Telugu హ్యూమరాలజీ_యర్రంశెట్టి శాయి_2005_347 P_LPSA104B181_B - anilvaranasi/indianlanguages GitHub Wiki

లమీర్తీంచట్ట గల ల జ గావో, =క్మ్సి ఇ

. 156 (04 818, | _ యర్రంశెబిశాయి ఇ0(్రధనుస్సు పబ్లికేషన్స్‌ పాటీ నెంబర్‌ 92, శాతవాహన నగర్‌, యలీ.బి. నగర్‌, హైట్రాబాద్‌-74 |

4 (4. [6 క 9 : ₹/2102౧0౧5606 541 (రి *లా౫౧౧56041 5241, [6612026 5 ౪౦01౧౧6౭ 12071566 : 60, 2005 106 : 150,/- 5 $15 ం౪లి ౭516౧ : కచగగె!ఉసిచగ అజ100015 : 849౮ 706 561106 : -"4క4!1! 019 1021౬5

  1. : ౦40-23047931. [సంర గీ : రా టాక అ నియా యథ జ కక టా విజయవాడ. ఫోన్‌ ; 2438324, [౬0119166 09 : " కడం2జయ0డంటకకల ిలల110260016 106%0.92, 5402720204 గిడండ% 1..5.262% 1296612026 - 74. 0? ౬౧౦౧1౬5 : ఒ₹16గ1ఓ4స 0111౧4 6౦౦ గు 110౮95 (గ|| 312౧0165) ₹4లగఉతి [111 300% 110౮95 (4|| 3132౧00౧69)

గా (6 . / ఠీ కల్పితాలు కాదు. తునీ తెలయగు /. ్గ / రాజ్థందికినీ ఉద్దేశించి రాస్తీతే, తున రాం ఇ౮ా / | యోరించడానికి పూర్తిబొట్టం | స తోరిరేక తోయినిట్లయినే అది కులం కూళీయం. ర ల్లో

ఫా ఏ ఇది వరుస.... -

  1. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి!.............౨౨౨౦౨౨౦౨౦ 402022020౯ ౨. శంకర్‌దాదా జిందాబాద్‌!...............00440460626 66066066 6426662442424420442 బరీ
  2. కరాటే చదువులు.............౨౨౦౦౦౦౦౦౦౦రరంంటలటటలతచంపటటపటటటమమటటు డ్వీడ్త
  3. వరుడు కావలెను లేక కట్నంతో పాటు కిరసనాయిలు ఉచితం .......... 59
  4. క్రికెట్‌! క్రికెట్‌! ..........౨౨౨౨౨౦౦౦౦666000060000 6002220000 02026000000004402 రడీ
  5. దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా..............0000200000000000000000 2000000002 96
  6. నిరాహారదీక్ష లేక బగారా బైగన్‌ ...............240040000022606622200264002= కేకల
  7. పబ్లిసిటీ ప్రహసనం ..........౨౨౨౨౦౦౨౦౨222 0200000600 20 222వ వవ లల 0422 కేవ
  8. సృ్మగ్గర్స్‌ గాంగ్‌ ..........4042220222220వవచటలవరనవవవడవవవంంం2 2020000000 1ేతి6ి
  9. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 కథ ...............244440424426240=222= కేత్తీ6
  10. పాదరక్షల ప్రహసనం...........2422606062666 2020226220 02 26262 26642402622244 క్షేళటై
  11. బడ్జెట్‌ భాగోతం .........౨౨౨౨౨౨౨ ౨౦౨౦౦౦ 000060 0022022 2వ 202 2000220000 196
  12. 'పోలీస్‌ స్టేషన్‌..............00000000000వవటవలవటంలలవలలటంంంం206
  13. గేదెలకు చెవలుంటాయ్‌.............4460006066060660 66 టలలటంల 4444200020 228
  14. ఫర్‌ సేల్‌...........౨౨లలలవవవవవ టవ టవటటటటటటటటరవవవవ వ పటటలవవంవవంలంం4400000 లైడ్తీరి 1/7. కొత్త ఆట............400400200200వవవవుటువి వటుని వటట ద దడి వ విట వలక వరవర వి వళ వరం 6666666664 లై మే
  15. అడుగో! ఆదిమానవుడు ............44000020వవవవవవలవవలలవ లతల 280
  16. పండుగ... 000000000టటరరవవటవదవలవదవవవలట పటట టప వదవద వదద వవ వదద రం 291
  17. ఫ్రీ డెలివరీ...........౨౨౨౨౨౨౨౨౦౦౦46660వవవవవవవవివవవదవవవవటలలలలంల వలం తి09
  18. ఉత్తమ సాహిత్యం జిందాబాద్‌ .............00002020002266662202022242244 తైకేరి
  19. బంద్‌ - 1999......444లలలలలలలలటలలటటటటలలటటవటలలవలలవవవవంంంంంం 826
  20. చదువుల గారడీ..............౨౨౦౦౦ లంట లి9ి?

గ గ్న్‌/ య.

హ్యూమరాలబజీి గురించి.....

ప్రస్తుతం మన దేశంలో - ముఖ్యంగా మన రాష్ట్రంలో - ఓ సగటు మనిషి జీవితం ఎంత అస్తవ్యస్తంగా, ఎంత దారుణంగా తయారయిందో మనందరికీ తెలిసిందే!

ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు మనల్ని మన రాష్ట్రాన్ని ముంచేస్తాడో తెలీదు. ఎప్పుడు ఏ బ్యాంక్‌ మన డబ్బు దోచుకుంటుందో తెలీదు. ఎప్పుడు ఎవడు మనల్ని మోసగిస్తాడో, దగా చేస్తాడో ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని కిడ్నాప్‌ చేస్తారో, ఎప్పుడు ఏ గూండా ఎవరి మీద దౌర్జన్యానికి దిగుతాడో వాళ్ళకే తెలీదు. రోడ్‌ మీద నడిచే ఆడపిల్ల ముఖం మీద ఎవడు యాసిడ్‌ కొడతాడో - ఎవరు ఎత్తుకుపోయి రేప్‌ చేసారో అంతా దైవాధీనం సర్వీసే! మర్దర్లు చేసే వాడికి శిక్షలు పడవ్‌! పైగా మంత్రి పదవులొస్తాయ్‌. ప్రజల్ని ముంచేసిన వాడిని ప్రభుత్వమే దాచేస్తుంది. లేదా విదేశాలకు తోలేస్తుంది. దొంగలు రాత్రికి రాత్రే దొరలవుతారు. మనవంతు సేవ మనమూ చేయాలని పోలీసులు ప్రజల భరతం పడితే వాళ్ళకు ప్రమోషన్గాస్తాయ్‌!

ఈ మోసాలు, ఈ దారుణాలు, మారణ హోమాలూ, చూసి చూసి మనకు పిచ్చెక్కుతుంది. బి.పి. పెరిగిపోతుంది. (పెజర్‌ పెరిగిపోతుంది. టెన్షన్స్‌ ఎక్కువయిపోతాయ్‌.

వీటన్నిటి నుంచీ ఎలా తప్పించుకోవాలో తెలీక - ఏం చేస్తే మనశ్శాంతి దొరుకుతుందో

అర్ధం కాక మనం గుళ్ళూ గోపురాలతో పాటు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీల వైపు పరెగెడుతాం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే వాస్తాలజీని (వాస్తు) పట్టుకుని ప్రాకులాడుతాం!

ఎన్ని చేసినా, ఏం తంటాలు పడినా మనకు ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన సిస్టమ్‌లో, ఈ అవినీతి రాజ్యంలో ఇవన్నీ ఒక భాగం కనుక!

అయినాగానీ ఈ నరకాన్ని వద్దనుకున్నప్పుడు మర్చిపోడానికీ, అవసరమయినప్పుడల్లా నవ్వుకోడానికీ ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ఈ హ్యూమరాలజీ!

ఎన్ని సమస్యల్లో ఇరుక్కున్నా, ఎన్ని చికాకులు చుట్టుకున్నాా వాటన్నిటినీ మరిపింపజేసి మళ్ళీమళ్ళీ తల్చుకుని నవ్వేలా చేసే టానిక్‌ హ్యూమరాలజీ !

3.రాసు (సినీ దర్శకులు)

| తెలుగోళ్ళ జీవితాలతో చెలగాటాలాడుతున్న పొలిటికల్‌ డెకాయిట్సి దుర్మార్గం మిద ఆల్‌ టెమ్‌ గ్రేట్‌ సెటైర్‌

క్‌ వ్‌ డె! దబ౦౦ంగలం౦స్తున్నారు న్వెగటీ౦ చెప౦ట! టే న్‌ థల క్యు క ఇ స! 1 కర + . షు ఎనాకు న లని! (. 1//1124//444 || |... 1!

అబ్బో! అబ్బో! తెలుగుజాతి చరిత్ర ఎంత గొప్పదో? తెలుగునాడులోనే రత్నాలు

వీధుల్లో కుప్పలుగా పోసి అమ్మారట! ప్రజలంతా ఎలాంటి కంప్లెయింట్సూ లేకుండా సకల 4 సౌభాగ్యాలతో తులతూగారట!

మరిప్పుడో! "ఆంధ్రప్రదేశ్‌ ఆహ్హహ్హ హ్హ- టుది పవర్‌ ఆఫ్‌ ఇన్ఫినిటీ!

నిర్భయనగర్‌ కాలనీ చాలా హడావిడిగా ఉంది. కాలనీ వాళ్ళందరూ కాలనీ మధ్య పార్కులో చేరారు.

"సోదరులారా!" అన్నాడు గోపాల్రావ్‌-అని చుట్టూచూశాడు. ఆడా మగా పిల్లా పీచూ అతనేం చెప్తాడా అని ఎదురుచూడసాగారు. గోపాల్రావ్‌ జర్నలిస్టు. అంచేత ఎప్పుడూ ఒకరు చెప్పింది రాసుకోడమేగాని మాట్లాడడం తెలీదు. అందుకని ఆ తరువాతేం మాట్లాడాలో తెలీదు. రెండు క్షణాలాగి మళ్ళీ "పెద్దలారా” అన్నాడు. మరుక్షణం ఆగి "పిల్లలారా "అన్నాడు. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! |

స ం తో

“పోనీలే-మామూలుగా మాట్లాడు" అన్నారెవరో. ఆమాటతో గోపాల్రావు ఉత్సాహం పుంజుకున్నాడు.

"మన కాలనీ కూడా ఊరికి చివరగా వుంది కాబట్టి ఎక్షణాన్నయినా దొంగలు "ర్యూ"కట్టి దోచుకోవచ్చని అనుమానంగా ఉంది. ఎందుకంటే మాన్యూస్‌ పేపర్ల వార్తలను బట్టి దొంగలు ఇప్పటికే హైద్రాబాదులోని ఊరిబయట కాలనీలన్నీపూర్తి చేశారు. వాళ్ళ లిస్పులో మనకాలనీ ఒక్కటే మిగిలిపోయింది. కనుక మనం ముందే చోరనిరోధకచర్యలు తీసుకుంటే బావుంటుందని ఇవాళ ఇక్కడ కలుసుకున్నాం! కనుక ఏచర్యలు తీసుకోవాలో ఎవరికితోచింది వారు చెపితే బాగుంటుంది" అంటూ ముగించాడు.

శాయీరామ్‌లేచి నిలబడ్డాడు.

"సోదరులారా! మనకాలనీని మనం రక్షించుకోవాలి. 'యూనిటీ ఈజ్‌ స్టెంగ్ల్‌ అన్నారెవరో. ఎందుకన్నారామాట? ఇదిగో- ఇందుకే- ఈదొంగలబాధ పడలేకే అన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కనుక అందరూ తమతమ నలహాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను- అని అందరివంకా సలహాలకోసం చూశాడతను.

జనం మధ్యలోనుంచి వెంకట్రావ్‌ లేచి నిలబడ్డాడు.

"ఈ సమస్యకు బెస్ట్‌ సాల్యూషన్‌ ఎమిటంటే మనందరం రాత్రుళ్ళు కాలనీకి కాపలా కాయటం " అన్నాడు సీరియస్‌గా.

'మనమందరమూనా?" ఎవరో అడిగారు.

"మనందరం అంటే నా వుద్దేశ్యం రోజుకి కొంతమంది చొప్పున కాలనీకి కాపలా కాయాలన్నమాట."'

అందరూ "అవునూ" అంటూఅరచారు.

"ఇదే చాలా పర్‌ఫెక్ట్‌సిస్టమ్‌ " అన్నాడు రంగారెడ్డి,

ఓ మూలనుంచి శంకగర్రావులేచి నిలబడ్డాడు.

అందరూ చిరాగ్గా అతనివేపు చూశారు. ప్రతి విషయానికీ ఏదో ఒక అడ్డుచెప్పటం అతనికలవాటని అందరికీ తెలుసు.

"కానీ ఆ రామగిరికాలనీలో దొంగలు, ముందుకాపలా తిరిగేవాళ్ళని కత్తితో పొడిచి తరువాతదోచుకున్నారుగా? " అనుమానంగా అడిగాడతను.

దాంతో అందరూ నిశ్శబ్దమయిపోయారు.

8 హ్యామరాలజీ

శాయీరామ్‌కేం మాటాడాలో తెలీలేదు. తను చెప్పిన సూచనని అతనలా ఒకమాటతో కొట్టిపారేయడం అసలునచ్చలేదు.

"అదివేరే-ఇదివేరే” అన్నాడు.

"అవును-అదివేరు-ఇదివేరు” అన్నాడు రంగారెడ్డి పుంజుకుంటూ.

"ఏది వేరు? "అడిగాడు శంకర్రావు.

"అదే-రామగిరి కాలనీలో సంగతి వేరయ్యా! అక్కడ కాపలాతిరిగింది ఇద్దరే! అందుకని దొంగలు అంతధైర్యంచేయగలిగారు. మనకాలనీలో రోజుకి నలుగురు తిరుగుతూంటారు.''

"ఒకవేళ దొంగలు ఎనిమిదిమంది వస్తే?" మళ్ళీ అడిగాడు శంకర్రాన్‌. దాంతో అందరూ మళ్ళీ నిశ్శబ్దం అయిపోయారు. అందరికీ శంకర్రావు మోద వళ్ళుమండిపోతోంది. ఇలా ఆదిలోనే హంసపాదు పెట్టేస్తాడనే అతనిని మీటింగ్‌కి పిలవలేదు. అయినా వచ్చి అందరినీ చెరిగేస్తున్నాడు.

"దొంగలు సాధారణంగా నలుగురే వస్తారని పేపర్లో చదివాను" అన్నాడుశాయీరామ్‌ ఓక్షణం ఆలోచించి" అంతకంటే ఎక్కువమంది ఉంటే వాళ్ళకేవర్కవుట్‌అవదు ”.

"అవును “అన్నాడు రంగారెడ్డి.

"కనుక సోదరులారా-మనం అమలు చేయబోతున్న మొదటి సూచన ఎమిటంటే "- అంటూ శంకర్రావుని బైపాస్‌ చేయబోయాడు శాయీరామ్‌. కానీ శంకర్రావు మళ్ళీ అడ్డుపడి పోయాడు.

"మొన్న కాంతినగర్‌ కాలనీలో ఎనిమిదిమంది దొంగలొచ్చేకదా నానా రభసాచేసి, పదిమందినిపాడిచి వెళ్ళింది?"

మళ్ళీ అంతానిశ్ళబ్దం అయిపోయింది.

చివరకు శాయీరామే కోలుకున్నాడు.

"వస్తేరానీయవయ్యా! అంతగా ఎక్కువమందివస్తే-వాళ్ళకు అడ్డుతొలిగిపోతేసరి- గొడవుండదుగా? "

"అయితే మరింక రాత్రుళ్ళు అలా నిద్రలు పాడుచేసుకుని తిరగటంఎందుకు?"

రంగారెడ్డి తల రెండుచేతులతో పట్టుకున్నాడు.

"ఎందుకేమిటి? దొంగలు నలుగురు కంటె తక్కువ వచ్చినప్పుడు ఉపయోగం కాదూ?" అన్నాడు గోపాల్రావ్‌. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 9

......_ "అవునవును-సో-అది సెటిలయిపోయింది. ఇక రెండోనలవో ఎవరయినా ఇవ్వగలరా?"

జనం నుంచి డిటెక్టివ్‌ నవలా రచయిత్రి రాజేశ్వరి లేచి నిలబడింది.

అంతా నిశ్శబ్దం అయిపోయింది.

"మనం ఓకొత్తపద్ధతి అవలంబిస్తే బాగుంటుంది" అందామె.

"ఎమిటది?"

"ప్రతి పదిఇళ్ళకూకలిపి మనం కంబైన్షగా ఒక వార్షింగ్‌బెల్‌ ఎర్పాటు చేసుకోవాలి. దాని మీట బెడ్‌రూమ్స్‌లో మంచం పక్కనే ఉంటుందన్నమాట. ఎఏఇంట్లోదొంగలుపడ్డా వాళ్ళు ఆమీట నొక్కితే మిగతా తొమ్మిది ఇళ్ళల్లోనూ బెల్‌ మోగుతుందన్నమాట! దాంతో అందరూ కలసివచ్చి ఆ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించవచ్చు. ఎలా వుంది."

“వండర్‌పుల్‌' అంటూచప్పట్లు కొట్టారందరూ,

"ఈ వార్షింగ్‌ బెల్‌సిస్టం వెంటనే అమలుచేయాలి." అంటూ అరిచారెవరో. శంక(ర్రావ్‌ మళ్ళీలేచి నిలబడేసరికి మళ్ళీ అంతానిశ్ళ్శబ్దం అయిపోయారు.

“మళ్ళీ ఎమిటి? ఈ సిస్టంలో కూడా నీకు లోపం కనిపించిందా? "అడిగాడు రంగారెడ్డి చిరాకుగా.

"అవునూ! వార్నింగ్‌బెల్‌ మోగుతుంది, రైటే! ఒప్పుకున్నాం! కానీ పదిళ్ళల్లో ఆబెల్‌ ఎవరి చ్చారో-అంటే ఎఇంట్లోనుంచి వచ్చిందో ఎలా తెలుస్తుంది?”

శాయీరామ్‌కి శంకర్రావు మోద వళ్ళుమండిపోతోంది,

  • _ "ఎందుకుతెలిదూ? బాగానే తెలుస్తుంది" అన్నాడు కోపంఅణచుకుంటూ,

"అదే-ఎలా తెలుస్తుందీ అనడుగుతున్నాను."

రాజేశ్వరికి కూడా శంకర్రావ్‌ మోద కోపంముంచుకొచ్చింది. తను తన డిటెక్టివ్‌ మెదడు ఉపయోగించి, ఎన్నో రోజులు ఆలోచించికనుక్కున్న అద్భుతమయిన ఉపాయాన్ని అతగాడలా ఎలాంటి శ్రమలేకుండా-తీసి పారేయడం భరించలేక పోయింది.

"ఎలా తెలుస్తుందేమిటి? ఆ వచ్చినవాళ్ళందరూ కలుసుకుంటే ఏ ఇంటిమెంబరు రాలేదో తెలిసిపోదూ? "అంది అతనో వట్టితెలివితక్కువ వెధవాయి అన్నట్లు చూసి.

"అలా నడిరాత్రి అందరి అటెండెన్సు తీసుకుని, ఆబ్సెంటెవరో చూసి తేల్చుకునేలోగా ఆదొంగలపనికాస్తా పూర్తయిపోతుంది కదా? అదీగాకుండా ఒకవేళ వాళ్ళుమెయిన్‌స్విచ్‌ఆఫ్‌ చేశారనుకోండి. "

10 హ్యామరాలజీ

"ఇక చాలు ఆపు" అరిచాడు శాయీరామ్‌.

శంక(ర్రావ్‌ ఆపేసి మళ్ళీకూర్చున్నాడు.

"శ్రీమతి రాజేశ్వరిగారు చెప్పినట్లు పదిళ్ళకు కలిపి ఓకాలింగ్‌బెల్‌ ఎర్పాటుచేసే పద్ధతి ప్రవేశపెట్టాలని నిర్ణయించడమైనది" అన్నాడు శాయీరామ్‌.

"సోదర సోదరీమణులు ఇంకేమయినా సలహాలు ఇవ్వగలిగితే త్వరగా చెప్పండి" అడిగాడు రంగారెడ్డి.

"కాలనీవాళ్ళ డబ్బుబాంక్‌లోనూ, నగలన్నీ బాంక్‌ లాకర్లలో పెట్టటం మంచిదని ఇందు మూలముగా నేను మనవి చేస్తున్నాను” అన్నాడు కొత్తగాకాలనీ బాంకు బ్రాంచికి మేనేజరుగా వచ్చిన మార్తాండరావ్‌. "అలా అయితే దొంగలకు దొంగిలించేందుకు ఏమీ ఉండదు."

అందరూ ఉత్సాహంగా “అవును ఈ అయిడియా చాలా బాగుంది" అంటూ అరిచారు.

శంకర్రావ్‌ మళ్ళీలేచి నిలబడ్డాడు

.మార్తాండరావ్‌ చిరునవ్వుతో అతనివేపు చూచాడు. తను చెప్పినదాంట్లో లోపాలు ఎన్నటం ఎవరివల్లవుతుంది?

"అయ్యా! నాదో సందేహం!" అన్నాడు వినయంగా.

"ఆవిషయం వేరే చెప్పక్కరలేదులే "అన్నాడు గోపాల్రావ్‌ తాపీగా.

"ఏమిటో అఘెరించు!"లోపల అనుకోబోయి పైకి అనేసినాలిక్కరుచుకున్నాడు రంగారెడ్డి.

"మార్తాండరావ్‌గారి సలహా నాకేంనచ్చలేదు. నగలు చేయించేది ఎందుకు? అన్నీ లాకర్లలో పెట్టిదాచుకోవడానికా! సరీ-చెవులదుద్దులు, గాజులు, నెక్షిస్‌తీసి బాంక్‌ లాకర్లలో పెడతాం! మరి ముక్కుపుడక, మంగళసూత్రంమాటేమిటి? అవికూడా లాకర్లలోపెట్టాలా?

శంకర్రావ్‌ పాయింట్‌ ఆడాళ్ళను బాగా ఆకర్షించినట్లు కనిపించింది.

"అవునూ |! మంగళసూత్రం లాకర్లో ఎమిటి-నా తలకాయ" ఎవరో అనడం స్పష్టంగా వినిపించింది శాయీరామ్‌కి.

"ఇక డబ్బూ అంతే! కనీసం అయిదారువందలయినా ఇంట్లో ఉంచుకోకుండా అంతా

__ బాంకులోపడేస్తే సడెన్‌గా ఎవరికయినా ప్రాణంమిదకొస్తే ఏంచేయాలి? ఎవడిస్తాడు డబ్బు?" అడీగాడు శంకర్రావ్‌.

"అవునూ-మొన్న సీతారామయ్యగారి ఆఖరిపిల్లకి ఇలాగే ప్రాణంమిదకు ముంచు కొస్తే పాపం-చేతిలో పట్టమని పాతిక రూపాయలులేకపోయె- "పార్వతీదేవి కొంచెం గట్టిగా వత్తాసు పలికిందతనికి. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! [1

మార్తాండరావ్‌ మొఖం చిన్నబోయింది. తన సలహాలోని రెండు అంశాల్నీకూడా శంకర్రావ్‌ అలా చీల్చిచెండాడడం అతనికి నచ్చలేదు. అందుకని ఎదురుతిరిగాడు.

"దాన్దేముందీ? డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వితడ్రాచేసుకోవచ్చుగా! బాంకు ఎలాగూ కాలనీలోనే వుంది-ఉదయం సాయంత్రం ఓపెన్‌ ఉంటుంది."

కాని శంకర్రావ్‌ బమాత్రం బెదరలేదు.

"మరి అర్ధరాత్రిసంగతేమిటి? అవ్పుడు డబ్బు కావాలంటే ఎలా?సరీ అదలా వదిలేయండి. మనదేశంలో సంవత్సరానికి మూడునెలలు మొత్తం ఆఫీసులకూ బాంకులకూ శెలవులుంటాయ్‌. వురి ఆ మూడునెలలూ డబ్బుదాచు కున్నవాడేంచేయాలి. అడుక్కుతినాలి. మొన్నటికి మొన్న వరుసగా మూడురోజులు బాంకుమూసేశారు. అప్పుడు నేను మనకాలనీ వాళ్ళందరినీ అడుక్కుని భోజనంచేయగలిగాను."

"అవును! బాంక్‌ వద్దూ, గుడ్డూ వద్దు" అన్నారొకరు. దాంతో శంకర్రావ్‌ విజృంభించాడు.

"ఇంకో విషయంకూడా చెప్తున్నాను-మన నగలకు బ్యాంకుల్లో మాత్రం ఎమిరక్షణ ఉంది? ఆమధ్య మా అవిడ గొలుసు బాంకులోతాకట్టుపెట్టి, తరువాత విడిపించుకుంటే, ఆగొలుసులో చిన్నముక్కకొట్టేసి అతుకు పెట్టారవరో! గాజులకు కూడా చిన్నచిన్న ముక్కలుకోసి కనిపించాయి-

అంతా హాహాకారాలు చెలరేగాయ్‌.

"అవ్‌! నాకు అట్టానే జరిగింది” అన్నాడు యాదగిరి లేచినిలబడి.

మార్తాండరావ్‌ ముఖాననెత్తురులేదు.

“సోదరులారా! ఎక్కడో ఓవ్యక్తి అలాంటిదురాగతానికి పాల్పడినంతమాత్రాన అన్ని బాంకులూ అంతేనంటారా? " అనడిగాడు దీనంగా. సావిత్రమ్మ కోపంగా లేచింది.

"బాంకులన్నీ దగా-దొంగలు-నా గొలుసువి కూడా రెండులింకులు కొట్టేశారు" అంది మెడలోని గొలుసుతీసి గాలిలోవూపుతూ.

చాలామంది ఆడాళ్ళు లేచి ఆమెచుట్టూమూగారు.

శాయీరామ్‌, రంగారెడ్డి,గోపాల్రావ్‌ కలిసి అందరినీ కూర్చోమని బ్రతిమాలసాగారు. =

అంతా సద్దుమణిగాక చూసేసరికి మార్తాండరావ్‌ ఎక్కడా కనిపించలేదు.

ఆ తరువాత ఇంకెవ్వరూ సలహాలివ్వలేదు. అంచేత అప్పటికప్పుడే కాలనీ సభ్యులందరినీ నలుగురు నలుగురు చొప్పున గ్రూపులు గా విభజించి ఎవరు ఎరోజునైట్‌ వాచ్‌మెన్‌ ఉద్యోగం చేయాల్సిందీ నిర్ణయించారు.

12 హ్యూమరాలజీ

డిటెక్టివ్‌ రచయిత్రి రాజేశ్వరికే ఆమెసూచించిన వార్షింగ్‌బెల్స్‌లను అమర్చే కార్యక్రమం అప్పజెప్పారు. అమె వారంరోజులు గడువు అడిగింది. దాంతో సభముగిసింది. సరిగ్గా ఆరాత్రే రెండింటికి శాయీరామ్‌ ఇంట్లోకి దొంగలొచ్చారు.

వాళ్ళంతట వాళ్ళేలే పేవరకూ శాయీరామ్‌కి మెలకువరాలేదు. నలుగురూ నిక్కర్లూ- చొక్కాలూ తొడుక్కొని చేతుల్లో మెరిసేకత్తులు పట్పకుని నిలబడి ఉన్నారు. శాయీరామ్‌కి వణుకూ, దడా వచ్చేసినయ్‌.

"దొ....దొ....దొ....దొంగలు " అన్నాడు వణికిపోతూ.

"ష్‌! ఏటా ఎదవకూతలు! దొంగలు కాకపోతే దారలాత్తారా, నీబోడికొంవకి! నోర్మూసుకుని ఆ ఇనుపబీరువా తాళంచేతులివ్వు! "

శాయీరామ్‌ మాట్లాడకుండా తలగడకిందున్న తొాళంచేతులు వాళ్ళకిచ్చాడు.

అవి తీసుకుని ముగ్గురూ లోపలికెళ్ళారు.

ఇదే అదననుకొని "దొంగ-దొంగ" అని తీతువులా అరిచాడు శాయీరామ్‌. మరుక్షణంలో దొంగ అతని నోరుమూసి చేతిమోద ఒక్కపోటు పొడిచాడుకత్తితో!

"నోర్మూసుకోకపోయావంటే ఛాతీలోగుచ్చుతాను "అన్నాడు కోపంగా.

శాయీరామ్‌ నోరు మూసేశాడు.

స్టీలు అల్మరాలోని నగలూ, డబ్బూ, ఇంకా కొన్ని విలువయిన వస్తువులూ అన్నీ చక్కగా ప్యాకింగ్‌చేసుకు వెళ్ళిపోయారువాళ్ళు. శాయీరామ్‌ భార్యస్వల్పంగాగాయమయిన భర్తచేయిచూసి శోకాలు పెడుతూ పాతచీరచింపుకొచ్చింది.

అతను అర్జంటుగా చేతికికట్టుకట్టకుని బయటకు పరుగెత్తి "దొంగ దొంగలు" అంటూ కేరలువేశాడు.

నలుగురు సభ్యులున్న వాచ్‌మెన్‌పార్టీ అతని ఇంటిముందున్న మల్లెపందిరి కింద నుంచి బయటికొచ్చారు ధైర్యంగా.

"దొంగలు వెళ్ళిపోయారా? " అడిగారు.

"ఇప్పుడే-ఇటే వెళ్ళారు."

“హమ్మయ్య! ఈ ఒక్క ఇంటితో వదుల్తారో వదల్రో అని హడలిచచ్చాం " అన్నాడొకతను.

"వాళ్ళురావడం మోరుచూశారా? "ఆశ్చర్యంగా అడిగాడు శాయీరామ్‌. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 13

"చూడకపోవడం ఏమిటి? వాళ్ళే మమ్మల్ని కత్తిచూపి తీసుకొచ్చి ఈ మల్లెపందిరికింద కూర్చోబెట్టారు." 'మరి మోరు ఎదురుతిరగలేదూ?” "వాళ్ళు తిరగనిస్తేకదా! మేమునలుగురం ఆచివరింటివేపు వెళుతోంటే వెనుకనుంచి . మెడమీద కత్తిపెట్టారు. 'తిరుగుతే చస్తారు-పదండి' అన్నారు. ఇంకేం చేస్తాం! మల్లెపందిరి కిందకివెళ్ళాం! అక్కడనుంచీ కదలొద్దన్నారు కదల్లేదు.. "శాయీరామ్‌కి వళ్ళు మండిపోయింది. అప్పటికే కాలనీవాళ్ళంతా ఒక్కొక్కరే గుమిగూడిపోయారక్కడ. "నేను చెప్పలేదూ? వాళ్ళు నలుగురున్నా-మనం పదిమందున్నా ఒక్కటే!” అన్నాడు ' శంక(ర్రావ్‌ ఆవులిస్తూ. "అవును- మనకేమో పెళ్ళాం బిడ్డలుండిరి. వాడేమో ప్రాణాలకు తెగించినవాడాయె " అన్నాడు వెంకట్రావ్‌. అందరూ శాయీరామ్‌ పోగొట్టుకున్న ఆస్థిలెక్కలువేశారు. మొత్తం పదకొండువేల ఆస్థి గోవిందా! "పదండి! పోలీసులకు రిపోర్టిద్దాం!" అన్నాడు గోపాల్రావ్‌ ఆవేశంగా. "పోలీసుస్టేషన్‌కి ఎందుకు? ముందు పోలీస్‌కంట్రోల్‌రూమ్‌కి ఫోన్‌చేయండి" ఎవరో అరిచారు. "అవును! ఆదొంగలు ఎంతోదూరం వెళ్ళివుండరు. ఈరోడ్డువెంట ఇప్పుడే వెళ్తున్నారని చెప్తే-కంట్రోల్‌రూమ్‌ వాళ్ళు వైర్‌లెస్‌ లో అందరూ మాట్లాడుకుని ఆదొంగల్ని ఇట్టేపట్టేస్తారు. " "అయితే పదండి! మార్తాండరావ్‌గారింట్లో ఫోన్‌ ఉంది." అందరూ మార్తాండరావ్‌ ఇంటిదగ్గరకెళ్ళారు. "గోపాల్రావ్‌ని మాట్లాడమనండి! జర్నలిస్టు అంటే భయపడతారు పోలీసులు" అన్నారొకరు. గోపాల్రావ్‌ కంట్రోల్‌ రూమ్‌నెంబర్‌ డయల్‌ చేశాడు గర్వంగా. 'ఎంగేజ్‌డ్‌' అన్నాడు. ఓ క్షణం అగి మళ్ళీరింగ్‌చేశాడు. మళ్ళీ 'ఎంగేజ్‌డ్‌' అన్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యంకలింగింది. "కంట్రోల్‌రూమ్‌ ఫోన్‌ ఎంగేజ్‌ ఎలాఉంటుదయ్యా-అదీ ఇంతరాత్రప్పుడు-ఒకవేళ అది చెడిపోయి అఘెరించిందేమో! లోకల్‌ అసిస్టైన్స్‌కి కొట్టోరింగ్‌” సలహా ఇచ్చాడు రాబేశ్వర్రావు. 14 హ్యామరాలజీ

లోకల్‌ అసిస్టెన్స్‌ కూడా ఎంగేజే వినిపించింది.

“"భలేతమాషాగా వుందే! అర్ధరాత్రికూడా ఇంత డిమాండ్‌ ఉంటుందా కంట్రోల్‌ రూమ్‌కి, లోకల్‌ అసిస్టైన్స్‌కీనూ" ఆశ్చర్యంగా అన్నాడు కుటుంబరావ్‌.

గోపాల్రావ్‌ మళ్ళీ కంట్రోల్‌రూమ్‌ కిరింగ్‌ చేశాడు-ఉహు! ఇంకా ఎంగేజ్‌ చూపిస్తూనే ఉందది. పావుగంట గడిచిపోయింది. అనుకోకుండా లోకల్‌అసిస్టైన్స్‌ నెంబరు రింగయింది.

"హలో అసిస్టెన్స్‌" అంది అపరీటరు.

"పోలీసు కంట్రోల్‌రూమ్‌ ఎంగేజ్‌ చూపిస్తోందండి. ఇరవైనిమిషాలనుంచీ! అర్జంటుగా అక్కడికి కనెక్షన్‌ ఇవ్వండి- దొంగలు పారిపోతున్నారు."

ఆమెక్షణం తర్వాత మాట్టాడింది.

"సారీ! ఇటీజ్‌ ఎంగేజ్‌డ్‌-

“ఎంగేబ్‌డా?

"అవును"

"ఇందాకట్నుంచీ ఎంగేజ్‌డేనా? "

"అవునండీ!"

"ఇంతరాత్రప్పుడు ఎంగేజ్‌ ఏమిటండీ నా మొఖం?" స్టయిల్‌గా అన్నాడు గోపాల్రావ్‌.

"మో మొఖంసంగతి నాకు తెలీదుగానండీ ఆఫోన్‌ మాత్రం ఎంగేజ్‌ ఉంది!"

గోపాలావ్‌ కంగారుగా చుట్టూచూశాడు, పారపాటున ఆమాటయెవరయినా విన్నారేమోనని.

"ఇదిగో చూడండి! నేను న్యూస్‌పేపరు జర్నలిస్టుని.ఈ _ టైమ్‌లో కంట్రోల్‌రూమ్‌ ఎంగేజ్‌ ఎలా వుంటుంది? మరోసారి ట్రైచేయండి."

"కంట్రోల్‌రూమ్‌ ఎప్పుడు బిజీగా ఉండేదీ తెలీని జర్నలిస్టులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది ' అందామె.

"అంటే రాత్రి రెండుగంటలసమయంలో అదెప్పుడూ ఎంగేజ్‌ ఉంటుందన్నమాట!"

"అవును స్వామీ అవును!" అనేసి ఫోన్‌పెట్టేసిందామె.

"రాత్రంతా ఆఫోన్‌ అలా ఎంగేజ్‌ ఉంటుందేమిటి?" ఆశ్చర్యంగా కుటుంబరావ్‌ నడిగాడు.గోపాలావ్‌. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 15

"అవునయ్యా! ఎడతెరివ్‌లే కుండా దొంగతనాలు జరగబట్సే-ఇలా ఫోన్‌లకెగబడుతున్నారు జనం" ఎవరో అన్నారు.

"ఒక్క దొంగతనాలేమిటి! మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోకదా! దోపిడీలు,మర్ణర్‌లు ,కార్లలో తిరుగుతూ ఒంటరిగా కనిపించిన ఆడవారిని ఎత్తుకుపోయి మానభంగాలు చేయడం, రౌడీలు వీరవిహరాలు చేయడం-ఇవ్వన్నీ రాత్రుళ్ళే ఎక్కువగా జరుగుతాయికదా! అందుకే కంట్రోల్‌రూం తెగబిజీగా ఉంటుంది."

మరోసారి కంట్రోల్‌రూమ్‌కి రింగ్‌చేశాడు గోపాలావ్‌. అతని మొఖంవెలిగిపోయింది. హఠాత్తుగా చెయ్యి పైకెత్తి "సైలెన్స్‌! నిశ్శబ్దంగా ఉండండి! దొరికింది" అంటూ వెర్రికేకవేశాడు.

"హలో!" అన్నాడు అవతలి వ్యక్తి.

"హలో! నేను జర్నలిన్సు గోపాల్రావ్‌ని మాట్లాడుతు న్నానండీ! నిర్భయ్‌ నగర్‌ కాలనీనుంచి మాట్లాడుతున్నానన్నమాటండీ! సంగతేమిటంటే శాయీరామ్‌ ఇంట్లోదొంగలు పడ్డారండీ. ఇప్పుడే సూట్‌కేసులతోసహా నాగార్జునసాగర్‌ రోడ్డువేపు వెళ్ళారండీ. వాళ్ళుమొత్తం నలుగురు. నలుగురు చేతుల్లో నాలుగు కత్తులు-ఇవేవాళ్ళ ఆనవాళ్ళు. సామ్ములన్నీ తీనుకొనివాళ్ళ నూటొకేనులలో పెట్టుకుని పోయారండీ-చాలాండీ, ఇంకేమయినా వివరాలుకావాలా? " గుక్కతిప్పకుండా మాట్లాడడం చేత ఆయాసపడసాగాడు గోపాల్రావ్‌. అందరూ అతనివేపు అభినందనపూర్వకంగా చూశారు.

"పుల్‌డిటెయిల్స్‌-బట్‌ క్రిస్స! ఎంత చక్కగా ఇచ్చాడండి వివరాలు" మెచ్చుకోలుగా అన్నాడు రాబేశ్వర్రావ్‌.

"అతనెప్పుడూ అంతేనండీ! జర్శలిస్టుకదా! టు-ది-పాయింట్‌-మాట్లాడతాడు! అంతే!" ఇంకివరోపాగిడారు.

"హలో" అన్నాడు గోపాల్రావ్‌ పొంగిపోతూమళ్ళీ.

"హలో" అంది అవతలిగొంతు.

"నేను చెప్పినవన్నీ నోట్‌ చేసుకున్నారా? ఎమిటి? నేనా? నేను ప్రముఖ జర్నలిస్ట్‌ గోపాలావ్‌ని. "

గోపాలావ్‌ మొఖం పాలిపోయింది.

"ఆ! ఏమిటి? మోరు మాట్లాడుతోంది కంట్రోల్‌రూమ్‌ నుంచి కాదా? మరెక్కడినుంచి? "మో ఇంట్లోనూ దొంగలుపడ్డారా? గంటసేపటినుంచీ మోరూ కంట్రోల్‌రూమ్‌ కోసం

16 హ్యామరాలజీ

ప్రయత్నిస్తున్నారా? మరాసంగతిముందేచెప్పరే. అనవసరంగా సంబరపడ్డాను- కంట్రోల్‌రూమ్‌

  • దొరికిందని-" అంతా మళ్ళీ నిరుత్సాహపడిపోయారు. "ఇలా కంట్రోల్‌రూమ్‌ కోసం కూర్చుంటే పుణ్యకాలం కాస్తాపూర్తయిపోతుంది. త్వరగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాంపదండి" అన్నాడు వెంకట్రావ్‌. "అవును పదండి! "అందరూ ఎందుకులెండి! ముందు నలుగురు వెళ్తే సరిపోతుంది. అందరం వెళ్ళా మంటే మళ్ళీ కొత్తదొంగలబాచ్‌వచ్చి అన్నిఇళ్ళూ ఊడ్చుకుపోతారు" అన్నాడు రంగారెడ్డి. "గోపాల్రావ్‌ని తీసుకెళ్ళండి. జర్నలిస్ట్‌ అంటే కొంచెం త్వరగా యాక్షన్‌ తీసుకుంటారు" అన్నారెవరో. గోపాల్రావ్‌, శాయీరామ్‌, వెంకట్రావ్‌, రంగారెడ్డికలిసి పోలీస్‌ స్టేషనుకి బయట్టేరారు. "ఎవరది?" అంతదూరంలో ఉండగానే అరిచాడు సెంటి. "నిర్భయ్‌నగర్‌ కాలనీవాళ్ళం " అన్నాడు గోపాల్రావ్‌. “ఏంగావాలి?” "మాకాలనీలో దొంగతనం జరిగింది. కంప్లయింట్‌ ఇవ్వాలి.” "అదుగో-అఆయనతోచెప్పండి! " అన్నాడు లోపలకుర్చీలో నిద్రపోతున్నతనినిచూపుతూ. క్‌ అందరూలోపలికెళ్ళీ అయిదు నిమిషాలపాటు తంటాలుపడీ అతనినిలేపారు. తననిద్రకలాభంగం కలిగించినందుకు అతనికి కోపంవచ్చింది. "ఏం కావాలి?" అడిగాడు చిరాకుగా. “దొంగతనం జరిగింది." "ఎక్కడా?" “శాయీరామ్‌ గారింట్లో." "ఏ శాయీరామ్‌?" "క.యల్‌. శాయీరామ్‌," .._ "నేనడిగేది అదికాదు-ఎవడా శాయీరామ్‌" "నేనే” అన్నాడు శాయీరామ్‌ ముందుకొచ్చి. . "అ! ఏం జరిగింది?" 2 దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 17

"దొంగలువచ్చికర్రచూపించి నగలూ, డబ్బూ,ఇంకా ఇతర వన్తువులు ఎత్తుకు పోయారండీ."

“ఎంతమంది ఉన్నారువాళ్ళు? “నలుగురండీ" "ఎలా వున్నారు?" "నల్లగా-పొడుగ్గాటున్నారండి. " “ఇంతకు ముందెక్కడయినా చూసినగుర్తుందా? " "లేదండీ." "నీపేరేమిటి? "శాయీరామ్‌ అండీ."

  • ఏ శాయీరామ్‌?” “కె. యల్‌. శాయీరామ్‌-" "మో అయ్యపేరీమిటి? " “"మాఫాదర్‌ పేరా?" “అన్నను. " “ఆయన పేరెందుకు?" “కావాలయ్యా. 'శంభులింగం. " "ఏ శంభులింగం? " "కె..యల్‌. శంభులింగం " “నీతాత పేరు?" ” నా తాత పేరుకూడా కావాలా?"

"కావాలయ్యా.' “బసవరాజు. " "ఎ బసవరాజు." "కె.యల్‌. బసవరాజు."

18 ' హ్యామరాలజీ

“దొంగతనం ఎన్నిగంటలకు జరిగింది? "రెండు గంటలకు." “తలుపులు తెరిచిఉంచావానువ్వు." "నేనెందుకు తెరుస్తాను” "మరెలా వచ్చిన్రువాళ్ళు? " బా. "తలుపులు పగలగొట్టుకుని వచ్చారు." "అంతవరకూ నువ్వెందుకు లొల్లిపెట్టలేదూ?" "పెట్టేంత టైముంటే ఈ గొడవంతా ఎందుకొస్తుంది? " "ఆళ్ళనింకివరయినా చూసినోళ్ళున్నారా? "నైట్‌వాలంటీర్‌ పార్టీవాళ్ళుచూశారు-" "ఎవరాళ్ళు?" "శ్రీధరం, రత్నాకరం, కిషోర్‌, రాబేష్‌-" "వాళ్ళంతా నమ్మదగినవాళ్ళేనా? "

  • శాయీరామ్‌ ఉలిక్కిపడ్డాడు. "అదేంటండీ ? వాళ్ళు మాకాలనీవాళ్ళేగా? " "కాలనీ ఏమిటయ్యా! ఇంట్లోసాంతమనుషులే మర్దర్ద్లుచేస్తును-ఇయ్యాల్రేపు. " "అబ్బే వాళ్ళంతా నమ్మకస్తులే!" "మీదేకాలనీ?" "నిర్భయ్‌నగర్‌ కాలనీ!” "నిర్భయ్‌నగర్‌ కాలనీయా?" ఇంకా చిరాకుగా అన్నాడతను. “అవును. "మరి ఇక్కడికెందుకొచ్చారు? " "ఇంకెక్కడికెళ్ళాలి! రిపోర్టివ్వాల్సింది పోలీస్‌ స్టెషన్‌లోనేగా? " "పోలీస్‌స్టేషన్‌లో కాకపోతే మంగలిషాపులో ఇస్తారేమిటి? నేననేది అదికాదయ్యా! ఇది మో ఏరియా పోలీస్‌ స్టెషన్‌కాదు." "మరి మా ఏరియాపోలీస్‌స్టేషనెక్కడుంది?" "ఆరోడ్డుచివర ఉంది. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 19

"అంతదూరం వెళ్ళాలా ఇప్పుడు?"

"రిపోర్టివ్వాలంటే-"

అనేసిమళ్ళీనిద్రకోసం వెనక్కువాలాడతను.

"ఇంకిప్పుడెందుకులే రిపోర్టి్వటం! పొద్దున్నవెళదాం!” అన్నాడు రాజేశ్వగ్రావ్‌.

"అవును, ఎలాగూ దొంగలీపాటికి మరోరెండుమూడు ఇళ్ళుకూడా చూచుకునివాళ్ళిల్లు చేరుకుని ఉంటారు" అన్నాడు రంగారెడ్డి. |

నలుగురూ మళ్ళీకాలనీకి చేరుకున్నారు. అప్పటికే కాలనీఅంతా నిశ్శబ్దం అయిపోయిం ది. అందరూ నిద్రపోయినట్టున్నారు. వాళ్ళనుచూడగానే కుక్కలు వాఠాత్తుగా నాలుగువేపులనుంచి వచ్చి మొరగసాగాయి. వాలంటీర్‌ పార్టీవాళ్ళు కర్రలు తీసుకుని పెద్దగా కేకలు వేసుకుంటూ పరుగుతో వచ్చారు. మరుక్షణంలో అందరిళ్ళల్లోనూ లైట్లువెలిగిపోయినయ్‌. క్షణాల్లో కాలనీవాళ్ళందరూ వాళ్ళచుట్టూ మూగిపోయారు.

"ఇందాకవచ్చిన దొంగలేనా? " అన్నాడు మార్తాండరావ్‌. వాళ్ళమొఖాల మోద టార్చ్‌లైటు వేస్తూ.

శాయీరామ్‌కి వళ్ళు మండిపోయింది.

“"సిగ్గులేకపోతేసరి! నిజంగా దొంగలొచ్చి దోచుకుపోయినపుడు ఒక్కడూదిక్కులేడుగానీ ఇప్పుడు భూమి ఈనినట్టువచ్చేశారు" అన్నాడు చిరాకుగా.

"అవును, కుక్కలూ అంతేగా" తాపీగా అన్నాడు రంగారెడ్డి.

"మోరిద్దరూ స్కూటర్‌ మోద వెళ్ళి మనఎరియా పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టిచ్చిరండి. నేనూ, రంగారెడ్డి వెళ్ళి మాపేపర్లో ఈవార్త ఎక్కించేసివస్తాము" అన్నాడు గోపాల్రావ్‌.

“ఎమనిరాస్తావు న్యూస్‌?" ఎవరో అడిగారతనిని సంబరంగా.

నిర్భయ్‌నగర్‌లో భయంకరమైడెకాయిటీ! ఇంటియజమాని శాయీరామ్‌తో ఢీ? పదకొండువేల అస్టి లౌ! చేతికి కత్తిపోట్లు-పోలిసువారి నిర్లక్ష్యం. ఇదంతామెయిన్‌ హెడ్డింగ్‌ అన్నమాట. కింద నాలుగు పేరాలు వివరాలు రాస్తాను."

"అబ్బ ఒండర్‌పుల్‌-" అన్నాడు రాబేశ్వర్రావ్‌. మర్నాడు ఉదయం అరుగంటలకల్తా న్యూస్‌ పేవర్‌కొని కాలనీ వాళ్ళంతా తమ కాలనీ దొంగతనం వార్త ఉత్సావాంగా చదువుకోసాగారు. మరికాసేపట్లో పోలీస్‌వానూ, జీపూ వచ్చేసినయ్‌ అక్కడకు.

20 హ్యూమరాలజీ

అందులోనుంచి బిలబిలమంటూ పోలీసులు, పోలీసుకుక్కలు, పోలీసు అధికారులు, | ఓపఫోటోగ్రాఫరూదిగి శాయీరామ్‌ ఇంట్లోకివెళ్ళారు కాలనీవాళ్ళంతా శాయీరామ్‌ ఇంటిముందు మూగిపోయి ఉత్సాహంగా చోద్యం చూడసాగారు. కుక్కలు దొంగలవాసన గుర్తెట్టుకుని వాళ్ళను వట్టుకోడానికి బయటికొచ్చాయ్‌. అందరూవాటి వెనకే బయల్టేరారు. అవికాలనీచుట్టూ రెండు రౌండ్లు తిరిగి గోపాల్రావ్‌ ఇంట్లోదూరి మొరగసాగాయ్‌! | "అదేమిటి? అతన్ని చూసి మొరుగుతాయ్‌?" అన్నారు జనం. . “మోరివరు? " అన్నాడు పోలీసు అధికారి గోపాల్రావ్‌నిచూసి. "జర్హలిస్ట్‌ గోపాల్రావ్‌ ఇతనేనండీ! ఈ దొంగతనం గురించి ఇవాళ పేపర్లో రాసింది ఇతనే” పరిచయంచేశాడు శాయీరామ్‌. "ఓహో" అనుమానంగా తలపంకించాడతను. "అయితే పోలీసుస్టేషనుకి పదండి." గోపాల్రావ్‌ అదిరిపడ్డాడు. "పోలీసుస్టేషనుకా? ఎందును?" "మిమ్మల్ని ప్రశ్నించాల్సివుంది. " ఈలోగా కుక్కలు మళ్ళీజయ్‌ మంటూ పరుగెత్తి వెంకట్రావ్‌ ఇంట్లోదూరాయ్‌. అది చూసి వెంకట్రావ్‌కి చలిజ్వరం వచ్చేసింది. "ఇదేం అన్యాయంసార్‌! చిన్నప్పటినుంచీ పూచిక పుల్ల కూడా ముట్టుకుని ఎరగను." అన్నాడు ఎడుపుమొఖంతో. కుక్కలు అక్కడనుంచి గుంవులోనిలబడ్డ యాదగిరిని చూసి మొరగటం ప్రారంభించేసరికి పోలీసు అధికారికి చిరాకేసుకొచ్చింది. "అంటే మేమందరం దొంగలమేనంటారా? " అడిగాడు యాదగిరి. అందరూ ఘెల్లున నవ్వారు. "ఇంక వీటిని తీసుకుపోండి" అన్నాడు ఇన్‌స్పెక్టర్‌, కుక్కలుమళ్ళీ వాన్‌ ఎక్కి వెళ్ళిపోయాయి. ఇ కాలనీవాళ్ళంతా పోలీస్‌ అధికార్లచుట్టూ మూగారు. "ఇలా విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతూంటే మోరేంచేస్తున్నట్లు? 'అందరితరపున్లా | వకాల్తాపుచ్చుకున్నట్లు అడిగాడు గోపాల్రావ్‌. పోలీసు అధికారికి వళ్ళుమండిపోయింది. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 21

"నువ్వెవరివి?" "జర్హలిస్టుని? " "ఓహో-అయితే పోలీసుడిపార్ట్‌మెంట్‌ ఎంచేస్తుందో అదివరకు మా పేపర్దురాయలేదా?" / "రాశాం!" "రాస్తేమళ్ళీ అడుగుతారేం? "డెకాయిటీలు ఎక్కువయిపోయాయి కాబట్టి!" (| “"డెకాయిటీలు ఎక్కువవ్వలేదు" కోపంగా అన్నాడు పోలీసుఅధికారి. "అబద్ధం" అరిచాడు గోపాల్రావ్‌ “అవును అబద్ధం" అన్నారు, అందరూ వత్తాసుగా. "అబద్ధం ఏమీలేదు." - = “అయితే మరి డెకాయిటీలు రోజుకోటి జరుగుతోంటే లేదంటారేమిటి?” పోలీసు అధికారి తల రెండుచేతుల్తోపట్టుకున్నాడు. "అవి దొంగతనాలు! అంటే వాటిని 'రాబరీ' అంటారు! డెకాయిటీలువేరు." "రెండూ ఒక్కటేగా? ఏరాయి అయినా మా పళ్ళేగావూడేది?” ఎవరో అరిచారు. " “కాదయ్యాబాబు! రెండూ వేరు." “ఎమిటో ఆకేడా?" "నలుగురుగానీ- ఇంకా తక్కువగానీ దొంగలు వస్తే అదిరాబరీ. అయిదుగురుగానీ, ఇంకాఎక్కువగానీ వస్తే అదిడెకాయిటీ-" "అయితే ఇప్పుడు శాయీరామ్‌ గారింట్లో జరిగింది డెకాయిటీకాదంటారు?” "మేము దాన్ని 'రాబరీ' కేటగిరిలో వేసుకుంటాం!" "మోరు దేనికిందేసుకుంటే మాకెందుకండీ ఇప్పుడీ 'దోపిడీ...." "ఇది దోపిడీ కాదన్నానా, దొంగతనం అను! అ!" "అబ్బా ఎఏదొకటిలెండి సార్‌!" "అలా వీల్లేదు. దేనికదే. మియిష్టంవచ్చినట్లు మోరు పేర్లుపెడితే ఎలా? ప్రతి దానికీ- ఓపేరూ, ఓమెయిన్‌ హెడ్డు, ఓప్రాసీజరూ ఉంటాయ్‌." "అయితే యిప్పుడేమంటారు?” 22 హ్యామరాలజీ

"ఇది రాబరీకిందవస్తుంది, డెకాయిటీ అనటానికి వీల్లేదు."

"సరే,అనం! అయితే యిప్పుడు రాబరీకిందవచ్చిందికాబట్టి మనకేమయినా లాభం

క్ష వుందా"

"ఎందుకులేదు? అన్నీ ఒకటిగా లెక్కవేసి-ఆసంఖ్యచూస్తే గుండెపగిలిపోదూ అందరికీ? అందుకేయిలా విభజించేస్తే చాలా తక్కువగా కనబడతాయ్‌. చూశారా మా డిపార్ట్‌ మెంట్‌కి ఎంతలాభమో-” అడిగాడు ఇన్‌ స్పెక్టర్‌.

“పోనీయింకోపని చేయకూడదా సార్‌!"

"ఏమిటది?"

"సరదా దొంగతనాలు, అవసరంకొద్దీ దొంగతనాలు, ఆకలి దొంగతనాలు, అలవాటు చొప్పున చేసిన దొంగతనాలు, మానసిక బలహీనతవల్ల చేసేదొంగతనాలు-యిలా బోలెడు భాగాలుగా విభజిస్తే అన్సలు తగ్గిపోతాయిగా! యించుమించుగా ఎమీలేనట్టెస్టేట్‌ మెంట్లివ్వచ్చు."

ఆయన అర్జంటుగా జీపెక్కివెళ్ళిపోయాడు.

ఆసాయంత్రంమళ్ళీకాలనీ మీటింగ్‌ జరిగింది.

"నేను ఆరోజేచెప్పాను. పది ఇళ్ళకు కలిపి ఓవార్నింగ్‌బెల్‌ ఎర్పాటుచేయమని. కానీ ఎవరూ వినిపించుకోలేదు. ఇప్పటికయినా దానివిలువ గుర్తించియేర్పాటు చేశారంటే | ఆదొంగల్ని మనమే పట్టుకోవచ్చు." అందిడిటెక్టివ్‌ రచయిత్రి ఆవేశంగా. అప్పటికప్పుడే చందాలు పోగుచేశారు. నలుగురు ఎలక్టీషియన్న్లు ఆరాత్రంతా పనిచేసిమర్నాటికి వార్షింగ్‌బెల్స్‌ ఎర్పాటుజేసేశారు. చాలాసార్లువాటిని ప్రయోగాత్మకంగా మోగించిసంతృప్తిచెందారు. ' స్వయంగా రాజేశ్వరే రాత్రిళ్ళురాబరీ డ్రిల్స్‌ నిర్వహించింది. అంటే రాత్రిరెండింటింకి ఏదోక ఇంట్లోనుంచి వార్షింగ్‌బెల్‌ వన్తుందన్నమాట. దాంతో అందరూ బయటకు ఇ పరుగెత్తుకురావాలి. ఆడ్రిల్స్‌ విజయవంతంగా పూర్తయినాయి. ఆమర్శాడే సీతాపతి ఇంట్లో దొంగలుపడ్డారు. వాడు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని వార్నింగ్‌బెల్‌ కొట్టాడు. కాని అచుట్టుప్రక్కల వాళ్ళందరియిళ్ళూ, ముందే బయటినుంచీ గొల్ఫ్ళాలు పెట్టేశారు దొంగలు. అన్నీ ఎత్తుకుపోయాక సీతాపతేవెళ్ళి అందరి తలుపులు గొళ్ళాలు తీయాల్సివచ్చింది. ; మర్నాడే మళ్ళీ కాలనీ మీటింగ్‌ ఏర్పాటు చేశాడు శాయీరామ్‌

"సోదరులారా! మనం చేయగలిగినవన్నీ చేశాం! యిప్పుడు మనకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే మన ఉపాయాలేమీపనికిరావని! యింకా కొత్తఉపాయాలేమైనా దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 23

ఎవరయినా సూచించగలరా?" అడిగాడతను. ఎవ్వరూ మాట్లాడలేదు. చివరకు రంగారెడ్డిలేచి నిలబడ్డాడు. ॥ "ఈ సమస్యకు ఒకే ఒక్కపరిష్కారం ఉంది.” అన్నాడతను. “ఏమిటిది?” "దొంగలకుమనమే స్వాగతంచెప్పడం!" అందరూ నవ్వారు. “రంగారెడ్డికి పిచ్చిపట్టింది" అనుకున్నారు కొందరు. "అయ్యా! నాకేం పిచ్చిపట్టలేదు. ఫాక్ట్స్‌చెబుతున్నాను. దొంగలకు మనందరంకలసి | స్వాగతం చెప్పాం. బాబూ మా ఇళ్ళు అలా ఇష్టంవచ్చినట్టుదోచుకోకండి. మోకు నెలనెలా మేమే ఎంతోకొంత ముట్టచెబుతాం అని రిక్వెస్టుచేద్దాం" మళ్ళీకేకలుచెలరేగినయ్‌. కాసేపుకోలాహలం తరువాత శాయీరామ్‌లేచాడు. ( "మన సోదరుడు రంగారెడ్డి సూచించిన ఉపాయమే బాగున్నట్టుతోస్తోంది " అన్నాడు వెంకట్రావ్‌. మరి కాసేపట్లో అందరూరంగారెడ్డి అలోచన బాగానేవుందనే నిర్ణయానికొచ్చారు. వెంటనే రంగారెడ్డి అధ్యక్షుడిగా దొంగల స్వాగతంకమిటీ ఒకటివేశారు. శాయీరామ్‌, యాదగిరి, గోపాల్రావు, సీతాపతి అందులోసభ్యులు. "ఇంతకూదొంగలకు ఆహ్వనం పంవడం ఎలా?" అడిగాడు యాదగిరి. "దానిదేముందీ? అన్ని న్యూస్‌పేపర్లలోనూ ఆహ్వానపథ్రాలు పబ్లిష్‌ చేద్దాం-వాళ్ళెలాగూ న్యూస్‌పేపర్లు చదువుతారు కాబట్టి తెలుసుకుని సంప్రదింపులకు వచ్చేస్తారు." ఆరోజే టాక్సిలో సిటీఅంతా తిరిగి నాలుగు భాషల్లో ఎనిమిది న్యూస్‌ పేపర్లలో ఆహ్వానాలు ప్రకటింపజేశారు వాళ్ళు. "మహారాజశ్రీ దొంగలకు! నిర్భయ్‌నగర్‌ కాలనీవాసుల సుస్వాగతం! ఆర్యా! మా కాలనీలో మోకు వచ్చేశనివారం రాత్రిఘనమయిన స్వాగతసభయేర్పాటు చేయబడుతుంది. కనుక మోరెల్లరు మాస్వాగతాన్ని మన్నించి, నభకు విచ్చేసి మాతో నంటప్రదింవులు జరపవలసిందిగా ప్రార్టిస్తున్నాము. మారు జరుపుతున్న దొంగతనాలవల్ల రాత్రుళ్ళు మోకు, మాకు నిద్రాభంగము కలుగుచున్నది. అంతేకాదు, తరచుగా మో కత్తిపోట్లువల్ల మాశరీరాలకు గాయాలు-వాటిని మాన్సించుటకు డాక్టరు బిల్లులు మిమిద రిపోర్టు ఇచ్చుటకు పోలీస్‌ స్టేషన్లచుట్టూ తిరగడం, దానికి ఆటో, టీ ఖర్చులు, కొన్ని నగలు బాంకులాకర్లలో దాయడం 224 హ్యామరాలజీ

మూలాన దానికయ్యే లాకర్‌ ఛార్జీలూ, సగంలో కొంత బంగారం బాంకువారుకొట్టేయడం-లేదా బాంకులోనే దొంగతనం జరగడం-ఇవన్నీ ఆలోచించి మేమినిర్ణయానికొచ్చాము. కనుక మీరు తప్పక శనివారం రాత్రిమాచే ఎర్పాటుచేయబడిన ఆహ్వానసభకు విచ్చేసిమాతో సంప్రదింపులు జరిపి, పరిష్కారపత్రాలమిద సంతకంచేసి, ఆతరువాత మేమొసంగు చందన,తాంబూలాది సత్కారములు గైకొని మమ్మానందింప జేయవలసిందిగా ప్రార్ధిస్తున్నాము-ఇట్టు ఆహ్వాన సంఘం-"

శనివారం రాత్రికాలనీ ఆవరణ ఆంతాపండగ వాతావరణం అలుముకుపోయింది. 'పెద్దషామ్యానాలు, పెద్దవేదిక, రంగురంగులదీపాలు, మైకులు,రికార్డులతో హడావుడిగా ఉంది.

"దొంగమహాశయులకు సుస్వాగతం" అన్న బోర్జు దేదీప్యమానంగా వెలుగుతోంది. సరిగ్గా రెండింటికి ఆరుగురుదొంగలు కారుదిగారు.

వెంటనే రంగారెడ్డి, మిగతా కమిటీసభ్యులు ఎదురువెళ్ళి పూలదండలువేసి స్వాగతం వలికారు. అందరూ వేదికమోద కూర్చున్నారు. ఆదొంగల్లోకందరికీ భీఫ్‌ దొంగను మాట్టాడవలసిందిగా కోరారు. దొంగలేచి మైక్‌దగ్గరకొచ్చాడు.

' "సోదరసోదరీ మణులారా! మేము దొంగలమే. వప్పుకుంటున్నాం. కానీ మేము దొంగలమయింది మాకేం సరదాపుట్టికాదు. అది ఒక వృత్తిగా స్వీకరించాం! అందులో తప్పే మిటో నాకు అర్ధంకావటంలేదు. రాజకీయాలు ఒక వృత్తి, అలాగే గూండాయిజం ఒక వృత్తి, అలాగే మర్షర్దుచేయడం ఒక వృత్తి. ఈ వృత్తులన్నీ కూడా మనంచేసేది కేవలం డబ్బు నంపాదనకేనని అందరికీ తెలుసు. మరి దొంగతనాలుకూడా డబ్బుసంపాదనకే కదాచేసేది! దీన్ని 'ఇల్లీగల్‌ అని ఎందుకంటున్నారో నాకు తెలీటంలేదు. ఇప్పటికయినా మాలో చైతన్యం కలిగి దీనిని చట్టసమ్మతం చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు నాకు ఆనందంగాఉంది. మాక్కా వలసిందేమీలేదు. మాకూ, మాభార్యాబిడ్డలకూ మూడుపూటలా తిండీ,ఖరీదయిన బట్టలూ,

సొంతిళ్ళూ, కారు మెయింటెనెన్స్‌ ఖర్చులు, పెట్రోలుఖర్చులూ, రోజు కోవిస్కీబాటిలూ- ఇంతే మాక్కావలనింది. వీటికోనవే మేము దొంగతనం చేన్తున్నాం. మిమ్మల్ని కత్తులతో పొడున్తున్నాం!మోరు మరివీటన్నిటికీ సరిపోయే డబ్బు నెలనెలా మాకుపడేస్తే మేము ఇంక మో జోలికెందుకు వస్తాం. చస్తేరాము. జైహింద్‌-" అంటూ స్పీచ్‌ ముగించాడతను. అందరూ తప్పట్టుకొటారు. మరుక్షణంలో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. చివరకు అందరూ ఓ నిర్ణయానికొచ్చారు..ఒప్పందంమోద సంతకాలయ్యాయి. దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండి! 25

కాలనీ రిజిష్టరలో దొంగగానమోదయిన వారందరికీ నెలకు అయిదువేలుచొప్పున జీతం (కన్సాలిడేటెడ్‌) ఇవ్వబడుతుంది. సంవత్సరానికొకసారి దీపావళి పండగ ముందు వేతనానికి నమానమయిన బోనస్‌ కూడా ఇవ్వబడుతుంది. దీనికి ప్రతిఫలంగా వారు నిర్భయ్‌నగర్‌ కాలనీలో దొంగతనాలుచేయరు, ఇంకొకరిని చేయనీరు.

అందరూ ఆ ఎగ్రిమెంట్‌కి హర్షం వెలిబుచ్చారు. ఆతరువాత అల్పాహారవిందు జరిగింది.

విందులో దొంగలనాయకునితో తనింటర్వ్యూ (ప్రారంభించాడు జర్హ్శలిస్టు గోపాలావు.

"అయ్యా! తమరి స్వగ్రామం ఏది?"

దొంగల లీడర్‌ నవ్వాడు. "మాగ్రూవులో ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెవరూ లేరు ప్రస్తుతానికి ' అన్నాడు. (

"అదేమిటి? మీ స్వంత రాష్టంలో మిరు దొంగతనం చేసుకోకుండా, పరాయి రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారు?

దొంగలనాయకుడు ఆప్రశ్నకు చిరాకుపడ్డాడు.

"నీళ్ళు ఎటుప్రవహిస్తాయి? "అనడిగాడు గోపాల్రావుని. .

“పల్లంవేపు.”

"అవునా? మరి మేమూ అంతే! ఏరాష్టంలో పోలీసుడిపార్ట్‌మెంట్‌ చేతకానిది ఉంటుందో అక్కడ హాయిగా బ్రతకొచ్చుగదా మేము!"

"ఓహో అదా సంగతీ!” అసలు రహస్యం తెలిసినట్లు రాసుకున్నాడు గోపాల్రావ్‌.

"అంటే మో ఉద్దేశ్యం-కేవలం పోలీస్‌డిపార్చుమెంట్‌ దేనికీ పనికిరాదు అన్నరాష్టంలోనే దొంగతనాలు చేస్తారన్నమాట! అంతేనా? "

“అంతేకాదు- ఇంకోటి కూడా వుంది."

"అదేమిటి? ప్రజలు! ఇక్కడి ప్రజలు గంగిగోవుల్లాంటివారు. కత్తిచూపించగానే సర్వస్తుం యిచ్చేస్తారు. ఎన్ని దొంగతనాలు చేసినా- ఎంతమందిని చావగొట్టినా కిక్కురుమనకుండా పడివుంటారు. ప్రజలను రక్షించటం చేతకాని ప్రభుత్వాన్ని తీసిపారేయాలని కోరుకోరు! కనుక మేము హాయిగా రిటైరయేవరకూ సుఖప్రదమయిన జీవితం గడపొచ్చు ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ అని అందుకే మేము పేరుపెట్టాం!"

"సరే-ఇప్పుడు మోరు ఇంతధైర్యంగా వచ్చారు కదా ఇక్కడికి! ఒకవేళ పోలీసులు వచ్చి పట్టుకుంటే ఎంచేసేవారు?"

26 హ్యామరాలబీ

ఆదొంగల నాయకుడు పకపకా నవ్వాడు.

"ఏమిటి నవ్వుతారు?"

"ఇంత చిన్న విషయం తెలీదంటే ఆశ్చర్యంగా వుంది.”

"ఎమిటా చిన్న విషయం?”

"పోలీసులెప్పుడయినా దొంగతనం జరుగుతుండగా గానీ, మర్ణర్‌ జరుగుతుండగా గానీ లేక యింకేదయినా కైమ్‌ జరుగుతుండగా గానీ ఎవరినయినా వట్టుకోవడం గురించివిన్నారా? "

"లేదు."

"మరింక ఇప్పుడు మాత్రం ఎలా పట్టకుంటారయ్యా, భలే జర్నలిస్పాలయ్యా మోరు! మోలాంటి జర్నలిస్పలుండబట్టే దేశం యిలా అఘోరించింది-వస్తా” అంటూ లేచాడతను.

అందరూ కారువరకూ వెళ్ళివాళ్ళకి వీడ్కోలు ఇచ్చారు. అంతే! ఆతరువాతెప్పుడూ మాకొలనీలో దొంగతనం జరగలేదు. *

ల (గ్రోల ఆ 11 కమ క ఈత టు 2 దొంగలొస్తున్నారు స్వాగతం చెప్పండీ! 2

న్వు ( ఇ క ళఘోళి పష (ల ర ల 1111 / చి /1 ళ 4 స్‌ (4 అలం తోనా

మా కొలనీ పేరు మికు తెలుసుకదా!

మా కాలనీ అంటే నా ఉద్దేశ్యం నిజంగా మాసొంతకాలనీ అనికాదు.

మేమంతా అకాలనీలో అద్దెకుంటున్నాం. అకాలనీ ఇళ్ళు ఓనర్ల్గందరూ హౌసింగ్‌ బోర్జువాళ్ళు. సాంతిళ్ళులేనివాళ్ళకోసం కట్టించిఇచ్చిన హౌసింగ్‌బోర్జుకాలనీలోని సొంత ఇళ్ళలో ఉంటున్నారు.

ఆరోజు ఆదివారం అవడంవల్ల ఉదయం ఎనిమిదిగంటలవరకూ హాయిగా నిద్ర పోవచ్చని నేను ప్తాన్‌వేశాను. ఎందుకంటే నిద్ర అనేది తెలుగు రాజధానిఫొరులకు రేషన్‌లో దారికేమంచినీళ్ళలాంటిది. -

ఎందుకంటే రాత్రి పన్నెండింటివరకూ ఆచుట్టుప్రక్కల గుడిలోనో,మసీదులోనో లౌడ్‌ స్పీకర్లలో పాటలూ, అరుపులూ కేకలూ వినబడుతూనే ఉంటాయ్‌. అంచేత అంతవరకూ గ్యారంటీగా ఎవరికీ నిద్రవుండదు. పోనీపన్నెండుతర్వాతే పడుకుందామా అంటే, మాకాలనీ పంపుల్లో నీళ్ళు రాత్రి ఒంటి గంటనుంచీ రెండింటివరకూ మాత్రమే వస్తాయ్‌.

28 హ్యాూమరాలజీ

"పోనీ రెండింటికి పడుకోవచ్చుకదా- దానికింత రాధ్దాంతంఎందుకట?" అని మీరు విసుక్కోవచ్చు.

కానీ రెండింటికి కూడా పడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రెండింటినుంచీ మూడు

న్నరవరకూ మన ఆంధ్రప్రదేశ్‌లో దొంగలుపడే బ్రైము. రోజూ అభైములో మనింట్లోనో, పక్కింట్లోనో, లేదా కాలనీలో ఏదోక ఇంట్లో దొంగలు పడక తప్పదుకదా! మరి అదొంగలు అలా ఊడ్చుకెళ్ళి పోయాక మనం నలుగురినీ పిలవడం-లేదా నలుగురూ మనల్ని పిలవడం-అందరూ కలసి ఆ దొంగతనం గురించి మాట్లాడుకోవడం- జోకులేసుకోవడం- జరుగుతుంది కదా!ఇక నాలుగ్గంటలకు పాలవాన్‌ వచ్చేస్తుంది.

అయిదు గంటల్లోపల పాలపాకెట్‌ తెచ్చుకోకపోతే- ఆతరువాత దొరకదు. మనపాల పాకెట్‌ని మరోపావలా ఎక్కువధరకుఎవరికో అమ్మేస్తాడుబూత్‌వాడు. లేదా ఆపాంట్‌లోనిపాలు కొన్ని తీసేసి నీళ్ళు కలిపేస్తాడు.

"పోనీ నాలుగున్నరకు పడుకోవచ్చుకదా, మాయరోగమా?” ఆని మోరనవచ్చు కానీ సరిగ్గా నాలుగున్నరకే పనిమనిషి తలుపులుకొడుతుంది. ఆమె టైము నాలుగున్నరనుంచీ అయిదు వరకూ. ఆ అరగంటసేపూ అంట్లు ఎగిరి పడటం, దార్లడంలాంటి శబ్దాలు ఎవరావగలరు?పోనీ ఆవనిమనిషిని అరున్నరకు రమ్మందామా అంటే- "నేను నాలుగున్నరయితేనే వస్తాను! ఇష్టంలేకపోతే రిజైన్‌ చేస్తాను" అని వార్శింగిస్తుంది. అంచేత అయిదింటివరకూ నిద్రఖాళీ!

ఆతరువాత వంటచేసే కార్యక్రమం ప్రారంభమయిపోతుంది. అప్పుడేన్యూస్‌ పేపర్‌.

ఇవాళ పేపర్లో ఎమిరాశారో చూద్దాం అనేకోరిక నిద్రను పూర్తిగాతరిమేస్తుంది. ఇక ఆరింటికి లేచి రెడీఅవడం ప్రారంభిస్తేగానీ ఎనిమిదింటికి యింట్లోనుంచి బయటపడటం సాధ్యంకాదు. ఎనిమిదింటి నుంచి బస్‌స్టాప్‌లో ఆంధ్రప్రద్‌శ్‌ వారి ఆర్‌.టి.సి.బస్‌ కోసం పడిగాపులు పడితేగాని తొమ్మిదిగంటలకు బస్సు దొరకదు.తొమ్మిదింటినుంచీ గంటన్నరపాటు అదిచిమలావేగంగా ప్రయాణిస్తేగానీ మనరాజధాని ట్రాఫిక్‌లో పదికిలోమీటర్ల దూరం వెళ్ళ లేదుకదా!

. కనుక ఆదివారం ఒక్కరోజుమాత్రమే కరువుతీరా నిద్రపోయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయ్‌.

అయితే ఆరోజు ఆరింటికల్లా తలువులు గట్టిగాబాదడం వినిపించేనరికి అప్పుడేపడుతున్న నిద్రకాస్తా ఎగిరిపోయింది. శంకర్‌దాదా జిందాబాద్‌ ! 29

ఎవరా తలుపింత భీకరంగా, యింతపాొద్దున్నే బాదుతున్నారని చిరాగ్గాలేచి వెళ్ళితలుపు తెరిచాను.

“ఎదురుగ్గా శాయీరామ్‌ నిలబడి వున్నాడు. |

"హలో-గుడ్‌మాణింగ్‌!" అన్నాడు నవ్వుతూ.

“గుడ్‌ మాణింగ్‌" అన్నాను కోపంగా.

"మనకాలనీలో ఎనిమిదింటికి మీటింగుంది" అన్నాడు చిరునవ్వుతో. (

నాకు వళ్ళుమండిపోయింది.

"మొన్నేకదా దొంగలతాలూకు మీటింగయింది?” అన్నాను చిరాగ్గా.

"అవును."

"అప్పుడు వాళ్ళూ మనం ఓ అగ్రిమెంటుకొచ్చేంకదా!"

“వచ్చాం!”

"మరింకెందుకిప్పుడీ మీటింగ్‌? "

“ఎలక్షన్‌ మాటింగ్‌!"

"ఎలక్షన్‌ మోటింగా? "

"అవును!"

"నీకేం పిచ్చెక్కలేదుకదా! మొన్నేగా ఎలక్షన్లయ్యాయి?”

"అయ్యాయిగానీ- అప్పుడు మన నియోజకవర్గంనుంచి గెలిచిన కాంగ్రెస్‌ (డబ్టూ) అభ్యర్ధి ఆఅత్మహత్యచేసుకున్నాడు, అందుకని బైఎలక్షన్‌-" = “అరె! ఎందుకు ఆత్మహత్యచేసుకున్నాడట? "

"తప్పక మినిస్టర్‌ అవుతాడని ఉన్న ఆస్తంతా ఖర్చుచేశాడట! తీరాచూస్తే మంత్రి వదవిదొరకలేదు. ఉట్టి 3424గాఉంటే ఖర్చుచేసినదానికి పదింతలే నంపాదించేఅవకాశం ఉంటుందట! ఇంకేం చేస్తాడు పాపం!"

"అయితే ఇప్పుడు మనం మీటింగ్‌ ఎందుకుపెట్పకోవాలి?"

"ఎందుకేమిటి? ప్రతిఎలక్షన్‌కి మనకాలనీ వాళ్ళందరంకలిసి మీటింగ్‌ పెట్టకుని ఏపార్టీకి ఓటువేయాలో నిర్ణయించుకోవడం మామూలేగా?"

"ఇంకా నిర్ణయించుకునేది ఎముంది? మన కాలనీ ఎప్పుడూ కాంగ్రెస్‌ (డబ్తూ) కేగా వోటువేసేది?"”

30 హ్యామరాలజీ

"కానీ ఈసారి కొత్తపార్టీ వచ్చిందికదా? అందుకని మళ్ళీ ఓసారి డిస్కస్‌ చేసుకుంటే..." "కొత్తపార్టీఎమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు. "కాంగ్రెస్‌ (జెడ్‌) "కాంగ్రెస్‌ జడ్డా? “అవును!” "అంటే ఈ కాంగ్రెసుల్లో అదే ఆఖరిదన్న మాట! దీంతో ఇంకపార్టీ చీలేందుకు అవకాశం లేనట్లేగా!" "ఎందుకులేదూ? " | "ఎందుకేమిటి? ఇంగ్లీష్‌లిపిలో జెడ్‌ వరకేగా ఉంది." శౌయీరామ్‌ నవ్వేడు. "పిచ్చివాడా? రెండక్షరాలతో మళ్ళీ కొత్తసిరీస్‌ మొదలుపెట్టవచ్చుగా?" "నాకర్థంకాలేదు" "అంటే?" అంటే కాంగ్రైస్‌(ఎ- బి), కాంగ్రెస్‌(జడ్‌- హెచ్‌) అలా లక్షలకొద్ది కాంబినేషన్లతో బోలెడు పార్టీలు ఏర్పాటుచేసుకోవచ్చు." "నిజమే" ఒప్పుకున్నాను. "అయితే పద త్వరగా మరి. ఎనిమిదింటికల్లా మోటింగ్‌ మొదలెట్టాలి. " వారానికోరోజు దారికే ఈ రేషన్‌ నిద్రని వదులుకోవడానికి నాకు మనసొప్పలేదు. "నాక్కొంచెం పనివుంది గురూ! మోరు మీటింగ్‌ స్టార్ట్రచేసేయండి. తరవాత వస్తాను" అన్నాను అబద్ధమాడేస్తూ,. "అదేంకుదరదు. కాలనీ కమిటీ వైస్‌పెసిడెంట్‌ వయ్య్యుండి నువ్‌రాకపోతే అందరూ గొడవచేస్తారు. " "సరే"అన్నాను గత్యంతరంలేక. ఇంకోసారి ఛస్తే కాలనీ కమిటీ పదవులేమాత్రం ఒప్పుకోకూడదని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను. శాయీరామ్‌ వెళ్ళిపోగానే- నేను రెడీఅయి మీటింగ్‌ జరిగే చోటుకి చేరుకున్నాను. అప్పటికే శాయీరామ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కాబట్టీ తానే దగ్గరుండి వేదిక, మైక్‌, షామియానాలు అన్నీ ఎర్పాట్లు చేయించేశాడు. శంకర్‌దాదా జిందాబాద్‌ ! తె]

ఎనిమిదింటింకి కాలనీలోని వాళ్ళుచాలామంది మీటింగ్‌ కొచ్చేశారు.

"కాలనీకమిటీ పెసిడెంట్‌ గోపాల్రావ్‌గారు ముందు మాట్లాడుతారు. "అన్నాడు శాయీరామ్‌ మైక్‌ దగ్గర నిలబడి. -

గోపాల్రావ్‌ మైక్‌ దగ్గరకోచ్చాడు.

"సోదరులారా! ఉన్నపార్టీలతోనే మనమందరం నానా ఇబ్బందులూ పడుతూంటే గోరు చుట్టుపై రోకటిపోటులా ఇప్పుడు కాంగ్రెస్‌ (జడ్‌) అవతరించింది. అపార్టీతాలూకూ

అభ్యర్థి నిన్నే మన కాలనీకొచ్చి మనం ఆయనకే ఓట్టువేస్తే మన కాలనీలో ప్రతిఇంటికీ ఓ

ఇత్తడి బిందె ఇస్తానన్నాడు. కనుక మనం ఇప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిన పరిస్టితి ఎర్పడింది."

"ఇత్తడిబిందె ఎసైజుది?" ఎవరో ఒకామె ఆడవాళ్ళలో నుంచి అడిగింది.

"సెజువివరాలు ఆయనింకా అందజేయలేదని నేను మనవి చేస్తున్నాను."

"మిగతా పార్టీలవాళ్ళు ఎమంటున్నారు?” మరొకావిడడిగింది ఆశగా.

"మిగతావాళ్ళల్లో కాంగ్రెస్‌(డబ్టూూ)వాళ్ళు మళ్ళీఅదివరకులోగానే ప్రతిఓటుకి ఓచెంచా ఫ్రీగా ఇస్తారు. టోకున అరడజను ఓట్ట్లున్న ఇంటికి చెంచాకుతోడుగా స్టీలుగిన్నెకూడా ఇస్తారు.ఇక టిడిపి (ఎక్స్‌) వాళ్ళు ప్రతి ఇంటికి ఓప్లాస్టిక్‌ బకెట్‌ ఇస్తామంటున్నారు. టిడిపి 'క్యూ' వాళ్ళు ప్రతి ఇంటికీ ఓ అమెరికన్‌ బ్రాయిలర్‌ చికెన్‌ ఇస్తారట. ఒకవేళ ఎవరయినా కోడి తిననివారుంటే వాళ్ళకి కోడికిబదులుగా కోడిగుడ్డు ఇచ్చేస్తారు. కాంగ్రెస్‌(జి) వాళ్ళు ప్రతి ఓటరుకి పదకొండుగాలన్ల గుడంబా పోస్తారట కనుక..."

అతనిమాట పూర్తికాకుండానే సావిత్రమ్మలేచి నిలబడింది.

"మిగతా పార్టీలు ఇస్తామంటున్న సామాన్ల న్నీ ఇదివరకు ఎలక్షన్లలోనే సమకూర్చుకున్నాం ఇంతవరకూ ఎవరూ ఇత్తడిబిందె ఇవ్వలేదు. కాబట్టి మనఓటుకాంగ్రెస్‌(జెడ్‌)కేవే సేద్దాం. "

దాంతో అంతా రణగొణధ్వనులు మొదలయ్యాయ్‌.

"ఆ బిందెసైజు తెలుసుకోందే మాటెలా ఇస్తాం?" అని ఒకరు.

"నాచీరలన్నీ బొత్తిగా చిరిగిపోయాయి పిన్నిగారూ! బిందె బదులు నాలుగుచీరలిమ్మంటే ఇవ్వరంటారా'" అని ఇంకొకావిడ.

"కిందటిసారి వాళ్ళిచ్చిన స్టీలుచెంచాలు తుప్పు పట్టిపోయాయి. అ సచ్చినోళ్ళని ముందా చెంచాలు వాపసు తీసుకుని మంచివి ఇమ్మని కబురు చేయండి” అని ఇంకొకావిడ.

32 హ్యాూమరాలజీ

ఈ రణగొణ ధ్వనిలోంచి ఒకావిడ కంఠం ఖంగుమనిమోగింది.

"అన్హి వస్తువుల ధరలూ పెరిగిపోయాయి! ఇంకా ఈ బిందెలూ, చిరలూ, చెంచాలు ఏమిటి? నామొఖం! టి.వి. సెట్టుగానీ, స్టీలు అల్మరాలుగానీ ఇవ్వమని అడగరాదూ?"

"అవునవును. ఎంతకాలం ఈ చిల్లరబేరాలు?" ఇంకెవరో సపోర్టుచేశారు.

నేను గొంతు సవరించుకున్నాను.

( "అంతఖరీదయినవి ఎవరిస్తారు? ఒక్కో ఇంటికి ఓ టి.వి సెట్టంటే చూడండీ మరి--కనీసం రెండుకోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది వాళ్ళకి. అదెలాసాధ్యం? అన్నాను నచ్చచెప్పూ.

"ఏం మాయరోగమేమిటి?స్తాంపుల కుంభకోణాల్లోనూ, ప్రభుత్వభూములకుంభ కోణాల్లోనూ ఇంకా ఇతరత్రా ఇంతకు పాతికరట్టు సంపాదించుకోరా.” విరుచుకుపడిందొకావిడ.

"సంపాదించుకున్నాగానీ- వాళ్ళుఖర్చుచేయరు-" నన్ను సమర్ధిస్తూఅన్నాడు గోపాల్రావ్‌.

"చేయకపోతే పోనీండి. మన ఓటు కూడావాళ్ళకేయం " అందామెమొండిగా.

ఆడాళ్ళతోనూ, పోలీసులతోనూ ఎప్పుడూ వాగ్వివాదం పెట్టుకోకూడదని మా గోపాల్రావ్‌ చెప్పిన విషయం నాకు గుర్తుంది. అంచేత ఆవిషయం శాయీరామ్‌కికూడా గుర్తుచేశాను.

అతను వెంటనే సైలంటయిపోయాడు.

ఈలోగా ఓటాక్సీ వేగంగా వచ్చి. ఆగిందక్కడ. అందరం ఆశ్చర్యంగా అటువేపు చూడసాగాం. టాక్సీలోంచీ మా కాలనీలోనే ఉంటున్న శ్యామల్రావుఖద్దరు చొక్కా, పంచెతోదిగి చిరునవ్వుతో మాఅందరికీ నమస్కారం చేశాడు. అందరికీ మతిపోయినట్లయింది ఆ అవతారంచూసి.

"శ్యామటల్రావ్‌గారికి జై" అంటూవెనుకే వాళ్ళపెద్దబ్బాయి కూడాదిగాడు.

శ్యామల్రావ్‌ చిరునవ్వుతో వేదికమీదకు వచ్చినిలబడి జనార్ధన్‌తోనూ, శాయీరామ్‌ తోనూ, నాతోనూ కరచాలనం చేశాడు.

"తమరుఅనుమతిస్తే నా ఓటర్లకు ఓ అభ్యర్థన చేస్తాను" అన్నాడు చిరునవ్వుతో.

“మో ఓటర్లీమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్‌.

"మోరంతా నా నియోజకవర్గంలోని ఓటరులే కదా! కనుక మన కాలనీ ఓట్లన్నీ నాకే వేయడం న్యాయమని మనవిచేస్తాను" చిరునవ్వుతో అన్నాడు.

ర శంకర్‌దాదా జిందాబాద్‌ ! 33

ఆ చిరునవ్వు చూస్తూంటే నేను చూస్తున్నది కలో నిజమో అర్ధంకావటంలేదు నాకు. నేను ఆకాలనీలోగత పదేళ్ళుగా ఉంటున్నాను. ఈ పదేళ్ళలో ఎ ఒక్కరోజుకూడా అతను నవ్వటం ఎవ్వరూ చూడలేదు.

“అంటే..... అంటే.....మిోరూ ఎలక్షన్‌లో....."

"అవున్నాయనా! మన నియోజకవర్గంనుంచేపోటీ చేస్తున్నాను." అప్పుడే పుణ్యక్షేత్రా లన్నీ సందర్శించి వచ్చిన పెద్దమనిషిలా శాంతంగా అన్నాడతను

మా సంభాషణ అంతా మైకులోఅందరికీ వినబడుతూండడంవల్ల సభలోకలకలం ళ బయళ్టేరింది.

"సోదరులారా! మోకు నన్ను నేను పరిచయంచేసుకోవాల్సిన అవసరంలేదని నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ వాడిని. మోలోపుట్టి పెరుగుతున్న మన కాలనీవాడిని, ఎలక్షన్లో నేను కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని మికందరకూ తెలియజేయడానికి ఎంతో సంతోషి స్తున్నాను. నిజానికి నాకసలు రాజకీయాలంటే మో అందరిలాగానే చిరాకు. కానీ ఈరోజున మనదేశంలో అస్తవ్యస్త పరిస్థితులు చూశాక గుండెద్రవించిపోయి ఒక్కదూకు దూకాను. కనుక నన్ను మోరందరూ తప్పక ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను ఎన్నుకుంటే 159 నెంబర్‌ బస్‌ని కాలనీలోపలి వరకూ లాక్కొస్తాను. పైప్స్‌లో మంచినీళ్ళుదొరికే టైముని అర్ధరాత్రినుంచి ఉదయంమూడింటికి మార్చేస్తాను. మనకాలనీలో ఉన్న పిచ్చికుక్కల్ని పక్కకాలనీలోకి తరిమే యిస్తాను! ఇంకా ఇలాంటివి బోలెడుచేస్తాను-” అంటూ ఆ తరువాతేం చెప్పాలో తెలీక ఆగాడతను.

"ఇంతకూ మిీరేమిన్తున్నారు మరి? బిందెలా, చీరలా?” సావిత్రమ్మ అడిగింది మధ్యనుంచి.

"అమ్మా, మోకో నమస్కారం నాకు'అంతటి తాహతులేదు, నేనేమీ ఇవ్వలేను.”

"మరి అవతలివాళ్ళు ఇవ్వన్నీ ఇస్తుంటే ఎవరొదులుకుంటారు? "

"అయ్యో! వదులుకోమని ఎవరన్నారమ్మా ఎవరేమిస్తే అది తీసుకోండి. ఎలక్షన్గుండగానే ఇల్లు చక్కబెట్టకోమన్న సామెత ఉండనేవుందిగదా అందరిదగ్గరా అన్నీ తీసుకుని ఓటుమాత్రం నాకు వేయండి. నాలాంటి బీదాడికి ఓటుదానం చేస్తే ఎంతోపుణ్యంమోకు. దానాలన్నిటిలోకి . 'ఓటుదానం గొప్పదని మన శాస్త్రాలు ఘోషిస్తూన్నాయికదా.

అందరూ చర్చించుకోవడం వొదలెట్టారు. చర్చముగిసేవరకూ అతను నమస్కారంపెడుతూ అలాగే ఉండిపోయాడు.

చివరకు అందరూ కలసి శ్యామల్రావుకే ఓటువేయాలన్న నిర్ణయానికొచ్చారు.

34 హ్యూమరాలజీ

ఆ నిర్ణయం విన్నవెంటనే శ్యామల్రావు అనందంతో పొంగిపోయాడు,

"నాకు చాలాసంతోషంగా ఉంది.మనకాలనీ ఓట్టంటే మాటలుకాదు. సుమారు అయిదువేల ఓట్లు. నేనింక ఎలాంటి ఢోకాలేకుండా గెలుస్తాను. నమస్తే నమస్తే” అంటూ నమస్కారాలు చేసుకుంటూ టాక్సీ దగ్గరకు వెళ్ళాడు. వెనకే అతని కొడుకు "శ్యామల్రావ్‌గారికి జై” "దేశ్‌కీనేతా-శ్యామల్రావ్‌బన్‌తా" "ఇండిపెండెంట్‌ అభ్యర్థి శ్యామల్రావ్‌ జిందాబాద్‌- "అని

-,...... అరుచు కుంటూ వెళ్ళాడు.

టాక్సీ వెళ్ళిపోగానే గోపాల్రావ్‌ మళ్ళీమైకు దగ్గరకొచ్చాడు.

"కాలనీ వాళ్ళందరం కలసిశ్యామల్రావ్‌గారికే ఓటు వేయాలని నిర్ణయించడం నిజంగా చాలా గొప్పవిషయం. శ్యామల్రావుగారు డబ్బుకి బీదాడేగాని చదువులో కాదు. ఆయన రెండుసార్లు బి.ఏ. పాసయ్యారు. ఒకసారి కార్పొరేషన్‌ ఎలక్షన్లో నుంచుని ఓడిపోయారు. గనుక రాజకీయఅనుభవం కూడావుంది. "

అతనలా మాట్లాడుతూండగానే మరో అరడజను టాక్సీలు వచ్చి ఆగాయ్‌ అక్కడ. మొదటి టాక్సీలో నుంచి ఎర్రటర్కీబనీనూ, పచ్చ పొంటూ వేసుకున్న నల్లని లావుపాటి అకారందిగింది. ఆ అకారం వెనుకే మరికొన్ని ఆకారాలు పంచరంగుల బనీన్లు, దుబ్బు జుట్టూ, చేతుల్లో కత్తులూ చైన్లతో దిగారు. ఒక్కొక్కరే రొమ్మువిరుచుకుని నడుస్తూ అక్కడషామియానాలో ఉన్న మాకు గస్తీపోలీసుల్లా నిలబడ్డారు.

"ఈ కాలనీ సిడెంటెవళ్ళువయా ఈడ?" అంటూ ఓపచ్చబనీను నా దగ్గరకొచ్చి అడిగాడు.

“పెసిడంటా-అదుగో-వారీ!” అంటూ గోపాల్రావుని చూపించాను.

"ఏయ్‌ ప్రెసిడెంటూ-జరాబయటకొచ్చి శంకర్‌దాదాని కలువ్‌!" అన్నాడతను జనార్ధన్‌తో.

“శకర్‌దాదానా!” ఉలిక్కిపడి అడిగాడు గోపాల్రావ్‌.

"అవ్‌!"

అందరం మొఖాలు చూచుకున్నాం.

శంకర్‌దొదా అంటే మా ఏరియాలో తెలీనివారు లేరు. వాడుచేసే కిరాతకాలు అందరికీ తెలుసు.

ఎప్పుడూ తన గాంగ్‌ని వెంబడేసుకుని రోడ్డమిోద అడ్డుపడ్డవాడినల్లా పాడుస్తూ- ఉంగరాలు, గడియారాలు, డబ్బు లాక్కుపోవడం పండుగమామూళ్ళు కత్తిచూపి వసూలు చేయటం చాలా మామూలు విషయం. శంకర్‌దాదా జిందాబాద్‌ |! 35

"ఇప్పుడు...నా...నా...నా...తో ఎమిటి ఏ...ఏ...ఏ... పని?" ఖంగారుగా అడిగాడు. గోపాలావ్‌

"గట్ల పరిషానెందుకవుతున్నావ్‌-శంకర్‌దాదా జర్ర నీతోమాట్లాడాల్నని వచ్చిండువయా _ నడుమళ్ళా!"

"అలాగీ-పదండి! మీరు కూడారండి వెళ్తాం!" అన్నాడు గోపాల్రావ్‌ మావంక చూస్తూ,

ముగ్గురంకలిసి శంకర్‌దాదా దగ్గరకెళ్ళాం |

"నమస్కారమండీ? నేనే గోపాల్రావ్‌ని" వినయంగా అన్నాడు గోపాల్రావ్‌ 4

"నమస్తే అన్నా! నిన్నుకలవాలని నాల్గుదినాలకెళ్ళి కోషిష్‌ చేస్తున్న!" అని షేక్‌హాండిచ్చి నావంకచూసి "నువ్వెవళు?” అనడిగాడు.

"నాపేరు ఉదయార్కర్‌!"

"నీపేరు గాదువయ్యా అడిగేది- నువ్వెవళు అనడుగుతున్న!"

"అదా-అదీ-నేను కాలనీవైస్‌ ప్రెసిడెంట్‌నండీ!" వినయంగా అన్నాను.

"నీయవ్వ-గట్లచెప్పరాదువయ్యా! నాకు తెలికనేపాయె.ఎదీ-చెయ్‌కలుపు-" అంటూ

చేయిజాపాడు.

అయిష్టంగానే కరచాలనంచేశాను.

"నేను కాలనీకమిటీ ఆర్గనైజింగ్‌ శెక్రటరీనండీ!”" ఎందుకయినా మంచిదని అడగకముందే చెప్పేసుకున్నాడు శాయీరామ్‌.

"నీయవ్వ-మంచిగయింది- అందరు ఈడనే జమయినుు! చెయ్‌ కలుపు" అంటూ శాయీరామ్‌తో కూడా కరచాలనం చేశాడు.

"అదిసరేగానీ, నేనిప్పుడు ఈడకి ఎందుకొచ్చినానో ఎరుకనా? " అడిగాడతను.

. "*'తెలీదండీ!"

"నేను ఎలక్షన్ల ఎమ్మెల్లెగానిలబడినా-సమజయిందా! అగో-ఆపని మీదనే ఈడకొచ్చినా! మోరు నాకు జర్ర మదద్‌చేయండ్రి! మోకాలనీ ఓళ్ళందరూ- మోమాటకు ఇజ్బ్జతిస్తరని మా గాంగోళ్ళుచెప్పిన్రు!” ముగ్గురం షాక్‌తిన్నట్టయిపోయాం!

"అలాగేనండీ అందరికీచెప్పి తప్పకమికేవేయిస్తాము-" అన్నాడు గోపాల్రావ్‌ షాక్‌నుంచి త్వరగాతేరుకుని.

"అయితే నడుమల్తా! మైక్‌లనేనుగూడ జరమాట్టాడికి కోషిష్‌జేస్త?" అంటూ మైక్‌ దగ్గరకు నడవసాగాడు. ముగ్గురం అతని వెనకే నడిచాము.

36 . హ్యామరాలజీ

"సోదర సోదరీవుణులారా, వన్తుతం అర్జంటుగా ఓ విషయం మనవి చేయదల్బుకున్నాను. మననియోజకవర్గం నుంచి శంకర్‌దాదా కూడా పోటీ చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ఇక్కడికొచ్చి తెలియజేశారు. శంకర్‌దాదా గురించి నేనుమోకు చెప్పాల్సిందేమీలేదు. అయన పేరు చిన్నపిల్లలక్కూడా తెలుసు. కనుక మన ఓట్లన్నీ ఆయనకే వేయాలని ఆయన కోరుతున్నారు. ఇవ్పుడు శంకర్‌దాదా మాట్లాడతారు" అనేసి పక్కకు జరిగాడు శాయీరామ్‌.

| శంకర్‌దాదా మైక్‌దగ్గరకొచ్చి అందరికీ నమస్కారం పెట్టాడు. క్ట "ఈడున్నోళ్ళందరికీ సలాం జెప్తన్న! శాయీరామ్‌ అన్న నాగురించి మోకు మంచిగా చెప్పిండు. ఈడున్నోళ్ళల్ల కొంతమంది సొంచాయిస్తుండొచ్చు. దాదాగిరీ చేసేటోడు-ఎమ్మెల్లేగ ఎట్ట నిలబడ్డాడు అని. నిజంవయ్యా, నేను మర్ణర్లు చేసినా, దొంగతనం జేసిన, జైలుకెల్లిన, రేప్‌లుచేసిన, కానీ ఇన్నిదినాలు మనదేశం పరిపాలించేటోండ్లలో ఇవన్నీ చెయ్యనోళ్ళివళు? మంచిగా సోంచాయించండ్రీ! ఇయ్యా(ళేవు పేవర్ష్లలో చూన్తును గదా. దొంగ సిమ్మెంటమ్ముకునేటోడొకడు, ప్రభుత్వం భూములమ్ముకునేటోడొకడు, దొంగస్టాంవు లమ్మేటోడొకడు. డాక్టర్ల కొలువులమ్ము కునేటోడొకడు- గిట్ల మినిష్టర్ల్ణందరూ దందాలు జేస్తును. గసంటోళ్ళకు ఓట్టువేస్తారువయ్యా? నన్ను గిట్ట గెలిపించిన్రంటే-ఖసమ్‌తోటి జెప్పున్న-నేను ఈ మర్దర్హు చేసెడిది-దొంగతనాలు, రేప్‌లు చేసెడిది-అన్నీ ఇడచిపెడత

ఏం జెప్తున్న)ు సమజయిందా. ఇంక నేను పోవాల్నామల్లా? "

ఎవ్వరూ ఏమిమాట్లాడలేదు. అందరూ భయంతో గుడ్దప్పగించి చూస్తుండి పోయారు.

"అచ్చామైజారవూ అన్నా ఈళ్ళందరితో ఓట్లెయిపించే జుమేదారిమోది. ఎమంటున్న? నాల్గుదినాలు అయినాక వస్తమల్తా." అనేసి వెళ్ళిపోయాడతను. మరుక్షణంలో టాక్సీలన్నీ వెళ్ళిపోయినయ్‌.

"ఏమిటి? రౌడీవెధవకు మనం ఓట్లెయ్యాలా? అయ్యో ఎంకాలమొచ్చింది."

"ఇలా ఎవడు బడితే వాడే నిలబడితే ఎలా?"

"మన కాలనీలో అందరూ గ్రాడ్యేట్ట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఉండి- అందరూ కలసి అక్షరంముక్కరాని రౌడికా ఓట్లువేసిగెలిపించడం-" ఇలా రకరకాల వ్యాఖ్యలు గుప్పుమని చెలరేగాయి. శంకర్‌దాదా వెళ్ళిపోగానే శాయీరామ్‌ మైక్‌దగ్గరకొచ్చాడు.

"సోదర సోదరీమణులారా, ఇప్పుడు అనుకోని పరిస్టితి ఎదురయింది మనకి. శంకర్‌దాదా ఓట్లుతనకే వేయమని వార్షింగిచ్చాడు. వేయకపోతే ఎంజరుగుతుందో మనందరం శంకర్‌దాదా జిందాబాద్‌ | 37

తేలిగ్గా ఊహించవచ్చు. వాళ్ళగాంగ్‌ వాళ్ళందరూ కత్తులు తీసుకుని మనకాలనీ అంతా స్వైరవిహారం చేసేస్తారు. అంచేత మనం ఇంతకుముందు శ్యామల్రావుగారి కిచ్చినమాట ఉపసంహరించు కుందాం, ఏమంటారు?”

యాదగిరిలేచి నిలబడ్డాడు.

"మోరూరికే పరిషానవుతున్నారుగానీ మనం వాడికి వోటువేయలేదన్న విషయం శంకర్‌దాదాకెట్లా తెలుస్తుందివయ్యా? |

"పిచ్చాడిలాగున్నావ్‌-మనకాలనీపక్కనున్న పోలింగ్‌బూత్‌లో వోట్లు లెక్కట్టేప్పుడు తెలీదూ?"

"తెలిస్తే ఏంజేస్తాడంటావ్‌?"

“కత్తులు- స్వైరవిహారం- మనలో వెయ్యిమందికి కత్తిపోట్లు, పాతికమంది దుర్మరణం- ఇలాసాగిపోతుంది ఆమర్శాడు పేపర్లోవార్త." అన్నాడు రంగారెడ్డి.

అందరూ నిశ్శబ్దం అయిపోయారు. మీటింగ్‌ అర్హ్దంతరంగా ముగిసిపోయింది.

"సోదరులారా, తిరిగి మనందరం వచ్చే ఆదివారం ఇక్కడ కలుసుకుని ఎవరికివోటు వేయాలో ఫైనల్‌గా నిర్ణయించుకుందాం" అన్నాడు శాయీరామ్‌. అందరూ ఎవరిళ్ళకు వాళ్ళుబయలుదేరారు.

_నాలోజులన్నా అవకముందే కాలనివాళ్ళందరూ బలవంతంగా అర్ధరాత్రి సమావేశం జరపాల్సివచ్చింది. అందుక్కారణం సిరాజుద్దన్‌ అనే అభ్యర్ధి. అతగాడు తనతాలూకూ వందమంది అనుచరులతో కాలనీని చుట్టుముట్టి అందరికీ కర్రలుచూపి లాక్కొచ్చారు. శాయీరామ్‌ కళ్ళును లుముకుంటూ సమావేశంప్రారంభించాడు.

"సోదరులారా! మన నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్న అభ్యర్ది శ్రీసిరాజుద్దీన్‌ గారి విన్నపంవల్ల- మనం అర్జంటుగా...

"విన్నపం గాదువయ్యా-జబర్లస్తేచేసినా! గట్లచెప్పనికి భయమేమున్నది" అన్నాడు సిరాజుద్దీన్‌ ఫొరుషంగా.

"ఆ! అదే బలవంతంగా మనల్సిక్కడ సమావేశపరచడానికి కారణం ఎమిటంటే మన కాలనీ వాళ్ళందరూ ఆయనకే ఓట్టువేయాలని ఆయన అబ్యర్టిస్తున్నారు-"

"ఇగో-గదే గలత్‌ మాట! నాకేం గర్ట్‌వయ్యా బతిమాలానికి? జబర్హస్త్‌ చెప్తున్న, పూరా వోట్‌నాకే ఎయ్యాల్న! ఎమంటున్న? ఎయ్యకుంటే కత్తితోకిరికిరవుతది! సమజయిందా?"

38 హ్యామరాలజీ

'"ఆ,అయింది సార్‌! ఇంత క్షియర్‌గా చెప్పాక ఇంక అర్ధమవకుండాఎలా ఉంటుంది?"

"అయితే నాగురించీ, నేనంతకు ముందుచేసిన ప్రజాసేవ గురించి కూడా చెప్పు ఆళ్ళకు"” అన్నాడు సిరాజుద్దీన్‌.

“సోదరులారా! సిరాజుద్దన్‌గారి గురించి మోకు వేరీ చెప్పనవసరంలేదు. ఆయన కూడా చిన్నప్పటినుంచీ జైలుకెళ్తూనే వున్నారు. ఈరోజున కూడా నిజానికిజైల్లోనే ఉండాల్సింది గాని మన ఓట్లకోసం జామోను మిద వచ్చారు. ఆయన అంతగ్రాష్టీయ జేబుదొంగ అన్న

7 విషయం మిరు పేవర్లలో చూసేవుంటారు! లేదా అనుభవవూర్వకంగానయినా గ్రహించివుంటారు. కేవలం తనొక్కడే సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కీముక్రింద ప్రారంభించిన అతని 'పిక్‌ పాకటొసంస్థ, నేడు అనేక వేలమంది సభ్యులతో కిటకిటలాడిపోతోంది. అప్పుడు సంవత్సరానికి పాతికవేలు టర్నోవర్‌ ఉంటే ఇప్పుడది ఇరవైకోట్లరూపాయలకు చేరుకుంది. "సిరాజుద్దీన్‌గారిది మంచి మనసు" అనడానికి నిదర్శనం ఆయన ఆ సంస్థ ద్వారా ఎంతో డబ్బు ఇంకా నంపాదించే అవకాశంఉన్నా-ఆ వృత్తిని మానేయడం! నిజంగా ఎంతో గొవృవిషయుం౦ ఇది. కావుధేనువు లాంటి వృత్తినెవరయినా వదులుకోగలరా- ఒక్కసిరాజుద్దన్‌గారు తప్ప." అందరూ తప్పట్లు కొట్టారు.

"ఇగో-తాలీ బజాయించితే నేను ఖుష్‌ అవుతాననుకోకండ్రి. కాలనీలోని ఓట్లన్నీ నాకేపడాల్న.! ఇయాల్చినుంచి ఈ కాలనీలోకి ఇంకెవళ్ళూ రాకుండా మా షాగిర్దీల్ని పహరాపెడ్తన్న- ఇంకెవళ్ళమాటా ఇనకండ్రి. ఇంకెవళ్ళకీ వోటెయ్యకండ్రి. సమజయిందా?"

'అయింది' అన్నాయి కొన్ని గొంతులు.

"ఇకపోండ్రి! ఓట్ల ఇసయంల నకరాలుచేస్తేమాత్రం కత్తితో కిరికిరవుతది" సిరాజుద్దీన్‌ వెళ్ళిపోయాడు.

అతని శిష్యులు ఇద్దరుమాత్రం అక్కడేగస్తీ తిరగసాగారు. అందరం నిశ్శబ్దంగా ఎవరిళ్ళకు వాళ్ళుచేరుకున్నాం.

ఆదివారం రానేవచ్చింది.

కాలనీవాళ్ళందరూ సమావేశానికి హజరయ్యారుగానీ ఎవరిమొఖాన్నా కళలేదు. ఎవరూ బిందెలగురించీ, స్టీలుగిన్నెల గురించీ, చీరలగురించీ మాట్లాడటంలేదు.

"సోదర సోదరీమణులారా! ఎవరెంతబెదిరించినా మనకాలనీ ఓట్లన్నీ కొద్దోగొప్పో చదువూసంస్కారమున్న శ్యామల్రావ్‌గారికే వేయాలని అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు" శంకర్‌దాదా జిందాబాద్‌ ! 39

అని గోపాల్రావ్‌ చెప్పగానే అంతటా తప్పట్లుమార్మోగిపోయాయ్‌. సరిగా అప్పుడే టాక్సీలోంచి “దిగాడు శ్యామల్రావ్‌.

ఆయనవెనుకే ఆయన కొడుకు "ఈరిగాడూ జిందాబాద్‌" అని అరుస్తూ మా మధ్య కొచ్చాడు.

అందరూ నిర్భాంతపోయారు. శ్యామల్రావ్‌ చిరునవ్వుతో మాట్లాడసాగాడు.

"సోదర సోదరీమణులారా! నేను కాంగ్రెస్‌ (జడ్‌) అభ్యర్ధిఅయిన ఈరిగాడినే బలపరుస్తూ పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ॥ కనుక మోఅందరి ఓట్టుకూడా ఈరిగాడికే వేస్తారని ఆశిస్తాను." అనేసి నమస్కారంచేసి వెళ్ళిపోయాడు.

అందరిమోఖాలు పాలిపోయాయ్‌.

"మోసం, దగా ఈరిగాడి దగ్గర లక్షరూపాయలు కొట్టేసి విత్‌డ్రా అయిపోయాడు " అన్నాడు రంగారెడ్డి.

"అ! లక్షరూపాయలు కొట్టేశాడా?" అరిచారు అందరూ.

"అవును. నిన్న ఈరిగాడి మనుషులే స్వయంగా చెప్పారుగాని నేను నమ్మలేదు" కొద్దిసేపు అంతా కోలాహలంతోనిండిపోయింది.

కేవలం లక్షేకాదు. ఎలక్షన్‌లో నిలబడ్డ వ్రతిఅభ్యర్ధికీ గవర్నవెంటు ఇచ్చే న్యూస్‌ప్రింటూ, పెట్రోలూ, వోటర్స్‌లిస్ట్‌లు, టెలిఫోన్‌ సౌకర్యం ఇవ్వన్సీకూడా శ్యామల్రావ్‌ గౌరు బ్లాకులో అమ్ముకుని పది లక్షలరూపాయలవరకూ సంపాదించాడని, ఆ తరువాత ఆయనకొన్న ఇల్లూ చేసినకూతురి పెళ్ళీ బుజువుచేశాయ్‌.

కొద్దిసేపు అంతా కోలాహలం-

“ఇంతకూ ఇవ్పుడు మనఓటు ఎవరికి?” అడిగారు కొందరు.

"ఈరిగాడికే వేస్తే సరి" నేను సలహా ఇచ్చాను.

"నీకెంత ఇచ్చాడు వాడు?" ఎవరో అరిచారు. నేను సైలెంటయిపోయాను.

“"ఈరిగాడా! వాడుచేసేది సారావ్యాపారం. కల్తీసారాతో ఆమధ్య అరవైమందినిటపా కట్టించాడు. వాడు ప్రజాప్రతినిధా?'

“"వద్దు-వద్దు" అని అరిచారు కొంతమంది స్త్రీలు.

"పోనీ కాంగ్రెస్‌ (క్యూ) అభ్యర్ధి అంగముత్తుకి వేద్దామా?"

"వాడికా! వాడు రోడ్డుమోద కనబడ్డ ఆడాళ్ళ మంగళసూత్రాలు లాక్కునిపారిపోతాడు కదా!"

40 హ్యామరాలబీ

"పోనీ కాంగ్రెస్‌ (పి) అభ్యర్థి సంగతేమిటి?"

"వాడికసలు' చదువేలేదుగా! బండిలో కూరగాయలమ్మేవాడు!"

“అయితే ఇండిపెండెంట్‌ రామ్‌సింగ్‌ మాటేమిటి?"

"వాడా? వాడిదగ్గరనుంచీ మొన్నేగా పోలీసులు స్మగుల్డ్‌సామాను పట్టుకుందీ? "

దాంతో జనార్ధన్‌కి చిరాకేసుకొచ్చింది.

"సోదరులారా! ఇలా అందరికీ వంకలు పెట్టటం నాకేంనచ్చలేదు. మనదేశంలో

/ ఎలక్షన్‌లో నిలబడేవారందరూ ఇంచుమించుగా ఇలాంటివారే! వాళ్ళలోనే మన ఓటు

ఎవరొకరికి వేయకతప్పదు" అన్నాడు వినుగ్గా.

అందరూ మళ్ళీతర్కంలో పడ్డారు.

చివరకు అందరూ కలిసిగోపాల్రావుకే ఆబాధ్యత అంటగట్టారు.

మా నియోజకవర్గంలో నిలబడ్డవారందరిలోనూ ఎక్కువచదుకున్నవాడూ, తక్కువ మర్ణర్‌లూ, రేప్‌లూ, జేబుదొంగతనాలూ, స్మగుల్డ్‌వ్యాపారం చేసేవాడూ అయిన అభ్యర్దిపేరు సూచించాల్సిందిగా అదేశించారు.

వాళ్ళ ఆదేశంమేరకు మేము ముగ్గురం అన్నిపోలీస్‌స్టేషన్లకూ వెళ్ళి అతి తక్కువ నేరాలుచేసిన అభ్యర్థిపేరుగాలించి విజయంసాధించాం!

మా నియోజకవర్గంలో పోటీచేస్తున్నవాళ్ళందరిలోకీ శంకర్‌దాదా ఒక్కడే అందరి కంటే ఎక్కువ చదువుకున్నాడు (రెండో క్లాసు). అలాగే అతనొక్కడే అతితక్కువ మర్దర్హుచేశాడు. (రెండొందల ఆరు) అతి తక్కువరేప్‌లు చేసిందికూడా అతనే (పదహారు). అతి తక్కువకాలం జైల్లో ఉన్నది కూడా అతనే (ఆరేళ్ళు) మరి చూస్తూ చూస్తూ వాడికెలా ఓట్టువేస్తాం? కానీ ఓపక్క శంకర్‌దాదా కత్తులతో కాలనీఅంతా స్వైరవిహారం చేసే దృశ్యంకూడొ మా కళ్ళ ముందు కనబడుతోంది. చివరకు ఎవరికీ వోటు వేయకూడదని నిర్ణయించుకున్నాం. .

అయితే ఈ విషయం ఎలా తెలిసిందోగాని సిరాజుద్దీన్‌కి తెలిసింది. ఆరాత్రి అతగాడు మా కాలనీకొచ్చి అందరినీ అర్జంటుగా బయట నమావేశపరచేశాడు.

"ఖబడ్డార్‌! వోట్లు నాకేస్తామని వాదాచేసి గిప్పుడు పల్దాయించి పోతారు? నీయవ్వ-మీకు మంచిగా బుద్దిజెప్త!నేనెసుంటోడ్డో మోకెరుకలేదు!" అంటూ వార్నింగించ్చాడు.

ఎవ్వరం మాట్లాడలేదు.

"అగో! మాట్టాడరు? నరే బిడ్డా! నేన్‌జూనుకుంట!పదండ్రి!” అనేసి కోవంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. శంకర్‌దాదా జిందాబాద్‌ ! ట్ర

అరాత్రి ఎవ్వరికీ నిద్రలేదు. భయం!

తెల్లారుజామున ఎవరో కెవ్వునకేకలు పెచ్టేసరికి అందరం ఉలిక్కిపడిలేచి బయటకు పరుగిెతాం!

తీరాచూస్తే శాయీరామ్‌కి కలవచ్చిందట-తనని సిరిజుద్దన్‌ చంపుతున్నట్లు-అందుకని వెరికేకలు పెట్టాడట

ఎలాగోలా తెల్లారింది.

అందరం వోటింగ్‌ చేయడానికి బయలుదేరాంగానీ కాలనీ బయట సిరాజుద్దీన్‌ శిష్యులు ఇ

కర్రలు తీసుకుని నిలబడి కనిపించారు.

"ఏయ్‌! సాయింత్రం వరకూ కాలనీ వోళ్ళిెవరూ బయటకు రాకండ్రి!ీవచ్చిద్రో కిరికిర వుతది!' అన్నారు బెదిరింపుగా.

వాళ్ళతో గొడవెందుకని అందరం మళ్ళీ ఇళ్ళల్లోకొచ్చేశాం.

తీరా మధ్యాహ్నం రెండవుతుండగా కాలనీ అంతా శంకర్‌దాదా తాలూకూరౌడీలు నిండిపోయారు.

"నీయవ్వ! మంచిగ చెప్పె ఇనరుబే? లేండ్రి! నడవుండ్రి వోట్లెయ్య నికి!” అంటూ అరవసాగారు.

"అయ్యా, ఓట్టేస్తే సిరాజుద్దీన్‌ మమ్మల్ని చంపుతానంటున్నాడండీ " అన్నాడు జనార్ధన్‌.

"ఇగో-ఇదంతా మాకు తెల్వదు-మంచిగ చెప్పినాం. ఇనకుంటే మీదే జుమేదారి” అనేసి వెళ్ళిపోయారువాళ్ళు.

సాయంత్రం మూడవుతుండగా మళ్ళీ కాలనీవాళ్ళందరం అత్యవసరం సమావేశం జరివాం.

"అ రౌడీ వెధవల్లో ఎందుకొచ్చింది? వెళ్ళివాడికే వేసేద్దాం పదండి ” అన్నాడు శాయీరామ్‌.

“చూస్తూ చూన్తూ వాడినా ఎన్నుకునేది?" అన్నారొకరు.

"మనచేత్తో మనమే కళ్ళుపాడుచుకుంటామా?" అందింకొకావిడ. గోపాలావ్‌ రెండుచేతుల్తో తల పట్టక్కూచున్నాడు.

మరో అరగంటతర్వాత నాకో అయిడియా వచ్చింది.

"సోదరులారా! త్వరగా పోలింగ్‌బూత్‌కెళదాం పదండి. వెళ్ళి బాలెటొపేపరు వెనుక ముద్రవేసి వచ్చేద్దాం దాంతో మన ఓట్లన్నీ 'ఇన్‌వాలిడ్‌' అవుతాయ్‌ ఎవరికీ వేయలేదన్న

జీ2 హ్యామరాలజీ

సంతృప్తి మనకూ ఉంటుంది-వాడికే వేశామనివాడుఅనుకుని మనజోలికి రాకుండా ఉంటాడు-" అందరూ నా ఆలోచనకు చప్పట్ట్లుకొట్టారు. కొంతమందీలలు కూడా వేశారు. వెంటనే ఎలక్షన్‌బూత్‌కి ఊరేగింపుగా వెళ్ళాం,

కానీ పదినిమిషాల్లో వెనక్కు తిరిగిరావాల్సివచ్చింది. కారణం అప్పటికే మా ఓట్లు ఎవరో వేసేశారు.

ఆ మర్నాడు రాత్రి మాకాలనీకొచ్చిన పెద్ద ఊరేగింపు చూడ్డానికి అందరం బయటకొచ్చి నిలబడ్డాం! శంకర్‌దాదా పెద్ద కార్లో దండల మధ్య నిలబడి అందరికీ నమస్కరిస్తున్నాడు. "శంకర్‌దాదా జిందాబాద్‌!” అంటూ కేకలు మార్మోగిపోతున్నాయి. అప్రయత్తంగా అక్కడ గుమికూడిన మేమురకూడా అరిచాము.

“శంకర్‌దాదా జిందాబాద్‌!” * లా ఏ ట్‌ ళ్‌ (కీ ఖా ఆ శంకర్‌దాదా జిందాబాద్‌ | ష్‌

గ్‌ ర్త కేస ౯/ గ్భౌగ్గ య క్ర ా (క్రష్‌ న్నర = అష శ భో ల ళు వ్య లీ వ్ల] చాలా హడావుడిగా ఉందా ప్రాంతం. ఆవరణమంతా కార్లతోనూ, స్కూటర్లతోనూ,నిండి ఉంది. వరండాలో వేసిన బెంచీల మోద వాటితాలూకూ ఓనర్ల్గందరూ ఆపబ్లిక్‌స్కూల్‌గురించీ, దాని స్టాండర్డ్‌గురించీ చాలా ఎగ్దయిటింగ్‌గా మాట్ట్లాడుకుంటున్నారు. గొడవ కొంచెం ఎక్కువయ్యేసరికి ప్యూన్‌ బయటికొచ్చాడు, ఆఫీనులో నుంచి. "ష్‌! సైలెన్స్‌!” అన్నాడు గట్టిగా. అంతా నిశ్శబ్దం అయిపోయారు. . “"ఎందుకువయ్యా-గట్టలోల్లి పెడతారు! ఇదేం స్కూలనుకున్రా, మోఇల్లనుకున్రా? " కోపడ్డాడు వ్యూన్‌. 44 హ్యామరాలజీ

అక్కడున్న వాళ్ళలో గెజిటేడ్‌ ఆఫీసర్లున్నారు. కోటీశ్వరులయిన వ్యాపారులున్నారు. మాలాంటిగుమాస్తాగాళ్ళూఉన్నారు.

అయినా ఎవ్వరూ జవాబివ్వలేదు.

జవాబిస్తే ఆ వ్యూన్‌కి ఆగ్రహం కలుగుతుందనీ, అప్యూన్‌కి ఆగ్రహం కలుగుతే ఆ(వ్రన్స్‌పాల్‌కీ ఆగ్రవాం కలుగుతుందనీ ఆటవీన్స్‌పాల్‌కీ ఆ(గ్రవాంకలుగుతే మహాప్రఖ్యాతిగాంచిన ఆ పబ్లిక్‌స్కూల్లో తమ పిల్లలకు సీటు దొరకదనీ అందరికీ తెలును.

. గోపాల్రావ్‌ ప్రాస్‌ పెక్టస్‌ తీసి అందులోని రూల్స్‌ మళ్ళీ చదివాడోసారి! అంతకుముందు

వారంరోజుల్నుంచీ ఇద్దరం (ప్రాన్‌ పెక్ట్సన్‌లో (వతిలైనూ చదివి, చర్చించుకుని అర్ధంచేసుకుంటూనే ఉన్నాం! అయినా ఎదోభయం।!

"గురూ! మనవాళ్ళను అలా చెట్టుకిందకు తీసుకెళ్ళి ఓసారి మళ్ళీఅన్నీ అప్పజెప్పించు కుందామా?" అడిగాడు గోపాలావ్‌.

“పద! ' అన్నాను.

నేను కిరణ్‌గాడిని, వాడుచిన్నిగాడి ని నడిపించుకుంటూ దూరంగా ఉన్న

  • ఒచెట్టుకిందవెళ్ళి నిలబడ్డాం.

"ఒరే చిన్నీ చె పమ్మా!వాటీజ్‌ యువర్‌నేమ్‌? " అడిగాడు గోపాల్రావ్‌.

"మైనేమీజ్‌ 3. శరత్‌బాబు."

"వాటీజ్‌దిస్‌? " అన్నాడువాడు పుస్తకంలోని పిల్లిబొమ్మను చూపించి.

"దిసీజ్‌ కాట్‌ సి ఎ టి కాట్‌!"

"టెల్‌ మీ అల్ఫాబెట్స్‌ ఫ్రం ఎ-టు-జడ్‌-"

వెంటనే వాడు ఎబిసిడిలు ఊపిరితిరగనంత స్పీడులో చెప్పేశాడు.

"ఇంకేం ఢోకాలేదులేరా?" అన్నాన్నేను ధైర్యం తెచ్చుకుని.

"అవును!" సంతృప్తిగా అన్నాడు వాడు.

తర్వాత ఇద్దరం కలసి కిరణ్‌గాడిని కూడా టెస్టుచేశాము.

అడగడం అలన్యం ఠకీమని చెప్పేశాడు వాడు.

ఒకటా-రెండా?

అంతకుముందు మూడునెలలనుంచీ వాళ్ళను చిత్రహింసలు పెట్టి వాళ్ళుపెట్టే చిత్రహింసలు భరించి నేర్పించాము అవన్నీ! లేకపోతే వాళ్ళకి మంచి స్కూల్లో ఎడ్మిషన్‌ దొరకదని తెలుసుకదా! మళ్ళి ఇద్దరం వెళ్ళి బెంచిలమిదకూర్చున్నాం. కరాటే చదువులు ఉక్‌

మమ్మల్ని చూసి మిగతావాళ్ళు కూడా చెట్టకిందకు పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళతో అన్నీ చెప్పిస్తున్నారు.

హఠాత్తుగా ప్యూన్‌ మళ్ళీ తలుపు తీసుకుని బయటికొచ్చాడు.

"అరె! ఎన్నిసార్లు చెప్పాలివయ్యా సైలెన్స్‌ గుండమని! ఏయ్‌-ఇగో నీకే చెప్పెడిది- ఎందుకట్ల లొల్లిపెడుతున్నావ్‌?" ఓగెజిటెడ్‌ అఫీసర్హ్ని పట్టకుని దబాయించాడతను.

గెజిటెడ్‌ ఆఫీసరు ఖంగారుపడ్డాడు. "పిల్లలకు కోచింగ్‌ ఇస్తున్నాను-' అన్నాడు దీనంగా.

"అదంతా గిప్పుడు చేస్తారు వయ్యా- ఇన్నిదినాలకెల్లి ఎం జేసినావ్‌? ఇంకబంద్‌ చెయ్‌-” . అని అందరివేపూ ఓసారి చూశాడు.

"హెచ్‌. శ్రీనివాసరావ్‌ ఎవరు" అనడిగాడు అందరి ముఖాల వంక సెకండ్‌రౌండ్‌ చూస్తూ."నేనే" అంటూ ఓమూల వాళ్ళపాపకు బిస్కెట్లు తినిపిస్తున్న వ్యక్తిలేచి నిలబడ్డాడు.

“పాపన్షీనుకుని లోపలకు నడు!”

అతను ఖంగారుగా పాపచేతిలో బిస్కెట్టులాగి అవతలపారేసి ప్రిన్సిపాల్‌రూమ్‌లోకి ఈడ్చుకుపోయాడు.

అందరూ ఊపిరి బిగపట్టేశారు. - లోపల ఐం జరుగుతుందా అన్న ఆత్రుత |!

పావుగంట తర్వాత చెమటలు తుదుచుకుంటూ బయటి కొచ్చాడతను. అందరం అతని చుట్టూమూగాము.

"ఏమి అడుగుతున్నారండీ? " అన్నాడొకతను.

"ఎమడిగితే ఎం లాభం లెండి-ఎడ్మిషన్‌ దొరకలేదు-" అన్నాడతను. నీరసంగా అక్కడినుంచి వెళ్ళిపోతూ. అందరికీ భయం పట్టుకుంది.

మరోవ్యక్తిని లోపలకు తీసుకెళ్ళాడు ప్యూన్‌.

అతను బయటకొచ్చాక అందరూ మళ్ళీ అతనిచుట్టూ మూగేశారు

"ఏమడిగాడండీ పాపను?" ప్రశ్చించాడొకతను కాగితం 'పెన్నూరడీగా పట్టుకుని.

"పాపనేమీ అడగలేదండీ?" బెంచీమిద కూలబడుతూ అన్నాడతను.

"మరి?" (

"నన్నే అడిగాడు ప్రశ్నలన్నీ!" .

“మిమ్మల్నా?" అందరి గుండెలూ గుభేలుమన్నయి. “అవును! " 46 హ్యాూమరాలజీ

“ఏమడీగారు? "

“"వేరీజ్‌ మూర్‌ ఐలెండ్‌?" అనడిగారు.

“ఆ!” ఆందరూ అదిరిపడ్డారు.

“మూర్‌ ఐలెండా?" ఓలక్షాధికారి తెల్లబోతూ అడిగాడు

"అవును."

"అంటే ఏమిటసలది?”

"అది ఒక ద్వీపం అటండీ! ఎక్కడుంది అనడిగారు-" విసుక్కుంటూ చెప్పాడా వ్యక్తి తెలుగులో.

] "ద్వీపం అంటే” మళ్ళీ అడిగాడా బిజినెస్‌ మ్యాన్‌.

"ద్వీపం అంటే కూడా తెలిదుటయ్యా" ఇంకెవరో ఫోజుతో అడిగాడు.

"ద్వీపం అంటే మూడువేపుల నీరు ఒకవేవు నేలవుంటుంది" అన్నాడు ఒకతను తెలిసినట్టు.

"కాదు-" ఇంకెవరో అరిచారు.

"ద్వీపం అంటే చుట్టూసముద్రం మధ్యలో భూమివుంటుంది."

"చుట్టూ సముద్రమే ఉండనక్కరలేదు. నది నీరు చుట్టూవున్నా దానిని ద్వీపమే అంటారు" అన్నాడు గెజిటెడ్‌ ఆఫీసర్‌గారు.

"కాదు" తను తాలూకాఫీసులో ఎల్లీసీగా పని చేస్తున్నానని అంతకుముందే పరిచయం చేసుకున్నాయన ఎదురుతిరిగాడు.

"చుట్టూ నీరువుంటే దానిని లంక అంటారు. సముద్రం వుంటే ద్వీపం అంటారు" అన్నాడతను.

కొంతమంది ఆలోచనలోపడ్డారు. అతని మాటలునిజమా కాదా అని!

"ఇంతకూ ఆ మూర్‌ ద్వీపం ఎక్కడుందసలు?" గోపాల్రావ్‌ బుర్రగోక్కుంటూ నన్నడిగాడు.

"సాత్‌ అమెరికా దగ్గర" అన్నాన్నేను తడుముకోకుండా.

"కరెక్ట్‌! బ్లాకసీలో ఉందది" అన్నాడు మరో ఆఫీసరు నన్ను సమర్ధిస్తూ.

"కాదు మన ఇండియా దగ్గరే ఉందది" అన్నాడు మరొకతను. అంతా ఆశ్చర్యపోయారు.

"మన ఇండియా దగ్గరా?"

“అవును బంగాళాఖాతం సముద్రంలో ఉంది." కరాటే చదువులు 47

"నో! ఇటీజ్‌ నాట్‌ బే ఆఫ్‌ బెంగాల్‌. అరేబియా సముద్రం” అన్నారింకెవరో

“అదికూడా కాదు. ఇండియన్‌ ఓషన్‌, అంటే హిందూ మహాసముద్రం” అన్నాడు మరొకతను. "

"అసలు మనకి మొత్తం ఎన్ని సముద్రాలున్నాయి?" అడిగారెవరో.

"అది సరేగాని- అనలీ ప్రశ్న మన పేరెంట్స్‌నెందుకడిగినట్ట్లు? ". ఒకాయన అలోచిస్తూ అన్నాడు.

"అవును! నిజమే! మూర్‌ ఐలెండ్‌ సంగతి మనకిందుకుట? "

ఈలోగా మరో వ్యక్తి ప్రిన్సిపాల్‌ రూమ్‌లోంచి బయటపడ్డాడు హుషారుగా.

అందరూ అతని చుట్టూమూగారు.

'మిమ్మల్నెం అడిగారు?"

"1919 ఎంతో చెప్పమన్నారు. ఠకీమని చెప్పేశాను. అంతే! మా అబ్బాయికి సీటు ఇవ్వడానికి వప్పుకున్నాడు.

"అంటే మో అబ్బాయినేమీ అడగలేదా?"

"ఒక్కముక్కకూడా అడగలేదు."

"ఇదెక్కడి విడ్డూరం-తండ్రిని ప్రశ్చలడిగి కొడుకుని యల్‌ కె.జిలో చేర్చుకోవడం" ఒకాయన ఆశ్చర్యపోతూ అన్నాడు.

"వాళ్ళు తండ్రి ఇంటలిజెన్స్‌ని పరీక్షిస్తున్నారండీ. తండ్రి ఇంటిలిజెంట్‌ అయితే కొడుకు ఇంటిలిజెంటయి ఉంటాడని ఐడియా! కనుక అందరూ అలాంటి తెలివిగల పిల్లలనే న్కూల్గ్లో చేరుకుంటే న్కూలుకిమంచి పేరొన్తుందనీ వాళ్ళ అభిప్రాయం." ఒకాయన వివరించాడు.

