Telugu Avishraantham - anilvaranasi/indianlanguages GitHub Wiki

” | ॥ న | లి ల కష స. స! కవిత్వం | త. | ||. |

    • " , టం! .

' ॥ ? " లట న ॥ నంటి. క స్‌ ॥ ॥] ళ్‌ న | | జ ల సల వ . - ళీ

/ ఖీ ఛి | న , ॥ /| గో

మాయే గ (బ్రాలో ఆ లై ట్‌ ఉ యయ లంట? గా వ కవిత్వం ధయ జ (జై వ్‌. గనీ! ఖు గ ఖీ. మ ర న న షి. - న యు? క ను స | వ. | స టిం గ ఖి స్పందన ల్ని ప్రచురణ

ఇ4ర్ష 627 స ణ్‌ లి న అవిశ్రాంతం (ఉంజగిరు2గ0) రాధేయ ఆగప్పు, 2009 (ప్రతులు : 1000 (ట్రతులకు . డా॥; రాధేయ, ఎం.ఎ, పిహెచ్‌.డి., ర్‌ూ రాధేయ కవితానిలయం లు ప్లాట్‌ నెం. 312 చ్‌ రాజహంస ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్స్‌ ౮ ఆర్‌.టి.సి ఐన్టాండ్‌ దగ్గర అనంతపురం - 515 001. / 'సెల్‌ : 9985171411 ( ముఖచిత్ర రచన : అక్షర్‌ లే-బిెట్స్‌ కవర్‌ డిజైన్‌ &ఉ ముద్రణ : అంకుష్‌ డిజైనర్స్‌ & ప్రింటర్స్‌ నల్లకుంట, హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27663213, 9912929078 ఆ-౧౧౩|| 2 2౧|౬౩౧.౧౮(్రుకగా2|1.00౧2 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ వారి పాక్షిక ఆర్థిక సహాయంతో ... భయ సం్ట [రా దో యే”, గ మే. // వెల : 60/- ళ్‌ న్న లే న్న / లన ర లేటా ఫ్‌ న శే మలో ను గ పాబాలి, వ

పరిచయం (వి. యన్‌. సుబ్బన్న) తపన జు స్థం ; కడపజిట్టా, ముద్దనూరు మండలం [్ర ల యామవరం గ్రామం క్‌ జనీసీం.. ; 09-01-1955 న చీటు్చు : ఎం.ఏ (తెలుగు) శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం, అనంతపురం. పి.హెచ్‌.డి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. అంశం : ఆధునికాంధ్ర కవిత్వానికి సీమకవుల దోహదం శ్చీర్తి వ తెలుగు ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పామిడి, అనంతపురం జిల్లా. 2008-09 సం॥లో ఇంటర్‌ మీడియట్‌ విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌ వారిచే తెలుగుపాఠ్య ప్రణాళిక సంపాదక మండలి సభ్యులు. అధికార భాషా సంఘం జిల్లా సభ్యులు. కన్వీనర్‌ - స్పందన - అనంతకవుల వేదిక రీచన్రీలు ; 1. మరో ప్రపంచం కోసం (కవితా సంపుటి) 1978 2. దివ్యదృష్టి (కవితా సంపుటి) 1982 3. జ్వలనమ్‌ (కవితా సంపుటి) 1983 4. తుఫాను ముందటి ప్రశాంతి (కవితా సంపుటి) 1986 5. ఈ కన్నీటికి తడిలేదు (కవితా సంపుటి) 1991 6. క్షతగాత్రం (కవితా సంపుటి) 2003 7 మగ్గం బతుకు (దీర్ధకావ్యం) 2006 8. అవిశ్రాంత౦ం (కవితా సంపుటి) 2009 కది స ఎకి

సంపాదకష్టుం : 1 యువస్వరాలు (కవితా సంకలనం) 1980 2. ఎక్స్‌రే రా.రా. ప్రత్యేక సంచిక - 1994 3. సరస్వతీపుత్ర పుంభావ సరస్వతి పుట్టపర్తి నారాయణాచార్యులు మోనోగ్రాఫ్‌ - 2007 4. 25 కథానికలు (వివిధ పత్రికల్లో) వివిధ సాహిత్య పత్రికల్లో వందకు పైగా సాహిత్య వ్యాసాలు, సమీక్షలు కొన్ని కవితలు, కథలు ఆంగ్లం, హిందీలో అనువాదాలుగా వచ్చాయి. 2003 సం॥లో ప్రసార భారతి ద్వారా జాతీయ కవిగా ఎంపికై గుజరాత్‌ లోని రాజ్‌కోటలో జరిగిన సర్వభాషా కవి సమ్మేళనంలో కవితాగానం ్యరిగ్థుపకులు. : ఉమ్మడిోట్టి సాహితీ అవార్డు (స్థాపితం : 1988) (ఆధునిక కవిత్వానికి ప్రతిష్టాత్మక పురస్కారం) లాట య్‌ మ్మ. కా వ్‌. న! యో | 1 వా” ం జ్‌... జ బి | కాలంగా ఖీ | న్‌! | శా సల ] (సా లా హా క్‌ 2. కా చయ ఇక శా. ర నపు ంం ము! లా గా మ హా (వరా (తా టెాాాాాాాాాాాాాాా ఓ 1? ఎడ

అంకితం స్ట ఇ / జీవితంలోనూ, కవిత్వంలోనూ, సొహిత్యసేవలోనూ నాకు తోడూనీడగా నిలిచి మూడు దశాబ్దాలుగా నా థమను పంచుకుంటూ నావెన్నంటి నడిచే 'సహచరి' 'గుత్యకు ఫ్రేమురో. (్రభ్వల న కసపు. శు ౪ అన

రక్తమూ - కన్నీక్ళు- అగ్నీ

“౨౦౬౪౧/ & 19 0650 ౧29 24/25 066౧ 8 ౧౩6౦110౧ 01 ౪6 5006166/ గంగా ఇగ|00 శ 504౧89. శగ౧6 6 0958 ౧౦9౪ ౧౭౪౭ ౧౧౧౫ 1693 ౧౧00069166 2౧౮ 0౧౧0౧1౦166 ౧౧౦6 ౧6౧౦౪౧(/60/ 2౧ ౧2౪/6 [15[0గ4౧9, ౧6 900121 2౧6 ౧౦1102!

011%౧216 206 ౪6 06411421 ౧౧0౧౪5 0 20)/ 9/6౧ 1026 2౧6 ౧12౦6” ౧4|1౧౦/ ఛంటగ06 [౧౦౧౫ 1౧౪౯౦౮64౦10% 10 '661807211015 82120% ఉీ౧౧6గ02౧ నిం61%/ - రాధేయ కవిగా ఒక పరిపక్వ దశకొచ్చాడు. అతని ఎనిమీదో కవితా సంపుటి అవిశ్రాంతం దీనికి ఒక దాఖలా - ఒక రెండున్నర దశాబ్దాలుగా, కవితాసాధనలో మునిగి పోయివున్నాడు. 1978లో అచ్చయిన 'మరో ప్రపంచం కోసం' కవితా సంపుటి నుంచి 2009లో వస్తున్న 'అవిశ్రాంతం' దాకా ఈ ప్రస్థానం కొనసాగుతుంది. “అవిశ్రాంత'మని పేరుపెట్టటం వెనుక ఉద్ధేశ్యం జీవితం అవిశ్రాంతం. దాన్ననుసరించి కవిత్వం అవిశ్రాంతం. తనదయిన ఒక జీవితం వుంది, దాని ఘర్షణల్లూ, వత్తిడులూ, అంతర్‌ బహిర్‌ యుద్ద్ధాలూ, వైరుధ్యాలూ, వైవిధ్యాలూ, నిరాశపడటాలూ, ఎదురుతిరగటాలు, అకస్మాత్తుగా రెక్కలొచ్చి ఎగరటాలు అన్నీ వున్నాయి. తన చుట్టూ ప్రపంచంతో కలగలసి పోయిన జీవితం, కఠిన వాస్తవమైన జీవితం. జీవన వాస్తవికతలు, సామాజిక వాస్తవికతల ప్రతిఫలనదర్శనాలూ అన్నీ వున్నాయి. దేన్నీ విడనాడలేదు. దేనికీ వెన్నుచూపలేదు. రాను రాను రాటుదేలి ఒక వీరుడిగా తయారవటం - ఒక దాన్లోంచి యింకొక దాన్లోకి ప్రవహించటం = దేన్నీ పరిత్యజించలేదు. నేడు, అన్నింటినీ గాఢాలింగనం చేయటమే - సుఖమో దుఃఖమో, దేన్నీ పరిహరించకుండా స్వీకరించి ఆత్మగతం చేసుకుని పలకటం; కవిత్వంగా పలకటం. అది ఒక యోగం. కవిత్వ సాధనా క్రమంలో అనుభవైక వేద్యమయినవి; ఆత్మ జాజ్బ్వల్యానికి దారితీసేవీ -తనతో తనకే యుద్ధం. ఒక సంవాదం - గతి తర్కిక సంవాదం - పాతికేళ్ళప్పుడు కవిత్వాన్ని అందుకోవటం వేరు; అనుభవించటం వేరు. యాభై దాటిన... తర్వాత

శప + ఎని

ఆరాధించటం వేరు, ఆనందించటం వేరు. ఒక యోగి పొందే ఆత్మజ్వలనం ఆత్మానందం, స్థిరంగా వెలిగే జ్ఞానం - కంటే గొప్ప ఆనందం స్ఫూర్తి. ఒక ఆత్మజ్వలనానందం కవిత్వం ద్వారా పొందటం. ముప్పై కవితలున్న “అవిశ్రాంతం'లో దరిదాపు ఐదారు కవితలు కవిత్వమే వస్తువుగా కలిగినవి. వేరే కవితల్లో గూడా సందర్భ మొచ్చినప్పుడు కవిత్వం గురించి మాట్లాడటం వుంది. కవిత్వం తనకేమిటో చెప్పటమూ వుంది. యింతగా కవిత్వం గురించి మాట్లాడటం - పలవరించటం, వ్యాఖ్యానించటం ఎందుకు? క్రమంగా తను ఈ పాతికేళ్ళలో దాన్గోనే లీనమయ్యే ఒక క్రమం కనుక్కున్నాడు. ఒడ్డున కూర్చోవటంతో మొదలై, కవిత్వంలోకి దూకి, పరిశోధనం చేయటం మొదలెట్టాడు. ఒక సత్యశోధన ఆ ఆత్మ సామాజిక సత్య శోధనా క్రమం వుంది. ఒకటి లేకపోతే రెండోది లేదు. ఈ ౧00855 ఈ పుస్తకంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. క్రమక్రమంగా లీనమయ్యే దశ. తన్నుతాను గట్టిపర్చుకోవటానికీ, నిలబెట్టు కోవటానికీ, ఒక ౪౬/40 గా మలుచుకోవటానికీ, ఆయనకు ఈ సాధనం తప్ప వేరే మార్గం లేదు. రాధేయకే కాదు ఏ కవికయినా యిది అనివార్యం. విచ్చినమయ్యే దశలో, ముక్కలు ముక్కలయిపోవటం తేలికయిపోయిన దశలో మనిషయిన కవి, తన్నుతాను ఆదర్శవంతంగా నిలబెట్టుకుని, వజ సంకల్పంతో, వైరుధ్యాల నెదుర్కొని సారాంశం వడకట్టాల్సిందే.

యిది ఒక పరిణామదశ. క్రమ పరిణామదశ. వేగిర పాటులుండవు. అలవికాని ఉద్వేగాలుండవు. అర్థంలేని ఆక్రోశాలుండవు. అంతటా ఒక సంయమనం. చాలా ఎరుకతో, మగృతతో, వస్తువును కవిత్వంగా మలిచే ఒక క్రమం కన్పడుతుంది.

ప్రపంచం, జీవితం కొట్టే దెబ్బలకు తట్టుకోలేక, దూరంగా జరిగే వాళ్ళు, పారిపోయే వాళ్ళు, పతనమయే్యేవాళ్ళు ఎక్కువవుతున్న తరుణంలో నిలకడగా నిలబడి, చెక్కుచెదరకుండా రాటుదేలటం కవిత్వ లక్ష్యాన్నీ సారాన్నీ అందుకోవటం మామూలు విషయం గాదు. బహుశ రాధేయ అది సాధించాడనుకుంటా -

“దుఃఖానికి కావ్య భాష తెలుసు

గాయపడిన హృదయాలెప్పుడూ

కవిత్వంతోనే సంభాషిస్తాయి

నమస్త జీవన కాంక్షల్లో తనదయిన

తాత్విక మూలాన్ని అన్వేషించేవాడే కవి"

1౧ 5£556[06 రాధేయ యిదే. తాత్విక మూలాల్ని అన్వేషించే క్రమంలో తను పొందే ఆనందం, లేదా - ఒక రహస్యం, ఒక జీవన రహస్యం, కనుక్కున్న వాడు, ప్రకృతి రహస్యం కనుక్కున్న వాడు వేసే ఆనందపు కేక 'యురేకా'

ఉరి 11 ఎత

“సమిష్టి అనుభవాల్ని

స్వానుభవాలుగా మార్చుకుని

శిశిరంలోంచి వసంతంలోకి

అడుగు పెట్టేదే కవిత్వం

“ప్రభాత సంధ్యలో

పత్ర హరిత ప్రపంచంలో

కొబ్బరాకు మీద జారుతున్న

మంచు బిందువుల సాక్షిగా

కవిత్యం తోడులేకుండా

నేను లేను"

అని అనగలిగాడు. తన ఏడుపు తను ఏడవటం గాదు, “సమిష్టి అనుభవాల్ని స్వానుభవాలుగా' మార్చుకోవటం - అక్కడనుంచి కవిత్వం పలకటం సాధనంతా దీన్నందుకుంటానికే ఒక్క రోజులోనో, ఒక సంవత్సరంలోనే సాధ్యమయ్యేదా ! కాదు. కడదాకా సాగేదే తనకీ తెలుసు “ఆత్మ విముక్తి అంటూ వేరుగా లేదని, సమిష్టి విముక్తిలోనే ఆత్మ విముక్తి యిమిడి వున్నదనీ తెల్పు.

“జీవితాన్ని ఎంతగా తడిమినా

ఏదో ఒక పార్శం

నా స్పర్శ కందకుండా

జారిపోతూనే వుంది.

అనే దిగులు - 'నిత్య జాగ్రదావస్థలో విస్తరించే విధ్వంసం”

అదీ కారణం' - అదీ అసలు కారణం

*'ఈ మట్టినీ, ఈ మనిషినీ

డేమించే మనుషుల కోసం

తపిస్తున్నాను నేను"

కర ఓ అతి

ఆ మనిషి నిర్మాణ క్రమానికి కవిత్వాన్ని పునాది రాయి చేయదల్బుకున్నాడు. ఒక సమైక్యానందం, ఒక సమైక్య సౌందర్యం - ఒక అనంత ఉత్సవం - బతకంతా ఒక ఆనందపు జాతరగా స్వప్పిస్తున్న కవి, అంతటా నెరైలు బారుతున్న వైనం - అంతటా వికారపు జాడలు,

“శుమాభిమానాలకు

డాలర్‌ మైకం కమ్మేసింది

దయారహిత ప్రపంచం

డాట్‌ కామ్‌లో స్థిరపడింది

కరుణ వాత్సల్యం

కనుమరుగై పోతోంది'

యిదీ ఈనాటి విధ్వంస దృశ్యం. సందర్భం ప్రపంచీకరణ. వస్తు వ్యామోహం- అన్నీ తెంచుకోటాలే. కలపటాలు లేవు, కలుసుకోవటాలు లేవు పగిలిన వేణవు, భగ్న రోగం, అభద్రతా వలయం -

రెండు ప్రపంచాల మధ్య ఒక ఘర్షణ ప్రారంభమయ్యింది.

