Telugu హ్యాపీ డేస్_గొరుసు జగదీశ్వరరెడ్డి_2018_229 P_LPSA104B169_B (2) - anilvaranasi/indianlanguages GitHub Wiki
గి గి శ ణో శే ఓ మై లే న్ 1 (| | ॥ . (| | షు. కహా క ఆట ఫై ఫౌావ ఇ క్రీ అంట్ట భు. కర! క ఇ. గ్ క | ఈ [ చన పు క్షి క్ ఫ్ క తలే ష్ మ ॥. అ ల్.” సిని [పప్రము చిన్ననాటి తీపి గుర్తులు సిని ప్రముఖుల చిన్న! పి ల పజాశకి బుకహౌస్ ౧9811
గ్రా.
. (1054 [04616 హ్య్వాబ దెస సినీ ప్రముఖుల చిన్ననాటి తీపి గుర్తులు గొరుసు జగదీశ్వర రెడ్డి శృ (వ్రజాళక్రి బుక్‌వౌస్ 27-80-4, ఆకులవారి వీధి, గవర్నర్‌పేట, రాఘవయ్యపార్భు వద్ద విజయవాడ - 520 002 ఫోన్ : 0866 -25775338
ఖా. ల్సి హో గానో న
- ళ్ళ గా క క్ష శ హ్ నో స్క ఇ తా ఇ ప లీ టు కవన. ప్రచురణ సంఖ్య :; 1569 ప్రథమ ముద్రణ : ఆగస్టు, 20186
వెల ; ₹175/- (ప్రతులకు
ట్త
తలే
[౨811 ప్రజాశక్తి బుక్ హౌస్ 27-1-54, కారల్‌మార్క్ రోడ్, గవర్నర్‌పేట, . విజయవాడ -2, ఫోన్ : 0866 -25775838 బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, ఏలూరు, విజయనగరం, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ (ఫెస్, విజయవాడ 603146 : ౪7౫7/.0901.10 012)232600601130102[0౪636 €౭౧౧211.0011 1ఏ0%- ౪978-81 -938053-4-3
|||||1|11111111111 137623
విషయ సూచిక ౫: ముందుమాట : యువతకిది స్ఫూర్తి - భువనచంద్ర 9
-
మా ఫైట్స్ అన్నీ రైల్వేట్రాక్ పక్శనే =భివాజీ 12
-
ముగ్గురమ్మాయిలు... ఒకటీ (ప్రేమ కాదు -వీరభద్రమ్ 16
-
డ్రామాలు, స్కిష్టలతోనే గడిచింది -ఇంద్రగంటి మోహనకృష్ణ 21
-
మధ్యాహ్నం పరీక్ష ఉన్నా మార్షింగ్‌షో చూసేవాణ్జి =మదన్ 205
-
మిడ్‌నైట్ బిర్యానీలంటే పడి చచ్చెవాళ్లం -=వరుణ్‌సందేశ్ 30
-
నా చదువంతా సినిమాహాల్లోనే -రాజీవ్ కనకాల 3ర్
-
ఆట రాకుండానే గోల్‌కీపర్‌నయ్యా =శ్రీకాంట్ 39 త్
-
నా పేరడీ దెబ్బకు సన్నానం కాన్సిలయ్యింది
-అనంత శ్రీరామ్ డ్తేర్త 9. స్కూలు బ్యాగులో సివిల్ ద్రెస్ పట్టుకెళ్లే వాడ్ని
-క్ఫుమ్ణడు శం 10. ఆ శబ్దం వినగానే నిక్కర్లు తడిసిపోయేవి!
_నాని ర్‌డీ . 11. ఆ అమ్మాయే లేకపోతే....
-భాస్మరభట్ల ర్9 12. చిరంజీవి ఫాన్స్ అంతా నా ఫాన్సే
-అళశోక్ 64 13. కాపీ కథ చెప్పి ఆదర్శ పురుషుడినయ్యా
-వీరు పోట్ల 69 14. పదిహేదేళ్లకే కన్యాదానం చేశాను
-చిన్నికృష్ణ // త్త 15. తాడూ లేదు, దొంగా లేడు.. అంతా (భ్రాంతే
=ఠై. ఎమ్, రాధాకృష్ణన్ 7/9 16. అన్నిసార్లూ పాట పాదే బయటపడ్డాను
-రేవంత్ 8డీ 17. వాడి లవ్ నన్ను హీరోని చేసింది
=మారుతి 89 18. పొట్టైళ్ల దెబ్బకు కెవ్వుకేక
=పి.జి,వింద 0 10. అచ్చం 'ఆటోగాఫ్...” సినిమా అనుభవాలే నావి
-రఘు కంచే 99 20. 'ఆత్మలను పిలిచి భయపెట్టైవాణ్సి
-శ్రీరామచంద్ర 104
|
-
నాన్నగారి ఉద్యోగం నా అల్లరికి అడ్డొచ్చిది -పి. సునీల్ కుమార్ రెడ్డి 109
-
నా ఫాంటసీలకు మూలం అమరచిత్ర కథలే = ఎస్. ఎస్.రాజమౌళి కేశ
-
“ఐశ్వర్యారాయ్'నే వద్దన్నాను వ్ -సంపత్‌నంది [119
-
“భాష రానిచోట బావుటా ఎగరేశాను క్క -శ్రీకృష్ణ [24
-
శ్రీశ్రీ మరణమే నాకు సాహిత్యాన్ని పరిచయం చేసింది =వనమాలి 120
-
నన్ను మార్చింది మా నాన్న కన్వీరే బొమ్మరిల్లు భాస్కర్ 134
-
అమ్మను నవ్వించడానికే “తాగుబోతు” నయ్యాను తాగుబోతు” రమేష్ 189 , 28. పాలడబ్బాల మీద మొదలైంది నా సంగీత ప్రయాణం -అనూప్ రూబెన్స్ 144 ౨౦. అర్ధరాత్రి ఆడపిల్లలు ఆటోగ్రాఫ్ కోసం వచ్చారు -దీపు 149
-
తథాస్తు దేవతల వల్లే నటుడ్నయ్యాను -కోమాకుల నుధాకర్ 154
-
నేను ఇప్పటికీ “సిద్దార్ధ ముద్దుబిడ్డనే -వి.ఎన్ ఆదిత్య 159
-
సంగీతం వచ్చింది కాని బాల్యం పోయింది -కారుణ్వు 164
-
చిన్నప్పట్నించీ నాకు సినిమా పిచ్చే -వంళీ పైడిపల్లి 169 ఖతి
-
అందరి చీటీల్లోనూ నా పేరే... -అంజనా నౌమ్య 174
-
సినిమా తప్ప మరో చదువు లేదు =చందు. 1/79
-
పాసవుతామో లేదో 'సిల్మ్‌స్మిత'ను అడిగేవాళ్లం శ్రీ 184 గ
-
“హలో డార్ష్లింగ్' అంటే మా మేడమ్ తనని అనుకుంది =సమీర్ 189 మ
-
నన్ను 'తాన్‌సేన్ అని పిలిచేవారు! -మళల్లికార్దునరావు 194 39, దమ్ముంటే అమ్మాయిని కదిలించమని పందెం కాశారు -బోయపాటి శ్రీ;:ఏ 199
-
రజసీయే అన్నారు.... నాది ఆర్టిస్ట్ ముఖమని =నాయికీరణ్ ౧౧4
-
“సూపర్ మానొలా ఫీలై ప్రాణం మీదికి తెచ్చుకున్నాను -శ్రీనివాస్‌రెడ్డి 209
-
“ఎలో అంటే మాకు ఐశ్వర్యారాయ్ -రేష్మ 214 43, సస్పెందవడంలో నాదే రికార్డు -=వారీష్ శంకర్ 219
్ 'హ్యాపీ డేస్ అంటే యవ్వనారంభపు రోజులు. తీపైనా, చేదైనా చిరకాలం గుర్తుండిపోయే అనుభూతులు.
ను కృతజ్ఞతలు ఠా “హ్యాపీ దేస్” శీర్షిక ద్వారా సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాళ్టుష్త గారికి, నేను రాసిన రాతల్ని అందంగా తీర్చిదిద్దిన మా మేడమ్ వేమన వనంతలక్షు గారికి, నన్ను మరింతగా ప్రోత్సహించిన మా ఎడిటర్ కెశ్రీనివాన్ గారికి, ఇందులో కొందరిని కలవడానికి పరోక్షంగా నాకు సహాయపడ్డ మా చిత్రజ్యోతి దెస్క్ వారికి, నేను అడిగిందే తడవుగా ముందుమాట రాసిచ్చిన శ్రీ భవనచంద గారికి, నా ఇంటర్వ్యూలన్నీ పుస్తక రూపంలో తీసుకొస్తున్న ప్రజాశక్తి బుక్‌వౌస్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. _ గొరును
"నా (1 . ఖే న. “్ స గల + వ గ ఒం “ యువతకిది స్పూర్తి -్ కో ఖత క్ష పాఠకులకు నమన్మారం శ్రీ గొరుసు జగదీశ్వరరెడ్డిగారు నాకు చిరపరిచితులు. అంటే మేం కలిశామనికాదు. కథలూ టెలిఫోన్లు మమ్మల్ని కలిపాయి. జగదీశ్వరరెడ్డిగారిది ఓ విలక్షణమైన శైలి.
'హ్యాపీడేస' అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాలేజీ జీవితం... యవ్వనం... ఆకర్షణ... విరహం... వినోదం... ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు... ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ 'హ్యాపీడేస్'లో నలభై ముగ్గురు యువ-లబ్ధప్రతిష్టుల ఊహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. “గమ్యాన్ని నిర్దెశించేది గమనమే...” అనేది ఈ సంపుటితో రుజువవుతుంది.
అసలు సినిమాల్లోకి వెడదామని ఆలోచనే చెయ్యని “శివాజీ నుంచి, 'చదువొక్కటే పరమార్ధం కాదు అని నిరూపించి తీరాలని తొడగొట్టీన అనంతశ్రీరామ్ నించి, 'పిల్లని ఎలాబుట్టలో వెయ్యాలో పిల్లనించే క్లాస్ తీసుకున్న బోయపాటి శ్రీను నించి, 'ఒకద్ని' తన్నడం కోసం కరాటే నేర్చుకున్న రామకృష్ణగారబ్బాయి సాయికిరణ్ నించి, 'సూపర్‌మాన్” కౌబాయి సైనిక విన్యాసాలు చేస్తూ గోతిలోకి హై(లో) జంప్ చేసిన శ్రీనివాసరెడ్డి నించి, (దైవర్‌తో చెప్పి “ఇద్దరు అల్లరికుర్రాళ్లని వరియానుంచి తరిమేయించిన రేష్మానుంచి, “పేమించిన పడతి (9) చేత తమ్ముడూ అని గొరుసు జగదీశ్వర రెడ్డి 4 9.
( పిలిపించుకుని, మరో ఎవర్‌గ్రీన్‌తో 'నీ కోతిచేష్టలు చూస్తూనే వున్నాలే' అని అనిపించుకుని, 80 నాటికలు 38 సస్పెన్నలతో జీవితాన్ని విజయపతాకలా మార్చుకున్న హరీష్ శంకర్ వరకూ... సంతోషం నిండిన మధురమైన హ్యాపీడేస్ మనముందు పరచుకున్నాయి... పూదోటలోని పూలలా.
ప్రతి ఒక్కరి జీవితమూ ఉత్సాహభరితమే. కథకుడిగా ఒక్కరి 'కథిని కూడా జగదీశ్వర్‌రెడ్డి చెప్పరు. ఎవరి జీవితాన్ని వారిచేతే చెప్పిస్తారు. జాగ్రత్తగా గమనిస్తే ఎవరికథ వారే చెప్పినట్టుగా, చెప్పుకున్నట్టుగా కనిపిస్తుంది కాని, అన్నీ వారి మాటల్లోనే పరకాయ ప్రవేశం చేసి, జగదీశ్వర్‌రెడ్డి రాసినవని మాత్రం పొరపాటున కూడా అనుకోలేము. గొరుసువారు చేసిన అతిగొప్ప మేజిక్ ఇదే.
ఒకరి మనసులో దూరి మాటల్ని బయటపెట్టొచ్చు. నలభై ముగ్గురి లబ్ధి ప్రతిష్టల మనసుల్లోకి దూరి, వారిలానే, అచ్చం వారిమాటల్నే తనమాటలుగా చేసుకోవడం ఎంత కష్టమో, ఎంత అనాధ్యమో మనకర్ధమవుతుంది.
కానీ అసాధ్యాన్ని అవలీలగా సుసాధ్యంగా మలచడమే జగదీశ్వర్‌రెడ్డిగారి ప్రత్యేకత.
ఈ హ్యాపీడేస్ కేవలం కలల ప్రపంచంకాదు. ఆ కలలని ఎలా సాకారం చేసుకోవాలో కూడా సూచనగా సూచించిన ఓ చక్కని మార్గదర్శి.
వీరంతా 'తామేమిటో, తమకేమి కావాలో” అని చిన్నవయసులోనే గ్రహించుకున్న యువత. ఆ [గగ్రహింపులేని నాడు “చరిత్రని ఎలా సృష్టిస్తారూ? స్పష్టత పూర్తిగా లేక/ రాకపోయినా, అవగాహన మాత్రం వారికి అంతర్గతంగా ఉన్నదనేది నిర్వివాదాంశం. లేకపోతే “పాటే నన్ను సెలిబ్రిటీ'ని చేసిందని 'స్పిరిటొగా యాక్ట్ చేసిన ఇండియన్ ఐడల్ మైనంపాటి శ్రీరామచంద్ర ఎలా అనగలడు! అసలు అంతచిన్న వయసులో “లీడర్ ఎలా కాగలడూ?
మరో పాయింట్ ఏమంటే, ఇవన్నీ డైరెక్టుగా వారి వారి నోట్లోంచి వచ్చిన మాటలు. ఎ కవిత్వమో, ఊహజనితమో కాదు. _
అందువల్లే యీ పుస్తకం చదివే ప్రతి యువతికీ, యువకుడికీ కూడా అద్భుతమైన స్ఫూర్తినిస్తుంది. “వాళ్ళు చేరారు... ఓ ఎత్తుకీ, ఓ సురక్షిత స్టానానికీ, నేను ఎందుకు చేరలేనూ?” అనే ఓ పట్టుదలని కూడా పాఠకుల్లో కలిగిస్తుంది పుస్తకం. ప్రతి 'రాత'కీ ఓ పర్పస్ అనేది వుండాలి. అప్పుడే అది “బుక్ ఆఫ్ ద అవర్” కాకుండా 'బుక్ ఆఫ్ ఆల్ టైమ్ అవుతుంది. అంతేగాదు. ఇది మనని ఆకర్షించే పుస్తకం. హ్యాపీ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాటి తీసి గుత్తలు + 10
నేను చిన్నప్పుడు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ వంటి సినీమహాకవుల పక్కనే చాకుపీస్‌తో నాపేరు రాసుకున్నట్టే, “యాక్టర్ల బొమ్మలకంటే కవులపేర్లే నన్ను ఎక్కువ ఆకర్షించేవి” అని చెప్పిన చి॥భాస్కరభట్ల చిన్నతనం, అల్లరితనం, సున్నితత్వం గురించి నాకు ఎలాతెలిసేదీ! అందరి జీవితాల్లోని “హ్యాపీ దేస్‌నీ హ్యాపీగా గుదిగుచ్చి మన ముందుకి తెచ్చిన ఘనత గొరుసు జగదిశ్వరరెడ్డిగారిది. ప్రతిజీవితమూ ఓ పాఠంలాగానే అనిపించింది నాకు. ఈ పుస్తకం చదివిన ఏ యువకుడూ, ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకో, 'నాకు దక్కలేదన్న దుగ్ధతో' అమ్మాయిలపై దౌర్జన్యానికో పాల్చ్పడడు. కారణం, వైఫల్యాన్ని కూడా “ఓ స్థిరచిత్తంతో తీసుకున్న మా “వనమాలి ఇందులో తన జీవిత పాఠాన్ని ణ చెప్పి మనని బుజ్జగిన్తాడు. అందుకే, స్నేహితులారా... ఈ పుస్తకం చదవడం ఓ మధురానుభవం. అసలిటువంటి పుస్తకం మనకి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన రావడమే గొరుసు వారి ప్రత్యేకతకి, ఆలోచనా పరిధికి నిదర్శనం. చి॥గొరుసు జగదీశ్వర్‌రెడ్డిగారు మరిన్ని విశిష్టమైన రచనలతో పాఠకులకు స్ఫూర్తి నివ్వాలనీ, వారి ప్రతి రచన ఓ ఆణిముత్యమై పాఠకుల హృదయాలలో కలకాలం నిలిచిపోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఫి శుభాకాంక్షలతో, నమస్సులతో భువనచంద్ర కన
త ( జాల ఎనీ | ల స. జ క ల జ. వ లో ర | డ్ పడు అ లి మా ఫైట్స్ అన్నీ రైల్వట్రాక్ పక్షనే యా య్ నటన కోసం ఏ ఫిలిం ఇనిస్టిట్వూట్‌లోనూ చేరకుందా జీవితం నేర్పిన శిక్షణతో నీనిమాల్లో వవేళించిన నటుడు ళివాజీ. పీరోయిజంలో కామెడీని కలివీ పండించడంలో దిట్ట. రొమాంటిక్ విలన్‌గా “ఒట్టేసి చెవుతున్నా అంటూనే “అమ్మాయి బాగుంది, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం” లాంటి నినిమాల్లో నటుడిగా తనేమిటో నిరూపించుకున్నారు. తోటి హీరోలతో కలిసి నందదే సందడి” అంటూ తెగ సందడి చేశారు. తాజ్‌మవహాలొని స్వయంగా కట్టి నిర్జాత అవతారం కూదా ఎత్తారు. నా కాలేజీ డేస్‌ని గుర్తు చేసుకోవడం అంటే నేను విహంగంలా మారిపోయి ఒకసారి మా నరసరావుపేటని చుట్టి రావడమన్నమాట! స్థానిక మునిసిపల్ స్కూల్లో పదో తరగతి ప్యాసవగానే ఇంటర్ చేద్దామని 'కొత్త రఘురామయ్య జూనియర్ కాలేజీలో చేరి ఆడుతూ పాడుతూ చదవడం, అడపా దడపా గొడవల్లో తలదూర్చడం, ఫైటింగ్స్ చేసుకోవడం, అప్పట్లో ఊర్లో ఉన్న పదమూడు సినిమా హాళ్లు సరిపోక ఉదయమె గుంటూరు వెళ్లి ఏకబిగిన అంటే మార్నింగ్ షో మొదలుకొని సెకండ్ షో దాకా వరసగా 4 సినిమాలు చూసేసి అర్ధరాత్రి దొనకొండ ప్యాసింజర్లో(దీన్ని దొంగలబడి అనేవాళ్లం) నరసరావుపేటకి తిరిగి రావటం... ఇలాంటి స్వీట్ మెమొరీలన్నీ నెమరు వేసుకోవడమే! హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 12
వ్ సై అంటే సై అనేవాణ్డి గాలి సుబ్బారావుగారు మా ప్రిన్స్‌పాల్‌గా ఉండేవారు. ఆయనెంత డైనమిక్ అంటే ఎవరైనా కాలేజీలో గొాడవపడుతుంటే, వాళ్ల దగ్గరకి సరాసరి వెళ్లిపోయి “ఏంట్రా గొడవా! సరే చూసుకుందాం రండి! ఏ సెంటర్‌కు రమ్మంటారో చెప్పండి” అని తొడగొట్టేవాడు. 'చౌదరి శీను” మా లీడర్. ఏ గొడవొచ్చినా తను ముందుండేవాడు. కాబట్టి అతని మనుషులమని చెప్పుకోడానికి తెగ ఉబలాట పదేవాళ్లం. శీను తరపు అని తెలిస్తే మిగతావాళ్లు మా జోలికి రావడానికి భయపదేవారు. శీనంటే అంత క్రేజ్ మాకు. అప్పట్లో వచ్చిన శివ" సినిమాలో మాదిరి ఉండేది మా హంగామా. ఒకసారి బస్తాపులో మా కజిన్‌ని ఒకడు ఏడిపిస్తుంటే శీను ఆధ్వర్యంలో వెళ్లి శుభ్రంగా ఉతికి ణా ఆరేశాం. అది మనసులో పెట్టుకుని నేను ఈశ్వర మహల్లో సినిమా చూస్తుండగా వచ్చి నన్ను కొట్టబోయారు. హాల్లో నాతో పాటు మావాళ్లు చాలామందే ఉన్నారని ఆ గ్రూపోకళ్లకి క్ తెలీదు. మళ్లీ పరిగెత్తించాం. ముఖ్యంగా మా ఫైటింగ్స్ అన్నీ రైల్వే ట్రాక్ పక్కనయ్యేవి. ట్రాక్‌కు అటూ ఇటూగా ఉన్న కంకర్రాళ్లే మా ఆయుధాలు. ఈ గొడవల్లో ఒకసారి మా గ్రూపులోని కట్టా శీను వీళ్లకి దొరికిపోయాడు పాపం! ఎన్ని సార్లు గొడవల్లో తలదూర్చినా పోలీసుస్టేషన్‌కు మాత్రం వెళ్లకుండా తప్పించుకునేవాణ్ణి. అప్పట్లో మా ఊరి ఎస్.ఐ. గా శరత్ అనే ఆయన సినిమాల్లో కన్నడ ప్రభాకర్‌లా డేగకళ్లతో తిరుగుతూ, గొడవల్ని పసిగట్టే ప్రయత్నంలో ఉందేవారు. మాలో మేం ఎంత దెబ్బలాడుకున్నా లెక్చరర్స్‌ని ఏడిపించేవాళ్లం కాదు. క్లాస్‌రూమ్‌ల్లో మాత్రం బుద్దిమంతుల్లా ఉండేవాళ్ళం. నరసరావుపేటలో ఉన్న మా కాలేజీతో పాటు శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ, రెడ్డి న కాలేజీల మధ్య గట్టి పోటీ ఉండేది. నేను చికెన్ స్పెషలిస్తును మొదట్లో మా బంధువులింట్లో ఉండేవాణ్ణి. తర్వాత విడిగా రూమ్ తీసుకుని (ఫెంద్స్‌తో ఉన్నాను. రమేష్ స్వాములు, బుల్లియ్యలు నా రూమ్మెట్స్. (బావిలో బుంగలు పడిపోతే నీరు ఎంత లోతుగా ఉన్నా సరే దూకేసి తీసేవోడు కాబట్టి వాడ్ని 'బుంగల థి బుల్లియ్య'” అని పిలిచేవాళ్లం). ముఖ్యంగా ఉదయం లేవగానే రసూల్ టీ కొట్లో రెండు సాల్ట్ బిస్కట్లతో పాటు టీ తాగేవాళ్లం. ఇప్పటికీ ఊరెళ్తే అక్కడ టీ తాగడమే అలవాటు నాకు. అంత రుచి మరెక్కడా రాలేదు నాకు. తర్వాత కోమల్ విలాస్‌లో 2 ఇడ్లీ, (బకెట్ సాంబారు లాగించడంతో దినచర్య మొదలయ్యిది. నేను వంట కూడా బాగా చేసేవాడ్ని ముఖ్యంగా టమోటా, చికెన్ కర్రీలంటే మహా ప్రితి నాకు. నేను చికెన్ వండితే అదరాల్సిందే.
శ్వ మిడతగుద్లమ్మాయి చెప్పు తెగుద్దన్నది . సరదాగా అప్పుడప్పుడు అమ్మాయిల్ని ఏడిపించేవాణ్ని. అదేదో ఒక 'పాలెం' నుండి ఒకమ్మాయి వచ్చిది (నరసరావుపేట చుట్టూ చాలా పొలాలు ఉన్నాయి). అచ్చు మందాకినిలా ఉండేది. లింగంగుంట్ల కాలనీ నుండి వచ్చే మరో అమ్మాయి భానుప్రియలా కన్పించేది. ఆ పిల్ల కళ్లు మిడతగుడ్లలా భలే ఉండేవి. సినిమా కెళ్లామా అంటే “చెప్పు తెగుద్దని' బదులిచ్చేది. ఇంటర్ చదివే టైంలోనే ప్రకాశ్‌నగర్‌లో నడింపల్లి అప్పారావుగారని ఉండేవారు. వారింట్లో చాలా చెట్లుండేవి. అరటి గెలలైతే రోడ్దు వైపు వేలాడుతూ కన్పించేవి. గుట్టుగా వెళ్లి వాటిని లటుక్కున కోసుకొచ్చెసేవాట్డి. నా స్నేహితుల్లో ముఖ్యులు మీరా, శ్రీధర్, శ్రీనివాస్ (ఇప్పుడు లేడు). ఇంటర్‌కీ డిగ్రీకీ మధ్య కాలంలో.... ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే మా నాన్నకి నన్ను బాగా చదివించాలని కోరిక. అప్పట్లో మా పెద్దమ్మ కొడుకు ధూళిపాళ కోటేశ్వర్రావు లెక్పరర్‌గా పనిచేసేవాడు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను అలాంటి ఉద్యోగంలో ఊహించుకునేవాడు నాన్న అయితే అన్నిట్లో మార్కులు బాగొచ్చినా జువాలజీ తన్నేసింది. ఇక చదువుకి స్వస్తి పలికి ఏదైనా జాబ్ చేయాలనుకున్నా అప్పట్లో మా తమ్ముడు ఏదైనా వ్యాపారం చేయాలని తెగ ముచ్చట పడేవాడు. సరసరావుపేట పక్కనే ఉండే గొరిజవోలు గ్రామం మాది. వ్యవనాయ కుటుంబం కాబట్టీ చిన్నప్పట్నుంచి పొలం పనులు అలవాటే. పైరుకి మందు కొట్టడం దగ్గర్నుంచి, కావిళ్లతో నీళ్లు మోయడం దాకా అన్ని పనులు వచ్చు నాకు. ముఖ్యంగా మా అమ్మ పని చేస్తుంటే తట్టుకోలేకపోయేవాణ్ని. ఏదో రకంగా ఆమెకు సహాయం చేయాలనిపించేది. ఉత్తి అమాయకురాలు. పేరు మాత్రం రూన్సీలక్ష్మి. ఎవరమ్మా నీకు ఆ పేరు పెట్టిందని అదిగితే నవ్వి ఊరుకునేది. అలాంటి అమాయకురాల్ని తీసుకుని హైద్రాబాద్ వచ్చేశాను. మా కజిన్ ఒకావిడ మౌలాలీలో ఉండేది. అక్కడే తమ్ముడితో కలిసి డైరీఫాం ఒకటి పెట్టాను. మాకు వ్యాపారం కొత్త పిండిన పాలని ఎలా అమ్మాలో తెలిసేది కాదు. వాలని ఎదురుగా పెట్టుకుని ఎవరొచ్చి కొంటారా అని చెంపకు చెయ్యానించి ఎదురుచూస్తూ కూచునేది అమ్మ. రోజూ కన్పించే ఆ సన్నివేశం నాలో ఏదో అలజడిని రేపేది. దీనంగా ఉండే అమ్మని చూసినప్పుడల్లా ఏదో చేయాలి. ఏదో చేసి సంసారాన్ని గట్టెక్కించాలి అనే కసి పెరిగిపోతుండేది నాలో. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో హ్యావ్ డేస్ = సన్ ప్రముఖుల బిన్ననాట్ తీస్ గర్తుఐ + 14
గ్ మా తాతయ్య విశ్వేశ్వర్రావు (అమ్మకు మేనమామ వరస) వచ్చి, నన్ను ఇంటర్మీడియట్ పూర్తి చేయమని, తర్వాత డిగ్రీలో చేరమని సలహా ఇచ్చారు. చివరకు గేదెల వ్యాపారానికి చమగీతం పాడి తిరిగి నరసరావుపేట వెళ్లిపోయాం. మళ్లీ కొనసాగిన చదువు బుద్దిగా చదివి ఇంటర్మీడియట్ గట్టెక్కి ఎన్.టి.ఆర్. డిగ్రీ కాలేజీలో (బి.ఏ. పొలిటికల్ సైన్స్) చేరిపోయా. చిన్నప్పట్నించే న్యూస్ పేపర్ ఏదో పైపైన అలా చూడకుండా ప్రతి పేజీని క్షుణ్ణంగా చదవటం అలవాటు. దాంతో కొంత జనరల్ న నాలెడ్జ్ ఆకళింపు చేసుకునేవాణ్ణి. నాలో తలెత్తే సందేహాలు తీర్చుకోవడం కోసం లెక్చరర్స్‌ని ప్రశ్నలతో నిలదీసేవాణ్తి. అది తట్టుకోలేక నన్ను ఎక్కడైనా ఇరికించి స్పాట్ పెట్టాలని నా చూసేవారు కాని దొరికేవాణ్సి కాదు. కాలేజీలో, ఏటా వార్షికోత్సవాలు నిర్వహించాల్సిందేనని గట్టీ పట్టు పట్టేవాణ్డి. ఆ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుందేవాణ్ణి కూడదా. పరుచూరి గోపాలకృష్ణగారు రాసిన ఈ చరిత్ర ఎర్ర సిరాతో నాటికలో రిక్షావాది పాత్రని వేశాను. కాలేజీ డేస్‌లో అన్నీ సరదాగా చేయాలనే ఉబలాటం తప్పించి తర్వాత జీవితంలో సినిమానటుడ్ని కావాలనే తపన నాలో ఏ కోశానా ఉండేదికాదు. క్రికెట్‌లో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది నాకు. పేస్ బౌలింగ్‌లో నాది అందెవేసిన చెయ్యి (తర్వాత కాలంలో అజారుద్దీన్‌గారి చేతుల మీదుగా ఒకసారి మ్యాన్ ఆఫ్‌ది మాచ్ కూడా తీసుకున్నాను.) డిగ్రీ చివర్లో నా బలవంతంపైనే అందర్నీ కూడగట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్స్‌కర్షన్ తీసుకెళ్లాను. అక్కడికి నటులు మోహన్‌బాబుగారు ఫ్యామిలీతో ఎర్ర కారులో రావడం బాగా గుర్తుంది. మా విద్యార్థులమంతా ఆయనో ఆటోగ్రాఫ్ తీసుకుని ఫోటోలు దిగాం. ఆ ఎక్స్‌కర్షన్ టైంలోనే మా (ఫెంద్స్ కొన్ని స్టిల్స్ తీశారు నన్ను. ఆ ఫోటోలు చూసినప్పుడు మాథత్రం అనిపించింది '“బాగున్నానే! సినిమాల్లో హీరోగా పనికొస్తానేమో'నని. ఉద్యోగం సంపాదించుకోవాలనే పట్టుదలతో పొట్ట చేతబట్టుకొని హైద్రాబాద్‌కి వచ్చేశాను. తర్వాత జి.వి. సుబ్బయ్యగారి వల్ల చిత్రరంగంలోకి ప్రవేశించడం అనుకోకుండా జరిగిపోయింది. ఏదేమైనా వెన్నలా కరిగిపోయిన కాలేజీ రోజుల్ని ఎప్పుడు తిరగదోడుకున్నా మనసుకు హాయిగా అనిపిస్తుంది. (26.2.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
శ ఫీ. లో | లక న ల న్‌ా ప. న్న వీరభద్రమ్ ముగ్గురమ్మాయిలు... ఒకటీ ప్రేమ కాదు
అల్లరి నరేశ్ 'అవా నా పెళ్ళంట” కు కథ, న్మీన్‌ప్లేతో పాటు దర్శకత్వం
వపొంచి అందరి దృష్టిలో పద్దారు వీరభ్యదమ్ నునీల్ 'పూలరంగదు'తో
చిత్ర పరిిశమలో తన స్థానం నుస్థిరం చేసుకున్నారు. అనీస్టెంట్
దైరెక్సరుగా “అకుడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయితో (ప్రారంభించి
ఇవివి, తేజు, లో వంళీ జయంత్ కరుణాకరణ్ లాంటి వలు దర్భకుల
వద్ద పని చేశారు. నాగార్జునలో భాయ్” లాంటి మరికొన్ని నినిమాలకు
దర్భకత్వం వపొంచారు.
నిడదవోలు (పగోజి) కి ఏడు కి.మీ. దూరంలో ఉన్న 'కలవలపల్లి మా
ఊరు. ఏడో తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత 'ఊనగట్లులో టెన్స్ పూర్తి చేసి, ఇంటర్మీడియట్‌కి నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాను. సినిమాలంటే మొదట్నించి తెగ పిచ్చి. నచ్చిన సినిమా వచ్చిందంటే కాలేజీ ఎగ్గొట్టి వెళ్లేవాడిని. అలాగని ఇంట్లో పనులు వదిలేవాణ్తి కాదు. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో మామిడి, జీడిమామిడి తోటలుండేవి. కావలి ఉండడం దగ్గర్నుంచి కాయలు తెంపడం, లారీల్లో లోడ్ చేయించేదాకా అన్ని పనులు దగ్గురుండి చే సేవాణ్డి. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 16
కాలేజీకి సైకిల్ పై వెళ్ళేవాణ్సి. అది నిక్కర్లకి వీడ్కోలు పలికి ప్యాంటుల్లో
- దూరబోతున్న నూనూగు మీసాల వయసు. వాచకంలో లేతదనం తగ్గుతూ స్వరం గొ బొంగురుగా మారుతున్న కౌమార దశ. శరీరంలో వస్తున్న మార్పులకు ఒకవైపు బిడియం మరోవైపు గర్వంగా ఉండేది. అప్పట్లో నాది బాగా ఉంగరాలు తిరిగిన జుత్తు - దువ్వినా దువ్వకపోయినా ఒకేలా కన్చించేవాణ్ణి. చిన్నతనం నుండి నాది లీడర్ స్వభావం. పైగా దుడుకుతనం ఎక్కువ. గొడవల్లో ముందుండేవాణ్జ్ణి అయితే మేం ముగ్గురు అన్నదమ్ములం (నేను రెండోవాణ్సి) కలిసికట్టుగా ఉండేవాళ్ళం కాబట్టి మా జోలికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు. ఆత్మావలోకనం చేసుకున్న గడియలు ఇంటర్‌లో నాది ఎం.పి.సి. గ్రూప్. టెన్త్ ఫస్ట్ క్లాసులో ప్యాసయిన నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మార్చ్, ఫిజిక్స్‌లో తప్పేను. నాతో పాటు చదువుకునే మా ఊరమ్మాయి గంగాభవాని ఫస్ట్ క్లాస్‌లో ప్యాసవడంతో కాస్త గిల్టీగా కూడా అనిపించింది. పైగా ఒకరోజు భవాని నాన్నగారు మానాన్నతో “చిన్నతనం నుండి మా అమ్మాయితో పోటీగా చదివేవాడు కదా. ఇలా తప్పడం ఏం బాగాలేదు. కాస్త మందలించిమని చెప్పడం క నాకు అవమానంగా అనిపించింది. అప్పుడు మాత్రం లోపం ఎక్కడుందని ఆత్మావలోకనం చేసుకున్నా తర్వాత ఆ రెండు సబ్జెక్టులు పూర్తి చేసి ఇంటర్ ఫస్ట్‌క్లాసుతో ప్యాసై నేనేమిటో నిరూపించుకుని, నిడదవోలులోనే వి.ఆర్.కె. (వెలగపూడి రామకృష్ణ) డిగ్రీ కాలేజీలో చేరాను. డిబార్ దాకా వెళ్లాను డిగ్రీ మూడేళ్లూ మేం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా శ్రీనివాస్ అని మా క్లోజ్ (ఫెండు ఒకడు వేరే కాలేజీలో ఖీ ఇంటర్ చదివేవాడు. ఒకరోజు వాడు కాలేజీకి రాలేదని తెలిసి వాడి తరపున 'ఢ్రైజెంట్ పలికాను. అంతే ! లెక్చరర్ నన్ను గుర్తుపట్టెసి, వెంటనే ప్యూనుకు చెప్పి ప్రిన్స్‌పాల్‌ని రప్పించి నన్ను పట్టించాడు. ఇంకేముంది? ఆయనగారు మా కాలేజీ ప్రిన్స్‌పాల్‌కి ఫోన్ చేసినా నిర్వాకం గురించి చెప్పడంతో కథ మొదలయ్యింది. మా ప్రిన్స్‌వాల్ ఆగమేఘాలపై నన్ను డిబార్ చేస్తున్నట్లు ప్రకటించి, మా నాన్నని ఉన్నపళంగా తీసుకురమ్మని ఆర్దర్ జారీ చేశారు. నాన్నతో ఈ విషయం చెప్పడానికి సిగ్గేసి, మా ఫ్యామిలీకి బాగా తెలిసిన ఎరువుల ఫ్యాక్టరీ యజమాని గూదడవాటి వెంకట్రామయ్యగార్ని తీసుకెళ్లా. “అదేం కుదరదు, వీడు రెక్లిస్‌గా జవాబిస్తున్నాడు, వీళ్ల నాన్న రావలిసిందే అని తెగేసి చెప్పేడు ప్రిన్స్‌పాల్,
కళ్లలో నీళ్లు తిరిగాయి నాకు. ఏడవడం ఒక్కటే తక్కువ. చివరికి నాన్నతో పెద్ద లెటర్ రాయించుకుని తీసుకెళ్లా నన్ను తిరిగి క్లాసులోకి తీసుకున్నారుగాని, అప్పట్నించి నాపైన ఓ కన్నెసి ఉంచారు. కాలేజీలో నా తొలి ఫైట్
డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా కాలేజీ ఎలక్షన్స్ వచ్చాయి. మా కాలేజీలో లోకల్స్ తక్కువగా, బెటర్స్ అంటే చుట్టుపక్కల పల్లెల్నుండి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేవారు. నేను బెటర్‌ను. లోకల్ స్టూడెంట్స్ మా మీద అజమాయిషీ చేయడానికి తెగ ప్రయత్నించే వారు. మేం కావాలనే బెటర్ స్తూడెంట్ ఎల్. ఎస్.ఆర్ మోహన్‌ని జాయింట్ సెక్రటరీగా నిలబెట్టాం ఆ ఏడాది. వాళ్లు ఓట్లు లోకల్స్‌కే వేయాలని బెదిరిస్తుంటే ఒకరోజు నాగు అనేవాడిని నా జీవితంలో మొదటిసారి కొట్టా. నాగు (ఫైండ్ ప్రసాద్ ఇద్దరూ కలిసి తర్వాత నన్ను కొట్టారు. ఈ విషయం తెలిసి మా ఊరి కుర్రాళ్లంతా ట్రాక్టర్లో వచ్చి వాళ్ళని శుభ్రంగా చితక్కొట్టేశారు. దాంతో కాలేజీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తర్వాత సద్దుమణిగిందనుకోండి! ఆ దెబ్బతో మేం నిలబెట్టిన అభ్యర్థి గెలిచాడు. ( అది ప్రేమ కాదు ఒక “క్రష్
ఒకమ్మాయి రైల్వే కాలనీ నుండి వచ్చిది. తను డిగ్రీ ఫైనలియర్. ఆశ్చర్యమేమంటే వయసులో నాకంటే రెండుమూదేళ్లు పెద్దదైనా నన్ను బాగా ఇష్టపడేది. ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళం. ఇద్దరం అప్పాజీగారి దగ్గర (పైవేట్‌కి వెళ్లేవాళ్లం. ఆమెపై నాకు చాలా ఇష్టం ఉండేది. కాని అది (ప్రేమని చెప్పలేను. ఏదో “క్రష్ అంతే! తన డిగ్రీ అవగానే పెళ్లిచూపులు జరిగాయట. అదే విషయం నన్ను కలిసి చెప్పింది. ఇంకేంటి ఎంచక్కా పెళ్లి చేసుకో అని పెద్ద మనిషిలా సలహా ఇచ్చాను. అప్పుడు తను చూసిన చూపులు ఇంకా గుర్తున్నాయి నాకు. (కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా ఒకరోజు బేగంపేట విమానాశయంలో భర్తతో కనిపించింది. వెంటనే గుర్తుపట్టెశా. మరి వెంటాడే చూపులు కదా! వాళ్ళాయన్ని పరిచయం చేసింది. అప్పటికే తనకి ఇద్దరు పిల్లలు కూడా) ఆ పిల్ల సైకిల్లో గాలి తీసేవాజ్లి
గమ్మత్తేమంటే నన్ను ఇష్టపడే అమ్మాయి తనైతే నేను డిగ్రీ సెకండియర్‌లో ఉండగా “శ్రీదేవి అనే అమ్మాయిని బాగా ఇష్టపదేవాణ్ణి. తను గాంధీనగర్ నుండి వచ్చేది. నేనెంత వెంటపడ్డా నన్ను అస్సలు లక్ష్యపెట్టేది కాదు. కసికొద్దీ సరిగా ఇంటికి వెళ్లే సమయం చూసుకుని ఆ పిల్ల సైకిల్లోంచి గాలి తీసేసేవాణ్సి. రోజూ ఇదే పని. హ్యావ్ డెస్ = సిస్ ప్రముఖల విన్ననాబి తీస్ గుర్తులు + 18
'గాలి తీసే ఇడియట్ ఎవడో” అని వినబడేలా అరిచేది. చివరికి ఒకరోజు గాలి తీస్తుండగా దొరికిపోయాను. నానా గోల చేసి, మా వైవేట్ మాస్టారు అప్పాజీగార్మి చెప్పి నన్ను తిట్టించింది. ఆమె బాయ్ (ఫెండ్ ఒకడుండేవాడు. (కాలేజీవాడు కాదు) అతనితో నాకు వార్నింగ్ కూడా ఇప్పించింది. చివరికి ఆ బాయ్ ఫెండునే పెళ్ళాడిందనుకోండి! ఈ జంట నేనోసారి అమెరికా వెళ్లినప్పుడు 'మేరీలాంద్'లో ఎదురై పలకరించడం మరో కొసమెరుపు.
మరోసారి ఇంకో అమ్మాయి హఠాత్తుగా తప్పిపోవడంతో వాళ్లింట్లో వాళ్లు మా గ్యాంగ్‌పై కంప్లెంట్ ఇచ్చారు. పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది. తీరా తెలిసిందేంటంటే ఆ అమ్మాయి మరో అబ్బాయితో (మా కాలెజీ అబ్బాయికాదు) వెళ్లిపోయిందని తెలిసింది.
కాలేజీ లెక్సరర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లం. ఒక లేడీ లెక్చరర్ మాత్రం కాలేజీ అవగానే ఉద్యోగంలో చేరింది కాబోలు, స్టూడెంట్‌లా ఉండేది మా కళ్లకి. ముద్దుగా కన్పించేది. కాబట్టి ముద్దు లక్ష్మి అని పిలుచుకునేవాళ్ళం. అంతే తప్ప ఇంకేం పిచ్చి వేషాలేయలేదు. లెక్సర్లందరికీ వినాయకచవితి పండగొస్తే ప్రత్యేకంగా పత్రి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళం. వెంటాడే వ్యధలూ ఉన్నాయి
మా కోతి బ్యాచ్‌లో దాదాపు క్రికెట్ టీమ్ మాదిరి పదకొండుమంది ఉండేవారు. మెం ఒక దగ్గర కలిశామంటే దిక్కులు పిక్కటిల్లాల్సిందే. కాలేజీ దగ్గర్లో ఉందే చెరుకుతోటల్లో, మామిడితోపుల్లో చొరబడి దొంగిలించిన గడల్ని కాయల్ని అమ్మాయిలకు ఇవ్వడం ఒక సరదా. ఒకసారి ఆ సరదాతో మామిడిచెట్టుపై నుండి పడి, తృటిలో ఎముకలు విరక్కుండా బయటపడ్డాను.
క కార్తీకమాసం వచ్చిందంటే మాతోపాటు మిగతా కొందరు స్తూదెంట్స్‌ని తీసుకుని పట్టిసీమకు స్టీమర్లో వెళ్ళేవాళ్ళం. వీళ్లలో సగం మంది విద్యార్ధినులు కూడా ఉండేవారు. మా అందరిలో స్నేహభావం తప్పించి మరో రకమైన భావన ఉండేది కాదు. పట్టిసీమ శివాలయంలో వీరభద్రస్వామిని దర్శించుకుని తిరిగొచ్చెవాళ్ళం. నేను ఫైనల్‌లో ఉండగా పట్టిసీమ దగ్గర ఒక దుర్హటన జరిగింది. అనుకోకుండా ఇద్దరు మిత్రులు నీళ్లలో మునిగిపోవడం నన్ను జీవితాంతం వెంటాడే విషాద సన్నివేశం. ఈ సంఘటన ఎప్పుడు గుర్తుకొచ్చినా మనసంతా వికలమైపోతుంది.
షూటింగ్స్ తెగ చూసేవాణ్ణి
ఊర్లో వినాయకచవితి సందర్భంగా తెరలు కట్టి సినిమాలు ప్రదర్శించేవారు. అలా మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు ఎన్నిసార్లు చూశానో, ఆ సినిమాల్లోని ప్రతి సన్నివేశం నాకు కంఠతా. పైగా ఎన్.టి.ఆర్. గారి అభిమానిని. మా వీధిలో వాళ్ళు ఎన్‌టిఆర్‌గారి సినిమాలు ప్రదర్శిస్తే, పక్కవీధిలోని వాళ్లు పోటీగా ఏఎన్‌ఆర్‌గారి సినిమాలు వేసేవారు. నేను సవ్యసాచిలా రెండు వీధుల్లోని సినిమాల్నీ చూ సేవాణ్డి.
ఇక కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ చాలా జరిగేవి. ॥ షూటింగ్ అని తెలియగానే కాలేజీ బంక్ కొట్టి పరిగెత్తేవాణ్ణి. నేను చూసినవాటిలో ఇవివిగారి సీతారత్నంగారబ్బాయి' “ఏమండీ ఆవిడొచ్చింది” వంశీగారి 'కనకమాలక్ష్మి రికార్దింగ్ డాన్స్‌ట్రూప్” లాంటివి బాగా గుర్తున్నాయి. దర్శకత్వంలో వాళ్లు చూపే మెళకువల్ని బాగా గమనించేవాణ్లి. అప్పుడనిపించేది... జీవితంలో ఎలాగైనా సినీ ఫీల్టులో స్థిరపడి డైరెక్టర్‌ని అవ్వాలని, ఆ కోరిక క్రమేపీ ఎంతగా బలపడిందంటే చివరికి నన్ను ఈ ఫీలుకి లాక్కుని వచ్చేదాకా.
డిగ్రీ అవగానే తణుకులోని ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. కాని నా ఇ మనసంతా సినిమారంగం పైనే ఉందేది. డైరెక్టర్ కావాలనే తృష్ణ నిలువెల్లా ఉండటంతో చివరికి నా ఫెండ్స్ కొందరు ఎం.సి.ఏ. కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తుంటే వాళ్ళతో పాటు నేనుకూడా కోచింగ్ తీసుకుంటానని అబద్ధం చెప్పి వచ్చేశాను. కోచింగ్‌ని గాలి కొదిలేసి ప్రముఖ దర్శకులను వెళ్లి కలుస్తుందేవాణ్లి. నా కోరిక ఫలించి చివరికి ఇవివిగారి దగ్గర “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" (పవన్‌కళ్యాణ్ గారి తొలిసినిమా) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపోయా. ఆ క్రమంలో పలు దర్శకుల వద్ద పనిచేసి చివరికి డైరెక్టరుగా నాకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాను.
ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అక్కడి మనుషుల్లో అంతర్లీనంగా దాగిన వెటకారం, నరనరాల్లో జీర్దించుకుపోయిన హాస్యరసం, గోదావరి గాలి, నీరు... నిత్యం సంతోషంగా ఉంచి, ఏదైనా సాధించేందుకు దోహదపడతాయి. బహుశా ఇవే నా (మా) విజయాలకు మూలకారణమేమో.
(43.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 20
ను పట ఆ] 1 భణాాకాలు నాలి ఇనా ్రేసీ ఆ న్ టొ ల తం ఇంద్రగంటి మోహనకృష్ణ క్హ్హ్‌్ల్యో డ్రామాలు, ప్రిష్టలతోనె గడిచింది సావాతీ వారనత్వం వుణీకివుచ్చుకుని, చి(త వరి[ళమలో అంచలంచెలుగా ఎదిగిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. చలం 'దోషగుణం” కథను (గ్రవాణం?గా తెరతిక్పుంచి ఒకేసారి (ప్రాంతీయ, జాలీయ ప్రభుత్వాల నుండి “ఉత్తమ తొలిచ్యిత దర్భకుడు'గా ఫురస్కారాలు అందుకున్నారు. తర్వాత రసవత్తరంగా “అవ్వాచమ్మా” ఆదించి అందరి తలలో నాలుకయ్వారు. ఆ వరనలో మాయాబజార్, గోల్తొంద హైన్సూల్ అంతకుముందు-ఆ తర్వాత, జెంటిల్‌మేన్స్ అమీ -తుమీ, సనమ్మోవానం వంటి నీనిమాలకు దర్శకత్వం వపొంచారు. ఇంటర్మీడియట్ నుండి ఫిలిం మేకింగ్‌లో డిగ్రీ పుచ్చుకునేదాకా దాదాపు పుష్నర కాలం వరకూ నాది స్తూడెంట్ లైఫే! అయితే నా కాలేజీ డేస్‌లో గ్రూపులు కట్టడాలూ, అమ్మాయిలను ఆట పట్టించడాలూ, లెక్చరర్స్‌కి నిక్ నేమ్స్ పెట్టడాలూ, సైకిల్ చెయిన్లతో బాహాబాహీ పోరాటాలూ, భుజాలూ తొడలూ చరుస్తూ మీసాలు మెలేయడాలూ గట్రా లేవు. ఎంతసేపూ చదవడం, డిబేటింగ్స్‌లో వాల్గొనటం, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు చూడటం, స్కి్స్ రాసుకోవడం, చిన్న చిన్న ఎపినోద్స్ తీయడం, ఎప్పుడైనా నాటికలు వేయడం.... అభిరుచి గల అతి కొద్ది మంది మిత్రులతో నా భావాలు పంచుకోవడం... ఇవే నా 'హ్యాపీదేస్”. గొరుసు జగదీశ్వర రెడ్డి శ 21
“పెద్దిభొట్లి వారు తెలుగు చెప్పేవారు విజయవాడ '“శ్రీఅమరవాణి నికేతన్” హైస్కూల్లో టెన్స్ పూర్తయ్యాక అక్కడే పి.బి. సిద్దార్ధ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరాను. అప్పట్లో ఆడపిల్లయితే డాక్టర్, మగపిల్లాడయితే ఇంజనీరింగ్ చదవాలనేవారు. బహుశా ఈ నానుడికి జడిసే నాకంతగా ఇష్టం లేకపోయినా ఎం.ఇసి. చదివి, సెకండ్ క్లాసులో ప్యాసై నెమ్మదిగా బి.ఏ. ఇంగ్లిష్ లిటరేచర్ చదవడానికి ఆంధ్రా లయోలా కాలేజీలో చేరిపోయా. బి.ఏ.లో పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు మాకు తెలుగు చెప్పేవారు. రాజశేఖర చరిత్ర, నిగమశర్మ అక్క కన్యాశుల్కం లాంటి సాహిత్య కథనాలు ఎంతో ఆసక్తిగా వివరించేవారు ఆయన. కమల్ పుజారా, రఘు, చిరంజీవి, సూర్య లాంటి మంచిమిత్రులు ఉండేవారు. అందరం కలిసి తరచూ డిబేట్‌లలో పాల్గొనేవాళ్ళం. ఇతర కాలేజీల్లో పాల్గొని ఫైజులు కూడా తీసుకొచ్చేవాళ్ళం. ఒకసారి అమలాపురం 'బానోజీ రామర్స్ కాలేజీలో డిబేటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు స్థానిక విద్యార్థులకూ మాకూ మధ్య చిన్న గొడవ వచ్చి చిలికి చిలికి గాలివానైంది. దాన్ని ఎంతో సమయస్ఫూర్తితో పరిష్కరించి చివరికి వాళ్లంతా తమ ఇళ్లకి మమ్మల్ని భోజనాలకు విలిచేంత (ప్రేమని సంపాదించగలిగాం. అప్పుడే మా నాన్నగారు రాసిన 'నగరానికి దూరంగా అనే పాట పాడి వాళ్లను ఇంట్రెస్ చేసిన గుర్తు. సెంట్రల్ యూనివర్శిటీలో చేరిక ఒకసారి మా కాలేజీలో జరిగిన డిబేటింగ్‌లో పాల్గొనడానికి మేరిస్టైల్లా కాలేజీ నుండి ఉమ, వేగుంట మోహనప్రసాద్‌గారి అమ్మాయి మమత వచ్చి ఫస్ట్ (ఫ్రైజ్ కొట్టుకుపోయారు. (ఉమతో ఆనాటి పరిచయం అంచెలంచెలుగా పెరిగి నా సహచరి అయ్యిందనుకోండి). ( బి.ఏ. చదువుతున్న కాలంలోనే హోటల్ మమతా, నవరంగ్ థియేటర్లలో వేసే ఫిలిం క్లబ్ సినిమాలు తెగ చూసేవాడిని. వాటిని చూస్తున్నంతసేపు అంతర్లీనంగా ఏదో అలజడి. ఆ డైరక్టర్లని అంచనా వేస్తూ వారు అనుకున్నది ఏ రూపంగా ప్రేక్షకులకు అందిస్తున్నారో అధ్యయనం చేసేవాడిని. ఆ రోజుల్లోనే అయితే జర్నలిస్టుగా, లేదంటే డైరెక్టరుగా జీవితంలో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చేశాను. బహుశా ఆ కోరికే తర్వాత ఎం.ఏ. కోసం సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ రాయడానికీ, హైద్రాబాద్ వచ్చేయడానికీ దోహద పడిందేమో! హ్యాట్ డేస్ = సన్ ప్రముఖం చిన్ననాటి తీస్ స్త ౪ 22
తొలి “డాక్యు ద్రామా”
యూనివర్శిటీలో ఉండగా సినిమా ఎలా తీయాలి? అనేదొక్కటే నా బుర్రలో గింగుర్లు తిరిగేది. అప్పటికి ఫిలింమెకింగ్ గురించి ఓనమాలు తెలియవు. ఎంత పెద్ద
ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది కదా! ఒక 'డాక్యు డ్రామా" తీసి చూద్దాం అనుకుని యూనివర్శిటీకి వచ్చిన ఒక కుర్రాడి ఆలోచనలు, అతన్ని వెంటాడే జ్ఞాపకాలు నేపథ్యంలో 15 నిమిషాల సస్కిఫ్ట్ రాసుకున్నా. అప్పటికే యూనివర్శిటీలో శ్రీవిద్య, నైజిల్ అనే మంచి మిత్రులను సంపాదించా. వాళ్లు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం నన్ను అబ్బురపరిచేది. వాళ్ల (ప్రేరణతో అడుగులు వేస్తుందేవాడిని. నా ఎపిసోడ్‌లో శ్రీవిద్య, నైజిల్ నటించారు. కెమెరా కోసం బెజవాడ మిత్రుడు హరిని పిలిపించాను. సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ ఆకృతుల్లో రాళ్లు ఉండేవి. కొన్ని డైనోసర్స్‌లా కన్పించేవి. వాటిని చూసినప్పుడు జురాసిక్ పార్కులోని మ్యూజిక్‌ని వాడుకున్నాను. మొత్తం మీద 'డౌన్ మెమరిలేన్” (జ్ఞాపకాల దారిలో) అని పేరు పెట్టి ప్రదర్శించాం. మా స్టూడెంట్స్ అందరూ ఆహాం అని భుజం తట్టి ళ ప్రోత్సహించారు.
“అష్టాచమ్మా” కి బీజం పడింది అప్పుడే
నాటకాలు, నవలలు ఎప్పుడు చదివినా వాటికి దృశ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించేవాదిని. షేక్స్‌పియర్ “జూలియస్ సీజర్, 'వోమెట్, 'మర్చెంట్ ఆఫ్ వెనిస్ లాంటివి చదివిన వెంటనే విధిగా వాటి సినిమాలు వెదికి చూసేవాడిని. ముఖ్యంగా ఆస్మార్‌వైల్డ్ 'ది ఇంవార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ నాటకం నా మనసులో నిలిచిపోయింది (దీని స్ఫూర్తితోనే తర్వాత “అవ్వాచమ్మా' తెరకక్కించాను.
“'డాక్యుద్రామా విజయం తర్వాత సోఫోక్షిస్ 'యాంటిగని” అనే గ్రీకు నాటకానికి స్కిప్ట్ తయారుచేసి స్టేజి నాటకం వేయాలనుకున్నాను. అందులో సైనికుడి పాత్ర నాది (చిన్నతనంలో ముళ్లపూడి “బుడుగు, శ్రీరమణ 'గ్లాసు పగిలింది నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది లెండి). 'యాంటిగనిగా శ్రీవిద్య నటించింది. ఉమది కూదా ఒక పాత్ర (అప్పటికే తనూ సెంట్రల్ యూనివర్శిటీలో చేరింది.) అచ్చంగా గ్రీకు ఆహార్యంతో ఆనాటి నేటివిటీని ప్రతిబింబించేలా తయారుచేశాను. రూ.5/- టికెట్ పెట్టి, పలానా టెంలో ఆ నాటకం వేస్తున్నామని చేతో రాసి తరగతుల్లో, కాంటీన్ గోడలపైనా అతికించాం. మా కాంటీన్ ముందున్న కానుగచెట్టు చప్పాపై గంటపాటు వేసిన ఈ నాటకాన్ని స్టూడెంట్స్ ఎగబడి చూశారు.
సెంట్రల్ యూనివర్శిటీలో చదవడం అన్నమాటే గానీ తరచూ ఉమతో కలిసి సినిమాహాళ్లకు, రవీంద్రభారతిలో నాటకాలకీ, డాన్స్ ప్రోగ్రామ్స్‌కీ తిరిగేవాణ్ణి. ముఖ్యంగా - గొరుసు జగదీశ్వర రెడ్డి + 23
సికింద్రాబాద్‌లోని సంగీత్, బషీర్‌బాగ్‌లోని స్పైలైన్, స్టెక్షిన్ థీియేటర్లే మా అడ్డ. వీటిల్లో ఇంగ్లీష్ సినిమాలు తెగ చూసేవాళ్ళం. మాతోపాటు శ్రీవిద్య, నైజిల్‌లు సరేసరి... ఇంకా రేఖ, అనిత, శ్రీలతలు ఉండేవారు. నన్ను ప్రోత్సహించిన ప్రాఫెసర్లలో తేజస్విని నిరంజన్, సంజయ్ పాలిషీకర్, సతీష్ దేశ్‌పాండే, విశ్వనాథ్‌న్‌లు ముఖ్యులు. అద్భుతమైన 'దేస్” అవి
ఎం.ఫిల్ అయ్యాక టోరంటోని యార్క్ యూనివర్శిటీలో ఫిలింమేకింగ్ కోర్సులో = చేరాను. 'అమ్నాన్ బక్‌బైండర్' నాకు గైడెన్స్ ప్రొఫెసర్‌గా ఉండేవారు. యార్క్ యూనివర్శిటీలోని సిఎంఐఎల్ లైబ్రరీలో ప్రపంచదేశాల సినిమాలు దాదాపు పాతిక వేలదాకా ఉందేవి. ఎన్ని వేల సినిమాలు చూశానో లెక్కలేదు. "క్విన్ వీడియో అనే ప్రైవేట్ షాపులోంచి కూడా ఎన్నో సినిమాలు తెచ్చి చూసేవాణ్ణి. కాలం తెలిసేది కాదు. ఫస్ట్ ఇయర్‌లో ఉండగా 5 నిమిషాల ఎపిసోడ్ ఒకటి తీశాను. 'ఓం స్వీట్ ఓం) దాని పేరు. పరాయిదేశం వచ్చిన వారికి స్వదేశం పై గల ప్రేమ, తను ప్రస్తుతం ఉంటున్న ఊరిపై ఇష్టం పెంచుకోవడం... ఈ అంశంతో తయారైన డాక్యుమెంటరీ అది. నా (గ్రూప్‌లోని స్టూడెంట్సందరం కలిసి దాన్ని రూపొందించాం. దీనికి డైరెక్షన్ చేసినందుకుగాను “ఎ పస్” గ్రేద్ వచ్చింది నాకు. 'సెకండియర్‌లో 'సంభాషణంి, 'పగటి కలి అనే రెండు పదకొండు నిమిషాల నిడివిగల ఫిలింస్ తీశాను. ఇవి కూడా మంచి మార్కులు తెచ్చుకున్నవే. మరిచిపోలేని అనుభవాలు
ఆస్కార్ లైఫ్‌టెం పురస్కారం పొందిన హాలీవుడ్ డైరెక్టర్ 'నార్మన్ జూ ఈసన్' మా కాలేజీకి వచ్చినపుడు కొన్ని ప్రశ్నల్ని నేను వేయడం ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పడం మరిపోలేని అనుభవం. “ఎన్ని కష్టాలు వచ్చినా నీవు నమ్మిందాన్నే సినిమాగా తీయాలి. చివరికి అదే అందరికీ నచ్చుతుంది. నిజమైన గుర్తింపుని తెస్తుంది. నీకు ఆత్మతృప్తిని మిగులుస్తుంద”ని చెప్పిన వారి మాటలు నా మనసులో ఇప్పటికీ నాటుకునే ఉన్నాయి. ఇంకోసారి హాలీవుడ్ నటుడు రాబర్ట్ ఫారెస్టర్ వచ్చారు. “జీవితాన్ని ప్రభావితం చేసే కళ ఇదొక్కటే. వినోదం కోసం తీస్తూ వికాసాన్ని అందించగలిగిన కళ ఇది” అని చెప్పడం కూడా మర్చిపోలేను.
మా అమ్మగారి నవల 'వెన్నెల మట్టిని స్రిఫ్ట్‌గా రాసి థీసిస్‌కి అప్లయ్ చేశాను. అదొక తల్లీకూతుళ్ల కథ. ఈ ్రిఫ్ట్ యూనివర్శిటీ థీసిస్ అవార్డుకు నామినేట్ అవడం నా కాలేజీ దేస్‌లోని మరో హ్యాపీ విషయం.
(11.3.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 24
జ '్న ట్ సలం ఆ శ య ఖ్య శ గ్ ॥ ల మదన్ మధ్యాహ్నం పరిక్ష ఉన్నా ఖీ వా ఇవీ మార్చ్నింగషో చూసవాబ్ళి 'ఆ నలుగురు” చిత్రానికి కథ, న్పీన్‌ప్లే సంభాషణలలో నీనీవవేశం కి చేసి “పెళ్ళైన కొత్తలో, (ప్రవరాఖ్యుడు, “గుందె రుల్లుమంది” “రం” వంటీ చిత్రాలకు దర్శకత్వం వవొంచారు మదన్. కాఫీ నీతో మై వైఫ్” నీనిమాతో నిర్జాతగా మారారు. చిత్ర వరిశమకు రాకముందు కొన్ని నాటకాలు రానీ వ్రదర్చించిన అనుభవం దంది. మా కాలేజీ రోజులు ఎప్పుడు గుర్తుకొచ్చినా గర్వంతో నా ఛాతీ అరంగుళం మేర వెడల్పవుతూ ఉంటుంది. నిలువెల్లా ఆనందంతో పులకించిపోతాను. ఆ వెంటనే హార్స్‌లీహిల్స్, రిషీవ్యాలీలతో పాటు మహానుభావులు జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్రనాథ్, ఠాగూర్‌లు కళ్లముందు కదలాదడతారు. బాల్య, కామారాల నుండి యౌవనారంభం వరకూ మదనపల్లి మట్టి పరిమళాలు పీలుస్తూ పెరిగినవాణ్ళి. ఆ రోజుల్ని గుర్తుచేసుకోవడం అంటే ఆయా దశల్లోకి పరకాయప్రవేశం చేయడమన్నమాట. గొరుసు జగదీశ్వర రెడ్డి + 25
కోయదంలో మాత్రమే ఫస్
“గిరిరావు థియోసాఫికల్‌ో హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్భీడియట్ కోసం వందేళ్ల చరిత్ర గలిగిన బి.టి. (బిసెంట్ థీియొసాఫికల్ కాలేజీలో చేరాను విశాలమైన క్లాసు రూములతో, పెద్ద పెద్ద ప్లే గ్రౌంద్స్‌తో, ఎత్తైన రాతి కట్టడంతో కోటను తలపించేది అది. టెన్త్‌క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటరోో బైపీసీ ఇంగ్రీషు మీడియం తీసుకున్నాను. ఆహా ఏమి విశేషమనుకుని సంబరపదడ్డాను. కాని అది త్వరలోనే విషాదమని తేలిపోయింది. ఎందుకంటే పాఠాలు ఒక్క ముక్క కూడా అర్ధమయ్యేవి కావు. దిక్కుతోచని పరిస్థితి. ముందే మా ప్రిన్సిపాల్ డి. కోదండపాణిగారు చండశాసనుడు. నా బాధ వర్ణనాతీతం. ఇంట్లో చెప్పలేక, లెక్చరర్స్ ముందు తల ఎత్తుకోలేక భయంతో క్లాసులు ఎగ్గొట్టేవాణ్ణి. నూట పదిమంది స్టూడెంట్స్ ఉండే మా క్లాసులో నేను తరచూ అబ్సెంటే... మా బయోలజీ లెక్చరర్ భాగ్యలక్ష్మి గారికి నా తీరు అర్ధమయ్యేది కాదు. అయితే ప్రాక్టికల్స్‌కి మాత్రం రెగ్యులర్‌గా వెళ్లేవాడిని,
మాది 'దివ్యజ్ఞాన సమాజం) నెలకొల్సిన కళాశాల కాబట్టీ అక్కడ కప్పులు, బొద్దింకల్లాంటి జీవులను చంపడం, కోయడం నిషిద్దం. మా జువాలజీ లాబ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉండేది. ప్రాక్టికల్స్ ల్యాంగ్వేజీల్లో పాసయితే చాలదు కదా... మొదటి సంవత్సరంలో శ సబ్జెక్టులు బ్రహ్మాండంగా చీదేశాయి. హైద్రాబాద్ పారిపోయాను
అంతే ! అవమానంతో తల తీసేసినట్టు సిగ్గుపడిపోయాను. ఒక సుముహుర్తం చూసి నా మిత్రుడు జి.వి. రమణతో కలిసి 'జంప్‌జిలానీ అంటూ చేతికి దొరికిన డబ్బుల్ని తీసుకుని “చలో హైద్రాబాద్” అని రైలెక్కేశాను. మొదటి రెండ్రోజులు కాచిగూడ ( రైల్వేస్టేషన్‌లో కాందిశీకుల్లా గడిపాం. తర్వాత జీడిమెట్లలోని ఒక బిస్కట్ కంపెనీలో క్యాజువల్ లేబర్‌ను తీసుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లి లైన్లో నిలబడ్డా. రోజుకు పదిహేను రూపాయలు ఇస్తారట! నెలకు రూ.450 అవుతాయి గనక, ఇద్దరివీ కలిపితే 900 దాంట్లో రూమ్ రెంట్‌కు పోగా, మిగతా వాటితో ఎలా గడపాలో లెక్క లేసుకుంటుండగానే 'నో వెకెన్సీ” బోర్టు పెట్టేశారు. తెల్లమొహాలేసుకుని మళ్లీ రోడ్లమీద పడి డబ్బులన్నీ అయిపోగానే ఇక్కడ లాభం లేదని, ఈసారి అనంతపురం వెళ్తామని దొంగ రైలెక్కాం. రైలు కదిలీ కదలగానే టి.సి కంట్లో పడి మిగిలిన పదీ పాతికా అతగాడికి సమర్పించేసి దిగాలుగా కూర్చున్నాం. హ్యాప్ డేస్ = సిన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు * 26
మార్గం చూపిన శ్రేయోభిలాషి ఆ రైలు సాంకేతిక కారణాల చేత గద్వాల స్టేషన్లో దాదాపు రెండు గంటలు ఆగిపోయింది. ఇప్పటికీ బాగా జ్ఞాపకం... బయట చిమ్మ చీకటి... మా ముందున్న భవిష్యత్ మాదిరే. దానికి తోడు హోరు గాలి.. వర్షం... మమ్మల్ని హైద్రాబాద్ నుండి గమనిస్తున్న ఒకాయన మెల్లగా మా కూపీ లాగి 'చదువు లేకపోతే మీరెందుకూ కొరగారు. . మదనపల్లికి వెళ్లి కాలేజీ కంటిన్యూ చేయండి. లోకంలో అమ్మా నాన్నలకంటే ్రేయోభిలాషులు ఉండరు. వాళ్లు మిమ్మల్ని ఏమీ తిట్టరు' అంటూ హితబోధ చేశారు. ఆశ్చర్యంగా ఆ మాటలు మాపై మంత్రించినట్లు పనిచేశాయి. ఆయన చెప్పినట్టుగానే మమ్మల్ని ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదు. అప్పటికే అమ్మ దిక్కులు పిక్కటిల్లేలా నాకోసం
- ఏడుస్తోందని తెలిసింది. రెండు రోజులయ్యాక ప్రాబ్లమ్ ఏంటని బుజ్జగిస్తూ అడిగారు నాన్న 4 సబ్బెక్టులు పోయిన విషయం చెప్పాను. ఆయన అర్ధం చేసుకుని “నీవు తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియంలోకి వెళ్లడం వల్ల జరిగిన నష్టం అని చెప్పి డిక్షనరీ ఒకటి కొని బేసిక్స్ నుండి నేర్పించారు. దాంతో సెప్టెంబరుకి ఆ 4 సబ్జెక్టులూ ప్యాసై, విజయవంతంగా సెకండియర్ కూడా కంస్లిట్ చేసే శక్తి వచ్చేసింది. ఆ
- సంవత్సరం మా క్లాసు రిజల్టు కేవలం 30 శాతం మాత్రమే. ఆశ్చర్యం ఏమంటే రెగ్యులర్‌గా కాలేజీకి వెల్లి బుద్ధిగా చదివిన వాళ్లు 'ఫయిలయితే అమావాస్య, పౌర్ణమికి క్లాసులకు వెళ్లిన నేను ప్యాసవడం. దాక్టర్ కావాలనుకున్నాను ఇంటర్ ప్యాసవగానే డాక్టర్ అయిపోవాలని కలలుగని ఎం.సెట్ రాసే ప్రయత్నంలో మునిగిపోయా. కాని నీకు మెడిసిన్‌లో సీటు వచ్చినా డొనేషన్లు కట్టి క చదివించే శక్తి మాకు లేదని ఇంట్లో కచ్చితంగా చెప్పేశారు. దాంతో అలక సాగించాను. నా వ్రతం ముగిసేలోగా డిగ్రీ కాలేజీలో కూడా సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. చివరికి బి.ఏ. (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) తీసుకున్నాను. ఆ గ్రూపు ఇంగ్రీషు మీడియం మొత్తంలో నేనొక్కడినే స్టూడెంట్‌ని. నా ఒక్కడికోసం విడిగా పాఠాలు చెప్పరు కదా, అందరితోపాటు తెలుగులో విని ఇంగ్లీషులో ఆలోచించేవాణ్లి. మా కాలేజీకి దగ్గర్లో ఒక శృశానం ఉండేది. అక్కడుండే చింతచెట్లకింద కూర్చుని చదువుకోవడం భలే ఇష్టం నాకు. ఒకసారి ఆ చెట్లకింద చదువుకుంటూ ఉండగా మా మిత్రుడు రవికుమార్ వచ్చి “ఏరా, కాలేజీ డే వస్తోంది. మనం కనీసం స్పోర్ట్‌లో గానీ, ఎన్.సి.సి.లో గానీ లేము. ఎందులోనూ లేకపోతే మనకి వాల్యూ ఉండదు. ఏదైనా నాటకం రాయి. వేద్దాం” అని సలహా ఇచ్చాడు. అప్పటికే కాస్త సాహిత్య వాసనలు
పీలుస్తున్నానేమో ఆలోచించి... చించి 'విద్యార్థులకు రాజకీయాలు అవసరమా? అనే కాన్‌సెఫ్ట్‌తో ఒక డ్రామా తయారుచేశాను. నాటికకీ, నాటకానికీ తేడా తెలీకుండానే “ఒంటి గొర్రె అనే డ్రామా రాసేశా. తీరా దాన్ని ప్రదర్శించే సమయానికి ఒక పాత్రధారి రాలేదు. ఏం చేయాలా దేవుడా అనుకుంటుండగా దేవుడిలా గోపాల్‌రెడ్డి అనే మిత్రుడు కనిపించాడు. వాడు అప్పటికే 15 రోజుల్నుండి విరేచనాల బాధతో కాలేజీకి సెలవు పెట్టి, కేవలం నా 'ఒంటి గొర్రె ని వీక్షించడానికే పడుతూ లేస్తూ వచ్చాడట పాపం | వాదిని బతిమాలి అప్పటికప్పుడు సన్నివేశం వివరించి ఆ పాత్ర వేయించాను. డ్రామా విజయవంతంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఊరట ఏంటంటే మా మిలట్రీ ప్రిన్సిపాల్ (ఫ్రైజ్ డిస్టిబ్యూషన్ చేస్తూ గెలుపొందిన నాటకాల వెనక సీనియర్ లెక్చరర్సు ఉన్నారు. కానీ 'ఒంటి గొర్రె వెనక మదన్ ఒక్కడే ఉన్నాడని కితాబీవ్వడం. మేనల్లుడి కిడ్డీ బ్యాంకు కొల్లగొట్టేవాణ్సి
నా సినిమా పిచ్చి గురించి ప్రత్యేకంగా చెవ్పొల్సిన పనే లేదు. పన్నెండు గంటలకు ఎగ్గాముందని తెల్సినా ఉదయం 9 గంటల షోకి వెళ్లిపోయేవాణ్ణి. డబ్బులకి మా నాన్న జేబులు తడిమేసేవాణ్ణి లేదంటే మా అక్క కొడుక్కి ఒక కిడ్డీ బ్యాంకు ఉండేది. దానిపై మా అక్క 'పునీత్ బ్యాంకు” అని అందంగా రాసింది కూడా. పాపం క పిల్లాడని ఇంటికి వచ్చిన వాళ్లంతా ఆ బొమ్మ బ్యాంకులో 5, 10 నోట్లు వేసేవారు. మనకు కావలసింది కూడా అదే కదా. ఎంచక్కా వాటిని అపహరించి సినిమాలకి చెక్కేసేవాణ్ణి. మా అమ్మ దాచుకునే పోపుల డబ్బాల్లోని చిల్లర మాత్రం ముట్టుకునేవాణ్ణి కాదు. ఎందుకంటే ఆవిడకి ఎక్కడ ఎంత డబ్బు పెట్టింది బాగా గుర్తుందేది. ఒకసారి “జాకీచాన్ సినిమాకి వెళ్లి వచ్చేసరికి అంతా కూడబలుక్కున్నట్టుగా ఇంటికి తాళం వేసి ఏ పేరంటానికో వెళ్లిపోయారు. నాకేమో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సినిమా స్టయిల్లో ఇంటీ వెనక్కి వెళ్లి పైపులు ఎగబ్రాకి ఇంట్లోకి దూకాను. నా అదృష్టం ఏమంటే మా వంటిల్లు విడిగా ఉండేది. హాయిగా భోజనం చేస్తుండగా మా వాళ్లంతా వచ్చేశారు. నన్ను చూసి ముందు దొంగాడని భయపడ్డా తర్వాత జెరా! అని నోరు తెరిచి ముక్కున వేలేసుకున్నారనుకోండి. ఆ సినిమా పిచ్చి రాను రాను ముదిరిందే కాని తగ్గలేదని చెప్పకృర్లేదనుకుంటా. 'పిచ్చికుక్కలిని పిలిచేవారు
“ఒంటి గొ(గ్ర స్ఫూర్తితో డిగ్రీ ఫైనల్లో ఉండగా 'పిచ్చికుక్కలు' అనే నాటకం రాశాను. అయితే మా కాలేజీలో వేయడానికి కాదు. “మదనపల్లి నాటక కళా పరిషత్” కోసం జడ్జీలు మా ఇంగ్లీషు లెక్చరర్స్ ప్రసిద్ధ సాహితీవేత్త వల్లంపాటి వెంకటసుబ్బయ్య, హ్యాప్ డేస్ = సినీ ప్రముఖల బన్ననాటి తీస్ గుర్తులు * 28
స్థానిక రిటైర్ జడ్జి జయరాంరెడ్డిగార్లు, రిహార్సల్స్ టైంలో మా టీంలోని స్టూడెంట్స్ హడావిడిగా తిరుగుతుంటే 'పిచ్చికుక్కలు తిరుగుతున్నాయి జాగ్రత్త! అని అరిచేవాళ్లు మా కోతి మూకను ఉద్దేశించి.
మా నాటకం ప్రారంభమవగానే జోరున వర్షం మొదలైంది. దాంతో ఎక్కడి వాళ్లక్కడ పలాయనం చిత్తగించారు. మిగిలింది జడ్డిగార్లు, మా వాత్రధారులు. వల్లంపాటిగారు *' ఆ పక్కనున్న షెడ్‌లో కంటిన్యూ చేయండి. పరిశీలించి మార్కులు వేస్తాం) అన్నారు. నేను ససేమిరా అన్నాను. 'పిచ్చికుక్కలు పోటీకి కాదని, (పేక్షకులు చూడడానికే' అని పట్టుబట్టి మర్రోజు ప్రదర్శించడానికి ఒప్పించాను. డ్రామా సూపర్ సక్సెస్. ఫస్ట్ ఫైజు రాకపోయినా కన్సలేషన్ బహుమతి వచ్చింది.
. వల్లంపాటి గారి రచనల స్ఫూర్తి
వల్లంపాటిగారు మొదట్లో మా ఇంగ్లీషు లెక్పరర్‌గా మాత్రమే తెలుసు. తర్వాతే తెలిసింది ఆయనెంత మేధావో వారి కథాశిల్పం, నవలా శిల్పం పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన నా గురువు కావడం నా అద్భష్టం.
క మాది కో - ఎడ్యుకేషన్ కాలేజీ అయినా అమ్మాయిల జోలికి వెళ్లే వాణ్ణి కాదు. నా ముక్కుకోటేరులా ఉన్నా బక్కగా చామన ఛాయలో ఉండేవాణ్ణి. (ప్రేమలూ దోమలూ నా ఒంటికి సరిపడవనే ఆత్మన్యూనత నాలో ఎక్కువగా ఉండేది అప్పట్లో. అదీగాక జిద్దు కృష్ణమూర్తి నడయాడిన, రవీంద్రుడు 'జనగణమన' జాతీయ గీతాన్ని ఇంగ్రీషులోకి తర్జుమా చేసిన నేలలో విపరీత పోకడలు పోకూడదని నాకు నేను బుద్ధి చెప్పుకునేవాడిని.
'డిగ్రీ' తీసుకున్న తర్వాత హైద్రాబాద్ వచ్చేసి, మొదట్లో చిన్నా చితకా పనులు చేస్తూ మెల్లమెల్లగా సినిమా (యా) ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటికీ ఎంత
; చికాకులో ఉన్నా సరే నా మదనపల్లి "కాలేజీ డేస్ గుర్తొస్తే మనసంతా ఉల్లాసంగా మారి, దూదిపింజలా తేలిపోతుంది.
(25.38.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి )
(న. రాగ ల్ జా నా 14 / లి . న. వరుణ్ సందేశ్ మిడ్‌నైట్ బిర్యానీలంటే పడి చచ్చెవాళ్లం వీ డా న్యూజార్సీ “తొ7748్ర072/67-824720272* న్కూల్లో బుద్ధిగా చదువుకుంటూ, అప్పుడే కౌమారం లోకి అదుగుపెడుతున్న "ఒక కుర్రాడిని గేలం వేసి లాగి తెలుగు చిత వరితమలో పదేశారు శేఖర్ కమ్మల. జరిగింది కలా నిజమా అని అళ్ళర్వంలో తలమునకలై, తేరుకునేలోపే ఆ నూనూగు మీసాల అబ్బాయిని నేపాళ మాంతికుది తరవోలో “చందు'గా మార్చేనీ వ్యోవీదేన్” వారోని చేసేశారు. ఆ ఊపుతో ఇక వెనక్తి తిరిగి చూదకుందా 'కొత్తబంగారు లోకం) “ఏమైంది ఈవేళా 'వ్యోవీ వ్యోవీగాా (వీయుదు; మరో చరిత్ర ఎవరైనా ఎవుడైన్సా (బమ్మిగాడి కథ) "కుదిరితే కప్పు కాఫీ) 'కుర్రాదు?.. లాంటి పాతిక చిత్రాల్లో వకభిగిన నటించేశాదు వరుణ్‌సందేళ్ ఈ మధ్యనే నటీ నితికను వివావాం చేసుకున్నారు. జీవితమంత మిరకిల్ మరొకటి లేదేమో! అమెరికాలో ట్వెల్త్‌క్లాస్ చదువుతున్న అబ్బాయికి అనుకోకుండా హైదరాబాద్ సి. బి.ఐ.టి. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావడం ఏమిటి? మధులాంటి అందమైన అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించడం ఏమిటి? ఆమెతోపాటు రాజేళ్, అప్పు, స్రవంతి,శంకర్, అర్జున్, సంగీతలాంటి వాళ్లంతా క్లోజ్ (ఫెండ్స్ కావడం, అందరూ సరదాగా పోట్లాడుకుంటూనే ప్రాణంగా స్నేహించుకోవడం... పార్కుల్లో, రోడ్లమీదా చక్కర్లుకొట్టడం... అనవసరంగా తమ జోలికి ఎవరైనా వస్తే హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 30
కా ఫైటింగ్స్ చేయడం, లెక్చరర్స్‌ని ఆటపట్టించడం... ఎంత గొప్ప కాలేజీ దేస్ అవి. మళ్లీ అలాంటి హ్యాపీడేస్ వస్తాయా? అన్నిటికంటే విశేషం... నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుని కేవలం రెండున్నర గంటల్లో పూర్తిచేయడం మిరకిల్‌లోనే మిరకిల్ కదా! ఆగండాగండి! కంగారు పడకండి ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి సరదాగా, మీతో ఇలా కాసేపు ఆటపట్టిస్తున్నా... కాస్త ఆలోచిస్తే మీకే అర్ధమవుతుంది... పై మటలన్నీ నా ఒరిజినల్ కాలేజీ దేస్ గురించి కాదని, అదంతా 'మ్యాపీడేస్ సినిమా తతంగమని. నా చదువు నైన్త్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు న్యూజెర్సీ 'బ్రిడ్జ్‌వాటర్ రేరిటన్ హైస్కూల్లో సాగింది. 8వ తరగతి మాత్రం 'ఒహాయో'లో చదివా. ఇంకా చిన్నతనంలోకి వెళ్తే టెక్సాస్ స్టేట్‌లో. నాన్నగారు విజయ్ జీడిగుంట ఐ.బి.ఎం.లో జాబ్ చేస్తుండేవారు. తను ఉద్యోగరీత్యా తిరగటం వలన చదువంతా ఒకే దగ్గర జరగలేదు. పైగా టెన్త్ పూర్తవగానే ఇంటర్‌కోసం మరో కాలేజీకి వెళ్లే అవసరం లేకుండానే ఆ స్కూల్లోనే క్లాసు మారడం, టెన్త్‌లోని మిత్రులే లెవన్స్, ట్వెల్త్ స్పాండర్ట్‌లో కూడా ఉండటం వలన కొత్తగా కాలేజీకి వెళ్లిన ఫీలింగ్స్ లేవు. మారుతి, సాగర్, ఆదిత్య లాంటి ఇండియన్ సెటిలర్ మిత్రులే కాక వారెన్, రాబ్, జోష్స్ హాల్, జేసన్ లాంటి అమెరికన్ మిత్రులూ నాకు క్షోజుగా ఉండేవారు. ఏం చేసినా అందరం అనుకుని, కలిసికట్టుగా చేయడం అనవాయితీ. ఇక టీచర్లంటే ఎలాంటి భయం ఉందేది కాదు. వాళ్లంతా మాతో చాలా జోవియల్‌గా, క్లోజ్‌గా ఉండేవారు. వాళ్లని పేర్లుపెట్టే పిలిచేవాళ్లం. తలచుకుంటే నోట్లో నీళ్లూరుతాయి రైస్, చికెన్ కోసం మా (ఫ్రెండ్స్ అంతా ఎంత తహతహ లాడేవాళ్లమో గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. బిర్యానికోసం న్యూయార్క్ సిటీకి అర్ధరాత్రి దొంగచాటుగా కార్తేసుకుని పారిపోయే వాళ్లం. ఇప్పటికీ బాగా గుర్తు న్యూయార్క్‌లోని 58వ ఫ్రీట్, 6వ ఎవెన్యూలో రోడ్డు పక్కన అరబ్బీవాళ్లు నడిపే చిన్న డాబా ఉండేది. బిర్యాని మమ్మల్ని నిలవనిచ్చేది కాదు. దాని పరిమళం మా ఇళ్లదాకా వ్యాపిస్తున్న ఫీలింగ్ కలిగేది. అందరూ పడుకున్న తర్వాత మెల్లగా షాన్ ప్రకారంగా మాలో ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి ఇంటికి కాస్త దూరంగా ఆపి, ఫోన్ చేసేవారు. ఇంట్లో వాళ్లకి మెలకువ రాకుండా (ముందే మావి కరమెట్లు) పిల్లిలా జారుకునేవాళ్లం. మా కారు గ్యారేజ్ పైనే మా అమ్మవాళ్ల బెడ్ రూం ఉండేది. ఏమాత్రం చప్పుడొచ్చినా వాళ్లకు తెలిసిపోయేది కాబట్టి నా కారుని తరచూ తీసేవాణ్ణి కాదు. ఆ అర్ధరాత్రి ఎంచక్కా
రోడ్డు పక్కనే నిలబడి శుభ్రంగా తినేసి తెల్లారేసరికి మళ్లీ ఎక్కడివాళ్లం అక్కడ గప్‌చిష్. అబ్బ! తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతుంటాయి. ఆ బిర్యానికోసం ఒక్కోసారి రెండు వందలమంది వరకు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయంటే నమ్మరేమో! బాక్సింగ్‌లోనూ 'కింగునే
అదేంటోగాని బాక్సింగ్ అంటే తెగ ముచ్చటగా ఉండేది అప్పట్లో. దానికోసం ప్రత్యేకంగా బాక్సింగ్ గౌజ్‌లు కొనుక్కునేవాళ్లం. కొట్టుకోవడానికి అనువుగా ఉందే ఒక ఏరియాని చూసుకునేవాళ్లం. అదంతా దట్టమైన గడ్డి ప్రదేశం కావడంతో కిందపదడ్డా దెబ్బలు తగిలేవి కాదు. నా టెన్త్‌లోనో, లెవన్స్ స్తాండర్ట్‌లోనో జరిగిన సంఘటన. బాక్సింగ్ మత్తులో “హాలో అనేవాడిని కొడితే వాడి పన్ను సగం విరిగిపోయింది. దాంతో వాడు నా మొఖంపై కొట్టిన పంచ్‌కి దిమ్మదిరిగి ముక్కులోంచి బొటబొట రక్తం కారడం ప్రారంభమైంది. చాలా భయపడిపోయాం. రక్తంతో బట్టలన్నీ తడిసిపోయాయి. సాగరనే ఫైండ్ (గుజరాతీ) నన్ను వాళ్లింటికి తీసుకెళ్లాడు. రక్తం చూసిన వాళ్లమ్మ కంగారుపడిపోయి 'వి కి ఏమైందని అడిగింది. (నన్నంతా 'వి' అనే పిలిచేవారు) బాక్సింగ్ అంటే మా పెళ్లవుతుందని భయపడి బాస్కెట్ బాల్ తగిలిందని అబద్ధం చెప్పాం. అయినా ఆమె నమ్మలేక రకరకాలుగా కూపీ లాగే ప్రయత్నం చేయడం ఇప్పటికీ గుర్తుంది. బహుశా ఈ ముక్కపచ్చడి సంగతి మా ఇంట్లో వాళ్లకి ఇప్పటికీ తెలీదేమో కూడా ! పాకెట్ మనీ పాట్లు
దాదాపు పదహారేళ్ల వయసు వచ్చేసరికి ఎవరి పాకెట్ మనీ వాళ్లే వెతుక్కోవడం అమెరికా పద్ధతి. దాని వల్ల డబ్బు విలువ, రెస్పాన్స్‌బిలిటీ కూడా తెలుస్తాయి. లేకపోతే మాలాంటి చదువుకునే కుర్రాళ్లకి కార్లలో తిరుగుతూ బిర్యానీలు గట్రా తినే అవకాశం రాదు కదా. అంచేత ముందుగా “౪68౧1205 అనే సూపర్‌మార్కెట్ లాంటి ఒక షాపులో క్యాషియర్‌గా చేరాను. గంటకి ఏడు డాలర్లు ఇచ్చేవారు. నాతో పాటు చైతన్య అనే (ఫెండ్ కూడా చేసేవాడు. వచ్చిన కస్టమర్లు సామాన్లని తమ కార్ల దాకా తీసుకెళ్లి ఖాళీ ట్రాలీలని అక్కడే వదిలేసే వాళ్లు. షాపు మూసే టైంలో అవన్నీ ఏరి ఒక దగ్గర పెట్టేవాళ్ళం. కేవలం క్యాషియర్ పనే చేస్తానంటే అవదు కదా. నేనూ చైతన్య కలిసే ఏరుకొచ్చెవాళ్ళం. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక “16జ00గ016..00%)' లో చేరాను. క్రికెట్ ఆటకు కావలసిన వస్తువులకు చాలా చోట్ల నుండి అంటే ఇతర దేశాలనుండి కూడా ఆర్దర్లు వచ్చేవి. ఎవరెవరు ఏమేం ఆర్టర్ చేశారో చూసి లిస్టు ప్రకారంగా వ్యాక్ చేయించి హ్యాపీ డేస్ = సిన్ ప్రముఖల బిన్ననాటి తీసి గుర్తులు + 32
వాళ్ల అడ్రస్‌లన్నీ ప్రింటవుట్ తీసి, కత్తిరించి బాక్స్‌లపై అతికించడం నా పని. అక్కడ గంటకి 10 డాలర్స్ ఇచ్చేవాళ్లు. అలాంటి “*6416220గ0.16(00%' కు ఆ తర్వాత కాలంలో (నేను హీరోనయ్యాక) బ్రాండ్ ఎంబాసిడర్‌గా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మా నాన్నకి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్. నిజం చెప్పాలంటే అందులో చేరిన తర్వాతే క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను. స్పీడ్‌గా (డైవ్ చేసి దొరికిపోయేవాణ్ణి
స్కూల్‌కి బస్‌లోనే వెళ్ళాల్సి వచ్చినా, సమయం దొరికితే ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి కారు తీసుకెళ్ళేవాణ్జి. నాది రాష్ డైవింగ్ కాదుగానీ, స్పీడ్ దైవింగ్. దానివల్లే మూడుసార్లు 'టికెట్స్' తీసుకుని ఫైన్ కట్టాను. స్పీడ్‌గా దైవ్ చేయడం ఇష్టం కాబట్టి హైదరాబాద్‌లో కారు దైవ్ చేయడానికి భయపడుతుంటా ఇప్పుడు. ఆటల విషయానికొస్తే బాస్కెట్ బాల్ లో ప్రొఫెషనల్ కావాలని ఉండేది. కానీ అది అంత సులువు కాదని తెలిసింది. మ్యూజికల్ ఇన్స్‌ట్రుమెంట్స్ అంటే కూడా భలే సరదాగా ఉండేది. స్కూల్లో '౪౯౫౧౧06౪ వాయించేవాణ్లి. “బ్యాంద్' లో ఒక్కోసారి ఆలస్యమైనా అమ్మ నాకోసం కారేజ్ తీసుకుని స్కూల్‌కి వచ్చేసేది. అమ్మ ఎప్పుడూ నన్ను కనిపెట్టుకుని నా వెన్నంటే ఉండేది. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రాంలు అవుతుండేవి కాని నేనెప్పుడూ పాల్గొనేవాణ్ణి కాదు. ఎంతసేపూ బాస్కెట్ బాల్ పైనే దృష్టి మా స్కూల్లోనే కాకుండా చుట్టుపక్కలున్న స్కూళ్లలో కూడా బాస్కెట్ బాల్‌ను ఆడటానికి వెళ్లేవాణ్సి. నైన్త్ స్తాండర్ట్‌లో ఉండగా ఒక్కసారి కూడా ఓడిపోకుండా వరసగా 25 గేమ్స్ ఆడి గెలిచాను. అదొక స్వీట్ మెమరీ.
అనుకోకుండా “హ్యాపీ డేస్ లోకి
నేను ముందుగా చెప్పినట్టు “హ్యాపీ దేసిలో నటించడం మిరకిలే. ఎందుకంటే అప్పటిదాకా నటన గురించి ఓనమాలు కూడా తెలీవు నాకు. కాకపోతే మా తాతయ్య జీడిగుంట రామచం(ద్రమూర్తి, బాబాయ్ జీడిగుంట శ్రీధర్‌గార్ల వారసత్వం అంతర్లీనంగా నాలోనూ ప్రవహిస్తుందేమో తెలీదు. తాతయ్య 70-80 దశకాల్లో హైద్రాబాద్ ఆకాశవాణి ద్వారా (ముఖ్యంగా కార్మికుల కార్యక్రమంలోని ఏకాంబరం, చిన్నక్కలతో వచ్చే బాలయ్యగా) తెలుగు శోతలకు బాగా తెలుసు. నాటక ప్రయోక్తగా, రచయితగా కూడా ప్రముఖులు. ఇక బాబాయ్ పలు టీవీ సీరియల్స్‌లో కన్పిస్తూనే ఉంటారు.
నేను నా చదువులో బిజీగా ఉండగా ఒకరోజు బాబాయ్ ఫోన్ చేసి శేఖర్ కమ్ములగారు తను తీయబోయే కొత్త పికృర్‌కోసం 1641601212.00% లో టాలెంటున్న కొత్త నటుల కోసం 'సర్స్” చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా ఆ వెబ్‌సైట్ చూసి సరదాగా నా స్టిల్స్‌ని పంవాను. కొద్ది రోజుల్లోనే వాళ్ల దగ్గర్నుంచి రిప్లయ్ వచ్చింది. గొరుసు జగదీశ్వర రెడ్డి + 33
దాంతో పాటు 'ఆ చిత్రంలోని చిన్న సన్నివేశం స్కిఫ్ట్ పంపుతూ, దాని ప్రకారం నటించి పంపిమన్నారు. అప్పటికి అది '“హ్యాపీ డేస్ సినిమా అనికాని, అందులో తమన్నా హీరోయిన్ అనికానీ తెలీదు.(తమన్నా ఇంటికి వెళ్లి కిస్ అడిగి, ఆమె తిరస్కారంతో మర్రోజు కాలేజీలో ఆమెకు సారీ చెప్పే సన్నివేశం అది). మా చెల్లి వీణాసాహితి తమన్నా పాత్ర డైలాగ్స్ పలుకుతూ, డిజిటల్ కెమెరాతో నా నటనని షూట్ చేసింది. ఆ సన్నివేశాన్ని క్యాజువల్‌గా నటించి, దాంతోపాటు బొమ్మరిల్లు సినిమాలోని “అపుడో ఇపుడో ఎపుడో (సరదాగా మా బ్రిడ్జ్ వాటర్ ఇంట్లో మెట్లపై పాడుతూ, డాన్స్ చెస్తూ తీసుకున్న వీడియోను కూడా కలిపి గూగుల్‌లో అప్‌లోడ్ చేసి శేఖర్‌గారికి పంపించాను. ఇదంతా సరదాలో భాగంగానే అనుకుని పంపాను.
ఈ విషయం (116200%0161.0011 లో పనిచేస్తున్న నా కొలీగ్స్‌కు చెబితే నీకు తప్పకుండా చిన్న రోలైనా అందులో ఇస్తారని జోస్యం పలికారు. దాంతో నాక్కూడా ఒక్క తెలుగు సినిమాలో అయినా నటిస్తే బాగుణ్డు అనే కోరిక మొదటిసారి కలిగింది. తర్వాత కొద్ది రోజుల్లోనే 'అనిష్ కురువిల్లా" (హ్యాపీడేస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) గారి నుండి కబురు... నీవు సెలెక్ట్ అయ్యావు. చిన్న రోల్ కాదు సినిమాలోని మెయిన్ రోల్ నీదే అంటూ. ఇంకేముంది? కేక.......
మరి సందేశ్ చదువుకుని ఏం చేశాడనే సందేహం మీకు రావచ్చు. మా కాలేజీ ప్రిన్సిపాల్‌గార్కి సినిమా ఛాన్సు వచ్చిన విషయం చెప్పాను. ఆయన గూగుల్‌లో సర్చ్ చేసి శేఖర్ కమ్ముల అనే తెలుగు దర్శకుడు గతంలో ఆనంద్, గోదావరి లాంటి సినిమాలు రీశారనే పూర్తి వివరాలు తెలుసుకుని 'మంచి ఛాన్సు, వెళ్లు. షూటింగ్ అయిపోయాక వచ్చి ఎగ్జామ్స్ రాయి” అంటూ సెలవు గ్రాంట్ చేశారు.
'హ్యాపీదేస్' రష్ చూసి దిల్‌రాజుగారు తను తీయబోయే 'కొత్త బంగారులోకం” కోసం అడిగారు. కాలేజీ పూర్తవ్వలేదని ఊగిసలాడుతుంటే, 'తొందరేం లేదు, చదువు ముఖ్యం. ఎగ్జామ్స్ రాసి వచ్చేశాకే షూటింగ్ మొదలెడదాం) అని భరోసా ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించేస్తారని తెలుసు.
కాలేజీలో చదువుకోలేని లోటును ఫీలవకూడదనే కాబోలు శేఖర్ కమ్ములగారు 'హ్యాపీడేస్' అవకాశం కల్పించారేమో, ఆ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను.