"నన్నడిగితే అలా అనుకోవడంపరమ తెలివితక్కువతనం" ఆఫీసరుగారన్నారు.

“ఎందుకని

"పండిత పుత్ర;ఃపరమశుంఠః" అని మన పూర్వీకులు ఘోషించలేదుటండిీ?

"అవును! వారుచెప్పింది నిజమే. కొవాలంటే చరిత్ర తిరగేసుకోండి. గొప్ప గొప్పవారి పుత్రులంతా వెధవలే. అది ఈనాటి రాజకీయాలకు కూడా వర్తిస్తుంది..." అన్నాడు సర్వే ఆఫ్‌ ఇండియాలో పనిచేస్తున్న ఆఫీసరుగారు.

"అది సరేగాని 19419 ఎంత?” గోపాల్రావ్‌నన్నడిగాడు. నేను లోలోపల ఎక్కాలు చదవటం మొదలుపెట్టానుగానీ పంధొమ్మిదిల దగ్గర కొచ్చేసరికి ఆగిపోతోంది.

48 హ్యూమరాలజీ

అందరూ అన్సర్‌ కోసం ఆశగా నావంక చూడడం గమనించేసరికి అక్కడున్నవారెవరికీ అన్సర్‌తెలీదనే నాకు అర్ధమైపోయింది.

వెంటనే ఓకాగితం, పెన్నూ తీసుకుని త్వరత్వరగా 19419 లెక్కకట్టడం ప్రారంభించాను.

"మూడు వందల అరవయి ఒకటి" అన్సర్‌ అందరికీ గట్టిగా చదివివినిపించాను.

అప్పటికప్పుడే అందరూ వరండా అంతా తిరుగుతూ పంధామ్మిదిపంధొమ్మిదులు- మూడొందల అరవయి ఒకటి అని మననం చేసుకోసాగారు. మరో పెద్ద మనిషిని లోపలకు పిలిపించారు.

ఆయన దిగాలుపడిన ముఖంతో బయటకొచ్చాడు. కాసేపటికి అందరూ ఆయనను

స చుట్టుముట్టేశారు. ఫీ "మిమ్మల్నేమడిగారు? " అడిగాడు గోపాల్రావ్‌ ఆత్రుతగా

"నన్నేమీ అడగలేదు. నేను రైల్వేలో ఎల్టీసీగా పనిచేస్తున్నానని తెలీగానే సీటుదొరకదు వెళ్ళిపామ్మన్నారు."

"అదేమిటి?" అందరం ఆశ్చర్యపోతూ అడిగాము.

"ఈస్కూలు ప్యూనుక్కూడా మాకంటే ఎక్కువ జీతం వస్తుందిట! కనుక మాలాంటి లోక్తాస్‌ వాళ్ళకు అడ్మిషన్‌ ఇవ్వరట..."

ఈలోగా మరో వ్యక్తి లోపల్నుంచి ఆనందంగా బయటకురావటంతో అందరూ అతని

్టీ దగ్గరకు పరిగిత్తారు.

"మా బాబుని ఎబిసిడీలు చెప్పమన్నారు. వాడు తడుముకోకుండా చెప్పేశాడు.అంతే ఎడ్మిషన్‌ ఇచ్చేశారు."

ఆమాట వినేసరికి అందరికీ బోలెడు ధైర్యం వచ్చింది.

నేనూ, గోపాల్రావ్‌ కిరణ్‌గాడిని-చిట్టిగాడిని కూర్చోబెట్టి మళ్ళీ ఎబీసిడీలు చెప్పించాము.

ఈలోగా గోపాల్రావ్‌ పేరు పిలవనేపిలిచారు.

ఇరవయి నిమిషాల తర్వాత సీరియస్‌గా బయటకు వచ్చాడు. అందరం మామూలు గొనే వాడిచుట్టూ మూగాము.

“"ఎమడిగారు? "

గోపాలావ్‌ హఠాత్తుగా పూనకం వచ్చినట్లు వూగిపోయి, పళ్ళుబిగపట్టి, చిన్నిగొడి పట్టుకుని చావగొట్టసాగాడు.

అందరూ కలసి వాళ్ళిద్దర్నీ విడదీశాం.

స్ట కరాటే చదువులు 49

"రాస్కెల్‌-నెలరోజుల నుంచి ప్రాక్టీస్‌ చేయించామా? వీడులోపలకెళ్ళాక నోరువిప్పడే! వాటీజీయువర్‌ నేమ్‌ అంటే మాట్టాడడు. పిల్లి బొమ్మను చూపించి వాటీజ్‌దిసి అంటే నవ్వుతాడుగానీ నోరు మెదపడు. ఏబిసిడీలు చెప్పమ్మా అంటే అడ్డంగా తలూపుతాడు."

నాగుండెల్లో రాయిపడింది. బహుశా అదేరాయి అందరి గుండెల్లోపడినట్లుంది. ఎవరిపిల్లల్ని వాళ్ళు బుజ్జగించివాళ్ళకు నేర్పిందంతా మళ్ళీ వెళ్ళ్గగక్కించటం ప్రారంభించారు.

నాపేరు రానే వచ్చింది.

కిరణ్‌గాడిని తీసుకుని లోపలకెళ్ళాను. ఒక కళ్ళజోడు అతను, ఓబట్టతలతను, ఓ ఆంగ్లోఇండియన్‌ ముసలామెకూర్చుని ఉన్నారు.

"హల్లో కిరణ్‌-కమియర్‌బాయ్‌" అంటూ కిరణ్‌ని తన దగ్గరున్న స్టూల్‌ మోద కూర్చో బెట్టందామె.

నేను వేరీ కుర్చీలో కూర్చున్నాను.

"వాటీజ్‌యువక్వాలిఫికేషన్‌?"” అందా ఆంగ్లో ఇండియన్‌ నా వేపుచూసి. నాకేమి అర్ధంకా లేదు అమె మాటలు. ఎందుకయినా మంచిదని ఓచిరునవ్వు నవ్వాను మాటాడకుండా!

"వయాయు లాఫీన్‌?" అందామె మళ్ళీ.

నాకు భయం మొదలయింది! ఆమె మాట్టాడే భాష ఇంగ్లీష్‌లాగానే వుంది కాని ఇంగ్లీషు మాత్రంకాదు.

మళ్ళీ ఓసారి నవ్విబట్టతలాయనపు చూశాను.

“వయ్‌ డోంటుయు అన్సర్‌?” అన్నాడతను చిరాకుగా.

నాకు చెమటలు పట్టినయ్‌...

"మోరేమంటున్నారు?" అనడిగాను ఆయనను దీనంగా. కళ్ళజోడతను నా పరిస్థితిని చూసి జాలిపడ్డాడు.

"అతనికి ఇంగ్లీషు రాదు కాబోలు-" అన్నాడు వాళ్ళందరితోనూ జాలిగా.

"అవునండీ! నేను తెలుగు మోడియం " అన్నాను వినయంగా.

మైగాడ్‌" అన్నాడు బట్టతల వ్యక్తి బట్టతలను సవరించుకుంటూ.

"కిరణ్‌-బెల్‌మీ-వాటీజ్‌ యువర్‌ నేమ్‌?" అడిగిందామె. వాడునావేపు చూశాడు.

"కమాన్‌-వాటీజ్‌ యువర్‌ నేమ్‌? చెప్పు-" అన్నాన్నేను వాడితో. వాడు మళ్ళీ అందరివేపు చూశాడొకసారి. నోరు మెదపలేదు- ఆమె మళ్ళీ అడిగింది. వాడు మళ్ళీ అందరి మొహాలు

50 హ్యామరాలజీ

చూశాడు. నాకు వాడిమోద ఒళ్ళు మండిపోయింది. చెంపలు పగలకొట్టాలన్న కోరికను అతికష్టంమోద అణచుకున్నాను.

"చెప్పు నీ పేరు చెప్పు." అన్నాను ఆత్రుతగా.

వాడు నోరుకదపలేదు.

“టెల్‌ ఎ బిసి డి...” అందామె.

వాడు ససేమిరా పలకలేదు...

"ఎ బిసి డి చెప్పరా?" అన్నాన్నేను కసిగా

వాడు మాట్లాడలేదు

  • "ఓ-వెరీ పూర్‌-" అందామె మళ్ళీ. నాకు అర్ధమైపోయింది వాడికి సీటు దొరకడం దుర్లభమని. "సారీ సీటు దొరకదు” అన్నాడు కళ్ళజోడు.

"వీడు కొంచెం కొత్తగా ఫీలవుతున్నాడండీ! అందుకని చెప్పడానికి జంకుతున్నాడు. అంతే!నిజానికి వాడికి అన్నీవచ్చు. కొన్ని పదాలుకూడా చెప్పగలడు-'" బ్రతిమాలుతూ అన్నాను.

"సారీ-మిస్టర్‌.పోనీ మీకయినా మంచి మార్కులొస్తే తీసుకునే వాళ్ళం” అన్నాడతను.

"నాకా? నాకు మార్కులేమిటి?"

"ఈ ఇంటర్యూలో మేము పేరంట్‌నీ, పిల్లలకూ కూడా వాళ్ళకెపాసిటీ చూసి మార్కులేస్తాము...."

"అదేమిటి? చదివేది వాళ్ళయితే మమ్మల్నెందుకుపరిక్షించడం? "

"ఇంటి దగ్గరకూడా పిలలవిషయంలో జాగ్రత్తతీసుకునే తెలివిగల తల్లిదండ్రు లుంటేనే సీటు ఇవ్వాలని మా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం యూకెన్‌ గో! ఓ! మీరు తెలుగు మీడియం కదూ- మిరిక వెళ్ళవచ్చు."

నేను కిరణ్‌గాడిని బయటికి ఈడ్చుకొచ్చాను.

"ఎమయింది?" అడిగారు జనం చుట్టూ మూగి.

"నేనూ, మా కుర్రాడు ఇద్దరం ఫెయిలయ్యాం" అన్నానేను.

పిల్లలను తీసుకుని నేనూ, గోపాల్రావ్‌ బయటికొస్తుంటే ఓకారు ఎదురొచ్చి ఆగింది. వెనుక సీట్లో కూర్చున్నవ్యక్తి కారు దిగుతూనే నన్ను చూసి- కరాటే చదువులు క్‌]

"అరి! నువ్వీడకొచ్చినావేమి సంగతన్నా?" అన్నాడు నన్ను గుర్తుపట్టి.

"ఏం లేదు రాములూ! వీళ్ళిద్దరికీ స్కూల్లో ఎడ్మిషను చేద్దామని..."

ఈలోగా ప్యూన్‌పరుగుతో వచ్చి అతనికి సెల్యూట్‌ కొట్టి నిలబడ్డాడు.

"అరెయ్‌-ఇగో-సూడు- ఈ దొరల్సి తోలుకప్రోయి నా కమరాలో కూర్చుండబెట్టు-నేను ప్రిన్సిపాలుడితో జరంత మాట్టాడొస్త! పదండ్రన్నా! ఆడ కూర్చోండి! ఇప్పుడే వస్తా!” అని సరాసరి ప్రిన్సిపాల్‌ రూమ్‌లో కెళ్ళిపోయాడు. నేనూ, గోపాల్రావు ప్యూన్‌తోపాటు మేడమిదకెళ్ళి సెక్రటరీ అని బోర్జువున్న గదిలోకెళ్ళి కూర్చున్నాము. ఎయిర్‌కండిషన్‌ ఏర్పాటు ఉండటంచేత చాలా చల్లగా ఉందాగది. లోపల చాలా ఖరీదయిన ఫర్షిచరు.

. “ఇప్పుడు నీతో మాట్టాడితను ఈ స్కూలు సెక్రటరీయా?" అడిగాడు గోపాల్రావ్‌ అశ్చర్యంతో.

"అలాగే కనబడుతోంది! అన్నాను అశ్చ్ళర్యంనుంచి తేరుకుంటూ.

"ఎట్లా తెలుసు నీకతను?"

"నేను ఎక్సయిజ్‌ డిపార్టమెంటులో పని చేసేటప్పుడు పరిచయం. సారా దుకాణం కాంట్రాక్టర్‌- ఆఏరియాలో రౌడీ."

రాములు లోపలికొచ్చి కూర్చున్నాడు.

"ఆ! చెప్పన్నా! నువ్వు ఎడ్మిషన్‌ గురించి వచ్చినావ్‌?"

"అవును! అది సరేగానీ ఈస్కూలు..."

"నాదే అన్నా! గుడంబదందా నడిచినంతకాలం మంచిగానే ఉండేగానీ, ధూల్‌పేటలో పోలీసులు జులుం ఎక్కువయిందన్నా! ఇక ఆళ్ళతో కిరికిరందుకని ఆ దందా బంద్‌చేసి ఈ స్కూల్‌దందా షురూజేసిన! ఇగో-నిజం చెప్త్పన్న-ఇను! ఈస్కూల్‌ నడిపే దందాలఇంత లాభముం దని ముంగటే ఎరికుంటే నేను అ ఫాల్తుగుడంబ పక్కకే పోకపోతుండె! పెద్ద పెద్దోండ్లు వచ్చి స్కూల్ల సీటు గురించి క్యూల నిలబడుతును! ఇక పైసలు ఎన్ని గట్టమంటే అన్ని కట్టనికి తయారు... రెండేండ్లకిందట ఇరవైవేలతో ఈన్కూలు షురూదేసిన! గిప్పుడుకమాయ్‌ ఎంతనో ఎరుకనా? రెండు లక్షలు. గిట్టుండాల దంద అంటే!"

నేనూ, గోపాల్రావ్‌ నివ్వెరపోయి వింటూండిపోయాము అతని మాటలు.

"అది సరేగాని మా పిల్లలిద్దరికి ఎడ్మిషన్‌కావాలి మాస్కూల్లో! ఇప్పిస్తావా? " అడిగాన్నేను అయిష్టంగానే. గుడంబా వ్యాపారం చేసే ఓరౌడీ నడిపే స్కూల్లో మా పిల్లలుచదువు

నేర్చుకోవడం నాకు నచ్చలేదు. రాములు ఓ నిమిషం మాటాడలేదు. ఏదో ఆలోచనలోపడ్డాడు. 52 హ్యామరాలజీ

"పోనీలే-కష్టముయితే ఇంకో న్కూల్లో ప్రయత్నిస్తాము" అన్నాను నేను అతని ధోరణిచూసి. "కష్టం గురించికాదన్నా! నేను వేరే విషయం గురించి సోంచాయిస్తున్నా!" "ఏమిటది?" "నువ్వు నాకు చాలాసార్లు మదద్‌ చేసినావ్‌! గసంటప్పుడు నీకు నిజం చెప్పకుండా లోపట జేయనికి నాకిష్టంలేదు. నీపిల్లగాడుభీ నా పిల్లగాడు లెక్కచూడాలి గదా! వీళ్ళని వేరే మంచి స్కూల్ల జేర్ప్చించు! నా స్కూలు మంచిగలేదు." నేనూ, గోపాల్రావ్‌ మొఖాలు చూచుకున్నాం! ఆస్కూలు ఎంతో గొప్పదన్నపుకార్లు వినే మేము అక్కడికొచ్చామసలు. "నీ స్కూలు ఎందుకని మంచిదికాదు?" అడిగాన్నేను. "ఎమి జెప్పాల? సదువు మంచిగుండదు." "అదేమిటి? ఎక్కువ అంగ్లోఇండియన్‌ టీచర్లున్నారు కదా? "అగో అక్కడనే లోపటయేది అందరూ! ఆ చట్‌కారోళ్ళు ఎం సదివిన్రనుకుంటున్నావు? ఎనిమిదో కలాసు. అదికూడా పాస్‌కాలే! తప్పిన్రు. ఇంక ఆళ్ళు పిల్లగాండ్డకేమ్‌ జెప్తరు? వాండ్లకేతెలియకపాయె! ఇంక మిగిలినోండ్లలో ఇద్దరు పోరీలు మా బంధువులే ! ఇద్దరూ అయిదో క్రాస్‌తోనే బంద్‌చేసిను. ఈళ్లందరికీ జరన్త ఇంగ్లీష్‌ మంచిగొస్తది గనుక నడిచిపోతున్నది. లేకుంటే అప్పుడే కిరికిరి అవుతుండె. అసలు నా కొడుకులిద్దరు ఎడ ౮ జదువుతుదో నీకెరుకనా? " “ఎక్కడ? " "గవర్నమెంట్‌ స్కూల్ల. ఆడ ఫీజుతక్కువ. సదువెట్లెయిన జెప్పనీ గానీ మంచి టీచరొకన్ని ట్యూషన్‌ పెట్టిన!" “సరే వస్తా" అన్నాన్నేను లేచి నిలబడుతూ "ఇగో ఒక్కమాట. ఈ మాట ఎవళ్లోను చెప్పకు మళ్ళా." "అబ్బే-చెప్పను. నే నెందుకు చెప్తాను?" "గదే అంటున్న-నువ్వు నా పాత దోస్త్‌వని చెప్పిన." నేనూ, గోపాల్రావ్‌ బయటికొచ్చాం! "దిసీజ్‌ టూ మచ్‌ 1!" అన్నాడు గోపాల్రావ్‌. టూ మచ్చేనని నేనూ అంగీకరించాను. కరాటే చదువులు 53

"ఇప్పుడేం జేద్దాం?" అడిగాడు గోపాల్రావ్‌ "సెయింట్‌ ఆంథోని కిండర్‌గార్జెన్‌ స్కూల్‌కళల్దాం పద. "అక్కడ మాత్రం దొరుకుతుందంటావా?

ప్రయత్త్సం చేయకతప్పదు కదా."

ఇద్దరం సెయింట్‌ ఆంథోని స్కూలుకి చేరుకున్నాం సైకిల్‌ మోద. అక్కడి వ్యవహారం కొంచెం ప్రోత్సాహకరంగానే కనిపించింది.

ప్రిన్సిపాల్‌ అప్పటికప్పుడే కిరణ్‌గాడిని, చిన్నిగాడిని ఇంటర్వ్యూచేసి,రిజల్స్‌ కూడా " పావుగంటలో చెప్పేశాడు. సీటు దొరికిందట. వెంటనే చెరో అఆరువందలూ ఎడ్మిషన్‌ ఫీజుగా కట్టేయాలట.

"ఇప్పుడంత డబ్బు తేలేదండీ, రేపు కడతాం" అన్నాడు గోపాల్రావ్‌.

"ఊహు, రేపటికయితే గ్యారంటీలేదండీ. ఈలోగా ఇంకెవరయినా వస్తే ఎడ్మిషన్స్‌ కోజయిపోతాయి తరువాత మీ ఇష్టం.” "

"పోనీ ఓ గంట టబెమిస్తారా?"

ఆయన టైమ్‌ చూసుకున్నాడు.

"ఓ.కే. గంట టబ్రైమిస్తున్నాను" అన్నాడు చిరాగ్గా.

గోపాల్రావ్‌ సైకిల్‌ మోద రివ్వున దూసుకెళ్ళి అరగంట తర్వాత నురగలుకక్కుకుంటూ వచ్చి ఇద్దరికీ ఫీజు కట్టేశాడు.

"హమ్మయ్య పెద్ద సమస్య తీరిపోయింది " అన్నాడు. సరిగ్గా అప్పుడే ఓపెద్దమనిషి హడావిడిగా స్కూలు గేటు దగ్గర్నుంచి మావేపు వచ్చాడు.

"ఫీజు కట్టేశారా? " అన్నాడు ఆత్రుతగా.

"ఆ కట్టేశాం- ఎందుకలా అడిగారు?" అన్నాను అశ్చర్యంగా.

గాలిలోకి చేతులుఎత్తి "గోవిందా-గోవిందా"” అంటూ అరిచాడు, దబ్దం పెడుతూ. మా గుండెల్లో రాయి పడింది.

"ఏమిటది? ఎందుకలా అంటున్నారు?" అడిగాడు గోపాల్రావ్‌ పాలిపోయిన మొఖంతో.

“మో ఫీజు గోవింద!"

“ఎం ఎందుకని?”

ర్‌డీ హ్యామరాలజీ

"ఎందుకేమిటండీ మావాడిని కిందటేడు ఈస్కూల్లోజేర్పించాను. వాడికిలెక్కల్లో ఎ+బి హోల్‌స్కేర్‌ అంటే ఎస్క్వేర్‌ ప్లస్‌ బిస్క్వేర్‌ అని చెప్పాడట ఆ ఇడియట్‌. వీడింక పిల్లలకేం నేర్పుతాడు?”

"అంటే లెక్కల మాష్టారుకి లెక్కలు తెలిదా?"

"గోవిందా....గోవింద." అసలు లెక్కల మేష్టరంటూ ఒకడుంటేకదా. ప్రిన్సిపాల్‌ సెవెన్త్‌క్లాస్‌ వాళ్ళకి లెక్కలు, సైన్సూ చెప్తాడు. అందుకే మొన్న పరీక్షకిళ్ళినముప్పయిమంది కుర్రాళ్ళలో ఇరవైమంది ఫస్ట్‌క్సాసులోనూ, మిగతా పదిమంది సెకండ్‌క్లాసులోనూ తప్పారు.

"తప్పారా?"

“అవును. ఫస్టు సెకండ్‌క్షాసుల్లో'

"దేముడో-ఇప్పుడేమిటి చేయడం?"

"ప్రజాసేవ చేయండి. ఈ గేటుదగ్గర కాసేపురోజూ కూర్చుని- కొత్తగా బలి అయేందుకు వచ్చేవాళ్ళను రక్షించండి." అనేసి వెళ్ళిపోయాడతను.

గోపాల్రావ్‌, నేనూ ఒకరి మొఖాలొకరు చూచుకున్నాం.

"పద. మన ఫీజు మనకిమ్మని అడుగుదాం” కోపంగా అన్నాడు వాడు.

“వాడివ్వనంటే."

"మర్జర్‌చేసేద్దాం. జైల్లోగడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను." ( ఇద్దరం మళ్ళీ ప్రిన్సిపాల్‌ గదిలోకి జారబడ్డాం,

"మా ఫీజు మాకిచ్చేయ్‌ " అన్నాడు గోపాల్రావ్‌ చొక్కాచేతులు పైకిమడిచి.

"ఒక్కసారి ఫీజు కట్టాక-ఏ పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వబడదని రసీదువెనుక రాశాంకదా? అది మారూలు-'

"ఇవ్వకపోతే మొఖం పగలగొట్టాలని మాకూరూలుంది."

"అతను కోపంగా కుర్చీలోంచి లేచాడు.

"అసలు ఎందుకు వాపస్‌ ఇవ్వాలి నేను?"

"ఎందుకంటే నీ బోడి స్కూల్లో క్వాలిఫైడ్‌ టీచర్లులేరు గనుక,"

"ఏ స్కూల్లో ఎడిచారుగనుక-నా స్కూలులో ఉండటానికి?"

"మో స్కూల్లో అందరూ ఫస్ట్‌క్లాసులో తప్పుతున్నారు."

"అది వాళ్ళకర్మ! నేను 'పాస్‌ చేయటం' గారంటీ ఇవ్వటంలేదు." కరాటే చదువులు ర్‌5

"వాళ్ళ కర్మకాదు. నీకు చదువుచెప్పటం రాకపోవటంమూలాన తప్పుతున్నారు." “"ఎవడాడు రాదంది?" "అయితే ఎ+బి హోల్‌ స్క్వేర్‌ ఎంతో చెప్పు." "సడన్‌గా చెప్పమంటే ఎలా? ప్రిపేరవ్వాలి. ఎల్లుండిమాణింగ్‌ ఒకసారి కనబడండి! చెప్తాను!” "పోనీ న్యూటన్య్‌ సెకండ్‌ లాఆఫ్‌మోషన్‌ ఎమిటో చెప్పు.” "ఫస్ట్‌లా ఆఫ్‌మోషన్‌ మొదటి లైనుకొంచెం చెప్పండి మిగతాది చెప్పేస్తాను." "ఛస్తేచెప్పను-" | “అయితే నేనూ సమాధానం చెప్పను-” "చెప్పలేకపోతే నా ఫీజు నాకిచ్చేయి. రెండిట్లో ఏదోకటి చెయ్యి." అతను చాలాసేపు ఆలోచించి ఎవేవో తప్పులు చెపటంమొదలు పెట్టాడు. "నీకు రాదులేగానీ డబ్బిచ్చేయ్‌" అన్నాడు గోపాల్రావ్‌. “నేనివ్వను." గోపాల్రావ్‌ ఠరక్కునవాడి చొక్కా పట్టకున్నాడు. అంతే! ఐదునిమిషాలపాటు అక్కడేం జరుగుతుందో నాకు తెలీదు. బల్లమీద-వస్తువులూ,గోడలకున్న కాలెండర్లూ, కుర్చీలూ, చెత్తబుట్టా, ఫోనూ, అన్నీ ముక్కలుముక్కలయిపోయినాయి, వాళ్ళ యుద్ధంలో! ఈలోగా అ స్కూలు సెక్రటరీ కాబోలు వచ్చి గోపాల్రావ్‌ని పట్టుకోబోయాడు. మరో పక్కనుండి ఆస్కూలు వ్యూన్‌ అతనికి సహాయంగా వచ్చాడు. ఇంక నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. వాళ్ళిద్దర్నీ చెరోతన్నూ తన్ని కిందపడగానే కుర్చీలు మిదవేసి నొక్కిపట్టాను. మరో ఐదు నిమిషాలు భీకర సంగ్రామం జరిగింది. బయట నిలబడ్డ కిరణ్‌గాడు, చిన్నిగాడు లోపలికొచ్చి ఆదృశ్యంచూసి ఎంతో ఆనందించారు. సినిమాసీనుల్లో ఫైటింగ్‌ చూడడం వారికెంతో ఇష్టం. అదే ఎదురుగ్గా జరుగుతోంది మరి. "డాడీ-వాడిని పిస్టల్‌తో కాల్చేయ్‌” అని సజెషన్‌ ఇచ్చాడు చిన్నిగాడు. హఠాత్తుగా ప్రిన్సిపాల్‌ మెడ గోపాల్రావ్‌ చేతుల్లో ఇరుక్కోవడంతో ఊపిరాడక “బాబోయ్‌ మీ డబ్బిచ్చేస్తాను వదలండి" అనరిచాడు ప్రిన్సిపాల్‌, ఇద్దరం బట్టలుదులుపుకుంటూ లేచి నిలబడ్డాం. ప్రిన్సిపాల్‌ చేతిమోద నుంచిరక్తం కారుతోంది. గోపాల్రావ్‌గాడి కన్నువాచిపోయింది. నాకాలుప్రాక్సృరయిందేమో అనుమానం. చివరకు ఇద్దరికీ చెరో వందరూపాయలూ కాన్సిలేషన్‌ ఫీజుకింద తీసుకుని మిగతా డబ్బిచ్చేశాడు ప్రిన్సిపాల్‌. క్‌ హ్యామరాలజీ

ఇద్దరం చిరిగిన బట్టలతోనూ, చెరిగిపోయిన జుట్టుతోనూ, ఒగరుస్తూ బయటికొచ్చి పిల్లలను+సైకిళ్ళనూ నెమ్మదిగా తీసుకుని నడవసాగాము. నాలుగడుగులు వేశామోలేదో శంకర్రావ్‌ ఎదురయ్యాడు. మా అవతారాలు చూసి ఆశ్చర్యపోయాడు.

"ఏమిటీ అవతారాలు? స్కూలుఫీజు వాపస్‌ గొడవేనా?" అడిగాడు నవ్వుతూ.

"అరె! నీకెలా తెలుసు?” ఇద్దరం ఉలిక్కిపడి అడిగాము.

| "స్కూల్స్‌ తెరిచేరోజుల్లో అందరం నాలుగుచోట్ల యుద్దం చేస్తేనేగదా ఈచెత్త స్కూల్స్‌ తప్పించుకునేది."

"నేను ఆరుగురు శెక్రటరీలను, పధ్నాలుగుమంది ప్రిన్సిపాల్స్‌నీ కత్తితోపొడిచాను-ఫీజు వాపసుకోసం.”

"అంతమందినా?"

"అవును మరి. చాలా చోట్టనేనూ కత్తిపోట్ట్లుతిన్నాననుకో-తప్పదు మరి. మనపిల్లల్ని ఆంధ్రప్రదేశ్‌లో చదివించాలంటే తల్లిదండ్రులు ఈమాత్రం రిస్క్‌తీసుకోవాల్సిందే."

"ఒకవేళ ప్రిన్సిపాల్‌ స్త్రీ ఉంటే ఎలా?" అడిగాడు గోపాల్రావ్‌.

“అప్పుడు మా అవిడను పంపిస్తాను. దానికి ఈమధ్యేకరాటే నేర్పించాను దీనికోసమని. ముగ్గురు లేడీ ప్రిన్సిపాల్స్‌ను చావగొట్టి ఫీజు వాపస్‌ తీసుకొచ్చింది, ఇప్పటికి-కనుక ముందు

| మో భార్యలను కరాటే స్కూలుకి పంపించండి. వీలయితే మీరూ నేర్చుకోండి వస్తా-ఇంకో శెకటరీ ఈపక్కకల్లు కాంపౌండ్‌లో కల్లుతాగుతున్నాడట. వాడి అంతుతేల్చుకోవాలి" అంటూ కత్తి బయటకు తీసి పక్కనే ఉన్నకల్లు కాంపొండ్‌లోకి పరుగెత్తాడు.

"పద" అన్నాడు గోపాల్రావ్‌.

“ఎక్కడికి? ' అడిగాను.

"కరాటే స్కూలుకి"

"మరి పిల్లలో...”

"వాళ్ళను కూడా తీసుకెళదాం... మనకి సహాయంగా ఉంటారు."

"అయితే ఓపని చేద్దాం. నువ్వుకరాటే స్కూలుకెళ్ళు. నేను డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్టక్షన్‌ ఆఫీసుకెళతాను. ఇలాంటి చెత్త స్కూల్సు అన్నిటికీ గవర్నమెంటు రికగ్నిషన్‌యిస్తున్న ఆ ఆఫీసరు అంతుతేల్చుకొస్తాను... "వాడు పిల్లల్ని తీసుకుని కరాటే స్కూలువేపు బయల్దేరాడు.

నేను డీ.పి.ఐ. అఫీసుచేరుకున్నాను. కరాటే చదువులు క్‌7

రిసెప్పనిస్పు చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. అందరికీ సమాధానాలు చిరాకుగా చెప్తాందామె. చివరకు నావంతువచ్చింది. "ఏంకావాలి? " "అడ్డమైన స్కూల్లుకీ రికగ్నిషన్‌ యిస్తున్న మో డైరెక్టర్ని కత్తితో పాడవాలి! ఎక్కడాయన?” "ఆయనని కత్తితో పాడవాలనుకుంటున్న పేరెంట్సు క్యూ ఆఫీస్‌ వెనుకవేపు వుంది. అటువేపువెళ్ళి 'క్యూ' లో నిలబడండి" అందామె చిరాకుగా. * - కనే శ 508 హ్యామరాలజీ

వరుడు కావలెను లేక కట్టంతెో “ అ త్‌ జ ఎటు కెరసణాయిలు ఉబిత౦ ళా గస శ్ర ఖ్‌ గగ చై. మా కాం గ్‌ 4 ౦ ననే "ము! శర గళ్లూ (1 న్‌ హైం క్ష, || ₹స్హైర్రోగ్రోో [] ఇష పెళ్ళీ పందిరంతా చాలా హడావుడిగా వుంది ఆడా, మగా, పిల్తాపీచు-ఓ పక్కబాండ్‌ మేళం, మరోపక్క పెళ్ళిపెద్దల కేకలతో హోరెక్కిపోతోంది. నేనూ, శాయీరామ్‌, రంగారెడ్డి, జనార్ధన్‌, మొదలయిన కాలనీవాళ్ళందరం కలసి, కుర్చీల్లో గుంపుగాకూర్చీని బాతాఖాని కొడుతున్నాం- శాయీరామ్‌ ఆతరువాత జరగబోయే కాలనీ మీటింగుతాలూకూ ఎజెండాగురించి ఎడా పెడా చర్చిస్తున్నాడు. అది మా కాలనీ (ప్రసిడెంట్‌ గోపాల్రావ్‌గారి అమ్మాయి పెళ్ళి అవడంవల్ల కాలనీ వాళ్ళందరూ గుమికూడారక్కడ. ముహూర్తం దగ్గర పడిపోంది. పెళ్ళికొడుకు తాళ్‌ పట్టుకుని రెడీ అయిపోయాడు. బాజాబవాళ్ళు వేగం విపరీతంగా పెంచేశారు-ఎదో కొంపమునుగబోతుందన్నట్ట్లు. వరుడు కావలెను లేక... 59

"మన తెలుగు సినిమాల్లో అయితే నరిగ్గా ఇలాంటి సీన్‌లోనే "ఆగండి! "అంటూ కేక వినబడుతుంది! కదూ" అన్నాడు రంగారెడ్డి.

"అవును! ఇలాంటి 'ఆగండి' సీన్లమీదే కొన్ని వందల సినిమాలొచ్చాయ్‌" అన్నాడు శాయీరామ్‌. "అయినాగాని మన 'పేక్షకులకు ఇంకా ఆసీన్‌లంటేనే యిష్టం"

సరిగ్గా అప్పుడే "ఆగండి!" అన్నకేక వినిపించి అందరం ఉలిక్కిపడ్డాం. మాతోపాటు పెళ్ళి పందిరంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది.

“ఎవరో భలేజోకు వేశాడు" అన్నాడు శాయీరామ్‌ పగలబడి నవ్వుతూ. మేమంతా | కూడా నవ్వబోయాంగాని ఆగొంతు మళ్ళీ కర్కశంగా. "జోకుకాదు-గాడిదగుడ్డూకాదు " అని అరచింది.

ఈసారి ఆగొంతుతాలూకూ ఓనర్‌ని అందరం జాగ్రత్తగా చూశాం. ఆగొంతు ఓనర్‌ మరెవరో కాదు. పెళ్ళికొడుకు తండ్రి. శాయీరామ్‌ని కోపంగా చూస్తున్నాడతను.

"జోక్‌కాదాండి!" కొంచెం తగ్గి అడిగాడు శాయీరామ్‌.

"గొడిదగుడ్డు జోకు! జోకేమిటయ్యా! ఇది జోకులేసుకునే టైమా?"

ఇంకా మండిపడుతూ శాయీరామ్‌ మాద కొచ్చాడతను. శాయీరామ్‌ మరో నాలుగడుగులు వెనక్కు వేశాడు.

"నేను జోకనుకున్నానులెండి.

"బుధ్యండాలి అలా అనుకోవడానికి."

ఇక లాభంలేదని నేనూ, రెడ్డీ జోక్యం చేసుకున్నాం.

"వాడికి కొంచెం బుద్ధి సరిగ్గా ఉండటంలేదులెండి. అదీ ఈమధ్య...టి.విలో డ్రామా లేయడం మొదలెట్టినవ్పటినుంచేలెండి! అంతకుముందు బాగానే ఉండేది-” అని .- సర్దిచెప్పాడు రెడ్డి.

ఇంతలో గోపాల్రావ్‌ పరుగుతో వచ్చాడు మా దగ్గరికి.

"ఎమిటి వియ్యంకుడుగారూ! ఏంజరిగింది" అన్నాడుగాభరాగా.

"గొడిదగుడ్డు జరిగింది" అన్నాడు బట్టతలాయన బట్టతల సవర్దీసుకుంటూ.

"గాడిదగుడ్డా?"

“అవును!

"గాడిదగుడ్డు జరగడమేమిటి?" మరింత గాభరాగా అడిగాడు.

“కాకపోతే ఎమిటయ్యా! తాళికట్టే బైము దగ్గరపడింది! ఇంతవరకూ వప్పుకున్నకట్న కానుకలన్నీ ఇవ్వరీం."

650 హ్యామరాలజీ

"అదేమిటి? కట్టంముందే ఇచ్చాంగా?” -

'కట్టంసంగతి సరేనయ్యా. కిరృనాయలుసంగతేమిటి?"

“కిర్సనాయిలా? "

“కిర్సనాయిలు ఇప్పుడెందుకు?

"ఇప్పుడుకాకపోతే ఎప్పుడిస్తారయ్యా? మాకోడలిని తగలేసుకోవద్దా? "

"వీల్లేదు. మా వంశాచారం ప్రకారం పదకొండో నెలవరకూ ఇంటికోడలిని

తగలెట్టడానికి వీల్లేదు" అరచాడు గోపాల్రావ్‌

"మీబోడి వంశచారం-మో కోడలికి పాటించండి. మా కోడలిని ఎప్పుడు కిర్సనాయి లుతో తగలెయ్యాలో అది మా ఇష్టం"

"కాదు.మా ఇష్టం" అన్నాడు గోపాల్రావ్‌,

"అలా ఒకరికొకరు రెచ్చిపోతే ఎలా గోపాల్రావ్‌గారూ ! ఇలాంటి విషయాల్లో పట్టు విడుపులంటూ లేకపోతే కష్టం. మన అమ్మాయిని వాళ్ళచేతుల్లో పెట్టాక వాళ్ళు ఎప్పుడయినా తగలేసుకోనీండి. మనం అడ్డు చెప్పడం బావుండదు" అన్నాడు రంగారెడ్డి ఇద్దరినీ శాంతపరుస్తూ...

"సరే, అలాగీ! ఎనిమిదోనెలే తగలేసుకోనీండి." తగ్గి, అన్నాడు గోపాల్రావ్‌.

' “మరి కిర్సనాయిలు మాటేమిటి?" మళ్ళీ అడిగాడు బట్టతలాయన.

"ఐం కిర్సనాయిలు?"

"మీ అమ్మాయిని తగలెయ్యడానికి పాతికలీటర్ల 'కిర్సనాయిలు ఇస్తానని ఒప్పుకున్నారుగా, అదేది అనడుగుతున్నాను."

"కిర్సనాయిలు సప్లయిచేస్తానని నేనువప్పుకోలేదే."

“"వప్పుకున్నారని మధ్యవర్తి చెపితేనే గదయ్యా-ఈ సంబంధం చేసుకోడానికి వప్పుకుంది. '

"ఏడీ మధ్యవర్తిని పిలవండి."

"పిలవండి!"

అందరం మధ్యవర్తికోసం వెదికాంగానీ మామూలుగానే ఆయనెక్కడా కనిపించలేదు.

"అయ్యా, ముహూర్తం మించిపోతోంది. తాళి కట్టించేస్తే బావుంటుంది-” అన్నాడు పురోహితుడు. వరుడు కావలెను లేక... 61

"బోడి ముహూర్తం పోతేపోనీ, కిర్సనాయిలు సంగతి తేలందే తాళి కట్టడానికి వీల్లేదు! అబ్బాయ్‌ పీటలమోదనుంచిలేచి ఇక్కడికొచ్చేయి" అన్నాడాయన. రెడ్డి మళ్ళీ ఆయనను శాంతపరచడానికి ప్రయత్నించాడు.

"ఇదిగో చూడండి బట్టతలగారూ"

ఆయన కోపంతో ఎగిరిపడ్డాడు.

"ఏమిటీ! నాపేరు బట్టతలా? "

రెడ్డి ఖంగారుపడి నావేపు చూశాడు! "ఈయన పేరేమిటని ఇందాక నిన్ను ా అడిగితే 'బట్టతల' అని చెప్పావుకదా?" అన్నాడుగాభరాగా,.

నేను ఎందుకయినా మంచిదని అక్కడ చేరిన గుంపువెనక్కు నడిచి, '' ఊరికే అన్నాలేసరదాకి!” అన్నాను పరిగెత్తుకుంటూ పారిపోవడానికి రెడీగా నిలబడి.

"సారీ సార్‌! ఎదో పొరపాటు జరిగింది! ఇంతకూ మీ పేరేమిటన్నారు?

"గాడిదగుడ్డు" ఇంకా మండిపడుతూ అన్నాడు.

"చూడండీ గాడిదగుడ్డు...సారీ! మోరుకోపంగా ఉన్నట్టున్నారు. అలాంటి పేరిక్కడయినా ఉంటుందా ఎమిటి? సరేకానీండి! పేరొదిలేద్దాం! చూడండి, ఎవరికోడలిని వాళ్ళే కిర్సనాయిలు కొనుక్కుని తగలెయ్యడం మన సంఘ ఆచారం! మోరిప్పుడు కొత్తగా పుట్టింటివాళ్ళే కిర్చనాయిలుకూడా సప్టయిచేయాలంటే ఎవరికయినా ఇబ్బందే కదా..."

"గాడిదగుడ్డు! అలా సప్లయి చేసేవాళ్ళ అమ్మాయినే చేసుకుంటామని మధ్యవర్తికి క్లియర్‌గా చెప్పాను." .

"అయినా అలా కిర్సనాయిలు అడగడమే చాలా తప్పండి!" అన్నాడు మా

కాలనీతాలూకు ఆంజనేయశాస్త్రి జనంలోంచి ముందుకొచ్చి,

"ఏమిటి? తప్పా?" బట్టతలాయన మళ్ళీరెచ్చిపోతూ అడిగాడు.

"అవును."

"ఎమిటి తప్పు?" =

"తప్పుకాకపోతే ఎమిటయ్యా! ఇవాళ మిరు కిర్సనాయిలు ఉచితంగా ఇమ్మంటున్నారు రేపు ఇంకొకాయన అంటించడానికి అగ్గిపెట్టికూడా కావాలంటాడు. అసలే పెళ్ళి ఖర్చులూ, కట్మాలూ ఇవ్వలేక ఛస్తూంటే-పాతిక లీటర్లకిర్సనాయిలు బ్లాకులో కొనియివ్వాలంటే మాటలా ఐమిటి?"

62 హ్యామరాలజీ

"అదంతా నాకనవసరమయ్యా! మా అబ్బాయికి కనీసం మూడు పెళ్ళిళ్ళయినా చెయ్యాలికదా! ముగ్గురిదగ్గర కట్నం, లాంఛనాలు వసూలు చేస్తేగానివాడికి నాలుగు డబ్బులు మిగలవని మోరూ వప్పుకుంటారు! అవునా! మరి మిగిలే ఆ నాలుగు డబ్బుల్లో ముగ్గురు భార్యలను ఒకరి తర్వాత ఒకరిని విడివిడిగా కిర్సనాయిలు పోసి తగలబెట్టాలంటే ఎంత ఖర్చ్పోమిరే ఆలోచించండి!" కొంచెంశాంతంగా అన్నాడు బట్టతలాయన.

"పోనీలేవయ్యా గోపాల్రావ్‌, కిర్సనాయిలు ఇచ్చేసేయ్‌, అయిన ఖర్చుఎలాగూ అయింది. ఇంక ఇప్పుడు వెనక్కు తగ్గడందేనికి?" ఎవరో గోపాల్రావ్‌కి సలహా ఇచ్చారు.

“ఇమ్మంటారా? " సందేహంగా అడిగాడు గోపాల్రావ్‌.

"ఇచ్చేసేయ్‌! ఈ సంబంధం తప్పిందంటే మళ్ళీ ఎప్పటికి ఇంకో సంబంధం కుదురు తుందో ఏమో! ఈలోగా మో అమ్మాయికి భర్త చేతిలో తగలబడేవయసు దాటిపోవటంలేదూ? ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరిగితేనే 'ముద్దు' అన్నారు అంటే, నాఉద్దేశ్యం మా అమ్మాయి కలకాలం ఇలాగే కిర్సనాయిలు చావుతప్పించుకునీ భష్టత్వం పొందుతుందని కాదు. ఏదొక సంబంధం చూసి ఎలాగూపెళ్ళిచేస్తావ్‌? ఆ అత్తమామలు, భర్తాకలసి ఎలాగూ కిర్సనాయిలు పోసి తగలెయ్యకా మానరు. ఎటొచ్చీ నీకు టైము ప్రకారం అమ్మాయిని తగలబెట్టించలేక పోయానే అన్న దిగులుండిపోతుంది ఆఅఖరివరకూను" నెమ్మదిగా నచ్చజెప్పాడు జనార్ధన్‌.

"సరే" అన్నాడతను.

అంతలోనే గోపాల్రావ్‌గారి భార్య సావిత్రమ్మ కస్సున లేచింది.

"ఏమిటి, కిర్సనాయిలు ఇస్తారా? అమ్మాయి వయసు దాటిపోతోందికదాని ఇలాంటి

కొత్త పద్ధతులన్నీ మొదలెడితే ఇంక అయినట్లే. ఇవాళ కిర్సనాయిలు వప్పుకుంటే రేపు అగ్గి 'పెట్టికూడొా ఇమ్మంటారు. ఆ తర్వాత మా అమ్మాయి అంత్యక్రియల ఖర్చుకూడా పెట్టు కోమంటారు. ఇలా దీనికి అంతం ఎక్కడుంది. వీల్లేదు, కిర్సనాయిలు ఇవ్వడానికి చస్తేవప్పు కోను" అందామె మొండిగా.

మరుక్షణం మా కాలనీ తాలూకూ ఆడవాళ్ళందరూ అలవాటు చొప్పున చప్పట్లు

| కొట్టారు ఉత్సాహంగా.

"అవును! ఇలా అడ్డమైన సౌకర్యాలు పెంచడానికి వీలులేదు" అంటూ అరిచారు

_ కొంతమంది. వరుడు కావలెను లేక... 63

ఇక లాభంలేదని రెడ్డిగారు కల్పించుకున్నాడు.

"చూడండమ్మా! పద్దతులనేవి కాలాన్నిబట్టి మారుతుంటాయి మనం అడ్డుపడ గూడదు. ఆరోజుల్లో పద్ధతులేవేరు! మా తాతయ్య ఇప్పటికీ చెప్పంటాడు. వాళ్ళకాలంలో మొగాళ్ళు

. ఒక్కటే పెళ్ళి చేసుకుని, ఒకే భార్యతో జీవితాంతం కాపురం చేసేవారట. అలాగే ఒకో వంశానికీ

ఒక్కోరకమైన ఆచారాలు ఉంటాయి. మా వంశం ఆచారం ఏమిటంటే మగాళ్ళు వరునగా

ముగ్గురు భార్యలవరకూ కాల్చిచంపాలి. నాలుగోభార్యమాత్రం జీవితాంతం సంసారంచేయాలి.

ఎపరిస్టితుల్లోనూ ఆమెను కిర్సనాయిలు పోసి కాళ్చి చంపకూడదు. ఒకవేళ తనంతట తానుగా

ఆమె అత్మహత్యచేసుకోవడం-లేదా చనిపోవడం జరిగితే అవ్పుడుగాని ఇంకో పెళ్ళి చేసుకోడానికి వీలులేదు!

అలాగే ఆంజనేయశాస్తిగారి వంశసంప్రదాయం ప్రకారం పెళ్ళయిన సంవత్సరంలోగా వరుసగా నలుగురు కోడళ్ళను అత్తామామలు మాత్రమే కిర్చ్సనాయిలు పోసి నిప్పంటించాలి. వాళ్ళకొడుకు కేవలంవారికి సహాయం చేయాలిగాని స్వయంగా నిప్పంటించకూడదు. . ఇక జనార్ధన్‌గారి సంప్రదాయం మరో రకంగా వుంటుంది. ఇంటి కోడల్ని భర్తగానీ, అత్తమామలుగానీ చంపడానికి వీలులేదు. అమె ఆడపడుచులే స్వయంగా మంచిరోజు చూసి కిర్సనాయిలుపోసి నిప్పంటించాలి ' అంటూ ముగించాడు రెడ్డి.

సీతారామయ్యగారు చేతికరతో వణుకుతూ ఉత్సాహంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఆయనకూడా ఏదో చెవ్పడానికి నరదొవడుతున్నాడని అందరికీ అర్ద్మమయిపోయింది.

“మాది బాగా వెనుకబడ్డ ప్రాంతంకదగర్రా! అక్కడ యింకో సంప్రదాయం ఉంది. అదేంటంటే భర్త భార్యను తగలబెట్టే రోజునే- అత్తగారినీ, తల్లినీ కూడా చంపేయాలి, ఆ ళ తర్వాత ఆ భర్తా అతని తండ్రి మామగారూ- ముగ్గురూ ఒకే పందిట్లో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి!"

హేమలత ఠక్కున అందుకుంది.

“అవున్లెండీ, ఎవరి సంప్రదాయం వాళ్ళది. మాలో పద్ధతి ఇంకో రకం. పెళ్ళయాక ఆమెను ఎవరూచంపరు. తనంతటతనే ఓగదిలో కిర్సనాయిలు పోసుకుని నిప్పంటించుకుని చచ్చిపోవాలి. అప్పుడు భర్త ఆమె స్వహస్తాలతో "తన చావుకి ఎవరూ బాధ్యులుకారనీ, అత్త మామలూ, భరా ఆడపడుచులు అంతా దేవతలూ-లేక దేవుళ్ళనీ, కేవలం తనకే సరాదా పుట్టి ఛస్తోందని” రాసిన ఉత్తరం లగ్నంనాడు అతని ఉత్తరీయంలో కట్టిన మూటనుంచి

64 హ్యామరాలజీ లో ఇ

తీసి పోలీసుల కిస్తారన్నమాట! అయితే ఆ ఉత్తరం అందుకునే పోలీస్‌ ఇన్‌స్పెక్టరికీ ఒక కానిస్టేబుల్‌కీ మనం బట్టలు పెట్టాల్సివుంటుంది! పవిత్రకార్యంగదా మరి." శీతారామయ్యగారికి పాతరోజులన్నీ కళ్ళముందు మెదలినట్టున్నాయ్‌.

“ఇదేకాదర్రా! ఆరోజుల్లో భార్యలను ఇప్పటిలాగా డైరెక్ట్‌గా కాల్చేవాళ్ళుకాదు. ముందు కట్నాలగురించో, మరోవస్తువు గురించో వియ్యాలవారితో వివాదం పెట్టుకునేవాళ్ళు. అవన్నీ తెమ్మని భార్యను బాగా వేధించాక అప్పుడు కిర్సనాయిలుపోసి నిస్పంటించేవారు.ఒకవేళ

౮ వియ్యాలవారు అడిగినవన్నీ ఇస్తే ఆమెను చివరికంటా అస్సలు చంపేవారేకాదు! అలాగే

  • కాపురం చేయనిచ్చే వాళ్ళు! అంత అజ్ఞానం ఉండేదారోజుల్లో."

ఈ గొడవంతా వింటున్న పెళ్ళికొడుక్కి చిరాకు పుట్టుకొచ్చింది. చేతిలోనిమంగళ సూత్రం నేలకేసి కొట్టాడు. "నేనేం హరికధలు వినడానికిరాలేదయ్యా! ముందు కిర్సనాయిలు ఇస్తారా ఇవ్వరా తేల్చండి?" అన్నాడు మొండిగా. శాయీరామ్‌ మంగళసూత్రం అతని చేతికిచ్చి సమాధానపర్పాడు.

“అలా తొందరపడితే ఎలాగయ్యా! ఓపక్కన మో మామగారు ఇస్తానని ఒప్పు కున్నారుగదా! మో అత్తగారికి యెలాగోలా నచ్చజెప్తాంలే! అల్లరిపడకు?"

“మోరెంత సేపూ అంతఖర్చు అని గొడవేగాని మా పెళ్ళికొడుకుల సైడ్‌ కొంచెంకూడా ఆలోచించరండీ! పెళ్ళయిన తర్వాత షుమారు సంవత్సరంపాటు భార్యను మేపి ఆ పెట్టుబడికి దమ్మిడీ రాబడి రాకుండానే అంతేసి కిర్సనాయిలు పోసికాల్చిచంపాలంటే ఎవరికయినా ఎంత కష్టం? పోనీ అలా అని జీవితాంతం దానిని కాల్చ్బకుండా బయటకు తోలేద్దామా అంటే లేనిపోని కాంప్లికేషన్స్‌ వస్తాయి! అదీగాకుండా మొదటిభార్య కిర్సనాయిలు పోసుకుని తగలెట్టుకున్నదని బుజువయితేగాని మరోపిల్ల నివ్వడానిఎవరూ ముందుకి రారు. అయినా భార్యలతో కట్నం వస్తోందన్నమాటేగాని పెద్దగా మాకు మిగిలిచచ్చేదెక్కడ? సంవత్సరంపాటు తిండి, ఆ తరువాత కాల్చిచంపడానికి కిర్సనాయిలు, అగ్గి పెట్టెలు, దహన[క్రియలు ఖర్చులు, దినవారాల ఖర్చులూ, *స్తికలు గంగలో కలపడాలు, ఇంట్లో పెద్దఫోటోలు ఫప్రేములుకట్టించి తగిలించడాలు-ఎంతఖర్చో మీరీలెక్కవేసుకోండి. గోపాల్రావ్‌గారు ఈ విషయంలో ఎంతో అభ్యుదయ భావాలున్నవారు కాబట్టి అడగ్గానే ఠక్కున వప్ఫుకున్నారు " అన్నాడు పెళ్ళికొడుకు.

మళ్ళీ శీతారామయ్యగారు అందుకున్నారు.

“నన్నడిగితే భార్యలను కిర్సనాయిలుతో చంపడం మానేయడం మంచిదంటాను! ఎందుకంటే రాన్రాను కిర్సనాయిలుధర తెగపెరిగిపోతోంది. వేరేఇంకేమయినా చౌకరకం

1 వరుడు కావలెను లేక... 65

ఆయిల్‌ ప్రభుత్వం సప్టయ్‌ చేయాలి. లేదా అసలు ఆడదాన్ని చంపకుండా బానిసలుగా అమ్మిపారేసే పద్ధతయినా బాగానే ఉంటుంది. ఇటువంటి పద్ధతివల్ల అటు ఖర్చ్బూతప్పుతుంది. ఇటు కొంతరాబడీ వుంటుంది. మరోవక్క కొన్నవాడికి గొడ్లకు బదులుగా స్త్రీలను ఉపయోగించుకుని లాభపడే అవకాశమూ ఉంటుంది. ఈ పద్ధతి ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది-'"' ఆమాట పూర్తికాకుండానే ఆడాళ్ళంతా ఎకమయి శీతారామయ్య మోద విరుచుకు పడ్డారు "అలా జరగడానికి వీల్లేదు. ఆడాళ్ళు పశువులుకాదు, అలా బానిసలుగా అమ్మి పారేయడానికి. భర్త చేతిలో కిర్సనాయిలు చావు చావడం మా జన్మహక్కు. ఇది మా భారతదేశ సాంప్రదాయం. మా నాగరికత. ప్రవంచంలోకిల్లా గొప్పవయిన మన ఆచారాలు తొలగించడానికి మేము ససేమిరా వప్పుకోము" అంటూ ఆవేశంగా అరిచారు. పరిస్థతి విషమించేలా ఉందని శాయీరామ్‌ చిరునవ్వుతో మధ్యలోకొచ్చాడు. “సోదరులారా, సోదరీమణులారా, మనలో మనకి గొడవెందుకు? మనం అటు గోపాల్రావ్‌గారి భార్యవాదననూ కొట్టేయడానికి వీల్లేదు. ఇటు పెళ్ళికొడుకూ, అతని తండ్రి అండ్‌ కంపెనీవాళ్ళు అడిగేదానికి కాదనలేము. ఎందుకంటే మనందరికీ కూతుళ్ళతో పాటు కొడుకులూ వున్నారు మన కూతురు ఒకింటికి కోడలైనట్టే, ఒకింటి కూతురూ మనింటికి కోడలుగా రాక తప్పదు. మరి మనింటి కోడళ్ళను మనమే స్వయంగా కిర్సనాయిలు పోసి నిపంటించడమూ సహజమే. అంటే మరి మనకూ ఖర్చుపెరుగుతుంది కదా! కనుక మనమందరం ఓ కొత్త పద్ధతి అవలంబిస్తే బావుంటుంది. అదేమిటంటే పెళ్ళికొడుక్కి ఒకేసారి ముగ్గురమ్మాయిలతో పెళ్ళిచేసిపారేస్తే అటు ముగ్గురికట్నం ఒకేసారి వస్తుంది. ఇటు వాళ్ళందరినీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చంపే పద్ధతిబదులు ఒకేసారి కట్టకట్టి కిర్సనాయిలు పోసి అంటిస్తే ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకని? అందరికీ కామన్‌గా దహనక్రియలు, కామన్‌గా దినవారాలు, అందరి అస్థికలూ, ఒకటేసారి గంగలో కలపడం,ఆతరువాత ఆ ఫోటోలకు జీవితాంతం జరిపే పూజల ఖర్చు కామన్‌- ఇలా ఎంత లాభమో చూడండి..." ఓక్షణం అంతా నిశ్శబ్దం అలుముకుంది. అ తరువాత ఎవరికి వాళ్ళు పక్కవాళ్ళతో తర్కించుకోవడం (ప్రారంభమయింది. "మోరు చెప్పింది చాలా బావుంది అన్నయ్యగారు!" అంది రాజేశ్వరి ఆడొళ్ళతరపున. "అవును-" అన్నారు మిగతావారు. "మోరేమంటారండి" అంటూ బట్టతలనడిగాడు శాయీరామ్‌ “"గాడిదగుడ్డంటాను." మండిపడుతూ అన్నరాయన. 66 హ్యామరాలజీ

"అదేమిటి?"

"లేకపోతే ఏమిటయ్యా, నాక్కవలసింది మీ బోడి సంఘసంస్కరణలు కాదు. కిర్సనాయిలు ఇప్పుడు ఇస్తారా, ఇవ్వరా, అంతే, ఒక్కటే జవాబు కావాలి." ం

“ఇవ్వకపోతే ఎం జేస్తావ్‌? అన్నాడు మా కాలనీ యువజన నాయకుడు సంగీతరావు.

"ఎంజేస్తానా?" 'ధూ' అని ఊసి పెళ్ళి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం."

"వెళ్ళడొనికి మోకు కాళ్ళులేవుగా."

ఆ "కాళ్ళు లేక పోవడమేమిటి? ఇవి కాళ్ళుకాదూ.?"

"ఇప్పుడున్నాయండీ! 'ధూ' అని ఊసి బయళ్లేరాక ఇంక అవెందుకుంచుతాం మేము? అన్నీ విరగ్గొట్టి ఇక్కడే ఓమూల కుప్పపడేస్తాం."

"ఏంట్రా? నా కాళ్ళు విరగ్గాడతావా?" అంటూ అతని మోదకు దూకాడు బట్టతల అంతే, అతరువాత ఏం జరిగిందో తెలీదు. కుర్చీలు, బల్లలూ, స్టీలుచెంబులూ, గ్లాసులూ, అన్నీ తుఫాను గాలి కెగిరినట్టు గాలిలోకి ఎగిరిపడేవరకే నాకు గుర్తుంది. అందులో ఒకటి ఏదో ఎగిరివచ్చి బలంగా నా నెత్తికి కొట్టుకోవడంకూడా కొంచెం గుర్తుంది. తిరిగి కళ్ళు విప్పేపటికి మా ఇంట్లో నా గదిలో మంచం కింద పడివున్నాను.

మా ఇంటి సభ్యులందరూ నా చుట్టూ మూగి విచిత్రంగా చూస్తున్నారు. పక్కనే

“ొ్పడివున్న ఇండియన్‌ ఎక్స్‌ెస్‌ పేపర్లో మొదటి పేజీలో "ఇంకో పెళ్ళి కూతురిని తగలేసిన కేసు" అన్న హెడ్డింగ్‌ ఇంగ్లీషులో కనబడుతోంది. లోపల్పుంచి రేడియోలో- 'కాదుసుమా కలకాదుసుమా' అన్న పాట వినబడుతోంది.

ళో శ ళ్‌

ఈ కథ మోకు హాస్యం అందిస్తే అందించవచ్చు!

కానీ ఈ కథ మనదేశంలోని పరిస్థితి చూసి నవ్వాలో ఏడవాలో తెలీక రాసినకథ!

సినిమాల్లో చూద్దామా తాగి తనను చితకతంతున్నా భర్త కాళ్ళు పట్టుకుని వదలని స్తీ

. పాత్రలు- భర్తను మరో స్త్రీకి మనం చూస్తుండగానే త్యాగంచేసి పారేసే పాత్రలు-

బయట చూద్దామా, కట్నలాంఛనాలకోసం- అత్తమామలు, భర్తా పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం-లేదా హత్యగావింపబడడం-

ఇవన్నీ అలా వుంచి ఈ పరిస్థితిని రాన్రాను అందరూ చాలా మామూలు విషయాల్లా-

కాజువల్‌గా ట్రీట్‌ చేయడం-ఇది మరీ ప్రమాదకరమయిన పరిస్థితి.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే- ఈ కథ త్వరలోనే నిజమైపోవడం ఖాయం! అప్పుడింక కన్నీళ్ళూమిగలవ్‌! నవ్వూమిగలదు! శ వరుడు కావలెను లేక... 67

అ త్‌ో ఇత్‌ 0] [శక్రుయిన్‌ (ఉమ్‌ మసులా |! చాలా లో [1 కరి చ. | నాము! టం వో ఇ! (ల సామి ల స్కో నాకు హైదరాబాదు నుంచి బెజవాడకు ట్రాన్స్‌ఫర్‌ అయింది. బెజవాడ ఆఫీసులో నా పాత మిత్రుడు భగవాన్‌ కనిపించాడు. “ఇల్లెక్కడ తీసుకున్నావ్‌?'' అడిగాడు భగవాన్‌. "ఎక్కడా తక్కువ అద్దెలో దొరకటంలేదు!" అన్నాను దిగులుగా. “అన్నట్లు నీకు బందర్లో ఓ ఇల్లుంది ఇదూ?" "అవును! ఉంటే ఏం లాభం?" "అక్కడే వుండి రోజూ బెజవాడ ట్రెయిన్‌లోవచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం బెస్సు! చాలామంది అదేపని చేస్తుంటారు.” 68 హ్యామరాలజీ

నాకూ ఆ అయిడియా నచ్చింది. వెంటనే బందర్లో సెటిలయిపోయి రైల్వేస్టేషన్‌ కెళ్ళి సీజన్‌ టికెట్‌ తీసుకున్నాను.

మొదటిరోజు పొద్దున్నే స్టేషన్‌ చేరుకుని రైలెక్కి కూర్చున్నాను. తొమ్మిదిన్నరకల్లా బెజవాడ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికల్లా బందరుచేరుకోవచ్చు. రైల్వే ఇంత అభివృద్ధి చెందటం నాకెంతో ఆనందం కలిగించింది. నా చిన్నప్పుడు బందరు బెజవాడ రైలు విజయవాడ చేరటానికి ఆరుగంటలుపట్టేది. ఇప్పుడు కేవలం మూడేగంటలట! భగవాన్‌ చెప్పాడు. రైలు కదిలేవేళయేసరికి కారేజ్‌లో సగంవరకు జనం నిండిపోయారు. నిజంగా

  • బస్‌ ప్రయాణం కంటే రైలు ప్రయాణం ఎంతో సరదాగావుంటుంది. అనేక ఊళ్ళవాళ్ళు కలుసుకోవడం మాటాడు కోవడం-

రైలు బందరు స్టేషన్‌ వదలగానే ప్రయాణీకులు అర్హంటుగా రాజకీయాలు మాట్టాడేసు కోసాగారు.

"ఎన్టీఆర్‌ మనకు చేసిందేమిటీ? అని నేను కొళ్చెన్‌ చేస్తున్నాను! తెలుగు ప్రజల అత్మగౌరవం తగలబడిపోతోందహోఅని కన్నీరుకార్పాడు- మరి మద్రాస్‌ నుంచి ఓ తమిళుడిని తీనుకొచ్చి తనకు కార్యదర్శిగా నియమించు కున్నవ్వ్చుడు తెలుగువాళ్ళ ఆ ఆత్మగౌరవంఏమయింది? అన్నేనుకొళ్చెన్‌ చేస్తున్నా! అంతేకాదు, కిలోరెండు రూపాయల బియ్యంఎవి? ఎవరిస్తున్నారు అని కూడా నేను కొళ్చెన్‌ చేస్తున్నాను."

ఆ గురుడి ఉపన్యాసం ఎంతవరకూ కొనసాగేదోగాని ఈలోగా ఆ కారేజిలోకి ఓ వర్తక శిఖామణి వచ్చివేలంపాట ప్రారంభిచేసరికి అతను చప్పబడిపోయాడు.

"ఈ అద్భుతమైన సూపర్‌ డీలక్స్‌ స్టీలుగిన్నై ఈ దంతపు దువ్వెనా కలసికేవలం అర్ధరూపాయి మాత్రమేనండీ. ఒకటోసారి రెండోసారి- డెబ్బయిఆరురూపాయల స్టీలు గిన్నె, పధ్నాలుగు రూపాయల దువ్వెన కలసి కేవలం ఆర్ధరూపాయి మాత్రమేనండీ."

అంతకుముందే కారేజిలోకి వచ్చి కూర్చున్న అతని అసిస్టెంటే కాబోలు, వాటిని బాగా పరీక్షించి 'అయిదు రూపాయలు' అన్నాడు.

సరీ ఈతతంగం తెలిసిందే కాబట్టి నవల తెరిచి చదువుకోనసాగాను.

కాసేపటి తర్వాత చూస్తే రైలు ఎదో స్టేషన్‌లో ఆగిపోయివుంది.క్రాసింగట. అరగంట

తర్వాత బయట్టేరింది మళ్ళీ. రెండో స్టేషన్‌లో మళ్ళీ ఆగిపోయి కదల్లేదు. ] “ఎందుకిక్కడ ఆగిపోయింది మన బండి పక్కనున్నతన్ని అడిగాను.

"స్టేషన్‌లో పొలవాళ్ళు పాలు తక్కువ పోశారట. గొడవ జరుగుతోంది" అన్నాడు తాపీగా.

ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా। 69

అదేమిటో చూద్దామని రైలుదిగి గొడవ జరుగుతున్నచోట కెళ్ళాను.

టికెట్‌ కలెక్టర్‌ కాబోలు పాలకాన్‌ల దగ్గర నిలబడ్డాడు.

"అదికాదండీ. మొన్న తక్కువపోశారు. నరీనన్సైప్పి, పట్టించుకోలేదు. చూడండి! ఇవాళకూడా ఈ గిన్నెలో సగానికి పోశారు. ఇది కావాలని చేయటం కాదంటారా?"

కోపంగా అన్నాడతను మరో పాలు అమ్మే పెద్దమనిషితో.

పెద్దమనిషి పక్క తిరిగి తక్కువపాలు పోసిన ఇద్దరినీ తగులుకున్నాడు.

"ఎందుకొచ్చిన గొడవరావుడూ! లెక్క ప్రకారం స్టేషనోళ్ళకి పోసీయకూడదూ?" క

రావుడు తిరగబడ్డాడు.

"గొడ్డు రెండు ఎండిపోయినయ్‌! అందుకని తగ్గించాను. అయినా గాని ఊరికే బేవర్సుగా వచ్చేపాలు- కొంచెం తగ్గితేనేం?' పౌరుషంగా అన్నాడురావుడు.

"ఏటి? బేవార్సుగా పోస్తున్నావా?" కోపంగా అడిగాడు టి. సి.

"అవును! మేమందరం బేవర్సుగా పోయకపోతే మీ రైలోళ్ళు ఏ రోజయినా డబ్బెట్టికొన్నారా?"

''ఎవడికోనం పోస్తారయ్యా? మీరు వదిరూపాయులు పాలు ఊరికేపోసి వందరూపాయలు లాభం మాదగ్గర్నుంచీ దొబ్బుతున్నారు.'

"మోలాటోళ్ళుంటే లాభాలు గాడిదగుడ్డొస్తాయ్‌."

గుంపుని నెట్టుకుంటూ స్టేషన్‌ మాస్టర్‌లోపలకు జొరబడ్డాడు.

“ఏమిటయ్యా గొడవ! బండికి ఆలస్యం అయిపోతుంది" అన్నాడాయన మందలింపుగా

"ఆ టికెట్‌ కలెక్టర్ని పాలడబ్బాలు వదలమనండి-వెళ్ళిపోతాం! మాడేం ఆలస్యంవుంది? ' అన్నాడు రావుడు.

“వదిలేయవయ్యా ఎందుకొచ్చిన గొడవ?" విసుకున్నాడు స్టేషన్‌ మాస్టర్‌.

"మో కోటా పాలు మోకువచ్చేశాయి గనుక మోరు వదలమంటారండీ! అనకేంజేస్తారు?" కోపంగా అన్నాడు టి. సి.

ఆ మాటతో స్టేషన్‌ మాస్టార్‌ కింకేమనాలో తెలీలేదు.

"సరీ-ఈరోజుకి పోనీ! రేపు సంగతి చుద్దాం" అన్నాడు రాజీధోరణిలో

“ఎలా పోనిస్తా నండి! మా చంటిదానికి పాలు పట్టించాలా? మా పెద్దాడికి పాలివ్వాలా, పెరుగు తోడెయ్యాలా-మా ఆవిడా, నేనూ తాగాలా? ఎట్టాసరిపోతాయి ఇంతమందికీ పాలు? మోకు తెలుసో తెలీదో-రెండ్రోజుల్నుంచీ జేబులో డబ్బెట్టి పావులిటరుపాలు కొంటున్నాను.

70 హ్యూమరాలజీ

నా సర్వీసులో ఎవ్పుడూకొన్లేదు. ఈ స్టేషన్లో మొట్టమొదటిసారి కొన్నానండీ! కాష్‌ పెట్టి పాలుకొన్నాను. థూ వెధవ స్టేషన్‌!” కన్నీళ్ళ పర్యంతం అయిందా టి.సి. కి, డబ్బు సంగతి తల్చుకోగానే.

ఈలోగా గార్టూ, డ్రయివరూ కూడా వచ్చి చేరారక్కడ.

“ఎమయింది?” అడిగాడు గార్డు.

= స్టేషన్‌ మాస్టరు కధంతా చెప్పాడుగార్జుకి. "అయితే వీళ్ళ గొడవమూలాన బండి ఎంతసేపు ఆపుతాం? స్టార్స్‌చేసేస్తాను" అన్నాడు గార్డు.

“ఎట్టా స్టార్ట్‌చేస్తావయ్యా!" నీ జగ్గులోపాలు పోయించుకోలేదా?" అడిగాడు పాలతను

“ కోపంగా.

"పోయించుకుంటే గంటసేపు ఆపమంటే ఎలా? ఎదో ఓ అరగంటంటే ఫర్లీదుగానీ! అవతల మా ఆఫీసర్లుకూడా మమ్మల్ని అడుగుతారు కదా?” అన్నాడు డడైవరు గార్జుని సపోర్టు చేస్తూ,

| దాంతో పాలతను మరీరెచ్చిపోయాడు. "ఏటీ? మీ ఆఫీసరా? ఏం? మొన్న మో ఆఫీసరుగారమ్మాయి పెళ్ళికి మా పాల వాళ్ళందరం కలసి ఫ్రీగా పాలుపోయలేదూ? బెజవాడలో ఏ ఆఫీసరింట్లో ఏం జరిగినా . మాకేగానష్టం? మరింకా ఏ మొఖం పెట్టుకుని బెదిరిస్తావయ్యా మమ్మల్ని?"

ఆ జవాబుతో గార్డు డైవరూ వెళ్ళిపోయారు-

నేను టైమ్‌ చూసుకున్నాను. అరగంటబైపోయింది, అప్పటికి! ఇక లాభం లేదని నేనే కలుగబేసుకున్నాను.

“ఇదిగో చూడండి టి.సిగారూ! అయిందేదో అయింది! ఇక రైలుని వదిలేస్తే మేము బెజవాడలో ఆఫీసుకెళ్ళాలి!” అన్నాను బ్రతిమాలుతో

'ముందు మో టికెట్‌ చూపించండి!" అన్నాడు టి.సి కోపంగా.

నేను సీజన్‌ టికెట్‌ తీసి చూపించాను.

ఫోటోవంక- నావంక రెండు నిమిషాలు పరీక్షగా చూసి టికెట్‌ నాకిచ్చేశాడు మళ్ళీ.

మొత్తంరైల్లోని జనంఅంతా వచ్చిచేరారప్పటికి!

"ఇదిగో చూడు బాబూ! నువ్వన్నా ఆయనక్కొంచెం పాలుపోయవయ్యా! మాకు టైమవుతోంది! అన్నాడు మరో ప్రయాణీకుడు పాలతనిని బ్రతిమాల్తూ,

" ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా | గ్‌

"ఎందుకు పోయాలండీ? అతని గేదెలు రెండు ఎండిపోయ్యాయట? ఎలా

పోస్తాడు? "ఇంకో పాలతను రావుడిని సమర్ధిస్తూ మాట్లాడాడు. ప్రయాణికులు అందరూ కలిసి పాలతనినీ, టి.సి.నీ బ్రతిమాలి రైలు స్టార్ట్‌ చేయడానికి వప్పించారు.

అందరం 'హమ్మయ్య' అనుకుని రైలెక్కాం. బిచ్చగాడు, ఓచిన్నపిల్లా పాట అందుకున్నారు. ప్రయాణీకులు "శ్రోతలు కోరిన రికార్డులు" పాడిస్తున్నారు, వరుసగా! రైలు మళ్ళీ బయలుదేరింది. |

పాతకోటు, భుజానపెట్టెైతగిలించుకున్న వ్యక్తి మా కారేజ్‌లో కొచ్చాడు.

“పట్నంలో పళ్ళడాక్టర్లకి ఇరవైలు, ముష్ఫృయ్‌లు ఖర్చు పెడతారుసార్‌! అంత డబ్బు | వృధాచేయకండి.కేవలం రెండురూపాయలు అరవైపైసలకే మో పళ్ళుపీకించుకోండి! నాలుగు పళ్ళుపకించుకున్న వారికి కన్ఫెషన్‌! గొప్ప దీపావళి బంపర్‌ అఫర్‌! నాలుగు పళ్ళూ కేవలం ఏడు రూపాయలే! ఆరు పళ్ళు పీకించుకున్నవారికి దువ్వెన ఉచితం! గొప్ప దీపావళీ బంపర్‌ ఆవరల్‌ సార్‌. ఎవరికండీ వన్నుపీకాలి? మాష్టారూ! ఈ అద్భుతవైన అవకాశం జారవిడుచుకోకండి! నేను మళ్ళీనెలరోజులవరకూ ఈ లైన్‌ మోదకు రానండీ! వైజాగ్‌లైన్‌ కెళ్ళిపోతున్నాను" కారేజంతా నాలుగురౌండ్లుకొట్టాక మా పక్క కంపార్ట్చుమెంటులోనే ఓ కేస్‌బుక్‌చేశాడతను.

"ఏ పన్నండీ బాబూ?"

"ఇదిగో ఇది....

"ఆహహా! పూర్తిగా చెడిపోయిందండీ!పాపం మోరు ఎంత బాధపడుతున్నారో."

"అవును తెగ బాధగా ఉందనుకో!"

"మరిదాని పక్కదాని మాటేమిటి? అదీ పాడయిపోయిందికదా?"

"అబ్బే! దాని బాదేంలేదు."

"లేకపోయినా ఇప్పుడే లాగేయటం మంచిదండీ! నేను మళ్ళీ నెలరోజుల దాకారానిటు. రేటుకూడా కొంచెం తగ్గిస్తాను."

"వద్దయ్యా దాన్నేంచేయకు"

"సరే! ఆ, మాష్టారూ! మో నలుగురూ ఇతనిని గట్టిగా కదలకుండా పట్టుకోండి సార్‌ ఈ రోగిని కదలకుండా పట్టుకుని, మాధవసేవ చేయండి బాబూ! ఎంతసేపో అక్కరలేదు. అయిదు నిమిషాలుచాలు ఆపరేషన్‌ చేసేస్తాను.”

72 హ్యామరాలజీ

అచుట్టు పక్కలున్నాళ్ళందరూ కలిసి ఆ ప్యక్తిని గట్టిగా పట్టుకున్నారు. మరోక్షణంలో ఆపరేషన్‌ ప్రారంభమయింది.

''అబ్బా-బాబోయ్‌-నాయనోయ్‌-నన్నువదలండడో-వ్వవ్వవ్వవ్వవ్వవ్వ- (ప్రాణం పోతున్నట్టుకేకలు వేస్తున్నాడా రోగి.

"ఇంకో నలుగురు పుణ్యాత్ములు వచ్చి ఇంకా గట్టిగా పట్టుకోండి సార్‌! మానవసేవే మాధవసేవ సార్‌ ! కేవలం రెండూ అరవైకే పన్ను ఎందుకు పీకుతున్నాను? మానవసేవే

మాధవసేవ సార్‌!" . నా పక్కనున్న మరో నలుగురయిదుగురు కూడా వెళ్ళి ఆ వ్యక్తిమోదపడి శరీరం,నోరు, తలా కదలకుండానొక్కిపట్టారు.! .॥ మళ్ళీ ఆపరేషన్‌ రెండో ఘట్టం ప్రారంభమయింది.

మళ్ళీ కేకలు.

"వావోయ్‌ వావోయ్‌- వ్వా-వ్వా-వ్వా- అవ్వా- అవ్వా.'

"అబ్బ! రక్తం చిమ్ముతోంది" అందో గొంతు. తి

"ఏవయ్యా-ఎమిటది, రక్తం పిచికారీ కొట్టినట్టు కొడుతోంది?"

థి "పన్నులో చేవ ఎక్కువుందన్నమాటండీ! అంటే వీళ్ళు వంశమంతా బాగా చేవవున్న

మనుషులన్న మాటండీ!॥! మా గట్టి దంతవరుస! సర్వీసులో ఇంతజబర్హస్తు దంతం పీకటంఇది మూడోసారిమాత్రమే." రైలు ఆగిందో స్టేషన్‌లో.

"నా పన్ను పకద్దు బాబోయి-నన్నిలా వదిలేయ్‌ దేవుడోయ." అంటో అరుపులు.

''వుద్యాలో ఎలా వదుల్తానయ్యా- నన్ను వన్ను వీకటం చేతకాని వాడనుకుంటారందరు-

"నేనీ స్టేషన్‌లో దిగాలయ్యా బాబూ! నన్నోదిలేయండి" తనను పట్టుకుని మీదెక్కి కూర్చున్నవారిని బ్రతిమాలసాగాడతను.

"ఏం ఫర్వాలేదయ్యా! గొడవచేయకు. ఇంకొక్కజర్కు ఇచ్చానంటే ఠకీమని వూడిపోతుంది."

"రలు బయట్దేరుతుందయ్యా బాబూ! దిగిపోతాను."

పళ్ళుపీకే వ్యక్తి ఓక్షణం ఆలోచించాడు.

"సరీ-నేనిప్పుడే వెళ్ళి ఓ పావుగంటబండి ఆపమని గార్జుగారితో చెప్పివస్తానుండు..

నేనూ నా పక్కనున్న వాళ్ళు అదిరిపడ్డాం.

"ఏమిటి? గార్జుగారితో బండి ఆపమని చెప్తావా?" ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా |! ౯3

“అవునండీ! ఏం ఫరవాలేదు! నేను చెప్తే ఆపేస్తారులెండి! ఒకసారి ఆయన కుక్కకి నేనే పన్ను పీకేశాను! ఒక్క పైసాకూడా తీసుకోలేదు" "కుక్కకా? ఒకాయన ఆశ్చర్యంగా ఆడిగాడు. “అవును సాధారణంగా కుక్క వళ్ళు పీకనులే! అయితే ఏదయినా పెద్ద _రికమండేషనుంటే పీకేస్తాను! జంతుసేవే మాధవసేవ..." అతనుగార్జు దగ్గరకెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు. రిలు ఆగిపోయింది. | మళ్ళీ ఆపరేషన్‌ మూడో ఘట్టం (అంతిమ ఘట్టం) (ప్రారంభమయింది. ''ఈసారి ఇంకాకొంచెం గట్టిగా పట్టుకోండి! సార్‌! మనం కోడీ మెడెలా పట్టుకుంటాం? అలా నొక్కి పట్టుకోండి! ఒకే ఒక జర్క్‌తో ఊడిపడాల్సిందే." ఆ అందరూ అతనిని బలవంతంగా పట్టుకుని నొక్కిపట్టారు. ఒక్కసారిగా అతను పిచ్చికేక వేశాడు. 4 అతనిని పట్టుకున్నవాళ్ళిద్దరు ఎగిరిపడ్డారు దూరంగా. "హమ్మయ్య! వచ్చేసింది!” అన్నాడు పళ్ళుపీకే అతను, తన చేతిలో కటింగ్‌ ప్లేరు మధ్యనున్న పంటిని అందరికీ ఉచితప్రదర్శన ఇస్తూ! కిందపడున్న వ్యక్తి మూలుగుతూ లేచి తనసంచీ తీసుకుని కిందకుదిగాడు. పళ్ళుపీకేవ్యక్తి కూడా ప్లాట్‌ఫారం మిదదిగి గార్జుకి చేయి ఊపగానే బండి మళ్ళీస్టార్ణయింది. అయితే మళ్ళీ పక్క స్టేషన్‌లో ఆగిపోయింది. "మళ్ళీఏమిటి?” అన్నాడు ఒకతను బయటకు చూస్తూ "మళ్ళీ ఇంకోరైలు క్రాసింగ్‌!” అరగంట తర్వాత మళ్ళీబయట్టెరిందిగానీ, కొద్దిదూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది. మరుక్షణంలో అన్ని పెట్టెల్లోకి బిలబిల మంటూ అర్‌.పి.ఎఫ్‌.వాళ్ళు, టి.టి.ఇ.లు ఎక్కేశారు. “టికెట్‌, టికెట్‌-" అంటూ నాలుగువేపులున్న తలుపుల దగ్గర అడ్డం నిలబడి అందరి టికెట్లూ చెకింగ్‌ చేయసాగారు. “ఇక్కడ చెక్కింగేమిటి?" అడిగాను పక్కనున్నతనిని. "స్క్వాడోళ్ళు వచ్చారండీ! స్పెషల్‌ చెక్‌ అన్నమాట!” మాకారేజ్‌లోనే సగంమందికి పైగా టికట్‌లు లేకపోవడం చూసేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. 74 హ్యూమరాలజీ

అందరినీ పక్కస్టేషన్‌లో దింపారు.

పావుగంట గడిచినా రైలు మళ్ళీ కదలకపోయేసరికి నేనూ మిగతావాళ్ళూ కిందకు దిగాము.

స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీసు బయట టిట్‌ లేనివాళ్ళ గుంవునిలబడి ఉన్నారు. వాళ్ళకిదురుగా టి. టి. ఇ.లు, ఆర్‌.పియఫ్‌. వాళ్ళు నిలబడ్డారు.

"అవునండీ! మోది స్పెషల్‌ చెకింగ్‌ స్క్వాడే! వప్పుకుంటాం. కానీ ముందు పాసింజర్లకు

  • చెప్పకుండా ఇలా హఠాత్తుగా చెకింగ్‌ కొస్తే ఎలా? ఇప్పుడు చూడండి! ఇంతమందిమి టికెట్లు కొనలేదు.” అన్నాడు గుంపులో నుంచి ఒక ప్రయాణీకుడు.

"మమ్మల్నేం చేయమంటారండీ? మా ఆఫీసరుగారు 'ఎటాక్‌' చేయమన్నారు." అన్నాడు

ఒక టి.టి.ఇ.

"ఆయన్నెప్తారులేవయ్యా? చెప్తే చేసేయటమేనా? మాకు రెండు స్టేషన్లముందే ఇలా మధ్యలో స్పెషల్‌ చెకింగ్‌ జరుగుతుందని తెలియజేస్తే మేము టికెట్‌ కొనుక్కుంటాం -' అని ఎన్నిసార్లు చెప్పాలి మాకు?" ఇంకో మిోసాలాయన దబాయిచాడు.

"మా ఇన్‌స్పెక్టరతో మాట్లాడండయ్యా! మాకేంతెలుసు. అక్కడికీ మేంచెప్తూనే వున్నాం!

ముందు చెప్పకుండా ఇలా సడెన్‌ చెకింగ్‌ చేస్తే పాసింజెర్స్‌వప్పుకోరు సార్‌ అని! ఆయన వింటేనా? డి.సి.యస్‌. ప్రోగ్రాం అఖరిక్షణంలో ఇచ్చారు గనుక మనమేం చేయలేము. అన్నారు-" అన్నాడు ఒక టి.టి.ఇ.

"ఏడి మా ఇన్‌స్పెక్టర్‌ని పిలు. మేము మాట్లాడతాం.” అన్నాడు మోసాలరావు.

స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీసులో ఇనస్పెక్టర్‌ నిలబడ్డాడు.

"ఇదిగో చూడండి బాబూ. ఈ ఒక్కసారికి పారపాటు జరిగింది. మోకు మా స్పెషల్‌చెక్‌ గురించి ముందే తెలియజేసేంత బైముకూడా లేకపోయింది." అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ వినయంగా,

"అదేంకుదరదండీ, మో చెకింగ్‌కాన్సిల్‌ చేసేసుకోండి. కావాలంటే రేపుచెక్‌ చేనుకోండి వప్పుకుంటాం" అన్నాడు ఇంకోలావుపాటి వ్యక్తి.

"సర్‌ పైజ్‌-చెకింగ్‌ ఎలా కాన్సిలవుంది? కుదరదుకదా" అన్నాడు ఇన్‌ స్పెక్టర్‌.

"ఏం ఎందుక్కుదరదు? పెద్ద పెద్ద విజిలెన్స్‌ చెక్‌లే కాన్సిల్‌ చేయించాం. మి చెకింగో పెద్ద లెల్టేమిటి?" ఇంకెవరో అరచారు.

ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా! 75

"అవును! కాన్సిలుచేసి మిరు వెళ్ళిపోవలసిందే.” అన్నాడు ఇంకో కుర్రాడు. ఇన్‌ స్పెక్టరూ, టి.టి. ఇ.లూ మొఖమొఖాలు చూసుకున్నారు. "మేము ముందే చెప్పాంకద్సార్‌. తెల్లారిలేస్తే మొఖమొఖాలు చూసుకోవాలి. చెప్పకుండా చెకింగ్‌ చేయడం బాగుండదని'' గొణిగాడు ఒక టి.టి. ఇ. "సరే! పదండి! రేపు చేద్దాం చెకింగ్‌ ఇక్కడ" అన్నాడు ఇనస్పెక్టర్‌, ప్రయాణికులంతా ఆనందంగా మళ్ళీ రైలెక్కేశారు. ఇక టి.టి.ఇ. అందరి దగ్గరకొచ్చి గట్టిగా చెప్పసాగాడు. న "ఇదిగో, రేపు ఇదే బండికి స్పెషల్‌ చెక్‌చేస్తున్నారు. ఇక్కడే ఈ స్టేషన్‌దగ్గరే. కనుక మళ్ళీ చెప్పలేదనకండి." రైలు కదిలింది. కాని మళ్ళీ ప్తాట్‌ఫారందాటగానే మళ్ళీ ఆగిపోయింది. బటానీలవాడు బండి ఎక్కడం మిస్‌ అయాడట. “అబ్బా, ఇప్పటికే రెండు గంటలులేటయిపోయింది బండి." అన్నాన్నేను. దిగులుగా. నా పక్కనున్నవాళ్ళు నావంక ఆశ్చర్యంగా చూశారు. "లేబేమిటి?" ''అదే-ఆలస్యం-"అన్నాను. “ఈ బందరు-బెజవాడ లైనులో అలాంటివేమో ఎవ్వరూ అడగరు." అన్నాడు ఒకతను. “బండి ఎప్పుడెళ్ళినా రైట్‌ టైమ్‌ అనే రాసేసుకుంటారు!" ఈసారి రైలు బయలుదేరి స్టేషన్‌రాకుండానే ఆగిపోయింది. “మళ్ళీ ఎమయింది?” అడిగాను చిరాగ్గా. అందరూ కిటికీలోనుంచి చూశారు. కొద్దినిమిషాల తర్వాత డైవర్‌ నడుస్తూ గార్జుపెట్టివేపు వెళ్ళసాగాడు. 'ఎమయిందిగురూ?" ఎవరో పాసింజర్‌ అడిగాడుడైవర్షి. "ఎవరో గొలుసులాగారు-" అంటూ వెళ్ళిమళ్ళీ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. "ఎవరులాగారు?" అడిగాడు పాసిజంరు మళ్ళీ. "గార్డు వాక్యూమ్‌ వేశాడు" అంటూనే వెళ్ళిపోసాగాడతను. "ఎందుకు?" - (డైవరు జవాబు చెప్పలేదు. మరో రెండు నిమిషాల్లో బండి స్టార్టయింది. గానీ మళ్ళీవెంటనే ఆగిపోయింది 76 హ్యామరాలజీ

మళ్ళీ ఎమయింది?" అడిగాడు ఇంకోపాసింజెరు వళ్ళు మండిపోతుంటే. అందరూ కిందకుదిగి డైవరుతోపాటు చివరివరకూ నడిచివెళ్ళారు. పదినిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. '"ఎంజరిగింది?' అడిగాను "గార్జుమందుకొట్టేశాడు. అందుకని మాట్టాడితే వాక్యూమ్‌ వేస్తున్నాడు" అన్నాడు ఒకతను. జ "అదేమిటి! ఎందుకలా బండిఆపటం?” "ఆగార్జంతే సార్‌! మందుకొడితే చాలు- వాక్యూమ్‌ వేసేస్తుంటాడు." "అసలు డ్యూటీలో మందుకొట్టటమేమిటి?" ఆశ్చర్యంగా అడిగాను.

  • "ఛ ఛ! ఆయన మంచాడుసార్‌! ఎప్పుడూ కొట్టడు. ఇవాళ వాళ్ళ పండగట! అందుకని కొట్టేస్తున్నాడు." రైలు మళ్ళీ బయలుదేరి పక్కస్టేషన్‌లో ఆగిపోయింది. ఓ ముసలాడు కోతితోసహా మా కారేజ్‌ ఎదురుగా ప్తాట్‌ఫారం మోద దుకాణం పెట్టాడు. "అయ్యగార్లకు దబ్ద్బంపెట్ట'" అన్నాడు. కోతి స్టేషన్‌ మాస్టరుకీ, బఠానీలవాడికీ నమస్కారం పెట్టింది. అదిచూసి ప్రయాణికులు చాలామంది రైలుదిగి దాని చుట్టూ మూగారు. "“డైవర్‌సాబ్‌కి సలాంపెట్ప!" కోతి డైవరుకి సలాం చేసింది. "ఆఫీసర్లు లంచం ఎలా తీసుకుంటారు?" కోతి వీపువెనుకచేయి చాచింది. అందరూ ఘెల్టుమన్నారు. "జయమాలిని డాన్స్‌ చేస్తుంటే ఎలా చూస్తావ్‌? కోతి నాలుక బయటపెట్టి గుడ్డు మిటకరించింది. ఎగురుతూ యాక్షన్‌చేసింది. "హఠాత్తుగా మో ఆవిడవస్తే ఎలా చూస్తావ్‌?" కోతి కళ్ళు మూసుకుని నీరసంగా కూలబడింది. గార్జుతూలుతూ వచ్చాడక్కడికి. "గార్జుసాబ్‌కి సలాం పెటు!" కోతిగార్జ్డుకి సలాం చేసింది. ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా! ౯౯

"భార్యకు తెలీకుండా సెకండ్‌ షో కెళ్ళి ఇల్లు ఎలా చేరుకుంటావ్‌? - కోతి దొంగలా నక్కి నక్కి నడిచింది. నేను స్టేషన్‌ మాస్టరు దగ్గరకెళ్ళాను. "ఆ కోతి ఆట అయ్యేవరకూ రైలు కదలదాసారొ?" . "ఏమోమరి! వాడు కోతిని చాలా రోజుల్తర్వాత తీసుకొచ్చాడు సెక్షన్‌లోకి" అన్నాడాయన కోతిని ఆనందంగా చూస్తూ. "నేనడిగేది రైలు సంగతి!" క "నేననేది కోతి సంగతి! వండర్‌ఫుల్‌ ఫీట్స్‌చేస్తోంది చూశారా?" "ఈ రైలు ఇంక బయలుదేరదా?" కోపంగా అరిచాను. | "ఎందుకు బయలుదేరదు?" "బయలుదేరుతుందని తెలుసండీ! ఏతారీఖు?" ఆయన కాలెండర్‌ చూశాడు. "ఇవాళ్ళే-ఇప్పుడే" "మరి కదలదేం?" "గార్జూ, డైవరూ టీ తాగి ఇప్పుడేగా వెళ్తోంది?" నేను గార్డు, డైవర్లకోసం చూశాను. అప్పుడే బయలుదేరివెళ్తున్నారు వాళ్ళు. మరో అయిదు నిమిషాల తర్వాత రైలు కదలింది. అయితే ప్లాట్ఫారం దాటకుండోనే మళ్ళీ ఆగిపోయింది. నేను, నా పక్కనున్నవారూ దిగి కారణమేమిటా అని చూశాము. టం డ్రైవరుదిగి వస్తూ కనిపించాడు. “ఎమయింది!” అడిగాను "ఇంకేముంది! గార్జమళ్ళీ వాక్యూమ్‌ వేశాడు." అందరం కలసిగార్హు దగ్గరకెళ్ళాం. "అరె[!వద్దంటే వాక్యూమ్‌ వేస్తావెందుకయ్యా?" అడిగాడు డైవర్‌ కోపంగా. ”షారీ! అయామ్‌ షారీ"' "ఇదిగో గార్జుగారూ! ఇప్పటికే బోలెడాలీశెం అయిపోయిందయ్యా! ఇంక బండి ఆపకు. పాలు పాడయిపోతాయి' అన్నారు పాలవాళ్ళు. 78 హ్యామరాలజీ

"నేనాపను. ఆపమన్నాఆఅపబఖు. కావాలంటే షూడండి- ఆపణు" అందరం మళ్ళీ రైలెక్కాం. రైలుకదిలింది. “ఇంకెన్ని స్టేషన్లున్నాయ్‌" దిగులుగా అడిగాను. "ఇంకెన్నండీ, రెండే." 'హమ్మయ్యా' అనుకున్నాను. కనీసం ఆఫీసుకి మధ్యాహ్నం నుంచయినా వెళ్ళవచ్చు.

  • కారేజ్‌లో మరో గిరజాల జుట్టు ఎక్కింది. "ఎవరికండీ మాష్టారూ-చెవిలో గుబులులాగేస్తాం? కేవలం రెండుచేవుల్లో గుబులుకి అర్ధరూపాయ్‌ మాత్రమే చార్జీఅండీ! గుబుల్‌ గుబుల్‌గా గుండెలు దడగా- ఎవరకండీ మాష్టారూ గుబులూ -నలుగురుకలసి గుబులుతీయించుకుంటే కీచైన్‌ ఉచితంసార్‌." అవ్పటికవ్పుడే రెండు కేనులుదొరికాయి అతనికి. వాళ్ళిద్దరిచుట్టూ జనం మూగిపోయారు. తీరా రైలు రెండు ఫర్హాంగులు వెళ్ళిందోలేదో మళ్ళీ ఆగిపోయింది. "సందేహంలేదు-గార్జు పనే మళ్ళీ" అన్నారు మా బోగీలో ఉన్నవాళ్ళు. అందరం కలసి గొర్జు దగ్గరకిళాం. "ఏమిటయ్యా గార్జుగారూ ఇది? అవతల పదకొండయిపోతోంది. మా పాలు పాడయి పోతాయి అని చెప్పంటే వినకుండాబండి అపేస్తావేమిటి?" గార్డు నవ్వాడు. "భేపోతే ఆవెంకట్రావ్‌ నాకేం ఫవర్‌ళేదంటాడా?? రాస్కేల్‌! నా ఫవరేంటో ఇవాళ షూపిస్తా! అడుగడుక్కీబండి అపేష్తా" "బాబోయ్‌! వద్దయ్యా స్వామీ, నీకు దణ్ణంపెడతాం! బండి ఆపకు." , "అయితే మరి వెంకట్రావ్‌ ఆకూత ఎందుక్కూషాడు-" "ఆ వెంకట్రావ్‌ పని మేము చెప్తాం కదా! తమరు బండి ఆపకండి" “షరే!” రైలు మళ్ళీకదిలి మరికాస్త దూరంనాడీచి ఆగిపోయింది. అందరం మళ్ళాగార్జు దగ్గరకిళ్ళాం. "మళ్ళీ ఎమొచ్చిందయ్యా మగడా!" ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా! 79 క్షీ

"ఆవెంకట్రావుగాడు లేడూ? ఆడు నన్ను 'బూష్‌' అని తిట్టాడు" రెండుచేతుల్తో తలపట్టుకుని దిగాలుగా అన్నాడు గార్డు. "ఆడిపని మేము చూస్తాంలేవయ్యా! బండి ఆపకు." నిజంగా ఆడి భరతం పడతారా?" “పడతాం సార్‌!" “మరి వాడినికూడా బూష్‌ అని తిడతారా?" “తప్పకుండా తిడతాం!” ఇ ''బమని తిడతారు?" “బూష్‌ అనే తిడతాం!” | 'బూష్‌ కాదు? బూష్‌ అని తిట్టాలి" “బూష్‌ అనే తిడతాం లేవయ్యా బండి పోనీ! జండా చూపించు!" "బూష్‌కాదని షెప్పుంటే వినరేం?”

  • "మరేమని తిట్టాలి?" “బూష్‌!" “సరీ! అలాగే తిడతాంలే నాయనా!" "ఏమని తిడతారు?" “అదే బూష్‌ అని చెప్పావుగా?" 'బూష్‌ కాదు." "మరి" 'బూష్‌-బూష్‌-" 'బూష్‌ బూష్‌ అన్నాడు పాలవాడు. “బూష్‌ కాదహా!" నేను కల్పించుకున్నాను. జ్‌ "బూట్‌ అని తిట్టాలి! అంతేగదా?" ''ఆ! అది! బూష్‌!” “సరే తిడతాంలెండి! జెండా చూపించండి!" 'నేను షూపించను-" 80 హ్యామరాలజీ

"అదేవిటి? వెంకట్రావ్‌ని మేము తిడతామన్నాంగా?" "వాడిని నేనే తిట్టాలి." ఈలోగా మీసాలాయన దిగివచ్చాడు "ఒరేయ్‌ ఇక లాభంలేదు గానీ బఠానీల వాడిని పిలవండి” అన్నాడు పరిస్థితి ఆకళింపు చేసుకుని. "బఠానీల వాడెందుకు?" అడిగాను అశ్చర్యంగా. “వాడొక్కడికే గార్డు ఉద్యోగం, ఇంజన్‌ డైవీేచేయటం తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు!" " కొంతమందివెళ్ళి బఠానీలవాడిని పట్టుకొచ్చారు. "ఒరేయ్‌సోమిగా! ఈ గార్జ్డుని మేము పక్కపెట్లోకి తీసుకుళ్తాంగానీ,కొంచెంగార్డు ॥ ఉద్యోగం చేయ్‌, బండిలేటయిపోతోంది." అన్నాడు మొసాలాయన. అందరూ కలసి గార్జని బళవంతంగా పక్కపెట్లోకి లాక్కెళ్ళిపోయారు. బఠానీలవాడు గార్డు పెట్టెక్కి, ట్రేక్‌వీల్‌ వెనక్కు తిప్పి, వాక్యూమ్‌ ఎడ్జస్ట్‌ చేసి "కయ్‌" న విజిల్‌ కొట్టి పచ్చజెండా చూపించాడు. రైలు ఈసారి హాయిగా రామవరప్పాడువరకూ శుభ్రంగా నడిచింది. బైము చూచుకున్నాను. . ఒంటిగంట! బండి పావుగంటయినా కదలకపోయేసరికి మళ్ళీ అందరం బలానీలవాడి దగ్గరకెళ్ళాం. " ఇంక మధ్యాహ్నం ఆఫీస్‌ కెళ్ళాలంటే సరిగ్గా అరగంట టైముంది. “ఎమయింది?” అడిగారువాడిని. "ఇంజన్లో ఎవరో సేఫ్టీ ఆఫీసరొచ్చారంట సార్‌! నేను జెండా చూపించకూడదని పట్టుబడు తున్నారు." అందరూ మళ్ళీ ఇంజన్‌ దగ్గరకెళ్ళి సేఫ్టీ ఆఫీసర్ని- డైవర్షి బ్రతిమాలారు. "మో ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌లో గార్డు పనిచేస్తున్నట్లి రాసుకొండిసార్‌! మాకిప్పట్‌కే ఆలస్యం అయిపోయింది" మళ్ళీ కదిలింది రలు. స్టేషన్‌ వచ్చేసింది. అయిదు నిమిషాలు గడిచింది. ఆ తరువాత పదినిమిషాలు, పావుగంటకూడా అయిపోయింది. బండికదలటంలేదు. ఎ ట్రయిన్‌ ఫ్రమ్‌ మసులా! 81

మళ్ళీ అందరం దిగి స్టేషన్‌ దగ్గరకు వెళ్ళాం.

టికెట్‌ కలెక్టరూ, బుకింగ్‌ క్షర్కూకలిసి ఓగుంపుతో పోట్లాడుతున్నారు.

"వీల్లేదయ్యా! బస్తాకి రెండ్రూపాయలు ఇవ్వాల్సిందే. లేకపోతే మిమ్మల్ని వదిలేది లేదు-"

"బియ్యం మేమిక్కడదింపటంలేదు సార్‌. బెజవాడ తీసుకెళ్తున్నాం ఇంక మీకెందుకు మామూలివ్వాలి?"

"ఇంతకాలం ఇక్కడ దింపి- ఇవాల్టినుంచి బెజవాడ తీసుకెళతారా? వీల్లేదు. ఇక్కడ " దింపాల్సిందే.” పట్టుపట్టారు బుకింగ్‌ క్షర్క్‌, టి.సి.లు.

"మోరు బస్తాకి రెండురూపాయలు అడుగుతోంటే ఇక్కడెందుకు దించాలండీ."

"బెజవాడలో ఎంత ఇస్తున్నారు?"

"రైల్వే పోలీస్‌కి రూపాయ్‌ మిగతా స్టాఫ్‌కి అర్ధరూపాయి."

"ఓహో! అర్ధరూపాయి లాభం కొడుతున్నారన్నమాట. అందుకని మా నోట్లో మొత్తానికే మన్నుకొడతారా?"

“"మోరు మరి రూపాయిన్నారకు వప్పుకోకపోతే మేమేం చేయంసార్‌?"

మోసాలాయన మళ్ళీ కల్పించుకున్నాడు.

"ఇదిగో బాబూ! బండి ఆపేసి లావాదేవీలేమిటయ్యా? మాకు అవతల లేటవుతోంది."

"లేకపోతే చూడండి సార్‌! బియ్యం బస్తాలన్నీ బెజవాడ తీసుకెళతామంటున్నారు. రోజూ వచ్చే మామూలు మాకిదొక్కటే గద్సార్‌. ఇదికూడా లేకపోతే మేమేం తినాలి?"

మోసాలయన బియ్యంవాళ్ళను కోపడ్డాడు.

“ఇదిగో రంగనాయకులూ! నువ్వుకూడా తొందరపడితే ఎట్టా? ఆ టి.సి.గారు, బుకింగ్‌ క్షర్క్‌గారు పరాయివాళ్ళేంకాదుగదా? ఎదో రెండు డబ్బులు అటూఇటయినా ఇక్కడే దించుకోండి.” ఈలోగా స్టేషన్‌ పోర్టర్‌ ఓముసలాడినీ రెండు మేకల్పి పట్టుకొచ్చాడు.

"సార్‌! ఈ మేకల్సి పాసింజర్‌ కంపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్తున్నాడుసార్‌."

"ఎరా! వాటిని బుక్‌ చేసి గార్జుపెట్టెలో తీసుకెళ్ళాలి కదా?" అన్నాడు బుకింగ్‌ క్షర్క్‌.

"పోరపాటయిపోయిందండీ."

నేను ఇంక లాభంలేదని అక్కడేదిగిపోయి రిక్షాలో ఆఫీస్‌ చేరుకున్నాను.

"ఎమిట్రా! ఇప్పుడొచ్చావ్‌?" భగవాన్‌ అడిగాడు.

82 హ్యామరాలజీ

"చాలా మంది బందరువాళ్ళు రోజూపాద్దున్న బెజవాడకు రైల్లో వచ్చి ఉద్యోగంచేసి మళ్ళీ సాయంత్రం బందరు వెళ్ళిపోతారని చెప్పావ్‌ గదా! ఆరైలు ఇప్పటికి చేర్చిందిక్కడికి." అన్నాను కోపంగా. “కొత్తలో ఇలాగే ఉంటుందిలే. రాన్రాను అలవాటయిపోతుంది" అన్నాడు భగవాన్‌. "కాని బస్‌లో గంటన్నర ప్రయాణం రైల్లో ఇన్ని గంటలా?" "తప్పదు మరి. పైసా ఖర్చులేకుండా బెజవాడ రావాలంటే అదొక్కటే మార్గం." "పెసా ఖర్చులేకుండానా అదేమిటి? సీజన్‌ టికెట్‌ ఉందికదా!"

"అద్గదీ! అందుకే నీకింత చిరాకనిపించింది" నవ్వుతూ అన్నాడు భగవాన్‌ "ఈ రైల్లో ఎవడూ ట్‌కిట్‌ కొనడు-" /

ళ్‌. = నాన [దానా-ను, స్టా

ఎ టటయిన్‌ ఫ్రమ్‌ మసులా! 83

(ఆఅ 1 కే 1 షా ల ళ్‌ ఇ . గ్‌. “సార్‌! ఆఫీసరు గారు పిలుస్తున్నారు" ఫ్యూన్‌ తాపీగావచ్చి చెప్పాడు. వెంటనే ఆయనరూమ్‌లోకి పరిగెత్తాను. ఆయన న్యూస్‌ పేపర్లో స్పోర్స్‌కాలమ్‌ చదువుతున్నాడు. "రాక్షస్‌ అండ్‌ రాక్షస్‌ కంపెనీ ఫైలు రెడీ అయిందా?" "ఇంకా లేదండీ. నోట్‌ రాస్తున్నాను." "త్వరగాకానీ అర! వెస్టిండీస్‌ వస్తున్నారే" హుషారుగా అన్నాడతను. నేను వెనక్కు తిరిగి చూచాను- ఎవరొస్తున్నారా అని. “ఎవరూలేరు కదండి." ఆయన చిరాకుగా నావైపు చూశాడు. "శీ 84 హ్యామరాలజీ

“ఎమిటెవరూ లేరు?" "అదే! ఎవరో వస్తున్నారని అంటున్నారుకదా”

  • _"నేననేది వెస్టిండీస్‌ సంగతయ్యా!ఇదే! వచ్చేవారం నుంచే టెస్ట్‌ మొదలవుతుంది." నాకింకా అయోమయం అయిపోయింది. ఆయనమాటలేమాత్రం అర్హంకావడంలేదు. _ అయినా నాకు ఇంకా తెలీనట్లు మాటాడితే బావుండదని,

"ఓహో! మీరనేది వెస్టిండీస్‌ సంగతా! అవునండీ! అవును." అన్నాను తడబడుతూ "లాయిడ్‌ స్టేట్‌మెంట్‌ చూశావా?" నాకు మళ్ళీ అర్ధంకాలేదు. మా ఆఫీస్‌కి సంబంధించిన యాన్యువల్‌స్టేట్‌మెంట్‌ మాత్రం

. నేను తయారుచేస్తుంటాను. కానీమరి ఈ లాయిడ్‌ స్టేట్‌మెంటేమిటో... "స్టేట్‌మెంట్‌ / మొన్నే హెడ్డాఫీసుకి పంపించాంకదండీ?" "నేననేది లాయిడ్‌ స్టేట్‌ిమెంటయ్యా! లాయిడ్‌ స్టేట్‌మెంటిచ్చాడు." "ఎమోసార్‌! నాకు మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ హెడ్‌క్షర్క్‌ గారికిచ్చాడేమో కనుక్కుంటాను.” ఆయన నన్నోపురుగుని చూసినట్లు చూశాడు- "యూకెన్‌గో! నీకు క్రికెట్‌ గురించి ఎమీ తెలిసినట్లు లేదు!" అన్నాడాయన-చూపుమార్చి నన్నో వింత జంతువుని చూసినట్లు చూస్తూ. నాగుండెల్లోరాయిపడింది! ఎందుకంటేనాకు (క్రకట్‌ ఆట గురించి అస్పలుతెలిదు. నేను స్కూలు ఫైనల్‌వరకూ చదివిన మా కైకలూర్లో | ఎవ్వరూ క్రికెట్‌ అఆడేవారుకాదు. దాన్నిగురించి మాట్లాడేవారుకాదు. క్రికెట్‌ అంటే అటూఇటూ మూడుకర్రలు పాతటం, ఒకడు రాయిలాంటి బంతితోదాన్ని పడగొట్ట బోతుంటే ఇంకొకడు బ్యాటు తీసుకుని, ఆకర్రల్ని రక్షించడం-అని నా ఉద్దేశ్యం! ఇటీవల పాకిస్తాన్‌తో మనవాళ్ళు క్రికెట్‌ ఆడినప్పుడుమాత్రం నేను నిజంగా నరకం అనుభవించాను. ఆఫీసులోనూ, బయటా, ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా క్రికెట్‌ గురించి మాటలే! వాళ్ళందరి మధ్యానేను "సహారా" ఎడారిలో ఉన్నట్లు ఫీలవుతూండేవాడిని! అంచేత టెస్ట్‌ మాచ్‌ జరిగినన్నిరోజులూ శెలవు పెట్టేసేవాడిని. "అబ్బ! ఆరుమాచీలు భలే అద్భుతంగా ఎంజాయ్‌ చేయవచ్చు." అన్నాడు రెడ్డి లంచ్‌ బెమ్‌లో నావంకచూస్తూ. “అవునవును! ఒండర్‌పుల్‌గా ఉంటుంది!” అన్నాను. . ఆరోజంతా కక్రికట్‌మాచీల గురించిన చర్చలతోనే గడిచిపోయింది ఈదారుణ మయిన , వాతావరణంలో నేను వట్టివాజమ్మలా కనిపించకుండా ఉండాలంటే క్రికెట్‌ గురించి క్రికెట్‌ ! క్రికెట్‌ ! 85

వీలయినంత త్వరగా తెలుసుకుని ఫాలో అయిపోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే రంగంలోకిదూకి న్యూస్‌పేపర్లలో క్రికట్‌ వార్లలుచదవడం మొదలెట్టాను. క్రికెట్‌ కామెంటరీ వినడానికని ఓపాకెట్‌ ట్రాన్సిస్టరు కూడాకొన్నాను.

"మార్షల్‌, హోల్డింగ్స్‌ తుక్కురెపేస్తారీసారి!" అన్నాడెవరోకుర్రాడు బస్‌స్టాండ్‌లో.

ఆమాట జాగ్రత్తగాగుర్హు పెట్టుకున్నాను.

ఆతరువాత వారం టెస్ట్‌ మాచ్‌స్టార్టయింది. ట్రాన్సిస్టర్‌చెవి దగ్గర పెట్టుకుని ఆఫీసుకి బయట్టేరాను. ఎంతసేపు విన్నాహోరున జనంగొడవ తప్పితే ఇంకేమీ వినిపించలేదు. ం

ఒకతను పరుగుతో నాదగ్గరకొచ్చాడు.

“టాస్‌ ఎవరుగెల్బారు?" అడిగాడు ఆత్రుతగా.

''టాసా?” ఆశ్చర్యంగా అడిగాను. యీ

“అవును!”

ఎదొకటి చెప్పాలి కనుక "వెస్టిండీస్‌" అన్నాను.

“బాటింగివరు చేస్తున్నారు?”

నాకుతెలీదు అని చెప్పటం నామోషీఅనిపించి అతన్ని వదిలించుకోవటానికి "వెస్టిండీస్‌" ( అన్నాను.

"ఇప్పుడు ఎవరాడుతున్నారు.?"

నాకు వెస్టిండీస్‌ తాలూకూపేరు ఒక్కటే ఒక్కటి గుర్తుంది. ఆరోజు బస్‌స్తాండ్‌ దగ్గర విని గుర్తుపెట్టుకున్నాను.

"మార్షల్‌, హోల్చింగ్స్‌! తుక్కురేగ్గొటేస్తున్నారు!” అన్నాను.

"అప్పుడే వాళ్ళవరకూ అవుటయిపోయారా?” నమ్మలేనట్లుగా అడిగాడతను.

ఎక్కడో ఎదో తప్పు చెప్పి ఉంటానని అనుమానం కలిగింది గానీ, ఇప్పుడిక చేయగలిగిందేమీ లేదు. ముందుకు దూసుకుపోవడమే.

“అవును?” అన్నాను.

“స్కోరంత?”

'ముప్పైఆరు!" అతను అదిరిపడ్డాడు.

"ఎన్ని వికెట్లుపడినయ్‌?"

పద్నాలుగు!"

86 హ్యామరాలజీ

అతను ఉలిక్కిపడి నెమ్మదిగా కాసేపు వెనక్కునడిచి, అక్కడి నుంచి హఠాత్తుగా రాకట్‌లా దూసుకుపోయాడు.

ఆఫీసులోకూర్చుని ట్రాన్సిస్టర్‌ టేబుల్‌ మీదే ఉంచి వాల్యూమ్‌ తగ్గించాను. విమల ఆశ్చర్యంగా నావేపు చూస్తోంది.

అతకుముందు పాకిస్తాన్‌తో మనవాళ్ళు ఆడేప్పుడు ఒకటి రెండుసార్లు క్రికెట్‌ గురించినాతో మాట్లాడి-నాకేమీ తెలీదని తెల్చుకుని-నన్ను అడవిమనిషిలా ట్రీట్‌చేయడం మొదలుపెట్టంది.

హఠాత్తుగా ట్రాన్సిస్టరులో పెద్దఎత్తునకేకలు,గొడవెక్కువయిపోయినయ్‌.

“ఎమిటి, వికిట్‌పడిందా?" ఆదుర్దాగా నా దగ్గరకొచ్చి అడిగిందామె.

/ "అవును" అన్నాను ఇంకేమనాలో తెలీక.

"ఎవరవుటయ్యారు?"

ఇండియన్‌ ఆటగాళ్ళలో నాకు మూడే పేర్షు తేలుసు.

గవాస్కర్‌, కపిల్దేవ్‌, కిర్మానీ! .

“గవాస్కర్‌!” అని చెప్పానామెకి. చుట్టపక్కలున్నవాళ్ళందరూ ఘెల్లుమన్నారు."బౌలింగ్‌ చేసేది ఇండియాయేకదా! | గవాస్కర్‌ అవుటయ్యాడంటారేమిటి-” అడిగిందామె నవ్వాపుకుంటూ.

"సారీ! సరిగ్గావినలేదు! కపిల్‌దేవ్‌ అవుటయాడు."

ఆమెమాట్ట్లాడకుండా తన సీటుకెళ్ళికూర్చుంది.

ఆఫీసర్‌ దగ్గర్నుంచీ కబురొచ్చింది. లోపల అప్పటికే రామకృష్ణ ఉన్నాడు.

"దేనికిప్పుడేలీవ్‌? టి.వి.లో ్రికట్‌మాచ్‌ చూట్టానికి కదూ!” కోపంగా అడిగాడు ఆఫీసరతనిని.

"అబ్బేకాదండీ మా అమ్మమ్మచనిపోయింది!”

"వ్వాట్‌? మీ అమ్మమ్మ చనిపోయిందా?”

"అవునండి?"

"మరి పాకిస్తాన్‌ టెస్ట్‌ మాచ్‌ జరిగినప్పుడు కూడా మీఅమ్మమ్మ అప్పుడే చనిపోయిందని లీవ్‌ తీసుకున్నావుగా?"

"అదా! అదే...అది...నిజమేనండీ! మాఅమ్మమ్మ అప్పుడే చనిపోయింది. ఆకారణంగా మాతాత ఇప్పుడు మళ్ళీ పెళ్ళిచేసుకుంటున్నాడండీ! అందుకని సెలవుకావాల్సార్‌! సొంత తాతయ్య పెళ్ళికి నేను వెళ్ళకపోతే ఎం బావుంటుంది." క్రికెట్‌ 1 క్రికెట్‌ ! 87

ఆఫీసర్‌ చిరాకుగా చూసి “"ఆల్‌రట్‌-గో" అన్నాడు ఈనడింపుగా.

రామకృష్ణ అనందంగా వెళ్ళిపోయాడు.

''ఫైలురడి అయిందా? '' అడిగాడు ఆఫీసర్‌.

"ఇంకో అరగంటపడుతుందండీ"

"కపిల్‌ఎన్ని ఓవర్స్‌ చేశాడు?" అడిగారాయన.

“పదకొండండీ!” ఠక్కున నోటికొచ్చింది చెప్పేశాను.

“మెయిడెన్స్‌-ఎన్ని?"

“ఇరవైమూడండి!"

"యూకెన్‌-గో-" మండిపడుతూ అన్నాడాయన. ఆయనకంతకోపం ఎందుకొచ్చిందో | అర్ధంకాలేదు.

ఆ తరువాత రెండురోజులు శెలవుపెట్టి ఇల్లు కదలకుండా కూర్చుని కా మెంటరీవిన్నాక నాకుచాలా విషయాలు తెల్సినయ్‌. తీరా ఆ మర్శాడు ట్రాన్సిస్టర్‌ ఆన్‌చేస్తే ఎక్కడా కామెంటరీ రావటంలేదు. వెంటనే అది నాకు అమ్మినవాడి షాపుకు పరుగెత్తాను.

“వారంక్రితం మీ దగ్గర కొన్న ట్రాన్సిస్టర్‌ చెడిపోయిందయ్యా.' అన్నాను దబాయింపుగా.

అతను పరీక్షించి “బాగానే వుంది కదండీ! అన్నాడు ఆశ్చర్యంగా.

“బాగుంటే మరి క్రికెట్‌ కామెంటరీ ఎక్కడారాదేం?"

అతనునవ్వాడు, "ఇవాళ రెస్పుకదండీ! మర్చిపోయినట్లున్నారు."

నేనో వాజమ్మనని అతను అనుకోగల ప్రమాదం ఉంది గనుక క్ర్‌కెట్‌ గురించి నాకు ఎంతో కెలుసునని కొంచెం ఓవరాక్షన్‌ చేస్తేగాని లాభం లేదనిపించింది.

"ఓ అయామ్‌ సారీ! పూర్తిగా మర్చిపోయాను. ఇవాళ వెస్టిండీస్‌కి రెస్ట్‌డే కదూ?"

అతను ఈసారి జాలిగా నవ్వాడు

"'క్రికట్‌ ఈజ్‌గేమ్‌ అని పుస్తకం ఉందండి. చాలా చక్కగా రాశారాపుస్తకంలో! అది చదివితే మొత్తం (క్రికట్టంతా తెల్సిపోతుంది" అన్నాడు.

నేనింక అక్కడ వుండటంవల్ల నాపరువుకి ఎక్కవహాని జరిగే అవకాశం ఉందని ఇంటికొచ్చేశాను.

మర్నాడు పొద్దున్నే మా అమ్మమ్మ హడావుడిగావచ్చి నన్ను నిద్రనుండి లేవగొట్టెసింది.

“ఎమిటి? ఎంజరిగింది" అన్నాను ఖంగారుగా. 88 హ్యామరాలజీ

“కొంప మునిగిందిరా నాయనా! వద్దురా అంటే మన నూకలపాలెం బంధువులతో పోట్లాడావ్‌. ఇప్పుడుచూడు వాళ్ళేం చేశారో! మనకి చేతబడి చేశారు." నేను అదిరిపడిలేచి నిలబడ్డాను. "చే...చే...చేతబడా?" "అవును,రా! బయట చూడు మన తలుపుకి-” పరుగుతో బయటకెళ్ళి చూశాను. తలుపుమోద ఎ(ర్రరంగుతో మూడుగీతలుగీసి ఉన్నాయ్‌, "అలా చూస్తావేంఠరా! వెళ్ళి మంత్రాలేసే వాడినెవర్హయినా తీసుకురా త్వరగా, లేకపోతే / ప్రాణాలు పోతాయి." మా గొడవకి చుట్టుపక్కల పెల్లలుపోగయ్యారు. "అది చేతబడి కాదంకుల్‌! వికట్స్‌. మీ తలుపుమీదగీశాం మేమే! నిన్నశెలవుకదా! (క్రక5ట్‌ ఆడాం ఇక్కడ." నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఆరోజు మా ఆఫీసర్‌ చాలా సరదా మూడ్‌లోవున్నాడు. నేనుఫైలు తీసుకెళ్ళగానే నోట్‌చదవకుండా సంతకం పెట్టేళాడు | “చూశావా మనాళ్ళు బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు." అన్నాడు ఆనందంగా. "అవునండీ దుమ్ముదులిపేస్తున్నారు.” అన్నాను రెడ్డి మాటలు గుర్తుకుతెచ్చుకుని. అప్పుడే ఆయన టేబుల్‌ మీదున్న ట్రాన్సిస్టర్‌లో హోరు పెరిగిపోయింది. ఆఫీసర్‌ అదిరిపడి నాకుషేక్‌హాండిచ్చాడు. "సిక్సర్‌-కపిల్‌-సిక్సర్‌కొట్టాడు. బ్రిలియంట్‌ షాట్‌! సూపర్బ్‌!” హి ఈజ్‌ నేచురల్‌ ప్టేయర్‌! ఒండర్‌పుల్‌ బాట్స్‌మెన్‌" "అవున్నార్‌ ! నేచురల్‌ ప్లేయర్‌." "అన్నట్లు నీ ఇంక్రిమెంట్‌ ఆగిపోయిందన్నావ్‌ కదూ?" “అవునండీ!” "వెంటనే ఒకఅప్పీల్‌రాసి పుటప్‌చెయ్‌ నేను రికమెండ్‌ చేసి హెడ్డాఫీస్‌కి పంపిస్తాను. నాలుగురోజుల్లో నీ ఇంక్రిమెంట్‌ వచ్చేస్తుంది-" నేను సంతోషంతో పొంగిపోయాను. ఇంక్రిమెంటంటే షుమారు అన్నీ కలసి రెండు వందలరూపాయలు జీతం పెరుగుతుంది. _ శ్రికట్‌! క్రికెట్‌! 89

"అలాగేసార్‌ ఇప్పుడే తెస్తాను" అంటూ పరుగెత్తుకెళ్ళి త్వరత్వరగా టైప్‌ చేసి తీసుళ్ళి కాగితం ఆయనముందుంచాను. ఆయన సంతకం పెట్టబోతుండగామళ్ళీ ట్రాన్సిస్టర్‌గట్టిగా మోతిక్కివోయింది. ఆఫీసర్‌చెవి దానిదగ్గర పెట్టివిన్నాడు ఠక్కున ట్రాన్సిస్టరు ఆఫ్‌ అయిపోయింది. "అవుట్‌!" అన్నాడు మొఖం కోపంగాపెట్టి. “"ఎమయిందిసార్‌!" "కపిల్‌దేవ్‌ అవుట్‌!" ఇంకా కోపంగా అన్నాడాయన "అలాగా! పాపం! ఒండర్‌పుల్‌ ప్రేయర్‌సార్‌! నేచురల్‌ ప్లేయర్‌సార్‌!' ఆయనను సముదాయించాలని అన్నాను. “డోంటాక్‌!” అరిచాడాయన. కపిల్‌దేవ్‌ ఆట చేతగాని వాజమ్మ! ప్లూక్‌ప్లేయర్‌! | హోప్‌లెస్‌ప్లేర్‌! ఇర్రెస్పాన్సిబుల్‌క్రీచర్‌!” అర్జంటుగానేనూ ప్లేట్‌ మార్చకపోతే ప్రమాదం తప్పదనిపించింది నాకు.'అవున్సార్‌! కపిల్‌దేవ్‌ని అసలు ఎవరుసెలక్ట్‌ చేశారోనాకు తెలీటంలేదు! అస్సలు ఆటరాదు. బాటింగ్‌ వీక్‌-బౌలింగ్‌ మరీవీక్‌-ఫీల్డింగ్‌ హారిబుల్‌-" “ఎప్పట్నుంచో చూస్తున్నాను!హి ఈజ్‌. అన్‌ఫిట్‌!" అన్నాడాయన. "నేనూ చిన్నప్పట్నుంచీ కనిపెడుతున్నాను. ఇలాగే హోప్‌లెస్‌గా ఆడుతున్నాడు సార్‌." సరిగ్గా అప్పుడే ట్రాన్సిస్టరు మళ్ళీగోల. | "గెటౌట్‌!" అన్నాడాయనకోపంగా నావేపుతిరిగి! “అఆ కాయితంమోద సంతకం" ----అడిగాను భయంగా. కాగితంచింపి చెత్తబుట్టలోపారేశాడు. ఇంకలాభంలేదని బయటికొచ్చేశాను... నీటుదగర కూర్చుని ట్రాన్సిన్టరు చెవి దగ్గర పెట్టుకున్నాను. ఈ క్రికెట్‌ అంతుతేల్చుకోవలసిందే! లేకపోతే జీవితమే సర్వనాశనం అయిపోతుంది. సన్‌దీప్‌పాటిల్‌ మళ్ళీ ఓబౌండరీ కొట్టాడు. అంతాగొడవ. _"వాడ్డూయూసే ఎబౌట్‌దిస్‌ షాట్‌'కామెంటేటర్‌ స్పెషలిస్ట్‌ నడిగాడు. “మాగ్నిఫిసెంటు షాట్‌! ఇలాంటి బ్యాటింగ్‌ ఇంతకుముందు డచ్చింగ్స్‌ ఒక్కడే చేయగా నేను 1948లో ఇంగ్లాండు వెళ్ళినప్పుడుచూశాను. సన్‌దీప్‌పాటిల్‌పాద్దుట్నుంచి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా ఆడుతున్నాడు. పూర్తిగా సెటిలయ్యాడు. అతనువెస్టిండీస్‌ బౌలింగ్‌కి ఒకఛాలెంజ్‌! “అంటూ హిందీలో చెప్పాడతను. 90 హ్యామరాలజీ

సరిగ్గా ఆతర్వాత బాలుకే సన్‌దీప్‌పాటిల్‌ అవుటయిపోయాడు.

ట్రాన్సిస్టర్‌లో కొద్దిక్షణాలు పెద్దకోలాహలం.

“సూపర్‌కాచ్‌ అండ్‌ హిఈజ్‌ అవుట్‌. వాడ్డూయోసే ఎబౌట్‌ దిస్‌షాట్‌' మళ్ళీ 'స్పెషలిస్ట్పునడిగాడు కామెంటేటర్‌:

"ఇటీజేపూలిష్‌షాట్‌! ఇంత చచ్చుదరిద్రపు బాటింగ్‌ నేను 1953 లో మూసర్‌మూర్‌ ఆ(స్టేలియాలో ఆడగాచూశాను. అంతే! ఆతర్వాతెవరూ ఇంతచెత్తగా ఆడలేదు. అసలు ప్రొద్దు నుంచీ సన్‌దీప్‌పాటిల్‌ చాలా వరస్ట్‌గా ఆడుతున్నాడు. అబౌలింగ్‌ని ఎదుర్కోవటమే

చేతకావటంలేదు. వ్రతిబాల్‌కీషేక్‌ అయిపోతున్నాడు. ఇన్నిగంటలు ఆడినాఇంకా సెటిలవలేదు. ఇరైస్పాన్సిబుల్‌ ప్లేయింగ్‌!” అన్నాడతను హిందీలో.

  • నాకు అయోమయంగా ఉన్నాయతని మాటలు.

సాయంత్రం రెడ్డీ, నేనూ కలిసేవెళ్ళాం ఇంటికి. .

“మనాళ్ళందరూ ఎందుకంతత్వరగా అవుటయిపోయారు? ' అడీగాను రెడ్డిని.

"కామెంటరీ వినలేదా నువ్వు?"

"విన్నాను-" /?

“మరి అస్పెషలిస్ట్‌ అన్నీ వివరంగా చెప్పాడుకదా! పిచ్‌చాలా డేంజరస్‌గా ఉందిట!

ఎంత మొనగాళ్ళయినా సరే ఈ పిచ్‌మోద బులెట్‌ తగిలిన పిట్టల్లా రాలిపోవాల్సిందేనట!"

"అంటే ఈఆటచోలా ఫాక్టర్స్‌మోద ఆధారపడి ఉందన్నమాట!"

“అవును!పిచ్‌, వికెట్‌టర్న్‌తీనుకోవడం, స్పిన్నయిపోవడం, లైటుఎక్కువవడం, 'షేడ్‌ీరావడం,లైటుతక్కువవడం, వర్షంకురవడం, కొత్తబంతి తీసుకోవడం,ఇలా లక్షాతొంభయ్‌ విషయాలమీద ఆధారపడి ఉంటుంది-"

ముర్నాడం ఆవీనులోనే వివులము౦దు నా వరిజ్ఞానం వదర్శించాలని నిర్ణయించుకున్నాను.

"మనాళ్ళు హోప్‌లెస్‌లీపూర్‌ ప్లేర్స్‌" అందామె టైప్‌చేసిన కాగితం నాకిస్తూ,.

"'అదేంకాదు!పిచ్‌డేంజరస్‌గా ఉంది! అదీగాక కొత్తబంతి! ఈపిచ్‌మిోద ఎంత మొనగాళ్ళయినా సో బులెట్‌ తగిలిన పిట్టలా రాలిపోవలసిందే" అన్నాను తడుముకోకుండా.

ఆమెపగలబడీ నవ్వింది.

"అలాగా?" అంది నవ్వాపుకున్నాక. క్రికెట్‌ ! క్రికెట్‌ ! 01

“అవును! ఏం" "

"మరి వెస్టిండీస్‌ ఇవాళ అలా సెంచరీలు కొడుతున్నారేమిటి?"

నేను అదిరిపడ్డాను.

“"సెంచరీలా?"

“అవును!”

నాకేం చెప్పాలో తెలీలేదు. ఆసమయంలో రెడ్డి పక్కన ఉంటే ఏంచెప్పేవాడో అనిపించిందిగానీ రెడ్డి లేడుమరి! .

"ఎలా కొడుతున్నారబ్బా?" అన్నాను ఆశ్చర్యంనటిస్తూ. నిజానికి ఆపాయింటునాకేం అర్ధంకావటంలేదు

"అందుకే చెప్పేది!పిచ్చీలేదు కాకరకాయలేదు! అవన్నీసాకులు!" అంటూవెళ్ళిపోయిందామె. మళ్ళీ విమల దగ్గర పరువుపోయింది.

“ఇప్పుడెవరు బ్యాట్‌ చేస్తున్నారు?" అడిగిందామె.

"పొద్దున్నుంచీ వాళ్ళు ఇద్దరేగా ఆడుతున్నారు?" అన్నాను అంతకుముందు వరకూ ట్రాన్సిస్టర్‌లో విన్నపేర్షు గుర్తుకి తెచ్చుకుంటూ.

“ఎవరు?

"అదే సిలిమాడాన్‌, ఇంకోకతను డీప్‌స్క్వేర్‌లెగ్‌! సిలిమాడాన్‌ మాత్రంఅద్భుతంగా ఆడుతున్నాడు."

ఆమె మళ్ళీ కిలకిలనవ్వేస్తూ అక్కడినుంచి వెళ్ళి అందరితోనూ చెప్పినవ్వసాగింది. నాకు తల కొట్టేసినట్టయిపోయింది. ఈ పరిస్థితిలో ఆమె నన్ను (పేమించడంకల్ల!

ఎలాగయినా నరీ-మరో మాబ్‌ వూర్తయేనరికల్తా మొత్తంనేర్చుకోవాలని ప్రతిజ్ఞచేసేసుకుని రెండోమాచ్‌ టైమ్‌కి మాఆఫిస్‌ ఎగ్గొట్టి లక్ష్మణరావ్‌ గాడింట్లో టి.వి. చూస్తూ రోజులు గడిపేయసాగాను.

రాన్రాను నాకూ క్రికెట్‌ మోద ఆసక్తి పెరిగిపోయింది. ఆ తరువాత మాచీలన్నీ కూడా ఆఫీస్‌ ఎగ్గొట్టి చూశాను. చివరికెలా అయిందటే నాకు తెలీని విషయం అంటూ ఏమీ మిగిలినట్లు నాకనిపించలేదు. ఆతరువాత మాచ్‌జరిగే సమయంలో వీరుడిలా ఆఫీసులో అడుగుపెట్టాను. అందరూ క్రికెట్‌ మాచ్‌ గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి స్పీచ్‌ మొదలెట్టైశాను.

92 హ్యామరాలజీ

_ఇది బ్యాట్స్‌మన్‌ పిచ్‌! అంచేత బ్యాటింగ్‌ మొదలెడితే వాళ్ళకు ఎడ్వాంటేజ్‌! ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకుంటే గాని గెలిచే అవకాశాలు బేవు" అన్నాను పెద్దఫోజిచ్చి.

అందరూ తెల్లబోయి నావంక చూడసాగారు.

ఆట మొదలయింది. ఇండియన్‌ వికెట్లన్నీ టపీటపీమని పడిపోతున్నాయ్‌. అప్పుడే ఆఫీసరు కారు దిగి లోపలికి వస్తూ నా దగ్గర ఆగి "ఎన్ని వికెట్లు పడిపోయాయ్‌?" అనడిగాడు.

