Telugu సరదాగా కాసేపు - anilvaranasi/indianlanguages GitHub Wiki

= ళా ఇ , ” అ గ గ్ల ౮ జె లో ్ట ॥ గ న ఇ ” తా క. శ కా య క " " లి టి _ ॥ =. ల + గు న న్‌ జ ॥ త్‌ + | క్‌ ॥ (॥ / | జ్జ సా

  • చ్‌ , | ( ల ల ఫే - శ్‌ ౪ 1 ॥ (| ళ్‌ . ॥ ॥ క య శ్‌ శ ం" 1 ' నా ॥ శ | . (| న్నా [ళ్‌ ** జ ల. _ ల శ ఖ్మ ॥ _ . క్ష క్ష ః = ఇ శ ణు ష్‌ శ _ ౦ త్‌ స . ఖ్‌ _ ళో _ గ్‌ న లల ట్‌ ేం.. న్‌ ల. ్ట్‌ జే హై. లీ శ్‌ శీ ల కై అన ర గా + . . |. 12 చో జ _ ॥ = ఎ చి ్లో రా కా య నా క నం త, . స్ట "నా ర. , శ అత మౌ ఎళ్టకీన్‌ ము | సం య బ్‌ కా శ అ ఆం యి ॥1 నటం , ళ్‌ | కట్ట య “ యం నే. 1 1ము ర్‌ ( | త్త వాం | అట్టలు 4 |! ం ఖా =] జ లే ఏం న _ ౨ శా | ర్‌ | [ప || క / న్‌ | వాత న ౧ ఖీ! (1 "ల్లు ॥ స (ల “ఈట్లే 4. ఇట ఇ యాన్‌ ఆ! ॥ శ జ్‌ క '' క. శల (మ. న త్‌ . వ న. 2 జ 1 (టూ హం! రంల నా. న్న ఆ | . తీనే (ను గటా ప్న వే " “4? జ నై క్‌ చంటి పే టం 1౪4 రన. | ల్‌ న. (' మ్మా ల ల టె అ జ జ | లే -( వ శ్రా చ కు. వ లీక్‌ ర్‌ % వ 4 శే గ "న సాన్‌ . శక క క త క్‌ శా వడ జ నళ న్‌ వా కం ॥ యీ చైనా = న జ న. [2 (| [క మన. వ. క్ల తజ 4 శి - శ్‌ ఈ = .. క "శం. "కాత! కన శ శ్‌ “నే ఏ లి శ శి . ల; [ కమా గం [ఓం జబ _ం|[ క్‌ జ్‌ శ . ల. "ల. టై. నల వాతా ర (జ త్య శ్రీ = - లంలో ఇల ॥ నో జ ॥ | వ జలే టా క్‌ ం “జట _ , శ. 1౯ _ః ం పల్య-ం ఇ జు (| శ న్‌! జి టైం మం 12. 7 , ఓక - చ ( ఎ ఉ ॥ _ కు బున గ టా ఆబ ౯. , , . | | గా (గ. ॥ ఇ . , , ఖా క్‌ లె ౬ గ్‌ ళ్‌ మే నాసా 4 _ తష కళ య. . 1... వ క... -- 7 , / క . ॥ పు క్‌, కే క న తం (| శ | $ వై క్‌ | . , తి వే క శే ప ల లా
  • ఇ గి సా చ్‌ గ ము ఎత్యాల్ఞో | న్‌ు “జా |. లూ. 1] , శ ను. £ త శ్‌ న్‌్‌ ; ్య _ వ శ ధి య. జు . ర్ట పము జ త్ర సనా 1: మ" | చ్‌ ఆక్రమి కా! శ ఆ! క్యా లీ ఫ్‌ క? క్‌" 4 1 సయ ష్‌ ॥ ॥ ః 1] అలు గ్‌ వ ో క్‌ యు ప శే స్ట! _ _ నా ంపా. | (, వళ) న ( / క 1 కు 7 ౮ అకా! ల నా నా మ్‌ ళీ సా. | గ స లం. ఒ లే " టు! ౯" స్‌ షం [1 | శస గ ॥ . శల ఫి జ (4 ఫే అల లు స్మ పై ఫ్‌. ట్ల తా క అట టి | ; న. జ్‌ |క| ఇ 4 ం న. 4 జనా క “కి || న్‌ ల్లో , _ * క ల || “తనా ్‌ ఇ! న్‌ తం 1. నా. న ల. . " - శ -1 - నే! " | | న. ఇం స . షై. య న యు బీ ఓ 4 జ కః తా అంజీ , ల 7 మ ర్‌? న్‌ నూ ( వ్‌ క ల ర. ల సట | వ న క / ఇ లం అ! టా! "| ల | ఈచిాాంటభ- న! - ఆ. ౮ నా. ' త శీ బా తో ఖో న 4 క. న శ వ ం. గ _ గల ఇ క్‌ గ చకా | | తం”, శ క ఇ. | రే, - . . ఇ 1 లజ లే వ = కన్‌ (| జీ (| శ లీ న ్‌ _ వీ. ఇ 1
  • స | గ్‌ మ యన ఈ జీ! ంసై అలీ టైం | తీటే త . జ చి 4 ॥ ఇ. , | య. టై [స ” సై లో | శ శ్‌ | వ వ వ్‌ ం . . న (1. శో శ గ! న్‌. [ శస పా జీ ల్‌ - | . న్‌ ! క్‌! ౯ గ ॥ 11 , గ్‌ సలా కీ జు ఖ్‌ - . యో చా ఖై. , ప | ఆ ” | . | ప! మా న 4 " వ స న్న క్‌ - కరమ 4 ల్‌ వ ఫాం టై న్‌ా ఆ ' ౯ ఇ్య్పాళ్ళీ ట్ల క అ! న జ సేన క ీ 2 ఆక, ం తి క్స్‌ క్ష ॥ గట. - శీ ” తలే వ థి ఆ హా! క శ త క్‌ ఇ ఖ్గ క *ట న. అ ఛ శా కే ఇ క్‌ గ" క క ౯ లాం - కా శ క్‌ న న్‌, జ్య ్ష . ” / =“ స _ “న్‌ ళ | గ ళు జ లై గ్‌. / మ్న్‌ _ ఖ టం జె ట్త్‌ వం. - " 1 , శ ళా |] ్గ్‌ శ ౬ క ష్‌. ॥ న కే గ్‌. , , | ఆ న " 1 ల . శ స ఉక న క | ర్‌ ల అ ఇ గ్‌ యనే! జ తో గా . కై. శే ॥ సా . | గ్‌ మ. షే " "కి మో | తి భఖ గ ” " . టి! యం “జ్య ల ॥ . వ - మ + శే ల _ ॥ - ” స గ జ్‌ న్‌. లి ఎ ల. గ. - ఆ శ గ్‌ ఇ _ | క ॥ న్‌ ; | న్‌ు జ. | న 5 లు . ॥ నా ఉ | న తీ! ౬ | ఇ | న _ రే * య న శ (| శ ల ళా జ్‌ పా | నః టీ | ల శ ల జ జ ల అ మ శ అజా (. ॥ ం క స | , ః వే 18 జ టం గాల క వ ష్‌. శ ఎక న్‌ గా న . టో -' క ల] మ్‌ జ కేం + జ్‌! క్‌ ము + శ్‌ క్‌ 7 అన్న లట... / ॥ క ల ఇ 2 ళా ః టీ గలా లీ ఠి క. క చు సం | | . న అ యం" " క జా న. | ళ్‌ మో జగ . | చి షా. సీ పజ షె ఆ చే. శ ॥ తేల "శ శక ” / _ భన. . నకు శ నిన్‌ వాన్వనైన " ॥ [ా తే ఇ జ 1జి ళ్లు వ్‌ఖ్లీ న వ. నూ , 1. - టా స” టే -. ల న జ ౧. క్‌ వాలం కాం ఖు శు. య శా క లు ఇ ప త శా షా క జ ఖు ఇ యా శ ఆగని మ ల స్‌ సు క టే ద్‌ బాక్స్‌ 'ఉ క = జ ఎ ఖో నన శ వై యడ; [గ ణా లి న్‌ ఘా టీ 1 ఆ శ? ? | ॥ ఆం ల, ॥ గో జ్‌ - లీ % వ. వో, శ కే ల ం ళ్‌ క! మ ?-. నా. ఆశీ న. ॥" | చే నం. ఖా. న్‌ | శీ మ , క్ర ంలా ఏ నే ష్‌ ణ్‌ నేల నాటు వగ | 1 శ్నా | గ? ః ళ్‌ ఇ ౨. . . & బ గ (4 న. ఉతుక _ టు ॥ ం క వ మిల కథ. శ కం ప- శక క. బం యము యంగ న వేం ఇక్‌ ౫ " న్‌ క వ / క్‌ స్య " కే క! ఎనీ ఇ్ఫు చ . , తి కా శ క్‌ - జ [క ॥ జబ స శ క క్ట గ్‌ ఆ 7ట్త జా శ శో శ్‌ (| కు ట్‌ ఉం. క్‌ | ణీ వ? , | క్‌ 4 శ క్‌. ల వు అ ల సే తి గీ ॥ ఉచ ఈత మేలి యె “ ఆ న. ॥ గట ల శ | | , ణ్‌. ల్‌ 1 స్త్‌ / ల తాఖట్ట 2. బ్‌ ॥్‌ చా ఇ వ , టి ఏళ |. ఖ్‌ మటు లో తే జు స - గ! క ఈం. నా! కిఇ / అతా, ఇ ॥ లే 1. ఉం. . = క్‌ కం శ్‌ అలన / నా ః శ ఫ్‌ | క ల్‌ న నా . నా క ఒం షా ఆ 1 | “త్త ఇ - శ] లు గ్‌. అకహా ట్‌ 1 ననే క ప శా శ య. యా | " (శం ఆనా. ప్రాడ్తో క. సే అ ర యం టే. శ న మ మ న. మ ళ్‌ క | నీ (౯ "గ ట్‌ 11 "జన _ _ ళ్‌ ఎన ర మ్‌ 9 ం ప ్‌ | ఒప -, మీ లీ ఇ స. _ వాలము! అపై సీ - . ఏ. | కం... క / 6 గ్‌ | ఉర శం లే స కనా కూ స కో // శీ / ర్‌ కం మాం తే 10... ైోో (| న్‌ కు ఆం ॥ యవ శ ళ్‌ వే - | స న క. | ల శ లా లం హ- ద్‌. కా శ్‌ గ య మ, శ జం గలా. ॥ |; ల | గర ఇ _్‌ స్‌ (| లీ శ | వ ర్ద కస య యా లో ఎం శ లా భి . 4 శే గ ళు | | ఖో. శ్‌ _ వం చు లకే. క! నీ డం న ఆల హా ా వ ల 4 జే జీ ఇ చు 4 ౯ లకీ టా ర్‌. + టాటా ౯ శ ఆ శ శీ * ఆ ల, క వ | “
  1. = 2 ' క = క పా నా ల క =. / క్ట ॥ జ జ శ న ఇ | ఇ + వ్‌ లేమి, మ! ణే. స శయ గంటి | | " శ “= టే శ్‌ క థు ॥ జ్‌ టం ఇ స్త్‌ శ జీ న స ల్‌ / లం _ య; వ - న య స దం! జం. లో స్టో " . + -తా- చన! న వ క స! క. న (వ క. ఉం *ి + ్న్వా వా, శామ్‌ _ లా ఇం “శరా - | ము... య . "మ ల క గ “జా * (౧ = వ్‌ జ. - " సాల ల్‌ సజ శ తృణ న్‌ శ వత్‌ 1 [ ॥ మట? - 1 గ్‌ జ క్‌ గ్‌ న! క్షే ఖత లీ జ ఇ _ ణా న. పా శ్‌ గ్‌ ను" ఆక స సు శ ల సన క త, | కీ నట. , ఇక ల్‌ ం స న్న న్య 1 గ శ తా బహి గా “పశ్య గ శీ ॥ న. వి శరా తస; [| శ న్‌ నట కా త వీ” 1 షి గా లీ _ ల ॥ స క య ఇది - లీ: వ్‌ తైక్టీ క్ట ల ర. ॥ ॥ ర జ తె శ [4 య్‌ + / / ॥ ఇం ఈ (| కే. ఛలో [ఖీ “మ శాకా క , "కు. _ ప ఇల ఇ వ న్‌. శ సూ | గొ ్‌ ఇ లో ల్‌ జ ః! వా. న టాం న ఎ , - ళ్‌ లై శ వ. చ స ల ఇకో! 7 స న శ ॥ ౨. మీ 1 క్ష = 7 అ మున క్‌ జాతే! న... ఈ సు న. , న రక క హో లల | న్‌ శే గ గ్‌ ్ట అజ. (లా యే వెజా (1 శ్ర ర్‌ గ్‌ ” |; మ మ్‌ “పంద... - లకే + ల్‌ నాట కళ ్ట ఇ బీ ల న్‌ా త్త వ | ల. జి ః టే న లం చో కొ నే నభా. ఇ క్ష వ్‌ యహ. ఈ న. న శ్‌ష శ్రా ల. 7 సక తీ జ. శ్‌ కీ | నా గ జల్‌ జ “ శ్త్తై వత న గ [౫ తూ + బు = కయ్‌... ఆం లా తం శ్శ గ ం క. ్‌ జా వ. ఎ 2. ర! ల కే శ్‌? + క ఎ | ఎ జే. గం | ఎఎ ఆం 1 లి క . ర 6 జై ్‌ ఆ మ" పత అల దర్థాత స న ల ళో /| థి ఛీఫితో గి కి
  • టు ఓ అంక నల ల "వచు. ॥ ఒట్లు గ వ్‌ శ జ టో ం యము తా (ల , అశ _ న. నో జ - నస. స్‌ో నా క స్‌ ఆ న. బీ న | క , ళీ! స్లో / తమా వ్‌ జే ల వ, ళల, నే లే ఇ. ఆ =. , వ. య క బలీ క నత న. + ఫం న. న. క యాలాల న, , 7 4-9 | ॥ ! కానా! ( య. _్‌ శి శో ఓక్‌ న నన బ్‌ న్‌ా " ఎన + శా . న లో జో ల ఇ. కు న న. జట నే || " 7 శ్‌:2 - రాల ॥ జ జం తమిుంళ్‌ " అటా [1 న. ః త్య , నా న్‌ నో గ్‌ చి లం | ఖే | / ఛ్‌ ౮ 4) క స. కీ ఇ ్‌ న ఆ క్‌ జు = ల్‌. ఖా న్‌ ౯ + శల /| రట ౪ దంటే శశ ్న ఇ. న శ గీ న | ఇ [కక గ ఆ " - క ' కా. క న లం జు ల క య న (వ శ్‌ సం కోట ల శన ర ఎస ౫ న. శో ౬ నా వీ గ ళ్‌ టే క ల్న గడా రా అవే 1 వంశం. పా ళ్ళ న [ ॥ గలా అక్‌ + త్ర టం. క. ఉత ల్‌ న అ ర . _ గ ఓ / త్‌ ల్‌ గ. లా మలక జ ం. మా టీ. ౨ మో ళ్‌ . | డే! ఖ ల | న్‌. న న గ కుజ | శ గ / ో. “సా | ఇ శ లా ఓ ఇ వ టె గీర, వ = . క న సే లే . కన్‌... | స్సు క్‌ , = నో చ ణ్‌ ఊం" జ పే లీ న. 1? టా శ్‌. ం వ. క , న (ఖ్‌; వ ళా ఆ న ర న ంత్సే ఆ ళా! ష్‌ న. గ్‌ గ ణీ = ( “ల కు _్‌ ॥ , "క టు గు 1వ . యు" జు ట్‌ ," | శ న్‌ ౮. (ప. - ఈ. _ 4 ॥ _ = త ంకీ క - ఆ మ ్‌ " ః జా క వ అ గీ గ్‌ా ఉన్‌ నే ఇ, -లీనో. ర వా. 4 షీ ॥ _ . 7ఇి గ. "ఇ ల " క ౬

పది వుద్‌ హౌస్‌ కథలు గబ్బిట కృష్ణమోహన్‌ $ విశాలాంధ్ర పబ్తిషింల్‌ హౌస్‌ లో విజ్ఞాన భవన, 4-1-435, బ్యాంక్‌ ప్రీట్‌, హైదరాబాద్‌ - 01;

నగగైశ0464 [కవలితిర ౧1640012 గగంగీగిత గీంగింగ . ప్రచురణ నెం. 2850/350 టం ప్రతులు వ 1000 ర్ధ్‌ ( ర | ప్రథమ ముద్రణ : సెప్టెంబర్‌ 2011 రణ ఆంగమూలర | న /00646/౧౦౮56. ౧6౧౧౧౮౮౦6౮ [౫ ర6౧౫5/0/ 0/ 6 ( 55/8/6 05౧౮6 1/1/000/౧0056 60 గ గంం్లంగ: 00/6/606

&ి14726 1/6 20%, ౧0౪ 64, ఓంగం0గ 77 ₹గ ముఖచిత్రం, బొమ్మలు ; రాంపా వై (అ గచ్చిట కృష్ణమోహన్‌ ] 105 5/౧౧/8౫74 ౨808౯ 464% 6-3-/099/1/9 50/22/0468, ౫/66/2046 - 500 082, * ౨౧72 66705247 ౭/( 9397075247 6 గ౭|/ 7 గాంగ4౧౯౭౦0/(2్రరగా2/. ౧0౧౫ ప్రతులకు ? విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 4-1-435, విజ్ఞాన భవన్‌, అబిడ్స్‌, "హైదరాబాద్‌. - 001, 1021 వగం812406120%ట్రు2షం0.000 ఇ +వ2122060200.6000. మచరాలంం( బుక్‌ వశెస్‌ అబిర్స్‌ & సుల్తాన్‌బజార్‌ - హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కరీంనగర్‌, తిరుపతి, గుంటూర్ను హన్మకొండ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం, హిచ్చరిక? ఈ 'పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ కొంత, గానీ కాపీరైట్‌ హోలరు & ప్రచురణ కర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా కాపీరైట్‌ చట్టరీత్యా "నేరం. - (ప్రచురణకర్తలు. ముద్రణ వ శ్రీ కళాంజలి (గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌ జ 0.

గలగల పాటే శాగదాది తల్ని 6న | శ్‌ ౫ జో వ! [ లో న్‌ ల న్‌ గ న శ (1 ప ప. హక హో ని ఏ స్తూ న కి న న. న 6 య. దగ్ధా విదిల0. మ స. ఈ 6ాగ్ర గాదిప్‌ క. ట్ర. క; స్మ (ల (శ్రుంవటర క క్రూ ఖై నం? టో! నో ర్ట కా.

అనుస్పజనలో ఆరితేరిపోయారు

రచయితలను అభిమానించడం వేరు. (పేమించదం వేరు గౌరవించడం వేరు. కొందరు ఈ మూడింటినీ కలివి రచయితల్ని అభిమానించి (ప్రేమించి. గౌరవిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే గబ్బిట కృష్ణమోహన్‌గారు. ఈయన ఆంగ్ల రచయిత వి. జి. వుడ్‌హౌస్‌ను అభిమానించి (ప్రేమించ్చి గౌరవించడమే కాదు, ఆయన్ని ఆవాహన చేసేసుకున్నారు. అంటే కృష్ణమోహన్‌గారిని వుడ్‌వౌస్‌ ఫూనేశాడు. ఈ పూనకం ఇవ్చదప్పుదే వదిలేట్టు లేదు. వదలకపోవదం మంచిదే! తెలుగు. పాఠకులకు మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా: వుద్‌హౌన్‌ చాలా మందిని వూనాదు. వుంఖాను పుంఖాలుగా రచనలొచ్చాయి. మెచ్చుకున్నారంత్నా వూనకంతో ఊగీపోతోన్న వ్యక్తిని వట్టుకుని 'నీ పేరేంటంటే” తన పేరు చెప్పాడే తప్పు, వూనినవాడి పేరెన్నడూ చెవ్చులేదు. అయితే కృష్ణమోహన్‌గారు అందుకు అతీతంగా పూనిన వ్వక్తి పేరు. చెబుతూ రచనంతా నా సాంతమంటున్నారు, దీన్ని 'అనుస్పజన' అంటున్నారు. అనువాదం వేరు. అనుస్పజన వేరు. అనువాదం అంటే 'డబ్బింగ్‌ సినిమా” లా ఉంటుంది, అనున్ఫజన అంటే 'ఠీ మేక్‌ మూవీలా ఉంటుంది. విషయం అదే! అయితే అనున్ఫజనలో మనవైన అందాలుంటాయి. మన మాటలూ మన ముచ్చట్లూ మన ప్రాంతాల్హూ పాత్రలూ... అన్నీ మనవే ఉంటాయి ఉండడం బాగ్రానే ఉంటుంది కాని ఇలా ఉంచదానికి రచయిత నానా కష్టాలూ పడాలి. సొంతంగా కథ రాసేయొచ్చు. అనువాదం చేసేయొచ్చు పెద్దగా ఇబ్బందులుండవు. అనునస్సజనంటేనే ఇబ్బంది. యావీల్‌ని మామిడి చెయ్యాలి, పైప్‌ని చుట్ట చెయ్యాలి, రోలింగ్‌ వైర్‌ని ఉయ్యాలబల్ల చెయ్యాలి. చేస్తే బాగుంటుంది, అర్ధమవుతుంది, అయితే అవక్సడితో ఆగవు. వస్తువులు మారిపోవడంతో పా(తలు మారిపోతాయి. (ప్రాంతాలు 'మారిపోతాయి, మాటలు. మారిపోతాయి ఇలా మారిపోయినవన్నీ మూలానికి దెబ్బ తీయకుండా. ముందుకు దూసుకుపోతే విజయం సాధించినట్టే! మొత్తానికి అనున్సజనంటే అక్షరాలూ వదాలు కాదు అదొక సంసృతి, ఆ సంన్ముతిని కళ్ళకు కట్టాలి. కట్టించాలి,

ఈ విద్వలో కృష్ణమోవాన్‌గారు విజయం సాధించేశారు. ఈ నంగతి ఈ వుస్తకంలోని, కథలు: చదివితే మీకే తెలుస్తుంది. కథల వరకూ: అక్షర్లేదు. విషయనూచికలో ఆంగ్రంలోని కథ పేరూ దానికి వీరు అనుస్పజనగా అందించిన కథ పేరూ చూస్తే చాలు! అర్హమయివోతుంది. వాసన చాలు వివి .నరపంగల్తో, ఏవి ఉమ్మెత్తలో చెప్పొచ్చు.

పది. వుడ్‌వౌస్‌. కథలివ్కి పది రకాలుగా నవ్విన్తాయి. నవ్వ నాలుగు రకాలు కాదు, వది రకాలనిపిస్తాయి. పూటుగా నవ్వగలగాలి. నవ్వితేనే అందం -- ఆనందం, మడి అలన్వం: దేనికళ చదవండి! నవ్వండి॥ వ.

ముళ్ళవూడి వెంకటరమణగారు వోన్యరన రాజ్యాధినేతగ్లా కీర్తించిన వి.జి: వుడ్‌హౌన్‌ రచనల్లో కొన్నింటిని తెలుగులోకి తీసుకురావాలనే యత్నంలో మొదటగా ది ఓల్డ్‌ రిలయబుల్‌ నవలని ఆపద్దాంధవి-ఉరథ్‌ -పాపాలభైరవిగా. అనున్ఫజించాను, జనవరి 2008 నుంచి మే 2009 వరకు ఆంధ్రభూమి మంత్లీలో ధారావాషాకంగా ప్రచురణ కాగానే ఎమెస్మోవారు పుస్తకంగా ప్రచురించారు. వుస్తకావిష్టరణ సందర్భంగా వుద్‌హౌస్‌కు వీరాభిమానులైన భావు-రమణలు

కృృష్ణమోహనంగా (గబ్బిట నడిచిన

ఇంఫునొంవుల తెనింపు నవల

“ఆపద్భాంధవి-ఉరఫ్‌-పాపాలభైరవి!”

చదివి పట్లీగ్లా నవ్వకపోతే --

ఉక్రిడ్డిని జీవ్స్‌ అవ్పడిగినంత ఒట్టు!

ఉ|్రిడ్ది యిచ్చినంత జట్టు,

వీవీ చిరునవ్వినంత ఒట్టు!

అంటూ. అభిమానంతో సందేశం పంపించి ఆశీర్వదించారు,

రెండవది అంకుల్‌ డైనమైట్‌ నవల. రెండింటికీ అవురూపమైన ముఖచి(త్రాల్ని రచించారు కళాప్రపూర్ణ బావుగారు. ఈ రెండు పుస్తకాల్నీ డి.టి,వీ దశలోనే చదివి తనదైన శైలిలో

సొంపైన తెలుగీసు

తలుగు వోన్యవ్రీయులకు

ఇంతకన్న ఆనందమేమీ!

అంటూ స్పందించిన రమణగారికి జోడు వందనాలు, అంకుల్‌ డైనమైట్‌ నవల (వ్రన్తుతం (92 ఆగన్దు 2011 నంచిక నుంచి) నవ్య వీక్లీలో ధారావాపొకంగా వెలువడుతోంది.

మూడవది మిస్తర్‌ మల్లినర్‌ నీరీన్‌ నుంచి పర్‌ కూర్చిన పది కథల సంవుటం ఈ “సరదాగా కాసేవుడ. వీటిని కూడా డి.టి.పి, దశలో వున్నప్పుడే (జనవరి 2021లో) అడిగి తెప్పించుకుని చదివ్మి ప్రోత్సపొంచి అలా. - మూడు రచనలకీ తొలి పాఠకుడిగా ముళ్ళపూడి వెంకటరమణగారు కావడం నా సుకృతం. భగవంతుడు. వారి. ఆత్మకు శాంతి చేకూర్చాలని (ప్రార్ధన, ల్‌

“సరదాగా కాసేపు” పుస్తకానికి ముందుమాట రాసిన నవ్వ వీక్లీ ఎడిటరు శ్రీ. ఎ, ఎన్స్‌ జగన్నాథళరగారికీ! చక్కటి ముఖ చిత్రం, బొమ్మలు వేసిన మి(త్రులు రాంపాగారిక్కీ ప్రచురించిన విశాలాంధ్ర వబ్లిషింగ్‌ హౌన్‌కీ, మేనేజరు శ్రీ బి, ఈశ్వరరెడ్డిగారికీ ధన్యవాదాలు, వీటిని తెలుగులో ప్రచురించేందుకు అనుమంతించిన కాపీరైట్‌ వోల్స ర్సు - 424 7726/6టూ (౮474 0/02/4 / గ04264౮02౮6 వారికి కృతజ్ఞతలు,

నెప్టెంబర్క్‌ 2011

విషయసూచిక అ. 2062024 4004/ ౮౭౦౧౬ ధ4ంం)4లె4ల1110ల) గ 2. శాంతి - ప్రశాంతి అ 4 న//04 ర40/2 (466౬041 40111260 న్నే +. తిటాగనొల/లా (0110ల )గ2%టు 55 4. ఉండ్రాజువారి ఉత్తేజామ్లం అ 4440726 58406 ర రూం (04660 340110లా ర5్‌ర్‌ 5. నవ్వితే నవరత్నాలు అల 246 వగ//6 7460 గబా (4010ల గంట) 78 6. బిషప్పుగారి పన్నాగం ల. 244 తసాగిరర 3 4076 (04661 స స4011ష0లఏ 95 వు. 2076 £2/226402070404 (4 2౫ 04100169 లర్‌ 8. శరద్రాత్రి సంబరాలు ౨ 64/2 ౧/౧ (40110 2ై%టి 128 9. పళ్ళంరాజు - పచ్చకలరు బూట్లు ఆం ₹/6వ్‌/0070ర/6022/0 1011111642 50621102) 154 10, ప్రేమికుడి ఇక్కట్లు అ 0/6 ల౫4౭౯4/ 0/ధలీజగ 4/76 (| గగ1111%6౯506211089) 1/5

సత్తిరాజు నతి నివారణ య క్ట

మా పానకుటీరంలోకి అడుగుపెడుతుండగ్గానే ఎదురుగా కనిపించిన దృశ్యమల్లా ఒక టేబుల్‌ దగ్గిర యిద్దరు కస్టమర్లు కూచునుండటం; అందులో ఒకాయన ఆవేశంగా చేతులూపుతూ చెబుతున్నద్రాన్నిబట్టి చూస్తే ఏదో కథ వినిపిస్తున్నాడని తోచడం. వివరాలు నాకంత సరిగ్గా విశదం కాలేదు కానీ “జీవితంలో ఎప్పుడూ అంత పెద్దది చూడలేదండీ!” అనీ, 'ఇదిగో య్యింథ పేద్ధది' అనీ అంటున్నది మాత్రం వినిపించింది. ఇలాంటి (ప్రదేశాల్లో జరిగేది వూహించటం అంత కష్టమైన పనేమి కాదు. వింటున్నాయన నా వైవోసారి చూసి చిన్నగా నవ్వుతూ తను పడుతున్న బాధని కన్ను గీటి తెలియపరిచే ప్రయత్నం చేశాడు. జవాబుగా జాలితో చిన్నగా నేనూ నవ్వాను.

దాంతో మా యిద్దరి మధ్య ఒక తెలియని సంబంధం ఏర్పడింది. కధ చెబుతున్న మనిషి ముగించేసి లేచి వెళ్లగానే నేనేదో పిలిచినట్టు దగ్గిరకొచ్చి కూచుని నాతో సంభాషణ మొదలెట్టాడు.

“చూడండి సార్‌, కొందరు ఎన్నెన్ని కోతలు కోస్తారో,! అన్నాడు నింపాదిగా,

“వ్యాపారస్తులు అన్నీ నిజాలే చెబుతారని మనం అనుకోకూడదండీ,' అంటూ సర్దిచెప్పాలని చూశాను,

“ఆయన వ్యాపారస్తుడు కాదండీ, మావూరి. డాక్టరుగారు. జలోదరం పట్టుకున్న 'పేషంటు గురించండీ యిప్పటి దాకా ఆయన చెప్పింది. ఆ మాట. అని నా మోకాలు తట్పతూ, “వ్యాపారస్తుల. గురించి అందర్లాగా తమరు భావించగూడదండి,అది సరదాగా కాసేపు | సత్తిరాజు నత్తి నివారణ

ఆనవాయితీగా వస్తున్న అపప్రధందీ. 'నేనూ వ్యాపారస్తుడినేగానండి, జీవితంలో మచ్చుకు కూడా అబద్ధం చెప్పి ఎరగనండి, అన్నాదతను. - అతని. 'మాటలు నమ్మబుద్దేసింది నాకు. పొట్టిగా లావుగా; నడివయసులో వున్న ఆ మనిషి కళ్ళు చిన్నపిల్లల కళ్ళలా కల్లా కపటం లేనట్టు కనపడ్డాయి. గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళలో. నిజాయితీ వుట్టిపడుతోంది. అలాంటి నిజాయితీపరుడు ఏది అమ్మినా నిస్సందేహంగా కానెయ్యగలననిపించింది. అంతలో తలుపు తెరుచుకుంది. లావుపాటి అద్దాలు "పెట్టుకున్న పొట్టి మనిషాకాయన. ఆదుర్దాపడుతూ లోపలికొచ్చి కన్నుమూసి తెరిచే లోపల గభాల్న గ్లాసుడు జిన్ను అడిగి తాగేశాడు. బడలిక సర్దుకున్నాక యిబ్బందిగా మమ్మల్ని చూస్తూ పలకరించే (ప్రయత్నం ఏమంటున్నాడో అని అతని వైపు చూశాం, ధైర్యం సన్నగిల్లినట్టుంది, ఎలా వచ్చాడో అలాగే సుడిగాలిలా మాయమయ్యాడు, నాతోబాటున్నాయన, “మనల్ని వలకరించడానికి గావుల్ను నమస్తే అనబోయినట్టున్నాడండీ," అన్నాడు. . . దానికి నేను, “నత్తి వున్నవాడికి కొత్త వాళ్ళతో మాట్లాడటం కష్టమేనండీ పాపం, “అయినా నత్తి నయం చేసుకునే ప్రయత్నంలో అలా చేశాడని నా అనుమానం, మా తమ్ముడిగారబ్బాయి భాగోతుల సత్తిరాజులా, మా తమ్ముడిగారబ్బాయి గురించి 'చెప్పానా మోకెప్పుడన్నా?! దాంతో నెను 'ఇప్పుడే కదండీ మనం కలవటం జరిగింది, "పైగా మాకో తమ్ముడుగారున్నారనీ ఆయన కొడుకు పేరు సత్తిరాజనీ తెలిసింది కూడా యిప్పుడే! అన్నాను, _ జ్రుర్రాడు లెండి, భాగోతుల సత్తిరాజు. అన్నట్లు నా పేరు భాగోతుల సూతరాజండి. మా సత్తిరాజు భాగోతం మికిప్పుడు చెబుతానుండండి, 'మహా తమాషాగా వుంటుంది.” మా తమ్ముడుగారబ్బాయి. భాగోతుల సత్తిరాజు (చెప్పడానికి వుపక్రమించారు సూతరాజుగారు) ఎంత మంచివాడంటే వాడిని చూడగానే మోలాంటి వాళ్ళకి ఈ కాలపు కుర్రాళ్ళందరూ'. యిలా వుంటే ఎంత బాగుండునుకదా. అని అనిపిస్తుంది. అయితే చిన్నప్పటినించి వున్న నత్తి మూలాన నలుగురితో మాట్లాడాలంటే శాపమై కూచుంది. వాడే కనక వుద్యోగం చెయ్యాల్యొస్తే యీ నత్తి జాడ్యంతో చాలా యిబ్బంది పడుండేవాడు. మా తమ్ముడు: పోతూ పోతూ వాడికి: జీవితాంతం 'మంచి ఆదాయం యిచ్చే వనరులు సత్తిరాజు నత్తి నివారణ 2 సరదాగా కాసేపు

ఏర్పాటు చేసిపోయాడు. సత్తిరాజు సుఖంగా జీవితం వెళ్ళగడుపుతూ వచ్చాడు. రేపల్లె దగ్గిర చిన్న పల్లెటూళ్ళో పుట్టిన వాడు అక్కడే స్థిరపడి నిత్యం గ్రామాల్లో జరిగే ఆటపాటల్లోనూ, క్రాస్‌వర్డ్‌ పజిల్సు - పదబంధ పారిజాతం, గడి-నుడి, గళ్ళ నుడికట్టు లాంటివాటితో కాలక్షేపం చేస్తుందేవాడు: వాటి మూలాన పాతికేళ్ళు దాటేలోపల ఇంద్రుడి ఖడ్గం పేరు, శివుడికున్న రకరకాల పేర్లు, దేవతల. పేర్లు రాక్షసుల పేర్లు మొదలైనవాటి ల్లో మంచి పరిజ్ఞానం సంపాదించాడు, ఆ వూళ్ళోనే కాపురముంటున్న హెడ్‌ మాస్టరుగారమ్మాయి సుజన అనే పిల్ల ఒక్కర్తే దాదాపు అతనికి సమానంగా యిలాంటి పరిజ్ఞానం సంపాదించుకుంది. సుజనకి కూడా క్రాస్‌ వర్డ్‌ 'పజిల్సు పూరించదమంటే మహా మక్కువ. విష్వక్సేనుడు ఏవర్హూ సప్తబుషుల 'పేర్తేమిటి లాంటి గడ్డు ప్రశ్నల్ని కూడా అవలీలగా పూరిస్తుందనే విషయం జిల్లా అంతా మారుమోగిపోయింది.

సుజనతో పరిచయం మొదలైన తరవాతే సత్తిరాజు తనకున్న నత్తిని నయం చెయ్యగల డాక్టరెవరైనా వున్నాడా అని మహా పట్టుదలతో వెదికాడు. ఆ పడుచువాళ్ళిద్దరిది ఒకే హబీ కావటంతో తరచు కలుస్తుండేవాళ్ళు. కాలి చిటికెనవేలికి తొడిగే భూషణం, ఏడక్షరాల మాట - సుజనకి తెలుసునేమోనని సత్తిరాజు హెడ్‌ మాస్టరుగారింటికి వెళ్ళడం, అలాగే ఆమె. - మోటారుబండి వేగంగా పోవాలంటే తొక్కవలసినది, ఆరు అక్షరాల పదం - సత్తిరాజుకి తెలుసునేమోనని వాళ్ళింటికొచ్చి కనుక్కోడం మామూలైంది. ఇలా తరచూ కలుసుకోడంలో ఒకరోజు ఆమె గరుత్మంతుడి తల్లి పేరేమిటోనని సతమతమవు తుంటే వెంటనే చెప్పి సాయం చేసినప్పుడు సుజనే తన సర్వస్వమని సత్తిరాజుకి జ్ఞానోదయమైంది. అలవాటు (ప్రకారం తన పరిభాషలో - సుజనే తన జీవిత భాగన్వామి, అర్ధాంగి, ఇల్లాలు, (ప్రేయసి, ప్రియురాల్సు మనసు దోచుకున్న పడతి అనుకున్నాడు,

మనసులో వున్నది ఆమెకి చెప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా మాటలు బయటికి రాక సీసాలో నీళ్ళు గలబరిస్తున్న శబ్దం మాత్రం బయటి కొచ్చేది . మనిషికి వెక్కిళ్ళు ఎంత వుపయోగమో యిలాంటి. శబ్దం కూడా అంతే వుపయోగం,

ఈ జాడ్యాన్ని అధిగమించేందుకు త్వరగా ఏదన్నా చికిత్స చేయించుకోవాలని ఒకరోజు మద్రాసులో వున్న స్పీచ్‌ థెరపిస్ణుని సంప్రదించడానికెళ్ళాడు.

"ఆ, ఏవిటి నీ బాధ” అడిగాడా స్పెషలిస్టు.

(నే-నే-నే-న్తే అన్నాడు సత్తిరా జ

“'ఏమంటున్నావ్‌ నువ్వు?

'పాట పాడుతూ చెప్పు, ఫరవాలేదు, అని సలహా యిచ్చాడు. స్పెషలిస్టు.

'పా-పా -ప్పా-ప్పా-ప్పా -పాటా?” అదిగాడు అర్ధంకాక సత్తిరాజు.

పొడుగాటి గడ్డం పెంచుకున్న స్పెషలిస్టు చాలా మంచివాడు, వుదార స్వభావుడు. "సరదాగా. కాసేపు వ్‌ సత్తిరాజు నత్తి నివారణ

“నత్తి వున్నవాళ్ళలో కొంతమందికి మాట్లాడటం. కష్టమయినప్పుడు చెప్పదలుచుకున్నది పాటగా పాడితే మాటలు సులభంగా దొర్లుకొస్తాయి,' అని సత్తిరాజుకి విపులికరించాడు,

ఈ సలహా బాగుందనిపించింది సత్తిరాజుకి, ఒక్కనిమిషంపాటు ఆలోచించి తల వెనక్కి వాల్చి, కళ్ళు గట్టిగా మూసుకుని రాగం అందుకుంటూ, 'మా వూళ్ళో ఒక చిన్నది, ఏంతో అందమైనదీ, ఆమెంటే నాకెంతో యిష్టమ్తూ, ప్రాణమైనా యిస్తానూ - లాయిలప్ప లాయిలప్ప లాయిల్తా లాయిలప్ప లాయిలప్పు లాయిల్హా? అంటూ పాడాడు.

“మరే అనుమానం లేదందులో, అన్నాడా 'స్పెషలిస్టు బెదిరిపోయి.

మళ్ళీ యింకోసారి గొంతు విప్పి అందుకున్నాడు సత్తిరాజు, “రోజూ కనిపిస్తుంది, నన్ను మురిపిస్త్రృంది, అందచందాలా ఆ చిన్నది, ఆమె చిరునవ్వలోనే హాయున్నదీ.”

'ఆహా! చాలా మంచిపిల్లలా అనిపిస్తో్ధందయ్యా”, అని చెప్పి సత్తిరాజు జేబులోంచి బయటికి తీసి చూపించిన ఫొటోని కళ్ళద్దాలు సవిరించుకుంటూ పరిశీలించి చూసి, 'ఓ, ఈ పిళ్లనా?* అని అడిగాడు.

దానికి తల వూపుతూ గొంతు సవరించుకునీ గుండెల్నిండా గాలి పీల్చి పాట ఎత్తుకున్నాడు సత్తిరాజు.

'అవునండోయ్‌, మరేనందోయ్‌, నా యిష్టదేవత అండీ నా'1ప్రాణసఖీ అండీ, నా ముద్దులగుమ్మండీ, నా సజీవ శిల్ప సుందరందీ.”

'సరే, సరే, మరే” అన్నాడు గబగబా ఆ స్పెషలిస్టు, ఆయన చెవులు అసలే కొంత

“నిను చూడక నేనుండలేనూ -” అని మళ్ళీ సత్తిరాజు అందుకోగానే అక్కడితో ఆపమన్నాడాయన.

ఫ్సర్తే అర్ధమైంది. నాకేమాత్రం సందేహం: లేదు, అయితే ఒక విషయం చెప్పు, అసలు నీ వ్రాబ్లెం ఏమిటి?” అని అడగ్గానే జవాబివ్వటానికి భద్రిరాజు వెంటనే గొంతు సపరించుకుని గుండెల్నిండా గాలి పీల్చుకునే ప్రయత్నం చేస్తుంటే “వద్దు పాడొద్దు. ఇదిగో యీ కాగితం మిద వివరాలన్నీ రాసివ్వు హైరాణ పడకుండ్నా” అన్నాడాయన - మావాడికి ఏ మాత్రం సందు యివ్వకుండా. =

చెప్పిన విధంగా చేశాడు సత్తిరాజు,

సుదీర్ధంగా వున్న ఆ లేఖని చదివి 'హుమ్‌!” అంటూ. ఒక నిట్టూర్పు విడిచాడు స్పెషలిస్టు, “అయితే నువ్వా అమ్మాయికి దగ్గిర కావాలన్న్మి (ప్రేమించాలని, పె లి చేసుకోవాలని, వివాహం చేసుకోవాలని, కణ్యాణమాడాలని అనుకుంటున్నావు. కానీ ఆ మాట చెప్పటానికి నీకు ధైర్యం చాలడం లేదు, ముందుకు పోలేకుండా వున్నావు, చేతకావడం లేదు, నువ్వా విషయాన్ని ప్రస్తావించబోయే ప్రతిసారీ నీ గొంతు పూడుకుపోతుంది, గొంతులో పచ్చి వెలక్మాయ పడినట్టు వుంటుంది, గొంతు తడారిపోతుంది, నాలిక పిడచకట్టుకుపోతుంది.! సత్తిరాజు నత్తి నివారణ భీ 'సరదాగా కాసేపు

అవునన్నట్టు తల వూపాడు సత్తిరాజు,

'ఇలాంటి కేసులు మామూలేనయ్యా. ఇంతకుముందు కూడా నేనిలాంటివి చాలా నయంచేశాను. అసలు ధారాళంగా మాట్లాడగలిగే వాళ్ళకే ప్రేమ అనేది ముంచుకొచ్చేసరికి గొంతు బిగుసుకుపోయి నోట్లోంచి మాట పెగలదు. మరి నత్తి వున్న వాళ్ళకైతే నూటికి తొంభైఏడూ పాయింట్‌ అయిదూ ఆరూ తొమ్మిదీ తొమ్మిది రికరింగ్‌ మందికి డ్రేమ అనే దివ్యమైన అనుభూతి కలగ్గానే గొంతులోంచి. వొట్టి గాలి బుడగల. శబ్దం మాత్రమే బయటికొస్తుందని ఏన్నో రకాల పరీక్షల్లో బయట 'పడింది. దానికున్న మందల్లా ఒక్కటే.”

“ఖ-టఏ-ఏ-ఏమి-ఏ-ఏ+ అంటూ విచారించాడు సత్తిరాజు.

ఆ. స్పెషలిస్టు రెండు చేతి వేళ్ళ కొనల్ని దగ్గిరకి చేర్చి సానునయంగా అతని వైపు చూస్తూ వివరంగా చెప్పాడు, 'చెబుతా విను. నత్తి అనేది ముఖ్యంగా మెదడుకి సంబంధించిన విషయం; బిడియం, సంకోచం 'మూలానే అది సంభవిస్తుంది. వాటికి కారణం ఆత్మ న్యూనత - ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌: అది రావటానికి కారణం అణిచిపెట్టుకున్న కోరికలో, లోపల్లోపలే దాక్కునున్న జంకుదనమో లేకపోతే మరేదోన్నో గొట్టంలోంచి గాలి బుడగలు. బయటికొచ్చినట్టు మాట్లాడే యువకులు నా దగ్గిరకొచ్చినప్పుడు వాళ్ళందరికీ నేనిచ్చే సలహా ఒకే ఒకటి - ప్రతిరోజూ పనికట్టుకుని ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురు ముక్కూ మొహం తెలీని కొత్తవాళ్ళని పలకరించే అలవాటు చేసుకోండి అని, ఆవిధంగా, అవతలివాడు ఎంత వెధవనిపించిన్నా కొత్తవాళ్ళతో సంభాషణ 'సాగ్గిస్తే నాలుగైదు వారాలు తిరిగేసరికి రోజూ పుచ్చుకుంటున్న మోతాదు వల్ల మంచి గుణం కలిగినట్టు తెలుస్తుంది. సిగ్గూ, బిడియం, జంకూ వెనకబడి: దాంతోబాటు నత్తి కూడా తగ్గిపోతుంది.

అని చెప్పి తొణుకూ బెణుకూ లేని స్వచ్చమైన గంభీరస్వరంతో తన ఫీజు కేవలం అయిదువందల రూపాయలు మాత్రమేనంటూ వసూలు చేసి ఆ కుర్రాడిని బయటి ప్రపంచంలోకి నెట్టేశాడు స్పెషలిస్సు.

ణ్‌

ఆ స్పెషలిస్టు యిచ్చిన సలహా తలుచుకున్నప్పుడల్లా సత్తిరాజుకి దానిమోద అయిష్టత ఏర్పడసాగింది. తెనాలి వెళ్ళే రైలు ఏక్కటానికి మద్రాసు సెంట్రల్‌ స్టేషన్‌కి ఆటోలో వెడుతుంటే వొళ్ళు జలదరించింది, బిడియపడే కుర్రాళ్ళందర్ణా నలుగురితో కలవలేకషోవడం - సమాజమంటే ఏదో వెగటు మూలాన గావుల్ను అని అనుకున్నాడు కాన్సీ బిడియం వల్ల కాదనుకున్నాడు యిప్పటివరకూ. ఇప్పుడైతే అసలు విషయం బయటపడింది కనక కేవలం. కుందేలుకు వున్నంత ధైర్యం తనకుందని గ్రహించాడు. బొత్తిగా ముక్కూ మొహర తెలీని కొత్తవాళ్ళని పట్టుకుని పలకరిస్తూ సంభాషణలోకి దింపడం తనవల్ల కానిపని అనుకున్నాడు,

ఎంత కానిపని, అయినా నెరవేర్చేందుకు వెనకాడరు మా భాగోతుల వంశీకులు, ప్లాట్‌ ఫారం చేరి రైలెక్కడాన్‌కి నడుస్తుంటే పట్టుదలతో 'పళ్ళు గిటకరించుకున్నాడు.

దృఢ నిశ్చయానికొచ్చినందుకు కళ్ళు వెలిగిపోతున్నాయి. రేపల్లె చేరే లోపల కనీసం ముగ్గురు కొత్తవాళ్ళతో మాట్లాడాలనీ, అంతగా అవసరమొస్తే పాటగా పాడటానికి కూడా 'వెనుకాడ కూడదనీ, సత్వరం అమల్లో 'పెట్టాలనీ నిర్ణయించుకున్నాడు సత్తిరాజు,

సత్తిరాజు ఎక్కిన ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ ఖాళీగా వుంది. సరిగ్గా రైలు బయలుదేరే సమయానికి ఒకాయన హడావిడి పడుతూ ఎక్కాడు. చూద్దానికి చాలా భయంకరంగా వున్నాడతన్వు మంచి వొడ్డూ, పొడుగూ వున్న వ్యక్తి. తనకి దొరికిన బోణీ యిలాంటివాడు కాక కాస్త సన్నగ్మా నాజూగ్గా వున్నవాదైతే 'బాగుందేది. కదా అనిపించింది సత్తిరాజుకి. పోనీ ఫరవాలేదులే అనుకుంటూ 'మాట్లాడటానికి కొంచెం ముందుకి వొంగాడు. అంతలో ఆ వ్యక్తే మాటల్లోకి దిగాడు.

_ “మ-మ-మ్మ-మద్రాసులో ఏ-ఏ-ఏం వు-వుక్క పో-పో-ప్పోస్తుందండీ, బా-బా-బ్బాబోయ్‌. ఇ-ఇ-ఇ-ఇప్పుడు కా-కా-కా-కాన్త్న గా-గా-గా-గాలి తి-తి-త్తిరిగింది, న-న-న్న్మయం,” అన్నాడతను,

రోకలితో మాడు మాద బాదినట్టు సత్తిరాజు హతాశుదై సీటుకి జారగిలపడ్డాడు. రైలు స్టేషన్‌ దాటి. వెళ్ళడంతో యింతవరకూ మసగ్గా వున్న పెట్టెలో యిప్పుడు బాగా వెలుతురొచ్చింధి. ఆ వెలుతురులో మరోసారి ఆ వ్యక్తిని పరిశీలిస్తే సత్తిరాజుకి లావుగ్యా ఎత్తుగా వున్న జబ్బలు, గుంటలు పడ్డ ముఖం. కోపంతో నిప్పులు కక్కుతున్నట్టున్న కళ్ళు కనిపించాయి. ఇలాంటివాడికి 'అ-అ-అ-అవు-అవునండీ, మ-మా-మ్మరే" అంటూ తను జవాబివ్వడం మూర్ధత్వం అనుకుని మాట్లాడకుండా వూర్మేతల వూపాడు,

అయితే. జవాబు యివ్వకపోవడం మంచి 'పాలిసీ కాలేదు. సత్తిరాజు మౌనంతో ఎదుటి వ్యక్తికి వాళ్ళు మండింది. మొహం జేవురురంగుకి తిరిగింది, చాలా నొచ్చుకున్నట్టు నిశితంగా గుచ్చి చూశాడు.

'నే-నే-నేనేదో మాట అంటే దా-దా-దా-ద్దానికి జ-జ-జ్ఞవాబివ్వటం క-క-కృష్టమా లే-లే-లే-లేకపోతే మూ-మూ-మ్మూగవాడివా? అంటూ దబాయించాడు.

మా భాగోతుల వంశీకులు మంచి లౌక్యులు, సత్తిరాజు బుర్ర వెంటనే పనిచేసింది. నోరు తెరిచి అంగిట్లో కొండనాలిక, టాన్సిల్సూ కనిపించేంత వరకూ నాలిక బార్లా'చాచి స్‌స్తాలో: నీళ్ళు గలబరిస్తున్న శబ్ద ౦ చేశాడు,

దాంతో ఘర్షణ నివారణ అయింది, కోపం పోయినట్టు ఆ మనిషి మొహం ప్రసన్నంగా మారింది.

_ జాలి వుట్టిపడే గొంతుతో యిలా అన్నాడతను. 'మూ-మ్మూ-మూగతనమా? కా-కా-కా-క్షమించాలండీ. నే-నేను క-క-కష్టపెట్టాను మి-మ్మిమృల్ని గొ-గా-గొంతు విప్పి మా-మా-మాట్లాడలేక పో-పో-పోడం దు-దు-దురదృష్టం కా-క్కాదా?'

అని చెప్పి న్యూస్‌ పేపరు తెరిచి దాంట్లో మునిగిపోయాడతను.. మలేరియా జ్వరం వచ్చినవాడిలా సత్తిరాజు వొణికిపోతూ సీట్లోకి వొత్తిగిల్లాడు. సత్తిరాజు నత్తి నివారణ ౮ సరదాగా కాసేపు

మాకు తెలుసుగా రేపల్లె చేరాలంటే తెనాల్లో రైలు దిగి తెనాలి-రేపల్లె ప్యాసింజ రెక్కాలి. సత్తిరాజు తెనాలి చేరేసరికి కొంత కుదటపడ్డాడు, స్థిమితం చిక్కింది. రైలు దిగి దూరంగా మూలకున్న ప్లాట్‌ఫారంలో రేపల్లె వెళ్ళే ప్యాసింజరు ఫస్ట్‌ క్లాస్‌ పెట్టెలో సామాను పెట్టేసి రైలు బయల్దేరేందుకు యింకా అరగంట పైన టైము వుండటంతో కిందిగి దిగి ప్లాట్‌ఫారం పొడుగునా పచార్లు చెయ్యటం మొదలెట్టాడు.

చల్లటి గాలి వీస్తోంది. ప్లాట్‌ఫారమంతా ఖాళీగా వుంది. కొంచెం దూరంగా బయట పంట కాలవ దానికి ఆనుకుని, గుబురుగా వున్న చెట్ల మధ్యలో తెల్లటి బిల్జింగు, గేట్సు లోపలికి పోయేందుకు కంకర రోడ్డు కనిపించాయి సత్రిరాజుకి. గేటు స్థంభాల్ని కలుపుతూ అర్ధచంద్రాకారంలో వున్న బోర్డు మోద ప్రభుత్వ పిచ్చాసుపత్రి అని రాసుంది.. చుట్టూ అందమైన (ప్రకృతి, దానికి తోడు చల్లటి గాలితో సేద తీర్చుకున్న తరవాత ఖాళీగా వున్న ప్లాట్‌ ఫారం మాద పలకరించి మాట్లాడటానికి వవరూ దొరకలేదేనని విచారిస్తూ తిరిగాడు.

ఆసమయంలో డాబుగా చాలా. గొప్పవాడిలా కనిపిస్తున్న మనిషాకాయన వ్లాట్‌ ఫారం మిదికొచ్చాడు.

కొత్తగా వచ్చినాయ న ఆజూునుబాహువైనా పొడుగాటి జుట్టూ గడ్డం మీసాలతో వున్న అతని వేషం మాత్రం విచిత్రంగా కనిపించింది. కేన్వాసు బూట్లు తొడుక్కుని వున్నాడు. తెల్లటి పైజమా, లాల్చీ మాద రెయిన్‌ కోటు వేసుకున్నాడు, టోపీ ఒకటి తిరగేసి పట్టుకుని మాటిమాటికీ దాంట్లో వేళ్ళు ముంచి బయటికి తీసి చుట్టూ అన్నివైపులా చిలకరిస్తున్నాడు. సత్తిరాజుని చూసి అభిమానంతో చిరునవ్వు నవ్వి తల వూపాడు. ఆ మనిషి వేసుకున్న డ్రస్సు చూసి ఆశ్చర్యపడ్డా పలకరించి చూద్దామనుకున్నాడు సత్తిరాజు. బాహ్యరూపాన్ని చూసి కాదు మనం 'మనిషిని ఏంచవలిసింది,. అభిమానంతో' నవ్విన నవ్వుని బట్టి ఆ రెయిన్‌ కోట్లూ లాల్చీల. వెనక ఒక మంచి హృదయం దాగి వుందను కున్నాడు సత్తిరాజు.

'ఆ-ఆ-ఆ-హా-హాయిగ్గా మ-మ-మంచి గాలేస్తుంది కదండీ, అన్నాడు,

“నచ్చినందుకు చాలా సంతోషం, నీకోసమే ప్రత్యేకంగా ఆర్దరిచ్చి తెప్పించాను,” అన్నాడా కొత్త మనిషి.

దానికి 'సత్తిరాజు కొంత ఖంగు. తిన్నా ముందుకుసాగాాడు.

అతను టోపీలో వేళ్ళు ముంచి యింకా అలానే చిలకరిస్తుంటే, 'మో-మి-మిోరా. టో-.టోపీతో ఏం చేస్తున్నారో అ-అ-అ- అడగొచ్చా? అన్నాడు.

“ఓ, ఈ టోపీతోనా? ఎందుకు అడుగుతున్నావో తెలిసింది. 'నా సంపదని ప్రజలందరికీ వెదజల్లుతున్నా'. అంటూ మళ్ళీ టోపీలో వేళ్ళు ముంచి తీసి నాలుగు దిక్కులా చల్లాడు, “ఈ పని చేసీ చేసీ విసుగు పుడుతోంది. కానీ నా అంతటి వాడికి యిది తప్పనిసరి పనయ్యా, అంటూ సత్తిరాజు చెయ్యి లాక్కుని తన చేత్తో గట్టిగా లంకె సరదాగా కాసేపు ౯ సత్తిరాజు నత్తి నివారణ

వేసి పట్టుకుని రహస్యంగా యింకా చెప్పాడు. 'యదార్ద్ధానికి నేనెవరో తెలుసా నీకు - మగథ సామ్రాజ్యానికి చక్రవర్తిని. అదిగో ఆ చెట్లల్లో వుందే, అదే నా రాజమహలు. ఈ సంగతి 'మరో నరమానవుడికి కూడా తెలీకూడద్యు బయటికి పొక్కకూడదు గుర్తుంచుకో. జ్వరమొచ్చినవాడిలా నీరసంగా నవ్వి సత్తిరాజు చెయ్యి విడిపించుకోబోతుంటే దూరమవటం యిష్టపడని ఆ ఆగంతకుడు మరింత పట్టు బిగించాడు. దొరికిన స్నేహితుడిని ఇనప కొక్సీలతోనయినా పట్టుకోమని షేక్సియర్‌ అన్నదానితో పూర్తిగా ఏకీభవిస్తునట్టు సత్తిరాజుని వుడుంపట్టు పట్టుకున్నాడు. మరోసారి అతన్ని చూసి తృప్తిగా శ్వాస విడిచాడు. ష్షాట్‌ ఫారం చివరిదాకా తీసుకెళ్ళి, 'హబ్బ, మొత్తానికి వంటరిగా మిగిలాం మనం," అన్నాడతను.

ఆ విషయం (గ్రహించటానికి. సత్తిరాజుకి ఎంతోసేపు పట్టలేదు. ప్యాసింజరు రైళ్ళు నిలిచే ప్లాట్‌ ఫారం కన్నా వొంటరి ప్రదేశాలు ఎక్కువుండవు. పట్టాల మాదా, వాటి మధ్యనున్న కంకరరాళ్ళ మాదా ఎండ వెలిగిపోతోంది. సిగ్నలిచ్చే పాత కాలపు లాంతర్హు, వెలిసిపోయిన ఆకుపచ్చా, ఏర్రరంగూ జెండాలు పెట్టున్న చిన్న షెద్దు మాత్రం వుందక్కడ,

సత్తిరాజుకిప్తుడు కావలసినవి యివన్నీ కాదు - దుడ్డుక(ర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చె పోలిసు బలగం. అలయ్లుతే దరిదాపుల ఎక్కడా. ఆఖరికి కనీసం

ఆ ఆగంతకుడు సంతోషంతో వుష్పాంగిపోతూ, 'చాలాసేపట్నించీ నీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాా' అన్నాడు.

'మి- మ్మారా, నా-నా-న్నాతోనా? అడిగాడు సత్తిరాజు,

“అవును. నరబలి గురించి నీ అభిప్రాయమేమిటో తెలుకుందామని.' తనకేమాత్రం యిష్టంలేదన్నాడు. సత్తిరాజు,

దానికతను విస్తుషోయి, 'అదేమిటి, ఎందుకలా?” అని అడిగాడు.

ఏందుకో వివరించి చెప్పలేను కాన్‌ నాకైతే ఏమాత్రం యిష్టంలేదని చెప్పాడు

నీ అభిప్రాయం చాలా తప్పని నా వుడ్దెశ్యం. నీ మాదిరిగా తలపోసే వర్గం పెరుగుతోంది, నేను వాళ్ళని ఖండించక తప్పుదు, ఇలాంటి అభ్యుదయ భావాలు నాకు నచ్చవు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులందరికీ నరబలులు శుభం కలగచేశాయి, నాకూ అదేమాదిర6 శుభం కలగాలి. కనక తమరు మరోలా: భావించకుంటే యిదిగో యిలా పక్కకి వేంచేయండి,! అంటూ అక్కడ.పాత దీపాలూ, జెండాలూ పెట్టన్న గదిలోకి పొమ్మని చూపించాడు ఆ చక్రవర్తిగారు. క్ష్‌

చీకటి గుయ్యారంలా వున్న ఆ గదిలోంచి ఆయిలు వాసనా, పోర్టర్ల వాసనా బయటికి చిమ్ముతోంది. అలాంటి గదిలోకి యిలా వింత అభిప్రాయాలున్న వ్యక్తితో లోపలికి వెళ్ళడం సత్తిరాజుకి సుతరామూ యిష్టం లేదు, 'పైగా క్షేమం కూడా కాదనిపించింది. సత్తిరాజు నత్తీ నివారణ &ి సరదాగా కాసేపు

'ము-ముందు తమరు ప్రవేశించండి, అన్నాడు సత్తిరాజు.

దానికా చక్రవర్తి అనుమానిస్తూనే, “వేషాలు కుదరవు నా దగ్గిర. అన్నాడు.

“అవును. 'నేను లోపలికెళ్ళగానే గడియ బిగించేసి కిటికీలోంచి బాల్చీల్లో నీళ్ళు కొట్టాలని. కదూ నీ వుద్దేశ్యం. ఇదివర కోసారి నాకలాంటి తంతు జరిగిందిల్మే అందుకే.

“లే-లే-లేదు నేనాపని చ-చ-చ-చెయ్యను.!

“సరే, నువ్వో 'పెద్దమనిషివి, నేనూ అలానే ఓ పెద్దమనిషిని, ఇద్దరికిద్దరం పెద్దమనుషులం, అన్నట్టు కత్తి వుందా నీ దగ్గిర? కత్తి కావాలి మనకిప్పుడు,” అన్నాడా

“లేదు. క-క-కత్తి లేదు నా దగ్గిర!

“అలాగా, అయితే అలాంటిదే ఏదో వస్తువు వెతకాలి మరి. ఎలాగో అలాగ తతంగం ముగించేద్దాంలే, అన్నాడు మగధ సామ్రాజ్యపు చక్రవర్తి,

అని చెప్పి వుల్లాసంగా. మళ్ళీ టోపీలో వేళ్ళు ముంచి తీసి తన సంపదని (ప్రజలందరికీ వెదచల్లుతూ గదిలోకి ప్రవేశించాడు.

సత్తిరాజు వెంటనే తలుపు గట్టిగా లాగి తాళం సపెట్టకవోవటం యిద్దరు పెద్దమనుషులు కుదుర్చుకున్న వొప్పందాన్ని వుల్లంఘించ కూడదనే నియమం వల్ల కాదు, ఆడిన మాట తప్పని మా భాగోతుల వంశీకులలాంటి కుటుంబాలు చాలా తక్కువ వుంటాయి. అయితే యిప్పుడు మాత్రం మా సత్తిరాజుకి తాళం, తాళంచెవీ కనక దొరికుంటే మొహమాటం లేకుండా తాళం వేసుండేవాడని చెప్పవచ్చు. అవి దొరకనందుకు మావాడు చేసిన పనల్లా గట్టి గా తలుపు బిగించడం మాత్రమే. అది కానిచ్చి వెనక్కి 'గెంతి వెంటనే స్లాట్‌ ఫారం 'మిద రేసు గుర్రంలా పరిగెత్తాడు, గదిలోంచి వింతగా వస్తున్న చప్పుళ్ళని బట్టి చక్రవర్తులవారు పాత దీపాల్లో, లాంతర్లలో యిరుక్కుని సతమతమవుతున్నాడని వూహించుకోవచ్చు.

ఇదే సందని పరిగెత్తుకుంటూ వెళ్ళిన సత్తిరాజు ఏక్కడా ఆగకుండా తన బోగీలోకి దూకేసి సీటు కింద దూరి ఆశయం తీసుకున్నాడు.

వొళ్ళంతా గజగజా వాణుకుతుంటే అలా సీటుకిందే వుండిపోయాడు. కాసేపటికి కంపార్ట్‌మెంట్‌ తలుపు 'తెరుచుకోవడం, చల్లటి గాలి లోపలికి రావడం (గ్రహించి నిర్దాక్ని ణ్యుడైన ఆ చక్రవర్తి తరుముతూ వెంటపడి వచ్చాడనుకున్నాడు సత్తిరాజు, సీటు కిందినించి కనిపించినంత మేర పరికించి చూస్తే ఆదదాని పాదాలు అగుపడ్డాయి. దాంతో వూరట కలిగి కాసేపు కళ్ళు మూసుకున్నాడు,

“పోర్టర్‌!' అంటూ ఏవరిదో గొంతు వినిపించింది.

“ఏంటమ్మా?”

"స్టేషన్లోకొస్తుంటే ఏదో గలాభా జరుగుతోంది, ఏమైందేవిటి?”

“అదిగో ఆ కనబడే పిచ్చాసుపత్రి నించి పేషంటు తప్పించుకొచ్చాడు, మేడం.

హార దేవుదా!! బు

ఆ గొంతులోంచి యింకా ఏదో వచ్చుండేదే కానీ అంతలోకి రైలు బయలుదేరింది. మెత్తటి కుషన్‌ సీటు మిదికి ఒక శరీరం కూలబడ్డ చప్పుడ్ము మరికాసేపటికి న్యూస్‌ పేపర్‌ 'తెరిచిన.చప్పుడు వినిపించాయి సీటుకింద దాక్కున్న సత్తిరాజుకి.

అతనికి రైలు పెట్టెలో సీటు కింద దాక్కుని ప్రయాణం. చేసే అనుభవం లేదు యింతవరకూ, అయితే కొత్త కొత్త అనుభవాలు పొందాలనే 'నవతరానికి. చెందినవాడే అయినా యిప్పుడు మాత్రం అలాంటి కోరిక లేదు సత్తిరాజుకి. అంచేత బయటికి రావాలి, వచ్చేటప్పుడు ఏ ఆర్భాటం లేకుండా. బయటపడాలి అని సిర్ణయించుకున్నాడు. ఆడవాళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువే అయినా రైలు. పెట్టెలో సీటు కిందినించి పాకుతూ బయటికొచ్చి మగవాడిని చూసి ఏ ఆడదైనా భయపడుతుందన్న విషయం .మాత్రం తెలుసతనికి. అందుకని పరిస్థితుల్ని అంచనా వేసి బయటపడేందుకు సన్నాహం చేసే దిశలో ముందుగా తల బయటికి పెట్టి చుట్టూచూశాడు.

అంతా బాగానే వున్నట్టు కనిపించింది. ఎదుటి సీటులో కూచున్నావిడ పేపరు చదవడంలో నిమగ్నమైంది. యోగాసనాల్లో అపారమైన అనుభవం వున్నవాడిలా చడీ చప్పుడూ కాకుండా అవయవాల్ని కూడదీసి బయటికి లాగుకుంటూ మూలకున్న సీట్లోకి గెంతేసి పోయి కూచున్నాడు. ఆవిడగారలా 'పేపరు చదువుకుంటూనే వుండిపోయింది,

ఇంతకుముందు పది పదిహేను నిమిషాలపాటు జరిగిన సంఘటనల మూలాన మద్రాసులో స్పెషలిస్టు చెప్పిన విషయం మరుగునపడింది సత్తిరాజుకి. తీరిగ్గా యిప్పుడు కూచుని ఆలోచిస్తుంటే తన మొదటిరోజు కార్యక్రమంలో చాలా వెనకబిడ్డానన్న విషయం గుర్తుకొచ్చింది. రోజూ ముచ్చటగా ముగ్గురు కొత్తవాళ్ళని పలకరించి మాట్లాడుతుండమని ఆ స్పెషలిస్టు చెప్పాడు కానీ తనీరోజు కేవలం ఒకే ఒక్క మనిషితో మాట్లాడాడు, అయితే ఆ వ్యక్తి వింతగా వుండటం మూలాన నిజాయితీగా వ్యవహరించనివాడు ఆ చక్రవర్తిని యిద్దరు మనుషులుగా కాకపోయినా కనీసం స్మోరు కారులో ఒకటిన్నరగా లెక్క వేసుకునేవాడు. భాగోతుల వంశపు నిజాయితీ సత్తిరాజు: రక్తంలో ప్రవహిస్తోంది కనక తప్పుడు లెక్కలు వెయ్యలేదు మావాడు.

అంచేత ధైర్యం కూడగట్టుకుని కర్తవ్యాన్ని ఆచరణలో పెట్టేందుకు గొంతు సవరించుకున్నాడు,

'ఆ- హుమ్మ్‌+ అన్నాడు సత్తిరాజు.

అలా మొదలుపెట్టి తోటి ప్యాసింజరు వైపునించి వలాంటి. చలనం వస్తుందా అని ముఖమంతా. సంతోషం పులుము కుంటూ ఎదురుచూశాడు. సత్తిరాజు నత్తి నివారణ 10 సరదాగా కాసేపు

తోటి ప్యాసింజరునించి వచ్చిన చలనమల్లా కూచున్న చోటునించి ఏడెనిమిది అంగుళాల ఎత్తుకి పైకగరడం మాత్రమే. చేతులో వున్న పేపరు కిందికి పారేసి. పాలిపోయిన ముఖంతో భయం భయంగా సత్తిరాజు వంక చూసిందావిడ. హిమాలయాల్లో వంటరిగా తపస్సు చేసుకుంటుంటే గడ్డకట్టిన మంచులో మానవమాక్రుడి పాదాల గుర్తులు కనిపించిన బుషిపుంగవుడితో ఆమె పరిస్థితిని మనం పోల్చవచ్చు. ఇంతసేపూ తను వంటరిగా వున్నానని తలుస్తుంటే. అమాంతం ఏదో గొంతు వినిపించినందుకు ఆశ్చర్యపడింది. ఆమె ముఖం మారింది కాని నోట్లోంచి మాట బయటికి రాలేదు.

ఆ సమయంలో మావాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. వాచిలో టైము చూసుకున్నాడు, అయిదు గంటలు కావస్తోంది. ఈ టైములో ఆడవాళ్ళు టీ తాగేందుకు యిష్టపడతారని తెలుసతనికి. అదృష్టవశాత్తు సంచీలో ఫ్లాస్కునిండా టీతోపాటు తెనాలిలో కొన్న చేగోడీలు, చిక్మిలాలూ వున్నాయి.

_ "క్షమించాలి, వేడి వేడి టీ ఓ కప్పు తాగుతారాండీ?* అని అడగాలనుకున్నాడు, అయితే ఎప్పట్లా ఆడవాళ్ళని చూడగానే సిగ్గు, బిడియం ముంచుకొచ్చి రాత్రిళ్ళు బొద్దెంకలు చేసేంత చప్పుడు మాత్రం అతని గొంతులోంచి బయటికొచ్చి ముందుకు 'సాగలేకపోయాడు.

ఆవిడైతే యింకా సత్తిరాజుని అలాగే రెప్పలు వాల్చకుండా చూస్తూ కూచుంది, కళ్ళు టెన్నిస్‌ బాలంత సైజుకి వుబ్చినాయి, అవసానదశలో వున్న ఆస్తమా రోగిలా ఏగశ్వాస వస్తోందిప్పుడు ఆవిడగారినించి. మా భాగోతుల వంశీకులందరిలా సత్తిరాజుకి కూడా అకస్మాత్తుగా సమయానికి మంచి ఆలోచన తట్టింది. 'చెప్పదలుచుకున్నది మాటల రూపంలో కన్నా పాటగా చెబితే మంచిదని మద్రాసులో 'స్పెషలిస్టు యిచ్చిన సలహా గుర్తుకొచ్చింది. పాట పాడుతూ చెప్పు - అదీ తన ముందున్న తక్షణ కర్తవ్యం,

సమయం వృధా చెయ్యలేదు సత్తిరాజు,

“అందమైన బాలా ఆవుపాల చాయా, విందుగా పసందుగా చాయ అందుకోవ్నా కోవా ,/ !

అదీ వినగానే ఆమె ముఖం కాస్తా ఆకుపచ్చరంగుకి మారటంతో ఆశ్చర్యపడి, సంగతి వివరంగా. చెప్పాలనుకుని వాట పాడటం మొదలెట్టాడు,

“అదిగదిగో థర్మాస్‌ వ్లాస్కూ అందమైన. థర్మాస్‌ వ్లస్కు ఇదిగిదిగో వేడి వేడి ఆవుపాల చాయి ఫ్లాస్మునిండ వున్నదోయీ, అదిగదిగో థర్మాస్‌ వ్లాస్కూ అందమైన థర్నాస్‌ వాస్కు ఇదిగిదిగో వేడి వేడి. ఆవుపాల చాయి వ్లాస్కునిండ వున్నదోయీ, మనకోసమె చాయంత్నా మనకోసమె చేగోడ్మీ మనకోసమె: చక్కిలమూ, ఎందరెందరో కలలు కనే చాయంతా మనకే, మాకొకింత గ్లాసులో పోయనా?"

ఇంత గొప్పగా సంతోషంతో టీకి ఎవ్వరూ ఆహ్వానించలేరని అంటే మిరు నాతో తప్పకుండా ఏకీభవిస్తారు. అయితే మా సత్తిరాజు వుద్దేశించి పాడిన వ్యక్తిలో ఏమాత్రం చలనం కనబడలేదు. నరకయాతన పడుతున్నట్టు చివరిసారిగా మావాడి వైపు చూసి సీటులోకి వారిగిపోయి గుడ్డు తేలేసిందావిడ: పెదిమలు బూడిదరంగులోకి తిరిగి అటూ సరదాగా కాసేపు క్షే సత్తిరాజు నత్తి నివారణ

యిటూ: మెల్లగా కదిలాయి. 'గేలాన్ని తగులుకుని తన్నుకుంటున్న చేపలా మొహం పద్దందామ!

సత్తిరాజు మూలకి జారబడి అలోచిస్తూ కూచున్నాడు. ఎంతసేపు ఆలోచించినా తనని వుత్తేజపరిచే, హుషారెక్కించే, ఆనందం కలిగించే, సంతోషపరిచే విషయం ఒక్కటి కూడా తట్టలేదు. రైలు రేపల్లే పరిసరాలకి చేరుతోంది. సుపరిచితమైన ప్రదేశాలు కనిపించాయి. వూరు దగ్గర పడుతుంటే సుజన గుర్తుకొచ్చి భావావెశానికి లోనయ్యాడు, భావావేశానికి లోనయినప్పుడల్లా మావాడికి ఆకలేస్తుంది. తెనాలి స్టేషన్లో కొన్న చేగోడీల ప్యాకెట్‌ అందుకున్నాడు లేచి, థర్మాస్‌ వ్లాస్ము మూత తిప్పి కప్పులో టీ పోసుకున్నాడు. సీటు మిద ఫ్లాస్కు పెట్టి టీ తాగడం మొదలెట్టాడు,

తోటి 'ప్రయాణీకురాలి వంక ఒకసారి చూశాడు. ఆవిడగారి కళ్ళింకా మూతపడే వున్నాయి, తెరుచుకునున్న నోట్లోంచి నిట్టూర్పులు బయటికొస్తున్నాయి. టీ తాగుతారా అని మరోసారి అడుగుదామనుకున్నాడు కానీ అతనికిప్పుడు గుర్తుకొచ్చిన ట్యూనల్లా - శేషశైలావాస ్రీవేంకటేశా - అన్నది మాత్రమే. ఆ ట్యూన్‌లో టీ. తాగుతారా, చేగోడీలు తింటారా అన్న పదాల్ని యిమద్చడం కష్టమనుకుని తింటూ బయటి ప్రకృతిని తిలకిస్తూ

ఇక్కడొక విషయం చెప్పాలి - రేపల్లె రైల్వే 'స్టేషన్‌ 'సమిపిస్తుంటే బెటర్‌ దాటిన తరవాత పట్టాలు మూడో నాలుగో బ్రేకులుగా విడిపోతాయి. అప్పుడు పాయింట్సు మాదుగా వెళ్ళే బండి సడన్‌గా కుదుపులకి లోనవుతుంది. అకస్మాత్తుగా వచ్చిన కుదుపులకి చేతిలో వున్నవి పడిపోడం సహజంగా అందరికీ అనుభవమే టీ తాగుతూ, చేగోడీలు నములు తున్నందుకు సీటు కొనకి పెట్టిన వ్లాస్కు విషయం సత్తిరాజు మర్చిపోయాడు. దాంతో రైలు పాయింట్సుని దాటుతుంటే 'వచ్చిన పెద్ద కుదుపుకి ప్రాణం పోసుకున్నదానిలా ఆ వ్లాస్కు పైకెగురుకుంటూ పోయి కిందపడి బాంబు "పేలినట్టు ఢధామ్మని ముక్కలైంది.

ఆ చప్పుడుకి సత్తిరాజు హడలిపోయాడు, చేతులో వున్న చేగోడీల ప్యాకెట్టు ఎగురుకుంటూ కిటికీలోంచి బయటికి దూసుకుపోయింది. వరసగా మూడుసార్లు గుడ్లు మిటకరించాడు. నోట్లోంచి వూడిపడేందుకు గుండెకాయ చేసిన ప్రయత్నంలో ముందుపన్ను కదిలింది.

ఎదురుగా వున్న ఆడ ప్యాసింజరు ఆ చప్పుడుకి మరీ బెదిరిపోయింది. ఒక్క గావుకేక పెట్టి సీటు మిద కూచున్నదల్లా తారాజువ్వలా. ఎగిరి ఆలారం గొలుసు లాగి కిందికొచ్చి కూచుంది. ఇంతకుముందొకసారి ఆవిడలా మంచి. జంప్‌ చేసింది, అయితే యిప్పుడావిడ దాన్ని దాదాపు అడుగున్నర 'పైగా అధిగమించి. వుంటుందని చెప్పవచ్చు. కూచుని చేసే హై జంపు పోటీల్లో రికార్దెంతో నాకు తెలీదుగాని దాన్ని ఆవిడ బద్దలు సత్తిరాజు నత్తి నివారణ 12 'సరదాగా' కాసేపు

కొట్టిందన్నది మాత్రం సత్యం. మా సత్తిరాజే కనక ఒలింపిక్‌ ఆటలకి సెలెక్షన్‌ కమిటీలో వుండుంటే కళ్ళు మూసుకుని ఆవిడని సెలెక్ట్‌ చేసేవాడు. క్రీడాభిమానులైన రైల్వేవారు కేవలం యాఖై రూపాయలకే అలారం చెయిను లాగొచ్చని ప్రకటించినా దాన్ని వుపయోగించేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ, పైగా లాగటాన్ని చూసినవాళ్ళ సంఖ్య మరీ తక్కువ, అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందన్న అవగాహన చాలామందికి లేనేలేదు.. చెయిను లాగితే జరిగే తతంగం సత్తిరాజు ప్రకారం యిలా వుంటుంది: మొదటగా అమాంతం బ్రేకులు పడినందుకు చెవులు చిల్లులు పడేంత హోరుతో శబ్దం వస్తుంది, ఆ తరవాత రైలు ఆగుతుంది. దాంతో, ఏమైందో తెలుసుకోవాలనే కుతూహలంతో జనం నేల నాలుగుచెరలనించీ వుత్సాహంగా వచ్చిపడతారు, రేపల్లె స్టేషనుకి మైలున్నర దూరంలో జరిగింది యా సంఘటన, ఒక నిమిషం ముందు కనుచూపు మేరలో వొట్టి వరిచేలూ, చెరుకు చేలూ తప్ప మరేమి కనిపించలేదు. ఎప్పుడైతే గట్టిగా చప్పుడు చేస్తూ రైలు ఆగకూడని చోట ఆగిందో అన్ని దిక్కుల్నించీ మనుషులు పరుగెత్తుకుంటూ రావడం కనబడింది. మన సత్తిరాజు బుర్ర ఆ సమయంలో తన న్వాధీనంలో లేదు కనక అతను చెప్పిందాన్ని మనం పూర్తిగా విశ్వసించలేకపోవచ్చు; కానీ నాకతను చెప్పిన ప్రకారం ఖాళీగా వున్న చిన్న మైదానంలోంచి యిరవై ఏడుగురు రైతు కూలీలు అమాంతం వచ్చారట, నేలలోంచి స్వయంభృవులై వుదృవించారట. ఇంతవరకూ ఖాళీగా వున్న పట్టాలు జనంతో కిక్కిరిసిపోవటం చూసిన సత్తిరాజుకి దేశంలో వుపాధిలేనివాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిందనిపించింది. నేల యీనినట్టు దేశంలో వున్న రైతు కూలీల జనాభా అంతా అక్కడే తిష్ట వేసుకున్నారనిపించింది. 'తెనాలిలో ఖాళీగా కనిపించిన రైలు యిప్పుడు ప్రతి బోగీలోంచి ప్యాసింజర్లని దింపుతోంది. ఇలాంటి మాబ్‌ సీను కనక సినిమావాళ్ళు చూస్తే వదిలేవాళ్ళు కాదు, సంతోషంగా చంకలు కొట్టుకునేవారట.. అయితే. సత్తిరాజు బుర్ర తన 'స్వాధీనంలో లేదని నేను ముందే చెప్పానన్నది గుర్తుంచుకోవాలి మనం. అలాంటి సందర్భంలో మెరికలాంటి కుర్రాడు ఎలా మసలుకోవాలో సరిగా అంచనా వెయ్యలేము. నా ప్రకారం యిలాంటి హఠాత్పరిణామాలని ఎదుర్మునేందుకు ఆత్మస్థెర్యమూ, నిగ్రహమూ కావాలి. అలాంటి శక్తి సామర్ధ్యాలు సత్తిరాజుకి. లేవని తడుముకోకుండా చెప్పగలను. ఈ పరిస్థితిలో అతని బుర్రకి ఆచరణలో 'పెట్టగల ఒకే ఒక వుపాయం స్ఫురించింది. అది - అక్కడినించి జారుకోడం; అది కూడా వీలైనంత త్వరగా. గుండెల్నిండా గట్టిగా వూపిరి పీల్చి పరుగు లంఘించుకున్నాడు. సత్తిరాజు. సరదాగా: కాసేపు 13 సత్తిరాజు నత్తి నివారణ

మా భాగోతులవారందరూ మంచి (క్రీడాకారులు, అందులోనూ సత్తిరాజు కాలేజీ రోజుల్లో పరుగుపందాల్లో దిట్ట. అందుకే లోగడ ఎప్పుడూ పరిగెత్తనంత వేగంగా పరుగెత్తటం మొదలెట్టాడు. పంటచేలకి అడ్డంబడి పోతుంటే సత్తిరాజుని చూసిన. కుందేలొకటి అసూయతో వొళ్లు మండుతూ తనవంక చూసిందని సత్తిరాజు చెప్పాడు కానీ, నాకైతే కొంత అతిశయోక్తి కనిపించింది అందులో, ఇంతకుముందే మనవి చేసినట్లు ఆ సమయంలో సత్తిరాజు చాలా వుద్వేగంలో వున్నాడు. ఏదేమైనా అలా చాలా దూరం పరిగెత్తుకు వెళ్ళాడన్నదాంట్లో సందేహం. ఏమాత్రం లేదు. అలా: పరుగెత్తడానికి కారణం -- ఆ కూలీలందరూ ముందు కొంచెం తికమకపడ్డా విషయం (గ్రహించి వెంటనే అతన్ని వెంబడించారు. ఆ మనిషిని కట్టేసి కుళ్ళపొడవాలని వాళ్ళల్లో వాళ్ళు తీర్మానించుకోడం సత్తిరాజు చెవులదాకా వచ్చింది. దానికితోడు పచ్చగా సస్యశ్యామలంగా: వున్న పొలాలన్నీ యిప్పుడు నల్లటి రూపాలతో వున్న జనంతో నిండిపోయాయి. 'పైగా గడ్డం పెంచుకుని తలపాగా చుట్టుకునున్న మనిషాకడు చేతులో గడ్డపాఅ పట్టుకుని ముందుండి జనాల్ని నడిపిస్తున్నాడు - అంటే నా వుద్దేశ్యం పరుగెత్తిస్తు న్నాడు అని, సత్తిరాజు ఠక్కున కుడివైపుకి తిరిగి కంటికొలకుల్లోంచి వెంబడిస్తున్న జనాన్ని చూసి అసహ్యించుకున్నాడు,.. అందులోనూ ఆ గడ్డపాణ. పట్టుకున్నవాడ్ని చూస్తే మరీ వొళ్ళు కంపరం పుట్టింది. . . అలా ఎంతదూరం, ఎంతసేపు అందరూ పరుగెత్తారో, వెంబడించారో ప్రత్యక్షంగా చూసినవాళ్ళే చెప్పగలరు. నాకు ఆ ప్రాతం బాగా పరిచయం 'కనక మావాడు చెప్పిందాన్ని ఒకటికి రెండుసార్లు తబిసీలు చేసి చూశాను. అబద్ధం కనిపించలేదు, అతను చాలా దూరం పరిగెత్తాడని బుజువైంది. అందులో పొలాలకి అడ్డంపడి గట్లవెంట పరుగెత్తుతుంటే ఎక్కడికి: వెడుతున్నామో ఎటు, వెడుతున్నామో తెలుసుకోడం కష్టం కూడా అంతదూరం వెళ్ళినందుకు వాంటిక్షి మంచి వ్యాయామం మాత్రం చిక్కిందని సంతోషంతో చెప్పుకోవచ్చు. ఎంత మంచి వ్యాయామం అయినా ఎప్పుడో ఒకప్పుడు ముగించాల్సిందే కనక సూర్యుడు ఎర్రబారి అస్తమించే సమయానికి వూరి గుడి గోపురం దూరన్నించి కనిపించింది సత్తిరాజుకి. కాస్త ముందుకెళ్ళగానే వూరి బయటున్న కాఫీ హోటలు కిళ్ళి కొట్టూ, మరింత ముందుకెళ్ళగానె శివాలయం వీధిలో వున్న తన యిల్లూ కనబడ్డంతో వేటగాళ్ళ బారినించి తప్పించుకు న్న్య గంలా సంతోషంతో కేరింతలు కొట్టాడుసత్తిరాజు. ఆ సమయంలో మావాడు చాలా వుద్వేగంలో వున్నాడని నెను చెప్పింది మరవకూడని విషయం. నెమ్మదిగా కాల్లో కాలు 'వేసుకుంటూ చిరపరిచితమైన యింట్లోకి ప్రవేశించి తనకిష్టమైన పడక్కుర్చ్పీలో చేరగిలపడ్డాడు, ఒక్క క్షణం అలా గడిపి విశ్రాంతికన్నా తనకిప్పుడు ముఖ్యమైంది మరోటుందని గుర్తుకొచ్చి బెడ్‌రూములోకెళ్ళి గ్లాసు నిండా బ్రాంది వొంపుకుని తాగాడు. అది కానిచ్చి మరోసారి. గ్లాసు నింపుకుని ముందురూములోకి వచ్చాడు. ఆ రూములో అతనిప్పుడు వంటరిగా: లేడు. సన్నగా: పొడుగ్గా నాజూగ్గా సత్రిరాజు నత్తి నివారణ 14 సరదాగా: కాసేపు

తెల్లటి మల్లెపూవులాంటి చీరె కట్టుకున్న యువతి బల్ల మీదున్న (బ్రౌను నిఘంటువు, శబ్దరత్నాకరాల్ని తిరగేస్తూ నుంచునుంది.

అతన్ని చూసి ఆశ్చర్యపడింది.

'ఏమైందండీ సత్తిరాజుగారూ మా: బట్టలు చిరిగి పోగులైనాయి, ముక్కలు ముక్కలైనాయ్యి. చీరికలైనాయి. దాంతో షాటు. మీ జుట్టు కూడా చెదిరింది, చెరిగింది, దువ్వుకోలేదు, వెండ్రుకలు వదులుగా వేలాడుతున్నాయి - కారణం ఏవిటి?" అని అడిగింది పదబంధపారిజాతపు పరిభాషలో,

దానికతను చిరునవ్వు నవ్వి, “చాలా కరెక్టుగా చెప్పారు మిరు. ఇవి కాక అలసట, నిస్త్రాణ, బడలిక, నిస్తేజం, సొమ్మ మూలాన చాలా బాధపడుతున్నానండీ” అంటూ ఆ భాషలోనే జవాబిచ్చాడు.

దానికామె 'అయ్యో, అయాం సారి" అని నెమ్మదిగా గొణిగింది. “నాకెంతో బాధగా, విచారంగా, కుమిలిపోతున్నట్టుగా, వ్యధగా, జాలిగా, మనస్తాపంగా వుంది సత్తిరాజుగారూ, అంది.

వెంటనె సత్తిరాజు ఆమె చెయ్యి అందుకున్నాడు. జాలిపడుతూ ఆమె తియ్యగా అన్న మాటలు తన రుగ్నతకి ఏంతోకాలం నించీ ఎదురుచూసిన మందులా పనిచేశాయి. రోజంతా అనుభవించిన కష్టాల మూలాన అనురాగంతో ఆమె పలికిన పలుకులు సత్వర రోగనివారిణి చర్యలా ప్రభావం చూపాయి.. ఇప్పుడు తను నత్తివాడు కాదన్సీ ఆ జాద్యం తనని 'వదిలేసిందనీ మెరుపు మెరిసినట్టు గ్రహించాడు భద్రిరాజు, “విష్వక్సేనుడు తస్మస్టంభంభొట్లు! అని పలకమంటే వెనకా ముంధూ ఆలోచించకుండా. పలికి వుందెవాడిప్పుడు,

కానీ అంతకన్నా మరెన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పాలి తను. 'మరండీ. సుజనగారండీ, సుజీ అని పిలుస్తా మీరేమి అనుకోనంటే” అంటూ "ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడతని గొంతు కంచు ఘంటలా ఆగకుండా: మోగుతోంది, వడెక్కిన కారు రేడియటర్లా యింతకుముందంతా వూర్మే బుడగలొచ్చినట్టు మాట్లాడటం. గుర్తుకొచ్చి. విస్తుపోయాడు. “మామూలు 'స్నేహంలా' కాక నీమీద నాకు అపారమైన 'గౌరవం, అభిమానం వున్నాయని నువ్వీపాటికి గ్రహించే వుంటావనుకుంటా, సుజీ, యిప్పటి దాకానా హృదయంలో కొట్టుకునేది నువ్వంటే నాకున్న (ప్రేమే అని నమ్ము ఈ (ప్రేమ అన్నది ముందొక చిన్న బీజంగా విత్తుకుని, నా గుండెల్లో వటవృక్షంలా పాతుకుని, మహాజ్వాలలా వ్యాపించి, దాని వుత్తుంగ తరంగాలు నాలో పీఠం వేసుకునున్న బిడియాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతనీ, సంకోచాన్నీ భస్మీపటలం చేశాయి. ఇప్పుడు నా హృదయం మంగళగిరి దేవాలయపు ఎత్తెన గోపుర శిఖరాగ్రం మాద కూచున్న పక్షి పిలుపులా, “నువ్వ నాదానివి, నా ప్రేయసివి! కాలం మొదలైనరోజునే నాకోసం సృష్టించబడినదానివి!” అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి 'చెప్పుతోంది. నడిసముద్రంలో. తుషాను తాకిడి వల్ల అలల్లో చిక్కుకున్న నావికుడికి ఆశాకిరణంగా, సంతోషంగా యింటికి చేరేందుకు దారి చూపించే నక్షత్రంలా - జీవితంలో వొడి దుడుకుల్ని ఏదుర్మునప్పుడు, “సత్తీ అధైర్యపడకు, సరదాగా. కాసేపు 15 సత్తిరాజు నత్తి నివారణ

నేనున్నానుగా!” అంటూ నువ్వు నాకు దారి చూపిస్తావు. సుజీ, నేను మితభాషిని, మనసులో వున్నదంతా మాటల్లో 'పెట్టలేను. అయినా యిప్పటిదాకా నా నోటినించి వెలువడిన యీ చిన్నచిన్న వాక్యాలు '- నువ్వంటే నాకున్న (ప్రేమని తెలిపేందుకు నా గుండెలోతుల్లోంచి ప్రవహించిన భావాలు, సుజ్మీ ఐ లవ్‌ యూ; మరి నా భార్యగా, అర్జాంగిగా, (ప్రేయసిగా, సహధర్మచారిణిగా, జీవిత భాగన్వామిగ్మా సహచరిణిగా వుండేందుకు నీకు అభ్యంతరం లేదనుకుంటా?” అంటూ ముగించాడు.

“ఓ నా సత్తీ! లేదంటే లేదు. నీతో పెళ్ళికి నిస్సందేహంగా, నిరభ్యంతరంగా, తిరుగులేకుండా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నా! అంది సిగ్గుపడుతూ

ఆమెని, దగ్గిరికి తీసుకుని పొదివి పట్టుకున్నాడు. అతనలా తీసుకోగానే బయట వీధిలోంచి మనుషులు 'పరుగెత్తుకొస్తున్న చప్పుడూ, మాటలూ వినిపించాయి, కిటికీ దగ్గిరకి పరిగెత్తాడు సత్తిరాజు, వీధిమూలన వూర సుబ్బారావు అంగడి ముందు గడ్డపాజ ని జెండాలా పట్టుకున్న మనిషీ, వెనకాల పెద్ద జనసందోహమూ కనిపించాయి.

'సుజీ డార్లింగ్‌, కొన్ని అనివార్య కారణాల మూలంగాన్తూ, ప్రత్యేకమైన స్వంత పని మీదా కాసేపు నిన్ను విడిచి వెళ్ళడం తప్పనిసరి అయింది. తరవాత కలుస్తావా మరి నన్ను?! అని అడిగాడు,

“నీకోసం ఎంతదూరమైనా వస్తా, పుడమి అంచులదాకా అయినా సరే, నా సత్తీ* అని జవాబిచ్చింది అనురాగం వుట్టిపడే గొంతుతో సుజన,

“అంత త్యాగం అక్కర్లదు 'సుజీ. నేను గొడ్లదొడ్డిలో గడ్డివామి వెనకాల ఓ అరగంటసేపు దాక్కునుంటా, నువ్వేమి అనుకోనంటే, ఈలోపల ఎవరన్నా వచ్చి నన్ను గురించి అడిగితే నేను లేనని చెప్పాలి, అంతే.”

'ఓ తప్పకుండా తప్పకుండా. సత్తీ అన్నట్టు నేనొచ్చిందీ ఎందుకో. తెలుసా, సేద్యానికి .వుపయోగపడే పనిముట్టు - బండి “ర' లేక శకటరేఫంతో అంతమయ్యే నాలుగక్షరాల పదం నీకు తెలుసేమో. కనుక్కుందాని వచ్చా.

“దాని పేరు గడ్డపాజ., కానీ ఆ పనిముట్టు 'సేద్యానికే పరిమితం కాదని అనుభవమ్మిద తెలిసింది కనక చెబుతున్నా మిరు నా మాటలు నమ్మండి, నమ్మకపోండిగాని ఆరోజునించీ మా సత్తిరాజుకి నత్తి అనేది లేశ్యం కూడా లేకుండా పోయింది. 'పెద్ద పెద్ద రాజకీయవేత్తలు నిర్వహించే సభల్లో యిప్పుడతన్ని పిలిచి వుపన్యాసాలు యిప్పిస్తుంటే అనర్గళంగా 'ప్రసంగిస్తున్నాడు. అందాకా ఎందుక్కు కిందటి ఆదివారం ఒక సభలో మైకు వదలకుండా వుంటే టమేటాలు విసిరి ఆపుచేయించారంటే సత్తిరాజు ఎంత ఎత్తుకు ఎదిగాడో మిరే గ్రహించుకోండి, అంటూ సూతరాజుగారు ముగించారు. ళా సత్తిరాజు నత్తి నివారణ 16 సరదాగా కాసేపు

ఆ₹30తి - ప్రశాంతి

పానకుటీరంలో ఆరోజుటి చర్చ కళారంగం వైపుకి మళ్ళింది: శ్రీ ఏకాంబరేశ్వర పిక్చర్‌ ప్యాలెస్‌లో నడుస్తున్న సినిమా 'సీతాదేవి సౌభాగ్యం" బాగుంద్యా చూడదగిందేనా అని అడిగాడొకాయన;

ఒక్కసినిమా కూడా వదలకుండా మొదటిరోజునే చూసే మా నారాయుడు లిక్కరు సర్వు చేస్తూ “చాలా బాగుందయ్యా: దాంట్లో ఓ పిచ్చి డాక్టరు సీత్రాదేవనే అమ్మాయిని అష్టకష్టాలు 'పెట్టి చివరికి యింతలావు పీతగా మార్చాలని చూస్తాడయ్యా! అంటూ సమాచారం అందించాడు.

ఆశ్చర్యం నించి తేరుకుని, 'సీతమ్మని పెద్దసైజు పీతమ్మగ్గా మార్చాలని. చూశాడా ఆ డాక్టరు?” అని మేమంతా ఒకేసారి అడిగాము.

“అవునయ్యా, పీతగానయ్యా, ఆ డాక్టరు వందలాది పీతల్ని పోగుచేసి రోట్లో పదేసి దంచుతూ వాటి (గ్రంధుల్ని మరగబెట్టి వడపోసి కషాయంగా మారుస్తాడు. ఆ కషాయాన్ని సూదిలోకెక్కించి సీతాదేవి వెన్నెముకలో. గుచ్చబోతుంటే రామాంజనేయులనే కుర్రాడు సమయానికి. అడ్డంవచ్చి ఆపేస్తాడయ్యా.!

'అలా ఎందుకు చేశాడతను?”

'ఎందుకంటేనండయ్యా, ఆ కుర్రాడు తను (ప్రేమిస్తున్న సీతాదేవనే కుర్రది పీతాదేవిగా మారిపోడంయిష్టంలేకనండయ్యా"

“అబ్బే మేమడిగింది - ఆ డాక్టరు సీతని పీతగా ఎందుకు మార్చాలని చూశాడూ అనయ్యా! అంటూ. అడిగాం మేము 'ముక్తకంఠంత్‌*,

'ఆ దాక్టరుకి ఆయమ్మాయంటే పడదయ్యా.!

నారాయుడు చెప్పింది యుక్తంగానే అగుపడి. దానిగురించే ఆలోచిస్తూ కూచున్నాం. కాసేపాగీ ఒకాయన అభ్యంతరం చెబుతున్నట్టు తల అడ్డంగా వూపాడు.

“ఏం సినిమాలో ఏవిటో, యిలాంటి కథలు నాకసలు నచ్చవు. రోజువారీ జీవితానికి యివి చాలా ధూరంగా వుంటాయి,” అన్నాడతను,

'మధ్యలో కలగజేసుకుంటున్నందుకు మన్నించాలి,” అంటూ వినిపించిందో గొంతు. భాగోతుల సూతరాజుగారు మా గుంపులో చేరినట్టు గ్రహించాం దాంతో,

సూతరాజుగారు యిలా అన్నారు; “మీరంతా కలిసి కూచుని ఏవేవో స్వంత విషయాలు మాట్లాడుకుంటుంటే మధ్యలో జోక్యం. చేసుకుంటున్నందుకు క్షమించాలి. అయితే యిప్పుడు మోరన్నది నా చెవిని పడింది కనక వచ్చాన్నేను. ఇదిగో ముఖ్యంగా మోరు - మోరన్న విషయం మిద వ్యక్తిగతంగా నాకు చాలా దృఢమైన అభిప్రాయాలు వున్నాయందీ, అదే, అలాంటివి రోజువారీ జీవితంలో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం. అన్న విషయం గురించండి. మనకున్న పరిమిత జ్ఞానంతో, అనుభవంతో దానికి జవాబెలా యివ్వగలుగుతామండీ? అసలు నేనోట్‌ అడుగుతా చెప్పండి - యిప్పటికిప్పుడు యీ క్షణాన ప్రపంచం మొత్తంలో వందలాది పడుచు కన్యలు పీతలుగా మారే. ప్రక్రియలో లేరని గ్యారంటీ ఏమిటండి? జనమంతా మూసపోసినట్టు యిలా ఒకే విధంగా ఆలోచిస్తుంటే నాకు చాలా:బాధగా వుంటుంది. అంచేత నేను కొంచెం కటువుగా మాట్టాడుతున్నందుకు మిరు మరోలా భావించకూడదని అర్ధిస్తున్నా మా పక్కింటాయన ఉండ్రాజు కృపానందంగారి తమ్ముడు శాంతికుమార్‌ జీవితంలో జరిగిన ఒక సంఘటనని కనక తీసుకుంటే మనం అనునిత్యం చూసే వాటికి అతని కథ భిన్నంగా, అవాస్తవికంగా తోస్తుంది. దాంతో నా నోటివెంట ఆ కథ విని నమ్మశక్యం కాదని మహా మహా తెలిసిన వాళ్ళే నా మొహం మోద చెప్పారండి.

ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మనసు కదిలి సూతరాజుగారు స్కాచ్‌. విస్కీలో నిమ్మకాయ తొన వేసి, తెమ్మని నారాయుడిని పురమాయించారు.

_ *“ఉండ్రాజు కృపానందంగారి తమ్ముడు శాంతికుమారుకి ఏమైందండీ? అతను

కూడా పీతగా మారిపోయాడా?”

దానికాయన నిజాయితీ వు ట్లిపడుతున్న కళ్ళతో ఆ ప్రశ్న అడిగిన మనిషిని చూస్తూ, “లేదు, అతను పీతగా మారలేదు. శాంతికుమార్‌ పీతగా మార్చబిద్దాదని చాలా సులభంగా. మోకు నేను చెప్పివుండచ్చు. అయితే ఇంతవరకూ నాకు నిజం పలకడమే. అలవాటు -

ఆ మాటకొస్తే ఎప్పటికీ యదార్ధం తప్ప మరేది పలకగూడదని చిరకాలంగా నిశ్చయించు కున్నానండీ, మా పక్కింటి కృపానందంగారి తమ్ముడు ఉండ్రాజు శాంతికుమార్‌ పాలిట జరిగిన సంఘటన చాలా చిత్రమైనదండి, గొప్ప 'సాహసకృత్యం అని కూడా వర్ణించి చెప్పవచ్చండి, అన్నారు సూతరాజుగారు.

ఉండ్రాజు కృపానందంగారి కుటుంబ 'సభ్యులందర్లోకీ ఆయన తమ్ముడు శాంతికుమార్‌ (సూతరాజుగారు చెప్ప సాగారు) మంచి తెలివితేటలున్నవాడు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే అతను- ఏవేవో కెమికల్సు తీసుకుని ఏమేమో ప్రయోగాలు చేస్తుందేవాడు,. ఆ తరవాత యూనివర్సిటీలో కాలమంతా రసాయనశాస్త్ర పరిశోధనల్లో మునిగితేలాడు. దాంతో పిన్నవయసులోనే ఉండ్రాజువారి ఉత్కృష్ట బెషధాలు - ఉండ్రాజువారి చర్మ సౌందర్య రక్షిణి, ఉండ్రాజువారి హిమాలయా ఫేస్‌ క్రీం లాంటి 'పేటెంటు మందులకి గంపగుత్తగా వచ్చిన పేరు - కనిపెట్టి తయారుచేసినవాడిగా చాలా ప్రసిద్ధి చెందాడు. వాటిల్లో కొన్ని సౌందర్యం యినుమడింప చేసేందుకూ, మరికొన్ని శరీర దారుధ్యం పెంచేందుకూ, రుగ్మతలనీ, దీర్హకాలవ్యాధులనీ చికిత్స చేసేందుకు మందులూ - లెక్కలేకుండా అలా ఎన్నెన్నో వుండటంతో మందుల వ్యాపారంలో మంచి "పేరు సంపాదించుకున్నాడతను.

దానిమూలంగా సహజంగానే ఎప్పుడూ చూసినా అతను చాలా బిజీగా వుండేవాడు. కృషపానందంగారి వంశీకులందరిలా శాంతికుమార్‌ కూడా చూడ్డానికి చక్కగా వుంటాడు. అయినా ముప్పయ్యొకటో ఏడు వచ్చినా ఎవరికన్నా మనసు యివ్వటం కానీ అసలు ఆడవాళ్ళతో (ప్రమేయం పెట్టుకోవడం కానీ ఏరగడు. దానికి కారణం యిలా అస్తమానం కేవలం పనిలో మునిగిపోవడం వల్లనే, అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓసారి అసలు ఆడవాళ్ళ గురించి ఆలోచన చేసేందుకు. తనకు వ్యవధే లేదు. అని అనడం యింకా గుర్తుంది నాకు,

అయితే మనమందరం యిలాంటి విషయాల్లో కాస్త ముందూ వెనగ్గా వుంటాం. దృథఢసంకల్పంతో వుండే శాంతికుమార్‌ లాంటివాళ్ళు కొంచెం లేటుగా (ప్రేమలో పడతారు. పని వత్తిడి నించి కాస్త విశ్రాంతి పొందుదామని ఒక ఏడాది సిమ్లా వెళ్ళాడు. తను వుంటున్న హోటల్లోనే బస చేసిన కుమారి చెరుకూరి ప్రశాంతిని కలిసి ఆకర్షితుడై ఆమె మిద మనసు పారేసుకున్నాడు.

ప్రశాంతిది చలాకీగా, కలివిడిగా వుండే మనస్తత్వం. అసలు ముఖ్యంగా అతన్ని ఆకర్షించింది - పచ్చగా నిగనిగలాదే ఆమె వంటి రంగూ, గుండ్రటి ముఖంలో దానిమ్మపండు రంగులో మెరిసే ఆమె చెక్కిళ్ళు అని శాంతికుమార్‌ నాకోసారి వివరించి చెప్పాడు.. అంతేకాదు ఆమెతో పెళ్ళి ప్రస్తావన తేవటం, అందుకామె అంగీకారం యివ్వటం' సరదాగా కాసేపు శే శాంతీ - ప్రశాంతి

జరిగిన రోజున తన మిద అతనికి మేమ కలగటానికి ప్రధానమైన కారణం ఏమిటని అడిగినప్పుడు కూడా (ప్రశాంతికి యిదే విషయం చెప్పాడతను.

దాంతో కుమారి ప్రశాంతి, 'ఈ మెరుపు చెక్కిళ్ళు, దానిమ్మపండు రంగు ఎంతకాలం వుంటాయండీ, మావూరు వెళ్ళగానే మళ్ళీ మామూలు రంగులోకి తిరిగొస్తాయవి. ఈ రంగు శాశ్వతంగా వుండటానికి ఏం చేయాలో తెలిస్తే ఎంత బాగుండును కదా,” అంది,

ఇలాంటి అత్యంత రమణీయమైన ప్రణయ ఘట్టంలోనూ శాంతికుమార్‌ తనాక పేటెంటు మందుల వ్యాపారిననే విషయం మరిచిపోలేదు.

ఆమెతో యిలా అన్నాడు; “చూడండి, దానికి మిరు దిగులుపడాల్సిన పనిలేదు, ఉంద్రాజువారి ముఖ సౌందర్య రక్షిణి వాడండి. అది రేండు రకాల సైజుల్లో దొరుకుతుంది

  • చిన్నది అనగా రూపాయిన్నర డబ్బాగానూ, పెద్దది నాలుగు రూపాయల డబ్బాగానూ దొరుకుతుంది మార్కెట్లో పెద్దదాంట్లో చిన్నదానికన్నా మూడురెట్లు ఎక్కువుంటుంది ఆ లేపనం. దాన్ని రోజూ రాత్రిళ్ళు పడుకునేముందు చిన్న పొడిగుడ్డతోనో, స్పాంజితోనో ముఖానికి పట్టించాలి... దాన్ని వాడి లబ్ది పొందిన సినిమా తారలూ, ఎంతోమంది ఐశ్వర్యవంతులూ యిచ్చిన ప్రశంసాపత్రాలు ఆఫిసులో వున్నాయి. ఆసక్తి వున్న వాళ్ళు వెళ్ళి అక్కడ తనిఖీ చేసుకోవచ్చండీ. .

“నిజంగా మంచి గుణం చూపిస్తుందా అది?

'దాన్ని కనిపెట్టిందీ, తయారుచేసిందీ నేనేనండీ,” అన్నాడు శాంతికుమార్‌ నిరాడంబరంగా.

“మికెన్ని తెలివితేటలో! మిమ్మల్ని పెళ్ళి చేసుకునే ఏ యువతైనా నిజంగా గర్వపడాలి.”

'దానిదేముందండి, అన్నాడు వినయంగా చేతులూపి కొట్టిపారేస్తూ శాంతికుమార్‌.

“ఏదేమైనా మాతో పెళ్ళికి యిష్టపడుతున్నానని నా బాగోగులు చూసుకుంటున్న గ్రార్జియనుకి కనక నేను చెబితే తక్షణం మండిపడతాడు.*

“ఎందుకు?

'చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు, చెరుకూరివారి ఆస్తి అంతా నాకు సంక్రమించింది. చిన్నప్పటినించి నా గార్జియనుగా వున్న ఆ 'పెద్దమనిషికి తన కొడుకు భూపతిని నాకిచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక.

.. శాంతికుమార్‌ ఆమెని దగ్గిరికి తీసుకుని మొహమంతా ముద్దులతో ముంచి సవాలు చేస్తున్నట్టు చిన్నగా నవ్వాడు.

“తానొకటి తలిస్తే దైవం యింకోటి తలుస్తుంది అంటారు యిందుకే,! అన్నాడు మహా సులభమైనదిగా ఎంచుతూ.

(ప్రశాంతి సిమ్లా విడిచిపెట్టి వెళ్ళిన కొన్ని వారాల తరవాత శాంతికుమార్‌ తన వూరికి చేరుకున్నప్పుడు ఆమె చెప్పిందే గుర్తుకొచ్చింది. ఒకరోజు ముందుగదిలో కూచుని శాంతి -- ప్రశాంతి 20 'సరదాగ్గా 'కాసేపు

రామచిలకల గొంతు బొంగురుపోతే వాడటానికి ఏలాంటి మందులు తయారు చెయ్యాలా అని దీర్శంగా ఆలోచిస్తూ కూచునుంటే నౌకరు అంజయ్య ఎవరిదో విజిటింగ్‌ కార్డు ఆ కార్డు మాద - జావుబహదూట్‌ జాజానగజం టాఘవజావు అని రాసున్నది చదువుకున్నాడు. ఆ పేరు రాసిన విధానం తమాషాగా వుండటమే కాదు అసలు అలాంటి "పేరు వున్న వ్యక్తి అతనికి పరిచయం కూడా కాదు. ఎటూ తేల్పుకోలేక సరే ఆయన్ని లోపలికి పంపించు అని చెప్పాడు. కాసేపటికి చెక్కుతీసిన కందగడ్డ రంగున్న వెడల్పాటి ముఖంతో యింతలావు భారీ కాయాన్ని మోసుకుంటూ ఆ వ్యక్తి లోపలికొచ్చాడు.. అలాంటి ముఖంతో వున్న మనిషి సాధారణంగా వుల్లాసంగా, వుత్సాహంగ్గా వుండాలి, కానీ ఈయన కాస్తా ముఖంలో చాలా విషాదం పులుముకుని వస్తున్నట్టు కనబడింది శాంతికుమార్‌కి. “రావుబహదూర్‌ రాజానగరం రాఘవరావుగారా మిరు? అని అడిగాడు శాంతికుమార్‌, “జావుబహదూట్‌ జాజానగజం జాఘవజావు,' అంటూ సవరించాడు. వుచ్చారణలో వున్న దోషాన్ని అతని తీక్షణమైన చెవులు కనిపెట్టాయి. “ఓహో అలాగా, మా పేరుని బండి 'రీ తో రాస్తారా మిరు?' “ఒక్కబండి “ర కాదు, మొత్తం బిరుదుతో సహా ఆరు బండి రాలు వుంటాయి. 'మిరిలా మా యిల్లు పావనం చేయటానికి కారణం ,.* “కుమారి ప్రశాంతి నా సంరక్షణలోనే వుంటుంది. “ఓహో అలాగా, మారెలా వున్నారు? కొంచెం విస్కీ సోడా పుచ్చుకుంటారా?' 'అడిగినందుకు థ్యాంక్స్‌, వద్దు. నేను వాటికి దూరం గా వుంటాను. అవి తాగటంతో నా బరువు పెరుగుతోందని (గ్రహించి మానేశాను. అంతేకాదు దాంతోపాటు --నెయ్యి, నూనె, వెన్న బంగ్లాళాదుంపలు వగైరా వగైరాలన్నీ వదిలేశాను. కానీ నేను వచ్చిన పని...* అంటూ సగంలో ఆగిపోయాడు. లావుపాటివాళ్ళు తమ ఆరోగ్యం గురించీ, లావు తగ్గటానికి ఆహార పానీయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, మెళకువలు పాటించాలో వర్ణించి చెప్పే అవకాశం పోయినందుకు బాధ పడుతుంటారు, ఈయన కూడా అలానే మొహం చిట్లించుకుని చెప్పసాగాడు, 'నేను వచ్చిన పని ఏవిటంటే -: యిదేదో మర్యాద కోసం రాలేదు నేను, అంచేత వూర్మే కబుర్లు చెబుతూ మి సమయాన్ని వృధా చెయ్య దల్చుకోలేదు. శాంతికుమార్‌గ్గారూ, 'మోకొక సందేశాన్ని పట్టకొచ్చాను. ప్రశాంతి నించి. “దేవుడు చల్లగా చూడాలా పిల్లని, జాఘవటావుగాజూ, ఆ పిల్ణంటే నాకు మహా యిష్టమండి, రోజురోజుకీ ప్రేమ యినుమడిస్తోంది తప్ప తగ్గటం లేదండీ.” “ఓహో అలాగా? సరే అదంతా జరిగిపోయిన కథ, ఆమెని మరిచిపొమ్మని చెప్పటానికే సరదాగా కాసేపు 2 శాంతి -. ప్రశాంతి

“ఏవిటీ?”

“అదంతా ముగిసిపోయింది. మాతో తెగతెంపులు చేసేముందు తను చాలా గాఢంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని చెప్పి రమ్మంది,"

శాంతికుమార్‌ కళ్ళు చిట్లించాడు. ఈ 'పెద్దమనిషి తన కొడుక్కి ప్రశాంతిని అంటగట్టేందుకు చూస్తున్నాడని ఆమె చెప్పిన సంగతి మరిచిపోలేదు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా యితన్ని నమ్మకూడదనుకుని లోతుగా పరిశీలిస్తూ చూశాడు అతనివంక, తను చదివే డిటెక్టివ్‌ కథల్లో వుల్లాసంగా. కనిపిస్తూ ఎర్రటి ముఖంతో యింతలావున్న మనుషులు చివరికి మానవరూపంలో వున్న రాక్షసుల్లాంటి వాళ్ళనీ, ముఖం చూసి మోసపోగుడదనీ తెలుసతనికి,

“నిజంగానా?” అంటూ అడిగాడు నిర్లిప్తంగా. “అయినా విషయం ఆమె నోటివెంట వినడమే నాకు ప్రధానమండీ.”

“ప్రశాంతి మమ్మల్ని కలవదు, అయినా మోరిలాంటి పరిస్థితి తీసుకొస్తారని ముందే వూహించి ఆమె నుంచి వుత్తరం తెచ్చాను చూసుకోండి. ఆమె దస్తూరి మిరు గుర్తుపట్ట గలరనుకుంటా?]

శాంతికుమార్‌ వుత్తరం తీసుకుని చూశాడు... అది ప్రశాంతి దస్తూరే కాక, చధువు తుంటే ఆమె రాసింది అతను చెప్పిన ప్రకారమే వుందని, తెలుసుకున్నాడు. వుత్తరం చదవటం ముగించి ఆయనకి తిరిగిస్తుంటే శాంతికుమార్‌ ముఖం కఠినంగా మారింది.

“బలవంతంగా రాయించే. వుత్తరాలు కూడా: కొన్ని వుంటాయని మికు తెలుసుగా,”

అది విని ఆ రావబహదూర్‌గారి ఎర్రటి మొహం కాస్తా బూడిదరంగులోకి మారింది.

“అంటే, మిరనేదేమిటి?”

“అదే? యిప్పుడు చెప్పిందేనండీ.”

“నన్నె మిరు అను మానిస్తున్నట్వ లీ

“అవును మిమ్మల్నే”

“ఏమిటిది, భీ ఛా!

'నావైపునుంచి కూడా మోకు. భ్మీ ఛాగ్‌ అన్నాడు శాంతికుమార్‌, 'అంతేకాదు, మరో విషయం కూడా తెలుసుకోండి మరు - మీ పేరుని వెర్రి వెధవలా బండి “ర” తో కాకుండా అందరిలా మామూలు “ర” తో రాసుకుంటే మంచిదని, హితవు చెబుతున్నా

దెబ్బ తగిలినట్టయి ఆ రావుబహదూర్‌గారు గభాల్న లేచి వెనక్కి చూడకుండా. వెళ్ళిపోయాడు,

తన జీవితాన్నంతా కెమికల్‌ రిసెర్చికే అంకితం చేసినా శాంతికుమార్‌ వూర్మే కలలు కంటూ కూర్చునే మనిషి కాడు. అవసరం కనక వస్తే కార్యాచరణలో ఎవరికీ

వెనుదీయడు. ఆ పెద్దమనిషి అలా వెళ్ళాడో లేదో వెంటనే లేచి ఎప్పుడూ వెళ్ళే సీనియర్‌ టెస్ట్‌ ట్యూబ్స్‌ క్లబ్బు -. మహాత్మాగాంధీ రోడ్డులో పేరుమోసిన రసాయన శాస్త్రజ్టులందరూ కలుస్తుండే క్షబ్బుకి బయట్దేరాడు, అక్కడ వాళ్ళనీ వీళ్ళనీ కలిసి సేకరించిన సమాచారం ప్రకారం జావుబహదూత్‌ జాజానగజం జాఘవటావు తూర్పు గోదావరి జిల్లాలో జాజా నగజం అనే వూరికి జమిందారనీ, అతని దేవిడీ ఆ వూరికి కొంచెం దూరంలో వుంటుందనీ తెలుసుకున్నాడు, కావలసిన సమాచారమంతా 'సేకరించాడతను. దాంతో తన ప్రశాంతి ఆ దేవిడీలోనే గృహ నిర్బంధంలో వున్నదనే నిర్ణయానికొచ్చాడు,

అసలామెని ఏక్కడో ఒకచోట బందీగా వుంచారన్నదాంట్లో అతనికి సందేహమే కలగలేదు. ఆమె రాసినట్టు పంపించిన వుత్తరం కూడా నిర్బంధంలో వుంచి బలవంతాన రాయించారు అన్నదాంట్లో కూడా అతనికి అనుమానం లేదు. ఉత్తరంలో దసూరి ప్రశాంతిదే అయినా రాసిన విధానం కాన్సీ వాడిన పదాలు కానీ, కనబరచిన వైఖరి కానీ, అభిప్రాయాలు కానీ ఆమె స్వంతం కావు అని శాంతికుమార్‌కి గట్టి నమ్మకం ఏర్పడింది. తను ముందెప్పుడో చదివిన కథలో హీరోయిన్‌ వెనకాల నుంచుని ఎవరో ఒక చేత్తో కత్తీ మరో చేత్తో విషం సీసా పట్టుకుని ఆమె చేత బలవంతంగా అలాగే చేయించారు - ఆమె ప్రమేయం లేకుండా ఆమె యిష్టానికి వ్యతిరేకంగా, అంచేత ఆ రావుబహదూరుగాడు ప్రశాంతి చేత బహుశా. అలానే చేయించి వుంటాదనుకున్నాడు,

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తుంటే వుత్తరంలో. తన గురించి రెండో 'పేరాలో రాసినవన్నిటికీ ఆమె బాధ్యురాలు కాదని, తోచింది శాంతికుమార్‌కి. అంతేకాదు వుత్తరం చివర్సో - విధేయురాలు, సి.హెచ్‌. ప్రశాంతి అంటూ ముగించటంలో ఆమెను తప్పుపట్ట లేదతను. రావుబహదూర్హు జమాందార్లు విషం నింపున్న సీసాలోనూ, కత్తులోనూ వెనక నుంచుని రాయిస్తుంటే ఆమె మాత్రం ఏం చెయ్యగలదు, పదాల్ని సరిగా ఏరుకుని రాయడం కష్టంగదా? అర్ధవంతంగా రాయడానికి అలాంటివి ప్రతిబంధకాలేగా అని అనుకున్నాడు.

ఆరోజు మధ్నాన్నం రైలెక్కి శాంతికుమార్‌ ఆ వూరికి బయళల్టేరాడు. సాయంత్రాని కల్లా రాఘవరావు జమిందారిలో వున్న జాజానగజం చేరి. "స్టేషనుకి దగ్గర్లో వున్న చిన్న హోటల్లో బస చేశాడు. ఆరోజు రాత్రే చీకట్లో దేవిడీని వెతుక్కుంటూ వెళ్ళి గేటు దాటి లోపలున్న తోటలోకి చేరి దూరంగా యింటి చుట్టూ తిరుగుతూ ఎక్కడినించైనా శబ్దాలు వినబదడతాయేమో అని చెవులు రిక్కించుకుని వినసాగాడు.

అలా యింటి చుట్టూ తిరుగుతుంటే కాసేపటికి పై అంతస్థులో వున్న గది కిటికీలోంచి ఎవరిదో గొంతు వినిపించింది. అది వినేసరికల్లా శాంతికుమార్‌ స్థాణువైపోయి ప్రాణం వుగ్గబట్టుకుని అటువైపే చూస్తూ నుంచున్నాడు.

అతనికి వినబడ్డది ఎవరో ఆడమనిషి ఏడుస్తున్న గొంతు, సరదాగా. కాసేపు 22 శాంతి + ప్రశాంతి

ఆరోజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూచుని మర్నాడు 'తెల్లారేసరికల్లా తను. జరపవలసిన కార్యక్రమానికి పధకం తయారు చేసుకున్నాడు శాంతికుమర్‌. రావుబహదూర్‌ రాఘవరావుగారి'నౌకరు కల్లో సారానో తాగటానికి అప్పుడప్పుడు వూళ్ళోకి వచ్చి కాసేపు గడుపుతుండటం గమనించి. నెమ్మదిగా అతనితో పరిచయం 'సంపాదించు కున్నాడు, మొత్తానికి తాగడానికి డబ్బులిస్తూ, మంచిగా మాట్లాడుతూ ఒకరకమైన 'స్నేహం అలవరుచుకున్నాడు అతనితో. ఆ వివరాలన్నీ చెబుతూ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదండీ నేను, చివరికి జరిగిందేమిటంటే వారం రోజుల పాటు అలా గడిపిన తరవాత ఆ నౌకరుకి భారీగా. కొంత డబ్బు ముట్టచెప్పి - 'మేనత్త మంచాన పడింది, పదిరోజుల పాటు మా వూరెళ్ళాస్తాను, అయినా తవంరికి యిబ్బంది కలగకుండా మా వేలువిడిచిన తమ్ముడు నా బదులు కొలువు చేస్తాదని దివాణంలో చెప్పి వెళ్ళిపొమ్మని చెప్పాడతనికి శాంతికుమార్‌, ఈ వేలు విడిచిన తమ్ముడు మరెవరో కాదు శాంతికుమారేనని విజ్ఞులైన మారు యిప్పటికే గ్రహించి వుంటారు. అయితే నల్లటి వుంగరాల జుట్టు, మంచి ముఖవర్సస్సుతో పాటు కొద్దికాలం ముందు రసాయనశాస్త్రంలో కొత్త పుంతలు శొక్కి కం +03427 - అని బుజువుపరిచి అందర్నీ దిగ్భాంతి చేసిన శాస్త్రజ్డుడికి యితనికీ అసలు పోలికే లేదు,తను ధైర్యంగా తీసుకున్న నిర్ణయంలో అపాయాలు వుండగలవన్న ముందుచూపుతో వూరు నించి బయళ్లేరు తున్నప్పుడే తెల్ల జుట్టున్న విగ్గు, నల్లటి కళ్ళద్దాలు డ్రామా షాపులో కొనుక్కుని వెంట తెచ్చుకున్నాడు. అయితే (యిప్పుడు నిర్వర్తించబోయే భూమికకి నల్లటి కళ్ళద్దాలు మాత్రం పనికిరావు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని'తిరిగే నౌకర్షి చూడగానే ఎంతటి అమాయక జమిందారుకైనా అనుమానం రావటం తథ్యం, అందుకని శాంతికుమార్‌ యిప్పుడు చేసిందల్లా విగ్గు తగిలించుకుని, మీసాలు గొరిగేసి ముఖానికింత ఉండ్రాజువారి బంజారా ఫేస్‌ క్రీము రాసుకోవడం: మాత్రమే. అలా తయారై శాంతికుమార్‌ జాజానగఅం జమిీందారుగారి దివాణానికి బయల్దేరాడు. బయటినుంచి చూస్తుంటే ఆ దివాణం పాడుపడినట్టు చికటి చీకటిగా విషాదం నింపుకున్నట్టుగా, భయంకర నేరాలకి ఆలవాలంలా కనిపించింది అతని కళ్ళకి. ఇంటి చుట్టూ కాసెపు తిరిగి రాగానే దివాణం చుట్టూ వున్న ఆవరణలో శవం దొరికిన చోట పోలీసులు ఇన్‌టూ గుర్తులు పెట్టగలిగే ప్రదేశాలు కనీసం అరడజను వుండొచ్చని అంచనా వేశాడు శాంతికుమార్స్‌ ఇంటిముందు నక్కలు వూళలు వేయటం, తీతువు పిట్టలు అరవడం, రాత్రిళ్ళు కిటికీ వూచల వెనకాల సించి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించడం లాంటివి ఇలాంటి ప్రదేశాల్లోనే జరుగుతూ వుంటాయని తలపోశాడు, దివాణం లోపల కూడా పరిస్థితి అదే మాదిరిగా కనిపించింది.. అక్కడ పనిచేసే నౌకర్లు కూడా ఆ వాతావరణానికి తగ్గట్టుగానే కనబడ్డారు, వంటింట్లో ముసలి వంటావిడ పొయ్యి మాది బూర్లెమూకుడులోకి వొంగుని దాంట్లోకి అవీ యివీ వేస్తుంటే - టూరింగు శాంతి -- ప్రశాంతి లజ సరదాగా కాసేపు

నాటకాలవాళ్ళ బాలనాగమ్మ నాటకంలో కాళికాదేవి విగ్రహం ముందు నుంచుని మాయల ఫకీరు హోమంలో అవీ యివీ చల్లుతున్నట్టుగా అనిపించిందతనికి. రెండోవాడు బట్లరు సూర్నారాయణ - ఒక కంటికి గంతలాంటి నల్లటి పట్టీ కట్టుకుని, బాగున్న రెండో కంటిసిండా కుళ్ళు నింపుకుని పొడుగ్గా, లావుగా భయంకరంగా వున్నాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఏదుర్మున్నప్పుడు చాలామంది. భయమేసి పారిపోతారు. శాంతికుమార్‌ అలాంటివాడు. కాదు. ఉందడ్రాజువారి వంశీకులందరిలా అతనిక్కూడా సింహానికున్నంత ధైర్యం వుంది. పైగా యిలాంటి విపత్మర పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే వూహించాడు కూడా... తను చేయవలసిన పనులేమిటో అడిగి తెలుసుకుని డ్యూటీలో చేది రెప్ప. వాల్చకుండా కనిపెడుతూ యిల్లంతా గమనించసాగాడు. అతని నిరిక్షణకి త్వరలోనే ఫలితం దొరికింది.

ఒకరోజు రాత్రి మసక వెలుతుర్లో గోడవారగా నక్కి నుంచుని చూస్తుంటే జమిందారు రాఘవరావు ట్రేలో భోజనం పళ్ళెం పెట్టుకుని మెట్లెక్కుతూ కనిపించాడు. నీడలా అతన్ని 'వెంటాడుతూ చూస్తే దాంట్లో చపాతీలు, కూర, పప్పు, అన్నం, గిన్నెలో సాంబారు, మినపగారెలు వగైరాలు వున్నట్లు గమనించాడు. గిన్నెలోంచి సాంబారు వాసన గుప్పున కొడుతోంది,

_ జమిందారుగారి. కంటపడకుండా చీకట్లో నక్కుతూ అలానే వెంబడిస్తూ వెడితే చివరకి యిద్దరూ పై అంతస్థుకి చేరుకున్నారు. అక్కడున్న గది బయట ఆ జమిందారు ఆగి నెమ్మదిగా మునివేళ్ళతో తలుపు తట్టాడు. తలుపు తెరుచుకుంది, వెంటనే ఒక చెయ్యి బయటికొచ్చింది, ట్రే మాయమైంది, తలుపు మూసుకుంది జమిందారు. కిందికి దిగటం మొదలెట్టాడు.

ఆయనతోబాటే శాంతికుమార్‌ కూడా వెనక్కి మళ్ళాడు. చూడవలసింది చూశాడు, కనిపెట్టవలసింది కనిపెట్టాడు. 'నౌకర్లుండే చోటుకి తిరిగొచ్చి బట్లరు సూర్షారాయణ విషాదంతో చూస్తుండగా ముందు ముందు తను చేయవలసిన కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మొదలెట్టాడు.

“ఎక్కడిఇళ్ళావ్‌ యింతసేపు?” అంటూ అడిగాడు సూర్దారాయణ అనుమానపడుతూ,

“ఎక్కడికీ. లేదు, వూర్కే కాస్త అటూ. యిటూ,” చెప్పాడు శాంతికుమార్‌ ధైర్యం కూడదీసుకుని. |

బాగున్న ఒక్క కంటితోనే సూర్నారాయణ భయంకరంగా చూశాదతనివంక,

కొరకొరలాదే చూపుతో బొంగురు గొంతుకతో, 'నువ్వు ఏక్కడుండాలో అక్కదే వుంటే మంచిది. దివాణంలో చూడకూడనివి కొన్ని వున్నాయి” అన్నాడు,

“హా, అవును] అంది వంటావిడ తరిగిన వుల్లిపాయ ముక్కల్ని నూనెలో వేస్తూ.

ఎంత చూపించకోకూడదని ప్రయత్నించినా కుదరక భయంతో వాణకిపోయాడు శాంతికుమార్‌, సరదాగా కాసేపు 25 శాంతి = (ప్రశాంతి

భయానికి వొణుకుతున్నా ఒక విషయంలో మాత్రం కొంత వుపశమనం చేకూరిందతనికి. తన ప్రియురాలిని ఆకలి కడుపుతో మాడ్చకుండా అక్కడివాళ్ళు బాగానే చూసుకుంటున్నారన్న భరోసా, ఇందాకటి ట్రేలోనించి మినపగారెల వాసనా, సాంబారు సువాసనా చాలా' గొప్పుగా వున్నాయని. గుర్తుకొచ్చింది; రోజూ యిలాంటి భోజన కార్యక్రమాలు వుంటే కనక ఆహార పానీయాల గురించి ఆమెకి ఎలాంటి చింత లేదను కానీ ఆ వుపశమననం చాలా కొద్దిసేపే నిలిచింది. భయంకరంగా. కనిపిస్తున్న అలాంటి యింట్లో చీకటి కొట్టులో తాళమేసి నిర్బంధంలో 'పెట్టుంచి యిష్టంలేని మనిషిని పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంటే - యిలాంటి మినపగారెలు, సాంబారు ఎంత రుచిగా వుంటే ఏం లాభం? అని తనకు తనే ప్రశ్నించుకున్నాడు, వాటి వల్ల ఏమాత్రం వుపయోగం లేదు. మనసు బాధపడుతుంటే మినపగారెలు కొంతవరకు ఆ బాధని తగ్గించవ చ్చుకానీ పూర్తిగా పోగొట్టలేవు. ఏది ఏమైనా, ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్మోవలసి వచ్చినా వీలైనంత త్వరలో ఆమెని బందీగా వుంచిన' గది తాళంచెవిని సంపాదించాలి, తను ఎంతగానో (ప్రేమిస్తున్న ప్రియురాలికి విముక్తి కలిగించాలి. ఆమె స్వేచ్చగా ఆనంధంలో మునిగి తేలాలి అని మనసులోనే. భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాడు శాంతికుమార్‌. అతను వేసుకున్న ప్రణాళికలో అన్నిటికన్నా గడ్డు సమస్య ఏమిటంటే ఆ గదికి తాళంచెవి ఎక్కడుందో తెలుసుకోడం. ఆరోజు రాత్రి జమాందారుగారు దైనింగ్‌ రూములో కూచుని భోజనం చేస్తుండగా శాంతికుమార్‌ ఆతి రహస్యంగా ఆయన పడక గదిలోకి దూరి రూమంతా గాలించాడు, ఏమి దొరకలేదు, దాంతో ఆ తాళించెవిని జమీందారు గారు ఎప్పుడూ జేబులోనే దాచుకుంటాడన్న నమ్మకానికి రావాల్సి వచ్చింది. మరది. దాన్ని సంపాదించడం ఏలా? శాంతికుమార్‌కి ఏం చేయాలో తోచలేదన్నది అతిశయోక్తి కాదు.. పరిశుద్ధమైన ఆక్సిజనుతో పొటాషియం. నైట్రేటు, టైనైట్రో టోలీన్‌ కలిపి బ్రాందీతో రంగరించి ఆ మిశ్రమాన్ని షాంపేను పేరుతో సీసా'నూరు డాలర్లు చొప్పున అమెరికాలో అమ్మవచ్చని కనిపెట్టి శాస్త్రజులందరినీ విస్మయంలో ముంచెత్తిన శాంతికుమార్‌ మేధస్సుకి యిది మాత్రం కొరకరాని సమస్య గానే మిగిలిషోయింది. అలా నెమ్మదిగా వారం రోజులు గడిచాయి. రోజు రోజుకీ ఆ యువకుడు చెప్పటానికి వీల్లేనంత నరకయాతన అనుభవించాడు. జీవితమంతా ఎప్పుడూ వెలుతురేనని ఎవరూ అనుకోరు, అందులోనూ నిండు జీవితంంలో ఒక చిన్న ఘట్టమైన కథని వర్ణిస్తున్నప్తుడు వెలుగుకి ఎంత ప్రాముఖ్యం యిచ్చామో చీకటికి కూడా అంతే ప్రాముఖ్యం యివ్వాల్సి వస్తుంది. అయినా రోజులు గడిచినకొద్దీ సమస్యకి ఏవిధమైన పరిష్కారం దొరక్కపోవటంతో శాంతికుమార్‌ మనసులో పడిన వ్యధని మికు చెప్పి విసిగించదలుచు శాంతి - ప్రశాంతి 26 సరదాగా! కాసేపు

కోలేదండి. మిరంతా తెలివైనవాళ్ళు కనక - చాలా చొరవ తీసుకుంటూ ముందు కొచ్చిన ఆ పడుచు (ప్రేమికుడు తన ప్రియురాలు ఎంత పై అంతస్టులో వున్నా, చీకటికొట్టులో బంధించి తనింత దగ్గిరగా వుండి కూడా. విడిపించలేనందుకు అతని 'హృదయం ఏంత. క్నోభించి వుంటుందో మిరే వూహించుకోగలరు. శాంతికుమార్‌ .కళ్ళు లోతుకుపోయాయి. సొట్ట పడిన బుగ్గలతో ముఖం పీక్కుపోయి ఏముకల గూడుగా మారాడు. ఇంత కాస్త వ్యవధిలో శరీరంలో కొట్టొచ్చినట్టు మార్పు కనబడి, ఓరోజు సాయంత్రం ఆ జాజానగజం జమిందారు ఒక పక్క ఆశ్చర్యపడుతూ మరో పక్క అసూయపడుతూ విమర్శలకి గురిచేశాడతన్ని. “ఇదిగో, నువ్వలా సన్నగా రివటలా ఏలా వుండగలిగి చస్తున్నావ్‌, ఓబులేసూ/ అంటూ అడిగాడా జమిందారు - శాంతికుమార్‌ అక్కడ కొలువులో చేరేందుకు పెట్టుకున్న మారుపేరు - ఓబులేసు. 'నిన్నటికి నిన్న ఈ వారపు ఖర్చులు. లెక్క చూస్తుంటే నువ్వు బకాసురుడి తమ్ముడిలా తింటున్నట్టు కనిపించింది; అయినా వొళ్ళు లావెక్కకుండా రోజురోజుకీ సన్నబడుతున్నావు. నన్ను చూడు -- పాలు, వెన్న, నెయ్యి, నూనె, బంగాళా దుంపలు వగైరాలు తినడం మానేసి రోజూ పడుకునేముందు కాస్తంత వుప్పు వేసిన వేడి వేడి నిమ్మకాయరసం తాగటం మొదలెట్టాను.. అంత చెసినా వెధవది పొద్దున బరువు చూసుకుంటే మరో వంద. గ్రాములు పెరిగింది కానీ తగ్గలేదు. నువ్వలా వుండటానికి కారణం ఏవిటో చెప్పి చావ అంటూ: అడిగాడు - చిన్నవాటి జమాందార్లందరిలా భాషలో ఏమాత్రం మర్యాద చూపించకుండా,

“అవునండి దొరగారూ,! అన్నాడు శాంతికుమార్‌ ఆలోచించకుండా,

“ఏవిటి నీ బోడి అర్ధం -- అవునండీ దొరగారూ అంటే?”

“లేదండీ దొరగారూ*

ఆ రావుబహదూర్‌ విచారంగా శ్వాస ఎగబీల్చి వదిలి చెప్పడం మొదలెట్టాడు:

(క్క విషయాన్ని నేను చాలా: లోతుగా పరిశీలించి చూస్తే ప్రపంచంలో అద్భుతమైనవని గొప్పగా చెప్పుకునే ఏడు వింతల్లో ఒకటిగా కనిపించింది నాకైతే... బొద్దుగా, లావుగా వుండే నౌకరుని, నువ్వెప్పుడన్నా చూశావా? చూసుండవు, నాకు తేలుసు. నువ్వే కాదు ఎవ్వరూ చూసుండరు, లావుపాటి 'నౌకరు అన్న 'ప్రసక్తే వుండదయ్యా: అయినా రోజంతా తింది తింటూనే వుంటారు వాళ్ళు, క్షణం వృధా చెయ్యకుండా, పొద్దున ఆరింటికి లేస్తాడో లేదో ఆరున్నరకల్లా చిక్కటి పాలు కలుపుకుని కాఫీయో. టీయో తాగుతూ నంచుకోడానికి బ్రెడ్డో రస్కులో తింటాడు. ఎనిమిదింటికల్లా ఇడ్లీలు, పెసరట్లూ వుష్మా వెన్న పూసుకుని బ్రెడ్డూ, జామూ'' వగైరా వగైరా. వాటిల్తోపాటు మళ్ళీ కాఫీ, టీ, పదకొండు కొట్టెసరికి యింకా కొంచెం వెన్న మరి కొంచెం జామూ బ్రెడ్డు. మధ్యాహ్నం భోజనం 'సంగతి చెప్పక్కర్లేదు - సుష్పుగా చికెను బిర్యాన్మీ మటను బిర్యానీ, కోడిగుడ్లు, చేపల పులుసు, రొయ్యలు వగైరాలతో మోగడ 'తేలే గడ్డ పెరుగు: అవన్నీ వాళ్ళు పెంచేవే కానీ, తగ్గించేవి కావు. కాస్త కునుకు

తీస్తాడో లేదో మళ్ళీ మూడింటికల్లా స్వీట్లు హాట్లు చిక్కటి పాలతో టీ. రాత్రి తొమ్మిది లోపల భోజనం - బంగాళాదుంపల వేపుడ్తూ, బిర్యానీ, మరికొంచెం బిర్యానీ, పదకొండు గంటలకి పడుకోబోయే ముందు గ్లాసుడు పాల్కు అర్ధరాత్రి ఆకలికి లేస్తే అనువుగా మంచం పక్షనే బిస్కట్ల ప్యాకెట్టు. ఇలా అస్తమానం తింటూనే వున్నా యింటి నౌకరు 'సన్నగా పొట్లకాయలా. వుంటాడు, మరి 'నేనేమో ఏళ్ళ. తరబడి. డయటింగ్‌ చెస్తున్నా నా బరువు నూట యరవై కిలోలకి ఏప్పుడూ తగ్గింది లేదు. 'పైగా వున్న జోడు గద్దాల కింద మూడో గడ్డం కూడా వచ్చేసింది. ఇదంతా విధి విచిత్రాలు, ఓబులేసూ,! “అవును దొరగారూ.

'సర్కే నీకో సంగతి చెబుతా విను. బొంబాయి నించి యింట్లో వాడుకునే టర్మిష్‌ బాత్‌ తెప్పిస్తున్నాను న్నానాల గదిలో యిమిడిపోయే స్టీమ్‌ బాత్‌ అది.. దానివల్ల కూడా వుపయోగం కనిపించలేదనుకో, యిహ నా ప్రయత్నాలన్నీ శుష్క దండగ అని మానేసి హాయిగా కూచుంటానయ్యా”

అనుకున్న ప్రకారం ఆ టర్మిష్‌ ఆవిరి బాత్‌ రానే వచ్చింది, ప్యాకింగ్‌ విప్పి దాన్ని జమిందారుగారు తన స్నానాల గదిలో అనువుగా అమర్చుకున్నాడు. సరిగ్గా మూడోరోజు రాత్రి నౌకర్లు విశ్రాంతి తీసుకునే గదిలో ఏదో ఆలోచిస్తూ శాంతికుమార్‌ పరధ్యానంగా వుండగా 'సూర్నారాయణ భగ్నం చేస్తూ లేపాడు,

“ఓయ్‌, యిదగో' నిన్న నిద్దర్లోంచి లే; జమిందారుగారు అడుగుతున్నారు నిన్ను! చెప్పాడు సూర్ష్నారాయణ,

  • ఒక్కవుదుటున. ఆలోచనల్లోంచి బయటికొచ్చి, 'ఏమని అడుగుతున్నారు?” అడిగాడు శాంతికుమార్‌, దాంతో కొరకరలాదే. చూపుల్తో, "పెడబొబ్బలు పెడుతూ నిన్ను పిలుస్తున్నారు” అన్నాడతను.

ఆమాట నిజమే, ఇంటి పై అంతస్టునంచి మనిషి ఛావుబతుకుల్లో కొట్టుమిట్టాడు తున్నట్టు వరసగా గావుకేకలు విని పిస్తున్నాయి, యజమాని జమాందారు. జాఘవజావు చావడానికి దగ్గిర్లో వున్నట్టు తోచడం వల్ల శాంతికుమార్‌ ఆ విషయంలో కలిగించుకో దల్చుకోలేదు; అయినా అతను కర్తవ్య పరాయణుడు అవడంతో ఆ దరిద్రపు కొంపలో తను వున్నన్నాళ్ళు, యజమాని జీతమిచ్చినంత కాలం. తన ధర్మాన్ని యథావిధిగా నెరవేర్చవలసిందేనని అనుకున్నాడు. వెంటనే పరుగెత్తుకుంటూ 'పైకి వెళ్ళాడు. జమిందారు గారి బెడ్రూములో అడుగుపెట్టగానే బాత్రూములో పెట్టున్న స్టీమ్‌ బాత్‌ మూత పైనించి ఆవిరికి వుడుకుతూ ఎర్రగా కమిలిపోయిన జమిందారు ముఖం కనిపించిందేతనికి. శాంతి -- ప్రశాంతి 2 సరదారా కాసేపు

అతన్ని చూడగానే ఆ జమిందారు కోపాన్నంతా వెళ్ళగక్కుతూ అడిగాడు. “వచ్చావా. నాయనా చివరికి! ఇదిగో చూడు, కాసేపటి క్రితం నన్నీ కాలి మిలో కూచోబెట్టి వెళ్ళేటప్పుడు ఏమేం అఘోరించి చచ్చావ్‌ దీంతో?! .

“దొరగార్హూ ఈ మెషినుతోబాటు వచ్చిన పాంఫెట్లో రాసున్న ప్రకారం తప్ప మరేమి చెయ్యలేదు, ముట్టుకోలేదు. దాంట్లో రాసినట్టు & అని మార్కు చేసున్న రాడ్‌ని 3 అని మార్కు పెట్టిన గాడిలోకి తోసి ఉఅన్న గడియతో బిగిస్తూ...

“నువ్వేదో కలగాపులగం చేసుంటావు తప్పకుండా, తలుపు బిగుసుకుపోయింది. ఇందులో యిరుక్కుపోయి బయటికి రాలేకుందడా వున్నా. ]

“ఇరుక్కుపోయి బయటికి. రాలేకుండా. వున్నారా?! ఆవేశంతో అరిచాడు శాంతికుమార్‌. క్ష్‌

'అవున్తు బయటికి రాలేకుండా వున్నాను. పైగా నిమిష నిమిషానికీ వేడి ఏక్కువైపోతూ అగ్నిగుండంలా మారుతోంది యీ ముదనష్టపుది.” ఆ జమిందారుగారు వుపయోగించిన భాషకి నా క్షమాపణలండీ, అయినా జమీందార్లు ఎంత పరుషంగా మాట్లాడుతారో మోకు తెలుసుగా. 'పుఠం పెట్టి నన్ను మగ్గేస్తున్నట్టుగా వుందయ్యా.'

వున్నట్టుండి శాంతికుమార్‌ ముఖం జ్ఞానోదయం కలిగినట్లు వెలిగిపోయింది.

'తమరిని నేను విడిపించి బయటికి తీసాను, దొరగారూ....”

'మరాపని త్వరగ్గా చేసీ చావు, వూం కదులు.

శాంతికుమార్‌ ఆ జమాందారుని తీక్షణంగా చూస్తూ, “అయితే ఒక్కషరతు మాద, ముందు. నాకా తాళంచెవి కావాలి]

'ఓరి దరిద్రపుగొట్టు మొహమ్మా దీనికసలు తాళమనేది వుంటేగదా: తాళంచెవి కావాల్సింది, 1 అన్న వెధవదేదో ౪ అన్న మరేదో వెధవదాంట్లో దూరిస్తే తెరుచుకుంటుంది, అంతే.

'నాకు కావలసిన తాళంచెవి మిరు కుమారి. చెరుకూరి ప్రశాంతిని బందీగా వుంచిన గది తాళానికండీ.! ఇ

'అసల్నీకు బుర్ర వుందా? నువ్వు మాట్లాడేదానికి అర్ధం ఏమన్నా వుందా? బాబోయ్‌!

"నేను మాట్లాడేదానికి అర్దం ఏమిటో యిప్పుడే విడమర్చి చెబుతా, జావుబహదూట్‌ అఆాజానగజం జాఘవళఖావ్‌. నేనెవరో తెలుసా, ఉండ్రాజు శాంతికుమార్‌ని!!

"గాడిదలా అవాకులు చెవాకులు 'పేలకు, శాంతికుమార్‌ది వుంగరాల జుట్టు, నల్లగా నిగనిగలాడుతుంటుంది.. నీదేమో. ముగ్గుబుట్టలా' 'పండిపోయింది, ఎవరి గురించో మాట్లాడుతున్నావ్‌ నువ్వు, బుద్ధిలేకుండా?”

“ఇదిగో నేను వేసుకున్నది విగ్గు, భారత్‌ [డ్రామా కంపెనీవాళ్ళది," అన్నాడు శాంతికుమార్‌ విగ్గు తీసేసి. చూపుడు వేలుతో జమిందారుని బెదిరిస్తూ పరుషంగా అన్నాడిలాః *'జావుబహదూట్‌ జాజానగఅం. జాఘవటావ్‌, ఇలాంటి అఘాయిత్యానికి సరదాగా కాసేపు ౧౮ శాంతి '- (ప్రశాంతి.

వొడిగడు తున్నప్పుడు ఈ ఉండ్రాజు శాంతికుమార్‌ నిన్ను దేగ కన్నుతో చూస్తుంటాడని పొరబాటున కూడా వూహించలేదు నువ్వు నీ ష్లానులన్నీ ఏమిటో ముందుగానే కనిపెట్టాను, వాటికిప్పుడు ఆట. కట్టించడం. నా వంతు. ఏదీ ఆ తాళంచెవి నాకివ్వు,

“జాక్షసుడు, వుచ్చారణా దోషాన్ని సవరించాడు. అలవాటు ప్రకారం ఆ జమిందారు.

'నా ప్రియురాలిని యీ దరద్రపుగొట్టు కొంపలో బందిఖానా నుంచి విడిపించి వీలైనంత త్వరలో రిజిస్టరు మ్యారేజి చేసుకుంటా.

వేడి వేడి ఆవిరిలో వాళ్ళు సలసలా కాగిపోతున్నా ఆ జమిందారు ముఖంలో నవ్వు చిందులు తొక్కింది.

'చేసుకుందామనుకుంటున్నావా; నిజంగానేనా?”

“అవును, నిజంగ్లానే.!

'అవున్ను నిజమేలే!

“తాళంచెవి యివ్వు”

“పిచ్చివాడా, నా దగ్గిర లేదది. తలుపుకే వుంది.”

“నువ్వు “హా, హా!” అంటూ హాహాకారాలు చేసి ప్రయోజనం లేదు.. తాళంచెవి తలుపుకే వుంది. ప్రశాంతి వున్న వైపున లోపలికి.”

“ఏర కధలు చెబుతున్నావయ్యా, 'నమ్మాలా? అయినా సమయం వృధా చేస్తూ యింకా యిక్కడే వుండన్నేను. తాళం చెవి ను వ్వ యివ్వకపోతే నేవెళ్ళి తలుపు విరగ్గాడత్మా అంతే.

“ఆ పనే చెయ్యి!” అంటూ ఆ జమాందారు నరకయాతన పడుతున్న జీవుడిలా నవ్వాడు. 'ఆ పిల్ల ఏమంటుందో నువ్వే చూస్తావులే.!

చిట్టచివర అతనన్న మాటలకి అర్ధం అంతు చిక్కలేదు శాంతికుమార్‌కి, ప్రశాంతి తనని చూడగానే ఏమంటుందో వూహించుకోగలనని అనుకున్నాడు. తను ఎప్పటికైనా వచ్చి రక్షిస్తాడని అనుకున్నానీ, తన నమ్మకాన్ని 'వమ్ము చేసే మనిషి కాదని 'తెలుసనీ చెబుతూ గుండె మాద తల ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తూ వుండే ప్రశాంతి రూపం మనసులో మెదిలింది. వెంటనే ఆమె వున్న గదికి పరుగెత్తటం మొదలెట్టాడు.

“ఇదిగో, ఏయ్‌ నిన్న! నన్ను యిందులోంచి బయటికి లాగవా?

“ప్రస్తుతానికి లేదు. మనసుని చల్లగా వుంచుకో, అని చెప్పి శాంతికుమార్‌ మెట్లు

ఆమెని వుంచిన గది తలుపు దగ్గిర నోరు ఆనించి, “ప్రశాంతీ, ప్రశాంతీ!! అంటూ అరిచాడు. శాంతి = ప్రశాంతి ఏ0 సరదాగా. కాసేపు

సుపరిచితమైన గొంతు లోపల్నించి, “ఎవరది?! అంటూ అడిగింది.

(ప్రశాంతీ, నేను - శాంతికుమార్‌ని. తలుపు విరగ్గొాడుతున్నాా దూరంగా జరుగు."

నాలుగడుగులు వెనక్కి వెసి ఆ తలుపుని బలంగా తన్నాడు, దాంతో తాళం వూడిపోగానే భళ్ళున చెక్కలు బద్దలై అతను లోపలికి దూకగ్గానే చీకటి గుయ్యారంలా వున్న ఆ గదిలో అతనికి ఏమీ కనిపించలేదు.

  • “ప్రశాంతీ, ఎక్కడున్నావ్‌ నువ్వ?!

'ఇక్కడున్నాను. నేనా. వుత్తరం రాసి పంపించినా యిక్కడికెందుకొచ్చావ్‌? గొంతులో ఏమాత్రం ఆప్యాయత చూపించకుండా అడిగిందామె, “వద్దని హెచ్చరించినా కొంతమంది. మగాళ్ళు యింతే, అర్ధం చేసుకోరు.” స

శాంతికుమార్‌ తూలిపద్డాడు, నుదురు కొట్టుకోకుండా వుంటే కింద 'పదుండేవాడు,

'ఆ వుత్తరమా? దాంట్లో నువ్వు రాసిందంతా నిజమనని' నమ్మమంటావా?” తత్తరపడుతూ. అడిగాడు శాంతికుమార్‌.

“అందులో రాసిన 'ప్రతిమాటా అక్షరాలా. నిజం యింకా మరింత ఎక్కువ. రాసుండాల్సింది నేను.

“కానీ - కానీ - కానీ - నువ్వ నన్ను ప్రేమించడంలేదా ప్రశాంతీ?!

నిన్ను ప్రేమించడమ్మా, నిన్ను? ఉండ్రాజువారి ముఖ సౌందర్య రక్షిణిని వాడమని ఉచిత సలహా యిచ్చిన మనిషిని నేను శ్రేమించడమా?"

“నువ్వేమంటున్నావో నాకు అర్ధమే కావటం లేదు.

“నీకు అర్ధమయ్యెట్టు చూపిన్తాను చూడు, ఉం(ద్రాజు శాంతికుమార్‌. జరిగిన అనర్ధం నువ్వే చూడిప్పుడు.”

వున్నట్టుండి గదిలో వెలుతురు చిమ్ముకుంది. స్విచ్చి మోద వేలు పెట్టి గోడ పక్కన (ప్రశాంతి నుంచునుంది. మహారాణీలా, ముచ్చటైన విగ్రహంతో అందాలు విరజిమ్ముతున్న ఆ పిల్లలో ఎంతటి ఘాటు విమర్శకుడైనా ఒక లోపాన్ని యిట్టే కనిపెట్టి వుండేవాడు. అది, ఆమె తల పూర్తిగా బట్టతల అయిన యదార్ధం.

శాంతికుమార్‌ ఆమె వంక పూజ్యభావంతో చూస్తూ నుంచున్నాడు. ఆమె ముఖం కొంతభాగం గచ్చకాయ రంగులో మరికొంతభాగం తెలుపురంగులో వుంది. హంసలాంటి మెడ మాదంతా బూడిదరంగూ, నలుపురంగూ కలిసిన మచ్చలు దస్తావేజుల్లో వేలిముద్రల్లా వ్యాపించి వున్నాయి.. అయినా: అతని కంటికి ఆమె. అప్సరసలా కనిపించింది. ఆమెసి దగ్గిరకి తీసుకుని గుండెకి హత్తుకోవాలనిపించింది. కానీ దగ్గిరకొస్తే ఏం చేస్తానో చూడు అన్నట్లు కళ్ళల్లోంచి విషం కక్కుతోంది కనక ఆగిపోయి ఆ పని చెయ్యలేదు.

“ఇదిగో నువ్వు చేసిన నిర్వాకం వల్ల నేను యీ దుస్థితికి దిగజారాను. ఉం(డ్రాజు శాంతికుమార్స్‌ నువ్వూ నీ ఉండ్రాజు వారి ముఖ సౌందర్య రక్షిణి చేసిన వుపకారం యిది. నువ్వు ముట్టుకోడానికి వువ్విళ్ళూరుతూ (ప్రేమించిన నా చర్మం వుందే, అదే యిది! సరదాగా కాసేపు వ శాంతి. - ప్రశాంతి

నీ సలహా ప్రకారం నాలుగు రూపాయలు ఖర్చుపెట్టి "పెద్ద డబ్బానే కొన్నాను, దాని ఫలితం ఏలా వుందో చూడిప్పుడు! ఆ మందు వాడిన ఇరవై నాలుగు గంటల్లో 'నేనెలా తయారైనానంటే ఫిజీ దీవుల్నించి తప్పించుకొచ్చిన మచ్చల రాజకుమారినని చెప్పి సరాసరి సర్మసు కంపెనీలో చేరుంటే ఎంత డబ్బు కావాలంటే అంత యిచ్చుండేవారు అభ్యంతరం లేకుండా. 'నేను చిన్నప్పుడు పుట్టి "పెరిగిన వూరికొచ్చి మొహం 'దాచుకోవాల్సిన గతి పట్టింది నాకు: ఇక్కడికి రాగానే ముందేం జరిగిందంటే...* గొంతు పూడుకుపోయి ప్రశాంతి, 'నాకు మహా యిష్టమైన వేటగుర్రం కాస్తా నన్ను చూడ్డానికే సిగ్గుపడి దాణా పెట్టే ముట్టేన్ని కొరికేసి ముక్కలు ముక్కలు చేస్తూ కూచుంది. పుట్టినప్పట్నించీ నేను అల్లారు ముద్దుగా సాకుతూ. పెంచుకున్న నా పెంపుడు కుక్క నా మొహాన్ని ఒక్కసారి చూసిందో లేదో భయపడిపోయి, యిప్పుడు. పశువుల ఆస్పత్రిలో చేరింది. ఇంకా అక్కడే వుంది, అది ఎప్పటి క్షీ తేరుకోలేదు బహుశా, దీనికంతటికీ కారణం నువ్వే నాకీ అవస్థ నీ మూలానే, సీ శాపం వల్లనే, మిస్టర్‌ ఉండ్రాజు శాంతికుమార్‌!!

ఈటెల్లా గుచ్చుకునే యిలాంటి మాటలు వింటే చాలామంది 'వాడిపోయి మూర్చ పోయుండేవారు,. కానీ శాంతికుమార్‌: మాత్రం ప్రగాఢమైన సానుభూతి వ్యక్తపరుస్తూ సహృదయంతో ఆమె బాధని అర్దం చేసుకుని సౌమ్యంగా చిరునవ్వు నవ్వాడు,

“మరేం: ఫరవాలేదు, ఆదుర్దా చెందాల్సిన. అవసరం కూడా లేదు. డార్లింగ్‌, ముందే ని న్ను హెచ్చరించి వుండాల్సింది నేను, చాలా సుకుమారంగా, నేవళంగా చర్మం వున్నవాళ్ళకి ఇలా అవడం కొన్ని కొన్ని సార్లు జరుగుతుంటుంది. దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఉండ్రాజువారి హిమాలయా లోషన్‌ని కనక వాడితే వెంటనే చర్మం మామూలు స్థితికి వచ్చేస్తుంది. మిడియం 'సైజు బాటిలు కేవలం మూడున్నర రూపాయలకే దొరుకుతుందిన

“శాంతికుమార్‌, నిజంగానే. అంటున్నావా?!

'నిజం, నూటికి నూరు శాతం నిజం నన్ను నమ్ము డార్లింగ్‌. ఇదొక్కటేనా మనిద్దరి మధ్య వున్న అడ్డంకి?!

వురుము వురిమినట్టు ఒక గొంతు, కాదు అంది.

అది విని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు శాంతికుమార్‌. తలుపు దగ్గర జావుబహదూట్‌ జాజానగజణం. జాఘవథావు నుంచుని వుండటం గమనించాడు. వొంటి చుట్టూ తువ్వాలు చుట్టుకుని వుండటంతో కనబడే తక్కిన భాగమంతా కమిలిపోయి ముదురు ఎరుపురంగులోకి తిరిగుంది. ఆయన వెనకాలే కొరడా ర్సుళిపిస్తూ నుంచున్నాడు ఆ దివాణం బట్లరు సూర్షారాయణ,.

'నన్నిం త తొందర్లో చూసావనుకోలేదు కదూ నువ్వు?” అడిగాడు జమీందారు,

దానికి శాంతికుమార్‌ కటువుగా, “ఒక ఆడదాని ముందు నిన్నిలా బట్టలు విప్పుకుని చూస్తానని మాత్రం. అనుకోలేదు,” అన్నాడు,

శాంతీ - (ప్రశాంతి బై 'సరదాగా' కాసేప్తు

“నా బట్టల సంగతి పక్కనపెట్టు,! అని వెనక్కి తిరిగి, 'సూర్నారాయణా, యింక నీ. పని కానివ్వు” అన్నాడా జమిందారు.

కొరకొరలాడే చూపులు చూస్తూ బట్లరు 'సూర్నారాయణ కొరడాతో లోపలికొచ్చాడు.

'ఆపెయ్యి, స్టాప్‌[ అంటూ గట్టిగా అరిచింది ప్రశాంతి అతన్ని వారిస్తూ,

ఆమెతో విభేదిస్తూ, “నేనింకా మొదలు "పెట్టనేలేదు, మేడం, అన్నాడా బట్లరు.

“శాంతికుమార్‌ మోద ఈగ వాలకూడదు. 'నేనతన్ని (ప్రేమిస్తున్నాను.'

“ఏవిటీ, ఇంత జరిగినాక కూడానా? గొంతు 'చించుకుంటూ అడిగాడు. జమిందారు.

“అవును. నాకతను పూర్తి సంజాయిషీ యిచ్చాడు,!

కందగడ్డలా మారిన అతని ముఖంలో గాఢమైన అసంతృప్తి కనిపించింది.

'ఆ దరిద్రపుగొట్టు స్టీం బాత్‌లో నేను పుఠం పెట్టినట్టు వుడికిపోతుంటే నన్ను బయటకి లాగకుండా ఎందుకు పారిపోయొచ్చాడో సంజాయిషీ యివ్వలేదని పందెం కడతా కావాలంటే. ఆ అఆవిరికి నా వొళ్ళంతా పాగ చిమ్ముతుంటే నా పాలి'కేకలు విని సమయానికి దెవుడిలా వచ్చి నన్నా నరకకూపం నించి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు మన సూర్నారాయణ.”

“అది నా పని కాకపోయినా కూడా! అంటూ దాన్ని పొడిగించాడా బట్లరు.

జమిందారు వైపు నిశితంగా చూస్తూ శాంతికుమార్‌ యిలా అన్నాడు; “మిరే కనక లావుపాటివారికి దివ్యాషధమైన ఉండ్రాజువారి చిక్కుడుమందుని డబ్బా మూడున్నర కొచ్చే గుళికెల రూపంలో కానీ, సీసా అయిదు రూపాయలకొచ్చే ద్రవాన్ని కానీ వాడి వుంటే మాకీ టర్మిష్‌ స్టీం బాత్‌లో మగ్గిపోతూ కూచుండే అవసరమే వచ్చుండేది కాదు. ఈ చిక్కుడుమందుతో మారు చిక్కిపోయి చిక్కుడుకాయలా' 'సన్నబడతారు.. పూర్తిగా ఆరోగ్యకరమైన వనమూలికలతో తయారు చేసిన ఈ జెషధంలో శరీరానికి కీడు కలిగించే రసాయనాలు లేనే లేవు. పైగా ఈ జెషధం వాడితే వొంట్లో వున్న కొవ్వు కరిగిపోయి వారానికి రెండు కిలోల చొప్పున బరువు తగ్గుతుందని గ్యారంటీ కూడా వుంది, జమాందార్హు, సినిమా యాక్టర్లు, ధనవంతులు అందరూ దీన్ని వాడి గుణం కనబడి ప్రశంసలు కురిపించారు,!

జమోందారుగారి ముఖంలో వున్న కోపం కాస్తా మంచులా కరిగిపోయింది,

“నువ్వు చెప్పింది నిజమేనంటావా?! అంటూ గొణిగాడు.

“ముమ్మాటికీ నిజం, నమ్మండి నన్ను.”

“గ్యారంటీ యి న్తావా?

“ఉండ్రాజువారి బజెషధాలన్నిటికీ పూర్తి గ్యారంటీ వుంటుంది. సరదాగా కాసేపు చేతే శాంతి = 'ప్రశాంతి.

'హారి పిడుగా!' అని అరిచి శాంతికుమార్‌ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మాటలు తడబడుత్తూ “మా అమ్మాయి ప్రశాంతి చెయ్యి అందుకో, దాంతో పాటు నా ఆశీర్వాదాలు కూడా అందుకో,” చెప్పాడు జమోందారు,

వెనకనించి చిన్నగా దగ్గినట్టు చప్పుడు వినిపించింది.

“వాతంతో నడుం పట్టుకుని బాధ పడేవాళ్ళకి కూడా. తమ దగ్గిర ఏదన్నా బెషధం వుందా అయ్యా?” అంటూ అడిగాడు బట్లరు సూర్నారాయణ మొహమాటపడుతూ,

'ఉండ్రాజువారి కటిబాధా విమోచనం వంతటి వాతాన్నయినా కేవలం ఆరు రోజుల్లో తగ్గించి వుపశమనం యిస్తుందయ్యా.! |

“దేవుడు చల్లగా చూడాలయ్యా మిమ్మల్ని పదికాలాలపాటు! అంటూ. బట్లరు సూర్షారాయణ కళ్ళు తుడుచుకున్నాడు. *1ఎక్కడ దొరుకుతుందయ్యా ఆ మందు?"

'అన్ని మంధుల షాపుల్లోనూ విరివిగా దొరుకుతుందది.'

(ముఖ్యంగా వీపు కింది భాగంలో పట్టుకున్నట్టు అవుతుందయ్యా నాకు.!

“ఇహమిాదట నిన్నది పట్టుకోదు” అన్నాడు శాంతికుమార్‌.

ఇంక మరి చెప్పే దుకు ఏమి మిగల్లేదండీ. నిఠారుగా నిలబడి 'పనులు చేసే బట్లరుగా సూర్నారాయణ జిల్లా మెత్తానికే ఆదర్శప్రాయంగా వున్నాడిప్పుడు, జమాందారు జావుబహదూట్‌ జాజానగఅణిం జాఘవజావు చిక్కుడుకాయలా సన్నబడి గంతులేయడం మొదలెట్టాడు. శాంతికుమారూ,. ప్రశాంతీ భార్యాభర్తలయారు. వీళ్ళ పెళ్ళి జరిగిన జూన్‌ నెలలో ఒకరోజు వుదయాన పచ్చగా మేలిమి బంగారంలా తళతళా మెరుస్తున్న ప్రశాంతి ముఖాన్ని పైకెత్తి బిషప్పుగారు, “శాంతికుమార్‌ అనే యీ యువకుడిని నీ జీవిత భాగస్వామిగా చేసుకుంటావా?" అని అడిగితే సిగ్గుపడుతూ “ేస్సుకుంటాో అని ఆమె బదులిచ్చినప్పుడు జాజానగజం చర్చలో గంటలు ఎప్పుడూ మోగనంత ఆనందంగా మోగాయని నాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు యిద్దరు బిడ్డల తల్లిదండ్రులు =- చిన్నది లావణ్య అనేది 'నర్సరీలో వుంది, పెద్దది కారుణ్య అనేది స్కూల్లో చదువుతోంది.

సూతరాజుగారు కథ ముగించి విస్కీ గ్లాసు ఖాళీ చేసి మాకు వీడ్కోలు చెబుతూ అక్కడినించి నిష్షమించారు.

ఆయన వెళ్ళగానే అక్కడంతా నిశ్శబ్దంగా వుండిపోయింది, వున్నవాళ్ళందరూ ప్రగాధంగా: ఆలోచిస్తూ కూచున్నారు. కాసేపటికి ఒకాయన లేచి నుంచున్నాడు.

“సరేమరి, అందరికీ గుడ్‌ నైట్‌ అ న్నాడతను,.

అతను పరిస్థితిని చక్కగా క్రోడీకరించినట్టు అనిపించింది మాకందరికీ. శాంతి .- ప్రశాంతి ల! సరదాగా. కాసేపు

బెస్స్‌ సెల్లర్‌ తో _భు దాకా మహా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వున్న మా పానకుటీరంలో ఆ నిట్టూర్పు నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా ఛేదించింది. ఏమయిందోనని తలలు పైకెత్తి చూస్తే మాకు లిక్కరు సర్వు చేసే నారాయుడు గ్లాసులు తుడిచే గుడ్డ బుజం మాద నించి తీసి దాంతో కళ్ళు వొత్తుకుంటున్నాడు. నారాయుడిది చాలా సున్నిత హృదయం, మేమంతా తననే. చూస్తున్నామని గ్రహించి నారాయుడు యిలా అన్నాడు: “తవం; రేమో: అనుకోబాకండయ్యా; ఆ దుర్నార్డుడు కానా ఆ పిల్లని వొదిలేసి అండమాను పారిపోయాడయ్యా. ఆమేమో యెన్నెల్లో గేటు కాడ నుంచుని పెదాలు బిగించుకుని యెక్కి యెక్కి ఏడ్చి వండిపోయిన కళ్ళతో సూత్తంది. ఆమె పడుతున్న బాదని అర్దం చేసుకున్నట్టు 'పెంపుడు కుక్క మాదికెగబడి 'సేతులు నాకిందయ్యా. అతనేమంటున్నాడో తెలీక మేమంతా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నాం. సూతరాజుగారు తన సహజ చాతుర్యంతో ఆ మిస్టరీని విడదీశారు. “శహోో అయితే 'నువ్వు “జ్ఞాపకాల వ్యధ” చదువుతున్నావనుకుంటా,; నచ్చిందా

“బెమ్మాండంగా .వుందండీ, ఓ. ఆడదాని మనసుని కత్తితో కోసి అందులోంచి ఆమె ఆత్మని బయట 'పెట్టినట్టుందండి," చెప్పాడు నారాయుడు.

“ఇంతకుముందు వచ్చిన నవలలాగానే వుంద్కా లేకపోతే నాణ్యత తగ్గినట్టు అసిపిస్తోందా? “విడిపోయిన దారులు” లాగా యిది కూడా అంత బాగా వుందనిపిస్తోందా? 7 “అంతకన్నా పావుందయ్యా.

విషయం యిప్పటికి అర్ధమైన బీరాస్వామి, 'ఓహో, నవల చదువుతున్నావా నువ్వు, నారాయుడూ? అని అడిగాడు.

“కొన్నేళ్ళ కిందట బహుళ (ప్రాచుర్యం పొందిన “విడిపోయిన దారులు” అనే నవల మోకు గుర్తే వుండొచ్చు. ఆ రచయిత్రి కలం నించి వెలువడిన సరికొత్త రచనండీ యిది. ఆమె రచనలంటే నాకు చాలా అభిమానం, ఏందుకంటే. తను మాయింటి కోడలే కనక.!

'మి యింటి కోడలా?!

“పెళ్ళయినాక కలిసిన చుట్టరికం. వ్యక్తిగత జీవితంలో యిప్పుడామె పేరు శ్రీమతి భాగోతుల సుశీలారాణీ నాగరాజు," నిమ్మకాయ తునక మునిగున్న విస్కీ గ్లాసు పూర్తిచేసి కాసేపు ఆలోచనలో పడ్డాడు సూతరాజుగారు.

'మా తమ్ముడుగ్గారబ్బాయి భాగోతుల నాగరాజు అతని భార్య సుశీలారాణి గురించిన వుదంతం. వినడానికి మికు యిష్టమే అనుకుంటా? వాళ్ళిద్దరిదీ సామాన్యమైన కథే, అలాంటివి అనునిత్యం. జరుగుతూనే వుంటాయి. అయితే యిది హృదయవిదారకమైన కథ, అయినా ఆసక్తికరంగా. వుంటుంది. మన నారాయుడిప్పుడు వుద్వేగ్గాన్నించి పూర్తిగా కోలుకుని నా గ్లాసుని కనక మరోసారి నింపితే మకా కథ వినిపిస్తా!

మా తమ్ముడుగారబ్బాయి భాగోతుల నాగరాజు ఒక ఏడాది జూన్‌ నెలలో రాత్రి పూట భీమునిపట్నం నుంచి వొడ్డున నుంచుని ప్రకృతి అందాలు తిలకిస్తున్న వైనర వూహించుకోమని చెబుతున్నా మికు (సూతరాజుగారు కథకి వుపక్ర మించారు). కొన్ని వారాల కిందట ఆ వూళ్ళోనే పరిచయమైన అనపర్తి సుశీలారాణి అతని పక్కన నుంచునుంది, ఎన్నో రోజులపాటు గుండెల్లో దాచుకున్న (ప్రశ్నని ఆరోజైనా' అమెతో ముచ్చటి ౦చాలని 'ప్రయత్నిస్తున్నాడు, అప్పటికి యిలా 'వందసార్లు ప్రయత్నించాడు కానీ ధైర్యం చాలక పోయిందతనికి, ఈరోజు కొంచెం హుషారుగా: వున్నందుకు గొంతు. సవరించుకుని చివరికి అడిగాడు.

“మిమ్మల్నో విషయం అడగాలని చాలా ఉబలాటపడుతున్నాను, సుశీలారాణిగారూ,' మొహమాటంగా చిన్న గొంతుతో అన్నాడు,

కాసేపు ఆగాడు... శ్వాస ఆగినట్టయింది. వెన్నెల్లో వెలిగిపోతున్న సముద్రం వంక చూస్తోందామె, అంతా నిశ్చలంగా వుంది.. దూరన్నించి పెళ్ళివారి బ్యాండుమేళం సన్నగా వినిపిస్తోంది, కొత్త 'పెళ్ళికూతురా రా, రా పాటని (శ్రుతి తప్పి వాయిస్తున్నారు. బెస్ట్‌ 'సెల్లర్‌ 36 సరదాగా కాసేపు

“మిమ్మల్నో విషయం అడగాలనుందండీ,/ అన్నాడు నాగరాజు,

“వూం; అడగండి; అందామె దగ్గిరకి జరుగుతూ చిన్నగా,

మళ్ళీ ఆగాడు. భయమేసింది.. ఆమె నుంచి వచ్చే సమాధానం తనకి చాలా విలువైనది,

మా. భాగోతుల నాగరాజు సముద్రతీరాన (ప్రశాంతంగా వుండే ఆ వూరికి. విశ్రాంతితో పాటు స్వస్థత పొందటానికి వచ్చాడు.. వృత్తిపరంగా అతను '“పుస్తకాభిలాషి అనే వారపత్రికకి అసిస్టెంట్‌ ఎడిటరు. సాహితీ పత్రికల్లో పని చేసే అసిస్టెంట్‌ ఎడిటరుగిరి అపాయ(గ్రస్తమైన వృత్తుల్లో దాదాపు అ(గ్రస్థానంలో వుంటుందని గణాంకాలతో పరిచయ మున్న వాళ్ళందరికీ తెలుసు. నవలా రచయిక్రుల్ని వారవారం ఇంటర్వ్యూ చెయ్యడం: వల్ల, ఆ కఠోర పరిశ్రమ చివరికి శరీరం మిద ప్రభావం చూపిస్తుంది. కాకలు తీరిన వుద్దండులు మాత్రమే దాన్ని నిభాయించుకోగలరు.

ఆరునెలలపాటు వారం వారం వేస్తున్న ఇంటర్వ్యూల్లో నవలా రచయిత్రుల ఆదర్శాల

గురించీ, వారి కళాభిమానం గురించీ వినీ వినీ నాగరాజు విసుగెత్తిపోయాడు. ఇళ్ళకు వెళ్ళి ఆ రచయిత్రులు ఏకాంతంగా కూచుని రాసుకునే ప్రదేశాల్లో వాళ్ళని కలుసుకున్నాడు. పెంపుడు కుక్కలంటే వాళ్ళకెంత (ప్రేమో తెలుసుకున్నాడు, తోటలో పూల మొక్కల మధ్య నుంచుంటే ఏంత సంతోషపడతారో. రాసుకున్నాడు. అలా నడుస్తుండగా వున్నట్టుండి ఒకరోజు ఆఫీసులో 'డెస్కు ముందు కూచుని నోట్లోంచి నురగలు బయటికొస్తుందగా, “తాళ్ళపూడి అనూరాధాదేవి తెల్లగన్నేరు పూలనుంచి స్ఫూర్తి చెందుతుంది! అని తనలో తనే విపరీతంగా గొణుక్కుంటుంటే ఎడిటరుగారు గమనించి వెంటనే అతన్ని వైద్యం నిమిత్తం స్పెషలిస్టు దగ్గిరకి తీసుకెళ్ళాడు, .

నాగరాజు గుండె నించి వస్తున్న చప్పుళ్ళని టెలిఫోన్‌లాంటి పరికరంతో కాసేప్త విన్నాక ఇ స్పెషలిస్సు యిలా చెప్పాడు: 'తెలిసిందోయ్‌, మన దేహంలో కొంచెం నలతగా వుంది, అవునా, కాదా? కంటిముందు రంగురంగుల మచ్చలు తేలుతూ, ఎగురుతున్నట్టు కనిపిస్తోంది మనకు, అవునా, కాదా? వొంట్లో నిస్సత్తువుగా వుండి పిల్లుల్లా మ్యావు మ్యా వంటూ శబ్దాలు చేస్తున్నాం మనం, అవునా, కాదా? స్పష్టంగా కనిపిస్తోందోయ్‌. ఇప్పుడు మనం చెయ్యవలసిందల్లా రక్తంలో ఎర్రకణాల్ని వృద్ధిపషరుచుకోటమే, అంతే."

మొదటిసారి అనపర్తి సుశీలారాణిని. చూడంగానే అతనో ఎర్రకణాలు వృద్ధి చెందాయి, పిక్నక్‌లో కలుసుకున్నారు. యిద్దరూ. ప్లేటులో పడిన యిసకని నాగరాజు వరుతుండగా, చుట్టూ తిరుగుతున్న కందిరీగని స్పూనుతో అదిలిస్తున్న సుశీలారాణి చూపులోకి 'వచ్చిందతనికి. '“పుస్తకాభిలాషి! వారపత్రిక ఆఫీసు వదిలొచ్చిన తరవాత మొట్టమొదటిసారి - చెత్తకుప్ప నించి కరుచుకొచ్చి పరిశీలించి చూసిన పిల్లి తలాడిస్తూ ఎబ్బే యిది మార్దాలాలకి ఆహారం కాదని వదిలేసిన పదార్ధంలా తనకి తను భావించడం మానేశాడు, వున్నట్టుండి క్షణాల్లో శరీరంలో ఎర్రకణాల సంత జరుగుతున్నట్టు అని సరదాగా: కాసేపు న్‌ వెస్ట్‌ సెల్లర్‌

పించింది. కోటానుకోట్ల ఎర్రకణాలు రక్తప్రవాహంలో ఎదురీదుతూ, సందేహిస్తూ వొడ్డున నుంచున్న ఎర్రకణాల్ని రండర్రా, 'రండి మిరు కూడా! ఈ రక్తం గొప్పగా వుంది, దూకండి. వెంటనే యిందులోకి! అంటూ. హుషారుగా పిలుస్తున్నాయని అనిపించింది నాగరాజుకి. అలా పది నిమిషాలు గడిచిన తరవాత అనపర్తి సుశీలారాణి లేని జీవితం శూన్యమనే నిర్ణయానికి వచ్చాడు నాగరాజు అయినా తన హృదయాన్ని ఆమె పాదాల ముందు పరచటానికి. యింకా సందేహిస్తున్నాదు, చూడటానికి ఆమె బాగానే వుంది. బాగానే వున్నట్టు కనిపిస్తోంది. బాగానే వున్నట్టుంది కూడా. 'నిజానికి ఆమె బాగానే వుండొచ్చు. కానీ. పెళ్ళి చేసుకోడానికి ఆమె అంగీకారాన్ని అడిగే ముందు ఒక సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి మరి. వున్నపళాన ఎడం. పక్క పైమూల మార్చిన్లో ఎర్రటి దారం: గుచ్చిన రాతప్రతి పట్టుకొచ్చి - యిది చదీవి మూ అభిప్రాయం నిర్మాహమాటంగా తెలపండి అనే అపాయం జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరికీ కొన్ని కొన్ని యిష్టం కానివి వుంటాయి. కొంతమందికి బల్లిని చూస్తే అసహ్యం, మరికొంతమందికి బొద్దెంకల్ని చూస్తే చిరాకు. నాగరాజుకి నవలా గచయి(తులంటే కంపరం, ॥ అందుకని. వాళ్ళిద్దరూ వెన్నెల ఆస్వాదిస్తూ నుంచున్నప్పుడు అతనిలా అడిగాడు: 'మిరెప్పుడైనా నవల రాశారా చెప్పండి? దానికామె ఆశ్చర్యపడుతూ చూసింది. 'నవలా? లేదండి.! “వోనీ చిన్న చిన్న కథలేమన్నా?” “లేదండి.” నాగరాజు గొంతు తగ్గించాడు. “వోనీ కవిత్వం?” గుసగుసలాడుతున్నట్టు సన్న గొంతుతో అడిగాడు. “లేదండి. సందేహాలన్నీ నివృత్తి కాగానే నాగరాజు మరింక ఆగలేకపోయాడు. గారడీవాడు టోపీలోంచి కుందేలును బయటికి తీసినట్టు నాగరాజు తన ఆత్మని ఆమె ముందు పరిచాడు. తను ఆమెని ఎంతగా ్రెమిస్తున్నాడో, ఆ (పేమ ఎంత లోతైనదో ఎంత పరిశృద్ధమైనదో, పదికాలాలపాటు ఎలా నిలుస్తుందో ఆమెకు విపులంగా చెప్పాడు. ప్రాధేయపడ్డాడు, వాదించాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. గుక్క తిప్పుకుని ఆమె జవాబు కోసం ఆగాడు. తనకి కూడా అలాంటి. ఆలోచనలే వచ్చాయనీ, తనని చూసి ఆమెకూ ఇదేరకమైన అభిప్రాయం ఏర్పడిందనీ విని పడిపోయినంత పని చేశాడు,...నాగరాజు ఆనందానికి అవధి లేకుండా పోయింది. బెస్ట్‌ సెల్లర్‌ వెరి సరదాగా కాసేప్తు

(ప్రేమ అనేది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్పందింపచేస్తుంది. మర్నాడు పొద్దున నాగరాజు సముద్రతీరం వెంబడి నాలుగు మైళ్ళు నడిచొచ్చాడు. మనసు వుష్పాంగి సంతోషం 'వెల్లువలై ప్రవహిస్తుంటే దాంట్లోంచి మనసుని వెలికి తీసే ప్రయత్నం చేయాల్సి రావటంతో

  • నున్నటి టేబులు ముందు కూచుని అరడజను పనసపండు తొనలు వాలుచుకు తినేసి
  • నవల రాయటం మొదలెట్టింది సుశీలారాణి.

మూడువారాలపాటు 'సముద్రతీరపు గాలి, దానికి తోడు తగిన విశ్రాంతి నాగరాజు మనసుక్షి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చాయి. దాంతో డాక్టరుగారు అతనింక ఆ అపాయగ(గ్రస్తమైన వృత్తిని తిరిగి కొనసాగించవచ్చని చెప్పారు. సుశీలారాణి మరో నెల రోజులపాటు భీమునిపట్నంలోనే గడిపి తిరిగొచ్చింది. ఆరోజు సాయంత్రం నాలుగుంబావకి యింటికి చేరుకుంది. నాలుగు గంటల పదహారున్నర నిమిషాలకల్లా తలుపు తోసుకుంట్లూ కళ్ళనిండా (ప్రేమ నింపుకుని ఆమె యింటికి వచ్చాడు నాగరాజు.

నెలరోజుల తరవాత కలుసుకున్న (పేమికులు ఎలాంటి పారవశ్యానికి లోనైందీ వివరాల్లోకి మనం వెళ్ళవలసిన పనిలేదు. నాగరాజు గుండె. మీదనుంచి తల 'పైకెత్తి సుశీలారాణి ముసిముసి నవ్వులు నవ్విన ఘట్టంతో మొదలెడదాం. మామూలుగా: అయితే ఆమె చిరునవ్వ నవ్విందని చెప్పడం ధర్మం. కానీ అది చిరునవ్వు కాదు ఏమాత్రం కూడా. ఆమె నవ్విన నవ్వు - కపటం్క కల్మషం, బిడియం కలిసున్న ముసిముసి నవ్వు - అది చూసి 'నాగరాజుకి ఏదో తెలీని భయం పట్టుకుంది. ఆమెనే. తేరపార చూస్తూ కూచున్నాడు, సుశీలారాణి మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వింది.

*నాగరాజ్తూ నీకో విషయం చెప్పాలి, అందామె.

“ఏవిటది?* అడిగాడు నాగరాజు...

సుశీలారాణి మరోసారి ముసిముసి నవ్వులు నవ్వింది.

*్రెబ్రిత్రే అవివేకం అంటూ నువ్వు నవ్వి కొట్టి పారెయ్యవచ్చు, కానీ ఇ3టే

“నేనో 'నవల రాశాను, నాగరాజూలే

ప్రేక్షకులకి భయం, జుగుప్స కలిగించే భీభత్న దృశ్యాలని ప్రత్యక్షంగా చూపకుండా పరోక్షంగా చెప్పించడం వుచితమని భావించారు సంస్క లత, గ్రీకు నాటకకర్తలు. దాన్న ప్రామాణికంగా తీసుకుంటే యిప్పటి దృశ్యాన్ని చేర్చకూడదు. కానీ యీ కాలపు జనాలు అప్పటివారికన్నా వుద్దండులు కనక దీన్ని గ్రంథికరించి తీరాలి, సరదాగా. కా సేపు ఏం బెస్ట్‌ సెల్లర్‌

ఆమె చెప్పింది విని.నాగరాజుకి కళ్ళు తిరిగాయి. మరి కాసేపటికి నెమ్మదిగా ఆ గది తిరగటం మానింది. రూములో వున్న కుర్చీలు, సోఫాలు, గోడకున్న బొమ్మలు, కేలెందర్లు వాటి వాటి. స్థానాలకి వొచ్చి కూచున్నాయి. నోటి వెంబడి మాట వచ్చిందిప్పుడు.

'నువ్వు - నువ్వు నవల రాశావా?' అడిగాడు సిరుత్సాహపడుతూ,

“అవును, యిరవై నాలుగో అధ్యాయం వరకూ వచ్చాను.

“ఇరవై 'నాలుగో అధ్యాయం వరకూ వచ్చావా?”

(అవును, తరవాతంతా సులభంలే.'

'తరవాతంతా సులభం అంటున్నావా?"

నాగరాజు కష్టంతో తీస్తున్న వూపిరి చప్పుడు మినహా అక్కడ కాసేపు నిశ్శబ్దం ఆఅవరించింది..

సుశీలారాణి వున్నట్టుండి, 'ఓ నాగరాజూ[ అని గట్టిగా అరుస్తూ, “నవల చాలామటుకు బాగా వచ్చింది. ఇదిగో, యిప్పుడే నీకు చదివి వినిపిస్తానుండు, అన్నది.

జీవితంలో మనకి అత్యంత 'విషాదకరమైన. ఆపద సంభవించినప్పుడు గతాన్ని గుర్తుచేసుకుని దానికన్నా తక్కువ పాలులో మనల్ని దురదృష్టం వెంటాడినప్పుడు విధిని అప్పుడెంత దూషించామో మననం చేసుకుంటాం. ఆరోజున నాగరాజు తను అత్యంత ందెన్యస్థితిలో మునిగినట్టు బాధపడ్డాడు. ఎత్తయిన పీఠం మిద తను నిలుపుకున్న సుశీలా రాణి ఆ పీఠం నించి పడిపోయిందనిపించింది. రహస్య నవలా రచయిత్రిగా అవతారం ఎత్తిందిప్పుడు. .హద్దు కాదూ అనుకున్నాడు - హద్దుకి చిట్టచివరి అంచు అని కూడా అనుకున్నాడు. పరిస్థితులు తారుమారైనాయి.

అంత దారుణం కాదు. ఇప్పటివరకూ జరిగింది కుంభవృష్టి కురిసేముందు పడే మొదటి 'చినుకులాంటిది.

ఆ పొరపాటు క్షమించదగినదే, తను ఎంతో దైన్యస్థితిలో మునిగిపోయాననీ, చేదుమాత్ర మింగాననీ తలసోసిన నాగరాజు హఠాత్తుగా విషమపరీక్షని వదుర్ముంటున్నానని తలవడం సమంజసమే. కథకి తగినట్టు “విడిపోయిన దారులు” అన్న పేరు పెట్టి యిప్పుడామె చదివి వినిపిస్తుంటే బాధతో మెలికలు తిరిగాడు నాగరాజు: జీవాత్మ కొంకర్లు చుట్టుకు పోయిందనిపించింది.

సుశీలారాణి నవల మహా ఘోరంగా వుంది, అందులో జెచిత్యమనేది కనబడలేదసలు. చదివినవాళ్ళు సిగ్గుతో తలవంచుకుంటారని కాదు = అసలు నాగరాజే సిగ్గుతో తలవంచుకోవాలి. ఆమె అనుభవించిన ఒకే ఒక ప్రణయ ఘట్టాన్ని - అంటే తమ (ప్రేమాయణాన్నే మాటల్లో తూచా. తప్పకుండా విపులీకరించింది. వాళ్ళిద్దరూ. ఎక్కడెక్కడ ఎలా కలిసింద్కి తియ్యటి మొదటి ముద్దు సంఘటన్నా, రెండు రోజులకే జరిగిన చిన్న [ప్రణయ కలహం - అన్నీ చేర్చింది అ నవలలో, 'కేవలం యిరవై రెండు. నిమిషాలు మాత్రం నిలిచిన ఆ చిన్న ప్రణయ కలహాన్ని నవలలో 'పది సంవత్సరాల బెస్ట్‌ సెల్లర్‌ త్ర సరదాగా కాసేపు

ఎడబాటుగా. చిత్రీకరించి, “విడిపోయిన దారులు” అన్న పేరుకి న్యాయం చేకూర్చి, యాభై అరవై పేజీలతో ముగించకుండా సాగదీస్తూ వచ్చింది, తను ఆమెని పెళ్ళికి సుముఖమేనా అని అడిగిన వుదంతానికొస్తే - నాగరాజు ఆ సమయంలో ఏమేం చెప్పాడో, ఏమేం చేశాడో అన్నీ పొల్లు పోకుండా వున్నవి వున్నట్టు సుశీలారాణి రాయడం విని - తనేనా వాతావరణాన్ని యింతగా కలుషితం చేసినవాడు అని తలుస్తూ బాధపడ్డాడు. అనాదినుంచీ పురుషులందరూ అనుకున్నట్టుగాన్నూ భవిష్యత్తులోనూ అనుకునే లాగానే నాగరాజు కూడా ఆడవాళ్ళు యిలాంటి పనులు: ఎందుకు చేస్తారు అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు, “విడిపోయిన దారులు” నవల వింటుంటే :- అదంతా తన కథే కనక - నడుస్తుంటే వున్నట్టుండి నడిరోడ్డులో ప్యాంటు జారి వూడిపోయిన భావన కలిగిందతనికి. తనకి కలిగిన భావనల్ని మాటల్లో పెట్టి ఆమెకి చెప్పవచ్చు కాన్మీ భాగోతుల వంశీకులందర్లా నాగరాజు కూడా స్రీల మానాభిమానాలని కాపాడే వ్యక్తి. సుశీలారాణిని నెత్తినొకటి బాదినా, దురుసుగా చెప్పులు తొడుక్కుని వెళ్ళిపోయినా ఆమెని అవమానించి నట్టు బాధపడతాడు... “విడిపోయిన దారులు” గురించి తన అసలు అభిప్రాయం కనక అంగుళం మేర వివరించినా మరింత అవమానించినట్టు భావించేవాడతను. నవల పూర్తిగా విన్న తరవాత, "గొప్పగా వుంది!” అంటూ బెకబెకలాడాడు. ఆ మాటకి ఆమె కళ్ళు వుజ్వలంగా వెలిగిపోయాయి. నిజంగా నీకు అలా అనిపించిందా?” “బాగుంది! చిన్న చిన్న పదాలు వాడటం సులభమనిపించింది అతనికి. “దీన్ని ప్రచురించడానికి ఏ పల్లిషరూ డబ్బు ఖర్చుపెట్టి ముందుకురాడని నాకన్‌పిస్తోంది,' చెప్పింది సుశీలారాణి. అది విని నాగరాజుకి వుపశమనం కలిగింది, ఆమె నవల రాసిన సంగతి యదార్ధం; దాన్ని ఎలాగో ఒకలాగ కప్పిపెట్టవచ్చు అనుకున్నాడు. “అందుకని పబ్లిషింగుకి అయ్యే ఖర్చులు నేనే భరించి తంగిరాల అండ్‌ సుమాణం వారితో వేయిద్దామనుకుంటున్నాా అది విని జవాబివ్వలేదు నాగరాజు, పెన్ను నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల గీసి వెలిగించే ప్రయత్నంలో వుంటూ శూన్యంలోకి చూస్తూ కూచున్నాడు. నాగరాజుతో మంచి వినోదం ఆడుకోబోతున్నానని గ్రహించిన విధి కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంది. పుస్తకాల ప్రచురణలో ప్రతి సీజనులోనూ అనుకోని సంఘటన సంభ విస్తుంటుంది. పాఠకులు వున్నట్టుండి మేలుకొని ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తమ ముందుకొచ్చిన ఒక నవలనో, రచననో అకారణంగ్యా 'కేవలం పుస్తక సమిోక్షల్లో “చదవదగినది అని సరదాగా కాసేపు = గే] బెస్ట్‌ సెల్లర్‌

రాసినందుకు ముందూ. వెనకా చూడకుండా విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి వెలం వెర్రిగా కొనేస్తారు,

అప్పుడప్పుడే 'పైకొస్తున్న తంగిరాల అండ్‌ సుమాణం కంపెనీ దోమల్‌గూడా వారు “విడిపోయిన దారులు” నవలని మొదటి ముద్రణలో మూడు వందల కాపీలు అచ్చువేశారు.. వాటిలో తను యిరవై కాపీలు మాత్రమే కొనుక్కుంటానని సుశీలారాణి చెప్పినప్పుడు భంగపడ్డారు. తంగిరాల ప్రకాశరావు ఆశావాది అవడంతో 'సుశీలారాణి వంద కాపీలు కొంటుందని అనుకుంటే (తమరి బంధువులకి అమ్ముకోవచ్చందమ్మా మిరు!) చివరికి తూకం లెక్కన పాత పుస్తకాల ధర ఎంతుందని న్యూస్‌పేపర్లు కొనేవాడిని విచారించసాగాడు. ఆ సంస్థ బాగా డబ్బు చేసుకునే ప్రయత్నంలో శ్రీమతి కాకర్లపూడి సౌదామినిగారి కలం నుంచి వెలువడిన “కలగూర గంపో నవలని. విడుదల చేసే సందర్భంలో - “నవలా రచనల్లో మితిమోరుతున్న శృంగార (ప్రేరణ హద్దులు లేవా? అనే టాపిక్‌ మాధ రేడియోలో టీవీ ఛానెల్సుల్కో పత్రికల్లో చర్చాగోష్టి కార్యక్రమం ని ర్వహించారు.

“కలగూర గంప” నవల అమ్ముడుపషోక నెలరోజుల్లోపలే షాపుల్నించి పుస్తకాలన్నీ తిరిగొచ్చాయి. పబ్లిషర్లు నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమాల్లో బయటపడిన విషయం

  • పాఠకుల దృష్టి శృంగారం విపరీతంగా. గుప్పించిన రచనల మోద లేదనీ అవంటే మొహంమొత్తి పోయారన్సీ యిప్పుడు కావలసిందల్లా ముచ్చటగా కుటుంబమంతా చదువుకో గల లేలేత ప్రేమ కథల్లూ హాయిగా, తియ్యగా వుండే యువతీ యువకుల స్వచ్చమైన కథలనీ; ఎదిగిన పిల్లలు గదిలోకొస్తే దిండుకింద దాచుకుసౌపుస్తకాలు కాదనీ, పాఠకుల మనోగతం మారిందనీ తేలింది. దానికి అనుగుణంగా పాఠకులు ఎంచుకున్న రచన -- కుమారి అనపర్తి సుశీలారాణి రాసిన “విడిపోయిన దారులు%

అనుకోకుండా పాఠకజనంలో కలిగిన యీ హఠాత్పరిణామానికి పబ్లిషర్లందరికీ పిచ్చెక్కినట్టయింది. "పేరుమోసిన యువరచయితలు వీధి 'చివర్నున్న అంగళ్ళకి 'వెళ్ళి దుకాణంలో పద్దులు రాసే వుద్యోగం ఏదన్నా ఖాళీగా వుందేమోనని వెదకసాగారు.. ఈ గొప్ప మార్పు సంభవించటానికి ముందు శృంగార [ప్రాధాన్యమైన రచనలకే ప్రాముఖ్యత వుండేది, ప్రతి పబ్లిషరూ ఈ పాపం ఆమెది కాదు మగాదిది? అనసూయ అజాగ్రత్త రుచి మరిగిన కామాంధుడు; అది కూదని పని అయినా చేసిందామె -- మొదలైన నవలలతో మార్కెట్టుని వుక్కిబిక్సిరి చేశాడు. మార్కెట్టులో యిప్పుడు వాటికి ఆదరణ లేకుండా పోయింది. రుచి మార్చుకున్న పాఠకులిప్పుడు స్వచ్చమైన, సామాన్యమైన రచనల్ని ఆదరించేందుక్తూ, తమ సరి కొత్త రుచిని సంతృప్తి పరుచుకునేందుకూ చేసిన పనల్లా - పుస్తకాల షాపుల మోదికి ఏగబడి కుమారి అనపర్తి సుశీలారాణి రాసిన “విడిపోయిన దారులు” నవలని విజ్బంభించి కొనుక్కోడం, కాపీల కోసం వెంపర్లాడటం,

పాఠకులు ఎగబడి జంతువుల్లా కొట్టుకున్నారు.. తంగిరాల అండ్‌ సుమాణం కంపెనీ చుట్టూ తేనెటీగల్లా ముసురుకున్నారు. ప్రింటిగ్‌ మెషీన్లని రాత్రింబవళ్ళు నడపాల్సి వచ్చింది: రాష్ట్రం నాలుగు చెరగులా కాక మద్రాసు, బెంగుళూరులాంటి తెలుగువాళ్ళు వుండే అన్ని చోట్లా ఎవరినోట విన్నా ఒకటే మాట --*విడిపోయిన దారులు”, ఎ యింట్లో చూసినా యథావిధిగా ముందు గదిలో గోడకి దేవుడి పటాలు, యజమాని కుటుంబంతో వున్న ఆల్బంతోపాటు “విడిపోయిన. దారులు” పుస్తకం కూడా టేబులు మిద వుంచడం ఆనవాయితీగా మారింది. చర్చిలో పాస్టర్లు దాని ప్రాశస్యాన్ని ప్రవచనాల్లో ప్రశంసించారు, వుపన్యాసాల్లో ప్రస్తావించారు, 'పేరడీ. చేసేవారు పేరడీలు కట్టారు నిత్యం మార్కెట్టుని క్షుల్ణుంగా విశ్లేషిస్తూ లావాదేవీలు సాగించే స్టాక్‌ బ్రోకర్లు యింట్లోనే కూచుని ఆ నవల ఆ నవల ఆధారంగా టీవీలో సీరియలు వస్తుందనీ; రామానాయుడుగారు సినిమా తీసే సంకల్పంలో వున్నారనీ; "పేరుమోసిన హీరో, హీరోయిన్లు అందులో నటి స్తున్నారన్‌; దర్శకత్వపు బాధ్యతలు బాపుగ్గారికి యిచ్చారన్వీ సంభాషణలు, స్ర్కీన్‌ ప్లే ముళ్ళపూడి వెంకటరమణగారనీ; అన్ని భారతీయ భాషల్లోకీ అనువదించే ప్రయత్నం జరుగుతోందనీ; హాలీవుడ్‌ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయనీ - రోజూ 'పేపర్లనిండా దుమారంగా “విడిపోయిన దారులు” కబుర్లే, పుకారులే. వుత్తుంగంగా లేచిన యీ: కెరటాల. శిఖరాగ్రం మోద స్వారీ చేస్తోంది కుమారి అనపర్తి సుశీలారాణి సంతోషంతో వుక్కిరిబిక్కిరవుతూ, మరి నాగరాజు సంగతో? అదిగో ఆ కెరటాల మధ్యన పల్లంలో పడికొట్టు కుంటున్నవాడే భాగోతుల నాగరాజు, అయిన్నా నాగరాజు సంగతి పట్టించుకోవాల్సిన అవసరం లేదిప్పుడు. నాగరాజుకి మాత్రం యిప్పుడు తనని గురించి తను పట్టించుకునే వ్యవధి దొరికింది. అహర్నిశలూ అతని మనసంతా ఏదో కెలుకుతున్నట్టు వుందని చెప్పడం హాస్యాస్పదం. నాగరాజు నిశ్చేష్టడయ్యాడు, ప్రపంచమంతా తలకిందు. లైనట్టు తోచింది. ముక్కూమొహం. తెలీని లక్షలాది పాఠకులు తను పవిత్రంగ్లా కాపాడుకున్న నిజజీవిత రహస్యాలన్నీ చదివి తృప్తి చెందుతున్నారనీ, అలాగే అశేష పాఠకలోకమంతా తను సుశీలారాణి దగ్గిర పెళ్ళి ప్రస్తావన చేసినప్పుడు వాడిన మాటలు పాఠకుల హృదయాలలోకి. చొచ్చుకుపోయి శిలాక్షరాలుగా మారాయన్న భావన అస్పష్టంగా. గుర్తించాడు. అయితే, పాఠకుల ముందు తనని యీకలు పీకినట్టు, మొహానికి. మసి 'పూసి 'మారేడుకాయ 'చెసినట్టు భావించాడు కానీ, ఆ విషయం అతన్ని అంతగా బాధించలేదు. అతన్ని బాధపెట్టిన విషయమల్లా - సుశీలారాణి వైఖరి పూర్తిగా మారిపోవడం, సరదాగా కాసేపు 4 బెస్ట్‌ సెల్లర్‌

మనుషుల మనసు తొందర్లోనే విజయానికి అనువుగా మార్చుకుంటుంది, సుశీలారాణి సుప్రసిద్ధమైన రచయిత్రిగా గుర్తింపు పొంది, తికమక పడుతున్న ప్రధమ దశ త్వరలోనే పూర్తయింది. మొట్టమొదటిసారి విలేఖరి అడిగిన ప్రశ్నలకి తడబడుతూ జవాబులివ్వడం చరిత్రలో కలిసింది. రెండు వారాలు గడిచాయో లేదో ్రెస్సుతో గొప్ప రాజకీయవేత్తలా వుదాసీనంగా జవాబులు యివ్వసాగింది. నోటుబుక్కులో వచ్చే విలేఖరులకి యిచ్చిన సమాధానాల్లో కొన్ని పదాలకి కొంతమంది ఆఫీసుకెళ్ళి డిక్షరీలో అర్జాలు వెదకాల్సిన గతి పట్టింది. తనలో 'వున్న కళ - 'నిర్మాణాత్మకం. కాక లయ బద్ధమనీ, అధివాస్తవికత వైపు మొగ్గు చూపుతుందని చెప్పసాగింది.

