Telugu విద్యా ప్రస్థానంలో ప్రత్యేక ప్రయోగాలు - anilvaranasi/indianlanguages GitHub Wiki
6౬. య /॥ టో క. ( ది. బూ ము క్ష్ = ఊం లగ్య్బుద్ర 0 " వ శీ గీ "ఆ - తీ ॥ా ే య | క్ష + 4నాస్త్ స ళ్ క | పై న! ఫి | ం ॥ | జా తొ
. క్ి ఈ, _ , ( " శీ - జ | తటి లా శ్ | , అ క్క సో శ క సా + క ల గలి ళ నై లా ఓ ॥ ( "
వా క. | ఏ | ౮ క్ట ఎకి ళ్ళ గ వై ఇ న లీ | ఫి తి ॥ = లం. జీ అన్ అ వరంతో. మ్ కా. రాకీ? అః క | వ తీ గి క! లి గ గ ]ళ్ యు రర! గ టా జీ న ల 1. చ లం. కా న నగ న క స సా 1 గీ [
ల్ శ శ ॥
5%! ౬014261 1(-౯-| | విద్యా ప్రగ్ధానల కుత్తేక ప్ర ప్రత్యేక ప్రయోగాలు వివిధ విద్యా వ్యవస్థల పరిచయం సంకలనం వి. బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎమ్పోచ్ భవన్, ప్లాటొనెం, 21/1, అజామాబాద్ ఆర్టిసి కళ్యాణమండపం దగ్గర హైదరాబాటద్-20. ఫోన్ : 640 - 27660073 |
ప్రచురణ సంఖ్య : 1169 ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి , 201 1 వెల:రు. 100/- కనర్ డిజైన్ : శ్రీరాం కారంకి ప్రజాశక్తి బుక్‌హౌస్ 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్ : 27608107 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం,
ద్ని
విషయసూచిక
- _ విభిన్న విద్యాలయాలు ...........00000200000000000000020000600660000 , 1 నా గారడీ బడి..........0000000వటవవటమవలంటంలలంంలంలంల క్రి
- _ డేవిడ్ హాస్పిరో కలల రూపం 'సుమవనరి ................. కేర్
- _ '“దిగంతరొో స్కూల్లో ఒక్కదినం................. 20
- రెండు స్కూళ్ళు, రెండు ప్రపంచాలు .....................2 లర్
- లోయ నుంచి లోకం చుట్టి వస్తూన్న రుషీవాలీ గ్రామీణ విద్యా కేంద్రం .............. 27
- _ ప్రాథమిక విద్యా పరిశోధనలో ప్రత్యామ్నాయాన్వేషణలో అగ్రగామి ఏకలవ్య...................22244222 తైల
- _ సగటు టీచర్ల సృజనాత్మకతకు ప్రతీక 'నలికలి'.............. 85
- _ ఈ రోజుల్లో క్లిష్టం చాలా సులభం, గ సులభం మాత్రం అనాధ్యం ................. ఉల క్, భొష్ట జు భావం 6900ల 02600 6ల లలల లలి లలి లి లి యిరి 0 6 ల 66 ల 9655 660606 చి ద ఏ6 లలిత రి 6 ఏ 66 శీ క్షే మాట్లాడించడం భాషాధ్యయానికి కీలకం...................4 ర్ డి, పిల్లలూ ఆ భామా క ౮
- పిల్లలు భాష నేర్చుకొన్నట్టే రాయడమూ నేర్చుకోగలరా? ................... 61
- రాతలో రమణీయకత .............220000060600000000222222 6ర్
- భాషా బోధనలో భిన్న ధోరణులు ...............0224422222 6
- భాషా బోధన అంటే భాషా హృదయాన్ని పిల్లలకి పట్టివ్వడమే! ............... 75 | “చ
$ ((.. కథలే పాఠాలు ర 00 ల ౨ 9వ టల ఉలి లం 6 6600690665 00 6005 లపల లలి 6 ఏ లి లలి 00 6 66 ల ఉం లి లలల 09 89
- పిల్లల చేత కథల పుస్తకాలు ఎలా చదివించాలి? ......... 85
- _ పిల్లలు చదివే పుస్తకాలేవీ, కథలేవీ? ......................... 87
- _ మన చదువుల్లో కథల స్థానం ఏమిటి? ..................... 92
- _ అభినయ గేయాలు - ఆంతర్యాలు ........... 100
- . మౌఖికం నుంచి లేఖనానికి మారే దశలో / పిల్లలూ - పుస్తక ప్రపంచం................ 104 .
- _ కథలోంచి భాష నేర్పడం ఎలా? .........440000ట00టల కేకేకే
- మంచి కథ ఇలా ఉంటుంది! ...........4224026662622200044 కేకే
- బోధన - శోధన .........000440006060 0022 0006000000002066666606066644666 కేల్లైకే _ బడిలో అడుగు పెట్టగానే మనమేం చెయ్యాలి ?............ 128
- మన తరగతి గదిలో జరుగుతున్నదేమిటి?! .......................౨- 128
- _ పిల్లల పట్ట, వారు నేర్చుకొనే విధానం పట్ల మనకున్న అభిప్రాయాలు సమంజసమైనవేనా? ............. 1838
- (ప్రాథమిక న్థాయిలో విద్యాబోధన - గురుశిష్యుల సంబంధం ...... 187
- _ పదకొండేళ్ళ పిల్లలతో ఓ డైలాగ్ ..........444404040006020222 కడలి
- పిల్లలు ఎలా నేర్చుకొంటారు ?..........000000000002020000200000422 కేడ్తీరి "7. _ పిల్లలూ - అంతర్గత శక్తులూ ! .....0.000002222022000202600044444242= కేర్]
- _ కాదేది పరీక్ష కనర్హం' శే కేరళ డి.పి.ఇపి. వినూత్న ప్రయోగం! ................... 1ర్4
- _ “బట్టి పట్టడమే పరిసరాల విజ్ఞాన అభ్యసనమా? ..................... 159
- మన చదువులు - మన ఆలోచనలు................440400000000004 162
- _ స్కూలు అసెంబ్లీని ప్రతిభావంతంగా నిర్వహించుకోవడం ఎలా? .... 169
- ఊహించడం ప్రతిభకు సంకేతమా ?.........404000000000260044ఐ కతి శ్త
నేపథ్యం విద్యారంగంలో (ప్రయోగాలు అనగానే చాలామంది సంకోచిసారు. సందేహాలకు గురవుతారు. కోన్ని చేదు అనుభవాలు అందుకు కారణం కావచ్చు గాని నిజానికి గత కొన్ని వందల ఏళ్లలో విద్యా బోధన ప్రక్రియ అనేక ప్రయోగాలవల్లనే పురోగమించింది. ఆధునిక కాలంలో విద్యా బోధన (ప్రజాస్వామికంగానూ పిల్లల భాగస్వామాన్ని పెంచేవిధంగానూ వుండాలన్న భావంతో ఏకీభవించని వారుండరు. అలాటి ప్రయోగాత్మక ప్రత్యామ్నాయ విద్యాసంస్థలు నడిపి చక్కటి ఫలితాలు సాధించిన ఉదాహరణలూ వున్నాయి. ప్రత్యామ్నాయ భావాలను తీర్చిదిద్దిన ప్రముఖులూ వున్నారు. అన్నిటినీ మించి బోధనాపద్దతులకు సంబంధించి ఉపాధ్యాయుల ప్రత్యక్షానుభవాలు కూడా వున్నాయి. ఈ మూడు అంశాలను మేళవింపుగా ప్రస్తుత సంకలనం రూపొందింది. విద్యా రంగంలో నవ్యత కోనం బాధ్యతగా ఆలోచించేవారందరికీ ఈ వున్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని మా విశ్వాసం. వీటిని సేకరించిన రచించిన వారందరికీ కృతజ్ఞతలు.
- ప్రజాశక్తి బుక్ హౌస్
ర్
| ట్ర ఖ్ థ్ 1]
క. విభిన్న విద్యాసంస్థలు
రి
నా గారదీ బడి
నేను చిన్నప్పుడు ఎంత మంచి బడిలో చదువుకొన్నానను కొన్నారు? ప్ప్.... ఐం చెప్పేది ? దాన్ని తలచుకొంటే ఇప్పుడు కనీళ్ళు కట్టలు తెంచుకొంటాయి. నా కొడుకు ఆనంద్‌కు అలాంటి స్కూలు దొరకలేదనే నా బాధంతా.
నా బడి కథ చెపుతుంటే మన పెద్దలు చెప్పే పురాణ కథలా మీకనిపించవచ్చు. నవ్వులాటగా వుండొచ్చు. కానీ నేను చెపుతున్నది ఓ అద్భుతమైన సంగతి.
నేను నాలుగేళ్ళపాటు సేవాగ్రాం ఆశ్రమ పాఠశాలలో చదువుకొన్నాను. నేనెప్పుడూ అక్కడ నాలుగ్లోడల తరగతి గది జైల్లో ఖైదీగా బతకలేదు. విసుగు పుట్టించే పాఠాల్ని బట్టీ వెయ్యలేదు. ప్రకృతి దగ్గరగా, సమాజానికి చేరువగా చేసే ప్రతి పనిలో దక్షతా, నైపుణ్యం ఉట్టిపడేలా నేను చదువుకొన్నాను. సేవాగ్రాం అనగానే మీకు గాంధీజీ గుర్తుకొచ్చి ఉంటారు.
మా ఆశ్రమానికి గాంధీజీ కోరిక మేరకు రవీంద్రనాధ్ ఠాగూర్ ఇద్దరు కార్యకర్తల్ని పంపారు. వారిలో ఆర్యనాయకమ్ సింహళీయుడు. ఆశాదేవి బెంగాలీ. గాంధీజీ బేసిక్ విద్య రవీంద్రుడి ప్రకృతి ప్రేమతో కళాతృష్ణతో మమైకమై పోయిందనుకోండి. ఓహ్! ఎంత మధురమధురానుభవాలు! ఎంతటి నిసర్జబోధనా విధానాలు. మీ కోసం కొన్నిటిని వివరిస్తా వినండి. పనస చెట్టు మీదే పాఠం
అప్పట్లో మా మరాఠీ మాష్టారు శ్రీ పాటిల్ గురూజీ ఓ పనస చెట్టు మీద కూర్చునే పాఠం చెప్పేవాడు. వితండంగా అన్పిస్తోంది కదూ! ఆయన వేటాడేప్పుడు జరిగిన సంగతులన్నీ కథలు కథలుగా చెప్పేవాడు. ఒకసారి ఆయన పొరపాటున ఓ గర్భిణీ జింక మీద తుపాకీ ప్రయోగించాడట. ఆ మూగజీవి కళ్ళల్లో బాధా ఆవేదనా చూచి చలించి పశ్చాత్తాపంతో వేట మరుక్షణమే మానేశాదట. అప్పటి నుంచి కెమెరాతో వన్యప్రాణుల ఫోటోలు తియ్యడం మొదలు పెట్టాడు. దాని కోసం ఆయన ఎన్ని రాశ్రులు మంచె మీద జాగారాలు చేశాడో.
ఫి
ఆయన మాటలు వింటుంటే (పాఠం బోధిస్తుంటే అనడం నాకేం బావోలేదు) అడవిలో తిరుగుతున్నట్లే వుండేది. ఆయనొక శబ్బశిల్పి. మాటలతో చిత్రాలు గీసేవాడు. నాకు ఇన్నేళ్లు వచ్చినా అడవి అంటే మేను పులకరిస్తుందంటే ఆయన కథల పుణ్యమే.
ఇప్పుడలాగాదే మన పిల్లలు అడవిని కూడా కంఠస్తం చేసేస్తారు. ప్రాణి = పశువు అని చెప్పే డిక్షనరీలు తలకింద పెట్టుకొంటారు. నేను మహారాష్ట్రలో గడ్చరౌలీ జిల్లా కెళ్లాను. ఇప్పటికీ అది అడవులతో నిండిన ప్రాంతం. అయితేనేం అక్కడి బడి పిల్లలకి అడవులతో ఆత్మీయత సంగతి దేవుడెరుగు అసలు కనీస సంబంధమైనా వుంటే వొట్టు!. సాధుమేళాలో సంగీతం
మెమప్పుడూ సంత్ తుకారాం అభంగాలు (పద్యాలు) చేదు మాత్రలు మింగినట్టు మింగలేదు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఏకాదశినాడు మా బడిలో సాధుమేళా జరిగేది. పదిహేను రోజులపాటు ఆశమమంతా మేళా సందడితో మునిగిపొయ్యేది. నాటకాలు వెయ్యడమేనా, బొమ్మలు గీయడదమేనా, వ్యానాలు రాయడమేనా, పాటలు పాడదమేనా, భజనలు చెయ్యడమేనా ఒక్క నిమిషం తీరిక దొరికేది కాదనుకోండి. ఎందరో సాధువుల జీవిత సంఘటనలు నాటకాలుగా ప్రదర్శితమయ్య్యేవి.