"ఫార్టీఫర్‌ ఫైవ్‌! "

ఆయననీరసంగా నా కెదురుగ్గా ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. "ఏమిటింతఘోరం? బౌలింగ్‌ మరీసివియర్‌గా ఉందేమో!” అన్నాడు. దొరికిందే అవకాశమని అందుకున్నాను.

"నో సార్‌! యూ అర్‌మిస్టేకన్‌! మన బ్యాట్స్‌మన్‌ కొంచెం కేర్‌లెస్‌గా ఆడారు! అంతే! ప్రతి బ్యాట్స్‌మన్‌ కనీసం యాభయ్‌పరుగులు చేయాల్సిన పిచ్‌ఇది! కిందటిసారి అంటే పదేళ్ళక్రితం వెస్టిండీస్‌ అక్కడ ఆడినప్పుడు కూడా అద్భుతంగా పరుగులు సాధించారు మనవాళ్ళు! అంతకుముందు ఆ(స్టేలియాటీమ్‌... "

"అంటే ఇవ్వ్చుడొచ్చిన బ్యాట్స్‌మన్‌ అయినా కనీనం ఇండీయావరువు నిలబెడతారంటావా? " దిగులుగా అడిగాడాయన.

, "ఓ, యస్‌! చూస్తుండండి! మన అసలయిన బ్యాట్స్‌మన్‌ ఇంకా ఆడలేదుకదా! వాళ్ళుదంచేస్తారు. " అన్నానుధీమాగా.

"ఎవరువాళ్ళు? "

"రోజర్‌ బిన్ని, మదన్‌లాల్‌, కిర్మానీ”

"వాళ్ళు బ్యాట్స్‌మన్‌ ఏమిటి నామొఖం? బౌలర్స్‌కదా! కిర్మానీ వికెట్‌కీపర్‌!”

"నోనోనో! అయాంసారీ! రియల్‌ బ్యాట్స్‌మన్‌ వాళ్ళుముగ్గురే! కావాలంటే హిస్టరీ చూడండి! వన్‌డే క్రికట్‌లోనూ, త్రీడే క్రీకట్‌లోనూ, సిక్స్‌డేమాచ్‌లోనూ సూపర్బ్‌ పెరృరమెన్స్‌! టేక్‌ ది స్టాటిస్టిక్స్‌! రోజర్‌బిన్నీ యావరేజ్‌ 36.6 రన్స్‌! మదన్‌లాల్‌ 38.9 రన్స్‌! కిర్మానీ! 30 రన్స్‌! బౌలింగ్‌అనాలిసిస్‌ రోజర్‌బిన్నీ- 26 ఓవర్స్‌-6 మెయిడిన్స్‌ 68 రన్స్‌-త్రీ విట్స్‌-మదన్‌లాల్‌-" ఆఫీసరుగారు కుర్చీలో నుంచిలేచి నిలబడ్డారు.

"ఓకే మిష్టర్‌! తర్వాత మాట్లాడదాం!" అనేసి తనరూమ్‌లో కెళ్ళిపోయారాయన. అందరూ నావంకే ఈర్వగా చూచారు. ఆ సాయంత్రం ఆయనే నన్నుగదిలోకి పిల్పాడు. క్రికెట్‌ 1! క్రీకట్‌ |! 93

"నువ్‌ చెప్పింది ఎగ్గ్జాక్ట్‌లీ కరెక్ట్‌! బిన్నీ మదన్‌లాల్‌, కిర్మానీ అద్భుతంగా ఆడబటై మనస్కోర్‌ బాగా పెరిగింది! అన్నారాయన ఆనందంగా.

“"ఇలాలాస్ట్‌ వికెట్స్‌ బాటింగ్‌ వెరీరేర్‌ సర్‌! 1927 లో ఇంగ్లీష్‌ టీంలో కూడా సర్‌గారీకో బన్‌,విర్‌మీర్‌ చేతన్‌ కూడా ఇలాగే మాక్సిమమ్‌ స్కోరింగ్‌చేసి రికార్డ్‌నెలకొల్పారు ఆతరువాత ఆగ్ర్రేలియాలో...."

“ఓకే-ఓకే "అన్నారాయన నన్నాపేఉద్దేశ్యంతో.

కానీ నేనెంత ప్రయత్నించినా బ్రేకులు పడడంకష్టంగా ఉంది.

"ఎనీవే-ఇం,క్రీవెంటు ఆగిపోయిందన్నావు కదూ! అప్పీలు తీనుకురా! నేనురికమండ్‌చేసి హెడ్డాఫీస్‌కి పంపిస్తాను! నాలోజుల్లో వచ్చేస్తుంది!" నాకు ఆనందం ఆగలేదు. "

(క్రకట్‌ పుణ్యమా అని ఇంక్రీిమెంటు వచ్చేస్తోంది.

త్వరత్వరగా అప్పీల్‌రాసేసి పరిగెత్తుకెళ్ళి ఆయన ముందుపెట్టాను.

"వచ్చేవన్‌డే మ్యాచ్‌ గురించి ఎమంటావ్‌! మనకేమయినా ప్రాస్పెక్టస్‌ ఉంటుందా?" అడిగారాయన,.

"టు టెల్‌ యూది ఫాక్ట్‌-నో ఛాన్స్‌ సర్‌! గవాస్కర్‌ ఈపిచ్‌మోద బాగా ఆడలేడు! అలాగే గయక్‌వాడ్‌! ఎట్‌దిమోస్ట్‌ పద్దెనిమిది పరుగులకంటే ఎక్కువ తీయలేడు. ఆతరువాత వెంగ్‌నర్కార్‌ మంచి ఫావులోనే ఉన్నాడుగానీ-మార్వల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండటంవల్ల..."

"ఓకే-ఓకే!” అంటూ. నన్నాపబోయాడాయన.

ట్రాన్సిస్టర్‌లో ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్‌ని కామెంటేటర్‌ అడుగుతున్నాడు హిందీలో.

"కపిల్‌దేవ్‌ ఈ మధ్యసరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. బహుశా అందుక్కారణం

ఈ కెప్టెన్సీవల్ల మీదబడిన అదనపుబాధ్యత అని నేననుకుంటున్నాను. మోరేమంటారు? " ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్‌ దగ్గాడు.

"యస్‌! ఆఫ్‌కోర్స్‌! యూ ఆర్‌ సెంట్‌పర్సెంట్‌ కరెక్ట్‌! దిసీజ్‌ రియల్లీ ట్రెమండస్‌ రెస్పాన్సిబులిటీ! ఇంత బాధ్యతమిద ఉన్నప్పుడు అది తప్పక అతని ఫెర్సారమెన్స్‌ మోద ఎఫెక్ట్‌ ఇస్తుంది! దిసీజ్‌ టూమచాఫ్‌ రెస్పాన్స్‌బులిటీ! ఇంతబాధ్యత, బరువు మీదపడితే . సరిగ్గా కాన్‌సంట్రేషన్‌ ఉండటం౦కష్టం." ఆఫీసర్‌ ట్రాన్సిష్టర్‌ కట్టేశాడు. నేను ఇంక నిగ్రహించుకోలేకపోయాను.

94 హ్యామరాలజీ

"ఆ ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్‌ చెప్పేదంతా బోగస్‌! మోరునమ్మకండి! బాధ్యతలేదూ

ల గాడిదగుడ్డూలేదు.అదే నిజమైతే ఆబాధ్యత వెస్టిండీస్‌కెప్టెన్‌ లాయిడ్‌ పెర్పారమెన్స్‌కి ఎందుకు

ఎ ఫెక్ట్‌ఇవ్వలేదు?" ఆగ్టైలియా కెప్టెన్‌ కిమ్‌ హ్యూగ్స్‌ ఇంగ్లీష్‌కెప్టైన్‌ బాబ్‌విల్లిస్‌ మాటేమిటి? పాకిస్తాన్‌కాప్టైన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ మాటేమిటి? శ్రీలంక కాప్టెన్‌-----"

“దట్స్టాల్‌రైట్‌ అయిదవుతోంది " అన్నాడాయన.

"అసలు క్రికెట్‌ ఈజ్‌ గేమాఫ్‌లక్‌ అని చాలామంది అంటారు! మో అభిప్రాయం ఏమిటి?"

"నాదీ అదే అభిప్రాయంగాని ఇంక మనంరేపు మాట్టాడుకుంటే---"

౮ "టాష్‌!" అరిచాను. ఆయన అదిరిపడ్డాడు.

"ఎమిటి? "

"మో అభిప్రాయం ట్రాష్‌! క్రికట్‌ ఈజ్‌లైక్‌ ఎనీ అదర్‌గేమ్‌! ప్రోఫిషియెన్సీ, ఎఫిషియెషిన్సీ అండ్‌ టాలెంట్‌! అందుకే వెస్టీండీస్‌ మనని తుక్కు రేగ్గొట్టేశారు. అంతేకాదు ఫర్‌ ఇన్‌స్టైన్స్‌ టేక్‌వరల్డ్‌కప్‌---"

"ఇంకచాల్లే! వెళ్ళు!" అన్నాడాయన. కానీ ఆపటంనావల్లకాలేదు.

"వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ మోద మనాళ్ళు అడిగినప్పుడు అందరూ ఎమనుకున్నారు? "

"ప్లీజ్‌ గెటవుట్‌ " కోపంగాలేచి నిలబడ్డాడాయన.

నేను ఏమాత్రంబెదర్లేదు. ఎదో శక్తి ఆవహించినట్లయింది.

"ఇంగ్లీష్‌ టీమ్‌ ఎలా ఓడిపోయింది?" ఆటరాకకాదు? ఎఫిషియెన్సీలేకా? కాదు! ఒక్కసారి ఇండివిడ్యుల్‌ ఎనాలిసిస్‌ చూడండి.

బాబ్‌ విల్లీస్‌ 1982 లో లార్బ్‌లో ఆడినప్పుడు ఒక మాచ్‌లో 46 ఓవర్స్‌లో 20 మేడిన్స్‌-83 రన్స్‌-సిక్స్‌వికెట్స్‌-అలాగే ఇయాన్‌బౌతుమ్‌----”

ఆఫీసర్‌చేతిలో నా ఇంక్రిమెంటుకాగితం చిత్తయిపోయి చెత్తబుట్టలోపడిపోయింది.

"బయటికెళావాలేదా?” మీదకొస్తూ అడిగాడాయన.

"56 ఓవర్స్‌-13 మైడెన్స్‌" బాగా దగ్గరకొచ్చేశాడతను.

"33 రన్స్‌ త్రీవికెట్స్‌" ఆతరువాత మాట్లాడటంకుదరలేదు. ఎదో బలంగా నామొఖం మోదతగిలి కింద పడ్డాను. * క్రికెట్‌ ! క్రికెట్‌ |! 95

2 1 అత్‌ దట్‌ వుమన్‌ (ప్రమ రష్యా, టి /7/ ్ట ణా [ గల సత భు వీ బలా (/ట 1 ళ్‌ క్కి శ 4! హ్‌ యయ పారం (యే కానడ 1 ౮/ గటి ॥ |] స [టో ఓ చాలారోజుల తరువాత మా కాలనీలో మళ్ళీ సంచలనం కనిపించింది. శాయీరామ్‌, రెడ్డి, గొపాల్రావు, జనార్దన్‌ హడావుడిగా మా ఇంటికొచ్చేరు పొద్దున్న... "ఏమిటి సంగతి?" భయంగా అడిగాను. అప్పటికప్పుడు కాలనీ మోటింగ్‌ అంటారేమో, బంగారంలాంటి ఆదివారం సర్వనాశనం అయిపోతుందేమో అన్న అనుమానం కలిగింది మరి. "త్వరగా రెడీ అవ్‌! మనందరం ఏరోడ్రోమ్‌కెళ్ళి ఎల్వీరా ఒజోలీనాని రిసీవ్‌ చేసుకోవాలి" అన్నాడు జనార్ధన్‌. "ఎల్వీరా ఒజోలీనా నా?" 96 హ్యూమరాలజీ

"అవును" “అంటే ఎమిటిది?" . "గ్రామర్‌మిస్టేక్‌! ఎవరు అనడగాలి” . "సరే! ఎవరు?" "రష్యన్‌ యూనివర్సిటీ ప్రోఫెసర్‌." "అతన్ని మనం రిసీవ్‌ చేసుకోవటమెందుకు?” అయోమయంగా అడిగాను. . "మళ్ళీగ్రామరు-ఆమె అనాలి అతనుకాదు" "సరే-ఆమెను మనం ఎందుకురిసీవ్‌చేసుకోవాలి? " "ముందుఎయిర్‌పోర్టుకి బయళ్చేరు! తర్వాత చెప్తాను" అన్నాడు రెడ్డి. ఇంకలాభంలేదని డ్రస్‌చేసుకుని వాళ్ళతో బయలుదేరాను. తోవలో వివరాలు అందించాడురెడ్డి. ఎల్వీరా ఒజోలీనా మనదేశంలోని తెలుగుజాతిగురించి రీసర్చిచేసి ఓ పుస్తకంరాయలని ఇండియా వచ్చిందట. ఢిల్లీలో జాబ్‌ చేస్తోన్న జనార్ధన్‌ అన్నయ్యకు స్నేహితుడయిన జక్కన్‌లాల్‌ మక్కన్‌లాల్‌ ఆమెను తెలుగుదేశం రాజధానిలో గడపమని పంపుతూ, ఆమెను మా కాలనీ అతిధిగాభావించాల్సిందిగా జనార్ధన్‌కు టెలిగ్రామిచ్చాడట! ఇదీ ప్లాష్‌బాక్‌కథ. విమానం రెండుగంటలు అలస్యంగా చేరుకుంది. ఎల్వీరా ఒజోలినాను గుర్తుపట్టడం తేలిగ్గా జరిగింది. తననుతాను పరిచయంచేసుకున్నాక మా అందరినీకూడా పరిచయంచేశాడు ్‌ జనార్ధన్‌. . "శాయీరామ్‌ " అన్నాడు శాయీరాంని పరిచయంచేస్తూ,. ఓ! శాయీరామోవ్‌! " అందామె ఆప్యాయంగా కరచాలనంచేస్తూ,. శాయీరాం ఖంగారుపడి అటూ ఇటూ చూశాడు "మావో గీవో అనకండి, పోలీసులు నన్ను కాల్చిపారేస్తారు" అన్నాడుగొంతు తగ్గించి రహస్యంగా "వ్వాట్‌? పోలీసులు కాల్చివేయుదురా! ఎందులకు? " అడిగిందామె తనునేర్చుకున్న ప్యూర్‌ తెలుగు ప్రయోగిస్తూ "ఏమోనండీ! ఎందుకో ఎవ్వరికీ తెలిదుగాని అలాంటి పేర్పు వినబడినా, పుస్తకాలమోద కనబడినా కాల్చిపారయ్యడం మాత్రం ఖాయం!" "వెరీబాడ్‌! " అందామె. దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా ! 9/

"అలావాళ్ళను 'వెరీబాడ్‌' అని ఇంకో రెండుసార్లన్నారంటే మిమ్మల్ని కూడా కాల్చి పారేస్తారు" అన్నాడు రెడ్డి.

ఆమె కొంచెం భయపడినట్టుంది. ఎందుకంటే ఆతరువాత గోపాల్రావ్‌పేరు పలికేప్పుడు 'గోపాల్‌ అని ఊరుకుంది.

జనార్ధన్‌ టాక్సీపిలిచాడు.

"మీటర్‌మీద ట్వంటీపఫైవ్‌ రుపీస్‌ ఎక్స్‌ట్రా!” అన్నాడు టాక్సివాడు, టాక్సీ మాదగ్గరకు లాక్కొచ్చి.

"వ్వాట్‌, మీటర్‌మీద ట్వంటీపైవ్‌రూపీస్‌ ఎక్స్‌ట్రా? ఎందుకు? ఇక్కడ టాక్సీలకు కరువా?" అడిగింది ఎల్వీరా డైవర్‌ని.

"టాక్సీలకు కరువుకాదుగానీ ఫారిన్‌ టూరిస్పలకు కరువు మేడం!" అన్నాడువాడు.

"వాటీజ్‌దిస్‌ నాన్సెన్స్‌! వీళ్ళ ఇష్టమొచ్చినట్టుచార్జ్‌ చేన్తుంటే మో గవర్నమెంట్‌ ఎఏమిచేయుచున్నాది?” అంది ఆశ్చర్యంగా.

"గవర్నమెంటా? వాట్‌ గవర్నమెంట్‌?” తనూ ఆశ్యర్యపోతూ అడిగాడు రెడ్డి. ఆప్రశ్నకు ఎల్వీరా ఉలిక్కిపడింది.

"అంటే-ఇక్కడ గవర్నమెంటు అనేదే లేదా?” అంది అందరివంకా చూస్తూ! రెడ్డి ప్రశ్నార్ధకంగా శాయీరామ్‌వేపు చూశాడు. శాయీరామ్‌ గోపాల్రావు వంకచూశాడు. గోపాల్రావ్‌ నావంకచూళశాడు. నిజానికి గవర్నమెంట్‌ అనేది ఉందో లేదో నాకూ తెలీదు. ఎందుకంటే ధరలు పెరిగాయని నేనీమధ్య న్యూస్‌పేపర్‌కొనటం మానేశాను ల

"ప్రస్తుతం ఉందో, లేదో తెలీదు మేడమ్‌! మా ఆఫీసులో కోలీగ్స్‌ని అడిగిరేపు ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తాను '' అన్నాను బిడియంగా.

క ఎల్విరా నిర్ధాంతపోయింది.

"వ్వాటేపీపుల్‌ యూ ఆర్‌! గవర్నమెంటు ఉందో లేదో కూడా తెలిదామోకు? మోరు ఎలక్షన్‌లో ఓటు చేయటంలేదా"

“ఇంతవరరూ ఓటెలా ఉంటుందో మాకెవ్వరికీ తెలీదండీ! మమ్మలత్నెవ్వరూఎప్పుడూ ఓటు వేయమని అడగరు."

“మరి ఇం8వర్షి అడుగుతారు?"

“బలహీనవర్గాల కాలనీవాళ్ళనూ, గూడెంలోవాళ్ళనూ, ఇంకా ఇతర బీదా బిక్కీలనూ, చదువురానివాళ్ళనూ అడుగుతారండీ!"

98 - హ్యామరాలజీ

ఎల్వీరా వెంటనే తనపుస్తకంతీసి 'తెలుగు ప్రజలలో బడుగువర్గాలప్రజలే ఎలక్షన్‌లలో క పాల్గొంటారు మిగతా ప్రజలకు అసలు ప్రభుత్వం ఉందోలేదో కూడా తెలీదు అని రాసుకుంది. అదిచదివిమేము మొఖమొఖాలుచూసుకున్నాం.

టాక్సీలో బయలుదేరాం అందరం.

అబిడ్స్‌కి చేరుకున్నాక "ఈ టాక్సీ మెయిన్‌ రోడ్‌ మీదనుంచి నడపకుండా ఇలా సందుల్లోంచి నడుపుతున్నాడేమిటి?" అనడిగింది ఎల్వీరా.

| "ఇది సందుకాదండీ! మెయిన్‌రోడ్డే!' అన్నాడు రెడ్డి. ష "వ్వాట్‌! ఇది మెయిన్‌రోడ్డా?" / "అవునండీ!"

"మరి వెహికల్స్‌ ఇలా ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారేమిటి?"

"ఇక్కడింతేనండీ! ఇలాగే మా కలవాటు!" అన్నాడు శాయీరామ్‌.

అమెవెంటనే తన పుస్తకం తీసి,

"తెలుగు ప్రజలు రోడ్డమీదనడవడం నడపటంచేతకానివాళ్ళు"

అనిరాసుకుంది.

మేమావాక్యం చదవనట్బనటించాం. టాక్సీకొంతదూరంవెళ్ళి ఠక్కున ఆగిపోయింది. రోడ్డుకడ్డంగా కట్టిన షామియానాలో వివాహం జరుగుతోంది.

"ఏమి జరిగింది?" అడిగింది ఎల్వీరా.

"రోడ్డు బ్జాక్‌చేసి పెళ్ళిజరిపిస్తున్నారవరో..."

"పబ్లిక్‌రోడ్‌ బ్లాక్‌చేసి మారేజ్‌ చేస్తూంటే ట్రాఫిక్కంతా ఏమవుతుంది? " ఆశ్చర్యంగా అందామె. |

"మా తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వెవరూ పట్టించుకోరు! ఎవరు ఏ రోడ్‌కావాలంటే ఆ రోడ్‌ని మూసేసి వాడుకోవచ్చు."

"మరి మీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏం చేస్తుంది?"

శాయీరామ్‌ పక పకానవ్వాడు.

"భలేవారే మిరు! అసలు కార్చ్పొరేషన్‌వాళ్ళే రోడ్లుతవ్వేసి మధ్యలో పెద్ద ఆర్చీలు కట్టి ఫలానా ఎంకిగాడికి స్వాగతం అని రాస్తుంటారు, అన్ని రోడ్డమోదా. అలా రోడ్డుఅన్ని సగం బ్లాక్‌ అయ్యే ఉంటాయ్‌ ఎప్పుడూను!" దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా ! 99

ఎల్వీరా ఠక్కున తన పుస్తకం తీసి "“తెలుగుప్రజలు మెయిన్‌ రోడ్లు బ్లాక్‌చేసి పెళ్ళిళ్ళు జరుపుట, "ఎంకిగాడికి స్వాగతం” బోర్జులుకట్టుట చేయుదురు." ( " అని రాసుకుంది. అంత చిన్న విషయంకూడా ఎందుకు రాసుకుంటోందా అని మేము "సైగలు చేసుకుని ఆమె తెలివితక్కువతనానికి నవ్వుకున్నాము. టాక్సీ వెనక్కు నడిచి అయిదు కిలోమీటర్లు ఎక్కువదూరం తిరిగి మాకాలనీకి చేరుకుంది. కాలనీ చివరి ఇంటిదగ్గర బోలెడుమంది గుమికూడి ఉండటం చూచింది ఎల్వీరా. "అక్కడెందుకు అంతమంది గుమిగూడారు?" అడిగిందామె. "న్యూస్‌పేపరు కోసం! మా కాలనీలో ఆ చివరింటాయన ఒక్కడే న్యూస్‌పేపరు తెప్పిస్తాడు. మిగతా అందరూ ఆయన దగ్గర తీసుకుని చదువుతారు" చెవ్పాడు జనార్ధన్‌. "అదేమిటి? ఎవరి పేపర్‌ వాళ్ళు కొనుక్కోవచ్చు గదా!" "కొనుక్కోవచ్చనుకోండి! కానీ అలవాటు లేదు.” ఆమె వెంటనే తన పుస్తకంతీసి- తెలుగువాళ్ళు అందరూ పక్కింటి వాళ్ళపేపర్హూ, మాగజైన్లు చదువుతారు. అనిరాసుకుంది. "భలేగుందే! ఇంత మైన్యూట్‌ డిటైల్స్‌ కూడా రాసుకుంటున్నారు " అన్నాడు గోపాల్రావ్‌ ఆశ్చర్యంగా. ఆమె చిరాగ్గా చూసింది. అందరం జనార్ధన్‌ ఇంటికి చేరున్నాం. "ముందు నేను స్నానం చేయాలి! బాత్‌రూమ్‌ ఎక్కడ?" అడిగిందామె. అందరం ఘల్లున నవ్వాము. ఎల్వీరా మమ్మల్ని పిచ్చివాళ్ళను చూసినట్లు చూసింది. . "ఐమిటలా నవ్వుతున్నారు?" అంది టవల్‌ భుజాన వేసుకుంటూ "ఇవాళ ఆదివారం కదా! మరి స్నానం చేస్తానంటారేమిటి? ఇక్కడవారానికి నాలుగు రోజులోనీళ్ళు వస్తాయి. అంచేత నాలుగురోజులే స్నానంచేయాలి. " వాట్‌? వారానికి నాలుగురోజులేనా? "వాటే హోప్‌లెస్‌ పీపుల్‌ యూ ఆర్‌!" అందామె చిరాకుగా. అని పుస్తకం తీసి తెలుగు ప్రజలు వారానికి నాలుగు రోజులే స్నానంచేయుదురు అని రాయబోయింది గాని శాయీరామ్‌ అడ్డుపడ్డాడు. 100 హ్యామరాలజీ

"దయచేసి అదంతా రాయకండి! ఎందుకంటే నేను చెప్పేది వేసవిలో సంగతి. అదీగాక క్ష . తెలుగు ప్రజలు ఇంకా నయమండి! తమిళప్రజలు వారానికి మూడుసార్ల చేస్తారు" అన్నాడు రెడ్డి

అందరం తలోకొంచెం నీళ్ళు దానం చేశాము ఆమె స్నానానికి.

మా అందరికీ గోపాల్రావ్‌ వాళ్ళింట్లోనే భోజనం ఏర్పాటుచేశాడు.

"కేవలం తెలుగుభోజనమే తింటాను" అని ముందే ఎల్వీరా చెప్పటంచేత తెలుగు

వంటకాలే చేయించారు. ఎల్వీరా అన్నం మొదటిముద్దనోట్లో పెట్టుకోగానే పటపటమన్న శబ్టాలు వినిపించాయ్‌. / "స్టోన్స్‌" అంటూ అరచి బయటకు పరిగెత్తి అన్నం ఊసివేసిందామె

"ఈవిడ వ్యవహారం మరీ విడ్డూరంగా ఉందే! రాళ్ళు ఉండకుండా ఎలా ఉంటాయ్‌?' అన్నాడు గోపాల్రావ్‌ రాళ్ళుమింగేస్తూ,.

“అన్నంలో రాళ్ళు మామూలు విషయమేనందీ! ఖంగారుపడవద!' చెప్పాడురెడ్డి.

"నోనో! నావల్లకాదు. నాకు బైడ్‌ తెప్పించండి!" అందామె.

క "బైెడ్‌లో కూడా రాళ్ళుంటాయ్‌!" అన్నాడు జనార్ధన్‌. "ఇలా అన్నిట్లోరాళ్ళు కలుపుతుంటే మో గవర్నమెంట్‌ ఎంచేస్తోంది? " "గవర్నమెంట్‌ ఎమిటి?" మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి,

ల ఆమె రెండుచేతులతో తల పట్టుకూర్చుంది.

క్ష "రుక్ష్మిణీ!” అంటూ భార్యనుపిలిచాడు గోపాల్రావ్‌.

"ఏమిటండీ!" చేతులు తుడుచుకుంటూ వంటింట్లోనుంచి వచ్చిందామె. 'నువ్వు నిన్న పక్కింట్లోనుంచి పేపర్‌తెచ్చి చదివినట్టున్నావ్‌ కదా! గవర్నమెంట్‌ ఉందీలేందీ ఏమయినారాశారా అందులో?"

"భలేవారే! గవర్నమెంట్‌ లేకపోవటం ఎమిటి? ఉందని జనార్ధన్‌ అన్నయ్యగారి భార్యకూడా అందినిన్న."

“"ఎది-ఆవిడనోసారి పిల్చుకురండి! సరిగ్గా కనుక్కుందాం!" అన్నాడు జనార్ధన్‌.

జనార్ధన్‌ భార్య రెండునిమిషాల్లో వచ్చింది.

"ఎమే? రుక్ష్మిణమ్మగారితో నువ్వు గవర్నమెంట్‌ ఉందన్నావా? "

“అవునూ!ఎం? " ( దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా! 101

"'నీకెలాతెలుసే ఆవిషయం?"

"బాగుందండీ! రోజు రోజుకీ ధరలు ఎరిగిపోతూంటే తెలియటంలేదూ? గవర్నమెంట్‌ ఈ లేకపోతే ధరలెలాపెరుగుతాయ్‌? "

"నిజమే!" ఒప్పుకున్నాడు శాయీరామ్‌,

"ఓ! అయిళథే గవర్షమెంట్‌ ఖచ్చితంగా ఉందన్నమాట!" అంది ఎల్విరా. ఆమెరెండు అరటిపళ్ళుతిని చేయి కడుక్కుంది. మధ్యాహృ్మంవరకూ తెలుగు ప్రజలగురించి ఎన్నో

ప్రశ్నలువేసి వివరాలు సేకరించిందామె.

(1) భర్తలను పశువులసంతలోవలె కొనుక్కొనుట విరిఆచారము. (2) మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నియో పిల్లలను కనుట వీరి ఆచారము.(3)...... గ

ఇలా చాలా విషయాలు ఆమెరాసుకుంటూటే నేను దొంగతనంగాచదివాను. (అవన్నీ మరోసారి మనవి చేసుకుంటాను.) మధ్యాహ్నం మా ఇంట్లో టీ పార్టీ.

టీ తాగుతుండగా కాలనీ మధ్యవరుసలోని ఇంట్లో పెద్ద కేకలు వినిపించినయ్‌, మరుక్షణం కాలనీలో చాలామంది అక్కడకు పరుగెత్తారు. (

మేమూ, ఎల్వీరాకూడా అక్కడకు చేరుకున్నాం. సంగతేమిటో మాకు ముందుగానే తెలిసిపోయింది.

కిరాతకరావు తన భార్యను రోజూచావగొట్టడం కాలనీలో అందరికీ తెలిసిన విషయమే! ఆమెను వుట్టింటినుంచి ఏవేవో ఖరీదయిన వన్తువులు తెమ్మని అతన్హూవాళ్ళమ్మా " నానాహింసలు పెడుతుంటారు,

మేము వెళ్ళేసరికి పూర్తిగా కాలిపోయిన కిరాతకరావు భార్యశరీరాన్ని గది తలుపులు పగులగొట్టి బయటకు తీసుకొచ్చారు కొంతమంది.

మరికాసేవట్లో టాక్సీమోద చావుబతుకుల మధ్య ఊగినలాడుతున్న అమెని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు.

"వాట్‌ హాపెన్ట్‌? " ఆందోళనపడుతూ అడిగింది ఎల్వీరా.

"ఆ! మామూలే! కొత్తగా పెళ్ళయింది. భార్యనుచంపేస్తే, మళ్ళీ బోలెడు కట్నంతీసుకుని పెళ్ళిచేనుకోవాలని-అలా చేస్తున్నాడు" చెప్పాడు జనార్దన్‌.

"మైగాడ్‌! మీ వాళ్ళు మనుషులా జంతువులా?” అందామె కోపంగా. 102 . హ్యామరాలజీ

ఇంటికి చేరుకోగానే పుస్తకంతీసి "తెలుగు ప్రజలలో చాలామందికి భార్యలను | కిరసనాయిలుపోసి తగలబెట్టుట ఆచారము." అని రాసుకుంది. మరి కాసేపుమిగతా ఆచారాలగురించి తనకు తెలియని విషయాలు వివరంగాచెప్పాడు శాయీరామ్‌. “మో తెలుగు సినిమా ఒకటిచూడాలి ఇవాళ!" అందామెకాసేపాగి. "ఓ యస్‌! మేమూ సినిమాచూసి చాలారోజులయింది పదండి!” అన్నాడు గోపాల్రావ్‌. అందరం రోడ్డుమీదకొచ్చాం. టాక్సీఖాళీగా కనిపించింది శాయీరాం డైవరుతోమాట్లాడాడు. "చాలిస్‌ రూపయాదేదో! అన్నాడు టాక్సీవాడు. ధ "నలభైఎందుకు? పదిహేనిస్తా!"

  • “పంద్రా?పంద్రా రుపయా ? హామ్‌ భీక్‌మాంగ్‌నేవాలోంకో దేతే-" / "అతను మాట్టాడేది ఎభాష?" అనడిగింది ఎల్వీరా. "ఉర్దూ!" “ఓ|ఐసీ1!" అందరం బస్‌స్తాపులొ నిలబడ్డాం బస్సువచ్చి ఆగింది. పుట్‌బోర్డుమీద యాభయ్‌మంది వేలాడుతున్నారు. బస్సు లోపలమాత్రం అన్నిసీట్లూ ఖాళీగా ఉన్నాయి. .. మేము ఆపుట్‌బోర్జ్డుమీద జనాన్ని తోసుకుంటూ లోపలికెక్కడానికి ప్రయత్నించాం జ గానీ మావల్లకాలేదు. బస్సువెళ్ళిపోయింది. "వాటీజ్‌దిస్‌? లోపలఖాళీ ఉండగా వీళ్ళంతా పుట్‌బోర్డ్‌ మీదే ఎందుకు నిలబడ్డారు?" ఆశ్చర్యంగా అడీగిందామె. "వుట్‌బోర్డ్‌టావెలింగ్‌ మా కాపిటల్‌ వ్రజలహాబీ! అందుకే త్వరలో కేవలం ప్పట్‌బోర్జులతోనే కొత్తరకంబస్సు తయారుచేస్తున్నారు " చెప్పాడురెడ్డి. ఆమెవెంటనే తనవున్తకంతీసి "వుట్‌బోర్డుమీద పప్రయాణించుట తెలుగు ప్రజలహాబీలలో ఒకటి" అనిరాసుకుంది. మరో రెండుబస్‌లు ఆగకుండా పోతూనే ఉన్నాయ్‌ చివరకు ఓబస్‌అపాడు. "కిదర్‌ జానా?" అడిగాడు కండక్షరు.. “నారాయణ్‌గూడా. " దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా ! 103

"కిత్నేట్‌కెట్‌? "ఛేట్‌కెట్‌-” అంటూ అయిదురూపాయలనోటు ఇచ్చాను. కండక్టర్‌నోటువంకచూసి ( చిరునవ్వునవ్వి నా చేతికి నాలుగురూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. "వాటెబౌట్‌ టికెట్స్‌?" అంది ఎల్వీరా ఆశ్చర్యంగా. "సాధారణంగా ఇక్కడ టికట్టివ్వరులెండి! దిసీజ్‌ నార్మల్‌" ఫ్రాంక్‌గా చెప్పేశాను. "ఓమైగుడ్‌నెస్‌! " అందామె అశ్చర్యంగా. అతరువాత ఆరష్‌లోనే పుస్తకంతీసి ఎదోరాసుకుంది. "తెలుగువాళ్ళు అవినీతిపరులు అనిరాసుకుందేమో!” అన్నాడు శాయీరామ్‌ నా చెవిలో. సినిమాహాలుకి చేరుకున్నాం. | "ఈహీరో పేరేమిటి?" హాల్‌ బయటవున్న పెద్దకట్‌అవుట్‌ని చూస్తూ అడిగిందామె. "రాబేష్‌కుమార్‌! తెలుగులో సూపర్‌స్టార్‌! అతను నటించిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయ్‌ '' చెప్పాడురెడ్డి, "ఓ ఐసీ! ఏం సినిమాలవి?" కుతూహలంగా అడిందామె. "అల్డుడేమేనత్తమొగుడు! సింహంరక్కింది! దగుల్బాజీ వెధవ...." “ఆగండాగండి! అరిచిందామె. " "ఎమిటి?" అడిగాడు జనార్ధన్‌ ఆగి. "అల్లుడే మేనత్తమొగుడు అంటే ఎమిటి?" "అంటే... అంటే సన్‌ ఇన్లా ఓన్లీ ఈజ్‌ ఆంట్స్‌ హజ్‌బెండ్‌." "అంటే?" మళ్ళీ అడిగిందామె. "అంటే...అంటే.... అదే!" "కానీ అదెట్లాకుదురుతుంది? మీ తెలుగులో అ వరసలు ఉండవుగా?" "అబ్బ్చే-అలాంటివేమీ చూడరండీ మావాళ్ళు! టైటిల్‌ కొత్తగా ఉండాలి-ప్రాస కుదరాలి! అంతే." "మిగతా అవార్డుఫిలిమ్స్‌ ఏమిటి?" "సింహంరక్కింది-దగుల్పాజీ వెధవ- తీటగాడు." "దగుల్పాజీ! వాటీజ్‌ దగుల్పాజీ-" "అంటే వట్టిరోగ్‌ అన్నమాటంగడీ! - 104 హ్యామరాలజీ

"వెధవ అంటే?" / "అంటే వట్టివెధవ అని అర్ధం." గోపాల్రావ్‌ టికెట్టు తీసుకొచ్చాడు. "తీటగాడు అంటే ఏమిటి?” అడిగింది ఎల్విరా. "అంటే-అంటే తీటగాడేనండీ” ఆలోచించి చెప్పాడు జనార్దన్‌. అందరం హాల్టోకళ్ళి కూర్చున్నాం. సినిమా బైటిల్స్‌ వస్తున్నాయి. 0 వక్రవీర ప్రొడక్షన్స్‌ సమర్పించు- 'తెడ్డిపాలెం గిడ్జిగాడు' అన్న అక్షరాలను అతి కష్టం మీద చదివింది ఎల్వీరా. / "తెడ్డిపాలెం గిడ్డిగాడు అంటే ఏమిటి?" అడిగిందామె రెడ్డిని, రెడ్డి ఓ క్షణం ఆలోచించి "అపేరుకి అర్ధం ఏమిట్రా?" అంటూ శాయీరామ్‌ని అడిగాడు. శాయీరామ్‌ రహస్యంగా నన్నడిగాడు. నేను రెండు నిమిషాలు ఆలోచించి “"తెడ్డిపాలెం అంటే ఓ ఊరన్నమాట! అందులో గిడ్జిగాడు! అదీ నంగతి" అనిచెప్పాను. "ఓ! కాని, గిడ్డిగాడు అంటే ఏమిటి" మళ్ళీ అడిగిందామె. నాకేం చెప్పాలో తెలీలేదు. "గిడ్జిగాడూ... మీన్స్‌....మీన్స్‌...." అని గోపాల్రావవేపు | చూశాను. క "గిడ్జిగాడంటే.... ఇది" అన్నాడు గోపాల్రావ్‌ సరయినపదం కోసం వెతుకుతూ "ఇదంటే?" "ఇదంటే అదే-ఇది! నిజం చెప్పాలంటే నాకూ సరిగ్గాతెలీదు" అనేశాడుచివరకు. "అయ్‌ టూ డోన్ట్‌నో!" అన్నాడు జనార్దన్‌. "వ్వాట్‌! గిడ్డిగాడు-తెలుగుపదమే కదా!" అడిగింది ఎల్విరా. "అఫ్‌కోర్స్‌ అఫ్‌కోర్స్‌" అన్నాం అందరం! "మరి మీ మదర్‌టంగ్‌ తెలుగయి ఉండి ఓ తెలుగు పదానికి అర్ధం తెలీదా? వెరీబాడ్‌!" అందామె పుస్తకంతీస్తూ,. "ఆగండాగండి! నిజానికిది తెలుగుకాదండీ?" "మరే భాష?" దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రపష్వా! 105

“అసలే భాషాకాదండీ! అర్ధంలేని మాట."

"మరి ఈ సినిమాకు అవార్డు కూడా వచ్చిందన్నారు. సిల్వర్‌ జూబ్లీఫిలిం ( అన్నారు-ఇలాంటి సినిమాకు అర్ధంలేనిపిచ్చిపేరు ఎలా పెట్టారు?

"మా తెలుగు సినిమాలు అంతేనండీ! సాధారణంగా టైటిల్‌కి అర్ధం ఉండదు" ఆమె వెంటనే పుస్తకంలో ఏదేదోరాసుకుంది.

"ఇందాక 'సింహంరక్కింది' అనేది మరో అవార్డ్‌ పికృరన్నారుకదా! దానర్ధం ఎమిటి?"

"అంటే హీరో సింహం అన్నమాటండీ! అతను అందరినీ రక్కేస్తూంటాడు?”

"అంటే అడవిమనిషా?"”

"కాదనుకోండి! నాగరికుడేగానీ రక్కేస్తుండటం వాడికిష్టం!”

"కానీ చేతులో మామూలుగా ఫైట్‌చేయవచ్చు కదా! రక్కటం ఎందుకు?"

"టెటిల్‌ ఎలా వుంటే అలా చేస్తారండీ మా తెలుగు హీరోలు! చెయ్యకపోతే జనం చూడరు!" "

“అవునండీ! వేటకుక్క అనేపిక్చర్లో మొదట్నుంచీ చివరివరకూ హీరోవిలన్లు అందరినీ కుక్కలా కరున్తూనే ఉన్నాడు 'రాబందు రాక్షని' సినిమాలో హీరోనోటితో అందరినీ చీల్చితినేశాడు. 'భల్లూక భన్మం' సినిమాలో హీరో భల్తూకంలా నడిచి గోళ్ళతో పాడుస్తుంటాడు."

"వెరీ స్ట్రేంజ్‌' అందామె తన పుస్తకంతెరుస్తూ,.

"తప్పదండీ! అడవిమృగాల పేర్లకే ఎక్కువగిరాకి! వాటికోసమే జనం ఎగబడతారుగానీ " మా హీరోలకోసంకాదు" సిగ్గుపడుతూ చెప్పాడు గోపాల్రావ్‌. ఆమె పుస్తకంలో ఎదోరాసేసింది.

సినిమా మొదలయింది.

హీరో విలన్లు ఫైటింగ్‌ మొదలు పెట్టారు.

“ఏమిటి వాళ్ళెందుకలా కొట్టుకుంటున్నారు?" ఆత్రుతగా అడిగింది ఎల్వీరా.

“సాధారణంగా ఫలానాకారణం అంటూ ఏమీ ఉండదు. ప్రతిపావుగంటకూ ఓ ఫైటింగు ఉండటం మామూలే!”

ఆసీనయిపోయింది,.

హఠాత్తుగా హీరో హీరోయిన్‌ వెనుకపడి పాట మొదలెట్టాడు.

“వంగతోటలో వంగమాకు-దొండతోటలో పడబోకు రెండూ జాగ్రత్త పిల్తా.... 106 హ్యూమరాలజీ

జనం కుర్చీల్లోనుంచి తప్పట్లు కొట్టారు.

“వాటీజ్‌దట్‌ ?” ఆశ్చర్యంగా అడిగింది ఎల్వీరా.

“ఆపాట సాహిత్యం వాళ్ళకు నచ్చిందికాబోలు...' అన్నాడు శాయీరామ్‌. “దానర్ధం ఏమిటో?”

మాకేం చెప్పాలో తెలీదు.

“అది డబుల్‌ మీనింగు సాహిత్యం.

“అంటే?”

క్ష “అంటే రెండర్థాలసాహిత్యం అన్నమాట ఒకటి మంచింది రెండోది బూతు

/ “మైగుడ్‌ నెస్‌! అలాంటి సాహిత్యం మీ తెలుగు ేక్షకులు విని అనందిస్తారా?

“అందరూ కాదండీ! చాలామంది...” ఆమెను సరిచేశాడు జనార్ధన్‌.

“మరి అలాంటి చెత్తసాహిత్యం మీ గవర్నమెంట్‌ బాన్‌చేయదా? "గవర్నమెంట్‌ ఉందోలేదో ఖచ్చితంగా తెలీదుకదండి-రేపు మా ఆఫీసులో అడిగిచెప్తా” “అయినా అది సెన్సార్‌ వాళ్ళుచేయాల్సినపనికాదా" అన్నాడు రెడ్డి. "మరి చేయరీ" అడిగింది ఎల్వీరా. "వాళ్ళకి పాపం సాహిత్యం తకెలియదండీ! ఆసలు చాలామంది సెన్సార్‌మెంబర్లకి తెలుగుకూడా రాదు! వచ్చినకొద్దిమందీ కూడా బూతుయాక్షనే అభ్యంతరకరమయిన సాహిత్యం అనుకుంటారు."

క "అదేమిటి? అంత తెలివితక్కువ వాళ్ళను సెన్సార్‌మెంబర్లుగా ఎలావేస్తారు?" "అదిసరిగ్లా తెలిదుగానండీ, మొత్తానికి అలాగే మానేజ్‌ చేస్తారు." మరికొంతసినిమా అయింది.

హఠాత్తుగా జనం పెద్దఎత్తున హర్షధ్వానాలుచేశారు.

"వాటిజ్‌దట్‌! వాట్‌హేపెన్ట్‌? ” ఆశ్చర్యంగా అడిగింది ఎల్వీరా."మరేంలేదు!కెమెరా హీరోయిన్‌ బొడ్డుమీద ఫోకస్‌ అయింది అందుకని."

వాటే పోర్నోటైబ్‌ యూఆర్‌..." అసహ్యంగా మొఖంపెట్టి అందామె. మరుక్షణంలో హీరో గ్రూప్‌ డాన్స్‌.

"జజ్జునకా జన్‌! జింగినక..." మళ్ళీ (పేక్షకులు తప్పట్లూ ఈలలు.

“ఏమిటి ఈచరణానికి అర్దం?" అడిగింది ఎల్వీరా.

“దీనిక్కూడా అర్ధం ఏమీలేదండీ! దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా ! 107

"మరివాళ్ళలా తప్పట్లూ, ఈలలు ఎందుకు వేస్తున్నట్లు?"

"ఏమో తెలీదుగానీ ఎప్పుడూ ఇలాంటి పాటలకు వేస్తుంటారు.-"

"అంటే మీ తెలుగు పాటలు సాహిత్యమంతా బూతుగానీ, అర్ధంలేని మాటలతో గానీ ఉంటుందన్నమాట! మరి నేను చదివిన పుస్తకాల్లో తెలుగు కవిత్వాన్ని గురించి అంతగొప్పగా రాశారేమిటి?"” అంటూ పుస్తకం తెరచి “తెలుగు ప్రజల సాహిత్యమంతా అర్ధంలేనిది. ఒకవేళ అర్ధం ఉంటే అది బూతుది.” అనిరాసుకుంది.

పాట అయిపోయింది.

కామెడీజంట వచ్చారు.

హీరో ఆమె దగ్గరకెళ్ళి "నాకు అదిస్తావా?" అన్నాడు

జనమంతా ఘెల్లున నవ్వారు.

"ఏమిటి మళ్ళీ నవ్వుతున్నారు?"

"బూతు డైలాగండీ!” సర్దిచెప్తూ అన్నాడు శాయీరామ్‌. రెండునిమిషాలపాటు బూతుమాటలు మాట్లాడాక పాట మొదలయింది.

"మన తనువులు కలిసేదెక్కడ?" పాటలోనే ప్రశ్నించింది హాస్యనటి.

"ఇక్కడా?" అంటూ పెదాలు చూపించాడు కమెడియన్‌.

"కాదు!" అందామె.

"ఇక్కడా?" అంటూ అమె గుండెలు చూపించాడతను. (పేక్షకులు మళ్ళీ అరుపులు ఈలలు.

"ఇక్కడా?"

“ఉహు! ఇక్కడ!"

అతను చూపించిన శరీరభాగం చూసి మొత్తం హర్షంతో కేకలువేసి డాన్స్‌ చేసినంతపనిచేశారు. తరువాత సీన్‌లో హీరోయిన్‌ తాలూకూ చిన్న పాపాయిని చంపటానికి విలన్‌ అర్ధరాత్రి కత్తితీసుకుని గదిలోకొచ్చాడు. ఈ సంగతితెలిసి ఊరిబయటపుట్టలో ఉన్న పాముగంటకు ఎనఖై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుకొచ్చి, కిటికీలోనుంచిదూరి, ఉయ్యాల మీదకెగిరి కత్తితో పోడవబోతున్న విలన్‌ చేతిని కసుక్కున కాటేసింది.

విలన్‌ పెద్దగా అరుస్తూ కిందపడ్డాడు. హీరోయిన్‌ పరుగుతో వచ్చి, ఆదృశ్యం చూసి

._ పాముతల ఆప్యాయంగా నిమిరి ముద్దు పెట్టుకుంది. 108 హ్యామరాలజీ

"వాటీజ్‌దిస్‌ నాన్సెన్స్‌?” అసహనంగా అడిగింది ఎల్వీరా. | "ఈ సినిమా ఇంకా నయమండీ! గొర్రెపోటెళ్ళు ఎద్దులు, ఆవులు గాడిదలు పిల్లులు, బొద్దింకలు, ఎలుకలు ఇవన్నీ కూడా మా సినిమాల్లో హోరున యాక్షన్‌ 'చేస్తాయండీ! హీరోయిన్‌కిగానీ, హీరోకిగాని సహాయం చేసి విలన్లను చంపిపారేస్తాయ్‌" చెప్పాడు గోపాల్రావ్‌. "మీకు తెలీదనుకుంటాను. ఈమధ్యనో తెలుగుపిక్చర్లో హీరోయిన్‌ రెండుతూనీగల్ని పెంచుతుంది. బాత్‌రూమ్‌ కెళ్ళినా-కాలేజీకెళ్ళినా ఎప్పుడూ ఆమెనే అంటిపెట్టుకుని ఉంటాయన్నమాట అవి! ఓవిలన్‌ సినిమా అంతా ఆమెని నానాబాధలు పెడుతూ చివర్లో రేప్‌ చేయబోతుంటే ఆరెండుతూనీగలు ఆవిషయం తెలుసుకుని కోపంగా ఎగిరి విమానాల్తా వాడిని ఛేజ్‌చేసి చివరకి వాడి మీదపడి రెండు కళ్ళూ పీకేస్తాయ్‌-కేవలం ఆసీనుకోసమే నూట ఇరవై ఆర్రోజులు ఆడింది ఆసినిమా!” చెప్పాడు శాయీరామ్‌. "ఇంక వెల్దామా?" అడిగింది ఎల్వీరా వాంతి అపుకుంటున్నట్టు మొఖంపెట్టి.- హఠాత్తుగా హాల్లో వున్న ఆడాళ్ళందరూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. “ఎమయింది? వాళ్ళెందుకు ఏడుస్తున్నారు?" ఖంగారుగా అడిగింది ఎల్వీరా. | "ఆడాళ్ళు ఏడవటానికి ఆఖరులో సెంటిమెంట్‌ సీన్లుపెడతారండీ! భర్తకాళ్ళు కళ్ళకద్దుకుంటూ ఏడ్చేసీన్ను, భర్తామెను చావగొట్టి పీక పిసుకుతున్నా 'పతియే ప్రత్యక్షదైవం. _ ఆదైవం కాదంటే ఉరియే అత్యంత ప్రియం" అని పాడటం, తననొదిలేసి ఇంకో స్త్రీతో సంసారం చేస్తున్న భర్తకోనం, జీవితాంతం పాటలు పాడుతూ ఎదుర్పూడటం, భర్త ఇంకెవర్షయినా ప్రేమిస్తే-తనే వాళ్ళిద్దరికి పెళ్ళిేచేయడం ఇలా చాలా బావుంటాయ్‌ సీన్లు-" "చాలు! చాలు" అంది ఎల్వీరా వికారంగా మొఖం పెట్టి. "అయినా మగాడిని ఇక్కడి స్రీలు దేవుడు అంటారేమిటి? ఇది నేనెక్కడా చూళ్ళేదు-" అందామె. "నేను చూశాను" అన్నాడు రెడ్డి తెలుగువాళ్ళను ఆమె అలా ఇన్సల్దుచేయటం భరించలేక. ఎక్కడ? "ఏమో గుర్తులేదు.! పాకిస్తాన్‌లో అనుకుంటాను!” అంటూ తప్పించుకున్నాడు. అందరం హాలు బయటకొచ్చేశాం రోడ్డుమీద ట్రాఫిక్‌ అంతా ఆగిపోయివుంది. "మళ్ళీ ఎమిటి? రోడ్డుమీద పెళ్ళా?" చిరాకుగా అడిగిందామె. దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా | న 109

'._ గోపాల్రావ్‌ జనంలోంచీ ముందుకు చొచ్చుకెళ్ళి సంగతి కనుక్కొచ్చాడు. ఏదో నబ్బుల కం పెనీవాళ్ళు-కొత్తగా తయారుచేసిన సబ్బు పబ్లిసిటీ కోసం వంద తాబేళ్ళను అలంకరించి. . రోడ్డుమీద బాండ్‌మేళంతో ఊరేగింపుగా నడిపిస్తున్నారు. పాపం తాబేళ్ళు కొంచెం స్లోకదా! అందుకని ట్రాఫిక్‌ నిలచిపోయింది. గంటసేపటితర్వాత తాబేళ్ళు పదిగజాలదూరంలో వున్న సెంటర్‌ దాటాయి. ఆతాబేళ్ళ వెనకే వెడుతున్న బస్‌ ఎక్కాం అందరం. "ఇలా ఆ సబ్బుల కంపెనీవాళ్ళు ట్రాఫిక్కంతా జామ్‌చేశేస్తుంటే మీ పోలీసులేం చేస్తున్నారు?" అడిగింది ఎల్వీరా. "పోలీనులా? అవును! నిజమే! పోలీసులేం చేన్తున్నారు?" అన్నాడు రెడ్డి కూడా ఆలోచిస్తూ. “పాపం! పోలీసుల్నేం అనకండి! వాళ్ళకి తీరికేది? మినిష్టర్ల ఇళ్ళకికాపలా వుండాలి కాబరేడొన్సులు రోజూ చూసి, ఎప్పుడయినా ఓసారి కేనులు పెట్టాలి. దగ్గరుండి వీడీయోపార్లర్లలో బ్లూ ఫిలిమ్స్‌వేయించాలి. ఎవరయినా 'వేయం' అని ఎదురుతిరిగితే దొంగకేసులు పెట్టాలి. వాళ్ళ అభిప్రాయాలతో ఎకీభవించని వాళ్ళను 'నక్సలైట్లు' అని అరిచి కాల్చి పారెయ్యాలి.మా బస్‌ రాత్రి పన్నెండింటికి తాబేళ్ళ ఊరేగింపు ముగిశాక, స్పీడ్‌గా పరుగెత్తి మమ్మల్ని కాలనీకి చేర్చింది. అందరంరాళ్ళు తక్కువగా వుండేగోధుమ రొట్టెలు తిన్నాం. "అబ్బ! నిదరొస్తోంది! గుడ్‌నైట్‌' అంది ఎల్వీరా. ” "అప్పుడే గుడ్‌నైట్‌ చెప్తన్నారేమిటి?" రెండింటివరకూ మేలుకోవాలి కదా!” అన్నాడు గోపా(లావ్‌. “ఎందుకు? ఆశ్చర్యంగా అడిగిందామె. ( “రెండింటికి దొంగలాస్తారు ఊరి బయటకాలనీలకు! వాళ్ళొచ్చేబైముకి తలుపులు తెరిచీ ఆహ్వానించకపోతే కాల్చిచంపేస్తారు." “దొంగలకోసం తలుపులు తెరిచి ఆహ్వానించాలా? ఎంతఘోరం?" "ఒకప్పుడు చాలా ఘోరమేననుకోండి! కానీ ఇప్పుడు అలవాటుపోయింది"” "మరి పోలీసులేం జేస్తు...సారీ! ఇందాకే చెప్పారుకదా!" రెండింటికి కాలనీలో ఓ ఇంటికి దొంగలాచ్చి వెళ్ళాక- అందరం గుడ్‌నైట్‌ చెప్పుకుని లేవబోతూంటే బయటినుంచి కేక వినిపించింది. 110 హ్యామరాలజీ

"పేపరు ఎవరి దగ్గరుంది మాష్టారూ?”

"ఎవరది?" అడిగింది ఎల్వీరా. ఆకేక ఎవరువేస్తారో మా అందరికీ తెలుసు. చివరింటి రామచంద్రం తాలూకు రోజువారి కార్యక్రమం అది. మా కాలనీలో అతనొక్కడే న్యూస్‌పేపర్‌ కొంటాడు. పేపరు రాగానే పక్కింటి అతను తీసుకుంటాడు. ఆతరువాత ఆపక్కింటి అతను. అలా తిరిగి తిరిగి ఎక్కడో వుండిపోతుంది. రాత్రి ఎనిమిదింటికి ఆఫీసునుంచి వచ్చాక ఆపేపర్‌కోసంగాలింపు మొదలుపెడతాడు, రామచంద్రం. ఇంటింటిముందు అరున్తూ

తిరుగుతాడు. కానీ ఇప్పుడా విషయంచెస్తే ఎల్వీరా తన పుస్తకంలో తెలుగు వాళ్ళు ! పక్కింటివాళ్ళ పేపరు చదవటమే కాకుండా, మళ్ళీ తిరిగి ఇవ్వరు.'' అని రాసుకుంటుంది. / అందుకే మేము నిజం చెప్పలేదు. "అతనెవరో పిచ్చాడులెండి! రోజూ అలాగే అరుస్తూంటాడు” అని చెప్పాను. అప్పుడే పోలీస్‌వ్యాన్‌ ప్రకటనలు చేస్తూ కాలనీలోకొచ్చింది. “ "జంట నగరాల్లో కల్లోలాలు జరగటంవల్ల రేవు ఉదయం ఆరుగంటలనుంచీ నిరవధికంగా కర్ఫ్యూ విధిండమైనది. ప్రజలందరూ గమనించప్రార్ధన."

'కర్ఫ్యూనా" ఆందోళనగా అడిగింది. “అది మామూలేలెండి. మేము తరచూ కర్ఫ్యూలోనేవుంటాం" అన్నాడు శాయీరామ్‌.

ఆమె వెంటనే తన పుస్తకంలో,"తెలుగుప్రజలు ఎక్కువకాలం కర్ఫ్యూలోనే

గడుపుదురు." అని రాసుకుంది. "ఇంక నిద్రపోండి" అన్నాడురెడ్డి.

"నోనో!నేను ఇప్పుడే ఎయిర్‌పోర్టుకెళ్ళిపోతాను" అందామె.

/ “అదేమిటి? " | "నా స్టడీ అయిపోయింది ఇంకిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను!" అంది అందరం ఆమెతోపాటు ఎయిర్‌పోర్టుకు బయల్టేరాం.టాక్సీవాడు "సౌరువయా దేనా" అన్నాడు. "అస్సీరుపయా" అన్నాడు గోపాల్రావ్‌. చివరకు బేరంకుదిరింది.

"తెలుగు ప్రజలు ఉర్పూమాట్లాడుదురు." అని రాసుకుంది ఎల్వీరా మేము చూసికూడా చూడనట్లు వూరుకున్నాం. స్తో దట్‌ వుమన్‌ ఫ్రమ్‌ రష్యా |! 111

నిరంంహారటీక లేక బగారా బెగన్‌ పలు! బాతూ గ గదోక్‌,! /5 ౧1 శ "త || గ లు / తూ కతా కా కంది మననం (క్రినో కా క మా నిర్భయ్‌ నగర్‌ కాలనీ ఎప్పుడూ ఏదొక సందడిగా ఉండటం మామూలేకదా! అందులోనూ అలా వారానికొకసారయినా సందడిగా ఉండేట్లు చేయడం మాకాలనీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శాయీరాంకి మరీ సరదా! వీధి కుక్కల్నిపట్టి బండిలోపడేస్తూ వేటాడే మున్సిపల్‌ బండిలాంటి ఆర్రీసిబస్సులో పడి అప్పుడే ఆఫీసునుంచి ఇంటికి చేరుకున్నాను. స్నానం వగైరాలుముగించి ఇలా 'టీ' తాగి అలా న్యూస్‌పేపరు పక్కింటాయనను అడిగి తెప్పించుకున్నానో లేదో శాయీరామ్‌ హడావుడిగావచ్చేశాడు. "త్వరగా పదగురూ! మిటింగుంది!” అన్నాడు గడపలో నిలబడి. "మళ్ళీ ఎంమీటింగు?” చిరాకుగా అడిగాను. 112 హ్యూమరాలజీ

"మన కాలనిరోడ్డ అధ్వాన్నపుస్థితిని గురించి మనం తీసుకోవాల్సిన చర్యలకోసం మీటింగు ఎర్పాటుచేశాంకదా! త్వరగా పద! అందరూ వచ్చేశారు." ఇంక తప్పదని లేచి బయట్టేరాను.

అప్పటికే జనార్ధన్‌ మైక్‌ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు.

"కాలనీవాసులందరికీ నమస్కారం! సోదరులారా! మన కాలనీరోడ్డువేసి ఎంత కాల మయిందో ఎవరికీ తెలీదు. పాతనైజాంస్టేట్‌ వాళ్ళు వేసిననాటిరోడ్డని కొంతమందీ, కాదు, శ్రీకృష్ణదేవరాయలు వేయించిన రోడ్లని మరి కొంతమందీ, కాదు, అశోక చక్రవర్తి

బాటకిరువైపులా చెట్లు నాటించే పధకంకింద ముందీబాటవేయించాడని ఇంకొంతమందీ

ఇలా అనేకమంది అనేకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఇటీవల మనకాలనీ

క్‌ డిటెక్టివ్‌సాహిత్యం రచయిత్రి రాజేశ్వరి గారు పరిశోధించి ఈ రోడ్డుని హైద్రాబాద్‌ మునిసిపాల్‌ కార్పోరేషన్‌ వాళ్ళే వేశారనీ, అయితే అందుకు వాళ్ళు కంట్రాక్టర్లకిచ్చిన బిల్లులే ఆధారమనీ తేల్చారు. ఎందుకంటే ప్రస్తుతం అరోడ్డు ఉండేచోట దిగుడుబావుల్లాంటి గుంటలు తప్పితే ఇంకేమీ కనిపించటంలేదు. ఈ దారుణమయిన రోడ్డుకి కనీసం రిపేర్ల్ణయినా చేయించమని

ఇ మనంపెట్టుకున్న అర్జీలగురించి పట్టించుకునేవారే లేరు. అంచేత మనం ఎంచేయాలో నిర్ణయించడానిగ్గాను ఇక్కడ సమావేశమయ్యాం!

ఈ విషయంలో అందరూ తమ తమ అమూల్యమయిన సూచనలు అందించ

॥ వలసిందిగా కోరుతున్నాము-జైహింద్‌!' అంటూ ఉపన్యాసం ఆపాడతను. ఎవరూతప్పట్లు కొట్టలేదు.

“ఆమధ్య రామంతపూర్‌ కాలనీవాళ్ళు ఇలాగే వాళ్ళ రోడ్డు రిపేరుకోసం నిరాహార

దీక్షచేసి, సాధించారుకదా! మనమూ అదే చేద్దాం!” అన్నాడు గోపాల్రావ్‌.

"అవును! ఈరోజుల్లో అదొక్కటే ఎఫెక్టివ్‌ మెథడ్‌ అన్నాడు రెడ్డి.

"అవునవును! అదే బెస్ట్‌" అంటూ అరిచారు ఇంకొంతమంది.

అప్పటికప్పుడే గోపాల్రావ్‌ సూచన ఎకగ్రీవంగా ఆమోదింపబడింది.

"ఇప్పుడు మనలో నిరాహారధీక్ష ఎవరు చేయలోకూడా మన నిర్ణయం తీసుకుంటే రేపే నిరాహారదీక్ష ప్రారంభించవచ్చు!” అన్నాడు శాయీరామ్‌ మైక్‌ ముందుకొచ్చి.

అందరూ మొఖమొఖాలు చూసుకున్నారు. పరిస్థితి గమనించి జనార్ధన్‌ మైక్‌ దగ్గర కొచ్చాడు. “మనలో ఎవరయినా వాలంటీర్లు నిరాహారదీక్షకోసం తమ పేర్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం!” అన్నాడు చిరునవ్వుతో.

8 నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 113

అందరూ ఎవరయినా పేర్లు ఇస్తున్నారేమోనని వెనక్కు తిరిగి చూశారు కాని ఒక్కడూ నోరు మెదపలేదు. గ

"కేవలం మగాళ్ళే నిరాహారదీక్ష చేయాలనేంలేదు, స్రీలుకూడా పాల్గొంటే బావుంటుంది!" అన్నాడు రెడ్డి. అయినా ఎవరూ ముందుకి రాలేదు.

"ఎవరో ఎందుకు? మన కాలనీ కమిటీ కార్యనిర్వాహకవర్గం వారందరూ చేస్తే సరిపోతుంది! అనరిచాడు రంగారావ్‌ వెనకనుంచి.

నా గుండెలు రుల్లుమన్నాయ్‌. గోపాల్రావ్‌, జనార్ధన్‌, శాయీరామ్‌ల మొఖాలు కూడా పాలిపోయినయ్‌ గానీ అది కనిపించకుండా నానా తంటాలూ పడుతున్నారు.

"అవ్‌! జర కాలనీల పేరుగిట్ట ఉన్నోళ్ళుచేస్తేనే ఖదరుంటది!” అన్నాడుయాదగిరి.

అందరిలోకీ ముందు జనార్ధనే కోలుకున్నాడు. ||

"సోదరులారా! మేము నిరాహారదీక్షచేయటానికి మాకేం అభ్యంతరంలేదు! కానీ ఇక్కడోటెక్షికల్‌ డీఫికల్చీఉంది. అదేంటంటే వేరేవాళ్ళు ఎవరయినా నిరావోదీక్ష ప్రారంభించినట్టయితే- మేము అధికారుల దగ్గరకూ, ఇతర రాజకీయ నాయకుల దగ్గరకూ, వెళ్ళి వత్తిడి తెచ్చి త్వరగా రోడ్‌ రిపేరు చేయించేందుకు వీలుంటుంది. కనుక మీలోనే ఎవరొకరు-” మళ్ళీ నిశ్శబ్ధం.

రంగారెడ్డి మైకు ముందు కొచ్చాడు.

"ఇంతకాలం ఎన్నో ధైర్యసాహసాలకు పేరుపొందిన మన కాలనీలో నిరాహారదీక్ష జరిపేందుకు ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావటం లేదంటే మనకాలనీకే అవమానం! నిజానికి నిరాహారదీక్షకు నేనంటే నేనని జనం ముందుకురావాలి!"

హఠాత్తుగా జనంలో తోపులాట కనిపించింది.

రెడ్డి ఆనందపడ్డాడు "ఆ! అదేమనక్కావలసింది అదీస్పిరిట్‌ అంటే"

"ఆళ్ళు నేనంటే నేననికాదు డకలాయిస్తున్నది. నువ్వంటేకాదు నువ్వని నూకుతున్రు" అన్నాడు యాదగిరి.

అరగంట గడిచిపోయింది. ఒక్కరుకూడా వేదికవేపు రావడంలేదు.

గోపాల్రావ్‌ మైకు ముందు కొచ్చాడు.

"సోదరులారా! మన కాలనీ యాక్టివ్‌ మెంబరయిన శ్యామల్రావ్‌గారిని నిరాహారదీక్ష చేయవలసిందిగా మీ అందరితరుపున కోరుతున్నాను. ఎందుకంటే ఆయనకు రాజకీయల్లో రూడా అనుభవం ఉంది గనుక!" అక్కడున్నవారి కరతాళద్వనులు ఆకాశాన్నంటినయ్‌.

శ్యామ(లావ్‌ గాబరాగా నుంచున్న చోట నుంచే అరచాడు. 114 హ్యూమరాలజీ

"నాకు ఆనందమే కానీ- నేను ఇవాళ అర్జంటుగా ఖమ్మం వెళ్ళాలి"

“ఎందుకు? "

"అక్కడ మా తమ్ముడి పెళ్ళివుంది" అన్నాడతను.

"అదేమిటి? మీకెవరూ తమ్ముళ్ళు లేరని చెప్పారుగా?"

"అది కేవలం ఈపాడు మతిమరుపువల్ల చెప్పి ఉంటాను! క్షమించండి! వస్తా! బస్సు టైమయింది ' అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు

"పోనీ రెడ్డిగారినే చేయమనండి" ఎవ్వరో అరచారు జనంలోనుంచి. రెడ్డి అదిరిపడ్డాడు.

"అయ్యా నాపేరు ఒకరుచెప్పెంతవరకూ కూడా నేను ఆగీవాడినికాదు అంత యిష్టంనాకు నిరాహారదీక్రలంటే! కానీ ఈమధ్య మా డాక్టరుగారు నేను ప్రతిరండుగంటలకు

/ ఓసారి ఫలహారమో, భోజనమో చేయాలనీ లేకపోతే దారుణమయిన కడుపునొప్పి వస్తుందనీ చెప్పారు. అంచేత ఇలాంటి అద్భుతమయిన అవకాశం పోగొట్టకుంటున్నందుకు నాకెంతో ఇదిగా ఉంది" అంటూ నెమ్మదిగా స్టేజిదిగి ఓపక్కగా నిలబడ్డాడు.

జనార్ధన్‌ మైక్‌ ముందు కొచ్చాడు మళ్ళీ.

"సోదరులారా! ప్రస్తుతపరిస్థితిలో ఒకే ఒక మార్గం కనబడుతోంది. అదేంటంటే అందరి ఇళ్ళనంబర్లూ చీటీమీదరాసి అందులో నుంచి ఓచీటితీసి ఆ ఇంటినెంబరున్నవాళ్ళతో నిరాహారదీక్ష చేయంచడం! ఎలా వుంది మన పాను?"

అంతా “అద్భుతం. అంటూ తప్పట్లు కొట్టారు.

మరుక్షణంలో అందరి ఇంటినంబర్లూ చీట్టమీద వరుసగారాసి ఓ కుప్పగా పోశారు.

ఓ ఆరేళ్ళకుర్రాడిని' పిలిపించి ఆ పోగులోనుంచి చీటి తీయమన్నారు. అంతా నిశ్శబ్ధం అలుముకు పోయింది. కుర్రాడు చీటీ తీసి జనార్ధన్‌కిచ్చాడు. జనమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. శాయీరామ్‌ ఆచీటీ చూసి మైక్‌లో ఆఇంటినంబరు చదివాడు.

చదివిన మరుక్షణం జనం మధ్యనుంచీ దబ్బుమన్నశబ్దం వినిపించింది. అందరూ కోలాహలంగా అటువైపు పరుగెత్తారు. నేనూ పరుగెత్తి "ఎం జరిగింది?" అనడిగాను.

"ఎవరో పడిపోయారు!" అన్నాడు రెడ్డి. పడిపోయిన అతని ముఖంమీద నీళ్ళు కొట్టాక నీరసంగా లేచినిలబడ్డాడు. అతనిని చుస్తూనే గుర్తుపట్టాను, వెంకట్రావ్‌. “ఇంటి నంబరు ఇంకోసారి చెప్పండి" అన్నాడతను నీరసంగా.

శాయీరామ్‌ ఇంటి నంబరు మళ్ళీచదివాడు.

"ఎవరిదీ ఇంటినెంబరు?" అడిగాడు జనార్ధన్‌.

నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 115

"మాదే!" అన్నాడు వెంకట్రావ్‌ నీరసంగానే.

“ఓహో అదాసంగతి! మరింకేం ఇలాంటి అవకాశం దొరికినందుకు ఆనందించక అలా కంగారు వడతావేమయ్యా. వద వద'' అంటూ అవృటికవ్చుడే వెంకటావ్‌ని స్టేజీమీదకుతీసుకెళ్ళి అందరికీ పరిచయం చేశాడు గోపాల్రావ్‌.

"సోదరులారా! పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, వెంకట్రావుగారికి చిన్నప్పటి నుంచీ కూడా నిరాహారదీక్షలంటే ఇష్టం అట. అలాంటి మహానుభావుడికే మళ్ళీ అలాంటి అవకాశం రావడం నిజంగా చాలా గొవ్ప విషయం! చాలా అద్భుతమయిన విషయం! చాలా..."అనిఇంకేమీ పదాలుదొరకక “అంతే!” అన్నాడు. మీటింగ్‌ ముగిసిపోయింది.

వెంకట్రావ్‌ పైకి ధైర్యంగా ఉన్నట్లే కనబడుతున్నా, లోలోపల తెగ భయపడుతున్నట్లు కనిపించాడు. "ఘమారుగా ఎన్నిరోజులు నిరాహారదీక్షచేయాలంటారు?" అన్నాడు దిగులుగా. |

"ఆ-ఎంత? నాలుగయిదు రోజులు- ఈలోగా మేము ఊరేగింపులు,ధర్నాలు, జరిపి కనీనం వెంటనే మొదలుపెడతామున్న 'వోమీ' అయినాతీనుకుని నిరావోరదీక్ష విరమింపజేసేస్తాం!”

నాలుగురోజులనేసరికి వెంకట్రావుకి ధైర్యం వచ్చేసింది.

"ఓశ్‌! ఇంతేనా! నాలుగయిదు రోజులు ఓలేఖ్థా ఎమిటి? ఎనిమిదేళ్ళక్రితంనాకు జ్వరం వచ్చినవ్పుడు పదిరోజులు తిండిలేకుండా గడపలేదాఎమిటి?" అన్నాడు ఉత్సాహం తెచ్చుకుంటూ.

"అంతేకాదు! ఇంకో సంగతికూడా ఆలోచించు! నువ్వెలాగూ ఎలక్షన్లో నిలబడాలను కుంటున్నావు కదా! దానికి ఇంతకంటే మంచి ఛాన్స్‌దొరకదు ఈ నిరాహారదీక్ష్తతో నువ్వు పెద్ద పాపులర్‌ ఫిగరయిపోతావు ఈఐఎరియాలో! మన నాయకులు చాలామంది ఇలాగే కదా ఎన్నికయింది' అన్నాడు రెడ్డి ప్రత్సాహంఇస్తూ,.

ఆమాట వెంకట్రావు మీద షార్ట్‌ సర్క్యూటింగ్‌లాగా పనిచేసింది.

"అవును! ఎలక్షన్లు కూడా దగ్గరకొస్తున్నాయ్‌ కదా. నాలుగయిదురోజులేకాదు! ఇంకో 'గంట ఎక్కువయినా ఫరవాలేదు నేను బ్రహ్మాండంగా నిరాహారదీక్ష చేస్తాను" అన్నాడు వెంకట్రావ్‌.

వెంకట్రావ్‌ వెళ్ళిపోయాక మా కార్యవర్గం మళ్ళీ అత్యవసరసమావేశం జరిపాము.

"వెంకట్రావ్‌ నిరాహారదీక్ష్రచేయటం౦ ఖాయమేగానీ, అతనికి మంచి వంటకాలంటే కొంచెం వీక్‌నెస్‌ ఉన్న విషయం మీకు గుర్తుందికదా?" అన్నాన్నేను పాత విషయాలు గుర్తుకితెస్తూ 116 హ్యూమరాలజీ

“్‌ తి

“అవునవును! ఈడెన్‌గార్జెన్‌లో వాడు చేసిన పని ఎలా మరచిపోతాం!" అన్నాడు శాయీరామ్‌. ఈడెన్‌ గార్డెన్‌ అనేది ఒకమారేజ్‌హాల్‌. ఓ రోజు మేమందరం మాట్నీసినిమాకిళ్ళి ఆ రోడ్‌ వెంబడివస్తోంటే ఆ పెళ్ళి ఆవరణలోనుంచి నోరూరించే వంటకాల వాసనలువచ్చి ఎటాక్‌ చేసినాయ్‌.

“ఆహా! బగారాబైగాన్‌" అన్నాడు వెంకట్రావ్‌ .వంటకాల్లో బగారా బైగన్‌ (గుత్తి వంకాయకూర) ఒకటన్న విషయం మా అందరికీ తెలుసు.

“అయితే ఎమంటావు?" అడిగాడు గోపాల్రావ్‌.

"నేను వెళ్ళి భోజనంచేసి వస్తాను-మీరు పదండి!"

"అదేమిటి? ఇది ముస్లిమ్స్‌ పెళ్ళికదా? వాళ్ళు పిలవందే ఎలా వెళ్తావు?" ఆశ్చర్యంగా

/ అడిగాడు జనార్ధన్‌.

"అయితేనేం హిందూముస్లిం భాయ! భాయ్‌! ఖుదా హాఫిజ్‌!" అనేసి పెళ్ళిలోకి జొరబడిపోయాడు. మేము మా దారినకాలనీ కొచ్చేశాము.

గంటసేపటి తర్వాత అతను కాలనీలో మా ఇంటి ముందు నుంచి టిఫిన్‌ కారియర్‌ పట్బకెళ్తూంటే భోజనంచేశాడో లేదో కనుక్కుందామని పిలిచాను.

"భలేవాడివే గురూ! భోజనంచేయకపోవడం ఏమిటి? తీరాచూస్తే అ పెళ్ళి ఎవరిదో కాదు! మనాఫీసులో హాకీప్టేయరు నిసార్‌గాడు లేడూ? వాడికిచాలా దూరపు బంధువులదట! నేను నిసార్‌గాడి (ఫ్రెండ్‌నని పరిచయం చేసుకుని దూసుకిళ్ళిపోయాను. నాకు బగారా బైగన్‌ ఇష్టమన్దైెప్పి- కారియర్‌లోకొంచెం కూర ఇమ్మనిరిక్వెస్ట్‌ చేస్తే పాపం ఆపెద్ద మనిషి పేరేంటంటే... ఆ! అబ్బల్‌ ఖాదర్‌-అదే పిల్లతండ్రి-వెంటనే ఈ టిఫిన్లో బగారా బైగన్‌ బోలెడు పెట్టి ఇచ్చాడు. టిఫిన్‌ రేపాద్దున్న వాళ్ళింట్లో ఇచ్చేస్తానని చెప్పాను"

  • ఇది ఒక్కటేకాదు! ఇలాంటి కథలు కాలనీలో ఎన్నెన్నో జరిగినాయి. యాదగిరి వాళ్ళింట్లో బంగాళాదుంపల బజ్జీలు చేస్తున్నారని తెలిసి అమాంతం వంటింట్లోకెళ్ళి ప్లేటుతీసుకుని కూర్చోవటం, జనార్ధన్‌వాళ్ళింట్లో పెసరట్లు వేస్తున్నట్లు వాసననుబట్టి పసిగట్టి లోపలకుదూరి జనార్ధన్‌ భార్యనుఅడిగి డజనుపెనరట్ట్లు వేయించుకుని తినేయడం- ఇది రాన్రాను చాలామామూలు విషయమైపోయింది మా అందరికి.

“క్యాకీభాయ్‌! మనోడు మంచిగా నిరాహారదీక్ష చేస్తాడని నాకు నమ్మకంలేదు!" అన్నాడు యాదగిరి.

ఏదేమయితేనేం వెంకట్రావ్‌ నిరాహారదీక్షలో ఉన్నన్నిరోజులూ మాకాలనీలో ఎవరూ వాడికిష్టుయిన వంటకాలు చేయకూడదన్న తీర్మానం ఒకటిపాస్‌ చేశాము. మర్నాడు పొద్దున్న నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 117

కీ

గోపాల్రావ్‌ అన్ని పేపర్లలోనూ వెంకట్రావ్‌ ఫోటో వేసి నిరాహారదీక్ష ప్రారంభించబోతున్న న్యూస్‌ రాయించేశాడు.

దాంతో మా ఏరియాలో పెద్ద సంచలనం చెలరేగింది.

మా కాలనీ అవతల దూరంగా ఉన్న వీకర్‌ సెక్షన్‌కాలనీ వాళ్ళాంతా పదిగంటల కల్లా ఆనందంగా మాకాలనీ కొచ్చేశారు- నిరాహారదీక్ష తంతుచూడ్డానికి.

మేళ తాళాలతో రోడ్డుపక్కనే ఉన్న పెద్దామియానాలోకి వెంకట్రావ్‌ని తీనుకెళ్ళాం. వెంకట్రావ్‌కి ఎక్కడిదో రాజకీయనాయకుడి డ్రస్‌ తగిలించారు మావాళ్ళు.

నిజంచెప్పాద్దూ! ఆవేషం వాడికిసూటయింది! ఇక గుణగణాలంటారా! అవీ రాజకీయ నాయకుడి గుణాలకు దగ్గరగానే ఉన్నాయ్‌. ఆఫీసులో లంచాలు పడుతుంటాడు! మందు కొడుతుంటాడు! ఇలా మరిన్ని చిల్లర దురలవాట్లు ఉండనే ఉన్నాయ్‌! అంచేత రాజకీయాల్లోకి " దిగాలనేవాడీ కోరికలో అసమంజసం ఏముంది? షామియానాలోకి రాగానే మా కాలనీవాళ్ళు రెండు దండలువేశారు మెడలో. ఆతరువాత వీకర్‌ సెక్షన్‌ కాలనీ వాళ్ళందరూ కలసి ఓదండవేసి మొఖానికి బొట్టుపెట్టారు. ఎందుకంటే ఆరోడ్‌పాడవటంమూలాన ఆర్టీసీ బస్‌లు ఆరోడ్డుమీద తిరగడం మానేసినయ్‌. ఆటోరిక్షాలవాళ్ళు, రిక్షావాళ్ళూ ఆ రోడ్డుమీద నసేమిరా నడవడానికి శ వవ్చుకోవటంలేదు. ఇందువల్ల మాతోపాటు ఆకాలనీవాళ్ళుకూడా నరకయాతన అనుభవిస్తున్నారు.

వెంటనే మేమంతా నినాదాలు (ప్రారంభించాం.

"వెంకట్రావ్‌" అన్నాడు యాదగిరి. "జిందాబాద్‌" అన్నాం మేము.

"ప్రజలకోసం ప్రాణాలర్పించడానికి సిద్దపడి నిరాహాదీక్ష చేస్తున్న వెంకట్రావ్‌- "వర్ధిల్లాలి."

"దేశ్‌ కీ నేతా-" "

"వెంకట్రావ్‌ బన్‌తా!'

“'దేశ్‌కీ నేతా కసేహో!”

"వెంకట్రావ్‌ జైసేహో!"

"వెంకటావ్‌ వెంట్రావ్‌!"

“జిందాబాద్‌- జిందాబాద్‌!

వెంకట్రావ్‌ షామియానాలో ఏర్పాటు చేసిన పరువుమీద కూర్చున్నాడు. ఆరోజు ఆదివారం కాబట్టి అందరం షామియానాలోనే గడిపాము.

సాయంత్రంమయేసరికి వెంకట్రావ్‌కి భోజనంమీదకు మనసు మళ్ళినట్టుంది.

118 హ్యూమరాలజీ

“మీ ఇంట్లో ఏం కూర?" అని అందరినీ అడగడం ప్రారంభించాడు.

మేము ముందే ఏం చెప్పాలో నిర్ణయించుకుని ఉండడంవల్ల "అబ్బే! కూరేంలేదు. పచ్చడీ, చొరునూ! అసలే ఎండలుకదా కూరగాయలు దొరకటంటేదు!'' అంటూ చెప్పేశాము. కొద్దిసేపు సైలంటుగా ఉన్నాక-

"పోనీ రాత్రి పొద్దుపోయాక కొంచెం పచ్చడన్నం లాగిస్తాను ఎమంటారు." అన్నాడు హఠాత్తుగా.

అందరం అదిరిపడ్డాం.

“అదేమిటి? నిరాహారదీక్ష ప్రారంభించాక పచ్చడన్నం అంటావేమిటి?"

"ఆ! ఎవరు చూస్తారులెద్దూ! అంతా మన కాలనీ వాళ్ళేగా"

"అయినాగాని అట్టాతినొద్దు తమ్మీ! గట్లచేస్తేగలత్‌ అవుతది! నేనే నిన్ను అరెస్ట్‌ేేేయాల మళ్ళా!” అన్నాడు ఓ మీసాలతను. అందరం ఆ మీసాలతనివంక ఆశ్చర్యంగా చూశాం! అవి మాకాలనీ తాలూకూ మీసాలుకావు. మా కాలనీలో మీసాల్రావ్‌లెవరూలేరు.

“మీరవరు?" మర్యాదగా అడిగాము.

"షోలీస్‌డిపార్ట్‌మెంట్‌! ఈ నిరాహారదీక్షలు చేసేటోళ్ళు గిసంటి దందాలు చేయకుండా మప్తీలో పహరాకొచ్చినా" అన్నాడతను. వెంకట్రావ్‌ మొఖం మాడిపోయింది.

"అబ్బే మా వాడు 'జోక్‌' కోసం అంటున్నాడంతే!" అన్నాం మేముసర్దేస్తూ,

"అవున్సార్‌! ప్యూర్‌ 'జోక్‌' అంతే!” అన్నాడు వెంకట్రావ్‌ కూడా అతి కష్టంమీద నవ్వుతూ.

“ఆయనెప్పుడూ అంతే నన్నా! భోజనంచేస్తా, చేస్తానని దిల్లగీ చేస్తుంటాడు!” అన్నాడు యాదగిరి! మీసాలకానిస్టేబుల్‌ మా మాట నమ్మాడు.

ఆ రాత్రి గడిచిపోయింది.

మేమంతా ఆ సాయంత్రం పెద్ద ఊరేగింపుతో మున్సిపాల్‌ కార్పొరేషన్‌కళ్ళి స్పెషల్‌ ఆఫీసర్‌కి ఓ మెమొరాండం అందజేయాలని నిర్ణయించుకున్నాం.

తీరా ఆఫీస్‌నుంచి వచ్చేసరికి అక్కడి దృశ్యం భయంకలిగించింది. షామియానా కెదురుగా ప్రభుత్వమొబైల్‌ కాంటీన్‌వాన్‌ ఆగివుంది. అందులో వివిధ రకాలఫలహారాలు వాసనలు ఘుమఘుమలాడుతూ బయటికొస్తున్నాయ్‌.

వెంకట్రావ్‌ ఆ కాంటీన్‌ వేపే గుడ్డప్పగించి చూస్తున్నాడు. మా కాలనీపిల్లలు కొంతమంది అప్పటికే వాన్‌ చుట్బచేరి మిరపకాయబజ్జీలు తినేస్తున్నారు. నేనూ, యాదగిరి హడావిడిగా వాన్‌ దగ్గరికళ్ళాం. నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 119

"ఈ వాన్‌ ఈడకెళ్ళి తీసేయాలి జల్ని' అన్నాడు యాదగిరి డైవరుతో.డైవర్‌ చిరునవ్వు నవ్వాడు.

"ఎందుకు తీయాలిసార్‌! ఇది మీసాంతభూమా?"

"కాకపోయినాగానీ మా కాలనీవాళ్ళ అనుమతి లేనిదే లోపలకురావద్దు."

"మాకు పోలీస్‌ కమీషనర్‌గారు పర్మిషనిచ్చారు!" ఇద్దరం ఉలిక్కిపడ్డాం.

  • "పోలీస్‌ కమిషనర్‌గారా? "

"అవును!"

“ఆయనెందుకిచ్చారు పర్మిషన్‌?"

"ఇయ్యాళ రేపు ఈ నిరాహారదీక్షలు బంద్‌ చేయడానికి కొత్త అయిడియాచేసిను. గిట్లా కాంటిన్లు పెట్టి నిరాహారదీక్ష చేసేటోళ్ళకు ఫలహారాలుసూపిస్తే ఆళ్ళు ఆదీక్షబంద్‌ చేసి తినెడిది షురూచేస్తరు."

మా కందరికీ కాళ్ళుచేతులూ వణకసాగినాయ్‌.

మిగతా వంటకాలు చేసినన్ని రోజులూ వెంకట్రావ్‌ని ఎలాగోలా ఆపవచ్చుగానీ, ఆలూ బజ్జీలూ, పెసరట్టు, బగారా బైగన్‌ తయారుచేస్తే మాత్రం వెంకట్రావ్‌ని భగవంతుడు కూడా ఆపలేడు.

ఈలోగా వీకర్‌ సెక్షన్‌ కాలనీవాళ్ళు ఊరేగింపుగా వచ్చేశారు మా కాలనీకి. "పదండ్రి జల్దీ! అన్నారు వాళ్ళ లీడర్లు. అప్పటికప్పుడే మా కాలనీవాళ్ళు ఆడా మగా అంతా ఊరేగింపులో కలిసిపోయాం. వెంకట్రావు మొబైల్‌ కాంటీన్‌కెళ్ళకుండా యాదగిరిని కాపలా పెట్టాం. ఆడవాళ్ళజట్టుకి రాజేశ్వరి నాయకత్వంవహించింది.

“మనిషికి కూడూ బట్టే కాదోయ్‌, రోడ్డుకూడా ఉండాలోయ్‌" అంటూ పాటలు పాడుతు న్నారు కొంతమంది.

మెమొరాండం సమర్పించాక తిరిగివచ్చేటప్పుడు, ఆర్టీసి బస్సులమీద రాళ్ళురువ్వారు మాలో కొంతమంది! ఎమిటంటే శాస్త్రంకోసం రువ్వారట-ఆనవాయితీ చెడగొట్టకూడదని! మేము వెంటనే అడ్డుపడి ఆపివేశాము.

మర్నాడు పేపర్లో వార్త మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది.

"మంత్రిగారు స్వయంగా మాకాలనీ రోడ్డు స్థితి సమీక్షించేందుకు మరో రెండురోజుల్లో వస్తున్నారట! అయితే వారొచ్చేలోగా నిరాహారదీక్షలు ఆపేయాలట!"

120 హ్యామరాలజీ

అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్‌ జరిపాము.

"ఇదంతా మోసం! మనవాడు నిరాహారదీక్ష ఆపేశాడంటే-మళ్ళీ రోడ్డుగతి ఎవరూ పట్టించుకోరు!” అన్నాడు గోపాలల్రావ్‌.

"అవును! రామగిరి కాలనీలో అలాగే జరిగింది కదా!” అన్నాడు రెడ్డి.

ఆ సాయంత్రం పోలీస్‌ కమీషనర్‌ స్వయంగా మా కాలనీకొచ్చారు, వ్యాన్‌ వేసుకుని. ఆయనతోపాటు మరికొంతమంది అధికారులు-

అందరూ షామియానా కెదురుగ్గానే కుర్చీలు వేసుకుని రకరకాల ఫలహారాలు ప్లేట్లో తీసుకుని వేడివేడిగా తినసాగారు మా అందరికీ కూడా నోరూరిపోతోంది. వెంకట్రావ్‌కి ఆ దృశ్యాలు కనబడకుండా కొంతమంది అడ్డునిలబడ్డాం. అక్కడ మూగిన కాలనీ పిల్లలని

పిలిచి ఉచితంగా బజ్జీలు, సమోసాలు ఇచ్చారు పోలీసులు.

మేము పిల్లలను చావగొట్టి ఫలహారాలు వాపస్‌ చేసేశాము. లేపోతే వెంకట్రావ్‌ లేచివెళ్ళి ఆ ఫ్రీసరుకు తినేస్తాడేమోనని అనుమానం.

ఈలోగా మప్టీలో కొంతమంది కానిస్టేబుల్స్‌ కాలనీఅంతా తిరిగి వెంకట్రావ్‌కిషుయిన

క్ట వంటకమేదో తెలుసుకోడానికి ప్రయత్సించసాగారు. ఈసంగతి తెలియగానే మేము పిల్లలందరినీ అన్ని ఇళ్ళకూ పరిగెత్తించి వెంకట్రావ్‌ కిష్టమైనది 'బగారా బైగాన్‌' అన్న సంగతి పోలీసులకు తెలియనీయవద్దని హెచ్చరికలు చేశాము.

తమష్తాను పారకపోయేసరికి పోలీసుకమీషనర్‌గారు కొత్త పథకం ఆలోచించారు. పూటకు ఆయిదారురకాల వంటకాలచొప్పున తయారుచేసి వెంకట్రావ్‌కి కనిపించేలా తినాలని

ప్లాను! అందులో వెంకట్రావ్‌ కిష్టుయిన వంటకం ఉంటే అతగాడు ఇక ఎగిరిదూకి వచ్చేస్తాడని అయిడియా. అదృష్టవశాత్తూ వాళ్ళు ఆరోజు వండిన వంటకాలలో బగారాబైగన్‌ రాలేదు. ఓ పక్క వెంకట్రావు పరిస్థితి విషమించిపోతోంది. "ఇంక చాల్లెండి! నాకాకలేస్తోంది. నేనుండలేను _ కావాలంటే మరోసారి ఇంకో రెండురోజులుచేస్తాను నిరాహారదీక్ష!” అనడిగాడు అసహనంగా ఆకలి చూపులు చూస్తూ-

"పిచ్చివాడా! అంత తొందరెందుకు? ఓపక్క అసెంబ్లీలో నీ నిరాహారదీక్ష గురించి గొడవచేయిస్తున్నాం! ఇంకొక్కరోజు ఓపిక పట్టుచాలు! ఈలోగా ఎవరోకరి హామీ అయినా తీసుకుందాం కనీసం" అంటూ నచ్చజెప్పాము. నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 121

సరిగ్గా అప్పుడే కమీషనరుగారు ఓ ప్లేట్లో వేడివేడి బజ్జీలు వేసుకొచ్చి ఎదురుగ్గా నిలబడి క మా అందరికీ ఆఫర్‌ చేసేసరికి వెంకట్రావు స్ప్రింగులా ఎగిరినిలబడ్డాడు అందుకోటానికి. అతనిచేయి స్లేట్లోకి వెళ్తూండగా మేమంతా ఒక్క దూకుదూకి వాడి చేయి వెనక్కు విరిచేసి వాడిని కిందపడేసి లేవకుండా నొక్కి పట్టాము.

పోలీస్‌ కమీషనర్‌ చిరునవ్వునవ్వాడు. “మీ అందరినీ అరెస్ట్‌ చేస్తున్నాను” అన్నాడు నాదగ్గరకొచ్చి.

”ఎందుకు?”

"ఒక వ్యక్తిని నిర్బంధించి తిండి పెట్టకుండా హత్యచేయడానికి ప్రయత్సిస్తున్నందుకు."

"అతను నిరాహారదీక్ష చేస్తున్నాడండీ! మేమెక్కడ నిర్బంధించాం"

"మరి అదేమిటి? పాపం అతనికిషుయిన అలూబజ్జీలు తినకుండా అతనిమీద కూర్చున్నారు! ఇది నిర్భంధంకాదూ!"

"కాదు"

"మర్యాదగా అతనిని స్వేచ్చగా వదులుతారా, లేక మిమ్మల్ని వాన్‌లో స్టేషన్‌కి తీసుకెళ్ళ మంటారా?" అందరం చేసేదిలేక దూరంగా జరిగాము. (

వెంకట్రావ్‌ నెమ్మదిగా లేచాడు. అతని దృష్టి అంతా కమీషనర్‌ చేతిలో ఉన్నబజ్జీల ప్లేట్‌ మీదే వుంది. హఠాత్తుగా యాదగిరికో అయిడియా వచ్చింది.

కెవ్వున నినాధాలుప్రారంభించేశాడు.

"వెంకట్రావ్‌- వెంకట్రావ్‌"

“'జిందాబాద్‌- జిందాబాద్‌ అంటూ అరచారు ఆడా, మగా అందరూ,

"రీపు ఎలక్షన్‌లో నిలబడబోయే వెంకట్రావ్‌!"

“వర్ధిల్లాలి!

“అలూబజ్జ్టీలు"

“రేపు తినొచ్చు-"

“ఉల్లిపాయ పెసనరట్టూ."

"రేపు తినొచ్చు!"

"బగారా... "మూడో స్తోగన్‌ ఇవ్వబోతుంటే నేను ఠక్కున యాదగిరినోరు మూసేశాను.

“అది పోలీసులకు తెలియకూడదురా పక్షీ! తెలుస్తే అది వండి వాడికి చూపించారంటే వాడ్నింక ఎవరూ ఆపలేరు." 122 హ్యామరాలజీ

"అవ్‌ అన్నా" అనేసి నినాదం మార్చేశాడు యాదగిరి. “ఆలూ బజ్జీ-పెసరట్ప"

"రేపు తినొచ్చు బోలెడు తినొచ్చు"

“ఇవాళ్ళ మాత్రం"

"ఛీ ఛీ! వద్దు-వద్దు-"

"పోలీస్‌ కమీషనర్‌ బజ్జీలూ-"

"డౌన్‌ డౌన్‌-"

“పోలీస్‌ కమీషనర్‌ కాంటీనూ"

“గో బాక్‌ ! గో బాక్‌-"

మా కేకలు వెంకట్రావ్‌లో కొంచెం సంచలనం కలిగించినట్ట్లుంది, వెనక్కు తగ్గి పరుపు మీద కూలబడ్డాడు మళ్ళీ . ఎప్పటికప్పుడే వెంకట్రావు పేరుతో జై జై నినాదాలుతో మోతెక్కించేశాడు యాదగిరి.

పోలీస్‌ కమీషనర్‌ ముఖం చిన్నబోయింది. కసిగా బజ్జీలన్నీ తనే తినేశాడు. ఇక్కడీ

/ గొడవ జరుగుతుండగా, మాకు తెలీకుండా ఇంకో వ్యవహారం చాటున జరిగిపోయింది.

ఈలోగా కాలనీ పిల్లలందరినీ వాన్‌లో సరదాగా షికార్లు తిప్పుతామని తీసుకెళ్ళి వాళ్ళందరికి చాక్‌లెట్టు, బిస్కెట్లు ఇచ్చి పోలీస్‌ ఇన్‌ స్పెక్టర్లు- వెంకట్రావు కిష్టరుయిన వంటకం గురించి తెలుసుకోడానికి ప్రయత్సించారట!

మొదట్లో మా కాలనీ పిల్లలు చెప్పటానికి నిరాకరించారటగానీ, చివరకువాళ్ళు మన ఇండియా క్రికెట్‌ టీమ్‌ ఫోటోస్‌ ఉన్న ఆల్బమ్‌ అందరికీ తలోటీ ఇస్తామనేసరికీ రహస్యం కాస్తాచెప్పేశారు. అయితే మేము చావగొడతామని ఈ విషయం మాకు చెప్పనేలేదు.

మర్శాడు మొబైల్‌ కాంటిన్‌ వాళ్ళు గుత్తివంకాయలు తెచ్చి మసాలా నూరడం కనిపించేసరికి మా పై ప్రాణాలు పైనేపోయాయి. ఆ దృశ్యం వెంకట్రావుకి కనపడకుండా యాదగిరి బోలెడుమంది కాలనీ వాళ్ళను కూడగట్టుకొని గోడలాగ అడ్డునిలబడ్డాడు.

ఆ కూర రెడీ అయ్యేలోవల ఎవరొకముఖ్యఅధికారినో,లేక ఎఛోటారాజకీయ నాయకుడినో తీసుకొచ్చి తను ఈ విషయంలో జోక్యం కలుగబేసుకుంటున్నట్టూ అంచేత

రోడ్డు రిపేరు విషయం తనకొదిలేయమని హామీ ఇచ్చి, వెంకట్రావుని నిరాహారదీక్ష

నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 123

విరమించమనికోరి నిమ్మకాయనీళ్ళు ఇచ్చేసే ఎర్పాట్లు చేయడానికని శాయీరామ్‌, గోపాల్రావులు టాక్సీలో తిరగసాగారు. ఈలోగా యాదగిరి పాలిపోయిన మొహంతో మా దగ్గరకొచ్చి రహస్యంగా ఓవిషయం చెప్పాడు. అదేంటంటే జంటనగరాల్లోకంతటికీ బగారాబైగన్‌ అద్భుతంగా వండగల పురానాపూల్‌ జాఫర్‌ అనే గజవంటగాడిని పిలిపించారట కమీషనర్‌గాయి! అవార్తవిన్నాక ఎవరి మొఖాల్లోనూ రక్తంలేదు. ఇంక మా వరువుని రక్షించడం ఎవరివల్తాకాదు. కేవలం హైద్రాబాద్‌ నిజాంనవాబుతాలూకూ కుటుంబసభ్యుల వివాహాలకే జాఫర్‌ బగారా బైగాన్‌ వండుతాడని మిగతావారినెవ్వరిని లెకృ్కచేయడనీ- అతని వంటకం రుచి చూడడానికి ఢిల్లీనుంచి కూడా గొప్పగొప్పాళ్ళు ప్రత్యేకంగా భోజనానికొస్తారనీ మేమందరం కథలువిన్నాం! మరి కాసేపట్లో . _బగారాబైగన్‌ ఘుమ ఘుమలు మా కాలనీ అంతా వ్యాపించినయ్‌. పోలీస్‌కమీషనర్‌గారు వాళ్ళ షామియానాలో రీవిగా, సంతోషంగా, మమ్మల్ని దెబ్బకొట్ట బోతున్న ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. పురానాపూల్‌ జాఫర్‌ బగారాబైగాన్‌ వండుతున్నాడన్న విషయం తెలిసి కాలనీలోని | ఆడాళ్ళందరూ అతనెలా వండుతున్నాడో చూసి నేర్చుకోవాలని అక్కడగుమికూడిపోయారు. "మీరందరుకూడా ఈపూట ఇక్కడే భోజనంచేయండమ్మా! ఏం ఫరవాలేదు. కన్సెషన్‌ రేటు!” అంటున్నాడు కమీషనర్‌! "అలాగే ఈ కూరచేసే పద్ధతికూడా ఓ కాగితం మీద రాయించి ఇవ్వండి అన్నయ్య గారూ?" అని ఆయన్నడుగుతున్నారు మా వాళ్ళు. మా అందరికీ మా ఆడాళ్ళమీదే వళ్ళు మండిపోతోందిగానీ ఏం చేయగలం! మరికా సేవట్లో బగారాబైగన్‌ వాననలు మరింత విజృభించినయ్‌. నిజం చెప్పాద్తూ? మాకేనోరూరుతోంది! ఆవాసన షామియానావేపురాకుండా ఫాన్‌లు పెట్టాం మేము-అయినా "హా" అంటూ గాలి బాగా పీల్చాడు వెంకట్రావ్‌. "అది బగారా బైగాన్‌! పురానాపూల్‌జాఫర్‌ వండుతున్నాడు'' అన్నాడు తన్మయత్వంపాందుతున్నట్లు కళ్ళుమూసుకుని. 'నీకెలాతెలును?' అశ్చర్యంగా అడిగాము. “లక్షమంది ఒకేసారి బగారాబైగాన్‌ వండుతున్నా సరే! అందులో పురానాపూల్‌ జాఫర్‌ వంటకం ఒక్కసారివాసన చూస్తే చాలు _ గుర్తు పట్టెస్తాను. ఆహా! అబ్బ చూశారా! ఇంతమంచివాసనలు ఇంకెవరివల్లాకాదు. ఆహా! అహా! బగారా బైగాన్‌-" 124 'హ్యామరాలజీ

మేము శాయీరామ్‌ వాళ్ళటాక్సీకోసం ఆతృతగా ఎదురుచూడసాగాం! ఈ వెధవ ఇంక

| కొద్దిక్షణాలకంటే ఎక్కువ మాచేతుల్లో ఉండడని తెలిసిపోతోంది.

“ఆ? భోజనంరెడీ!" అంటూ అరిచారు కమీషనర్‌గారు.

మరుక్షణం, సబిన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్‌ అందరూ బఫెడిన్నర్‌ ప్రారంభించేశారు. “ఎవరయినా సరే భోజనం చేయవచ్చు! కన్సెషన్‌రేట్‌లో ఇస్తున్నాం! ఈ కన్సెషన్‌ కేవలం ఈకాలనీ వాళ్ళకు మాత్రమే!” స్పీకర్‌లో పోలీస్‌వాన్‌లోనుంచి వినబడింది, ఎనౌన్స్‌మెంట్‌.

"కొంచెం అడ్డంలేవండి! బగారా బైగాన్‌ ఎలావుందో వూరికే చూస్తాను-" అన్నాడు వెంకట్రావ్‌ సృహలోలేనట్లు ఆవాసనల్లోమునిగిపోయి-

“అక్కర్లీదులే! అలా కూర్చో! రేవు జావర్‌కి ఎంత డబ్బయినా ఇచ్చి నీకు వడించిపెడతాం!" అన్నాడు రెడ్డి.

"ఒక్కసారి లేవండి! చాలు!” బ్రతిమాలసాగాడు వెంకట్రావ్‌. ఈలోగా కమీషనర్‌గారు న్వయంగా ఓపెద్ద ప్లేటునిండా బగారాబైగన్‌కూర పాగలుకక్కేవేడిది వడ్డించుకుని మరోప్లేటులోచపాతీలు తీసుకొచ్చి వెంకట్రావ్‌కి కనిపించేట్టు ఓ కుర్పీలోకూర్చునితినడం ప్రారంభించాడు. వెంకట్రావ్‌ నోరు వెళ్ళబెట్టేళాడు. గుడ్లు మిటకరించేశాడు. ఆశగా రొప్పటం

ప్రాంభించాడు నోట్లోనుంచి లాలాజలం చుక్కలుగా రాలుతోంది. నెమ్మదిగా ఆప్లేటువంకే చూస్తూకూర్చున్నచోటు నుంచిలేచాడు. పరిస్థితి విషమించిపోతుందని గమనించి యాదగిరి నినాదాలు ప్రారంం౦ంభించాడు'

“వెంకట్రావ్‌-వెంకట్రావ్‌"

'జిందాబాద్‌-జిందాబాద్‌"

"పోలీసుల నక్కజిత్తులకు-"

“వెంకట్రావ్‌ లొంగడు-లాంగడు-"

“పోలీసుల వంటకాలకు"

“వెంకట్రావ్‌లాంగడు, తలవొంచడు-"

"పోలీస్‌ కమీషనర్‌”'

“డౌన్‌ డౌన్‌"

"వర్ధిల్లాలి !ీవర్ధిల్లాలి- వెంకట్రావ్‌ మనోనిబ్బరం వర్టిల్లాలి-''

పోలీస్‌ కమీషనర్‌ వెంకట్రావ్‌ వేపు చిరునవ్వుతో చూశాడు. ఆయన చేతిలో నూనె కారుతున్నవంకాయ చూసేసరికి వెంకట్రావ్‌కి ఏదో పూనకం వచ్చినట్లయింది. మా అందరిచేతులూ ఎక్కడలేని బలంతో విదిలించుకొని పోలీస్‌ షామియానావేపు పరిగెత్తాడు. నిరాహారదీక్ష లేక బాగారా బైగన్‌ 125

ని

యాదగిరి ఇంకా ప్రయత్నాలు మానలేదు.

"వెంకట్రావ్‌ వెంకట్రావ్‌"

"జిందాబాద్‌ జిందాబాద్‌"

"పోలీస్‌ .వాళ్ల బగారా బైగాన్‌కి"

"మహాత్మా వెంకట్రావ్‌లాంగడు"

"వెంకట్రావ్‌ నిగ్రహం"

"వర్ధిల్లాలి- వర్ధిల్లాలి"

"పోలీస్‌ కమీషనర్‌ బగారా బైగాన్‌”

"డౌన్‌ డౌన్‌" వెంకట్రావ్‌కి ఏమీవినిపించటంలేదు. పిచ్చివాడిలా బఫేటేబుల్‌ దగ్గరకు నడిచాడు.

ఆతరువాత అంతా క్షణాల్లో జరిగిపోయింది. వెంకట్రావ్‌ పెద్ద ప్లేట్లో బగారాబైగాన్‌ వేడిగా వడ్డించుకొని ఆవురావురుమనితినేస్తున్నాడు.

మరుక్షణం నినాదాలు మారిపోయాయి.

"వెంకట్రావ్‌"

"డౌన్‌ డౌన్‌

"వెంకట్రావ్‌ బగారాబైగాన్‌" |

“నళించాలి"

అప్పుడే శాయీరామ్‌ వాళ్ళు ఎమ్మెల్యేలతో సహాకార్లో వచ్చేశారు.

"నిమ్మకాయ నీళ్ళు సిద్దంగా ఉంచారా?" అడిగారాయన షామియానదగ్గరకొచ్చి. ఈలోగా పోలీస్‌కమీషనర్‌గారు ఆయన క్కూడా బగారాబైగన్‌కూర-చపాతీలు స్లేట్టుతీసుకొచ్చి అందించేసరికి ఆయనకూడా మాట్లాకుండా తినేసారు. మరి కాసేపటికి కాలనీలో పిల్లా పెద్దా అందరూ కన్సెషన్‌ టికెట్టు కొనుక్కుని నిలబడి భోజనంచేయటం కనిపించింది.

_ కేవలంమా కార్యనిర్వహక వర్గం వాళ్ళుదూరంగా నిలబడ్డూం "నిరాహారదీక్షలు మొదలు పెట్టడం ఆతరువాత రోజులు గడిచినకొద్దీ అది అల్లరికి, దౌర్జన్నానికి అస్పినష్టానికి దారితీయటం-ఇలా జరగకుండా మేము ఈ కొత్త పద్ధతి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం! విజయవంతంగానే జరిగింది గనుక త్వరలో ఇది దేశమంతా ప్రవేశపెట్టాలని సిఫార్సుచేస్తాం!" అన్నారు కమీషనరుగారు

మేము 'ఇహిహి అంటూ చిరునవ్వు నవ్వాము వెంకట్రావ్‌ వేపు కోపంగాచూస్తూ. *

. 126 హ్యామరాలజీ

శ్‌ బాణ ఆ తన్ని నర్వ తన . పబిసిటీ ప్రహసనం “తక్‌. | చే రళ్ళది . వీ 1

  • ట్వఫనతలినీ లన్న 52 (ఆ (౫ క్‌ |. వ ఇ 111! గుప్తలనాటీ కాలాన్ని స్వర్ణయుగమన్నారు చరిత్ర రాసిన రచయితలు. అలాగే ప్రస్తుత కాలాన్ని "ప్రకటనలు లేక పబ్లిసిటీ యుగం"గా మనం మొఖవాటం లేకుండా చెప్పు కోవచ్చు. రచయితలు రాసేయవచ్చు. మరికొంతకాలంపోతే ఈ వ్యాపారప్రకటనలు ఏ పద్ధతి కొస్తాయో ఎవరయినా తేలిగ్గా ఊహించుకోవచ్చు. ఆనాడు మన నిర్భయ్‌నగర్‌ కాలనీ లైఫ్‌ ఇదిగో ఇలా వుంటుంది! ఇక చదవండి! నో న గా నేనూ, శాయీరామ్‌, రంగారెడ్డి, జనార్ధన్‌ కలిసి ఆఫీస్‌ కెళ్ళడానికి బయట్టేరి బస్‌స్టాప్‌ దగ్గరకొచ్చాము. అక్కడ రష్‌ చాలా ఎక్కువగా ఉంది. పబ్లిసిటీ ప్రహసనం 127

"అబ్బ! రష్‌ బాగా ఉందే?” అన్నాడు శాయీరామ్‌.

అనటమే ఆలన్యం ఓ వ్యక్తి మా వెనుక నుంచి నర్రున ముందుకి దూసుకొచ్చాడు. | "అవున్సార్‌! ఎక్కడ చూచినా రష్‌! ఎటు చూచినా రష్‌! రైళ్ళల్లో బస్సుల్లో, షిప్పుల్లో, విమానాల్లో, రోడ్లమీద, అఫీసుల్లోనూ, అంతా రష్‌! అన్నీరష్‌! అంచేత మోరూ నేడే వాడండి రష్‌! కమ్మని కమనీయమయిన కూల్‌డ్రింక్‌ పౌడర్‌ రష్‌! రొటీన్లకూ, ప్రోటీన్లకూ తెగ తాగండి రష్‌! పొడర్‌తో చేసిన పానీయం! ఒక పాకెట్‌ రష్‌ పౌడర్‌-ఎనిమిది బిందెల నీళ్ళను కమ్మని రసమయ రసంగా మార్చేస్తుంది. ఆరొందల మందికి సరిపోతుంది. ఎవరికి సార్‌ కూల్‌డ్రింక్‌ పౌడర్‌” = అంటూ తన బాగ్‌లో నుంచి రష్‌ పాఠెట్లు తీసి మాకివ్వబోయాడతను.

"మాకొద్దు నాయనా!” అన్నాడు రంగారెడ్డి షాక్‌ నుంచి తేరుకుని.

“అదేమిటి సార్‌! రష్‌ బాగా ఉందే అని మీరనుకోవటం నేను వినలేదనుకున్నారా?"

అతనిని వదిలించుకునేసరికి పావుగంట పట్టింది- ఇంతలో మా మధ్యకు ఏదో జంతువు దూరినట్టనిపించింది. -

ఆ జంతువుని చూసి రంగారెడ్ని కెవ్వున కేకవేసి అవతలివేపుకి ఒక్కగెంతు గెంతాడు. ఆ గెంతుకి అక్కడ నిలబడ్డ ఓముసలాయన అటువేపు నిలబడ్డ ఇద్దరు ప్రీలమీద పడ్డాడు. వాళ్ళు కింద చతికిల బడుతూ ఇంకొకాయన కాళ్ళుతొక్కారు. అ కాళ్ళ ఓనరు “నాయనోయ్‌! నా కాళ్ళు పచ్చడి అయిపోయాయ్‌ దేవుడో" అంటూ ఆ లావుపాటావిడను బూతులు తిట్టసాగాడు.

ఈ చైన్‌ రియాక్షన్‌ ఓపక్క జరుగుతూండగానే నేనూ, శాయీరామ్‌ కలసి మా, మధ్యకొచ్చిన ఆ జంతువేమిటా అని పరీక్షగా చూశాము.

రంగురంగుల బొచ్చులో నుంచి తెలుగు అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయ్‌. "అత్త మొగుడే నా మొగుడు! నేడే చూడండి! అద్భుతమైన సెంటిమెంటల్‌ చిత్రం! పద్నాలుగు ధియేటర్లలో నేడే విడుదల!" అని రాసి ఉంది.

ఆ జంతువు తోకమీద తారాగణం పేర్లున్నాయి.

అ జంతువు నెమ్మదిగా మా దగ్గరకొచ్చి తోకాడించాకగానీ మాకు తెలీలేదు అది కుక్క అని! అయితే అది కుక్క అని ఓ పట్టానతెలీటంలేదు. మనిషి మొఖంలా ఉంది దాని మొఖానికి కూడా రంగులు పూసి ఆ రంగులతో ఆ సినిమాలోని హీరో మొఖం

కనిపించేటట్లు చేశారు. అంచేత మేము కొంచెం కన్‌ఫ్యూజ్‌ అయ్యాము.

"ఇది కుక్కరా!" అన్నాడు జనార్ధన్‌ రంగారెడ్డికి ధైర్యం చెప్పూ.

128 హ్యామరాలజీ

"అవునవును! ఇది కుక్కే! ఊరకుక్క. ఈ మధ్య సినిమా కంపెనీవాళ్ళు కుక్కలూ, = పందుల మీదే రంగులేసి కొత్త పిక్చర్ల పబ్లిసిటీ ఇస్తున్నారు” అంటూ చెప్పాడో స్టూడెంట్‌! ఇంతలో ఓ సిగరెట్‌ కంపెనీ వాన్‌ వచ్చి అ బస్‌స్టాప్‌ దగ్గర ఆగింది. "మినిష్టర్‌ సిగరెట్లనే వాడండి! అయిదు సంవత్సరాల పాటుకాలుతూండే ఎకైక సిగరెట్టు-మినిష్టర్‌ సిగరెట్టు! ధారాళమయిన పాొగకి నేడే వాడండి! మినిష్టర్‌ సిగరెట్లు!" ఇలా ఆ వాన్‌ అంతా బొమ్మలతో పాటు రాసి ఉంది. ఆ వాన్‌లోని వాళ్ళు దిగి మమ్మల్ని సిగరెట్లు ఎక్కడ కొనమంటారోనని మేము బాగా వెనక్కి జరిగి నిలబడ్డాము. అదృష్టవశాత్తు ఆ “వాన్‌'' వెళ్ళి పోయింది. అది వెళ్ళిపోగానే అప్పడాల వాన్‌ వచ్చింది. మేము ఇంకొంచెం దూరం పరుగెత్తు కెళ్ళి నిలబడ్డాము “ముద్ద ముద్దకీ మధ్య అప్పడం! మనిషి మనిషికీ మధ్య అప్పడం! నేడే వాడండి జుబేగా వారి అప్పడాలు! మనిషి శరీరం పెరుగుదలకూ-ఆరోగ్యానికీ అవసరమైన ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలతో తయారు చేయబడినాయ్‌ జుబేగా కంపెనీ వారి అవ్పడాలూ!” ఆ వాన్‌ కూడా వెళ్ళి పోయింది గానీ- ఇంకా మా సెక్రటరియట్‌ బస్‌రాకపోయేసరికి చిరాకుపుట్టుకొచ్చింది ఆ విషయం గట్టిగా అందామంటే మళ్ళీ ఆ "టెమ్‌ సెట్టర్‌ కంపెనీ తాలూకు పార్ట్‌టైమ్‌ పెద్దమనిషి ఎక్కడ చుట్టముడతాడోనని భయం! ల కాని ఆ విషయం మర్చిపోయిన శాయీరామ్‌ మాత్రం "ఇవాళ ఒక్క సెక్రటేరియట్‌ బస్‌కూడా రావటంలేదేమిటి?" అన్నాడు చిరాకుగా. మా పక్కనున్న చెమ్కీటోపీ సాయిబుగారు నవ్వారు. “ఇప్పుడే గదండీ -సెక్రబేరియట్‌ బస్‌లు రెండు వెళ్ళాయ్‌!” అన్నాడతను. మేము ఉలిక్కిపడ్డాము. "సెక్రటేరియట్‌ బస్‌లు వెళ్ళాయా?" “అవునూ!" "మేము ఇక్కడ నిలబడి అరగంటవుతోంది! మాకే బస్సూ కనిపించలేదే!' "ఇప్పుడే మీ కళ్ళముందే రెండు బస్సులు వెళ్ళాయి కదండీ!” "ఇప్పుడు వెళ్ళిన రెండు అప్పడాల కంపెనీ వాన్‌లు! వాటినే చూసి నువ్వు బస్‌ అనుకున్నావేమో!" అంటూ తిరగబడ్డాడు. పబ్లిసిటీ ప్రహసనం 129

సాయిబుగారు రంగారెడ్డిని చాలా జాలిగా చూశారు.

"అవి అప్పడాల కంపెనీ వాన్‌లు కాదు నాయనా! ఆర్టీసీవారి సిటీబస్‌లు!"

మాతో పాటు అక్కడున్న చాలామంది ఉలిక్కిపడ్డారు.

“"అప్పడాలవాన్‌లు ఆర్టీసీ బస్‌లా"

"అవును! నిన్న పేపర్లో వేశారుకదా చూళ్ళేదా?"

"ఏమని?"

"ఇవాల్టి నుంచీ బస్‌లకు నంబర్జు-డెస్టినేషన్‌ పేర్లూ ఉండవ్‌! కేవలం వ్యాపారప్రకటల్ని బట్టే గుర్తుపట్టాలి!"

"అవును! నేను బ్లేడ్స్‌ కంపెనీ బస్‌ ఎక్కాలి!" అన్నాడు ఓ న్యక్తి తన చేతిలోని డయిరీ తీసి తను వెళ్ళాల్సిన చోటకెదురుగ్గా ఉన్న ప్రకటన చూస్తూ. మేము సెక్రటేరియట్‌ కెళ్ళాలంటే ఏ బస్‌ ఎక్కాలండీ? నేను అపెద్దమనిషిని వినయంగా అడిగాను.

అతను మళ్ళీ డయిరీ చూశాడు.

సెక్రటేరియట్‌ అని ఉన్నచోట అప్పడాల కంపెనీ అని ఉంది.

''అందుకేనయ్యాా! నేను చెప్పింది! అప్పడాలకంపెనీవి మరి రెండు బస్‌లు . వెళ్ళాయికదా?" నవ్వుతూ అన్నాడు సాయిబుగారు.

జనార్ధన్‌ అపెద్దమనిషి నడిగి ఎ వ్యాపార ప్రకటన బస్‌ ఎక్కడి కెళ్ళుతుందో తన డయిరీలో రాసుకోసాగాడు.

ఈసారి బ్రాందీ బస్‌ వచ్చింది "

"బ్రాందీ-బ్రాందీ" అని అరచాడు కండక్టర్‌ లోపల్నుంచి!

“అంటే! పంజాగుట్ట మీదనుంచీ వెళ్ళుతుందా?" ఒకావిడ అనుమానంగా అడిగింది.

"లేదమ్మా? విస్కీబస్‌ పంజాగుట్ట మీదనుంచి వెళ్తుంది! బ్రాందీ బస్‌ కూడా అంటే వెళ్తుంది గానీ సందుల్లో నుంచి తిరిగి వెళ్ళుతుంది!”

“మరి బీరు బస్సో?"

"'బీరుబస్‌ అంతదూరం వెళ్ళదు మాస్టారూ! ఖైరతాబాద్‌ దగ్గరే ఆగిపోతుంది! ' అంటూ గంట కొట్టాడతను. బస్‌ వెళ్ళిపోయింది. మరో పదినిముషాల తర్వాత ఒడియాల బస్‌ వచ్చింది.

"అప్పడాలూ, వడియాలూ ఒకటే జాతికదా! ఇది సెక్రటేరిట్‌ దగ్గర కెళ్ళుతుందేమో" అన్నాడు జనార్ధన్‌ అనుమానంగా.

130 హ్యామరాలజీ

శాయీరామ్‌ కండక్టర్‌ దగ్గరకిళ్ళి వివరం అడిగాడు. ల

“అప్పడాలు వేరు, ఒడియాలు వేరు సార్‌! బస్‌ లకడీకపూల్‌ నుంచి మెహిదీపట్నం పోతుంది-"

"లకడీకాపూల్‌లో దిగినడిచి వెల్దాంలే పదండి- ఇందులో వెళ్దాం! "అన్నాడు రంగారెడ్డి,

లోపల ఎక్కడ చూసినా ఒడియాల బోమ్మలే కనబడుతున్నాయి కండక్టర్‌ మాత్రం

చేగోడీల డిజైన్‌ ఉన్న యూనిఫారం వేసుకున్నాడు. “"మరేంలేదు సార్‌! ఒడియాల బస్‌ కండక్టరు రాలేదని నన్ను బుక్‌ చేశారు" అన్నాడతను మా ఆఅశ్చర్యంచూసి చిరునవ్వునవ్వి!

మా ముందు నిలబడ్డ ఓ కళ్ళజోడు పెద్దమనిషి ఒక్కసారి భీకరంగా అరిచాడు. బస్‌లోని వాళ్ళంతా అదిరిపడి లేచి నిలబడ్డారు. పుట్‌బోర్డుమీద నిలబడ్డ కొంతమంది యాక్సిడెంట్‌ అయిందేమోనని కిందకు దూకేశారు.

"భయపడకండి సార్‌! మేడమ్‌! అశేషాంధ్రలోకాన్ని అద్భుతమైనస స్పెన్స్‌తో, సరికొత్త కథలతో ఈ బస్‌లాగా ఒళ్ళు గగుర్పొడిపించే మలుపులతో ఉరూూతలూగిస్తున్న ఆంధ్రుల అభిమాన ప్రఖ్యాత రచయిత యండమూరివీరేంద్రనాధ్‌గారి నవలలు ఎవరికి కావాలో ఇప్పుడే ఆర్డర్‌ బుక్‌ిచేయండిసార్‌! ప్రతి నాలుగు నవలలు కొన్నవారికి ఓ నవల ఉచితంగా ఇవ్వబడుతుంది. అంతే కాదు. దానిమీద రచయిత ఆటోగ్రాఫ్‌ కూడా ఉంటుంది.

అంతేకాదు! ఆ నవలలో ఓతప్పు ఉంది. అ తప్పేమిటో కనుక్కొన్న మొదటి

చ వెయ్యిమంది పాఠకులకు ఇంకో తప్పు కనుక్కునేందుకు "క్లూ" ఇవ్వబడుతుంది" అని మళ్ళీ భీకరంగా కేకశాడతను. ఈసారి అతని పక్కనే కూర్చున్న ఓ గర్భిణీ స్త్రీ మూర్చపోయింది. బస్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌ దగ్గర ఆగింది. పోలీస్‌ చేతిలో కనబడుతున్న స్టాప్‌బోర్డ్‌ మీద "దోమ మార్కుగల పళ్ళపాడినే వాడండి!” అని రాసి ఉంది పెద్ద అక్షరాలతో. అడుగున చిన్న అక్షరాలతో "స్టాప్‌" అని ఉంది. లం బస్‌ దిగి సెక్రటేరియట్‌కి పరుగెత్తాం. గేట్లమీద ఓ బిస్కెట్‌ కంపెనీ వారి పెద్ద పెద్ద హోర్షింగ్స్‌ కనబడుతున్నాయి. అదేమిటి- ఇక్కడ బిస్కెట్‌ కంపెనీ ఎప్పుడు పెట్టారు? సెక్యూరిటీ గార్డు నడిగాము ఆశ్చర్యంగా.

"ఇవాల్టీనుంచేనండీ!"

"మరి సెక్రటేరియట్‌ ఎమయింది?”

“వెనుక రాత్రి కొత్తగా వేసిన పాకల్లోపెట్టారండీ!" పబ్లిసిటీ ప్రహసనం 131

“ఎందుకలా? "బిస్కెట్‌ కంపెనీ వారికి-గవర్నమెంట్‌ వారికి కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం ఈ ( ఏర్పాట్లు జరిగాయండీ! దీనివల్ల గవర్షమెంట్‌కి ఏటా తొంభయ్‌ లక్షల రూపాయలు లాభం

వస్తుంది!” మేము వెనుకవేపు నడిచి కొత్తగా పాకల్గ్లో ఏర్పాట్లు చేసిన మా ఆఫీస్‌లో కూర్చున్నాము.

"ఇవాల్టి నుంచీ ఆఫీస్‌ డ్రాప్టులకు ఈ కాగితాలే వాడండి!" అంటూ ఓ తెల్లకాగితాల కట్ట అందించాడు ప్యూను.

కాగితం ఒకవేపు తెల్లగా ఉంది. రెండోవేపు వ్యాపార ప్రకటనలతో నిండి ఉంది.

"భూతమ్‌ వారి ఎలక్ట్రిక్‌ ఫొన్లు ఇప్పుడు దేశంలో 90 శాతం ఉపయోగిస్తున్నారు కనుక మీరు ఈ ఫాన్‌ కొని శాతాన్ని పెంచండి!”

మిగతా కాగితమంతా రకరకాల ఫాన్లబొమ్మలు-

లంచ్‌ టైమ్‌లో జనార్ధన్‌ వచ్చాడు.

"సాయంత్రం రామ్‌కోటిలో మన సుదర్శనంగాడి సిస్టర్‌ మారేజ్‌ ఉందట.

మనల్నందర్ని రమ్మని మరీ మరీ చెప్పాడు..." అన్నాడు

ఆఫీసవగానే అందరం కలసే పెళ్ళికి బయళ్లేరాం. నాలుగడుగులు వేశామో లేదో మాముందు నడున్తున్న వ్యక్తి హఠాత్తుగా ఆగిపోయి వెనక్కు తిరిగి మా వేపు చూసి చిరునవ్వునవ్వాడు.

“ఆహా! ఏం తెలుపు? మొఖం పగిలిపోయే తెలుపు!” అన్నాడు.

మేమంతా భయంగా వెనక్కు తగ్గాం! “వాటీజ్‌దట్‌?" ధైర్యం తెచ్చుకుని అడిగాడు

"అదేనండీ! అద్భుతమయిన తెలుపు. ఇంత తెల్లగా ఎలా వచ్చిందో తెలుసా?" ఇదేదో పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చిన కేసు-తెలుస్తూనే ఉంది.

ఎందుకయినా మంచిదని రోడ్డుకి మరో పక్కకు పరుగెత్తాం! కానీ అతను మా కంటేముందు అక్కడికి చేరుకున్నాడు "మిమ్మల్నే! ఎంత తెలుపు-మొఖం పగిలే తెలుపు!" అన్నాడు మళ్ళీ చిరునవ్వుతో.

ఇంక చేసేదిలేక “అవును!” అన్నాడు శాయీరామ్‌.

"చాలా మరీ ఎక్కువ తెలుపు" అన్నాడు రెడ్డి. .

"ఇంత తెలుపు ఎలా వచ్చిందో చెప్పండి?" అన్నాడతను మళ్ళీ నవ్వుతూ. 132 హ్యూమరాలజీ

“ఇంకేముంది! మురికివట్టిన పాతబట్టల్ని మీ కంపెనీవారి వాషింగ్‌ పౌడర్‌ | వాడినందువల్ల-"అన్నాడు శాయీరామ్‌ సినిమాల్లో ఓ వాషింగ్‌ పౌడర్‌ పబ్లిసిటీ గుర్తుతెచ్చుకుని. "ఛీ! మాది వాషింగ్‌పొడర్‌ కాదు!"

"మరి!"

"చక్రివారి రెడీమేడ్‌ దుస్తులు! ఇంత తెల్లగా ఎలా వచ్చాయో తెలుసా? మురికిపట్టిన పాతబట్టలు పారేసి చక్రివారి రెడీమేడ్‌ దుస్తులు కొన్నందువల్ల! మీరూనేడే చక్రివారి దుస్తులు కొనండి! మొఖం పగిలే తెలుపుతో తిరగండి!"

"సరీ తిరుగుతాం-మీరింక మమ్మల్ని వదుత్తే....”

. అతను చిరునవ్వుతో మా చొక్కాలమీద చక్రివారి స్టిక్కర్‌లు అంటించి "థ్యాంక్యూ" అంటూ వెళ్ళిపోయాడు.

ఆ స్టికర్లు తీసేయడానికి మేము ఆరోడ్‌ పక్కనే గంటసేపు కూర్చుని తన్నుకున్నా రాలేదు.

చేసేదిలేక అలాగే బస్‌స్టాప్‌ కెళ్ళి నిలబడ్డాం. బస్‌స్టాప్‌లో అంతవరకూ జెంటిల్మన్‌లాగా నిలబడ్డ ఓ వ్యక్తి గట్టిగా విరగబడి నవ్వాడు.

॥ అందరం ఇదేదో హిస్టీరియా బాపతేమో అనుకున్నాంగానీ కాదంట!

"నేను మామూలు మనిషిననుకుంటున్నారు కదా! కాదండీ! ప్రఖ్యాత రచయిత

శ రామజోగ్‌ని 'భావన' వారపత్రికలో రాసే సీరియల్‌ నాదే! ఆ సీరియల్‌మీద మిరు రాసే ఓ మాంచి ఉత్తరానికి నేను 196 ఫోజులతో కనిపించే విడియోకాసెట్‌ ఉచితం" అన్నాడు. ఆ రచయితని వదిలించుకుని పెళ్ళికి వెళ్ళాం.

పెళ్ళిపందిరంతా సెంటుకంపెనీ వాళ్ళ పోస్టర్లతో నిండివుంది.

పెళ్ళికూతురిని వేదికమీద చూసి ఉలిక్కిపడ్డాం! ఆమె పక్కనే ఓ బోర్డు తగిలించి ఉంది. .

వి "ఈమె అంబికావారి పెళ్ళికూతురు. ఈమె ధరించిన దుస్తులన్ని అంబికాసిల్క్‌ ఎంపోరియంలో లభిస్తాయ్‌. నేడే మీ పెళ్ళికీ ఇతర రకాల పండుగలకూ మా అంబికా సిల్క్‌ ఎంపోరియంనే సందర్శించండి- ఇట్టు-అంబికా సిల్క్‌ ఎంపోరియం-బాలక్‌స్టీట్‌-కోఠి-" వెంటనే మేము సుదర్శన్‌ని పక్కకుపిలిచాం.

"ఇదేమిటి అబోర్డు..."

పబ్లిసిటీ ప్రహసనం 133

"ఇవాథభ్రేపు అందరూ ఇట్లాగే చేన్తున్నార్లే! ఆబోర్జు పెళ్ళి రోజంతా అలా ఉన్నందుకు గొను ఆ సిల్క్‌ ఎంపోరియంవాళ్ళు ఓ పట్టుచీర ఫ్రీగా ఇస్తున్నారు. కరువు రోజుల్లో అదీ ఓ లాభమే కదా?” మరి కాసేపట్లో పెళ్ళికొడుకుని తీసుకొచ్చారు. అతని నోట్లో రెండుగజాల పాడుగున్న చుట్ట ఉంది. గుప్పు గుప్పున పాగ వదులుతున్నాడతను. నెత్తిమీద మెరుస్తోన్న కిరీటం ఒకటి! దానిమీద రంగు రంగులతో మెరుస్తోన్న అక్షరాలు!

“రాబందు మార్క్‌చుట్టల పెళ్ళికొడుకు! పెళ్ళినాటిరాత్రి ప్రతి పెళ్ళికొడుక్కి ఆనందం కలిగించేవి రెండే రెండు. అందమైన పెళ్ళికూతురు, రాబందుమార్క్‌వారి పొడుగాటి కింగ్‌ సైజ్‌ చుట్ట!”

"మరి పెళ్ళికొడుక్కి అది తగిలించుకున్నందుకు ఆచుట్టలకంపెనీ వాళ్ళు ఎమిస్తారు?"

అడిగాడు రెడ్డి అనుమానంగా

"ఓ సూట్‌ బహుకరిస్తారు! ఈ కరువు రోజుల్లో మరి అది కొనాలంటే కష్టమే కదా 'అన్నాడు సుదర్శనం

అక్కడినుంచీ మా కాలనీ కెళ్ళడానికి ఏ బస్‌ ఎక్కాలా అని డయిరీ. చూశాడు శాయీరామ్‌. టెలివిజన్‌ కంపెనీల బస్‌ ఎక్కాలని రాసి ఉందందులో.

అరగంటసేపు ఎదుర్వూసినా టెలివిజన్‌ కాదుగదా రేడియో బస్‌ కూడా రాలేదు. ఇక లాభంలేదని ఆటోఎక్కాం నలుగురం- కొంత ఎక్‌స్ర్రా ఛార్జ్‌ ఇచ్చేట్లు మాట్లాడి.

కొంతదూరం వెళ్ళాక ఆటోడైవర్‌ వెనక్కు తిరిగి 'సుఖమైన బసకూ సాంత ఇంటి 1 వసతులకూ- హోటల్‌ ఛత్రపతిలోనే దిగండి! అనురాగంతో మిమ్మల్ని సేవిన్తుంది హోటల్‌ ఛత్రపతి" అన్నాడు చిరునవ్వుతో.

మాకేం అర్ధం కాలేదు. ఎదో చెప్పబోయి ఏదో చెప్పాడేమోలే అని నరి పెట్టుకున్నాం.