నాగరాజు చూపించే చవకబారు వుత్సాహానికి ఆమె అందుకోలేనంత ఎత్తు

ఎదిగింది... ఇద్దరూ కలిసి కారులో ఏటన్నా కాసేపు తిరిగొద్దామని అతను ప్రస్తావిస్తే తన వల్ల కాదంది. 'పాఠకులు రాసే వుత్తరాలకి జవాబులు రాయాలంది. ఎంతోమంది పాఠకులు “విడిపోయిన దారులు” తమకి వంత వూరట, స్ఫూర్తి కలిగించిందోనని రాస్తుంటే వాళ్ళకి సమాధానాలు రాయడం వుచితమంది. దానికితోడు ఆటోగ్రాఫులు. నిమిషం కూడా వ్యవధి లేదని చెప్పింది,

మరోసారి తనతో కలిసి క్రికెట్‌ మ్యాచికి రమ్మన్నాడు నాగరాజు, తల అడ్డంగా వూపింది సుశీలారాణి, సరిగ్గా ఆరోజే 'ఆధునిక రచనల తీరుతెన్నులు, వస్తున్న మార్పులు” గురించి వేరే వూళ్ళో వుపన్యాసం యివ్వటానికి వెడుతున్నానంది,

నాగరాజుకి సుశీలారాణి మాదున్న వల్లమాలిన (ప్రేమ మూలాన, ఇలా ఎన్నోమార్లు లేదని చెప్పడాన్ని వోర్పుతో సహిస్తూ, భరిస్తూ వుండేవాడు.. అయితే, సరిగ్గా ఆ సమయంలో అతని జీవితంలోకి కాటకంలా కటకం వెంకట్రావనే దుర్మార్డుడు విషవాయువు నింపుకున్న

ఒకరోజు వనితా మండలిలో “నవల; సందేశాన్ని యివ్వాలా?” అనే టాపిక్‌ మిద వుపన్యాసం యివ్వటానికి వెడుతూ కేవలం 'పదంటే పది నిమిషాలు మాత్రం నాగరాజుకి. కేటాయించినప్పుడు, “ఇందాక నీతో నడుస్తూ వస్తున్న ఆ మనిషి ఎవరు? అని అడిగాడామెని.

'మనిషి కాడతను. నా ఏజెంటు = లిటరరీ ఏజెంటు,” అని జవాబిచ్చింది

సుశీలారాణి వ్యవహారాలన్నీ యిప్పుడు కటకం వెంకట్రావే చక్కబెడుతున్నాడని రూఢి అయింది, ప్రజల శ్రేయస్సుకు మచ్చ తెచ్చే యీ దుర్మార్లుడు మానవరూపంలో వున్నవిషప్పురుగు. లావుపాటి అద్దాలు పెట్టుకుని ఆడ క్షయింట్లతో సరదాగా, రొమేంటిక్‌గా వుండాలని చూసే రకం, అందుకే. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యానికీ ముందర

  • "డియర్‌ లేడీ! అంటూ సంబోధిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే - తనని వలచ్చి, పెళ్ళికి సిద్ధంగా వున్న యువతి చుట్టూ తిరగవలసిన వాడు మాత్రం కాదనిపించింది నాగరాజుకి, బెస్ట్‌ "సెల్లర్‌ 44 సరదాగా. కాసేపు

సుశీలారాణికి నిజంగా వజెంటుతో అవసరం వుంటే తనే లావుపాటివాడిని ఏవడినన్నా కుదిర్చి వుండేవాడు. నాగరాజు ముఖంలో అసూయ తొంగిచూసి నుదురు ముడిబడింది. “వాడిని చూడగానే యిలాంటివాడెలా దాపురించాడురా బాబూ అనిపించింది నాకైతే,! విమర్శించాడు నాగరాజు, “కటకం వెంకట్రావుకి వ్యవహార దక్షత మెండుగా వుంది, ఠక్కున జవాబిచ్చింది “ఆహా, అలాగా?” వ్యంగ్యంగా. అన్నాడు: నాగరాజు, మొహంలో ఆ వ్యంగ్యాన్ని కొంతకాలంపాటు అక్కడితో ఆగిపోయింది, అయితే ఎక్కువ రోజులు. కాదు, సోమవారం పొద్దున సుశీలారాణికి ఫోన్‌ చేసి మధ్యాహ్నం లంచికి ఆహ్వానించాడు సాగరాజుః “అయాం సారీ, నేను రాలేను.. కటకం వెంకట్రావుతో లంచికి వెడుతున్నా చెప్పింది 'అవునా?' అన్నాడు నాగరాజు. “అవును” అంది సుశీలారాణి. రెండురోజులాగిన తరవాత సుశీలారాణికి ఫోన్‌ చేసి యీసారి డిన్నరు చేద్దామని పిలిచాడు నాగరాజు; “అయాం. సారీ, నేను రాలేను, కటకం వెంకట్రావుతో డిన్నరుకి వెడుతున్నాా" అంది 'సుశీలారాణి. 'అవునా?' అన్నాడు నాగరాజు, “అవును, అంది సుశీలారాణి. “ఓహో, అన్నాడు నాగరాజు, మూడురోజుల తరవాత సినిమా టిక్కెట్లు పట్టుకుని సుశీలారాణి యింటికొచ్చాడు “అయాం. సారీ ..* అంటూ మొదలెట్టింది సుశీలారాణి. “నువ్వ చెప్పొద్దు. నన్ను వూహించుకోనీ, కటకం వెంకట్రావుతో సినిమాకి వడుతున్నావు కదూ?” అడిగాడు నాగరాజు, “అవును వెడుతున్నా రాం గోపాల్‌ శర్మ సినిమా “దహనానికి కాచుకునున్న ఆరు శవాలు” మొదటాటకి కాంప్లి మెంటరీ టిక్కెట్లు వున్నాయతని దగ్గిర. “వున్నాయా అతని దగ్గర? “అవును, వున్నాయి.! సరదాగా. కాసేపు తీ బెస్ట్‌ సెల్లర్‌

ఆ గదిలో రెండు మూడు. సార్లు పచార్లు చేశాడు నాగరాజు, కోపంతో అతను పళ్ళు కొరుకుతున్న చప్పుడు మినహా పూర్తిగా నిశ్శబ్దం ఆవరించిందక్కడ. కాసేపటికి మాట్లాడటం మొదలెట్టాడు: నాగరాజు,

_ “ఆ చీడపురుగు వెంకట్రావు విషయానికొస్తే - నిజానికి నీకో ఏజెంటు కావాలంటే నేను అద్దు చెప్పే మనిషిని కాను, సుశీలా. నీకు నిజంగా నవలలు రాయాలనుంటే అది నీకూ, నువ్వ పూజించే నీ దేవుడికీ సంబంధించిన విషయం. నవలలు రాయడం తప్పనిసరి అయితే, నీకో ఏజెంటు కావాలనుకుంటే సరే మరి, కానీ - యిదిగో యిక్కడే నేను చెప్పేది సావ ధానంగా విను = యిలాంటి సినిమా హీరోలాంటి వాడిని మాత్రం నేను వొప్పుకోను, ఎప్పుడు చూసినా మంతనాలు ఆడుతున్నట్టు నీ చెవిలో రహస్యాలు మాట్లాడే ఏజెంటు కాదు. ఎప్పుడూ నిన్ను “డియర్‌ లేడీ!” అని సంబోధిస్తూ, వ్యవ హారాల్ని రోజూ లంచికీ, డిన్నరుకీ, సినిమాలకీ, షికార్లకీ ముడిపెట్టే రకపు ఏజెంటు కాదు”

మధ్యలో ఆపద్దన్నట్టు చెయ్యెత్తి వారించాడు నాగరాజు, “నేను చెప్పవలిసింది అవలేదు, యింకా వుంది, అన్నాడు నాగరాజు, "నాది సంకుచిత మనస్తత్వమని ఏవ్వరూ వేలెత్తి చూపలేరు, చరిత్రలో గొప్ప ప్రేమికుడి లక్షణాలు కటకం వెంకట్రావులో' కనక కాస్త తక్కువ పాలులో వుంటే నేను నోరు మూసుకుని కూచుండెవాద్ని క్షయింట్సుతో మంతనాలు సాగించేటప్పుడు కనక కటకం వెంకట్రావు రచయిత్రుల చెవుల్లో కోయిల కూసీనట్టు కూయకుండా వుంటే వదో విధంగా 'సర్ది చెప్పుకునే వాది కానీ అతనలా కాదు, వుండలేదు కూడా. వ్యవహారం యిలా వున్నందుక్తూ మని ద్దరం యివాళో రేపో పెళ్ళి చేసుకోబోతున్నాం కనకనూ ఈ పొద్దు తిరుగుడు పువ్వుని దూరంగా వుంచమని చెప్పటం నా ధర్మం కనక చెబుతున్నా దగ్గిరకి రానీకు వాణ్ణి. వెళ్ళగొడితే యింకా మంచిదని నా సలహా. నీతో వ్యవహారాలు మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడమను. ఫోన్‌ చేసినప్పుడల్లా రాంగ్‌ నెంబరుకి పోవాలని నా. ఆళ్ళ" సుశీలారాణి లేచి నుంచుని పొగలు కక్కుతున్న కళ్ళతో చూసింది అతనివంక, “ఓహో, అలాగా?” వ్యంగ్యంగా. అడిగింది. “అవున్ము అంతే అన్నాడు నాగరాజు, 'నెను నీకు వూడిగం చే సేదాన్ననుకుంటున్నావా?' నిగ్గదీసి అడిగింది సుశీలారాణి. “ఎమన్నావ్‌?! ఆ మాటకి అర్ధం తెలీక అడిగాడు నాగరాజు, 'వూడిగం. బానిసత్వం. దాస్యం. వెట్టి చాకిరీ. నువ్వెలా చెప్పితే అలా ఆడే. అధోగతి. ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించాడు నాగరాజు. “లేదు. అలా అనుకోడం లేదు నేను.”

బెస్ట్‌ సేల్లర్‌' జీగ్ర సరదాగా కాసేపు

'వద్దు. నాకా బానిసత్వం అక్థర్లదు. నేను ఎవరెవరితో స్నేహం చెయ్యాలో శాసించే హక్షునీకు లేదు చెప్పింది సుళీలారాణి,

“ఇంతసేపూ నేను చెప్పిందంతా విన్నాక కూడా నువ్వింకా వాడ్న నీ చుట్టూ తిరగడానికి అనుమతిస్తున్నట్టైనా?”

“అవును, తిరగనిసా.!

'ఆ తేనెటీగతో యింకా కలిసిమెలిసి తిరగాలనే వుద్దేశ్యమా నీది?”

“అవును, అదే వుద్దేశ్యం.

'సృష్టిలో తప్పుగా పుట్టిన వీడిని తరిమేయడానికి నిజంగా నీకు మనసొప్పడం లేదా?

“నిజంగా లేదు

“సరే మరి!” అన్నాడు నాగరాజు చేసేది లేక,

గొంతు ప్రాధేయపడుతున్నట్టు ధ్వనించింది యిప్పుడు.

అహంకారం మించిపోయిన ఆ పిల్ల గట్టిగా, వికటంగా నవ్వింది.

“అవునా?” అంటూ మళ్ళీ నవ్వింది పరిహాసంగా. “ఇంత రభస జరిగిన తరవాత యింక మన 'పెళ్ళి జరగడం కల్ల.”

“నిస్సందేహంగా, ఇకనించీ మనవి - విడిపోయిన దారులు అని [గ్రహించుకో. నువ్వు నన్ను అవమానించావు, నా అందమైన భావనల్ని కాలితో తొక్కేశావు. నిరంకుశులు ఎలా ప్రవర్తిస్తారో నువ్వు నా కళ్ళముందర చేసి చూపించావు, నువ్వెలాటి వాడివో సరిగ్గా సమయానికి నేను గ్రహించేట్టు నిరూపించావు. గుడ్‌ బై, మిస్టర్‌ భాగోతుల. నాగరాజూ, గుడ్‌ బై -

“నామాట కాస్త విను ;,* అంటూ మొదలెట్టాడు నాగరాజు,

“వెళ్ళు, నీ మొహం చూపించొద్దు నాకింక! ఆమాట అని సుశీలారాణి, అదిగో తలుపు, పక్కన నీ చెప్పులు. వెళ్ళింక, అంది.

ఆ మాటలు అంటూ రాజసం వుట్టిపడుతున్నద్రానిలా తలుపు. వైపు చూపించింది; అతను వెళ్ళగానే భళ్ళుమని చప్పుడు 'చేస్తూ తలుపు గట్టిగా మూసేసింది.

కుంగిపోయిన మొహంతో మెట్లు దిగాడు నాగరాజు. రోడ్డు మాద నడిచి 'వెడుతుంటే మరింత కుంగినట్టు కనిపించాడు. తను కన్న కల కాస్తా భగ్నమైంది. వూహల్లో తేలిపోతూ గాలిలో కట్టుకున్న మేడ కుప్పకూలడం చూసి నిష్టూరంగా నవ్వుకున్నాడు.

ఏదీ ఏమైనా ఆఫీసుకు వెళ్ళి వుద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్పదు, సరదాగా: కాసేపు త బెస్ట్‌ "సెల్లర్‌

పుస్తకాభిలాషి ఆఫీసులో నాగరాజు చాలా మారిపోయాడని ఆశ్చర్యపడుతూ అతన్ని గురించి గుసగుసలాడటం. మొదలెట్టారు. అతనిలో పట్టుదల ఎక్కువైందనీ, మనిషి మునుపటికన్నా దృఢంగా వున్నాడసీ చెప్పుకోసాగారు. నాగరాజుకి జబ్బు చేసినప్పటినించీ ఎడిటరుగారు అతని, పట్ల వుదాసీనంతో వ్యవహరిస్తూ ఆఫీసులోనే కూచుని రాబోయే పుస్తకాల గురించి 'పేరాలకు "పేరాలు రాయమని చెప్పి, ఏలాంటి వుధృతానికైనా తట్టుకోగలవాళ్ళనే రచయిత్రుల ఇంటర్వ్యూలకు పంపించడం మొదలెట్టాడు. 'నాగరాజుని కుడిభుజంలా దగ్గర వుంచుకున్నాడు.

ఒకనార్మి “గంగూరి విజయసౌభాగ్యంగారితో వారి రచనల గురించి ముచ్చట్లు" అనే కాలం రాయల్సి వచ్చినప్పుడు ఎడిటరుగారు నాగరాజుని ఆ పనికోసం చింతలూరు పంపించాడు. ప్రముఖ శృంగార నవలా రచయిత్రి శ్రీమతి చిలంకుర్తి ప్రమాలా రామన్‌ గారిని ఇంటర్వ్యూ చేసే ౦దుకు సత్యనారాయణ అనె మరో అసిస్టెంట్‌ ఎడిటర్ని పంపిస్తే ఆమెతో కేవలం యిరవై నిమిషాలు గడిపిన తరవాత ట్యాంకు బండు మీదున్న విగ్రహాల దగ్గిరకెళ్ళి తల బద్దలుకొట్టుకోవడం చూసిన వాళ్ళు అతన్ని వలాగోలా యింటి కి చేర్చారు. అలాంటి అపాయకరమైన పనిని అతనికి యివ్వకుండా వుండాల్సిందని ఎడిటరు దాన్ని కాస్తా నాగరాజుకి అప్పగించారు, ఎలాంటి వొడిదుడుకులకీ లోనుకాకుందా. నాగరాజు పని పూర్తిచేసుకొచ్చాడు,

ఈ సమయంలోనే నాగరాజు ఒకరోజు మధ్యాహ్నం - కుమారి తోటకూర ఆశాకుమారినీ, శీమతి వడ్డెం కనకదుర్దనీ ఇంటర్వ్యూ. చేశాడు... అతను చేసిన ఆ ఘనక్షార్యం: గురించి యింకా 'పుస్తకాభిలాషిో ఆఫీసులో విడ్డూరంగా: చెప్పుకుంటున్నా రంటే నమ్మండి... అసలొక్క 'పుస్తకాభిలాషి” ఆఫీసులోనే కాదండీ. బిడియపడుతూ ఎందుకొచ్చిందిరా దేవుడా అంటూ నీరస పదే వాళ్ళందరితోనూ ప్రతి సాహిత్య పత్రిక ఎడిటర్నూ 'నాగరాజుని చూసి నేర్చుకోందయ్యా!' అని వెన్ను తట్టి పంపిస్తారు ప్రోత్సహిస్తూ

బెదురుతున్న వాళ్ళని, “నాగరాజు భయపడ్డాడా? నాగరాజు బిత్తరపోయాడా?' అంటూ అడిగేవాళ్ళు.

ఇలా:జరుగుతుంటే దీపావళి సందర్భంగ్లా విడుదల చేసే ప్రత్యేక సంచికకి “కుమారి అనపర్తి సుశీలారాణిగారితో ముచ్చట్లు అన్న శీర్షిక వేద్దామనుకున్న ఎడిటరుకి ముందుగా తట్టినవాడు నాగరాజే. అతన్ని ఆఫీసు గదిలోకి పిలిపించాడు,

“ఆహ్హా నాగరాజూ!!

“ఎమిటి పిలిచారు, ఎడిటరుగారూ?”

దానికా. ఎడిటరు *ఇది విన్నావో "లేదో, వినుంటే నన్ను ఆపెయ్యి. ఓసారి ఒక తెలుగువాడ్తూ ఓ మళయాళీ, ఓ పంజాబీ కలిసి వెడుతున్నారట ...” బెస్ట్‌ సెల్లర్‌ త సరదాగ్గా. కాసేపు

అలా ఎడిటరు తన కింద పనిచేసే అసిస్టెంటుతో మాటలు కలపడానికి వుపోద్దాతంలా ముందు యిచ్చిన తరవాత అసలు విషయానికి వచ్చాడాయన,

తన కింద పనిచేసే వాళ్ళందరితోనూ తండ్రిలా సౌమ్యంగా మాట్లాడటం అలవాటు. ఆ ఎడిటరుకి - అందుకే అతన్ని అందరూ అభిమానిన్హారు, మన్నిస్తారు, ఇప్పుడు కూడా అదే ధోరణిలో కొనసాగించాడాయన. 'మన పత్రికకి ఘనకీర్తి చేకూర్చే శక్తి నీలో వుందని మొదటగా చెప్పాలయ్యా, ఈ ముక్క చెప్పిన తరవాత యింకోటి కూడా చెబుతా. - ఒకవేళ నీకది యిష్టం లేకపోతే నువ్వు నిర్మొహమాటంగా కుదరదని చెప్పొచ్చు, నాకేమి అభ్యంతరం లేదు. ఈమధ్య నువ్వు చాలా గద్దు పరిస్థితుల్లో చిక్కుకున్నావు; అంచేత నీకది కష్టమైన పనిగా తోస్తే చెప్పు, నేను సహృదయంతో అర్ధం చేసుకుంటా. అయితే మనకిప్పుడు కావాల్సింది ఏమిటంటే ఎలాంటి 'పరిస్థితుల్లోనూ “కుమారి అనపర్తి సుశీలారాణిగారితో ముచ్చట్లు” అన్న వ్యాసం దీపావళి ప్రత్యేక సంచికకి వచ్చి తీరాలోయ.”*

ఎదురుగా కూచున్న కుర్రాడు ఆ మాటలు విని జంకటం చూసి అర్ధం చేసుకున్నట్టు జాలితో తల వూపాడు ఎడిటరు.

“నీకా పని కష్టమని తోస్తోంది కదూ? నాకు కూడా భయమేసిందయ్యా, అందర్లోకీ ఆవిదగారు నికృష్ణమైందని చెప్పుకోడం నేనూ విన్నా. గర్విష్టి అన్మ్‌ స్త్రీల అభ్యుదయం గురించే ఎక్కువగా మాట్లాడుతుందని కూడా. విన్నాను, సరే, పోనీలేవోయ్‌, సత్య నారాయణతో సరిపెట్టుకుంటాలే యీసారికి. అతనిప్పుడు తేరుకున్నాడనీ, మళ్ళీ ఆఫీసులో యిదివరకటి. స్థానాన్ని సంషాదించుకోడానికి చూస్తున్నాడనీ విన్నా ఫరవాలేదులే. సత్యనారాయణని పంపిస్తా.”

'నాగరాజు మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చాడు.

“వద్దండి ఎడిటరుగార్లూ, నేనే వెడతా చెప్పాడు నాగరాజు

“నువ్వు వెడతావా?!

(ప్రింటులో మనకి కనీసం రెండూ, రెండున్నర పేజీల మేటరు కావాలి మరి,!

'మికు ప్రింటులో కనీసం రెండూ, రెండున్నర పేజీలకు తక్కువ కాకుండా మేటరు వస్తుందండీ.!

ఎడిటరుగారు కళ్ళన్సీళ్ళ .పర్యంతమై. మొహం తిప్పుకున్నాడు.

జన్మలో మళ్ళీ ఎప్పుడూ ఆ డోరు బెల్లు మోగించనని అనుకున్నవాడు సుశీలారాణి యింటి తలుపుకున్న పరిచయమైన బెల్లు కొడుతూ నాగరాజు: వింతైన వుద్వేగానికి లోనయ్యాడు. సుశీలారాణితో సంబంధం: తెగిపోయిన తరవాత ఒకటి రెండు సార్ను సరదాగా. కాసేపు శి బెస్ట్‌ 'సెల్లర్‌

మాత్రమే ఆమెని చూశాడతను, అదీ కేవలం: దూరన్నించి. అయితే ముఖాముఖీగా కలుసుకోవాలి యిప్పుడు మరి. సంతోషమా, విచారమా? చెప్పలేకుండా వున్నాడు. చెప్పగలిగిందల్లా తను 'ముందటిలాగే ఆమెని యింకా ప్రేమిస్తున్నాడని మాత్రం.

ముందుగదిలో కూచున్నాడు నాగరాజు. ఆమె అక్కడ వున్నప్పుడు ఆ గది ఎంత బాగా'వుందేది, అంతా తనే అన్నట్టు అవరించి వుండేది ఒకప్పుడు, అదిగో ఆ ఫోఫాలోనే తను తరచు.కూచుని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ..;

వెనకాల అడుగుల 'చప్పుడు. వినిపించగానే ముఖానికి. ముసుగు తొడుక్కునే సమయం ఆసన్నమైందనుకున్నాడు, లేచి నుంచుని ఇంటర్వ్యూ చెయ్యడానికొచ్చిన విలేఖరిలా ముఖంలో కృత్రిమంగా చిరునవ్వు పులుముకుని వెనక్కి తిరిగాడు.

'నమస్మారం, మెడం సుశీలారాణిగారూ, అన్నాడు.

అందుకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల నీరసించిందో లేకపోతే డయటింగ్‌ చేస్తోందో తెలీదు గానీ ఆమె చాలా చిక్కిపోయింది, అందమైన ముఖం కాస్తా పీక్కుపోయింది.. తన అంచనా సరి. అయితే ఆమె చాలా వ్యధలో వున్నట్లు కనబడింది నాగరాజుకి,

తనని చూడగానే ఆమె కళ్ళల్లో కొద్దిసేపు వెలుగు వచ్చినట్టు అనిపించినా, అపరిచితుల మాదిరి నిర్జిష్ష వైఖరిని కొననాగించాడు..

“గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌, మీస్‌ సుశీలారాణిగారూ. నేను పుస్తకాభిలాషి! పత్రికనుంచి వచ్చానండీ. మా పాఠకుల కుతూహలం తీర్చేందుకు మా వడిటరుగారి అభిమతం మేరా తమరి కళాభిమానం గురించీ, ఆదర్శాల గురించీ, లక్యాల గురించీ విశదికరించడానికి తమరు అంగీకరించినట్టు నా [గగ్రహింపండీ,!' అన్నాడు నాగరాజు

సుశీలారాణి కింది పెదవి కొరుక్కుంది.

కూచోండి దయచేసి మిస్టర్‌ ...?'

“నాగరాజు, పేరు చెప్పాడతను.

“మిస్టర్‌ న్గా గరాజుగారూ, ముందు కూచోండి. సర్తే మాకు కావలసిన సమాచారం యివ్వడానికి సిద్ధంగా. వున్నా” చెప్పింది సుశీలారాణి,

నాగరాజు కూచున్నాడు.

“సుశీలారాణిగారూ, మోకు కుక్కలంటే యిష్టమా?” అడిగాడు.

“అవునండీ, అవంటే చాలా యిష్టం నాక్సు, చెప్పింది సుశీలారాణి.

“కాసేపాగి మాకు అభ్యంతరం లేకపోతే మిరు. కుక్కల్ని ముద్దు చేస్తున్న ఫొటో ఒకటి తీసుకుంటానండీ, మికు చెప్పకృర్లేదనుకుంటా, యిలాంటి మానవీయ దృక్పధాన్ని మా పాఠకులు ఎంతో హర్షిస్తారు,:ఆస్వాదిస్తారు,' అన్నాడు నాగరాజు.

'ఓ తప్పకుండా. కుక్కని. తెప్పిస్తా. నాకు కుక్కలెంత యిష్టమో పూలన్నా అంతే యిష్టం, చెప్పింది. సుశీలారాణి. - బెస్ట్‌ సెల్లర్‌ 56 సరదాగా కాసేపు

'బహుశా మికు పూల మొక్కల మధ్య వున్నప్పుడు చాలా సంతోషంగా వుండొచ్చు, అవునా?

మొత్తానికి అలానే అని చెప్పొచ్చు.

'అమాయకదశలో చనిపోయిన చిన్నపిల్లల ఆత్మలే ఆ విరబూసిన పువ్వులు అని అప్పుడప్పుడు అనిపిస్తుందా మికు?"

“తరచుగా.”

రాసుకుంటున్న పెన్నుని నోట్లో పెట్టుకుని తీసి, 'సరే, మరిప్పుడు తమరి ఆదర్భాల గురించి కొంచెం చెప్పాలండీ, మో ఆదర్శాలు ఎలాంటివి?!

'సుశీలారాణి కొంచెం సందేహించింది.

శ చాలా గొప్పవి, అని చెప్పింది.

'ఈ నవయుగంలో నవలా సాహిత్యం అనేది స్రీల అభ్యున్నతికి గొప్ప పనిముట్టు అని అంటారందరూ. దాని గురించి మి అభిప్రాయం ఏవిటి. న్న

“ఆ, అవును.” . గర. వ. రభ, క్ష

“అయితే నవలలు కోకొల్లలుగా వస్తున్నాయి.! (( [౬౫ ఆజా

ఆ, అవును. లు " స టి ఆలో ౧ /

“విడిపోయిన దారులు” తరవాత మరో నవల రాయచానిక్షహ్రైనుకున్నారా?ా గ 2 స

“ఆ, అవును. ర.

'సుశీలారాణిగారూ, ఆ నవల ఎంతవరకూ వచ్చిందని అడిగితే మీరేమి అనుకోరుకదా?”

ఓహ్‌, నాగరాజూ! అంది సుశీలారాణి.

కొన్ని కొన్ని సందర్భాల్లో వుచ్చరించిన పలుకుల ముందు మన ఠీవి వేసవిలో మంచు ముక్కలా కరిగిపోతుంది, కోపతాపాలుంటే పారిపోయి గాయపడిన హృదయంలోంచి కృపారసం ఆనకట్ట తెంచుకుని పారినట్టు పొంగి పరవళ్ళు తొక్కుతుంది, వాటిల్లో - (ఓహ్‌, నాగరాజూ!' అనేది ఒకటి, అందులోనూ ఆ పలుకులకి వలవలా కారే కన్నీళ్ళు తోడయితే మరింక చెప్పాల్సింది ఏముంది,

(ఓహ్‌, నాగరాజూ!! తోపాటు జలపాతంలా కన్నీళ్ళు కార్చింది సుశీలారాణి, సోఫా మోద పడి ఏడుపు ఆపుకోలేక పక్కనున్న కుషన్‌ని నోట్లో కుక్కుకుని నములుతోందిప్పుడు, మాంసం ముక్కల్ని బరబరా మింగుతున్న పెంపుడు కుక్కలా దుఃఖాన్ని దిగమింగు కుంటోంది; అప్పటి దాకా నాగరాజు ముభావంగా కఠినంగా వున్నవాడు కాస్తాఆ దృశ్యం చూసి చలించిపోయాడు. సోఫా మోదికి ఒక్క అంగ్రలో దూకాడు. ఆమె చేతిని , పట్టుకున్నాడు. తల మోద చిన్నగా తట్టుతూ వెండ్రుకలు సవరించాడు. నడుం దగ్గిర మెత్తగా వొత్తాడు. బుజం తట్టాడు. వీపు మాద వేళ్ళతో మర్దించాడు. సరదాగా కాసేపు వ్‌ బెస్ట్‌ "సెల్లర్‌

సంతోషంతో సుశీలారాణి పక్కనే కూచుని నాగరాజు వూరడిస్తుంటే అతనికి స్సురించిన ఒకే ఒక చిక్కల్లా - ఈ సీనుని పూర్తిగా డైలాగ్సుతో సహా మొత్తం కొత్తగా రాసే నవలలో తప్పక బరికి గీకేస్తుందన్న భయం మాత్రమే ఆ సంతోషంలో కనిపించిన విషాదం.. ఆ కారణం చేతనే కొంతవరకు తన వ్యాఖ్యల్ని స్వయంగా సెన్సారు చేసుకున్నాడు. అయినా వుదేకంలో ఆ హెచ్చరికని సాంతం మరిచిపోయి అజా(గత్తతో వ్యవహరించాడు. ఆమె అతన్ని పట్టుకుని అద్ధిస్తూ నాగరాజ్తూ నాగరాజూ అంటూ వాలిపోతే నాగరాజుకి: జాలేసింది: దాంతో అతను మాట్లాడేది పూర్తయేసరికి మేటరు రెండువందల 'పేజీలు దాటింది. బహుశా తంగిరాల అండ్‌ సుమాజణం. కంపెనీ వారికి యూ. సంగతి తెలిస్తే ఎగిరి గంతులేస్తారేమో కూడా. దాన్ని గురించి యిప్పుడతను పట్టించుకునే స్థితిలో లేడు. తను చెప్పవలిసింది చెప్పాడు. దాన్నంతా యిరికించి సుశీలారాణి నవల రాసిన తరవాత అది లక్ష కాపీలు అమ్ముడుషోతే క్‌ పోనీ లక్ష కాపీలు అమ్ముడు కానీ. సుశీలారాణిని గట్టిగా బాహువుల్లో బంధించి - తను యిప్పటిదాకా చేసిందీ, అన్నదీ కాపీరైటు చేసి దేశంలో అన్ని భాషల్లోకీ, గిరిజన భాషతో సహా, అనువాదాలు చేస్తే చేసుకోన్సీ నాకెందుకు అనుకున్నాడు నాగరాజు, “ఓహ్‌, నాగరాజూ!” అంది సుశీలారాణి. “మై డార్లింగ్‌! నేను గట్టి చిక్కుల్లో యిరుక్కున్నాను, నాగరాజూ." “డార్లింగ్‌, ఏవిటా చిక్కులు?! సుశీలారాణి లేచి కూచుని కళ్ళు తుడుచుకుంది. 'వాడే, ఆ కటకం వెంకట్రావు. నాగరాజు మొహం క్రూరంగా మారి 'నుదురు ముడతలు పడింది. తను ముందే యిది గ్రహించి. వుండాల్సింది. అనుకున్నాడు. జల్సారాయుడిలా కనిపించే వెంకట్రావు ఒక అబలని యిప్పుడో అప్పుడో అవమానించడం తప్పదు. దానికి లావుపాటి కళ్ళద్దాలు తోడైతే మరి వాడు మానవరూపంలో వున్న రాక్షసుడుకాక మానుతాడా అనుకున్నాడు “చంపేస్తా వాడ్డ! అన్నాడు వెంటనే, 'అసలా పని ఎప్పుడో చేసుండాల్సింది నేను, ఎందుకో మనం పోనీలే అని వుపేక్తిస్తూ వాయిదా వేస్తూ వుంటాం, ఏం చేశాడు వాడు? బలవంతంగా నిన్ను తన వైపుకి ఆకర్షించుకోవాలని చూశాడా? ఆ సోడాబుడ్డి కళ్ళజోడు వాడు ముద్దు పెట్టుకోవాలనో లేక మరింకేదన్నా చెయ్యడానికో ప్రయత్నించాడా?'

(నన్ను వూపిరి సలపలేనంతగా బుక్‌ చేసి కూచున్నాడు.

“ఏం చేసి కూచున్నాడంటావ్‌?

“బుక్‌ చేసి కూచున్నాడు. రకరకాల మేగజీన్లలో. మూడు సీరియళ్ళు కాక ఎన్ని కథలకి నన్ను వొప్పుకునొచ్చాడో నాకే తెలీదు.”

(నువ్వనేది నీతో కథలు రాయిస్తానని మాట యిచ్చి వచ్చాడంటున్నావా?'

గుడ్లలో నీళ్ళు నింపుకుని అవునన్నట్టు తల వూపింది సుశీలారాణి.

“ప్రతి మేగజీనుతోనూ వొప్పందం కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది నాకైతే. దిక్కు తోచకుండా వుంది, వాళ్ళేమో అడ్వాన్సుగా చెక్కులు పంపిస్తూనే వున్నారు - వందలూ, వేలూను.. నేనిప్పుడు ఏం చెయ్యాలి?”

“బ్యాంకులో 'వేసుకోవాలి”+ సలహా యిచ్చాడు నాగరాజు.

'కాన్సీ ఆ తరవాత?”

'ఖర్చు పెట్టుకోవాలి.

'మరి ఆ తరవాత?

నాగరాజు: కాసేపు ఆలోచించాడు.

'అదే కాస్త కష్టమైన పని అనుకో, 'న్యూసెన్సు. ఆ తరవాత మరింక కూచుని రాయాల్సిందే, తప్పదు,”

ఆత్మ ఘోషిస్తున్నట్టు సుశీలారాణి వెక్కి వెక్కి వడవటం మొదలెట్టింది.

జ్రాన్సీ నేనిప్పుడు రాయలేను, నాగరాజూ!. వారాల తరబడి కూచుని ప్రయత్నించాను, ఒక్క వాక్యం కూడా రాయలేకపోతున్నాను. కలం ముందుకు సాగటం లేదు. అసలు నేను ఎప్పటికీ రాయలేను కూడా. రాయాలని లేదు నాకు, పెన్ను ముట్టుకోటానికే అసహ్యమేస్తోంది. దేన్ని గురించి రాయాలో తెలీడం లేదు నాకు, నాకైతే చచ్చిపోతే బావుండ నిపిస్తోంది..

అతన్ని గట్టిగా పట్టుకుని: వదళ్లేదామె.

“ఇవాళే అతన్నించి వుత్తరం వచ్చింది. చూస్తే మళ్ళీ యింకో రెండు మేగజీన్లకి నాచేత రాయిసాొనని వాప్తుకున్నాడట.]

నాగరాజు మృదువుగా ఆమెని ముద్దు పెట్టుకున్నాడు, అసిస్టెంట్‌ ఎడిటరు వుద్యోగంలో 'చేరకముందు తను కూడా రాస్తుండేవాడు కనక అర్ధం చేసుకున్నాడు పరిస్థితిని. సున్నిత మనస్తత్వంతో వుండే కళాకారుడిని బాధించే విషయం -- అడ్వాన్సుగా చెక్కులు రావడం కాదు - కూచుని రాసే శ్రమ.

'ేనిప్తుడు వం చెయ్యాలో?! ఏడుస్తూ అరిచింది సుశీలారాణి, సరదాగా కాసేపు వ్‌ బెస్ట్‌ సెల్లర్‌

'అసలు యిదంతా పూర్తిగా విరమించెయ్యి,” అన్నాడు నాగరాజు, “సుశీలా, నువ్వు కారు డైవింగ్‌ నేర్చుకున్న రోజులు గుర్తున్నాయా నీకు. మొదట్లో ఏమనుకున్నావ్‌? చాలా కష్టం అనుకున్నావా లేదా? వదిలేద్దామని కూడా అనుకున్నావా? అయితే రోజూ ప్రాక్టీసు చేసి చేసి చివరికి సాధించావా లేదా? రాయడం కూడ్రా. అంతే అనుకో. మొదట కాస్త భయమేసినా తరవాత్తరవాత (శ్రమ పడినందుకు ఫలితం దక్కుతుంది. కనక నువ్వు రాయదలుచుకుంటే కఠిన పరిశ్రమకి లోనవ్వాలి. ఏవిటీ దాని వుపయోగం? నామాట విని వదిలెయ్యి.

“మరి డబ్బు వాపసు చెయ్యమంటావా?

నాగరాజు తల అడ్డంగా ఆడించాడు వద్దన్నట్టు.

“వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు,! అన్నాడు స్థిరంగా. “నువ్వు చాలా దూరం వెడుతున్నావు. డబ్బుని జిద్దులా గట్టిగా పట్టుకో, రెండు చేతుల్లో యిరికించుకో, వెనక పక్కతోటలో పాతిపెట్టి గుర్తుగా దాని మోద కర్రపుల్ల పాతి 'పెట్టుంచుోే

'మరి కథల మాటేవిటి? ఏవరు రాస్తారవన్నీ?” ౨.

నాగరాజు చిరునవ్వు నవ్వాడు: .

నేను!” అన్నాడతను, 'ఈ వుద్యోగంలో చేరకముందు నేను కూడా “విడిపోయిన దారులు” లాంటి చెత్తా చెదారం రాస్తుండే వాడిని. నిన్ను నేను పెళ్ళి చేసుకునేటప్పుడు త్రికరణశుద్ధిగా - నాకవంత బాగా తెలీవు కానీ బహుశా మనస్కా వాచా కర్మణా అంటారనుకుంటా - నా సర్వస్వం ధారపోస్తాన్నీకు, ఆ సర్వస్వంలో - ఏ పల్లిషరూ ప్రచురించడానికి ముందుకురాని మూడు నవలలు, తిరుగుటపాలో తిరిగొచ్చిన యిరవై రెండు కథలూ వుంటాయి. వాటిని నీకు. వుచితంగ్లా యిచ్చేస్తా, ఇవాళ రాత్రికే నీకొక నవల అడ్వాన్సుగా యిస్తా. తంగిరాల అండ్‌ సుమాణం కంపెనీ వాళ్ళు అయిదారు లక్షల కాపీలు అమ్ముతుంటే మనం కూచుని గమ్మత్తు చూద్దాం, సరేనా?!

“ఓహ్హ్‌ నాగరాజూ!' అంది సుశీలారాణి. “'ఓహ్హ్‌ సుశీలా[్‌ అన్నాడు నాగరాజు, బెస్ట్‌ సెల్లర్‌ 5 సరదాగ్లా కాసేపు

ఉండ్రాజువారి ఉలేజావయుం ణాణాతీంి మామ్‌.

దూరానున్న చర్చిలోంచి దేవుడి కీర్తనలు మేము కూచునున్న పానకుటీరందాకా వినిపిస్తున్నాయి. 'సూతరాజుగారు శ్రుతి కలిపి సన్నగా పాడుతున్నాడు. కాసేపలా కూనిరాగం తీసి యిలా అన్నాడు: “మాకు తెలుసో లేదో గమ్మత్తయిన విషయమేమిటంటే ఈరోజుల్లో చర్చి షాస్టర్లెవరూ సన్నగా రివటలా వుండటం లేదు, గమనించారా?”

“నిజమే. ఇప్పటి వాళ్లందరూ కండలు పెంచుకున్న. వస్తాదుల్లా వుంటున్నారు. పీలగా వుండే పాస్టర్లని ఈమధ్య నేనెప్పుడూ చూళ్ళేదు, వొప్పుకున్నాన్నను.

“మా యింటిపక్కనుండే ఉండ్రాజు కృపానందంగారబ్బాయి ప్రేమ్‌సాగర్‌ని చూశారా ఎప్పుడన్నా?!

“లేదంది.

“అదేదో షాటలో వర్ణించినట్టే వుంటాడతను. (ప్రేమ్‌సాగర్‌ సంగతి వినాలని మికు చాలా కుతూహలంగా వున్నట్టుంది, చెబుతా వినండి.”

॥

సరదాగా కాసేపు. 5్‌5్‌ 'ఉంద్రాజువారి ఉల్తేజామ్లం

ఇది జరిగిన రోజుల్లో (సూతరాజుగారు కథకి వుపక్రమించారు) ్రేమ్‌సాగర్‌ చిన్న కుగ్రామంలో చర్చి పాస్టరు దగ్గిర అసిస్టెంటుగా వుంటుండేవాడు. కుర్రాడే అయినా వయసుకి తగినంత చారవ, ధైర్యమూ లేక పిరికివాడుగా చెలామణీ అవుతుండేవాడు. కాలేజీ రోజుల్లో మాత్రం కొంత దూకుడుతనం కనిపించినా బహుశా థియొలాజికల్‌ కాలేజీ దశలో ఏదో క్రూరాత్మ అతన్ని ఆవహించి వుండవచ్చు. అక్కడినించి బయటపడ్డ తరవాత పాపాత్ములకి సన్మార్గం చూపించే కార్యక్రమంలో రెవరెండ్‌ గొర్తి రాజరత్నంగారికి సాయపడుతూ ఆయన చర్చిలోనే వుండేందుకు 'వచ్చాడు.. ప్రేమ్‌సాగర్‌ సాత్వికంగా, అమాయకంగా వుండేవాడప్పుడు. నున్నటి జుట్టు, నీరసమైన ముఖంతో బలహీనంగా కనిపిస్తుందేవాడు. .

బాగా కండరాలు తిరిగి మంచి వొడ్డూ పొడుగూతో నిండుగా వుందే 'రెవరెండ్‌ గొర్తి రాజరత్నం పర్సనాలిటీ కూడా. అతనికి ప్రాప్తించిన పిరికితనాన్ని, సంకోచాన్ని పోగొట్టలేకపోయింది. రెవరెండ్‌ రాజరత్నంకి పుష్కలమైన కండబలం ఒక్కటే కాదు = రోషం, ఆవేశం, మితిమోరిన కోపం కూడా ఆయన సాత్తు, ఎదుటి వాళ్ళు మాడి భస్మీపపలమయేలా వుందే ఆయన చూపు ఎంతటి గట్టివాడినీ గజగజ వొణికేటట్టు చేస్తుంది. కాలేజీ రోజుల్లో కుస్తీ పోటీల్లోనూ, బాక్సింగులోనూ ఆయనకి చాలా మెడల్సు వచ్చాయని చెబుతారు. ్రేమ్‌సాగర్‌ ప్రకారం - చర్చికి సంబంధించిన వాదోపవాదాల్లో కూడా ఆ మెళకువల్నే ఏక్కువగా 'ప్రయోగించేవాడట రెవరెండుగారు. ఒకసారి ఈస్టరు పండగ సందర్భంలో చర్చి అలంకరణ గురించి ఆయన చెప్పినదాన్ని వ్యతిరేకించినందుకు ఎత్తి కుదేసినంత 'పని 'చేశాడని అతను చెప్పడం నాకింకా గుర్తు. అసలు విషయానికొస్తే జరిగింది చాలా చిన్నదట - తెల్లగా సున్నం వేసిన గోడలమిద దేవుడి వాక్యాలు ఎర్ర పెయింట్‌తో దాయించాలా లేకపోతే నీలం 'పెయింట్‌తో రాయించాలా అన్న విషయం మోద నెత్తురు చిమ్మేంత రభస చేసినట్టు చెప్పాడు.

అదీ రెవరెండ్‌' గొర్తి రాజరత్నంగారి. అసలు రూపం. అయిన్నా అంత భీకరంగా వుండే ఆయనగారి కూతురు మాదనే (్రేమ్‌సాగర్‌ మనసు పారేసుకున్నాడు, కాముడి. బాణాలకి మనమందరం హీరోలవుతామనేది పచ్చి నిజం.

కరుణ చాలా మంచి పిల్ల. ప్రేమ్‌సాగర్‌ ఆమెని ఎంత అభిమానిస్తాడో ఆమె కూడా అతన్ని అంతే అభిమానంతో ప్రేమించింది... అయితే ఆ సంగతి రెవరెండుకి చెప్పేందుకు ధైర్యం లేక మూడోకంట కనబడకుండా వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు చాటుమాటున కలుసుకుంటుందేవాళ్ళు; అయితే ఉండ్రాజువారి కుటుంబీకులందరిలా (పేమ్‌స్తాగర్‌కి కూడా అబద్దాలంటే గిట్టదు, నిజం చెప్పటానికి ప్రాణమిస్తాడు. అంచేత యిలా మోసగిస్తూ కలిసే. దానికన్నా నిజం చెప్పేస్తే మంచిదనుకున్నాడు, ఒకరోజు సాయంత్రం సంధ్య వెలుగులో వాళ్ళిద్దరూ 'పెరట్లో మామిడిచెట్టు వెనకాల పచార్లు చేస్తున్నప్పుడు (ప్రేమ్‌సాగర్‌ దీన్నింక కట్టి పెట్టాలనుకున్నాడు. ఉం(డ్రాజువారి: ఉత్తేజామ్లర 56 సరదాగా కాసేప్ప

“కర్రుణ్తా, యిలా రహస్యంగా కలుస్తుండటం నావల్ల కాదింక, ఇప్పుడే యింట్లోకెళ్ళి నిన్ను నా చేతుల్లో పెట్టమని మో నాన్నగారిని అడిగొస్తా* అన్నాడామెతో.

నాన్నగారి స్వభావం కరుణకి కొట్టిన పిండి కనక చేతి సంగతి ఎలావున్నా జవాబు మాత్రం బూటు కాలుతో యిస్తాడనే [గ్రహింపు వుంది.. ముఖం పాలిపోయింది, అతను వెళ్ళకుండా ఆపుతూ గట్టిగా పట్టుకుంది.

“వద్దొద్దు. నామాట విను (ప్రేమ్‌, వెళ్ళొద్దు!

“ఇలా దాగుడుమూతలు ఆడకుండా తిన్నగా వుండేందుకు మనకి అదొక్కటే మార్గం, దార్లింగ్‌.!

కానీ యివాళ మాత్రం వద్దు. నిన్ను బతిమాలుకుంటా, యివాళొద్దు.!

“ఏం, ఎందుకని?”

“ఆయనివాళ చాలా కోపంగా వున్నారు. చర్చిలో మాస్‌లోన్తూ పండగలకీ ఆయన వేసుకునే అంగీకి చాలా ఆడంబరంగా లేసు పూలూ, అల్లికలూ. చేయించుకున్నాడనీ; అది పద్ధతి కాదనీ, పాస్టరుకి అన్ని అలంకారాలు తగవనీ అభ్యంతరం తెలుపుతూ యింతకుముందే బిషప్‌ బూషి శౌరయ్యగారినించి. లెటరొచ్చింది. దాంతో నాన్నగారు మండిపడుతున్నారు. ఇంకో సంగతేమిటంటే -. తనూ, బిషప్‌ శారయ్యగారూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న సంగతి 'నాన్నగారింకా మరిచిపోలేదు. భోజనం 'చేస్తూ ఆ చట్టిముక్కు బూషి శౌరయ్యగాడు నామిద పెత్తనం చెలాయిద్దామని అనుకుంటున్నాడు కాబోలు, 'నా తడాఖా చూపిస్తా వాడికి అంటూ ఆయన మిద కారాలు మిరియాలు నూరేరు.!

'జ్ఞానస్నానం జరిపించటానికి బిషప్‌ శారయ్యగారు రేపే వస్తున్నారిక్కడికి మరి.

“అవును. వాళ్ళిద్దరూ ఎక్కడ పోట్లాడుకుంటారోనని నాకు యిప్పటినించే భయం పట్టుకుంది, నాన్నగారు మరో బిషప్‌గారి కింద వుంటే ఎంతో బావుండేదనిపిస్తోంది. చిన్నప్పుడు క్లాసులో చొక్కా చిం పేశాడన్న విషయం నాన్న యింకా మరిచిపోలేక చర్చి వ్యవహారాల్లో బిషప్‌ బూషి శారయ్యగారు తనకి పైవాడనే గౌరవం యిసుమంత కూడా చూపడం లేదు. అందుకే యివాళ మాత్రం నువ్వాయన్ని ఏమా అడగొద్దు, సరేనా?

“సరే అడగన్లే" భయంతో వొణుకుతూ అభయం యిచ్చాడామెకి (ప్రేమ్‌సాగర్‌:

'ఇంటికెళ్ళగానే ఛాతీ మిదంతా జామాయిలు మర్దనం చేసి రెండు మూడు స్వెట్టర్లు తొడుక్కుని రగ్గు కప్పుకుని పడుకో, కిటికీలు మూయడం మర్చిపోవద్దు. చలి విపరితంగా వుందసలే,!

“అలాగే, తప్పకుండా నువ్వ చెప్పినట్టే చేస్తా, డార్లింగ్‌.

'నువ్వసలే అర్భకుడివి. సీకు ఏమాత్రం కండపుష్టి లేదని తెలుసుగా?”

"నాకు వాంట్లో బలం తక్కువని తెలుసు, కరుణా.

“బలానికి మంచి టానిక్కేదన్నా పుచ్చుకోవాలి నువ్వు. సరదాగా కాసేప్పు వ్‌7 ఉండ్రాజువారి ఉర్తేజామ్లం

“అవును, పుచ్చుకోవాలనుకుంటా... గుడ్‌ నైట్‌, కరుణా.”

'గుడ్‌ నైట్స్‌ ప్రేమ్‌”

(ప్రేమికులు విడిపోయారు. రెవరెండుగారింట్లోకి కరుణ జారుకుంటే, మెయిన్‌ రోడ్డు షూదున్న అద్దె యింట్లోకి 'ప్రేమ్‌సాగర్‌ చేరుకున్నాడు, లోపలికి అడుగుపెట్టగానే టేబులు మిదొక పార్సిలు, దాని పక్కనే వుత్తరం కనిపించాయి.

ఏక్కడో మనసుపెట్టి ఆలోచిస్తూ వుత్తరం చింపి.చదవసాగాడు.

'మై డియర్‌ (పేమ్‌సాగర్‌.”

సంతకం ఎవరిదానని వుత్తరం చివర చూశాడు. ప్రశాంతి పిన్ని నించొచ్చిన వుత్తరం అది. ఆవిడ కృపానందంగారి తమ్ముడు శాంతికుమార్‌ భార్య. వాళ్ళిద్దరూ కలుసుకున్న వైనం, దంపతులైన వైనం ముందోసారి చెప్పాను, గుర్తుండొచ్చు మికు. గుర్తొస్తే శాంతికుమార్‌ రసాయనశాస్త్రంలో చాలా గొప్ప రిసెర్చి చేసిన సంగతీ, ఎన్నెన్నో పేటెంటు మందులు కనిపెట్టిన సంగతీ మర్చిపోయుండరు మిరు. ఆయన కనిపెట్టిన మందుల్లో ముఖ్యమైనవి, మహా ప్రసిద్ది పొందినవీ అయిన ఉండ్రాజువారి ముఖ సౌందర్య రక్త్షిణ్మి ఉంధ్రాజువారి హీమాలయా ఫేస్‌ క్రీం మొదలైనవి వున్నాయి. 'ప్రేమ్‌సాగర్‌కీ, వాళ్ళ బాబాయి శాంతికుమార్‌కీ మధ్య సంబంధం అంతంత మాత్రమే కానీ, వదినె ప్రశాంతిగారికీ, (ప్రేమ్‌సాగర్‌కీ మధ్య మంచి ఆప్యాయత, చనువు వున్నాయి.

మై డియర్‌ (పేమ్‌సాగర్‌ (అంటూ రాసింది ఉంద్రాజు వ్రశాంతి,)

నాయనా (ప్రేమ్‌, ఈమధ్యనెందుకో తరచు నువ్వే గుర్తుకొస్తున్నావయ్యా కిందటిసారి నువ్వొచ్చినవ్చుడు బలపొనంగా కనబడిన సంగత్కీ నీలో విటమిన్లు లోవించినట్టు గమనించిన సంగతీ మర్చిపోలేకుండా వున్నా. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావని తలుస్తున్నాను.

నువ్వు మంచి టానిక్‌ పుచ్చుకోవాలని కొంతకాలంనించీ చెబుదామనుకుంటుంటే అంతలోకీ అదృష్టవశాత్తు మా బాబాయ్యిగారు యింట్లో దొరికిన పాతకాగితాలు సేకరించి మరో గొప్పు మందు తయారుచేశాననీ, వెంటనే గుణం కని విస్తుందనీ చెప్పారు. దాని పేరు ఉం(్రాజువారి ఉత్తేజామ్లం,

ఈ మందు నేరుగా రక్తంలో కలిసిపోయి ఎర్రకణాల మిద ప్రభావం చూవిస్తుంది. దీన్నింకా మార్ఫెట్లోకి విడుదల చేయలేదాయన; అందుకే లేబరేటరీలోంచి చిన్న శాంఫులు బాటిలు ఆయనకి చెప్పకుండా తీనుకొచ్చి నీకిమ్లుడే పార్సిల్లో పంవిస్తున్నా. వెంటనే దీన్ని తాగటం. మొదలెట్టు. నీకు కావాల్సింది యిదేనని నాకు ఖండితంగా అనివీంచింది.

అభిమానంతో నీ విన్ని, ఉంద్రాజు (ప్రశాంతి, ఉంద్రాజువారి ఉత్తేజ్లామ్లం 58 సరదాగా కాసేపు,

తాజా కలం - రాత్రిళ్ళు పడుకునేముందు ఒక చెంచాడూ, మళ్ళీ పొద్దున్నే టిఫిన్‌ తినేముందు మరొక చెంచాడూ పుచ్చుకోవాలి. -

(ప్రేమ్‌సాగర్‌కి మూఢనమ్మకాలు లేవు. అయినా కాసేపటి ముందే మంచి టానిక్‌ పుచ్చుకోమని ప్రియురాలు కరుణ సలహా యివ్వటం, అంతలో టానిక్‌ యింటికే రావటం 'చూసిగురి ఏర్పడింది. తనకోసమే. యిలా జరిగిందనుకున్నాడు. బాటిలు బాగా గలబరించి, 'మూత తెరిచి, చెంచానిండా పోసుకుని కళ్ళు మూసుకుని మింగేశాడు.

ఆ మందు రుచి మరీ అంత చెడుగా లేదనుకున్నాడు, వాసన మాత్రం పాత చెప్పుల్ని దంచి. మిరియాల కషాయంలో కలిపినట్టు కొంచెం ఘాటుగా అనిపించింది. ఆ పూటకి సరిపడా మోతాదు మింగేసి కాసేపు థియాలజీ వ్యాసాలు చదివి పడుకున్నాడు.

వొంటి నిండా రగ్గులు కప్పుకుని పడుకోగానే పనివాడు రోజూలాగా ఆ రోజు కూడా మంచినీళ్ళ చెంబు తల దగ్గిర పెట్టలేదన్నది గమనించి కోపం వచ్చింది.

“భీ ఏవిటో ఏప్పుడూ యింతే”? అనుకున్నాడు (ప్రేమ్‌సాగర్‌,

తనకి రాత్రిళ్ళు నాలుక పిడచకట్టుకుపోతుందనీ, చెంబునిండా నీళ్ళు నింపి స్టూలు మోద పెట్టాలనీ నౌకరుకి ఎన్నో మార్లు చెప్పినా పట్టించుకోడా మనిషి. ఈ వ్యవహారం నచ్చలేదతనికి.. వెంటనే మంచం దిగి మెట్ల దగ్గిరకెళ్ళి, 'జకరయ్యా!' అని గట్టిగా అరుస్తూ పిలిచాడు.

జవాబు రాలేదు కిందనించి.

'జకరయ్యా!' అంటూ మళ్ళీ యింకోసారి ఎలుగెత్తి పిలిచేసరికి గాలిదుమారం వచ్చినట్టు కిటికి అద్దాలు టపటపా కొట్టుకున్నాయి. జకరయ్యంటే జంకు మూలాన ఆ రోజు రాశ్రివరకూ చాలా నెమ్మదిగా, సుతారంగా చిన్నగ్గొంతుతో మాట్లాడేవాడు. ఇప్పుదైతే మహా ధైర్యంతో పిలవటం వింతగా, కొత్తగా కనిపించింది అతనికే,

మెట్ల మిద అడుగుల చప్పుడు వినబడింది.

మంచి నిద్రలోంచి లేపినందుకు చిగర్రుబు(ర్రులాడే గొంతుతో, “ఏవిటి, ఏవైందిప్పుడు?” అడిగాడు జకరయ్య.

“ఏవైందో చెప్పాలా? నా రూములో మంచినీళ్ళుంచాలని ఎన్నిసార్లు చెప్పేన్నీకు? మళ్ళీ మరిచిపోయావ్‌, బుద్ధిలేని గాడిదా!”

అలాంటి మాటలు ఎప్పుడూ వినని జకరయ్య ఎదురుతిరగబోయాడు. “నన్నెవరూ యింతలేసి మాటలు యింతవరకూ...! |

చాల్లే కట్టిపెట్టు, నోర్మూసుకో గర్జించాడు ్రేమ్‌సాగర్‌, 'నాక్కావాల్సింది మంచినీళ్ళు పెట్టడం, అంతేకాని మాటకి మాట జవాబివ్వడం కాదు. తీసుకురా ముందు, లేకపోతే

యిహ్పుడే నిన్ను పీకిపారేస్తా వుద్యోగంలోంచి. ను వ్వొకృడివే వున్నావనుకుంటు న్నావా వూళ్ళో? నీలాంటి వాళ్ళు కో అంటే కోటిమంది. మంచినీళ్ళ చెంబు తే, ఫో! ఇంకా నుంచుని ఏం చోద్యం చూస్తున్నావ్‌, పరిగెత్తు.” సరదాగా: కాసేపు 50 ఉండ్రాజువారి. ఉిత్తేజామ్లం

'అలాగేనయ్యా, చిత్తమయ్యాః ఇదిగో చిటికెలో వస్తానండయ్యా.”

“యాక్షన్‌! యాక్షన్‌! అడుగు ముందుకెయ్‌, స్పీడు పెంచు! గొంతు చించుకుంటూ అరిచాడు ్రేమ్‌సాగర్‌. |

'తెస్తున్నానయ్యా, యిదుగోనండయ్యా” తమాయించుకుంటూ అన్నాడు జకరయ్య బుద్ధొచ్చినవాడిలా. - .

_ ఓ గంటసేపటి తరవాత కాస్త కునుకు పడుతున్నప్పుడు (ప్రేమ్‌సాగర్‌ బుర్రలోకి రకరకాల (ప్రశ్నలు చొచ్చుకొచ్చాయి. జకరయ్య మోద అనవసరంగా మాటలు తూలేనా? తన ప్రవర్తనలో దూకుడు కనిపించిందా? మొరటుగా వ్యవహరించానా? అవును, కూడని విధంగా ప్రవర్తించాను అనుకున్నాడు. లైటు వేసి టేబులు మిదున్న డైరీ తీశాడు.

పేజీ తెరిచి యిలా రాసుకున్నాడు దాంట్లో

సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. మరి నేను సాత్వికుడినా? అనుమానమే మరి. జకరయ్య చాలా మంచి నౌకరు, అయినా కాసేపటిముందు గదిలో మంచినీళ్ళ చెంబు పెట్టలేదని అతని మిద విరుచుకువడ్డాను, కారణం ఎంత సమంజసమైనా అంత వుద్రేకానికి లోనవటాన్ని నన్ను నేనే సమర్ధించుకోలేకుండా వున్నాను. మరోసారి యిలా మనలుకో కూడదని గుర్తుంచుకోవాలి.

అయినా మర్నాడు పొద్దున నిద్ర లేస్తూనే అదంతా మర్చిపోయాడు. టిఫినుకి ముందు ఉత్తేజామ్లం ఒక డోసు పుచ్చుకున్న తరవాత డైరీలో ముందురోజు రాత్రి రాసుకున్నది. చదివి తనేనా యిలా రాసింది, నమ్మశక్యంగా లేదనుకున్నాడు. “విరుచుకు పద్దానా?" అవును విరుచుకుపడ్డాను. తప్పేముంది అందులో? తనున్న పరిస్థితిలో ఎవరున్నా మంచినిళ్ళ చెంబు పెట్టనివాడి మిద విరుచుకుపదడరా?

వొత్తుగ్మా నల్లగా రాసే పెన్సిలు తీసుకుని రాసింది పూర్తిగా కొట్టెసి పక్కన మార్టిన్లో. ఎ(ర్రసిరాతో, '“ఏవిటీ విపరీతమైన రాతలు? బుద్ధి, జ్ఞానం అంటూ లేవా నీకసలు? ఆ సోమరిపోతుకి తగిన శాస్తి చేశావుగా!' అని రాసి టిఫిన్‌ చెయ్యటానికి కిందికెళ్ళాడు,

తను అంత చురుగ్గా వుండటం ఆశ్చర్యం కలింగించింది. ఆ టానిక్కు రక్తంలో ఏర్రకణాల మాద మహా ప్రభావం చూపిస్తాయని బాబాయి శాంతికుమార్‌గారు అన్నది చాలా కరెక్టు. అప్పటివరకూ తన వొంట్లో ప్రవహించే రక్తంలో అసలు ఎర్రకణాల్లాంటివి లేనే లేవనుకున్నాడు.. జకరయ్య వడ్డించబోయే టిఫినుకోసం ఎదురుచూస్తూ కూచుంటే యిప్పుడా కణాలు వొళ్ళంతా తిరుగుతూ డాన్సు చేస్తున్నట్టూ, రౌడీ మూకల్లా గుంపులు గుంపులుగా వెన్నెముక మాంచి. పాకుతున్నట్టు అనిపించింది. కళ్ళు వుజ్వలంగా వెలుగుతున్నాయి. జీవితం ఆనందదాయకంగా' వుందని తలుస్తూ దేవుని కీర్తనలు అందు కున్నాడు సన్నటి గొంతుతో.

జకరయ్య ప్లేటులో వేడి వేడి పూరీలు పట్టుకొచ్చేటప్పటికి యింకా అలాగే కూనిరాగం ఉంద్రాజువారి ఉత్తేజామ్లం. 60 సరదాగా' కాసేపు

ప్లేటు వంక చూసి మహా కోపంతో, ఏవిటవి? అంటూ వురిమాడు.

'పూరీలయ్యా. మంచి గోధుమల్ని పిండాడించి చేసిన పూరీలయ్యా,!

“మంచి గోధుమలంటే ఏవిటి నీ అర్ధం? గోధుమలు, మంచివి కావచ్చు. సాత్వికమైనవి కావచ్చు. కానీ ఈ పూరీలు మనుషులు తినేందుకు పనికొస్తాయనుకుంటే మాత్రం నువ్వు భ్రమపడుతున్నావ్‌. వెంటనే నీ అభిప్రాయాన్ని మార్చుకో. మళ్ళీ వంటింట్లోకెళ్ళి యీసారి మంచిగా వేయించినవి తీసుకురా, వంట చేసేటప్పుడు నువ్వొక వంటవాడివనీ, శృశానంలో శవాల్ని తగలబెట్టే వాడివి కాదనీ గుర్తుంచుకో. మాడనీయద్దు, దోరగా పూరీలు. వేయించటానికీ, శవాన్ని తగలబెట్టడానికీ చాలా అంతరం వుందని (గ్రహించు యిష్పుడైనా, నా దగ్గిర వుండాలని కనక నీకుంటే ఈ అంతరం గుర్తుంచుకుని వంట చెయ్యి, తెలిసిందా?”

పొద్దున లేచిన దగ్గిర్నుంచీ చాలా హేపీగా. ఫీలవుతున్న ్రేమ్‌సాగర్‌కి రోజు గడుస్తున్నకొద్దీ ఆ ఫీలింగు ఏమాత్రం తగ్గలేదు, పైగా పెరుగుతోందనే అనిపించింది. రోజూ ఆవేళ్లప్పుడు యింట్లోనే కాలక్షేపం చేసే మనిషి ఆ రోజైతే గభాల్న బట్టలేసుకుని పొలం గట్ల వెంబడి వాకింగ్‌కి బయల్చేరాడు.

నడిచినందుకుగాను బుగ్గలు. ఎరుపెక్కి వుత్సాహంగా తిరిగొస్తుంటే ఏనాడూ ఏ పల్లెటూళ్ళోనూ కనబడని దృశ్యం అతని కంటబడింది. అది - బిషప్‌గారు భయంతో ప్రాణాలు అరచేతులో 'పెట్టుకుని పరుగెత్తుతున్న దృశ్యం, అతను ౦డే అలాంటి కుగ్రామాల్లో బిషప్‌గారు కనబడటమే అరుదైన విషయం, ఒకవేళ అలా జరిగినా ఏదో పదవంత కారులో వెడుతూనో, మందీ మార్చలంతో దర్జాగా రోడ్డు మాద నడుస్తూ పోతుండటమో జరగాలి. అయితే యాయనగారు మాత్రం డెర్బీ గుర్రంలా 'పరిగెత్తుతున్నాడు. ఆ దృశ్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోడానికి ప్రేమ్‌సాగర్‌ వున్నవోటునే నిలబడి తిలకించాడు.

బిషప్‌గారు పొడుగ్గా దిట్టంగా వున్నాడు. మన్నిక కోసమే కాని, వేగం కోసం సృష్టించబడ్డవాడు కాదు. అయినా మహా వేగంగా పరిగెత్తుకొస్తున్నాడు. వేసుకున్న బట్టలు గాలికి జెండాల్లా రపరెపలాడుతుండగా 'ప్రేమ్‌సాగర్‌ని దాటి, అమాంతం పక్షనే. గుబురుగా వున్న చెట్టు ఎక్కేసి కొమ్మల్లో దాక్కున్నాడు, పరుగులో దిట్ట మాత్రమే కాక మంచి ఆల్‌రౌండర్‌ కూడానని నిరూపించుకున్నాడు. ఆయనలా ఎందుకు చేశాడో వెంటనే గ్రహించగలిగాడు (పేమ్‌సాగర్‌, వొళ్ళంతా బొచ్చుతో నిండున్న వూరకుక్క బిషప్పుని తరుముతూ వెంబడించింది, బిషప్పు చెట్టెక్కిన మరుక్షణంలో అది. చెట్టు దగ్గిరకొచ్చి పైకి చూస్తూ మొరగటం మొదలెట్టింది.

ప్రేమ్‌సాగర్‌ వెంటనే చెట్టు దగ్గిరకి చేరుకున్నాడు.

“ఏవిటి, ఈ మూగజీవి మిమ్మల్ని యిబ్బంది పెడుతోందా, బిషప్‌గారూ?” అంటూ సౌమ్యంగా విచారించాడు.

తను కట్టుకున్న గూడులోంచి కిందికి తొంగిచూశాడు బిషప్పు.

'దీని బారినించి నన్ను రక్షించు నాయనా!” అంటూ అర్ధించాడాయన. సరదాగా కాసేపు 61 ఉండ్రాజువారి ఉత్తేజామ్లం.

'సరే, ఆ సంగతీ నేను చూసుకుంటా, నాకొదిలెయ్యండి,! అన్నాడు (ప్రేమ్‌సాగర్‌.

వాస్తవానికి ఆరోజు వరకూ అతనికి కుక్కలంటే మాచెడ్డ భయం. ఆమడ దూరం పారిపోతుందేవాడు, అయితే యిప్పుడు మాత్రం వెనకాడలేదు. మాటలకన్నా చేతల్లో వేగం చూపించాడు, లావుపాటి కంకరరాయొకటి ఏరి గురి చూసి దాని మాదికి విసిరాడు, ధబ్‌మన్న చప్పుడుతో రాయి గమ్యస్థానం చేరేసరికి సంతోషంతో కేరింతలు కొట్టాడు, ఇదేదో మంచికి రాలేదని ఆ కుక్క గ్రహించి కుయ్యోమంటూ అరుస్తూ నలఖై మైళ్ళ స్పీడుతో పారిపోయింది. 'నెమ్మదిగా చెట్టు దిగొచ్చిన బిషప్పు అమాంతం, (ప్రేమ్‌సాగర్‌ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. .

“నాప్రాణం కాషాదావయ్యా!? అన్నాడాయన ఆనందంతో, చెమర్చిన కళ్ళతో,

'మోరలా అనకూడదండీ, 'స్నేహితుడు కష్టాల్లో వుంటే ఆదుకోడం నా ధర్మం. అందులోనూ. అర్చక వృత్తిలో వున్న మనం. అన్యోన్యంగా. ఒకరికొకరు సాయం చేస్తూ కలిసి మలిసుండాలి కదా;'

'ఓ నిమిషంపాాటైతే నన్నది పట్టేసుకుందనే అనిపించిందోయ్‌,.”

'దరిద్రపుగొట్టు కుక్కండీ. దిట్టంగా ఎంత లావునుందో అది.

అవునన్నట్టు, తల వూపుతూ బిషప్పు, “అతనికి దృష్టీ మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు.” ద్వితీయోపదేశకాందము 4 ;7,' అంటూ వొప్పకున్నాడు. “దారితప్పి వచ్చినట్టున్నా పాస్టరుగారింటికి దారెటో చెబుతావా?!

'మిమ్మల్ని నాకూడా తీసుకెడత్తా రండి,

థాం క్యూ, అయితే, ఆ కుక్కమూతి గాడితో - నేననేది, రెవరెంద్‌ గొర్తి రాజరత్నంతో సీరియస్‌గా ఒక విషయం చర్చించాలి నేను, నువ్వు లోపలికి రాకుండా. వుంటే మంచిదయ్యా.'

“నేను వాళ్ళమ్మాయితో సీరియస్‌గా ఒక విషయాన్ని చర్చించాలండీ. "పెరట్లో మామిడిచెట్టు దగ్గిరుంటాను.”

ఇద్దరూ కలిసి నడుస్తుంటే, “చాలా మంచి కుర్రాడిలా కనిపిస్తున్నావు, నాకు నచ్చావ్‌. నువ్వేమిటి, పాస్టరుకి అసిస్టెంటా?”

“ప్రస్తుతానికి మాత్రం, ముందు ముందు చూపిస్తా నా తడాఖా. నేననేది కాస్త ఓపిక పట్టండి నా ప్రతిభ చూద్దురుగాని, అన్నాడు (ప్రేమ్‌సాగర్క్‌ బిషప్పు ఛాతీని. చూపుడువేలుతో పొడుస్తూ.

'చూన్తానయ్యా, తప్పకుండా చూస్తా. నువ్వు చాలా చాలా పైకి ఎదగాలి, చెట్లు శిఖరాగ్రం వంటో స స -

“శఈమరిందాక చెట్టెక్కి చేరినట్టా? హ్హహ్హహ్హ[

'హ్లహ్హహ్హ! మహా చిలిపికుంకలాగున్నావ్‌ నువ్వు! అంటూ, ్రేమ్‌సాగర్‌ వీపు తట్టాడీసారి బిషప్పు, ఉంద్రాజువారి ఉత్తేజామ్లం 62 సరదాగా. కాసేపు

. పాస్టరుగారింటి "గేటు దాటుతుంటే బిషప్తు మళ్ళీ అన్నాడు: *'ఈ ముచ్చట్లన్నీ కాసేపు పక్కన పెడదాం. నేను మాత్రం నీ పురోగతి ఒక కంట కనిపెడుతూనే వుండి నీ తెలివితేటలకీ, నడవడికీ తగినట్టు త్వరలో మంచి హోదా. లభించేట్టు చూస్తా. కుగ్రాడివే అయిన్మా. ఒక స్నేహితుడిగా అభిమానిస్తున్నాను. మాటలు తూచి తూచి వాడుతూ చాలా: సీరియస్‌గా చెప్పేది వమిటంటే - యిందాక రాయి తీసుకుని నువ్వా కుక్కని తరిమికొట్టావు చూడు, అలాంటి హస్తలాఘవం. నేనెప్పుడూ చూడలేదయ్యా,. నేనెప్పుడూ కఠలోరసత్యమే చెబుతానన్న సంగతి [గ్రహించువో

“ణిజం గొవుదీ, అన్నింటికన్నా శక్తివంతమైనదీ.” ఎస్‌ద్రాస్‌ 4 £ 41 అన్నాడు (పేమ్‌సాగర్‌. పక్కకి తిరిగి పెరట్లో మామిడిచెట్టు వెనకాల కరుణని మామూలుగా కలిసే చోటుకెళ్ళాడు. తలుపు దగ్గిరున్న కాలింగ్‌ బెల్లు నొక్కాడు బిషప్పు. కలుసుకుందామని ముందు అనుకోకపోయినా టైము గడుస్తున్నకొద్దీ కరుణ జాడ లేకపోవడం ప్రేమ్‌సాగర్‌కి ఆశ్చర్యంగా అనిపించింది. వూళ్ళో విశేషాలన్నీ బిషప్పు భార్యకి చూపించమని కరుణతో వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు తెలీదు అతనికి, పావుగంటకి పైగా ఆమె కోసం నిలబడి, ఓపిక నశిస్తుండగా వెడదామనుకుంటే యింట్లోంచి గట్టిగా అరుపులు, గావుకేకలు వినిపించాయి. 'వెంటనే ఆగిపోయాడు. కింద ముందుగదిలోంచి మాటలు వినిపించాయి. చప్పుడు చెయ్యకుండా ఆ గది దగ్గిరకెళ్ళి కిటికీ కింద నుంచుని వినసాగాడు. చువ్వల్లేని కిటికీ తలుపు తెరిచుంది. లోపల జరుగుతున్న సంభాషణ స్పష్టంగా వినబడింది. పాస్టరు గొంతుకి రూము దద్దరిల్లిషోతోంది. “హో, అలాగా? అడిగాడాయన, “అవును, అంతే! అ న్నాడు బిషప్పు, 'హహ్హా!' నావైపు నించి కూడా నీకు హహ్హా చెబుతున్నా ఏం చేసుకుంటావో చేస్కో!” శ్రుతి కలిపాడు బిషప్పు. కిటికీకి మరింత దగ్గిరగా జరిగాడు ప్రేమ్‌సాగర్‌.. ఆ క్లాస్‌మేట్సిద్దరూ కారాలు, మిరియాలు నూరుకుంటారని కరుణ భయపడింది సమంజసమే అని తోచింది. లోపలికి తొంగి చూశాడు... పాస్టరైతే చేతులు వెనక్కి కట్టుకుని చొక్కా పీక్కుంటూ గదిలో పచార్లు చేస్తున్నాడు. బిషప్పేమో ధిక్కారం సహించలేక కోపంతో గుడ్లురిమి చూస్తూ నుంచున్నాడు. 'మతాచార్యులు ధరించే అంగీలకి నువ్వొక అథారిటీ అని ఏవరు చెప్పార్నికు?' గద్దిస్తూ అడిగాడు పాస్టరు. 'ఏవరు చెప్పారన్నది నీకు అనవసరం, వదిలెయ్‌, బదులిచ్చాడు బీషప్పు. సరదాగా: కాసేపు గ్ర ఉండ్రాజువారి. ఉత్తేజామ్లం

“నీకసలు వాటిగురించి కొంచెం కూడా తెలీదని నా నమ్మకం,”

కహో, అలాగా?”

“అవును, ఏవిటో చెప్పు చూద్దాం మరి?”

“అది గుండ్రంగా బుజాల *చుట్టూ వేల్లాడుతూ ఆడంబరంగా కుట్లు అట్లకలు చేసిన అంగీ. ఇదిగో కుక్కమూతీ, నా మాట విను. నువ్వెంత అరిచి గీపెట్టినా 'సరే, నువ్వేసుకు తిరిగే ఆ అంగీ మహా డాబుగా వుందని గుర్తుంచుకో, ఇంకో విషయం, నువ్వెంత త్వరగా అంగీనించి నగిషీలు తీసిపారేస్తే అంత మంచిది. లేకపోతే దానికి పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది.!

పాస్టరు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి,

'ఏన్టిటీ? తియ్యనుగాక తియ్యను, ఏం చేసుకుంటావో చేస్కో నామాద పెత్తనం చెలాయించడానికి వచ్చావా యిక్కడికి? ఏవిటసలు నీ వుద్దేశ్యం? పొట్టిలాగూ వేసుకుని స్మూలుకొచ్చినప్పటినించీ నువ్వు నాకు తెలుసు, నీగురించి ఒకటైండు విషయాలు లోకానికి చెబితే జనాలెంత సంతోషిసారో తెలుసా?”

“నా గతం తెరిచిన పుస్తకం లాంటిది.

నిజంగానా?” ద్రోహబుద్ధితో అదిగాడు పాస్టరు. 'లెక్కల మేస్తారి టేబులు సారుగులో చుంచు పిల్లల్ని దాచిపెట్టిందెవరు, చెప్పు?

దానికి గతుక్కుమన్ని 'వార్డెన్‌ దిండు మోదా, దుప్పట్లోనూ దురదగుంటాకు పెట్టిందెవరు?! ఎదిరించాడు. బిషప్పు,

“ఎప్పుడు చూడు, చొక్కాలు చింపుకుంది. ఏవరు?!

“చొంగతో చొక్కాతడవకుండా గొంతుకి గుడ్డ చుట్టుకుని తిరిగిందెవరు?” అడిగాడు బిషప్పు, విశాలంగా వుండే చర్చిలో ప్రవచనాల్ని మంద్రస్వరంతో చెప్పినా అక్కడ చేరినవాళ్ళందరికీ స్పష్టంగా వినిపిరీచేటట్టు మాట్లాడే బిషప్‌గారి స్వరం యిప్పుడైతే చర్చి ఘంటలా ఠంగుమని మోగుతోంది. “యానివర్సరీ రోజున పొట్ట పగిలేట్టు తిని మర్నాడు మంచం: ఎక్కిందెవరు?”

పాస్టరు వొళ్ళు ఆపాదమస్తకం కంపించింది. అసలే నల్లగా వుందే మొహం కాస్తా యిప్పుడు మరింత 'నలుపుకి తిరిగింది.

కోషానికి వాణుకుతున్న గొంతుతో, “చేపలు వండేటప్పుడు ఏదో తప్పు జరిగిందన్న సంగతి నీకూ తెలుసు. ఎవరికైనా అలానే అవుతుంది," అన్నాడు.

“తప్పు జరిగింది. చేపలు వండేటప్పుడు కాదు, ఆబగా నువ్వ మెక్కడంలో: వాళ్ళు, పెంచుకునేందుకు చేసిన కృషి కనక నువ్వు ఆత్మని పెంపొందించుకోడానికి జరిపుంటే ఈపాటికి, ఏద్కీ ఈపాటికి నా అంత వున్నత స్థితికి చేరుందేవాడివి.'

కృహో నిజంగానా?!

“కాదు, నాదే పొరపాటు. నీకంత బుర్ర లేదులే.” ఉండ్రాజువారి ఉత్తేజామ్లం (4 'సరదాగా కాసేపు

'ఓహో, బుర్ర కావాలా? నువ్విప్పుడు అన్నావే వున్నత స్థితి అని, అది నీకెలా వచ్చిందో మాకు తెలుసులేవోయ్‌.'

“ఏవిటి దీనర్ధం?”

'నువ్విప్పుడు బిషప్పువి. అంత పైకి ఎలా ఎదిగావన్నది మేము అడగం.

“ఏవిటి దినర్ధం?'

'నేనిందాక చెప్పిందేనయ్యా అడగం మేము.”

“ఏం, ఎందుకు అడక్కూడదు?”

“అడక్కుండా వుండటమే అందరికీ క్షేమం అని!” అన్నాడు వొస్టరు,

బిషప్పు పూర్తిగా సంయమనం కోల్పోయాడు. పట్టలేని కోపంతో మొహం వికారంగా మారింది. అడుగు ముందుకేశాడు. ఆలోగా సమయానికి ప్రేమ్‌సాగర్‌ కిటికీలోంచి దూకి లోపలికొచ్చాడు.

“అదిగో, అదిగో, అదిగో! ఆగండిద్దరూ. వెనక్కి తగ్గండి, వెనక్కి? అన్నాడు యిద్దరి మధ్యలోకి వచ్చి.

ఆగంతకుడిని చూసి మూగపోయి శిలాప్రతిమల్లా నుంచుండిపోయారు వాళ్ళిద్దరూ,

'చాలించండి, చాలించండి!” అన్నాడు (ప్రేమ్‌సాగర్‌.

ముందుగా తేరుకున్న పాస్టరు కోపంతో చూశాడతన్ని.

'నా కిటికీలోంచి దూరి లోపలికి రావటంలో ఏవిటి అర్ధం? నువ్వసలు నా అసిస్టెంటువా, సర్మస్‌లో బఫూనువా?*' అంటూ గదిమాడు.

కొరకొరలాదే పాస్టరు చూపుకి (ప్రేమ్‌సాగర్‌ తొణకలేదు, బెణకలేదు.

“చర్చిలో నేను మాకు సహాయకుదిని. నాకన్నా చాలా వున్నత స్థానంలో వున్నవాళ్ళు, పైగా చిన్నప్పటినుంచీ పరిచయం వున్నవాళ్ళు తమ హోదాలు మరిచి కీచులాడుకుంటుంటే సహించలెకపోయా. ఇది మంచిది కాదని చెబుతున్నా. నాకన్నా గొప్ప హోదాలో వున్నవాళ్ళు యిలా తగాదాలు పెట్టుకోడం తగదని చెప్పటానికొచ్చా.”

వొస్టరు నాలిక కొరుక్కున్నాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు బిషప్పు.

ఇద్దరి బుజాల మాదా చేతులేసి, *నా మాట వినండి. ఇద్దరు సౌమ్యులు పోట్లాడుకోడం చూడ్డానికి అసహ్యంగా వుంది,” అన్నాడు (పైమ్‌సాగర్‌,

“అతనే మొదలెట్టాడు,” అన్నాడు పాస్టరు గుణుస్తూ.

బిషప్పు జవాబివ్వబోతుంటే తుంచేస్తూ, “ఎవరు మొదలెట్టారన్నది వదిలేయండి పెద్దమనుషుల్లాగా మారిద్దరూ యింగితం చూపించండి వాదనల్లో ఒకరికొకరు గౌరవం చూపించుకోండి. చిరునవ్వుతో యిచ్చిపుచ్చుకోడం నేర్వండి అన్నాడు. ఇప్పుడు బిషప్పుని చూసి, 'మి చిరకాల మిత్రుడు చర్చిలో వేసుకునే అంగీ ఆడంబరంగా వుందని కదూ మా అభియోగం?” అని అదిగాడు

“అవును. ఇప్పటికీ అదే అంటున్నా.” సరదాగా కాసేపు 65 ఉంద్రాజువారి ఉత్తేజామ్లం

“అవునండీ, అవునూ అవును. కానీ, బాల్యమిత్రులిద్దరి మధ్య కాస్తంత ఆడంబరం ఏపాటిదో ఆలోచించుకోండి. మారూ, యింత గొప్ప పాస్టరుగారూ ఒకే స్కూల్లో చదువు కున్నారు. ఏంతైనా చిరకాలపు స్నేహం మిమ్మల్నిద్దర్నీ కట్టి పడేస్తుంది. ఒకచోటే పెరిగారు. ఒకే మైదానంలో ఆడుకున్నారు. ఒకే పక్కలో పడుకోకపోయినా ఒకే గదిని పంచుకున్నారు. హోం వర్కు ఎగ్గొట్టి గాలిపటాలు ఎగరేశారు. ఇవన్నీ మాకేమి అనిపించవా? ఈ జ్ఞాపకాలు మో గుండెల్లో మోగవా?' అంటూ. అనునయంగా హితబోధ చేసి, యిద్దర్నీ చూస్తూ, 'బిషప్‌గారూ, పాస్టరుగారూ' అంటూ వేడుకున్నాడు (ప్రేమసాగర్‌.

దూరంగా వెళ్ళి కళ్ళు తుడుచుకున్నాడు పాస్టరు, చేతిరుమాలు కోసం. జీబులు తదుముకున్నాడు బిషప్పు. పూర్తిగా నిశ్చబ్దం: ఆవరించింది,

కాసేపటికి. తేరుకుని గద్దద 'స్వరంతో, 'కుక్కమూతీ, సారీ అయ్యా," అన్నాడు బిషప్పు,

నేనలా అనకుండా వుండాల్సింది, చట్టిముక్కూ గొణిగాడు పాస్టరు.

“అసలా రోజు తప్పు నీది కాదనుకుంటా. ఆ చేపలే మంచివి కావని తరవాత తెలిసింది, మంచాన పడటం నువ్వన్నట్టు వాటి మూలానేనని సమర్ధిస్తున్నా ఆ చేపలు వంటకు పనికిరానివయ్యా.!

“నువ్వయితే ఆరోజున లెక్కల మేస్ణారి టేబులు సొరుగులో చుంచు పిల్లల్ని పెట్టి లోకానికే మహోపకారం చేశావ్‌. అసలు అప్పటికప్పుడే నిన్ను బిషప్‌గా చేసుండాల్సింది.”

వాళ్ళిద్దరూ చేతులు కలుపుకున్నారు.

“అద్భుతం, అన్నాడు (పేమ్‌సాగర్‌ అది చూసి. “ఇప్పుడంతా సజావుగా సర్జుమణిగినట్టేనా మరి?”

“చాలా బాగా” అన్నాడు వాస్టరు,

“నామట్టుకైతే అంతా సజావుగా వుందనే చెబుతా, అని బిషప్పు చిరకాలమి్రుడి వంక తిరగి, 'ఇదిగో యికనించీ నీకిష్టమైనన్ని అలంకారాలు చేయించుకో నీ అంగీకి. చేయించుకుంటావా కుక్కమూతీ?! అని అడిగాడు.

“లేదు, లేదు. తప్పు చేశానని తెలిసిందిప్పుడు. చట్టిముక్కూ యికనించీ ఎలాంటి ఆడంబరాలకీ పోనయ్యా.!

జానీ కుక్కమూతీ ...!

“పం ఫరవాలేదు. అవి వుంటే ఎంత, లేకపోతే ఏంత?! అభయమిచ్చినట్టు చెప్పాడు పాస్టరు,

'ఎంత విశాల హృదయమోయ్‌ నీది! ఆవేశాన్ని అణుచుకోడానికి పొడిదగ్గు దగ్గాడు బిషప్పు, దాంతో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించిందక్కడ.. కాసేపాగి, “ఇంక నేను బయల్టేరితే ఉం(డ్రాజువారి ఉత్తేజామ్లం. 66 సరదాగా కాసేపు

మంచిదనుకుంటా,.. నా భార్య ఎక్కడుందో చూడాలి. మి అమ్మాయి బయటికి తీసుకెళ్ళిందన్నారు, వూళ్ళో ఎక్కడో వుంటుందిలే,!

'ఇదిగోనోయ్‌, యిప్పుడే గేటు తెరుచుకుని వస్తున్నారు వాళ్ళిద్దరూ.

“కనిపిస్తున్నారులే. నీ కూతురు చాలా అందంగా. వుందయ్యా.”

ఆ 'మాటకి (ప్రేమ్‌సాగర్‌ బిషప్పు బుజం తట్టాడు.

“ఎంత గొప్పగా సెలవిచ్చారండీ తమరు. ప్రపంచంలో వున్న యువతుల్లో ఆమె ప్రియాతి ప్రియం, చాలా మధురం, పాస్టరుగారూ, మా యిద్దరి కలయికనీ మిరు కనక వెంటనే ఆశీర్వదిస్తే చాలా సంతోషిస్తానండీ. గొప్ప మనసుతో నేనామెని ప్రేమిస్తున్నాను. తనకి కూడా నామాద అలాంటి భావనలే వున్నాయని మాకు తెలపడానికి చాలా సంతో షిస్తున్నానండీ, మారు అంగీకరించానని చెబితే, వెంటనే 'పెళ్ళికి బట్టలు కుట్టించుకుంటా మరి.

ఏదో కుట్టినట్టు అమాంతం యింత ఎత్తున లేచాడాయన. అందరు పాస్టర్లలా ఆయనకి కూడా తనకింద పనిచేసే అసిస్టెంటంటే చాలా చిన్నచూపు. అందరూ ఈసడించుకునే ఆ వర్గంలో ప్రేమ్‌సాగర్‌ది అధమస్థానమని కూడా ఆయన అభిప్రాయం,

“ఏవిటీ! అంటూ అరిచాడు.

“ఇది చాలా మంచి శుభవార్త. నా ప్రకారం యిది చాలా గొప్ప పని, అన్నాడు బిషప్పు ఆనందంగా నవ్వుతూ.. - _

'నా కూతురా! నా కూతురు ఒక అసిస్టెంటుని పెళ్ళాట్టమా!”' అన్నాడు. పాస్టరు రెప్పలు వాల్చకుండా చూస్తూ,

“నువ్వు కూడా ఒకప్పుడు అసిస్టెంటుగానే వుండేవాడివి కదోయ్‌, కుక్కమూతీ.?

“అవును వుండేవాడిని, కానీ యిలాంటి నికృష్ణపువాడ్ని కాదు.!

“లేదు. నువ్విలా. వుండలేదు. ఆమాటకొస్తే నేనూ యిలా వుండలేదు. మనం కూడా యితనిలా వుండుంటే ఎంతో హాయిగా వుండేది. ఈ కుర్రాడున్నాడు చూశావ్‌, గుర్తుపెట్టుకో, చాలా గొప్పవాడయ్యా నాకు తెలిసినంతలో. సరిగ్గా గంట క్రితం నేనో పేద్ధ వూరకుక్క. బారిన పడితే నన్నెలా. రక్షించాడో తెలుసా? వొళ్ళంతా నల్ల నల్లటి మచ్చల్లో తోక మొండిగా వుండే. కుక్కయ్యా. సమయానికి యితను ఎక్కడ్నించి వూడిపడ్డాడో తెలీదు కానీ కుక్కమూత్స్కీ మంచి హస్త లాఘవం చూపిస్తూ యింతలావు కంకర్రాయి తీసుకుని దాని డొక్క పగలకొట్టాడయ్యా. "ఏంత (ప్రశంసించినా తక్కువే, అది చూసి చాలా మురిసిషపోయా; దాంతో ఆ కుక్క పరిగెత్తింది చూడూ నేను చెప్పలేననుకో!!

పాస్టరు చాలా వుద్రేకానికి లోనయ్యాడు. ఆయన కళ్ళు యింతలావు వుబ్బినాయి.

“ఏదీ, వొళ్ళంతా నల్ల నల్లటి మచ్చలున్న కుక్కనా?” =

“బొగ్గురంగుతో నల్లటి మచ్చలు. దాని గుండెకాయ మరింత నల్లగా వుండొచ్చు.

“నిజంగానే, దాని డొక్క పగలకొట్టాడా యితను?] సరదాగ్రా కాసేపు 67 ఉందడ్రాజువారి ఉత్తేజూమ్లం

'నాకు కనిపించినంత మేర సరిగ్గా డొక్క మధ్యలో తగిలిందా రాయిః

పాస్టరు చెయ్యి చాచాడు.

“ప్రేమ్‌, నాకీ విషయం తెలీదు. 'వెలుగులోకొచ్చిన నీ ప్రతాపం వల్ల నా అభ్యంతరాల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేందుకు వెనకాడనయ్యా, కిందటి ఈస్టరునించీ ఆ కుక్క మాద నాకు ప్రచండమైన కోపం వుంది . ఓరోజు సాయంత్రం కాలవొడ్డున్మ వచ్చే ఆదివారానికి చర్చిలో చెప్పవలసిన - అభ్యుదయ భావాలుగా చెలామణీ అవుతున్నవాటి నిజస్వరూపం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు - 'ప్రవచనం గురించి ఆలోచిస్తూ నడుస్తుంటే అదే కుక్క వెనకనించొచ్చి సరిగ్గా నా చీలమండ దగ్గిర పట్టుకుని వదల్లేదయ్యా, కరుణని నువ్వు వివాహం చేసుకో. నా అనుమతి వుదారంగా యిస్తున్నా. నీలాంటి వాడు భర్త అయినందుకు తను చాలా సుఖపడుతుందనే దాంట్లో నాకు రవ్వంత కూడా. సందేహం లేదు.” |

కాసేపలా అభిమానంగా మాట్లాడిన తరవాత బిషప్పుని తీసుకుని ్రేమ్‌సాగర్‌ వెళ్ళిపోయాడు. దార్లో బిషప్పు మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.

''ప్రమ్‌, నీకు నేను చాలా బుణపడున్నాా! అన్నాడాయన చిట్టచివరికి.

'నాకదేమి తెలియదండి. నిజంగానంటారా?! అని అడిగాడు.

“దాలా చాలా బుణపడున్నా. మహా గొప్పు ఆపదనించి నన్ను కాపాడావు. నువ్వు కనక సమయానికి. కిటికీలోంచి దూకొచ్చి అడ్డం రాకపోతే నా బాల్యమిత్రుడి మాద చెయ్యి చేసుకునుండేవాడ్ని 'మహా రెచ్చగొట్ట్లాడతను.”

_ “పాస్టరుగారు అలా వేధించడం మామూలేనండి.!

'అప్పటికే నా పిడికిలి బిగుసుకుంది, చెయ్యి ఎత్తబోతుంటే నువ్వొచ్చి ఆపావు. వయసుకి మించిన తెలివితటలు, యుక్తి కనక నువ్వప్పుడు ప్రదర్శించకుండా వుంటే విషయం ఎంతదాకా వెళ్ళుండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. బిషప్‌ పదవినించి నన్ను తొలగించి వుండేవారు. అది తలుచుకుని ఆయన వొణికాడు, చలిగా లేకున్నా. 'సంఘంలో మళ్ళీ మొహం చూపడానికి సిగ్గుపడుండేవాడ్ని. సరేలే, అవన్నీ వదిలేద్దాం. అని (ప్రేమ్‌సాగర్‌ బుజం తడుత్తూ '“జరగనిదాన్ని గురించి అనవసంగా మనమిప్పుడు ఆలోచించడమెందుకు? నీగురించి చెప్పవయ్యా. పాస్టరుగారమ్మాయి చాలా అందంగా వుంది, నిజంగా నువ్వామెని (ప్రమిస్తున్నావా?'

అవునండీ, మనసారా!

బిషప్పు ముఖం గంభీరమైంది.

'బాగా ఆలోచించుకో ప్రేమ్‌, 'పెళ్ళి అనేది చాలా సీరియస్‌ విషయం, లోతుపాతులు చూడకుండా ఆ వుచ్చులోకి దిగవద్దు. నేనూ ఒక భర్తనే, 'పైగా అలాంటి విశ్వాసపాత్రురాలైన భార్యని పొందటం దేవుడి ఆశీర్వాదం, ఎంతైనా మగవాడు బ్రహ్మచారిగా వుండిపోతేనే మంచిదని నాకు చాలా అనిపిస్తుంటుంది. (ప్రేమ్‌, స్తీజాతి చాలా విచిత్రమైనదయ్యా:! ఉండ్రాజువారి 'ఉత్తేజామ్లం 68 సరదాగా. కాసేపు

'నిజమే,! అన్నాడు (ప్రేమ్‌సాగర్‌"

'నా భార్య వుంది చూశావూ, చాలా గొప్ప మనిషి, సుగుణవతి అయిన భార్యకి సంసారంలో వొడిదుడుకుల్ని తట్టుకునే సహనం సహజంగా వుంటుంది. యవ్వనంలో అందంగా ముచ్చటగా వుందటం, జీవితమంతా సహృదయంతో గదపటం చాలా గొప్పదని నేను ఎన్నిమార్లో చెబుతూ వుంటా అయినా కానీ _;౫ -

“అయినా కానీ” అడిగాడు ్రేమ్‌సాగర్‌,

కాసెపు తర్జనభర్జన పడ్డాడు బిషప్పు, బాధతో మెలికలు తిరుగుతూ, వీపు గోక్కున్నాడు.

“ఇదిగో చెప్తా చూడు, యివాళ ఏండ విపరీతంగా వుందా, దాంతోపాటు మరీ వుక్కపోతగా వుందా లేదా?”

'అవునండీ, ఎండ బాగానే వుంది,” అన్నాడు (ప్రేమ్‌సాగర్‌.

“ఎండగా వున్నా పొద్దున్నే చలిగాలికి జలుబు చేస్తుందని చొక్కాలోపల యింతలావు 'స్వెట్టరు తొాడుక్నోవాలని నా భార్య పురమాయించి, అన్నంత పనీ చేసింది. నిజానికి, “వివేకములేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది,” సామెతలు 9; 21," నిట్టూర్పు విడుస్తూ అన్నాడు బిషప్పు.

“ఇరవై రెండు,” సరిదిద్దాడు ప్రేమ్‌సాగర్‌.!

“అవునయ్యా, యిరవై రెండని చెప్పాల్సింది నేను, ఆ 'స్వెట్టరు కూడా గొంగళి నేసే వున్నితో చేసిందయ్యా.. దానికి తోడు నా చర్మం చాలా సున్నితం. బాబ్బాబు, కాస్త నా వీపు గోకి పుణ్యం కట్టుకో నాయనా. కావాలంటే ఓ వెదురుబద్ద విరిచి దాంతో గోక్సు కాస్త వుపశమనం దొరుకుతుండొచ్చు.”

“అయ్యో బిషప్‌గార్హూ తమరికి యిలాంటిది జరగకూడదండీ,” అన్నాడతను జాలిపడుతూ,

'నా భార్య సంగతి కనక తెలిసుంటే నువ్విలా మాట్లాడవయ్యా, ఆవిడగార వుత్తర్వులకి అప్పీలనేది వుండదు.”

'నాన్సెన్స్‌!' గట్టిగా అరిచాడు ్రేమ్‌సాగర్‌. తోటలో చెట్ల మధ్య కరుణతో తిరుగుతూ ముక్కు కిందికి జారుతున్న కళ్ళజోడు పైకెగతోసుకుంటున్న బిషప్‌గారి భార్య వంక చూశాడు. *నాకొదిలేయండి, నేను చూసుకుంటా దీని సంగతి" అన్నాడు.

అతడి చెయ్యి గట్టిగా. పట్టుకున్నాడు బిషప్పు.

“నాయనా, ఏం చెయ్యాలని నీ వుద్దెశ్యం?! .

'నేవెళ్ళి మా భార్యగారితో ఈ విషయం ప్రస్తావించి వివేకంగా ్రవర్తించమని చెప్పి తేల్చుకొస్తా. మండుటెండలో గొంగళ్ళా! విపరీతం కాదు మరీను! అసందర్భం! ఇంత అవివేకాన్ని నేనెప్పుడూ వినలేదు, చూడలేదు,! సరదాగా. కాసేపు 09 ఉండ్రాజువారి. ఉత్తేజామ్లం

గుండె బరువుతో అతను వెళ్ళిన వైపే చూస్తూ వుండిపోయాడు బిషప్పు. అప్పటికే అతన్నీ కన్నకొదుకులా అభిమానించనాగాడు. అలాంటి కుర్రాడు ముందూ. వెనకా చూడకుండా. విపరీతాన్ని ఏదుర్కోబోతుంటే మనసంతా విచారంతో నిండిపోయింది, ఎంత వున్నత పదవిలో వున్నవాడైనా తన మాటకి ఎదురు చెప్పాడంటే సహించలేదావిడ. ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆ అర్భకుడేమో. వెలగబెట్టేది చర్చిలో చిన్నపాటి వుద్యోగం. మరికాసే పట్లో యింతలావు క కృద్దాల్లోంచి చూస్తూ (ప్రేమ్‌సాగర్‌ని భస్మం చెయ్యగలదావిడ; దాంతో దేశంటో చిన్నపాటి వుద్యోగస్తుల శవాలు తేలుతుంటాయి. అలాంటి బడుగువర్లపు వాళ్ళు ఆవిడగ్గారి'చూపులకి వొరుగుల్లా ఎండిపోవడం తను ఎన్నిమార్లు చర్చిలో చూడలేదు

కాసేపు వూపిరి పీల్చడం మానేశాడు. (ప్రేమ్‌సాగర్‌ తన భార్యని సమిపిస్తున్నాడు, ఆవిడగారు కళ్ళద్దాలు సవరించుకుంటూ అతనివైపు చూస్తోందిప్పుడు, .