తుకారం అభంగాల్లో 'జేకారంజ్లే గాంజలే' అనే అభంగం అప్పుడే మూడు రకాలుగా పాడటం నేర్చుకొన్నాను. భైరవి రాగమంటే నాకు ప్రాణంతో సమానమైంది. ఆ 'గీతా మండలిలోనే ఆదుతూ పాడుతూ ఎందరు మహానుభావుల జీవితాలు ఆపోసనం పట్టానో! ఇప్పుడిలా గాదే “ఆది చరిత్ర, “ఇది భాషు, “అదిగో అది సంగీతం” 'ఇది ఆధ్నాత్మికం” అని చీటీలు (లేబిళ్ళు) తగిలించి షోకేసులో పెట్టేశారు. నేను ఓ ప్రభుత్వ పాఠశాల కిటీవల వెళితే “కావ్య కుసుమాంజలి అనే ఇంత లావుపాటి పాఠ్యగ్రంథంలో తుకారాం అభంగం 'జేకారంజ్లే గాంజలే నా కంటబడింది. దాన్ని ఆ అవస్థలో తుకారాం చూస్తే దిగులుతో మంచ మెక్కేవాదే!. చెట్టూ పుట్టలే బోటనీ బోధకులు
ఇప్పుడు ఎంత పెద్ద పాఠశాల కెళితే అంత పెద్ద సీసాల్లో స్పెసిమన్లు దర్శనమిస్తాయి. చివరికి చిన్నవేరు సైతం సీసాలో బంధించి చూడాల్సిందే. మొక్కల జాతుల మూలాలన్నీ కొరుకుడు పదని టెక్నికల్ నామధేయాల జపంతో తెలుసుకోవల్సిందే. పరీక్షల దాకా ఎలాగో ముక్కున పెట్టుకొని మరుక్షణం వదిలించుకొంటారు మన పిల్లలు.
మా బడిలో అలాగాదు. చుట్టూ కావల్సినన్ని మొక్కలుండేవి. మా మాష్టారు మమ్మల్ని కోతుల్లా వెంటపెట్టుకొని ప్రతి చెట్టూపుట్టా తిప్పేవారు. పొలాలన్నీ చూపేవారు. మొక్కను చూడగానే దాని పేరు చెప్పేవారు. ఇక మేము ఆకుల్సి వెళ్ళని అణువణువూ పరిశీలించేవాళ్ళం. పళ్ళు, పూలు, గింజల వివరాలు రాసుకొనేవాళ్ళం. రేగు కాయలు, ఉసిరికాయలు లాంటివి
కే0
లక్షణంగా ఆరగించెవాళ్ళం. క్లాసుల్లో కూడా మాకు ఇదే పని (క్లాసులో తినదమా! అనాగరికం గాదూ అంటారేమో, నాగరీకత చంద్రమండలం దాకా ఎగబాకిన అమెరికా క్లాసు రూముల్లో పిల్లలు లక్షణంగా తినడానికి, తాగడానికి స్వేచ్చ ఉంది. అయితే వాళ్ళు తినేవి చాక్లెట్లూ తాగేవి కోకా కోలాలూ) పళ్ళు తింటూనే రేగుపండుకీ మామిడిపండుకూ సమానగుణాలు చర్చించే వాళ్ళం. నోట్ చేసుకొనే వాళ్ళం. వృక్ష శాస్తమంటే మాకు తోటల్లో తిరగడమే. అందువల్లే 'పామెట్ దైవర్డెంట్ రెటిక్యులేటొ లాంటి పదాలు మాకు ఇనపగుగ్గిళ్ళులా ఎప్పుడూ
- అనిపించలేదు. బొప్పాయి ఆకు ఎదురుగ్గా వుందిగా మరి!
నాకు బాగా గుర్తు! ఏడవ తరగతి పరీక్ష కోసం మా మాష్టారు రకరకాల ఆకులతో, పువ్వులతో ఆల్బమ్ చెయ్యమన్నారు. వీటి కోసం మేం మా ఆశ్రమంలో ప్రతి అంగుళం వెతికాం. పాతికెళ్ళు గడిచాయి. అయినా నేనిప్పుడు సేవాగ్రాం పరిసరాల్లో ఎక్కడ ఏ మూల 'పామెట్ డైవర్డెంట్ రెటిక్యులేటొ ఆకులున్నాయో ఇట్టే చెప్పగలను. అవన్నీ నా కళ్ళముందు నిలుచున్నటై వున్నాయి.
నేను బోటనీలో మా కాలేజీలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనపుడు ప్రొఫెసర్లు అభినందిస్తే నాలో నేనే “మాష్టారూ నేను ఈ కాలేజీలో బోటనీ ఒక్క ముక్కా నేర్చుకోలేదు సుమండీ! అంతా సేవాగ్రాం చలువే” అనుకొన్నాను. బతుకు గణితం
“ఒక నీటి తొట్టికి రెండు పంపులు కలవు. ఒకటి తొట్టిని నీటితో నింపును మరొకటి ఖాళీ చేయును. అప్పుడా తొట్టి ఎప్పటికి నిండును? వంటి ఇప్పటి లెక్కలు చూస్తుంటే నాకు తిక్క పుట్టుకొస్తుంది. “తొట్టి నింపాల్సినవాడు పంపు నెందుకు వదిలేశాడని ఒక్కరూ అడగరే, జీవితం, గణితం అంత దిక్కుమాలినంత దూరానివా ?
_ మా బడిలో జరిగిన ఓ సంగతి వినండి. మేము ప్రతిరోజూ మూడు గంటల పాటు ఏదో ఒక పని (ఉత్పాదన) చెయ్యాల్సి ఉండేది. *బైడ్ లేబర్” (స్వయం కృషితో సంపాదన) అనేది గాంధీజీ మౌలిక సిద్ధాంతం. దీని కోసం నేను కొన్నాళ్ళు గోశాలకు వెళ్ళాను. మా గురువుగారు నాకో సమస్య ఇచ్చి దాన్ని పరిష్మరించమన్నారు.
ఒక ఆవు ఒక రోజంతా ఎంత నీరు తాగుతుందో తెలుసుకొని, గోశాలలో ఉన్న ఆవులన్నిటికీ ఎంత నీరు పడుతుందో లెక్కగట్టి అంత నీరు పట్టే తొట్టి నిర్మించాలి. దీనిక్కాల్సిన ఇటుకలెన్ని ? లెక్కకట్టి తీసుకొని రావాలి. ఈ గణిత సమస్య కోసం నేను వారం రోజులు కుస్తీ పట్టాను. ఎన్ని తొట్లు కొలిచానో! వాటి సరాసరి ఎన్నిసార్లు లెక్కించానో, ఎంత గుంజాటన పడ్డానో చిట్ట చివరికి సాధించాను. గణిత మంటే ఇది కాదూ ?
! శ ల
ఆహారశాస్త్రంలో అర్ధశాస్త్రం
మేము వంతులవారీగా వంట చేసే వాళ్ళం. రోజూ మా స్నూలు మెస్‌లో 100 మందికి వంట కావాలి. ప్రతినెలా ఎంత ఖర్చు అవుతుందో మేమే లెక్కించాలి. ఆహారం సమతులిత పౌష్టికాహారమై ఉండాలి. అది అందరికీ నచ్చాలి. ఇదంతా మా బడ్జెటులోనె కావాలి. నానా హైరానా పడిపోయే వాళ్ళమనుకోండి. బంగాళాదుంపలు అన్నిటికన్నా చవక. నిజమే. మరి అందులో పిండి పదార్థాలు తప్ప మిగతావి లేవే. వాటిని వదిలేయ్యాలి. “ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్” వారి లెక్కనయితే ఒక్క నూనె కోసమే మా బడ్జెట్ మొత్తం ఖాళీ అవుతుంది. ఒక నామాన్య గృహిణ్ కుండే అనుభవంలో ఆవగింజంత కూడా మాకు లేదన్నమాట!.
ఆహారశాస్త్రం ఆర్ధశాస్త్రం రెండూ కుమ్ములాడుకొని మామీదబదేవి. కాగితాలన్నీ ఖరాబు చేసేవాళ్ళం. పప్పు ఉడకడానికి ఎంత టైం పడుతుందో లెక్క వెయ్యడంలోనే పప్పులో కాలు" _ వేసే వాళ్ళం. చీకటి పడేప్పటికి అంట్లు తోమడం ఎదురయ్యేది. ఆ పని అయ్యెప్పటికి యుద్ధంలో గాయపడ్డ సైనికుల్లా అయ్యేది మా పని. తెల్లవారితే సరి మళ్ళీ వంటశాల తాటకిలా నోరు తెరుచుకొని ప్రత్యక్షమయ్యాది.
అయితే మాత్రమేం ? ఈ మొత్తం ప్రక్రియలో పాకశాస్త్రం, కుటుంబ ఆర్ధిక శాస్త్రం, ఆహారశాస్త్రం అద్భుతంగా వొంటపట్టాయి. కొత్తిమీరలో 10,600 యూనిట్ల విటమిన్లున్న సంగతి నాకు మెడికల్ కాలేజీలో ఎప్పుడూ నేర్పలేదంటే నమ్మండి !
మరి ఇప్పటి పిల్లలకో? లేడీస్ ఫింగర్స్ అంటే తప్ప బెండకాయ లంటేనే తెలియదే వేళ్లు తెగకుండా ముక్కలు కొయ్యడం తెలిసేదెక్కడ ? పోషక పదార్థాలు పరీక్షల కోసం గానీ వంటింటి కోసమెక్కడ? గోమూత్ర వ్యవసాయం
మాకందరికీ పొలం పని చెయ్యడానికి భూమిని చిన్న చిన్న భాగాలు చేసి ఇచ్చేవాళ్ళం.
. దున్నడం, తడపడం, విత్తడం, ఎరువు చల్లడం అంతా మాపనే. నీళ్ళు పెట్టడానికి వంతు కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవలసి వచ్చేది. ఒక్కోసారి చీకటి కూడా పడేది. చీకట్లో గుంట నక్కలు 'హూహూ'” అంటే ఊళవేసి సంగీతం మొదలెడితే మరీ చిన్నపిల్లలు జదుసుకొనేవారు. అయినా గుండె చిక్కబట్టుకొని నీళ్లు పెట్టే వాళ్ళం. అప్పుడే మాకు ఆగ్రానమీ అర్ధమైంది. పండ్లచెట్ల పెంపకం తెలిసొచ్చింది. రనాయన ఎరువుల సంగతి అవగతమైంది. దీనికోసం మేము రైతుల దగ్గరికెళ్ళి మాట్లాడేవాళ్ళం. అప్పుడు మాకు జపాన్ దేశపు సాగు నైపుణ్యం నేర్చుకొచ్చిన శ్రీముక్తేశ్వరభాయితో పరిచయమైంది. ద్రాక్ష పంట మొట్టమొదట వేసి ప్రేమ్ భాయ్‌ని ఆరోజుల్లోనే కలిశాం. మాకు దగ్గర్లో ఇజ్రాయిల్ దేశపు సాగు పద్ధతులతో సేధ్యం చేస్తున్న శ్రీ హవెలీగారి పొలం కూడా వుండేది. ఆయన పొలం దున్నడానికి ఎద్దులకు కే2
బదులు గుర్రాలు వాడేవాడు. మధ్య మధ్యలో అన్నా సాహెబ్ సహస్రబుద్దే మాకు మెళకువలు తెలిపేవారు. ఇక వ్యవసాయమంటే కరతలామలకం కాకుండా ఎలా పోతుంది ?