జీవద్భాష మృత భాషవ్వటం, వ్యాపార భాషవ్వటం, వ్యవస్థీకృత హింసోన్మాదం, రక్తం చిందిన ముదిగొండ, పల్లె అదృశ్యం కావటం - సామాజిక పరిజ్ఞానమంతా సాంప్రదాయ సంకెళ్ళు, ఆత్మను కోల్పోయిన సౌందర్య వాది - ఒక సజలనేత్రి అణగారిన దీనస్వరం జీవితానికి వేగం ముఖ్యం గావటం - ఒక యోధుని ఉరితీత - ఒక్ర ఎన్‌కౌంటర్‌ మరణం, ఎడారి వసంతం - ఊళ్ళు బీళ్ళు - చావు పంట విరగకాయటం = అంతా ఒక అనంత దుఃఖం.

వీటన్నింటి మధ్య నిలబడి - రాయక తప్పని పరిస్థితిలో రాసిన కవిత్వం.

“కవిత్వమంటే గోడకు దిగ్గొట్టిన

మేకు కాదు

భుజానికి వేలాడే తుపాకీ -

కవిత్వం సొమాజిక సంస్కారం

ఆయుధం మా ఉత్తేజం

అయుధం మా జఉనికి

ఓట ౫ ఎక

అయుధాన్ని కోల్పోవటమంటే

చెయ్యి పిడికిలిని కోల్పోవటమే” -

బాప్పీకృత జీవద్భాష కవిత్వ వాక్యం - గుండెల్లోంచి పెల్లుబికి రావటానికి చేసే సమరం -

“కవిత్వం. నాకు కన్ను మూతపడని జ్వరం

కవిత్వం నా కనురెప్పలమీద

వాలిన నమ్మకమయిన కల

“కాలం చిటికిన వేలుపట్టుకుని కవి నడుస్తూ వుంటాడు. వలేసి అన్నింటినీ గుంజుకుంటాడు. గతానికీ వర్తమానానికి తేడా గుర్తించగలడు. గతాన్ని వర్తమానంతో అనుసంధించి బేరీజు వేయగలడు.

“పాతికేళ్ళ ప్రాయంలో

ప్రపంచం నాముందు

దోసిలిపట్టి నిలిచేది

యాబై దాటిన ఈ వయసులో

ప్రకృతి సమస్తం

అకులు రాలిన రుతువై

నా వైపు దీనంగా చూస్తున్నట్టే వుంది. ”

ఆత్మ విశ్వాసం కొడిగట్టే దశలో - సామాజిక రాజకీయ, జాతీయ అంతర్జాతీయ సన్నివేశంలో - కవిత్వం కాపాడుతుంది. నిలబెడుతుంది. మనిషినీ, కవినీ సజీవం చేస్తుంది. కవిత్వమంటే ఆయుధమన్నారు. ప్రేమే కాకుండా కవిత్వం ఆయుధమెలా అవుతుంది. అందుకే ముందు కవిత్వం - తల్లి - పేమ

“పేమించటమంటే

ఒక స్వర్గంలోకి ప్రయాణించటమే

స్వప్న సాకారంలోకి ప్రవహించటమే

(థ్రేమకై జీవించటం

ఢేమతో మమకం కావటం”

ఓటి 1 ఎ

కవిత్వానికి పేమలేఖ కవిత మొత్తం - ఒక మహోద్వేగంతో శ్రీశ్రీ 'కవితా ఓ కవితా' లా సాగింది. కవిత్వాన్ని ప్రాణహంసగా సంభోదించాడు. కవిత్వం పట్ల తనకున్న మహా ప్రేమ, గొప్ప ఆకాంక్ష ఉద్రేక తరంగంలా ఎగసింది ఈ కవితలో - నిన్ను దక్కించుకోలేని

“నిస్సహాయ యాత్రలో

ఓ శిక్షా శిబిరం చుట్టూ

నా బతుకు పరిభ్రమిస్తూనే వుంటుంది"

కవిత్వయాత్ర మొత్తం ఒక శిక్షా శిబిరమే - జీవితమూ అంతే. ఇవి రెండూ విడదీయరానివే - జీవితాన్ని కవిత్వమూ కవిత్వాన్ని జీవతమూ ప్రభావితం చేసుకుంటూ ముందుకెడతాయి - జీవతమంత సుదీర్ధ ప్రయాణంలో ఎప్పుడు ఒక అసంతృప్తి వేధిస్తూనే వుంది. ముగియని కవితగా యిది మిగులుతుంది. జీవితం ఒక 1౧00గ౧౧181ఆ

౧౦౭౧౫. నంగ) ఒక 1౧ ౦౦0గ౧1816 116. 110 ౬౯౧4. మొదలవుతుంది. ముగుస్తుంది. ముగిసిన చోటే మొదలవుతుంది. అలమీద అల, కలమీద కల - క్షణక్షణ పునరుర్జానం, కవిత జీవితం.

“ఒక నదివై ఒక ఎడారినై

సమిష్టి ప్రాణ ధ్యాసలోంచి

అక్షరాన్నై మొలకెత్తాలని -

అవధుల్లేని అలసట లేని

అకొశం లాంటి కవిత్వం

రంగు రంగుల కలలూ

సెలయేటి గలగలలే కాదు

నాకు దుఃఖం కావాలి

లోలోని బలహీనతల్ని కరిగించే

అంతర్మధనం జ్వలనం కవిత్వమే

అది సమాధి శూన్యం కాదు

సమస్తాన్ని ఢ్రుమింబే న్రైర్మల్య జీవనం

నేను నేనుగా మిగిలిన వాస్తవం

అది అనంతం, అది అవిశ్రాంతం”

కరు మ ఎనో

ఇది ఒక ఆత్మగానం. ప్రతి కవీ ఏదో ఒక సమయంలో ఈ స్ధితి అనుభవిస్తాడు ఇదొక ఆత్మగానం - జీవనాత్మగానం

'నా తాత్విక భూమికను

ఆత్మగానం చేస్తాను

సమస్త సామాజిక మానవీయ

విలువలతో - కవిత్వమై విస్తరిస్తాను'

ఒక పాతికేళ్ళలో ఎనిమిది కవితా సంపుటులు ప్రచురించి రాధేయ, వట్టిపోని కవిగా, నిరంతర (ప్రవాహ కవిగా, తన్ను తాను రుజువు చేసుకున్నారు. ముఖ్యంగా “మగ్గం బతుకు" దీర్ధకావ్యం. ఆయన కవిత్వ దారుఢ్యాన్ని ధారను ప్రదర్శించింది. ధార తెగకుండా ఒక కావ్యం రాయటం మామూలు కవికి సాధ్యమయ్యే విషయం కాదు. క్రమక్రమంగా విస్తృతి చెందుతూ కవిత్వపులోలోతుల్లోకి వెళ్లే సుదీర్థయాత్రా క్రమం కన్పిస్తుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని - అటు వస్తుపరంగానూ, యిటు రూపపరంగానూ - తనలో యిముడ్చుకుని ముందుకు పోతున్నారు. ఇది 'ప్రాఢ వయః పరిపాకదశ. జడాత్మకత నుంచి బయట పడి - నిజానికి ఆయనెప్పుడూ జడంగా లేరు - ప్రజాస్వామికంగా ప్రసరించటం కన్సడుతూంది.

ఆయనది సంక్షిష్టశైలి కాదు, జీవితంలోని, సమాజంలోని సంక్షిష్టతల్ని గురించి ఆయన మాట్టాడేటప్పుడూ ఆయనది సూటి అయిన శైలే, గత రెండు దశాబ్దాలుగా కవిత్వాన్ని చాలా 568గ045గా తీసుకుని, అదే జీవితమని చెప్పేదాకా వెళ్లారు. కవిత్వపు ఆంతరిక శక్తి అర్ధమయ్యింది. దాని లీలలూ అర్థమయ్యాక యిక దాన్ని వదిలే ప్రసక్తే లేదు. కవిత్వం ఆయన జీవన విధానమయ్యింది. మనుషుల పట్ట, సమాజం పట్ల అపారమయిన ప్రేమ, కరుణ - ఈ రెండింటినీ కాపాడటానికీ ఆగ్రహమూ, పోరాటామూ చేయాల్సిన అవసరమూ గుర్తించి - కవిత్వ సాంద్రత - ౧౦౪౦౩ 1౧16౧910/ ని సాధించారు.

“కవిత్వం రాయటం, కవిత్వం చదవటం, కవులను గౌరవించటం నాకెంతో ప్రాణప్రదమయిన లక్ష్యాలుగా ఎంచుకున్నాను. ఉత్తమ కవిత్వం కోసమే నా తపని అని చెప్పుకున్నారు.

క్రమం తప్పకుండా 'ఉమ్మడి శెట్టి అవార్డు' యివ్వడమే కాకుండా, తను ఉత్తమ కవిత్వం రాయటానికి తపన పడటం ముఖ్యం. అ దిశగానే చాలా నిర్ధిష్టంగా నిర్వందంగా సాగుతున్నారు. నిజానికి ఉద్యోగం తప్ప యితర ఆర్థిక, వనరులు అంతగా లేకపోయినా 1988 నుంచి క్రమం తప్పకుండా “ఉమ్మడిశెట్టి' అవార్డు ఉత్తమ కవితాసంపుటికి

ఇభ 18 ఉత

యివ్వటం నిర్మోహంగా, నిష్కర్లగా దీన్ని నిర్వహించటం వల్ల దానికి 6"864101॥0/ పెరిగింది. అది అలా కొనసాగటానికి రాధేయ కృషి పట్టుదల కారణం. [66౪69136 [౧౦౧౯ లాగా దీనికీ గొప్ప గుర్తింపు (ప్రాశస్త్యం వచ్చింది. యివన్నీ ఆయన కార్యద్‌ీక్షకూ, కవిత్వం పట్ల (ప్రేమనూ తెలియచేస్తాయి. ఇవన్నీ నిర్వహిస్తూ, సంసారాన్ని ఈదుతూ, కవిత్వాన్ని వదలకపోవటం రాను రాను రాటు దేలటం, అఖండంగా ఆరాధించటం అబ్బురపరిచే విషయాలు.

పరిణత వయస్కుడు, ఒక ఖచ్చితయిన (ప్రాపంచిక దృక్పథం ఉన్న కవి నుంచి “పరిణత కవిత్వమే” వస్తుంది. అది తన నిర్దిష్ట పరిథి దాటి సార్వజనీనత వైపు సాగుతుంది. ఆయన చెప్పుకున్నట్లు

“రాయాలనిపిస్తేనే కాదు

రాయక తప్పదని పించే స్థితికి

అనివార్యంగా ప్రయాణిస్తున్నాను"

ఆ అవిచ్చిన్న ప్రయాణంలో యిది ఎనిమిదో మజిలీ - బాగా “మగ్గిన ఫలం యింట్లో వుంటే యిల్లంతా మధురమయిన ఆ వాసనే వస్తుంది. రాధేయ ఈ పుస్తకం ఆర మగ్గిన ఫలం - దాని రుచీ, సువాసనలు అందరినీ ఆకట్టుకుంటాయి -

“రాయకుండా ఉండలేని స్థితి

రాయకపోతే జ్వరపడే స్థిత

ఆ కవిత్వ జ్వరం అలా అంట కాగుతూ వుంది. ఆ కొలిమిలో కాలిన మాట ప్రాణహిత - బెషధం - ఆనందకారకం -

"2౧౧ 1౧ 6 ౧143040163

౧6 ౪౦/6౩ 4/6 1౧ ౧౫/ ౧౫1651

1౧ ₹6 |/16051 ౪0౧౦౩ |! 2౧౧”

౪/10 ౦౯6౮5 |! 566 1౧6008౧156 | ౧౭|6 2ం00421౧(2౧06 1! 91 5006 1104001 6౪6౧/1౧8౧౧5011౧00 1 ౧౦౯౦౭6 4 11౧౧౪55" ఉట 1 చీ

అస్సామీ కవయిత్రి నిర్మల ప్రభ కవితా వాక్యాలు గుర్తుకొచ్చాయి - రాధేయ “అవిశ్రాంతం' చదివాక -

"౧౧6౧౪ 13 50 ౧౧౪౦౧ 0100641 10 ౪౦649

౧68 15 50 ౧౫4౦౧ 1౧౧6 1౧ ౪0/65

రక్తమూ, కన్నీళ్ళు, అగ్ని కలిసి ప్రవహించే కవిత్వం అవిశ్రాంతం - కవిగా రాధేయ ఎదుగుదల నన్నాశ్చర్యపర్చలేదు - ఆయన్ని గత రెండు దశాబ్దాలుగా ఫాలో అవుతూనే వున్నా సంవత్సరం గుర్తులేదు, ఆశారాజుకి ఉమ్మడి శెట్టి అవార్డు వచ్చినప్పుడు మొదటిసారిగా కలిశాననుకుంటా - అక్కడనుంచి బాగా దగ్గరిగా రావటం మొదలయిందనుకుంటా- అది ఎలాంటి వేదనయినా సే తలొగ్గనితనం అలవర్చుకునే తత్వం రూపొందించుకున్నారు. 56060676 ౭8౦౧) 00)4014/6 ఇర్రంగ/ నా అని కాదు, దేన్నయినా కవిత్వంగా మలచే ఒక నేర్ను క్రమక్రమంగా అభివృద్ధి చేసనుకోవటంలోనే - కవీ సజీవంగా వున్నాడు. మనిషీ సజీవంగా వున్నాడు. రానురాను మరీ మెలకువగా తయారయ్యారు. బహుశ ఇక ఇక్కడ నుంచే ఆయన ఎక్కువ రాయాల్సి వుంది. ఒక 9212౧096 0౪1 100% ఏర్పరచుకున్నాక, ఉత్పత్తి పెరగాలి. సృజనకి కావాల్సిన ౧8 ఉండొచ్చు. అది కూడుకునే నమయం. అది కొనసాగుతుంది.

2003లో జాతీయ కవిగా ఎంపికయిన రాధేయ కవిగా సుప్రసిద్ధుడు - ఆయనకీ ముందు మాటనవసరం.

కేవలం నన్ను గౌరవించటానికీ, నా పట్ల ఆయనకున్న (ప్రేమని తెలియచేయటానికీ ముందుమాట రాయమని అడిగారు తప్ప - ముందుమాట అవసరమయి కాదు. అందుకాయనకి ధన్యవాదాలు. కొండ కవ్వంగా, సర్పం తాడుగా సాగరమధనం చేయటం- ఒక పౌరాణిక ప్రతీక మాత్రమే - ఒక ౧౫౭2౧౧౦ మాత్రమే. అదెప్పుడూ సృజనకి అన్వయించేదే.

శోధన మొదలయింది, 16-61300౪61౧8 ప్రారంభమయ్యింది.

అంతిమంగా అమృతమే వస్తుంది.

ఇవన్నీ రాధేయకి తెలిసిన విషయాలే -

ఈ €|)/5365 యాత్ర కొనసాగుతుంది.

అభినందనలతో... మీ 26.09 లీ వో ఇప 07 ఉని

నా అవిశ్రాంత స్వాప్పిక అంతరంగం !

నాకు జీవితమంటే కవిత్వమే

నా నిరంతర సాధనా స్వరం కవిత్వమే -

నా జ్ఞాపకాలూ, గాయాలూ, ఆకలీ, ఆవేదనా అన్నీ కవిత్వంలో భాగమే

నాకు కవిత్వమంటే సామాజిక సంస్కారంతో సంభాషించడమే

చెక్కు చెదరని ఏకాగ్రతలోంచి, ప్రాణభూతమై ఆకాంక్షల్లోంచీ

ఈ లోకాన్సీ ఈ మనుషులను అధ్యయనం చేసే ఒకానొక తాత్వికత కవిత్వం !

నా వ్యక్తిగత జీవితం అనేకానేక సంక్షోభాలతో, ఆటుపోట్లతో తీవమైన మానసిక్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు ఈ కవిత్వమే నాకు కన్నీళ్ళు తుడిచి సాంత్వన కల్గించింది. అక్కున చేర్చుకొని ఆదరించింది. సంక్షిషలోనూ, సంఘర్షణలోనూ ప్రశాంతత నిచ్చింది. నా దృష్టిని విశాలం చేసింది. ఈ కవిత్వమే నాకు ఎందరో అభిమానుల్ని కవుల్ని విమర్శకుల్ని, మేధావుల్ని దగ్గరగా చేసింది.