(01.042012, ఆదివారం ఆంధ్రజ్యోతి) 'హ్యాప్ డేస్ - సిన్ ప్రముఖల బన్ననాటి లీస్ గుర్తుల + ౩4
జ ఎంటో 1 ణ్ హహ. , (| స్ట్ శ -. త్రి నా చదువంతా సినిమా హాల్లోనె నట వారసత్వంతో పాటు తంది దేవదాస్ కనకాల నదిపే (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్వూటో ఛాయలో పెరగదంతో బాల్వం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తూ తను కోరుకున్న థియేటర్ ఆర్హ్స్‌లోనే పీ.జి. వరకు చదివారు రాజీవ్ కనకాల. దూరదర్భన్ నుండి వెందితెర వెవు మరలి దాదాపు 8ఈ€ చిత్రాల్లో నటించారు. (ఫిలిం బై అరవింద్, 'ఖ్లాక్ అంద్ వైట్తొ విశాఖ ఎక్స్(పెన్స్ “మీనాక్షి తదితర చిత్రాల్లో హీరోగా 'సూదెంట్ నెం. 1 'రాంబంటుూ “కన్వాదానంా “సై విక్రమార్శుడు” వంటి నినిమాల్లో విభిన్న వపొతల్ని పోషిస్తూ నటుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. (ప్రముఖ యాంకర్ సుమ జీవన సవాచరి. చదువు విషయంలో నాకు పట్టిన అదృష్టం ఇంకెవరికీ పట్టి ఉండదేమో! అందరూ ఇంటర్ అవగానే ఎంసెట్ రాసి ఇంజనీరింగో, మెడిసినో చెద్దామని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. లేదా బి.ఎ. బి.కాం. లాంటి డిగ్రీల్లో నయినా చేరిపోతుంటారు. కాని మా అమ్మానాన్నలిద్దరూ నటులు కావడం వలన కాబోలు, . చిన్నతనం నుండి నటనకు సంబంధించిన విద్య మాత్రమ చదవాలని భీష్మించుకుని ఉండేవాజ్డి. శని వక్రదృష్టితో చూసి ఉంటే ఏమయ్యుదో కానీ నా విషయంలో అద్బష్టం నా వెన్నంటే ఉంది. గొరుసు జగదీశ్వర రెడ్డి + 35
కాలేజీ జైలులా కనిపించేది
అమీర్‌పేట 'విద్యోదయి'లో టెన్త్ పూర్తవగానే హిమాయత్‌నగర్‌లోని, సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో చేరడమైతే చేరాగానీ కాలేజీకి వెళ్లాలనిపించేది కాదు. కొంతకాలం అటెండెన్స్ కోసం ఫస్ట్ పీరియడ్‌లో నిప్పులమీద కూర్చున్నట్టు కూర్చుని మెల్లగా జారుకునే వాణ్ణి. గేట్ దగ్గర యముడిలా ఉండే వాచ్ మన్‌ను తప్పించుకోడానికి రకరకాల వ్యూహాలు పన్నాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే కాలేజీ జైలులా కన్పించేది. అటెండెన్స్ విషయంలో అప్పటి మా ప్రిన్సిపాల్ ఆరోగ్యరెడ్డిగారు ఒకటి రెండు సార్లు మందలించారు కూడా. ఆయన మా నాన్నగార్శి బాగా తెలుసు. ఐనా నా మనసంతా కాలేజీ సమీపంలోని స్టెర్లిన్, స్కైలైన్ థియేటర్ల చుట్టే తిరిగేది. ఎనిమిదిన్నరకి మొదలయ్యే కాలేజీ కోసం బుద్దిమంతుడిలా ఇంటినుండి బయల్చేరి కాలేజీ చుట్టూ చక్కర్లు కొట్టి, ఆ తర్వాత హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ వీధుల్ని సర్వే చేసి మార్నింగ్ షో టైంకి టంచన్‌గా సినిమాహాలులో దూరిపోయేవాణ్సి. అందుకే ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాలు నాకు కొట్టిన పిండి. సెకండియర్ వచ్చేసరికి రోడ్లు కొలిచేపని తప్పింది. కాలేజీ, మాట్నీ టైమింగ్ ఒకటే కావడంతో సరాసరి థియేటర్లోకే వెళ్లి కూర్చునే వాణ్ణి. సినిమాలంటే అంత పిచ్చి. ఇవన్నీ గమనించి కాబోలు ఇంట్లో వాళ్లు (ప్రైవేటు పెట్టించారు. దానికోసం ఈసురోమని సంజీవరెద్దినగర్ వెళ్లాల్సి వచ్చేది. సరే ఏదైతేనేం ఇంటర్మీడియట్‌ని ఎలాగో గట్టెక్కేశాను. చెప్పా కదా... “అదృష్టం నా జిగిరీదోస్తని. డిగ్రీ కోసం థియేటర్ ఆర్ట్స్‌లోకి
సరిగ్గా నేను ఇంటర్ ప్యాసయిన సంవత్సరమే నాకోసమే అన్నట్టు తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ కోర్సు ప్రారంభించారు. నాతో పాటు 20 మంది చేరారు. ఆశ్చర్యమేమంటే విద్యార్థులంతా ముదుర్లు.. మూడు పదులు దాటినవారే. అందరిలో నూనూగు మీసాలతో కౌమారంలోకి అడుగుపెడుతున్నవాణ్సి నేనాకృన్నే విశ్వవిద్యాలయంలో అప్పటికే ఫోక్. మ్యూజిక్, దాన్స్, ఆర్ట్ తదితర కళలకు సంబంధించిన విభాగాలుందేవి. అన్ని సెక్షన్లలోకి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. మా ఫ్రీడం మిగతా వాళ్లకి కాస్త అసూయగానే ఉందేది. ప్యారిస్ కార్నర్లో తప్పిన ముప్పు
నేను చేరిన కొన్నాళ్ళకే 'సౌత్‌జోన్ యూత్ ఫెస్టివలొకి త్రివేండ్రం వెళ్లాల్సివచ్చింది. అన్ని డిపార్దుమెంట్సు నుండి దాదాపు 40 మందిని సెలక్టు చేశారు. మా బెటాలియన్ హెడ్ కృష్ణారెడ్డిగారు. అక్కడ ప్రదర్శించడానికి *నా దేశం” అనే డ్రామాని తయారుచేసుకున్నాం. మైమ్‌లాంటి మరికొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. హైద్రాబాద్‌లో సాయంత్రం బయట్టెరి మ(ర్రోజు ఉదయానికి మద్రాసు చేరాం. త్రివేండ్రం రైలు హాప్ డేస్ = సీస్ ప్రముఖల విన్ననాటి తీసి గుర్తులు ఇ 36
న సాయంకాలం ఆరుగంటలకి... అంతవరకు ఏం చేయాలని సామాన్లు క్లాక్ రూమ్‌లో పడేసి రోడ్ల మీద పడ్డాం. నేను దగ్గర్లోని ప్యారిస్ కార్నర్‌కి వెళ్లి టైమ్‌పాస్ కోసం కీ చెయిన్ బేరమాడాను. కొట్టువాడు చెప్పిన దానికంటే బాగా తగ్గించి అడిగా - నేను అడిగిన ధరకి వాడు ఎలాగూ ఇవ్వడని ధీమా. వాడు సరే తీసుకో అనే సరికి బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వద్దులే అని జారుకోబోతుంటే వాడు నా చొక్కాపట్టుకుని కొంటేనే గాని వదలనని. కదిలితే కాల్చేస్తా అనే లెవల్లో చేతిలో ఒక టాయ్‌గన్ పట్టుకుని అరవంలో అరుస్తున్నాడు. ఇదెక్కడి పీడరా దేవుడా అని దిక్కులు చూస్తున్నాను. అలా వాది అదుపాజ్ఞల్లో ఎంత సేపు ఉండాల్సివచ్చేదో కాని అనుకోకుండా అటుగా వచ్చిన
మా మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ స్టూడెంట్ మాధవి, వాడ్ని దబాయించి నన్ను రక్షించింది. పంచా, లాల్చీ కండువా, స్పోర్ట్స్ షూ గణతంత్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి ముందు రాహ్లైల వారీగా తమ సంస్కృతిని చాటుతూ కదిలే శకటాల్లా త్రివేండ్రంలో వి.సి. రాష్ట్ర గవర్నర్‌లాంటి పెద్దల ముందు వివిధ యూనివర్శిటీలనుండి వచ్చిన మా విద్యార్థుల పరేడ్ ఉంది. రైలు లేటుకావడంతో మమ్మల్నందర్ని రైల్వే బాత్రూంల్లోనే స్నానాలు కానిచ్చెయమన్నారు. తెలుగు సంస్కృతిని చాటేలా తెల్లని పంచె, లాల్చీ, మెడలో కండువా, కాళ్లకి షోలాపూర్ చెప్పుల్లాంటివి ధరించి స్టేషన్లో దిగాం. అక్కడంతా లుంగీలు పైకెత్తి తిరిగే రకాలే కదా... మా (్రెస్‌కోడ్‌ను చుట్టుపక్కల వాళ్లంతా వింతగా చూస్తుండగా పరుగు పరుగున యూనివర్శిటీకి చేరి అప్పటికే మొదలయిన పెరేడ్‌లో మా బానర్‌ను రెపరెపలాడిస్తూ గుంపులో కలిసిపోయాం. మాలో శివ అనేవాడు చెప్పులతో కాకుందా పంచెకట్టు విత్ స్పోర్ట్ షూస్‌తో, అదీ మేజోళ్లు లేకుండా పెరేడ్‌లో పాల్గొనడం కొసమెరుపు. అంతా నారికేళ తైల పరిమళం ఓపెనింగ్ సెర్మనీ పూర్తిచేసి డార్మెటరీకి వెళ్లేసరికి రాత్రి పదకొండున్నర. ఉదయం రైల్లో తిన్న టిఫిన్... మధ్యాహ్నం భోజనం లేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అన్నమో రామచంద్రా అని అంకమ్మ శివాలెత్తితే చివరికి అందర్నీ వరసగా కూర్చోబెట్టి అరిటాకులు పరిచి, ఒక గిన్నెతో అన్నాన్ని మా విస్తట్లో కొట్టుకుంటూ వెళ్లాడొకడు. అవి మెతుకులో మార్చుల్చో అర్ధం కాలేదు. చూడగానే ఆకలి చచ్చిపోయింది. మెతుకులతో గోలీలాట మొదలెట్టేశారు కొందరు. దానికి తోడు కొబ్బరినూనె గుబాళింపు కూరలు... కడుపులో దేవేసింది. మజ్జిగ మాత్రం తాగేసి ఆ పూటకి గడిపేశాం. మర్రోజు టిఫిన్‌కి ఉవ్మా. అదీ కొబ్బరి నూనెతోనే. పక్కన ఉదకేసిన పెద్ద అరటిపండు, దాంతో నంజుకోడానికి పంచదార. వేర్లు వేసి కాచిన నీళ్లు. మరోసారి త్రివేండ్రం ధ రాకూడదనిపించే వికారం కలిగింది అందరికీ. గొరుసు జగదీశ్వర రెడ్డి + 37
పరువు కాపాడిన శ్రవణ్ [
నేను మైమ్ యాక్టింగ్ చేయాల్సి ఉంది. హైద్రాబాద్ నుండే మైమ్ మ్యూజిక్‌ని కేసెట్‌లో రికార్డింగ్ చేసుకుని తీసుఇళ్ళాం. సరిగ్గా మైమ్ చేస్తుండగా కరెంటు పోయింది. ప్రేక్షకులు అరిచే లోపే కరెంటు వచ్చిందికాని దురదృష్టం కొద్దీ క్యాసెట్ రీలు టేప్‌లో చుట్టుకుపోయింది. సౌండ్ లేకుండా మైమ్ చేయడం ఎలా? మిత్రుడు శ్రవణ్ అప్పటికప్పుడు అక్కడున్న మైక్ అందుకొని సౌంద్స్‌ని మిమిక్రి చేయడంతో అభాసుపాలు కాకుండా బయటపడ్డాను. తర్వాత 'నా దేశం) డ్రామాని విజయవంతంగా ప్రదర్శించాం. డ్రామా అనంతరం వాళ్లనీ వీళ్లనీ అడిగి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్తారెంటుకు చేరుకున్నాం. హమ్మయ్య కనీసం ఈ రోజైనా కడుపునిండా తిందాం అనుకున్నాం కానీ అక్కడా కొబ్బిరినూనె పరిమళమే... కడుపులో తిప్పటమే తరువాయి.
మరోసారి బెనారస్ హిందూ యూనివర్శిటీలో జరిగిన యూత్ ఫెస్టివల్‌కి వెళ్లాం. అక్కడికి ఇండియాలోని అన్ని యూనివర్శిటీల కళాకారులు వచ్చారు. విపరీతమైన చలిని జీవితంలో మొదటిసారిగా అనుభవించానక్కడ. పెరేడ్‌కి వి.సి., హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ లాంటి పెద్దలందరూ వచ్చినా 'స్తూడెంట్స్ యూనియన్ (పెసిడెంటొ వచ్చేవరకు ్రోగ్రాంని వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగించింది. యూనియన్ (ప్రెసిడెంట్ 'హవాకి ముచ్చటేసింది. డిగ్రీ పూర్తయ్యేలోపు కాలికట్స్ గుల్బర్గా లాంటి పలు యూనివర్శిటీల్లో జరిగిన ఫెస్టివల్స్‌లో పాల్గొని నాటకాలు ప్రదర్శించాం. రెండు పడవలపై ప్రయాణించలేకపోయా
పి.జి. కోసం సెంట్రల్ యూనివర్శీటీలో చేరానే గాని అప్పట్లో దూరదర్శన్‌లో బాగా అవకాశాలు రావడంతో (ఆ సీరియల్స్‌లో నటించినప్పుడే సుమతో నా తొలి పరిచయం) తరచూ అబ్సెంట్ అయ్యేవాణ్ణి. అటెందెన్స్ సరిపోకపోయేది. రెండు పడవలపై ప్రయాణించలేక కాలేజీ వదిలేశాను. మరుసటి సంవత్సరం మళ్లీ రిటన్ రాసి చేరాల్సి వచ్చింది. సెంట్రల్ యూనివర్శిటీలో అంతర్వాహినిలా కొంత రాజకీయం నడిచేది. కొందరు ప్రొఫెసర్లు సమయం దొరికితే నన్ను తొక్కేయాలని చూసేవారు. కావాలని మార్కులు తక్కువ వేసేవాళ్లు. పైగా వారంతా నాన్నకు బాగా తెలిసినవారు కావడం ఆశ్చర్యం. అయినా వాళ్లకు దొరక్కుండా తప్పించుకున్నాననుకోండి. పిజి కోర్సులో పెద్దిరామారావు నేను ఒకేసారి చేరినా నేను దిస్మంటన్యూ చేయడంతో తను నాకంటే సీనియర్ అయ్యారు. మేమంతా కలిసి యజ్ఞం, చివరిగుడిసె లాంటి కథల్ని నాటకాలుగా వేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తుందేవాళ్ళం. గుర్తు చేసుకున్నప్పుడంతా గొప్ప ్రిల్‌గా ఉంటుంది.
(05 ౧4 20222 ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 38
( ్ఞ్థా | శ్రీఠాంత్ టాం ఆట రాకుండానే గోల్‌కీపర్‌నయ్యా వ పొా(తతలోనైనా ఒదిగిపోతూ ఆబాలగోపాలానికీ చేరువయ్యే బాద్రాగోపాళం ఆయను పరిచయ వాక్వాలు అక్కర్లేని అందాల నటుదే కాదు, నూనూగు మీసాలనాదే నినిమా వీరో అయిపోదామని ఊవాల్లో తేలిపోయి చెన్నవట్నం పారిపోయిన థునుదు కూదా. 'వీపుల్స్ ఎన్‌కౌంటలోతో నినీ అరంగే(టం చేనీ “అమె” “తాజమవాలొ పెల్లినందదీ+ 'ఖద్దం% ఎగిరేపావురమా, తాళి, కన్వాదానం, నిన్నే (ప్రేమిస్తా “ఒట్టేసి చెబుతున్నా? “విరోధి? నుంది నిన్నటి శ్రీరామరాజ్యం” వరకు శతాధిక చిత్రాల్లో నటించి తన 'ఊవాని నిజుం చేసుకున్నారు. అందరికి మామూలు కలలొస్తే నాకు మాత్రం ఈస్ట్‌మెన్ కలర్లో సినిమా కలలొచ్చేవి. అదేం చిత్రమో అందరికీ గుండె “లబ్ డబ్ - లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండెమాత్రం “సినిమా సినిమా అని కొట్టుకునేది. మా పొలం దగ్గర చేనుకి కావలికి వెళ్లిన రాత్రుళ్లు... మంచెమీద పడుకుని ఆకాశంలో (సితారల్ని లెక్కపెడుతూనే, ౮ మేఘాలమాటున దోబూచులాడే విమానాల్ని కూడా తదేకంగా చూసేవాణ్లి. “ఆ యిమానంలో ఎవురుందారయ్యా? అని మా పాలేర్లు అడిగితే 'ఇంకెవురా, సినిమా గొరుసు జగదీశ్వర రెడ్డి + 39
జూ
యాక్షర్లు.. అదిగదిగో అందులో ఉన్నది చిరంజీవిగారే' అని చూసినట్టు ఠపీమని (4 చెప్పేవాణ్ణి. సినిమా హీరోలు తప్పించి మరో మనిషి ఆకాశయానం చేయలేదనే నా అమాయకత్వాన్ని మా పాలేర్లు కూడా నమ్మేంతగా ఊరించి చెప్పేవాజ్ణి. హీరోవైపోదామని మద్రాసు పారిపోయా
నా బాల్యం, కౌమార్యం, యౌవనారంభం కర్షాటకలోనే గడిచింది. 5 దశాబ్దాలకు పూర్వమే ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చి గంగావతి సమీపాన బసవపట్నంలో సెటిలైన వ్యవసాయ కుటుంబం మాది. గొట్టిపాటి వెంకటరత్నం హైస్కూల్లో “టెన్త్ ప్యాసవగానే ఎడ్యుకేషన్ సెంటర్‌గా పేరుపొందిన ధార్వాడ్‌లో ఇంటర్ చదివేందుకు పంపించారు నన్ను. కొంతమంది మిత్రులతో కలిసి రూమ్ తీసుకుని ఉండేవాణ్ణి. ఇంగ్రీషు మీడియం. ఏమీ అర్ధమయ్యేది కాదు. అతి కష్టంమీద రెండు నెలలు ఓపికపట్టాను. ఏం చేయాలో తోచక 20 కిలోమీటర్ల దూరంలోని హుబ్లి వెళ్లి ఏకబిగిన కన్నడ, తెలుగు సినిమాలు చూస్తుండేవాణ్లి. ఒకానొక ముహూర్తంలో చదువు, మనకబ్బదని నిర్ణయించుకుని (3 నెలలు పూర్తవకుండానే) గప్‌చుప్‌గా ఇంటికి వచ్చేసి దొరికినన్ని డబ్బులు జేబులో “ వేసుకుని ముందూ వెనకా ఆలోచించకుండా “చలో మద్రాస్ అంటూ రైలెక్కేశాను. స్టూడియో గేట్లు తొక్కనివ్వలేదు
మద్రాసు సెంట్రల్ చేరగానే హీరో దర్జాతో ఒక లాడ్జిలో దిగాను. ముందురోజు ఆటో మాట్లాడుకుని ఎ.వి.ఎం. స్టూడియో, తర్వాత రోజు మరో స్టూడియోకి వెళ్లాను. చిరంజీవిగారు ఎక్కడైనా షూటింగులోఉంటారేమో, నా మనసులోని మాట చెప్పి సినిమాల్లో చేరిపోవచ్చనే అమాయకత్వం. చిరంజీవిదాకా ఎక్కడ, స్తూడియో గేటులోపలకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. బెట్‌డోర్ షూటింగ్స్ మెరీనా బీచ్‌లో జరుగుతాయని తెలిసి అక్కడ మనల్ని అద్దుకునే వాళ్లు ఉండరని వెళ్లేవాడిని. ౩ రోజులు గడిచాక చెన్నపట్నంలో ఎన్నాళ్లున్నా లాభం లేదని, హీరోనవడానికి ఇది సరైన సమయం కాదని నాకు నేను సర్దిచెప్పుకుని తిరిగి బసవపట్నం చేరుకున్నా.
అప్పటికే ఇంట్లో అంతా అల్లకల్లోలం. బయట నాన్న తమ్ముడు నా కోసం కంగారుగా వెతుకుతుంటే ఇంట్లో అమ్మ శోకాలు, నన్ను చూడగానే 'హమ్మయ్యః' అని ఊపిరి పీల్చుకున్నారు. ధార్వాద్‌కు మళ్ళీ వెళ్లనని మొరాయించా. సరే వాళ్లు మాత్రం ఏమంటారు? మళ్ళీ పారిపోకుండా తమ కళ్ళముందు ఉంటే చాలనుకన్నారు. కొన్నాళ్ళపాటు అక్కవాళ్ళింటికి విజయవాడకు వెళ్ళి అక్కడే ఉన్నాము. తర్వాత సంవత్సరం మాకు 40 కిలోమీటర్ల దూరంలోని హోస్పేట్‌లో మళ్ళీ ఇంటర్‌లో చేరా. తమ్ముడు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తుల * 40
గ్ర నాకంటే ఒక సంవత్సరం జూనియర్‌గా ఉండేవాడు. నేనొక సంవత్సరం ప్ర చదవకపోయేసరికి నాతో సమానమయ్యాడు. హోస్పేట్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని స్ద అమ్మ, నేను, తమ్ముడు ఉండేవాళ్లం. అమ్మ, తమ్ముడు తోడుగా ఉండటంతో మళ్లీ పారిపోవాలన్న ఆలోచన మాత్రం రాలేదు. అబద్ధమాడి జట్టులో చేరా తమ్ముడు ర్యాంకు స్పూడెంటే కాని నా స్కోరు మాత్రం 50, 60 శాతం దాటేది కాదు. సినిమా ఛాన్సు ఎలాగూ లేదు, కనీసం స్పోర్ట్స్ లోనైనా నా ఉనికి చాటుకోవాలని ఉండేది. పుట్‌బాల్ టీమ్‌కి మూర్తి అని కెప్టెన్ ఉండేవాడు. ఆయన వద్దకు వెళ్లి టెన్స్‌లో నేనో గొప్ప పుట్‌బాల్ ప్లేయర్‌నని అబద్ధమాడి జట్టులో చేర్చుకోమన్నాను. నిజానికి పుట్‌బాల్ గురించి ఓనమాలు కూడా తెలీవు నాకు. గోల్‌కీపర్‌గా వున్న వాడు బాల్‌ని లోనికి రాసియకుండా చూస్తాడని మాత్రం తెలుసు. ఆ మాత్రం నేను పట్టుకోలేనా అని నా ధీమా. రెండు రిహార్సల్ టెస్టులు పెట్టాడు. ఒక్క బాల్ కూడా 'ఇన్” అవకుండా క్ అద్దుపద్డా. నాపై నమ్మకం ఏర్పడి టీమ్‌లోకి తీసుకున్నాడు. అలా గోల్‌కీపర్‌గా సక్సెస్ అయిపోయా. ఆ వరుసలో క్రికెట్ లాంటి మిగతా ఆటల్లో కూడా నా సత్తా చాటుకునేవాణ్డి. మాది కో-ఎడ్యుకేషన్ అయినా అమ్మాయిల విషయంలో వేరే ఆలోచనలు వచ్చేవి కాదు. ఇంటర్ పాసయ్యాక తమ్ముడు సూరత్మల్‌లో ఇంజనీరింగ్‌కి వెళ్తే, నేను నా మాజీ ధార్వాడ్ కాలేజీకి వెళ్లి బికాంలో చేరిపోయాను. నా ఇంటర్ (ఫెండ్స్ మళ్లీ నాకు జతవడం చాలా సంతోషం కల్పించింది. పేమ రాయబారం అప్పట్లో అమ్మాయిలను టీజ్ చేయడం నాకు తెలిసేది కాదు. కానీ మా మిత్రుడు దినేష్ గురించి ఒక (ప్రేమ వ్యవహారంలో తలదూర్చాల్సి వచ్చింది. సచిన్ అనే స్టూడెంటు ఒకమ్మాయిని లవ్ చేశాడు. వాళ్లిద్దరూ పెళ్లిచేసుకునేదాకా వెళ్లడంతో అమ్మాయి తరపువాళు
- రంగంలోకి దిగారు. నిజానికి వాళ్లిద్దరిదీ ఒకే కులం కాని గోత్రమో, తెగో అద్దొచ్చిందట. = వాళ్లు (ప్రేమించుకోడానికి దినేషే మూలకర్తని అమ్మాయి తరపువాళ్ల అనుమానం. మనుషుల్ని పెట్టి కొట్టించడానికి నిర్ణయించుకున్నారట. నా రూమ్‌మేట్స్‌తో విషయం చెప్పి దినేష్‌కి సపోర్ట్‌గా వెళ్లామన్నాను. నా రూమ్ మేట్స్‌తో విషయం చెప్పి వినేష్‌కి సపోర్ట్‌గా వెళ్ళామన్నాను. అది వాళ్లు వాళ్లు తేల్చుకుంటారు. మధ్యలో మనమెందుకని తప్పించుకున్నారు వాళ్లు. ఒక మునిమాపులో దాడి చేయడానికి హాకీ స్టిక్స్‌తో బైకులమీద వచ్చారు. నేను ధైర్యంగా వెళ్లి 'ప్రేమించుకున్నది వాళ్లిద్దరు. మధ్యలో దినేష్ గొరుసు జగదీశ్వర రెడ్డి శ 41
తప్పేముంది?వీడి మీద ఒక్క దెబ్బ పద్దా మీలో ఇద్దరు లేచిపోతారని సవాల్ చేశాను. అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలీదు. నా మాటతో కాస్త వెనకడుగువేశారు. అలా వాడి తరఫున పెద్దమనిషిలా వకాల్తా పుచ్చుకుని సమస్య పరిష్కరించడం ఎప్పుడు గుర్తుకువచ్చినా నవ్వొస్తుంది. పార్టీ ఇచ్చి భోరున ఏడ్చాడు
(ప్రేమో, ఆకర్షణో తెలీదు కానీ డిగ్రీ ఫైనల్లో ఉండగా ఒకమ్మాయిని బాగా ఇష్టపడేవాదిని. తను చాలా అందంగా, కోమలంగా, అచ్చం చందనం బొమ్మలా ఉందేది. తరచూ ఐ లవ్‌యూ చెప్పెద్దామని అనిపించేది. మెల్ల మెల్లగా దగ్గరవ్వాలనుకుని స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌లో క్యారమ్స్ పార్టనర్‌గా ఉండమన్నాను. తను ఒప్పుకుంది. నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యేంతలోపే బసవరాజు అనే మిత్రుడు వచ్చి నాకో హెల్ప్ చేయి గురూ, ఆ అమ్మాయి నీతో క్యారమ్స్ ఆడుతుంది కదా, తనంటే నేను పడి చసాను. మా ఇద్దరినీ కలుపు ప్లీజ్ అన్నాడు. ఆ మాటతో షాక్ తిని, వెర్రిచూపులు చూసి, చివరికి సరే అన్నాను. ఏద్వలేక నవ్వుతూ, ఆ అమ్మాయిని వొప్పించి, దినేష్ వాళ్ల హోటల్లో కలిసేట్టుగా అరేంజ్ చేశా. వాళ్లిద్దరూ హోటల్లో ఒక మూలగా కూర్చుని మాట్లాడుకుంటున్నంతసేపూ “వాడి ప్రపోజల్‌ని ఆ అమ్మాయి ఒప్పుకోకుండా చెయ్యి దేవుడా అని జపం చేస్తూనే ఉన్నా గంట తర్వాత వాడొచ్చి 'రేపు పార్టీరా అనేసరికి తెల్లటోయా. మర్రోజు అన్యమనస్కంగానే పార్టీలో కూర్చున్నా. కొద్దిసేపు తర్వాత బసవరాజు నిజం కల్కేస్తూ “గృగ్రూ తను ఒప్పుకోలేదం'ిటూ భోరున ఏడ్చేశాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఇదాంక్ గాద్” అనుకున్నాను. కొసమెరుపు ఏంటంటే ఆ అమ్మాయి మా ఇద్దర్నీ కాదని మరొకరిని డుమించడం! తరచూ గోవా వెళ్లేవాళ్లం
ఫైనలియర్‌లో కాలేజీదేకి ఒక హిందీ సాంగ్ గ్రూప్ డాన్స్‌లో పాల్గొని కోలాటం ఆదాను. అదే నేను తొలిసారిగా స్టేజ్ ఎక్కడం, గుంపులో గోవిందలా కాకుండా నా పహ్పూర్మెన్స్ నచ్చి నన్ను వరసలో ముందుంచేవారు. కొన్నాళ్లు కరాటే కూడా నేర్చుకున్నాను. ఉందేది రూమ్‌లో అయినా వంట పని ఉందేది కాదు. మూడు పూటలా మెస్‌లోనే తిండి. కాకపోతే బట్టలు మాత్రం ఎవరికి వాళ్లం ఉతుక్కునే వాళ్లం. ఆదివారం వచ్చిందంటే ఎక్కడో పిక్నిక్ వేసేసేవాళ్లం. గోవా మాకు వంద కిలోమీటర్ల దూరమే కాబట్టి తరచూ (ఫెంద్స్‌తో వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ గడిపేవాళ్లం. ఇలాంటి హ్యాపీదేస్ చేజారిపోతే మళ్లీ రావన్నట్టుగా ఇంటినుండి తెచ్చిన డబ్బులన్నీ వారం రోజుల్లోనే ఖర్చుచేసి, మళ్లీ డబ్బులకోసం ఉత్తరాలు రాస్తుండేవాణ్ణి. హ్యాట్ డేస్ = సిన్ ప్రముఖల చిన్ననాటి తీన్ గుర్తులు + 42
ఒకప్పుడు ధార్వాడ్‌లో చదువుకోడానికి భయపడి, మద్రాసు పారిపోయిన నేను తిరిగి అదే కాలేజీ నుండి డిగ్రీ తీసుకోవడం గర్వంగా ఉంటుంది. కాలేజీ వదిలేసి వచ్చేప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్లి మా ఆత్మీయతను కలబోసుకుని, కన్నీళ్లతో వీడ్కోలు చెప్పుకున్నాం.
మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో... డిగ్రీ చేతికి రాగానే కొన్నాళ్లపాటు అకృవాళ్లింట్లో ఉండి అక్కడ్నించి సినిమా ప్రయత్నాలు చేసానని, సక్సెస్ కాకపోతే వచ్చి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయినవుతానని ఇంట్లో చెప్పేసి విజయవాడ చేరాను. అక్కడ్నుంచే 'అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌కి అప్లయ్ చేశాగానీ సీటు రాలేదు. తర్వాత హైద్రాబాద్ వచ్చి “మధు ఫిలిం ఇనిస్తూట్యూట్‌లో వి. మధుసూదనరావుగార్ని కలిశాను. రెండు నెలల పాటు వచ్చి క పరిశీలిస్తూ ఉండమన్నారాయన. కొన్నాళ్లు వెళ్లి కొంత నేర్చుకున్నాక, నా పర్‌ఫార్మెన్స్ చూసి వారే నీకిక శిక్షణ అక్కర్లేదు, సినిమాల్లో ప్రయత్నించు అని చెప్పేశారు. అమీర్‌పేట 'చర్మాస్ వెనకుండే రామకృష్ణ అపార్ట్‌మెంట్స్‌లో మరో ముగ్గురితో కలిసి ఉండేవాణ్ణి. కేవలం సినిమా ఛాన్సులకోసం తిరగాలికాబట్టి ఒక బైక్ కొనుక్కున్నాను. మధు ఫిలిం 7. ఇనిస్టిట్యూట్‌లో సర్టిఫికెట్ తీసుకోకుండానే ఉషాకిరణ్ వారి “పీపుల్స్ ఎన్‌కౌంటర్'లో నటించే అవకాశం వచ్చింది. ఇక్కడ ఫెయిలై ఉంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలాగూ ఉండేదనుకోండి! అన్నట్టు ఈ మేదేనాడు ధార్వాడ్‌లో మా పూర్వ విద్యార్థులమంతా
కలిసి కబుర్లు చెప్పుకోబోతున్నాం. (15. 042012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
| తపా ల స న ౧ ల శ॥ శ ౯ అనంతత్రీరామ్ నా పెరడి దెబ్బకు సన్మానం కాన్సిలయ్యింది వరపతి 'ర్వాంకు'లకు పెద్దపీట వేసే కార్పొరేట్ కాలేజీలపై కినుక వపొంచి తన 'న్వోవీదేస్‌ఐి మధ్యలోనే వదిలేసి చిత్ర రంగం వైవు అదుగులు వేసిన అభిమానధనుదాయన. మాటా మాటా కూర్చి వొటల్ని మాలలుగా కట్టదంలో అందెవేసిన వేల్లాయనవి. “అప్పుదో ఇపుడో ఎవుదో కలగన్నానే చెలి” (బొమ్మరిల్లు), 'వరారే పరారే వవ్పువ్స్ వరారే” (స్పాలిన్స), 'రబ్బురు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే” (యమదొంగ), 'నమ్మవేమోగానీ అందాలా యువరాణీ” (పరుగు), 'తెలుగమ్హూయి తెలుగమ్మాయి” (యర్వాదరామన్న, ిజుంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? (కొత్త బంగారులోకం) లాంటి కుర్రకారుని కేకలు పెట్టించి, స్టెప్పులేయించి, ళివాలెత్తించే పసందైన వందలాది పాటల్ని తన ఖాతాలో దాచుకున్నవర్తమాన యువకవి అనంత శ్రీరామ్. బతకదానికి ఉద్యోగం చేయాలని, అందుకు చదువొక్కటే ఎకైక మార్దమనే గుడ్డి నమ్మకంతో పాలకొల్లుకి 18 కి.మీ. దూరంలో ఉందే “'దొడ్డిపట్లు నుంది అమాయకత్వాన్ని మూటగట్టుకుని విజయవాడ గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజీలో చేరానొకనాడు. టెన్స్ వరకు ఊరి పొలిమేర దాటి ఎరుగని నాలో ఏదో తెలియని ఇ భయాన్ని ఆసక్తిని కలిగించిన వాతావరణం అది. హాస్టలు, కాలేజీ పక్కపక్కనే జంట హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 44
జైళ్ళలా కనిపించేవి. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన రకరకాల విద్యార్థుల హంగామా... 'ఒర్లకు ఒర్లకు, '“ఒల్లకుండు), “ఏం జేస్స్పండావు?” 'గమ్మునుండు” 'అత్తాండత్తాండిలాంటి అప్పటిదాకా చెవికి సోకని కొత్త కొత్త మాటలు.... నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుండేవి. ప్రథమ శత్రువు వార్డెనే
మా హాస్టల్ గది గురించి చెప్పాల్సివస్తే 14412 పొడవు, వెడల్పులతో కుడి ఎదమలుగా ఐదేసి ఇనుప మంచాలతో కిక్కిరిసిపోయి. ఉండేది. రూమ్‌కి 10 మంది చొప్పున ఒక్కో ఫ్లోరులో 120 మంది విద్యార్థులం ఉండేవాళ్లం. ఎనిమిది స్నానాల గదులు. ఎవరి బకెట్‌పై వాళ్ల పేరున్న స్టిక్కరు విధిగా ఉండాల్సిందే. సరిగా ఉదయం 4-45కి రేకుల తలుపులపై కర్రతో దడదడ బాది నిద్రలేపే వార్దెనే మా ప్రథమ శత్రువు. బ్రష్ చేసుకోడానికి పొడవాటి సింక్. అందులో 20 కొళాయిలు. నీరు వెళ్లే బెజ్జం మూసుకుపోయిందంటే మా పేస్టు నురగలతో బాత్‌టబ్‌ని గుర్తుచేసేది. గబగబా బ్రష్ కానిచ్చి స్నానానికి లైన్లో నిలబదేవాళ్లం. 6 గంటలకే మొదటి క్లాసు ప్రారంభం
కాబట్టి ఆ లోపునే స్నానం చేసేయాలి. లేదంటే క్లాసులో నిద్ర ముంచుకొచ్చిది. కునికిపాట్లు
పద్డామంటే లెక్చరర్ చేతిలోని చాక్‌పీసు రెండు ముక్కలై మా ముక్కుకో, చెవికో, తలకో ఉండేలు దెబ్బలా వచ్చి తగిలేది. కారిడార్లో అందరం రాత్రి పదిన్నర వరకు కుర్చీ బల్ల చెక్కపై పుస్తకం పెట్టి చదవాలి. పహారా కాసే మా ట్యూటర్ రూలు కర్ర నిద్రపోయేవాజణ్ణి వెంటనే పసిగట్టి వీపుపై తధిగిణతోం అఆదేది.
రాత్రి ఒంటిగంటకు మధ్యలో నిద్రలేచి బకెటుని బాత్రూం దగ్గర లైన్లో పెట్టి వచ్చి మళ్లీ వడుకునేవాణ్సి. కానీ బలవంతుడిదే రాజ్యం కదా మధ్యలో దూరిపోయేవాళ్లు కొందరు. దేవుడు వాళ్లకి బలమిస్తే నా లాంటి బలహీనులకి తెలివిస్తాడు కదా! కసికొద్దీ బయట గొళ్లెం పెట్టేసే వాణ్ణి, కోపంతో రేకుల తలుపుల్ని తన్ని తన్ని గొళ్లాలు ఊదడగొటైవాళ్లు. కుండ బద్దలైంది - గూబ గుయ్యిమంది
ఇంటర్వెల్‌లో మాత్రం మా కోతిమూకకి కొద్దిపాటి స్వెచ్చ లభించేది. పొడవాటి కారిడార్ పై కప్పుకు ఆధారంగా ఉండే ఇనప రాడ్‌కి వేలాడుతూ ఆ చివరనుండి ఈ చివర వరకు కోతి కొమ్మమీద పాకినట్టు గాలిలో నడిచేవాళ్లం. ఎవరు తక్కువ సమయంలో
; వెళ్తే వాళ్లు గెలిచినట్టు. అదే హాల్లో ఒక మూలన మంచినీటితో పెద్ద కుండ ఉండెది.
దాన్ని ఎత్తడానికి పందెం వేసుకున్నాం ఒకరోజు. కిరణ్ అనే మిత్రుడు పైకెత్తగానే
ఎప్పుడొచ్చారో ఎదురుగా మా ఎం.డి.ఇఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు క్షణాల్లో కుండ భళ్లు భళ్లు. మాతో '“బల్లే బల్లే' ఆడిస్తాడని భయపడిపోయాం. కానీ అందర్నీ క్లాసుకు పిలిచి “విద్యార్థులు - క్యారెక్టరు” అనే అంశంపై మా గూబలు వాచిపోయి చెవినుండి రక్తాలు కారేదాకా ఉపన్యాసం ఇచ్చి వదిలేశారు.
పేలిన పేరడి - కూలిన సత్కారం
ఆగస్టు 15, జనవరి 26 లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తూ మంచి పేరు కొట్టేయడంతో కొంత వి.ఐ.పి. గుర్తింపు వచ్చెసింది నాకు. ఫస్ట్ ఇయర్ వార్షికోత్సవం సందర్భంలో నాకు సన్నాన కార్యక్రమం కూడా ఉందని తెలిసి మేఘాల్లో తేలిపోయి, ఆ సంతోషంలో సింధూరం) సినిమాలోని 'హాయ్‌రే హాయ్ - జాంపండు రోయ్” అనే పాటకి పేరడీ రాశాను.
“హాయిరే హాయ్... సాంబారు రోయ్... ( నీళ్లు బాగ కలిపినారు రోయ్
ఏం పెరుగురా.. ఎంత పులుపురా
వేసుకుంటే నోరు పులిసెరా
అయ్యబాబాయ్!”
..అంటూ మెస్‌లో పెట్టే బంగాళదుంపల్ని గులకరాళ్లని, బెండకాయల్ని బొగ్గుముక్కలని, పూరీలను అప్పడాలని.. ఇడ్లీలను బస్సు టటైరుకింద పెట్టినా పగలని రాళ్లని.... ఇలా రెచ్చిపోయి స్తూడెంట్స్ ఈలల మధ్య బ్రహ్మాండంగా పాడేశాను. మేం పెట్టిన తిండిపై ఇంత వెటకారమా అని పళ్లు నూరి, గుడ్లు ఉరిమి సత్నారం కౌన్సిల్ అన్నారు. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక గాలివానతో ఢమాల్ అన్నట్టయింది నా పరిస్థితి. మూడు 'పద్మల కైవసం
ద్యామేజైన నా ఇమేజ్‌ని తిరిగి తెచ్చుకోడానికి ఫస్ట్ ఇయర్‌లో 90 శాతం మార్కుల్తో ప్యాసయ్యాను. విద్యార్థుల పర్ఫార్మెన్స్ నచ్చితే మా ఎం.డి. గారు రూపాయి నోటుపై తన సంతకం చేసి ఇచ్చేవారు. ఆ రూపాయి సంపాదించిన విద్యార్ధి పద్మభూషణ్ పురన్నారం పొందినంతగా ఫీలయిపోయేవాడు. ఒకసారి అనర్హకంగా ఉపన్యాసం ఇచ్చి మొదటి రూపాయి సంపాదించా. అలా మొత్తం 38 రూపాయలు సంపాదించడంతో మళ్లీ వి.ఐ.పి. ని అయిపోయాను. సెకండియర్ వార్షికోత్సవంలో తెలుగులో ఉపన్యసించే సరికి మా మరో డైరెక్టరు వైఎన్‌ఆర్ గారు వెయ్యి రూపాయల నోటుపై సంతకం చేసి హ్యాపీ డేస్ - సిన్ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుప్తలు + 46
. ఇవ్వడం ఓ మధురమైన జ్ఞాపకం.
వామ్మో ! ఏం సమయస్ఫూర్తి బాబోయ్ !
ఇంటర్మీడియట్ పూర్తయ్యాక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీకి మకాం మారింది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన అధునాతన కాలేజి మాది. చివరి క్లాసు చెప్పె మార్స్ లెక్చరర్ రత్నకుమారిగారు ప్రతిరోజు క్షాసుని 5 నిమిషాలు ఆలస్యంగానే వదిలేవారు. ఎక్కడో మూల నుండే మా కాలేజీ బస్సుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్లెసరికి సీట్లు ఉందేవి కావు. రోజూ నిలబడవలసి వచ్చేది. జన్నకో శివరాత్రి అన్నట్టు ఒకరోజు 5 నిమిషాలు ముందే క్లాసు వదిలేశారు. ఈరోజు ఎలాగైనా బస్సులో సీటు సంపాదించాలనుకుంటూ బయటకు వచ్చా. మా మేడమ్ మెట్లు దిగుతూ కన్పించారు.
ఆవిడ ముందు నడుస్తుంటే నేను వెనక. ఆవిదని దాటుకుని వెళ్లడం బాగోదని ఆవిడ
వెనకాలే నడుస్తున్నాను. హఠాత్తుగా వెనక్కి తిరిగి 'ఫాలో అవుతున్నావా?” అంది. షాక్ తిన్నాను. “లేదు మేడమ్ బస్‌కోసం' అన్నాను తడబడుతూ. 'నేనడిగింది క్లాసులో లెసన్స్ ఫాలో అవుతున్నావా అని” అంది. ఆవిడ సమయస్సూర్తికి కంగు తిని వామ్మో అనుకున్నా. వెంకటేశ్వర “గుడిలో ఏముంది?
మా మెస్‌కు దగ్గర్లో వెంకటేశ్వర అనే థియేటర్ ఉండేది. దాంట్లోకి వచ్చేవన్నీ అళ్లీల చిత్రాలు. వాటికోసం కాలేజీ ఎగ్గొట్టి మరీ దూరేవాళ్లం. లోపల ఒకడికి తెలియకుండా ఒకడు కనిపించేవాడు. అమ్మో! బయట స్వాతిముత్యంలా కన్పించే వీడు కూడా “వెంకటేశ్వర గుడికి” వచ్చేవాడేనా అని నోరెళ్లబట్టేవాళ్లం. మేమంతా ఆ టాకీసుని ఆ పేరుతో పిలిచే వాళ్లం. గుడికి వెళ్లినప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్లేవాళ్లమో వచ్చేప్పుడు అంత నీరసంతో బయటికి వచ్చేవాళ్లం. ఎంచేతనంటే వాటిల్లోని శృంగారం అంతా 'నేతిబీరు చందమే కాబట్టీ.
బాపట్లలో చిత్రమైన రిక్షాలుందేవి. రెండు చక్రాలపైన ఒక బల్లచెక్క - సిమెంటు బస్తాల్లా నాలుగు మూలలా నలుగురు కూర్చునేవాళ్లం. ఆ రిక్షాలు బాపట్ల, చీరాలల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక రథాలు. ఒకసారి మా (ఫైండ్ ప్రియాంక చున్నీ ఆ రథచక్రంలో చుట్టుకుని, తృటిలో తప్పిన ప్రమాదం ఇప్పటికీ గుర్తుంది.
అప్పటికే పాటలు రాసే అలవాటు ఉండేది. బాపట్లకి తూర్పున 8 కి.మీ దూరంలోని సూర్యలంక బీచ్‌కి ఒక్కడినే వెళ్లి పాటలు రాసుకునేవాణ్డి. ప్రకృతి రమణీయంగా ఉండేవి. మాలో ఎవరిదైనా బర్త్‌దే జరుపుకోవాలంటే సైకిళ్ల మీద వెళ్లి ఇసకలో ఉండే నాటు పడవల్లో కేక్ కట్‌చేసి ఎంజాయ్ చేసేవాళ్లం.
ళీ
ఆఅవరించిన నైరాశ్యం
కార్తీకమాసంలో కులాల వారీగా పిక్‌నిక్‌లకు వెళ్లడం, ఆ కులానికి సంబంధించిన ఊరి పెద్దల్లో ఒకర్ని గెస్ట్‌గా పిలవడం విద్యార్థులకు అనవాయితీగా ఉందేది. అంతే కాదు తమ కులం హీరో సినిమా విడుదలైతే భారీ ఎత్తున బాణాసంచా కాల్చేవారు. కులానికి సంబంధించిన ఉత్సవాలకు పిలిచేవారు కాదు గానీ తమ హీరో తరపు సినిమా బ్యానర్లపై రాసే రాతల కోసం మాత్రం నన్ను ఆశ్రయించేవాళ్ళు.
స్టూడెంట్స్‌లోని కళని బయటికి తీసే ఉద్దేశ్యంతో మా ఫెంద్ వంశీతో కలిసి “స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ఒకటి స్తాపించాను. ఆ క్రమంలో కొన్ని ప్రోగ్రాంలు
థి
తయారుచేసేవాళ్ళం. ఒకసారి 'జార్జిబుష్ రూపకం వేశాం. అనుకోని పరిస్థితుల్లో జార్జిబుష్ వేషాన్ని ఒక అమ్మాయితో వేయించాల్సి వచ్చింది. నా బట్టల్నే ఆమెకు యిచ్చాను. “బట్టలు ఉతికే ఇచ్చిందంట్రా? అని ఆట పట్టించేవాళ్లు మా కోతిమూక.
ఎవరితోనైనా పాడించాల్సి వస్తే కనీసం 15 సార్లు రిహార్సల్ చేయించేవాడివి. దాంతో గోల పెట్టేసేవారు. అంత కష్టపడి రిహార్సల్ చేయించినా సరిగ్గా స్టేజిపై పల్లవి పాడగానే మైకు ఎవరో గొంతు నొక్కసినట్టు పనిచేసేది కాదు చిత్రంగా
రాంకులతోపాటు విద్యార్థుల్లోని కళని కూడా మెచ్చుకుని ప్రోత్సహించే యాజమాన్యం ఎక్కడా ఉండదేమో! ఆ క్రమంలో కొన్నాళ్లకి చదువంటే ఒక రకమైన నైరాశ్యం ఆవరించింది నన్ను అప్పటివరకు అనుభవించిన హ్యాపీడేసన్నీ మూటగట్టి నెత్తిన పెట్టుకుని బతకడానికి చదువే ప్రామాణికం కాదని నిరూపిస్తానని తొడగొట్టి శపథం చేసి ఇలా మీ ముందుకు వచ్చేశాను.
(22042012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 48
సం చం ట్య , య. . క. | ష్య బు... | / కు గ | నై త్త జై రృర్డుడు స లో స్కూలు బ్యాగు ల్రా వ లే సివిల్ డైస్ పట్లుకెళ్లివాద్ని నటించాలన్న తపన నిలువెల్లా ఉందాలే కానీ సిక్స్‌ప్వాక్' ల అవసరం లేదని నిరూపించిన పొరో ఆయన. అందిన చిన్నా చితకా అవకాశాలు వదులుకోకుందా నటిస్తూ 'వ్యోవీదేస్” ద్వారా అందరి కంట్లో పద్దారు. హీరో వినాయకుడు/గా దర్ధనమిబ్చి అనతి కాలంలోనే అమాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, పవ్పు, రామదండు, వైకుంఠపాళి నాకూ ఓ లవరుంది వంటి సినిమాలతో ఒక (్రత్వేకమైన ఇమేజ్‌ని స్వంతం చేసుకున్నారు. దాదాపు యాభై చిత్రాల్లో నటించిన రాజోలు “కృష్ణుడు” ఆయన. రాజోలు దగ్గరున్న చింతలపల్లి మా స్వగ్రామం. మా ఇంట్లోనూ, మా ఊరి పరిసరాల్లోనూ సినిమా షూటింగ్స్ తరచూ జరుగుతుండేవి. బహుశా అప్పుడెక్కిన సినిమా కైపే నన్నిక్కడిదాక లాక్కొచ్చిందేమో! అక్షరాభ్యాసం నుండి ఆటోమొబైల్స్ డిప్లామా పట్లా తీసుకునెదాకా పిల్లి పిల్లల్ని తిప్పినట్లు తిప్పి తిప్పి చదివించారు నన్ను మా ట గతా" ట్ వాళ్లు. నిడదవోలు నుండి బెంగళూరు వరకు వయా విశాఖ, కాకినాడ, గుంటూరుల గొరుసు జగదీశ్వర రెడ్డి + 49
మీదుగా కొనసాగిన విద్య నాది. ఎన్ని ఊర్లు తిప్పినా వీసమెత్తు కష్టం కలిగించకుండా ఎంతో గారాబంగా పెంచారనుకోండి. ఇంటిపట్టున లేనన్నమాటేగానీ మనం ఆడిందే ఆట - పాడిందే పాటగా సాగిన హ్యాపీడేస్ అవి. థియేటర్‌లో దొరికిపోయా...
తొమ్మిదో తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి, పదో తరగతికి కాకినాడ చేరాను. ఎన్.ఎఫ్.సి.ఎల్‌లో పనిచేసే మా పెదనాన్నగారి ఇంట్లో ఉండేవాణ్ణి. అప్పటి వరకు బందీగా ఉన్నానేమో... ఒక్కసారిగా రెక్కలొచ్చిన పక్షినైపోయాను. ఒకటా రెండా? కాకినాడ నిండా సినిమా థియేటర్ల. అవన్నీ ఊరిస్తూ అప్పుడప్పుడు నా బుర్రచుట్టూ రౌండదేస్తూ ఉందేవి.
ఒకసారి 'చాణక్య - చంద్రగుప్త థియేటర్స్‌లో “మేజర్ చంద్రకాంత్” మార్షింగ్ షో చూడాలనుకున్నాను. ఎన్.టి.ఆర్. గారి ఏ సినిమా వచ్చినా వదిలేవాణ్సి కాదు. ఆవేళ యూనిఫాం వేసుకుని, పుస్తకాల సంచితో పాటు సైకిలెక్కి బుద్దిమంతుడిలా బయట్చేరాను. థియేటర్ బడికి చేరగానే ఎప్పట్లాగే బ్యాగులో దాచిన సివిల్ డ్రెస్ తీసి గబ గబ యూనిఫాంపై వేసుకున్నాను. ఆ రోజు ఖర్మగాలి నేల టికెట్టు తప్పించి ఏదీ దొరక్కపోవడంతో, మా పెదనాన్నగారి పక్కింట్లో పని చేసేవాడి కంట్లో పడిపోయా. వాడు నన్ను చూసి బిత్తరపోయి “ఏటండీ? ఉదయం స్కూల్ యూనిఫాంలో కనిపించారు తంవరు! స్కూలు ఎగ్గొట్టి సినిమా కొచ్చారా?” అన్నాడు. గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. వాణ్ణి మంచి చేసుకుని ఇంటర్వెల్‌లో చెగోడీలు తినిపించి, కూల్‌డ్రింక్ తాగించి 'మా పెదనాన్నగ్గారితో, చెప్పొద్దని బతిమాలాను. నేను కొనిపెట్టినవన్నీ శుభ్రంగా లాగించేసి 'అలాగేనండి' అంటూ తలూపాడు గానీ విషయం మాత్రం పెదనాన్న దాకా వెళ్లింది. మర్నాడు స్కూల్‌కు బయల్చేరుతుంటే “బ్యాగులో సివిల్ దైస్ ఉందా? అంటూ చెక్ చేశారాయన. లక్కీగా ఆ రోజు సివిల్ డ్రస్ లేకపోవడంతో బతికిపోయాను. హీరో గెటప్‌లో క్లాసుకు వెళ్లేవాణ్సి
సినిమా మాయలో పడటంతో లెక్కలు తన్నశాయి. ఆ సబ్జెక్టులో తర్చిదు కోసం ఈసారి గుంటూరు, అరండల్‌పేటలోని “బిలియన్స్ కాలేజీకి తరలించారు నన్ను. ఆరునెలల శిక్షణ. నూనూగు మీసాలతో కౌమారంలోకి అడుగుపెడుతున్న వయస్సేమో... ఖరీదైన బట్టలు, రేబాన్స్ కళ్లజోడుతో హీరో స్టయిల్లో క్లాసులోకి వెళ్లేవాడిని. స్టూడెంట్స్ నన్ను అబ్బురంగా చూడ్డం నాకు గర్వంగా అనిపించేది. అప్పుడే పరిచయమైన మిత్రుడు ప్రసాద్ “నీలో హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఏనాటికైనా సినిమా హీరోవి హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 50
అవుతావని” జోస్యం చెప్పాడు (ఇప్పటికీ మా (ఫ్రెండ్‌షిప్ అలాగే అలరారుతోంది). గుంటూరులో ఉన్న రోజుల్లో కూడా సినిమాలని వదల్లేదు. థియేటర్లకి వెతుక్కుంటూ వెళ్తుందేవాణ్సి. ఏదైతేనేం కోచింగ్ కొంతలో కొంత మేలు చేసిందేమో లెక్కల్లో గట్టెక్కిపోయాను. ర్యాగింగ్ తప్పించుకోలేకపోయా
టెన్స్ పూర్తికాగానే ఆటోమొబైల్స్ డిష్లామో కోర్సు కోసం బెంగళూరు పంపించారు. అది మలయాళీల యాజమాన్యంలో నడిచే ప్రైవేట్ కాలేజీ. తిప్పసంద్రలో ఉండేది. ఆ కాలేజీలో 80 శాతం విద్యార్థులు మలయాళీలే. పదిమంది విద్యార్థులం కలిసి ఒక వ్లాట్ అద్దెకి తీసుకుని ఉందేవాళ్లం. నాతో కలిపి సుహేల్‌ఖాన్, శ్రీనివాసరెడ్డి అని నగరి నుండి వచ్చినవాళ్లు తెలుగువాళ్లు కాగా, మిగతా వడుగురూ కేరళీయులే. అప్పటివరకూ వినని మలయాళ భాష చెవుల్లో హోరెత్తిపోయేది. మొదట్లో కీచురాళ్ల రొదలా ఉండేది కానీ, క్రమంగా అలవాటయ్యింది.
చేరిన కొద్ది రోజులకే ర్యాగింగ్ చేయడానికి సీనియర్స్ దిగిపోయారు. మేముండే అపార్ట్‌మెంటులోని మరో ఫ్లాట్‌లో కొందరు సీనియర్స్ ఉండేవారు. ర్యాగింగ్‌లో భాగంగా ఒకరోజు బుట్టెడు మాసిన బట్టలు తీసుకొచ్చి ఉతకమని ఆర్దర్ జారీ చేశారు. సరే ఉతికి ఆరేశాం. తర్వాత రోజు జూనియర్స్‌ని టెర్రస్ పైకి తీసుకెళ్లి కట్'డ్రాయర్లపై డాన్స్ చేయమన్నారు. ముందు తటపటాయించినా, తర్వాత రాజీ పడిపోయి 'మీ ఖర్మ.. అనుభవించండి నేను డాన్స్ చేశాగానీ, మా సుహేల్ ఖాన్ మాత్రం ససేమిరా అన్నాడు. పైగా ఒక బల్లిని చంపి సీనియర్స్‌ని తినమని రివర్స్ గేర్‌లో ర్యాగింగ్ చేశాడు వాడు. దాంతో కోపం వచ్చిన సినియర్లు సుహేల్‌ని రెండు నెలలు సస్పెండ్ చేయించారు. అదంతా మలయాళీ రాజ్యం అని ముందే చెప్పా కదా! వాళ్లు చెప్పిందే వేదం అక్కడ. పుట్టు, ఇడియాప్పాలే టిఫిన్లు
నిద్ర లేచినదగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు అంతా మలయాళమయం. ప్రతి ఉదయం ఏసుదాసు కీరనలతో ఆరంభమయ్యాది. లుంగీలు పైకి లాక్కుంటూ చకచక గరిటెలు తిప్పుతూ స్వయంపాకంలో మునిగితేలి, చివరికి పుట్టు, ఇడియప్పం అనే కొబ్బరినూనె టిఫిన్స్ పెట్టెవారు. మొదట్లో అలవాటు లేకపోయినా కొన్నాళ్లకి అలవాటు
పడ్డాం. మా రూంలో థామస్ అనేవాడికి అప్పట్లోనే విసిఆర్ ఉండేది. థామస్ వాళ్లది
'కొట్టాయం” (కొన్నాళ్ల తర్వాత మమ్మల్ని వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు కూడా. కొట్టాయం వెళ్లినప్పుడె కృష్ణుడి గుడిని చూడ్డానికి గురువాయూర్ వెళ్లాను). వాళ్ల పేరెంట్స్ దుబాయ్‌లో గొరుసు జగదీశ్వర రెడ్డి + 51.
ఉండేవారు. తరచూ విసిఆర్‌లో మలయాళ సినిమాలు వేస్తుండేవారు. నాకు భాషాఖేదంలేదు కదా, సినిమా అయితే చాలు చూడ్డానికి ముందుందేవాళ్ణి. వాళ్లు వేసిన వాటిల్లో మోహన్‌లాల్ 'వియత్నాం కాలనీ నాకిప్పటికీ బాగా గుర్తుండిపోయిన సినిమా. రెస్టారెంట్లో బేరర్లుగా పనిచేశాం
సస్పెంద్ అయిన రెండు నెలలూ సుహేల్ ఖాళీగా ఉండకుండా షోగర్ చైనీస్ రెస్తారెంట్లో బేరర్‌గా చేరిపోయాడు. ఒకరోజు నాతో '*నువ్వు కూడా నాతో రా, లైఫ్ అంటే ఏంటో బోధపడుతుంది” అన్నాడు. ముందు తటపటాయించినా చివరికి 'సరే అని వెయిటర్‌గా చేరిపోయాను. కాలేజీ అవగానే సాయంత్రం డైరెక్టుగా రెస్తారెంటుకి వెళ్లేవాణ్ణి. “ఇంటినుండి ఎన్ని వేలు కావలిస్తే అన్ని వేలు తెప్పించుకునే వీడేంట్రా వెయిటర్‌గాచేరాడిని (ఫ్రెంద్స్ ముక్కున వేలు వేసుకునే వారు కానీ నాకు నేనుగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చిన తృప్తి వేరు కదా. కేవలం సరదాకోసమే కొన్నాళ్లు అక్కడ పనిచేసినా డబ్బు విలువ ఏంటో తెలిసింది కూడా అక్కడే. రెస్టారెంట్లో పనిచేసిన సంఘటన ఎప్పుడు గుర్తుకు వచ్చినా అది నిజమేనా అని ఆశ్చర్యంగా ఉంటుంది. లేడికి లేచిందే ప్రయాణం
క్షాసులో బుద్దిగా కూర్చుని వాఠాలు వినడం మాత్రం నాకు అస్సలు నచ్చేది కాదు. తరచూ సినిమాలు చూడ్డానికి మెజిస్టిక్ సెంటర్లో తచ్చాడుతుండేవాణ్సి. మెజిస్టిక్, కపాలి థియేటర్లలో వచ్చి ప్రతి తెలుగు సినిమా చూడాల్సిందే. ఒకరోజు మెజిస్టిక్ సెంటర్లో తిరుగుతుంటే ఎదురుగా ఊటీ వెళ్తున్న బస్సు కన్పించింది. వెనకా ముందు ఆలోచించకుండా ఎక్కేశాను. అంతే! 4 రోజులు పాటు ఎవరికీ కనిపించలేదు. రూమ్మేట్స్ అంతా కంగారు. నాకోసం బెంగళూరంతా గాలించి అలిసిపోయారట. చివరికి పోలీసు స్టేషన్లో “తప్పిపోయినట్లు' కేసు నమోదు చేసి, మా ఇంటికి కూడా ఫోన్ చేశారట. నేను ఎంచక్కా ఊటీలో గడిపి రాజాలా తిరిగొచ్చి విషయం చెప్పేసరికి అంతా షాక్! చివరికి నమ్మలేక 'కట్టుబట్టల్లో ఎలావెళ్లావిని పాయింట్ లాగారు. ఊటీలో దిగగానే రెండు జతల బట్టలు కొనేశానని చెప్పాను. తెల్లబోయి నన్ను ఎగాదిగా చూశారంతా. అందరిలా గానుగెద్దు టైపులో బతికేస్తే జీవితంలో మజా ఏముంది? బుర్రలోని దిక్సూచి ఎటు వెళ్లమంటే అటు వెళ్లడం మొదట్నుంచీ అలవాటు మరి. మా కజిన్స్‌ని హడలెత్తించేవాణ్డి
కాలేజీలో ఏమాత్రం సెలవులు దొరికినా హైద్రాబాద్‌కి వచ్చేసి మా తాతయ్య సాంబశివరాజుగారింట్లో ఉండి సినిమా ప్రయత్నాలు ఎలా చేయాలా అని ఆలోచిస్తుండేవాణ్ణి. పొద్దస్తమానం నా ఆలోచన సినిమా పైనే ఉందేది. హ్యావ్ డేస్ - సినీ ప్రముఖుల బన్ననాటి తీస్ గుర్తులు + 62
లో 1994లో డిప్లామా అవగానే పెట్టే బేడా సర్పుకుని హైద్రాబాద్‌కి వచ్చేసి దేవదాసు కనకాలగారి 'మధు ఫిలిం అంద్ టివీ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరిపోయాను. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది వరకు క్లాసులుండేవి. ప్రతిరోజు వాళ్లిచ్చిన హోమ్‌వర్క్‌ని ఇంటికి వచ్చి చేసేవాణ్ణి. హోంవర్కంటే ఏం లేదు, ఇచ్చిన స్రిఫ్ట్‌ని చదువుతూ, మన హావభావాల్ని అద్దంలో పరిశీలించుకోవడం. దానికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద అద్దం తయారుచేయించుకుని, దాని ముందు నిలబడి యాక్షన్ చేసేవాళ్డి. నాకు నేనే కెమెరా, యాక్షన్, కట్ లాంటి డైలాగ్స్ పలుకుతూ ఇంట్లో అందర్నీ హడలెత్తించేవాణ్సి (6వ తరగతిలో ఉండగా కళ్యాణ రాముడిగా ఒక యక్షగానంలో నటించాను. అదే తొలిసారి ముఖానికి రంగు వేసుకోవడం. ఆ మధ్య ఒకసారి గుడిలోవ రెసిడెన్షియల్ స్కూల్‌కి వెళ్తే ఆనాటి నా రాముడి ఫోటోని చూపించి నన్ను ఆశ్చర్యపరిచారు). ఇల్లంతా ఫేస్'క్రీమ్స్, మసాజ్ కలర్స్‌తో నిండిపోయి ఉండేది. నేను అద్దం ముందుకు వెళ్తున్నానంటే ఇంట్లో హడల్. “వీడి యాక్షింగేమో గానీ, ఇల్లు దద్దరిల్లిపోతోందని” చెవుల్లో దూది కుక్కేసుకుని, బెంబేలెత్తి పరుగులు తీసేవారు మా కజిన్స్ అంతా. రెండేళ్ల యాక్టింగ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసి సినిమా ప్రయత్నాల్లో ఉండగా ఒక దుర్ముహుర్తాన అమీర్‌పేట, గ్రీన్‌పార్కు దగ్గర్లో యాక్సిడెంట్‌కు గురయ్యాను. కాలు (ఫ్రాకృరయ్యింది. రెస్ట్‌కోసం రాజోలు వెళ్లి దాదాపు రెందేళ్లు అక్కడే ఉందివోయాను. యాక్సిడెంట్‌కు పూర్వం ఉన్ననా రూపం హఠాత్తుగా మారిపోవడం... ఒక్కసారిగా లావైపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయినా సినిమాల్లో నటించాలనే తపన నన్ను నిత్యం వెంటాడుతూనే ఉందేది. మళ్లీ వచ్చి సినిమాల్లో
నటించేంత వరకు నా మనసు నా మాట వినలేదు. (29.04ఓ2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
బ్ ఇ క ర క స 1 ణం 0. న్ ] నాని ఆ శబ్దం వినగానే నిక్కర్లు తడిసిపోయెవి! ఒకనాడు “వరల్డ్ స్పేస్” శ్రోతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ చిలిపిత'నాని'కి చిరునామా అయిన లేడియో జాకి అతడు, అటువిమ్మట రాధాగోపాళం” చిత్రానికి ల్యాబ్ అసిస్టెంట్‌గా చేరి, (ప్రేక్షకులతో “అష్టాచెమ్మా” ఆడించడానికి వీరో అవతారం ఎత్తాడు. అనతికాలంలోనే ఎందరో అభిమానుల్ని నంపాదించి *అలా మొదలైంది, భీమ్లీ కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, “స్నేహితుడా”, 'రద్' లతో పాటు 'వెప్పం” లాంటి తమిళ చిత్రంలోనూ నటించి “సెగ పుట్టించాడు. “ఎటో వెళ్లిపోయిన మనసుని వెదుక్కుంటూ 'జోరీగొలా దూసుకు వెళ్తున్న సహజనటుదు “నాని, ఇప్పటికే నందితో పాటు ఫిలిమ్ ఫేర్ వంటి అవార్డులు అందుకున్నారు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించారు. “భలే భలే మగాడివోయ్”, 'నిన్ను కోరి” చిత్రాల్లో నటుడిగా విశ్వరూపం చూపించారు. పుష్కరం క్రితం ఎం.పి.సి. చదవడానికి సంజీవరెడ్డి నగర్ (హైద్రాబాద్) నారాయణి జూనియర్ కాలేజీలో చేరిన రోజులవి. బాగా చదివే విద్యార్థులకు లు, నాలాంటి ఆవరేజ్‌గాళ్లకు “బి, తొట్టిగ్యాంగుకు 'సి” సెక్షన్లు కటాయించేవారక్కడ. చెరిన కొంతకాలానికి “బిలో (స్టైంత్ ఎక్కువైందనే మిష మీద నన్ను తీసికెళ్లి తొట్టిగ్యాంగ్‌లో పడేశారు. అన్నీ ప్యాసైపోతే నామోషీ అని మొదటి ఏడాదే రెండు సబ్జెక్టులు చీదేశాను. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 54
కో క్లాసులో ఉండాలంటే యమ చిరాగ్గా ఉండేది. ఎస్.ఆర్.నగర్ పరిసరాల్లో ఆరేడు
స్నూకర్ పార్లరు ఉండేవి. బంక్ కొట్టానంటే నా మొదటి అడ్డా అదే. ఇక రెండో అడ్డా కాలేజీకి కూతవేటు దూరంలోని 'సత్యం' థియేటర్. క్లాసులో ఉండాల్సిన టెంలో భగభగ మందే ఎండలో, క్రిక్కిరిసిన వీరాభఖిమానుల మధ్య నలిగిపోతూ గేట్లు ఎప్పుడు తెరుస్తారా? టికెట్ కౌంటర్ దగ్గరకి ఎవడు ముందు పరిగెత్తుతాడా అని పడిగాపులు కాసేవాళ్డి. ఒకరి మీద ఒకరం మందలా పదేసరికి చొక్కాలు చిరిగిపోయి, చెప్పులు జారివోయి.. ఒకటా రెండా? అలా “మురారి టైంలో చెప్పులు పోగొట్టుకుని, “ఖుషి టెంలో పోలీసు దెబ్బలు రుచి చూసి... ఎన్ని పాట్లు పడ్డా టికెట్ సంవాదించి సినిమా చూస్తున్నప్పుడు కలిగే 'మజా' నే వేరు! అమ్మగా “నటించి” కాపాడేది
మనం బంక్ కొట్టడం ఆలస్యం కాలేజీ నిఘా వర్షం పసిగట్టీ వెంటనే*మీ అబ్బాయి క్లాసుకు రాలేదింటూ ఇంటికి ఫోన్లో ఫిర్యాదు వెళ్లేది. ఇలాంటి ప్రమాదం ఉంటుందనే మా అక్కతో ఒప్పందం కుదుర్చుకునేవాణ్ణి. రిసీవర్ తనే ఎత్తి “నాని వాళ్లమ్మని మాట్లాడుతున్నా... మా వాడికి ఒంట్లో బాగలేదు.. ఈ రోజు వాడు కాలేజీకి రాలేడయ్యా' అని అమ్మలా గొంతుమార్చి చెప్పెట్టుగా, ఈ పని చేసినందుకు ప్రతిఫలం ఏం కోరేదో తెలుసా? ఆ సాయంత్రం తను చూసే టీవీ ఛానల్‌నే నేను కూడా చేతులు కట్టుకుని, నోరు మూసుకుని చచ్చినట్టు చూడాలి (నాకు అత్యంత ఏడుపు వచ్చే సన్నివేశం అదే.) నిజానికి మా ఇంట్లో ఉందేది ఒక్క టీవీనే గాని “ఛానల్స్” మార్చడం కోసం మా ఇద్దరి మధ్య జరగే యుద్ధంలో కనీసం పదిహేను రిమోట్స్ ముక్కలై ఉంటాయి. 'గీన్ అండ్ క్షీన్‌తో గూబ గుయ్‌మంది
సెకండియర్ చివరి ఎగ్జామ్ రాసిన రోజు... కుర్రాళ్లంతా రోడ్డుపై చేరి ప్రశ్నాపత్రాలను ముక్కలు ముక్కలు చేసి ఆకాశంలోకి విసిరేసి, కేరింతలు కొడుతూ డాన్స్ మొదలెట్టారు. సరిగ్గా అదే టైంలో పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి ఆగడం, పోలీసులు దిగడం క్షణాల్లో జరిగిపోయింది. ముందుగా నా ఎర్రరంగు చొక్కాపై వాళ్ల దృష్టి పడింది. వాళ్లకేం గుర్తొచ్చిందో తెలీదు కానీ నన్నూ నాతో పాటు మరో ఇద్దర్ని పట్టుకుని జీపు ఎక్కించారు. రవి అనేవాడు “చించింది నేను కాదు, నన్ను వదిలేయండి సార్” అని బతిమాలాడు. వాడ్ని వదిలేస్తే నేనూ అలాగే బతిమాలి బయటపడాలనుకున్నా కాని వాళ్లు లారీకి పనిచెప్పేసరికి నా ఆలోచన మార్చుకున్నాను.
జీపు సరాసరి పోలీస్‌స్టేషన్ ముందు ఆగింది. కాలేజీకి స్టైెషన్ దగ్గరే కాబట్టి దాదాపు రెందు వందల మంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చెశారు. ఈ లోపు మమ్మల్ని
తీ దోషులుగా ఎస్.ఐ. ముందు నిలబెట్టేశారు. కొట్లో తోసి కుళ్ల బొడుస్తారేమోనని జడిసిపోయాం గానీ ఆ ఎస్.ఐ. గొంతు సవరించి “బంటయ్యా, ఒకపక్క చంద్రబాబుగారు నగరం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచడానికి స్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవ్వాలని చెబుతుంటే మీరు కాగితాలు చించి రోర్ల నిండా పోసారా? అంటూ 'పరిశుభ్రత - ఉపయోగాలు” అనే అంశంపై ఏకబిగిన గంటన్నర సేపు లెక్చర్ దంచి, తర్వాత మమ్మల్ని కాలేజీ ముందు వదిలేసి రమ్మని ఆర్దర్ జారీ చేశాడు. మా దురదృష్టం కొద్దీ సరిగ్గా మేం జీపు దిగుతున్నప్పుడే గర్ల్స్ కాలేజీ వదిలారు. మమ్మల్ని చూసి అమ్మాయిలంతా షాక్ |! వాళ్లముందు తలొంచుకుని పరువంతా పోయినట్టు తెగ సిగ్గుపడిపోయి, బాధపడ్డాను కానీ ... విధి ముందు మనం నిమిత్తమాత్రులం అనే తత్త్వం బోధపడింది కూడా అప్పుడే.
పేమ రాయబారం
ఇంటర్ ఫైనల్‌లో ఉండగానే ఒకరి (పేమ కావ్యంలో తలదూర్చాల్సి వచ్చింది. “క్రాంతి” అనే మా క్లాస్‌మేట్ ఒకడు తనొక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు చెబుతూ, మరొకడు ఆ అమ్మాయిని టీజ్ చేస్తున్నాడని గొల్లుమనడంతో వాడ్ని ఓదార్చి, కర్చీఫ్‌తో కళ్లు తుడిచి అభయమిచ్చేశా. టీజింగ్ చేసేవాడు కూడా మా కాలేజీ ప్రేమికుడే. అందరం కలిసి ఎస్.ఆర్.నగర్ గ్రౌాండులో సమావేశమయ్యం. ఇరువర్గాల మధ్య హోగాహాోరి. 'ఆ అమ్మాయిని మా క్రాంతి లవ్ చేస్తున్నాడు - నువ్వు తప్పుకో అని వార్నింగ్ ఇచ్చాను. వాడు రెచ్చిపోయాడు. ఆ మాటేదో అమ్మాయితోనే చెప్పిస్తే బాగుంటుందని ఆలోచించాను. కొసమెరుపు ఏంటంటేనూ క్రాంతితో పాటు, ఆ రెండోవాడు కూడా తనకు తెలీదని కొట్టినట్టు మొహం మీద చెప్పేసి వెళ్లిందా 'కావ్యనాయిక. దాంతో మరోసారి అలాంటి బుద్ధి తక్కువ (ప్రేమరాయబారాల్లో తలదూర్చరాదనే బుద్ధి మాత్రం వచ్చింది. 20 సార్లు చూసిన “లగాన్”
ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసేశాక “డిగ్రీ అంతు కూడా చూసేద్దామని సికింద్రాబాద్‌లోని" వెస్తీ డిగ్రీకాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సంజీవరెడ్డినగర్‌లో చదివేటప్పుడు మన అద్దా 'సత్యం” అయితే అక్కడ 'ఆనంద్'. సరిగ్గా మా కాలేజీకి ఎదురుగా ఉండే థియేటర్. కాలేజీకి వచ్చీ రావడంతోనే ఆనంద్‌లోకి దూరిపోయేవాణ్ణి. అలా అమీర్‌ఖాన్ “లగాన్” సినిమాని ఏకబిగిన 20 రోజుల పాటు చూశానంటే మీరు నమ్మరేమో! ఆ సినిమాని పదేపదే చూసినపుడే ప్రతి షాట్‌ని దర్శకుడు ఎలా తీశాడా అనే ఆలోచనలు పుడుతుండేవి. దాంతో సినిమాని ఎన్నిసార్లు చూసినా హ్యాట్ ఊస్ = సన్ ప్రమఖం బిన్ననాటి తీస్ గుర్తు + 56
బోర్ కొట్టెది కాదు. ముఖ్యంగా మణిరత్నంగారి సినిమాల్లోని (ఫ్రేమ్స్‌ని గమనిస్తుండేవాడ్డి. దర్శకుడు ఆ షాట్‌ని ఇలా తీశాడ్రా, అలా తీశాడ్రా అని వర్చించి చెబుతుంటే “పోరా... అవన్నీ మాకెందుకు? సినిమా చూడ్డం, ఎంజాయ్ చేయడం వరకే అని కొట్టిపారెసే వాళ్లు (ఫెండ్స్. అయితే మా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్‌గారు మాత్రం నన్ను గమనిస్తూ “ఎప్పటికైనా నీవు సినీ ఫీల్దుకి వెళ్తావం'టూ జోస్యం పలికేవారు. దాంతో . సిసిమాలపట్ల మరింత మోజు పెరిగి విజ్బంభించేవాణ్డి.
వాడి కళ్లల్లో వెయ్యి మతాబుల వెలుగు
ఒకరోజు “ఆనంద్” నుండి బయటకి వచ్చి బస్తాప్ వైపు రాబోతున్నాను. ఒక షాపు యజమాని పదేళ్ల పిల్లాడ్ని చితక బాదేస్తున్న దృశ్యం కళ్లబడింది. నాతో పాటు మరో 8 మంది విద్యార్థులున్నారు. కారుకు గీతలు పెట్టాదనో, మరేదో తప్పు చేశాదనో తిడుతూ శివమెత్తి తంతున్నాడు. నాకు కుతకుత ఉడికివోయింది. ఆ పిల్లాడ్ని రక్షించడానికి అప్పటికప్పుడు ఒక షాన్ వేసుకుని, గబగబా వాడి దగ్గరకి వెళ్లి 'ఏరా మా రాజేశ్‌ని నిన్న ఏమన్నావ్?” అంటూ ఉరుముల్లని పిడుగుల్లా పిడిగుద్దులు మొదలుపెట్టాం. “ఏ రాజేశ్? ఏ రాజేశ్? నన్నెందుకు కొడ్డున్నారంటూ వాడు పరేషాన్. దెబ్బల బారినుండి పిల్లాడిని తప్పించడానికి మేమంతా కలిసి వేసిన ష్లాన్ అనే విషయం ఇప్పటికి వాడికి తెలీదనుకుంటా. గబగబా వాడ్ని ఉతికేసి అప్పుడే వచ్చిన బస్ ఎక్కేసి ఆ పిల్లాడి వైపు
చూశాం. పిల్లాడి కళ్లలో వెయ్యి మతాబుల వెలుగు. దాదాపు ఆ పిల్లాడి వయసులో
ఉండగా నేను చేసిన ఒక సాహసం గురించి కూడా మీతో చెప్పాలి. 138 ఏళ్లకే మిస్టరీ ఛేదించాను
ఇంట్లో చెప్పిన మాట వినటం లేదని, రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే పెంకితనం తగ్గుతుందని ఓ సంవత్సరం పాటు విజయవాడ దగ్గర్లో ఉన్న ఈడ్పుగల్లు సిద్ధార్ధ రెసిదెన్నియల్లో బంధించారు నన్ను మనం ఇంట్లో ఉన్నా, రెసిదెన్నియల్లో ఉన్నా ఒక్కలాగే ఉంటానని తెలియని అమాయకత్వం మా వాళ్లది. సరే అది మొత్తం ౩ అంతస్తుల బిల్జింగ్. ఆ డార్మెట్రీ రాత్రికి పడగ్గదిగా పగలు బడిగా మారిపోయేది. ఒక రాత్రి సరిగ్గా పన్నెండు దాటగానే వెన్నులో వణుకు పుట్టించే శబ్దాలు వినిపించాయి. అలా ప్రతిరోజూ క్రమం తప్పకుందా, ఆ శబ్దాలు వినగానే కొందరి నిక్కర్లు తడిసిపోయేవి. కచ్చితంగా దెయ్యం అన్నారు. అది దెయ్యమో కాదో నిరూపించే బాధ్యత చేపట్టి పదిమిందిని బలవంతంగా ఒప్పించి టార్భిలైట్స్ తీసుకుని బాల డిటెక్టివ్‌లా కదిలాను. ముందు ఫస్ట్ ఫ్లోర్ చేరాం. ఇంకా పైనుండి విన్పిస్తోంది శబ్దం. రెండో ఫ్లోర్ కెళ్లాం. ఇంకా పైనుండి గొరుసు జగదీశ్వర రెడ్డి శ 57
వినిపిస్తోంది. చివరి దాకా తీసుకెళ్లాను. పొడుగాటి కారిడార్. దూరంగా పాడుబడ్డ గదినుండి గుండె దడ పుట్టించే శబ్దాలు. పిక్కలు, వణికిపోయి కొందరు వెనుతిరిగారు. వాళ్లందరికీ ధైర్యం నూరిపోసి మళ్లీ తీసుకొచ్చాను. మెల్లగా వెళ్లి ఆ గది తలుపులు తీశా... గదినిండా బూజు... పాతబడ్డ కుర్చీలు, విరిగిన బల్లలు.... పైకి చూశాను. తుప్పుపట్టి విరిగిపోయిన ఫ్యాన్ రెక్క తిరగలేక తిరుగుతూ అడ్డుగా పడిన ఒక ఐరన్ రాద్‌కి తగిలి 'దెయ్యం” శబ్ధాలు చేస్తోంది. అందరం ఊపిరిపీల్చుకున్నాం. ఎప్పుడో సాయంత్రం స్విచ్ వేస్తే సరిగ్గా రాత్రి పన్నెండు దాటాక ఎలక్టిసిటి ఆ గదికి చేరేదన్నమాట. 13 ఏళ్ల వయసులో ఆ మిస్టరీ ఛేదించడం గొప్పని ఒప్పుకుంటారా లేదా? కనువిందు చేసిన దాల్ఫిన్స్
(ఫెండ్స్‌తో సరదాగా ఊర్లు తిరగడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ముఖ్యంగా నదులపై షికారు చేయడం బాగా అలవాటు. ఒకసారి అవనిగడ్డ దగ్గరున్న హంసలదీవికి మా మిత్రులు ప్రశాంత్, నాగేశ్, వంశీ, చైతన్యలతో కలిసి వెళ్లాను. సముద్రంతో కృష్ణానది సంగమించే దృశ్యం నన్ను కట్టిపదేసింది. మెం సరిగ్గా అక్కడికి వెళ్లేసరికి అప్పటిదాకా విపరీతంగా కాసిన ఎండ ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మబ్బుల్తో నిండుకుంది. దాంతో వందల సంఖ్యలో నీటిపై తేలిన డాల్ఫిన్స్‌ని చూడ్డానికి మా రెండు కళ్లూ చాల్లేదు. మమ్మల్ని బోటులో తీసుకెళ్లిన పడవవాడు కూడా వాటిని చూసి షాక్ తిన్నట్లు “ఎన్నో సంవత్సరాలుగా పడవ నడుపుతున్నాగ్గానీ వీటిని ఇంతకు ముందెన్నడూ చూల్లేదని ఆశ్చర్యపోయాడు. బహుశా ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేనేమో ( నా రైడ్ విడుదల సందర్భంలో కూడా మరోసారి ఆ స్పాట్‌కి వెళ్లివచ్చాను.)
(06.05.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హాప్ డేస్ - సిస్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 56
న భ్ నం యా. లా. భాస్కరభట్ల
దుంపలబది నుంది ది[గీ వరకు గుంపులో గోవిందలా కాకుందా,
వందమందిలో ఒకదిగా ప్రత్వేకంగా కన్చించాలనుకునే తత్వం అతడిది.
అదే ఆయన్ని నీనీరంగం వైవు అడుగులు వేయించింది. ఒకనాడు
పత్రికల్లో కల్చరల్ కబుర్లు రాస్తూ బుడి బుడి నదకలు నడిచిన ఆ
కలం 'సారొస్తారొస్తారే వస్తారొస్తారే (బిజినెస్‌మేన్) అని చిందులేస్తూ
వరగులు తీస్తోందిప్పుడు. 'రామనక్కని బంగారుబొమూ రానలీలకు
వస్తావా” (ఇట్లు (శ్రావణి సుబ్రమణ్యం), నూజివీడు సోనియా” (జను
వాళ్లిద్దరూ ఇప్రపద్దారు), “ఇవ్పటికింకా నా వయను నిందా పదహారే”
(పోకిరి, “గాల్లో తేలినట్టుందే = /పందె పేలినట్టుందే” (జల్సా,
క్పువ్దానగర్ మామా” (నేనింతే) నుండి (సుందెజూరి గల్లంతయ్యిందే”
(గబ్బర్ నీంగ్) వరకు సుమారు వెయ్యికి పైగా పాటలు రానీన గేయ
రచయిత భాన్ఫురభట్ల. నంతోషం, నీమ అవార్డులను క్రైావనం
చేసుకున్నారు.
అవి నేను పదో తరగతి అత్తెసరు మార్కులతో వ్యాసయిన రోజులు... అత్తెసరుకి
బియ్యం ఉడికి అన్నం అవుతుందేమో కానీ ఏ కాలేజీవాడూ పిలిచి సీటివ్వడు కదా! పైగా “చదివింది చాలు, గుళ్లో నాకు సాయంగా ఉండమని నాన్నగారు హుకుం జారీ గొరుసు జగదీశ్వర రెడ్డి శ 59
చేశారు. ఆయన రాజమండ్రి ఇన్నీసుపేట ఆంజనేయస్వామి ఆలయంలో అర్భకులుగా శ ఉందేవారు. ఎలాగైనా కాలేజీ చదవాలనేది నా పట్టుదల. ఒకసారి నాన్న పై ఊరికి వెళ్లినప్పుడు 4 కాలేజీలకి అప్లికేషన్ పెట్టేను. గుడ్డిలో మెల్లలా ఏ కాలేజీవాడైనా పిలవకవోతాదా అని. అనుకున్నట్టుగానే వి.టి. కాలేజీలో సీటొచ్చింది. బైపిసి తీసుకుని (ఫైవేట్‌గా చదివే స్తోమత లేదు. ఎంపిసికి వెళ్లే తెలివీ లేదు. సి.ఇటి.సితో సరి పెట్టుకున్నాను. అదిగాక తెలుగంటే మనకు మొదట్నించి మక్కువ. ప్యాసవడానికి ఆ అమ్మాయే ప్రేరణ
అప్పటివరకూ ఆదమొహం ఎరక్కుండా చదివిన వారఠశాల చదువు - ఇక్కడేమో పక్కసీట్లలోనే రంగురంగుల సీతాకోకచిలకల్లా ఎగురుతూ, కిలకిలరావాల్తో అమ్మాయిల సందడి.... ఉక్కిరిబీక్కిరై తెప్పరిల్లడానికి రెండు నెలలు పట్టింది. మా క్లాసులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉండేవి. ఆ తర్వాత అక్కడే డిగ్రీ కాలేజీ మొదలయ్యేది. ఎలా జరిగిందో తెలీదు గానీ డిగ్రీ చదివే ఒక అమ్మాయి నా మనసు దోచేసింది. ఆ మైకంలో 'వలపు తేనె పాట, తొలి వలపు పూలతోట, పరువాల చిన్నెలా సయ్యాటి అని పాడుకుంటూ ఆమెకు దగ్గరవ్వాలనుకునేలో పే ఫస్టియర్‌లో న! సబ్జెక్టు తన్నెశాయి. ఈ నాలుగూ ప్యాసై, సెకండియర్ ప్యాసైతేగాసీ డిగ్రీలోకి వెళ్లి ఆ అమ్మాయిని అందుకోలేను. ఆలోచించా... చించా... ఒకటే మార్గం కనిపించింది. ఎకలవ్యుడిలా ఆ అమ్మాయి రూవాన్ని మనసులో ప్రతిష్టించుకుని పట్టుదలతో చదివి అన్ని సబ్జెక్టులూ వ్యాసైవోయాను. అద్దంలో జ్ఞానోదయం
కానీ ఏం లాభం? బొటాబొటీి మార్కులు. డిగీలో సీటు వచ్చే అవకాశం కన్పించలేదు. ఆ సంధికాలంలోనే ఒకనాడు (అశోక) బ్లేడ్‌కోసం అమ్మని దబ్బులు అడగాల్సి వచ్చింది. గడ్డం గీసుకుంటుంటే... హఠాత్తుగా పెద్దవాడినైయిపోయిన ఫీలింగ్ కలిగింది. అర్దరూవాయి బ్లేడు కోసం అమ్మని అడుక్కోవడం ఏమిట్రా? అని అద్దంలోని ప్రతిబింబం చీవాట్లు వేసినట్టు అనిపించింది. ఆ వెంటనే ఈ మాత్రం డబ్బులు సంపాదించలేనా అనే రోషం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. బుద్దుడికి బోధివృక్షం కింద అయితే నాకు అద్దంలో జ్ఞానోదయం అయ్యిందన్నమాట. ఏదో రకంగా సంపాదించాలనే తపన మొదలైంది. మా ఫ్యామిలీ (ఫెండ్ అరుణభాస్కర్‌గారు అప్పట్లో “ఈనాడు” యాద్ డిపార్ణుమెంటులో పనిచేసేవారు. ఆయన దగ్గరకి వెళ్లి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాను. ముందు ఆశ్చర్యపడ్డారు. తర్వాత అభినందించి కంట్రిబ్యూటర్‌గా చేస్తావా ॥
అని అడిగారు. అప్పటికే కవిత్వం కతకడంలో అలవాటుంది. పట్నంలో జరిగే / సాంస్కృతిక కార్యక్రమాలపై ఆర్టికల్స్ రాయడం సులువే అనిపించి సరే అన్నాను. (మొదటి నెల జీతం రూ. 126 ఇచ్చిన రిక్ జీవితంలో మర్చిపోలేను.)
డిగీ చదివే రాత మనకు లేదేమో అనుకుని ఉద్యోగంలో ఒదిగిపోతుందగా అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. వి.టి. డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్ ఎస్.వి. రాఘవేంద్రరావుగారు ఒక పద్యకవితా సదస్సు నిర్వహణ పనిమీద “ఈనాడు” ఆఫీసుకు వచ్చి న్యూస్ రాసి పెట్టమన్నారు. మాటల్లో నా వివరాలు అడిగి, డిగ్రీకి అప్రయ్ చెయ్యి రికమెండ్ చేస్తానన్నారు. ఇంకేముంది రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వారి సిఫారసుతో మళ్లీ అదే కాలేజీలో చేరిపోయా, నా కలల రాణిని చేరుకోడానికి మార్గం కూడా సుగమమైంది. అప్పటికి తను డిగ్రీ ఫైనల్.
“ఇదే నా మొదటి (పేమలేఖా....
నేను ఫాలో అవుతున్న విషయం ఆ అమ్మాయి పసిగడుతోందని తెలిశాక ఒకరోజు ధైర్యం చేసి తను కూర్చునే సీటు సొరుగులో ఒక చీటీ ఉంచి 'అందాల ఓ చిలుకా అందుకో నా లేఖా” అని సంజ్ఞలు చేసి పిల్లిలా వచ్చెశాను. నా యాక్షన్‌కి ఇమిడియట్ రియాక్షన్ - ఆ (ప్రేమలేఖ పట్టుకుని సరాసరి మా క్లాసుకు వచ్చి నన్ను బయటికి రమ్మని పిలిచింది. తోటి విద్యార్థులంతా పరేషాన్.
“నీ వయసేంటి? నా వయసేంటి?” అంది కోపంతో. తన ముక్కుపుటాలు అదురుతుంటే నాకు చెమటతో శరీరం తడిసిపోతోంది. పెట్టాల్సిన నాలుగూ పెట్టి చీటీని ముక్కలు చేసి బోనస్‌గా వార్నింగ్ ఇచ్చి చక్కా వెళ్లింది. ఈ విషయం మా నాన్నకి ఎక్కడ చెప్పేస్తుందా అని వణికిపోయా. చివరికి ప్రేమలో గెలవలేకపోయినా, తన (ప్రేరణతో ఇంటర్ ప్యాసవగలిగాను కదా అని తృప్తిపద్డా. లాబ్‌ను బాగు చేసిన ఘనత
మా కాలేజీ కెమిట్టీ లాబ్ చాలా అధ్వాన్నంగా ఉండేది. వర్షం వస్తే చాలు గోడలన్నీ చెమ్మతో ముట్టుకుంటే షాక్ కొట్టేవి. ఎన్నిసార్లు కంప్లెయింట్ చేసినా ప్రిన్సిపాల్ పట్టించుకునేవారు కాదు. కొవ్వూరు నుండి వచ్చే “హెప్పిబా” అనే అమ్మాయి ఒకరోజు లాబ్‌లో పని చేస్తూ షాక్‌కు గురైంది. కెమికల్ ఎగిరి ఆమె కళ్లలో పడింది. ఆ దుర్హటన నా మనసుని కలచివేసింది. లాబ్ ఫోటోకి హెప్పిబా ఫోటో జతచేసి “వీరేశలింగం ఆశయాలకు తిలోదకాలు” అనే హెడ్దింగుతో సిటీ టాబ్లాయిడ్‌లో వార్తాకథనం రాశాను. గొరుసు జగదీశ్వర రెడ్డి + 61
దాంతో యాజమాన్నానికి నాపై గుర్రు మొదలయింది. ఆ మర్నాడే ప్రిన్సిపాల్ పిలిచి 'ఎంటయ్యా ఇది? కాలేజీ పరువు పోతుందయ్యా' అన్నాడు కోపంగా. 'విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి సార్” అన్నాను అంతే రేంజ్‌లో. నన్ను డిస్మిస్ చేస్తానని బెదిరించారు. మా కెమిస్ట్ లెక్చరర్స్ నాకు సపోర్టు రావడంతో వెనక్కి తగ్గారు. ఆ వెంటనే చకచక లాబ్ రూపురేఖలు మారిపోయి కొత్త ఎక్విప్‌మెంటుతో కళకళలాడింది వానీ వాళ్ల 'హెప్పిబా కంటిచూపుని తెప్పించలేక పోయింది. దాంతో సెలబ్రిటీ అయిపోయా
అంతకు ముందు కాలేజీ ఐదు నిమిషాలు లేటుగా వెళ్తే రానిచ్చేవారు కాదు. లాబ్ సంఘటనతో మనం చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయాం కదా, ఎప్పుడు వెళ్లినా గౌరవంగా గేటు తీయడం మొదలెట్టాడు వాచ్‌మేన్, అప్పటిదాకా పట్టించుకోని కాలేజీ ఎదురుగా ఉండే టీ కొట్టు ధర్మారావు కూడా మర్యాదగా పిలిచి “టీ తాగుతారేటండి అనేవాడు. నాతో పాటు మా ఫ్రెంద్స్‌కి కూడా టీ పోయించి ఠీవిగా ఖాతాలో రాసుకోవోయ్ అనెవాణ్డి.
అందరికీ నాపై ప్రత్యేకమైన లుక్కేర్పడింది. అయితే ఒక విషయంలో మాత్రం గిల్టీగా ఉండేది. సైకిల్ తొక్కడం వచ్చేది కాదు నాకు (ఇప్పటికీ రాదనుకోండి). అమ్మాయిలేమో అందమైన సైకిళ్లపై (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా స్టయిల్లో) తిరుగుతుంటే నాకు తల కొట్టేసినట్టు ఉండేది. ఆ ఆత్మన్యూనత నుంది తప్పించుకోడానికి సాయికుమార్ అనే నా క్లాస్‌మేట్‌ని బాడీగార్డుగా ఎంచుకుని వాడి సైకిల్ వెనక దర్జాగా కూర్చుని తిరిగేవాణ్లి.