భరించలేక కళ్ళు మూసుకుని తల తిప్పుకున్నాడు బిషప్పు. ఆ తరవాత - ఏన్నో సంవత్సరాలు గడిచినట్ట్లు ఆయనకి అనిపించింది - ఆనందంగా తనని పిలుస్తున్న గొంతు వినిపించింది, తల తిప్పి చూస్తే చెట్ల మధ్యలోంచి సంతోషంగా. గంతులు వేసుకుంటూ వస్తున్న ప్రేమ్‌సాగర్‌ కనిపించాడు.

"మరేం ఫరవాలేదు, బిషప్‌గారూ, అంతా శుభంగా ముగిసింది, చెప్పాడు ప్రేమసాగర్‌.

'ఆ, శుభం - శుభంగా ముగిసిందా? తత్తరపడుతూ అడిగాడు. బిషప్‌,

“అవునండీ. మారు వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని సన్నటి లాల్చీ వేసుకురమ్మని చెప్పారావిడ.'

విస్తుపోయిన బిషప్‌గారికి మాటలు తడబడ్డాయి.

“అయితే - అయిత్మే అసలు నువ్వేం చెప్పావు ఆవిడకి? ఎలాంటి తర్మాన్ని వృపయోగించావ్‌ ఆవిడ దగ్గిర?”

“అబ్బే, ఏంలేదండీ. ఇవాళ ఎండ విపరీతంగా వుందని చెబుతూ ఆవిడ్ని కబుర్లలో పెట్టి వుల్లాసపరుస్తూ ...”

“ఏవిటీ, కబుర్లలో పెట్టి వుల్లాసపరిచావా!!

“ఆవిడెంతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వొప్పుకున్నారండీ. రేపో మాపో మా ప్యాలెస్‌కొచ్చి కలవమన్నారు కూడా.”

.. (్రేమ్‌సాగర్‌ చెయ్యి పట్టుకుని వదల్లేదు బిషప్పు,

“అబ్బాయ్‌, మా ష్యాలెస్‌కి రావడం మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువే పనుంది నీతో గొంతు పెగుల్చుకుంటూ అన్నాడాయన, “నువ్వొచ్చి మాతోబాటు ప్వ్యాలెస్‌లోనే వుండిపో (ప్రేమ్‌, నా సెక్రెటరీగా చేరు, జీతమెంత కావాలో కోరుకో, యిసా. అందులోనూ. పెళ్ళి చేసుకోబోతున్నావు కనక జీతం ఎక్కువే కావాలయ్యా నీకు. నా సెక్రెటరీగా అనుక్షణం

ఉంగ్రాజువారి. ఉత్తేజామ్లం 70 సరదాగా కాసేపు

నన్ను వదలకుండా ఎప్పటికీ నా పక్కనే వుండు. నీలాంటివాడు కావాలని సంవత్సరాల తరబడి వువ్విళ్ళూరానయ్యా. .

పాస్టరుగారి ఆహ్వానాన్ని మన్నించి (ప్రేమ్‌సాగర్‌ మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనం చేశాడు. ఆ చిన్న గుంపుకి తనే ప్రాణంలా సరదాగా కబుర్లు చెబుతూ అందర్నీ సంతోష పరిచి యింటికి తిరిగొచ్చేసరికి సాయంత్రం అయింది.

లోపలికి అడుగుపెడుతూనే వినయ విధేయతలు వుట్టిపడుత్తూ 'మికో లెటరొచ్చిందయ్యా?' అంటూ ఎదురొచ్చాడు జకరయ్య, క్‌

లెటరు తీసుకుని, 'త్వరలో నేనిక్కడినించి వెడుతున్నానయ్యా, చెప్పాడు ప్రేమ్‌సాగర్‌,

“అయ్యా, నా తప్పేమన్నా వుంటే ...”

“అబ్బే, అలాంటిదేం కాదు, నమ్ము. సంగతేమిటంటే బిషప్‌గారు. నన్ను తనకింద సెక్రెటరిగా నియామకం చేశారు, అంచేత సామాన్లవీ సర్పకుని వారి. ప్యాలెస్‌కి వెడతున్నానయ్యా.”

"ఏంత గొప్ప శుభవార్తయ్యా! అంతెందుకు తమరే కొద్దిరోజుల్లో బిషప్‌ కూదా అవ్వాచ్చయ్యా.

“కావచ్చు, కావచ్చు బహుశా, ముందు వుత్తరం చదవనీ నన్ను."

వుత్తరం చించి చదవసాగాడు. చదువుతుంటే తీవ్రమైన ఆలోచనలకి గురి అవుతున్నందుకు కనుబొమ్మలు ముడి పడ్డాయి.

మైడియర్‌ (పెమసాగర్‌,

అనాలోచితంగా మో, వీన్ని ప్రశాంతి చేసిన పని మూలాన హడావిడి పడుతూ నీకీ జాబు రాయాల్సి వచ్చింది.

నేను కొత్తగా తయారు చేసిన ఉత్తేజామ్లం అనే మందు శాంవిల్‌ భాటిల్ని నాకు తెలీకుండా లేబరేటరీ నుంచి తీసుకుని నీకు పంవించానని చెప్పింది తను. ముందే కనక నాకా విషయం మో వీన్ని చెప్పి వుంటే యిలాంటి వివత్సర పరిస్థితికి దారి తీయకుండా ఆపేవాదిని.

ఉండ్రాజువారి. ఉత్తేజామ్లుం రెందు రకాలు అంటే రెండు భిన్నమైన రకాలు - శ, మరియు 8. వాటిల్లోది ఘాటుగా లేకుండా ఆస్వాదకరంగా వుండి దుర్పలలుకీ, జబ్బునించి కోలుకుంటున్నవారికీ శక్తిన్నీ బలాన్నీ సమకూరుస్తుంది. ఉత్తేజామ్లం - 1. ఇవ్మా ఉత్తేజాన్లుం 8 నంగతేమిటంటే - అది కేవలం జంతువులకీ, అడవివృగాలకీ పనికొచ్చే మందు. .

నీకోసంగతి తెలినుందకపోవచ్చు, మా తాత ఉంద్రాజు సుబ్బయ్యగారు మతం వుచ్చుకోకముందు ఆయుర్వేదంలో గొప్పు వైద్యుడిగా ప్రసిద్ది పొందారట, ఓసారి వల్లూరు రాజువారు అంబారీ ఎక్సి వేటకి వెడితో అడవిలో ఎదురొచ్చిన సింవోన్ని చూసి ఆ వనుగు భయపడి వెనక్షి పరుగుతీనిందట, విషయం తాతగారికి తెలిసి అలాంటి సరదాగా కాసేపు ః. ఉందడ్రాజువారి ఉత్తేజామ్లం

జంతువులు భయపడి పారిపోకుండా ఉత్తేజాన్ని కలిగించేందుకు ఉందడ్రాజువారి ఉత్తేజామ్లం అనే మందు తయారు చేశారట. వివరాలు కాలగర్భంలో కలిసిపోయి, యీమధ్యనే పాత కాగితాలు తిరగేస్తుంటే దొరికాయి, వాటిని వుపయోగించి నేను లేబరేటరీలో మరిన్ని వ్రయోగాలు చేసి మనుషులకోనర జీత్తేజామ్లం -4, :జంతువులకోసం' ఉత్తేజామ్లం - 88 మందుల్ని తయారు చేశాను. ఈ రెండో మందు ఒక చెంచాడు పొద్దున్నే కుడితిలోన్నో దాణాలోనో కలివి పెడితే ఏంతటి పిరికి వనుగైనా వెరవకుండా పులుల మోదిక్కీ సింవోల. మాదికీ దాడి చెయ్యగలదు. మో' వీన్ని పారపాటున నీకు వంవీంచినది ఉత్తేజామ్లుం - ఈ. కనక నీ దగిరున్న మందు దయచేసి వాడవద్దు, నా మాట నమ్ము, గుర్తుంచుకో, నీ బాబాయి ఉం(ద్రాజు శాంతికుమార్‌ ఉత్తరం పూర్తిచేసి చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు (ప్రమ్‌సాగర్‌. లేచి కూచుని జూన్‌ యిరవై ఆరో తారీఖున పాడటానికి ఎంచుకున్న కీర్తనని యీలతో పాడుతూ మరో అరగంటలో ఆ 'వూరి పోస్టాఫీసు నించి టెలిగ్రాం మెసేజి తీగెల్లో ప్రవహించింది. దాంట్లో యిలా రాసుంది: (శీ ఉండ్రాజు శాంతికుమార్‌;, ఉండద్రాజువారి వీధి, రాజమండ్రి ఉత్తరం అందినది. ఈ టెలిగ్రాం అందిన వెంటనే ఉండ్రాజువారి ఉత్తేజామ్లం -- ౭, రిపీట్‌ త, మూడు కేసులు వివి.వీలో పంవించగోరుతున్నాను. “నీ గంపయు విండి .వీసుకు నీ తొట్టియు దీవింపబడును. ” ద్వితీయో పదేశకాందము..28;౪ ౯ - ఉంద్రాజు (పేమ్‌సాగర్‌ ఉంధ్రాజువారి ఉల్తేజామం 2 సరదాగా కాసేపు

నవ్వితే నవరత్నాలు నా (/ ఉం/ 7

మా పానకుటీరంలో ఆ రోజున చర్చ జమాందార్హు కామందుల్సు మషావుకార్లు మొదలైన వారిలో నీతి నియమాలు అడుగంటిన విషయం మోదికి మళ్ళింది.

మాకు లిక్కరందించే నారాయుడు తను చదువుతున్న డిటెక్టివ్‌ నవలలో ఒక జమిందారు కుటుంబ వ్యవహారాలు చూసుకునే వకీలుని కొండ మించి కిందికి తోసి చంపేశాదని చెప్పాడు,

“అలా ఎందుకు చేశాడంటే జమిందారు 'చాలా గోప్యంగా దాచుకున్న రహన్యాల్ని ఆ వకీలు కనిపెట్టేశాడనండయ్యా, విపులీకరించాడు నారాయుడ్డు, గ్లాసుని మచ్చల్లేకుండా గుడ్డతో రుద్ది పాలిష్‌ చేస్తూ. “చాలా నిగూఢంగా దాచుకున్న రహస్యాల్ని ఆ మనిషి కనిపె ట్టేశాడు కనకనయ్యా వకీల్ని జమాందారు కొండమాద నించి తోసి చ ౦పేసిందయ్యా. అవుతే, మనకు తెలీదు కానీ అలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే 'వుండేయి గావుల్సు."

అది విన్న భాగోతుల సూతరాజుగారు గంభీరంగా తల పంకించారు.

'ఆ రోజుల్లో యిలాంటివి ఎంత తరచుగ్గా జరుగుతుందేవంటే ఎక్కడన్నా కుటుంబ. వ్యవహారాలు చూసుకుంటున్న వకీలుగారి శవం కనక కొండ కింద తునాతునకలై పడుంటే పోలీసులు ముందేం చేసేవారంటే చుట్టుపక్కలున్న మోతుబరి రైతుల్నీ, షావుకార్లనీ, చిన్నా 'సేరదాగా కాసేపు “6 నవ్వితే నవరత్నాలు

చితకా జమోందార్లనీ అనుమానించి కూపీ లాగేందుకు పోలీస్‌ స్టేషనుకి తీసు౭ళ్ళడం పరిపాటిగా వుండేది.” ॥ -

“వీళ్ళ సంగతెలా వున్నా ఆ రోజుల్లో కరణాలూ, మునసబులూ అయితే మరీ ఘోరవండి. మా బాబాయి ఓ, కరణం గారి మాట నమ్మి ఎందుకూ పసికిరాని పదెకరాల పాలం కొని మోసపోయాడండి," అన్నాడొక వోడ్మా విత్‌ (స్పైట్‌ కలగ చేసుకుంటూ.

సూతరాజుగారు వెడి నిట్టూర్పు విడిచారు,

'అసలు ఆ రోజుల్లో ఒకడని కాదండీ, కాస్తంత డబ్బూ దస్కం, పలుకుబడి వున్న 'ప్రతివాడిలో నీతి నిజాయితీలు చాలా కొరవడిగా వుండేవి. మరి చిన్నా చితకా జమిాందార్ల విషయమైతే చెప్పకృర్తేదండి, ఏ ఘాతుకానికైనా వెనుకంజ వేసేవాళ్ళు కాదు. నేనన్నదానికి బుజువుగా. మా వేలువిడిచిన తమ్ముడు, డిటెక్టివ్‌ భాగోతుల నూకరాజు కథే బల పరుస్తుంది,! చెప్పారు సూతరాజుగారు.

“మోకో వేలు విడిచిన తమ్ముడుగారున్నారస్క్‌ ఆయనో డిటెక్షివ్‌ అనీ నాకు తెలీనే తెలీదండి,! అన్నాడో లార్డ్‌ వి స్కీ

అయ్యొ వున్నాడండీ, అయితే యిప్పుడు రిటైరయ్యాడు లెండి. కానీ, ఆ;కాలంలో అందర్లోకీ చాలా కుశాగ్రబుద్ధితో అపరాధ పరిశోధన చేస్తుండేవాడు (సూతరాజుగ్గారు కథకి వుపక్రమించారు?. చాలాకాలం కిందట జరిగిన వుదంతం యిది. అప్పట్లో మన (ప్రాంతమంతా: మద్రాసు పట్టణం -- యిప్పటి చెన్నై - రాజధానిగా"వుమృడి. మద్రాసు రాష్ట్రంలో వుంటుండేది. తెలుగువాళ్ళు చాలామంది వుండేవాళ్ళక్కడ, వాళ్ళకి. అది చెన్నపట్టణం. మా తమ్ముడు భాగోతుల నూకరాజు మద్రాసు క్రిస్టియన్‌ కాలేజిలో పట్లా పుచ్చుకుని కొన్నాళ్ళు ఏవేవో చిన్నా చితకా వుద్యోగాలు చేసి, చివరికి డిటె క్షివ్‌ వాలి, యుగంధర్‌ అండ్‌ కంపెనీ వారి అపరాధ పరిశోధనా సంస్థలో మోజుపడి చేరాడు, ఎనిలో మంచి మెళకువలు చూపించేవాడు. ఆ ప్రముఖ సంస్థలో చేరిన రెండో యేట గోరపూడి సంస్థానానికి జమిందారైన గోరపూడి వీర వేంకట భుజంగరావుగారి కూతురు రాణీ ప్రమాలాదేవిని మా నూకరాజు కలవడం, (ప్రేమలో పడటం వరసగ్గా జరిగాయి.

తప్పించుకు పారిపోయిన జూలీని పట్టుకుని తిరిగి అప్పగించిన సాహస కార్యం ఆ యువ జంటని దగ్గిరకి చేర్చింది. కేవలం వృత్తిపరంగా చూస్తే మా తమ్ముడెప్పుడూ దాన్నొక గొప్ప పరిశోధనగా పేర్మోలేదు, కానీ ఆ తరవాత సంభవించిన పరిణామాల వల్ల - బహుశా తన వృత్తిలో ప్రముఖ సంఘటనగా దాన్ని భావిస్తాడని మనం అనుకోవచ్చు. జరిగిన సంగతి ఏమిటంటే - ఓరోజు సాయంత్రం మా నూకరాజు షికారుకని 'పార్ములోకి వెడితే అంతలోకీ ఒక కుక్క పిల్ల దారితప్పి గేటులోంచి దూరి లోపలికొచ్చింది. వెంటనే దాని మెడకి కట్టి వున్న కాలరు మిద - గోరపూడి రాణీ ప్రమాలాదేవి, 18, కేశవయ్యంగార్‌ పీట్‌, వెస్ట్‌ మాంబళం అని ఆ కుక్కయజమానురాలి అ(డ్రసు రాసి వుండటం గమనించి తక్షణం దాన్ని తీసుకెళ్ళి యజమానురాలికి అప్పగించాడు. నవ్వితే నవరత్నాలు 7/4 సరదాగా కాసేపు

ఈ పరిశోధన గురించి మా తమ్ముడు నూకరాజు దగ్గిర ప్రస్తావిస్తే “అందులో ఏం గొప్పు, చిన్నపిల్లాడు కూడా చెయ్యగలడు ఆ పని,” అంటూ కొట్టిపారేస్తాడు. అయితే, కుమారి గోరపూడి రాణీ ప్రమిలాదేవి మాత్రం అపరాధ పరిశోధనా చరిత్రలో దానికి అగ్రతాంబూలం యిచ్చి వీరావేశంతో ప్రశంసలు కురిపించింది. మా. తమ్ముడి మాద అపారమైన గౌరవం కనబరిచింది. లోపలికొచ్చి కాఫీ తాగి వెడుదురుగానండీ అంటూ ఆహ్వానించింది. కాఫీతో బాటు మూడు రకాల 'కేకులు, దోసెలు, వుప్మా మొదలైనవి పక్కన కూచుని తినిపించింది, అలా యిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిను ముగంచి, ఆ కాస్త పరిచయం తరవాత వీడ్కోలు చెప్పుకునే సమయంలో- వాళ్ళిద్దరి మధ్య'స్నేహం కన్నా మరింత గాఢమైన అనురాగం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.

అవును అసలు ఆ అమ్మాయి నూకరాజుని చూడగానే ప్రేమలో పడిందనీ, అతనూ అంతేననీ నా నమ్మకం, ఆమె వైపు నుంచి చూస్తే - మా భాగోతుల వంశీకులందర్లా మా వేలు విడిచిన తమ్ముడు నూకరాజు కూడా' స్ఫురద్రూపి అవడం ఒకటి, మంచి రంగుతోపాటు సన్నగా పొడుగ్గా వుండి ముఖంలో అర్ధం కాని విషాదం పులుముకున్నట్టు వుండటం మరోటీను. ఈ రెండూ ఆమెని చూడగానే ఆకర్షించి వుండవచ్చు.

నిజానికి ముఖంలో అలా విషాదం కనిపించేందుకు కారణం మా తమ్ముడు, నూకరాజుకీ చిన్నప్పటినించీ పట్టి పీడిస్తున్న అజీర్తివ్యాధి వల్ల. ఆ సంగతి తెలీక అతనిలో గొప్పగా: ప్రేమించే ఆత్మ వుండటం మూలాన ముఖంలో విషాద ఛాయలు కమ్ముకు నున్నాయని ఆ పిల్ల భావించి, చూసిన మరుక్షణంలోనే ప్రేమలో పడింది. లోతైన హృదయం వున్నవాడే అలా విషాదంగా, గంభీరంగా వుంటాడని తీర్మానించుకుంది.

ఆమె అలా. అనుకోడానికి కారణం ఏమిటో 'చూద్దాం, అప్పటిదాకా ఆ పిల్ల జీవితంలో ఎంతసేపూ బుర్ర తక్కువ మనుషులే చుట్టూ చేరి - ఆ సినిమా చూశావా, ఈ సినిమా చూశావా, కాఫీ తాగుతావా అని అడిగి ఆ తరవాత ఏం మాట్లాడాలో తెలీని మూర్చల మధ్య గడిపిందామె. అందుచేత సన్నగ్గా, పొడుగ్గా, స్ఫురద్రూపంతో వుండి చక్కగా వేలి ముద్రల గురించి, అడుగుల గుర్తుల గురించి, మనోవైజ్ఞాన శాస్త్రం గురించి, కరడు కట్టిన నేరస్తుల గురించి విపులంగా విప్పి చెప్పిన మనిషి గొప్పవాడన్న సంగతి రాణీ ప్రమాలాదేవి మోద చాలా ్రగాధమైన ప్రభావం చూపించింది,

ఏదీ.ఏమైనా వాళ్ళిద్దరి మధ్యా మూడు పువ్వులూ ఆరు కాయలుగా (ప్రేమ దినదిన

ప్రవర్ధమానమైంది. రాణీ ప్రమాలాదేవిని కలిసిన రెండు వారాల తరవాత ఒకసారి కేవలం

డిటెక్టివ్‌లకే పరిమితమైన -- నెత్తుటి జాడలు - అనే క్లబ్బులో ఆమెకి లంచి యిస్తూ పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు నూకరాజు, విన్న వెంటనే సరేనంది ఆమె, దాంతో ఆ తరవాత యిరవై నాలుగు గంటలపాటు మద్రాసు పట్టణంలో నూకరాజంత సంతోషంగా వున్న ప్రైవేట్‌ డిటెక్టివ్‌ మరోడు లేడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

సరదాగా కాసేపు 75 నవ్వితే నవరత్నాలు

మర్నాడు మళ్ళీ అతను, రాణీ ప్రమిలాదేవిని లంచిలో కలిసినప్పుడు, 'పరిశోధనా విషయాల్లో బాగా ఆరితేరినవాడు కనక్క అందంగా మెరుస్తూ వుండే ఆమె, ముఖంలో ఆందోళన చెందుతున్న ఛాయలు కనిపెట్టి కారణం ఏమిటని అడిగాడు.

'ఓహ్‌ నూకరాజూ, అనుకున్నంతా అయింది, పరిస్టితి అధ్వాన్నంగా తయారైంది. మన పెళ్ళి గురించి చెబుతుంటే మా నాన్నగారు. అసలు వినడానికే తయారుగా లేరు. మా యిద్దరికీ యిష్టమని చెబితే ఆయనేమో, “భీ ఛ్హా థూ,” అంటూ వూర్మే చీదరిస్తూ కూచున్నారు ప్రతిసారీ. జీవితంలో ఎప్పుడూ యిలాంటిది, కనీ వినీ ఎరగను అన్నారు. పదేళ్ళ కిందట మా బాబాయికి జరిగిన వుపద్రవం 'మూలాన అప్పటినించీ ఆయనకి డిటెక్టివ్‌లంటే మహా చెడ్డ రోత,” అంటూ. చెప్పింది రాణీ ప్రమాలాదేవి,

“మి బాబాయిగారిని నేనింతవరకు కలవలేదనుకుంటా,”

“నీకా అవకాశం వచ్చే సంవత్సరం దొరుకుతుందిలే. మంచి నడవడి మూలాన శిక్ష తగ్గించడం మామూలే కనక వచ్చే జులై నెలలో మన మధ్యన వుంటాడాయన. అదికాక మరో విషయం కూడా వుంది.”

'మరోటి కూడానా?”

“అవును. షావుకారు దోణం. అప్పయ్యచౌదరి తెలుసా నీకు?”

“ఎవరూ, షేర్లు అమ్మే ఆ వ్యాపారా?'

“అతన్ని నాకిచ్చి పెళ్ళి చెయ్యాలని నాన్నగారి కోరిక. ఛండాలంగా లేదూ యిది?

నూకరాజు అవునన్నట్టు తల వూపి “ఇంతకన్నా మంచి మంచి వార్తలు ఎన్నో విన్నాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి కనక బాగా ఆలోచించాలి 'మరి,* అన్నాడు.

దురదృష్టకరమైన ఆ పరిణామాల్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ కూచున్నందుకు. నూకరాజుకి అజీర్తివ్యాధి తిరగబెట్టి పొత్తి కడుపులో నెప్పి ఎక్కువైంది. రెండు 'మూడు వారాలుగా రాణీ ప్రమాలాదేవితో గడపటం మూలాన్నూ ఆమె తనని ప్రేమిస్తోందన్న విషయాన్ని గుర్తించిన ఆనందంలోనూ యిన్ని రోజులూ నెప్పులు బాగా తగ్గాయి, మళ్ళీ కడుపులో యిప్పుడా నులినొప్పి మొదలై యిదివరకెన్నడూ లేనంత బాధపెట్టసాగింది. ఒకరోజు రాత్రి నెప్పితో నిద్ర పట్టక, తేళ్ళ కుటుంబాన్ని యావత్తు మింగినట్టు బాధతో విలవిల్లాడి చివరికి స్పెషలిస్టుని సంప్రదిస్తే మంచిదని అతని దగ్గిరకి వెళ్ళాడు.

ఆ స్పెషలిస్టు మామూలు డాక్టర్లలాగా పాతకాలప్త విధానాలు అవలంబించే వ్యక్తి కాదు, పురోగామి. మంచి విశాల దృక్పధం వున్న డాక్టరు, 'నూకరాజుకి పరీక్షలన్నీ ముగించిన తరవాత్మ కుర్చీలో: వెనక్కి చేరగిలబడి చేతివేళ్ళ కొనల్ని దగ్గిరకి చేర్చి కూచున్నాడు. .

'నవ్వ!” అన్నాడాయన.

“'ఏవిటీ?* అంటూ అడిగాడు నూకరాజు,

'నూకరాజూూ నవ్వవయ్యా, స్మైల్‌.” నవ్వితే నవరత్నాలు 76 సరదాగా కాసేపు

“నవ్వమంటున్నారా నన్ను?!

'అదేనోయ్‌.. ఏదీ నవ్వ మరి.!

“ఎలా నవ్వనండీ, మనసారా (ప్రేమించిన యువతిని ఇప్పుడే కదా జారవిడుచు

'మునిగిపోయిందేమి లేదులేవయ్యా” అన్నాడతను. ఆ స్పెషలిస్టు ఆజన్మ బ్రహ్మచారి. “చూడు బాబూ, నా మాట విని నవ్వడం మొదలెట్టు యిప్పటకైనా, కీప్‌ స్మైలింగ్‌.'

నూకరాజు కొంచెం తికమకపడ్డాడు.

'నామాట కొంచెం వింటారా, నవ్వు, నవ్వవోయ్‌ సైల్‌ అంటూ ఏవిటిందంతా? నాకు గుర్తున్నంతమేర మనం నా జీర్ణ గ్రంధుల్ని గురించి కదా చర్చ మొదలెట్టింది, ఇప్పుడేమో మరి వాటి సంగతి వదిలేసి అమాంతం నవ్వుల ప్రస్తావన ఎందుకొచ్చిందో తెలీడం లేదు. నవ్వు అని చెప్పడంలో మో వుద్దేశ్యం ఏవిటి? అసలు నేనెప్పుడూ నవ్వనే నవ్వనండి, ఎప్పుడో స్కూల్లో నాకు .పది పన్నెండేళ్ళప్పుడు మా లెక్కల మేస్టారు అరిటి తొక్క మాద కాలేసి జారిపడ్డప్పుడు తప్ప ఈ మధ్యలో నేనెప్పుడూ నవ్వినట్టు జ్ఞాపకం లేదండి.”

'స్పెషలిస్టుగారు తల పంకించాడు,

“అవును యదార్ధం అది. అందుకే జీర్ణావమయవాలు. బాధిస్తున్నాయి. నిన్ను అజీర్తివ్యాధి అనేది 'పూర్తిగా మానసికం అని ఆధునిక వైద్యులు గుర్తించి ఘోషిస్తున్నారు. మేము మందులతో, ఇంజెక్షన్లతో దానికీ చికిత్స చేయమయ్యా, అస్తమానం సంతోషంగా గడపడం ఒకటే దానికి చికిత్స. నూకరాజూ, వుల్లాసంగా వుండంటం మొదలెట్టు, కేరింతలు కొడుతుండు.. అలా చెయ్యలేకపోతే కనీసం చిరునవ్వు నవ్వుతుండు. నవ్వుకు కారణభూతమైన కండరాలు దవడల దగ్గిర వుంటాయి: నవ్వించే కండరాలకి కాస్తంత ఎక్సర్‌సైజు యిస్తే చాలు, చాలా (ప్రయోజనం కలుగుతుంది, కనక బయటికి వెళ్ళి అవకాశం దొరికినప్పుడల్లా కనీసం చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తూ వుండు.'

'ఇలానే అంటారా?! అడిగాడు నూకరాజు నవ్వి చూపిస్తూ.

'ఇంకానోయ్‌, దవడలు మరింత సాగదీసి నవ్వు.

“ఇదెలా వుందంటారు?]

కొంచెం నయం,” చెప్పాడు స్పెషలిస్టు. “కానీ కావలసినంత మేరకి దవడలు సాగలేదు. అయినా నీకు కొంచెం ప్రాక్టీసు అవసరమనుకో. అలవాటులేని పని చేయాలంటే కండరాలు కాస్తంత తుప్పు వదిలించు కోవాలని గ్రహించాలి మనం. రోజులు గడిచినకొద్దీ మరింత గుణం కనిపిస్తుందిలే.”

ఆ మాటలు చెప్పి నూకరాజు వైపు సాలోచనగా చూస్తూ చెప్పాడాయన.

“ఆశ్చర్యం, నువ్వు చిరునవ్వు 'నవ్వితే చాలా విచిత్రంగా కనిపిస్తోందేమిటి, నూకరాజూ... నాకైతే మోనా లీసా నవ్వుతో పోలికలు కనబడుతున్నాయి. ఆమె నవ్వులో సరదాగా: కాసేపు 77 నవ్వతే నవరత్నాలు

అంతర్లీనంగా వుండే కుటిలం, కల్మషం, కపటం నీ నవ్వులో కూడా దాక్కునున్నాయి. నీది మామూలు చిరునవ్వుగా కాక, కపటంగా వికృతంగా నవ్వినట్టుంది. ఎందుకో మరి, మాగురించి నాకంతా తెలుసులెండి అని ఏదుటివాడితో చెబుతున్నట్టు నవ్వె నవ్వులాగా: వుందసలు. అదృష్టవశాత్తు నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, అందరూ చదువుకోవచ్చు. అందుచేత నీ చిరునవ్వు నాకేమి అసౌకర్యంగా కనబడటం లేదయ్యా. అయితే ప్రస్తుతానికి కొన్నిరోజులపాటు జబ్బుతో మంచాన పడున్నవాళ్ళ వంకా, నరాల బలహీనత వున్నవాళ్ళ వంకా చూసినప్పుడు దయచేసి నీ ఆ చిరునవ్వుని దాచుకుంటే నయమని నా సలహా. భయపడతారు. గుండెపగిలి చస్తారయ్యా, నూకరాజూ. అంతేనోయ్‌ మరి. ఫీజుగా రెండు వందల యాఖై రూపాయలు మాత్రం అక్కడ పెట్టి నువ్వు వెళ్ళవచ్చింక,"

ఆరోజు సాయంత్రం కంపెనీవాళ్ళు పురమాయించిన డ్యూటీకి వెళ్ళినప్పుడు నూకరాజు ముఖంలో. ఎలాంటి నవ్వు కాని, ఆఖరికి చిరునవ్వు కాని కనబడలేదు.. తన ముందున్న విషమ పరీక్షని ఎలా నెగ్గుకు రావాలా అని భయపడుతున్నాడు. టి. నగర్‌లో జరుగుతున్న పెళ్ళి రిసెప్పనులో పెళ్ళివారి కట్నాల్లూ, కానుకలూ వుంచిన గదిని జాగ్రత్తగా కాపలా కాసే డ్యూటీ పడిందతనికి. దాంతో. వీపులో. బాకు దించినట్టు అనిపించింది నూకరాజుకి: అంత విలువైన వస్తువులున్న గదిలో అతను. గస్తీ తిరుగుతుంటే ముఖం గంభీరంగా మారి రోత పుట్టేలా వుంది. ఇలాంటి వేడుకల్లో యిన్నాళ్ళూ కాపలా కాసి నప్పుడు తనొక డిటెక్టివ్‌ అని ఎవ్వరూ గుర్తించలేనందుకు గర్వపడుతుండేవాడు. ఈరోజు మాత్రం చూడంగానే తన వృత్తి ఏమిటో చిన్నపిల్లలు కూడా: చెప్పెయ్యగలరు. మనిషి షెర్లాక్‌ హోమ్స్‌ లా అగపడుతున్నాడు.

చుట్టూ కేరింతలు కొడుతున్న జనాన్ని చూసి పట్టించుకోలేదతను. ఇలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వుంటాడు, కానీ ఈరోజున మాత్రం అతని. బుర్ర అక్కడ లేదు, రాణీ ప్రమాలాదేవిని గురించి ఆలోచిస్తూ విచారంగా వున్నాడు. మనసు యిలా విషాదంలో కొట్టుకుంటుంటే - బయటికెళ్ళి అందర్హోపాటు ఒక గ్లాసు వైనో, ఏదో తాగొచ్చుంటే కాస్త వుపశమనం కలిగుండేది - వున్నట్టుండి పొత్తి కడుప్తు దగ్గిర మొదలైన నులినెప్పి కాస్తా వొళ్ళంతా వ్యాపించింది... ఆ నెప్పి'వెంటనే త గ్గడానికి ఏదన్నా విరుగుడు కోసం పరితపించాడు..

చాలా కష్టపడి ప్రయత్నించిన తరవాత ముఖంలో అవయవాల్ని మెలిదిప్పి సాగదీసి చివరికి 'చిరునవ్వులోకి మార్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో లావుగా, బుర్రమాసాలతో నడివయసులో వున్న మోటు మనిషాకడు తల తిప్పి నూకరాజు వంక చూసి, 'హారి దేవుడా! అంటూ పాలిపోయిన ముఖంతో గావుకేక పెట్టాడు.

ఎ(ర్రగా బుర్రగా యింతలావున్న ఆ వ్యక్తి 'పేరు ఐనంపూడి వరహాలరాజు, ఐనంపూడికి చిన్న జమాందారు. ఆరోజు అదృష్టం అతనికి బాగా కలిసొచ్చింది. సంఘంలో నవ్వితే నవరత్నాలు 78 సరదాగా కాసేపు

పేరు ప్రతిష్టలున్న వాళ్ళ పెళ్ళిళ్ళల్లో చేతికి అందినవన్నీ జేబులో వేసుకునే రకాల్లాగానే యితను కూడా వచ్చిన దగ్గిర్నించి ఆ టేబుళ్ళ చుట్టూనే తిరుగుతూ అక్కడొక వజ్రాల నెళ్లిస్తూ యిక్కడొక వుంగరాల జోడీ, వెండి గ్లాసులూ, కుంకమ భరిణెల్లూ, దీపం కుందులూ కోటు జేబుల్లో దోపుకున్నాడు. అతని భారీ కాయం మోయగలిగినంత బరువుని నింపుకుని వతనుగా కలుస్తుండే మార్వాడీ దుకాణానికి ఎప్పుదెప్పుడు వెళ్ళి తాకట్టు పెల్టి దబ్బు రూపేణా బూర్చుకుందామా అని తలపోస్తున్నాడు. నూకరాజు నవ్విన చిరునవ్వు చూడగానే హడిలిపోయి భయంతో రాయిలా నుంచుండిపోయాడు. |

నూకరాజు చిరునవ్వు గురించి ఆ స్పెషలిస్టు ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో మనం ముందే చూశాం గదా, స్పెషలిస్టు గారి అంతరాత్మ ఎంతో నిర్మలం, పారదర్శకం. అయినా ఆ డాక్టరుకి నూకరాజు చిరునవ్వు కుటిలంగ్గాా వక్రంగా వికృతంగా అగు పించింది. అంచేత మరి ఆ చిరునవ్వు జమీందార్‌ ఐనంపూడి వరహాలరాజు మోద ఎలాంటి ప్రభావం చూపించిందో గమనిద్దామిప్పుడు.

కపటంతో వికృతంగా చిరునవ్వు చిందిస్తున్న ఆ మనిషితో తను ఎలాగైనా సరే రాజీ కుదుర్చుకోవాలనుకున్నాడు. కోటు జేబుల్లోంచి వరసగా - వజ్రాల నెక్షెసూ, వుంగరాల జోడీ, వెండి గ్లాసులూ, కుంకుమ భరిణలూ, దీపం కుందులూ వగైరా - ఒక్కొక్కటే బయటికి తీసి టేబులు మిద పెట్టేసి చేతులు దులుపుకుని నజకరాజు వైపుకొచ్చి బలహీనంగా నవ్వాడు.

'ఆ, ఏం సార్‌ ఎలా వున్నారు, బావున్నారా? మళ్ళీ చేతులు దులుపుకుంటూ పలకరించాడు.

చాలా బాగా వున్నానన్నాడు నూకరాజు. అది నిజం కూడాను. ఆ స్పెష౭ిస్టుగారి సలహా దివ్యంగా పనిచేసింది. ముక్కూ మొహం తెలీని ఓ అపరిచితుడు తనని యిలా సౌమ్యంగా పలకరిస్తున్నందుకు మొదట్లో కొంచెం ఆశ్చర్యపడ్డా ఆకర్షణీయమైన తన స్ఫురద్రూపం వల్లనే చనువుగా వచ్చి పలకరిస్తున్నాడని తోచింది నూకరాజుకి.

“భలే. చాలా బాగుంది, భలేగా వుంది.. అన్నట్టు మరి - మరి మిరు యిందాక చిరునవ్వు నవ్వినట్టు అనిపించిందండీ నాకు, అన్నాడా జమిందారు.

దానికి నూకరాజు, “అవునండీ నవ్వాన్నేను. చూడండి యిలా...”

'చూశానండోయ్‌ మహాప్రభో, చూశానండి. పెళ్ళివారిని కాస్త ఆటపట్టించాలని నేను ఏవేవో చిలిపి పన్లు చేస్తుంటే మారది గమనించి మోలో మిరే నవ్వుకున్నారు. ఎందుకో తెలుసా, అదంతా తమాషాకనీ, వుత్తి పుణ్యానికి వూసుపోక నేనలా చేశానని తమరు (గ్రహించడం వల్లనేనండీ. సరే, ఆ సంగతి వదిలెయ్యండి. మికు యీ శని, ఆదివారాలు ఏమన్నా పనులున్నాయాండీ? మా ఐనంపూడి దివాణానికొచ్చి రెండు రోజులపాటు మా ఆతిధ్యం స్వీకరించాలండీ?' అంటూ ఆహ్వానించాడు వరహాలరాజు,

దానికి నూకరాజు సందేహిస్తూనే, “అయ్యొ, ఎందుకండీ మోకా (శ్రమ, అన్నాడు. కొత్త

ప్రదేశంలో కొత్తవాళ్ళతో రెండు రోజులు గడపడం కష్టమనుకున్నాడు. సరదాగా కాసేపు 70 నవ్వితే నవరత్నాలు

“'ఇదిగోనండి నా విజిటింగ్‌ కార్డు. సరే మరి శుక్రవారం సాయంత్రానికల్లా మిమ్మల్ని మా యింట్లో చూసానండి. జనం ఎక్కువమంది వుండర్లెండి, చిన్న పార్టీ. గోరపూడి జమిందారైన గోరపూడి వీర వేంకట భుజంగరావుగారూ, పేర్ల వ్యాపారి దోణం అప్పయ్యచౌదరిగారూ, మరో ఒకళ్ళిద్దరు మాత్రమేనండి. ఏం లేదు, సరదాగా కాసేపు కాలక్షేపం చెద్దాం, రాత్రి పూట పేకాడుకుందాం, అంతే. భలేనండీ. చాలా బాగుందండీ. వస్తానందీ, శుక్రవారం నాడు కలుద్దామండీ.”

అలా అని టేబులు దాటి వెడుతూ యింకా జేబులో మిగిలున్న రెండు వెండి స్పూన్లు తీసి టేబులు మిద పదేసి వెళ్ళిపోయాడు జమిందార్‌ ఐనంపూడి వరహాలరాజు.

క

వరహాలరాజు యింటికి ఆహ్వానించిన అతిధుల పేర్లు వినగానే అతని కోరిక మన్నించాలా వద్దా అన్న సందేహం వీడింది నూకరాజుకి. పెళ్ళి చేసుకుందామనుకున్న కుర్రాడికి - ఆ పెళ్ళికూతురి తండ్రినీ, ఆమెకు తన బదులు కాబోయే భర్తనీ కలవడం సరదాగా వుంటుంది. రాణీ పప్రమిలాదేవి ఆ విషాద వార్తని చెప్పిన తరవాత మొట్ట మొదటిసారి నూకరాజు సంతోషంతో వెలిగిపోయాడు. వరహాలరాజంతటి గొప్ప జమిందారు చూడగానే తనని యిష్టపడ్డాడు. మరి జమిందారు గోరపూడి వీర వేంకట భుజంగరావు కూడా తనని చూసిన తరవాత యిష్టపడి - తను చేస్తున్న వృత్తి ఎలాంటిదైనా పక్కకి పెట్టి - అల్లుడుగా వెంటనే స్వీకరించవచ్చు కదా. ఏమో, ఎవరు చెప్పగలరు?

అలా ఆలోచించి ఆ శుక్రవారంనాడు బట్టలతోపాటు తేలికపడ్డ మనసుని కూడా సర్దుకుని వ

ఆదిలోనే అదృష్టవశాత్తూ విధి అతనికి సహకరించడంతో నూకరాజులో ఆశ మరింత పెరిగింది. విధితన పక్షానే పోరాడుతోందని కూడా అనిపించింది. మద్రాసు సెంట్రల్‌ స్టేషన్లో ప్లాట్‌ ఫారం మిద నడుస్తూ తను ఎక్కవలసిన రైలులో ఖాళీగా వున్న పెట్టె కోసం వెదుకుతుంటే బట్లరు లాంటివాడు - 'ఖరీదైన మంచి బట్టలు వేసుకుని డాబుగా, ఠీవిగా పొడుగ్గా వున్న వ్యక్తిని ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిస్తూ సామాన్లు సర్దతుండటం కనిపించింది. ఈ బట్లరులాంటి మనిషే తనని ఆరోజు - 18, కేశవయ్యంగార్‌ పీట్‌, వెస్ట్‌ మాంబళం: యింట్లో తలుపులు. తెరిచి విధేయతతో చేతులు కట్టుకుని నిలబడి - లోపలికి తీసుకెళ్ళినవాడు అని గుర్తుపట్టాడు. అంచేత మరి ఆ డాబుగా, రీవిగా, తెల్లజుట్టుతో వున్న ఆసామి మరెవరో కాదు - రాణీ ప్రమిలాదేవి తండ్రి జమిందారు. భుజంగరావే అనుకున్నాడు. దాంతో దూరప్రయాణంలో కనక ఆ మనిషిని ప్రసన్నం చేసుకోలేకపోతే అందర్నీ మంచి చేసుకుని దారికి తెచ్చుకోగలననే ధీమా దండగ అనుకున్నాడు. నవ్వితే నవరత్నాలు 80 సరదాగా కాసేపు

అలా అనుకుని రైలు బయలుదెరుతుండగా 'పెట్టెలోకి దూకేశాడు. చదువుతున్న న్యూస్‌ పేపరునించి దృష్టి మళ్ళించి జమిందార్‌ భుజంగరావు పొమ్మనట్టు తలుపుకేసి వేలు చూపించాడు.

“ఇందులో ఖాళీలేదు. కనబడ్డం లేదా, గుడ్డివాడివా, ఫో బయటికి. దిగు ముందు, అన్నాడాయన,

బోగీలో వాళ్ళిద్దరు మినహా మరెవరూ లేనందుకు నూకరాజు ఆయనగ్గారి ఆజ్ఞని తిరస్కరించాడు. పైగా రైలు స్పీడు అందుకున్నందుకు: దిగటం (ప్రమాదం కూడా, దాని బదులు నూకరాజు సరసంగా మాటల్లోకి దించాడాయన్ని.

“తమరు జమిందారు భుజంగరావుగారనుకుంటా?

'గో-టు-హెల్‌, అన్నాడా జమాందారు.

“మరేం. లేదండి. మనమిద్దరం ఐనంపూడి వరహాలరాజుగారింట్లో రెండు రోజులపాటు వుంటూ వారి ఆతిధ్యాన్ని కలిసికట్టుగా స్వీకరిస్తున్నామండి*

“అయితే ఏవిటంట?”

“ఏం లేదు, వూర్మే చెప్పానంతే.”

'ఓహో? సరే మరి యిక్కడే వుంటావు కనక కాసేపు ఆడుకుందామంటాను, వవంటావ్‌?! అడిగాడు జమీందార్‌ భుజంగరావు.

సంఘంలో విశిష్టస్థానం: వున్న అందర్లా రాణీ |ప్రమాలాదేవి తండ్రి ప్రయాణాల్లో చీట్లపేకలు తన కూడా తెచ్చుకుంటాడు. పుట్టుకతోనే అలవాటుగా మారిన చేతివాటం మూలాన రేసుల కోసం వేసే "స్పెషల్‌ రైల్లో రెండు చేతులా సంపాదిస్తాడతను,

“పర్షియన్‌ మోనార్చ్‌ ఎప్పుడన్నా ఆడావా? అడిగాడాయన 'పేకముక్కలు కలుప్తతూ.

“ఆడలేదనుకుంటానండి,! అన్నాడు నజకరాజు,

'దాలా: సులభమైన ఆటయ్యా, ఈ కట్టలోంచి అవతలి మనిషికన్నా పెద్ద ముక్క కోస్తానని పాతికో, పరకో నువ్వ పందెం కట్టావనుకుందాం, కోస్తే గెలుస్తావు, కొయ్యలేకపోతే అంతే సంగతులు, చెప్పాడు జమాందారు భుజంగరావు.

ఇది మంగమ్మ శపధం ఆటలానే వుందన్నాడు నూకరాజు,

“అవును, మంగమ్మ శపధమే. అచ్చు మంగమ్మ శపధంలానె. అసలు మంగమ్మ శపధం కనక 'నువ్వు ఆడగలిగితే పర్షియన్‌ మోనార్క్‌ని కూడా ఆడగలుగుతావయ్యా, సందేహం లేదు, అన్నాడు జమాందారు భుజంగరావ.

ప్రయాణం. ముగించి వాళ్ళిద్దరూ ఐనంపూడి: స్టేషన్లో దిగేసరికి రెండు వందల రూపాయలు చేతులు 'మారాయి నూకరాజు జేబునుంచి. అయితే ఆ నవ్హాన్ని పట్టించు కోలేదసలు నూకరాజు, 'పైగా వ్యవహారం అలా ముందుకు సాగుతున్నందుకు సంతోష పడ్డాడు కూడా, గెలిచినందుకు మహా తృప్తితో ఆనందంగా వున్న జమిందారుగారి ధోరణి మారి, తనంటే. యిష్టపడుతున్నాదని [గ్రహించి ఈ అవకాశాన్ని ఎంత త్వరగా తనకి అనుకూలంగా మార్చుకోవాలా అని వువ్వళ్ళూరాడు నూకరాజు, సరదాగా కాసేప ర్‌] నవ్వితే. నవరత్నాలు

ఐనంపూడి దివాణంలోకి చేరిన తరవాత ఆ విషయమై మరింక ఆలస్యం చెయ్యదలు కోలేదతను.. డిన్నరుకింకా గంట టైముందని తెలుసుకుని జమిందారు భుజంగరావుగారి రూముకి వెడితే ఆయన బాత్‌రూములో న్నానం చేస్తున్నట్టు గ్రహించాడు.

“జమిందార్‌ భుజంగరావుగారూ లోపలికొచ్చి మ్‌తో ఒక్క నిమిషం “మాట్లాడ వచ్చా?” అని అడిగాడు తలుపు దగ్గిర నుంచుని.

“మాట్లాడటమేం ఖర్మ, అంతకన్నా మంచి పన్గొకటి చెయ్యి. వొళ్ళు రుద్దుకుంటుంటే సబ్బుబిళ్ళ కాస్తా ఎక్కడో! మాయమైంది, కాస్త వెతికి పెట్టి పుణ్యం కట్టుకో బాబూ? అన్నాడాయన కళ్ళు మూసుకుని.

'ఎవిటి, సబ్బుబిళ్ళ పోగొట్టుకున్నారా?

“అవును. ఒక్క నిమిషం కిందట నా చేతులో వుంది, యిప్పుడేమో పోయింది.”

'తమాషాగ్గా వుందే, అన్నాడు నూకరాజు,

“చాలా తమాషాగ్గా వుందీ వ్యవహారం,! అంగీకరించాడు జమిందారు భుజంగరావు. “ఇలా జరుగుతుంటే ఏమిటోగా అనిపిస్తుంది మనసుకి. 'పైగా అది నా స్వంత సబ్బే

కాసేపు విషయాన్ని అర్ధం చేసుకునేందుకు [ప్రయత్నించాడు నజకరాజు,

“అసలేం జరిగిందో 'సరిగ్గా వివరాలన్నీ పూర్తిగా చెప్పండి. మా స్వంత మాటల్లో, ఏష ఒక్కటీ వదలకుండా అంతా వున్నదున్నట్టు చెప్పండి. చిన్న విషయంలే అని వదిలేస్తే చివరికి అదెంత ముఖ్యమైందో మనకి తెలిసిరాదు; కనక వదలకుండా అంతా వివరంగా చెప్పండి అన్నాడు నజకరాజు,

.. ఫిర్యాదు చేసిన మనిషితన ఆలోచనల్ని క్రమబద్ధం చేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

'నా పూర్తి పేరు భ్రీభీభ్రీ గోరపూడి వీర వేంకట భుజంగరావు, గోరపూడి సంస్పానానికి ఐదవ జమోందారుని. తండ్రిగారి పేరు స్వర్గీయ గోరపూడి ఎంకట సూర్యనారాయణ వర్మగారు. 'ఈ నెల పదహారవ తారీఖున్మ అనగా యీరోజ్సే నేను - నా స్నేహితుడూ, ఐనంపూడి. జమిందారూ అయిన ఐనంపూడి వరహాలరాజుగారింటికి రెందురోజుల పాటు అతిధిగా వుండటానికి వచ్చాను. ఇంటికొచ్చిన అతిధులు తాజాగా, పరిశుభ్రంగా వుండటాన్ని 'వరహాలరాజుగారు కోరుకుంటారని. తెలుసు కనక, రైలు దిగి రాగానే స్నానం చేద్దామని నిర్ణయించుకున్నాను. 'సూట్‌ కేసులోంచి సబ్బు బిళ్ళ తీసుకుని కాసేపటిపాటు. మెదనించి పైకి సబ్బు బాగా పట్టించాను. ఆ పైన వంటికి రాసుకునే తరుణంలో కుడికాలుకి సబ్బు పట్టిద్దామని చూస్తే అంతలో. ఆ సబ్బుబిళ్ళ కాస్తా మాయ మైంది. చెప్పాలంటే షాకయ్యాను, నమ్ముతావో లేదో.!

ఆయన. చెప్పిన సమాచారాన్ని (శ్రద్ధగా ఆలకించాడు నూకరాజు జటిలంగా కనిపిస్తున్న ఈ సమస్యని అన్ని కోణాల నించి నిశితంగా పరిశీలించి. చూడాలని నిర్ణయించాడు. నవ్వితే నవరత్నాలు 82 సరదాగా కాసేపు

కాసేపు ఆలోచించి, “ఇది ఖచ్చితంగా యింటివాళ్ళ పనే, బయటివారి ప్రమేయం లేదిందులో, ముఠాదొంగల పని మాత్రం కాదు, ఎందుకంటే దొంగల ముఠాని మీరు గమనించి వుందేవారు కనక. మరోలా భావించకపోతే యింకోసారి క్లుప్తంగా చెబుతారా జరిగినవన్నీ?' సి!

'సర్కే నేను యిక్కడ స్నానం చేస్తున్నాను. ఇదిగో సబ్బుబిళ్ళ యిక్కడ - నా రెండు అరచెతుల మధ్యలో యిలా, నిమిషంలో అది 'కాస్తా మాయమైంది.

“మోరు ఏదీ వదలకుండా వివరాలన్నీ చెప్పినట్టేనాండీ?

జమిందారు భుజంగరావు కాసేపు ఆలోచించాడు.

“ఒక విషయం చెప్పటం.మరిచాను, నేను పాట పాడుతూ స్నానం చేశా.

నూకరాజు ముఖం గంభీరంగా మారింది.

“పాటా? ఏం పాట పాడారు?”

“శిలలపై శిల్పాలు చెక్కినారూ... *” పాట.

నూకరాజు ముఖం విప్పారింది.

“సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగిందండి. మోకు, తెలుసో లేదో ఆ పాటలో - “విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా” దగ్గిరకి వచ్చినప్పుడు వూపిరి గట్టిగా బిగబట్టి కండరాల్ని నొక్కిపెట్టి పాడాల్సి వస్తుంది. ఇదిగో యిలా -*“విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా”: చూశారా? కనక ఆ పాటకి న్యాయం చేకూర్చాలంటే. ఎవరైనా కానీ అరచేతులు రెండూ దగ్గిరకి చేర్చి వాటిని గట్టిగా నొక్కుతూ పాడాలి మరి. అప్పుడా అరచేతుల మధ్య ఏదన్నా జారిపోయే వస్తువు - సబ్బుబిళ్ళ లాంటిది - కనక వుంటే అది చేతుల్లోంచి పైకెగిరి పడిపోడం ఖాయం, అంటూ బాత్రూములో అంతా వెతుకుతూ, “అది దూరంగా కాళ్ళు తుడుచుకనే పట్టా మాద పడుతుందండి/ అని చెప్పి పోయిన వస్తువుని యజమానికి అప్పగించి, “ఇదిగో యిక్కడుంది.” అన్నాడు పరిశోధన దిగ్విజంగా ముగించిన నూకరాజు,

జమిందారు భుజంగరావు నమ్మలేనట్టు చూశాడతని వైపు.

స్మంత్ర గొప్పు పరిశోధన నేను యింతవరకెప్పుడూ చూడలెదయ్యా,” అన్నాడు.

నూకరాజు బుజాలు కుదిస్తూ, “ఎలిమెంటరీ” అన్నాడు,

“నువ్వు డిటెక్టివ్‌గా వుండాల్సిందయ్యా.”

నూకరాజు దొరికిన అవకాశాన్ని వదులుకోలేదు.

"నేను డిటెక్టివ్‌నేనండి. నా 'పేరు నూకరాజు, భాగోతుల నూకరాజు: డిటెక్టివ్‌ వాలి, యుగంధర్‌ అండ్‌ కంపెనీలో పనిచేస్తున్నా, ఇన్వెస్టిగేటర్‌గా.”

అతను చెప్పింది 'వెంటనే గ్రహింపుకు రాలేదు భుజంగరావుకి, వొళ్ళంతా సబ్బు నురగలో నిండి వూర్మ అతనివైపు చూశాడు, వున్నట్టుండి జ్ఞానోదయం కలిగి అప్పటిదాకా సౌమ్యంగా వున్నవాడు కాస్తా గంభీరంగామారాడు, సరదాగా కాసేపు 83 నవ్వితే నవరత్నాలు

'నూకరాజా? ఏవిటీ, నీ పేరు నూకరాజన్నావా?'

“అవునండి.”

“పొరబాటున నువ్వేనా ,..

“అమ్మాయిగారైన రాణీ ప్రమాలాదేవిని చెప్పలేనంత గాఢంగా (ప్రేమించిందీ అని అడగబోయారు కదూ? అవును, జమిందారు. భుజంగరావు గారూ, నేనే. మిరు అంగీ కరిస్తూ'మ మృల్నిద్దర్నీ పె ద్దమనస్తు తో తప్పుకుండా ఆశీర్వదించాలని నా కోరి కండీ..

ఆ జమాందారుగారి నుదురు ముడిపడి నల్లటి రంగుకి తిరిగింది. పాదాలు రుద్దుకునేందుకు తీసుకున్న కొబ్బరి పీచుని గట్టిగా అదిమిపెట్టి పట్టుకున్నాడు,

_ “ఓహో, నువ్వా, నుప్వనా వాడివి?! అన్నాడు కోపంగా, “ఎందుకూ పనికిరాని ఒక

  • అడుగుల గుర్తులూ, సిగరెట్టు బూడిదా, చుట్ట పీకలూ వెదుక్కుంటూ గడిపేవాడికి మా అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తానని ఎలా అనుకున్నావ్‌? బుద్ధుందా అసల్నీకు? కాళ్ళ మీదా. చేతుల మోదా యిల్లంతా పాకుతూ భూతద్దం పట్టుకుని పనికిరాని చెత్తా చెదారం. ఏరుకుని జేబులు నింపుకుంటూ: పొద్దస్తమానం తిరిగే మనిషికి మా. అమ్మాయిని కట్టబెడతానని అనుకున్నావా నుప్పు, నీదేనా యీ ఐడియా? ఆ నీ సంగతి తెలుస్తోందిలే!. మా. అమ్మాయి. రాణీ ప్రమిలాదేవిని ఒక పనికిరాని డిటెక్టివ్‌కి యిచ్చి ..౮

'అసలు డిటెక్టివ్‌ల మిద మాకున్న అభ్యంతరం ఏమిటో?”

“అది నీకు అనవసరం. డిటెక్టివ్‌లంటే నాకెందుకు పడదో నీకు చెప్పాల్సిన అగత్యం పట్టలేదు నాకు. 'నా కూతుర్ని పెళ్ళి చెసుకుంటాట్ట! చిన్నంతరం 'పెద్దంతరం చూడక్టల్లేదా, ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావ్‌? అంతెందుకు, నాలుగు రబ్బరు గాజులు కూడా కొనిపెట్టలేవు మా అమ్మాయికి.”

నూకరాజు హుందాగా వుండటానికే ప్రయత్నించాడు;

'ప్రస్తుతం చేస్తున్న వుద్యోగంలో ఆశించినంత మేర జీతభత్యాలు ముట్టడం లేదని వొప్పుకుంటున్నాా అయితే మా సంస్థ దీపావళి నాటికి పెంచుతామని చూచాయగా...

భీ! అని చీదరించాడు భుజంగరావు. 'థూ! ఛా! మా అమ్మాయి వివాహం గురించి నికు అంతగా తెలుసుకోవాలని వుంటే విను; యిదిగో ఆ అభ్రకం గనుల షేర్లు అమ్మేయంగానే మా కుటుంబానికి కావలసినవాడూ, నా చిరకాల మిత్రుడూ అయిన బిజినెస్‌ మేగ్నెట్‌ దోణం అప్పయ్యచౌదరితో పెళ్ళి జరిపిస్తా. ఇక నీ సంగతికొచ్చేసరికి నూకరాజూ, నేను చెప్పేది రెండే రెందు మాటలు. ఒకటేమో ఫో రెండోదేమో. బెట్‌,

గర్వంతో మిడిసిపడుతున్న ఆ ముసలాయన యిలాంటి మూడులో వున్నప్పుడు వాదించి 'ప్రయోజనం లేదనుకున్నాడు నూకరాజు. -

“మంచిది భుజంగరావుగారూ, అలాగే," అన్నాడు ప్రశాంతంగా,

బాత్రూములో వంగినప్పుడు వొంటికి అంటుకున్న బూజూ, దుమ్మూ పట్టించు కోకుండా అక్కడినించి వెళ్ళిపోయాడు. నవ్వితే నవరత్నాలు 84 సరదాగ్గా కాసేపు

అరగంట' తరవాత జరిగిన డిన్నర్లో ఐనంపూడి వరహాలరాజుగారు అతిధులకి తాగడానికీ, తినడానికీ చక్కటి ఏర్పాట్లు చేశాడు. భోజనప్రియులు కోరుకునే వాటినన్నింటినీ కొదవలేకుండా సమకూర్చాడు. నూకరాజు మాత్రం వడ్డించినవి చక్కగా రుచి చూస్తూ తినకుండా. వూర్మే మింగుతూ కూచున్నాడు. అతని. దృష్టంతా ఎదురుగుండా కూచున్న దోణం అప్పయ్యచౌదరి మాదనే. వుంది. 'రెప్పలార్చకుండా అతన్నే గమనిస్తూ కూచున్నాడు.

నిశితంగా: పరీక్షించి చూసినకొద్దీ దోణం అప్పయ్యచౌదరిలాంటి మనిషి తను: (ప్రైమించిన యువతిని, పెళ్ళి చేసుకోబోతున్నాడన్న తలపు ఏహ్యంగా కనిపించసాగింది.

అయితే మనం యిక్కడో విషయాన్ని గమనించాలి - తను ఎంతగానో (ప్రేమించిన యువతిని మరొకడు పెళ్ళి చేసుకుంటున్నాదని తెలిస్తే ఆ మనిషిని చూడగ్గానే ద్వేషం 'పుట్టుకురాక తప్పదు, సహజం ఎవరికైనా. అసంద ర్భంగా కనిపిస్తున్న యిలాంటి పరిస్థితుల్లో ఆ 'పెళ్ళికొడుకు మహేశ్‌ బాబయిన్నా, షారుఖ్‌ ఖాన్‌ అయినా. మన నూకరాజుకి నచ్చి వుండేవాడు కాదన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ దోణం అప్పయ్యచౌదరి లాంటివాడిని అతను ద్వేషించటం చాలా వరకు సమంజసమేనని చెప్పాలి

ఓం'ప్రధమంగా. చెప్పాల్సింది ఆ షేర్ల వ్యాపారస్తుడున్నాదే అతను యిద్దరు వ్యాపారస్తులకి సమానం. సృష్టికర్త ఈ వ్యాపారస్తుడిని సృష్టిస్తున్న సమయంలో యిలా అనుకుని. వుండొచ్చు: “వీడి సంగతేదో బాగా చూడాలి. పిసినారితనం పనికిరాదసలు,” అనుకుని వుత్సాహం పొంగిపొర్లి మరీ అతిగా చెశాడు. లావుపాటి శరీరం వొక్కటే కాదు, బట్టతలతో పాటు పోదుచుకొచ్చే కళ్ళు కూడా యిచ్చి వయసుమళ్ళినవాడని చూడగానే చెప్పే పరిస్థితి వర్పడింది. అలాంటి వ్యక్తి శృశానాల్లో కాటికాపరి వృత్తికి పనికొస్తాడు కానీ లేలేత వయసులో చూడచక్కగా వున్న రాణీ ప్రమిలాదేవిని - ఆమెకి యిష్టం లేకపోయినా - వరించేవాడు మాత్రం కాదని తోచింది. 'నూకరాజుకీ, ఆ ఏవగింపుతో డిన్నరు పూర్తి కాగానే అతన్ని పలకరించాడు.

'మితో కొంచెం మాట్లాడాలి, యిలా రండి అంటూ అతన్ని ఆరుబయట తోటలోకి తీసుకెళ్ళాడు నూకరాజు,

చల్లటి వాతావరణంలో అతన్ని అనుసరించి వస్తూంటే. దోణం అప్పయ్యచౌదరి ఆశ్చర్యంతోపాటు కాస్త యిబ్బంది కూడా పడ్డాడు. డిన్నరు చేస్తున్నంతసేపూ ఎదురుగుండా కూచున్న మనిషి తదేకంగా తననే తేరిపార చూస్తుండటం గమనించాడు. పనికిరాని అభ్రకం గనుల షేర్లు త్వరగా అంటగట్టాలని చూస్తున్నవాడికి అలా నిశితంగా పరీక్షిస్తూ చూసే చూపులు అసలు గిట్టవు.

కంగారుపడుతూ అడిగాడు 'నూకరాజుని, “ఏం కావాలండీ మాకు?”

నూకరాజు నిప్పులు కక్కుతూ చూశాడతన్ని. సరదాగా కాసేపు క్ర నవ్వితే నవరత్నాలు

“అప్పయ్యచౌదరిగారూ మా ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకుంటారా?' అని అడిగాడు నిర్మొహమాటంగా.

“చాలాసార్లు చెప్పాడా వ్యాపారి వందుకలా అడుగుతున్నాడో అర్ధంకాక.

“మా బరువెంతో ఎప్పుడన్నా చూసుకున్నారా?

'బట్టలు కుట్టించుకోడానికి టైలరు దగ్గిరకి వెళ్ళినప్పుడు అతను టేప్త పట్టుకుని మో'చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మా కైవారం కొలతలు 'రాసుకోడానికి అరిచి: చెబుతుంటే మీరెప్పుడన్నా ఆ కొలతలు విన్నారా?!

న,

'అయిత్కే మా మాద నాకు అనురాగం ఏమాత్రం లేదని గుర్తుంచుకుని వినండి, మిరు వట్టి తిండిపోతయి వొళ్ళంతా బలిసి కొట్టుకుంటున్నారని మారు గ్రహించే వుంటారనుకుంటా, మరి తగుదునమ్మా అంటూ రాణీ ్రమాలాదేవిని పెళ్ళి చేసుకోవాలని మాకెలా అనిపించిందో నాకైతే ఆశ్చర్యంగా వుంది. యవ్వనంలోకి యిప్పుడిప్పుడే అడుగు పెట్టిన ఆ చిన్నారి పక్కన మిరు నడుస్తుంటే అందరూ గాడిదలా వున్నాడని అనుకోరా అని మోకు తట్టలేదా? మోరిద్దరూ కలిసి వెడుతుంటే రాణీ 'ప్రమాలాదేవిని వాళ్ళ పెద్ద మావయ్యగారు మ్యూజియంకో, షికారుకో తీసుకెడుతున్నాడు గావుల్ను అని పొరబాటు పదరా?” అంటూ: ముగించాడు: నూకరాజ్సు

వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు అప్పయ్యచౌదరి.

'ఓహో!! అన్నాడతను,

“షేహో[౫ అంటూ కూచుంటే వపయోగం లేదని 'తెలుసుకోండి ముందు. అలా “ఓహో!” అని చెప్పి తప్పించుకోలేరు మారు, మన మాటల్సూ, వివాదాలూ. పూర్తయిన తరవాత చివరికి మిగిలేదేమిటో వినండి - మిరు లక్షాధికారి కావచ్చు, కానీ చూడ్డానికి మహా రోత పుట్టిస్తూ ఆంబోతులా. కనిపించే వయసుమళ్ళిన లక్షాధికారి. అనే నిజం మాత్రం నిలిచిపోతుంది. మా పరిస్థితిలో కనక నేనుంటే యిదంతా వదిలేసుకునే వాదిని. అయినా నాకు తెలీక అడుగుతున్నాను, అసలు మోకు 'పెళ్ళిందుకో చెప్పండి? 'ఇప్పుడిలా హాయిగానే వున్నారుగా, ఇవన్నీ వదిలేసినా, 'షేర్లమ్ముకునే వ్యాపారస్తుడి బ్రతుకు ఏంత దారుణమో ఆలోచించండి ముందు. వున్నపళాన ఓరోజు సాయంత్రం --రాక్రిక్తి నేను భోజనానికి రాను, నాకోసం కనిపెట్టుకు కూచోకుండా నువ్వు చేసెయ్యి - సెంట్రల్‌ జైల్లో ఏడు సంవత్సరాల శిక్ష యివాబ్దినుంచే అమలు కాబోతున్నది అన్న వార్తని మిరామెకి ఫోన్ల చెబితే, ఆ లేత పృదయం ఎంత ఘోరంగా: విలవిల్లాడుతుందో, క్షోభిస్తుందో ఎప్పుడన్నా ఆలోచించారా. అసలు?”

ఈ మాటలు వింటూ కోపంగా దానికి తగిన ఘాటైన సమాధానం ఆ వ్యాపారి నోట్లోంచి దొర్లబోయింది. అయితే చివరగా నూకరాజు అన్నది వినేసరికి నోట్లో వున్న నవ్వితే నవరత్నాలు 86 సరదాగా: కాసేపు

మాటలు బయటికి రాలేకపోయినాయి. మనిషిలో ధైర్యం సన్నగిల్లి, దాన్ని దాచుకోకుండా ఎదుటి వ్యక్తి వైపు ఆందోళనతో చూస్తూ నుంచున్నాడు.

చివరికి కొంత తేరుకుని, 'మిరనేదేమిటో అర్ధం కావడంలేదు! అన్నాడు.

“ఫరవాలేదు లెండి," అన్నాడు నూకరాజు.

లేని అభ్రకం గనుల్లో పెట్టుబడి పెట్టండని పనికిరాని షేర్లు అమ్మచూపే కొంతమంది వ్యాపారస్తులు చివరికి ఏదో ఒకరోజు జైలు పాలవుతారని నూకరాజుకి తెలుసు కనక అలా అన్నాడు కానీ, అప్పయ్యచౌదరి చేసే వ్యాపారం ఏమిటో తెలిసి కాదు.

“ఇదిగ్రో నా మాట వినండి, అన్నాడు ఆ వ్యాపారస్తుడు.

వినిపించుకోలేదు నూకరాజు, ఇందాక డిన్నరు చేసేటప్పుడు: ఏదో ఆలోచిస్తూ వూర్మే మింగుతూ కూచున్నాడని ముందే చెప్పాను గుర్తుందిగా, శరీరం యిప్పుడు ప్రతీకారం తీసుకోడం మొదలెట్టింది. వున్నట్టుండి పొత్తి కడుపులో నులి నొప్పి మొదలై శరీరమంతా వ్యాపించేసరికి 'హబ్బా!' అంటూ బాధకి. తట్టుకోలేక గట్టిగా మూలుగుతూ మనిషి వొంగి పోయి వున్న చోటునే గుండ్రాలు తిరగడం మొదలెట్టాడు,

అప్పయ్యచౌదరి ఓపిక కోల్పోయి నాలిక టకటకలాడించాడు.

“చూడండి, శివమెత్తినట్టు అలా చిందులు తొక్కే సమయం కాదిది అని తెలుసుకోండి. ఏవిటి జైలు జైలు అంటూ యిందాక ఏదో అన్నారు, ముందర దానిసంగతి తేల్చండి” అన్నాడతను మహా కోపంతో.

నూకరాజు యిప్పుడు. నిఠారుగా నుంచున్నాడు. వెండిలా మెరుస్తున్న వెన్నెల కాంతిలో చూడచక్కని అతని ముఖం యిప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఆ ముఖంలో కపటం, దగా, కుట్ర, కల్మషం అన్నీ కలబోసినట్టు నూకరాజు నవ్విన చిరునవ్వు వికృతంగా కనిషించింది అప్పయ్యచౌదరికి, ఆ నవ్వు మామూలు చిరునవ్వు కాదనీ, ఎదుటివాడి వ్యవహారం తనకంతా తెలుసుననే ధీమాతో ఎద్దేవా చేస్తూ నవ్వుతున్న వికారపు నవ్వనీ అనిపించింది.

ఇలాంటి వ్యాపారస్తులకి నిశితంగా ఎవరన్నా పరిశీలిస్తూ చూస్తే నచ్చదని ముందొకసారి చెప్పాను మాకు, అంతకు మించి యిలా ఎవరన్నా కల్మషంతో కూడిన చిరునవ్వు నవ్వితే మరీ నచ్చదు, అభ్యంతరకరంగా తోస్తుంది వాళ్ళకి, అప్పయ్య చౌదరికి తల తిరుగుతున్నట్టయింది,. మళ్ళీ యింకోసారి యిందాకటి ప్రశ్న అడుగుదామనుకునే లోపల. నూకరాజు యింకా అలాగే చిరునవ్వు నవ్వుతూ చెట్ల నీడల్లో కలిసి మాయ మయ్యాడు. ప నంల్వ

ఆ పేర్ల వ్యాపారి ముందుగదిలోకి సరాసరి వెళ్ళాడు. తాగటానికి కావలసిన సరంజామా అంతా అక్కడ వుంటుందనీ, గట్టిగా ఒక గ్లాసు బ్రాందీనో, విస్మీనో బిగిద్దామన్‌ చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకిప్పుడు అర్జంటుగా కావలసింది. చిక్కటి బ్రాంది లేక విస్కీ నూకరాజు న వ్విన నవ్వులో తను అ నుకుంటున్నట్టు నర్మగర్భమైన విషయాలు సరదాగ్గా కాసేపు 8 నవ్వితే నవరత్నాలు

వుండవనీ కేవలం అది తన వూహ మాత్రమేననీ తనకి తానే చెప్పుకోడానికి ప్రయత్నిం చాడు అయినా ఆ గదిలోకి అడుగు పెడుతుంటే వాళ్ళంతా వొణికింది,

తలుపు తెరిచి చూడగానే ఏవరో గట్టిగా అరుస్తుండటం వినిపించింది. ఆ గొంతు పకృవ్లూరి జమిందారైన కాశీపట్నం భూపతివర్మ్నగారిదని గుర్తించాదతను.

_ మళ్ళీ అదే గొంతుతో గట్టిగా, 'మిరింత నీచానికి వాడిగడతారనుకోలేదు,! అన్నాడు భూపతివర్శ.

ఏం జరుగుతోందో అర్ధంకాక తికమక పడ్డాడు అప్పయ్యచౌదరి, ఇంటి యజమాని వరహాలరాజు గోడకానుకుని. నుంచున్నాడు. దుద్దుకర్రంతటి చూపుడువేలుతో అతని గుండె మోద పొడుస్తూ బుద్ధి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు భూపతి వర్క

“ఏం జరిగిందండీ?! అంటూ అడిగాడు అప్పయ్యచౌదరి,

“ఏం జరిగిందో చెప్తా వినండి, గట్టిగా అరుస్తూ అన్నాడు వర్మగారు. “ఇదిగో యిక్కడున్నాడే యీ పెద్దమనిషి, యింటికొచ్చిన అతిధుల. మిద ఒక. కన్ను వేసుంచాలని డిటెక్టివ్‌ని పట్టుకొచ్చి. పెట్టాడు, వవడో పనికిమాలిన వెధవ నూకరాజు అనేవాడిని, ఇదండీ మన సభ్యత్మా సంస్కారమ్హూ యింటికి పిలిచిన అతిధులికిచ్చే గౌరవమూను, హారి దేవుడా!” అన్నాడతను: ద్వేషం కక్కుత్నూ యింకా చూపుడు వేలితో పొడుస్తూ, “ఇది నీచాతినీచర అంటాన్నేను. ఇంత నీచానికి వొడిగడతావని నేనెప్పుడూ అనుకోనేలేదు. నేనే గనక చుట్టుపక్కల జమిందార్లని యింటికి 'పిలిస్తే మామూలుగా. 'ఏం చేస్తానో తెలుసా - ఖరీందెన వస్తువుల్ని అలమర్లలో పెట్టి తాళం వేసి దాచేస్తాను. పైగా రోజూ: రాత్రిళ్ళు చెంచాలూ గరిటెలూ లెక్కపెట్టుకుంటూ వుండమని. మా: నౌకర్లకి పురమా యిస్తాను. అంతేగాని వెధవ డిటెక్టివ్‌లని పట్టుకొచ్చి నిఘా 'పెట్టడమనేది కలలో. కూడా వూహించలేను. మనిషికి. పరువూ, మర్యాదా. అనేవి లక్షణమండి. జమాందార్లంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఏవంటారు, మిరేవంటారు?'

“ఇదిగో నామాట నమ్మండి, యిందాకటినించీ నేను చెబుతున్నా వినిపించుకోడం లేదు మిరు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల అతన్ని మా యింటికి పిలవాల్సి వచ్చింది. మా యింట్లో వుండి మా వుప్పు తిన్న తరవాత నన్ను బయట 'పెట్టడస్‌, తిన్న యింటి వాసాలు లెక్కపెట్టడనీ అనిపించింది నాకు?” బతిమాలే ధోరణిలో 'చెప్పాడు వరహాలరాజు.

'ఏవిటి మారనేది, బయటపెట్టడం. ఏవిటి?

వరహాలరాజు పొడి దగ్గు దగ్గాడు,

“ఏదో మరీ చిన్న విషయంలైండి. చాలా చిన్న విషయం. అయినా ఆ మనిషి కనక తలుచుకునుంటే నన్ను యిరకాటంలో పెట్టి వుండేవాడు. అంచేత, నేను తలెత్తి పైకి చూసేసరికి అతను నా వంక అదోమాదిరిగా తనకంతా' తెలుసునన్నట్టు నవ్విన

అది వినంగానే దోణం అప్పయ్యచౌదరి గట్టిగా అరిచాడు, నవ్వితే. నవరత్నాలు 88. సరదాగా కాసేపు

“'నవ్వాడా? ఏవన్నారు మిరు, చిరునవ్వు 'నవ్వాడన్నారా?" అన్నాడు. గుటకలు: మింగుతూ,

'నవ్వతూ నుంచున్నాడన్నది కరెక్టు. ఆ వికృతమైన నవ్వు ఎలాంటిదంటే గుండెల్లో బాకులా దిగి మారు దాచుకున్న రహస్యాల్ని సెర్చి లైటుతో వెదుకుతున్నట్టు కనిపించే చిరునవ్వు” అన్నాడు జమాందారు ఐనంపూడి వరహాలరాజు.

అప్పయ్యచౌదరి మరోసారి గుటకలు మింగాడు.

“మోరు చెప్పేది - అదే ఆ నవ్వ మనిషి - సన్నగా పొడుగ్గా చూడ్డానికి అందంగా. వుంటాడే, అతనేనా?'

“కరెక్ట్‌, అతనే. అంతెందుకండీ, యిందాక డిన్నర్లో మోకు ఎదురుగుండా కూచున్నాడే, అతనే!

"పైగా అతనో డిటెక్టివ్‌ కూడానా?”

దానికి జమిందార్‌ భుజంగరావుగార్హు. “అతనో గొప్ప డిటెక్టివ్‌, సమర్హుడు, మంచి చాకచక్యం వున్న డిటెక్షివ్‌ కూడాను," వొప్పుకున్నాడు యిష్టం లేకపోయినా. *నా సబ్బుబిళ్ళ పోతే ఎంచక్కా వెదికి పట్టుకున్నాడంటారు. ఆ మనిషి దగ్గిర ఏదో అతీతమైన శక్తి వుంది - దివ్య చక్షువు లాంటిది - అంట్నే మికు అర్ధమైందనుకుంటా. వెధవ, తుంటరి. డిటెక్టివ్‌లంటే నాకు పరమ అసహ్యం, వాళ్ళని చూస్తేనే నా వొళ్ళు జలదరిస్తుంది. పైగా బొత్తిగా భయభక్తులనేవి లేకుండా - మి. అమ్మాయి రాణీ ప్రమిలాదేవిని పెళ్ళి చేసుకోవచ్చా అంటూ పర్మిషన్‌ అడిగాడు నన్ను! తలుచుకుని వాళ్ళంతా జలదరిస్తుండగా చెప్పాడా సంగతి.

“(మళ్ళీ కలుస్తానండీ, అన్నాడు దోణం అప్పయ్యచౌదరి. ఒక్కగంతులో గదిలోంచి మాయమై బయట తోటలోకి పరిగెత్తాడు. సమయం వృధా చెయ్యగూడదింక అనుకున్నాడు. అలా పరిగెత్తుతుంటే నల్లబారిన ముఖం కాస్తా వంకర్లు తిరిగి బూడిదరంగులోకి మారింది, ఒక చేత్తో కోటు లోపలి జేబులోంచి చెక్కు బుక్కు బయటికి లాగాడు, మరో చేత్తో యింకో జేబులోంచి పెన్ను బయటికి తీశాడు,

ఆ 'షేర్ల వ్యాపారికి ఎదుటబడ్డ నూకరాజు -- మనిషిప్పుడు తేరుకున్నట్టు కనిపించాడు. ఏ ముహూర్తాన ఆ 'స్పెషలిస్తుని సం'ప్రదించానో కదా అనుకుని మనసులోనే ధన్యవాదాలు సమర్పిస్తూ, యిలాంటి వ్యవహారాల్లో అతను ఆరితేరినవాడు అన్నదాంట్లో సందేహం లేదనుకున్నాడు:. నవ్వాలంటే బుగ్గల దగ్గిరున్న కండరాలు నొప్పి పుట్టవ చ్చు, అయినా అజీర్తివ్యాధి మూలాన కలిగే బాధని. మాత్రం అది తప్పక వుషశమనం కలగచేస్తుంది అని తలపోశాడు..

దోణం అప్పయ్యచౌదరి ఒక చేత్తో చెక్కు బుక్కున్మీ మరో చేత్తో పెన్నునీ వూపుకుంటూ వచ్చే కాసేపటి ముందే 'నూకరాజు ముఖానికి కాస్తంత విశ్రాంతి యిచ్చాడు. బుగ్గలూ, దవడలూ విశ్రాంతి తీసుకున్నాయి కనక్క మళ్ళీ వాటికి పని యిచ్చి తన అజీర్తివ్యాధికి సరదాగా కాసేపు 89 నవ్వికే నవరత్నాలు

చికిత్స మొదలెట్టాడు. దాంతో, దోణం అప్పయ్యచౌదరి హడావిడిపడుతూ నూకరాజుని సమిాపించేసరికి అతన్‌ మొహంలో విరిసిన చిరునవ్వు = ఎదుటివాడి గుట్టంతా తెలుసునని కనబడేలాంటి చిరునవ్వు - కనిపించి నడుస్తున్న వాడల్లా ఒక్కసారి ఆగిపోయి నోట్లోంచి “మాటలు రాకుండా నుంచుండిపోయాడు,

ఎలాగోలా కాసేపటికి 'తేరుకున్మి ఓహో, యిక్కడున్నారా మిరు, మాతో కొంచెం వ్యక్తిగతమైన విషయం సెపరేట్‌గా మాట్లాడావచ్చా, నూకరాజుగారూ?' అంటూ అడిగాడు.

నూకరాజు సంతోషంతో మరింత చిరునవ్వు వొలకబోసి సరేనన్నట్టు తల వూపాడు, ఆ వ్యాపారస్తుడు నూకరాజు బుజం పట్టుకుని లాగుతూ పక్కకి తీసుకెళ్ళాడు. అప్పయ్య చౌదరి వూపిరి తీస్తుంటే గురక పెడుతున్నట్టు చప్పుడొస్తోంది.

“నేను చాలా: చాలా ఆలోచించానండీ చివరికి మారు చెప్పిందే సబబుగా తోస్తోందండీీ! అన్నాడు 'నూకరాజుతో,

'సబబా?" అడిగాడతను విషయం ఏవిటో అర్ధంకాక,

'అదే నా పెళ్ళి గురించి. కుదరదు ఆ పని,!

'కుదరదా?"

“ఎబ్బే, కుదిదేపని కాదండీ. అసందర్భం, తెలిసొచ్చిందిప్పుడు. ఆ సుకుమారికి నను తగను, నాకు వయసు మ ళ్చిందిల్‌

“అవును,

“నా తల మిద వెంట్రుకలు బొత్తిగా లేవు, పూర్తిగా బట్టతలం

"పైగా శరీరం యింత లావుపాటిదీ కూడాను.

'మహా లావు, కాస్తా కూస్తా కాదు” అంగీకరించాడు నూకరాజు: అవతలి మనిషి వున్నట్టుండి మనసు మార్చుకున్నందుకు కలవరపడినా అది. శ్రావ్యమైన సంగీతంలా వినిపించింది, అప్పయ్యచౌదరి చెబుతున్న ప్రతి మాటా వింటుంటే హృదయం. లోపల్లోపలే మెకపిల్లలా గెంతుతున్నట్టు వుంది. దాంతో అతని పెదిమెలు వంకర తిరిగి చిరునవ్వగా మారింది;ఆ చిరునవ్వుని చూసి అప్పయ్యచౌదరి భయమేసిన గుర్రంలా సిగ్గుతో చచ్చి పోతున్నాడు. గబగబా నూకరాజు బుజం. తట్టాడు. ,

“అంచేత నేను మారిచ్చిన సలహా పాటిద్దామని నిర్ణయం తీసుకున్నానండి. అంటే మారిందాక 'సెలవిచ్చిన్నట్టు - వదిలేసుకుంటున్నానండి, అని చెప్పాడు.

“అంతకన్నా మంచిపని మరోటి లేదు, అన్నాడు నూకరాజు హృదయపూర్వకంగా సమ్మతిస్తూ,.

__ అప్పయ్యచౌదరి కొనసాగించాడు: “ఇలాంటి పరిస్థితుల్లో 'నేను దేశంలో కనక వుంటే అవాంఛనీయమైన సంఘటనల్ని ఎదుర్మోవాల్సి వస్తుందండి. అందుకని మూడో కంటికి తలియకుండా.'మారుమూల ప్రదేశానికి -బహుశా ఏ (శ్రీలంకక్కో మారిషస్‌కో నవ్వితే నవరత్నాలు 90 సరదాగా కాసేపు

జారుకుంటానండి, ఏవంటారు మారు, మంచిదేనంటారా?” అని అడుగుతూ చేతులో వున్న చెక్కు బుక్కులో చెక్కుల్ని రెపరెపలాడించాడు.

“చాలా గొప్పపని చేస్తున్నారు,” అన్నాడు నూకరాజు.

“నేను వేసుకున్న ప్లాను తమరు ఏవరికీ చెప్పరు గదా? ఈ రహస్యాన్ని మనిద్దరి మధ్యనే దాస్తారుగా? ఒకవేళ సి,ఐ,డి బలగంలో పనిచేసే తమరి స్నేహితులెవరన్నా నా గుదించి అడిగితే మిోకేమా తెలీదని చెబుతారుగా?'

'తప్పకుండానండి.”

"భలే? అన్నాడు ఆ వ్యాపారి తేరుకుని. 'మరో సంగతి కూడా వుందండి.. గోరపూడి భుజంగరావుగారు యిందాక' అంటుంటే విన్నాను, వారమ్మాయి రాణీ ప్రమాలాదేవిని తమరు పెళ్ళి చేసుకోటానికి కుతూహలం చూపిస్తున్నారట కదా, కానీ సరిగ్గా పెళ్ళి టైముకి నేను ఏక్కడుంటానో - వూ6 వేంటనే బుర్రకి తడుతున్నదైతే దుబాయి బహుశా

  • అందుకని తమరిద్దరి పెళ్ళికి నా వైపునించి బహుమానర అనండి, కానుక అనండి, అదేదో యిప్పుడే యివ్వాలని వుందండి.!

అలా అని చెక్కు బుక్కులో గభాల్న బరబరా: గీకేసి చెక్ళుని చింపి నూకరాజు

“గుర్తుంటుంది కద్మా మాట పొల్లుషోకూడదు" అన్నాడు,

'సరేనండ్కి* అన్నాడు నూకరాజు:

అప్పయ్యచౌదరి కారు షెడ్డు వైపుకి వెడుతుంటే చూస్తూ, అంత గొప్ప సహృదయుడిని అనవసరంగా అపార్ధం చేసుకున్నానేమోనని చింతించాడతను, అంతలో కారు బయళ్టేరిన శబ్దం విని అతను మెల్లగా జారుకున్నాడని గ్రహించాడు. తన భవిష్యత్తుకి, ఆనందానికీ వున్న అవరోధాల్లో ఒకదాన్ని అధిగమించానని సంతోషిస్తూ మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దామని లోపలికొచ్చాడు నూకరాజు,

ముందుగదిలోకి వెళ్ళి చూస్తే మహా (ప్రశాంతంగా వుందక్కడ. కొంతమంది బ్రిడ్జి ఆట ఆడుకుందానుంటే వద్దని వారిస్తూ జమిందారు గోరపూడి వీర వేంకట భుజంగరావు గారు అందర్నీ చిన్న టేబులు దగ్గిర సమావేశపరిచి తనకి మహా యిష్టమైన పర్షియన్‌ 'మోనార్స్‌ ఆటకి కూచోపెట్టాడు.

వాళ్ళకి ఏలా ఆడాలో వివరిస్తున్నాడిప్పుడు; “ఇది చాలా సులభమైన ఆటండీ. పేక కట్ట తీసుకుని అందులోంచి ముక్క కొయ్యడమ్మే అంతే, ఇప్పుడు మిరు కనక ఎదుటివాడికన్నా పెద్ద ముక్క కోస్తానని - వూర్మే అనుకుందాం - పదో పరకో పందెం కాశారనుకోండి. కోశారో మోరు గెలిచినట్టు. కొయ్యలేకపోయారో అంతే సంగతులు, ఎదుటి వాడు గెలిచినట్టు: అర్దమైంది కదా అంతా?”

ఇది సరిగ్గా మంగమ్మ శపధం ఆటలా వుందని ఎవరో అన్నారు,

దానికి భుజంగరావు, 'ఇది మంగమ్మ శపధమే, దాదాపు మంగమ్మ శపధంలాంటి సరదాగా కాసేపు న. నవ్వితే నవరత్నాటు

ఆటే'యిది. విషయం ఏవిటంటే మాకు గనక మంగమ్మ శపధం వచ్చుంటే పర్షియన్‌ మోనార్క్‌ సులభంగా ఆడగలరు,” అన్నాడు. వాళ్ళందరూ ఆటకి కూచుంటే అప్పయ్యచౌదరితో యిప్పుడిప్పుదే ముగిసిన సంభాషణ వల్ల గుండెల్లో తుపానులా రేగిన సంభ్రమాన్ని మననం చేసుకుంటూ గదిలో మెల్లగా పచార్లు చేస్తున్నాడు నూకరాజు, ఇంక మిగిలిందల్లా ఏదోవిధంగా జమిందార్‌ భుజంగరావుకి తన మిదు న్న దురభిప్రాయాన్ని పారదోలే ప్రయత్నం చెయ్యాలి, అదంత సులభమైన పని కాదు. మొదటి అడ్డంకి - తన ఆర్ధిక పరిస్థితులు. అప్పయ్యచౌదరి యిచ్చిన చెక్కుని యింకా. తెరచి చూడలేదని వున్నట్టుండి గుర్తుకొచ్చిందతనికి. జేబులోంచి బయటికి తీశాడు. జాగ్రత్తగా దాన్ని పరిశీలించి చూడగానే తుపాను తీవ్రతకి వూగిసలాడే మానులా వూగిపోయాడు. అందులో ఎంత 'వుంటుందో చెప్పలేకపోయేవాడతను. ఓ యాభయ్యో, మహా అయితే నూరో వుంటుందనుకున్నాడ్రు, పెళ్ళికి చిరుకానుకగా రెండు కుర్చీలో పరుపో కొనుక్కోడానికి పనికొస్తుందని వూహించి వుండేవాడు. ఆ చెక్కులో రాసున్న మొత్తం లక్ష రూపాయలు, అక్షరాలా లక్ష రూపాయలు. ఆశ్చ్ళర్యంనించి తేరుకోలేక ఎదురుగా గోడవారగా: వున్న నిలువుటద్దంలో చూసుకుంటే తన మొహం తనే గుర్తుపట్ట లేకపోయాడు, పొగమంచు కమ్ముకున్న అద్దంలోకి చూస్తున్నట్టు అనిపించింది. కాసేపటికి ఆ పొగమంచు కరిగింది. ఇప్పుడు అద్దంలో కనిపిస్తున్నది తన మొహం ఒక్కటే కాదు, ఎడం పక్కన కూచున్న జమిందార్‌ భూపతివర్శతో పందెం కట్టి, కట్టలోంచి ముక్క కోస్తున్న గోరపాటి వీర వేంకట భుజంగరావు ముఖం కూడా స్పష్టంగా కనిపించింది. తనకి అమాంతంగా. తన్నుకుంట్టూ వచ్చిన సిరిసంపదల్ని చూసి ప్రియురాలు రాణీ ప్రమిలాదేవి. తండ్రి మోద అది ఎలాంటి మార్చు తెస్తుందోనని నూకరాజు తలుచుకుంటుంటే వున్నట్టుండి అతని మొహంలో చిరునవ్వు విచ్చుకుంది. అదే క్షణంలో వెనకనించి పెద్దగా ప్రాణం పోయినట్టు ఎవరో పొలికేక పెట్టడం వినిపించి అద్దంలోకి చూస్తే తనవంకే చూస్తున్న భుజంగరావు చూపు అతని చూపుతో కలిసింది. మామూలుగానే. పొడుచుకొచ్చినట్టుందే అతని కళ్ళు యిప్పుడు రొయ్య గుడ్లులా మరీ ముందుకు పొడుచుకొచ్చాయి. జమిందార్‌ భూపతివర్శగారు జేబులోంచి పెద్ద నోటు బయటికి తీసి టేబులు మోద ముందుకు జరిపి, “ఏవిటి, మళ్ళీ ఇస్పేటాసా! నా పనైపోయిందింక[!? అన్నాడు అరుస్తూ. భుజంగరావు కుర్చీలోంచి లేచాడు. నవ్వితే నవరత్నాలు 92 సరదాగా కాసేపు

_ నిరాశతో కూడిన స్వరంతో, 'మిరు. నన్ను క్షమించాలండి. ఒక్క నిమిషంపాటు నా స్నేహితుడు, నా చిరకాల మిత్రుడూ అయిన నూకరాజుగారితో మాట్లాడొస్తాను, మిస్టర్‌ నజకరాజూ, మితో కొంచెం వ్యక్తిగతమైన విషయం సెపరేట్‌గా మాట్లాదాలి, కాసేపలా బయటకి వస్తారా?! అని అడిగాడు,

అలా బయటికి దారితీసిన తరవాత ముందుగది కిటికీకి దూరంగా వెళ్ళేంతవరకు యిద్దరి మధ్యా నిశ్శబ్దమే అలముకుంది. కొంతదూరం వెళ్ళాక జమిందార్‌ భుజంగరావు గొంతు సవరించుకున్నాడు.

“నూకరాజూ, మో యింటి 'పేరేవిటి, బాబూ?** అంటూ మొదలెట్టాడు.

“భాగోతులవారండ్వి భాగోతుల నూకరాజు.

“నాయానా, భాగోతుల నూకరాజూ, :ఈ మధ్యనెందుకో నాక్కొంచెం జ్ఞాపకశక్తి క్షీణిస్తోందయ్యా, అయినా భోజనానికి ముందు స్నానాల గదిలో నేనున్నప్పుడు నువ్వేదో మా అమ్మాయి రాజీ ప్రమిలాదేవిని వివాహం చేసుకోవాలనే వుద్దేశ్యంలో వున్నట్టు చెప్పావని మాత్రం గుర్తుకొస్తోందయ్యా! అన్నాడు భుజంగరావు.

'అనే చెప్పానండీ,' జవాబిచ్చాడు నూకరాజు, “మా అమ్మాయితో పెళ్ళికి నా ఆర్ధిక పరిస్థితే కనక మోకు అడ్డంకిగా వుందంటే, మనం కలిసిన తరవాత యిష్పుడు నేను ధనవంతుడినయ్యానని భరోసా యిస్తున్నాండీ మాకు.

“అదేవిటి నూకరాజ్లూ చిత్రంగా మాట్లాడుతున్నావ్‌. నిన్ను గురించి నాకేమీ అభ్యంతరాలు లేవయ్యా -- ఆర్ధిక పరంగా కానీ, మరే యితరమైనవి కానీ” అన్నాడు భుజంగారావు ఆప్యాయంగా 'నూకరాజు బుజం తడుతూ, “నా కూతురుకి మంచివాడు, సహృదయం. వున్నవాడు - అంటే, నీలాంటి వాడే -- భర్తగా రావాలని నేను కోరుకు న్నానయ్యా. నువ్వు చాలా సహృదయస్తుడివోయ్‌.. ఏవేవో... చిన్నా చితకా... అదేలే అత్యల్పమైన విషయాలు ఏవేవో బయటపెట్టి కాబోయే స్వంత మామగారికి దుఃఖం కలిగించేవాడివి నువ్వెప్పటికీ కాదయ్యా. ఇందాక పేకాటలో, పర్షియన్‌ మోనార్భ్‌ - అదే మంగమ్మ శపధం ఆటలో నేను కావాలని కొన్ని చిన్న చిన్న మార్పులు, గమ్మత్తుకోసం అంటే ఆట మరింత హుషారుగా, రంజుగా సాగాలని చేస్తుంటే నువ్వది అద్దంలోంచి గమనించి నీలో నువ్వు వికృతంగా నవ్వుకోడం గమనించానయ్యా,. 'నాకూ అద్దేంలో కనిపించిందిలే, ఆట హుషారుగా సాగేందుకు నేను చేసిన చిన్న చిన్న గమ్మత్తుల్ని బయటపెట్టి 'చేతివాటంతో ఏప్పుడూ పెద్దముకృనే కోస్తానని 'చెబుతూ పిల్లనివ్వబోయే మామగారిని అభాసుపాలు చేయబోవనీ, నా పరువు నలుగుర్లో మంటగలపవనీ..; అసలు క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పాల ంటే, అబ్బాయ్‌ నూకరాజూ, మా అమ్మాయిని వివాహం చేసుకోవోయ్‌, దాంతోపాటు పిల్ల తండ్రిగారి ఆశీస్సులు కూడా అందుకోవోయ్‌.!

అలా అని భుజంగరావు చేతులు ముందుకు చాచాడు... నూకరాజు వాటిని గట్టిగా పట్టుకున్నాడు. సరదాగా కాసేపు. న్‌ నవ్వితే నవరత్నాలు

'నా అంత ఆనందంగా వున్న వ్యక్తి ప్రపంచంలో మరోడు వుండడండీ” అన్నాడు నూకరాజు ముఖంలో "చిరునవ్వు పులుముకుంటూ.

అది చూసి భుజంగరావు బాధతో మూలిగాడు.

'ఆ పని చెయ్యకుండా వుండగలవా, నాయనా?'* అడిగాడు వికృతంగా కనిపిస్తున్న అతని చిరునవ్వునే. చూస్తూ.

'ఏం లేదండీ, నవ్వాను... అంతే/ చెప్పాడతను.

“తెలుసు బాబూ, అదే వద్దంటున్నాను/ అన్నాడు జమాందార్‌ గోరపూడి వీర వేంకట. భుజంగరావు. - .

ఇంక మరి చెప్పేందుకు ఏమి లేదనుకోండి. మూడు నెలల తరవాత అట్టహాసంగా జరిగిన పెళ్ళిలో రాజీ 'ప్రమిలాదేవీ, నూకరాజులు' దంపతులయ్యారు, సమాజంలో "పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళందరూ పెళ్ళికి హాజరయ్యారు. చదివించిన కట్నాలూ, విలువైన కానుకలూ పందిట్లో నిండిపోయున్నాయి, పెళ్ళికూతురు దివ్యంగా మెరిసిపోతోంది. పేరుమోసిన జమిందారు జగపతినాయుడుగ్గారు పెళ్ళి పెద్దగా. వ్యవహరించారు,

వేడుకలన్నీ అయిపోయి 'పెళ్ళికొడుకూ, 'పెళ్ళికూతురూ విడిదికి చేరుకున్న తరవాత రాణీ ప్రమాలాదేవిని చూసిన నూకరాజు తను పడిన బాధలన్నీ ముగింపుకొచ్చాయని మొదటిసారిగా గుర్తించాడు. మంచికి చెడుకి కష్ట సుఖాలు పంచుకోడానికి యీ అందగత్తె యిప్పుడు తన భార్య అయిందన్న (గ్రహింపు పూర్తిగా సోకగానే పరవశిస్తూ ఆనందంలో

వృత్తిలో చాలా విలువైన స్థానాన్ని పాందబోతున్నవాడిలా పెళ్ళి వేడుకలు జరుగుతున్నంత సేపూ గంభీరంగా వుండిపోయాడతను. ఇప్పుడు విడిదిలో భార్యతో వంటరిగా వున్నప్పుడు ఆమెని దగ్గిరకి తీసుకుంటూ బుజం మిద చెయ్యి వెశాడు, అలా చేస్తుండగా వెంటనే ముఖంలోకి మళ్ళీ అదే చిరునవ్వు సోకిందిప్పుడు.

ఎదురుగుండా నుంచున్న యిందాకటి 'పెళ్ళిపెద్ద జమాందారు జగపతినాయుడు గారు దృష్టిలోకొచ్చాడు భార్య బుజం మాదినుంచి. ఒక్కక్షణం కాగానే ఎవరో బుజంతట్టి నట్టు అనిపించింది నూకరాజుకి..

_ “నూకరాజుగార్జూ మిరేమి అనుకోనంటే, మీతో కొంచెం వ్యక్తిగతమైన విషయం సెపరేట్‌గా మాట్లాడాలండీ, యిటొస్తారా?' అని ఆ పెళ్ళిపెద్ద జమిందారు జగపతినాయుడు గారు సన్నటి గొంతుతో రహస్యం: చెబుతున్నట్టు అడిగాడు నూకరాజుని. నవ్వితే సవరత్నాలు 0 సరదాగా వాపు

బికప్పు గారి పన్నాగం

“మన వూరి చర్చికి కొత్త పాస్టరుగారొచ్చారని తెలిసింది. పాస్టరు సంగతి వొచ్చింది కనక అడుగుతున్నా మా పక్కింటాయన ఉంద్రాజు కృషానందంగారబ్బాయి గురించి చెప్పారొకసారి. ఎలా వున్నాడో, యిప్పుడేం చేస్తున్నాడో అని తలుస్తూ వుంటా అప్పుడప్పుడు.