ఇంకాస్త దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కు తిరిగి మళ్ళీ అదే మాట్టాడాడు.

"వీడెవడో పిచ్చాడులాగున్నాడు! మనం ఆటోదూకి పారిపోవడం మంచిది" అన్నాడు . రంగారెడ్డి అనుమానంగా.

ఎలాగోలా ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నాం కాలనీ చేరేవరకూ! కాలనీలో దిగి ఛార్జి చెల్లించగానే మళ్ళీ మొదలు సెట్టాడువాడు. "సుఖమైన బనకూ సాంత ఇంటి వసతులకూ- హోటల్‌ ఛత్రపతిలోనే దిగండి! అనురాగంతో మిమ్మల్ని సేవిన్తుంది హోటల్‌ =

9 ఛత్రపతి” అన్నాడు మళ్ళీ!

"ఆ హోటల్‌ పేరెందుకు చెప్తున్నావ్‌?” అన్నాడు రెడ్డి అనుమానంగా,

134 హ్యూమరాలజీ

"అలా చెప్తే వాళ్ళు నాకు డబ్బు ఇస్తారండీ! ప్రతి పాసింజర్‌కి పబ్లిసిటీ చేస్తూండాలి నేను. మర్చిపోకండి! అనురాగంతో మిమ్మల్ని 'సీవిస్తుంది హోటల్‌ ఛత్రపతి" అంటూ కాలనీ దగ్గర ఆపి మీటర్‌ ఛార్జిమీద ఎక్‌స్టా తీసుకుని వెళ్ళి పోయాడతను.

మేము ఎవరింటికి వాళ్ళు చేరుకున్నాం. మా ఇంటి ముందు తలుపులకు అడ్డంగా పెద్దబోర్డులు కనిపించినయి. వాటిమీద పెద్ద తాటికాయంత అక్షరాలు. అక్షరాల మధ్యలో నుంచి ఇంట్లో కెళ్ళడానికి చిన్నతలుపులు రెండు కనబడుతున్నాయి.

"సువేగా గాస్‌ స్టవ్‌లు-కూరగాయలను కసిగా తరిగే ఎకైక గాస్‌స్టవ్‌ సువేగా! 'గా' అనే అక్షరాలు మధ్య నుంచి దూరి వెళ్ళిలోపలకు వెళ్ళేసరికి మా ఆవిడ ఆనందంగా గులాబ్‌జూమ్‌ తింటోంది. "బయట అడ్డంగా ఆబోర్జు ఎవరు పెట్టారు?" చిరాకుగా అడిగాను" అయ్యో! అదేంటండీ! వాళ్ళ బోర్డులు మన కాలనీలో అందరిళ్ళకు ముందు తగిలించారుగా!"

"అదేనేనడిగేది! ఎందుకు పెట్టారు అని"

“అవి అలా పెట్టనిచ్చినందుకు మనకు పెద్ద గులాబ్‌జామ్‌ పాళట్‌ ఉచితంగా ఇచ్చారండీ! అలా నెలకొకటి ఇస్తారట! పిల్లలు అనందంగా గులాబ్‌జామ్‌ తింటుంటే చూసి ఏమీ మాట్లాడలేక పోయాను. ఆబోర్జులో నుంచి 'గా' అనే అక్షరం మధ్య నుంచే వెళ్ళటం, రెండు మూడుసార్లు ప్రాక్టీస్‌ చేశాను!

రాత్రి పది గంటలకు కాలనీ బయట ఎవరో అరుస్తూండటం వినిపించి కిటికీ తెరిచి చూశాను! శ్యామల్రావ్‌గారు, వాళ్ళబ్బాయితో సహా కాలనీ అంతా తిరుగుతూ “రాత్రిళ్ళు | పడుకునేముందు-మీరందరూ "వేపిక్స్‌" సేవించండి. అలసటను పోగొట్టి, ఆత్రుతను లేవగొడుతుంది మర్చిపోకండి "వేపిక్స్‌- వేపిక్స్‌-" అని అరుస్తున్నారు. నాకు అర్ధమయింది. ఆ కంపెనీవారు శ్యామల్రావ్‌ ద్వారా చేయిస్తున్న మరో పబ్లిసిటీ వ్యవహారం ఇది. నిద్రపోవడానికి ఉపక్రమించి లైటార్చ్పబోయేసరికి ఎదురుగ్గా గోడమీద పెద్దవెల్తురు కనిపించి అదిరిపడి లేచి కూర్చున్నాను.

"నిరోధ్‌ వాడండి! సర్వకాల సర్వావస్థ్టలయందు ఉపయోగపడుతుంది నిరోధ్‌!” అని చెప్తోంది అమ్మాయి గోడమీద నిలబడి. ఆ తర్వాత ఠక్కున మాయమయిపోయింది.

ఆ తరువాత నేను నిద్ర కుపక్రమించాను అర్ధరాత్రి మా ఆవిడ నన్ను భయం భయంగా లేపింది. లేచి “ఎమిటి సంగతి' అని అడిగాను.

"చదవండి! వెంటనే చదవండి! హ్యూమరాలజీ! మీ జీర్ణశక్తి అభివృద్ధికి హ్యూమరాలజీ" అంటున్నారండీ ఎవరో అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. శ పబ్లిసిటీ ప్రహసనం 135

గు, గ్‌ స, గర్‌౧ా0 ॥ కం జ్‌ గోగ్‌ ఉ్యడ్య గెల నీ | న! ౮ రీ సట ద 1 ఉగ ఏ డం / సో [7 “కార్ల్‌ మార్క్‌ జిందాబాద్‌! కామ్రేడ్‌ శాయీరామ్‌ జిందాబాద్‌!" కేకలు దగ్గరయాక చూస్తే-వాళ్ళంతా మా కాలనీ కుర్రాళ్ళే! వాళ్ళందరూ మార్క్సిస్ట్‌ (ఎక్ట్రీమ్‌, లెనినిస్ట్‌ మీడియమ్‌ గ్రూప్‌) ఇది మా కాలనీలో కొత్తగా ప్రారంభించిన కమ్యూనిస్ట్‌ పార్టీ! ఎవరికిష్ట మొచ్చిన పార్టీవాళ్ళు స్థాపించుకునే సాంప్రదాయం మనకెలాగూ ఉండనేఉంది కదా! ఇప్పుడు సంగతేమిటంటే మా కాలనీవాళ్ళు తీయబోయే సినిమా కేవలం మార్క్సిస్ట్‌ భావాలతో విప్పవాత్మకంగా తీయాలని వాళ్ళు డిమాండ్‌ చేస్తూ ఊరేగింపు జరిపారన్నమాట. సంగతేమిటో కనుక్కుందామని శాయీరామ్‌ ఇంటికెళ్ళేసరికి అందరూ అక్కడే సమావేశమయి కనిపించారు. 136 హ్యూమరాలజీ

"మరేంలేదు. మార్క్సిస్ట్‌ భావాలతో సినిమా తీయాలని వప్పుకునేనరికి "నాకే" జైకొట్టేస్తున్నారు" చిరునవ్వుతో చెప్తున్నాడు శాయీరామ్‌. "అదేమిటి మనం మొదటి సినిమా పూర్తికమర్షియల్‌ మషాలతో వ్యాపార చిత్రం తీయాలనుకున్నాం గదా?" అడిగాడు జనార్ధన్‌ “"అందుకేనయ్యా బాబూ.... మార్క్సిస్ట్‌ వ్యవహారంతో సినిమా తీయటం! ఈ రోజుల్లో అవే వ్యాపార చిత్రాలు! ఆ మషాలా పెట్టి, మిగతా మషాలాలు కొంచెం తగిలిస్తే చాలు!" అన్నాడు శాయీరామ్‌. "అవునవును!" అంది పార్వతీదేవి. "కానీ మార్క్సిస్ట్‌ సినిమా ఎలా తీయాలో మనకెలా తెలుస్తుంది?” అనుమానంగా అడిగాడు రంగారెడ్డి. "నాకు తెలుసు నేను చెప్తానులే!” అన్నాడు జనార్ధన్‌. జనార్ధన్‌ వాళ్ళ అన్నయ్యకు ఆమధ్య వ్యాపారంలో లక్షలు లక్షలు లాభం వచ్చేసరికి ఆకుటుంబమంతా మార్క్సిస్ట్‌లతో చేరిపోయారు. మార్క్సిస్ట్‌ నాయకులవాలంటే లక్షలకు లక్షల ఆస్తి ఉండాలంట! కాదని మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. కావాలంటే మన రాషష్టంలోని కమ్యూనిస్టు మార్కిస్టుపార్టీల నాయకుల ఆస్తి వివరాలు కనుక్కోమంటాడు. "మార్క్సిస్టు సినిమా అంటే ఇలా ఉండాలన్న రూలేంలేదు. మనిష్ట మొచ్చిన

  • సినిమాయే తీసి పబ్లసిటీ మాత్రం మార్క్సిస్టు సినిమా అని ఇస్తే చాలు" అన్నాడు జనార్ధన్‌. "మరి దీనికి కథెవరు తయారు చేస్తారు?" అడిగాను నేను. "ఇంకెవరు? నేనే! ఎలాంటి కథయినా రాయగలను నేను" అన్నాడు చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయ్‌ ఉరఫ్‌ రామసుబ్బయ్య,. “నువ్వా! నీకసలు మార్క్సిజం అంటేనే తెలిదుకదయ్య?" అడిగాను చిరాకుగా "భలేవారే సార్‌! మార్క్సిజం సినిమా తీయడానికి మార్క్సిజం అంటే ఏమిటో | తెలియాలా? భలేవారే సార్‌! విమానం ఎక్కడానికి విమానం డైవింగ్‌ తెలుసుండాలా? భలేవారే సార్‌ మీరు." అందరూ నన్ను చూసి నవ్వారు. "అయితే ఓ వారంలో కథ తయారుచెయ్‌! లాగించేద్దాం!”' అన్నాడు శాయీరామ్‌. చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయ్‌ ఆనందంగా కాగితాలు కలం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వారమంతా సినిమా వ్యవహారంలో బిజీ అయిపోయే వాళ్ళేమో గానీ ఈలోగా, మా స్మగ్గర్స్‌గాంగ్‌ 137

కాలనీ పిల్లలందరూ చదువుతోన్న స్కూల్‌ తొలూకూ ప్రిన్సిపాల్‌గారి దగ్గర్నుంచీ మా అందరకూ ఉత్తరాలు వచ్చాయ్‌. అన్నిట్లోనూ మేటర్‌ ఒక్కటే. "మీ పిల్ల, పిల్లగాడు.... కి టి.సి. ఇచ్చి న్కూలునుంచి గెంటేయాలని ఆలోచిస్తున్నాము. ఆ విషయంలో మీ నహకారం కోసం అర్ధిస్తూ- ప్రిన్సిపాల్‌ పిడుగుపడ్డట్టు అందరం స్కూలుకి పరుగెత్తాం పిల్లథాయలను వెంట బెట్టుకుని. అప్పటికే అక్కడ ఓ జాతరలాగుంది తల్లిదండ్రులూ, పిల్లలతో! ప్రిన్సిపాల్‌ రూమ్‌బయట అప్పుడప్పుడూ పిల్లల్ని మింగేసేలా చూస్తూ తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. రంగారెడ్డి చాలామందితో ఇంటర్వ్యూచేసి వచ్చాడు. "అందరికీ అవే ఉత్తరాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడే ఇద్దరు పిల్లలకి టి. సి. ఇచ్చి పంపిచేసిందట కూడాను” వివరాలు చెప్పాడు మాకు. ఈలోగా ప్రిన్సిపాల్‌ రూమ్‌లో నుంచి ఓ తండ్రి గొంతు గట్టిగా బ్రతిమాలుతూ వినిపించింది. "అలా అనకండి మేడమ్‌! ప్లీజ్‌ మేడమ్‌! ఇప్పుడు టి.సి. ఇస్తే సీటెక్కడ దొరుకుతుంది మేడమ్‌." "లేకపోతే ఏమిటది? ఏమిటి చదువు? ఏమిటీ మార్కలు? మాత్స్‌-ట్వంటేీ పర్సెంట్‌, సైన్స్‌ ఫిఫ్టీన్‌ పర్సెంట్‌! నో 1నో ! టి.సి. తీసుకెళ్ళిపోండి! పిల్లలచదువు మీద శ్రద్దలేని తల్లిదండ్రులు మాకక్కర్లీదు-మా స్కూల్లో "సీటు" కు ఎంత డిమాండ్‌ ఉందో తెలుసా మీకు?" "తెలుసండీ!" "సీటు" ఇస్తాను అంటే చాలు! వేలకువేలు డొనేషన్లు కట్టే పేరెంట్స్‌ వేలకు వేలున్నార్న సంగతి తెలుసా మీకు?" "తెలుసండీ!" "తెలిసే ఇంత నిర్లక్ష్యం అన్నమాట! తీసుకుపోండి!” "క్షమించండి మేడమ్‌- ఈసారికి క్షమించండి! వచ్చే పరీక్షలకు ముందు నేనే శెలవుపెట్టి బాగా చదివి మా పిల్లలక్కూడా చెప్పి మంచి మార్కులు వచ్చేలాచేస్తా!” "ఇప్పటి పరీక్షల నంగతి మాట్లాడు! ఇప్పుడెందుకు మంచిమార్కులు రాలేదు?" "నాదే బుద్ధి తక్కువండీ! చాలా పొరపాటు చేశాను." 136 హ్యామరాలజీ

"అందుకే టి.సి తీసుకెళ్ళమంటున్నాను." . | "బాబోయ్‌ అంతమాట అనకండి మేడమ్‌-టెక్స్‌ వుస్తకాలు లేకపోవటంవల్ల ఆ రెండింటిలో తప్పారండి...” "టెక్స్‌ వుస్తకాలెందుకు లేవు?" "ఎమో వేడమ్‌! అడ్గమయిన షావులూ తిరిగాను. ఇంతవరకూ. ఎక్కడా రాలేదంటున్నారు-" "పిచ్చివాగుడు వాగకూడదు! క్లాస్‌టీచర్‌ దగ్గర ఒక _టెక్ట్‌పుస్తకం నేను చూశాను. ఇంతవరకూ రాకపోతే క్హాస్‌టీచర్‌ దగ్గరకెలావచ్చాయ్‌? " "ఆవిడ భర్త సౌదీఆరేబియాలో వని చేన్తున్నాడు మేడమ్‌! అక్కడనుంచి తెప్పించుకుందేమో మరి..." "సీ- మిస్టర్‌! మీరు టెక్ట్‌వున్తకాలెలా తెచ్చుకుంటారో, ఎక్కడ తెచ్చుకుంటారో నాకనవసరం! టి.సి తీసుకుపోండి...." “ఈసారికి క్షమించండి మేడమ్‌! మేడమ్‌, మేడమ్‌? మేడమ్‌ ప్లీజ్‌ మేడమ్‌!” "నో-నో-నో- యూ ఆర్‌ టూ ఎడొమెంట్‌.టి.సి. తీసుకుపోవాల్సిందే” అందరం ఊపిరి బిగబట్టి వింటున్నాము. అతనిగొంతువిపించలేదీ సారి. హఠాత్తుగా “ధన్‌ “మన్న శబ్ధం వినిపించింది. దానివెనుకే అవిడ కీచుగొంతు 'కయ్‌' మంది "ఛీ! వాటీజ్‌ దిస్‌, వాటీజ్‌దిస్‌ నాన్సెన్స్‌! మేరీ-మేరీ- రిమూవ్‌ హిమ్‌ ్రమ్‌దిస్‌ ప్లేస్‌..." మాకు అర్హమయిపోయింది, అతను రాజకీయనాయకులువాడే ఆఖరి అన్తం ప్రయోగించాడు. ఆమె కాళ్ళమీద పడిపోయాడు. "అలా అనకండి మేడమ్‌! ఇప్పుడు ఇంకో స్కూల్లో చేర్ప్చాలంటే మళ్ళీ కొత్తరకం ' యూనిఫారం, రెండువేలు డొనేషనూ- బాబోయ్‌-నా వల్లకాదు మేడమ్‌ మీరు వప్పుకునేవరకూ మీ కాళ్ళువదలను." “ముందు కాళ్ళువదులు-" "నేను వదలను మేడమ్‌-" . "ఆల్‌రైట్‌! వచ్చే యూనిట్‌ టెస్ట్‌లో అయినా అన్ని సబ్జెక్టులో పాస్‌ మార్కులు రాకపోతే టి.సి. ఇవ్వడం ఖాయం!" స్మగ్గర్స్‌గౌంగ్‌ 139

“అలాగే మేడమ్‌!”

“అయితే ఇంక కాళ్ళువదులు!"

“థ్యాంక్యూ మేడమ్‌!”

"మేరీ! ప్రిన్సిపాల్‌ .గొంతు వినిపించింది.

“యస్‌ మేడమ్‌!"

"అక్కడ విక్స్‌డబ్బా ఉంటుంది-కొంచెం తెచ్చి నాకాళ్ళకు రాయ్‌-మరీ నొప్పి పుట్టేలా పట్పకున్నాడు...."

“అలాగే మేడమ్‌!"

మా అందరిగుండెలూ రుల్లుమన్నాయ్‌. .

“ఆవిడ కాళ్ళు పట్టుకోవడం మరీ టూ మచ్‌!” అన్నాడు రంగారెడ్డి.

"ఒకళ్ళ సంగతేమో గానీ, గిసంటిపనులు నాతోని కాదు భయ్‌" చెప్పేశాడు యాదగిరి అయితే మేము కాళ్ళు పట్టుకోకపోయినా ఇంచు మించుగా అంత ఘోరంగానూ జరిగింది మా ఇంటర్వ్యూ!

అందరం వాచిపోయిన మొఖాలతో బయటకొచ్చాం.

హఠాత్తుగా యాదగిరి తన చైన్‌లోని చాకు తెరచి తన పన్నెండేళ్ళ కొడుకుని పాడిచేయడానికి వెంబడి పడ్డాడు. వాడు "అమ్మో అమ్మో" అంటూ మా అందరి చుట్టూ తిరిగసాగాడు.

మేమంతా నానా హడావుడిపడి యాదగిరిని బలవంతంగా పట్టుకుని కత్తిలాక్కున్నాం

“ఎమిట్రా! నీకేమయినా మతిపోయిందా కన్నపిల్హాడిని చంపుతానంటావేమిటి?'

“లేకుంటే ఏం కిరికిరి గురూ ఇది? ఇస్కీ మాకీ-వీడు పుట్టిన దగ్గర కెళ్ళి ఒకటే పరిషాన్‌, వరిషాన్‌-ఈడికి పాలడబ్బాలు కొననికి కిరికిరి! దేశమంతా తిరిగినంగానీ పాలడబ్బా మనగ్గావల్సినది దొరకదు! బ్లాకులో కొనెడిదే! అడికెళ్ళి స్కూల్లో ఎడ్మిషన్‌ గురించి కిరికిరి! వెయ్యిరూపాయలు నగలు గిర్వికిపెట్టి తెచ్చి డొనేషను గట్టి లోయర్‌ కేజీల జేర్పించిన! ఈడు స్కూలుకి పోనికి రిక్ష! నీయవ్వ! ఈడి ఫీజు నలబై! రిక్ష నలభై! ఈడి యూనిఫారం బట్టగురించి వంద దుకాణాలు తిరిగినా ఆడకళ్ళి ఈడి బూట్లు, టై నిజం జెప్ప్తన్న భయ్‌! ఈ ఇద్దరు పిల్లగాండ్రిని సదివియ్యనికి పైసల్టాలక నేనూ, నా భార్య ఒక్క పొద్దే భోజనం చేస్తున్నం- గీపరిషాన్ల నేనుంటే గిప్పుడీ ప్రిన్సిపాల్‌ టి.సి ఇస్తననబట్టే! ఎరా ఎందుకుర మార్కులు గన్ని తక్కువొచ్చినయ్యనడిగితే టెక్ట్స్‌ పుస్తకాలు తీస్కరమ్మంటడు! నీయవ్వ ఇంకేదయినా అంటే 140 హ్యామరాలజీ

తెస్తంగానీ గీ టెక్స్‌ పుస్తకాలు ఎడకెళ్ళి తేవాల? అదేం బంగారమా, వెండా-తేలిగ్గా దొరకనికి? ! థూ! నీయవ్వ-గిసంటి దేశంలో పిల్లల్నెవడువయ్యా కనమని చెప్పెడిది?"

"మేమంత నీతోపాటే బాధలు పడటం లేదేమిటి? అంతమాత్రన కత్తితీసుకుని పిల్లలను పొడిచేస్తున్నామా?" అన్నాడు రంగారెడ్డి. అందరం కాలనీకి చేరుకున్నాం.

"ఇలాక్కాదు గురూ! అందరం తలోవేపూ వెళ్ళి మొత్తం హైద్రాబాద్‌ అంతా వెతికి వద్దాం టెక్ట్స్‌ పుస్తకాలెక్కడయినా దొరుకుతాయేమో! అన్నాడు గోపాల్రావ్‌.

అ ఆలోచనతో అందరూ ఏకీభవించారు.ముర్నాడు శెలవుపెట్టి అందరం టెక్ట్‌పుస్తకాలకోనం తలోదిక్కూ వెళ్ళాం! మధ్యాహ్నాం తిరిగి వచ్చేసరికి శాయీరామ్‌ ఉత్సాహంగా ఓ విషయంచెప్పాడు. ,

"చార్మినార్‌ దగ్గర ఓ చిన్న షాపువాడు ముందే డబ్బిస్తే రెండు రోజుల్లో పుస్తకాలు తిప్పించి ఇస్తానంటున్నాడు.''

"నాకూ ఓ (ధ్రెండ్‌ కనబడ్డాడు. వాడికి డబ్బిస్తే ప్రింటింగ్‌ (పెస్‌లో వాళ్ళ (ఫెండ్‌ ద్వారా తెప్పిస్తాట్ట'' అన్నాడు రంగారెడ్డి.

వెంటనే అందరం ఆలోచించి ఇద్దరికీ కట్టేద్దామని నిర్ణయించుకున్నాం! "ఇద్దరిలో ఎ ఒక్కరు పుస్తకాలు తెచ్చినా రెండోవారి దగ్గర ఆర్డర్‌ కాన్సిల్‌ చేసేయవచ్చు-" అన్నాడు జనార్ధన్‌.

వారంరోజులు గడిచిపోయినయ్‌. అయినా ఏ ఒక్కరూ టెక్స్‌ పుస్తకాలుతేలేదు. ఆ రోజు అర్దరాత్రి తలుపు తట్టారెవరో. నిద్రకళ్ళతో తలుపు తెరచాను.

ఎదురుగ్గా శాయీరామ్‌, రంగారెడ్డి, గోపాల్రావ్‌, యాదగిరి కనిపించారు.

"ఏమిటింత రాత్రిలో వచ్చారు?" అన్నాను నిద్రమత్తుతో.

టెక్స్‌ వుస్తకాలు! టెక్స్‌ వుస్తకాలుదొరుకుతున్నాయట! త్వరగా పద!” అన్నాడు శాయీరామ్‌ రహన్యంగా. నా నిద్రమత్తంతా వదిలిపోయింది. ,

"ఎక్కడికి?"

"ష్‌! అదంతా సీకైట్‌! ఆజమ్‌భాయ్‌ ఇప్పిస్తానంటున్నాడు-"

అప్పటివరకూ నేను ఆజమ్‌భాయ్‌ని చూళ్ళేదు. వీళ్ళందరి వెనుకా నిలబడి ఉన్నాడు ఆజమ్‌భాయ్‌ కూడా మా కాలనీ నివాసే! అతనికి ఆల్ఫ్భాహోటల్‌ పక్కన చిన్నపుస్తకాల షాపుంది. మాంచి ఇంగ్లీషు మషాలా నవలలు అద్దెకిస్తూంటాడు.

నేను వెంటనే బట్టలుమార్చుకుని వాళ్ళతో బయలుదేరాను. అందరం అబిడ్స్‌

చేరుకున్నాం సైకిళ్ళమీద. అబిడ్స్‌ సెంటర్‌కి దగ్గర్లోనే ఉన్న ఇరుకుసందులు ఓ అరడజను తిప్పాడు అజమ్‌. చివరకు ఓ పాడుబడినట్టున్న మేడముందు నిలబడ్డాం స్మగ్గర్స్‌గాంగ్‌ 141

. "ఇగో, దేఖోభయ్‌! పోలీసులు గిట్టవచ్చి ఈడ ఎందుకు నిలబడిను అంటే టెక్ట్‌పుస్తకమ్‌ కర్‌కే బోల్‌నానై సమ్‌జెకినై?” “సముజే-సముజే!" అన్నాడు రంగారెడ్డి. "మళ్ళా ఈడ ఎందుకు నుంచున్నావు అంటే ఏం జెప్తాన్‌?" "ఏం జెప్పమంటావ్‌?" అతనినే అడిగాడు శాయీరామ్‌. "సెకండ్‌ షో సినిమాదేక్‌కే ఆరెహే కర్కేబోల్‌నా! నముజేకినై!" "సముజే! అన్నాడు రెడ్డి" . అయిదు నిమిషాలయిపోయింది. అందరం నిళ్ళబృంగా దొంగల్లా నిలబడ్డాం. "టెక్స్‌ పుస్తకాలేకదా మనం కొనేది? దానికింత రహస్యం ఎందుకు?” నెమ్మదిగా ఆజమ్‌ భాయ్‌ పక్కన చేరి చెవిలో గుసగుసలాడాను. “అరె బేవకూఫ్‌! ఇవి స్మగుల్గు టెక్స్‌ పుస్తకాలు! మద్రాస్‌కెళ్ళి ప్రింటయి వచ్చింది. సముజే?" “నహీసముజే!” అన్నాను మొఖవాటం లేకుండా "అరె! క్యాదమాక్‌ హైజీ తుమారా? మన రాష్ట్రంలో టెక్ట్స్‌ పుస్తకాలు దొరకటంలేదని స్మగుల్డు వస్తువుల వ్యాపారం చేసేటోళ్ళు- టేప్‌రికార్డర్లు, వాచీలు, బట్టలు కాసెట్లు స్మగ్లింగ్‌ బంద్‌చేసి మన ఆంధ్రప్రదేశ్‌ టెక్ట్స్‌పుస్తకమ్‌లు మద్రాసులో ప్రింట్‌ చేయించి బ్లాకులో '_ అయిదు రూపాయలకు ఎక్కువ రేటుతో అమ్ముతున్నయ్‌. కొన్ని పుస్తకమ్‌లు హాంకాంగ్‌, జపాన్‌ నుంచి భీ స్మగ్గింగ్‌ హోరైబోల్‌కే సునామై?" మరో అయిదునిమిషాలు గడిచినయ్‌. లాల్చీపైెజామా తొడుక్కున్న ఓ వ్యక్తి ఆ పాడుబడ్డ భవనంలోనుంచి టార్చిలైట్‌తో రోడ్డుమీద కొచ్చి అటూ ఇటూ రెండుసార్లు పచార్లు చేశాడు. రంగారెడ్డి అతని దగ్గరకెళ్ళి "ఆకాశంలో పగలే నక్షత్రాలలొచ్చాయ్‌!" అన్నాడు అతను ఓ క్షణం ఆగి "నిన్నరాత్రి సూర్యుడు కూడా వచ్చాడు! “అన్నాడు, సిగరెట్‌ వెలిగించుకుంటూ! ఆ తరువాత ఏం చెప్పాలో రంగారడ్డి మర్చిపోయినట్ట్లుంది. తన డయిరీ తీసి అగ్గిపుల్ల వెలుగులో చూసి అగిపుల్లకు ముళ్ళున్నాయ్‌" అన్నాడు. ఆ వ్యక్తి ముఖంలో సంతృప్తి |. కనిపించింది. "ఎవరు పంపించారు మిమ్మల్ని?” అనడిగాడు. ఆఅజయ్‌భాయ్‌ ముందుకొచ్చాడు “నిసారీమియా!” 142 హ్యామరాలజీ

“ఎంతమందిక్కావాలి టెక్స్‌ పుస్తకాలు."

“పద్దెనిమిది సెట్లు!” చెప్పాడు శాయీరామ్‌.

"మద్రాసు ఎడిషన్‌ లేదు! అవి లేకపోతే మా పిల్లలకు సంవత్సరం గోవిందా అవుతుంది!" అన్నాడు గోపాల్రావ్‌.

"అసలురేటుమీద ఆరూూపాయలెక్కువవుతుంది!"

"వప్పుకుంటున్నాంగదా!”

"అయితే డబ్బివ్వండి!"

అందరం లెక్కచూసి డబ్బు అతనిచేతికిచ్చాం

అతను ఆ భవనంలోకళ్ళిపోయి పావుగంట తర్వాత పెద్ద “బండిల్‌ "తో తిరిగి వచ్చాడు.

"ఇదిగో పద్దెనిమిది సెట్లు! తెలుగు టెక్ట్స్‌లో అక్కడక్కడ ఒకటి రెండు చైనీస్‌ అక్షరాలు

వస్తే రావచ్చు ఎడ్జస్ట్‌ చేసుకోండి! మళ్ళీ రిటర్న్‌ తీసుకోమంటే మాత్రం తీసుకునేది లేదు. వారం పదిరోజులు వీటిని స్కూలు కివ్వకండి! సరీనా?"

“సరే!”

అందరం అతనిని కౌగిలించుకుని ముస్లిమ్‌ పద్ధతిలో భుజాలు కలిపి, షేక్‌హాండిచ్చి కృతజ్ఞతలు తెలిపి కాలనీకి చేరుకున్నాం

తీరా మర్శాడు ఉదయానికి రంగారెడ్డి (ఫైండ్‌ మింట్‌కాంపొండ్‌లో తన(ఫెండ్‌ద్వారా సంపాదించిన పుస్తకాలపార్శిల్‌ రిక్షాలో పంపించాడు. చార్మినార్‌ దగ్గర షాపులో ఎడ్వాన్స్‌గా

కట్టిన డబ్బు తీసుకొచ్చేద్దామని వెళ్ళిన శాయీరామ్‌ మరో పార్శిల్‌తో తిరిగివచ్చాడు.

“పుస్తకాలు వచ్చేసినయ్‌ కనుక డబ్బువాపస్‌ ఇవ్వనన్నాడు ఆ షాపువాడు!" అన్నాడు దిగాలుపడీ

ఈ ఎక్స్‌స్తా పుస్తకాల బెడద ఎలా వదిలించుకోవాలా అని అందరం చాలా భయంక రంగా ఆలోచిస్తూ కూర్చున్నాం. తీరా సాయంత్రం నాలుగయేసరికి మా కాలనీ పిల్లలంతా స్కూలు నుంచి వచ్చేశారు. అందరి చేతుల్లో టెక్స్‌ పుస్తకాల పార్సెల్స్‌.

ఖంగారుపడి "ఈ పుస్తకాలెక్కడివి?' అడిగాం వాళ్ళను.

"మా ప్రిన్సిపాల్‌ ఎక్కడి నుంచో తెప్పించి మా అందరికీ ఇచ్చింది. రేపు డబ్బు పట్టుకొచ్చి కట్టమంది?' అన్నారు వాళ్ళు. స్మగ్గర్స్‌గాంగ్‌ 143

మూలిగేనక్కమీద కొన్ని వందలు తాటికాయులు వరునగా గంటకువు పడినట్లనిపించింది. చివరకు ఆ రాత్రి అందరూ కలసి ఓ తీర్పు ఇచ్చారు. నేనూ, శాయీరామ్‌ కలసి ఆఎక్‌స్ట్రా పుస్తకాలన్నీ ఓ రిక్షాలో ఓ పెద్ద స్కూలు బయట నిలబడి కావలసిన విద్యార్ధులకు అమ్మివేయాలన్నదే ఆ తీర్పు సారాంశం. ఇష్టం లేకపోయినా, ఆపని ఎవరొకరు చేయక తప్పదు కనుక వప్పుకున్నాం- మర్నాడు పొద్దున్న అనుకున్న ప్రకారం రిక్షా మాట్లాడి పుస్తకాలన్ని వేసుకుని మా కాలనీకి కొంచెం దూరంలో ఉన్న ఓ పెద్ద స్కూలుదగ్గరకిళ్ళి నిలబడ్డాం. మావంక ఎవరూ చూడకపోయేసరికి శాయీరామ్‌కి గట్టిగా అరవకతప్పలేదు. "ఎవరికి మాస్టారూ టెక్స్‌ పుస్తకాలు! టెక్స్‌ పుస్తకాలెవరికండి! తాజా టెక్ట్స్‌ పుస్త-సారీ-కొత్త- టెక్స్‌ పుస్తకాలు- గవర్నమెంట్‌ టెక్స్‌ పుస్తకాలెవరికండీ బాబూ....." నాలుగుసార్లలా అరిచేసరికి కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళ తండ్రులూ మా రిక్షా చుట్టూ పోగయ్యారు. నాకు అలా పుట్‌పాత్‌ వ్యాపారం చేయడం చిన్నతనంగా ఉంది కాని తప్పదు కదా మరి! అయితే శాయీరామ్‌ ఎందుకనో అవేషానికి భలే సూటయ్యాడనిపించింది. కొంతమంది టెక్స్‌ పుస్తకాలు తిరగేసి చూశారు. "జపాన్‌ ఎడిషన్‌ లేవా?" అడిగాడొకతను. “లేవుసార్‌! ఇవే వున్నయ్‌!" "అందులో పేపరు మంచిది వాడతారు! అందుకని అడుగుతున్నాను. కావాలంటే ఇంకో రెండ్రూపాయ లెక్కువ తీసుకుని జపాన్‌వి తెచ్చిస్తారా?" "అయ్యా మేము ఈ వ్యాపారం చేసేవాళ్ళం కాద్సార్‌! మా పిల్లలకు అనుకోకుండా , మూడుసెట్ట్లు కొనడంవల్ల అమ్మేస్తున్నాము. "హలో ఉదయార్కర్‌" అని ఎవరో పిలవడంతో నాపైప్రాణం పైనేపోయింది. అతను మా ఆఫీసులోనే వర్క్‌ చేస్తుంటాడు. "ఎమిటి ఉద్యోగం మానేశావా?" అశ్చర్యంగా అడిగాడతను. "అబ్బేకాదు" అంటూ ఖంగారుగా చెప్పబోయానుగానీ అతను వినిపించు కోలేదు "ఓహో పార్ట్‌చెైమ్‌ అన్నమాట! అవున్లే! స్మగ్లింగ్‌ బెస్ట్‌ బిజినెస్‌! ఎంత మంది ఇట్టే లక్షాది కారులయిపోలేదు? హాజీమస్తాన్‌ చూడు! మొదట్లో తిండిక్కూడా గడిచేదికాదుట-" పావుగంటసేపు హాజీమసాన్‌ కథంతా చెప్పివెళ్ళిపోయాడతను. "శాయీరామ్‌!” నీరసంగా పిలిచాను. 1144 హ్యూమరాలజీ

"ఎమిటి?"

"ఇలా లాభంలేదు గురూ! పిల్లల్ని స్కూల్‌దగ్గర డ్రాప్‌చేయడానికి తల్లిదండ్రు లొస్తారు చూడు! వాళ్ళని అడిగితే బావుంటుంది గానీ ఇలా అసహ్యంగా కేకలు పెడుతూ అమ్మటం నాకు బావుండలేదు" అన్నాను.

"నీ అయిడియా బాగానే ఉంది!" అన్నాడు శాయీరామ్‌. సరిగ్గా అప్పుడే ఓ పెద్దమనిషి స్కూటర్‌ మీద వచ్చి వాళ్ళ పాపను డ్రాప్‌ చేసి తిరిగి వెళ్ళబోతుంటే నేను పరుగుతో వెళ్ళి అడ్డం నిలబడ్డాను.

"మీ పిల్లలకు టెక్స్‌ పుస్తకాలు కావాలా సార్‌?" అతను స్కూటర్‌ ఆపాడు "కావాలి!"

"రండిసార్‌! తీసుకోండి! రిక్షాలో ఉన్నాయ్‌! మేము కొన్నధరకే ఇచ్చేస్తున్నాం!"

"ఐసీ" అన్నాడతను స్కూటర్‌కి స్టాండ్‌వేసి రిక్షా దగ్గరకొస్తూ. పుస్తకాలన్నీ చూశాక "ఇవ్వన్నీ కొంటాను ఇస్తారా?" అనడిగాడు. శాయీరామ్‌, నేనూ అనందంగా మొఖాలు చూచుకున్నాం -

"ఇస్తాం సార్‌! అంతకంటె కావల్సిందేముందీ?"

"అయితే నా వెంబడే రానీండి రిక్షా” అంటూ స్కూటర్‌ స్టార్ట్‌ చేశాడతను. రిక్షా స్కూటర్‌ వెనకేపోతోంది. మేము సైకిల్‌ మీద బయల్దేరాము. "వీడెవరో స్మగ్గర్‌లాగున్నాడు! ఈ పుస్తకాలన్నీ మామూలు రేటుకి కొనేసి-బ్లాకులో అమ్ముకుంటాడు కాబోలు!” అన్నాను శాయీరామ్‌తో

"ఇంకా అనుమానమెందుకూ? బాక్‌ మార్కెట్‌ బిజినెస్‌ చేయబట్టే ఆ స్కూటర్‌ కొనగలిగాడు!" అన్నాడు శాయీరామ్‌. “ఇక్కడ ఆపు!" అన్నాడతను రిక్షావాడితో. రిక్షా ఆగింది.

"ఫోర్‌ నాట్‌ త్రీ- ఆ రిక్షానీ, వాళ్ళిద్దరినీ లోపలకు తీసుకు పద!” అంటూ అరిచాడు. ఉలిక్కిపడి చూచాము. ఎదురుగ్గా పోలీస్‌స్టేషన్‌! ఓ కానిస్టేబుల్‌ బయటకొచ్చి "లోపలకు పదండి అన్నాడు కర్కశంగా. ఆ షాక్‌నుంచి తేరుకోకముందే మమ్మల్ని లోపలకు తీసు౭ళ్ళి లాకప్‌లో పడేళాడు. ఫోన్‌లో మమ్మల్ని తీసుకొచ్చిన స్కూటర్‌వాలా గొంతు భయంకరంగా వినబడుతోంది.

"హలో సార్‌! యెస్పీగారా సార్‌! గుడ్‌ మాణింగ్‌ సార్‌! నేను సి. అయ్‌. డీ ఇన్‌స్పెక్టర్‌ నర్శింగరావ్‌ని మాట్లాడుతున్నాను. టెక్ట్స్‌ పుస్తకాల స్మగ్లింగ్‌కేసు పట్టేశాను సార్‌! చాలా పెద్ద రాకెట్‌ సార్‌ అది! ఇద్దరు వ్యక్తుల్ని, రిక్షాడుపుస్తకాల్నీ కాన్‌ఫిస్కేట్‌ చేసేశానండీ!.. మన రాష్టంలో జరుగుతున్న ఈ స్మగ్జింగ్‌ వ్యవహారంలో ఇదే పెద్ద ముఠా సార్‌..."

మాకు క్రమంగా సృహ తప్పసాగింది. ౫

10... స్మగ్లర్స్‌గాంగ్‌ 145

అబి మోపెట్‌ రేస్‌ అును జా జ౫ా.మి.యణ-£0 కథ (స ల్ల

వ్‌ / నా. /1.

ప్రతీ అదివారం ఏదో గొడవమీద మాకెవరికీ విశ్రాంతి లేకుండా కాలనీ మీటింగ్స్‌లోకి ఈడ్వటం శాయీరామ్‌కి చాలా మామూలు విషయమని మీకూ తెలుసు కదా!

కానీ తమాషా ఏమిటంటే ఆ ఆదివారం అలాంటి గొడవ లేమీ లేకుండా రోజంతా ప్రశాంతంగా గడిచిపోయింది. కానీ మర్నాడు ఉదయం తెల్లారక ముందే తలుపుకొట్టేరంవరో. లేచివెళ్ళి నిద్రకళ్ళతో తలుపు తెరిచాను.

"గురూ! ఇవాళ మనకి జి.వి. యస్‌-50 మోపెడ్‌ వస్తోంది. అంచేత ఆఫీస్‌కి శెలవు పెట్ట-" అన్నాడు ఆనందంగా.

నాకు శాయీరామ్‌ మీద ఈర్ష్య కలిగింది. మా కాలనీలో మా బాచ్‌ వాళ్ళివ్వరికీ మోపెడ్‌ లేదు. గవర్నమెంట్‌ ఉద్యోగుల జీవితాల్లో మోపెడ్‌ కాదుకదా- దాన్ని ఫ్రీగా ఇచ్చినా పెట్రోల్‌ పోయించే కెపాసిటీ ఉండదు. 146 హ్యామరాలజీ

"త్వరగా రడీ అవ్‌! నేను వెళ్ళి రంగారెడ్డికీ, జనార్టన్‌కీ యాదగిరికీ గోపాల్రావుకీ కూడా చెప్పేసి వస్తాను.” అంటూ వెళ్ళిపోయాడతను.

అందరం కలసి పదింటికల్తా జి.వి. యస్‌-50 షోరూమ్‌ 3ళ్ళాం

"ఎ కలర్‌కావాలో చూసుకోండి!” అన్నాడు మేనేజరు.

"బూరంగు కొందాం!" అన్నాడు యాదగిరి. కాసేపు రంగుల గురించి మాలో మాకు వాగ్వివాదాలు జరిగాక చివరకు నల్లరంగు అయితే పది కాలాలపాటు బావుంటుందని సెలెక్ట్‌ చేసుకున్నాం. ఆ మోపెడ్‌ గురించి మేనేజర్‌ పావుగంట పొగిడాడు.

"లీటరు పెట్రోల్‌కి 70 కి. మీ! అంటే ఎంత? కిలోమీటరుకి ఇరవైపైసలుఖర్చు! అదే సిటీబస్‌కయితే కి.మీ. 50 పైసలు!" షాప్‌ సూపర్‌వైజర్‌ వచ్చాడు "ఫస్ట్‌ రెండు సర్వీసింగ్‌లూ ఫీ! ఆ తరువాత ఏ రిపేరు వచ్చినా మేమే మా స్పెషల్‌ మెకానిక్స్‌తో చేయించి-నామ్రినల్‌గా ఛార్జ్‌ చేస్తాం! కస్టమర్స్‌ సర్వీస్‌ ఈజవర్‌మోటో....” అన్నాడతను (ప్రేమగా.

అందరం కలసి బండి నడిపించుకెళ్ళి ఆ పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించాం.

అందరికీ ఆ పక్కనే ఉన్న హోటల్లో స్వీట్లు ఇప్పించాడు శాయీరామ్‌.

"మీరుకూడా కొనెయ్యండ్రా! ఎన్ని రోజులిలా మన దరిద్రపు సిటీ బస్సుల్లో పుట్‌

బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేస్తారు?" అన్నాడు శాయీరామ్‌ మా అందరివంకా జాలిగా చూన్తూ. వాడంత జాలిపడుతుంటే నిజంగానే మా బ్రతుకు చూసి మాకు ఎడుపొచ్చింది. అందరం బయటి కొచ్చాము.

"మీరు బస్‌లో ఇంటికొచ్చేయండి. నేను (డైవ్‌ చేసుకొచ్చేస్తాను-” అన్నాడు శాయీరామ్‌,

అప్పుడే బస్‌ వేలాడుతున్న జనంతో కదల్లేక కదులుతూ వచ్చింది.

"అబ్బబ్బ! నిజంగా బస్‌ ప్రయాణం హారిబుల్‌-రోడ్డుమీద చెత్తను వేసుకెళ్ళే మునిసిపల్‌ ఎద్దుబండిలో ప్రయాణం చేసినట్లే...” అన్నాడు శాయీరామ్‌,

మేమందరం మొఖాలు చూసుకుని మళ్ళీ మామీద మేమే జాలిపడ్డాం.

వాడు బండి స్టార్ట్‌ చేసికొని జనంలో నుంచి తూనీగలా దూసుకుపోయాడు.

మేము దిగులుగా బస్‌కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాం.

"ఈపాటికి మన కాలనీ చేరుకుని ఉంటాడు... "అన్నాడు రంగారెడ్డి దిగులుగా. మోపెడ్‌ రేస్‌ అను జి.వ.యస్‌-50 147

"అవ్‌!" అన్నాడు యాదగిరి ఇంకా దిగులుగా- ఆగకుండా వెళ్ళిపోయిన ఓ బస్సువంక చూస్తూ,

చివరకు అరగంట తర్వాత కాలని బస్‌ దొరికింది.

తీరా ఎక్కి రెండు స్టాప్‌లు దాటామో లేదో- అక్కడ రోడ్డు పక్కనే ట్రాఫిక్‌ పోలీస్‌తో ఏదో గొడవపడుతున్న శాయీరామ్‌ కనిపించాడందరికీ.

“ఎదో గొడవయినట్లుంది- పదండి! దిగి వెల్ళాం"అన్నాడు జనార్ధన్‌. అందరం బస్‌ దిగి వళ్ళాం.

"బండి కొన్నది ఇప్పుడే అయితే లైసెన్స్‌ ఎక్కడి నుంచి వస్తుందడీ?" అంటూ అరచాడు శాయీరామ్‌ గట్టిగా.

"ముందే టెంపరిరీ లైసెన్స్‌ తీసుకోవాల్నయ్యా!” అన్నాడు కానిస్టేబుల్‌ దబాయింపుగా, యాదగిరి జోక్యం చేసుకున్నాడు. +

"టెంపరరీ లైసెన్స్‌ గురించే పోతున్నాడండీ! ఇంతలోనే మీరు రుకాయించబట్టి-"

“అదంతా మాకనవసరమయ్యా! రెండొందలు ఫైన్‌ కట్టాలె'

అందరం ఉలిక్కిపడ్డాం! అయిదూ పదీకాదు! రెండొందలు-

"ఇదిగో-బండికి '[' బోర్డుకూడా పెట్టలే" అన్నాడు కానిస్టేబుల్‌ -ఇప్పుడు బండిలోని మొత్తం లోపాలన్నీ పరీక్షిస్తూ.

"ఇదిగో- హెడ్‌లైట్‌కి సగం నల్లరంగు వేయాల్సున్నది-వేయలే!"

రాన్రాను లిస్ట్‌ పెరిగిపోతుందని భయపడి యాదగిరి అతనిని పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా మాట్టాడివచ్చాడు.

ఆ కేసులన్నీ వదిలించుకోవడానికి పాతిక రూపాయలు ఖర్చయింది!

అఆ తరువాత టెంపరరీ లైసెన్స్‌ కోనం వారంరోజులు తిరగాల్సి వచ్చింది. ఆ వారంరోజులూ శాయీరామ్‌ మాతోనే బస్‌లో పుట్‌బోర్జుమీద వేళ్ళాడుతూ ఆఫీస్‌కి రాక తప్పలేదు.

ఆ తరువాత రెండురోజులు మోపెడ్‌ మీద ఆఫీస్‌కెళ్ళాడో లేదు మళ్ళీ వారం శెలవుపెట్టాడు.

_ "ఏమిటి? ఎమయింది?" ఆశ్చర్యంగా అడిగాను శాయీరామ్‌ని కలుసుకుని.

"షాపువాళ్ళు ఇచ్చింది టెంపరరీ రిజిస్టేషన్‌ కదా! అందుకని రోడ్‌ టాక్స్‌ కట్టడానికి రోజూ ఆ ఆఫీసుకెడుతున్నాను-" అన్నాడు దీనంగా చివరకు తనకు సాధ్యంకాక బ్రోకర్‌కు రెండొందలిచ్చి పని పూర్తిచేశాడు. 148 హ్యామరాలజీ

వారంరోజుల తరువాత రోడ్‌టాక్స్‌ బుక్‌ తీసుకొని విజయగర్వంతో మళ్ళీ మోపెడ్‌ మీద అఫీస్‌కొచ్చాడు.

అ తరువాత ఆదివారం అమ్ముగూడాలో బోసువాళ్ళింటికెళ్ళి వస్తానన్దెప్పి మోపెడ్‌ మీద కాలనీలో హారన్‌ కొట్టుకుంటూ వెళ్ళాడు. మోపెడ్‌ పుణ్యమా అని కాలనీలో మిటింగ్‌ల బెడద తప్పిందిగదాని సంతోషించాం మేము! కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు.

"మీరు కూడా జి.వియస్‌-50 కొనండి!” అంటూ మా కాలనీలో ఆడాళ్ళందరూ భర్తలను వేధించుకు తినడం మొదలుపెట్టారు. రంగారెడ్డి ఇక తప్పేదిలేదని జి.వి యస్‌-50 కోసం రెండువేలు డిపాజిట్‌ కూడా కట్టేశాడు.

ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలా అని నేను ఆలోచిస్తూండగా

అసలు కథ ప్రారంభమయింది. మేము లకడీకపూల్‌ దగ్గర ఒక బస్‌ కోసం చూస్తూంటే తన మోపెడ్‌ని సైకిలురిక్షాలో వేసుకుని చెమటలు కారిపోతూ వెనుక నడుస్తూ కనిపించాడు శాయీరామ్‌. -

అందరం పరుగుతో వెళ్ళి రిక్షాచుట్టూ మూగాము.

“ఏమిటీ? ఏం జరిగింది?" అనడిగాడు రంగారెడ్డి ఆశ్చర్యంగా.

"ఎందుకో వీల్‌ తిరగటంలేదు-" అన్నాడు శాయీరామ్‌ కర్చీఫ్‌తో చెమటలు తుడుచుకుంటూ.

"అప్పుడే ఈ ట్రబులేమిటి! పద-షోరూమ్‌కెళ్ళి ఆ మేనేజర్ని అడుగుదాం" అన్నాన్నేను.

అందరం ఆఫీస్‌ ఎగ్గొట్టి షోరూం కెళ్ళాం.

అప్పుడే మరో అరడజను మంది కూడా తమ తమ మోపెడ్‌లను రిక్షాల్లో వేసుకొచ్చారు.

మెకానిక్‌ మా మోపెడ్‌ని కాసేపు రిపేర్‌ చేసి 'వీల్‌' తిరిగేట్లు చేశాడు.

"“క్రచ్‌ప్టేట్స్‌ కూడా పోయాయ్‌ కౌంటర్‌లో కొనుక్కురండి" అన్నాడు బండి స్టార్టవక పోయేసరికి.

జనార్ధన్‌కి కోపం పాడుచుకొచ్చింది.

"అదేమిటి? కొత్తబండే కదా, ఫ్రీగా వేయరా" అనడిగాడు చొక్కా చేతులు పైకి మడుస్తూ.

" "ఆలా మాట్లాడకు గురూ! కిరికిరి ఎందుకూ?" అన్నాన్నేను అతని చొక్కాచేతులు (క్రిందకు దించేస్తూ.

అందరం మేనేజర్‌ దగ్గరకు నడిచాం.

మేనేజర్‌ చిరునవ్వు నవ్వాడు "ఈ క్షచ్‌ప్లేట్స్‌ మీరు నిర్లక్ష్యంగా బండినడపడంవల్ల పోయాయ్‌-అంచేత కొనుక్కుని వేసుకోవాల్సిందే" అన్నాడు. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 149

యాదగిరి మేనేజరు మీదకు నడిచాడు.

"ఇగో మేనేజర్‌ సాబ్‌! ఇది మంచిగలేదు, మేము బండి మంచిగ నడపలేదని నీకేం యెరుక?"

“రామచంద్రన్‌ షాపు సూపరైజర్‌ని పిలిచాడు మేనేజర్‌.

“"యస్సార్‌!”

"వీళ్ళ బండి బయట పెట్టెయ్యండి! ఆర్గుమెంట్‌కి టైమ్‌లేదు" అని మేనేజర్‌ మోపెడ్‌డెలివరీ కోసం వచ్చిన మరో కస్టమర్‌తో మాట్లాడడం మొదలు పెట్టాడు. చేసేదిలేక కౌంటర్‌ దగ్గరకెళ్ళి 'క్షచ్‌ప్టేట్స్‌' కోసం అడిగాము.

"అదిప్పుడు స్టాక్‌లేదు! ఓ వారం తరువాత కనుక్కోండి!” అన్నాడు సేల్స్‌మన్‌.

మాకు వళ్ళు మండిపోయింది.

"అంతవరకూ ఏం చేయాలి?" అడిగాడు రంగారెడ్డి.

'“ఎదురుచూడాల్సార్‌!”

అందరం చేసేదిలేక బయటికొచ్చాము. హఠాత్తుగా యాదగిరికో అయిడియా వచ్చింది.

“"అరేభయ్‌-ఈ పార్చ్పబయట షాపులోభీ ఉంటయ్‌ గద! పాయ్యి అరుసు కుందాం నడవండ్రి!” అందరం స్పేర్‌పార్ట్స్‌ షాపుకళాం.

“క్యాహోనా?" అన్నాడు సర్దార్డీ.

"జి.వి.యస్‌-50 క్షచ్‌ప్లేట్స్‌-"

అతను వెంటనే క్షచొప్టేట్స్‌ పాకెట్‌ తీసిచ్చాడు మాకు ఆశ్చర్యం కలిగింది. ఆపార్ట్‌ మోపెడ్‌ కంపెనీ వాళ్ళ షోరూమ్‌లో తప్పుతే మిగతా అన్ని చోట్లాలభిస్తాయన్న మాట!

“ఎంత?” అడిగాడు శాయీరామ్‌ భయంగా.

"దేడ్‌ సౌ రూపయా-" శాయీరామ్‌ హారర్‌ ఫీలిమ్‌ చూసినట్టు చూశాడు సర్జార్టీవంక.

' “అదేమిటి? షోరూమ్‌లో వందరూపాయలేగా?"

"అయితే అక్కడే తీస్కో-” అన్నాడు సర్దార్టీ అచ్చతెలుగులో. అందరం షాపు బయటి కొచ్చేస్తుంటే సర్దార్జీ పిలిచాడు.

“ఎయ్‌... ఇధరావో"

అందరం వెనక్కు నడిచాం మళ్ళీ.

150 _హ్యామరాలజీ

"డూప్లికేట్‌ క్షబ్‌ ప్లేట్‌ సెట్‌ చెలేగా క్యా? మంచిగుంటది!"

“ఎంత?

“వచాస్‌! యాభై" "

రంగారెడ్డి అనుమానంగా శాయీరామ్‌ వేపు చూశాడు. శాయీరామ్‌ ఆ పక్కనే ఉన్న దేవుడి కేలెండర్‌ వేపు చూశాడు.

"సరీ-తీసుకో-కనీసం ఈ పదిరోజులూ ఉండి పనిచేస్తే చాలుగదా-" అన్నాడు జనార్ధన్‌,

అ డూప్లికేట్‌ సెట్‌ కొని మెకానిక్‌ దగ్గరకెళ్ళాం.

అరగంటలో అది ఫిట్‌చేసి ఇచ్చాడతను.

“నలభైరూపాయలివ్వండి!” అన్నాడు చిరునవ్వుతో చేయి చాపుతూ.

"అదేమిటి? ఈ కాస్త పనికి నలభైరూపాయలా?" .

"డూప్లకేట్‌పార్ట్‌ అని తక్కువ అడిగినా సార్‌! లేకుంటే అరవై-"

నలభయ్‌ వాడి చేతిలో పెట్టి అందరం కదిలాం అక్కడ నుంచి.

" మీరు బస్‌లో వెళ్ళండ్రా! పాపం మోకు వెధవ బస్‌లు ఎప్పటికి దొరుకుతాయో ఏమో! నేనుబండిమీద వచ్చేస్తాను-" అన్నాడు శాయీరామ్‌.

"నేనూ నీ బండిమీద వచ్చేస్తాను-" అన్నాడు రంగారెడ్డి ముచ్చటపడిపోతూ. అతని వెనుక కూర్చోగానే శాయీరామ్‌ స్టార్ట్‌ చేశాడు.

మేమంతా బస్‌ కోసం ఎదుర్పూసి చూసి గంటన్నర తరువాత ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. అప్పటికీ వాళ్ళిద్దరూ కాలనీకి చేరుకోలేదు.

"ఎమయ్యారంటావ్‌?" అడిగాడు జనార్ధన్‌.

“అదే సమజ్‌ కావటంలేదు- ఎడయినా టక్కరిచ్చిన్రేమో-” అన్నాడు యాదగిరి అనుమానంగా. మేమంతా ఆ విషయం పెద్ద ఎత్తున డిస్కస్‌ చేస్తుండగానే శాయీరామ్‌ భార్య రంగారెడ్డిభార్యా ఎడుస్తూ పిల్లల్ని తీసుకొచ్చేశారక్కడికి.

“చెప్పండి అన్నయ్యగారూ! ఆయనెలా ఉన్నారు? దెబ్బలు బాగా తగిలాయా? అంటూ అడిగేసరికి మాకు మతిపోయినట్లయింది. _

"ఎమిటి? ఏం జరిగింది? అనడిగాను ఆశ్చర్యంగా.

"అదే-ఆయన మోపెడ్‌కి యాక్సిడెంట్‌ అయిందని మీరు మాట్ట్లాడుకుంటూంటే పిల్లలు విని చెప్పారు...” మాకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు. మోపెడ్‌ రేస్‌ అను జి.వి.యస్‌-50 151

యాదగిరి జరిగిందంతా నచ్చజెప్తోంటే- దూరంగా రంగారెడ్డి, శాయీరామ్‌ మోపెడ్‌ని తోసుకురావడం కనిపించింది. పిల్లలంతా పరుగుతో వెళ్ళి దాని చుట్టూ మూగారు. "అంకుల్‌, దానిమీద ఎక్కంచుకుని ఓ రౌండ్‌ తిప్పవూ?" అడగసాగారందరూ.

“ష్‌! పోండ్రా! మేము ఓ రౌండ్‌ తిరుగుదామంటేనే కుదిరిచావడంలేదు. వెళ్ళండి- వెళ్ళండి-” విసుక్కున్నాడు రంగారెడ్డి.

"ఏం జరిగింది మళ్ళీ-" అడిగాము ఆత్రుతగా.

"ఓ ఫర్తాంగు నడిచి ఆగిపోయింది.”

“ఎందుకని? '

“క్షచ్‌ప్లేట్స్‌ పోయాయట-"

"అదేమిటి ఇప్పుడేగా కొత్తది వేయించిందీ?"

“డూప్లికేట్‌ పార్ట్స్‌ అంతేనంట! మెకానిక్‌ చెప్పాడు" అన్నాడు శాయీరామ్‌ దిగులుగా.

"పోనీ అసర్జార్టీ దగ్గర ఒరిజినల్‌ పార్ట్‌ కొనేయడం మంచిదేమో”

"అవును-"

అందరం కలసి ఇలా కస్టమర్లను ఇన్ని తిప్పలు పెడుతూన్న జి.వి. యస్‌-50 కంపెనీని పీట్టకున్నాం.

ఆ మర్నాడు అందరి దగ్గరా తలో ఇరవై రూపాయలూ అప్పుతీసుకుని ఒరిజినల్‌ క్ల్షచ్‌ప్లేట్స్‌ కొనడానికి బయళ్టేరాడు శాయీరామ్‌.

“నేను అది కొని మెకానిక్‌తో ఫిట్‌ చేయించే వరకూ బండి తోసుకుంటూ నడిచే తిరగాలి- మీరు హాయిగా ఇంటి దగ్గర బస్సెక్కి ఆఫీస్‌లో దిగుతారు.” అన్నాడు మావంక ఈర్యగా చూస్తూ,

"ఆ- మాకు మాత్రం సుఖం ఎముందిలే! నీ బండి కంటె కొంచెం తక్కువశ్రమ! అంతేకదా-" అన్నాడు రంగారెడ్డి.

తీరా మేము అఫీస్‌ చేరుకుని గంటన్నర అయినా శాయీరామ్‌ జాడకనిపించలేదు. సాయింత్రం కాలనీ చేరుకునే సరికి అతనింటి ముందు మోపెడ్‌ కనిపించింది.

అందరం లోపలికళ్ళాం

"ఏమయింది? ఆఫీస్‌కి రాలేదు?" అడిగాం శాయీరామ్‌ని.

152 | హ్యామరాలజీ

"క్షచ్‌ప్లేట్‌ వేయించి ఆఫీస్‌ కొస్తుంటే- క్షచ్‌వైర్‌ తెగిపోయింది. మళ్ళీ క్లచ్‌ వైర్‌కొనుక్కుని వేయించేనరికి పన్నెండయిపోయింది- అప్పుడింక ఆఫీస్‌కెలా రావటం? అందుకని ఇంటికొచ్చేశాను-" అన్నాడు దిగులుగా.

"పోనీలే- ఇంక రేపట్నుంచీ ప్రాబ్లెమ్స్‌ ఎమీ ఉండవు కదా-"

“ఏమీ ఉండవు!” అన్నాడతను ఉత్సాహంగా.

మర్నాడు పొద్దున్న ఎనిమిదింటి నుంచీ శాయీరామ్‌ మోపెడ్‌ని స్టార్ట్‌ చేయడానికి ప్రయత్నించడం మా కందరికీ తెలుస్తూనే ఉంది. తొమ్మిదయినా అది ఇంకా స్టార్రవలేదు.

మేము ఆఫీస్‌ కెళ్ళాడానికని బయటికొచ్చేసరికి శాయీరామ్‌ చెమట్టుకక్కుకుంటూ పెడల్‌ కొడుతూనే ఉన్నాడు గానీ అది స్టార్ట్‌ కావటంలేదు. బోలెడుమంది పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు.

శాయీరామ్‌ భార్య ఉండుండి టవల్‌తో అతని చెమటలు తుడుస్తోంది. .

మేము అక్కడికి చేరుకున్నాం.

"మళ్ళీ ఎం జరిగింది?" అడిగాడు జనార్ధన్‌

"స్టార్ట్‌ కావటం లేదెందుకో!"

"మెకానిక్‌కి చూపించు! ఇలా రోజులతరబడి “కిక్‌ కొడితే ఎం లాభం?" అన్నాడు రంగారెడ్డి.

"ఓ వేళ ప్లగ్‌ గిట్ట క్లీన్‌ చెయ్యాల్నేమో-” అన్నాడు యాదగిరి.

“ఇందాకే క్లీన్‌ చేశాను-" .

"చలో- అందరం కలసివెళ్ళి ఆ షోరూమ్‌ మేనేజర్ని పట్టుకుందాం! కొత్త బండికే ఇన్ని ట్రబుల్స్‌ వస్తే ఎలా?" అన్నాడు జనార్ధన్‌.

అందరం బండిని ఆటోలో వేసుకుని షోరూమ్‌ చేరుకున్నాం,

"ఏమయింది?" అడిగషాడు షాప్‌ సూపర్‌వైజర్‌.

"మాకేం తెలుసు? స్టారవటంలేదు-" అన్నాడు శాయీరామ్‌,.

“ఒరేకిషన్‌-” మెకొనిక్‌ని పిలాచాడతను.

ఓ పన్నెండేళ్ళ కుర్రాడు బయటకొచ్చాడు.

“బండి చూడోసారి!” అన్నాడతను.

కుర్రాడు పరీక్ష చేశాడు "కార్పొరేటర్‌ క్లీన్‌ చేయాల్సార్‌!” అన్నాడు సూపర్‌వైజర్‌తో. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 153

"మరి చేసేయ్‌-" అన్నాడు రంగారెడ్డి,

"ఇప్పుడెక్కడ కుదురుతుంది సార్‌! ఎల్లుండి సాయంత్రానికిగానీ కుదరదు. ఎల్లుండి పొద్దున్న తెచ్చివ్వండి బండి-

"అదేమిటి? మేము బండి కొంటున్నప్పుడు "కస్టమర్స్‌ సర్వీస్‌ ఈజ్‌ అవర్‌ మోటో” అన్నావుగా!

"అవును! ఇప్పుడు మాత్రం లేదని ఎవరన్నారు?"

"అయితే ఇప్పుడే రిపేర్‌ చేయించాలి కదా-"

"కుదరదు! బోలెడు మోపెద్స్‌కు ఎడ్వాన్స్‌గా చెప్పిటంచాము. అంచేత అవన్నీ రిపేర్‌ చేయటం పూర్తయాకే మీ బండి-"

"ఇగో మాదీ బండి గిప్పుడు రిపేర్‌ చేస్తావా? చేయవా? ఒక్కమాట చెప్పు” అన్నాడు యాదగిరి మీద కెళ్తూ.

"ఎం బెదిరిస్తున్నావా!" అన్నాడు సూపర్‌వైజర్‌ కూడా ముందుకొస్తూ,.

యాదగిరి అతని చొక్కా పట్టుకున్నాడు. అతను యాదగిరి చొక్కా పట్టుకున్నాడు.

మేనేజర్‌ పరుగుతోవచ్చి ఇద్దరినీ వెనక్కు లాగేశాడు.

"అలా కొట్టుకోవటం ఎందుకయ్యా! అందరంస్నేహంగా (ప్రేమగా మాట్టాడు కోవాలి!" యాదగిరి చట్టుక్కున మేనేజర్‌ చాక్కా పట్టుకున్నాడు. అందరం కలసి వాళ్ళిద్దరినీ విడిపించాం. చివరకు చేసేదేమిలేక మళ్ళీ దానిని తోనుకుంటూ మెకానిక్‌ దగ్గరకెళ్ళాం. రెండు గంటల తరువాత బండి రిపేరయింది. పదిరూపాయలు మళ్ళీ సమర్పించుకుని ఇంటి మొఖం

“ఒరేయ్‌-నేను బండిమీద ముందు వెళ్లూంటాను. మీరు ఆటోలో నావెనుకే వస్తూండండి" అన్నాడువాడు భయంగా. వాడు కోరినట్లే ముందు వాడి మోపెడ్‌ వెనుక మేము రెండు ఆటోల్లో బయల్టేరి ఇల్లు చేరుకున్నాం

మర్నాడు ఆఫీసులో ఆ మధ్య జీ.వి. యస్‌.ఫిఫ్టీ-కొన్న శేఖర్‌ని కలుసుకున్నాం

“ఐం గురూ? ఎలా వుంది నీ బండి!" అనడిగాం చాలా ఫార్మల్‌గా అడుగుతున్నట్లు,

"ఫర్లేదు బావుంది!" అన్నాడతను.

అందరం మొఖమొఖాలూ చూచుకున్నాం.

"రిపేర్లేమీ లేవా?" '.

154 హ్యామరాలజీ

"చాలా తక్కువ! కొత్తబండికదా! మహా అయితే నెలకి రెడొందలు రిపేర్‌ కవుతుంది! అంతే! రాన్రాను బాగా ట్రబులిస్తుందంటున్నారు గానీ ఇప్పుడు బాగుంది! రెండొందలే ఖర్చవుతోంది."

“అయినాగాని అంత ఖర్చ్భవుతూంటే నీఠరు జీతం ఎలా సరిపోతోంది" ఆశ్చర్యంగా అడిగాను.

"ఏడ్బినట్టుంది! నా జీతం ఎందుకు ఖర్చుచేస్తాను దీనికి? ఇది మా మావగారు కొనిచ్చారు. అంచేత ఖర్చంతా ఆయనిదే! ఆయన్షగ్గర చాలా బ్లాక్‌మనీ ఉందికదా! బ్లాక్‌మనీ వైట్‌ చేసుకోవాలనుకొనే వాళ్ళంతా జి.వియస్‌-50యే కొంటారట! ఒక్క సంవత్సరంలో నలభై లక్షలవరకూ బ్లాక్‌ మనీ వైట్‌ అయిపోతుందట-" చెప్పాడు వాడు. ఆసాయంత్రం మళ్ళీ ఎంత తన్నుకున్నా బండి స్టార్టవలేదు.

అందరం బండిని మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్ళాము-

"ప్లగ్‌ ఖరాబయింది సార్‌! కొత్తది తీసుకురాండ్రి!" అన్నాడు మెకానిక్‌.

'"ఎంతవుతుంది?" ఏడుపుమొఖంతో అడిగాడు శాయీరామ్‌.

"కొత్త ప్లగ్‌ ఇరవై రూపాయలుంటుంది సార్‌”

"ప్లగ్‌ కెంతయినా ఫర్లేదు. నేనడిగేది నీ ఛార్జీ ఎంతవుతుందని?" .

"ఎంత సొర్‌ అయిదు రూపాయలు."

అక్కడి నుంచి ఇద్దరం రిక్షాలో ఆటో స్పేర్‌ పార్టు అమ్మేషాపుకెళ్ళి ప్లగ్‌ కొనుక్కొచ్చి వేయించాము. బండి బ్రహ్మాండంగా స్టార్టయింది. అందరం హాయిగా ఇంటికి చేరుకున్నాం.

శాయీరామ్‌ ఆ తర్వాత కాసేపు కాలనీ పిల్లల్ని వెనుక ఎక్కించుకుని రౌండ్స్‌ కొట్టాడు. ఆ తరువాత మేమందరం చూస్తూండగానే వాళ్ళావిడను దర్జాగా ఎక్కించుకుని సినిమా కెళ్ళిపోయాడు. రాత్రి తొమ్మిదిన్న్షరవరకు నేను నవల చదువుకోవటం అపి పడుకుందా మనుకుంటే ఆటో వచ్చి శాయీరామ్‌ ఇంటి ముందాగింది అందులో నుంచి శాయీరామ్‌

ఫామిలీతో దిగాడు. లేచి అతని దగ్గర కెళ్ళాను.

"ఆటోలో వచ్చావేమిటి?" అశ్చర్యంగా అడిగాను.

"ఆ వెధవబండి స్టారయి ఛస్తేగా?" మండిపోతూ అన్నాడతను. "ఎందుకని?"

"మధ్యలో గంటసేపు వర్షం కొట్టింది కదా! వర్షంలో తడుస్తే- కార్పొరేటర్‌ లోకి నీళ్ళు వెళ్ళి బండి స్టార్టు కాదంట- అందుకనే దాన్ని సినిమా హాల్లోనే వదిలేసి ఆటోలో వచ్చేశాము." మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 155

మర్నాడు అపీసుకి శెలవుపెట్టి బండి రిపేర్‌ కోసం వెళ్ళాడతను.సాయంత్రం మేము ఇంటికొచ్చేసరికి మోపెడ్‌ మళ్ళీ తళ తళ మెరుస్తూ శాయీరామ్‌ ఇంటిముందు కనిపించింది. “శాయీరామ్‌ బండి బాగుపడిందా?" అడిగాడు రంగారెడ్డి ఆత్రుతగా.

“ఎందుకు? "

"అలా కోఠి వరకూ వెళ్ళివద్దామని- నా క్కొంచెం పని ఉంది-"

"కోఠి వరకా?"

“అవును! ఐం?"

“అదెక్కడ పనిచేస్తుంది? ఇంటి కొస్తుంటే-యాక్సిలేటర్‌ వైర్‌ పోయింది-”

“"అదేమిట్రా! నీ బండికిలా ట్రబుల్స్‌ వస్తున్నాయ్‌? మరి వామన్రావ్‌గాడు హాయిగా నడుపుతున్నట్లు చెప్పాడుకదా!"

"ఏమో అదే నాకు అర్ధం కావటంలేదు-ఇప్పటికిప్పుడే వెయ్యిరూపాయలు మెకానిక్‌కీ రిపేర్లకూ ఖర్చయింది... "అన్నాడు దిగులుగా.

'వామన్రావగాడింటికళ్ళి కనుక్కొడ్దాంపద-' అన్నాడు రంగారెడ్డి.

అందరం కలసి వామన్రావ్‌ ఇంటికి బస్సులో చేరుకున్నాం. అంతా వినివాడు చిరునవ్వు నవ్వాడు.

"ఈ మోపెడ్‌ కొన్నప్పుడు మనం టైంటేబుల్‌ వేసుకోవాలి బ్రదర్‌! అలా వేసుకుని దాన్ని ఫాలో అయితే ట్రబులుండదు-"

"ఏమిటా టైమ్‌ టేబుల్‌?"

"ప్రతి సోమవారం క్లచ్‌ ప్పేట్స్‌ కొత్తవి వేయించాలి! మంగళవారం కొత్త ప్లగ్‌, బుధవారం కొత్త క్షచ్‌ వైరూ, గురువారం యాక్సిలేటర్‌ వైరూ, శుక్రవారం కార్పొరేటర్‌ క్లీన్‌ చేయించాలి, శనివారం ఓవరాలింగ్‌, ఆదివారం బండిీకి రెన్స-అంతే! చెక్కు చెదురదు బండీ! ఎప్పుడూ మాంచి కండిషన్‌లో ఉంటుంది-''

"మరి ఇవ్వన్నీ చేయిస్తూ కూర్చుంటే ఆఫీస్‌కెలావెళ్తాను?" ఆశ్చర్యంగా అడిగాడు శాయీరామ్‌.

"బస్‌లో! " 1

“మరింకా బండి ఎందుకు?"

"ఎమర్దన్సీలో ఉపయోగించటానికి-అంటే రోజూ మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్ళడానికి, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తేవడానికీ-స్పేర్‌ పార్ట్‌ కోసం షాపు చుట్టూ తిరగడానికి అది పని చేయ్యాలి కదా-"అందరం తిరిగి వచ్చేస్తూంటే లక్ష్మయ్య కొత్త జి.వియస్‌-50 మోపెడ్‌ మీద ఎదురయ్యాడు.

156 హ్యూమరాలజీ

“ఏం గురూజీ! ఇది కొన్నారా?” గాబరాగా అడిగాడు రెడ్మి

లక్ష్మయ్య చిరునవ్వు నవ్వాడు.

"పిచ్చివాళ్ళల్లారా! మనం ఏ బండీ ఎప్పుడూ కొనకూడదు?"

"మరి?" ."“కొన్నవాళ్ళనడిగి రెండురోజుల కోసం వాళ్ళ బండి అరుపు తెచ్చుకుని మళ్ళీ ఇచ్చివేస్తుండాలి-"

"ఆ తర్వాత ఎలా మరి?”

"ఇంకో ఓనర్‌ని వెతుక్కోవాలి-"

“అలా ఎంతకాలం?"

"జీవితమంతా అలా గడిపేయడమే? నాకు చూస్తూ చూస్తూ ఈ పద్ధతిలోనే పదేళ్ళు గడిచిపోయింది కదా!”

"కానీ అలా ఎందుకు? మీరే ఓ బండి కొనుక్కోవచ్చుకదా?"

. _ "కొనుక్కుంటే మనమే రిపేర్లు చేయించ్చొద్దంటోయ్‌? అది పిచ్చిపని! తెలివితక్కువ వాళ్ళు చేసేపని-వస్తా ఈ బండి కొంచెం ట్రబులిస్తోంది! త్వరగా ఓనరుకిచ్చేయాలి- అన్నట్లు నీ బండి కండిషన్‌ బావుందా? ఉంటే నాకివ్వు! రెండ్రోజుల్లో ఇచ్చేస్తాను-"

మేము మాట్లాడకుండా ముందుకి నడిచాము.

"అరె మాట్లాడరేమయ్యా! ఓనర్లకు తెగ పాగరిక్కువయిపోయిందీ మధ్య! ఇస్తాను. .ఇవ్వను అని కూడా చెప్పటంలేదు-" అంటూ తన బండి స్టార్టు చేసుకళ్ళిపోయాడు లక్షయ్య కోపంగా. ఆ రాత్రి శాయీరామ్‌ ఇంట్లోనుంచి పెద్ద పోట్లాట వినిపించింది. మేమంతా అతనింటి కెళ్ళాం సంగతేమిటో కనుక్కుందామని.

"ఆ పాడుబండి కొనటమే నా కిష్టం లేదసలు. దానికోసం-గొలుసు బ్యాంక్‌లో పెట్టాలంటే పోనీలే కదాని ఇచ్చాను. ఇప్పుడు దాని రిపేర్లకి మంగళసూత్రం కావాలా! ఛస్తే

ఇవ్వను-' అంటోంది వాళ్ళావిడ.

వాళ్ళ సంభాషణ విని మేమంతా బరువెక్కిన గుండెలతో వెనక్కు తిరిగి వచ్చాం! శాయీరామ్‌ కష్టాలు చూసి మా అందరికీ విపరీతమయిన జాలి వేసింది. మర్నాడు ఉదయం శాయీరామ్‌కి జ్వరం వచ్చిందని తెలిసింది. అందరం వెళ్ళి కాసేపు అతనితో మాట్లాడి జ్వరానికి టాబ్‌లెట్స్‌ తెప్పించాం. , మోపెడ్‌ రేస్‌ అను జి.వి.యస్‌-50 157

అయితే అది జ్వరంకాదనీ, కేవలం ఆ మోపెడ్‌ని ఎమి చెయ్యాలో తెలిక వచ్చిన మనోవ్యధ అని తేలళ్చిందతని భార్య

అందరం మళ్ళీ శాయీరామ్‌ దగ్గరకెళ్ళి ధైర్యం చెప్పాము.

“ఆ మోపెడ్‌గురించి దిగులుపడుతున్నావా ఎమిటి?" అని అడిగాడు గోపాల్రావ్‌.

“ఏం ఫర్లేదు బ్రదర్‌! ఆ బండి విషయం మర్చిపో! దాని సంగతి మేము చూసుకుంటాం" అన్నాడు జనార్ధన్‌

"ఇప్పుడు దాన్నింక ఎవరుమాత్రం ఎం చెయ్యగలం?" విచారంగా అన్నాడు శాయీరామ్‌. రంగారెడ్డి గలగల నవ్వాడు.

"పిచ్చివాడా! ఈ మాత్రానికే బెంబేలు పడిపోతే ఎలా? ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది అని ఎక్కడో చదివాం కదా! అంచేత మోపెడ్‌లు కొన్నవారికి కూడా ఎదో బయటపడే మార్గం ఉండే ఉంటుంది-" అన్నాడు ఆప్యాయంగా.

"ఈ బండి గురించి సోంచాయించెడి దేమున్నదివయ్యా! మా చిన్నమ్మ కొడుకు గిట్టనే మోపెడ్‌ కొన్నంక పరేషాన్‌ పరేషాన్‌ అయి-రెండునెలల్ల అమ్మేసిండు మళ్ళీ-" అన్నాడు యాదగిరి.

అందరూ యాదగిరి సలహాకు తప్పట్లు కొట్టారు.

“వండర్‌ఫుల్‌ అయిడియా! మన మోపెడ్‌ని కూడా అమ్మేస్తే-చాప్టర్‌ క్లోజ్‌! శాయీరామ్‌ ॥ ఇంట్లో మళ్ళీ సుఖశాంతులు" అన్నాడు జనార్ధన్‌.

శాయీరామ్‌ కూడా కొద్దిక్షణాలు ఆనందపడిపోయాడుగానీ వెంటనే అతనిమొఖంలో మళ్ళీ మబ్బులు కమ్ముకొచ్చేసినయ్‌.

"“కానీ-ఫస్ట్‌హాండ్‌కే నమ్మకంలేదు ఈ సెకండ్‌ హాండ్‌నెవరు కొంటారు? మన కాలనీ చుట్టుపక్కల వాళ్ళందరికీ దీని విషయం తెలిసిపోయిందికదా!"

“దానికి ఓ ఉపాయం ఉంది బ్రదర్‌! మన గోపాల్రావ్‌ న్యూస్‌పేపర్లో ఎడ్వర్టయిజ్‌మెంట్‌ చేస్తే జనం విరగబడిపోరూ?" అన్నాడు జనార్ధన్‌.

“ఒండర్‌పుల్‌ అయిడియా అన్నాడు రంగారెడ్డి.

అప్పటికప్పుడే అందరం కూర్చుని ప్రకటన తయారుచేయటం మొదలు పెట్టాము.

"నెలరోజులు మాత్రమే ఉపయోగించిన అద్భుతమైన మోపెడ్‌ అమ్మకానికి కలదు" అన్నాడు జనార్ధన్‌ “అలా పొడిగా రాస్తే చాలదోయ్‌! మన బండిని బాగా పాగిడి ఎట్రాక్షన్‌ కలుగజేయాలి-" ఆన్నాడు రంగారెడ్డి ఆలోచిస్తూ. కొద్దిక్షణాల తర్వాతగట్టిగా అరచాడు. 156 హ్యామరాలజీ

“ఆ! దొరికింది! చూడండి చెప్తాను.

ఒక్కనెల మాత్రమే- ఒక్క ఓనర్‌ వాడిన-సరికొత్త మోపెడ్‌ (జి.వి.యస్‌...5[0) అమ్మకానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన పికప్‌! లీటర్‌ పెట్రోల్‌కి డెబ్ఫె కిలోమీటర్లదూరం (త్వరలో ఎనభై కూడా ఇస్తుందని, కంపెనీ వారి గ్యారంటీ) కావల్సినవారు వెంటనే శాయీరామ్‌, (నిర్భయ్‌నగర్‌ కాలనీ) నికలుసుకోండి! ఇది సువర్ణావకాశం! ఆలసిస్తే ఆశాభంగం! నేడే మీ అభిమానమోపెడ్‌ని సందర్శించి సొంతం చేసుకోండి!"

యూసుపుద్దీన్‌ నిసౌర్‌ కది అంతగా నచ్చలేదు.

"యే బస్‌! నహీహోతాయార్‌!”" అన్నాడు తనూ ఆలోచిస్తూ,

"ఎందుకు? ఎం తక్కువయింది?” అడిగాడు జనార్ధన్‌.

"అది మంచిమోపెడ్‌ ఉంటె ఈ శాయీరామ్‌ ఎందుకు అమ్ముతుయ? కొంచెం బ్రెయిన్‌ ఉంటే ఎవ్వరూ కొనయ్‌?"” అన్నాడు వాడు.

"నీ తెలుగు తగలెయ్యా!" అన్నాడు గోపాల్రావ్‌.

నిసార్‌ నవ్వాడు"ఈ తెలుగుసాలు భాయ్‌ ఆంధ్రప్రదేశ్‌కో!"

నిసార్‌ చెప్పిన పాయింట్‌ మా కందరికీ అర్ధమయింది. నిజమే ఆమోపెడ్‌ అంత అద్భుతమయినదయితే శాయీరామ్‌ు ఎందుకమ్ముతున్నట్లు అని ఎవరికయినా అనుమానంవస్తుంది.

"అంచేత మనం అది ఎందుకమ్ముతున్నట్ట్లు అనేవివరం కూడా తెలియజేయాలి!" అన్నాడు రంగారెడ్డి.

'కారు కొంటున్నందువల్ల ఈ మోపెడ్‌ అమ్ముతున్నాము అని రాస్తే? అని అడిగాను నేను. అందరూ నావంక పిచ్చివాడిని చూసినట్లు చూశారు. అందులో డిఫెక్ట్‌ ఎమిటో నొకేమాత్రం అర్ధంకాలేదు

"డాక్టర్‌ సలహామీద (ఆరోగ్య కారణాలవల్ల) అమ్మాల్సి వస్తోంది. అనిరాస్తే' అడిగాడు రంగారెడ్డి.

"అంటే ఈ బండి వాడిన వాళ్ళందరికీ ఆరోగ్యం చెడిపోతుంది అన్న అర్ధం వస్తుంది ' అన్నాడు గోపాల్రావ్‌.

“అవునవును” అన్నాడు శాయీరామ్‌

"ఓ తమామ్‌ కైకుభాయ్‌! మై ఎక్‌ బాత్‌ బోలూం౦?” అడిగాడు నిసార్‌.

"బోలోభాయ్‌-బోలో!” అన్నాడు యాదగిరి. మోపెడ్‌ రేస్‌ అను జి.వ.ియస్‌-50 159

"ఓనర్‌కో అండమాన్‌ ట్రాన్స్‌ఫర్‌ హోగయా బోల్‌కే లిఖో-"

అందరూ తప్పట్లు కొట్టారు.

“సూపర్చ్‌ అయిడియా? అన్నాడు జనార్ధన్‌.

అందరం కలసి కూడబలుక్కుని ఆ వాక్యంకూడా తయారుచేశాము.

"ఓనర్‌కి అండమాన్‌ ట్రాన్స్‌ఫర్‌ అయినందువల్ల అమ్మేయడం జరుగుతోంది... "అంటూ తగిలించాం ఆఖర్లో! అదంతా కాలనీ రచయిత చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయ్‌ తన అద్భుత శైలితో రీరైట్‌ చేశాడు.

"కానీ మన రాష్ట ప్రభుత్వం వాళ్ళకు అండమాన్‌ ఎందుకు బదిలీ అవుతుంది?" అని అడిగాడు శాయీరామ్‌ అనుమానంగా.

“అవన్నీ ఎవడడుగుతాడోయ్‌- వెధవ అనుమానాలు...” అన్నాడు జనార్ధన్‌. దాంతో శాయీరామ్‌ సైలంటయిపోయాడు

అందరం కలసి తలోఅయిదు వేసుకుని పేపర్లో ఆ ప్రకటన ఇవ్వటానికి డబ్బు పోగుబేశాము.

“ఇప్పుడు మనం చెయ్యాల్సిన ముఖ్యమయినపనేమిటంటే- ఈ మోపెడ్‌ని మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్ళి కనిసం అయిదారు కిలోమీటర్లు దూరమయినా ఆగకుండా నడిచే విధంగా రిపేర్‌ చేయించాలి! ఎందుకంటే కొనేవాళ్ళు దీనిమీద ఓ రౌండ్‌కొట్టి పరీక్షిస్తారు కదా?" అన్నాడు రంగారెడ్డి.

వెంటనే నేనూ శాయీరామ్‌ కలసి దానిని మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్ళాము.

"చూడు రాములూ! దీనిని కనీసం ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ ఎలాంటి ట్రబుల్‌ రాకుండా నడిచేటట్ట్లు చేయాలి! ఎలా చేస్తావో నాకు తెలీదుగానీ ఈ సహాయంచెయ్‌-” అన్నాడు శాయీరామ్‌.

రాములు కెవ్వున కేకవేశాడు.

“అరేయ్‌! ఆ చిట్‌ఫడ్‌ కంపెనీ మనిషి వెళ్తున్నాడు- అర్జంటుగా పిలు..." అంటూ కుర్రాడిని పరిగెత్తించాడు.

"ఎమిటి ఎం జరిగింది?” అడిగాను ఆశ్యర్యంగా."ఈ బండిని నమ్ముకుని నేనిప్పుడే కొత్త చీటీ కట్టాను. ఈ బండి మీదనెలకొచ్చే రెండొందలూ ఆ చీటీకి కట్టాచ్చని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు మీరు అయిదారు కిలోమీటర్లు నడిచేట్లు చూడమంటే అర్ధం అమ్మేస్తున్నారనే కదా- ఇంక నాకు అ చీటీ కట్టడానికి డబ్బెక్కడనుంచి వస్తుంది?" అన్నాడు దిగులుగా.

చీటీ పెద్దమనిషిని తీసుకొచ్చాడు కుర్రాడు. '

160 హ్యామరాలజీ

'సారీ అన్నా! చీటీ కాన్సిల్‌ చేసెయ్‌! ఈ బండి అమ్మేస్తున్రు" అన్నాడు రాములు. అతను గొణుక్కుంటో చీటీ కేన్సిల్‌ చేసేశాడు. సాయంత్రంవరకూ తంటాలుపడి పాతికరూపాయలు తీసుకుని బండి తిరిగి ఇచ్చాడు మెకానిక్‌, “ఎక్కి ఇంటికి వెల్లిపోదాం! రిపేరయిందిగా?" అన్నాన్నేను శాయీరామ్‌తో. "వద్దు గురూ! ఎక్కితే మళ్ళీ ట్రబులిస్తుందేమో-కొనేవాళ్ళు టెస్టు చేసుకొనేటప్పుడు వాడితేనే మంచిది" అన్నాడు శాయీరామ్‌ భయంగా. మళ్ళీ దానిని కాలనీకి తీసుకెళ్ళాము. ఆ రాత్రంతా యాదగిరి, శాయీరామ్‌ కలసి దాన్ని తళతళలాడేలా తుడిచి తెల్లారేసరికల్లా శాయీరామ్‌ ఇంటిముందు నిలబెట్టారు. ్ష నిజం చెప్పాలంటే దాన్ని చూస్తూంటే అమ్మడానికి మాకే ప్రాణం వప్పలేదు. అంత అందంగా ఉంది. ం పేపర్లో మా ప్రకటన రానె వచ్చింది. "నిజంగా-ఈ ప్రకటన ఎంత ఎట్రాక్టివ్‌గా ఉందంటే-నాకే కొనబుద్ధివేస్తుంది" అన్నాడు ' ఆఈంగారెడ్డి. ఆ రోజు ఆదివారం కావటంవల్ల మా మోపెడ్‌ కొనుగోలుదార్లు వస్తారేమోనని అందరం కాలనీ ఎంట్రెన్స్‌ దగ్గరే కూర్చున్నాము. టైము పన్నెండయింది. ఒంటిగంటా, రిండూ కూడా అయింది. అయినా ఎవరూ రాకపోయేసరికి అందరికీ నిరుత్సాహం పుట్టుకొచ్చింది. "ఎవరూరారేమో”" అన్నాడు శాయీరామ్‌ దిగులుగా. అప్పుడే ఆటోరివ్వున వచ్చి మా కాలనీ ముందు ఆగింది. అందులో నుంచి చేతిలోబేగ్‌ పట్టుకున్న పెద్దమనిషి దిగాడు. “ఇక్కడ శాయీరామ్‌ గారిల్తు...." 'ఇడుగో ఇతనేనండి శాయీరామ్‌. వండర్‌పుల్‌ మోపెడ్‌-సూపర్‌ పెర్ఫారమెన్స్‌- పాపం! అండమాన్‌ బదిలీ అవబట్టి అమ్మటమేగానీ అది అమ్మడం అన్సలిష్టంలేదు అతనికి! "అసలు మా కాలనీలోనే ఎవరొకరు కొనుక్కునేవాళ్ళం! బయటవాళ్ళకమ్మటం మాకెవరికీ ఇష్టంలేదు. కానీ పాపం అతనికి ట్రాన్స్‌ఫర్‌ ఖర్చులకు దానికిడబ్బు ఇప్పుడే అవసరం కదా! మా దగ్గర అంత డబ్బు లేదు...” అన్నాడు జనార్ధన్‌. | మోపెడ్‌ రేస్‌ అను బి.వియస్‌-50 161

"బండి చూద్దామా” అడిగాడతను.

అందరం కలసి పెద్ద ఊరీగింపులా బండి దగ్గరకు నడిచాము.

"ఏమీట్రబుల్‌ లేదుకదా?" అడిగాడతను బండివంక అనుమానంగాచూస్తూ.

"ట్రబులా? అహహహ-" అని నవ్వాడు రంగారెడ్డి ఇంకేమీ చేయలేక, వెంటనే యాదగిరి అందుకున్నాడు.

"అవ్సార్‌! ట్రబులెందుకుంటుంది? ఫస్ట్‌క్లాస్‌ బండిసార్‌! అనలు ఈ బండీ కొత్తగా మార్కెట్లో రిలీజవగానే 14 మంది మెకానిక్‌లు ఆత్మహత్య చేసుకును! మికెరికేనా”

= ఆ పెద్ద మనిషి ఆశ్యర్యపోయాడు.

“అత్మహత్యా? ఎందుకు?" అనడిగాడు నమ్మలేనట్లు

"ఎందుకేమి సార్‌! దీనికి రిపేర్స్‌గిట్టా ఏమీరావని ఆళ్ళకి తెల్సిపోయింది సార్‌! రిపేర్‌కి రాకుంటే మరి ఆళ్ళు బతికెడిదెట్ట్లా?'

“అవునవును-" అన్నాడతను.

"పాపం వాళ్ళనీ మోపెడ్‌ నిజంగా పొట్టమీద కొట్టినట్లే- “అన్నాడు జనార్ధన్‌.

అతను మరోసారి బండిని పరీక్షగా చూశాడు.

"రేబెంత?" అడిగాడతను

"నాలుగువేలు-వాడీంది నెలరోజులే! అయినా ఎనిమిదొందలు నపష్టానికమ్మేయాల్సివస్తోంది" అన్నాడు గోపాల్రావ్‌.

"అదీగాక మా వాడికి 'డబ్బు ముఖ్యం' కాదు అనే మనస్తత్వం! అందుకే ఎనిమిదొందలు పోతేపోనీమని వదిలేస్తున్నాడు-” అన్నాడు రంగారెడ్డి

"ఇదేకాదు. ఇతను ముందొకసారి కూడా వాషింగ్‌మిషన్‌కొని నెలోజులన్నా అవకముందే అరొందలులాస్‌కి అమ్మేశాడు" అన్నాడు జనార్ధన్‌

"నాలుగువేలు చాలా ఎక్కువ" అన్నాడతను మరోసారి బండివంకచూస్తూ. |

"నో నో....చాలా తక్కువ" అన్నాడు శాయీరామ్‌. "అండమాన్‌ వెళ్ళిపోతున్నారంటే. ' ఇంకా తక్కువ ధరకు దొరుకుందనుకున్నాను-" అన్నాడతను.

"సూపర్బ్‌ వెహికల్‌ సార్‌! ఒక్కలీటర్‌కి 70 కిలోమీటర్లు తక్కువదూరమా?" అడిగాడు యాదగిరి. 162 హ్యామరాలజీ .

నాకు ఆ మోపెడ్‌ కంపెనీవాడు దానిని పాగిడినరోజు గుర్తుకొచ్చింది. వాడలా అబధ్ధాలు చెప్పినందుకు ఆతర్వాత మాకు కోపం వచ్చిందిగానీ- వాడెందుకలా పాగిడాడో ఇప్పుడు. తెలిసింది! బిజినెస్‌! అంతే! ఓ వస్తువు పక్కాడికి అంటగట్టాలంటే అలా పాగడక తప్పదు. "మూడువేల అయిదొందలకిస్తారా?”" అడిగాడతను మళ్ళీ. అందరం శాయీరామ్‌ మొఖం వేపుచూశాము. 'సరీ' అనేసేట్లు కనిపించాడునాకు. అడగ్గానే 'సరీ' అంటే అవతలి వ్యక్తికి బండిమీద అనుమానం కలుగుతుంది కదా! అంచేత నేనే కల్పించుకుని "నో! ఒక్కపైసకూడా తగ్గదు" అన్నాను. అతను శాయీరామ్‌వేపు చూశాడు “"అంతేనంటారా?" అన్నాడు వెళ్ళిపోడానికి సిద్ధపడుతూ అందరూ ఖంగారుపడ్డారు. "అంతే అంటే ఖచ్చితంగా అంతే అని కాదనుకోండి! కొంచెం ఆటూ ఇటూ.... అన్నాడు శాయీరామ్‌ చప్పున. ''మరతనెవరో ఒక్కపైన కూడా తగనంటాడేం?'' నావంక కోపంగా చూపుతూ అడిగాడతను. రంగారెడ్డి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. "అబ్బే అతనికేం సంబంధంలేదులెండి." "లేకపోతేఇక్కడెందుకు నిలబడ్డాడు?" = "పాపం అతని వస్తువేదో అమ్మినప్పుడు బాగా నష్టపోయాట్ట! అప్పటినుంచీ ఎవరూ నష్టానికి అమ్మగూడదని మాట్టాడుతూంటాడు." "సరే- అయితే చెప్పండి! మూడువేల అయిదొందలకిస్తారా?" శాయీరామ్‌, రెడ్డీ పక్కకళ్ళి మాట్ట్లాడుకొచ్చారు. "మూడువేల ఆరొందలకయితే ఇస్తాను" అన్నాడు శాయీరామ్‌. "అక్కర్లేదు" అంటూ వెనక్కు తిరిగి బయళట్టేరాడతను. గోపాల్రావ్‌ జనార్ధన్‌కి కన్ను గీటాడు. జనార్ధన్‌వొక్కదూకు దూకి అతనికి అడ్డంగా నిలబడ్డాడు. "ఆం! ధ్రెండ్‌షిప్‌లో అంత కోపమయితే ఎలాగండీ! మావాడు కూడా వందరూపాయల కోసం ఫ్రెండ్‌షిప్‌ పాడుచేసుకుంటాడా ఏమిటి?" అన్నాడు చిరునవ్వుతో “ఫెండ్‌షిప్పా? గ్రైెండ్‌షిప్పేమిటి? ఇక్కడ నాఫెండెవరూ లేరే”! ఆశ్యర్యంగా అన్నాడతను. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 163

"అదేమిటి నన్ను గుర్తుపట్టలేదా మీరు?” అన్నాడు జనార్ధన్‌ ఇంకేమనాలోతెలీక.

"మిమ్మల్నా? మిమ్మల్నెక్కడా చూసిన గుర్తు లేదే!

"భలేవారే! మనం ది గ్రేట్‌ ఓరియంటల్‌ సర్కస్‌లో పక్కపక్కనే కూర్చోటేదూ?

"నేనప్పుడూ సర్కస్‌కెళ్ళలేదు" అన్నాడు చిరాకుగా.

"హార్నీ! అది కూడా మర్చిపోయారన్న మాట! ఆఫ్‌కోర్స్‌ మీకు మతిమరుపు ఎక్కువని చెప్పారప్పుడు

"నాకేం మతిమరుపులేదు- మనం ఎప్పుడూ కలుసుకోలేదసలు.'"'

"సరే పోనీండి! మీకు స్నేహభావం లేకపోయినా మావాడికుంది! అందుకే మీరునా ఫైండ్‌ అని నమ్మి ఆ వంద నష్టం కూడా భరించటానికి వప్పుకుంటున్నాడు- మూడువేల అయిదొందల కాష్‌ ఇచ్చి బండి తీసుకెళ్ళండి" అన్నాడు జనార్ధన్‌.

"స్నేహం కోసమని ఇంతింత నష్టాలు భరిస్తుంటే నువ్వు దెబ్బతింటావ్‌ గురూ! ఈసారి పోతేపోనీలే గానీ నీప్యూచర్‌ గురించి చెప్తున్నా.."అన్నాడు రంగారెడ్డి నిష్టూరం నటిస్తూ శాయీరామ్‌తో.

"ఎమో గురూ! మొదటినుంచీ స్నేహం అంటే ప్రాణం పెట్టటం అలవాటయిపోయి ఏడ్చింది” అన్నాడు శాయీరామ్‌ నొచ్చుకుంటూ.

“బండిమీద ఓ రౌండుకొట్టి చూస్తాను" అన్నాడతను.

"ఓ! హాయిగా చెక్‌ చేసుకోండి! ఎటొచ్చీ ఎక్కువదూరం వెళ్ళవద్దు..." అన్నాడు శాయీరామ్‌ భయంగా. ం

"ఇక్కడే మెయిన్‌రోడ్‌వరకూ వెళ్ళివస్తాను” అంటూ బండి స్టార్బ చేసుకుని నెమ్మదిగా నడవసాగాడతను.

_ అందరం గుండెలు బిగపట్టుకుని చూడసాగాం.

"భలేపడ్డాద్దేవలలో- ఇంకేంఢోకాలేదు శాయీరామ్‌ అదృష్టవంతుడు!" అన్నాడు జనార్ధన్‌,

అతగాడు మెయిన్‌రోడ్‌ మీదకు వెళ్ళి తిరిగి వస్తుంటే గమనించాము అతని మొఖం ఆనందంతో వెలిగిపోతోంది.

"హమ్మయ్య! ఇంక భయం లేదు! వాడు కొనేసినట్టే... "అన్నాడు రంగారెడ్డి.

సరిగ్గా అప్పుడే అనుకోని ఘోరం జరిగింది. ఒక దుర్మార్గుడు, శాయీరామ్‌ సక్సెస్‌ని చూసి ఓర్వలేని వెధవ-తన చెడిపోయిన కొత్త జి.వి.యస్‌-50 మోపెడ్‌ రిక్షామీదవేసి రిక్షాని వెనుకనుంచీ తోసుకెళుతూ ఎదురయ్యాడు.

164 . హ్యామరాలజీ

అంతే! అయిదు నిమిషాల్లో అతను మోపెడ్‌ తీసుకొచ్చి మా మధ్యలో స్టాండ్‌ వేయటం తన బాగ్‌తీసుకుని పరుగెట్టటం జరిగిపోయింది. అక్కడికీ జనార్ధన్‌, యాదగిరి అతని వెంటపడ్డారు. "కంట్రాక్ట్‌ అయింది గనుక బండి తీసుకుతీరాలని" అరుస్తూ. కానీ అతను కార్ల్‌ లూయిస్‌ గ్రాండ్‌ఫాదర్‌ లాగా పరుగెత్తాడు. పరుగెత్తి మెయిన్‌రోడ్‌మీద ఉన్న ఆటోలో కూర్చుని ఏం చెప్పాడో ఏమోగానీ-ఆటోగాల్లో తేలిపోతూ ఎగిరిపోయింది.

అందరం మళ్ళీదిగాలుపడి కూర్చున్నాం.

సాయంత్రం అయిదవుతుండగా ఇంకో ఆటోవచ్చి శాయీరామ్‌ ఇంటిముందు ఆగటం చూసి అందరం పరుగిత్తాము అక్కడికి.

తీరా చూస్తే అటోదిగింది మరెవరో కాదు లక్ష్మయ్య!

"పేపర్‌ చూశానివాళ! మన మోపెడ్‌ అమ్ముతామని వేశారు కదా! సరే అమ్మటానికి రెండ మూడు రోజులు వడుతుంది కదా! అంతవరకూ వాడుకోవచ్చని వచ్చాను-అమ్ముగశున్నారు గనుక, బండి కండిషన్‌లో ఉండే ఉంటుందికదూ?” అన్నాడు లక్ష్మయ్య బండి బబ్రేకులూ, అవీ చెక్‌ చేసుకుంటూ.

"మీ దగ్గరఎవరిదో బండి ఉండాలికదా?" పాలిపోయిన మొఖంతో అడిగాడు శాయీరామ్‌,

"నిన్నటివరకూ ఉందిగానీ దాని ఓనర్‌కి ఎంత కొవ్వెక్కిపోయీందటే రోజూవచ్చి నాబండి

నాకిమ్మని పేచీ పెట్టటం మొదలుపెట్టాడు. ఒకరోజూ రెండ్రోజులంటే ఊరుకుంటాం-పోనీలే ఓనర్‌గదాని వదిలేస్తాంగానీ రోజూ పేచీపెడితే వళ్ళుమండుతుందా, మండదా" అనడిగాడతను.

"అవును మరి! ఎంత ఓనరయితే మాత్రం-అలా చిరాకు పెట్టేస్తుంటే ఎవరికయినా మండిపోతుంది!” అన్నాన్నేను,

"అందుకే వాడిమీద పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చాను..."

అందరికీ ఆమాటతో ఆసక్తి కలిగిందా కేస్‌మీద.

"తరువాతేం జరిగింది?" అడిగాడు రంగారెడ్డి. "ఏముందీ పోలీసులు ఓనర్‌ని లాక్కొచ్చి లాకప్‌లో పడేశారు, గానీ తరువాత వాడు చెప్పిన విషయాలన్నీ విని జాలిపడి మా ఇద్దరికీ రాజీ కుదిర్పారు. దాని ప్రకారం ఇవాళ పొద్దున్న బండి ఓనర్‌ కిచ్చేయమన్నారు. నేను పెద్దమనిషిని కాబట్టి ఇంక బావుండదని ఇచ్చేశాను. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 165

"అవును! అదే ఇంకొకరూ ఇంకొకరూ అయితే అలాంటి పేచీకోరుకీ అసలు బండి రిటర్న్‌ ఇవ్వరు" అన్నాడు గోపాల్రావ్‌.

"సరే-ఈ బండి మాత్రం ఎల్లుండి ఇచ్చేస్తాను- ఈలోగా ఇంకెవరయినా కొనడానికి వస్తే నా అడ్రస్‌ ఇవ్వండి-" అన్నాడు స్టార్టుచేసి బండిమీద కూర్చుంటూ!

అందరం అతనికి అడ్డం పడిపోయాం.

"బాబ్బాబు! ఈ బండి తీసుకెళ్ళకు-నానా అవస్థలూ పడి దీన్ని నడిచేట్లు చేశాం నిన్న! ఇప్పుడు అమ్మలేకపోతే ఇంక జన్మలో దీనిని అమ్మటం సాధ్యంకాదు" అన్నాడు శాయీరామ్‌.

“పోనీ రిపేర్‌వస్తే ఫిష్టి-ఫిఫ్టీ వేసుకుందాంలే! ఇదే ఇంకొకరయితే అసలు ఒక్క పైసకూడా నేను ఖర్చు చేయను..."

“గురూగారూ! అంత మాటనకండి! అందరం కలసి ఎలాగోలా నానా తిప్పలూ పడుతున్నాం దీన్ని అమ్మటానికి-దీన్ని వదిలేయండి! మీకు తల్చుకుంటే బళ్ళకేం కొదవ? ఎవరొక ఓనరు దొరక్కపోడు కదా-"

లక్ష్మయ్య చిరాగ్గా బండి దిగాడు.

“మరా సంగతి ముందే చెప్పరేమయ్యాా! నా టైమ్‌ వేస్ట్‌ చెశారు! బండి ఓనర్‌ అన్నాక "డీసెన్సీ" నేర్చుకోవాలి బ్రదర్‌! ఇలా చిరాకు పెడితే రెండోసారి ఇంకెవరిదగ్గరా బండి తీసుకోబుద్దికాదు నాకు... వస్తా అ పక్క కాలనీలో ఇంకొకతను కూడా ఇవాల్టి పేపర్లోనే బండి అమ్ముతున్నట్లు వేశాడు. అతను నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌లే! పైగా ఓసారి నేనతనికి చాలా _ సహాయం కూడా చేశాను-సిగరెట్‌ వెలిగించుకోవడానికి లైటర్‌ అడిగాతే ఇచ్చాను! ఇంత స్నేహం ఉన్నప్పుడు “బండి ఇవ్వను" అని అనలేడు కదా... వస్తా...." అంటూ వెళ్ళిపోయాడు.

అందరం "హమ్మయ్య" అంటూ తేలిగ్గా గాలి పీల్చుకున్నాం

వారంరోజులు గడిచిపోయాయి.

వారం రోజులు గడిచిపోయినా మోపెడ్‌ కోనడానికి ఎవరూ రాకపోయేసరికి మాకు

. భయంవేసింది. శాయీరామ్‌ దిగులు పెట్టుకున్నాడు.

'అదింక అమ్మడం మనవల్లకాదు- “అన్నాడు దిగులుగా.

హఠాత్తుగా ఆరోజు నిసార్‌గాడు వూడిపడ్డాడు."ఛలో-జల్లీ ఛలో-'" అన్నాడు మా దగ్గరకొచ్చి. “ఎక్కడికి?” అడిగాము మేము.

166 హ్యూమరాలజీ

"ఆజమ్‌భాయ్‌-వాళ్ళ(ఫెండు మిల్‌కే ఎక్‌ మోపెడ్‌ అమ్మింది! కైసా బేచే పూఛ్‌లేంగే..."

అందరం కలసిఆఅటోలో అల్ఫ్భావోటల్‌ పక్కనున్న అజముభాయ్‌ బుక్‌ స్టాల్‌నిచేరుకున్నాం. బలవంతంగా ఆజమ్‌భాయ్‌ని ఆల్ఫ్భాలోకి లాక్కెళ్ళి భాయ్‌ తాగించాము.

"ఇప్పుడు చెప్పుగురూ! నువ్వూ మీ ఫెండూ కలసి మోపెడ్‌ ఒకటి అమ్మారట! ఎలా అమ్మారు?"

"ఎందుకు శాయీరామ్‌ కూడా అమ్మేస్తున్నాడా?" అడిగాడతను.

“అవును.”

"అది అమ్మటం చాలా కష్టం!” అన్నాడు ఆజమ్‌ గంభీరంగా.

"కానీ నువ్వూ మీ (ఫెండ్‌ నిన్న అమ్మారని నిసారమియా చెప్పాడుగా?"

"చాలా వ్లూక్‌ బాయ్‌! అదృష్టం! అంతే!"

"మోపెడ్‌ని బ్రోకరు దగ్గరకు తీసుకెళ్ళాం! అతను అది చూసి ఇనుపకొట్లల్లో అయితే కిలోల్లెక్కకొనే అవకాశాలున్నాయని చెప్పాడు వెంటనే కొట్లకి తీనుకెళ్ళి కిలోలెక్క అమ్మేశాం. మూడొందల పాతిక రూపాయలు వచ్చింది- మా ధ్రైండ్‌ చాలా సంతోషించాడు...."

హఠాత్తుగా జనార్ధన్‌కో ఉపాయం తట్టింది. "గుడ్‌ అయిడియా!” అన్నాడు ఉత్సాహంగా.

"అంటే?" అనుమానంగా అడిగాను

“అవును! మన మోపెడ్‌ కూడా బోకర్స్‌కి అమ్ముందాం" అన్నాడతను.

“అవ్‌! బెస్ట్‌ ఆయిడియా-'

అవ్పటికవ్వుడే అందరంకలని ఆటోలో ఇంటికెళ్ళి మోపెడ్‌ని తీనుకుని ఓ బ్రోకర్‌ షాపుకెళ్ళాం. అతను మోపెద్‌ని టెస్ట్‌చేశాడు. కీ రౌండ్‌ కొట్టాడు దొనిమీద. తిరిగి వచ్చి "రెండువేలు ఇస్తాను" అన్నాడు.

శాయీరామ్‌కి ఎడువు ముంచుకొచ్చింది “నెలకిందట అయిదువేలు-ఇవ్పుడు రెండువేలకు సమానమా?" అన్నాడు దీనంగా.

అందరం ఇంకో బోకర్‌షాప్‌కి బయళల్చేరాం. అతను మా మోపెడ్‌ని చూస్తూనే "పదిహేను వందలు" అన్నాడు. మాకుమతి పోయినట్టుంది.

"అదేమిటి అవతల షాపతను రెండువేలిస్తానన్నాడుగా?" అడిగాడు రంగారెడ్డి. "వాడు మెంటల్‌ హాస్పిటల్‌ పేషెంట్‌ అయుంటాడు! లేకపోతే! రెండువేలు ఇవ్వటమేమిటి?" అన్నాడతను చిరునవ్వుతో. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 167

మరోషాపుకి వెళ్ళాం పాలోమని,

అతను బండిమీద ఓరౌండ్‌ కొట్టివచ్చి “నా కొద్దీ బండి! అన్నాడు తెగేసినట్టు.

“ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్‌.

"కిందటిసారి ఈ బండికొంటే దారుణంగా పదివేలు నష్టం వచ్చింది!" అన్నాడతను.

"దీని ఖరీదే అయిదువేలయితే పదివేలునష్టవెలా వచ్చింది?” కోపంగా అడిగాడు జనార్ధన్‌!

"అదే నాకిప్పటివరకూ తెలియటంలేదు-ఎలా వచ్చిందో-బహుశా ఒక్కొక్క పార్టూ రెండు మూడుసార్లు వేయించి ఉంటాను-"

అక్కడినుంచి మరో రెండుషాపులకు కూడా తిరిగాక మాకు దాన్ని రెండువేలకంటే ఎక్కువకు అమ్మలేమని తెలిసింది.

అంచేత రెండువేలు ఇస్తానన్న బ్రోకర్‌ దగ్గరకే వెళ్ళాం మళ్ళీ,

'"ఎంకావాలి?" అడిగాడతను."ఇందాక మోపెడ్‌ చూపించాం కదా-రెండువేలు ఇస్తానన్నారు మీరు....”

"అది ఇందొక సంగతి!” అన్నాడతను తాపీగా.

"అంటే?" ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్‌.

"ఇప్పుడు పదిహేను వందలే ఇస్తాను-"

“అదేమిటి? ఇంతలోనే రీటెందుకు మారిపోయింది?" |

“అమెరికాలో డాలర్‌ ధర పడిపోయింది"

"ఇంకో అరగంటాగితే ఇంకా పడిపోతుంది!" అన్నాడతను. ఇంక అతనితో లాభంలేదని మళ్ళీమోపెడ్‌ని తోసుకుంటూ బయల్చేరాం

కాస్తదూరం నడిచామో లేదో మా కెదురుగ్గా ఓ కొత్త "ఆటో మొబైల్‌ బ్రోకర్ఫ్‌" అనే బోర్డ్‌ కనిపించింది. అది ప్రారంభించి రెండు మూడు రోజులే అయిందనటానికి నిదర్శనంగా పూలదండలు ఇంకా నగమే ఎండి కనిపించాయ్‌.

"ఇగో-ఈడు కొత్తాడులెక్క ఉన్నాడు భాయ్‌! మీరేమీ మాట్లాడకండి! నేనుసెటిల్‌జేస్తా!” అన్నాడు యాదగిరి.

అందరం యాదగిరి వెంబడి ఆ షాపులోకి నడిచాము. 168 హ్యామరాలజీ

సర్దార్జీ మమ్మల్ని చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానించాడు.

"క్యా హోనా?" అన్నాడు హిందీలో.

"ఎ మోపెడ్‌ బేచ్‌నే ఆయే...” అన్నాడు యాదగిరి.

'కిత్‌లేమే బేచ్‌ణాహై?" అనడిగాడతను బయటకొచ్చిమోపెడ్‌ని పరీక్షిన్తూ

"త్రీ అండ్‌ హాఫ్‌ తౌజెండ్స్‌" అన్నాడు శాయీరామ్‌, రెడ్డి ప్రాంప్టింగ్‌ వింటూ.

"సాడేతీణ్‌?" అశ్చర్యంగా అన్నాడు సర్హార్డీ.

అని మోపెడ్‌ స్టార్ట్‌ చేసుకుని ఓ రౌండ్‌ కొట్టి వచ్చాడు.

'"'తీణ్‌ హజార్‌ దూంగా!” అన్నాడు మా వంకచూసి. అందరికీ గుండెలు ఆగిపోయినయ్‌ ఓ క్షణంపాటు! నిజంగా అతనన్నది 'మూడువేలు' అనేనా అనడిగాడు గోపాల్రావ్‌ రహస్యంగా.

"అవును" అన్నాడు రెడ్డి.

"సర్జార్జీకేమీ మతిభ్రమించలేదుకదా?” అన్నాడు జనార్ధన్‌ రహస్యంగా.

"మూడువేల రెండొందల్‌-" అన్నాడు యాదగిరి.

అందరికీ యాదగిరి మీద ఒళ్ళు మండిపోయింది. రాక రాక వచ్చిన అద్భుతమైన బేరాన్ని అతను చెడగొట్టేస్తున్నాడనిపించింది. అతని వీపుగోకాడు శాయీరామ్‌ వవ్పు కోమన్నట్లు."ఒక్క పైసా కూడొ ఎక్కువ ఇవ్వన్‌-" అన్నాడు సర్భార్టీ.

“రక్‌ హై? పైసలు ఇవ్వు-” అన్నాడు యాదగిరి.

సర్దార్జీ ఓ క్షణం ఆలోచించాడు

| "ఇప్పుడు కాదు! రేపు భాయ్‌ వస్తాడు అప్పుడు" అన్నాడు అనుమానంగా.

మా గుండెల్లో బోలెడు రాళ్ళుపడ్డాయ్‌. "అట్లా అంటే కాద్సార్‌! ఇతనిప్పుడు అర్జంటుగా ఈ బండి అమ్మటానికి కారణమేమిటనుకున్నారు? భార్య సీరియస్‌ సార్‌! ఆపరేషన్‌ చేయాలి! డొక్టర్కి రెండువేలు ఫీజు కట్టాలి-ఇంకా మందులకీ మాకులకీ కూడా డబ్బు కావాలి! లేకపోతే ఇంత మంచి బండి, ఇంత కొత్తబండి అమ్ముతారా ఎవరైనా?నో! నెవర్‌సార్‌! ఈ రేటుకి ఛస్తే అమ్మరు-'

సర్దార్జీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.

"ప్లీజ్‌ సర్దార్జీ ప్లీజ్‌!” అన్నాడు శాయీరామ్‌ ఇంకా ఆలోచింపజేస్తే ప్రమాదమని.

"అభా రీక్‌ హై!" అంటూ కాగితాలమీద శాయీరామ్‌ సంతకాలు తీసుకుని రిజిస్టేషన్‌ పుస్తకం వగైరాలు ఒకసారి చూచుకుని- మూడువేలూ లెక్కపెట్టి ఇచ్చాడు. ఇచ్చిందే ఆలస్యం వణుకుతున్న కాళ్ళతో అందరం రోడ్డు మీద కొచ్చాం. మోపెడ్‌ రేస్‌ అను జి.వియస్‌-50 169

"గురూ! వాడు ఏ క్షణంలోనయినా మనసు మార్చుకుని- నా డబ్బు నాకిచ్చేయమని వెంబడిపడవచ్చు. అంచేత అందరం విడిపోయి ఎవర్జారిన వాళ్ళు బస్సుల్లో ఇంటికి పోదాంపదండి!" అన్నాడు జనార్ధన్‌,

వాడి ఆలోచన అద్భుతమనిపించింది మాకు.

మరుక్షణంలో ఎవర్జారిన వాళ్ళు విడిపోయి బస్సుల్లో కాలనీ చేరుకున్నాం. ఆ రాత్రి యాదగిరి అందరినీ పిలిచాడు.

"చూడు గురూ! సర్దార్టీ కొత్తోడుగనుక మనబండి కొన్నాడు. రేపు ఆయన తమ్ముడు వచ్చిండంటే మన గురించి వచ్చి ఫైసల్‌ వాపస్‌ తీసుకోనికి కోషిష్‌జేస్తాడు. కనుక శాయీరామ్‌ అన్న గడ్డంగిట్ట తగిలించుకుంటే గుర్తుపట్టలేరు-” అన్నాడు.

"అవును. మనందరం కూడా కొన్నాళ్ళుపాటు ఆ సర్ధార్టీ షావుముందు నుంచి నడవకూడదు-" అన్నాడు రంగారెడ్డి.

అప్పటికప్పుడే కాలనీ కుర్రాళ్ళందరికీ సర్జార్టీలెవరైనా వచ్చి శాయీరామ్‌ ఇల్లు అడిగితే ఎలా తెలీదని చెప్పాలో ప్రాక్టీస్‌ చేయించాము.

ఓ రోజు గడిచిపోయింది. శాయీరామ్‌ మా కాలనీ మేకప్‌మేన్‌ వేంకటేశ్వర్రావ్‌నడిగి ఓ గడ్డం తెచ్చుకుని తగిలించుకున్నాడు. మేమందరం క్రాఫ్‌ మార్చేసుకున్నాం. అనుకున్నంతా జరగనే జరిగింది.

ఆ రోజు సాయంత్రం ఇద్దరు సర్దార్టీలూ మోటార్‌ సైకిల్‌ మీద కాలనీ కొచ్చారు. పిల్లలు ఆడుకుంటున్న చోటకెళ్ళి శాయీరామ్‌కా ఘర్‌ కహా హై? అని అడగడం వినిపించింది మాకు."మాకు తెలీదు!” అని చెప్పేశారు పిల్లలు ముక్తకంఠంతో.

వాళ్ళు నెమ్మదిగా కాలనీ స్టేజీదగ్గరకొచ్చి సినిమా స్కిప్ట్‌రాస్తోన్న చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయ్‌ దగ్గర కెళ్ళారు.

అతనేదో మాటాడి తెలీదని చేతులూపి పంపించివేశాడు. అయినా వాళ్ళు నిరాశ పడకుండా అన్ని ఇళ్ళనంబర్లూ వెతికి శాయీరామ్‌ ఇల్ట్లుకనుక్కున్నారు. కిటికీలోనుచి ఆ వ్యవహారమంతా చూస్తోన్న మాకు టెన్షన్‌ పెరిగిపోతోంది.

పావుగంట తలుపుకొట్టాక శాయీరామ్‌ గడ్డం తగిలించుకుని బయటి కొచ్చాడు. వాడొక్కడే మాటాడితే ఖంగారుపడి ప్తానంతా ఎక్కడ పాడుబేస్తాడోనని నేను కూడా కళ్ళజోడు పెట్టుకొని వాడి దగ్గరకిళ్ళాను.

170 హ్యూమరాలజీ _

థి "హమ్‌కో మోపెడ్‌ బేచాహై శాయీరామ్‌ నామ్‌సే-అడ్రస్‌తో యహీహై" అంటున్నాడు "మోపెడా? ఎవరమ్మారు? శాయీరామా? ఆ పేరుగలాళ్లివ్వరూ లేరు-”" అన్నాడు శాయీరామ్‌,. "ఏం కావాలిట?" అడిగాను నేను ఎమీ తెలియనట్లు శాయీరామ్‌ని. "ఎవరో శాయీరామ్‌ అని మోపెడ్‌ అమ్మారట విళ్ళకు-" “మరి అడ్రస్‌..."గొణిగాడు సర్దార్డీ. "నిర్భయ్‌నగర్‌ కాలనీ పేరుతో రెండు మూడు కాలనీలున్నాయ్‌- అక్కడెవరయినా ఉన్నారేమో-” అన్నాన్నేను. “ఎక్కడ?” అడిగాడు సర్దార్టీ ఆత్రుతగా. "నాకూ తెలీదు! ఒకటి బాంబేహైవేలో ఉన్నట్లు గుర్తు! ఇంకొకటి నిజామాబాద్‌ రోడ్‌ మీదెక్కడో ఉండాలి! మరోటి నాగార్చునసాగర్‌ రోడ్‌ మీద..." సర్ద్హార్ట ముఖం పాలిపోయింది. "బహుత్‌ నుక్‌సాన్‌ హో గయాభయ్‌ హమారా!" అన్నాడు దీనంగా. ''ఎందుకు ఏం జరిగింది?" అడిగాడు శాయీరామ్‌. "ఆ శాయీరామ్‌ అనే దొంగరాస్కెల్‌ మాకు మోపెడ్‌ అంటగట్టి మూడువేలు తీసుకుని పారిపోయాడు. తీరా చూస్తే అది పదిహేనువందల కంటే ఎక్కువ చేయదట! పైగా ఇప్పుడు అసలుదాన్ని కొనేవారే కనిపించటంలేదు..." "అయ్యో పాపం" అన్నాడు శాయీరామ్‌. "పాపం మీకు చాలా నష్టం అనుకుంటాను!" అన్నాను నేనూ సానుభూతి ఒలకబోస్తూ, "నిజంగా నాకు మోపెడ్‌ అమ్మింది నువ్వు కాదా?" అనుమానంగా అడిగాడు సర్దార్డీ శాయీరామ్‌ గడ్డంవంక చూస్తూ. శాయీరామ్‌ చిరునవ్వు నవ్వాడు. "అరే భయ్యా! నాకసలు మోపెడ్‌ అనేదే లేదు. ఇంక అది అమ్మే ప్రసక్తి ఎక్కడిది?" అన్నాడు నా వంకచూస్తూ. “అవును! మాకాలనీలో అసలెవరికీ మోపెడ్‌లేదు! ఎవరూ ఇంకకొనరు కూడా?” అన్నాన్నేను ఎదొకటి మాట్లాడాలని! మోపెడ్‌ రేస్‌ అను బి.వియస్‌-50 11/1

"అచ్చం మీలాగానే ఉన్నాడతనుకూడా! కానీ గడ్డం లేదప్పుడు" అన్నాడు సర్దార్జీ ఇంకా శాయీరామ్‌ వంకే అనుమానంగా చూస్తూ.

శాయీరామ్‌ ఈసారి గట్టిగా నవ్వాడు. నేనూ గట్టిగా నవ్వకతప్పలేదు.

"నేను చిన్నప్పటినుంచీ పెంచుతున్నానీ గడ్డం! కావాలంటే ఇతని నడగండి!" అన్నాడు నావంక చూపుతూ.

"అవునవును! అయిదో క్లాస్‌ చదివేటప్పటినుంచీ గడ్డం ఉంది ఇతనికి!” అన్నాన్నేను.

"అయిదో క్లాసులోనే గడ్డం వచ్చాయ్‌?" అన్నాడు సర్హార్టీ ఆశ్చర్యంగా. __"“అఫ్‌కోర్స్‌-అఫ్‌కోర్స్‌-వీడు అయిదోక్లాస్‌ చదివేటప్పటికే వీడి వయసు పదిహేడు-అన్ని కానులూ రెండేళ్ళు, మూడేళ్ళు చొవ్పున చదవాల్సి వచ్చింది" అన్నాను తవ్వ్పు కప్పిపుచ్చుకోటానికి.

సర్దార్టీ మొఖం హఠాత్తుగా కోపంగా మారిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయినయ్‌.

“ఆ శాయీరామ్‌ ఎక్కడకు పోతాయ్‌ నేను చూస్తా! ఎక్కడయినా కనబడితే ఖతమ్‌చేస్తా" అన్నాడు కత్తిమీద చేయివేస్తూ.

శాయీరామ్‌ వణికిపోతున్నట్టు తెలుస్తూనే వుంది నాకు.

"అవును! అలాంటి వాళ్ళను మర్ణర్‌ చేయాల్సిందే!” అన్నాన్నేను కూడా సపోర్ట్‌ చేస్తూ. సర్దార్జీ లిద్దరూ వెళ్ళిపోయారు.

శాయీరామ్‌, యాదగిరి ఆ తరువాత నెలరోజుల వరకూ ఆఫీస్‌ కెళ్ళలేదు.

శెలవుపెట్టి ఇంట్లో కూర్చుండిపోయారు.

తరువాత ఓరోజు మేమందరం కలసి ఎగ్జిబిషన్‌కివెళ్ళి వస్తుంటే ఎవరో ఒకతను శాయీరామ్‌ మోపెడ్‌ని రిక్షామీద తీసుకెళుతూ చెమటలు తుడుచుకుంటూ కనిపించాడు.

“హమ్మయ్య! ఇంక మనకి భయంలేదు! సర్దార్జీ మోపెడ్‌ని వీడికెవడికో అమ్మేశాడు. ఇంక మనకోసం వెతకడు" అన్నాడు శాయీరామ్‌ ఆనందంగా.

అందరం స్వేఛ్చగా ఊపిరిపీల్చుకున్నాం. తో 172 హ్యామరాలజీ

ఆతక్సు =తోవ్వజాల అత్‌ ఎందరక్షల (ప్రపొాసనం౦ శీ శ ర్‌ / గ న, తీ వె మనన ననా | ఎళ్ళళ్ళలకూ పాదరక్షలకూ చాలా దగ్గర సంబంధం ఉందని అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకోవడమేకాదు, వళ్ళు మండిందంటే “ఎవడన్నా లేదన్నాడంటే వాడిని చీరేస్తాం" అనికూడా అంటారు.పెళ్ళివారికి కట్నాల గురించిగానీ మరే ఇతర లాంఛనాల గంరించిగానీ పేచీ వచ్చిందనుకోండి. అవృడంువారు చెవులు యుదధేోేఛ్చగా ఉపయోగించుకుంటారు. లేదా ఇద్దరూ కలసి మధ్యవర్తిమీద ప్రయోగిస్తారు. కొంతమందికి పెళ్ళిళ్ళల్లో వియ్యంకులతరపువారి చెప్పులుదొంగలించటం సంప్రదాయంకూడా. అయితే నేను రాయదల్బుకుంది ఈ విధమైన సంబంధం గురించి కాదు. మనందరం అనుభవించే మరో సంబంధం గురించి. అదేమిటంటే పాదరక్షలు పోగొట్టుకోవటం! పాదరక్షల ప్రహసనం 173

అంటే నా ఉద్దేశ్యం పెళ్ళిళ్ళలో ఇంకేమీ పోవని కాదు. ఆ మాటకొస్తే పెళ్ళిళ్ళళ్ళోపోని వస్తువంటూ ఉండదు. గరిటెలు, స్పూనులూ, బట్టలూ, పొత్రలూ, నగలూ, చిన్నపిల్లలూ, మిఠాయిలూ-ఇలా ఆయా పెళ్ళిళ్ళకొచ్చిన అతిధుల అభిరుచులను బట్టి అన్నీపోతూ ఉంటాయి. కానీ వీటన్నింటి కంటే కూడా సిస్టమేటిగ్గా,అదో నిబంధనగా చాలామంది చెప్పులు పోగొట్టుకోవటంవల్ల పెళ్ళిళ్ళలో పాదరక్షలకన్న (ప్రాముఖ్యత మరి దేనికీ ఉండదు. ఇక ముందు ఉండబోదు.

నేను రెండేళ్ళపాటు జీతంలో ప్రతినెలా కొంత డబ్బువాయిదా పద్ధతిలో ఒక చెప్పుల షాపువాడికి కట్టి, ఇష్టమైన చెప్పుల జత ఆమధ్యే కొన్నాను. అంటే ఆ బాకీ తీరిపోయిందని కాదు. మరో ఎనిమిది నెలలపాటు వాడికీ వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడు పూర్తిగా అవి నా సాంతం అవుతాయన్నమాట! అంతవరకూ అవి ఆ షాపు యాజమాన్యం పేరే ఉంటాయి. మధ్యలో నేను చనిపోవడంవల్ల గానీ, లేదా మరే కారణం వల్ల గానీ మిగతా వాయిదాలు కట్టడం మానేస్తే వాటి యజమానులు వాటిని స్వాధీనం చేసుకుంటారు.

అంచేత ఆ ఎనిమిది నెలలూ అయాకే వాటిని వాడటం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని వాటిని ఆ షాపు యాజమాన్యం వారిచ్చిన అట్టపెట్టెైతో సహా స్టీల్‌ అల్మరాలో దొచేశాను. నా ఈ అద్భుతమైన ప్లాన్‌ తప్పక విజయవంతం అయేదేమోగానీ-ఇంతలో మా రామరాజుగాడి పెళ్ళి వచ్చింది. సరిగ్గా ఆ సమయానికే నా పాత చెప్పులు ఇక రిపేర్‌కి పనికిరావని ఖండితంగా చెప్పేశాడు, అవి గత మూడేళ్ళనుంచీ రిపేరు చేస్తున్న చెప్పుల మెకానిక్‌.

గత్యంతరం లేక కొత్త చెప్పులు వేసుకునే వాడి పెళ్ళికి చేరుకున్నాను. పారపాటునయినా వాటికి ఎదురు దెబ్బలూ, గాయాలూ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే వాటిమీద సర్వాధికారాలూ ఇంకా ఆ షాపు యజమానికే ఉన్నాయి కదా.

పెళ్ళి తంతుముగిసింది "ఆ! భోజనాలకు రండి" అని అరిచారవరో.

మరుక్షణం పందిట్లో జనమంతా హాల్లోకి జొరబడిపోయారు. నేనూ నా చెప్పుల్ని జాగ్రత్తగా వో పక్కన విడిచి భోజనానికని లోపలి కెళ్ళాను. అప్పటికే హాలంతా నిండిపోవడంతో రెండో పంక్తిలో కూచోవచ్చని మళ్ళీ బయటికొచ్చి చూసేసరికి చెప్పులు వాటి స్టానంలో కనిపించలేదు నా గుండెలు జల్లుమన్నాయి.

త్వరత్వరగా ఆవరణ అంతా వెదికాను. ఎక్కడాలేవు.

"ఐం, గురూజీ! ఎమిటి చూస్తున్నావూ?" అడిగాడు భవానీశంకరం. వాడూ, నేనూ ఒకప్పుడు క్లాస్‌మేట్స్‌మి. 174 'హ్యూమరాలజీ

"చెప్పులు కనిపించటంలేదు" అన్నాను కంగారు అణచుకుంటూ.

"ఎవడోకొట్టేసి ఉంటాడు-దానికి పెద్ద ఇదేముంది" అన్నాడతను.

"అదేమిటి? నేను వాటిని విడిచి ఒక్కనిమిషమేగా అయింది?"

"ఒక్కనిమిషం చాలా ఎక్కువ వాడికి"

“ఎవడువాడు?"

"అది తెలుస్తే కథ లేదుగా?" నవ్వుతూ అన్నాడు.

నేను పెద్దాడయాక ఎప్పుడూ ఎడవలేదు. చిన్నప్పుడు ఎడవడమే! మరి ఇంతకాలం ప్రాక్టీస్‌ లేకపోయినా ఇప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఏడుపొచ్చింది. వాటికి కట్టవలసిన మిగతా వాయిదాలు తీరకుండానే, వాటిమీద సర్వహక్కులూ ఆ షాపు యాజమాన్యాని కుండగానే పోగొట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకేం జవాబు చెప్పాలి?

విచారంగా కుర్చీలో కూలబడ్డాను.

! భవానీశంకరం నా పక్కనే కుర్చున్నాడు. కూర్చుని ఆ చెప్పుల వివారాలన్నీ ఒకటొకట్‌ీ అడిగి తెలుసుకుని మరీ సానుభూతి ఒలకబోస్తున్నాడు. వాడు సొనుభూతి ఒలకబోస్తున్న కొద్దీనాకు మరీ ఎడుపెక్కువై పోతోంది.