నాకు కవిత్వమంటే -

'పేదరికంలోంచీ పోరాడుతూ మధ్యతరగతి స్థాయి వరకూ ఎదిగి నేను నడిచివొచ్చిన నా జీవిత నేపథ్యమే ! గత మూడు దశాబ్దాలుగా తెలుగు కవిత్వంలో వచ్చిన అనేక పరిణామాలకూ, ప్రభావాలకు లోనయ్యాను. అందుకే నేను బతుకును ప్రేమించినంత ఇష్టంగా కవిత్వాన్ని (ప్రేమిస్తాను.

మా కుటుంబంలో వారసత్వంగా నాకు ముందుగానీ, వెనుక గానీ ఎవరూ కవులూ, పండితులూ లేరు, కడప జిల్లా, ముద్దనూరు మండలం, యామవరం గ్రామంలో ఓ పేద చేనేత కుటుంబంలో పుట్టిన నాకు బతుకుదెరువు కోసం ఎదురీదే తత్త్వం అలవడింది. మా సమిష్టి కష్టంలోంచి నా చదువు, నా ఉద్యోగంలోనూ కవిత్వం నాతో

తరు 41 ఉత

కలిసి బతికింది. మగ్గమే బతుకు పోరాటమైన నా తల్లి కష్టం, తండ్రి పోరాటం. అన్నదమ్ముల చదువుల కోసం నిరంతర మానసిక ఘర్షణలు, ఎదురీదిన సంఘటనలు, అనుభవాలు, గాయాలు, అన్నీ నన్ను కవిత్వం వైపు నడిపించాయి. ॥

అందుకే కవిత్వం నా అవిశ్రాంత ప్రయాణం. నా నిర్జిద్ర దీరరాత్రులన్నీ కవిత్వంలోనే తడిసి తెల్దారాయి. నా కృత్యాద్యవస్థలో శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి గార్ల ఆశీస్సులు, కుందుర్తి వాత్సల్యం, శివారెడ్డి ధెర్య్గవచనం, మానేపల్లి, అద్దేపల్లి, రాచపాళెం ఆత్మీయ స్పర్శలు, నేను కవిగా, నిటారుగా, నిలబడటానికి, ఊతమిచ్చాయి.

1975 నుంచే కవిత్వం నా వెంటనే ఉంది. నాలో మమేకమై ఉంది. కథలు అరుదుగా రాశాను. అవి పాతిక మించిలేకపోయినా మంచి గుర్తింపునిచ్చాయి. 75 నాటి నుంచే కవిత్వాన్ని చదవడం, కవిత్వం రాయడం, కవులను గౌరవించడం నాకు ప్రాణఖప్రదమైన అంశాలుగా నా మనోఫలకంపై స్థిరపడ్డాయి.

ఈ నేపథ్యంలోంచే 1988 సం॥లో ఇంటిపేరును వేదికగా చేసుకొని 'ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డును' స్థాపించాను. నాటి నుంచీ ఈనాటి వరకూ ప్రతిఏటా, క్రమం తప్పకుండా, ప్రణాళికాబద్దంగా న్యాయ నిర్దేతల చేత ఎంపిక చేయబడ్డ ఉత్తమ కవిత్వాన్ని రాసిన కవిని అవార్డుతో సత్కరిస్తూ తద్వారా నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఈ అవార్డును ఆధునిక కవిత్వానికి ప్రతిష్టాత్మక పురస్కారంగా భావిస్తున్న కవిలోకానికి కృతజ్ఞతలతో, సేవాభావంతో చేతులు జోడిస్తున్నాను. నా కవిత్వం, ఈ అవార్డు నా వ్యక్తిగత, సామాజిక సాహిత్య జీవితాన్ని సమన్వయం చేస్తూ నా బాధ్యతను మరింతగా పెంచింది. నా ముప్ఫై ఏళ్ళ సాహిత్య జీవితంలో నేనూ, కవిత్వం వేర్వేరు కాదు.

ఈ 'అవిశ్రాంతం' నా ఎనిమిదవ కవితాసంపుటి. మగ్గం బతుకు దీర్ధకావ్యంతో రాష్ట్రంలోని చేనేత కార్మెకులందరూ నన్ను ఎంతో ఆర్ధంగా, ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ దీర్ధకావ్యంపై ఎం.ఫిల్‌ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య రాచపాళెం గారికి ఆచార్య ఎస్టీడి చంద్రశేఖర్‌ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పరిశోధక విద్యార్థులకు నా అభినందనలు తెల్పుకుంటున్నాను. ఎంతో ఆలస్యంగానైనా 'ఆధునికాంధ్ర కవిత్వానికి సీమకవుల దోహదం” అనే అంశం మీద పరిశోధనకు అవకాశం కల్పించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పర్యవేక్షకులైన ఆచార్య ఎప్టీడి చంద్రశేఖర్‌ గారి అత్మీయతను మరువలేను.

కది ౫11 ఎకి

ప్రముఖ కవి క. శివారెడ్డి ఆత్మీయవాక్యాలకు, ఈ “అవిశ్రాంతం' వెనుక అన్వర్‌ కృషికి ఎంతగా కృతజ్ఞతలు తెల్పినా అవి తక్కువే.

ఇందులోని కవితల్ని ప్రచురించిన అన్ని ప్రముఖ దినపత్రికలు మరియు నేటినిజం, నడుస్తున్న చరిత్ర , ప్రజాసాహితీ, పత్రిక, సాహిత్య (ప్రస్థానం, సాహిత్య నేత్రం, కవితావార్తికలు, కవిత-2007, కవితా మాలిక, ఓ కవితా... సంపాదకులకూ...

ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్‌-సప్తగిరికీ, మరియు ఆకాశవాణి కేంద్రాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు...

జ 'క్రాఖ్న్వ

ఇదీ వరుస 1 రెప్పవాల్బని స్వప్నం 2. కవిత్వమే తోడూ నీడగా 3. రెప్పలు మోయని దుఃఖం 4. దోసెడు స్వప్పాలు చాలు 5. ధిక్కార స్వరం 6. నేరమెవరిది మారాజా! 7. క్షమయాధరిత్రీ! 8. కోల్పోతున్న మూల్యం 9, కవిత్వం నా ఫిలాసఫర్‌ 10. పోటెత్తే గాయాలు 11. ఆఖరి మెతుకు 12. సౌందర్య రాహిత్యంలో 13. సజలనేత్రి సాక్షిగా 14. ఖడ్గప్రహారం! 15. చివరి సంతకం 16. కవిత్వానికి ప్రేమలేఖ కది ర ఎని

17 ఉష్టరక్త కాసారమా! లాల్‌ సలాం! 18. ఎడారి వసంతం! 19. శేష ప్రశ్న 20. ఓటమినా పునరుర్థానం! 21. అవిశ్రాంతం! 22. ఆత్మగానం 23. మేరా భారత్‌ మహాన్‌! 24. మిత్రుడు కన్పించడం లేదు! 25. అహా! చావుపంట విరగ కాస్తోంది! 26. అనంత దుఃఖం! 27. అనివార్యం 28. ప్రాణ దీపం 29. సమూహ దుఃఖం 30. స్మృతిశకలం ఇట 30 ఎనీ

| రెప్పవాల్బని స్వప్నం! సాంద్రీకృత మహా మౌనం లోంచీ ఓ నీటి పాయ వేణువును మోసుకొచ్చి నా చేతివేళ్ల కందించింది అవ్యక్త రాగాలాపనతో నా అధరాలు మృదుభాషితాలయ్యాయి ప్రశాంత నదీజలాల్లోంచీ కోమల సుగంధాల్లోంచీ ఓ బూడిద రంగుపిట్ట మోదుగపూల వసంతంలో వేకువ మంచుతో తడిసిన రెక్కల్ని నాముందు పర్చింది ఎన్ని ఆత్మల మూగవేదన నైరాశ్యంగా మోసుకొచ్చిందేమోగానీ వణుకుతున్న ఈ పెదవులపై కునుకు తీస్తున్నరాగం | ఒక్కసారిగా ఉలిక్కిపడి ా.

స్వరం మార్చింది

వ్యాఖ్యానమే అక్కర్లేని

ఓ ఆహ్లాద పార్వమొకటి

నాఆత్మ చుట్టూ (ప్రదక్షిణం చేసి

నాతో కరచాలనం చేసింది అనుభూతిని వర్ణించడానికి

ఈ అక్షరాలకింత సిగ్గెందుకో లి

మీగడ పెరుగులోంచీ తీసిన వెన్నముద్దల రుచి

మథించిన కవ్వానికేం తెలుసు ? అనుభూతికి కవితా రహస్యం తెలుసు దుఃఖానికి కావ్యభాష తెలుసు గాయపడిన హృదయాలెప్పుడూ కవిత్వంతోనే సంభాషిస్తాయ్‌ శిల్పిచేతివేళ్ళు మెరుపు తీగలై సోయగాల్ని అంటుకట్టినట్లు ధ్వంసమైన నమ్మకం లోంచి నిటారుగా నిలబడేదే జీవితం

అదే అసలైన ఆత్మవిశ్వాసం

కాలానికి ప్రయాణ్‌ంచడమే కాదు ప్రవహించడమూ తెలుసు

కాలమైనా, నది అయినా ఒక్కటే

అవి మైదానాల్లోనే కాదు హృదయాల్లోనూ ప్రవహిస్తాయి

సమస్త జీవన కాంక్షల్లో తనదైన తాత్తికమూలాల్ని అన్వేషించేవాడే కవి! /

4 లో

| కనిత్వమే తోడూ నీడగా | కవిత్వమే జీవితమైనవాడు రాయాలి, రాస్తూనే వుండాలి రోజుకొక్క వాక్యమైనా రాయకపోతే కవిగా నాకు మనశ్శాంతి దక్కదు అగ్గిసెగలోంచీ ం నిప్పుకణికల్పి వెలికి తీసినట్టుగా భావోద్వేగం నుంచీ భాషను పిండుకోవాలి వూట చెలిమె లోంచీ భావధారను చేదుకోవాలి గాయాల కొలిమిలోంచీ వాస్తవాల్ని సానబట్టాలి పైరగాలి రెపరెపలకు పాలకంకులు తలలూపినట్లుగా శ్‌ ప్రాణలిపిని పారలు, పాఠలుగా లో

విడదీసి చదువుకోవాలి కవిత్వం బహుళార్ధక సాధకం కావాలి కవి సాహిత్య భగీరథుడు కావాలి ఆఅత్మస్టైర్యం సాకారమయే్యేదాకా రాయాలి ఎక్కుపెట్టిన బాణం

లక్ష్యాన్ని ఛేదించే దాకా రాయాలి

దాహం తీరేదాకా

అకలిపెరిగీ దాకా రాయాలి

ఉద్రేకం ఉడికి పాయ్యేదాకా రాయాలి

సిద్ధాంతం కన్నా

అనుభవం గొప్పదని రాయాలి

సమిష్టి అనుభవాల్ని

స్వానుభవాలుగా మార్చుకొని శిశిరంలోంచి వసంతంలోకి

అడుగుపెట్టేదే కవిత్వం

సహనం కళ్ళెదుటే

జీవితం దహనకావ్యమౌతుంటే మానవీయ బంధాలన్నీ

మంటగల్సి పోతుంటే

గుండెలోంచి ఉబికివచ్చేదే కవిత్వం పాలింకిపోతే నోరెండిపోయిన శిశువులాంటి దుఃఖం కవిత్వం మాతృత్వం పాదులోంచి “| మొలకెత్తే వాత్సల్యం కవిత్వం ా.

ముసురుపట్టిన కన్నీటి జడిలోంచీ ఆత్మశాఖల మీద కూర్చొని కోయిల కవితాగానం చేస్తూంటే పారిభాషిక పదాలన్నీ

పరవశించి పోవాలి

అప్పుడే పొదుగు లోంచీ కురిసిన పోలనురుగు వెచ్చదనం కవిత్వం గడపముంగిట అలికి ముగ్గు పెట్టిన స్వచ్చమైన అంతరంగం కవిత్వం ప్రభాత సంధ్యలో

పత్రహరిత ప్రపంచంలో కొబ్బరాకుమీద జారుతున్న మంచు బిందువుల సాక్షిగా కవిత్వం తోడులేకుండా

నేను లేను

అక్షరాలు వెంటరాకుంటే

అడుగు ముందుకెయ్యలేను కడదాకా రాస్తాను

నా కన్నీటితడీ

ఇంకిపాయ్యేదాకా రాస్తాను ॥

రెప్పలు మోయం దుఃఖం

నేనీమధ్యనే

మందహాసాన్ని జారవిడుచుకొని

ప్రశ్నార్ధకాల్ని మోస్తున్నాను

ఆత్మళూన్య దేహంతో

అన్వేషణ సాగించలేక

అనుభవాల ఆకురాయిమీద

నిత్యం ఘర్షణ పడుతూ

ముందుకు సాగుతున్నాను

జీవితాన్ని ఎంతగా తడిమినా

ఏదో ఒక పార్శ్యం

నా స్పర్శకందకుండా

జారిపోతూనే వుంది

దిగులు వర్ధాలన్నీ దుఃఖంతో

తడిసిపోయి

శిల్పంగా చిక్కబడుతున్నాయి - ( ఒక నాజూకు చేతన లో

నా మనసు మడతల్లో

నలిగిపోతూనే వుంది

పదచిత్రాలన్నీ పరవశత్వం కోల్పోయి

ఊహలన్నీ ఉద్రేకాల్ని మోస్తున్నాయి

అనాదిగా నిద్రకూ మెలకువకూ మధ్య నిత్యజాగ్రదావస్థలో

విస్తరించే విధ్వంసమే

నన్ను శాసిస్తోంది.

సకల స్వార్భాలతో కాలుష్యమైనవారికి

సార్వ జనీన సత్యాలేవీ చెవికెక్కవు

క్షీరధారల్ని పాదుగునిండా నింపుకొని కట్టుగొయ్యకు పెనుగులాడే

లేగదూడకోసం ఆర్తిగా చూస్తూ

'అంబా' అని పిలుస్తోంది మాతృహృదయం అయినా, పాలవ్యాపారి హృదయం కరుగుతుందా? డబ్బును (్రేమించే మనసు

వాత్సల్యానికి లొంగద్దు

కులాల్ని (పేమించినంత ఇష్టంగా

మనుషుల్ని ప్రేమించలేరు

కరచాలనంకోసం చాచిన చేతులు కౌగిలించుకోడానికి ముందుకురావు

పూల పరిమళాన్ని

ముళ్ళపాదలు ఆస్వాదిస్తాయా!

ప్రేమించడమే నేరమైన చోట | జీవితం హింసాత్మక సన్నివేశమే లో

గాయాలను ఒరుసుకుంటూ జ్ఞాపకాలు ప్రవహిస్తాయి జ్ఞాపకమంటేనే చిగురాకు చలనం హృదయవీణా తంత్రీ ప్రకంపనం ఊహల్లోంచీ ఉత్పేక్షలొస్తాయికానీ ఊకలోంచీ గట్టిగింజలు రాల్తాయా? ఢేమించగలవాడెప్తుడూ ద్వేషించలేడు మమకారం తెలీనివాడు మనిషెలా అవుతాడు? మానవ సంబంధ భాష్యకారులారా! సంక్షోభాలు, సందిగ్భాలు లేని

సరికొత్త జీవితాన్ని నిర్వచిస్తారా?