పంట ఎవరి పొలంలో ఎంత ఎక్కువ పండుతుందా అని పోటీపడే వాళ్ళం. గోమూత్రం బక్కెట్లతో నింపి పొలం నిండా చల్లేవాళ్లం. గోమూత్ర ఫలంగా నేను రెండు కిలోల “వంకాయ” నొకటి పండించాను. దీన్ని వార్థా బజార్లో అమ్మకానికి పెడితే ఇదేదో తెగులు వంకాయ కాబోలునని ఒక్కరూ కొనడానికి ముందుకు రాలేదు. నా వంకాయ నాకే దక్కింది.
ఇప్పటి మన పిల్లలకి బెండచెట్టుకీ వంగ చెట్టుకీ తేడా తెలీదు కానీ రికార్డు మాత్రం అద్భుతంగా తయారు చేసి మార్కులు కొట్టెయ్యడమెలాగో తెలుసు. గాజుగ్గాసులో గింజని కర్రపుల్లక్కట్టి తంటాలు పడతారుగానీ పెరట్లో ఓ గింజ మొలకెత్తడం ఓపిగ్గా చూచిన పాపనపోరు. “శారీరక (శ్రమ చేస్తే చదువులెప్పుడు నేర్చుకోవాలి? పోటీలో ఎలా నిలదొక్కుకోవాలి?” అని మన తల్లిదండ్రులు తిరగబడే రోజులొచ్చాయి. పాపం రాజాజీగారు ఈ దాడితోనే రాజీనామా చెయ్యాల్సి వచ్చింది!
గంధకికామ్లం తయారు చేసి నాలుగు పద్దతుల్లో ఒక్కటి చెప్పలేక పోయినా వాడు వట్టి తెలివితక్కువ దద్దమ్మ కింద లెక్క తొమ్మిదవ తరగతి పిల్లాడికిది ఎప్పుడవసరమొస్తుందా అనేది మాత్రం ఒక్కరూ గుర్తించరు! భూతాలు లేని భూగోళం
నాకు తెలుసు మీరే విషయం ఆలోచిస్తున్నారో? దేన్ని అనుమా నిస్తున్నారో? చరిత్ర భూగోళం రాజనీతి శాస్త్రం ఈ సేవాగ్రాం పిల్లలకి తెలిసేదెలా ? అని కదూ మీ సందేహం!
భూగోళం నెను మా సేవాగ్రాం బడిలో మాటవరసకైనా నేర్చుకోలేదు. సేవాగ్రాంకి దేశ విదేశాల వారు వచ్చేవారు. వారి నుంచి వేర్వేరు దేశాలూ వాటి పరిస్థితులూ తెలుసుకొన్నాను. వివిధ దేశాల స్టాంపులు సేకరించడం నాకెంతో ఇష్టం. వాటి నుంచి ఎన్నో కుతూహలాంశాలు లభించేవి. తొమ్మిదో తరగతిలోనే నేను శరత్ చంద్ర రాసిన 'పథేర్దేవి” రువేర్ చంద్ర మేఘాణీ రాసిన “ప్రభపథారే' చదివేశాను. దాంతో బర్మా గురించి నాకు కావల్సినంత తెలిసింది. తెలియడం కాదు నన్నీ పుస్తకాలు ఎంత మంత్రముగుణ్ణి చేశాయంటే పెద్దయ్యాక అవి నన్ను బర్భాకు లాక్కెళ్ళాయి! భూగోళం నన్నెప్పుడూ భూతంలా భయపెట్టలేదు. ప్రతిది కుతుహలంగా వుందేది.
ప్రతి సాయంత్రం మా మాష్టార్లు దిన పత్రికలు చదివి విన్పించే వారు. ఒక్కో సంఘటనను తీసుకొని కథలా వివరించేవారు. రష్యా క్యూబాకి అణ్వాయుధాలు పంపితే, దాన్ని అమెరికా అడ్డుకొనేందుకు నానా బీభత్సం సృష్టించిందనేది ఆ కాలంలో ఒక గొప్పవార్త, రెండో ప్రపంచ యుద్ధం, సామ్యవాద దేశాల ఆవిర్భావం ఇవన్నీ మా కళ్ళముందు జరిగినట్టుండేవి, స్విట్టర్లాండు దేశస్తులు తమ దేశాన్ని 'హెల్వెటిమా' అని ఎందుకంటారో తెలుసుకొనేందుకు ఆ దేశచరిత్రనంతా తిరగదోడినంత పని చేశామనుకోండి.
13
శ్రమైక జీవన సౌందర్యం
మా బడిలో అటు గాంధీజీ ఇటు విశ్వకవీ కలలు ప్రతిఫలించేలా ఎన్ని ప్రయోగాలు చేశామో! మామూలు పరీక్షలు గాక చిత్రలేఖనం, నాటకాలు వెయ్యడం, సభా ప్రసంగంలాంటి ఎన్ని పరీక్షల్ని ఎదుర్శొనే వాళ్లమో. కొన్నిటిలో కొందరు చురుగ్గా వుంటే కొందరు మందంగా వుండేవారు. అయితేనేం అందరూ సంపూర్ణ మానవులయ్యామని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం.
ఒక క్లాసులో కూచోవాలని మాకు ఎప్పుడూ నియమం లేదు. నేను ఒకే సంవత్సరం ఏడవ తరగతి ఇంగ్రీషు, తొమ్మిదవ తరగతి గణితం, పదవ తరగతి మరారీ పాఠాలకు హాజరయ్యే వాణ్సీ! ఆనాటి సామాజికోద్యమాల్లో మేం భాగన్వాములం. (శమజీవన సౌందర్యారాధకులం, సమిష్టి జీవనమంటే, మానవతా విలువలంటే మాకు ఎనలేని విశ్వాసం, గౌరవమూ!
ఇప్పుడు మన పిల్లల్ని 'ట్రోలతో, బూట్లతో బిగించి పెడుతున్నాం. మట్టి తగిలితే చాలు మాసిపోతారనుకొంటున్నాం. పోటీలు పెట్టి సర్మసు చేయిస్తున్నాం. “ఐక్యూ'లు కనిపెట్టి ఎవరికి వారినిగా విడదీసి తూకమేస్తున్నాం. చిరవగా ఒక్కమాట
ఇలా నేను చెపుతూంటే 'ఏమండీ అలాంటి బడి ఇంకా వుందాండీ! మేమూ మా పిల్లల్ని అక్కడికి పంపుతాం” అనే వాళ్ళిందరో వున్నారు. మీరూ అలా అడగాలని కుతూహల పడుతుందొచ్చు.
మిత్రులారా! ఆ విద్యా ద్వీపం నవనాగరికతా మహా సముద్రంలో పోటీ తుఫానులో చిక్కుకొని మునిగిపోయింది. దానికి “ప్రభుత్వ గుర్తింపు కరువైంది. ఫలితంగా విద్యార్థుల బ్రతుకు పశ్హార్థకమైంది చివరికి ఆ బడి నడిపే భూదాన ఉద్యమ కార్యకర్తలు సైతం తమ పిల్లల్ని మరోచోటికి తీసుకెళ్ళాల్సి వచ్చింది.
ఆ దీపం అలా ఆరిపోయింది ! ఒక స్మృతి శకలంగా మిగిలిపోయింది. నా పిల్లల్ని చూసినపుడల్లా ఓ కన్నీటి పొరగా నన్ను మాత్రం వెంటాడుతూంది !
కేశ
లాడ్ ఆడది ఆస అలో ఆదికి (కి దేవిడ్ హాస్పిరో కలల రూపం 'సుమవనం కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. ఆశయాలు హిమాలయ శృంగాల్ని తాకుతాయి. భావో(దేకాలు గగన తలాల్ని చుంబిస్తాయి. కార్యాచరణలు సమకాలీన బుద్ధిజీవుల్ని అనితర సాధ్యంగా ఆకర్షిస్తాయి.
ఆధునిక విద్యాతత్వవెత్తల్లో జిద్దు కృష్ణమూర్తి. డేవిడ్ వాస్పిరో ఈ కోవలోకి వస్తారు. కృష్ణమూర్తి మహాపండితుడు, తాత్వికుడు, స్వేచ్చా విద్యాప్రవక్త, అవధులెరుగని జ్ఞానం, హద్దుల్లేని స్వేచ్చ, అఖండ సౌందర్య పిపాస ఆయన కోరుకున్న విద్యకు లక్ష్యాలు. అసూయ, అజ్ఞానం, పోటీ పెత్తందారీతనం లేని సమాజం ఆయన ఆదర్శం.
హాస్పిరో కూడా ఆదర్భవాదే. కానీ ఆయన తత్వంలో భౌతిక వాదానికి న్థానమెక్కున.
“ఈ పేదలకి మనం భూములివ్వలేం. ఆస్తులివ్వలేం. కనీసం ఒక్కపూట తిండికైనా మనం సాయపడలేం. మనసున్న మనుషులంగా ఈ సమాజం ఇలానే అస్తవ్యస్తంగా వుందరాదని కోరుకొనే సామాజిక జీవులంగా వీళ్ళ పిల్లలకైనా ఏమైనా చెయ్యగలమా? ఏళ్ళకి మనం ఏమీ చెయ్యలేకుంటే, ఈ దుస్థితి ఇలా ఎంతకాలమైనా కొనసాగుతూ వుంటే ఒక ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికీ, తత్వశాస్తాలకీ, ప్రజాస్వామ్యానికీ అర్ధం ఎమిటి?
“మరి ఈ పిల్లలకి మనమెం ఇవ్వగలం? ఏమిస్తే మంచిది? వాళ్ళనీ ప్రపంచంలో మనుషులుగా నిటారుగా నిలబెట్టగల్లింది, ఈ ప్రపంచాన్ని ఇంతకంటే మంచిగా మార్చాలన్న విచక్షణ పుట్టించగల్లిందీ చదువే. ఆ చదువుని వీళ్ళకందించగల్లితే.....
“చదువంటే నాలుగు ముక్కలు రాయడం, చదవడమూగాదు, ఈ చదువు మళ్ళీ వాళ్ళని అలానే వుంచుతుంది. ప్రస్తుత వ్యవస్థలో సర్దుకొని పోవడాన్న నేర్పుతుంది. అందువల్ల వీళ్ళకిచ్చే చదువు అత్యాధునికమై వుండాలి. ఉన్నతవర్ధాల కందుబాటులో వున్న చదువు వీళ్ళకివ్వాలి. ఈ చదువు ఒకవైపు ఈ ఆధునిక సమాజంలో ధీటుగా రాణించగల్లడానికీ, మరోవైపు ఈ సామాజిక వ్యవస్థపట్ల స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం కల్పించడానికీ తగినదిగా వుండాలి,
కర్
“మరి దీనికెవ్వరు నడుం బిగిస్తారు "మనమే బిగించాలి. ఈ సమాజం నుంచి అన్ని సదుపాయాలూ పొంది ఉన్నతస్థితి కెదిగిన మన మే కొందరం దీనికి కంకణధారులం కావాలి” ఇదీ హాస్పిరో ఆదర్శం.
కృష్ణమూర్తి వాస్పిరో ఇద్దరూ సమకాలీన మేధావుల్ని విపరితంగా ఆకర్షించారు. ఎల్లలు దాటి వచ్చినవారు, అత్యున్నత పదవుల్ని ఉద్యోగాల్ని వదులుకొని వచ్చి వీరికి శిష్యులై తమ జీవిత ఏకైక లక్ష్యంగా విద్యను స్వీకరించిన వారెందరో వున్నారు. అకుంఠిత దీక్షతో హాస్పిరో అందించిన దీపం నుంచి దీపాలు వెల్లిస్తున్న వారిని ఎలీనావాట్స్ నుంచి రోహిత్ దినకర్ దాకా, నరసింహన్ నుంచి మంతెన శివరాం దాకా ఎందరి నైనా చెప్పవచ్చు.
నరసింహన్ ఏరోనాటిక్స్ ఇంజనీరు, ఐఐటి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుడు ఉష నీల్బాగ్లో హాస్పిరో శిష్యురాలు. కృష్ణమూర్తి హాస్పిరోల ఆశయాలకూ, సిద్దాంతాలకూ ప్రతి రూపం చిత్తూరుజిల్లాలోని వీరి సుమవనం. వీరి 18ఏళ్ళ దీక్షకిది దర్పణం. సుమవనం - చదువు
ఇందులో చదువుతున్న పిల్లలందరూ నిరుపేదలు. కొందరు బడి మానేసినవారు. కొందరు బడికే నోచుకోనివారు. కొందరు కోరి వచ్చినవారు. ఆరెళ్ళ నుంచి 15 ఏళ్ళదాకా వయస్సున్న పిల్లలు ఒకట్ నుంచి 10 దాకా తరగతులవారు (అలా తరగతుల విభజన లేదనుకోండి).