"గురూ! నేనో ప్పాన్‌ చెప్తాను. చేస్తావా?" అన్నాడు వాడు రహస్యంగా. “ఏమిటి?” అనుమానంగా అడిగాను. “చ్రేస్తానంటే? చెప్తాను" "ఎది? అప్పుడు కాలేజ్‌లో ఇచ్చిన ప్లాన్‌లాంటిదేనా?" అడిగాను అనుమానంగా ఆ కథ ఎమిటంటే అప్పుడు కాలేజీలో మమ్మల్నిద్దరినీ ఏదో విషయంలో ప్రిన్సిపాల్‌ వారం రోజులపాటు డిబార్‌ చేయించాడు. ప్రిన్సిపాల్‌మీద ఎప్పటైై3నా నేను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞచెస్తే, భవానీశంకంరం "“ఎప్పటిదాకానో ఎందుకురా?ఇవాళే తీర్చుకోవచ్చు. దానికి నేనో ప్తాన్‌ చెప్తాను" అన్నాడు. అప్తానేమిటంబే ప్రిన్సిపాల్‌కి వ్యతిరీకంగా = కాలేజీలో గోడలనిండా బొగ్గుతో అక్తీలపదాలు రాయడం! ఆ ప్లాన్‌ మహత్తరమైందని వాడు నన్ను నమ్మించడంచేత నేను ఆ రాత్రి గోడలమీద బొగ్గుతో రాస్తూ పోలీసులకు దొరికి పోయాను. వాళ్ళ బారినుంచి తప్పించుకుని బయటపడడానికి నెలరోజులు పట్టింది. భవానీశంకర్‌ మనస్పూర్తిగా నవ్వాడు. “"ఛఛ! అది వేరు ఇది వేరు! ఇది పర్‌ ఫెక్ట్‌ప్తాన్‌" అన్నాడు "ఏం చేయమంటావ్‌?" పాదరక్షల ప్రహసనం 1/5

"ఏదో మరో మంచి జత చెప్పులు చూసి వేసుకుని వెళ్ళిపో"

నేను ఉలిక్కిపడ్డాను. “ఇంకొకరివా?"

"అవును"

"ఛీ! తప్పు కదూ?"

"మరి నీ చెప్పులు వేసుకెళ్ళినవాడు తప్పు అని అనుకోలేదుగదా?”

"ఓహో అట్నుంచి వచ్చావా!" ఆలోచిస్తూ అన్నాను.

నా వీక్‌నెస్‌ కనిపెట్టి వాడు మళ్ళీ నా చెవిదగ్గర గొణిగాడు.

"నీకేం సంకోచం అక్కర్లేదురా! ఇదిగో! నా చెప్పులు చూడు! ఇవి నా స్వంతం అనుకుంటున్నావా? అబ్బే! ఇలా కొట్టెసినయ్యే!”

నేను వాడి చెప్పులవంక చూశాను. చాలా కొత్తగా అద్భుతంగా ఉన్నాయి.

"మరి ఎవ్వరూ కనిపెట్టలేదూ?" అనుమానంగా అడిగాను"వాటి ఓనరు నా ముందు నుంచి పధ్నాలుగు సార్డు తిరిగాడు గానీ, గుర్తుపట్టలేదు. ఒకవేళ గుర్తుపట్టినా అడిగే ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? అయినా నీకేం ఫర్లేదు. నేను నీ పక్కనే ఉంటాను!"

నాకు కొంచెం ధైర్యం వచ్చింది.

"ఇప్పుడేం చేయమంటావు?"

"లేచి రంగంలోకి దూకు! వరండాలో కెళ్ళు. అక్కడున్న వాటిల్లో బెస్ట్‌జత సెలెక్ట్‌చేసుకో!

అటూ ఇటూ చూడకుండా-సిగరెట్‌ వెలిగించుకుంటూ వాటిని కాజువల్‌గా తొడుక్కో-అంతే, ఆ తరువాత తిన్నగా ఇంటికళ్ళిపో-వెనక్కు తిరిగి చూడవద్దు. వెనుక నుంచి కేకలు, అరుపులు, పోలీస్‌ విజిల్స్‌-ఇలాంటివేమీ వినిపించినా వెనక్కు తిరక్కు! జయంనీదే!”

“అంతేనంటావా?” వణుకుతున్న గొంతుతో అన్నాను.

“అంతే!”

నేను కుర్చీలో నుంచి నిలబడ్డాను. వరండాలో చిందరవందరగా కనబడుతున్నాయి- చెప్పులు! త్వరగా నడిచి మాంచి కొత్త జత దగ్గర ఆగి సిగిరెట్‌ వెలిగించుకున్నాను. మరుక్షణంలో ఆ చెప్పులురెండూ నా కాళ్ళకు అమరిపోయాయి. వెనక్కు తిరిగిరెండడుగులు = వేసేసరికి ఎవరో భుజం తట్టారు. నా ప్రాణాలు పైకి రాకెట్‌ లా దూసుకుపోయాయి. వణుకుడుని సర్దుకుంటూ వెనక్కుతిరిగి చూశాను. లావుపాటి పొట్టగల ఆకారం నన్ను చూసి నవ్వింది.

176 హ్యూమరాలజీ

"ఏ...ఏ....ఏ....మి...టి...?” అన్నాను ఏడుపు ఆపుకుంటూ.

“చెప్పులు...” అన్నాడు. నేను పట్టుబడిపోయాను. అతనిని కౌగిలించుకుని బావురుమని ఏడ్చేయాలన్న ఫీలింగ్‌నీ బలవంతంగా ఆపుకున్నాను.

"నిజం సార్‌! ఇవి నావే-భలేవారే! నేనలాంటి వనిచేస్తానా? ఒట్టు! కావాలంటే మా భవానీశంకరం నడగండి-వచ్చేప్పుడు ఇవి వేసుకున్నానో లేదో-” అన్నాను బ్రతిమాలుతున్న ధోరణిలో.

అలావుపాటి అకారం మళ్ళీ నవ్వింది.

“అబ్బే-నేననేది అదికాదు. మీకాళ్ళ వంక చూడండోసారి." నేను నా కాళ్ళవంక చూసుకున్నాను. రెండుకాళ్ళకూ రెండురకాలు చెప్పులున్నాయి అంటే ఆఖంగారులో నేను రెండురకాల చెప్పులు తొడిగేసుకున్నానన్నమాట! ఒక్కసారిగా ధైర్యంతిరిగి వచ్చేసింది

"ఇదా! నేను చూసుకోలేదులెండి. ఎదో ఆలోచిస్తూ... ఇహిహి..."అంటూ ఆ లావుపాటి అక్షారానికి ధాంక్స్‌ చెప్పి రెండో కాలి చెప్పుతీసేసి దాని తాలూకు జత చెప్పు తొడుక్కుని వరండా దిగి పందిట్లో కొచ్చి భవానీశంకర్‌ పక్కగా కూర్చున్నాను.

౨... "అలా వణకకు! బావుండదు" అన్నాడు వాడు కోపంగా. “నే...నే...నే నెక్కడ...వ...వ...ణుకుతున్నాను...” అన్నాను ఖంగారుగా. ఇంకొంచెం ఎక్కువగా వణుకుతూ . _ "నామాటవిని ఇక్కడి నుంచి మీ ఇంటికి త్వరగా వెళ్ళిపో! నువ్వలావణకడం చూస్తే ఎవర్తికైనా అనుమానం వస్తుంది." _ “"'మ..మ...౦...భో...జ...జ...నం" "పోతే పోనీ-వెధవ భోజనం! భోజనంకోనం చూసుకుంటే పట్టుబడిపోతావ్‌!" గత్యంతరం లేక లేచి వడివడిగా బయటకు నడవబోయాను. తీరా రెండడుగులు వేశానోలేదో, '"బవండోయ్‌ మాస్టారూ" అంటూ ఎవరో నన్ను పిలవడం వినిపించింది. హఠాత్తుగా నాలో మళ్ళీ వణుకు జబ్బు ప్రవేశించింది. ఎవరో నన్ను కనిపెట్టేశారు. ఆ చెప్పులవోనర్‌ కేక పెట్టి ఉంటాడు. , _ ఏమిటిప్పుడు చేయడం?

నాకు సడన్‌గా భవానీశంకర్‌ మాటలు గుర్తుకొచ్చాయి.

2 పాదరక్షల ప్రహసనం 177

"ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం చేపట్టినప్పుడు వెనక్కి తిరిగి చూడకు బ్రదర్‌. అరుపులు కేకలు పోలీస్‌విజిల్స్‌ ఇలాంటివేవీ వినిపించినా-సరే వెనక్కు, తిరగకు-" అంచేత నేను వెనక్కు తిరగదల్బుకోలేదు. ధైర్యంగా ముందుకు సాగిపోయాను.

కానీ ఆ వ్యక్తి అరుపులతో ఆగలేదు.

పెద్ద అంగలు వేసుకుంటూ నా కెదురు వచ్చి నిలబడ్డాడు. ఇలాంటి చెప్పుల యజమానులు అడ్డం నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు భవానీశంకర్‌ క్లూ ఇవ్వలేదు. అందుకని వాడివైపు చూశాను. వాడు ఇదేం పట్టనట్లు సినిమా పత్రిక చదువుకుంటున్నాడు.

"ఇవి నా వేనండీ!” అన్నాను గాభరాగా.

"ఎవి మీవి?" ఆశ్చర్యంగా అడిగాడతను

"ఇవే చెప్పులు..."

  • "చెప్పులేమిటి?”

"అదే కాళ్ళకేసుకునే చెప్పులు!”

“కాళ్ళకేసుకునే చెప్పులా?" ం

"అవును"

'అయితే-వాటి్‌కే మయింది?"

"అవి నావే అంటున్నాను. కావాలంటే మా భవానీశంకర్‌ని అడగండి అంటూ ఒరేభవానీ!” అని పిలిచాను వాడిని, -

“ఆ! ఏమిటి?” అంటూ పరుగుతో వచ్చాడు వాడు.

"ఈ నొప్పులు చెప్పేకదరా?"” ఖంగారుగా అని, వెంటనే సరిదిద్దుకుని, “ఈ చెప్పులు నావేకదుట్రా?” అనడిగాను.

"అవును మాస్తారూ! హి ఈజ్‌ ది వోనర్‌ ఆఫ్‌దీజ్‌ చెప్పల్స్‌! ఆ విషయంనేను ఖండితంగా చెప్పగలను. ఎలా చెప్పగలనంటారా? వొడు అలాంటివాడు కాదుకాబట్ట! నాకు తెలిసినంతవరకూ ఎప్పుడూ ఎవరిచెప్పులూ దొంగతనం చేయలేదు. ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయ్‌. కొత్తవి, అద్భుతమయిన మోడల్స్‌, విదేశీబూట్లు రూడా కనిపించాయ్‌, అయినా వాడెప్పుడూ వాటి వంకయినా చూడలేదు. నేనూ అంతే! ఎప్పుడూ నా చెప్పులే వేసుకుంటాను. ఎంత పాతయినా సరీ! పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరీ- మీ చెప్పులే మీరు ఉపయోగింపుడు అన్న ప్రిన్సిపుల్‌కి లోబడి జీవితం గడుపుతున్నాం! అంచేత, దయచెసి వాడిని అనుమానించకండి! 178 హ్యూమరాలజీ

|

వాడి చెప్పులకు వాడే యజమాని! అలాగే నా చెప్పులకు నేనే వోనర్‌ని! ఇద్దరం కేవలం నీతిమిద నిలబడతాం గానీ, పరాయివాడి చెప్పులమీద కాదు." ఆ పెద్దమనిషి చిరాగ్లా చూశాడు భవానీని! "ఇప్పుడు చెప్పులు దొంగిలించారని ఎవరన్నారయ్యా! తమరు భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదంటున్నాను అంతే" అన్నాడు నాతో వినయంగా. నాకు పోయినప్రాణాలన్నీ కేరింతలు కొట్టుకుంటూ తిరిగి వచ్చేసినయి. "భోజనమా? దాన్దేముంది-తరువాత చేస్తాను అలా వెళ్ళి వచ్చి..." “అలా వద్దు, సార్‌! దయచేసి భోజనం చేశాకే వెళ్ళండీ! కొంచెం ఆలస్యం అయిన మాట నిజమే! అంతమాత్రాన అలా కోపగించుకుంటే ఎలాగండి-రండి! అలా రెండు నిమిషాలు కూర్చోండి! రెండో బంతి పావుగంటలో రడీ అవుతుంది..." అంటూ నా చేతులు పట్టుకుని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు. చేసేదిలేక వెధవముఖం వేసుకుని కూర్చున్నాను. శంకర్‌ కూడా నా పక్కనే కూర్చున్నాడు. “మనం తొందరపడి చెప్పుల గురించి మాట్టాడకూడదు అన్నాడు వాడు. "అవును! ఇప్పుడు కదా ఆ విషయం తెలిసింది" అన్నాను నేను. . "ఈ సారి ఎవరైనా పిలిచినా ఛస్తే చెప్పుల గురించి మాట్లాడకూడదు" అన్నాడువాడు. "ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఏమిటి?" అడిగాను మళ్ళీ చెప్పుల నంగతి గుర్తు తెచ్చుకుని. "ఏముందీ? ఈ సారివాడు పిలుస్తున్నా ఆగకుండా బయటకు పరుగెత్తు..." "అలా పరుగెడితే అందరికీ అనుమానం రాదూ?” "వచ్చినా సరీ-మన దేహ సౌందర్యరక్షణ ముఖ్యం కదా?" "అంతేనంటావా?" "అక్షరాలా అంతే!” "పోనీ భోజనం చేశాకయితే బాగుంటుదేమో. అప్పుడయితే వాడిక అడ్డుపడడు." "వాడు అడ్డుపడడు గానీ, ఇప్పుడు మొదటి పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్న ఈ చెప్పులవోనరు బయటికొస్తే తప్పక అడ్డుపడతాడు." "అవునవును! ఆ విషయం మర్చీపోయాను" అన్నాను మళ్ళీ వణుకులోకొచ్చేస్తూ,. "హలో" అన్నగొంతు వినిపించి ఇద్దరం అదిరిపడ్డాం. పాదరక్షల ప్రహసనం 179

మా వెనకాలే నిలబడ్డాడో వ్యక్తి. అలా చిరునవ్వుతో పలుకరించే వాళ్ళను చూస్తేభలే ముచ్చటవేసేది. కానీ ఈ చెప్పులు తస్కరించిన కొద్దిసేపటినుంచీ-ఆ చిరునవ్వు ఎంతో భయంకరంగా గుండెలవిశిపోయేలా కనబడుతూంది

"యస్‌" అన్నాడు భవానీశంకర్‌ ధైర్యంగా.

నేను ఆ పెద్దమనిషికి నా చెప్పులు కనిపించకుండా కాళ్ళు కుర్చీకిందకు లాక్కున్నాను అతను మళ్ళీ చిరునవ్వు నవ్వాడు.

నాకు చటుక్కున భవానీ శంకర్‌ మాటలు గుర్తుకొచ్చాయి, అతను వచ్చింది చెప్పులగురించి కాదేమో! "మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది-" అన్నాను సంభాషణ వేరే రంగంలోకి దింపుతూ.

“ఉండొచ్చు-ఉండొచ్చు" అన్నాడతను ఇంకా చిరునవ్వు నవ్వుతూనే.

భవానీశంకర్‌ నావైపు అభినందిస్తునట్లు చూశాడు.

ఆ తరువాతేం మాట్లాడాలో నాకు తెలియటంలేదు. సహాయంకోసం వాడివైపు చూశాను. వాడు వెంటనే అందుకున్నాడు.

“వెదర్‌ చాలా బావుంది" అన్నాడు పందిరివైపు చూస్తూ.

“అవును! చాలా ఆహ్లాదంగా ఉంది" అన్నాన్నేను.

“అ చెప్పులు...” అతనేదో చెప్పబోయాడు గానీ, భవానీశంకర్‌ అడ్డుపడిపోయాడు.

“మీరెప్పుడైనా డార్జిలింగ్‌ వెళ్ళారా?" అడిగాడతనిని.

"లేదు ఎందుకు?” ఆశ్చర్యంగా అన్నాడతను.

"అక్కడ ఎప్పుడూ ఇలా కూల్‌గా క్తౌడీగా ఉంటుంది వెదర్‌!" అన్నాడువాడు.

"ఐ.సీ" అన్నాడా వ్యక్తి.

"నేను త్రీ టైమ్స్‌ వెళ్ళానక్కడికి!"

ఆ వ్యక్తికి డార్జిలింగ్‌ గురించిగానీ, అహ్లాదకరమైన వాతావరణం గురించిగానీ ఎ మాత్రం ఆసక్తి ఉన్నట్లు లేదు. అందుకని టక్కున మళ్ళీ సబ్జెక్ట్‌లోకి దిగిపోయాడు.

“అ చెప్పులు...” అన్నాడు నా కాళ్ళవైపు చూపుతూ. నా మెదడంతా మొద్దుబారి పోయింది. ఇంక దేవుడు కూడా నన్ను రక్షించలేడు. ఈ దెబ్బతో పెళ్ళిపందిట్లో నా పరువంతా గోవిందా |!

కానీ శంకర్‌ పరిస్థితిని చేయిదాటిపోనీకుండా మరో ప్రయత్నం చేశాడు.

"అందాకా ఎందుకూ-కొడైకెనాల్లో కూడా అచ్చం ఇలాగీ ఉంటుంది"

కానీ ఆ వ్యక్తి అవేం పట్టించుకోలేదు. జలగలాగా పట్టేనుకున్నాడు.

180 హ్యామరాలజీ

“ఆ చెప్పులు-ఓసారి చూడనిస్తారా?' అన్నాడు నాతో,

నాకేం తోచలేదు "ఇహిహి-చెప్పులా?" అన్నాను.

“అవును! ఒకసారి చూడనిస్తారా?"

“ఎందుకు?” "పనుంది!"

"ఏం పని?" న

"ఏదో పని!"

"అలాగా?"

"అవును! మరి చూడనిసారా?”

"ఎందుకు చూడటం?"

“పనుంది!”

"ఎం పని?"

"మిష్టర్‌! మీకే చెప్పేది" ఈ సారిగొంతుపెంచి అన్నాడతను. అతనిగొంతు మా ముందు వరుసలో కూర్చున్న మరి కొంతమందిని ఆకర్షించింది. అందరూ మా దగ్గరీదో సినిమా ఆడుతున్నట్టు మా వైపు తిరిగి కూర్చుని చూడసాగారు.

నేను భవానీశంకర్‌ వైపు చూశాను. వాడు అర్దంటుగా గాలిలోకి చూశాడు. "చూపించండి!" మరింత ధీమాగా అడిగాడతను. నాకు తెలియకుండానే వణుకుతున్న నా కాళ్ళు కుర్చీకింద నుంచి బయటికొచ్చాయి.

! భవానీశంకర్‌ వెంటనే జోక్యం చేసుకున్నాడు.

“చాలా అద్భుతమైన చెప్పులు!” అన్నాడు నాతో "మీక్కూడా నచ్చాయా?" అనడిగాడు అ ఎదుటి వ్యక్తిని. అతను ప్రశ్న పట్టించుకోలేదు.

"ఆ చెప్పులు ఎక్కడివి మీకు?" కొత్తగా రిక్రూట్‌ అయిన పోలీస్‌కానిస్టేబుల్‌లాగా అడీగాడు.

"మీరే కాదు-ఇప్పటికీ ప్రశ్న ఇరవై ముగ్గురు అడిగారు!” అన్నాడు భవానీశంకర్‌ మళ్ళీ జోక్యం చేనుకుని.

నేనేమీ మాట్లాడకపోవడం చూసి "కదురా" అంటూ నా భుజంచరిచాడు.

“అవును!” ఒప్పుకున్నాను నేను. "ఇతనితో కలసి ఇరవై నలుగురూ" అంటూ సరిదిద్దాను.

"అంత అద్భుతమైన మోడల్‌ “అన్నాడు వాడు. నేను పుంజుకున్నాను. పాదరక్షల ప్రహసనం 181

''ఆ షాపువాడు మా (ఫెండ్‌ కాబట్టి-ఇచ్చాడు! అసలు ఎంత డబ్బు ఇస్తామన్నా ఎవ్వరికీ - అమ్మటంలేదు" అన్నాను.

"అవును! ఆ తరువాత మన ఫెండ్స్‌ చాలామంది షావుకెళ్ళి అడిగారు- ఎవ్వడికీ ఇవ్వలేదు!" .

“అంతెందుకు-వీటినే ఎంతడబ్బు కావాలంటే అంత ఇస్తాం నాకిచ్చెయ్యమని ' రామచంద్రపిళ్ళి అడిగాడు త

“అవును! రామచంద్రపిళ్ళి! గుడ్‌ ఫెలో! హి ఈజ్‌ ఫ్రమ్‌ కేరళా! వెరీఫాండాఫ్‌ దీజ్‌ చెప్పల్స్‌' అన్నాడు భవానీశంకర్‌.

"రామచంద్ర పిళ్ళి కదూ?” కన్‌ఫర్మేషన్‌ కోనంనన్నడిగాడు మళ్ళీ.

“అవును! అసలు వాళ్ళ వంశమే అంతట-వెరీ ఫాండాడ్‌ చెప్పల్స్‌! ఒకసారి 'మీసాలు నీవి, రోషాలు నావి' సినిమా క్యూలో నిలబడినప్పుడు వాళ్ళ పూర్వీకులహిస్టరీ అంతా చెప్పాడు నాకు!"

ఆ క్యూ అంత పెద్దదా?”

“అవును!”

"మరా సినిమా ఎనిమిదోరోజునే ఎలా వెళ్ళిపోయింది?"

"ఎవడన్నాడు ఎనిమిదో రోజువెళ్ళిపోయిందని"

“ఆహాలువాడు!"

“ఎడ్చాడు!"

"ఏం ఎందుకు?"

“అది వెళ్ళింది తొమ్మిదో రోజున!"

"మరివాడు ఎనిమిదోరోజున అంటాడేం!"

“వాడీ మొఖం! వాడు తొమ్మిదో రోజు ఈసినిమానే చూసి కొత్త సినిమా అనుకుని ఉంటాడు.” ఈ సంభాషణ ఆవ్యక్తికి ఎమాత్రం నచ్చినట్ట్లులేదు. అంచేత మళ్ళీ మధ్యలో అడ్డుపడ్డాడు.

"ఆ చెప్పలు మీవా?"

భవానీశంకర్‌ అతని మాటలు వినిపించుకోలేదు. మళ్ళీ రామచంద్రపిళ్ళేని అడ్డం ఖ తెచ్చుకున్నాడు.

"రామచంద్ర పిళ్ళే, వాళ్ళ తాతా ఒకసారి ఆగ్రా వెళ్ళినప్పుడు అక్కడ ఫోర్ట్‌ గేటు పక్కనే ః ఒక చిన్న చెప్పుల దుకాణంలో అద్భుతమయిన చెప్పులజత చూశాడట. “అవెంత?” అని అడిగాడట వాడని. వాడు 'యాభైరూపాయలు అని చెప్పాట్ట"

182 హ్యామరాలజీ

“అవి ఎవరు తయారుచేశారు?" అనడిగాట్ట.

“నేనే!” అని జవాబిచ్చాడట వాడు.

"ఇలాంటివి ఎన్ని జతలు చేశావ్‌?" అనడిగాడు ఆయన.

"ఇదొక్కటే చేశాను. దీన్నే ధర ఎక్కువని ఎవరూ కొనడంలేదు" అంటూ కన్నీళ్ళు 'పెట్టకున్నాట్ట వాడు. మరి రామచంద్రపిళ్ళి తాతగారి రోజులంటే మన స్వాతంత్రానికి పూర్వం అన్నమాట. అప్పుడు యాభయ్‌ రూపాయిలంటే ఎక్కువేకదా!

అయన వెంటనే వందనోట్లు అయిదుతీసి వాడికిచ్చి “ఇలాంటివి ఇంకెవ్వరికీ చేయకుండా ఉంటానికిస్తున్నానీ డబ్బు" అని చెప్పి ఆ చెప్పులు తీసుకువచ్చేశాట్ట! ఇప్పటికీ ఆ చెప్పులు అలా ఉంచారు వాళ్ళింట్లో.

"వాళ్ళ ఫాదర్‌ కూడా మంచి చెప్పుల కోసం మలేసియా వెళ్ళినప్పుడు-ఇలాగే ఒక చిన్న దుకాణం వాడికి-" .

రామచంద్ర పిళ్ళే వాళ్ళ వంశం తాలూకూ చెప్పుల కథలు ఆ చుట్టూకూర్చున్న వారికి మహా రసానుభూతిని కలిగిస్తున్నాయేమో కాని, ఆ వ్యక్తిని ఏ మాత్రం కదిలించలేక పోతున్నాయ్‌, పైపెచ్చు రాన్రాను అతనికి ఆ రామచంద్రపిళ్ళే మీద, వాళ్ళ వంశంతాలూకూ చెప్పుల కథలు మనోజ్ఞకంగా వినిపిస్తున్న భవానీశంకర్‌ మీదా, ద్వేషం ప్రబలిపోతున్నట్లు దాఖలా కనిపించింది.

"ఆ చెప్పులు మీవా? అని నేను-మిమ్మల్ని-అడుగుతున్నాను." ఒక్కొక్క పదం విడదీసి స్పష్టం చేస్తూ అడిగాడతను.

"ఐ చెప్పులు?" అడిగాను ఎమో అర్ధంకానట్టునటిస్తూ-

"అవిగో- అవి-ఆకాళ్ళకున్నవి?"

"ఎ కాళ్ళకు?"

"మీకాళ్ళకు!"

"వాటికే మయిందిప్పుడు?"

"ఆ చెప్పులు మీవేనా?"

“హిహిహి'' చాలాకాజువల్‌గా నవ్వాలనుకుని ప్రయత్నించాను గాని, అదికాస్తా వెర్రి నవ్వయి కూచుంది. పాదరక్షల ప్రహసనం 183

మొట్టమొదటిసారిగా నాతో ఈ వెధవ పనిచేయించి నన్నిలాంటి పరమభయంకర పరిన్థతిలో వడేసిన భవానిశంకర్‌గాడిని హత్య చేయాలన్నంత కోపంవచ్చింది. కానీ అప్పటికప్పుడు హత్యచేయడం అంత తేలికేం కాదు.

"ఎమిటది?” కోపంగా అడిగాడా వ్యక్తి.

"ఎమిటేమిటి?” ఏమీ తెలీనట్లు అడిగాను.

"ఇప్పుడు నా ్రశ్చకు ఇహ్హిహ్హిహ్హ్హి అంటూ మీరు చేసిన ప్రక్రియ ఏమిటి? అని అడుగుతున్నాను."

“అదా!” తేలిగ్గా అనేశాను.

“అవును! అదే!" ం

నవ్వాను."

"యస్‌-అది నవ్వే!” తనూ వప్పుకున్నాడు భవానీశంకర్‌

"ప్లీజ్‌-డోంట్‌ ఇంటర్‌ ఫియర్‌!" భవానిశంకర్‌కి వార్నింగిచ్చాడతను.

భవానీశంకర్‌ ఆశ్చర్యంగా అతనివేపు చూశాడు.

"డోంట్‌ ఇంటర్‌ఫియరా?"

“అవును!” ;

"ఎమిటి డోంట్‌ ఇంటర్‌ఫియర్‌?"

"మధ్యలో కల్పించుకోవద్దు అని రిక్వెస్ట్‌ చేస్తున్నాను."

“ఎవరి మధ్యలో?”

“మా మధ్యలో?"

“మీరు ఎంచేస్తున్నారు?"

"వెరిఫై చేస్తున్నాను. అంటే నిర్ధారించుకోవడం అన్నమాట!”

"ఎ విషయం?"

“చెప్పుల విషయం!”

“అవా? ఇంపాజిబుల్‌! ఎంత ప్రయతించినా మీ కలాంటివి ఎక్కడాదొరకవ్‌! రామచంద్రపిళ్ళె అనీ వాళ్ళ(ఘఫెండ్‌కూడా పాపం ఇలానే వాటిమీద ఎంతో మోజుపడ్డాడుట. అసలు వాళ్ళవంశమే చెప్పుల మోద రీసెర్చిచేశారని..."

'టు హెల్‌ విత్‌ రామచంద్రపిళ్ళి” అరచాడు ఆవ్యక్తి.

184 హ్యామరాలజీ

"ఎందుకలా అరచారు?” అశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్‌.

  • "పిచ్చెక్కి!"

"అప్పుడప్పుడూ అలా ఎటాక్‌ వన్తూంటుందా, ఇదే మొదలా?"

ఆ వ్యక్తి మళ్ళీ నావేపు తిరిగాడు

"మిస్టర్‌! జవాబు చెప్పండి!"

"ఏం జవాబు?"

"అదే, అ చెప్పుల గురించి?"

| "ఏ చెప్పుల గురించి?”

"మీ కాలికున్నవి!"

“వాటివివరాలు చెప్పానుగదా"

"నాకావలసింది వివరాలుకాదు-అవి మీవా అని అడుగుతున్నాను."

“ఎందుకు అడగడం?"

“ఎందుకో మీకుతెలీదా?"

"నాకా? నాకేం తెలుస్తుంది?”

"అవును! తెలీదు! ఎందుకంటే "అవి మీవి కావుగనుక!” ్క

ఆ మాటతో ఆ చుట్బ్టపక్కలున్నాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు.

నామొహం కళ తప్పిపోయింది. మెదడు శోషవచ్చి పడిపోయింది. కేవలంమెడల్లా అబ్గాంగేటా దయమీద ఆధారపడి ఉంది పరిస్థితి.

"ఇవి నావి కాదా?"

"కావు"

''మరివరివి?”

"నావి!"

“ఇంపాజిబుల్‌!” అన్నాను భవానీశంకర్‌ వంకచూనే.

"ఎస్‌. క్వొయిట్‌ ఇంపాజిబుల్‌ అన్నాడువాడు.

"యూ ఆర్‌ మిస్టేకెన్‌" అన్నాన్నేను, ఇంగ్లీష్‌లోకి పూర్తిగా దిగిపోతూ. ఇలా పదిమందిలో పరువుపోయే పరిస్థితుల్లో కేవలం ఇంగ్లీషే మాట్లాడితే చాలా ఉపయోగం ఉంటుందని వాడే చెప్పాడునాకు. పొదరక్తల ప్రహసనం గ. 185

“యస్‌! ధరూలీ మిస్టేకెన్‌" అన్నాడు భవానీశంకర్‌.

"మిస్టేక్‌ లేదూ-గాడిదగుడ్డూ లేదు. అవినావి!" ఖండితంగా అన్నాడతను.

"నో నో. దే ఆర్‌మైన్‌" అన్నాను.

"యస్‌! హి ఈజ్‌ ది హోల్‌ అండ్‌ సోల్‌ వోనర్‌ ఆఫ్‌ దీజ్‌ చెప్పల్స్‌" అన్నాడు భవానీశంకర్‌.

"నేను కాదు అని చెప్తున్నాను. అవి నావి!” కోపంగా అరచాడతను. సరిగ్గా అదే సమయంలోఫస్ట్‌ షో సినిమా వదిలినట్లు మొదటి పంక్తిలో కూర్చునిభోజనం చేసిన జనం బ్రేవున తేన్బ్చుకుంటూ వచ్చి మా చుట్టూ అప్పటికే గుమికూడిన చిన్న సైజు గుంపుని పెద్దదిగా చేశారు. రోడ్డుపక్కన గారడీవాడిక్కూడా ఇంతమంది ఆడియెన్స్‌ ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాత (పేక్షకులు క్రొత్తగావచ్చిన వాళ్ళకి ఇంత వరకూ జరిగిన కథక్త్షుప్తంగా చెప్పడం (ప్రారంభించారు.

“కాదు.... నావి!” అన్నాన్నేను-వణుకు తగ్గించడానికి ప్రయత్త్నంచేస్తూ.

“అవునువాడివే! అందులో అనుమానం లేదు. వాడెప్పటికి ఇంకొకరిచెప్పులుగానీ, లేక మరే ఇతర పాదరక్షలుగానీ, బూట్లుగానీ దొంగిలించేరకం కాదు. అంతేకాదు, చాలా , సార్లు మేజోళ్ళు కూడా దొంగతనం చేయలేదు. మీకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. వాడిప్పటికి నూటముప్పై నాలుగు పెళ్ళిళ్ళకు హాజరయ్యాడు-నూటము స్పై నాలుగేకదట్రా?" నన్నడిగాడు కన్‌ఫర్‌మేషన్‌కోసం.

"ఈ పెళ్ళితో నూట ముప్పయి అయిదు" అన్నాన్నేను.

“కరెక్ట్‌ నూట ముఫ్పై అయిదు పెళ్ళిళ్ళకు వెళ్ళాడు. అక్కడ వేలకువేలు చెప్పులు, బూట్టు, బెల్ట్‌ షూ, కాన్వాస్‌ షూల మధ్యగంటల కొద్దమసిలాడు. అయినా వాడేమయినా చలించాడా? ఒక్క జతయినా ముట్టుకున్నాడా? లేదు. కేవలం వాడి సాంతచెప్పులతోనే ఇంటికి తిరిగి వచ్చాడు! సిన్సియర్‌గా చెప్పండి! కెన్‌ ఎనీబడీ డూ ఇట్‌?నో! ఇంపాజిబుల్‌! అంతేకాదు. వాడికి ఫారిన్‌ బూట్ట్లుకూడా కొట్టేయగల అవకాశాలెన్నో వచ్చాయ్‌. అయినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎందుకని? కారణం ఎమిటి?వాడికి ధైర్యం లేకనా?రన్నింగ్‌ చేతకాదనా? అవేమికాదు. సింవుల్‌ రీజన్‌-మీ చెవ్పులే మీరు ఉపయోగించుడు అన్న నీతికి కట్టబడ్డ మొదటి పౌరుడువాడు. నేను రెండోవాడినని మీకీపాటికే తెలిసి ఉంటుంది. ఇవిగో నా చెప్పులు చూడండి! ఇవెవరివి? నావి. ఎంతోకాలం నుంచీ వీటినే తొడుగుతున్నాను. ఎన్ని పెళ్ళిళ్ళకెళ్ళినా వీటిని మార్చలేదు. కొత్తవాటితో 186 హ్యూమరాలజీ

ఎక్స్‌చేంజ్‌చేయలేదు. ఎక్కడికెళ్ళినా ఎంతమందికీ చూపించినా ఇవి నావి అని ఎవ్వరూ అనలేదు, ఎందుకని?" ఉద్వేగంతో అడిగాడు భవానీశంకర్‌.

'గుర్తువట్టి ఉండరు..." ఎవ్వరో గుంవులోనుంచి అరిచారు. అందరూ ఘెల్లుమన్నారుకానీ, భవానీశంకర్‌ అదేమీ పట్టించుకోలేదు.

"కాదు!" అన్నాడు వెంటనే "గుర్తుపట్టక కాదు! వాళ్ళు అవి తమవే అని తెలిసినా గాని మౌొనంవహిస్తారు ఎందుకు? మనుషులను బోలినమనుషులున్నట్లే, చెప్పులును బోలిన చెప్పులుంటాయ్‌! కనుక నాలాంటి మర్యాదస్తులను- "ఇవి మీవి కావు, నావి..." అని అనడం వారి మర్యాదకు లోపం అవుతుంది ఇంకా ఎంతసేపు వాడీ ఉపన్యాసధోరణి కొనసాగేదో గాని, ఆవ్యక్తి టక్కున అడ్డుపడ్డాడు.

"అయితే ఇవి మీవే నంటారు!" అన్నాడు నాతో.

"నూటికి నూరుపాళ్ళూ" అన్నాన్నేను.

“అంటే ఇవి అచ్చంగా మీరీకొన్నానంటారు!"

“అవును!”

"ఏ షాపులో కొన్నారు?

ఆ ప్రశ్ననాకు భయం కలిగించింది. ఎషాపులో అని చెప్పగలను? ఒకవేళ ఏదయినా షాపు పేరుచెస్తేవాడు ఎంక్వయిరీ చేస్తాడేమో!

“ఎందుకు? షాపుపేరు కూడా చెప్పాలా?"

"చెప్పాలి"

“ఎందుకు చెప్పాలి?"

"అవిమీవి అని తెలియడానికి! నాచెప్పులుదొంగతనం చేయలేదు అని బుజువు చేయడానికి!" క

“అంటే మీ చెప్పులు నేను దొంగతనం చేశానని మీరనుకుంటున్నారా?" “అనుకోవడమేమిటి? చేశారు!”

నేను ఆశ్చర్యం నటిస్తూ భవానీశంకర్‌ వేపు చూశాను.

“వౌగ్ర్రుంజ్‌" అన్నాను ఇంగ్లీషులో

"టూ మచ్‌గ్రేంజ్‌! "అన్నాడు వాడు

"స్రేంజీ, చీంజీలేదు. ముందు షాపు పేరుచెప్పు!” అన్నాడా వ్యక్తి పట్టదలగా.

పాదరక్షల ప్రహసనం 187

"షాపు పేరా?" “అవును! “రాధోడ్‌ కర్‌ చెప్పల్‌గంజ్‌ అనే షాపులో." "రసీదుందా?" మళ్ళీ అడిగాడు వాడు. ఇంక చిరాకేనుకొచ్చింది నాకు. ఎలాగూ దొరికిపోక తప్పదు. దొరికేముందు ఆఖరిసారిగా వో విసురు విసిర్తే గానీ పరువు దక్కేట్ట్లులేదు. అంచేతవిరుచుకుపడ్డాను. “రసీదా?" "అవును! రసీదే!" "వాట్‌ రసీద్‌" "ఆ చెప్పులు మీరు రాదోడ్‌కర్‌ గంజ్‌లోకొన్నట్లు!” “రాదోడ్‌కరో్‌ గంజ్‌కాదు! రాధోడ్‌కర్‌ చెప్పల్‌గంజ్‌” "అదే రాదోడ్‌కర్‌ చెప్పల్‌ గంజ్‌” . "'ధ' కి వత్తుంటుంది" "ఏ థాకి?" ( “రాధోడ్‌కర్‌లో 'ధో'కి" "నాక్కావలసింది 'థ' కి వత్తుకాదు. రసీదు! "అవును" “వాట్‌ రసీద్‌?" "ఇదిగో-ఈ నాటకాలు నా దగ్గర కాదు! మర్యాదగా నా చెప్పులు నాకివ్వు!" "నీ బెప్పులేమిటి? ఇవి నావి! కావాలంటే వాడినడగండి" అంటూ భవానీశంకర్‌ని చూపించాను. "అవును! అవి వాడివే! నేనే-విట్‌నెస్‌! కావాలంటే రామచంద్రం పిళ్ళే కూడా విట్‌నెస్సే?” "అయితే రసీదు చూపించండి." అరిచాడావ్యక్తి. "రసీదా-చెప్పులు కొన్నవాళ్ళు జేబులో పెట్టుకొని తిరగాలనుందా?” ఎదురుతిరిగాడు ం భవానీ శంకర్‌. వాడి లా పాయింటు భటే నచ్చిందినాకు, వాడిని ఎప్పటికయినా హత్య చేయాలన్న ఆలోచన విరమించుకున్నాను. 188 హ్యూమరాలజీ

"జేబులో లేకపోతే ఇంటికెళ్ళి తీసుకురావచ్చుగా?"

నేను-ఎం జవాబు చెప్తాడో అని భవానీశంకర్‌ చేపు చూశాను.

''ఆ అవసరం మా వాడికి లేదు” అన్నాడు వాడు.

"అవును. ఏ మాత్రం లేదు" అన్నాన్నేను.

"లేకపోతే చెప్పులు ఇక్కడ విడిచి వెళ్ళాల్సిందే!” మొండికేశాడతను చొక్కాచేతులు పైకి మడుస్తూ.

పరిస్థితి క్షణక్షణానికీ క్షీణించిపోతోందని గ్రహించి లావుపాటి పొట్టగల వ్యక్తి రంగంలో

దూకాడు. .

"అయితే ఇప్పుడు ఆ చెప్పులు వోనర్‌ షిప్‌ తేలాలన్న మాట!” అన్నాడు పాట్ట ం సవరించుకుంటూ. "అవును తేలాలి-దొంగ ఎవడో బుజువవుతుంది. అప్పుడు వాడిని కసితీరా ఉతకాలి."

నేను అంతవరకూ మర్చిపోయిన వణుకు మళ్ళీ తిరిగి వచ్చేసింది.

"అవునవును" అన్నాడు (పేక్షకవర్గంలోనుంచి ఎవరో. బహంశా అదీ ఎప్పుడో పెళ్ళిలో

కొత్త చెప్పులు పోగొట్టుకున్న బాపతయి ఉంటుంది.

"అయితే వో పని చేద్దాం! ఆ చెప్పుల మీద ఆ కంపెనీ పేరు-ధర ముద్ర వేసి

ఉంటుందిగా! అది ఎవరుకరెక్ట్‌ గా చెప్తారో చూద్దాం!” అన్నాడు లావుపాటి పొట్ట.

"బ్రహ్మాండంగా వుంది ఆయన అయిడియా!” (పేక్షకుల్లో నుంచి ఇంకెవరో సపోర్ట్‌

చేశారు.

నాపరిస్థితి చాలా విషమించిపోయిందని అర్ధమయింది నాకు. క్షణాలమీదుంది

వ్యవహారం. ఆ చెప్పులకంపెనీ పేరు, ధర వాడు ఖచ్చింతంగా చెప్పేయగలడు. దాంతో నా ఆటకట్టు. భవానీశంకరంగాడిని మర్ణర్‌ చేయాలనుకున్న పాత కోరిక మళ్ళీపైకి లేచింది.

"ముందు అతనినే చెపమనండి చూద్దాం!" అన్నాడా వ్యక్తి దొరికిందే నందని.

"కాదు ముందు అతనినే చెప్పమనండి!" అన్నాన్నేను చెమటలు తుడిచేసుకుంటూ.

"అబ్బా ఆశే! నేను చెప్తే-నువ్వూ అదే కాపీకొట్టిచెవ్దామనా?"

"అహ్హహ్హ" అంటూ (ేక్షకులు మనసారా నవ్వారు.

"అవును! ఇద్దరినీ చీటీలు రాసి ఇవ్వమనండి! వాటిని పరీక్షచేసి రెండింట్లో ఏది

ఉత్తమమయిన ఎంట్రీయో నిర్ణయించి బహుమతి ప్రదానం చేద్దాం" అది మరో ్రేక్షకగొంతు. పాదరక్షల ప్రహసనం 189

క్షణాల్లో మా ఇద్దరి చేతుల్లో ఎంట్రీఫారాలు వచ్చిచేరినాయ్‌!

“అతనిని కూర్చోనీకండి! కూర్చుంటే కాళ్ళు పక్కకు జరిపి చెప్పులమీదున్న పేరు,ధర చూస్తాడు" అన్నాడావ్యక్తి. నా గుండెల్లో మరోరాయిపడింది! ఎలాగోలా కాలు తొలగించి వాటికంపెనీ పేరు రాద్దామనుకున్నాను.

"నాకిలా నుంచుని రాయడంరాదు!" అన్నాను హీనస్వరంతో.

"అవును! ఇప్పుడే కాదు-మొదట్నుంచీ అంతే! స్కూలు గార్డెన్‌లో కొబ్బరికాయలు దొంగతనం చేసినప్పుడు కూడా క్షాసులో టీచర్‌ నుంచోపెట్టి నోట్సురాయమంటే ఒక్కఅక్షరం కూడా రాయలేక పోయాడు" సపోర్ట్‌ చేశాడు భవానీశంకర్‌.

(పేకులంతా మళ్ళీ మనశారా నవ్వారు. అందులో అంత హాయిగా నవ్వాల్సిన విషయం ఏముందో మా ఇద్దరికీ అర్దంకాలేదు

"ఫరవాలేదు! ఇది దస్తూరి పోటీకాదు కదా-పేజీలు పేజీలుకూడా రాయనక్కరలేదు. రెండు మూడక్షరాలు మహా అయితే" లావుపాటి పొట్ట సలహా ఇచ్చాడు.

"అవునహో-అవును" మరో[్రేక్షకగొంతు

అ వ్యక్తి అటువేపు తిరిగితను రాస్తున్నది నేను చూడకుండా ఏదో కాగితం మీదగీకి ఆ ఎంట్రీ ఫారం లావుపాటి పొట్టకు అందబేశాడు.

“రాయవయ్యా! నువ్‌ కూడా కానీ” ఎవరో చెవిలో అరిచారు. _

పెన్ను చేతిలోకి తీసుకుని నాకు తెలిసిన చెప్పుల కంపెనీ పేర్లన్నీ ఆలోచించాను

"నాకు పేరు గుర్తురావడంలేదు"” అన్నాను ఏడుపు, బలవంతంగా ఆపుకుని. పోనీ పేరు మర్చిపోతే చెప్పుల సైజురాయి"

నాకు తోచిన ధర త్వరత్వరగా రాసీ ఆ లావుపాటి పొట్టకిచ్చాను.

“ఆ! ఇప్పుడు చెప్పులు విప్పమనండి!” ఆ వ్యక్తి ఆనందంగా అన్నాడు.

_"విపవయ్యా?” వణుకుతున్న కాళ్ళు నొక్కిపెట్టి వో చెప్పుజారవిడిచాను.

దానిమీద మెరుస్తోన్న అక్షరాలు ధర చూసేసరికి నాకు కళ్ళు తిరిగినయ్‌. ఆపేరు అంత వరకూ కనీవినీ ఎరగనిది. ధర తొంభయి ఎనిమిది రూపాయలు. నేను కాగితంలో అరవై రెండు రూపాయలని రాశాను.

"ఇదిగో-ఇతను రాసినపేరు, ధరా, సైజూ అన్నీకరెక్ట్‌గా సరిపోయాయ్‌. కనుక- ఇతనే బహుమతి పొందిన విజేత!” అంటూ ఆ వ్యక్తి చేతిని పట్టుకుని పైకెత్తాడు లావుపాటి పొట్ట. 190 హ్యూమరాలజీ

నేను చెప్పులు విడిచి దూరంగా జరిగాను. ఆ వ్యక్తి విజయగర్వంతో చెప్పులు ధరించాడు. .

  • అంతా కరతాళధ్వనులు చేశారు. "తరువాతి కార్యక్రమం ఎమిటి?” ఎవరో అరచారు. నేను పడిపోబోయి కుర్చీ పట్టుకుని నిలబడ్డాను. " "ఇది అన్యాయం! అయ్‌ ప్రాటెస్ట్‌ ఇట్‌!” అంటూ అరచాడు భవానీశంకర్‌. "పేరు సైజు ధర చెప్పినంతమాత్రాన చెప్పులమీద హక్కులభించడం అక్రమం" అన్నాడు వాడు. ఎవరూ వాడి మాట వినిపించుకున్నట్లు లేదు.

"వీడిని చూడండి! వీడి మొహం చూడండి! వీడి స్టేటసేమిటి? వీడిహిస్టరీ ఏమిటి?వీడి ప్యూచరేమిటి? ఇలాంటి పెద్దమనిషిని-కేవలం ధరా,సైజూ, పేరూ, చెప్పలేక పోవడంవలన చెప్పులు లాక్కుని అవమానపరుస్తారా? అసలు ఈ పద్దతి...” యింకావాడేం చెప్పేవాడో

నాకు తెలిదుగాని, నా గురించివాడు చెబుతున్న మాటలునాకే జాలి కలిగించి కళ్ళ వెంబడి నీళ్ళు తెప్పించాయ్‌.

ఇంతలో ఎవరో వాడి ప్రవాహానికి పెద్ద ఆనకట్టలా అడ్డుపడ్డారు. "చాల్లే వయ్యా-చేసేది వెధవపనులు, చెప్పేది బోడికబుర్లు” ఎవరోకసిగా అరచారు. "ఆ మాట అంది ఎవరో?" లేచి కుర్చీ ఎక్కి నిలబడ్డాడు భవానీశంకర్‌ చొక్కా చేతులు మడచి. "నేను!" అంటూ ముందుకొచ్చిందో బట్టతల! అతని చొక్కా చేతులు అప్పటికే మడచి ఉన్నాయ్‌. పైగా కండలు తిరిగిన శరీరం . "మీరా?" కొంచెం తగ్గి అడిగాడు భవానీశంకర్‌, - "అవును! ఏం చేస్తావ్‌?" వ. . _ "ఐం చేస్తానా? అలా అనడం మర్యాద కాదని చెప్తాను" అంటూ కుర్చీదిగిపోయాడు. "లేకపోతే అతను చేసిన పనేమిటి? అది మర్యాదగలపనా?" _ .. . "మీరు ఊరికే అపార్దం చేసుకుంటున్నారు గానీ అది కేవలం పారపాటువల్ల జరిగి ఉండవచ్చు' _ "అంటే?" , "*వీడివీ అచ్చం అలాంటి చెప్పులే! అందుకని పారపాటున అవే వేసుకున్నాడు. ఇందులో వెధవపని ఎముంది, ఆమర్యాద ఎముంది?” _ "అవును! నా చెప్పులూ అచ్చం ఇలాగే ఉంటాయ్‌" అన్నాన్నేను స్పృహలోకొచ్చి. పాదరక్షల ప్రహసనం 19

"అయితే నీ చెప్పులేవీ మరి?" ఎవరో కూశారు. “అదే నాకు అర్హం కావటంలేదు." అన్నాను వరండా ఆంతా వెతుకుతూ. "మనుజులను పోలీన మనుజులున్నట్టే చెప్పులను బోలిన చెప్పులుండటంవల్లనే ఈ అనర్హం జరిగి ఉంటుంది" అన్నాడు భవానీశంకర్‌. "అయితే మరి అతను వేసుకొచ్చిన చెప్పులమయినయ్‌?"” ఎవరో అడిగారు. = "అదే! మనం ఇప్పుడు వాటిని వెతకటమే వ్రథమకర్తవ్యం!" నేను వెతకడం ముగించాను."ఎవరో కొట్టేశారు" అన్నాను అవ్పుడే నగ్నసత్యం తేలుసుకున్నట్లు ..... “అరె-పాపం" అన్నాడు భవానీశంకర్‌ జాలిపడి. "అవును! కొట్టేశారు" "దిసీజ్‌ టూ మచ్‌-కొత్త చెప్పులు" అన్నాడువాడు. "చాలా కాస్ట్‌లీ కూడా!” . “ఇంకాహారిబుల్‌!" అన్నాడువాడు “ఇదే మొదటిసారి పోవటం.” “అదీ సొంత చెప్పులు పోతే చాలా బాధగానే ఉంటుంది." “ఇవి మరీ సొంతచెప్పులు." "పరాయివాడివయితే కొంత ఫరవాలేదు.” "ఇకనుంచీ ఇలా మన చెప్పులనుబోలిన చెప్పులు కనిపించినప్పుడు ఆ పెళ్ళిలో ' ఒక్కక్షణంకూడా ఉండను" అన్నాను కోపంగా. "అవును! ఇలాగే అనుమానంగా కంపెనీపేరు చెప్పమనీ ధరచెప్పమనీ ట్రిక్స్‌ ప్లేచేసి లాగేసుకుంటారు." ఇలా చుట్టూఉన్న (పేక్షకుల సానుభూతిని సంపాదించడానికి ఇద్దరం విశ్వప్రయత్నాలూ

  • చేస్తాంటే వరండాలో అరుగుఎక్కి వోగొంతు ఖంగుమని అరిచింది. “ఈ చెప్పులెవరివో చూడండి బాబూ! నేను అర్జంటుగా విడిదింటికెళ్తూ. వెంటనే తిరిగిరావచ్చు కదాని వేసుకెళ్ళాను. అక్కడ పావుగంట ఆలస్యం అయిపోయింది. ఇక్కడ ఈ చెప్పుల యజమాని ఎంతగా విలపిస్తున్నాడో అని పరుగుతో వచ్చాను-ఇవి ఎవరివో తీసుకోండిసార్‌!” నేనూ, భవానీశంకర్‌ ఒక్క ఉదుటన పరుగెత్తికెళ్ళి చూశాము. 192 హ్యామరాలణీ

నా గుండెలు అనందంతో కొట్టుకున్నాయ్‌. మనసు సంతోషంతో ఎగసిపడింది.

"ఎంటి బాబూ, ఇవి మీవేనా?" అడిగాడు ఆ వ్యక్తి.

"అవును" అనబోతుండగా 'కాదు' అరిచాడు భవానీ శంకర్‌.

“కాదా? ' ఆశ్చర్యంగా అన్నాను.

"కాదు!" అన్నాడు వాడు. "నీ చెప్పులు-అదిగో! అతని చెప్పులనుపోలి ఉండాలి కదా! ఇవి నీవెలా అవుతాయ్‌?” అన్నాడు కన్నుగీటుతూ. నాకు వాడిమాటల్లోని అంతరార్ధం అప్పుడుగాని బోధపడలేదు. "అవును! నావి కావు!” అన్నాన్నెను. "నావి కానిచెప్పులను ఎప్పటికి కావనే చెప్తాను" అందరివేపూ సగర్వంగాచూసి. అన్నాను

"అంతేకాని తనచెప్పులుపోయినాయని ఇంకొకరిచెప్పులుకాజేసే వెధవ బుద్ధి వీడికి లేదు” అన్నాడు భవానీశంకర్‌.

( "ఆ చెప్పులు నావి అనిఎవరూ రాకపోయినా, నేనువాటిని అడగను. ఎవరయినా బలవంతంగా ఇచ్చినా తీసుకోను" అన్నాను,

“ఒకవేళ అంతంగా ఇక్కడున్న వారంతా కలసి బలవంతం చేస్తే తప్ప" అన్నాడు భవానీశంకర్‌. అలా అంటే అందరూ బలవంతం చేసి వాటినినాకిస్తారని వాడి ఆలోచన. కాని ఎవరూ బలవంతం చేయలేదు. కనీసం “పోనీలేతీసుకో అనికూడాఅనలేదు.

"అవి బహుశా నీ చెప్పులు పారపాటున వేసుకెళ్ళినతని చెప్పులయి ఉంటాయ్‌. కనుక నువ్వుతీసుకోవచ్చు! " అన్నాడు భవానీ అందరి మొఖాలవంకా చూస్తూ,

ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడకపోయేసరికి నాకు ధైర్యం వచ్చింది. "నువ్వు తప్పదంటే తీసుకుంటాను” అన్నాను మొఖమాటం, అయిష్టం నటిస్తూ!

"ఈసారి తీసుకో! కాళ్ళకేదొక "రక్ష" ఉండాలికదా! ప్లీజ్‌ తీసుకో!” అన్నాడు వాడు. అయిష్టం నటిస్తూ. నేను తీసుకోబోతుండగా వో వ్యక్తి ఆదరాబాదరా వచ్చి ఆ చెప్పులు తొడిగేసుకున్నాడు. నాతోపాటు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.

"వీటికోసం నేను అరగంట నుంచీ వెతుకుతున్నాను. అయినా అలా అడక్కుండా ఎవరు తీసుకెళ్ళమన్నారు. నిన్ను! నువ్వుచేసిన నిర్వాకంమూలాన నేను వీటికోసం'

ఎక్కడెక్కడో గాలిస్తూన్నాను-" అన్నాడతను ఆ చెప్పులు తెచ్చిన వ్యక్తి మీదకోపంతో

"నాది పారపాటే అని చెప్తున్నాను కదండి!" అన్నాడా పెద్దమనిషి నొచ్చుకుంటూ.

" "ఇంకోసారిలాంటి పనిచేయకు! "అన్నాడా వ్యక్తి, 13 పాదరక్షల ప్రహసనం 193

"ఇంకెందుకు చేస్తానండి-"

నేనూ, భవానీశంకర్‌ ఉక్కిరిబికిరయిపోతున్నాం! అవి నా చెప్పులు! కొత్తవి! ఆరోజే నేను వేసుకున్నవి. స్పష్టంగా తెలిసిపోతుందా విషయం. మరివాడు అంత నిర్భయంగా అబద్దంచెప్పి ఎలాదొంగిలించుకుపోతున్నాడు?

“అవి మీవా?" ఆశ్చర్యంగా అడిగాను ఆ వ్యక్తిని.

"అవును! ఏం?"

"అహ-మరేంలేదు- ఊరికే అడిగాను-"

"ఊరికే ఎందుకడగడం?"

"మా (ఫెండ్‌ ఒకతనికి కూడా అచ్చం ఇలాంటివే ఉన్నాయ్‌."

"మనుజులను బోలిన మజులున్నట్టు-చెప్పులను బోలిన చెప్పులుంటాయి నాయనా!" చిరునవ్వుతో అన్నాడా వ్యక్తి. న 1

"అవునవును" అన్నాడు భవానీశంకర్‌ చిరునవ్వుతో.

"నామీద మీకేమయినా అనుమానముంటే చెప్పండి! ఈ చెప్పుల కంపెనీ పేరుగెట్రో! ధరతొంభై ఆరు-నిన్నేకొన్నాను- ఇవాళే వాడటం మొదలుపెట్టాను" అని నెమ్మదిగా పందిట్లో

నుంచి వెళ్ళిపోసాగాడతను.

నాకు కళ్ళవెంబడినీళ్ళు కారిపోతున్నాయ్‌. భవానీశంకర్‌ జేవురించిన మొఖంతో ఆదొంగ వెధవ వంకచూస్తూన్నాడు. "రండి బాబు-భోజనానికి రండి!” అన్నారెవరో మా మీదజాలిపడి.

“నాకాకలిలేదు-" అంటూ నేను అక్కడినుంచి బయటపడ్డాను. నా వెనుకే భవానీశంకర్‌ వచ్చాడు. ఇద్దరం బస్‌స్టాప్‌లో నిలబడ్డాం

"ఒకోసారి ఇలా భలే తమాషాలు జరుగుతుంటాయ్‌-" అన్నాడు చిరునవ్వుతో.

"ప్లీజ్‌ గెటెవే ఫ్రమ్‌దిస్‌ ప్లేస్‌" అన్నాన్నేను కోపంఅణచుకుంటూ.

“అదేమిట్రా? అంతకోపం ఎందుకు? ఒకోసారి మనపష్తాన్‌ ఫెయిలవుతూంటుంది. అంతమాత్రాన ఇలా నిరుత్సాహ పడకూడదు. వచ్చేనెలలో మన రంగరాజుగాడి పెళ్ళి ఉండనే ఉంది- అప్పుడు మంచి జత చూద్దాం! అయినా నువ్‌ నేను చెప్పిన ముఖ్యమైన సూత్రం మర్చిపోకూడదు- చెప్పులు తొడుక్కున్నాక వేగంగా వెళ్ళిపోవాలి. నీ సొంత చెప్పులు వేసుకున్న ఆ దొంగవెధవ బులెట్‌లాగా ఎలా వెళ్ళిపోయాడో చూశావ్‌ కదా! వెనక్కు తిరిగిఛస్తే . 194 హ్యామరాలజీ

చూడకూడదు. ఎవరు పిలిచినా వినిపించుకోకూడదు. కేకలు, అరుపులు పోలిసులవిజిల్స్‌, ఇవేమీ-" " "మర్యాదగా ఇక్కడి నురిచి పోతావా,లేదా?" పిడికిలిబిగించి అడిగాను. "ఓ! మనసు పాడయిపోయిందన్న మాట! ఓకే,ఓకే బాగున్నప్పుడు కలుస్తాన్లే మళ్ళీ ఎలాగూ నెక్ట్స్‌మంత్‌ రంగరాజు గాడి పెళ్ళికి ప్రోగ్రాం ఉందికదా! డోన్ట్‌వర్రీ" నేనువాడి మొఖంమీద ఒక్కపిడిగుద్దు వేశానుగానీ, అదిగాలిలోకి తేలిపోయింది. వాడు అప్పటికే రెండొందలగజాల దూరంలోజఉన్న చౌరస్తా దాటుతున్నాడు. ఖో కలో వాదరక్షల ప్రహసనం 195

బడ్జెట్‌ భాగోతం కాలా | రామ్‌ సబా వీ సి లీ షయ న ల్‌ జ డు చాడా చ గతోన జా రో! (త్ర వో (గేర్‌ ్న శే ఛీ /4ో మోపెడ్‌ అమ్మినతరువాత కొద్దిరోజులవరకూ శాయీరామ్‌ ఎవరికి కనిపించలేదు. కాలనీ మీటింగ్‌లు కూడా రెండువారాలపాటు నిర్వహించకుండా వదిలేశాడు. రండు ఆదివారాల పాటు మమ్మల్ని సుఖంగా నిద్రపోనిచ్చినందుకు మేమెంతో ఆనందించాంగాని మా ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మూడో అదివారం కొంపముంచుకుపోయినట్లు అందరిళ్ళకూ [ వెళ్ళి మీటింగ్‌కు తరుముకొచ్చాడు. "ఇప్పుడు మీటింగ్‌ దేనికిట!” కోపం అణుచుకుంటూ శాయీరామ్‌ అడిగాడు. "ఎందుకేమిటి? వచ్చే శనివారమే బడ్జెట్‌ వస్తోంది." "అయితే మనకేమిటి హడావిడి?” 196 హ్యూమరాలజీ

దానికి శాయాీరామ్‌ జవాబు చెప్పకుండా మిగతా వాళ్ళందర్నీ పిలిచి, నన్నో తెలివి

  • తక్కువ వాడిలా చూపిస్తూ "చూశారా! ఎడ్య్యుకేటెడ్‌ అయున్నా కూడా ఉదయార్కర్‌కు బడ్జెట్‌ విలువ తెలీదు. మన కాలనీలో ఈ ఒక్క ఉదయార్కరికాదు. ఇంకెంతోముంది అజ్ఞానులున్నారు. అలాంటి వాళ్ళను నిద్రవుల్కౌలవటానికే వమనం ఇక్కడ సమావేశమయ్యాం!" అన్నాడు. అందరూ నావేపు జాలిగా చూశారు. "బడ్జెట్‌ విలువ తెలీదా?" అన్నట్టు నవ్వారు. నేనిక లాభంలేదని సైలంటయిపోయాను. శాయిరామ్‌ మైక్‌ ముందు కొంచెం హడావుడిచేశాక రంగారెడ్డి ఉత్సాహంగా మైక్‌ అందుకున్నాడు. “"సోదరసోదరీమణులారా! ఇన్ని సంవత్సరాలుగా మనందరం ఎంతనష్టపోతున్నామో ఎలా నష్టపోతున్నామో మీకెవరికయినా తెలుసా? ఉదయార్కర్‌గారూ! మీకుతెలుసా?" అడిగాడు నన్ను. "తెలీదు!" అన్నాను మొఖవాటం లేకుండా "గోప్రాల్రావ్‌ గారు, మీకు తెలుసా?” "కొంచెం తెలుసుగొనీ-మర్చిపోయాను" అన్నాడు గోపాల్రావ్‌ తప్పించుకుంటూ. "జనార్ధన్‌ గారూ మీకు తెలుసా!" 'తెలీదు-" రంగారెడ్డి విజయగర్వంగా అందరివేపూ చూశాడు. థి "కానీ నాకుతెలుసు!” అన్నాడు చిరునవ్వుతో అందరం రంగారెడ్డి వంక ఈర్ష్యగా చూశాము. మాకు తెలీనీ విషయాలన్నీ అతనికెలా తెలిశాయా అని. "తెలుస్తే చెప్పు త్వరగా!” అన్నాడు. "నాకు తెల్సిందదికాదు! మీకెవరికీ ఏమీ తెలీదన్న విషయం నాకు తెలుసు" చిరునవ్వుతో అన్నాడు రెడ్డి. "సంగతేమిటంటే మనకాలనీ శ్యామల్రావ్‌గారు ఎంచేశారనుకున్నారు? కిందటి బడ్జెట్‌ న్‌ ముందురోజు గదినిండుగా సబ్బులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మర్నాడు బడ్జెట్‌ చూస్తే ఏంజరిగింది అనుకున్నారు? ఒకో సబ్బుమీద పావలాచొప్పున టాక్స్‌ పెరిగింది. అంటే శ్యామటల్రావ్‌కి ఎంతలాభం కలిగిందో మీరే చూడండి! గదినిండా ఉన్న సబ్బులన్నీ
  • కొంచెంచౌకధరకు మన కాలనీవాళ్ళందరికీ అమ్మి వేలరూపాయలు సంపాదించాడు-" అందరం మొఖ మొఖాలు చూసుకున్నాం బడ్జెట్‌ భాగోతం 197

శ్యామళలావ్‌ సబ్బులమ్మితే కొన్నాంగానీ-దానివెనుక ఈ కథ ఉందని మాకు తెలిదు. తన అన్న కొడుకు సబ్బుల కంపెనీలో రిప్రజెంటేటివ్‌ అనీ, అందుచేత ఓఅయిదుపైనలు తక్కువకు దొరుకుతున్నాయనీ మాఅందరికీ అబద్ధం చెప్పాడు. అది మేము శుంఠల్లా నమ్మేశాము.

"కనుక సోదరులారా! రేపు శనివారం వస్తున్న బడ్జెట్‌ కి ముందే మనం కూడాతెలివిగా కొన్ని వన్తువులు కొనేసి స్టాక్‌పెట్టినట్లయితే-మనందరికీఎంత లాభమో ఒక్కసారి ఆలోచించండి."

అందరూ ఒక్కసారి ఆలోచించేసరికిగుండెలు బాదుకోబుద్దేసింది. అడాళ్ళలో పెద్దఎత్తున కలవరంచెలరేగింది. .

"ఈ విషయం మనకు తెలీనే తెలీదు పిన్నిగారు! చూశారా-మనకాలనీలో ఉండటంవల్ల మనకిన్ని విషయాలు తెలుస్తున్నాయో-నేనూ మా రెండు అల్మారాలనిండుగా బట్టలసబ్బులు కొనిపెట్టెస్తాను."

"నేను చింతపడుకొంటాను-"

"మీరేంకొటారు పార్వతమ్మగారూ."

"ఫేలుగిన్నెలు" అందామె.

తమలో తాము చర్చించుకోవటం పూర్తయ్యాక జనార్దన్‌ మైక్‌ముందుకొచ్చాడు.

"నా ప్రియమైన తెలుగు ప్రజలారా!" అన్నాడు సినిమాఫక్కిలో! “మీకో విషయం చెప్పడం మర్చిపోయాను" జనార్ధన్‌ ఇటీవల కొంచెంఎన్టీఆర్‌ని అనుకరిస్తూ మాట్లాడడం. హావభావాలు ప్రదర్శించటం చేస్తూన్నాడు. అతనలా చేయడానికి కారణంఎమిటంటే- ఎన్టీఆర్‌ఎలాగూ సినిమా ఫీల్డు వదిలేశాడుకాబట్టి అస్టానం అలా ఖాళీగానే ఉందికాబట్టి సినిమాల్లో ఎన్టీఆర్‌ వేసేహిరో పాత్రలు తనకులభించే అవకాశంఉంటుందని ఎవరోచెప్పారుట.

"ముక్కుపచ్చలారని చిన్నారిముద్దుబిడ్డలారా? తెలుగింటి వెలుగులు నా ప్ర్రియమయిన ఆడపడుచులారా!" ఆమాటలతో ఆడాళ్ళందరూ తప్పట్లుకొట్టారు.

మాకు మతిపోయినట్లయింది. ఒకేఒక్కడైలాగ్‌తో మాకాలనీ ఆడాళ్ళందరి అభిమానం సంపాదించాడే అని.

"నేను మన కాలనీ (పెసిడెంటు అయిన దగ్గర్నుంచీ అనుక్షణం, క్షణంక్షణం, ప్రతిక్షణం- మీకేంసేవ చేయగలనా అని ఆలోచనలు వునఃరాలోచనలుచేస్తున్నాను. ఇన్నాల్టికి ఇప్పుడా అవకాశం లభించింది!"

198 హ్యామరాలజీ

"మళ్ళీ ఆడాళ్ళందరూ తప్పట్లు కొట్టారు."

"ఈ బడ్జెట్‌లో పెరిగేధరలు సాధారణంగా మనలాంటి మధ్యతరగతి ఫామిలీస్‌ అందరికీ శాపం! కానీ ఈ శాపాన్నివరంగా మార్చుకునేందుకు నేనుసహాయం చేస్తాను. ఢిల్లీలో ఫైనాన్స్‌ మినిస్ట్రీ బడ్జ్డెట్‌సెల్‌లో మా పిన్నికొడుకు పనిచేస్తున్న విషయం మీకెవరికీ బహుశ తెలిసుండదు. నిన్నటి వరకూ నాకూ తెలీదనుకోండి. అది వేరే విషయం. వాడితో ఫోన్లో మాట్లాడాను. బడ్జెట్‌పైజెంట్‌ చేయడానికి ఓరోజుముందు, అంటే శుక్రవారం సాయంత్రం మనకు ఐమేం వస్తువుల ధరలు పెరగనున్నదీ రహస్యంగా ఫోన్‌లో ఇన్‌ ఫర్మేషన్‌ అందిస్తానని ప్రామిస్‌ చేశాడు. మనకా ఇన్‌ఫ్మేషన్‌ అందగానే మనమంతా ఆ వస్తువులు మన ఆర్టికశక్తికొద్దీ కొని స్టాక్‌ చేనిపార్వే-వునమూ వాడుకోవచ్చు- ఇంకాలాబానికీ బయట అమ్ముకోవచ్చుకూడా-"

అందరూ తప్పట్లు కొట్టారు. ఈసారి మగాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. శుక్రవారం వరకూ కాలనీ వాళ్ళందరూ చాలా హడావుడిగా రోజులు

గడిపారు. చాలా మంది బ్యాంకుల్లో దాచుకున్నడబ్బంతా విత్‌డ్రాచేసి రడీగా పెట్టుకున్నారు. బ్యాంక్‌ బాలెన్స్‌ లేనివాళ్ళు నగలు బాంకులోపెట్టి డబ్బు తీసు కున్నారు.

ఇంకొందమంది బంధువుల నుండి అప్పులు తీసుకున్నారు.

శుక్రవారం సాయంత్రం వచ్చేసింది.

గోపాల్రావ్‌, శాయీరామ్‌, రంగారెడ్డి, యాదగిరీ,నేనూ, జనార్ధన్‌ కలసి మాకు తెలిసిన ఓఫోన్‌ ఓనర్‌ఇంటి౭ళ్ళి కూర్చున్నాము.

సాయంత్రం ఎడుగంటలతరువాత ఢిల్లీనుంచీ ఫోన్‌వచ్చింది జనార్ధన్‌ ఫోన్‌ అందుకున్నాడు. ఓచేతిలోపెన్నూ మరోచేతిలో అవ్పుడే కొత్తగా కొన్ననోట్‌వున్తకం పట్బ్పక్కూర్చున్నాడు గోపాల్రావ్‌.

“రాసుకో” అన్నాడు జనార్ధన్‌ హడావుడిగా, “టూత్‌ పేస్ట్‌లు"!-గోపాల్రావ్‌ చకచక రాసేశాడు.

"నెక్ట్‌-టేబుల్‌ ఫాన్లు-ఆతరువాత సబ్బులు- వనస్పతి-"అయిదు నిమిషాల పాటులిస్ట్‌ చదివాడు.

అందరం ఆలోచనలో పడ్డాం

అప్పటికప్పుడు లిస్ట్‌ కాపీలు తయారయాయ్‌.

"ఇంక ఆలస్యం ఎందుకు పదండి-” అన్నాడు శాయీరామ్‌. అందరం వెటనే మార్కె ట్‌కి పరుగెత్తాం నేనుమాత్రం వీలయినంత టూత్‌పేస్ట్‌స్టాక్‌ మాఇంట్లో నింపేయాలని నిర్ణయించు కున్నాను. బడ్జెట్‌ భాగోతం 199

ఆ రాత్రి పదిగంటలవరకూ మా కాలనీలోకి రిక్షాల్లో రకరకాల వస్తువులు చేరుతూనే ఉన్నాయ్‌. మిగతా రాత్రి కూడా ఎవ్వరికీ నిద్ర పటినట్టులేదు. అందరిళ్ళల్లోనుంచీ చాలా ఎగ్జయిటింగ్‌గా మాటలు వినబడుతూనే ఉన్నాయ్‌.

తెల్లారిపోయింది. అందరం ఆఫీస్‌కి శెలవుపెట్టి మధ్యాహ్మంనుంచీ రేడియోదగ్గరే కూర్చున్నాం.

సాయంత్రమయేసరికి బడ్జెట్‌ వివరాలు ఒక్కటొక్కటే బయటకొస్తుంటే అందరి గుండెల్లోనూ ఆందోళన మొదలయింది.

జనార్ధన్‌కి ఫోన్‌లోవచ్చిన లిస్ట్‌లోని వస్తువుల ధరలేమాత్రం పెరగలేదు. అందరి మొఖాలూ పాలిపోయాయ్‌! కొంతమంది ఆడంగులు గట్టిగా ఎవర్నోతిట్టడం, శాపనార్జాలు పెట్టటం స్పష్టంగా వినిపిస్తూనే ఉంది.

మా అవిడ దిగులుగా వచ్చింది టి.వి. 'దగ్గర్నుంచీ!

"ఇప్పుడా రెండువేలరూపాయల టూత్‌పేస్ట్‌ ఎమిటిచేయటం?" అంది గాబరాగా.

అప్పుడే జనార్ధన్‌ భార్యవచ్చింది మాఇంటికి.

"వాళ్ళ పిన్నికొడుకు మాటలు నమ్మవద్దని మొత్తుకుంటూనే ఉన్నాను. అక్కయ్య గారు! వింటేనా? ఇరవై బేబుల్‌ ఫాన్లు కొనుక్కొచ్చి ఇంట్లోపడేశారు. ఓగదంతా నిండిపోయాయవి. ఇల్లుఇరుకయింది. ఇప్పుడా ఫొన్లు ఎంచేయాలి?" ఏడుపు ఆపుకుంటూ అందామె.

మరికాసేపటికి యాదగిరి వచ్చాడు.

"క్యా పరేషానీ హైయారో! జనార్ధనన్న భరోసామీదికెళ్ళి సబ్బులుకొనిపెట్టినా! నా భార్యేంచేసిందో ఇన్నావు? నీయవ్వ-నాకరుక లేకుండా చింతపండు వందకిలోలు తెచ్చి స్టాక్‌ పెట్టింది! బడ్జెట్‌లో చింతపండుధర ఎడయినాపెరుగుతాదివయ్యా? "

ఆ రాత్రికల్లా మరెన్నో ఆసక్తికరమైన వివరాలందాయ్‌. చాలామందికాలనీఅడాళ్ళు కాలనీలోచెలరేగినపుకార్లునమ్మి గాజులు, పౌడర్లు, స్నోలు,బొట్టుబిళ్ళలు, కొంతమంది కూరగాయలు కూడా కొనేసి స్టాక్‌పెట్టారుట.

జనార్భన్‌ ఎవరికీకనివించలేదు. ఎంతోవుంది అతనింటికి వెళ్ళినా ఇంట్లోకనిపించలేదుట! ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదన్నారు. మిగతా రాత్రంతా కూడా ఇంట్లో స్టాక్‌ ఏం చేసుకోవాలో తెలీక దిగులుతో ఎవ్వరూ నిద్రపోలేదు.

మర్నాడు ఉదయం శాయీరామ్‌ పరుగుతోవచ్చాడు.

“చూశావా గురూ! ఉప్పు ధర తెగపెరిగిపోయింది! మనం అదయినా స్టాక్‌పెట్టి ఉంటే ఎంతబావుండేది?" అన్నాడు విచారంగా.

200 హ్యూమరాలజీ

"ఉప్పు ధర పెరుగుతుందని ఎవరనుకున్నారు?" అన్నాన్నేను విరక్తిగా!

"మనంకొన్నస్తాక్‌ నంతా సాయింత్రం తీసుఇళ్ళి మళ్ళీషాపులవాళ్ళకి స్తే తీసుకుంటా రేమో!” అన్నాడు రంగారెడ్డి.

సాయింత్రం అందరం బయల్దేరి మార్కెట్‌ చేరుకున్నాం.

మా కథంతా వినిషాపువాడు నవ్వాడు.

"ఏం ఫర్లేదుసార్‌! స్టాకంతా తీసుకొచ్చేయండి! సగంధర ఇచ్చేస్తాను- అన్నాడు. శాయీరామ్‌ అదిరిపోయాడు.

“సగం ధరగా?"

"అవున్నార్‌! ఎంతోకాలంనుంచి తెలిసినవారు కదా! అందుకని మీకు సగంధర ఇచ్చేస్తాను."

"అంటే మిగతావాళ్ళకు అదికూడా ఇవ్వవా?"

"మిగతావాళ్ళ దగ్గర అసలు కొననుగద్సార్‌? "

"కానీ మరీసగంధర అంటే మాకు సగంనష్టంరాదూ? "

"బిజినెస్‌ అన్నాక అంతే సార్‌! ఒకోసారి ఇలాగే నష్టం వస్తూంటుంది!" జాలిగా అన్నాడు.

"కాని మాది,మాది... బిజినెస్‌ కాదు కదా..."

"నష్టం వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు గురూజీ! ఇదే, బడ్జెట్‌లో ఆవస్తువుధర ఒకోదానిమీద రూపాయిపెరిగిందనుకోండి! మీరుబిజినెస్‌చేయరూ? " అందరం ఇళ్ళకు తిరిగివచ్చాం!

అర్జంటుగా అప్పటికప్పుడే కాలనీమీటింగ్‌ ఎర్పాటుచేశాడు శాయీరామ్‌. ఆడామొగా అందరం వాడి పోయిన మొఖాలతో కూర్చున్నాం.

"సోదర సోదరీ మణులారా! అనుకోకుండా అందరందెబ్బతిన్నాం! ఇప్పుడీ భయంకర పరిస్థితినుంచి ఎలా బయటవడాలా అనే విషయం ఆలోచించాలి మనం-" అన్నాడు రంగారెడ్డి. "నష్టానికి అమ్మేద్దాం!” అన్నాడు గోపాల్రావ్‌. అందరూ 'వద్దు అనికేక వేశారు.

“ఆ జనార్ధన్‌ పనిపడతాను! మా ఇల్లంతా సర్వనాశనం చేశాడు-" అన్నాడు వెంకట్రావ్‌ కోపంగా.

“ఎందుకు? ఎంజరిగింది?"” అడిగాడు శాయీరామ్‌,.

"నేను రెండూ క్వింటాళ్ళు వంకాయలు కొన్నాను-" బడ్జెట్‌ భాగోతం 201

మానిసార్‌గాడు జనంలోంచి మైక్‌దగ్గరకొచ్చాడు.

"మీక్కావాలి-తో-నేను ఒక్క అయిడియా చెప్తయ్‌!” అన్నాడు చిరునవ్వుతో

“చెప్పరా నాయినా! త్వరగా అఘోరించు'' అరచాడు రంగారెడ్డి,

“బార్టర్‌సిన్టమ్‌ మంచిగ ఉంటాయ్‌! బార్టర్‌ సిన్టమ్‌ బోలేతోమీకీ నమజ్‌ అవుతున్నాయ్‌?

మాకు అర్హమయింది. డబ్బు చలామణీలేనికాలంలో వాడేవాళ్ళది.

వస్తువు బదులు వస్తువు మార్చుకోవటం-

“ఒండర్‌పుల్‌ అయిడియా-" అన్నాడు యాదగిరి.

అందరం నిసార్‌ని కౌగిలించుకున్నాం!

"ఇంతమంచి అయిడియా నీకెట్లా వచ్చిందన్నా?" అడిగాడు యాదగిరి.

"నేను వెయ్యిరూపాయల్‌ బ్రెడ్‌స్టాక్‌ ఇంట్లోపెట్టినయ్‌! అదిచూస్తే అయిడియా వచ్చినయ్‌."”

అప్పటికప్పుడే బార్టర్‌సిస్టమ్‌ అమలుపరచటం ప్రారంభమయింది.

నా దగ్గరున్న టూత్‌పేస్ట్‌లు కాలనీలోఅందరికీ తలకొన్నీ అంటగట్టేళాను. మహా అయితే రెండొందలు నష్టంవచ్చి ఉంటుందంతే.

అలాగే శాయీరామ్‌ కాఫీపొడిపాకెట్లు అందరికీపంచాడు. నిసార్‌గాడిదగ్గరున్న బ్రెడ్‌స్టాక్‌ అందరంపంచుకున్నాం. వెంకట్రావ్‌ కొన్న వంకాయలు ఆ రాత్రే అందరూ చచ్చినట్టు, సయించకపోయినా వండుకుతిన్నారు. పనిలోపనిఅని యాదగిరిభార్య చింతపండు అందరకూ | పంచేసింది. ఎటొచ్చీ గొడవంతా ఎక్కడొచ్చిందంటే డిటెక్టివ్‌ రచయిత్రి రాజేశ్వరి దగ్గర.

ఆమె న్యూస్‌ప్రింట్‌ ధర పెరుగుతుందన్న నమ్మకంతో బోలెడు న్యూస్‌ప్రింట్‌కొని పెట్టేసింది. అది ఎవ్వరూ పంచుకోవడానికి ఇష్టపడలేదు.

“అసలు అపాడు న్యూస్‌ ప్రింట్‌ ఎందుకు కొన్నట్లు?" చిరాగ్గా అడిగాడు రంగారెడ్డి.

“ధరలుపెరిగితే పబ్లిషర్లంతా న్యూస్‌ప్రింట్‌కోనం 'క్యూ'కట్టి నేనడిగినరేటిచ్చి కొనుక్కెళ్ళతారని అనుకున్నాను..." అందామె కన్నీళ్ళతో.

“అయినా అంత ఆశ ఉండకూడదు మరీనూ?" అన్నాడు గోపాల్రావ్‌,

"నేను డబ్బుకోసం ఆశపడలేదు. న్యూస్‌ప్రింట్‌ మామూలు ధరకే ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నా డిటెక్టివ్‌ నవలలు పబ్లిష్‌ చేయమని కోరదామనుకున్నాను-” అందామె అసలు విషయం బయటపెడుతూ. చివరకు శాయీరామ్‌ ఓ అయిడియా ఇచ్చాడు. 202 హ్యామరాలజీ

“ఎలాగూ ప్రతితెలుగు కుటుంబంలో ఓ కధారచయిత(త్రి)గానీ, గేయరచయిత(త్రి) గానీ, నవలా రచయిత(త్రి)గానీ, కార్టునిస్ట్‌గానీ ఉండక తప్పదుకదా. కనుక ఎవరి రచనలు

వాళ్ళు రాజేశ్వరి న్యూస్‌ప్రింట్‌ కొనుక్కుని అచ్చువేసుకుంటే పదికాలాలపాటు వాళ్ళరచనలు నిలచిపోతాయ్‌

“ఆ మాట చెప్పాడో లేదో రాజేశ్వరి న్యూస్‌ ప్రింట్‌ అంతా ఖర్చయిపోయింది.

బార్టర్‌సిస్టమ్‌ అమలుచేయటంవల్ల కాలనీలో కొన్ని ఇబ్బందులుకూడా ఎదురయ్యాయ్‌.

ఆ పద్దతి ద్వారా నేను కొనాల్సివచ్చిన-సిగరెట్ట్లు, బీడీలు-అలవాటు లేకపోయినాతాగక తప్పటంలేదు.

అలాగే శాయీరామ్‌ అందరికీ తలోబాటిల్‌ విస్కీఇచ్చాడు. అది మగవాళ్ళకు బాగానేఉంది. అయితే చాలామందిఆడాళ్ళు దాన్నివెంటనే పారబోసేశారని తెలిసింది.

జనార్ధిన్‌ఒక్కడికే చాలాఎక్కువనష్టం వచ్చింది కాలనీమొత్తంలో.

టేబుల్‌ ఫాన్లన్నీ అలాగే ఉండిపోయాయ్‌ ఎవ్వరూ తీసుకొలేదు.

మర్నాడు మా ఆవిడ కూరగాయలమ్మాయి దగ్గర తోటకూర కొంటూటే కట్టఒక్కటీ పావలా అనటం వినిపించిందినాకు.

"అదేమిటి?-నిన్నేగా పావలాకి నాలుగుకట్టలిచ్చావ్‌!” అడిగిందామె ఆశ్చర్యంగా.

"బడిజెట్టంటమ్మా-అదేందోనాకెరుకలేదుగానీ-ధరలు పెరిగినయ్యంట"

బడ్జెట్‌కీ తోటకూరకూ సంబంధం ఏమిటోనాకర్టంకాలేదు.

| నేను ఇంకుబాటిల్‌ కొందామని మాకాలనీ దగ్గర్జోనే ఉన్న షాపు కెళ్ళాను,

"ఆర్రూపాయలుసార్‌." అన్నాడు షాపతను చిరునవ్వుతో ఇంక్‌ బాటిల్‌ ఇస్తూ.

"అదేమిటి? మొన్నటివరకూ నాలుగు రూపాయలేగా?"

"బడ్జెట్‌ కద్పార్‌. ధరపెరిగింది"

"కానిబడ్జెట్‌లో 'ఇంక్‌' ధర పెరగలేదుగా?"

"బడ్జెట్‌ఎ ఫెక్ట్‌కి కొన్ని ధరలు పెరుగుతాయ్‌."

"ఎఫెక్ట్‌ అంటే?"

"డిఫెక్ట్‌ సార్‌-మీకు తెలీదా?"

తెలీదంటే బావుండదని ఇంటి కొచ్చేశాను. అపక్కనే హోటల్‌ అసామీ గట్టిగా అరుస్తున్నాడు “బడ్జెట్‌ గురించి పెరిగినాయివయ్యా రేట్టు-రేట్ట్లు ఎందుకు పెరిగినాయంటే ఎమన్నమాట?" బడ్జెట్‌ భాగోతం 203

అవ్వుడే మా కాలనీ ముందు జనార్ధన్‌ రిక్షాదిగాడు. అతనితో పాటు ఓ మీసాలపెద్దమనిషి కూడా వచ్చాడు-

"నా దగ్గరున్న ఫాన్లు ఈయనకొంటానన్నారు గురూ! అందుకని తీసుకొచ్చాను-" అన్నాడు

నేనూ, రంగారెడ్డి, యాదగిరి కలిసి జనార్ధన్‌ ఇంటికిళ్ళాం.

ఆ పెద్దమనిషి ఫాన్లన్నీ చూశాడు.

"ఎంతకమ్ముతావ్‌?” అనడిగాడు మీసాలు దువ్వుకుంటూ.

"నేను ఒకోటీ నాలుగొందలకు కొన్నాను. మీరు మూడొందల పాతిక ఇస్తే చాలు" అన్నాడు జనార్ధన్‌ దీనంగా.

మీసాలపెద్దమనిషి గట్టిగా నవ్వాడు, తన జేబులోనుంచి అయిడెంటిటీ కార్డ్‌ తీసిచూపిస్తూ "మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాను-" అన్నాడు జనార్ధన్‌ భుజంతడుతూ

అందరం అదిరిపడ్డాం! అతను మష్టిలో ఉన్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌.

“ఆ! అరెస్టెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్‌.

“ఎందుకేమిటి? బడ్జెట్‌ ముందురోజు వ్రజావనర వన్తువులను ఎక్కువధరకు అమ్ముకోవడంకోసం స్టాక్‌ చేసినందుకు! దీనినే 'హోర్గింగ్‌ అంటారు" అన్నాడతను.

“కానీ...కానీ... ఇరవై ఫాన్లు కొన్నంత మాత్రాన హోర్డింగ్‌ ఎలా అవుతుంది?" అడిగాడు శాయీరామ్‌.

"అవునండీ! రేపు బడ్జెట్‌ అనగా పెట్రోల్‌ బంక్‌వాళ్ళు పెట్రోల్‌అమ్మకాలు ఆపేయటం, టీవి, రేడియో,ఇంకా ఇతర పెద్దపెద్ద కంపెనీలవాళ్ళు తమ స్టాకని రిలీజ్‌ చేయకపోవటం-ఇవన్నీ హోర్డింగ్‌ కాదా?" ఆవేశంగా అడిగాడు రంగారెడ్డి,

"వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి వాళ్ళ జోలికెళ్ళటానికి మీకు దమ్ముల్లేవు” అన్నాడు గోపాల్రావ్‌.

ఇన్‌స్పెక్టర్‌ మళ్ళీమీసాలుదువ్వుకుంటూ చిరునవ్వునవ్వాడు.

"ఆ చిన్నపిల్లల ప్రశ్నలన్నీ రేపుకోర్చులో జడ్డిగారి నడగండి!”

చివరకు అందరం ఇన్‌స్పెక్టర్‌ని బ్రతిమాలక తప్పలేదు.

"బాబ్బాబు! ఈ పాతికరూపాయలుంచుకోండి! మావాడిని వదిలేయండి" అన్నాడు శాయీరామ్‌. ఇన్‌స్పెక్టర్‌ మళ్ళీ మీసాలు దువ్వుకున్నాడు.

"పాతికా? అహ్హహ్హ-వెధవరాంగ్‌ సైడ్‌ పార్కింగ్‌కేస్‌ పట్టకుంటేచాలు యాభయ్‌ దొరుకుతుంది. ఇంత పెద్దకేస్‌కి పాతికా?"

204 హ్యామరాలజీ

“పోనీ యాభయ్‌ తీసుకొండి.”

"అహ్హహ్హ-సినిమాహాల్లో సిగరెట్‌ తాగినకేనుకే డెబ్బయ్‌ ఇస్తారు-ఇంత పెద్దకేసుకి యాభయ్యా?"

“బాబ్బాబు-పిల్లలు, ఫాన్లుగలవాడు. వాడిని దయచూడండి. ఓ వందతీసుకుని వదిలేయండి-"

"ఇదే కేసుకి నిన్నయితే వందేతీసుకునేవాడినయ్యా-ఇవాళ కూడా వందే ఇస్తానంటే ఎలా? నూటయాభై ఇవ్వండి."

"అదేమీటి?నిన్నటికీ ఇవాల్టికీ యాభయ్‌పెంచారా?"

"అవ్వునయ్యా-బడ్జెట్‌ వచ్చింది కదా, మామూళ్ళధరలుకూడా పెంచారు అంటే బడ్జెట్‌లో అనికాదు-బడ్జెట్‌ ఎఫెక్ట్‌ అంటారు దీనిని..."

"ఎఫెక్ట్‌ అంటే?..."అని అడగబోయి "తెలుసులెండి డిఫెక్ట్‌ అన్నాను. నేను కేసుమాఫీ అయిపోయింది.

"బడ్జెట్‌లో మామూళ్ళకు కూడా రేట్లు ఫిక్స్‌ చేస్తారా?" అడిగాడు శాయీరామ్‌

"అయినా ఈ బడ్జెట్‌లో మామూళ్ళ ప్రసక్తలేదే-" అన్నాడు జనార్ధన్‌. ఫోం

నా క్క [న్‌ు

బడ్జెట్‌ భాగోతం 205

వోలేస్‌ సషన్‌ ల౦లి గుం ఇ వావ నాలా చ్‌ మ; వా ళ్‌ 17 ఇ మౌనిర్భయ్‌నగర్‌ కాలనీ-హైద్రరాబాదులోని మిగతా కాలనీలతో పోల్చిచూస్తే చాలా వ్రశాంతకరమయిన కాలనీగా భావించవచ్చు. (శాయీరామ్‌, జనార్ధన్‌, రంగారెడ్డి, మాకాలనీలోనే ఉంటున్నప్పటికీ కూడా) అయితే ఉండుండి ఓదొంగలములా ఏదోక ఇంటిని దోచుకోవటం (మేము రాజీకుదుర్చుకున్న పెద్దముఠాకాదు) వెంటనే పోలీసులువచ్చి మమ్మల్నందరినీ పోలీస్‌స్టేషన్‌కి తీసుకుపోయి నానాప్రశ్నలూ వేయటం, ఇవి మాత్రం తప్పటంలేదు. అదీగాక ఆమధ్య మరోగొడవయింది. మాకాలనీ కల్చరల్‌ సెక్రటరీ పార్వతీదేవి ఓసారి ఆటోలో కాలనీకొచ్చింది. మీటర్‌ చార్జి నలబై రూపాయలు అయింది. పైన ఇంకోరూపాయి ఇవ్వాలని వాడు పేచ్చీపెట్టాడు దాంతోమేమంతా రంగంలోకిదిగాల్సి వచ్చింది. వాడిని పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్ళాలని అనుకున్నాంగానీ అంతదూరం వెళ్ళటానికి బద్దకం 206 హ్యామరాలజీ |

వేసింది. దానిబదులు వాడికిరూపాయలు ఇవ్వటమే తేలికయిన పద్దతని గ్రహించి- వాడిని వదిలించుకున్నాము.

ఇలాంటివే మరిన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాక మాకాలనీకొక పోలీస్‌స్టేషన్‌ ఉండటం ఎంతో అవసరమన్న అభిప్రాయానికొచ్చాము. ఇలా అభిప్రాయానికొచ్చామో లేదో- దొరికిందే చాన్స్‌ అని ఆ ఆదివారంనాటికల్లా కాలనీమీటింగ్‌ ఎర్సాటుచేసేశాడు శాయీరామ్‌, నేను మీటింగ్‌ చేరుకునేసరికే ఉధృతంగా కొనసాగుతోందది. శాయీరామ్‌ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. "మనకాలనీలో తక్కువ జనాభా ఎంలేదు, రెండు పోలీస్‌స్టేషన్లు ఎర్పాటు చేయదగినంత జనాభా ఉంది. కనుక ఒకటయినా వెంటనే నెలకొల్పాలని మనం ఇప్పుడే హోమ్‌శాఖామంత్రిగారిని కోరాలి. పోలీస్‌ స్టషనుంటే మనకిన్నోవిధాల సౌకర్యంకలుగుతుంది. మనకాలనీ చుట్టుప్రక్కల దుకాణాలవాళ్ళు తూకాల్గ్లోమోసంచేస్తే మనంవెంటనే పోలీస్‌ని పిల్వవొచ్చు. ఆటోవాళ్ళుమీటర్‌మీద ఎక్‌స్టాఇమ్మని పేచీలుపెట్టరు. రౌడీలు తాగి కాలనీలోకి రారు. దొంగలభయం అసలే ఉండదు-"

'అవును- అవును' అంటూ తప్పట్లు కొట్టారందరూ.

"రెండేళ్ళ క్రితం నేను మాణింగ్‌వాక్‌ కెళ్ళేప్పుడు ఒకడు నామెడలోగొలుసు తెంచుకుపోయాడు. పోలీస్‌స్టేషన్‌ దగ్గర్లో ఉంటే వెంటనే వాడిని పట్టించేదానినికదా-" అంది పార్వతమ్మ,

"కాలనీవెనక ఉన్న “ఇందిరానగర్‌ లో మాట్టాడితే ప్రాద్దుట్నుంచీ సాయంత్రంవరకూ, వరుసగా స్పీకర్‌లో తెలుగు సినిమా తాలూకూ బూతుపాటలు వేయకుండా పోలీస్‌కి కంప్లెయింట్‌ ఇవ్వవచ్చు-" అంది రాజేశ్వరి.

అప్పటికప్పుడే అందరంకలసి హోమ్‌మినిష్టర్‌ గారికో అర్జీ తయారుచేశాం-మర్నాడు అందరం శెలవు పెట్టి ఓ చిన్నసైజు ఊరేగింపుగా బయట్టేరి హోమ్‌మినిష్టర్‌గారి దగ్గరకెళ్ళాం! మా కాలనీపేరు చూడగానే-వెంటనే-బయటికొచ్చిమమ్మల్సి కలుసుకున్నారాయన.,

"మీ కాలనీ గురించి న్యూస్‌పేపర్స్‌లో చదివాను. దొంగలనందరినీ మీకాలనీకి ఆహ్వానించి వాళ్ళతో రాజీకుదుర్చుకున్నది మీరే కదూ?" అడిగారాయన.

"అవును సార్‌ మేమే!" అన్నాడు రంగారెడ్డి గర్వంగా.

“చాలాసంతోషం! ఇలా ప్రజలే సమస్యల్ని పరిష్కరించుకుంటే ప్రభుత్వంఎంతో సంతోషిస్తుంది. దేశమంతా కూడా మీకాలనీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది-ఇంతకూ ఇప్పుడు ఎం పనిమీద వచ్చారు?” ఎంతో అభిమానంతో అడిగారు.

"అదేసార్‌-మాకాలనీ సిటీకి బయటుంది. అందుకని మాఏరియాలో ఓ పోలీస్‌స్టేషన్‌ ఎర్పాటుచేస్తే-" పోలీస్‌ స్టేషన్‌ 207

ఆయన వెంటనే తన శెక్రటరీవేపు తిరిగాడు. -

“అదేంటోయ్‌ శెక్రటరీ! వ్రజలు రైల్వేస్టేషన్‌ కావాలని అడుగుతారు, లేదా రేడియోస్టేషన్‌, బస్‌స్టేషన్‌, ఫైర్‌స్టేషన్‌ అలాంటివి అడగటం గురించి విన్నాం కానీ ఇలా పోలీస్‌స్టేషన్‌ కావాలని అడగటం వినలేదే?"

"అవున్నార్‌! ఇలాంటి వింత కోరిక కోరటం నేనూ ఇదే మొదటిసారి చూస్తున్నాసార్‌!”

"పోనీ ఇంకెవరికయినా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని మనం హామీలిచ్చామా?"'

"లేద్సార్‌! అసలు 'పోలీస్‌స్టేషనో కావాలి అని అడిగినవారెవ్వరూ ఇంతవరకూ లేరు సార్‌! వీళ్ళే మొట్టమొదటి సారిగా అడుగుతున్నారు-" ఆయన ఆశ్చర్యపోయారు.

"నిజమే! ప్రజలు పోలీస్‌స్టేషన్లు కావాలని ఎందుకడగరసలు? న్కూళ్ళు కావాలనీ, . ఆస్పత్రులు కావాలనీ, ఫ్యాక్టరీలు కావాలనీ-ఇలా ఎన్నో కావాలని అడుగుతారు గాని"

"అదే నాకూ అర్ధం కావటం లేద్సార్‌-"

"సరే! మీ నిర్భయ్‌నగర్‌ కాలనీకి వెంటనే పోలీస్‌స్టేషన్‌ ఇస్తాను-" అన్నారు మినిష్టర్‌ గారు.

అందరం తప్పట్లు కొట్టాం.

“హోమ్‌ మినిష్టర్‌గారికీ-” అని అరచాడు శాయీరామ్‌.

"జె" అరచాము అందరం. ఇది జరిగిన వారం రోజులకే మాకాలనీ చివర ఉన్న ఓఇంట్లో ఓకొత్తపోలిస్‌ స్టేషన్‌కి ప్రారంభోత్సవం జరిగింది. ఆ మీటింగ్‌కి కాలనీ వారందరం హాజరయ్యాం. కాలనీ శెక్రట్రి హోదాలో రంగారెడ్డి కూడా వేదిక మీద కూర్చున్నాడు.

పోలీస్‌ అధికారి ఒకరు పోలీస్‌స్టేషన్‌ గురించి, తను సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నరోజుల్లో- పద్దెనిమిది గంటల్లో-ఓ హంతకుడిని పట్టుకొన్న కేస్‌ గురించీ గంటన్నరసేపు వర్ణించాడు.

ఆ తరువాత రంగారెడ్డి మాట్టాడాడు.

"ఈ ఉత్సవానికి విచ్చేసిన గౌరవనీయులయిన కాలనీవారికీ మరియు పోలీసు అధికారులకూ మా స్వాగతం! ఇవ్వాళ మన కాలనీకి నిజంగా పర్వదినం, ఎందుకంటే ఇవాళ మన కాలనీలో మన కోసం ప్రత్యేకంగా ఒకపోలీస్‌స్టేషన్‌ ప్రారంభించారు గనుక! అసలుపోలీస్‌లంటే ఎవరు? మన స్నేహితులు! ఎన్నో విధాల మనకు సహాయం చేసేవారు. ఇంగ్లీష్‌ పిక్సర్స్‌లో పోలీసులు ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయపడటం మనందరం చూస్తూనే ఉంటాం! అదేదో ఇంగ్లీష్‌ పిక్చర్లో- ఆసినిమా పేరు నాకు గుర్తురావటంలేదు-ఒక పోలీస్‌, ఒక సామన్య పౌరుడితో ఎంతో మర్యాదగా మాట్లాడే సీన్‌-నన్నెంతో కదిలించివేసింది-" 208 హ్యామరాలజీ

జనార్ధన్‌ ఠక్కున లేచాడు మా మధ్యలో నుంచి.

"ఆ సినిమాపేరు హెల్‌ రైడర్స్‌-" అంటూ గుర్తు చేశాడు.

"కరెక్ట్‌! హెల్‌ రైడర్స్‌-అందులో ఆపోలీస్‌-పోలీస్‌ అయుండికూడా ఒకసామాన్య పొరుడితో ఎలాంటితిట్టూ, అమర్యదాలేకుండా రెండునిమిషాలు మాట్లాడతాడు. అంతేకాదు. అపౌరుడి జేబులో డబ్బు ఉన్నట్లుతెలిసినా-ఒకపైన కూడాతీనుకోడు-' అందరూ తప్పట్ట్లుకొట్టారు.

"కనుక సోదరులారా! -ఇంగ్లీష్‌ పిక్చర్స్‌లో పోలీనులు ఇంతఉదాత్తంగాకూడా ప్రవర్తిస్తూంటారు-కనుక మనం కూడా-"

"ఇంకచాలు-” వెనుకనుంచి మాకాలనీ స్టూడెంట్‌ ఎవరోఅరిచారు.

"కనుక మనంకోరగానే ఈ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుచేసిన హోంమంత్రిగారికీ, పోలీస్‌ అధికారులకూ నాకృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను-" అంటూ వేదిక దిగాడతను. న

ఆతరువాత కాలనీ కమిటీ ఏర్పాటు చేసిన తేనీటి విందు జరిగింది. కొత్త పోలీస్‌స్టేషన్‌ తాలూకూ ఇన్‌స్పెక్టర్‌ మా అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎవరికెలాంటి ఇబ్బంది కలిగినా తను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని హామిఇచ్చాడు. అందరితోనూ కరచాలనం చేశాడు. "మేము మీ సేవకులం" అన్నాడు చిరునవ్వుతో. అందరం అంతమంచి ఇన్‌ స్పెక్టర్‌ దొరికినందుకు ఆనందించాం.

ఆ మర్నాడు సాయంత్రం మేము ఆఫీస్‌ నుంచి కాలనీకి చేరుకునేసరికి కాలనీఅంతా బోసిపోయినట్లు కనిపించింది. సాయంత్రమయేసరికి కాలనీ మధ్యలోచేరి 'ముచ్చట్లు'

| చెప్పుకునే అడాళ్ళెవరూ మాకు కనిపించలేదు.

"చాలా అశ్చర్యంగా ఉందే! వర్షంపడుతున్నాకూడా లెక్కచేయకుండా ఇక్కడ సమావేశమయి ఏవేవో విషయాలు మాట్ట్లాడుకుంటూండే వాళ్ళుకదా?" అన్నాడు శాయీరామ్‌.

అందరం దగ్గర్లో ఉన్న మా ఇంటికళ్ళాం.

"ఇవ్వాళ మీ లేడీస్‌ సమావేశం లేదేమిటి?" ఆశ్చర్యంగా మా ఆవిడనడిగాము.

“భలేవారే! చదవేస్తే ఉన్నమతి కూడా పోయిందట! ఓ పోలీస్‌స్టేషన్‌ ఉండగా-

ఆడవాళ్ళను ఇళ్ళల్లో నుంచి బయటకు రమ్మంటారా?" అందామె చిరుకోపంతో. మేమంతా మొఖాలు చూచుకొన్నాం.

“"అదేమిటి-మనకాలనీకి 'రక్షణ' కోసమేగా మనం పోలీస్‌స్టేషన్‌ అడిగింది!” అన్నాడు జనార్ధన్‌ అశ్చర్యంగా!

పోలీస్‌ స్టేషన్‌ 209

“చాల్లెండి! రమీజాబీ కేస్‌ సంగతి మర్చిపోయామనుకుంటున్నారేమిటి?" అఎదరం ఉలిక్కిపడ్డాము.

“అవ్‌! మనం మరచినాం అసంగతి!” అన్నాడు యాదగిరి. అందరి మొఖాల్లోనూ కొద్దిక్షణాలపాటు అశాంతి తాండవంచేసింది.

"అప్పటిపోలినులు వేరు-ఇప్పటిపోలీనులువేరు" అన్నాడు శాయీరామ్‌ పోలీస్‌ డీపార్టమెంట్‌ని సమర్ధిస్తూ.

"మొన్న పాపం ఆ ఇన్‌ స్పెక్టరూ, కానిస్టేబులూ, ఎంతచక్కగా, మర్యాదగా అభిమానంతో మాట్లాడారు? చాలా మార్చువచ్చింది పోలీసుల్లో! అన్నాడు రంగారెడ్డి మెచ్చుకోలుగా.

మర్శ్హాడు సాయంత్రం మేము ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి కాలనీ మధ్యలోని కూరగాయల బళ్ళుచుట్టూ ఆడాళ్ళందరూ మూగికనిపించారు. పెద్దెత్తున వాదోపవాదాలు జరుగుతున్నట్లు

తెలీడంతో మేమూసరాసరి వాళ్ళదగ్గరకు చేరుకున్నాము.

“మార్కెట్లో టమాటో కిలోరెండూపాయలుంటే నువ్వు అయిదు రూపాయల కమ్ముతున్నావా? కిలోకి ఓ రూపాయి ఎక్కువ వేసుకునేవాడివి ఇంతలోనే ఏంరోగంవచ్చింది? ఒక,కిలో మీద మూడు రూపాయలు లాభం వేసుకుంటావా?” పార్వతమ్మ గారు గట్టిగా అరుస్తోంది.

"ఇప్పుడూ నాకుమిగిలేది కిలోకిఓరూపాయికంటే ఎక్కువ ఉండదమ్మా" దీనంగా చెప్పన్నాడతను.

వెంటనే శాయీరామ్‌ కల్పించుకున్నాడు.

“హరికథలు చెప్పకోయ్‌! కిలోకి మూడురూపాయలు ఎక్కువ వేసుకుని ఒక్కరూపాయి అంటావేం౦ం-"

"ఆ రెండ్రూపాయలూ నాదికాదు సార్‌! పోలీసులకు మామూలుఇవ్వాలి! కొత్త పోలీస్‌స్టేషన్‌ పెట్టారు కదా ఈ ఎరియాలో" రంగారెడ్డి ఆశ్చర్యపోయాడు.

"పోలీసులకు మామూళ్ళుఇవ్వాలా మీరు?”

"అవున్సార్‌! అందులో కొత్తేముంది? పోలీస్‌స్టేషన్‌ చుట్టపక్కల అమ్మకాలు జరిపే వారందరూ లెక్కప్రకారం మామూళ్ళు ఇవ్వాల్సిందే-”

"మీరు ఇవ్వకపోతే ఏమవుతుంది?"

"ఒకటనేమిటి సార్‌! వాళ్ళు మా బండిని లాక్కోవచ్చు. వేరేకేస్‌లో మమ్మల్ని ఇరికించి నానా ఇబ్బందీ కలిగించవచ్చు-తూకంరాళ్ళు మోసమని లాకప్‌లో పడేయవచ్చు-" అందరం 210 హ్యూమరాలజీ

మొఖాలు చూచుకున్నాం! పోలీస్‌స్టేషన్‌ కాలనీ పక్కన ఎర్పాటుచేయడంవల్ల అన్నీలాభాలే ఉంటాయనుకున్నాము. కానీ ఇప్పుడు పరోక్షంగా మాపోలీస్‌ స్టేషన్‌కి మేమే మామూళ్ళ ఇచ్చుకోవాల్సి వస్తోంది-కూరగాయలకు ధర ఎక్కువచెల్లించడం ద్వారా!

అయితే ఈ విషయంలో మేము చేయగలిగిందేమీ లేకపోవడంవల్ల మౌనం వహించాము.

మరోవారంరోజుల్లో మాకాలనీ చుట్టపక్కలున్న అన్ని షాపుల్లోనూ, ధరలు కొంచెం కొంచెంగా పెరిగిపోయాయ్‌. రోడ్డు మీదున్న 'టీ' హోటల్‌వాడు హఠాత్తుగా నీళ్ళ 'టీ'ఇవ్వటం ప్రారంభించాడు.

"ఏం జేయాల్సర్‌-దినాము 'పుకట్‌' చాయ్‌ పోలీస్‌స్టేషన్‌కి ఇయ్యాలి! లేకుంటే ఆళ్ళతో కిరికిరి-' అన్నాడతను శాయీరామ్‌తో.

మరోవారంగడిచేసరికి హఠాత్తుగా మాకాలనీ పక్కనే ఓ చిన్న గుడంబాదుకాణం వెలిసింది. వెంటనే అందరం కలిసి దుకాణం వాడి దగ్గరకిళ్ళాం.

"ఈదుకాణం ఈ డెందుకు పెట్టినావ్‌?" అడిగాడు యాదగిరి.

“నువ్వెవరు అడగడానికి?" ఎదురు తిరిగాడు వాడు.

"కాలనీ వాడిని! కాలనీ పక్కన గుడంబ దుకాణం ఉండకూడదు! సాయంత్రానికల్లా తీసేయ్‌? లేకుంటే పోలీస్‌ కంప్లెయింట్‌ ఇస్తాం!" బెదిరించాడు గోపాల్రావ్‌.

వాడు ఘెల్లున నవ్వాడు.

"నీ యవ్వ! గింతేనా! ఇంకేం లొల్లి పెడతారోనని పరేషానయినా! ఇన్‌ స్పెక్టర్‌సాబే పర్మిషనిచ్చిండు నాకు!"

అందరం మొఖాలు చూచుకున్నాం మళ్ళీ.

“పదండి-పోలీస్‌ స్టేషన్‌కెళ్ళి ఇన్‌స్పెక్టర్‌నే అడుగుదాం!” అన్నాడు శాయీరామ్‌.

అందరం పోలీస్‌స్టేషన్‌ కెళ్ళాం. ''గుడ్‌ మాణింగ్‌ సర్‌ అన్నాడు రంగారెడ్డి.

ఇన్‌స్పెక్టర్‌ “కంగారూ అనే జంతువుని చూసినట్లు చూశాడు మమ్మల్ని.

"ఎవరు మీరు?" అడిగాడు కర్కశంగా.

అందరం షాక్‌ తిన్నాం! మా అందరినీ భుజంతట్టి షేక్‌హాండిచ్చి డేమగామాట్టాడిన మనిషేనాఇతను అన్నఅనుమానం కలిగింది. పోలీస్‌ స్టేషన్‌ 21

“మేమే సార్‌!” ఈ కాలనీ కమిటీ మెంబర్స్‌-"

"ఏంగావాల?"

"కాలనీ పక్కనే గుడంబ దుకాణం తెరచారండీ-ఎవరో-"

"అయితే నన్నేం జేయమంటావ్‌? చల్‌-బయటకు నడవండ్రి'"

“"అదిగాద్సార్‌!"

"ఒక్కసారి చెప్తే సమజ్‌ కాదా మీకు? బయటకు నడవండ్రి-" గట్టిగాఅరిచాడు

"దిసీజ్‌ టూమచ్‌-" అన్నాడు గోపాల్రావ్‌. “ఇదంతా మా పత్రికలోరాస్తాను రేపే!”

"ఫార్టీత్రి-” పిలిచాడు ఇన్‌స్పెక్టర్‌:

"యస్సార్‌-" ఓ కానిస్టేబుల్‌ పరుగుతో వచ్చాడు.

“ఇస్‌ కో అందర్‌కర్‌దో" అన్నాడు గోపాల్రావ్‌ని చూపిస్తూ.

మరుక్షణంలో ఆ కానిస్టేబుల్‌ గోపాల్రావ్‌నిలాక్కెళ్ళి లాకప్‌లో పడేశాడు.

“మీరందరూ కూడా బయటకి పోతారా-లోపల వేయాలా?" మావంక చూసి మళ్ళీ అడిగాడు.

అందరం బయటకొచ్చి నిలబడ్డాము.

"ఇప్పుడేమిటి చేయడం!” అడిగాడు రంగారెడ్డి. =

"నేను టీ.వి డ్రామావేసిన ఆర్టిస్ట్‌నని చెప్తే వదిలేస్తారీమో-" అన్నాడు జనార్ధన్‌ తల హెయిర్‌స్టెయిల్‌ సరిజేనుకుంటూ.

"పిచ్చిమాటలు మాట్లాడకు-ఆవిషయం చెపితే నిన్నుకూడా లాకప్‌లో పడేస్తాడు-" అన్నాడు శాయీరామ్‌.

మరో అరగంట తర్వాత గోపాల్రావ్‌ బయటకొచ్చాడు.

"ఎం జరిగింది-ఎలా వదిలేశాడు?" అడిగాం అందరం అతని చుట్టూ మూగి

"ఇంకెప్పుడూ పోలీస్‌స్టేషన్‌ మీద దాడిచేయమని రాసిమ్మన్నాడు. రాసిచ్చాను."

"అదేమిటీ? మనం దాడి ఎప్పుడు చేశాం-"

"నేనూ అదే అడిగానుగానీ వినిపించుకోలేదు అలారాసివ్వకపోతే నాపేరు రౌడీషీట్‌లో కక్కిస్తానన్నాడు.'

మేము మాట్టాడుతుండగానే ఇన్‌స్పెక్టర్‌ బయటికొచ్చాడు.

"ఏయ్‌-ఎవ్వరు మీరు? ఎందుకిక్కడ నుంచున్నారు?” 212 హ్యామరాలజీ

"వెళ్ళిపోతున్నాం సార్‌-" అన్నాడు గోపాల్రావ్‌ భయంగా.

"ఇగో-ఇది లాస్ట్‌వార్నింగ్‌! ఇక్కడసెక్షన్‌ 144 అమల్లో ఉన్నది. మీఅందరినీలోపట జేసేస్తా! మంచిగా ఇళ్ళకు పోండ్రి"

అందరం పరుగుతో ఇళ్ళకు చేరుకున్నాం!

మరో వారంరోజులు ప్రశాంతంగా గడిచిపోయినయ్‌. ఆతరువాత మొదలయింది కథ. జనార్ధన్‌ మోటర్‌సైకిల్‌ మీద ఆఫీసునుంచివస్తూంటే మాకాలనీదగ్గర ఓసైకిల్‌వచ్చి వెనకనుంచి డాష్‌ ఇచ్చింది. ఆ కన్‌ వ్యూజన్‌లో సైకిల్‌వాడితోపాటు జనార్ధన్‌ కూడా కిందపడకతప్పలేదు. పడేప్పుడు బలమంతాచేతి వేలుమీద పడడంతోవేలుఫ్రాక్చర్‌ అయింది. అందరం అప్పటికప్పుడే జనార్ధన్‌ని ఆటోలోవేసుకుని ఉస్మానియాహాస్పిటల్‌ చేరుకున్నాము. మామూలుగానే మమ్మల్నందరినీ నానాహింనలూ పెట్టాక జనార్ధన్‌చేతిని ఎక్సేరేతీసీ కట్టకట్టిపంపించివేశారు. ఈలోగా శాయీరామ్‌, గోపాల్రావ్‌ కలిసి రోడ్డుమిదపడిన జనార్ధన్‌ మోటర్‌ సైకిల్‌ని తీసుకెళ్ళి వాళ్ళింటిదగ్గరకు చేర్చారు.

ఆ మర్నాడు పొద్దున్నే మేమంతా ఆఫీస్‌కెళ్ళబోతూ ఉండగా పోలీస్‌ కాని స్టేబుల్‌ వచ్చాడు

మా ఇంటికి.

“నిన్న సాయంత్రం యాక్సిడెంట్‌ అయిందటగా సార్‌! ' అడిగాడతను.

యాక్సిడెంట్‌ అయిన మర్నాడే అతనలా పరామర్సించడానికి రావడం మాకంతో ఆనందం కలిగించింది.

"ఆ! పెద్ద యాక్సిడెంట్‌ కాదులే! చిన్నది-ఎంఫర్వాలేదు! ఈ వేలుఫ్రాక్స్‌రయింది అంతే! నువ్వేం వర్రీ అవకు-” అన్నాడు జనార్ధన్‌ ఆప్యాయంగా.

"నేనుకొద్సార్‌-మా ఇన్‌ స్పెక్టర్‌ గారు..."

"ఆయనను కూడా బాధ పడవద్దని చెప్పండి! చాలా చిన్నదెబ్బే తగిలింది- "అన్నాడు రంగారెడ్డి.

“ఈ ఇన్‌ స్పెక్టిర్‌ పైకలా ఉన్నా లోపల చాలా మంచిమనిషిలాగున్నాడు! పాపం ఎంత ఆదుర్దాతో కబురుచేశారోచూడు" అన్నాడు గోపాల్రావ్‌.

“అవును! పోలీస్‌ డిపార్చ్‌మెంట్‌ దృక్పృథంలోనే చాలా మార్పు వచ్చింది" అన్నాడు

శాయీరామ్‌.

"ఇదంతా ఎన్టీఆర్‌ ప్రభుత్వంవల్లే సాధ్యమయిందని నేను నిన్నే మాపేపర్గో రాశాను-" అన్నాడు గోపాల్రావ్‌ గర్వంగా. పోలీస్‌ స్టేషన్‌ 213 .

హఠాత్తుగా కానిస్టేబుల్‌ మొఖంలో ఎక్స్‌ప్రెషన్‌ మారిపోయింది.

"నిన్ను వెంటనే స్టేషన్‌కి తీసుకురమ్మన్నాడు మా ఇన్‌స్పెక్టర్‌ సాబ్‌!” అన్నాడు సీరియస్‌గా జనార్ధన్‌వేపుచూస్తూ,

"నన్నా?"

"అవును"

"ఎందుకు?"

"కేను రాయడానికి!”

ఈసారి అందరం ఉలిక్కిపడ్డాం

"కేసేమిటి?'"

"గదే-మీ మోటర్‌సైకిల్‌-సైకిల్‌ ఠక్కర్‌ అయినయ్‌ గదా? దాన్నిగురించి”

"దానిక్కేసెందుకు? మేమేమీ కంప్లెయింట్‌ ఇవ్వలేదుగదా దాన్ని గురించి"

“అది ఇంకొకగల్తీ-యాక్సిడెంట్‌ కేస్‌ని పోలీస్‌కిచెప్పకుండా చుపాయించిను! రండు కేసులు!"

"దిసీజ్‌ టూమచ్‌ "అన్నాడు శాయీరామ్‌.

"బేకార్‌ ఇంగ్లీషు మాట్టాడకండ్రి! జట్టివస్తరా? రారా?" కోపంగా అడిగాడు కానిస్టేబుల్‌.

"పదండి! ఇన్‌ స్పెక్టర్‌తోనే మాట్లాడదాం!" అన్నాడు రంగారెడ్డి. అందరం పోలీస్‌స్టేషన్‌ తిళ్ళాం.

“గుడ్‌ మాణింగ్‌ సార్‌!” అన్నాడు శాయీరామ్‌ ఇన్‌ స్పెక్టర్‌తో.

“ఎవర్చువ్వు?”

"నేను శాయీరామ్‌నండి! కాలనీ ఆర్గనైజింగ్‌ శెక్రట్రీని"

"నువ్వెందుకొచ్చినావీడకు?"

"అదే మా వాడిని పిలిపించారంటేనూ.....”నసిగాడు శాయీరామ్‌.

"ఇదిగో-మీకులాస్ట్‌ వార్నింగ్‌! నేనెవళ్ళనుపిలుస్తే అళ్ళేరావాల! ఇదేంపెండ్లిల్లుగాదు. బంధుమిత్రులతోని రానికి! నడవండి బయటకు"

శాయీరామ్‌ రెండడుగులు వెనక్కువేసి రంగారెడ్డివేప్రచూశాడు. రంగారెడ్డి యాదగిరివేపు చూశాడు.

అందరం బయటకొచ్చి నిలబడ్డాం. లోపల్నుంచీ జనార్ధన్‌, ఇన్‌స్పెక్టర్‌ల సంభాషణ వినబడుతూనే ఉంది. 214 హ్యామరాలజీ

"యాక్సిడెంట్‌ అయినాక నీ మోటరొసైకిల్‌ ఆ జాగాకెళ్ళి ఎందుకు తీసినావయ్యా?"

"రోడ్‌ ట్రాఫిక్‌కి అడ్డం అని తీసేసానండీ..."

"పోలీసులోచ్చేవరకూ తియ్యగూడదు గదా!"

"కానీ అది చిన్న యాక్సిడెంటేగదండీ-సైకిల్‌ వాడు నెమ్మదిగానే డాష్‌ ఇచ్చాడు"

"ఇదిగో! ఎక్కువతక్కువమాట్లాడకు! యాక్సిడెంట్‌ గురించి పోలీస్‌కిచెప్పకుండా చుపాయించినందుకు నీమీద కేసుపెడుతున్నా." =

"ఇందులో దాయాలని దాచిందేమీలేదండీ-చిన్నదానికి పోలీస్‌ వరకూ ఎందుకని..."

"ఇగో! ఫాల్లూ మాటలు మాట్లాడకు!” గట్టిగా అరచాడు ఇన్‌స్పెక్టర్‌. మేమంతా ఉలిక్కిపడ్డాం. పోలీస్‌ అంటే మాక్కొంత అవగాహనజఉందిగాని మరీ ఇంతఅవగాహన కాలేదెప్పుడూ. సరిగ్గా అప్పుడే ఓకానిస్టేబుల్‌ మాదగ్గరకొచ్చాడు చిరునవ్వుతో.

“ఏమిసార్‌ ఈ కిరికిర! మనమంతా ఒక్కజాగాలో ఉండేటోళ్ళం” అన్నాడు ఆప్యాయంగా. వెంటనే “హెలైడర్స్‌ ఇంగ్రీషుపిక్చర్లో అయిదునిముషాలపాటు మామూలు మనిషిలా మాటాడిన పోలీస్‌ పాత్రగుర్తుకొచ్చింది మాఅందరికీ,

"మాదేముందీ-మీ ఇని స్పెక్టర్‌గారేకదా పిలిపించి గొడవచేస్తోందీ?" కోపంగా అన్నాడు రంగారెడ్డి.

"ఇనిస్పెక్టర్‌సాబ్‌ చాలా మంచిమనిషి సార్‌! పై ఆఫీసర్ల దిక్కుకెళ్ళి పరేషాన్‌ అయికేనులు బుక్‌చేన్తున్న! గంతనే! వీరు మున కాలనీ ఓళ్ళేకాబట్టీ వెయ్యిరూపాయలిచ్చేయండ్రి! కేస్‌ మాఫ్‌ జేస్తడు!"

మాకు మతి పోయినట్టయింది.

"ఎమది? వెయ్యి రూపాయలు మేమివ్వాల్నా" ఆశ్చర్యంగా అడిగాడు యాదగిరి.

"మనకాలనీవాండ్లు కాబట్టి-వెయ్యిరూపాయల్సార్‌! లేకుంటే రెండు వేలకు ఒక్కపైస తగ్గెడిది కాదు" జాలిగా అన్నాడతను.

"అంటే మేము లంచం ఇవ్వాలా?" కోపంగా అడిగాడు రంగారెడ్డి.

"ఏం 'లంచం' అని గట్టిగా చిల్లాయిస్తున్నావ్‌! అట్లరుస్తే భయమనుకుంటున్నావా?" తనూ కోపంగా అడిగాడు కానిస్టేబుల్‌.

శాయీరామ్‌ ఇద్దరికీ సర్దిచెప్పాడు. "మాగురించి నీకు తెలియదేమో! మేము లంచాలు ఇవ్వము-తీసుకోము" అన్నాడు పౌరుషంగా. పోలీస్‌ స్టేషన్‌ 215

'ఇయ్యకుంటే కోర్చుచుట్టూ తిరగండి! ఎవళ్ళకు నష్టం" అనేసి వెళ్ళిపోబోయాడతను.

"అసలీ యాక్సిడెంట్‌ అయినట్టు మీకెవరు చెప్పారు?" అనుమానంగా అడిగాడు గోపా(లావ్‌.

"ఆమాత్రం తెలివి లేదువయ్యా? హాస్పిటల్‌డాక్షర్లు బరాబర్‌చెప్తరు మాకు" ఈ లోగా జనార్ధన్‌ బయటి కొచ్చాడు. అందరం వాడి చుట్టూ మూగాం.

“ఎమన్నాడు?"

"జరిగిందంతా రాసిమ్మన్నాడు! ఇప్పుడు నామీద కేస్‌ పెడతాడంట."

"వెయ్యి రూపాయలు ఇస్తే వదిలేస్తారని కానిస్టేబుల్‌ చెప్తన్నాడు మరి..." అందరం మా ఇంటికిచేరుకుని ఉన్నతన్థాయి చర్చలు ప్రారంభించాం. -

"ఇదంతా మాపేపర్లో రాసేస్తా-తిక్కవదిలి పోతుంది" అన్నాడు గోపాల్రావ్‌.

"ఎ పేపర్‌ చూసినా అన్నీ ఇలాంటి వార్తలే రోజూనూ! వీటినెవరు పట్టించుకుంటారు?" చిరాగ్గా అన్నాడు రంగారెడ్డి.

కాసేపటి తర్వాత అందరం ఓ నిర్ణయానికొచ్చాం. అదేమిటంటే-ఎంతోకొంత లంచంకట్టి కోర్టుకెళ్ళే భాధ తప్పించుకోవటం-వెంటనే కానిస్టేబుల్‌ ని బయటకు పిలిచి బేరాలు ప్రారంభించాం.

''మరీ వెయ్యి రూపాయలు చెప్తే ఎలా? ధర చాలా ఎక్కువ! కొంచెం తగ్గించుకోమనిచెప్పు మీ ఇన్‌స్పెక్టర్‌గారితో” అన్నాడు శాయీరామ్‌.

''ఇదే కన్సెషన్‌రేట్‌ సార్‌! మొన్న అఆ పాన్‌డబ్బా రాములుయాక్సిడెంట్‌లో ఎంతచార్జిచేసిండో ఎరుకనా? మూడువేలు!"

అందరం ఆశ్చధ్యపోయాము "మూడు వేలా?"

“ఆవ్‌! కావాల్నంటే రాముల్సే అడిగి రాండ్రి! నేనీడనే నిలబడతా-"

"అబ్బే ఎందుకులెండి మా మాటమీద మాకుగురి ఉంది. కానీ ఈ ఒక్కసారికీ అయిదు వొందలు చేసుకోండి! ఈసారి యాక్సిడెంట్‌ అయినప్పుడు తప్పక రేటు పెంచుతాం" అన్నాడు రంగారెడ్డి.

"మంచిగున్నార్సార్‌ మీరు! ఈ పైసలు మేముతిననికా? మాపై ఆఫీనర్లకియ్యాల! ఎరుకనా?"

ఇకలాభంలేదని జనార్ధన్‌ చప్పున కానిస్టేబుల్‌చేతులు పట్బకున్నాడు.

216 హ్యూమరాలజీ

“బాబ్బాబు! కాదనకు! ఓ పక్క,వేలుప్రాక్సర్‌ అయి నానాచావూ ఛస్తోన్నాను. మరోపక్క బండికిరిపేరు. నేనుచేసే ఉద్యోగమా-ఎందుకు పనికిరాని డిపార్ష్‌మెంట్‌! ఒక్క రూపాయి కూడా 'పై డబ్బు'రాదు."

"ఏ డిపార్టమెంట్‌ మీది?" అనుమానంగా అడిగాడు కానిస్టేబుల్‌.

"పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌-"

కానిస్టేబుల్‌ మొఖమంతా జాలితో నిండిపోయింది.

"థూథూథూ! ఫాల్తునౌకరీ భాయ్‌! మికు వ్రమోషన్‌రాదు, జీతంపెరగదు పైసఅమ్హాన్‌లేదు-నిజంచెస్తున్న! నాకువెయ్యిన్నరజీతమిచ్చినగానీ ఆ డిపార్టమెంట్‌లోబేరను."

అదేమంచిఅవకాశమని జనార్ధన్‌ వెంటనేతనజేబులోనుంచి అయిదువందలుతిీసి అతనిచేతిలో పెట్టేశాడు.

"సరే! మా ఇనిస్పెక్టిరసాబ్‌కి నేను సమ్‌జాయిస్తగానీ మళ్ళీ యాక్సిడెంట్‌ అయినప్పుడు మాత్రం బరాబర్‌ వెయ్యిరూపాయిలియ్యాల! ఎమంటున్నా?"

"ఓ తప్పక ఇస్తాను!"

కానిస్టేబుల్‌ వెళ్ళిపోయాడు.

మర్నాడుపొద్దున్నే యాదగిరి హడావుడిగావచ్చాడు మాయింటికి.

"గురూ! రాత్రి ఏం జరిగిందో చూశావా! ఆమెయిన్‌ రోడ్డుమీదున్న వీడియోపార్లర్‌లో బూఫిలిమ్‌వేశారుట!"

నేను ఆశ్చర్యపోయాను. ఆ వీడియోపార్లర్‌మరెవరిదో కాదు. మాకాలనీతాలూకు ఓ నిరుద్యోగిది.

వీడియోపార్లర్‌పెడికే లాభసాటిగా ఉంటుందని మేమే సలహా ఇచ్చాము అతనికి,

అప్పుడే శాయీరామ్‌, రంగారెడ్డి కూడా వచ్చేశారు-ఆ వార్త మరొకరి ద్వారా తెలిసి,

"ఆకుర్రాడికేం పోయేకాలం వచ్చింది? బాగా చదువుకున్నవాడు,' మంచివాడూ అనిమనం వీడియోపార్లర్‌పెట్టిస్తే ఇవ్పుడువాడు మొత్తం మనకాలనీకుర్రాళ్ళందరినీ చెడగొట్టేస్తున్నాడు కదా-” అన్నాడు శాయీరామ్‌.

"పదండి వాడినే అడుగుదాం!” అన్నాడు చంద్రకాంత్‌ చటోపాధ్యాయ.

అందరంకలిసి వీడియోపార్లర్‌కి చేరుకున్నాం మమ్మల్నందర్సీచూసి కొంచెం ఖంగారుపడ్డాడతను.

"బ్లూఫిలిమ్‌ వేశావుట కదా రాత్రి! మనకాలనీ కుర్రాళ్ళకు చాలామందికి టిక్కెట్లు అమ్మావుట-" అడిగాడు శాయీరామ్‌. పోలీస్‌ స్టేషన్‌ 217

అతని మొఖం పాలిపోయింది. తల వంచేసుకున్నాడు. ఏడుపొక్కటే తరువాయ్‌.

"ఎం చేయ్యమంటారుసార్‌! పోలీస్‌స్టేషన్కి నెలకి వెయ్యిరూపాయలు ఇవ్వాలని కబురు చేశారు. నెలకు దానిమీద రాబడి అంతా కలిపితే ఎనిమిదొందలేసార్‌ అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కావాలంటే బ్రూఫిలిమ్స్‌ వేసుకుని రాబడిపెంచుకో. మేమునిన్నేమీచేయం! కానీ వెయ్యి రూపాయలు చచ్చినట్లు కట్టాల్సిందే-లేకపోతే రేపే మూసేస్తాం" అన్నారు- అందుకని రాత్రిషోవేసి ఆకలెక్షన్‌ ఆరొందలూ తీసుకెళ్ళి ఇచ్చివస్తున్నాను. ఇకనుంచీ నెలకు రెండువేలివ్వాలని-కావాలంటే రోజూ ఆ ఫిలిమ్స్‌ వేసుకోమని అంటున్నారిప్పుడు."

అందరం మొఖాలు చూచుకున్నాం!

"పదండి! ఈ పోలీసు వ్యవహారమేమిటో తేల్చుకుందాం దగ్గరుండి. గుడంబా దుకాణం, బ్లూఫిలిమ్స్‌-క్షబ్‌లు ఇవ్వన్నీ ప్రోత్సహించటానికా పోలీస్‌స్టేషన్‌ పెట్టింది?” అరచాడు మా కాలనీ కవివిప్లవజ్యోతి.

అందరం తిన్నగా పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నాం.

ఇనిస్పెక్టర్‌ అప్పుడే మోటర్‌సైకిల్‌ మీదేక్కడికో బయల్దేరబోతున్నవాడల్లా మమ్మల్ని ' చూసి ఆగాడు.

"మళ్ళీ ఎందుకొచ్చిన ఇక్కడికి? “కోపంగా అడిగాడు” ఈ పోలీస్‌స్టేషన్‌ చుట్టుపక్కల కనిపించొద్దని చెప్పలే నేను?"

"మీతో మాట్లాడాలని వచ్చాము.-"

“ఏవిషయం?”

"కాలనీదగ్గర ఆగుడంబాదుకాణం తెరవటం గురిచీ, మట్కాపెద్ద ఎత్తున ఓపెన్‌గా జరగటంగురించీ, ఎప్పుడూ మంచి సినిమాలు వేసే ఆ వీడియోపార్లర్‌ వాడు బ్టూఫిలిమ్స్‌ వేయటం గురించీ మాట్లాడాలి-"అన్నాడు శాయీరామ్‌ ధైర్యం తెచ్చుకుని.

ఇనిస్పెక్టర్‌ మోటర్‌సైకిల్‌ దిగి మీదమీదకువచ్చి నిలబడ్డాడు భయంకరంగా.

"ఎయ్‌ ఎమ్‌ సంగతి? జులుమ్చేయనికొచ్చిన్రా! లేక పెద్ద మొనగాల్లమనుకుంటున్రా! ఎక్కడో, ఎవరో, ఏమోజేస్తే-పాగల్‌గాండ్లలాగా పోలీస్‌స్టేషన్‌కొస్తారు? నడవండ్రి ఈడకెళ్ళి-"

"మేము వెళ్ళం! ముందు అగుడంబా దుకాణం, వీడియో పార్లర్‌ మూయించాలి." హఠాత్తుగా ఇన్‌ స్పెక్టర్‌ శాయీరామ్‌ మెడమీద చేయివేసి దూరంగాతోశాడు.