డిగ్రీ ఫైనల్లో రత్న అనే అమ్మాయి మా పాలిటి ఐశ్వర్యారాయ్. మీగడ తరగలా, వెన్నెల సోనలా, లాలిత్యానికి పర్యాయపదంలా ఎంతో సుకుమారంగా ఉందేది. ఆ అమ్మాయిని చూద్దానికి, తనతో మాట కలపడానికి ఏదో మిష మీద పక్కక్లాసు స్టూడెంట్స్ మాటిమాటికి వచ్చేసేవారు. వాళ్లంతా రత్న కోసమే వస్తున్నారని తెలిసి మాకు మండిపోయేది. “మీ క్లాసులో రత్నలాంటి అమ్మాయి లేకపోతే అది మీ దురదృష్టం. మేం పనిగట్టుకుని మీ క్లాసులోకి రావటం లేదుకదా అని తగువేసుకునేవాళ్లం, ఆమె మాకు మాత్రమే పరిమితం అయినట్టు. నా షూటింగుల పిచ్చి
రాజమండ్రి చుట్టూవుండే బొమ్మూరు, వేమగిరి, కడియం, కడియపులంకల్లో తరచూ షూటింగ్స్ జరుగుతుండేవి. షూటింగ్ చూడాలనే పిచ్చితో (సైకిల్ రాదు కాబట్టి) హ్యావ్ డేస్ = సిన్ ప్రముఖల వన్ననాటి తీసి గుర్తుల * 62
పదేసి కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్లిన రోజులూ ఉన్నాయి. ఒకసారి *ప్రెసిడెంట్‌గారి పెళ్లాం) షూటింగ్ కడియపులంకలో అవుతుంటే కిందామీదా పడి వెళ్లాను. 'ఆ ఒద్దు ఈ ఒద్దు ఈ మధ్య ఏరద్దు' పాటని కొరియోగ్రాఫర్ (తార) చేసి చూపిస్తున్నారు. కిక్కిరిసిన జనం తోపులాటలో నేను పక్కనే ఉన్న బురద కాలవలో పడటం ఇప్పటికీ గుర్తుంది. ఇంకోసారి కుమారదేవం దగ్గరున్న తోటలో “ఏమండీ ఆవిడ వచ్చింది” షూటింగ్ కవరేజి కోసం పత్రిక తరుపున వెళ్లాల్సివచ్చింది. ఒక ట్రాక్టరు పట్టుకుని రాజమండ్రికి తిరిగి వచ్చేసరికి రాత్రి పది దాటింది. దిగే కంగారులో నా కాలు మీదుగా టైరు వెళ్లడం, వేళు ..... _ చితికిపోయి రక్తం కారడం.. ఆఫీసులో సిబ్బంది చూసి చెప్పేవరకు నాకు తెలియనేలేదు. వాళ్లే ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. ఆ రోజు నా పుట్టినరోజు కావడం ఇంకో విశేషం, విచారం. వాల్ పోస్టర్ల ప్రభావం చిన్నతనం నుండి గుంపులో గోవిందలా జీవించడం సుతరామూ ఇష్టముందేది కాదు. ఏదో ప్రత్యేకతని సంతరించుకుని చుట్టూ ఉన్నవాళ్ల దృష్టి నాపై పదేలా రకరకాల జిమ్మిక్కులు చేస్తుండేవాణ్ణి. బ్లాక్ బోర్డుపై కవితో, బొమ్మో... కెలుకుతూ సెలబ్రిటీగా పోజిచ్చేవాజ్ణి. దుంపలబడి మొదలు డిగ్రీ వరకూ ఇదే తరహా నాది. మా స్కూలుకి పెద్ద ప్రహారీ గోడ.. దాని చుట్టూతా సినిమా పోస్టర్లు అతికించి ఉండేవి. భుజానికి కరీంబీడీ సంచి తగిలించుకుని నెమ్మదిగా అడుగులేసుకుంటూ ఆ పోస్టర్లను చూస్తూ నడవటం ఎంతో ఇష్టంగా ఉండేది. పోస్టర్ల మీది యాక్టర్ల బొమ్మలకంటే అడుగున ఉండే సిరివెన్నెల, వేటూరి, భువనచంద్ర లాంటి పేర్లు నన్ను ఎక్కువగా ఆకర్షించేవి. ఆ పేర్ల దగ్గర నా పేరు కూడా ఉండాలంటే నేను కూడా పాటలు రాయాలనే 7 ఆలోచన ఆ వయసులోనే వచ్చింది. (సినిమాల్లోకి వచ్చేక ఒకసారి రాజమండ్రి వెళ్లినప్పుడు అదే స్కూలు గోడలపై 'నచ్చావులే పోస్టరులో రామోజీరావు, రవిబాబు, భాస్మరభట్ల పేర్లు కన్పించేసరికి కలిగిన సంతోషం రాయడానికి మాటలు చాలవు). డిగ్రీ ఫైనలు పూర్తికాకుండానే హైదరాబాద్ వచ్చేసి సితార” లో చేరడం అనుకోని మలుపు. ఆ తర్వాత సినీరంగంలోకి ప్రవేశించినా... డిగ్రీ పూర్తి చేయలేకపోయాననే వెలితి వెలితిగానే ఉండిపోయింది. ఎంచేతంటే 'గాల్లో తేలినట్టుందే, గుండె పెలినట్టుందే' అని ఎన్ని తింగరి వేషాలేసినా కాలేజీలోనే కదా.. ఆ హ్యాపీడేస్ తిరిగొచ్చేస్తే ఎంత బావుణ్ణు. (13.05.2012, ఆంధ్రజ్యోతి ఆదివారం) గొరుసు జగదీశ్వర రెడ్డి 63
నో వ స. కీ ఖా సే పూల: లీ 1 న్ని తు అశోక్ చిరంజీవి ఫాన్స్ అంతా నా ఫాన్సే రేపటి పౌరులు” చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన అశోక్ కాన్త పెద్దయ్యాక ఇంజనీరింగ్ వట్లాతో పాటు “కొరియో(గ్రాఫర్” అవతారమెత్తారు. వరసపెట్టి 60 దాక్కుమెంటరీలు తీయదమే కాక 'ఉషోదయం' అనే విల్లల చిత్రానికి గాను 2007లో ఉత్తమ దర్హకుడిగా జ్యూరీ నంది వురస్కారం కూదా అందుకున్నారు. “ఫ్లాష్ న్వూన్) “ఆకాళరామన్న” చిత్రాల తర్వాత “పిల్ల జమిందారోొ సుకుమారుడు” చిత్రాలతో అందరి దృష్టిలో పద్దారు. త్వరలో రానున్న చిత్రం భాగమతి? కాలేజీలో ప్రవేశించే నాటికే నేనాక బుల్లి సెలబ్రిటిని. అప్పటికే కొన్ని వందల డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు రేపటి పౌరులు, నవభారతం, గడుగ్గాయ్, లాంటి కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించేశా. అదీగాక ఒంగోల్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో నా డాన్స్ విధిగా ఉండాల్సిందే. చిరంజీవిగారి డాన్స్‌లు చేసి చేసి ' జూనియర్ చిరంజీవిగా మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందేది. ఈ దాన్స్‌ల్లో మునిగి ఎక్కడ ఫెయిలైపోతానో అని అమ్మ భయం. కళలు కూడు పెట్టవని కొందరు (శ్రేయోభిలాషులు చెవిలో హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 64
ఇల్లుగట్టుకుని పోరేసరికి మెల్లగా మునిసిపల్ హైస్కూల్ నుండి నా సీటు కదిపి పదో
తరగతికి “నాగార్జున రెసిడెన్నియల్‌లో వేశారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడె చదవాల్సి వచ్చింది. చెల్లి ఫోర్టరీతో గుంజీళ్లు తప్పేవి
రెసిడెన్నియలైనా ఇంటినుండే కాలేజీకి వెళ్తుందేవాణ్ణి. మన అడ్డా ఎక్కువగా శ్రీనివాస్+శ్రీదేవి జంట థియేటర్ల దగ్గరో, రత్నమహల్ వద్దో ఉండేది. చిన్నప్పుడు మా చెల్లి అరుణతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథక్ నేర్చుకోవడం వల్ల డాన్స్ నా ఆరోప్రాణం అయింది. ముఖ్యంగా చిరంజీవిగారి స్టెప్స్ అంటే పడి చచ్చెవాణ్లి. సినిమా పిచ్చితో రాత్రుళ్లు సెకండ్ షోలు చూసి ఆలస్యంగా నిద్రలేవడం, లేటయినప్పుడల్లా తెలివిగా కాలేజీకి టి.వి.ఎస్ బండి వేసుకెళ్లి దారిలో బండి రిపేరొచ్చిందని అబద్దాలు చెప్పడం... రోజూ రిపేళ్లిమిట్రా అని మా లెక్చరర్స్ విస్తుపోవడం... ఇలా నడుస్తుండేది. ఒక్కోసారి పూర్తిగా డుమ్మా కొట్టె సేవాణ్సి. అందుకుగాను నాన్నతో లెటర్ రాయించి తీసుకు వెళ్ళాల్సి వచ్చేది. ఫోర్దరీ చేయడంలో మా చెల్లిది అందెవేసిన చెయ్యి. 'ఇస్నోఫీలియా వల్ల మా అబ్బాయి నిన్న రాలేకపోయా'డని నాన్న సంతకంతో లెటర్ తయారు చేసి నన్ను ఒద్దున పడేసేది. లేదంటే అమ్మాయిల ముందే గుంజీళ్లు తీయాల్సి వచ్చేది. ఇంట్లో ఈ వేషాలన్నీ కనిపెట్టారో ఏమో - ఇంటర్ సెకండియర్‌కి అద్దంకి వెళ్లేదారిలో గుళ్లాపల్లి దగ్గర ఉండే “నాగఖైరవ రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించారు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిన జీవితం ఒక్కసారి దారితప్పినట్టు అనిపించింది. మనసుంటే మార్గం ఉంటుందనే తత్వం బాగా వంటబట్టినవాబ్స్ కాబట్టి మెల్లగా దారులు వెతకడంలో నిమగ్నమయ్యా, వీరబాబుగార్శి దొరికిపోయాం
ముందుగా మస్తాన్ అనేవాణ్ణి మిత్రుడిగా చేసుకున్నా. ఎంచేతంటే వాడు అప్పటికే మూదేళ్లుగా అక్కడే చదువుతున్నాడు. కాలేజీ లూప్ హోల్సన్నీ బాగా తెలిసినవాడు. ఏ వేళప్పుడు, ఏ దారిగుండా బయటకి పారిపోవొచ్చో చెప్పేవాడు. మా కాలేజీ నుండి ఒంగోలు అరగంట ప్రయాణమే కాబట్టి తప్పించుకుని మెయిన్‌రోడ్ ఎక్కేసి ఏ లారీనో పట్టుకుని సినిమాకు చెక్కేసేవాళ్లం. ఒకరోజు “కొదమసింహంి సినిమా చూసి మెల్లగా గోడ దూకబోతుండగా ఎదురుగా మా కరస్పాండెంట్ వీరబాబుగారు వీర లెవల్లో నిల్చుని చూస్తున్నారు. మా పై ప్రాణాలు పైనే ఉష్... శిక్ష తప్పలేదనుకోండి. కొన్నాళ్లు బుద్దిమంతుడిలా ఉన్నా. కానీ చిరంజీవిగారి సినిమా నన్ను నిలవనిచ్చెది కాదు. అలవాటు గొరుసు జగదీశ్వర రెడ్డి + 65
పడ్డ ప్రాణం కదా! వాచ్‌మేన్‌కు ఐదో, పదో సమర్పించి చెక్కేస్తుందేవాళ్లం. మూడు నెలలు తప్పించుకు తిరిగా
డాన్స్ బ్రహ్మాండంగా చేస్తానని తెలిసి కొందరు అమ్మాయిలకి డాన్స్ నెర్చించమని ఆర్టర్ వేసి మగపురుగైనా వెళ్లలేని లేడీస్ హాస్టల్లోకి నన్ను పంపేవారు. ఆ క్రమంలో తక్కువ కాలంలోనే అందరి నోళ్లలో నాలుకైపోయా. ఆ ఏడాది డిసెంబర్ 31కి నేను కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ పెట్టించారు. ఆ మర్రోజే నాన్న బర్త్‌దే కాబట్టి ఎంత రాత్రయినా ఇంటికి వెళ్లాలనే తొందర్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. ప్రోగ్రాం అయిన వెంటనే ఒకమ్మాయి వచ్చి నా చేతికి గులాబి పువ్వుతో పాటు “గ్రీటింగ్ ఇచ్చింది. బహుశా నన్ను అభినందిస్తున్నదేమోనని విప్పి చూసి తెల్లబటోయా. అదొక (ప్రేమలేఖ. చెమటలు పట్టేశాయి. గబగబ జేబులో కుక్కేసి, కంగారుగా టాయిలెట్ రూమ్‌కు పరిగెత్తి సాంతం చదివా. ఈ విషయం లీకైతే తాట వలిచేస్తారని 3 నెలల వరకు ఆ అమ్మాయిని తప్పించుకుని తిరిగానంటే నమ్మంది. చిలిపి చేష్టలు తారాస్థాయిలో ఉందేవి
బాత్రూమ్‌లు తక్కువ ఉండడంతో ఆరుబయట పెద్ద తొట్టి పెట్ట దాన్నిందా నీళ్లు పోసి ఉంచేవారు. అక్కడ చచ్చినా స్నానం చేసేవాణ్ణి కాదు. 'తొట్టిగ్యాంగ్ మాత్రం అక్కడే జలకాలాదేది. స్టడీ అవర్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. ఆలోపు న్నానం చేసి పరిగెత్తాలి. బాత్రూంలో ముందుగా స్నానం చేయడం ఎలా అనే ఐడియా వేసి సబ్బులన్నీ కలిపేసేవాదిని. ఎవరి సబ్బు వాళ్లు ఏరుకునే లోగా నా స్నానం అయిపోయేది. కొంటె పనులకు కొదవుందేది కాదు. కుమార్ అనేవాడు స్నానం చేస్తుంటే వాడి టవల్‌ని దాచేసేవాళ్లం. దాంతో వాడు బాగా చీకటి పడ్డాక ఆదిమానవుడి అవతారంలో బాత్రూం నుండి దొంగలా బయటికి వచ్చేవాడు. స్టడీ అవర్‌కి వాడెందుకు లేట్‌గా వస్తున్నాడో మాకు తప్పించి మరెవరికీ తెలియని మిస్టరీ అది.
ఒక్కోసారి కాంటీన్‌కి ముందుగా వచ్చేసి ఏం తోచక టేబుల్ మీద ఉండే సాంబారు మగ్గులో పక్కనే ఉండే ఉప్పును సాంతం ఒంపేసి ఆ మగ్గుని ఒకరికి తెలియకుండా ఒకరం టేబుల్స్ మార్పేసి... ఆ సాంబారు ముందుగా పోసుకున్న వాడి ముఖకవళికల్ని గమనించే వాళ్లం. కొన్నాళ్లకి మాలోనే ఎవరో ఉప్పు కలుపుతున్నారని పసిగట్టి స్పూను సాంబారుని తీర్ధంలా చేతిలో పోసుకుని రుచి చూసి ఆ తర్వాతే అన్నంలో కలుపుకునేవారు. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 66
ర్యాగింగ్ ర్యాగింగ్ ర్యాగింగ్
ఇంటర్మీడియట్ తర్వాత విజయవాడ దగ్గర్లోని “కోనేరు లక్ష్యయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను కొత్తలో ర్యాగింగ్ చేస్తారని తెలిసి చాలా భయపడిపోయాను. ఒకరోజు అనుకోకుండా 9 మంది సీనియర్స్ బిలబిలమంటూ క్లాసులోకి వచ్చేసి “చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమందో చేతులెత్తండి' అన్నారు. 20 మంది ఎత్తారు. వెంటనే చిరంజీవికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్లు చెప్పలేకపోయేసరికి ఎండలోకి తరిమేశారు. తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరన్నారు - మరికొందరు చేతులెత్తారు. బాలకృష్ణ వాళ్ల అబ్బాయి పేరంటని అడిగారు. ఎవరూ చెప్పలేకపోయేసరికి నేను చెప్పాను. అంతే! నీవె నిజమైన బాలకృష్ణ అభిమానివని మెచ్చుకుని వచ్చే సండే “నిప్పురవ్వ సినిమాకి మాకందరికీ టికెట్లు తీసుకొచ్చి ఇవ్వమని ఆర్దర్ వేసి వెళ్లారు. మరోసారి మాలో కొందర్ని హాస్టల్స్‌కు తీసుకెళ్లారు. ఒక దగ్గర టూత్‌పిక్ మొదలుకుని మూడడుగుల పొడవుండే కర్రలున్నాయి. ఎవరికి ఇష్టమైన కర్రని వాళ్లని సెలక్ట్ చేసుకోమన్నారు. సెలక్ట్ చేసుకున్నవాటితో కొడతారేమోనని భయపడి మాలో ఒకడు టూత్‌పిక్ సెలక్ట్ చేసుకున్నాడు దెబ్బ తగలదు కదా అని. దాంతో హాస్టల్ కాంపౌండు చుట్టుకొలతని కొలుచుకుని రమ్మన్నారు. ఒకన్ని కర్ర పట్టుకుని తాతలా నడవమన్నారు. చికుబుకు చికుబుకు రైలే...
ఒకరోజు సుధాకర్ అనే మిత్రుడు కరకట్ట రోడ్డు పక్కన లూనా పై నుండి పడెయడంతో కాలికి దెబ్బతగిలి ఇంట్లోనే ఉండిపోయా. సిద్ధార్ధ కాలేజీకి మాకూ సై అంటే సై అన్నట్టు ఉండేది. ఇల్లు వెతుక్కుంటూ మా సీనియర్ “బాబు వచ్చి నన్ను అర్జెంటుగా తయారవమన్నాడు. కాలు నెప్పిగా ఉన్నా తప్పలేదు. బైక్‌మీద సరాసరి స్టెల్లా కాలేజీకి తీసుకెళ్లి '*నీవు ఇప్పుడు డాన్స్ చేయాలి. మన కాలేజీ తరపున కాంపిటేషన్‌లో వొల్గొనాలి' అన్నాడు. బదులు చెప్పలేక, కాలు నెప్పితోనే “చికుబుకు చికుబుకు రైలి పాటకి డాన్స్ చేశా. డాన్స్ మూడ్‌లో చూసుకోలేదు... రక్తం కారిపోతోంది. తనే కట్టుకట్టించి ఇంట్లో దింపేసి వెళ్లాడు. మూడు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లా. అప్పటికే ఫెండ్స్ అంతా స్వీట్స్ పంచేసుకున్నారు డాన్స్ కాంపిటేషన్‌లో కాలేజీకి ఫస్ట్ (ఫైజ్ వచ్చిందన్న ఆనందంలో... చూడండి ఎంత అన్వ్యాయమో! ప్రేమలూ - చీవాట్లూ
నా సీనియర్ ఒకమ్మాయి నాతో పాటు ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తుండేది. ఒకరోజు లోస్లీగా ఉన్నప్పుడు దగ్గరకొచ్చి “నీవు లేకుండా జీవించలేను. ఒక్క అరగంటలో రిప్లయ్
ఇవ్వాలి... అదీ పాజిటివ్‌గా” అని బాంబు పేల్చి, చేతిలో చీటి పెట్టేసి వెళ్లిపోయింది. ఇదెక్కడి గొడవరా బాబూ అని కంగుతిన్నాను. అదే రోజు చివరి పీరియడ్ ప్రిన్స్‌పాల్‌ది కావడంతో అతడు క్లాసుకు వస్తాడో, రాదో కనుక్కుందామని ఆ అమ్మాయి క్లాస్‌రూమ్ ముందునుండే వెళ్లాను. నేను ప్రిన్సిపాల్ గదికి వెళ్లడం ఆ అమ్మాయి చూసింది. 1పేమలెఖ విషయం చెప్పేసి ఉంటానని డిసైడ్ చేసుకుని అదే రోజు సాయంత్రం బైక్ స్టాండ్ దగ్గర పట్టుకుని నిలదీసింది. “ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాన్, ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ చేస్తావా అని విరుచుకుపడింది. నేను ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. పరోక్షంగా ప్రిన్సిపాల్ నన్ను రక్షించాదన్నమాట. పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి
ఒకసారి సంక్రాంతి సెలవుల్లో ఒంగోలు వెళ్లాను. ఊర్లో గాయత్రి యాగం జరుగుతోందని తెలిసి వాలంటీర్‌గా హెల్ప్ చేద్దామని అనంతభట్ల శ్రీనివాస్ అనే మిత్రుడితో కలిసి వెళ్తాను యాగం అయ్యేసరికి రాత్రి పదకొండు దాటింది. ఇంటికి నడుచుకుంటూ బయళ్టేరాం. మా వెనక తొట్టిగ్యాంగ్ వస్తోంది. కొంత కాలంగా అమ్మాయిల టీజింగ్ జరుగుతోందని నిఘా వేసి ఉంచారట పోలీసులు. మా మాటల్లోనే పెట్రోలింగ్ వ్యాన్ రావడం, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వ్యాన్ ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. మా వెనకాల వస్తున్న గ్యాంగు పోలీసుల్ని చూడగానే చెల్లాచెదురైపోయింది కాబట్టి వాళ్లెవరూ దొరకలేదు. పోలీసులు యక్షప్రశ్నలు వేస్తుంటే అక్కడే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ “అమ్మాయిలు వాళ్ల వెంట పడేలా ఉన్నారు కానీ, వీళ్లు అమ్మాయిల వెంట పడేలా ఉన్నారా?” అని మమ్మల్ని తెచ్చిన పోలీసులకు చివాట్లు పెట్టి మమ్మల్ని పంపించేసింది.
ఫైనల్ సెమిస్టర్ రాయకముందే సినిమాల్లో “కంపోజర్ అసిస్టెంటొగా ఛాన్స్ రావడంతో మద్రాసు వెళ్లిపోవడం, తర్వాత దాదాపు 200 పై చిలుకు సినిమా నృత్యాలకు కొరియోగ్రాఫర్‌గా చేయడం, లండన్ 'లెబియన్' యూనివర్శిటికి వెళ్లి లాటిన్ స్టయిల్లో 'సల్ఫా లంబా” అనే డాన్స్ నేర్చుకుని రావడం.... తర్వాత దర్శకత్వ శాఖలో చేరిపోవడం ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి కానీ, అందమైన నా కాలేజీ దేస్ మాత్రం మదిలో నిశ్చలంగా మిగిలిపోయాయి.
(20.5.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 68
షి య శ శ 1 న స | క్ట న్‌ు ల సే | (స న. స్య కంచు ల శ ఖ్ స కా న్ ల లీ జ ( లే | శ. | య య ! పక వే వీరు పోట్ల ఆలం. ఆలీ కాపీ కథ చెప్పి ఆదర్శపురుషుడినయ్యా ఇంటిపేరు “పోట్ల” - అ నునా పోట్లాదలేని సాత్వికుడు. ఊరు వీదు/రాళ్ల - కనీసం ఉరుములా కూదా నినివించదు. పోట్లాడినా, వీడుగులు కురివీంచినా వెండితెరపైనే చూపుతొనంటూ కథల నంచిని భుజూనికి తగిలించుకుని వల్నాటినీమ నుండి సినీపరిళమకు చేరిన ీరు'దతదు. నువ్వొస్తానంటే నేనొద్ధంటానా; వర్షం, లాంటి సినిమాలకు విజయవంతమైన కథలందించి “బిందాస్, “రగడ?” 'దూసుకొళాా “ఈడు గోల్ ఎహే” చిత్రాలకు కథ, న్కీన్‌ప్తే సంభాషణలతో పాటు దర్శకత్వం జాధ్యతలు కూదా చేపట్టిన “వీరు పోట్ల” నామధేయుదతడు. నా స్టడీదేస్ అన్నీ హ్యాపీడేస్ కావు. సంతోషాలు, దుఃఖాలు భయానకాలు మిశ్రమంగా అనుభవించిన రోజులవి. కాకపోతే ప్రతి మజిలీలో మనసుకు దగ్గరయ్యే ఒకరిద్దరు మంచి మిదత్రులు దొరికారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని జానపాడు మాది. వ్యవసాయ కుటుంబం. జీవితమంటే చదవడం ఒక్కటే కాదని చెప్పినా వేలు పట్టుకుని దిశామార్దం చూపిన గురువు పందిటి రామిరెడ్డిగారు. తన క్లాసులో క్లెవర్ స్తూడెంట్స్ ఎవరున్నారో గొరుసు జగదీశ్వర రెడ్డి + 69
నిశితంగా గమనిస్తూ వాళ్ల భవిష్యత్ కోసం కంకణం కట్టుకొనేవారు. నాచేత తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయించారు. సీటొచ్చినందుకు నాకంటే ఆయనే ఎక్కువ సంతోషించారు. అప్పుడు ఆయన నాతో చేసిన కరచాలన స్పర్శ ఇంకా తడిగానే ఉంది. లేని రోగం తెచ్చుకునేవారు
చేరిన కొద్దిరోజుల్లోనే అందరి తలలో నాలుకైపోయాను. ఫిజిక్స్‌లో క్లాసు ఫస్టు రావడంతో మోహనరావు మాస్తారు దృష్టిలో పడి 'సిక్‌లీడరొ అయ్యాను. సిక్‌లీడర్ అంటే మరేం లేదు. విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉందేమో తనిఖీ చేస్తూ వాళ్లను మా కాంపస్‌లో ఒక మూలగా ఉండే డిస్పెన్సరీ మేడమ్ దగ్గరకి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించాలి. మేడమ్ చాలా అందంగా ఉందేది. కేవలం ఆమెను చూడాలనే వంకతో ఏదో ఒక జబ్బును తెచ్చుకునేవారు కొందరు. బహుశా అది కౌమారం జబ్బెమో!
నాకు మొదట్నించి సినిమా పిచ్చి ఎక్కువే. రాత్రి రెండో ఆటకి తాడికొండ వెళ్లి సినిమా చూసి చీకట్లో దొంగలా వచ్చి పదుకుని, తెల్లవారి మామూలుగా స్కూలుకి వెళ్లేవాద్ని. రాత్రుళ్లు చెకింగ్‌కు వచ్చే వెంకటేశ్వర్రావు మాస్తారుకి మేం డార్మెట్రీలో లేమని అనుమానం వచ్చిందంటే మమ్మల్ని వెతుక్కుంటూ బెత్తంతో పాటు సరాసరి సినిమా హాలుకి వచ్చేసేవారు. పిర్రలు వాయిస్తూ పరిగెట్టించడమే కాకుండా మర్రోజు పెరేద్‌లో ప్రిన్సిపాల్ ముందు దోషులుగా నిలబెట్టేవారు. రైల్వే స్టేషన్లో కాందిశీకుల్లా....
ఎన్ని సార్లు పనిష్మెంట్ ఇచ్చినా మా వంకర బుద్ధి మారేది కాదు. ఒకరోజు ఎం.వి. నరసింహారావు అనే మిత్రుడితో కలిసి గుంటూరు వెళ్లి వరసగా మార్నింగ్, మాట్నీ ఫస్ట్ షో సినిమాలు చూసేశాను. కొద్దిలో చివరి బస్సు మిస్సు. ఇద్దరం శక్తి కూడదీసుకుని బస్సు వెనకాలే ఆపమని కేకలేస్తూ దాదాపు 8 కి.మీ. పరిగెత్తాం. బస్సు మాత్రం ఆగలేదు. ఆయాసంతో పాటు దుఃఖం కూడా ఎగదన్నుకొచ్చింది. జేబులో డబ్బులు ఛార్జీకి సరిపడా ఉన్నాయి. ఉదయం పెరేడ్‌లో మేం కనిపించకపోతే జరిగే పరిణామం ఊహిస్తూ వణికిపోయాం. చివరికి ఆకలితో రైల్వేస్టేషన్‌లో కాందీశీకుల్లా గడిపి తెల్లవారి ఫస్ట్‌బస్‌కి తాడికొండకి చేరుకున్నాం. అదృష్టం కొద్ది మమ్మల్ని ఎవరూ పసిగట్టలేదు.
అప్పట్లో వేణు, ఛార్తెస్, అలీ నా క్లోజ్ (ఫెండ్స్. ఎక్కడికైనా మేం కలిసే తిరిగేవాళ్లం. తాడికొండ ఊర్లోకి వెళ్లి కోడిగుడ్లను తీసుకొచ్చి వాటిపై పేర్లు రాసి ఎవరికీ తెలియకుండా ఉడికించి ఇవ్వమని వంటవాళ్లకు ఇచ్చేవాళ్లం. అయితే ఉడికే అన్నంలో హ్యావ్ డేస్ = సిన్ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 70
వేసిన గుడ్డు తిరిగి పైకి వచ్చేవి కావు. ఎలా మాయమయ్యేవో ఇప్పటికీ అర్ధంకాని మిస్టరీ. కొల్లిపర కాలేజీ కబుర్లు
టెన్త్‌లో తొంభై శాతం మార్కులతో విజయఢంకా మోగించి కొల్లిపర దగ్గరుందే 'అవుతు రామిరెడ్డి రెసిదెన్నియలొలో ఇంటర్‌లో చేరిపోయా. అప్పటిదాక చదివింది తెలుగు మీడియం. సడన్‌గా ఇంగ్లీష్ మీడియంలో పడేసరికి మొదటి రెండు నెలలు నరకం అనుభవించాం. 90 శాతం మార్కులతో తాడికొండ నుండి వచ్చాననెసరికి నాకు అన్నీ తెలుసనే భ్రమల్లో ఉండేవాళ్ళు లెక్చరర్లు, వాళ్లు అడిగిన ప్రశ్నలకి నోరు తెరవగానే 'ఆం... కాపీ బ్యాచ్ అని నవ్వుకునేవాళ్లు స్టూడెంట్స్. దాంతో తలకొట్టేసినట్టు అన్పించి మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేవాళ్లి. సరిగ్గా ఆ సమయంలో జరిగిన యూనిట్ టెస్ట్‌లో ఫిజిక్స్ నా పరువు కాపాడింది. మెల్లగా గ్రామరు నేర్చుకుంటూ ప్రతీదీ క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడం మొదలెట్టా. టౌన్లో ఉంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయనే భ్రమతో సెకండియర్‌కి గుంటూరు జె.క.సి.కి మకాం మార్చేశాను.
కొల్లిపరలో సంపాదించుకున్న మిత్రరత్నం ప్రసాదరెడ్డి. తనుకూడా నాతోపాటు గుంటూరుకి వచ్చెశాడు. నా కథగా నమ్మకం కలిగించా
గుంటూరు వచ్చేశాక సినిమా పిచ్చి ముదిరి తీగపాకంలో పడింది. అక్కడ హాస్టల్ వార్డెన్ మరింత స్ట్రిక్ట్. తాడికొండలో కంచె దూకడానికి అనుకూలంగా
ఉండేది. దీని ప్రహరీ మాత్రం చాలా ఎత్తుగా గాజుపెంకుల తాపడంతో ఉందేది.
మనసంతా సినిమాలవైపే. లేదంటే లైబ్రరీలో దూరిపోయేవాణ్సి. సినిమాకి కథ ఎలా తయారుచేయాలి? స్క్రిప్ట్, డైలాగ్స్ ఎలారాయాలి? 24 గంటలూ ఇదే ధ్యాస.
ఒకనాటి రాత్రి హాస్టల్లో కరెంటు పోవడంతో అందరం డాబాపైకి చేరాం. పిచ్చాపాటీ కబుర్ల మధ్య మిత్రులంతా ఏదైనా కథ చెప్పమని అడిగేసరికి వాళ్లని ఆటపట్టించాలని అప్పటికే నేను చదివిన ఒక నవలను దృష్టిలో పెట్టుకుని కథంతా నా జీవితంలో జరిగినట్టు ఫీలింగ్‌తో చెప్పాను. అంతా అవాక్కయిపోయారు. అందులో కథానాయకుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోవాలనుకుని, ఆమెను 'యమకూపంి నుండి బయటకి తీసుకువస్తాడు. 'వద్దు.... వేశ్యను పెళ్లి చేసుకోవద్దు. మీ ఇంట్లో వాళ్లు బాధపడతారని కొందరు, “నీలో ఒక ఆదర్శపురుషుడు ఉన్నాడని మరికొందరు భిన్నస్వరాల్తో నన్ను కొన్నాళ్లపాటు ఊపిరి ఆడనివ్వలేదు. అది మల్లాది వెంకటకృష్ణమూర్తి “నాతిచరామి నవలనే విషయం ఇప్పటికీ వాళ్లకు తెలియదనుకోండి. అప్పుడు ఏర్పడింది
నాపై నాకు పూర్తి నమ్మకం. మనం ఇక నైన్ టు ఫైవ్ జూబ్ చేయకుండా దర్దాగా సినిమాల్లో స్కిఫ్ట్ రైటర్‌గా స్థిరపడిపోవచ్చని.
(డ్రేమ వ్యవహారాల్లో ఎప్పుడూ తలదూర్చలేదుకానీ, (పేమలేఖల్ని రాసి పెట్టడంలో నా పాండిత్యమంతా చూపెట్టిన సందర్భం ఒకటుంది. ఒక మిత్రుడికోసం ఆ పని చేయాల్సి వచ్చింది. (ఇప్పుడు పెళ్లయిపోయింది కాబట్టి పేరు బయటపెట్టి వాడి కాపురం కూల్చలేను - క్షమించండి). ఎన్నాళ్లుగానో వెంటపడుతున్నా పట్టించుకోని ఆ అమ్మాయిని నేను రాసిన (ప్రేమలేఖలు చూపించి బుట్టలో పదేశాడు. తలుచుకుంటే ఫన్నీగా ఉంటుంది. గుప్పెట్లో గుండెను దాచుకుని...
అనుకోకుండా వచ్చిన రాజకీయ ఉపద్రవం మమ్మల్ని అతలాకుతలం చేసిన రోజులవి. వంగవీటి రంగా చనిపోయినప్పుడు చెలరేగిన అల్లర్లకు తటస్థంగా ఉండే నేను కూడా గుండెని గుప్పెట్లో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి హఠాత్తుగా హాస్టల్లోకి దూసుకు వచ్చిన వాళ్ల చేతిలో బలైపోవలసిందే. ఒకడు గురిచూసి గోలీసోడా నాపైకి విసిరాడు. అయినా అది గురితప్పి పక్కనున్న రాయిఫై పడి భళ్లుమని పగిలిపోయింది. గుడ్డిలో మెల్ల ఏమంటే అది ఖాళీది. అదే సోటాగ్యాస్‌దై ఉండి ఉంటే.. (ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేనుందేవాణ్ణి కాదు). సైకిళ్లన్నీ తీసుకొచ్చి పక్కనే ఉన్న బావిలో వేసేశారు. ఎవరు ఎవర్ని కొడుతున్నారో తెలీని గందరగోళంలో బతుకు జీవుడా అనుకుంటూ పుస్తకాలు, బట్టలు ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయి 8 రోజుల పాటు మా ఫ్రెండ్ రూమ్‌లో తలదాచుకున్నాను. తర్వాత అడ్డదారుల్లో పడి పిడుగురాళ్లకు చేరిన ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటే.
మొదట్నించి కామైద్స్ పట్ల సింపథ్రైజర్‌గా ఉందేవాణ్డి. ఆ ఉబలాటంలో ఒకసారి ఎస్.ఎఫ్.ఐ. మిత్రులతో కలిసి వలమందిమి “చలో హైద్రాబాద్” అని బాడ్డీలు గుచ్చుకుని, జెండాలు పట్టుకుని రైలెక్కేశాం. కిక్కిరిసిపోయిన జనంతో ఊపిరి సలపని బోగీల్లో ఒంటికాలిపై హైద్రాబాద్ వెళ్లి ఇందిరాపార్కులో జరిగిన బహిరంగసభలో పాల్గొని తిరిగి ఒంటికాలిపైనే రైలు ప్రయాణం చెయ్యడం మరో మర్చిపోలేని సంఘటన. సరదాకి వెళితే... ఏదో అన్నట్టు
రెసిడెన్నియల్లో చదివే నాకు యూనివర్శిటీ ఎలా ఉంటుందో చూడాలనే కోరిక ఉండేది. అక్కడ చదివే స్టూడెంట్స్, వాళ్ల వాస్టల్స్, వందల ఎకరాల్లో ఉండే విశ్చవిద్యాలయ హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు పి 76
ప్రాంగణం.. ఆ పరిసరాల్లో గడపాలనే ఆసక్తి ఉండేది. గతంలో నాతోపాటు చదివిన ఒక మిత్రుడు నాగార్జున యూనివర్శిటీలో ఉండేవాడు. కొన్నాళ్లు వాడితోపాటు ఉండి ఆ పరిసరాల్ని గమనించాలనుకున్నాను. నేను వెళ్లిన వేళా విశేషం ఏమంటే యూనివర్శిటీ అంతా అరుపులతో, కేకలతో దద్దరిల్లుతోంది. ఏ కారణంగానో ఆ వైస్ ఛాన్స్‌లర్‌ని తొలగించాలని బాడ్జలు పెట్టుకుని అందరూ గుంటూరు మద్రాసు హైవే పైన బైఠాయించారు. దాదాపు 20. కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏం చేయాలో తోచక నేను కూడా మావాడితో పాటు రాస్తా రోకోలో పాల్గొనాల్సి వచ్చింది. అరుపులు కేకల మధ్య దూసుకొచ్చిన పోలీసు వ్యాన్లను చూడగానే అంతా చెల్లాచెదురయ్యారు. టియర్‌గ్యాస్ వదిలి, ఆ తర్వాత కన్పించినోడిని కన్పించినట్టు రబ్బరు బుల్లెట్లతో ఆడుకున్నారు పోలిసులు. నాకు సబంధం లేనిదైనా భయంతో బతుకు జీవుడా అని పరిగెత్తాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయంలో ఉండడం కుదరలేదు కానీ కాలం
కలిసిరాకపోతే తాడే పామై కరవొచ్చనే తత్వం మాత్రం బోధపడింది. కాలేజీ పూర్తి చేశాక గుంటూరులో కొన్నాళ్లపాటు ఒక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం కూడా వెలగబెట్టా. కళ్లు మూసినా తెరిచినా వెండితెర రారమ్మని పిలుస్తోంటే ఉద్యోగం ఎన్నాళ్లు చేయగలను? నా కలల్ని సాకారం చేసుకోవడమే మన తక్షణ కర్తవ్యమని ఒక శుభముహుర్తాన కథల సంచిని భుజానికి తగిలించుకుని ఇలా మీ
ముందుకు వచ్చేశా!
(27.05.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
వ హీ జ్ఞ జ ఫై. . క ం | స లా న క్ష శో శ్ గ న (ఓ ణీ శ్రి క టీ హా త్ భ% |. ఓ గ క్త లలో స్మ గ చిన్నికృష్ణ బి గ్ పదిహేదేళ్లకే కన్యాదానం చెశాను “ఆం(ధ్రావ్వొరిన్” నుందీ ఐయలుదేరి 'భాగ్యరాజాణి వెతుక్కుంటూ చితసీమలోకి అడుగు పెట్టిన చిన్నిక్ళుమ్తదతదు. తొలిసారిగా రజనీకాంత్ 'వదయవ్పు” (నరసింవా) నీనిమాకీ విజయవంతమైన కథనందించి రచ్చ గెలిచి ఇంట గెలిచిన కథల మనిషి, నరసింవానాయుడు? “ఇంద్ర, 'గంగో(తి? “దీనాభ్‌్ కథలతో తనేమిటో నిరూవీంచుకున్నాదు. వొమాలయాల గొప్పుతనాన్ని తొలిసారిగా తెరకు పరిచయం చేని నేపాల్ (వగ్రభుత్వం నుండి “ఇందో నేపాల్ యూనిటీ” వురస్త్కారం కూదా అందుకున్నారు చిన్నిక్ళష్త. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా 'ఆంధ్రాప్యారిస్' తెనాలే. అమ్మ పరమ భక్తురాలు. ప్రతిరోజూ గుడికి వెళ్లేది. ఆమెతో పాటు నేనూ వెళ్తుండేవాణ్స్లి. అమ్మ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుంటే వాటిని లెక్కపెడుతూ ఒక గిన్నెలో మిరియపు గింజల్ని వేస్తుండేవాణ్సి. రోజూ 108 ప్రదక్షిణలు చేసేదావిడ. ఆ విధంగా వేదమంత్రాలునాలో ఒక భాగమైపోయి నన్ను గురుకుల పాఠశాల వైపు నడిపించాయి. (నా కథల్లో అంతర్లినంగా ఆధ్యాత్మికత చోటు చేసుకోవడానికి ఇవే కారణాలు.) కులాల పేరుతో విద్యార్థుల్ని విదదీసి, వాళ్లమధ్య విభేదాలు సృష్టించే కాలేజీలంటే మొదట్నించీ భయమే. కల్మషంలేని పసిమనసుల్ని కలిపే పాఠశాలలంటేనే ఇష్టం. చిన్నప్పట్నంచి క్రమబద్ధమైన జీవితాన్ని నేర్పింది మాత్రం కృష్ణాతీరంలోని చిలుమూరు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 74
గురుకుల పాఠశాల. దాదాపు 500 మంది విద్యార్థులతో నిత్యం వాల్మీకి ఆశ్రమంలా కళకళలాడుతూ క్రమశిక్షణకి పర్యాయపదంలా ఉండేది. పక్షుల కూజితాల కంటే ముందు మా పిల్లల కువకువలే విన్పించేవి. వేకువనే 4 గంటలకు నిద్రలేవడంతో మా దినచర్య ప్రారంభమయ్యేది. అమ్మానాన్నల్ని వదిలి గురువు సన్నిధిలో ఉండేవాళ్లం కాబట్టి గురువును దైవంగా భావించేవాళ్లం. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్కై శ్రీ గురవేనమః అనేది మాకు నిత్య పారాయణ జపం. “'ముఖ్యమంత్రి'నయ్యా
మా గురుకులం ఒక రాష్ట్రం అనుకుంటే విద్యార్థుల్లోనే కొందరు మంట్రులుగా వ్యవహరించి అన్ని శాఖల్ని నిర్వహించడం గమ్మత్తుగా ఉండేది. క్రీడలు, ఆరోగ్యం,
్క విద్య... ఇలా అన్ని రంగాలు అక్కడ ఉందేవి. విద్యార్థులు క్లాసు లీడర్లను ఎన్నుకుంటే,
లీదర్లంతా కలిసి పిల్ల మంత్రుల్ని ఎన్నుకునేవారు. మొదట్లో నేను ఆహార శాఖ మంత్రిగా ఉండేవాణ్ణి. గురుకులానికి వచ్చే పాల దగ్గర్నుండి రాత్రి భోజనాల వరకు అన్నిటిమీదా నిఘా ఉంచాలి. పాలల్లో నీళ్లు కలిపినా, వంటలు రుచిగా లేకపోయినా పెత్తనం సాగించి సరిదిద్దాలన్నమాట. నేను ఎస్.ఎస్.సి. లోకి వచ్చెసరికి ఆహారశాఖామంటత్రి నుంది ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చానంటే నేనెంత కష్టపడి పనిచేసి ఉంటానో అర్ధం చేసుకోండి!
తరచూ పిల్లలమంతా చిలుమూరు నుంది అనంతవరం, ఈవూరు కొల్లూరు లాంటి గ్రామాలకు వెళ్లే బాటకు రెండువైపులా మొక్కల్ని నాటేవాళ్లం. అందుకుగాను సేంద్రీయ ఎరువుల్ని కూడా సేకరించాల్సి వచ్చేది. అలా ఎన్ని వేల మొక్కల్ని నాటి ఉంటామో (అప్పుడు మేం నాటిన మొక్కలు నేడు మహీ వృక్షాలై ఆకాశాన్ని తాకడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది, శిలువను చూస్తే మనసంతా ఆర్రత
ఎనిమిదో తరగతిలో అనుకుంటా వెల్లటూరు “పూర్ణనంద శర్మగారి ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఆర్ట్ కాంపిటీషన్‌కి మా గురుకులం నుండి కొంతమందిమి వెళ్లాం. ఏసుక్రీస్తు జననం నుండి ఆయన్ని సిలువ వేసేవరకు కొన్ని ఘట్టాల్ని తీసుకుని బొమ్మలుగా వేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టెశాను. ఇప్పటికీ సిలువలో ఉన్న ఏసుక్రీస్తు బొమ్మని ఎక్కడ చూసినా ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోతుంటాను. నా కళ్లకది "పెయిన్‌పుల్ దృశ్యం.
మా గుంపులోనే చిట్టిబాటు అని ఒకడుందేవాడు. అప్పటికే తను నాకంటే సీనియర్. కాంపిటీషన్ ముగిసి, తిరిగి గురుకులానికి వెళ్తుండగా నన్ను పక్కకి పిలిచి
న్స్ దగ్గర అగ్గిపెట్టె ఉందా? అన్నాడు. ఎందుకని ఆశ్చర్యపోయి అదిగా, జేబులోంచి కాష్టన్ సిగరెట్ తీసి చూపించాడు. బిత్తరపోయి నోరు తెరిచాను. వాళ్లది సిద్ధిపేటని, తన మావయ్యల్లో కలిసి బీరు కూడా తాగుతానని చెప్పేసరికి బుర్ర తిరిగిపోయింది. ఆ వయసు పిల్లలు సిగరెట్టు తాగడం నేనెప్పుడూ చూడలేదు. అగ్గిపెట్టే విషయంలో మా మధ్య మొదలైన మైత్రితో నాతో సిగరెట్టు కాల్సించాడు. అలవాటు లేని పని. పొగతాగడం అదే మొదలు - అదే చివర కూడా. దివిసీమ ఉప్పెనలో చిక్కుకుపోయాం
మా గురుకులం అంతా రెల్లు గడ్డితో, తాటి కప్పుతో ఉందే పెద్ద పెద్ద గుడిసెల్లాంటివే. పెద్ద గాలి వీస్తే ఊగిపోయేవి. అలాంటిది దివిసీమ ఉప్పెనకు ఆగుతాయా? ఆ తుఫాను (నవంబరు 19, 1977) ఇప్పటికీ కళ్లకు కట్టినట్టే ఉంది. పిల్లలం చూస్తుండగానే మా గుడిసెలన్నీ గాలివాటుకు ఎగిరిపోయాయి. ఆ ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో దద్దరిల్లింది. పుస్తకాలు, బట్టలు ఉప్పెన లాక్కుపోవడంతో కట్టుబట్టలతో మిగిలాం. భోజనాలు చేసే కాంటీన్‌షెడ్ మాత్రం కాస్త గట్టిగా ఉండడంతో అందరం పొలోమని అందులోకి దూరిపోయి రాత్రంతా జాగరణ చేస్తూ గడిపాం. తెల్లారేసరికి కనీసం చెప్పులు కూడా మిగల్లేదు. అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇంటికి వెళ్లామంటే రవాణా లేదు. గాలివానలో తడుస్తూ బురదలో నడుస్తూ.. అక్కడక్కడా చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న శవాలను భయం భయంగా చూస్తూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని పదకొండు కి.మీ. నడిచి ఆ సాయంత్రానికి తెనాలి చేరుకున్నాం. కొందరు విద్యార్థులను మా ఇంట్లోనే ఉంచుకుని ఉప్పెన పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ల ఊర్లుకు పంపడం గుర్తుంది. అదొక చీకటి జ్ఞాపకం,
గురుకులంలో మాంసాహారం నిషిద్ధం కాబట్టి ప్రతి ఆదివారం మా తాతయ్య రకరకాల నాన్‌వెజ్ వంటకాలు, బిర్యానీలు చేయించుకుని స్కూలుకి తీసుకొచ్చేవాడు. చాలామంది పేరెంట్స్ ఘుమ ఘుమలాడే వంటకాలతో వచ్చేసేవాళ్లు. అందరం కృష్ణానది ఒడ్డుకు చేరి అక్కడ తినేవాళ్లం. నా క్లాన్‌వేట్ (మంత్రి) మోవిదేవి వెంకటరమణారావు. వాళ్ల ఇంటినుండి పీతలు, చేపలు, రొయ్యలు కూరలు రావడం కూడా గుర్తుంది. భాగ్యరాజా నన్నావహించాడు
టెన్స్ పూర్తి కాగానే తెనాలి వి.ఎస్. ఆర్. అండ్ ఎన్. వి.ఆర్. కాలేజీలో చేరి ఎం.పి.సి. తీసుకున్నాను. కాలేజీకి వెళ్తున్నప్పుడల్లా రోడ్డు పక్కన అతికించే సినిమా పోస్టర్లని తదేకంగా చూడడం అలవాటు నాకు. వాటిని చూస్తూ ఎంతసేపైనా అలా హాల్ డేస్ = సిస్ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తులు + 6
నిలబడిపోయేవాణ్ణి. ఆ కాలంలోనే వచ్చిన భాగ్యరాజా అనువాద చిత్రం “చిన్నరాజా నాలో మార్పుకి నాంది పలికిందనే చెప్పాలి. తనను మారుటి తల్లి ద్వేషిస్తోందని తెలిసి కూడా ఆమెను అతిగా (ప్రేమించే ఒక కొడుకు కథ అది. నిర్మాత, దర్శకుడు, కథానాయకుడూ భాగ్యరాజానే. మనల్ని ద్వేషించే వాళ్లని అంతగా (ప్రేమించడం సాధ్యమా అనిపించేది. (ప్రేమ ఏ లెవల్లో ఉంటుందనేదానికి పరాకాష్ట ఆ సినిమా. ఆ సినిమా చూసిన రోజే భాగ్యరాజా ఏ దేశంలో ఉన్నా కలవాలని డిసైద్ అయిపోయా.
మా కాలేజీ పరిసరాల్లో తరచూ ఒక పిచ్చి ఆడమనిషి తిరుగుతూ ఉందేది.
దాదాపు తనకి 40 ఏళ్లుంటాయి. ఆమెను ఎప్పుడూ అంతగా పట్టించుకునే వాళ్లం
కాదు. ఒకరోజు అనుకోకుండా కాలేజీ క్యాంపస్‌లో నడుస్తూ వెళ్తుంటే దగ్గరకు వచ్చేసి 'నీవు సినిమా యాక్టరులా ఉండావయ్యా, అచ్చం ఎన్టీరామారావు బిడ్డలా ఉందావు' అనడంతో ఒక్కసారిగా కంగు తిన్నాను. ఆ రోజు నుండి నన్ను కొందరు “బాలకృష్ణు అని పిలుస్తూ ఆట పట్టించేవారు. నేను వేసిన లవ్ స్కెచ్ అదిరింది
కాలేజీలో ఉండగానే శివ అనే మిటత్రుడి ప్రేమ వ్యవహారంలో రాయబారం నడపాల్సి వచ్చింది. అప్పట్లో శివ వాళ్ల బావగారు కొట్టాయం (కేరళులో బట్టల షాపు నడిపేవాడు. శివ చుట్టం చూపుగా కొట్టాయం వెళ్లినప్పుడు ఆ షాపులో పనిచేసే సేల్స్‌గర్ల్ (ప్రేమలో పడ్డాడు. తెనాలిలో ఉండే కొందరి మిత్రులతో తన (ప్రేమకావ్యం చెప్పి ఏదో రకంగా తమని ఒకటి చేయమని ప్రాధేయపడితే, “చిన్నికృష్ణు ఈ వ్యవహారానికి చక్కగా “స్కెచ్ వేస్తాడని ఆలోచించి నాదగ్గరకి వచ్చారంతా. రెండు రోజులు ఆలోచించి సరైన ప్లాన్ తయారుచేశాను. మా మరో మిత్రుడు దామర్ల ఆంజనేయులు దగ్గర కొంత దబ్బు అప్పుగా తీసుకుని శివతో పాటు నలుగురం కలిసి కొట్టాయం రైలెక్కేశాం.
కొట్టాయంలో దిగగానే ఒక లాడ్జిలో బసచేసి కథ ఎలా నడిపించాలని ఆలోచించాం. తర్వాత నేనాక్కద్నే షాపుకు వెళ్లొస్తానని చెప్పి బయల్చైరాను. శివ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ అమ్మాయిని గుర్తు పట్టడానికి నాకెంతో సమయం పట్టలేదు. బట్టలు కొనడానికి వచ్చినట్టుగా నటిస్తూ ఆమె దగ్గరకి వెళ్లి ఇంగ్లీషులోనే 'నేను శివ (ఫెండునని, మేమంతా పలానా హోటల్లో బస చేశామని చెప్పాను వెంటనే గ్రహించింది. సాయంత్రం ఆరు గంటలకి ఒక గుడి గుర్తులు చెప్పి మమ్మల్ని అక్కడికి రమ్మంది.
ం అనుకున్నట్టుగానే అందరం కలిశాం. మర్రోజు తెనాలికి మాతో పాటు తనూ వచ్చెట్టుగా
ఒప్పించాం. వచ్చేప్పుడు తన టెన్స్ క్లాస్ సర్టిఫికెట్ మాత్రం మర్చిపోవద్దని చెప్పాం. ఆ అమ్మాయికి మైనారిటీ తీరిందనడానికి అదొక్కటే ఆధారం కాబట్టీ. కొట్టాయంలో రైలెక్కితే ఆ అమ్మాయిని ఎవరైనా గుర్తుపడతారని ఆ తర్వాత వచ్చే స్టేషన్ వరకు ఒక టాక్సీని గొరుసు జగదీశ్వర రెడ్ది + 77
మాట్లాడుకున్నాం. టాక్సి దైవర్‌కి మా భాష అర్ధం కాకపోయినా విషయం అర్ధమైనట్టుంది. అదిగాక ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల్ని వదిలేసి మాతో వచ్చేస్తున్నందుకు మధ్య
మధ్యలో ఏడుస్తూనే ఉంది. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దైవర్. మమ్మల్ని రైల్వేస్టేషన్లో దించేసి వెళ్లినప్పుడు వాడికి మరో రెండు వందలు ఎక్కువ ఇచ్చాం కూడా,
(ఆ అమ్మాయి వాళ్లు క్రిస్టైియన్లని, అన్నలు స్థానికంగా అంగబలం ఉన్నవాళ్లని, కూరగాయల వ్యాపారస్తులని, సదరు (దైవరుగారు వాళ్ల అన్నలను కలిసి * మీ చెల్లిని తెనాలి తెలుగు కుర్రాళ్లు ఎత్తుకుపోతున్నారనె రహస్యాన్ని చెప్పేశాడని, వాళ్లంతా కోపంతో శివ వాళ్ల బట్టల షాపుపై విరుచుకుపడి, తర్వాత జీపులో రైల్వేస్టెషన్‌కి వచ్చారని, జీపు రావడం, రైలు కదలడం ఏకకాలంలో సినిమా లెవల్లో జరిగిపోయాయని.. ఈ విషయాలన్నీ తర్వాత కాలంలో తెలిశాయి. ఒకవేళ వాళ్లు అందుకోడానికి ప్రయత్నించినా అది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాబట్టి వాళ్లకు అందే ప్రసక్తే లేదనుకోండి. )
విజయవాడలో రైలు దిగి, ఆ అర్ధరాత్రే టాక్సీ మాట్లాడుకుని తెనాలి చేరాం. వెంటనే నాకు తెలిసిన ఒక లాయర్ని కలిశాను. విషయమంతా కూలంకషంగా చెప్పాను. ఇద్దరికీ మైనారిటీ తీరింది కాబట్టి భయపడాల్సిన పనిలేదని అభయమిచ్చారాయన. ఇంకేముందీ - లైన్ క్లియర్! ఎందుకైనా మంచిదని పోలీసు స్టేషన్‌లో కూడా చెప్పి ఉంచాం. మర్రోజే వైకుంఠపురం గుళ్లో పెళ్లి. కోపంతో శివ తల్లిదండ్రులు రాలేదు. పెళ్లి పెద్దను నేనే, అమ్మాయి తరపున ఆమెకు అన్నలా ఉండి శివ కాళ్లు కడిగి కన్వాదాన కార్యక్రమం ముగించేశాను. అంతా అయిపోయాక కొట్టాయం నుండి అమ్మాయి తరపువాళ్లు దిగడం గొడవ చేయబోవడం... తర్వాత ఏమైందంటారా? 'డబ్బు' దగ్గర కులాలు, మతాలూ, గోత్రాలూ, తెగలూ, ప్రాంతాలూ, వర్దాలూ, వర్గాలూ, జాతులు... అన్నీ ఉష్ కాకి ! ఈ నగ్న సత్యం అందరికీ తెలిసిందేగా - అబ్బాయి వాళ్లు సౌండ్ పార్టీ అని తెలియగానే వాళ్ల ఆవేశాలన్నీ మైనస్ డిగ్రీలోకి వచ్చేశాయి. సరే ఏదైతేనేం నేన్నడిపిన రాయబారం మాత్రం సూపర్ సక్సెస్. వాళ్లిప్పుడు చిలకా గోరింకల్లా పిల్లాపాపల్తో హాయిగా ఉన్నారు. అదండీ నేను కాలేజీలో ఉండగా నడిపిన ప్రేమ రాయబారం !
ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి కాకినాడ వెళ్లి, అక్కడ నచ్చక గుంటూర్లో చేరా. చివరకు చదువే నచ్చక 'జై భాగ్యరాజా' అని నినదిస్తూ ఆయన్ని వెతుక్కుంటూ మద్రాసు బయలుదేరాను.
(08.06.2012, ఆదివారం అంధ్రజ్యోతి) హ్యాప్ డేస్ = సిస్ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 78
; క! గ గా ళ్ లన ఎడు న స. క స ట్ట టో ష్ ల వై అయ గ్ స్స ఖా ల న | మల నేల క యో వట లా క! క.ఎమ్.రాధాకృష్ణన్ తాడూ లేదు, దొంగా లేడు.. అంతా భ్రాంతే!
“యమునా తీరం... సంధ్వారాగం” లాంటి సుమధురమైన బాణీలతో
(పేక్షక (శోతల్ని ఆనంద లాపొరిలో ఓలలాడించిన న్వరకర్త అతడు.
“ఆనంద్ “గోదావరి “చందమామ'లతో పొటు దజును పైచిలుకు
నీనిమాలకు వీనుల విందైన నంగీతం నమకూర్తారు. “గోదావరి”
(2006) చిత్రానికి ఉత్తమ సంగీత దర్భకుదిగా 'నంది'తో పాటు ఇతరత్రా
మరెన్నో పురస్కారాలు అందుకున్న యువ నంగీత దర్భకులు కెఎమ్.
ఊహ తెలిసిన నాటి నుండే ఒక తపన ఉండేది నాలో. ఏం చేయాలో ఇదమిత్ధంగా తెలిసేది కాదుగానీ ఏదో ఒకటిచేసి పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని... విమానాల్లో తిరగాలని రంగు రంగుల ఊహల్లో తేలిపోతుండేవాణ్ణి. ఏం చేసినా అరకొరగా కాకుండా ఏనుగు కుంభస్థలాన్న కొట్టాలని ఉందేది. నాన్న వారసత్వం అబ్బింది కోయంబత్తూరు దగ్గరున్న 'కాట్రంపట్టీ) అనే ఊరినుండి దాదాపు 50 ఏళ్ల
క్రితం కర్నూలుకు వలస వచ్చిన కుటుంబం మాది. అకృ్కడ్నుంది లక్ష్మిదేవమ్మ సంస్థానంలో గుమాస్తా గిరి కోసం తాతగారు గద్వాలకి మకాం మార్చారట. నేను పట్టింది కూడా గొరుసు జగదీశ్వర రెడ్డి శ 79
అక్కడే. అమ్మ టీచర్‌గా, నాన్న గ్రామ పంచాయితీలోనూ పనిచేస్తుందేవారు. అమ్మ బదిలీలను బట్టి ఊర్లు తిరుగుతూ ఎక్కువగా వనపర్తి, (దేవుని) పాలెంలలో గడిపాను. నాన్న ఆకాశవాణిలో లైట్ మ్యూజిక్ పాడుతుందేవారు. ఆయన పాట పలానా సమయానికి రెడియోలో వస్తోందని తెలియగానే దగ్గర్లో ఉన్న కేసెట్ సెంటరుకు వెళ్లి శ్రద్ధగా కేసెట్లో రికార్డు చేయిస్తుండేవాణ్ణి. నాన్న తన పాటలకి బాణీ కూర్చే సమయంలో పక్కనే ఉండి తను పల్లవి పాడగానే చరణం అందిస్తుండేవాణ్ణి. ఆ విధంగా సంగీతం పట్ల నాకు అంచెలంచెలుగా మమకారం ఏర్పడింది. అది చూసి వనపర్తిలో మహాలింగం అనే ఆయన దగ్గర సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. నిక్కర్లు వేసుకునే వయసు కదా... మధ్యలో తాళం మరిచిపోతే తొడమీద “ఛళ్లు మని చరుస్తూ 'తాళం తాళం” అంటూ గుర్తు చేస్తుండేవారాయన. నాన్నతో ఉన్నంతసేపూ సంగీతమే... వనపర్తిలో ఇల్లు కడుతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూనే ఇద్దరం క్యూరింగ్ చేసేవాళ్లం.
ఆరో తరగతి తర్వాత వచ్చిన వేసవి సెలవుల్లో బండ్లగూడా (హైద్రాబాద్) సరస్వతి శిశుమందిర్‌లో అన్నమాచార్య విభాగంలో చేర్పించారు. ఆ అనుభవం వల్ల ఊరు వెళ్లాక 7వ క్లాసు పిల్లలకు నాతో సంగీత శిక్షణ ఇప్పించేవారు. అక్కడ నేర్చుకున్న (శివాజీ గో సంరక్షణ” అనే బుర్రకథని కూడా వాళ్లకు చెప్పి అలరిస్తుండేవాణ్ణి. సంగీతంలో నేను మరింత నైపుణ్యత సాధించాలని “ఇండియాటుడే” వాళ్లు అమ్మే థీమ్‌సేన్ జోషి. బాలమురళి, ఏసుదాసు, హరిప్రసాద్ చౌరాసియా లాంటి ప్రముఖ సంగీత విద్వాంసుల క్యాసెట్లు తీసుకొచ్చేవాడు నాన్న ఈత సరదా...
వనపర్తిలో మోటబావులు చాలా ఉండేవి. (క్రమేపీ నీరంతా అడుగంటి ఇప్పుడవన్నీ పూడుకుపోయాయనుకోండి). ఈత నేర్చుకోవాలనే సరదా నన్ను నిలవనిచ్చేది కాదు. మా కజిన్స్ తోదురాగా మరికొందరు మిత్రులతో కలిసి నాన్నకి తెలియకుండా (తెలిస్తే వీపు విమానంమోతే) బావులకు వెళ్లేవాణ్ణి. మొదట్లో నా నడుముకు మునగబెండు కట్టి పైనించి నీళ్లల్లోకి విసిరేసేవారు. బెండు కట్టినన్నాళ్ళూ చక్కగా ఈదుతూ సీళ్లలో ఎంజాయ్ చేసేవాణ్ణి. “ఎన్నాళ్లు బెండు కట్టుకుని ఈదుతావురా అని బెండు విప్పేసి నీటిలోకి తోశారు ఒకరోజు (నడుముకు పెద్ద తాడు కట్టి వదిలారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే బుడుంగే). అన్నాళ్లు బెండు కట్టుకుని ప్రాక్టీసు చేసినా ఆ రోజు ఏమాత్రం ఈదలేకపోయాను. ఒక్కసారిగా భయం ఆవరించేసింది. మునకలేస్తూ నీళ్లు మింగేస్తున్నా సరే కాళ్లు కొట్టు, నీళ్లని పొట్టకిందకి లాక్కో అని కూతలేస్తున్నారే తప్ప తాడుని పైకి లాగరే... ఇక లాభం లేదని “అమ్మో గుండెలో నెప్పి” అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా హ్యాప్ డేస్ - ననీ ప్రముఖల విన్ననాటి తీసి గుర్తుల * 8౦
ఒద్దుకు లాగేశారు. బతుకు జీవుడా అని అదే పోత. అప్పటినుండి బావి ఇటు కనిపిస్తే మొహం అటు తిప్పుకుంటా, అమ్మాయి ముందు దర్దా ఒలకబోసూ....
పాలెం టి.హెచ్.ఎం.ఎస్. స్కూల్లో చదువుతున్నప్పుడే పి. జి. వింద అనే మిత్రుడితో పరిచయం ఏర్పడింది. ఆ వయసులోనే ఇద్దరం ప్లేగౌండులో కూర్చుని భవిష్యత్ ప్రణాళికలకు స్కెచ్‌లు వేస్తుందేవాళ్లం. తను పెయింటింగ్స్‌పై శ్రద్ధ చూపితే, నేను మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. జనవరి 26, ఆగస్టు 15 వసోందంటే విద్యార్థులంతా నా పాటకోసం ఎదురు చేసేవారు. అంటే అప్పుడే చిన్నపాటి సెలబ్రిటీనన్నమాట.
బహుశా టెన్త్‌లో అనుకుంటాను - ఒకసారి వింద గుడి దగ్గర వెయిట్ చెస్తూ నన్ను అక్కడికి రమ్మని కబురుచేస్తే సైకిల్ తీసుకుని బయలుదేరాను. స్పీడ్‌గా తొక్కడం మొదట్నుంచి అలవాటు. సరిగ్గా గుడికి చేరబోతుండగా అద్దుగా గేదె రావడమో, ఇసకలో స్కిడ్ అవడమో జరిగింది. దభీమని కిందపడ్డాను. ఒళ్లంతా మట్టి... మోకాళ్లు చెక్కుకుపోయాయి. నిలబడి దుమ్ము దులుపుకుంటుండగా మా క్లాస్‌మేట్ ఒకమ్మాయి ఎదురుగా రావడం కన్పించింది. కంగారుపడ్డాను. నేను పడటం తను చూసిందేమో అని అనుమానం రాగానే ఏమీ జరగనట్టు సైకిల్‌ని అక్కడె వదిలెసి (సైకిల్ అసలు నాది కానట్టే) ఠీవిగా వేళ్ళతో వెంట్రుకల్ని పైకి దువ్వుకుంటూ గుడివైపు నడిచాను. (దూరం నుండి వింద ఇదంతా గమనిన్తుండడంతో సైకిల్‌ని ఎవరూ ఎత్తుకుపోలేదనుకోండి) అప్పట్నించి కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి పేరు జోడించి సైకిల్ సంఘటన గుర్తుచేస్తూ నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు. అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస
సంగీత సాధనతో పాటు పుస్తకాలు కూడా బాగా చదివేవాణ్సి. బుచ్చిబాబు “చివరకు మిగిలేది” పేరు వినగానే ఏదో తాత్వికత నిండుకునేది. అప్పట్లో మధుబాబు 'షాడో” నన్ను తరచూ ఆవహిస్తూ ఉండేవాడు. 13-14 ఏళ్లకే “మిస్టర్ ప్రకాశ్ అనే అద్వెంచర్ నవలని ఆరంభించి దాదాపు 70 పేజీల దాకా రాశానంటే నమ్మగలరా? రేడియేషన్ ద్వారా ప్రళయం సృష్టించే సబ్జెక్టు కాబట్టి తరచూ మా ఫిజిక్స్ టీచర్‌ని రేడియేషన్‌పై రకరకాల ప్రశ్నలు సంధించి ఆయనకు పిచ్చెక్కించేవాణ్ణి. అలాగే అప్పట్లో వచ్చే కొన్ని పాటలకు (నిజంగా తెలీకే) అర్జాలు చెప్పమని తెలుగు టీచర్‌ని వేధించేవాణ్లి. అవి రెండర్థాల పాటలని, వాటిని వివరించలేక ఆయన నానా అవస్థలు పడ్డాడని కొంతకాలం తర్వాత గానీ తెలీలేదు. నా అమాయక అన్వెషణ, అర్ధాలు తెలుసుకోవాలనే గొరుసు జగదీశ్వర రెడ్డి + 81
జిజ్ఞాస ఆ లెవల్లో ఉండేవన్నమాట. ఆ వయసులోనే ఒక యూత్ అసోసియేషన్ స్థాపించి జిల్లా లెవల్లో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించే వాళ్లం. “పాడుతా తీయగా” స్టయిల్లో పాటల కాంపీటేషన్ పెట్టేవాళ్లం.
సినిమా పిచ్చి కూడా నాకు బానే ఉందేది. అద్దె సైకిళ్లు తీసుకుని 18 కి.మీ. దూరంలోని నాగర్‌కర్నూల్ వెళ్లి సినిమాలు చూసి వచ్చేవాళ్లం. నా ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల టైంలో “ముద్దమందారం సినిమా చూసొచ్చానని తెలిసి నాన్న ముద్దు ముద్దుగా నన్ను కొట్టడం మాత్రం ఇప్పటికీ మర్చిపోలేదు. కోడిపర్తి మిట్ట దగ్గర...
ఇంటర్మీడియట్‌ని మా మేనత్త ఇంట్లో (మహబూబ్‌నగర్) ఉండి చదివాను. ఫస్ట్ క్లాసులో ప్యాసవడంతో నాన్న ఓ బజాజ్ చేతక్ కొనిచ్చారు. బండి చేతిలో ఉండడంతో అటు పాలెం, ఇటు హైద్రాబాద్‌కు తెగ తిరిగేవాణ్సి. ఒకరోజు విందతో కలిసి మహబూబ్‌నగర్ నుండి పాలెం వెళ్తున్నాను. రాత్రి ఎంతయిందో గుర్తు లేదు కానీ చిమ్మచీకటి.
జద్బర్లకు బిజనపల్లికి మధ్య కోడిపర్తి మిట్ట అనే చిన్న పల్లె ఉంది. అక్కడ దొంగలుంటారని, రోడ్డుకు అడ్డంగా మీటరు ఎత్తులో తాడు కడతారని, ఆ తాడు తగిలి మనం కింద పడిపోగానే, కొట్టీ = మన దగ్గరున్న డబ్బంతా లాక్కుంటారని బాగా ప్రచారంలో ఉందేది. అది గుర్తు చేసుకుంటూ భయంభయంగా (దైవ్ చేస్తూ వస్తున్నాను. సరిగా అక్కడికి రాగానే నిజంగానే అద్దుగా తాడున్నట్టు అనిపించి స్కూటర్‌ని పడేసి కెవ్వుమన్నాను. ఇద్దరం రోడ్డుకడ్డంగా పడి కాసేపు అలాగే ఉండిపోయాం. కీచురాళ్ల చప్పుళ్లు తప్పించి తాడూ లేదు, దొంగలూ లేరు. “అంతా భ్రాంతియేనా' అని లేచి బిజనపల్లి వెళ్లేవరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె తాత్వికత వెంటాడుతూనే ఉంది
నేను డిగ్రీలో, వింద జె.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్స్‌లో చేరడంతో ఇద్దరం మళ్ళీ హైద్రాబాద్‌లో దగ్గరవడం జరిగింది. ఒకసారి ఇద్దరం కలిసి జద్బర్లలో రైలెక్కి హైదరాబాద్‌కు వస్తున్నాం. కాచిగూడ చేరేసరికి దాదాపు రాత్రి పది కావస్తోంది. అబిడ్స్ తాజ్‌మహల్‌లో భోంచేసి అక్కడ్నుంచి విడిపోదాం అని నిర్ణయించుకుని బస్తాఫ్ వైపు నడుస్తున్నాం. ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనుమానం వచ్చి వెనక్కి చూస్తే ఒక స్తీ తను కూడా మాతోపాటు రైల్లోంచి దిగి ఉండాలి. మేం బస్టాండ్‌లో నిల్పోగానే దగ్గరకు వచ్చి మాట కలిపి మా వివరాలు కూపీ లాగింది. *నన్ను కూడా మీతో హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 82
తీసుకెళ్లి, భోజనం పెల్టంచండి' అంది. ఒక్కసారిగా కంగుతిన్నాం. కనీసం ఆమె బీదగా కూడా కన్పించలేదు. క్షణాల్లో ఇద్దరికీ భయంతో చెమటలు పట్టేశాయి. ఆమెను పట్టించుకోనట్టు ముందుకు నడుస్తూ 'ఆటో ఆటో అని కేకలేశాం. ఆమె మా వెన్నంటి వస్తూ 'ప్రీ చందమామకు ప్రతిరూపం... అది అందించే వెన్నెల్ని కళ్లుండి ఆస్వాదించలేకపోవడం ఏమిటనే అర్ధం వచ్చేలా చక్కని ఉర్దూలో కవిత్వం చెప్పడం మొదలెట్టింది. ఈ లోపు ఆటో రావడం, మేం ఎక్కేయడం జరిగిపోయింది. కానీ ఆమె కవిత్వం మాత్రం చాన్నాళ్లవరకూ వెంటాడుతూనే ఉంది. “చందమామ సినిమాలో సుద్దాల అశోక్‌తేజగారి 'రేగుముల్లోలొ పాట ముందు వినిపించే సాకీలో ఆమె చెప్పిన మాటల్నే వాడాను. ఒకరోజు విందని పిలిచి పాట వినిపిస్తే ఆశ్చర్యపోయి ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేశాదు. అంటే దాదాపు 15 బళ్ల (క్రితం విన్న ఆమె కవిత్వం తనూ మరవలేదన్నమాట. పాడుతా తీయగా.... ఒకపక్క డిగ్రీ చేస్తూనే మరోపక్క సంగీత కళాశాలలో పార్ట్‌టైం డిప్లొమాలో చేరాను. ఆ టైంలోనే ఈటీవీ నిర్వహించిన కోల్లేట్ 'పాడుతా తీయగా”లో పాల్గొనడం జరిగింది. పాడేవాళ్లందరికీ ఒక హోటల్ రూంలో బస ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో కాకినాడ నుండి వచ్చిన ఒక అంధ గాయకుడు తనను తను పరిచయం చేసుకున్నాడు. ఆయన్ని చూడగానే మనసంతా ఆర్తితో నిండిపోయింది. నేను సెలక్ట్ కాకపోయినా పర్వాలేదు. అతను మాత్రం సెలక్ట్ అవ్వాలని కోరుకున్నా మనసులో. నా ఎపిసోడ్‌లో ఉందే నలుగురిలో తనూ ఒకడు కావడం యాదృచ్చికంగా జరిగింది. “నేను ఏ.ఆర్.రెహమాన్ 'శశివదనే' పాడాను. నేను కోరుకున్నట్టే ఆ ఎపిసోడ్‌లో నేను ఎలిమినేట్ అయ్యి, తను మరో ఎపిసోడ్‌కు వెళ్లడానికి సెలక్ట్ అయ్యాడు. వాళ్లిచ్చిన గిప్ట్ తీసుకుని బయటకి రాగానే కొందరు అమ్మాయిలు నా చుట్టూ మూగినా ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో ఎక్కడలేని ఆశ్చర్యమెసింది. అభిమానానికి వెలకట్టలేమని అర్ధమై కళ్లు చెమ్మగిల్లాయి. (ఈ మధ్య ఒకసారి బాలుగారి పక్కన జడ్జిగా అదే ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఆనాడు నేను “పాడుతా తీయగా'లో పాల్గొన్న బిట్‌ని చూపించి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు) ఏదేమైనా జీవితంలో మ్యూజిక్ కంపోజర్‌ని కావాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకుని “కృషి ఉంటే మనుషులు రుషులవుతార'నే వేటూరి మాటల ప్రకారం ఆ దిశగా అడుగులు వేస్తూ ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందున్నాను. (10.06.2012, ఆంధ్రజ్యోతి ఆదివారం) గొరుసు జగదీశ్వర రెడ్డి శ 83
టం న | త ౯] షేల్ న. టో గ + నే కి ళీ | ళ్ ల్ ం మ ( / (న! రేవంత్ ఆలీ అన్నిసార్లూ పాట పాదే బయటపడ్డాను ఇప్పుడిఫ్పుదే కౌమారం వదిలి నూనూగు యౌవ్వనాన్ని అద్దుకుంటున్న నీక్తోలు (శ్రీకాకుళం) నీన్నోడు రేవంత్. మా సూపర్ సింగ్ - 5” తో బుల్లితెర (పేక్షక (ోతల్ని కేక పెట్టించి, కీరవాణి ఇచ్చిన అవకాశంతో వెందీతౌరపైకీ వచ్చేశాడు. “ఎన్నోళ్లకు పెద వండగ వచ్చే” (మయర్వాదరామన్న, “అంది దదీ, జగదాంఐ దరీ,” “'చిరంజీవా.... చిరంజీవా” (బద్రీనాథ్), “వెయ్యి వెయ్యి దెబ్బకు దెబ్బ" (రాజన్న, '“రూలర్సొ “రాజు వచ్చినాడు” (దమ్ము, వేభీ అఆ పోవుల దబ్బా” (నువ్విలా), “నా ఎనకాల వదకే విల్లా” (దాన్ ళీను, 'మనోవారీ"(బాముబలి) లాంటి పాటలతో కుర్రకారుని కెవ్వు కొవ్వు మనివీస్తూ దూసుకుపోతున్నాడు బదినాథ్స, రాజన్న పాటలకు జ్యూరీ పురస్సారాలు కూదా దక్షించుకున్న రేవంత్ 2016-17 సంవత్సరానికి గాను 'ఇందీయన్ ఐదడల్‌ొ విజేతగా కూదా నిలిచారు. ఊహ తెలిసినప్పటి నుండి పాట వెనక నేను పడ్డానో, నా వెనక పాట పడిందో కానీ పాటే నా ప్రాణమైంది. నా ముందు ఎవరు పాడుతున్నా వెంటనే నా నోటిగుండా పాటొచ్చేసేది. ఎగ్జామ్స్ రాసేప్పుడు జవాబుల్ని పాట రూపంలో బాణీ కట్టి గుర్తుపెట్టుకునే విద్యకూడా చిన్నతనంలోనే కనిపెట్లానండోయ్. _ హ్యాపీ డేస్ - సినీ (ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు ఫి 84
మూడో తరగతిలో కాబోలు - మా బాల భవన్ విద్యాలయ వార్షికోత్సవం జరుగుతోంది. స్టేజీపైన ఒకరి తర్వాత ఒకరు ఓహో... తెగ పాడేసుకుంటున్నారు. ఎప్పుడు మైకు లాక్కుందామా అని కాలుగాలిన పిల్లిలా స్టేజి చుట్టూ అసహనంగా తిరిగేశాను. మధ్యలో మైకు ఖాళీగా కన్పించగానే చెంగున స్టేజీపైకి దూకి “నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు” అంటూ గట్టిగా పాడేసి నా గొంతుబ్బరం తీర్చేసుకున్నాను. ఇంకేముంది ? ఆడియన్స్ కెవ్వు కేక అటుపిమ్మట నా వీపుమీద రేవు పెట్టారనుకోండి. అది వేరేనంగతి! చాలామందికి స్టేజి వీయర్ ఉంటుందంటారుగానీ, నాకు మాత్రం మైకు కన్పిస్తే చాలు పూనకం వచ్చేసేది (రాజకీయ నాయకుడి లక్షణాలు ఉన్నాయంటారా?) చెట్టుకు కట్టేసి కుళ్లబొడిచారు
శ్రీకాకుళంలో మా అమ్మమ్మ తాతగార్ల దగ్గరుండి చదువుకునేవాణ్లి. ఆరోక్లాసు చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఒకసారి లంచ్(బ్రేక్‌లో దగ్గర్లో ఉన్న మామిడి తోపుకి వెళ్లాలని ప్లాను వేసుకున్నాం. చెట్ల దగ్గర పహారా కాసే గ్రామసింహాల కళ్లు గప్పి ఎలాగో చెట్టెక్కాను. కాయల్ని తెంపేసి కిందున్న వాళ్లకి విసురుతుండగా హఠాత్తుగా కుక్కల్లో పాటు కాపలా వాళ్లు రావడం.. హాం ఫట్ అన్నట్టు మా వాళ్లందరూ మాయమైపోవడం ఒకేసారి జరిగిపోయాయి. నేనొక్కడ్నే చెట్టుపైన మిగిలిపోయాను. చెట్టుచుట్టూ తిరుగుతూ మర్యాదగా కిందకి దిగమన్నారు. “ఇప్పటి వరకూ కోసిన మామిడికాయలన్నీ తిరిగి ఇచ్చెస్తాను. నన్ను ఒదిలేయండి' అని బతిమాలుకున్నాను. వినలేదు. “నాకు పొడ్డంవొచ్చు. కావాలంటే ఒక పాట పాడతాననన్నాను. వాళ్లు ససేమిరా అన్నారు. పెద్ద తాడుతో నన్ను అదే చెట్టుకు కట్టెసి, తర్వాత మా స్కూలుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తర్వాత షరా మామూలే. రౌండే రౌండు. ఏ రెండు గ్రూపుల వాళ్లు తన్నుకుని గొడవపడ్డా అందులో రేవంత్ ఉన్నాడా? అనేది మా టీచర్ల మొదటి ప్రశ్న. అలాంటి చిచ్చుబుడ్డిని మరి. ఇంత అల్లరి చేసినా చదువులో చాలా క్లెవర్‌గా ఉండేవాణ్ణి. పెంకితనం రక్తంలోనే ఉండేదేమో |
మరీ పెంకిగా తయారవుతున్నానని ఏడో క్లాసుకి నన్ను వైజాగ్‌లోని మా మేనమామ ఇంట్లో ఉంచారు. అక్కడ మాత్రం ఊరుకున్నానా? వాళ్లకు ఒక బడ్డీ కొట్టు
_ ఉండేది. ఐస్‌బాక్సులోని సోడాలో ఆడుకోవడం సరదా నాకు. ఒకసారి సోడాల్ని
కెలుకుతుంటే 'భళ్లు” మని పేలిపోయి, నా మణికట్టు చీరుకుపోయింది. ఐసు ముక్కలన్నీ
నా రక్తంతో ఎగర్రెరగా.... ఎ(రైర్రగా, లాభంలేదన్, నన్ను భరించలేక 8వ తరగతికి శ్రీకాకుళం పంపించేశారు. ఈసారి రాగోలు పబ్లిక్ స్కూల్లో వేశారు. మా క్లాసులోని ఒకమ్మాయి నన్ను తీసిపారేసినట్టు మాట్లాదేది. ఆ పిల్లని ఏ రకంగా వడిపించాలో అర్ధం కాక చివరికి పాట రూపంలో 'ఐ లవ్‌యూ ఓ హారికా, ని ప్రమకే జోహారికా' అని మొదలెట్టాను. ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి నాన్న కూడా మరో స్కూలుకి ప్రిన్స్‌పాలనే విషయం అప్పటిదాకా నాకు తెలీదు. ప్రిన్స్‌పాల్‌తో పాటు టీచర్లు కూడా వీరబాదుడు బాదారు. ఇంత జరిగినా బుద్ది మార్చుకోవడం నా రక్తంలోనే లేదు కాబట్టి ఆ పిల్ల సైకిల్ టైర్లు రెండూ మేకుతో పంచర్ చేసి, పైగా ఆ పని నేనే చేశానని కాలరెగరేశా. అప్పటికి గాని నా ఆత్మారాముడు చల్లబడలేదు మరి. పాటతో చల్లబరిచేశాను
నా టెన్త్ క్లాసు సోషల్ ఎగ్జామ్ రోజున జరిగిన సంఘటన ఇది. ఏదో డౌటొస్తే పక్కవాళ్ళతో మెల్లిగా డిస్కషన్ చేస్తున్నాను. ఆ పాము చెవులకి ఎలా వినిపించిందోగాని ఎక్కడో ఉన్న టీచరమ్మ గబగబ దగ్గరకు వచ్చెసి నా ఆన్సర్ పేపర్ లాగేసుకుని సీరియస్‌గా వెళ్లిపోయింది. అప్పటికింకా ఏమీ రాయనేలేదు. ఎంత బతిమాలినా పేపరివ్వట్లదు. టైం అయిపోయే కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతోంది. డిబారైపోతానేమో అని బెంగ చుట్టేసింది. ఏడాది చదువంతా గంగలో పోసినట్టే కదా అని ఏడుపొచ్చేసింది. అరగంట తర్వాత నా పేపర్షి టేబుల్‌మీద పెట్టి పక్క సెక్షన్‌లోకి వెళ్ళడం చూశాను. గబగబా వెళ్లి పేపర్ తెచ్చేసుకుని రాసేస్తుండగా మళ్ళీ వచ్చేసి సీరియస్‌గా నా ముందు నిల్చుంది. ఒక తెగింపుతో ఏదైతే అయిందని ఆమె కళ్లల్లోకి చూస్తూ పరీక్ష హాల్లో అందరిముందే “చూపులో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్” అని ఎత్తుకున్నాను. అంత సీరియస్ మనిషీ ఒక్కసారిగా కిలకిల నవ్వేసి, నా తలకాయ మీద మొట్టికాయ మొట్టింది. అప్పటికీ ఊరుకోక “మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు మేడమ్” అన్నాను. అంతే ! ఆవిడ స్లాట్ - నేను 80 శాతం మార్కులతో పాస్! పందెం కాసి పరువు దక్కించుకున్నా
టెన్త్ కాగానే మళ్లీ వైజాగ్ వచ్చేశాను. ఓల్డ్ డైరీఫాం నుండి మద్దిలిపాలెంలో సిటీ బస్సు దిగి నడుచుకుంటూ ఇసకతోటలోని కృష్ణాకాలేజీకి వెళ్లేవాణ్ణి. మా అక్క (మేనమామ భార్య) సరిగ్గా 20 రూపాయలు ఇచ్చేది. అందులోనే టిట్ ఛార్జీలు, పేపర్లు, పెన్నులు అన్నీ కొనుక్కోవాలి. కడుపులో ఏ ఎలుక ఉండేదోగానీ ఉదయం టిఫిన్ చేసి వచ్చినా ఎందుకో తెగ ఆకలేసేది. అందుకే చాలాసార్లు కొందర్ని మంచి హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 86
చేసుకుని లిప్ట్ అడిగి కాలేజీకి వెళ్లి మిగిలిన డబ్బులతో టిఫిన్ చేసేవాణ్ణి. ఒకరోజు తొట్టిగ్యాంగు నన్ను పిలిచి “ఒరేయ్ చారీ (అప్పటికే “అపరిచితుడు సినిమాలోని “ఓ సుకుమారీ పాట పాడి ఉన్నాను కాబట్టి, చారి పేరు తగిలించారు ఒకమ్మాయిని చూపిస్తాం. పక్కన కూర్చుని మాట్లాడి ఆ అమ్మాయి పేరు కనుక్కొని రావాలి. పందెం గెలిస్తే నీకు కడుపునిండా క్యాంటీస్‌లో టిఫిన్ పెట్టిస్తాం అన్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నాకు సీనియర్. అయినా టిఫిన్ అనగానే ఆశపుట్టి సరేనని బయళ్చేరాను. తిన్నగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి అటూ ఇటూ చూసి పక్కన కూర్చుని “హాయ్, నా పెరు రేవంత్. మీ పేరేంటి? అన్నాను. నావైపు సీరియస్‌గా చూసి “నీకు అవసరమా?” అంది “అదిగో అక్కడున్న తొట్టిగ్యాంగు పందెం కాసేరండి. బాగా ఆకలిగా వుంది. మీతో మాట్లాడి మీ పేరు తెలుసుకొని వస్తే టిఫిన్ పెట్టిస్తామన్నారిని అసలు విషయం చెప్పేశాను. సన్నగా నవ్వి, 'సరే నెనే తీసుకెళ్తాను పద కాంటీన్‌కి' అంది. ఇద్దరం కాంటీన్‌లో టిఫిన్ చేస్తుండగా ఆ అమ్మాయిని ఇష్టపడే (ఫఫెండ్ ఒకడు గబగబా నా దగ్గరకు వచ్చేసి “ఏంట్రా? నీకు సీనియర్ అమ్మాయి కావల్సి వచ్చిందా? అని పేచీకి దిగాడు. చివరికి ఆ అమ్మాయి వాడికి వార్నింగు ఇచ్చి నన్ను కాపాడిందనుకోండది. పాటలా? పరీక్షలా?
మా మేనమామ ప్రోత్సాహంతో జెమినీ టీవీ తరపున 'హచ్' వాళ్లు నిర్వహించే 'ఆంధ్రా సూపర్‌న్వర్” అనే పాటల కాంపిటేషన్ ఆదడిషన్‌లో వాల్గొనడం జరిగింది. లక్కీగా సెలక్టయ్యూను. పలానా రోజు చెన్నైలో షూటీంగని చెప్పి అక్కడికి వచ్చెేయమన్నారు. తీరా ఆ డేట్స్‌లోనే నా ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్. అయ్యో అనిపించింది. పాటలా? పరీక్షలా? దేన్ని సెలక్ట్ చేసుకోవాలో అర్ధంకాక దిగాలు పడిపోతుండగా మా మేనమామ 'పరీక్షలు మరోసారి రాసుకోవచ్చు. షూటింగ్‌కు వెళ్లమని వెన్ను తట్టాడు. చెన్హాకి బయళ్చ్దేరదామని అనుకుంటుండగా షూటింగ్ డేట్ వాయిదా వేసినట్టు ఫోనొచ్చింది. ఊపిరి పీల్చుకున్నాను. శుభ్రంగా పరీక్షలన్నీ రాసేశాక పిలుపొచ్చింది. తొలిసారి చెన్నై ప్రయాణం... రైలు దిగి పలానా దగ్గరకి వెళ్లాలని చెప్పాను. ఆటోవాడు నన్ను ఎక్కించుకుని అరగంట పాటు అన్ని వీధుల్ని తిప్పి తిప్పి చివరికి నేను ఎక్కిన దగ్గరే దింపేసి అదే ఇది అని అరవంలో అరిచి, డబ్బులు తీసుకుని ఎంచక్కా వెళ్లిపోయాడు. బెరా అని నోరు తెరిచాను. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఆటోమెటిగ్గా నా నోరు గుహలా తెరుచుకుని అలాగే ఉండిపోతుందంటే మీరు నమ్ముతారా! గొరుసు జగదీశ్వర రెడ్డి + 87
హైద్రాబాద్ ర్యాగింగ్
మా మావయ్యకి బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చినా వదులుకొని కేవలం నా భవిష్యత్ కోసం హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడికి షిఫ్ట్ అవుతున్న సమయంలోనే ఈటీవీ వాళ్ల సైజోడి నెం. 1 సప్తస్వరాలు ప్రోగ్రామ్స్‌లో పాల్గొని ఫైనల్స్ దాకా వెళ్లడం జరిగింది. డిగీ కోసం దోమల్‌గూడా ఎవి కాలేజీలో చేరాను. చేరిన రెండో వారంలోనే ర్యాగింగ్ మొదలయ్యింది. ఒకచోట నన్ను దొరకబుచ్చుకుని చుట్టూ చేరిపోయి ఒక పేపరు పెన్నూ ఇచ్చి ప్రేమలేఖ రాయమని పురమాయించారు సీనియర్స్. అప్పటిదాకా ఆడపిల్లల్ని ఏడిపించే రకాన్నే కాని, ప్రేమించిన పాపాన పోలేదు కదా. నా బొంద! ఏం రాస్తాను? సరే ఏదో సినిమాలోని సీన్ గుర్తుకు తెచ్చుకుని 'హాయ్ ప్రియా... నిన్ను చూసిన మరుక్షణం మనసు పారేసుకున్నానింటూ చేతికొచ్చినట్టు రాసేశాను.
అక్కడితో ఆగలేదు వాళ్లు. ఇంకేం చేస్తావన్నారు. నాకున్న ఆయుధం పాటే కాబట్టీ పాడతానన్నాను. సరే పాడు అన్నారు. “అపుడో ఇపుడో కలగన్నానే చెలీ, 'గంధపుగాలిని” అనే రెండు పాటల్ని పాడాను.
“తెలంగాణ పాట(ల్రావా?” అన్నారు.
హైద్రాబాదు వచ్చిన కొత్త. పైగా ఇక్కడి మాండలికాన్ని అర్ధం చేసుకోడానికి తంటాలు పడుతున్న సందర్భం. వచ్చీరాని యాసలో పాడితే నన్ను బంతిలా ఆడుకుంటారేమోనని భయపడి రావన్నాను. “అదేంద్రా బయ్....మాయదారి మైసమ్మ ఎత్తుకో” అన్నారు. గుర్తున్నంత వరకు రెండు లైన్లు పాడి బయటపడ్డాను.
తర్వాత కొన్నాళ్లకి మా టీవీ నిర్వహించిన 'సూపర్ సింగర్-5 ప్రోగ్రాం నన్ను బుల్లితెర (ప్రేక్షకులకు సన్నిహితం చేసి, ప్రముఖ సంగీత దర్శకుల దృష్టి నాపై పడేలా చేసింది. నేను పాడిన ఒక ఆల్బమ్‌ని కీరవాణిగార్కి ఇవ్వడం, వారు నన్ను ఆ మర్నాడు సాయంత్రమే పిలిపించిరామరామ కృష్ణకృష్ణ సినిమాలో కోరస్ పాడించడం.. ఆ వెంటనే కోటి, మణిశర్మ, తమన్,ఆర్.పి. వసంత్, ఆశీర్వాద్‌గార్ల వంటి ప్రముఖ సంగీత దర్శకులంతా నాకు అవకాశాలు ఇవ్వడంతోపాటు నన్నొక బుల్లి సెలబ్రిటీని చేసి ఇప్పుడిలా మీ ముందుకొచ్చి నా హ్యాపీదేస్ చెప్పుకునే అవకాశం కూడా కల్పించారు.
ఇప్పటికీ పాటల రికార్దింగ్ టైంలో నా తోటి సింగర్స్‌ని ఆటపట్టిస్తాను కానీ అది నిజం ఆట కాదు సుమండీ! కేవలం వాళ్లు నవ్వడం కోసం నేను చేసే జిమ్మిక్కులన్నమాట. నవ్వుతో నవ రోగాలు పోగొట్టొచ్చని నమ్మే ఫిలాసఫీ లెండి నాది.