మొత్తం పదేళ్ళ చదువులో మొదటి రెండున్నర సంవత్సరాలూ టీచరు తోడ్పాటు ఎక్కువగా అవసరమైనవని వీరి విశ్వాసం. అందువల్ల మన స్కూళ్ళల్లోలాగే క్లాసులో ఎప్పుడూ టీచరుంటాడు. ఆ తర్వాత అలా వుండదు. ఎవరిపని వారిదే చాలా వరకు స్వంతంగా . నేర్చుకొంటారు. పైస్థాయి పిల్లల్నించి కొంత నేర్చుకొంటారు. వాళ్ళవాళ్ళ అవసరాలు, బాధ్యతలు స్పష్టంగా వుంటాయి. టీచర్లు అందుబాటులో వుంటారంతే. ఎవరికి వారు అవసరమైందాన్ని ఇష్టం వచ్చినపుడు వచ్చి టీచరు దగ్గర చెప్పించుకొంటారు. ఒకే అవసరం ఇద్దరికి కల్గినా ఎవరికి వారు వస్తుంటారు. ఈ రావడానికి ఒక్కో సందర్భంలో వేళాపాళా వుండదు. ఉదయం 10 గంటలు కావచ్చు రాత్రి 9 గంటలు కావచ్చు!
చివరి రెందేళ్ళూ పరీక్షల మీద కూడా మనసు పెట్టక తప్పదుగదా. 10 వ తరగతి పరీక్షకు సిద్ధం చేసేందుకు సమాయత్తం చేస్తారు. అక్కడితో ఆగక వాళ్ళు పై చదువులకెళ్ళినా సుమవనం సాయం అన్నివిధాలా కొనసాగుతుంది.
“ఉన్నత వర్గాల పిల్లలకి దీటుగా తయారు చెయ్యాలంటే ఇంగ్లీషు మీడియం అవసరమవుతుంది. అన్ని సబ్దక్టులూ వీళ్ళు ఇంగ్లీషులోనే చదువుతారు. కానీ మాతృభాషలోనే
16
మేము వివరిస్తాం, వాళ్ళు నేర్చుకొంటారు” అంటారు నరసింహన్ దంపతులు. దీనికి తగ్గట్టే సుమవనం పిల్లలు ఆంగ్ల అక్షరాలు గని క అనీ, 0ని చ అనీ, గని అ అనీ, 144) స్పెల్లింగు చెప్పమంటే (మ ఆ ని అంటారన్నమాట. మాతృభాషనూ ఇక్కడ నేర్పిస్తున్నారు. అందులోనే పిల్లలు మాట్లాడుకొంటారు కూడా. కానీ అన్ని సబ్దెక్టుల పాఠ్య గ్రంథాలూ ఇంగ్రీషు మీడియంవే. దీనిక్కారణం ఇంగ్లీషులో చదివే ఉన్నత వర్గాల పిల్లలకి వీళ్ళు సరితూగాలన్న ఆశయమే. స్వేచ్చ - క్రమశిక్షణ ఈ పిల్లలకి కావల్సినంత స్వేచ్చ వుంది. తమక్కావల్సింది తాము గుర్తించి, ఇష్టం వచ్చినపుడు టీచర్ని సంప్రదించడమంటే అంతా స్వేచ్చే గదా. కానీ ఈ స్వేచ్చ బాధ్యత గుర్తెరిగి ఒక జీవన విధానంగా అలవరచుకొన్నది. శనివారం నాటికి ఎవరి సిలబసు వారు పూర్తి చేసుకోవాలి. ఎవరి వర్క్ వారు పూర్తి చేసుకోవాలి. అంటే దీన్ని ఖచ్చితంగా పిల్లలు పాటిస్తారు! వెళకు బడికి వస్తారు. రాలేకపోతే కారణాలు చెపుతారు. ఇక అలా రాకూడదని ఖచ్చితంగా తమకు తాము ఒక నిర్ణయానికి వస్తారు. శిక్షలూ విధించుకొంటారు! స్కూల్లోనే కాదు ఇంట్లోనూ ఈ విధి నిషేధాలు వారికి వారే విధించుకొంటారు. | టి.వి. అదే పనిగా రాత్రులు చూడకూడదు. నాటకం వేస్తే అర్ధరాత్రి దాకా దానికోసం మేలుకోగూడదు. అలా చేస్తే ప్రక్కరోజు స్కూల్లో నిద్రపోవాల్సివస్తుంది. ఇంట్లో వుంటె టివి చూడకుండా వుండలేమనుకొంటే ఆ సినిమావచ్చే రోజు సుమవనంలోనే వచ్చి రాత్రికి పడుకొంటారు. ఆశ్చర్యంగా వుందిగదూ! చదువులో ప్రవేశం కల్పించి, దాని రుచి, అవసరం గుర్తింపజేసిన ధైర్యం స్వేచ్చ అందిస్తే చాలు పిల్లలు అన్ని పనుల్లానే చదువునూ తమకు తాము ఒక పద్ధతిలో నేర్చుకొంటారు. 1 మనం తోడ్పడాలి అంతే. అందుకొని ఎంత దూరమైనా వెళతారు. ఇదీ సుమవనంలో ' మనం కళ్ళారా చూస్తున్న వాస్తవం! చదువులో నిత్యజీవితం ఒక్క చదువులోనే గాదు మిగతా పనుల్లోనూ ఇదే తీరు. ఇక ఆవు వుంది. అది షాలిచ్చే రోజుల్లో దానికి మేత వేసి జాగ్రత్తగా చూచుకొంటారు. దాని పాలు అమ్మి కోడిగుడ్లు కొనుక్కుంటారు. ఆవుపాలివ్వని రోజు కోడిగుడ్లు రావుమరి! ఉదయం 8 గంటలకల్లా వసారు. సుమవనం చెట్లతో నిండిన ఎంతో అందమైన వనం. ఆశ్రమంలా ఎంతో ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా వుంటుంది. దిన్ని ఎవరు క్షే
శుభ్రం చెయ్యాలి? చెట్టెవరు నాటాలి? ఇవన్నీ పిల్లలే చేస్తారు. వీరితో పాటు టీచర్లూ చేస్తారు. రోజూ ఉదయం ఒక గంట ఈ పని అయ్యాకే పాఠాలు ప్రారంభం!
'మరి పరీక్షలో” అని సహజంగానే మనకు సందేహం వస్తుంది. పరీక్షలు వీళ్ళెరగరు. అవును, ఏ స్థాయిలోనూ ఎరగరు. మెట్టు తర్వాత మెట్టు ఎక్కిపోవడమే. ఎక్కడికక్కడ అభ్యాసాలు చెస్తూ మూల్యాంకనం చేసుకోవడమే. ఎవరి దశలో వారుండడమే. ఒక్కో సబ్జెక్టులో ఒక్కొక్కరు ఒక్కో దశలో కూడా వుందొచ్చు.
పెద్ద పెద్ద పరికరాలూ, బోధనోపకరణాలూ ఈ స్కూల్లో కన్పించవు. కానీ అవసరమైన ప్రతి ఒకటీ వున్నట్టే. ఛార్జ్చులు, బొమ్మలు కావల్సినవన్ని పుస్తకాలు, పెన్సిళ్ళు ఒక పెద్ద పెట్టెలో ఇమిడిపోయిన లాబొరేటరీ, అందుబాటులోని వస్తువులతో చేసుకొన్న చిన్న చిన్న వస్తువులు వీళ్ళు చూడొచ్చు. ప్రతి పిల్లా బొమ్మలు వేస్తుంది. చేతిపని చేస్తుంది. ఆ బొమ్మల్లో - పెన్సిల్‌తో గీసినవి, కుంచెలు వాడినవి, ఆకులూ, ఈనెలూ ప్రయోగించినవి, దారాలతోనే ఎర్పర్చినవి, అనుకరించినవి, కాపీ తీసినవి ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. చదువులో ఈ బొమ్మలకున్న ప్రాధాన్యత కేవలం చెయ్యి తిరగడమో, ఆసక్తి కల్లడమో అనుకొంటే పొరపాటు. ఏకాగ్రత, విద్యార్ధి మమేకత, సృజనాత్మకత ఇందులో కీలకమైనవి. వీటిని చదువు నుంచి దూరం చేసి భాగస్వామ్యంలేని యాంటత్రికతను మనం రుద్దుతున్నాం.
అలాగే చేతిపని, ప్రతి ఒక్కరూ చెయ్యవల్సిందే. కొన్ని పనులు వినోదానికి కావచ్చు. కొన్ని బొమ్మలే కావచ్చు. కొన్ని తమ నాటకాలకీ, కృత్యాలకీ పనికొచ్చేవి గావచ్చు. అల్లికలు, కత్తిరింపులు లాంటివి అమ్మకానికీ ఉపయోగపడవచ్చు. ఇందులోని అంతరార్ధం మనకు స్పష్టం. పిల్లలు పని నేర్చుకోవాలి. పనీ చదువూ ఒకదానికొకటి తోడుగావాలి గానీ దేనికది కాగూడదు. పనిలో శ్రమలో సౌందర్యం వుంది. సార్ధకత వుంది. పిల్లల్ని దీనికి సన్నిహితం చెయ్యాలన్నదే ఈ అంతర్జాం. పనీ - పాటా ఎంత దగ్గరివో గుర్తించారు గాబట్టే ఉదయం 8 గంటలకు పనితో బడి మొదలై 9 గంటలకి ఆటలతో, పాటలతో క్లాసులు మొదలవుతాయి. అసలు పాఠాలు 10 గంటల తర్వాతే. కీ*ఉలక 0 5611001౬ అనుభవం :
మరి ఎక్కడో అడవుల్లో మునుల్లా విద్యా తపస్సు చేసుకొంటుంటే సరిపోతుందా? బయటవున్న పిల్లల సంగతేమిటి? మరీ ప్రభుత్వ పాఠశాలల్లోని లక్షలాది పిల్లల, వాటి నుంచి పారిపోతున్న పిల్లల సంగతేమిటి? ఈ ప్రశ్న నరసింహన్ దంపతులకూ తలెత్తింది.
చిత్తూరుజిల్లాలో సందర్భంగా నరసింహన్ దంపతులు తమ అనుభవాల ఆధారంగా ఒక ప్రణాళికా, ఒక పాఠ్య క్రమం రూపొందించారు. బహుశా? తెలుగులో గ్రేదెడ్ పద్దతిలో
18
భాషా బోధనాపడద్ధతికి ఇదే శ్రీకారం కావచ్చు. అక్షరమాలని వర్గీకరించి, ప్రాచుర్యం గల 6-7 అక్షరాల్ని కొన్ని పదాల్లో నేర్పించి, వాటిని స్థిరపరిచేందుకు అభ్యాసాలూ, కథలూ ఆ పరిమిత భాషతోనే ఇవ్వడం ఇందులోని ప్రత్యేకత. దీన్నిపుడు రుషీవాలీ, జనవిజ్ఞాన వేదిక ॥ లాంటి సంస్థలు మరింత పరిపుష్టంచేస్తున్నా యనుకోండి.
దాదాపు 8000 మంది బడిమానేసిన పిల్లల్ని మళ్ళీ బడికి తెచ్చే ఈ తొలి ప్రయత్నంలో నరసింహన్ దంపతులకి ప్రభుత్వ ఉపాధ్యాయులతో విస్తృతంగా సంబంధాలేర్చడ్డాయి. “టీచర్లు స్వతహాగా సమర్దులు, వారికి మన పాఠ్యపుస్తకాల్లో ఏ భాగం ఎలా రాయబడిందో కొంత వివరిస్తే చాలు అద్భుతంగా వాటినుపయోగించుకొంటారు. కావల్సిందల్లా వాళ్ళ కవసరమైంది మాత్రం అందివ్వడం, వాళ్ళని నమ్మడం” అంటారు గణితబోధనలో తల పండిన నరసింహన్
పెద్దలెంతో పిల్లలూ అంతే అవసరం.