ఈ మట్టినీ ఈ మనిషినీ

(్రేమించే మనుషుల కోసం తపిస్తున్నాను నేను

మానవీయ డ్రేమతత్వాన్ని

ఈ మనుషులకు విశదీకరించండి!!

| దోసెడు స సాలు చాలు |! మనిషి గాయపడుతుంటే కవి మౌనంగా ఉండగలడా? కంటికి నిద్రపడుతుందా? నానారుచిరార్థ సూక్తి నిధులన్నీ చిక్కనవుతున్న దుఃఖంలోకి ఇమిడి పోతూంటే కవిత్వం క్షతగాత్రంకాక మరేమవుతుంది? పంటగింజల్ని అన్నంమెతుకులుగా మార్చలేని నిస్సహాయ స్థితిలో పనిముట్టన్నీ జీవనభృతిని కోల్చోతున్నప్పుడు కవి గాయపడక తప్పదు మొల3౩త్తే ఉత్సాహం ముళ్ళమీద ఆరేయబడుతుంబే మొగ్గ తొడిగే బాల్యం దిగులు కొక్కేనికి వేలాడుతుంటే ( () నా కవిత్వం లో

అందమైన అమ్మాయి అరచేతిలో గోరింటలా పండుతుందా! 'పేమాభిమానాలకు డాలర్‌ మైకం కమ్మేసింది దయారహిత (ప్రపంచం డాట్‌కామ్‌లో స్థిరపడింది కరుణా వాత్సల్యం కనుమరుగై పోతుంటే నా కవిత్వం శిల్పనైపుణ్యంలో చిక్కుబడుతుందా? పగిలినవేణువై భగ్నరాగమే పల్కుతుంది? మనిషి చుట్టూ అభద్రతావలయాలు వస్తువ్యామోహాలు వెన్నంటి తరుముతూంటే నా కవిత్వం కమ్మటి నేతిగార౭లవాసన రాదు కదా! ఈ లోకంలో దుఃఖాన్ని జయించిన కవి ఎవడైనా ఉంటే నాకు చెప్పండి అతని చరిత్రను గానం చేస్తాను అతని పాదాలను స్పృశించి పరవశించిపోతాను ఈ ప్రపంచంలో పేమకంటే తీయని అభివ్యక్తి మరొకటి ఉందా! మానవత్వం కంటే మించిన "విశ్వమానవ సౌందర్యం వేరొకటి ఉందా! న నాకు చారెడు చిరునవ్వులు ॥ | || , దోసెడు స్వప్నాలు చాలు! స.

| ధిక్కార స్వరం! అరెయార్‌, కవిత్వమంటే గోడకు దిగ్గొట్టిన మేకుకాదు భుజానికి వేలాడే తుపాకీ. కత్తి అంచును సొన బెట్టాలంటే సానరాయి మీద గానీ కనుగుడ్డు మీద కాదురా! వ్యవస్థీకృత హింసోన్నాదానికి గురిపెట్టే లక్ష్యం కవిత్వం కవిత్వమొక సామాజిక సంస్కారం దోహచింతనపై ధిక్కారస్వరం అరెభాయ్‌, దిగుడు బావి మెట్లమీద కూర్చొని తాగుతూవుంటే ఎలా? లే... ఆ మెట్ల మీంచి పైకిరా | | బాట పక్కన నిలబడు ఇ ౯.

అక్షరాలన్నీ నీ దోసిట్లో పోస్తాను వాక్యాల పడవలు నిర్మించుకో! రాగాలన్నీ ఏరి నీ జేబు నింపుతాను బతుకు నేపథ్యాలన్నీ వొడినింపుకో అణిచిపెడ్తే ఆర్పి కూడా సాయుధ మవుతుంది తెలుసా? ఆయుధం మా ఉనికి ఆయుధం మా ఉత్తేజం ఆయుధాన్ని కోల్పోవడమంటే చెయ్యి పిడికిలిని కోల్పోవడమేకదా! ఆత్మరక్షణంటే ప్రజారక్షణేకదా! రానున్న కాలమంతా ప్రల్షించే తరానిదే ! ప్రతిఘటించే ధైర్యానిదేనని గుర్తుంచుకో |! అరే బేటా! చావెప్పుడూ భయంలోంచే పుడుతుంది చావును వెంటాడే సాహసంలోంచే సాయుధుడు పుడ్తాడు !| 12 తో

| నేరమెనరిది నూరాజా ? ఇప్పుడుచెప్పు! ఇంతకీ నేరమెవరిది మా రాజా? తలదాచుకోను గూడడిగిన పాపానికి గుండెల్లో దిగిన బుల్లెట్లదా ? రిక్త హస్తాలతో నినదించిన కోపానికి రక్తంతో వసంతమాడిన రాజ్యహింసదా ? మీ దేహాల్ని పాతి పెట్టుకోడానికి ఎకరాలు కేటాయించుకోండి మా కభ్యంతరం లేదు అంతేకాదు కిషాన్‌ ఘాట్‌లు, సేవాఘాట్‌లు నిర్మించు కోండి మేం ముడుచుకు పడుకోడానికి ముప్పై అడుగులు జాగా ఇవ్వండి చాలు ( | ్ర మీకు మరణం మధుర జ్ఞాపకం లో

మాకు జీవితం నిత్యసంకటం మేమేం నేరం చేశామని మా భర్తల్ని కూల్చారు ? మేమేం పాపం చేశామని మా బిడ్డల్ని పొట్టనబెట్టుకున్నారు ? కన్నబిడ్డని కళ్ళెదుటే కాల్చేసి "పైసలు విదిళిస్తే ఏరుకొనేదెవరు బాబూ! మా ప్రాణాలు మీ పరిహారం కోసమా? మాకీ అనుభవం కొత్తేమీకాదు మా అనుభవానికి ఓటమి లేదు మా నమ్మకాన్ని ధ్వంసం చెయ్యలేరు రాజ్యాంగం మీకు రక్షణకవచాలు నిర్మిస్తుంది. మాపై ఏ.క.47లు ఎక్కుపెడుతుంది. పోరాటాలు అవమానాల్ని ధిక్కరిస్తామని తెల్సుకో! దోరమగ్గిన గాయాలు మొనదేలి సలుపుతుంటే ఊపిరిని ఉగ్గబట్టుకొని ఎంత కాలమని యాచిస్తాం! అసహాయత లోంచి పుట్టిన కసి అడుగు వెనక్కి తిప్పదని రక్తం చిందిన ముదిగొండ నేడు కత్తులు నూరుతోంది జాగ్రత్త ॥ | శ

| త్రి క్షముయాధరిత్ర! వదిలెయ్‌ వాడిని వదిలెయ్‌ చరిత్ర హీనుడు వాడు నీ క్షమకు అర్హుడు కాడు వాడి గురించి అస్సలు పట్టించుకోకు పాలుతాగే రొమ్ముమీద పాదం మోజే చరిత్ర వాడిది రక్తబంధాళ్ని ఎడంకాలితో తన్నేసి విలువల్ని వెక్కిరించే నేపథ్యం వాడిది మాతృత్వమా! వీధినపడ్డ వార్థక్యమా! ఎక్కడమ్మా నీ చిరునామా? నీ చెమట చుక్కల్ని కూడేసుకొని చెప్పించిన చదువుకు సాక్ష్యం వాడు కార్పోరేట్‌ విజ్ఞాన చ్భాయల్లో ఎదిగి | గి బుద్ది జీవుడైన నీ ఏకైక కుమారుడు 1 / లో

అమ్మా నాన్నలకింత అన్నంపెట్టలేనివాడు డాలర్ల వేటలో అగ్రరాజ్యాలకు దాస్యం చేయడానికైనా సిద్ధమౌతాడు పసితనంలోనే తండ్రీని కోల్పోతే నీ కడుపును మాడ్చుకొని కాన్వెంట్‌లో చేర్ప్చించావు రెక్కలు ముక్కలు చేసుకొని రెసిడెన్షియల్‌ కాలేజీలో చదివించావు వాడి భవిష్టుత్తుకోసం నీ బతుకునే బల్లకట్టు చేసుకున్నావు వాడిప్పుడు ఎంతగా ఎదిగిపోయాడో?... మనీ మార్కెట్‌లో హోదాను పెంచుకున్నాడు మ్యారేజి బ్యూరోలో పెళ్ళాన్నీ ఎంచుకున్నాడు తల్లిప్రేమకు తూట్టుపాడిచి నీ దాస్యాన్ని దర్భంగా అనుభవించాడు తల్లుల తలరాతల్ని మార్చిరాసే ఈ కుమార బ్రహ్మల్ని చూసి ఈ సభ్యసమాజం సిగ్గుపడాలిగానీ నువ్వెందుకమ్మా తలదించుకుంటావు | నీ ఏకాకి నౌక చప్పుడు తీరం చేరక ముందే ఏకాంత ద్వీపాంతర వాసంలో వాడు కట్టుకున్న కలల సౌధం బీటలు వారుతోంది చూశావా? వాడి ఏకైక కుమారుడి చేతిలో | ( గునపం మెరుస్తోంది గమనించావా? రం సో

| కోల్పోతున్న మూల్యం బూల్యమంటేనే పరావర్తన సూత్రం అన్ని కాలాల్లోనూ అన్ని దశల్లోనూ మనల్ని వెన్నంటి నడిచే రుణపత్రం బాల్యమంటేనే బతుకు నేపథ్యం అనునిత్యం గుండె అంచుల్ని | పదునెక్కించే సరికొత్త వాక్యం పూట గడవని ఇంట్లోంచీ పనిలోకి తోసేసిన విషాదంలో కారుచౌక కూలీగా మార్ప్చుచెంది ఇటుకల్ని తలమీద మోస్తుంది మగ్గం మీద పేగుల్ని ఆరేస్తుంది మునివేళ్ళతో బీడీలు చూడుతుంది పూల కేనెలన్నీ చేదెక్కి వసంతం వలసపోయినట్లు | | విద్యా, విజ్ఞానం, మాగ్కెట్‌ సరుకులై ల్‌ /

వారి దరిద్రంతో పరాచికాలాడితే వారి కలల ప్రపంచం కుప్ప కూలిపోకేం చేస్తుంది ! నీవెంతగా... ప్రశ్నల జడివాన కురిపించినా విమర్శల సుడిగాలులతో చుట్టేసినా ఈ బాల్యం ఏ రాజకీయానికి పట్టదు ఆఅ కళ్ళ లోగిళ్ళలోకి ఏ అధికారము తొంగిచూడదు కృత్రిమ నాగరికత, అహాలమధ్య ఆత్మీయతల్సి తగలేస్తూ పాతతరాన్ని చీదరించుకునే వర్తమానం ఈ బాల్యానికి జవాబు దారీ వహిస్తుందా? ఒరేయ్‌ బాబూ! ఈ పోటీ ప్రపంచంలో ఆటబొమ్మవు నువ్వ! ఈ చేదు విషంలో జీవసారం నీ నవ్వు! తడబాటులేని గీతాళ్లోకంలా నన్ను చుట్టేసుకుంటావు అపస్వరం లేని పరిశుద్ధ గ్రంథంలా నన్ను వెంటాడుతుంటావు నిరంతరం జాగృత వచనంలా (1

నా చెవుల్లో గింగిరు మంటుంటావు నా అక్షరాలకు ఆవేశం నేర్చినవాడా నా కుంచెలోకి దృశ్యాల్ని నింపినవాడా నీవు కోల్పోయిన బాల్యం

ఈ దేశం చెల్లించలేని మూల్యం మొసలి కన్నీటితో

కంటితుడుపు చర్యలతో

నీ బాల్యం తిరిగిరాదు

ఎన్నెన్ని పథకాల

ఎంగిలి మెతుకులు విదిలించినా నీ అరచేతుల్లోకి

అన్నం ముద్ద చేరదు

సర్వ శిక్షా అభియాన్‌తో

నీకు సకల శక్తులు సిద్ధించవు |!

కవిత్వం నా ఫిలాసఫర్‌!

కవిత్వం నాకు కన్ను మూత పడని జ్వరం

కవిత్వం నా కనైప్పల మీద వాలిన నమ్మకమైన కల

ఒక్క కవితా వాక్యం

ఈ గుండె లోతుల్లోంచీ

ెల్టుబికి రావాలంటే

ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో

వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్నే అడుగు

అక్షరసైన్యం నా వెంట నడిస్తేచాలు

నా సర్వస్వం కోల్పోయినా

లెక్క చెయ్యను

కవిత్వమై మిగిలిపోతాను

ఈ గుండెచప్పుడు ఆగిపోయి

ఈ తెప్ప ఏ రేవులోకి చేరవేసినా

అక్కడ పచ్చని మొక్కై

మళ్ళీ ప్రాణం పోసుకుంటాను | | భాష్బీకృత జీవద్భాష కవిత్వం లో.

నరాలపై తంత్రీ ప్రకంపనం కవిత్వం

సారవంతమైన స్మృతిలో

పారదర్శకమైన జ్ఞాపకం కవిత్వం

ఏకాంత దుఃఖమా |

నీ పేరు కవిత్వమే కదూ!

నువ్వు పొగిలి పొగిలి ఏడుస్తున్నావంటే

కవిత్వమై రగిలిపోతున్నట్లే తెక్క

దుఃఖించని వాడూ

దుఃఖమంటే ఎరుగనివాడూ

కవి ఎలా అవుతాడు?

ఢ్రేమించని వాడూ

ఢేమంటే తెలియనివాడూ

(పేమికుడెలా అవుతాడు?

ఏకాకిగా మిగిలిన వాడూ

ఎవర్నీ పట్టించుకోనివాడూ

బతికున్నా మరణించినట్లే లెక్క

కన్నీళ్ళను బహిష్కరించేవాడికి =

బతుకు పుస్తకంనిండా

అన్నీ అచ్చుతప్పులే!

జీవించే హక్కును

కాలరాచే చట్టాలతో

జానెడు పొట్టకోసం

పిడికెడు దుఃఖంగా - మిగిలేవాడు మనిషి ॥ | ఈ మనిషి బలహీనతల మీద లో

వ్యామోహాలమీద ఎదురుదాడి చెయ్యగలవాడే కవి! రోజు రోజుకూ దట్టమౌతున్న ఈ మానవారణ్యంలో చిక్కనవుతున్న వ్యాపారకాంక్షల్లో ఓ మృదువైన మాటకోసం ఓ ఆర్ధమైన లాలన కోసం ఓ వెచ్చటి ఓదార్పు కోసం కాలం మైలు రాయిమీద తలవాల్చి ఎదురు చూస్తున్నా కవిత్వం నా ఫిలాసఫర్‌ కవిత్వం నా గైడ్‌ !!

జ్ర

| పోటెత్తే గాయాలు! అలి జఒకానాక సంక్షిష్ట స్థితిలోనే సంఘర్షణ రాజుకుంటుంది వర్తమాన సామాజిక సందర్భాలన్నీ సంక్షోభంలోనే మొదలవుతున్నాయి జీవితం శకలాలు శకలాలుగా విడిపోతున్నప్పుడు గాయాలన్నీ బహిరంగ ప్రదర్శనలే సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించి _ ఉరికొయ్యకు ఉయ్యాలలూగిన 'సద్దాం'ను నేనింకా మరువనేలేదు పైశాచిక శక్తుల పాశవిక దాడిలో బేనజీర్‌ బలిదానం నా కంటిపాపలో ఇంకా దృళ్యమై నిలిచేవుంది వాకపల్లి ఆదివాసీల (0 పగిలిన గాజుల ముక్కలు లో

ఈ గుండెల్లో

గుచ్చుకుంటూనే వున్నాయి ముదిగొండ, నందిగాం

మృతుల చితులింకా ఆరనేలేదు మతోన్మాదులు తస్టీమాపై జరిపినదాడిలో లౌకిక ప్రజాస్వామ్యం “లజ్జ' తో తలదించుకుంది. గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కుల విధ్వంస విస్ఫోటనంలో విస్తుపోయిన మానవహక్కుల విషాదం రాజ్యహింస ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుంది కత్తులవంతెన మీద నడిపించి

రక్తంతో వసంతమాడుతుంది సామ్రాజ్యవాదం

ట్రిగ్గర్‌ మీద తన చూపుడు వేలు నిలిపి శాంతిమంత్రం జపిస్తుంది.

కన్నీళ్ళను (పేమతో స్పృశించి

పెదాలపై నవ్వులు పులుముకొని కరచాలనం చేస్తుంది

ప్రతి ఐదేళ్ళకోసారి

అధికారం మారినప్పుడల్లా

దోపిడి చేతులు మారుతుంది

రాజకీయ చదరంగంలో శ్రీ

సంఖ్యాబలమున్న వాడే సర్వాధికారి ఆయుధాలున్నవాడే అధిక సంపన్నుడు ఇతిహాసపు చీకటి కోజాలన్నీ

రక్తసిక్త అనుభవాలే కదా!