“మోరడిగేది డ్రుమ్‌సాగర్‌ గురించేనా?”

“ఉండ్రాజువారీ ఉత్తేజామ్లం పుచ్చుకు న్న అతనండీ.!

మహం వెలిగిపోతూ భాగోతుల సూతరాజుగారు, 'ఆ, అతన్నే ్రేమ్‌సాగర్‌, ఎప్పుడో కాలక్షేపానికి చెప్పిన చిన్న 'వృత్తాంతాన్ని మిరు యింత బాగా గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందంగా వుందండీ. ఎవరి లోకంలో వాళ్ళు మగ్గే యీ రోజుల్లో ఇలాంటి పిట్ట కథలని సహృదయంతో విని, గుర్తుంచుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా (ప్రేమ్‌సాగర్ని ఎక్కడ వాదిలేశామో జ్ఞాపకం చేసుకోనివ్వండి నన్ను! అన్నాడు. సరదాగా కాసేపు ర్‌ బిషప్పు గారి పన్నాగం

“బిషప్‌ బూష్ని శౌరయ్యగారి దగ్గిర సెకైటరీగా వుంటూ వాది ప్యాలెస్‌లోనే వుండటానికి వెళ్ళాడు.

'అ, అవునవును. సరే మీరు గుర్తు తెచ్చిన సంఘటన జరిగిన ఆరునెలల తరవాత అతన్ని గమనాన్ని చూద్దామిప్పుడు మనం.

చర్చి వ్యవస్థలో వుండే మతాధికారులందరిలా బిషప్పు బూషి శౌారయ్యగారు కష్టించి పనిచెయ్యడానికి వెనుకాడరు, చేసే పనిని 'ఢ్రుమిస్తారు కూడా (సూతరాజుగారు మహా వుత్సాహంతో, వుల్లాసంగా చెప్పడం మొదలెట్టారు). అంచేత దినచర్యగా వొనరెంచే రోజువారీ కార్యక్రమాల్ని చిరునవ్వుతో నిర్వహించే వ్యక్తి ఆయన. ముఖంలో 'చిరునవ్వ చిందిస్తూ హుషారుగా సాగే దేవుడి కీర్తనని పాడుకుంటూ టపాలో వచ్చిన వుత్తరాలు, అభ్యర్థనలు చదివేసి ఏరోజుకారోజు తగిన చర్యలు తీసుకోడం, వుత్తర్వులు జారీ చెయ్యడం పరిపాటి. ఈ కథ జరిగిన రోజు మాత్రం ఆయన దేన్నిగురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు, అన్యమనస్కంగా వున్నట్టు కనిపించాడు. ఆఫీసు గది దగ్గిరకొచ్చి లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహిస్తూ తలుపు దగ్గిరే తచ్చాడాడు. కాసేపటికి నిభాయించుకుని తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు.

'అబ్బాయ్‌. (ప్రేమ్‌సాగర్మ్‌ గుడ్‌ మార్చింగ్‌, అన్నాడాయన. ఆయన పడుతున్న ఆందోళన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది,

టపాలో వచ్చిన కవర్లు చింపి వుత్తరాల్ని బొత్తిగా 'పేరుస్తున్న శ్రేమ్‌సాగర్‌ తలెత్తి, (గుడ్‌ మార్నింగ్‌ బిషప్‌. నడుం నెప్పి ఏలావుందీ పూట, కాస్త తగ్గిందా"? అంటూ నవ్వుతూ పలకరించాడు.

“కాస్త తగ్గుముఖం పట్టిందనే అనిపిస్తోంది, థాంక్యూ, [ప్రేమ్‌సాగర్‌. ఒకవిధంగా వుపశమించిందనే చెప్పొచ్చు. వాతావరణంలో మార్పునా మంచికే జరిగిందనుకుంటా, చూడవయ్యా, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి; పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పొవుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పరమగీతము 2; 1112.

(బాగా జరిగిందిలెండి. ఇవాళొచ్చిన వుత్తరాల్లో అంత అర్జంటువేమి కనబడటం లేదు. పటమటలంక. పాస్టరుగారు ధూపద్రవ్యాలు వాడొచ్చా అని అడుగుతున్నారు, మారేమంటారు?”

“వాడకూడదని తెలియపరుచు ఆయనకి.

“సరేనండి.

ఇబ్బంది పడుతున్నట్టు చూపుడువేలి గోటితో గడ్డం కింద గీరుకున్నాడు బిషప్పు. అ(ప్రియమైన వార్త వినిపించేందుకు. ధైర్యం కూడగట్టుకుంటున్నవాడిలా కనిపించాడు.

“డేమ్‌సాగర్‌్స,' అంటూ పిలిచాడు,

“వవిటండీ?” బిషప్పు గారి పన్నాగం. రిగ్ర సరదాగా కాసేపు

'నువ్విష్పుడు వాడిన “పాస్టరు” అన్న పదం వుంది చూశావూ, నిన్నటిరోజు మనమిద్దరం మాట్లాడుకున్న విషయాన్ని మరిచిపోకుండా గుర్తు చేసింది. అదేనయ్యా, వల్లూరులో పాస్టరు పోస్టు ఖాళీ అయిన విషయం.

“అవునా? నాకు దొరుకుతుందంటారా మరి? ఆత్రంగా అడిగాడు గ్రుమ్‌సాగర్‌.

బీషప్పు పడుతున్న బాధ ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. విచారిస్తూ తల అడ్డంగా వూపేడాయన లేదనట్టు.

“బాబూ ప్రేమ్‌సాగర్‌, నిన్ను నేను స్వంత కొడుకులా అభిమానిస్తున్న విషయం నీకు కెలుసు, నాకే గనక స్వేచ్చ వుంటే క్షణం కూడా ఆలోచించకుండా నీకది యిద్దునయ్యా, అనుకోకుండా ఒక చిన్న అవాంతరం .వచ్చిపడిందిప్పుడు. దాన్ని తన బంధువుల అబ్బాయికే యిమ్మని నా భార్య ఒకటే మంకు పట్టు పట్టుతోంది, గొర్రె అరుపులా గొంతు వుండటమె: కాదు, తెల్ల అంగీ ఎప్పుడు. ధరించాలో. రంగుల సిల్కు అంగీ ఎప్పుడు ధరించాలో తెలీని మూర్భుడు వాడు, ఏం. చెయ్యగలం మనం?! అన్నాడు వెటకారం స్ఫురించే స్వరంతో బిషప్పు,

తనకా పాస్టరు. పదవి దక్కటం. లేదన్న నిరాశతో '(ప్రేమ్‌సాగర్‌ మనసు కాసేపు చివుక్కుమన్నాా ఉండ్రాజువారి కుటుంబానికి చెందటం వల్ల ఆ నిరాశ ఎక్కువసేపు నిలబడలేదు. పైగా అతను మంచి స్పోర్ట్‌మన్‌ కూడా.

“దానిగురించి మారు అంత బాధ పడాల్సిన పనిలేదు, బిషప్పుగారూ, అర్ధం. చేసుకోగలను, నేను ఆశ పెట్టుకోలేదనను కానీ, రేపో మాపో మరో అవకాశం

రాకపోతుందా చెప్పండి" అంటూ ఆదరణతో అనునయించాడు బిషప్పుని.

తలుపులు మూసున్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలించి బిషప్పు, “నా పరిస్థితెలా వుందో గమనించు - గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె. మిద్దెమోద నొక మూలను నివసించుట మేలు, సామెతలు 21 : 9 అన్నాడు.

(ముసురు దినమున ఎదతెగక కారు నీళ్ళును గయ్యాళియెన భార్యయు సమానము. సామెతలు 27 ; 15 అంటూ ఆయనతో ఏకీభవించాడు ప్రేమ్‌సాగర్‌.

“సరిగ్గా చెప్పావయ్యా, నువ్వు నన్నెంత బాగా అర్ధం చేసుకున్నావు, (ప్రేమ్‌సాగర్‌.

టపాలోంచి ఒక వుత్ర్తరాన్ని చూపిస్తూ, 'దీని సంగతి తేల్చాలి మిరు. 'పైడిపోతల యేసురత్నంగారినించి వచ్చింది? అన్నాడు.

“అవునా? చిన్నప్పుడు స్కూల్లో నా క్లాస్‌మేట్‌ అతను.. ఇప్పుడు రావులపాలెం ఎడ్వర్డ్‌ మమోరీయల్‌ హైస్కూల్లో హెడ్‌ మాస్టరుగా వుంటున్నాడు, రెవరెండు. ఆ స్ఫూల్లోనే మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఏం రాశాడేమిటి?”

“పెదిరెడ్డి శామ్యూల్‌ ప్రభాకర్రెడ్డిగారి శిలావిగ్రహాన్ని స్కూలు ఆవరణలో నెలకొల్పు తున్నారట, దాన్ని తమరి చేతుల మిదుగా ఆవిష్టరింప చెయ్యాలని వుందట, తీరుబడి చూసుకుని నాలుగైదు రోజులు వారితో గడపగలరేమోనని అభ్యర్ధిస్తూ రాశారాయన.! సరదాగా కాసేపు 07 బిషప్పు గారి పన్నాగం

'పెదిరెడ్డి శామ్యూల్‌ ప్రభాకర్రెడ్డి కూడా మాతోబాటే స్కూల్లో వుండేవాడయ్యా లావుగా వుండేవాడు, అంచేత పందికొక్కు అని మారుపేరుతో పిలుస్తుందే వాళ్ళం.”

“జాబు 'వెనకాల తాజా కలంలో తన దగ్గర పాత వైను బాటి ల్సు స్టాకు చాలా 'వుందని 'రాశారు.]*

బిషప్పు 'పెదిమలు ముడిపడ్డాయి..

“ఆ పిల్లికళ్ళవాడు, అంటే నా వుద్దేశ్యం - రెవరెండ్‌ 'పైడిపోతల యేసురత్నం తలపోసిన విధంగా 'నేను భౌతిక సుఖాలకి లోబడే వాడిని కాను. కానీ చిన్నప్పుడు చదువుకున్న నా స్కూలు ఆహ్వానించిందంటే వెళ్ళక తప్పదు మరి, వెడదాం మనం.”

“మనం?”

“అవున్ము నువ్వ కూడా నావెంట రావాలి. రావులపాలెం ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ స్కూలు నీకు మహబాగా నచ్చుతుంది. ఎప్పుడో కాటన్‌దొర కాలం కన్నాముందునుంచే

'ఆ స్కూలు సంగతి నాకు తెలుసండీ, మా ఆఖరి తమ్ముడు అక్కడె చదువుతున్నాడు.”

'నిజంగానా?' అని పాతస్మృతులు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు బిషప్పు, “దాదాపు యిరవయ్యేళ్ళకు 'పైగా అయిందోయ్‌ నేనా స్ఫూలు "గేటు లోపలికి అడుగుపెట్లి. సుపరిచితమైన ఆ ప్రదేశాలు, ప్రాంతాలు మళ్ళీ ఒకసారి చూస్తే నా వొళ్ళు పులక రిస్తుందయ్యా. (ప్రేమ్‌సాగర్‌, నేనొకటి చెబుతా విను - మనం ఎంత వున్నత స్థితిలోకి ఎదిగినా, జీవితం మనకెన్నో విలువైన కానుకలు అందించినా చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూలు జ్ఞాపకాలు మాత్రం ఏనాటికీ మరిచి పోకూడదయ్యా,. తడబడుతూ: అడుగులు వేసే సమయంలో కన్నతల్లిలా మనల్ని... *

“సందేహం లేదందులో,” అన్నాడు 'ప్రేమ్‌సాగర్‌,

“అదికాక వయసు మిరుతున్నకొద్దీ ఆ పాతరోజుల్నీ ఎలాంటి బాధ్యతలూ లేని స్కూలు జీవితాన్నీ మళ్ళీ సరిగా మననం చేసుకోలేము. ఆ రోజుల్లో జీవితం క్లిష్టంగా వుండేదికాదు. ఏలాంటి వాత్తిళ్ళు లేని జీవితమయ్యా. తోటి స్నేహితుల్ని నమ్మినవారిని నిరాశపరిచే సందర్భం అసలు రాలేదంటే నమ్ము.

బిషప్పుని ఓదార్చుతూ, 'నాకా పాస్టరుద్యోగం దక్కలేదని మిరు యింకా బాధపడటం సవ్యం కాదు. నన్ను చూడండి ఎలా వున్నానో, హాయిగా లేనూ?! అన్నాడు ప్రేమ్‌సాగర్‌,

న్‌ట్టూర్పు విడిచాడు బిషప్పు,

“నాకు కూడా. నీలా నిభాయించుకునే శక్తి వుంటే బావుందనిపిస్తుందయ్యా, అయినా ఎటలా వుండగలుగుతున్నావ్‌ నువ్వలా?"

'నేనెప్పుడూ సంతోషంగా. వుండటానికి ప్రయత్నిస్తాను. రోజూ ఉండ్రాజువారి ఉత్తేజామ్లాన్ని పుచ్చుకుంటాను.! బిషప్పు గారి పన్నాగం ర్ట సరదాగా కాసేపు

'మా బాబాయి ఉండ్రాజు శాంతికుమార్‌గారు కనిపెట్టి తయారుచేసిన టానిక్కు మాయాజాలంలా పనిచేస్తుందది.”

'పేమ్‌సాగర్‌ జీవితం విషాదంగా కనబడుతోంది. నిన్ను అడిగి రేపో మాపో నేనూ కాస్త పుచ్చుకోవాలనుకుంటున్నా! సహనం కోల్పోతున్నట్టూ, సగానికి సగం తనలోనే మాట్లాడుకుంటున్నట్టు మళ్ళీ యిలా అన్నాడు, బిషప్పు; “అసలా పందికొక్కుకి విగ్రహం ఎందుకు చేయిస్తున్నారో అర్ధం చేసుకోలేకపోతున్నా. బొత్తిగా నికృష్టపు మనిషి వాడు - పిల్లల చొక్కాల మిద యింకు చల్లుతుండేవాడు.! ఆలోచనా సరళిని మార్చుకుంటూ 'అదంతా యిప్పుడు అప్రస్తుతమనుకో, పెదిరెడ్డి శామ్యూల్‌ ప్రభాకర్రెడ్డి ప్రజాసేవకి ముగ్దులై శిలావిగ్రహానికి అర్హుడయ్యాడని స్కూలు కమిటీ మెంబర్లు తలిస్తే మనం ఆక్షేపించడం తగదు. 'రెవరెండు పైడిపోతల యేసురత్నంగారికి విగ్రహావిష్కరణకి నేను సంతోషంతో అంగీకరిస్తున్నానని వెంటనే జాబు రాసి తెలియపరుచు; అని చెప్పాడాయన,

రావులపాలెం ఎద్వర్ట్‌ మెమోరియల్‌ స్కూల్లో అడుగుబెట్టి దాదాపు యిరవయ్యేళ్ళకి పైగా అయిందని (ప్రేమ్‌సాగర్తో అన్నాడు. కానీ, ఆ స్కూలు బిల్లింగుల్లో, మైదానంలో, అక్కడ పనిచేస్తున్నవాళ్ళలో ఏమాత్రం మార్పు లేకపోవడం చూసి బిషప్పు ఆశ్చర్యపోయాడు. నలభైమూడు సంవత్సరాల కిందట కొత్తగా తనా స్కూల్లో చేరడానికొచ్చినప్పుడు ఏలా వుండేదో యిప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే వుండటం గమనించాడు బిషప్పు. పదకొండుగంటలకి. ప్యాస్‌ పీరియడ్లో తను చిరుతిళ్ళు కొనుక్కున్న చిన్న బడ్డీ దుకాణం 'స్కూలుకదురుగా యింకా అలానే వుంది. బాల్‌ బ్యాట్మింటన్‌ కోర్టు, లైబ్రరీ, ఆఫీసు రూము, స్టాఫ్‌ రూము మొదలైనవాటిల్లో పెద్దగా మార్పులేమి కనబడలేదతనికి. బిషప్పుగారంటే రంగు రంగుల సిల్కు దుప్పటీ చుట్టూ కప్పుకుని టోపీలో బూటులేసులు కట్టుకునే మనిషని అనుకునేవాడు ఆ రోజుల్లో, తనకు కనిపించిన ఒకే ఒక మార్పల్లా లైబ్రరీకి ఎదురుగా వున్న చిన్నపాటి గార్జెన్లో యిప్పుడొక రాతి పీఠం, దానిపైన ప్టాస్టక్‌ గుడ్డ ముసుగులో 'పెదిరెడ్డి శామ్యూల్‌రెడ్డి రూపులేని శిలావిగ్రహం; తను యిక్కడికొచ్చింది ఆ విగ్రహాన్ని ఆవిష్మరించడానికే. అక్కడ గడిపిన కొద్దీ బిషప్పు అర్ధం లేని మానసిక వుద్వేగానికి లోనవుతు న్నాడెందుకో. అలాంటి సమయంలో సర్వసాధారణంగా జరిగే మానసిక వుద్వేగానికే తను లోనవుతున్నానని ముందు అనిపించింది. అదే నిజమైతే మరి ఆ వుద్వేగం చాలా ఆనందదాయకంగా వుండాలిగా? అయితే బిషష్తుకు మాత్రం ఆ అనుభూతులు రుచించలేదు. ఒకసారి మలుపు తిరిగి ముందుకెడుతుంటే స్కూలు ఫుట్‌ బాల్‌ జట్టు కప్టైను ఎదురొచ్చాడు, అతన్ని చూడగానే భయంతో కాళ్ళు స్వాధీనం తప్పాయి. బిషప్పును గమనించి ఆ కెప్టెను గౌరవంగా టోపీ కొంచెం పైకెత్తి పట్టుకుని పక్కకెళ్ళగానే మళ్ళీ మామూలు మనిషి అయినాడు కానీ ఆ కాస్త సమయంలో తను భయపడటం ఎందుకు 'సరదాగా కాసేపు 09 బిషప్పు గారి. పన్నాగం

జరిగిందో గుర్తించగలిగాడు. నలభయ్యేళ్ళ కిందట ఫుట్‌ బాల్‌ ప్రాక్టీసు ఎగ్గొట్టి తిరుగుతు న్నప్పుడు డ్రిల్లు మాస్టారు ఎదురుపడితే అలాగే భయపడేవాడినని గుర్తుకు తెచ్చుకున్నాడు. బిషప్పు చాలా కలవరపడసాగాడు. ఇంద్రజాలశక్తి ఏదో గతించిన కాలాన్నంతా మంత్రదండంతో చెరిపేసి తనని మళ్ళీ పొట్టిలాగూ వేసుకునొచ్చిన చిన్నపిల్లాడిలా చేసినట్టు అనిపించసాగింది. రోజురోజుకీ ఆ భావన పెరుగుతోంది కానీ తరగడం లేదు. రెవరెండు 'పేడిపోతల యేసురత్నంతో సాహచర్యం దాన్ని మరింత పెంపుచేసింది. స్కూల్లో వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే తిరిగేవాళ్ళు, ఆ మనిషిలో అప్పటికీ యిప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ వూరొచ్చిన మర్నాడు హెడ్‌ మాస్టరుగారి గదిలోకి అడుగుబెట్టినప్పుడు పిల్లికళ్ళ యేసురత్నం హెడ్‌ మాస్టరుగారి కుర్చీలో కూచునుండటం చూసి విస్తుపోయాడు బిషప్పు. ఏవిటిది, ఏమైంది వీడికి, తన కుర్చీలో కూచోడం చూస్తే ముసలాయనకి కోపమొచ్చి బెత్తంతో కొడతాడుగదా! ఆమాత్రం [గ్రహింపు లేదా, వీడికి? అని అనిపించింది. మొతానికి విగ్రహాన్ని ఆవిష్కరించే రోజు వచ్చేసరికి బిషప్పు మనసుకి కాస్త స్థిమితం చిక్కింది. విగ్రహావిష్కరణ, ఆ తరవాత జరిగిన సభ బిషప్పుకి విసుగు పుట్టించాయి, చిరాకేసింది. స్కూలు రోజుల్లో 'పెదిరెడ్డి శామ్యూల్‌ ప్రభాకర్రెడ్డంటే చాలా అయిష్టంగా వుండేది బిషప్పుకి,. "అలాంటి వ్యక్తిని శ్లాఘిస్తూ వుపన్యాసం యివ్వాల్సి వ చ్చినందుకు మరింత అయిష్టత ఏర్పడిందిప్పుడు, పైగా స్టేజి మొద కూచోగానే. ఎందుకో విపరీతమైన సభాకంపం పుట్టుకొచ్చిందా యనకి. అంతమంది ముందు తను అలా నిలబడి ఏకధాటిగా మాట్లాడు తుంటే తనకే ఏవిటోగా అనిపించింది. ముందు కూచున్న ్రేక్షకుల్లోంచి క్లాసు లీడరు లేచి చాలించవోయ్‌ సొద, మహా చెప్పాచ్చావ్‌ యింక ఆపెయ్‌ అనగలడనే సంశయంతో ప్రాణం కొట్టుకుంది. అయితే అలాంటి వుపద్రవం ఏదీ జరగలేదు. పోతే, వుపన్యాసం చాలా విజయ: వంతంగా ముగిసింది కూడా, విగ్రహావిష్కరణ, సభ ముగియగానే స్కూలు బోర్జుకి ఛైర్మన్‌ అయిన మేజర్‌ ఆరోగ్యపాదం బిషప్పుగారి చేతులు పట్టుకుని వదలకుండా, “బిషప్పుగారూ, తమరిచ్చిన గొప్ప వుపన్యాసం ముందు నాది దిగదుడుపండ్కీ దిగదుడుపు, దిగదుడుపు. తమరు మమ్మల్ని అదరగొొట్టేశారు, అదరగొట్టేశారు,” అన్నాడు, కాళ్ళు మార్చి మార్చి నుంచుంట్టూ “చాలా చాలా ధన్యవాదాలండీ అన్నాడు బిషప్పు సిగ్గపడుత్నూ చాలాసేపు సాగిన ఆ వుత్సవం మూలాన బిషప్పుకి పొద్దు గడిచేకొద్ది బడలిక ఎక్కువైంది. ఆరాత్రి భోజనాలు ముగించి హెడ్‌ మాస్టరుగారి ముందుగదిలో కూర్చున్నప్పుడు విపరీతమైన తలనొప్పి వచ్చింది. రెవరెండు పైడిపోతల యెసురత్నం కూడా అలిసి పోయినట్టు కనిపించాడు. బిషప్పు గారి పన్నాగం 100 సరదాగా కాసేపు

“ఇలాంటి సభల మూలంగా చాలా అలసట వస్తుందోయ్‌, బిషప్పూ* అన్నాడాయన ఆవలింతల్ని ఆపుకుంటూ,

“అవును కద్మా హెడ్‌ మాస్టరూ.”

“పాతిక సంవత్సరాల పాత వైను తాగినా బడలిక తీరలేదోయ్‌.

“అవును, ఎంతమాత్రం ప్రభావం చూపలేదుగదయ్యా;' అని అంతలోకీ ఏదో మంచి వుపాయం తట్టినట్టు, “కాస్తంత ఉండ్రాజువారి ఉత్తేజామ్లాన్ని పుచ్చుకుంటే యీ బడలిక తగ్గవచ్చునోయ్‌. అదేదో ఒకరకమైన టానిక్కట, మూ సెక్రెటరీకి రోజూ దాన్ని పుచ్చుకునే అలవాటుంది. అతనికైతే అది చాలా మంచి గుణం యిస్తున్నట్టు కనబడింది. హుషారుగా వుత్తేజంగా వుంచుతుందతన్ని. అంత చురుకైనవాడ్ని నేనెప్పుడూ. చూడ లేదయ్యా. మా నౌకర్ష్ని అతని దగ్గిరకి పంపించి ఒక బాటిలు తెప్పిస్తే ఎలా వుంటుం దంటావ్‌? మనం అడిగితే కాదనడని నా నమ్మకం.”

“ఓ, అలాగే తప్పకుండా.!

(ప్రేమ్‌సాగర్‌ గదికి వెళ్ళొచ్చిన నౌకరు ముదురురంగులో చిక్కగా సగం బాటిలుకి పైగా వున్న ద్రవాన్ని తెచ్చాడు. బిషప్పు దాన్ని నిశితంగ్లా: పరిశీలిస్తూ చూశాడు,

“డోసు ఏంత పుచ్చుకోవాలో ధీనిమాదెక్కడా రాసిలీదోయ్‌.. అయినా రోజంతా కష్టపడి విశ్రాంతి తీసుకుంటున్న మీ నౌకర్షి నిద్ర లేపి పంపిస్తూ అడిగించటం భావ్యం కాదనిపిస్తోంది. ఒక పని చేద్దాం, మనమే ఏదో యింతని నిర్ణయించుకుందాం, సరేనా?!

'ఓ, అలాగే. అసహ్యంగా వుంటుందా రుచి?)

బిషప్పు సీసా బిరడా తీసి దాన్ని నాలికతో నాకి చూశాడు.

'లేదు, అసహ్యంగా వుందనలేం. దీని రుచి చాలా ప్రత్యేకంగా, విశిష్టంగా కొట్టొచ్చినట్టు వుంధయ్యా, అయినా అభ్యంతరకరంగా లేదా రుచి.!

“మరైతే నిండా చెరో గ్లాసూ పుచ్చుకుందామయ్యా!!

రెండు వైను గ్లాసుల్నిండా ఆ ద్రవాన్ని బిషప్పు నింపిన తరవాత యిద్దరూ గంభీరంగా కూచుని గుటకలేయడం మొదలెట్టారు.

“బాగానే వుందనిపిస్తోందయ్యా,! అన్నాడు బిషప్పు,

“బాగానే కాదు, విశిష్టంగా వుందోయ్‌.!

'వాళ్ళంతా వుజ్వలంగా వెలిగిపోతుట్టు అనిపిస్తోంది.”

“కొట్టొచ్చినట్టు కనబడే వెలుగు.”

'మరికొంచెం పుచ్చుకుంటావ్నా హెడ్డూ?!

వవ ద్దోయ్‌ ' థాం క్యూ, శె

'వూర్మ ఫరవాలేదయ్యా,!

“మరీ బలవంతపెడుతున్నావు కనక, యిదిగో రెండంటే రెండు చుక్కలు చాలు, సరదాగా కాసేపు 101 బిషప్పు గారి పన్నాగం

'మొత్తానికిది బానే వుందయ్యా; అన్నాడు బిషప్పు.

“విశిష్టంగా వుంది, అన్నాడు హెడ్‌ మాస్టరు.

ఉండ్రాజువారి ఉత్తేజామ్లాన్ని ప్రేమ్‌సాగర్‌ వాడిన వుదంతం ముందోసారి విన్నారు కనక, ఉండ్రాజు కృపానందంగారి తమ్ముడు శాంతికుమార్‌ అడవుల్లో పులులూ, సింహాలూ ఎదురైతే ఏనుగులు భయపడి పారిపోకుండా వుండేందుకని ప్రాధమికంగా దాన్ని తయారు చేశాడనీ, దాణాలోనో కుడితిలోనో రోజుకొక చెంచాడు ఎదిగిన ఏనుగులకి మామూలు డోసనీ మోకు గుర్తుండే 'వుంటుంది. అంచేత ఆరోజు రాత్రి 'హెద్‌ మాస్టరూ, బిషప్పూ చెరో రెండు వైను గ్లాసుల్నిండా: పుచ్చుకునేసరికి వాళ్ళకి జీవితం మిద అవగాహనే పూర్తిగా మారసాగింది.

వాంట్లో అలసట మాయమైంది, దాంతోపాటు అంతవరకూ మానసికంగా

కుంగిపోతున్న భావన కూడా ఎగిరి పోయింది,తెలియని అనుభూతిలో నిండివోయి ఇద్దర్లోనూ ఆనందోత్సాహలు కమ్ముకున్నాయి. అందులో, అక్కడికి వచ్చిన దగ్గిర్నుంచీ మళ్ళీ బాల్యావస్థలోకి అడుగుపెట్టినట్టు భావిస్తున్న బిషప్పుకైతే మరీ సంతోషంగా వుందిప్పుడు. పదిహేనవ యేట అడుగుపెట్టిన కుర్రకారు. పిల్లాడిలా మారినట్టు అనిపించింది.

(మో: నౌకరు పడుకునేది ఎక్కడోయ్‌, పిల్లికళ్ళూ?” అంటూ అడిగాడు కాసేపు ఆలోచించి,

'నాకంత బాగా 'తెలీదోయ్‌, ఏందుకు అయినా?! “ఏం. లేదు మనిద్దరం వెళ్ళి తలుపు బయటినించి గొళ్ళెం పెట్టాస్తే బావుండదా అన్న ఆలోచనొచ్చింది,! . హేడ్‌ మాస్టరు కళ్ళు ఆనందంతో వెలిగాయి. 'అవునోయ్య్మ్‌. భలేగా: వుండదూ![' అన్నాడు, వాళ్ళిద్దరూ కాసేపు పరధ్యానంగా ఏదో ఆలోచొస్తుంటే, వున్నట్టుండి హెడ్‌ మాస్టరు ఏమైంది, ఏందుకలా పళ్ళు యికిలిస్తున్నావ్‌? అంటూ బిషప్పు అడిగాడు.

“ఏంలేదోయ్‌, మధ్యాహ్నం మోటింగులో నువ్వా పందికొక్కు 'పెదిరెడ్డి శామ్యూల్‌ (ప్రభాకర్రెడ్డిగాడిని ఒకటే పొగడ్తల్లో ముంచేస్తుంటే వొట్టి అడ్డగాడిదలా అగుపించావ్‌ నాకు,

ఎంతో ఆనందో[దేకంలో వున్నా బిషప్పు నుదురు చిట్లించాడు, కనుబొమ్మలు ముడిపడ్డాయి.

'వాడొట్టి వెధవాయని చిన్నప్పుడే మనం: గ్రహించినా ఆత్మను చంపుకుని వాడి గురించి గొప్పగా, ఆమాటకొస్తే మహా గొప్పవాడని శ్లాఘించాల్సి వచ్చిందయ్యా, ఇంతకీ యిలా విగ్రహాలు పెట్టేదాకా రావటానికి ఆ పందికొక్కు జీవితంలో ఏం వెలగబెట్టాడట?”

బిషప్పు గారి పన్నాగం 102 సరదాగా. కాసేపు

'ఎక్సయిజు కంట్రాక్టరనుకుంటా, రెండు చేతులా సంపాదించి రాజకీయాల్లో చేరాడట,) జవాబిచ్చాడు హెడ్‌ .మాస్టరు మధ్యమంగా.

“అలాంటిదే ఏదో చేస్తాడనుకున్నాలే. అందర్నీ నెట్టుకుని ముందుకుపోయే టప! ఆ పందికొక్కుని తలుచుకుంటేనే మహా అసహ్యమేస్తుంది నాకు,” అంటూ బిషప్పు సన్నగా గొణుక్కున్నాడు,

[నాక్తూ అంతేనోయ్‌, అంగీకరించాడు హెద్‌ మాస్టరు, “వాడు నవ్వితే డబ్బాలోంచి నూనె వాంపుతున్న చప్పుడొచ్చెద, వెధవ నవ్వూ వాడూను.

“నీక్సు గుర్తుండే వుంటుంది, వట్టి తిండిపోతు. అత్యాశ. వాళ్ళింట్లో వుందే ఒకతను చెవ్పాడయ్యా - ఓసారి కడుపు నిండా అన్నం మెక్కిన తరవాత నలభై ముంజెకాయలు:

“ఇదిగో మనిద్దరి మధ్యే కనక చెపుతున్నా -- స్కూలుకెదురుగా వున్న దుకాణం నించి చిరుతిళ్ళు కాజేసేవాడని నాకెప్పుడూ అనుమానంగా. వుండేది. అయితే తగిన సాక్ష్యాధారాలు లేకుండా అలాంటి నిందలు వెయ్యడం నాకు యిష్టం లేదు, కానీ ఎవరెన్ని యిబ్బందులు పడుతున్నా వీడు మాత్రం సర్వకాల సర్వావస్థల్లోనూ ఇంటర్వెల్లో ఏదో ఒకటి తెచ్చుకుని తింటుందేవాడు, నిజంగా పందికొక్కులా,! అన్నాడు హెడ్‌ మాస్టరు.

“పిల్లికళ్ళూ, ఎవరికీ తెలీని విషయమొకటి నీ చెవిని వేస్తున్నా విను. స్కూలు ఫైనలు చదివేటప్పుడు ఫుట్‌బాల్‌ ఫైనల్‌ మ్యాచిలో కావాలని నా మోకాలు మాద తన్నాడు.

'హోరినీ, నిజంగానా?

గ్ర వునయ్యా."

“ఏం మనిషయ్యా! ॥

“ఆటలో మోకాలి మోద చిన్నవో పెద్దవో దెబ్బలు తగలటం మమూలేగ్మా మనకేమి అనిపించదు కూడా అప్పుడు. ఒకసారి మనం కొడతాం, మరోసారి ఎదుటివాడు కొడతాడు, అలాంటివి లెక్కచెయ్యం. అయితే యీ 'మోటువాడు కేవలం నన్ను గాయపరచాలనే దురుద్దేశ్యంతో మిద పడి మోకాలు తొక్కితే - ఏం చెయ్యాలయ్యా, ఎలా సహించాలి చెప్పు” అన్నాడు బిషప్పు బాధపడుతూ.

“అలాంటి వాడికి స్కూలు కమిటీ 'వెధవలు శిలావిగ్రహాన్ని పెట్టించారు, పైగా కొంచెం ముందుకు వంగి రహస్యంగా అన్నాడు బిషప్పు,

'పిల్లికళ్ళూ!?

“ఏవిటయ్యా?”

'నీకోటి తెలుసా?”

'లేదు, ఏవిటి?!

'సరదాగ్గా కాసేపు 103 బిషప్ను గారి పన్నాగం

'అసలేం చేద్దామంటే యిక్కడంతా' సర్టుమణిగాక పన్నెండు గంటల. ప్రాంతాల్లో మనిద్దరం వెళ్ళి ఆ విగ్రహానికి నీలంరంగు పెయింటు పులిమొద్దాం, సరేనా?" “ఎరుపురంగు పెయింటెందుకు వాడకూడదూ?” 'నీకదే నచ్చుతుందంటే ఎరుపురంగే మరి.” “ఎరుపు మంచి కలరు, బావుంటుంది “అవును, చాలా బావుంటుంది.! “అదీ కాక ఆ పెయింటు డబ్బాలు ఎక్కడున్నాయో కూడా నాకు తెలుసుం “డబ్బాలకి డబ్బాలు. “పిల్లికళ్ళూ, నీ గోడల మిద శాంతి, న్‌ మహళ్ళ లోగిట ఐశ్వర్యమూ వుందుగాక.. సామెతలు 71 : 6 అన్నాడు బిషప్పు, సరిగ్గా రెండు గంటల తరవాత ముందుగది తలుపు చప్పుడు కాకుండా మూసి బయటికొచ్చిన బిషప్పుకి -- న్యాయమార్గంలో నడిచే వారికి దేవుడి కృప వుంటుందనేది సార్ధకం కావటమే కాదు తను నిర్వర్తించబోయే. కార్యక్రమానికి. వలసిన దానికన్నా మరింతగా విధి సహకరిస్తోందని (గ్రహించాడు. శిలావిగ్రహానికి రంగు పులిమెందుకు పరిస్థితులన్నీ వుపయుక్తంగా సానుకూలంగా వున్నాయి. సాయంత్రం నించీ కురుస్తున్న వాన పూర్తిగా ఆగిపోయింది; వెన్నెలతో చిక్కులు లేకుండా చంద్రుడు సౌకర్యంగా దట్టమైన మబ్బుల చాటున దాక్కున్నాడు, మనుషుల అలికిడి లేకపోవటంతో ఎలాంటి విపత్తుకు తావులేదు, అర్ధరాత్రి దాటిన తరవాత స్కూలు 1గ్రౌండులో పిట్టపిరుగు కనిపించదు. పందికొక్కు శిలావిగ్రహం సహారా ఎడారి మధ్యలో వుందన్నట్లు అనుకోవచ్చు. విగ్రహాన్ని సమీపించి దానికి కట్టిన రాతిపీఠం ఎక్కారు యిద్దరూ, వంతుల ప్రకారం బ్రష్న పట్టుకుని పెయింటులో ముంచుతూ - అది వాళ్ళ కనీసధర్మమని మనసు చెబుతుంటే - కర్తవ్యం ముగించి దిగొచ్చారు. అలిసి పోయారు యిద్దరూ, కంకరరోద్దు మాద అడుగుల చప్పుడు కాకుండా సుతిమెత్తగా నడుస్తూ యింటికి చేరి మళ్ళీ తలుపు ముందు నుంచునేంతవరకూ నిర్విఘ్నంగా సాగిపోయిన కార్యక్రమంలో చిన్న అపశ్రుతి దొర్లినట్టు గ్రహించలేదు వాళ్ళు. తలుపు ముందు సైమెట్టు దగ్గిరే నుంచుండిపోయిన. హెడ్‌ మాస్టర్ని “ఎందుకు అగావ్‌?” రహస్యం చెబుతున్నట్టు అడిగాడు బిషప్పు. “అర సెకెండు ఆగవోయ్‌, వేరే జేబులో వుండొచ్చు, చెప్పాడు హెడ్‌ మాస్టరు తగ్గు గొంతుతో, “ఏవిటది? “తాళంచెవి.” బిషప్పు గారి.పన్నాగం 104.

“అలానే అనిపిసోంది చూస్తుంటే.

“ఇదిగో పిల్లికళ్ళూ, విగ్రహాలకి రంగు,పులిమేందుకు నీతో రావడం యిదే ఆఖరు సారి, ఛస్తే రాను యికమిదట, అన్నాడు బిషప్పు తీవ్రంగా మందిలిస్తూ,

“జేబులోంచి జారి పడిపోయినట్టుంది ఎక్కడో

“ఏం చేద్దాం మరిప్పుడు?”

“వంటింటి వైపున కిటికీ ఏదన్నా తెరిచుందేమో చూద్దాం, పద.”

కానీ వంటింటి వైపున కిటికీలన్నీ మూసే వున్నాయి. 'పడుకోబోయేముందు జాగ్రత్తగా, విధాయకంగా, విధేయంగా నౌకరు కిటికీ తలుపులన్నీ మూసి గడియలు బిగించి పడుకున్నాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పోయింది.

పెద్దయినాక బయటి ప్రపంచాన్ని ఎదుర్మునేటప్పుడు జీవితంలో కలిగే సమస్యలకి చిన్నతనంలో స్కూల్లో నేర్చుకున్న పాఠాలు అక్కరకొస్తాయన్నది చాలా మంచి సూక్తి, షాగమంచులాంటి వాత స్మృతుల్లోకి వెళ్ళి బిషప్పు వున్నట్టుండి జ్ఞాపకం తెచ్చుకున్నాడు.

'పిల్లికళ్ళూ!'

“వెనకాలొక నీళ్ళగొట్టం వుండాలి నా ప్రకారం - నువ్వు కనక మార్పులూ చేర్పులూ చెయ్యకుండా వుంటే అది సరిగ్గా మేడమిద వరండా వైపున్న కిటి కీల పక్కగా వెడుతుంది, చూద్దాం పద.

" బిషప్పుగారి జ్ఞాపకశక్తి వమ్ము కాలేదు. గోడకి పట్టిన నాచు మొక్కల 'మధ్యలో 'పైనించి కిందికి స్తాగిన నీళ్ళగొట్టం కనిపించింది. చిన్నప్పుడు సరిగ్గా దాన్నె పట్టుకుని దిగి పారిపోయి రాత్రిళ్ళు స్కూలు పక్కనున్న కాలవలో ఈత కొట్టొచ్చి ఎవరికీ తెలీకుండా మళ్ళీ ఎక్కొచ్చి పడుకునేవాడు ఆరోజుల్లో బిషప్పు,

“ఎక్కెయ్‌ పైకి” చెప్పాడతను క్లుప్తంగా.

హెడ్‌ మాస్టరు మారు మాట్లాడకుండా ఎక్కడం మొదలెట్టాడు. ప్రస్తుతం యిద్దరూ గబగబా పాకేస్తున్నారు నీళ్ళ గొట్టం పట్టుకుని.

సరిగ్గా కిటికీని సమీపిస్తుండగా మళ్ళీ యింకోసారి నెత్తిమోద తన్నితే వూర్మోనని బిషప్పు హెడ్‌ మాస్టరుకి చెబుతుంటే వున్నట్టుండి ఆ కిటికీ తెరుచుకుంది.

“ఎవరక్కడ? అంటూ ఒక పడుచు కంఠం అడగటం వినబడింది.

"హెడ్‌ మాస్టరుకి కంగారు పుట్టింది. కిటికీ తెరిచి కిందికి చూస్తున్నవాడు చేతులో యింతలావు దుద్దుకర్ర పట్టుకుని విసరటానికి రెడీగా వున్నట్టు గమనించాడు, అంతంత మాత్రంగా వున్న ఆ వెలుగులో. దుద్దుకర్ర చూడగానే తను ఎవరైందీ చెప్పి, అర్ధరా[తి దొంగతనానికి వచ్చినవాడనే భ్రమని పోగొడదామనుకున్నాడు. అయితే తనెవరో చెపితే సరదాగా కాసేపు [05 బిషప్పు గారి 'పన్నాగం

వచ్చే తంటాలు: కళ్ళ ముందుకొచ్చాయి, దాంతో ఏం చెయ్యాలో తోచక నిశ్శబ్దంగా సిళ్ళగొట్టం పట్టుకుని వేలాడుతూ వుండిపోయాడు,

బిషప్పు అతనికి విరుద్ధం, యిలాంటి సమయాల్లో వెంటనే మంచి వుపాయాలు తడతాయతనికి.

“మనం ఏవరో పరాయివాళ్ళం కాదు వంటింట్లో తిరిగే పిల్లులం అని చెప్పు” గుసగుసలాడినట్టు'సలహా యిచ్చాడు,

'హెడ్‌ మాస్టరు బుజువర్తనుడ్కు కల్లా కపటం. తెలీనివాడు, అందువల్ల యిలా అసత్యం పలికే నీచస్థితికి దిగజారటం. మంచిది కాదనిపించింది, కానీ యిష్పుడున్న పరిస్థితుల్లో అంతకన్నా మరో గత్యంతరం లేదని కూడా తోచింది.

_ “అబ్బే, ఎవరూ కారు, మేమే, జోడు. పిల్లులం,' చెప్పాడు. సుతిమెత్తని స్వరంతో.

'కాదు, వొట్టి మమూలు పిల్లులం

“వంటాయన పెంచుకుంటున్న పిల్లులం మేము, ప్రాంప్టింగు చేస్తూ ప్రోద్బల మిచ్చాడు బిషప్పు కిందనించి,

“వంటాయన 'పెంపుడు, పిల్లులం," తగిలించాడు హెడ్‌ మాస్టరు.

కిటికీ దగ్గిర నుంచున్న వ్యక్తి 'ఓహో అలాగ్గా, అయితే సర్లెండి, అన్నాడు.

అతను పక్కకి జరిగి నుంచుని వాళ్ళని లోపలికి రానిచ్చాడు. మారు వేషంతో మోసం చెసిందానికి పాత్రోచితంగా బిషప్పు మ్యావ్‌ మ్యావ్‌ అని అరుస్తూ లోపలికి. దిగి బెడ్రూముకి దారితీశాడు, వెనకాలే హెడ్‌ మాస్టరు అనుసరించాడు. దాంతో ఆ వుదంతం ముగిసింది అని అనుకున్నారిద్దరూ.

అయినా: హెడ్‌ మాస్టరు సమాధానపడలేదు, ఏవిటో కడుపులో దేవినట్టుగా వుంది.

“మనం నిజంగా పిల్లులమే అని నమ్మకం కుదిరిందంటావా అతనికి?" ఆత్రపడుతూ

“ఏమో నాకంత నమ్మకం కలగట్లేదు; అయినా మనం వుదాసీన వైఖరి ప్రదర్శించి మోసపుచ్చాం, అన్నాడు బిషప్పు.

'ఆ మాట మాత్రం నిజమయ్యా: ఇంతకీ ఎవరతను?”

'నా సెక్రెటరి, ముందోసారి నేను చెప్పిన కుర్రాడు, మనకా గొప్ప టానిక్కుని

“ఆహా, అయితే .మరేం ఫరవాలేదు. నిన్ను పట్టించడులే..

“అలాంటివాడు కాదతను. అదీ కాక మనల్ని అనుమానించేందుకు మనమెక్కడా ఎలాంటి ఆధారాలు వదల్లేదు.!

కాసేపు ఆలోచించి, “ఎంతైనా ఆ విగ్రహానికి మనం 'పెయింటు పులమటం అవివేకం అనిపిస్తోందిప్పుడు నాకైతే” అన్నాడు హెడ్‌ మాస్టరు. బిషప్పు గారి. పన్నాగం 106 సరదాగా కాసేపు

'మనం కాకపోతే యింకోళ్ళయినా చెయ్యాల్సిందేగా. ఆ పని, గట్టిగా సమర్ధించుకున్నాడు బిషప్పు, _ 'ఆ మాటా నిజమేలే అన్నాడు హెడ్‌ మాస్టరు వుష్పాంగిపోతూ, మర్నాడు వొద్దున చాలా ఆలస్యంగా. నిద్ర లేచి గదిలోకే కొంచెం టిఫిను తప్పించుకు తిన్నాడు బిషప్పు, చెడ్డ 'పని చేసినందుకు మర్నాడు పశ్చాత్తాపం చెందటం సాధారణంగా జరుగుతుంది కానీ, అతనికి అలాంటి భావన రానేలేదు. అనుకున్నది నెరవేర్పినందుకు రాత్రి మంచి వి(శ్రాంతి లభించింది; అందుకే ఏలాంటి వ్యాకులపాటు చెందలేదాయన. అతన్ని యింకా కలవరపెడుతున్న విషయం - విగ్రహానికి నీలంరంగు 'పెయింటు పులిముంటే బాగా కొట్టాచేలా వుండేదిగా అన్నదే. అయితే చిరకాల మిత్రుడు ఎరుపురంగు 'పెయింటే పులుముదామంటే కాదనలేకపోయాడు. ఎంతైనా తను ఆ హెడ్‌ మాస్టరుకి అతిథిగా వచ్చాడాయె, గృహస్తు అభిమతాన్ని వ్యతిరకించకుండా సమ్మృతించడం సమంజస 'మని సరేనన్నాడు దానికి. అయినా, నీలంరంగే. కొట్టొచ్చినట్టు కనపడుతుందని యిప్పటికీ అనుకుంటున్నాడా బిషప్పు. తలుపు తట్టి లోపలికి ప్రవేశించాడు ప్రేమ్‌సాగర్‌. (గుడ్‌ మార్చింగ్‌, బిషప్‌. (గుడ్‌ మార్నింగయ్యా, ప్రేమ్‌సాగర్‌. ఈరోజు తొందరగా మెలకువ రాలేదయ్యా,' అన్నాడు బిషప్పు సౌమ్యంగా, _ “అది సరే బిషప్పుగారూ, నిన్నరాత్రి ఉత్తేజామ్లాన్ని పెద్ద డోసు పుచ్చుకున్నారా?” అని అడిగాడు ఆదుర్దా పడుతూ, . . “పెద్ద డోసా? లేదోయ్‌. నాకు గుర్తున్నంత వరకైతే చాలా చిన్న డోసయ్యా. వైను గ్లాసు నిండా రెండే రెండు గ్లాసులు మాత్రం.” 'అమ్మబాబోయ్‌!! “ఎందుకలా అడిగావ్‌ చెప్పు? “అబ్బే ఏం లేదండీ. వూర్మేనే అడిగ్గా రాత్రి నీళ్ళగొట్టం మాద మి ప్రవర్తన వింతగా అనిపిస్తేనూ, అందుకే” క్ష దాంతో ఆశాభంగమైంది బిషప్పుకి. 'అయితే మరి నువ్వు మా-అంటే-మా-మేమాడిన చిన్న నాటకం. కనిపెట్టే శావన్నమాట? “అవును, కనిపెట్టేశాను.' జరిగింది వివరించటానికి ప్రయత్నించాడు బిషప్పు. “అసలేమైందంటేనయ్యా, రాత్రి హెడ్‌ మాస్టరూ, నేనూ కాసేపలా బయట తిరిగొచ్చాం. చూస్తే అతను తాళంచెవి ఎక్కడో పారేసుకున్నాడు. రాత్రిపూట ప్రకృతి ఎంత అందంగా వుంటుందో'నేను వర్ణించలేను, సరదాగా కాసేపు 107 బిషప్పు గారి పన్నాగం

ప్రేమసాగర్‌! అంతులు లేని నల్లటి ఆకాశం, చెవులో రహస్యాలు చెబుతున్నట్టు చల్లటి పిల్ల తెమ్మెరలు, చెట్లనించి పూల గుబాళింపులూ.

“అవును, అని చెప్పి ఒక్కనిమిషం ఆగాడు (పేమ్‌సాగర్‌. “పొద్దున్నే చాలా 'పెద్ద రభస జరిగింది. పెదిరెడ్డి శామ్యూల్‌ 'ప్రభాకథ్రెడ్డిగారి విగ్రహానికి ఏవరో ఏరుపురంగు "పెయింటు పులిమారు రాళథ్రికి రాత్రి.

'నిజంగ్రానా?

'అవును,'

“అంతేనోయ్‌, పిల్లలు పిల్లలేగా? అన్నాడు బిషప్పు చాలా ఓరిమి చూపిస్తూ.

(చాలా చిత్రంగా వుందీ పని,!

'సందేహం లేదు, సందేహం లేదు. అయితే ్రేమ్‌సాగర్‌ ఒక్క విషయం చెప్పు, జీవితమే.:చాలా చిత్రమా కాదా?”

కానీ ఆ విగ్రహం తల మాద తమరు ధరించే బిషప్పు టోపీ కప్పి వుండటం గమనించి మరీ విచిత్రంగా చెప్ప్తుకుంటున్నారంతా.”

అది విన్న బిషప్పు కంగు తిన్నాడు.

ఏవిటీ!

“నిజంగాచే

“'ప్రమ్‌సాగర్స్హ్‌ ఒకటి రెండు విషయాలు. గాఢంగా ఆలోచించుకోవాలి, కాసేపు నన్ను వొంటరిగా వదిలెయ్‌,”

గభాల్న లేచి బట్టలు మార్చుకున్నాడు. వేళ్ళు మొద్దుబారినందుకు కష్టపడాల్సి వచ్చింది. జరిగిందంతా గుర్తొస్తోంది. యిప్పుడు, 'పెయింటు పులిమే, ముందు టోపీ తీసి పక్కన పెట్టకుండా విగ్రహం మాడు మిద పెట్టాడు తను, అన్నది గుర్తుకొచ్చింది బిషప్పుకి, ఆ సమయంలో అది చాలా వుత్తమంగాా బుర్రకి తోచి వెంటనే ఆచరణలో పెట్టాడు తను. మనం చేసే యిలాంటి అత్యల్పమైన పనులు ఏంతటి విపరీత పరిణామాలకి దారితీస్తాయో

హెడ్‌ మాస్టరు స్కూల్లో పదో తరగతి పిల్లలకి లెక్కల పాఠం చెబుతున్నాడు, దాంతో పన్నెండున్నరకి లంచి బెల్లు కొట్టెంతవరకు ఒక్కడే చికాకు పడుతూ కూచోవాల్సి వచ్చింది. ముందుగదిలో కిటికీ దగ్గిర ఓపిక 'నశిస్తూ నుంచునుంటే హెడ్‌ మాస్టరు రావడం కనిపించింది. నెత్తి మోద చాలా. బరువు మోస్తున్నవాడిలా నింపాదిగా 'నడుస్తూ వస్తున్నాడతను.

గదిలోకి రాగానే, “ఎమైందయ్యా?” అంటూ. అరిచాడు బిషప్పు.

హెడ్‌ మాస్టరు బూట్లు విప్పి పక్కన 'పెట్టి నిస్తేజంగా కుర్చీలోకి కూలబడ్డాడు.

'కిందటి రాత్రి పిచ్చిపట్టిన .వాడిలా నేనెందుకు ప్రవర్తించానో నాకే యింకా కొరుకుడు పడటం 'లేదు,! చిషప్పు గారి పన్నాగ్రం 108 సరదాగా కాసేపు

ఆ మాటలకి బిషప్తు కొంత ఆందోళన. చెందాడు. కానీ, యిలాంటి వైఖరిని ఆమోదించలేదు.

'హెడ్‌ మాస్టరూ, నీ పద్ధతి నాకేం అర్ధం కావటల్లేదయ్యా. మనతో స్కూల్లో చదివినవాడు, మనిద్దరం అసహ్యించుకున్న ఆ లేకివాడికి, అనవసరంగా వీళ్ళు లేనిపోని ఘనతలు అంటగట్టి విగ్రహం పెడితే మనలాంటివాళ్ళు చూస్తూ కూచోవాలా? పెయింటు పులమటమనేది మన కనీస ధర్మమయ్యా.”

'అవునుగానీ, ఆ విగ్రహం మాడు మీద నీ టోపీ పెట్టంచటం కూడా. నీ కస్‌స ధర్మం అనుకోవాలా?" -.

బిషప్పు చిన్నషాటి దగ్గు దగ్గాదు, "అక్కడే నేను కొంచెం (శ్రుతి మించాననుకుంటా,. అనాలోచితంగా చేసిన ఆ పనికి మి కమిటీవాళ్ళు అనుమానిస్తున్నారంటావా నన్ను?”

'ఏందుకిలా జరిగిందానని తల బద్దలు కొట్టుకుంటున్నారు.

“మా స్మూలు కమిటీవాళ్ళ వుద్దేశ్యం ఏవిటి?”

'నేరుస్తుర్ని నేనే వెతికి పట్టుకోవాలట, పట్టుకోలేకపోతే నేను దారుణ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందట,” "

“అంటే, నిన్ను హెడ్‌ మాస్టరు పదవినించి తీసేస్తారా మరి?

'వాళ్ళ అర్ధం అదేగా మరి. నాచేత రాజీనామా. యిప్పిస్తారు. అదే కనక జరిగితే నేను బిషప్పు అయ్యే ఛాన్సు పోతుంది దాంతో.”

'ఫోతే పోయిందిల్తే బిషప్పుగా వుండటం ఏమంత గొప్ప ఘనకార్యం కాదులేవోయ్‌. పిల్లికళ్ళూ, అయినా నీకా పదవి నచ్చదు లే”

నీకేం, ఏమైనా మాట్లాడ్దావ్‌ నువ్వు అసలు నన్నీ రొచ్చులోకి దింపింది నువ్వే, అద్దగాదిదాగ్‌ .

“ఇది మరీ బావుందయ్యా! నువ్వు కూడా నా అంత వుత్సాహం చూపించావుగా,'

“ఈ పన్నాగం ఎవరిది, నీది కాదా?

'విన్న తరవాత చంకలు కొట్టుకుంటూ ఎగిరిందెవరు, నువ్వు కాదా?”

కోపంతో యిద్దరూ ఎదురుబొదురుగా నుంచున్నారు, కొట్టుకోబోతున్నారని అని పించింది కాసేపు. తనని, తనే తమాయించుకున్నాడు. బిషప్పు.

ముఖంలో చక్కటి చిరునవ్వు తెచ్చుకుని హెడ్‌ మాస్టరు చెయ్యి పట్టుకుని, 'పిల్లికళ్ళూ,

యిది మనకి తగదయ్యా: పోట్లాడుకోకూడదు. మనిద్దరం శేసిన తుంటరిపనికి కారణం ఏంత సమంజసమైన ఎంత శ్లాఘనీయమైనా యీ యిరకాటం నించి తప్పించుకునే వుపాయం ఏమిటని మన రెండు బుర్రలూ కలిపి ఆలోచించాల్సిన తరుణం యిది,

"నాకూ అదే ఆలోచన వచ్చిందోయ్‌, దానివల్ల ప్రయోజనం లేదు, అన్నాడు

హెడ్‌ మాస్టరు, “ఒకవేళ. మనం...” సరదాగా కాసేపు 109 బిషప్షు గారి. పన్నాగం

'లేదు. అదీ వుపయోగం లేదు, అన్నాడు బిషప్పు.

నిశ్శబ్దంగా కూచుని. దీర్హంగా కాసేపు ఆలోచించారిద్దరూ. ఆలోగా తలుపు తెరుచుకుంది;

'మేజర్‌ ఆరోగ్యపాదంగారు వచ్చారయ్యా; అని చెప్పాడు నౌకరు,

'ఆహా గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి. నెమ్మదిగా నుందు, కీర్తనలు 55 ; 6” అంటూ గొణుక్కున్నాడు బిషప్పు.

వున్న చోటునించి పక్షిలా వేగంగా: ఎగురుకుంటూ మాయమవ్వాలన్న అతని కోరిక అంత అసమంజసం 'కాదనే చెప్పాలి. మేజర్‌ ఆరోగ్యపాదం, 514514, ఆర్నీనించి రిటైరయిన తరవాత కొంతకాలంపాటు డిటెక్టివ్‌ ఏజెన్సీ నడిపి మంచి పేరు సంపాదించాడు. అతడ్ని మోసగించటం అసాధ్యం. అలాంటివాడిని స్కూలు కమిటీ వాళ్ళు విచారణ జరిపేందుకు నియమించడం బిషప్పుకి అస్సలు నచ్చలేదు.

మేజరు రాచఠీవితో అంగలు వేసుకుంటూ గదిలోకొచ్చాడు. ముఖంలో: నల్లటి గుడ్డూ వాటిమిద గుబురైన తెల్లటి.కనుబొమ్మలూ; తీక్షణంగా చూస్తున్న అతని చూపులూ: బిషప్పుకి మరీ నచ్చలేదు.

వస్తూనే, “ఇదంతా చాలా చెడ్డ వ్యవహారం. చాలా చెడ్డ వ్యవహారం. చెడ్డ వ్యవహారం!

“అవునండీ, నిజంగానే? తదబడుతూ అన్నాడు బిషప్పు.

“దిగ్భ్రాంతి కలిగిస్తున్న వ్యవహారం. దిగ్ర్రాంతి. దిగ్భ్రాంతి. ఆ విగ్రహం మాడు మాద ఏం కనబడిందో తెలుస్తా ఆ విగ్రహం మాడు. మద్ద విగ్రహం. మాడు మాద? మారు ధరించే టోపీ, బిషప్పుగారూ. మి టోపీ. మిటోపీ. మా టోపీ.”

తమాయించుకోడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది బిషప్తుకి, ఆ'మేజరు ఒక్కొక్కటి మూఢు మూడు సార్లు అంటుంటే రాత్రి తను చేసిన ఆకతాయి పని మూడు రెట్లు చెడ్డదిగా మూడు రెట్లు ఘోరంగా కనబడి బుర్ర తిరిగిపోయింది. ఇప్పుడు తను మూడు విగ్రహాలకి మూడు డబ్బాల పెయింటు వేసి ఆ మూడింటి తలల మిదా మూడు టోపీలు పెట్టొచ్చినట్టు భావించసాగాడు, అయితే బిషప్పు గట్టిపిండం కనక అధైర్యపడలేదు.

“ఏవిటి, మిరు నా టోపీ చూశానంటున్నారా? అసలా టోపీ నాదని మికెలా తెలుసు? నిన్నటి రాత్రి వందలకొద్దీ బిషప్పులు స్కూలు (గగ్రౌండులో తిరిగుందచ్చెమో?! అంటూ దబాయించాడు.:

“దాని మొద ఎంబ్రాయిడరీ చేసిన మా పేరు వుంది. మా పేరు వుంది. మీ పేరు వుంది బిషప్పు గారి పన్నాగం 110 'సరదాగా' కాసేపు

కూచున్న కుర్చీని గట్టిగా అదిమి పట్టుకున్నాడు బిషప్పు. ఆ మేజరుగారి కళ్ళు బిషప్పుని గుచ్చి గుచ్చి చూస్తుంటే తను కసాయివాడి ముందు. నిలబడ్డ గొ(్రైలా అనిపించింది. టోపీ మాద రాసున్నది బహుశా ఫోర్జరీ అయుండొచ్చని 'చెప్పబోయ. లోపల తలుపు మోద ఏవరో చిన్నగా తట్టారు.

కుర్చీలో కుంగిపోయి కూచున్న హెడ్‌. మాస్టరు, 'కమిన్‌,' అన్నాడు.

యూనీఫాంలో వున్న చిన్న పిల్లాడొకడు లోపలికొచ్చాడు, ఆ పిల్లాడిది పరిచయమున్న స్ఫూలు, ముఖంలా కనబడింది బిషప్పుకి. ఆరమగ్గిన ఎర్రటి టమేటో పండుకి ముక్కొకటి గుచ్చినట్టు వున్నాడా పిల్లాడు, అయితే బిషప్పు బుర్రలో గుచ్చుకున్నది అది కాదు. పిల్లాడిని చూడగానే బిషప్పుకు స్ఫురణకొచ్చింది టమేటోలు కాదు, 'మరేదో యింకోటి,

'సార్ర్‌ ఫ్లీజ్‌ సార్‌, అన్నాడా పిల్లాడు.

“యస్‌, యస్‌, యస్‌, అన్నాడు మేజర్‌ ఆరోగ్యపాదం కఠినంగా: 'ఆబ్బాయ్‌, ముందు ఫో యిక్కగ్నించ్మి ఫో యిక్కడ్నించి, ఫో యికృడ్నించి. ' మేమంతా బిజీగా వున్నాం, కనబడటం. లేదా?

'కాన్సీ షార్క్‌ ప్లీజ్మ్‌ సార్‌: ఆ విగ్రహం గురించి సార్‌.

“ఏవిటి విగహం గురించి? ఏవిటి దాన్ని గురించి? ఏవిటి దాన్ని గురించి?”

సార్‌, ప్లీజ్‌. సార్‌, ఆ పని చేసింది నేనే.

“ఏమిటీ! ఏమిటీ! ఏమిటీ! ఏమిటీ! ఏమిటీ!

బిషప్పూ, మేజర్వూ హెడ్‌ మాస్టరూ ముగ్గురూ ఒకేసారి నోరు విప్పారు; దాంతో వాళ్ళు అన్న “ఏమిటీ[లు!

బిషప్పు 1

మొత్తం అయిదుగా తేలాయి. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక అలా. ఏమిటీ! అని ముగ్గురూ. ఆ 'పెల్లాడినె తదేకంగా చూస్తుంటే అతని ముఖం కందిపోయింది.

'ఏమన్నావ్‌ నువ్వు? మళ్ళీ యింకోసారి చెప్పు ఆ విగ్రహానికి రంగు పులిమింది నువ్వా? గట్టిగా అరిచాడు హెడ్‌ మాస్టరు.

“నువ్వాళే బిషప్పు అడిగాడు.

“సార్క్‌ యస్‌, సార్‌"

“నువ్వా? నువ్వా? నువ్వా? అడిగాడు మేజరు. సార్‌ యస్స్‌ సార్‌. సరదాగా కాసేపు [11 బిషప్పు గారి పన్నాగ్రం

కంపిస్తున్న మౌనం ఆవరించిందక్కడ. బిషప్పుగారు హెడ్‌ మాస్టరు వంక చూశాడు. హెడ్‌ మాస్టరు బిషప్పు వంక చూశాడు... మేజరుగారు ఆ పిల్లాడి వంక చూశాడు, ఆ పిల్లాడేమో తల వంచుకుని నేలని చూస్తూ నుంచున్నాడు.

మొట్టమొదట నోరు తెరిచింది మేజరే.

“ఇది ఘోరాతి ఘోరం. ఘోరాతి ఘోరం. ఘోరాతి ఘోరం,” కోపంతో అరిచాడాయన. “ఇలాంటిదెప్పుడూ'. కనీ వినీ ఎరగం.. ఈ పిల్లాడ్ని వెంటనే డిస్మిస్‌ చెయ్యాలి, 'హెడ్‌

“లేదు! అన్నాడు హెడ్‌ 'మాస్టరు ఘంటకొట్టినట్టు.

'కాకపోతే తోలు వలిచెయ్యాలి. తోలు వలిచెయ్యాలి. తోలు వలిచెయ్యాలి”

'లేదు[ మళ్ళీ గట్టిగా అన్నాడాయన. రెవరెండు పైడిపోతల యేసురత్నంగారికి నూతన చైతన్యం. ఆవహించింది... పొగలు విడుస్తున్నట్టుగా. ముక్కులోంచి వూపిరి బయటికొచ్చింది, కళ్ళు కూడా పెద్దగా రొయ్య కళ్ళ సైజులోకి మారాయి. 'స్కూలు 'క్రమశిక్షణకి సంబంధించిన విషయంలో మాత్రం 'హెద్‌ మాస్టరుడే అంతిమ నిర్ణయమని వినమ్రంగా మికు తెలుపుతున్నాను, నా అవధుల మేరకు 'నేను చూసుకుంటా ఈ విషయాన్ని నా'ప్రకారం దీనికంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనబదటం. లేదు. ఏవంటారు, మిరు నాతో ఏకీభవిస్తున్నారా బిషప్పుగారూ?"

ఒక్కవుదుటున తేరుకున్నాడు బిషప్పు, మిరకిల్సు విషయం మోద పునర్విచారణ చేస్తూ అప్పుడే ముగించిన వ్యాసం గురించి ఆలోచిస్తున్నాడాయన. నవయుగానికి చెందిన భావనల్ని యిముడుస్తూ మిరకిల్సు అనేవి సందేహాత్మకమే అన్నట్టు ధ్వనింప చేశాడు ఆ వ్యాసంలో. బహుశా. అలా రాయటం తొందరపాటుతనమేమో. అని తోచిందిప్తుడు.

'ఓ, తప్పకుండా," అన్నాడాయన.

కోపంతో వూగిపోయాడు మేజరు.

“అయితే యిందులో నేనింక తలదూర్చను.. ఇందులో తలదూర్చను. తలదూర్చను. ఈ రోజుల్లో పిల్లలికి యిలాంటి బుద్దులు నేర్పిస్తున్నారు గనకనే దేశం కుక్కల పాలవుతోంది. కుక్కల పాలు,:. కుక్కలపాలవుతోంది దేశం.”

తలుపు తెరుచుకుని విసురుగా లాగి వెళ్ళిపోయాడాయన, జయించిన ముఖంతో చిరునవ్వు నవ్వుతూ హెడ్‌ మాస్టరు కుర్రాడి వంక తిరిగి అడిగాడు.

“నీ దురుసుతనానికి యిప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నావని అనుమానం లేదు

“ఇంకెప్పుడూ యిలాంటి పని. చెయ్యవుగా?' బిషప్పు గారి పన్నాగం 112 సరదాగా కాసేపు

విప్పారిన మొహంతో హెడ్‌ మాస్టరు, “మరైతే కాస్త సానుభూతితో మెలుగుదాం యీ విషయంలో, ఏందుకంటే ఎంతైనా పిల్లలు పిల్లలేగా, పిల్లచేష్టలుగా చూద్దామంటాను, మీరేమంటారు బిషప్‌

“అలాగే తప్పకుండా.

“ఇదెలాంటి పిల్లచేష్టంటే ఆ హహ్మ్హా హ్హా హ్హా మనిద్దరం కూడా అలాంటి పని, అంటే, ఈ పిల్లాడున్న వయసులో మనమైనా అలానే చేసుండేవాళ్ళం2

“ఆ మాటా నిజమే.”

“అయితే నువ్విప్పుడేం చేస్తావంటే పుస్తకం తీసుకుని ఓ యిరవై లైన్లు యింపోజిషన్‌ రాసి నాకు చూపించు, మరింక యీ విషయం గురించి మరిచిపోదాం, ఏవంటావ్‌, ఉండ్రాజు వారబ్బాయీ.” -

కుర్చీలోంచి అమాంతం 'పైకి లేచాడు బిషప్పు.

'పేండ్రాజువారా! ఏమన్నావూ, ఉండ్రాజూవారబ్బాయన్నావా?”

“అవును.”

'ఆ యింటిపేరుతో వున్నతను నా దగ్గిర సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. అబ్బాయ్‌, నీకేమవుతాడతను, మా బంధువా?"

“సార్‌ యస్‌, సార్‌. మా అన్నయ్య. నేనాయన ఆఖరి తమ్ముడిని."

ఓహో!” అన్నాడు బిషప్పు.

ప్రేమ్‌కుమార్‌కి తోటపనంటే చాలా యిష్టం, కలుపు మొక్కలు పెళ్ళగిస్తుంటే బిషప్పుగారొచ్చి ఆప్యాయంగా బుజం మిద చెయ్యి వేశాడు.

“ప్రేమ్‌సాగర్‌, ఆశ్చర్యకరంగా ముగిసిన యీ వుదడంతంలో నీ అద్భశ్యహస్తం వుందని నేను గమనించలేదనుకోకు.”

'ఆ? ఆశ్చర్యకరంగా ముగిసిన వుదంతం ఏమిటి బిషప్‌?! అంటూ అడిగాడు (ప్రేమ్‌కుమార్‌.

'కిందటిరోజు రాత్రి నేనూ, హెడ్‌ మాస్టరు రెవరెండు 'పైడిపోతల యేసురత్నంగారూ సంఘానికి మంచి కలిగించాలనే గౌరవప్రదమైన సదుద్దేశ్యంతో ఆ పందికొక్కు పెదిరెడ్డి శామ్యూల్‌ ప్రభాకర్రెడ్డి విగ్రహానికి రంగు పులిమామన్న సంగతి నీకెలానూ తెలుసు, ఇంతకుముందే హెడ్‌ మాస్టరుగారి ముందుగదిలో ఒక పిల్లాడొచ్చి ఆ పని చెసింది తనేనని చెప్పి వొప్పుకున్నాడు, ఆ పిల్లాడెవరో కాదు, (ప్రేమ్‌సాగర్‌ మా తమ్ముడేనయ్యా.”

'అఅవునాండీ” సరదాగా కాసేపు 113 బిషప్పు గారి పన్నాగం

“నన్ను కాపాడ్డానికని నువ్వే అతని చేత అలా చెప్పించావ్‌: కాదని బుకాయించకు, ప్రేమ్‌సాగర్‌

ప్రేమ్‌సాగర్‌ కలవరపడుతూ చిన్నగా నవ్వాడు.

'దానికేం లెండి, మరేమంత గొప్పా, బిషప్పుగారూ]

“అవునయ్యా, ఆ పనికి ఘనంగా నువ్వ ఖర్చు 'షెట్టలేదని తలుస్తున్నా అన్నాదమ్ముల స్వభావాలు తెలిసినవాడ్ని కనక, అంత గొప్ప వుపకారం కేవలం వూర్మే చేసుండడు ఆ పి ల్లాడు. శ్ర

“అబ్బే, ఓ రెండొందల రూపాయలు మాత్రమేనండి. ఐదువందలడిగాడు, బేరం చేసి ఆఖరుకి రెందుకి వొప్పించాను, అవివేకం! అంత చిన్న పనికి ఐదువందలా? అలా చెప్పి వొప్పించాను.!

“ఆ పైకం నీకు తిరిగిచ్చేస్తానోయ్‌, ప్రేమసాగర్‌,!

“వద్దండి, అక్టర్లేదు బిషప్పుగార్లూ.”

“కాదోయ్‌ (ప్రేమ్‌సాగర్‌, వద్దనకు. నీ పైకం నీకిచ్చెస్తా. ఇప్పుడైతే నా దగ్గిర అంత పైకం లేదు కానీ, నీ కొత్త అడ్రసు - అదేనయ్యా, సెయింట్‌ జాన్స్‌ చర్చి, వల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పాస్టరు ప్రేమ్‌సాగర్‌ పేరిట చెక్కుపంపిస్తానయ్యా.!

(ప్రేమ్‌సాగర్‌ కళ్ళు ఆనందబాష్పాలతో నిండాయి.

పూడుకుపోయిన గొంతుతో, *“బిషప్పుగారూ, మోకెలా ధన్యవాదాలు తెలపాలో అర్ధంకాకుండా: వుంది. కానీ ,.. మారో సంగతి ఆలోచించారా?”

'ఆలోచించడమా?”

“నీ కౌగిటి భార్య. ద్వితీయోపదేశకాండము 18 : 6. మారీ విషయం చెబితే ఏమంటారావిడ?'

పట్టుదల సూచిస్తున్నట్టు బిషప్పు కళ్ళు మెరిశాయి.

'ఆ పాయింటు మరిచిపోయాననుకోకయ్యా, అయితే పరిస్థితులన్నీ అదుపుగా నా గుప్పెట్లో పెట్టుకున్నా. ఏలయనగా ఆకాశపక్ష్నులు సమాచారము కొంచుబోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ప్రసంగి 10: 20. నా నిర్ణయాన్ని ట్రంక్‌ కాల్‌ చేసీ ఆవిడకి చెప్పేస్తా . బిషప్పు గారి పన్నాగం. 111 సరదాగా కాసేపు

నే ము ో [) | ట్రం ర న్‌ కరి లంరిం (౪ మా పానకుటీరంలో పిచ్చాపాటీ-చేసేటప్పుడు ఏవేవో కబుర్లు దొర్హుతుంటాయి. మా బృందంలో వాళ్ల ఆలోచనలు ఈ కొమ్మనించి ఆ కొమ్మ మీదికి దూకే కోతుల్లా మారుతాయి. ఆరోజున టాపిక్‌ వున్నట్టుండి ఈ కాలపు పత్రికల్లో వస్తున్న కధల వైపు మళ్లింది, నాకు గుర్తున్నంతలో అప్పటిదాకా - దేవుడు ముందు సృష్టించింది మనిషినా లేక్ష అతని నైతిక పతనాన్నా అన్న విషయం మిద గోష్టి నడుస్తోంది. లిక్కరు సర్వ్‌ చేసే నారాయుడు కొనే. వారపత్రికని అప్పటి దాకా తిరగేస్తున్న రమ్మారావు బుస్సుమని గట్టిగా సరదాగో కాసేపు [15 రావె నా 'చెలియా

“చిరంజీవ, శతాయుష్పు! అన్నాడు పక్కనున్న బీరాస్వామి.

“నేనేం తుమ్మలేదయ్యా, వూర్కేనిట్టూర్చా, అంతే; అని, 'అసలు యిలాంటి అర్ధం పర్ధం లేని కధలు ఎందుకు వేస్తారో ఏమిటో?! అంటూ విసుక్కున్నాడు రమ్మారావు.

“ఇలాంటి - అంటే మా వుద్దేశ్యం ఎలాంటివి అని?”

“ఇవేనయ్యా, రంగుల్లో బొమ్మలు కూడా వేయించిన కధలు. ఓ పడుచు పిల్లాడూ, ఓ పడుచు పిల్లా బీచి వొడ్డున కలుస్తార్హు పరిచయాలైన. తరవాత కాసేపలా మాటా మంతీ జరుపుతారో లేదో ఠక్కున (ప్రేమలో పడతారు. కలుసుకున్న అరగంట లోపలే పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకుంటారు.!

స్మాచ్‌ విస్కీలో నిమ్మకాయ తునక వేసుకుని సేవిస్తున్న భాగోతుల సూతరాజుగారు అది విని గ్లాసులోంచి ఒక గుక్క చప్పురించారు,

“'మోకది సహజంగా అవుపట్టంలేదు కదూ?” అని అడిగారాయన,

“మరంతే కదండీ, చూడండి, నేనూ పెళ్లయిన వాడినే, పెళ్ళికి ముందు ఆవిడగార్ని వొప్పించడానికి నామట్టుకు నాకు రెండేళ్ళు పట్టిందనుకోండి. దానికి తోడు లెక్కలేనన్ని చిన్నా చితకా (పెజెంట్సూ గట్రాను,అంత కష్టపడితేనే ఆవిదగారు సరేనంటూ తల వూపింది, నా అంతకి నేను చెప్పుకుంటే బాగోదు కాని ఆ రోజుల్లో చూద్దానికి హీరోలా బ్రహ్మాండంగా వుండేవాళ్డి. కావాలంటే ఎవర్నయినా కనుక్కోండి పోనీ

సూతరాజుగారు తల వూవారు,

“'మోరన్నదాంట్లో పాయింటుందని వాప్పుకుంటా.. అయితే పత్రిక నడిపే ఎడిటరు వైపు నించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎప్పుడూ తన లోకంలోనే జీవించే ఆ ఎడిటరు - ముక్కూమొహం తెలీని యిద్దరు పడుచువాళ్ళు తొలి పరిచయంతోటే పెళ్ళికి దారిత్‌న్తారు గావుల్ననే అభిప్రాయపడతాడు, కానీ తమరన్నట్టు నిజ జీవితంలో అలా జరగటం చాలా తక్కువే సుమండీ. మా భాగోతులవారి కుటుంబంలో యించుమించు అందరూ, కలిసిన మరుక్షణంలోనే (ప్రేమలో పడ్డారు. అయితే తరవాతి వ్యవహారం మాత్రం వాళ్లకి సులువుగా సజావుగా సాగిందని అనుకోకూడదు. 'నడుం గట్టిగా. బిగించాల్సి వచ్చింది, ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా తమ్ముడుగారబ్బాయి మోహన్రాజు సంగతే గుర్తుకొస్తోందిప్పుడు.!

“అతను కూడా బీచి వొడ్డున ఆడపిల్లల్ని కలుస్తుందేవాడా?”

లక్ష్మమ్మగారనే ఆవిడ మా. 'మోహన్రాజుకి వరసకి అమ్మమ్మ అవుతుంది (సూతరాజుగారు కధ చెప్పడం మొదలెట్టారు), ఆధ్యాత్మిక సభలు ఎక్కడ జరిగినా విధిగా వెళ్లి తీరేదావిడ, ఓసారి తాడేపల్లివారి బంగళాలో జరుగుతున్న సభలకి తోడుగా రమ్మని పిలిస్తే తప్పనిసరై మావాడికి వెళ్ళాల్సి వచ్చింది. అభిమాన హీరోగ్గారి సినిమా రిలీజైన మొదటిరోజు మొదటాట చూట్టానికి మావాడు ప్లానేసుకుని సిద్ధమవుతుంటే లక్ష్మమ్మగారు రావె నా చెలియా: శే 0 సరదాగ్రా కాసేపు

  • నాయనా నన్ను భీమునిపట్నం తీసుకెళ్లరా అని అడగ్గానే విసుగొచ్చింది, కోపంతో మండిపోయాడు, ఆ సంగతి. తలుచుకుంటే యిష్పుడు తమాషాగా అనిపిస్తుంది, అప్సరసలాంటి అమ్మాయి అక్కడ మావాడి కంటబడింది. దాంతో ఆ కోపం, విసుగూ. ఆట్టేసేపు నిలవక పుసిక్కిన మాయమయ్యాయి. ధ్యాసంతా ఆ పిల్ల మీదనే వుంచి కళ్ళార్పకుండా చూస్తూ వుండటంతో చేతులో వున్న సంచి జారిపోతున్నట్టు కూడా 'తెలిసిరాలేదు. ఆఖరి: క్షణంలో తమాయించుకుని పట్టుకున్నాడు.

'ఆహా, ఓహో అని ఆమె అందాన్ని జుర్రుకుంటున్నట్టు చూస్తూ, “ఇదేదో కొత్త మలుప్తకి దారి తీస్తున్నట్టుందే' అనుకున్నాడు.

తాదేపల్లివారి బంగళా బయట లాను, దానికి దూరంగా. పెద్ద చింతచెట్టు, ఆ చెట్టు నీడలో షొడుగాటి టేబులు మాద పూజా సామగ్రి పరిచిపెట్టిన దుకాణమూ చూశాడు. అది నడిపేది ఆ పిల్లేనని చూసి అవయవాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ దుకాణంలో అమ్మకానికి పెట్టినవన్నీ కొనేశాడు, 'నాలుగు రుద్రాక్షమాలలు, అరడజను గీతా (ప్రెస్సు వారి పుస్తకాలు, రెండు దీపం కుందులూ, డజను అగరొత్తుల ప్యాకెట్లు చేతులు మారిన తరవాత -.ఈ విధంగా తను కూడా ఆధ్యాత్మిక సంఘంలో సభ్యుడైనట్టే కదా, మరింక ఆమెతో పరిచయం చేసుకోవచ్చని మాటలు మొదలెట్టాడు.

మహా (ప్రశాంతంగా వుందండీ ఇక్కడ” అంటూ మాటలు కలిపాడు,

అవునండీ, చాలా బావుంటుందిక్కడ,' అందామ్మాయి,

చేతులో వున్న అగరుబత్తి ప్యాకెట్టుతో ఆకాశంలో మబ్బుల్ని చూపిస్తూ, “ఆ మబ్బులు చూడండి ఎంత బావున్నాయో” అన్నాడు,

(అవును, నేనజ చూశా ఆ మబ్బుల్ని, అంది ఆ అమ్మాయి.

'నేననేది ఆకాశంలో మబ్బులు అలా కమ్ముకునుంటే మనసుకి వుల్లాసంగా వుంటుంది కదా అని? అన్నాడు మోహన్రాజు, “మిమ్మల్ని యిలా కలవడం ముచ్చటగా వుందండీ.. నేనెవర్సో నా పేరేమిటో తెలుసుకోవాలని, మికు కుతూహలం కలుగు తుండొచ్చు - మోహన్రాజ్కు భాగోతుల మోహన్రాజు/

ఆ పిల్ల తన పేరు కాశీభొట్ల కాత్యాయిని, అక్కడే వాళ్ళ అత్తయ్య తాడేపల్లి సీతారావ మ్నగారి బంగళాలోనే వుంటున్నానని చెప్పంది, ఆమెని కాత్యాయినీ అంటూ యిప్పటినించే పిలవటమా, మరిక్షాసేపటికి వాయిదా వెయ్యటమా అని మోహ(న్రాజు తటపటాయిస్తుంటే ఆలోగా యుద్ధనౌకలాంటి భారీ శరీరం మోసుకొని ఒక పెద్దావిడ దొర్లుకుంటూ చేరింది.

ఏమ్మా, అమ్మకాలు ఎలా వున్నాయ్‌, బానే వున్నాయా?! అంటూ విచారించిం దావిడ.

వచ్చినావిడని సీతమ్మత్తా అని పిలుస్తూ, మొదట్లో చెప్పుకోదగ్గ బేరాల్లేకపోయినా యిప్పుడే యిదిగో యీ పెద్దమనిషి మూలంగా వ్యాపారం బాగ్లా పుంజుకుందని చెప్పి -

దేవుడి అనుగ్రహం కోసం వొంటికాలు మొద తపస్సు చేసేవాడిలా నుంచున్న మోహన్రాజుని చూపిస్తూ - "ఈయనే, మోహన్రాజుగారు, భాగోతుల మోహన్రాజుగారు,' అంటూ ఆవిడకి పరిచయం 'చేసింది.

'భాగోతులవారా బాబూ? భాగోతుల 'పేర్రాజుగారని విష్వాలయంలో పురాణాలు చెబుతుండేవారు తెలుసా: నీకు? మేమిద్దరం. చిన్నప్పుడు వీధిబడిలో కలిసి చదువు కున్నామయ్యా. మోకేమైనా బంధువులా ఆయన?” అని విచారించిందావిడ.

పురాణాలు చెప్పే పేర్రాజుగారి పేరు మొట్టమొదటిసారి విన్నాడు మావాడు, అయినా కధ ముందుకు సాగేందుకు దొరికొచ్చిన అవకాశాన్ని వదల దలుచుకోలేదు మోహన్రాజు:

“ఆ, అవునండీ మరే. వరసకి పెదనాన్నవుతారండీ.. చిన్నప్పట్నించీ పేరయ్య పెదనాన్నా అంటూనే పిలుస్తా .

'ఎన్నాళ్ళయిందో ఆయన్ని చూసి. ఎలా వున్నారు, కులాసాగా వున్నారా?

“ఓ, ఆయనకేం దిట్టంగా వెలిగిపోతున్నారు..

“ఆ. ముక్క విన్నం దుకు సంతోషంగా వుంది నాయన్నా, రోజూ పురాణాలు చెప్పి చెప్పి చివరికి ఆయనగారి గొంతు. పూడుకుపోయిందని విన్నానయ్యా లోగడ. ఇదిగో సరిగ్గా-చచ్చి స్వర్గానున్న మా కాత్యాయిని వాళ్ళ నాన్నగారు వాసుదేవయ్య హరిదాసులా అందావిడ. అది వినంగానే మోహన్రాజు ఒక నిర్ణయానికొచ్చాడు, ఆ నిర్ణయం '- షేక్సియర్‌ అన్నట్టు - అతన్ని కష్టాల కడలిలో ముంచేసిందంటే 'నమ్మండి.

ఈ అమ్మాయేమో: పురాణాలు, హరికధలు చెప్పుకునే వాళ్ళ కుంటుంబానికి చెందింది. అద్దమంత స్వచ్చంగా కనబడుతోంది.. పరిశుద్ధమైన అంతరాత్మ కలిగున్న వాళ్లెవరన్నా వున్నారా అంటే అది యీ అమ్మాయే అయుండాలి. పైగా వాళ్ళత్తయ్యేమో ఎప్పుడు చూసినా. పురాణాలు, హరికథలు చెప్పే వాళ్ళతోనే పొద్దుపుచ్చుతున్నట్టు కనిపిస్తోంది. కాత్యాయినికి తగినవాడుగా తనని కనక వాళ్ళు భావించాలంటే మరి తనకి కూడా. సాధు సంపర్శం వున్నట్టు, ఆ గుణాలు అబ్బినట్టు వాళ్ళ కళ్ళకి కనబడాలి. ఇంత వరక్రైతే తను అల్లరి. చిల్లరిగా తిరిగి జీవితాన్ని అనుభవిస్తూ మూడు సార్లు పోలీసుల చేతికి చిక్కి ఫైను కట్టి తప్పిచుకున్నాడు. ఈ క్ష ణాన్నించి మాత్రం నీతి నియమాలతో గడిపితే ఆ అమ్మాయీ, వాళ్ళత్తయ్యా తన ప్రవర్తనని చూసి, “అమ్మో! అంటూ అబ్బుర పదడతారుగ్గా అని 'మోహన్రాజు మనసులో అనుకున్నాడు,

, ఈ ఆధ్యాత్మిక సభల సందర్భంగా ఏర్పాటు చేసిన విక్రయాల్లో వచ్చే లాభాలన్నీ సమాజసేవకే అంకితం అని సీతారావమ్మగారు చెప్పగానే వుష్పాంగిపోయి గుండెల్నిండా. గాలి పీల్చుకుని మోహధన్రాజు యిలా ఏకరువు పెట్టాడు: సమాజసేవకి వాళ్ళింతగా తాపత్రయ పడుతున్నందుకు తనకెంతో సంతోషంగా: వుందన్నాడ్రు, తను కూడా అంతే నన్నాడు, యిప్పుడే కాదు సర్వకాల సర్వావస్థల్లోనూ అంతేనన్నాడు. తనకి పరిచయ మున్న కుర్రాడొకడికి అసలు సమాజసేవంటే ఏవిటో తెలియదన్నాడు, సూదికి గుచ్చి పట్టుకొచ్చి

చూపించినా వాడు గుర్తుపట్టలేడన్నాడు, అలాంటి వాళ్లని తనెప్పుడూ దూరంగా వుంచు తానన్నాడు. అసలు నాకు మంచి వాతావరణంతో బాటు సమాజసేవ యిచ్చి చూడండి, యిహ మిరు నా గురించి పట్టించుకోనకృల్లేదన్నాడు. తను ఎంతగా దాన్లో మునిగి పోతానన్న'సంగతి గురించి మిరు నిశ్చింతగా. వుండవచ్చన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోయేసరికి ముచ్చటపడి సీతారావమ్మగారు. అప్పుడప్పుడు మా యింటికి వస్తూ వుండు నాయనా అని. ఆహ్వానించటం, దాన్ని చాలా తరచుగా వాడుకోవాలని మోహన్రాజు 'సంకల్పించటం వడివడిగా: జరిగాయి.

ఆ తరవాత కొన్ని వారాలపాటు. జరిగిన సంఘటనల వివరాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదండీ. ఒక్క విషయం మాత్రం చెప్పితే చాలు - పరిస్థితి ఎంత వరకొచ్చిందంటే మోహన్రాజు తాడేపల్లివారి బంగళాకి. వెళ్ళిన ప్రతిసారీ మహా గొప్ప సాధువులా కనబడసాగ్గాడు, చివరికి సాధుగణమంతా మావాడ్ని గురించి చెవులు కొరుకునే పరిస్థితికొచ్చింది. తను మెచ్చిన్మ తనకి నచ్చిన పిల్లకి మంచి మంచి వుద్ధంధాలు కొని తెచ్చిచ్చేవాడు. తన ఆదర్శాలని గురించి ఆమెకి చెబుతూ వుండేవాడు. వాళ్ళింట్లో భోజనం చెయ్యమన్నప్పుడల్లా బొబ్బట్లు కాని, గారెలు కాని ఎంత రుచిగా వున్నా సరే మారు వడ్డించుకునేవాడు కాదు. అలా అమితంగా తినడం ఆర్భాటంగా, అధార్మికంగా భావిస్తున్నట్టు చేతల్లో 'కనబడేలా: చేశాడు. ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు అభిమానిస్తారని అనుకున్నదాంట్లో పొరబాటు పడలేదని త్వరలోనే తెలుసుకున్నాడు. అప్పుడప్పుడు ఆ అమ్మాయి తన వంక వింతగా చూడటం, ఆ చూపులో యిది కల్మా నిజమా అన్న 'సంశయం స్ఫురింప చేస్తూ కనబడటంతో ఆమెకి తన మాద (ప్రేమ మొగ్గ తొడిగిందని మోహన్రాజు రూఢి పరుచుకున్నాడు - తనకి తనే,

ఆ అమ్మాయిని మంచి చేసుకుంటూ క్రమంగా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా. తాడేపల్లివారి బంగళాకి వెళ్లినప్పుడల్లా సీతారావమ్మగారి అక్క కొడుకు రాధాకృష్ణమూర్తి అనే కుర్రాడు తరచుగా అక్కడ తారసపడుతుండటం మొదట్లో కొంచెం. యిబ్బంది కలిగించింది మోహన్రాజుకి, రాధాకృష్ణమూర్తి రచయిత, నవలలు రాస్తాడు. అయితే, ఏదో పిల్లి నోట్లో కరుచుకొచ్చిన పదార్ధంలా. కనిపించె మామూలు రచయితల్లా కాకుండా చూడ్డానికి చక్కగా అందంగా వుంటాడు.. దానికితోడు హుషారుగా, చలాకీగా. అందరో్తో కలిసిపోతాడు.. అతనుందేది తాదేపల్లివారి బంగళాలో కాకపోయినా: తరచుగా అక్కడికొచ్చేవాడు. అతని రాక్కా మోహన్రాజు రాకా కాకతాళీయమవటం, అలా జరిగి నప్పుడల్లా అతను కాత్యాయినితో చాలా కలుపుగోలుగా స్నేహంగా ప్రవర్తిస్తూ వుండటం చూసి మోహన్రాజుకి బాధ కలుగుతుందేది.

అయితే వరసలో వాళ్ళిద్దరికీ బావా మరదళ్ళ బంధుత్వం వుండటంతో కొంత వెసులుబాటు యివ్వాల్సి వచ్చినా వాళ్ళిద్దరి వ్యవహారం మోహన్రాజుకి నచ్చలేదు. మరికొన్ని

రోజుల తరవాత రాధాకృష్ణమూర్తి యిక్కడివాడు కాదనీ, టెలీ ఛానెల్లో పనిచేసే కుమారి యమున అనే పిల్లతో అతనికి పెళ్ళి కుదిరిందనీ తెలీడంతో తృప్తిగా వూపిరి పీల్చుకున్నాడు, మనసుకి వూరట లభించింది. మోహన్రాజుకి ఆ మనిషి పట్ల వున్న అభిప్రాయం పూర్తిగా: మారిపోయి, రాధాకృష్ణమూర్తి చాలా మంచివాదనీ, అతనో స్నేహం 'పెంచుకోవాలనీ అనిపించింది. ఓరోజు సాయంత్రం తాదేపల్లివారి బంగళాకి దినచర్య లాగా మోహ(న్రాజు వచ్చినప్పుడు కాత్యాయినితో కబుర్లు చెబుతూ కూచున్న రాధాకృష్ణమూర్తిని చూడగానే ఆప్యాయంగా బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు.

దానికి రాధాకృష్ణమూర్తి కృతజ్ఞతలు చూపిస్తూ, “ఇప్పటికైతే నా ఆరోగ్యం దివ్యంగా వుందండీ, అయితే రేపీపాటికి ఎలా వుంటానో ఎవరు: జోశ్యం చెప్పగలరు? మోహ(న్రాజు గారూ, ఇవాళ రాత్రికి నాకు కళోర పరిశ్రమ వుందండీ బాబూ. నా పుస్తకాల్ని పబ్లిష్‌ చేసే మహానుభావుడు - తంగిరాల ప్రకాశరావు అనే ఆయన - హైదరాబాదు నించి దిగాడు.ఆయనో కలిసి యివాళ రాత్రి డిన్నరుకెళ్ళాలి, మిరెప్పుడన్నా తంగిరాల ప్రకాశరావు గారితో డిన్నరు చేశారా? అని అడిగాడు.

తంగిరాల 'ప్రకాశరావుగారితో డిన్నరు చేసే భాగ్యం తనకు దక్కలేదన్నాడు

'అదో విశిష్టమైన అనుభవం అనుకోండి/ ఆమాట అనేసి ఏదో ఆలోచిస్తూ తల అడ్డంగా పంకిస్తూ రాధాకృష్ణమూర్తి లేచి అక్కడినించి వెళ్లిపోయాడు,

ఆ నవలా రచయిత మోద మోహన్రాజుకి కొత్తగా అభిమానం పుట్టుకొచ్చింది, అందుకని అతనలా దిగులుగా వెళ్లడం చూసి కలవరపడ్డాడు, రాధాకృష్ణమూర్తి చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడని కాత్యాయినితో అంటే ఆమె ఒక్కనిట్టూర్వు విడిచింది.

“కిందటిసారి ఆయన వచ్చినప్పుడు డిన్నరుకెళ్ళిన వుదంతాన్ని గుర్తు చెసుకుని అలా అయ్యాడు.”

“ఏం జరిగిందేవిటి?*

“దానిగురించి మరీ వివరంగా చెప్పలేకపోయాడు. మెదడు మసకబారి పూర్తిగా స్థంభించిపోయిందని మాత్రం చెప్పాడు. అతనికి గుర్తున్నదల్లా * మర్నాడు పొద్దున బెడ్రూంలో కటికనేల మాద పడుకుని వుండటం, కిటికీ రెక్క మోద వాలిన పిచ్చుక కిచకిచమంటూ చేసిన కాస్త చప్పుడుకి భయంతో పైకప్పు దాకా వగరడమూను. బుర్ర బొప్పి కట్టిందని చెప్తాడు రాధాకృష్ణమూర్తి బావ.”

“అంటే మీరనేది ముందురోజు రాత్రి మితం లేకుండా తాగేడదనా?'

“సాక్నాధారాలన్నీ దాన్నే బుజువు పరుస్తున్నాయి మరి.”

రావె నా చెలియా 120 'సరదాగా కాసేపు

'కొంచెం అలా అయిందని చెప్పక తప్పదండీ. ఈ మత్తు పదార్థాల్ని సేవించి మనిషి ఏలాంటి ఆనందం పొందాలని చూస్తాడో నాకైతే అర్దం కాదు. తాజా నిమ్మరసం ఎంత వుల్లాసం, వుత్తేజం యిస్తుందోకదండీ.. నేనైతే అది తప్ప మరోటి ముట్టుకోనండి,!

'మారు అందర్గాంటివారు కాదులెండి విలక్షణం.

"నేనూ అదే అనుకుంటూ వుంటా.”

కాత్యాయిని అతని వంక వింతగా, ఏదో ఆలోచిస్తున్నదానిలా. చూస్తూ, *మారు చాలా మంచివాళ్ళు, నిదానంగా వుంటారు?” అంది.

ఇంతకన్నా మంచి సూచన మరింకేం కావాలనుకు న్నాడు మోహన్రాజు, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.

'కాత్యాయిన్స, ఐ లవ్‌ యూ అన్నాడు మోహనై్రాజు,

శఉహో అలాగా?' అంది కాత్యాయిని,

“మోకి ష్టమైతే, మిరొప్పుకుంటే మి మ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుంది, యిష్టమెనా?'

“లేదు! అంది కాత్యాయిని,

దాంతో మోహన్రాజు విస్తుపోతూ చూశాడామెని,

'లేదు,!

'అంటే నన్ను పెళ్ళి చేసుకోవటం మోకు యిష్టం లేదంటున్నారా?”

ఇప్పటిదాకా తను చెప్పిందానికి క్లుప్తంగా అదే అర్దం కదా అంది కాత్యాయిని, ఆమాట అని రెప్ప వాల్చకుండా: అతని వైపోసారి చూసి, బుజాలెత్తి కుదించి గదిలోంచి

బయటికెళ్లింది..

మోహన్రాజు యింటికి తిరిగెళ్ళి రాత్రి చాలా పొద్దపోయేదాకా గదిలో వంటరిగా కూచుని కాత్యాయిని అలా వింతగా ఎందుకు ప్రవర్తించిందా అని ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచించిన కొద్దీ ఆమె ప్రవర్తనని వంటబట్టించుకోలేకపోయాడు. గత కొన్ని వారాలుగా తను వాళ్ళింట్లో వ్యవహరించిన తీరుని సింహావలోకనం చేసుకుంటే

  • ఆధ్యాత్మిక పరమైన కుటుంబానికి చెందిన యువతిని, విధి తనకి భార్యగా అను గ్రహించిన దానిని, ఆకర్షించగల నడవడి ఏదన్నా వుందా అంటే సరిగ్గా అది - యిన్నాళ్ళూ తను చూపించిన ప్రవర్తనే కదా అని నిర్ధారించుకున్నాడు. భీమునిపట్నంలో తాదేపల్లివారి బంగళాలో భాగోతుల మోహన్రాజు అనుచరించిన నడవడి ఆమెకి' తృప్తి కలిగించకపోతే, మరి కాత్యాయిని తనకంటే మరింత గొప్పవాడ్ని కోరుకుంటోంది గావుల్ను అని అనుకున్నాడు. ..