ఇక పిల్లల్ని గురించి చెప్పమంటే ఉష గారు ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెపుతున్నారు.
“ఈ ప్రపంచానికి పండితులూ, శాస్తవేత్తలూ, ఉపాధ్యాయులూ, నాయకులూ ఎంత అవసరమో పిల్లలూ అంతే అవసరం. వారికెంత ప్రాధాన్యత వుందో పిల్లలకూ అంతే ప్రాధాన్యత వుంది. వీళ్ళు లేకుంటే ఏమవుతుందో చూడండి. ఒక్కరోజు జరుగుతుందేమో చూడండి. నిజానికి మా సుమవనానికీ అంతే. వీళ్ళు లేకుంటే దీన్ని కనీసం శుభ్రం గూడా మేం చేసుకోలేం. ప్రపంచంలో పిల్లలకున్న ఈ స్థానం పిల్లలు గుర్తించేరోజు రావాలి. మేమింతటివాళ్ళం అనుకొంటే వాళ్ళంత ధీమాగా ఈ సమాజ గమనంలో భాగస్వాములవుతారు.
= దీన్ని మనమూ గుర్తించే రోజు రావాలి. అప్పుడు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలో మనకూ
తెలిసొస్తుంది.”
పిల్లల పట్లా, సమాజం పట్లా ఇంత స్పష్టమైన తాత్త్విక దృక్పథం వున్న ఎన్ని సుమవనాలు ఎందరు నరసింహన్ దంపతులు ఇప్పుడు మన కవసరమో మీరే చెప్పండి!
కేం
కల్యా 34 స దిగంతర్' స్కూల్లో ఒక్కదినం
అది అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న రాజస్థాన్ రాష్ట్రం. జైపూర్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలోని 'ఖోనాగోరియాన్' (గ్రామంలో సీదాసాదా ఎలిమెంటరీ స్కూలు. 'దిగంతర్” అనే ప్రాథమిక విద్యా పరిశోధనా సంస్థ అ స్కూలు నడుపుతోంది. జూలై 28న నేను ఆ బడిలో ఉదయం 830కు అడుగుపెట్టి సాయంత్రం 6.00 దాకా అక్కడే అతుక్కుపోయాను. గిజూభాయి 'పగటికలి ఆ స్కూల్లో సాక్షాత్కరించి నాకళ్ళను నేనే నమ్మలేక నిర్నిమేషంగా నిలిచిపోయింది.
అదిగో దిగంతర్బడి. నాతో మీరూ రండి. కలిసి చూద్దాం.
ఉదయం &80 : విశాల మైదానం కనుచూపుమేరలో “వృక్షం? అని చెప్పుకోదగ్గ చెట్టు ఒక్కటీ కన్పించని మైదానం, ఎక్కడో విసిరేసినట్టున్న ఇళ్ళు.
మైదానం ఓ వైపున మన బడి. అవును అచ్చం మనబడే! మట్టీ గోడలు. పూరికప్పు వర్తులాకారంలో వున్నందువల్ల కాంపౌండు అవసరం రాలేదు. ద్వారానికి మాత్రం ఇనుపగేటు. ఎగాదిగా చూస్తూ నిలబడ్డాను.
గుంపులు గుంపులుగా పిల్లలు వస్తున్నారు. అందరూ పెద పిల్లలు. ముఖం పీక్కుపోయి జుట్టు మాసిపోయి నిష్ట దరిద్రం తాండవిస్తున్న పిల్లలు. దూరం నుంచి నడిచి మరీ వస్తున్నారు. ఆశ్చర్యం ఏమంటే బడికొచ్చే పిల్లల్లో ఒక్కరి చేతుల్లోనూ పలకళ్లవు. పుస్తకాళ్లేవు. ఉన్నవల్లా చిన్న ప్లాస్టిక్ కారియర్ సంచులు. ఒకరిద్దరు చేతుల్లో మాత్రం ప్ర్టీలు డబ్బాలు. అందులో వున్నదల్లా రెండు మూడు రొట్టెలని చెప్పకనే తెలిసిపోతోంది. మాష్టార్లూ వచ్చేస్తున్నారు. అంతా పాతిక ముప్పైయేళ్ళ కుర్ర టీచర్లే! వీళ్ళని టీచర్లుగా పిల్లలు గుర్తిస్తున్న దాఖలా ఎక్కడా కన్పించదు.
ఉదయం 89 0౮0: బడిగంట గణ గణా మోగింది. అంతే పిల్లలంతా వెళ్ళి చీపురుకట్టల మీద పడ్డారు. 50-60 చీపురు కట్టలున్నై. కొందరు బకెట్లు, కొందరు చాటలు, కొందరు పారలు, మరికొందరు చిన్నసైజు గునపాలు ఇలా తలా ఒకటి తీసుకొన్నారు. చూస్తుండగానే బడి లోపలా బయటా కోలాహలంగా శుభ్రం చెయ్యడం మొదలెట్టారు.
20
కొందరు చెట్లకు నీరు పోస్తున్నారు. కొందరు రాళ్ళేరుతున్నారు. కొందరేమో నాటిన చెట్లకు జారిపోయిన కంప ఎగదోసి పాతుతున్నారు. అంతకంటే ఆశ్చర్యం పిల్లలతోపాటు టీచర్లూ చెయ్యడం, సళ్ళు మొయ్యడం నుంచి ప్రతిపనీ వాళ్ళంతా కలిసే చేస్తున్నారు. ఒక్కక్షణం అర్ధంగాక బిత్తరపోయ్యాను. టీచల్లేమిటి, ఈ శ్రమైక జీవన సౌందర్యమేమిటి? చూస్తుండగానే అన్నీ శుభ్రంచేసి వ్లాస్టిక్ ట్యాంకుల్ని సీళ్ళతో నింపి అంతా చేతులు కడుక్కొన్నారు.
ఉదయం & 80: తరగతి గది పాతికమంది పిల్లలున్నారు. నేను అడుగుపెట్టెిటప్పటికి అందరూ ధ్యానం చేస్తున్నారు. కొందరు చాలా చిన్న పిల్లలు. కొందరేమో 7-8 సం॥ల పిల్లలు. ఇదే క్లాసో నాకేమీ అర్ధం కాలేదు. అసలు విషయం ఏమంటే ఆ బడిలో క్లాసులు లేవు. ఉన్నవల్లా 'సమూహాలే!” మొత్తం 13 సమూహాలున్నాయి. ఒక్కో దానికి ఒక్కో రూము, ఒక్కో టీచరు వున్నారు. మొత్తం 279 మంది పిల్లలు. ఒక్కో గ్రూపులో 20-25 మంది పిల్లలు ఈ సమూహాలు స్థాయిని బట్టి ఏర్పడినవి. నేను కూచున్న గదిలో “చందమామ” సమూహం ఉంది. వారితో 'సాగరొ సమూహం కూడా చేరి వుంది. “చందమామ చిన్నపిల్లలది. 'సాగర్ * పెద్దలది. ఈ రెండు సమూహాల్లోని సగం సగం మందిని ఒకటి చేసి ఇక్కడ కూచోబెట్టారు.
పిల్లలచేత అభినయం చేయించారు. టీచర్తాగా ఒకడు, అమ్మ లాగా ఒ కళాయి ఇలా రకరకాల అభినయాలు7-8 మంది చేశారు. పెద్ద పిల్లలు ఎక్కువగా చేశారు. చిన్న పిల్లలు వాళ్ళని అనుకరించారు. తర్వాత పొడుపు కథలు పిల్లలూ పొడుపు కథలు వేశారు. 'కంబళి” తీసేస్తుంది. బావిలో దూకేస్తుంది. అనేదొక పొడుపుకథ.
స ఇలా ఎందుకు రెండు సమూహాల పిల్లల్ని ఒకచోట చేర్చారంటే చిన్నపిల్లకి బెరుకుతనం
పోవడం కోసమట.
ఆశ్చర్యం ఏమంటే బడికొచ్చే పిల్లల్లో ఒక్కరి చేతుల్లోనూ పలకల్లేవు. పుస్తకాల్లేవు.
ఉదయం 0.00: సమూహాలు విడిపోయాయి కొంచెం సేపు మంచినీళ్ళ కోసం వ్యవధానం, తర్వాత సాగర్ సమూహం క్లాసులోకి వచ్చింది. అంతా కలిసి 21 మంది గదిలో టీచరుకు కుర్పీలేదు. టేబిల్ లేదు. తరగతికి గచ్చు నేలయినా లేదు. జంఖానా పట్టలు
ఖ పరుచుకొన్నారు. గది కూడా చాలా చిన్నది. అందరూ చుట్టూ కూచున్నారు. టీచరు కూడా కింద కూచోడమే. టీచరుకు రెండు పక్కలా గూడా పిల్లలు కూచున్నారు. ఈ 21 మంది 4 గ్రూపులుగా కూచున్నారు. మాస్తారు అందరికీ ఏక వచనం - బహువచనం చెప్పాడు. లేచి బోర్డు మీద రాసి వివరించాడు. పెద్ద బోధనోపకరణాలూ ఏమీ లేవు. కానీ ప్రతిదీ పిల్లలతో మాట్లాడుతున్నట్టే. వాళ్ళ స్వంత విషయాల్లా చెపుతున్నాడు. (ముందుగా ప్లాన్ చేసుకొన్నాడని తెలుస్తూనే ఉంది). తర్వాత పిల్లలందరికీ దానిమీద అభ్యాసాలిచ్చాడు. 2]
క్షాసురూములో ఒక అల్మరా వుంది. దాంట్లో పాఠ్య పుస్తకాలూ, నోట్సులూ, పెన్సిళ్ళు ఉన్నై పిల్లలే వెళ్ళి ఎవరివి వారు తెచ్చుకొన్నారు. అభ్యాసాలు (గ్రూపులుగా కూచుని చేస్తున్నారు. టీచరు ప్రతి గ్రూపు దగ్గరికి వెళ్ళి సందేహాలు నివృత్తి చేస్తున్నాడు. టీచర్ని ఒక్కరూ సార్ అనరె! “నాథూరామ్జీ, నాథూరామ్జీ' అంటూ రాగాలు తీసి పిలుస్తున్నారు.
ఆ తర్వాత "కాలాలు", “పర్యాయపదాలు ఇలా హిందిపాఠం సాగింది. ఒక్కొక్క గ్రూపుకు ఒకె అంశానికి సంబంధించిన వేర్వేరు అభ్యాసాలు ముందుగా తయారుచేసినవి చెప్పారు. వాళ్ళు కలిసి కూచుని రాస్తున్నారు. అంతా ఆటలాడుతున్నట్టే తప్ప భయంగానీ, తడబడటంగానీ, అన్యాపదేశంగా వుండటంగానీ మచ్చుకైనా కన్పించడం లేదు.
ఒకరితో ఒకరు అభ్యాసాల్ని గురించే గాదు. ఇతరులూ మాట్లాడుతున్నారు. గలభా అన్పిస్తోందిగానీ అందరూ ఎవరిపని మాత్రం వాళ్ళు లక్షణంగా చేస్తున్నారు.
ఇవన్నీ అయ్యాక ఒక్కొక్క గ్రూపుని ఒక్కొక్క జంతువు లేదా పక్షిని గురించి స్వంతంగా రాయమన్నాడు టీచరు. “చిలకకు రెండు కాళ్ళు” అనే వాక్యం ఒకటి చెప్పాడు. అలాంటి వాక్యాలు ఎవరెన్ని రాస్తారో పోటీ పెట్టాడు. ఇది మాత్రం [గ్రూపు కృత్యం కాదు. వ్యక్తిగత పోటి. ఆ సాగర్ సమూహం బడిలో చేరి మూడేళ్ళు దాటాయి. అంటే మన నాల్సవ తరగతి అనుకొందాం. స్వంతంగా రాయడం అద్భుతంగా వుంది. మాస్టారు అన్ని గ్రూపుల్నీ తిరిగి తిరిగి చూస్తూ చెపుతున్నాడు.
ఈ అభ్యాసం అయ్యాక బోర్డు మీద గళ్ళు గీసి “మిత్రుడి పేరు, అతని తల్లిపేరు, తండ్రిపేరు, సోదరులెందరు, తండ్రిపని” అనే అభ్యాసం ఇచ్చాడు. పిల్లంతా అల్మరాలోని స్మేళ్ళు తీసుకొని గళ్ళు కొట్టుకొని రాసేందుకుపక్రమించారు. పిల్లలు ఇలా తిరుగుతూనే వున్నారు. ఒకరిద్దరు వెళ్ళిపోయారుగానీ టీచరెందుకో పట్టించుకోలేదు.