అదిచూసి అందరూ రెండడుగులు వెనక్కివేశాము.

218 హ్యూమరాలజీ

"పోతారా? లాఠీచార్జీ చేయమన్నారా?" అరచాడతను.

కాలనీకవి విప్లవజ్యోతి 'లాఠీమాట' వింటూనే బులెట్‌లావాళ్ళింటివైపు దూసుకు పోయాడు.

మేమెంత పిలుస్తున్నా వినిపించుకోలేదు.

"సరే-మేమంతా కలసి మీమీద పోలీస్‌ కమీషనర్‌గారికి అర్జీ పెడతాం!" - అన్నాడు గోపాల్రావ్‌ కసిగా.

"ఏయ్‌ టు సిక్టిఫోర్‌!-ఈళ్ళందర్ని లోపలేసేయ్‌-” గట్టిగా అరచాడు ఇన్‌స్పెక్టర్‌.

మరుక్షణంలో ఇద్దరు కానిస్టేబుల్స్‌ పరుగుతోవచ్చి మాముందు నిలబడ్డారు.

"మనం చేసేపనేదో సైలెంట్‌గా చేద్దాంపదండి!" అన్నాడు రంగారెడ్డి మావేపుతిరిగి.

అందరం వెనక్కు తిరిగి నడిచాము నిశ్శబ్దంగా. . అప్పటికప్పుడే రంగారెడ్డి అర్జీ తయారుచేస్తానన్నాడుగానీ-ఆఫీస్‌లకు టైమయిపోవటం వల్ల సాయంత్రం వరకూ ఆ కార్యక్రమాన్ని వాయిదావేశాం!

అందరికీ ఆ ఇనిస్పెక్టర్‌ ప్రవర్తన అవమానకరంగా అనిపించటంచేత ఆరాత్రి తిరిగి

కాలనీ వేదికదగ్గర సమావేశమయ్యాము.

రంగారెడ్డి అర్జీరాయటం మొదలుపెట్టాడు. రాత్రి పదయిపోయినా ఇంకా అర్జీపూర్తి కాలేదు. ఇంగ్లీషు గ్రామరుపుస్తకం ఉండుండి రిఫర్‌ చేయాల్సి వస్తోంది.

మేమందరం ఈ హడావిడిలో ఉండగా ఓపోలీస్‌జీప్‌ శరవేగంతోవచ్చి మాకుకొన్ని అంగుళాలదూరంలో సడెన్‌గాఆగింది. అందులోనుంచి ఓటార్చిలైట్‌ఫోకస్‌ పడింది మామీద.

"ఏయ్‌! ఎవర్రా మీరు?” అంటూ ఓ గొంతుగట్టిగాఅరిచింది జీప్‌లోనుంచి,

అనుకోని నంవుటనకు మేమంతా నిశ్చేష్పలమయినా మమ్మల్నలా అంత ' అవమానకరంగా సంభోధిస్తున్న వాడెవడా అని జీప్‌ దగ్గరకు నడిచాము కోపంగా.

''ఏం మాట్టాడరీరా? ఎవరు మీరు? ఎంజేన్తున్నారిక్కడ?'' మళ్ళీసైరన్‌లా మోగిందిగొంతు. మరుక్షణంలో నలుగురు కానిస్టేబుల్స్‌ జీప్‌ వెనుకనుంచి దిగినిలబడ్డారు. ముందుకూర్చుని బ్రాందీ పవర్‌లో అరుస్తోంది సర్కిల్‌ ఇనిస్పెక్టర్‌ అని తెలిసింది మాకు అతనికున్న బాడ్జీవల్ల.

"మేము కాలనీ వాళ్ళం!” అన్నాడు శాయీరామ్‌ టార్చిలైట్‌ వెలుతురికి కళ్ళు

మూసుకుని.

“ఇంతరాత్రివేళ ఇక్కడేం జేస్తున్నారు?"

“అర్జరాస్తున్నాం” అన్నాడు రంగారెడ్డి కల్పించుకుంటూ. పోలీస్‌ స్టేషన్‌ . 219

"హూ ఆర్‌ యూ?" టార్చిలైట్‌మొఖం మీదవేశాడతను.

"నాపేరు రంగారెడ్డి"

"డోంటాక్‌-ఆసిగరెట్‌ అవతల పారేసి మాట్లాడు! ఇడియట్‌! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"

“ఎవరయినాగానీ-అలా ఇడియట్‌ గిడియట్‌ అన్నావంటే బాగుండదు” కోపంగా అన్నాడు రంగారెడ్డి.

“షటప్‌ మరింత భీకరంగా అరచాడతను.

రంగారెడ్డి సపైలంటయిపోయాడు.

“ఆసిగరెట్‌ పాంయ్‌ ముందు-"

రంగారెడ్డి సిగరెట్‌ పారీసేడు.

"ఎయ్‌-నువ్వెవరు నిన్నేఎయ్‌- రెడ్‌ మస్టర్‌!"

గోపాలావ్‌ ఖంగారుగా మవ్లర్‌ తలమీదనుంచితీసి చుట్టేసి చేత్తోపట్టుకున్నాడు. టార్చిలైట్‌ అతని ముఖంమీద పడిందప్పుడు. 1

"నాపేరు గోపాల్రావండి! జర్నలిస్ట్‌ని!”

"షటప్‌! నువ్వెవడివో చెప్పు! అంతే! జర్నలిస్టు, గొడిదగుడ్డు అని చెప్పనక్కరలేదు."

“ఉద్యోగం అడిగారనుకుని."

"నీలాంటి బోడిజర్నలిస్పులను పాతికమందిని బామికలిరగ్గొాట్టాను! వాళ్ళ కెమేరాలు, బ్రీఫ్‌ కేనులూ విరిచి అవతలపారేశాను-జర్నలిస్ట్‌ అంటే గొప్పనుకుంటున్నావా? తొక్క రేగ్గడతాను జాగ్రత్త!"

గోపాలావ్‌కి పౌరుషం పాడుచుకొచ్చింది.

"అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు" గట్టిగా అన్నాడు.

"వటవ్‌-తలకు మవ్ళర్‌ కట్టుకుని నిలబడతావురా? నేనిక్కడ మాట్లాడుతోంటే-లాకపలోతోస్తా నకరాలు చేశావంటే."

గోపాల్రావ్‌ సైలంటయిపోయాడు.

. "మీరంతా ఇక్కడ మీటింగ్‌ పెట్టటానికి పోలీస్‌ పర్మిషన్‌ తీసుకున్నారా?"

అందరం మొఖాలు చూచుకున్నాం.

“మాట్లాడరేం? అడిగేది మిమ్మల్ని కాదూ?"

220 హ్యామరాలజీ

"మాకాలనీ మధ్యలో కలుసుకుని మాట్టాడుకోడానికి పర్మిషనెందుకండి?" అడిగాడు జనార్ధన్‌ ఓ మూలనుంచి. "ఎవడాడు మాట్టాడింది?" "నేనే! ఆడుగీడు అన్నారంటే బాగుండదు. నేను టి.వి ఆర్టిస్పని!" "డొంటాక్‌! టి.వి. ఆర్జిస్స అన్నావంటే సెక్షన్‌ 420 కింద తోసేస్తా! ఇడియట్‌! నేనెవర్ని అడుగుతే ఆడే మాట్లాడాలి! ఇంకోళ్ళునోరెత్తద్దు.” "మేమెప్పుడూ ఇక్కడే కలుసుకుని మాట్లాడుకుంటామండీ! మాకాలనీయేగా ఇది!” అన్నాడు రంగారెడ్డి గొంతు పెగుల్చుకుని. "కాలనీ అంతా నీగ్రాండ్‌ఫాదర్‌ ప్రాపర్టీకాదు. కాలనీలో ఇల్లే నీది. ఇంట్లో నుంచి = బయటికొచ్చి ఎంచేసినాగానీ పోలీస్‌ పర్మిషన్‌ కావాలి!” ఎవ్వరూ మాట్లాడలేదు. “"మీఅందరూ డెకాయిట్స్‌కాదని నాకేమిటినమ్మకం! నగరమంతా రోజూ దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్న సంగతి తెలుసుకదా! మీరేదొంగతనం చేసేగాంగ్‌ అనినేనంటాను!" “"అనలు దొంగల నెలాగూ పట్టలేరుకదా! ఇలా మాలాంటి వాళ్ళనేవట్టండి!' వెనుకనుంచి గొంతుమార్చి అన్నాడు చంద్రకాంత్‌ చటోపాధ్యాయ్‌. కోపంతో జీపులోనుంచి తూలుతూ మాగుంపు వెనుకకు నడిచాడు సర్కిల్‌. "ఎవడ్రా ఆమాట అంది? రాస్కెల్‌ ఎవడ్రా అడు? చెప్పకపోతే అందరినీ తోలువలి చేస్తాను-" ఈ హడావుడంతా చూసి మాకాలనీ డిటెక్టివ్‌ రచయిత్రి పరుగుతో వచ్చింది మా = దగ్గరకు. టార్చిలైట్‌ అమె మొఖం మీద వేశాడు సర్కిల్‌. "ఎవర్నువ్వు?" | "ముందాలైటార్సండి!” అంది రాజేశ్వరి కోపంగా. "మొన్న లైసెన్స్‌ లేకుండా స్కూటర్‌ నడిపింది నువ్వేకదూ?" కోపంగా అడిగాడతను. మేమంతా తెల్లబోయాం. మా కాలనీలో ఆడాళ్ళివరికీ వెహికల్స్‌లేవు. "నేనెప్పుడు నడిపాను?" ఆశ్చర్యంగా అందామె. "ఏయ్‌ రహమాన్‌! ఈ పోరేకదూ లైసెన్స్‌ లేకుండా న్కూటర్‌ నడిపింది?" "కాద్సార్‌! ఇది ఇంకొక లేడీ ఉన్నయ్‌. కాలనీకూడా ఇదికాదు, బ్యాంక్‌కాలనీ-" "పోనువ్‌ ఈడకెళ్ళి!” రాజేశ్వరితో అన్నాడు నర్కిల్‌. ం పోలీస్‌ స్టేషన్‌ 221

“నేనెందుకు పోవాలి? నేనిక్కడే ఉంటాను-" మొండిగా అందామె.

"ఏయ్‌ పోరి ఎక్కువ తక్కువ మాట్టాడినావంటే లాకప్‌లోవేస్తా తెల్సిందా?'

"వెయ్‌ చూద్దాం! లేడీపోలీస్‌లేందే నన్నెట్లా అరెస్ట్‌చేస్తావో నేనూ చూస్తా-" రూల్స్‌తెలీ కుండానే అందరం తప్పట్ట్లుకొట్టాం! అదే అదనని సర్కిల్‌ మా మధ్య కొచ్చాడుమళ్ళీ.

"ఎవడ్రా ఆడు తప్పట్లు కొట్టింది! రాస్కెల్స్‌! ఒక్కనిమిషంటైమిస్తున్నా మీకు- ఎవడింట్లోకి ఆడు వెళ్ళకపోయాడంటే. జీప్‌లోవేసుకెల్తా స్టేషన్‌కి-” అన్నాడు తూలిపడబోయి మళ్ళీ నిలదొక్కుకుని.

“పదండి! కిరికిరి ఎందుకు? ఇదంతా నేనురేపే మాపేపర్లో రాస్తానుగా"” అన్నాడు గోపాల్రావ్‌.

"ఒరే జర్నలిస్ట్‌-నీపేపర్పీ నిన్నూ తుక్కురేగ్గొాడతా-కొడకా! నోర్మూసుకుని ఫో"

అందరికీ రక్తంకాగిపోతుందికానీ మనదేశంలో పోలీస్‌పరిస్థితి ఎక్కడయినా అలాపై చేయిగానే ఉందని గుర్తురావడంతో చేసేదేమీలేక ఇళ్ళకు బయట్టేరాము.,

అతరువాత మా అందరినీ బండ బూతులు తిడుతూ సర్కిల్‌ ఇనిస్పెక్టర్‌ కాలనీ మధ్యలో కాసేపు స్వైరవిహారంచేసి వెళ్ళిపోయాడు.

ముర్చాడు పాద్దున్న ఓ పెద్దపోలీస్‌ వాన్‌ వచ్చి మాకాలనీ మధ్యలో ఆగింది. అందులోనుంచి తుపాకులు తీసుకుని బోలెడుమంది పోలీసులు దిగి నిలబడ్డారు. రాత్రివచ్చిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టరూ, మా పోలీస్‌స్టేషన్‌ సబిన్‌స్పెక్టరూ రివాల్వర్‌ చేతిలోకి తీసుకుని మా ఇంట్లో కొచ్చారు.

"వీడే-” అన్నాడు సర్కిల్‌ నన్ను చూడగానే.

కానిస్టేబుల్స్‌ ఇద్దరువచ్చి నన్ను రెక్కలువిరిచి పట్టుకున్నారు మరోకానిస్టేబుల్‌ ఓ పుస్తకం అతని జేబులోనుంచి తీసి నేను చూస్తుండగానే నా టేబుల్‌ మీదకు విసిరేశాడు. వెంటనే సర్కిల్‌వెళ్ళి ఆపుస్తకం తీసి చూశాడు.

“ఆ! మావో సాహిత్యం! గవర్న్షమెంట్‌ని కూలదోయటానికి, భూస్వాములనందరినీ హత్య చేయడానికి కుట్ర!” అన్నాడు గట్టిగా.

మరికాసేవట్లో గోపాల్రావ్‌నీ, రంగారెడ్డినీ, జనార్ధన్‌నీ, కాలనీకవివిప్లవజ్యోతినీ, రాజేశ్వరినీ కూడా అరెస్ట్‌ చేసి మా అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళారు.

గోపాల్రావ్‌ ఇంట్లో బాంబులుకూడా దొరికాయట;!

''నాజన్మలో అనలు బాంబుఎలావుంటుందో నేనుచూళ్ళేదు! మా ఇంట్లో బాంబులుండట మేమిటి?" భయంతో అన్నాడు గోపాల్రావ్‌. 222 హ్యామరాలజీ

"ఇది అన్యాయం! అక్రమంగా మామీద లేనిపోని నేరాలు మోపుతున్నారు" అంది రాజేశ్వరి కోపంగా.

"అక్రమమేం లేదు! మీ అందరిళ్ళల్లో మావోసాహిత్యం దొరికింది. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మిరు తయారుచేసిన పథకాలుదారికాయి" అన్నాడు సర్కిల్‌.

"మా ఇంట్లో ఎమీ దొరకలేదుకద్సార్‌-నన్నాదిలేయండి! " అన్నాడు విప్లవజ్యోతి దీనంగా.

"ఎమీ దొరకలేదా? ఎవడన్నాడూ? ఇదిగో! ఈగేయంనువ్‌ రాసిందేగా!"

"వేషగాళ్ళు మోసగాళ్ళు-

స్వార్ధపరులు-బడాచోర్లు-

రక్తంపీల్చే జలగలు-దోపిడీదొంగలు

హంతకులు-వంచకులు

వీళ్ళ ఆటలు అరికట్టించండి

వీళ్ళందరినీ తుదముట్టించండి"

“అవున్న్సార్‌! నేనే రాసింది-"

"మరింకేమిటి? మన ప్రభుత్వాన్ని స్పష్టంగా వర్ణించావు! దానిని తుదముట్టించ మంటున్నావు-మరదిప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రకాదూ?"

"నేను వర్ణించింది ప్రభుత్వాన్నికాదు సార్‌! మన సమాజంలో ఉన్న చెడుని-"

"ఛట్‌ మాకామాత్రం తెలీదనుకోకు! సమాజంలో అంత చెడు లేనే లేదు. ఖచ్చితంగా నీవర్ణనంతా ప్రభుత్వానికే సరిపోతుంది-"

“బాబోయ్‌-దేవుడు సాక్షిగా చెప్తున్నాను! నేను ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని రాసింది కాదండీ! నన్ను నమ్మండి సార్‌! అలా రాస్తే పత్రికల వాళ్ళు వేసుకుంటున్నారని-అలాగే రాస్తున్నాను! అంతేకానీ నాకీకుట్రలూ, రాజకీయాలూ అస్సలుతెలీవు సార్‌!” కన్నీళ్ళు తుడిచేసుకున్నాడు, విప్లవకవి! మేమంతా ఆశ్చర్యపోయాం.

"నేనురాసే కవిత్వంవల్ల ఎవ్పుడో ఒకప్పుడు దేశంలోవివ్లవంవన్తుంది సార్‌'' అంటూండేవాడు మాతో అతను సీరియస్‌గా.

మాకాలనీలో మిగతా వారంతా ఆడాళ్ళతో సహా క్రమేపీ పోలీస్‌స్టేషన్‌ దగ్గరకు చేరుకుంటూండడంతో సర్కిల్‌ ఇన స్పెక్టర్‌లో కలవరం కలిగింది.

లేచి మళ్ళీమాదగ్గర కొచ్చాడు. _ పోలీస్‌ స్టేషన్‌ .. 223

“అందరూ రాసివ్వండి! ఇంకివ్పుడూ నగ్గలైట్‌ కార్యకలాపాల్లో పాల్గానబోము. ప్రభుత్వానికి విధియులమై ఉంటాము అని రాయండి-రాసిచ్చేవారినే వదిలేస్తాను"

"మేము రాయం! మాలో ఎక్కువమంది గవర్నమెంట్‌ సర్వెంట్స్‌మే ఉన్నాం. అసలు రాజకీయాలతోనే మాకు సంబంధంలేదు. అలాంటిది కావాలని మా ఇళ్ళలో బాంబులు, మావోఫోటోలు, సాహిత్యం మీరేపడేసి మమ్మల్ని నగ్గలైట్టంటారా?" ఆవేశంగా అన్నాడు రంగారెడ్డి.

"లేకపోతే పోలీస్‌లంటే వేళాకోళంగా ఉందా మీకు? మా వ్యవహారాల్లో మా “"మామూ ళృల్లో" మీరు తలదూర్చి అర్జీలు తయారుచేస్తారా మామీద-ఇప్పుడు తెలిసిందా పోలీస్‌ అంటే ఎమిటో?" అడిగాడు కసిగా సర్కిల్‌.

“మిమ్మల్ని ఇక్కడ కాల్చినా గాని మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవళ్ళూలేరు! ఎరుకనా?" అన్నాడు సబ్‌ఇని స్పెక్టర్‌.

"అదేమంత తేలిక కాదు! మమ్మల్ని కాల్చిచంపితే మీరు ఉరికంబమెక్కుతారు!” అన్నాడు గోపాల్రావ్‌. లో "అరేపాగల్‌! మీ కాలనీలో నగ్గలైట్లను అరిన్న చేసినవ్పుడు, లొంగకుండా వ్రతివంటించినందుకు కాల్పులు జరిపినామనీ-అపైరింగ్‌లో చచ్చిననీ వేము పేపర్‌స్టేట్‌మెంటిస్తాము- ఇంకెవడేం జేస్తాడుబే-"

అందరం సైలంటయి పోయాము. కొద్దిక్షణాలు అందరి గుండెల్లోనూ రైళ్ళూ, బస్సులూ పనిగెత్తినయ్‌. ఇనిస్పెక్టర్‌ చెప్పినమాట నిజమే.

మమ్మల్పందరినీ వాళ్ళు కాల్చిపారేసినా దిక్కులేదు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదు. సివిల్‌లిబర్టీస్‌ వాళ్ళేవరో వచ్చి-నిజం తెలుసుకుంటారని పేపర్లో చదివాము గొనీ- అందువల్ల కాల్పుల్లో చచ్చిన అమాయకులు (అంటే-మేము) తిరిగి బ్రతకరుకదా! పైగా అసివిల్‌ లిబర్టీస్‌వాళ్ళ స్టేట్‌మెంట్స్‌ కూడా పట్టించుకొనే నాధుడు లేడు.

“అందరినీ వాన్‌లో ఎక్కించండి. ఇంటరాగేషన్‌కి తీసుకెళ్టాం-" అన్నాడు సర్కిల్‌.

మాకు చెమటలు పబ్టేసినయ్‌.

ఇంటరాగేషన్‌కని అడవిలోకెక్కడికోతీసుకెళ్ళి- మమ్మల్ని కాల్చిపారేస్తారు. ఏమాత్రం అనుమానంలేదు. ఇంతకుముందు పేపర్లో చదివినవన్నీ ఇలాంటి ఎన్‌కౌంటర్లేనని మా అనుమానం,

"నేను రాసిచ్చేస్తాను.” అన్నాన్నేను.

224 హ్యామరాలజీ

మిగతా అందరూకూడా రాసిచ్చేయడానికిరడీ అయారు. సర్కిల్‌ ఇనస్పెక్టర్‌వేపు విజయ గర్వంతో చూశాడు. సబ్‌ఇన్స్‌ పెక్టర్‌ మమ్మల్నందరినీ దీపం పురుగుల్నిచూసినట్లు జాలిగా చూళాడు.

అందరం వాళ్ళు చెప్పినట్లు రాసిచ్చి ఇళ్ళకు బయలుదేరాం.

అరోజునుంచీ కాలనీచుట్టూ ఎ అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవటం మానేశాము.

కానీ కథ అక్కడితో ముగియలేదు.

వారంరోజులన్నాగడవక ముందే ఓరోజు సాయంత్రం నిసార్‌, యాదగిరి మా ఇంటికి పరుగుతో వచ్చారు "దేఖో భాయ్‌!" అన్నాడు గాబరాగా నిసార్‌ "మనకాలనీ పిల్లల్ని పోలీసులు తీస్కృపోయినయ్‌."

నేను ఆశ్చర్యపోయాను.

"ఎందుకని?"

"ఏమో! మూడుపిల్లలూ బయట ఆడుకుంటున్నాయ్‌. పోలీసులొచ్చి తీస్కపోయినయ్‌."

ముగ్గురం కలసి మిగతా గాంగ్‌ని పోగేసుకుని స్టేషన్‌కి పరుగెత్తాం. మొత్తంకాలనీకి

చెందిన నలుగురు పిల్లలనులాకప్‌లో పడేశాడు ఇన్‌స్పెక్టర్‌. = "నమస్కారం సార్‌!" అన్నాన్నేను.

“ఎవరునువ్వు?"

"నాపేరు ఉదయార్కర్‌ సార్‌! కాలనీ కమిటీ వైన్‌ఫ్రెసిడెంట్సి..."

"ఇగో-ఎక్కువ తక్కువ మాట్లాడకు! నువ్వెవళ్ళు అనడిగితే పేరుజెప్పు! గంతేనేగాని వైస్‌టెసిడెంట్‌, బైగన్‌కిప్రసిడెంట్‌- కరేకేబేకార్‌ మాటలు మాట్లాడకు! ఎందుకొచ్చినావీడకు?"

"మా పిల్లలను మీరుస్టేషన్‌కి తీసుకొచ్చారని తెలిసింది-"

"ఆవ్‌! తీసుకొచ్చినాం!”

“"ఎందుకుసార్‌”? “ఎందుకేమిటి? వాళ్ళు కొట్లాడుకున్నారు! అందుగురించి అరెస్ట్‌ చేసినాం."

“చిన్నపోరలు ఆటల్లోకొట్లాడుకున్నందుకు అరెస్ట్‌ చేసిన్రా?' ఆశ్చర్యంగా అడిగాడు యాదగిరి.

"బరాబర్‌ జేస్తా!”

"వాళ్ళు పొట్లాడుకోకుండా మేము చూస్తాములెండి! వదిలేయండి!" అన్నాన్నేను.

క్‌ పోలీస్‌ స్టేషన్‌ 225

“"ఇదిమామూలు కొట్లాటకేసుగాదు! కమ్యూనల్‌ రైట్స్‌! సమజయిందా'"'

"కమ్యూనల్‌ రైట్సా?” అందరం ముక్తకంఠంతో నమ్మలేనట్లు అడిగాము.

"అవ్‌! ఈ పోరల్లో ఒక ముస్లిమ్‌, ఇద్దరు హిందూ, ఒక క్రిష్టియన్‌ ఉన్నారు. అందుకే వీళ్ళుకొట్లాట'మతకలహం' కింద రిజిష్టర్‌ చేసినా."

"అదేమీటి సార్‌! వాళ్ళు చిన్నపిల్లలు. ఆటల్లో కొట్టాడుకుంటారు-ఒకటవుతూంటారు. అది మామూలేగా-"

' "హౌ సాబ్‌! హమారేలోగేంమే-కభీభీ రెలిజియన్‌కి బాత్‌నహీఆతీ" అన్నాడు నిసార్‌!

"ఛలో-ఇంక బయటకు నడవండ్రి" లేచి నిలబడ్డాడు ఇనిస్పెక్టర్‌ చేయి బైటకు చూపుతూ.

అందరం బయటకు నడిచాం. కానిస్టేబుల్‌ మాకోసమే ఎదుర్పూస్తున్నాడు బయట.

''ఈ కిరికిరంతా ఎందుకుసార్‌! నెలనెలా ఎంతో కొంత మావూలిస్తే మాతో మీకే కిరికిరీ ఉండదు కదా?"ఉలిక్కిపడ్డాం మేము.

"ప్రతినెలా మీ పోలీస్‌స్టేషన్‌కి మామూలివ్వాలా? ఇలాంటిదెక్కడా వినలేదే వేచ&ీ' అడిగాడు శాయీరామ్‌.

"ఆవ్‌ సార్‌! మీరే కావాలని పోలీస్‌స్టేషన్‌ పెట్టించుకున్నారు. ఈ ఎరియాలో మాకు ఆమ్‌దాని చాలా తక్కువున్నది. గసంటప్పుడు మీరే ఎంతోకంతిస్తూంటే మంచిగ నడిచిపోతది. వేముమీ జోలికి రాము-మీరు మాజోలికిరావద్ను! లేకుంటే గిట్లఏదోకకేన్‌లో మీరుపైసలుకడుతూనే ఉండాలి. గిప్పుడుచూడండ్రి! ఈ పోరలు జబర్హస్తీల అటకాయించి పోయిను! రెండువేల రూపాయలిస్తేగానీ ఈళ్ళను ఇడవనికి కాదు-"

అందరం భయంగా ఒకరిమొఖాలాకరు చూచుకున్నాం.

"రెండువేలా?" .

"సాబ్‌! కమ్యూనల్‌కేస్‌ ఇది. జబర్ధస్త్‌కేస్‌! చుపాయించెడిదే కష్టం, ఈకేస్‌ల! బరాబర్‌ జైలుశిక్ష పడతది..

“కాని వాళ్ళు చిన్నపిల్లలుకదా-"

"కమ్యూనల్‌కేస్‌కి చిన్నాపెద్దా ఎమీలేద్చార్‌-మనకాలనీ అని ఇన్‌ స్పెక్టర్‌సాబ్‌ కన్సెషన్‌రేట్‌ చెప్పిండు. నిన్న గుడంబదుకాణం దగ్గర జగడం అయితే అళ్ళిద్దరికీ నాలుగువేలు ఛార్జీచేసిండు-"చేసేదిలేక రెండువేలు కట్టి పిల్లలందరినీ విడిపించాము.

226 హ్యామరాలజీ

అప్పటికప్పుడే కాలనీలో ఎమర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేశాడు శాయీరామ్‌. చాలా రోజుల తరువాత జరిగిన మీటింగ్‌ అవటంవల్ల స్త్రీలు, పిల్లలు అంతా కిటకిటలాడి పోయారు. 'సోదరసోదరీమణులారా! ఇప్పుడు మనకాలనీకి కొత్త సమస్య ఎదురయింది. అదేమిటంటే మనం ఇటీవలే కోరి ఏర్పాటు చేసుకున్న మన పోలీస్‌స్టేషన్‌! వారికీ మనకూ మధ్యకొన్ని బాధాకరమయిన సంఘటనలు జరిగిన విషయం మీఅందరికీ తెలుసు. కనుక అలాంటి సంఘటనలు ఇకముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ్యులు సూచించవలసిందిగా కోరుతున్నాను-" అంటూ ముగించాడు శాయీరామ్‌. అంతాకలవరం చెలరేగింది. కొద్దినిముషాల తర్వాత రాజేశ్వరి లేచినిలబడింది. "మా ఆడాళ్ళందరి అభిప్రాయం ఏమిటంటే-పోలీస్‌స్టేషన్‌ని మనకాలనీ నుంచి ఎత్తివేయాలని మనం మినిష్టర్‌గారికి అర్జీ పెట్టాలని!" అంతా తప్పట్టుమార్మోగిపోయినయ్‌. , "అవునూ! పోలీస్‌ స్టెషన్‌వద్దు-పోలీస్‌ స్టషన్‌వెంటనే ఎత్తివేయాలీ" అంటూ అరిచారు విద్యార్భలు వెనుకనుంచి! కాలనీవారందరం కలసి మంత్రిగారి దగ్గరకు ఊరేగింపుగా వెళ్ళి పోలీసుస్టేషన్‌ ఎత్తివయాలన్న మెమొరాండం సమర్పించాలని నిర్ణయించారు చివరకు. “కానీ సోదరులారా! పోలీస్‌స్టేషన్‌ ఎత్తివేయటంఅంటే అంతతేలిగ్గా జరిగే విషయంకాదు. చాలాటైము పట్టవచ్చు. కాని అంతవరకూ పోలీసులబారినుండి మనం మనకాలనీని రక్షించుకోవాలంటే ప్రతినెలాకొంత మామూలుఇవ్వాల్సి ఉంటుంది. సభవారంతా వప్పుకున్నట్లయితే- మనకాలనీఫండ్స్‌నుంచి వారికి మామూలు ఇవ్వటంప్రారంభిస్తాము-" “"అంటే-అదివరలో ఆదొంగలతో రాజీకుదుర్చుకుని వారికినెలనెలా మామూలు ఇస్తున్నటల్లే-ఇప్పుడు పోలీసులతో రాజీ కుదుర్చుకుంటారా?” ఎవరో అడిగారు. . "అవును! అయితే వాళ్ళతో ఎగ్రిమెంట్‌రాయటం కుదరదని సర్కిల్‌గారు చెప్పారు. కేవలం నోటిమాటే నమ్మకం!" ఆ తీర్మానాన్ని సభ వెంటనే ఆమోదించింది. | ఆతరువాత ఆదివారమె కాలనీఅంతా మంత్రిగారి దగ్గరకు వెళ్ళడానికి రూడా నీర్ణయం తీసుకున్నాక అందరం నిర్భయంగా ఆనందంగా నిట్టూర్చాం! * పోలీస్‌ స్టేషన్‌ 227

ఢ గి కాతాణాలళ క్‌: నే | న్‌ అనడు... కీ 4 ఇక్‌” (8 (

ఈ కొద్దిరోజులలోనే మాకాలనీలో చాలా మార్చులొచైసినయ్‌. పోలీస్‌ స్టేషన్‌ పెట్టిననెలరోజుల్లోనే దానిని ఎత్తివేయాలంటూ మేము పెట్టుకున్న-అర్జీ మంత్రిగారికి ఎంచేతో నచ్చలేదు- అయితే అదృష్టంకొద్దీ వేరే కారణాలవల్ల పోలీస్‌స్టేషన్‌ మాకాలనీకి దూరంగా ఉన్న భవనంలోకి మారింది.

ఇక రెండోమార్పు ఏమిటంటే జనార్దన్‌కీ, యాదగిరికి హఠాత్తుగా మద్రాసునుంచి టెలిగ్రావు వచ్చింది. వాళ్ళిద్దరికీ తను డైరక్షన్‌ చేయబోతున్న సినిమాలోమంచి వేషాలివ్వబోతున్నట్టు బోసుబాబు ఆటెలిగ్రామ్‌లో తెలియజేశాడు. అప్పటికప్పుడే వాళ్ళిద్దరూ రడీఅయి మద్రాసుకిబయళ్టేరారు. మేమంతా స్టేషనుకి వెళ్ళాము సెండాఫ్‌ ఇవ్వడానికి. జనార్దన్‌ నిజంగా ఎప్పట్నుంచో సినిమాహీరోనన్నట్ట్లు ఫోజ్‌పెట్టి నిలబడ్డాడు ప్లాట్‌ఫారం మీద. 2268 హ్యామరాలజీ

"ఎమిటో గురూ! జనంలో అందరితోపాటు కలసి రోడ్డవెంబడితిరిగీ అవకాశం పోగొట్టుకుంటున్నాము- ' అన్నాడు జనార్ధన్‌.

“ఎందుకని?”

"రీపో పిక్చర్‌ రిలీజయిందంటే-రోడ్డుమీదకు రావటంకుదరదుగదా! ఎక్కడికక్కడ జనం మూగిపోతారు. మనదేశంలో ఇదో పెద్దహెడేక్‌. మా సినిమావాళ్ళకి అస్సలు స్వేచ్చ ఉండదు" అన్నాడు విచారంగా.

మాకు వళ్ళుమండిపోయింది వాడి వ్యవహారానికి. కానీ వెళ్ళేప్పుడు గొడవెందుకులే

/ అని ఊరుకున్నాం.

ఈ రెండు మార్పుల తర్వాత కాలనీ ప్రశాంతంగా ఉన్నట్లనిపించసాగింది. కానీ ఓవారం అయినా గడిచీ గడవకముందే మా తాతయ్యకు సీరియస్‌గా ఉన్నట్లు ఉప్పుమంచినుంచి టెలిగ్రామ్‌ వచ్చింది. కారంచేడు ప్రక్కనే ఉంది ఉప్పుమంచి గ్రామం. వెంటనే బయట్టేరి ఉప్పుమంచి చేరుకున్నాను. ఆ ఊరు నాచిన్నప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది. ఊరికి బస్సు, రైలు ఏమీలేవు. నేను బస్‌దిగే చోటకు మాబంధువు రామచంద్రంవచ్చాడు. చిన్నప్పుడు ఆ ఊళ్ళో వాడూనేనూ కలసి అయిదో కాస్‌ చదివాము. ఆతరువాత వాడుచదువాపేశాడు.

తాతయ్య అప్రక్కఊళ్ళోనే ఓనర్పింగ్‌హోమ్‌లో ఉన్నాడు. నేనూ రామచంద్రం కలసి

సైకిల్‌ మీద ఆఊరు చేరుకున్నాం అప్పటికే డాక్టర్లందరూ పెద్ద ఎత్తున డిస్కషన్స్‌ జరిపి "ఈ ముసలాయన ఇక బతకడు తీసుకెళ్ళిపోండి'" అని నోటీసిచ్చేశారు. మేమందరంకలసి తాతయ్యను ఓ బండిలో వేసుకుని 'ఉప్పుమంచి' చేరుకున్నాం. మిగతా ఎర్బాట్లు చేస్తే బాగుంటుందని రామచంద్రంతో అన్నానుగాని, రామచంద్రం నవ్వేశాడు 'అదేం అవసరంలేదు అన్నాడు. అంతలోనే తాతయ్యలేచి కూర్చున్నాడు. మరో ఇరవైనాలుగ్గంటల్లో ఆయన పరిస్థితి ఇంచుమించుగా నార్మల్‌ కొచ్చేసింది.

"మరి డాక్టర్లలా చెప్పారీమిటి? ఆశ్చర్యంగా రామచంద్రాన్నడిగాను.

"మా డాక్టర్లసంగతి నీకుతెలీదు! బ్రతకడు అంటే సేఫ్‌ అని అర్ధం. ఇంకేం ప్రాబ్లెమ్‌ లేదు-అంటే ఖాళీయేనని లెజ్బ-" అన్నాడునవ్వుతూ

మేము మాట్లాడుతూండగానే “బాంక్‌ మేనేజరుగారొచ్చారు రమ్మని “మావాడికి కబురొచ్చింది.

“పదరా! అలా వెళ్ళాద్దాం!” అన్నాడు వాడు. గేదెలకు చెవులుంటాయ్‌ 229

ఇద్దరం పంచాయితీ ఆఫీస్‌ దగ్గరకి వెళ్ళాం. ఆఫీసులో డి.ఆర్‌.టెలివిజన్‌సెట్‌ ఉంది. అప్పటికే ఆవసారాలలో కొంతమంది ఆఊరివాళ్ళుకూర్చుని ఉన్నారు. వాళ్ళకెదురుగ్గా కుర్చీలో ఒకాయన పాంటూ బుష్‌షర్టూ వేసుకుని కూర్చున్నాడు.

“ఆయన కొత్తగా వచ్చిన బాంక్‌మేనేజరు!” నాతో చెప్పాడు రామచంద్రం

సమావేశం ప్రారంభమయింది. మేనేజర్‌ గారు మాట్టాడడం ప్రారంభించారు. "మీ ఊళ్ళోపాతికమందికి బతుకు తెరువుకోనం-20 నూత్రాల వథకం కింద-గేదెలు కొనుక్కోవడానికి మా బాంక్‌ అప్పులివ్వడానికి నిశ్చయించుకుంది!" అన్నాడతను.

అందరూ పెద్దెత్తున కరతాళ ధ్వనులు చేశారు. విలేజ్‌డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌వచ్చి ఎవరెవరికి అప్పులిస్తోందీ చదివాడు. అందరూ మళ్ళీ తప్పట్లు కొట్టారు. ఓ మూలనుంచి ఓ యువకుడు లేచి నిలబడి గట్టిగా అరచాడు.

"అన్యాయం! వాళ్ళందరి దగ్గరా లంచం తీసుకుని మీరువాళ్ళకు అప్పులిస్తున్నారు-"

"ష్‌! ఎవరది-పెద్దాచిన్నా లేకుండా మాట్లాడుతున్నారు?" కోపంగా అన్నాడు మేనేజర్‌.

"నేనే!" అంటూ ముందుకొచ్చాడతను "అందరితో పాటు నేనూ అప్పుకోసంరాశాను. వాళ్ళకెందుకిస్తున్నారు, నాకెందుకివ్వటంలేదు? ఈ విషయమంతా ఇవాళే మనకేంద్ర డిప్యూటీ

మంత్రి జనార్ధన్‌ పూజారికి రాస్తాను-"

ఆడైలాగ్‌ బాగానే పనిచేసినట్టుంది. మేనేజర్‌ కర్చీఫ్‌తో మొహం తుడుచుకున్నాడు.

"లోన్స్‌ మేము అందరికి ఇవ్వటం కుదరదయ్యా! ఎవరెవరి పరిస్థితులెలా ఉన్నాయో గమనించి ఎంతో అవసరం ఉన్నవారిని మాత్రమే ఎన్నుకున్నాము."

"అదే జనార్దన్‌ పూజారికి రాస్తాను-"

దాంతో వి.డి.వో కల్పించుకోక తప్పలేదు

_ "ఇదిగో-గణపతీ నీకు నుయ్యి తవ్వుకోటానికి అప్పు ఇప్పిస్తాన్లే! అందరికి పశువులమీద అప్పు కావాలంటే ఎలా?” సర్ధిచెప్పబోయాడతను.

"అదివరక్కూడా నాకు నుయ్యితవ్వేఅప్పే యిప్పించావ్‌! ఇప్పుడూమళ్ళీ అదే ఇస్తానంటున్నావ్‌! ఎం?నేనంతవనికిరాని వాడినయిపోయానా? నాకుమాత్రం గేదెలోన్‌తీసుకోవాలని ఉండదూ? నాకుమాత్రం పెళ్లాం బిడ్డలులేరనా?"

వి.డి.ఓ.కి కోపం ముంచుకొచ్చింది.

230 హ్యామరాలజీ

“ఇదిగో గణపతీ! మర్యాదగా మాట్టాడు! నాలుగేళ్ళ క్రితం నీకు పాలంలేకపోయినా దొంగపట్టామీద ఎగ్రికల్చ్బరల్‌లోన్‌ ఇప్పించలేదూ? విశ్వాసం లేకుండా మాట్టాడతావేం?"

"ఊరికే ఇప్పించావేమిటయ్యా? ఎవరి కమీషన్‌ వాళ్ళకిచ్చానుగదా!"

ఈలోగా మిగతావాళ్ళు కొంతమంది కల్పించుకుని గణపతికి నచ్చజెప్పబోయారు.

“నాకిదంతా అనవసరమయ్యా! కోళ్ళఫారానికి నాక్కూడా అప్పుఇస్తానంటేనే ఊరుకుంటా! లేకపోతే కలెక్టరుగారికీ, మినిష్టరుగారికీ రాసేదిఖాయం-"

బాంక్‌ మేనేజర్‌ ఉల్కిపడ్డాడు.

" “కోళ్ళఫారం అంటే మాటలతోఉందేమిటి? ఎవరైనా మా పైవాళ్ళు ఇన్‌స్పెక్షన్‌కొస్తే పాతిక్కోళ్ళన్నా కనబడాలా? నువ్‌ నిజంగా కోళ్ళఫారం పెడతానని చెప్పు-తప్పకుండా లోన్‌ ఇప్పిస్తాను-" అన్నాడు ఆందోళనగా.

“నిజంగా కోళ్ళఫారం పెట్టేట్లయితే నువ్విచ్చేదేమిటయ్యా! రామ్‌ భరోసాబాంక్‌వాళ్ళు ఎంత లోన్‌ కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు-" /

ఇక లాభంలేదని రామచంద్రం వెళ్ళాడతని దగ్గరకు.

అయిదు నిముషాలు ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకున్నాక గణపతి మొఖంలోకి చిరునవ్వు తొంగిచూసింది. _

“నిజంగా నాకు 'బందిపోట్స్‌బాంక్‌' వాళ్ళతో గొట్టెల లోన్‌ ఇప్పిస్తావా?"

'తప్పకుండా ఇప్పిస్తానంటున్నాకదా! గొజ్జిల పెంపకం పథకంకింద బోలెడు డబ్బు అలాఉండిపోయిందట. వెంటనే ఎవడో ఒకడికి అప్పు ఇవ్వకపోతే మేనేజర్‌ ఉద్యోగం వూడిపోతుంది-తెలుసా?

“అంటే-మిగతా లోన్స్‌లాగా, గొర్రైలు కొనకుండానే, కొన్నట్లు నాటకమాడిలోన్‌ తీసుకోవచ్చుకదా?" అనుమానంగా అడిగాడు గణపతి.

“మరీ కొనకపోతే బాగోదురా! వందగొరైలకు బుణం తీసుకుంటున్నప్పుడు ఒకటిరెండు మేకలయినా కనిపించాలి! వాళ్ళకిెలాగూ మేకలకూ గొర్రైలకూ అంతగా తేడాతెలీదులే! ఎం ఫర్వాలేదు-”

గణపతి వెళ్ళిపోయాడు.

నాకక్కడి వ్యవహారాలన్నీ చూస్తూంటే మతిపోతోంది. మేనేజర్‌ మళ్ళీ మాట్లాడాడు. గేదెలకు చెవులుంటాయ్‌ 231

"రేపే మనం గేదెలను కొనేనిమిత్తం కంకిపాడు సంతకుబయల్టేరుతున్నాం. మీరందరి తరపునా ఒకరిని ప్రతినిధిగా మాతోపంపుతే మేముగేదెలుకొనుక్కుని తిరిగివస్తాం-"

“రామచంద్రమే వస్తాడు" అంటూ అరచారందరూ.

"నీకు ఈ వూర్లో మంచి పలుకుబడి ఉన్నట్టుందే?” అడిగాను రామచంద్రాన్ని. వాడు నవ్వేశాడు.

“"అదేంకాదులే! ఇలాంటి వ్యవహారాల్లో నాకు ఎక్కువ అనుభవం ఉంది! అందుకని నేనంటే మంచి గురివాళ్ళకు-"

"గేదెలు కొనడానికి పెద్ద అనుభవంకావాలా?" నవ్వుతూ అడిగాను.

"ఆ అనుభవం కాదులేరా! రేపు నువ్వూ వస్తావుగా మాతో! అక్కడచూద్దూగాని...”

ఇద్దరం సమావేశం ముగియగానే తిరిగివచ్చాం

తాతయ్య హుషారుగా మాట్లాడుతున్నాడివుడు.

"నేను టపా కట్టెస్తానని చెప్పారట ఆ నర్శింగ్‌హోమ్‌ వాళ్ళు! వాళ్ళందరూ టపాకట్టాల్సిందే నా కంటిముందు-'"

నేనూ, రామచంద్రం,మిగతా బంధువులూ, కలిసి మళ్ళీ తాతయ్యను నర్శింగ్‌హోమ్‌కి తీసుకిళ్ళాం.

డొక్టర్లందరూ తాతయ్యను చూసి భోరున ఆశ్యర్యపోయారు.

" "మేముస్వయంగా దగ్గరుండి ట్రీట్‌మెంట్‌ఇచ్చి బ్రతకడనిచెప్పినా ఈ కేసు ఎలా బ్రతికాడు? ఖచ్చితంగా బ్రతకుతాడు అని చెప్పినకేసేమో ఇందాకే పైలోకానికి వెళ్ళి పోయింది! ( భలే తమాషాగా ఉందే!” అన్నారు విస్తుపోతూ.

వెంటనే తాతయ్యను మళ్ళీ పరీక్షించి మళ్ళీఅరడజను రకాలటాబ్‌లెట్లు, ఇంజక్షన్లు, టానిక్కులు రాసిచ్చారు.

"'వెంటనేవెళ్ళి ఇవి పరమేశ్వరా మెడికల్‌షాప్‌లోనే కొనుక్కురండి! వేరేచోట కొనవద్దు!" అన్నాడు డాక్టరు.

"పరమేశ్వరా మెడికల్‌ షాపువాడు వీళ్ళకి బోలెడు కమీషన్‌ ఇస్తాడు! అందుకే అక్కడ కొనమంటారు! కిందటేడు దీపావళికి డాక్టర్లందరికీ తలోకారు బహుమతిగా ఇచ్చాడు-" అన్నాడు రామచంద్రం నాతో.

"నాలుగుకార్లు బహుమతిగా ఇచ్చేంత బిజినెస్‌ ఇచ్చారన్నమాట వీళ్లు-” ఆశ్యర్యంగా రామచంద్రం దగ్గరున్న మందుల కాగితం తీసుకుని చూశాను.

232 హ్యామరాలజీ

బి.సి. ఫోర్టకాప్సూల్స్‌ , బికాం ప్లెక్సుఇంజక్షన్లూ మల్టీవిటమిన్‌టానిక్‌లు రెండురకాలూ ఉన్నాయ్‌.

"ఇదేమిటి-ఇవ్వన్నీ ఒకటే కదా! ఇన్ని రకాలుగా రాశాడెందుకు?" ఆశ్చర్యంగా అడిగాను రామచంద్ర్రాన్ని.

“ఇవ్వన్ని ఒకటే మందా?"

"అసలదిమందుకాదు. బలానికి ఉపయోగించేవి. వీటిల్లో ఎఒక్కటి వాడినాచాలు. కావాలని ఇన్ని రకాలు రాశారు-" /.

ఇద్దరం మళ్ళీ డాక్టర్ల దగ్గరికి నడిచాము.

"ఇదేమిటి డాక్టరుగారూ-బి కాంప్లెక్స్‌ ఇన్నిరకాలవి రాశారు! ఏదయినా ఒక్కటి సరిపోతుంది కదా!"

డాక్టర్‌ నావేపు చిరాగ్గా చూశాడు.

"నేను డాక్టర్నానువ్వు డాక్టరువా?"

"మీరే డాక్టరండీ!”

"అయితే నువ్వెందుకు వెధవ్వాగుడు వాగుతున్నావ్‌? ఎదివ్వాలో, ఎదివ్వకూడదో నాకు తెలుసు. ముందవన్నీ కొనండి! ముసలాయన త్వరగాకోలుకుంటాడు.''

ఇద్దరం మెడికల్‌షాపుకెళ్ళి అవ్వన్నీ కొన్నాం. నాకు తెలుసు అవన్నీకొనటం వృధా

అని!

కేవలం మెడికల్‌షాపులోని స్టాక్‌ ఎక్కువమందితో కొనిపించటమే ఆ డాక్టర్ల ఉద్దేశ్యం.

నేనూ, రామచంద్రం, పశువుల డాక్టరూ, విలేజ్‌డెవలప్‌మెంట్‌ ఆఫీసరూ మర్నాడు తెల్లవారుజాముననే బయలుదేరి కంకిపాడు చేరుకుని ఓ హోటల్లోదిగాము.

అందరికీ బస్‌ టిక్కెట్లూ, హోటల్‌ బిల్లులూ రామచంద్రమే కట్టాడు.

కంకిపాడు ఊరంతా చాలా రద్దీగా ఉంది. ఎటు చూసినా సంతకు పోయే పశువులే. శుభ్రంగా రకరకాల ఫలహారాలుతిని అందరం సంతకు బయలుదేరాం. రామచంద్రాన్ని చూడగానే ఇద్దరు వ్యక్తులువచ్చి అతనినిచుట్టేశారు.

“"మాదగ్గరీ కొనండి రామచంద్రంగారూ! కిందటిసారి కూడా మీకునమ్మకంగా ఇచ్చాను గేదెలను, గుర్తుందికదా! అన్నాడొకతను గేదెలకు చెవులుంటాయ్‌ 233

"ఈసారి మాదగ్గరకొనండి రామచంద్రంగారు! అన్నీ ఫస్ట్‌క్షాస్‌గేదెలు పూర్తిగా రెండు చెవ్వులతో ఉన్నాయి. ఒక్కొక్కచెవీ ఆరీడుసార్లు కట్‌చేయటానికి పనికొస్తుంది!” అన్నాడు ఇంకొకతను.

"మా గేదెల్నేకొనండి రామచంద్రంగారూ! ఒక్కొక్కగేదెకూ ఈసారి వెయ్యిరూపాయ లిస్తాను-'' అన్నాడు మొదటివాడు.

"నేను పన్నెండు వందలిస్తాను"

"నెనూ పన్నెండు వందలిస్తాను"

"నేను షన్నెండొందల పాతికిస్తాను"

“నేనూ పన్నెండొందల పాతికిస్తాను"

“నేను పన్నెండొందల యాఖైఇస్తాను"

"ఏయ్‌! నీకేం మతిపోలేదుగదా! నీ స్వార్ధంకోసం మనలో మనమేపోటిపెడితే ఇద్దరికీ నష్టం కలగదూ?" వాళ్ళల్లో ఒకడు కోపడ్డాడు

"నువ్వే పోటీకొచ్చావ్‌!"

"నువ్వే వచ్చావ్‌-”

రామచంద్రం వాళ్ళిద్దరినీ సమాధానపరచాడు.

"అలా కొట్టుకోకండయ్యా! మీ ఇద్దరూజఒకటేననీ కేవలం నన్నుబోల్తా కొట్టించడానికే ఇలా నాటకమాడుతున్నారనీ నాకు తెలుసు. మొదటిసారి ఒక్కొక్కగేదరూ పదహారు వందలిచ్చారు-"

“పదాహారా?" ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు.

రామచంద్రం వాళ్ళను లెఖ్బచేయకుండా ముందుకి నడిచాడు. నేనూ అతన్ని అనుసరించాను. నాకు వాళ్ళ వ్యవహారం భాష-ఏమి అర్ధంకావటంలేదు. లావుగా, బలంగా ఉన్న గేదెలు బోలెడున్నాయ్‌ గానీ రామచంద్రం వాటివంకయినా చూడటంలేదు. అందరం వెళ్ళిబాగా ఎండిపోయి, కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఉన్న గేదెలదగ్గర ఆగాము. వాటి తాలుకా బ్రోకర్‌ పరుగుతో వచ్చాడు మాదగ్గరకు. "ఫస్ట్‌క్లాస్‌ గేదెలుసార్‌! రెండు చెవ్వులూ పూర్తిగా ఉన్నాయ్‌! పెద్దపెద్దగేదెలు. పూటకిఎనిమిది లీటర్ల పాలు ఇస్తాయ్‌! అంటే రోజుకి పదహారు లీటర్లపాలు అమ్ముకోవచ్చు-'

రామచంద్రం సంబరంగా నావేపు చూశాడు.

"చూశావా! ఇలాంటి గేదెలేకావాలి మనకు-" అన్నాడు

"నీకేం మతిపోలేదుకదా! చచ్చేట్లున్న ఈ గేదెలు ఎవరయినా కొంటారా?” 2౩4 హ్యామరాలజీ

"మాలాంటి బాంక్‌లోన్‌వాళ్ళందరం ఇలాంటివాటినే ఎన్నుకుంటాం!"

"అవి వాడుచెప్పినట్లు నిజంగా ఎనిమిదిలీటర్లపాలిస్తాయని నీనమ్మకమా?"

"పావు లీటరులో సగంకూడా ఇవ్వవని తెలుసు?"

నేనేమీ మాట్టాడలేదిక.

"ఎంత?" అడిగాడు రామచంద్రం అబోకర్‌ని.

"పదిహేనువందలిస్తాను!"

“రెండు వేలిస్తావా?"

అతను ఓక్షణం ఆలోచించాడు.

"పద్దెనిమిది వందలిస్తాను-"

"రెండు వేలివ్వకపోతే అఖ్బర్లదు-"

"వీటికి పూర్తి చెవులున్నాయండీ! పెద్దపెద్ద చెవులు-చూస్కూండి "రామచంద్రం అదేమీ పట్టించుకోనట్లు నడవబోయాడుగానీ బ్రోకర్‌ అడ్డుపడ్డాడు.

“సరే తీసుకోండి!”

నేను దగ్గరకళ్ళి వాటిచెవులను పరీక్షగా చూశాను. బమయినా ప్రత్యేకత ఉందేమోనని! కానీ నాకేం కనబడలేదు! రామచంద్రం ఉత్సాహాంగా బాంక్‌ మేనేజర్‌ దగ్గరకు నడిచాడు.

"ఇవి బాగున్నాయ్‌సార్‌! రోజుకి పదకొండులీటర్లపాలు ఇస్తాయ్‌-వీటి వయసుకూడా

, చాలా చిన్నది!” బాంక్‌ మేనేజరూ,విలే డెవలప్‌మెంట్‌ ఆఫీసరూ, గేదెలవంక చూళారు. "అవును! బాగానే ఉన్నట్టున్సయ్‌!" అన్నాడు వి.డి.ఓ.

_పశువులడాక్టర్‌ గేదెలదగ్గర కెళ్ళి అన్నిటినీ పరీక్షించాడు.

“చాలామంచి గేదెలు!” అన్నాడు తిరిగివచ్చి.

"ఏమిట్రా ఇది? ఇవాళో రేపో చచ్చేట్లున్న అఆముసలి గేదెలను పట్టుకునిమంచి గేదెలంటారేమిటి అందరూ? పైగా అవి పదకొండు లీటర్జ్లుపాలు ఇస్తాయని నువ్‌ కొత్తఅబద్దం చెప్తున్నావా?" రామచంద్రాన్ని రహస్యంగా అడిగాను.

"మీసిటీ జనానికి బొత్తిగా బుర్రలుండవురా! అందుకే అలా ఫకీర్లలాగుంటారు" అన్నాడు నవ్వుతూ

"అయితే వాటిని రెండువేలిచ్చి కొంటారన్నమాట మీరు!” గేదెలకు చెవులుంటాయ్‌ 235

"వీటికి రెండువేలు ఇచ్చేది మేముకాదు! విటిని కొన్నందుకు వాటియజమానులే మాకిస్తారు ఒక్కొక్కగేదెకూ రెండువేలు చొప్పున-"

నాకు మళ్ళీమతిపోయింది.

“అదేమిటి? వాళ్ళిందుకివ్వటం?"

“ఎందుకేమిటి? పోనీలేగదాని మేము ఆ పనికిరాని గీదెలను కొనటంలేదూ?"

"కానీ దానివల్ల నష్టం మీకేగా?"

"ష్‌! అందుకే సిటీబుర్రలు మట్టి బుర్రలన్నాను. అందుకే మీ నిర్భయ్‌ నగర్‌కాలనీ గురించి అన్నిసార్లు పేపరులో రాస్తున్నారు-"

రామచంద్రం మళ్ళీ ఆగేదెల బ్రోకర్‌ దగ్గరకు నడిచాడు.

“ఏం బాబూ! మరి మా అందరికీ ఖర్చులు కూడా నువ్వే ఇస్తావా?" బోకర్‌

చిరాకుపడ్డాడు.

"కుదరదండీ! ఈ గేదెల్లో ఆచివరినాలుగూ రోజుకి అర్ధపావుపాలు నిజంగా ఇస్తాయ్‌."

"వాటినెవడు కలపమన్నాడు ఈ ఎండిపోయిన గేదెల్లో?"

"ఈసారి ఎండిపోయినగేదెలెక్కడా దొరకలేదండీ! చాలా ప్రయత్త్సించాను. ఎక్కడా దొరకలేదనే నాలుగు పాలిచ్చేవాటిని కలిపితీసుకొచ్చాను-"

చివరకు ఖర్చులకు మరో అయిదొందలు అదనంగా ఇచ్చేందుకు వప్పుకున్నాడతను.

బాంక్‌ మేనేజర్‌ వెంటనే తన దగ్గరున్న బాగ్‌లో నుంచి డబ్బుతీసి ఒక్కొక్క గేదెకు ఆరువేలచొప్పున లెక్కబెట్టి పాతిక గేదెల సామ్మూ అతని కిచ్చేశాడు. ఆ బ్రోకర్‌డబ్బు తీసుకుని మళ్ళీ ఒక్కొక్కగేదెకు రెండువేలచొప్పున యాభయ్‌వేలరూపాయలూ రామచంద్రానికిచ్చేడు. ఆపైన మా ఖర్చులకు ఇంకోఅయిదొందలు కూడా ఇచ్చాడు. ఆతరువాత మళ్ళీ బాంక్‌ మేనేజరూ, పశువులడాక్టరూ, విలేజ్‌డెవలప్‌మెంట్‌ ఆఫీసరూ విడివిడిగా ఆబ్రోకర్‌ని పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా మాట్టాడారు.

దానితో కొనుగోలు తతంగంపూర్తయింది. మేమంతా హోటల్‌కివచ్చి మందూ, భోజనాలు కానిచ్చి తిరిగుముఖం పట్టాము.

"బస్‌లో మళ్ళీవాడిని కదిపాను. "ఎమిట్రా-మీ వ్యవహారం నాకేం అర్ధంకావటంలేదు- మీరసలు గేదెల్ని ఎందుకు కొన్నట్లు?"

_ "బాంక్‌ వాళ్ళు అప్పుతీసుకోమని బలవంతం చేస్తుంటే ఎం చేస్తాం మరి! మా వూరికి చుట్టుప్రక్కలూళ్ళల్లో నాలుగు బాంకులున్నాయ్‌. ఎప్పుడూ ఎదొకలోన్‌ తీసుకోమని మమ్మల్ని వేధించుకు తింటూంటారు వాళ్ళు-"

236 హ్యూమరాలజీ

"అదేమిటి అడక్కుండానే అప్పులిస్తారా?"

"నీ మట్టిబుర్రతగలెయ్యా! అందుకే మీకాలనీ అలా అఘోరించింది! నువ్‌ మీకాలనీ కమిటీ వైస్‌ పెసిండెంట్వికూడా! కదూ?"

“అవును"

"ఇంక మో కాలనీ వాళ్ళను దేవుడే రక్షించాలి! నీకు తెలుసో తెలీదో! ఒక బ్యాంకు మేనేజర్‌ ఎంచేశాడనుకున్నావ్‌? మా వాళ్ళందరికీ కోళ్ళఫారానికోనం తలో వదివేలూ లోన్‌ ఇవ్వాల్సివచ్చింది. ఇవ్వకపోతే వాడిఉద్యోగం గోవిందాకొడుతుంది! అవునా! ఆ పరిస్థితిఅంతా చెప్పేసరికి సరే పోనీలెమ్మని జాలిపడి అప్పు తీసుకోవడానికి వప్పుకున్నాం! తీరా ఇచ్చేముందు ఏమన్నాడో తెలుసా కోళ్ళఫారంఅంటే నిజంగాపెద్దఫారం లేకపోయినా కనీసం ఇంటికోపాతిక్కోళ్ళన్నాకనిపించాలి అని కండిషన్‌ పెట్టాడు. మాకు వళ్ళు మండిపోయింది. ఓపక్క లోనుతీసుకుని నిజంగా కోళ్ళు పెంచాలంటే ఎవడికయినా తిక్కపుట్టుకొస్తుంది గదా! అందుకని నీబోడిలోన్‌ మాకక్కర్లేదు పామ్మన్నాం. అప్పుడుచూడాలి వాడి తిప్పలు! ఫలానాతారిఖులోపల ఆడబ్బంతా అప్పులద్వారా పంచకపోతే వాడి ఉద్యోగం ఠా! ఇటేమో అందరంలోన్‌ అక్కర్లేదని తిరగబడ్డాం !చివరకు మా గడ్డంపట్పకుని బ్రతిమాలాడు ఓ రోజంతా! వాళ్ళావిడా పిల్లలుకూడా మావూరొచ్చి దీనంగా నిలబడేసరికి మాకుజాలేసింది. సరే పోనీలెమ్మని వప్పుకుని లోన్‌తీసుకున్నాం!”

"మరి పాతిక్కోళ్ళయినా ఉండాలన్న కండీషను మాటేమిటి?"

"ఆ కండీషన్‌ వదిలేసుకున్నాడు. అయితే ఎవరయినా పై అధికారులు ఇనిస్పెక్షన్‌ కొచ్చినప్పుడు మాత్రం ఎవరోఒకరికోళ్ళు ఓ అరడజను తీసుకొచ్చి చూపించమన్నాడు-"

"ఇంతకూ మీరీగేదెల్ని ఎందుకు కొన్నట్లు?"

“అర్జంటుగా డబ్బు అవసరం వచ్చింది. మా ఉప్పుమంచిలో ఎవరికి డబ్బు అవసరం వచ్చినా బాంక్‌కెళ్ళి ఎదోక స్కీమ్‌ కింద అప్పుతీసేసుకుంటాం!"

“మరితీర్చడం?"

రామచంద్రం విరగబడి నవ్వాడు.

"నీయవ్వ! అందుకే 'సిటీ' వోళ్ళంది. మరీ ఇంత దారుణమయిన మెదడు అనుకోలేదు గురూ మీది! బ్యాంక్‌లోన్లు ఎవరైనా తీరుస్తారా ఎక్కడయినా?” గేదెలకు చెవులుంటాయ్‌ 237

"తీర్చకపోతే వాళ్ళూరుకుంటారా?"

"ఎం చేస్తారేమిటి? ఇప్పటికి మేము అరడజనుసార్లు బాంక్‌ అప్పులు ఎగ్గొట్టాము. అవ్చులకింద లాక్కోడానికి మా దగ్గరేముందని! మా ఇళ్ళీ ఉన్నాయ్‌! అవేమో ప్రభుత్వంకట్టించిన ఇళ్ళాయె! వాటిని బాంకోళ్ళు తీస్కుంటే రాష్ట్రప్రభుత్వం ఊరుకోదుగదా! ఒకఅర్జీకలెక్టరికీీ ముఖ్యమంత్రికీ, కేంద్రమంత్రికీ కొట్టామంటే బాంకోళ్ళు తోక ముడుస్తారు."

"పోనీ ఎలాగూ బాంక్‌ వాళ్ళు మీకు గేదెలు కొనిస్తున్నప్పుడు, మంచిగేదెలు కొనుక్కుంటే మీకు లాభంగా ఉంటుంది కదా-"

వాడు నన్నోవాజమ్మను చూసినట్టు చూశాడు.

"గాడిదగుడ్డు లాభం! మా ఊర్జోపాలెవరు కొంటార్రా? ఇక మేమే తాగాలి రాత్రింబవళ్ళు! అయినా ఆగేదెలలా మాదగ్గరేపడుంటే మళ్ళీమళ్ళీ మాకు అప్పులెవరిస్తారు? నీసిటీమెదడు అస్సలులాభంలేదురా-"

రెండో రోజునే ఆగేదెలన్సీ మా ఊరికి చేరుకున్నాయి. గేదెలతోపాటు అందరికీ తలో రెండువేలూ పంచాడు రామచంద్రం. గేదెలన్నింటికి చెవులకు చిల్లులు పొడిచి టోకెన్లు కట్టారు. టోకెన్లు మీద"బోగస్‌ బాంక్‌వారి గోవు" అని రాసి ఉంది.

రెండు రోజుల తర్వాత తాతయ్యను మళ్ళీ నర్సింగ్‌ హోమ్‌కి తీసుకెళ్ళాము. అన్ని పరీక్షలూ జరిపి-మళ్ళీ బలానికి ఎనిమిది రకాల టానిక్కులూ, టాబ్లెట్లూ, కాప్సుల్స్‌ రాశాడు డొక్టరు.

“ఇవ్వన్నీ వాడండి! ఇవి వాడటం చాలా అవసరం! శుభ్రంగా లేచి తిరుగుతారు. మళ్ళీ వారంరోజులతర్వాతతీసుకురండి! అన్నారు వాళ్ళు.

"ఎమిటో చెప్పండి!”

“మాదోచిన్నరిక్వెస్టండీ " అన్నాన్నేను

"మీక్కావలసింది ఈ టానిక్‌లన్నీ మేము కొనడంవల్ల మీకొచ్చేకమీషన్‌ పెరగాలనే కదా! అమొత్తం ఏదో చెప్తే మేమే మో కిచ్చేస్తాం. అనవసరంగా ఆ చెత్తంతాకొనకుండా ఉంటే మాకూ లాభం-కమీషన్‌ముట్టడం వల్లమీకూ లాభం! ఎలావుందంటారు?"

"ఎడ్బినట్టుంది!” అన్నాడు డాక్టరు.

"ఎందుకనండీ?"

"ఇలాగయితే మాకొచ్చే ఫ్రశాంపుల్స్‌ ఎలా అమ్ముకోవటం?"

238 హ్యామరాలజీ

"ఆటానిక్‌లూ అవీ మీరేమీఇంట్లోకి వాడుకోవచ్చు గదండ్వీ! అసలే సన్నగా ఉన్నారు మీరు-"

"టానిక్‌లు తాగితే బలంవస్తుందేమిటి మో మొఖం! అవన్నీ తాగుతే లేనిపోని సైడ్‌ ఎఫెక్ట్‌కూడా వస్తాయ్‌-వెళ్ళండి-ముందు అవన్నీకొనండి-" అవన్నీ కొనుక్కుని ఇంటికి చేరుకున్నాము.

పది రోజులయిపోయింది. తాతయ్య పరిస్థితి పూర్తిగా బాగయిపోయింది. వచ్చిన బంధువులంతా తిరుగుముఖంపట్టారు.

ఆరోజు వముధ్యావ్నాం నేను రామచం౦ం[దం కోనం వూళ్ళోకీ వెళుతుంటే ఆరోజుకంకిపాడులో మాకుగేదెలమ్మిన బ్రోకర్‌ కనిపించాడు.

నన్ను చూస్తూనే గుర్తుపట్టాడతను.

"మీరుబ్యాంకు మేనేజరుగారు కదండీ! నమస్కారం!"

“కాదండీ! నమస్కారం!"

"అయితే మీరు ఇనిస్పెక్షన్‌ వాళ్ళా?"

"కాదండీ! రామచంద్రం ఫ్రెండ్‌ని!"

"ఓహో-అలాగా-అవున్లెండి! ఆరోజున వచ్చారుకదూ! రామచంద్రం ఎక్కడున్నారండీ-"

“పంచాయితీ ఆఫీస్‌ దగ్గర! నేనూ అక్కడికే వెళ్తున్నా పదండి!" ఇద్దరంబయల్టేరాము.

"మీరు మళ్ళీ వచ్చారెందుకు?" అడిగాను అనుమానంగా

"అదే! మాగేదెల్ని తోలుకుపోదామని!”

"మీగేదలా?"

"అవున్సార్‌! అమ్మాముకదా! అవే!"

మ "అవి మీవెలాఅవుతాయ్‌? వీళ్ళుకొన్నారుగా?"

"నేను కాదనటంలేదు కదండీ! ఇప్పుడు మళ్ళీ వాటిని కొనుక్కుపోదామని వచ్చాను-"

నాకు మతిపోయినట్లయింది

"మళ్ళీమోరు కొనటం ఎందుకు?"

"ఎందుకేముందిసార్‌! ఏదో పొట్ట తిప్పలు! మీకు తెలీందేముంది?" నవ్వుతూ అన్నాడతను.

నాకేం అర్ధంకావటంలేదు. రాన్రాను ఈ గేదెలొక పెద్దమిస్టరీ అయిపోతున్నా యనిప్‌ంచింది. గేదెలకు చెవులుంటాయ్‌ 239

పంచాయితీ ఆఫీస్‌ దగ్గర రామచంద్రంకొలువు తీరి రూర్చుని ఉన్నాడు. గేదెల్నికొన్న పాతికమంది అతని చుట్టూ మూగి అతను చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు.

"అడుగో-గేదెల పెద్దమనిషిరానే వచ్చాడు-" అన్నాడు రామచంద్రం నాపక్కనున్న అసామీని ఆనందంగా చూస్తూ.

అందరూ ఆనందంగా ఆతనివేపు చూశారు. 1

మేమిద్దరం వెళ్ళి రామచంద్రం పక్కన కూర్చున్నాం.

"ఎంతకిచ్చేద్దామంటారు చెప్పండి!" అడిగాడు రామచంద్రం వాళ్ళను. "వెయ్యి రూపాయలకు తక్కువలేదు-" అన్నాడొకతను.

“అవును! వెయ్యిురూపాయలకు ఒక్కపైసాకూడా తగ్గటానికి వీల్లేదు-" ఇంకొకతను కూడా అన్నాడు.

రామచంద్రం ఆగేదెల ఒరిజినల్‌ ఓనర్‌వేపు చూశాడు.

"మావాళ్ళు వెయ్యిరూపాయలకు తగ్గమంటున్నారు మరి-”

"అయ్యా! నేను ఎనిమిదివందలకంటే ఎక్కువివ్వలేనండి!” అన్నాడు గేదెల ఓనర్‌ బ్రతిమాలుతూ! |

“ఇవ్వకపోతేపోనీండి-ఏం చేస్తాం" ఆవ్యక్తి లేచి నిలబడ్డాడు గానీ, అతనికీ వెళ్ళబుద్ది కావటంలేదు.

"పోనీ ఎనిమిదివందల యాభయ్‌ చేసుకోండి"

"కురదయ్యా! వేరే వాళ్ళు వెయ్యి రూపాయలిస్తామంటున్నారు-" అన్నాడు రామచంద్రం ఖండితంగా.

అతను ఇంకాసేపు ఆలోచించాడు.

"సరీ కానీండి! తప్పేదేముంది?"

అందరూ ఆనందంగా అతనిచుట్టూ మూగారు. ఒక్కొక్కరికి వెయ్యిరూపాయల చొప్పున లెక్కగట్టి ఇచ్చేశాడతను.

"మరి వశువుల డాక్టరూ, వి.డి.వో, బాంక్‌మేనేజర్ల మాటేమిటి?" అడిగాడు రామచంద్రం.

"అదంతా నేను చూచుకుంటా గదయ్యా-"

మరికొద్దినిమిషాల్లో అందరూతాము కొన్నగేదెలను తీసుకొచ్చి వరునగా నిలబెట్టారు. ఓపెద్దకత్తెర తీసుకొచ్చాడు రామచంద్రం. వాటిచెవులకున్న టోకెన్సవరకూ చెవిముక్కలు కత్తిరించి ఆటొకెన్లన్నీ ఓసంచిలోవేశాడు. 240 హ్యామరాలజీ

గేదెల ఓనర్‌ ఆగేదెల్ని తోలుకెళ్ళి పోయాడు.

“ఆగేదెల్ని అతనికెందుకు అమ్మారుమళ్ళీ?" రామచంద్రాన్ని అడిగాను ఆశ్చర్యంగా. "డబ్బు వస్తుందికదా-అందరికీ పొద్దున్నపాద్దున్నే తలోవెయ్య్యి వచ్చిందా లేదా-” "వచ్చింది-"

"అద్గది నంగతి-.మనక్కావలసింది కాష్‌-అంతే! పద! పశువుల డాక్టర్‌ ఇంటికెళ్టాం-" అన్నాడతను.

అందరంకలసి పశువుల డాక్టర్‌ ఇంటికీ వెళ్ళాము. అందర్నీ చూడగానే డాక్టర్‌ మొఖం ఆనందంతో వెలిగిపోయింది.

"గేదెలుఅన్నీ చచ్చిపోయాయా?" అడిగాడు సంబరంగా.

"చచ్చిపోయాయండి!"

"ఒక్కటికూడా మిగల్లేదుకదూ?"

"ఒక్కటికూడా మిగల్లేదండి!"

"వాటికి ఆపాడుజబ్బు చేస్తే అంతే! ఒకే రోజున చచ్చిపోతాయ్‌-”

"అవునండీ-వెధవ జబ్బు-"

“మరి వాటినేంచేశారు?"

“"పాతేశామండీ!"

“మరి-వాటిచెవులకున్న టోకెన్లు కత్తిరించారా?"

"ఇవిగో-తెచ్చామండి-” అంటూ సంచీలో నుంచి టోకన్లతోసహా ఉన్న చెవిముక్కలు క్రుమ్మరించాడతను.

డాక్టర్‌ ఆనందంగా చూశాడు వాటివేపు.

"సర్టిఫికేట్స్‌ వారంక్రితమే రడీచేశాను-ఇవాళ్ళ తారీఖువేసి ఇచ్చేస్తాను-" అంటూ లోపలికెళ్ళి ఓఫైలు తీసుకొచ్చి సంతకాలు చేయడం ప్రారంభించాడు.

"వారంక్రితమే చచ్చిపోయుంటాయనుకున్నాను! ఈసారి ఆలస్యమయిందేం? ఇంతకు ముందు కొన్నగోవులన్నీ కొన్ననాలుగురోజులకే చచ్చేవికదా!” అడిగాడాయన.

"గేదెల ఓనరికి పాపం,డబ్బు దొరకలేదండీ! అందుకని ఆలస్యంగా ఇందాకే వచ్చాడు! రాగానే చచ్చిపోయినాయ్‌-"

| గేదెలకు చెవులుంటాయ్‌ 2డ1

సర్టిఫికెట్లు తీసుకుని బాంక్‌ మేనేజర్‌ ఇంటికెళ్ళాం అందరం మళ్ళీ ఊరేగింపుగా. =

“అమ్మయ్య! చచ్చిపోయినయ్యా! గొడవ వొదిలిపోయింది. ఎల్లుండి మా వాళ్ళు ఇనిస్పెక్షన్‌ కొస్తున్నారు-ఆగేదెల్ని చూస్తే మాట వస్తుందేమో అని ఒహటే భయపడుతున్నాను!" అన్నాడు బాంక్‌మేనేజర్‌ ఆనందంగా. ఈలోగా విలేజ్‌డెవలప్‌మెంట్‌ అఫీనర్‌ హడావుడిగా వచ్చాడు.

“ఇవాళైనా చచ్చిపోయినయ్యా?" అడిగాడతను రామచంద్రాన్ని.

“'అవునండి!"

"రక్షించారు! ఎరోజుకారోజే ఎదుర్పూస్తున్నాను! అవతల అకస్మాత్తుగా మాపిల్లలకు పరీక్షఫీజులు కట్టాల్సి వచ్చింది-ఈగేదెలు చావగానే ఫీజులు కబ్టేయొచ్చుకదాని ఆశతో ఉంటే- వీట్‌కేమో చావడానికి ఇన్నిరోజులు వట్టింది" అన్నాడతను అసంతృప్తిగా. నరిగ్గా అప్పుడే గణపతి వచ్చాడెక్కడినుంచో.

'నానంగతేమిటీ మరి! ఈ గేదెలగొడవంతా అయిపోయాక నాకు లోన్‌ ఇస్తానన్నారుగా?'' అన్నాడు దబాయింపుగా.

"వాడితోపేచీఎందుకు? ఏదోక పాయింట్‌కింద ఇచ్చిపారీయండి. ఎంతోకంత!" అన్నాడు రామచంద్రం బాంక్‌మేనేజర్‌తో "మనకిచాలాపాయింట్లున్నాయిగా!"

మేనేజర్‌ ఓ అప్టికేషన్‌ఫారం తీశాడు.

"దీనిమీద సంతకంపెట్టు!” అన్నాడతనితో.

గణపతి ఆ కాగితం తీసుకుని ఓసారిచూశాడు.

“అయిదువేలు లోన్‌ ఇస్తున్నట్లు రాశారు, అంతేనా" అడిగాడతను.

"అవును!"

“అయిదువేలు ముట్టినట్టునేను సంతకంపెడితే నాకుకాష్‌గా ఎంత ఇస్తారు?”

''మామూలేగా-కొత్తగా అడుగుతావేం? మూడువేలఎడువందలయాభయ్‌ కాష్‌ ఇస్తాము-"

"మిగతాడబ్బు ఏమవుతుంది? మీరుతినేస్తారుకదా?"

"నాకక్కర్లేదయ్య బాబు- మిగతాడబ్బు నువు తిరిగిచెల్లించినట్లు జమవేసుకుంటాం! ఎందుకంటే నీకిచ్చే మూడువేలబడువందల యాభయ్‌ రూపాయలూ ఐ.ఆర్‌.డి.పి.వాళ్ళు మాకు సబ్సిడీగా ఇచ్చేస్తారు- కనుక పన్నెండు వందలయాభై నువ్‌ కట్టేసినట్లు చూపిస్తే- ఆ ఎకౌంట్‌ వ్యవహారం క్లోజ్‌ అయిపోతుంది. ఎవరికీ నష్టంలేదు. నన్ను కూడా మాబాంక్‌ అధికారులు మెచ్చుకుంటారు-లోన్‌ అంతా రికవర్‌ చేసినందుకు!"

242 హ్యామరాలజీ

"నువు వచ్చినంత తీసుకుని సంతకంపెట్టరా-అవన్నీ నీకెందుకు?" అన్నాడు వి.డి.వో.

చిరాకుగా. గణపతి సంతకంపెట్టి చెక్కుతీసుకుని వెళ్ళిపోయాడు. అందరం ఇళ్ళకు బయబట్టేరాం. సాయింత్రం తాతయ్యను మెడికల్‌ చెకప్‌ కోసం మళ్ళీ అదే నర్సింగ్‌ హోమ్‌కి తీసుకెళ్ళాం. అప్పటికప్పుడే ఎక్స్‌రేలు, స్కానింగ్‌లూ, ఇ.సి.జి., బ్లడ్‌ టెస్ట్‌ అన్నీ అయిపోయాయ్‌.

"అన్నీ ఫరపెక్ట్‌గ ఉన్నాయ్‌. ఇంక మెడికల్‌ చెకప్‌ కూడా ఇప్పట్లో అవసరం లేదు!

క ఎందుకయినా మంచిది ఈ ఆరురకాల మందులు వాడండి-" అన్నారు నర్సింగ్‌హోమ్‌ డాక్టర్లు, వెయ్యి రూపాయలు ఫీజ్‌ తీసుకుని. ఆ ఆరూ ఆరురకాల టానిక్‌లు!

"అన్నీ బాగుంటే ఇంక ఇవెందుకు?" అడిగాను డాక్టర్‌ని.

'మెడీసిన్‌ మాకు తెలుసా? నీకు తెలుసా?" అడిగాడతను కోపంగా.

“మీకే తెలుసులెండి-"

“మరి తెలివితక్కువగా మీరెందుకు మాట్లాడుతున్నారు?"

మాట్లాడకుండా అన్నిటానిక్కులు కొనుక్కుని ఇంటికి చేరుకున్నాం.

మరో రెండురోజులు గడిచిపోయినాయ్‌. ఆ రోజు తెల్లారుజామునే బాంక్‌ మేనేజరు పరుగుతో వచ్చాడు మాఇంటికి.

“రండి కూర్చోండి! అన్నాడు రామచంద్రం.

"కూర్చోడానికి రాలేదు రామచంద్రం! కొంపలు అంటుకున్నాయ్‌ అవతల-"

"ఏం జరిగిందిసార్‌?"

"ఫైనాన్స్‌ మినిఫ్టీ అధికారులు, ఆర్‌.బి.ఐ. అధికారులు కలసి మాబ్రాంచ్‌లోన్స్‌ ఇనిస్పెక్షన్‌ కొస్తున్నారట! అర్జంటుగా పాతికమందిని ఎవర్షయినా పట్టుకురా! తలో అయిదువేలూ ఇచ్చెస్తాను-"

రామచంద్రం విసుక్కున్నాడు. “ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా సార్‌! కొంచెం టెమిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరెక్కడ తాగి పడుకున్నారో తెలీదు-'

"బాబ్బాబు! నీకు రెండు పేర్లమిద పదివేలిస్తాను-త్వరగా తీసుకురా!” రామచంద్రంతో పాటు నేనూ బయల్ట్దేరాను-మరో గంటసేపటికి పాతికమందిని పోగేసుకుని వచ్చాము. అందరికీ తలో అయిదువేలూ ఇచ్చేసి సంతకాలు తీసుకున్నాడు మేనేజరు. గేదెలకు చెవులుంటాయ్‌ 243

"మరి పూచీకత్తు సంతకాలు అవసరం లేదూ?" అడిగాడు రామచంద్రం.

అయిదువేలకి పూచీకత్తులూ అక్కర్లేదు, సంతకాలూ అక్కగర్రైదు. అసలు కాగితాలు కూడా అవసరంలేదు."

"మరి వాళ్ళు లోన్‌ఎగ్గొడితే!” అడిగాను నేను.

"ఎగ్గొట్టనీయండి! ప్రజలసొమ్ము ప్రజలేతింటున్నారు-తప్పేముంది? మాకు ప్రభుత్వ ఆదేశాలు అలా వున్నాయ్‌-"

నాకు హఠాత్తుగా ఆశ పుట్టింది

"అయితే నాకూ అయిదువేలిస్తారా?" అన్నాను ధైర్యం తెచ్చుకుని.

"మీకా-మీదీ ఊరుకాదుగదా?" అనుమానంగా అడిగాడతను.

"ఈ ఊరు వాడినేనని రామచంద్రం సాక్ష్యం ఇస్తాడు!"

మేనేజర్‌ రామచంద్రం వేపు చూశాడు.

''అవునండి-అందులోపెడ్ద ఇదేముంది? ఓ అయిదువేలు ఇచ్చేయండి! పిలలుగలవాడు. పాపం!”

మేనేజర్‌ అయిష్టంగానే అయిదువేలకి చెక్‌రాసిచ్చి నాసంతకం తీసుకున్నాడు.

"రేపాద్దున్నే మనం కంకిపాడు వెళ్ళివద్దాం. మన వాళ్ళందరికీ గేదెలు కొనేస్తే మొత్తం లోన్స్‌కి నంబంధించిన డబ్బంతా ఖర్చు చేసినట్లయిపోతుంది- అన్నాడు మేనేజర్‌ రామచంద్రంతో.

నేను ఉలిక్కిపడ్డాను గానీ మాట్లాడలేదు.

మర్హాడుపొద్దున్నే రామచంద్రం కంకిపాడువెళ్ళాడు. ఆరెండోరోజున మేము పంచాయితీ ఆఫీస్‌ దగ్గర కూర్చున్నప్పుడు కంకిపాడు నుంచి గేదెలు వచ్చేసినయ్‌. వాటిని చూస్తూనే ఉక్కిరిబికిరయ్యాను. అవేగేదెలు! కాకపోకే మరింత ఎండి-మరింత త్వరగా చచ్చేట్లు కనబడుతున్నాయ్‌. వాటన్నింటికీ కొంతభాంగం చెవిముక్కలు ఇటీవలే కత్తిరింపబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

"ఎమిటి? మళ్ళీ అవగేదెలు కొన్నారా?" అడిగాను రామచంద్రాన్ని.

"అవును! ఈసారి ఒకోదానికి రెండువేలఅయిదొందలవరకూ వచ్చింది కదా మరి! అంతరేటు ఇంకెవరూ ఆఫర్‌ చేయలేదు-" నాకు మతిపోయినట్లయింది.

ఆరాత్రి తాతయ్యపరిస్థితి హఠాత్తుగా క్షీణించటం ప్రారంభమయింది. నర్సింగ్‌ హోమ్‌కి బయలుదేరాం."ఆరోగ్యం ఫర ఫెక్ట్‌గా ఉందన్నారు కదా-అన్ని పరీక్షలూజరిపి? అశ్చర్యంగా రామచంద్రంతో అన్నాను. 244 హ్యామరాలజీ

అంత సీరియస్‌ పరిస్థితిలో కూడా తాతయ్యనవ్వాడు.

"వాళ్ళ పరఫెక్ట్‌ అన్నారంటే తప్పక ప్రమాదం ముంచుకొస్తుందని నేను చెప్తూనే ఉన్నాను గదుట్రా!"

మరికాస్త దూరం వెళ్ళేసరికి తాతయ్యకు వెక్కిళ్ళు ప్రారాభమయాయ్‌. మాకుగాభరా ఎక్కువయింది.

మరికొద్దిక్షణాలు గడిచేసరికి తాతయ్య ప్రాణాలుకాస్తా పోయాయ్‌. నాడి పట్టుకుని చూసి “అయిపోయింది” అన్నాడు రామచంద్రం.

"వెనక్కు వెళ్ళిపోదామా?" అడిగాను

"ఇంతదూరం వచ్చాంకదా! నర్సింగ్‌ హోమ్‌లో చూపిద్దాం ఓసారి!” అన్నాడతను. నర్సింగ్‌ హోమ్‌కి చేరుకోగానే తాతయ్యను '్రైచర్‌మీద ఎమర్జెన్సీ రూమ్‌లోకి తీసుకెళ్ళారు. ఇద్దరు డొక్టర్డు ఆయనను పరీక్షించటం ప్రారంభించారు.

"దారిలోనే ప్రాణంపోయింది" అన్నాన్నేను.

"ఆవిషయం చెప్పాల్సింది మేము-" అన్నాడు డాక్టర్‌. నేనిక మాట్లాడలేదు. అప్పటికప్పుడే మళ్ళీ పరీక్షలు ప్రారంభమయాయ్‌. స్కానింగ్‌, ఇ.సి.జి. ఎక్స్‌రీలు-

రెండుగంటల తర్వాత ఎమర్లెన్సీ రూమ్‌లోనుంచి బయటికొచ్చారు డాక్టర్లు.

“చనిపోయాడు తీసుకెళ్ళిపోండి-” అన్నాడు జాలిగా.

"ఆసంగతి మేము అప్పుడే చెప్పాం కదా!” అన్నాడు రామచంద్రం.

"మీరు చెప్తే ఎలా కుదురుతుందయ్యా- మేము చెప్పాలిగాని- వెయ్యిరూపాయలు ఈ టెస్ట్‌లన్నింటికి ఫీజుకట్టండి."

"కానీ చనిపోయిన వాడికి ఆ పరీక్షలన్నీ ఎందుకు చేసినట్లండీ?” అడిగాను ఆశ్చర్యంగా.

"మెడిసిన్‌ చదివింది మీరా, మేమా?”

“"మీరేనండి!”

"అయితే తలలేని ప్రశ్నలు మీరు వేస్తారెందుకు?"

"సారీ సార్‌! మీరే వేయాలి!"డబ్బు కట్టి ఇంటికి చేరుకున్నాం! నా ప్రయాణం మరో వారం రోజులు వాయిదా పడింది. బాంక్‌ అధికారులు, కేంద్రం ఫైనాన్స్‌ మినిస్ట్రీ అధికారులు ఊరికి విచ్చేశారు. గేదెలకు చెవులుంటాయ్‌ 245

పెద్దెత్తున లోన్‌మేలాఫంక్షన్‌ ఎర్పాటుచేశారు రెవిన్యూఅధికారులు,.

ఊళ్లోమరికొంతమందికి చెప్పులు కుట్టుకునే మిషన్లు, కొంతమందికి మంగలిషాపు 'పెట్బకోవడానికీ, మరికొంతమందికి చేపలు పట్టుకునే వలలు కొనుక్కోవడానికీ అప్పులు పంచిపెట్టారు వాళ్ళు. జనగణమన పాడాక ఎవర్జారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడే ఆయా మిషన్లు, మంగలిషాపు పరికరాలు, చేపలు పట్టే వలలూ అన్నీ రామచంద్రం సాయంతో పట్నంలో అమ్మివేసి డబ్బుతీసుకుని ఆనందంగా తిరిగివచ్చారువాళ్ళు.

నేను ఆరోజు ఉదయమే హైద్రాబాద్‌ ప్రయాణమయ్యాను. రామచంద్రం నన్ను బస్‌ ఎక్కించడానికి తనూబయట్టైరాడు.

ఇద్దరం పంచాయితీ ఆఫీస్‌ దగ్గరకొచ్చేసరికి అక్కడ వారం క్రితంఉన్న అవే గేదెలు మళ్ళీలైనుగా నిలబడి ఉన్నాయ్‌. వాటిచెవుల సైజు ఇంకొంత తగ్గిపోయింది ఇప్పుడు! ఆ గేదెలు అమ్మినబ్రోకరు ఆనందంగా వాటిని తోలుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాడు మళ్ళీ.

"ఇలా ఎన్నిసార్లు వీటినికొని అమ్ముతారు?" అడిగాను రామచంద్రాన్ని వాడు నావంకహేళనగా చూశాడు.

"మీ సిటీవాళ్ళకు బొత్తిగా బుర్రలుండవ్‌రా! అందుకే మీ కాలనీ అంతా నవ్వుల పాలవుతోంది! ఎన్నిసార్లు కొనడమేమిట్రా? బాంక్‌లో అప్పులకోసం కేటాయించిన మొత్తం అయిపోవాలి! లేదా ఆగేదెల చెవులు మొతానికి తెగిపోవాలి! ఎదిముందు జరిగితే అది! అప్పుడు వాటిక్రయవిక్రయాల కార్యక్రమం ముగుస్తుందన్న మాట!"

"అంతవరకూ ఇలా కొనడం-అమ్మడం జరుగుతూనే ఉంటుందా?"

"అవును"

"ఆ తరువాత మీ బ్రతుకుతెరువు మాటేమిటి?"

"పిచ్చివాడిలాగున్నావే! అప్పులంటే కేవలం గీదెలొక్కటే అనుకున్నావా? గేదెలు, ఆవులు, మేకలు, గొరైలు, కోళ్ళు, పిట్టలు, చేపలు, కప్పలు-ఎన్నిరకాలు కావాలంటే అన్నిరకాల లోన్లు దొరికుతాయ్‌. సంవత్సరానికి నాలుగులోన్లు దొరికితే చాలు. హాయిగా గడిచిపోతుంది. జీవితం-"

ఇద్దరం బస్‌ స్టాండ్‌కి చేరుకున్నాం. అక్కడ చెట్టకింద ఓ మునలాడు గోచీపెట్టుకుని,చిరిగిన బనీనుతో నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఓ బక్కచిక్కిన స్త్రీ నిలబడిసన్నగా రోదిస్తోంది. పొడుగాటి పిగిలిపోతున్న చీరముక్కను తన ఎండిన శరీరానికి 246 హ్యామరాలజీ

చుట్టుకుని ఉందామె. ఆమె చంకలో మూడేళ్ళ పిల్లడు మూలుగుతున్నాడు. చిరుగుల దుప్పటి ముక్కతో వాడికి కప్పినా, వాడి పెద్దతల నన్నగా చీపురు పుల్లల్లా ఉన్న కాళ్ళూచేతులూ, బయటకు పొడుచుకొచ్చిన బొమికలూ స్పష్టంగా కనబడుతున్నయ్‌.

"ఏంట్రా ముసలయ్యా-ఎమయింది?" అతన్నడిగాడు రామచంద్రం.

"పదిరోజుల్నుంచీ ఆ పిల్లడికి తిండిలేదు. నిన్న సందేళనుంచీ ఆడి ఒళ్ళు ఆగ్గిలాగా కాల్లాంది. పట్నం తీసుకెళ్ళి పెభుత్తాసుపత్రిలో సేరుద్దామనీ-" అన్నాడతను.

నాగుండె కలచివేసినట్లయింది వాళ్ళపరిస్థితి చూస్తూంటే.

"వీళ్ళుకూడా మీఊరివాళ్ళేనా?" అడిగాను రామచంద్రాన్ని.

"అవును"

"ఇంత దారుణమయిన పరిస్థితిలో వీళ్ళుంటే-బాంక్‌లూ, ప్రభుత్వమూ ఎవరూ వీళ్ళకి సహాయంచేయరా?"

రామచంద్రం చిరాకుపడ్డాడు.

"థూత్‌-ఏం ్రశ్నరా ఇది! అందుకే మీ నిర్భయనగర్‌ కాలనీ వోళ్ళు-"

వాడిమాట పూర్తి కాకుండానే బస్‌ వచ్చింది. నేను ఎక్కాను. అఆ ముసలాడూ, ఆ స్త్రీ కూడా ఎక్కబోయారు గానీ కండక్టర్‌ ఎక్కనీలేదు.

"మీ పాసింజర్‌ వెనుక వస్తోంది-అందులో ఎక్కండి! ఇందులో చార్జీలు ఎక్కువ-" అంటూ బెల్‌ కొట్టాడు. వెళ్ళుతున్న బస్‌ లోనుంచి వాళ్ళవేపు చూడ్డానికి ప్రయత్నించాను గొనీ బస్‌ లేపిన దుమ్ములో వాళ్ళ ఆకారాలు కనిపించలేదు. వో

(న స్స కయ్‌ాయ్య

గేదెలకు చెవులుంటాయ్‌ 247

పై న్‌ యే 4. అకనతులటునతుతున యుత | 4 గ క్త నా ళో

రాత్రి పన్నెండవుతోంది. “

దిల్‌షుక్‌నగర్‌ ప్రాంతంలోని రోడ్లన్నీ పదిగంటలనుంచే క్రిక్కిరిసిపోయి ఉన్నాయ్‌.

నేనూ, రంగారెడ్డీ, శాయీరామ్‌, గోపాల్రావ్‌, యాదగిరీ, చంద్రకాంతఛటోపాధ్యాయ్‌ అందరం ఆజనంలోనే యిరుక్కుని నిలబడ్డాము. పోలీసులు జనం రోడ్‌మీదకొచ్చినప్పుడల్లా వాళ్ళను విజిల్స్‌ద్వారా లాఠీలద్వారా బెదరగొట్టి వెనక్కుతోసేస్తున్నారు. ఆహడావుడిలో వచ్చి ఆగింది ఓనల్లనివ్యాన్‌.

“పరీక్షారధం పరీకారధం" అని జనం అనుకోవటం, యజ్ఞం జరిగినప్పుడు వల్లించే సంస్కృత శ్లోకాల్లా వినబడుతోంది.

ఆవ్యాన్‌మీద రంగుబల్బులతో రాసిన "పరీక్షారధం” అనే అక్షరాలు ఆరుతూ వెలుగుతూ కనబడుతున్నాయ్‌. ఆ వ్యాన్‌ టాప్‌ మీద కొచ్చి నిలబడ్డాడు ఓ వ్యక్తి. 248 హ్యామరాలజీ

"భాయియో, బహెనో-మెహర్చానీ కర్‌కే ఖామోష్‌రహియే-" అంతా నిశ్ళబమయిపోయారు. "మొదలు మేము టెన్స్‌ క్లాస్‌కొశ్చెన్‌ పేపర్లు ఇచ్చెడిదున్నది. దాన్ని గురించి ఇంటర్మీడియట్‌ పేపర్లు కావల్సినోళ్ళు జరా వెనక్కు నిలబడండి." కొద్దిసేపు తోపులాటలు, కుమ్ములాటలు జరిగినయ్‌. మరోవ్యక్తి వ్యాన్‌టాప్‌ మీద కొచ్చాడివ్పుడు. "మొదట టెన్త్‌క్లాస్‌ సైన్స్‌పేపర్‌ ఇస్తున్నామండి! ఎవరికండీ సైన్స్‌ పేపర్‌? క్యూలో వస్తే త్వరత్వరగా ఇచ్చేయటానికి వీలవుతుంది-" జనంలోనుంచి హర్షధ్వానాలు వినిపించాయ్‌. వెంటనే పోలీస్‌ వాళ్ళ సహాయం లేకుండానే క్యూ తయారయింది. , "సైన్స్‌ పేపర్‌-కేవలం అరవై నాలుగురూపాయల డెబ్బయ్‌ పైసలు. అందరూ కాష్‌ రడీగాపట్టుకోండిసార్‌-" యాదగిరి కోపంగా వాన్‌ దగ్గరకు నడిచాడు. "క్యా హైమియా! నీయిష్టమొచ్చిన లెజ్జ్బ ధరచెప్తున్నాన్‌ ఎమి సంగతి? మోజంజాహి .. మార్కెట్ల అరవై రుండ్రూపాయాలికే ఇస్తున్రుగదా?" అన్నాడతను. "అక్కడ నర్కిల్‌ ఇనిస్పెక్టర్‌ మంచాయనసార్‌! చాలా రీజనబుల్‌రీట్స్‌లో ఉంటాయివాళ్ళ మామూళ్ళు."' “ఆసంగతలావుంచి డెబ్బై పైసలేమిటి? ఇందులో చిల్లరవ్యవహారమేమిటయ్యా మళ్ళా-" అడిగాడు గోపాల్రావ్‌. "దానికి మనమేమీ చేయలేం సార్‌! స్థానిక పన్నులు అదనం అనిమీకూ తెలుసుకదా?" "పరీక్షల ప్రశ్నాపత్రాలకు స్థానిక పన్నులా?" "అవున్సార్‌! సేల్స్‌టాక్స్‌-! అమ్మకాలు జరిగిన ప్రతి వస్తువుకి 'సేల్స్‌టాక్స్‌' కట్టక తప్పదుగదండి- “అదేంకుదరదు. అరవైరండ్రూపాయలకు ఒకపైసాకూడా ఎక్కువివ్వం-'" అన్నాడు రంగారెడ్డి కోపంగా. "ఇవ్వకపోతే పోవయ్యా-నువ్వు కొనకపోతే ఇంకోడు కొంటాడు" అన్నాడా వ్యక్తి. ఫర్‌ సేల్‌ 249

ఆమాటతో మా అందరికీ కోపంవచ్చింది.

' "సోదరులారా! అరవైరెండ్రాపాయలకిచ్చే వరకూ మీరివరూ ఈ (వ్రళశ్చా పత్రాలుకొనవద్దు-” అంటూ అరచాడు శాయీరామ్‌.

"అవునూ-కొనొద్దు" అంటూ అరచాం మేమందరం. అయితే మా మాట ఎవరూ వినిపించుకోకుండా ఎవర్జారిన వాళ్ళుకొనుక్కువెళ్ళటం చూసేనరికి మా అరువులు విరమించుకుని మేమూ వెళ్ళి క్యూలో నిలబడ్డాము.

కాసేపట్లో ఆప్రశ్నాపత్రాలు అమ్మటం పూర్తయింది. ఈ లోగా ఇంకో కొత్తబండిల్‌ మరో కార్లో వచ్చింది.

"సోదరులారా! లెక్కలపేపర్లుకూడా ఇప్పుడే వచ్చాయి. తాజా సరుకు! ఒక్కొక్కటి ఢబ్బై ఆర్రూపాయల-నలభై ఎనిమిది పైనలు (ఇంక్షూడింగ్‌ ఆల్‌టాక్సెస్‌) త్వరగా = కావలసినవాళ్ళు “క్యూ కట్టండి" అంటూ మైక్‌లో అరచాడా వ్యక్తి,

అందరూ మళ్ళీక్యూలో జొరబడ్డాము.

నగంపేవర్లు అమ్మారోలేదో వాఠాత్తుగా పెద్దపైరన్లతో పోలీనస్‌కార్లు, జీప్‌లు, వచ్చినిలబడ్డాయక్కడ. వాటిల్లో నుంచి బిలబిలమంటూ పోలీసులు దిగారు. ఆపరీక్ష 'పేపర్లమ్మే వాళ్ళను అరెస్ట్‌ చేస్తారని అనుకున్నారందరూ. తీరా చూస్తేవాళ్ళు హెల్మెట్‌లేకుండా మోటర్‌ సైకిల్సుమీద కూర్చున్న కొంతమందిని చెలాన్‌చేసి తలో ఇరవైరూపాయలూ వసూలు చేశారు. ఆ తరువాత తాగుడు వాసన వస్తున్న మరో అయిదారువందలమందిని చెలాన్‌ చేసేశారు. అక్కడితో ఆగక ట్రాఫిక్‌ జామ్‌ అయేందుకు కారణమ యారన్న నెపం మీద మరో పదిమంది తోపుడుబండి వాళ్ళనూ, రాత్రిళ్ళుహోటళ్ళు తెరిచి ఉంచినందుకు హోటల్‌ వాళ్ళనూ కూడా చెలాన్‌ చేశారు. ఆఖరులో “పరీక్షారధం" దగ్గరకొచ్చారు.

“ఎవరిదయ్యా ఈవాన్‌?" అడిగాడు అధికారి బండగొంతుకతో

"మాదే సార్‌”

"రాంగ్‌పార్కింగ్‌ ఎందుకు చేశావ్‌?"

"పార్కింగ్‌బోర్డు ఉందిసారిక్కడ'' అంటూ ఆ వాన్‌ వాళ్ళే తెచ్చి పాతిన ఓ బోర్డు వంక చూపాడతను.

అధికారికేం మాట్లాడాలో తెలీలేదు.

"సరే-మా ఆఫీసర్లకు... టెన్స్‌ ఇంటర్‌ రెండు సెట్లు కొళ్చెన్‌పేపర్స్‌ కావాలి! త్వరగా ఇవ్వు" దర్పంగా అడిగాడతను.

250 హ్యూమరాలఖీ

“రెండు సెట్లకూ కలిపి ఆరొందల తొంభయి రూపాయలు ఇవ్వండి సార్‌! పోలీస్‌ అధికారికి కోపం ముంచుకొచ్చింది.

| "ఏమిటి? మేముకూడా డబ్బివ్వాలా?"

“అవున్సార్‌! మేము మాత్రం పోలీస్‌ డిపార్టుమెంట్‌ వాళ్ళకు డబ్బుకట్టాద్దాసార్‌?"

"అయితే ఫ్రీగా ఇవ్వవన్నమాట."

“"ఇవ్వంసార్‌"

"అయితేసరే-ఎయ్‌ ఎయిట్‌ఫార్టీ! వీళ్ళందరినీ మనవాన్‌ ఎక్కించు" అన్నాడతను కసిగా

“ఎందుకు సార్‌? మేమేంనేరం చేశాం?" కోపంగా అడిగాడావ్యక్తి

"మీరు నగ్జలైట్‌ కార్యకలాపాల్లో పాల్గొాంటున్నట్టు మాకిప్పుడే ఇన్‌ఫ్మేషన్‌ వచ్చిందని అంటాను. కాదని ఎవడు బుిజువు చేస్తాడు."

వాళ్ళు వెంటనే వాన్‌ దిగి ఆ అధికారుల కాళ్ళ మీద పడిపోయారు.

“సరేసార్‌-కొళ్చెన్‌ పేపర్స్‌ సగంధర కిస్తాం! తీసుకోండి."

| “కుదరదయ్యా ఫ్రీగా కావాలి! అంతే! కొత్తపద్దతులు ప్రవేశపెడుతున్నారేమిటి మీరు?" వ “పోనీ వందరూపాయలయినా ఇవ్వండి సార్‌”

"ఎయ్‌! మాలో ఎవరయినా ఎప్పుడయినా జేబులో నుంచి డబ్బు తీయటం

చూశావా నువ్వు" "లేద్సార్‌" “మరింకా పిచ్చివేషాలేస్తావెందుకు? అయినా నీహెల్మెట్‌ ఎదీ?"

“నాకెందుకుసార్‌-నాకు మోటర్‌సైకిల్‌ లేదుగా?”

"వాట్‌? మోటరుసైకిల్‌ కూడా లేదా? దిసీజీ టూమచ్‌! హెల్మెట్‌ ఒక్కటీ లేదంటే ఎలాగోలా జాలిపడి వదిలేవాడిని! మోటర్‌సైకిల్‌ కూడా లేదంటే నువ్వెంత డేంజరస్‌ ఫెలోవో తెలుస్తోంది. ఎయ్‌ ఎయిట్‌ ఫార్టీ-వీడిని లోపల ఏసేయ్‌."

“గొడవెందుకులెండి సార్‌-ఇవిగో! కొళ్చెన్‌ పేర్లు, వెళ్ళిపోండిక-''పోలీస్‌వాన్‌లన్నీ వెళ్ళిపోయాయి.

క్యూ మళ్ళీముందుకు జరిగి హఠాత్తుగా ఆగిపోయింది ఫర్‌ సేల్‌ 21

"ఎమిటి? మీరు ఎడ్యుకేషన్‌ డిపార్చుమెంటులో పనిచేస్తున్నారని కన్సెషన్‌ రేట్లో ఇవ్వాలా? చాల్చాల్లే వెళ్ళండయ్యా! అందరికి ఫ్రీలు, కన్సెషన్లు ఇచ్చి ఇంక మేమేం తినాలయ్యా మట్టి? ఇష్టమయితే ఫుల్‌రేటుకి తీసుకోండి-లేదంటే లేదు."

వాళ్ళు గొణుక్కుంటూ ఫపులరీటుకి కొనుక్కోక తప్పలేదు. మేము డబ్బు కట్టి పేపర్లన్నీ తీసుకునేసరికి తెల్లారుజామున మూడయింది. మా కాలనీ వాళ్ళాందరూ ఆడా మగా పిల్లాపీచూ- అందరూ మాకోసమే ఎదురుచూస్తూన్నారక్కడ ఆత్రుతగా.

శాయీరామ్‌ ఉత్సాహంగా మైక్‌ దగ్గరకు నడిచాడు. చాలా రోజుల తరువాత అతనికి మళ్ళీ మైక్‌ముందు నిలబడేఅవకాశం వచ్చినందుకు ఎంతఆనందంతో ఉన్నాడో అతని కళ్ళు చూస్తేనే తెలిసిపోతోంది.

"సోదరీ సోదరులారా! ఇంతకాలంగా మనందరం పరీక్షల ప్రశ్నాపత్రాలు కొనకుండా మన కాలనీ పిల్లలతో పరీక్షలు రాయించాము. అందువల్ల నగరంలో మిగతా విద్యార్భులందరికీ డిస్టింక్షన్స్‌ వస్తే మన కాలనీ వాళ్ళకు పాస్‌ మార్కులు కూడా గగనమైపోయాయ్‌. అందుకే ఈసారి మిగతా తెలుగు ఫౌరులలాగానే మనం కూడా పరీక్ష పత్రాలు కొనుక్కొచ్చాము. నేను ఒక్కొక్క పేపరే మైక్‌లోచదువుతాను. మిోరందరూ నోట్‌చేసుకోండి."

అందరూ తప్పట్లు కొట్టారు.

శాయీరామ్‌ ఒక్కొక్క ప్రశ్నే చదవటం ప్రారంభించాడు. అందరూ నిళ్ళ్శబ్దంగా రాసుకోసాగారు. అన్ని పేపర్లూ పూర్తయ్యసరికి తెల్లారుజూమున నాలుగయిపోయింది.

"అలా వర్టిప్రశ్నలు చెప్తేఎంలాభం? సమాధానాలు కూడా చెప్పండి" అంది పార్వతీదేవి.

“అవును! అన్సర్‌ కూడా కావాలి” అంటూ అరచారు టెన్స్‌ కుర్రాళ్ళు.

“అన్సరేమిటి! మీ స్కూల్లో ఆన్సర్‌ చెప్పలేదూ?"

"మా న్కూల్లో చెప్పలేదు. అనలు మాకు సోషల్‌ టీచరీ లేదుగా!” అన్నాడు విజయ్‌బాబు.

"మా స్కూల్లో సైన్స్‌టీచర్‌ మధ్యలో మానేసింది. అందుకని మాకు సగంపోర్షనే అయింది" అంది రాజేశ్వరి చెల్లెలు ఆరణి.

"మాకు టీచర్లున్నారుగాని ఏమోచెప్పరు" అన్నాడు గోపాల్రావ్‌ కొడుకు.

అందరం కలసి కొళ్ళెన్‌ పేపర్స్‌ దగ్గర పెట్పకుని నాలుగు గైడ్స్‌ తెప్పించి అన్నింటికీ అన్సర్స్‌ తయారుచేశాము.

వాటిని మళ్ళీ శాయీరామ్‌ మైక్‌ దగ్గర చదువుతూంటే అందరూ రాసుకున్నారు. 252 హ్యామరాలజీ

ఉదయం ఎనిమిదిగంటలకే అందరం కాలనీపిల్లలను తీసుకుని బస్‌లో ఎగ్జామినేషన్‌ సెంటర్‌కి బయల్దేరాము. అరగంట తర్వత ఆ ఎరియాకు చేరుకుని మహాత్మా ఎడ్యుకేషనల్‌ ఎకాడమీ గురించి వాకబుచేశాము. ఎంతమందిని అడిగినా మాకు తెలీదని చెప్తూండేసరికి మాకుభయం పట్టుకుంది. పరీక్షటైమ్‌లోపల ఆస్కూలుని కనుక్కోగలమో లేదో అని! చివరకు బోలెడు గేదెల షెడ్డున్న ఓకాంపౌొండ్‌ కనిపించింది మాకు చాలామంది అక్కడ పాలకోసం

  • గిన్నెలు పట్టుకుని నిలబడి ఉన్నారు. పాలుకొంటున్న ఓవ్యక్తి దగ్గరకెళ్ళి అడిగాడు రంగారెడ్డి, అస్కూల్‌ గురించి! “"ఇదేనయ్యా ఆఅస్కూలు! బోర్జుకనబడటం లేదూ?" అంటూ అపాకకు వేలాడుతోన్న _..... బోర్డుచూపించాడు. అందరం అప్పుడుచూశాం ఆబోర్జుని! పెద్దఅట్టముక్క మూలలుచిరిగిపోయి ఉంది. దానిమీద బొగ్గుతోరాశారు "మహాత్మా ఎడ్యుకేషనల్‌ అకాడమీ" అని “మరిన్కూల్‌ బిల్జింగ్‌ ఎక్కడా? "అడిగాడు రంగారెడ్డి ఆ ఆసామీని. “అవేమిటయ్యా? ఆ పాకలుకనబడటంలేదూ?" విసుక్కున్నాడతను. మాకు మరీఆశ్చర్యం కలిగింది. తిన్నగా వెళ్ళి పాలుపోస్తూన్న అసామీని అడిగాము. "అవిగో! ఆచివరి రెండుపాకలూ స్కూలువే. ప్రిన్సిపాల్‌ అక్కడే కూర్చుని ఉన్నాడు చూడండిీ.'' అందరం చివరిపాకలదగ్గరకు నడిచాము. ఓ టేబుల్‌ మీద “ప్రిన్సిపాల్‌ అని బోర్జుపెట్టిఉన్నచోట ఓవ్యక్తికూర్చుని ఉన్నాడు. “నమస్కారం సార్‌” అన్నాడు రంగారెడ్డి. “నమస్సే హాలు టికెట్స్‌ చూపించండి" అన్నాడతను. అందరం హాల్‌ టిక9ట్స్‌ చూపించాము. అప్పటికప్పుడే టేబుల్స్‌ మీద చాక్‌పేస్తో నెంబర్లు వేసేశాడతను. "కూర్చోండి" అన్నాడు పిల్లలతో | మా వాళ్ళంతా వెళ్ళి సీట్లలో కూర్చున్నారు. ''ఏరా-వరీక్షటైమవుతుంది-ఇంకా అవలేదురా నీపని" అరచాడు ప్రిన్సిపాల్‌- పాలుపోస్తున్న వ్యక్తిని చూస్తూ. “అయిందయింది" అన్నాడతను. "త్వరగా గేదెలను బయటకు తోలెయ్‌! పరీక్ష టైమవుతోంది" ఫర్‌ సేల్‌ 253

అతను మిగిలిన వారందరికీ కూడా పాలుపోయటంముగించి గేదెలను బయటకు తోలేశాడు.

మరికాసేపట్లో కార్డు, స్కూటర్లు, సైకిళ్ళమీద విద్యార్భలు రావటం ప్రారంభమయి పోయింది.

"అందరి దగ్గరా అన్సర్‌ పేపర్స్‌ ఉన్నాయిగదా!” అడిగాడు శాయీరామ్‌ మావాళ్ళను.

“ఉన్నాంయప" అన్నారు వాళ్ళు.

"కొశ్చెన్‌ పేపర్స్‌ ఇవ్వగానే మన ఆన్సర్స్‌చూసి రాసేయండి" రహస్యంగా చెప్పాడు రంగారెడ్డి. -

"ఆ తర్వాత మీరు తెచ్చిన కాగితాలన్నీ మాకిచ్చేయండి-మేమే బయట పారేస్తాము. లేకపోతే పట్టుబడ్డారంటే మాస్కూల్‌ పరువుపోతుంది" అన్నాడు ప్రిన్సిపాల్‌.

మేము ముందు కంగారుపడినా ఆయన మాటలకు అనందించాము.

పరీక్ష మొదలయింది. మేమంతా బయట నిలబడ్డాము. పోలీస్‌కానిస్టేబుల్స్‌ ఇద్దరు వచ్చి మా దగ్గరలో కూర్చున్నారు.

మధ్య మధ్యలో మేమంతా దూరంనుంచే సైగలు చేసి కనుక్కుంటున్నాము. వాళ్ళు చక్కగా కాపీ చేస్తోంది లేనిదీ.

వాఠాత్తుగా ఓజీప్‌ వచ్చి పాకలముందాగింది. అందులోనుంచి పోలినులూ మరికొంతమంది మామూలు దుస్తులవాళ్ళూ దిగి పాకల్లోకి పరుగెత్తారు.

“చచ్చాంరా నాయినా! న్లయింగ్‌ స్క్వాడ్‌ వాళ్ళు వచ్చారు" అన్నాడు గోపాల్రావ్‌.అందరిలోనూ టెన్షన్‌ పెరిగిపోయింది.

"మనవాళ్ళు ఎవరయినా పట్టుబడితే సంవత్సరం వృధా అయిపోయింది." అన్నాడు శాయీరామ్‌ దిగులుగా.

పావుగంట తర్వాత జీప్‌ వెళ్ళిపోయింది. వెంటనే అందరూ పాకలవేపు పరిగెత్తాము.

ప్రిన్స్‌పాల్‌ మా దగ్గరకు చిరునవ్వుతో వచ్చాడు.

"ఏం ఫర్లేదులెండి! ఆస్క్వాడ్‌లో ఒకాయన కొడుకు మన పాకల్లోనే పరీక్ష రాస్తున్నాడు. ఇక్కడ ఎవరినీ పట్టుకోరు."

అంతా తేలిగ్గా గాలిపీల్పాము. నాలుగు రోజులు గడిచిపోయాయి. తీరా లెక్కల పేపరు న్యూస్‌పేపర్‌లో పబ్లిష్‌ అయేసరికి మాకు భయం పట్టుకుంది. పరీక్షలన్నీ ఎక్కడకాన్సిల్‌ అవుతాయోనని. 254 హ్యామరాలజీ

"మీజర్నలిస్ట్‌లతో ఇదే పేచీ! ఎవ్వడికీ లేనిదురద మీకెందుకు? ఇప్పుడు చూడండి! అటు గవర్నమెంటుకీ, ఇటుమనకీ, అందరికి హెడేక్‌! "గోపాల్రావ్‌ మీద విసుక్కున్నాడు

శాయీరామ్‌!

గోపాల్రావ్‌ ఏమీ మాట్టాడలేకపోయాడు.

న్యూస్‌ పేపర్లూ, జర్నలిస్ట్‌లూ, మరీబాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని వప్పుకున్నాడు.

మర్నాడు మేమనుకున్నంతా అయింది. ఆ తరువాతి పరీక్షలు రద్దయ్యాయి. మా అందరికీ విచారం పట్టుకుంది.

మిగతాపరీక్షలకు బోలెడుడబ్బు పోగుచేయాలి పైగా న్యూస్‌పేపర్‌ వాళ్ళబెడద ఎక్కువయిందిగనుక ప్రభుత్వంకూడా కొంచెం స్టిక్ట్‌గా ఉంటుంది.

అంచేత కొళ్చిన్‌పేపర్స్‌ ధర ఈసారి మరీ ఎక్కువగా ఉంటుంది...

మేమనుకున్నంతా అయింది. ఆతరువాత కొళ్ళెన్‌పేపర్స్‌ ఒకోటి రెండు వేలు పెట్టకొనాల్సి వచ్చింది.

రిజిల్బ్‌ వచ్చాయి.

మా సంతోషానికి హద్దులేవు. కాలనీలో అందరికీ ఫస్ట్‌క్షాసులువచ్చాయ్‌.

“ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిందాబాద్‌" అంటూ అరచాడు యాదగిరి ఆనందం పట్టలేక.

కానీ మా అనందం ఎంతోకాలం నిలవలేదు.

కాలేజీసీట్లకోసం వేట ప్రారంభమయింది. శాయీరామ్‌ ఆరోజే మీటింగ్‌ ఏర్పాటు చేశాడు.

"సోదరసోదరీ మణులారా! మన కాలనీవాళ్ళను ఎకాలేజీలో జాయిన్‌ చేయాలో నిర్ణయించడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం"” అన్నాడు శాయీరామ్‌.

"బిగ్‌వ్లవర్‌ బిగ్‌వ్లవరొ్‌' అంటూ అరచారు ఆడవాళ్ళందరూ. మేమంతా ఆశ్చర్యపోయాం. బిగ్‌ఫ్లవర్‌కాలేజీ ఒకటుందనీ, దానికి అంతమంచిపేరుందనీ మా ఆడాళ్ళకు తెలిసింది కానీ మాకు తెలీలేదు.

"మనాళ్ళకు ఫస్ట్‌క్లాస్‌ వచ్చింది కదా! అంతకంటే మంచి కాలేజ్‌ ఎమీలేదా?” అడిగాడు జనార్దన్‌! లేదని తెలిసి అంధరం కలిసి 'బిగ్‌ప్లవర్‌ కాలేజ్‌కెళ్ళాము.

నేనూ రంగారెడ్డి ప్రిన్సిపాల్‌ రూమ్‌ కెళ్ళాము

''మాకాలనీ న్చూడెట్స్‌ అందరికీ వన్స్‌క్తాన్‌ వచ్చింది. అందుకని మంచి జూనియర్‌కాలేజ్‌లో చేర్ప్చించాలని మేమనుకున్నాం. మా వాళ్ళు కొంతమంది మీకాలేజ్‌పేరు ఫర్‌ సేల్‌ 255

సజెస్ట్‌చేశారు. బైదిబై మీకాలేజ్‌ స్టాండర్డ్‌ గురించి మాకు డిటెయిల్స్‌ ఇస్తే-బాగుందనుకుంటే సగర్వంగా జాయిన్‌ చేస్తాము." అన్నాడు రంగారెడ్డి.పెద్దగా కిందపడినవ్వి, మళ్ళాలేచి కూర్చీలోకూర్చున్నాడు ఆయన.

"ముందు మీవాళ్ళను ఎంట్రెన్స్‌ రాయమనండి-సెలక్టయితే తర్వాత చూద్దాం!" అన్నాడు అతికష్టంమీద నవ్వాపుకుంటూ.

నేనూ రంగారెడ్డి మొఖాలు చూసుకున్నాం.

"ఎంటైెన్సేమిటి?" అడిగాడు రంగారెడ్డి ఆశ్చర్యంగా.

"ఎంట్రెన్స్‌ అంటే మేము మాకాలేజ్‌ తరపున పెట్టే పరీక్ష!"

“అదెందుకు?”

"రుర్రాళ్ళలో నిజంగా 'స్టఫ్‌' ఉందో లేదో తెలుసుకోటానికి."

“ఇంకా తెలీకపోవటమేమిటి సార్‌! మావాళ్ళందరికి ఫస్ట్‌క్లాస్‌ వచ్చిందికదా"

ప్రిన్స్‌పొల్‌ మళ్ళా కిందపడి నవ్వాడు.

ఈసారి నేను-లేచి ఆయనను లేపి కుర్చీలోకి చేర్చాను.

“అందుకే-యిలా అడ్డమయినోడికి ఫస్ట్‌క్షాస్‌ వస్తోందనే-ఎంట్రన్స్‌ పెడత!"

రంగారెడ్డికి కోపం ముంచుకొచ్చింది.

"అంటే మీ ఉద్దేశ్యం ప్రభుత్వం పెట్టేపరీక్షలమీద మీకు నమ్మకంలేదన్నమాట! అంతేనా?"

ప్రిన్స్‌పాల్‌ మళ్ళాకిందపడి నవ్వబోతూంటే పడకుండా ముందే ఆపేశాను.

"ఆహ్హహ్హహ్హ! ఓహ్హహ్హహ్హ-ప్రభుత్వం పరీక్షలు! అదోపరీక్ష! దానికో క్లాసులూ, రాంకులూ, అహ్హహ్హహ్హ'" అంటూవగరుస్తూ నవ్వసాగాడు. అతనికళ్ళ వెంబడి నీళ్ళుకూడా తిరిగాయ్‌! నవ్వు ఆపాక మళ్ళాతనే మాట్లాడాడు. .

"అబ్బ! అబ్బ! ఎంతకాలనికయ్యా భలే నవ్వించారు మీరెవరో గాని! మీకాలనీలో అందరూ ఇలాగే జోకులేస్తూంటారా? ఒకసారి మీకాలనీకి రావల్సిందే! బాగా నవ్వుకోవాలని పించినప్పుడల్లా తప్పకవస్తాను. అడ్రసిచ్చివెళ్ళండి" రంగారెడ్డి అతని అడ్రస్‌ బుక్‌లో మాకాలనీ అడ్రస్‌రాసిచ్చాడు.

ఆయన దగ్గర అప్లికేషన్‌ ఫారమ్స్‌ తీసుకుని బయటికొచ్చాము. బయట ఇసుకవేస్తేరాలనంత జనం కనిపించేసరికి మతిపోయినట్టయింది మాకు.

"ఏమిటీ జనమంతా?" వరండాలో నిలబడ్డ యాదగిరిని అడిగాడు.

"ఈ బిగ్‌ఫ్లవర్‌ జూనియర్‌కాలేజీలో సీటు గురించి వచ్చిన్రు"

256 హ్యూమరాలజీ

"ఇంతమందా?" గోపాల్రావ్‌, జనార్దన్‌ దిగాలుపడిన మొఖాలతో జనంలోంచి ముందుకొచ్చారు. “ఇక్కడ ఉన్నాళ్ళందరి పిల్లలకూ నూటికి తొంభయ్‌ శాతం మార్కులు వచ్చాయంట" అన్నాడు గోపాల్రావ్‌.

రంగారెడ్డి నమ్మలేకపోయాడు.

“నూటికి తొంభయి మార్కులా?"'

'అవును-"

"ఇక్కడ నిలబడ్డ ఈరెండు వేలమందికి అన్నిఎక్కువమార్కులు వచ్చాయా?"

“అవునంట"

"అంటే మరి మనకాలనీవాళ్ళకు అరవైనాలుగు 'పర్సెంటేగా వచ్చింది."

అందరం నిశ్శబ్దంగా బయటకు నడిచాము. అంతవరకూ మేమనుభవించిన ఆనందం కాసా దిగులుగా మారిపోయింది.

అక్కడి నుంచి అందరం సెవెన్‌సెయింట్స్‌ జూనియర్‌ కాలేజీకి చేరుకున్నాము. యాదగిరివెళ్ళి మా కాలేజీలోని యభయ్‌ మందికీ ఆప్లికేషన్‌ ఫారాలు పట్టుకొచ్చాడు.

ప్రాస్పెక్టస్‌ చదువుతూనే మాగుండెలు రుల్లుమన్నాయ్‌.

(క్రస్టియన్స్‌ కోటలో కొన్ని సీట్లు,

బాక్వార్డ్‌ క్లాసెస్‌ కోటాలోకొన్ని సీట్టు,

'షెడ్యూల్‌క్లాసెస్‌ కోటా,

సెంట్రల్‌ గవర్శ్షమెంట్‌ కోటా,

స్టోర్స్‌ కోటా, ఫిజికల్సీహాండీకాప్‌డ్‌ కోటా,

డీఫెన్స్‌పరసనల్‌ కోటా,

విఅయ్‌.పి. కోటా,

ఈ కోటాలన్నీ పోను మిగిలిన సీట్లు మాత్రం మార్క్‌నిబట్టి ఇవ్వబడతాయ్‌. అంటే మహా అయితే 'ఓపాతిక సీట్లు మిగల్తాయ్‌. ఈపాతికా ఎనభయ్‌శాతం వాళ్ళకో తొంభమ్‌శాతం వాళ్ళకో పోతాయి. ఇంక మనకేం దొరుకుతాయ్‌?

అయిష్టంగానే అప్లికేషన్‌ఫారాలు ఫిలప్‌చేసి తలోపదిరూపాయలు రిజి(స్టేషన్‌ ఫీజులు కట్టి బయటపడ్డాం.

7 ఫర్‌ సేల్‌ 25 /

దాంతో ఆరోజు కార్యక్రం పూర్తయిపోయింది. మర్నాడు మరోమూడుకాలేజీల్లో అప్లయి చేయటం మంచిదని చెప్పాడు గోపాల్రావ్‌. లేకపోతే సీట్లు దొరకటం కష్టమని వాళ్ళ లెక్చరర్‌ _ఫెండొకాయన చెప్పాడట.

అంచేత తెల్లారుతూనే అందరం హడావుడిగా బయట్లేరి తిమ్మరుసు జూనియర్‌కాలేజీకి చేరుకున్నాం. అవ్పటికే కాలేజీముందు పెద్ద “క్యూ కనిపించేనరికి మాకు మతిపోయినట్టయింది కాలేజీ ఇంకా తెరవనేలేదప్పటికి.

"ఈ "క్యూ" దేనికి మాస్టారూ? "రంగారెడ్డివెళ్ళి “క్యూ"లోఫలహారం చేన్తున్న ఓ 'పెద్దమనిషినడిగాడు.

“దేనికేమిటయ్యా! ఇంటర్‌ అప్లికేషన్‌ కోసం"

"ఇంటర్‌ అప్లికేషన్‌ కోసం ఇంత “క్యూ” యా? అంటే ఈ కాలేజీ చాలా మంచి కాలేజా?"

“ఈ కాలేజీలో ఒకడికి కిందటి పరీక్షల్లోస్టేట్‌ సిక్ట్రీయత్‌ రాంక్‌ వచ్చిందట. అందుకని డిమాండ్‌ పెరిగిపోయింది-"

మాకు “క్యూ” చూస్తే భయంవేసింది మరి కాసేపటికి తర్వాత గోపాల్రావ్‌ ఓవ్యక్తిని తీసుకొచ్చాడు మా దగ్గరకు.

"ఈ కాలేజీలోనే లెక్సరర్‌ ఇతను! నాకు హైస్కూల్లో క్తాస్‌ మేటుగా ఉండేవాడు" అంటూ మాకు పరిచయం చేశాడు.

“మీరంతా మా గోపాల్రావ్‌ తాలూకూ మనుషులు కనుక నిజం చెప్తున్నా! ఈ కాలేజీకి అప్లయి చేయకండి! వేస్ట్‌!” అన్నాడతను.

"అదేమిటి?" విస్తుపోతూ అడిగాడు శాయీరామ్‌.

"అవునండీ! సీట్లన్నీ ఎప్పుడో బాక్‌డోర్‌లో ఒకోటీ పదివేలకు అమ్మేశారు మావాళ్ళు"

“అంటే డొనేషన్‌ తీసుకున్నారా?" కోపంగా అన్నాడు జనార్దన్‌.

"అవునూ! ఏం?"

“మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక డొనేషన్లు బంద్‌చేశాం అన్నారుకదా మా అన్నగారు?” అన్నాడు శాయీరామ్‌.

లెక్చరర్‌ పగలబడి నవ్వాడు అయిదునిమిషాల సేపు.

"మీరుకూడా మనరాష్ట ప్రభుత్వంలాగానే భలే జోకులేస్తున్నారండీ! ఎవరికయినా మనసు బాగోనప్పుడు మీకాలనీలోకొస్తే భలేటైమ్‌పాస్‌ అవుతుందనుకుంటాను. మీ అడ్రసివ్వండి. ఎందుకయినా మంచిది-" అంటూ అతని డైరీలో మా అడ్రస్‌ రాసుకున్నాడు. 258 హ్యామరాలజీ

"అవునోయ్‌! సీట్లన్నీ డొనేషన్లకు అమ్ముకుంటే మరి ఇన్నివేల మందిని క్యూలో ఎందుకు నిలబెట్టారు?"

లెక్చరర్‌ మళ్ళీ పగలబడి నవ్వాడు.

"నీయవ్వ! భలేగున్నారండీ మీరు! ఆపిచ్చి వెధవలు బపూన్లలాగా "క్యూ" లో నిలబడి నానాఛావూ ఛస్తూంటే ఎంజాయ్‌ చేయకుండా వెధవ ప్రశ్నలేస్తారేమిటి?"

నాకు కోపం ముంచుకొచ్చింది.

''విల్లల నీట్లకోనం వేము నానాభావూ ఛసోంటే మీకు బమ్రన్లలాగా కనబడుతున్నామా?" అన్నాను కోపంగా.

"ఇదిగో చూడండి మాష్టారూ! ఎవడి సరాదాలు వాడికుంటాయి... మికుసర్కస్‌లూ, సినిమాలూ, మాజిక్‌షోలూ చూసి ఆనందించటం సరదా! ప్రజలను పిచ్చివెధవలను చేసి ఆడించటం ప్రభుత్వం సరదా! మాకేమో ఇలా సీట్లకోసం ఎగబడే పిచ్చివాళ్ళను చూస్తే సరదా. నాలుగురోజులు వాళ్ళను “క్యూ"లో నిలబెట్టి మరో నాలుగు రోజులు ఎంట్రన్సలు ఇంటర్వ్యూలు పెట్టి టైమ్‌పాస్‌ చేసుకున్నాక అందరినీ "నో సీట్‌ "అంటూ గెంటేయడంలో ఎంత త్రిల్‌ ఉంటుందో అనుభవిస్తేగానీ మీకు తెలీదు”

మేము ఆ కాలేజీకి అప్లయి చేయకుండానే బయటి కొచ్చేశాము. ఆ తరువాత ఆ కాలేజీకి పాతిగజాల దూరంలోనే ఉన్న ఇంకోకాలేజీలో కెళ్ళాము.

"ఇంటర్‌ అప్లికేషన్ల అమ్మకము అయిపోయినది" అని రాసిఉంది, బోర్డుమీద. అక్కడి నుంచి గవర్నమెంటు కాలేజీకి చేరుకున్నాము పదకొండు గంటలవుతున్నా ఇంకా ఎవరూ రాలేదు. కాలేజీకిబయటే కూర్చుని బ్రాకెట్‌ చార్జు చూస్తోన్న ప్యూన్‌ దగ్గర కెళ్ళాడు

రంగారెడ్డి.

"ఇవాళ కాలేజీలేదా?" అడిగాడతనిని.

'ఉందిసార్‌! నిన్నేగా ఖుల్లా అయింది."

"మరి ప్రిన్సిపాల్‌గారుగానీ, ఆఫీస్‌స్టాప్‌గానీ రాలేదా?” అడిగాడు శాయీరామ్‌.

“ఇంతవరకూ రాలేసార్‌! వచ్చెడిదుంటే పదిగంటలకే వచ్చేస్తూండె!"

"మరి కాలేజ్‌తెరవకపోతే మాకు అప్లికేషన్‌ ఫోరమ్స్‌ ఎవరిస్తారు!"

ప్యూన్‌ ఆమాట వినగానే ఆనందంగాలేచి నిలబడ్డాడు."మీకు అప్లికేషన్‌ ఫారమ్స్‌ కావాలా సార్‌? ఇప్పుడేతెచ్చిస్తా! మీరిక్కడే ఉండండి"అంటూ పరుగుతో బయటి౩ెళ్ళి పోయాడు. పావుగంట తర్వాత ప్రిన్సిపాల్‌తో పాటు స్కూటర్‌మీద వచ్చేశాడు. ఫర్‌ సేల్‌ 259

"రండి రండి ఫారమ్స్‌ ఇస్తాను" అంటూ మమ్మల్ని తనగదిలోకి తీసుకెళ్ళి అప్లికేషన్‌ ఫారమ్స్‌ అందరికీ తలోటీ ఇచ్చాడు ఆనందంగా.

"త్వరగా ఫిలప్‌చేసి ఫీజు ఇప్పుడేకట్టేయండి" అన్నాడతను. ఆమాట అనేసరికి మాకు అనుమానంకలిగింది.

"కాలేజీలో కిందటేడు ఎంతమంది పాసయ్యారు?" అడిగాడు రాంగారెడ్డి.

ప్రిన్సిపాల్‌ గర్వంగా చూశాడు మావేపు.

"ఎంతమందా? ఏమనుకుంటున్నారు మాకాలేజీ గురించి? ఫిస్టీపర్సెంట్‌ రిజల్ట్స్‌ మిస్టర్‌! సగానికి సగంమంది ఫస్ట్‌క్తాస్‌లో పాసయ్యారు"

మా అందరికి సంతృప్తి కలిగిందా మాట వినేసరికి. తీరా ఫీజుకట్టబోయే ముందు యాదగిరికో ఆలోచన వచ్చింది.