(17.06.2012 ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - నన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 8౩
(౧) కై ్ట / ల / / ఆలీ... లయ... ఎయమొట్ మారుతి ల్రా వాడి లవ్ నన్ను హీరోని చేసింది భాల్బంలోనే బతుకు కళని కనిపెట్టినవాదు మారుతి. డిగ్రీ పూర్తి కాగానే తనలోని చి(తకళకి మెరుగులు దిద్దుకోవాలని ఐందరు నుంది భాగ్యనగరం చేరుకున్నాడు. “యానిమేషన్” లోతుల్ని వరిళీలించే [గ్రమంలోనే 'బన్నీ'తో చెలిమి కలిసింది. తనలో రేకెత్తే భావాలకు రూపం కల్పించాలనే తపనతో వెందితెరవైపు అడుగులు వేసి ఏ ఫిలిం జె అరవింద (ప్రేమిస్తే చిత్రాలకు కో. (పొాద్వూనరయ్యాడు. “ఈ రోజుల్లో...” చిత్ర దర్శకుడిగా యువతని ఉ(రూతలూగించి, ఆ తర్వాత 'బన్టావ్” 'కొత్తజంటుా (భలె భలె మగాడివోయ్ “బాబు ఐంగారం) 'మయవోనుభావుడు” వంటి చిత్రాలకు దర్భకత్వం వపొంచారు. (పేమకథా చిత్రమ్” చిత్రానికి దర్భక పర్యవేక్షణ చేస, నిర్దాతకూదా అయ్యారు. చిన్నతనం నుండి గుంభనంగా, పైకి ఏమీ ఎరగనట్టు అమాయకంగా బిల్బప్ ఇచ్చేవాణ్ణి కానీ నేనెంత అల్లరి పిడుగునో, పెంకి ఘటాన్నో నాకు మాత్రమే తెలిసిన పరమ రహస్యం. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ జనాల్ని పరుగులు పెట్టించడమంటే గొప్ప సరదా నాకు. మా వీధిలో ఎక్కువగా వైశ్యులుండేవారు. లేబర్ బస్తీకి మా వీధిగుండానే దారి ఉందేది. కొందరు పుల్‌గా సారా కొట్టెసి చిందులేస్తూ మా ఇండ్ల మధ్య నుండి వెళ్లేవాళ్లు. వాళ్ల వీరంగం చూడలేక చీకటి పడగానే మా వీధిలోని తలుపులన్నీ మూసుకుపోయేవి. ఇది కనిపెట్టిన నేను కొందరి ఇళ్ల తలుపులప్పె, కిటికీలపై దబదబ గొరుసు జగదీశ్వర రెడ్డి శ 89
బాదుతూ, తాగినోడిలా యాక్షన్ చేస్తూ, గట్టిగా అరుస్తూ లోపలి వాళ్లని భయపెట్టి హడలెత్తించేవాణ్ణి. ఇలా నా లీలలు చెప్పుకుంటూ పోతే “ఇంత తుంటరోడివా మారుతీ? అని మీరంతా ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇలాంటివన్నీ గుర్తొస్తే కల్పన కంటే వాస్తవం ఎంత చిత్రమైందో కదా అని ఆశ్చర్యం కలుగుతుంది. నెంబర్ ప్తేట్లతో పాకెట్ మనీ
మధ్యతరగతి కుటుంబం కావడంతో ఇంట్లో అందరూ ఏదో ఒక పనిచెస్తూ ఉండేవాళ్లు. నాన్నది అరటిపండ్ల వ్యాపారం. బండి ఉండేది. అమ్మ మిషన్ కుట్టది. తను జాకెట్లు కుడుతుంటే నేను హుక్స్ తగిలిస్తూ ఉడత సహాయం చేసేవాణ్లి. నాకు ఆర్ట్ వేయడం కూడా వచ్చు కాబట్టి పిల్లలు తమ క్లాసు పుస్తకాలపై నా చేత పేర్లు రాయించుకుని, కీ చెయిన్స్‌పై బొమ్మలు వేయించుకుని సంతోషించేవాళ్లు. టెన్స్‌క్లాసు చదువుతుండగానే మా మామయ్య నడిపే ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఆఫీసు బాయ్‌గా చేరాను. రిజి(స్టైషన్ అయిన వెహికిల్స్‌కి నెంబరు ప్లేట్స్ రాస్తూ, స్టిక్కర్లు కట్ చేసి అతికిస్తూ పాకెట్ మనీ సంపాదించేవాళ్డి. వాటితో సినిమాలు చూడ్డమే కాదు, నా స్కూలు ఫీజులు కూడా నేనే కట్టుకునేవాణ్డి. నెత్తురు చూపించాడు
ఆరో తరగతిలో ఉండగా మా ట్యూషన్ మాస్త్టారుతో పెద్ద గొడవైపోయింది. చదవకుండా కబుర్లు చెబుతున్నానో లేక పక్క పిల్లాడి పిర్రగిల్లి ఏమీ ఎరగనట్టు మొహం పెట్టానో గుర్తులేదు. కనిపెట్టేశాడు మాస్టారు. దగ్గర్లో ఉన్న చెట్టు కొమ్మ విరిచి ముందు వెనక చూడకుండా సుబ్బరంగా బాదేశాడు. అప్పుడు తెలీలేదు గానీ, కొద్దిసేపు తర్వాత ఎర్రని రంగు నా ముందున్న పుస్తకం నిండా పరుచుకుంది. రంగు ఎక్కడ్నుంచి పడిందా అని అటూ ఇటూ చూస్తున్నా కానీ అది నా పగిలిన తలలోంచే అన్న ధ్యాస లేదు. తలపై రుద్దుకుంటుంటే చేతి నిండా రక్తమే. అంతే అప్పటిరవకూ రాని దుఃఖం ఉప్పెనలా తన్నుకొచ్చేసింది. బేరుమని మా నాన్నదగ్గరికి పరిగెత్తి నన్ను కొట్టిన విషయం చెప్పాను. నాన్న కోపంతో హడావిడిగా వచ్చేసి మాస్త్టారును తిట్టేయడం, తోటి టీచర్లు ఆయనకి సర్ది చెప్పి నన్ను ప్రథమ చికిత్సకోసం హాస్పటల్‌కి పంపడం ఇంకా గుర్తున్న సంఘటనే. తొలి ప్రేమ విఫలం
టెన్స్‌లో ఉన్నప్పుడు... అప్పుడప్పుడే నూనూగు మీసాలతో యౌవ్వనంలోకి అడుగు పెడుతున్నాను. మా ఇంటి వెనకుందే అమ్మాయి రోజూ నన్ను చూడ్డం, నేను హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 90
తనను చూడ్డం.. చూపులతోనే బాసలు చేసుకుంటూ గడిపేవాళ్లం. రామాలయం నుండి ప్రసాదం తీసుకెళ్లి ఇస్తూ ఆ పిల్లకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉందేవాణ్ణి. మా అడ్డా గుడి ప్రాంగణమే. ఒకరోజు గుడి దగ్గర నిల్చుని ఆ అమ్మాయికోసం ఎదురుచూస్తున్నాను. ఎంతకీ రావట్లేదు. ఆ అమ్మాయి పక్కింట్లో ఉండే ఐదేళ్లబ్బాయి కన్పిస్తే నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని కబురు చెప్పమన్నాను వాడితో. వాడు రాకెట్‌లా దూసుకెళ్లి ఇంట్లో అందరూ ఉండగానే “అక్కా మారుతి అంకుల్ నిన్ను దొడ్దివైపు రమ్మన్నాడు” అంటూ అరిచాడట. బాంబు పేలిన శబ్దం విన్నట్టు అంతా బిత్తరవోయారట. తనెంతకూ రావట్లేదు కదా అని నేను మా ఇంటికి వెళ్లిపోయి అమ్మకు కుట్టుపనిలో సాయం చేస్తున్నాను. ఇంతలో వీధి గుమ్మంలో 'మా అమ్మాయిని రమ్మంటాడా? అంత మగాడా? ఏదీ వాణ్ణి బయటకి రమ్మను. పిల్లల్ని కనగానే సరిపోదమ్మా... బాగా పెంచాలి అంటూ శివాలెత్తుతూ ఆ పిల్ల నాన్న గొంతు వినిపించింది. విషయం అర్ధం చేసుకున్న అమ్మ ఇక తప్పదన్నట్టు కొంగు నడుముకు బిగించి రంగంలోకి దిగింది. నిజం చెప్పాలంటే అమ్మంటే ఆ పేటంతా హడలు. ఆయన్ని జాడించిపారేసి ఇంట్లోకొచ్చి 'సిగ్గులెదురా నీకు? వాడి మొహం చూశావా... అలాంటోడి కూతురిని (ప్రేమిస్తావా... ఇంకెవరూ దొరకనట్టు' అంటూ నాపై విరుచుకుపడింది. పిల్లిలా జారుకున్నాను. అప్పట్నించి ఆ అమ్మాయితో కటీఫ్ అయిపోయింది లెండి. ఎక్కడి దొంగలు అక్కడనే... అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. శ్రీరామనవమి వచ్చిందంటే మాలో ఉత్సాహం ఉరకలెత్తేది. ఆ ముందురోజు రాత్రి గుడికి అలంకరణ చేయడానికి కొంతమందిమి గుమిగూదేవాళ్లం. ఆ పనుల్లో దాదాపు తెల్లవారిపోయేది. ఒకసారి రాత్రి 2 వరకూ గుడికి పెయింటింగ్స్ గట్రా వేసి, మామిడికాయలు కోసుకొద్ధామని ప్లాను వేశాం. గుడికి దగ్గర్లోనే ఒకరింట్లో మామిడిచెట్టు ఉండేది. ఆ ఇల్లు ఎవరిదో తెలీదు కానీ అందులో మాత్రం ఒక బ్రాహ్మణ ముసలి దంపతులు కాపురం చేసేవారు. నలుగురం బయల్దేరాం. ముందు ప్రహరీ గోడ ఎక్కి దానికి అనుకుని ఉన్న బాత్రూం కప్పుపైకి వెళ్లాం. అక్కడ్నుంచి చెట్టుపైకి ఎక్కాలనే షాన్ మాది. వరసగా ముగ్గురం బాత్రూం కప్పుపైకి చేరగానే ఆ సిమెంటు రేకుల కప్పు దథేల్‌మని పడిపోయింది. ముగ్గురం ఒకరిమీద ఒకరం కప్పుతో పాటు కిందపడ్డాం. అది చూసి నాలుగో వాడు పిల్లిలా గోడ దూకేసి పారిపోయాడు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. చేతులూ, కాళ్లూ గీరుకుపోయాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే మా నడుములూ, కాళ్లూ విరగలేదు. మెల్లగా లేవబోతుండగా దొడ్లో లైటు వెలిగింది. ముగ్గురం తేలు కుట్టిన దొంగల్లా గప్‌చుప్‌గా
ఉండిపోయాం. అంత చల్లదనంలో కూడా చెమలు కారుతున్నాయి మాకు. ఇంతలో “ఎవరదీ?” అంటూ ముసలాయన కర్ర తీసుకుని మావైపు వస్తున్నాడు. తనూ భయపడుతున్నాడనే సంగతి కనిపెట్టి... మేమంతా కూడబలుక్కుని ఒక్కసారిగా 'భో అంటూ గట్టిగా అరిచాం. “చచ్చానా దేవుడా అంటూ ఆ ముసలాయన కర్ర వదిలేసి తడబడుతూ ఇంట్లోకి పరిగెత్తి తలుపేసుకోవడంతో మెల్లగా అక్కడ్నుంచి ఒకరి తర్వాత ఒకరం గోడ దూకి వచ్చేశాం. ప్రతి శ్రీరామనవమికి ఈ సంఘటన గంట కొట్టినట్టు గుర్తుకురావడం, మనసారా నవ్వుకోవడం అలవాటయిపోయింది. అంతా నాకు సపోర్టు ఇచ్చెవారే
హిందూ కాలేజీలో డిగ్రీ సెకందియర్‌లో ఉండగా జరిగిన సంఘటన. మన ప్రమేయం లేకపోయినా ఒక్కోసారి కష్టాలు తలకు చుట్టుకుంటాయనే సత్యం బోధపడింది కూడా అప్పుడే. మా క్లాస్‌మేట్ ఒకడు మా కాలేజీ అమ్మాయినే సిన్సియర్‌గా లవ్ చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయేమో వీడిని ఎంతకూ కనికరించేది కాదు. వీడికేమో ఆ అమ్మాయంటే తగని మోజు. ఒకరోజు మేమిద్దరం టూ వీలర్‌పైన వెళ్తుండగా ఆ అమ్మాయి నడుస్తూ కనిపించింది. దాంతో మావాడు రెచ్చిపోయి ఆ అమ్మాయి పక్కనుంచి రయ్యిమంటూ బండిని పోనిచ్చాడు. వెనక కూర్చున్న నా చేయి తగిలి ఆమె చేతిలోని పుస్తకాలన్నీ రోద్దుపైన పడిపోవడం, వాడేమో బండి ఆపకుండా స్పీడ్‌గా ముందుకు పోనివ్వడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఇద్దరం వెళ్ళి “మాధవా మ్యూజికల్స్'లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఇమిడియట్ రియాక్షన్ - నాకోసం పోలీసులు కాలేజీకి వచ్చారని కబురు. నాలో కంగారు మొదలైంది. పైగా ఆ అమ్మాయి నాన్న న్యాయవాది. విషయం కాలేజీ అంతా గుప్పుమంది. అందరి కళ్ళూ నా కోసం ఎదురు చూస్తున్నాయట. రాత్రివరకూ పోలీసులు కంట పడకుండా అక్కడక్కడే దాక్కున్నాం. విషయం తెలిసిన ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు నాకు సవోర్టుగా ఉంటామని ముందుకు వచ్చారు. తర్వాత మా నాన్నని తీసుకుని ఎం.ఎల్.ఏ. గారితో మాట్లాడ్డం ఆయన ప్రిన్సిపాల్‌తో చెప్పించడంతో... అసలు దోషిని నేను కాదని తేలిపోయింది. ఐనా ఆ సంఘటన గుర్తుకొస్తే కాస్త టెన్నన్‌గానే ఉంటుందిప్పటికీ.
పోలీసులు అర్ధం చేసుకుని రావడం మానేశారు కానీ, ఆ అమ్మాయిని ఇష్టపదేవాడు ఇంకొకడు మాత్రం చిందులు తొక్కుతూ పదిమందిని వెంటేసుకుని మా కాలేజీకి వచ్చాడు. నేను క్లాసులో ఉండగా కాంటీన్లో నా కోసం ఎదురుచూస్తు కూర్చున్నాడట. విషయం తెలిసిన మా మామయ్య షాపులో పని చేసే కుర్రాళ్లు వాళ్ల హ్యాపీ డేస్ - సిస్ ప్రముఖల చిన్ననాటి లీని నత్తలు + 92
దగ్గరకు వెళ్లి 'మా వాడిపై చేయి పడిందంటే తలలు లేచిపోతాయిని వార్నింగ్ ఇవ్వడంతో తోక జాడించారట. ఇవన్నీ తర్వాత తెలిసిన విషయాలు. ఏదైతేనేం ? ఈ సంఘటన అప్పటివరకూ తెరమాటునున్న నన్ను ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చి కాలేజీ హీరోని చేసేసింది. నా జీవిత 'స్పందని
డిగ్రీ ఫైనల్లో ఉండగా జూనియర్ ఛాంబర్స్ యూత్ (ప్రెసిడెంట్‌గా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు 'పాట్ లక్ అనే సందర్భం పెట్టుకుని అంతా కలిసేవాళ్లం. పాట్‌లక్ రోజు ఎవరికి వారు తమ ఇంట్లో తయారుచేసిన డిష్‌లు తయారు చేసి తీసుకురావాలి. అదే రోజు సాంసృతిక కార్యక్రమాలను కూడా జరిపేవాళ్లం. అప్పట్లో మా ఛాంబర్‌లోని లేడీస్ సెక్షన్‌లో సభ్యురాలైన ఒకామె తన కూతుర్ని 'పాట్ లక్ కోసం వెంట తీసుకొచ్చింది. ఆ అమ్మాయి స్టేజీపై డాన్స్ చేస్తుంటే చూశాను. తనని చూడగానే పరిచయం చేసుకోవాలని కోరిక కలిగింది. అనుకోకుండానే ఒకరి కొకరం దగ్గరయ్యాం. తన పేరుని స్టిక్కర్లుగా కట్ చేసి బళ్ల వెనకాల అతికించే వాజ్లి. చూస్తుండగానే నా డిగ్రీ పూర్తయ్యింది. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుండగా జీవితంలో ఎదగాలంటే మరోచోటికి వలస వెళ్లక తప్పదని సలహా ఇచ్చింది తనే. ఆ మాట ప్రకారం అప్పట్లో నా సంపాదనలో దాచుకున్న కొంత డబ్బు తీసుకుని హైద్రాబాద్ వచ్చెసి “ఆర్ట్ యానిమేషన్ అకాడమీలో చేరాను. మా మధ్య ఎర్బ్పడ్డ చెలిమి డ్రుమగా
చిగురించి, చివరకు ఆమె నా జీవిత 'స్పందనిగా మారిపోయింది.
ఇక నా సినిమా పిచ్చి... ఇవివి, జంధ్యాల, వంశీగార్ల సినిమాలంటే పడిచచ్చేవాజ్ణండీ బాబూ! అప్పట్లో బందర్లోని 18 థియేటర్లలో ఏ సినిమానీ వదిలేవాణ్ణి కాదు. నచ్చితే వరసపెట్టి ఒకే సినిమా వారం రోజులు కూడా చూసేవాళ్డి.
యానిమేషన్‌లో ఎదిగే క్రమంలో అనుకోకుండా బన్నీ పరిచయం కావడం, తన నుండి ఎన్నో తెలుసుకోవడం కూడా మరిచిపోలేని అనుభవమే. జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్‌ని అనుభవించినవాడే మానవసంబంధాల్ని సరిగ్గా అంచనా వేయగలదనేది నా ఫిలాసఫీ. నాలోని భావాల్ని తెరకెక్కించాలంటే వెండితెర వైపు మళ్లక తప్పదని తెలుసుకుని అటువైపు దృష్టి సారించి ఇలా మీకు చేరువయ్యాను.
(24.06.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
మ య శ న్ తా న శ. | ] కం స్ట్ న | స | ఎ యభరా ' | పొట్టెళ్ల దెబ్బకు కెవ్వుకేక 'దాక్టరు కాబోయి యాక్టరయ్యా'(ననడం నినిమానటులకు నాలుక చివరుందే నానుడి. దీనికి కొద్ది దగ్గరలో దాక్టర్ కాబోయి కెమరామెన్ అయినవాడు వీ,జి. వింద. ఫీల్హాటో(గఫీలో పట్టాపొంది మధు అంబట్ వద్ద అనీ స్టెంట్ కెమెరామెన్‌గా వనిచేశారు. ఆ తర్వాత కొన్ని దాక్కుమెంటరీలు, యాద్ ఫిలింలూ తీనీ (గహణం'తో వరితమ కంట్లో వద్దారు. “నందనవనం 120 కిమీ.* 'అనుమానన్సదం? “అప్లా చెమ్మా? “వినాయకుడు” నుండి ఇవుటి 'సమ్మోవానం” వరకు 20పై చిలుకు చిత్రాలకు 'నిన్నిందలే” కన్నడ చిత్రానికీ నినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. చిదబ్రన్స్ ఫిలిమ్ 'లోటన్ పాందొతో డైరెక్టరుగా మారారు. కౌమార, యవ్వన దశలతో పోలిస్తే నా మనసుపై గాఢమైన ముద్ర వేసింది మాత్రం బాల్యమే. అప్పటి అనుభవసారమే జీవితంలో సరైన దిశగా అడుగులు వేయడానికి దిక్సూచిలా పనిచేసింది. ఆ అందమైన బాల్యం తాలూకూ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ తడి తడిగా, తాజాగా పరిమళిస్తూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్‌కు సమీపంలో ఉన్న 'పాలెం) మా ఊరు. స్థానికంగా వెంకటేశ్వరుడి గుడి ఉండడంతో 'దేవుని పాలెంగా ప్రసిద్ధి. వ్యవసాయక కుటుంబం కావడంతో పాడిపంటలతో మమేకమై గడిచిన బాల్యం నాది. పొలం పనులతోపాటు, పితికిన పాలను ఇంటింటికి వెళ్ళి పోసి వచ్చేవాణ్డి. ఇన్ని పనులు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 94
చేస్తూ కూడా చదువులో క్లాస్ ఫస్ట్ అంటే మాటలు కాదు కదా. అంచేతే సెవెన్స్ పూర్తవగానే ఎ.పి. రెసిడెన్షియల్ సీటు దానంతటదే నన్ను వెదుక్కుంటూ వచ్చింది. బాల వైద్యశిఖామణీ్‌గా.....
నాన్న అప్పుడప్పుడు నాటు వైద్యం చేస్తుందేవాడు. తేలు కుట్టినా, గాలి సోకినా జనం ఆయన దగ్గరకు వచ్చి మంత్రం వేయించుకునేవాళ్లు. ఒకసారి నాన్న ఊర్లో లేనప్పుడు ఒకావిడ కడుపునెప్పితో బాధపడుతూ వచ్చింది. అప్పటికే సైన్స్ ప్రకారంగా ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగిస్తే కొంత ఉపశమనం కల్గుతుందని కనిపెట్టాను. ఆవిద ముందే కాస్త ఉప్పుని చేతిలోకి తీసుకుని నా కొచ్చిన భాస్కర శతకం శ్లోకాల్ని రెప్పలు అల్లాడించి చదువుతూ మంత్రించినట్టు ఫోజు కొట్టాను. ఆమె నిజంగానే మంత్రం చదువుతున్నానని అనుకుంది. శ్లోకం చదివేసి నీటిలో ఆ ఉప్పుని, చక్కెరను కలిపి తాగించాను. ఆవిడ కొద్దిసేపట్లోనే తేరుకుని, “నీ కడుపు సల్లగుందా, తగ్గిందయ్యా' అని దీవించి వెళ్లింది. అలా బాలవైద్య శిఖామణిగా వెలిగిపోయా.
చేపల వేట కూడా యమ సరదాగా ఉందేది. మొదట్లో ఒకసారి బురద కుంటలో దిగి చేపనుకొని పాముని పట్టుకున్నాను. అంతే ! ఆ దెబ్బతో మళ్లీ ఎప్పుడూ చేపల జోలికి వెళ్ళలేదు. మొహర్రం వచ్చినప్పుడు అలాయ్ మధ్యలో కాల్చడానికి తొట్టిగ్యాంగుతో కలిసి కర్రమొద్దుల్ని దొంగిలించి తెచ్చేవాణ్డి. ఆ మర్రోజు ఆ ఇంటివాళ్లతో తిట్లు మామూలే. అది 'దుర్యోధన వస్తాపహరణ”
సమయం దొరికినప్పుడల్లా వీధినాటకాలు వేస్తుండేవాడు నాన్న ఇంటి చుట్టూ ఉన్న పిల్లల్ని కూడగట్టి రాత్రి చూసిన ఆ నాటకాన్నే మా ఇంటి వరండాలో ఆడించెవాణ్ణి నేను. అలా ఏడేళ్ల వయసులోనే బాల డైరెక్టరునయ్యా. పాత బట్టలు చించి పంచెలు, రేకు పలకలను వంచి కిరీటాలు చేసేవా్డి. శృంగార్ తిలకాన్ని లిప్‌స్టిక్‌లా పెదాలకు రాసుకునేవాళ్లం. హార్మోనియం ఒక్కటే తక్కువగానీ అచ్చం రాత్రి మా పెద్దలు వేసిన నాటకానికి ఏమాత్రం తీసిపోయుది కాదు.
ఒకరోజు “ద్రౌపది వస్రాపహరణ” వేయిస్తున్నాను. ద్రౌపది వేషం వేయడానికి ఏ అమ్మాయీ ఒప్పుకోదు కాబట్టి మా వరండాలో ఉన్న ఒక స్తంభాన్నే ద్రౌపదిగా అనుకొని, దానికే చీరలు చుట్టి లాగుతున్నట్లు యాక్షన్ చెస్తున్నాడు బాల దుశ్శాసనుడు. దుర్యోధనుడి వేషంలో ఉన్న పురుషోత్తం అనేవాడు ద్రౌపది (స్తంభం)ని చూస్తూ 'ప్హూహ్హ హ్హా అని వికటాట్టహాసం చేస్తున్నాడు. ఇంతలో వాళ్ల అన్నయ్య బెత్తంతో రావడం, వీడు భయపడి చెంగున గెంతడం, ఆ కంగారులో పంచె జారి దిసమొలతో పరిగెత్తడం... క్షణాల్లో జరిగిపోయి “దుర్యోధన వస్తాపహరణ” ప్రహసనంగా ముగిసింది.
చింతచెట్టుకు వేలాడుతూ...
మాకో బట్టెద్దు (మచ్చలది) ఉండేది ఒకరోజు దాన్ని బండికి కట్టి పొలం దగ్గరికి వెళ్తున్నాం. బండిలో నేనొక్కడ్నే. మా జీతగాడు బండి తోలుతున్నాడు. వాడు ఎప్పుడు చూసినా బైరాగిలా తత్వాలు పాడుకుంటూ వాడి లోకంలో వాడుండేవాడు. మా ఇంటినుండి పొలం దాదాపు 5 కిలోమీటర్ల దూరం. దారిపొడవునా అటూ ఇటూ చింత చెట్లు. కొడవళ్లలా చింతకాయలు వేలాడుతూ కనిపించగానే నా నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా వాటిని కోయాలని మునివేళ్ల మీద నిల్బుని ఎగిరి (బండి వెళ్తూనే ఉందన్న ధ్వాస లేకుండా) ఒక కొమ్మను అందుకున్నాను. చింతకాయలు చెతికి చిక్కాయి. కానీ రెప్పపాటులో బండి కదిలి ముందుకు వెళ్లిపోయింది. కొమ్మని పట్టుకునే గట్టిగా అరిచాను. మా జీతగాడు మాత్రం తిరిగి చూడలేదు. వాడి తత్వాలు బండి దూరమయ్యేవరకూ వినిపిస్తూనే ఉన్నాయి. పాక్కుంటూ కొమ్మపైకి వెళ్లలేను. కిందకి దూకనూలేను... అదొక త్రిశంకు నరకం. ఏడుపు తన్నుకొస్తోంది. ఇంతలో అదే దారిలో కొందరు రావడం కనిపించింది. ఏం జరిగినా ప్రథమ చికిత్స చేసి మా ఇల్లు చేరుస్తారన్న ధీమాతో గెంతేశాను. వాళ్లు గబగబ పరిగెత్తుకొచ్చి 'అయ్యో చెట్టెందుకు ఎక్కినవయ్యా” అంటూ లేపారు. నడుం విరగలేదనుకోండి. నేను చెట్టుకొమ్మకు ఎలా వేలాడబడ్డానో వాళ్లకు కూడా అర్ధం కాలేదు. వివరించేలోగా మా జీతగాడు నన్ను వెతుక్కుంటూ వెనక్కి రావడం కనిపించింది. మానం కాపాడిన గంగమ్మ
ఒకరోజు ఈతకోసం ఊరిబయట ఉన్న మోటబావికి వెళ్లాం. అందరిదీ పదీ, పన్నెందేళ్ల వయసే. బట్టలు విప్పి దూరంగా ఒక చెట్టు కొమ్మపై విసిరేసి (లేకపోతే మా కోతినాయాళ్లు నిక్కర్లను దాచేస్తుంటారు) దిస మొలలో బావికి దగ్గరగా వస్తున్నాం. ఇంతలో మా క్లాసు మేట్ ఒకమ్మాయి ఈత నేర్చుకోడానికి వాళ్ల అన్నయ్యని తీసుకుని రావడం కనిపించింది. నా మిత్రబృందం కుంభమేళకు వచ్చిన సన్యాసుల్లా నిశ్చలంగా ఉన్నారుగానీ నాకు మాత్రం కంగారు పుట్టెసింది. ఆ అవతారంలో నన్ను చూసిందంటే ఇంకేమైనా ఉందా. మర్రోజు క్షాసులో ఆ పిల్ల మొహం ఎలా చూడగలను? ముందూ వెనక ఆలోచించకుండా అంత లోతైన బావిలోకి దధేల్‌మని దూకేశాను. నా వీరోచిత క విన్యాసాన్ని ఆ పిల్ల గొప్పగా చూసిందేమో కానీ, అసలు సంగతి ఇప్పటికీ తనకి తెలీదు. చచ్చినట్టు ఆ పిల్ల వెళ్లిపోయేదాకా నీటిలోనే ఉండి నా మానం కాపాడుకున్నాను. అడ్వంచర్ బుర్రలే...
బీచుపల్లి ఎ.పి. రెసిదెన్నియల్ గురుకుల పాఠశాలలో చదివేరోజుల్లో నేను చేసిందంతా అద్వంచరే. మా హాస్టల్ పక్కనే కృష్ణానది ప్రవహించేది. చుట్టూతా చిట్టడివి. హ్యాపీ డేస్ = సన్ ప్రముఖం చిన్ననాటి తీసి గుర్తులు + 96
అడవి మధ్యలో కలువల కొలనుందేది. (నా 'లోటస్ పాండ్ సినిమాకు ప్రేరణ). వనవాసంలో తిరిగే రామ, లక్ష్మణ, ఆంజనేయుల్లా మాకు మేమే ఊహించుకుని ధనుర్చాణాలతో సంచరించేవాళ్లం. ఎదురు బధద్దలతో ధనుస్సు, బాణాలూ తయారుచేసుకునేవాళ్ళం. ఒకసారి గురిచూసి నా (రామ) బాణంతో ఒక పావురాన్ని కింద పడగొట్టెశాను. తర్వాత దాని బాధ చూసి చాలా జాలేసింది. పావురాన్ని హాస్టల్‌కి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశాం. దాన్నిమా దగ్గరే ఉంచుకొని రోజూ గింజలు వేసూ, నీరు తాగిస్తూ అది కోలుకునేలా చేశాం.
స్టడీ అవర్స్‌లో ఎవడైనా చదువుతూ చదువుతూ కునికాడంటే చాలు వాడికి నా దగ్గరున్న రంగుల్లో మీసాలు పెట్టేవాణ్సి. మీసాలు ఎవడికైతే ఉన్నాయో వాడు పడుకున్నట్టు లెక్క మీసాలరాయుళ్లను చూడగానే టీచర్ బెత్తానికి పని చెప్పేవాడు. సుబ్బి పెళ్లి ఎంకిచావుకు.....
పాపార్దునరావు అనే ఆయన మా డ్రాయింగ్ టీచర్. తనకు ఫోటోగ్రఫీ హాబీ. స్కూల్లోనే ఒక డార్క్‌రూం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రకరకాల పక్షులను, ఉడతలను, పూలను, మేఘాలను, కృష్ణానదిని.... కంటికి ఏవి కనిపించినా వదలకుండా తన కెమెరాలో బంధించేవాడు. ఒకసారి రెండు పొటేళ్లు గాల్లో ఎగురుతూ ఢీ కొట్టుకునే ఫోటో తీయాలని నిశ్చయించుకుని, పొట్టెళ్లని వెతికి తెమ్మని మాకు పురమాయించాడు. ఇద్దరం వెళ్లి అతి కష్టం మీద ఒక గొర్రెల మందలో జొరబడి పొట్టెళ్ల కొమ్ముల్ని గట్టిగా పట్టుకుని ఈడ్చుకొచ్చాం. తెచ్చాం సరే, అవి రెండూ గాల్లోకి ఎగిరి ఒకదానికొకటి ఢీ కొట్టుకోడం ఎలా? ఎట్లయినా వాటిని గాల్లోకి ఎగిరించి ఢీ కొట్టించాలనే పట్టుదల మాది. ఆలోచించి, చించి వాటి తోకల్లేపి ముల్లు గుచ్చాం. మా సారువాడు అవి ఎప్పుడు గాల్లోకి లేచి ఢీ కొట్టుకుంటాయా అని ఊపిరి బిగబట్టి కెమెరాతో రెడీగా ఉన్నాడు. ఆవేమో ముల్లు దిగగానే బాధతో “'మే* అంటూ కొద్దిగా కదులుతున్నాయి తప్పించి గాల్లోకి ఎగరడం లేదు. మొదట్లో పిల్లకాయల ఆటలనుకుని సహకరించాయి గాని, తోకలేపి ముల్లు గుచ్చేసరికి గుర్రుమన్నాయ్. “ఎక్కడ కుమ్మితే దిమ్మతిరిగి మనుషుల మైంద్ బ్లాక్ అవుద్గో వాటికి బాగా తెలిసినట్టుంది. గురిచూసి గుప్పించి ఫెదేల్మనిపించి ఆ పట్టపగలే మా ఇద్దరికీ చుక్కలు చూపించి రెప్పపాటులో మాయమయ్యాయి. ఇంకేముంది? సీన్ కట్‌చేస్తే - కెవ్వుకేక!
దాక్టరు కావాలనుకున్నా
నిజానికి పొట్టెళ్ల దెబ్బకు ఫోటోగ్రఫీపై ఏవగింపు కలగాలి కానీ రివర్స్‌గా కెమెరాపై మోజు పెరిగింది నాలో. చిత్రలేఖనానిక్తీ, శిల్పకళకీ, ఫోటోగ్రఫీకీ అంతర్లీనంగా ఏదో అవినాభావసంబంధం ఉందనిపించేది. మా స్ఫూల్లో తెప్పించే హిందూ పేపర్‌లో గొరుసు జగదీశ్వర రెడ్డి + 97
ఎం.ఎఫ్.హుస్సేన్, జెమినీరాయ్, అర్పితారాయ్ లాంటి చిత్రకారుల గురించి చదువుతున్నప్పుడు మాత్రం జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల అంతర్లీనంగా బలపడుతూ ఉండేది. పాలెం వెళ్లినప్పుడల్లా నా మిత్రుడు రాధాకృష్ణన్ (ఆనంద్, గోదావరి చిత్రాల మ్యూజిక్ ఫేం) కలిసేవాడు. ఇద్దరం ఒక ప్లేగ్రౌండులో కూర్చుని అప్పటివరకూ విడివిడిగా మేం కన్న కలలన్నీ ఒక దగ్గర పోగేసి చర్చించుకునేవాళ్లం. మా మాటలు వినే మిగతా (ఫెండ్స్ మాకేదో పిచ్చి పట్టిందని ఎగతాళిగా నవ్వుకునేవాళ్లు. ఇంటర్మీడియట్ పాలెంలోనే చదివి డాక్టర్ అయిపోవాలని ఎం. సెట్. కూడా రాశాను. మెడిసిన్‌లో సీటు రాకపోవడంతో కర్నూల్ వెళ్లి సిల్వర్‌జూల్లీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో చేరిపోయా. అక్కడ సినిమాలకు కొదవ లేదు. సమయం దొరికితే చెక్కేసేవాళ్లం. ఒకసారి రెండో ఆట చూసి వచ్చి హాస్టల్ గేటు దూకబోతుంటే మా ప్రిన్సిపల్ కాచుకుని ఉన్నాడు. నా లక్కేంటంటే ఆ మగ్రోజే వాళ్ల అమ్మాయి పెళ్లి కాబట్టి రెండు చీవాట్లతో సరిపెట్టి వదిలేయడం. “'ముక్కాంబే' సృష్టికర్తనయ్యాను
డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు జూనియర్స్‌ని ర్యాగింగ్ చేసేవాణ్లి. పాలిటిక్స్ ఇష్టమని చెప్పిన ఒక బకరాని పట్టుకుని అప్పటి ప్రధానమంత్రి ఎవరని అడిగా. 'రాజీవ్‌గాంధి” అని చెప్పేడు. ఆయన ప్రధాని కావడానికి కారుకుడైన (నేను సృష్టించిన) ముక్కాంబే గురించి తెలుసా అని అడిగా. తెల్లమొహం వెసి తెలీదన్నాడు. ముక్కాంబే వల్లే ఆయన ప్రధాని అయ్యాడని కల్పించి ఒక వ్యాసం తయారుచేసి జనవరి 26న స్టేజీ పైన చదవమన్నాను. వాడు మేం చెప్పినట్టు మైకు దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చదవడం .... ప్రేక్షకులంతా ఈ ముక్కాంబే ఎవరని విస్తుబోయి.. ముక్కుమీద వేలేసుకుని బిత్తరపోవడం గురొస్తే ఇప్పటికీ నవ్వాపుకోలేను.
డిగ్రీ అయ్యాక సరాసరి హైద్రాబాద్ వచ్చేసి జెఎన్‌టియు ఫిలిం ఆటోగ్రఫీ కోర్సులో చేరిపోయాను. చివరి సంవత్సరంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు మధు అంబట్ వద్ద అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్‌గా (లజ్జ హింది సినిమాకి) అవకాశం రావడం, తర్వాత నా మిత్రుడు అల్‌తాఫ్ ద్వారా మోహనకృష్ణ ఇంద్రగంటి పరిచయం, (గ్రహణం సినిమాకి తొలిసారిగా కెమెరామన్‌గా చేయడం... ఆ మధ్య చిల్రన్ ఫిలిం “లోటస్ పాంద్‌తో దర్శకుడిగా మారడం... ఏం చేసినా అన్నీ తెరవెనకే ఉండి చేశాను. ఇప్పుడునా 'హ్యాపీడేస్” పంచుకోడానికి మాత్రం ఇలా మీ ముందుకు వచ్చాను.
(01.07.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 98
స న్ 1డీ . జ లో _ ॥ ఇ ఖం ఖ్ . బళ్లో ష్య థ్... = చ్ బ్ న జ | బో న. న. రఘు కుంచే చం “ఆటోగ్రాఫ్... సినిమా అనుభవాలే నావి అచ్చుం 'ఆటొగ్రాఖ... సి అ నా ఒకనాటి జెమినీ ఛానల్ 'పోస్టుబాక్స్ - 2662” టపా మనిషి మీకు గుర్తున్నాడా? తొలి మేల్ యాంకర్‌గా బుల్లితెరం(గేటం చేని, గాయకుడిగా నటుడిగా దబ్బింగ్ ఆర్ధిస్తుగా, మ్యూజిక్ దైరెక్టరుగా ఆచి తూచి అందలమెక్కిన రఘు కుంచే అతదే. “ఎందుకే రవణమ్మా..” (బంపర్‌ఆఫర్) పాటతో (పేక్షక (శోతల్ని వోరెత్తించి 'సుబ్బలక్ష్రీ మాటాదే సుబ్బలక్ష్ర” (దేవుడు చేసిన మనుషులు) తో రఫ్ ఆడించారు. దారి వర్షం (తిలక్ 'ఊరు చివర ఇల్లు” మూలకథ టెలీ ఫిలింతో నటుడిగా మారారు. ఇవ్పుటీికే 6 నందులందుకుని, నంగీత దర్శకుడిగా 11 చిత్రాలను, గాయకుడిగా దాదాపు 400 పాటలను తన ఖాతాలో వేసుకున్న తూగోజి బుల్లోడు రఘు, మీలో చాలా మంది 'నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమొరీస్ సినిమా చూసే ఉంటారు కదూ.. అచ్చంగా నా చిన్నతనంలో జరిగిన 70 శాతం సంఘటనలే ఆ సినిమాలోనూ ఉన్నాయంటే నమ్ముతారా? అది యాదృచ్చికమే కావచ్చు గాక, నా మటుకు నాకు బోల్దంత విశేషమే కదండీ! రాజమండ్రికి 30 కి.మీ. దూరంలో కోరుకొండ దగ్గరున్న 'గాదరాడి మా ఊరు. “అబ్బో గోదారి జిల్లావోడివా? అయితే ఎటకారినికేం తక్కువుండిదని మీరంటారని గొరుసు జగదీశ్వర రెడ్డి ఇ 99
తెలుసు. అయితే, ఒకమాటండి! గోదారి జనాలకి ఎటకారంతో పాటు మమకారం కూడా జాస్తేసుమండీ- ఆయ్ ! దెయ్యం దెబ్బకు పాట పుట్టింది
చిన్నప్పుడు చదువుకోడానికి మా ఊరినుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న కోరుకొండకి సైకిల్‌పై వెళ్లేవాణ్సి. ఆటల్లో పడి రాత్రి 8 తర్వాతగానీ ఇల్లు గుర్తుకొచ్చెది కాదు. దారిలో ఊడలతో జడలు విరబోసుకున్న మర్రిచెట్టు ఒకటుండేది. దాన్ని పగలు చూస్తేనే తొడలూ, పిక్కలూ ఒణికేవి నాకు. ఇక చీకట్లో.... చెప్పాలా? చెట్టు దగ్గరకి రాగానే ఒళ్లంతా చెమటలు, అదీగాక ఊడల మరర్రిపైన దెయ్యాలను చూశామని ఊర్లో చెప్పుకునే వాళ్లు. సరిగ్గా చెట్టుదగ్గరికి రాగానే 'శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం' దండకం నా నోట్లోంచి హైపిచ్‌లో వచ్చేసేది (హనుమంతుడి పేరంటే దెయ్యాలకి హడలంటగా). ఆ ఊపులో సినిమా పాటలు వొద్దం కూడా అలవాటైంది. రాబోయే ఏడు తరాల మాట దేవుడెరుగు కానీ, వెనక ఏడుతరాల్లో కనీసం పాట కాదు కదా, పద్యం, మంగళహారతి పాడేవాళ్లు ఒక్కరూ లేరట మా ఇంట్లో, మరి శృతి, లయ తప్పకుండా నాకు పాడ్డం అబ్బిందంటే దెయ్యం దెబ్బ కాక మరేమిటి? (ప్రేమలేఖా - చెంపదెబ్బా?
ఒకసారి టీచర్ అడగడంతో క్లాసులోనే 'రవివర్శకే అందని ఒకే ఒక అందానివో అనే పాట పాడాను. అంతా “ఆహా అని మెచ్చుకోడమే కాదు, ఆ దెబ్బతో అమ్మాయిల కళ్లకు చిన్న సెలబ్రిటిగా మారిపోయా కూడా. ఆ ఎదాది ఆగస్టు 15 కోసం స్కూల్‌ను ఆ ముందురోజు అలంకరణ చేస్తున్నాం. ఒకే పురికొసకి ఒక చివర నేను, మరోచివర ఒకమ్మాయి (పెరెందుకులెండి) రంగు కాగితాల్ని మైదాతో అతికిస్తున్నాం. ఆ అమ్మాయి నా దగ్గరకి రాగానే “రఘూ నిన్న క్లాసులో పాట చాలా బాగా పాడావు. రాత్రంతా ఆ పాటే గుర్తొచ్చింది తెలుసా?” అంది. ఇంకేముంది? వ్లాటైపోయి గాల్లో తేలిపోయా. అదీగాక తను మా క్లాసులో అందరికంటే అందగతై. అప్పట్నించి ఆ అమ్మాయికి దగ్గరవదడానికి ప్రయత్నించేవాళణ్డి. ఒకరోజు ధైర్యం చేసి ప్రేమలేఖ రాసి, తన చేతికి అందివ్వాలని స్కూల్ వదలగానే సైకిల్‌పై వెంబడించా. ఎవరూ చూడటం లేదని రూఢి చేసుకున్నాక ఒక దగ్గర సైకిల్ ఆపి పిలబోయేంతలో ఉమామహేశ్వరావు అనే మా క్లాస్‌మేటే నాపక్కనుండి రమూమ్మంటూ దూసుకెళ్లి ఆ అమ్మాయి దగ్గర సైకిల్ ఆపి చేతికి ఒక చీటీ ఇచ్చి పళ్లికిలించాడు. ఆ దృశ్యం చూడగానే గుండె రగిలిపోయి దుఃఖం తన్నుకొచ్చేసింది. అక్కడ ఏడిస్తే బాగోదని సైకిల్ వెనక్కి తిప్పా. హ్యావీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 100
ఊహించని విధంగా ఆ చీటీని మర్రోజు స్కూలుకు రాగానే మా తెలుగు టీచర్‌కి అందించింది ఆమ్మాయి. ముందే ఆయన చండశాసనుడు. చెంప చెళ్త్లుమనిపించడంలో అందెవేసిన చెయ్యి. వాణ్సి ఆఫీసు రూమ్‌లోకి పిలిచి వేసిన చెంపదెబ్బ కనీసం అర కి.మీ. దాకా వినిపించి ఉంటుంది. కిటికి పక్క దొంగచాటుగా వింటున్న నాకే తగిలినట్టు తూలిపడ్డానంటే అర్ధం చేసుకోండి మరి. కాలం కలిసి రాకపోతే ఆ దెబ్బ రుచి నేను చూడాల్సి వచ్చేదన్నమాట. వామ్మో! దేవుడున్నాడండోయ్! చిట్టెమ్మ దెబ్బకు పారిపోయిన దత్తుణ్జి
మా ఊరి పోలేరమ్మ వారి తీర్ధం వచ్చిందంటే భలే కోలాహలం. ఊరంతా డప్పుల మోతతో దద్దరిళ్లది. బోల్డన్ని పౌరాణిక నాటకాలు వేసేవారు. ముఖ్యంగా షణ్ముఖ ఆంజనేయరాజుగారు పాడే పద్యాలు నన్ను బాగా ఆకర్షించేవి. ఒకసారి తీర్ధంలో మా కుర్రాళ్లమంతా కలిసి “చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకం వేయడానికి సిద్ధమయ్యాం. దత్తుడి వేషం నాకు కట్టబెట్టారు. చిట్టెమ్మని రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు. రిహార్సల్ అంతా బాగానే జరిగింది. 'చిటికి మాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో' పాటని మా వాళ్లే ఎవరో పాడి రికార్డు చేశారు. స్రేజికి ఒకపక్క కూర్చున్న ఆడంగులు నా వేషం చూసి, నోటికి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వడం కనిపించగానే బోల్టు సిగ్గేసి, తల కొట్టేసినట్టయింది. ఇంతలో పాట మొదలు - చిట్టెమ్మ నన్ను పట్టుకోడానికి రావడం, నేను తప్పించుకుంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ స్టేజీ అంతా తిరగడం చివరకు స్టేజీ దూకేసి పారిపోవడం దాకా వచ్చింది. ఇంకేముంది అంతా రసాభాస, మర్రోజు ఊర్లో జనం నేను కన్సించగానే 'ఏటండి దత్తుడు గారూ రాత్రలా చేసేరెటండి?” అని రాగం మొదలెట్టారు. నా తొలి మేకప్ కథా కమామీషు అలా ముగిసింది. అది భరించలేని “విషాద పేమ”
టెన్త్ పూర్తవగానే కోరుకొండలోనే ఇంటర్లో చేరి బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఐతే ఆడుకోడానికి సమయం దొరకదని, పైగా కప్పలు, బొద్దింకలూ కోయిస్తారని భయపెట్రేసరికి సి.ఇసి.కి మార్చుకున్నాను. అక్కడ కూడా పాటలతోనే మార్కులు కొట్టెసి అభిమానుల్ని సంపాదించేవాణ్సి. గోకవరం నుండి ఒకమ్మాయి వచ్చేది. కాలేజీ బ్యూటీ, నాకు తెలియకుండానే తనని ఆరాధించడం మొదలెట్టాను. ఇదిలా కొనసాగుతుండగా... రాజమండ్రిలో ఫస్ట్ ఇయర్ చదివి, సెకండియర్‌కి మా కాలేజీకి వచ్చి చేరాడొక కుర్రాడు. కాలేజీ మొత్తంలోకి స్కూటర్‌పై వచ్చేది తనొక్కడే. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. క్రమంగా మా ఇద్దరికీ మైత్రీ కుదిరింది. మాటల్లో ఆ అమ్మాయి గురించి తెగ చెప్పేసేవాడ్డి. గొరుసు జగదీశ్వర రెడ్డి శ 101
తను సైలెంట్‌గా వింటూ ఉండేవాడు. నాలో ఆరాధన తారాస్థాయిలో చేరిపోయి (ప్రేమలేఖ రాసి, దాన్ని ఆ అమ్మాయికి ఎలా అందివ్వాలో సలహా ఇవ్వమని ఆ కుర్రాణ్ణి అడిగా ఒకరోజు స్కూటర్‌పై నన్ను కాలేజీకి దూరంగా తీసుకెళ్లి ఒక దగ్గర ఆపి, మెల్లగా డిక్కీలోంచి (పమలేఖల కట్టని బయటికి తీశాడు. వె[ర్రిమొహం వేసుకుని చూస్తుంటే గుందె బద్దలయ్యే మాట చెప్పేడు. అసలు విషయం ... ఆ అబ్బాయి (నేను ఆరాధించే) అమ్మాయీ ఎన్నాళ్లుగానో (ప్రేమికులట. పైగా ఒకే ఊరివాళ్లు. వీళ్ల ప్రేమగోల పడలేక ఈ అబ్బాయిని రాజమండ్రికి పంపించి అక్కడ కాలేజీలో చేర్చించారట. ఫస్ట్ ఇయర్ మాత్రం అక్కడ చదివేసి, ఇంట్లో వాళ్లని ఎలాగో ఒప్పించి మళ్లీ ఆ అమ్మాయికోసమే ఇక్కడ సెకండియర్‌లో చెరాడట. ఆ (ప్రేమకథ సాంతం వినగానే కళ్లు బైర్లు కమ్మేశాయి నాకు. విషాదమేమంటే ... మా ఇంటర్ పూర్తికాకుండానే ఒకరోజు వాళ్లిద్దరూ పురుగుల
మందు తాగేయడం, ఆ అమ్మాయి చనిపోవడం.... ఆ అబ్బాయి షాక్‌కు గురవడం, కొంతకాలం పిచ్చోడిలా గడ్డం పెంచేసి తిరగడం - ఒకరోజు యాక్సిడెంట్‌లో పోవడం... వెంటవెంటనే జరిగిపోయిన దుర్హటనలు. సినిమాల్లో చూడ్డం తప్పించి ఇలాంటీ అమర(ప్రేమల్ని, త్యాగాల్ని నిజ జీవితంలో చూడ్డం అదే మొదటిసారి. చాలోజుల వరకూ తట్టుకోలేకపోయాను. ఆ (కుమికుల జంట ఎప్పుడు గుర్తుకొచ్చినా మనసంతా బాధతో నిండిపోతుంది. బాలు గారి చేతుల మీదుగా...
ఇంటర్మీడియెట్ తర్వాత డిగ్రీకోసం రాజమండ్రి వచ్చేసి, కందుకూరి వీరేశలింగం కాలేజీలో చేరాను. రోజూ అప్ అంద్ దౌను ప్రయాణమే. రాజమండ్రికి వచ్చి డిగ్రీలో చేరడంలో నాకు ఒరిగింది ఏమీ లేదు గాని, స్టానిక “వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం'లో జరిగే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు తీసుకునేవాణ్ణి. బహుమతి ప్రదానం రోజు నిర్వాహకులు దేశంలోని ఎ టు జెడ్ నృత్యాలన్నీ చేయించి, రాత్రి ఏ రెండింటికో బహుమతులిచ్చేవారు.
డిగ్రీలో ఉండగానే హైద్రాబాద్‌లో జరిగిన 'అభినందన) సినిమా పాటల పోటీలో పాల్గొనడం, దాంట్లో గెలవడంతో బహుమతికోసం చెన్నై వెళ్లడం జరిగింది. ఆ సభలో ఓపీనయ్యర్, ఇళయరాజా, ఎస్. జానకి, బాలు గార్ల వంటి మహామహులంతా పాల్గొన్నారు. నాకు మాత్రం బహుమతి బాలు గారి చేతుల మీదుగా అందుకోవాలని ఆశ. నా పేరు పిలిచేవరకూ బాలు గారు ఇస్తే బావుణ్ణని ధ్యానం చేస్తూనే ఉన్నాను. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 102
తధాస్తు దేవతలు పలికినట్టు చివరకు బాలుగారి చేతుల మీదుగానే వెయ్యిరూపాయల నగదు, స్వర్ణపతకం అందుకోవడం ఒక స్వీట్ మెమరీ. మనుషుల్లో దేవుడు
డిగ్రీ ఫైనల్లో ఉండగా 'దాసరిగారు తీయబోయే ఒక చిత్రానికి నటీనటులు, గాయకులు కావలెను అనే యాడ్ చూసి నా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి హైద్రాబాద్ బయలుదేరాను. రైల్లో కె. రాధాకృష్ణగారనే ఒకాయన పరిచయమయ్యారు. తను ఇసిఐఎల్‌లో మార్కెటింగ్ ఆఫీసరుగా పనిచేస్తున్నానని చెప్పి, ఎక్కడికెళ్తున్నావని కూపీ లాగారు. గొప్పగా సినిమాలో ఛాన్సుకోసం అని చెప్పా. ఏదీ ఒక పాట పాడూ అన్నారు. సిరివెన్నెల “విధాత తలపుని పాట పాడాను. నేను పాడుతుంటే అటూ ఇటూ ఉన్న బోగీల్లోని జనం దాదాపు 20 మందిదాకా మూగారు. ఆ పరిచయంతో నన్ను వాళ్లింటికి తీసుకెళ్లడం, వాళ్లవిడ ఎంతో ఆప్యాయంగా నాకు అన్నం వడ్డించడం... ఇప్పుడు తలచుకున్నా కళ్లు చిప్పిల్లుతాయి. ఆ కొత్త సినిమా గాయకుల సెలక్షన్లో దాసరిగారితో పాటు మరికొందరు సినీ ప్రముఖులున్నారు. “ఆది భిక్షువునేది కోరేది పాడాను. ఐదుగుర్ని సెలక్ట్ చేశారు. అందులో నేనొకడ్ని. తర్వాత పిలుస్తామని, ఎప్పుడు పిలిచినా రావడానికి రెడీగా ఉండమని చెప్పారు. రాజమండ్రి వెళ్లిపోయి ఆ పిలుపుకోసం ఎదురుచూస్తుండగానే నా డిగ్రీ కూడా అయిపోయింది. చివరికి తెలిసిందేమంటే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని.
అయినా హైద్రాబాద్ వచ్చేసి ఏదో రకంగా ఈ ఫీల్దులో సెటిలవ్వాలనే తపన మాత్రం నన్ను నిద్రపోనిచ్చేది కాదు. ఒకసారి రాధాకృష్ణగారితో నా మనసులోని మాట చెప్పాను. ఆయన మా నాన్నతో ఫోనులో మాట్లాడి ఆయన్ని ఒప్పించి నన్ను హైద్రాబాద్ రప్పించారు. తనకు తెలిసిన ఒకబ్బాయి రూమ్‌లో నన్నుంచి, “ఇక అదృష్టం పరీక్షించుకోవడం నీ వంత”ని కట్టిన తాళ్లు విప్పేసి చిత్రజనారణ్యంలోకి వదిలేశారు. ఆ వెతుకులాటలోనే పూరీజగన్నాథ్‌గారి పరిచయం కలగడం ఒక స్వీట్ మెమొరీ. అవకాశాలకోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగ్గా, తిరగ్గా... కాళ్లు పూర్తిగా అరిగిపోకముందే ఫకీర్రాజు సీరియల్‌లో నటుడిగా, దూరదర్శన్‌లో గ్రూప్ సింగర్‌గా, జి.3. మోహన్‌గారి ద్వారా జెమినీలో యాంకర్‌గా.... ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టరుగా మీ ముందుకొచ్చి నిల్చున్నాను.
(08.07.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
గొరుసు జగదీశ్వర రెడ్డి + 103
ర్న య. మ చ న జ. ఖీ న , ఖా శే / జ య స కో జో శ్రీరామచంద్ర థ ఇఒ లా చలీ అ ఆత్మ లను పిలిచి భయపెటెవాణి జు ణు వరిచయం అక్కర్లేని ఈ వొటగాదు “ఇండియన్ ఐదలొ ద్వారా అఖిల భారత బుల్లితెర (పేక్షకులందరి తలలో నాలుకయ్వాదు. సీతమ్మవాకిట్లో సీరిమల్లెచెట్టు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంది నిన్నటి ఎమ్. ఎన్. ధోని వరకు వలు తెలుగు, తమిళ కన్నడ, పొందీ చిత్రాల్లో వందలాది వొటలు పాదారు. గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్స్ బిగ్ టి.వి. లాంటి జాతీయ అవార్డులతో పాటు లతామంగేష్టుర్స్ ఘంటసాల, వి.బి. శ్రీనివాన్ పేరిట ఉన్న రాష్ట్రస్థాయి వురన్నారాలు కూదా ఎన్నో స్వంతం చేసుకున్నాడు. ఆయనే నవతరం గాయకుడు మైనంపాటి శ్రీరామచంద, పొట వారసత్వంగా అబ్బలేదు నాకు. పాటను ఇష్టపడ్డమేగాని మా ఇంట్లో ఎవరికీ సంగీతంలో చిన్నపాటి ప్రవేశం కూడా లేదు. కాళిదాసు నాలుకపై కాళికాదేవి బీజాక్షరాలు రాసినట్టుగా ఎప్పుడో నేను ఆదమరిచి నిద్దరోతున్నప్పుడు సరస్వతీదేవి మా ఇంటీ ముందు నుండి వెళ్తూ వెళ్తూ నన్ను చూసి 'పిల్లాడు ముద్దాస్తున్నాడినుకుని నా గొంతులో ఓ 'పాట మాత్ర వేసి వెళ్లినట్టుంది - అప్పటినుండి నా పెదాలపై పాట అలవోకగా కదలాడుతూనే ఉంది. ఆ మాత్ర ప్రభావం కాబోలు నా పదో ఏటనే మా వెంకటాచలం మావయ్య అర్మెస్తాలో పాట పాడాను. ఆ సందర్భంగానే మా మోలిని టీచర్ దగ్గరకి వెళ్లి నా ప్రోగ్రాం రవింద్రభారతిలో ఉందంటూ “బుల్లి సెలబ్రిటీ లెవల్లో ఒక ఇన్విటేషన్ ఇచ్చినట్లు గుర్తు. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 104
పాట పాది లిడరునయ్యాను
నా పాట రాళ్లను కరిగించ లేకపోవచ్చుగానీ మా అమిత టీచర్ మనసును మాత్రం కరిగించేసింది. అవి నేను బోయిన్‌పల్లి “సెయింట్ ఆండ్రూస్‌లో 8వ తరగతి చదువుతున్న రోజులు. ఆమెనూ క్లాస్ టిచర్. సోషల్ చెప్పేది. ఆ సబ్జెక్ట్ అంటేనే యమ తిక్క నాకు. ఒక మంత్లీ ఎగ్జామ్స్ ట్రెంలో జవాబులకు బదులు నా బుర్రకు తోచింది ఏదో రాసిపారేశా. నా తిక్క సమాధానాలకి ఆమెకి తిక్కరేగి క్లాసులో పక్కపిల్లాడికి నా పేపరిచ్చి అందరూ వినేలా గట్టిగా చదివించి నాకు చుక్కలు చూపించింది. బహుశా బోయిన్‌పల్లి మిలట్రీ ఏరియా ప్రభావం కాబోలు... ఆవిడ స్మూల్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సస్రిక్ట్‌గా మారిపోయేది. మా స్కూల్లో ప్రతి నెలా 45 నిమిషాల పాటు జాస్ అసెంబ్లీ జరిగేది. స్టడీస్‌కి సంబంధించి కాకుండా ఆటలు, పాటలు, దాన్సుల గురించి చర్చించే సమావేశమన్నమాట.
ఒక అసెంబ్లీలో నేను పాట పాడ్డంతో అమిత టీచర్ బాగా ఇంప్రెస్ కావడం, నన్ను ఆ టీమ్‌కి లీడర్‌ని చేయడం - పాట సంతోషాన్నే కాదు, చిన్నపాటి సెలబ్రిటీని కూడా చేస్తుందని మొదటిసారి తెలిసిందప్పుదే. అమ్మ చేతిలో తధిగిణతోం... తోం
స్కూల్లో ఒకసారి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి పేరెంట్స్‌తో సంతకం చేయించుకు రమ్మన్నారు. ఆ మార్కులు చూస్తే వీపు విమానం మోతే. పైగా నాన్న న్యాయవాది. మార్ములు తక్కువొచ్చినందుకు ముద్దాయిని ఆరా తీసినట్టు తీసారనే భయంతో పది రోజుల వరకూ ఇంట్లో చూపించలేదు. ఒకరోజు సడన్‌గా స్కూల్లో అమ్మ కన్పించేసరికి ఆశ్చర్యపోయా. అమ్మ ముందే 'రామ్, నీ ప్రోగ్రస్ కార్డు ఏదీ?” అంది టీచర్. “ఏ ప్రోగ్రెస్ కార్డు టీచర్?” అని ఏమి ఎరగనట్టు మొహం పెట్టి నటించా. చివరికి నా బ్వాగ్‌ని తనిఖీ చేయడంతో దొంగ దొరికిపోవడం..... అమ్మకి తారాస్థాయితో కోపం రావడం... ఇంకేముందీ...? తధిగిణతోం - ' ఈ రకంగా నన్ను ఇన్‌సల్డ్ చేస్తావా? అని అక్కడికక్కడే అమ్మ వీరలెవల్లో ఉతకడం ఇప్పటికీ మర్చిపోలేను. దెబ్బల సంగతి ఎలా ఉన్నా ఆ సంఘటనతో నేను కూడా నటించగలనన్న నమ్మకం మాత్రం ఎర్పడింది. నన్ను దోషిని చేసిన పిల్ల
ఇది నేను టెన్త్‌లో ఉండగా జరిగిన సంఘటన. ప్యూపా నుండి సీతాకోక చిలుకలోకి మారినట్టు నిక్కర్ల నుండి ప్యాంటుల్లోకి మారే దశ. స్కూల్ బస్సుకు ఇంట్లో గొరుసు జగదీశ్వర రెడ్డి + 105
వాళ్లు డబ్బులు కట్టినా సైకిల్‌పైనే స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. ఆ రోజు నేను వెళ్లేసరికి ప్రార్ధన జరుగుతోంది. మధ్యలో దూరడం బాగోదని తిన్నగా క్లాసులోకి వెళ్లి కూర్చున్నా. అప్పుడు సుబ్బలక్ష్మిగారు మా క్లాస్ టీచర్. ఆవిడ మొదటి పీరియడ్ తీసుకొని ఇంటర్వెల్ తర్వాత మరో పీరియడ్ తీసుకోవడానికి వచ్చారు. ఈ లోపుగా ఏం జరిగిందో రావడం రావడంతోనే నా వైపు కోపంగా ఒక చూపు విసిరింది. క్లాసు చెబుతున్నంత సేపూ తీక్షణ్హంగా చూస్తూనే ఉంది. నాకేదో మూడిందని డిసైదైపోయా. క్లాసు అయిపోగానే * ఈరోజు క్లాసులోకి మొదటగా వచ్చింది ఎవరిని అడిగింది. 'నేనే టీచర్ అంటూ గర్వంగా లేచి నిలబడ్డా (గతంలో మనమెప్పుడూ ముందుగా వెళ్లిన దాఖలాలు లేవు). అంతే. 'నీకు సిస్టర్స్ లేరా? పేరెంట్స్‌తో కలిసే ఉంటున్నావా? అంటూ మొదలెట్టింది. మ్యాటరేంటో తేలదు. ఆ తర్వాత తెలిసిన అసలు విషయం ఏంటంటే - ఒకమ్మాయి (ఎక్స్) బ్యాగ్‌పై ఎవరో పెన్నుతో '“బ్యాడ్‌ోగా రాశారట. ఆ పిల్ల నా పేరు చెప్పిందట. అదీ సంగతి. నేను కాదని ఎంత చెప్పినా వినదే... 'నీవు కాకపోతే నీ (ఫైండ్ అనిల్ అయ్యుంటాడు అంది. అది వినేసరికి నా పక్కనే ఉన్న అనిల్‌గాడు “బేరొమని ఆరున్నాక్క రాగం ఎత్తుకున్నాడు. 'సరే సరే నీవు కాదులే, రామే అయ్యుంటాడిని మళ్లీ నా వైపు గుద్దురిమింది. నా నిర్చొషిత్వాన్ని ఎలా రుజువు చేసుకోవాలో అర్ధం కాలేదు. 'ప్యారిసొది కాదు పక్కింట్లోదే
అప్పటికి వారం క్రితం ఆ అమ్మాయి క్లాసుకు ఒక చిత్రమైన పువ్వుని తీసుకొచ్చి “ప్యారిస్ నుండి తీసుకొచ్చానిని కోతలు కోయడంతో తిక్కరేగింది నాకు. పిల్లలందరూ మూగి “ఆహో, ఓహో” అని నోళ్లు తెరిచి ఆశ్చర్యపోయారు. “బాతు” ఆకారంలో బూడిదరంగులో ఉన్న పువ్వది. ఆ పూలు మా పక్కింట్లో చూశాను. మర్రోజు అదే పువ్వుని తీసుకెళ్లి 'ఆ పూలు ప్యారిస్‌లో కాదు, మా ఇంటి దగ్గరే ఉన్నాయని చెప్పేసరికి ఆ పిల్ల మొహంలో నెత్తురుచుక్కలేదు. అప్పట్నించి నాకు స్పాట్ పెట్టాలని చూసినట్టుంది. కర్మగాలి ఆ రోజు క్లాసుకు ముందు వెళ్లేసరికి తన బ్వాగ్‌పై రాసింది నేనేనని సుబ్బలక్ష్మి టిచర్‌కి చెప్పి పగ తీర్చుకుందన్నమాట. అప్పట్నించి అమ్మాయిల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం అలవాటైెందనుకోంది. అబద్ధం చెప్పి దొరికివోయా
టెన్త్‌లోనే మార్కులు బాగా రావాలని స్టడీ సర్కిల్‌కి పంపించేవాళ్లు. కృష్ణమూర్తిగారు మా హెడ్. మిగతా స్కూల్లో చదివే పిల్లలు కూడా అక్కడికే వచ్చేవాళ్లు. ఒకమ్మాయి నాతో క్లోజ్‌గా ఉండేది. ట్యూషన్ అవగానే ఆ పిల్ల ఇంటి వరకూ వదిలి వచ్చేవాణ్డి. నేను సైకిల్ నడిపిస్తూ, తనేమో పుస్తకాలు పట్టుకుని నా పక్కన నడుస్తూ.... కబుర్లు హ్యాపీ డేస్ = సన్ ప్రముఖం బిన్ననాటి తీస్ గుర్తుల ౪ 106
చెప్పుకుంటూ అలా వెళ్లడం నాకిష్టంగా ఉండేది. ఈ క్రమంలో ఒక తొట్టిగ్యాంగ్ మమ్మల్ని ఫాలో అవుతుందేది. అందులో మా ట్యూషన్ వాళ్లే ఒకరిద్దరు ఉండేవాళ్లు కూడా. ఒకసారి కోపం వచ్చి ఒకడిపై చేయి చేసుకున్నా వాడు ఆ ఏరియా దాదా తమ్ముడు. ఆ గొడవలో వాడు తోసిన తోపుకు పక్కనున్న కాలవలో పడిపోయి నా ఫ్రేమ్‌లెస్ కళ్లజోడు విరగ్గొట్టుకున్నా మర్రోజు ఈ విషయం కృష్ణమూర్తి సార్‌కు చెప్పెసరికి తొట్టిగ్యాంగ్‌కు సపోర్టు చేసిన వాళ్లకు బడిత పూజ చేశాడు. అలా ఆ పిల్ల మరికాస్త నాకు దగ్గరయ్యిందనిపించి... తరచూ వాళ్లింటికి ఫోన్ చేస్తుండెవాణ్ణి. ఆ అమ్మాయి కాకుండా వేరే వాళ్లు ఫోనెత్తితే వెంటనే కట్ చేసేవాణ్సి. నా ఫోన్ గోల ముదిరి పాకాన పడ్డాక ఒకరోజు వాళ్ల పేరెంట్స్ వచ్చి మాసార్‌తో చెప్పేశారు. ఆయన నన్ను పిలిచి 'ఆ పిల్ల ఇంటికి ఎందుకు మాటిమాటికి ఫోన్ చేస్తున్నావిని క్లాస్ పీకుతుంటే ఠపీమని “సబ్టెక్టులో డౌటొచ్చి' అని చెప్పా. '“అబద్దం ఆడినా అతికినట్టు ఉండాల్రా. ఆ పిల్లది ఐసిఎస్‌సి సిలబస్, నీది ఎస్.ఎస్.సి.” అని చీవాట్లు పెట్టాడు. ఇంతకీ ఆ పిల్ల ఇంట్లో ఉన్నది 'కాలర్ ఐడి ఫోనట. నా నెంబర్లన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యెవి. ఆ విధంగా దొంగ దొరికిపోయాడు! అర్ధరాత్రి మద్దెల దరువు
విజయవాడ చైతన్య రెసిడెన్న్షియల్‌లో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో - తెల్లవారి లేచింది మొదలు రోజంతా చదువుతోనే సరిపోయేది. నాకేమో జిమ్ చేయాలనే సరదా ఉండేది. చివరికి నా రూమ్మేట్ వంశీ, నేను కలిసి రాత్రి అందరూ పడుకున్న తర్వాత రూమ్‌లోనే జిమ్ ప్రాక్టీస్ చేద్దామని ష్లాన్ వేశాం. ఒకరోజు ఇద్దరం వీరలెవల్లో బస్కీలు తీస్తూ రకరకాల విన్యాసాలతో చెమటలు కక్కుతున్నాం. మా కసరత్తు మత్తులో పక్కనే ఉన్న ఇనప మంచాల కిర్రుకిర్రులను గమనించలేదు. ఇంతలో డోర్‌పై “టక్ టక్ అని కొట్టిన శబ్దం. తలుపు తీసి చూస్తే నైట్ చెకింగ్ వార్డెన్. చెమటలు కక్కుతున్న మా ఇద్దరినీ చూసి అవాక్కయ్యాడు. “ఏం చేస్తున్నారిద్దరూ - ఆ మంచం శబ్దాలేంటి?” అంటూ లోపలికొచ్చాడు. “జిమ్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్” అని చెప్పేసరికి 'ఈ వేళప్పుడా?” అని మమ్మల్ని ఆవాదమస్తకం విస్తూవోయి చూశాడు. ఆ లుక్కుకి భయపడి మర్రోజు నుండి జిమ్ బంద్! దెయ్యం పిలకనా చేతిలో....
మా హాస్టల్ చుట్టూ కనుచూపు మేర పొలాలే. తరచూ సర్పసంహారాలు జరిగేవి. కీచురాళ్ల రొద తప్పించి ఏమీ వినిపించని ఆ వాతావరణం రాత్రయ్యే సరికి మాలో ఒక భయం కలిగించేది. ముఖ్యంగా పల్లెటూళ్ల నుండొచ్చిన కుర్రాళ్లు తెగ భయపడి
చచ్చేవాళ్లు. ఒకరాత్రి రాకేశ్, రాందాస్, వెంకట్, నేనూ కలిసి స్పిరిట్ గేమ్ ఆడుతున్నాం. లైట్లన్నీ ఆఫ్ చేసి బల్లపైన “ఎబిసిడిలు రాసి కొవ్వొత్తి వెలిగించి మధ్యలో "కాయిన్ ఉంచి స్పిరిట్‌ని పిలిచాం. ఇంతలో మా పక్క రూమ్మేట్స్ కూడా వచ్చారు. ఒక్కొక్కడికీ తాము పాసవుతామా లేదా? ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఆత్మను అడిగి తెలుసుకోవాలనే ఉబలాటం. దాంతో పాటు భయం కూడా ఉండేది. వాళ్లడిగిన ప్రశ్నలకు నా వేలునా ఇష్టం వచ్చినట్టు తిప్పేవాణ్డి. వాళ్లంతా అది నిజంగా స్పిరిట్ పనే అనుకుని తెగ యాంగ్లయిటీ ఫీలయ్యేవారు. భయంతో మధ్యలో వెళ్లిపోతాం...! అంటే ఆట మధ్యలో కాయిన్‌పై నుండి వెలు తీసేస్తే స్పిరిట్ ఇక్కడే ఉంటుందని భయపెట్టేవాళ్లం. ఒకసారి ఆట మధ్యలో వేలు తీసేయడం, కావాలని నురగలు కక్కినట్టు నటించి మూర్చ్భరోగిలా కాళ్లూ చేతులు కొట్టుకోవడంతో వాళ్లు బెంబేలెత్తి వార్దెన్‌ను పిలుచుకురావడానికి వెళ్లడం... ఇప్పుడు గుర్తొస్తే యమ నవ్వొస్తుంది.
ఇంజనీరింగ్‌ని చేవెళ్ల దగ్గరున్న ఆర్.ఐ.టి.ఎస్.లో చదివే రోజుల్లో తరచూ బంక్‌కొట్టి దగ్గర్లో ఉన్న దామరదొడ్డి వెళ్లి అక్కడే గడిపేవాళ్లం. ఒకవైపు ఇంజనీరింగ్ చదువు, మరోవైపు మ్యూజిక్ కాలేజీలో సంగీతం.... అబ్బో యమ బిజీ లైఫ్ అది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పేస్తారు. ఇండియన్ ఐడల్ నన్నొకృసారిగా సెలటబ్రిటీని చేసేయడంతో ఇప్పుడు కొంటె పనులకు టైం లేదు. “ఐడల్ అయ్యాక చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?
(15.07.2012, అదివారం ఆంధ్రజ్యోతి)
హ్యావ్ డేస్ - సినీ ప్రముఖల చిన్ననాటి తీసి గర్తుటు + 106
ఇ. స - జ | అ /| ( ఏ. సునీల్ కుమార్ రెడ్డి నాన్నగారి ఉద్యోగం నా అల్లరికి అడ్షొచ్చేది ౧౧ 0౧ మొదట్లో భృతి కోసం ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న అతడు తర్వాత సమాజ అసమానతల్ని ఎలుగెత్తి చాటేందుకు జర్నలిజం వైపు దృష్టి సారించి 'కోకిలి, 'సిటీ రౌండప్” పత్రికలు నడిపారు. అటుపిమ్మట సైలెంట్‌గా "సైలెన్స్ ప్లీజ్ అంటూ వెండితెరంగేటం చేశాడు. ఆ క్రమంలో “హీరో” నుండి “ఛాన్స్, “ప్రయత్నం, “'వృేఘృంి, 'మిస్పింగ్, “బెస్ట్ (ఫెంద్' (మలయాళం), “సొంత ఊరు), “గంగపుటత్రులు, “ఒక రొమాంటిక్ కైమ్ కథ” గల్ఫ్, తిక్క వరకు పలు ప్రయోజనాత్మక సినిమాలు తీశాడు. ఇప్పటికే 18 నందుల్ని కైవసం చేసుకుని, అవార్జుల బావుటా ఎగరేస్తున్న ఆయనే వర్తమాన దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి. చదువుకునే రోజుల్లో సగటు విద్యార్థుల్లానే అల్లరి చేస్తూ కొంటె పనులతో రెచ్చిపోవాలని పిచ్చ కోరికుండేది. ఈ ఆలోచనలు వచ్చినప్పుడల్లా 'నీవు అందర్లాంటి పిల్లాడివి కాదు. మీ నాన్న ప్రిన్సిపాల్. నువ్వు ఒబీడియంట్‌గా ఉండాల్సిందే. నువ్వు అల్లరి చేస్తే చెడ్డ పేరు వచ్చేది ఆయనకు” అంటూ నా తోక పుచ్చుకుని దభీమని కిందపడేసేది ఇంగితం. మనసూ, బుద్ధీ కీచులాటలోనే నా హ్యాపీడేసన్నీ కలలా కరిగిపోయాయి. గొరుసు జగదీశ్వర రెడ్డి + 109
మాది నెల్లూరు జిల్లాలోని అలగానపాడు. నాకు ఊహ తెలిసేసరికే నాన్న ఉద్యోగరీత్యా విశాఖ “కృష్ణా కాలేజీలో లెక్చరర్‌గా ఉండేవారు. నేను ఏడవ తరగతికి వచ్చెసరికి ప్రిన్స్‌పాల్ ప్రమోషన్‌పై తనకి (గ్రీకాకుళం జిల్లాలోని సోంపెటకు బదిలీ అయ్యింది. నాకు దక్కిన కొన్ని హ్యాపిడేసన్నీ సోంపేట పరిసరాల్లో జరిగినవె. స్వ్వాద్‌కు భయపడి రైల్లోంచి గెంతేశాం
మొదట్నించి నేను సినిమా పిచ్చోళ్ణే. స్కూల్‌కని వెళ్లి మార్నింగ్ షోలో దూరి, అనుమానం రాకుండా ఇంటర్వెల్‌లో ఇంటికి వచ్చి నా ఉనికి చాటుకుని మళ్లీ సినిమాకు పరిగెత్తే తెలివితేటలు నావి. సోంపేటలో స్థానికంగా ఉన్న మూడు సినిమా హాళ్లు సరివోక ఆదివారం కొంతమందిమి కలిసి రాష్ట్ర బార్టర్ దాటి (బరంపురం జిల్లా) కొత్త సినిమాలు చూసేవాళ్లం. ఒకరోజు “బొబ్బిలిపులి” చూడ్డానికి బయల్చైరాం. “కంచిలి” వరకు నడిచి వెళ్లి అక్కడ్నుంచి రైలెక్కి బార్టర్ దాటేవాళ్ళం వచ్చేప్పుడు అందరం టికెట్లు తీయడం ఎందుకని, ఐదో పదో టి.సి. చేతిలో పెడితే చాలని సలహా ఇచ్చాడు మా టీమ్ లీడర్ ఆట్ల ప్రభాకర్. అనుకోకుండా ఆరోజు రైల్వే స్వాద్ రావడంతో టి.సి. చేతులెత్తేసి మేం ఎవరో తెలీనట్టు నటించడం మొదలెట్టాడు. అంతే రైలు ఖైరిపురంలో ఆగబోతుండగా అందరం కూడబలుక్సున్నట్లు రైల్లోంచి గెంతేశాం. మాలో ఎవడి కాళ్లూ చేతులూ విరగలేదు గానీ, చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందనే తత్త్వం మాత్రం బోధపడింది. చేతబడి రాజ్యమేలేది
చేతబడి ఉందో లేదో ఆ వయసుకి తెలిసేది కాదు గానీ సోంపేటలో మాత్రం “చేతబడి అనే మాట తరచూ వినబడేది. ఆ భయానికి ఇంట్లో వాళ్లు మా జేబులో ఒక నిమ్మకాయ పెట్టి స్కూళ్తకి పంపేవారు. పొరపాటున కూడా తల వెంట్రుకల్ని బయట పడేసే వాళ్లం కాదు. నేను టెన్త్‌లో ఉండగా నా క్లాస్‌మేట్ తుమ్మిడి శ్రీనివాస్‌కి అనుకోకుండా జబ్బుచేసింది. అది చేతబడి అనుకుని ముందు రకరకాల భూతవైద్యాలు చేయించి చివరికి వైజాగ్ కెజిహెచ్‌కి తీసుకెళ్లారు. అది లివర్ ప్రాబ్లం అని తేల్చి, ఎక్కువరోజులు బతకడని ఇంటికి పంపించేశారు. ఇంట్లో వాడొక్కడే. కనీసం వాడి ఫొటో కూడా లేదని, తీసుకోమంటే ఒప్పుకోవట్లేదని వాళ్లమ్మ బాధపడేది. ఒకరోజు వాడికి నచ్చచెప్పి ఫోటో స్టూడియోకి తీసుకెళ్లాం. అందరం ఫోటో దిగి బయటికి వస్తుంటే “ఏంట్రా నేను పోతానని మీకూ తెలిసిపోయిందా?” అని గట్టిగా నవ్వేసరికి అందరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. మేం పిలవగానే స్టూడియోకి సరదాగా వచ్చాదనుకున్నాం గానీ అసలు విషయం వాడికి తెలిసిపోవడంతో గిల్టీగా ఫీలయ్యాం. హ్యాప్ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాట్ తీస్ నత్తలు + 110
సోంపేట నుండి అప్పుడప్పుడూ బీచ్‌కి వెళ్లేవాళ్లం. ఒక ఉపనది పాయ
సముద్రంలో కలిసే చోట చిన్న లంకలా ఉందేది. దాన్నిండా సర్వి చెట్లు... పాయ దాటి అక్కడికి వెళ్లి మాకిష్టమైన ఆటలు ఆడుకునేవాళ్లం. ఒకరోజు ఉదయం వెళ్లినప్పుడు లేని ప్రవాహం సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి ఉప్పాంగడంతో అందరం దూకలేకపోయాం. ముందుగా దూకిన శ్రీనివాస్‌ని చెయ్యందివ్వమన్నాను. వాడునా వేళ్ల కొసల్ని అందీఅందనట్టు పట్టుకుని లాగడంతో బ్యాలెన్స్ తప్పి ఆ వాగులో కొట్టుకుపోవలసింది నేను. ఎలాగో అవతలి ఒద్దుకు చేరి చెయ్యెందుకు సరిగ్గా అందివ్వలేదని కోపంగా అడిగితే “నీళ్లలో దిగితే నా ప్యాంటు తడిచిపోద్ది కదరా' అని జవాబు. నోరెళ్లబెట్టా. ప్రతి క్షణం జీవితాన్ని ఎంతో అపురూపంగా చూసుకునే శ్రీనివాస్ ఆ మాయదారి జబ్బుతో మా కళ్ల ముందే కనుమరుగవడం తట్టుకోలేకపోయా. వాడెప్పుడు గుర్తుకొచ్చినా కళ్లు చిప్పిల్లుతుంటాయి. నన్ను గేలి చేసినట్టు అనిపించింది
ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి నాన్నకి కొత్తవలస ట్రాన్స్‌ఫర్ కావడం, నా కాలేజీ మారిస్తే చదువు పొడవుతుందనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీని సోంపేటలోనే ఉంచి తను వారం వారం వస్తుండేవారు. నాన్న ఊర్లో లేకపోవడంతో నాలోని ఆకతాయి మళ్లీ బయటికొచ్చేశాడు. మిగతా స్టూడెంట్స్‌లా అమ్మాయిలని ఏడిపించాలనే చిలిపి కోరికలూ విజ్బంభించేవి. కాలేజికి తరచూ ముగ్గురమ్మాయిలు కలిసి వచ్చేవారు. ఒకరోజు వాళ్లలో ఒక్కరే కన్పించడంతో నేను మరో ఇద్దరు కుర్రాళ్లని వెంటేసుకని టీజ్ చేసే క్రమంలో “ఏంటి ఈ రోజు ఒక్కదానివే కనిపిస్తున్నావ్' అంటూ మొదలెట్టా (నేను ఎంత అల్లరి చేసినా స్వతహాగా కాకుండా, తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండేది). ఈ విషయం ఆ పిల్ల కని పెట్టిందో, లేక తన మనసులో ఉన్నదే చెప్పిందో కానీ... “అన్నయ్యా, నీవు మమ్మల్ని ఎలా టీజ్ చేసినా మేం మాత్రం నిన్ను అన్నయ్యగానే ఉహించుకుంటాంి అనేసరికి ధమాల్! చేసేదేంలేక మిడిగుద్లు అప్పగించి చూస్తుండిపోయా. ఆ మాట సూటిగా గుండెలో దిగినట్టు నా వ్యక్తిత్వాన్ని గేలి చేసినట్టు అనిపించి విలవిల్లాడిపోయా. అప్పట్నించి ఆ ముగ్గుర్నీ సిస్టర్స్‌గానే ట్రీట్ చేయడం అలవాటు చేసుకున్నాను. కాటికాపరిలో కన్నీళ్లు చూశాను
గోవిందనే వాడు సోంపేట దగ్గర్లో ఉన్న మఠం సర్వేపల్లి నుండి వచ్చేవాడు. వాడు వేణువు ఊదితే నా కళ్లకి బృందావనం కనిపించేది. అప్పటికే యండమూరి తులసి, తులసిదళాలు నా బుర్రలో దూరి ఓం హ్రీం అని రీసౌంద్స్ చేస్తుందేవి.
గోవిందతో కలిసి శృశానానికి వెళ్లి అక్కడున్న మర్రి చెట్టు కిందున్న చప్తాపై కూర్చుని తీరిగ్గా తాంత్రిక విద్యలనేవి ఉన్నాయా లేవా అని చర్చ మొదలు పెట్టేవాళ్లం. మధ్యమధ్య ఏ అనుమానం వచ్చినా కాటికాపరిని అడిగేవాళ్లం. అలా పగటి పూట వెళ్లడం అలవాటు చేసుకుని చివరికి ఒక శివరాత్రి అక్కడే జాగరణ చేశాం. రోజూ వచ్చే శవాలు వాటిని కాలే కాటికాపరి... ఆ వాతావరణం అంతా వింతగా కనిపించేది. ఏ శవాన్ని కాల్చినా కాటికాపరి ముఖంలో ఒకటే భావం (నా 'సొంత ఊరు సినిమాలో ఎల్. బి. శ్రీరామ్ గారు వేసిన కాటికాపరి పాత్రకి అతడే ప్రేరణ). కొసమెరుపు ఏంటంటే మా కళ్లముందు వందలాది శవాల్ని నిర్లిప్తంగా తగలబెట్టిన ఆ కాటికాపరి తన సొంత కొడుకు చనిపోయినప్పుడు మాత్రం బోరున విలపించడం. ఆ దృశ్యం చూశాక మానవ సంబంధాల మధ్య ఉందే సున్నితత్వం మరింత బోధపడింది. అది వెంటాడే అపరాధభావమే
నాటకాలు రాసి, ప్రదర్శించే అలవాటు నాకు 8వ తరగతిలోనే అబ్బింది. ఒకసారి స్కూల్ వార్షికోత్సవంలో కర్పూరపు ఆంజనేయులు రాసిన “ఎత్తుకు పై ఎత్తు నాటకం వేస్తున్నాం. అందులో ఒక డైలాగ్ 'ఏంటా ముఖం? మొగుడు చచ్చిన ముండలా! అనేది. వీరలెవల్లో ఆ డైలాగ్ చెప్పేసి గొప్పగా రెస్పాన్స్ కోసం ఆడియన్స్ వైపు చూశాను. ఎదురుగా మా (ఫ్రెండ్ వాళ్లమ్మగారు... అంతకు కొన్నాళ్ల క్రితమే ఆమె భర్తపోయాడు. ఒక్కసారిగా షాక్ - మనసు చివుక్కుమంది.. ఏదో అవరాధం చేసినట్టు గిలగిలలాడిపోయా. ఆమె ముఖంలో కన్పించిన రంగులు నన్ను ఎంత క్షోభకు గురిచేశాయంటే... చివరికి నా నాటకాలు నేనే రాసుకోవాలి తప్ప. మరొకరు రాసినవి వేయకూడదని నిర్ణయించుకున్నాను. 9వ తరగతి వార్షికోత్సవానికి “ఇదిగోండి మీ దేశం” అనే నాటకాన్ని స్వయంగా రాసి దర్శకత్వం వహించా. దాన్ని చూసిన “బారువా! కాలేజీ వాళ్లు, వాళ్ల వార్షికోత్సవంలో ప్రదర్శించడం అప్పట్లో గొప్ప కితాబు నాకు. అప్పటి హిందీ ఇప్పటికీ పనికొస్తోంది
రెగ్యులర్‌గా చదివే చదువు కాకుండా ఇంట్లో వాళ్ల బలవంతంపై ప్రైవేట్‌గా హిందీ ప్రాథమిక, మాథ్యమిక లాంటి ఎగ్జామ్స్ రాయవలసి వచ్చేది. వీటికోసం నాన్నకు తెలిసిన ఒక హిందీ టీచర్ వద్దకే ప్రైవేట్‌కి వెళ్లేవాణ్ని మాథ్యమిక మొదటిసారి కట్టినప్పుడు ఫెయిలయ్యా. రెండోసారి కూడా కట్టా. అప్పుడూ ఫెయిలయ్యా. ఈ విషయం ఇంట్లో చెప్పడానికి భయమేసి ప్యాసయ్యానని చెప్పా. పైవేట్ చెప్పిన మాస్టారు మా వద్ద నుండి ఫీజు తీసుకోలేదని, ఒక రోజు మా అమ్మ ఆయనకి ఏదో గిఫ్ట్ ప్యాక్ చేయించి హ్యాపీ డేస్ - సినీ ప్రముఖల చిన్ననాటి తీసి గుర్తులు + 112
తీసుకెళ్లిందట. ఈ విషయం నాకు మా అక్క చెప్పేసరికి చెమటలు పట్టేశాయి. అమ్మకు నిజం తెలిసి పోతుందని, వచ్చాక నాకు బడితపూజ తప్పదని ఊహించి ముసుగుతన్ని పడుకుండిపోయా. (పడుకున్న వాళ్లని కొట్టకూడదని నానుడి ఉండేదప్పట్లో) అమ్మకి కోపం తగ్గాక ముసుగు తీసి దొంగలా నిలబడి “ఈసారి మీరు ఫీజు కట్టొద్దు. నాకు పాకెట్ మనీ కింద ఇచ్చే డబ్బుల్నే వాడుకోకుండా కట్టి వ్యాసవుతానిని శపథం చేశా. అన్నట్టుగానే ప్యాసయ్యా కూడా. మనసు పెట్టి ఏ పనిచేసినా జీవితంలో విజయం సాధించవచ్చనే సత్యం అప్పుడే బోధపడింది. అప్పుడు నేర్చిన ఆ హిందీతోనే ఇప్పటికీ నెట్టుకుని వస్తున్నా ప్రిన్సిపాల్‌ని కొట్టారు నాన్నకు కొత్తవలస బదిలీ అయ్యాక ఆయన స్థానంలో వచ్చిన ప్రిన్సిపాల్‌కి, యూనియన్ స్తూడెంట్స్‌కీ మధ్య ఏదో విషయంలో కొంత గొడవయింది. దీనితో కొందరిని ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రాయనీకుండా డిబార్ చేశారు. వాళ్లు హైదరాబాద్ వెళ్లి ప్రిన్సిపాల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డులో ఫిర్యాదు చేయాలని విరాళాలు సేకరించారు. నేనూ కొంత డబ్బిచ్చాను. అయితే వాళ్లు హైద్రాబాద్ కంటే ముందు, వసూలు చేసిన డబ్బుతో ఫుల్‌గా మందు కొట్టేసి ప్రిన్స్‌పాల్ ఇంటికి వెళ్లి (ముసుగులు వెసుకుని) ఆయన్ని కొట్టారు. దాంతో కేసు. కొందరిని కటకటాల్లోకి తోసిన పోలీసులు వారికి విరాళాలు ఎవరెవరు ఇచ్చారో అని ఆరాతీయడం మొదలెట్టారు. మా ఇంట్లో వాళ్లు నన్ను వెంటనే వైజాగ్ పంపించేశారు. ఎంసెట్‌లో సరైన ర్యాంక్ రాకపోవడంతో డిగ్రీ చదవడానికి గతంలో నాన్న ఉద్యోగం చేసిన కృష్ణా కాలేజీలోనే చెరాను. అక్కడ ఒక సంవత్సరం చదివాక మద్రాసు వెళ్లి ఎయం.ఐ.ఇ. కేవలం రెండున్నరేళ్లలో పూర్తిచేసి వైజాగ్ వచ్చెశాను. కొంతకాలం రెండు పత్రికలకి సారథ్యం వహించి ఆ తర్వాత సివిల్స్ రాయడానికి ఢిల్లీ వెళ్లాను. అక్కడా పొసగక తిరిగి వైజాగ్ వచ్చేసి చివరికి చిత్రపరిశ్రమే నా అసలైన మజిలీ అనుకుని మీ ముందుకు వచ్చేశానిలా. (22.07.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
| శ్ య ఇట ఎ, వ ః/ (4 ల్ భు / | ఇ ఎస్.ఎస్. రాజమౌళి _ఫాంటసీలకు మూలం అమరచిత్ర కథలే నా ఖొాంటసిల లం అ (త కథ ఈతరం వారోలకే పారో అతదు. ఆయున నీనమాలో వనిచేయాలనుకోవడం వాళ్లకొక మధురస్వవ్నం. అతనికి గాలి నీరు, తిండి నిద్రా అన్నీ నినిమానే. కష్టే ఫలి నూత్రాన్ని నమ్ముకుని చిత్రరంగంలోకి అదుగు పెట్టి 'స్పూదెంట్ నెం. 1'తో దర్భకుదై సింవ్యోద్రి? “సె ఛత్రపతి? “విక్రమార్ముదు? (యమదొంగ మగధీర 'మర్వాద రామన్న ఈగ బాముబలి లతో కీర్తి వతాకాన్ని సినీవినీలాకాళశంలో రెపరెపలాదించారు. “మగధీర” చిత్రానికి ఉత్తమ దర్భకుదిగా నంది, థీలిమ్ ఫేర్ '“బావుబలి'తో జాతీయన్థాయి వురస్కారాలందుకున్న దర్భకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. నాలో మీకు ఒక్కడే కనిపిస్తాడు కానీ నిజానికి ఇద్దరున్నారనే సీక్రెట్ తెలిసింది మాత్రం నాకు ఒక్కడికే. ఒకడిలో చిన్నతనం నుంది మనసు నిందా భయం, పిరికితనం, మరొకడిలో నిలువెల్లా 'అద్వంచరే”. సైకిల్‌పై మైళ్ళ కొద్దీ దూరాలు కొలవాలన్... కొండలెగబాకి దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనీ.... బంగారం తయారు చేసెయ్యాలనే... అబ్బో ఒకటా రెండా? వీటన్నింటికీ బీజం ఎక్కడ, ఎలా పడిందో చెపుతాను. నేను పుట్టింది కర్నాటకలోని రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలో. ఎప్పుడో అరవయ్యో దశకంలో నాన్నవాళ్లంతా తుంగభద్ర డ్యామ్ కడుతున్నప్పుడు కొవ్వూరు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 114
నుండి వలస వెళ్లి అమరేశ్వర కాంపును ఏర్పాటు చేసుకున్నారట. ఉమ్మడి కుటుంబం. మా వాళ్లంతా అక్కడే ఉన్నా నేను, అక్కయ్య మాత్రం కొవ్వూరులో నాన్నమ్మ దగ్గర ఉండేవాళ్లం. మొదట్నించీ దూకుళ్ల మీద సాగిన చదువు నాది. నాన్నమ్మ చెప్పే బాల రామాయణం, భారతాల్ని బెపోసన పట్టాక ఒకేసారి నన్ను 4వ తరగతిలో పడేశారు. నాన్న అప్పుడప్పుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి లైబ్రరీలో అక్కకూ, నాకూ ఐదు రూపాయల చొప్పున కట్టి కార్డు తీయించారు. ఆ లైబ్రరీలోని చెక్క బీరువాలు తెరవగానే మరో ప్రపంచం కనిపించింది. పట్టలేని ఆనందం. ఎన్ని కామిక్సో. 'అమరచిత్ర కథలు” నన్ను పూర్తిగా లోబరుచుకున్నాయి. అర్థం తెలియకుండానే పాడేశాను
అప్పట్లో మా 'దీప్తి కాన్వెంటొ లో ప్రతి శనివారం విద్యార్థుల్లోని కళలను వెలికి తీసేవిధంగా రెండు క్లాసులు ఉండేవి. నాన్నమ్మ నుండి అబ్బిన విద్య కథ చెప్పడమే
కాబట్టీ చిలవలు పలవలు కల్పించి చెప్పేవాట్లి. నావంతు రాగానే పిల్లలంతా “ఇక కథ
మొదలిడ్దాడ్రొ అని గట్టిగా నిట్టూర్చెవాళ్లు. ఒకసారి రజియా సుల్తానా టీచర్ ఆ పీరియడ్ తీసుకున్నప్పుడు ఎప్పట్లాగే లేవబోతుంటే 'నో స్టోరీస్ అంది సీరియస్‌గా. ఉక్రోషం పొడుచుకొచ్చి 'పాట పాడతా టీచర్ అన్నాను. 'సరే పాడు చూద్దాం” అంది అపనమ్మకంగానే. ఆమె అనడం ఆలస్యం “చూడు పిన్నమ్మా పాడు పిల్లడూ....? అంటూ ఆరునొక్క రాగంలో ఎత్తుకున్నా. అంతే ! మిన్నే విరిగిందో, సునామే వచ్చిందో తెలీదు గానీ ఒక్కసారిగా అందరూ ఊగిపోతూ పడలబడి పడీ పడి నవ్వడం - మా టీచరైతే నవ్వలేక కడుపు పట్టుకుని తన ముందున్న టేబుల్‌పై దభీమని పడిపోవడం ఇప్పటికీ కళ్లకు కట్టినట్టే ఉంది. అంత చిన్న వయసులో ఆ పాటకి అర్ధం నాకెలా తెలుస్తుంది చెప్పండి? వయసు 11, ఆలోచనలు 60...లో
ముందే చెప్పా కదా, నాది దూకుళ్ల చదువని, 4వ తరగతి కాగానే ఏకంగా ఏడవ తరగతి చదవడానికి ఏలూరికి జంప్. బెనర్జీపేటలోని పాండురంగటాకీసు సమీపంలో మా మేనత్తగారింట్లో ఉండేవాణ్లి. ఆ టాకీసులో ప్రదర్శించే సినిమాలు డైలాగ్స్‌తో సహా ఇంట్లోకి వినిపించేవి.
సెవెన్త్‌క్లాస్ మంచి మార్కుల్లో ప్యాసయ్యాక మెట్రిక్‌లోకి మళ్లీ దూకుడు. అప్పటికింకా నా వయసు పదకొందే. 18 ఏళ్లుంటేగానీ మెట్రిక్‌లో కూర్చోనివ్వరని ఒక డాక్టర్‌ను సంప్రదించి 2 ఏళ్లు పెంచుకుని ఒక సర్టిఫికెట్ సృష్టించాం. ఈ విషయం
తెలునుకున్న మా (%ండొకడు ఆశ్చర్యపోయి 'నీకేవానా విచ్చా? రెండేళ్లు ఎక్కువేయించుకుంటావా? రెండేళ్లు ముందుగానే ఉద్యోగంలోంచి రిటైర్ అవ్వాలి తెలుసా?” అన్నాడు. పదకొందేళ్లు కూడా ఉండవు రిటైర్‌మెంట్ గురించి వాడు చేసిన దూరాలోచనకి వెర్రిమొహంతో చూస్తుండిపోయా. నానమ్మ రౌండ్‌టేబుల్ సమావేశం
రవీంద్ర ట్యుటోరియల్‌లో మెట్రిక్‌కి కోచింగ్ తీసుకునే టైంలో సినిమాలు తెగ చూస్తున్నానని చెప్పి, ప్యాసవుతానో లేదో అనే అనుమానంతో మరో ట్యూషన్‌లో పెట్టారు. ఆ ట్యూషన్ ఉదయం 6 నుండి 7 వరకు. అక్కడ మరీ ఘోరం. 239వ ఎక్కాన్ని కూడా వీరలెవల్లో బట్టీ పట్టించేసి వల్లె వేయించేవారు. నావల్ల కాలేదు. రెండు రోజులు వెళ్లి అప్పట్నించి బంక్ కొట్టీ ఉదయమే వీధులన్నీ కొలిచి రవీంద్ర ట్యుటోరియల్‌కి మాత్రం వెళ్లేవాణ్లి. ఒకసారి నా ఫీజు కట్టడానికి మా అక్క స్ఫూల్‌కి రావడం, అందరికంటే ముందు నేనొక్కళ్లో స్కూల్లో కనిపించడంతో అసలు విషయం బయటపడింది. ఇంకేముంది? సాయంత్రం ఇంటికెళ్లగానే మా నాన్నమ్మ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం. ఒంట్లోని నీరంతా ఆవిరయ్యి నేను శోషతో పడిపోయేదాకా రెండు గంటలు క్లాసు పీకి నా చదువుని పరీక్షించారు. ఒక్కరోజు కూడా పుస్తకం తెరవలేదని తెలిసిపోయింది వాళ్లకి. ఆ ఉక్రోషంతో కేవలం 20 రోజుల్లో సిలబస్ పూర్తి చేసి మంచి మార్కుల్లో మెట్రిక్ ప్యాసై నేనేంటో నిరూపించుకున్నాను. మాథ్స్ నా బద్ధ శత్రువు
మెట్రిక్‌లో నా మార్ములు చూడగానే అంతా అవాక్కయ్యారు. మా అక్కమాత్రం “వీడు ఏకసంథాగ్రాహి. కేవలం పరీక్షల ముందు చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇకపై వీడు ఎన్ని ఆటలాడినా మనం ఏం అనకూడదని డిసైడ్ అయిపోయింది. ఆ నమ్మకమే నాకు మైనస్ పాయింట్ కూడా అయ్యిందనుకోంది. ఖాలీగా ఉన్నప్పుడంతా నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాణ్ణి. మధుబాబు షాడోతో పాటు, యండమూరి, మల్లాదిల ద్వయం నన్ను ఊపిరి సలపనిచ్చివాళ్లు కాదు. దానికితోడు మా మావయ్య బంగారం ఎలా తయారు చేయాలో, రాబిన్ వుద్‌లా సాహసయాత్రలు ఎలా చేయాలో చెబుతూ నా బుర్రలోకి ఫాంటసీకి ఆజ్యం పోస్తుండేవాడు. ఇది చూసి మా మేనత్త తన పైత్యంతో మా మామయ్య నన్ను చెడగొడుతున్నాడని లబోదిబో మనేది(మావయ్య ఎడ్డెమంటే ఆమె తెడ్డెమనేదనుకోండి)
మెట్రిక్ కాగానే సి.ఆర్. రెడ్డి కాలేజీలో చేరి ఎంపిసి తీసుకున్నాను. మాథ్స్, ఫిజిక్సులంటే నాకు ముందునించే పడదు. పైగా ఒక్కో పుస్తకం ఇంతెత్తున ఇటుకంత హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 116
దళసరిగా కన్సించేవి. వాటిని చూస్తేనే నీరసం వచ్చేది. కాలేజీకి వెళ్లేవాణ్ణి కాని క్షాసులో కూర్చోబుద్ది కాక, ఇండోర్ స్టేడియంలో ఆటలాదేవాణ్ణి. క్లాసులకు రోజూ ఎగ్గొట్టినా కాలేజీ ఎగ్గొట్టింది మాత్రం సంవత్సరం మొత్తంలో రెండుసార్లే. ఒకటి - రాజీవ్, శ్రీనివాస్, సువర్ణలతో కలిసి సైకిల్ మీద విజయవాడ పొలిమేరల దాకా వెళ్లి మెం కూడా సాహసాలు చేయగలమని నిరూపించుకున్నప్పుడు. రెండు - బ్రూసిలీ సినిమా చూడ్డం కోసం. ఇష్టం లేని చదువు కదా, పొరపాటున డిస్టింక్షన్‌లో ప్యాసయితే నన్ను నేను తట్టుకోవడం కష్టమనిపించి ఫస్ట్ ఇయర్‌లో మార్స్, ఫిజిక్స్ చీదేశాను. ఏలూరు టు కొవ్వూరు వయా మద్రాసు తర్వాత ఏం చేయాలో అర్ధంకాక తిన్నగా మద్రాసు వెళ్లిపోయా. అప్పటికే
నాన్నావాళ్లు సినిమాలకు కథ(లాయడానికి కర్నాటక నుండి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేవారు. మద్రాసులో ఏం చేయాలో తోచేది కాదు. మా అన్నయ్య కల్యాణమాలిక్ (సంగీత దర్శకులు, నేనూ కలిసి చెరో ౩5 రూపాయలు పోగేసి 'సత్యం, శాంతం, శుభం” టాకీసులకు వెళ్లి ఇంగ్లీషు పిక్చర్స్ చూసి వచ్చేవాళ్ళం.పనీ పాటా లేకుండా మేం చేసే ఘనకార్యాలు తెలుసుకున్న మా సమీప బంధువు బి.ఎస్. ప్రసాద్‌గారు 'అడ్డగాడిదలా మద్రాసు రోడ్లు కొలుస్తూ తిరుగుతున్నాడు వీడు. ఇక్కడుంటే ఇక చదువు అటకెక్కడం ఖాయమని తిరిగి నన్ను కొవ్వూరుకు తీసుకెళ్లి ఇంటర్ సెకండియర్‌లో చేర్పించేశారు. కక్కలేని మింగలేని బాధ
మా కెమిట్టీ లెక్బరర్ సాయిబాబాగారు మూడో తరగతి పిల్లల్ని అడిగినట్టు మాపై ఉండుండి ప్రశ్నల్ని సంధించేవాడు. మొదటి బెంచీలో శ్రీనివాస్, కిరణ్ అనే ఇద్దరబ్బాయిలు పక్కపక్కనే కూర్చునేవాళ్లు. సరిగ్గా వాళ్లకు వెనకే రెండో బెంచీలో నా సీటు. ఆయన అడిగిన ప్రశ్నలకి శ్రీనివాస్ ఠపీమని నిలబడి జవాబు చెప్పేసేవాడు. ఒకసారి కిరణ్‌గాడికి చిరాకేసి “ఎందుకలా టింగుమని లేచిపోతావ్? నీకు వచ్చని తెలుసులేవోయ్. ఎప్పుడూ నువ్వే చెపుతుంటే నీ పక్కన కూర్చున్నందుకు నేను ఇడియట్‌లా కనిపిస్తాను అని గోలపెట్టాడు. అయినా శీనుగాడు మాత్రం ఆగలేకపోయేవాడు. శిశు వాలుని నూరు తప్పులు భరించి శ్రీకృష్ణుడు చివరికి చక్రం వదిలినట్టు ఒకరోజు వాడు లేచి నిలబడగానే వీడు తన బాల్‌పెన్ను క్యాప్ తీసి బెంచీ మీద సరిగ్గా ఎక్కడ పెట్టాలో అక్కడ నిలబెట్టాడు. సీనంతా నేను వెనకనుండి గమనిస్తూనే ఉన్నా. వాడు సమాధానం చెప్పి సీట్లో కూలబడ్డం, క్లాసు దద్దరిల్లేలా గావు కేకేసి నేలకు కొట్టన బంతిలా పైకెగరడం క్షణాల్లో జరిగిపోయాయి. వాడి కళ్లనిండా నీళ్లు. కక్కలేడు మింగలేడు. కొసమెరుపు
ఏంటంటే కిరణ్‌గాడు ఏమీ తెలియనట్టు నంగనాచి తుంగముల్లులా బిల్లప్ ఇవ్వడం. గడగడ వణికించిన కపాలం
సాయంత్రాలు గోదావరి గాలి పీలుస్తూ ఇసుక మేటలపై నడవడం చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు ఆలోచిస్తూ నడుస్తున్న నా పాదానికి ఏదో గట్టిగా తగలడంతో ఉలిక్కిపడి చూశాను. ఇసుకలో సగం కూరుకుపోయిన మనిషి పురై. ఆ కపాలం చూడగానే భయం నా కపాలానికి ఎక్కేసింది. ఒళ్లంతా చెమటలు, చుట్టూ చీకటి. అప్పటికే కిలోమీటరు పైగా నడిచేశాను. ఇంకేముంది? వణికిపోతూ తడబడుతూ వెనక్కి ఒకటే పరుగు. ఆ టైంలో నాలోని అడ్వంచర్ మనిషి నిద్రపోతున్నట్టున్నాడు. లేకపోతే ఆ పురైని చేత్తో పట్టుకుని కాలితో పుట్‌బాల్‌ని తన్నినట్టు ఒక తన్ను తన్నేవాదే!