జఉదయం 200 : గంట గణగణా మోగింది. క్లాసురూముల్లోనే పిల్లలు తమ రొట్టెలు తిననాగారు. ఏముంది ఆ తిండిలో? రెండు మూడు ఎండిపోయిన రొట్టెలు. ఉల్లిపాయ లేదా ఒకటి రెండు పచ్చి మిరపకాయలు అంతే. వాటినే ఆవురావురుమని తింటున్నారు పాపం. అదే వాళ్ళకు పరమాన్నం.
మధ్యావ్నాం 1.00 : మళ్ళీ క్లాసులు ప్రారంభం. ఇది “ఆజాద్ సమూహం “ఏ పాఠం చెప్పుకొందాం” అడిగాడు టీచరు. కొందరు సైన్సు అన్నారు కొందరు లెక్కలు అన్నారు. కొందరేమో సాంఘికమన్నారు.
సమూహంలోని 20 మందినీ నాలుగు (గ్రూపుల్ని చేసి రెండు గ్రూపులకు 'వాతావరణం'” పాఠం (సైన్సు), ఇతర రెండు [గ్రూపులకు భూగోళం చెపుతున్నాడు. భూగోళం వాళ్ళకి
22
రాజస్థాన్ మ్యాప్ తెప్పించి అందులోని నదులన్నీ నోట్సు మీద రాయమని పని పెట్టాడు. మిగిలిన రెండు (గ్రూపుల్ని దగ్గర కూచోబెట్టుకొని వాతావరణం బోధించాడు. బోధన అంతా 15 నిమిషాలే! ఆ తర్వాత అభ్యాసాలు చెయ్యాలి. దానికి ముందు పాఠమంతా చదవాలి. పాఠం చాలా బాగా చదువుతున్నారు. తప్పులు చదివే వాళ్ళూ లేకపోలేదు. 'వాతావరణంి పాఠం కూడా సంభాషణలాగా వుంది. అభ్యాసాలు రాయడంలో మాత్రం కొంచెం తికమకపడ్డారు. ఎన్ని తప్పులైనా రాయనిచ్చాడు టీచరు. వాటినేమీ సరిచెయ్యలేదు. తర్వాత సైన్సు వారికి సాంఘికం, సాంఘికం వారికి సైన్సు పరిచయం చేశాడు గానీ టైము చాలలేదులా వుంది. మధ్యాన్నాం 200 : “ఆజాద్” పిల్లలంతా వడ్రంగం పనికెళ్ళారు. అక్కడున్నవల్లా 20-25 రంపాలు, నాలుగైదు బల్లలు. కొన్ని ప్లైవుడ్ చెక్కలు, ముక్కలు. పెన్సిల్‌తో గీతలు గీసి ఆకారాలు వచ్చిలా స్లెవుడ్ చెక్కల్ని రంపంతో కొయ్యడం నేర్చుకొన్నారు. ఇందులో మాస్టారు చెప్పింది ఏమీ లేదు. వాళ్లే ఆ పని చేశారు. బహుశా నిన్నటి పనికి కొనసాగింపు గావచ్చు. మధ్యావ్నాం 230 : సమూహమంతా మళ్ళీ తరగతి గదికి వచ్చెశారు. ఇపుడు అభినయాత్మక బృందగానం. ఎక్కడలేని వుత్సాహం. మాప్పారు బాగొ మాటకారి. అయణద్దంగా అడుగులు వేసి పాటలు పాడుతూ పాడిస్తున్నారు. ఎక్కువ భాగం ఇంగ్లీషు పాటలు. బ్యాం 04190౪? 112101 1006 1" అనేదొక పాట. ఎందుకీ పరభాషా గీతాలో నాకర్థం గాలేదు. తర్వాత తెలిసింది. వీళ్ళకి త్వరలో ఇంగ్లీషు నేర్ప్చుతారట. అందువల్ల ముందుగా పదాల పరిచయం కోసం ఈ పాటలు. పాటలన్నీ మాష్టారూ, పిల్లలందరూ కలిసి పాదేవే! ఇక వీళ్ళని కూచోబెట్టడం సాధ్యం గాదని నాకర్థమైపోయింది. టీచర్ని ఒక్కరూ సార్ అనరే! నాధురామ్జీ నాధూరామ్జీ అంటూ రాగాలు తీసి పిలుస్తున్నారు. పిల్లలు మంచినీళ్ళడిగారు గానీ మాష్టారు ఒకబ్బాయిచేత ముక్కు చెంబుతో నీళ్ళు తెప్పించాడు. మాస్టారు అందరికీ ఒక్కొక్క డ్రాయింగు పేపరిచ్చాడు. పిల్లలు బరబరా ఆల్మారాలోని ఎవరి రంగులపెట్టే వాళ్ళు తెచ్చుకొన్నారు. కావల్సినన్ని వాడి పారేసిన టూత్‌బ్రష్ లు కూడా వున్నాయి. ప్పాస్టిక్ డబ్బాలున్నై. పిల్లలు రంగులు కలిపారు. డ్రాయింగు పేపర్లమీద స్టైవుడ్తో కత్తిరించి వున్న బొమ్మల్ని తీసుకొని అమర్చారు. రంగుల్లో బ్రష్‌ను ముంచి కాగితం మీద బాగా చిలకరించారు. తర్వాత స్టైవుడ్ ముక్కలు తీసేస్తే బొమ్మల ముద్రలు ఏర్పడ్డాయి. చేతగాని పిల్లలకి మాస్టారు దగ్గరుండి చేసి చూపించాడు. 28
మధ్యాన్నాం & 00. బడిగంట గణగణా మోగింది. పిల్లలింకా డ్రాయింగు పనిలోనే చాలామంది వున్నారు. పూర్తిచేసిన వారు అట్టబోర్దు మీద పిన్నుతో తమ డ్రాయింగ్ షీట్‌ను గుచ్చి వెళ్ళివోతున్నారు. నిన్నటివి ఆ బోర్డు నుంచి తీసేసి ఒకచోట పేర్చుతున్నారు. సాయంత్రం లాంగ్బెల్మోగగానే పొలోమంటు కేకలు పెట్టకొంటూ ప్రవాహంలా మన స్మూళ్ళల్లో పరుగెత్తుతారు పిల్లలు. అదొక ముగ్ధ మనోహర దృశ్యం. అలాంటి దృశ్యమే దిగంతర్ స్ఫూల్లో కన్పించదు. నేను అన్ని రూములు తిరిగాను ప్రతిచోటా అదే పరిస్థితి. బొమ్మలు వేసేవారు వేస్తున్నారు. వేసిన వాళ్ళు అతికించి వెళుతున్నారు. ఒక రూములో ఒక చిన్న పిల్ల ఏడుస్తోంది. కాగితాలతో బొమ్మలు చేయడం నేర్పే క్లాసది. ఆ పిల్ల తనకి మాష్టారు బొమ్మ చెసివ్వలేదని మారాం చేస్తోంది. “ఏడిస్తే ఎలా ఇసా వుండు” అంటూ బుజ్జగిస్తూ ఆ అమ్మాయికి చేసిచ్చాక గెంతుకొంటూ వెళ్ళిపోయింది. అచ్చం మనింటిలో కన్పించే దృశ్యమే! నొయంత్రం &€00 : పిల్లలంతా వెళ్ళిపోతున్నారు. మాపష్పార్లు ఎవరి రూములో వారు కూచున్నారు. మొదట పిల్లల పుస్తకాలు, నోట్సులు, రంగు పెన్సిళ్ళు తదితరాలన్నీ అల్మరాలో సర్దారు. తర్వాత కూచుని తమ సమూహంలోని ప్రతి విద్యార్థి ఏమి చేశాడో రిపోర్టు తయారు చేశారు. అది కూడా సబ్దక్టువారీ. పిల్లల పేర్లు వేరుగా రాసి పెట్టుకొన్నాడు. అడిగితే రేపు మొదట వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తప్పులు ప్రత్యేకంగా తెలియజెప్పాల్సి వుందన్నాడు. ప్రక్కరోజు కోసం చిన్న వ్లూనింగు సబ్దక్టువారీ రాశారు. ఒక్కో సబ్దక్టు మీద 4-5 వాక్యాలు. అంతే! చిన్నపిల్లల పుస్తకాల్లో అభ్యాసాలు రాసిపెట్టారు. ఇది ప్రతి విద్యార్థికీ రాయాల్సి వుంది. రేపు వాటిని పిల్లలు పూర్తిచేసారు. ఒక మాస్తారు రేపు పిల్లలు రంగు లెయ్యడం కోసం 21 మందికి బొమ్మలు గీశాడు. ఇలా ఎవరికి వారు 5.00 గంటల కావస్తున్నా ఒంటరిగా వాళ్ళ క్లాసురూముల్లో అతుక్కు పోయ్యారు. 'లాంగ్‌బెల్ కొట్టగానే పొలోమంటూ కేకలు పెట్టుకుంటూ (ప్రవాహంలా పరుగెత్తే ముగ్ధమనోహర దృశ్యం దిగంతర్ స్కూల్లో కనిపించదు. నొయం(్రం & 0 : ఇద్దరు ముగ్గురు మినహా అందరూ బయళ్లేరారు. ఇంతకూ హెడ్మాస్టరు ఎవరో నాకేమీ అర్ధం గాలేదు. తర్వాత తెలిసింది. వారానికొకసారి రివ్యూ చెయ్యడమే తప్ప హెడ్మాస్టరు పర్యవేక్షణ వుందదని అసలు హెడ్మాస్టరే వుండదని. మెల్లగా సంజ నీడలు పరుచుకొంటున్నై. దూది పింజల్లా ఆలోచనలు ముసురుతున్నై. కళ్ళలో మన ఎలిమెంటరీ స్కూళ్ళు మెదలుతున్నై. అడుగులో అడుగు వేస్తూ దారి పట్టాను. వ! .
"
య
౦౦దు స్కూళ్ళు, ౦౦డు ప్రపంచాలు ఫి అగ
(వ్రొథమిక విద్యలో సైతం ఎంత వికృత మైంది మన విద్యా విధానం. ఒకవైపు అతి కొద్ది మంది కోసం సకల సౌకర్యాలతో శోఖిల్లే పైవేటు స్కూళ్ళు. మరోవైపు కోట్లాదిమంది కోసం ఆలనాపాలనా లేని సర్మారు స్కూళ్ళు. రెండూ రెండు ప్రపంచాలు.
నేను ఢిల్లిలో ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేసి, ప్రస్తుతం ఇక్కడే ఒక (ప్రభుత్వ బాలికల
పాఠశాలలో పనిచేస్తున్నాను. నా కళ్ళ ముందిప్పుడీ రెండు ప్రపంచాలు సాక్షాత్మరిస్తున్నాయి. ఈ రెంటి మధ్య తేదా ఒక్క వసతుల, వనరుల విషయంలోనేనా? కానే కాదు. మౌలికంగానే ఇవి రెండు ప్రపంచాలు. మొదటిదేమో పెట్టిపుళ్టనవాళ్ళ కలల్ని పండించే చదువులు నేర్పింది. రెండోదేమో నిష్ట దరిద్రులు, నిమ్నకులాల పిల్లల శక్తికీ, సృజనాత్మకతకూ సమాధి కట్టేది. ఈ రెండోది అజ్ఞానాన్నుంచీ, పేదరికాన్నుంచి వాళ్ళని విముక్తి చేసేది కాదు. దరిద్రాన్ని పరాజిత మనస్తత్వాన్నీ శాశ్వతం చేసేది.
ఈ రెండో స్కూలుకొచ్చే పిల్లలు నిర్వాసితులు, నిరుపేదలు వీళ్ళ తల్లిదండ్రులు కూలీలు, రిక్షావాలాలు, వీధి వ్యాపారులు, చిరుద్యోగులు. కూటికి నోచుకోని ఈ పిల్లలంతా మురికివాడల్లో చీకటి గుహల్లాంటి గుడిసెల్లో బతికేవాళ్ళు. ఇంటి చాకిరితో సతమతమయ్యేవాళ్ళు. నిజానికి వీళ్ళకి చదువు నేర్పాలంటే మరింత (శ్రద్ధ కావాలి. మరింత మనసు పెట్టాలి.