_ "పాసయినవాండ్ల లిస్ట్‌ జరాచూపించండ్రి" అన్నాడు ప్రిన్సిపాల్‌తో. ప్రిన్సిపాల్‌ మొఖంలో రంగులు మారాయి.

"అంటే నామాటమీద నమ్మకంలేదా?"

"లేదు! ఇయ్యాఖ్రేపు దొంగబాడకవ్‌లు చాలామంది స్కూళ్ళుకాలేజీలు పెడుతునుు."

"మాది గవర్నమెంటు కాలేజయ్యా!”

"గవర్నమెంటు అందరికంటే బడాచోర్‌లు! లేకుండా ఏమిటి? కె.జి. సీట్లకు పరిషాని! ఇంటర్‌ సీట్లకు పరిషాని! డిగ్రీ సీట్లకు పరిషాని! (పైవేటు కాలేజీ వాళ్ళతోటి కల్సిపోయి, ఆళ్ళదగ్గర పైసట్దిని, గిట్ల సీట్లస్కేర్సిటి కావాలని స్పష్టిస్తును!"

ఇంక చేసేది లేక ప్రిన్సిపాల్‌ అల్మారాలోంచి ఓఫైలుతీసి మాముందు పడేశాడు.

అందులో ఒకే ఒక్క కుర్రాడి మార్క్స్‌ లిస్ట్‌ ఉంది. అతి తక్కువ మార్కులతో పాసయ్యాడతను.

"ఏమిటి? వ్‌న్పీవర్సెంట్‌ వన్స్‌క్తాన్‌లోపాన్‌ అన్సెపవ్ప్‌ ఒక్కమార్క్స్‌ లిన్స్‌ చూపిస్తున్నావ్‌? "అడిగాడు యాదగిరి.

“అవునయ్యా! మాకాలేజ్‌లో ఇద్దరే స్టూడెంట్స్‌! ఒకడు తప్పాడు. ఒకడు పాసయ్యాడు ఫిస్టీపర్సెంట్‌ రిజల్స్‌ కాదా అవి?"

మాకెవరికీ మాటరాలేదు.

మారుమాట్టాడకుండా యాదగిరిని బయటికీ డ్చుకొచ్చి ఇంకో కాలేజీ వేపు బయళట్టేరాము. విజయనగర్‌కాలనీ ప్రాంతంలో మరోమంచి కాలేజ్‌ ఉందని చెప్పటంతో అటువేపు బస్‌ ఎక్కాము.

260 హ్యూమరాలజీ (/

బస్‌ దిగగానే ఎదురుగా పాడుపడినట్ట్లున్న ఓ పెంకుటింటి ముందు బోర్డు కనిపించింది.

"కెలాసా జూనియర్‌ కాలేజ్‌, రికగ్నయిజ్‌డ్‌ బైదిగవర్షమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌!"

1986-87 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో కెల్లా అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎకైక జూనియర్‌ కాలేజ్‌.

నూటికి నూరు శాతం ఫస్ట్‌క్షాస్‌లు"

అందరం ఆత్రుతగా లోపలికెళ్ళాం ఓ వ్యక్తి టేబుల్‌ ముందుకూర్చుని ఎవో ఫైల్స్‌ చూస్తున్నాడు. అతని టేబుల్‌ మీద ప్రిన్సిపాల్‌ అన్న బోర్డు ఉంది.

“యస్‌. వాడ్డూయూవాంట్‌ొ" అన్నాడతను-మావంక చూసి.

"ఎడ్మిషన్‌ కావాలి సార్‌! మాకాలనీ వాళ్ళందరూ ఫస్ట్‌కాస్‌లో పాసయ్యారు. ఇంటర్‌ ఎమ్‌ఎపి.సి.లో సీట్టు ఇప్పిస్తారీమోనని"

అతను ఓక్షణం ఆలోచించాడు.

"అప్లికేషన్స్‌ నిన్న ఒక్కరోజులోనే అయిపోయాయి... మీరు నిన్నే వస్తే బాగుండేది" అన్నాడు జాలిగా.

“సార్‌! ఎలాగోలా దయచూడండి సార్‌! మీకాలేజ్‌ ఎంతో గొప్పకాలేజ్‌ అని

| జంటనగరాల్లో అందరూ చెప్పారు అందుకని ఇం8క్కడా ప్రయత్నించకుండా తిన్నగా

ఇక్కడికొచ్చాము" అబద్దా లాడేశాడు శాయీరామ్‌.

“అవున్నార్‌! మీరు దయచూడకపోతే మాకింకెవరూ దిక్కులేరు" అంటూ గోపాల్రావ్‌కి కన్నుకొట్టాడు రంగారిెడ్డీ.

గోపాల్రావ్‌ ధభేల్మని ఆయన కాళ్ళమీద పడిపోయాడు.

"ఆల్‌రట్‌! కాళ్ళమీద పడ్డారుకాబట్టి సీట్స్‌ ఇస్తున్నాను. తలో యాభయ్‌ రూపాయలూ

ముందు ఆప్లికేషన్‌ఫారమ్స్‌కోసం ఇవ్వండి."

"యాభై రూపాయలా" ఉలిక్కిపడుతూ అడిగాడు శాయీరామ్‌.

"ఇలాంటి వెధవ ప్రశ్శలేస్తే మెడబెట్టి బయటకు గెంటిస్తాను. ఇడియట్స్‌! బ్లడీ పూల్చ్‌! పోన్లేగదాని సీటిస్తానంటే యాభై రూపాయిలకోసం గొణుగుతున్నారా పిసినారి వెధవల్లారా? "

మాఅందరికీ కోపంముంచుకొచ్చింది. వెధవసీట్లకోసం వాడితో తిట్లుకూడాతినాలా! ఫర్‌ సేల్‌ 261

"ఏయ్‌ జరా మంచిగ మాట్లాడు-" అన్నాడు యాదగిరి చొక్కాచేతులు 'పైకిముడుస్తూ, కానీ అతనిని గోపాల్రావ్‌ శాయీరామ్‌ నోరు మూసి వెనక్కులాగేశారు.

"మన పిల్లల భవిష్యత్తుకోసం అడ్డమైనాడితోనూ మాటలు పడకతప్పదయ్యా' అంటూ నచ్చజెప్పారతనికి,

"సరేసార్‌! యాభయ్‌ రూపాయలిస్తాం" అన్నాడు రంగారెడ్డి . వెంటనే ప్రిన్సిపాల్‌ తన డ్రాయర్‌ సారుగులోనుంచి మరకలతో నిండిఉన్నపాత న్యూస్‌పేపర్‌ కాగితాలు కొన్ని లాగి ముక్కలు ముక్కలుగా చింపి అందరికి తలోటి ఇచ్చాడు. మాకేం అర్ధంకావటంలేదు.

''అదే అప్లికేషన్‌ ఫారం! డబ్బివ్వండి'" అన్నాడతను దబాయింపుగా. మాకు మతిపోయినట్లయింది.

సరిగా అప్పుడే లోపల్నుంచి ఒక స్రీ బయటకొచ్చింది.

"అయ్యో! అప్పుడే మళ్ళీ వచ్చారా జనం! అబ్బబ్బ! ఛస్తున్నాను ఈ సీట్లకోసం తిరిగే పిచ్చాళ్ళతో! ఇదిగో చూడండిబాబూ! ఆయన మావారే! మా అబ్బాయిల సీట్లకోసం తిరిగితిరిగి పిచ్చెక్కింది. అప్పట్నుంచి అలా బోర్డ్‌ పెట్టక్కూచుని అందరి ప్రాణం తీస్తున్నారు. వెళ్ళిపోండి మీదారిన మీరు-”

"ఆ! వీడు పిచ్చాడా?" ఆశ్చర్యంగా అన్నాడు శాయీరాం.

ఆమాట వినటంతోనే ఆవ్యక్తికి కోపం ముంచుకొచ్చింది.

"ఏమిట్రా? నేను పిచ్చాడినా? బాస్టర్ట్‌-'అంటూ డ్రాయర్‌ సొరుగులో నుంచి కత్తి తీనుకుని పాడవటానికి మీదకొచ్చాడు. మరుక్షణంలో అందరం అతి వేగంగా రోడ్‌మీదకొచ్చాము. అతనుకూడా వెంట పరుగెత్తుకు రావటం చూసేసరికి మాగుండెలవిసి పోయాయ్‌. రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న ఆర్టీసీ బస్‌ డైవర్‌ కండక్టర-మమ్మల్నిచూసి “రండి-బస్‌ ఎక్కేయండి-" అంటూ అరచారు.

అందరం పరుగెత్తి బస్‌ ఎక్కేశాము. పిచ్చాడు మమ్మల్ని చేరుకునేలోపలే బస్‌స్టార్టు చేశాడు డైవర్‌.

“బస్‌ మాకోసం ఆపారా? ' అడిగాడు రంగారెడ్డి, ఒగరుస్తూ కండక్టరుని.

"కేవలం ఈ పిచ్చాడి బారినుండి పారిపోయి వచ్చేవాళ్ళకోసం ప్రత్యేకంగా వేశాంసార్‌ ఈబస్‌! ప్రతిగంటకు ఓబాచ్‌ ఆఇంట్లోనుంచి పారిపోయి వస్తుంటారుకదా సీట్లపిచ్చాళ్ళు-"

మా అందరికీ కోపంతో రక్తం ఉడికిపోయిందిగానీ ఏమీ మాట్లాడలేదు. బస్‌లో కోఠీ చేరుకుని పక్కనే ఉన్న హోటల్లో కూర్చుని తలో వన్‌బైటూ '“టీ' ఆర్డర్‌ చేశాము.

“ఇప్పుడేం చెద్దామంటారు?" అడిగాడు రంగారెడ్డి.

262 హ్యామరాలజీ

ఎవ్వరం జవాబివ్వలేదు. అందరి దృష్టీ మాకవతల టేబుల్‌దగ్గర వ్యక్తి చదువుతున్న "పేపర్‌ మీద పడింది.

'పేపర్‌వెనుక పేజీలో స్పష్టంగా కనబడుతోంది ప్రకటన-

“సరికొత్త జూనియర్‌ కాలేజ్‌ నేడే ప్రారంభం! తెగ చదివిన అధ్యాపకవర్గం! స్టూడెంట్స్‌ని చీల్చిచెండాడే డిసిప్లిన్‌! యూనియన్‌ మినిష్టర్‌ భగీరాగారి ఆధ్వర్యంలో- రాష్టవిద్యామంత్రి గారిచే ప్రారంభోత్సవం! అంచేత పరీక్షా పేపర్లు లీకిఅవకపోయినా విద్యార్దులకు సప్టయ్‌ చేసే బాధ్యత మాది! నూటికి నూటరెండుశాతం ఫస్ట్‌క్సాస్‌పాస్‌లు గొరంటీ! అంతేగాక స్టేట్‌ డిస్టింక్షన్‌ కూడా మాకాలేజ్‌కే ఎర్పాటు చేసే పూచీ మాది, మాదే! మాదే! ఆహా అద్భుతావకాశం. ఓహో! అపూర్వావకాశం. సీట్లు పరిమితం. డొనేషన్లు అపరిమితం. మీకోసం మా వెనుక తలుపు ఎప్పుడూ తెరచే ఉంటుంది. (గమనిక! అనివార్య కారణాలవల్ల కాలేజ్‌కి ముందు తలుపు మూసి ఉంచడమైనది. సీట్టకోసం వచ్చేవారందరూ విధిగా బాక్‌డోర్‌నే ఉపయోగించవలసిందిగా ప్రార్దన!)

యాదగిరి ఆనందంగా నావేపు తిరిగాడు.

“అన్నా! అదిగో! ప్రకటన చూడు" అన్నాడు ఆనందంగా.

అందరం వెళ్ళి ఆపేపర్‌ఓనరుని బ్రతిమాలి అడ్రస్‌నోట్‌ చేసుకుని ఆకాలేజికి చేరుకున్నాం. చాలా అందమయిన బిల్డింగ్‌ అది.

"రండి! రండి! స్వాగతం" అన్నబోర్జు వేలాడుతోంది. బయట ఓయువకుడు కూర్చుని ఉన్నాడు దర్జాగా.

"సార్‌! మీ కాలేజీ సీట్లు-" అన్నాడు శాయీరామ్‌ సంశయంగా.

"ఓ! ఇవ్వాళే స్టారయినాయ్‌ ఎడ్మిషన్లు. ఇంకా పదకొండు సీట్లున్నాయ్‌ ఇప్పుడే బుక్‌ చేసేసుకోండి! లేకపోతే రేపటికి దొరకవ్‌"

"అంటే ఏం చేయాలి సార్‌ మేము?" "వెంటనే రెండువేలు కట్టండి. పదిహేను రోజుల్లోగా మిగతా-డబ్బు కట్టవచ్చు."

“ఆ! రెండువేలు కాకమిగతా డబ్బా? అదెంత?" నీరసంగా అడిగాడు గోపాల్రావ్‌.

"ఆ! ఎంతోనా? యాభైఎనిమిదివేలు"

"ఏమిటి యాఖైఎనిమిదివేలా?” మాటలు తడబడిపోయినాయి జనార్ధన్‌కు.

“రూపాయలు-" ఫర్‌ సేల్‌ 263

"రూపాయలట"” మావేపు తిరిగి చెప్పాడు జనార్ధన్‌.

“రూపాయలు” అన్నాడు శాయీరామ్‌ రంగారెడ్డితో.

“మొత్తం అరవైవేలరూపాయలు" అన్నాడు రంగారెడ్డి గోపాలావ్‌తో. .

"అంటే అన్నీ రూపాయలే నన్నమాట" అన్నాడు చంద్రకాంత్‌.

"అరవైవేలు ఫీజా? ఇది జూనియర్‌ కాలేజా లేక మెడికల్‌ కాలేజా?" అడిగాడు యాదగిరి అనుమానంగా.

"బయట బోర్డు కనబడటంలేదంటయ్యా! ఆఫీజు సంవత్సరం మొత్తానికి చదువుకీ, తిండికీ,రూముక్షీ-"

"కానీ మాకు హాస్టల్‌ అవసరంలేదు కదండి-మా ఇళ్ళన్ని ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి."

"అలా కుదరదయ్యా! ఇది కేవలం రెసిడెన్షియల్‌కాలేజ్‌ అంతే! ఇష్టమయితే చేరండి! లేకపోతేలేదు-నెక్స్‌" అన్నాడతను, మావెనుక అప్పటికప్పుడే చేరిపోయిన పాతికమంది క్యూని

చిరాకు పుట్టి అందరం అక్కడినుంచి వచ్చేశాము. కాళ్ళీడ్చుకుంటూ కాలనీకి చేరేసరికి చొంతాడులా కాలనీ బయటమెయిన్‌రోడ్‌ వరకూ తయారయిన ఓ “క్యూ కనిపించింది.

"ఇదేమిటి? వీళ్ళివరు మనకాలనీలో 'క్యూ' కట్టారు?" అడిగాడు రంగారెడ్డి ఆశ్చర్యంగా.

"అవునవును! మెలికలు తిరిగితిరిగి మనకాలనీలోకే వెళ్ళిందది" అన్నాడు. శాయీరామ్‌. 'క్యూ' లో చివర నిలబడ్డ వ్యక్తిని సంగతేమిటని అడిగాడు గోపాల్రావ్‌.

“ఈ సీజనులో 'క్యూ' లెందుకుంటాయిసార్‌? కాలేజ్‌ సీట్లకోసం."

"ఆవిషయం తెలుసయ్యా! మేము ఇప్పటివరకూ 'క్యూ'లోనే నిలబడే వస్తున్నాము. కానీ ఇక్కడెందుకు 'క్యూ' కట్టారు అని అడుగుతున్నాము-"

"ఎందుకేమిటండీ?" ఇక్కడ శ్యామల్రావ్‌ జూనియర్‌ కాలేజ్‌ అని ఒక కాలేజ్‌ పెట్టారట. స్పూడెంట్స్‌కి మెరిట్‌రాకపోతే డబ్బువాపస్‌ అని రాశారుపేపరులో"

మేమందరం మొఖాలు చూసుకున్నాం

"పోనీ మనవాళ్ళను కూడా ఇక్కడే చేర్చించేద్దామా?" అడిగాడు గోపాలావ్‌ అనుమానంగా.

అఆమాటతో యాదగిరి మండిపడ్డాడు.

"చేర్చక చేర్చక ఈ ఫాల్లూ శ్యామల్రావ్‌ కాలేజ్‌లోనా జేర్చెడిది? మీకేం దమాక్‌గిట్ట ఖరాబయిందా?"

“అసలు చూద్దాం పదండి ఓసారి" అన్నాడు శాయీరామ్‌. 264 హ్యామరాలజీ

అందరం శ్యామల్రావ్‌ ఇంటికి చేరుకున్నాం. బయటచాలా ఖరీదయిన బోర్డు కనబడింది మాకు. "శ్యామల్రావ్‌ జూనియర్‌ కాలేజ్‌. రికగ్నజ్‌డ్‌ బైగవర్షమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌” దానికింద ఇంకో బోర్జుకూడా ఉంది. "ఈసంవత్సరం రిజల్స్‌! తొంభయ్‌ శాతం ఫస్ట్‌క్తాసులు- పదిశాతం సెకండ్‌ క్షాస్‌లు- నాలుగు స్టేట్‌ రాంకులు సాధించిన అద్భుత శిక్షణా సంస్థ." అందరికీ వళ్ళు మండిపోయింది ఆ బోర్డు చూసేసరికి. నిన్నటి వరకూ అసలు కాలేజియే లేదు. “.... "ఇదన్యాయం గురూ! పాపం! ఈజనాన్ని మోసం చేస్తున్నాడు. మనం అందరితోనూ _ చెప్పేద్దాం! ఇదంతా మోసమని” అన్నాడు రంగారెడ్డి. "బరాబర్‌ జెప్పాలె! ఈ సాలేగాడు మనకాలనీ ఇజ్జత్‌ తీశేస్తుండు." అన్నాడు యాదగిరి. అందరం క్యూలో నిలబడ్డ వాళ్ళ దగ్గరకు పరుగిత్తాం. శాయీరామ్‌ అప్పటికప్పుడే ఉమన్యాసం ప్రారంభించాడు. జనమంతా మా చుట్టూ మూగిపోయారు. ఉపన్యాసం ముగిశాక మళ్ళా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడేసరిమాకు ఆశ్చర్యంవేసింది. / "ఈకాలేజీ వాళ్ళు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారని చెప్పినా మీరు ..... వెళ్ళిపోకుండా మళ్ళీ క్యూలో నిలబడ్డారేమిటి?" అడిగాడు రంగారెడ్డి ఒకతనిని. "చూడండి సార్‌! మనల్ని మన ప్రభుత్వమే మోసం చేస్తుంటే ఇంకా ఇలాంటివాళ్ళు చేయటంలో తప్పేముంది?" ప్రజలు అంటే డెఫినిషన్‌ “అతి తేలిగ్గా మోసగింపబడే జాతి" అని! అంచేత కానీండీ! ఇంకోసారి మోసపోతాం అంతేకదా" వారం రోజులు గడిచిపోయినయ్‌ శ్యామల్రావ్‌ బయటషామ్యానాలు నాలుగేసి నేలమీద విధ్యార్దులను కూర్చోబెట్టి తనూ, వాళ్ళబ్బాయ్‌ పాఠాలు చెప్పటం చాలా విచారంతో గమనించాము మేము. మేము అప్లయ్‌ చేసిన కాలేజీలన్నీ ఫస్ట్‌ లిస్టు ప్రకటించాయి. ఆలిస్టు చూడ్డానికి కొన్ని చేల మంది కాలేజ్‌దగ్గర గుమికూడడంతో త్రోపులాటలు, కొట్లాటలు జరిగిపోయాయి. ఫర్‌ సేల్‌ 265

మేమందరం కలసి లిస్పులకు అడ్డంగా నిలబడ్డ ఓ రౌడీగాంగ్‌ని పక్కకు తప్పుకోమని అడిగినందుకు పేచీవచ్చి ఓచిన్నసైజు యుద్దం చేయాల్సివచ్చింది. మాచొక్కాలు, బనీన్ల్తూ చిరిగిపోయాయి ఆదొమ్మీలో. అయితే ఆలిస్టులో మాకాలనీ వాళ్ళివ్వరి పేర్తూ లేవు.

మరో వారంరోజుల తర్వాత సెకండ్‌ లిస్ట్‌ పెడతామని చెప్పారు కాలేజ్‌ వాళ్ళు- వారం రోజుల సస్పెన్స్‌లో గడిపాక ఆరోజు ఉదయం ఆఫీసులకు సెలవులు పెట్టి మళ్ళీ అన్ని కాలేజీలూ తిరిగాము. రాత్రిపదకొండుగంటలకు రెండోలిస్ట్‌ పెట్టారు వాళ్ళు. అందరం టార్చిలైటు వేసుకుని మాకాలనీ వాళ్ళపేర్లుకోసంవెతికాం. ఒక్కపేరుకూడా కనిపించలేదు. మరో వారంతర్వాత మూడోలిస్టూ చూశాము. అందులోనూపేర్లులేవు. అందరం దిగాలుపడి నిలబడి ఉంటే మా ఆఫీస్‌లో పనిచేసే కుమార్‌ కనిపించాడు.

"ఎమిటి గురూ? సీట్‌ దొరకలేదా? ప్రిన్సిపాల్‌ని కలుసుకుని ఆమెకు లంచం ఇస్తానని చెప్పండి! ఠకీమని ఇచ్చేస్తుంది సీట్‌'అన్నాడతను.

''ఆ నిజంగానా?" ఆశ్చర్యంగా అడిగాడు

“"నేనలాగీ తీసుకున్నానోయ్‌! కాకపోతే ప్రిన్సిపాల్‌తో డైరక్ట్‌గా క్యాష్‌ ఇస్తానని చెప్పకూడదు. ముందు ఒకరు ఆమెతోమాట్లాడుతూంటే వెనకనుంచి ఒకరు చేయిపైకెత్తి ఆమె అటువేపు చూసినప్పుడల్లా అయిదువేళ్ళూ తెరవండి! ఆమె అర్హంచేసుకుంటుంది."

"కానీ చేతివేళ్ళు చూస్తే ఆమెకెలా అర్ధమవుతుంది?” అడిగాడు శాయీరామ్‌.

“వాళ్ళకు వ్రేళ్ళభాష, కళ్ళభాష ఇవన్నివచ్చు. అంచేత అర్థంకాదన్న భయంలేదు-"

అమర్శాడు ఉదయం అందరం ప్రిన్సిపాల్‌ దగ్గరకెళ్ళాం. ప్యూన్‌ బయటే అడ్డంగా నిలబడి ఉన్నాడు.

“"ఐంకావాలి సార్‌?”

"సీట్‌ కావాలయ్యా! మాపిల్లకాయలకు" అన్నాడు గోపాల్రావ్‌.

"చాలా కస్టం సార్‌!"

"ఆ మాటప్రిన్సిపాల్సారు చెప్పితే వెళ్ళిపోతాం!” అన్నాడు రంగారెడ్డి.

“అలాగా!” అన్నాడతను.

“అవును!” అన్నాడు రంగారెడ్డి. .

అతను మాపేర్లడిగి లోపలి కెళ్ళి క్షణంలో తిరిగి వచ్చాడు. . 266 హ్యూమరాలజీ

"ఆమె ఎవ్వరీనీ లోపలకు రానీయవద్దంటున్నారు" అన్నాడు మళ్ళీ.

మాకేం చేయాలో తోచటంలేదు. చాలాసేపటి తర్వాతగానీ జనార్దన్‌కి కోపంరాలేదు.

"నీయమ్మ కాలేజీలు! నీయవ్వ గవర్నమెంట్‌-తూత్‌! పదండి! మనపిల్లల్ని నగ్ధలైట్లలో చేర్పించేద్దాం! అక్కడ ఈగవర్న్షమెంట్‌ ఉద్యోగాలకంటె ఎక్కువ జీతాలిస్తారట!"

అందరం ఓసారి మళ్ళీ మొఖాలు చూసుకున్నాం.

"వాళ్ళిక్కడ కోచింగ్‌ ఇస్తారట?" అడిగాడు చంద్రకాంత్‌ అనుమానంగా.

“సత్తుపల్లి అడవుల్లో" అన్నాడు శాయీరామ్‌.

హఠాత్తుగా ప్రిన్సిపాల్‌ వెనుక డోర్‌నుంచి పారిపోతూ కనిపించింది మాకు. అందరం ఒకర్నొకరు తోసుకుంటూ పరుగిత్తాము ఆమెను చేరుకోటానికి. చివరికి మాకాలనీవాళ్ళే గెలిచారు. ఆమెను మేము మొదటి వరుసలోనే చుట్టేశాము. మాగొడవంతా విని 'నో సీట్స్‌' అందామెహలఠాత్తుగా. యాదగిరి ముందుకిదూకి ఆమెమొఖందగ్గర చేయి పెట్టి అయిదు వేళ్ళు పైకి కిందకూతిప్పసాగాడు.

"ఏమిటిది?" అందామె అతని చేతివంక అనుమానంగా చూస్తూ. యాదగిరి చిరునవ్వు నవ్వి "అదే మేడం!” అంటూ చేతి వేళ్ళుమరీ ఆమెమొఖం ముందుపెట్టి నాలుగు సార్లు మూసి తెరిచాడు. అంతే! ఆమె కెవ్వున కేక వేసింది

“బాబోయ్‌ రక్షించండి! అమ్మో! నాయనో-" అంటూ సైరస్‌లా అరవసాగింది. దాంతో అల్లకల్లోలం అయిపోయింది. ఏం జరిగిందో మాకు సరిగ్గా తెలీదు. అయిదు నిమిషాల్లో పోలీసులు వచ్చారు కాంపస్‌లోకి. మరుక్షణంలో ప్రిన్సిపాల్‌ వచ్చిమావేపు చూపించింది పోలీసులకు.

“వీళ్ళే సార్‌! సీట్లు ఇవ్వనన్నానని హిప్నటైజ్‌ చేయబోయారు నన్ను" భయంగా అందామి.

. పోలీస్‌ఆఫీసర్‌ మమ్మల్ని పరీక్షగాచూశాడు.

“నిజమేనా? ఆమెచెప్పేది?"

"అంతా వర్దిదేసార్‌'అన్నాడు రంగారెడ్డి.

"నిజమండీ! ఇదుగోవీడు! వీడు నామొఖంముందు చేయిపెట్టి తిప్పతూంటే నాకు కళ్ళుతిరుగుతున్నట్టయింది! అసలు నాలుగురోజుల్నుంచి మాఇంటి మీద రాత్రుళ్ళు రాళ్ళవర్షం కూడా పడుతోంది! సార్‌! అదంతా ఈగాంగ్‌పనే అనినాఅనుమానం. నేను కారులో తిరుగుతున్నాను కదా! అందుకని చేతబడి చేయటం కుదరక హిప్పటెజ్‌ చేస్తున్నారు-"

  • ఫర్‌ సేల్‌ 267

"అందరినీ వాన్‌ ఎక్కించండి!” అన్నాడు పోలీస్‌ అధికారి. మాపై (ప్రాణాలు పైనే

"సార్‌! నిజం సార్‌! మాకే మంత్రాలూ రావండి! మేము మర్యాదస్తులమయిన ఉద్యోగస్తుల మండీ!” అంటూ బ్రతిమాలాముగానీ అతను వినిపించుకోలేదు. అందరం పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నాం,

మమ్మల్నందరినీ లాకప్‌లోవేసి చావగొడతాదేమోనని భయం పట్టుకుంది అందరికీ. ః కాని తీరాలోపలికెళ్ళాక మమ్మల్నందరినీ మర్యాదగా కుర్చీలో కూర్చబెట్టేసరికి మాకు ఆశ్చర్యంవేసింది. ఈలోగా ఆపోలీస్‌ ఆఫీసరు లోపలకొచ్చాడు. అందరికీ కాఫీలు తెప్పించాడు వస్తూనే.

"చూడండి? మిమ్మల్ని నేనేమి చేయను! కానీ నాకో సహాయం చేయాలి మీరు" -

అన్నాడు ఆప్యాయంగా.

"ఏమిటండీ అది?" అడిగాడు రంగారెడ్డి.

"ఇంకోకాలేజీలో మేము మాబంధువులపిల్లల సీట్లు అడ్మిషన్‌కోసం అప్లయ్‌ చేశాము. కాని వాళ్ళు ఇవ్వనంటున్నారు. ఆ ప్రిన్సిపాల్‌నికూడా హిప్పటెజ్‌చేసి సీట్లిప్పిస్తే మిమ్మల్నందరినీ ఏమిచేయకుండా వదిలేసాను-"

మాకు మతిపోయినట్లయింది.

"సార్‌! నిజం చెప్పన్నామండీ! మాకేమంత్రాలూరావు. హిప్పాటిజమూరాదు. మాకాలనీలో ఒకే ఒక్కడు హిప్పటిజం పోస్టల్‌ట్యూషన్‌నేర్చుకుంటున్నాడు. ఎప్పటికయినావాడి గయ్యాళి భార్యను హిప్నటైజ్‌ చేయాలని వాడిప్రయత్స్నం! నాలుగేళ్ళయిందిగాని వాడికోరిక ఇంతవరకు నెరవేరలేదు.”

పోలీసాఫీసర్‌కి వళ్ళు మండిపోయింది.

"ఏయ్‌! ఈ కాఫీలన్నీ కాన్సల్‌ చేసేసి వీళ్ళందరినీ లాకప్‌లో తోయండి. జామీను ఇస్తేగాని వదలకండి! తప్పుడు నాకొడుకులు-" అంటూ లారీతో మమ్మల్ని గదిబయటకు తోసేశాడు.

చివరకు గోపాల్రావ్‌ తన అయిడెంటిటీ కార్డు చూపించి వాళ్ళని 'ఈక్షణం' ఎడిటర్‌తో రికమండ్‌ చేయించాక గానీ మమ్మల్సి వదిలిపెట్టలేదు.

ఆ రాత్రి ఇంటికి చేరుకునే సరికి పన్నెండయిపోయింది శ్యామల్రావ్‌ మాకోసమే

' ఎదురుచూస్తున్నాడు "అంతా విన్నాను. మనకాలనీ ఆడాళ్లంతావచ్చి నన్నుబ్రతిమాలారు. 268 హ్యూమరాలజీ .

మనకాలనీ పిల్లలందరకూ సీట్లిమ్మని. తలోరెండువేలూ చాలుడొనేషన్‌. మిగతా వాళ్లు అయిదువేలిస్తున్నారు" అన్నాడు చిరునవ్వుతో

"చూడు నాయనా! మనకాలనీ పిల్లల్ని డెకాయట్స్‌ చేసేయాలన్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మేమంతా ఆడెసిషన్‌ తీసుకోగానే తప్పక మీకాలేజ్‌లోనే చేర్పిస్తాము" అన్నాడు రంగారెడ్డి. శ్యామల్రావ్‌ మమ్మల్ని చూసి నవ్వి వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయం చంద్రకాంత్‌ఛటోపాధ్యాయ పరుగెత్తుకొచ్చాడు మాఇంటికి.

"అర్జంటుగా మేధిపట్నం వెళ్ళాం పదండి. అక్కడ బ్రహ్మండమయిన కాలేజ్‌ ఉంది. ప్రిన్సిపాల్‌ మాబాబాయి(ఫైెండ్‌అట-రికమండేషన్‌లెటర్‌ ఇచ్చాడు-" అందరం పదిగంటలకల్త్లా

  • ఆకాలేజ్‌ చేరుకున్నాం-ప్రిన్సిపాల్‌ ఆ ఉత్తరాన్ని చూస్తూనే “"ఓకే-మీక్కావసిన సీట్లన్నీ ఇస్తాం" అన్నాడు ధీమాగా. అప్లికేషనులు పూర్తిచేసిచ్చాము.

మా అప్లికేషన్స్‌ అన్నీ చూశాడు ప్రిన్సిపాల్‌. చూస్తూనే నవ్వేశాడు.

"గహ్హ గహగహం- గప్లికేషన్‌లో ఇంగ్తూస్‌ మీడిగిమ్‌ అని రాశారేమిటి? తెగులూ తెగులూ మీడిహెమ్‌ సీట్లున్నాయి" అన్నాడు

మేము మొఖాలు చూసుకున్నాం మళ్లీ.

"కానీ మావాళ్లు టెన్త్‌ వరకు ఇంగ్లీష్‌మీడియంలో చదివారుకదండీ, ఇప్పుడు తెలుగు మీడియం అంటే కష్టంకదా?" అన్నాడు శాయీరామ్‌.

“కష్టమ్‌? కష్టం హేమిఉంది! నన్ను సూడు! ఇంగ్లీష్‌ నోస్‌ మీ! తెగులూవస్తయి! ఉర్దూ వస్తయ్‌ అంతా! అన్ని లాంగ్వేజ్‌ భాషల్‌ వస్తయి నాకు! ఎందుకని? టెన్త్‌లో తెగులూ, ఇంటర్‌ల ఇంగ్లూస్‌! డిగ్రిలో ఉరూ "అంటూ అపి 'గహగహగహ' అంటూ మళ్ళీ నవ్వాడు.

మేము చేసేదిలేక తలూపాము. మిగతా అప్లికేషన్‌లు కూడా తీసి చూశాడతను

"ఇగో! బి. ఎ. తెలుగు మీడిహెమ్‌ లేదు. తమిళమిడిహెమ్‌ తీసుకోండి!”

"ఆ తమిళమా? తమిళం మనకెందుకండీ బాబు! మాకేం ఉపయోగంఅది?" ఆయన మళ్ళీనవ్వాడు 'గహగహగహ-తమిళం వస్తే మన ముఖ్యమంత్రికి ఎడ్‌వైజ్‌ర్‌ అంటే సలహాదారుడుగా పనిచేసి పూడ్చవచ్చు. ఎంత మంచి నౌకరి అది! అఛ్చ్భాజాబ్‌ హై"మళ్ళీ తలూపాము.

"ఇదిగో-ఇక్కడే ఇంగ్లీష్‌ మీడియం అనిరాసినయ్‌. బి.కామ్‌. ఉర్జూ మీడిహెమ్‌

సీట్లున్నాయి తీసుకోండి. ఉర్జూమీడి హెైమ్‌ తీసుకుంటే చాలా ఎక్కువప్రాఫెట్‌."

"ఏంచేద్దామంటారు?" అడిగాడు ఓ కుర్రాడి తండ్రి భయంగా ఫర్‌ సేల్‌ 269

“తప్పదు తీసుకోండి! ఇవాళే లాస్ట్‌డే ! ఇంకో కాలేజీలో ఇప్పుడు వెళ్ళి అప్లికేషన్‌ ఫారమ్స్‌ ఇవ్వమన్నా ఇవ్వరు. మళ్ళా అప్లికేషన్‌ ఫారమ్స్‌ ఇవ్వాలంటే మనందరం మళ్ళీనెలరోజుల శెలవుపెట్టి ఎడ్యుకేషన్‌ సెక్రటరీ దగ్గర పర్మిషన్‌తెచ్చుకోవాలి. ఆపర్మిషన్‌ ఆయనివ్వాలంటే మినిష్టర్‌ సెక్రటరీ దగ్గర రికమండేషన్‌ చేయాలి. కాలేజ్‌ప్రిన్సిపాల్‌ రాసివ్వాలి. " ఇదంతా అయ్యేవరకూ అకాలేజీలో సీట్టుండాలి-" అన్నాడు రంగారెడ్డి.

మాట్లాడకుండా ఫీజులుకట్టి బయటపడ్డాము.

"ఉర్జూ, తెలుగు, ఇంగ్లీషు, తమిళం, మీడియాలు చదివి కలగాపులగంగా చదివిన పిల్లలు ఎలాంటి ఫౌరులుగా తయారవుతారో మాకు తెలుసు అలాంటివన్నీ చదివిన ఆకాలేజ్‌ ప్రిన్సిపాల్‌ దానికి ఎగ్జాంపుల్‌ 'అన్నాడు శాయీరామ్‌ కాలనీ చేరుకున్నాక.

"ఆ గాడిద గుడ్డు లేస్తూ! వాళ్ళెలా తయారయితే మనకెందుకు! వాళ్ళెిలాంటి భాషమాట్టాడితే మనకెందుకు! మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తగ్గట్లె పిచ్చి ఫొరులుగా తయారవుతావు! అవనీ! ఆ గవర్నమెంటుకి సరిపోతారు'" అంటూ 'గహ గహ గహ" మని నవ్వాడు రంగారెడ్డి. *

ఈ ౬ గ్‌ 270 హ్యామరాలజీ

50ట్రఆట ౮ గ్ర ( క _ | ళో , కాన్హ నా

కాలేజీ సీట్లుగొడవతో మాఅందరికీ పిచ్చెకినట్టయింది కోద్దిరోజులపాటు. అందుచేత ఇంకెలాంటి సమస్యలజోలికి పోకుండా ప్రశాంతంగా కొంతకాలం గడపాలని నిర్ణయంచుకున్నాము. శాయీరామ్‌కీ, యాదగిరికీ చాలాగట్టివార్నింగ్‌ ఇచ్చాడు రంగారెడ్డి, కొద్దిరోజులు కాలనీలో ఎలాంటి మీటింగులూ పెట్టవద్దని. పాపం శాయీరామ్‌, యాదగిరి నాలుగు రోజులపాటు ఏయాక్టివిటీ లేకుండా ఇంట్లోకూర్చోటానికి చాలా ఇబ్బంది పడిపోవటం మేము చూస్తూనే ఉన్నాము. కానీ తమాషా ఏమిటంటే నాలుగురోజులు గడిచేసరికి మాకే ఏ కార్యకలాపాలూ లేకుండా ఇంట్లో కూర్చోవటం చాలా చిరాకుగా తయారయింది. చివరకు నేనే ఆచిరాకును భరించలేక ఆ ఉదయం రంగారెడ్డి ఇంటికి చేరుకున్నాను. రంగారెడ్డి అప్పుడే తనపెన్‌ కనిపించటంలేదన్నమిషతో ఇంట్లో భార్యాపిల్లలతో యుద్ధం చేస్తున్నాడు. కొత్త ఆట 2/1

"అబ్బబ్బ! ఈనాలుగు రోజుల్నుంచీ ఛస్తున్నాను మీగొడవతో. ఏదొక మీటింగో, పాడో ఉంటేగానీ, నాప్రాణానికి హాయిగా ఉండదు. పాపం ఆ ఉదయార్కర్‌ భార్యకూడా ఇదే గొడవ! నాలుగు రోజులు ఇంటివట్టున ఉండేవ్పటికి ఎదోక మడత పేచీ 'పెట్టకుంటున్నారట అఆ అన్నయ్యగారు" అంటోందామె.

"ఈ మగజాతే అంత! ఒకర్షని ఎం లాభం?" అంటోంది మాఆవిడ.

నేను గతుక్కుమన్నాను.

మాఆవిడమీద కోపంవచ్చేసింది-నాగురించి అలా బ్యాడ్‌ పబ్లిసిటి ఇస్తున్నందుకు.

"ఎమిటి గురూ! ఎంతసేపయింది వచ్చి!” అడిగాడు రంగారెడ్డి బయటి కొచ్చి నన్ను చూని. అతని భార్యకూడా నాలికరచుకుంది నన్నుచూసి.

"ఇప్పుడే! మీమిసెస్‌మాట్ట్లాడుతోందేమీ వినలేదింకా" అన్నాన్నేను ఎవరికీ ఇబ్బంది

_ కలుగకుండా.

"వింటే మాత్రమేముందిలే కూరగాయల ధరలు మరీ పెరిగిపోతున్నాయంటోంది" అన్నాడు రంగారెడ్డి అబద్దమాడేస్తూ,

“అవునవును! దొండకాయలు చూడరాదూ? మరీకిలో రూపాయి అట! కిందటి సంవత్సరం ఇదే రోజుల్లో అరవైపైసలకు కొన్నాం” అన్నాన్నేను కూడా నాటకమాడుతూ. "శాయీరామ్‌ దగ్గరకు వెళ్ళాంపద" అన్నాడు రంగారెడ్డి మళ్ళీమాటమార్చేస్తూ. ఇద్దరం శాయీరామ్‌ ఇంటికి చేరుకున్నాం! అప్పటికే అక్కడబోలెడు మంది కాలనీ పిల్లలను జమచేసి అవేశంగా ఎదోఉపన్యాసం ఇస్తున్నాడు శాయీరామ్‌.

"నాకుతెలుసు! మనకాలనీ పిల్లలకు ఒక్క టి.వి. తప్పితే వేరే కాలాక్షేపాలేమీ లేవని! కానీ అఆ టి.వి. లోనేమో కళకు అంకితమయిన ్రోగ్రామ్స్‌ ఎక్కువ. దానినుంచి మనం నేర్చుకునేది- ముఖ్యంగా పిల్లలు నేర్చుకునేదేమిలేదు. అదివరలో పిల్లందరినీ రిపబ్లిక్‌ పెరీడ్‌కూ,స్వాతంత్ర్రదినోత్సవంవేడుకలకూ, నెహ్రూ పుట్టినరోజు సరదాలకూ ఇలా ఎన్నో కార్యక్రమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ గవర్నర్‌. ప్రధానమంత్రి ఇతరమంత్రులూ, వురవముఖులూ కనిపించేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే ఉవన్యానంవిని ఎంతోమంది ఉత్తేజితులయ్యేవాళ్ళు. అలాదేశనాయకులనడవడి, వారిసంస్కృతి ఎంతోమంది పిల్లలకూ, "పెద్దలకూకూడా ఆదర్శప్రాయమయింది"” అంటూ చెప్పిమమ్మల్సి చూసి ఆశ్చర్యపోయాడు.

"ఏం గురూజీ! ఏమిటిలా వచ్చారు?" అడిగాడతను-నేను రెడ్డీ ఇద్దరం తడబడ్డాము.

"అబ్బే! ఎమిలేదు-ఊరికే అలా" అన్నాన్నేను.

272 హ్యూమరాలజీ

"మీరేమనుకుంటారోనని మీదగ్గరకురాలేదు మీకు ఓవిషయం చెప్పాలి.” అన్నాడు శాయీరామ్‌ కొంచెం జంకుతూ

"అబ్బే! ఏం ఫర్లీదన్నా చెప్ప! ఏమిటది? ఏమిటది?" అంటూ మావెనుకనుంచీ ముందుకి దూసుకొచ్చి అడీగాడు యాదగిరి. అతను మావెనుక ఎప్పుడుచేరాడో మాకేతెలీదు. అనుమానంవచ్చి వెనక్కు తిరిగిచోసేసరికి గోపాల్రావ్‌, చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయ్‌ కూడా నిలబడీ ఉన్నారు.

"ఏమిటీ? మీరందరూ బయతళ్చేరేసరికి ఏమయినా విశేషం ఉందేమోనని-” అన్నాడు గోపాల్రావ్‌ ఆశగా.

"ఎమీలేదు." అన్నాన్నేను.

అంతా నిరాశపడిపోయారు.,

“కానీ శాయీరామ్‌ ఎదో విషయం చెప్పాలంటున్నాడుగా?" అడిగాడు యాదగిరి.

"ఎమిటది?" అడిగాడు రంగారెడ్డి శాయీరామ్‌ని ఆత్రుతగా. "అదే! ఇవాళ పేపరులో వేశారుకదా! మనకాలనీ వెనుకవేపున్నగుడిశెల్లో ఆ మధ్యకాలిపోయిన రెండుగుడిసెలు చూడ్డానికి మనప్రధానమంత్రి ఉత్తమకుమార్‌గారూ, మన ముఖ్యమంత్రి నిత్యానందంగారూ వస్తున్నారని! బహుశా మన గవర్నర్‌ మహాధీర్‌ రూడా వసారనుకుంటాను, కనుక ఇది మన కాలనీ పిల్లలందరకూ అపూర్వ అవకాశం! మనం చిన్నపిల్లలుగా వున్నపుడు (పెసిడెంట్‌ వస్తున్నాడన్నా, ప్రధానమంత్రి వస్తునాడన్నా ఎంతవేడుకగా ఉండేది? వాళ్ళు చెప్పేమాటలు వింటూంటే మనకెంత ఇన్‌స్పిరేషన్‌ వచ్చేది?" ఆవేశంగా అన్నాడు శాయీరామ్‌.

"అవునవును! అప్పట్లో పేపరులో చూశాను! ఓ దొంగ నెహ్రగారి మీటింగ్‌కొచ్చి ఆయన ఉపన్యాసంవిని ముగ్గుడయి దొంగతనం త్యజించి చదువుకుని యూనివర్శిటీ ప్రాఫెసర్‌ అయిపోయాడట"' అన్నాడు గోపాల్రావ్‌.

"అంతేకాదు! మన(పెసిడెంట్‌ బాబూరాజేంప్రసాద్‌గారి ఉపన్యాసంవిని ఒకతాగుబోతు తాగుడు మానేశాడట-" అన్నాడు జనార్ధన్‌,

"డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణగారు కారులో తనను చూడానుకి నిలబడ్డ పిల్లల్లో ఓకుగర్రాడి తలనిమిరి [పేమగా ఎఏంచదువుతున్నవ్‌బాబు? అని అడిగినాలుగు మంచిమాటలు చెప్పేసరికి అంతవరకూ ఆకతాయిలుగా చదువూ సంధ్యా లేకుండా తిరుగుతున్న ఆపిల్లలందరూ స్కూలు కెళ్ళటం ప్రారంభించారు-ట" అన్నాడు చంద్రకాంత్‌. కొత్త ఆట 2/73

"అందుకని మనకాలనీవాళ్ళందరం కలసి మనపిల్లలతో ఆగుడిశెల దగ్గరకు వెళ్ళి ప్రధానమంత్రికి, పూలదండ వేయిస్తే బావుంటుంది" అన్నాడు శాయీరామ్‌.

ఆ ఆలోచన మా అందరి వెంటనే నచ్చింది. పిల్లలంతా కూడా వెళ్లాం వెల్దాం అంటూ కేకలు వేయసాగారు ఉత్సాహంగా. అప్పటికప్పుడే కాలనీమీటింగ్‌ ఎర్పాటుచేసేశాడు శాయీరామ్‌, ' భయంకరమయిన ఆనందంతో! ఆడాళ్ళు పిల్లలూ విరివిగా వచ్చేశారు మీటింగుకి.

"సోదర సోదరీమణులారా! నేడు మనకు పర్వదినం" అన్నాడు శాయీరామ్‌ మైక్‌ ముందుకొచ్చెసరికి హఠాత్తుగా విజృంభిస్తూ,

"ఎందుకు పర్వదినం?" అని వెనుకనుంచి కాలనీ విద్యార్ధలు అరచారు బిగ్గరగా.

"ఎందుకంటే ఎందుకంటే.... ఏమో నాకు తెలీదు. సాధారణంగా రాజకీయమీటింగుల్లో అలా అంటారు కాబట్టి అన్నాను-' అన్నాడతను తడబడి.

“అయితే ఆమాట వితడ్రాచేసుకో' అరచారు కుర్రాళ్ళు.

..... శాయీరామ్‌ విత్‌డ్రా చేసుకున్నాడు.

“సోదర సోదరీమణులారా! ఈ రోజు మామూలు దినం! ఇప్పుడు ముఖ్యమయిన విషయం ఏమిటంటే మనకాలనీ వెనుకవేపుఉన్న వీకరొసెక్షన్స్‌ గుడిశెలకు మన ప్రధానమంత్రి ఉత్తమ్‌కుమార్‌ గారు, మనముఖ్యమంత్రి నిత్యానందరంగారు, ఇంకో రెండుగంటల్లో వస్తున్నారని తెలిసింది. కనుక మనందరం వెళ్ళి మనకాలనీ పిల్లలద్వారా వారికి వూలదండవేయించి వారితో కొద్ది నిముషాలు సంభాషించేలాచేస్తే మనపిల్లలందరూ కూడా ఆమహానీయుల సూక్తులు విని, ఆసంస్కృతి అవలంబించి సత్ర్రవర్తనులయి మహోన్నతమయినటువంటి స్థితికి ఎదుగుతారని నాఅభిప్రాయం! మీరేమంటారు?"

అడాళ్ళూ, పిల్లలు ఏకగ్రీవంగా తమఅంగీకారాన్నీ ఉత్సాహాన్నీ తమ హర్షధ్వానాల ద్వారా తెలియజేశారు. ఎంచేతో మగాళ్ళు మాత్రం ఎమంత ఉత్సాహం చూపలేరు. సరే-యమనభారతదేశంలో మగాళ్ళ అభిప్రాయాలకు రాజకీయాలూ, సినిమాలూ ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వవ్‌ గనుకమేమూ ఇవ్వదల్బుకోలేదు.

అప్పటికప్పుడే కాలనీ తాలూకుకిచెన్‌ గార్డెన్‌లో ఉన్న రకరకాలపూలు తీసుకురావడం, క్షణాల్లో వూలదండతయారుచేయడం౦ జరిగిపోయింది. అందరం ఓఅరగంట ముందుగానేవెళ్ళి బలహీనవర్గాలవాళ్ళు గుడిశెల దగ్గర నిలబడ్డాం. సరిగ్గా అరగంట గడవగానే పోలీస్‌ సైరన్లు, జనాన్ని వెనుకకు తోస్తున్న కేకలూ వినిపించాయి. మరుక్షణంలో 274 హ్యూమరాలజీ |

అతివేగంగా పైలెట్‌ పోలీస్‌జీప్‌ వచ్చికాలనీలోకి తిరిగిపోయింది. కానీ దాని వెనుకే వస్తున్న ప్రధానమంత్రి కారు మాత్రం కాలనీ వేసు తిరగకుండా అతివేగంగా దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది. జనం, పోలీనులూ హాహాకారాలు చేశారు.

''అరి! వ్రధానమంత్రి ఇటు తిరగకుండా తిన్నగా వెళ్ళిపోయాడేమిటి?" అనుకుంటున్నారు అధికారులు. ఈలోగా ఆకారువెనుకే గవర్నరూ, ముఖ్యమంత్రికారుకూడా వేగంగా వెళ్ళిపోయాయి. బలహీనవర్గాలందరూ నిరాశపడిపోయారు.

"మా తగలబడిన గుడిశెలు చూడ్డానికి ప్రధానమంత్రిగారొస్తోన్నారని చెప్తే ఆనందించాం బాబు! కానీ ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు అన్నారు వాళ్ళు. మేము కూడానిరాశగా పోలీసు అధికారుల దగ్గరకిళ్ళాం.

" పధానమంత్రిగారు- ఈకాలనీకొస్తారనీ పేపరులో వేశారుకదా! అలా ఆగకుండా ఇంకెక్కడికో తిన్నగావెళ్ళిపోయారేమిటి?" అడిగాడు రంగారెడ్డి.

"అది మామూలేనయ్యా! ఎప్పుడూ నూటపాతిక్కిలోమీటర్ల స్పీడ్‌లో కారు తోలటం ప్రధానమంత్రిగారికి హాబీ! అందుకని అప్పుడప్పుడూ అలా కొంతదూరం కారు తోలుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కుతిరిగివచ్చేస్తారు-" అన్నారు.

పదినిమిషాలతర్వాత వాళ్ళన్నట్లే మళ్ళీ అదేవేగంతో వచ్చి సడన్‌బ్రేకులతో ఆగినాయి కార్లు. ప్రధానమంత్రి ఉత్తమ్‌కుమార్‌గారు చాలాచలాకీగాకారులోనుంచి కిందకుదిగారు. వెంటనే గవర్నరు, ఇతర అధికారులు, ప్రధానమంత్రితాలూకూ 'ఉరి అనే పార్టీనాయకులూ ఆయనను చుట్టముట్టారు.

"అబ్బ కారు చాలా స్పీడుగా డైవ్‌చేశారు సార్‌ మీరు" అన్నారు వాళ్ళు పార్టీనాయకులు.

“మొన్న రాజస్తాన్‌లో హరిజనులమీద అగ్రవర్ధాలవాళ్ళదాడి జరిగినప్పుడు కూడా వెళ్లానుకదా! అక్కడా ఇంకా బోలెడు స్పీడుగా నడిపేశాను ఇహి..."అన్నాడు ప్రధానమంత్రి.

"అవున్సార్‌! అప్పుడు దుమ్ముకూడా సరిగ్గా మూడొందల రెండు మీటర్ల ఎత్తు పైకి లేచింది! దుమ్ముపైకి లేవటంలో రాజస్తాన్‌ ట్రిప్‌ రికార్డ్‌బేక్‌ సార్‌' అన్నాడు పార్టీ నాయకుడు కాకారావ్‌.

"కాదు సార్‌! అలహాబాదు ట్రిప్‌లో మూడొందల రెండు మీటర్లపెన ఆరుసెంటీమీటర్లు ఎత్తు దుమ్ములేపారు." అన్నాడు మరో నాయకుడు బాకారావ్‌.

"ప్రపంచంలో ఆంతఎత్తు దుమ్ములేపిన ప్రధానమంత్రి మీరొక్కరేనని నిన్నే గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌వరల్డ్‌రికార్స్‌కి రాసి పంపించాను సార్‌ అన్నాడు ఇంకో తబాకారావ్‌. కొత్తఆట 2/75

ప్రధానమంత్రి అతని వేపు గ్రేమగా చూశాడు.

“ఇంకా వెళ్ళిపోదామా?" అడిగాడతను.

అందరూ అదిరిపడ్డారు. ప్రోగ్రాంప్రకారం మీరు అగ్రకులాలవారు తగులబెట్టిన ఆగుడిసెలను చూడాల్సి ఉందండీ అన్నారువారు.

"ఓ! అవునవును! ఈకారు స్పీడ్‌ డైవింగ్‌ గొడవలో ఆసంగతి మర్చేపోయాను-"

అంటూ గుడిసెలవేపు నడిచాడు ఉత్తమ్‌కుమార్‌.

మేము ముందే ఇచ్చిన సూచనల ప్రకారం మాకాలనీ పిల్లందరూ "చాచా ఉత్తమ్‌ జిందాబాద్‌" అంటూ అరచారు. అరడజనుసార్లు ఉత్తమ్‌ మావేపు చేయివూపి గుడిసెల వాళ్ళ దగ్గరకు నడిచారు. అప్పటివరకూ దూరంగావున్న బలి అనేపార్టీవారితో మరో గ్రూపుగా నడుస్తోన్న ముఖ్యమంత్రి నిత్యానందం ఒక్క పరుగుతో ముందుకి వచ్చేశాడు.

ప్రధానమంత్రి తాలూకా 'ఉరి' పార్టీనాయకులు అప్పటికే ఓగుడిసెకు చెందిన ముసలమ్మచుట్టూ ఫెన్సింగ్‌లా నిలబడ్డారు, ప్రధానమంత్రిని చూడగానే ఆమె "ఓరి దేవుడో, రావుడో! నాగుడిసెను 'బలి' పార్టీవాళ్ళు బలి తీసుకున్నారో నాయనో" అనే అర్ధం వచ్చేట్లు కపాలి భాషలో పెద్దఎత్తున ఏడ్చేయసాగింది.

"ఎం జరిగిందమ్మా? ఏం జరిగింది?" అంటూ అడిగాడు ప్రధానమంత్రి బెంగాలీలో.ఆ స్త్రీ కపాలీ భాషలో జవాబిచ్చింది.

"గుంప్రోకసో మాసిజీర కసాసు భమర్‌ తణా" అందామె ఏడుస్తూనే.

వెంటనే పార్టనాయకుడు కపాలీ భాషనుంచి తనకు తెలిసిన భగోరా అనే భాషలోకి ఆమె మాటల్ని అనువాదంచేశాడు.

“ఆగామణ్‌బా తగీలాబాగ్రామూళ్చెకప్‌తీరా బోస్‌కమ్‌సూని" అన్నాడతను. ప్రధానమంత్రి తెలమొఖం వేశాడు.

"నాకు భగోరా భాషరాదని అతనికి చెప్పండి” అన్నాడు పక్కనున్న పధ్మాలుగురు అనువాదకుల నుద్దేశించి. వెంటనే కపాలీ భాషనుంచి హిందీలోకి అనువాదం చేయగల అనువాదకుడు ముందుకొచ్చాడు అతను ఉన్నదున్నట్టు అనువాదంచేసేశాడు."మా మగోడు తాగొచ్చి బీడీ ఆర్పకుండానే విసిరీస్తే ఇల్లంటుకుంది."

హఠాత్తుగా “ఉరి” పార్టీ నాయకుడు ఒక్క ఎగురెగిరి ఆ అనువాదకుడి మీదపడ"” పీక నొక్కేశాడు. వెంటనే ఇంకో 'ఉఊరి' నాయకుడు అనువాదం మొదలు పెట్టాడు.

276 హ్యామరాలజీ

"ఆమె, ఆమెభర్త కూలిచేసుకునివచ్చి వంటచేసుకుంటూండగా ప్రాంతీయపార్టీ అయిన 'బలి” పార్టీ నాయకులు కిందటి ఎన్నికల్లో తగాదాలకారణంగా తామిద్దరినీ తన్ని కత్తితోపాడిచి, గుడిశెతగలబెట్టి పారిపోయారని ఆమె ఆ(క్రోసిస్తూ చెప్తోందిసార్‌! రాష్ట్రప్రభుత్వానికి ఎన్ని మహజర్డు పెట్టుకున్నా పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆమెగోడు ఎవరూ పట్టించుకోలేదని ఆమె కడివెడుకన్నీరు కారుస్తూ చెపుతోంది సార్‌."

అతనిమాట పూర్తికాకుండా అతనిని ఒక్కతోపుతోసి ముఖ్యమంత్రి నిత్యానందం ముందుకొచ్చాడు. "ఇదంతా అభూత కల్పన! అందుకు నిదర్శనం ఈ 'ఉరి' పార్టీ అనువాదకునికి కపాలీభాష రాకపోవడమే” అన్నాడు నిత్యానందం

“వచ్చు! ఆమె చెప్తోన్నదేమిటంటే ఆమె ఒకప్పుడు'ఉరి' పార్టీకి చెందినమనిషేకాని, ఈమధ్య 'బలి' పార్టీలో చేరడంవల్ల 'ఉరి' పార్టీ వాళ్ళు ఆమె గుడిశె తగులబెట్టి ఆమెను చంప బోయారనీ-"

ముఖ్యమంత్రి మాట వూర్తికాకుండానే 'ఉరి'పార్టీ కేంద్రమంత్రి ముందుకి చొచ్చుకొచ్చాడు.

“అబద్దం! ఆ స్త్రీ చెప్పినదేమిటంటే అమె ఇంతకుముందు “ఉరి” పార్టీలో వుండేదని,

“కానీ బలి పార్టీ నాయకులు అమెను బలవంతంగా..."

'అంతాఅబద్ధం! అభూతకల్పన! దుర్మార్గం'' అన్నాడు ముఖ్యమంత్రి

"నోర్ముయ్‌! నీకు కపాలీ భాషరాదని నాకు తెలుసు!” అన్నాడు 'ఉరి' పార్టీకి చెందిన కేంద్రమంత్రి.

"ఎడ్బావ్‌! కావాలంటే కాగితం తెచ్చుకో! ఆభాషలో సంతకం చేస్తాను” అన్నాడు ముఖ్యమంత్రి కోపంగా. “పోరా వెర్రివెంగళాయ్‌" అన్నాడు కేంద్రమంత్రి.

“నువ్వే పోరా పిచ్చిపుల్లయ్‌-"

'పోరాబాడ్‌కవ్‌-" ో "నీయవ్వ-మక్కిలిరగదంతా!"

నాకొడకా! ఒక్కలాత్‌ కొడతా"

మేమంతా నిశ్చేష్టులై చూస్తూండిపోయాం. కానీ మాకాలనీ పిల్లలు హఠాత్తుగా ఆతిట్లకు పులకరించిపోయారు. ఆఇద్దరూ తిట్టుకునే ప్రతి తిట్టుకీ తప్పట్ట్లుకొట్టి ఉత్సాహంతో "అబ్బ! అబ్బ భలే తిట్టాడు! భలేతిట్టాడు” అంటూ ఆనందం వ్యక్తం చేయసాగారు. కొత్త ఆట 277

పావుగంట తర్వాత గవర్నర్‌ మహాధీర్‌ మధ్యకి దూకి ఇద్దరినీ తిట్టుకోకుండా _ సమాధానపరచాడు. ముఖ్యమంత్రి నిత్యానందం కోపంగా ప్రధానమంత్రి ఉత్తమ్‌కుమార్‌వేపు తిరిగాడు. "ఇదంతా మీరిస్తున్న అలుసు ఆనాకొడుక్కి! లేకపోతే ముఖ్యమంత్రిని అన్ని తిట్లు తిట్టడానికి ఎంతధైర్యం?' అన్నాడు మండిపడుతూ. దాంతో ఉత్తమ్‌కుమార్‌కి కోపంవచ్చింది. “"ఆల్‌ైట్‌ నేనే అలుసిచ్చాను! అయితే ఎమంటావ్‌?” _. . "ఎమంటానా? నీలాంటి చేతకానివాడు ప్రధానమంత్రిగా ఉంటానికి అనర్హడంటాను.” “నువ్వెవడివిరా ఆమాటంటానికీి? నాప్రజలు నన్ను వధానిగా ఉండమని ఎన్నుకున్నారు!” "అలాగా! నీ కోఫర్స్‌ కుంభకోణం తెలీక ఎన్నుకున్నార్రానిన్ను " "ఒరేయ్‌! నీ గాచారం భూములకుంభకోణం సంగతి ఎవడికీ తెలీదనుకోకు.” "నీ ఫెండ్‌ గబితాబ్‌ బచన్‌ విదేశీ బ్యాంక్‌ నిల్వలు నాకూ తెలుసు" "అలాగా నీ అల్లుడికి నువ్విచ్చిన కంప్యూటర్స్‌ లైసెన్స్‌ కుంభకోణం నాకూ తెలుసు." "అలాగా! నీ బామ్మర్ది పేరుమీద నువ్‌సగంథిల్లీ కొన్నవిషయం ఎవడికీ తెలీదనుకోకు" ఇ "నీతమ్ముడి పేరుమీదా, మీ అబ్బాయ్‌ పేరుమీదా నువ్‌ సగం రాషష్టంకొనేయడం చిన్నపిల్లలకు కూడా తెలును-" “ఒరేయ్‌! నీ అంతుచూస్తా-" “పోరా. ఇద్దరికి ఫైటింగ్‌ ప్రారాభయమ్యేసరికి గవర్నర్‌ మధ్యలో దూరి ఇద్దరినీ విడదీశాడు. _ దాంతో అప్పటికప్పుడే 'ఉరి' పార్టీవాలంటీర్లు 'బలి' పార్టీవలంటీర్లు తమతమపార్టీలకు జిందాబాద్‌ చెప్తూ కేకలుమొదలు పెట్టారు. “నాకొడకా-ఢిల్లీ వెళ్ళి నీ అంతుతేలుస్తానుండు-" అన్నాడు ఉత్తమకుమార్‌. క మళ్ళీ గవర్షర్‌వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఉత్తమకుమార్‌ వెళ్ళిపోబోతుంటే మేము వెంటపరుగెత్తాము. "సార్‌! మాకాలనీ పిల్లలు మీకు దండవేయడానికి వచ్చారు" అన్నాడు రంగారెడ్డి ప్రధానమంత్రితో. ప్రధానమంత్రి సంతోషంగా మాకాలనీ పిల్లల దగ్గరకొచ్చాడు తీరా 278 హ్యామరాలజీ

ఆయనకుమావాళ్ళు దండవేయబోతూన్న సమయంలో ముఖ్యమంత్రి నిత్యానందం కూడా పరుగుతో వచ్చి పిల్లలందరి భుజం తట్టి. “నాకోసందండతెచ్చారా? థాంక్యూ" అన్నాడు మెడముందుకిచూస్తూ.

“దండ నాది" అన్నాడు ఉత్తమకుమార్‌ దండలాక్కోబోతూ

“నాది అంటూ తనూ ఒక్కలాగు లాగాడు నిత్యానందం.

దండ రండు ముక్కలయింది.

దాంతో 'ఉరి' పార్టీవాళ్ళూ 'బలి' పార్టీవాళ్ళూ కలబడ్డారు హఠాత్తుగా. మేము వెంటనే పిల్లలను తీసుకుని మాకాలనీవేపు పరుగెత్తాము.

నై ల ళా

ఇదిజరిగి వారంరోజులతర్వాత ఓరోజు సాయంత్రం మేమంతా కాలనీ వేదిక దగ్గర కూర్చుని మాట్టాడుకుంటూంటే కాలనీ పిల్లలందరూ ఆడుకోవడంచూచాము.

“ఇవాళ కొత్తరకం ఆట ఆడుదామురా!" అన్నాడు ఒకడు.

॥ "ఎమిట్రా అది" అందరూ వాడిచుట్టూ మూగారు.

"ప్రధానమంత్రి-ముఖ్యమంత్రీ ఆట-"

అందరూ చెరోవేపుకి వెళ్ళి నిలబడ్డారు.

“ఒరే దొంగనాయాలా! నువ్‌ లోఫర్‌విరా?”"

"నువ్‌ డబుల్‌ లోఫర్‌విరా సాలే"

“చల్‌రే బాడుకవ్‌"

“చల్‌రీ దొంగబాడుకవ్‌"

"జారేలుచ్చే..." స్తం

అను బోను గ్‌ (ఫ్రా

కొత్త ఆట ాల్త్యల్ల్ట 279

అదుగో |! ఆదిమానవుడు శేతే. ; /| యో 11; (| [1 / ర్న )// కే కం అర్ధరాత్రి-పన్నెండు గంటలకు కాబోలు! చాలా పెద్ద కోలాహలం వినిపించింది కాలనీకిదగ్గరగా. నాకు శాయీరామ్‌మీద వళ్ళు మండిపోయింది. మళ్ళీఏదో కొంపలమీదకుతెచ్చి మీటింగ్‌ ఐర్పాటు చేశాడేమోనని. వచ్చేఎలక్షన్లలో శాయీరామ్‌కి ఎలాంటి ఆఫీస్‌బేరర్‌ పోస్టు దక్కకుండా చూడాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను. ఈలోగానే తలుపులు దబదబ బాదటం మొదలు పెట్టారు బయటినుంచి. తలుపుతెరిచేసరికి ఎదురుగ్గాశాయీరాం, రంగారెడ్డి, జనార్ధన్‌, యాదగిరి, గోపాల్రావ్‌, పార్వతీదేవి, రాజేశ్వరి, వెంకట్రావ్‌, చంద్రకాంత్‌ అందరూ నిలబడి ఉన్నారు. 280 హ్యామరాలజీ

''ఎమిటి?" కోపంగా అడిగాను శాయీరామ్‌ని, "

“బయటకు పద! అక్కడెవరో చాలామంది జనంవచ్చారు-' అన్నాడు రంగారెడ్డి.

"ఎవరు వాళ్ళు?"

"అదేతెలీదు! నాలుగు లారీల్లో తీసుకొచ్చి వాళ్ళనక్కడదింపి వెళ్ళిపోయారట ఎవరో-"

నాకు అర్హమయిపోయింది.

హైద్రాబాద్‌లో ఇలాంటి దృశ్యాలు కొత్తేమి కాదు. ఎమ్మెల్ట్యెలు, గూండాలు సాధారణంగా అర్ధరాత్రుళ్ళే వాళ్ళమనుషులను తీసుకొచ్చి గవర్షమెంటుదో, (పేవేటుదో మాంచి ఖాళీస్టలంచూసి తెల్లారేసరికల్లా గుడిశెలువేయించేసి కాపురాలుపెట్టించేస్తారు. ఆఅకొాలనీకి ఇందిరాహట్స్‌కాలనీ అనిగానీ, సంజయ్‌నగర్‌కాలనీ అనిగానీ బోర్జుపెట్టేస్తారు. అంతే! ఆతర్వాత ప్రభుత్వంగానీ, ఆస్థలం ఓనరుగానీ ఎంత తన్నుకున్నా ఎమీలాభంలేదు.

"బహుశా ఈసారి ఎన్టీఆర్‌ హట్స్‌కాలనీ అని పెడతారేమో-" అన్నాన్నేను.

"అసలు సంగతేమిటో కనుక్కుందాం పదండి" అన్నాడు శాయీరామ్‌. అందరం వాళ్ళదగ్గరకెళ్ళాము.

తీరా వాళ్ళదగ్గరకెళ్ళేసరికి మాకు భయంవేసింది, వాళ్ళ ఆకారాలు చూసి. నల్లగా, లావుగా పొడుగ్గా, కేవలం నడుముచుట్టూఆకులతోఅల్లినచాపధరించి ఉన్నారు.

మమ్మల్ని చూడగానే కొంచెం భయపడినట్లున్నారు. నాలుగడుగులు వెనక్కువేసి గుంపుగా నిలబడ్డారు అందులో ఒకరిద్దరు ఈటెల్లాంటివి చేతుల్లోకి తీసుకున్నారు కూడా.

మాకు ఖంగారుపుట్టింది- మమ్మల్ని చావబాదుతారేమోనని. ఎందుకయినా మంచిదని మేమూ రెండడుగులు వెనక్కివేశాము.

"మీరెవరు?" అడిగాడు శాయీరాం.

వాళ్ళు మావేపు అయోమయంగా చూశారు. -

"కలోతసబీనమా కననమ" అన్నాడు వాళ్ళమధ్యలో నిలబడ్డ లావుపాటి వాడు. వాడినెత్తీన చిన్న శంఖువు ఒకటి కిరీటంలా నిలబడి ఉంది.

వాళ్ళదేదో సరికొత్త భాష అని అర్హమయింది నాకు.

“ఇదేదో సరికొత్తభాష లాగుంది. అసలే పద్దెనిమిది భాషలతో మనదేశం నానా ఛావు ఛస్తూంటే మళ్ళీ ఇప్పుడింకోటా?"” విసుక్కున్నాడు రంగారెడ్డి.

"ఇంతకూ వీళ్ళవిషయాలు ఎలా తెలుసుకోవడం" అందరం ఆలోచనలో పడ్డాం,

"పోనీ మన తెలుగు వీళ్ళ కర్ధమవుతుందేమో చూద్దాం-"” అన్నాడు యాదగిరి. అడుగో ! ఆదిమానవుడు 281

"ఎడ్బినట్టుంది మన తెలుగు ఒక ప్రాంతంది ఇంకో ప్రాంతంలోనే అర్ధరముయిచావదు- ఇంక బయటాడికేం అర్ధమవుతుంది?" విసుక్కున్నాడు రంగారెడ్డి,

"ఇంకోపని చేద్దాం! మన కాలనీలో రాజానందం ఉన్నాడు గదా! అతనినిపిల్చుకొద్దాం" అన్నాడు శాయీరామ్‌ ఆ అయిడియా అద్భుతంగా ఉందని అందరం అతన్ని మెచ్చుకున్నాం.

రాజానందానికి పదహారు భాషలు వచ్చన్న విషయం కాలనీలో అందరికీ తెలుసు. వెంటనే యాదగిరి వెళ్ళి రాజానందాన్ని సైకిల్‌ మీద తీసుకొచ్చేశాడు.

"హలో హౌ ఆర్‌యూ? ౯

కైసేహై?

బాగున్నావా?

నల్ల ఇరుకా?"

అంటూ అన్ని భాషల్లో మాట్టాడబోయాడు గాని మధ్యలో కట్‌ చేసేశాము టెంలేదని.

"ముందు వీళ్ళతో మాట్టాడు-వీళ్ళ భాష మాకు తెలిచ్చావటంలేదు" అన్నాడు రంగారెడ్డి. అతను వెంటనే వాళ్ళదగ్గరకు నడిచాడు.

“ఎవరుమీరు" అనడిగాడు ముందు. తరువాత మరో అయిదారు. భాషల్లో అడిగాడు. ఆఖరికి “గిబసీబసాతామ” అన్న భాషకు వాళ్ళు సమాధానం చెప్పారు.

"గదసీ మసజకా-బిక్షాద్వీప్‌" అన్నాడు వాళ్ళనాయకుడు.

"నేను అనుకున్నది కరెక్టే! వీళ్ళది భిక్షాదీప్‌ అని ఒకద్వీపం! అక్కడ నుంచి వచ్చారుట!" అన్నాడు రాజూానందం మావేపు తిరిగి.

"భిక్షాద్వీపం అంటే ఎక్కడుంది?"

"లక్షాద్వీప్‌ పక్కనే! చాలా చిన్నద్వీపం-"

అంటూ వాళ్ళతో మరో పదినిమిషాలు మాట్టాడాడు-వాళ్ళ భిక్షాద్వీప్‌ భాషలో.

వాళ్ళసంభాషణలో మాకు లభించిన వివరాబేమిటంటే-ఎవరో ఓకేంద్రమంత్రి భిక్షాద్వీప్‌ పర్యాటన కెళ్ళాడట. అక్కడున్న ఈ భిక్షాద్వీప్‌ ప్రజలు ఇంకా ఆదిమానవుల దశలోనే ఉండటం (గ్రహించి వెంటనే వారందరినీ నాగరీకులుగా చేయటానికి భారతదేశంలోని అయిదారు. షట్టణాలల్లో "పునరావాసం కల్పించాలని నిర్ణయించి ఇండియాకు తీసుకొచ్చారట. వాళ్ళల్లో ఒకజాతిని మాకాలనీ పక్కగా ఉన్న ప్రభుత్వస్థలంలో వదిలి ఇళ్ళు కట్టుకోటానికి మెటీరియల్‌ సమకూర్చారు. ఆమాట వినటంతో మాకాలనీలోని లేడీస్‌ అందరికీ ఉత్సాహంపుట్టుకొచ్చింది.

"పాపం! వీళ్ళను మనందరంకలసి నాగరికులుగా చేద్దామండి" అంది పార్వతీదేవి. 282 ._ హ్యూమరాలజీ

"అవును! మన ఆడాళ్ళకిలాగూ మధ్యాహ్నంపూట పనీపాట ఉండదు. కనుక తీరిక సమయాల్లో వీరికన్నీ నేర్పవచ్చు-" అన్నాడు శాయీరామ్‌ కూడా.

ఆ విషయమే రాజానందంతో వాళ్ళకు చెప్పించాము. మర్నాడు పొద్దున్నే మళ్ళీ వాళ్ళను కలుసుకుంటామని చెప్పి వచ్చేశాం.

ఆ రోజు ఉదయం ఆదివారం కావడంవల్ల తీరిగ్గా కాఫీ ఫలహారాలుముగించి ఆడా మగా, పిల్లలూ అందరం భిక్షాద్వీప్‌ ఆదిమానవుల దగ్గరకు చేరుకున్నాం.

అప్పటికే వారు కొండరాళ్ళతో కొండ గుహల్లాగా ఇళ్ళుకడుతున్నారు. మాకు జాలివేసింది వారిని చూస్తూంటే.

"పిచ్చి వాళ్ళలారా! చీకటి గుమారాల్లంటి కొండ గుహల్లో ఉండటం తప్పు. ఆధునిక మానవుడి ఇల్లు చూపిస్తారండి!" అంటూ నచ్చచెప్పాడు రాజానందం వాళ్ళకు.

అందరం శాయీరాం వాళ్ళింటికెళ్ళాం. కానీ పవర్‌కట్‌ ఉండడంతో ఇల్లంతా పరమ చీకటిగాఉంది ఎక్కడే వస్తువుందో కనబడటంలేదు. అదీగాక లోపలివంటిల్లూ, పడగ్గదీ

, అసలు ఒక్క కిటికీకూడా లేకపోవటంవల్ల-మరింతగాఢంధకారంగా ఉన్నాయ్‌. అతనిదే కాదు

మాకాలనీలో అందరిళ్ళూ అలాగే ఉంటాయ్‌. వాటిని “కబోలా అనే ఓ మతానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్‌ డిజైన్‌ చేశాడు. వాళ్ళ మతాచారాల ప్రకారం ఇంటి ఆడాళ్ళ మీదకు ఎలాంటి వెల్తురూ. ప్రసరించకూడదట. బ్రతికున్నన్నాళ్ళూ వాళ్లు ఆఇంటి గడపదాటి బయటకు రాకూడదు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వంటింట్లోనే తవ్విపాతి పెట్టేస్తారు. _ '

కనుక ఆ కబోలా ఇంజినీరుగారున్నంతకాలం వాళ్ళకోసం ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి కాలనీలే నిర్మించింది ప్రభుత్వం.

"ఇల్లంటే ఇలా ఉండాలి. గాలి వెల్లూరూ ధారళంగా రావాలి" అన్నాడు శాయీరామ్‌. ఆఅచీకటిలో పక్కకు నడవబోయి ఏదో పీటతగిలి కిందపడి త్వరత్వరగా లేచినిల్చుంటూ.

ఆదిమానవులందరూ మొఖాలు చూసుకున్నారు.

"కాని ఇదీ మా కొండగుహల్లాగానే చీకటిగా ఉంది కదా!” అడిగాడు వాళ్ళ నాయకుడు -. (రాజానందం ప్రకారం). మాకేం జవాబు చెప్పాలో తెలీలేదు.

"కొంచెం అలాగే ఉందనుకో-కానీ ఈ కాలనీ వదిలేస్తే మిగతా ప్రైవేటు ఇళ్ళు చాలా బాగుంటాయ్‌-” అంటూ గొణిగాడు రంగారెడ్డి. అడుగో ! ఆదిమానవుడు 283

వాళ్ళు మాఎక్స్‌ప్లనేషన్‌తో సంతృప్తిపడలేదు.

అందరం కాలనీమధ్య శాయీరామ్‌ ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు నడిచాము. అప్పటికే వాళ్ళను చూడ్డానికి వందల మంది మాకాలనీ ఆడాళ్ళు గుమిగూడి పోయారు.

"ముందు వాళ్ళను బట్టలు కట్టుకోమని చెప్పండి" అన్నాం రాజానందంతో.

. "ముందు మీరంతా బట్టలు కట్పకోవాలి మాలాగా! శరీరం అంతా బయటకు కనబడటం మీరాతియుగం పద్ధతి!” చెప్పాడు రాజానందం వాళ్ళతో. _

వాళ్ళు మాబట్టలవేపు చూశారు కుతూహలంగా.

నిజానికి అది వేసవి కావటంవల్ల వేడి భరించలేక సగంమంది మగాళ్ళం షర్చులు, బనీన్లు కూడా లేకుండా కేవలం' లుంగీలతో ఉన్నాం. అదే వాళ్ళమొఖంలో (ప్రశ్నగా కనిపించింది.

“మా మగాళ్ళ సంగతివేరు! వేసవివేడివల్ల ఇప్పుడు షర్టులు వేసుకోలేదు. అని సర్ది చెప్పాడు రాజానందం.

"మరి వాళ్ళో?” అంటూ మాకాలనీ ఆడాళ్ళవేపు చూశాడు బిక్షాద్వీప్‌ నాయకుడు. మేమంతా కూడా వెనక్కు తిరిగి ఆడాళ్ళవేపు చూశాము. దాంతో మా అందరి మొఖాలు వాడి పోయినాయ్‌. మేము ఈమధ్య సరిగ్గా గమనించటం లేదుగానీ కాలనీలో స్త్రీలు, యువతులుచాలామంది మిడ్డీస్‌ వేస్తున్నారు. అంచేత సగం వళ్ళుకనబడుతూనే ఉంది. చీరలు కట్టిన వాళ్ళు సరేసరి. జాకెట్‌కి చేతుల్లేవు. పైగాసన్న పట్టిలాంటి వెడల్పుతో మాత్రమే శరీరాన్ని చుట్టేసుకుని ఉంది. ఇక చీరలుచూద్దామా నడుముకి బాగా కిందుగా కట్టారు.

అంటే మా అందరికీ ఇంచుమించుగా మూడొంతుల వళ్ళు కనబడుతూనే ఉంది. మా పరిస్థితిలా ఉండగా అప్పడే కొంతమంది కాయకష్టం చేనుకునే కూలీలు కేవలం మొలకోచిన్నగుడ్డ చుట్బకుని మా కాలనీ పక్కనుంచే వెళ్ళటం కనిపించింది.

"అరుగో-వాళ్ళు కూడా అచ్చం మాలాగే ఉన్నారు కదా?" అడిగారు అదిమానవులు.

"అదివేరు లెండి-ఇంచు మించు మేమూ మీలాగే ఉన్నాం. కానీ కట్టకోడానికి బట్టకొనలేక అలా ఉన్నాం. బట్టల ఖరీదు మరీ ఎక్కువ కదా!” అనేసి ఇంక లాభంలేదని టాపిక్‌ మార్చేశాం.

మధ్యాహ్నం వాళ్ళ కోసం మేమంతా కొన్ని కూరగాయలు కలెక్షన్‌చేసి వండుకోడానికి ఇచ్చాము-అయితే వాళ్ళు పచ్చివే తినటం చూసి అశ్చర్యపోయాము.

"అలా పచ్చివి తినకూడదు! వండుకుని తినాలి మాలాగా! చెప్పాడు రాజానందం

“"వండుకోవడమంటే ఏమిటి? ఎలా ఉంటుందది" అడిగారు వాళ్ళు వెంటనే వాళ్ళందరినీ రంగారెడ్డి ఇంటికి తీసుకెళ్ళాం.

284 హ్యూమరాలజీ

"మా అవిడ ఇప్పుడు కూరలు వండుతూంటుంది! చూసి నేర్చుకోండి" అంటూ కిచెన్‌లోకి తీసుకెళ్ళాడతను.

అక్కడి దృశ్యం చూసేసరికి అందరికీ మతిపోయింది.

రంగారెడ్డి భార్య, వాళ్ళపిల్లలు డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుని పచ్చి కూరగాయలు తింటున్నారు. /

భిక్షాద్వీప్‌ వాళ్లు ప్రశ్నారకంగా మావేపు చూశారు.

"మీరూ మాలాగే పచ్చివి తింటున్నారుగా?" అడిగాడతను వాళ్ళభాషలో.

"నిజమేగానీ ఎప్పుడూ ఇలా తినము. గాస్‌ అయిపోయినప్పుడల్లా-మళ్ళీగాస్‌ వచ్చేవరకూ-అంటే సంవత్సరానికి ఆరునెలలు పచ్చివి తింటాము" అని జవాబు చెప్పి ఎందుకయినా మంచిదని టాపిక్‌ మార్చేశాము.

"అన్నట్టు మీరంతా చాలా దుర్వానన కొడుతున్నారు, ఎన్నాళ్ళకోసారి స్నానం చేస్తున్నారు?" అడిగాడు రాజానందం వాళ్ళను.

“ప్రతి అమావాస్యకూ, పౌర్దానికి చేస్తాం" గర్వంగా చెప్పాడు వాళ్ళ నాయకుడు. అందరం ఘెల్లున నవ్వాము.

| మరీ ఇంతదారుణంగా ఉంటారనుకోలేదు ఆదిమానవులంటే.

"ఛీ! ఛీ! అదిచాలా చెడ్డ అలవాటు. ప్రతిరోజూ స్నానంచేయాలి వీలయితే రెండుపూటలా చేయాలి. అప్పుడే మురికి, సూక్షజీవులూ అన్నీపోతాయ్‌! మమ్మల్ని చూడు! ఎంతనీట్‌గా నిగనిగలాడుతున్నామో-"

వాళ్ళు మావేపు పరీక్షగా చూస్తోంటే అనుమానం వచ్చి మావంక మేము చూసుకున్నాం. అందరివంటిమీదా నల్లగా చారలుకట్టి ఉంది మట్టి. దగ్గిరకొచ్చి కొంతమట్టిని కిందకు రాల్బారు వాళ్ళు. ముఖ్యంగా యాదగిరి, జనార్దన్‌లవంటి మీద పావుకిలో మట్టిరాలింది.

“మీరెన్నాళ్ళకోసారి చేస్తారు స్నానం?" అడిగారు వాళ్ళు హఠాత్తుగా ముక్కులు మూసుకుంటూ.

'రోజూ రెండుసార్లు' అనబోయి ఆగిపోయాన్నేను ఎందుకంటే మా కాలనీలో అందరం వారం రోజులుపాటు నిళ్ళు దాచుకుని వారానికో రోజుస్నానం చేస్తున్నాము.

మరికొన్ని చోట్ల నీళ్ళ సమస్యవల్ల పదిహేను, ఇరవై రోజులకొకసారి స్నానంచేస్తున్నారు.

"చెప్పరీం? మీరిన్నిసార్లు చేస్తున్నారు రోజూ?” అడిగారు వాళ్ళు. మేమెవ్వరం సమాధానం చెప్పకుండా టాపిక్‌ మార్చేశాము. అడుగో ! ఆదిమానవుడు 285

ఈలోగా వాళ్ళల్లో ఒకడు పెళ్ళాన్ని పట్టుకుని బడితెతో చావబాదటం మొదలు పెట్టాడు. వాడి పెళ్ళాం భోరున ఎడుస్తోంది. అందరం పరుగుతో వెళ్ళివాడు కొట్టకుండా పట్టుకున్నాం,

“ఎమిటి? ఎందుక్కొడుతున్నావ్‌?" అడిగాడు రాజూానందం వాడిని.

వాడేదో అయిదు నిమిషాలపాటు చెప్పాడు రాజానందంతో.

“అ దూరంగా కనిపించే కొండలదగ్గర వీళ్ళ బాచ్‌ ఇంకొంతమందిని ఉంచిందట ప్రభుత్వం. వాళ్ళళ్ళోవీడి పెళ్ళాం తాలూకు తల్లిదండ్రులున్నారట. వాళ్ళు పెళ్ళిలో వాడికిస్తామన్న రెండుమేకలు ఇవ్వలేదట అందుకని దాన్ని చావగొడుతున్నాడు-

మా అందరికీ వళ్లు మండిపోయింది.

"నీకేం బుద్దుందా లేదా! వాటికోసం పెళ్ళాన్ని చావగొడతావా? అసలు ఆడదాన్ని కొట్టడం అనాగరికం! మా దగ్గర చూడు-మా ఆడాళ్ళూ మేమూ సమానంగా ఉంటాం అన్ని రంగాల్లోనూ" అన్నాం గర్వంగా మాతో పాటు వచ్చిన మాకాలనీ స్త్రీలను చూపుతూ,

వాళ్ళనాయకుడు చాలా సేపు ఆలోచించాడు.

"నిజమే! మీరు చాలా అభివృద్ది సాధించారు. స్త్రీకి గౌరవం ఇచ్చే విషయములో మావాళ్ళందరూ కూడా మీలాగా ఆడాళ్ళను బాధలు పెట్టకుండా కొత్తగా కట్టడి చేస్తాను."

అందరికీ ఆమాట వింటునే ఆనందం కలిగింది. ఈ ఒక్క విషయంలోనయినా వాళ్లకంటే మేం ముందు ఉన్నందుకు గర్వపడ్డాము. .

కానీ మా గర్వం రెండు నిముషాలన్నా నిలువకముందే మాకాలనీలో ఓ ఇంటిలో నుంచి పెద్దగా పాగలు బయటకు రాసాగినయ్‌. దానివెనుకే కేకలు, ఎడుపులు-

అందరం ఆఇంటి దగ్గరకు పరెగెత్తాం. కొత్తగా పెళ్ళయిన అమ్మాయికట్నం తేలేదని ఆమె భర్త ఆమె మీద కిర్సనాయిలు పోసి చంపేశాడు.

"ఏమిటి? ఏంజరిగింది?" అడిగాడు భిక్షాద్వీప్‌ నాయకుడు.

జరిగినదంతా చెప్పాడు రాజానందం. ఆనాయకుడి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. "అదేమిటి? మీ ఆధునిక సమాజంలో భార్యను ఏకంగా ఛంపేస్తారా?" అనడిగాడు.

మేము మాట్లాడలేదు. "మాకు అర్జంటు వనుంది" అంటూ అక్కడ నుంచి జారుకున్నాం,

ఆరాత్రి ఆదిమానవులందరూ కలసి కొమ్ముబూర ఊదుతూ చెట్లఆకులు రెండుమాత్రం నడుముకి కట్టుకుని అర్హనగ్నంగా ఎగురుతూ పిచ్చి పిచ్చిగాకేకలు వేస్తున్నారు.

అలా ఎందుకు చేస్తున్నారో అర్ధంగాక అందరం వాళ్ళదగ్గరకు చేరుకున్నాం.

286 హ్యూమరాలజీ

' వాళ్ళనాయకుడితో మాట్లాడాక రాజానందం చెప్పాడు

"వాళ్లకు అలా ఓ పద్దతీపాడు లేకుండా ఎగరటమే వినోదకార్యక్రమం ఆట."

“మీ ఆదిమానవులు ఇలాంటి పిచ్చిపిచ్చి చేష్టలు మానేయాలి. మమ్మల్సి చూడండి! మేము మీలాగా అర్ధనగ్నంగా ఎగురుతున్నామా?” అడిగాడు రాజానందం వాళ్లతో.

"లేదు" అన్నాడు వాళ్ళ నాయకుడు.

"మీరు అలా ఎగరటం రాతియుగంనాటి సంస్కృతి. ఆధునిక యుగంలో అలా ఎవరూ చేయరు!"

"మరి మీకు వినోదం కావాలంటే ఎలా?" అనుమానంగా అడిగాడు.

"మాకు ఎంతోకాలంనుంచీ ఎందరో మహానుభావులు కృషిచేసి అభివృద్ది పరచిన సంగీతం సాహిత్యం, నృత్యంలాంటి కళలున్నాయి. మీరుకూడా వాటిని నేర్చుకోవాలి."

"ఎలా ఉంటాయవి?"

"ఇప్పుడు మీ వాళ్ళు ఎగురుతూ పాడుతోన్న ఓ పదం విన్నాను. దానర్ధం చాలా పెద్దబూతు మానమాజంలో! అలాంటి బూతులు మేము మాట్లాడం! మాభాష చాలా సాఫిస్టికేటెడ్‌గా ఉంటుంది- కావాంటే మా వినోద కార్యక్రమాల గురించి తెలియజేస్తాం! రండి"

అంటూ వాళ్ళందరినీ వెంబడి తీసుకెళ్ళి రంగారెడ్డి ఇంట్లో టి.వి. లో వస్తోన్న చిత్రలహరి ప్రోగ్రాం చూపించాము.

అప్పుడే కొత్తగా రిలిజయిన అడ్డం తిరిగిన తెలుగుగడ్డ లోపాట ప్రారంభమయింది. హీరో హీరోయిన్‌ ఇంకా బోలెడు మంది అమ్మాయిలు సగం బట్టకట్టుకుని ఆది మానవులకంటే అన్యాయంగా అధ్వాన్నంగా పిచ్చిగంతులేస్తూ, అంతకంటే బూతుగా వికారంగా పాడసాగారు. భిక్షాద్వీప్‌ వాళ్ళందరూ అదిచూసి ఆనందంతో గంతులేయసాగారు.

“అచ్చం మావినోదనృత్యంలాగానే ఉందికదా మీదికూడా" సరిగ్గా అప్పుడే కాలనీ బయటనుంచి ఎవరో 'పాము పాము' అంటూ కేకలేయసాగారు. అందరం బయటకు పరుగిత్తాము. బయట చంద్రకాంత్‌ ఇంటిముందునుంచి సరసరా పాకుతోందో పాము. దాన్ని చూస్తూనే భిక్షాద్వీప్‌ వాళ్ళు ఒక్కదూకు దూకి పట్టుకుని నేలకేసిగట్టిగా ఓసారికొట్టి తలో ముక్క తుంపుకుని తినేయసాగారు.

మా కందరికీ భయంతో వళ్ళుగగ్గుర్పొడిచింది. డిటెక్టివ్‌ రచయిత్రి రాజేశ్వరి ఆదృశ్యం చూళ్ళేక స్పృహతప్పింది.

రాజానందం వాళ్ళమీద మండిపడ్డాడు "పిచ్చి వెధవల్లారా! పాముని తింటే ఛస్తారు" అన్నాడు వాళ్ళతో. అడుగో ! ఆదిమానవుడు 287

"ఎందుకు చస్తాం?" "అందులో విషం ఉంటుంది" వాళ్ళు ఘెల్లున నవ్వారు “మరి మేము ఎప్పటినుంచో వాటిని తింటున్నాంకదా!" “అదృష్టం కొద్ద బ్రతికిపోయారు. ఇంక అలాంటివి తినకండి!” "మరేంతినాలి?" “మాలాగా అన్నం కూరలు తినాలి! అవి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు-" రాజానందం చెప్తూండగానే మా బగరా బైగన్‌ వెంకట్రావ్‌ హఠాత్తుగా మా మధ్యే వాంతి చేసుకోవటం ప్రారంభించాడు. అప్పటికప్పుడే కాళ్లూ, చేతులూ చల్లబడి పోవటంతో డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళాం. "హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. కల్తీ ఆహారంతిన్నాడు" అన్నాడు డాక్టరు. అప్పటికప్పుడే వెంకట్రావ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు. "ఏం జరిగింది?" అడిగాడు ఆదిమానవుల నాయకుడు. "తిన్న భోజనంవల్ల-ప్రాణం మీదకొచ్చింది" "అదేమిటి మీరు తినే భోజనం మంచిదన్నారుగా" "అన్నాననుకోండి! కానీ ఎప్పుడు ప్రాణం మీదకొస్తుందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు, ఎవడు- ఆ భోజనంలో కల్తీచేస్తాడో కూడా తెలీదు-” “అయితే మా పాములే మంచివి" మేమింక మాట్లాళ్ళేదు. తెల్లారక బయటికొచ్చి చూసేసరికి భిక్షాద్వీప్‌ వాళ్ళాంతా నెత్తిన పెద్దపెద్ద బండరాళ్ళు పెట్టుకుని అవి కిందపడిపోకుండా తాళ్ళతో కట్టుకుని తిరగసాగారు. వాళ్ళను వెంటనే పిలిషించాము సంగతేమిటో కనుక్కోటానికి. "మానాయకుడు పెట్టుకోమని ఆజ్ఞాపించాడు అందుకని పెట్టకున్నాం '' చెప్పాడొకడు. "మీకేం బుద్భుందా లేదా? మీ నాయకుడేం చెపితే అది గొర్రెల్లా చేసేయటమేనా? రేప్పాద్దున్నవాడు మిమ్మల్ని గంగలోదూకమంటే దూకేస్తారా?" అడిగాడు రాజానందం. "మా నాయకుడు చెప్పినట్లు చేయకపోతే చాలా పెద్దశిక్ష వేస్తారు మాకు" భయంగా జవాబిచ్చాడు. రాజానందంతో పాటు మేమూ ఆనాయకుడి దగ్గరకు నడిచాము. ఆ నాయకుడు హాయిగా తన గుహలో పడుకుని ఈతసారా తాగుతున్నాడు. రాజాచంద్ర ప్రశ్న వింటూనే గట్టిగా నవ్వాడతను. "మీకామాత్రం తెలీదా? పైగా పెద్ద ఆధునిక మానవుడంటారు. పైనగద్దలు తిరుగుతున్నాయ్‌ కనబడుతుందా?" 288 హ్యామరాలజీ

అందరం ఆకాశంవేపు చూశాము. గద్దలు కొన్ని తిరుగుతున్నాయి."అయితే ఎమిటి?"

"ఆ గద్దలు మననెత్తిమీద తంతేప్రమాదంకదా! అందుకనే బండరాళ్ళు నెత్తిన 'పెట్టకోమని వాళ్ళకు ఆజ్ఞాపించాను. ఇప్పుడు గద్దలుతన్నినా రాయికి తగులుతుంది

గానీ మావాళ్ళకు దెబ్బతగలదు-"

"నీకేం మతుందా లేదా? అయినా గద్దలెందుకు తంతాయ్‌?”

"చాలా సంవత్సరాలక్రితం ఓ సారి తన్నింది-"

“అందుకని ఎప్పుడూ రాయి నెత్తిన పెట్టకుంటారా?”

అందరం ఘెల్లున నవ్వాము. నాయకుడి ముఖం చిన్నబోయింది మేము వెనక్కు తిరిగి ఇంటికి చేరుకుని వెహికల్స్‌ తీసుకుని ఆఫీస్‌కి బయల్దేరాము. హఠాత్తుగా భిక్షాద్వీప్‌ వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టేశారు. వాళ్ళ నాయకుడు కోపంగా మాదగ్గరకొచ్చాడు.

"ఇందాక బండరాళ్ళు మేము నెత్తినకట్టుకున్నామని హేళనచేశారుగా! మరిమీరు చేస్తోందేమిటి?" మేము ఆశ్చర్యంగా నెత్తితడుముకున్నాం. తీరా చూస్తే అవి మా హెల్మెట్లు!

"ఇవి బండరాళ్ళుకాదు హెల్మెట్లు-” అన్నాడు రాజానందం.

“"వదయితేనేం? ఇదెందుకు మోస్తున్నారు మీరు?"

"మాపోలీస్‌ కమిషనర్‌ పెట్టకోమన్నాడు!"

"ఎందుకు?" అందరం మొఖాలు చూసుకున్నాం. ఎందుకు హెల్మెట్‌ పెట్టకోమన్నారో నిజంగానే మాకేం తెలీదు. “ఎప్పుడో ఓ సారి యాక్సిడెంట్‌ అవుతుందట! అందుకని పెట్టకోమన్నారు-"

ఆదిమానవులంతా ఘెల్లున నవ్వారు

"ఎప్పుడో ఎదో అవుతుందని జీవితమంతా దీన్ని మోస్తూ తిరుగుతారా?” అన్నారువాళ్ళు మేము సిగ్గుపడి జారుకున్నాం అక్కడినుంచి. ఆసాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చేప్పటికి భిక్షాద్వీప్‌ వాళ్ళందరూ ఓ మునలావిడ చుట్టూమూగి ఉన్నారు. నంగతేమిటో కనుక్కుందొమని వెళ్ళాం.

"ఈ ముసలాడు బండరాయిబరువువల్లదాన్ని మీదేసుకుని కిందపడ్డాడు. బాగారక్తం అదీపోయింది. వీళ్ళ ఆచారంప్రకారం జబ్బువచ్చినవాడిని చావకముందే పాతిపెట్టేస్తారట-"

అందరం వాళ్ళ మీద విరుచుకుపడ్డాం "అది అమానుషం" అంటూ అరచాం.

"మీరేం చేస్తారు జబ్బువస్తే?” అడిగాడు వాళ్ళనాయకుడు ఆశ్చర్యంగా.

“హాస్పిటల్‌లో చేర్పించి జబ్బు తగ్గిస్తాము" “

7 అడుగో ! ఆదిమానవుడు 289

అతను బుగర్రగోకున్నాడు "సరే మేమూ మీపద్దతి అవలంబిస్తాం" అన్నాడు. అప్పుడే గోపాల్రావ్‌ ఆటోలో వాళ్ళ నాన్నగారిని తీసుకోచ్చాడు. ఆఇంటివాళ్ళంతా పెద్దగా ఏడుస్తూ అటో చుట్టూ మూగారు. మేముకూడా షాక్‌తిన్నాము. గోపాల్రావ్‌ వాళ్ళనాన్నగారిని ప్రభుత్వహాస్పిటల్లో చేర్చాడు. కానీ వాళ్ళ నాన్నగారు ప్రాణాలతో తిరిగి వచ్చారిప్పుడు.

“బాస్టర్ట్స్‌-మానాన్న చావక ముందే చచ్చిపోయాడని మార్చురీలో పడేశారు. తీరా శవాన్ని తెద్దామని వెళ్ళేసరికి పరుగుతో బయటి కొచ్చాంయన-" చెప్పాడు గోపాల్రావ్‌.

  • ఆవిషయం ఆదిమానవులతో చెప్పటం మాకిష్టం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు పద్ధతులే మన ఆధునిక సమాజం కూడా ఆచరిస్తోందని బుజువయిందికాబట్టి! ఆరాత్రి హఠాత్తుగా మళ్ళీకేకలు వినిపించినయ్‌. బయటకు పరుగెత్తి చూసేసరికి కొండల్లో ఉన్న ఆదిమానవులకీ, మాకాలనీలో ఉన్న ఆదిమానవులకూ యుద్ధం జరుగుతోంది యుద్ధంలో ఓపాతికమంది చనిపోయాక అవతలివాళ్ళు మళ్ళీకొండల్లోకి పారిపోయారు.

"ఎందుకు వాళ్ళతో యుద్ధంచేశారు? వాళ్ళూ మీలాగే ఆదిమానవులే కదా?" అడిగాడు రాజూానందం వాళ్ల నాయకుడిని.

"వాళ్ళకూ మాకూ శత్రుత్వం ఏమీలేదుగానీ ఎంతో కాలంనుంచీ అప్పుడప్పుడూ యుద్దంచేసి ఎవరు ఎక్కువో తేల్చుకుంటూంటాం" చెప్పాడతను.

“చూశారా మీరెంత మూర్థత్వంలో మగ్గిపోతున్నారో! ఊరికే పోట్లాడుకుని కొట్బకుని చనిపోతున్నారు. మమ్మల్ని చూడండి! ఎంత నభ్యతతో కలసిమెలసి జీవితం గడుపుతున్నామో"

భిక్షాద్వీప్‌ నాయకుడు కాసేపు ఆలోచించాడు

“నిజమే! వేమూ మీలాగా మారిపోతాం! ఇకనుంచీ యుద్దాలు రాకుండా చూసుకుంటాం"

అతనలా చెపుతూండగానే బయట పోలీస్‌ వాన్‌లోనుంచి హెచ్చరిక వినిపించసాగింది.

“నగరంలోరెండు వర్గాలమధ్య జరిగినమత కల్గోలాలవల్ల నిరవధికంగా కర్ఫ్యూ విధించడమయినది. వీధుల్లో ఎవరయినా కనిపించినట్లయితే కాల్చివేయడం జరుగుతుంది-"

"ఎమిటి? ఏం చెపుతున్నారు?' అడిగాడు భిక్షాద్వీప్‌ నాయకుడు కుతూహలంగా.

మేము వారికేం నమాధానం చెప్పలేదు. కర్ఫ్యూ ముగిశాక కూడా వాళ్ళకి కనిపించటానికి మొఖం చెల్లలేదు మాకు. నః 290 హ్యామరాలజీ

వా రుంటుగ (//// త్‌ బని బు రడ నల . 166 హ్‌ శాం కో | నేను అదిరిపడి నిద్రలేచి కూర్చున్నాను. సరిగ్గా అదే సమయానికి అందరిళ్ళల్లో పిల్లలు కెవ్వుమని ఏడుపు మొదలెట్టారు. మాశీనుగాడు కూడా యధాశక్తి ఇల్లెగిరేట్లు అరవసాగాడు. అనలేం జరిగిందో నాకోవట్టాన అర్ధంకాలేదు. ఏవో కొంవలు మునిగిపోతున్నాంత శబ్బాలు, గుండెలమీద ఎవరో పరుగిడుతున్నట్ట్లు అడుగులచప్పుడు-ఇంక ఆలస్యం చేయకుండా తలుపు తెరుచుకుని గోపాల్రావ్‌ వాళ్ళింటికి పరుగెత్తాను. అప్పుడే గోపాల్రావ్‌ కూడా నిద్రమత్తులో వాళ్ళ పసివాడ్ని భుజానవేనుకుని - వాళ్ళావిడతోసహా ఇంట్లోనుంచిబయటకు పరుగెత్తుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే రంగారెడ్డి. శాయీరామ్‌, జనార్ధన్‌ కూడా పరుగుతో వచ్చేశారు వాళ్ళపిల్లతో సహా. "ఏమిటది? మన పక్కమేడలో గోడలు ఏమయినా కూలిపోతున్నాయా?" కంగారుగా అడిగాడు గోపాల్రావ్‌. పండుగ 29]

"ఆ-మీరు మరీనూ-మన కిటికీ వక్కన రోడ్డుమీద వినాయకుడి ఉత్సవం చేయటంలేదూ? వాళ్ళుమైకులో! సినిమా రికార్డులు, పెట్టినట్బన్నారు! ఇవాళేగా వినాయకచవితి' అంది వాళ్ళావిడ రాజ్యలక్ష్మి

మరికొద్ది క్షణాలు ఆశబ్దాలు విన్నాక అమె చెప్పినమాట నిజమేనని అర్ధమయిపోయింది మా అందరికీ.

ఆస్పీకర్‌ మరీ కిటికీ పక్కనే ఉండడంతో ఆశబ్దాలు సినిమా రికార్డులోని ఆర్కెస్ట్రావని తెలీలేదు. ఈలోగా ఆర్కెస్ట్రా అగి పాట మొదలయిపోయింది.

"ఓ సుబ్బారావూ, ఓ అప్పారావూ, ఓ వెంకట్రావూ-"

చెవులు వపగిలిపోతునాయ్‌.

"ఇదేమిటిలా అర్ధరాత్రిమైకు?" అడిగాడతను.

."అర్ధరాశ్రీమిటి? తెల్లవారుజాము మూడయిపోయిందిగా! అందుకని పెట్టివుంటారు!" అందామె తేలికగా.

గోపాల్రావ్‌ వాళ్ళబాబిగాడిని ఎత్తుకుని అటూఇటూ పచార్జుచెస్తూ నిద్రపుచ్చడానికి ప్రయత్నించసాగాడు.

వాళ్ళావిడ ఆరునెలల పసిగుడ్డుచెవిలో దూదిపెట్టి, ఆమైక్‌ పాట వినబడకుండా చెవులకు గుడ్డచుట్టేసింది.

గోపాల్రావ్‌కి అఏరియా విఘ్నేశ్వర కమిటీమీద వళ్ళుమండిపోయింది.

"ఇప్పుడే వెళ్ళి ఆస్పీకర్‌ డైరక్షన్‌ మార్చమని చెప్పివస్తాను... "అన్నాడు రాజ్యలక్ష్మితో.

"వాళ్ళు మీమాట వింటారా ఏమిటి మీపిచ్చిగాని... “. దుప్పటి చెవులమీద

వేసుకుంటూ అందామె.

గోపాల్రావ్‌, బాబిగాడితో సహా, అందరం రోడ్డుమీదకొచ్చా?::ు నలుగురు యువకులు గ్రామఫోన్‌ దగ్గరకూర్చుని బూతులు మాట్లాడుకుంటున్నారు.

"ఈపాట పాడేప్పుడు జయమాలిన్ని సూడాల్రా-నీయవ్వ భలే చేసిద్ది"

“ఈరికార్లప్పుడా?'' ఇంకొకడడిగాడు.

"అవ్‌."

"ఇస్కిమాకీ-గప్పుడే నేను సిగరెట్‌ తాగనికి బయటికెళ్ళినా-'

"కల్‌ఫిర్‌ జాయంగే-చల్తే? ఇస్కీ-మాకీ-ఛోడ్‌ నానై-ఉత్‌నా జబర్ధస్త్‌-బతాతీరే-" పాట అయిపోయింది.

292 హ్యామరాలజీ

మరో రికార్డుతీశాడు మైక్‌ కుర్రాడు. "'ఏంపాటది?" "ఇదిగో తెల్లచీరా-ఇవిగో-మల్లెపూలూ..." ''ఊ ఊ ఊపెయ్‌ నీయవ్వ" పాట మొదలయిపోయింది. __గోపాల్రావ్‌ వాళ్ళ దగ్గరకు నడిచాడు. రోడ్డుకడ్డంగాపెద్దస్టేజీ! దాని మీద వినాయకుడు చాలా పెద్దబొామ్మ. "ఇదిగో! కొంచెం ఆస్పీకర్‌ అటునుంచి ఇటుపక్కకు తిప్పిపెడతారా" వాళ్ళందరూ అతనివంక పిచ్చివాడిని చూసినట్లు చూశారు. "ఎందుకు?" "అది సరిగ్గా మాకాలనీకెదురుగ్గా ఉంది. ఇంట్లో చెవులుపగిలిపోతున్నాయి.” ఇద్దరు వెకిలిగా నవ్వారు. _ "కిటికీ తలుపులు మూసుకోండ్రి!"” "మూసుకున్నా లాభంలేదు" ్ష "స్పీకర్‌ తిప్పనికి కాదువయ్యా" "అంటే? ఇవాళంతా ఆవెధవపాటలమోత భరించాల్సిందేనన్నమాట!” కోపంగా అన్నాడు శాయీరామ్‌. "ఇయాలా? ఇయాలేమీటి? తొమ్మిద్దినాలుంటదిది" , "అంటే ఆస్పీకర్‌ మరోవేపుకి తిప్పరన్నమాట-' సీరియస్‌గా అడిగాడురంగారెడ్డి. "ఛల్‌ చల్‌మియా! నీకోసం స్పీకర్‌ తిప్పనికి నువ్వేం మినిష్టరువా? ఎళ్ళిళ్లు" కొపం అణచుకుని అక్కడనుంచి వచ్చేశాము. "రప్రాద్దున్న పోలీస్‌కంప్లెయింట్‌ ఇద్దాం” అన్నాడు గోపాల్రావ్‌. అరగంట గడిచిపోయింది. రెండు చెవ్వుల్లో దూదిపెట్టుకుని పడుకున్నాము. వంటింటివేపు నుంచీ చెవులుపగిలేలా శబ్బమయింది. మళ్ళీ పిల్లలులేచి కెవ్వుమని ఎడుపు మొదలెట్టారు. "హేకృష్ణా, ముకుందా, మురారి-" "ఇటు పక్కవీధిలో ఇంకో వినాయకుడిని పెట్టినట్లున్నారండీ..."అంది మా ఆవిడ. పండుగ 293

రెండుమైకులు పాటలూ కలబడిపోయినయ్‌

"హే కృష్ణా! ఇదిగో తెల్లచీరా-ముకుందా ఇవిగో మల్లెపూలు-మురారీ ఇదిగో తెల్లచీరా- జయకృష్ణా-ఇదిగోమల్లె-ముకుందాపూలు మురారీ"

"అబ్బా!" రెండు చేతుల్లో తల పట్టుక్కూర్చున్నాను.

రెండు రికార్డులూ ఒకేసారి అయిపోయేసరికి మొఖం పగిలిపోయేటంత నిశ్శబ్దం

హఠాత్తుగా అంతనిశ్ళ్శబ్దం భరించలేక పిల్లలు భయపడిపోయి మళ్ళీ ఏడుపు ప్రారంభించారు.

కొద్దిక్షణాల్లో మళ్ళీ ఒకేసారి రెండు రికార్డులు ప్రారంభమయ్యాయి అప్పుడుగానీ ఏడుపు ఆపలేదు వాళ్ళు.

"ఏడుకొండలస్వామీ- ఏమిటంటే ఎమిచెప్పను- ఎక్కడున్నావయ్యా- ఎందుకంటే. . ఎలా చెప్పను- ఎన్నిమెట్లెక్కినా- అబ్బా- నిద్దరొన్తుందండీ- కానరావేమయ్యా తొలిరాత్రి. ఏడుకొండలసామీ రాదంట- ఏడుకొండలస్వామీ- ముద్దులాడాలంట- సుద్దులాడాలంట- ఆఅకాశమంటూ ఈ కొండ శిఖరమ్మునా- అబ్బ- వద్దండీ ఊ- ఏడుకొండలసామీ- వద్దంటే? ఎక్కడున్నావయ్యా- మ్యావ్‌ మ్యావ్‌ అందాల ఓ పిల్లీ- ఎచోటాగాంచినా నీవుండువదురే- అబ్బా- ఏమిటో నీమాయా ఎందుకండీ- తెలియకున్నా మయ్యా అందుకే అని ఎలా చెప్పను."

నేను నెత్తిమీద తలగడ విసిరికొట్టి పక్కమీదనుంచి లేచి కూర్చున్నాను. టైము అయిందయింది. ఆ చుట్టప్రక్కల అందరిళ్ళల్లోనూ లైట్ట్లువెలగటం కనబడుతూనే ఉంది. సాధారణంగా ఆరింటి వరకూ ఏ ఇంట్లోనూ లైటువెలగడం నేనింతవరకూ చూళ్ళేదు.

అంటే నాతోపాటు ఆ చుట్టు ప్రక్కలాళ్ళందరినీ కూడా ఆమైకులు నిద్ర లేపేశాయన్న మాట.

మరి కాలనీ వాళ్ళందరూ ఆమైకువాళ్ళను మందలించరేం? రెసిడెన్షియల్‌ ఏరియాలో అంతశబ్దాలు చేయడానికి ఎలా అంగీకరిస్తున్నారు?

కోపంగాలేచి బయటికొచ్చాను. అప్పటికే రంగారెడ్డి, శాయీరాం, జనార్ధన్‌, యాదగిరి, గోపాల్రావ్‌, రాజేశ్వరికాలనీలో నిలబడి సీరియస్‌గా చర్చించుకుంటున్నారు.

"ఇలా ఊరుకుంటే లాభంలేదు. కాలనీ వాళ్ళందరం కలసివెళ్ళి గొడవచేస్తేగానీ ఆమోత ఆగదు. పదండి! అందరినీ తీసుకెళదాం" అన్నాడు గోపాల్రావ్‌.

నేనూ వాళ్ళతోపాటు మా పక్కింటికెళ్ళాను. గది కిటికీ దగ్గరే కూర్చుని ఆఫీస్‌ ఫైల్స్‌ చూనుకుంటున్నాడు భుజంగరాజు.

294 హ్యామరాలజీ (|

మమ్మల్ని చూసి "హలో! ఏమిటిలా వచ్చారు? మళ్ళీ ఎమయినా మీటింగా?" భయంగా అడిగాడు.

"అబ్బే! కాదు!”

"సంతోషం! మరి ఇంత పొద్దున్నే ఎందుకులేచారు? సాధారణంగా ఎనిమిదివరకూ లేవరుకదా?” చిరునవ్వుతో అడిగాడు.

"మేము లేవలేదయ్యా! ఆవెధవమైకులు టేపేసినయి" చెప్పాడు రంగారెడ్డి.

"ఓ స్పీకర్ల? సంతోషం”

"సంతోషమా, వల్లకాడా? ఆపాడుమోత మీక్కూడా పిచ్చెక్కించటంలేదూ?" చిరాగ్గా అన్నాడు శాయీరాం.

అతను నవ్వాడు.

"అదా! అదిసరిగ్గా వినిపించదుకదా మా హైద్రాబాద్‌వాళ్ళకి ॥

“'అంటే-మాది హైద్రాబాద్‌ కాదేమిటి?"

"మీరు ఒక తరంనుంచే ఉన్నారు. మేము ఎనిమిది తరాలుగా ఇక్కడే ఉంటున్నాం.

  • అంచేత ఈలౌడ్‌ స్పీకర్ల మోతకు వంశపారంపర్యంగా మాకు చెవుడొచ్చేసింది. అంచేత ఎంత పెద్దశబ్దాలయినా ఎప్పట్నుంచో హైద్రాబాద్‌లో ఉండేవాళ్ళనేమి చేయలేవు.”
  • "అంటే ఇప్పుడా స్పీకర్‌ మోత వినిపించడంలేదా?”

“ఎక్కడో దూరంగా హిమాలయాల్లో ట్రాన్సిష్టర్‌ మోగుతున్నట్టుంది అంతే! మీకు బాగా వినబడుతుందా?" ఆత్రుతగా అడిగాడతను.

“వినబడటమా? చెవులు పగిలిపోతున్నయ్‌! '

"సంతోషం! ఇప్పుడేం పాటవస్తోంది?"

మాకు కోపం ముంచుకొచ్చింది గానీ తమాయించుకున్నాము. ఇంక అతనితో మాట్లడటం అనవసరమని బయటకు నడిచాము,

"ఇదిగో-మీరెవరయినా అస్పీకర్‌ వాడి దగ్గరికెళ్తే 'ఇదిగో తెల్లచీరా'పాటకొంచెం గట్టిగా సౌండ్‌ పెట్టేయమని చెప్పండి-"

ఇంకో ఇంటి దగ్గరకు చేరుకున్నాం.

శ్రీనివాసరావ్‌ బయటకొచ్చాడు పళ్ళు తోముకుంటూ.

"చూశారా ఆమోత!” అడిగాడు గోపాల్రావ్‌. పండుగ 295

"మూడింటినుంచి చూస్తూనే ఉన్నాను."

“అందరం కలసి ఆగొడవ అపించలేమూ"

“మనమా?” నవ్వుతూ అడిగాడు.

"అవును-ఎం?”

"ఆ ఉత్సవం చేసేదెవరనుకుంటున్నారు? ఈ ఏరియాలోని గూండాలు. వాళ్ళు మనమాట వింటారా?"

"అయితే ఈతొమ్మిదిరోజూలూ-ఈనరకం అనుభవిస్తూనే ఉండాలా?"

"నేనందుకే ఓ ప్తాన్‌వేస్తాను-”

"ఏమిటది? చెవులలో దూది పెట్టుకోవడమా!”

"అదికాదు. అదికూడా పని చేయడంలేదిప్పుడు! వరంగల్‌ రోడ్డులో ఉప్పల్‌కి అవతల ఊరికి సంబంధంలేకుండా మాఫెండొకడు ఉంటున్నాడు. ఈవారంరోజులూ వాడింటి కెళుతున్నాను-దాంతో శనివదిలిపోతుంది"

“అంతేగాని ఆమైకులను ఆపే ప్రయత్నం చేయరన్నమాట!"

“వృధా ప్రయాస-అదీగాక గూండొలతో వ్యవహారం-మనకెందుకు చెప్పండి.

"అందరూ ఎవరికివారు ఏదోరకం సర్దుకుపోయేవారే. థూ! దొంగనాకొడుకులు" అన్నాడు యాదగిరి.

మళ్ళీ రెండుక్షణాలు నిళ్శబ్దం.

వెనుకవేపు రోడ్‌లో ఉన్న నర్శింగ్‌ హడావుడిగా గోపాల్రావ్‌ దగ్గరకు వచ్చాడు.

"నీయవ్వ-ఫాల్లూనా కొడుకులు. మనం ఆమోతకి బతకాల్హా, సావాల్నా? పసిపిల్లలు ఒకటే ఏడుపు” మాతో అన్నాడతను.

గోపాల్రావ్‌కి ఆనందం కలిగింది. మాలాగా బాధపడుతున్నవాడు ఒక్కడేనా దొరికాడు.

"నేనూ *దే మొత్తకుంటున్నాను. మనముగ్గురికీ తప్పితే ఇంకెవరికీ పట్టినట్టులేదు" అన్నాడు గో, "వ్‌.

"మీరు నాస్తాగట్టా చేసి తయారుండండ్రి! నేనూ చేసాస్తా! నీయవ్వ ఈమైక్‌ కిరికిరి ఎట్లఖతం కాదో సూద్దాం! ' అన్నాడు నర్శింగ్‌-

"ఓ మేము అరగంటలో రడీ అయిపోతాం!” ఆనందంగా అన్నాడు గోపాల్రావ్‌,

296 హ్యామరాలజీ

అందరం విఠాల్రావ్‌ ఇంటికి చేరుకున్నాం.

"ఏమిటి సంగతి?" అడిగాడు విఠల్‌రావ్‌.

"అదేం ఆమైక్‌ కిరికిరి బంద్‌ చేయిద్దాంనడు"” అన్నాడు యాదగిరి.

“ఎందుకు?”

“అలావూరుకుంటే ఈ తొమ్మిది రోజుల్లో ఆరెండుమైకులూ కలిసి మనల్నిశవాలు చేసేస్తయ్‌"-గోపాల్రావ్‌ అందుకున్నాడు

“కానీ ఆపాటలుమంచిగా ఇనొచ్చుకదా" ఆనందంగా అన్నాడు విఠల్‌రావ్‌.

“అంత మోతపెడుతూంటే ఆపాటలు ఎంజాయ్‌చేస్తావా?" అశ్చర్యంగా అన్నాడు యాదగిరి.

“ఎంతమోతగున్న సరీ-నాకు పాటలంటే చాలాఇష్టంభయ్‌! రేడియోలో రోజుకి రెండు పాటలయినా నాపేరుమీద జనరంజనిలో ప్రసారంజేస్తుంటారు. ఇనలే?"” అందరం మొఖాలు చూసుకున్నాము. తిరిగి అన్నాడతను. “అన్నింటిలోకి సామజవరగమనా భలే ఇష్టం! అబ్బ! ఎన్నిసార్లయినా గానీ ఇంటా!”

సరిగ్గా అప్పుడే మళ్ళీ రెండు మైకులలో పాటలు తగులుకున్నాయి.

"సామజవరగమనా-సామజవరగమనా-సామజవరగమనా దూరన దూరన తారా దీపం- సాధుహృత్తరసాధ్యకాలాతీత విఖ్యాత-భారమయిన గుండెలో ఆరనితాపం- సామజవరగమనా- ఆఅరిమోదు చేరరాదు- ఆశాదీపం సామనిగమ జసుధామయ- ఆతారాదీపం ఈతీరని తాపం-గానవిచక్షణ గుణశీల వికసించిన మందారం నీవయ్యారం-దయాలవాల మాపాలయ సామజవరగమనా-విరియని పసికందు మొగ్గ-నీహృదయం-మనసులోన మధురమయిన- ఆమనికోయిల ఇలా నాజీవనవేణువు లూదగా మరీమరీ తిరిగేను మతిమాలిన తుమ్మెదను-

" మధురలాలసల దూరాన దూరాన- మధుపలాలసల- తారాదీపం- పెదవిలోని మధువు దూరాన వెత్తముపుని- తారాదీపం- జతకు చేరకు సరిగా- నిసాగని- మగ-గమ" యాదగిరి కోపంగా విఠల్‌రావ్‌ వేపుచూశాడు, విఠాల్‌రావ్‌ మొఖం మాడిపోయింది.

"ఇను, నీకిష్టమున్నావుగా మనసారా ఇను. పదహా" అంటూ గోపాల్రావ్‌ చేయిపటుకుని బయటి కీడ్చుకొచ్చాడు.

అందరం పందిట్లోని మైక్‌ సిస్టం దగ్గరకొచ్చాము.

“ఇగో-ఈ సౌండ్‌ తగ్గిస్తారా లేదా?” కోపంగా కుర్రాళ్ళనడిగాడు రంగారెడ్డి. వాళ్ళు అతనివంక నిర్లక్ష్యంగా చూళారు. _ పండుగ 29/7

"కమిటీ వాళ్ళనడగాలి. వాళ్ళు తగ్గించమంటే తగ్గిస్తాం" “"ఎవరుకమిటీ వాళ్ళు?” "రాములుదాదా, లింగన్నగౌడ్‌దాదా రెడ్డీసాబ్‌." "సరే-వాళ్ళనే అడుగుదాం పద" అన్నాడు గోపాల్రావ్‌. ఇద్దరూ రాములుదాదా ఇంటికి చేరుకున్నారు. “'రాములున్నాడా?" ఇంటిముందు కూర్చున్న ఓ ముసలతన్ని అడిగాడు గోపాల్రావ్‌. “ఎవళ్ళు మీరు?" "మేము ఆ ప్రక్కనే కాలనీలోనే ఉంటాం!" “ఏటిపని ఆడితో?” “మాట్టాడాలి!" అన్నాడు యాదగిరి. “మాట్లాడాలంటే మధ్యహ్నం పన్నెండు గంటలకు రాండి" “"ఇప్పుడింట్లోలేడా?" "ఉన్నడుగానీ పదకొండు గంటలగ్గాని లేవడు." ' చేసేదిలేక అందరం కాలనీకితిరిగివచ్చాము. ఈసారి రెండు హిందీ రికార్డులు కలబడ్డాయి. “కభి అల్విదనాక హెనా-ఓహమారీటక్కర్‌హై-కభి అల్విద నాకహెనా” “పన్నెండింటికి వస్తాను-తయారుండు"” అని చెప్పివెళ్ళిపోయాడు రంగారెడ్డి. మధ్యాహ్నం పన్నెండింటికి మళ్ళీ అందరం రాములింటికెళ్ళాం. “గిప్పుడే వినాయకుడి పూజగురించి పోయిండు" అన్నాడు మునలాడు. ఇద్దరూ రికార్డులు మోగేచోటకు చేరుకున్నారు. 'రాములువచ్చిండా ఈడకి?" ఓ యువకుడినడిగాడు విఠల్‌రావ్‌. “వచ్చిండు-అగో ఆబార్‌లో ఉన్నాడు." “"బార్‌లోనా? " “అవ్‌!” “ఆడెందుకున్నాడు?” అతనునవ్వాడు "బార్ల ఎందుకుంటారో ఎరికిలేదా?" అందరూ బార్‌లోనికి నడిచారు. 296 హ్యామరాలజీ క

ఎదురుగ్గానే ముగ్గురువ్యక్తులు కూర్చుని రమ్‌ తాగుతున్నారు.

"వినాయకుడి ఉత్సవకమిటీ నెంబర్లు మీరేనా?" అడిగాడు యాదగిరి

“నువ్వెవళు?"

“మేము ఈకాలనీలోనే ఉంటాం!”

"ఏం గావాల్నీకు?"

"మా ఇళ్ళల్లో ఆస్పీకర్‌మోతకు బేజారయిపోతున్నాం. వాటిడైరక్షన్‌ అయినా మార్చండి- లేదా జరసొండ్‌ అయినా తగ్గించండ్రి!"

"మీరంతా హిందువులేనా?" అడిగాడతను రమ్‌గ్గాస్‌ ఎత్తితాగుతూ.

“"అవ్‌-ఎమట్ల అడిగినవ్‌?"

"హిందువులయుండి పండగకు లొల్లి పెడతార్వయ్యా-మనదేవుడి పండగ్గాదిది?"

"మనవండగేగాని-దేవుడి మొఖాన్న స్పీకర్టుపడేసి-మనం బార్లల్లో కూనుంటే అవతలోళ్ళకి ఎంత తక్షీఫ్‌ ఉంటుంది?" కోపంగా అన్నాడు యాదగిరి.

"ఇగో-ఎక్కువ తక్కువ మాట్లాడకండ్రి-ఆసౌండ్‌ గట్టనే ఉంటది. ఎంజేస్కుంటారో చేస్కోండ్రి" పొగరుగా అన్నాడు.

యాదగిరి ఏదో అనబోయాడుగానీ గోపాల్రావ్‌ అతనిచేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. -

"వాడితో కిరికిరి ఎందుకు మనకి-ఎక్కువమాట్టాడితే మనల్ని ముగ్గురూకలిసి ఉతికేస్తారు" అన్నాడు సమాధానపరుస్తూ,

"అట్లాని ఈదరిద్రం తొమ్మిదిరోజులెట్టనయ్యా భరించేది?" "పోలీస్‌రిపోర్టిస్తే-దెబ్బకు దారికి వస్తారందరూ'"అన్నాడు శాయీరామ్‌

అందరంకాసేవు తటవటాయించాముగానీ అంతకంటే గత్యంతరంలేదని పోలీస్‌స్టేషన్‌కి బయళ్లేరాము.

"ఏంగావాలి?" అడిగాడు హెడ్‌కానిస్టేబుల్‌ చిరాగ్గా మావంకచూస్తూ.

“కంప్లెయింట్‌ ఇవ్వడానికొచ్చాం '

“ఎవరు మీరు?"

"అదిగో! ఆనిర్భయనగర్‌ కాలనీవాళ్ళం." పండుగ 299

"ఓహో మీరేనా-సరే సరీ!” తలవూపుతూ అన్నాడు "ప్రతిచిన్న విషయానికి కిరికిరి పెట్టేది మీకు అలవాటయిపోయిందని మాపాత ఇన్‌ స్పెక్టర్‌ చెప్పాడ్దే! ఇంతకూ ఇప్పుడు ఏవిషయం గురించి కంప్పెయింట్‌ ఇవ్వడానికొచ్చారు?"

"ఆవీధి వినాయకుడిదగ్గర స్పీకర్లు పెట్టి మాకాలనీ వాళ్ళందరికీ న్యూసెన్సు చేసేస్తున్నారు. పిల్లలు రాత్రుళ్ళు నిద్రపోవడంలేదు. మాక్కూడా పిచ్చెక్కిపోతోంది."

"పిచ్చెక్కితే ఎర్రగడ్డ పోవాలి? పోలీస్‌స్టేషన్‌కొస్తే మేమేం జేస్తాం?"

"అంటే ఆస్పీకర్స్‌గొడవతో మీకేమీ సంబంధం లేదన్నమాట-" క్‌

"లేదని ఎవరన్నారయ్యా! ఇలాంటి పిచ్చివ్యాఖ్యానాలు చేయకండి! వాళ్ళకులై సెన్స్‌ ఇచ్చింది మా అసిస్టెంట్‌కమిషనర్‌సాబేకదా! సంబంధం లేదని ఎలా అంటాం?"

"అదే-అదేమేమూ అడిగేది! చుట్టపక్కలుండేకుటుంబాల వాళ్ళకు ఎంతన్యూసెన్స్‌ అవుతుందో చూడకుండా పర్మిషనెట్లా ఇచ్చారు" గట్టిగా అరచాడు రంగారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌కి కోపంవచ్చింది.

"ఇంకోసారి అలా అరచారంటే మర్యాదగా ఉండదు! ఆ!" అంటూండగానే లోపల్నుంచి . ఇన్‌స్పెక్టర్‌ వచ్చాడు కోపంగా.

'ఎవడాడు అరిచిందిప్పుడు?' అన్నాడు మావంక చూస్తూ,

"నేను" అన్నాడు రంగారెడ్డి.

“ఇంకోసారి అరచావంటే లోపటవెస్తా-" పొగరుగా అన్నాడు.

దాంతో రంగారెడ్డికి కోపం మరింత పేట్రేగిపోయింది.

"ఏమిటి? జైల్లోవేస్తావా? ఏంతప్పుచేశామని జైల్లోవేస్తావయ్యా? వేస్తేగాజులు తొడుక్కుని కూర్చుంటామనుకున్నారా?"

_ సరిగ్గా అప్పుడే ఓ గిరిజాలజుట్టువాడిని ఈడ్చుకొచ్చి లోపలకు తోశారు కానిస్టేబుల్స్‌.

వాడువచ్చి ఇన్‌ స్పెక్టర్‌ముందు నేలమీదపడ్డాడు. “వీడేసార్‌-చెరుకురసం బండివాడు"

ఇన్‌ స్పెక్టర్‌ వాడిని కాలితో ఒక్కతన్ను తన్నాడు.

"ఏరాకొడకా! మా పోలీసోళ్ళు చెరకురసం తాగి డబ్బివ్వకుండా పోతున్నారని ఈనాడు పేపరోడి ఇంటర్వ్యూలో రాయిస్తావా?" ఆ

"అవ్‌సార్‌! మీరు పైసలిస్తునా మరి?" కిందనుంచి లేచి ధైర్యంతో అడిగాడువాడు. క 300 హ్యావరాలజీ

మి

"నీయమ్మ-సాలే! నీకా రోడ్‌మీద బండిపెట్టటానికి లైసెన్స్‌ ఉందా? నీ బండిగురించి ఆరోడ్‌ఇరుకయిపోయి ఎన్నియాక్సిడెంట్లు అయినాయిబే! అందులో ఆరుగురు అక్కడిక్కడే చచ్చిన్రు! అయినాగానీ నీబండితియ్యమని నేనెప్పుడూ జెప్పలే. ఇంత మదద్‌జే స్తే-గన్నారస్‌కి 'పైసలిమ్మంటావ్‌రా'" అంటూ ఇంకో తన్ను తన్నాడు.

"ఇదిగో హెడ్‌కానిస్టేబుల్‌! ఈడికాళ్ళూ చేతులూ ఇరగ్గొట్టి నగ్జలైట్‌ ఎన్‌కౌంటర్‌లో దొరికాడని అన్యూస్‌ పేపరోడికే ఫోన్‌జేసి చెప్పు! ఎవడితో చెప్పుకుంటాడో చూద్దాం"

అందరం భయభభ్రాంతులయిపోయాం. అంతవరకూ మాలో రంగారెడ్డివల్ల పొంగి పారలిన కోపం నీళ్ళు కారిపోయింది. వాడిని లోపలకు ఈడ్చుకెళ్ళిపోయారు కానిస్టేబుల్స్‌. ఇన్‌స్పెక్టర్‌ మళ్ళీ రంగారెడ్డి దగ్గరకొచ్చాడు.

"ఆ! నువ్వేంటంటావ్‌? జైల్లో వేస్తేగాజులు తొడుక్కుని కూర్చోనంటావ్‌? అంతేనా"

రంగారెడ్డి తడబడ్డాడు. "ఏదో కోపంలో అనేశానండీ-"

" నువ్వు ఏదయినా తప్పు చేస్తేనే జైల్లో వేయాలని రూలుందా?"

“లేదని ఇప్పుడే తెలిసిందండి"

"అయితే సక్కగ బయటకు పొండి! ఇంకోసారి ఈఎరియాలో కనిపించొద్దు."

"అలాగే సార్‌”'

అతను కొంచెం శాంతించాడు.

"ఇక్కడి శెందుకొచ్చిను మీరిప్పుడు?"

అంతా వివరించాడు శాయీరామ్‌.

"అవ్‌-వినాయకుడి పండగకు మైక్‌, స్పీకర్లు బరాబర్‌ బజాయిస్తరు. వద్దననికి మీరెవరు?”

"ఆస్పీకర్‌ బాధకు తాళలేక మీదగ్గరకొచ్చినం. అది ఆపుజేయిస్తారా లేదా? లేదంటే అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌కి కంప్లెయింట్‌ చేస్తాం-” అన్నాడు యాదగిరి కోపం అణచుకోలేక.