సెకండియర్ అయిపోయాక అందరం విడిపోతుంటే మాత్రం చాలా బాధేసింది. అన్నట్టు ఒకమ్మాయిని బాగా ఇష్టపదేవాణ్ణండోయ్. కాని మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గో భయమో తెలీదు కానీ... ఒక్కసారి మాత్రం ధైర్యంచేసి 'ఫీజు కట్టావా?” అని అడగ్గలిగాను. ఆ సంవత్సరం మొత్తంలో నేను మాట్లాడింది ఆ మాటొక్కటె అంటే నమ్ముతారా?
ఇంటర్మీడియట్‌తో చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టెసి కర్నాటక వెళ్లిపోయా. అక్కడ ప్రసంగి అనే పాస్టర్ ఒకాయన మాకు తోడు దొరికాడు. ఎందుకో తెనీ.కు కానీ అప్పట్లో ఒకరకమైన ఆధ్యాత్మికత నన్ను ఆవరించుకుని ఉందేది. తరచూ గుండు గీయించుకుని, కాషాయ వస్త్రాలు ధరించేవాణ్లి. చిన్నతనంలో చదివిన '“అమరచిత్ర కథలి ప్రభావం వల్ల కాబోలు ఎప్పుడూ ఏదో అద్వెంచర్ చేయాలని మాత్రం ఉండేది. ప్రసంగి గారితో పాటు ఒకసారి పెద్ద గుట్ట ఎక్కి ఎవరెస్తు శిఖరం అధిరోహించినంత ఆనందం పొందటం ఇప్పటికీ మర్చిపోలేను.
తర్వాత నా మజిలీ మళ్లీ మద్రాసు. ఈలోగా కీరవాణి అన్నయ్యకి పెళ్లవడం, మా శ్రీవల్లి వదిన (అమ్మనే పిలుస్తాం) పనీ పాటా లేకుండా తిరిగేవాళ్లందర్నీ కూచోబెట్టి విజయానికి ఎలా నిచ్చెనలేయాలో రోజువారీగా క్లాసులు తీసుకోవడంతో... 'ఇక లాభం లేదు. జీవితాన్ని సీదియస్‌గా తీసుకోవాల్సిందే! అని గల్టగా నిర్ణయించుకుని ఒక శు భముహూర్తం చూసుకుని ఎడిటింగ్ అసిస్టెంట్‌గా అరంగేట్రం చేసి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టరుగా... అలా అలా... అబ్బో ఇప్పటికేచాలా చెప్పేసినట్టున్నాను. తర్వాత ఏం జరిగిందో మీకెలాగూ తెలుసు.
(29.07.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 118
న. న న భ్ క్! స . టో క్ . నంవత్‌నంది “ఐశ్వర్యారాయ్”నె వదన్నాను 6౪
దొక్టర్ కాబోయి యాక్టర్ అయినట్టు, (దగ్ ఇన్‌స్పెక్టర్ కాబోయి
దైరెక్టరయ్యాదతను. ర్యాగింగ్ చేయబోయిన వాళ్లకు తన స్మిబ్ట్‌తో
సమాధానం చెప్పీ “బెస్ట్ (ఫెషర్” అవార్డు గెలుచుకున్నాడు. ఆ క్రమంలో
'మోద్రన్ రామాయణం నన్నానో మనీషా వ్యోండిబ్చింది” లాంటి
సరికొత్త (స్మీన్ట్‌లు తయారుచేసి కాలేజీ తలలో నాలుకయ్యాడు. పోసాని
కృష్ణమురళి దగ్గర పాతిక నీనిమాలకు అనీస్టెంట్ రైటర్‌గా పనిచేసిన
అనుభవంతో ఎమైంది ఈవేళ చిత్రానికి కథ, మాటలు, స్కీన్‌ప్లే,
దర్భకత్వం వపొంచాదు. రామ్‌చరణ్‌తో “రచ్చ” చేసి (పేక్షకులతో “రచ్చ
రచ్చ” అని కేళలు పెట్టించి, ఆ తర్వాత “భొంగాలకైగల్?
అనివీంచుకున్నారు. 'గాలివటం” చిత్రంలో నిర్హాతగా మారిన ఆ యువ
దర్శకుడు సంవత్‌నంది.
మీలో ఎవరైనా ఒకే సినిమాని రోజూ 4 ఆటల చొప్పున మూడు రోజులపాటు
వరసగా చూడగలరా?అని నేనడిగితే 'ఇదేం పిచ్చి ప్రశ్న? నిద్రాహారాలు మానేసి ఎవరైనా అలా చూస్తారా? అని విసుక్కుంటారు కదూ, కానీ అలా చూసిన సినిమాభిమాని ఒకడున్నాడు. పేరు సంపత్ నంది.. అంటే మనమే! 'అది ఏ సినిమా? ఏ ఊర్లో? ఏ హాల్లో? వరుసగా 12 సార్లు ఎందుకు చూడాల్సి వచ్చింది?” అని ప్రశ్నలు గుప్పించకండి. గొరుసు జగదీశ్వర రెడ్డి + 119
నా 'హ్యాపీడేసిలో వాటికి సమాధానం దొరుకుతుంది. ముందుకెళ్లి చదవండి. జమ్మికుంట టు రాయచూర్ వయా నెల్లూరు మా ఊరు కరింనగర్ జిల్లాలోని 'ఓదెలి, వ్యవసాయ కుటుంబం, బాల్యం
అక్కడే గడిచింది. టౌన్‌లో అయితే చదువు బాగుంటుందని టెన్త్ క్లాస్ వచ్చేసరికి జమ్మికుంట “గౌతమి రెసిడెన్షియల్ లో చేర్పించారు. ఆ వయసులో చదువుతో పాటు | నన్ను ఆకట్టుకున్నవి మా లైబ్రరీ పుస్తకాలే. వాటిని చూస్తుంటే నాక్కూడా ఏదో రాసేయాలని మనసు లాగేది. పైగా ప్రజాకవులు ఆలపించే ఉద్యమ వాటలు చిందేయించేవి. సినిమా పాటలు నన్ను నిలువనిచ్చేవికాదు. వేటూరి 'ాలిపోని పువ్వా పాట విన్న తర్వాత నా కలంలో కదలిక మొదలైంది. భావుకత చిగురులు వేస్తున్న టైంలోనే మా స్కూలు తరపున జిల్లా స్థాయి “పర్యావరణ” వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకోవడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది.
దాంతోపాటు ఇంటర్ కోసం వరంగల్ వచ్చాక సినిమాల పట్ల మరింత మోజు పెరిగింది. ఇంట్లో వాళ్లు నాపై ఒక కన్నేసినట్లున్నారు- ట్రాక్ తప్పుతున్నానని సెకండియర్ వచ్చెసరికి నెల్లూరు రత్తాకాలేజీలో చేర్పించారు. అయితే నాలో ఒక గుణం ఉందేది. కొన్నాళ్లవాటు సినిమా చూడకూడదని నిర్ణయించుకుంఓ మాత్రం పట్టు సడలనిచ్చేవాడ్ని కాదు. ఆ మంకుపట్టు వల్ల మణిరత్నంగారి “బాంబే” మిస్సయ్యాననుకోండి. ఇంటర్ అవగానే ఎంసెట్, కెసెట్ రెండూ రాశాను. బిఎంఎస్‌లో సీటొచ్చినా వెళ్లకుండా బిఫార్శసీ చేసి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అయిపోవాలని కర్నాటక వెళ్లి రాయచూర్ 'విఎల్‌సిపి' కాలేజీలో చేరిపోయా. 'మాద్రన్ రామాయణంితో సెలబ్రిటీతనం
అన్నిచోట్ల ఉన్నట్లే అక్కడా ర్యాగింగ్ భూతం ఉంది. నన్ను వదల్లేదు. సీనియర్లు ఒకరోజు హాస్టల్లో దొరకబుచ్చుకుని “స్మోక్ చేస్తావా?” అని అడిగారు. అలవాటు లేదన్నాను. చేతిలో ఒక సిగరెట్ పెట్టి కాలేజీ చుట్టుకొలత కొలుచుకురమ్మని పంపించారు. అప్పుడే అనిపించింది. ర్యాగింగ్ నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేసి ప్రత్యేకంగా నిలబడాలని. ఇంతలో 'పెషర్స్ డే వచ్చింది. నాలోని రచయితని బయటికి తీసి 'మాద్రన్ రామాయణం అనే ఐదు నిమిషాల సెటైరికల్ స్కిప్ తయారుచేసి ప్రదర్శించాను. దాంతో అందరి దృష్టి నాపై పడింది. ఆ కార్యక్రమంలోనే 'బెస్ట్ ప్రెషర్ అవార్డు కోసం 60 మందిలో నలుగురిని సెలక్టు చేసి ఒక చిక్కు ప్రశ్న వేశారు. “ఐశ్వర్యారాయ్ ప్రపోజ్ చేస్తే ఏం చెస్తావు? అని. తలా ఒక సమాధానం చెప్పారు. నేను ఠపీమని రిజెక్ట్ హ్యావ్ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాటి తీసి గుర్తు ₹ ,20
చేస్తాను అన్నాను. నా సమాధానం వినగానే ఆడిటోరియం అంతా అవాక్కయింది. 'ఐష్ ప్రపంచానికంతా తెలిసిన సుందరి. ఒకవేళ నాకు గుర్తింపు వచ్చినా ఆమె వలన వస్తుందే తప్ప నాకు నేను తెచ్చుకున్నదిగా ఉండదు. ఒకరి ద్వారా వచ్చిన సెలబ్రిటితనం నాకొద్దని చెవ్పొ. అంతే మిన్నుముట్టన కరతాళధ్వనుల మధ్య నాకు 'బెస్ట్ (పెషర్ అవార్పు ప్రకటించారు. ఇంట్లోనే కాదు రచ్చ గెలిచి వచ్చా “బెస్ట్ (పెషర్” అవార్హుతో చిన్న సెలబ్రిటీ హోదా రావడంతో నన్ను ర్యాగింగ్
చేయడం మానేశారు. పైగా మూడేళ్ల పాటు కల్చరల్ సెక్రటరీ హోదా కూడా కల్పించారు. అప్పట్నించి నన్నంతా '“డెరెక్టర్' అని పిలిచేవారు. మా ప్రిన్సిపల్ శాంతకుమార్ ఒకసారి నన్ను పిలిచి “గుల్బర్గా యూనివర్శిటీలో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మన కాలేజీలో గెలవడం కాదు. అక్కడకి వెళ్లి మెడల్ తీసుకురావడం గొప్పు అని రెచ్చగొట్టారు. ఆ మాటని సవాల్‌గా తీసుకుని 6 నిమిషాల నిడివితో 'సన్మాన్” అనే స్క్మిఫ్ట్ తయారు చేసుకున్నా. నేను వేసే డ్రామాలో నటించడం కోసం అమ్మాయిలను ఎన్నుకునే స్వేచ్చ పూర్తిగా ఉండేది. వాళ్లతో రిహార్సల్స్ చేయిస్తున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ యమ కుళ్లుకునేవారు. వీడు నకృతోక తొక్కి వచ్చాడా అనుకునేవారు. తర్వాత గుల్చ్బర్లాలో 'సన్నాన్' ప్రదర్శించడం, గోల్స్‌మెడల్ కొట్టుకురావడంతో మరింత సెలబ్రిటీతనం వచ్చేసింది. అర్ధరాత్రి “కాలి సర్బం'
హాస్టల్లో మాది గగ్రౌండ్‌ఫ్లోర్. చుట్టూ దట్టమైన చెట్లతో అడవిలా ఉండెది. మర్నాడు 'ఫార్మ సూటీిక్స్” ఎగ్జామ్ ఉంది. మా రూమ్మేట్స్ వీరెేళ్. ఫణికుమార్‌రెడ్డి, రమణారెడ్డిలతో కలిసి హార్ట్ స్టడీ చేస్తున్నాను. రాత్రంతా చదివి తెల్లవారుజామున పడుకోవడం అలవాటు. రాత్రి ఒంటిగంట టైంలో నిద్రనుండి తప్పించుకోడానికి టీస్తాల్‌కు బయల్చేరాం. ఇంతలో వీరేశ్ అద్దం ముందు తల దువ్వుకుంటూ 'కెవ్వ' మన్నాడు. హడలిపోయి చూస్తే పాము. వాడి కాలిపై కాటు. అందరికీ చెమటలు. వణుకుతూనే బైక్ స్టార్ట్ చేసి ఆస్పత్రికి తీసుెళ్ళాం. అప్పటికే టైం రెండయ్యింది. నర్సు ఒక్కతే ఉంది. “డాక్టర్ లేరు, ఆంటీ వీనమ్ ఇంజక్షన్ తెచ్చుకోండి వేస్తా నంటూ ఆవలించింది. ఏం చెయ్యాలో తోచని స్థితి. ఆ అర్ధరాత్రి పరుగు పరుగున మెడికల్ షాప్స్‌పై దబ దబ బాదుతూ... పిచ్చిపట్టినట్లు అరిచాం. చివరికి ఒక షాపు వాడు నిద్రకళ్లతోనే ఇంజక్షన్ కోసం వెతికాడు. అదృష్టం కొద్దీ ఒక్కటి ఉంది. ఇంతలో డాక్టర్ రావడం... టైం చూస్తే 5 గంటలు. ఆ కంగారులో గొరుసు జగదీశ్వర రెడ్డి + 121
అప్పటిదాకా చదివిందంతా హుష్ కాకి. వీరేశ్ బతికి బట్టగట్టాడు కానీ ఆ ఎగ్జామ్ ప్యాసయ్యింది మాత్రం నేనొకృడ్న మా కాలాన్ని హరించి కంగారు పెట్టిన ఆ "కాలి సర్పం గుర్తుకొస్తే ఒళ్లు జలదరిస్తూనే ఉంటుంది ఇప్పటికీ. ఆ దెబ్బతో భంగ్ బంద్
మా కాలేజీలో దక్షిణాది విద్యార్థులే కాకుండా, ఉత్తరాది నుండొచ్చిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. హోలీ వచ్చిందంటే వీరంగమే. ఒక హాోలీకి రంగులు ం చల్లుకోవడంతో పాటు 'భంగ్” కొట్టడం కూడా జరిగింది. అప్పటి వరకు భంగ్ అనే మాట వినడమే తప్ప తాగింది లేదు. ఆ రోజుమాత్రం ఉత్తరాది విద్యార్థులు బలవంతంగా పాలల్లో కలిపిచ్చిన భంగ్ తాగి రచ్చ రచ్చ చేశానట. రంగుల మేళా చల్లబద్దాక బైకులేసుకుని తుంగభద్రలో స్నానాలు చేయడానికి మంత్రాలయం బయళ్ట్లేరాం. అదొక్కటే గుర్తుంది నాకు. నీటిలో ఎన్నిసార్లు ముంచినా తేరుకోలేదట నేను. నిషా కపాలానికి ఎక్కేసరికి పెదాలపై వెర్రి నవ్వు తప్పించి ఏమీ గుర్తుపట్టే స్థితిలో లేనట. మెలకువ వచ్చేసరికి హాస్టల్ బెడ్‌పై ఉన్నాను. అప్పటికే ఒకరాత్రి గడిచిపోయింది. “ఎక్కడున్నా?'నని అమాయకంగా నేనడిగిన ప్రశ్నకి నా రూమ్మేట్స్ నాకిలా సమాధానం చెప్పి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. చప్పట్లతో పాటు అవమానాలు కూడా..
ఒకరోజు “ఫార్మా అనాలసిస్ ప్రాక్టికల్స్ క్లాస్‌లో అవమానం పొందాల్సి
వచ్చింది. నాదె గౌడ అనే లెక్సరర్‌కి నా నాటకాలంటే ఇష్టం లేదో, లేక నాకొస్తున్న పేరంటే మంటో తెలీదు కానీ ఆ రోజు నన్ను అందరిముందు దెబ్బకొట్టేదాక ఊరుకోలేదు. స్మిఫ్ట్ గొడవల్లో పడి అంతకుముందు ఆయన చెప్పినట్టు రికార్డు రాసుకెళ్లలేదు. “దొరికాడు వీడు” అనుకున్నాదేమో అప్పటివరకు నాపై దాచుకున్న అక్కసంతా కళ్కేశాడు. “నీవేమైనా పెద్ద డైరెక్టర్ అనుకుంటున్నావా? ముందు నీ రికారెక్కడ చూపించు?” అంటూ నోటికొచ్చినట్టు అరిచాడు. నేను సారీ చెప్పినా ఊరుకోదే. అదే క్లాసులో నేను నైట్రోజన్ రసాయనం కలిపినప్పుడు గ్రీన్ రంగుకు బదులు పసుపుపచ్చ కనిపించడంతో మరీ పిచ్చెక్కిపోయాడు. బయటకి వెళ్లి ఒక ఆకు తీసుకురమ్మని, ఆకు పచ్చదనం నీ ప్రాక్టికల్‌లో రాలేదని... డైరెక్షన్ కాదు, చదువు ముఖ్యం అంటూ మళ్లీ అందుకున్నాడు. ఆ అవమానంతో బు తిరిగిపోయి వ్యూచర్‌లో ఏమైనాసరే దైరక్టరు అవ్వాలని డిసైదైపోయాను. హ్యావ్ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాటి తీసి గుత్తులు + 122
“ఐష్ జోష్‌లో ఏవీ గుర్తుకురాలేదు. మొదట్లో చెప్పినట్టు నేను రోజుకు నాలుగు షోల చొప్పున, వరసగా మూడు రోజులు చూసిన సినిమా సల్మాన్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌ల 'హమ్ దిల్ దే చుకే సనమ్”. రాయచూర్ శశిమహల్లో ఆ సినిమాని నిద్రాహారాలు మాని పిచ్చిగా చూస్తుంటే మా (ఫెండ్స్ అంతా విస్తుపోయారు. విడుదలకు ముందే అది బంపర్ హిట్ అవుతుందని వెయ్యిరూపాయల పందెం కూడా కాశాను. మరోసారి ఐష్ సినిమానే... దాని పేరు “జీన్స్ ఆదోనిలో రిలీజ్ అయిందని తెలిసింది. ఎ టు జెడ్ ఖర్చంతా నాదేనని ప్రకటించి కొందర్ని కూడగట్టి రైల్లో తీసుకెళ్లాను. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత బుకింగ్ క్లోజ్. ఇజ్జత్ కా సవాల్ - డబ్బులన్నీ పెట్టీ బ్లాక్‌లో కొని సినిమా చూపించాను. జేబులు ఖాళీ. ఖర్చంతా నాదే అనేసరికి ఎవడూ దమ్మిడీ తీసుకురాలేదు. ఒక పక్క ఆకలి దహిసోంది. సినిమా జోష్‌లో ఏవీ గుర్తురాలేదు. ఆకలిని ఎలాగోలా తట్టుకోగలం కానీ, రాయచూర్ వెళ్లేదెలా? ఏదైతే అదయిందని ఆ సాయంత్రం వరకు అక్కడే తచ్చాడి చివరికి రైలెక్కేశాం. టిసి రాగానే మా ఐడి కార్పులు చూపించి విషయం చెప్పి బతిమాలుకున్నాం... మహానుభావుడు... అర్ధం చేసుకున్నాడు. కొన్ని తిట్లతో సరిపెట్టి మమ్మల్ని రాయచూర్‌లో దింపేశాడు. బహుశా తనుకూడా ఐష్ 'పంకా' కావచ్చు! ఒకసారి తుంగభద్ర ఒద్దుకు వనభోజనాలకు వెళ్లినప్పుడు ఆడిన ఒక ఫన్ గేమ్‌లో “భవిష్యత్తులో ఏమవుతావ'నే స్లిప్ వచ్చింది నాకు. నేను తడుముకోకుండా సినిమా డైరెక్టర్ అనగానే అంతా గొల్లున నవ్వడంతో నాలో పట్టుదల మరింత పెరిగింది. అలా అంతా నన్ను రెచ్చగొట్టినందుకే నా అడుగులు సినిమా రంగం వైపు నడిచాయేమో! కాలేజీ అయిపోగానే మిగతా మిత్రులంతా ఉద్యోగాలు వెతుక్కుంటూ తలో దిక్కూ వెళితే, నేను మాత్రం తిన్నగా హైద్రాబాద్ వెళ్లి పోసాని కృష్ణమురళిగారి వద్ద అసిస్టెంట్ రైటర్‌గా చేరిపోయా. ఆయన దగ్గర దాదాపు మూడేళ్లపాటు పాతిక సినిమాలకు పనిచేశాక కథ, మాటలు, స్షీన్‌ప్లే, దర్శకత్వం వహించి 'ఏమైంది ఈవేళ చిత్రానికి దర్శకుడిగా మారి మాట నిలబెట్టుకున్నా ఒకప్పుడు నేను డైరెక్టరుని అవుతానంటే జోక్‌గా తీసుకుని నవ్విన నా మిత్రులు ఇప్పుడు మనస్ఫూర్తిగా అభినందనలు పంపిస్తుంటే గాల్లో తేలినట్టుంటుంది. (05.08.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) గొరుసు జగదీశ్వర రెడ్డి + 123
సి శయ | శే నస | | న [్ భాష రానిచోట బావుటా ఎగరేశాను అతడి గొంతులోని పాట, చేతల్లోని చారవ ఏకమవడంతో నడవడమే క కాదు, విదేశాలు కూడా చుట్టొచ్చాడు. మొదట్లో 98.5 ఎఫ్.ఎం. రేడియో జాకీగా శ్రోతల్ని హోరెత్తించి ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు "కోటి" ద్వారా “గోపి గోడ మీద పిల్లి తో చిత్రరంగం వైపు దూకాడు. ఆ క్రమంలో “ఆడించీ అష్టాచెమ్మా (అష్టా చెమ్మా), “ఇది అదేనేమో” (గోల్కొండ హైస్కూల్ ) “ఒక పువ్వు) (జై బోలో తెలంగాణ), “'డోలారే డోలారే ధఢంి (అరుంధతి), 'రాజ రాజ రవితేజ” (దాన్ శీను), “మరు మల్లెతీగ” (వీడు తేడా), “స్నేహమా, “తెలియ లేదురా (దేవస్థానం), “అరుదైన సంగతి” (ఓనమాలు)... దాదాపు ఆరు పదుల సినిమా పాటలతో పాటు, నాలుగు వందల ఇతరత్రాలను తన పాటల జోలెలో దాచుకున్న నవతరం గాయకుడు శ్రీకృష్ణ, నా వ్యాపీదేసన్నీ పాటతో ముడిపడ్డ సంఘటనలూ, సన్నివేశాలే! మా ఇంట్లో ఎవరికీ “తి అంటే 'తూ' రాకపోయినా పాటనా కబ్బడం ఆశ్చర్యం కదా! చిన్నప్పుడు, నాన్నమ్మతో పాటు మా ఇంటెదురుగా ఉండే రామాలయానికి వెళ్లి, భజన కార్యక్రమాల్లో పాల్గొనేవరకు నాలో ఒక గాయకుడు ఉన్నాడన్నదే ఎవరికీ తెలీదు సుమండీ! హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 124
ఊహ తెలిసింది విజయవాడ కృష్ణలంకలో. చిన్న కుటీరంలాంటి ఇల్లు, చుట్టూ చెట్లు. ఎదురుగా ఉరకలెత్తే కృష్ణమ్మ. రమణీయ దృశ్యమది. దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం మాది. నాన్న నవతా ట్రాన్స్‌పోర్టులో, అమ్మ “ఐడియల్ పబ్లిక్ స్కూల్లో పనిచేసేవారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులో, మరేవో ఆ వయసుకు తెలిసేవి కాదుగాని నాకంటూ కొంత సంపాదించాలనే తపన అప్పట్లోనే నిలువెల్లా ఉండేది. పిల్లల్లో ఎవరైనా రెండు మూడు రోజులు బడికి రానప్పుడు హోమ్‌వర్క్ చెసిపెట్టమని బతిమాలితే, పేజీకి పావలా చొప్పున డిమాండ్ చేసేవాణ్ణి. దీన్ని మీరు వ్యాపారం అంటారేమో! నేనది బతకనేర్చిన తనమంటాను. ఈ చొరవే పలుమార్లు నన్ను రక్షించింది కూడానూ. రూలుకరతో వీపు విమానం మోత ఒకసారి స్కూల్ నుండి ఒక కాంపిటీషన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు నాతో పాటు తమ్ముడు, నాన్న కూడా వచ్చారు. 'మాదేనోయ్ హిందుస్తాన్” అనే పాటని పాదేసి ఆడియన్స్‌లో కూర్చున్నాను. ఫైజ్ మరొకరికి ఇచ్చినట్టు అనౌన్స్‌మెంటు వినిపించగానే ఉక్రోషంతో ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాను. నేను వెళ్లిన కొద్దిసేపటికే నా పాటకి స్పెషల్ _ ఫ్రైజ్ ప్రకటిస్తే, స్టేజీపైకి మా తమ్ముడు వెళ్లి తీసుకుని వచ్చాడట. జీవితంలో తొలిసారి వచ్చిన ఫ్రైజ్ అది. దాంతో (ఫైజుల మత్తు నన్ను ఆవరించేసింది. రోజూ పేపర్లలో సిటీ డైరీ కాలమ్ చూసి ఎక్కడెక్కడ పాటల పోటిలున్నాయో వెతుక్కుని అక్కడికి వెళ్లి పాడేసి ఫైజ్‌లు తెచ్చేసేవాణ్ణి. (ఫైజజల మోజులో పడి చదవట్లేదని అమ్మ అరుస్తూనే ఉండేది. ఆవిద భయానికి బహుమతిగా వచ్చిన ్లాస్కులు, సబ్బుపెట్టెలు, వాటర్‌జగ్గులు, పెన్నులు, ఫ్లవర్‌వాజ్‌లను... చెట్ల చాటున, గోతుల్లో, ప్రహారీ గోడ సందుల్లో దాచేసి
- ఏమీ ఎరుగనట్టు ఇంట్లోకి వెళ్లేవాణ్డి. హరప్పా మొహంజొదారో తవ్వకాల్లో బయటపడ్డట్టు ఎప్పుడో ఒక్కొక్కటిగా అవి అమ్మ కంట్లో పడ్డప్పుడు నా వీపు విమానం మోత మోగేది. ఈ మోత నా ఇంటర్ పూర్తయ్యేదాకా మోగుతూనే ఉందండి బాబూ! చిలిపి “కృష్ణుడు ఏం చేసేవాడంటే.. చిన్నప్పుడు ఐస్‌క్రీం అంటే పడిచచ్చెవాణ్లి (ఇప్పటికీ ఇష్టమేననుకోండి). ముఖ్యంగా బీసెంట్ రోడ్‌లో రవీంద్ర కూల్‌డ్రింక్స్‌లో ఐస్‌క్రీం తినడం మరింత ఇష్టం. ఇంట్లో సిటీ బస్సుకు మాత్రమే డబ్బులిచ్చేవారు. ఐస్‌క్రీం తినడానికి రకరకాల పన్నాగాలు... బస్సులో వెళ్లకుండా లిఫ్టు అదగడం, నాకోసం కట్టిన క్యారియర్‌ను రిక్షా అతడికి ఇచ్చేసి నన్ను స్కూల్ దగర దిగబెట్టమని బతిమాలుకోవడం... ఇలాంటీ ట్రిక్కులతో డబ్బులు మిగిల్చుకుని ఐస్‌క్రీం తినేవాడ్ని అదేం యావో ఐస్‌క్రీం బుర్రలో మెదలగానే నోట్లో ఊట జలజలమని పొంగేది.
ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ... దానికెప్పుడూ సిగ్నల్స్ అందేవి కావు. మెల్లగా పక్కింటాళ్ల మెదెక్కి వాళ్ల యాంటెనా కనెక్షన్‌ను మా టీవీకి కనెక్ట్ చేసి ఏమీ ఎరగనట్టు ఉందేవాణ్సి. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది. అది నిత్యం మోగాల్సిందే. ఒకరోజు బాలల కార్యక్రమం వస్తుంటే నేనెందుకు రేడియోలో పాడకూడదనే ఆలోచన వచ్చి, వెంటనే మా తమ్ముడ్ని తీసుకుని రేడియో స్టేషన్ వెతుక్కుంటూ వెళ్లిపోయాను. ధైర్యంగా లోపలికి వెళ్లి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కృష్ణకుమారిగార్ని కలిసి నేను కూడా బాల వినోదంలో వాల్గొంటానని చెప్పాను. పెద్ద వాళ్లెవరూ తోడు లేకుండా ఆరిందాలా వెళ్లేసరికి ముందు ఆశ్చర్యపోయి, ఆనక తెప్పరిల్లి “ఏదీ నెమలి గురించి నాలుగు ముక్కలు చెప్పు చూద్దాం” అని ఆమె అడగటమాలస్యం 'నెమలి చాలా అందమైన పక్షి మబ్బుల్ని చూడగానే పురివిప్పి ఆడునంటూ నాకు | తెలిసిందంతా సాగదిస్తూ కవితాత్మకంగా చెప్పాను. అంతే ఆవిడ ఫ్లాట్! ఏకంగా బాలానందాన్ని నడిపించే పోస్టు ఇచ్చేశారావిడ. అలా ప్రోగ్రాంకు రూ. 400 చొప్పున సంపాదించేవాణ్ణి. ఆ అనుభవంతో ఒకసారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఒక ప్రోగ్రాంలో యాంకర్‌గా కార్యక్రమం నడిపించడం మర్చిపోలేని అనుభవం. మనుషుల్లో దయామయులు వేరయా!
ఇంటర్మీడియట్‌కి వచ్చెసరికి ఒకటి రెండు లలిత గీతాలు నేర్చుకుని సంగీతం వచ్చినవాడిలా ఫోజు కొాడూమా వీధిలోని చిన్న పిల్లలను పోగేసి నేర్పించేవాణ్ని. పదీ పాతికా ఇచ్చేవాళ్లు. నేను సంగీతం చెబుతున్న విషయం మా కాలేజీలో తెలిసి కెమిప్టీ లెక్చరర్ లలితగారు కూడా తనకీ, వాళ్ల కూతురికి సంగీతం నేర్పిస్తే నెలకి యాభై రూపాయల చొప్పున ఇస్తానన్నారు. నా కొచ్చిన పాటలన్నీ వళల్లెవేసి నేర్పిస్తూ వాళ్లను కూడా మెప్పించా కొన్నాళ్లవాటు.
ఇంటర్ ఫైనల్లోకి వచ్చేసరికి నాన్న అనుకోని పరిస్థితుల్లో ఒక షూరిటీ కేసులో ఇరుక్కోవడంతో ఒకవైపు అప్పులాళ్ల బాధ, మరోవైపు కాలేజీలో ఫీజు కడితేగానీ హాల్ టిట్ ఇవ్వని పరిస్థితి. అప్పటికే నాకు తాతయ్య వరుసయ్యే రాధాకృష్ణమూర్తిగారు కొంత సహాయం చేశారు. ఇంకా సగం ఫీజు కట్టాలి. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే బుర్రలో ఒక మెరుపు మెరిసింది. టెన్స్‌లో ఉండగా ఒక లైబ్రరీ నిర్వహించిన పాటల పోటీల్లో అప్పటి డిఫ్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణగారి చేతుల మీదుగా ఫ్రైజ్ అందుకోవడం గుర్తొచ్చింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ధైర్యంచేసి వారిని కలిసి సహాయం అర్ధించాను. నా చొరవకి ముందు హాప్ డేస్ = సిన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు * 126
ఆశ్చర్యపోయి తర్వాత నేను చెప్పేది నిజమో, కాదో తెలుసుకురమ్మని మా ఇంటికి కానిస్టేబుల్‌ని పంపించారు ఆయన. నా మాటలు నిజమని తేలాక న్ధానిక నాయకుడు కోగంటి సత్యంగారితో చెప్పి నాకు హెల్ప్ చేయించడం మర్చిపోలేను. చారవుండాలేగాని మనుషుల్లో దాగిన దయాగుణాన్ని బయటకి లాగొచ్చనేది నా ఫిలాసఫీ.
బాలుగారిని మెప్పించాను
ఇంటర్లో ఉండగానే కాలేజీ తరఫున 'భారత్ వికాస్ పరిషత్ వాళ్లు నిర్వహించిన పోటీకి వెళ్లి 'సంపూర్ణ వందేమాతరం” పాడి ఫస్ట్ ఫ్రైజ్ కొట్టుకొచ్చాను. వారే మరోసారి “జాతీయ గీతాల పోటీలలో పాడడానికి వారణాసి తీసుకెళ్లారు. అక్కడ పరిచయమైన ఇండోర్ అమ్మాయిలు బీనా, మేఘనలు ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. ప్రతి ఏడాది రాఖీలు పంపడం.... వాళ్ల పరిచయం ఒక స్వీట్ మెమరీ.
“పాడుతా తీయగా” ప్రోగ్రాం టీవీలో చూసినప్పుడల్లా బాలుగారి ముందు నేను కూడా వాడుతున్నట్టు ఊహించుకుని తెగ సంబర పడేవాణ్ణి. అనుకోకుండా ఆ అదృష్టం మా టీవీ 'పాడాలని ఉంది' ద్వారా తలుపు తట్టింది. ఫైనల్లో 'ఆలాపనిలో బాలుగారు పాడిన 'మదన లతిక ఆడే పాటని సెలక్టు చేసుకోమని (శ్రేయోభిలాషి రాంప్రసాద్‌గారు
(| సలహా ఇచ్చారు. అయితే ఆ పాట ఎక్కడా దొరకలేదు. క్యాసెట్లో కూడా లేదు. ఎల్.పి.లో మాత్రం ఉందని, ఏవో కారణాల చేత సినిమాలో తీసేశారని తెలిసింది. నా అన్వషణ ఫలితంగా కావలిలో ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి రికార్డు చేసుకొని, నేర్చుకుని ఫైనల్లో పాద్దానికి ముంబయి వెళ్లాను. షన్ముఖానంద ఆడిటోరియంలో 4 వేల మంది (పెక్షకులు శివమణి, హరిహరన్, బాలుగారు వంటి ఉద్ధండుల ముందు గజల్ బాజణీలోని ఆ పాట పాడడం.... ఒక అదృష్టమైతే, ఫస్ట్(ఫైజ్ నాకే రావడం నమ్మలేని నిజం. పాటే నన్ను చదివించింది
బి.ఏ. కంప్యూటర్స్ చదవడానికి సిద్దార్ధ కాలేజీలో చేరానే గాని నిత్యం పాటల్లో మునిగి తేలేవాణ్డి. పాటలతో వీడు చెడిపోయే ఘటం కాదనుకుందేమో అమ్మ కూడా
ప్రోత్సపించేది. కాలేజీ తరఫు నుండి వెళ్లిన ప్రతిసారి బహుమతులు నాకే రావడంతో అందరి తలలో నాలుకైపోయాను. ముఖ్యంగా మా లెక్చరర్స్ అడుసుమిల్లి శ్రీనివాస్, రమేష్‌గార్లతో పాటు, ప్రిన్సిపాల్ సుబ్రమణ్యేశ్వరశర్మగార్లు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్లు. పాటలు పాడి నేను కాలేజీకి పేరు తెచ్చానని ఆ మూడేళ్లలో కట్టిన ఫీజులు చివర్లో తిరిగి ఇచ్చేయడం మర్చిపోలేను. పాటకున్న పవరేమిటో తెలిసింది అప్పుడే. సిద్ధార్ధలో డిగ్రీ పూర్తికాబోతుండగా ఎం. ఎస్‌సిలో సిటు ఇస్తామని శారదా కాలేజీ నుండి
ఆఫర్. శారదలో చేరి, పాటల కాంపిటీషన్‌లో తిరిగి నా మాజీ 'సిద్దార్ధ'పైకే దండెత్తడం తలుచుకుంటే ఫన్నీగా ఉంటుంది. బంగారు గొలుసుతో అభినందన
ఎం.ఎస్‌సి. ఫైనల్లో ఉండగా కన్నడ 'ఈ టివీలో 'పాడుతా తీయగా” మాదిరే “ఎద తుంబి హాిీళు వెను ప్రోగ్రాం జరగబోతుందని తెలిసింది. అంతకు ముందు పరిచయమైన ఇందిరగారి సహకారంతో కొన్ని కన్నడ పాటలు నేర్చుకుని, అప్లయ్ చేసి, సెలక్టు అయ్యాను. అక్కడ కూడా ఫైనల్ వరకూ వెళ్లడం ఇప్పటికీ ఆశ్చర్యమే. సెమి ఫైనల్స్‌లో బాలుగారు పిలిచి “నీకు భాష రాకపోయినా సెమీ ఫైనల్స్ వరకు రావడం గొప్పే. వీళ్లకు భాషాభిమానం మెండు. ఉచ్చారణ దోషాలు లేకుండా పాడాలి సుమా అని హెచ్చరించారు. నిజానికి నాకు కన్నడ అసలు తెలీదు. 'నన్న ఎసరు శ్రీకృష్ణ నాను విజయవాడ దింది బందితిని, 'ననగి స్వల్ప కన్నడ బర్త - ఈ మూడు ముక్కలు బట్టీ పట్ట అందరి దగ్గర అవే వల్లిస్తూ మిగతా ప్రశ్నలకు ఒక వెర్రి నవ్వుతో సమాధానం చెప్పేవాణ్ణి ఫైనల్స్ బెంగళూరు జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో జరగడం, నాకు ఫస్ట్ (ఫఫైజ్ రావడం, ఒక కన్నడ ఫ్యామిలీ ఆనందంతో నా మెడలో బంగారు గొలుసు వేసి నా నుదుట చుంబించడం... నేను తేరుకునేలోగా వాళ్లు వెళ్లిపోవడం... ఇవన్నీ మీకు నమ్మలేని నిజాల్లా అనిపిస్తాయేమో కానీ నా జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతులు.
చదువు పూర్తిచేసి ఉద్యోగం వెతుక్కునే వంకతో హైద్రాబాద్ రావడం, ఆ క్రమంలో 93.5 ఎఫ్.ఎం.లో రేడియో జాకీ అవతారం ఎత్తి 24 గంటలూ (శోతల చెవులు నమిలేస్తుండగా, కోటిగారు “గోపి గోడ మీది పిల్లి” ద్వారా సినిమా గాయకుద్నిచేయడం... ఆ తర్వాత అమెరికా, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు తిరిగి చిత్ర, శైలజగార్ల వంటి ప్రముఖ గాయనీమణుల జతన పాడడం... ఇవన్నీ వెంటవెంటనే నన్ను వెంటాడిన అదృష్హాలు. ఎందరో సంగీత దర్శకులు నిత్యం నన్ను తీర్చిదిద్దుతున్నా... బాలు, కోటిగార్లు చూపుతున్న ఆల్మీయత, నన్ను నిలబెట్టేందుకు వాళ్లిస్తున్న ఊతం జీవితంలో మర్చిపోలేను.
(12.08.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 128
- వ్ _ " నీ తొ ఆకినర్చై శ స లక్ ఆంగం ట్ 2 న ల్లో ( టీ వనమాలి శ్రీశ్రీ మరణమె అల్లో త్ర నాకు నాహిత్యాన్ని పరిచయం చెసింది మాతృభాష తమిళమైనా తెలుగులో వుట్టి, తెలుగులో పెరిగి, తెలుగు వొటయిన “'మణిగోపాలు'దతను. “అరెరే... అరెరే... మనసే జారే” అంటూ తెలుగు వెండితెర పాటల తోటలోకి వనమాలిగా (పవేళించి నీలో వలపు” (రోబో), నేనూ నువ్వంటూ*(ఆరెంబ్, కరిగే లోగా ఈ క్షణం” (ఆర్వ2, “చిరునవ్వే నవ్వుతూ” (ఓయ్), “చెంగు చెంగు చెంగుమంటూ” గచందమామి, ఎందుకో వమో” (రంగం, “ఎ బ్యూటీఫుల్ ఫేన్” (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) నుండి మొన్నటి మనం?” చి(తం వరకు దాదాపు ఐదు వందల వొాటల మొక్టులు పెంచొడు. ఆ క్రమంలో రెందు బుల్లితెర నందులతో పొటు ఒక వెండితెర, “ఫిలిమ్ ఫేర్ ఫలాలను అందుకున్న “వనమాలి? నా జీవితంలో “హ్యాపీడేస్ కేం కొదవలేదు కానీ, వీటితో పాటు ఒకటీ అరా విషాదాలూ లేకపోలేదు. హ్యాపీడేస్ కాలంతోపాటు కరిగిపోతాయేమో కానీ, తగిలిన దెబ్బలు, అవమానాలు మాత్రం గుండెలో గూడు కట్టుకునే ఉంటాయని గట్టిగా నమ్ముతాను. గొరుసు జగదీశ్వర రెడ్డి + 129
నాకు ఊహ తెలిసింది అనంతపురం జిల్లా కదిరిలో. నాన్న పంచాయితీ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తుండేవారు. 'చంద్రవదన మొహియార్ మున్సిపల్ స్కూల్లో సాగిన చదువు నాది. నూర్ జిలాన్ భాషా, నియామతుల్లా, ఇదయతుల్లా, సుబ్బయ్య, లక్ష్మినారాయణలు నా జట్టుగాళ్లు. సోమగుట్ట వీధిలో ఒక ముస్లింల ఇంట్లో అద్దెకు ఉందేవాళ్లం. మా ఇంటీ వెనక వీధిలోనే సందడి సందడిగా కల్లు అంగడి. ఏ మాత్రం సిగ్గుపడకుండా తరచూ అక్కడికి వెళ్లి తాగుబోతుల మాటల్ని వాళ్ల హావభావాల్ని గమనిస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్డి. కలలా కరిగిపోయాడు
అప్పట్లో వేసవి వచ్చిందంటే పిల్లలమంతా విధిగా సైకిల్‌తో పాటు ఈత కూడా నేర్చుకునే వాళ్లం. మిత్రులతో కలిసి పొలాల గట్టున ఉండే మోట బావికి వెళ్లి మునగ క బెండు కట్టుకుని ఈదేవాణ్ణి. లక్ష్మినారాయణ కూడా నాతో పాటు బెండు కట్టుకునేవాడు. మిగతా వారికి ఈతొచ్చు. బెండు రక్షణగా ఉందనే ధైర్యంతో బావి అంచులో ఉండదే రాతి కడ్డీలు ఎక్కి అంత పైనుండి భయం లేకుండా నీళ్లలోకి దూకేవాళ్తం. పది రోజులు బెండుతో ఈది, తర్వాత దాన్ని విప్పేసి ఈదాలని, లేకపోతే ఎన్నాళ్లయినా ఈత రాదనేవారు. అది నిజమేనేమోనని.... బెండు లేకుండా పైనుండి 'డై' కొట్టడం, బావి అడుగు బంకమట్టిలో వాడి తల కూరుకుపోవడం...... చూస్తున్నంతలో జరిగిపోయాయి. అప్పటి వరకూ పలానా వాళ్లు చనిపోయారని వినడమే తప్పించి చనిపోయిన మనిషి ఎలా ఉంటాదో తెలీని నేను (రోజూ నాతో పాటు ఆడుకునే) వాడినలా నిర్జీవంగా చూడడం తట్టుకోలేకపోయాను. ముద్దుగా 'పుంజూ” అని నిక్ నేమ్‌తో పిలుచుకునే లక్ష్మీనారాయణ ఎప్పుడు గుర్తుకొచ్చినా గుండె పట్టేసినట్లు ఉంటుంది. ఆ సంఘటనతో ఈత బంద్. ఇప్పటికీ నీళ్లంటే చచ్చేంత భయం నాకు. సిగ్గుబిడియాలు ఉందేవి కాదు
జిలాన్ బాషా వాళ్లకు అప్పట్లో రాధిక. విజయ, సంగం థియేటర్ల దగ్గర బేకరీ షాపులుండేవి. వెన్నబిస్కట్లు, బన్నులు, కేకులు వాళ్లింట్లోనే తయారు చేసేవారు. పెద్ద పళ్లెంలో మైదా, శాకరిన్ వేసి, పల్లీకాయల మాదిరి గుర్లని టప్ టప్‌మని పగటగొట్టి సొనలను పిండి మధ్యలో వేసే దృశ్యం ఒక వింత. పిందిని కలిపి, ముద్ద చేయడానికి మనలాంటి వాళ్ల శక్తి సరిపోదు. ప్రత్యేకంగా కండలు తిరిగిన మనిషి ఒకడుండేవాడు. ఈ తతంగం చూడ్డానికి బడి టైమ్‌కంటే గంట ముందే బయల్చేరి వాళ్లింటికి వెళ్లే వాణ్ణి. స్కూల్ అయిపోగానే బాషాతో పాటు సినిమా థియేటర్లకు వెళ్లి ఇంటర్వెల్ నుండి ఫ్రీగా సినిమాలు చూసేవాణ్నిి అలాంటి సగం సినిమాలు ఎన్ని వందలు చూసి ఉంటానో! అప్పుడప్పుడూ బాషాతో పాటు బేకరీలో నిలబడి అమ్మేవాణ్జి కూడా. నా మరో క్లాసుమేట్ హ్యాట్ ఊస్ = సీస్ ప్రముఖల చిన్ననాటి తీసి గుర్తుల + 130
రహమతుల్లాకి ఐస్‌బండి ఉండేది. స్కూల్ అయిపోగానే ఒక్కోసారి వాడితో పాటు “ఐస్‌క్రీం” అని అరుస్తూ, బండి తోసుకుంటూ వెళ్లడం... అన్నీ అమ్మాక పుల్లలు విరిగిన ఐస్‌లను తినడం... గొప్ప థ్రిల్. అది తప్పో ఒప్పో తెలియదు కానీ జీవితాన్ని నిజంగా అనుభవించమంటే మాత్రం అదే. రాయాలనే తపన అలా మొదలైంది ఒకరోజు సుబ్బయ్య ఏడుపు మొహం పెట్టి 'శ్రీశ్రీ చనిపోయాడంటరా” అన్నాడు
నా దగ్గరగా వచ్చి నిల్చుని మొదట్లో వాడి బంధువేమో అనుకుని ఊరుకున్నాను. తర్వాత వాడే “శ్రీశ్రీ మహాప్రన్యానం” అనే హెడ్డింగ్‌తో ఉన్న న్యూస్ పేపర్ తెచ్చి చూపించాడు. అప్పటివరకు శ్రీశ్రీ ఎవరో నాకసలు తెలీదు. మా అన్నయ్యతో చెబితే “ఆయనో మహాకవి అంటూ తను డైరీలో రాసుకున్న శ్రీశ్రీ కవిత్వంలోని కొన్ని లైన్లు చూపించాడు. 'ప్రాసతో కూడిన ఆ పద విన్యాసం నన్ను విపరీతంగా ఆకర్షించింది. మనసుని కుదిపేది ఏదో అందులో ఉందనిపించడంతో నా దృష్టి సాహిత్యం వైపు మళ్లింది. కారణం సరిగ్గా గుర్తులేదుగాని మా ఊరి లైబ్రరీకి వచ్చిన వందలాది నవలలు, కవిత్వం, కథల పుస్తకాల సంచులు మా ఇంట్లోకి వచ్చి చేరాయి. ఆటలన్నీ ఆపేసి పుస్తకాలు చదువుతూ ఉండేవాణ్ణి. అలా సాహిత్యం నన్ను తన బానిసని చేసుకుంది. చదువుతుంటే రాయాలనే తపన కూడా మొదలైంది. 'పేమలేఖిల ప్రహసనం
నేను టెన్స్ ప్యాసవడం, నాన్నకు చిత్తూరు బదిలీ కావడం ఒకేసారి జరిగాయి. మకాం కదిరి నుండి చిత్తూరుకి మారింది. కాలేజీకి వెళ్తూనే ఒక ఇనిస్టిట్యూట్‌లో ఇంగ్రీష్స్ హిందీ, తెలుగు ట్రెప్ నేర్చుకునేవాణ్ణి అక్కడే రవి పరిచయం. ఇనిస్టిట్యూట్‌కు వచ్చే ఒకమ్మాయిని హార్ట్‌ఫుల్‌గా లవ్ చేసేవాడు కానీ ఆ అమ్మాయి కళ్లెత్తి కూడా వీడివైపు చూసేదికాదు. ఆలోచించి చించి ఒక రోజు తెగించి నాతో కవితాత్మకంగా ఒక (ప్రేమలేఖ రాయించి ఆ అమ్మాయికి ఇచ్చాడు. అంతే! “నీవు ఇంత బాగా ఉత్తరాలు రాస్తావని తెలీదు రవీ. పైగా నీ చేతిరాత ఎంత బాగుందో అంటూ పడిపోయింది. (చేతిరాదే కాదు, నిజానికి ఆ ఉత్తరాల నిండా ఉన్నది నా ఫీలింగ్చే). వాళ్లిద్దరూ బాగా క్ల్షోాజవడంతో నాకు లేఖలు రాసిపెట్టే పని క్రమంగా తప్పింది. ఒకరోజు “నిజానికి నిన్ను ప్రేమించింది నీవు రాసే (ప్రేమలేఖలు చూసే. మనం దగ్గరవడంతో నీ లేఖలు ఆగిపోయాయి” అని నిష్టూరమాడిందట. దాంతో వాడు నిజం కక్కేశాడు. అంతే ! ఆ అమ్మాయి కాళిక అవతారం ఎత్తి మనోడ్ని చడామడా.... తిట్టి అదే పోత. అతి కష్టం మీద ప్రసన్నం చేసుకోబోయాడు కానీ ఎక్కటబోయిన రైలు జీవితకాలం గొరుసు జగదీశ్వర రెడ్డి శ 131
ఆలస్యం అన్నట్టు ఈలోపు ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి కుదిరిపోయింది. నాకు (ప్రేమలేఖలు రాసే బాధా తప్పింది. తెలియకుందా ప్రత్యక్షంగా తిట్టాను
ఒకసారి ఫస్ట్ అవర్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉండడంతో అందరం లాబ్ ముందు గుమిగూడి ఉన్నాం. టైం గడుస్తున్నా ఎంతకీ మా కెమిస్టి లెక్బరర్ రాదే! తనొచ్చేవరకు లాబ్‌లో కూర్చుందామనుకుంటే అది కాస్తా తాళం వేసి ఉంది. లాబ్ తాళాలు ఆయన దగ్గరే ఉన్నాయట. నాలో అసహనం పెరిగిపోయి "పెద్ద మెంటలోడిలా ఉన్నాడ్రా వీడు. ఎంత సేపని వెయిట్ చేస్తాం?” అంటూ నోటికొచ్చిన తిట్ల దండకం మొదలెట్టాను. పక్కనున్నోడు నా చేతిని గిల్లుతూనే ఉన్నాడు కానీ ఆ కోపంలో వాడి గిల్లుడ్ని పట్టించుకోలేదు. తిట్టీ తిట్టి పక్కకు చూస్తే నా వెనకాలే మా లెక్చరర్. ఒక్కసారిగా షాకయ్యాను. బిత్తరపోయి గమ్మునుండిపోయా. 'నా పని అయిపోయిందిరా. ప్రాక్టికల్స్‌లో నాకు పెద్ద సున్నా తథ్యం” అనుకున్నాగానీ.. 'థాంక్ గాద్' మంచి మార్కులే వేశాడు. పిలకాయనని క్షమించాడో, తను ఆలస్యంగా రావడం తప్పని తెలుసుకున్నాడో ఇప్పటికీ తెలీదనుకోండి! అది చిన్న సంఘటనే కానీ, అప్పట్నించి వెనకా ముందూ చూడకుండా మాట తూలకూడదన్నది బోధపడింది. బాణీకి పాట రాయడం అలవాటైంది
డిగ్రీ తర్వాత ఎం.ఏ. తెలుగు చేయాలని మనసు పీకేది. సైన్స్ స్టూడెంట్‌ని కావడం, పైగా నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కావడంతో కుదరదన్నారు. ఆ కసితో సంవత్సరం వెస్ట్ అయినా ఫర్వాలేదని తెగించి, బి.ఏ. తెలుగు 16 సబ్జెక్టులను ఒకే సిట్టింగులో రాసి, ప్యాసై మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎ.లో చేరాను. మెరీనా బీచ్ సమీపంలో యూనివర్శిటీ... పాఠాలతో పాటు సముద్ర ఘోషను వినడం గొప్ప థ్రిల్‌గా ఉండేది. హాస్టల్లో ఉంటే నాన్న పంపే డబ్బులు సరిపోవని, “రాజుతో కలిసి ట్రిఫ్లికేన్‌లో ఒక రూమ్ తీసుకుని స్వయం పాకం చేసుకునేవాణ్తి. నా మిత్ర బృందంలో రాజుతో పాటు మోహన్, మాధవి, వేణు ఉండేవారు.
మా ఇంటి ఓనర్స్ మార్కెట్లో విడుదలైన కొత్త కొత్త తమిళ పాటల కాసెట్స్ తెచ్చి గూబ గుయ్యిమనే శబ్దంతో హోరెత్తించే వారు. 'వినడానికి బాగున్నాయి కానీ, ఒక్క ముక్కా అర్ధం కావట్లేదురా” అనేవాడు రాజు. దాంతో అప్పటికప్పుడు ఆ వాటని ట్యూన్‌కు అనుగుణంగా తెలుగులో రాసి వినిపించేవాణ్ణి. బాణీకి పాట రాయడం అలా అలవ్వాటైంది. అప్పుడే అనిపించింది ఎప్పటికైనా నేరాసిన పాట బాలుగారి నోట వినాలని.
ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే మా కల్చరల్ మేడమ్ శమంతకమణిగారు నాతో పాటు కొందర్ని రేడియో స్టేషన్‌కి తీసుకెళ్లి ఒక కదంబ కార్యక్రమం నిర్వహించారు. హ్యాల్ డేస్ = సినీ ప్రముఖల బిన్ననాటి తీస్ గుర్తులు + 132
అప్పుడు నా పెర్పామెన్స్ చూసిన ఆకాశవాణివారు ఆ తర్వాత వచ్చిన ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనడానికి నాకు ఆహ్వానం పంపడం జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నేను పాల్గొన్నది ఆరుద్ర, సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, జగ్గయ్య, పి.బి.
- శ్రీనివాస్ వంటి దిగ్గజాలతో కలిసి, నా కవిత విన్న సిరివెన్నెలగారు అప్పుడిచ్చిన కితాబు మర్చిపోలేను. ప్రేమే నేరమౌనా? ఎం.ఏ.ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే మణిగోపాల్ పేర (నా అసలు పేరు) అప్పుడప్పుడూ ఆకాశరామన్న ఉత్తరాలొచ్చివి. రాతను బట్టీ వాటిని రాసింది అమ్మాయని ణు మాత్రం అర్ధమయ్యేది. ఎవరా ఎవరా అని నిద్రపట్టేది కాదు. (ఆ మిస్టరీ ఛేదించేలోపే నా ఎం.ఏ. పూర్తవడం, పిహెచ్‌డి చేయడానికి (్రెసిదెన్సీ కాలేజీకి మారటం, అదే సమయంలో 'ఈనాడులో సినిమా రిపోర్టర్‌గా ఉద్యోగంలో చేరడం వెంటవెంటనే జరిగిపోయిన సంఘనటలు) తర్వాత ఒకసారి నా మాజీ కాలేజీకి వెళ్లినప్పుడు మరో అమ్మాయి ద్వారా ఆ ఆకాశరామన్న ఎవరో తెలిసింది. ఆ పేరు చెప్పగానే ముందు ఆశ్చర్యపోయా. ఎందుకంటే తను నాకంటే సీనియర్. ఎందుకీ దాగుడు మూతలని వెళ్లి ముఖాముఖే మాట్లాడాను. తనలో దాచుకున్న (ప్రేమను నేరుగానే చెప్పింది. మా (ప్రేమ మూడు పువ్వులు పూసి, ఆరు కాయలయ్యే క్రమంలో ఏం జరిగిందంటే - నా తరఫున మా మిత్రుడొకడు వాళ్ల ఇంటికి వెళ్లి మా పెళ్లి విషయం కదిపితే వాళ్ల నాన్న అగ్గిమీద గుగ్గిలమై నిప్పులు కురిపించడమే కాదు, ఆ అమ్మాయిని మరో క ఊరికి పంపించేశాడు. మరోసారి మా నాన్నగారు వెళ్లినా అదే పునరావృతమైంది కానీ ఆయన చల్లబడలేదు. కొన్నాళ్ల తర్వాత ఒక సందర్భంలో కలుసుకున్నప్పుడు 'మనం (ఫెంద్స్‌గానే ఉందాం'” అని గొణిగింది తను. ఆమె అంతరంగం అర్ధమైంది. మనసారా (ప్రేమించిన వాణ్ణి కాబట్టి ఆ మాటకి మనసు చివుక్కుమంది. అలా నా (ప్రేమ మొగ్గలై వికసించకుందడానే నేలరాలిపోయింది. కోలుకోలేకపోయా ఒకరోజు 'జీవితమంటే ఇదేనోయ్ వెర్రి నాగన్నా” అని వెక్కిరించి, “ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు మనకోసం ఎక్కడో తెరుచుకునే ఉంటుందిని బోధించింది నా ఇంగితం. దాంతో నెమ్మదించి, ఆ తెరిచిన తలుపుని వెతుక్కుంటూ ముందుకు సాగిపోయా! తర్వాత మద్రాసు నుండి హైద్రాబాద్ ఈనాడు” కార్యాలయానికి బదిలీ కావడం... శేఖర్ కమ్ములగారి 'హ్యాపీడేస్‌లో పాటలు రాసి మీకు చేరువవడం, ఇప్పుడిలా మీతో నా సొంత 'వ్యాపీదేసొని పంచుకోవడం... అన్నీ అనుకోకుండా జరిగిపోతున్న సంఘటనలే! (19.08.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) గొరుసు జగదీశ్వర రెడ్డి + 133
య ఏ వి న్ ల శ జి 180 4042041004 య 'బొమ్మరిల్లు' భాస్కర్ క నన్ను మార్చింది మా నాన్న కన్నీరే 'అదయార్ ఫిలిం ఇనిస్టిట్వూటొ నుందీ డైరెక్షన్ అంద్ గ్కీన్‌ప్లే' వట్టా వుచ్చుకుని, నరానరి మన థీల్ఫ్ నగరానికొచ్చిన రాయవెల్లూరు నల్లపయ్యన్” అతదు. అసోసియేట్ డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేని, ఆపై వెండితెరపై “బొమ్మరిల్లు” కట్టి, దర్భక మేస్తీగా మారాడు. అటు వీమ్మట పరుగు 'ఆరెంజొ '*ఒంగోలుగిత్త లతో తెలుగు (పేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తొలి నీనిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆ యువదర్శకుదే బొమ్మరిల్లు ఖాస్ఫుర్. విత్తు ముందో, చెట్టు ముందో చెప్పడం లోకంలో ఎవరికీ నాధ్యం కాకపోవచ్చుగానీ, ఒక మనిషి “విక్టరీ వెనక దానికి సంబంధించిన బీజం ఎప్పుడో, ఎక్కడో పడే ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ్టి నా సెలబ్రిటీతనానికి బీజం ఎక్కడ, ఎలా పడిందో చెపుతాను మీకు. నేను పుట్టిందీ, నాకు ఊహ తెలిసిందీ రాయవెల్లూరులో. నాన్న టీచర్. ప్రతి ఉదయం నా చిటికెన వేలు పట్టుకుని తనతో వాకింగ్‌కి తీసుకెళ్లడం, దారిలో న్యూస్ పేపర్ కొని, అక్షరాల్ని గుర్తుపట్టి ఎలా చదవాలో నేర్పించడంతో మూదేళ్ల వయసుకే పేపరు చదవడం అలవాటైంది నాకు. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 134
'లైబరీ సాంతం నమిలేశాను ఒకసారి మా అక్కకోసం లైబ్రరీలో రూ. 5 పెట్టి కార్డు తీశాడు నాన్న. పింక్, మెరూన్ రంగుల్లోని ఆ కార్డు ఇప్పటికీ నా కళ్లలో మెదుల్తుంది. దాని పుణ్యమాని మిగతా పిల్లల్లా ఆడుకునే అదృష్టం కోల్పోయాను. అదే టైంలో మా అక్క టైప్ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లేది కాబట్టే లైబ్రరీ డ్యూటీ నాకు పదేది. వెళ్లనంటే వీపు విమానం మోతే. తీరా పుస్తకం తెస్తే నవల కాదు కథలని, కవిత్వం కాదు ఆత్మకథని, నాటకం కాదు వ్యాస సంపుటని... ఈ 'టార్చర్లో నా ఐదేళ్ల వయసుకే ఏది ఏ పుస్తకమో, ఎందులో ఏముంటుందో తెలిసిపోయింది నాకు. తెచ్చిన పుస్తకాన్ని రోజుకొకటి చొప్పున పరపర నమిలేసేది. ఒకరోజు లైబ్రరీకి వెళ్లనని, ఆడుకుంటానని భీష్మించుకు కూర్చుంటే సుబ్బరంగా ఉతికేసి, ఒక గదిలోకి తోసి తాళం వేసింది. మరీ చిన్నవయసు, మ తిరగబడలేను. ఏడుస్తూనే దీన్నించి ఎలా తప్పించుకునేదిరా దేవుడా? అని ఆలోచించి, చివరకు పుస్తకాన్నే ఇష్టంగా చేసుకుని ఆ 'లైబరీకే సరెండరైపోయా. తెలుగులో చందమామలా, తమిళంలో 'అంబులిమామి ఉందేది. దాంతో చదవడం ప్రారంభించా. ఆ క్రమంలో లైబ్రేరియన్‌తో (ఫైెంద్‌షిప్ ఏర్పడింది. లైబ్రరీ నాదే అన్నంత చారవగా అలమరాలు శుభ్రం చేస్తూ, పుస్తకాలు సర్దుతూ, జాబితా రాస్తూ, కొత్త పుస్తకాల కోసం గవర్నమెంటుకు అప్లికేషన్ పెట్టమని లైబ్రేరియన్‌ను సతాయిస్తూ... మీరు చెబితే నమ్మరేమో గానీ నా టెన్త్ పూర్తయ్యేలోపు అప్పట్లో తమిళంలోకి అనువాదమైన 'యండమూరి' నవలలతో పాటు లైబ్రరీ అంతా జెపోసన పట్టేశాను. దోబూచులాటలో కిక్” దొరికేది అప్పట్లో ఊర్లో ఒక రాత పత్రిక నడిచేది. లైబ్రరీలో చదివిన సాహిత్యం నాలోని రచయితను మేల్కొల్పడంతో కథలు, కవితలూ రాసి మారుపేరుతో పంపేవాళ్లి. లైబరీకి వచ్చి చదివినవారు తమ అభిప్రాయాలు రాయడానికి ఆ రాత పత్రిక వెనక కొన్ని తెల్లపేజీలు ఉండేవి. నా కథలు, కవితలు మెచ్చుకుంటూ కొందరు అభి'ప్రాయాలు రాసేవారు. ఒకరోజు మా లైబ్రేరీయన్ నా పక్కన కూర్చుని '“ఎవరోనయ్యా వీడు? కలం పేరులా ఉంది. చాలా బాగా రాస్తున్నాడు. చదివేవాళ్లు కూడా మెచ్చుకుని తమ అభిప్రాయాలు రాస్తున్నారున్నాడు. దాంతో నా ఛాతీ కనీసం అంగుళం వెడల్పు సాగి ఉంటుంది. అదొక కిక్. అప్పట్లో ఎన్టీఆర్ పెట్టిన రెండు రూపాయల బియ్యం పథకం తమిళనాట ఒక హాట్ టాపిక్. ఆ టాపిక్‌తోనే కాలేజీలో కవితల పోటీ నిర్వహిస్తే అలవోకగా ఒక కవిత రాసి మళ్లీ వద్దనుకుని ఉండ చుట్టి చెత్తబుట్టలో పడేశాను. దాన్ని ఎవరో బయటకు తీసి సాపు చేసి, కింద నా పేరు రాసి నాకు తెలియకుండా గొరుసు జగదీశ్వర రెడ్డి + 135 (|
పోటీకి పంపించారు. దానికి ఫస్ట్ (ప్రైజ్ వచ్చింది. స్టేజ్‌పై నా పెరు అనౌన్స్ చేసినా, నన్ను గుర్తుపడతారనే భయంతో వెళ్లలేదు. క్లాసులో అందరూ పాఠం వింటుంటే, వెనక సీట్లో కూర్చుని నవలా పఠనంలో నిమగ్నమై ఉండేవాణ్ణి. అంత పిచ్చి ఉండేది పుస్తకాలంటే. వీడి లైఫ్ ఫినిష్ అనుకున్నారంతా
అప్పటిదాకా అందరి కళ్లకి 'రాముడు ముంచి బాలుడు గా ఉండేవాణ్సి కాస్తా కాలేజీలో చేరగానే 'రౌడీ రాముడి” నైపోయా. దీని వెనక ఒక కథ ఉంది - మా ఊర్లో రెండు రౌడీ గ్యాంగులు రాత్రనక, పగలనక కత్తులూ, కాగడాలూ పుచ్చుకుని స్వైర విహారం చేస్తూ పహారా కాస్తుండేవి. బలహీన ప్రాణులు తమకు ఏ కష్టమొచ్చినా వెళ్లి ఆ మూకలతో మొరపెట్టుకునేవి. అందులో ఒక గ్యాంగు వాళ్లు మా అన్నయ్య స్నేహితులే. ఒకసారి మా క్లాస్‌మేట్ ఒకడు నాకు బాగా తెలిసిన ఒకమ్మాయిని ఏడిపించడంతో వార్నింగ్ ఇచ్చాను. వాడెళ్లి ఒక రౌడీగ్యాంగుతో నా గురించి చెడుగా చెప్పడంతో నాలోని '“రౌడీ బయటకి దూసుకొచ్చాడు. వాడిని దొరకబుచ్చుకుని వీర బాదుడు బాదాను. అంతే. అప్పటివరకూ ఉన్న మంచి పేరంతా గంగలో కలిసిపోయింది. చివరికి ఎందాక వచ్చిందంటే మా బంధువులు కూడా నాతో మాట్లాడకూడదని పెదాలు బిగించుకునే దాక.
సరిగ్గా అదేటైంలో నేనొక అమ్మాయిని (ప్రేమించే వాణ్ణి. తనూ నన్ను ఇష్టపదేది. ఈ గొడవల్లో తను చాలా హర్ట్ అయ్యింది. “చాలా మంచోడివని, పుస్తకాలు తప్పించి ఇతర గొడవలు ఏవీ తెలియవని విన్నాను. ఇదేంటి? నేను విన్నదానికి ఇప్పుడు నీ ప్రవర్తనకి పోలికే లేదంది. అప్పటికి చదవడం గాల్లో కలిసిపోయింది. ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాను. అదే కాలేజీలో కంటిన్యూ అవడం నామోషిగా అనిపించి, టి.సి. తీసుకున్నాను. టి.సి. తీసుకుని బయటికి వస్తుంటే, ప్లే గ్రాండులో ఆడుతున్న ఆ అమ్మాయి నన్ను చూసి పరిగెత్తుకు వచ్చింది. నా చేతిలో టి.సి. చూడగానే కళ్లనిందా నీళ్లు పెట్టుకుని ప్లీజ్... వెళ్లకు, ఇక్కడే కంటిన్యూ అవ్వు” అంది. కసిగా టి.సిని అక్కడే చింపేసి, ఉండలా చుట్టి విసిరి కొట్టి ఇంటికి వచ్చేశాను. దాంతో “వీడి లైఫ్ ఇంతటితో సరి అనుకున్నారంతా. కసి నుండీ పుట్టిన చదువు
అందరికి నేనొక ప్రశ్నగా తయారయ్యాను. పిల్లలు కౌమారం నుండి యౌవనంలోకి అడుగుపెట్టే టైంలో బహుశా ప్రతి ఇంట్లో ఇలాంటి అలజడి తప్పదేమో! హ్యాప్ డేస్ = సిస్ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తులు ౪ 136
నన్ను ఎలా మార్చాలో మా ఇంట్లో వాళ్లకి తెలీదు. నన్ను నేను ఎలా మార్చుకోవాలో నాకూ తెలిసేది కాదు. ఈ సందిగ్ధ స్థితిలో ఏదో గొడవ జరిగి ఒకరాత్రి అంతా కలసి నాపైకి దాడికి దిగారు. అష్ట దిక్కుల్ని అంతా ఆక్రమించుకున్నట్టు అన్నయ్యలు, అమ్మ, అక్క.. తలో దిక్కునుండి నన్ను తిడుతుండగా అప్పుడే నాన్న ఇంట్లోకి ప్రవేశించారు. విషయం ఆయనకి అర్ధమైంది. 'వాడికి ఎవరూ ఏమీ చెప్పకండి. వాడికి అంతా తెలుసు” అని అందరిపైన గట్టిగా అరిచారు. తర్వాత మెల్లగా తన గదిలోకి వెళ్లి మంచంపై కూర్చున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్. అంతా మాట పడిపోయినట్టు నిలబది నాకేసి నమిలేసేట్టు చూస్తుండగా నాన్న కేసి చూశాను. అంతే! అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా నా ఒళ్లంతా చల్లబడిపోయింది. నాన్న కళ్లనిండా నీరు.. బొట్టు బొట్టుగా చెంపల పైనుండి జారి, గుండెలను తడుపుతోంది. నాలో ఏదో కదలిక... వీళ్లు ఎంత అరిచి గీపెట్టినా మారని నేను, నాన్న కన్నీటి బొట్టుకి చలించిపోయాను. “నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుంటా అని ఆ క్షణంలోనే శపథం చేసుకొని, ఆ పట్టుదలతో కరస్వ్పాందెన్స్‌లో ఇంటర్ ప్యాసై వందేళ్ల చరిత్ర గల “ఊరిస్) డిగ్రీ కాలేజీలో చేరి నేనంటే ఏమిటో నిరూపించుకున్నాను. నా ఏకాగ్రతకు అంతా భయపడేవారు నేనెందుకూ పనికిరాననుకొని, నాతో మాట్లాడ్డం మానేసిన వాళ్లతో నేను ఆ కూడా మాట్లాడ్డం మానేసేవాజణ్డి. ఒక్కోసారి కాలేజీకి పది రోజులపాటు వెళ్లకుండా నా క్ష గదిలో కూర్చుని విపరీతంగా చదివేవాణ్సి. నా మౌనానికి ఇంట్లో అంతా భయపడిపోయేవారు. నాలో ఏ మార్పయినా పరోక్షంగా తీసుకురావాలన్నది నాన్న పాలసీ. ఒకరోజు ఆయన “డబ్బులు కావాలా? ఎక్కడికైనా టూర్‌కి వెళ్లి రాకూడదూ!” అన్నారు. విషయం అర్ధమైంది. కాస్త మనుషుల్లో పడమని దానర్ధం. నిజానికి భవిష్యత్‌లో ఏం చేయాలనే ఆలోచనల్లో గడుపుతున్న గడియలవి. మా కాలేజీ ఎదురుగా గోడకి అంటించిన ఒక సినిమా పోస్టర్లో కనిపించిన డి.ఎఫ్.టి. (డిప్లోమా ఇన్ ఫిలిం టెక్నాలజీ) అక్షరాలు నన్ను విపరీతంగా ఆకర్షించాయి.
“ఏ టూరుకీ వెళ్లను. నా డిగ్రీ పూర్తవబోతుంది. తర్వాత “అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర్ప్చించండి చాలు” అన్నాను నాన్నతో. నా భవిష్యత్ కార్యాచరణ స్పష్టమవడంతో, అప్పటికి ఇంకా పడుతూ లేస్తూ కొనసాగుతున్న నా ఇంటర్ (ప్రేమాయణానికి కొన్ని కారణాల వలన పుల్‌స్తాప్ పెట్టాల్సివచ్చి, నా మనసు లోని మాటని 60 పేజీల సుదిర్హ ఉత్తరంగా రాసి అక్కడితో ఆమెకు 'బై చెప్పెశాను కూడా.
క
నా కోరిక ప్రకారం డైరెక్షన్, స్క్రీన్‌ప్లే కోర్సులో చేరిపోయా. మొదట్లో కొన్నాళ్లు ఇంటినుండే రెండు రైళ్ళూ, రెండు బస్సులూ మారి అప్ అండ్ డౌన్ చేసేవాజ్డి. తెల్లవారి లేచి అదరా బాదరాగా పరిగెడ్డుంటే అమ్మ నేను వీధి మలుపు తిరిగే వరకూ వాకిట్లో నిల్చుని అలా చూస్తుండిపోయేది. (అమ్మ ఇప్పుడు లేకపోయినా ఆ ప్రేమ నిండిన చూపులు ఇప్పటికీ నన్ను స్పర్శిస్తూ వెంటాడుతూనే ఉంటాయి) లోకాన్ని చూపిన 'ఫిలిం ఇనిస్టిట్యూట్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో రాజా (ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి), మురుగేశ్, బాల నా జతగాళ్లు. వెల్లూరు లైబ్రరీ దేశాన్ని పరిచయం చేస్తే ఇనిస్టిట్యూట్ లైబ్రరీ ప్రపంచాన్ని చూపించింది. మా కాలేజీ కాంపొండులోనే ఒక బారుందేది. మొదటి క్లాసు అవగానే, బార్‌లో కూర్చుని ప్రపంచ సాహిత్యంపై, సినిమాలపై డిస్కషన్స్ మొదలుపెట్టేవాళ్లం. ఎంత డీప్‌గా అంటే అసలు కాలం తెలిసేది కాదు. రాత్రి ఏ పన్నెండో అయ్యేది. ఆ హ్యాపీడేస్ తిరిగి వస్తాయంటారా?! కాలేజీ తరపునుండి ఒకసారి ఢిల్లీలో జరిగిన “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివలొకి వెళ్లినప్పుడు ఒక సినిమా నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. చూస్తున్నంత సేపూ చెంపలు తడిసిపోయాయి. సినిమా అయిపోయి, అంతా బయటకి వెళ్లివోవడం కూడా నాకు గుర్తులేదు. ఈ లోకంలోకి వచ్చేసరికి ఎదురుగా తెల్లటి వెండితెర, హాల్లో ఒక్కడినే. మనలో సత్తా ఉండాలే కానీ ఆ తెల్ల తెరపై గొప్ప జీవితాన్ని ఆవిష్కరించి చూపొచ్చనిపించింది ఆ క్షణంలో. అప్పటి వరకూ నన్ను ఏడిపించిన సినిమా 'చిల్రన్ ఆఫ్ హెవెన్), ఇరానీ సినిమా. భారంగా హాలు బయటకి వచ్చేసరికి, ఎదురుగా ఆ చిత్ర దర్శకుడు 'మజీద్ మజ్జీ చెబుతున్న మాటలు వింటూ జనం. చిన్న పాయింట్ తీసుకుని హృద్యంగా చిత్రీకరించిన దర్శకుడికి మనసులోనే జోహార్లు చెప్పుకున్నాను. ఫిలిం కోర్సు ముగింపు రోజనుకుంటా... జెమినీ ప్లయ్‌ఓవర్ దగ్గరున్న బస్తాపులో నిల్చుంటే “తర్వాతి బీవితం ఏంటి?” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజా. గాఢంగా ఊపిరి వదిలి “చిల్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమా తీయాలని ఉంది అన్నాను. “అలా తీయాలంటే మనం ఆ ఫీల్దులోనే తచ్చాడుతూ ఉండాలి. హైద్రాబాద్ పద, మా నాన్న క్షేమంగా వెళ్లి లాభంగా రండి” సినిమా తీస్తున్నారు. దానికి మనిద్దరం అసోసియేట్ డైరెక్టర్లుగా ఉందాం” అని తనతో నన్నిక్కడకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీ గుండెల్లో “బొమ్మరిల్లు కట్టుకుని అందులోనే ఉండిపోయిన సంగతి మీకూ తెలుసు కదా! (26.08.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) హ్యాన్ డేస్ = సిన్ ప్రముఖల చిన్ననాద్ లీస్ గుర్తులు ఇ 138 |
జ
|.
| స్టా టల
వ. గ గ ఈ
'తాగుబోతు' రమేష్ అమ్మను నవ్వించదానికే “తాగుబోతు నయ్యాను
(నల్లఐబంగారం” గనిలో వుట్టిన వెంటితెర బంగారం అతను, 'అక్సినేని ఫిల్ట్ ఇనిస్లీట్యూటొ లో చేరి తనలోని నటుడిని మరింత పుటం పెట్టుకున్నాడు. శిక్షణలోనే 'తాగుబోతు%గా నటించి బాలీవుడ్ నటుడు 'కోన్దో ముఖిర్ణీ త్రో వోల్చబడ్దాడు. మొదట్లో వ్యోంగోవర్” లాంటీ లఘు చిత్రాల్లో కనివీంచినా, *“జగదం”తో చి(తరంగ అరంగేట్రం చేని 'మవాోత్మ్శ 'భీమ్లీ కబడ్డీ జట్టు “అలా మొదలైంది. “రచ్చ “ఈగ కల్వాణవైభోగం” వరకు దాదాపు 60 పైచిలుకు సినిమాల్లో నటించాడు. 'అలా మొదలైంది"లో “తాగుబోతు” ముద వేయించుకుని, దాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న తాగుబోతు కాని “తాగుబోతు రమేవ్”
“బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అన్న దేవదాసు మా (ప్రొటని తు.చ. పాటిస్తూ వస్తున్నాను. కాబట్టి నా జీవితంలో అన్నీ “హ్యాపీ హ్యాపీడేసే “అది సరే, ఎంత తాగుబోతు'వైతే మాత్రం పోల్చుకోడానికి ఆ దేవదాసే దొరికాడా నీకు?” అని ముఖం చిట్లించి ముక్కు మూసుకోకండి - ప్లీజ్! నేను జెప్పేది జెర ఇనండి... షార్! కోదండమా? గోడ కుర్చీనా? గొరుసు జగదీశ్వర రెడ్డి + 139
నల్లబంగారం పండే సీమ నుండి వచ్చినోన్ని నాన్న గోదావరిఖని సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేసేవాడు. నాకు పదేళ్ల వయసు వచ్చేవరకు బడిముఖం చూడనేలేదు. అలాగని చదువుకోలేదని కాదండోయ్! మా కాలరీస్ క్వార్టర్స్‌లోనే ప్రైవేట్‌గా వహీదా ఆజ్మీ టీచరమ్మ (ప్రస్తుత లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ మరియు డిస్టిక్‌లు కాంగ్రైస్ మహిళా స్పీకర్) దగ్గర ఐదు వరకు చదివాను. చెప్పడం కాదుగానీ, ఆమె యమ స్ట్రిక్ట్. తప్పు చేస్తే కోదండం లేదా గోడకుర్చీ! ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఛాన్స్ ణి మాకే ఇచ్చేది. ఆమె దగ్గర చదివిన నాతోటి వాళ్లలో కొందరు ఐఏఎస్. ఐపిఎస్‌లు అయ్యారంటే ఆమె ఎంత గొప్ప టీచరో అర్ధం చేసుకోండి. 'కళిని కనుగొన్న మార్తమ్మ టీచర్
ఆ తర్వాత జిల్లాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరాను. దొధ్గ్లో నుండి మందలో పడ్డట్టు ఎక్కడ చూసినా పిల్లకాయలే. అదొక కొత్త లోకం. అదేందోగానీ చదువులతల్లి 'సరస్వతమ్మ' నన్ను చూడగానే దౌడుతీసేది. ఆమెను అందుకోలేక నాకు ఆయాసం వచ్చేది. ఇక నా వశం కాదని ఆమెని వదిలేసి, మెల్లగా ఆటల వైపు మళ్లాను. ఎప్పుడు చూసినా గేమ్స్. క్లాసులో కూర్చునేది తక్కువ మనం. తరచూ బడి ఎగ్గొట్టేవాణ్సి. మార్తమ్మ టీచరు నా 'షఖలో చూసి ఒరేయ్ నీలో గొప్పోని లక్షణాలున్నాయిరా. ఎప్పటికైనా పైకొస్తవు. డుమ్మా కొట్టకుండా బడికి రారా' అని అడుక్కునేది. నేను వినకపోతే, ఒక్కోసారి ఏద్బేది. టీచర్లలో కూడా “అమ్మలు ఉంటారని అప్పుడే తెలిసింది నాకు. తువాకి రాముడి దెబ్బకు నాకు సంకెళ్లు
మా వీధిలోకి *'తుపాకి రాముడు" (పిట్టల దొర) వచ్చిండంటే నాలాంటి పిల్లలందరికీ చాలా సరదాగా ఉండేది. వాడి నెత్తిమీద టోపీ, భుజానికి వేలాడే (పేలని) తుపాకీ, వాడి టక్కు టెక్కు... మాటతీరులో వెంట వెంటనే దొళ్లే ప్రాస పదాలు నన్ను మరింత ఆకట్టుకునేవి. “తుపాకి రాముడు” ఊర్లోకి వచ్చాడని తెలిస్తే నా పనులన్నీ ఆపేసి వాడిని వెతుక్కుంటూ వెళ్లి, వాడి కూడా తిరుగుతూ, రాత్రి వాడు ఊరి పొలిమేర దాటేవరకు వాడితోనే ఉండి ఇంటికి వచ్చేవాణ్ణి. వాడి మాటలు నన్నంతగా లోబరుచుకునేవి. చెప్పాలంటే ఒక "కిక్ ఇచ్చేవి. తుపాకీ రాముడు వచ్చాదని తెలిస్తే మా ఇంట్లో హడల్. నేను చేతికి చిక్కనని తెలిసిపోయేది. వాడు ఊర్లోకి వచ్చినట్టు నాకంటే ముందే మా ఇంట్లో వాళ్లకు తెలిసిందా ఇంకే సంగతులు. నన్ను కదలకుందా గుంజకు కట్టేసేవారు. నేను గింజుకోవడమే తరువాయి. 'హ్యాల్ డేస్ - సిన్ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తులు ఇ 40
నటించి నాన్నను ఏడిపించేశాను
ఒకసారి రామకృష్ణాపూర్‌లో ఉండే మా చిన్నాన్న ఇంట్లో ఏదో ఫంక్షన్. దానికి అమ్మ, నాన్న ఇద్దరూ విధిగా హాజరు కావల్సివుంది. వచ్చే జీతమే తక్కువ కాబట్టి ఫంక్షన్‌కు వెళ్తే మస్తర్ పోతుందని నాన్న ఉదయం మామూలుగానే డ్యూటీకి వెళ్లాడు. పదకొండు గంటల టైంలో అమ్మ నన్ను పిలిచి “ఒరే, అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదని చెప్పి నాన్నని పిలుచుకుని రా” అని పంపించింది. అక్కడ ఎలా చెబితే బాగుంటుందో దారిలోనే బాగా రిహార్సల్ చేసుకుంటూ వెళ్లాను. నాన్న కనిపించగానే “అమ్మకు సీరియస్‌గా ఉంది. వెంటనే రమ్మని” వడుపు నటిస్తూ చెప్పేసరికి నాన్న నిజంగానే ఏడ్చేశాడు. చుట్టూ ఉన్న నాన్న కొలీగ్స్ “రాములు, వెళ్లు వెళ్లు... ఏద్వకు' అని గుండె ధైర్యం
ం చెప్పారు. అప్పుడనిపించింది. నాలో మామూలు నటుడు లేడని (నాలో నటున్ని నేను మాత్రమే గుర్తిస్తే సరిపోదు కదా. మీరంతా గుర్తించినప్పుడే కదా సెలబ్రిటీని అయ్యేది) నాన్న తర్వాత సంపాదించే మొగోట్జి!
అదృష్టం అందలమెక్సిస్తే బుద్ధి బురదలకు గుంజిద్దని, మార్తమ్మ టీచర్ ఎంత మొత్తుకుంటే ఏం లాభం? ఏడో తరగతి పూర్తి చేసి, అదేదో డబల్ ఏం.ఏ. పట్టాలాగ భ్రమచెంది బయటికి వచ్చేసి మోహన్ మేస్త్రీ మెకానిక్ షాపులో చేరిపోయా. చేతినిండా పైసలు. మా అన్నదమ్ములం ముగ్గుర్లో నాన్న తర్వాత సంపాదించే మొగోణ్జి నెనె. ఇంట్లో ఖర్చులకు డబ్బులిచ్చినప్పుడల్లా అమ్మ నావైపు గర్వంగా చూసేది. చాలా కుషీ కుషీ అయ్యేది. ఇక ఊర్లో విద్యార్థుల మధ్య ఏ రకం గొడవలైనా సరే సలహా కోసం నా దగ్గరకు వచ్చేవారు. దాంతో కాస్త పెద్దరికపు హోదా కూడా వచ్చేసింది. ఎక్కడ కనిపించినా 'నమస్తే పెట్టుడు పిల్లల ముందు సెలబ్రిటీ లెవల్ మెయింటెయిన్ చేసేవాణ్డి. మెకానిక్ షాపులో పనిచేసినా, ఊరిమీద పిల్లకాయల పంచాయితీలకు వెళ్లినా నా బాల్యం వదులుకునేవాణ్లి కాదు. (వదులుకుంటే మళ్లీ దొరకదని తెలుసు). ఖాళీ దొరికితే చాలు నా జట్టుగాళ్లు గోపాల్ శీను, ప్రసాద్, పెరక రవి, బక్కరవి, శ్రీనులతో గోలీలు, పత్తాలు, బంతాట... ఒకటి కాదు. ఎన్ని రకాల ఆటలో ! నులకమంచానికి కట్టి ఉతుకుడే ..
మెకానిక్ పని చేయడంతో చేతినిండా డబ్బులే డబ్బులు కదా, మనసు సినిమాలపైకి మళ్లేది. ఇంట్లో తెలియకుండా సినిమాలకు చెక్కేసేవాణ్ణి. ఒకసారి రాజెష్ టాకీసులో 'సింధూరపువ్వు' సినిమా చూస్తున్నాను. అదే హాల్లో మా అన్న ఉన్న సంగతి నాకు తెలీదు. నాకు కన్పించకుండా తప్పించుకుని, ఇంటికి వెళ్లి అమ్మకి చెప్పేశాడు. గొరుసు జగదీశ్వర రెడ్డి శ 141
నన్ను పట్టుకోడానికి వల పన్నారంతా, వావురాలను పట్టుకోడానికి బోయవాడు గింజలు చల్లినట్టు. సినిమా చూసి ఇంటికి రాగానే నా కోసం ప్రత్యేకంగా కోడిగుడ్లతో కూర చేసి ప్రేమగా తినమని ముందుంచారు. తిండిని ఆస్వాదిస్తున్న టైంలో అందరూ కలిసి 'దొరికాడురా దొంగి అని నా పెడరెక్కలు విరిచి నా వెనకున్న నులక మంచానికి కట్టేసి సినిమా పిచ్చి తగ్గించుకుంటావా లేదా? అని ఉతుకుదే ఉతుకుడు. రేవులో కూడా బట్టల్ని అంత గట్టిగా బండకేసి బాదరేమో! అలా మొదలయ్యింది
అమ్మ నన్ను కొట్టినా తట్టుకునే వాణ్డి కాని, ఆవె బాధవడితే తట్టుకోలేకపోయేవాణ్ణి. నాన్న బొగ్గు కార్మికుడు కాబట్టీ తీవ్రమైన పని వత్తిడి వల్ల రోజు వారీగా తాగి ఇంటికి వచ్చేవాడు. తాగిన మత్తులో అమ్మపై వీరంగం ఆడి, నెమ్మదిగా బయటికి వెళ్లేవాడు. అమ్మ దిగులుగా ఉండడం చూసి భరించలేక నాన్న అటు వెళ్లగానే అచ్చం అప్పటివరకు నాన్న తూలినట్టె తూలుతూ ఆయన్ని అనుకరించి అమ్మను నవ్వించే ప్రయత్నం చేసేవాళ్డి. దాంతో అమ్మ బాధ మరిచి, నవ్వేసి, నన్ను దగ్గరకు తీసుకుని ముద్దాదేది. అమ్మను నవ్వించగలిగినందుకు చాలా గర్వంగా ఉండేది. అమ్మ నవ్వుతూనే “అరేయ్, తాగుబోతు యాక్షన్ బాగా చేస్తున్నవ్ గని, పెద్దగయినంక నీవు గిట్ల తాగేవు కొడుకా” అనేది. తాగడం వల్ల జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో కళ్లతో చూసినవాణ్ణి కాబట్టి తాగుబోతుతనానికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాను. గుడ్డ పీలికలనే పాదరక్షలు చేసేది
అమ్మతో అప్పుడప్పుడు మా అమ్మమ్మవాళ్ల ఊరు తాడిచెర్లకు వెళ్లేవాణ్లి. (నాన్నది సంసారానికి ఏ మూలకీ చాలని జీతం, పైగా నలుగురు సంతానం... దాంతో, మాకెవరికీ చెప్పులుండేవి కావు) దారిలో పెద్ద ఇసక మేట వచ్చేది. ఎండలో నడవాలంటే నరకమే. కాళ్లు కాలిపోయేవి. ఇంటినుండి బయల్టేరినప్పుడే కొన్ని పాత గుడ్డ పీలికలను సంచిలో పెట్టుకునెది అమ్మ. సరిగ్గా ఆ ఇసక మేట వచ్చేసరికి పాదాల చుట్టూ వాటిని చుట్టి (చూద్దానికి వొదాలకు దెబ్బ తగిలితే బ్యాందేజ్ వేసినట్టు ఉందేది) నడిపించేది. నడుస్తున్నప్పుడు బాగా దాహం వేస్తే చేలల్లో పారే నీటి కాలవల దగ్గరకు తీసుకెళ్లి మేం సరిగ్గా తాగలేమని, తనే దోసిళ్లతో పట్టి మా నోటి దగ్గర పెట్టి తాగించేది. బంగారు, వెండి గ్లాసుల్లో తాగినా ఆ అనుభూతి రాదేమో, తాడిచెర్ల వెళ్లినప్పటి ఆ సన్నివేశాలు ఏవి ఎప్పుడు గుర్తుకొచ్చినా గుండె చెరువవుతుంది. ఎంతైనా అమ్మ అమ్మే కదా! హ్యావ్ డేస్ - సిన్ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు ౪ 142
అమ్మలేని తనం ఎంత శూన్యమో |
ఏ సినిమాకైతే నన్ను వెళ్లద్దని వీర బాదుడు బాదిందో, అదే సినిమా హాల్లో 'రిక్షావాడు సినిమా చూస్తుండగా అమ్మ చనిపోయిందని కబురొచ్చింది. అహర్నిశలు మా బాగు కోసం పరితపిస్తూ ఉందే అమ్మని టి.బి. జబ్బు వెన్నాడుతోందని తెలిసినా ఏం చేయలేకపోయాము. అమ్మ పోవడంతో జీవితమే శూన్యం అనిపించింది. కొన్నాళ్ల వరకు మనిషినే కాలేదు. అమ్మ పోయిన ఐదేళ్లకే నాన్న కూడా చనిపోవడంతో అన్నదమ్ములందరం కలిసి చెల్లెలి పెళ్లి చేశాం.
అప్పట్నించి ఇంటి బాధ్యతలంటూ నాకేమీ లేకపోవడంతో మనసు మళ్లీ చదువు అనేకంటే నాలో ఉన్న కళని మెరుగుపెట్టుకోవాలంటే ఏదైనా నటనాలయంలో చేరాలనిపించింది. అప్పటీ వరకు ఆధారం చూపించిన కాశిపేట లింగయ్యగారి వద్ద సెలవు తీసుకుని, ఆయన వద్ద చేస్తున్న పనికి స్వస్తి పలికి దీక్షితులుగారి అధ్యక్షతన నడిచే “అక్కినేని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరాను.
శిక్షణ కాలంలో ప్రాక్టికల్స్ తీసుకోడానికి వచ్చిన 'కళ్లు రఘుగారు నా తాగుబోతు నటన చూసి బాలివుడ్ నటుడు 'కేస్తో ముఖర్జీతో పోల్చడం పెద్ద కితాబు. ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయ్యాక, అవకాశాల కోసం ఎదురుచూసే క్రమంలో వేణు, ధనరాజ్,చిత్రం' శీను, ఉత్తేజ్‌లాంటి మిత్రుల పరిచయం.... 'జగడం'లో నటించే అవకాశం రావడం... తర్వాత కృష్ణవంశీగారి 'మహాత్మ'లో... రచయిత లక్ష్మీభూపాల్ గారి ద్వారా నందినిరెడ్డి గారి పరిచయం... చిత్రసీమలో నా ఆరోహణ క్రమం 'అలా
(| మొదలైంది, (02.09.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
గొరుసు జగదీశ్వర రెడ్డి శ 143
ణా వాల్ల సం ఫాం లణాలాా [ . “జి ఓ ఉక్త " ణీ శ బా తళ లాల తయమూలుత్ల ' అనూప్ రూబెన్స్ పాలడబ్బాల మిద మొదలైంది యా అల్లో ఇ... నా సంగీత ప్రయాణం వదవోరణాల హై(ద్రాబాదీ అతదు. దిగీ చదువుతూనే సినిమాల్లో ప్రవేశించి, 200 పై చిలుకు చిత్రాలకు కీబోర్డు ప్లేయర్‌గా పని చేశాడు. దర్భకుదు తేజ 2” చిత్రంతో మ్యూజిక్ డైరెక్టరుగా అరంగేట్రం చేసీ (గౌతమ్ ఎన్. ఎన్. స (బోణి “అందరి ఐంధువయా 1(పేమకావాలి) పూలరంగడు '“ఇష్స్ “లవ్‌లీ “ఆటోనగర్ నూర్య్య సుకుమారుడు” నుంది ఈ మధ్య వచ్చిన 'పైనావసూలొ వరక్షు పలు చిత్రాలకు ఎన్నో మెలోడీ సాంగ్భ్ అందించాడు. అమితాబ్ బుద్దా వోగా తేరా బావ్” చిత్రానికి నేపథ్య నంగీతం సమకూర్చాడు. 'ఏ కాలీ కాలీ అంఖే తేరీ లాంటి పాటలతో అప్పుడప్పుడు గాయకుడిగా కూదా యువతను ఉర్రూతలూవుతున్న నవతరం మ్యూజిక్ డైరెక్టర్ అనూవ్ రూబెన్స్. “'మ్యూజిక్‌పై ఆసక్తి పుట్టుకతో అబ్బిందో, లేక గత జన్మలో తీరని తృష్టో తెలీదు కానీ నాలుగేళ్ల వయసులోనే 'లాక్షోజిన్' పాలడబ్బాలను బోర్లించి, కర్రలతో ధన ధన బాదుతూ ఇంట్లో ప్రకంపనాలు సృష్టించేవాణ్డి. స్కూలు నుండి రావడం ఆలస్యం... రోజూ ఇదే తంతు. నా గోల భరించలేక నాన్న బుల్లి డ్రమ్స్ కొనిచ్చి, హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 144
దూరంగా వెళ్లి వాయించుకోమనేవారు మా స్కూల్లో (సెయింట్ జేవియర్). ఆదివారం చర్చి ప్రేయర్లో ఆ డ్రమ్స్ పై నా ప్రతాపం చూపిస్తూ ఆ వయసులోనే తబలిస్టులా బిల్డప్ ఇచ్చెవాణ్డి. నా తొలి గిటారుకు తీగల్లేవు
అప్పట్లోనే మా క్వార్టర్స్ ఎదురుగా అష్రఫ్ అనే ఆయన కిరాణ షాపు నడిపేవాడు. అక్కడికి వెళ్లినప్పుడల్లా వరుసగా ఉండే పిప్పరమెంట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, సీసా మూతలపై నా వేళ్లు నాకు తెలీయకుండానే లయబద్ధంగా వాయించేవి. ఆయన విసుక్కోకుండా ముచ్చటగా నా తబలా శబ్గాన్ని ఆస్వాదించేవాడు. ఒకరోజు “మ్యూజిక్ అంటే ఇష్టమా? నా దగ్గర ఒక గిటారుంది. కావాలంటే నీకు రూ. 125 కి అమ్మేస్తా అన్నాడు. సరే అని ఇంటికొచ్చి అప్పటి వరకు నా కిద్దీబ్యాంకులో దాచుకున్నవి తక్కువైతే ఇంట్లో గొడవ చేసి మరికొన్ని డబ్బులు కలిపి అష్రఫ్ చేతికి ఇచ్చాను. తీరా చూస్తే వైర్లు తెగిపోయిన గిటారది. దానికి వైర్లు వేయించి, సికింద్రాబాద్, రెజిమెంటల్‌బజార్ చర్చిలో ఇన్'స్తుమెంట్స్ వాయించే ఓబేద్ అన్నయ్యతో ట్యూన్ చేయించుకున్నాను. ఇక అప్పల్నీంచి గిటారే నా లోకమైంది. గురువంటూ ఎవరూ లేరు. ఎవరైనా వాయిస్తుంటే గమనిస్తూ స్వతహాగా ప్రాక్టీసు చేసేవాజ్లి. గిటారు వెనకే కీబోర్జాచ్చే డుం డుం....