మరి మా స్ఫూలేమో ఆలనాపాలనా లేనిది. 1500 పిల్లలకి, 70 మంది టీచర్లకూ కలిపి మాకు ఉన్నది ఒకే ఒక్క మరుగుదొడ్డి. అదీ కంపుగొడుతుంటుంది. కరెంటు సంగతి
సరేసరి. దాని రాకా, పోకా అంతా దానిష్టం. నీళ్ళ పంపు ఎప్పుడూ పనిచెయ్యదు. క్లాస్‌రూం చీకటి మయం. అసలు క్లాసు “రూం లెక్కడ? ఉన్న వరండానే క్లాసుల కింద పంచుకొంటాం.
ః ప్రకృతి కరుణిస్తే సరి, కన్నెర్ర చేసిందో, నాలుగు చినుకులు పద్దాయో ఒక్కో తరగతిలో రెండు మూడు క్లాసులు కుక్కేస్తాం. ఓ పక్క రేఖాగణితం, ఇంకోపక్క సాంఘికశాస్త్రం, ఆ బూజుపట్టిన చీకటి గుహల్లోనే చెపుతుంటాం. బెంచీలు లేవుగా, పిల్లలు ఒళ్ళోనే నోట్సులు పెట్టుకొని రాసుకొంటారు. అప్పుడు మా మరుగుదొడ్డి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంది. దీనర్ధం ఏమిటి? ఇంటినే మా బడి ప్రతిబింబిస్తుంది. ఇక్కడా వాళ్ళకు అదే లోకం సాక్షాత్కరిస్తుంది. వాళ్ళ లోకం ఇంతేనని, ఇదేననీ బడి గుర్తు చేస్తుంటుంది.
ఇక పాఠాలంటారా? వాటికీ పిల్లల ప్రపంచంతో సంబంధమే వుండదు. అదో వున్నతవర్థాల రంగుల ప్రపంచం. పుట్టిన రోజు పండుగలు, సెలవుల్లో కుటుంబ వాహ్యాళులు,
కాల 2గ్
ఆకాశహర్యాలు పుస్తకాల్లోంచి తొంగి చూచి వాళ్ళని క్రూరంగా వెక్కరిస్తుంటాయి. నేను ఇంగ్లీషు టీచర్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాఠ్యాంశాలకీ, ఈ నిరుపేద పిల్లలకీ ఏడామడల దూరం. పొంతనలేనంత వైరుధ్యం. బోధన విషయానికొస్తే అది పిల్లల్ని అడుగడుగునా గాయపరుస్తుంటుంది. అవమానిస్తుంటుంది. మన బోధనాధోరణి ఈ పిల్లల ఆత్మ విశ్వాసాన్ని తొలిచేస్తుంది. అభిమానాన్ని కాలరాస్తుంది. టీచర్లుగా మనం దీన్ని గమనించం. ఫలితంగా మనబడి విజ్ఞాన వికాసాల నూతన ప్రపంచాన్ని వాళ్ళకోసం ఆవిష్కరించదు. వాళ్ళ నిష్ట దారిద్ర్యాన్ని వంచితత్వాన్ని | భౌతికంగానూ, మానసికంగానూ మరింత పునఃప్రతిష్ట చేస్తుంటుంది. నేనీ స్కూల్లో చేరినప్పుడు నా వ్యక్తిగత శ్రద్ధతో, కృషితో ప్రభుత్వ స్కూల్లో కూడా (1 ఎంతో సాధించవచ్చని మనసారా నమ్మాను. నా అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. వ్యవస్థలో రావాల్సిన మార్పు ఇది. అధోజగత్సహోదరుల కనుకూలంగా వ్యవస్థ మారాల్సి వుంది. నాలాంటి ఏ ఒక్కరో చేసే కృషి వల్ల చూపే చొరవ వల్ల ఫలితం చాలా పరిమితంగానే వుంటుందన్పిస్తోంది. ఉదాహరణకి తక్కువ ఖర్చుతో బోధనోపకరణాల్ని తయారు చేశాను. కథల పుస్తకాల్ని సేకరించాను. వాటి నెక్కడ పెట్టిది. అల్మరాలు లేవు. దాచిపెట్టే మార్గంలేదు. చార్జుల్ని (ప్రదర్శిద్దామన్నా వీలులేదు. ఒక్క ఏదాది వాడితే చాలు రెందోసారికి పనికిరాకుండా 6 పోతున్నాయవి. చివరకు చాక్‌పీసులు కూడా నేనే తెచ్చుకొంటున్నాను. ఫలితం ఏమిటి? మళ్ళీ యాంత్రికతలోకి వొరిగిపోతున్నాను. సందర్భోచితంగా సృజనాత్మకంగా తరగతిలో వ్యవహరించడమనే ఆలోచనే క్షణభంగురంగా మారిబోతున్నది. అన్నిటికంటే తలనొప్పి ఎలాగో ఒకలాగున పిల్లల్ని పరీక్షల్లో గట్టెక్కించాల్సి రావడం. అదీ గుడ్డి కంఠస్థం చేయించి సాధించడం! పిల్లల్ని పాస్ చేయించడంలోనే టీచరు సమర్ధతంతా వున్నట్టు లెక్కిస్తున్నారు మరి. ఆహ్హాదరకమైన అభ్యసనం కోసం సరైన అవగాహన కల్పించడం కోసం చేసే ప్రయత్నాల్ని గుర్తించేవారు లేరు. మార్గాంతరం లేక నేనూ సిలబసు పూర్తి చెయ్యడమే పరమావధిగా మారిపోతున్నాను. పిల్లల్లో విభిన్న సామర్దాలు నేర్చుకోవడంలో ముందు వెనుకలు వుంటాయన్నది వదిలేసి పిల్లలందర్నీ ఒకే గాట కట్టేసి సుత్తి కొడుతున్నాను. తగినంత సమయం వుండదు. పరిక్షలు తరుముకొస్తుంటాయి. దానికి తగ్గట్టు చెప్పాలి. ఈ దురదృష్ట జాతకుల కోసం వారి ప్రత్యేక అవసరాల కోసం ఏ ఏర్పాటూ వుండదు. ఫలితంగా వాళ్ళు మరింత దగా పడతారు. మరింత వెనకబడిపోతారు. తెలిసో తెలియకో నేనూ దీనికి సాధనమవుతున్నాను. మంచి చదువు నుంచి, జీవితం నుంచి మెజారిటీ వర్ధాన్ని మరింత దూరం చెయ్యడానికే తరగతిలో పాఠం చెపుతున్నాను. ॥ ఫలితంగా ఈ సామాజిక అసమానతల్ని సుస్థిరం చెయ్యడానికే ఈ వృత్తి చేపట్టిన దాన్నిగా మారిపోతున్నాను. బలవంతంగా నెట్టబడి మరీ మారిపోతున్నాను.
-
- స్నేహలత, ఢిల్లీ 'ప్రోబొ సౌజన్యంతో 26
లోయ నుంచి లోకం చుట్లి వస్తూన్న కి లు కే గా రుషవాలీ గ్రామీణ విద్యా కేంద్రం రుషీవాలీ అనగానే మహాతత్వవేత్త జిద్దు కృష్ణమూర్తి మదిలోకొస్తాడు. కొండకోనల మధ్య అమ్మ వొడిలో బిడ్డలా వాదిగిపోయిన ఒక మహా విద్యాలయం గుర్తుకొస్తుంది. ప్రపంచానికి దూరమైందనీ, సంపన్నులకు దగ్గరిదనీ ఎక్కడో భయమూ వేస్తుంది. అందని మానిపందనిపిస్తుంది.
కానీ మనం చెప్పుకొంటున్నది రుషీవాలీ గ్రామీణ విద్యా కేంద్రం (ఆర్విఎఫ్ఇసి) గురించి. ఆరు దశాబ్దాల తమ అనుభవసారాన్ని తాము నమ్మిన విద్యా విలువల్ని అట్టడుగు
క పేదల పిల్లల కందిస్తున్న ఈ విద్యాకేంద్రం రుషీవాలీ సంస్థ కనుబంధం, రుషీవాలీ పరిధిలోనే చిత్తూరు జిల్లా మదనపల్లి వద్దగల విశాలమైన “రుషివనం' దీనికి కేంద్రం.
'రుషివనం' ఒక ప్రయోగాత్మక వాఠశాల. ఇరవై యేళ్ళుగా 100 మంది పిల్లలతో ఏడు తరగతులతో నడుస్తున్న పాఠశాల. ఇప్పుడు దీని చుట్టూ 16 ఉపగ్రహ పాఠశాలలు వెలిశాయి. ప్రతి సంవత్సరం రెండేసి ఇలాంటి స్మూళ్ళను కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ పేద పిల్లలవి
- ఇవన్నీ నిరుపేద పిల్లల పాఠశాలలు. వీటిలో మొదటిది “వాల్మీకి వనంి పాఠశాల. ఇది ఎగువ బోయపల్లెలో వుంది. ఆదికవి వాల్మీకికి వారసులమని చెప్పుకోవడం తప్ప వీరిలో శతాబ్లాలుగా అక్షరం ముక్క నేర్చుకొన్నవారు లేరు. నాగరికతా ప్రపంచం నుంచి దూరంగా విసిరేసినట్టున్న వీరి పల్లె బోయలకు నెలవు. నిరక్షరాస్యతకు వాళ్ళు నెలవులు. 250 కుటుంబాలున్న ఈ పల్లెలో అందరూ నిర్భాగ్యులు. గొర్రెల్ని మేకల్ని మేపుకొని బతికేవాళ్ళు. కొందరు కూలీనాలీ చేసుకొనేవారు.
॥ అలాంటి బోయల్ని కదిలించి రుషీవాలీ (గ్రామీణ విద్యా కేంద్రం “రుషివనంి వొఠశాలకి ఉపగ్రహంగా “వాల్మీకి వనం” పాఠశాల నిక్కడ తెరిచింది. బోయలు ముందుకు “౫ స్థలం ఇచ్చారు. పాకలు వేశారు. పిల్లల్ని చేర్చారు. సంజ చీకటి ముసురుకొనేప్పటికల్లా
27 షా.