అలా ఆలోచిస్తూ సరిగ్గా రాత్రి ఒంటిగంట అయ్యేసరికి ఆ అమ్మాయి అన్నది

నిజం కాద్సు పెళ్ళికాని ఆడపిల్లలకి సహజంగా వుండే. బిడియం, సిగ్గు మూలాన అలా 'సేరదాగా కాసేపు 121 రావె నా చెలియా

డైలాగులు మరిచిపోయి. వూర్మే ఏదో అని వుంటుందనే నిర్ణయానికొచ్చాడు. తను రూపొందించుకున్న థియరీని వెంటనే పరీక్షించి చూడాలనుకున్నాడు.. రాత్రి చాలా పొద్దుపోయింది, అయినా వ్లద్రేక పూరితుదైన పడుచు (ప్రేమికుడు గడియారం వంక్ష చూడడు. మా భాగోతుల వంశీకులందరిలానే మోహన్రాజుకి కూడా కర్తవ్యం ముఖ్యం. కుర్చీలోంచి ఒక్క వుదుటున 'లేచాడు, బట్టలు మార్చుకున్నాడు, వీధిలోకి ఒక్క గంతు వేశాడు, బయట వున్న మోటర్‌ బైక్‌ మిదకి ఒక్క దుముకు దుమికాడు, సరిగ్గా నలభై నిమిషాల తరవాత తాడెపల్లివారి బంగళా గుమ్మం ముందు నుంచుని కాలింగ్‌ బెల్లు చాలాసేపటికి ఆ యింట్లో పనిచేసే అప్పలసూరి ఆవలిస్తూ తలుపులు తెరిచాడు. అప్పలసూరి మొహంలో కోపం స్పష్టంగా కనిపించింది, దానికి కారణం మావాడు వూహించలేకపోయాడు. 'పైగా'మొహమాటం లేకుండా సీతారావ మ్మ గోర్సు అమ్మాయగోరు పట్నంలో హరికధ యిండానికెళ్లార్ము వొచ్చేందుకు పొద్దుపోద్ది అన్నాడు విసుగ్గా, “పోన్లే, వాళ్లొచ్చే దాకా లోపల కూచుంటాలేవయ్యా, అన్నాడు మోహన్రాజు. అక్కదే మావాడు పప్పులో కాలేశాడు. అతనా వాక్యం పూర్తి చేసే లోపలే దభీమని తలుపులు మూసుకోటంతో నిశ్శబ్దంగా వున్న రాత్రిలో మనవాడు వంటిరిగా మిగిలాడు. మహా వుద్రిక్తతతో వున్న పడుచు (ప్రేమికుడు తన ప్రియురాలి అత్రయ్యగారి బంగళా బయటున్న తోటలో నిశ్శబ్దంగా వున్న రాత్రి సమయంలో వంటరిగా మిగిలిపోతే - హో, అలానా మరి, సరే యివాళ్లికి యింతట్లో వదిలేద్దాంలే” అనుకుంటూ యింటికి పోయి హాయిగా పడుకోడు. నాలుగడుగులు వెనక్కి జరిగి యింటికి ఎదురుగుండా నుంచుని ప్రియురాలి బెడ్రూముకున్న కిటికీ వైపే శ్రధ్ధాసక్తుల్లో భక్తి పూర్వకంగా చూస్తూ నుంచుంటాడు. మన మోహన్రాజులా అతనికి కూడా ఆమె బెడ్రూం కిటికీ ఏదో తెలీకపోతే కనిపిస్తున్న కిటికీలన్నీ మార్చి మార్చి చూస్తూ, ప్రతిదాన్నీ భ క్తిశద్ధలో పరిశీలిస్తాడు మర. మోహన్రాజు సరిగ్గా యిప్పుడు ఆ పనే చేశాడు. మిద్దె మాద ఎడమ 'వైపునున్న రెండో కిటికీ నించి దృష్టిని ఎడమ. వైపునున్న మూడో కిటికీకి మారుస్తుండగా వెనకనించి ఏవరిదో గొంతు వినిపించడంతో - నిఠారుగా నుంచుని చేసే "హైజంపులో ఆసియా. “ఆ, మై డియర్‌ ఫ్రెండ్‌ మోహన్రాజూ, మిరిక్కడ కలుస్తారనే అనుకున్నాన్లెండి,” అన్నాడు రాధాకృష్ణమూర్తి - ముందు వినిపించిన గొంతు అతనిదే, ఏవిటి , ఆవిడగారి కిటికీ వంకే చూస్తూ నిలబడ్డారా? (ప్రేమించే రోజుల్లో నేనూ. మీలానే యిలా కిటికీల వంకే చూస్తూ నిలబడేవాడిని, ఇంతకన్నా ఆరోగ్యకరమైంది లేదంటే నమ్మండి. చల్లటి వాతావరణంలో ఆరుబయట నిలబడి పరిశుద్ధమైన గాలిని పీలిస్తే వూపిరి తిత్తులకి చాలా మంచి చేస్తుంది? డాక్టర్లందరూ: యిచ్చే సలహా కూడా యిదేనండోయ్‌. కానీ, వూర్మే రావె నా 'చెలియా 122 సరదాగా కాసేపు

కిటికీ వంక చూస్తూ నిలబడితే సరిపోతుందా అని మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న నా జవాబు మాత్రం'సరిపోదు అని, గురూగారూ, మొరు అవలంబించాల్సింది యింతకన్నా శ్రేష్టమైన పద్ధతి. నచ్చిన యువతిని మెప్పించడానికున్న మార్గం, సరైన పద్ధతిని పాటించటమేనండి. అయితే మా దగ్గిర అది మాత్రం లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. మా మరదలు - అలాంటిదే ఏదో వెధవ చుట్టరికం అనుకోండి. - మాద మిరు చూపిస్తున్న గాధావేశాన్ని యింతకాలం నేను కేవలం పుత్రవాత్సల్యంతో గమనిస్తూ వచ్చాను. గురూగారూ, ఒక పడుచు పిల్ల హృదయాన్ని దోచుకునేందుకు కీలకమైన విషయాన్ని మాత్రం మిరు పట్టించుకోకపోవటం చూసి నాకు ఆశ్చర్యమేసింది. అదేవిటంటే. - ్రేమ గీతాలాపన, ఆఅవిడగారి కిటికీ కింద నుంచుని హార్నొనీ పెట్టో, ఫిదేలో వాయిస్తూ -రావే నా చెలియా, నా జీవన నవమాధురి నీవే.;: అంటూ ఆమె జడలో నలిగిన ఒక్క గులాబ్‌ పువ్వనో, మల్లె పువ్వనో మి మోదికి విసరమని ఎప్పుడన్నా పాడేరా? నాకు తెలిసినంత మేరకైతే లేదనే చెప్పాలి. కనక మై డియర్‌ మోహన్రాజూ, మారు పూనుకున్న పని విజయవంతం కావాలంటే యిలాంటి పొరబాట్లని గుర్తించి వీలైనంత త్వరగా 'ప్కీన్‌ ప్లేలో తగిన మార్పులు చేసుకుని ఆచ రించాలండీ నిజానికి ప్రగాఢమైన తన ప్రేమని దాదాపు కొత్త మనిషెవరో కూచుని విశ్లేషించటం మోహన్రాజుకి నచ్చలేదు కానీ, అతని బుర్ర యిప్పుడు. మరో కోణంతో నిండి వుంది. పక్కనున్న మనిషి ముఖ కవళికలు మసక చీకటిలో సరిగా కనిపించక పోయినా, వొణుకు తున్న గొంతు. బట్టి లక్షణాలేమిటో వెంటనే గ్రహించగలిగ్లాడు. ఇలాంటి లక్షణాలు దేన్ని 'సూచిస్తాయో తెలుసుకోటానికి యిదివరలో అతనికి లెక్కలేనన్నిసార్లు అవకాశం కలిగింది, అందువల్ల యీ మనిషి పూర్తిగా పీకెల్లోతు తాగి, మైకంతో తూలుతున్నాడని సులభంగా వెల్లడైంది, శారీరక బలహీనతలకి లొంగి గంటల తరబడి పానకాల స్వామిలా తాగుతూ వుండిపోయాడని నిర్ధారించుకున్నాడు మోహన్రాజు, తనని గురించి మౌనంగా విమర్శ జరుగుతున్నట్టు (గ్రహించిన రాధాకృష్ణమూర్తి విపులీకరించాడు. మోహన్రాజుగారూ, నేను పూర్తిగా మత్తు పానీయాల వశంలో వున్నట్టు మారిప్పటికే [గ్రహించుంటారు. అయినా నాకు తెలీకడుగుతున్నా, ఎవరుండరండీ? తంగిరాల అండ్‌ సుమాణం బుక్‌ పబ్లిషింగ్‌ కంపెనీ, దోమల్‌గూడా, హైదరాబాదుకి చెందిన తంగిరాల ప్రకాశరావుగారితో సాయంత్రం నించీ గడిపినవాడు ఎలా మడి కట్టుకుని కూచోగలడండీ? ఒకసారి యిల్లాదిలి బాదరబందీల్ని దూరం చేసుకున్న పబ్లిషరు _- బోనులోంచి తప్పించుకున్న సింహం కన్నా రెచ్చిపోతాడు. ముక్కు మిదికి జారిపోతున్న కళ్లజోడుని అస్తమానం పైకి తోసుకుంటూ వుండే రచయితల్లో రోజుల్రోజులు గడిపే పన్లిషరు - ఒక్కరోజు యిలాంటి ఆటవిడుపు దొరగ్గానే పురి విప్పుకున్న నెమలిలా నాట్యం చేస్తాడు. గుండెల్నిండా గాలి పీల్చు కుంటాడు. తనకు తోచినట్టు చేస్తాడు. కొన్ని గంటల వ్యవధిలో సరదాగా కాసేపు 1203 రావె నా. చెలియా

తంగిరాల 'ప్రకాశరావునీీ ఆయన కూడా వున్న యీ గెస్ట్‌న్‌ మూడు బార్లనించీ, ఒక హోటల్నించీ బయటికి 'గెంటేశారంటే నేను చెప్పేది మోకు అర్థమైందని తలుస్తాను. తప్పో వాప్పో గానండీ, పైకప్పుకి బిగించిన సీలింగ్‌ ఫ్యాన్లు - కోడిగుడ్లతోనూ, సున్నుండలతోనూ కొట్టటానికేనని ఆయనగారి అభిమతం, సంచారానికి బయల్దేరే ముందే సంచి నిండా సున్నుండలు కోడిగుడ్లు నింపి బుజాన వేసుకునొచ్చాడు. దూరం నించి పరిగెత్తుకుంటూ 'వచ్చి. కపిల్‌ దేవ్‌ బౌలింగెలా చేస్తాడో నాకు చూపిస్తూ కూచున్నాడు. దీనికి మన. దగ్గిర వుండవలసిందల్లా మంచి లాఘవం, దాంతోబాటు గురి అని నాకు రన్నింగ్‌ కామెంటరీ చెబుతూ వరసగా సున్నుండల్నీ,: కోడి. గుడ్లనీ "పైన తిరుగుతున్న సీలింగు ఫ్యాన్లకేసి కొడుతూ కూచున్నాడు.”

'అలాంటాయన్ని వదిలించుకుని వచ్చినందుకు. మిరిప్పుడు చాలా హేపీగా ఫీలవుతున్నారనుకుంటా.! |

'అయ్యొ, ఆయన్నింకా వొదిలించుకోలేదండి, చిన్నప్పుడు నేను తిరిగిన ప్రదేశాలు, ఆడుకున్న 'చోట్లు చూపించమంటే యిక్కడికి తీసుకొచ్చానతన్ని. పుట్టి పెరిగింది: రాజ మండ్రిలో, నిజానికి చిన్నప్పుడు నేనిక్కడ ఆడుకోనే లేదు కాని ఆ తేడా ఆయనకేం తెలుస్తుందిలెండి.. కుక్కని తిప్పుతూ. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడాయన.”

“సాయంత్రం ఓ కుక్కని కొన్నాడులెండి.. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటి కొనడం ఆయనకో అలవాటు. ఓసారైతే కోతి. పిల్లని కొనడం చూశాన్నేను. మరి నేవెళ్లి గురువుగారెక్కడున్నారో వెతికి పట్టుకుంటే నయమనుకుంటా౫ అంటూ రాధాకృష్ణమూర్తి

అతను వెళ్లిన రెందే. రెండు నిమిషాలకి మోహన్రాజు జీవితంలోకి. ఆ కుక్క ప్రవేశించింది,

బలిష్టంగా వేట కుక్కలా వుందది, పైగా కోపంతో రుసరుసలాడుతున్నట్టు కూడా కనిపించింది. దాని వైఖరిని బట్టి - తన యజమాని మోద ఎవరో పగ పట్టారని అప్పుడే గుర్తించినట్టూ, ఆ ముఠాకి నాయకుడు మరెవరో కాదు మోహన్రాజేనని గమనించినట్టూ =: అతని మాదికి వురికొచ్చే పద్ధతి చెప్పక చెబుతోంది. మావాడు తను అలాంటివాడిని కాననీ, అమాయకుడిననీ నాలుగు మాటలతో దానికి నచ్చచెప్పుకునుంటే అర్ధం చేసుకుందేదేమో గాని, మోహన్రాజు మాత్రం యింకా అక్కడే నుంచుని దాంతో మాటల్లోకి దిగటం వొట్టి అవివేకమనుకున్నాడు. అనుకున్నదే తడవు తక్షణం దగ్గిరున్న చెట్టెక్కేసి దాని మాద కూచోడం క్షేమదాయకమని ఆ పనే చేశాడు. ఒకప్పుడు - బాగున్న రోజుల్లో

  • కాత్యాయిని దగ్గిర్నుంచి మావాడు నాలుగు రుద్రాక్షమాలలు, అరడజను గీతా ప్రెస్సు వారి పుస్తకాలు, రెండు దీపం కుందుల్లూ డజను అగరొత్తుల ప్యాకెట్లు కొన్నది ఆ చెట్టు కిందనే అవటం తమాషా. రావె నా చెలియా 124 సరదాగా కాసేపు

చెట్టు చివర్న గుబురు కొమ్మల్లో మావాడు దాక్కుని కూచున్నాడు. రౌడీ వెధవలు రెక్కలు కట్టుకుని వున్నట్టుండి మాయమవడం ఎప్పుడూ చూడకపోడంతో చెట్టు కిందున్న కుక్క మాత్రం ఖంగారు పడుతూ, 'నేలని వాసన చూస్తూ = పారేసుకున్న గుండుసూది కోసం వెదుకుతున్నవాడిలా - అక్కడే హడావిడిగా గుండ్రంగా చుట్లు చుడుతోంది. కాసేపటికి వెదకటం మానేసి తిడుతున్నట్టు సన్నగా మూలిగి వెళ్ళిపోయిందా కుక్క మరికాసేపటికి మోహ(న్రాజు తను కట్టుకున్న గూడునించి కిందికి చూసేసరికి - రాధాకృష్ణమూర్తితోపాటు యింత లావుపాటాయన బీరు బాటిల్ని మెడ దగ్గిర పట్టుకుని నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో,.. అని పాడుకుంటూ రావటం గమనించాడు. వాళ్ళిద్దరూ చెట్టు కిందికొచ్చి నిలబడ్డారు.

“అయ్యొ, నా (ఫ్రెండు మోహన్రాజు గురించి మోకిప్పుడే చెప్పాను గదా గురూగారూ, చూస్తుంటే వెళ్ళిపోయాడనిపిస్తోంది. మోకు గుర్తుండొచ్చు - మా మరదలు కాత్యాయినిని విపరీతంగా: (ప్రేమించాడతను. నేను కూడా: నా వైపు నుంచి వీలయినంత సాయం చేద్దామనుకున్నా మోరిషుడు పాట పాడుతుంటే గుర్తొచ్చిందండ్కీ యిలాంటి విషయాల్లో మొదటి అడుగు - (ప్రేమగీతం పాడటం. మావాడింకా ఆలాపనే చెయ్యలేదు. ఐతే అతనికృడ లేడుకదా మరి (ప్రేమగీతాలెలా ఆలపిస్తాడని మిరు అడుగుతారని తెలుసులెండి. అది నిజమేగానండి, నాటకం వేసే రోజున తీరా అసలైన నటుడు రాకపోతే ఏం చేస్తారండి? కాస్తో కూస్తో గాత్రం వున్నవాడిని వెంటనే పట్టుకొచ్చి నిలబెడతారా లేదా? అంచేత అతనికి బదులు నేనే ఆ స్థానాన్ని భర్తీ చేద్దామనుకుంటున్నా చేతులో గిటార్నో హార్మొనీ పెట్టో వుంటే బ్రహ్మాండంగా వుండేదనుకోండి. అవేవీ లేనందుకు మిరే కొంచెం పక్కనుంచి (శ్రుతి కలిపితే సరిషోతుంది, క్షమించాలి, తమరేదో అన్నట్టన్నారు?”

తంగిరాల ప్రకాశరావు కొబ్బరికాయ కొట్టకుండా నాటకం ఆరంభించకూడదని గొణుక్కున్నాడు.

(ప్రదర్శన నిర్విఘ్నంగా సాగాలంటే తెర తీసే ముందు కొబ్బరికాయ కొట్టి, మంగళ హారతి యిస్తూ పరాబ్రహ్మ పరామేశ్వరా.., అంటూ పాడాలయ్యా. సంప్రదాయాల్ని తూచా. తప్పకుండా పాటించాలి మరి” అంటూ ప్రకాశరావు చేతులో వున్న బీర్‌ బాటిల్ని మేడమిోది కిటికీకి గురిచేసి లాఘవంగ్గా: విసిరాడు. కిటికీ అద్దం భళ్లుమంటూ పగిలి ముక్కలు ముక్కలైంది.

“ప్రదర్శన విజయవంతంగా సాగుతుందింక, ఫో? అన్నాడాయన,

తల పట్టుకుని కూచోడం యిప్పుడు రాధాకృష్ణమూర్తి వంతయింది,

“గురూగారూ, మరోలా భావించనంటే ఒకవిషయం చెబుతానండి. తమరు కార్యక్రమాన్ని తలకిందులు చేశారండి. స్టేజిమోద కొబ్బరికాయ కొడతారండి ఎవరైనా, కొబ్బరికాయతో స్టేజినే బద్దలుకొట్టరండి.' అలా అన్ని, మెడమిదున్న కిటి కీలోంచి అప్పలసూరి తల బయటకి 'పెట్టి తొంగిచూస్తూ వుండటం గమనించి, “అయినా అనుకున్న ఫలితం సాధించాం, సరదాగా కాసేపు 125 రావె: నా 'చెలియా

మనకిప్పుడు. ప్రేక్షకులు కూడా జమకూడారు గురూగారూ. ఏమిటయ్యా, ఏదో అడుగుతున్నావ్‌?” అంటూ అప్పలసూరిని అడిగాడు.

“'ఎవరక్కడ? గద్దిస్తూ అడిగాడు అప్పలసూరి.

“నేనయ్యా, మోహన్రాజుని మాట్లాడుతున్నానయ్యా, ఆమాటకొస్తే పాటుతు: న్నానయ్యా,' అన్నాడు. రాధాకృష్ణమూర్తి, రావే నా చెలియా... అన్న పాట పాడటం ఆరంభిస్తూ. మోహన్రాజు వులిక్కిపడ్డాడు 'చెట్టుమోద.

_ కిటికీలోంచి తొంగిచూస్తున్న తలకాయ కనబడగ్గానే తంగిరాల ప్రకాశరావుగారిలో వుత్సాహం రెట్టింపైంది. తన ప్రతిభని చూపించే అవకాశం దొరికినందుకు మురిసి పోయాడు. విజృంభించిన కపిల్‌ దేవ్‌ బౌలింగ్‌ని 'ప్రత్వక్షంగా' మరోసారి చూడగలిగే అదృష్టం రాధాకృష్ణమూర్తికి దొరికింది దూరం నించి పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ దిక్కుగా విసిరిన కోడిగుడ్డు -' కాస్త కూడా అటూ యిటూ కాకుండా గురిచేసిన చోటుకి సరిగ్గా చేరుకుంది.

“హబ్బ, మిడిల్‌ స్టంప్‌ లేచిపోయింది చూడవయ్యా” అన్నాడు ప్రకాశరావు. సంతృప్తితో. ఆమాట అని యిహ ఆ రోజుటి. కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చినవాడిలా అక్కడినించి కదిలి వెళ్ళాడు. రాధాకృష్ణమూర్తి సిగరెట్టు తీసి వెలిగించి రెండు దమ్ములు పేల్చాడో లేదో సీతారావమ్మగారి నౌకరు - అప్పలసూరి - చేతులో పెద్ద దుద్దుకర్రతో పక్కనొచ్చి చేరాడు.

కుక్కల్ని తరుముతున్నావా, అప్పలసూరీ?' అంటూ పలకరించాడు రాధాకృష్ణమూర్తి.

'రాదాకిస్టమూర్తిగోరూ దండాలయ్యా. మోహన్రాజుగోరి కోసం యెతుకుతుం డానయ్యా; అన్నాడు అప్పలసూరి గొంతు నిండా రోషంతో. చెట్టుమోదున్న మోహన్రాజు యిదేవిటి నాకోసం 'వెదకడం 'ఎందుకు అనుకుంటూ విస్తుపోయాడు,

'మోహన్రాజా? ఇప్పటిధాకా యిక్కడే వుండెగదయ్యా, కాసేపటి ముందు చూశానతన్ని ఆయన్లో నీకేమన్నా స్పెషల్‌గా పనుందా ఏవిటి?”

“నా"పెకారం ఆడంగులు తిరిగొచ్చే లోపట ఆయనగోర్ని పట్టుకుని. గదిలోపలెట్టి

“ఎందుకయ్యా, ఏం చెశాడేవిటి అతను? మోహన్రాజు కూడా అవును ఏమిటి నా' అపరాధం అనుకుంటూ ఆశ్చర్యపోయాడు.

'నేను పడుకునే గది కిటికీ కింద నుంచుని పాటలు పాడుతూండారయ్యా.' నేనా?

'బహుశా నువ్వంటే అతనికి చాలా యిష్టమై వుందొచ్చయ్యా. ఇంతకీ ఏమంటూ

'ముందేమో రాయే నా సెలియా.., అంటూనండయ్యా. ఆ తరవాత నాకర్దమైనంత వొరంకెతే నా కొప్పులో నలిగిన ఓ గులాబి పువ్వు తీసి తనకి యిశిరయ్య మంటూనయ్యా!! రావే నా చెలియా 126 సరదాగా కాసేపు

“విశిరావా మరి?!

“మంచిదేలే. గులాబిపూలు చాలా ఖరీదుగా.

“అంతేకాదు నా మొహం మిదికి కోడిగుడ్డేసి కొట్టారయ్యా. నేనా? అనుకుంటూ మళ్లీ నివ్వెరపోయాడు మోహనై్రాజు,

“ఓహో అలాగా, అందుకేనా నీ మొహం నిండా సాన కారుతోంది... ఈమధ్య రకరకాల బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయిగా, నున్నగా నేవళంగా వుండాలంటే పడుకునే ముందు మొహానికింత బురద పూసుకోమని సలహా యిచ్చారేమో అనుకున్నా. అప్పలసూరీ, అదంతేనోయ్‌, పడుచురక్తం కదయ్యా.”

'మోహన్రాజున్న వయసులో రక్తం అలా చిందులు తొక్కుతుండటం మామూలే. ఈ పడుచువాళ్ళున్నారే కొంతవరకు వాళ్ళని: చూసీ చూడనట్టు సర్దుకు పోతుండాలోయ్‌.!

'కానైతేనయ్యా,. తేల్లారగట్ట మూడు గంటలకి కిటికీ కింద నుంచుని షాడ్డమ్నూ కోడిగుద్దేసి కొట్టటమూ సరి. కాదండయ్యా.'

'్లాదులే, అక్కడే కొంచెం అతిగా ప్రవర్తించాడనిపిస్తుంది. అయితే యివాళ సాయంత్రం నించి అతను మహా వుత్తేజంగా వున్నాడయ్యా, రాత్రి మేమిద్దరం కలిసే డిన్నరు చేశాం, ఆట్రైములో మూడు బార్లనించి, ఒక కాఫీ హోటల్నించి మమ్మల్ని బయటికి గెంటేశారు. నెత్తిమోద' తిరిగే సీలింగు ఫ్యాన్లని సున్నుండలేసీ, కోడిగుడ్లేసీ కొడుతూ వౌలింగ్‌ చేస్తూ కూచున్నాడయ్యా. హల్లో!” ఎవరో నీళ్ళ గుంటలో పడ్డ చప్పుడు దూరం నించి వినిపించటంతో, *మా 'స్నేహితుడొకాయన బావిలోన్నో బురదగుంటలోనో పడ్డట్టున్నాడయ్యా. నేను పోయి చూశొస్తా. సాయం కావాలతనికి మరి, అంటూ వెళ్ళి

చెట్టుమాద గుబురు కొమ్మల్లో దాక్కుని కూచున్న మోహన్రాజుకి యిదంతా అయోమయంగా తోచి రాధాకృష్ణమూర్తి గబగబా అడుగులెసుకుంటూ వెళ్ళటం గమనించి సంతోషించాడు. అప్పలసూరి కూడా అతన్ని అనుసరించక పోవడంతో ఆ సంతోషం సగం సంతోషంగానే మిగిలింది. అప్పలసూరి మాత్రం ఏమైనా సరే ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నట్టు కనిపిస్తోంది. ఆందుకని మోహన్రాజు కూచున్న చోటునే బిగుసుకుపోయాడు. అంతలో ముందు 'గేటు దగ్గిర కారు ఆగటం; కారు దిగిన సీతారావమ్మ గారూ, కాత్యాయిని గేటు తెరుచుకుని లోపలికి రావటం అతనికి కనిపించింది.

'అప్పలసూరీ!' అంటూ సీతారావమ్మగారు పొలికేక 'పెట్టింది. అర్ధరాత్రిపూట 'నౌకర్లు యింటి బయట తిరుగుతుండటం ఆవిడకి కొత్త అనుభూతి, బహుశా ఆవిదే కనక మంచి పెంపకంలో పెరిగుండకపోతేనూ, పురాణాలు, 'హరికధలు చెప్పేవాళ్ళతో పరిచయాలు సరదాగా: కాసేపు 127 'రావె 'నా: చెలియా

లేకపోతేనూ, “ఏవిటీ ముదనష్టపు రభస?” అంటూ కళ్ళెర్ర చేసుండేదని చెట్టుమాద నించి యిదంతా గమనిస్తున్న మోహన్రాజుకి తోచింది. =

'దండాలండమ్మగోర్లూ,” అన్నాడు అప్పలసూరి,

'ఏవిటిద్హి యింత రాత్రప్పుడు ఏం చేస్తున్నావిక్కడ?'

'మోహన్రాజుగోరికోసం యెదుకుతున్నానమ్మా.!

'దేన్నీ!!

“ఎవర్ని! అంటూ అడగటం సబబు కాదా అని మనసులో చర్చించుకుంటున్నట్టు ఆ నౌకరు ఒక్క నిమిషంపాటు తటపటాయిస్తూ ఆగి, ముందు చెప్పిన విషయాన్నే మళ్లీ

'కానీ మోహన్రాజు యిక్కడ లేడుగదయ్యా?!

“అవునమ్మా,

“తెల్లావారురూమున మూడు గంటలకా?'

“అవునమ్మా. సరిగ్గా రెండు గంటలకనుకుంటా, అయన యీదిగుమ్మం. బెల్లు కొట్టారు. తవంరు లేరని సెప్పి యెంటనే తలుపు మూశా, దాంతో బవుశా యెల్లిపోయుంటా రనుకున్నా అయితే అలా కాదని తరవాత్తెలిసింది. పది నిమిషాల కిందట నిండు బీరు బాటిల్ని గొంతు దగ్గిర పట్టుకుని నా కిటికేసి యిసిరి కొట్టారమ్మా.. ఏవిటా సప్పుడని కిటికీ లోంచి తొంగి సూత్తే రాయే నా సెలియా... అంటూ పాట పాడి, నా కొప్పులో నలిగున్న గులాబి పువ్వు తనకి యిశిరయ్యమని కూడా పాడారమ్మా. ఆ తరవాత కోడిగుడ్డు తీసుకుని యీడ్చి నా. ఎడం కంటి గుద్దు కేసి కొట్టారమ్మా. అయ్యో యిందులో నా ప్రమేయం ఏమి లేదు పిన్నిగారూ అని మోహన్రాజు చెట్టు మాద చేతులూపాదు కాని, నోరు మెదపలేదు,

అప్పలసూరి చెప్పిందంతా విన్న కాత్యాయిని ఆశ్చర్యంతో కెవ్వున కేక వెయ్యటం చెట్టు మోదున్న మోహన్రాజుకి వినిపించింది. సీతారావమ్మగారు అంతకన్నా విడ్డూరపడుతూ వొదిలిన నిట్టూర్చులో' ఆ కేక అణగారిపోయింది.

“ఏవిటి నువ్వనేది, భాగోతుల మోహన్రాజు యింతపని చేశాడా?"

“ఆ, అవునమ్మా, ఇయ్యాల సాయంత్రం నించీ మోహన్రాజుగోరు యిట్టాంటి పన్లే సేత్తుండారని వుప్పుడే రాదాకిస్ట మూర్తిగోరు సెప్పారమ్మా. ఆళ్ళిద్దరూ కలిసి డిన్నరు సేశారంటమ్మా. రాదాకిస్టమూర్తిగోరి పెకారం మోహన్రాజుగోరి మూలానే ఆయన్నీ ఆయనగోరి స్నేయితుల్నీ మూడు బార్లనించి, ఒక కాఫీ హోటల్నించి బయటికి తన్ని తగిలేశారంటమ్మా రాదాకిస్టమూర్తిగోరు - 'పదుచోళ్ళకుండే సురుకుదనం వల్ల యిట్లా జరుగుతా వుంటాది, యిట్టాంటియి సూసీ సూడనట్టు వదిలైమనీ 'సెప్పారమ్మా. నేను మాత్రం పెద్దమనసు సూపిత్తూ అంత సులబంగా తీసుకోలేనండమ్మా.

సతారావమ్మగారు కాసేపు మౌనంగా వుండిపోయింది. విన్న సమాచారాన్ని జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టిందావిడకి. ఇంతవరకూ తను పిల్లాడిని సాకినట్టు రావె నా చెలియా: 126. సరదాగా: కాసేష

మోహన్రాజుని అల్లారు ముద్దుగా. చూసుకుంటే చివరికది పాముకి పాలు. పోసి పెంచినట్టయిందని బాధపడింది. ఇప్పుడావిడ స్థిమితంగా ఆలోచించి. పరిస్థితిని అర్దం చేసుకుంది,

“ఈసారి కనక ఆ 'మోహన్రాజు నా గడప తొక్షితే, అప్పలసూరీ, 'నేను యింట్లో లేనన్‌ చెప్పి పంపించెయ్‌... వవిటద్మి ఏదో చప్పుడు వినిపించింది, ఏవిటది?* ఆ చప్టుడు - భంగపాటుతో మోహన్రాజు గొణుగుతున్నట్టు మూలిగిన మూలుగు,

'నాకైతే ఏవరో మూలిగినట్టు వినిపించిందయ్యా.

“సెట్టల్లోంచి యీస్తుండే గాలి అప్పుడప్పుడలాంటి సప్పుళ్లు సేస్తుందమ్మా,!

“నువ్వన్నది కూడా నిజమే కావొచ్చు. గాలి వీచేటప్పుడు తరచూ చెట్లనించి అలాంటి చప్టుడొస్తుందిలే. నీకు వినబడ్డదా, కాత్యాయినీ?'

“నాక్కూడా ఏదో చప్పుడు వినిపషించిందత్తయ్యా.?

'ఏదో గొణిగినట్టు వినిపించింది నాకైతే.!

'మూలుగో, గొణుగుడో, సంక్షోభంలో వున్న (ప్రేతాత్మ దవడల్నించి బయటికి లాగినట్టు వచ్చిందది/” సీతారావమ్మగారు అన్మి మసక చీకట్లోంచి ఏదో ఆకారం బయటికి రావటం -చూస్సి 'రాధాకృష్ణాకో అంటూ అరిచింది.

రాధాకృష్ణమూర్తి అభయహస్తం యిస్తున్నట్టు అక్కడున్న వాళ్ళ వైపు చెయ్యూపాడు, “హల్లో యిక్కడున్నారా. హల్లో, హల్లో, హల్లో హల్లో!

“అబ్బే ఏంలేదు పిన్నీ ఈ సాయంత్రం మొదలైన కార్యక్రమానికి ముగింపు పలుకుతున్నానంతే. అయ్యొ, మళ్ళీ మరిచిపోయే లోపల చెప్పేస్తానుండండి. మా పబ్లిషరాకాయన అటుకేసున్న బురదగుంటలో పీకల్లోతు నీళ్ళలో పడ్డాడు. వేసుకున్న బట్టలు వూడదిసి (ప్రస్తుతం గొడ్లపాకలో వొళజృ, బట్టలూ ఆరబెట్టుకుంటున్నాడు. మారెవరన్నా పనిమోద అటెళ్ళినప్పుడు దిగంబర పబ్లిషరు కనక దర్శనమిస్తే దయచేసి చూడనట్టు (ప్రవర్తించండండోయ్‌, వాహోయ్‌!!

“తప్పతాగి వొళ్ళు తెలీకుండా పేల్తున్నావ్‌, రాధాకృష్ణా, పీకెల్దాకా తాగినట్టున్నావ్‌.

“తంగిరాల అండ్‌ సుమాణం బుక్‌ పబ్లిషింగ్‌ కంపెనీ, దోమల్‌గూడా, "హైదరాబాదుకి చెందిన తంగిరాల ప్రకాశరావుగారితో డిన్నరు చేస్తి మాకు భాగోతుల మోహన్రాజు తోడుగా వున్నప్పుడు ఎవరన్నా మడికట్టుక్కూచోగ(ల్రా పిన్నీ అన్నట్టు యిప్పుడే బావి దగ్గిర గులాబిరంగులో వున్న ఖద్గమృగాల. గుంపు చూశ్నా అవి చాలా క్రూరమృగాలు, అందు లోనూ యిప్పుడవి జతకూదే. సీజను కూడా. మనిషిని చూడంగానే అమాంతం సరదాగా: కాసేపు [129 రావె నా చెలియా

తొడ పట్టుకుని కొరికేస్తాయి. అటువైపుకి వెళ్ళద్దని మోహన్రాజుకి వార్నింగివ్వాలి. అతని

గురించే వెదుకుతున్నానసలు.” మోహన్రాజు చెట్టు మోద తల పట్టుకు కూచున్నాడు. కాత్యాయిని నోరు విప్పింది, ఆ అ మ్మాయి గొంతు వాణుకుతోంది. రాధాకృష్ణమూర్తి బావా!

'మోహన్రాజు గురించి అప్పలసూరి చెప్పిందంతా నిజమెనంటావా?!

“ఏం: చెప్పాడేవిటి?'

'అప్పలసూరి. కిటికీ కింద నుంచుని పాటలు వాడటం, అతని మొహానికి కోడిగుడ్డేసి కొట్టడం?”

“ముమ్మాటికీ నిజం. 'పైగా వాటికి ప్రత్యక్ష 'సాక్షిని నేను.” రామ. రామ యిదేం అన్యాయంరా బాబూ అనుకు న్నాడు చెట్టు మాదున్న మోహన్రాజు,

సీతారావమ్మగ్గారు గాలి పోసుకున్నట్టు మరింత వూరిపోయింది.

“'రేప్పాద్దున్నే కూచుని భాగోతుల మోహన్రాజుకి ఘాటైన వుత్తరం రాసిపారేస్తా లాయరు నోటీసులా. కోర్టు పరిభాషలో రాస్తా, నాయింట్లో మళ్ళీ అడుగుపెట్టలేడింక ... అదిగో నుళ్ళీ. స్పష్టంగా మూలుగే వినిపించింది. .ఈ తోటని భూత (ప్రేత పిశాచాలు ఆవహించి నట్టున్నాయ.!

ఆమాట అని ఆవిడ అక్కడ్నించి కదలబోతుంటే రాధాకృష్ణమూర్తి కలవరపడ్డాడు.

“పిన్నీ గొడ్హపాక కేసయితే వెళ్ళడం లేదుగదా మిరు?

“ఇంట్లోకెడుతున్నా. అప్పలసూరీ, ఓ గ్లాసు నిండా వేడి వేడి పాలు తెచ్చి 'పెట్టునా గదిలోకి,”

'మంచిదమ్మా, అలాగేనండమ్మా.!

సీతారావమ్మగారు యింటి వైపుకి కదిలింది, అప్పులసూరి ఆవిడని అనుసరించాడు. కాత్యాయిని. వలవలా వెక్కివెక్కి వడుస్తూ వుండటం గమనించి రాధాకృష్ణమూర్తి ఆందోళన పద్దాడు,

“హలో, నీకేం కష్టమొచ్చింది, కాత్వాయినీ?”

లికవుతున్న 'రేడియేటర్లా ఆ పిల్ల ఏడుపు దిగమింగుకుంటోంది.

'నేనెన్ని కష్టాల్లో చిక్కుకున్నానో నీకేం తెలుసు బావా, మననారా (పేమించినవాడిని చెతులారా వోగొట్టుకున్నా..

“ఆఖరిసారి ఎక్కడ కలిశావతన్ని?”

కంపిస్తున్న గొంతుతో 'కాత్యాయిని. బాధపడుతూ యిలా చెప్పింది; “నిజానికి మోహన్రాజులో యింతటి శౌర్యప్రతాపాలు దాక్కున్నాయ నాకెలా తెలుస్తుంది? నేనేమో అతనొట్ట్‌ ఆముదం. మొహం లాంటివాదని యిన్నిరోజులూ తలుస్తుంటే తీరా అతను కాస్తా నౌకర్లని కోడిగుడ్లతో కొట్టడమే కాదు, బీరు బాటిళ్ళతో కిటికీ అద్దాల్ని పగలకొట్టే రావె నా. చెలియా 13౮ సరదాగా కాసేపు

స్పోర్ట్‌మెన్‌ స్పిరిట్‌ని దాచుకున్న గొప్పవాడని యిప్పుడు తెలిసింది బావా, ఇంత లోతు మనిషని. కల్లో కూడా నేను వూహించలేదు. అదేవిటో తమాషా, మేము మొదటిసారి కలిసినప్పుడే అతనంటే నాకు చాలా ఆకర్షణ కలిగింది, కానీ రోజులు గడుస్తున్న కొద్ది అతనో పరమ బోరనిపించింది. చెక్కబొమ్మలో ఎంత రొమాన్సుందో యితన్లో కూడా అంతే రొమాన్సుందని అనుకునేదాన్ని అయితే తనలో యింత ప్రతిభ దాచుకుని, నాన్నగారు చెబుతుండేటట్టు - నివురు కప్పిన నిప్పులా వున్నాడన్నమాట.. ఇప్పుడేం చెయ్యాలో నాకు దిక్కు తోచడం లేదు, బావా, ఇ లవ్‌ హిమ్‌, ఐ లవ్‌ హిమ్‌, ఐ లవ్‌

“అతనికీ నువ్వంటే యిష్టమేగా, మరింకేం యిముడంతా' కుదిరినట్టే మరు

'మికభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్ళి చేసుకుందామా అని యివాళ మధ్యాహ్నం నన్ను అడిగితే దుప్పటి దులిపినట్టు తిప్పికొట్టాను.!

“ఇప్పుడు మనసు మార్చుకున్నానని చక్కగా మంచి వుత్తరం రాస్తే సరిపోతుందిలే,!

కాలాతీతమైంది బావ్మా టూ లేట్‌ ఇంత (ప్రజ్ఞా పాటవాలున్న కు'ర్రాణ్సి యీపాటికి ఎవరో ఒకరు ఎగరేసుకు పోయుంటారు బావా, నాకు దక్కడు. అయ్యో, మరిప్పుడు ,,+

అలా యింకా! మాట్లాడు తుందేదే కాత్యాయిని, బహుశా "నేనేం చెయ్యాలి?' అ ౦టూ దానికి జతపరిచి వాక్యాన్ని పూర్తిచేసుండేది. * ఆ లోపల ఆమె నోట్లోంచి మాటలు స్పాంజితో పీల్చినట్టు లాగబడకుండా వుంటే, చెట్టు మాదనించి ఆప్యాయం, అనురాగం నింపుకున్న గొంతొకటి '“ఒహోయ్‌!' అంటూ అరవటంతో పైకి చూడగానే మావాడి మొహం కనిపించింది ఆ అమ్మాయికి,

వున్నట్టుండి ఎక్కడినించో వూడిపడ్డ మోహ(న్రాజుని చూడగానే ఆనందం పట్టలేక హడావిడిలో నాలిక కొరుక్కుంది కాత్యాయిని. 'మ్మొ-మ్మొ-మ్మొ-మోహన్‌!' అంటూ గటిగా అరిచింది, /

“ఏవండోయ్‌, మోహన్రాజుగారూ, చెట్టు మోద కూచుని ఏం చేస్తున్నారు, గుడ్లు పొదుగుతున్నారా ఎవిటి?” విచారించాడు రాధాకృష్ణమూర్తి.

'ఇదిగో చూడమ్మాయ్‌, నువ్వు అన్నదంతా. విన్నాన్నేను. నిజంగానే చెబుతున్నావా?” అంటూ అక్కడినించే గట్టిగా అరుస్తూ అడిగాడు మోహన్రాజు.

“అ-అవును, అ-అవును, ఒకసారి కాదు రెండుసార్లు కాదు, వె-వె-వెయ్యిసార్లు

“నువ్వు నన్ను నిజంగానే డ్రేుమిస్తున్నావా?

'అయ్యు, నిస్సందేహంగా"

"నా భార్యగా వుండటం నీకిష్టమేనా?!

“కోర్టు ఆదేశాలు కూడా నన్నాపలేవు.

“బ్రయితే మరి... నువ్వేమి అనుకోనంటే మళ్ళీ మళ్ళీ యిబ్బందుల్లేకుండా ఒకేసారి

తేల్చుకుంటా... నేనిప్పుడు కిందికి దిగొచ్చి నీ మొహమ్మిద 'ముద్దుల వర్షం కురిపిస్తే అభ్యంతరం లేదుకదా?! .

“అబ్బే, ఏమాత్రం అభ్యంతరం లేదు,

“ఇంకేం మరి, యిదిగో ఒక్క నిమిషంలో నీ దగ్గిరకి వాల్తాను.”

వాళ్లిద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు, అది కనక విజయా పిక్సర్సువారు చూసుంటే నాలిక కరుచుకుని రీళ్ళకు రీళ్ళు కత్తిరించి పారేసుండేవారు.. ఆ తతంగాన్ని రాధాకృష్ణమూర్తి గమనించి వాళ్ళ 'సెంటిమెంటుని అర్ధం చేసుకుని తృప్తిగా శ్వాస వదిలాడు. 'తను కూడా (ప్రేమలో వుండటంతో రెండు హృదయాలు ఏకమైనందుకు ఆనందించాడు.

“ఆహా, ఆహా! అయితే మూ యువజంట పెళ్ళి చేసుకుని ఒకటై కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టనా?' అంటూ. అడిగాడు. 'సరే బావుంది, యిదిగో నాకిప్పుడే దొరికిన యీ నాలుగు నత్తగుల్లల్ని తీసుకోండి, అంటూ వాటిని మోహన్రాజు చేతులో పెట్టాడు. 'మో పెళ్ళికి నావైపు నించి చిరుకానుక,' అంటూ వివరించాడు. “ఇది మరీ. చౌకబారు బహుమానం అనుకోండి, :కానీ సూటిగా మనసారా యిచ్చింది. కానుక ఎవిటన్నది ముఖ్యం కాదు దాని వెనకాలున్న మంచి మనసు ముఖ్యమని మోకు తెలీదా అయిన్నా, ఏవంటారు? దేవుడు అంతా మంచే చేస్తాడండీ, గుడ్‌నైట్‌.. ఇహ నేవెళ్లి మా తంగిరాల ప్రకాశరావుగారి సంగతి ఎలా వుందో చూడాలి మరి. వొంటి మాద నూలుపోగు లేకుండా వొట్టి కళ్ళజోడు మాత్రం ధరించున్న హైదరాబాదు పబ్లిషర్ని మారెప్పడన్నా చూస్తుంటారా? ఓహ్‌, ఆ దృశ్యాన్ని తప్పకుండా 'చూసి తీరా లండ్వీ, అయితే అబలలకీ, మనోదౌర్చల్యం వున్నవాళ్ళకీ నెను మాత్రం రికమెండ్‌ చెయ్యనండీ.*

అలా అని చేతులో వున్న నత్తగుల్లల వంక సందేహంగా. చూస్తున్న మోహన్రాజుని వొదిలేసి రాధాకృష్ణమూర్తి చీకట్లోకి వెళ్లిపోయాడు. మోహన్రాజుకి వాటినేం చెయ్యాలో తోచలేదు, కాని పారెయ్యటం సమంజసం కాదనుకున్నాడు.

అతని బుర్రల్లో మంచి ఆలోచన తట్టింది.

“డార్లింగ్‌!

“ఏవిటి [ప్రియా?”

'నా రాణీ మా నౌకరు అప్పలసూరి పడుకునేదెక్కడో తెలుసా?!

“ఓ, బాగా తెలుసు'నా రాజా, ఎందుకు?!

'నేననుకునేది ఏవిటంటే యివి తీసుకెళ్ళి అతను కప్పుకునే దుప్పటి మడతలో దాచిపెడితే... అబ్బే, యిదో సలహా మాత్రమే సుమా.

“హబ్బ ఎంత గొప్ప ఆలోచనో, ఎంత మంచి సలహానో, మై డ్రీమ్‌ మేన్‌, పద యింకా పెద్ద పెద్ద ఆల్చిప్పల్ని కూడా వెదికి తెచ్చుకుందాం రా," మోజుపడుతూ అంది రావె నా చెలియా 132 సరదాగా. కాసేపు

శరద్రాత్రి సంబరాలు

ఆరోజు మా పానకుటీరంలో జనం: కిక్కిరిసి. వున్నారు. మధ్యాహ్నం జరిగిన గుర్రప్పందేల మూలంగా కస్టమర్లు ఎక్కువైనారు. రోజూ చీకటిపడే వేళ భాగోతుల 'సూతరాజుగారి నోటి 'వెంబడి జాలువారే కథల్ని ఆసక్తితో వినేవాళ్ళే కాక, మరో అరదజను కొత్త ముఖాలు అగుపిస్తున్నాయి, వాళ్ళల్లో చిందరవందర జుట్టుతో లార్డ్‌ అండ్‌ సోడా తాగుతున్న వాడి ముఖంలో ఎంచుకున్న గుర్రాలేవీ గెలవలేదని కొట్టొచ్చినట్టు చెబుతోంది, జీవంలేని కళ్ళతో నోరు తెరుచుకుని శూన్యంలోకి చూస్తూ కూచున్నాడు. స్నేహితులు హుషారెక్కిద్దామని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.

క్రమం తప్పకుండా: రోజూ అక్కడికి వచ్చే వీరాస్వామి ఆ మనిషి పడుతున్న బాధ చూసి జాలిపతాడు అన్నాడు.

*మ్రో స్నేహితుడికి యిప్పుడు కావలసిందేమిటో తెలుసా, ఉండ్రాజువారి ఉత్తేజామ్లం,.

అది విన్న కొత్త కస్టమరు రమ్మాకాంత్‌, 'ఉండ్రాజువారి ఉత్తేజామమా, నెనెప్పుడూ వినలేదే దాని గురించి?” అని అడిగాడు వుత్సాహం చూపిస్తూ. సరదాగా కాసేపు శ3వే శరద్రాత్రి సంబరాలు

భాగోతుల సూతరాజుగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి వివరించాడు దాని గురించి, “ఆయన అన్నది మా యింటి పక్కాయన ఉండ్రాజు కృపానందంగారి తమ్ముడూ రసాయన శాస్త్రంలో గొప్ప పరిశోధకుడూ అయిన ఉందడ్రాజు శాంతికుమార్‌గారు కనిపెట్టిన గొప్ప టాసిక్కు గురించండీ, ఆ కాలంలో రాజులు ఏనుగు అంబారీ ఎక్కి అడవుల్లో పులులూ, సింహాల వేటకి వెళ్ళినప్పుడు ఆ మృగ్గాల్ని చూసి ఏనుగులు భయపడి పారిపోకుండా ధైర్యంగా:వుండేందుకని ఆ మందు కనిపెట్టటం జరిగింది. అయితే, మనుషులు కూడా క్వచిత్తుగా పుచ్చుకున్నారు పుచ్చుకున్న వాళ్ళకి మంచి గుణం కనపరిచింది, కృపానందంగారి రెండో అబ్బాయి ప్రేమ్‌సాగర్‌ మిద ఆ మందు ఎంతో చక్కటి ప్రభావాన్ని చూపిన.వుదంతం ఆ మధ్య మావాళ్ళకి చెప్పుకొచ్చానులెండి.]

'మరి అతనికి వుత్తేజాన్నిచ్చిందా ఆ మందు?"

&ఓ, అంతా యింతా కాదండ్పీ, చాలా. గొప్పగా పనిచేసిందా మందు, వాళ్ళ బిషప్పుగ్రారు పుచ్చుకున్నప్పుడు కూడా అలాగే పనిచేసిందది. ఆ టాని క్కుంది చూశారూ, పుచ్చుకున్న కాసేపటి కల్లా మనిషికి మంచి వుత్తేజాన్న శక్తిన్మీ బలాన్నీ సత్తువనీ యిస్తుంది.

_ అన్నట్టు ప్రేమ్‌సాగర్‌ యిప్పుడెలా వున్నాడండీ?” అడిగాడు బీరాస్వామి.

“బాగానే. వున్నాడండీ. ఈరోజే అతని దగ్గిర్నుంచి వుత్తరం వచ్చింది. ఇప్పుడతను వాస్టరయ్యాడన్న విషయం మోకు చెప్పానో లేదో గుర్తులేదు. వల్తూరు చర్చిలో. టౌనుకు దగ్గర్హనె వున్న చిన్న పల్లెటూరు. వూరి చుట్లూ చక్కగా పచ్చటి 'చేలూ, కాలువలూూ, అమాయకంగా కనిపించే ప్రజలూ '-+-చాలా ప్రశాంతంగా వుంటుందా. వూరు.

'అప్పుడు. జరిగిన సంఘటన దరిమిలా మరేమన్నా కొత్త విశేషాలు జరిగినట్టు తెలిసిందా?"

నిమ్మకాయ తునకని విస్కీలో 'వేసుకు తాగుతూ గ్లాసు పూర్తి చేసి రిపీట్‌ అన్నట్టు ఖాలీ గ్లాసుని సుతారంగా టేబులు మోద కొడుతూ సూతరాజుగారు చెప్పారు. “మిరిలా అడగటం: ఆశ్చర్యంగా: వుంది. సుమండీ, ఇప్పుడే చెప్పానుగా జాబు 'రాశాదనిి; దాంట్లో అతను తమాషా అయిన వుదంతాన్ని రాశాడు. కొత్తూరి విజయరత్నం అనే కుర్రాడికీ, అరికెంపల్లి జ్యోత్స్నకూ మధ్య నడిచిన (పప్రమాయణం వర్చిస్తూ రాశాదతను. (ప్రేమ్‌సాగర్‌ భార్య కరుణకి స్కూల్లో చదివే రోజుల్లో జ్యోత్న అనే అమ్మాయి మంచి స్నేహితురాలు. ఆ మధ్య జబ్బుపడి కోలుకుంటున్న కరుణకి సహాయంగా. వుంటూ, ఆమెకు విశ్రాంతి యిచ్చేందుకు. వల్లూరు వచ్చి వాళ్ళ యింట్లోనే వుంటోంది: జ్యోత్స్న చర్చి తతంగంలో (ప్రేమ్‌సాగర్‌కి పై అధికారి అయిన బిషప్‌ బూషి శౌర య్యగారికి జ్యోత్స్న మేనకోడలు, పైగా ఆమెకి సంరక్షకుడు కూడా ఆయనే/

'ఓసారెప్పుడో ఉంధ్రాజువారి ఉత్తేజామ్లం పుచ్చుకున్నది ఈ బిషప్పేనా?'

'అవున్సు అతన్నే! చెప్పాడు సూతరాజుగారు. "కొత్తూరి విజయరత్నం విషయానికొస్తే కాస్తో కూసో భూమిో గట్రా: వున్నవాదే. అతను, వుందేది కూడా ఆ చుట్టుపక్కల 'వొాంతం లోనే. కాకినాడకి చెందిన కొత్తూరి వాళ్ళు.”

శరద్రాత్రి సంబరాలు 134 సరదాగా: కాసేపు

'విజయరత్నం. పేరు ఏవిటోగా వుంది, అన్నాడొక జిన్నయ్య:

“ఆ విషయంలో మాత్రం జ్యోత్స్న మాతో ఏకీభవించదండీ,” అన్నాడు సూతరాజు గరు. *చాలా గొప్పగా కనిపించింది ఆమెకా' పేరు; పడుచు హృదయాన్ని అతనికి సమర్పించింది, 'పెళ్ళి కూడా దాదాపుగా ఖరారైంది, దాదాపుగా అని. ఏందుకున్నానంటే

  • వాళ్ళిద్దరి పెళ్ళికి బిషప్పు బూషి. శౌరయ్యగారి అంగీకారం తప్పనిసరి. ఈ విషయం తమరందరూ విధిగా గుర్తుంచుకోవాలి. ఆయనగారు అబ్బాయి నచ్చలేదని తిరస్కరిస్తే మరి ఆ పెళ్ళి జరగటం కల్ల, .గ్రులాబీ రేకులు పరిచున్న జీవితపు బాటలో ఆనందంగా వాళ్ళిద్దరూ సంచరిస్తుంటే మొనతేలి వున్న యీ రాయి మూలాన కాలికి ఏదురు దెబ్బ తగలకుండా అధిగమించాలి, అయితే చాలా రోజులపాటు: కాముడు ఆ రాయినే కొట్టుకున్నట్టయింది.'

ఒక చల్లటి. సాయంత్రం పూట జరిగిన వుదంతంతో ఈ కథని ఆరంభించేందుకు ఎంచుకున్నాను (అంటూ 'సూతరాజుగారు కథకి వుషక్రమించారు). ప్రేమ్‌సాగర్‌ యింటి 'పెరట్లో వున్న తోట నీరెండలో వెలిగిపోతోంది. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు కరిగించి పోసిన బంగారంలా మెరుస్తూ తోటలో పొడుగ్గా విస్తరిస్తున్నాయి. విజయరత్నం, జ్యోత్నలు చెట్టు కింద ఎత్తుగా వున్న నాపరాతి బండ మిద కూచుని పచ్చిక మాద పడుతున్న నీడల్ని గమనిస్తున్నారు, అవి క్షణక్షణానికీ మరింత పొడు గ్గా సాగుతున్నాయి. ఆవరిస్తున్న నల్లటి చీకటి రాబోయే. అశుభాన్ని సూచిస్తున్నట్టు జ్యోత్నుకి అనిపించింది. అది తలుచుకుంటే వంట్లో వొణుకు పుట్టింది. వెలుతురులో మెరుస్తున్న పచ్చిక తన సుఖసంతోషాలకీ; దాని మాద పడుతున్న నల్లటి నీడ మరకలు రాబోయే వృపద్రవానికీ ప్రతిబింబాలుగా తోచాయి ఆమె మనసుకి.

'విజయ్‌, నువ్విప్పుడు బిజీగా వున్నావా?” అని అడిగింది.

'ఆ? ఏవిటీ? బిజీగా వుందటమా? ఓహో, ఏం చేస్తున్నాను అనా నీ అర్ధం? లేదు, నేనిప్పుడు ఏమి చెయ్యటం లేదుగీ జవాబు చెప్పాడు విజయరత్నం.

'అయితే మరి నన్ను ఘాట్టిగా ముద్దు పెట్టుకో ముందు, కోరింది జ్యోత్స్న.

దానికా కుర్రాడు, 'రైఠరో నువ్వన్నది అర్ధమైంది. మంచి. వషాయం, ఇదిగో తప్పకుండా యిప్పుడే," అన్నాడు.

చెప్పిన పని పూర్తి చేశాడ్యు కాసేపటిపాటు వాళ్ళిద్దరూ హత్తుకుపోయారు, మెల్లగా ఆ పిల్లని దూరం జరుపుతూ వీపు మాద గట్టిగా చరుచుకున్నాడు విజయరత్నం,

“చొక్కాలోపల పురుగేదో దూరినట్టుంది వీపు మోదికి, చెట్టు నించి రాలుండచ్చు,! వివరించాడతను. -

“మళ్ళీ యింకోసారి ముద్దు పెట్టుకోవా?” గోముగా అడిగింది జ్యోత్స్న సరదాగా కాసేపు 135 శరద్రాత్షి సంబరాలు

“వచ్చేస్తున్నా ఒక్క సెకెండాగు. ఇదిగో యీ పురుగో, మరేదో ముందు దీని సంగతి తేల్చి ఆ తరవాత నీ పని చూస్తా, వెన్నెముక మిద పైనుంచి కిందికి లెక్కేసి నాలుగో పూస (మోద గట్టిగా. ఒక్క దెబ్బెయ్యి. దాంతో మరోసారి ఆలోచించాలి ఆ పురుగు, అన్నాడు విజయ్‌.

ఆశ్చర్యంతో గట్టిగా అరిచింది జ్యోత్స్న.

'ఏవిటిద్మి పురుగుల గురించి మాట్లాడే. టైమా. యిది? ఆవేశంతో తీవ్రంగా మందలించింది. .

__ క్షమించమన్నట్టు తగ్గుగొంతుతో చెప్పాడతను; “జ్యోత్స్నా ఈ సంగతి నీకు తెలుసో తెలీదో యీ పురుగులున్నాయి చూశావ్‌, చొక్కాలోంచి వీపు మీదికి జారితే చాలు, ఏం. చేస్తాయో తెలుసా - ముందా వెన్నుపూస సంగతి చూడాలని ఒకటే పట్టుపడతాయి, నీక్కూడా. ఎప్పుడో 'ఒకసారి యిలాంటి అనుభవం కలిగుంటుందిల్సే నాకు తెలుసు. ఆషామాషీ వ్యవహారం కాదిది... ఇప్పుడది కిందికి దిగి అయిదో పూస దగ్గిర తచ్చాడుతోంది. నువ్వు కనక చెయ్యాడించి గట్టిగా నా వీపు మోద ఒక్క చరుపు చరిస్తే చచ్చి వూరుకుంటుంది.*

జ్యోత్స్న పిడికెలి బిగించింది. బుర్ర తక్కువ మనిషితో 'వేగలేని యువతులందర్లా యీమెకు కూడా ఆ మనిషి తత్వం చూసి విసుగు పుట్టింది.

'హోయి నా వెర్రిమాలోకమా, నువ్విలా వూర్మే పురుగుల గురించే వాగుతూ కూచుంటే ఆశాభంగం తప్పదు. నన్ను కనక ముద్దు పెట్టుకోవాలనుంటే వీలైనన్ని సార్లు చకచకా యిప్పుడే ముద్దులు కురిపించి వుక్కిబిక్కిరి చెయ్యి. ఈ రాత్రి నించీ నువ్వ చరిత్రలో భాగమై నిష్కమించబోతున్నావనే విషయం (గ్రహిస్తున్నట్టు లేదు.”

శఉహో, లేదు, అలా కాకూడదు. అయినా ఏందుకలా?'

"కాసేపట్లో మా శౌారయ్య మామ వస్తున్నారికడికి..

“ఎవర్వూ బిషప్‌ బూషి, శౌారయ్యగారా?”

“అవును. మా అత్తయ్య సరోజమ్మగారు కూడా”

“అంటే నీ వుద్దేశ్యం నేనంటే వాళ్ళకి యిష్టం లేదనా?

“అవును. మనిద్దరి సంగతీ వాళ్ళకి వుత్తరం రాసి తెలిషాను. నీ సంబంధం నచ్చలేదని మధ్యాహ్నం జాబొచ్చింది.*

“ఏవిటి, యిదేవిటి? నిజంగానా? వందుకిలా జరిగింది? ఏం బాలేదు!

“ఆ ప్రశ్నే లేదు” అని రాశాడు మామయ్య. పైగా దాన్ని అండర్‌లైన్‌ చేసి మరీ పంపాడు.

“నిజంగానా? నిజంగానే అలా అండర్‌లైన్‌ చేశాడా ఆయన?"

“అవును. పైగా రెడ్డింకుతో రెండు సార్లు చేశాడు.” శరద్రాత్రి సంబరాలు 136 సరదాగా' కాసేపు

ఆ కుర్రాడి ముఖంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. తొలుస్తున్న పురుగిప్పుడు వీపు కింది భాగానికి చేరి డాన్సు చేస్తున్నట్టు అనిపించింది. అయినా పట్టిరచుకోలేదతను, పురుగులే కాదు, మిడతలదండే వచ్చి కుట్టినా పట్టించుకునే స్థితిలో లేడిప్పుడు.

“కానీ 'నేనంటే ఆయనకి ఎందుకింత వ్యతిరేకత?”

'వూర్వ ఒకటేమో నిన్ను కాలేజీలోంచి వెళ్ళగొట్టారని ఆయన విన్నాడట.*

“అయితేనేం, ఎంతోమంది గొప్పవాళ్ళకి కూడా యిలాగే అయిందిగా, వాడి సంగతి చూడు, ఏవిటి -- వాడి పేరు. కవిత్వం రాశాడు 'షైలాక్‌: ఏదో అలాంటి పేరే."

“అదీ కాక నువ్వెప్పుడూ డాన్సులు చేస్తుంటావని తెలుసుకున్నాడాయన.!

“డాన్సులు చేస్తే తప్పేమిటంట? నాకీ విషయాలంత బాగా. తెలీవు కానీ సాల్‌ ముందర డేవిడ్‌ డాన్స్‌ ఆడలేదా? వాళ్ళేనో నేననుకునేది వేరే మరో జంటో? అదెలా వున్నా, ఎవడో ఒకడు యింకోడి. ముందు డాన్సు చేసిన సంగత్సీ ఆ. తరవాత అందుకు అతన్ని బాగా అభిమానించిన సంగతీ నాకు తెలుసు.

“డేవిడ్‌...”

అబ్బే నేను డేవిడే చేశాడంటం లేదన్న సంగతి. గ్రహించు, అతను. కాకపోతే చేసినవాడు శామ్యూల్‌ అవ్వొచ్చు కూడా.” .

'దేవిడ్‌..*

“లేకపోతే బిమ్నా కొడుకు నిమ్మా కూడా కావచ్చు, ఎవడో అలాంటివాడే/

“దేవిడ్‌' కానీ, శామ్యూల్‌ కానీ, బిమ్నా కొడుకు నిమి కానీ హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ లోకెళ్ళీ రికార్డింగ్‌ డాన్సులు చెయ్యలేదు! చెప్పింది జ్యోత్సు

ఆమె చెప్పింది వూరికి దూరంగా. కాలవొడ్డున అప్పుడప్పుడు వెలుస్తుండే నైట్‌ క్షబ్బుల సంగతి. ఇదైతే (ప్రేమ్‌సాగర్‌ చర్చికి అర మైలు దూరంలోనే వుంది.

దీని గురించి గోలపెడుతున్నాడా బిషప్పు? హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ ని ఆయన నిజంగా అసహ్విస్తున్నాడని అంటావా? ఎందుకు, కెథెడ్రల్సులా అదీ చాలా గౌరవప్రదమైన క్షబ్బని తెలుసుకోమను. దాని చరిత్రలో కేవలం అయిదంటే అయిదు మార్లు పోలీసులు 'రెయిడ్‌ జరిపినట్టు ఆయనకి తెలుసో లేదో? అసలు పక్కన కూచుని వివరంగా చెబికే [గ్రహిస్తాడాయన. ఆ ముసలాయన్ని కలిసి పూర్తి వివరాలు చెబుతా,”

వద్దంటూ తల అడ్డంగా వూపింది జ్యోత్ను.

లేదు, మాట్లాడి ప్రయోజనం వమి.వుండదు. ఆయన బుర్రలో ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది, వుత్తరంలో యింకా ఏీమేమి రాశాడంటే - పావలాకి కొరగాని లౌకిక వ్యక్తితో వివాహానికి తను అంగీకరించడం కన్నా, నేను లోతు భార్యలా ఉప్పు స్థంభ ంలా మారిపోతే సంతోషిస్తాడట్క ఆదికాండము 19 ; 26, అంతకన్నా యింకేం చెప్పాలి, కాదం టావా? అందుకని 'నేననేది ఏమిటంటే వెంటనే నన్ను దగ్గిరకి తీసుకుని నా మొహం మిద ముద్దులు గుమ్మరించు. ఇదే నీకు ఆఖరి అవకాశం.!

"సరదాగా కాసేపు శస శరద్రాత్రి సంబరాలు.

జ్యోత్స్న చెప్పింది సబబేనన్న విషయం విజయ్‌ (గ్రహించి ఆమె సలహాని పాటించే ప్రయత్నం చేయబోతుండగా యింటి వైపునుంచి - వచ్చే ఆదివారానికి పాడాల్సిన కీర్తనని సన్నగా వాడుతూ వస్తున్న గొంతు వినిపించింది. కాసేపవగానే ఆ యింటి గృహస్తు, రెవరెండు ఉండ్రాజు ప్రేమ్‌సాగర్‌ దూరంగా కనిపించాడు. వీళ్ళిద్దర్నీ చూసి పూల మొక్కల్ని అవలీలగ్గా గెంతేసి దాటుతూ తోటకి అడ్డంబడి. పరిగెత్తుకుంటూ రావటం గమనించాడు విజయరత్నం,

ప్రేమ్‌కుమార్‌ సమోపిస్తుంటే అసూయతో, *ఈ మనిషి ఎప్పుడు చూసినా శారీరకంగానూ, మానసికంగానూ మహా చలాకీగా వుల్లాసంగా వుంటాడు. వలా వుండగలుగుతున్నాడు. అలా?" అని అడిగాడు విజయ.

“దాని కిటుకేమిటో నిన్నరాత్రి చెప్పాడు. ఆయన దగ్గిరో టానిక్కుందట్క రోజూ క్రమం తప్పకుండా అది పుచ్చుకుంటాడట. దానిపేరు ఉండ్రాజువారి ఉత్తేజామ్లం రక్తంలో వుండే ఎర్రకణాల మిద నేరుగా ప్రభావం చూపిస్తుందట,! చెప్పింది జ్యోత్స్న.

'బిషప్పుకి కూడా ఓ లోటాడు. దాన్ని తాగిస్తే బావుణ్ణు, అన్నాడు విజయ ఆలోచిస్తూ. వున్నట్టుండి ముఖంలోకి కొత్త వెలుగొచ్చింది, “ఇదిగో, జ్యో, యిది కేవలం వూహాగానం మాత్రమె సుమా. అయినా వూహ చాలా బాగుంది కదూ? నాకైతే ఈ ఆలోచన చాలా నచ్చింది. ఆ బిషప్పే కనక కొంగలా బాటిల్లో ముక్కు ముంచి ఆ టానిక్కు తాగితే నేనంటే వున్న దురభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటాడు.!

జీవితంలో మంచి భార్యలుగా కాగోరే ఆడపిల్లలందరిలా జ్యోత్స్న కూడా - కాబోయే భర్త, భాగస్వామో యిచ్చే సలహాలు వొట్టి నాసిరకం, నిష్ప్రయోజనం; బుద్ధిహీనంగా ఎంచటం అలవాటు చేసుకుంది.

“ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు నేనెప్పుడూ విన్లేదు.!

“'నేననేది నువ్వు ఆమాత్రం (ప్రయత్నించడంలో తప్పేం లేదుగదా' అని. 'ప్రయత్నించమంటున్నాా అంతే, ఏమంటావ్‌?”

“లేదు, నేనలాంటి. పన్లు చెయ్యనే చెయ్యను.'

'అదికాద్ము నువ్వు కాస్త ప్రయత్నం చేస్తే వారిగిపోయేదేమి లేదుకదా అన, అంటే చూడు కొంచెం అని, తెలుసుగా నీకు, అన్నాడు విజయ్‌.

ఇప్పుడు మూడో మనిషి చేరటంతో దాన్ని గురించి మరింత లోతుగా చర్చించే అవకాశం చిక్కలేదతనికి. పాస్టరు (పేమ్‌సాగర్‌ వచ్చాడు. ఆప్యాయత వుట్టిపడు తూ పలకరించే స్నేహపూరితమైన స్వభావం వున్న (ప్రేమ్‌సాగర్‌ ముఖం గంభీరంగా వుందిప్పుడు.

'నాన్నా విజయ్మ్‌ నిన్ను తొందరపెట్టాలని కాదుగానీ బిషప్పుగారు సతీమణితో సహా యిప్పుడే రైలు దిగి యిటు బయళ్టేరారని తెలియబరచటం నా కనీస ధర్మం కనక చెప్పుతున్నా. నీ పరిస్థితిలో నేనుంటే యీపాటికి పారిషోయుండే వాడిని. వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును:. సామెతలు 14: 15, శరద్రాత్రి సంబరాలు 138 సరదాగా: కాసేపు

'సరే, అలాగేనండీ,” అన్నాడు విజయ్‌ ముడుచుకుపోతూ. ప్రియురాలి వైపు తిరిగి యిలా. అన్నాడు: “ఈ ఒక్క రోజు రాత్రికి ఎలాగో ఒకలాగు బయటపడి చిట్టచివరిసారి కాసేపు కాళ్ళు తొక్కేందుకు హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ కి రాగలవా? ఇవాళ శరద్రాత్రి సంబరాలు జరుగుతాయక్కడ. కాసేపు ఎగరొచ్చు మనిద్దరం. గుడ్‌ బై చెప్పుకునేందుకు అవకాశం దొరక పుచ్చుకుందాం, ఏమంటావ్‌?”

“లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు నేనెప్పుడూ విన్లేదు/ జ్యోత్స్న అలవాటుకొద్దీ అనేస్తి “ఓ, తప్పకుండా వస్తా," అంది.

“సరే మరి, రోడ్డు చివర్న సరిగ్గా పన్నెండు గంటలకి కలుస్తాన్నిన్ను” చెప్పాడు విజయ్‌.

గబగబా నడుస్తూ, చెట్ల మరుగులో కనిపించకుండా వెళ్ళిపోయాడు. దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది. జ్యోత్స్న: (ప్రేమ్‌సాగర్‌ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా వొత్తాడు...

“ఇదిగో అమ్మాయ్‌, దుఃఖం ఆపుకో, నిరాశ పడకు, గుర్తుంచుకో, అగాధసముద్ర జలము (ప్రేమను ఆర్పజాలదు, నదీప్రవాహములు దాని ముంచివేయజాలవు. పరమగీతము. 83 7].

“ప్రేమను ఆర్బటానికీ దీనికీ సంబంధం. ఏమిటో 'నాకేం అర్ధం కావటం లేదు,” విసుగ్గా అంది జ్యోత్స్న. “మాకున్న చిక్కల్లామా మావయ్యణ, రంగు రంగు..సిల్కు బట్టలు దుప్పటిలా చుట్టుకుని టోపీలో బూటు లేసులు కట్టుకు తిరిగేవాడు - విజయ్‌ని టెలిస్మోప్‌తో

జాలితో తల వూప్తుతూ 'ప్రేమ్‌సాగర్‌ అన్నాడిలా; *నాకా సంగతి బాగా తెలుసు. నా గుండె ద్రవించిపోతోంది నీ గురించి. నేను కూడా యిలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకప్పుడు. కరుణని పెళ్ళి చేసుకోవాలనుకుంటే నాకూ యిలాంటి ప్రతిబంధకమే వచ్చింది - మా మామగ్గారి రూపంలో.. ఆయన. ఎలాంటివాడో చూస్తే కానీ నమ్మలేవు. అస్తమానం కోపంతో ధూంధాం అంటూ ఏగురుతాడు. "పైగా, ఇనప పలుగుని అలాగ్గా వంచుతూ నడుం చుట్టూ బెల్టులా చుట్టుకోగల మనిషంటే నమ్ము. లౌక్యంగా ఆలోచించి చిన్నపాటి యుక్తి పన్నగ్గానే మనిషి దారిలోకొచ్చాడు. నీ విషయంలో కూడా అలాంటి య్తే వుపయోగించాలని అనుకుంటున్నా. నా బుర్రలో మంచి వుపాయం తొలవడం మొ, “బెట్టింది అప్పుడే. అదేమిటో చెప్పనుగాని, దీనికి విరుగుడు అదే అని మాత్రం నీకు భరోసా యిస్తా!

శ్రేమ్‌సాగర్‌, మోరెంత సహృదయులండీ,” నిట్టూరుస్తూ అంది జ్యోత్స్న.

శాస్త నలుగుర్లో గి౯గి ప్రజాసేవ చేస్తున్నందుకు నాకిది అలవడింది. 'ఈ వూరంతా అలాంటి వాళ్ళతో నిండిపోయుంది.. నువ్వు మాత్రం విచారించాల్సిన అగత్యం లేదు, పైగా యిన్నిరోజులపాటు 'నువ్వు కరుణని యింత బాగా కనిపెట్టుకున్నందుకు నీకు నేను సరదాగా: కాసేపు 139 శరద్రాత్రి సంబరాలు

బుణపడి వున్నాను కూడా, అందుచేత చివరికి అంతా. మంచిగా జరిగేలా చూస్తాను. ఇంత చిన్న విషయాన్ని కుదర్చలేకపోతే నేనింక ఏందుకు చెప్పు.

అలా ధైర్యం చెప్పి 'రెండు 'గెంతుల్లో మొక్సల్ని దాటేసి, మరో గెంతులో బెంచి మించి దూకేసి చర్చిలో పనులు చూసుకోడానికి. వెళ్ళిపోయాడు (ప్రేమ్‌సాగర్‌,

ఆరోజు రాత్రి భోజనాలప్పుడు డైనింగ్‌ టేబిలు దగ్గిర జ్యోత్స్న లేకపోవటంతో

(ప్రేమ్‌సాగర్‌కి వుపశమనం చిక్కింది కొంత. జబ్బుపడి కోలుకుంటున్న కరుణ గదిలోకే భోజనం తెప్పించుకుని ఆమెతో తిన్నది. జ్యోత్స్న అందుకే ఆమె వ్యవహారాన్ని స్వేచ్చగా కదిలించగలిగాడు. నౌకర్లు వెళ్ళిపోగానే ఆ పని మొదలెట్టాడు.

“ఇదిగో మారిద్దరూ చాలా మంచివాళ్ళు. మనం వంటరిగా వున్నాం కనక మన జ్యోత్సు విజయ్‌ల వ్యవహారం గురించి నేను చెప్పేషి దయచేసి కాస్త వినండి.!

ఏమాత్రం కూడా యిష్టం లేనందుకు బిషప్పుగారి సతీమణి మూతి ముడుచుకుంది. ఆవిడగారి శరీరం యింత లావునుండి బాగా పొడుగ్గా భారీగా వుంటుంది. యుద్ధంలో ట్యాంకు దళంలో పనిచేసిన 'ప్రమ్‌సాగర్‌ స్నేహితుడొకడు యుద్ధం రోజులు మళ్ళీ గుర్తుకొచ్చింది ఆవిడ మూలానే. కాన్మీ 'మరేదాని. వల్లా కాదు అన్నాడు. 'పైగా ఆవిడకి స్టీరింగ్‌ వీల్‌తో షాటు రెండు మెషిన్‌ గన్లు కనక తగిలించి యుద్ధభూమిలోకి తీసుకెడితే ట్యాంకు వస్తోందని భ్రమపడి. 'దారిలో ఎవ్వరూ ్రశ్నించరని కూడా అన్నాడు,

“ప్రేమ్‌సాగర్‌) ప్లీజ్‌” అందావిడ నిరుత్సాహపరుస్తూ.

అయితే ప్రేమ్‌సాగర్‌ నిరుత్సాహపదే మనిషి కాడు. ఉండ్రాజువారి వంశీకులందర్లా యితనికి కూడా ఎవరినీ లెక్క చెయ్యని గుండెబలం వుంది.

'వాళ్ళ విషయంలో మోరిద్దరూ పానకంలో పుడకల్లా అద్దు పడుతున్నారని విన్నాను. అది నిజం కాదని ఆశించవచ్చా?!

“ముమ్మాటికీ నిజం, (ప్రేమ్‌సాగర్‌, నేనన్నది తప్పంటావా శౌర్యం?”

“కాదు, కరెక్టే” చెప్పాడు బిషప్పు,

'ఆ పిల్లాడిని గురించి మేము చాలా జాగ్రత్తగా వాకబు చేసి సమాచారం 'సేకరించాం. దాన్నిబట్టి అతను తగినవాడు కాదని నిర్ణయించాం.

“ఏవంటున్నారు మిరు? నాకైతే చాలా మంచి కుర్రాడిలా కనపడ్డాడు, పాపం. అయినా మాకున్న అభ్యంతరం ఏవిటి?" అడిగాడు (ప్రేమ్‌సాగర్‌,

బిషప్పుగారి భార్య అది తలచుకోగానే వాణుకుతూ కూచుంది.

“మా భోగట్టా ప్రకారం యీ' పిల్లాడు అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా తరచుగా టౌన్లోకెళ్ళి డాన్సులు ఆడి రావటం కాకుండా, స్వచ్చమైన యిలాంటి ప్రదేశంలో కూడా కైతక్కలాడ్డాడట.. ఈ చుట్టుపకృల్నే అదేదో హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనే చోటు వుందిట

'అవున్ను యిక్కడికి దగ్గిర్లోనే వుందది, రోడ్డు చివర్లో. మోకు వెళ్ళాలనుంటే వెళ్ళవ చ్చు, ఈ రాత్రికి శరద్రాత్రి సందర్భంగా సంబరాలు జరుప్పుతున్నారట. ఇష్టమున్నవారు ఫాన్సీ డ్రెస్సు కూడా వేసుకోవచ్చట, చెప్పాడు ప్రేమ్‌సాగర్‌,

“ఈ పిల్లాడు రోజూ రాత్రిళ్ళు అక్కడే. గడువ్లతాడని మాకు సమాచారం అందింది, డాన్సు చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదు. పద్ధతి ప్రకారం నడిస్తే ఆనందంతోపాటు మంచి కాలక్షేపం కూడా అవ్వుతుంది. పడుచుదనంలో 'నేనూ తక్కువేం లేదు, రకరకాల డాన్సుల్లో పాల్గొనేదాన్ని చెప్పాలంటే చర్చి నిర్వాహకుల కుమార్తెల సంక్షేమనిధి కోసం విరాళాలు సేకరించే డాన్సు ్రోగ్రాంలోనే నేను నా కాబోయే భర్తని కలిశాను," గడగడా వల్లించింది బిషప్పుగారి భార్య |

“నిజంగానే? వావ్‌! అన్నాడు ప్రేమ్‌సాగర్‌ గ్లాసు ఖాళీ చేస్తూ.

“డాన్సు అనే మాటకి యీరోజుల్లో చెప్పుకునే అర్దం వేరు, నువ్విందాక చెప్పిన సంబరాల్లో చివరికి ఏమవుతుందో ఎలా ముగుస్తాయో తెలుసా? ముక్కూ మొహం తెలీని ఆడా మగా రాసుకుంటూ. పూసుకుంటూ' తిరుగుతారు, విదేశాల్లో అయితే ఏమైనా చెల్లుతుంది కానీ మన సంస్కృతిలో అది నప్పదయ్యా. కనక యీ పిల్లాడు హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ లాంటి చోట్లంతా వూర్కే తిరిగేవాడైతే స్వచ్చంగా వుందే మా మేనకోడలు జ్యోత్తుకి తగడని చెబుతున్నా వద్దు, నేనన్నది రైటేనంటావా, శౌర్యం?

“సరే అయితే మరి," అని లౌకికంగా సమాధానం చెప్పి రాబోయే సభల గురించి బిషప్పుతో చర్చించసాగాడు ప్రేమ్‌సాగర్‌.

పల్లెటూర్లో జీవనం సాగిస్తున్నందుకు పెందలాడే. నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు 'ప్రేమసాగర్‌. త్వరగా పడుకుంటే మర్నాడు పొదున్న ప్రసంగం తయారు చేసుకోవటానికి బుర్ర తాజాగా, చురు గ్లా వుంటుందని పదిన్నరకే నిద్రకి వుపక్రమించాడు (పెమ్‌సాగర్‌.: నిరాఘాటంగా ఎనిమిది గంటలపాటు హాయిగా పడుకుందామని తలిస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఎవరో బుజాలు పట్టుకుని కుదుపుతూ నిద్ర లేపుతుంటే కోపమొచ్చిందతనికి, మెల్లగా కళ్ళు విప్పి చూసేసరికి గదిలో లైటు వెలుగుతోంది. ఆ వెలుగులో బిషప్త్పు బూషి శౌారయ్యగారు మంచం పక్షనే నుంచుని వుండటం కనిపించింది.

“హల్లో, ఏమైందండీ? ఏమన్నా షారబాటైందా?! అడిగాడు ప్రేమ్‌సాగర్‌ ఆయన్ని బిషప్పుగారు ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ కోయవాళ్ళ పాటలు రాగం తీస్తున్నారు. ఆయన చాలా ఆనందోద్వేగాల్లో మునిగున్నాడు.

'అబ్బే అలాంటిదేం లేదబ్బాయ్‌,.. నువ్వనుకున్న దానికి పూర్తి విరుద్ధం, ఎలా వున్నావయ్యా; (్రేమ్‌సాగర్‌?' సరదాగా కాసేపు 11] శరద్రాత్రి సంబరాలు

'బానే వున్నాను, బిషప్పుగారూ,

'నువ్వు నా అంత 'హుషారుగా లేవని ఏంత కావాలంటే అంత పందెం కాస్తా చూస్కో అన్నాడు బిషప్పు. “ఈ వూరు గాలిలోనే ఏదో మహత్తు వుందయ్యాః అప్పుదెప్పుడో కాలేజీలో ఆగడాలు చేసిన రోజుల్ని గుర్తుకు తెప్పిస్తోంది యిప్పుడు. వావ్‌! యాహూ! ఓ యాకోబ్బూ నీ గుడారములు ఎంత బాగుగానున్నవి, ఓ ఇజ్రాయిలూ, నీ మందిరములు ఎంత బాగుగానున్నవి. సంఖ్యాకాండము: 4 ; 5" అలా అంటూ మంచానికి తలభాగంలో అడ్డంగా వున్న యినప కమ్మాని రెండు చేతుల్లో పట్టుకుని కాళ్ళు గాల్లోకి పైళత్తి తలకిందులుగా బేలెన్సు చేస్తూ జిమ్నాస్టులా నిలబడేందుకు ప్రయత్నించాడు.

చేష్టలుడిగి ఆయన్నే చూస్తూ కూచున్నాడు (ప్రేమ్‌సాగర్‌, ఆయన యింతగా పొంగుతూ. వురకలు వేస్తుంటే దాని వెనకాల ఏదో అదృశ్య శక్తి పనిచెస్తోందనుకున్నాడు.

ముందు కూడా అప్పుడప్పుడు బిషప్పుగ్రారు యిలా చలాకీగా: వుత్సాహంగా వుండటం చూశాదతను, చర్చి మతాధికారుల్లో ఈయనగారి 'సరసాలు, సల్లాపాలు చాలామందికి పరిచయం.

అలా రకరకాల భంగిమలతో శరీర వ్యాయామాలు ముగించిన తరవాత మంచం మోద కూచుని, “ఆహా, (ప్రేమ్‌సాగర్‌, పందేనికి తయారైన కోడిపుంజులా వున్నానని అనిపిస్తోందయ్యా. హుషారుతో వాళ్ళు సలిపేస్తోంది. బంగారంలాంటి రాత్రంతా నిద్రపోతూ వృధా చెయ్యడం: శుద్ధ దండగని సీతో కాసేపు బాతాఖానీ వేద్దామనొచ్చానోయ్‌. విషయం ఏవిటంటే -:ఆ మధ్యనోసారి జాబులో రాశావు చూడు, ఇక్కడ జరిపిన ఏదో వుత్సవాల్లో నువ్వు చాలా ప్రముఖ పాత్ర వహించావని - గుర్తుకొచ్చిందా? నాకు జ్ఞాపకమున్నంత మేరకి. నువ్వ కోయదొర వేషం. కట్టినట్టు గుర్తు, కదూ?” అడిగాడు బిషప్పు.

“అవును, నిజమే..

'నీ దగ్గిరికి ఎందుకొచ్చానంటే, (ప్రేమ్‌సాగర్‌,. ఆ కోయదొర వేషం, విగ్లూ కనక యింకా నీ దగ్గిరుంట్తే నీకు అభ్యంతరం లేకపోతే కాసేపు అరువి స్తావేమోనని అడగటాని కొచ్చా. అదెక్కడుందో తెలుసా?!

“ఎందుకండీ. యిప్పుడు మోకది?!

'పమ్‌సాగర్‌, ఎందుకండీ అని అడగొద్దయ్యా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయమల్లా - నా వుద్దేశ్యం మంచిదనీ, కేవలం సంఘానికి వుపయోగపడే లాంటిదనీ, నాకు ఆ వేషం కావాలనీ మాత్రమేనోయ్‌..

“అలా అయితే సరేనండి బిషప్పుగార్హూ రేపు పొద్దున్నే వెతికి తీసిస్తా మాకు. కోపంతో నుదురు చిట్లస్తూ బిషప్పు “పనికిరాదయ్యా. ఇలా బద్ధకంతో వాయిదాలు వెస్తూ, వ్యక్తి స్వాతంత్ర్యంలో జోక్యం కలగచేసుకుని చూద్దాంలే. అంటూ. జాప్యం చెయ్యడమనేది నీలో వుందని అనిపించనే లేదసలు నాకు.* అలా అని యిప్పుడు కొంచెం సౌమ్యంగా, 'సర్హే యింక మాటలు కాసేపు కట్టి పెడదాం. ఆ కోయవాడి వేషాన్ని బయటికి శరద్రాత్రి సంబరాలు 142 సరదాగా: కాసేపు

లాగు ముంద్భు రవ్వంత చలాకీతనం చూపించు, అన్నీ మరిచిపోదాం, సరేనా” ఇంతకీ ఎలా వుంటుందది?

'మామూలుగా కోయవాళ్ళందరూ కట్టుకునేదే, బిషప్పుగారూ,

“భలే, పసందుగా వుంది, తలకి కూడా ఏదో 'చుట్టుకోవాలనుకుంటా కదా?!

“గిరజాల జుట్టుతో వున్న విగ్గు తలకి అడ్డంగా .కుర్రోకురు అని రాసున్న అడ్డ

_ మహదానందపడి బిషప్పు, "ఆహా, ఆహా, ఎంత గొప్ప సంగతి చెప్పావయ్యా, అది కొంచెం యిచ్చావంటే ఈ రాత్రికి నిన్నింక కష్టపెట్టను, ద్రాక్షతోటలో నీవు ఈరోజు పడిన శ్రమకు తగిన విశ్రాంతి దొరకును. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు... ప్రసంగి త £ 12.

బిషప్పుగారు తలుపు మూసి వెడుతుంటే (ప్రేమ్‌సాగర్‌కి మనసులో. ఆందోళన పుట్టింది. ఆయనగారు యిలా మహా వుల్లాసంగా, వుత్తేజంగా' వుండటం కేవలం ఒకే ఒకసారి యింతకుముందు చూశాడు. రెండేళ్ళ కిందట యిద్దరూ కలిసి రావులపాలెం ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హైస్కూల్లో పెదిరెడ్డి శామ్యూల్‌ (ప్రభాకర్రెడ్డిగారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్ళినప్పటి సంగతి అది. ఆ సందర్భంలో ఉండ్రాజువారి ఉత్తేజామ్లం డోసు ఎక్కువ పుచ్చుకున్న ప్రభావంతో బిషప్పు కేవలం విగ్రహావిష్కరణతో సంతృప్తి పడలేదు, అర్దరాత్రి దాటేక దానికి ఎరుపురంగు 'పెయింటు పులిమేడు కూడా, తను వంగుని కిటికీలోంచి బయటికి చూస్తుంటే బిషప్పుగారు నీళ్ళగొట్టం పట్టుకుని మేడమోదికి వగబాకటం కనిపించింది. అది చూసి ఆ సమయంలో. ్రేమ్‌సాగర్‌ మనసు ఎంత వుద్వేగం చెందిందో యిప్పటికీ యింకా గుర్తే. దానికాయన్క తను వంటాయన పెంచు కుంటున్న పెంపుడు పిల్లినని కుంటి సంజాయిషీ యిస్తుంటే ఆయన వైఖరి చూసి విచారం; జాలీ కలగడం తనకి గుర్తుంది.

ఈ పరిస్థితు ల్లో మ లీ నిద్ర పట్టడం అనేది శూన్యం. అంచెత (్రెస్సింగ్‌ గౌన్‌ తొడుక్కుని కింద భాగంలో ఆఫీసు రూముగా వాడుకునే గదిలోకెళ్ళాడు. తను చెప్పవలసిన ప్రవచనానికి కొంత నోట్సు తయారుచేసుకుంటే మెదడుకి శ్రమ తగ్గి ప్రశాంతత చిక్కుతుందని ఆశించాడు. -

'ప్రేమసాగర్‌ కూచుని చదువుకునే గది కింది భాగంలో తోట వైపుకి వుంది. బయట వాతావరణం, చల్లగా హాయిగా వున్నందుకూ, తోటలో గుబాళిస్తున్న పూలు సువాసనలు వెదజల్లుతున్నందుకూ నిలువుకిటికీ తెరిచి వుంచాడు. టేబులు ముందు కూచుని రాసుకోడం మొదలెట్టాడు,

చర్చిలో ప్రవచనం అందరికీ వుపయోగపడేలా 'వుండాలి, అలాగే కూలీ నాలి చేసుకునే సగటు మనుషులకి సులభంగా అర్ధం కావాలి, గంభీరమైన పదాలతో వుండ సరదాగా కాసేపు శేతం. .శరద్రాత్రి సంబరాలు

కూడదు. అందుకని 'ప్రేమ్‌సాగర్‌ ఓపిగ్గా శ్రద్ధపూని తయారు చేస్తాడు, కాసేపటికి పనిలో పూర్తిగా నిమగ్నమై బాహ్యప్రపంచాన్ని మరిచిపోయి అలౌకికవాదం అన్న మాటకి తేలికైన పదం ఏమిటన్నది ఆలోచిస్తుంటే ఏంతకీ అంతుబట్టకుండా' వుందతనికి, కళ్ళల్లో ఏకాగ్రత కనిపిస్తోంది. నాలిక నోటి బయటికొచ్చి ఎడమనించి కుడికి 'పెదిమెల మాద చిన్నగా రౌండ్లు చుట్టడం మొదలెట్టింది, అలా జాగ్రదావస్థలోనే మైకం కమ్ముకునున్న (ప్రేమ్‌సాగర్‌ నెమ్మదిగా తేరుకొని తనని ఏవరో పేరుపెట్టి పిలుస్తున్నట్టూ, గదిలో తనిప్పుడు వంటరిగా లేనట్టూ గ్రహించాడు. ఎదురుగా వున్న కుర్చీలో పల్చటి వొంటి మోద ఆకుపచ్చ శాలువా కప్పుకుని కూచుంది జ్యోత్సు రెప్పలార్సకుండా ఆమెనే చూస్తూ, *హ ల్లో, నువ్వ యిక్కడికొచ్చావా?' అని అడిగాడు ప్రేమ్‌సాగర్‌. “హల్లో, అవును యిక్కడికే వచ్చాను, జవాబిచ్చింది జ్యోత్ను. 'అహా, నేననేది అదికాదు. విజయ్‌ని కలవడానికి హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ కి వెళ్ళలేదన్నట్టు తల: అడ్డంగా వూపింది జ్యోత్సు 'ఇవాళ రాత్రి పోలీసులు రెయిడ్‌ చేస్తారని విజయ్‌కి ఏవరో టిప్పు యిచ్చారట; అక్కడికెళ్ళడం. మంచిది కాదని ఫోన్‌ చేసి చెప్పాడు, దాంతో యిద్దరం ఆగిపోయాం. “'మంచిపని చెశారు," అన్నాడు. ప్రేమ్‌సాగర్‌ అంగీకరిస్తూ. “ఇలాంటి వాటిల్లో విచక్షణా జ్ఞానం ముఖ్యం. ఏ పనిని చేతులో తీసుకున్ననూ దాని అంత్యమును. గుర్తుంచుకుని నీవు తప్పుడు మార్గమును అవలంబించరాదు.. ప్రసంగి. 7: 864 చేతిరుమాలు తీసి కళ్ళొత్తుకుంది జ్యోత్స్న “నిద్ర పట్టలేదు. గదిలో లైటు కనబడింది, అందుకే కిందికి దిగొచ్చా, నాకు చాలా దుఃఖంగా వుంది, (ప్రేమసాగర్‌,” “ఏదీ విజయ్‌ గురించేనా?” “అవును, 'వుండు, మరేం ఫరవాలేదు. చెబుతున్నాగ్లా, పరిస్థితులు చక్కబడతాయి.! “నాకైతే ఏమనాలో తోచడం లేదు. విజయ్‌ గురించి మావయ్యా, అత్తయ్యా ఏమేమి అనుకుంటున్నారో విన్నారా? అంటురోగం వున్నవాడిలా దూరంగా వుంచుతున్నారు “తెలుసు, నాకంతా తెలుసు, ఇందాక చెప్పినట్టు నా దగ్గిరో మంచి ష్లానుంది, నీ విషయంలో నేను చాలా ఆలోచించాను, దీనికి మూలకారణం అసలు మా అత్తయ్యగారేనని చెబితే నువ్వు వొప్పుకుంటావనుకుంటా. ఆవిడ గారిని కాస్త మంచి చేసుకుంటే చాలు, బిషప్పుగారు ఆవిడేం చెబితే అది. చేస్తారు, మి అత్తయ్య యివాళ ఆలోచించేది మా శరద్రాత్రి సంబరాలు శీత4 'సేరదాగా :కాసేపు

మావయ్య రేపు ఆలోచిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే ఆవిడని కనక మనం బుట్టలో వేసుకున్నామా చాలు, నిమిషంలో ఆయన వొప్పేసు కుంటారు. అవునా, కాదా?” అవునన్నట్టు జ్యోత్స్న తలాడించింది.

“ఆ మాట నిజమే. మారన్నది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్‌ మా అత్తయ్య చెప్పింది మావయ్య తప్పకుండా వింటారు, చిక్కల్లా ఆవిడగ్గార్నీ మోరెలా బుట్టలో వేసుకోగలరూ అనేదే?”

“ఉం(డ్రాజువారి ఉత్తేజామ్లంతో. అద్భుతమైన ఆ టానిక్కు ఎంత గొప్పగా పనిచేస్తుందో చాలాసార్లు చెప్పాన్నీకు, గుర్తుండొచ్చు. తాగిన వెంటనే మంత్రదండం తిప్పినట్టు మన తరహానే పూర్తిగా మారిపోతుందనుకో. 'రేపు రాత్రికి మా: అత్తయ్యగారు పడుకునే ముందు తాగే వేడి వేడి. పాలల్లో నాలుగు చుక్కలు కలపాలి మనం. దాని. ప్రభావం చూస్తే నువ్వ ఆశ్చర్యపడక మానవంటే నమ్ము?

“గ్యారంటీ యివ్వగలరా మోరు,"

'పూర్తి గ్యారంటీ'

మొహం విప్పార్చుకుని ఆ పిల్ల, 'అయితే సరే, కాసేపటి ముందు నేను చేసిన పని అదే. తోటలో సాయంత్రం విజయ్‌ ఆ సలహానే యిచ్చాడు. నేనెందుకు ఆ పని చెయ్యకూడదు అనుకున్నా ఆ టానిక్కు సీసా, యిదిగో, యీ అలమారులో కనిపించింది. వెంటనే అత్తయ్యకి వేడి వేడి పాలల్లో కాస్త కలిపిచ్చా. ఎందుకైనా మంచిదని మావయ్య తాగిన వైనులో కూడా కలిపేశా,' అని చెప్పింది.

'పేమ్‌సాగర్‌కి వున్నట్టుండి గుండె చిక్కబట్టుకున్నట్టు అయింది, కాసేపటి ముందు తన పడకగదిలో జరిగిన సీను యిప్పుదర్ధమైంది.

“ఎంత కలిపావ్‌/ కష్టంగా వూపిరి తీస్తూ అడిగాడు.

“ఎంతోన్నా చాలా కొద్దిగా. పాపం వాళ్ళకి విషం ఎక్కించకూడదనిపించి చెరో చెంచాడూ కలిపాను/ చెప్పింది జ్యోత్స్న.

ప్రేమ్‌సాగర్‌ భయంతో వొణుకుతూ మూలిగినట్టు శబ్దం చేశాడు,

“బాగా ఎదిగిన ఏనుగుకి ఓ మాదిరి. డోసు - ఒక్క చెంచాడు మాత్రమేనని తెలుసా నీకు?” అడిగాడు (ప్రేమ్‌సాగర్‌ జీవం లేని గొంతుతో,

'డోసు, ఏక్కువైతే చాలా విపరీతమైన పరిణామాలకి దారి తీస్తుందని తెలుసుకో, కుంగిపోతూ అన్నాడు. “అందుకే మరి యిందాక్ష బిషప్పుగారు అలా తమాషాగా 'ప్రవర్తిస్తుంటే ఆశ్చర్యమేసింది నాకు.”

“ఏమిటీ, మావయ్య తమాషాగా ప్రవర్తించారా?!

నీరసంగా తల వూపాడు (ప్రేమ్‌సాగర్‌. సరదాగా కాసేపు 145 శరద్రాత్రి సంబరాలు

“ఇందాక నా: పడకగదిలోకి వచ్చినప్పుడు నా మంచం తలభాగంలో .వున్న అడ్డ పట్టీని రెండు చేతుల్తోనూ పట్టుకుని జిమ్నాస్ట్‌లా బస్కీలు, దండేలు తియ్యడం మొదలెట్టాడు. అది కాగానే నా దగ్గిరున్న కోయదొర వేషాన్ని పట్టుకేళ్ళాడు.

“దాంతో ఏమవసరం వచ్చిందో ఆయనకి ?'

(ప్రేమ్‌సాగర్‌ వాణికిపోతున్నాడు.

'ఆలోచించడానికే భయంగా వుంది నాకు, బహుశా హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌కి 'వెడదామనుకున్నాడా యాయన? ఈరోజు సంబరాలు న దుస్తున్నాయక్కడ్త గుర్తుంది కదా?"

'ఆ, అవును అక్కడికే అయుండొచ్చు. మా అత్తయ్య కూడా ఒక గంట ముందు నా దగ్గిరికొచ్చి నీ దొరసాని వేషం నాకోమారు యివ్వగలవా అని అడిగింది.”

“తీసుకుందా: ఆవిడ?”

'ఆహా, పట్టుకెళ్ళింది. ఎందుకు అడిగిందో నాకప్పుడు అర్ధం కాలేదు కాన్మీ యిదిగో యిప్పుడు తెలిని' చ్చింది. మ

ప్రేమ్‌సాగర్‌ దీర్హమైన నిట్టూర్పు: విడిచాడు. అది. అతని ఆత్మకుహరం నుంచి "పెకళించుకుని వచ్చినట్టు అనిపించింది.

“ఆవిడ యింకా గధిలోనే వుందేమో 'పరుగెట్టికెళ్ళి చూసిరా ముందు! చెప్పాడు (ప్రేమ్‌సాగర్‌. *నామటుకు నాకు ఏమనిపిస్తోందంటే - మనం గాలిని విత్తయున్నాము గనక ప్రళభయవాయువు మనకు కోతయగును. హోషయా 8:

జ్యోత్సు హడావిడి పడుతూ వెళ్ళింది. దిక్కుతోచని వాడిలా (శ్రేమ్‌సాగర్‌ గదిలో ముందుకీ వెనక్కీ పచార్లు చెయ్యడం మొదలెట్టాడు, అలా అయిదుసార్లు తిరిగి ఆరోది 'మొదలెట్టబోతుంటే నిలువుకిటికీ బయటనుంచి ఏదో చప్పుడొచ్చింది. కోయదొర ఒకాయన సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చి ఆయాసంతో ఎగశ్వాసలు తీస్తూ పడక కుర్చీలో చేరగిల పడ్డాడు,

అది చూసి, “బిషప్పుగారూ!' అంటూ యిల్లు మారుమోగేలా అరిచాడు ప్రేమ్‌సాగర్‌,

బిషప్పుగారు ముందు కాస్తంత వూపిరి చిక్కబట్టుకునే సంగతి చూసి ఆ తరవాత చూస్తాలే నీ సంగతి అన్నట్టు చేత్తో సౌజ్జ్ఞ చేసి మళ్ళీ గట్టిగా వూపిరి తీస్తూ రొప్పటం మొదలెట్టారు. అర్ధంకాక ఆందోళన చెందాడు ్రేమ్‌సాగర్‌, తన' అతిథిగారు పూర్తిగా నలిగిపోయినట్టు కనిపించాడు.. కట్టుకున్న కోయదొర పంచెని బాగా బలమైన శక్తి గట్టిగా లాగి పీకినట్టు చాలా భాగం చిరిగి వుంది. నెత్తి మాది విగ్గు మాయమైంది, తను భయ పడినట్టు ఏదో జరగరానిదే జరిగిందని తట్టిందతనికి.

'ఏమైందండీ, బిషప్పుగారూ?” అంటూ అడిగాడు 'పెద్ద గొంతుతో.

బిషప్పు కుర్చిలో సర్దుకుని కూచున్నాడు. వూపిరి క్రమంగా పీలుస్తునాడిప్పుడు. చాలావరకు సంతృప్తి చెందినట్టు, హాయిగా వున్నట్టు ఆయన ముఖంలో కనిపించింది.

ఒహో, ఎంత కోలాహలంగా వుందో అక్కడ!* అన్నాడాయన. శరద్రాత్రి. సంబరాలు [46 సరదాగా: కాసేపు

ఆందోళన పడుతూ, “ఏం జరిగిందో చెప్పండి ముందు, అర్ధించాడు ప్రేమ్‌సాగర్‌.

బిషప్పు కాసేపు ఆలోచించి జరిగిన విశేషాలన్నీ వరసక్రమంలో పెట్టుకోసాగాడు.