మ్యూజిక్‌కి సంబంధించిన ఏ ఇన్'స్తుమెంట్ కనిపించినా నా కళ్లకి పండుగలా ఉండేది. డ్రమ్స్, గిటార్‌ల తుప్పు వదలగొడుతున్న టైంలో ఒకసారి మా ఇంటి దగ్గర్లో
'లైట్ మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంటే వెళ్లాను (అప్పట్లో మా ఇల్లు గోల్కొండ క్రాస్‌రోర్స్‌కి
సమీపాన ఎస్.ఆర్.టి. క్వార్టర్స్‌లో ఉండేది). అక్కడ ఒకాయన కీబోర్డు వాయించడం చూసి ఆశ్చర్యపోయాను. ఒకే కీబోర్డులో పియానో, గిటార్, ఆర్టన్, అకార్జియన్ లాంటి రకరకాల ఇన్'స్టుమెంట్స్ వినిపించాయి. చిన్న బటను ఛేంజ్ చేస్తూ శబ్దం మార్చేయడం భలే వింతగా అనిపించింది. ఇంటికి రావడంతోనే అలాంటి కీబోర్డు కావాలని రాగం మొదలెట్టాను. నాన్న తలపట్టుకున్నాడు. అప్పట్లో కీబోర్డు ఖరీదు ఆరేడు వేలుండేది. విక్రమార్శుడిలా పట్టు వదలకపోయేసరికి, నా పోరు పడలేక 'టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో ప్యాసైతే కొనిస్తా అని మాటిచ్చాడు చివరికి. నిజానికి నాది ఫస్టు క్లాసులో ప్యాసయ్యే బుర్రకాదు. టైమంతా మ్యూజిక్‌పైనే ఉంచి ఆవరేజ్‌గా ప్యాసవుతూ వచ్చేవాణ్ణి. కీబోర్టుపై మోజుతో సంగీతాన్ని పక్కకు నెట్టి మనసంతా చదువుపైనే ఉంచి, ఫస్ట్ క్లాసులో ప్యాసై కీబోర్డు సాధించుకున్నాను. మ్యూజిక్ కోసం అంత పట్టుదల వచ్చేసేది నాలో. గొరుసు జగదీశ్వర రెడ్డి * 145
రేంజర్ సైకిల్ ఓం ఫట్
ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి చిన్నపాటి సెలబ్రిటీతనం కూడా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయట ప్రోగ్రాంలో గిటార్ వాయించేవాణ్ణి. అట్లా కూడబెట్టుకున్న డబ్బులతో సెకండియర్‌కి రాగానే హీరో రేంజర్ సైకిల్ కొన్నాను. నా కష్టార్దితంతో కొన్న తొలి వాహనం అది. కొత్త సైకిల్‌పై స్టయిల్‌గా ఆ మర్రోజే కాలేజీకి వెళ్లా. ఉదయం స్టాండులో పెట్టి, లాక్ చేసి, క్లాసులకు అటెండై సాయంత్రం ౩ గంటలకి బయటకి వచ్చెసరికి సైకిల్ మాయం. ఒక్కసారిగా దుఃఖం ఎగదన్నుకొచ్చింది. ఎవడో ఎత్తుకుపోయాడు. సైకిల్‌కి కట్టిన ప్లాస్టిక్ సీల్స్ కూడా ఇంకా విప్పలేదు. పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇద్దామంటే టూ వీలర్ కూడా కాదు. క్లాస్‌మేట్ అజయ్ నన్ను ఓదార్చి, చివరికి వాడి సైకిల్ పైనే మా ఇంట్లో దిగబెట్టడం ఇప్పటికీ మర్చిపోలేను. తప్పించుకున్న తొల్టిగ్యాంగు
చదువు, మ్యూజిక్ తప్పించి మరో ఆలోచన ఉందడకపోవడంతో నాపై 'బుద్ధిమంతుడి' ముద్ర వేసి, అమ్మాయిల వెనక బెంచీపై కూర్చోబెట్టేవాడు. నాతోపాటు నవీన్ అని మరొకడుండేవాడు.
ఒకసారి ఇంటర్వెల్ టైంలో ఏవైనా స్నాక్స్ తిందామని 'బ్లూఫాక్స్' వరకు నడుస్తున్నాం. మా ముందు కొందరమ్మాయిలు.. మా వెనక ఒక తొట్టిగ్యాంగు. మేం అంతగా గమనించలేదు కానీ ముందు వెళ్తున్న అమ్మాయిల్లో ఒకర్ని టీజ్ చేస్తున్నారు వాళ్లు. నిజానికి ఆ అమ్మాయి ఉందేది అదే గల్లీలో. ఈ సన్నివేశాన్ని ఆమె అన్నలు మేడ పైనుండి చూసి గబగబ దిగి రావడం, ఈలోపు తొట్టిగ్యాంగు పరార్ అవడం, ఆ అన్నలు సరాసరి మా దగ్గరికి వచ్చి ముందు నా కాలర్ పట్టి గుంజి తర్వాతనా పక్కనున్నశ్యామ్ పై చెయ్యి చేసుకోవడం... ఏం జరుగుతుందో, వాళ్లెందుకు మాపై దాడిచేస్తున్నారో మొదట అర్ధం కాలేదు. విషయం తెలిసి తెల్లబటోయాం. మేం కాదని ఎంత చెప్పినా వినిపించుకోరే. మాపై వాళ్లు దాడికి దిగిన సంగతి "సెయింట్ జోసఫ్” కాలేజీలో చదివే నా మిత్రుడు జగదీళ్‌కు తెలిసి గొడవపడ్డానికి కొందర్ని తీసుకుని మా కాలేజీకి వచ్చాడు. ఈ విషయం మా ప్రిన్సిపాల్‌కి తెలిసింది. రాద్ధాంతం చేయవద్దని వాళ్లకు సర్ది చెప్పి పంపించేశాడు. అనవసరంగా మాపై దాడికి దిగారనేది తలుచుకుంటే ఇప్పటికీ మనసు రగిలిపోతూనే ఉంటుంది. హ్యాపీ డేస్ = సినీ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తుల 146
దెయ్యాల దెబ్బకి “సొల్లుగాడు పరార్ ఇంట్లో ఒక్కడినీ చదవడం కంటే కంబైన్స్ స్టడీ చేస్తే బాగుంటుందని, ఎగ్జామ్స్ టైంలో మా (ఫెండొకడు రాంనగర్‌లో ఉంటే వాడి దగ్గరకి వెళ్తుందేవాణ్లి. వాడుందేది పెంట్ హౌస్‌లో. మరొకడు కూడా మాతో పాటు స్టడీ చేయడానికి వచ్చేవాడు. వాడు రావడం కాదుగానీ మా తల బొప్పి కట్టేది. చదవడానికి ఉంచుకున్న మా టబ్రెయిన్ని వాడు రావడం రావడంతోనే తినేయడం మొదలెట్టేవాడు. 'మా ఇంట్లో టీవీ, సోఫాలు, మంచాలు, కర్టెన్లు, గరిటెలు, చివరకి లావెట్రీలో వాడే చీపురు... అన్నీ ఫారెన్‌వే అని కోతలు కోసేవాడు. వాళ్ల వాళ్లంతా విదేశాల్లోనే ఉంటారని.... అన్నీ గొప్పలే. ప్రతి రోజూ ఇదే సొల్లు. వాడి సొల్లు పరాకాష్టకు చేరేసరికి అంతా కలిసి ఒక ష్లాన్ వేయక తప్పలేదు. రాత్రి 1 గంట వరకు చదువుకుని పెంట్ హౌస్ ఆరుబయట పడుకునేవాళ్లం. ప్రతిరోజూ సరిగ్గా ౩ గంటలప్పుడు లేచి వాడు పడుకున్న పరుపుని అటిద్దరం ఇటీద్దరం పట్టుకుని (మంకీ క్యాప్స్ తగిలించుకునేవాళ్లం) అమాంతం తీసుకెళ్లి పక్కింటి డాబాపైన మెల్లగా వదిలేసి వచ్చి కామ్‌గా పడుకునేవాళ్లం. వాడు పొద్దున్నే నిద్ర లేచి విషయం అర్ధంకాక జుట్టు పీక్కునేవాడు. దూరం నుంది వాడి ఫీలింగ్స్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్లం. తర్వాత రోజు మరో డాబాపైన (అక్కడ ఒక డాబా పైనుండి మరో డాబా పైకి వెళ్లడం సులువు. అన్నీ ఒక దాన్నొాకటి అంటుకునే ఉండేవి). ఇంకోసారి దైనేజ్ పైపు పక్కకి తీసుకెళ్లి వదిలేవాళ్లం. ఏరోజుకారోజు ప్లేసు మార్చేసేవాళ్లం. వాడు క్ మేం బనాయిస్తామని చెప్పడానికి మొదట్లో సిగ్గుపడి తర్వాత ఎప్పుడో చెప్పినప్పుడు, మేమంతా భయం అభినయిస్తూ “అరే, ఇలాంటి పనులు దెయ్యాలు చేస్తాయని మా తాత చెప్పేవాడ్రా!? అనేసరికి వాడి గుండెలో రాయిపడింది. అంతే! మర్రోజునుండి ఆ ఛాయల్లో కనిపిస్తే ఒట్టు. మా పాచిక పారడంతో అంతా పండగ చేసుకున్నాం. ప్రేమ దెబ్బకు ట్యూషన్ బంద్ డిగ్రీలోకి వచ్చేసరికే స్టూడెంట్స్‌లో సెలబ్రిటీగా మారిపోయాను. వీలు దొరికినప్పుడల్లా ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. ఈ విషయం ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసేవాణ్ణి కానీ, ఆ ప్రోగ్రాం చూసినవాళ్లలో ఎవరో ఒకరు మా నాన్నతో 'మీ వాడు గిటార్ చాలా బాగా వాయిస్తాడు. మొన్న మ్యూజిక్ ప్రోగ్రాంలో వాడిదే హైలైట్ ॥ అని చెప్పినప్పుడు మాత్రం ఆయన విషయం అర్ధంగాక ఆశ్చర్యపోయి చూసేవారట.
నా గ్రూప్ ఎం.ఇసి. కావడంతో కామర్స్ సబ్టెక్టుకు మాత్రం ట్యూషన్‌కి వెళ్లేవాణ్ణి. అప్పటికే స్వంత డబ్బులో కొన్న సైకిల్‌ని దొంగలు ఎత్తుకుపోవడంతో సెకండ్ హ్యాండ్ లూనాపై తిరిగేవాజ్ణి. మా ట్యూషన్‌లో ఇతర కాలేజీ అమ్మాయిలు కూడా ఉండేవారు. మ్యూజికల్ ఇన్'స్టుమెంట్స్ ప్లే చేస్తానని కొందరు అమ్మాయిలు నాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. అయితే వాళ్ల గురించి పట్టించుకునే సమయం నాకుండేది కాదనుకోండి. ఆ రోజు ట్యూషన్ నుండి బయటికి వచ్చేసరికి (మా ట్యూషన్‌లో చదివే అమ్మాయే... మా కాలేజీ మాత్రం కాదు) గబ గబనా దగ్గరకు వచ్చి 'కొంచెం లిస్ట్ ఇస్తావా?” అంది. సడన్‌గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్ధంకాక కంగారుపడ్డా తడబడుతూనే 'లూనా బాగా వీక్... గుంజదు అని చెప్పా. అయినా ఆ అమ్మాయి అక్కదే నిల్చుని, అటూ ఇటూ చూసి సడన్‌గా “నీవంటే నాకిష్టం.. ఐ లవ్ యూ అంది. ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది. ఒళ్లంతా చెమటలు... బదులు చెప్పకుండా, లూనాపై ఎగిరి కూచుని ఒకటే దౌడు. అంతే! తర్వాత ఆ ట్యూషన్ వైపు వెళితే ఒట్టు. డిగ్రీ చదువుతూనే శశిప్రీతమ్ గారి వద్ద అవకాశం రావడం, తర్వాత చక్రిగారి దగ్గర చేస్తున్నప్పుడు ఆర్‌పి గారితో పరిచయం కావడం, 'చిత్రం' చిత్రానికి పనిచెయడం, తేజగారి 'జై సినిమాలో “దేశం మనదే, తేజం మనదే, వందేమాతరం” అనే పాటతో మ్యూజిక్ డైరెక్టరుగా అరంగేట్రం చేయడం... ఆ వరసలో పలు సినిమాలకు సంగీతం అందించడం.. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. పాజిటివ్ థింకింగ్ ఉంటే.. కాలేజీ క. అట కంత గచ. ర
రోజులే కాదు. ఇప్పుడు నడుస్తున్నవీ, రాబోయేవి కూడా హ్యాపిడే సనా దృష్టిలో.
(09.09.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 148
త క. శ! ఖే సూ క ఖ | _ శే లే [ ఖీ శే దీఫు లా అరరాత్రి ఆడపిల్లలు (ఖ్ గ్‌ా క అనం ఆటోగ్రాఫ్ కోసం వచ్చారు
నేనే... నానీనే. నేనే నానీనే.. అరె అరె అరె ఓ... " అంటూ “ఈగై”
రాష్ట్రమంతటా వాల్‌చెల్ చేనిన పాటగాదతదు. ఆరేళ్లక్రితం మిక్కీ
జె మేయర్ సంగీతంలో 'జూబిలికి తెలియదు లేరా” (టెన్స్‌క్లాన్) పాటతో
నీనీ అరంగేట్రం చేశాడు. ఆ వరసలో నాచోరే నాచోరే' (యమదొంగ,
'లవ్ యూ రా” (చిరుత, విచ్చి వీచ్చిగా” (గధీరు, సత్వం ఏమిటో
స్వవ్నం ఏమిటో (అతిథి, 'లచ్చువమ్మ లచ్చువమ్మ” (రాజన్న,
“సెలెంటు చూవులోడు” (రచ్చ), “దో అనుకుంటే” (అలా మొదలైంది)
నుంది మొన్నటి చూనవసేవే మాధవసేవ” గణిరిడినాయి) వరకు
దాదావు రెందు వందలపైనే పాటలు పొదాదు. నంగీతంతో పొటు
ఇంజునీరిం/ వట్టాని ఏకకాలంలో సాధించిన నవ్వసాచిగా, (శావ్వతకు
మారుపేరుగా దూసుకుపోతున్న నవతరం గాయకుడు దీపు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు నాకు పుట్టుకతోనే పాట అబ్బింది. వందేళ్ల
క్రితం ఎప్పుడో మా ముత్తాత తనకు పిల్లలు పుట్టాలని మొక్కుకుని... ఆ మొక్కు
తీర్చుకోడానికి భక్తిగీతాలు పాడుకుంటూ మెొగిలిగిద్ద (మహబూబ్‌నగర్ జిల్లా) నుండి శ్రీశైలం వరకు కాలి నడకన వెళ్లాడని కహానీ. అనుకోవడమే గానీ ఆయన పాడటం గొరుసు జగదీశ్వర రెడ్డి + 149
చూసినవాళ్లు ఎవరూ లేరనుకోండి! సంజీవరెడ్డి నగర్ (హైదరాబాద్‌లోని 'మణి జర్మయ్య' స్కూల్లో ఐదో తరగతి చదివే రోజుల్లోనే రేడియో, టీవీలలో వచ్చే పాటల్ని విని, హమ్ చెస్తుందేవాణ్ణి. నా పాటలు విన్న మా బంధువులు “వీడి గొంతు బాగున్నట్టుంది. సంగీతం నేర్పించమిని మా అమ్మానాన్నలకు సలహా ఇచ్చారు. మొదట్లో రవిశంకర్‌గారి దగ్గర, తర్వాత రామాచారి, బాలసుబ్రమణ్యంగార్ల వద్ద లలిత /కర్నాటక సంగీతం నేర్చుకునేవాణ్ణి. సంగీతం మీది (ప్రేమతో అంత చిన్న వయసులోనే రెండుమూడు బస్సులు మారి క్లాసులకి వెళ్లి వస్తుండేవాళ్డి. నా పాట వినగానే మాట్లాడింది
మిగతా సబ్జెక్టు ఫర్వాలేదుగానీ, మాథ్స్ అంటే అసలు పడేది కాదు నా ఒంటికి. అలాంటిది, తొమ్మిదో తరగతిలో ఉండగా అనిల్‌కుమార్ అనే సారు మా స్ఫూల్లో చేరడం... ఆయన లెక్కలు చెప్పే పద్ధతి నన్ను మంత్రముగ్గుడ్ని చేసింది. దాంతో ఆయన వద్ద ప్రైవేటుకు కూడా వెళ్తుందేవాణ్ణి. సార్ మాతో చాలా జోవియల్‌గా ఉండేవాడు. రేపు పబ్లిక్ ఎగ్జామ్ ఉందని తెలిసినా ఆ ముందు రోజు మమ్మల్ని సెకండ్ షో పిక్చరికి తీసుకెళ్లేవాడు. అంత సరదా మనిషి, నాతో పాటు ఇతర స్కూళ్లలో చదివే పిల్లలు కూడా వచ్చేవారు. వాళ్ళల్లో ఒక ఉత్తరాది అమ్మాయి బాగా “రిచ్‌గా కనిపించేది. అప్పటి నా పద్నాలుగేళ్ల వయస్సులో నా కంటికి తనొక ఐశ్వర్యారాయ్. నాతో మాట్లాడేది కాదు. ఒకరోజు 'ఆ అమ్మాయి చాలా బాగుంది సార్ అన్నాను. మాస్తారు నవ్వి, తన ముందే నాతో పాట పాడించాడు. అప్పుడప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న శంకర్ మహదేవ్‌గారి 'కోయి జో మిలాతో” పాడా. అంతే ! పాట మహిమ! అప్పటి వరకు నన్ను పట్టించుకోని ఆ అమ్మాయి వెంటనే నాతో మాట్లాడేసింది. ఆ మర్రోజు 'నిన్న నీవు పాడిన పాటలో కొన్ని తప్పులున్నాయి. తప్పులళ్లేకుండా రాసి తీసుకొచ్చా.. ఇప్పుడు నేర్చుకో అంది. తను నాతో కాస్త చనువుగా ఉంటున్న టైంలోనే వాళ్ల నాన్నకి బదిలీ అవడంతో వాళ్లంతా ఉత్తరాదికి వెళ్లిపోయారు. కాని తన దస్తూరితో రాసిన శంకర్‌మహదేవ్ పాట మాత్రం ఇప్పటికీ అపురూపంగా దాచుకున్నాను. సరిగ్గా పాడలేదని తెగ వడ్చాను
ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా 'సంఘం కళా [గ్రూప్ వాళ్లు నిర్వహించిన జాతీయ న్ధాయి కాంపిటీషన్ ఉస్మానియా యూనివర్శిటీ కాంపస్‌లోని ఒక హాల్లో జరిగింది. నెగ్గితే ఢిల్లీలో జరిగే ఫైనల్స్‌లో ఛాన్సు వస్తుంది. ఆ పోటీకోసం రేయింబవళ్లు కష్టపడి రెండు పాటలు నేర్చుకున్నా. మొదటిది సినిమా పాట “రసికరాజ హాల్ డేస్ = సన్ ప్రమఖం చన్ననాట కీన్ గప్పు ౩ $50
తగువారము కాదా” రెండోది హరహరన్ గారి (పైవేట్ గజల్. జడ్జిగా వచ్చిన వాళ్లల్లో శోభారాజుగారు ఒకరని గుర్తు 'రసికరాజ” ఎంత బాగా పాడినా కానీ, మధ్యలో కొన్ని గమకాల్ని మర్చిపోయా. అంతే, హాలు బయటికి వచ్చెసి భోరుమని ఏద్చేశాను. సరిగ్గా పాడలేకపోయానని నాపై నాకే కల్గిన ఉక్రోషం అది. లంచ్ తర్వాత నాన్ ఫిలిం సాంగ్ కాంపిటీషన్లో కసితో గజల్ పాడా, అందులో మొదటి (ఫైజు రావడంతో పైనల్స్‌కు ఢిల్లీ వెళ్లాను. అక్కడ ఎవరి పాటైనా ఒక్క లైను వినగానే “సరే, ఓకే అంటూ స్పెజీ దింపేస్తున్నారు. జడ్డిలుగా వచ్చిన వాళ్లల్లో కనీసం పాట సాంతం వినే ఓపిక లేదని బాధపడ్డా కానీ, తర్వాత తెలిసిందేమంటే విజేతను ముందే సెలక్ట్ చెసుకుని 'నామ్‌క వాస్తే ఒక్కో లైను పాడించారని, బహుమతి రాకపోయినా, సంగీతంలో కూడా రాజకీయాలు రాజ్యమేలుతాయనే విషయం మాత్రం బోధపడింది. ఇంజనీరింగ్ వర్సెస్ మెడికల్
సెకండియర్‌లో ఉండగా.. మా సీనియర్ ఒకతనికి యాక్సిడెంట్ జరిగింది. అతడ్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ, అక్కడ చికిత్స ఆలస్యం కావడంతో అతను చనిపోయాడట. విషయం తెలిసి సీనియర్స్ అంతా కోపంతో రగిలిపోయారు. అప్పటికప్పుడు మొత్తం పది కాలేజీ బస్సులను తీసుకుని బయళ్సరాం. ఆస్పత్రి ముందు బస్సులు ఆగడం ఆలస్యం... నేనింకా బస్సే దిగలేదు... భళ్లు భళ్లుమని అద్దాలు పగులుతున్న శబ్దం. నా కాళ్లల్లో వణుకు మొదలైంది. రాళ్లు పేషంట్లకు ఎక్కడ తగులుతాయోనని నా భయం. మీడియా వాళ్లకు ఎలా తెలిసిపోయందోగానీ మాకంటే ముందే అక్కడ కెమెరాలతో రెడీగా ఉన్నారు. వాతావరణం రణరంగంగా మారబోతుండగా పోలీసులు దిగారు. దిగడం ఆలస్యం దొరికినవాళ్లను దొరికినట్టు... లారీలతో ఉతుకుదే ఉతుకుడు. భయంతో అంతా చెల్లాచెదురయ్యాం. కొందరేమో రాస్తారోకో చేయడానికి రోద్దుపై బైళాయించారు. వాళ్లందరినీ బలవంతంగా వ్యానుల్లో ఎక్కించారు. ఇంతలో గొడవ విషయం మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి తెలిసి 'మా ఆస్పత్రిలో అద్దాలు పగలకొడతారా' అని కోపంతో చిందులేస్తూ, మా కాలేజీ బస్సుల్లో రెండింటికి వాళ్లు నిప్పు పెట్టారు.
ముందూ వెనకా చూడకుండా పరిగెత్తి పారిపోవడంలో బ్యాగ్స్ అన్నీ బస్సుల్లో ఉండిపోయాయి. పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకుని అందులో ఉన్న పేర్లు అడ్రసుల ప్రకారం వాళ్ల వాళ్ల ఇండ్లకు వెళ్లి విచారించారని తెలిసింది. నా బ్యాగు చూసి మా ఇంటికి వస్తారమోనన్న భయంతో ఇంటికి వెళ్లకుండా మా అమ్మమ్మ వాళ్లింట్లో ఉండిపోయా కొన్నాళ్లు. కానీ వాళ్లు మా ఇంటికి రాలేదనుకోండి. ఇలాంటి సంఘటనలు
|
టీవీల్లో, సినిమాల్లో చూడ్దమేగాని.. నిజ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు కలిగే ఉత్కంఠ అనూహ్యం. కళ్లల్లోకి కళ్లు పెట్టీ రొమాంటిక్ సాంగ్
ఇంజనీరింగ్‌లో నాది ఐటి గ్రూప్. అందరి మాదిరే మొదట్లో కొన్నాళ్లపాటు ర్యాగింగ్ నుండి తప్పించుకోలేకపోయా. కంది దగ్గరుండే డి. వి.ఆర్ కాలేజీకి వెళ్లడానికి మా స్టాఫ్ (ఎస్. ఆర్. నగర్‌లో కాలేజీ బస్సు ఎక్కుతున్నప్పుడే గుండెలు దడదడలాదేవి. బస్సు ఎక్కడం ఆలస్యం, సీనియర్స్ రుబాబుగా వెనక్కి పిలిచి “నీ విడి(బయోదడేటా) చెప్పుకో అని హుకుం జారీ చేసేవారు. తెలుగులో చెప్పినప్పుడు ఇంగ్లీషు పదం, ఇంగ్లిషులో చెప్పినప్పుడు తెలుగు పదం దొర్లకూడదు. ఓడిపోతే పనిష్మెంట్ తీవ్రంగా ఉండేది. అలా వాళ్లు నాకిచ్చిన పనిష్మెంట్ ఏంటంటే... నేను ఒక జూనియర్ అమ్మాయి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ రోమాంటిక్ పాట పాడాలి. తప్పే అయినా తప్పలేదు. *నా గుండెలో నీవుండిపో అనే రొమాంటిక్ సాంగ్ పాడాను. నేను పాడుతున్నప్పుడు ఆ అమ్మాయి పడ్డ ఇబ్బంది ఇప్పటికీ గుర్తుంది. జైబోలో గణేష్ మహరాజ్ కీ
ర్యాగింగ్ కేవలం బస్సులోనే కాదు, కాలేజీలో కూడా కంటిన్యూ అయ్యేది. జూనియర్ అనేవాడు జీన్ ప్యాంటు, టీషర్టు వేసుకోరాదు. చెప్పులు తప్పించి బూట్లు వేసుకోకూడదు. క్యాంటిన్‌లోకి అసలే రాకూడదు. ఒకవేళ పొరపాటుగా క్యాంటీనులో కనిపిస్తే సీనియర్స్ తిన్న బిల్ పే చెయ్యాలి. నేను పాటలు పాడతానని తెలిసి కొందరు సీనియర్ అమ్మాయిలు ఫ్రీ క్లాసు టైంలో నన్ను పిలిపించుకుని తమకిష్టమైన వాటలు పాడించుకునే వాళ్లు. ఆ టైంలో బాయ్స్ అంతా గేమ్స్ ఆదేవాళ్లు. వాళ్లు తిరిగొచ్చేసరికి నా చుట్టూ అమ్మాయిలు మూగి ఉండటం భరించలేక 'మా క్లాసులోకి ఎందుకు వచ్చావని క్తాసు పీకేవాళ్లు.
నేను చేరిన వారంలో మరో సంఘటన జరిగింది. ఒకరోజు సీనియర్స్ మా క్లాసులోకి వచ్చేసి అందర్నీ బెంచీలపై నిల్పోమని ఆర్దరేశారు. అంతా పైకి ఎక్కి నిల్చున్నాం. మాలో అందరికంటే లావుగా ఉన్నవాడిని ఎంచి, నలుగురి భుజాలపై వాణ్ణి కూర్చోబెట్టి 'జై బోలో గణేష్ మహరాజ్ కీ అని క్లాసు దద్దరిల్లేలా అరవమన్నారు. నాలుగు రౌండ్లు అయ్యాక స్టేజి పై నుండి దభీమని వినాయకుడ్ని నిమజ్జనం చేసినట్టు పదేయమన్నారు. కన్ను లొట్టబోయి బతికి బట్టకట్టినట్టు ఆ స్టూడెంటు వినాయకుడికి ఎముకలు విరగలేదు. కానీ, దెబ్బలు తగిలాయి. సీనియర్ అయ్యాక ఇంతకు రెండింతలు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 152
ర్యాగింగ్ చేసి కసి తీర్చుకోవాలని కుతకుత ఉడికిపోయేది మాకు. మేము సీనియర్లు అయ్యేసరికి కాలేజీ గోడలమీద “ర్యాగింగ్ చేసేవాళ్లకు జైలు శిక్ష అనే పోస్టర్లు దర్శనమిచ్చాయి. మా జూనియర్లు ఆ రకంగా బతికిపోయారు. ఈలోగా మేనేజ్‌మెంట్ ఇచ్చిన (ప్రెషర్స్ డే పార్టీలో “అంజలీ, అంజలీ, “నా చెలి రోజావే' పాటలు పాడటంతో నాపై ర్యాగింగ్ తగ్గించారు కానీ.. నేను కన్చించగానే “అంజలి... రోజా” అని పిలిచేవారు. నా జుట్టు లాగుతూ కేకపెట్టింది ఒకసారి భీమవరం విమెన్స్ కాలేజీ వాళ్ల వార్షికోత్సవంలో పాడటానికి హైద్రాబాద్ నుండి ఆర్గనైజర్ రాజుగారు నాలాంటి కొంతమంది గాయకుల్ని తీసుకెళ్లారు. ఫంక్షన్ అయ్యేసరికి రాత్రి 12 దాటింది. గెస్ట్‌హౌస్‌కు వచ్చి భోంచేస్తుండగా గేటు బయట అరుపులు! దాదాపు 30 మంది అమ్మాయిలు... “దీపు ఆటోగ్రాఫ్ కావాలి అంటూ కేకలు, రాత్రి రెండవుతున్నా కదళ్లేదు వాళ్లు. మా ఆర్గనైజర్ వచ్చి “వాళ్ల అరుపులు వింటుంటే గేటు దూకి మనల్ని కొట్టేలా ఉన్నారయ్యా” అని నన్ను ఒప్పించి వాళ్లందర్నీ లోపలికి తీసుకొచ్చారు. రేషన్ షాపు ముందు క్యూ మాదిరి అందరూ వరసగా నిల్చుని నా ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఒక మధురమైన అనుభవం. అంతటితో ఆగితే బాగుణ్ణు... ఒకమ్మాయి ఉన్నట్టుండి లన్సీ జుట్టు ఒకనారి ముట్టుకోవచ్చా?” అంది. ఐం సమాధానం చెప్పాలో అర్ధంగాక తెల్లబోయి చూశా (పాడుతున్నప్పుడు నా జుట్టు గాలికి ఎగరడం బాగా అబ్జర్వ్ చేసినట్టుంది) కక్కలేక, మింగలేక 'ఊలి అనేలోపే నా వెంట్రుకల్ని వెనక్కి గట్టిగా దువ్వి కెవ్వుమని అరిచింది. అమ్మాయిలంతా చప్పట్లు కొడుతూ ఒకటే కెవ్వు ! వామ్మో. అమ్మాయిల అభిమానం ఐ స్థాయిలో ఉంటుందనేది మొదటిసారి తెలిసింది. క్రీస్తు పాటలు, సాయిబాబా భక్తి పాటల ఆల్బమ్స్ పాడుతున్న టైంలో కీర్తన స్టూడియోలో నా స్వరం విన్న వెంకట్‌గారు మిక్కీ జె. మేయర్‌గారికి నన్ను పరిచయం చేయడం, ఆయన 'టెన్స్‌క్లాస్ సినిమాలో అవకాశం ఇవ్వడం, తర్వాత కీరవాణిగారు పాట పాడించడం... అలా ఎందరో సంగీత దర్శకులు నా ఎదుగుదలకు కారకులయ్యారు... అవుతూనె ఉన్నారు. కాలేజీ డేస్ అన్నీ “హ్యాపీ దేసే' అనుకుంటాను గానీ, అప్పుడప్పుడు మా సీనియర్ మిత్రుడి మరణం, "కాలేజీ బ్యూటీగా ఎన్నికైన ఒకమ్మాయికి ప్రాక్టికల్స్‌లో మొహం మీద కెమికల్ పడటం లాంటి సంఘటనలు గుర్తొచ్చినపుడు మనసు చివుక్కుమంటుంది. ఆ వెంటనే బొమ్మాబొరుసుల సమ్మేళనమే జీవితం అనే తత్వం కూడా బోధపడ్డుంది. (23.09.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) గొరుసు జగదీశ్వర రెడ్డి ఫ 153
టక్ దె సక్నన్నై , ప జ క కోమాకుల నుధాకర్ తథాసు దెవతల వలే నటుడ్దుయ్యాను థాను ల టుద్న( శ అలి గూ
కంప్యూటర్ సైన్స్‌లో వీ.జి. పట్టా పొంది, న్యూయార్స్ నీటీలో (ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసుకుంటున్న ఒక కుర్రాడిని గాలమేని పట్టుకుని నాగరాజు” (లైఫ్‌ళజ్ బ్యూటిఫుల్‌గా మార్చిపారేశారు శేఖర్ కమ్ముల. విళాఖ తీరంలో వుట్టి పెరిగి, “తెలంగాణ మాందలీకంి'తో వెందితెరంగేటం చేసిన ఆ నవ నట కెరటం కోమాకుల నుధాకర్.
“అసలు దేవుడి సంగకేమోగానీ, 'తథాస్తు దేవతలు” ఉన్నారని మాత్రం కచ్చితంగా నమ్ముతానండోయ్! అందుకు తగ్గ కారణాలు ఏమిటో, అవి నా జీవితంలో ఎలా నిజమయ్యాయో... నా హ్యాపీడేస్‌ని ఫాలో అయిపోతే చాలు.. అన్నీ వివరంగా తెలుస్తాయి మీకు.
నాన్న “రామ్‌గోపాలరావు” గారు విశాఖ పోర్చుట్రస్టు ఉద్యోగే అయినా, 'మడిసన్నాక కుసింత కళాపోసనుండాల”నే తత్వం జీర్న్షించుకున్నవాడు కావడంతో అడపా దడపా రంగేసుకుని రంగస్థలం ఎక్కేవారు. ఆలపాటి లక్ష్మి, కొండవలస, మిశ్రో గార్ల వంటి కళాకారులతో కలిసి బోల్టు నాటకాల్లో నటించారు కూడా. చిన్నతనంలోనే 'కళాపోసన రుసి' మరిగాను గనకే, నా అడుగులు కూడా అటువైపు కదిలాయి. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 154
చావబాది సారీ చెప్పారు మా 'సూర్యోదయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ (మాజీ మిలట్రీ) దృష్టిలో 'రాముడు మంచి బాలుడు” టైపు నేను. మరీ బుద్ధావతారంలా కనిపిస్తే పిల్లలు 'పండూ, చంటీ, చక్రపొంగలీ, దద్దో జనం” లాంటి బిరుదులు అంటగదతారని భయమేసి, అప్పుడప్పుడు అల్లరి చేయాలనిపించేది. అందులో భాగంగానే తొలిసారి (టెన్స్ క్లాసులో) శివగణేష్ అనేవాడి టెక్స్‌బుక్ దాచేను. వాడు అటూ ఇటూ వెదికేసి, టింగుమని లేచిపోయి “టీచర్, నా బుక్కెవడో దాచేశాడు” అంటూ గట్టిగా అరవడం, సరిగ్గా అప్పుడే మా ప్రిన్స్‌పాల్ క్లాసులోకి అడుగుపెట్టడం కాకతాళీయంగా జరిగాయి. ఆయన సరాసరి గణేష్ దగ్గరకి వచ్చి “ఎవడు దాచేడ్రా?” అన్నాడు కోపంగా. వాడు నా పక్కసీట్లో కూర్చున్న కళ్యాణ్ పేరు చెప్పేడు. కళ్యాణ్‌ని వంగోబెట్టి వీపుపైన ఒక్కటిచ్చాడాయన. వాడు కుయ్యోమొగ్రో అంటూ 'దాచింది నేను కాదు, సుధాకర్ సార్ అంటూ అసలు దొంగని అంటే నన్ను పల్టీచ్చాడు. రాముడు ముసుగేసుకున్న రావణుడిని చూసినట్టు నాకేసి ఒక లుక్కేసి, తనతో పాటు క్లాసు బయటికి తీసుకెళ్లి వరండాలో నిల్పోబెట్టి పిల్లలందరూ చూస్తుండగానే వీర బాదుడు బాదాడు. ఇంటికి వెళ్లేవరకూ ఏడుస్తూనే ఉ న్నాను. ఆ మర్రోజు తన రూమ్‌కి పిలిపించి “సారీ, నిన్న డిస్టిబ్‌గా ఉండడంతో నిన్ను కొట్టాను. ఏమీ అనుకోకు అనడంతో బాధంతా ఎగిరిపోయింది. దెబ్బల బాధ కాదుగానీ, అందరి ముందూ కొట్టాడన్న ఫీలింగ్ మాత్రం... ఈ రోజు వరకూ పోలేదంటే నమ్మండి. ముద్దాయిలను చేసి ఊరంతా తిప్పారు “ఆల్ఫా జూనియర్ కాలేజీలో చేరబోతున్న టైంలో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు బస్‌పాస్ తీద్దామని మద్దిలపాలెం డిపోకి బయల్చేరా. కైలాసపురం నుండి మద్దిలపాలానికి బస్సు దొరక్కపోవడంతో, ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ్నుంచి మరో బస్సు ఎక్కా బస్సులో మా (ఫెండ్ అరుణ్ కన్పించాడు. వాడూ బస్‌పాస్ కోసమే వెళ్తున్నా అన్నాడు. బస్సులో నిల్పోడానికి ఖాళీ లేనంత రష్‌గా ఉంది. చూస్తుండగానే బస్సు బుల్లయ్యకాలేజీ దాటేసింది. కందక్టర్ దగ్గరకు రావడంతో అరుణ్ జేబులోంచి డబ్బులు తీయబోతుంటే 'నెక్ట్‌స్టాపే కదరా, అనవసరంగా డబ్బులు బొక్క అనగానే వాడు దబ్బుల్ని మళ్లీ జేబులోకి తోసేశాడు. సరిగ్గా కూతవేటు దూరంలో న్గాప్ ఉండగా ధవళ వస్త్రాల్లో దేవదూతల్లా బస్సుకు అడ్డంగా స్వాడ్. దొరికిపోయాం. ఇద్దరినీ మొబైల్ జైల్లో తోసేశారు. “సారీ సార్, పొరపాటైంది. ఫైన్ కట్టేస్తాం) అని జేబులోంచి డబ్బులు తీయబోతుంటే (టెం ఒంటీ గంట దాటింది ఇది లంచ్ టైం. మేం తీసుకోకూడదు. కోర్టులో జరిమానా కట్టాలి అని ఆ రోజు సాయంత్రం వరకూ వ్యానులోనే ఉంచి
విశాఖ నగరమంతా తిప్పి తిప్పి సాయంత్రానికి కోర్టులో హాజరు పరిచారు. సినిమాల్లో మాదిరే పేర్లు పెట్టి పిలిచి, బోనులోకి ప్రవేశపెట్టి మా తప్పుని వివరించి, “50 రూపాయల జరిమానా విధించడమైనది' అంటూ తీర్చు ఇచ్చారు. అరుణ్‌గాడి వైపు తలెత్తి చూడలేకపోయా. వాడి చూపులకు మరొకడైతే భస్మం అయిపోయేవాదే. ఆ దెబ్బతో ఎప్పుడు సిటీబస్ ఎక్కినా టికెట్ తీసుకోవడం అలవాటైందనుకోండి. అది అధికార వారసత్వం
మేముండే పోర్టు క్వార్టర్స్‌కీ, తాటిచెట్లపాలానికీ మధ్యలో జామ, జీడిమామిడి, ఈత, సపోటా చెట్లతో తోట ఉండేది. ఖాళీ దొరికతే చాలు ఆ తోటలోకి దూరిపోయి, ఎవడి కిష్టమైన చెట్టు వాదెక్కేసి బాగా చీకటి పడ్డాక కాపలా వాళ్లు చూడకుంగా దిగేవాళ్లం. ఒక శివరాత్రి టైంలో... అప్పట్లో మా బాచ్ లీడర్ చిన్నాతో పాటు శ్రీను, మధులతో కలిసి తోటపక్క నుండి నడుస్తున్నాను. ఇంతలో ఒక ప్రహరీ పక్కనున్న కొబ్బరిచెట్టు పైకి మళ్లింది మా దృష్టి. గోడ ఎక్కితే చేతికి అందేలా ఉన్నాయి కాయలు. చిన్నా గోడ అలా ఎక్కాడో లేదో, మాకు అతి దగ్గర్లో బుల్లెట్ సౌండ్ వినిపించి వాడు గోడకు అటువైపు దూకేశాడు. ఇంతలో ఆ బుల్లెట్ బాబు “ఏం చేస్తున్నారా - కాయలు దొంగతనమా? అంటూ దగ్గరకి వచ్చాడు. అప్పటికి మేమంతా ఇంటర్మీడియట్ పిల్లలం అయినా ఆ వచ్చిన మనిషి ఆకాశమంత ఎత్తుగా కనిపించాడు మా కళ్లకి. భయంతో గదడగడలాడిపోయాం. మా బస్ పాస్‌లు, ఐదెంటీ కార్డులూ లాగేసుకుని, రేపు పోలీసు స్టేషన్‌కు రండి అంటూ వెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్ధంగాక, ఇంట్లో చెప్పుకోలేక తర్జనభర్జన పడుతుండగా మూడు వేలు సమర్పించమని కబురుచేశాడు. విషయం ఇంట్లో తెలిస్తే చమడాలు వలిచేస్తారని అప్పటికప్పుడు తంటాలు పడి 15 వందలు సమర్పించి, మా పాస్‌లు వెనక్కి తీసుకుని బతుకు జీవుడా అనుకున్నాం. ఇంతకూ ఆ వచ్చిందెవరో కాదు, ఒక సి.ఐ. గారి పుత్రరత్నం. కసి స్థానంలో కరుణ ఉవ్పొంగింది
వినాయక చవితి వచ్చిందంటే యమ సందడిగా ఉందేది. ఒకరోజు వినాయకుడికి అలంకరణ చేస్తున్నాం. ఎందుకొచ్చిందో గొడవ గుర్తులేదు కానీ,రమణ అనేవాడూ, నేనూ తెగ కొట్టుకున్నాం. వాడు నాకంటే బక్కపల్చగా ఉన్నా దెబ్బలు నాకే ఎక్కువ తగిలాయని నా తరపు మిత్రబృందం తీర్పు ఇవ్వడంతో తెగ అవమానం అనిపించి, అదునుచూసి వాడిపై పగ తీర్చుకోవాలని కసి పెరిగిపోయింది. నిమజ్జనం రోజు టపాకాయలు కాల్చడానికి కురుపా మార్కెట్‌కి వెళ్లి “పచ్చిపులుసు సన్నయ్య హ్యాట్ డేస్ = సన్ ప్రముఖం చిన్ననాటి తీన్ సర్తము ౪ 156
అండ్ కోలో “గన్ పౌడర్” కొన్నా (365 రోజులూ గన్ పౌడర్ అమ్మే కొట్టు వైజాగంతటికీ అదొక్కటే). కాగితం మధ్యలో నాలుగు గులకరాళ్లు, కొంత కొంత గన్ పౌడర్ వేసి పురికొసతో గోడ బాంబులు తయారుచేస్తున్నాం. పురికొసను ఎంత గట్టిగా లాగి కడితే అంత బాగా పేలతాయన్నమాట. మాగ్రూపులో రమణ కూడా ఉన్నాడు. వాడిని ఎలా దెబ్బ తీయాలా అనే కసికొద్దీ పురికొసని బిగించి కడుతున్నాను. అటునుంచి వాడూ తన ప్రతాపం చూపుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి చెవులు చిల్లులు పడెలా “ధన్” మంటూ బాంబు పేలిన శబ్దం... అంతా పొగ రమణ కడుతున్న గోడబాంబు పేలడం, వాడి ఎడమ చేతి రెండు వేళ్లు తెగిపోవడం... అంతా రక్తం. వాడిని ఆ స్థితిలో చూడగానె నా కసి అంతా మంచులా కరిగిపోయి దుఃఖం తన్నుకొచ్చెసింది. వాడిని తీసుకుని హాస్పటల్‌కి పరిగెత్తాం. ఆ తర్వాత వాడూ నేనూ మంచి ్రెండ్స్‌గా మారిపోయాం అనుకోండి. వాడి తోపుడికి డాన్స్ భయం ఉష్ కాకి
రాక్ మ్యూజిక్ ఎప్పుడు విన్నా నా కాళ్లలో కదలిక మొదలయ్యేది. మీరు నమ్ముతారో లేదోగాని “జెంటిల్ మాన్'లో ప్రభుదేవా డాన్స్ చూసి పిచ్చెక్కిపోయవాళ్డి. “చికుబుకు చికుబుకు రైలే” డాన్స్‌ని కొన్ని వందలసార్లు ప్రాక్టిస్ చేసుంటాను. ఒక విధంగా ప్రభుదేవా వకలవ్య శిష్యుడిని. ఒకసారి మా కాలేజీ తరపునుండి కైలాసగిరి పిక్‌నిక్ వెళ్లాం. రాజారమేష్ అనే మా సీనియర్ తెగ రెచ్చిపోయి డాన్స్ చేస్తున్నాడు. వాడు చేసే స్టెప్స్‌లో తప్పుందని తెలిసినా చెప్పాలంటే భయం. మరోసారి మా సీనియర్స్‌కి ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చే సందర్భంలో రిహార్సల్ జరుగుతుంటే వెళ్లి చూస్తూ నిలుచున్నా. నా డాన్స్ పిచ్చి తెలిసిన మా (ఫెండు ఒకడు ఒక పాట మొదలు కాగానే నన్ను బలవంతంగా స్టేజిపైకి తోశాడు, డాన్స్ చేయమంటూ. వెనక్కి వచ్చేస్తే అవమానం. అని, మెల్లగా కళ్లు మూసుకుని డాన్స్ మొదలెట్టా. డాన్స్ పూర్తవగానే ఒకటే చప్పట్లు. వెంటనే ఫేర్‌వెల్‌లో నాతో సోలో డాన్స్ చేయించడానికి ఒప్పించారు. నాపై నాకు భరోసా కలిగించిన సంఘటన అది. అది మొదలు ఇక తిరుగులేకుండా పోయింది. ఎంతవరకంటే కొన్ని స్ఫూళ్లల్లో డాన్స్ కంపోజింగ్ చేసే “కొరియోగ్రాఫర్” స్థాయికన్నమాట. ఆ రోజు వాడు నన్ను బలవంతంగా తోయకపోతే....! దాన్స్ ఇరగదీయబోతే...
ఒకసారి దసపల్లాలో డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతుంటే కాలేజీ తరపునుండి పాల్గొనడానికి వెళ్లాను. అప్పటికే మనకు బుల్లి కొరియోగ్రాఫర్‌గా పేరొచ్చింది కదా... గొరుసు జగదీశ్వర రెడ్డి + 157
ఆ స్థాయిలోనే (ఫైజు కొట్టాలని మనసులో ఉంది. అందరూ అయ్యాక నన్ను పిలిచారు. “ఎందరికో డాన్స్ నేర్పిన డాన్సర్, డాన్స్ ఇరగదీస్తాడు.... ఒహోయ్... ” అంటూ అనౌన్స్ చేసి, “దిల్ చాహతా హై'లోని 'కోయ్ కహే కహెతా రహే పాటని ఆన్ చేశారు. అప్పటివరకు ఆడియన్స్‌లో కూర్చుని ఉన్న నేను మెల్లగా లేచి, మైకేల్ జాక్సన్ స్టయిల్లో పేక్షకుల మధ్యలో నుండే డాన్స్ చేసుకుంటూ ఒకేసారి చెంగుమని స్టెజీపైకి గెంతాను. అంతే... పెళపెళమని స్టేజి విరిగింది. చూస్తుండగానే నా రెండు కాళ్లూ స్టేజీలోకి కూరుకుపోయాయి. (అంత బాగా కట్టారన్నమాట,). వెంటనే పాట ఆపేశారు... ఇంకా నయం, చెక్కల పైన కార్పెట్ ఉండబట్టి బతికి పోయా. లేదంటే (పేక్షకులకు కనపడకుండా స్టేజీ కిందికి జారిపోయే వాణ్ణి. ఆ కసితో మళ్లీ సంవత్సరం '“సాయిప్రియ రిసార్టొలో పెట్టిన కాంపిటీషన్‌లో పాల్గొని ఫస్ట్ ఫైజ్ కొట్టా.
భూమి గుండ్రముగా ఉందని....
కంప్యూటర్ సైన్స్ పీజీ చేసి జాబ్ వెతుకులాటలో హైద్రాబాద్ వచ్చేసిన కొన్నాళ్లకి మా బ్రదర్ 'డిసిఎల్ ఆర్ కెమెరా గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాంతో నా మోజంతా స్టిల్స్ తీయడం వైపు మళ్లింది. తర్వాత ఒక ఫోటోగ్రఫీ సెమినార్‌లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ రంజిత్ సిన్లాగారి పరిచయం కలగడంతో వారి వద్ద శిష్యరికం చేశాను.
ఆ తర్వాత న్యూయార్క్ వెళ్తుంటే నా మిత్రులంతా “ఏరా? హైద్రాబాద్‌లో ఉండి సినిమాల్లో ప్రయత్నిస్తానని అన్నావ్? హఠాత్తుగా యుఎస్ వెళ్లిపోతున్నావేం?” అంటే, “అక్కడికి వెళ్లి ఫోటోగ్రఫీ ఫ్రీలాన్స్ చేస్తూ, ఒక షార్ట్ ఫిలిం తీస్తానని, గతంలో శేఖర్ కమ్ముల గారు కూడా యు.ఎస్. వెళ్లి వచ్చారని, ఏనాటికైనా ఒకే తెరపై మా ఇద్దరి పేర్లూ చూస్తారని” నవ్వుతూ సరదాగా గొప్పలు చెప్పి ఫ్లయిట్ ఎక్కేశా. తర్వాత ఐడియల్ యిన్. కామ్ ద్వారా శేఖర్ కమ్ములగారి “లైఫ్ ఈజ్ బ్యూటిఫులొలో ఛాన్స్ రావడంతో... న్యూయార్క్ నుండి హైద్రాబాద్‌లో వాలిపోవడం, 'నాగరాజుగా అవతరించడం... విషయం మీకు తెలిసిందే కదా. మరి తథాస్తు దేవతలు ఉన్నట్టా, లేనట్టా... మీరే చెప్పండి.
(30 ౧92022 ఆంధ్రజ్యోతి ఆదివారం, హ్యాట్ డేస్ = సిన్ ప్రముఖం చిన్ననాటి లీస్ గుర్తులు + 156
( రే ప్త ఫ్ ఖ్ క వాస్ | న్ స గ్ తు 4 గం ఇ శ్ సన య్ జ గ బి కలి గ నెను ఇప్పటికీ సిదారి ముదు బిడనె ! అథి న న్న “తూనీగ తూనీగా ఎందాక పరిగెదతావే రావే నావంకా...” ఇవ్పుటికీ మన పెదాలపై తదారని బాణీ! ఈ పాట వెనకే మనసంతా నువ్వే” సినిమా కళ్లముందు కదలాడుతుంది. దాని న్ఫష్టీకర్త ఎవరనేది (వ్రత్వేకంగా మీకు చెవ్పక్కర్లేదేమో! ఇంజనీరింగు, నీవిల్స్‌లలో ఏ వట్లాలకృర్లేదని నినిమా పట్టాలెక్టీ దర్భకుదయ్యాదతను. 'మనసంతా నువ్వే” స్టేషన్లో ఎకి 'శ్రీరామ్? నేనున్నాను మనను మాటి వినదు బాన్ అట్టి రెయిన్ బో రాజ్హ్ ముగ్గురు” లాంటి స్టేషన్లలో మజిలీలు చూన్తూ నీనీ ప్రయాణం సాగిస్తున్నారు. అతదే కుటుంబ చిత్రాలను భిన్న తరవోలో ఆవిష్కరించి, తనకంటూ (వత్వేకమైన (పేక్షకులను ఏర్పరచుకున్న నవ దర్శకులు వి.ఎన్ ఆదిత్యం నేను పుట్టింది ఏలూరులోనే అయినా నాన్నగారి బదిలీల వలన పిల్లి పిల్లల్ని మార్చినట్టు ఆయన మమ్మల్ని రాష్ట్రమంతా తివ్వ్పారు. నాన్నగారు రచయిత కావడంతో ఇంట్లో సాహితీ సంపద చాలా ఉండేది. ఇల్లు మారినప్పుడల్లా ఇతర సరంజామా రవాణా చేయడం ఒకెత్తయితే, పుస్తకాలు రవాణా చేయడం అంతకు పది రెట్ల శ్రమగా ఉందేది. గొరుసు జగదీశ్వర రెడ్డి + 159
నేను కాస్త అల్లరి ఎక్కువే చేసేవాడ్ని. ఎక్కువ దెబ్బల రుచి చూసింది కూడా నేనే! జంగారెడ్డి గూడెంలో ఒకసారి మజ్జిగ కవ్వం విరిగేలా తగిలించారు. తోటి పిల్లలు గుజ్జనగూళ్లు కట్టుకుంటుంటే హనుమంతుడిలా వాటీపై ఎగిరి లంఘించడం, నాన్న మాటకు ఎదురు చెప్పడం.. ఎవరైనా కొట్టకుండా ముద్దెట్టకుంటారా చెప్పండి? అయితే, ఆ దెబ్బలకు తగ్గట్టుగా తర్వాత తాయిలాలుందేవి. దెబ్బలు మరిచిపోవడానికి అవే కాస్త తెరపి మరి.
నా ఆటలన్నీ వయసులో నాకంటే పెద్దాళ్లతోనే, దాంతో మనకు 'బాలముదురు” అనే బిరుదు కూడా ఉండేది. మా అన్నదమ్ములందరికీ నాన్నగారు వేదం నేర్పించడంతో ఎవరింటికి వెళ్లినా 'ఏదీ, బాలవటువుల్లా పట్టుపంచెలు కట్టుకుని వేదం చదవండర్రా” అని పురమాయించేవారు. అప్పుడు మాత్రం వేదాలు వల్లిస్తూ బాలపండితులమయ్యే వాళ్లం.
ఎంత అల్లరి చేసినా, చదువుల్లో ముందే ఉందేవాణ్దనుకోండి. కాకపోతే టెన్స్‌లో మూడు పేపర్లు రాయగానే “పేపర్ లీకయిందంటూ పరీక్షలు ఆపేశారు. మళ్లీ ఎప్పుడు పెడతారో తెలియదు. దాంతో తాతవాళ్ల ఇంటికి ఏలూరు వెళ్లిపోయి సినిమాలు చూస్తూ ఉండిపోయా. అప్పుడే 'స్వాతిముత్యం' సినిమాని 15 సార్లు వరసగా చూసేశా. తర్వాత ఎగ్జామ్స్ రాశాగానీ, ముందు రాసిన మూడుపేపర్లలో 90 మార్కులు దాటితే, తర్వాత రాసిన వాటిల్లో 60 లోపే... మరి సినిమాల ప్రభావం. ! 'నేను ఇప్పటికీ 'సిద్ధార్ధా ముద్దుబిద్దనే!'
కన్‌ఫ్యూజ్ అయ్యారా? అది మా కాలేజీ పేరండీ! సరిగ్గా నా టెన్త్ అయిపోవడం, మా నాన్నగారికి లింగపాలెం నుండి విజయవాడకి బదిలీ అవడం ఒకేసారి జరిగాయి. నాన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్‌గా ఉందేవారప్పట్లో. ఇంట్లో వాళ్ల కంటి ముందు విజయవాడ వెళ్లి, మా బంధువుల ఇంట్లో మకాం వేసి, ఇంటర్ ఏ కాలేజీలో చేరితే బాగుంటుందనే ఎంక్వయిరీ మొదలెట్టాను. వడపోతల అనంతరం '“లయోలా), 'సిద్ధార్ధలు తేలాయి. 'లయోలా' స్ట్రిక్ట్ అని చెప్పడంతో 'సిద్ద్ధార్ధిలో చేరిపోయా కానీ, చేరాకగాని తెలియలేదు ఇది అంతకంటే యమ స్ట్రిక్ట్ అని. “5685ొగాడు
ఇంట్లోవాళ్లు నన్ను ఇంజనీరింగ్ పట్టాతో చూడాలనుకోవడంతో వాళ్ల ముచ్చట కాదనలేక ఎం.పి.సి. తీసుకున్నా గానీ, నేను చేరవలసిన గమ్యం అది కాదని నా ఇంగితం చెబుతూనే ఉందేది. కాలేజీలో చేరిన తొలిరోజీ లెక్బరర్ 'మీ పరిచయాలు హ్యాప్ డేస్ = సన్ ప్రముఖుల బిన్ననాటి తీసి గుర్తును + 160
చేసుకోండి” అనడంతో, ఒక్కొక్కరం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో ఒకడు ఠక్కున లేచి, చేతులు కట్టుకుని 'ఐ యామ్ రాజేష్ ఫ్రమ్ శ్రీకాకుళం - 568 కిలోమిటర్స్ అని చెప్పేసి సీరియస్‌గా కూర్చున్నాడు. వాడు ఏం చెప్పాడో... లెక్సరర్‌తో పాటు మాకెవరికీ అర్ధంగాక తెల్లమొహం వేశాం. తర్వాత ఒకసారి లైబ్రరీలో కనిపించినప్పుడు అడిగితే “బెజవాడ నుండి సికాకుళానికి 568 కి.మీ. దూరం. అంత లాంగు నుండి వచ్చానంటే గొప్పే కదండీ అంటూ పట్టపగలే చుక్కలు చూపించాడా సిక్కోలు సిన్నోడు ఉరఫ్ రాజేశ్ అగర్వాల్. అమాయకత్వమో, అతి తెలివితేటలో తెలియలేదుగానీ ఆ తర్వాత వాడి పేరు మాత్రం 568గా స్థిరపదిపోయింది. అమ్మాయిలు లేనిచోట...
అప్పట్లో మా కాలేజీలో అమ్మాయిల లేకపోవడంతో కాలర్ ఎగరేస్తూ హీరోయిజం ప్రదర్శించే అవకాశం కుర్రాళ్లందరం మిస్ అవుతూ ఉండేవాళ్లం. మా లెక్బరర్లు నాగరాజు, అడుసుమిల్లి శ్రీనివాస్, వై. మధుసూదన్‌గార్లు సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఆర్గనైజ్ చేసేవారు. మా హీరోయిజం ్రదర్శించుకోవాలంటే అందులో ఏదో ఒక ఏక్టివిటీలో పాల్గొనాల్సి వచ్చేది. డిగ్రీ విద్యార్థులు యోగేష్ పాయ్ (కొంకిణి),, సంజయ్ లుల్లా (మరాఠీ), రామన్ శేషాద్రి(తమిళం) లు కల్చరల్ టీమ్ లీడర్లు. వాళ్లను ఒప్పించి డిబేటింగ్‌లో పాల్గొని “సమాజంపై సాహిత్యం ప్రభావం” అనే టాపిక్‌పై అనర్గళంగా మాట్లాడి “బెస్ట్ ఎంగ్ స్పీకర్‌గా మొదటి (ఫ్రైజ్ కొట్టేశాను. అది మొదలు సీనియర్ ఇంటర్ వచ్చేసరికి దాదాపు 40 ్రైజులు గెలిచాను. ఇంట్లో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్
. రాయమని ఎంత మొత్తుకున్నా... అక్కడే బి.ఎస్.సి. కంటిన్యూ చేశానంటే ఆ కాలేజీని
ఎంతగా ఇష్టపడ్డానో అర్ధం చేసుకోవచ్చు. తర్వాత వరంగల్ ఆర్.ఇసి.కి వెళ్లి అక్కడా ఫస్ట్ (ఫైజ్ తీసుకురావడంతో మనమొక సెలబ్రిటీగా మారిపోయాం. ఎంచేతంటే ఆర్.ఇసి. నుండి (ఫైజ్ తెచ్చి మొదటి స్తూడెంట్‌ని నేనే గనక. 'సృజనోత్సవ్' అలా మొదలైంది
కొన్నాళ్లయ్యసరికి కాలేజీ తరపు నుండి ఇతర కాలేజీలకు వెళ్లి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సుమారు 340 (ఫైజులు తీసుకొచ్చాను. ఎప్పుడూ మేం మరో కాలెజీకి వెళ్లడమేనా? మా కాలేజీలో కార్యక్రమాలు నిర్వహించి ఇతర కాలేజీ స్తూడెంట్స్‌ని ఆహ్వానించవచ్చు కదా అనే ఆలోచన రావడం ఆలస్యం. మా సిద్దార్ధ అకాడమి ట్రెజరర్ 'ముమ్మనేని సుబ్బారావు (హీరో శర్వానంద్ తాతయ్య) గారితో నా మనసులోని మాట చెప్పాను. ఆయన ఆలోచించి, వెంటనే అమలు చేశారు. అలా 'సృజనోత్సవ్” గొరుసు జగదీశ్వర రెడ్డి + 161
్టీ
రూపుదిద్దుకుంది. తొలిసారి భారీ ఎత్తున పండగలా చేశాం. వివిధ కాలేజీల నుండి 1500 మంది స్తూడెంట్స్ వచ్చారు. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు చిత్ర ప్రముఖులైన కులశేఖర్, గాయని సునీతగార్లు ఆ ప్రోగ్రాంలో పాల్గొని బహుమతులు తీసుకోవడం, అప్పట్లో “లయోలా” కాలేజీలో చదివే (ఇప్పటి దర్శకులు) ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా వచ్చారు. కార్యక్రమాలకు నన్ను కో - ఆర్దినేటర్‌ను చేయడంతో మరింత బిజీబిజీగా ఉండేవాడ్ని. ఒకసారి నాగార్జున యూనివర్శటీ తరపునుండి నార్త్ ఇండియాలో జరిగిన 15 రోజుల యూత్ ఫెస్ట్‌వల్ వెళ్లి రాజీవ్‌గాంధీగారి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నా అదొక స్వీట్ మెమరీ నాకు. “శివి ప్రభావం ఉండేది
స్టూడెంట్స్‌లో గ్రూపు తగాదాలు బాగానే ఉందేవి. యు.ఎస్.ఒ, యు.ఐ. అనే రెండు గ్రూపుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉందేది. అప్పట్లో వచ్చిన వర్మగారి “శివి సినిమా ప్రభావం కూడా స్టూడెంట్స్‌పై చాలా ఉందేది. ఎంతలా అంటే, ఆ సినిమాలోని “భవానీని ఇమిటేట్ చేస్తూ, సాక్సుల్లో రాడ్లూ, బటన్ నైఫ్‌లూ దాచుకుని, పిడికిలి చుట్టూ వెహికిల్ చైన్లు తిప్పుకుంటూ తిరిగేవాళ్లు. ఈ రెండు గ్రూపుల మధ్య ఏదైనా రాజుకుందంటే.. కాలేజీ గేట్లు మూసేదాకా వచ్చేది. మొగల్రాజపురం అంతా విద్యార్థుల కవాతుతో దద్దరిల్లేది. ఇలాంటి గొడవల్లోనే ఒకసారి కాలేజీలోకి ఎవ్వర్నీ పోనివ్వడం లేదు. ఆ టైంలో నేను కాలేజీలోకి ఎంటరవుతుంటే కొందరు ఆపేశారు. అక్కడే ఉన్న యు.ఎస్.ఒ.కి సంబంధించిన రమణ నన్ను ఒక్కడిని మాత్రం లోపలికి వదలమని ఆర్దరేశాడు. లోపలికి వెళ్లినా, నేను క్లాసుకు వెళ్లనని ఏ కల్చరల్ ప్రోగ్రాం గురించో కసరత్తు చేస్తానని వాళ్ల్షకంత నమ్మకం మరి. డిసెంబర్ ౩1 హంగామా
'న్యూ ఇయర్ రాబోతోందంటే వీరలెవల్లో మందు పార్టీ చేసుకోబోతున్నట్టు ఒకటే హంగామా చేసేవాళ్లం. మా పార్టీ ఏంటో తెలుసా? ఒకటిన్నర లీటర్ల “స్పయిట్ సాఫ్ట్ డ్రింక్ విత్ మిక్చర్. అంతే ! ఒక డిసెంబర్ 31కి మా (ఫైండ్ ఇంట్లో కలిశాం అంతా. ఆ (ఖెంద్ రూమ్మెట్ (పేరందుకు లెండి) అప్పటికే ఉద్యోగి. జీతం అందుకున్న రోజు కావడంతోనో, కొత్తగా ఉద్యోగం వచ్చిందనో... సర్‌ఫైజ్ చేయడానికి, ఎవ్వరికీ తెలియకుండా పీపాల కొద్దీ బీర్లు తెచ్చి మేడపైని వాటర్ ట్యాంకులో పోసేశాడు. నీళ్లు తాగుదామని పంపువిప్పి (మసక వెలుగులో రంగుగ మనించలేదు) గొంతులో పోసుకోగానే కుంకుడుకాయ రసం తాగినట్టు చేదు. వాంతి చేసుకున్నంత పనైంది. హ్యావ్ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తులు + 162
ఇలా సర్‌మ్రైజ్ చేయడంలో అఖండుడు తనుం 'ఎలొ షేప్‌లో ఉండే ఆ బిల్దింగులో అంతా బాచిలర్లు ఉండబట్టి సరిపోయింది. కానీ అదే ఏ ఫ్యామిలీ వాళ్లో ఉండి ఉ ంటే...?! నిషా నషాళానికి ఎక్కిన తర్వాత ఆ అర్ధరాత్రి 'మొగల్రాజపురం విధుల్లో నూలుపోగు లేకుండా ఎవరైనా తిరిగొస్తారా' అంటూ తొడగొట్టి సవాల్ విసిరేవాడు. పందెం డబ్బు వేలో లక్షలో అనుకునేరు! కేవలం రూ. ర్ మాత్రమే. నా సంపాదన నాదే...
నా పాకెట్‌మనీ కి ఇంట్లో ఆధారపడ్డం అనెది ఎప్పుడోగానీ జరిగేది కాదు. మొదట్లో ఆగస్టు 15 లాంటి రోజుల్లో రేడియోలో జరిగే ప్రత్యేక కదంబ కార్యక్రమాల్లో పాల్గొని రూ. 150 నుండి 500 వరకూ సంపాదించేవాణ్ణి. వాటితో సినిమాలు... అప్పట్లో విజయవాడలో ఉన్న పాతిక థియేటర్లూ జల్లెడ పట్టేసి... కొత్తసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవాణ్సి. అంత సినిమా పిచ్చి.
ఒకసారి మా ఫిజిక్స్ లెక్చరర్ టి.వి. ఆర్‌గారికి ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నప్పుడు ఆయన నన్ను 'నీ ఫ్యూచర్ షాన్ ఏంటి అని అడిగితే ఠరపీమని 'ఫిలిం డైరెక్టర్ నవుతానన్నాను. ఇంజనీర్‌గానో, సివిల్స్ రాసి పెద్ద ఆఫీసర్‌గానో అవతరించి ఉద్ధరిస్తానని అందరూ కలలు కనెవాళ్లుగానీ నేను మాత్రం మొదట్నించి సినిమా దైరక్టరు అవ్వాలనుకునవాణ్ణి. నా కలల్ని సాకారం చేసుకోవడానికి డిగ్రీ అయిపోగానే చలో మద్రాస్ అంటూ ఆ రోజే ప్రారంభమైన 'పినాకిని' ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఎక్కేశాను.
“'ఖైరవద్వీపం) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న రోజుల్లో సిద్దార్థ కాలేజీవాళ్లు పిలిచి బెస్ట్ అవుట్ గాన్ స్టూడెంట్‌గా గుర్తించి “మిస్టర్ సిద్దార్ధ అనే బిరుదుతో మా పేరెంట్స్ ముందు నన్ను సన్మానించడం జీవితంలో మరచిపోలేని మధుర ఘట్టం. తర్వాత 'మనసంతా నువ్వే' చిత్ర దర్శకుడిగా మీ ముందుకు రావడం... ఆ తర్వాత ఏం జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు ! కానీ.. ఇప్పటికీ ప్రతి వదాదీ జరిగే సిద్ధార్ధ 'సృజనోత్సవ్‌కి నాతో పాటు ఒకరిద్దరు సెలబ్రిటీలను వెంట తీసుకుని వెళ్లి ఆ ఉత్సవంలో పాల్గొంటాను. ఆ రకంగా నా హ్యాపీదేస్‌ని నేను ఎప్పటికీ మిస్ కాను.
(07 10.2072 ఆంధ్రజ్యోతి ఆదివారం,
శ్ ల్ ॥ ; రా జా ౯ ఫే మళ! _ స్టగాసులో వాల ఖా! శ .“ న క్ ర న న స కి క్ ణ్" లో | అనల వ. కారుణ్వ సంగీతం వచ్చింది కాని బాల్యం వోయింది “ఇండియన్ ఐదల్-2” లో రన్నర్ అవ్‌గా నిలిచిన తొలి దక్షిణాది గాయకుదతను. “అణే చార్ అణే' (లగే రవో మున్నాబాయ్) పాటతో నినీ అరంగేట్రం చేనీ, “ఏకాంతంగా ఉన్నా” (అశోక, “ఎందుకో విచ్చివీచ్చిగా (చిరుతు, 'ఓరుగల్లుకే వీల్లా” (సైనికుడు), సిడ్నీ నగరం” (ఆరెంబ్స), '“అమాయి కిటికీ వక్కన కూర్చుంది” (మర్వాద రామన్న, 'నదాళివా సన్వానీ” (ఖలేజా), వయ్యారాల జాబిల్లీ (తీన్‌మార్, 'యమగా ఉందే” (క్తి, 'తడిపెదవులే (ఇట్స్ మై లవ్ స్లోర్సీ నుందీ 'విల్లను చూస్తే (కెమెరామెన్ గంగతో రాంబాబు) వరకు ఎన్నో (శ్రావ్యమైన పాటలందించి (ోతల అభిమానం పొందాదు. మూదు పదుల వయసులోనే నంది, ఫిలిమ్ ఫేర్ లాంటి వురస్తారాలను కైవసం చేసుకున్న వర్తమాన యువ గాయకుడు కారుణ్వ. వొటకు పల్లవి ప్రాణమంటారుగానీ... పాడగా పాడగా... ఆ పాటే నా ప్రాణంగా మారింది. మా 'నల్లాన్ చక్రవర్తి వంశంలో తరతరాలుగా అంతా సంగీత ప్రియులే. తాతగార్లు “శ్రీనివాస సోదరులు శతవధాన్లు. మా కుటుంబ వేడుకల్లో అందరం ఒకచోట కలిశామంటే చాలు. సరస్వతి కొలువుతీరి, అప్పటికప్పుడు అక్కడొక నిలయ విద్వాంసుల కచేరీ జరిగేది. మొదట్లో గాత్రం అబ్బిందని సంతోషించా గానీ, మిగతా పిల్లల్లా బాల్యానికి దూరమయినందుకు ఒక దశలో బాధపడ్డానని ఒప్పుకోవాలి. ఒకానొక సమయంలో హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 164
ఈ గాత్రం నన్ను ఎన్ని ఇబ్బందుల పాలుచేసిందో, ఎన్ని మందులు మింగించిందో, ఎంత అశాంతికి గురిచేసిందో చెప్పలేను.
అమ్మ జానకి బి.డి. ఎల్.లో, నాన్న మధు దడి.ఆర్.డి. ఎల్‌లో ఉద్యోగులు కావడంతో బాల్యమంతా యుద్ధ వాతావరణంలో గడిచినట్టుండేది. ఒకరు 'పృథ్వి' లాంటి మిసైల్స్‌కు రూపకల్పన చేస్తే, మరొకరు వాటి తయారీకి నడుం బిగించేవారు. అబ్బుల్ కలామ్‌గారొచ్చినా, ఆగస్టు పదిహేనొచ్చినా ప్రార్ధనా గీతం నేను వెళ్లి పాడాల్సిందే. నా పాట విని అందరూ చప్పట్లతో అభినందింస్తుంటే ఇతరులలో లేని ప్రత్యేకత ఏదో నాలో ఉందనేది మాత్రం కొద్దికొద్దిగా అర్ధమయ్యేది. ఇద్దరి ఉద్యోగాలు ఒకే ఏరియాలో కావడంతో, నా చిన్నప్పుడే 'బాలాపూరొలో ఇల్లు కట్టుకున్నాం. అప్పట్లో అది అడవి ప్రాంతం. లేళ్సు, పాములు, తొందలు, రాబందులు, ఉదుములు... ఇలాంటి జీవరాసులతో కలిసి జీవించాం. రెండేళ్లపాటు ఆ ఏరియాకు ఎలక్ట్రిసిటీ లేదంటే మీరు నమ్మగలరా? తీరా ఒక్కొక్క ఇల్లూ పుట్టుకొస్తుంటే మాత్రం “అయ్యో, ప్రకృతికి దూరమైపోతున్నామె అని బాధనిపించేది. తొలి అద్వంచర్ అదే !
అప్పట్లో అమ్మా నాన్నలు సిద్ధి సమాధియోగ తరఫున మెడిటేషన్ కోర్సు కోసం చిట్టడివిలా ఉండే 'రావిరాలి ఆశమానికి వెడుతూ బాల వాలంటీర్‌గా నన్నూ వెంట తీసుకెళ్లారు. అక్కడికి వచ్చినవారంతా 'మౌనమే మా భాష ఓ మూగ మనసా అన్నట్లు ఉండేవారు. దాంతో నాలాంటి పిలకాయలకు పిచ్చెక్కిపోయేది. కోర్సులో భాగంగా ఒకరోజు అందర్నీ గుట్టలు ఎక్కించారు. ఒక పెద్ద కొండ సగం ఎక్కేసరికి వర్షం... అంతా వెనుతిరిగారు. అయితే ఆ కొండ పూర్తిగా ఎక్కాలనేది నా కోరిక. వాళ్లతో తిరిగొచ్చేశానే కాని అక్కడ ఏముందో అని ఆలోచిస్తూ రాత్రంతా జూుగరణ చెశా. తెల్లవారి 4 గంటల బైంలో నా ఈడు వాడుకిట్టూని నిద్రలేపి, ఆ కొండ దగ్గరకి తీసుకెళ్లాను. రాత్రంతా వర్షం పడడం వల్ల ఏటవాలుగా ఉన్న ఆ కొండ ఎక్కుతోంటే ఒకటే జారడం. అయినా 'సాహసం శేయరా డింభకా...” అనే మాటని జపం చేస్తూ అతి కష్టం మీద కొండ శిఖరం చేరాం. అక్కడ “రాజకుమారి లభించలేదు గానీ పెద్ద తాచుపాము కనిపించడంతో... గుండె గుభేల్‌మంది. నాతో వచ్చిన కిట్టూ కెవ్వు కేక. “చిమ్మచీకట్లో అంత సాహసం ఎలా చేయగలిగానా' అనేది ఇప్పటికీ సందేహమే! ఆఅ విధంగా స్టేజ్ ఫియర్ పోయింది
ఎల్.కె.జి. నుండి టెన్త్ వరకూ మిధాని దగ్గరుండే బి.పి.డి.ఎ.వి. స్కూల్లో సాగిన చదువు నాది. పాడతానని తెలిసి మా ప్రిన్స్‌పాల్ సీతాకిరణ్‌గారు. ఒకరోజు అసెంబ్లీలో నాచేత పాడించారు. ఇప్పటికీ గుర్తు 'ఆకులో ఆకునై” పాదా. దాంతో ఆవిడ ప్రతి
మంగళవారం (ప్రేయర్లో ఒక ప్రైవేట్ సాంగ్ పాడమని ఆర్దర్ జారీ చేశారు. నా టెన్స్ అయ్యేలోగా ఎన్ని వందల పాటలు పాడి ఉంటానో లెక్కేయండి | ఆ విధంగా నా స్టేజ్ ఫియర్‌ని పోగొట్టిన ప్రిన్స్‌వాల్‌గార్కి నేనెప్పుడూ రుణపడి ఉంటా. మా మేడమ్ లక్ష్మిగారు కంజీర, మంజరిగారు తబలా, తపతిగారు హార్మోనియం వాయిస్తుంటే నేను పాడేవాణ్లి. వీరు ముగ్గురూ దేశంలోని మిగతా భాషల పాటల్ని కూడా సేకరించి నాతో పాడించి “ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్'కు పంపించేవారు. నేను అలా వెళ్లగానే, షీల్దుకోసం ఒక అల్మారా తయారుచేయించేవారు మా ప్రిన్స్‌పాల్. ఆమెకు అంత నమ్మకం నేను షీల్టుతో తిరిగి వస్తానని. పాట నాకు వరమా? శాపమా?
పాట అబ్బడం కాదుగానీ ఆటలన్నీ మిస్సయ్యే వాణ్ణి. తోటి పిల్లలు ఆడుకుంటుంటే గొప్ప అసూయగా ఉండేది. నాకిదేం శిక్షరా దేవుడా? అని ఏడుపొచ్చేది. స్కూలు నుండి రావడం ఆలస్యం, నాన్నగారు రెడీగా ఉండేవారు - సంగీతం క్లాసులో నన్ను దిగబెట్టడానికి. పైగా ఎవరింటికి వెళ్లినా నన్ను చూడగానే కారుణ్యా.. ఒక పాట పాడు” అని దర్జాగా పురమాయించేవారు. ఆదివారం ఉదయం పదిగంటలకు టీవీలో వచ్చే డిడి ప్రోగ్రామ్స్ బేతాళ, మొగిలీ లాంటి సీరియళ్లు చూడనీయకుండా నన్ను కబళించే సంగీతం క్షాసులంటే ఏవగింపు కలుగుతున్నటైెంలో ఒక సంఘటన ఒ3౨గింది.
మా కజిన్ 'వంశీ పెళ్లిలో తలంబ్రాల సీన్ అయ్యాక అంతా పెళ్లి విందు ఆరగిస్తున్నారు. తర్వాత షరా మామూలే - అంతవరకు పురోహితుడు మంత్రాలు చదివిన మైకును నాకందించి పాట పాడమన్నారు. తప్పదు కదా! 'భక్త ప్రహ్ణాదిలోని 'మందార మకరంద” పద్యం ఎత్తుకున్నాను. అంతే ! ఎక్కడో డైనింగ్ హాల్లో తింటున్నవాళ్లంతా ఆ ఎంగిలి పళ్లేలతోపాటు పెళ్లి మండపం దగ్గరకి వచ్చెసి స్థాణువుల్లా నిల్చుండిపోయి నా పాట వినసాగారు. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ! ఆ వెంటనే మరో పద్యం 'కంజాక్షునకు గాను...” నా పాటతో కడుపు నిండిపోయిన తృప్తి వాళ్ల కళ్లలో... నా గాత్రానికి అంత పవరుందని అప్పటి వరకూ నాకు తెలియదు. దాంతో లోపల ఏదో అలజడి మొదలైంది. ఇకపై పాటని నిర్లక్ష్యం చేయకుండా, మరింత సానబట్టుకోవాలని అనిపించింది. “పాడుతా తీయగా'లో బాలుగారి ప్రశంస
నేను తొమ్మిదో తరగతిలో ఉండగా ఈటీవీ వారు పిల్లలతో “పాడుతా తీయగా” తొలిసారిగా ఆరంభించారు. నాన్నగారు నేను పాడిన పాటలేవో వాళ్లకు పంపారు కానీ అప్పటీకే వాళ్లు పెట్టిన గడుపు అయిపోవడంతో నన్ను తీసుకోలేదు. ఆ తర్వాత సెలక్టయిన పిల్లల్లో ఒకబ్బాయి ఏవో కారణాల చేత తప్పుకుంటే ఆ ఛాన్స్ నన్ను వెతుక్కుంటూ హ్యాసీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 166
వచ్చింది. ఉన్నపళంగా నన్ను తీసుకుని సారథి స్టూడియోకి వచ్చేయమని బాలుగారి అర్మెస్తాలో ఉందే కృష్ణగారి నుండి పిలుపు. బాలుగారి ఎదుట వాడటం... నిజంగా నాకో కల. ఇప్పటికీ బాగా గుర్తుంది. ఒక ఎపిసోడ్‌లో సుందరాంగా... అందుకోరా" (భూకైలాస్) పాడితే, బాలుగారు, 'నీ గొంతుని ఇలాగే ఉంచుకోవయ్యా.. ఎంత బాగుందో ... కావలిస్తే ఒక మగ గొంతు ఉన్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తాం. ఇద్దరూ ఎంచక్కా పాడుకుంటూ ఉండొచ్చు” అన్నారు. (ఫైనల్స్‌లో అబ్బాయిల్లో నేను, అమ్మాయిల్లో మాళవిక ఎన్నికయ్యాం, స్వరం మారింది - గుండె జారింది
సరిగ్గా బాలుగారు ఆ మాట అన్న 8 నెలలకే నా గొంతులో ఏదో మార్చు 'హెపిచ్‌లో పాడుతుంటే కీచుగా మారిపోయేది. ఒకే గొంతులో రెండు మూడు గొంతులు కలిసిన ధ్వని వచ్చేది. కంఠంలో ఏదో జరిగిపోయిందని బెంబీలెత్తిపోయి, ఇంట్లో వాళ్లని కంగారు పెట్టేశాను. వాళ్లు అల్లోపతి, హోమియోపతి, యునానీ, రేకి హీలింగ్, భస్మాలు, చూరాలు, యోగాలు... ఉప్పుకారాలు తగ్గించడాలూ, కషాయాలు తాగిపించడాలూ... హాజ్‌మోలాలు తినిపించడాలూ... ఒకటి కాదు, ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు. గొంతు పోయిందని అన్నం తినడం మానేసి బెంగెట్టుకున్నాను. చివరికి ఒక డాక్టరుగారు “గొంతులో ఏ లోపం లేదు. బాల్యం నుండి కౌమారంలోకి అడుగు పెడుతున్నప్పుడు సహజంగా ఏ అబ్బాయి స్వరమైనా మారుతుందిన్నాడు. అదే నిజమైంది. 4 నెలల్లో స్వరంలో లాలిత్యం పోయి గాంభీర్యం నెలకొంది. అది వయసు మార్పనే ఐడియా ఎవరికీ రానేలేదు సుమండీ! అందరి కన్నులు నామీదా... నాకన్నులు మాత్రం నీమీదా....
శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో మా క్లాసులో ఒకమ్మాయి నన్ను విపరీతంగా ఆకర్షించేది. చూస్తుండగానే ఆ రెండేళ్లూ దొర్లిపోయాయి గానీ ఒక్కసారి కూడా తనని పలకరించిన పాపాన పోలేదు నేను. అది మూగ (ప్రేమో, ఆరాధనో తెలిసేది కాదుగానీ ఒక క్రష్ అని మాత్రం అర్ధమయ్యేది. ( అదేంటో.. అమ్మాయిల్ని మా స్వంత సాొత్తుల్లా.... పలానా అమ్మాయి నా కాండిడేట్, తనని మరొకడు కన్సెత్తి చూడరాదని ప్రకటించేసేవాళ్లం). ఇంటర్ తర్వాత మా దారులు వేరయ్యాయి. ఆ తర్వాత మూడేళ్లకు - నేను “ఇండియన్ ఐడల్ రియాల్టీ షోలో పాల్గొని వచ్చాక సి.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోగ్రాం ఇస్తుంటే... నా ఇంటర్మీడియట్ (ఫైండ్ ఒకడు “నీవు ఇష్టపడే అమ్మాయి నీ ప్రోగ్రాంకు వచ్చిందిరా” అన్నాడు. షో అయిపోయువరకూ అందరి చూపులూ నాపైనుంటే నా చూపులు మాత్రం ఆ అమ్మాయి కోసం వేలమంది ఆడియన్స్‌లో వెతుకుతూనే ఉన్నాయి. ప్రోగ్రాం పూర్తవడం, జనం ఒక్కసారిగా నా పైన పడిపోవడం...
దాంతో నన్ను బలవంతంగా కారెక్కించి పంపించడం... ఆ అమ్మాయి మళ్లీ కనిపించనే లేదు. ఇప్పుడు కనిపించినా గుర్తుపడతానో లేదో అనుమానమే. ఐడల్‌కు వెళ్లడంలో మిత్రుడి పాత్ర
తీగల కృష్ణారెడ్డి? ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్‌లో ఉండగా “ఇండియన్ ఐడల్ రియాల్టీ షో-2” ఆడిషన్స్‌లో మా (ఫైండ్ వినయ్ (ఎల్‌కేజీ నుండి ఇంటర్ వరకు కలిసే చదివాం) ప్రోత్సాహంతో పాల్గొన్నాను. మొదట్లో అంతా నేనే 'విన్” అవుతాననుకున్నారు కానీ, చివరికి రన్నర్‌గా నిలవడం... దాంతో బుల్లితెర ప్రేక్షకులంతా నిరాశకు గురికావడం, కొందరైతే నాకు రాలేదన్న బాధతో రిమోట్స్‌ని టీవీకేసి విసిరి కొట్టడం చేశారని తెలిసింది. అభిమానం ముందు ఎన్ని ఐడల్స్‌లో పాల్గొని గెలిచినా తక్కువే అనిపించి కళ్లు చిప్పిల్లేవి.
ఐడల్ ప్రోగ్రాంని అమెరికాలో చూసిన బాలీవుడ్ దర్శక, నిర్మాత విధు వినోద్ చోప్రాగారి సోదరి షెల్లీ (శైలజ) గారు, నేను విన్ కాలేదని తెలిసి ఏడుస్తూ వాళ్ల అన్నయ్యకు ఫోన్ చేసి ఎలాగైనా కారుణ్యకు అవకాశం ఇవ్వమన్నారట. ఆయన నుండి పిలుపు వచ్చిన టైంలో ముంబాయిలో నా కో - సింగర్ “మీనన్ జైన్ ఇంట్లో లంచ్ చేస్తున్నాను. ఆయన తీసిన పరిందా, 1942 లవ్ స్టోరీ, మున్నాబాయ్ ఎం.బి.బి. ఎస్ చిత్రాలు గుర్తొచ్చాయి. ఆయన సంగీత దర్శకులు 'శాంతన్ మొయిత్రా"కు ఫోన్ చేసి నా గురించి చెప్పడం, మర్రోజు రికార్దింగ్ జరగడం, 'లగేరహో మున్నాబాయ్‌ుిలో 'అణేచార్ అణే' పాట పాడించడం.... కలలో జరిగినట్లు జరిగిపోయాయి. తర్వాత జూ. ఎన్.టి.ఆర్ గారి “అశోక్ చిత్రంతో మణిశర్శగారి ద్వారా తెలుగులో అరంగేట్రం చేశాను.
గమ్మత్తేమంటే, ఐడల్ నుండి వచ్చాక ఒకరోజు అతి మామూలుగా లంచ్ బాక్స్ బుక్స్ తీసుకుని రోజూ మాదిరే కాలేజీకి వెళ్లాను. స్టూడెంట్స్ అంతా 'కారుణ్యా, కారుణ్యా అంటూ నా చుట్టూ మూగి “ఐడల్ షోలో జడ్డిలుగా వచ్చిక అమితాబ్, ప్రియాంక చోప్రా, కరీనా, కాజోల్... లాంటి సెలబ్రిటీల గురించి చెప్పవా అంటూ గుమిగూడారు. ఆరోజు క్లాసులన్నీ ఐడల్ ముచ్చట్లతోనే ముగిశాయి. అప్పటికే కొన్నాళ్లుగా *'పాటి నన్ను గాలమేసి లాగుతుండడంతో, ఇక పూర్తిగా పాటకే అంకితమవ్వాలని నిర్ణయించుకుని, అదేరోజు సాయంత్రం అప్పటివరకూ దాచుకున్న వ్యాపీడేస్‌ని మూటగట్టుకుని ఇంటికి వచ్చేసి, మళ్లీ కాలేజీ వైపు కన్నెత్తి చూడలేదు. నా హ్యాపీడేస్ మనసులో మెదిలినప్పుడల్లా ఆ జ్ఞాపకాల మూటని విప్పుతుంటాను!
(24 20.2022 ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాప్ డేస్ = సన్ ప్రముఖం చిన్ననాటి లీని సప్త 2 168
స. స్ ఆలో త్రి ప్రా
చిన్నప్పుట్నించి నాకు సినిమా పిచ్చె
దాల్బం నుంది ఎదురైన 'వ్యోవీదేన్” ని మన్ కాకుందా అనుభవిస్తూ,
చివరికి తను కోరుకున్న నినీరంగం వైవు అడుగులు వేశాదతను.
ఈశ్వర్, వర్షం, మాన్, భద చిత్రాలకు అనీ స్టెంట్, అసోనియట్
డైరెక్టరుగా వనిచేనిన అనుభవంతో (పభాన్ మున్నా” చిత్రానికి
తొలినారిగా దర్భకత్వం వవొంచాడు. జూ. ఎన్.టి. ఆర్. బృందావనం”
విజయంతో నీనీవినీలాకాళశంలో తన అస్తీత్వవు బావుటా ఎగరేశాడు.
ఆ తర్వాత “ఎవదూ “ఊవీరి” నినిమాలతో దర్భ్శకుదిగా
తానేమిటోనిరూవీంచుకున్నారు వంళీ పైడిపల్లి.
ఒకసారి వెనక్కి తిరిగి నా స్కూల్ డేస్‌ని, కాలేజీ దేస్‌ని గుర్తు చేసుకుంటే, అలవోకగా పెదాలు విచ్చుకుని, జీవితం కంటే మిరకిల్ ఈ ప్రపంచంలో మరొకటి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో ఎవరం వమవుతామనేది ఎవరికీ తెలియదు కదా! అనుకోనిది జరగడం మిరకిల్ కాక మరేమిటి?
నేను ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు చదివింది "హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో. అక్కడే హాస్టల్లో ఉండటంతో అదే ప్రపంచంలా ఉండేది. అప్పట్లో స్కూలొక జైలులా, రోజులు భారంగా గడిచినట్లుండేది కానీ, ఇప్పుడాలోచిస్తే... అవే నిజమైన హ్యాపీడేస్ అనీ... బాధలకు, బాధ్యతలకు దూరంగా విహంగంలా స్వేచ్చగా ఎగిరింది అప్పుడె గొరుసు జగదీశ్వర రెడ్డి + 169
కదా అనిపిస్తుంది. అదిగాక నవీన్, శ్రవణ్, పవన్, చందూ, రమణ, ఆనంద్ లాంటి మనసుకు దగ్గరైన కొందరు మిత్రుల్ని ప్రసాదించిన స్కూల్ అది. వాళ్లు నా క్లాస్‌మేట్స్ అనడం కంటే 'సోల్‌మేట్స్' అంటే బాగుంటుంది. వీళ్లల్లో డాక్టర్లు, కంపెనీ యాజమాన్సు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌లో సెటిలైన వాళ్లూ ఉన్నారు. మిత్రులైన అందరూ మనతోపాటు ట్రావెల్ చేయరు కదా. చివరిదాకా నడిచేది కొందరే. అందరం ఎప్పుడైనా కలిస్తే మా మా అధికారపు వలువల్ని వదిలేసి మరోసారి 'పబ్లిక్ స్కూలొ పిల్లలుగా మారిపోయి కేరింతలు కొడతాం. పొద్దంతా సినిమా హాల్లోనే నాకు 'సినిమా వైపు దృష్టి మళ్లడానికి వెనకున్న కారణం ఊర్లోని మా
“లక్ష్మి థియేటర్. నేను పుట్టకముందే నాన్నగారు ఆ థియేటర్ కొన్నారు. ఏడాదిలో సంక్రాంతి, వేసవి, దసరా... ఇలా మూడు దఫాలుగా సెలవులిచ్చేవారు స్కూల్లో. ఎప్పుడు ఖానాపూర్ వెళ్లినా ఎక్కువగా ఆ సినిమా హాల్లోనే గడిపేవాడ్ని. రీల్స్ లోడ్ చేయడం, ప్రొజెక్టర్ నడిపించడం, సౌండ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో పరిశీలించడం, బుకింగ్‌లో కూర్చొని టికెట్స్ అమ్మడం... కొత్త సినిమా వస్తోందంటే చేసే హడావిడి ఇంతా అంతా కాదు. ఇవన్నీ నాకు తెలియకుండానే సినిమాపై మోజు ఏర్పడేలా చేసేవి. ఇక సెలవులు అయిపోతున్నాయంటే మాత్రం దడ మొదలయ్యెది నాలో. ఆ సినిమా హాలుని, అమ్మావాళ్లను వదిలి హైద్రాబాద్ రావాలంటే ఏడుపొచ్చిది. రావడమేంటి ఏడుస్తూనే ఉందేవాడ్ని. మా సినిమా హాల్ మేనేజర్ శేఖర్‌తో నన్ను పంపించేవారు. మా నాన్న నోటి వెంట ఆ మాట వినగానే ఆయన గుండెలో రాయి పడేది. ముందే అతను బి.పి. పేషెంటు. హైద్రాబాద్ చేరేవరకు అతడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడ్ని. ఒకటికి రెండు బి.పి. మాత్రల్ని వేసుకుంటేగానీ నన్ను కం[టటోల్ చేయలేకపోయేవాడు. ఎప్పుడో ఒకనారి నాన్న దిగబెట్టేవాడు. అప్పుడు మాత్రం మనం గప్‌చుప్... రాముడు మంచి బాలుడు కదా!