మానవ సమూహం పైన

లాఠీలతో దాడి చేస్తే

తుపాకులతో కాలరాస్తే క్రతగాత్రులంతా ఏకమై

ఉద్యమాలు నిర్మించుకుంటారు యోధుడు మరణించడు

బలదానం కోరుకుంటాడు "= సామ్రాజ్యవాదికి

యుద్ధం ఓ క్రీడా వినోదం

సంపన్న దేశాలన్నీ

వాడి కనుసన్నల్లో మెలిగి

సెల్యూట్‌ చెళ్యూలి

అణు ఒప్పందం

పడగ నీడలో ప్రాణదీపం వైరుధ్యాలతో దగ్గమయ్యే

ఈ దేశ నైసర్గిక రూపాన్ని నేనూహించలేను

మట్టి మీద మమకారం

వాడికి గిట్టదు

మట్టి అట్టడుగు పారల్లోని ॥ ర్‌ చమురు నిక్షేపాలపైనే వాడికన్ను లో

ప్రపంచ సంతలో అంతా వ్యాపారమే, వస్తువ్యామోహమే కన్పించని శత్రువు ప్రపంచ మేధావి మనిషిని మార్కెట్లో నిలబెట్టి నీ ఆకలిని నిర్వీర్యం చేస్తాడు కత్తివాడి చేతిలో ఉన్నంతకాలం చెట్టూ మనదికాదు కాయలూ మనవి కావు తల్లి చనుబాలను సైతం నువ్వు చవగ్గా సరఫరా చెయ్యగల్లితే పేబెంట్‌ హక్కులతో నిన్ను ప్రేమగా స్వాగతిస్తాడు ఆకలి నీ పురాకృత పుణఖ్యమనుకుంటే నీ రొట్టె కూడా కోతి నోటికే దక్కుతుంది చెట్టునీడేనీకు శాశ్వతమనుకుంటే నువ్వు నిలబడ్డ నేలకూడా నీది కాకుండా పోతుంది సమస్యలెన్నున్నా నువ్వు సజీవంగానే వుండాలి వ్యాధులూ, బాధలూ వృద్ధి చెందుతూనే వుండాలి నీతి న్యాయాల్ని నిస్సిగ్గుగా అమ్మకానికి పెట్టి పావురాల్ని పలావుగా వండించుకుతింటాడు వాడు (పేమించడాన్ని నిరసించి శ్రీ

ద్వేషాన్ని గొప్పకళగా అభివర్ణిస్తాడు

ఈ భూమ్మీద సంస్కృతినీ, నాగరికతనూ సమూలంగా సమాధిచేసి

మానవ సంబంధాల్ని కరెన్సీతో మాత్రమే కొలుస్తాడు

జీవద్భాషను మృతప్రాయం చేసి

వ్యాపార భాషకు అనుసంధానం చేస్తాడు పోటెత్తే గాయాలు

కంటి మీద కునుకు లేకుండా చేస్తూంటే భయం పిరికితనమై వెంటాడుతూ

కంటి మీద కునుకులేకుండా చేస్తున్సుంతకాలం

విరుచుకు పడ్డున్న వినోదాల వెల్లువలో వర్తమానం కొట్టు మిట్టాడుతున్నంతకాలం ఈ అణిచివేతను తీవ్రంగా నిరసించే అక్షర సైన్యం నా కవిత్వం

బతుకును (పేమించగల్లినంత ఇష్టంగా చావును (పేమించగల స్థైర్యం నా కవిత్వం 1!

| ఆఖరినుతుకు! మన సామాజిక పరిజ్ఞానమంతా సంప్రదాయాల సంకెళ్ళతోనూ ఆచారాల సుడిగుళ్ళతోనూ అల్లుకు పోయినచోట మనిషిని మనిషిగా చూడడమేపాపం మనిషి మనిషిగా ఎదగడమే నేరం ఈ మనిషిని ప్రేమించే స్వభావం కోసం ప్రతిభను గుర్తించే జ్ఞానం కోసం మనువుని కాదు మార్క్‌ని చదవండి కౌటిల్యునికాదు ప్లేటోని చదవండి భారత రాజ్యాంగం అర్ధం కావాలంటే అంబేద్కర్‌ను చదవండి ఒక బుద్ధుడు, ఒక చార్వాకుడు ఒక మహావీరుడు సాగిపోయిన బాటలో నడిచి /[ మానవతావాదాన్ని ప్రకటించిన లో

ఈ జ్ఞాన యోగిని అధ్యయనం చెయ్యండి

శిల్పిని వేరుచేసి

శిల్పాన్ని చూడగలమా

కవిని విస్మరించి

కవిత్వాన్ని చదవగలమా !

భౌతిక అగాధాల మధ్య

భావ విష్ణవం సాధ్యమైతేనే

ప్రజాస్వామ్యం, సామ్యవాదం

అర్ధవంత మౌతుంది

అర్ధిక, సాంఘిక

రాజకీయ అధికారంలో

ప్రజలందరూ భాగస్వాములైననాడే

సామాజిక సాంస్కృతిక

విప్లవం సాధ్యమౌతుంది!

రాజ్యాంగం ఏ కొందరి చేతికో

దక్కిన ఆస్తికాదు

అందరం కల్సి, అందరికోసం

నిర్మించుకున్నదే ఈ ప్రజాస్వామ్య సౌధం

పాలక విధానాలు

సామాజిక సంక్షోభాల్ని పట్టించుకోవు

అధికారం కోసం

పాదయాత్రలు, “రోడ్‌షో'లు నిర్వహించి

బలహీన వర్గాలపై

అప్పుల వలలు విసిరేస్తాయి (0

పథకాల మెతుకులు చల్లి గ గో టో

ఓట్లను దండుకోవాలని చూస్తాయి ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసాన్ని దిగంబరం చేస్తాయి అణిచివేత, హింస

ఆధిపత్య పోరాటంలో భాగమే

భూత, భవిష్యత్‌ వర్తమానాన్ని కలవరపెట్టి కుదిపేసే

సవాలక్ష సందేహాలకు

మానవీయ మూల్యాలను

బౌద్ధంలో దర్శించిన

దార్శనికుడు అంబేద్కర్‌

రోజురోజుకూ

విసృత మౌతున్న సకలవైరుధ్యాలను సమాయత్త పర్చి పోరాట దిశగా మళ్ళించే సాయుధం అంబేద్కరిజం ఇవాళ

నా విస్తరిలో ఆఖరిమెతుకై

నా మునివేళ్ళను ముద్దాడిన అంబేద్కర్‌ కవిత్వమై కలవరపెట్టి

నన్ను నిలువునా చుట్టేసుకున్నాడు.

౮0, స.

| సొందర్య రాహీత్యంలో... అమాయికత్వానికి అచ్చమైన అకృతిలా ఇక్కడో పల్లెపట్టు వుండాలి ఇప్పుడు కన్పించదేమిటి? ఈ కొండల, కోనల గుండెల్లోంచీ వడివడిగా దూకే జలపాత ముండాలి అది మా బాల్యమూకకు స్నానఘట్టమై తపన దీర్చేది ఇప్పుడది అదృశ్యమై పోయిందా ? ఇక్కడే ఈ చీలిన కాలిబాటలో ఓ మాతృమూర్తి నిలబడి తన నుదురుకు చేయి అడ్డం పెట్టుకొని పని కోసం పట్నం వలస బోయిన కన్నపేగుకోసం ఎదురు చూసేది | | నే నా బాటమీద నడిచినప్పుడల్లా తో

దుమ్మురేగిన ఆమె పాదముద్రలు వెన్నెల చేతి కర్రల్డా నా వెన్నంటే నడిచేవి నేను పట్నం బస్సు దెగి

ఆ మిట్ట పల్టాల మీద నడుస్తుంటే గొల్ల గురవయ్య కూతురు ఎదురొచ్చి నా చేతుల్లో బరువంతా తానేమోసేది ఆ పిల్ల రెండు భుజాలమీద

చిరిగి పోయిన ఆ చోళీ

చిగురేసిన మా స్నేహాన్ని

ఎగతాళి చేసేది

ఓ బుజ్జిమేకపిల్ల

ఆ పిల్ల పరుగుతో పోటీపడేది ఇప్పుడా గుడిసేదీ ?

ఆఅ గొల్ల గురవయ్యేడీ ?

ఆ మేకపిల్లా, ఆ కన్నెపిల్లా కన్పించదేమిటి ?

సాయం సంధ్య బూడిదరంగులోంచి పాగడపూల పాదల్లోంచీ

నాటి స్వాప్నిక దర్శనం

నేడు గగనమై పోయిందా ? నేనెక్కడికి వచ్చాను ? నేనెక్కడున్నాను ? ్ర / ఒంటెద్దు బండిలోంచీ "స్మ /

నగరం నాగరికతలోకి దార్లిపోయాక

నా ఊరే నాకు పరాయిదై పోయిందా ? నేను నా ఊరికే పరదేశినయ్యానా ? ఇప్పటికీ 1

నా శ్వాస నా సల్లెది

నా ప్రాణం మాత్రం పట్నంది

నిజం చెప్పనా...

నేనిప్పుడు

ఆత్మను కోల్పోయిన

సౌందర్యవాదిని |

సజలనేత్రి సాక్షిగా...

ఓ సజలనేత్రి

అణగారిన దీన స్వరంతో

పితృస్వామ్యం సాక్షిగా

దుఃఖాన్ని మోస్తూ నడుస్తోంది

చరిత్ర పుటల్లో దాగిన

ఓ దీర్ధకాలిక వ్యధ

లింగ వివక్ష కారణంగా

మౌనహింసను భరిస్తూ

స్వీయ మరణాన్ని

స్వయంగానే కలవరిస్తోంది.

పురుష స్వామ్య వివక్షలో

ఓ చాకిరీ యంత్రం

బరువు బాధ్యతల నడుమ

నీతి సూత్రాల సంకెళ్ళతో

తనలో చెలరేగే శ్‌ (| భావోద్రేకాల అలజడిని సైతం న

మునిపంట నొక్కి అదిమిపెడ్తోంది తండ్రికి కూతురిగా

అన్నకు చెల్లిగా

భర్తకు భార్యగా

కొడుక్కి తల్లిగా

పాత్ర లెన్ని మారినా

తెరవెనుక సూత్రధారి

చూపుడు వేలు శాసిస్తున్నంత కాలం ఈ బతుకు ప్రయాణంలో

అన్నీ మజిలీలే, గమ్యం లేదు ఆకాశంలో సగమైనా

అవకాశాల కల్పనలో

ద్వంద్వ నీతి ప్రమాణాలే చెల్లుబాటయ్యే కాలంలో

నువ్వు ముందు వరుసలో నిలబడ్డా చివరి వ్యక్తివే సుమా!

సోదరీ, దిగులు చెందవద్దు

నీ దుఃఖ మెన్నటికీ వృధాపోదు

నీ ఆశయ సాధనకు

నా అక్షరాలు తోడుంటాయి

ఎవరి సానుభూతినీ నమ్ముకోకు

నీ స్వానుభవమేచాలు

సమాధానం చెప్పడమే కాదు ప్రశ్నించే స్వరం నీది కావాలి | ( ీ ఒక గాంధారి, ఒక చంద్రమతి కంటే సో

ఒక మహాశ్వేతాదేవి, మరొక అరుంధతి రాయ్‌ నీకు అభిమానపాత్రులు కావాలి ఒక దమయంతి, మరొక సావిత్రికంటే ఒక మదర్‌ తెరిసా, మరొక మథాపాట్కర్‌ నీకు ఆదర్శం కావాలి

ఒక సీత, మరొక (ద్రౌపది కంటే

ఒక ఇందిరాగాంధీ, మరొక కిరణ్‌ బేడీ నీకు ఉత్తేజం కావాలి

ఆత్మవిశ్వాసమే నీకు

అభిమాన ధనం కావాలి

నీ కోసం సంపెంగలు పూస్తాయని సన్నజాజులు పలవరిస్తాయని

మొగిలి రేకులమీద

నిన్ను నడిచి రమ్మంటారు

మానవీ ! మరోసారి

మోసపోవద్దు జాగ్రత్త !

నువ్వు ప్రబంద నాయికవి కాదు వర్తమాన “మహిళగా

నిన్ను నీవు నిరూపించుకో !

త్త ర్య నో అ ఒ| ఖడదప్రహారం! గీ. ఆవేశానికి అక్షరాల్ని జతకూర్చి చూపును ప్రశ్నార్థకంగా ఎక్కుపెట్టి కవిత్వమై దూసుకొచ్చినవాడు- అత్మశాంతితో జీవిత శిఖరాల్ని అధిరోహించి కాలాన్ని అధిగమించి కొత్తయుగాన్ని ఆవిష్కరిరచినవాడు- ధరిత్రిని కలంతోదున్ని చరిత్రను ఆధ్యయనం చేసిన హాలికుడు- అన్నికాలాల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ నిత్యనూతనంగా పద్యమై రగిలి ప్రామాణికతను ఫణంగా చెక్కిన శిల్చి- | |

రూసో మానవతావాదాన్ని గ్రుమించి గురజాడ నవ్య కవిత్వాన్ని ఆపోసనపట్టి శిల్పాన్ని మధు పాత్రలా ఎత్తిన శాబ్దిక శార్దూలం - కవిత్వం రాజకీయం కారాదు అది సిద్దాంతాల రాద్ధాంతంకాదు అనుభవైకవేద్యమే అసలైన కవిత్వమన్నవాడు - 'ప్రాచీనుల్లో ఆధునికుడు సనాతనుల్లో స్ఫురద్రూపి కొమ్మల్ని చీల్చుకొచ్చే పూలంటే ప్రగాఢ విశ్వాసమున్నవాడు - ఆధునిక తెలుగు కవితకు విష్ణవాభివ్యక్తిని సృష్టించిన ఖడ్గ ప్రహారం ఆ కవిత్వం ! ప్రాతఃకాల స్వప్పంలో ఆమని కోయిలగానం ఆ కవిత్వం శేషేన్‌! నీ పల్కరింపుతో రాత్రులకు రాత్రులే కవిత్వంతో తడిసిపోతాయి కదా | క.

నీ చిర్చవ్వుచాలు - సెలయేటి గలగలలు సైతం కవిత్వంతో మిలమిల లాడ్డాయి కదా 1 నీవు కనుపైగచేస్తేనే బాల్కనీలోకి తొంగిచూసే చంద్రుడు పానశాలలో ద్రవరూపమై వొదిగి పోతాడు గులాబీ రేకులతో గుజ్జెనగూళ్ళు కట్టి ఆఅడుకుంటాయి నక్షత్రాలు శేషేన్‌ | నువ్వు ఉషస్సు కోసం తుఫాన్లతో కరచాలనం చెయ్యగలవు భూకంపాలను మునివేళ్ళతో నిమిరి వెచ్చటి ఆవిరిగా మార్చగలవు ప్రవహించే జీవనదిని | దోసిట్లో నింపుకొని కవిత్వ జలంగా మంత్రించగలవు కలల వసంతంతో గొంతెత్తిన నీ కవితాగానం మా కరువు సీమలో గర్జిస్తూనే వుంది నిన్ను తల్చుకున్నప్పుడల్లా

  • తడి తడిగా చెమరిస్తూ తడబడుతున్నా! ... నేను ! ్ర () శోపేంద న్మృతిలో "సతో

| చివరి సంతకం! మైడియర్‌ థ్రుండ్‌ ! మనదారులు చీలిపోతున్నాయి మనం విడిపోయే సమయం ఆసన్నమైంది ఎందుకైనా మంచిది - ఇక్కడే చివరి సంతకంగా విడిపోదాం అంతిమ జ్ఞాపకంగా మిగిలిపోదాం జీవితానికి వేగం ముఖ్యమో గమ్యం ముఖ్యమో తెలియని సందిగ్ధంలో మనిషితనం కోల్పోయి నువ్వు మార్కెట్‌ వెంట పరుగులు తీస్తున్నావు క్షమించు... నీతో కరచలనం చెయ్యలేను కల్సినడవలేను ప్రవేశమే తప్ప నిష్క్కమణం లేని 4 ఒకానొక షుగర్‌ కోటెడ్‌ లో

విషసంస్కృతిలోకి

నా కళ్ళముందే నువ్వు జారిపోతూంటే

వెబ్‌సైట్‌ వసంతంతో

గానం మర్చిపోయిన కోయిలనై

నేనిక్కడే నిలబడి పోయాను న దారి పొడవునా నెత్తుటిమంటలు

నాలుకలు చాస్తున్నాయి

ఆనవాళ్ళను చూపించి

హతుల చిరునామాలు

వెతుక్కోమంటున్నాయి

అనుకూల మిత్రుడే

నీకు శత్రువు

దోసెడు కలలు నీపై చల్లి

నిన్ను నిలువుదోపిడీ చేస్తున్నాడు

సౌందర్య విడిభాగాలను

చవగ్గా అందజేసి

నీ చెల్లి తలపై

సౌందర్య కిరీటం పెడ్తున్నాడు

నవ్వుతూనే నీ నాలుకలో

ముల్లు దించుతున్నాడు

వస్తు వ్యామోహంలో

నిన్ను ఓలలాడించి

నీ నమ్మకాల రెక్కల్ని కత్తిరిస్తున్నాడు

ఈ మనుషుల మీద అధికారం | జీవితం మీద ఆజమాయిషీ [! /

“అంతా వాడిదే!