'ఏమైందంటే నేను హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ కి వెళ్ళేసరికల్లా అక్కడున్నవాళ్ళందరూ డాన్సు చెస్తున్నారు. మంచి ఆర్మెస్త్రా. మ్యూజిక్‌ కూడా. బాగుంది. అందుకని నేనజ డాన్సు చేశాను.

“అవునయ్యా చేశాన్ను! అన్నాడు బిషప్పు వన్నె తెచ్చిన ధీమాతో, 'ఇంగ్లీషు డాన్సు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చర్చి అధిపతులు యితరులకి మార్గదర్శకంగా వుండాలోయ్‌, ప్రేమ్‌సాగర్‌. అసలు వమనుకుంటున్నావ్‌ నన్ను, హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ కి వెళ్ళి వొక్కణ్ణే కూచుని పేకాడొస్తాననా నీ వుద్దేశ్యం? హాని కలిగించని కాలక్షేపాలు నిషిద్ధం

కానీ మారు డాన్సు చెయ్యగలరా అని?!

“నేను డాన్సు చెయ్యగలనా ? ్రేమ్‌సాగర్‌, నేను డాన్సు చెయ్యగలనా? ప్రభుదేవా. పేరు ఎప్పుడన్నా విన్నావా?” అడిగాడు బిషప్పు. .

“అది నా మారుపేరు, స్టేజి మాదలే,* చెప్పాడు బిషప్పు.

వ్యవహారం బాలేదన్నట్టు ఆందోళన పడుతూ గుటకలు మింగి, “ఇంతకీ ఎవరితో డాన్సు చేశారండీ?” అడిగాడు 1ప్రేమ్‌సాగర్‌,

_ “ముందైతే నేనొక్కడ్నే చేశా. తరవాత అదృష్టంకొద్దీ కాసేపటికి నా భార్యామణి సరోజమ్మ వచ్చి చేరింది, అప్పుడు యిద్దరం కలిసి చేశాం. సినిమాల్లో వున్నట్టు మాంఛి దొరసాని గెటప్పులో వచ్చిందావిడ. ఆ వేషంలో మహా ముచ్చటగా వుంది కూడా అన్నాడు.

“మిమ్మల్ని అక్కడ చూసి ఆశ్చర్యపడలేదా ఆవిడ?!

“అబ్బే అలాంటిదేమి లేదే. అయినా ఏందుకు ఆశ్యర్యపడాలావిడ?!

“అదా, తెలీదు నాకు.”

'మరా ప్రశ్న ఎందుకడిగావ్‌?'

“ఏదో ఆలోచించకుండా అడిగేశా,!

'ఇహనించీ ఏదన్నా అడిగే ముందు ఆలోచించి అడుగు, 'ఢ్రేమ్‌సాగర్‌, అంటూ మెత్తగా చివాట్లు "పెట్టాడు బిషప్పు.

తలుపు తెరుచుకుంటూ. జ్యోత్స్న లోపలికొచ్చింది.

“'లేదావిడ...* అని అక్కడే ఆగిపోయి, 'మావయ్యా,” అంటూ అరిచింది.

'ఏమ్మా,'పలకరించాడు బిషప్పు, “అయితే (పేమ్‌సాగర్‌, చెప్పాను గదా యింతకు ముందు మేమిద్దరం కలిసి డాన్సు చేస్తుంటె కాసేపటికి జరిగిన. సంఘటన 'వల్ల మహా చిరాకేసిందయ్యా: "సంతోషంతో మా అంతకి మేము డాన్సు చేస్తూ అందరం ఆనందంగా గడుపుతున్న సమయంలో -- సరిగ్గా పానకంలో పుడకల్లా ఎవరొచ్చారనుకున్నావ్‌ - సరదాగా కాసేపు 147 శరద్రాత్రి సంబరాలు

పోలీసులయ్యా, అడ్డం పడుతూ పోలీసులు, చాలా దుడుకుగా, పొగరుమోతుతనంతో వ్యవహరించారు వాళ్ళు. పైగా అన్నీ తెలుసుకోవాలనే తపన కూడాను, ఒకదేమో వూర్మే నా పేరు, అడ్రసూ చెప్పమని ఒకటే రొద, ఈ వెధవగోలకి అద్దుపెట్టేశా నేను. వాడి పళ్ళు రాలగొట్టేశా.”

“లేకపోతే ముద్దెట్టుకోమంటావా, ఏమిటి? గూబ గుయ్యిమనిపించానయ్యా. సరిగ్గా అప్పుడే యిదిగో యీ కోయదొర పంచె చినిగి ముక్కలైంది. తలకున్న విగ్గు వూడింది. వాడు వూర్మే నా సహనాన్ని మరీ పరీక్షించాడనుకో. నా పేరు అడ్రసూ ఎంతో కావలసిన వాళ్ళకీ, పాతకాలపు 'స్నేహితులకీ తప్ప వేరే ఎవ్వరికీ యివ్వను అని చెబుతున్నా వినిపించు కోకుండా పదే పదే అదే అడుగుతూ వచ్చాడు. పైగా నా దారిన నేను పోతుంటే కోయదొర పంచె గోచీ పట్టుకుని లాగుతూ వదల్లేదు. మరా పరిస్థితుల్లో చెంప ఛెళ్ళుమనిపించకపోతే ఏం చెయ్యాలి చెప్పు. మా వంశంలో అందరూ ఆరితేరిన యుద్ధ వీరులు. మా తాతగారైతే బొబ్బిలి మహారాజుగారి సైన్యంలో వుండి ఏన్నో యుద్దాలు చేశారు, అందుకే వాడినిపిట్టని కొట్టినట్టు రాల్చేశా. కింద పడ్డాడు దాంతో! నన్నడుగు నేన్ఫైెబుతా? అన్నాడు బిషప్పు సంతుష్టంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ,

ప్రేమ్‌సాగర్‌, జ్యోత్స్నలు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

కానీ, మావయ్యా.,/ అంటూ ఏదో అడగబోయింది జ్యోత్స్న.

“ఇదిగో అమ్మాయ్‌, మధ్యలో నన్నాపద్దు! చిరుకోపంతో అన్నాడు బిషప్పు. “అడుగడుక్కీ నువ్విలా అడ్డుపడితే నా ఆలోచనలకి అంతరాయం కలుగుతుంది. ఆయి,. ఎక్కడున్నానిందాక? ఆం అవును. సర్కే ఆ తరవాత ఏమైందంటే అసలే పరిస్థితి గందర గోళంగా వుంటే దాంతో మరింత పెరిగి రసాభాసగా మారిందని చెప్పొచ్చు. ఎవరో లైట్లు ఆర్పేశారు, యింకోదెవరో టేబులు తన్నాడు, నేనైతే యింక బయల్టేరితే మంచిదనుకున్నాా! బిషప్పు ముఖంలో విచారం చొచ్చుకొని వచ్చింది. “నా భార్య కూడా అవస్థ పడకుండా వెళ్ళిపోడానికే నిశ్చయించుకుందని: నా నమ్మకం. చివరిసారి చూసినప్పుడు ఆమె లాఘ వంగా దగ్గిరున్న కిటి కీలోంచి బయటికి దూకేస్తూ కనిపించింది; చాలా చక్కటి వుపవాయం తట్టిందావిడకి. హా, అదిగో వచ్చేసిందండోయ్‌! ఇంత సాహసం నెరవేర్పినా ఆమె ఏమి జరగనట్టు చక్కగా వుంది. లోపలికి ర్కా మై డియర్‌. ఇప్పుడే వీళ్ళిద్దరికీ హోమ్‌ ఫ్రమ్‌ హోమ్‌ లో మనమెలా గడిపామో చెబుతున్నా యింతలోకీ నువ్వొచ్చేశావు.”

వాగరుస్తూ ఆవిడ, “శౌర్యం, నన్ను రక్షించు శౌర్యం అన్నది.

“తప్పకుండా, మై డియర్‌. దేన్నుంచి?? అడిగాడాయన ప్రశాంతంగా,

మౌనంగా నిలువుకిటికీ వైపు చూపించిందావిడ. దాంట్లోంచి యమభటుడిలా రక్షకభటుడి ఆకారం లోపలికి వస్తోంది, గాలి పోసుకుంటున్నట్లు అతను కూడా కష్టపడుతూ వూపిరి తీస్తున్నాడు.

శరద్రాత్రి సంబరాలు 148 సరదాగా కాసేపు

బిషప్పుగారు అమాంతం లేచి నుంచున్నాడు.

'అయ్యా పోలీసూ, యిలా చొరబడటానికి అర్ధమేమిటో చెబుతారా కాస్త,' అడిగాడు కోపంగా:

'హా[ అన్నాడు పోలీసు.

కిటికీ తలుపులు. మూసేసి వీపు కిటికీకి అడ్డంగా 'పెట్టి నుంచున్నాడు పోలీసు.

విచక్షణా జ్ఞానం .వున్న (ప్రేమ్‌సాగర్‌ తానింక కలిగించుకోకపోతే లాభం లేదను

నోరారా పలకరిస్తూ “నమస్కారమండి, కానిప్టేబులుగారూ. మారు బాగా' వ్యాయామం చేసొచ్చినట్టు కనబడుతున్నారండీ: దాహం తీరేందుకు కాస్తంత కూల్‌ డ్రింకు పుచ్చుకుంటే మంచి చేస్తుంది, యిమ్మంటారాండీ?] అని అడిగాడు.

పోలీసు నాలికతో పెదిమల్ని తడుపుకున్నాడు కానీ జవాబివ్వలేదు.

'నా దగ్గిర యిదిగో యీ అలమారులో మంచి టానిక్కు వుంది. పుచ్చుకుంటే బడలిక తీరి ఓపిక వస్తుందని మిరే తెలుసుకుంటార్లెండి, కూల్‌ ్రింకులో నాలుగు చుక్కలు కలిపిస్తానుండండి,” అన్నాడు 1ప్రేమ్‌సాగర్‌.

కానిస్టేబులు అన్యమనస్కంగానే సుని చేతులోకి తీసుకున్నాడు. అతని దృష్టంతా బిషప్పు మిదా, ఆయన భార్య మోదనే వుంది.

“పట్టుకున్నానా లేదా మొత్తానికి ?” అంటూ అడిగాడు.

“నువ్వేమంటున్నావో నాకేమి: బోధపడటం లేదోయ్‌, పోలీసూ,' అన్నాడు. వుదా సీనంగా బిషప్పు

బిషప్పుగారి భార్యని చూపిస్తూ, “ఆవిడగార్ని మైలు దూరం నించీ తరుము కొచ్చానండీ,” చెప్పాడు పోలీసు.

అతన్ని మింగేటట్టు చూస్తూ బిషప్పు, *నువ్వు చేసింది ఏహ్యమైన పని. పైగా ఆవిడగారి మనసు నొప్పించావు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నావు కూడా. డాక్టరుగారి సలహా మేరకు నిద్రపోయే ముందు తను రోజూ రాత్రీళ్ళు నిర్మానుష్యంగా వున్నచోట పరిగెత్తుతుంది ఎ ర్రోజూను, పోలీసులు వెంటబడకుండా - యింకా: ఘట్టిగా నొక్కి చెప్పాలంటే తరుముకుంటూ రాకుండా - వైద్యుడి సలహాని పాటించలేమంటే మన దేశానికి ఎంత ఆధోగతి పట్టిందో ఆలోచించాలి,” అన్నాడు పరుషంగా.

"ఓహో, అయితే ఆవిడగారు హోమ్‌ ్రమ్‌ హోమ్‌ కి వెళ్ళింది కూడా కేవలం డాక్టరుగారి' సలహా 'మేరకేనన్నమాట, అవునా? అడిగాడు పోలీసు నిశితంగా చూసూ.

“నువ్వు చెప్పిన అదేదో ప్రదేశం వుందే నా భార్య అక్కడికి వెళ్ళిందంటే అంతకన్నా ఆశ్చర్యకరమైన వార్త మరోటి వుండదయ్యా,' అన్నాడు బిషప్పు,

“తమరూ వున్నారక్కడ. నేను చూశా మిమ్మల్ని

“అసంభవం!” సరదాగా' కాసేపు 140 శరద్రాత్రి సంబరాలు.

'నా తోటి కానిష్టేబులు సుబ్చిగాడి మొద మిరు చెయ్యి చేసుకోడం చూశాన్నేను.!

“ఇది మరీ విడ్తూరంగా: వుందయ్యా.

“మిరు అక్కడికి వెళ్ళకపోతే మరా కోయదొర వేషం ఎందుకు వేసుకున్నారో?”

బిషప్పుగారి కనుబొమ్మలు పైకి లేచాయి.

“నాకు యిష్టమై తొడుక్కున్న దుస్తుల్ని - చాలా ఆలోచించి మధనపడుతూ: అంటున్నాను యీ ముక్క అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటా - నడుమున వడ్డాణ్ణం, నెత్తిన యింతెత్తు కిరీటం పెట్టుకుని ఖాకీ చొక్కా లాగూతో అస్తమానం తిరిగేవాడు విమర్శించడం నేను సహించలేనయ్యా. అసలీ కోయదొర డ్రెస్సులో నీకు కనిపించిన అభ్యంతరం ఏవిటి? తప్పేమో కనిపించడం లేదే కోయదొర కట్టుకునే బట్టల్లో పరువు తక్కువైనట్టు నాకేం అనిపించడం లేదే... ఎంతోమంది గొప్పగొప్ప వాళ్ళు కోయదొర బట్టలు వేసుకున్నారు, ఆమాటకొస్తే మన్యంలో జనాభా అంతా యీ బట్టలే కట్టుకుంటారు. ఆయన 'పేరేవిటి ... !

“అల్లూరి సీతారామరాజు. పేరు అందించింది జ్యోత్స్న.

“హ్హా నువ్వెంత బాగానో చెప్పినట్టు అల్లూరి సీతారామరాజులో

ముఖం చిట్లించి కోపాన్ని అణుచుకుంటున్నాడు ఆ పోలీసు. ఆత్మ విమర్శ చేసుకున్ని వాదించి లాభం లేదనుకున్నాడు. ఇంతవరకూ విన్న వితండ వాదనకి గట్టి జవాబు ఏదో వుండవచ్చనుకున్నాడు. ఆలోచనలకి సహకరించేందుకు చేతులో వున్న ఉండ్రాజువారి ఉత్తేజామ్లం కలిసిన కూల్‌ డ్రింకు గ్లాసెత్తి ఒక్కగుటకలో తాగేశాడు.

పోలీసు ఆ పని చెయ్యగానే ఎర్రగా కాల్చిన యినపకడ్డీ మోద నీళ్ళు పోసినట్టు కోపం కాస్తా ఆవిరైపోయింది. ఇప్పుడు అతని ముఖంలో అపారమైన దయా దాక్తిణ్యాలు చోటుచేసుకున్నాయి. తడిసిన మిసాలొక్కసారి తుడుచుకుని ఏదో గుర్తుకొచ్చినట్టు తనలో తనే నవ్వుకోడం మొదలెట్టాడు,

“నేనైతే నవ్వాపుకోలేక చాలా అవస్థ పడ్డాననుకోండయ్యా. అదే, మా కానిస్టేబులు సుబ్బిగాడు మిరు కొట్టిన దెబ్బకి కిందపడి దొర్హుతుంటేనండీ, మాలావు దెబ్బంటే నమ్మండి. ఈమధ్యనెప్ప్తుడూ: అలాంటి దెబ్బ చూడలేదండి, వాటంగా, ఫట్టున... తవంరి చెయ్యి మూరెడు దూరం కూడా పోలేదు, అవును కదా? సార్‌, చిన్నప్పుడు మిరు బాక్సింగు నేర్చుకున్నారని నా అంచనా అండీ/ అన్నాడు పోలీసు,

పోలీసు అలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుతుంటే బీషప్పుగారు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని వదిలేశారు. 'పాపాత్ములని మందలిస్తున్న వాడిలా కనిపించటం లేదిప్పుడు. ఎప్పట్లా మళ్ళీ చలాకీతనం చూపిస్తూ హుషారుగా వున్నాడు.

సంతోషంతో మూతి విప్పార్చుకుని చెప్పాడాయన; “చాలా కరెక్టుగా చెప్పావయ్యా, అంటే యిప్పుడు కాదుల్మే ఒకప్పుడు - యిప్పటి కన్నా వయసు తక్కువున్న రోజుల్లో పాస్టర్లకి నిర్వహించే హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ పోటీల్లో రెండుసార్లు వరసగా గెలిచానోయ్‌. శరద్రాత్రి. సంబరాలు 150 సరదాగా. కాసేపు

ఆ కాలంలో నాకున్న నైపుణ్యం, వొడుపూ - ఓహ్‌, ఆ వాసనలు యిప్పటికీ అంత కాకపోయినా కొంతైనా నిలబడ్డాయని. అనిపిస్తుందోయ్‌.

  • పోలీసు మళ్ళీ ముసిముసి నవ్వలు నవ్వాడు.

“నాక్కూడా. అలానే అనిపిసోంది సార్‌” అని చెప్పి చిరుకోపంతో, “అసలీ గలాభా అంతా ఎందుకో తెలీడం లేదయ్యా, మా తలకిమాసిన ఇన్సైక్టరుగాడొచ్చి, “వురేయ్‌, పోండ్రా, వోయి ఆ నైట్‌ క్లబ్బుని రైడ్‌ చెయ్యండ్రా, ఫొండి,” అన్నాడయ్యా. మరి మేవంతా బయల్టేరి 'సెప్పిన పని 'సేశావ ౧య్యా. అయినా నాకైతే మనసు మనసులో లేదయ్యా, ఆమాటకొస్తే మా వోళ్ళందరికీ అంతేనయ్యా. ఏదో వుబుసుపోకకి కాసేపు సరదగా కాల క్షేపం సేసుకుంటే మునిగిపోయేదేంటంటా? నే చెప్పేదదే, తప్పేముందంట అందులో, ఆం?'

“మంచిమాట చెప్పావయ్యా, పోలీసూ

“అదేగదా నే 'సెప్పేది. తప్పేమిటంటా? జనాలు ఎవురిస్టం కొద్ది ఆళ్ళు కాసింత సంబరాలు జరుపుకోవచ్చనేగదా నేననేది,.మరలాంటి సమయంలో పోలీసులొచ్చి అడ్డం పడితే ఏం సేత్తారెవరన్నా'- సెంప సెళ్ళున వాయగొట్టాలి. నేననేది, తవంరు కానిస్టేబులు సుబ్బిగాడికి శాస్తి సేసినట్టు అని, అదీ నేననేది..

'భలే బాగా చెప్పావోయ్‌,” అన్నాడు బిషప్పు, భార్య వైపు తిరిగి, “సరూ డియర్‌, యీ కుర్రాడున్నాడు చూశావ్‌, బ్రహ్మాండమైన తెలివితటలున్నాయితనికి, అన్నాడు.

'ఈ కుర్రాడి ముఖం బాగుందని నేను మొదలే గుర్తుపట్టాను. నీ పేరేమిటి పోలీసూ?'

“బత్తిన చినవీరేశ్వర్రావండీ. అవుతే తవురు ఈరయ్యా అని పిలవొచ్చండీ, చెప్పాడా

'అలాగేనోయ్‌్స్‌ తప్పకుండా అలాగే సం తోషంగా. పిలు స్తా. వీరయ్యా, మా. వూరి దగ్గిర నాకు ఒకప్పుడు బత్తిన కుటుంబాలు చాలా తెలుసయ్యా, మోకు చుట్టాలా వాళ్ళే మన్నా?! అంటూ అడిగింది బిషప్పుగారి భార్యామణి సరోజమ్మ,.

“అయ్యుండొచ్చు, మేడం... పెపంచికం సాలా' సిన్నదిగా మేడం.”

“అహా కాదయ్యా, గుర్తొచ్చిందిప్పుడు. వాళ్ళు బత్తిన వాళ్ళు కారయ్యా, కోడెబోయిన

“అదమ్మా, జీవితం ఎప్పుడూ అంతేనమ్మా, కాదా? అన్నాడు కానిస్టేబులు బత్తిన చినవీరేశ్వర్రావు.

“అంతేనోయ్‌, జీవితం ఎప్పుడూ: అంతే. చాలా గొప్ప నిజం చెప్పావు, వీరయ్యా,! వొప్పుకున్నాడు బిషప్పు.

అత్యంత ప్రేమతో సాగుతున్న యీ సంభాషణ ముదిరి పాకాన పదకుండా నీళ్ళు

చల్గుతున్నట్టు జ్యోత్స్న గొంతు దాన్ని ఆపేసింది.

“బావుంది, మహా ముచ్చటగా. వున్నారు. మారు. అంటున్నా! అన్నది కలగజేసు కుంటూ, సరదాగా కాసేపు శవ] శర(ద్రాత్రి సంబరాలు

“ఎవరు మేడం, మహా ముచ్చటగా వున్నారని ఏవరి గురించి అన్నారు మేడం?” అడిగాడు పోలీసు విషయం అర్ధం కాక.

“ఇదిగో యింకెవరు, వీళ్ళిద్దరే. వీరయ్యా, నీకు పెళ్ళయిందా?”

“లేదమ్మా యింకా, జీవితమనే. నదీ (ప్రవాహంలో తేలుతూ ప్రయాణించే వాంటరి కర్రపుల్లనమ్మా నేను,"

'ఫరవాలేదులే, (ప్రేమలో పడటమంటే కొంచైమెనా తెలిసుండొచ్చు నీకు, వీరయ్యా!

"అది మాత్రం చాలా నిజం, మేడం.

'నేను కొత్తూరి విజయరత్నంని ప్రేమిస్తున్నా. అయన నీకు పరిచయమే వుండొచ్చు, వీరయ్యా, అతనెంత మంచివాడో, అతని ప్రవర్తన ఎలాంటిదో నీకు తెలీదా?'

"నేను ఎరిగున్నవాళ్ళలో ఆయన సాలా సొచ్చమైన మడిసమ్మా.”

“అవునా, మరి మేమిద్దరం పెళ్ళి చేసుకుందామనుకుంటే, యిదిగో మా అత్తయ్యా, మావయ్యా పడనివ్వడం లేదు. ఎందుకూ అతను ప్రాపంచిక విషయాలకే ప్రాముఖ్యత యిస్తాడని.. అంటే, కేవలం డాన్సులకి 'వెడతాడని. మరి వీళ్ళేమో బూట్లు, చెప్పులు అరిగి పోయి వట్టి కాళ్ళు బయటికి పాడుచుకొచ్చేదాకా డాన్సులు చేశొచ్చారింతవరకూ; ఇది ఏంతమాత్రం సబబు కాదంటున్నా నేను,!

మొహం చేతుల్లో కప్పుకుని ఏడుపు ఆపుకోడానికి ప్రయత్నించింది జ్యోత్స్న బిషప్పూ, అతని భార్యా తెల్ల మొహాలేసుకుని ఒకర్నొకరు చూసుకున్నారు.

“నాకేం అర్ధం కావటం లేదు, అన్నాడు బిషప్పు.

“నాకూ అంతే, అంది బిషప్పుగారి భార్య సరోజమ్మ, “చూడమ్మా, 'నువ్వు విజయ రత్నంని పెళ్ళి చేసుకోడం మాకిష్టం లేదంటూ వవిటిదంతా? నీ బుర్రలోకి అసలా ఆలోచన ఎలా: వచ్చింది? కుదరదని 'మేమెప్పుడన్నాం కనక? తప్పకుండా నమ్మా, నువ్వ తన్ని పెళ్ళి చేసుకోడానికి నావైపు నించి అభ్యంతరం ఏమో లేదు. నా భర్త వైపు నించి కూడా' లేదని చెబుతున్నా కాదా శౌర్యం?”

'ఓ. అలాగే, తప్పకుండా, అన్నాడు బిషప్పు.

సంతోషం పట్టలేక గట్టిగా అరిచింది జ్యోత్స్న

“ఎంత మంచివాళ్ళు మారిద్దరూ! నిజంగానే చేసుకోవచ్చా?!

'తప్పకుండానమ్మా. నిరభ్యంతరంగా. నీకేమి అభ్యంతరం లేదుగా, వీరయ్యా?'

'అబ్బే, నాకేం లేదు, మేడం,

అంతలోకీ జ్యోత్స్న ముఖం కుంగిపోయింది.

“అయ్యో, నేనేం చెయ్యాలిప్పుడు!” అందామె,

“ఏమైందమ్మాయ్‌?”

“ఈ సంగతి విజయరత్నంకి తెలపాలంటే గంటలు గంటలు ఆగాలినేను. గంటలు గంటలు గడపాలంటే ఎంత కష్టమో మిరే ఆలోచించండి!!

బిషప్పు తనకే స్వంతమైన నవ్వు నవ్వాడు పగలబడుతూ.

'శరద్రాత్రి సంబరాలు 152 సరదాగా కాసేపు

గంటలు గంటలు ఏందుకు ఆగాల్నువ్వ? ఇప్పుడే చెప్పాలి యింతకన్నా మంచి సమయం మరింక లేదు.!

జ్రాన్సీ అతనీపాటికి నిద్రపోయ్యంటాడు.”

“దాన్దేముంది, లేపి కూచోపెడదాం/ అన్నాడు బిషప్పు గుండెనిండుకూ. 'మనం యిప్పుడేం చెయ్యాలో చెబుతానుండండి. నువ్వూ, నేనూ, సరోజత్తమ్మా - 'మరి నువ్వ కూడానా వీరయ్యా? - అందరం కలిసి విజయ్‌ యింటికెడదాం ముందు. వెళ్ళి అతను పడుకునే గది కిటికీ కింద నుంచుని గట్టిగా అరుద్దాం, సరేనా?!

“ఆమాటకొస్తే రాళ్ళుచ్చుకుని కిటికీకేసి కొడదాం,” సలహా యిచ్చింది బిషప్పుగారి

“తప్పకుండ్వా, నువ్వెలా చెబితే అలా, డియర్‌.

“గలాటా యిని అతను కిటికీలోంచి తల బయటికి పెటి తొంగిసూడగానే తోటలో మొక్కలకి నీళ్ళు పోసే పైపుతో మొహమ్మిద నీళ్ళు సిమ్మితే ఎలా వుంటదంటారు? అందరం ఎంసక్కా ఆనందంగా పడీపడి నవ్వుకోవచ్చు,! చెప్పాడు కానిస్టేబులు వీరయ్య.

దానికి బిషప్పుగ్రారు, 'మై డియర్‌ వీరయ్యా, అన్నీ భలేగా సమయానికి తగ్గట్టు ఆలోచిస్తావోయ్‌ నువ్వు అధికార వర్గంలో నాకున్న కాస్తో కూస్తో పలుకుబడితో '-'నీ తెలివితేటలు సరైన రీతిలో సక్రమంగా వుపయోగపడే పోస్టుకి ప్రమోషను యిచ్చి మరీ పంపించే ఏర్పాట్లు చేస్తానయ్యా: సరే మరి పదండింక, ఆలస్యం ఎందుకు. నువ్వు కూడా మాతో వస్తావా? అని అడిగాడు.

రానన్నట్టు తల అడ్డంగా వూవొడు (ప్రేమ్‌సాగర్‌.

(ప్రవచనం రాసుకోవాలి బిషప్పుగారూ.!

సరే, నీకెలా వీలైతే అలానే. నీ యిష్టం మరి. అయితే ఒక పని చెయ్యి.. తలపెట్టిన మంచి కార్యాన్ని మేము పూర్తి చేసి యింటికి తిరిగి రాగానే సులువుగా ఎవర్నీ యిబ్బంది పెట్టకుండా పక్కల మోద వాలేందుకు ముందు తలుపు మాత్రం తెరిచి పెట్టంచవయ్యా,

“తప్పకుండా బిషప్పుగారూ,;!

'మరైతే యిప్పటికి బై బై (పేమ్‌సాగర్‌,'

“టా టా, బిషప్పుగారూ, అన్నాడు (ప్రెమ్‌సాగర్‌.

పెన్ను తీసుకుని మళ్ళీ రాయడం మొదలెట్టాడతను, కమ్మటి సువాసనలు వెదజల్లుతున్న రాత్రిలో బయటినుంచి నలుగురి గొంతులూ దూరమవటం విన్నాడు, పాతకాలంనాటి చేయెత్తి జైకొట్టు తెలుగోడా జగమెంతా ఘనకీర్తి కలవోడా... పాట పాడుకుంటూ వెడుతున్నారు అందరూ కలిసి. ఆనందంగా చిరునవ్వుతో, 'సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము, సామెతలు 17 వ 22, అంటూ మననం చేసుకున్నాడు (ఢ్రేమ్‌సాగర్‌ తనలో తనే, [ సరదాగా కాసేపు || 5 శరద్రాత్రి సంబరాలు

పళ్ళంరాజు - పచ్చ కలరు బూల్సు (9 స్టే ఆ రాడా

మా పానకుటీరానికి వతనుగా వచ్చే వాళ్ళు అక్కడి ప్రశాంత వాతావరణంలో మమేకమై బయటి ప్రపంచాన్ని విస్మరిస్తారని, సాధారణ ప్రజానీకం పడే యిబ్బందుల్ని కష్టాల్ని పట్టించుకోకుండా వాళ్ళ గుండెలు మొద్దుబారిన స్థితికి చేరుకున్నాయని కొంతమంది అనుకోడం నా చెవులదాకా వచ్చింది.. ఈ అభిప్రాయం చాలావరకు సమంజసమేనని కూడా. నాకు అనిపిస్తుంది, నిలవనీరు లాంటి ఈ ప్రదేశంలో తల దాచుకుని సెలయేరులా సాగే జీవితానికి సుదూరంగా. గడుపుతు న్నామన్న మాట నిజమే. బయటి ప్రపంచంలో రోజుకి రోజు ఎంతో మందికి గుండెలు బద్దలవుతుంటాయనీ, నెత్తురోడుతుంటాయనీ మాకందరికీ లీలగా (గ్రహింపు వుంది; అయినా పరుల బాధని పట్టించుకోకుండా: మరో బాటిలు బీరుకో, రమ్ముకో, జిన్నుకో ఆర్దరిచ్చి వాళ్ళ సంగతి మరిచిపోతాం. విషాదం అంటే మా లెక్కన - చల్లగాలేని బీరో, రుచిగా లేని రమ్మో, స్ట్రాంగ్‌గా లేని విస్కోనో మరో పళ్ళంరాజు :- పచ్చ కలరు బూట్లు 154 సరదాగా కాసేపు

అయితే యిలాంటి. స్వార్ధపూరితమైన నిర్లిప్త వైఖరిని పూర్తిగా రూపుమాపలేకపోయినా కనీసం 'పైపొరని ఛేదించటానికి వీలవుతుంది. ఒక ఆదివారం నాటి సాయంత్రం సూటూ, బూట్లూ నెత్తిన ఖరీదైన టోపీ పెట్టుకుని దర్జాగా భాగోతుల సూతరాజుగారు లోపలికొచ్చి మాకు లిక్కరు సర్వు చేస నారాయుడి. కూతురు రంజన పెళ్ళి ఆగిపోయిందని చెప్పడంతో మేమందరం నిశ్చేష్టలమయ్యాం. 'నారాయుడి కూతురు రంజనకీ, మెయిన్‌ రోడ్డులో బట్టల దుకాణంలో పనిచేసే రాజమల్లుకీ 'పెళ్ళి జరపటానికి నిశ్చయించి తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు ఈ. మధ్యనే,

'అదేవిటండీీ ఓ గంటసేపటి కింద నారాయుడి కూతురు పట్టుచీర కట్టుకుని, కొప్పు నిండా' పూలు పెట్టుకుని ముస్తాబై, కంటినిండా కాటుకతో సహా (ప్రేమని కూడా నింపుకుని వెడుతుండగా చూశాం. మెట్ల కింద రాజమల్లుని కలిసి గుట్ట మాది దేవాల యానికి వెడుతున్నామని చెప్పింది, అంటూ చెప్పాం మేము.

విచారం కమ్ముకున్న ముఖంతో గట్టిగా నిట్టూర్పు విడిచి గ్లాసులో నిమ్మకాయ తొన ముసిగున్న విస్కీ ఒక గుక్కచప్పురించి చెప్పారు సూతరాజుగారు; 'ఆమాట నిజమే, అయితే వాళ్ళిద్దరూ పవిత్రమైన ఆ దేవాలయానికి చేరుకోలేదు. మెట్ల కింద కలిసిన మరుక్షణం అభిప్రాయ. భేదాలొచ్చి అక్కడిక్కడే తెగతెంపులు చేసుకున్నారు, సున్నితమైన (పేమ నౌకని ఢీ కొట్టి బద్దలుకొట్టిన బండరాయి --. బట్టలకొట్టు గుమాస్తా రాజమల్లు తొడుక్కువచ్చిన పచ్చటి పసుపురంగు బూట్లు”

“పసుపురంగు బూట్లా?!

“అవును, ధగాధగా మెరుస్తున్న పసుపుపచ్చ బూట్లు, చెప్పారు సూతరాజుగారు. “వివాదానికి దారి తీయడం ఆ బూట్ల గురించే. నారాయుడి కూతురు రంజన మహా తెలివైన పిల్ల. దేవుడన్నా, దేవాలయాలన్నా చాలా భక్తి ప్రపత్తులు చూపిస్తుంది. ఇలాంటి బూట్లు తొడుక్కుని గుడికి రావడం దైవాపచారంతో సమానం అంది. రాజమల్లులో వేడి నెత్తురు ప్రవహిస్తుండటంతో ఆ విమర్శకి కోపమొచ్చి తొంభై తొమ్మిది రూపాయలు పేట్టి కొన్నాను వీటిని, నువ్వూ నీ దేవుడూ గంగలో దూకండి అన్నాడు. దాంతో తాంబూలా. లప్పుడు యిచ్చిన వుంగరాలు చేతులు మారాయి. కానుకలు గట్రా, రాసుకున్న ప్రేమలేఖలు తిప్పి కొట్టడానికి ప్రయత్నాలు చకచకా జరిగాయి.”

“ప్రేమ కలహం కావచ్చులెండి,”

“అలా అనే ఆశిద్దాం.!

అక్కడున్న వాళ్ళు తీవ్రంగా అదే విషయాన్ని ఆలోచిస్తూ మౌనంగా వుండిపోయారు. సూతరాజుగారే మొదటగా ఆ. ఏకాగ్రతని వీడారు,

మౌనాన్ని భగ్నం చేస్తూ యిలా చెప్పారాయన: 'ఒకే కారణాన్ని విధి ఎన్ని రకాలుగా వపయోగిస్తుందో తలుచుకుంటే ఆశ్చర్యంగా వుంటుందండీ. పసుపుపచ్చటి బూట్ల జత యిక్కడేమో జత (పేమికుల హృదయాలని విడగొట్టి దుఃఖ సాగరంలో ముంచింది. ఇంకో సరదాగా కాసేపు 155 పళ్ళంరాజు - 'పచ్చ కలరు: బూట్లు

వైపునేమో యివే జత పచ్చ బూట్లు మా వేలువిడిచిన తమ్ముడు భాగోతుల పళ్ళంరాజుకి భార్యని జతగా చేకూర్చింది. ఇలాంటివి రెండు. వైపులా పనిచేస్తాయండీ. జం

మా వేలువిడిచిన తమ్ముడు భాగోతుల పళ్ళంరాజు మాద నాకు చాలా అభిమానం వుందని చెబితే (సూతరాజుగారు చెప్పసాగారు) నిజంగా అది అబద్ధమ అవుతుంది. నాకే కాదు చాలామందికి అతనంటే ఏవగింపు, జుగుప్ప. నీటుగా, దర్జాగా, ముక్కుకి సూటిగా వ్యవహరించే ఎంతోమంది నడివయసు (బ్రహ్మచారుల్లాగా ఈ మనిషి, కూడా తయారవుతాడని చిన్నతనంలోనే అలాంటి. చిహ్నాలు కనబరుస్తుండేవాడు. అలాంటి వాళ్ళంటే నాకు గిట్టదు. నీటుగా, దర్జాగా, ముక్కుకి సూటిగా వ్యవహరించడమే కాక వూళ్ళో వున్న గర్విష్టి వాళ్ళలో మేటి గర్విష్టి మా పళ్ళంరాజు.

మిగతా విషయాలకొస్తే. మంచి ఏరియాలో బృందావనం కాంస్లెక్సులో వసతిగా వుండే ఫ్లాటు తీసుకుని వుంటుందే వాడు. అతని దైనందిన చర్యలో ఒక భాగం - రోజూ పొద్దున తొమ్మిదిన్నర నించీ పన్నెండు గంటల వరకు ఏకాంతంగా శ్షనృఫైకెటరీ కుమారి ఏస్‌, హైమవతికి డిక్టేషను యిస్తూ గడపటం. ఇంతకీ అతను ఏ విషయం మిద ఆమెకి డిక్టేషను యిచ్చేవాడో యిప్పటికీ గోప్యమే. మగవారి దుస్తులు ఎన్నిరకాలు, కాలక్రమాన వాటిలో జరిగిన మార్పులు, అభివృద్ది వగైరాల గురించి బృహత్తర చారిత్రక [గ్రంధం 'రాస్తున్నాడని కొందరంటే ఆత్మకథ రాయడంలో నిమగ్నమైనాడని. మరి కొందరు అనేవారు. పళ్ళంరాజు అసలేమి రాసే ప్రయత్నంలో లేడు, కాకపోతే కుమారి ఎస్‌. హైమవతిని పనిలోంచి డిస్మిస్‌ చేయగల 'ధైర్యం' కూడగట్టుకోలేక రెండున్నర గంటలపాటు వూర్మే కూచోబెట్టి పంపించే వాడు అని నా వ్యక్తిగత అభిప్రాయం, ఆమెది చాలా ప్రశాంత స్వభావం, ప్రపంచాన్నంతటినీ లావుపాటి కళ్ళద్దాల్లోంచి ధైర్యంగా, నిశితంగా చూసే యువతి. ఆమె మూతి దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది, గడ్డం. పట్టుదలని సూచిస్తుంది. అత్యంత 'ప్రాభవంతో వెలిగిన దశలో మాత్రమే బహుశా జెరంగ జేబంతటివాడు ఆమెని డిస్మిస్‌ చేసుండే వాడేమో కానీ తక్కిన మానవమాత్రులెవరూ అంత ధైర్యానికి వొడికట్టరని నాకు యిప్పటికీ నమ్మకమండి.

అదండీ మా వేలువిడిచిన తమ్ముడు భాగోతుల పళ్ళంరాజు పరిస్థితి. వయసు మాత్రం నలఖై చాటింది, నడుము. చుట్టుకొలత నలభై అయిదు అంగుళాలు దాటి యింకా పెరుగుతోంది. మొగవాళ్ళు ఎలాంటి డ్రస్సులు ఎప్పుడు ధరించాలన్న విషయం మిద అతని అభిప్రాయాలు (వ్రామాజికం. అతనంటే మహా బోరని క్లబ్బులో అందరూ దూర దూరంగా: వెడుతుండేవారు. అయితే ఆ వూళ్ళో గొప్పగొప్ప వాళ్ళందరి యిళ్ళల్లోకి అతనికి తప్పనిసరి ఆహ్వానం వుంటుండేది -- ముఖ్యంగా జమిందార్లూ, ఒకప్పటి రాజులూ, ధనికవర్గానికి చెందినవాళ్ళూ. అలా స్థిరమైన ప్రశాంత జీవనంలో అమాంతం ఆ ప్రశాంతత పళ్ళంరాజు + పచ్చ కలరు బూట్లు 156 సరదాగా కాసేపు

భగ్నమైందని చెబితే నమ్మశక్యంగా లేదనగలరు మారంతా, అయినా జరిగింది అదేనండి. జీవితంలో విధి అనేది ఏ మూలనో నక్కి దాక్కుని ఎప్పుడో ఒకప్పుడు నెత్తిమోద మొట్టు తుందనేది యదార్ధం.

భాగోతుల పళ్ళంరాజు ప్రశాంతంగా గడిపే బ్రహ్మచారి జీవితం కాన్తా భయంకరమైన వొడిదుడుకులకు పాలైన రోజు చాలా: ఆనందంగా మొదలైంది. ఆ రోజు ఆదివారం, సెలవుదినం కనక :కుమారి ఎస్‌, హైమవతి బృందావనం కాంప్లెక్సుకు ఆరోజు మాత్రం రాదు.. ఆ కారణంగా (ప్రతీ ఆదివారం అతను మహా హ్యాపీగా ఫీలవుతూ వుండేవాడు, కొంతకాలం నుంచి కుమారి ఎస్‌.హైమవతి తన యింట్లో గడిపే రెండున్నర గంటలూ యిబ్బందిగా వుంటోందతనికి. ఈమధ్య తన వంక విచిత్రమైన చూపులు చూస్తూ ఆ చూపుల్లో ఏదో ఆశాభావం నింపుకున్నట్టు చూడటం అలవాటుగా చేసుకుందామె. ఆ చూపులకి అర్ధం ఏమై వుంటుందో అతనికి అగమ్యగోచరం, కానీ పళ్ళంరాజు యిబ్బంది పడుతూనే వున్నాడు ఆమె అలా ముఖంలోకి చూసినప్పుడల్లా. వారానికొక్క రోజు ఆమె పూర్తిగా తనతో గడపనండుకు సంతోషిస్తూ వచ్చాడు.

కొత్తగా కుట్టించుకున్న సూటు ముందటిరోజునే టైలరు నించి వచ్చింది. పొద్దున్నే కొత్త బట్టలు వేసుకుని అద్దంలో చూసుకుంటే బ్రహ్మాండంగా కనిపించింది ఆ డ్రెస్సు. కట్టుకున్న నెక్‌ టై నిరాడంబరంగా, ఆకర్షణీయంగా వుంది. సూటు సరిగ్గా వొంటికి అతికించి కుట్టినట్టు చాలా గొప్పగా వుంది. నల్లగా నిగనిగలాడే బూట్లు డ్రెస్సుకి తగ్గట్టు వున్నాయి. వేషధారణలో తనకొక ప్రత్యేకత అంటూ వుంది కనక పళ్ళంరాజు ఆ ప్రత్యేకతని, నిలబెట్టుకోవాలి. ఇలాంటి. విషయాల్లో ఎంతోమంది యువకులకి అతను మార్దదర్శకం. ఈరోజు కూడా: వాళ్ళని నిరుత్సాహ పరచనని అనిపించిందతనికి.

ఆరోజు 'పెదముత్తేవి జమిందారు ముత్యాలరాజుగారింటికి సరిగ్గా మధ్యాహ్నం ఒకటింబావుకి భోజనానానికి వెళ్ళవలసిన కార్యక్రమం వుంది. వూళ్ళో వున్న ఘరానా మనుషుల్లో అత్యంత ఐశ్వర్యవంతుల్ని అక్కడ కలవటం జరుగుతుందని భావించాదతను.

అనుకున్న దానికన్నా మరింత గొప్పగా జరిగిందక్కడ. 'డైనింగ్‌ టేబులు దగ్గిర పొరబాటున ఎలాగో లోపలికొచ్చిన పిల్ల జమిందారొకడూూ తనూ మినహా మిగతా వాళ్ళందరూ జమిోందార్ల కుటుంబాలకీ, ఒకప్పటి సంస్థానాధీశ్వరులకీ వారసులే వున్నారు. అదొక్కటే కాదు విజయరామరాజుగారి అందాల గారాబు పట్టి రాణీ శైలజాకుమారి తన పక్కకుర్చీ లోనే వుండటం గమనించి అతని సంతోషానికి అవధి లేకుండా పోయింది, ఆమె అంటే పళ్ళంరాజుకి ఎప్పట్నుంచో అమిత వాత్సల్యం, గౌరవం తోపాటు కన్నతండ్రిలా (ప్రేమగా చూసుకుంటాడు, భోజనం చేస్తున్నంత సేపూ వాళ్ళిద్దరూ వుల్లాసంగ్లా కబుర్లు చెప్పుకున్నారు. అందరూ లేచి వెడుతుంటే, తను పక్కనున్న పార్కులో గాంధిగారి విగ్రహం సరదాగా 'కాసేపు శేవ?7 పళ్ళంరాజు - పచ్చ. కలరు: బూట్లు

దాకా వెడుతున్నాననీ మిరు కూడా అటే వెడుతుంటే యిద్దరం కలిసి వెడదామనీ చెప్పింది. ప ళృంరాజుతో.

అలా వాళ్ళిద్దరూ కలిసి నడుస్తుంటే దార 'మి మ్మల్ని నాతో రమ్మన్నది ఎందుకో తెలుసా? నామనసులో మాటని ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది. ఇప్పుడిప్పుడే పెళ్ళికి అంగీకరించాను, అంది రాణీ శైలజాకుమారి.

“అమ్మాయ్‌ ఎంత చక్కటి శుభవార్త చెప్పావమ్మా, అన్నాడు పళ్ళంరాజు 'చాలా భక్తి శ్రద్ధలు చూపిస్తూ, “పేపర్లో ఎక్కడా కనిషించలేదే యీ: వార్త? అని అడిగాడు.

పాదు ఈ వార్త మోకెప్పటికీ పేపర్లలో కనిపించదని పందెం కడతా, ఇవాళ మధ్యాహ్నం పాపారావుని మా యింటికి తీసుకెళ్ళి నాన్నగారికి పరిచయం చేసినప్పుడు. ఆయనెలా స్పందిస్తారో దాన్నిబట్టి వుంటుంది. నిజం చెబుతున్నా పాపారావంటే నాకు చాలా యిష్టం, నిట్టూరుస్తూ చెప్పిందామె, “అతని మోద నాకున్న వల్లమాలిన ప్రేమని వర్ణించాలంటే మాటలు దొరకడం కష్టం. అయితే పాపారావు అందరూ అభిమానించే వ్యక్తి మాత్రం కాదని నాకూ తెలుసు, అతను బొమ్మలేసే ఆర్టిస్టు, తనంతటకి తనని వదిలిపెడితే అడుక్కునే వాడికన్నా హీనమైన బట్టలేసుకుని తిరుగుతాడు. అయినా అంతా మంచిగా ముగిస్తుందనే అనుకుంటున్నా నిన్ననే యాక్స్‌ బ్రదర్శుకి తీసుకెళ్ళి మంచి సూటూ, ఖరీదైన టోపీ వగైరాలు కొనిపించాను అతనితో. అవి వేసుకోంగానే కాస్తంత గౌరవప్రదంగా కనబడ్డాడు. దాంతో...

గొంతు పిసికేసినట్టు వున్నట్టుండి ఆమె మూగదానిలా అయింది, వాళ్ళిప్పుడు పార్కులో గాంధీ బొమ్మని సమిపిస్తున్నారు. చూడ్డానికి చక్కగా కనిపిస్తున్న ఒక పడుచు కుర్రాడు ఏమాత్రం వంక పెట్టలేని 'సూటు వేసుకుని దానికి తోడు బ్లూ కలరు నెక్‌ టై కట్టుకుని, నెత్తిమిది టోపీ వుల్లాసంగా పైకెత్తి పలకరిస్తూ ఎదురొచ్చాడు.

అతని గెటప్పు ఎంత బాగున్నా నూటికి నూరు శాతం కరెట్టుగా లేదు, గొంతు దగ్గిర్నుంచి చీలమండల వరకూ విమర్శించేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. అక్కడినించి కింది భాగంలోనే ఛండాలంగా వున్నాడతను. రాణీ శైలజాకుమారి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోవటానికీ, ఆ మనిషిని చూడగానే భాగోతుల పళ్ళంరాజులోంచి బాధతో గట్టిగా మూలుగు బయటికి రావటానికీ కారణం '-- ఆ పడుచు కుర్రాడు కాళ్ళకి ముదురు పసుపుపచ్చ రంగు బూట్లు తొడుక్కుని వుండటం:

“పాపారావ్‌! అని అరుస్తూ రాణీ శైలజాకుమారి ఆ దృశ్యాన్ని భరించలేక వణికే చేతుల్తో కళ్ళు మూసుకుంది. 'హారి.భగవంతుడా, ఏవిటది! పేరంటానికి వెళ్ళొచ్చావా? పాదాలకి పచ్చ కామెర్షొచ్చాయా! నీ కాళ్ళు అరటి పళ్ళ తోపుడుబండి అనుకున్నావా! ఎందుకు? కారణం ఏమిటి?* అంటూ పార్శంతా. దద్దరిల్లట్టు అరిచింది.

ఆ కుర్రాడి మనసు చివుక్కుమన్నట్టు కనిపించింది ఆ మాటలకి. పళ్ళంరాజు - పచ్చ కలరు బూట్లు 158 సరదాగా. కాసేపు

“నీకు నచ్చలేదనుకుంట్కాడియర్‌, యివి? నాకేమో చాలా నీటుగా కనిపించాయి మరి. నిన్న మనం కొన్న సూటుకీ, హేటుకీ జోడుగా కాస్త రంగుల కలయిక వుంటే ఎఫెక్టు చాలా గొప్పగా వుంటుందని తోచింది," అన్నాడు చిత్రకారుడైన ఆ యువకుడు.

“అధ్వాన్నం... మిస్టర్‌ పళ్ళంరాజుగారూ, అవి ఎంత అధ్వాన్నంగా వున్నాయో మిరైనా చెప్పండితనికి,!

ఆ మనిషి కలర్‌ కాంబినేషన్‌ చూసి పళ్ళంరాజు ఆత్మ క్నోభించింది, 'పూడిపోయిన గొంతుతో, “బాబూ, నువ్వేసుకున్న డ్రస్సుకి పచ్చకలరు బూట్లు నప్పవు;” అని చెప్పాడు.

“ఏం, ఎందుకు నప్పవు?'

“ఎందుకు నప్పవూ అన్నది వదిలెయ్‌, అవి నప్పవు, అంతే. చూడిక్కడ్త మిస్టర్‌ పళ్ళంరాజుగారి బూట్లు, ఆయన వేసుకున్న డ్రస్సు చూడు, చెప్పింది రాణీ శైలజాకుమారి.

చె ప్పినట్టు చూశాడా కుర్రాడు,

“అబ్బే, బొత్తిగా డల్‌, పసలేదు వాటిల్లో, రంగులు లేక వెలవెలబోతున్నాయి. ఆత్మ అనేది కనిపించదు సరికదా మాటల్లో చెప్పడానికి వీలుకానిదేదో వుంది. నాకస్సలు యిష్టం లేదు, అన్నాడు చిత్రకారుల పరిభాషలో ఆ కుర్రాడు. ॥

దానికి రాణీ శ్రైలజాకుమారి, “ఇష్టపడటం నేర్చుకోవాలి, ఎందుకంటే యిదిగో యీ నిమిషంలో మిస్టర్‌ పళ్ళంరాజు' గారి బూట్లు నువ్వు తొడుక్కుంటావు కనక, అంటూ శాసించింది..

గబ్బిలం అరుపులా కీచుమంటూ సన్నటి శబ్దం ఆ నడివయసు (బ్రహ్మచారి గొంతులోంచి బయటికొచ్చింది. తను సరిగ్గా విన్నాదా, విన్నది కరక్టేనా అన్న అనుమానం వచ్చింది,

రాణీ శైలజాకుమారి వడివడిగా 'నడుస్తూ, “ఇదిగో ముందు మిోరిద్దరూ. యిక్కడికి రండర్రా, ఆ బెంచీలున్నాయే వాటిచాటున బూట్లు మార్చుకోండిప్పుడే, మికు అభ్యంతరం లేదనుకుంటా, మిస్టర్‌ పళ్ళంరాజుగారూ? మరోలా భావించరు కదా? అని అడిగింది.

భయంతో యింకా కంపిస్తున్నాడు పళ్ళంరాజు.

నేనిప్పుడు వేసుకున్న సూటుకి, టోపీకి పచ్చకలరు బూట్లు తొడుక్నోమంటావా?” అంటూ హీనస్వరంతో అడిగాడు. మెరిసే సిల్కు టోపీ కిందున్న ముఖం పాలిపోయి కుంగిపోయింది.

“అవును.”

“ఇక్కడా? పార్కులోనా? ఇంతమంది జనం మధ్యలోనా?”

“అవును. త్వరగా కానీయండి.”

మిస్టర్‌ పళ్ళంరాజుగారూ! .ఏవిటిది? నేను అడుగుతున్నా పట్టించుకోరా మిరు?”

వేడుకుంటున్న కళ్ళతో చూసిందామె పళ్ళంరాజు వంక, ఏం చేయాలో తోచని:

పరిస్థితిలో వున్న పళ్ళంరాజుకి వున్నట్టుండి రాణీ 'శైలజాకుమారి. రాజకుటుంబంలో పుట్టిందనీ పైగా తన తల్లి వైపునుంచి ఆమేతో బంధుత్వం కూడా వుందనీ గుర్తుకొచ్చింది. ఇలా గౌరవప్రదమైన కుటుంబంలోంచి వచ్చి గొప్పగొప్ప వాళ్ళతో సంబంధ బాంధవ్యాలున్న ఈ చిన్నదాని కోరికని తను తిరస్మరించడమా?

కాళ్ళకి పక్షవాతం కమ్మినట్టు యింకా అలా నిలబడే 'వున్నాడతను, ఇప్పటిదాకా జీవితమంతా తన వేషధారణ గురించి గర్వపడుతుందేవాడు. కుర్రాడుగా వున్నప్పుడు ముదురురంగు నెక్‌ టైలు 'వాడేవాడు. కాదు. అలాగే ప్యాంటూ, షర్టూ, సాక్సు అన్నీ ఫాషనుకి తగ్గట్స వేసుకునేవాడు.. తను అడిగింది ఏంత ఘోరమైన కోరికో తెలుసా ఆ అమ్మాయికి? కాసేపు గుడ్లు మిటకరించాడు... కళ్ళల్లో నీరు చిమ్మింది, చెవులు రెపరెప లాడాయి. పార్కు గుండ్రంగా అతని చుట్టూ తిరుగుతున్నట్టు తోచింది.

ఆ పిల్ల పెత్తల్లి కొడుకు గజపతిరాజుల వంశానికి చెందినమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని హెచ్చరిస్తూ బొబ్బిలి, పిఠాపురం జమిందార్లతో కూడా ఆమె కుటుంబానికి సంబధాలున్నాయని రహస్యంగా దూరన్నించి ఒక గొంతు హెచ్చరించినట్టయి సమాధాన పడ్డాడు:

'సర్తే అలాగే కానిద్దాం, అన్నాడు భాగోతుల పళ్ళంరాజు అంగీకరిస్తూ, కాసేపటికి పార్కులో వంటరిగా మిగిలిన మా వేలువిడిచిన తమ్ముడికి ముందు కర్తవ్యం ఏమిటో అంతుబట్టలేదు. విచ్చిన పొద్దుతిరుగుడు పువ్వల్లా కాళ్ళకి మొలుచుకొచ్చిన పచ్చకలరు బూట్లు చూసుకుంటూ స్తబ్బదై నుంచున్న చోటునే రాయిలా వుండిపోయాడు. గొప్ప సామర్ధ్యం చూపించి తేరుకున్న తరవాత గబగబా: పార్కు బయటకి వచ్చి ఖాళీగా పోతున్న టేక్సీని పిలిచి గభాల్న అందులోకి దూరి బృందావనం కాంప్లెక్సు, మహాత్మా గాంధీ రోడ్డుకి పోనిమ్మని దడైవరుకి చెప్పాడు.

ఎవరి దృష్టిని ఆకర్షించకుండా గూట్లో దాక్కున్నట్టు వున్నందుకు ఆనందంతో అతని బుర్రలోకి మరే యితర ఆలోచనలు రాలేదు, కాసేపట్లో క్షేమంగా తన అషార్జుమెంటు చేరుకోవచ్చన్సీ యింట్లో పడున్న ముపష్పయ్యేడు జతల నల్లరంగు బూట్లలో ఏదోఒకటి తొడుక్కుని భయంకరంగా మెరుస్తున్న ఈ పచ్చకలరు బూట్లని విసిరి పారేయచ్చు కదా అనుకున్నాడు. అయితే బృందావనం కాంప్లెక్సుకి చేరుకోగానే తన మార్గం అనుకున్నంత సులభం. కాదని గుర్తుకొచ్చింది.

టేక్స్సీ దిగి లోపలికి ఎలా వెళ్ళాలి ఈ బూట్లతో, పచ్చకామెర్లు కమ్మిన ఓడలా కనిపించడూ తను? గేటు దగ్గిరుండే 'సెక్యూరిటీ గార్డు తన అవతారం చూసి ఏమను కుంటాడు? తను - భాగోతుల పళ్ళంరాజు - యింతకాలం అందరికీ ఫాషన్ల గురించి లెక్చర్లు యిచ్చినవాడు,. కుర్రాళ్ళకి తరచుగా. సలహాలిచ్చినవాడు, ఓసారి సినిమా హీరోకే

పళ్ళంరాజు - పచ్చ'1కలరు: బూట్లు 160 సరదాగ్గా కాసేపు

(డ్రస్సులో 'మెళకువలు నేర్పించినంతటివాడు - యిలా.పచ్చకలరు బూట్లు తొడుక్కుని లోపలికి ఎలా నడవగలడు? శక్యం కాదు. తన అంతరాత్మ అలాంటి పనికి అంగీకరించదు, గర్తిస్తుంది కూడాను. మరిప్పుడేమిటి గతి? ఏం చేయాలి?

'మా భాగోతుల వంశీకులందరిలాగానే పళ్ళంరాజుకు కూడా ఎంతటి కష్టాల కడలిలో మునిగున్నా అవసరానికి బుర్ర చక్కగా పనిచేసి ఏదో ఒక 'వుపాయం తట్టే సుగుణం వుంది. వెంటనే ముందుకి వంగి టేక్సీ డ్రైవరుతో మంతనాలాడాడు. .

'బాబ్బూ నువ్వు తొడుక్కున్న బూట్లు ఎంతకి అమ్ముతావ్‌?” అంటూ బేరానికి దిగాడు.

ఆ డైవరు వూరి జనాభాలో మెరుపులా ఆలోచించగల వాళ్ళ కోవకి రాడు. వెనక్కి తిరిగి పూర్తిగా ఒక్క నిముషం పాటు ఆలోచించి తను విన్నదాన్ని జీర్ణం చేసుకోగలిగాడు.

చిట్టచివరికి, *నా బూట్లా?? అంటూ అడిగాడు.

"అవును, నీ బూట్లు!"

“నా బూట్లు ఏంతకి అమ్ముతాను అనేనా మారడిగింది?'

"అవును, నిజం, నాకు నీ బూట్లు అర్జెంటుగా కావాలి. ఎంతకిస్తావ్‌ నీ బూట్లు?

(బూట్లు ఎంతకిస్తాననా?' సై

“అవును, కరెక్టే. ఎంతకమ్ముతావ్‌ వాటిని?!

“మారు నా బూట్లు కొనాలనుకుంటున్నారా?'

“అవునయ్యా, నిజంగా.”

“ఆహా, కానీ మొత్తం మోద ' జరిగిందేవిటంటే వినండి, మికు చెప్తా. నేనసలు లెదరు బూట్లే తొడుక్కుని రాలేదు. నాకు పాదాల కింద ఆనలు వున్నాయి. అందుకని కేన్నాసు బూట్లతోనూ, హవాయి చెప్పుల్తోనూ వస్తాన్నేను. కావాలంటే జత వంద రూపాయిలకి కొనుక్కోండి యిచ్చేస్తా? అన్నాడా ద్రైవరు.

భాగోతుల పళ్ళంరాజు మూగబాధ అనుభవిస్తూ సీట్లో వెనక్కి జేరగిలబడ్డాడు. కలిగిన ఆశాభంగానికి మెదడు మొద్దుబారింది. అయినా: భాగోతల వంశీకుల కుశాగ్రబుద్ధి అక్కరకొచ్చింది వెంటనే. ఒక్కక్షణం ఆగిమళ్ళీ తల ముందుకు పెట్టి డ్రైవరుతో, 'నన్నిప్పుడు నెంబరు ఏడూ, బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్డ్‌కి తీసుకెళ్ళు, అసి చెవ్పాడు.

అది విని ఆ దైవరు కాసేపు ఆలోచించాడు. “ఏం ఏందుకు?” “ఎందుకో నీకు అనవసరం, పోనియ్‌.” దానికా దైవరు, “బృందావనం కాంస్లెక్సుకి కదా తీసుకెళ్ళమన్నారు. మోరేం చె ప్పారంటే జా బృందావనం కాంప్లెక్సు, మహాత్నా గాంధీ రో ద్దుకి పోనివ్వన్నారు. ఇదిగో యిదెగా బృందానం కాంప్లెక్సు. కావాలంటే ఎవర్నన్నా అడిగి చూడంది, అన్నాడు,

“అవును, అవునూ, అవునూ. కానీ నేనిప్పుడు నెంబరు ఏడూ బాలాజీ. ఎవెన్యూ, వ్యాలీ ఫీల్స్‌కి వెళ్ళాలి ..." సరదాగా కాసేపు 161 పళ్ళంరాజు -,పచ్చ, కలరు. బూట్లు

'అఆఇళఈల్లో ఏ, డకి కొమ్మిస్తే డు, నెంబరు వడు, బాలాజీ ఎవెన్యూ ...” “అదెలా రాస్తారు మరి?” “బాలాజీ అంటూ తెలుగులో ఎవెన్యూ అంటూ ఇంగ్లీషులో, వ్యాలీ ఫీల్స్‌ ... అదంతా ఇంగ్లీషులోనే. జ యింతకీ ఆ యిల్లు వ్యాలీ ఫీల్స్‌లో వుందంటున్నారా?” “అవునయ్యా, కరెక్టుగా చెవ్వావ్‌.' “అంటే అందులో ఒక వీ వస్తుందా?” “అవును, ఒక వీ, ఒక యఫ్‌ చెప్పాడు పళ్ళంరాజు, కాసేపు మౌనంగా కూచున్నాడా 'టైవరు, పోవాల్సిన (ప్రదేశం ఎలా రాస్తారో తెలుసుకుని యిప్పుడు తన ఆలోచనల్ని దారిలోకి తెచ్చుకుంటున్నాడు, ఇప్పుడంతా 'సరిగ్గా తెలిసిపోయిందండి, మోరు వెళ్ళాల్సింది - నెంబరు ఏడూ, బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్డ్‌, అవునా?! అని అడిగాడు. “కరెక్ట్‌! 'మరి నా కేన్వాసు బూట్లు, హవాయి చెప్పులూ యిప్పుడే కొనుక్కుంటార్మా అక్కడికి 'నాకు నీ కేన్వాసు బూట్లు అక్థర్లేదు. హవాయి చెప్పులు అంతకన్నా అక్థర్లేదు. వాటిని కొనేందుకు నేను మార్కెట్లో లేను. “వోనీ, జత యాభై రూపాయలకి తీసుకోండి.! “ధ్ధ్యా ంక్యూ, వద్దయ్యా. “సర్లెండి, పాతిక రూపాయలు చేసుకోండి.! “వద్దూ, వద్దూ వద్దు. నాకు నీ కేన్వాసు బూట్లు వద్దు, నీ హవాయి చెప్పులు నాకసలే వద్దు.* “ఏవిటీ, మాకు కేన్వాసు బూట్లు వద్దా?! “వద్దు. “హవాయి చెప్పులు కూడా వద్దా?! తన ఆలోచనల్ని యిప్పుడు మరింత క్రమ పద్ధతిలో పెట్టుకుని, 'కానీ మరిప్పుడు నెంబరు ఎడు బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్స్‌కి వెళ్ళాలంటారు, అంతేనా?' మందలిస్తున్నట్టు “ఆహా,” అని గభాల్న ఇంజను స్టార్టు చేసి బయల్దేరాడా [దైవరు. ఇప్పుడు సరిగ్గా కుదిరిందంతా. మోరీ. సంగతి ముందే చెప్పుంటే ఈపాటికి సగం దూరానికి చేరుకునుండేవాళ్ళం,” అంటూ చురక అంటించాడు, పళ్ళంరాజు - పచ్చ. కలరు బూట్లు 162 సరదాగా కాసేపు

_ నెంబరు ఏడూ, బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్స్‌ అనే సుందర ప్రదేశానికి వెళ్ళాలని భాగోతుల 'పళ్ళంరాజుకి తోచడం వూర్మే వుబుసుపోకకి కాదని మనవి. అలాగే టేక్సీలో తిరుగుతూ కూర్చోవలనీ కాదు, సైట్‌ సీయింగ్‌కి అంతకన్నా కాదు. ఆయనగారి సెక్రెటరీ కుమారి ఎస్‌, "హైమవతి వుండేది ఆ యింట్లోనే, అదే పోస్టల్‌ అద్రసులోనే. పళ్ళరరాజు అప్పటికప్పుడు వేసుకున్న పధకం చాలా గొప్పదిగా తోచిందతనికి. ఈ పరిస్థితుల్లో ఆతను చెయ్యదలచుకున్నదల్లా -* కుమారి ఎస్‌, హైమవతిని బయటికి. పిలవడం, తన యింటి తాళం చెవి ఆమెకి యివ్వడం, దాంతో ఆమెని టేక్సీలో మహాత్మాగాంధీ రోడ్డు, బృందావనం కాంప్లెక్సుకు పంపించి యింట్లో పడున్న ముష్ఫయ్యేడు నల్ల రంగు బూట్ల జతల్లో ఏదో ఒక జత తెప్పించుకోడం. ఆమె తిరిగి వచ్చిన తరవాత నల్ల బూట్లు తొడుక్కుని ప్రపంచాన్ని మళ్ళీ ధైర్యంగా ఎదుర్కోవచ్చని అతని ధీమా,

కలా వేసుకున్న పధకంలో అతనికి ఎక్కడా లొసుగు కానీ, వ్యాలీ ఫీల్స్‌కి చేరుకునే దూరప్రయాణంలో మరింత దీర్హంగా ఆలోచిస్తున్నప్పుడు యిబ్బంది కానీ కనిపించలేదు. చక్కగా పొందిగ్గా వున్న డాబా ముందున్న తోట 'గేటు బయట టేక్సీ ఆగగానే దిగి, దైవరుకి కాసేపు వెయిట్‌ చెయ్యమని (వెయిటింగ్లా? వెయిటింగేవిటి? ఓహో, మీరనేది కాసేపు వుండమనా?' అంటూ ఆ దైవరు అడిగాడు) చెప్పిన తరవాత పళ్ళంరాజు బుర్రలో అనుమానాలు చెలరేగి యిబ్బంది పడసాగాడు. లోపలికి వెళ్ళి గుమ్మం దగ్గిరున్న కాలింగ్‌ బెల్లు నొక్కటానికి వేలు పైకెత్తుతుంటే నమ్మకం కుదరక - పక్కన కూచున్న జమిందారు గారి భార్యని డొక్కలో పొడవటాన్ని తమాయించుకున్నట్ట - వెంటనే వేలు దింపేశాడు. ఇంత మంచి సూట్లూ 'హేటూతో పచ్చకలరు బూట్లు తొడుక్కుని కుమారి ఎస్‌. హైమవతిని తను ఎలా కలవగలడు? ఏమనుకుంటుంది తన గురించామె? ఆలోచిస్తూ ఆమెనిలా కలవడం మంచిది కాదనే బలవంతపు నిర్ణయం తీసుకున్నాడు. ఆధునిక కాలంలో మగవాళ్ళు ధరించే దుస్తుల మోద. విమర్శిస్తూ ఎన్నిసార్లు తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకి వుత్తరాలు రాస్తుంటే ఆమె డిక్టేషను తీసుకోలేదు? మరిప్పుడు తనే యిలాంటి పచ్చకలరు బూట్లు తొడుక్కుని ముందు నిలబడితే కుమారి ఎస్‌. "హైమవతి చూపులు ఎలా వుంటాయో గదా అని ఆలోచిస్తుంటే బుర్ర తిరిగి పోయిందతనికి. మారేనా ఈ పని చేసిందని ఒక్కసారి కనుబొమ్మలు పైకెత్తుతుందామె... తృణీకరిస్తున్నట్టు కదిలే పెదిమెలు... ప్రశాంతంగా వుండే ఆమె కళ్ళు అసహ్యంగా: వున్నావని రెప్పలు కొడుతూ చూసే చూపులు... లేదు, తను మాత్రం ఈ అవతారంతో కుమారి ఎస్‌. హైమవతిని వదుర్భోలేడు. భాగోతుల పళ్ళంరాజుకి దీన్నుంచి విరమించుకుంటెేనే మంచిదని తోచింది. వూర్మే మనసులో ఘర్షణ పడుతూ కూచోడం వద్దనుకున్నాడు. వెంటనే టేక్సీ దగ్గిరకెళ్ళి డైవరుని బతిమాలో బామాలో గంటసేపు అర్ధమయేలా వివరిస్తూ తనని మళ్ళీ బృందావనం కాంప్తెక్సు, మహాత్మా గాంధీ రోడ్డుకి తీసుకెళ్ళమని (అదేవిటి, యిందాకోసారి మిమ్మల్ని తీసుకెళ్ళాగా అక్కడికి, మికేమో నచ్చలేదది,' అంటూ. అతను సోది మొదలెట్టడం 'సరదాగా కాసేపు 163. పళ్ళంరాజు --'పచ్చ కలరు బూట్లు

వూహించుకున్నాడు పళ్ళంరాజ్బు చెబుదామనుకున్నాడు. అంతలో ఎక్కడో దగ్గిర్నించే వున్నట్వ్సండి - బురదలోంచి బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్న పంది చేసే చప్పుడులా ఘట్టిగా, చెవులు చిల్లులు పడుతూ నీళ్ళు వుక్కిలిస్తున్న శబ్దం అతని చెవులకి చేరింది. అది లోపల ముందు గదిలో ఎవరో గురకపెడుతున్న చప్పుడు, తిరిగి చూశాడు, పక్కనే వున్న కిటికీ బార్లగా తెరిచి వుండటం గమనించాడు.

ఆరోజు మధ్యాహ్నం బాగా వడక పోస్తోందని మాకు నేను ముందే చెప్పుండాల్సింది. ఎలా వుందంటే వూరికి దూరంగా వుందే వాళ్ళందరూ ఆదివారం కనక కావలసినంత చల్లటి బీరు తాగి సుష్పుగా మటన్‌ బిర్వాన్సీ చికెన్‌ కర్రీ చేపల పులుసు,. కోడిగుడ్లూ వగైరాలన్నీ ఆత్మన, దేహాన్నీ కలిపి వుంచేలా తినేసి ముందుగదిలో విశ్రాంతి తీసుకుంటూ కాస్త కునుకు తీసేలాంటి రోజది. పళ్ళంరాజు కిటికీలోంచి తొంగిచూసింది - యిష్పుదే అలా భోజనం ముగించి 'వాలుకుర్చీలో కునుకు తీస్తూ కొట్టొచ్చినట్లు కనబడుతున్న యింటి యజమాని గదిలోకి. వాలుకుర్చీలో పడుకుని దగ్గిరకి లాక్కున్న మరో కుర్చీ మాద కాళ్ళు జాపుకుని నిద్రపోతున్న మనిషి భారీగా, లావుగా వున్నాడు. నిద్రాభంగం కాకుండా ముఖం మాద జేబురుమాల కప్పుకుని పడుకున్నాడు. పళ్ళంరాజు పరికించి చూస్తే ఆయనగ్గారి కాళ్ళకి వొట్టి సాక్సు మాత్రమే వున్నాయి, విప్పిన బూట్లు కుర్చీ పక్కన తివాచీ మిద కనబడ్డాయి.

ఎముకలు కొరికే చలిలో సలసల కాగుతున్న వేడినీళ్ళు పోసుకున్నట్టు పళ్ళంరాజుకి వున్నట్టుండి. గొప్ప అనుభూతి కలిగింది - దానికి కారణం అక్కడున్న బూట్లు నల్లగా

ఏదో ఆపరాని వుద్వేగం ఆవహించి తోసినట్టు ఒక్క క్షణంలో పళ్ళంరాజు చప్పుడు చెయ్యకుండా కిటికీలోంచి లోపలికి దూరి మోకాళ్ళ మదా ముంజేతుల మీదా పాకుతూ కుర్చీని సమాపించడం మొదలెట్టాడు... పళ్ళు బిగపట్టాడు, కళ్ళు వింతైన వెలుగుతో ప్రకాశించాయి, నెత్తి మాద టోపీ కనక లేకపోతే - మహారణ్యంలో ఆహారాన్ని 'పసిగట్టి వేటకి బయలుదేరిన పెద్దపులికి సరిసమానంగా కనిపించి వుండేవాడు.

ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు 'పళ్ళంరాజు, ఇదివరలో ఎన్నడూ యిలాంటి పని చెయ్యనివాడైనా యిప్పుడు 'గూత్రం ఏంతో అనుభవం వున్నవాడిలా చురుగ్గా కదులుతున్నాడు. ఇంకొంచెం సరిగ్గా చెప్పాలంటేనంది, ఆ పెద్దపులి కనక మనవాడిని యిప్పుడు చూసుంటే కాసిన్ని పాఠాలు నేర్చుకునుండేది అన్నదాంట్లో నాకేమాత్రం సందేహం లేదు. చప్పుడు చెయ్యకుండా అంగుళం అంగుళం మేర పాకుతూ ఆ నల్లరంగు బూట్లని సమిపిస్తుంటే వాటిని చూసి పళ్ళంరాజు అరచేతులు దురద పెట్టసాగాయి. 'పళ్ళంరాజు :- పచ్చ కలరు బూట్లు 164 సరదాగా కాసేపు

సరిగ్గా అదే సమయంలో సినిమా యాక్టరు. జయప్రకాష్‌రెడ్డి .ఎత్తునించి. రేకుల షెడ్డు మోద జారి పడినంత శబ్దం మగతగా నిశ్చలంగా వున్న ఆ వేసవి మధ్యాహ్నపు నిశ్చలతనీ, నిశ్శబ్దాన్నీ భంగపరిచింది. ఆ చప్పుడు ఎక్కడినించో కాదు, పళ్ళంరాజు నెత్తినున్న టోపీ ఠక్కున కింద పడటంతో వచ్చిన చప్పుడది, అయితే యింతవరకూ జరిగిన సంఘటనల మూలాన అతని బుర్ర వేడెక్కి నరాల వుద్రిక్తత వల్ల చెవులు గింగురుమన్నట్టు చప్పుడొ చ్చిందన్న భావనలో వున్నాడతను, భయపడి అంత లావు మనిషీ నిశ్శబ్దంగా చెంగున ఒక్కదూకు దూకి వాలుకుర్చీ వెనకాల నక్కి దాక్కున్నాడు పళ్ళంరాజు,

చాలాసేపు అయినట్టు అనిపించిందతనికి. అంతా సవ్యంగానే వుందనుకున్నాడు మొదట్లో. పడుకున్న పెద్దమనిషి నిద్ర లేవలేదనుకున్నాడు. అంతలో నీళ్ళు పుక్కిలించిన శబ్దం వినవచ్చింది, ఆ లావుపాటి మనిషి లేచి కూచున్నాడు కుర్చీలో. ఇంతలావు చెయ్యి పళ్ళంరాజు పక్కనించి దాదాపు అతన్ని రాసుకున్నట్టుగా వెళ్ళి గోడకున్న బెల్లు నొక్కింది. ప్రస్తుతం తలుపు తెరుచుకుంటూ. యింట్లో, పనిచేసే అమ్మాయి వచ్చింది.

కుర్చీలో కూచునున్న పెద్దమనిషి ఆమెని చూడగానే, 'పిచ్చాలూ!' అన్నాడు.

“అవునా అయ్యా?"

“నాకేమనిపించిందంటే... పిచ్చాలూ!”

'ఈ టోపీ ఏవిటిక్కడ, నేల మోద ఏం చేస్తోందది?”

“టోపీనా అయ్యా?

“అవును, టోపీయే,” చిరచిరలాడుతూ కోపంగా ఆ "పెద్దమనిషి అన్నాడు. “చాలా. బాగుందీ వ్యవహారం. నేనేమో ప్రశాంతంగా కునుకు తీద్దామని యిక్కడికొస్తే కన్ను మూశానో లేదో గదంతా చిందరవందరగా టోపీల్లో నిండిపోయుంది, ఇక్కడ కాస్త విశ్రాంతి. తీసుకుందామనుకుంటే ఏమాత్రం హెచ్చరికన్నా లేకుండా మోకాల్లోతు టోపీల్లో చిక్కుబడిపోయా, పిచ్చాలూ, ఆ టోపీ యిక్కడెందుకుంది? నాక్కావాల్సింది సరైన సమాధానం, గుర్తుంచుకో.

“బహుశా హైమవతమ్మగోరు యిక్కడుంచారేమోనయ్యా.!

(గదంతా టోపీలో ఎందుకు నింపుంటుంది మి హైమవతమ్మగారు?"

“అవునయ్యా.

“అవునయ్యా అంటే అర్ధం ఏమిటి?!

'కాదయ్యా.!

“సరే ఇంకోసారి మాట్లాడే ముందు. కాస్త ఆలోచించుకుని మాట్లాడు. పిచ్చాలూ, సరదాగా: కాసేపు 165 పళ్ళంరాజు - పచ్చ కలరు; బూట్లు

ముందా టోపీ అక్కడ్నించి తీసెయ్‌, అలాగే మళ్ళీ యింకోసారి ఏమాత్రం అలికిడి కాకుండా వుండేట్టు చూడు. నాకు మధ్యాహ్నం పూట కాస్తంత కునుకు తప్పనిసరని గుర్తుంచుకో,!

'తవంరు తోటలో కలుపు మొక్కలు తీస్తారని హైమవతమ్మగోరు సెప్పారయ్యా.

పిచ్చాలూ, ఆ సంగతి తెలుసు నాకు, చెప్పాడా మనిషి నిండు దర్పంతో, కాసాపేగి నా వీలు 'ప్రకారం తోటలో కలుపు మొక్కల సంగతి చూస్తాలే, ముందు నాక్కావాల్సింది కాస్తంత విశ్రాంతి. ఇవాళ ఆధివారం, వేసవికాలం మిట్ట మధ్నాహ్నం. పక్షులు కూడా ఎండకి చెట్ల ఆకుల్లో దాక్కుని నిద్రపోతున్నాయి. చిన్నబ్బాయి రమేష్‌ కూడా డాక్టరు సలహా పాటించి పైన గదిలో నిద్రపోతున్నాడు, నేనూ పడుకోవాలనుకుంటున్నాను. ఆ టోపీ తీసుకెళ్ళి నా మానాన నన్నాదిలెయ్‌ పిచ్చాలూ.”

పిచ్చాలు తలుపు మూస్తూ వెళ్ళిపోయింది, ఆ పెద్దమనిషి సంతృప్తితో గుర్రుమంటా గర్జించి కుర్చీలో వెనక్కి జారగిలబడి నిద్రకి వుపక్రమించాడు, కాసేపట్లో మళ్ళీ గ్రురక తీయడం మొదలెట్టాడు.

అయినా పళ్ళంరాజు తొందరపాటు చూపించదలుచుకోలేదు, ఇందాకటి చేదు అనుభవం మూలాన చిన్నప్పుడు 'స్ఫూల్లో స్కౌాటు మేస్ప్టార్లు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని ఈసారి చాలా జాగ్రత్తగా మెలగాలనుకున్నాడు. దాదాపు పావుగంట సేప్త అక్కడే కుర్చీ వెనకాల నక్కి కూచున్నాడు, అప్పటికా పెద్దమనిషి గురక పతాకస్థాయికి చేరుకుంది. స్టమింజను చప్పుడు వస్తుంటే సురక్షితంగా. యిప్పుడు తన కార్యక్రమం మొదలెట్ట వచ్చనుకున్నాడు పళ్ళంరాజు, అక్కడే కూచుని తన వడంకాలి బూటు వివ్వాడు, దగ్గిర్లో వున్న నల్ల జత బూట్లలో ఒకదాన్ని తనవైపుకి లాక్కుని తొడుక్కున్నాడు, అతని పాదానికి చక్కగా సరిపోయిసరికి మొట్టమొదటిసారిగా అతనికి కొంత సమాధానం, సంతృప్తి దొరికి నట్టు భావించాడు, ఇంకొక్క నిమిషంలో, కేవలం ఒకే ఒక్క నిమిషంలో అంతా సరిగా ముగుస్తుందిగా అని అనుకున్నాడు.

అలా తనలో తనే ధైర్యం చెప్పుకుంటున్న మరుక్షణంలో వున్నట్టుండి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సైనికులు బాంబులు పేల్చిన శబ్దం వినిపించింది. అతని గుందెకాయ లేచొచ్చి ముందుపళ్ళకి ఢీ కొట్టుకుంటే పన్ను కదిలింది. ఠక్కున వెనక్కి జరిగి గుహలో దాక్కున్నట్టు మ భ్ఫీ కుర్చీ వెనకాల దాక్కున్నాడు.

నిద్రపోతున్న పెద్దమనిషి కాస్తా భయంతో లేచి కూచున్నాడు.

'పిల్లా, పాపా క్షేమంగా వర్ధిల్లుగాక* అన్నాడు.

ఆ తరవాత చెయ్యి చాస్తూ బెల్లు నొక్కాడు,

'పిచ్చాలూ!”

“అయ్యా?”

'పిచ్చాల్తూ ఆ కిటికీ తలుపుకున్న చిలక మళ్ళీ వూడినట్టుంది. ఇలా ఎవరింట్లోనూ పళ్ళంరాజు. '- .పచ్చ కలరు బూట్లు 166 సరదాగా .కాసేపు

చూడలేదు, మాటిమాటికీ పడిపోతుంటాయి. ఈగ వాలితే చాలు, దాని బరువకి కిందికి జారతాయి. బండ పుస్తకమో మరేదన్నానో అడ్డం పెట్టుంచు.!

'అలాగేనండయ్యా.

'పిచ్చాలూ నీకో సంగతి చెబుతా విను. నేనే అన్నట్టు నిర్భయంగా నలుగురితోనూ. చెప్పు ఫరవాలేదు. ఇహమిద మధ్యాహ్నం పూట కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే ఏ బాయిలరు ఫ్యాక్టరీకో వెడతాగానీ యిక్కడికి మాత్రం రాను.

పనిమనిషి పిచ్చాలు వెళ్ళిపోయింది, ఆ పెద్దమనిషి గట్టిగా శ్వాస పీల్చి నిట్టూరుస్తూ మళ్ళీ కుర్చీలో వెనక్కి జారగిలబడి నిద్రపోయాడు, కాసేపటికి తుఫాను హోరులా గదంతా గురక చప్పుడుతో ప్రతిధ్వనించింది.

అలా కాసేపయిందో లేదో గది కప్పు వూడిపోతున్నట్టు చప్పుళ్ళు వచ్చాయి.

అవి బాగ్లా గట్టి చప్పుళ్ళు. మిద్దె మాద గదిలో ఏనుగు పాదాలంత పాదాలతోఎంతో మంది. (గ్రూప్‌. డాన్సు చేస్తున్నారనుకున్నాడు పళ్ళంరాజు. అయినా అందరూ నిద్రపోయే యిలాంటి సమయంలోనా యిష్టమొచ్చినట్టు స్వార్ధంగా అనుభవించటం అనుకున్నాడు మనసులో, కుర్చీలో 'పడుకున్న పెద్దమనిషి కదలడం మొదలెట్టాడు, లేచి నిఠారుగా కూచుని అలవాటు ప్రకారం చెయ్యి ముందుకు చాచి బెల్లు నొక్కాడు.

“వింటున్నావా!”

“ఏవిటా చప్పుళ్ళు?

“ఆదివారం కదా, సిన్నబ్బాయిగోరు కాస్తంత నిదరోతున్నట్టున్నారయ్యా.!

ఆ పెద్దమనిషి కుర్చీలోంచి లేచి నుంచున్నాడు, అనుభవిస్తున్న క్నోభని మాటల్లో పెట్టలేకపోతున్నాడు. సొరంగం లాంటి. నోరు తెరుస్తూ గట్టిగా ఆవలించి బూట్లు తొడు క్కోడానికి వుపక్రమించాడు,

“జరిగింది చాలు. ఇహ నేవెళ్ళి యింటి ముందు తోటలో కలుపు మొక్కల సంగతి చూస్తా. పార్గా పలుగూ ఎక్కడ?”

“బయట వరండాలో వుండాయయ్యా”

'హింసాకాంద,"* అన్నాడాయన వ్యంగ్యంగా, 'అవున్ను నిజంగా హింనాకాండ. సిల్కు టోపీలు... కిటికీ తలుపు చిలకలు... సిన్నబ్బాయిగోరు... పిచ్చాలూ, నువ్వు కాదని ఎంతైనా వాదించవచ్చు కానీ నేను. మాత్రం భయపడకుండా చెబుతా, పైగా జరిగిన విషయాలు సరదాగ్గా: కాసేపు 167 పళ్ళంరాజు - పచ్చ కలరు. బూట్లు

కూడా నేనన్నదే బుజువు పరుస్తాయి - యిది హింసాకాండ తప్ప మరేం కాదు.!

గొంతు రాసుకుపోయినట్టు మాటల్లేని శబ్దాలు వున్నట్టుండి ఆయన గొంతులోంచి బయటికొచ్చాయి. శ్వాస ఆగినట్టు కనిపించాడు.

“ఏదీ, నా మొహంలోకి మొహం. పెట్టి సూటిగా చూడు!”

“'పిచ్చాల్నూ మనిద్దరి మధ్య అబద్ధాలొద్దు, దాపరికాలు అసలే వొద్దు, సరీనా? ఎవరు.... నా బూటుని పసుప్తురంగులోకి మార్చిందెవరు, ఎవరు?”

“బూటా అయ్యా?

“అవును, బూటు.

“పసుపురంగా అయ్యా?”

'అవును, పచ్చగా మేలిమి పసుపుపచ్చ రంగు. ఈ బూటు చూడు. క్షుణ్ణంగా పరిశీలించు, పక్షపాతం లేని మనసుతో దీని మోద కన్నేసి చూడు. పడుకునే ముందు నేనీ బూటుని విప్పినప్పుడు దీని రంగు 'నల్లటి కారు నలుపు. కాసేపలా మగత నిద్ర పట్టి కళ్ళు తెరిచానో లేదో అది కాస్తా పచ్చరంగుకి మారింది. ఇలాంటి విషయాల్లో నేను పిరికితనం చూపించను, 'ఈ పని చేసిందెవరు?"

“అయ్యా, మరైతే నేను కాదయ్యా!

“ఎవరో చేశారీపని, బహుశా ఏదో ముఠా: దొంగల పని అయుండచ్చు.. అసలి యింట్లో దుర్శార్గాలకీ, ఘోరాలకీ అంతులేకుండా పోయింది, నే చెబుతున్నా విను, పిచ్చాలూ- నెంబరు ఏడూ, బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్స్‌ వుంద్హే అది వున్నట్టుండి. రహస్య కార్యకలాపాలకి: స్థావరంగా మారింది, అందులోనూ ఆదివారం పూట. యిలా జరగటం మరింత దారుణం. తెల్లారే లోపల కరైన్ల వెనకాల్నించి గొంతు పిసకటానికి చేతులు బయటికొస్తేనూ, గోడల్నించి శవాలు ముందుకు దొర్లుతుంటేనూ నేనేం ఆశ్చర్య పడనని గుర్తుంచుకో. ఇదంతా నాకేం బాలేదు, మంచికి రాలేదని దాచుకోకుండా చెబుతున్నా పిచ్చాల్లూ సరే, పక్కకి జరుగు మరి, యిహ ఆ కలుపు మొక్కల భరతం పదతానుండు.!

గట్టిగా చప్పుడు చేస్తూ తలుపు మూసి వెళ్ళిపోయాడాయన. దాంతో ముందుగదిలో ప్రశాంతత ఏర్పడింది కానీ పళ్ళంరాజు మనసులో మాత్రం కాదు, మా భాగోతుల వారందరూ అవసరానికి చక్కగా: ఆలోచించగలరు, అంచేత యిప్పుడు పరిస్థితులు ముందటి కన్నా మరింత విషమించాయని తెలుసుకోడానికి ఆట్టేసేపు పట్టలేదు. పళ్ళంరాజుకి,

అవున్సు పరిస్థితి చెయ్యిజారింది. ఈ గదిలోకి అతను నెత్తిన సిల్కు టోపీతోనూ, పసుపుపచ్చ బూట్లతోనూ ప్రవేశించాడు. బయటికి వెళ్ళేటప్పుడు - టోపీ వుండదు, పైగా ఒక కాలికి పళ్ళంరాజు - పచ్చ కలరు బూట్లు 168 సరదాగా. కాసేపు

నల్లటి బూటూ మరో కాలికి పచ్చకలరు బూటూ వుంటాయి.

దుస్తుల్లోనూ, వాటికి తగిన బూట్లలోనూ ప్రత్యేకతని సంవాదించుకున్న మనిషికి యిది చాలా విపత్మర పరిస్థితి.

దానికితోడు మరో యిబ్బంది కూడా గుర్తుకొచ్చింది. ఇప్పుడతనికి బయటి

ప్రపంచంతో సంబంధం తెగిపోవటం '-- తాత్సాలింగానైనా క్షేమంగా తలదాచుకోవటానికి ఆస్కారంగా బయట రోడ్డు మోదున్న టేక్సీకీ తనకీ మధ్యలో పలుగూ, పారా పట్లుకునున్న ఆ పెద్దమనిషి రూపంలో, ఎంత ధైర్యసాహసాలకి వొడిగట్టే వాడికైనా యిలాంటి పరిస్థితి భయపెడుతుంది. టార్జాన్‌ కూడా జంకి వుండేవాడు. పళ్ళంరాజయితే బొత్తిగా సహించ

తన ముందున్నది ఒక్కటే ఒక్కమార్దం. ఈ దరిద్రపు కొంపకి 'పెరటి వైపున తోట వుండొచ్చు, అక్కడికి దారి తీయటానికి తలుపేదో వుండొచ్చు. ఇప్పుడు తను చెయ్యవల సిందల్లా అడుగులో అడుగు వేసుకుంటూ నిశ్ళబ్దంగా - యిలాంటి యింట్లో నిశ్శబ్దం అనేది కనక సాధ్యపడితే - నడవలోంచి నడుచుకుంటూ వెళ్ళడం, "'పెరటితోటలోకి దారి తీసే తలుపుని వెతుక్కుని బయటికి వూడిబడటం, కాంపౌండు గోడెక్కి పక్కింటి "పెరట్లోకి దూకి కనబడకుండా రోడ్దు మోిదికెక్కి గభాల్న టేక్సీలోకి గంతు వెయ్యటం, యింటికి చేరటం. బృందావనం కాంప్లెక్సులో తనని చూసి సెక్యూరిటీ గార్డు ఏమను కున్నా లెక్కచేసే పరిస్థితిలో లేడిప్పుడు పళ్ళంరాజు. బహుశా చూసి కాసేపు నవ్వకుంటాడు, ఒకరిద్దరికి చెబుతాడు. పాతికో పరకో చేతులో పెట్టి వాడి నోరు మూయించవచ్చు. ఏది ఏమైనా, ఎలాంటి పర్యవసానం ఎదుర్శోవాల్సి వచ్చినా తను మాత్రం బృందావనర కాంప్లెక్సుకి తిరిగెళ్ళడం తప్పనిసరి, అంతేకాదు శరవెగంతో వెళ్ళాలి. పళ్ళంరాజు మనసు పూర్తిగా చితికిపోయింది.

కార్పెట్‌ మాద చప్పుడు చెయ్యకుండా నడుస్తూ పళ్ళంరాజు మెల్లగా తలుపు తెరిచి చూశాడు. నడవలో ఏవరూ లేరు. గోడవారగా నక్కుతూ ముందుకు సాగి చివరకి దగ్గిర పడుతుండగా వున్నట్టుండి ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడు వినిపించింది, అతనున్న వైపునే మరో తలుపుంది, అది తెరిచే వుంది; చెంగున ఆ గదిలోకి గెంతాడు, చిన్న స్టోర్‌ రూము, దానికో చిన్న కిటికీ, ఆ కిటికీలోంచి బయటికి చూడగానే పెరటి తోట కనిపిం చిందతనికి. ఇందాకటి అడుగుల చప్పుడు వంటింట్లోకి దారి తీసి అక్కడో ఆగిపోయింది,

పళ్ళంరాజు హాయిగా వూపిరి పీల్చుకున్నాడు... గండం తప్పిందనీ తనింక విపత్మరంగా తయారైన ప్రయాణంలో ఆఖరి మెట్టుని అధిగమించాలనీ అనుకున్నాడు, బయట నుంచున్న టేక్సీ అయస్కాంతంలా అతన్ని ఆకర్షిస్తోంది. ఇంతవరకూ ఆ టేక్సీ డ్రైవరంటే తనకెలాంటి సదభిప్రాయం లేదు కానీ యిప్పుడు మాత్రం అతని సాంగత్యానికి వువ్విళ్ళూరుతూ వున్నాడు. దాహమేసిన లేడి సెలయేరు కనిపించగానే పరిగెత్తినట్టు అతను సరదాగ్గా కాసేపు 169 పళ్ళంరాజు -- పచ్చ కలరు బూట్లు

కూడా ఆ డైవరు దగ్గిరకి అలా పరిగెత్తాలనుకున్నాడు.

చాలా జాగ్రత్తగా పళ్ళంరాజు కిటికీకున్న తలుపుని పైకి ఎత్తాడు. తరవాత కార్య (క్రమాన్ని వుపక్రమించేందుకు: ముందుగా తల బయటికి 'పెట్టి వదురుగా కనిపిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించాడు. చూడగానే పరవశించిపోయాడు. కిటికీలోంచి 'పెరట్లోకి సులభంగా దూక్షవచ్చు, ఎక్కువ ఎత్తు లేదు. ఆ చిన్న కిటికీలోంచి తను ఎలాగో ఒకలాగు దూరాలి, అంతే, ఆ తరవాతంతా శుభంగ్గా ముగుస్తుంది,

అలా ఆలోచించి దాన్ని ఆచరణలోకి 'పెడుతుండే సమయంలో కిటికీకున్న చిలక వూడిపోయి తలుపు కాస్తా వధ్య స్థలంలో మేక మెడ మోద కత్తి పెట్టినట్టు పళ్ళంరాజు మెడ మాద.పడి, ముందుకీ వెనక్కీకదలలేని నిస్సహాయస్టితి లో అలానే వండిపోయాడు.

ఏదో ఆలోచిస్తూ పడుకున్న ఒక పిల్లి అతను లోపలికి రావటం. చూసి ఏవరా ఈ ఆగంతకుడు అన్నట్టు పరిశీలిస్తూ లోపల వేలాడుతున్న పళ్ళంరాజు పాదాలని వాసన చూడటం మొదలెట్టింది. గదిలో జరుగుతున్నది మామూలుగా కనిపించకపోయినా మానవ (ప్రయోజనం వున్నట్టు పసికట్టిందా పిల్లి, అలానే కూచుని ధ్యాన ముద్రలోకి దిగిందది.

ఆలోపల పళ్ళంరాజు కూడా అదేమాదిరి ధ్యాన ముద్రలోకి దిగాడు.. మనం కనక కాస్త ఆలోచిస్తే అలా కిటికీలో చిక్కుకున్న మనిషి మరింకేమి చెయ్యలేడని తెలుస్తుంది. చాలాసేపటిపాటు పళ్ళంరాజు కిటికీ కింద విరగపూసిన పూలతోటని చూస్తూ బుర్రనిండా ఆలోచనల్ని నింపుకుని అలాగే వుండిపోయాడు,

'చెబుతాం కానీ ఆ ఆలోచనలు మరేమంత' గొప్పవి కాదని వూహించుకోవచ్చు మనం, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న మనిషి ఓరిమి. కోలుపోడన్స, చిరాకు పడదనీ చెప్పడం వృధా. తనని ఈ రకమైన యిబ్బందులకి పాల్పడే స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ మిద మనసులో కారాలూ మరియాలు నూరుతూ వుంటాడు,

పళ్ళంరాజు విషయంలో మాత్రం దీనికి బాధ్యులెవరో గుర్తించడం కష్టం కాదు. తన పతనానికి కారణభూతం కేవలం ఒక స్త్రీ - మాజీ రాజుగారి ఏకైక కూతుర్ని అలా అనడం సమంజసమైతే. పళ్ళంరాజు మనసులో ఇప్పుడు చెలరేగుతున్న విష్లవంలో ముఖ్యమైన అంశం - రాణీ శైలజాకుమారి ఏంత గొప్ప రాజవంశానికి చెందినా యిప్పుడు మాత్రం అతని దృష్టిలో ఆమెని నీచాతినీచమైనదిగా తలచాడు,

మనసు చాలా చలించిపోయి ముందు రాణీ శైలజాకుమారినీ, ఆ వరసలో ఆమె దగ్గిర బంధువుల్ని చివరకి రాజరికాన్నే ఏవగించుకున్నాడు. ఇరవై 'నాలుగు గంటల కిందట - సరిగ్గా చెప్పాలంటే కేవలం రెండంటే రెండు గంటల కిందట - జమిందార్లన్నా, మాజీ సంస్థానాదీశులన్నాా వాళ్ళ కుటుంబీకులన్నా పళ్ళంరాజుకి ఎంతో భయమూ, భక్తి మన్ననా వుండేవి. ఇప్పుడైతే కేవలం జుగుప్స. రష్యాలో లాగా విప్లవం రావాలనే పళ్ళంరాజు '- 'పచ్చ కలరు. బూట్లు 170 సరదాగా: కాసేపు

కాంక్ష మరీ ఇనుమడించింది, వీళ్ళంతా సోమరి పోతుటీగలు అనుకున్నాడు అంతేకాదు ఆలోచిస్తుంటే కాస్త పరుషంగా అనిపించినా దానికే కట్టుబడి, తుపాకులకి గురి కావలసిన సోమరిపోతుల్లు అనీ కూడా తలపోశాడు, సోమరి పోతుటీగని పళ్ళంరాజు ఏనాడూ చూడలేదు కానీ దేశంలో వున్న వేలాది ధనవంతుల్లాగే అవి వుంటాయని తట్టిందతనికి. 'ఇలా ఎంతసేపు? ఏంతసేపింకా? అంటూ బాధతో మూలిగాడు. మాస్కోలో ్రజ్వలించిన జ్వాల ఎప్పుడు యిక్కడిదాకా వ్వాపించి రాణీ శైలజా కుమారితో ఆరంభించి తరవాత వరస వరసన ఎందుకూ కొరగాని యిలాంటి. పిండి బొమ్మల్ని దుబారా మనుషుల్ని మాడ్చి భస్మీపటలం చేసే. రోజు ఏప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. ఇలా కోరుకుంటున్న సామాజిక విప్లవం నుంచి అతని ఆలోచనలు వున్నట్టుండి కుడి పిక్క మాద విపరీతమైన బాధ వెయ్యడంతో వాటిని దూరం చేశాయి. బాగా ధ్యానముద్రలో వున్న పిల్లులు అప్పుడప్పుడు వెనక కాళ్ళ మిద నుంచుని దృష్టిలో నిఠారుగా కనిపించే వస్తువుని ముందు కాలి గోళ్ళతో గీరుతూ ఆ గోళ్ళకి పదును పెట్టుకోవాలని చూస్తాయి. మామూలుగా. అయితే ఏ చెట్టునో మానునో చూసుకుని ఆ పని చేస్తాయి. అయితే యిష్పుడక్కడ అలాంటిదేదీ అగుపడకపోడంతో గదిలో వున్న ౫ జేవురు రంగు పిల్లి పళ్ళంరాజు కుడికాలి పిక్కని వుపయోగించుకోవాలని చూసింది. దాని బుర్ర యిప్పుడు ఏ క్లిష్ట సమస్యని గురించి ఆలోచిస్తోందో ఏమో, ఒకటి రెండు సార్లు కళ్ళార్చి ఆలోచించకుండా ఆ పిల్లి లేచి నిలబడి పళ్ళంరాజు కుడి పిక్కలో తన ముందుకాళ్ళ గోళ్ళు గుచ్చి పైకీ కిందికీ నెమ్మదిగా పట్టు వదలకుండా గీరటం మొదలెట్టింది. నది వొడ్డున సంచరిస్తున్న మనిషిని అమాంతం నీళ్ళల్లోంచి బయటికొచ్చి మొసలి రెండు ముక్కలుగా. కొరికేసినట్టు పళ్ళంరాజు నోట్లోంచి ప్రాణం పోతున్నట్టు గావుకేక బయటి కొచ్చింది. ఆ పొలికేక యుద్ధభేరిలా తోటంతా వ్యాపిస్తూ, కాసేపటికి దాని ప్రకం పనలు తగ్గినాక ఎదురుగా ఒకామె పళ్ళంరాజు ముందుకొచ్చి నిలబడింది. సూర్యుడి కిరణాలు ఆ కళ్ళజోడులో ప్రతిఫలించాయి, ఆమె మరెవరో కాదు తన సెక్రెటరీ కుమారి ఎస్‌. హైమవతేనని గుర్తించాడు పళ్ళంరాజు, “గుడ్‌ ఆప్టర్‌నూన్‌, మిస్టర్‌ బి, పళ్ళంరాజుగారూ,! పలకరించింది కుమారి ఎస్‌,

  • ఆమె గొంతు తీరు ఎప్పటిలా మంద్రంగా (ప్రశాంతంగా వుంది. నిజంగా ఆమె తన యజమానిని ఆవిధంగా చూసి - అయినా అక్కడ. చూడ్డానికి అతని తల. తప్ప మరేం లేకపోయినా -- ఆశ్చర్యపడి వుంటే అది ఆమె కనబరుచుకోలేదు.. ఒక వ్యక్తిగత కార్యదర్శిగా అతి సమిపంలో వుండి పనిచేసే అమ్మాయి యజమాని చేసే ఏ పనికైనా సరదాగా కాసేవు కే] పళ్ళంరాజు - పచ్చ కలరు బూట్లు

ఆశ్చర్యపడ కూడదని ముందే నేర్చుకుంటుంది.