ఆ సినిమా ఇష్టంతోనే స్కూల్ వారికోత్సవాల్లో వేసే నాటికల్లో పాల్గొనాలనె ఉబలాటం ఉండేది నాలో. ఒకసారి 'శ్రీకృష్ణదేవరాయలు” డ్రామా వేస్తుంటే ఆ కిరీటాలు, గదలు, విగ్గులు లాంటి ఆహార్యం చూసి 'టెంప్ట్ అయ్యి, నేను కూడా రాజు వేషం వేస్తానన్నాను. వాళ్లిచ్చిన డైలాగులు సరిగ్గా చెప్పలేదో ఏమో గాని చివరికి శూలం పట్టుకుని నోరు మెదపకుండా నిలబడే ద్వారపొలకుడి వాత్ర ఇచ్చి అదే రాజు పాత్ర అని సర్దుకోమన్నారు. ఆ తర్వాత మల్లీ ఎప్పుడూ మొహానికి రంగేసుకుని స్టేజి ఎక్కిన గుర్తు లేదు. హ్యాపీ డేస్ = సన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 176
నాన్నగారితో తధిగిణతోం! అదేమిటో... చిన్నప్పట్నించి నాకు సినిమా పిచ్చే. చిరంజీవి సినిమా విడుదలైందని తెలిస్తే చాలు, 'అసెంన్లీ అవగానే అట్నుంచి అటే అందరం కూడబలుక్సుని, క్లాస్‌కు వెళ్లకుండా వెనక గోడ దూకి మార్షింగ్ షోకి పారిపోయవాళ్లం. నాకు దివ్యభారతి సినిమాలంటే కూడా యమపిచ్చిగా ఉండేది. గోడ దూకే బ్యాచ్‌లో నాతో పాటు నవీన్, (శ్రవణ్, పవన్ ఉండేవాళ్లు. క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 0-ధియేటర్‌కు తప్ప మిగతా అన్ని హాళ్లకు వెళ్లేవాళ్లం. ఎందుకంటే ఆ హాలు నవీన్ వాళ్లదే. స్టాఫ్ గుర్తుపట్టి వాడి ఇంట్లో చెబుతారని అదొక్కటి మినహాయించేవాళ్లం. నేను 8వ తరగతిలో ఉండగా షరా మామూలుగా గోడదూకి వెళ్లి, సినిమా చూసి వచ్చేసరికి నన్ను చూడ్తానికి నాన్నగారు ఊరి నుండి వచ్చి ఉన్నారు. ఇంకేముంది? పట్టుబడిపోయాను. దొంగ దొరికిపోయాక శిక్ష తప్పదు కదా. తధిగిణతోం! బహుశా నాకు గుర్తున్నంతలో అదే తొలిసారి, చివరిసారి అనుకుంటా నాన్నగారితో దెబ్బలు తినడం. తర్వాత ఎప్పుడూ ఆయన నాపై చెయ్యి చేసుకోలేదు. ఆ సంఘటనతో 'వీద్ని ఇలా వదిలేస్తే లాభం లేదినుకున్నారేమో వెంటనే ఆదిలాబాద్ జిల్లా, ఖానాపూర్‌లో ఉన్న అమ్మవాళ్లను హైద్రాబాద్‌కు షిప్ట్ చేయించారు. అప్పట్నించి ఇంటీ నుండే స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. దాంతో మరింత ఫ్రీడం దొరికేదనుకోండి. నా ఒక్కడికే ఇన్విజిలేటర్! ఉప్పల్ 'లిటిల్ ఫ్లవర్స్‌లో (ఇంటర్మీడియట్ సెకండియర్) ఉండగా జరిగిన సంఘటన ఇది. అప్పట్లోనే నాకో బైకుందేది. సంక్రాంతి హాలీడేస్ డిక్లేర్ చేసిన రోజే... అంతా ఊరెళ్తామనో, మరేదో గుర్తు లేదు గానీ ఆ సంతోషంలో మరో ఇద్దర్ని ఎక్కించుకుని స్పీడ్‌గా డైవ్ చేస్తూ కాలేజీ ఎదురుగా ఒక టర్నింగ్ వద్ద స్కిడ్ అయి పడేశాను. నా వెనకవాళ్లకి ఏమీ కాలేదు కానీ, నాకు మాత్రం కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇంకేముంది? కాలుకి పెద్ద కట్టు. లోపల ప్ట్‌ల్ రాడూ! సరిగ్గా ఎగ్జామ్స్ రెండు నెలలు ఉండగా జరిగిన యాక్సిడెంట్. చూస్తుండగానే హాల్‌టికెట్ కూడా వచ్చెసింది. “ఎగ్జామ్స్ రాస్తావా? లేక సెప్టెంబర్‌కు ప్రిఫేరవుతావా?” అని అడిగారు నాన్న. “లేదు, ఇప్పడే రాసాను అనేశాను. ఎందుకంటే “సరిగ్గా నడవలేక, క్షచెస్‌తో కుంటుతూ ఎగ్జామ్ హాల్‌కు వెళ్తే సింపతీతో కాపీ కొట్టొచ్చనే'ది నా ఆలోచన. మా అమ్మగారితో పాటు ఒకరోజు ముందే మౌలాలీలోని ఒక కాలేజీ సెంటర్‌లో నా సీటెక్కడో చూడ్డానికి బయళట్టైరాను. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది ఏమంటే- నేను ఎగ్జామ్ రాయాల్సింది నాలుగో అంతస్తులో అని. అన్ని మెట్లు ఎక్కి వెళ్లడమనేది అసాధ్యం. అంతలో ప్రిన్స్‌పాల్‌గారు అటుగా వచ్చి మా అమ్మగారితో, “అంత (శ్రమ పడి ఎందుకమ్మా
ఫోర్త్ వ్లోర్ ఎక్కడం? నా రూమ్‌లో నా ఎదురుగా కూర్చుని ఎగ్జామ్ రాయమనండి' అన్నారు. ఒక్కనారిగా షాక్ అయ్యాను. మొదటికే మోసం వచ్చిందిరా దేవుడా అనుకున్నా. వందమంది స్టూడెంట్స్‌కి ఒక ఇన్విజిలేటర్ ఉండాల్సింది పోయి నాకొక్కడికే ఒక ఇన్విజిలేటరు అయ్యాడు. ప్రిన్స్‌పాల్ మీద చాలా కోపం వచ్చింది. కొసమెరుపు ఏంటంటే... ఎగ్జామ్స్ అన్నీ ఆయన రూమ్‌లో, ఆయన ఎదురుగా కూర్చుని, అస్సలు కాపీ కొట్టకుండా రాసి, ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం!
అన్నట్టు, చెప్పడం మరిచిపోయా - లిటిల్ ఫ్లవర్స్” ఓసీ బాయ్స్ కాలేజీ కావడంతో అమ్మాయిలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించేది. పైగా కౌమార దశ ఎంటరింగ్ కదా... ఆ లోటును పూరించుకోడానికి అప్పుడప్పుడు సాయంత్రాలు కాలేజీ అయిపోయాక ప్రత్యేకంగా సికింద్రాబాద్‌కు గుంపుగా తరలి వెళ్లి “సెయింట్ ఆన్స్ ముందు నిలబడి, అమ్మాయిలను చూసేవాళ్లం. అది కేవలం అరోగ్యకరమైన వేడుకే గానీ, చెడు ఆలోచనలకు తావుందేది కాదు. కర్రతో వెంబడించిన చోటే, పూలతో స్వాగతించారు
అప్పట్లో వచ్చిన ప్రేమదేశం, ప్రేమికుడు సినిమాలంటే పడి చచ్చేవాళ్లం. ఈ రెండు సినిమాలు కుర్రకారుని ఎట్లా అల్లాడించాయో మీకు తెలియంది కాదు. కాని మా దరిదాపుల్లో ఉన్న హాల్ప్‌లో ఆ సినిమాలు ఆడుతున్నా చూసేవాళ్లం కాదు - క్రాస్‌రోద్స్ వెళ్లి సంధ్య, సుదర్శన్, ఓడియన్ లాంటి వాటిల్లో చూస్తేనే సినిమా చూసినట్లు ఉందేది మాకు. నేను టికెట్స్ తీస్తానని చెప్పి, మిగతా వారిని న్యూస్ పేపర్స్ కటింగ్స్ తీసుకురమ్మని ఒప్పందం చేసుకునేవాడ్ని (పాట మొదలవగానే కాగితం ముక్కల్ని పైకి విసిరీయడంలో గొప్ప ఆనందం ఉండేది మరి)
ఒకసారి సుదర్శన్ 85 ఎం.ఎం.లో “*ఢ్రేమికుడు సినిమాకి 20 మందిని వెంటేసుకుని వెళ్లాను. అప్పటికే ఆ సినిమా చూడ్డం నాలుగో సారనుకుంటా. సినిమా మొదలైంది. మొదటి పాట మొదలవగానే 20 మందిమి ఒకేసారి లేచి నిలబడి పేపర్ కటింగ్స్‌ని పైకి విరజిమ్మి, విజిల్స్ వేస్తూ, డాన్స్‌లు మొదలెట్టాం. మొదట్లో ఏదో కుర్రకారు అభిమానం అనుకున్నారు గానీ, ప్రతి పాటకీ లేచిపోతుంటే ఇక ఓపిక సన్నగిల్లి, కోపంతో వెళ్లి సినిమా మేనేజర్ 'మక్సూదొని వెంటబెట్టుకుని వచ్చారు. ఆయన రావడంతోనే పెద్ద కర్రపుచ్చుకుని వచ్చి మమ్మల్నందర్నీ బయటికి తరిమెశారు.
(అదే సుదర్శన్ 35 ఎం.ఎం.లో నా “బృందావనం సినిమా విడుదలైనప్పుడు, అదే మేనేజర్ మక్సూద్ కనిపించాడు. “ఢ్రేమికుడు” సినిమాలో తను కర్రతో మమ్మల్ని వెళ్లగొట్టిన సంఘటన గుర్తుచేస్తే 'అప్పుడది నా డ్యూటీ కదా సార్ అన్నాడు నవ్వుతూ) హ్యాపీ డేస్ = సన్ ప్రముఖల బిన్ననాటి తీస్ గుర్తులు + 172
డిగ్రీలోనే పెల్లి పెద్దనయ్యాను ఇంటర్మీడియట్ తర్వాత నేను చేరింది కాచిగూడా దగ్గరున్న 'భద్రుక కామర్స్ డిగ్రీ కాలేజిలో. మొదట్నించి నాన్నగారు నా చదువు విషయంలో చాలా (శ్రద్ధగా ఉ ండేవారు. నేనెప్పుడూ మంచి స్కూళ్లలో, కాలేజీల్లోనే చదవాలని నగరంలోని కాలేజీలన్నీ జల్లించి తనకు నచ్చిన దాంట్లో చేర్పించేవారు. అప్పటి వరకూ అమ్మాయిల ముఖం ఎరుగని 'లిటిల్ ఫ్లవర్స్ నుండి కో - ఎడ్యుకేషన్ “'భద్రుకికు రావడంతో కాస్త రిలీఫ్‌గా ఉండేది. (మరో కాలేజి ముందు నిల్చుని బీటేసే బాధ తప్పినందుకు). నా జూనియర్ ఒకమ్మాయంటే (క్రష్ ఉండేది. అయితే తనతోనూ అందరితో ఉన్నట్లై (ఫైెండ్లీగా ఉండేవాద్నే కానీ ఏనాడూ థైర్యం చేసి నా మనసులోని మాట చెప్పలేదు. ఆ అమ్మాయి కనిపించగానే నా చుట్టూ ఉన్న (ఫెండ్స్ నవ్వుతూ నన్ను ఏడిపించేవాళ్లు కూడా. అయితే నేను చేసిన సాహసం ఏంటంటే నాతో పాటు డిగ్రీ చదువుతున్న వాళ్లల్లో మూడు జంటల్ని ఒకటి చేసి పెళ్లి పెద్దనయ్యాను. ఒక జంటకి (అమ్మాయి తరపు వాళ్లకు ఇష్టం లేకపోయినా, సాహసించి) ఆగమేఘాల మీద ఆర్యసమాజ్‌కు తీసుకెళ్లి పెళ్లి చేయడం పెద్ద అడ్వంచర్. ఆ జంటలన్నీ హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్నాయిప్పుడు. డిగ్రీ తర్వాత అదే కాలేజీలో ఎం.సి.ఏ. చేసి, కొంత కాలం ఉద్యోగం చేశాను. ఆ తర్వాత “ఈశ్వర్ చిత్రానికి దర్శకులు జయంత్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రప్రస్థానానికి నాంది పలికి... ఇదిగో ఇప్పుడిలా డైరెక్టరు హోదాలో మీతో నా హ్యాపీడేస్‌ను పంచుకుంటున్నాను. (272. 102022 ఆదివారం ఆంధ్రజ్యోతి)
/ (గ ల " | - ట్ స ఇ. క న (౮. యి ట్ వం స అంజనా నౌమ్య ఇప్ అందరి చీటీల్లోనూ నా పేరే! చదువులో, నంగీతంలో నవ్యసాచిలా ఏకకాలంలో చక్రం తివ్పీన పాటల రాణీ ఆమె. “పొదుతా తీయగా (వీయా వీయతమా రాగాలు) 'సూపర్ నీంగర్ త లాంటి ఎవీసోద్స్‌లో విజేతగా నిలిచి ఎందరో అభిమానుల్ని గెలుచుకున్న ఎం.బి.వ. వట్టభ్యదురాలు కూడా. 'వనలవూటి కథల” బాటిల్ సాంగ్‌తో బుల్లితెర (పేళక్షకుల తలలో నాలుకయ్యారు. కోటి నంగీత దర్శకత్వంలో క్లాన్‌మేట్స్ట్'తో నీనీ గాయనిగా అరంగే(టం చేని ఇవుటికే శతాధిక పాటలు పాదారు. చోరీ చోరీ” (లవ్ లు, లిజన్ టు మై వోక్స్” ((పేమ కావాలి), “ఊవాలో నుందరా (రదాగా కాసేవు), “చినుకులా రాలి” (అవా నా పెళ్లంటు, అచ్చాహై (సీంవా, 'దేవుదా దేవుదా” (దేవుడు చేసిన మనుషులు), “ఇంద్రధనుస్సులకు” (బురిడీ), 'సంపేన్తున్నాయే వీల్లా” (దేవరాయ), “యమా” (ఆఆ) లాంటి పాటలతో పాటు తమిళ కన్నద, మలయాళ భాషల వారికి కూదా తన స్వరమాధుర్యం పంచుతున్న వ ర్ధమాన గాయని అంజనా సౌమ్య. “స్వరములు ఏదైనా రాగాలెన్నో! మధ్యమావతి, శివరంజని, యమునా కళ్యాణి, ఆనందభైరవి... ఒకటా, రెండా? బడు స్వరాలకే ఇన్నేసి రాగాలుంటే, రెండు దశాబ్ధాల పై చిలుకు విద్వనేర్చిన కాలంలో ఎన్నెసి జ్ఞాపకాలు పొదిగి ఉంటాయో ఊహించండి! ఇవన్నీ మీతో ఒకేసారి హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు * 174
కలబోసుకోవడం సాధ్యమా? అందుకే, చేదువి నా గుండెలోనే నిక్షిప్తం చేసుకుని, గుప్పెడు తీపి గుర్తులను మాత్రం మీతో పంచుకుంటాను. రెందేళ్లు ఫ్రీ ఎడ్యుకేషన్ ఛాన్స్
కాకినాడ “ఆదిత్య పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఈ సంఘటన నన్నెంతగా బేజారెత్తించిందో చెబుతాను. ఆ సంవత్సరం డిసెంబర్ 31న మా స్ఫూలో జరిగిన 'సింగర్స్ ఆఫ్ ద ఇయర్ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఎవరో ఇచ్చిన ఉసిరికాయ తినేయడంతో గొంతు పట్టెసి, పలకడం మానేసింది. సరిగ్గా అదే వారంలో హైద్రాబాద్ వెళ్లి “పాడుతా తీయగా ఫైనల్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇక చూడండి, ఎంత టెన్షనో! రకరకాల మందులు మింగితే కాని గొంతు మాట వినలేదు. అప్పట్లో ఏ పాటయినా సీరియస్‌గా ముఖం పెట్టి పాదేదాన్ని. ఒకసారి ప్రోగ్రాంలోనే బాలుగారు 'ఏంటమ్మాయ్, మైసూరువాకు తింటూ ఆవకాయ తింటున్నట్టు మొహం పెడతావ్?” అన్నారు. అందులో సెకండ్ విన్నర్‌గా సెలక్ట్ కావడంతో స్కూల్ వాళ్లు టెన్త్ వరకూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఛాన్స్ ఇచ్చేశారు. పాటతో సాధించిన తొలి విజయం అది. ఆ దెబ్బతో పరార్...
స్ఫూల్ ఫైనల్లోనో, అంతకుముందు సంవత్సరమో గానీ - ఒకబ్బాయి రోజూ నన్ను ఫాలో అవుతూ ఉందేవాడు. స్సూల్ బస్ బయల్లేరగానే సైకిల్ ఎక్కేసి, బస్‌కంటే ముందు నేను దిగాల్సిన స్టేజ్ దగ్గర కాపు కాసేవాడు. తర్వాత నేను ఇంటికి చెరవరకూ బాడీగార్జులా సైకిల్ నడిపిస్తూ వెంట వచ్చేవాడు. రోజూ ఇదే తంతు. పోనీ నన్నేమన్నా కామెంట్ చేస్తాడా అంటే అదీ లేదు. మూగగా వెంటపడడం. ఈ టార్చర్ తట్టుకోలేక స్కూల్ అవగానే మాథ్స్ చెప్పించుకోడానికి పైవేట్‌లో చేరిపోయా. రెండు మూడ్రోజులు నాకోసం వెతికి, చివరికి నా ఆచూకీ తెలుసుకుని తనూ వచ్చి నాతోపాటు ట్యూషన్‌లో చేరిపోయాడు. వీడ్ని ఎలా తప్పించుకోవాల్రా దేవుడా? అని ఆలోచించి, ఒకరోజు వాడు లేచి వెళ్లబోతుంటే పక్కనే ఉన్న స్కేల్ చూపించి “అన్నయ్యా, నీవు స్కేల్ మర్చిపోయావ్” అని అరిచాను. అంతే ఆ తర్వాత నా దరిదాపుల్లోకి వస్తే ఒట్టు. పైగా ట్యూషన్ మానేశాడు. రేగుపళ్ల ప్రహసనం
చదువుకునే రోజుల్లో పుస్తకాల బ్యాగులో విధిగా రేగుపళ్లు ఉండేవి. ఒకసారి పైవేట్‌లో రాంబాబు మాష్టారు ప్రహరీ గోడకు కుర్చీ వేసుకుని మాకు మాథ్స్ చెబుతున్నారు. నేను తిన్న రేగుపళ్ల గింజల్ని మాస్తారు చూడకుండా లాఘవంగా ప్రహారీ గోడ అవతలికి విసిరేదాన్ని. ఒకరోజు గురితప్పి సరిగ్గా నా ఎంగిలి గింజ
ఆయన ఒళ్లో ఠపీమని పడింది. ఆయన దండకం మొదలెట్టకముందే లేచి నిల్చుని తప్పు ఒప్పేసుకున్నాననుకోండి.
అయితే ఇంటర్లోకి వచ్చాక కూడా రేగుపళ్లని వదిలేదాన్ని కాదు. నేను, లావణ్య, మంజు ముగ్గురం ఒకే బెంచీలో వరసగా కూర్చునేవాళ్లం. సరిగ్గా సంస్కృతం పీరియడ్‌లో నిద్ర ముంచుకొచ్చేది. నిద్రను తప్పించుకోడానికి రేగు వడియాలు చప్పరించేవాళ్లం. (రేగుపళ్లు సీజనల్ ఫ్రూట్ కదా. అంచేత పళ్లు దొరకనప్పుడు వడియాలపై పదేవాళ్లం) ఒక క్యారీబ్యాగ్‌ని మా బెంచ్ అడుగున మేకుకి తగిలించి అందులో ఎంగిలి గింజల్ని వేసే వాళ్లం. ఒకరోజు సంస్క తం క్లాసు చెబుతున్న మేడమ్ ఎవరిపైనో అరుస్తూ సడన్‌గా నావైపు తిరిగి “చూడండి, క్లాసులో బుద్ధిగా ఎలా మెసలాలో సౌమ్యను చూసి నేర్చుకోండి” అంది. అప్పటికే నా బుగ్గనిండా రేగు వడియం. పెదాలు విప్పకుండానే నవ్వు మొహం పెట్టీ “హీహీ” అన్నాను. “నోరు విప్పి కూడా నవ్వదు, అంత సంస్కారం ఉండాలి” అంది ఆవిడ. వెంటనే నా పక్కనున్న లావణ్య “నీ మొహం దాని బుగ్గనిండా రేగు వడియం ఉంది.. అందుకే ఆ యాక్షన్” అంది. పాటకు చిల్లర వేయబోయిన చేపలమ్మి!
కాకినాడ నుండి తాళ్లరేవు వెళ్లేదారిలో ఉండేది మా 112) ఇంజనీరింగ్ కాలేజి. మొదట్లో ర్యాగింగ్ దెబ్బకు భయపడి కొన్నాళ్లపాటు ఆర్.టి.సి. బస్సులో వెళ్లాను. అయినా అక్కడా సీనియర్స్ కాపుకాసి మాతో పాటు బస్సెక్కేసి ర్యాగింగ్ మొదలెట్టేవారు. అమ్మాయి కనిపిస్తే చాలు పాడమని ఆర్దరేసేవారు. పొడ్డం రాని అమ్మాయిలకు మాత్రం నరకంగా ఉండేది. నేను ఏ పాట పాడమన్నా ఎంజాయ్ చేస్తూ పాడేదాన్ని. కాకపోతే బస్సు నిండా చేపల బుట్టలుండేవి. ఆ వాసన భరిస్తూ పాడటం కొద్దిగా ఇబ్బందే. ఒకరోజు (దాదాపు 20 కి.మీ. దూరం ఉన్న) కాలేజీ వరకు నాచేత ఏకధాటిగా పాడిస్తూనే ఉన్నారు. ఆ రోజు కొసమెరుపు ఏంటంటే నన్ను బస్సులో పాటలుపాడి చిల్లర అడుక్కునే రకం అనుకున్న ఒక చేపలమ్మి చిల్లర డబ్బులతో నా దగ్గరకి రాబోవడం ఆ దెబ్బతో ఆ తర్వాత ఆర్.టి.సి. బస్సెక్కితే ఒట్టు. మగర్రోజే కాలేజీ బస్సులోకి జంప్... ర్యాగింగ్ తప్పనప్పుడు ఎ బస్సయితే ఏమిటి చెప్పండి?
కాలేజీలో చేరిన వారానికి ఏదో పనుండి లైబ్రరీకి వెళ్లి, అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోరు తెరిచాను. నాతో పాటు చేరిన వాళ్లంతా బేల ముఖాలు వేసుకుని మా సీనియర్స్ రికార్డులను రాసి పెడుతున్నారు. ర్యాగింగులో భాగమట అది. వామ్మో, నన్నూ బుక్ చేస్తారేమో అని భయమేసి మెల్లగా జారుకుంటుంటే ఒక సీనియర్ హావ్ డేస్ = సిస్ ప్రమఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 176
పిలిచి “మన కాలేజీ స్పెల్లింగ్ చెప్పు?” అన్నాడు. కంగార్లో [0122 అనేశాను. 'ఆహాం .. అవునా? సరే, ఇంటికి వెళ్లి వెయ్యిసార్లు కాలేజీ పేరు (1621002642 36016 01 అ౭ంల108 204 (60101029) రాసుకుని రా అని హుకుం జారీ చేశాడు. చచ్చినట్టు రాత్రంతా జాగరణ చేసి రాసేసరికి వేళ్లు నెప్పెట్టి, ఏడుపొచ్చెసింది.
ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే కాలేజీ మేనేజ్‌మెంట్ ఇచ్చిన “పెషర్స్ డె ఫంక్షన్‌లో కీరవాణిగారి “నువ్వే నా శ్వాస (ఒకరికొకరు) పాట పాడేసరికి అంతా నా అభిమానులైపోయారు. “అయ్యో ఇంత బాగా పాడే అమ్మాయినా రాగింగ్ చేసాను” అని పశ్చాత్తాప పడ్డాడట నాచేత జైటొ రాయించినబ్బాయి.
“మిస్టర్ వెటకారం”
థర్ల్ ఇయర్ మొదటి సెమిస్టర్‌లో ఉండగా మా లెక్చరర్ ఒకాయన మమ్మల్ని ఒక్కొక్కర్నీ నిల్పోబెట్టి ఫ్యూచర్ ష్లాన్స్ గురించి ఆరాతీస్తున్నాడు. ఆయన పేరు గుర్తులేదు గానీ, నిలువెల్లా వెటకారమని మాత్రం తెలుసు. ఒక్కొక్కరు తమకిష్టమైన రంగాన్ని చెప్పి, అందులో దున్నేస్తాం, పొడిచేస్తాం, చిరేస్తాం అని డబ్బా కొడుతున్నారు. నా వంతొచ్చి లేవబోతుంటే 'సరె, నువ్వు పాటలు పాదేసి బతికేస్తావ్...” అన్నాడు వెటకారంగా. తోటి విద్యార్థుల ముందు ఆ మాట అనగానే షాక్ అయ్యాను. దుఃఖం ఎగదన్నుకొచ్చేసింది. అలాగే బెంచీ కింద నేలపై కూర్చుండిపోయి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశాను. నా కన్నీటితో చేతి రుమాలంతా ముద్దముద్దయిపోయిందంటే నమ్ముతారా? కొసమెరుపు ఏంటంటే, తర్వాత మూడేళ్లకి అదే కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్‌కు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే, ఆ మిస్టర్ వెటకారం ఫాకల్టీగా కనిపించడం! కల నిజమాయెొగా...
కాలేజీ బస్సులో ప్రతి రోజూ కొత్త పాటకు రికార్డులు వేస్తుందేవారు. అవి విన్నప్పుడల్లా *నా పాట కూడా వీళ్లందిరితో పాటు కాలేజీ బస్సులో వినే అదృష్టం వస్తుందా?” అనుకునేదాన్ని. తథాస్తు దేవతలు నా మొర ఆలకించారేమో! ప్రాజెక్టు వర్క్‌కోసం హైద్రాబాద్ వెళ్లినప్పుడు కోటిగారు అనుకోకుండా క్లాస్‌మేట్స్” సినిమాలో చిత్రగారు పాడాల్సిన ఒక పాట ట్రాక్ నాతో పాడించారు. తర్వాత అదే పాటని స్రవంతి రవికోషోర్‌గార్కి వినిపిస్తే సినిమాలో “సదా” లిప్ మూమెంట్‌కి సరిగ్గా సరిపోతుంది. అమ్మాయి బాగా పాడింది. చిత్రగారితో మళ్లీ పాడించకృల్లేదేమో'” అన్నారట. దాంతో, వారం తర్వాత కోటిగారు సినిమాలో నా పాటనే ఉంచేస్తున్నామని చెప్పేసరికి ఆనందం పట్టలేకపోయాను. మా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి, కాలేజీలో సబ్‌మిట్ చేయడానికి వెళ్తుంటే అదే పాటని బస్‌లో స్తూడెంట్స్‌తో కలిసి వినడం వహ్, మధురమైన, మరవలేని అనుభవం.
విశాఖ “గీతం కాలేజీ" ముచ్చట్లు
ఇంజనీరింగ్ తర్వాత ఎం.బి.ఏ. చేయడానికి వైజాగ్ 'గీతంిలో చేరాను. పాండురంగాపురంలో అమ్మతో పాటు ఉండేదాన్ని. నాన్న జాబ్ రీత్యా (వైశ్యాబ్యాంక్ మేనేజర్) కాకినాడలోనే ఉండి వారం వారం వైజాగ్ వచ్చేవారు. టూ వీలర్‌పై బీచ్ రోడ్డులో రిషికొండ వరకూ రోజూ వెళ్లడం అదొక అద్భుతం. సముద్రం అంచున ట్రావెలింగ్ ఎంత గొప్ప అనుభూతిగా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. ఒకసారి సెలవుల్లో కాకినాడ వెళ్లినప్పుడు తల వెంట్రుకలు బాగా చికాకు పెడుతుంటే అమ్మతో చెప్పి కొంత కట్ చేయించాను. ఆ తర్వాత కాలేజీకి వెళ్లినప్పుడు ఒకబ్బాయి నా దగ్గరకి గబగబా వచ్చేసి 'ఏంటండి? పొడవాటి జుత్తు కట్ చేసుకున్నారు?” అంటూ విచారంగా మొహం పెట్టి వాపోయేసరికి ఆశ్చర్యపోయి “బాబోయ్, అబ్బాయిలు అమ్మాయిలను నఖశిఖపర్యంతం పరీక్షిస్తుంటారా? అసి నోరెళ్లబెట్టాను. కాలేజీ చివరి రోజుల్లో ఒక హోటల్లో ఫేర్‌వెల్ ఇచ్చారు. అప్పుడు జరిగిన ఫన్‌గేమ్‌లో స్తూడెంట్స్ అంతా వాళ్లకు నచ్చిన వాళ్ల పేరుని చీటీపై రాయమంటే, అబ్బాయిల్లో ఎక్కువగా నా పేరుని మెన్న్షన్ చేయడంతో నాకు 'మోస్ట్ వాపెనింగ్ గర్ల్ అనే బిరుదు ప్రదానం చేసి, కరతాళధ్వనుల మధ్య నన్ను సన్మానించడం ఒక తీపి గుర్తు. నా మాటకి చిరు గారు స్టేజీ ఎక్కేసారు
'గీతం'లో ఉండగానే 'మా టీవీ సూపర్ సింగర్స్ ౩లో పాల్గొనడానికి హైద్రాబాద్ వెళ్లాను. ఆ క్రమంలో ఒకరోజు 'చిరు' సినిమాల్లోని పాటల ఎపిసోడ్... బ్యాక్‌గ్రౌండ్‌లో చిరంజీవిగారి కట్ అవుట్స్ పెట్టారు. షో అయిపోయాక మెల్లగా కెమెరామన్‌తో చెప్పి, పక్కనే ఉన్న చిరు “ఇంద్రసేనారెడ్డి హోర్ట్షింగ్‌పై చెయ్యివేసి ఫొటో దిగాను. చిరుగారంటే అంత అభిమానం నాకు. తర్వాత హైద్రాబాద్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో స్టేజిపై ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆడియన్స్‌లో ఉన్న చిరంజీవి గారు వెంటనే స్టేజిపైకి వచ్చి 'హోర్దింగ్ మీద చెయ్యి వేసి దిగడమెందుకమ్మా? ఇప్పుడు నాపైనే వేసి దిగొచ్చు' అంటూ నా పక్కన నిల్చుని ఫోటోకి ఫోజివ్వడం ఒక తీపి అనుభవం.
గీతంలో ఎం.బి.ఏ. పూర్తయ్యాక కొన్ని ఉద్యోగాలు నా వెంట పడ్డాయి కానీ, వాటిని తప్పించుకుని నేను *పాటి వెంట పడి హైద్రాబాద్ వచ్చిశాను. ఈ క్రమంలో గాయనిగా పలుమార్లు విదేశాలు చుట్టి కచేరీల్లో పాల్గొన్నాను కూడా. ఎందుకంటే 'పాటిలోని మత్తు మరింకెందులోనూ నాకు దొరకలేదండి!
(28 202012 ఆదివారం ఆంధ్రజ్యోతి,
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 178
ఖలీ శ జ్ఞాశుల | ఇ ల చందు
సినిమా తప్ప మరో చదువు లెదు
"మ మ
స్కూలూ, కాలేజ్సీ యూనివర్శిటీ... అన్నీ అతనికి సినిమానే. పన్నెందేళ్ల
(ప్రాయంలోనే పారో అయిపోదామని పారిపోయిన తూగోజి
బుల్లోదతను. నూనూగు మీసాల వయనులో కోరి కోరి సినీలోకం'లో
తలదూర్తాదు. ఆ లోకంలో గదించిన ఎత్తువల్లాల అనుభవంతో
టెన్స్ క్లాస్” తో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఆ తర్వాత '“నోట్‌బుకొతో
విమర్భకుల (ప్రశంసలు పొందాడు. నటి ఛార్జితో కలినీ (పేమ ఒక
మైకం” అన్నాడు. ఆ యువదర్భ్శకుడు చందు.
నీళ్ల సారమో, మట్టిసారమో తెలీదు కానండీ... నాకు తెలిసి గోదావరి జిల్లాల వాళ్లలో వెయ్యిమందిలో ఒకరైనా చిత్రపరిశ్రమలో స్థిరపడ్డవారేనండి! కాకపోతే ఆ వెర్రి నా రక్తంలో పిసరంత ఎక్కువుందేమో - పన్నెందేళ్ల వయసులోనే హీరోనైపోదామని ఇంట్లోంచి పారిపోయా! ఎప్పుడు, ఎలా అని మీరు అడగకముందే నా 'సినీ ప్రయాణం రీలు తిప్పుతాను - చూడండి! చిత్తుగా చితక్కొట్టేశారండి బాబూ !
నాకు ఊహ తెలిసేసరికి నాన్నగారు 'కొంకుదురు” నుండి రైస్ బిజినెస్ చెయడానికి రాజమండ్రి వచ్చి స్థిరపడ్డారు. మొదట్లో చదువబ్బడం లేదని కాన్వెంట్లు మార్చేవారు తప్పించి, నా కన్ను నినిమాపై లగ్నవ్లై ఉందని మాతం గొరుసు జగదీశ్వర రెడ్డి + 179
కనుక్కోలేకపోయారు. ఇంటి దగ్గర్లో 'గంగా యమునా సరస్వతి థియేటర్లు ... వాటి ముందు కనిపించే సినిమా కటౌట్లు నన్ను వెరైెక్కించేవి. అలా ఎనిమిదేళ్ల వయసులోనే “బొబ్బిలిపులి” సినిమాకి తీసుకెళ్లమని ఇల్లు పీకి పందిరేసిన జ్ఞాపకం. “లాభం లేదు, - సినిమా సినిమా అని ప్రాణాలు తోడేస్తున్నాడు వీడిని సాయంత్రం స్కూల్ వదలగానే (ప్రైవేట్ అరేంజ్ చేశారు. ఒకసారి మా తాతగారు ఊర్నుండి వచ్చినప్పుడు డబ్బులిచ్చారు. డబ్బులు చేతిలో పడగానే మామూలు పిల్లలయితే ఏ జీళ్లో, జంతికలో, కొబ్బరుండలో తినాలనుకుంటారు. నేను అందర్లాటోణ్ని కాదు కదా... ట్యూషన్ వదలగానే నా అడుగులు “శ్యామలి థియేటర్ వైపు దారి తీశాయి. సినిమాలో కూర్చున్న తర్వాత బాహ్య ప్రపంచం గుర్హుకు రాలేదు. రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి చేరాను. అమ్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి ఉంది. అప్పటికే రాజమండ్రి నలుచెరగులా గాలించేశారు. నన్ను చూడగానే “హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సంతోషపడ్డారు. కానీ, అసలు విషయం తెలిసాక మాత్రం పులుసులోకి దుమ్ము దొరక్కుండా చితక్కొట్టేశారండీ బాబూ! స్టూడియోలో అదుగుపెట్టనివ్వలేదు
అంతకొల్టినా సినిమా కటౌట్లు కనిపించగానే కొట్టిన దెబ్బలు మటు మాయమయ్యేవి. వయసు పెరిగే కొద్ది స్కూలు ఎగ్గొట్ట సినిమాలకు వెళ్లడం బాగా అలవాటైంది. జోసఫ్, వెంకటేశ్వర్రావు, గోపి నా సినిమా జట్టుగాళ్లయితే, చదువులో మాత్రం సురేష్ తోడుందడేవాడు. అయితే ఒకటి - ఎంత సినిమా పిచ్చి ఉన్నా చదివినంత మేర సబ్దెక్టుని సినిమా కథలా ఊహించుకుని చదివేవాణ్ణి కాబట్టి మంచి మార్కులే వచ్చేవి. ఎటొచ్చి చదువంటే ఇష్టం ఉండేది కాదంతే!
మా పెద్దమ్మ వాళ్ల అల్లుడు ఒకాయన వైజాగ్ క్రాంతి ఫిలిమ్స్‌లో పనిచేసేవాడు. రాజమండ్రి వచ్చినప్పుడల్లా సినిమాలకు సంబంధించిన (బోచర్హు, క్యాసెట్లు తెచ్చి నాకిస్తుందేవాడు. వాటిని స్కూల్లో చూపిస్తే నన్ను ఒక హీరోలా చూసేవారంతా. 8వ తరగతిలోకి వచ్చేసరికి సినిమా పిచ్చి బాగా ముదిరి, మాట వినడం మానేశాను. దాంతో ఇంట్లో రోజూ యుద్ధమే. ఒకసారి అది మహాభారత సం([గ్రామంగా మారడంతో రెండు జతల బట్టల్ని స్కూలు బ్యాగులో కుక్కేసి, సరాసరి “ఈస్ట్‌కోస్ట్ ఎక్కేసి, సికింద్రాబాద్‌లో వాలిపోయాను. వాళ్లను వీళ్లను అడిగి “అన్నపూర్ణ స్థూడియో” చేరాను. గేటులోకి తొంగి చూడనివ్వలేదు సెక్యూరిటీ వాళ్లు. ఎక్కడికి వెళ్లాలో తెలీని పరిస్థితిలో స్టూడియో ఎదురుగా ఒక గోడపై 'సూర్య ఫిలిం ఇనిస్టిట్యూట్ అనే వాల్‌పేపర్ నన్ను ఆకర్షించింది. ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని అడ్రస్ - పట్టుకుని అక్కడికి వెళ్లి 'యాక్టింగ్ కోర్సులో చేరడానికి రాజమండ్రి నుండి వచ్చానని, డబ్బులు ఎక్కువగా లేవిని చెప్పాను. వాళ్లు నన్ను నఖశిఖపర్యంతం ఎగాదిగా చూసి హాప్ డేస్ - సినీ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తుల + 180
“నీకు వయసు సరిపోదు, మీసాలు మొలిచాక వచ్చి చేరమిని సలహా ఇచ్చి పంపించెశారు. _ అపధ్పాంధవుడిలా ఆదుకున్నాడు
పిచ్చోడిలా భాగ్యనగరం రోడ్లు కొలుస్తుండగా ఒకరోజు వీరేశ్ కనిపించాడు. (గతంలో మా నాన్నగారు రైస్ బిజినెస్‌కి తోడుగా జిరాక్స్ మిషన్ కూడా నడిపేవారు. మిషన్ రిపేర్ చేయడానికి వీరేశ్ హైద్రాబాద్ నుండి రాజమండ్రి వచ్చేవాడు). అతనూ నన్ను గుర్తుపట్టడంతో ఊపరి పీల్చుకుని, పారిపోయి వచ్చిన కథంతా చెప్పి బావురుమన్నాను. బెంగపడవద్దని, నన్ను తీసుకెళ్లి చిలకలగూడాలో తనకు తెలిసిన ఒక బ్యాచిలర్స్ రూమ్‌లో ఉంచాడు. సమయానికి ఇంత తిండి పెట్టేవారు కానీ... తర్వాత ఏం చెయ్యాలో తోచేది కాదు. ఉందేకొద్దీ ఇంటిపైన బెంగ పట్టుకుంది. దాంతో విపరీతంగా జ్వరం వచ్చెసింది. వీరేళ్ మా నాన్నగార్మి ఫోన్ చేయడంతో అప్పటికి 'కథ' సశేషంగా ముగిసింది.
కొడితే మళ్లీ పారిపోతానని అనుకున్నారో ఏమో, పల్లెత్తు మాట అనలేదు. జ్వరం తగ్గాక ఇక బడికి వెళ్లనని ప్రకటించేశాను. దాంతో అమ్మ కళ్లసీరెట్టుకుని 'కనీసం టెన్త్ క్లాస్ అయినా పూర్తిచెయ్యమిని బతిమాలుకుంది. అమ్మ బాధ చూడలేక సరే అయితే స్కూల్‌కు మాత్రం వెళ్లననీ, (పైవేట్‌గా ఆంధ్రా 'మెట్రిక్ కడ్డానని చెప్పి ఒప్పించాను. కోటిపల్లి బస్తాండు దగ్గరున్న ఒక ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి విషయం చెబితే, వయసు సరిపోదని, రెండేళ్లు వయసు పెంచి నాచేత మెట్రిక్ కట్టించారు. ఒకేసారి అన్ని సబ్దెక్టులూ పాసైపోయి అందరికి మూర్చలు తెప్పించాను. అమ్మాయిల ఓట్లతో నెగ్గాను
వె(ట్రిక్ వూర్తయ్యాక చదువుకు పుల్‌స్తావ్ పెట్లేనీ వు[ద్రాను చెక్కేద్దామనుకున్నాను గానీ, సరిగ్గా అదే టైంలో “శివి సినిమా విడుదలవడం, ఆ సినిమాను చూడ్డం, కాలేజీ లైఫ్ మజా ఏమిటో అందులో కనిపించడంతో - మనసు మార్చుకుని వి.టి. కాలేజీలో చేరిపోయా. “శివ” ప్రభావమేమో చేరిన 3 నెలలకే కాలేజీ ఎలక్షన్లలో నిలబడి పోటీ చేశాను. ఏదో రకంగా పదిమందిలో నా సెలబ్రిటీతనం నిరూపించుకోవాలన్న తపన తప్పించి ఏ మాత్రం గెలుస్తానన్న ఆశ లేదు. కానీ.. గెలిచాను. అదే ఆశ్చర్యం ! కాలేజీలో అందరికంటే వయసులో చిన్నోడిననేమో, పైగా లేత తాటిముంజలా స్మార్ట్‌గా ఉందేవాణ్నేమో... అమ్మాయిల ఓట్లన్నీ నాకే పడ్డాయి మరి. శివి తర్వాత 'సాజన్), 'మైనే ప్యార్ కియా), 'ఆషికీ' లాంటి సినిమాలు విడుదలై రాజమండ్రి కుర్రకారుని ఉర్రూతలూపేవి. ఆ పిచ్చిలో పడి రామకృష్ణ థియేటర్లో 'ప్రేమపావురాలు” (మైనే ప్యార్‌కియా) డబ్బింగ్ సినిమాని 138 రోజులు వరసపెట్టి
చూశాను. నా జీవితంలో అన్ని సార్లు చూసిన సినిమా మరొకటి లేదు కూడా. కాలేజీలో చేరి నాలుగు నెలలు పూర్తి కాకుండానే నాన్న వాళ్లు తణుకు షిఫ్ట్ అయ్యారు. కాలేజీ మానేస్తేగాని మద్రాసు వెళ్లడానికి ఛాన్సు రాదని మనసులో గాఢంగా నాటుకుపోవడంతో రాజమండ్రికి స్వస్తి చెప్పి వాళ్లతో పాటు వెళ్లిపోయా. అనుకున్నట్టై గ్రీన్ సిగ్నల్ దొరికింది. బహుశా నేను తణుకులో ఉండి చేసేది ఏమీలేదని వాళ్లకూ అర్ధమైనట్టుంది. మద్రాసులో సినిమా పాట్లు
తణుకులో పరిచయమైన ఒకబ్బాయి సి.ఏ చేయడానికి మద్రాసు వెళ్తే ఆయన్ని వెతుక్కుంటూ వన్ ఫైన్ డే మద్రాసు వెళ్ళిపోయా. కనీసం అప్పటికి నాకు మైనారిటీ కూడా తీరలేదు. మొదట్లో అతడి దగ్గర షెల్టర్ తీసుకుని అట్నుంచి సినిమా ఆఫీసులపై దండయాత్ర ప్రారంభించా. మేముండే దగ్గర్నుండి టి.నగర్ కనీసం పది కిలోమీటర్లు. బస్సు చార్జీలు మిగుల్చుకోడానికి అడ్డదారిలో వయా లయోలా కాలేజీ మీదుగా సినిమా ఆఫీసుల్ని టచ్ చేస్తూ రోజూ నడిచి వెళ్లేవాణ్సి. అలా ఎన్ని నెలలు గడిపానో.. కనీసమంటే ఏడాది పైనే!
పది రోజులుగా కడుపునిండా తిండి లేకుండా బన్ను టీలతో కాలం గడుపుతున్న టైంలో ఒకరోజు టి.నగర్‌లో అనుకోకుందా కృష్ణ అనే అబ్బాయితో పరిచయం అయ్యింది. అతడు ఆర్టిస్ట్ ఈశ్వర్‌గారి దగ్గర పనిచేస్తున్నాడు. నా వివరాలన్నీ అడిగి జాలిపడి తనవెంట తీసుకెళ్లి ఒక మెస్ కార్డు ఇప్పించి నెలరోజుల వరకు పుడ్దుకు ఢోకా ఉండదు. ఈ లోపు ఎక్కడైనా పని వెతుకోమని చెప్పాడు. సాయంత్రం వరకూ తిరిగి తిరిగి ఈశ్వర్‌గారి ఆఫీసుకు వెళ్లేవాణ్సి. ఇప్పట్లో ఉన్నట్టు డిజిటల్, చిప్పింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఆయన వేసిన బొమ్మలకి బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసి, పేస్టు చేస్తూ ఎందరో ఉండేవారు. ఈశ్వర్‌గారు చేసిన డిజైన్స్ అన్నీ నిలువెత్తు ఆల్బమ్స్‌లో పొందుపరిచి ఉండేవి. మేం అర్ధరాత్రి వరకూ సినిమా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే పడి నిద్రపోయేవాళ్లం. అక్కడికి అన్ని మాగబజైన్స్ నుండి సినిమా రిపోర్టర్లు వచ్చేవారు. అలా వచ్చిన వాళ్లలో వార్తలో పనిచేసే “శ్రీనుతో పరిచయం కలగడం.. ఆయన వాళ్ల మావయ్య 'హరి'గారి దగ్గర నన్ను అసిస్టెంట్ దైరెక్టరుగా చేర్చడం జరిగింది. కానీ - నరిగ్గా అదే టైంలో నినీ వర్యిశమంతా హై(ద్రాబాద్ షివ్న అవడానికి సమాయత్తమవుతోంది. మద్రాసులో ఉండాలా? హైద్రాబాద్ వెళ్లాలా అనే డైలమాలో పడ్డాను. అప్పటికే పరిచయమైన మల్లిడి మోహనగాంధీ గారు "హైద్రాబాద్ షిష్ట్ అవడం బెటరని, అక్కడ తనని కలవమని” చెప్పడంతో మద్రాసులో చేసిన మూడేళ్ల అనుభవాన్ని చంకలో పెట్టుకుని హైద్రాబాద్ వచ్చేశాను. హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 182
ఆ ముగ్గురికీ ఎప్పటికీ బుణగ్రస్తుడ్నే
“ కుర్రవాళ్లందరం శ్రీనగర్‌కాలనీలోని గాంధీగారి ఆఫీసు “గుమ్మడి టవర్స్‌లో కలసేవాళ్లం. అదే మా అడ్డా. మద్రాసులోనే వి.వి. వినాయక్‌గారి పరిచయం కలిగినా // హైద్రాబాద్ వచ్చాక మరింత బలపడింది. తనప్పటికే అసోసియేట్ దైరెక్టరుగా // చేస్తుందేవారు. నన్ను సొంత తమ్ముడిలా చూసేవారు. ఇద్దరం కలిసి ఆర్టీసీ క్రాస్‌రోద్స్‌కి లో వెళ్లి సినిమాలు చూసి, డిస్కషన్స్ చేసుకుంటూ గడిపిన రోజులు ఎన్నో! ఆ టైంలోనే ఒక డైరెక్టరు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరక్టరుగా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత లేదని చెప్పడంతో తీవ్ర మానసిక వ్యధ అనుభవించాను. దాంతో కొన్నాళ్లపాటు సినిమా డైరెక్షన్‌కు దూరంగా ఉండాలపించి 20 వేలు అప్పు చేసి అమీర్‌పేట్, నాగార్జుననగర్‌లో సి.డి. షాపు పెట్టాను. (అప్పట్లో పూరీగారి ఇల్లు మా షాపు ఎదురుగా ఉందేది). రోజుకు 2 వేలు సంపాదించేవాళ్సి. సాయంత్రం అవగానే షాపు దగ్గరకి సురేందర్ రెడ్ది, వాసు వర్మ, జాన్‌లాంటి వాళ్లంతా వచ్చేసి సినిమాల గురించి డిస్కషన్స్ చేసేవారు .అదే టైంలో వినాయకన్నకి 'ఆది' సినిమా చాన్స్ రావడంతో తనకి అసిస్టెంట్ డైరెక్టరుగా చేరిపోయి 'సాంబి వరకూ కంటిన్యూగా పనిచేశాను. శ్యాంప్రసాద్‌గారి దగ్గర 'కళ్యాణరాముడు” సినిమా చేస్తుండగా అల్లుగారు నన్ను చూసి “ఒరెయ్, నీవెప్పటికైనా డైరెక్టరువి అవుతావురా' అని ఇచ్చిన కితాబు ఎప్పటికీ మర్చిపోలేను. అయన అన్నట్టుగానే శ్యాంప్రసాద్‌గారే నన్ను 'టెన్స్ క్లాస్” సినిమాతో డైరెక్టరుని చెశారు. మద్రాసులో నా ఆకలి తీర్చిన కృష్ణని, నాకు కొండంత అందగా నిలిచిన వినాయకన్నని, సినిమా డైరెక్టరును చేసిన శ్యాంప్రసాద్‌గార్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా ప్రపంచమే నా స్కూలు... నా కాలేజీ.. నా విశ్వ విద్యాలయం అన్నీ ఇందులో ఎన్నో నేర్చుమన్నాను. నేర్చుకుంటూనే ఉంటాను. దీన్ని ఇష్టపడి ఇల్లు వదిలి వచ్చేశాక కష్టాన్ని ఇష్టంగా మలచుకునే మనస్తత్వం అబ్బింది కాబట్టి
అన్నీ 'హ్యాపీదేసే”. ఈ “చిత్ర విశ్వవిద్యాలయంలో నిరంతర విద్యార్థినే | (04. 21.2022 ఆదివారం ఆంధ్రజ్యోతి)
4 | న్ న న. (నా? చ న లల్లి 69. ఎకరం ల పాసవుతామో లేదో సిల్మ్‌స్మిత ను అడిగేవాళ్లం
ఆరో తరగతిలోనే చదువుకు వుల్‌స్టావ్ పెట్టేని, నినిమా పొరో
అయిపోదామనుకున్న అతదు, తంది మాట జవదాటకుందా ఎం.బి. ఏఐ
చదివి, బిజినెన్ దెవలవ్‌మెంట్‌లో మేనేజర్ ఉద్యోగం చేసే వరకూ
ఎదిగాడు. కాలం కలినీ రావదంతో “ఈ రోజుల్లో” నినిమాతో పొరో
అయ్యాడు శ్రీ! ఆ చిత్ర విజయం తర్వాత 'ఐ ఫిలిం బై అరవింద్
2ు అందుకోవదానికి '“దూలళీను'?గా తయారై 'లవ్ సైకిలొ ఎక్కి
'రయ్ రయ్'మయని దూసుకుపోయాదు.
“ఠాగూర్ సినిమాని మార్నింగ్ షోలో ఇంటర్వెల్ దాక చూసి, డిగ్రీ ఫైనల్ ఇంగ్లీష్ పేపర్ రాసి, సెకండ్ ఆఫ్ చూడ్డానికి మాట్నీకి పారిపోయానంటే... నా సినిమా పిచ్చి ఎంతటితో ఊహించడానికి ఈ ఉదాహరణ సరిపోద్దనుకుంటా! అంతెందుకూ, ఎ.బి.సి. స్కూల్లో ఆరో తరగతి అవగానే “చదువు” మానేసి, ఏదైనా జాబ్‌లో చేరి, ఆ తర్వాత సినిమాల్లో చేరతానని” చెప్పి ఇంట్లో వాళ్లని పొలమారేలా చేసిన ఘనుణ్సి కూడా. నా మాటలకు కంగారు పడ్డ నాన్నగారు ఆ మర్రోజే నన్ను ” హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 184
“బోరింగ్ పార్ట్స్ తయారుచేసే మా ఫ్యాక్టరికి తెసుకెళ్లి అక్కడ పనిచేసే వాళ్లకి ఎంతెంత జీతాలు ఇస్తున్నారో, వాళ్లు చదివిన డిగ్రీలు ఏవో వివరంగా చెప్పి నా బుర్రకు పట్టిన బూజు దులిపి మళ్లీ స్కూల్‌కు పంపించారు.
మాది ఉమ్మడి కుటుంబం. తాతయ్య, నానమ్మ, బాబాయ్‌ులు, పిల్లా జెల్లా అంతా కలిపి 19 మందిమి. నిత్యం సందడే సందడి. నా ఈడు పిల్లలంతా బాగా చదువుతుంటే నేను మాత్రం సినిమాలను నమిలేసేవాణ్ణి. ఇప్పటికీ విజయవాడలో మా ఇల్లూ, స్కూలూ, సినిమా థియేటర్లూ తప్పించి ఇతర ఏరియాలేవీ నాకు తెలీవంటే నమ్ముతారా? ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ల ఊరు కాకినాడకి మాత్రం వెళ్లేవాణ్సి. తేలు కుట్టన దొంగనయ్యాను
చిన్నపుడే కాదు, ఇప్పటికీ తిండి యావ ఎక్కువే నాకు. ఏ బేకరీకి వెళ్లినా కౌంటరు ముందు అరల్లో పేర్చిన కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లూ అమాంతం తీసుకుని అక్కదే నిల్పొని నమిలేస్తుంటా. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గని! తిండి దగ్గర మొహమాటాలన్నీ ఉష్ కాకి! ఒకసారి అమ్మమ్మ వాళ్లింట్లో క్యాన్ నిండా పాలకోవాలు చెసి పెద్ద చెక్కపెట్టెైలో పెట్టడం నా కంట్లో పడింది. అది ఎంత పెద్ద పెట్టె అంటే, దాని మూత తెరవాలంటే పెద్దవాళ్లకే ఆయాసం వచ్చేది. కోవాలకోసం ఎక్కడ లేని బలం తెచ్చుకుని మూత ఎత్తి క్యాన్ అందుకోబోతూ, తూలి డుబుక్కుమని పెట్టెలోకి జారిపోయా. కేక వేసేలోపే మూత పడిపోయింది. తేలు కుట్టిన దొంగలా ఏం చేయాలో అర్ధంగాక ఒక్కొక్కకోవాని చప్పరిస్తూ ఆ సాయంత్రానికల్లా క్యాన్ ఖాళీ చేసి అందులోనే ముడుచుకుని పడుకుండిపోయా. నేనెక్కడికి వెళ్లానో తెలీక ఇంట్లో అంతా అటూ ఇటూ బెంబేలెత్తి, పరిగెత్తి, అలసిపోయి చివరకి ఏదో పనుండి పెట్టె తెరిస్తే ఇంకేముంది? మనం మాంఛి గాధ నిద్రలో ఉన్నాం. మూతీ, చేతులూ, ఒళ్లంతా కోవా పూసుకుని చిన్న కృష్ణుడిలా! అదృష్టం ఏంటంటే ఆ పెట్టెకి అక్కడక్కడ గాలి దూరడానికి కన్నాలుండబట్టి బతికిపోయా! కన్నీటికి కరిగిపోయేవాణ్సి
'మోడ్రన్ అకాడమీ కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో ఒక మిత్రుడి (9) కప్టాలు చూడలేక నాలోని మానవత్వం లావాలా ఎగజిమ్మంది. వాడి బాధలు వినలేక నా పాకెట్ మని మొత్తం వాడికి ఇచ్చేసేవాణ్లి. ఒకసారి వాళ్ల నాన్నకి బైపాస్ సర్దరి అని చెప్పి బోరుమన్నాడు. ఎలాగైనా వాడికి సహాయ చేయాలని ఇంట్లోని నగలు ఎత్తుకెళ్లి వాడి చేతిలో పెట్టాను. అప్పట్నించి వారానికో కష్టం వెళ్లబోసి, కన్నీళ్లు కార్చేవాడు. నేను ఇంట్లో వాళ్ల కన్నుగప్పి ఏ నగదొరికితే అది తీసుకెళ్లి వాడి కష్టం త్రీర్చేవాణ్లి. ఆ క్రమంలో బైక్ కూడా కొనిచ్చా. చివరికి మార్వాడి కొట్టువాడి
ద్వారా నాన్నకి విషయం తెలిసి పిచ్చకొట్టుడు కొట్టాడు నన్ను ఒక మంచి పని చేసినప్పుడు కష్టాలుఎదురవడం సహజమే అనే తత్త్వమో, మత్తో అప్పటికె బాగా తలకెక్కడంతో, వాళ్లు కొట్టిన దెబ్బల్ని చిద్విలాసంగా భరించా. వాడు అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నాడన్న విషయం చివరికెప్పుడో బోధపడిందనుకోండి. అభిమన్యుడిలా...
డిగ్రీలో సూర్య, పూర్ణలు నా క్లోజ్ (ఫెండ్స్. మా ముగ్గురి పుట్టినరోజులు ఒకే నెల (జనవరి) లో ఉండడంతో అందరం ఒకే రకం డ్రెస్సులు కుట్టించుకుని, ఒకే రకం షూస్ వేసుకుని, ఒకేరోజు బర్త్‌డే పార్టీ జరుపుకునే వాళ్లం. మా క్లాసు మొత్తంలో ఐదుగురు అమ్మాయిలే. వాళ్లు మాట్లాడేది కూడా మా ముగ్గురితోనే. అవతలి గ్రూప్ స్టూడెంట్స్‌కి మండిపోయేది. అమ్మాయిలను ఏమీ అనలేక, సమయం దొరికితే మాపైకి “సై అన్నట్టు కాలుదువ్వుతూ ఉండేవారు. ఒకరోజు రైతు బజార్లో ఒక హీరో సినిమా షూటింగ్ జరిగితే అంతా క్లాసులు ఎగ్గొట్టి అక్కడికి వెళ్లారు. మర్రోజు క్లాసుకు రాగానే మా లెక్చరర్ ఒక్కొక్కడిని లేపి “ఏంట్రా? క్లాసు ఎగ్గొట్టి షూటింగ్‌కు వెళ్లావా? అని నిలదీయటంతో, నేను లెవల్‌గా 'ఆ షూటింగ్ ఏమైనా కమల్‌దా? రజనీదా? ఎందుకు వెళతాను?” అనగానే, ఆ (షూటింగ్) హీరోని అభిమానించే అవతలి (గగ్రూప్‌లోని 15 మంది ఒకేసారి నాపై దాడికి దిగారు. నాకు హనుమంతుడి బలం వచ్చేసి, పక్కనున్న బెంచీ అమాంతం పైకెత్తి పద్మవ్యూహంలో అభిమన్యుడు చక్రం తిప్పినట్టు గిరగిర తిప్పి వాళ్ల పైకి విసిరేశా. ముక్కులూ, మొహాలు షగిలి అంతా రక్త ప్రవాహం. సోత్రం చదివి నా ఉగ్రరూపం చల్లబర్చడానికి లెక్సృరర్‌కి తలప్రాణం తోకకొచ్చింది! తోడు కోరిన ఈడు
డిగ్రీ ఫైనల్లోకి రాగానే నాకో గర్ల్ ఫెంద్ కావాలనే ఆలోచన సదన్‌గా బుర్రలోకి పురుగులా జొరబడింది. అప్పటికే నా చేతిలో బైక్ ఉండేది. దానిపై గర్ల్ (ఫెంద్‌ని కూర్చోబెట్టుకుని సినిమాలకు వెళ్లాలని కలలు కనేవాద్డి. దానికో స్కెచ్ క్ష కూడా వేశాను. మా కామర్స్ లెక్చరర్ ఆంజనేయులుగారితో 'సార్, మీలో అంత సబ్జెక్టు నిక్షిప్తమై ఉంది కదా, ప్రైవేట్లు చెప్పుకుంటే మరికొంత డబ్బు వస్తుంది కదా, ఈ చాలీచాలని జీతంతో ఎన్నాళ్లు గడుపుతారు? వన్ టౌన్‌లో ఉమెన్స్ కాలేజీ పక్కన ఒక రూమ్ అద్దెకు తీసుకోండి. బోల్బ్దంత మంది అమ్మాయిలు కామర్స్ చెప్పించుకోవడానికి వస్తారని ఉసిగొల్పాను. నా పాచిక పారడం, ఆయన గది తీసుకొని కామర్స్ ఫైవేట్ చెప్పబడును అనే బోర్డు పెట్టడం, వారంలోపే దజను మంది డిగ్రీ అమ్మాయిలు ైవేట్‌లో చేరిపోవడం జరిగిపోయింది. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు హాల్ డేస్ = సన్ ప్రముఖం చిన్ననాటి తీస్ గుర్తులు ఇ $66
సంబరపడిపోయి, సూర్య, పూర్ణలతో పాటు నేనూ ట్యూషన్లో చేరిపోయా. “సార్, మీరు పాఠాలు చెప్పడంలో నిమగ్నం కండి, మేం మాకు నచ్చిన అమ్మాయిలను ఎంచుకోవడంలో నిమగ్నమవుతాం'” అని చెప్పేశాం. (పైవేట్ పెట్టమని చెప్పింది నేనే కాబట్టి సార్ మాకు ఎదురు చెప్పేవారు కాదు పాపం! అందరూ అందంగానే ఉండేవాళ్లు. ఎవరం ఎవర్ని ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నంతలోనే వాళ్లంతా మాకు క్లోజ్ (ఫెండ్స్ అయిపోయారు. దాంతో వాళ్లకు లైనేద్దామనే ఆలోచన అడుగంటిపోయి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, చిన్నపిల్లల్లా ఆడుకునేవాళ్లం.
మా సార్ లేనప్పుడు గది తలుపులన్నీ మూసేసి, కొవ్యొత్తి వెలిగించి, ఆత్మలను పిలిచే కాయిన్ ఆట మొదలు పెట్టేవాళ్లం. మేం పిలిచే ఆత్మలన్నీ సినిమా స్టార్ల. ఒకసారి సిల్మ్‌స్మితను పిలిస్తే, మరోసారి దివ్యభారతి... ఇలా. మా 15 మందిలో ఎవరు ప్యాసవుతారో, ఎవరికి, ఎప్పుడు, ఎవరితో పెళ్లవుతుందో ఆత్మల్ని అడిగేవాళ్లం. తీరా ఆటంతా అయిపోయాక మాత్రం ఆ ఆత్మలు వెళ్లిపోయాయో లేక అదే గదిలో ఉన్నాయో అనే భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేవి మాకు. స్వ్వాడ్ భయంతో పేపర్లు మింగేశా
కార్పొరేట్ అకౌంట్స్ సబ్జెక్ట్ అంటేనే జ్వరం వచ్చేది నాకు. నాన్నేమో సర్టిఫికెట్ పైన 'స్తార్ గుర్తు వేయించుకోకుండా అన్ని సబ్దెక్టులూ ఒకేసారి పాసవ్వాలని కండీషన్ పెట్టాడు. ఆ మగ్రోజే కార్పొరేట్ అకౌంట్స్ ఎగ్జామ్. భయంతో ముందు రోజు సాయంత్రమే ముసుగు తన్నేసి పడుకుండిపోయాను. ఇంతలో "కార్పొరేట్ అకౌంట్స్” పేపర్ లీకయిందంటూ సూర్య, పూర్ణలు పరిగెత్తుకొచ్చారు. వెర్రి ఆనందం! అంతకు ముందు సేకరించిన “అడిషనల్ పేపర్ల”పై తెల్లవార్లూ కూర్చుని ఆన్సర్లన్నీ రాసేసి “నూటికి నూరు మార్కులు ఎక్కడికీ పోవిన్న ధీమాతో ఎగ్గామ్‌కి వెళ్లా. తీరా కొశ్చన్ పేపర్ చూశాక భూమి గిర్రున తిరిగి మూర్చ వచ్చినంత పనైంది. రాత్రి వాళ్లు తెచ్చిన పేపరుకీ ఎగ్జామ్‌లో వచ్చిన పేపరుకీ పోలికే లేదు. చచ్చానాా దేవుడా అని కూలబడిపోయా. ఇంతలో పులిమీద పుట్రలా దూరంగా స్వ్వాడ్ రావడం కనిపించింది (నా సీటు కిటికీ పక్కన ఉండేది), బుర్ర వేగంగా పనిచేసింది - జేబులో ఉన్న అడిషనల్ పేపర్లని గబగబ నోట్లో కుక్కేసి నీళ్లు తాగేశాను. స్వాడ్ రావడం రావడం నా దగ్గరకే వచ్చి “ఏంటి నోరంతా రంగు? అని అడిగింది. నేను కాగితాలు నమిలినప్పుడు అంటుకున్న బ్లూ ఇంక్ అయి ఉంటుందని గుర్తుకొచ్చి, వెంటనే జేబులోంచి చాక్లెట్ చూపించి “చాక్లెట్ కలరిని బుకాయించా. చేసేదేం లేక చివరి 20 నిమిషాల్లో అన్ని ప్రశ్నల ఫార్ములాలు గీసేశా. కొసమెరుపు ఏంటంటే ఆ ఫార్ములాలకే మినిమమ్ మార్కులతో ప్యాసైపోవడం. కలిసి వచ్చిన అదృష్టం అంటే అదే కదా!
లైన్లో పదేయబోయి లైనులో పడ్డాను
డిగ్రీ అవగానే ఎం.బి.ఏ. చేయడానికి హైద్రాబాద్ వచ్చి ఐ.ఎఫ్.ఎం.లో చేరిపోయా. మా కాలేజీ తాజ్ క్రిష్టా వెనకుండేది. ఎర్రమంజిల్‌లో రూమ్ తీసుకుని ఉండేవాణ్ణి. చేరిన కొద్ది రోజులకే క్లాసులో ఉందే ఒకమ్మాయిని (?) చూపించి తనని పడేస్తానని తొదకొట్టి సవాల్ చేసి, ఆమెతో పరిచయం చేసుకుని, మాట్లాడ్డం మొదలెట్టా. అన్ని విషయాల్లో చాలా కరెక్టుగా ఉండేది తను. పైగా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. లైను వేయడం మర్చిపోయి తననుండి ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకున్నా. (ఫెంద్స్‌గా ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. ఇద్దరం మార్షింగే కంటే ముందే ట్యాంక్‌బంద్‌కి వెళ్లి వాకింగ్ చేసి వచ్చి ఎన్.క.ఎం. (గ్రాండ్‌లో టిఫిన్ చేసి, సాయంత్రం ఒక రెస్టారెంట్‌లో బార్చెక్యూ చికెన్ తినేవాళ్లం... మరిచి పోలేని హ్యాపీదేస్ అవన్నీ!
ఫస్ట్ ఇయర్ చివర్లో కాంపస్ ఇంటర్వ్యూలు జరగడం, నాకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో అందరం విడిపోవాల్సి వచ్చింది. అయినా ఆమె నుంచి నేర్చుకున్న పాఠాలు నా జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయి. నా ఉద్యోగంలో భాగంగా... విజయకుమార్ వర్శగారితో పరిచయం కలగడం, అతడినుందడి మారుతి గారిని కలవడం, వారు 'ఈ రోజుల్లో సినిమాతో నన్ను హీరోని చేయడం నా లైఫ్‌లో నాకు - జరిగిన అతి పెద్ద అద్భుతం. అన్నట్టు యు.కె.లో మంచి జాబ్ కూడా వచ్చిందండోయ్. ఇంగాండా? హైద్రాబాదా? అని మీనమేషాలు లెక్కించేలోపే షూటింగ్ మొదలవడంతో ఆలోచనకి పుల్‌స్తాప్ పెట్టేసి హీరో అవతారమెత్తి ఇలా మీ ముందుకు వచ్చెశాను.
(21. 22.2022 అదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 188
| జైన ౮ హమ్ ఈ గ న. | ము య టట మె | స్ట స త్ ఖీ ట్ట వే నీ ॥ మము నమీర్ థ థ్ లాలీ హలో డార్లింగ్ అంటె మా మెడమ్ తనని అనుకుంది!
అమ్మ నుంది అబ్బిన వారసత్వపు కళ అభినయంగా మారి అతడిని
నటుడ్ని చేసింది. దిగీ చదివే రోజుల్లోనే వరసగా మూడు నీనిమాల్లో
నటించేశాదు. అ తర్వాత ఇంద, నై, నీంవ్య(్రి, ళిరిడి శాయి, మగధీర,
శ్రీరామరాజం, శ్రీరామదాను నుండి దమరుకం వరకు దాదాపు
₹00 చిత్రాల్లోనూ, బావు “భాగవతం” మొదలుకొని 'రుతురాగాలు)
శాంతినివానంి "లేడి డిటెక్టీవొ “కళంకిత, 'మనోయజ్ఞం? “ఏది
నిజం” లాంటి బుల్లితెర నీరియల్స్‌లోనూ నటించాడు. ఏక కాలంలో
రెండు తెరలపై కనివీస్తూ సవ్యసాచిలా నటజీవితం కొనసాగిస్తున్నాడు
నమీర్.
పుట్టింది వైజాగైనా నా టెన్త్ వరకూ తమిళనాడులోనే విద్యాభ్యాసం కొనసాగింది. బిజినెస్ రీత్యా అమ్మా, నాన్నలు దుబాయ్‌లో ఉండడంతో చెల్లితో పాటు నన్నూ బోర్జింగ్ స్కూల్లో వేశారు. కొడైకెనాల్ నుండి మద్రాసు “కళాక్షేత్రం? స్కూలుకు మారిన తర్వాతే లోకాన్ని పరిశీలించడం అలవాటైంది. చదువుతో పాటు 'మృదంగం' కూడా నేర్చుకునేవాణ్సి. మరోపక్క ఆటల్లోనూ ఫస్టే, ఒకసారి కాంపిటిషన్‌లో పాల్గొనడానికి కసరత్తు ఆరంభించే టైంలో సైకిల్ పైనుండి పడి మోకాలి చిప్ప గొరుసు జగదీశ్వర రెడ్డి + 189
విరగొట్టుకున్నా. మా స్పోర్ట్ మాస్టరు పొన్నప్పన్ గారు నిత్యం నాతోనే ఉండి థెరపీ చేయిస్తూ, రెండు పూటలా నడిపిస్తూ అథ్లెటిక్స్‌లో పాల్గొనేలా చేయడం, ఛాంపియన్ షిప్ గెలవడం ఇప్పటికీ మర్చిపోలేని అనుభవం. రక్తంతో ప్రేమలేఖ రాసింది
చెల్లి కూడా కళాక్షేత్రంలోనే కదా. నేను టెన్స్‌లో ఉంటే తను నైన్త్‌లో ఉందేది. వాళ్ల హాస్టల్ మా కాంపస్ పరిధిలోనే. చెల్లిని కలవడానికి వెళ్లినప్పుడల్లా ఒకమ్మాయి నాతో మాట్లాడేందుకు ప్రయత్నించేది కానీ నేనంతగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకసారి చెల్లి ఒరేయ్, నీవంటే తనకి ఇష్టమనుకుంటా రా, సీకు ఏ రంగు డైస్ ఇష్టమో కనుక్కోమంది. ఆ ద్రైస్‌తో మార్నింగ్ అసెంబ్లీలో నీకు కనిపిస్తుందట! అంది. పిచ్చి మాటలంటూ కొట్టిపారేసి నవ్వేశా కానీ, టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి ముందు జరిగిన సంఘటనతో మాత్రం షాకయ్యా. ఆ వేసవి తర్వాత కళాక్షేత్రం నుండి మేమిద్దరం టి.సి. తీసుకుని వైజాగ్ వెళ్లిపోతామనే విషయం ఆ అమ్మాయికి తెలిసింది. ఒకరోజు మా క్లాసుకు వచ్చి నేను లేనప్పుడు నా పుస్తకాల్లో ఒక లెటర్ పెట్టేసి వెళ్లిపోయింది. రక్తంతో *ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ' అంటూ రాసిన లేఖది. పిచ్చ కోపం వచ్చి, హాస్టల్‌కు వెళ్లి 'ఏదైనా ఉంటే నాతో ముఖాముఖి చెప్పాలి గాన్, వేలు కోసుకుని రక్తంతో ఉత్తరం రాయడం ఏంటని తీవ్రంగా మందలించా. తర్వాత మేం వైజాగ్ వెళ్లిపోవడం, ఆ అమ్మాయి కర్నాటక వెళ్లిపోవడం... ఇప్పుదెక్కడుందో కూడా తెలియదనుకోండి. అది నేను ఎదుర్కొన్న మొదటి బ్లడ్ లవ్! మేడమ్ గారి సమయస్ఫూర్తి
వైజాగ్ వచ్చేశాక బుల్లయ్య కాలేజీలో చేరాను. మా పప్రిన్స్‌పాల్ కె.సి. వెంకటేశ్వర్లు గారు రిటైర్డ్ మిలట్రీ ఆఫీసరు. సివిల్ డ్రెస్ వేసుకొచ్చిన యమధర్శ్మరాజులా ఇంతేసి మీసాలతో... చూడగానే మాకు పడిపోయేది. పైగా ఇంటర్ రెండేళ్లూ స్కూల్లో చిన్నపిల్లల మాదిరి యూనిఫామ్ విధిగా వేసుకెళ్లాల్సిందే. అప్పటికే నేను ఆరడుగుల ఎత్తు. నేను జూనియర్నోో సీనియర్నో అర్ధం గాక ర్యాగింగ్ చేయాలా, వద్దా అనే మీమాంసలో ఉందేవారు స్తూడెంట్స్. నాకేమో ర్యాగింగ్ చేయించుకోవాలని తపన. నేను జూనియర్న్న అని తెలిశాక చిన్న చిన్న ర్యాగింగులతో సరిపెట్టారు.
మా ఇంగ్రీష్ మేడమ్ చాలా అందంగా ఉండేది. ఇతర క్లాసులెగ్గొట్టినా ఆమె క్లాసు ఫుల్ అటెందెన్స్‌తో ఉండేది. క్లాసు బోరనిపించినా భరించేవాళ్లు. మనమెప్పుడూ వెనక బెంచీ పైనే. ముందుంటే ప్రశ్నలు అడుగుతారని భయం. నేను కాలేజీలో చేరకముందే ఎవడో రాలుగాయి ఆమెపైకి సమోసా విసిరేశాదని, అప్పట్నించి “సమోసా నిక్‌నేమ్ అయిపోయిందని తెలిసింది. ఒకరోజు కాసు యమబోర్‌గా హ్యావ్ డేస్ = నీస్ ప్రముఖల చిన్ననాటి తీసి గుప్తద ₹ 190
అనిపించి, ఆవలింతలు వస్తుంటే, తమాషాగా “సమోసా” అని గట్టిగా అరిచా. ఆమె వెంటనే పాఠం చెప్పడం ఆపేసి “వెరీగుడ్”. కాలేజీ పూర్తయ్యాక ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అరిచినోడెవడో ఎంచక్కా సెంటర్లో సమోసాలు అమ్ముకు బతకొచ్చు” అని రివర్స్‌లో దెబ్బకొట్టింది. బు(ర గిర్రుమంది..
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో జరిగిన సంఘటన ఇది. ఒకసారి మా (ఫెండ్స్ బంక్ కొట్టి మాట్నీకి చెక్కేద్దామన్నారు కానీ నేను వెళ్లలేదు. మర్రోజు కారిడార్‌లో కలిసి 'నిన్న నీవు రాలేదని మేం కూడా వెళ్లలేదురా" అన్నారు. “కథలు చెప్పకండి. మీరు వెళ్లారని నాకు తెలుసు. జగదాంబలో 'హలో డార్లింగ్ సినిమాకు వెళ్లిన సంగతి నాకు, వైర్లెస్‌లో తెలిసిపోయిందిన్నా.
సీన్ కట్ చేస్తే - అదేరోజు ఎకనామిక్స్ క్లాసులో ఉండగా 'సమీర్‌గార్ని (వ్రిన్స్‌పాల్‌గారు రమ్మంటున్నారం'టూ వచ్చాడు ఆవీన్ వ్యూన్. ఏదో మూడిందనుకుంటూనే వెళ్లాను. నేను వెళ్లేసరికి ఇంగ్లీష్ మేడమ్ ఉన్నారు. “ఏరా? గురువు దైవంతో సమానం అని చదువుకోలేదా? పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను రెండ్రోజులు సస్పెండ్ చేస్తున్నా - వెంటనే మీ అమ్మానాన్నల్ని తీసుకుని రా” అని హుకుం జారీ చేశారు. ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగిపోయింది. కొంపతీసి 'సమోసా' అని అరిచింది నేనే అని మేడమ్‌కి తెలిసిపోయిందా అని మనసు శంకించింది కానీ
, ఆ సంఘటన జరిగి చాలోజులే అయింది. మరింకేం గొడవ? బుర్ర గోక్కున్నా అర్ధం
కాలేదు. తర్వాత మా గ్యాంగులో ఒకడికి బుర్రలో లైటు వెలిగి “నీవు కారిడార్లో “హలో డార్లింగ్” అని సినిమా గురించి అంటున్నప్పుడు నీ వెనకనుంచే మేడమ్ వెల్లిందిరా” అని గుర్తు చేశాడు. విషయం అర్ధమైంది. నా అదృష్టం కొద్దీ మా అమ్మగారు ఆ టైంలో వైజాగ్‌లోనే ఉన్నారు. అమ్మ ముందే ప్రిన్సిపాల్‌తో కారిడార్‌లో జరిగిన సంఘటన వివరించాను. 'వేషాలేయకండి. అలాంటి సినిమా లేదని” ఉగ్రుడయ్యాడు ఆయన. తర్వాత శాంతించి, ఆరా తీసి, ఆ సినిమా ఉందని తెలిశాక సారీ... జెంటిల్ మాన్... పొరపాటు నాదే” అన్నాడు పెద్దమనసుతో. వ్రతం చెడ్డా ఫలితం దక్కినట్టు ఆ ఘటనతో నాపై మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది ఆయనకి. అడ్డకత్తెరలో వోకచెక్కనయ్యాను
డి(గ్రీ ఫస్ట్ ఇయర్ కొచ్చేసరికి ఏడుగురు అమ్మాయిలతో, పది మంది అబ్బాయిలతో ఆరోగ్యకరమైన గ్రూపు ఒకటుండేది. అంతా చాలా (ఫెండ్లీగా ఉండేవాళ్లం. (ప్రమలూ, దోమలూ మా మధ్య లేవు. ఇంటినుండి వచ్చే దారిలోనే మా క్లాస్‌మేట్ ఒకమ్మాయి ఉండేది. అప్పుడప్పుడు కాలేజీ వరకు లిక్ ఇచ్చేవాణ్సి, తనని ఫైనల్
ఇయర్ స్టూడెంట్ ఒకడు ప్రపోజ్ చేస్తున్నాడని, వాడంటే తనకి ఇష్టం లేదని మొదట్లో నాకు తెలీదు. ఒకరోజు వాడు లంచ్ టేక్‌లో నన్ను కలిసి 'ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకొస్తున్నావేంటి? తనకి నేను ప్రపోజ్ చేస్తున్నా. ఆ అమ్మాయితో మాట్లాడితే ఊరుకోనని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. విషయం ఆ అమ్మాయితో చెబితో “వంటి వాడికి భయపదేది? ఇక నుండి రోజూ నీ బైక్‌పైనే కాలేజీకి వస్తాను. ఏం చేసాడో చూద్దాం”) అంటూ మొండికేసింది. “నీవు బాగానే ఎక్కుతావు తల్లీ, తన్నులు తినేది నేను కదా” అని మనసులో అనుకుని, సరే - ఏం జరిగితే అది జరుగుతుందని ఊరుకున్నాను. ఒకరోజు అనుకున్నంతా అయ్యింది. ఆ సాయంత్రం కాలేజీ బయట నడుస్తుంటే, హఠాత్తుగా ఒక వ్యాన్ వచ్చి మా ముందు ఆగడం, అందులోంచి కొందరు దిగడం (శివ సినిమా టైపులో), నాతో పాటు ఉన్న మరో నలుగుర్ని కర్రలతో వీర కుమ్ముడు కుమ్మి అదే వ్యాన్‌లో పరారవడం... మేం తేరుకునేలోపే జరిగిపోయింది. వచ్చిన వాళ్లు ఎవరనేది నా మనసుకు తెలుసు. కానీ సరైన ఆధారం లేదు. ఈ విషయం మా ఇంటి దగ్గర్లో ఉన్న ఎ.వి.ఎన్. కాలేజీ స్టూడెంట్స్‌కి తెలిసి స్కెచ్ గీసి మమ్మల్ని కొట్టినవాళ్లని ఫాలో అవడం ఆరంభించారు. నేను మాత్రం కావాలనే ఆ అమ్మాయిని బైక్‌పై తీసుకొస్తూనే ఉన్నాను. ఒకరోజు మళ్లీ అదే వ్యాన్ మా దగ్గరికి వచ్చి ఆగింది. వాళ్లు వ్యాన్ దిగి మా దగ్గరకి రాబోయే లోపే కాపు కాసి ఉన్న ఎ.వి.ఎన్. గ్యాంగ్ రంగంలోకి దిగి, దొరికినోడ్ని దొరికినట్లు వీరబాదుడు బాది నిజం కక్కించి సూత్రధారిని పట్టిచ్చారు. అప్పటికప్పుడు ఆ న్వాట్‌కి వాడ్ని లాక్కురావడం, ఆ అమ్మాయి చేత చెంప చెళ్లుమనిపించడం చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయింది. కానీ తర్వాత ఆ అమ్మాయి నా వైపు మొగ్గుచూపడం మొదలెట్టింది. రెండు చేతులూ కలిపితేనే చప్పట్లు కదా... నాకు ఇష్టం లేకుండా ఎలా? తన బుర్ర వాష్ చేసి తప్పుకున్నాననుకోండి! తొలి సినిమా అవకాశం
డిగ్రీలో ఉండగానే సినిమా ఛాన్సు రావడం ఒక అద్భుతం. ఉషాకిరణ్ వాళ్ల 'మౌనపోరాటం” షూటింగ్ అరకులో జరుగుతుండగా, దర్శకులు మోహన్‌గాంధీ గార్కి “సినిమాకు సంబంధించి కొందరు గిరిజన మహిళలు కావలసి వచ్చి వైజాగ్‌లో సోషల్ వర్కర్‌గా పేరున్న సరస్వతీదేవి గార్ని సంప్రదించారట. ఆమె మా అమ్మకి (విన్నకోట మహాలక్ష్మి క్లాసికల్ డాన్సర్‌గా మంచి పేరు. థియేటర్ ఆర్ట్స్‌లో డబల్ ఎం.ఎ. స్టూడెంట్) క్లోజ్ ఫైండ్ కావడంతో *'మా (ఫ్రెండ్ వాళ్లబ్బాయి ఒకడున్నాడు. బాగుంటాడు. మీ సినిమాలో ఏదైనా వేషానికి పనికొస్తాదేమో చూడండి” అన్నారట. హ్యాప్ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాట తీస్ గుర్తులు + 192
క్యాజువల్‌గా, వెంటనే గాంధీగారు పాత్ర ఇవ్వడం, ఒక జైలు సీనులో స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటించడం జరిగిపోయింది. కొన్నాళ్లకి హీరో వినోద్‌కుమార్ గారు 'రాజధాని” సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చినప్పుడు “మౌనపోరాటం” షూటింగ్‌లో ఉన్న కొద్దిపాటి పరిచయంతో వెళ్లి కలిశాను. అప్పుడూ అదృష్టం తలుపు తట్టి కోడి రామకృష్ణగారు మరో పాత్ర నిచ్చారు. కె. విశ్వనాథ్, కమల్ గార్ల ప్రశంస
డిగ్రీ ఫైనల్లో ఉండగా సరస్వతీదేవి గారు పోలియోపై అవగాహన పెంచేందుకు 'సూదిమందు అనే వీథి నాటకాన్ని విశాఖ జిల్లా వ్యాప్తంగా 101 ప్రదర్శనలు ఇప్పించారు. ఆ నాటకంలో అవసరాన్ని బట్టీ రెండు, మూడు పాత్రలో నటించేవాణ్జి నేను. సరిగ్గా అదే టైంలో కె.విశ్వనాథ్ గారి యూనిట్ 'శుభ సంకల్పం” షూటింగ్ కోసం స్టీల్ ప్లాంట్‌లో ఉందని తెలిసింది. అప్పటి వరకూ వీథి నాటకంగా వేసిన 'సూదిమందుని స్టెజీ నాటకంగా మలచి ఒక సాయంత్రం ఆ యూనిట్ సభ్యుల ముందు ప్రదర్శించాం. ఆ మోజే సాక్షి రంగారావు గారి నుండి ఫోను- సమీర్‌ను పంపించండి. విశ్వనాథ్ గారు కన్పించమన్నారని. నిజానికి ఆ మ(రోజే నా పుట్టన రోజు. మిత్రులను, బంధువులను భోజనానికి ఇంటికి పిలిచి ఉన్నాం కూడా. 3. విశ్వనాథ్ గారు పిలిస్తే వెళ్లకుండా ఉండగలనా? నాకు తగ్గ పాత్రనిచ్చారు. షూటింగ్‌లో చెమటలు పట్టాయి కానీ, డైలాగ్ చెప్పగానే కమలహాసన్, విశ్వనాథ్‌గార్లు వెరీ గుద్” అని మెచ్చుకోవడంతో గాల్లో తేలిపోయాను.
సరిగ్గా నా డిగ్రీ పూర్తయిన కొత్తలోనే అమ్మకు థియేటర్ ఆర్ట్స్‌లో పరిచయం ఉన్న దేవదాస్ కనకాల గారు మా ఇంటికి రావడం, అమ్మ నా గురించి వారితో చెప్పడం, నేను వాళ్ల ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరడం కలలో మాదిరి జరిగిపోయాయి. నా దగ్గర పైసా తీసుకోకుండా శిక్షణ ఇచ్చారు వారు. అక్కడ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మళ్లీ ఉషాకిరణ్ ద్వారానే బాపుగారి 'భాగవతం'లో గౌతముడు పాత్రలో బుల్లితెరకు పరిచయం కావడం మరో అద్భుతం. కె. విశ్వనాథ్, బాపు గార్ల వద్ద అవకాశాలు రావడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతమే అనుకుంటాను.
అవండీ, నా హ్యాపీదేస్... కళాక్షేత్రం నుండి కాలేజీ వరకూ చిన్నా చితకా సంఘటనలు మినహా అంతా హ్యాపీగానే గడిచిపోయింది. నిక్ నేమ్స్ పెట్టడాలూ, కొట్టుకోవడాలూ... ఈ మాత్రం కూడా లేకపోతే కాలేజీ లైఫ్‌లో మజా ఏముంది చెప్పండి?
(28 21.2012 ఆంధ్రజ్యోతి, ఆదివారం,
ల న ఖ స లాల ల్ షే || లై | మల్లికార్జునరావు నన్ను “తాన్‌సేన్ అని పిలిచెవారు! 'ఆట” కోసం “పాటి” నేర్పిన గాయకుదతడు. 'పాదుతా లీయగా” వేదిక నుంచి అఖభిలాం(ధ బుల్లితెర (పేక్షకులకు వరిచయమత్యూడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో నీనిమా పాటకు శ్రీకారం చుట్టి, ఆ వరంవరలో 1650 పాటల వరకూ పొదాదు. “కనులు తెరచినా, కనులు మూనినా” (ఆనందం), నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అవ్పదీగిందీ" (ఆది), “ఘల్లు ఘల్లుమని నీరిమువ్వల్లే' (ఇం(ద, 'సావానం శ్వానగా సాగిపో (ఒకడు), “చిట్లి నదుమునే చూస్తున్నా” (పుదుంబా శంకర్) వప్పేనుకో చారేసుకో* (లక్షీ నరనీంవా), “నీ ఇంట్లో అమ్మానాన్నా” (సుభాష్ చం(ద్రబోన్), “మన్నథా మన్నథా” - (ఠాగూర్ నుంది “ఎన్నడూ లేనిదీ” (లవ్ స్టోరీ) వరక్షు వలు మెలోడీలను అందించాదు. “కత్తి కాంతారావు” చితంతో నంగీత దర్భకుది అవతారం కూడా ఎత్తిన నృత్య” గాయకుడు మల్లికార్జునరావు. నాన్న శ్రీశైలం నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేస్తున్న కాలంలో పుట్టడం వల్ల 'మల్లికార్డుని నామధేయుడనయ్యాను. నాన్న బదిలీ క్రమంలో నాకు ఊహ తెలిసింది రాజమండ్రిలో చిన్న వయసులోనే రెండు నదులు నీటిని తాగడం వల్లేమో, అల్లరిలో ఎప్పుడూ “అప్పర్ హ్యాందే, పైగా గోదావరి మట్టిసారమేమో సినిమా ఆరోప్రాణమైంది. మొదట్లో ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారని తెలీదు. హీరోలే స్వయంగా హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 194
పాడుతూ తెరమీద స్టెప్పులు వేస్తారనుకునే అమాయకత్వం నాది. వాళ్ల మాదిరి డాన్స్ చేయాలంటే పాట రావాలి కదా.... పాట నాలోకి అలా ్రవేశించిందన్నమాట! డాన్స్‌తో పాటు వాళ్ల 'మ్యానరిజాన్ని అనుకరించడం గొప్ప సరదా. 'చిరంజీవిగార్ని తలుచుకోగానే అచ్చం ఆయనలా మారిపోతానని కితాబిస్తుంటారు ఇంట్లో వాళ్లు. సిగ్గుతో చితికిపోయిన క్షణాలవి
ముందే చెప్పా కదా మహా తుంటరి పిడుగునని. ఒకరోజు క్లాసులో టీచర్ లేని టైంలో పిల్లలంతా ఒక బెంచీ నుండి మరో బెంచీ పైకి కోతుల్లా గెంతుతుంటే ఆ 'సర్మస్ ఫీటొ నేనూ చేయబోయా - ఇంతలో "కాలర్ బోన్” పుటుక్కు. వెంటనే నాన్నకి కబురందించడం, ఆయన కంగారుగా పరిగెత్తుకొచ్చి నన్ను హాస్పిటల్‌లో చేర్చడం వరకూ గుర్తుంది. తర్వాత మత్తిచ్చి ఆపరేషన్ చేసి, కనీసం, రెండు నెలల దాకా స్కూలుకు పంపొద్దన్నాడట డాక్టరు. హాస్పిటల్ నుండి నేరుగా ఇంటికి వెళ్లకుండా స్కూల్లో విషయం చెప్పి వెళ్లామని నన్ను తీసుకుని స్కూలుకు వచ్చారాయన. అప్పటికి నాకిచ్చిన మత్తు క్రమంగా వదుల్తోంది. పూర్తి మెలకువ వచ్చేసరికి స్కూల్లో... నా చుట్టూ (ఆడ+మగ) పిల్లలంతా మూగిఉన్నారు. కొసమెరుపు ఏంటంటే... నా ఒంటిమీద నూలు పోగు లేదు. చేతులు అడ్డుపెట్టుకుందామంటే సహకరించని సిమెంటు పట్టీ చేతులు... “కృష్ణా... దీనబాంధవా” అంటూ గావు కేకేసి గాట్టిగా కళ్లు మూసుకున్నాను. కన్ను కొట్టింది నీకు కాదు తల్లో !
స్కూల్లో నేను ప్రార్ధన పాడుతుంటే అందరూ నన్ను అనుకరించాలి. మాత్రం సరిగ్గా పలక్కపోయినా పహరా కాసే లెక్కల మాస్తారి బెత్తం గాల్లోకి ఎగిరేది. నా పక్క వరసలో నిల్చున్న కె.వి.వి. సత్యనారాయణ అనేవాడు సరిగ్గా అనుకరించట్లెదని, కన్ను కొట్టి, సారొస్తున్నాడని సైగ చేశా.
సీన్ కట్ చేస్తే - మా హెడ్ మాస్టర్ ఎదురుగా చేతులు కట్టుకుని “నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా” అనే ఎన్టీఆర్‌లా నిల్చున్నాను. నా పక్కనే నాకంటే జానెడు పొడువున్న మా క్లాస్‌మేట్ ఒకమ్మాయి. అసలు విషయం చెప్పకుండా “ఎరా ఒళ్లెలా ఉంది? అమ్మాయిల్లో జా(గ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి సుబ్బరంగా బు(ర్ర తినేసి పంపించాడు. నేను చేసిన తప్పేంటో చాలోజుల వరకూ అర్ధం కాలేదు. ఒకరోజు సడన్‌గా బల్బ్ వెలిగింది - నేను వాడికి కన్ను కొట్టినప్పుడు ఆ పక్కనే ఈ అమ్మాయి ఉందన్నది! ఇప్పటికీ 'అ -హ - చర్యమే !
టెన్స్ క్లాస్‌లో (అప్పటికే వైజాగ్ వచ్చేశాం) ఉండగా ఒక సాయంత్రం అందరం [గ్రౌండులో క్రికెట్ అడుగుతున్నాం. బ్యాటింగ్ అంటేనే నిక్కరు తడిసిపోయేది నాకు.
పైగా ఎవడైనా ఫాస్ట్ బౌలింగ్ చేశాడంటే “బాబోయ్' అని పక్కకి తప్పుకునేవాణ్డి. ఆరోజు మా టీమ్‌లో అందరూ అవుటయ్యాక చివర్న నేను బ్యాట్‌పట్టుకోగానే “ఒరేయ్ మల్లిగాడు వచ్చాద్రా.. దెబ్బకు అవుటో అంటూ కేకలేస్తూ ఒకటే దాన్స్‌లు. మా టీమ్ వాళ్లమో “ఒరేయ్ మల్లీ. సెవెన్ రన్స్ తీశావంటే గెలిచేస్తాం. నీవు పాటగాడివే కాదు. ఆటగాడివని నిరూపించాలి' అంటూ ధైర్యం రంగరించి పోస్తున్నారు. మీరు నమ్మరేమోగానీ.. హఠాత్తుగా పిల్లి పులైపోయినట్టు ఫీలై, గట్టిగా గాండ్రించి, బ్యాట్‌ను గాల్లోకి తిప్పా. ఒక ఫోర్ - రెండు రన్స్-మరో సింగిల్ - ఆట గెలిచేశాం. మా వాళ్లిచ్చిన సైకలాజికల్ ట్రీట్‌మెంట్ అంతలా పనిచేసింది. ఓహో... అంతా నన్ను ఎత్తుకుని, వరల్డ్ కప్ సాధించినంత ఆనందపడిపోయారు. ఇప్పటికీ నాకంత బలం ఎలా వచ్చిందా అని అనుమానం + ఆశ్చర్యంతో తలమునకలవుతుంటా. అడవిలో ఆర్తనాదం
ఇంటర్మీడియట్లో రమేష్ మూర్తి ప్రకాశ్, వెంకట్, రవి, రామకృష్ణ నాతో కలిపి అంతా 7 ఇడియట్స్, శైలజ, సుజాత, ఆశ అనే అమ్మాయిలూ అప్పుడప్పుడు మా జట్టులో కలిసేవారనుకోండి. అందరికీ లీడర్ మాత్రం రమేష్కే మేముండేది గోపాలపట్నం. కాలేజీ పెందుర్తిలో, సిటీబస్సులో సీటు సంపాదించడానికి రమేష్‌గాడు రోజుకో స్కెచ్ వేసేవాడు. ఒకరోజు మెంటల్లీ రిట్రెర్ పిల్లల్లా నటిస్తూ ముందు నుండి ఎక్కి సీట్లు సంపాదిస్తే... ఇంకో రోజు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని గుడ్డవాళ్లలా..... సింపతీ కొట్టేసి ఎక్కేసేవాళ్లం. అప్పటికే సీట్లన్ని నిండిపోతే అమ్మాయిలను కాస్త జరగమని చెప్పి, పక్కనే కూర్చునేవాళ్లం. కాలేజీ రాగానే కళ్లద్దాలు తీసేసి “రండ్రా... స్టాపొచ్చింది అని అరిచేవాళ్లం. అప్పుడు వాళ్ల మొహాలు చూడాలి ! కందక్టరూ, డైవరూ రోజు మారేవాళ్లు కాబట్టి మేం రోజుకో వేషం వేసినా నడిచిపోయేది మరి.
మా కాలేజీ వెనక పెద్ద కొండ ఉందేది. 'ఇంగ్రీష్ పికృర్సలో చేసే అద్వెంచర్స్ = దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పీరియడ్ అవగానే కొందెక్కేవాళ్లం. మాతో పాటు ఒక అమ్మాయి కూడా ఉందేది. (ఇంగ్లీష్ పికృర్స్‌లో అల్లానే ఉంటారు కదా) ఒకరోజు ఉదయం బయల్చెరిన వాళ్లం సాయంత్రం వరకూ పొదలు చీల్చుకుంటూ, కనిపించిన పురుగులను చంపేస్తూ అదేదే పెద్ద అద్వెంచర్‌లా ఫీలయిపోయి - ఆ ఆనందంలో దారి తప్పివోయాం. అంతా ఒక దగ్గర చేరేసరికే చీకటి పడిపోయింది. ఎక్కడున్నామో తెలీదు, ఎలా దిగాలో తెలీదు. పైగా చిరుత పులులుంటాయన్న ఆలోచన అప్పుడే తట్టింది. వెన్నులో చలి మొదలైంది. రామకృష్ణ రెండు నిమిషాలకొకసారి 'మా అమ్మకి ఒక్కద్నేరా' అంటూ ఆరున్నాక్క రాగం తీసేవాడు. వాడి ఏడుపు వింటే మరింత హ్యాపీ డేస్ - సినీ ప్రముఖల చిన్ననాటి తీసి గుర్తులు 4 196
దడపుట్టెది. చివరికి నానా కవ్టాలు పడి ఇంటికి వచ్చాం అనుకోండి. ఆ దెబ్బకు అడ్వెంచర్స్ బంద్. తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అవడం, తలో దిక్కు వెళ్లిపోవడం, డిగ్రీ చేయడానికి నేను “కృష్ణా కాలేజీలో చేరడం... జరిగిపోయాయి. బాంబు పేలింది - ముఖం కాలింది
డిగ్రీలో ర్యాగింగ్ రెండు పాటలు, మూడు డాన్సులతో గడిచింది. ఎట్లాగూ ఈ రెండూ ఇష్టమైనవే కాబట్టి ర్యాగింగ్‌లా అనిపించేది కాదు. నాకు 'తాన్‌సేన్ అనే నిక్‌నేమ్ కూడా పెట్టారు. అప్పటికి తాన్‌సీన్ ఎవరో నాకు తెలియదనుకోండి! అలా ... పాటల్లో డాన్స్‌లో హరికథలతో కాలం కరిగించేస్తుంటే మా కెమిస్ట్రీ మాథ్స్ లెకరర్స్‌కి అది ఎంత మాత్రం గిట్టేది కాదు. “ఒరేయ్, అవేవీ కూడు పెట్టవురా' అంటూ కనిపించినప్పుడల్లా క్లాస్ పీకేవారు. చేతికి దొరికినప్పుడల్లా బలవంతంగా ప్రాక్టికల్స్ చేయించేవారు. గవర్నమెంట్ కాలేజీల్లో విద్యార్ధుల పట్ల అంతలా (శ్రద్ధ తీసుకునే వాళ్లు అరుదేమో!