గాయాల ఆనవాళ్ళుదొరకని చిత్రవధలో ఎవడికి వాడే ఓ నిప్పుల ఉప్పెన కంప్యూటర్‌కైనా, కరెన్సీకైనా మమకారాలేం తెలుస్తాయ్‌

మనుషుల్ని ఆడించడం తప్ప

అంతా గ్లోబల్‌ మాయాజాలం ఎప్పటికైనా -

ఈ విషవలయాన్ని ఛేదించుకొని

ఈ బినామీ బతుకు నుండి బయటపడి

నా కోసం వస్తావనీ

నీ స్తేహహస్తం కోసం

నా చేయి చాస్తూ...

ఈ కల్లోల సముద్రాన్ని ఈదుకుంటూ ఆవలితీరం వైపు

ఆశగా సాగిపోతున్నాను !

| కవిత్వానికి ప్రేమలేఖ... కాలం చిటికన వేలు పట్టుకొని నా కవితా కన్య అడుగులేస్తోంది నిద్రకూ మెలకువకూ మధ్య నిత్య జాగరణతో అమలిన హృదయం కోసం అన్వేషణ ప్రారంభించింది క్రిక్కిరిసిన ఆశయాలతో ॥ ఊపిరాడని ఉద్రేకంతో అడుగడుగునా నైరాశ్య వలయాలు తెరలు తెరలుగా కన్నీళ్ళు మసక మసకగా దృశ్యాలు దుఃఖం తీగలై సాగి భాష్ప నైవేద్యం సమర్చిస్తోంది అనుభవాలన్నీ గాయాలే శ ్ర గాయాలన్నీ అనుభవాలే లో

అడుగు సాచలేని దూరంలో గమ్యం వుంది పాతికేళ్ళ ప్రాయంలో ప్రపంచమంతా నా ముందు దోసిలిపట్టి నిలిచేది యాభై దాటిన ఈ వయసులో ప్రకృతి సమస్తం ఆకులు రాలిన రుతువై నా వైపు దీనంగా చూస్తున్నట్లే వుంది అచంచల (ప్రేమలో అత్మవిశ్వాసం కొడిగట్టదు యెడబాటు దీర్ధమైతే (పేమ కుదించుకుపోదు ప్రేమించడమంటే - ఒక స్వర్గంలోకి ప్రయాణించడమే స్వప్నకాసారంలోకి ప్రవహించడమే (పేమకై జీవించడం (ప్రేమతో మమేకం కావడం ఊహల దాహార్తిలో పెదవులపై తడి సంతకం దిద్దినట్లే నీకు నాకూ మధ్య ముగింపులేని కవితా వాక్యంలా ఈ ప్రేమలేఖ... రాసిన ప్రతి వాక్యం చివరా నా సంతకమే వుండాలని తపన ఈ మనుషుల మధ్య శ్రీ

దీర్ధమైన ధ్రేమ రాహిత్యంలా

ఈ అక్షరాలమధ్య

సామరస్యం కుదరనప్పుడు

భావం ఏకాకిగా మిగిలిపోతుంది పరిహాసాలు పల్లవించే కాలంలో దరహాసాలు పుష్పించవు

కనైప్పల టపటపల్లో కంజీర పల్కనట్లు మందహాసం ఒక్కసారిగా

వలస బోతుంది

మమతానుబంధం దూరమౌతుంది ఆకారం లేని తియ్యటి బాధ

ఈ గుండెల్లో సలుపుతూనే వుంటుంది దగాపడిన విశ్వాసాన్ని వెక్కిరిస్తూ గడపగడపనూ గాయాలతో కడుగుతున్నట్లే వుంటుంది

ఒక నాజూకుచేతన

మౌన వ్యాఖ్యానం

రచిస్తున్నట్లే వుంటుంది

మబ్బుల్లో దోబూచులాడే

అస్పష్ట చంద్రరేఖను చూసి

ఓ ఒంటరిపిట్ట

ఒంటికాలిపై నిలబడి

తన అంగవైకల్యాన్ని

అదే పనిగా ప్రదర్శిస్తోంది (0 సున్నితమైన వీణ మెట్టపై నో /

వెన్నెల జల్గిపాతం గారాలుపోతోంది అదును తర్వాత ఓచినుకు మట్టినిముద్దాడ' బోతే మూతిముడుచుకుంది

ఓ గరికపువ్వు

ఆకాశాన్ని అవలీలగా

ఈదేస్తున్న పిట్టలగుంపాకటి తొలిసంజె చెరుగును మునిపంటలాగుతూ

వయ్యారాలు పోతోంది

నా కవితా సృజన కోసం

ఈ ఏకాంత సాయంసంధ్యను ఇంకాస్త పొడిగించుకొని

నా వెంట నడిపించుకు పోతాను పడవను నడిపే సరంగు

నది మీద అలిగి దిగి వెళ్ళిపోతే నీకు భయమెందుకు?

మనదైన కాల్పనిక నావలో

ఊహల కెరటాలలో ప్రయాణించి ఆవలి తీరం చేరుకుందాం! ప్రకృతిలో పాటె చుట్టివద్దాం కంటిపాపల్లో దృళ్యమై మిగిలిపోదాం మన ప్రేమను...

పురాతన సంస్కారంగా గ్ర / ఈ ప్రపంచానికి చాటుదాం శ్రీ( గగ

ఓ నాప్రాణ హంసా | ॥ రెండు పుష్కరాలుగా

నీ అన్వేషణలోవున్నాను

ఏ స్వర్గ ద్వారాలకు

తోరణమై నిలిచావో

ఏ గాంధర్వలోకంలో

సుస్వర సుమధుర నాదమై పలుకుతున్నావో

ఓ కవితా...

నిన్ను నేను (ప్రేమించకుండా వుండలేను నిన్ను దక్కించుకోలేని

నిస్సహయతలో

ఓ శిక్షా శిబిరంచుట్టు

నా బతుకు పరిభ్రమిస్తూవుంది

నిన్ను శ్రేమిచడమే నేరమైతే

నా ఉనికి ప్రశ్నార్థకమే సుమా ॥

ఉష్టరక కాసారనూ! లాల్‌సలాం! ధో అల్‌ యోధుడు యుద్ధనీతినే అనుసరిస్తాడు మాతృదేశాన్ని ప్రేమించేవాడికి ॥ మరణనుంటే లెక్కేలేదు వాడు కలుగులో వున్నా బోనులో నిలబడినా శిరసెత్తి ఠీవిగా నిలబడి సింహనాదమే చేస్తాడు తలపై ఎగిరే శ్వేతసౌధవు డేగకు తన కండల్ని చీరేసి ఎగరేస్తాడే తప్ప తలోంచడు, కాల్మొక్కడు రక్షణ వలయంలో జీవిస్తున్నా సామ్రాజ్యవాది ఎప్పుడూ పిరికివాడే తలెత్తి ప్రశ్నించేవాణ్లీ చూస్తే శ్రీ

వాడికి పక్కమీద నిద్రపట్టదు ధిక్కారస్వరం వినిపిస్తేచాలు చావుడప్పుగా వణికిపోతాడు

నెత్తుటి మడుగులో స్నానంచేసేవాడు దప్పిక తీరక చావాల్సిందే ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మలుచుకున్నవాడు

నెత్తురు ధారలు కడుతున్నా ఆయిల్‌ మరకలంత హాయిగా తుడిచేసుకుంటాడు

ఆ కంఠం కౌగిలింత కోసం ఉరికొాయ్యే తలవంచి ముంగాళ్ళమీద నిలబడి ప్రార్ధించింది బాగ్దాద్‌ నగరవీధులన్నీ

దుఃఖంతో చిల్లులు పడ్డాయ్‌

ఇరాక్‌ పౌరసత్వం

నిద్రాహారాలు మానింది

ఖర్జూరపు చెట్లన్నీ

నిశ్చలంగా నిలబడి ధ్యానంచేశాయి ఓ బాగ్దాద్‌ అమరసింహమా

ఉష్టరక్త కొసారమా 1

అందుకో నా లాల్‌ సలాం ॥ (అమరయోధుడు నద్దాం న్యృతిలో శ

| ఎడారి నసంతం |! ఊళ్ళు బీళ్ళవుతున్నాయి పల్లెలు తల్లడిల్లి పోతున్నాయి నగరంలో సంస్కృతీ సభ్యతలు ఆశ్లీలం అంచులు దాటి దూసుకుపోతున్నాయి తల్లిపేగు దుఃఖ భాషతో తండ్డాడుతోంది ఈ మౌన వేదనను అక్షరీకరించాలంటే గుండెదిటవు చాలకుంది దేశంలోని జీవనవైరుధ్యం ప్రమాదస్థాయికి చేరుకుంది ఎవడి స్వార్ధం వాడిది ఎవరి ప్రయోజనం వాడిది ఆధునిక జీవితం విలాసవంతమై మనిషి అవసరాల్ని పెంచిపోషిస్తోంది గ ( మనిషి వ్యక్తిత్వాన్ని వై

మార్కెట్లో రూపొందించి

ఖరీదైన కలలకొనుగోలు శక్తికి

దాసోహం చేసింది

గ్లోబలైజేషన్‌ క్రీనీడలు

మన తార్కిక జ్ఞానాన్ని

ఎగతాళి చేస్తున్నాయి

ధ్వంసమౌతున్న సమస్త విలువలకూ

ఈ జీవితం ప్రత్యక్ష సాక్ష్యమైంది

ప్రపంచీకరణ వ్యాపార సంస్కృతి

ఈ మనుషుల మధ్య

(పేమరాహిత్యాన్ని పెంచి పోషిస్తోంది

మానవసంబంధాలన్నీ

కథల్లో కావ్యాల్లో మాత్రమే

అపురూపంగా గోచరిస్తున్నాయ్‌

ఆర్థికబంధాలు అనుబంధాల్ని శాసిస్తూ

అమ్మకానికి తరలిపోతున్నాయ్‌

(పేమ పాశాల్ని తెంచేస్తున్నాయ్‌

మనకు తెలియని, పైకి కన్పించని

ఒక భయానక అగాథంలోకి

నెట్టివేయబడుతున్నాం

జీవితాన్ని ప్రబలంగా శాసించే

ఉద్రేకాలన్నీ ప్రపంచీకరణలో భాగమే

సే జీవన రంగాల్మాకి ఆనన! గా చొాచ్చుకొస్తున్న యప లో యు

[మ ₹గంరం

ఈ గ్లోబలైదేషన్‌ సొమ్రాజ్యవాదం కంటె

ప్రమాదకరం

నేడు ఈ మనుషులందరూ వినియోగ్శదారులే

తమ కలల కరెన్సీ కోసం

ఆత్మల్ని తాకట్టుపెట్టే విలాసజీవులే |

నేడు స్వేచ్చ జీవంలేని బానిసైంది (ప్రజాస్వామ్యం వ్యాపారలావాదేవీల్లో తలమునకలైంది

ఇతిహాసపు ప్రాచీన పునాదులన్నీ నేలమట్టమవుతున్నాయ్‌

మనకింక ఉదయరాగాలు

మనోహర సుషప్రభాతాలూ

మచ్చుకైనా కన్పించవు

ఎడారి జీవితం తప్ప |

మతోన్నాదికి మనిషి మనుగడ గిట్టదు సామ్రాజ్యవాదికి శాంతి మంత్రం చెవికెక్కదు ఉగ్రవాదికి విధ్వంసమే లక్ష్యం

శవాలమీద సవారీచేసే సామ్రాజ్యవాదపెత్తనం

మన కాళ్ళ కింద భూమిని సైతం తన్నుకుపోతోంది గ / బహుళజాతి కంపెనీ కనుసన్నల్లో "సళ

గాలీ, భూమీ, నీరూ సైతం

విర్షణ పొందుతున్నాయ్‌

విజ్ఞానం వినోదం పంచాల్సిన ఛానళ్ళన్నీ మార్కెట్‌ వస్తువుల విలాస క్రీడల్ని ప్రచారం చేస్తూ చాపకిందనీరై సాంస్కృతిక దాడి చేస్తున్నాయ్‌ మనిషికిప్పుడు ఆత్మవిశ్వాసం లేదు వస్తువ్యామోహంలో చిక్కుకున్నాడు గాలాన్ని ముద్దాడే చేపకేం తెల్సు తన బతుకే వేలంపాటై పోతుందని వలలో చిక్కిన పావురానికేంతెల్సు బోయవాడి ఆపేక్ష

తన్ను కరకరా నమిలేస్తుందని |

| శేష ప్రళ్న ఓ అక్షరం ధీమాగా నా ఛాతీమీదుగా నడిసొచ్చి నా కంటి పాపల్టోకి తొంగిచూస్తూ క్షోభని వెతికిపట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది ఎక్కణ్జుంచో ఓ వలసపక్షి ఎదురొచ్చి బెరుకు బెరుకుగా నా భుజమ్మీద వాలి అంతలోనే పిడుకెడుధైర్యాన్ని నా గుండెలోంచీ తోడుకొని స్వేచ్చగా ఎగిరిపోయింది శిశిరానికి చివరిసారిగా వీడ్కోలిచ్చి వస్తూవస్తూ వసంతాన్ని వెంటబెట్టుకొచ్చాను మా ఇంటి వసారోలోని చిలుకకు పంజరం నుండీ స్వేచ్చనుకల్పించి ప్రేమగా నిమిరి ॥| శీ ఓ చిగురు కొమ్మపై నిలబెట్టాను స

ఆ కొమ్మలరెమ్మల్లోంచీ ఓ పూవు

నా ఒడిలోకి జారిపడింది

కృతజ్ఞతంటే ఇదే కాబోలు!