"ఎయ్‌! ఇగో-ఎక్కువ తక్కువ మాట్టాడిన్రంటే వినాయకచవితి పూజలకు మీరు అడ్డుతగులుతున్రని మతకల్లోలాల సెక్షన్‌కింద కేస్‌బుక్‌చేసి లాకప్‌లఎస్త! సమజయిందా?”

. ఎంచేతో తెలీదుగానీ ఆమాట చాలా పవర్ఫుల్‌గా అర్ధమయిపోయింది మాకు. నిశ్శబ్దంగా వెనక్కుతిరిగి బయటకునడుస్తోంటే ఇన్‌స్పెక్టర్‌ తిట్లు వినబడుతూనే ఉన్నాయ్‌. పండుగ . ౩01

'ఫాల్లూకొడుకులు- ఆ వినాయకపూజలకు చందాలిచ్చెడిది ఈళ్ళే- బంద్‌ జేయిపించ మని కిరికిరి చేసెడిది ఈళ్ళే- ఇగోత్రీనాట్‌త్రీ- ఇంకొసారొస్తే అందరినీ లోపటేసేయ్‌."

మాకు వళ్ళుమండిపోయింది ఆ మాటలకు. చందాలు మేము ఇచ్చినమాట నిజమేగాని ఇయ్యకపోతే ఆ ఎరియా గూండాల చేతుల్లో ఏమైపోతామో మాకు తెలును.

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ దగ్గరరైటర్‌ మమ్మల్ని బయటే ఆపేశాడు.

"ఎంగావాలి?" కథంతా చెప్పబోయాంగానీ అతను వినిపించుకోలేదు.

''కంప్లెయింట్‌ రాసివ్వండి."

అందరం రకరకాల ఇంగ్లీష్‌ ఉపయోగించి కంప్లెయింట్‌ రాసిచ్చాం-చూస్తూనే చిరాకుపడ్డాడు.

"మీకేం దమాకున్నదా లేదా? దీని మీద స్టాంప్‌ కొని అంటియ్యాల.”

స్టాంప్‌కోసం అరగంటసేపు ఆటోలో తిరిగి తీసుకొచ్చాడు యాదగిరి. అది అంటించి మళ్ళీరైటర్‌ కిచ్చాం. అప్పుడు చదివాడతను. "ఏమిది? స్పీకర్స్‌ గురించి కంప్లెయింటా? థూత్‌' అంటూ మా మీదకు విసిరీశాడా కాగితం.

"అదేంటండీ? ఏమయింది?"

"మేమే కదయ్యా ఆ స్పీకర్స్‌కి పర్మిషన్‌ ఇచ్చింది-మళ్ళీ మేమే కంప్లెయింట్‌ ఎట్లా తీసుకుంటాం?"

"అంటే మేమీస్పీకర్స్‌ శబ్దాలతో పిచ్చెక్కి ఛావాల్సిందేనా"

"ఇదిగో-ఇంకోసారిలి 'ఛావాల్సిందేనా' అన్నావంటే సూసైడ్‌ ఎటెంప్ట్‌ కేస్‌ కింద

ఆమాటతో యాదగిరి కోపం పెరిగిపోయింది.

"ఎమి? జైల్లో ఏస్తావ్‌? ఎయ్‌ సూద్దాం మళ్ళా"

మాగొడవంతా చూసి ఓ ఇన్‌స్పెక్టర్‌ బయటికొచ్చాడు.

"ఏయ్‌ ఏమిటిక్కడలొల్లి?'"

రైటర్‌ జరిగిందంతా రెండుముక్కల్లో చెప్పాడు.

"సర్లే-మీరుపాండి! కానిస్టేబుల్‌ని పంపిస్తాం-"

మేము కాలనీ చేరుకున్న అరగంటకే ఓ కానిస్టేబుల్‌ వచ్చాడు మోపెడ్‌ మీద: అందరం కలసి అతనితోపాటు వినాయకుడి విగ్రహం దగ్గరకు చేరుకున్నాం. . 302 _. హ్యామరాలజీ

రికార్డులువేస్తోన్న దాదాతో అయిదు నిమిషాలు మాట్లాడాడతను.- తరువాత ఇద్దరూ కలసి ఎదురుగ్గా ఉన్న బార్లోకెళ్ళారు.

గంటసేపటి తర్వాత తూలుతూ బయటికొచ్చాడతను. మోపెడ్‌ స్టార్ట్‌చేస, మమ్మల్నిచూసి . దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు.

"ఇగో-ఇది దేవుడి గురించి చేస్తున్న పూజ! మీరుకూడా సాయంజేయాలిగానీ కిరికిరి పెడితేఎట్ల? నచ్చినంక స్వర్గానికి ఎళ్ళాలని లేదా?" అనేసి వేగంగా వెళ్ళిపోయాడు. అతని వెనుకే వచ్చినిలబడ్డ రాములు మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు హేళనగా.

కోపం అణచుకొని కాలనీలోకి నడిచాం.

రాత్రీ గొడవ ఇంకా ఎక్కువయిపోయింది.

రికార్డులకు తోడు, బూతు రికార్మడాన్స్‌లు-వాటిని చూడ్డానికి విరగబడ్డ జనం- వాళ్ళకేకలు-ఈలలు.

పన్నెండింటి వరకూ కంటిమీద కునుకులేదెవ్వరికి.

ఉండండి యాదగిరి “ఫాల్తునా కొడుకులు" అని తిడుతున్నాడు గట్టిగా. వాళ్ళ తండ్రీకి ఆరికార్డుల శబ్బ్దంవల్ల బ్లడ్‌(్రైజర్‌ పెరిగిపోయిందట. ఒంటిగంటకు రికార్డమోగటం ఆగింది. అయితే తెల్లారుజామున నాలుగింటికి మళ్ళీ మొదలయినయ్‌! ఉదయం ఎనిమిదింటికి అందరినీ బూతులుతిట్టుకుంటూ తండ్రిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు

క యాదగిరి, " గోపాల్రావ్‌ ఆఫీస్‌కెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అతనికోసమే ఎదుర్చూస్తున్నాడతను.

“పదండి-ఎమ్మెల్యేగారింట్‌కెల్దాం" అన్నాడు హడావుడిచేస్తూ.

“ఎందుకు? ఈమైక్‌ని అపేపవర్‌ ఆయనకెక్కడిది?" అన్నాడు గోపాల్రావ్‌.

"ఎందుకు లేదు? ఆయన పోలీస్‌స్టేషన్‌కి ఒక్కఫోన్‌కొడితే ఛట్‌మని బంద్‌అయిపోద్ది!”

“సరే! అయితే పదండి!" ,

అందరూ ఎమ్మెల్యే శంకర్‌దాదాగారింటికి చేరుకున్నాము.

అప్పుడే ఎక్కడికో బయట్టేరుతున్నవాడల్లా మమ్మల్ని చూచి ఆగాడు.

“నమస్కారంసార్‌!"

"నమస్తే-నమస్తే-నమస్తే-ఎవరు మీరు?"

"మేము ఈపక్కకాలనీ వాళ్ళం సార్‌! మర్చిపోయినట్లున్నారు! మిమ్మల్ని సహాయం కోరదామని వచ్చాము?” పండుగ 303

"బమిటది?”

"మా ఇళ్ళపక్కకి రెండువేపులా రెండు విఘ్నేశ్వరుళ్ళను పెట్టి పూజలు చేస్తున్నారు కదండీ! వాటి తాలూకూ మైక్‌లు రాత్రింబగళ్ళు మాచెవులు పగలకొట్టేస్తున్నాయండీ!"

"అయితే చెవి డాక్టరు దగ్గరకెళ్ళాలివయ్యా! నేనేం చేస్తాను?"

“జర ఇనండి సార్‌! ఈఫాల్లు రికార్డుల శబ్దానికి మాఫాదర్‌ బ్లడ్‌ (పెజర్‌ ఎక్కువయింది. హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది-"

"మరి ఇంకేంకావాలయ్యా! ముసలాయనను ఈతొమ్మిద్దినాలూ దవాఖానలోనే ఉండనీ! కావాలంటే డాక్టర్‌కి నేను ఫోన్టేసిచెప్తా! డిశ్చార్డ్‌గట్టా ఇయ్య ద్దని!"

"అయితే మరి మాసంగతేమిటి సార్‌?" -

“ఎట్లాగట్లా భరాయించాల్నయ్యా! అవూజలు చేన్తున్నది ఎవరికోనం? మన నియోజకవర్గంలో ఓటర్లు సుఖంగా ఉండాల్ననేగదా!"

"కానీ ఎవళ్ళింట్లోవాళ్ళు వినాయకుడిని పెట్టిపూజలు చేస్తున్నాంగద్సార్‌. మళ్ళీవీధుల్లో వినాయకుడెందుకు?"అ ప్రశ్నతో శంకర్‌దాదాకు కోపంవచ్చింది.

"మీకేం దమాకున్నదా లేదా? ఇంట్ల దేవుడున్నాడని గుడికళ్ళటంమాన్తారు వయ్యా! తిర్పతి, కాశీపోయేటోండ్లు పాగల్‌గాళ్ళా? గిసంటి పండగల్లోనే మన పార్టీవర్కర్లు ఖుషామత్‌ చేసుకోనికి ఛాన్సుంటది. సమజయినాది?"

"అంటే వినాయకచవితి పండగ పార్టీవర్కర్లు ఖుషామత్‌ గురించిచేస్తున్రా?" రోషంగా అడిగాడు యాదగిరి.

"అవ్‌ మళ్ళా! ఇందుల రహస్యమేమున్నది? ఖుల్లమ్‌ఖుల్ల జెప్తున్న! ఈ ఎలక్షన్లు అయిదేండ్దకొక్కసారి ఆస్తయ్‌. మళ్ళా ఈ అయిదేండ్ల వరకు మా వాళ్ళెట్లబ్రతకాల? ఇగో-గిసంటి పండగలు, గొప్పోళ్ళ సావులు, గిట్టా వచ్చినప్పుడు చందాలు గిట్టవసూల్టేసుకుని మనిషికి ఐదారు లక్షలు సంపాదించుకోని గుజరాయిస్తుంటరు. గిదంతా మనం సూసీ సూడనట్లు పోవాలె! అంతా మనపోరగాండ్రే కదా! అంతేగాని ఆవిగ్రహాలు రోడ్డుకి అడ్డంగా ఎందుకు పెట్టిన్రు, రోడ్‌ మీద ష్యామ్యానాలేసి రోడ్‌ ఎందుకు బ్లాక్‌చేసి(ను, స్పీకర్లల సినిమా పాటలెందుకేస్తునుు అంటూ కిరికిరి పెడితే వచ్చే ఎలక్షన్ల పని ఎవళుజేస్తరు? దొంగోట్లు ఎవళ్ళేస్తరు? ఇయన్నీమంచిగ ఆలోచించాలి! వెళ్ళండ్రి ఈనాల్గుదినాలూ కండ్డూ, చెవులూ మూసుకోండి! పోండ్రీ!”

304 హ్యామరాలజీ

అప్పుడే రాములు దాదా వచ్చాడక్కడికి.

"అవ్‌రా రాములూ? ఎట్లా నడుస్తున్నది?”

“దుకాణాలోళ్ళందరూ మనం అడిగినంత చందా ఇన్తును సార్‌! ఆరాకేష్‌మాల్‌ దుకాణం ఓనరుమాత్రం నకరాలు జేస్తుండు-"

"గట్టన? ఆడి మొఖంమీద యాసిడ్‌ కొట్టండ్రి! అడిపెండ్లాంమీద కూడా కొడతామని బెదిరించండ్రి! సుథరాయించిపోతాడు-ఎంజెప్తున్న?"

"గట్లనేసార్‌-" శంకర్‌దాదాకార్లో వెళ్ళిపోయాడు.

రాములు బయటికెళ్ళ బోతూ మమ్మల్ని చూసి ఆగిపోయాడు.

"మళ్ళీ ఈడకొచ్చిన్రేమి నంగతి? ఆస్పీకర్స్‌ కిరికిరి గురించేనా?"

"అవును-” చెప్పాడు రంగారెడ్డి.

"ఆర్నియవ్వ-మీరెక్కడ లఫంగ్‌గాంగ్‌ దొరికిన్రుభయ్‌! మీకు దేవుడిమీద భక్తిగిట్ట లేదా ఎంది?"

“ఆచెత్తరికార్డులు పెట్టటమే భక్తి అయితే-లేదు."

"ఇగో-మీకు మంచిగచెప్తున్నా ఇంకొక్కసారి మైక్‌ గురించి ఎవరికయినా కంప్లెయింట్‌ చేసిన్రో మంచిగుండది! పోలీసోళ్ళేం చేస్తారువయ్యా? మైక్‌ గుంజుకు పోతరా? ఆళ్ళకంత దమ్ములున్నాయ్‌? ఇగో-ఈ ఇనిస్పెక్టర్‌కాదు-కమీషనరు అయినగాని ఏమీ చేయ్యలేరు! సమజైనాది? ఎమ్మెల్ట్యేకి ఎదురుమాట్లాడానికి యెవరికయా ధైర్యంఉన్నది?"

మేము బయటికొచ్చేశాము

"ఇప్పుడేం చేద్దాం!” అడిగాడు గోపాల్రావ్‌

"“మినిష్టరుగారి దగ్గరకెళ్ళాం. ఎమయినాసరే దీని అంతుకేల్చుకోవాలి..."అన్నాడు శాయీరామ్‌.

అందరం మినిష్టరు గారింటికి చేరుకున్నాం.

బయట ఓవ్యక్తి కూర్చుని ఉన్నాడు.

“ఎవరు మీరు? ఏంకావాలి?"

"మినిష్టరుగారితో మాట్లాడాలి"

"ఏవిషయం?"

“ఆయనతోనే చెప్తాం!”

“ఆయనతోనే మాట్లాడాలంటే వారంరోజులు ముందే ఆపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి!” గత్యంతరంలేక వచ్చినపని బయటపెట్టాడు గోపాల్రావ్‌.

0 పండుగ తక్‌

“సంగతేమిటంటే-ఆఇళ్ళదగ్గిర జరుగుతోన్న గణపతి నవరాత్రి ఉత్సవాలమైకులు చాలా న్యూసెన్స్‌గా ఉన్నాయి. ఎవ్వరికీనిద్రలేదు. రాత్రింబగళ్ళు మోత! ఎవరికి చెప్పినా- ఆఖరికి రిపోర్ట్‌ చేసినా ఫలితం దొరకడంలేదు." ''అంటే మినిన్సరుగారిది ఇలా మైకుల గురించి ఫోన్లు చేసే ఉద్యోగం అనుకుంటున్నారా?" 'అహహ-అదికాదు-" "ఇదిగో చూడండి! మీకు తెలీదనుకుంటాను. ఇవాళ ఈమిష్టరుగారే ఎనిమిదిచోట్ల విఘ్నేశ్వర పూజకు హాజరవుతున్నారు. మరి ఆమైకులు తీసేయమని వాళ్ళకు ఆయనెట్లా చెప్తారు? కొంచెమయినా మీకు కామన్‌సెన్స్‌లేకపోతే ఎలా?" "అంటే మేమింకా ఈనరకం భరించక తప్పదంటారు! అంతేనా!" “మీనరకంసంగతి మాకెందుకయ్యా! మా మినిష్టరుగారిపార్టీ కంటే బి.జె.పి.వాళ్ళు ఎక్కువ విగ్రహాలు పెట్టారని ఇప్పుడే మా మినిష్టరుగారికి తెలిసి నానాబాధాపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంకో పద్దెనిమిది వీధుల్లో విగ్రహాలు పెట్టిపూజలు ప్రారంభించాలని ఆయన “ పావం వపిచ్చికుక్కలాగా తిరుగుతున్నారు ఉదయంనుంచి! ఇవ్చుడు టైము ఒంటిగంటవుతున్నా ఇంతవరకూ ఒక్కపెగ్గుకూడా తాగలేదు. వినాయకుడి పూజంటే అంత భక్తి ఆయనకు-అవునూ! మీకాలనీలోపల వినాయకుడి విగ్రహాలేమయినా పెట్టారా?" | ఆత్రుతగా అడిగాడతను "ఎందుకు?" భయంగా అడిగాడు శాయీరామ్‌, "ఎందుకేమిటయ్యా! అర్జంటుగా ఇంకోపద్దెనిమిది చోట్లవిగ్రహాలు పెట్టాలని మినిష్టరుగారు స్థలాలకోసం తిరుతున్నారని చెప్పలే? మీకాలనీలోకూడా ఒకటో రెండోపెట్టేస్తే సమస్య తీరిపోతుందాయనకు-" మాకు భయం వేసింది. మాకాలనీ లోపల విగ్రహం పెట్టలేదని తెలిసిందంటే తక్షణం రెండు విగ్రహాలు వచ్చేస్తాయి. నెమ్మదిగా పదిఅడుగులదూరం వెనక్కునడిచి అక్కడినుంచి వెనక్కుతిరిగి వేగంగా పరుగెతాము. "ఎయ్‌-మీకాలనీ అడ్రసిచ్చిపోండి! మిమ్మల్నే" అంటూ అతను అరుస్తున్నా వినిపించు కోలేదు. నీరసంగా కాలనీ చేరుకున్నాం. అప్పటికే స్పీకర్స్‌లో పాటల ఉధృతం పెరిగిపోయింది. 306 హ్యూమరాలజీ క్‌ లా

"అంటే మనచావు మనమే ఛావాలన్నమాట" పళ్ళుకొరుకుతూ అన్నాడు గోపాల్రావ్‌.

"ఇప్పుడేకాదు. మన డెమొక్రసీలో ఎప్పుడూ ఎవడిచావువాడు చావవలసిందే” అన్నాడు రంగారెడ్డి.

ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నాం.

హఠాత్తుగా మూడోవేపునుంచి మరోస్పీకర్‌లో సినిమాపాటలు భయంకరమయిన శబ్దంతో వినిపించసాగాయ్‌. దీంతో అన్నివేపులనుంచి ముట్టడి (ప్రారంభమయింది.

"వందనం-అభివందనం-నాంపల్లి స్టేషన్‌ కాడరాజాలింగా-నీ అందమె ఒకనందనం- రాజాలింగా- రామరాజ్యంతీరునూడు -శివాశంభులింగా-నిన్నకురేపుకు నంధిగనిలచిన ఓసుందరీ- లింగా- రామరాజ్యంతీరూసూడు-పాదాభివందనం-శివాశంభులింగా-కన్నులు పొడిచిన చీకటిలో- తిందామంటే తిండీలేదు-ఆరే దీపవు వెలుగుల్లో ఉదమంటే ఇల్లేలేదు-తీరని ఊహలరేవుల్లో- చేద్దామంటే కొలువూలేదు-తీరంచేరని పడవల్లో-పోదామైటే నెలవూలేదు- వస్తాననీ, నేను వస్తానని- గుక్కెడు గంజీ కరువైపోయే ఒక్కడి పెళ్ళాం బరువైపోయే తలవులు తలువుకు తనువిచ్చీ, వలవులగడవకు నడుమిచ్చి- బీదాబిక్కిపొట్టలుకొట్టి- మేడలుకట్టే చీకటిశెట్టి- ఎదురు చూచిన సారిక, అభిసారిక, సారి వందనం-నాంపల్లి స్టేషన్‌కాడి రాజాలింగా-వందనం---"

నేను ఇంట్లోకొచ్చి పడుకున్నాను. భోజనం కూడా చేయబుద్ది కావటంలేదు. గుండెలమీదసమ్మెట పోట్లలా, చెవుల్లో హోరెత్తిపోతూ, శబ్దాలు! రాత్రితొమ్మిది- పది- పదకొండు- ఒంటిగంటా.

"హే కృష్ణా, ముకుందా, మురారీ, ఇదిగో తెల్లచీరా, ఇవిగో మల్లెపూలు, రెండూకావాలా? ఆరెండూకావాలా? వందనం,అభివందనం, నాంపల్లిస్టేషన్‌ కాడా, సామజవరగమనా, సామజవరగమనా, ఇంటింటి రామాయణం, వింతమయిన(పేమాయణం, దూరానదూరాన తారాదీపం, శంకరా,సూదిలో దారం, సందులోబేరం, సన్నయిరాగానికి ఈ చిన్నారి నాట్యానికి ఆడించు అడించు గానుగా, జననీ జన్మభూమిశ్చ, ఓ సుబ్బారావు, ఓ అప్పారావూ, సరిగమలు, లేపమంటావా, నన్నే లేపమంటావా, అంతవాడు అంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా, ఆగదు ఆగదు ఎనిమిషము, ఆగితే సాగదు ఈలోకము, పాలుకావాలా? పండుకావాలా?" మంచం మీదనుంచి హఠాత్తుగా లేచి కుర్చున్నాను.

అప్పుడే స్పీకర్‌ శబ్దాలు ఆగిపోవటంతో అంతాగాఢనిద్రలోకి జారిపోయారు. ఏదో పూనకం ఆవహించినట్లు బయటకు నడిచాను. ఎదురుగ్గా గొడ్డలి పట్టుకుని నిలబడి పండుగ 3౦

ఉన్నాడు యాదగిరి. అతని వెనుక పక్కన రంగారెడ్డి గడ్డపలుగు పట్టుకుని ఉన్నాడు అతనివెనక గోపాలావ్‌ పారతో.

అందరూ నాలాగానే పూనకంపూనినట్టున్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోలేదు.

స్పీకర్స్‌లో పాటలన్నీ ఆగిపోయి భయంకరమయిన నిశ్శబ్దం తాండవిస్తోందా (ప్రాంతమంతా! నిశ్శబ్దంగా నడవసాగాం అందరం.

ఠః శః గా

మర్నాడు ఉదయం నాలుగ్గంటలకు మాకాలనీ చుట్టూ ఉన్న మూడు స్పీకర్స్‌ శబ్దాలు చేయలేదు. నేను ఎనిమిది గంటలవరకూ హాయిగా నిద్రపోతుంటే మా ఆవిడ పరుగుతో వచ్చినిద్రలేపింది.

“"చూశారా-ఎంత విచిత్రం జరిగిందో?" అడిగిందామె.

"ఏం జరిగింది?" కళ్ళు మూసుకునే అడిగాను.

.. = "ఆరోడ్‌మీదున్న వినాయకుడి విగ్రహాలు రాత్రిమాయమయిపోయాయట!"”

"అలాగా?” ఎమీ తెలీనట్లు నవ్వాపుకుంటూ అడిగాను.

"ఇదేదో ఆదేవుడిలీలే అని జనం తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు పావలా పావలా టికెట్‌ పెట్టారు ఆ ఉత్సవకమిటీవాళ్ళు."

నేను ఉలిక్కిపడిలేచి కూర్చున్నాను.

అప్పుడే ఓ గొంతుస్పీకర్‌లో వినబడుతోంది.

"అమ్మలారా-అయ్యలారా! అందరూక్యూలోరండి! భగవంతుడు. తనంటతాను మాయమయిన ప్రదేశం చూసి తరించండి" దాని వెనుకే మళ్ళాసినిమా పాటలు. నాకు నిజంగానే పిచ్చెక్కి నట్టయింది. త్త

“ఫాలో గా 308 హ్యామరాలజీ |

త్‌ 11 డెలివలీ (6 లో సా (| ర్‌ భూ నా మౌకాలనీ నగరంబయట అఘోరించిందన్న విషయం మీకు తెలుసుకదా! మాదేకాదు. మాలాంటి మిడిల్‌క్తాస్‌ పక్షులందరూ నగరానికి చాలాదూరంగా నెట్టివేయబడడంవల్ల వెలసిన కాలనీలు చాలా వున్నాయ్‌ మాచుట్టపక్కల. ఈకాలనీల్లో వాళ్ళెవరూ సాధారణంగా ఓట్టువేయరు, వేసినాప్రతి పక్షానికే వేస్తారు. గనుక ఈకాలనీల గురించి పట్టించుకునే వారివరూ ఉండరు. ముఖ్యంగా మానిర్భయ్‌ నగర్‌ కాలనీ పరిస్థితి మరీదారుణం. మంచినీళ్ళసప్లయ్‌ ఉండదు. రోడ్డసంగతి మీకు తెలుసుకదా! లైట్లు సరేసరి! దోపిడీలకు వచ్చే దొంగలు టార్చ్‌లైట్స్‌ వేస్తేనేగాని రాత్రిళ్ళు కాంతి ఎలా ఉంటుందో తెలీదు. (రోడ్‌లాంటి చోట) రాత్రి తొమ్మిదిదాటితే బస్‌లుకనిపించవ్‌. ఒకటే ఒక్కబ్యాంక్‌వుందిగానీ అది నేషనలైజ్‌ అయిన దగర్నుంచి వీలయినంతవరకు కస్టమర్స్‌ని చిత్రహింసలు పెట్ట ఎకౌంట్స్‌ ఎత్తేసుకుని పారిపోయేలా చేస్తోంది. ఎందుకంటే వర్క్‌లోడ్‌ తగ్గించడానికని ఉద్యోగులు అనధికార పూర్వకంగా చెప్పారు. ఫీ డెలివరీ ౩3౦09

ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు తెల్హారుజామున నాలుగ్గటలకు మా ఇంటి తలుపు గట్టిగా కొట్టడం వినిపించి మెలకువ వచ్చింది నాకు. ఛటుక్కున లేచి కూర్చున్నాను. ఒకవేళ దొంగలేమో అని అనుమానరి వచ్చింది. కాలండర్‌వేపు చూశాను. అవి నెలాఖరురోజులు గనుక దొంగలయి వుండరని అర్ధమయిపోయింది. (వాళ్ళు సాధారణంగా జీతాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేస్తారు) మా ఆవిడనిద్రలో "విశ్వామిత్ర విశ్వామిత్ర అంటూ కలవరిసోంది.

"ఎయ్‌ లేలే! ఎవరో తలుపు కొడుతున్నారు చూడు!" అంటూ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి లేచి గాబరాగా నావేపు చూసింది.

"ఏవండీ! అన్నగారి విశ్వామిత్రను నిజంగా సుప్రీంకోర్ట్చువాళ్లు అపేశారా?" అంది ఖంగారుగా.

"నీమొఖం! అదంతా నీకలగానీ వెళ్ళి తలుపుతియ్‌ ఎవరోవచ్చారు "అన్నాను సర్దిచెపుతూ. ఆమె అది కల అయినందుకు సంతోషిస్తూ వెళ్ళి తలుపు తెరిచింది. శాయీరామ్‌ ఆదుర్దాగా లోపలికొచ్చాడు, నాకు వళ్ళు మండిపోయిందతన్ని చూసేసరికి.

"ఎం బ్రదర్‌! నీకు రాత్రీ, పగలూ, తెల్లారుజామూ, అంటూ తేడాలేమీ లేవా?" అన్నాను కోపంగా.

కానీ శాయీరామ్‌ మామూలుగానే నన్ను పట్టించుకోలేదు.

"అర్జంటుగా పదగురూ! మనకాలనీరైటర్‌ చంద్రకాంత్‌ ఛటోపాధ్యాయభార్యకు నొప్పులాస్తున్నాయట! అర్జంటుగా డెలివరీకి హాస్పిటల్‌కి తీసుిళ్ళాలి!” అన్నాడు హడావుడిగా.

నాకు నిద్రమత్తంతా ఎగిరిపోయింది.

అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరగడంమామూలే మాకాలనీలో! అలాంటి సమయాల్లో ఎంతచిత్రవధ అనుభవించాలో కూడా మాఅందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. ఇంకలాభంలేదని మాఆవిడతోపాటు చంద్రకాంత్‌ ఇంటికిచేరుకున్నాను. బయటే రంగారెడ్డి, గోపాల్రావ్‌, యాదగిరి, జనర్ష్దన్‌, డిటెక్టివ్‌ రచయిత్రి రాజేశ్వరి, పార్వతీదేవి అంతా నిలబడి వున్నారు, చంద్రకాంత్‌ వాళ్ళందరిమధ్యా తప్పుచేసినవాడిలా తలవంచుకుని నిలబడి వున్నాడు.

“అదికాదోయ్‌! మీ ఆవిడ ఎ రోజయినా డెలివరీ అవచ్చని తెలుసుకదా! తెలిసికూడా ఊరిబయటకాలనీలో వుంచితే ఎలా అనుకున్నావ్‌? రెండ్రోజులు ముందే ఎదయినా ప్రైవేట్‌ నర్శింగ్‌ హోంలో ఎందుకుచేర్చించలేదు?" కసురుకుంటున్నాడు రంగారెడ్డి.

_ 310 హ్యూమరాలజీ |

"చేర్పిద్దామనుకున్నానుగానీ (పైవేటునర్శింగ్‌హోమ్‌లో అయితే 'సిజేరియన్‌' ఆపరేషన్‌ చేస్తారుకదా! దానికి బోలెడు డబ్బు కట్టాల్సివస్తుందని-ఇంట్లోనే వుంచేశాను "అన్నాడు భయంగా.

మాకు అతని మాటలు సరిగ్గాఅర్ధం కాలేదు.

"ఏమిటి? సిజేరియన్‌ ఆపరేషన్‌చేస్తారా? నీకేం మతిపోలేదుకదా! సిజేరియన్‌ ఆపరేషన్‌ ఎందుకుచేస్తారు? ఎవరికయినా డెలివరీ కష్టం అయితే, తప్పనిసరి పరిస్థితుల్డా చేస్తారు" అన్నాడు గోపాల్రావ్‌.

"అవి పాతరోజులు గురూ! ఇప్పుడు కావాలని ప్రతివాళ్ళకీ సిజేరియన్‌ చేసేస్తున్నారు"

“ఎందుకలా?

"ఫీజు ఎక్కువ వస్తుందని! మామూలు డెలివరీ అయితే బిల్‌ఎక్కువ అవడంలేదని ఈకొత్తపద్దతి ఇంట్రడ్యూస్‌ చేశారు. ఈపద్దతికని పెట్టాక యిప్పుడు నర్శింగ్‌హోమ్‌ల లాభం తెగ పెరిగిపోయిందట."

మాకేం చేయాలో తెలీలేదు

"ఇప్పుడామెని గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కెలా తీసుకెళ్ళడం?" అడిగాడు గోపాల్రావ్‌.

"ఎవర్షయినా ఆటోకి పంపించండి"

మరుక్షణం జనార్ధన్‌ ఓమోపెడ్‌మీద అటోవేటకు వెళ్ళిపోయాడు. అతను తిరిగివచ్చే సరికి తెల్లారిపోయిందిగానీ ఆటో రాలేదు.

"ఆటో ఎమయింది?" అడిగాడు రంగారెడ్డి ఆదుర్దాగా.

"ఆటోలు ఎక్కడాలేవు! ఒకే ఒక్కటి ఎన్‌టి.ఆర్‌. నగర్‌ దగ్గర వుందికానీ డ్రయివర్‌ ఉదయం ఎనిమిదిగంటలగ్గాని నిద్రలేవడట.”

"మీటర్‌మీద అయిదు రూపాయలు ఎక్కువ ఇస్తాననకపోయారా?"

"వందరూపాయ లెక్కువిచ్చినా నిద్ర డిస్టర్చ్‌ అవనీడట "నేనేం గవర్నమెంట్‌ సర్వెంట్‌ననుకున్నారా- ఒకటైమూపాడూ లేకుండా పనిచేయడానికి?" అంటూ కసురుకున్నాడు.

అందరం మొఖాలు చూసుకున్నాం.

“ఎం చేద్దాం?" అడిగాడు శాయీరామ్‌.

నేను టైమ్‌ చూసుకున్నాను.

బడవుతోంది.

“ఎనిమిదయితేగానీ ఆటోలు మనకాలనీవరకూ రావు" అన్నాడు గోపాల్రావ్‌. ఫ్రీ డెలివరీ 311

'అయిజే అప్పటివరకూ ఆగుదొాం! మనందరం కూడా అప్పటికి మొఖాలు కడుక్కుని రడీ అయిపోవచ్చు" అన్నాడు జనార్ధన్‌.

అతని ఆలోచనబాగానేవుందని ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరాం. మళ్ళీ ఎనిమిది గంటలకల్లా అందరం చంద్రకాంత్‌ ఇంటి దగ్గర ఎసెంబుల్‌ అయ్యాం.

చివరకు ఎనిమిదిన్నరకు ఓఆటో కనిపించింది.

అందరం వరుగుతో వెళ్ళిరోడ్డుకడ్డంగా చేతులుపట్టుకుని నిలబడ్డాం. మా చేతులమధ్య నుంచి దూరిపోవడానికి ప్రయత్నించి వెనుకకూడా ఇంకోరెండువరుసల్లో మాకాలనీవాళ్ళు అడ్డంగానిలబడటంవల్ల గత్యంతరంలేక ఆపేశాడతను.

అందరం కలసి అతనిని బ్రతిమలాడాము. రూల్చ్స్‌వ్రకారం అతనెలాగూ ఆటోనడపడన్న విషయం మాకు తెలుసునని, కేవలం జంటనగరాల పొరులమీద జాలితో, త్యాగనిరతితో ఆటోనడువుతున్నాడన్న నంగతి మేము అర్ధంచేసుకున్నామనీ చెప్పాము. ఎలాగయితేనేం, మీటర్‌మీద వదిరూపాయలు ఎక్స్‌ట్రా ఇవ్వడానికి మేమంతా అంగీకరించడంతో అందరం ఆనందంగా ఆటోని జాగ్రత్తగా కాపాడుతూ (వెనక్కి తిరిగి పారిపోకుండా) కాలనీలోకి తీసుకొచ్చాము.

చంద్రకాంత్‌ భార్యను అడాళ్ళు అందరూ కలసి ఆటోలోకి చేర్చారు. మామిసెస్‌ ఆమెను జాగ్రత్తగా పట్టుకుని కూర్చున్నాక ఆటోబయట్లేరింది.

మేమంతా వెనుక మాకాలనీవాళ్ళ మోపెద్స్‌మీదా, స్కూటర్లమీదా బయల్లేరాం. సరిగ్గా

' చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి దగ్గరకొచ్చేనరికి పోలీస్‌ విజిల్స్‌ మార్మోగిపోయినయ్‌. కొంతమంది

ట్రాఫిక్‌పోలీసులు గట్టిగా కేకలువేస్తూ మాఆటోనీ, స్కూటర్లనూ మిగతాట్రాఫిక్‌తోపాటు ఆపేశారు.

అన్నివేపులా ట్రాఫిక్‌ ఆగిపోయింది.

"ఇదేమిటి? ఎటోకటు వెళ్ళనీయాలి కదా! అన్నిసైడ్సూ ట్రాఫిక్‌ అలా ఆపేశారేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శాయీరామ్‌ నన్ను.

శాయీరామ్‌ గొంతువినడంతోనే ఓ ఇన్‌స్పెక్టర్‌గట్టిగా కేకలువేస్తూ మా మీదకు దూనుకొచ్చాడు.

"ఏయ్‌?తుమ్‌లోగోంకో అకల్‌నైహైక్యా? ఖామోషీసే ఖడేహోజావ్‌" అన్నాడు శ శాయీరామ్‌ని కొట్టేట్లుచూస్తూ.

"అరే! ఎందుకాపారు అనడిగితే అంత కోపమెందుకండీ?'' మొండిగా అడిగాడు శాయీరామ్‌. ఇన్‌స్పెక్టర్‌ ఇంకా మండీపడిపోయాడు. 312 హ్యామరాలజీ

"సైలెన్స్‌!" అంటూ ఫాక్టరీ సైరన్‌లా అరచాడు.

దాంతో అందరూ నిశళ్శ్ళబ్దమయిపోయాం.

ఈలోగా మావెనుక ఎవరో ఆటోవాడు హారన్‌కొట్టడంతో పిచ్చికోపంతో అటువేపు పరుగెతాడతను.

"“సాలే-కోనైరే హారన్‌ మారేసు? షరమ్‌ నైహై తేరేకో? సబ్‌లోగ్‌ ఖామోషీసే ఖడేహోజావ్‌!" అంటూ మరింత క్రూరంగా అరిచాడు.

అందరం సైలెంటయిపోయాం. సెంటర్‌లో వైర్‌లెస్‌సెట్‌ పట్పకుని నిలబడ్డ మరోపోలీస్‌ అధికార్గిటైమ్‌ చూసుకున్నాడు.

“ఆ ట్రైెమయింది! విజిల్‌ వేయండి" అంటూ అరిచాడతను నాలుగు వేపుల్నుంచీ పోలీస్‌ విజిల్స్‌ మార్మోగిపోయినయ్‌ మళ్ళీ.

అంతా ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తున్నారు.

'అమ్మా-అబ్బా-" అంటోంది ఆటోలో నొప్పులుపడుతోన్న చంద్రకాంత్‌ భార్య.

ఆమె గొంతు వినడంతోనే "ఖామోష్‌' అంటూ భీకరంగా అరిచాడు మా ముందు నిలబడ్డ కానిస్టేబుల్‌. ఇన్‌స్పెక్టర్‌ మండిపడుతూ మాఅటోదగ్గరకొచ్చాడు.

"ఏయ్‌ ఎవళ్ళిక్కడ దిల్లగీ చేస్తును" తీవ్రంగా అడిగాడు.

"ఆమెకు నొప్పులొస్తున్నాయండీ! అందుకని అరుస్తోంది."

"నొప్పులొస్తే డిస్పెన్‌ టాబ్‌లెట్స్‌ వేసుకోమనవయ్యా! అరిస్తేఎలా?" మరో కానిస్టేబుల్‌ మాదగ్గరకొచ్చాడు.

“ఆనొవ్పులు కాదండీ! అమెకు నెలలు నిండాయ్‌. డెలివరీకి వోస్పిటల్‌కి తీసుకెళుతున్నాం. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మా ఆటోని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం" చెప్పాడు రంగారెడ్డి.

ఆమాట వినడంతోనే ఇన్‌స్పెక్టర్‌ కోపంగా రంగారెడ్డి దగ్గర కొచ్చాడు.

“"మీకేందమాకున్నదా? రెండునిమిషాలు నిలబడడానికి లొల్లిపెడతరేమయ్యా।! అయినాగాని ఆమెకిదే టైమ్‌దొరికిందా నొప్పులు తెచ్చుకోడానికి?"

“కానీ ఇప్పటికి మమ్మల్ని నిలబెట్టి అయిదు నిమిషాలయింది కద్సార్‌ "అడిగాడు శాయీరామ్‌.

“ఇగో ఎక్కువతక్కువ మాట్లాడకండ్రి తొమ్మిదిగంటలకిల్లి తొమ్మిదీ రెండునిమిషాల వరకూ ఖామోషీతోటుండాలె!" ఫ్రీ డెలివరీ 313

“ఎందుకు సార్‌! ఇటువేపు సి.ఎమ్‌గానీ, గవర్నర్‌గానీ వెళుతున్నారా?" అడిగాడు ఇంకో స్కూటర్‌వాలా.

"నిన్ననే పేపర్ల ఇచ్చినం ఇయాళ మార్చీర్స్‌డే అని! సదవలే నువ్వు?తొమ్మిదిగంటలకళ్ళి తొమ్మిదీ రెండు నిమ్నాలవరకూ పూరాశహార్‌ రుకాయిస్తదని టి.వి.లో గూడా జెప్పిను. ఇనలే?"మరింత కోపంతో అన్నాడతను.

“మార్టీర్స్‌డే అంటే ఏమది?" కుతూహలంగా అడిగాడు యాదగిరి.

ఇన్‌ స్పెక్టర్‌ కొంచెం కన్‌ప్యూజయాడు.

“ఎయ్‌ నీయవ్వ-మార్టీర్స్‌డే అంటే ఎరుకలేదువయ్యా? కైసేకైసే లోగ్‌హైభయ్‌ _ యేశహర్‌మే" అనేసి అక్కడనుంచి జారుకున్నాడు

సరిగ్గా తొమ్మిదిగంటలకు మళ్ళీ విజిల్స్‌ మార్మోగిపోయినయ్‌. -

అందరం రెండునిమిషాలు ఎప్పుడవుతుందా అనివాచిలు చూసుకోసాగాము. మావెనుక

... సెరిగిఫోతున్న వాహనాల హారన్స్‌, కేకలు, అరుపులు ఇంకా పెరిగిపోతూనేవున్నాయ్‌.

ఆటోలో చంద్రకాంత్‌ భార్య వేసేకేకలు ఎక్కువయి పోతూనే వున్నాయ్‌. సరిగ్గా తొమ్మిదీరెండుకి ట్రాఫిక్‌ కదిలేందుకు అనుమతి ఇచ్చారు పోలిసులు. అప్పటికే అన్నివేపులా ట్రాఫిక్‌ పెరిగిపోవడంవల్ల మామూలుగానే ట్రాఫిక్‌ జామ్‌ అయిపోయింది.

ఆ జామ్‌ నుంచి మేమూ, మాఆటో బయటపడేసరికి పదయిపోయింది. అప్పటికే చంద్రకాంత్‌ భార్యకు నొప్పులెక్కువయిపోయి. గట్టిగా ఎడ్బేస్తోంది.

"ఆటో త్వరగా పోనీ" అరిచాడు శాయీరామ్‌.

ఆటో డైవర్‌ వేగం పెంచాడుగానీ మళ్ళీగట్టిగా పోలీసులు విజిల్స్‌వేస్తూ ఎక్కడి వాహనాలక్కడ ఆపేస్తూకనిపించారు.

లాఠీతో మావేపు దూసుకొచ్చి మాఆటోనూ, స్కూటర్లనూ, మోపెడ్‌ని రోడ్డుపక్కకు నెట్టేశాడు ఓ కానిస్టేబుల్‌.

"మళ్ళీ ఎమిటిప్పుడు?" కోపంగా అడిగాడు రంగారెడ్డి అకానిస్టేబుల్‌ని.

"గవర్నర్‌ ఓల్డ్‌సెటీలో 'పౌరుల ఇక్కట్లు' అనేసదస్సు ప్రారంభోత్సవానికెళుతున్నారు. ఆకార్డు వెళ్ళేవరకూ ట్రాఫిక్‌ ఆగాలి."

"కాని ఇవతల మా అవిడ పురిటి నొప్పులతో బాధపడుతోందయ్యా!” ఆదుర్దాగా, అన్నాడు చంద్రకాంత్‌.

( 314 హ్యామరాలజీ

"కుదరదండీీ! గవర్నర్‌ వెళ్ళేవరకూ ఎవరూ కదలడానికి వీల్లేదని మా అసిస్టెంట్‌ కమీషనర్‌ గారు గట్టిగా చెప్పారు."

“అంటే డెలివరీకేసుల్ని కూడా ఆపయమన్నారా?"

"డెలివరీఏమిటిసార్‌? హార్ట్‌ఎటాక్‌ కేనులయినా నరే! గవర్నర్‌ వన్తున్నారంటే నిలబడిపోవల్సిందే!"

"ఈలోపల ఆ సపేషంట్‌హార్ట్‌ ఎటాక్‌తో ఎగిరిపోతే?"

"పోతేపోనీండిసార్‌! గవర్నర్‌ ప్రారంభోత్సవం కంటే ఎక్కువా ఒక ఆర్డినరీ సిటిజన్‌ ప్రాణం?"

అప్పుడే చంద్రకాంత్‌ భార్యమళ్ళీ బాధగా అరవడం మొదలుపెట్టింది ఆటోలోంచిి.

"బాబ్బాబు మమ్మల్ని రోడ్‌దొటనీయండిసార్‌! హాస్పిటల్‌ వరకూ చేరుకున్నాక ఇక్కడిలా ఆపేయడం భావ్యంకాదు" బ్రతిమాలాడు శాయీరామ్‌.

"అరె! చెపుతూంటే నీక్కాదయ్యా! మిమ్మల్ని వదిలానంటే నాఉద్యోగంపోతుంది?'"'

“చూడండి! ఆపదలో ఉన్నగర్భవతి ప్రాణం ముఖ్యమా, మీఉద్యోగం ముఖ్యమా మీకు?"

అతను ఓక్షణం అలోచించాడు.

"నా ఉద్యోగమే ముఖ్యం" అన్నాడు వెంటనే. "పాతికవేలు పెట్టి కొనుక్కున్నానిది"

అందరం ఉలిక్కిపడ్డాం.

యాదగిరి మోపెడ్‌దిగి దగ్గరకువచ్చాడు.

"పోనీ (ప్రైవేట్‌ నర్శింగ్‌హోమ్‌కి తీసుకెల్దాం భాయ్‌! పాపం ఆమెకు నొప్పులు బడాయించి పోయినయ్‌' అన్నాడు ఆదుర్దాగా.

“ఇక్కడెక్కడుంది నర్శింగ్‌ హోమ్‌?" అడిగాను నేను.

"ఆరెండోట్టీట్‌లో ఉంది. వెనక్కుపోదాం పదండ్రి ఈ గవర్నర్‌ ఎప్పటికొచ్చేనో బమో?"

అందరం ఆటో తీసుకుని వెనక్కు తిరిగాం.

చంద్రకాంత్‌ వాళ్ళావిడ బాధచూడలేక తనూ ఎడ్బేస్తున్నాడు.

తీరా నర్శింగ్‌పోమ్‌ ఇవతల చౌరస్తా దగ్గరకొచ్చేసరికి మళ్ళీ పోలీసులు చాలా మంది రోడ్డుకి అడ్డంగా నిలబడి కనిపించారు.

"ఎయ్‌! ఆటో! రోకో-ఉధర్‌రాస్తా బంద్‌ హై" ఆరిచాడు-ఓకాని స్టేబుల్‌.

మాగుండెల్లో రాళ్ళు పడినయ్‌.

ఫీ డెలివరీ తె!ేర్‌

“రాస్తాఎందుకు బంద్‌ వుంది?”

"గణేష్‌ నిమజ్జనం ్రాసెషన్‌ వెళుతోంది- డైవర్షన్‌! లెఫ్ట్‌కి వెళ్ళిపోండి" అరిచాడు ఓ ఇన్‌ స్పెక్టర్‌.

"కానీ మేము రైట్‌కి తిరిగి ఆనర్సింగ్‌ హోమ్‌ కెళ్ళాల్సార్‌. చాలా అర్జెంట్‌! డెలివరీకేస్‌'" అత్రుతగా చెప్పాడు రంగారెడ్డి,

“లెఫ్ట్‌ కళ్ళి తిరిగిరండి! కమాన్‌! ఛలో" మామాట వినిపించుకోకుండా అరిచాడు.

"కానీ లెఫ్ట్‌ కెళితే ఎక్కడికెళతాంసార్‌? మళ్ళీకాచిగుడా అంతా తిరిగి రావాలికదా?"

“ఎయ్‌! పోతారా లేదా?” లాఠీ తీసుకొస్తూ అరిచాడు ఇంకో కానిస్టేబుల్‌. చేసేదిలేక అందరం లెప్ట్‌కితిరిగిపోయాం.

ఆ సందు ఎక్కడికెళుతుందో ఎవరికీ తెలీదు.

చాలాసేపు ఆసందులో వెళ్ళాక ఆటో కాచిగుడా చేరుకుంది.

అక్కడినుంచీ ఎక్కడికెళ్ళాలో ఎవరికీ అర్ధంకాలేదు.

"పోనీ కింగ్‌కోరీలో ఇంకో హాస్పిటల్‌ వుంది అక్కడికెళదాం"అన్నాడు గోపాల్రావ్‌.

“దానికెలా వెళ్ళాలి?"

"తిన్నగా వెళ్ళడానికి వీల్లేదు వన్‌వే!” అన్నాడు ఆటోడ్రయివర్‌.

“అయితే నారాయణ్‌గూడా మీదుగా వెళదాం"అన్నాడు జనార్దన్‌.

ఊరేగింపు మళ్ళీ నారయణ్‌గూడావేపు మళ్ళింది.

హఠాత్తుగా అక్కడ మళ్ళీ పోలీసులు అడ్డంనిలబడి కనిపించారు. మాకు కోపం ఆగడంలేదు.

“బహుశా ఇలా భార్యను డెలివరీకోసం హాస్పిటల్‌కి తీసుకిళడానికి ప్రయత్నించిన వాళ్ళే నగ్గలైట్స్‌గా మారిపోయి వుంటారు" అన్నాడు రంగారెడ్డి కసిగా.

"ఇటువెళ్ళడానికి వీల్లేదు!” అరిచాడు కానిస్టేబుల్‌.

"ఎం? ఎందుకని?"

"వెస్టిండీస్‌-ఇండియా క్రికెట్‌ మాచ్‌ కదయ్యా! ఆమాత్రం తెలీదా? ట్రాఫిక్‌డైవర్తన్‌."

“అవతల ఆడమనిషి పురిటినొప్పులతో బాధపడుతోందయ్యా! అర్జంటుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మీకేమాత్రం మానవత్వం లేదా? ఇటు వెళ్ళనివ్వండి మమ్మల్ని" కోపంగా అన్నాడు గోపాలావ్‌. 316 హ్యామరాలజీ

కానిస్టేబుల్‌ వినిపించుకోకుండా లాఠితో మాఆటోమీద కొట్టాడు.

"ఛల్‌ జల్టీ-ఛలో" అంటూ అరిచేసరికి ఆటోడ్రైవర్‌ గాబరాపడి ఆటోని యూనివర్శిటీ రోడ్‌వేపు తిప్పేశాడు. -

"పోనీ తార్నాకా మీదనుంచీ సికింద్రాబాద్‌ వెళ్ళి గాంధీహాస్పిటల్లో చేర్చిద్దాం” అన్నాడు చంద్రకాంత్‌.

అప్పటికే అతని భార్యబాధతో స్పృహతప్పేట్ట్లు కనబడుతోంది. ఆయాసంతో ఒగరుస్తూ అరవడానికికూడా శక్తి చాలనట్టువుంది.

తీరా తార్‌నాకాకెళ్ళేసరికి మళ్ళీ పోలీసులు.

"ఆగండి! రోకో! రెైరో' అంటూ అరుపులు, విజిల్స్‌.

"ఏమిటి మళ్ళీ? మీరున్నది జనాన్ని నరకయాతన పెట్టడానికా? ట్రాఫిక్‌ ఆగకుండా స్మూత్‌గా నడిచేట్ట్లుచూడ్డానికా? మీకేమయినా బుద్దుందా అసలు? అవతల ఆడకూతురు పురిటి నొప్పులతో బాధపడుతోందయ్యా అంటే ఒక్కనాకొడుకూ వినిపించుకోరేం?" అంటు ఎలుగిత్తి అరిచాడు రంగారెడ్నీ

ఆ కేకలతో ఆగిపోయిన జనం మావేపు తిరిగారు. చంద్రకాంత్‌ భార్య అప్పటికే స్పహ తప్పింది.

"సార్‌! నాభార్యప్రాణం పోయేట్ట్లుందిసార్‌! ఇంక జన్మలో ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల్ని కననని (ప్రామిస్‌ చేస్తున్నాను సార్‌! ఈ ఒక్కసారికి క్షమించి మా ఆవిడను రక్షించండిసార్‌!” అంటూ ఏడ్చేస్తూ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కాళ్ళమీదపడ్డాడతను.

ఇన్‌ స్పెక్టర్‌కి మా అందరినీ చూసి జాలివేసినట్టుంది "ఇదిగో చూడండి బ్రదర్‌! మేమేమీ చేయలేని నిస్సహాయస్థితిలో వున్నాం! రోజూ ఈటైమ్‌కి మన ముఖ్యమంత్రిగారు 'విశ్వామిత్ర' షూటింగ్‌కి వెళతారని తెలుసుకదా! తెలిసికూడ ఈ రోడ్‌80దుకొచ్చారు? ఆయన స్టూడియో కెళ్ళేవరకూ ట్రాఫిక్‌ని వదలడంకుదరదు."

"పోనీ ఈ ఆటో ఒక్కటి వదిలేయండిసార్‌-ప్రమాదస్థితిలో ఉన్నారంటున్నారు కదా?" పక్కనున్నతను సలహా ఇవ్వబోయాడు.

'ఏయ్‌! నీసంగతి నువు చూసుకో! అర్ధమయిందా? ఈ ఆటోని వదిలామంటే అంతా ప్రమాదస్థితి అంటూ వెళ్ళిపోతారు. మొన్నిట్లనే ఓ యాక్సిడెంట్‌ జరిగినప్పుడు తలకు దెబ్బలు తగిలినయ్యని వాడెక్కిన ఆటోని హాస్పిటల్‌కి విడిస్తేఎమయింది? ఆటో వీల్‌విరిగిరోడ్‌ మధ్యలో పడిపోయింది. ఆటోవాడూ, యాక్సిడెంట్‌కి గురయి దెబ్బలు తగిలినవాడూ ఫ్రీ డెలివరీ 31/7

ఇద్దరూ చచ్చారు. దాంతో 'విశ్వామిత్ర' షూటింగ్‌ అరనిమిషం లేటయిపోయింది. ఎంత దారుణమో చూడండి." " చంద్రకాంత్‌కీ పిచ్చెక్కిపోయినట్టయింది.

హఠాత్తుగా కానిస్టేబుల్‌ చేతిలోని లాఠీలాక్కుని పెద్దగా అరుస్తూ పోలీసుల మీదకు దూకాడు.

"అరేయ్‌-నాభార్య చావుబ్రతుకుల్లో వుందిరా! నీయమ్మ- ప్రారంభోత్సవాలూ, కకికట్టూ, దేవుడి ఊరేగింపులూ, సినిమాషూటింగ్‌లూ-కొడకల్లారా-ముందు మనిషిని బ్రతికించండ్రా"

పోలీసులందరూ కలసి చంద్రకాంత్‌ని పట్టుకుని వానులో వేసేశారు. ఇద్దరుకానిస్టేబుల్స్‌ చంద్రకాంత్‌ని కదలకుండా మీదెక్కికూర్చున్నారు.

మరో అయిదునిమిషాల తర్వాత పోలీస్‌ సైరనుతో జీపూ, దాని వెనక మేనక కారూ, దానివెనక విశ్వామిత్రకారూ, దానివెనక తెలుగుదేశం పార్టీకారూ అన్నీ వెళ్ళిపోయినయ్‌.

మేము ఆటోతీసుకుని గాంధి హాస్పిటల్‌వేపు బయలుదేరాం. ఆటోడ్రయివర్‌ చాలావేగంగా నడపసాగాడు.

ఆటో కొద్దిదూరం వెళ్ళిందో, లేదో హఠాత్తుగా స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డువచ్చింది.దాంతో బ్రేకింగ్‌డిస్టైన్స్‌ చాలకపోవడంవల్ల ఆటో ఎగిరిపడింది.

మరుక్షణంలో "కేరో' మంటూపాపాయి ఏడుపు వినిపించింది.

ఆటోడైవర్‌ ఆటోఆఅపి ఆనందంగా మాదగ్గరకొచ్చాడు.

"నాకు తెల్పుసార్‌! ఇదే స్పీడ్‌బ్రేకర్‌ దగ్గర ఎనిమిది మంది అటోలోనే డెలివరీ అయ్యారు. ఇది స్పెషల్‌ స్పీడ్‌ బ్రేకర్‌ సార్‌! ఎంతనెమ్మదిగా వెళ్ళినా నాలుగడుగులు పైకెగిరి పడేట్లు డిజైన్‌ చేయించింది మనస్టేట్‌ గవర్నమెంట్‌!"

మా అవిడ ఆటోలోనుంచి తొంగి చూసింది.

“ఏవండోయ్‌-ఆడపిల్ల"-అందినవ్వుతూ! "ఆటో వెనక్కు తిప్పమనండి! ఇంటి కెళ్ళిపోదాం!

ఆటోవెనక్కు పంపించి నేనూ, రంగారెడ్డి, యాదగిరి, పోలిస్‌ స్టేషనుకి బయలుదేరాం- చంద్రకాంత్‌ని విడిపించి తీసుకురావడానికి. న 318 హ్యామరాలజీ

మి.

పెం ద్ర ఉత్తమ బంటొట్సేం జంబాబా ఎక టీ (జీ రం య ఇరగ కాలనీ వాళ్ళందరం పిల్లలతో సహా వేదిక దగ్గర సమావేశమయ్యాము. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో కనిపించే ఉత్సాహం, హడావుడి, అరుపులూ కేకలూ-ఏమీ కనిపించడంలేదా రోజు. అంతా అతి భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని వుంది. అందరి ముఖాల్లోనూ వ్యాకులత, భయం, దిగులు అలుముకుపోయినాయ్‌. నేనూ రంగారెడ్డి, గోపాల్రావ్‌, యాదగిరి, జనర్ధన్‌, చంద్రకాంత్‌ విచారంగా ఓపక్కన రూర్చున్నాం. శాయీరామ్‌ నెమ్మదిగా వచ్చివేదిక ఎక్కి మైక్‌ ముందు నిలబడ్డాడు దీనంగా. చిన్న చిట్‌క వేసినా వినిపించేత నిశ్శబ్దం. 'సోదరసోదరీమణులారా! ఇవాళ మనకు చాలా విచారకరమయిన రోజు. మన కాలనీలోని డజనుమంది టెన్త్‌ విద్యార్భలు- పెద్దలకు తెలీకుండా -రహస్యంగా అతి ఉత్తమ సాహితృం జిందాబాద్‌ 319

జుగుప్పాకరమయిన సాహిత్యం చదువుతుండగా వట్టుబడ్డారు. పన్నెండుమందీ కూడా భయంకరమయిన చెడుమార్గంలోనే ప్రయాణిస్తున్నారంటే కాలనీలోని మిగతా పిల్లలుకూడా ఇదే త్రోవలో నడున్తున్నారని వేరీ చెప్పడం అనవసరం అని నాఅభిప్రాయం. కనీసం ఇప్పటికయినా మనకాలనీ పిల్లలు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారో వారితల్లిదండ్రులుతో పాటు ఇతరులుకూడా తెలుసుకుంటే భవిష్యత్తులో వారు అలాంటితప్పు మార్గంలో వెళ్ళకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని నాఆళ. అందుకే ఈరోజు ఈ అత్యవసరసమావేశం ఎర్పాటు చేయవలసి వచ్చింది."

ఇంతవరకూ చెప్పి అందరివంకా ఓసారి చూశాడు శాయీరామ్‌, అందరిచూపులు తనమీదే నిలచివుండడంతో మరింత విచారంగా ఫోజుఇస్తూ మళ్ళీ ప్రారంభించాడతను.

"ముందుగా యాదగిరినీ, అతని కొడుకు శంకర్‌ని వేదికమీదకు రావలసిందిగా కోరుతున్నాను" అన్నాడతను.

యాదగిరి పాలిపోయిన ముఖంతో తనకొడుకుని తీనుకుని వేదికమీదకు ఒ చేరుకున్నాడు.

"యాదగిరీ! మీఅబ్బాయి ఏ పుస్తకం చదువుతుండగా పట్టుబడ్డాడో ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పు!” అన్నాడు శాయీరామ్‌.

యాదగిరి ఏదో మాట్లాడాలని తలెత్తి పెదాలుకదపడానికి ప్రయత్నించి కుదరక మళ్ళీ తలదించుకున్నాడు అవమానంతో.

"నేను చెప్పలేను. ఆడినే అడగండ్రి" అన్నాడు సిగ్గుతో.

  • "ఏరా శంకర్‌! నువ్‌ ఓవర్‌హెడ్‌ టాంక్‌ కింద ఎవరికీ కనబడకుండా కూర్చుని చదువుతున్న పుస్తకం ఏమిట్రా" అడిగాడు శాయీరామ్‌.

"ఇంకెప్పుడూ చదవనంకుల్‌ ! నన్నాదిలేయండి"” భయపడిపోతూ అన్నాడువాడు.

"నిన్నేమీ చేయంలే! వుస్తకమేదో చెప్పు!"

వాడు ఓక్షణం తటపటాయించి చెప్పేశాడు "సత్యహరిశ్చంద్ర"

_అపేరు వింటూనే అందరూ ఉలిక్కిపడ్డారు.

చాలామంది తమకు తెలియకుండానే హాహాకారాలు చేశారు.

“అయ్యో! అయ్యో! వింటిరా? ఎంత పన్దేసిండో-సత్యహరిశ్చంద్ర చదివిండట! భగవంతుడా! ఇదేంకిరికిరి తెచ్చినావ్‌ స్వామీ-"అంటూ యాదగిరి భార్య భోరున ఏడ్చేయసాగింది. అందరూ ఆమెను అతికష్టం మీద ఓదార్చసాగారు.

320 హ్యామరాలజీ

"జరిగిన నష్టమేదో జరిగిపోయింది కదమ్మా! ఆ పిల్లాడిని ఎలా మళ్ళీ మంచి మనిషిగా చేయాలో ఆలోచించాలిగానీ ఎడుస్తే ఎంలాభం?"” అంది సావిత్రమ్మ.

"ఊరుకోమ్మా! కాలం అలాంటిది! పిల్లల్నని ఏం లాభం? ఆదిక్కుమాలిన వుస్తకాలు అమ్మినవాడిననాలి! ఎంత లాభసాటి వ్యాపారమయితే మాత్రం చిన్నపిల్లలని కూడా చూడకుండా అలాంటి బూతుపుస్తకాలమ్ముతాడా?'' విరుచుకుపడింది పార్వతమ్మ,

“ఇంతకూ ఆపుస్తకమంతా చదివేశాడా ఆకుర్రాడు?” అడిగింది ఇంకొకామె.

శాయీరామ్‌ యాదగిరి వేపు చూశొడు.

యాదగిరి శంకర్‌వేపు చూశాడు.

"ఏమిరా! ఎన్నిదినాలకెళ్ళి సదువుతున్నావీఫాల్లూ పుస్తకం?" అడిగాడతను కోపంతోనూ బాధతోనూ.

"పదేను దినాలకెళ్ళి!”

అందరూ మళ్ళీ హాహాకారాలు చేశారు."అయితే మొత్తం చదివేసి వుంటాడు! ఇంకెలా బాగుపడతాడు వీడు?" అంది సావిత్రమ్మ.

“అందులో కథంతా సదివినావురా?” అడిగాడు యాదగిరి మళ్ళీ

“అవ్‌! అంతా నదివినా!”

“"గంటే-హరిశ్చంద్రుడు 'నత్యం'కోసం భార్యను అమ్మేనుకొనుడు కాటికాపరిగా పనిచేసుడు అన్నీ సదివినావులే!” మరింత గాబరోగా అడిగాడు.

"అవ్‌! కత మొత్తం సదివినా! పాపం అరిశ్చంద్రుడు బాకీపైనలు తీర్చనికి ఎంత పరీషానయిండో మంచిగా రాసిండు నాయనా?"

అందరూ మరింత జాలిగా చూశారు వాడివేపు,

"అదంతా చదివినాంక ఇప్పుడు నీకేమనిపిస్తుందిరా?”

వాడు భయపడుతూ అందరివేపూ చూశాడు.

“చెపితే నన్ను కొడతావు నువ్వు!” అన్నాడు అనుమానంగా.

"కొట్టడులే! కొడితే అడ్డుకునే పూచీనాది! చెప్పెయ్‌" అన్నాడు శాయీరామ్‌

“నేనుగూడా ఎన్నటికీ నిజమే మాట్లాడాలని వున్నదే” భయంగా అన్నాడు.

అందరూ నిర్భాంతపోయారు. వాళ్ళమ్మ బిగ్గరగా ఎడ్బేయసాగింది. ఉత్తమ సాహిత్యం జిందాబాద్‌ 321

“నాబిడ్డ వూరా ఖరాబయిపోయిండు దేవుడో! ఈదినాల్ల 'నిజం' వలుకుతే ఎమయిపోతాడు దేవుడో! ఈడ్నింకెవరు బచాయిస్తరు దేవుడో!” అందరూకలసి ఆమెను ఓదార్చసాగారు.

"బం చేస్తామమ్మా! నీఖర్మ అది! వాడావున్తకం వూర్తిగా. చదివేసాక ఇంక ఎవరేంజేయగలం చెప్పు! వాడిఖర్మ వాడనుభవించాల్సిందే"”

శాయీరామ్‌ మైక్‌ దగ్గర కొచ్చాడు మళ్ళీ.

“సోదర సోదరీ మణులారా! యాదగిరి కొడుకు చదివిన దారుణమయిన సాహిత్యం గురించి, దానివల్ల సంభవించిన అనర్ధం గురించీ విన్నారు. ఇప్పుడు గోపాల్రావ్‌ కూడా వాళ్ళబ్బాయిని అలాంటి సాహిత్యమే చదువుతూండగా రెడ్‌హాండెడ్‌గా పట్పకున్న విషయం గురించి వివరంగా వివరిస్తారు" అన్నాడు.

మరుక్షణం గోపాలావ్‌ దీనంగా వేదికమీదకొచ్చాడు.

"గోపాల్రావ్‌గారూ! మీ అబ్బాయికూడా మనసమాజం నిషేదించిన అక్లీలవుస్తకాలు చదువుతూ పట్టుబడ్డాడని తెలిసింది నిజమేనా?” అడిగాడు శాయీరామ్‌.

“అవును!”

"ఏం పుస్తకం అది?"

"భర్శహరి సుభాషితాలు-నుమతీ శతకం" . ఆమాట వింటూనే అందరూ "అయ్యో! అయ్యో-ఇదెక్కడి ఘోరం? మరీ భర్శహరి సుభాషితాలా! మనర్యాష్టం సర్వనాశనమయిపోతోంది" అనుకోసాగారు.

“ఎంతకాలం నుంచి వాడా పుస్తకం చదువుతున్నాడో కనుక్కున్నారా?"

  • “చెప్పుకుంటే సిగ్గుచేటు! పదిరోజుల్నుంచీ అవే వుస్తకాలు చదువుతున్నాడట."

అందరికీ గుండెలవిసి పోయినంత పనయింది.

' “అమ్మో! పదిరోజుల్న్లుంచే? అన్ని రోజుల్నుంచీ అంత ప్రమాదకరమయిన పుస్తకాలు చదువుతూంటే మీరేం చేస్తున్నారు మరి?" చిరాకుపడ్డాడు. చంద్రకాంత్‌.

"మాకేం తెలుసు! పైకి కనిపించకుండా యండమూరి వీరేంద్రనాథ్‌, కొమ్మనాపల్లి, _ మల్తాది, సూర్యదేవర, యరర్రంశెట్టిశాయి నవలలమధ్య పెట్టుకుని చదువుతున్నాట్ట. మేము 'పైనవలలు చూసి మంచిసాహిత్యమే చదువుతున్నడ్డే అనుకుంటున్నాం! తీరా ఓరోజు ఆపుస్తకం

322 హ్యామరాలజీ క _

చదువుతూ చదువుతూనే నిదరపోయినప్పుడు లోపలున్న సుమతీశతకం కిందపడి అసలు రహస్యం బయటపడింది! అప్పుడు పట్టుకుని చావగొడితే భర్శహరి సుభాషితాలు కూడా చదువుతున్నానని వప్పుకున్నాడు" దిగులుగా అన్నాడు గోపాల్రావ్‌.

“ఏం పోయేకాలమొచ్చింది ఈకాలం పిల్లలకు? ఈనాటి సమాజంలో ఎలా బ్రతకాలో ఎలాంటి అవినీతి పనులు చేయాలో నేర్చే ఈకాలం రచయితల అద్భుత ఉత్తమ సాహిత్యం చదవకు౦శా అలా నీతి, నియమం, మంచీనేర్ప్చే ఆపాతకాలంనాటి బూతుసాహిత్యం చదువుతే ఏమయిపోతారు? అడుక్కు తినాల్సిందేగా?" అంది సావిత్రమ్మ ,

"ఈ చెత్తపుస్తకాలు చదివే కాబోలు, మావాడు మొన్నకాలేజ్‌ రోడ్‌ మీదో అమ్మాయి ఎదురొస్తే, ఆ అమ్మాయి చెయ్యిపట్టుకోలేదు సరికదా! కనీసం కన్నూ గీటలేదట. మిగతా పిల్లలంతా రాగానే చెప్పారు. ఆపిల్లకూడా పాపం ఇంటికెళ్ళి ఒకటే ఏఎడుపట-వీడు తననలా అవమానపరచాడని! వాళ్ళనాన్న మండిపడి వీడిమీద పోలీఎ కంప్లెయింట్‌ ఇస్తానని కూర్చుంటే మిగతా వాళ్ళందరూ సర్దిచెప్పి ఆపారట! ఇంకోసారి కూడా అలాగే నీతిగా ప్రవర్తిస్తే అప్పుడు వీడిపని పడదాం అన్నారట" అంది పార్వతీదేవి. రంగారెడ్డి కోపంగా లేచి నిలబడ్డాడు.

"వీళ్ళనిలా వదిలితే లాభంలేదు! మిగతా కాలనీ పిల్లలంతా కూడా రేపు అడివిబాపిరాజు పుస్తకాలు, గోపీచంద్‌, రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్యం, యోగివేమన శతకాలూ, గురజాడ అప్పారావ్‌ సాహిత్యం, మునిమాణిక్యం, చిలకమర్తివారి సాహిత్యం, కాశీపటం, మధురాంతకం రాజారాం కథలు, కొడవటిగంటి కుటుంబరావు నవలలు చదవడం మొదలు పెడితే వాళ్ళ భవిష్యత్తేమయిపోతుంది? ఆసాహిత్యం ప్రభావం పడినీతిగా, బుద్దిగా బ్రతుకుతామని మొండికేస్తే మనమేం చేయగలం?” ఆవేశంగా అన్నాడతను.

అందరికీ రక్తం ఉడికిపోతున్నట్లయింది. మరోపక్క పిల్లల పరిస్థితి తల్చుకుని భయం.

"అవును! మనం వీళ్ళనిలా వదిలేస్తే మనకే నష్టం! ఇంకోసారిలాంటి దిక్కుమాలిన లిటరేచర్‌ చదవకుండా కట్టడిచేయాలి!” అరిచాడు జనార్ధన్‌.

మిగతా పదిమంది కుర్రాళ్ళూకూడా ఒక్కరొక్కరే వేదిక మీదకెక్కి ఇంకెప్పుడూ అలాంటి బుద్దితక్కువపని చేయమని చెంపలేసుకున్నారు.

వాళ్ళల్లో ఒకడు ఓ ప్రముఖ సెక్స్‌ వారపత్రిక అడ్డుపెట్టుకుని లోపల చందమామ పుస్తకం చదువుతున్నాడట. మరొకడు స్త్రీ అంగాంగాలూ వర్ణిస్తూన్న సీరియల్స్‌ ప్రచురించే ఉత్తమ సాహిత్యం జిందాబాద్‌ తే2తె

మరో తెలుగు వారపత్రిక అడ్డుగా పెట్టకుని లోపల టామ్‌సాయర్‌, డాన్‌ క్విక్సాట్‌, అల్లాడీన్‌ మాజిక్‌లాంప్‌, టబైెజరీఅయ్‌లెండ్‌ లాంటి ఇంగ్లీషు వున్తకాలు చదువుతున్నాడట.

ఇంకో కుర్రాడు బూతు మాసపత్రిక ఒకట అడ్డుపెట్టకుని లోపల పుష్పవిలాపం పద్యాలు చదువుతున్నాడట!

ఈగొడవంతా చూసేసరికి (్రేక్షకుల్లో నుంచి సరస్వతమ్మగారు ఏడుస్తూ వేదికమీద కొచ్చింది.

"ఈ పిల్లల పరిస్థితి చూస్తేనే గుండె పగిలి పోతోందంటే- మొన్న మా ఆయనేం చేశాడో తెలుసా అన్నయ్యగారు?" అంటూ మళ్ళీ బావురుమంది.

"అరె ఎడుస్తావెందుకమ్మా! ఏం జరిగిందో చెప్పు!” ఓదార్పాడు శాయీరామ్‌.

"మొన్న-మొన్న-నేను మార్కెట్‌కెళ్ళి హఠాత్తుగా వచ్చి తలుపు తెరిచేనరికి-" అంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది.

“అరె! ఎడవకమ్మా! త్వరగా చెప్పు! ఏం చేశాడో?"

"నేను తలుపు తెరిచేసరికి -తెరిచేనరికి ఆయన తేనెటీగ, డెత్‌సెల్‌ పుస్తకాలు అడ్డుగా పెట్టుకుని" మళ్ళీ బావురుమందామె.

"చెప్పమ్మా! అవి అడ్డుగా పెట్టుకుని లోపల ఏ పుస్తకం చదువుతున్నాడు?" అడిగింది పార్వతీదేవి. “వాఢివరో జులాయి రచయిత విష్ణుశర్మరాసిన 'పంచతంత్రం' పుస్తకం చదువుతున్నారు" అందరి దృష్టి ఓ మూలగా పాలిపోయిన ముఖంతో కూర్చున్న సరస్వతమ్మ భర్తమీద పడింది. "ఏమయ్యా! పిల్లలకు చెప్పాల్సిందిపోయి ఎద్దులాగుండి నువ్వే అలాంటి క్షుద్ర సాహిత్యం చదువుతున్నావా? నీకేమయినా బుద్దుందా?" రంగారెడ్డి విరుచుకుపడ్డాడతనిమీద.

అతను దీనంగాలేచి నిలబడ్డాడు.

"పారబాటయిపాయింది. ఇంకెప్పుడూ అలాంటిచెత్త చదవనని ప్రామిస్‌ చేస్తున్నాను. ఈసారికి నన్ను క్షమించండి! అన్నాడు తలవంచుకుని. క్షణాల్లో అంతా గందరగోళంగా తయారయింది.

అతనిని క్తమించడానికి వీల్లేదని కొంతమంది అరవసాగారు. అతను పశ్చాత్తాపం వ్రకటించే వరకూ తులసిదళం నవల పదే పదే చదివిెస్తేగానీ తిరిగిదారిన పడడని 324 హ్యామరాలజీ | ఓ...

మరికొంతమంది సలహా ఇచ్చారు. చివరకు శాయీరామ్‌ జోక్యం చేసుకోక తప్పలేదు. వెంటనేమైక్‌ దగ్గరకొచ్చాడు.

“సోదర సోదరీమణులారా! మన సమాజం ఎంతో ప్రగతి సాధించిందని మనం అనుకోవడమేగాని నిజానికి ఎన్నితప్పుదారులు తొక్కుతోందీ, ఎంతవెనక్కు లాగుతోందీ- ఇవాళ ఈ సంఘటనలు బుజువుచేస్తున్నాయ్‌. కనుక మనం వ్యక్తుల్ని శిక్షించడం కంటె మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా చర్యతీసుకోవడం మంచిదని నాఅభిప్రాయం. ఈవిషయంలో మీ మీ సలహాలు తెలియజేస్తే వాటిల్లో ఆచరణయోగ్యంగా వున్న వాటిని స్వీకరించి అమలు పరచేందుకు మనప్రయత్నాలు మనం చేయవచ్చు" అన్నాడతను. అందరూ రకరకాల సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

"ఇక నుంచి అలాంటి పాతకాలం సాహిత్యం చదువుతూ పట్టుబడ్డవాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి" అన్నాడు బాబు.

"వాళ్ళమీద మనం కేసులు పెట్టి జైలుకి పంపాలి!” అన్నాడు చంద్రకాంత్‌.

నన్నడిగితే ఈగొడవంతా వడేబదులు ఆసాహిత్యాన్ని మన (ప్రభుత్వంతో నిషేదింపజేయాలి" అన్నాడు రంగారెడ్డి. మరుక్షణంలో తప్పట్లు మార్మోగిపోయినయ్‌.

“రంగారెడ్డి సలహా బాగుంది! వెంటనే మనమంతా గవర్నర్‌ ఇంటికి ఊరేగింపుగా వెళ్ళి ఆచెత్త సాహిత్యాన్ని నిషేధించమని అర్జీ సమర్పించుకోవాలి!” అంటూ అరిచారు అందరూ. అప్పటికప్పుడే అర్జీ తయారుచేడంలో నిమగృమయిపోయాం అందరం. *

// స్యస్తు 4 1 సి ప కలో ఉత్తమ సాహిత్యం జిందాబాద్‌ 2క్‌

న్య ర్న అ క్ష శ

అరోజు ఆదివారం. అయితే మాకాలనీ వాళ్ళంతా కాలనీవేదికదగ్గర గుమికూడింది అందుక్కాదు. మర్షాడు రాష్ట్రప్రభుత్వం స్వయంగాజరిపిస్తున్న బంద్‌గురించి మాట్లాడడానికి. మాకాలనీలో రాషష్ట్రప్రభుత్వోద్యోగులతోపాటు కొంతమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు రూడా ' వుండడంవల్ల మేమంతా బంద్‌లో పాల్లొనాలా వద్దా అనే విషయం చర్చిస్తున్నాం.

కాసేపటి తర్వాత మోటర్‌సైకిల్స్‌మీద ఉద్యోగసంఘ నాయకులు హడావుడిగా వచ్చారు. వస్తూనే స్పీచ్‌ అందుకున్నాడో నాయకుడు. .

"సోదర సోదరీ మణులారా! మనర్యాష్టవ్రభుత్వ ఉద్యోగులందరూ బంద్‌తో సహకరిస్తామని ప్రభుత్వానికి మాట ఇచ్చాము. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం మనకి ఒక్కొక్కఉద్యోగికీ అయిదు వందల రూపాయలనగదు, ఒక జతటెర్లిన్‌ బట్టలు, ఒకపాలిస్టర్‌చీర జాకెట్టు, ఒకకుంకుమ భరిణ, పిల్లలకు ఆటవస్తువులూ ఇస్తుంది. కనుక మీరంతా వెంటనే మీ మీ ఆఫీసులకెళ్ళి అవన్నీ తెచ్చుకోవలసిందిగా కోరుతున్నాం!"

326 హ్యామరాలజీ

అంతా తప్పట్టు మార్మోగిపోయినయ్‌.

ఆడాళ్ళంతా కుంకుమభరిణ, పాలిష్టర్‌ చీర సంగతి వింటూనే విప్పారిన మొఖాలతో బంద్‌వల్ల ఎన్నిలాభాలున్నయో చర్చించుకోసాగారు.

ఈలోగా కేంద్రప్రభుత్వోద్యోగుల నాయకుడు స్పీచ్‌ మొదలు పెట్టాడు.

“సోదరీ సోదరీ మణులారా! ఈ బంద్‌ మన దేశప్రయోజనాలకు భంగకరం అని మన కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కనుక మనందరం ఈ రాత్రికే ఆఫీసులకెళ్ళి అక్కడేపడుకుని రేవు వూర్తి అటెండెన్స్‌తో పనిచేయడానికి మన కార్మికనంఘం అంగీకరించింది. ఇందుకు ప్రతిఫలంగా మనకు ఒక్కొక్కరికీ ఆరువందలరూపాయలనగదు, ప్రతి కుటుంబానికి రైల్లో ఆలిండియా టూర్‌చేసే ఫ్రీపాసూ, రెండుచీరలు, పిల్లలకు ఉచితంగా యూనిఫారం, పుస్తాకాలూ ఇస్తారు. ఇవికాక ఇవాళరాత్రి ఆఫీసుల్లో గడిపేవారికి టైెమ్‌పాస్‌కోనం ప్రముఖ సినీ సెక్స్‌ డాన్సర్‌లు ఒకోఆఫీస్‌కూ ఒక్కొక్కరు చొప్పున వెళ్ళి డాన్స్‌లుచేస్తారు. ఇంతేకాకుండా ప్రతినలుగురికీ రెండుసెట్ల పేకముక్కలు, దానితోపాటు వందరూపాయలు కిట్టి మనీ గూడా ఏర్పాటుచేస్తారు. ఇవికాక రాత్రి నాలుగు రకాల బ్రాందీ విస్కీలు, ఎనిమిదిరకాల నాన్‌ వెజిటెరియన్‌ వంటకాలతో భోజనాలు, ఉదయం బెడ్‌కాఫీ, కాఫి ఫలహారాలు, మళ్ళీమధ్యాహ్మం బఫేడిన్నర్‌లూ ఉంటాయి. రాత్రి మంచాలూ యూఫోంబెడ్స్‌ కూడా ఎర్పాటు చేసేయడం జరుగుతుంది. రాత్రికి కొంతమందివేశ్యలను ఏర్పాటుచేసే విషయం గురించి కూడా మన యూనియన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. కానీ ఇంకా వివరాలు తెలీదు."

దాంతో కేంద్రప్రభుత్వోద్యోగులందరూ తప్పట్లు కొట్టి విజిల్స్‌వేశారు ఆనందంగా. అయితేవాళ్ళ ఆడాళ్ళుమాత్రం కస్సుమంటూ లేచారు.

"ఎమిటి? మా మగాళ్ళకు వేశ్యలను ఏర్పాటుచేస్తారా?" అంటూ చెంగు దోపుతుంటే నాయకుడు ఖంగారు పడ్డాడు. "అబ్బే ఊరికే-జోక్‌కిఅన్నాను" అంటూమాకేసి తిరిగి కన్నుకొట్టాడు.

మా అందరికీ కేంద్ర ప్రభుత్వోద్యోగులను చూస్తే ఈర్షకలిగింది. వాళ్ళు హాయిగా ఆఫీసులో ఎంజాయ్‌ చేస్తుంటే మేము ఇంటిదగ్గర పడిచావాలి.

అప్పటికప్పుడే అందరం ఆఫీసులకెళ్ళి డబ్బూ, చీరలూ, ఇతర వస్తువులూ అన్నీ డ్రా చేసుకుని ఇళ్ళకు చేరుకున్నాం.

మర్నాడు మేము కూడా నాలుగయిదు కుటుంబాలకు ఒక వి.సి.ఆర్‌., కొన్ని సినిమా కెసేట్లు తెచ్చుకుని హాయిగా గడపాలని నిర్ణయించుకున్నాం.

బంద్‌ - 1999 తే2౯

మరికాసేపట్లో నాలుగుబస్‌లు వచ్చి కేంద్రప్రభుత్వోద్యోగులకు డబ్బూ యితర వస్తువులూ యిచ్చి ఆఫీసులకు తీసుకెళ్ళిపోయినాయ్‌.

ఆరాత్రి వెన్నెల్లో కూర్చుని మర్హాడు మగాళ్ళకోసం కాలనీలో ఏమేంఏర్పాట్లు జరపాల్సిందీ చర్చలు (ప్రారంభించాము.

పేకాడేవాళ్ళంతా లక్షణరావ్‌ వాళ్ళింట్లో సమావేశమయేట్టూ, ప్రత్యేక వంటకాలంటే పడిచచ్చేవారంతా బగారాబైగన్‌ వెంకట్రావ్‌ ఇంట్లో కలుసుకునేట్టూ ఇలా రకరకాల ఏర్పాట్లు చేసేస్తున్నారు. సరిగ్గాఅప్పుడే ఓజీప్‌, దానివెనుకోవ్యాన్‌ వచ్చి ఆగాయ్‌ మాకుకొద్దిదూరంలా.

అందులోనుంచి హోమ్‌ మినిష్టర్‌, ఓపోలీస్‌ అధికారీ దిగారు.

"సోదరులారా! రేపు మనందరం కలసి కేంద్రానికి వ్యతరేకంగా బంద్‌ చేస్తున్నామన్న

విషయం మీకుతెలిసేవుంటుంది! బంద్‌వల్ల ఎన్నిలాభాలున్నాయో మీకందరకూ తెలిసేవుంటుంది. కేంద్రప్రభుత్వానికి ఒక్కరోజులో ఆరువందల అరవైకోట్లునష్టం వచ్చేలా చూడడం మనందరి ధ్యేయం అని నేను మీకు సవినయంగా మనవిచేస్తున్నాను. ఈటార్గెట్లి సాధించడంకోసం మనందరం ప్రాణాలకుతెగించి కేంద్రప్రభుత్వానికి చెందినటువంటి - రైళ్ళు, టెలిఫోన్‌లు, దూరదర్శన్‌, ఆకాళశవాణిలాంటి అనేక నంనృ్ధలకుభారీనష్టం కలుగజేయాల్సివుంటుంది. అవసరమయితే కొన్ని రైళ్ళను ప్రయాణీకులతో సహా తగలబెట్టాలి. ఎందుకంటే బంద్‌నాడు ప్రయాణం చేసేవారంతా కేంద్రంలోని అధికారపార్టీవాళ్ళుగాని, వాళ్ళ సానుభూతి పరులుగానీ అఆయుంటారని నేనునొక్కి వక్కాణిస్తున్నాను. ఏది! అందరూ య ఓసారి గట్టిగా అరవండి! రేపు మేమందరం ఎవరి (ప్రోద్చలం లేకుండా మాఅంతట మేమే ॥ స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నాం' అంటూ అరిచాడతను.

మేమెవ్వరం అరవకపోయేసరికి అతనికి మామీద కోపం వచ్చేసింది.

“మీకేచెప్పేది-అరవండి" అన్నాడు మండిపడుతూ.

అయినా మేమెవ్వరం నోరుమెదపక పోయేసరికి పోలీసుఅధికారి వేపు తిరిగాడతను.

మరుక్షణంలో వ్యాన్‌నుంచి పాతికమంది కానిస్టేబుల్స్‌ తుపాకులు తీనుకుని మమ్మల్నందరినీ చుట్టుముట్టారు. రంగారెడ్డిని బట్‌తో ఒక్కపోటుపొడిచాడో పోలీసుఅధికారి.

“"చూస్తారీమిట్రా అరవండి! బంద్‌ గురించి గవర్నమెంట్‌ దగ్గర అయిదొందలు తీస్కుని ఇంకేం రోగం అరవకపోటానికి?"

అప్పటికీ అరవకపోతే ఏంజరుగుతుందో మాకు తెలుసు.

అందుకని వెంటనే అరచాము. 328 హ్యామరాలజీ

ల

"రేపు మేము ఆనందంగా, సంతోషంగా బంద్‌లో పాల్లొంటున్నాము.

ముఖ్యమంత్రీ-దేవుడూ!

ప్రధానమంత్రీ-రాక్షసుడూ!

బంద్‌- జయప్రదంకావాలి!

కేంద్రం-పడిపోవాలి! నాశనమయిపోవాలీ!

రాష్ట్రం గెలవాలి! వర్టిల్లాలీ!”

మేము నినాదాలు చేస్తున్సంతసేపూ జీప్‌లోనుంచి ఒకడు మామీద ఫ్లడ్‌లైట్స్‌వేసి

వీడియో కమెరాతో షూటింగ్‌ చేశాడు. హోమ్‌ మంత్రి కెమెరామెన్‌ వైపు పరుగెత్తాడు.

"ఒరే వీడియోవాలా! జాగ్రత్తగా తీయి! పోలీసులు వాళ్ళవీపులకు తుపాకి గురి పెట్టటం ఫిల్మ్‌లో ఎక్కడా కనబడకూడదు! అర్ధమయిందా!"

"అయిందిసార్‌”' అంటూ హోమ్‌ మంత్రి కాళ్ళు కళ్ళకద్దుకున్నాడతను. అప్పుడు చూశాం అతనిని మేము. అతను పబ్లిక్‌రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఐ.ఎ.ఎస్‌. అధికారి.

“ఇదిగో ముందేచెపుతున్నా వినండి! రేపు ఒక్క పిట్టరూడా ఇళ్ళల్లోనుంచి బయటకు రాకూడదు. ఎవరికైనా జబ్బుచేస్తే పోలీసుల సహాయం తీసుకోండి! వాళ్ళు జబ్బ్ముచేసినవ్యక్తి రెండురోజులు స్పహతప్పేట్లు కొన్ని మందులిస్తారు. సృహవచ్చాక అప్పడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళవచ్చు. రే పెవరయినా చనిపోతేశవాల్ని మీపెరట్లోనేతవ్వి పాతేసుకోండిగానీ శృశానాలకు వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వబడదు. అర్ధమయిందా? గట్టిగా అడిగాడు మినిష్టరు.

అందరం అయిందని తలూపాము.

వెంటనే జీప్‌,దాని వెనుకే పోలీసులతో వానూ వెళ్ళిపోయాయి.

"దిసీజ్‌ టూ మచ్‌" అన్నాడు రంగారెడ్డి కాసేపు నిశ్శబ్దంగా వున్నాక.

"అవును! ప్రజల్ని వీళ్ళు కుక్కలకంటే హీనంగా చూస్తున్నారు" అన్నాడు శాయీరామ్‌.

అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెవుండగానే ఇంకో పెద్దవాన్‌ చాలా బలమయిన సారావాననతో రివ్వునవచ్చి మాముం౦ందాగింది. అందులోనుంచి పాతికవుంది లావుపాటివ్యక్తులు తూలుతూ మాదగ్గరకొచ్చారు. అందరి చేతుల్లోనూ కర్రలున్నాయ్‌. ఒకరిద్దరు మాత్రం తుపాకులు పటుకుని నిలబడ్డారు.

“ఏయ్‌! ఈకాలనీ కమిటీ గ్రెసిడెంట్‌, శెకఠ్రటరీ ఎవరు?'"అడిగాడు ఒకడు. వాడు కింద పడిపోకుండా ఇంకో ఇద్దరు గట్టిగా పట్టుకుని నిలబెట్టారు. బంద్‌ - 1999 వే2క

మాకు వళ్ళుమండిపోయింది.

“ఎయ్‌ అంటావేంది? మంచిగా మాట్టాడడం రాదుబే నీకు?" అన్నాడు యాదగిరి కోపంగా.

"బంది? మంచిగా మాట్లాడాలా? నీయవ్వ" అంటూ యాదగిరిమీద నలుగురుపడి చేతులు విరిచి కిందపడేశారు.

పరిస్థితి విషమించేట్టుందని రంగారెడ్డి, గోపాల్రావ్‌ ముందుకి వచ్చారు.

"నేనే కాలనీశెక్రటరీని! ఈయనగ్రొసిడెంట్‌! మాతో ఏమిటి మీకు పని?" అడిగాడు రంగారెడ్డి.

"గట్ల మంచిగా మాట్లాడాలిభాయ్‌! ఇగోసూడు! కేంద్రంలోని అధికారపార్టీకి ఈ ఏరియాలీడర్ని నేను! నాపేరు నర్శింహ! సమజైందా?" అడిగాడతను. ల. "అయింది! ఇంతకూ మాతో ఎమిటిపని మీకు? "మళ్ళీ అడిగాడు రంగారెడ్డి సామ్యంగా.

"ఏం లేదన్నా! రేపు ఈఫాల్లూ అపోజిషన్‌ కొడులు మన రాష్ట్రంల బంద్‌ చేయనికి కోషిష్‌ జేస్తును ! బంద్‌ గిట్టజేస్తే జెస్కోనీగానీ, కిరికిరేడొస్తున్సదంటే ఈబంద్‌ జబర్ధస్త్‌ చేస్తునన్నా! మనదేశంల గిట్ల జబర్ధస్త్‌ చేసేడిది గలత్‌ కదా!"

"ఆ మాటనిజమే!” వప్పుకున్నాడు రంగారెడ్డి.

"అవునా అన్నా! జబర్ధస్త్‌ గాకుండా మీదిళ్ళి మీఅందర్కీ పైసలు గిట్ట ఇచ్చి ఇళ్ళల్లోకళ్ళి బయటకు రావొద్దని చెప్తున్నది. ఎంత బేఇజ్జ్ఞత్‌ సంగతిది?”

“అవ్‌! చాలా బేఇజ్జత్‌' అన్నాడు గోపాల్రావ్‌,

"ఇప్పుడు మేమొచ్చిన పనేమంటే రేపు ఎట్లయిన మనం ఈబంద్‌ని ఫెయిల్‌ జేయాలె! అంటే మీరంతా ఆఫీసులకు వెళ్ళాలి! సమజైందా?"

మేము ఉలిక్కిపడ్డాం! "ఏమిటి? రేపు మేము ఆఫీస్‌లకెళ్ళాలా?"

“బరాబర్‌ ఎళ్ళాలె! ఆఫీస్‌లకు పోనీకి రెండుబన్‌లు మేమే ఎరీంజ్‌చేన్తం! నమజయిందా?"”

"అయిందిగానీ-ఆఫీసు కెళ్ళడానికి వీల్లేదని ఇప్పుడే హోమ్‌మినిష్టర్‌ వార్నింగ్‌ఇచ్చి ల వెళ్ళాడు కదా!" అన్నాడు గోపాల్రావ్‌ సణుగుతూ.

"అరే గ్రైసిడెంట్‌! జీనానై హైక్యారే తేరేకో? రేపు తొమ్మిదిగంటలకు రెండు లారీలు తెస్తున్నా! అందరూ లారీలు ఎక్కకపోయిననో బేఇజ్జ్ఞతవుతది. సమజైందా?" ఇక లాభంలేదని రెడ్డి కల్పించుకున్నాడు. 330 హ్యూమరాలజీ

న్డీ

"ఇదిగో చూడండి నర్శింహగారూ! మీరిలా జబర్దస్త్‌ చేయడం ఎమీ బాగుండలేదు. ప్రభుత్వమే రేపు ఆఫీ ఎలు మూసేస్తోంది."

“అదంతా మాకు తెల్వదుభాయ్‌! మాలీడర్‌సాబ్‌ చెప్పిండు. ఆఫీసులు ఖుల్లఉుండినా, లేకున్నాగానీ మీరు ఆఫీస్‌లముందు నిలబడాలె! లేకుంటే మీభార్యాబిడ్డలను లోపటజేస్తాం! ఎంజెప్తున్న?"

"సరీ" అన్నాడు గోపాల్రావ్‌ నీరసంగా.

మరుక్షణంలో వాన్‌వెళ్ళిపోయింది.

అందరం ఒకరిమొఖాలొకరు చూసుకున్నాం.

"ఇప్పుడేమిటి చేయడం?" అడిగాడు రంగారెడ్డి. |

"ఈ గూండాలతో గొడవెందుగ్గాని మనం ఆఫీస్‌లకెళ్ళడమే మంచిది" అన్నాడు శాయీరామ్‌.

"కాని స్టేట్‌గవర్నమెంట్‌ అఫీనులకు రాకుండా వుండడానికి కదా! మనకి అయిదువందలు ఇచ్చింది?"

"అయితే ఓ పనిచేద్దాం! అందరం ఆఫీస్‌లకు వెళ్తాంగానీ కాంటీన్‌ దగ్గరే కూర్చుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేద్దాం!" అన్నాడు గోపాల్రావ్‌.

. ఆ అయిడియా అందరికీ నచ్చింది.

“ఒకే బులెట్‌కి రెండుపిట్టలు" అన్నాడు జనార్ధన్‌. .

ఉదయం ఆఅఫీస్‌కెళ్ళడానికి అందరం రెడీఅయి. గూండాల స్పెషల్‌లారీలకోసం ఎదుర్పూస్తూ వేదిక దగ్గర కూర్చున్నాం. అయితే లారీలకు బదులుగా ఇంకోపెద్ద వాన్‌వచ్చింది. అందులోనుంచి ఓపాతికమంది గూండాలు-తుపాకులు, బాంబులు తీసుకుని దిగారు. వాళ్ళతోపాటు రాషష్టహోమ్‌ మంత్రి దండలతోదిగాడు.

"ఏయ్‌! ఇయాళ బందని తెల్సికూడా మళ్ళీ ఆఫీస్‌కళ్ళడానికి ఈడెందుకు జమయినుబే? తలగిట్ట తిరుగుతున్నదా ఎం?” అడిగాడు మినిస్టరు.

గోపాల్రావ్‌ లేచి వినయంగా నిలబడ్డాడు.

"అదికాదండీ! రాత్రి ఇంకెవరో గూండాలు వచ్చి ఆఫీస్‌లకెళ్ళకపోతే మా ఇళ్ళమీద ఎటాక్‌ చేస్తామని చెప్పారు. అందుకని..."

"అందుకని మాదగ్గర అయిదొందలు తీస్కోని మళ్ళీ ఆపార్టీగూండాలు చెప్పినట్టు చేస్తారు? నీయవ్వ మీకేమయినా షరమున్నడా? తినేది స్టేట్‌ గవర్శమెంట్‌ ఉప్పు పలికేది బంద్‌ - 1999 331

కేద్రప్రభుత్వం పలుకులా? ఇగో! ఇప్పుడే చెప్తున్నా ఇనండ్రి! ఒక్కడు గూడా ఆఫీసులకు పోయిండో ఈకాలనీ ఖబరసాన్స్‌ అవుతది! ఎం చెప్తన్న?”

అందరం భయంగా తలూపాం! వాళ్ళు మళ్ళివాన్‌లో ఎక్కారు.

"ఇగో-నేను గంటకోసారి ఈడకొచ్చి మీ అందరి హాజరు తీసుకుంటా! సాయంత్రం వరకూ ఇట్లా గంటగంటకూ చెకింగ్‌చేస్తనేవుంటా! సమజయిందా?" అడిగాడు హోమ్‌మినిష్టర్‌.

అందరం తలూపాము. అందరి మొఖాలు పాలిపోయి వున్నాయి.

వాన్‌ వెళ్ళిపోయింది.

దూరంగా మెయిన్‌రోడ్‌నుంచి లౌడ్‌స్పీకర్‌ అమర్చిన పోలిస్‌వాన్‌ బిగ్గరగా హెచ్చరికలు చేసుకుంటూవెల్లోంది.

"ప్రజలకు పోలీసు హెచ్చరిక! ఇవ్వాళ ప్రభుత్వబంద్‌ జరుగుతున్నది. కనుక రాత్రి

పన్నెండు గంటల వరకు ఇళ్ళనుంచి బయటకు రావడం నిషేధించడమైనది. ఈని షేధాన్ని

ఉల్లఘించిన వారిని నిర్ధాక్షిణ్యంగా చంపుటకు మాకు అధికారం ఉందని తెలుసుకో(ప్రార్ధన" మాగుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అందరి మొఖాల్లోనూ భయం కనిపిస్తూందిప్పుడు.

ఆ వాన్‌ దూరం వెళ్ళిపోగానే రెండు లారీల్లోగూండాలు కేంద్రంలోని అధికారపార్టీ జెండాలతో రాష్ట ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూవచ్చేశారు.

“ఛల్‌ఎక్కండి" అన్నారు వాళ్ళు లాఠీలు పట్టుకుని మావేపువస్తూ,.

"కానీ ఆఫీస్‌కేళ్తే చంపేస్తామని రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళన్నారుకదా! ఎవరిమాట వినాలి మేము?"అన్నాడు రంగారెడ్డి ధైర్యంగా.

వాళ్ళంతా రంగారెడ్డి వేపు చూశారు.

"ఎవరి మాట వినాలా? ఎవడిచేతిలో కత్తివుంటే అఆడిమాటవినాలి? తెల్సిందా?" ఒకడు కత్తితీశాడు బయటకు.

ఇంక గత్యంతరంలేక లారీలు ఎక్కసాగాము.

కాలనీలోని ఆడాళ్ళూ, పిల్లలూ అందరూ భోరునఎడుస్తూ లారీలచుట్టూ నిలబడ్డారు.

"ఎవండి! మనపెద్దాడిని టెన్త్‌ అయాక ఏం చదివించమంటారు?"” అంది మా ఆవిడ కన్నీరు తుడుచుకుంటూ.

“వాడిని నేనుంటే ఇంజనీరింగ్‌ చదివిద్దామనుకున్నానే! కానీ నీకు అంత పెద్ద చదువు చదివించడం కష్టమవుతుందో ఏమో! పాలిటెక్తిక్‌లో చేర్ప్చించు” చెప్పాను.

"ఏమండీ! మీరు పోతే గవర్నమెంట్‌ మాకెంతిస్తుంది?" అడిగింది ఒకామె తన భర్తను. 332 హ్యామరాలజీ

న్నీ

"రెండులక్షలు ఇస్తారను కుంటానే! దాంతో ఎ ఆథ్ర్రైలియాకో, సింగపూర్‌కో వలస వెళ్ళిపో! పిల్లలయినా బాగుపడతారు ' చెప్పాడు అతను.

కాసేపు అప్పగింతలూ, ఎడుపులూ అయాక మాలారీలు బయట్టేరాయి.

రోడ్లన్నీ ఖాళీగా వున్నాయిగానీ చాలాచోట్ల రోడ్డుకి అడ్డంగా ముళ్ళకంచెలు వేసివున్నాయి. వాటిని ఓక్రేన్‌ తొలగిస్తుంటే వెనుక మాలారీలు నడవసాగినయి. కోరీచౌరస్తా దగ్గర కొచ్చేసరికి పోలిసులు తుపాకులు పట్టుకుని అడ్డంగా నిలబడ్డారు.

"వెంటనే లారీలు వెనక్కు తిప్పి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి! లేకపోతె కాల్పులు జరపాల్సివస్తుంది" అంటూ తుపాకులు ఎక్కుపెట్టారు వాళ్ళు. మాలారీలో గూండాలు వాళ్ళమీద బాంబులు విసిరారు. వాళ్ళుపారిపోతూనే తుపాకీలు కాల్చారు. భయంకరమయిన శబ్దాలకు భయపడిపోయి మేము లారీలో తలవంచుకుని వణుకుతూ కూర్చుండిపోయాము.

అరగంటసేపు యుద్ధం జరిగింది.

పోలీసులు మాములుగానే పారిపోయారు. గూండాలలో అరడజనుమంది బుల్లెట్‌ దెబ్బలతో చచ్చికిందపడివున్నారు. మాలారీలు మళ్ళా బయట్టేరాయ్‌. ఆబిడ్స్‌ వెళ్ళేసరికి ఇంకా చాలామంది పోలీసులు తుపాకులతో చుట్టుముట్టేశారు. గూండాలు కూడా బాంబులు విసిరారుగానీ అవి పేలలేదు. వాళ్ళందరినీ పోలీస్‌వాన్‌లో ఎక్కించేశారు.

“నీయమ్మ! ఈబాంబులు తయారుచేసిన కంట్రాక్టరుగాడు మోసం చేశాడు" అన్నాడు గూండా.

"ఎవరు మీరంతా?" అడిగాడు పోలీస్‌ అధికారి మమ్మల్ని

“వేము (వ్రభుత్వోద్యోగులంసార్‌! ఈగూండాలు మమ్మల్ని బలవంతంగా

_ యిళ్ళల్టోనుంచి బయటకీడ్చుకొచ్చి ఆఫీసుకి తీసుకెళుతున్నారు."

''ఆల్‌్స్‌ంట్‌! వెంటనే వెనక్కుతిరిగి ఇంటికి వెళ్ళవోండి. ఇంకొకసారి బయటెక్కడయినా కనిపించారో కాల్చిపారేస్తాం! జాగ్రత్త!" హెచ్చరించాడతను.

మేము ఈసురోమంటూ మళ్ళీ మాకాలనీవేపు బయలుదేరాం. దారిలో రోడ్‌పక్కనే నిలబడివున్న పెద్దగూండాగుంపు కనిపించేసరికి మాకు భయంవేసి కొద్దిదూరంలోనే నిలబడీిపోయాం.

“ఎయ్‌ దుకాణాలు ఖుల్లపెట్టాలని చెపితే ఎందుకు బంద్‌జేసిన్రుబే?” కొంతమంది వ్యాపారస్తుల్ని గద్దిస్తూ అడిగాడు గూండా నాయకుడు.

"తెరుస్తే షాపులు తగలబెడతామని ఆపోజీషనోళ్ళు జెప్పిను భాయ్‌! మేమంజెయ్యాలి?" బంద్‌ - 1999 333

"ఇగో! ఈనకరాలు మన దగర నడవవు. గిప్పుడు ఖుల్లబేస్తరా లేదా? ఒకటే మాట అడుగుతున్న!"

"చేస్తే వాండ్లొచ్చి దుకాణాలు తగలబెడతారు సార్‌ అతని కాళ్ళమీద పడ్డారు వాళ్ళు.

గూండానాయకుడికి కోపం ఆగలేదు.

"అరేయ్‌! క్యాదేఖ్‌రైరీ! జలావ్‌ దుకాణోంకో" అరిచాడు అతను.

మరుక్షణం షాపులన్నింటి లోపలకు పెట్రోల్‌పోసి నిప్పంటించారు వాళ్ళు. పెద్ద ఎత్తున మంటలు లేచేసరికి మేము పరుగు మొదలుపెట్టాము. రెండుగంటలు ఆగకుండా నడిస్తేగానీ మాకాలనీ చేరుకోలేకపోయాము. అప్పటికే అంతదూరంనడవడం అలవా!... లేకపోవడంవల్ల పాదాలు పుళ్ళయిపోయాయి. దానికితోడు భయంకరమయిన నొప్పులు.

ఇళ్ళలోకెళ్ళి రెండురోజులు కదలకుండా మంచాలమీద పడివుంటేగానీ తిరిగి తేరుకోలమని మాకు అర్ధమయింది.

తీరా కాలనీ చేరుకునేసరికి ఇంకో రెండు లారీలు వాటి పక్కనే తుపాకులతో నిలబడ్డ మరోగుంపు కనిపించారు.

కాలనీలో మాఇళ్ళన్నీ ధ్వంసం అయివున్నాయి. సామానంతా ఇంటిబయట

_తగలబడుతూ కనిపించింది. ఆడాళ్ళూ, పిల్లలూ అంతా బయటే నిలబడి ఏడుస్తున్నారు.

"ఎమిటి? ఎం జరిగింది?" అడిగాము ఆడాళ్ళను.

"అందరూ ఇళ్ళల్లోనే వుండాలని హోమ్‌మినిష్టరు చెప్పినా మీరు వినకుండా ఆఫీసుల కెళ్ళారని తెలిసి పోలీసులను తీసుకొచ్చి అంతా ధ్వంసం చేయించాడు దగ్గరుండి."

మాకేం చేయాలో తెలీలేదు.

"ఏయ్‌ లారీలెక్కండి" అంతవరకు మావంక నిశ్శబ్దంగా చూస్తున్న గుంపులో నుంచి ఒకడు మాకు తుపాకీ గురిపెట్టి అరచాడు.

"మళ్ళీ మీరెవరు?" ఎడుపు ఆపుకుంటూ అడిగాడు రంగారెడ్డి.

"నీయవ్వ! ఆఫీసులకెళ్ళమని లారీలెక్కిస్తే మళ్ళావెనక్కు తిరిగొస్తారా? సాలే! ఎక్కండి . లారీ! లేకపోతే అందర్ని పిట్టల్నికాల్చినట్లు కాల్చిపారేస్తాం" అంటూ గాల్లోకి తుపాకీపేల్చాడు. .- యాదగిరికి పౌరుషం పాడుచుకొచ్చింది మళ్ళీ.

"నీయవ్వ! బయటికెళితే పోలీసుల లాఠీచార్జీ! ఇండ్ల కొస్తే ఈబాడుకవ్‌లు కాల్చి చంపుతామని బెదిరింపు. థూ! నీయవ్వ జిందగీ! గింత బాడుకవ్‌దేశం ప్రపంచంలో ఇంకడగూడా వుండదు ధూ...ధూ'"”

334 హ్యామరాలజీ ఇ.

"ఎమిరోయ్‌ స్పీచ్‌లిస్తున్నావ్‌? మంచిగ లారీ ఎక్కుతున్రా లేదా?"ఇద్దరు కత్తులు తీసుకుని మామీద కొచ్చారు. పక్షవాతం వచ్చినట్టున్న కాళ్ళను కూడదీసుకుంటూ అందరం మళ్ళీలారీఎక్కాం. ఈసారి లారీ ఎక్కువదూరం వెళ్ళకుండానే హోమ్‌మినిష్టర్‌ జీప్‌తోపాటు వస్తున్న నాలుగు లారిలు పార్టీగూండొలతో ఎదురువచ్చి అటకాయించినాయి.

“లారీల్లోనూ లోపటున్నోళ్ళనూ అందర్నీ జలాయించండ్రి" అంటూ అరిచాడు హోంమినిష్టర్‌. అప్పటికే మాలారీపక్కన బాంబులు (ప్రేలడం మొదలయింది.

ఆతరువాతేం జరిగిందో నాకుతెలీదు.

తిరిగి కళ్ళుతెరిచేసరికి అందరం గవర్నమెంట్‌ హాస్పిటల్లోని వరండాల్లో వరుసగా నేలమీద పడివున్నాం. అందరికీ బాండేజీలు!

వార్డ్‌ లోపల్నుంచి టి.వి.వార్తలు వినబడుతున్నాయి.

“నేడు రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన బంద్‌సంపూర్ణంగా విజయవంతం అయిందని రాష్ట బంద్‌శాఖామంత్రి శ్రీబందేశ్వర్రావుగారు తెలియజేశారు. రాష్ట్రప్రజలంతా అమితమయిన ఆనందోత్సాహాలతో బంద్‌లోపాల్గాని ఇళ్ళల్లోనుంచి బయటకురాకుండా పూర్తిమద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వారికి తమ అభినందనలు తెలిపారు. కొన్నిప్రాంతాల్లో తెరచిన కొన్ని దుకాణాలమీద ముఖ్యమంత్రి బృందం అతిధైర్యసాహసాలతో పోలీసుల సాయంతో

  • దాడులు జరిపి తగలబెట్టారు. ముఖ్యమంత్రే న్వయంగా అరు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జ్యోతిని వెలిగించి నిప్పంటించినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఒకకేంద్రప్రభుత్వ కార్యాలయానికి నిప్పంటిస్తున్నప్పుడు ప్రతిఘటించిన కొంతమంది కేంద్రసిబ్బందిని స్వయంగా ముఖ్యమంత్రే తమ మిషన్‌గన్‌తో కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో అయిదువేలమంది మరణించగా ఎనిమిదివేలమంది గాయపడ్డారు. రాష్ట్రం మొత్తంమీద పదహారు ప్రయాణికుల రైళ్ళను ప్రయాణికులతోసహా తగుల బెట్టినప్పుడు మంట లార్పడానికి ప్రయత్నించిన కేంద్ర రిజర్వ్‌దళాలతో రాష్ట్రపోలీస్‌ దళాలు రాత్రిపన్నెండు గంటలవరకూ పోరాటంజరిపాయి. రాష్టకాబినెట్‌ మంత్రులందరూ విధ్వంస కాండలో పాల్గొని ముఖ్యమంత్రికి తమ పూర్తిసహకారం అందబేశారు. అయితే రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన బంద్‌ పూర్తిగా విఫలమయిందని కేంద్రంలోని అధికారపార్టీ నాయకుడు శ్రీబంద్‌జితీయాదవ్‌ ప్రకటించారు. తాము బంద్‌కు ముందురోజే హైజాక్‌చేసిన రెండువందల రాష్ట ఆర్టీసిబస్‌లను బంద్‌ రోజుప్రయాణికుల సౌకర్యంకోసం తమపెర్టీడైవర్ల సాయంతో నడవగలిగామనీ, రాత్రి వన్నెండింటివరకూ నడిపినతర్వాతనే వాటిని బంద్‌ - 1999 తేతెక్‌

తగలబెట్టామని, ఆయన తెలియజేశారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన అనేకకార్యాలయాల భవనాలను ధ్వంసంచేసి తగులబెట్టినందుకు ఆయన కేంద్రరిజర్వ్‌పోలీస్‌ని అభినందించారు. తమ పార్టీవలంటీర్లు బంద్‌కి వ్యతీరీకులయిన అనేకమంది ప్రజలకు తమతమ విధులకు హాజరయేందుకు ఎన్నోవిధాలుగా సహాయంచేశారని ఆయన అన్నారు. తాముస్వయంగా నగరమంతా పర్యటించి షాపులుతెరవడానికి నిరాకరించిన అనేకమందిని చంపకతప్పలేదని ఆయన అన్నారు. రాష్టగవర్నర్‌ శ్రీబజోషి పక్షపాత వైఖరి అవలంభించి కేంద్రప్రభుత్వంతో కుమ్మక్కయితామే ఒకషాపుతెరచి సరకులుఅమ్మారనీ ఇది సహించరాని విషయమని రాష్టహోంశాఖమంత్రి తమాగ్రహాన్ని తెలియజేశారు. మొత్తం మీద బంద్‌ప్రశాంతంగా జరిగిందని, చెదురువుదురుూ నంచంటనలు మినవో, అవాంబనీయు సంఘటనలేమీజరగలేదని, అందువల్ల రాష్ట డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌పోలీస్‌కి కాబినేట్‌ మంత్రి హోదా కలుగబేస్తున్నామని రాషష్టముఖ్యమంత్రి అన్నారు. రాషష్టవిధ్యాశాఖమంత్రి శ్రీనిరక్షరాస్యరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని స్టూడెంట్స్‌ అందరూ బంద్‌లో పాల్గొన్నారనీ, క ఆరోజు రాష్ట్రంలోని కాలేజీలు, హైస్కూళ్ళూ అన్నీఫర్నిచర్‌తో సహాతగలబడిపోయి కూలిపోయినందున వారందరికీ కర్నాటక విధ్యాలయాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్త్సం చేస్తున్నామని చెప్పారు."

ఇంక మేము వార్తలు వినలేదు.

మాపక్కనే కూర్చుని మావంక ఆందోళనగా చూస్తోన్న మాకుంటుంబసభ్యులతో మాట్లాడడం ప్రారంభించాము. *

గ్ర ర్వో/డ్ర యే. పకల స్‌ ళా శల 336 హ్యామరాలజీ ఇ

క శ్‌ (న్‌ ప్ర 1110281!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ తమాషావుంది.

అదేమిటంటే ఎప్పుడూ ఎదోవొక తమాషా జరుగుతూనే వుండడం. హఠాత్తుగా జర్షలిస్టులను చావగొట్టి వాళ్ళకిమెరాలు విరగ్గొటటం పోలీసులకు ఓరోజుతమాషా అయితే, పోలినులను నక్సలైట్స్‌ కిడ్నాప్‌ చేసుకెళ్ళటం మరో రోజుతమాషా! ఎంట్రెన్స్‌ పరీక్షల్లో కొశ్చెన్‌ పేపర్లు తెగ లీక్‌ అవటం ఓరోజుతమాషా! దేశంలోని నగరాల మేయర్లందరూ రోడ్డు ఊడవటం ఓరోజుతమాషాఅయితే అనలు రోడ్డనేవే కనిపించ కుండా పోవటం నగరంలోని చాలాలొకాలిటీల్లోని మరోతమాషా!

మనప్రజలు ఈతమాషాలన్నిటికీ 'ఇమ్యూన్‌' అయిపోయారనుకుంటే మాకాలనీ వాళ్ళూ ఇంకో అడుగుముందుళిళ్ళి వాటికి 'ఎడిక్ట్‌ణయిపోయారు. చదువుల గారడీ 337

రోజూ ఏదోఒక వింతగానీ, ఏదో ఒక తమాషాగానీ జరగకపోతే కాలనీలో ఎవరికీ మనళ్ళాంతి వుండదు. నిద్రవట్టదు. తిండిసయించదు-అహ-హ! సారీ! తిండిబాగానే సయిస్తుంది.

ఎడిక్షన్‌ తీవ్రత తాలూకూ ప్రధమవిక్టిమ్‌ మాకాలనీ కమిటీ ఆర్గనైజింగ్‌ శెక్రటరీ

శాయీరామ్‌.

ఆదివారం అందరం ఇంకా నిద్రయినా లేవలేదు. ఈలోగా పెద్దగా ఓకుర్రాడిఎడుపూ, వాడివెంటవడి కొంతమంది పెద్దాళ్ళు వాడిని చావగొట్టటానికి చేన్తున్నవయత్నం

.మాకంటపడింది. మేమంతా సంగతేమిటోకనుక్కుందామని వెళ్ళేనరికే శాయీరామ్‌ ఆకుగర్రాడినీ, అతని కుటుంబపెద్దలనూ వేరుచేసి ఆకురాడిని కొట్టవద్దని వారికీ నచ్చవెపుతున్నాడు.

"ఏం జరిగింది?" ఆవేశంతో ఊగిపోతున్న ఆకుర్రాడితండ్రి శంకర్రావ్‌నీ, బాబాయినీ అడిగాము. "ఇంకేం జరగాలండీ! ఈగాడిదకొడుకు మేము భయపడినంత పనీ చేశాడు" కసిగా అన్నాడు శంకర్రావ్‌.

"ఏం చేశాడు? దొంగతనంచేశాడా?" అడిగాడు శాయీరామ్‌. |

శంకర్రావ్‌ శాయీరామ్‌ వేపు పిచ్చాడిని చూసినట్టు చూళాడు.

"దొంగతనం చేస్తే మేమెందుకు కొడతామయ్యా! అదేంతప్పుపనా?బోఫోర్స్‌ కుంభ కోణాలూ, నాచారంకుంభకోణాలూ, హెల్మెట్‌భాగోతాలూ, రామకృష్ణాన్రూడియోవన్ను మినహాయిం పులూ-వీటిముందు దొంగతనాల్ని ఇంకదొంగతనాలని ఎవడంటాడయ్యా?" కోపం అణచుకుంటూ అన్నాడు.

“పోనీ ఎవరితోనయినా కొట్లాడాడా?" అనుమానంగా అడిగాడు రంగారెడ్డి.

“ఏమిటి? కొట్టాడితే మేము గొడవచేయటానికి పిచ్చాళ్ళమనుకున్నారా? అసెంబ్లీలో, పార్లమెంటులో కొట్లాటలు, మర్దర్‌ప్రయత్సాలూ వీటిముందు వీధికొట్లాటలేముందయ్యా? వీటిల్లో ఏంతప్పుందని?” మరింత రెచ్చిపోతూ అడిగాడు శంకర్రావ్‌.

"ఒకవేళ ఏ అమ్మాయినయినా మానభంగం లాంటిది చేశాడా?” హాస్యంగా అడిగాడు జనర్ధన్‌.

"ఏయ్‌! ఏం మాట్టాడుతున్నావయ్యా! మానభంగం చేస్తే నేనెందుకుకొడతాను? మావాడు ఎమ్మెల్యే అయే రోజొచ్చిందని మురిసిపోతాను! జయలలితను అసెంబ్లీలో మానభంగం చేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినవ్పటినుంచీ అదినేరంకాదని 338 హ్యామరాలజీ =

న

బిజువయిపోయిందికదా! అలాంటి పనులేం చేసినా నెత్తినా పెట్టుకుని పూజించేవాళ్ళం. కానీ వీడు వాటన్నింటికంటే దారుణమయిన ఘోరం చేశాడండీ!”

"అంటే ఎం చేశాడు?"

'టెన్త్‌కాస్‌ పాసయ్యాడండి! ఇదిగో చూడండి మార్క్స్‌లిస్టు! ఇవాళీవచ్చింది! అసలు వీడిని టెన్త్‌లోచేర్చవద్దే, ఆ దిక్కుమాలిన కంవ్యూటర్‌ మనరాష్ట్రంలో అందరినీ ముందుఫెయిల్‌చేసి, రివాల్యుషన్‌కి అపయ్‌చేశాక అందరినీ ఫస్ట్‌క్తాస్‌లో పాస్‌చేస్తుందే అని మాఆవిడతోమొత్తుకుంటూనే ఉన్నా! వింటేనా? షనకుండా వాడిని వెధవగారాంతో టెన్స్‌లో చేర్పించింది! ఈదౌర్పాగ్యపువెధవ ఇప్పుడు ఫస్ట్‌క్లాస్‌లో పాసయి అఘోరించాడు" మేమంతా శంకర్రావ్‌ మీదా, ఆపక్కనే నిలబడి కళ్ళొత్తుకుంటున్న అతని భార్యమీదా జాలిపడ్డాము.

"పోనీలేండి! జరిగిందేదో జరిగిపోయింది. పాసయిపోయాక ఇప్పుడింక ఎవరుమాత్రం ఎంచేయగలం?"” ఓదారుస్తూ అన్నాడు రంగారెడ్డి.

"నేనూ అలాగే అనుకున్నానండీ! ఛస్తే చావనీ అని వదిలేద్దామనుకున్నాను. కానీ ఎం జరిగింది? ఇప్పుడు కాలేజీలో చేరతానని కూర్చున్నాడు."అందరం ఉలిక్కిపడ్డాం.

"ఏమిటీ? కాలేజీలో చేరతానంటున్నాడా? వీడికేంపోయేకాలమెొచ్చింది" ఆడవాళ్ళందరూ మెటికలు విరిచారు.

ఆకుర్రాడి తల్లి కూడా భోరున ఎడ్చేయసాగింది.

"నిన్న రాత్రినుంచీ ఇదే వరస పిన్నిగారూ-కాలేజీలో చేరతా అని ఒకటేగొడవ. ఇంక వీడెలా బతికి బట్టగడతాడు?" ఏడుస్తూనే అందామె.

రంగారెడ్డి ఆకుగర్రాడి దగ్గరకు నడిచాడు.

"ఏదోపాపం తెలీనివయసు! ఈవయసులో అందరూ ఇలాగే తప్పులు చేస్తుంటారు. మనందరం నచ్చజెప్పే వాడే తెలుసుకుంటాడు లెండి-ఎరా రమణా? ఈ రోజుల్లో చదువులేమిట్రా? తప్పుకదంట్రా? మీవంశం ఎలాంటిది? మీనాన్నగారు వాళ్ళ పెద్దల మాట వినకుండా చదువుకోబట్టేకదా ఈనాడిలా అడుకుతినే పరిస్థితిలో ఊరి బయటపడున్నారు? మేమంతా కూడా మాపెద్దలమాట విని చదువుకునే కదా ఇవాళ ఈకుక్కటబ్రతుకు బ్రతుకుతున్నాము?" అతనికి నచ్చచెప్పబోయాడు (ప్రేమగా.

వాడికి ఎడుపొచ్చేసింది.

"నేను చదువుతానంకుల్‌! నాకేండబ్బు ఖర్చుచేయనక్కర్లేదు. నాకు అన్నికాలేజీ ఎంట్రన్సు ల్లోనూ వస్ట్‌రాంక్‌ వచ్చింది. చదువంతా గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్‌తోనే చదివేయగలను-" అన్నాడు ఏడ్బ్చేస్తూ. యాదగిరి వాడి భుజంమీద చేయివేశాడు ఆదరంతో. చదువుల గౌరడీ ౫ 339

"ఒరేయ్‌ రమణా! గవర్నమెట్‌ సంగతి నీకెరుకలేదురా! గిట్లనే నీస్కాలర్‌షెప్‌లని, స్పెషల్‌ కోటాసీట్లనీ పోరగాండ్లకు అళపెట్టి కాలేజీల నదివేట్లుజేన్నరు. కొనాకు ఈ చదువుకున్నోండ్లేంబేస్తరు? అడుక్కుతినానికిగూడా పనికిరారన్నట్ట్లు! సమజయిందా? ఎంతమందిని సూడటం లేదురా నువ్‌? మొన్నే గదా మనకాలనీలో ఎమ్మే సదివినోడు కోడిగుడ్లు వాడితాన కొనమని అందరినీ బ్రతిమ లాడిండు! గుర్తులే?"

యాదగిరి మాటలు కూడా వాడిలో ఎలాంటి చలనం కలిగించలేదు.

“నాకేం? నేనుకాలేజీలోచేరతా? నాకు చదవాలని ఉంది "అన్నాడూ మళ్ళా మొండిగా.

శంకర్రావ్‌కి కోపం వచ్చింది.

"అరె నీయవ్వ-మళ్ళీ అదేమాట మాట్టాడతావు? చదువులేనోళ్ళు ఎంత మంచిగా బ్రతుకుతున్నారో చూసి కూడా బుద్ది తెచ్చుకోవేరా? "అంటూ రెండు వేసేసరికి రంగారెడ్డి ఆతనికి అడ్డువెళ్ళాడు.

"ఒరేరమణా! మనదేశచరిత్రంతా ఓసారిచూడరా!'కింగ్‌ మేకర్‌ అనిపేరున్న కామరాజ్‌ నాడార్‌ బంచదివాడ్రా? అతనికిరాయటం, చదవటం రెండూరావ్‌కదురా! అయినా రాజుల జాతకాలు రాశాడు. అవునా? అందాకా ఎందుకు? మన ఎక్స్‌ చీఫ్‌ మినిష్టర్‌ అంజయ్య నీలాగా చదువుకునివుంటే చీఫ్‌మినిష్టర్‌ అయేవాడా? మన రాష్ట్రాన్ని మిగతాచదూకున్న చీఫ్‌ మిష్టర్లకంటేబాగా వరిపాలించ గలిగీవాడా? మనకాలనీలో (ప్రెసిడెంట్‌ మెడల్‌ నంపాదించిన ఇంజనీర్‌ ఏంచేన్తున్నాడు? వేలి ముదలువేసే కంటాక్టరకింద రోజుకూలీలెక్కన పనిచేస్తున్నాడుకదా" ఏకధాటిగా స్పీచ్‌ ఇచ్చాడు.

“అందాకా ఎందుకురా! నువుచదివిన స్కూల్స్‌, కాలేజీలు ఎవరివనుకున్నావ్‌? ఒకటో క్తాస్‌గూడాచదువని సారాకంట్రాక్టర్‌వి! మరి వాడికిందే ఎమ్‌.ఏ. పిహెచ్‌డీలూ, ఎమ్మెస్సీ బి.ఇడీలూ, ఎమ్‌ కామ్‌లూ, పనిచేస్తున్నారా లేదా? నువ్‌ ఎగబడి చూసే సినిమా డైరెక్టర్టూ, ప్రాడ్యూసర్లూ ఎంతమంది చదువుకున్నారనీ? మనదేశం మొత్తం మీద ఎమ్మెల్యేలు ఎంపీలలో అక్రరంముక్క రాని వాళ్ళే ఎక్కువమంది ఉన్నారన్న విషయం తెలుసా నీకు? వాళ్ళు రకరకాల కమిటీలకు హెడ్స్‌గా వనిచేన్తూ మనదేళ భవిష్యత్తుని నిర్ణయించటంలేదూ?" తనూ కల్పించుకుంటూ అన్నాడు గోపాల్రావ్‌.

"ఆమాటకొస్తే చాలాపత్రికల ఎడిటర్హూ, కొంతమంది తెలుగు రచయితలకూ ఒక్కలైన్‌ రాయటం కూడా రాదు. అయినా వాళ్ళను మన తెలుగుప్రజలు పైకెత్తేసి బేబేలు కొట్టటంలేదూ? బాగా చదూకుని ఉంటేపాపం వాళ్ళ గతేమయి ఉండేది? అంది రాజేశ్వరి. 340 హ్యామరాలజీ

ఆ కుర్రాడు ఆలోచనలో పడ్డాడు.

“మామాట వినరాబాబూ! గొప్ప గొప్ప వ్యాపారస్తూలూ, లక్షాధికారులూ, కోటికి పడగలెత్తిన వారూ మెజారిటీ ఏబీసీడీలు రానివారేరా! క్రిమినల్‌ 'ప్రాసీజర్‌' కోడ్‌ అనేలావుపాటి పుస్తకాలుచదివి సమాజంలోని రుగ్మతలన్నీ అదువులో పెట్టాల్సిన పోలీసుల్లో నూటికి డెబ్బైెమంది చదువు రాని వారేరా! ఎవరిక్కావాల్రా చదువు?” అంది వాళ్ళమ్మ,

"వాటి సంగతలా వుండనీ! నువ్‌ చదువులేని వాడవయితే మనప్రభుత్వం నీకు ఎన్ని రకాల రాయితీ లిస్తుందోఒక్కసారిచూడు! జనార్ధన్‌ పూజారి స్కీంప్రకారం చదువూ సంధ్యా లేకుండా పనిపాటా చేయని వాళ్ళందరికీ ప్రతిసంవత్సరం అయిదువేలు ఉచిత లోన్‌ దొరుకుతుంది. ప్రతి బాంక్‌లోనూ రకరకాల మారుపేర్లతో ఎన్నో వందలసార్లు లోన్లుతీసుకుని ఎగ్గొట్టవచ్చు! నీలాంటివాళ్ళందరికీ గవర్షమెంట్‌స్థలాలు ఆక్రమించుకునే హక్కు మన ' ప్రభుత్వం ఇస్తుంది. అంటే అలాంటి స్థలాలు సంవత్సరానికి ఒకటి ఆగక్రమించుకుని పట్టాదొరగ్గానే అమ్మేసుకుని డబ్బు చేసుకోవచ్చు. ఇదికాక బలహీనవర్గం అని చెస్తే సంవత్సరానికో ఇల్లుకూడా ప్రభుత్వం నీకిస్తుంది.అదీ అమ్మేసుకోవచ్చు. ఇదీగాక నీఓటుని అన్నిరకాల ఎలక్షన్‌లకూ కలిపి అయిదేళ్ళకు టోకున ఏపదివేలకో ఏదోఓకపార్టీకి అమ్మేసు కోవచ్చు" చెప్పాడు రంగారెడ్డి.

_ “ఇప్పుడు నెహ్హూ రోజ్‌గార్‌ యోజన స్కీమ్‌లో యింకెంతడబ్బు ముడుతుందో తెలీదు. ఎలక్షన్లలోగానే ఎన్టీఆర్‌రోజ్‌గార్‌ స్కీమ్‌ ఒకటి ప్రవేశపెడితే ఇంక నీకూడబ్బుకేంకొదవచెప్పు!" నచ్చజెప్ప సాగాడు గోపాల్రావ్‌.

"“గ్రీన్‌కార్డ్‌ హోల్దర్‌వయితే నీకెన్ని సౌకర్యాలుంటాయో తెలుసా? నిజామ్‌హాస్పిటల్‌, అపోలోహాస్పిటల్‌ లాంటి అతిఖరీదయిన ఆస్పత్రులలో ఉచితంగావైద్యం, కిలోరెండ్రూ పాయల బియ్యం, అతిచౌకగాబట్టలు-ఇంతకంటే ఇంకేంకావాల్రా నీకు?" అన్నాడు రంగారెడ్డి.

వాడీలో సంచలనం కలిగింది.

“మీరు చెప్పింది నిజమేననుకో” అన్నాడు నెమ్మదిగా.

అందరికీ ఒక్కసారిగా నెత్తిమీద బరువుదింపినంత సంబరమయింది.

శంకర్రావ్‌ కొడుకుని కౌగిలించుకున్నాడు.

“ఎంతమంచివాడివిరా నువ్వు! ఎంతత్వరగా అర్ధంచేసుకున్నావు? అన్నాడు ఆనంద భాష్పాలురాలుస్తూ.

“కానీనాకు పెద్దపదవుల్లోకెళ్ళే ఛాన్స్‌పోతుందికదా అంకుల్‌?" రంగారెడ్డినడి గాడువాడు. చదువుల గౌరడీ చేశే]

, వానా వయసు... “ఎ పదవులు కావాలనుకుంటున్నావ్‌ నువ్వు?" "ఐ.ఏ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, లాంటివి." అందరూ ఘెల్లున నవ్వారు. “పిచ్చివాడా! ఆ పదవులన్నిటికన్నా పైపదవిని చాలా తేలిగ్గా ఎలాంటి చదువూ లేకుండా సంపాదించవచ్చురా?" అన్నాడు రంగారెడ్డి. ' ఎలాగ?" “ఎలాగేముంది? పాదాభివందనం చేస్తేచాలు! నాలుగయిదేళ్ళు అలా శ్రమపడ్డా వంటే పదవి తప్పదు-న్యూస్‌ పేపర్లలో ఆఫోటోలు చూడలే నువ్వు?" రమణ మొఖంలో చిరునవ్వు కనిపించింది.

"అయితే సరే! నేను కాలేజిలో చేరను డాడీ!" అన్నాడు నిర్ణయించుకున్నట్టు. శంకరయ్య, అతని భార్య, రమణను ఆనందంగా ఇంటికి తీసుకళ్ళిపోయారు. మేమంతాకూడా తేలికయిన హృదయాలతో ఎవరిళ్ళకువాళ్ళు బయళల్టేరాం *

వే న్‌ ఆ జ ఇకిఫో 342 - హ్యూమరాలజీ

న! న! ఠి క్రి మై వీ వి యు శౌ వ $ థీ క్రీ థి సు సీ. 0 ఇ

క్ర మూ స్తాబ్లెమ్‌ మూ కర్ణమంింంది. న | / కాల్‌ సెంటర్లో మూబాస్‌ మూకెప్పడూ నైట్‌ డ్యూటీలే వేస్తున్నాడు. మా ఇంట్లో నాళ్ళు [= ఛానెల్‌ నిషయంలో నూకో గొడనపడుతున్నారు. | మూ గాళ్తబాయ్‌ ఫ్రెండ్‌ ఈ నుఢ్య కొంచెం | / రూట్‌ నూరుస్తున్నట్టుగా మా కనిపిస్తోంది. ఇనే కాక ఇంకా సవాలక్షమందికో నూకుచాలా తలనొప్పిగా ఉంది. వీటిన్నిటీ నుంణి నినంక్తికావాలంటే ( వెంటనే నాళ్ళందరికో | | హ్తూమరాలజీ చదివించండి. / | - మూ స్తాట్లెమ్‌ సాల్వ్‌ అవుతుంది. లేదా ౯ ( మూసే హ్య్తూమరాలజీ తీసుకొండి! ఇ నాళ్ళందరి సాట్లెమ్స్‌ సాల్వ్‌ గ

  • ' అవుతాయ్‌ నా

జా. అనా లందాాండాలి ానరడులట టు నాని అననన యత్‌ ₹ నుకంపం టర పానం టం 02యాలా యు రోల (టా... నం జం 9 లతని కపంంసమాం నన్‌ ఏ” ఉగ కట్‌ తవాాంనాని। నోరి ఆ యట. కకంంయా౨2వనని వినములంాంా దాగా తిన. నకచతం ( __సోరువందూపికి లగి చేప నించే అనాం నన ౨ నానల తిానన (