అయినా కుమారి ఎస్‌. హైమవతిలో స్రీ సహజమైన జిజ్ఞాస లోపించలేదు.

“మిస్టర్‌ పళ్ళంరాజుగారూ, ఏం 'చేస్తున్నారు మారక్కడ? అని అడిగిందామె.

"నా కాలుని ఏదో గీరుతున్నట్టుంది,' బాధకి తట్టుకోలేక అరుస్తూ చెప్పాడు పళ్ళంరాజు,

“బహుశా అది మా పాపభీతి అయ్యుంటుంది,” చెప్పింది కుమారి ఎస్‌. ' హైమవతి, అలాంటి. పుస్తకాలు చాలా చదివినందువల్ల. “ఎందుకు మిరు నిర్బంధంలో వుంచినట్టు అలా వుండిపోయారు?!

“కిటికీలోంచి బయటికి తొంగి చూస్తుంటే చిలక పడిపోయి తలుపు మూసుకుంది.

“ఎందుకు కిటికీలోంచి బయటికి తొంగి చూస్తూ కూచున్నారు?!

"కిందికి దూకటానికి ఏంత ఎత్తుందోనని చూశా?”

“ఎందుకు కిందికి దూకాలనుకున్నారు?"

'ఇక్కడినించి పారిషోవాలని చూశాను.

“ఎందుకు మారిక్కడికొచ్చారు?" కధంతా మొత్తం చెప్పటం తప్పదనిపించింది పళ్ళంరాజుకి. చెప్పడానికి అతనికి ఏమాత్రం యిష్టం లేదు. చెప్పకపోతే 'తెల్లవారే దాకా కుమారి ఎస్‌. హైమవతి యిలా “ఎందుకు తో మొదలయ్యే ప్రశ్నల్ని సంధిస్తూనే వుంటుందనుకున్నాడు. తడారిపోయిన గొంతుతో జరిగిందంతా చెప్పాడు.

అతను కధంతా వివరించినా కాసేపటిదాకా ఆమె మౌనంగా నుంచుంది. ఆమె ఆలోచనల్లో నిమగ్నమైనట్టు ముఖంలో కనిపించింది.

'మాకు కావలిసిందల్లా ఒక ఆడదాని సంరక్షణ, మిమ్మల్ని మంచిగా చూసుకునే భార్య,” చెప్పిందామె,

కాసేపు ఆగింది,

ఒక నిర్ణయానికి వచ్చినట్టు, “సరే, అది అందరికీ. సాధ్యపడేది కాదు, కానీ ఆ పనికి పూనుకోడానికి నాకేమి అభ్యంతరం లేదు" అని చెప్పింది.

అదేదో దుశ్ళకునంలా అనిపించి బిగుసుకుపోయాడు పళ్ళంరాజు.

'నువ్వనేదానికి అర్ధం ఏవిటి?! ఆయాస పడుతూ అడిగాడు.

దానికి కుమారి ఎస్‌; హైమవతి. యిలా చెప్పింది: “మికు భార్య అవసరం చాలా వుంది. కొంతకాలం నించి ఆ విషయమే నా మనసుని తొలుస్తోంది, యిప్పుదైతే నాకంతా స్పష్టమైంది. మిరు పెళ్ళి చేసుకోవాలి. మిస్టర్‌ పళ్ళంరాజుగారూ, నేను మిమ్మల్ని పెళ్ళి

పళ్ళంరాజునించి చిన్నటి అరుపు బయటికొచ్చింది. గత కొన్ని వారాలబట్టీ తన చళ్ళంరాజు = పచ్చ కలరు. బూట్లు 1/72. 'సరదాగా' కాసేపు

సెక్రెటరీ అద్దాల వెనక కళ్ళల్లో కనిపించిన వింత చూపుకు అర్ధం యిదన్నమాట అని అనుకున్నాడు.

ఎవరో వస్తున్నట్లు కంకర మోద అడుగులు చప్పుడు వినిపించింది. ముందుగదిలో వాలు కుర్చీలో పడుకుని గురక పెడుతూ నిద్రపోయిన మనిషి గొంతు వినిపించింది. ఆయన గొంతులో కలవరపాటు ధ్వనించింది.

“అమ్మాయ్‌ హైమా, కారణం లేకుండా నేను వూర్మే రభస చెయ్యననే విషయం నీకు తెలుసు: జీవితంలో కష్టసుఖాల్ని నేనెప్పుడూ సమానంగా చూస్తానని కూడా నీకు తెలుసు, కానీ ఈ యిల్లు ఏవో దుష్టశక్తుల ప్రభావానికి లోనయిందని నీకు తలియబరచడం నా కర్తవ్యంగా భావిస్తున్నా వాతావరణం పూర్తిగా దుర్మార్గంతో నిండిపోయింది. సిల్కు, టోపీలు వున్నట్టుండి వూడిపడుతున్నాయ్‌. నల్లటి బూట్లు కాస్తా పసుపుపచ్చ రంగులోకి మారుతున్నాయ్‌, ఇప్పుడేమో యిక్కడ యా టేక్స్సీ, యా టేక్స్సీ ద్రైవరున్నాడే. ల పేరు సరిగ్గా వినిపించలేదిందాక. నరసయ్యా? నరసయ్యా, ఈమె నా కూతురు హైమవతి... ఇప్పుడేమో ఈ నరసయ్య ప్రకారం - చాలాసేపటి కిందట ఒక పెద్దమనిషి తన టేక్సీలోంచి దిగ మన ముందు గేటు తెరుచుకుంటా లోపలికొచ్చాదనీ, ఆ తరవాత పత్తా లేకుండా పోయాడనీ్సీ అసలు భూమ్మిద వున్నాడో నూకలు చెల్లిపోయాయో. కూడా తెలీదనీ అంటున్నాడు. ఇదంతా చూస్తుం టే నాకు ఖచ్చితంగా ఏమనిపిస్తోందంటే, అసలీ యిల్లుందే- నెంబరు ఏడూ, బాలాజీ ఎవెన్యూ, వ్యాలీ ఫీల్స్స్‌ ం! దీంట్లో ఏదో. గూఢచారుల ముఠా పనిచేస్తోందనీ, సినిమాల్లో చూస్తుంటామే అరుపులూ, 'పెడబొబ్బలూ, ఏడుపులూ వినిపిస్తుండే యిళ్ళుంటాయి చూడు అలా... ఠక్కున అక్కడో ఆగి, నమ్మలేనట్టు గట్టిగా పొలికేక పెట్సి, 'హారి భగవంతుడా, అది, అక్కడుంది. అది ఏవిటి?” అంటూ విస్తుపోయి. చూస్తూ అదిగాడు,

“ఏది నాన్నగారూ?”

'అదే ఆ మొండెం లేని తల, మిగతా శరీరం లేని వొట్టి మొహం. నా మాట నమ్ము, హైమా, గోడ పక్కన కిటికీలోంచి నరికేసిన వొట్టి తల వేల్లాడుతోంది. చూడు. నేనున్న చోటికి రా, చూపిస్తా. ఇక్కడ్నించి స్పష్టంగా కనిపిస్తుంది."

'౬ఓ అదా? అది నా కాబోయే భర్త” చెప్పింది కూతురు హైమవతి.

“ఏవిటీ, నీ కాబోయే భర్తా?

అవును నా కాబోయే భర్త, మిస్టర్‌ భాగోతుల పళ్ళంరాజుగారు.!

“ఇంతే మిగిలాడా ఆయన?” అంటూ విస్తుపోయి అడిగాడు టేక్సీ డ్రైవరు.

ృిగతాదంతా యింట్లో వుంది,” చెప్పింది హైమవతి.

తండ్రి పరశురామయ్య యిప్పటికి కోలుకుని, కొంతవరకు మామూలు స్థితిలోకొచ్చి పళ్ళంరాజుని నిశితంగా పరిశీలిస్తూ చూశాడు. .

“పళ్ళంరాజా? మా అమ్మాయి వుద్యోగం చేసేది నీ దగ్గిరే కదూ, నువ్వతనివేనా?' సరదాగా కాసేపు ే/3 'పళ్ళంరాజు : పచ్చ కలరు బూట్లు

"నేనే అతన్ని నా దగ్గిరే పనిచేస్తుంది తను, చెప్పాడు పళ్ళంరాజు. “మరి నువ్వు మా అమ్మాయిని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నావా? పళ్ళంరాజు సమాధానం చెప్పే లోపల, “అవును, నన్ను తప్పకుండా పెళ్ళి చేసుకుండాయన] అంది కుమారి ఏస్‌. హైమవతి. వున్నట్టుండి పళ్ళంరాజు మనసు '*ఏం, ఏందుకు చేసుకోకూడదు?! అంటూ అడిగింది. అతను పెళ్ళి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మగారి గానే వుండిపోదామనుకున్నది నిజమే, అందరు నడివయసు బ్రహ్మచారుల్లా ఎప్పుడో మనసు ప్రశాంతంగా లేక కుంగి పోయినట్టు వున్నప్పుడు తప్ప, "పెళ్ళంటే ఆమడ దూరం పారిపోయేవాడతను, తన భార్య ఎలా వుండాల్‌ అని ఎవరన్నా ఒకవేళ అడిగితే కుమారి ఎస్‌. 'హైమవతితో దాదాపు దగ్గిర పోలికలుండే వ్యక్తి రూపం గీసి వుందేవాడనేది కూడా యదార్ధమే. ఇప్పుడామెని చూస్తుంటే ముఖంలో గట్టి పట్టుదల, సామర్ధ్యం కనిపిస్తున్న యిలాంటి అమ్మాయే తనని- మధ్యాహ్నం నించీ పడుతున్న బాధల్ని మరోసారి ఏదుర్కోకుండా చేయగల వ్యక్తి అనిపించింది. చాలా బావుందని తోచింది పళ్ళంరాజుకి: ఇవన్నీ కాక మరో సంగతి కూడా వుంది. ఇప్పుడు సమసమాజానికి గట్టి మద్దతు యిచ్చే పళ్ళంరాజు - కుమారి ఏస్‌. హైమవతికి విరుద్ధంగా ఎవరెన్ని చెప్పినా ఆమె మాత్రం హృదయంలేని ధనికవర్గానికి చెందిన పాషాణం కాదన్న ఒక్క విషయం చాలు తనకి. రాజులకీ, జమిందార్లకీ, ధనవంతలకీ ఆమెతో చుట్టరికాలు లేవు, సంబంధాలు అసలే లేవు - ఆ ఒక్కటీ చాలు అతనికి, ఇవన్నీ టకటకా ఆలోచించి, “అవును, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కోరిక అది+ అని సన్నటి దృధమైన గొంతుతో చెప్పాడు పళ్ళంరాజు. “ఇప్పుడు దయ వుంచి ఎవరన్నా ఈ కిటికీ రెక్కని నా గొంతు మీదనించి 'పైకి లేపి ఈ దరిద్రపుగొట్టు పిల్లో మరేదో జంతువో, నా పిక్కల్ని గీరుతూ కూచున్న దాన్ని ఒక్క తన్ను తన్ని దూరంగా విసిరేస్తే మనందరం కలిసి కూచుని హాయిగా ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.! అదండీ, మా. వేలువిడిచిన తమ్ముడు భాగోతుల పళ్ళంరాజు పచ్చకలరు బూట్ల కథ, అలా సుఖాంతంగా ముగిసి ఒక యింటివాడయ్యాడతను అంటూ సూతరాజుగారు ముగించి లేచి వెళ్ళారు, పళ్ళంరాజు = పచ్చ. కలరు బూట్లు 174 సరదాగా కాసేపు

లబ్రమికుదటి ఇక్కట్లు కీ మిట్‌. "నో య

విప్పుడూ వుల్లాసంగా కనబడే భాగోతుల 'సూతరాజుగారు ఆరోజు మౌనంగా మా పానకుటీరంలోకి వచ్చి గ్లాసులో నిమ్మతొన ముని గున్న విస్కీని పరధ్యానంతో త్రాగుతూ కూచున్నారు, అది గమనించి నిజంగా ఏదో కీడు ముంచుకొచ్చుండాలని మాకు వెంటనే తోచింది. జాలి పడుతూ. ఏవిటి సంగతని ప్రశ్నించాం మేము.

మా ఆదుర్తాకి సంతోషించారాయన. మొహం కాస్త విచ్చుకుంది.

“నా వ్యక్తిగత బాధలు చెప్పి మీ. వుల్లాసాన్ని చంపుతూ కష్టపెట్టదలుచుకోలేదు. అయితే మిరంతా కుతూహలం చూపిస్తున్నారు కనక చెబుతా వినండి, నాకు దూరపు చుట్టమైన కుర్రాడొకడు భార్యని విడిచిపెట్టి విడాకుల కోసం కోర్టుకెక్కుతున్నాడు. అది విన్నప్పటినించి నా మనసు మనసులో లేదు, ఏమిటోగా వుంది, అంతేనండీ మరేం లేదు, అన్నారు. సరదాగా కాసేపు కే (ప్రేమికుడి ఇక్కట్లు

మాకు లిక్కరందించే నారాయుడు గ్లాసులు తుడుస్తూ వ్యవహారాన్ని పడక గదిలోకి లాగాడు, [ “ఏదన్నా విషపునాగు జొరబడిందాండీ యింట్లోకి?! అని అడిగాడు. సూతరాజుగారు కాదని తల అడ్డంగా తిప్పారు. 'లేదు, అలాంటి వ్యవహారం కాదులే. నాకు తెలిసినంతవరకైతే మొత్తం గొడవల్లా - మావాడు తన భార్యని పలకరించి నప్పుడల్లా ఆమె కళ్ళు రెండూ పూర్తిగా విప్పార్చుకుని రామచిలుక లాగా 'మెడ పక్కకి వంచుతూ “ఏమిటి?” అని అడుగుతూ వుండటమే, ఇలా తనూ క్నోభ సరిగ్గా పదకొండు నెలల మూడు రోజులపాటు భరించాననీ యికముందు మాత్రం తనవల్ల కాదనీ, అసలు అదే దేశంలో రికార్టన్మీ కనక వలసిన చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందన్న నిర్ణయానికి వచ్చాననీ తెలిపాడట.! ఆ మాటలు చెప్పి భాగోతుల సూతరాజుగారు గట్టిగా: నిట్టూర్పు విడిచారు. “ఇప్పుడొక ముఖ్యమైన విషయం గ్రహించాలి మనమందరం = ఈరోజుల్లో మగాడికి పెళ్ళి అనేది చాలా సులభమైన వ్యవహారంగా మారింది. వూసుపోకపోతే అలా బయటికె డతాడు, ఎర్రగా బుర్రగా మంచిదానిలా కనిపించే అమ్మాయి కలవగానే వెంటబడతాడు, ఆమె గ్రేమని పొందిన మరుక్షణం నుంచి లక్ష్యపెట్టడం మానేస్తాడండీ. విడాకులు విపరీతంగా పెరగడానికి కారణం యిదేనని నా విశ్వాసం, వివాహ వ్యవస్థ సురక్షితంగా, స్థిరంగ్లా పది కాలాలపాటు 'వుండాలంటే పడుచువాళ్ళు (ప్రేమించుకుంటూ చెట్టాపట్లా లేసుకుని తిరిగే కాలంలో గట్టి అవరోధాల్ని ఎదుర్కుంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. నాకు తెలిసిన వాటిల్లో కేవలం ఒక్కటంటే ఒక్క వుదాహరణ తీసుకుందాం - మా తమ్ముడుగారబ్బాయి భాగోతుల ధర్మరాజు వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా నడుస్తోందంటే పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలు, ఆమెను పొందేందుకు అతను పడ్డ అష్టకష్పాలే దానికి కారణమని 'చెబుతా, కవ్టాలకు లోనుగాకుండా. వుత్తి పుణ్యాన కుమారి రాచవరపు గీతాంజలి కనక దొరికుంటే యిప్సుడతను అంతగా' ఆమెని ఆరాధిస్తూ కూచుండేవాడు కాదండోయ్‌. “తను ఏంత నిఖార్సయిన మనిషో ఆమెకి తెలియపరిచేందుకు చాలా సమయం పట్టిందా అతనికి?! అని అడిగాం మేము, ఆమెలో ప్రేమ తొందరగా వికసించలేదా? అంటూ నారాయుడు అనుమానం దానికి సూతరాజుగారిలా చెప్పారు: “అబ్బే, అదేం కాదు, అసలు విషయం చెప్పాలంటే మావాడిని ఆమె తొలి చూపులోనే ప్రేమించింది. ఆమె డ్రేమని పొందేందుకు మా తమ్ముడుగారబ్బాయి భాగోతుల. ధర్మరాజు ఎదుర్శొన్న కవ్చాలు, విషమ పరీక్షలు ఆమె వ్యతిరేకత వల్ల కాదండి, దూర్వాసుల పరశురాం అనే మనిషి తీరు వల్ల. ఆ 'పేరు వింటే మోకేమన్నా అనిపిస్తుందాండీ? ప్రేమికుడి ఇక్కట్లు శ/6 సరదాగా: కాసేపు

“లేదండీ?”

'అలాంటి పేరుతో చలామజీ అయ్యే వ్యక్తి గట్టి పిండం అయుంటాదని అనిపించడం: లేదా మికు?”

“మోరిప్పుడు చెప్పారు కనక అయుండొచ్చండీ.”

“నిజంగా అతను వుద్దండుడండీ. చాలాకాలంపాటు ఆఫ్రికా ఎడారుల్లో అన్వేషణ సాగించిన సమయంలో వుష్టపక్నులు దూర్వాసుల పరశురాం కనబడగానే ముఖాలు చాటేసుకుని ఇసుకలో దాచిపెట్టుకునేవట. జంతువుల్లో క్రూరమైన ఖద్దమృగాలు కూడా అతను వెళ్ళేంత వరకు ఏ చెట్టు మాటునో దాక్కుని వుండిపోయేవట. మా తమ్ముడు గారబ్బాయి జీవితంలో యీ మనిషి - దూర్వాసుల పరశురాం - అడుగు 'పెట్టగానే ఆ వుష్రపక్సులు, ఖద్గమృగాలు చాలా తెలివిగా ప్రవర్తించాయన్న (గ్రహింపు, జ్ఞానోదయం ధర్మరాజుకి అత్యంత విషాదకర పరిస్థితుల్లో కలిగింది.”

మోకిప్పుడు చెప్పబోయేది చాలాకాలం కిందట జరిగిన సంఘటనండీ (అంటూ చెప్పసాగారు సూతరాజుగారు). మా తమ్ముడుగారబ్బాయి భాగోతుల ధర్మరాజు జీవితంలో దూర్వాసుల పరశురాం అడుగుపెట్టక ముందు అదృష్టదేవత సంపూర్తిగా, ఆమాటకొస్తే పార్లిపోయే. విధంగా అతన్ని కనికరిస్తూ వచ్చింది. మా భాగోతులవారందర్లానే అతను కూడా అందగాడు... చక్కటి రూపానికీ, ముఖవర్చస్సుకీ. తోడు ఆరోగ్యంగా, చలాకీగా వుండేవాడు, ఇహ డబ్బు గురించంటారా ఇన్‌కం టేక్సు ఆఫీసర్లు చంకలు కొడుతూ 'సంతోషించేంత దబ్బు మూలుగుతుండేది అతని దగ్గిర, ఇవన్నీ కాక చాలా అందమైన యువతిని (ప్రేమించాడు, ఆమెకు. కూడా తనంటే వల్లమాలిన అభిమానం, అనురాగం అని మనసులో గుర్తించాడు,

ఆ విధంగా కొన్ని వారాలు, నెలలు సంతోషంగా ప్రశాంతంగా గడిచాయి. రోజులు గడచిన కొద్ది ఆమె (ప్రేమని పొందడంలో - యింటికి వెళ్ళడం, పూల బొకలు పంపించడం, వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి - ముఖ్యంగా. ఆయనగారి కీళ్ళవాతం గురించి విచారించడం, వాళ్ళ అమ్మగారి పెంపుడు కుక్కని ముద్దాడటం. మరింత చొరవ చూపించి తల్లిదండ్రుల అంగీకారంతో ఆమెని తనతో అప్పుడప్పుడు సినిమాలకీ, షికార్లకీ, హోటళ్ళకీ తీసుకుని వెడుతూ ఎలాంటి అవరోధాలు లేకుండా ధర్మరాజు ముందుకు 'సాగాడు, ఒకరోజు రాత్రి -- నిజానికది కాళరాత్రి అనొచ్చు - అందరూ సంతోషంగా, వుల్లాసంగా గడిపిన రోజున ఇదిగో ఈ దూర్వాసుల పరశురాం రూపంలో మావాడిని పీడించింది.

దూర్వాసుల పరశురాం అవతరించేంత వరకూ వుల్లాసంగా వుత్సాహంగా గడిచిన ఆరోజు రాత్రి ఆ ప్రశాంతతకి భంగం వాటిల్లింది. హోటల్లో చేసిన డిన్నరు చాలా. బాగుంది, ఆ తరవాత చూసిన సినిమా హాయిగా వుంది. ఇంటర్వెల్‌కు ముందు రెండుసార్లు, ఆ తరవాత మూడుసార్లు ధర్మరాజు చీకట్లో ధైర్యం చేస్తూ సున్నితంగా పెద్దమనిషిలా ఆ పిల్ల సరదాగా కాసేపు 177 (ప్రేమికుడి ఇక్కట్లు

చేతిని తన చేత్తో పట్టుకుని నొక్కితే ఆమె కూడా అదే మోతాదులో. మృదువుగా తన చేతిని నొక్కిందని అనిపించింది. ఇంటికి చేరి బయట మెట్ల మిద నుంచుని వీడ్మోలు చెబుతున్న సమయంలో అంతా మంచిగా. జరిగింది కనక మరింత ముందుకు సాగ వచ్చని ధర్మరాజుకి తోచడం. ఆశ్చర్యపడాల్సిన విషయం. కాదు. గెలుపో, ఓటమో తేల్చుకోడానికి యింతకన్నా మంచి తరుణం లేదని తన. అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ధర్మరాజు ముందుకు సాగి కుమారి రాచవరపు గీతాంజలిని కౌగిట్లో బంధించి గాఢంగా .ముద్దు పెట్టుకున్నాడు, ఎంత గాఢంగా ముద్దు పెట్టుకున్నాడంటే చీమ చిటుక్కుమన్నా వినిపించేలా వున్న ఆ నిశ్ళబ్దంలో ఎవరో లక్ష్మీ ఆటంబాంబు పేల్చినంత చప్పుడొచ్చింది దాంతో, దాని ప్రకంపనాలు కాస్తంత తగ్గుముఖం 'పట్టాయో లేదో లావుగా పొడుగ్గా, సూటూ, బూటూ వేసుకుని నెత్తిన గుడ్డ టోపీ పెట్టుకున్న వ్యక్తి తన పక్షనే వచ్చి చేరాడని గుర్తించాడు ధర్మరాజు. కాసేపు మౌనమే నడించిందక్కడ. చివరికి ఆ పిల్లే నోరు విప్పింది. ఆమె గొంతులో కోపం ధ్వనించింది, 'హల్లో, పరశురాం, 'నువ్వెక్కద్నించి వూడి పడ్డావ్‌? కాంగోలోనో మరోచోటో అన్వేషిస్తూ గడుపుతున్నావనుకున్నా” అందామె. ఆ మనిషి నెత్తినున్న గుడ్డ టోపీని తీసి రెండు చేతుల మధ్య వొత్తుతూ చపాతీలా చదును చేసి మళ్ళీ నెత్తికి తగిలించుకుని వురిమినట్టు పెద్దగొంతుతో జవాబిచ్చాడు. 'కాంగోనించి యివాళ పొద్దునే తిరిగొచ్చా. మో అమ్మా, నాన్నా డిన్నరుకని పిలిస్తే యిదిగో యిప్పుడే ముగించి బయటికొస్తున్నా నువ్వు యీ పెద్దమనిషితో సినిమాకెళ్ళావని “ఈయన మిస్టర్‌ భాగోతుల ధర్మరాజుగారు. మా.బావ,మిస్టర్‌ దూర్వాసుల పరశురాం.! “బాగున్నారాండీ, అంటూ విధాయకంగా పలకరించాడు ధర్మరాజు, మళ్ళీ అక్కడ కాసేపు నిశ్శబ్దం కమ్ముకుంది. దూర్వాసుల పరశురాం మరోసారి టోపీ తీసి రెండు చేతుల మధ్యన చపాతీలా వొత్తి చదును చేసి తలకి తగిలించుకున్నాడు. “'సరేమరి, గుడ్‌ నైట్‌, అని చెప్పింది గీతాంజలి. “గుడ్‌ నైట్‌,” అన్నాడు ధర్మరాజు, “గుడ్‌ నైట్‌,” అంటూ చెప్పాడు దూర్వాసుల పరశురాం, తలుపు మూసుకుంది. ధర్మరాజు తన చూపుని తలుపు నుంచి పక్కనున్న వ్యక్తి వైపు మళ్ళించి చూస్తే అతను అదో రకమైన వైఖరితో కళ్ళార్చ్నకుండా తనని గమనిస్తూ వుండటం గుర్తించాడు. అతని కళ్ళు గంభీరంగా, నిప్పు కణికెల్లా మెరుస్తున్నాయి. ఆ చూపులు ధర్మరాజుకి నచ్చలేదు. = “మిస్టర్‌ ధర్మరాజూ, అంటూ పిలిచాడు దూర్వాసుల పరశురాం. “హల్లో, ఏవిటండీ?”' అడిగాడు ధర్మరాజు. “నేనోటి చెప్తా విను. అంతా చూశాన్నేను.' (ప్రేమికుడి ఇక్కట్లు 178 సరదాగా కాసేపు

“అంతానా? . 'అంతాను, మొదట్నించీ చివరిదాకా. మిస్టర్‌ ధర్మరాజూ, నువ్వా పిల్లని (ప్రేమి _ “అవునండీ. 'నేనూ పేమిస్తున్నాను తనని, 'అవున్ను నేనూ, అది విని ధర్మరాజు కలవరపద్డాడు. ఓ, యిప్పుడు మనది విస్తరిస్తున్నా కుటుంబం అని అనాలని చాలా తోచింది అప్పటికప్పుడు. 'ఆ పిల్ల ఇంకెత్తు వున్నప్పట్నించి ఆమెని (డ్రేమిస్తున్నా? మసక చీకటిలో చూపు సరిగ్గా ఆనక, “ఎంతెత్తు వున్నప్పట్నించి?' అని. అడిగాడు “ఇంతెత్తు వున్నప్పట్నించీ, అంతేకాదు, మా యిద్దరి మధ్యలో ఎవడైనా వచ్చాడా దూరేందుకు (ప్రయత్నించే వాడెవడైనా సరే - వాడ్ని... * “అహహా - ఏవిటండీ యిది? అడిగాడు ధర్మరాజు. దూర్వాసుల పరశురాం పట్టించుకోనట్టు చిన్నగా నవ్వాడు, యృూగాంబో-ముగాంబో దేశాన్ని పరిపాలించే రాజుని నేనెం చేశానో విన్నావా ఎప్పుడన్నా” ముగాంబో-ముగాంబో అనే దేశం వుందనీ, దానికో రాజు వున్నాడనీ 'నాకు తెలీనే తెలీదండిన 'లేడ్కు ఇప్పుడు లేడులే, విశదంగా చెప్పాడు దూర్వాసుల పరశురాం. ధర్మరాజుకి వెన్నెముక నిక్కబొడుచుకున్నట్టు, వీపు మిద లేళ్ళు, జెర్రులూ పాకుతున్నట్టు అనిపించింది. “ఏం చేశారు మీరతన్ని?' "బ్రడగా ద్దు. ల . తెలుసుకోవాలని వుంది 'శెలుసుకోడం వంటికి మంచిది కాదు. నువ్వింకా మా మరదలు గీతాంజలి చుట్టూ యిలా తిరుగుతుంటే త్వరలోనే తెలుసుకుంటావనుకో, అది వేరే సంగతి. నేను చెప్పేది, చెప్పగలిగింది అంత మాత్రమే, మిస్టర్‌ ధర్మరాజూ.” పైన ఆకాశంలో మిలమిల మెరుస్తున్న నక్షత్రాల వంక చూసి దూర్వాసుల పరశురాం యింకా యిలా అన్నాడు? ఈరోజు వాతా వరణం ఎంతో హాయిగా ప్రశాంతంగా: వుంది కదా, అప్పుడు కూడా యిలానే ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వొట్టి నక్షత్రాల వెలుతురు మాత్రమే వున్న రాత్రిపూట సరదాగా కాసేపు 170 (ప్రేమికుడి ఇక్కట్లు

నంగోబీ ఎడారిలో చిరుతప్తులిని 'నా వట్టి చేతుల్లో గొంతు పిసికి చంపేసిన విషయాన్ని గుర్తుకు తెస్తోంది.”

ధర్మరాజు వరసగా గుటకలు మింగినందుకు శ్వాసనాళిక ఓ మెట్టు కిందికి దిగింది.

“ఏ - ఏ-చిరుతపులి?

ఓ, అది నీకు పరిచయం వుండుండదులే. అక్కడుందే ఎన్నో చిరుతపులుల్లో ఒకానొక చిరుతపులయ్యా. నా' కుడి చెతికి వ్లాస్టరుండటం మూలాన ఎడమ చెయ్యే వాడాల్సి వచ్చింది. ముందొక ఐదారు నిమిషాలపాటు యిబ్బంది పడ్డాననుక్కో అయినా ఎడం చేత్తోనే దాని గొంతు నులిమి పారేశా, సరే, గుడ్‌ నైట్‌, మిస్టర్‌ ధర్మరాజూ, గుడ్‌ అలా చెప్పి దూర్వాసుల పరశురాం నెత్తినున్న టోపీ తీసిరెండు'చేతుల్తో చపాతీలా చదును చేసి మళ్ళీ తగిలించుకుని ఆ. చీకటిలో వడివడిగా అంగలేనుకుంటూ వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిన చాలాసేపటి వరకు ధర్మరాజు నిశ్చేష్టుడ్రై జీవంలేని కళ్ళతో నుంచున్న చోటనే వుండిపోయాడు. అలానే మలువు తిరిగి అణ్లామలై వీధి చివర్లో వున్న యింటికి చేరుకుని తాళం తెరవడానికి మూడు సార్లు ప్రయత్నించి విఫలమై చివరికి తెరవగలిగాడు. మెట్లెక్కి ప్రశాంతంగా 'వున్న తన రూములోకి వెళ్ళాడు. గ్లాసు నిండా చిక్కటి బ్రాందీ పోసుకుని కొద్దిమాత్రం సోడా కలిపి ఏకాగ్రతతో ఆలోచిస్తూ కుర్చీలో కూచున్నాడు, మొదటి గ్లాసు గబగబా తాగేసి రెండోది కొంచెం నెమ్మదిగా చప్పరించిన తరవాత కానీ అతని ఆలోచనలు ఒక క్రమపద్ధతిలోకి 'రాలేదు. క్రమ. పద్ధతిలో అంటే వాటిని చెప్పడానికి నాకే సంకోచంగా వుందని తమరందరూ (గ్రహించాలనీ, మరోలా భావించకూడదనీ నా మనవీ, విజ్ఞప్తీను.

మారంతా. పెద్దమనుషులు కనక మీ అందరిముందు నా దగ్గిర బంధువుని కించపరుస్తూ చెప్పడం భావ్యం కాదు, అయినా నిజం నిజమె కనక ఆ నిజాన్ని తప్పకుండా వెల్లడించ వలసిందే. 'మా. తమ్ముడుగారబ్బాయి ధర్మరాజు తను భాగోతుల వంశీకుడన్న సంగతి మరిచిపోయి ఆ క్షణంలో పిరికిపందలా భయానికి లోనయ్యాడు.

అయితే అలా కావటానికి కారణాలు ఏమిటో వెదికితే కనిపించవచ్చు. వున్నపళాన అతని మీదికి ఈ విపరీతం వచ్చి పడింది గనక ఏంతటి నిరర్భ్మయస్తులైనా యిలాంటి అరిష్టాల్ని ఎదుర్కోవడం కష్టం. అదీగాక అప్పుడు అతనున్న పరిస్థితులు, పుట్టి "పెరిగిన వాతావరణం ఈ వైపరీత్యాన్ని తట్టుకునేలా చేయలేదు. పుట్టినప్పటినించీ మనిషిని అదృష్టం వెన్నాడుతూ గారాబం చేస్తుండటంతో మనిషిచాలా నాగరికంగా తయారవుతాడు: నాగరికత పెరిగిన కొద్ది దూర్వాసుల పరశురాంలాంటి రాతియుగానికి చెందిన నికృష్ణుల్ని ధైర్యంగా ఎదుర్కోడానికి జంకుతారు, సందేహిస్తారు. అంచేత, 'మా భాగోతుల ధర్మరాజు :కొండ

(ప్రేమికుడి ఇక్కట్లు 150 సరదాగ్గా' కాసేపు

గుహల్లో నివసించే ఆదివాసి లాంటివాడితో సమవుజ్జీ కాలేకపోయాడు. చదరంగం ఆటలో కాస్తో కూస్తో ప్రవేశం తప్ప అతనికున్న ఒకే ఒక నైపుణ్యం - దేశ విదేశాలకు చెందిన స్టాంపులు సేకరించే హాబీ మాత్రమే. మూడోసారి గ్లాసులో బ్రాందీ - సోడా కలుపు తున్నప్పుడు వొంటి చేత్తో, అదీ ఎడమచేత్తో చిరుతపులుల్లో యుద్దానికి దిగేవాడితో కనక తను పోట్లాటకి దిగితే తనకున్న ఆ ఒకే ఒక నైపుణ్యం వుపయోగపడదని తలపోశాడు. ఇప్పటి నాజూకు పరిస్థితుల్లో తన ముందున్న మార్గం అనుకున్నాడు, గీతాంజలి (ప్రేమని వాదులుకుంటే గుండెలు బద్దలైనా ఈ అంధకారంలో, గుండెకీ తన ప్రాణానికీ మధ్య జరుగుతున్న ద్వంద్వయుద్ధంలో ప్రాణానికే అధికంగా వోట్లు వస్తాయనిపించింది, ప్రాణం సంగతి తలుచుకుని వంట్లో నరనరాలు వొణుకుతుండగా టేబులు ముందు కూచుని ప్రియురాలు గీతాంజలికి వీడ్కోలు చెబుతూ అఖరిసారిగా. వుత్తరం రాశాడు. అర్జెంటు పనుల మిద వెంటనే అండమానుకి వెళ్ళాల్సి రావటంతో కుమారి గీతాంజలిని ముందు అనుకున్నట్టుగా మరుసటిరోజు కలవలేకపోతున్నానని రాశాడా వుత్తరంలో, తనని కలవడం, పరిచయం 'పెంచుకోడం, తనతో స్నేహం: చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానీ, బహుశా జీవితంలో మళ్ళీ యిద్దరూ కలవటం అసంభవంగా కనిపిస్తోంది కనక భవిష్యత్తులో ఆమె పురోగతిని చాలా వుత్సుకతో గమనిస్తూ వుంటాననీ కూడా రాశాడందులో.. . వుత్తరం చివర ఒక ప్రేమికుడు, ప్రియుడు రాసినట్టు కాకుండా విధేయుడు, బి.ధర్మరాజు అంటూ ముగించి కవర్లో పెట్టి వీధి చివర్పున్న డబ్బాలో పోస్ట్‌ చేశాడు, అలా ముగింపు పలికి యింటికొచ్చి. పడుకున్నాడు. ముందటిరోజు రాత్రి బాగా పొద్దపోయి పడుకోడంతో మర్నాడు. పొద్దున ఆలస్యంగా లేచాడు ధర్మరాజు, స్నానం ముగించి, భోజనం చేసేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. చేతి గడియారం చూసుకుని బహుశా ఈ పాటికి తన వుత్తరం ఆమెకు చేరి వుండొచ్చని వూహించుకుంటూ గదిలో టెలిఫోను మోగుతున్నా ఎత్తలేదు. ప్రియురాలు గీతాంజలి ఆ వుత్తరం చదివి తనతో. మాట్లాడాలని 'ప్రయత్నిస్తుండవచ్చు అనుకున్నాడు, బట్టలు మార్చుకుని ఏం చేయాలో తోచక తటపటాయిస్తుంటే ధర్మరాజు యింట్లో నౌకరుగా పనిచేసే సాంబయ్య, బ్రిగేడియర్‌ రాచవరపు నంజుండయ్యగారు తమరికోసం వరండాలో నుంచునున్నారయ్యా అని చెప్పాడు. అది విని ధర్మరాజుకి వెన్నెముక మాద ఐసుగడ్డతో రుద్దినట్టయింది. అదీ యిది ఆలోచిస్తూ, తనకోసం ఎవరైనా వస్తే యింట్లో లేనని చెప్పమని సాంబయ్యతో అనడం మరిచిపోయినందుకు తనను తనే తిట్టుకున్నాడు, కాళ్ళల్లో ఎముకలు తీసేసినట్టున్నా చివరికి బలవంతాన నిభాయించుకుని ఆయన్ని కలవడానికి వెళ్ళాడు: పొడుగ్గా, నిఠారుగా, సరదాగ్గా కాసేపు 181 (పేమికుడి ఇక్కట్లు

గంభీరంగా, తెల్లటి జుట్టుతో భారీగా వున్న వయసుమళ్ళిన వ్యక్తిని లోపలికి రమ్మంటూ ఆహ్వానించాడు.

“గుడ్‌ మార్నింగ్‌, ఏం తీసుకుంటారు నాలుగు మినప సున్నుండలు తింటారా?" అంటూ: అడిగాడాయన్ని.

'మినపసున్నుండలు నాలుగు కాదు కదా ఒక్టటి కూడా తినన్నేను, సున్నుండలట, సున్నుండలు! వెధవ సున్నుండలు! ఛీ! భా! థూ థూ! అన్నాడు (బ్రిగేడియర్‌ నంజుండయ్య.

ఆయన అలా అంత మోటుగా. అన్నది బయటివాడెవరన్నా వినుంటే, నంజుండయ్య గారికి సున్నుండల నిషేధ సమితిలో స భ్యత్వం వుంది కాబోలని అనుకుందేవాడు. అయితే ధర్మరాజుకి "అసలు సంగతి తెలుసు కనక ఆ మోటుదనాన్ని సహృదయంతో సరిగ్గా అర్ధం 'చేసుకున్నాడు. ఇంటికొచ్చిన పెద్దమనిషి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ తనవంక చూస్తుంటే మిలిటరీవాళ్ళు ఈ నంజుండయ్యని ఎంత అసహ్యించుకునేవారో కదా అని వూహిస్తుందగా ఆయన సూటిగా వుత్తరం. విషయాని కొచ్చాడు.

“మిస్టర్‌ ధర్మరాజూ, నువ్వు రాసిన దరిద్రపుగొట్టు వుత్తరం మా అమ్మాయి గీతాంజలికి చేరింది.

ఓ క్షేమంగా. చేరిందాండీ ఆ వుత్తరం” అంటూ అడిగాడు. కాస్త గంభీరత తగ్గించడానికి.

“ఇప్పుడే వచ్చింది, దానికి స్టాంపులు అతికించడం మరిచిపోయావు, రూపాయ 'ఫైను వసూలు చేశాడు పోస్టుమేను,!

“నా వైపునుంచి తప్పు జరిగిందండి, క్షమించాలి... పైకం తప్పుకుండా ;.. *

బ్రిగేడియర్‌ నంజుండయ్య' వినదలుచుకోక చెయ్యూపుతూ ఆ క్షమాపణలని వారించాడు,

“మా అమ్మాయి బాధ పడింది డబ్బులు వసూలు చేసినందుకు కాదు, వుత్తరంలో వున్న విషయాలు చదివినందుకు. ధర్మరాజూ, కిందటిరోజు రాత్రి పొద్దుపోయాక మారిద్దరూ: పెళ్ళి చెసుకుందామని నిర్ణయించుకున్నట్టు ఆమె అభిప్రాయ పడిందట,.!

“అదండీ. - ఏవిటంటే - సరిగ్గా అలా అని కాదండీ, అంతదాకా వెళ్ళలేదండీ. లేద్కు విషయం..... నేననేది ,.. చూడండి ,.4

“నేను చూస్తూనే వున్నా స్పష్టంగా. మిస్టర్‌ ధర్మరాజూ నువ్వు మా అమ్మాయి గీతాంజలి మనోభావాలతో ఆడుకుంటున్నావు, మాయింటి ఆడబడుచుల మనోభావాలతో ఆడుకునే వాళ్ళని వదిలిపెట్టకూడదని శపథం తీసుకున్నా నేను! ఆ మాటలు అని పక్కనున్న బౌండు పుస్తకం తీసి కొన వైపున పేపరు వెయిట్‌ పెట్టి బ్యాలెన్సు చేస్తూ, “కెప్టెన్‌ బాలకృష్ణ గురించి విన్నావా ఎప్పుడన్నా?” అని. అడిగాడు.

ప్రేమికుడి ఇక్కట్లు 182. సరదాగా. కాసేపు

'లేదండి.!

“కెప్టెన్‌ బాలకృష్ణ గురించి విన్లేదా? నల్లగా, కళ్ళద్దాలు 'పెట్టుకునుంటాడు. ఆర్మీ క్షబ్బులో గిటారు వాయిస్తుంటాడు..

"లేదండి.

“లేదా? నీకు పరిచయం అనుకున్నాలే, మా మేనకోడలు రంజని మనోభావాలతో అడుకున్నాడతను ఓసారి. దాంతో అతన్ని వాళ్ళ క్లబ్బు మెట్లమీద నుంచోబెట్టి కొరడాతో కొట్టాను. గంగవరపు కోదండపాణి పేరెప్పుడన్నా విన్నావా?"

'లేదండి.!

“గంగవరప్తు కోదండపాణి మా యింకో మేనకోడలు సుభాషిణితో ఆడుకోవాలని చూశాడు, గోదావరి జిల్లాకి చెందిన గంగవరపు కుటుంబం వాళ్ళది. లావుపాటి నల్లటి మాసంతో వుండేవాడులే, పక్షుల్ని పెంచుకుంటూ. వాడిని బర్డ్‌ వాచర్స్‌ క్షబ్బు మెట్లమాద నుంచో బెట్టి కొరడాతో బాది పంపించా, ఆ, అన్నట్టు, మిస్టర్‌ ధర్మరాజూ యింతకీ నువ్వే క్లబ్బులో మెంబరువి?”

“నాది యునైటెడ్‌ స్టాంప్‌ కలెక్టర్స్‌ క్షబ్బండీ” చెప్పాడు వాణుకుతున్న గొంతుతో

“'మెట్లున్నాయా దానికి?!

“బాగుంది, మహబాగుంది.' కలలు కంటున్నట్టు 'బ్రిగేడియర్‌గారి చూపులో కనిపించింది. *సరే, నీకూ మా అమ్మాయి గీతాంజలికీ త్వరలోనే పెళ్ళి జరుగుతుందని రేపు అన్ని పేపర్లలోనూ 'ప్రకటిస్తున్నా నీనుంచి వ్యతిరేకత వచ్చిందో... సరె మిస్టర్‌ ధర్మరాజ్తూ వెళ్ళొస్తాను మరి, చెప్పింది గుర్తుంచుకో, అంతే.

చేతులో వున్న పేపరు వెయిటు పక్కన పెట్టి పుస్తకం టేబులు మోదుంచి బ్రిగేడియర్‌ రాచవరపు నంజుండయ్య అక్కడినించి వెళ్ళిపోయాడు.

మా తమ్ముడిగారబ్బాయి ధర్మరాజు ముందురోజు రాత్రి సుదీర్హంగా ఆలోచిస్తూ ధ్యానముద్రలో కూచున్నది యిప్పటి దానికన్నా చాలా రెట్లు తక్కువని చెప్పవచ్చు. పూర్తిగా గంటసేపటిపాటు తల రెండు చేతుల మధ్య పెట్టుకుని ఆ పేపరు. వెయిట్‌నే చూస్తూ నిరాశా నిస్పృహల్లో మునిగిపోయాడు, భాగోతుల వంశీకులందర్లా ధర్మరాజుకి కూడా స్పష్టంగా ఆలోచించే శక్తి వున్నా యిప్పుడు మాత్రం దిక్కు తోచకుండా వున్నాడు. ఆలోచిస్తుంటే పరిస్థితి మరింత క్షిష్టమైనట్టు అనిపించి గదిలోకి వెళ్ళి పెన్ను కాగితం తీసుకుని తనని ౫ లా పెట్టుకుని ఆల్టీబ్రా లెక్కలు కూడా వేశాడు. అయినా ఫలితం కనబడలేదు. మరింత దీర్హంగా ఆలోచిస్తూ కూచునుంటే కాసేపటికి సాంబయ్య వచ్చి టీ సరదాగా కాసేవు 183 ప్రేమికుడి. ఇక్కట్లు

'తెమ్మంటారా అని అడిగాడు.

“అప్పుడేనా టీ? టీ తాగే బ్రైమయిందా అప్పుడే?! అని ఆశ్చర్యపోతూ అడిగాడు.

“అవునయ్యా: తవంరికి నా శుభాకాంక్షలు అభినందనలు తెలపచ్చా అయ్యా?

టా

'తమరి పెళ్ళి గురించండయ్యా. 'ఇందాకొచ్చిన మిలిట్రీ ఆసామిని 'గేటుదాకా సాగనంప్తుతుంటే ఆయన 'సెప్పారయ్యా - తవుంరికీ ఆరమ్మాయిగోరు గీతాంజలిగోరికీ సంబంధం కుదిరిందనీ, తొరలో పెళ్ళి జరుగుద్దనీ సెప్పారయ్యా. ఆయనగోరలా సెప్పడం మంచిదైండయ్యా, ఎందుకంటే వుంకో పెద్దమనిషి దానిగురించి సమచారం అడిగినప్పుడు యీడానికి యీలు సిక్కిందయ్యా.!

“పెద్దమనిషా?”

“ఎవురో దూర్వాసుల పరశురాం గారంటయ్యా, మిలిట్రీ ఆయనెళ్ళిన గంటకల్లా ఫోన్‌ చేసి తమరి నిచ్చితార్ధం గురించి యిన్నది నిజమేనా అంటా అడిగారయ్యా. నిజమే నంటూ 'సెప్పానయ్యా, దాంతో ఆయన తరవాతొచ్చి తమర్షి కలుత్తానన్నారయ్యా. తమరు యింట్లో వప్పుడుంటారో తెలుసుకోడానికి సాలా ఆసక్తి సూపారయ్యా. ఎవురోగాని మనిషి సాలా మంచోడిల్మా స్నేహం కలిపే గుణమున్నోడిలా అనిపించాడయ్యా.!

కూచున్న కుర్చీ కాలుతున్నట్టయి ధర్మరాజు ఏగిరి లేచాడు అందులోంచి.

'సాంబయ్యా!!

“అర్జంటు పని మిద నేను వూరు విడిచి వెడుతున్నా అసలు ఎక్కడికెడుతున్నానో నాకే తెలీదు - బహుశా భూటానుకో, నేపాలుకో అవ్వొచ్చు - తిరిగి రావటానికి ఏళ్ళు పూళ్ళు పట్టొచ్చు. ఇంటికి తాళం పెట్టి పని వాళ్ళందరికీ 'సెలవులిస్తున్నా ఏంతవరకో యిప్పుడు మాత్రం చెప్పలేను. మూడు నెలల జీతం అడ్వాన్సుగా యిచ్చి వెడతాను. ఆ తరవాత ఏం చేయాలో నా వ్యవహారాలు చూసుకునే భద్రయ్య, సుభద్రయ్య, రుద్రమూర్తి అండ్‌ కంపెనీలో ప్లీడరుగార్లకి తెలుపుతా, ఈ విషయం నౌకర్లందరికీ చెప్పేసెయ్యి!

'ఆ, అన్నట్టు సాంబయ్యా-

'“ఇకనించీ కళాసేవ చేస్తూ నాటకరంగాన్ని వుద్ధరించాలని అనుకుంటున్నానయ్యా బయటికెళ్ళి భారత్‌ డ్రామా డ్రస్‌ కంపెనీ. నించి ఒక మంచి విగ్గు, గడ్డం మీసం, పెట్టుడు ముక్కూ మాంఛి లావుషాటి ముదురు నీలంరంగు అద్దాల కళ్ళజోడూ తీసుకురా అర్జెంటుగా,” అంటూ. సాంబయ్యకి లిస్టు చెప్పి పంపించాడు ధర్మరాజు,

గంట తరవాత బయటికొచ్చిన ధర్మరాజు రోడ్డుకు అటూ యిటూ: జాగ్రత్తగా (ప్రేమికుడి 'ఇక్కట్లు 184 సరదాగా కాసేవ

చూసి ఖాళీగా పోతున్న టేక్త్సీ ని కేకేసి అవ్వయ్యారు స్టీట్‌లో లోపల మూలకి మరుగ్గా వున్న ఒక హోటలుకి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు. బుర్రలో వున్న పధకంలో స్పష్టత ఏమాత్రం కానరాలేదతనికి. ఆశ్రయంలోకి చేరి.విగ్గు గడ్డం మాసాల్సు పెట్టుడు ముక్కు నీలం రంగు కళ్ళద్దాలు తగిలించుకున్న తరవాత ముందు కార్యక్రమం గురించి మంచి పధకం వేసుకోవడం మొదలెట్టాడు, ఆరోజంతా బయటికి రాకుండా గదిలోనే వుండి మర్నాడు భోజనం టైముకి కొంచెం ముందు మౌంట్‌ రోడ్డుకు దగ్గరో టూరిస్టులకి సెకెండ్‌ హేండ్‌ సామాన్లు అమ్మే మొదలియార్‌ బ్రదర్సు షాపుకి. వెళ్ళాడు, మర్నాడు. బయజ్టేరే స్ట్‌మర్లో. అండమాను చేర అజ్ఞాతంగా కొన్నాళ్ళు అక్కడ గడిపి, అకృడినించి జావా, సుమత్రా, మలయ్యా జపాన్‌, కొరియా దేశాలన్నీ చుట్టపెట్టిన తరవాత చివరికి చైనా దేశంలో విస్త్రృతంగా పర్యటించాలనేది అతని వుద్దేశ్యం, షాపులో ధర్మరాజు అడుగుపెట్టగానే మొదలియార్‌ బ్రదర్సందరూ 'సంతోషంతో స్వాగతం చెప్పారు. పెద్ద ఆర్డరు వచ్చేలా వుందని తోచి అందరూ అతని చుట్టూ ఈగల్లా మూగారు. ఈ పెద్ద ఎంపోరియంలో సెకెండ్‌ హేండ్‌ దుస్తులే కాక (ప్రపంచంలో వున్న అన్నిరకాల వస్తువులూ దొరుకుతాయి. వచ్చిన చిక్కల్లా మొదలియార్‌ బ్రదర్సు అమ్మకాల్లో చాలా నిప్త్లణులు కావడంతో అక్టరేని చెత్తా చెదారం అమ్మచూపితే వద్దంటూ నివారించడం చాలా కష్టమైన పని, షాపులో అడుగు పె ట్లిన అయిదు నిమిషాలకల్లా - .మండుటెందని కాచే టోపీలు, మూడు బాక్సుల చీట్లపేకలు, ఆటకి డబ్బులకి బదులు వాదే టోకెన్సు బాక్సు, చేపలు పట్టే గాలం, గిటారు, పాత ఫిడేలూ ధర్మరాజు స్వంతమైనాయి. కోపానికి తాళలేక నాలిక టకటకలాడించాడతను. తన పరిస్థితిని వాళ్ళు సరిగా అర్ధం. చేసుకోలేదనిపించింది. తను చేయబోయే (ప్రయాణం వినోదయాత్ర అనుకుం టున్నారు కాబోలని విసుక్కున్నాడు. సౌర చేప బారిన పడటానికి ముందో లేక మలేరియా, టైఫాయిడ్‌ లాంటి విషజ్వరాలు కమ్ముకుని (ప్రాణర పోయే. ముందో మిగిలున్న కాస్తో కూస్తో ఆయుర్ధాయం తనకి పేకాట ఆడటానికి కాన్మీ వొద్దున కూచుని చేపలు పట్టటానికి కానీ, గిటారు, ఫిడేలు వాయించటానికి కానీ సరిపోదని వీలైనంత వరకూ ఆ అన్నదమ్ములకి తెలియపరుద్దామని చూశాడు ధర్మరాజు, అంచుల్లేని టోపీయో, కుట్టు మిషనో అమ్మండి పోనీ నాకు అన్నాడు చిరుకోపంతో వ్యంగ్యంగా, ఆ మాట వినంగానే మొదలియార్‌ (బ్రదర్సులో కలకలం మొదలైంది వెంటనే. 'వొడేయ: ఆర్ముగం, యిందసారుకు. సూయింగ్‌ మిషను కొండువా,' అంటూ పురమాయించాడు గణేశ్‌ మొదలియారు.: నాడేయ నడేశన్‌, యింద సారుకు అంచుల్లేని టోపీ తెచ్చేటప్పుడు షూ డిపార్ట్‌మెంట్‌లో వుండ ఆ కస్టమర్ని ఒరే ఒరు నిమిషం యింగె కూటుకుని వరియా?' చెప్పాడు మురుగేశన్‌ మొదలియారు. “మి అదృష్టం బావుంది. సార్స్‌ మిరు విదేశాలకి సరదాగా' కాసేపు 185 ప్రేమికుడి. ఇక్కట్లు

కనక వెడుతున్నట్టయితే అక్కడున్నాయన మంచి సలహాలిస్తారండీ, ఆయన్ని పిలుచుకు రమ్మని 'చెప్పాను* అంటూ ధనరాజుకి అభయమిచ్చి, “మిస్టర్‌ దూర్వాసుల పరశురాం గురించి మారు వినే వుంటారనుకుంటా?! అని అడిగాడు.

ధర్మరాజు మొహమంతా గడ్డాల్ను మాసాల్లో నిండి వృన్నందువల్ల బయటకు కనిపిస్తున్న తక్కిన కాస్త ముఖం అది విని పాలిపోయింది,

'మిస్టర్‌ దూ -దూ -ప - ప... ?

“అవరుద్నా కరెక్టె సార్‌, పంశురాంగారు, ఎప్పుడూ. అన్వేషణా యాత్రలు చెస్తుంటారాయన.]

.. “గ్రాల్ని నాకు వూప్‌రాట్టం లేదు, గాలి కావాలి!” అన్నాడు ధర్మరాజు.

గభాల్న తలుపు దగ్గిరకి పరిగెత్తాడు, ఒక్క నిమిషంలో అక్కడినించి బయటికీ పారిపోయుండేవాడే కానీ అంతలో తలుపు తెరుచుకుంటూ పొడుగ్గా, నిఠారుగా మిలటరీ ఆఫీసర్లా కనిపిస్తున్న పెద్దమనిషి లోపలికొచ్చాడు.

“ఎవరయ్యా షాపులో! అంటూ: సామ్రాజ్యానికి అధినేతలా స్పష్టంగా గట్టిగా అరిచాడు. అతన్ని చూసి ధర్మరాజు చొక్కాల మోపు వెనక దాక్కున్నాడు, వచ్చినాయన బిగేడియర్‌ రాచవరపు నంజుండయ్య,

ఆ కేకకి హడిలిషోయి. మొదలియార్‌ బ్రదర్సు పటాలం మొత్తం వచ్చి చేరింది. గణేశ్‌ మొదలియారు చేతికి దొరికిన అగ్నిమాపక సిబ్బంది 'వాడే హెల్మెట్‌ని పట్టుకొచ్చాడు, ఆర్ముగం మొదలియారు మైక్రోస్మోపుతోబాటు వైకుంఠపాళీ కూడా తెచ్చాడు, వాళ్ళందర్నీ పక్కకి తప్పుకోమన్నాడు ఆ మిలటరీ మనిషి,

“మి దగ్గిర కొరడాలు దొరుకుతాయా? అని అడిగాడాయన.

'వుండాయి సార్క్‌ కావలసినన్ని వున్నాయి.

'నాక్కావాల్సింది. మంచి. చురుకైన కొరడ్డా. పట్టుకోడానికి మాడియం. సైజు గ్రిప్పుండాలి,! చెప్పాడు బ్రిగడియర్‌ నంజుండయ్య

సరిగ్గా ఆ సమయానికి నటేశన్‌ మొదలియారు దూర్వాసుల పరశురాంని ఎంట పెట్టుకు వచ్చాడు,

'ఓహో, ఈయనేనా ఆ పెద్దమనిషి?” అని విచారించి, “మిరు విదేశయాత్రలకి తలపెట్టారని చెప్పారు. మోకేవిధమైన సహాయం కావాలన్నా సంతోషంగా అందచేస్తాను సార్‌” అన్నాడు దూర్వాసుల పరశురాం.

'హారినీ నువ్వా పరశురాం? ఇక్కడంతా చీకటి చీకటిగా వుంది, దాంతో నిన్ను పోల్చుకోలేకపోయా,” అన్నాడు బ్రిగేడియర్‌ 'నంజుం దయ్య

“ఆర్ముగం, ఆ లైటెయ్యి,” పురమాయంచాడు గణేశ్‌ మొదలియారు.

"వద్దు, ఆ పని చెయ్యొద్దు. నా కళ్ళసలే బలహీనం, ఎక్కువ వెలుతుర్ని తట్టుకోలేవు,” ప్రేమికుడి ఇక్కట్లు 186 సరదాగా కాసేపు

అన్నాడు ధర్మరాజు,

“మరి కళ్ళు బలహీనంగా వుంటే మారిలా వుష్ణ ప్రదేశాలకి వెళ్ళగూడదండీ, ఎండకి

త ట్టుకోలే రు పాపం,! చెప్పాడు దూర్వాసుల పరశురాం. | "పెద్దమనిషి మో. [్రైండా?' అడిగాదు మిలిటరీ మనిషి

“లేదు, ఆయన ప్రయాణానికి కావలసినవి కొనడానికి సాయం చేస్తున్నానంతే.!

“వారు యిప్పటికే ఎండని కాచే. టోపీ, మూడు బాక్సుల చీట్లపేకలు, ఆటకి డబ్బులకి బదులు! వాడే టోకెన్సు బాక్సు, చేపలు పట్టే గాలం గిటారు, పాత ఫిడేలూ ఆ పైన అంచుల్లేని టోపీ, కుట్టమిషనూ కొన్నారండీ, అంటూ సమాచారం. అందించాడు మురుగేశన్‌'మొదలియారు..

'ఆహా? అయితే యింక మోక్కావల్సిందల్లా మరో టోప్కీ పోలీసులు చీలమండ దగ్గిర్నించీ మోకాలి వరకు నాక్స్తుకు బదులు. చుట్టుకునే పట్టిలు ఓక జత, దోమకాటుకి ఆయింట్‌మెంటు, మొసలి కరిస్తే రాసుకోడానికి ఓ డబ్బాడు. మలామ్నూ అంతే, చెప్పాడు దూర్వాసుల పరశురాం,

'పెట్టుబడి ఎవరో పెడుతుంటే తనే యాత్రకి వెళ్ళే మనిషిలా గభాల్న ధర్మరాజుకి కావలసినవన్నీ షాప్తులోంచి ఏరి యిచ్చాడు,

“పంశురాం, అసల్నువ్వు యిక్కడికెందుకొచ్చావ్‌?' అడిగాడు మిలిటరీ ఆఫీసరు,

నేనా?"స్పెషల్‌ బూట్లు -సోల్‌ కింద మాంచి మొనతేలిన బుడిపెలుండే బూట్లకోసం వచ్చాను. నాగుపామొకదాన్ని వాటి ల్లో తొక్కి చంపాలి. .

'తమాషా, కాకతాళీయంగా వుంది. 'నేనూ ఒక నాగుపాముకి బుద్ధి చెప్పేందుకు కొరడా కొనడానికొచ్చాను.' _

“చూస్తే ఈ లెక్కన నాగుపాముల (గ్రహచారం బావున్నట్టు లేదీవారం,! అన్నాడు పరశురాం,

బ్రిగేడియర్‌ నంజుండయ్య ముభావంగా తల వూపాడు.

'అయితే నేను చెప్పిన నాగుపాము చివరికి నాగుపాము కాకపోవచ్చు. ఆ మనిషిని నాగుపాముగా అనుకోడంలో నేను పారబాటు పడివుండొచ్చు కూడా; అదే నిజమైతే నాకి కొరదా వాడే అవసరం వుండదు. అయినా యిలాంటిదొకటి యింట్లో పడుంటే ఎందుకైనా 'మంచిది.*

“అయ్యొ, కాదా మది తప్పకుండా, లంచికి వెడదాం వస్తారా నాతో?"

“ఆనందంగా వస్తానయ్యా”

“వస్తాను. సార్‌ మరి,” అన్నాడు: దూర్వాసుల పరశురాం ధర్మరాజు వంక తిరిగి "స్నేహపూర్వకంగా చూస్తూ. “మికు అంతో యింతో సాయం చేసినందుకు సంతోషంగా వుంది, ఇంతకీ మా ప్రయాణం ఎప్పుడు?”

“సారువారు నాళికి రాజ్‌పుటానా స్టేమర్లో వెడుతున్నారు,! చెప్పాడు నడరాజన్‌. సరదాగా: కాసేపు 187 (ప్రేమికుడి. ఇక్కట్లు

“ఏవిటీ?! అంటూ గట్టిగా. అరిచాడు బ్రిగేడియర్‌ నంజుండయ్య, “మారు అండ మాను వెడుతున్నట్టు నేను గ్రహించనే లేదు యింతవరకూ. నేనక్కడ కొంతకాలం. వుండొచ్చాను కనక మికు పనికొచ్చే విషయాలు. చాలా చెప్పగల్లు: ఇంతకీ రాజ్‌పుటానా లో వెడుతున్నారా! ఎంత మంచి షిప్పో అది.. దాని కెప్టెనుతో నాకు మంచి పరిచయముంది, ఒక పని చేస్తా రేప్పాద్దున మోకు వీడ్కోలు. చెప్పడానికొచ్చి అతనో కాసేప్త పిచ్చాపాటి వేసుకుంటా: ప్రయాణంలో మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడతను. వద్దు, వద్వ బాబూ వద్దు, నాకు థాంక్సు చెప్పాద్దు. నా' బుర్రంతా వేడెక్కి వుందిప్పుడు, ఎవరికన్నా కాస్త సహాయం చేస్తే వుపశాంతి కలుగుతుందేమోనయ్యా,!

అవ్వయ్యారు వీధిలో వున్న హోటలు రూముకి తిరిగొచ్చిన తరవాత విధి తనని అన్నివిధాలా పరీక్సిస్తోంది కావుల్ను అనుకున్నాడు ధర్మరాజు, బ్రిగేడియర్‌ నంజుండయ్య గారు కనక రేప్పాద్దున స్టీమరు దగ్గిరకొస్తే మరి తనింక ప్రయాణానికి పూనుకోడం వట్టి పిచ్చితనం, మానుకోవలసిందే సందేహం లేదు, స్టీమరు డెక్‌ మోద ఎర్రటి ఎండలో నుంచున్నప్పుడు బ్రిగేడియర్‌ నంజుండయ్య తన మారువేషాన్ని సులభంగా గుర్తుపట్టగలడు. అంచేత పారిపోయే వుద్దేశ్యం విరమించుకుని వేరే ఏదన్నా పథకం ఆలోచించాలి. ధర్మరాజు రెండు కప్పుల వట్టి డికాషన్‌ కాఫీకి ఆర్జరిచ్చి తడి జేబురుమాల్ని తలకి చుట్టుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.

భాగోతుల వంశీకులు కలవర పడవచ్చు కానీ వాళ్ళని నిరోధించడం కష్టమని తరచు చెప్పుకుంటూ వుంటారు. ధర్మరాజు చిట్టచివరికి పథకం వేసి కార్యక్రమం నిర్ణయించుకునెసరికి రాత్రి భోజనం వేళ అయింది. ఇప్పుడు నిర్ణయించు కున్న పధకం ముందుదానికన్నా గొప్పదిగా తోచింది.

దేశం వదిలిపెట్టి పారిపోవడమనే ఆలోచన తప్పుగా అనిపించిందిప్పుడు, జీవితంలో మరోసారి బ్రిగేడియర్‌ నంజుండయ్యగారిని కలుసుకోకూడదని నిశ్చయించు కున్న వాడికి దాక్కోడానికి కావలసిందల్లా మద్రాసు పట్టణానికి చుట్టు పక్కలున్న శివారు ప్రాంతాల్లో ఏదో ఒకటి. తలుచుకున్నప్పుడు బ్రిగేడియర్‌ నంజుండయ్య వున్నట్టుండి సూట్‌కేసులో నాలుగు గుడ్డలు కుక్కుకుని జావా, సుమత్రా, మలయా, జపాన్స్‌ కొరియాలకి బయల్దేరి రావడం సంభవం, కానీ బస్సెక్కో లోకల్‌ బ్రైయినెక్కో అంబత్తూరు, తిరువాత్తి యూరు, పెరంబుదూరు, గుమ్మిడిపూండి లాంట్‌ ప్రదేశాలకి రావడానికి యిష్టపడడు. కనక అలాంటి ప్రదేశాల్లో ధర్మరాజు క్షేమంగా తల దాచుకోవచ్చు.

ఇన్నివిధాల ఆలోచించి రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే హోటల్లో ముడిపోయి ఆ

'ప్రేమికుడి ఇక్కట్లు 188 'సరదాగా కాసేపు

తరవాత అణ్జామలై వీధిలో వున్న తన యింటికెళ్ళి యిన్నాళ్ళూ సేకరించిన స్టాంపుల ఆల్బంన్నీ కావాల్సిన వస్తువుల్నీ పెట్టెలో 'సర్దుకుని హాయిగా కానరాని ప్రదేశంలో మాయమైపోవాలని ధర్మరాజు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు,

అర్ధరాత్రి దాటిన తరవాత అలవాటైన. మెటెక్కి సుపరిచితమైన తాళం బెజ్జంలో తాళంచెవి దూర్చాడు, దూర్వాసుల పరశురాం ఎక్కడో తనకోసం నక్కి కూచు న్నాదేమోనన్న సందేహంతో నిశితంగా చుట్టూ చూశాడు. ఎక్కడా మానవమాత్రుడి జాడ అగపడలేదు. నెమ్మదిగా హాల్లోకి ప్రవేశించి చప్పుడు కాకుండా తలుపు మూశాడు,

సరిగ్గా ఆ సమయానికి అవతల వైపునున్న డైనింగు రూము తలుపు కిందినించి

సన్నటి వెలుగు రేఖ కనిపించింది.

ఇంట్లో ఎవరూ వుండరని తను అనుకున్నట్టు కాకుండా లోపల లైటు వెలుగు తుండటంతో ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. కాసేపటికి తేరుకుని ఏం జరిగి వుంటుందో వూహించుకోగలిగాడు. సాంబయ్యతో సహా 'నౌకర్లందరినీ యిల్లు విడిచిపెట్టమని ఆదేశించినా తను వూరొదిలి వెళ్ళాడని సాంబయ్య పరిస్థితిని చేజిక్కించుకుని ఆనందిం చాలనుకున్నాడు. అలా తలుస్తూ కోపంతో వూగిషోయి డైనింగు రూముకి వెళ్ళి చూసేసరికి తను అనుకున్నంతా జరుగుతోందని గ్రహించాడు. టేబులు మోద యిద్దరు మనుషుల డిన్నరు కోసం - భోజనం (్రింక్సు తప్పు తక్కినవన్నీ - అమర్చి వున్నాయి. బల్లమాద భోజనం (్రింక్సు లేకపోడానికి కారణం వెంటనే గు ర్తించాడు ధర్మరాజు - సాంబయ్యకు తోడుగా వచ్చిన మనిషి ఆడదై వుండాలనీ, యిద్దరూ కలిసి వంటగదిలో వండుకుని తెచ్చుకుంటున్నారన్నదాంట్లో సందేహం ఏమాత్రం లేదనుకున్నాడు.

నెత్తికి పెట్టుకున్న విగ్గు నించి కింద అరికాలు వరకు. వొళ్ళంతా కోపంతో మండిపోయింది ధర్మరాజుకి. ఓహో, యిదన్నమాట తన వెనకాల జరుగుతున్న భాగోతం? పక్కనున్న నిలువుకిటికీకి దట్టంగా పొడుగాటి కర్టెన్లు వేలాడుతున్నాయి, వెళ్ళి వాటి వెనకాల దాక్కున్నాడు. భోజన కార్యక్రమాలు ప్రారంభం కానిచ్చి ఆ తరవాత పగ తీర్చుకునే రాజకుమారుడిలా బయటికొచ్చి నౌకరు సాంబయ్యని ఎడా పెడా తన్ని తగిలెయ్యాలని వూరుకున్నాడు కాసేపు. దూర్వాసుల పరశురాంలాగా, (బ్రిగేడియర్‌ నంజుండయ్యలాగా తను వొడ్డూ పొడుగూతో. భారీగా కండలు తేలిన మనిషి కాడు; అయినా పిచ్చిక ప్రమాణంలో వుండే సాంబయ్యని ఎదుర్శుని బుద్ధి చెప్పగలననే నమ్మకముంది ధర్మరాజుకి. గత నలభై ఎనిమిది గంటలుగా పడిన కష్టాల మూలాన చెప్పులు. వేసుకున్నా అయిదడుగులు దాటని సాంబయ్య న్ని ఎదుర్మోడం అనేది ధర్మరాజు విషయంలో టానిక్కులా 'సరదాగ్గా కాసేపు 189 (ప్రేమికుడి, ఇక్కట్లు

పనిచిసింది.

కాసేపట్లో కర్షెను బయట అడుగుల చప్పుడైంది. శబ్దం రాకుండా మెల్లగా విగ్గు, పెట్టుడు ముక్కూ గడ్డం మోస్తాల్లూ ముదురు నీలంరంగు కళ్ళజోడూ ఒక్కొక్కటి తీసేశాడు, ఎదురు పడంగానే తను మారువేషంలో వున్నట్టు గుర్తించి సాంబయ్య షాకునించి తేరుకుని మెత్తబడకూడదు, కర్టెన్ల మధ్యలోంచి చూస్తూ ఒక్క వుదుటున మోదికి దూకేందుకు ధర్మరాజు సిద్ధమయ్యాడు.

ధర్మరాజు ఒక్కవుదుటున మోదికి దూకలేదు సరికదా మామూలుగా కన్నా పిరికి తాబేలులా డిప్పులోకి కుచించుకుపోయాడు, శబ్ద్బమనేది బయటికి రాకుండా వుండాలన్న జాగ్రత్తలో చెవుల్లోంచి వూపిరి పీల్చి వదులుతున్నాడు. దానికి కారణం వచ్చినవాళ్ళు సాంబయ్యా కాదు, అతని తరఫు ఆడమనిషీ కాదు - దూర్వాసుల పరశురాంకి అన్నల్లా మహా బలిష్టంగా వన్న యిద్దరు దొంగలు.

వాళ్ళని చూడగానె. ధర్మరాజు నిశ్చేష్టుడై స్థంభించిపోయాడు.. ఇదివరకెప్పుడూ అతను దొంగల్ని చూడలేదు యిది కూడా: యిలా దగ్గిర్నించి కాకుందా టెలిస్కోపులోంచి చూడగలిగుంటే బావుందేదనుకున్నాడు. ఇప్పుడైతే సింహం బోనులో దూరిన విధంగా తోచిందతనికి, ఎనభై 'సెకెండ్లపాటు బిగబట్టిన వూపిరి ఒక్కసారిగా గట్టి శబ్దం చేస్తూ బయటికి రావడంతో ఆ.శబ్ద్బర సీసా బిరడా తెరిచిన చప్పుడులో అణగారిపోయింది.

ధర్మరాజు జాగ్రత్తగా దాచుకున్న (ఫెంచి షాంపేన్‌ బాటిలు బిరడా తెరిచిన చప్పుడది. ఈ నిశాచర దొంగవెధవలు మొహమాటానికి పోకుండా తమకి కావలసినవన్నీ సమకూర్చు కుంటున్నారని గమనించాడు, ఈరోజుల్లో అందరూ. ఆరోగ్యం పాడవకుండా ఏదో ఒకరకమైన డయటింగ్‌ చేస్తుంటే - పాతకాలానికి చెందినవాళ్ళలా క్రమాహారం, క్యాలరీలు వగైరాల్ని ఖాతరు చెయ్యక బుజాల్ని కుదిపి కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా మింగి తినేవాళ్ళు చాలా తక్కువమంది. కనిపిస్తారు. ధర్మరాజు యింటికొచ్చిన అతిధులు అలాంటి పాత తరహాకే చెందినవాళ్ళు. వాళ్ళిద్దరూ ఏకబిగిన బాటిళ్ళని జగ్గుల్లోకి వాంపి పోసుకుని ఆ జగ్గులెత్తి తాగుతూ మూడు రకాల మటను కూరలు తినడం చూస్తే అధిక రక్తపుపోటు అనేది డాక్టర్లింకా కనిపెట్టలేదని అనిపించేలాగుంది. మరోసారి బిరడా తెరిచిన శబ్దం రెండో షాంపేను బాటిలు తెరిచిన తాలూకుది.

భోజన కార్యక్రమాల ఆరంభదశలో కబుర్లు చెప్పుకుంటూ: తాగుదాం తిందాం అనేది నామమాత్రంగా కూడా ఆచరించలేదు వాళ్ళు, కానీ రెండు కిలోల మటను, చికెను, చెపలకూర తిని ఆకలి కొంతవరకు తీరినందుకు ధర్మరాజుకి దగ్గిర వైపున్న దొంగ యిప్పుడు కాస్త వుపశమనం చెందాడు, ఇల్లంతా పరికించి చూసి బావుందన్నట్లు సంతృప్తి చూపించాడు.

“ఈ కొంప బావుందిరా, కిస్టమూర్తీ, అన్నాడు.

అసలే ముభావంగా వుండే ఆ తోడుదొంగ, నోటినిండా వున్న వేపుడు 'చేప ప్రేమికుడి. ఇక్కట్లు 190 సరదాగా కాసేవు

మూలంగ్గా, *వూ!,” అంటూ మూలిగాడు,

“ఒకప్పటి కాలంలో రాజులూ, మహరాజులూ దీంటో వుండేవాళ్ళు గావుల్సురా,'

'వుప్పుడు కూడా జమిందార్లో, కామందులో వుంటున్నారంటే ఆశ్చర్యం లేదు.

జగ్గులోకి మరింత షాంపేను వొంచుకుని దాన్లో కాస్త వైనూ, బ్రాందీ, జిన్ను రమ్మూ, విస్కీ గుమ్మరిస్తూ కలిపి దట్టంగా కలరొచ్చిన తరవాత గుటగుటమంటూ తాగుతూ కూచున్న రెండో దొంగ *వూ!,” అన్నాడు.

మొదటి దొంగ ఏదో ఆలోచిస్తూ కూచున్నాడు,

“జమాందార్ల వూసొచ్చింది గనక అగుడుతుండా -- ఓకేళ టేబులు మాదికిలా నువ్వు డిన్నరుకి పిల్మావనుకో?”

“క్క యింటోనే, యిదే గదిలోనే అనుకో."

“ఈ జమోందార్లకి తవుంరు ముం దంటే తవుంరు ముందంటా వూర్మే లాంఛనాలెక్కువ గందా, మరైతే అట్టాంటిప్పుడు బోయనానికి జమీందారుగోరి సెల్లెలో, అక్కో ముందు నడుస్తదా మరి పక్కూరి జమోందారుగారి తమ్ముడు కూతురు ముందు నడుస్తదా? ఇది నన్నెప్పుడూ వూరే పీడుస్తానే వుంటాదిరా, నుచ్చెప్పు..

రెండో దొంగ షాంపేను, వైన్సు బ్రాంద్సీ, జిన్ను రమ్ము, విస్కీ కలిపున్న మిశ్రమాన్ని పూర్తిచేసి మళ్ళీ యింకోసారి కలుపుకుని తాగాడు.

“యాడకన్నావ్‌, భోయనం .బల్లకాడికా?'

"అవ్‌, డిన్నరుకి.?

'ఏవుందిరా అందులో, రెండో యమ్మాయి కూసింత పిక్కబలం సూప్‌ తొరగా అంగలేత్తే తనే ముందెడుద్దిరా. ఆమా[(త్రం కూడా తెలీదేరా నీకు?" జవాబిచ్చాడు "హేతుబద్ధంగా ఆలోచించిన రెండో దొంగ.

అది విన్న మొదటిదొంగ కనుబొమ్మలు పైకి లేచాయి,

“వరే కిస్టిగ్యా బొత్తిగా బుద్ధి జ్ఞానం లేని గొడ్డులా మాటాడొద్దురోయ్‌. గొప్పోళ్ళ యెవ్యారాలు వలా వుంటాయో, ఆళ్ళ ఆశార యెవ్వారాలేంటో యిన్లేదేరా నువ్వనాడూ?'

దాంతో ముఖం కందగడ్డలా మారింది రెండో దొంగకి, ఆ దెప్పిపొడుపు అతన్ని కుదిపేసినట్టు ముఖంలో కనిపించింది. కాసేపు గంభీరమైన నిశ్శబ్దం నిండింది. మొదటిదొంగ యిప్పుడు తినడం మొదలెట్టాడు. అతను తినే విధానాన్ని గుచ్చి గుచ్చి చూస్తూ కూచున్నాడు రెండో దొంగ: అవకాశం కోసం కాచుకున్నవాడిలా కనిపిస్తున్నాడు, యిప్పుడా అవకాశం దొరికరిందతనికి.

'సుబ్బిగా!' అన్నాడు. సరదాగా కాసేపు 191 (ప్రేమికుడి. ఇక్కట్లు

“ఏందిరా?! అడిగాడు మొదటిదొంగ. 'సుబ్బిగా, ఏందిరా, తిండిపోతులా అట్టా మెక్కుతుండావేంట్రా?” అడిగాడు రెండో దొంగ. హఠాత్తుగా వచ్చిన యీ: మాటలకి మొదటి దొంగ ఆశ్చర్యంతో వులిక్కిపడ్డాడు. కోపానికి కళ్ళు ఎర్రగా మెరిశాయి, రెండో దొంగలాగానే యితనికి కూడా పటిష్టంగా. కాషాడుకొస్తున్న స్టయిర్యం విడిపోయింది, 'ఎవుడ్రా తిండిపోతులా మెక్కుతోంద్హి ఎవుడ్రా చెప్పు?" 'అవున్రాః నువ్వేరా" ఎవ్లర్రా, 'నేనేనంట్రా?' 'తిండిపోతులా 'మెక్కుతున్నానంట్రా?” “వూ! పందిలానో పందికొక్కులానో మరో అట్టాంటిదేదో దాన్లారా." పానకంలా గుటగుటా తాగిన దాని ప్రభావం. వాళ్ళిద్దరి మాదా యిప్పుడు చూపిస్తున్నదని వెలడైంది కర్టెన్ల వెనకాల దాక్కుని యిదంతా గమనిస్తున్న ధర్మరాజుకి. వాళ్ళ మాటలు తడబడుతున్నాయి, ముందుకు పొడుచుకొచ్చిన కళ్ళు ఏర్రగా చింతనిప్పుల్లా “వురేయ్‌ కిస్టిగాా జమిందారోళ్ళ కొంపల్లో వోరు ముందెడతార్హూ :వోరు యెనక మాలుంటారనేది నాకు తెలీక పోవచ్చున్రోయ్‌, అవుతే కూడు తీనేష్పుడు. పందిలానో, పందికొక్కులానో 'మరో అట్టాంటిదాన్లానో మెక్కన్రోయ్‌,!' చెప్పాడు. సుబ్బారావు అనే సుబ్బిగాడు,. _ మందలింపుని సమర్దించుకునేందుకా అన్నట్టు టేబులు మోదున్న చికెన్‌ లెగ్‌ తీసుకుని మహా రుచిగా వున్నట్టు కొరుక్కు తినడం మొదలెట్టాడు, మరుక్షణంలో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. సభ్యత, సంస్కారంలో సుబ్బిగాడు తనకి పాఠాలు నేర్చుతున్నట్టు కనిపించి కస్టమూర్తి దొంగకి వాళ్ళు మండింది. సంఘంలో తనకన్నా తక్కువ స్థానంలో వున్నాడని యున్నాళ్ళూ భావిస్తున్న సుబ్బీగాడా తనకి పాఠాలు నేర్పేది. అని భంగపడ్డాడు కిస్టిగాడు. కోపం అణుచుకోలేక బల్ల మిదున్న ఖాళీ సీసాఎత్తి కన్ను మూసి తెరిచే లోపల తోడుదొంగ నెత్తిన మోదాడు. కర్ణెన్ల వెనకాల దాక్కునున్న ధర్మరాజు అక్కడ జరుగుతున్నది చూసి కుంగిపోయాడు. కలాంటి (క్రీడలంటే. ఆసక్తి వున్న వాళ్ళయితే దగ్గిర్నించి చూసేందుకు వంతైనా ఖర్చుపెట్టి టిక్కెట్లు కొంటారు కనక ధర్మరాజులో వున్న క్రీడా స్ఫూర్తి కూడా మంచిదేదో 'పోగ్గొట్టు ప్రేమికుడు ఇక్కట్లు 192. సరదాగా కాసేపు,

కుంటున్నావని గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. కాసి బయటికొచ్చి చూసే ధైర్యం చిక్కబట్టుకోలేదతను. కళ్ళారా చూడకపోయినా చెవులారా వింటానికి కూడా చాలా వుత్సాహ కరంగా వుందక్కడ, పడుతూ, లేస్తూ, కొట్టుకుంట్నూ పిడిగుద్దులు గుద్దుకుంటా, మూలుగుతూ చేస్తున్న చప్పుళ్ళ .వల్ల ఆ తోడుదొంగలిద్దరూ. గోడకి వేసిన పెయింటు, మూలకున్న భోషాణమంత అలమరా తప్ప చేతికి అందుబాటులో వున్న అన్ని వస్తువుల్లో కొట్టుకుంటున్నారని ధర్మరాజు [గ్రహింపుకు వచ్చింది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ నేలమోద పడి దొర్లుతూ మల్లయుద్ధం చేస్తున్నట్టు, మరి కాసేపటికి దూరం జరిగి ఒకళ్ళ మోది కింకొళ్ళు ఖాళీ సీసాలు విసురుకుంటున్న చప్పుళ్ళు వినిపించాయి.. వాళ్ళ నోట్లోంచి వస్తున్న పదాలు పదాల సందోహం వింటున్న ధర్మరాజుకి అసలు భాషలో అలాంటి పదాలు, పద ్రయోగ్గాలు వున్న విషయం యిదివరకెప్పుడూ తెలియదు, అలా సాగుతున్న ఆ ద్వంద్వయుద్దానికి పర్యవసానం ఏమిటి? ఎప్పుడు? అన్న ప్రశ్నలు ధర్మరాజు మనసులో పీకుతున్నాయి.

కాసేపలా సాగి మహా వృక్నాలు నేలకి వొరికినట్టు 'పెద్ద చప్పుడుతో ఎంత త్వరగా వాళ్ళ పోట్లాట మొదలైందో అంతే త్వరగా ముగిసింది.

మరికాసేపు ఆగి కానీ ధర్మరాజుకి కర్టెన్లు తప్పించి బయటికి తొంగిచూసే ధైర్యం రాలేదు, అలా తొంగి చూడగానే అతని కళ్ళముందు కనిపిస్తున్న దృశ్యం భీతావహంగా

  • తరచు సినిమాల్లో చూపించే క్నుద్రకర్మల దృశ్యాల్లో ఒకటిలా. అనిపించింది. సినిమా పరిభాషలో అయితే షాట్‌ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పుకోవచ్చు దీన్ని చూసి. మరి కావలసిందల్లా వొంటిమిద నూలుపోగంటూ: లేని అందమైన అమ్మాయిల్ని కనక నుంచోబెడితే సినిమా సీనుకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది అనుకున్నాడు ధర్మరాజు,

బయటికొచ్చి కిందపడున్న శిధిలావశేషాల్ని నోరు వెళ్ళబెట్టి చూస్తూ నుంచున్నాడు. కిస్ట్‌గాడని పిలవబడే. దొంగాడిది తల భాగం .మాత్రం బయటికుంది తక్కిన భాగం భోషాణమంత అలమారు కిందికి దూరి వుంది: సుబ్బిగాడని పిలవబడే దొంగ డైనింగ్‌ టేబులు కిరద లుంగచుట్టుకుని పడున్నాడుః కాసేపు ముందు వొడ్డూ పొడుగ్గా మహా బలిష్టంగా. కనబడిన వీళ్ళిద్దరేనా యింట్లోకి జొరబడి కడుపునిండా తిని తాగింది అని తలుచుకుంటే నమ్మశక్యం కాలేదు ధర్మరాజుకి. చెరుకు రసం తీసే మెషిన్లోంచి బయటపడ్డ వాడిలా కనిపించాడు కిస్టిగాడు.. సుబ్బ్చిగాదైతే బండ .మిద వుతికి పిండేసిన బట్టలా కనిపించాడు. వీళ్ళు కనక పోలీసులకి తెలిసినవాళ్ళే అయుంటే - నిజానికి అయ్యుండాలి కూడా - చాలా నిశితంగానూ, సూక్ష్యంగానూ పరిశీలించగల పోలీసు మాత్రమే యిప్పుడు వీళ్ళిద్దరూ పడున్న పరిస్థితిలో పోల్పుకోగలడు అనిపించింది.

పోలీసుల విషయం వచ్చింది కనక షౌరుడిగా. తను నిర్వర్తించాల్సిన ధర్మం

గుర్తుకొచ్చింది ధర్మరాజుకి. టెలిఫోన్‌ తీసి దగ్గిరున్న షోలీస్‌. స్టేషనుకి జరిగిన విషయర తెలపగానే వీలైనంత త్వరలో రక్షక్షభట దళం వచ్చి ఆ శిధిలావశేషాల్ని స్వాధినం చేసు కుంటాయని, చెప్పారు. వాళ్ళ రాకకి ఎదురుచూస్తూ తిరిగి డైనింగు రూముకి వెళ్ళాడు కానీ ఆ వాతావరణం: చూడగానే అసహ్యం పుట్టిందతనికి. కాస్తంత పరిశుభ్రంగా వున్న చోట మంచి గాలి పీలిస్తే బావుందనిపించింది, వీధి తలుపులు 'తెరిచి బయట మెట్ల మోద గుండెల్నిండా గాలి పీలుస్తూ నుంచున్నాడు;

అలా అక్కడ నుంచునుందగా చీకట్లోంచి ఒక ఆకారం కదిలొచ్చి గట్టిగా ధర్మరాజు భు జం పట్టుకు ది.

“మిస్టర్‌ ధర్మరాజనుకుంటా? చీకట్లో నేను సరిగ్గా షోల్చుకోగలిగితే నువ్వ మిస్టర్‌ ధర్మరాజువే అనుకుంటా? గుడీవినింగ్‌, మిస్టర్‌ ధర్మరాజూ, నీతో ఒక మాట మాట్లాడాలి మిస్టర్‌ ధర్మరాజూ, అని వినబడింది దూర్వాసుల పరశురాం గొంతునించి,

ధర్మరాజు కూడా అతన్ని రెప్ప వాల్చకుండా చూస్తూ నుంచున్నాడు. మునుపెన్నడూ ఏరగని విధంగా అతను చాలా ప్రశాంతంగా వున్నాడిప్పుడు. 1ప్రపంచంలో అన్ని విషయాలు సాపేక్షమైనవే అనేది నిజం కనక ఈ దూర్వాసుల పరశ్తురాం యిష్పుడతనికి తేలికపాటి శుచ్చమైన 'పదార్ధంలా కనిపిస్తూ అసలీ మనిషంటే తను ఏందుకు భయపడ్డాడో కదా అని అనుకున్నాదు.ఇప్పుడిప్పుదే సుబ్బిగాడు, కిస్టిగాడు లాంటి మహామహుల సమాజంలోంచి బయ టపడ్డ వాదికి దూర్వాసుల పరశురాం మరుగుజ్జులా కనిపించసాగ్లాడు.

'ఆ, ఏంటోయ్‌, ఏం కావాలి పరశురాం?” అంటూ అడిగాడు ధర్మరాజు,

సరిగ్గా అదె సమయంలో గట్టిగా (బ్రేకులు నొక్కి చప్పుడుతో పోలీసు వ్యానొచ్చి యింటిముందు. ఆగగ్గానే బొలబొలమంటూ పోలీసులు దిగారు అందులోంచి.

'మిస్టర్‌ ధర్మరాజుగారా?' అంటూ. అడిగాడు ఇన్సెక్టరు.

"అవునని తల వూపుతూ సాదరంగా ఆహ్వానించాడు ధర్మరాజు,

“రండి సార్‌, లోపలికి రండి. నేరుగా లోపలికెడితే డైనింగు రూములో కనిపిస్తారు వాళ్ళు. నెను కొంచెం అతిగా ప్రవర్తించాననుకుంటా. ఎందుకైనా మంచిది మిరు వెంటనే డాక్టరుకి ఫోన్‌ చేసి పిలిపించండి,!

'వాళ్ళ కండిషన్‌ బాలేదాండీ?'

“నాకైతే బాలేదనిపిస్తోంది, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వున్నారండీ.

“కోరి తెచ్చుకున్నారు వెధవలు, మంచి శాస్తే జరిపార్లెండి+ అన్నాడు ఇన్సక్టరు.

“భలేగా అన్నారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ్క! అన్నాడు ధర్మరాజు.

జరుగుతున్న సంభాషణ ఆసాంతం వింటున్న దూర్వాసుల పరశురాంకి అంతా అగమ్యగోచరంగా వుంది.

“ఏవిటి, ప్రవిటిదంతా?”" అని అడిగాడు.

వులిక్కిపడుతూ ధర్మరాజు ఆలోచనల్లోంచి బయటికొచ్చాడు.

(మేయికుడి ఇక్కట్లు 194 సరదాగా కాసేష

'ఏంటోయ్మ ఓహో నువ్వింకా యిక్కడే వున్నావా?!

వన్నానికృడే. 1 6 గార్వం

“ఏవిటి, నాతో ఏమన్నా మాట్లాడాలా? ఏం తొలుస్తోందయ్యా నీ బుర్రని?!

“మిస్టర్‌ ధర్మరాజూ, నీతో ఏకాంతంగా ఐదంటే ఐదు నిమిషాలు మాట్లాడాలి.”

'తప్పకుందానోయ్మ్‌ అలానే. అలాగేనోయ్‌, తప్పకుండా, ఒక్క నిమిషం కనక ఆగావంటే ఈ-పోలీసుల్ని పంపించేసి నీతో ఏంత సేపైనా గడుపుతానయ్యా, మా యింట్లో చిన్న దొంగతనం జరిగిందోయ్‌.!

_ *దొంగత... అంటూ దూర్వాసుల పరశురాం నోరు విప్పబోతుంటే ఆలోగా యింట్లోనించి యిద్దరు పోలీసులు బయటికొచ్చారు. సుబ్బిగాడిని వాళ్ళిద్దరూ చెరో వైపునా రెక్కలు పట్టుకుని యీడుస్తూ తీసుకొచ్చారు. మరికొంతమంది పోలీసులు కిస్టిగాడ్ని కూడా అలాగే లాక్కొస్తున్నారు.. చివర్లో వస్తున్న ఇన్స్వెక్టరు ధర్మరాజుని చూస్తూ గంభీరంగా తల రెండు వైపులా తివ్పాడు.

“సార్‌, మిరిలాంటి విషయాల్లో కాస్తంత జాగ్రత్త పాటించాలండి. అలా అని మారు చేసిందానికి నేను తప్పుపట్టడం లేదు, యీ 'వెధవలకి మంచి శాస్తి క్లేశారు, వాళ్ళకి. జరగాల్సిందే యిది. కాని కొంచెం జాగ్రత్తగా వుండండి. ముందు ముందు ఏదో ఒకరోజు,,* అంటూ సలహా యిచ్చాడు ఇన్సెక్టరు.

తప్పు చేశానని వొప్పుకుంటున్నట్టుగా ధర్మరాజు దానికి, “బహుశా నేను కొంచెం (శ్రుతి మించినట్టున్నానండి. ఇలాంటి 'వెధవల్ని చూస్తే నాకు వాళ్ళు మండిపోయి తిక్క రేగుతుందండి.. తెలుసుగా నాలో పోట్లాదే రక్తం ప్రవహిస్తోంది. సరేనండి గుడ్‌ నైట్స్‌ ఇన్సేక్టరుగారూ, గుడ్‌ నైటండీ, అని. చెప్పి, పంపించేశాడు. ఇప్పుడు పక్కకి తిరిగి దూర్వాసుల పరశురాం భుజాన్ని పట్టుకుని లాక్కెడుత్తూ “ఆ, యిష్పుడు చెప్పు, ఏవిటి, నాతో ఏదో మాట్లాడాలా? రా, లోపలికెడదాం రా, ఏకాంతంగా కూచుని మాట్లాడుకోవచ్చు. ఇంట్లో ఎవరూ లేరు, మా నౌకర్లకి సెలవులిచ్చి పంపించేశా. మనం తప్ప లోపల పిట్ట పురుగు కూడా లేద్ము హాయిగా కూచుని మాట్లాడుకుందాం, రా, అంటూ యింట్టోకి తీసుకెళ్ళటోయాడతన్ని,

దూర్వాసుల పరశురాం చెయ్యి విడిపించుకున్నాడు. మొహంలో కలవరపాటు కనిపించింది. వీధి దీపం గుడ్డి వెలుతుర్లో పాలిపోయినట్టు కూడా కనిపించింది.

“ఇదంతా. మారే...! గుటకలు మింగుతూ మళ్ళీ, *ఈ పని నిజంగా మిరు చేసిందేనాండీ?' _

“నిజంగానా అంటె? ఓ నువ్వడిగింది ఆ దొంగ వెధవల్ని గురించా? అవును, నేనే, ఇంట్లోకి అడుగు పెట్టేసరికల్లా నా డైనింగు రూములో కూచుని హాయిగా, ప్రశాంతంగా ఏమి ఎరగనట్టు నా వైను తాగుత్తూ నా తిండి తింటూ మజా. 'చెస్తుండటం చూశా, పముందీ వెంటనే వాళ్ళనో పని పట్టా, అంతే. కానీ ఆ ఇన్సెక్టరు వెళ్ళేటప్పుడు చెప్పింది సరదాగా కాసేపు 195 (ప్రేమికుడి ఇక్కట్లు

కరెక్తే. కోపం వస్తే నన్ను నేనే మరిచిపోతూంటా, అది తగ్గించుకుని అదుపులో వుండాలని గుర్తుంచుకోవాలి యికనించీ, అంటూ జేబులోంచి రుమాలు తీసి ముడివేశాడు గుర్తుకి, “వెధవది ఏవిటంటే ఆంజనేయస్వామివారిలా నా శక్తి నాకే తెలీదు. అది సరే, యింతకీ నువ్వొచ్చిన పనేమిటో చెప్పావు కాదు?' అడిగాడు ధర్మరాజు.

దూర్వాసుల పరశురాం రెండుసార్లు గుటకలు మింగాడు ధర్మరాజుని దాటుకుంటూ మెట్ల కిందికి దిగాడు. ఏదో తికమక పడుతున్నట్టు కనిపించాడు. ఇప్పుడతని మొహం పూర్తి నల్లరంగుకి తిరిగింది.

“అబ్బె మరేంలేదండి, ఏమి లేదండీ ” 'అది కాదయ్యా, ఏదో అతి ముఖ్యమైన పనుంటేగానిః ఆర్ధరా[భ్రప్పుడు యింత దూరం రావుగదయ్యా?

దూళ్వోసుల పరశురాం మళ్ళీ ఠండుసార్లు గుటకలు మింగాడు.

'అదిటేనండీ, అసలందీ త్వరట్లో శమరి వివాహం జరగబోతున్నదని విన్నానండి, పేపక్షే శూడా చూశానండీ, దాంతో నేను + నేను - నేనండీ, నేనేమనుకున్నానంటేనండీ మిమ్మల్నొక్కసారి కలిసి తమగిశ్షాికిబే వీస్తువు పెళ్ళికి కానుకగా పంపిస్తే నచ్చుతుందోనని తెలుసుకోడానికొచ్చానండీ..

'భ్రోరినీ, భలేవాడివోయ్‌. చాలా సంతోషంగా వుందోయ్‌.”

'కనక - అది - అదండీ, నేను కూడా అందరూ యిచ్చినట్టె ఏదో యిస్తే బాగుండదు కదండీ, అందుకండీ.”* 'అదీ నిజమేననుకో. సరే, ఆ సంగతేదో యింటో కూచుని మాట్లాడుకోవచ్చు గదయ్యా?”

“ధాంక్సందీ, నేను మాత్రం యింట్లోకి చస్తే రానండీ, అడుగు లోపలికి పెట్టనండీ. పోన్లెండి, మోరే ఆలోచించి నాకో లెటరు పంపండి. నా పేరు రాసి, బాంగో ఆన్‌ది కాంగో, పోస్ట్‌ రెస్తాంట్‌ అని రాస్తే చాలందీ నన్ను వెతుక్కుంటూ వస్తుందండి. రేపే ఆఫ్రికాకి తిరిగెడుతున్నానండీ.!

“ఓ, అలాగే తప్పకుందా,” అని చెబుతూ ధర్మరాజు అతని కాళ్ళవంక చూసి, 'అదేవిటోయ్‌, అలా భయంకరంగా కనిపిస్తుండే బూట్లు తొడుక్కొచ్చావేమిటోయ్‌?” అని అడిగాడు, 'ఆనలు, అరికాల్లో ఆనలు వున్నాయందీ,” చెప్పాడు దూర్వాసుల పరశురాం.

“అయితే మరి బూట్లకున్న సోల్సు కింద ముళ్ళలా పొడుచుకొచ్చే బుడిప లెందుకయ్యా?”

“అవా, అవి పాదాల మిద భారం పదకుండా వుపయోగపదతాయందీ.”

'ఓ, అలాగా, సరేమరి, గుడ్‌ నైట్‌, మిస్టర్‌ పరశురాం.”

“గుడ్‌ నైట్‌, మిస్టర్‌ భాగోతుల ధర్మరాజుగారూ.”

'గుడ్‌ నైట్‌, చెప్పాడు ధర్మరాజు,

“గుడ్‌ నైట్‌, అంటూ అక్కడినించి పారిపోయాడు దూర్వాసుల పరశురాం,

గి (ప్రేమికుడి ఇక్కట్లు 196 సరదాగా కాసేపు

నీ న్నాం శ సం. టా గడ 44 | నూ ర! జ్‌

ఎ. . ఆ. ” / వ. | . స -, శ | 1 టా. | " పి.జీ. వుడ్‌హౌస్‌. గబ్బిట కృష్ణమోహన్‌ ఇంపైన వుడ్‌హోస్‌ . . | సొంపైన తెలుగీసు . . . తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి. కా ముళ్ళపూడి వెంకటరమణ

  • పది వుడ్‌హొస్‌ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపినాయి. ల పూటుగా నవ్వగలగాలి నవ్వితేనే అందం! ఆనందం! * .. మరి ఆలస్యం దేనికి? చదవండి! నవ్వండి! టై ( .. = జగన్నా నార శర్మ టం... _ ఉా1-43ిర్‌, విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌స్టీట్‌ హైదరాబాద్‌ -01 _