అప్రయత్నంగా ఓ కన్నీటిచుక్క

నా బుగ్గపై జారింది

ప్రతిస్పందనంటే ఇదేకాబోలు

మన ప్రేమల్సీ స్ప్నేహాల్ని

కన్నీళ్ళనీ, చిరునవ్వుల్నీ వస్తువ్యామోహంలో

తప్పిపోనీకండి

వేనవేల లేత దరహాస చంద్రికల

సౌందర్యాన్ని శేషప్రశ్శగా

మిగిలిపోనీకండి

ఈ లోకంలో ఏదీ స్థిరం కాదు

ఎవ్వరూ శాశ్వతం కాదు

(పేమ ఒక్కటే నిజం

'స్నేహమొక్కటే శాశ్వతం

దయచేసి మీమీ ప్రేమల్ని

మీ నుంచి దూరం కానీకండి

శూన్యం బరువెక్కుతుంది

మోయలేరు 1 శ లో

| ఓటమి నా ప్పునరుర్గానం |! థి మిత్రుడా! నేనోడి పోయాను నీ నిలువెత్తు విశ్వాసం ముందు నేను నిజాయితీగా తలదించుకుంటున్నాను ఓటమి నా కెదురు పడని అనుభవంకాదు "స్నేహం ముందు ఓడిపోవడమంటే నా కెంతిష్టమో చెప్పలేను 1 అమ్మముందు ఓడిపోవాలని భార్యముందు గెలవాలని అందరూ అనుకుంటారు నాకైతే ఇద్దరిముందూ ఓడిపోవాలనే వుంటుంది అంతెందుకు, వ్యవహార జ్ఞానంలో నన్ను మించిపోయిన నా బిడ్డలముందు నిత్యం ఓడిపోతూనే వున్నాను ఏ అనుకున్న లక్ష్యాల్ని సాధించి "స

నాకంటే ఎదిగిపోయిన నా పూర్వ విద్యార్ధలముందు నేనెప్పుడూ ఓడిపోతూనే వున్నాను హదయాల్లో ఎడార్లు విస్తరించుకొంటూ ఎంతకాలమని ప్రయాణిస్తాం చెప్పు? ఓడిపోయి దుఃఖాన్ని కలబోసుకోవడమంటే నాకెంతో ఆనందం దృశ్యాలు కనుమరుగవుతాయని కన్నార్చడం మర్చిపోయాను రేపటి కలలమీద నాకు నమ్మకం లేదు తప్పిపోతూ, ఎదురొస్తూ తడబడుతూ బతికయ్యడం కంటె ఒక్కసారిగా అన్ని ఆశల్నీ భ్రాంతుల్నీ దూరంగా గిరాటేసి ॥ నీటిబొట్టునై ఆత్మలోకి ఇంకిపోయి నా మూలాల్ని వెతికిపట్టుకుంటాను ఓడిపోయినా పర్వాలేదు నా ప్రయత్నం విరమించుకోను ఒక నదినై ఒక ఎడారినై సమిష్టి ప్రాణ ధ్యాసలోంచీ అక్షరాన్నై మొలకెత్తాలనివుంది నా ప్రాణస్నేహితుడా | ఓటమి నా జీవితలక్ష్యం కాదు స్‌ ఓటమి నా అంతర్మథనం / ఓటమి నాకు పునరుర్ధానం 1 ల్‌

అనిశ్రాంతం!

ఎడతెగని చింతనతో

సామాజిక ఏకాంతం నన్నుకట్టిపడేస్తే

ప్రకాశించడం మాని

ప్రవహించడం మొదలుపెట్టాను

నేల పొరల కింద నీటి గలగలలు

స్పష్టంగా విన్పిస్తున్నాయి

చెట్లనీడల్లో మాగిన పరిమళం

నన్ను వివశుణ్ణి చేస్తోంది

ఎవరో హఠాత్తుగా

తటాకంలోకి రాయివిసిరినట్టుగా

నా ఏకాంత ధ్యానంలో

కలవరం మొదలైంది

ఒక మృదువైన దరహాసం

మంచుఖడ్గంతో ప్రవేశించింది

అంతలోనే... గ ( మధ్యాహ్న వేసవిలా కరిగిపోయింది "న్న

రెప్పలు మూసుకున్న ప్రతిసారీ నా ధ్యానయోగంలోంచీ

రక్కలు మొలుచుకొచ్చి

కొత్త ప్రపంచంలోకి వాలిపోతాను అందాకా ఉద్వేగాల్సీ ఉద్రేశకాల్నీ మోస్తున్న ఈ తెల్లకాగితం కవిత్వమై రెపరెపలాడుతుంది నిళ్ళబ్దాల్ని పేల్చడం తెల్సినవాడు అక్షరాల్ని సృష్టించగలడు దుఃఖాన్ని తట్టి లేపితే

ఎడారి విస్తరిస్తుంది

కన్నీళ్ళను కవ్వించావో సముద్రమే మేల్కొంటుంది పారదర్శకమైన కాంతి వర్ణవర్ణాలుగా విడిపోయి సూర్యుణ్ణి దిగంబరం చేస్తుంది ఈ హృదయం, ఈ శరీరం లోలోపలి చీకట్లను చీల్చుకొని ఏకాంతంలో లయించాక

నేను కవిత్వమై మాట్లాడుతా కవిత్వమై జీవిస్తా ! మరణించాక జీవించడం మరణాన్ని జయించడం ఒక్కకవికే సాధ్యం | (11 జనన మరణాల రహస్య శోధన జో

కవిత్వమే | " అవధుల్లేనిి అలసటలేని

ఆకాశం లాంటి కవిత్వం

రంగు రంగుల కలలూ

సెలయేటి గలగటేకాదు

నాకు దుఖుంకావాలి |

లోలోని బలహీనతల్ని కరిగించే అంతర్మథనం, జ్వలనం కవిత్వమే ! అది సమాధి శూన్యంకాదు సమస్తాన్ని (ప్రేమించే నైర్మల్యజీవనం నేను నేనుగా మిగిలిన వాస్తవం

అది అనంతం, అవిశ్రాంతం 11

| ఆత్మగానం! ఇవాళ నూటయాఖై ఏళ్ళ చారిత్రక సంధ్యలో నిలబడీ ప్రధమ స్వాతంత్ర్య సమరోత్సాహాన్ని స్మరించుకొంటున్నా... ఈ అరవై ఏళ్ళ స్వేచ్చా ప్రస్థానంతో పోటెత్తే అంతరంగాన్ని ఆవిష్కరించుకొంటున్నా... వలస పాలకుల ఆధిపత్యాన్ని ధిక్కరించి పోరాడి గెలిచిన చరిత్ర నా కళ్ళ ముందు కదలాడుతోంది ఉత్రేక్షలతో ఊహల కావిళ్ళను భుజాన వేసుకొని తిరిగిన చరిత్రకాదు సత్య అహింసలే సత్యాగ్రహంగా రూపుదాల్చిన గాంధేయవాద చరిత్ర! వెచ్చటి సూర్యోదయాలను ( (0 | చల్లటి సాయంకాలాలను ల న్‌

తియ్యటి అభివ్యక్తులతో అభిషేకించిన చరిత్రకాదు “వందేమాతరం” అంటూ గుండుకు గుండెను ధీటుగా నిలిపి మరణాన్ని నుదుట సింధూరంగా దిద్దుకున్న చరిత్ర!

అందలాలకోసం

అధికార శరభాల అడుగులకు మడుగు లొత్తిన చరిత్ర కాదు నాటిమేటి కవులంతా

జాతీయ భావోద్వేగ ప్రతిధ్వనులై మాతృభూమిని కీర్తించిన చరిత్ర! వీరగంధము తెచ్చి నామంటూ భీరుల్ని సైతం సమరోత్సాహుల్ని చేసిన చరిత్ర

మా కొద్దీ తెల్ల దొరతనమంటూ గరిమెళ్ళ గర్జనతో

ఉరక లెత్తించిన చరిత్ర

చరిత్రను విస్మరించినవాడు

చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు గతాన్ని మర్చిపోయినవాడికి భవిష్యత్తు శూన్యమె

కాలానికి అంతంలేదు

అనుభవాలకి ఓటమిలేదు ( / జ్ఞాపకాలు నిద్రపోయినా భో /

గాయాలు మేల్కొనే వుంటాయి

అక్షరాలు మౌనం వహించినా

ఆశయాలు అలజడి సాగిస్తూనే వుంటాయి కాలం కనుకొలకుల్లోంచీ

నా దేశ చరిత్ర చేజారి పోకుండా

పోదివి పట్టుకొని

ఊపిరితో పెనవేసుకున్న

భాషలోంచీ మాట్లాడుతున్నాను గాయపడుతున్న

గుండెగడప లోంచి మాట్లాడుతున్నాను భంగపడుతున్న స్వరంలోంచీ మాట్లాడుతున్నాను

చిట్లిపోతున్న ఆశయంలోంచీ మాట్లాడుతున్నాను

అమూల్యమైన నా దేశీయ పరిజ్ఞానం అంచెలంచెలుగా వలస బోతుంటే

నా జాతీయ భావనలో ఏదో అపళ్ళతి దొర్లినట్టుగా వుంది నాకు

మానవ సంబంధాలన్నీ

ఆర్థిక సంబంధాలై

సాంతయింటిలోనే

పరాయితనం అంటించుకొని

నా కళ్ళముందే తిరుగుతుంటే

నాకు నేనే ఓ దుఃఖ నిఘంటువునై 0) లోలోకి ఇంకిపోతున్నాను లో

పుత్రోత్సాహం కంటే

సమరోత్సాహమే మిన్నగా

భావించిన నా దేశంలో

కన్న కొడుకులు కరెన్సీ వ్యామోహంలో డాలర్లకోసం మేధస్సును అంకితం చేస్తూంటే దహించుకుపోతున్నాను

నేలదాహం మేఘం తీరుస్తుంది

అధికార దాహం పదవితో తీరుతుంది (ఢేమకై పరితపించే ఈ మనిషిని ఆప్యాయంగా హత్తుకునే దెవరు?

నేటి మందహాసాలన్నీ

రేపటి ప్రశ్నార్థకాలైతే

ఈ ఒంటరి ఓడ ప్రయాణమెంతకాలం? 'పెచ్చులూడుతున్న పై కప్పుకింద ఎంతకాలమని తల దాచుకుంటాను?

నాడు 'స్వేచ్చకోసం పోరాటం జరిపి

చరిత్రను నిర్మించుకున్న వాళ్ళం

నేడు ఆస్వేచ్చనే కోల్పోయి

స్వార్ధంముందు సాగిలపడడం

ఎంత విషాదకరం?

సహస్ర వృత్తులూ ఛిద్రమై

బతుకు భద్రత కోల్పోతోంది

వ్యవసాయం జూదమై

బతుకు వలస దారిపట్టింది ర్ట మరణం అనివార్యమే (|

బతుకు పోరాటమూ అనివార్యమే గద్దించవలసిన చోట గుంభనంగా వుండి మాట్టాడవలసినచోట మౌనంగా వుంటే మనిషి జీవించినా మరణించినట్లే లెక్క నా దేశంలో హరితవసంతాన్ని కలగంటున్న కవిని నేను

నీరుపోసినా, నాట్లు వేసినా

కోతకోసినా, కుప్పనూర్చినా

మట్టిపిసికే చేతులకే

ఆ భాగ్యం దక్కాలి

ఆత్మవిశ్వాసాన్ని

కవితాఖడ్గంగా ధరించినవాణ్ణీ

పేదరికం లేని భారతాన్ని కలగంటున్నా... స్వార్ధచింతన లేని

దేశభక్తిని కోరుకుంటున్నా

నాకు స్వర్గం మీద కోరికలేదు

ఈ దేశంమీదే అభిమానం

ఈ మట్టిమీదే మమకారం

ఈ మనిషి మీద గ్రేమ

ఈ పురిటి గడ్డమీదనే

నా తాత్త్విక భూమికను

ఆత్మగానం చేస్తాను

సమస్త సామాజిక మానవీయ విలువలతో (0 గ్‌ కవిత్వమై విస్తరిస్తాను | టో /

మేరా భారత్‌ మహాన్‌ ! అయోధ్యారాముడు

దయా సముద్రుడు

ఆదికావ్యం సాక్షిగా ఆకలివుంది

అల్లా అపార కరుణామయుడు

“ఖురాన్‌' సాక్షిగా కన్నీళ్ళున్నాయ్‌

క్రీస్తు కృపాసాగరుడు

“బైబిల్‌ సాక్షిగా నిరుద్యోగముంది

సర్వమత సారం...

ఆకలీ, కన్నీళ్ళు, నిరుద్యోగమే కదా!

| మిత్రుడు కన్పించడం లేదు ! మన్నించండి! నాకత్యంత ఆప్పుడు, ఆత్మీయ మిత్రుడు కన్పించడంలేదు నిన్నటి శుభోదయాన ఓ సుదీర్బలేఖ నా చేతుల్లో వుంచి దారితప్పిపోయాడు మాటలు కోల్పోయిన మౌనంలో దిగాలుపడి కూర్చున్న నాకు మిత్రుని ఉత్తరం ఓ ఊరడింపు ఈ బహిరంగ లేఖను అతని కోర్కె మీద మీకందరికీ విన్సిస్తున్నాను - మిత్రమా! మన్నించు నేను కన్పించకుండా వెళ్ళిపోతున్నందుకు నువ్వు కలవరపడొద్దు 1 గ | ఈ జనారణ్యంలో టీ

జడపదార్థంలా నేను జీవించలేను అమ్మక్షాలు కొనుగోళ్ళ మధ్య

నేనొక వినియోగదారుడిగా మిగిలిషపోలేను

ఈ మనుషులంతా

ప్లాస్టిక్‌ నవ్వులతో, గ్లిజరిన్‌ కన్నీళ్ళతో నిత్యం నా కెదురొస్తున్నారు

ఆహార్యంలో అనుభూతులు రంగరించి నటనలో అద్భుతంగా జీవిస్తున్నారు ఒక్కసారి వీళ్ళ కనురెప్పలెత్తిచూడు దుఃఖం లాకులెత్తిన ప్రవాహమై

మనల్ని ముంచేస్తుంది

నిజం చెప్పాలంటే -

ఎవరికి వారు ఓ స్మశానాన్ని మోస్తూ తిరుగుతున్నారనిపిస్తుంది

ఎక్కికూర్చున్న కొమ్మనే

నరికేసు.కొంటున్న ఈ నవీన నాగరికతలో ఎంతకాలమని ఈ దుఃఖాన్ని భరించను? ఈ శిథిల శిల్ప ఖండాలను చూస్తూ ఇంకెంత కాలమని జీవితాన్ని పొడిగించుకోను?

వ్యామోహాలన్నీ వ్యసనాలై

యువతరంపై స్వారి చేస్తున్నాయి ప్రపంచమే ఓ కుగ్రామమై (ఫీ వీళ్ళ అరచేతుల్లోకొచ్చింది ం గగ

మాటల్ని కొంటున్నారు

అభిమానాల్ని అమ్ముకుంటున్నారు వీళ్ళకి కన్నవాళ్ళు

కవరేజి ఏరియాలో కన్పించరు

వీరంతా సెల్‌ఫోన్‌ రింగుల్లోంచీ శబ్దరత్నాకరం నేర్చుకుంటున్నారు ఇంటర్నిట్‌లో కూర్చొని “శృంగారనైషథం' అధ్యయనం చేస్తుంటే అమ్మానాన్నలకు అనాధశరణాలయాలే ఆదుకొంటాయి

నా తెలుగు భారతికి

ప్రాచీన హోదా దక్కడం

నాకింతో గర్వంగా ఉంది మాతృభాషలో మనసారా పల్కరించుకోలేని నా సోదరుల్నిచూస్తే సిగ్గుగా ఉంది

అంతరిక్ష పరిశోధనలో అద్భుతవిజయం చంద్రయానం తల్చుకుంటేనే ఉప్పాంగుతోంది మనసు అహింసకు పుట్టిల్లైన నాదేశం విద్రోహుల విధ్వంసానికి వేదిక కావడం) ఓ విషాద పరిణామమే!

ఆకాశమంత ఆత్మగౌరవాన్ని

అనాదిగా పురుషాధిక్యం .- (00 గాయపరుస్తూనే ఉన్నా ళో /

ఈ జనారణ్యంలో

మానవ మృగాల పైశాచికదాడిలో స్వప్నిక, ప్రత్యూష, ఆయేషా లూ నేలరాలుతుంటే ఎలా సహించను ? అహంకారమే, ప్రాణమైనవాడికి ఆత్మసౌందర్యం ఏం తెలుస్తుంది ! విద్వేషమే జీవితమైన వాడు ఉన్నాదికాక మరేమవుతాడు (ఫేమంటే జీవితమనీ

జీవితమంటే త్యాగమనీ అర్ధంచేసుకోలేని అల్పుల మధ్య ఎలా జీవించమంటావు ?

మిత్రమా 1

నా కంటి చెమ్మనీ

గుండెతడినీ ఇంతకాలంగా

నీతో పంచుకున్నాను

మనం పచ్చగా బతికిన క్షణాల్నీ పరవశించి పోయిన యవ్వనోద్రేకాల్ని నెమరేసుకుంటూ

ఇంకా ఎంతకాలమని ఎదురీదమంటావు? నాకు పేదరికంలేని విజ్ఞానం కావాలి యుద్ధ భయంలేని జీవితం కావాలి నా స్వష్పాలన్సీ నిజమయ్యే రోజుకు మళ్ళీ తప్పక తిరిగొస్తాను || )

| అహా! చాన్ససంట విరగకాస్తోంది! స్వర్ధాంధ్రప్రదేశ్‌లో చావుపంట విరగకాస్తోంది ఒక్కటా... రెండా .. ముప్ఫై రోజుల్లోనే ఇరవై ఆకలిచావులు సిరిసిల్ల నేతన్నా! ఆత్మహత్యల అభివృద్దిరేటులో ఆదర్శం నీవేనన్నా! నమ్ముకున్న నూలు పోగులు ఉరితాళ్ళు పేనుతూంటే మగ్గాల శాలలన్నీ చావుడప్పు వినిపిస్తూంటే నడుంలోతు మగ్గం గుంటలు నిలువెత్తు సమాధులు నిర్మిస్తూంటే ఆకలీ, అప్పులూ, రోగాలూ అన్ని వైపులనుంచీ ఒక్కసారిగా | | నీపై దాడిచేస్తే ూ.