డిగ్రీ సెకండియర్‌లో ఉండగా కెమిట్టీ లాబ్‌లో జరిగిన సంఘటన ఇది. ఆరోజు మాతో పాటు జానియర్స్ కూడా ్రాక్షికల్స్‌లో ఉన్నారు. ఒక జూనియర్ కుర్రాడు మా దగ్గరికి వచ్చి 'సోడియమ్ ఎలిమెంట్‌కు నీళ్లు తగిలితే మండుతుందా? అని అడిగాడు. అవునని చెప్పి పైగా చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెవ్వాం అదేరోజు సాయంత్రం (గ్రాండులో కొందరు క్రికెట్ ఆడుతుంటే మేమంతా నిలబడి చూస్తున్నాం. ప్లే గ్రౌండు పక్కనే పారుతున్న (డైనేజీ వంతెనకు అటూ ఇటూ ఉన్న దిమ్మలపై కొందరు స్టూడెంట్స్ కూర్చుని క్రికట్ చూస్తున్నారు. ఇంతలో బాంబు పేలిన శబ్దంతో పొటు పెద్దమంట. భయంతో తలోదిక్కు పారిపోయాం. చివరికి తెలిసిన విషయం ఏమంటే - మమ్మల్ని లాబ్‌లో సోడియం గురించి వాకబు చేసిన కుర్రకుంక శనగబద్దంత సోడియమ్ బిళ్లని జేబులో వేసుకొచ్చి (డైనేజీలో విసిరి పరీక్షించాడట. వాడి ముఖం కాలిపోవడమే కాదు, పక్కనున్న కుర్రాళ్లకూ చావు దప్పి కన్ను లొట్టటోయిన పరిస్థితి. “నేటి గాయకుడే రేపటి నాయకుడు”
డిగ్రీ ఫైనల్లో 15 మంది బ్యాచ్‌మేట్స్ ఉండేవాళ్లు. జగన్నాధరాజు అనేవాడికి ఏం బుద్ది పుట్టిందో *ఈసారి సైన్స్ గ్రూప్ నుంచి కూడా ఎలక్షన్స్‌లో పాల్గొనాల్సిందె' అని ప్రకటించాడు. సరే, కాలేజీ మొత్తంలో పాటగాడిలా నాకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని నేను వద్దు మొర్రో అని మొత్తుకున్నా వినకుండా (ప్రెసిడెంట్‌గా నిలబెట్టారు. ప్రతి క్లాసుకు వెళ్లి స్పీచ్ ఇవ్వాల్సి వచ్చేది. ఒక బెంచీ, ఆ పైన కుర్చీ వేసి దానిపైన నిలబడితే తప్పించి క్లాసులోని స్టూడెంట్స్ అంతా కనిపించేవాళ్లు కాదు. అటువంటి
పర్సనాలిటీ మనది. దాంతో స్టూడెంట్స్ నా పర్సనాలిటీ కళ్లకి ఆంటీల్లా, అంకుల్స్‌లా కనిపించేవారు. ఆ ఎలక్షన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. నేను చెప్పాల్సిన మాటల్ని పాట రూపంలో రాసుకుని వెళ్లి పాడి 'కాన్వాసింగ్' చేసేవాణ్జి. ఎక్కడ చూసినా 'మల్లికార్డునరావు గాయకుడే కాదు, కాబోయే నాయకుడు కూడా అనే స్లోగన్స్, ఎలక్షన్స్ ముందురోజు గ్రౌండులో బహిరంగ సభ జరుగుతుంటే అంతా నిల్ఫుని ఉన్నాం. ఇంతలో మా ప్రిన్స్‌పాల్ సత్యనారాయణగారు అటుగా వెళ్తూ నా దగ్గరకి వచ్చి నాతో మాట్లాడి వెళ్లాడు అంతే - 'మల్లిగాడికి ప్రిన్స్‌పాల్ ఏదో చెప్పాడ్రా, ఇక తిరుగులేదు. వాడే గెలుస్తాడ్రా” అనే పుకారు కార్చిచ్చులా లేచింది. మర్రోజు రిజల్స్..... ఎంచక్కా ఓడిపోయాను. ప్రెసిడెంట్‌కి పోటి చేసిన ఆరుమందిలో సెకండ్ ప్లేస్ నాకే వచ్చిందనుకోండి. ఓడిపోయినందుకు మా టీమ్‌లో అంతా బాధపడ్డా, లోలోపల సంతోషించింది మాత్రం నేనాకృద్నే - ఎక్కడ గెలిచి చస్తానో అని తెగ భయపడేవాణ్ని కాబట్టి ఇంతకూ మా ప్రిన్స్‌నాల్ నా చెవిలో చెప్పిన రహస్యం మీకు చెప్పలేదు కదూ “ఒరేయ్, నీ పర్సనాలిటీకి ఎలక్షన్స్ అవసరమా? పిచ్చి వేషాలేయకుందడా బుద్ధిగా చదువుకో అన్న అమృతవాక్కులు. ఒకసారి కారిడార్‌లో కనిపించిన శైలజ 'మల్లిక్, ఈ టీవీలో పాడుతా తీయగా ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ప్రయత్నించు అని చెప్పడం అనుకొకుండా సెలక్టు అవడం.... వందేమాతరం శ్రీనివాస్‌గారు “సింగన్న చిత్రం ద్వారా తొలి అవకాశం ఇవ్వడం... 'పాడుతా తీయగా” టైంలో పరిచయమైన గాయని గోపికా పూర్ణిమ తర్వాత కాలంలో నా జీవిత సహచరి కావడం.... అన్నీ నిన్న మొన్న జరిగిన సంఘటనల్లా ఉన్నాయ్. అన్నట్టు నా డిగ్రీ బ్యాచ్‌లోని మిగతా పధ్నాలుగురూ పై చదువులు చదివి అమెరికాలో సెటిలయ్యారండోయ్ ! నేను అమెరికా వెళ్లినప్పుడల్లా అందరం ఒకదగ్గర చేరి మా 'హ్యాపీదేస్‌ని నెమరేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం. (25.11.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) హాప్ డేస్ = సన్ ప్రముఖల వన్ననాటి తీస్ గుర్తులు + 198
(౫ ల్ ల / ఇ
- లీ . క్ స ర ర. 1. | గ 1 బోయపాటి శ్రీను దమ్ముంటే అమ్మాయిని కదిలించమని ॥ అర్లీ పందెం కాశారు! ఇవ్పుటీకే రెందు తరాల పాొరోలతో నాలుగు భారీ నీనిమూలు తీనీ (పేక్షకుల తల్లో నాల్నుకైన (వ్రముఖ దర్భకుదతను. డిగీ పూర్తి చేశాక ముత్వాల నుబ్బయ్య దగ్గర “చ్యతి' మెలకువలు నేర్తాడు. ఆ అనుభవంతో పూర్తి న్ధాయి టైరక్టరుగా మారి, (భద 'తో తనేమిటో నిరూవీంచుకుని - తులని, నీంవో, దమ్ము, లెవెంద్, నరైనోడు చిత్రాలతో దూసుకెళ్తున్న దర్శకుడు బోయవాటీ శ్రీను. నేను పుట్టింది, పెరిగిందీ అంతా గుంటూరు జిల్లా పెదకాకానిలోనే. మాది వ్యవసాయక ఉమ్మడి కుటుంబం. ఊర్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా హామీలు ఇవ్వడంలో, షూరిటీలు పెట్టడంలో ముందుండేవాడు మా నాన్న ఆయన అతి మంచితనం వల్ల కొన్ని పొలాలూ, స్థలాలూ ఓం ఫట్ అయ్యాయి. నాది 'అంతా మన మంచికే) అనే మనస్తత్వం కాబట్టి, దానివల్ల “బాధ్యత'గా ఆచి తూచి ఎలా అడుగులు వేయాలో తెలిసాచ్చిందని అనుకుంటాను, పొలం పనులతో పాకెట్ మనీ అప్పట్లో సమాజం ఇప్పుడంత వేగంగా లేదు. ఒకమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే 364 రోజులు మనసులోనే తర్జన భర్దన పడాల్సి వచ్చేది. ఏ అమ్మాయితో గొరుసు జగదీశ్వర రెడ్డి శ 1099
ప్రేమవ్యవహారం నడపాలన్నా ఊరంతా గుప్పుమంటుందని భయం. చదువులో మెరిట్‌కీ యావరేజ్‌కీ మధ్య స్టూడెంట్‌ని నేను. ఊర్లోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్స్ వరకూ చదివాను (ఇప్పుడది ఎన్.టి. ఆర్. జెడ్.పి. హెచ్. ఎస్). నాలో ఉన్న నాయకత్వ లక్షణాలను చూసి స్కూల్లో లీడర్ను చేశారు. సత్యనారాయణ, సన్నపనేని కృష్ణారావు. నాళం పుల్లారావు. హుస్సేన్, ఉయ్యూరు సాంబశివరావులు నా జట్టుగాళ్లు, దాదాపు అందరికి పొలాలుండేవి. ఆదివారం వచ్చిందంటే మా మా పొలాల్లోనే కందిచేను నరకడమో, పత్తి ఏరటమో, కాలువగట్లు చెక్కడమో.... లాంటి పనులు చేసి ఆ వారానికి సరిపడా పాకెట్ మనీ సంపాదించే వాళ్లం. ఎంత ఉత్సాహంగా పనిచే సేవాళ్లమంటే ఒక్కోసారి పాములు కూడా మా కొడవళ్ల వేటుకి తెగిపడేంతగా. మేం కష్టపడి సంపాదించిన ఆ డబ్బుల్తో మా ఊర్లోని “భ్రమరాంబా మల్లేశ్వరి టాకీసులో సినిమా చూస్తుంటే ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉండేది. భయంలోంచి పుట్టుకొచ్చిన...
వేసవి వచ్చిందంటే పిల్లలంతా చెరువుల నిండా, బావుల నిండా వికసించిన కలువలయ్యేవారు. పల్లాలమ్మ చెరువు, పాతూరి చెరువు, లేళ్లవారి బావితో పాటు కొత్తకాలువ.. ఎక్కడ చూసినా పిల్లలే. ఒక వేసవి రోజు - లేళ్లవారి బావి గట్టుమీద - పెద్ద ఈతగాడిలా బట్టలు విప్పేసి నిల్చుని, నీళ్లల్లో ఈదే పిల్లల్ని చూస్తున్నాను. నిజానికి అప్పటికి నాకు ఈత రాదు. పిల్లలు ఒకర్నొకరు పైనుండి బావిలోకి తోసుకోవడం అక్కడొక ఆట. ఉన్నట్టుండి ఎవడో నన్ను వెనకనుండి విసురుగా బావిలోకి తోసేశాడు. దాదాపు 60 అడుగుల లోతు. ఊహించని తోపుడికి గుండె ఆగినంత పనైంది. చూసినవాళ్లు నాకు నేనుగానే దూకానని అనుకున్నారు. ఈత రాకపోయినా ఎలా ఈదాలో తెలుసు కాబట్టి, ఈ భయంతోనే కాళ్లూ చేతులూ ఆడించడం మొదలెట్టా. కప్పపిల్లలా తవా తవా కొట్టుకుంటూ ఒద్దుకు చేరుకుని, నన్ను నేనే గిల్లి చూసుకుని ఆశ్చర్యపోయా. ఈతంటే అప్పటిదాకా ఉన్న భయం ఎగిరిపోయి, నీటిలో రూపాయి బిళ్ల విసిరి అది అడుక్కి వెళ్లే లోపే దాన్ని తీసుకురావడానికి పందాలు వేసేంత | వరకూ ఎదిగాను. కృష్ణ్వమ్మతో సమానంగా...
ఒకసారి కృష్ణారావు వాళ్ల పొలం పక్కనున్న కాలువలో నీళ్లు లేకపోవడం చూసి, పిల్లలందరం బిళ్లంగోడు ఆట మొదలెట్టాం. ఆట మంచి ఊపులో ఉంది. బ్యాటింగ్ నేనే చేస్తున్నా. నేను కొట్టిన బిళ్ల తీసుకురావడం కోసం పరిగెత్తిన వాళ్లలో కొందరు నావైపు చూస్తూ అరవడం మొదలెట్టారు. ఆ గాలి హోరులో 'రేయ్ రేయ్ అని మాత్రమే వినిపిస్తోంది. నన్ను వచ్చేయమంటున్నారేమో అనుకుని, నా ఆట హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 200
ఇంకా ఉందని నెను రానని తలూపి, అక్కడ్నించి కదల్లేదు. పిల్లలంతా కేకలేస్తూ ముందుకు పరిగెత్తడం గమనించి, ఏం జరిగిందబ్బా.... అని వెనక్కి చూశా. లాకులు ఎత్తేశారు. నీళ్లు రయ్యిమని తరుముకొస్తున్నాయి. నా పిక్కల్లోకి వెయ్యి ఏనుగుల బలం తెచ్చుకుని దాదాపు కృష్ణ్యమ్మతో సమానంగా పరిగెత్తి చెంగుమని గట్టు పైకి దూకేశాను. లక్కీగా వెనక్కి చూడబట్టి సరిపోయింది. లేదంటే... ఏమయ్యేవాణ్నో! ఇంత జరిగినా ఏమాత్రం భయం లేకుండా గట్టెక్కి నీళ్లను వెక్కిరిస్తూ మేమే గెలిచినట్టు “హే హే” అని గెంతులేశాం. వేలు పచ్చడి పచ్చడి
రాజు, అచ్చుుత్, సుబ్బారెడ్డి, రేణుకగార్లు ఇప్పటికీ నాకు గుర్తున్న టీచర్లు. అయితే ప్రైవేట్ మాత్రం మరో స్కూల్లో పనిచేసే శ్రీను మాస్టరు వద్ద చదివేవాళ్లం. ఎగ్జామ్స్ టైంలో మేము రాత్రుళ్లు కూడా అక్కడే ఉండిపోయేవాళ్లం. తెల్లారి 5 గంటలకు
మాస్టారు ఒక్కొక్కడ్ని తన్ని మరీ లెగొట్టి చదివించేవాడు. అదే టైంలో కొందరు
బయటినుండి ైవేట్‌కి వచ్చేవాళ్లు. మాస్తారు కన్ను గప్పి, వాళ్లు వచ్చేదారిలో చాటుగా, చీకట్లో ఉల్లి బాంబుల్ని దఢేల్‌మని కొట్టేవాళ్లం. దాంతో వాళ్లంతా భయంతో కేకలేస్తూ ఒకటే వరుగు. మళ్లీ వేవేం వెల్లి వాళ్లని తీనుకొచ్చేవాళ్లమనుకోండి. రాత్రుళ్లు నోరు తెరుచుకుని పడుకున్న పిల్లల నోటినిండా టూత్ పేస్టు పిండదం లాంటి కోతి పనులు కూడా చాలా చేసేవాళ్లం. అన్నట్టు అప్పట్లో క్యారమ్స్ ఆటంటే విపరీతమైన మోజుందేది నాకు. ఊరంతటికీ ఈ ఆట ఒక జాద్యంలా వాకిపోయింది. ఆట మంచిదే కానీ, దాన్ని మేమంతా జూదంలా డబ్బులు పెట్టి ఆడేవాళ్లం. అదీ అందులోని మత్తు. చదువు ఎగ్గొట్టి టైం దొరికితే చాలు క్యారమ్స్ ఆడేందుకు పారిపోయవాణ్ణి. 'చిన్నోడా చిన్నోడా వద్దురా, ఆడొద్దురా...” అని నాన్న ఎంత చెప్పినా వినకపోవడంతో ఒకరోజు నా చేతులు చాపించి సరిగ్గా ఆడే వేలుమీదసుత్తితో దధేల్‌మని బాదేడు. వేలంతా పచ్చడి పచ్చడి... మళ్లీ ఆయనే బాధపడి, ఆ వేలుకి కట్టుకట్టి చికిత్స చెశారనుకోండి. సుత్తి దెబ్బతో క్యారమ్స్ మోజు క్రమంగా తగ్గింది. నా చేతుల్లోనే ప్రాణాలొదిలాడు
నేను ఇంటర్మీడియట్ చదవడానికి గుంటూరు జె.కె.సి.లో చేరిన కొత్తలో జరిగిన సంఘటన ఇది, టెన్త్ వరకూ నాతో పాటు చదివిన మిత్రుడు (దూరపు బంధువు కూడా) సత్యనారాయణ చదువు మానేసి మా ఊరి ఆటోనగర్‌లోని ఒక రబ్బరు ఇండట్టీలో చేరాడు. నూనూగు మీసాల వయసు. మొగ్గలు తొడుగుతున్న యవ్వనం కదా... ప్రేమలో పడ్డాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం తెలిసి అమ్మాయి ఇంట్లో వాళ్లు ఆ అమ్మాయిని మందలించడం, తర్వాత ఆ అమ్మాయి ఏదో మిషమీద
మా వాడిని తిట్టడం... మా వాడు వీరావేశంతో హాఫ్ లీటరు 'నువోక్రాన్) పురుగుల మందుని మగ్గులో కలుపుకుని తాగడం జరిగాయి. సరిగ్గా పాద్దుగూకే టైంలో విషయం తెలిసి పరిగెత్తాను. అప్పటికే వాడు వేలాడిపోతున్నాడు. ఆగమేఘాల మీద ఆటోలో వేసుకుని గుంటూరు పరిగెత్తాం. అస్పత్రిలో అడుగు పెడుతుండగా నా చేతుల్లోనే ప్రాణాలొదిలాడు. ప్రియమిత్రుడి చావుని కళ్లతో చూడటం నన్ను ఎప్పటికీ వెంటాడే గొప్ప విషాదం. అప్పట్లోనే ఊర్లో మాకో ఫోటో స్టూడియో ఉండేది. రాత్రి భోజనాలు చేశాక వాడూ, నేనూ కలిసి లుంగీల మీదే సినిమా హాలు దాకా వాకింగ్ చేసి, కబుర్లు చెప్పుకుంటూ మా స్తూడియోలోనే నిద్రపోయేవాళ్లం. ఇప్పటికీ వాడితో గడిపిన రోజులన్నీ సినిమా రీళ్లలా కళ్ళల్లో మెదులుతూ గుండెని మెలిపెడుతూ ఉంటాయి. ఇదే టైపు “క్రష్
ఒకవైపు రెండు బస్సులు మారి కాలేజీకి వెళ్లడం - మరోవైపు స్టూడియోలో ఊపిరి తీయడానికి వీల్లేనంత పని ఉండడం. ఊళ్లోనే కాదు, చుట్టపక్కలున్న తక్కెళ్లవాడు, ఉప్పలవాడు - ఎక్కడ ఏ వేడుక జరిగినా వెళ్లి ఫోటోలు తీసేవాణ్లి. డిగ్రీ కూడా అదే కాలేజీలో కంటిన్యూ చేయడంతో ఐదేళ్లూ ఇంటినుండే కాలేజీకి వెళ్లేవాణ్సి. డిగ్రీ రెండో సంవత్సరంలో అనుకుంటా... నాజ్ సెంటర్ బస్టాపులో ఒకమ్మాయి నా కంట్లో పడింది. వాకబు చేస్తే తను చదివేది ఉమెన్స్ కాలేజీ అని తెలిసింది. అమ్మాయి బాగుందని మాటవరసకి అనగానే, మా బృందంలో ఉన్న ఉయ్యూరు రత్తయ్య ఉమర్చాలు '“వద్దు గురో, చూడ్డానికి సుకుమారంగా పువ్వులా ఉంది కానీ, కదిలించబాకు. నోరు మహా దొడ్దది. మేమిద్దరం నీకంటే ముందే కదిలించి పుష్టిగా తిట్లు తిన్నాం” అన్నారు. ఇంకోవైపు నన్ను రెచ్చగొడ్లూ “దమ్ముంటే నీవెళ్లి కదిలించు చూద్దాం) అని పందెం కూడా కాశారు. దాంతో రోషం పొడుచుకొచ్చి “ఓకే” అని సవాల్ విసిరి, మర్రోజు అనుకున్న ప్రకారం ఆ అమ్మాయి కనిపించగానే ధైర్యంగా వెళ్లి తనకు పక్సగానే నడుస్తూ... 'హాయ్.. ఏం పేరు?” అనడిగా. “ఈరోజు వీడి వంతొచ్చినట్టుంది' అన్నట్టు నా వైపు ఒక వంకర చూపు విసిరి 'వీ.. ణ) అంది వ్యంగ్యంగా. “వీణ సరిగ్గా పలకట్లేదు... సవరించనా?” అన్నా అంతకంటే వ్యంగ్యంగా, షాక్ కొట్టినట్టు కనుబొమలెగరేసి “తీగ తెగిద్ది అంది సీరియస్‌గా. “వామ్మో అప్పుదే తీగ తెగితే ఎట్టా అని ముందుకెళ్లివోయా. ఆ తర్వాత పది రోజుల వరకూ ఆ అమ్మాయి కనిపించినా కేర్‌లెస్‌గా ఉందేవాళ్డి. పదకొందో రోజు తనే చారవగా నా దగ్గరకొచ్చి *ఏం పేరు? ఏం చదువుతున్నావు? ఏ కాలేజీ?” అని ప్రశ్నలు గుప్పించి, చివరకి “డిగ్రీ చదువుతున్నావ్.. ఒకమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదా? చెప్తా విను. ముందు రోజు పేరదగాలి. తర్వాత రోజు ఎక్కడ చదువుతున్నావని అదగాలి. హ్యాపీ డేస్ = సిన్ ప్రముఖల చిన్ననాటి తీసి గుర్తులు 202
రెండ్రోజులు పోయాక, నిన్న కనిపించలేదు. ఎక్కడికెళ్లారండి? అని అడగాలి. స్టెప్ బై స్టెప్ మాట కలపాలి కానీ. నీ ఇష్టమొచ్చినట్టు మాట్టాడతావా?” అని క్లాసు పీకింది. తిక్కరేగి, 'నాకు డొంక తిరుగుళ్లు తెలీవు. ముక్కుసూటి తత్త్వం మనది” అన్నా బింకంగా. నా మాటకు 'సరేలే' అని భళ్లున నవ్వేసింది. ఆ తర్వాత నుండి ఎప్పుడు కనిపించినా సరదాగా మాట్లాడేదనుకోండి! ఏదైనా అంత స్పోర్టివ్‌గా తీసుకునేవాళ్లం అప్పట్లో. డిగ్రీ ఫైనల్లో శేఖర్, మోహన్, ప్రతాప్, బొడ్డపాటి శ్రీను, సుధాకర్, కృష్ణ నీరజ, శారద, సుచరిత, సునంద లాంటి దాదాపు 15 మంది మిత్రబృందం ఉండేది. అందరం చాలా క్లోజ్‌గా ఉందేవాళ్లం. ఎలాంటి పిచ్చి ఆలోచనలు మా మధ్యన వచ్చేవి కావు. సైన్స్ గ్రూపులో ఉండే ఒకడు మా జట్టులోని అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటే ఒకటికి పదిసార్లు వార్నింగ్ ఇచ్చి చూశాం. ఇంకా వాడు రెచ్చిపోవడంతో ఒక ఫైన్ ఈవినింగ్ వాడి రూమ్‌కు వెళ్లి బయటకి లాగి 'తధిగిణతోం' ఆడుకున్నాం. తర్వాత ఈ గొడవ ప్రిన్స్‌పాల్ వరకు వెళ్లడం, వాడు కేసు పెట్టడం... అమ్మాయిలను ఏడిపిస్తున్నాడనే నిజం తెలిసి చివరికి వాడినే తిట్టడంతో ఆ గొడవ సమసిపోయింది. ఇలా, ఒకటా రెండా... ఎన్నెన్నో మధురమైన సంఘటనలతో కాలేజీ పూర్తిచేసి బయటికొచ్చా. ఉగాది పచ్చడిలా చేదు, పులుపు, తీపి, కారం, ఒగరు లాంటి భిన్న రుచులతో గడిచిన హ్యాపీడేస్ నావి. తర్వాత ([గ్రూప్స్‌కి రాయటం... ఇతర ఉద్యోగాలు ఒకటీ ఆరా చేయటం జరిగింది. కానీ - మనసు సినిమా వైపు పరుగులు తీస్తుంటే అవన్నీ వెనక్కి తప్పుకున్నాయి. ఒక శుభముహుర్తం చూసి ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర చేరి, అసిస్టెంట్, అసోసియేట్, కో - డైరెక్టర్ వరకూ ఐదేళ్లపాటు శిక్షణ పొంది 'భద్రితో డైరెక్టరుగా మీ ముందుకు వచ్చేశా. అన్నట్టు చెప్పడం మరిచా
- రాబోయే జనవరిలో మా ఎన్.టి.ఆర్. ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులమంతా పెదకాకానిలో కలిసి ఆనాటి ముచ్చట్లని మరోసారి నెమరు వేసుకోబోతున్నామండోయ్. (2 2220122 ఆదివారం ఆంధ్రజ్యోతి)
ఆశే సం సాయికిరణ్ డా రజనీయె అన్నారు.... నాది ఆర్లిస్స్ ఉఅయలు ముఖమని! “అనగనగా ఆకాళం దంది... ఆకాళంలో మేభుం జంది” పాట గుర్తుంటో చాలు.. మీరింకా ఆ పొరోని మర్చిపోలేదన్నమాటే, గాయకుడు వి. రామకృష్ణ కుమారుడిగా, బుల్లితెర వెండితెరల హీరోగా అందరికీ తెలిసిన నటుదతను. 'నువ్వేకావాలి'తో చిత్రరంగ (వవేశం చేని (పేమించు “సత్తా 'దార్లింగ్ దార్లింగ్ “వెంగమాంబ “ళిరిదీ శాయి” వంటి వలు చిత్రాల్లో నటించారు. అలాగే '“ఆటో భారతి) 'ుందరకాంది “అవరంజి” లాంటి బుల్లితెర నీరియల్స్‌లోనూ కనివీంచిన “నాయికీరణ్” అతదు. అంజలీదేవిగారి ఇంటికి సత్యసాయిబాబాగారు వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా నా నామకరణం జరిగిందట. అమ్మానాన్నలు ఇద్దరూ గాయకులే కాబట్టీ తరచూ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఊర్లు తిరుగుతూ ఉండడంతో, ఏదేళ్ల వరకూ అమ్మమ్మ వాళ్లింట్లో హైద్రాబాద్‌లోనే పెరిగాను. అమ్మమ్మ వాళ్లు అప్పట్లో ఎర్రమంజిల్ కాలనీలో ఉందేవారు. ఆ ఇంటీ పక్కనుండే ఫారెస్టు ఆఫీసరు ఒకాయన వికారాబాద్ అడవుల్లో గాయపడ్డ నెమళ్లనీ, జింకలను తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇవ్వడం నాకు హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి దీసి గుర్తులు శా 204
బాగా జ్ఞాపకం. బహుశా అదే ఆ తర్వాత నేను జంతు (ప్రేమికుడిగా మారడానికి దోహద పడిందేమో! సంక్రాంతి పండగ సందర్భంలో ఎగరేసే గాలిపటాల “మాంజా” కోసుకుని ఎన్నో గద్దలు నేల రాలిపోతుండేవి. అలా పడిపోయిన గద్దలపై ఒక టర్కీ టవల్ కప్పి, జాగ్రత్తగా కుక్కపిల్లని చంకలో పెట్టుకున్నట్టు పొదుపుకొని, ఇంటికి తీసుకొచ్చేవాణ్సి. అలా నేను కుక్కలు, పాములు, తాబేళ్లు, పావురాలు, లవ్‌బర్ట్, గబ్బిలాలు, గద్దలు, చిలకలు లాంటి ఎన్నో ప్రాణులు బాగోగులు చూసుకున్నాను. వీటికోసం ప్రత్యేకంగా పంజరాలను తయారుచేయించడం.. దెబ్బ తిన్న వాటి ఆరోగ్యం కుదుట పడగానే యథావిధిగా వాటిని ప్రకృతిలోకి వదిలేయడం ఒక హాబీగా ఉందేది. 'రిడద్నాపి నుండి తప్పించుకున్నాను
హైద్రాబాద్‌లో చదివింది 2వ తరగతి వరకే గాని టీచర్లని మూడు చెరువుల సీళ్లు తాగించేవాణ్ణి. చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. హోంవర్కు చేయడమంటే యమ బద్ధకం. పూర్వజన్మలో డాక్టర్నేమో... నా రాత అర్ధం చేసుకోలేక టీచర్ల బుర్ర గిర్రున తిరిగిపోయేది. అయితే చిత్రలేఖనంలో అందె వేసిన చెయ్యి నాది. పొద్దస్తమానం బొమ్మలు గీస్తూ గడిపేవాణ్ణి. టిచర్ కొట్టటోయినప్పుడల్లా 'మాడమ్ మీ శారీ చాలా బాగుంది. మీరు చాలా బాగున్నారు లాంటి మాటల్ని చెప్పేసి తప్పించుకునే వాట్ట. పొగడ్తకంటే తీయనిదేముంది? చుట్టంచూపుగా వచ్చే అమ్మానాన్నల్ని పరాయి వాళ్లలా చూస్తుండడంతో ఇక లాభం లేదని బలవంతంగా చెన్నై తీసుకెళల్లిపోయారు. అమ్మమ్మ నుండి నన్ను విడదిశారని వాళ్లిద్దరిపై మొదట్లో కోపంగా ఉందేది.
స్కూల్‌లో నన్ను దించటానికి, మళ్లీ తీసుకురావడానికి ఒక రిక్షా ఉందేది. ఒకరోజు స్కూల్ వదిలేసి అరగంటైనా రిక్షా రాలేదు. అప్పటికే పిల్లలంతా వెళ్లిపోయారు. ఒక్కడ్నే గేటు బయట అరుగు మీద కూర్చుని రిక్షా కోసం ఎదురుచూస్తున్నా ఇంతలో నాకు ఎదురుగా ఒక పొడవాటి కారు ఆగింది. అందులోంచి ఒకడు దిగి, 'ఏం పేరు నీది? చాలా బొద్దుగా ఉన్నావు అంటూ (ప్రేమగా మాట కలిపాడు. బెరుకుగానే సమాధానం చెప్పాను. 'అరే నువ్వు సింగర్ రామకృష్ణ అబ్బాయివా? మీ నాన్న నేను మంచి మిత్రులం తెలుసా? అంటూ మామిడి ముక్కలు కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంతలో మా రిక్షా అతడు వచ్చాడు.'నీవు వెళ్లిపో, నేను బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే. వీళ్ల నాన్న నేను ఫెండ్స్ అన్నాడు వాడు. నేను కూడా సరే అనడంతో మా రిక్షా వెనక్కి తిరిగింది. తర్వాత వాడు జేబులోంచి “'స్పే తీసి “ఇది చూడు. ఎంత మంచి వాసన వేస్తుందో అంటూ నా చేతిలో పెట్టటోయాడు. అంతకు ముందు రోజే స్పే కొట్టి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందని, జాగ్రత్తగా
ఉండమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి “వద్దు అంటూ భయంగా వెనకడుగు - వేశాను. ఇంతలో మా రిక్షా అతను వెనక్కి వచ్చి “బాబు ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? అని అడిగాడు అతన్ని. “తెలుసు తెలుసు. నీ వెళ్ల అంటాదేగాని అడ్రసు చెప్పట్లేదు. మా రిక్షా అతడికి డౌటొచ్చి కేకరలేయడంతో పలాయనం చిత్తగించాడు వాడు. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాన్నో?! ఇంట్లోంచి పారిపోయాను
8వ తరగతిలో ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిజల్స్ తెలిసినప్పుడు జరిగిన సంఘటన ఇది. లెక్కల్లో 90 శాతం తెచ్చుకోకపోతే తన్నులు తప్పవని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అయినా నాకు నూటికి 5 మార్కులే వచ్చాయి. ఇంటికి వెళితే తన్నులు ఎలాగూ తప్పవని రిక్షా రాకముందే సిటీ బస్సులో మద్రాసు సెంట్రల్‌కి వెళ్లి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (స్షీపర్‌లో) ఎక్కి దర్జాగా కూర్చున్నాను. రైలు గూడూరు దాటాక టి.సి వచ్చి టికెట్ అడిగాడు. 'మా అమ్మానాన్నలు కూడా ఇదే రైల్లో ఉన్నారు. వాళ్లు ఏ బోగీలో ఉన్నారో తెలీదు. టికెట్ వాళ్ల దగ్గరే ఉంది” అని అబద్ధం ఆడేశాను. నా భుజానున్న స్కూల్ బ్యాగ్, చేతిలో లంచ్ బాక్స్ చూడగానే టి.సి.కి అనుమానం వచ్చి మెల్లగా కూపీ లాగాడు. “నీవు రామకృష్ణగారి అబ్బాయివా? నేను మీ నాన్నగారి ఫ్యాన్‌ను తెలుసా అనడంతో అసలు విషయం కక్కేసి... అమ్మమ్మ వాళ్లింటికి హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పేశాను. రామకృష్ణ్టగారి అబ్బాయిని కావడంతో టికెట్ విషయం మర్చిపోయి, “అమ్మో ఒక్కడివీ ఎలా వెళ్తావు అని బాధపడిపోయి, హై(దాబాద్‌లో దిగగానే తనకు తెలిసిన మనిషికి నన్ను అప్పగిచ్చి మా అమ్మమ్మ వాళ్లింట్లో దిగబెట్టమన్నాడు. నేను సేఫ్‌గా అమ్మమ్మ వాళ్లింటికి చేరుకున్నాగ్గానీ... చెన్నైలో మా అమ్మానాన్నలు మాత్రం నిద్రాహారాలుమాని పోలీసుస్టేషన్ల వెంట తిరిగి, వాళ్లకు లంచాలిస్తూ నా ఆచూకీ కోసం నానా హైరానా పడ్డారట. అమ్మమ్మ ఇంటినుండి వార్త అందిన తర్వాతగానీ వాళ్లు కుదుట పడలేదట. అంత తెగింపు నాకెలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్ధం కాని విషయమే కానీ ఆ దెబ్బతో అమ్మానాన్నలు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉందేవారు. చదువు, చదువు అని వెంటపడ్డం మానేశారు. ఆ మాటతో హీరోనైపోయా
మా చిన్న నాన్నమ్మ పి. సుశీలగారి అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇవ్వదానికి నాన్న వెంట నేనూ రజనీకాంత్‌గారి వద్దకు వెళ్లాను. అప్పుడాయన '“ఉలైపాళి అనే తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. శుభలేఖ తీసుకుంటూ పక్కనే ఉన్న నన్ను చూసి “ఎవరీ అబ్బాయి? ఆర్టిస్ట్ ముఖం. యాక్టర్‌ని చేయండి” అన్నారు. ఆ మాటతో నా చుట్టూ కెమెరా జూమ్‌తో రెడీగా ఉన్నట్టు, లైట్స్ ఒక్కసారిగా వెలిగినట్టు. ఎక్కడో హ్యాట్ డేస్ - సిన్ ప్రముఖం చిన్ననాటి తీసి గుర్తులు + 206
యాక్షన్ అనే పిలుపు వినిపించినట్టు ఫీలయిపోయా. బయటకి రాగానే “చూశారా, అందరి కళ్లకు రజనీకాంత్‌గారు యాక్షర్లా కనిపిస్తే ఆయన కళ్లకి నేను యాక్టర్లా కనిపించాను. చదువు మానేసి హీరోనైపోతా' అన్నాను. ముందు డిగ్రీ పూర్తి చేయమని కచ్చితంగా చెప్పేశారు నాన్న అదేంటో ఇంటర్మీడియట్ టైంలో గడిచిన ఒక్క సంఘటనా మెదడులో నిక్షిప్తం కాలేదు. ఆ రెండుళ్లూ ఎలా తుడిచి పెట్టుకుపోయాయో ఇప్పటికీ అర్ధం కావట్లేదు. డిగ్రీలో ఈ కోర్స్, ఆ కోర్స్ అనీ చివరికీ దేనిమీదా ఇన్‌టైెస్ట్ లేక ఆ సంవత్సరం అంతా వృధా. చివరికి హైద్రాబాద్‌లో 'హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తానని ఒప్పించి అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేశాను. వాడికోసమే కరాటే నేర్చుకున్నాను
మొదట్లో మా కాలేజీ బేగంపేటలో ఉండేది. అందరూ సరదాకోసం ర్యాగింగ్ చేస్తే అమిత్ అనేవాడు మాత్రం వాడి అవసరానికి ర్యాగింగ్ చేసేవాడు. “జేబులో ఎన్ని పైసలున్నాయో తియ్” అంటూ దాదాగిరి చేసేవాడు. తిరగబడతామంటె నాకు శక్తి సరిపోయేది కాదు. వాడి పుణ్యమా అని సిటీబస్‌కు కూడా డబ్బులు లేక బేగంపేట నుండి జూల్లీహిల్స్‌కి (అమ్మమ్మవాళ్లు అక్కడ ఉండేవాళ్లు) నడిచి వెళ్లేవాడ్ని. కాళ్లు నొప్పెట్టినప్పుడల్లా వాడిమీద కసి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగేది. వాణ్ని తన్నాలంటే నేను దృఢంగా అవ్వాలి అనుకుని, ఉదయం 5 గంటలకే నిద్రలేచి కరాటే క్లాసులకు వెళ్లేవాణ్ణి. సీన్ కట్ చేస్తే...
సెకండియర్‌కి వచ్చేసరికి పుష్టిగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి కొట్టె బలం, ధైర్యం వచ్చేసింది నాకు. ఒక ఫైన్ ఈవినింగ్ వాడింటికి వెళ్లి బయటకి పిలిచి నన్ను నడిపించిన దృశ్యాలు నెమరేసుకుంటూ చితకబాదుతుంటే లోపల్నుంచి వాళ్ల నాన్న పరిగెత్తుకొచ్చి 'ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడిని అరిచాడు. వాడు చేసిన నిర్వాకం చెప్పగానే, కామ్‌గా ఇంట్లోకి వెళ్లిపోయి 2 రోజుల పాటు వాడిని ఇంట్లోకి రానివ్వలేదట. ఆ తర్వాత నన్ను తన్నించడానికి మనుషుల్ని పెట్టాడని తెలిసింది. అప్పటికే మా కాలేజీ బేగంపేట నుండి కొంపల్లికి మారడంతో నాకోసం రెండ్రోజులు తిరిగి “నీవిచ్చిన డబ్బులు రెండ్రోజులతో సరి' అని వాడికి చెప్పి వెళ్లిపోయారట. కొసమెరుపు ఏంటంటే ఆ టైంలో నేను కాలేజీకి వెళ్లలేదు. అమ్మమ్మే నా బెస్ట్ ఫైండ్
మా కాలేజీ పక్కనే ఒక డిగ్రీ కాలేజీ ఉండేది. ఈ రెండు కాలేజీలకు మధ్యలో 'ఇగ్గ్లూ' అనే రెస్తారెంట్. ఖాళీ దొరికితే టీ తాగడానికి అందులోకి వెళ్లేవాళ్లం. అప్పుడే నా కంట్లో పడిందొక నార్త్ ఇండియన్ (మిలట్రీ వాళ్ళ) అమ్మాయి. బోయిన్‌పల్లి నుండి వచ్చేది తను. కేవలం ఆ అమ్మాయిని చూడ్డానికే ఇగ్గూకి వెళ్లవాణ్సి. ఇద్దరి
మధ్య పరిచయం పెరిగింది. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని అమ్మమ్మతో వెళ్లి చెప్పా ఒకసారి. 'వద్దురా, ఉత్తరాది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా ఉంటారు కానీ, పిల్లలు పుట్టగానే అమ్మమ్మల్లా అయిపోతారింది. నా మనసు మాత్రం ఊరుకునేది కాదు. అప్పట్లో నేను కాలేజీలో నేర్చిన (ఫైెంచ్ లాంగ్వేజీని అప్పుడప్పుడు ఇంట్లోనే ట్యూషన్‌గా చెప్పేవాణ్లి. ఒకరోజు నా క్లాసు వినడానికి తనూ వచ్చింది. అమ్మమ్మకి చూపించి “చూడు ఎంత అందంగా ఉందో” అన్నాను. అప్పటికైనా మనసు మార్చుకుంటుందేమోనని. “వయసులో గాడిద పిల్ల కూడా ముద్దుగానే ఉంటుందిరా! అని క్లాసు పీకింది.
మళ్ళీ సీన్ కట్ చేస్తే - 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి నా ఫేస్‌బుక్‌లో కనిపించింది. అమ్మమ్మ మాటని నిజం చేస్తూ, ఈ విషయం అమ్మకి చెబితే 'అందుకేరా?, పెద్దల మాట వినాలి” అని మరోసారి క్లాసు పీకడానికి రెడీ అయ్యింది.
డిగ్రీ అవగానే ఉషాకిరణ్ మూవీస్ పిలుపు - శివలీలలు సీరియల్ కోసం మెకప్ టెస్ట్ చేస్తామంటూ ముందు మన్మథుడి పాత్రకు పిలిచి, తర్వాత శివుడి మేకప్ వేశారు. చివరికి విష్ణుమూర్తి వేషానికి సెలక్ట్సు చేశారు. అలా శివలీలలతో బుల్లితెరంగేట్రం చేశాను. '“నువ్వేకావాలి' చిత్రం కోసం విజయభాస్మ్కర్‌గారు రెండో హీరో కోసం వెతుకుతుంటే కృష్ణవంశీగారు 'రామకృష్ణగారి అబ్బాయిని టై చేయమని సలహా ఇచ్చారట. అలా మరోసారి ఉషాకిరణ్ మూవీస్‌తోనే సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పట్నించీ జీవితాన్ని నాకు నచ్చినట్టే గడిపాను. కాబట్టి రోజులన్నీ నాకు హ్యాపీడేసే. అంతేకాదు. రాబోయే రోజులు కూడా కచ్చితంగా హ్యాపీడేస్ అనే నమ్మకం నాది.
(09.12.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
హ్యాపీ డేస్ = సిన్ ప్రముఖుల చిన్ననాటి తీస్ గుర్తులు + 208
( అజస్లే జై గా త స్టే స స ఏక్ నషట పీ ఇ స భా శ్రీనివాస్‌రెడ్డీ కలల ఆబ లి 900 కీ సూపర్ మాన్‌ొలా ఫలై ప్రాణం మీదికి నూనూగు మీసాల నాదే దర్భకుదవ్వాలనే కోరికతో హౌరా మెయిలెక్తి మద్రాసులో వాలిన పగోజి బుల్లోదతను. మొదట్లో ఆయన కళ్లకి పొరోలే దేవుళ్లు, స్టూడియోలే దేవాలయాలు, (ప్రపంచమే “సినిమా 'అంకుళం'తో అనిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టి, ఆ తర్వాత పలు నీనిమాలకు అసోనీయేటి కోదైరెక్టరుగా వనిచేశాదు. '“ఆషాధం పెళ్లికొడుకు'తో పూర్తి స్థాయి డైరెక్టరుగా మారి “అదిరిందయ్యా చంద్రం? “టాటా బిర్లా మధ్యలో లైలా? “యమగోల మళ్లీ మొదలైంది? 'బొమ్మనా (బ్రదర్స్ చందనా నిస్టర్స్, 'కుబేరులు%' అ ఆ ఇ ఈ” నుండి నాగార్జున 'దమరుకం” వరకూ చాలానే నినిమాలు తీశాడు. పెద్ద చదువులకూ, డైరెక్టరు కావదానికీ పొంతన లేదని నిరూవీంచి ముందుకు సాగిపోతున్న దర్భకుడు శ్రీనివాన్‌రెడ్డి. మా పగోజి మట్టి ప్రభావమో, నీటి ప్రభావమో తెలీదు కానండి... చిన్నతనం నుండి డైరెక్టరు అయిపోవాలనే తపన నిలువెల్లా ఉండేది. మనుషుల పేర్లు సరిగ్గా గుర్తుండేవి కావు గాని, మా ఊరి చుట్టూ ఉన్న సినిమా థియేటర్ల పేర్లు, వాటిలో ఆడే సినిమాల పేర్లు నిద్రలో లేపి అడిగినా ఠపీమని అప్పచెప్పేవాణ్ణి. భీమవరం దగ్గరి గొరుసు జగదీశ్వర రెడ్డి + 209
పెనుమంట్ర మండలంలోని వెలగలవారి పాలెం మా ఊరు. లేకలేక పుట్టిన ఒకే ఒక్క కొడుకుని కావడంతో మహా గారాబంగా పెరిగాను. గోదావరి జిల్లాల అందమే అందం కదండీ. ఎటుచూసినా పిల్ల కాలవలు, నిండైన కుంటలు, పచ్చని పైర్డు, ఆకాశాన్ని కప్పేసే కొబ్బరాకుల పచ్చదనం... పైగా మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వీటన్నిటినీ మరింత ఆస్వాదించేవాణ్లి. అదొక పునర్జన్మ
చెప్పా కదా గారాబం ఎక్కువని... నాన్న ఎక్కడికెళితే అక్కడికి ఆయనో పాటు వెళ్లేవాణ్ని ఒకసారి ఆయన పొలం దగ్గరకి వెళ్తుంటే వెంటపడ్డా. పొలం పక్కనే చెరువు. దాని అంచున ఒక పెద్ద జామచెట్టు... కొమ్మలన్నీ నీటివైపు వాల్చేసి ఉంటుంది. ఆ రోజు నేను అడిగిందే తడవుగా నాన్న పళ్లు కోయడానికి చెట్టెక్కాడు. గట్టు చివర నిల్చుని దోర పళ్లు ఆకుల మాటున ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో చెబుతూ చెబుతూ... మట్ట అంచు విరిగి మెత్తగా నీటిలోకి జారిపోయాను. అప్పటి వరకూ అదిగో పండు, ఇదిగో పండు అంటూ గొంతెత్తి అరిచిన నేను ఒక్కసారి సైలెంట్ కావడంతో అనుమానం వచ్చి ఆయన కిందకి చూశారట. ఎక్కడా లేను నేను. గబగబ చెట్టు దిగి చుట్టూ ఒకసారి కలయచూసి, కిందకి చూస్తే నీటిలో బుడగలు రావడం కనిపించిందట. వెంటనే దూకేసి నన్ను గట్టుపైకి లాగి, పొట్టపై ఒత్తి ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. రక్తం ధారవోశా...
సోషల్ స్టడీస్ చెప్పే వెంకన్న ఇంగ్రీషు చెప్పే కృష్ణంరాజు, తెలుగు చెప్పే కనికిరెడ్డి మాస్టర్లంతా... నన్ను బాగా ఇష్టపడేవారు. నేను మర్చిపోలేని మరో మాస్టారు మా క్రాఫ్ట్ మాస్టారు. కుటీర పరిశ్రమలు ఎలా నేర్పించాలో చెప్పే క్రమంలో ఒకసారి మగ్గం నేయించారు. మగ్గం కర్రని ఆడిస్తూ నూలు వడికేటప్పుడు పట్టుదప్పి నా చెయ్యి తెగింది. అప్పటి వరకూ అల్లిన నూలంతా రక్తంతో తడిసిపోయింది. పూర్తిగా నేనే అల్లి దాన్ని ఇంటికి తీసుకుపోయాను. నా రక్తం ధార పోసి అల్లుకున్న వస్త్రం కదా,
ఒకసారి కొణితివాడలో ఉన్న థియేటర్లో ఎన్.టి. ఆర్. “సూపర్‌మాన్ సినిమా చూసి సైకిల్‌పై తిరిగి వస్తున్నాం. నేను తొక్కుతుంటే, వెనక నా ఫ్రెండ్ శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు. ఎన్.టి.ఆర్. గాల్లో తేలుతూ ఫీట్స్ చేయడం, వాలుగా జెంప్ చేయడం కళ్లముందు కదుల్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సూపర్‌మాన్ నన్ను పూర్తిగా ఆవహించేశాడు. ఆ ఊపుతో సైకిల్‌పై రకరకాల విన్యాసాలు చేస్తూ స్పీడుగా హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 210
తొక్కుతున్నాను. ఒక ట్రాక్టరును ఓవర్‌టేక్ చేయబోయేంతలో ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న లారీ. కెవ్వుమంటూ కుడివైపు హ్యాండిల్ తిప్పా. విసురుగా వెళ్లి పెద్ద గోతిలో పడ్డాం. చావుదప్పి కన్న లొట్ట బోయినట్టయింది. థియేటర్లోనే పడుకున్నా...
వరసకు మామయ్యలైన లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డిలు మార్చేర్లో ఉందేవారు. వాళ్లింటికి చుట్టం చూపుగా వెళ్లినప్పుడు జరిగిన సంఘటన ఇది. సినిమా పిచ్చోడిని కదా... ఒకృడ్నే రాత్రి భోంచేసి మారుతి థియేటర్లో కన్నడ డబ్బింగ్ సినిమా 'గాయత్రి' క్రి వెళ్లాను. వెళ్లినప్పుడు ఉత్సాహంగా వెళ్లాను కానీ సినిమా చూస్తుంటే భయమేసి ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. అదొక దెయ్యం సినిమా. రాఘవేంద్రస్వామికి, ఆత్మకి మధ్య జరిగే యుద్ధం. సరిగ్గా రాత్రి 12 తర్వాత వదిలారు. ఆ టైంలో మామయ్య వాళ్ల ఇంటికి వెళ్లాలంటే... వణుకు పుట్టింది. హాలు దాటి బయటకు వెళ్లానంటే ఆ దెయ్యం ఎక్కడ నన్ను వెంటాడుతుందో అని భయం. హాల్లో జనమంతా వెళ్లిపోయేవరకూ ఉండి గట్టిగా కళ్లు మూసుకుని కుర్చీల మధ్య దూరి పడుకుండిపోయాను. తెల్లారి చీపుళ్ల చప్పుళ్లకు మెలకువ వచ్చింది. అంతా నా చుట్టూ మూగి 'ఎందుకు ఇక్కడున్నావు?' అని సవాలక్ష ప్రశ్నలు వేసి, ఆ తర్వాత జాగ్రత్తగా మామయ్య వాళ్ల ఇంటికి దిగబెట్టడం ఇప్పటికీ మర్చిపోలేను. “లక్ష్మి కోసం ఎదురీదా
గోదావరి జిల్లాలకు తుపాను తాకిందంటే ఆ బీభత్సం వర్ణనాతీతం. అప్పటి వరకూ దేవతలా కనిపించిన ఊరంతా దెయ్యంలా వికృతంగా మారిపోతుంది. 1984లో అలాంటి తుపానే వచ్చింది. ఎటు చూసినా గాలీ వాన. చూస్తుండగానే ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం, పశువులు కొట్టుకుపోవడం జరిగేది. మా పశువులన్నీ పొలం దగ్గర పాకలో ఉన్నాయి. ముఖ్యంగా నేనెంతో ఇష్టపడే ఆవు “లక్ష్మి, దాన్ని ఎలాగైనా రక్షించాలని ఇంట్లో చెప్పకుండా, పొలం కేసి పరిగెత్తాను. పొలానికి, ఊరికీ మధ్యలో విజృంభించి పారుతున్న కాలవ. “సాహసం చేయరా డింభకా” అని అరిచి నీటిలోకి దూకేసరికి ప్రవాహం నన్ను అర కిలోమీటరు దూరం లాక్కుపోయింది. శక్తినంతా కూడదీసుకుని ఎలాగో అవతలి ఒద్దు చేరి “లక్ష్మితో పాటు మిగతా పశువుల్ని తోలుకుని అన్నిట్నీ కాలవ దాటించాను. అంత బలం ఎలా వచ్చిందో ఇప్పటికి ఆశ్చర్యమే. పశు వులను కాలువ దాటిస్తుంటే ఊరి జనం గుంపుగా ఆ వర్షంలోనే నిల్చుని నా సాహసాన్ని అభినందిస్తుంటే పొంగిపోయా కానీ, అమ్మానాన్నలకు మాత్రం గుండె ఆగినంత పనైంది. ఏడుస్తూనే నన్ను తిట్టారు.
ఊపిరాడనివ్వని సినిమా
టెన్స్‌లో ఉండగా... అప్పటికే సినిమాలు చూసిన అనుభవంతో రెండు కథలు రాసి పత్రికలకు పంపించా, అవి అచ్చయిన రోజు మిత్రులంతా నా చుట్టూ చేరి “ఒరేయ్ నీవు వెలగలవారిపాలెంలో కాదురా... మద్రాసులో ఉండాల్సినోడివి. సినిమాల్లోకి ఎల్లకుండా జీవితాన్ని వృథా చేస్తున్నావింటూ ఒక రేంజ్‌లో గాల్లోకి ఎగరేశారు నన్ను. ఆ మాటలో టేక్ రెడీ, పేకప్‌లు చెబుతూ కెమెరాతో పాటు క్రేన్‌పై పరిగెడుతున్న అనుభూతి. ఇంటర్మీడియెట్ చేయడానికి భీమవరం డి.ఎన్. ఆర్. కాలేజీలో చేరా కానీ కళ్లు మూసినా, తెరిచినా.... రాత్రింబగళ్లు సినిమానే కనిపించేది. కాలేజీలో చేరి 4 నెలలు కూడా పూర్తవలేదు. ... 'మద్రాసు వెళ్లిపోతానని” మారాం మొదలెట్టాను. నా మాట ఎప్పుడూ కాదనలేదు కాబట్టి లోపల ఎంత బాధపడ్డా, నా మనసు నొప్పించకూడదని, మద్రాసులో మాకు దూరపు బంధువైన డైరెక్టరు విజయారెడ్డిగార్ని (కన్నడ దర్శకులు) కలవమని చెప్పి హౌరా మెయిల్ ఎక్కించారు. మొదలైన సినిమా కష్టాలు
అలా పదహారో ఏట మద్రాసులో అడుగుపెట్టాను. ఒకసారి విజయారెడ్డి గారు పలాన స్టూడియోలో ఉన్నాను, వచ్చి కలవమని కబురుచేశారు. తీరా అక్కడికి వెళ్తే వాచ్‌మెన్ నన్ను లోనికి వెళ్లనివ్వకుండా అద్దుకున్నాడు. ఎంతలా అంటే నా మెడమీద చెయ్యి వేసి విసురుగా తోసేంతవరకు. వాడి తోపుకి బొక్కబోర్లా పడ్డాను. ఒళ్లంతా చీరుకుపోయింది. చేతిలోని సంచి అల్లంత దూరంలో పడింది. సరిగ్గా అదే టైంలో లోపల్నుంచి నటి రూన్సీ కార్లో వెళ్లడం కనిపించింది. దుమ్ములో కూర్చుని రక్తం తుడుచుకుంటూ ఆమె వెళ్లిన వైపే చూస్తూ (తెరమీద చూసిన యాక్టర్ని నిజ జీవితంలో తొలిసారి చూడ్డం వలన కాబోలు) ఆ బాధ మర్చిపోయాను. అంత సినిమా పిచ్చన్నమాట!
మరోసారి టి.నగర్‌లో చిరంజీవిగారి “'జేబుదొంగి షూటింగ్ నా కంట్లో పడింది. ఒక కళ్యాణ మండపంలో జరుగుతోంది. లోపలికి వెళ్లామంటే ఛాన్సే లేదు. ఉదయం పది గంటల టైంలో ఎర్రటి ఎండలో గేటు బయట నిల్ఫున్నాను. కనీసం చిరంజీవిగారు కనిపిస్తే చాలనే ఆశ. మధ్యాహ్నం 2 దాటింది. చూస్తుండగానే షూటింగ్ సిబ్బంది భోజనాలు కూడా చేశారు. సాయంత్రం 6, రాత్రి 9... ఇంకా గేటుముందే తచ్చాడుతున్నాను. మీరు నమ్ముతారో లేదో... చిరంజీవిగారిని ఎక్కడ మిస్ అవుతానో అని కనీసం పచ్చి మంచినీళ్లయినా తాగకుండా కళ్లు పత్తికాయల్లా చేసుకుని గేటు లోపలికే చూస్తున్నాను. సరిగ్గా షూటింగ్ పేకప్ అయి, రాత్రి 11 దాటాక చిరంజీవి గారు కారులో బయటకు రావడం కనిపించింది. రెప్ప వాల్చకుండా ఆయన హ్యావ్ డేస్ = సిన్ ప్రముఖం చిన్ననాటి తీసి గుర్తులు * 212
కనుమరుగయ్యేవరకూ చూసి జన్మ ధన్యమైంది అనుకున్నాను. చిరంజీవి గారంటే అప్పట్లో నా వయసు కుర్రాళ్లందరికీ అంత క్రేజ్ ఉండేది (ఇప్పటికీ ఆయనంటే క్రేజ్ లేనిదెవరికి లెండి) ఆ తల్లి ప్రేమను వర్ణించలేను
ఒకసారి 'డాక్టర్ భవాని చిత్రం షూటింగ్ తిరుపతి 'రూయా” హాస్పటల్‌లో జరుగుతోంది. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నాను. షూటింగ్ హడావుడిలో ఉంటూనే ఆ వార్డులో ఉన్న తల్లీ కొడుకుల్ని గమనిస్తున్నాను. తల్లికి కనిసం 70 ఏళ్లు. వాళ్ల అబ్బాయి 25-30 ఏళ్ల మధ్య వయస్కుడు. చూడానికి మానసిక రోగిలా ఉన్నాడు. ఉదయం నుండి అరగంటకోసారి కక్కుతున్నాడు. పక్క బెడ్స్ మీదున్న పేషెంట్స్ తాలూకు వాళ్లు ముఖాలు వికారంగా పెడితే, ఆస్పత్రి సిబ్బంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనీసం ప్లాస్టిక్ డబ్బా అయినా లేదు వాళ్ల దగ్గర. కొడుకు కక్కిన ప్రతిసారీ ఆ తల్లి తన దోసిళ్లతో పట్టి బయట పారబోసి వస్తోంది. ఆ దృశ్యం చూస్తున్న కొద్దీ ఇంటి దగ్గరున్న మా అమ్మ గుర్హుకు రాసాగింది. షూటింగ్ పేకప్ అయ్యాక నాకు తెలియకుండానే దుఃఖం పొంగుకొచ్చి, గోడ చాటుకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. మద్రాసులో ఉన్నంత కాలం అమ్మను మిస్ అవుతున్నాననే బాధ నన్ను తొలుస్తూనే ఉండేది. ఏ సినిమా కోసం వెంపర్లాడుతూ అమ్మకు దూరమయ్యానో... నా ఎదుగుదలను పూర్తిగా చూడకుండానే అమ్మ దూరమయింది.
సినీ ప్రపంచంలో మనకు తెలిసినవారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా గానీ.... అదృష్టం తలుపు తట్టినప్పుడే అవకాశం వస్తుందనే సత్యం త్వరలోనే బోధపడింది. ఆ మాయా ప్రపంచంలోని రంగులన్నీ తెలిశాక... చివరికి 'అంకుశం'లో అసిస్టెంట్ డైరెక్టరుగా అవకాశం వచ్చింది. 10 సినిమాలకి అసిస్టెంట్, అసోసియేట్, కో దైంక్టరుగా పని చేశాక నన్ను ఇష్టపడే కొందరు మిత్రులు నన్నెలాగైనా సినిమా డైరెక్టరుగా చూడాలనే తపనతో పట్టుబట్టి, కొంత పెట్టుబడి పెట్టి అలీ హీరోగా 'ఆషాడం పెళ్లికొడుకుతో ఆ భాగ్యం కల్పించి నాకో మార్దం చూపెట్టారు. అది ఆరంభం... అప్పటి నుంచి 'ధమరుకం' వరకూ చిత్ర జగత్తులో ఎన్నో ఎత్తులూ, పల్గ్లాలూ చూస్తూ ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి నా మనసు విప్పుతున్నాను.
(16.12.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి)
[ 5 స ( స న ] | ళ్ థ థి ఎలొ అంటే మాకు ఐశ్వర్యారాయ్ మన చిత్రపరిశ్రమ పరభాషా కథానాయికలను దిగుమతి చేసుకుంటున్న ఈ తరుణంలో అచ్చమైన తెలుగమ్మాయిగా వెండితెరపై అడుగు పెట్టిన నటి రేష్మ... చదవడానికి రాజధానిలో అడుగుపెట్టి, టీవీ యాంకర్‌గా మారడమే కాక క్రమంగా 'మొగిలిరేకులు” సీరియల్‌లో పల్లవిగా బుల్లితెరపైనా “ఈ రోజుల్లో” హీరోయిన్‌గా వెండితెరపైనా కనిపించారు. ఆ తర్వాత *లవ్ సైకిల్, 'జై శ్రీరామిలతో నటిగా తనేమిటో నిరూపించుకున్నారు రేష్మ. మా నాన్న సింగరేణి కాలరీస్‌లో ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉండడం వల్ల ప్రతి ఐదేళ్లకొకసారి ఆయనకు బదిలీ అవుతుండేది. నాకు అసలే తక్కువమంది స్నేహితులు ఉండేవారు. ఈ బదిలీలు మూలంగా ఆ కొద్దిమందిని కూడా వదిలేయాల్సి వచ్చి చాలా బాధగా ఉందేది. అంతేగాక కాస్త రిజర్వుద్‌గా ఉందేదాన్నేమో... “తెల్లగా ఉంటుందని రేషాకి పొగరు అనే వదంతి కూడా పుట్టించేవారు. ఈ గొదవంతా ఎందుకని మా తమ్ముడితోనే ఎక్కువగా (ఫెండ్లీగా ఉండేదాన్ని వాడికీ నాకూ ఒక్క క్లాసే తేడా, అయితే వాడి అల్లరి తట్టుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉండేది. కోతలకే పాఠాలు నేర్పే విద్యలుండేవి వాడికి. ఒక రాఖీ పండగ ముందు రోజు రాత్రిమా హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు శ 214
ఇద్దరికీ ఏదో కారణం మీద పెద్ద గొడవయ్యింది. సై అంటే సై అనుకున్నాం. ఆ కోపం మీద పొద్దున్న నాతో రాఖీ కట్టించుకోకుండా నా కళ్లుగప్పి స్కూల్‌కు పారిపోయి, సాయంత్రానికి చేతినిండా రాఖీలు కట్టంచుకుని వచ్చాడు. వాడిని చూడగానే దుఃఖం పొంగి, ఉన్నాదిలా వాడి చేతికున్న రాఖీలన్నీ పీకేసి నా చేతుల్లో నేను రాఖీ కట్టిన తర్వాతగానీ నా మనసు శాంతించలేదు. చివరికి నా బాధని అర్ధం చేసుకున్నాడేమో మెల్లగా “సారీ అక్కా అని చెప్పాడు. నాన్సే అలవాటు లేదు
ఎవరు ఏ రకంగా నన్ను ఎఏడిపించాలని ప్రయత్నించినా వెంటనే అమ్మకో, లేదంటే ప్రిన్సిపాల్‌కో చెప్పేసేదాన్ని మనసులో పెట్టుకుని నానబెట్టే అలవాటు లేదు. మణుగూరులో టెన్త్ చదివే రోజుల్లో - స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ బస్తాప్‌లో నిల్చునేదాన్ని. ఇద్దరు కుర్రాళ్లు బైక్‌పై అక్కడికి వచ్చి ఏదో ఒకటి వాగుతుండేవారు. వాళ్ల బాధ పడలేక సరిగ్గా బస్పొచ్చే టైంకే ఇంట్లోంచి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు టైం దాటిపోయినా బస్సు రాకపోయేసరికి ఒకవేళ మిస్సయ్యానేమో అని కంగారుగా బస్తాప్‌కు వచ్చాను. అప్పటికే ఆ ఇద్దరూ రెడీగా కాచుకొని ఉన్నారు. ఇంతలో బస్సు వచ్చింది. డైవర్ దగ్గరకు వెళ్లి వాళ్లిద్దర్ని చూపించి రోజూ అల్లరి పెడుతున్నారని చెప్పగానే ఆయన బస్సు ఆపేసి, వాళ్లని తిడుతూ కర్ర పట్టుకుని వెంటపడ్డాడు. వాళ్లు పరుగో పరుగు. మర్రోజు నుండి వాళ్లిద్దరూ ఆ ఏరియాలో కనిపిస్తే ఒట్టు. రాత బాగుంటే చదువక్కర్తేదు
మాకు ముజాహిద్ అనే సారు హిందీ చెప్పేవాడు. ఆయన హ్యాండ్‌రైటింగ్ బాగుంటే చాలు మార్కులు వేసేసేవాడు. ఒకసారి “వ్రేపల్లెలో కృష్ణుడి చిలిపి చేష్టలు” అనే అంశంపై రెండు పేజీల వ్యాసం రాయమంటూ టెస్ట్ పెట్టాడు. పిల్లలందరిలోకి అబ్బుల్ రోషన్‌ది అందమైన రాత. అక్షరాలు చెక్కినట్టు ఉండేవి. ప్రశ్నని ఎర్ర సిరాతో రాసి జవాబు స్థానంలో “చూడీ చో కర్షేక్రీ హాత్ మే" అనే ఒక హిందీ పాటని రిపీట్ చేస్తూ రాసేశాడు. అక్కడక్కడ అక్షరాలకు దెకరేషన్లు కూడా. అందరికి పదికి 5,6 మార్కులోస్తే రోషన్‌కు మాత్రం 10 కి 10 మార్కులు వేసి పైనుండి అందరికీ ఆ పేపరు చూపించి, రాయటం ఎలాగో రోషన్‌ను చూసి నేర్చుకోండి అన్నాడు అందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే తను మాకంటే బాగా రాయలేడనేది మాకందరికీ తెలిసిందే. మెల్లగా రోషన్ పేపరు తీసి చేస్తే రహస్యం బయటపడింది. ఆ తర్వాతెప్పుడో తను మాతో ఏదో గొడవ వేసుకుంటే ఈ రహస్యాన్ని ముజాహిద్ సారుతో చెప్పేశాం. సారు ఉగ్రుడై “నన్ను వెర్రివాణ్సి చేస్తావురా? అని తధిగిణతోం ఆదేశాడు.
“ఎ ఫర్ ఐశ్వర్యారాయ్
ఇల్లెందులో ఇంటర్శీడియట్ చదివే రోజుల్లో జరిగిన సంఘటన ఇది. మా కెమిస్టి లెక్బరర్ నర్సింహారావు చాలా సరదాగా పాఠాలు చెప్పేవారు. సబ్జెక్టుల్లో ఫార్ములాలు గుర్తుంచుకోవాలంటే చాలా తలనొప్పిగా ఉండేది. పొటాషియం, మాంగనీస్, జింక్, సల్ఫర్, ఇలాంటి ఎలిమెంట్‌ల కోడ్స్‌కు సినిమా తారల పేర్లు చెప్పేవాడు. మాక్కూడా అవే అలవాటైపోయాయి. పొటాషియానికి కోడ్ 'క” కాబట్టి కరిష్మాకపూర్ అనీ, హైడోజన్‌కు 'హెచ్‌కు బదులు హృతిక్‌రోషన్ అని, కార్చన్ 'సి కి బదులు సిమ్రాన్ ఇలా.. ప్రతి అక్షరానికి ఏదో ఒక సినిమా తార పేరుందెది. ఒకసారి ఎగ్జామ్‌లో 'అల్యూమినియమ్' కి 'ఎ.ఎలొ రాయాల్సింది పోయి “ఐశ్వర్యారాయ్” అని రాసేశాను. ఆయన క్లాసులో ఒక్కొక్కరి పేరును చదివి, మార్కులు చెబుతూ నా పేపరు మాత్రం పక్కనపెట్టి చివర్లు మొత్తం చదివి వినిపించాడు. క్లాసంతా గొల్లుమంది. ఒక స్టూడెంట్ లేచి “మీరు చెప్పిన కోడ్సే కద సార్ అవి అన్నాడు 'మామూలు ఎగ్జామ్ కాబట్టి సరిపోయింది. కామన్‌లో ఇలాగే రాస్తే ఇంకేమైనా ఉందా? అని అప్పట్నించి పాఠాల్లో సినిమా పేర్లు రాకుండా జాగ్రత్తపదేవాడు. టీ కప్పు రక్షించింది
సెకండ్ ఇంటర్‌కు కాలేజీ మారి ఖమ్మం వైతన్యలో చేరాను. కామన్ ఎగ్గామ్స్‌లో ఇన్విజిలేటర్స్ బయటి కాలేజీల నుండి వచ్చేవారు. ఇదీ కెమెస్టీ ఎగ్గామే. కొన్ని రసాయనాలు వాడి రెడ్ బ్రవున్ కలర్ తెప్పించాలి. 60 మార్కుల పేపర్ అది. ఎలిమెంట్స్ కలపడంలో ఎంతో నైపుణ్యం ఉంటే తప్పించి సరైన కలర్ రావడం కష్టం. క్లాసు మొతానికి శ్రీధర్, వరలక్ష్మి అనే వాళ్లిద్దరే ఆ రంగు తెప్పించేవారు. నేను ఎంత టై చేసినా ఆ రంగు రావడం లేదు. ఏం చేయాలో అర్ధం కాక పిచ్చెక్కుతోంది. రౌండ్స్ వేస్తున్న ఇన్విజిలేటర్ టీ తాగుతూ నా అదృష్టం కొద్దీ సగం తాగిన కప్పుని నా టేబుల్ ముందు పెట్టి పక్కరూమ్‌కి వెళ్లాడు. చూస్తే ఆ టీ కలర్ అచ్చంగా (బ్రౌనిష్ రెడ్‌లో ఉంది. అటూ ఇటూ చూసి ఆ టీని నా బీకరులో ఒంపేసి, ఆయన రాగానే చూపించాను వెంటనే ఆయన 'వెరీగుడ్? అంటూ మెచ్చుకుని నన్ను పంపించేశాడు. సమయస్సూర్తిగా నెను చేసిన పనికి నన్ను నేనే అభినందించుకుని ఆ సాయంత్రం ఈ విషయాన్ని మా ఫండ్ బిందుతో చెప్పాను. అదేమో మర్రోజు క్లాసులో ఆ రహస్యం కాస్తా బయటపెట్టి నా పరువు తీసి, లెక్చరర్‌తో నా నెత్తిన మొట్టకాయ వేయించింది. స్టడీ అవర్స్‌లో కెవ్వు కేక
చైతన్యలో చదివే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని రాత్రి భోజనాలు పూర్తికాగానే “స్టడీ అవర్స్ మొదలయ్యేవి. ఒక పెద్ద హాల్లో కూర్చుని పదకొండు వరకు విధిగా హ్యాపీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 216
చదవాల్సిందే. తినగానే చదువు బు(ర్రకెక్కేది కాదు. ని(ద ముంచుకొచ్చేది. అయినా చదువుతో కుస్తీ పట్టేవాళ్లం. కొందరు గోడకు వీపు అని చదివేవాళ్లు. ఆరోజు గోడ పక్కనే వరలక్ష్మి కూర్చుంది. చలికాలం కావడంతో చున్నీలను తలనిండా కప్పుకుని ముసుగు దెయ్యాల్లా ఊగుతూ, మంత్రాలు చదివినట్టు పెదవులు ఆడిస్తున్నాం. చదువుతూ చదువుతూ తల పైకెత్తి చూస్తే వరలక్ష్మి కూర్చున్న గోడమీద బల్లి. అది ట్యూబ్‌లైట్ ముందు పారాదే పురుగుల కోసం పొంచి ఉంది. నోట్ బుక్‌లోంచి పేపర్ చింపి బాల్ మాదిరి ఉండ చుట్టి గురిచూసి బల్లిపైకి విసిరాను. అది గోడకు తగిలి అట్నుంచి వరలక్ష్మి తలమీద రపీ మని పడింది అంతే! బల్లి పడిందనుకుని వణికిపోతూ హాస్టల్ కంపించేలా కెవ్వున కేకేసి దిగ్గున లెచింది. అప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న పరిసరాలు, ముసుగుల్లో కునికిపొట్లు పడుతున్న అమ్మాయిలు... అందరికీ ఒక ర్సులక్. ఇంతలో వార్డెన్ 'ఏం జరిగిందంటూ రయ్యిమని పరిగెత్తుకొచ్చింది. బల్లికి బదులు కాగితం బంతి కనిపించింది. ఆ పని చేసింది ఎవరని చుట్టూ చూసింది. విసిరింది నేనే అని చెబితే ఇంకేమైనా ఉందా? అయినా ఆ మర్రోజు వరలక్ష్మితో ఆ ఘనకార్యం చేసింది నేనే అని చెప్పా. నిజానికి దానికి నేనంటే చాలా ఇష్టం. రెండు రోజులు నాతో మాట్లాడకుండా అలిగింది.
మరోసారి రేవతి అని మా ఇంకో క్లాస్‌మేట్ ఒక్కర్తి మేడమీద గదిలో ఉండగా సడన్‌గా కరెంటు పోయింది. ఆ టంలో మేం దైనింగ్ హాల్‌లో ఉన్నాం. భోంచేసి మెల్లగా మెట్లెక్కి రేవతి రూమ్ ముందు నిల్చు ఊళ వేసి, గబ్బిలాల రెక్కల చప్పుళ్లు చేసి దాన్ని వణికించాం. ఆ దెబ్బతో దానికి ఫీవర్ పట్టుకుంది. ఈ విషయం వార్దెన్‌దాకా వెళ్లడమే కాక రేవతిని భయపెట్టిన వాళ్లల్లో నేనూ ఉన్నానని తెలిసిపోయింది. దాంతో మమ్మల్ని అంతకు రెట్టింపు భయపడేలా తిట్టిపడెసింది వార్జెన్. అలవాట్లో పొరపాటు
ఇంటర్మీడియట్ తర్వాత ఎల్. ఎల్.బి చేయడానికి అమ్మ తమ్ముడితో పాటు హైద్రాబాద్ షిస్ట్ అయ్యాను. నాన్న మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందేవాడు. కాలేజీకి వెళ్లడం తక్కువ, యాక్టింగ్ పై మక్కువ ఎక్కువ అయింది. టీవీ ఛానల్స్‌లో యాంకరింగ్ కోసం టై చేస్తూ సక్సెస్ అయ్యా. నా యాంకరింగ్ చూసిన మంజులానాయుడుగారు మొగలిరేకులు” సీరియల్‌లో “పల్లవి” క్యారెక్టరు కోసం పిలిపించారు. ఆడిషన్‌లో ఏదైనా డైలాగ్ చెప్పి మెప్పించమని, ఓకే అయితే 4 రోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఆడిషన్‌లో చెప్పడానికి ఒక డైలాగ్‌ని బట్టీ పట్టి వెళ్లాను. కానీ తీరా అక్కడికి వెళ్లి కెమెరా ముందు నిల్పోగానే (ఉదయం నుండి రాత్రివరకూ రెండు మూడు ఛానల్స్‌లో
యాంకరింగ్ చేయడం మూలాన్నేమో) “వాయ్, మీ కోసం మీ రేష్మా వచ్చేసింది. (ప్రతి షోని విందుగా, పసందుగా... * అంటూ చెప్పేసరికి చుట్టూ ఉన్నవారంతా నోరు తెరిచారు. అయినా ఎంపిక చేసుకున్నారనుకోండి.
'మొగలిరేకులు'లో నటిస్తుండగానే మారుతిగారు 'ఈ రోజుల్లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ షూటింగ్ చిలుకూరులో జరుగుతున్నప్పుడు గుడి ముందు దేవుడి పటాలు, కాశీదారాలు అమ్ముకునే ఒకబ్బాయిని ఏదో అవసరం ఉండి “అన్నయ్యా” అని పిలిచానని 'నన్ను అన్నయ్యా అంటావా” అని ఇంతెత్తున ఎగిరాడు. “బావా అని పిలిస్తే ఖుషీ అయ్యేవాదేమో...? అని మా యూనిట్ సభ్యులలో ఎవరో అంటే, అంతా పగలబడి నవ్వారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడే మనిషిలోని లోపలి మనిషి బయటపడుతుంటాడు. ఒక వైపు చదువు, మరోవైపు నటిగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే బిజీలో రోజులన్నీ హ్యాపీగా దొర్లిపోతున్నాయి.
(23.12.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి) హ్యాపీ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 218
మ ] వూ అవా య్ టీ శ 1 ఇ వూ ల | 1 శా నే ఖో న న న ల్ల లై వారీష్‌ళంకర్ ఆ అ సస్పెండవడంలో నాదే రికార్డు రంగస్థల అనుభవంతో వెందితెరపై విజయం సాధించాదతను. నిన్న ఇష్టపద్దాను” అంటూ అనిస్టెంట్ డైరెక్టరుగా ననీ వ్రస్టానానికి నాంది పలికి, 'నీదేతో అసోసియేట్ దైరెక్షరై నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌తో కో - దైరెళక్లరయ్యాదు. ఆ తర్వాత పూర్తిన్ధాయి దైరెక్టరుగా “షాక్‌తో షేక్ చేయించి, 'మిరవకాయ్'తో ఘాటు చూవించి, (గబ్బర్‌సింగ్ 'తో కెవ్వు కేక పెట్టించాడు. ఆ [క్రమంలో “రామయ్యా వస్తావయ్యా) 'సుబ్రవ్హాణ్యం ఫర్‌సేలొ “దువ్వాడ జగన్నాథం” చిత్రాలను కూదా తన ఖాతాలో వేసుకున్న యువదర్భకుడు వారీష్‌ళంకర్. ఉగ్గుపాలతో వస పట్టినప్పుడు పిసరంత డోసు ఎక్కువైందేమో, చాలా తొందరగా మాటలొచ్చేశాయట నాకు. దాంతో నాన్‌స్టాప్‌గా ఇంట్లో వాళ్ళ బుర్రలు తినేస్తుంటే, నా గోల భరించలేక సంవత్సరం ముందే స్సూల్లో పడేశారట. నాన్న హైద్రాబాద్ బి. హెచ్..ఇ ఎల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవాడు. తెలుగు టీచర్ కావడంతో భాషలో చిన్న పొల్లు తేడా వచ్చినా (బాధిలో వత్తులేకపోయినా, 'విద్యలో వత్తు చేరినా) ఊరుకునేవాడు కాదు. ఆ విధంగా నాలో తెలుగుపై మొదట్లో భయం కలిగినా, రాను రాను వల్లమాలిన (పేమ ఏర్పడింది. తరచూ నన్ను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సినిమాలకు తీసుకెళ్లేవాడు. ఆయన ఒళ్లో కూర్చుని చూసిన అమితాబ్ 'కూలీ ఇప్పటికి కళ్లకు కట్టినట్టె ఉంది. కిషోర్‌కుమార్ పాటలంటే చెవి కోసుకునేవాడు. మంచి సంగీత గొరుసు జగదీశ్వర రెడ్ది శ 219
ప్రియుడు. అప్పుడప్పుడు లైట్‌మ్యూజిక్ పాడేవాడు. హాస్య చతురత కూడా ఎక్కువే. ఆయన ప్రభావం నాపై చాలానే ఉంది. పదేళ్లకే “గండపెండేరం” -
బి. హెచ్.ఇ ఎల్. అంతటికీ మాదొక్కటే తెలుగు మీడియం... చుట్టూ 5 ఇంగ్లీషు మీడియం స్కూళ్లుండేవి. ఎంతైనా వాళ్ల డ్రెస్‌కోడ్ మాకంటే మెరుగ్గానే ఉంటుంది కదా (మేం స్లిప్పర్స్‌తో వెళ్లినా ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు) వాళ్ల యూనిఫామ్ చూసినప్పుడల్లా ఆత్మన్యూనతకు గురయ్యేవాణ్ణి. అయితే వాళ్లకంటే మెరుగ్గా ఉండాలని, ఏదో రకంగా వాళ్లని ఓడించాలనే తపన మాత్రం రావణకాష్టంలా రగులుతూ ఉండేది. ఆ కసే నన్ను డిబేట్‌లలో, డ్రామాల్లో పాల్గొనేలా చేసేది. ఒకసారి మా తెలుగు పండిట్ ఆంగీరసశర్మగారు “అష్టదిగ్గజ కూటమి" అనే నాటిక రాసి, నాతో అల్లసాని పెద్దన వేషం వేయించారు. రాయలవారు “గండపెండేరం” తొడుగుతున్నప్పుడు తీసిన ఫోటో ఇప్పటికీ ఉంది. మరోసారి ఒక సాంఘిక ద్రామా వేస్తున్నప్పుడు స్టైజ్‌పై నాతో పాటు నటిస్తున్న అమ్మాయి హఠాత్తుగా డైలాగ్స్ మర్చిపోతే మెల్లగా అందించబోయాను. పైనెక్కడో ఉన్న మైకు నా మాటల్ని లాగేసి (ప్రేక్షకులకు వినిపించడంతో అంతా గొల్లున నవ్వారు. “శివి దెబ్బకు స్కూలే మారింది
నేను నైన్త్‌లో ఉండగా వచ్చిన శివి సినిమా ప్రభావం కేవలం కాలేజీ కుర్రాళ్లపైనే కాదు, మాలాంటి స్కూలు పిల్లలపై కూడా గట్టిగానే పడింది. ఆగస్టు 15 సందర్భంలో క్లాస్‌ను డెకరేట్ చేసే విషయంలో నాకూ, మాక్సాస్‌మేట్ క్రాంతికిరజణ్‌కీ గొడవొచ్చింది. మా ఇద్దర్లో ఒకడు శివ ఐతే, మరొకడు భవానీ అన్నమాట. ఒకరికొకరు వార్నింగులు ఇచ్చుకోవడమే కాదు, డిష్యుం డిష్యుంల దాకా వెళ్లింది మేటర్. దెబ్బకు ఆ స్కూల్ మానిపించి, టెన్స్ చదవడానికి జగిత్యాల శిశుమందిర్‌కు పంపించారు నన్ను, అక్కడ నా క్లాస్‌మేట్ ఒకమ్మాయి పాటలు బాగా పాడేది. పాటతో పాటు ఆ అమ్మాయినీ ఇష్టపడ్డాను కానీ పైకి చెప్పడానికి ధైర్యం చాలేది కాదు. చూస్తుండగానే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. హైద్రాబాద్ వచ్చేముందు ఆటోగ్రాఫ్ పుస్తకం తీసుకెళ్లి తన ముందు పెడితే... “ప్రియమైన తమ్ముడూ, నీకు 500 మార్కులు దాటాలని కోరుకుంటున్నాను. ఇట్లు - మీ అక్కయ్య' అని రాసింది. ఆ మూడు ముక్కలు చదవగానే నా గుందె ముక్కలైపోయింది. వెళ్లి అద్దంలో ముఖం చూసుకున్నాను. అద్దం అబద్ధం చెప్పదు కదా.... సన్నగా, పీలగా, తనకి తమ్ముడిలాగే కనిపించడంతో నన్ను నేనే బుజ్జగించుకోవలసి వచ్చింది. హాప్ డేస్ = సిన్ ప్రముఖం చిన్ననాటి తీస్ గుర్తులు 220
రంగస్థల జీవితం మొదలైందిలా
బి. హెచ్.ఇ.ఎల్. జీవితం నిజంగా ఒక వరం. నగరం హంగులన్నీ అందుబాటులో ఉన్న పల్లె వాతావరణం అది. ముఖ్యంగా మా కమ్యూనిటీ హాల్లో రోజు ఏదో ఒక డ్రామా ప్రదర్భనో, రిహార్సలో జరుగుతూ సందడిగా ఉండేది. ఇంటర్లో ఉండగా ఒక సాయంత్రం క్రిట్ ఆటయ్యాక, అట్నుంచి అటే బ్యాటుతో పాటు కమ్యూనిటీ హాలుకు వెళ్లాను. 30 వళ్ల వయసున్న ఒకతనికి కాలేజీ కుర్రాడి వేషం ఇచ్చి డైలాగ్ రిహార్సల్ చేయిస్తున్నాడు దర్శకుడు. వాళ్ల మాటల్ని వింటూ వింటూ ఉండబట్టలేక “'నటరాజా, నీ మురిపాల మువ్వల మాల నుండి ఒక మువ్వ రాలిపోయిందయ్యా..... తీసుకో అనే డైలాగ్‌ని అలవోకగా భావ ప్రకటనతో చెప్పేసాను. డైరెక్టరు నాగమోహనరావుగారు ఆశ్చర్యపోయి, నేనెవరో తెలుసుకుని, ఆ వేషం నాతోనే వేయించారు. 'సమ్మోహనాస్త్రం” నాటకంతో నా రంగస్థల జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత భుజంగరావు, బి.ఎస్. శ్రీనివాస్, మోహనరావు, అదబాల, పొట్లూరి లక్ష్మయ్య గార్లు నన్నెంతో ప్రోత్సహించడంతో డిగ్రీ పూర్తి చేసేలోగా దాదాపు 80 నాటకాల్లో వేషాలు వేశాను. వేషం లేనపుడు కూడా డ్రామాకు సంబంధించిన ఏదో ఒక పని కల్పించుకోవడం వల్ల రంగస్థలానికి సంబంధించిన పలు విషయాలు తెలుస్తుందేవి. పోలీస్ స్టేషన్ చూడగానే...
కూకట్‌పల్లి ఎమ్.ఎన్.ఆర్. కాలేజీలో డిగ్రీలో చేరిన తొలి రోజులవి. అప్పటికింకా కాలేజీలో ఐదెంటీ కార్టులు ఇష్యూ చేయలేదు. బిహెచ్‌ఇఎల్‌లో బస్ ఎక్కగానే వెనక సీట్లో బైఠాయించి, నానా హంగామా చేసేవాళ్లం. ఒకరోజు మా గోల భరించలేక కాలేజీ ఐడెంటీ కార్డులు చూపించమన్నాడు కండక్టర్. ఇంకా ఇవ్వలేదంటే నమ్మడే... పాస్‌లు ఉన్నా సరే టికెట్స్ తీయించేదాక వదల్లేదు. అదొక అవమానంగా అనిపించి, ఎలాగైనా కండక్టర్ని వడిపించాలని స్కెచ్‌వేశాం. మర్రోజు అదే బస్సు ఎక్కి (కండక్టర్, డైవర్ మారేవాళ్లు కాదు) ఏదో మిష మీద కండక్టర్‌తో గొడవ పెట్టుకుని బస్సుని ఏ స్టేజ్‌లో కూడా ఆగనీయకుండా అద్దుకున్నాం. దైవర్ ఆపకుండా వెళ్తుంటే మాకు సహకరిస్తున్నాదేమో అనుకున్నాం గానీ, అతను సరాసరి జె. ఎన్.టి. యు. పోలీస్ స్టేషన్ ముందు ఆపినప్పుడు గానీ మా ప్లాన్ ఎంతలా బెడిసికొట్టిందో తెలిసిరాలేదు అంతే. అప్పటి వరకూ కండక్షర్ని ఆట ఆడించినవాళ్లమంతా క్షణాల్లో జంప్‌జిలానీ, మమ్మల్ని స్టేషన్‌లో అప్పగిద్దామని కందక్టర్ కాలేజీకి వరసగా మూడురోజులు తిరిగాడట. ఆ మూడు రోజులూ మేం వెళ్తే కదా!
ట్రాఫిక్‌లో టెన్షన్ టెన్షన్
ఒకసారి విజయవాడ తమ్ములపల్లి కళాక్షేత్రంలో 'ఫణి” అనే నాటకం - వేయడానికి వెళ్లాం. ఒక స్కూల్లో బస ఏర్పాటు చేశారు మాకు. స్టేజీ పై అమర్చడానికి ఒక పెద్ద తలుపును హైద్రాబాద్ నుండే తీసుకెళ్తాం. ఆ తలుపు విధిగా స్టేజిపై ఉండాల్సిందే. నాటకం (ప్రారంభానికి గంట ముందే బస దగ్గర నుండి తలుపుని రిక్షాలో వేసుకుని బయళ్సరాను. కళాక్షేత్రం అర కిలోమీటరు దూరంలో ఉందనగా ఏదో యాక్సిడెంట్ జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. స్టేజ్‌పై ఫిక్స్ చేయడానికి కార్పెంటర్ ఎదురుచూస్తూ ఉంటాడని తెలుసు. ఆ తలుపు లేకుండా డ్రామా వేయడం కుదరదు. రిక్షా వెనక్కిగాని, ముందుకిగాని వెళ్లడానికి విల్లేని పరిస్థితి. ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో 8 గంటలు పడుతుందన్నారు. నాలో ఒకటే టెన్షన్. ఏం చేయాలో అర్ధంకాలేదు కాసేపు. చివరికి రిక్షా దిగిపోయి తలుపుని భుజంపై ఎత్తుకుని ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ కళాక్షేత్రం దగ్గరకి వచ్చాను. నన్ను చూడగానే టీమ్ సభ్యులంతా ఏం జరిగిందో అర్ధంగాక కంగారు పడ్డారు. జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత నాటకం పట్ల నాకున్న కమిట్‌మెంట్‌కు అభినందనల్తో ముంచెత్తారు. నాటకం కూడా అనుకున్న సమయానికి ప్రారంభమై దిగ్విజయంగా ప్రదర్శించబడింది. అనాటి చెలిమి ఒక కల
ప్రతి వేసవి సెలవులకు మా పెదనాన్న వాళ్ల ఊరు నిర్మల్ వెళ్లే వాణ్ణి. అలా డిగ్రీలో ఉండగా వెళ్లినప్పుడు ఒక నీరెండ వేళ -ఆకుపచ్చని చుడీదార్‌తో మా గేటులోకి అడుగుపెట్టిందాక అమ్మాయి. చూడగానే గుండె లయ తప్పింది. క్షణాల్లో మనసు పారేసుకున్నాను. తనతో మాటలు కలపాలని మనసు తహతహ లాడేది. అవసరం వున్నా లేకపోయినా ఏదో పని కల్పించుకుని వాళ్లింటికి పదిసార్లు వెళ్తే ఎప్పుడో ఒకసారి దర్శనమిచ్చేది. చీకటి పడ్డాక ఆ కాంపొండులోని పిల్లలంతా గుంపుగా కూర్చుని అంత్యాక్షరి ఆడేవారు. తనూ పాల్గొనేది. కావాలని ఆమె పక్కకు వెళ్లి కూర్చునేవాణ్డి. తను పాడిన పాటలోని చివరి అక్షరంతో పాట మొదలెట్టాలనే ఆరాటం నాది (ఆనాటి అంత్యాక్షరి ప్రేరణే 'గబ్బర్‌సింగ్'లోని సన్నివేశం) అలా వేసవి సెలవులంతా తనని ఆకట్టుకోడానికి, తన దృష్టిలో పడ్డానికి కిందా మీదా పడేవాణ్ణి (ఈమధ్య ఒకసారి ఆమె కలిసినప్పుడు ఆ వేసవి రోజుల్ని గుర్తు చేస్తే “నాకు తెలుసు.. నీ కోతి వేషాలు గమనించే నేను దూరంగా ఉండేదాన్ని అంది ఎ మాత్రం మొహమాటం లేకుండా). హ్యావ్ డేస్ - సిన్ ప్రముఖల చిన్ననాటి తీస్ గుర్తులు + 222
కైనెటిక్ హోండా చోరీ
డిగ్రీ పైనల్స్‌లో కాలేజి డేకి మాంచి డాన్స్ చేసి (ఫైజ్ కొట్టేయాలని 'దిల్ వాలే దుల్లనియా లే జాయెంగేలోని 'మెహందీ లగాకె రఖ్ నొ పాటను ఎన్నుకున్నాం. మాకు (ఫైజ్ రాకుండా చేయాలని అమ్మాయిల [గ్రూపులో వాళ్లు “యాద్ పియా...” పాటని ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిసింది. హోరాహోరిగా సాగిన కాంపిటీషన్ అది. రెండు రిహార్సల్స్‌నీ చూసిన వాళ్లు కొందరు వాళ్లకే ష్రైజ్ రావచ్చని, వాళ్ల డ్రెస్ కోడ్ బాగుందని చెప్పడంతో నాకు తెలిసిన ఒక కాస్త్యూమ్ డిజైనర్‌ని పట్టుకుని సినిమాలో షారూక్ వేసుకున్న ఆహార్యంలాంటివే కుట్టించాను. డ్రెస్‌లు రడీగా ఉన్నాయి. వచ్చి తీసుకెళ్లమని కృష్ణనగర్ నుండి కాస్టూమ్ డిజైనర్ ఫోన్ చేసే సమయానికి మా దగ్గర ఒక్క టూవీలర్ కూడా లేదు. స్టాండ్‌లో ఒక కైనెటిక్ హోండా కనిపించింది. ఆ అమ్మాయిని అడిగితే ఎలాగూ ఇవ్వదని ఒక (ఫెండ్ సహాయంతో దాన్ని ఓపెన్ చేయించి తీసుకెళ్లా. 4 గంటల తర్వాత కాలేజీ గేటులోకి అడుగుపెట్టేసరికి సీన్ మారిపోయింది. ఆ అమ్మాయి తన హోండా పోయిందని ప్రిన్స్‌పాల్‌కి కంప్లెంట్ ఇవ్వడం, అందరూ స్టాండ్ దగ్గరే తచ్చాడడం.. నేను ఎంటరవుతుంటే నా వైపు గుర్రుమని చూడడం... ఏం చేయాలో తెలియలేదు. తాళం వేసిందాన్ని ఎలా తీసుఇళ్లావని అడిగాడు ప్రిన్స్‌పాల్. “ఇలా అనగానే వచ్చేసింది సార్, చాలా అర్జెంట్ పనిమీద వెళ్లాను. అడిగే టైం కూడా లేదిని చెప్పా. ఫంక్షన్ అయిన మర్రోజే ౩ రోజులు సస్పెండ్ చేశాడు. అది నాకేం కొత్త కాదు. క్లాసు బోరు కొటినప్పుడల్లా పక్కనే ఉన్న గోడ దూకేసి పారిపోయేవాణ్ణి. అలా డిగ్రీ మూడేళ్లలో 38 సార్లు సస్పెందై రికార్డు బద్దలు కొట్టిన ఏకైక స్టూడెంట్‌ని నేనె, మలయాళీ మాటే మంత్రంలా...
డిగ్రీ పూర్తవగానే నాటకల టీంలో ఉండే బి.ఎస్. శ్రీనివాస్‌గారు “మాకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలున్నాయి. నువ్వు ఏదో రంగంలో సెటిలవ్వాలి కదా. ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'కి అప్లయ్ చెయ్” అని సలహా ఇచ్చారు. షబానా ఆజ్మీ నసిరుద్దీన్‌షా, షారూక్‌లు శిక్షణ పొందిన అలాంటి చోట నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అప్లయ్ చేశాను. బెంగళూరులో ఇంటర్వ్యూ, జడ్డీల్లో గిరీష్ కర్నాడ్‌గారు ఒకరు. ఆంధ్రప్రదేశ్ నుండి మరో అబ్బాయి సెలక్సు అయ్యాడని విని ముందు డీలా పడ్డా. ఆ అబ్బాయిని చూసిన తర్వాత వాళ్ల నిర్ణయమే కరెక్టు అనిపించింది. ఆ జడ్డిల్లోని ఒక మలయాళీ 'మీ ఇద్దరికీ సమానంగానే మార్కులు వచ్చాయి. మిగతా జడ్డిలంతా నీకే ఇమ్మంటే నేనే వద్దన్నాను. ఆ అబ్బాయి
1, ప్రైజెంటేషన్‌లో కమిట్‌మెంట్ ఉంది. నీలో మమ్మల్ని మెస్మరైజ్ చేసే శక్తి ఉంది. అయితే నీవు థియేటర్‌కు కాదు, సినిమాకు బాగా పనికొస్తావు. ఆ దిశగా వెళ్లు' అని సలహా ఇచ్చాడు. అప్పటికే సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా ప్రయత్నాలు చేస్తున్న నాకు ఆ మలయాళీ మాట మంత్రంలా పనిచేసింది. ఆ వెతుకులాటలో నిన్నే ఇష్టపడ్డాను సినిమాతో అసిస్టెంట్ డైరెక్టరుగా కొత్త జీవితం మొదలైంది. కొసమెరుపు ఏంటంటే... నేను ఇంటర్మీడియట్‌లో ఉండగా బి. హెచ్.ఇ ఎల్. కాలనీలో “తొలిప్రేమ, తమ్ముడు” షూటింగ్స్ జరిగినప్పుడు - అందరితోపాటు గుంపులో గోవిందలా ఆ షూటింగ్స్‌ను ఎగబడి చూస్తూ “ఎప్పటికైనా పవన్‌కళ్యాన్‌గారితో సినిమా తీస్తానని మనసులో అనుకోవడం - అది నిజమవడం కెవ్వు కేక కదా! - (30.12.2012, ఆదివారం ఆంధ్రజ్యోతి). (6౮౮56 హ్యానీ డేస్ - సినీ ప్రముఖుల చిన్ననాటి తీసి గుర్తులు + 224 షి!
క 'రిత్తూ.
_(ఇ6[06482 164, ముప వనమో 499 04/5 . నై భ్ లన - ౮౦౧౫5౪ ౮222666307 ౫జ 666? జి ల కేల... . జ 11 సా క తా... . ఖీ న 2 'హ్యాపీడేస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాగి ఖి స్ వినోదం... ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి నకలు... వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు... తం? | ం . ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే ఇ ఇర జమా ( వా. స . నా న ఓ భలే ట్ నలభై ముగ్గురు యువ-లబ్ధిప్రతిష్టుల ఊహలున్నాయి... టు. న? కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం హా; గ్ ను. వారుపడ్డ తపనలున్నాయి. “గమ్యాన్ని నిర్దేశించేది స్తో జజ. య 1 గమనమే...” అనేది ఈ సంపుటితో రుజువవుతుంది. శత మ్మ న్‌్ త ( న. న - . . సే శ. అందరి జీవితాల్లోని 'హ్యాపీ దేస్‌నీ వ్యాపీగా గుదిగుచ్చి జ న. ల వున ముందుకి తెచ్చిన వునత గొరును సఖ క ఖై స జగదీశ్వరరెడ్డిగారిది. ప్రతిజీవితమూ ఓ పాఠంలాగానే వ శ. ౭ శ్ ౨ అనిపించింది నాకు. క. ఈ పుస్తకం చదివిన ఏ యువకుడూ, (ప్రమ .॥ 1 మ! ఆస కె | ఆడ 6 9 అస లుల అమ్మాయిల పై దౌర్జ న్యానికో వాల్పడడు. కారణం, . హి. య. వైఫల్యాన్ని కూడా 'ఓ స్థిరచిత్తంతో తీసుకున్న మా న భో ఖ్ ననన “వనమాలీ ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మనని కోనా. (ణా . | స టై. ః వ. | బుజ్జగిన్తాడు. జా శ్ర 6 అందుకే, స్నేహితులారా... ఈ పుస్తకం చదవడం . క వం. ఓ మధురానుభవం. అసలిటువంటి పుస్తకం మనకి | శ. ప బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన రావడమే గొరుసు వారి
-
- య. ప్రత్యేకతకి, ఆలోచనా పరిధికి నిదర్శనం. "శ యం =. . క్ష (, -. . . 978-81-938053-4-3 జర వ. 9 788193 ' 805343
న్‌ా ల మే సోనం 2025 __ నరుల సుం కానని నం ననన వకవ 220 పో వలం అత్య యయ అం ఆ అ అం రన టయ నోరి వయా లాయర్ సోన సరందూపిరీ లంచ లంచం ౧ మాాంలయష ని ల