తట్టుకునే శక్తి నీ రెక్కల్లో ఉందా ?

సిరిసిల్ల శివయ్య

చీరాల బసవయ్య

శ్రీకాకుళం సత్యవతి

మనుబ్రోలు దయాకర్‌

ఠకూడేరు శివశంకర్‌

ఊళ్లు వేరైనా

పేర్లు ఎవరివైనా

అన్నీ ఆకలిహత్యలే

వల్లకాటి శవాలే |

అఖిల పక్ష సభ్యులకూ

అధ్యయన బృందాలకూ

ఇదే మా కన్నీటి విన్నపం

కంటితుడుపు చర్యలు మా కొద్దు

శాశ్వత ప్రాతిపదికన

మా బతుక్కి భద్రత కల్పించకపోతే

మా భవిష్యత్తుకు భరోసా కల్గించకపోతే

మీ ప్యాకేజీస్కీంలూ, అరోగ్యశ్రీలూ

అన్నీ మాకు వాయిదా మరణాలే !! ((

| అనంత దుఃఖం |! అ... అమ్మ ఆ... ఆకలి అమ్మా! ఆకలి | తెలుగు వర్ణమాల అచ్చుల్లో మొదటి అక్షరం అనంతపురాన్ని పల్కరిస్తుంది మొదటి హల్టు - కరువునే కలవరిస్తుంది ఆకలి అనేది అనంతమైతే అనంతజిల్లా ఆకలి స్వరమే పల్కుతుంది కరవు అనేది ప్రాంతీయమైతే అది మా రాయలసీమనే వరిస్తుంది అనంత సాహిత్యానికి అమరకోశం కరువు సీమ వేదనకు పేదిరికమే పెద్దబాలశిక్ష | ఫ్యాక్షన్‌ రాజకీయాలకిది ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (పైవేట్‌ సైన్యాలకు ప్రాంతీయ కేంద్రం కంటి చెమ్మను మునివేళ్లతో | కీ అద్దుకుంటూ లో

అక్షరాల ఒడిలో దుఃఖ భాషను దిద్దుకొంటోంది ఈ జీవితం

ఇక్కడ మా చిరునామాలన్నీ చిరునవ్వుల్ని మోయడం లేదు

నిరాశ నీలి నీడల్ని మోస్తున్నాయి మృత్యువు కోసం దగ్గరి దారిని అన్వేషిస్తున్నాయి

ఎప్పటికప్పుడు

ఈ అనంత దుఃఖాన్ని

నాదైన మాతృభాషలోకి

కన్నీటి భాషలోకి అనువదిస్తూనే వున్నా ఇంకామిగిలేవుంది

స్వేదాన్నీ, సేద్యాన్నీ నమ్ముకున్నవారు నట్టేటమునిగి పోతూంటే

గుండె గుండెలో దుఃఖం

గడప గడపలో అంతర్యుద్ధం కృష్ణమ్మ, పెన్నమ్మ

తుంగబద్ర, చిత్రావతి

నదీ పరీవాహ ప్రాంతమంతా దాహంతీరని దుఃఖజలమే భూగర్భజలాలన్నీ

మాకు ఆగర్భశత్రువులే

దారిద్ర్యం మా పాత పరిచయం కరువే మాకు దగ్గరి చుట్టం

దుర్భిక్ష దొస్యానిక్‌ సజీవ సాక్ష్యం మా అనంత |! (|

బతుకు యుద్ధమైన ప్రాంతమిది బానిసత్వం పహారాకాస్తున్న నేలయిది | స్మశాన సౌందర్యం

మా బతుకుల్ని వెక్కిరిస్తోంది

నీళ్ళులేక నిస్సారంగా

నవ్వుతున్న కాలువ గట్లు

పాలాల్ని తడపలేక

నిస్సహాయంగా రోదిస్తున్నాయ్‌

పినాకిని దుఃఖం

పెదవుల మధ్యనే చిట్టిపోతోంది. కృష్ణమ్మ ఒరవడి

పుష్కరాలకే పరిమితమైంది

నేటి మా బాలలంతా

రేపటి దరిద్రులే

ఇక్కడి బాల్యానికి

పోషణకే తిండి లేదు

ఇంక... పోషకాహారం మాట దేవుడెరుగు అయినా మేం ఆశాజీవులం

మా గుండెనిబ్బరం

ప్రతిరాత్రినీ జోకొడ్డుంది

మా మనో ధైర్యం

ప్రతి ఉదయంతోనూ

కరచాలనం చేస్తుంది

మా రెప్పల కింద జలాశయాలు | గ్‌ ఈ సీమ కవుల భావుకత్వాన్ని షో

భాస్వరమై మండిస్తాయ్‌

పూర్వం అప్పుడెప్పుడో

మా ముత్తాతల మీసాలపై

మీగడ కట్టిన రోజుల గురించి

కథలు, కథలుగా కబుర్లు విని

ఒకింత గర్వపడ్డాం

ఆ తర్వాత

డొక్కలు కరువు రోజుల్లో

రేగడిమట్టిలో గడ్డపెరుగును

కలుపుకొని అబగా మెక్కిన

రోజుల్ని గురించి

మా తండ్రులు తల్పుకుంటూంటే

విని జాలిపడ్డాం

ఇవాళ ఆకలి, దారిద్ర్యం, అప్పులతో

ముప్పేట ఉరి పేనుకొని

పూట కొకరు, వీధి కొకరు

ఉసురు తీసుకొంటున్న

ఈ తల్లి దండ్రుల వారసులం మేం

పెండ్లీడుకొచ్చి గుండెమీద

కుంపట్రైన ఆడబిడ్డలం మేం

లోతైన శూన్యంలో కొడిగట్టిన దైన్యంతో

ఇంకంతకాలమని ఈ బతుకుపోరు?

ఎంతకాలమీ వలసల ప్రస్థానం ?

ఈ జిల్లా చరిత్రలో

ఏ పార్టీ ఆందలమెక్కినా గ / 0 లో

అభివృద్ది వెనక్కే పరుగెడుతుంది

అధికార యంత్రాంగమా |!

మా అభివృద్ధి మీ ఊహల్ని

వెక్కిరించడం లేదా!

మా అవమానాలు మీ ఆత్మవంచనల్ని

నిస్సిగ్గుగా నిలదీయడం లేదా

మా ఆత్మసంయమనం

ఆయుధంగా రూపుదిద్దుకోకముందే

అఆర్హులపట్ల మీ బాధ్యతను

గుర్తెరిగి, చక్కదిద్దుకోండి |! గై

| అనినార 9 రాయకుండా ఉండలేని స్థితి రాయకపోతే జ్వరపడే పరిస్థితి రాశాక, రాసింది తృప్తిగాచూసుకున్నాక జ్వరం తగ్గిపోతుంది హృదయం తేలిక్రైెపోతుంది . ప్రాణం చివుక్కుమన్నప్పుడల్లా పదాలు గలగలమంటూ ప్రవహిస్తాయి ఎన్ని జీవనదుల జల బిందువులు కలిస్తే జాషువా కన్నీటి పద్యమౌతుంది ఎంతటి ఉద్రేకం 'లావా'గా ఉప్పాంగితే శ్రీథీ కవితా జ్వాలలవుతాయి ఎన్నెన్ని మందహాసాలు మంచి గంధమై ఇగిరిపోతే శేషేంద్ర కవితా మహేంద్ర జాలమవుతుంది ఎన్నెన్ని స్వరతరంగాలు అలజడి సృష్టిస్తే ॥| || ( బిస్మిల్లాఖాన్‌ షహనాయి వాద్యమవుతుంది లో

ఎన్నెన్ని జీవన సంధ్యలు పల్కరిస్తే ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి శాస్ట్రీయ గాత్రమవుతుంది

ఎన్ని కొమ్మలు పారిజాతాలు రాలిస్తే ఒయాసిస్సులు హరిత వసంతాలవుతాయి పురావస్తు సముదాయాల మధ్య పరివ్యాప్తమవుతున్న దుఃఖంలో

మరణ భయంతో కన్నీళ్ళు

కలల విధ్వంసంలో కన్నీళ్ళు

గాయం చేసే కత్తిని

గౌరవంగా పూజించే వ్యవస్థలో

నమ్మక ద్రోహం చేసేవాణ్ణి

నమ్మకంగా (ప్రేమిస్తున్నాం దుఃఖోపశమనం తర్వాతనైనా

నీ ఉనికిని ఉన్నతీకరించుకోలేకపోతే విస్మరించిన బాధాసందార్భాలన్నీ వెంటాడుతూ వేధిస్తుంటాయి

మీకు తెలుసా-

ఈ విషాదాలన్నీ

మనం కలబోసుకునే దుఃఖాలే !

అదిమి పట్టిన సహనంలోంచి

ఎగిసిపడే ఉప్పెనలే !

మన ఉద్వేగాలకవి ఉమ్మడి వేదికలే ! జీవితాన్ని దిగంబరంగా

ఆరేసుకోవడమే తెల్సినవాణ్ణి రాయాలనిపిస్తేనే కాదు

రాయక తప్పదనిపించే స్థితికి | () అనివార్యంగా ప్రయాణిస్తున్నాను! జో

| నిక్షిప్త జానదాహం ! ట్ట ఒకానొక పురాతన సంస్కృతీ పాయలో శిల్చ ప్రభావతి చెక్కిలిమీంచి జారిపడిన దుఃఖాశ్రువు మా రాచపాళెం | వాగ్దేవి కాటుక కంటినిటితో చలించిపోయి పాలక వర్గాన్ని ఆశ్రయించక హాలికుడిగానే బతుకును సాగించి పామరులకు చేరువైన పోతన్నలా... కల్పనా జగత్తును త్రోసిరాజని మార్క్సిస్టు అవగాహనా చేతనలోంచి ఎదిగిన ఆధునిక మేథాచంద్రుడు ! ఆర్థిక, రాజకీయ, సామాజిక తాత్త్విక నేపథ్యంలోంచి ఆధునిక దృక్పథాన్ని ( ( వంట బట్టించుకున్న వర్తమాన రారా ! పడ /

సంప్రదాయాల సంకెళ్ళను నిలదీసి

ఆచారాల సూత్రాలను నిరసించి

సామాజిక న్యాయానికి

సన్నిహితంగా మెలుగుతాడు

గౌరవప్రదమైన జీవనకాంక్షకు

వినయంగా తలవొగ్గుతాడు

కరువు బీభత్సంలో

దాడిచేస్తున్న దుఃఖంలో

అప్పుల వలసల పత్రాలపై 'సర్జ్ణభారతి తోడుగా'

సాక్షి సంతకం చేసినవాడు 1

తరతరాలుగా సేద్యాన్ని

నమ్ముకున్న పాపానికి

తాను సండించిన పంటపైనే

అధికారంలేని అన్నదాతల దుఃఖమే

“పాలి'దీర్బ కావ్యమైంది

తన అస్థిత్వం కోసం ఎన్నడూ

ఆత్మగౌరవాన్ని తాకట్టు సెట్టనివాడు

ఆఅమోదమైనా, తిరస్కారమైనా

వాదాలపట్లనేగానీ

వ్యక్తులపట్ల చూపనివాడు |

విమర్శనొక బాధ్యతగా

స్వీకరించినవాడు

భౌతిక అగాథాలమధ్య _. భావవిప్లవాన్ని ఆకాంక్షించేవాడు ( ( | / సమూహాలతోనే స్నేహం చేస్తాడు ! లో

తన గుబురు మీసాలవెనుక

గుట్టుగా దాచుకొని

గుంభనంగా నవ్వగలిగిన

"స్టైర్యం ఆయనది !

వర్తమాన సాహిత్య విమర్శకు

ఓ నూతన అభివ్యక్తి !

భవిష్యత్కాలాలకు

గురజాడ ఆశయాల్ని

గుండెలనిండా నింపుకున్న హేతువాది

నాకు రాచపాళెం

ఓ నిక్షిప్త జ్ఞానదాహం ||

(విమర్శకులు రాచపాళెం తోనం...) శ్రకద్యు గ్రంరాలయ క్షా ॥ ల |

ఆధునిక కవిత్వానికి ప్రతిష్టాత్మక పురస్కారం “ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు" - గ్రహీతలు 1 సౌభాగ్య - కృత్యాద్యవస్థ -. 1988 2. శిఖామణి - మువ్వల చేతికర్ర -. 1989 3. సుధామ - అగ్నిసుధ = 1990 4. అఫ్సర్‌ - ఇవాళ - 1991 5. డా॥ పాపినేని శివశంకర్‌ - ఒక సారాంశం కోసం =. 1992 6. ఆశారాజు - దిశ - 1993 7. కందుకూరి శ్రీరాములు - వయోలిన్‌రాగమో! వసంత మేఘమో! - 1994 8. దర్భశయనం శ్రీనివాసాచార్య - ముఖాముఖం -. 1955 9, చిల్లర భవానీ దేవి - శబ్దస్పర్శ - 1996 10. నాళేశ్వరం శంకరం - దూదిమేడ - 1997 11 విజయచంద్ర - ఆహ్వానం -. 19986 12. డా॥జూపల్లి ప్రేమ్‌చంద్‌ - అవేద -. 1999 13. అన్వర్‌ - తలవంచని అరణ్యం - 2000 14. దాసరాజు రామారావు - గోరుకొయ్యలు - 2001 15. పి.విద్యాసాగర్‌ - గాలికట్ట +. 2002 16. కొప్పర్తి - విషాదమోహనం - 2003 17. మందరపు హైమవతి - నిషిద్ధాక్షరి -. 2004 18. ప్రభు - పారిపోలేం -. 2005 19. గంటేడ గౌరునాయుడు - నదిని దానం చేశాక _ 2006 20. తైదల అంజయ్య - పునాస * 2007 21. పెన్నా శివరామకృష్ణ - దీపఖడ్గం - 2008

    • ,ఇాకవిత్సం లట, య (౯. / షం ॥ ॥ = . స్ట న / “ . 7 థం - నం... | త | భాగా షీ 4 కవిళ్యం:న్చాకు క్రన్ను మూతపడని, జ్వరం. . ఖీ 1 | న. కవిత్వం 'నొఃకనైప్పల మీద'వాలిన' ౨. |. బక్క కవితా. వాక్యం | | * | ఖే ఈ:గుండె లోత్తుల్లోంచి పెల్లుబికి రావాలంటే || గ. వన్ని రాత్రుల నిద్రని. తాకట్టు పెట్టాలో | న. |... వేదనలోంచి పుట్టిన ఈ శ్రవిత్వాన్నే అడుగు అక్షర సైన్యం నావెంట. నడిస్తే చాలు ల నా సర్వస్వం కోల్ఫోయినా' లెక్కచెయ్యను | 1, కవిత్వమై మిగిలిపోతాను లల / ఈ-గుండె చప్పుడు ఆగిపోయి ట్‌. / ళీ ఈతెప్ప ఏ రేవులోకి చేరవేసనా "హవ. శ అక్కడ పచ్చని మొక్కై (4 . మళ్ళీ ప్రాణం పోసుకుంటాను | / కవిత్వం తోడు లేకుండా నేను లేను క |. | | చ న అక్షరాలు వెంటరాకుంటే న్‌ న... పలు అడుగుముంధుకెయ్యలేను ఖీ _ గూ, రాల. క్ల లా ఖు కడ దొకా రాస్తాను ల “ ఎనో. నా కన్నీటి తడి ఇంకీపాయ్యే దాకా రాస్తాను!