ఈ బడి వయోజన కేంద్రంగా మారుతుంది. ఇప్పుడీపల్లె అక్షరాస్యత అక్షరాల డెబ్బై ఐదు శాతం |! 1986 “వాల్మీకి వనం” అనుభవం నుంచి ఇలాంటి పాఠశాలల సంఖ్య నేటికి 16కు చేరుకొంది. ఇదొక నెట్‌వర్క్‌గా మారుతోంది. మొత్తం గ్రామానికి ఈ పాఠశాలలు నేడు “వనరుల కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. 4 అవసరాల ప్రాతిపదికన సమూహాలు మన పాఠశాల లెదుర్కొంటున్న సమస్యల్లోకెల్లా తీవ్రమైంది బహుళజాతి తరగతి, బహుళ స్థాయి బోధన అన్నది మనందరికీ తెలుసు. పిల్లల్లోని ఈ వైవిధ్యం ఒకే తరగతిలో వున్న కవలపిల్లల్లో కూడా కన్పిస్తుంది. దీనికో పరిష్కారం రుషీవాలీ కనుక్కొంది. తరగతి గదిలో పిల్లలు 5-6 మంది ఒక సమూహంగా వుంటారు. ఈ విభజన పిల్లల స్ధాయి లేదా నేర్చుకొనే అంశం ఒకటిగా వుండటం అనే (ప్రాతిపదికన వుండదు. అవసరాల ప్రాతిపదికన వుంటుంది. ఇలాంటి అవసరాలు ఆరు వుంటాయని వీరు నిర్ధారించారు. పిల్లలకి తప్పనిసరిగా టీచరుండి నేర్పాల్సినదొక సమూహం అయితే పిల్లలే స్వంతంగా కలిసి కూచుని చేసుకొనేదొక సమూహం. టీచరు కొద్దిగా సహకరించాల్సిన సమూహమొక్కటైతే పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి సహకరించేది ఇంకో సమూహం. ఇలాంటి విభజన వల్ల ఒకే సమూహంలో 1వ తరగతి, ౩వ తరగతి పిల్లలిద్దరూ వుండొచ్చు. ఉదాహరణకు 1,2,8,4, అంకెల ప్రాథమిక భావన, పెద్ద కూడికల పద్ధతి ఉపాధ్యాయుడే దగ్గరుండి నేర్పాలి. ఇవి నేర్చుకొనే పిల్లలు ఒకే తరగతి వారుగా వుండరు. (తరగతులిక్కడ లేవనుకోండి) అయినా వీరంతా ఒకే సమూహంగా వుంటారు. ఇ తరగతి గది పిల్లలిలా సమూహాలుగా కూచుని ఎవరి పని వారు చేసుకోవటం చూడ ముచ్చటగా వుంటుంది. పిల్లలంతా ఏ సముద్రం వొడ్డునో ఆడుకొంటూ, ఇసుకగూళ్ళు కట్టుకొంటునట్టే వుంటుందనుకోండి. ఎవ్వరూ ఎవ్వర్నీ నియంత్రించినట్టుగానీ, ఎక్కడా కన్పించదు. ఉపాధ్యాయుడు మాత్రం ఇటూ అటూ మారుతుంటాడు. ఎవరు బోర్డు వారికుంటుంది. ఎవరి సామాగ్రి వారికుంటుంది. ఎవరి లక్ష్యం వారికుంటుంది. ఉండందల్లా ఒకటే ఎవరి భయం వారికి ! ం అసలు రహస్యం కిట్‌లో వుంది. ” మరిలా నేర్పాలంటే కావల్సింది' టోధనా సామగ్రి. ఎంత మెటీరియల్ వుంటే ౯ ఉపాధ్యాయుడంత సులభంగా తన పని చేయగలడని రుషీవాలీ నమ్ముతోంది. దానికోసం _ ఒక కిట్ (పెట్టెలో బడి) తయారు చెసింది. ౮ న్ 28 గ // వ్ ఆ ో్
ఇందులో 1 నుంచి దాదాపు 5వ తరగతి స్థాయి వరకు కావాల్సిన సామాగ్రి వుంటుంది. ఇందులో పుస్తక రూపంలో వాచకాలేవీ పిల్లలకుండవు. అన్నీ లామినేషన్ చేసిన కార్డుల రూపంలో వుంటాయి. ఇవన్నీ ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు ఒక క్రమంలో ఒక్కో కార్డులో ఒక్కొక్కటి వుంటాయి. వాటి వరుస సూచించేందుకు కొన్ని గుర్తులు (పక్షులు,
, జంతువులు) వుంటాయి. వాటినాధారంగా చేసుకొని పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తూ పోతుంటారు. ఇలా ఎవరు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. అంటే తరగతి పిల్లలంతా రకరకాల స్థాయిలో వుంటారన్నమాట దీని * నిచ్చెన పద్ధతి అని వారు పిలుస్తున్నారు.
పెద్ద పెద్ద భావనల్ని సైతం చిన్న చిన్న ముక్కలుగా చేసి చెప్పడం ఇందులోని ప్రత్యేకత. ముచ్చటగా “గోరుముద్దలు” తినిపిస్తున్నట్టుందనుకోండి. పిల్లలు తమంత తాము నేర్చుకోవడంలో లీనం గావడం, ఒక ఆటలాగా ఒక పని. తర్వాత మరో పని చేస్తున్నట్టు, ఒకటి చెయ్యగానే మరో స్థాయికి వెళుతున్నట్టు, సవాలును స్వీకరించి నాధిస్తున్నట్టు వుందే విధానం మనకు చాలా విచిత్రంగా వుంటుంది. కానీ ఏ మాత్రం విద్యాగంధం లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు అమోఘంగా చెయ్యడం చూసినప్పుడు మాత్రం మనకే ఆశ్చర్యం కల్గుతుంది. చాలా వేగంగా నేర్చుకొనేవారు, చిన్నగా నేర్చుకొనే వారు ఎవ్వరూ ఈ పద్ధతిలో ఇబ్బంది పడరని కూడా మనం గమనించాలి. అలాగాక మన స్మూళ్ళలో వేగంగా ముందుకెళ్ళే వారిక్కూడా మనం సంకెళ్ళు వేసి పెడుతున్నాం. కొంచెం వెనక బడుతున్న వారిని తొందర పెట్టి ముందుకు నెట్టుతున్నాం. దీని వల్ల ఇద్దరూ నష్టపోతున్నారు.
టీచరు సౌలభ్యం కూడా మనం గమనించదగ్గది. ఎక్కువ కార్డులు ఇతర సామాగ్రి (భార్జుల నుంచి చింత పిక్కల దాకా) వుండటం వల్ల పిల్లలు వాటితో ఎవరి పనిలో వాళ్ళుంటారు. ఒకటి సాధించగానే వాళ్ళే టీచరు కోసం ఎదురు చూడకుండా మరో కార్చ్హులోకి వెళ్ళిపోతారు. టీచరు ఒక క్రమం ప్రకారం తాను తప్పనిసరిగా వుండాల్సిన సమూహంలో వుండటంతోపాటు
మిగిలిన సమూహాలకు సహకరిస్తుంటాడు. టీచరు కేవలం మార్గదర్శిగా మాత్రమే వుండే బోధన ఇది.
ఈ కిట్‌లోని బోధనాంశాలు, భాష ప్రతీదీ స్థానిక పరిస్థితులకు సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా వుంటుంది. కొండ కోనల వాతావరణం అడుగడుగునా కన్పించడం వల్ల పిల్లలే మాత్రం పరాయీ కరణ పొందరు. తన పాఠ్యాంశాల్లో దిని కుండాల్సిన ప్రాధాన్యత పట్ల రుషీవాలీ ఎక్కడా రాజీపడలేదు. టీచర్లూ - శిక్షణా
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు నెర్చేందుకు ఎంత విద్యాస్థాయి వుండాలి?
ఎంత శిక్షణ అవసరం ? అనేవి కూడా మనం రుషీవాలీ నుంచి చూచి నేర్చుకోవాలి. పెద్దపెద్ద
డిగ్రీలు, దీర్హక్షాలిక శిక్షణా కోర్సులు చదివినవారు ఈ ఉపగ్రహ పాఠశాలల్లో లేరు. ఎక్కువ 20౮
శ
ళ్ష భాగం 10వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ మాత్రమే చదివిన వారు. వీరికి రుషీవాలీ గ్రామీణ వనరుల కేంద్రం శిక్షణ నిస్తుంది.
శిక్షణ కనీసం ఆరువారాలుంటుంది. టీచరు స్థాయిని బట్టి, అవసరాన్ని బట్టి ఇది ఒక సంవత్సరం కూదా కావచ్చు. ఈ కాలంలో 'నిట్టనిలువు సమూహాల నిర్వహించడం నుంచి మధ్య పరీక్షించాకే దేనికైనా ఒక రూపం ఇస్తున్నారు. ఇంత చేసినా తరగతి గదిలో ॥ ఉపాధ్యాయుడే అంతిమ నిర్ణయాధికారి. అతడు వీటిని ఎలాగైనా మార్చుకోవచ్చు. కొత్తవి జత చేసుకోవచ్చు. అలా చేసుకొంటేనే ఏ పాఠ్యాంశమైనా రాణిస్తుందని వీరు మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నారు.
ఒక్క తరగతి గది మాత్రమే ఈ ప్రయోగాలకు సరిపోదు. విరు నిర్వహిస్తున్న మెట్రిక్ మేళా ఒక సరికొత్త ప్రయోగం. ఇదొక రకమైన సంత. జనమంతా దుకాణాలు పెడతారు. పిల్లలు వీటి లెక్కల్ని చూస్తారు. వచ్చినవారి ముక్కుల్ని కూడా కొలుస్తారు. నిత్య జీవితం నుంచి గణితాన్ని నేర్చుకొంటారు.
అమ్మల్ని సమావేశపరిచి వాళ్ళచెత కథలు చెప్పించడం మరో ప్రయోగం. వాళ్ళు చేప్పే కథలు మనమెక్కడా చదవనివి. ఎప్పుడూ మనం ఎరగనివి. వీటినిప్పుడు రికార్డు చెయ్యడం (వ్రారంఖించారు.
'పాటల్లో పంచతంత్రం' నాటకరూపంలో పంచతంత్ర కథల్ని ప్రదర్శించడానికి వీలుగా రూపొందించింది. ఆడియో క్యాసెట్లు, తోలు బొమ్మల కిట్, ఒక గైడు ఇందులో ఉన్నాయి. రుషీవాలీ పాఠశాలల్లో ఈ తోలుబొమ్మలాటలు సర్వ నాధారణం. చాలా చిన్నపిల్లలు ఎంతో నైపుణ్యంతో వీటిని ప్రదర్శిస్తారు.
బోధనా సామాగ్రి నిత్య నూతనంగా వుండాలి. ఆహ్ల్హాదకరంగానే కాదు గ్రామీణ వాతావరణానికి ప్రతిరూపంగా ఉండాలి. అది కొన్ని నిర్ధిష్ట విలువల్ని ప్రబోధించేదిగా వుండాలి. స్థానిక వనరులతో, వస్తువులతో అది రూపొందాలి. వినోదాత్మకంగా వుంటూనే పిల్లలకి విజ్ఞానాన్ని సంతరించి పెట్టాలి. కేవలం భాష్క, గణితం లాంటివి నేర్చుకోవడంతో సరిపోదు. హస్తకళా నైపుణ్యం పిల్లలకి అవసరం. దీన్ని రుషీవాలీ చదువుల్లో అవిభాజ్య భాగంగా పరిగణిస్తోంది.
ఈ పాఠశాలల్లో పిల్లలు ప్రతి సంవత్సరం చేసే సర్వేలు, వాటిని ప్రదర్శించే ఛార్పులు మనం గమనిస్తే ప్రపంచాన్ని పిల్లలెంత అద్భుతంగా పరిశీలించగలరో మనకర్ధమవుతుంది. అద్బుత ఫలితాలు
ఈ పాఠశాలల పనితీరును, ఫలితాన్ని ఎన్.సి.ఇ ఆర్.టి.తో సహా పలు సంస్థలు సమీక్షించాయి. బేరీజు వేశాయి. 700 మంది వున్న ఈ 16 స్కూళ్ళలో దాదాపు డ్రాపొట్సు లేరు. ఈ పిల్లలంతా మొదటితరం విద్యార్థులు. అయినా ఫలితాలు ఎంతో గొప్పుగా వున్నాయి.
_తి0
ఆరవ తరగతిలో వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. అక్కడ బాగా రాణిస్తున్నారు. ఒక్క చదువులోనే కాదు ఇతరత్రా కూడా వీరి వికాసం ఎంతో మిన్నగా వుంటోంది. అన్నిటినీ మించి ఒక సమగ్ర మానవుడి ప్రాథమిక రూపం ఈ పిల్లల్లో వ్యక్తమవుతోంది. ఏ 20-80 మంది పిల్లలతోనో, ఏ నిష్టాతులైన ఉపాధ్యాయులతోనో ప్రయోగాలు చెయ్యడం పెద్ద పనిగాదు. ఫలితాలు సాధించడం పెద్ద విషయమూ గాదూ. కానీ గ్రామీణ యువకులతో, నిరుపేద పిల్లలతో ఇంత విస్తృతమైన నెట్‌వర్క్‌తో ఈ ఫలితాలు సాధించడం మనందరి కళ్ళూ తెరిపించే అంశం. రుషీవాలీ తన ప్రయోగాల్ని తనకు పరిమితం చేసుకోలేదు. తన అనుభవాల్ని లోకానికి పంచేందుకు సర్వదా సిద్ధంగా ఉంది. ఎక్కడెక్కడి స్వచ్చంద సంస్థలు ఇక్కడికే వస్తున్నాయి. బెత్సాహిక ఉపాధ్యాయులు, విద్యాఖిమానులు వస్తున్నారు. వారిక్కావల్సిన శిక్షణ, సలహాలు, ॥ సామాగ్రి వారికి ఇక్కడ లభిస్తాయి. ఇప్పటికే మన రాష్ట్రంతో సహా (పాడేరు ప్రాజెక్టు కోసం) అనేక రాష్త్రాలు వీరి సహాకారం కోరాయి. కానీ రుషీవాలీ తన సామాగిని యధాతథంగా ఎగుమతి చెయ్యడానికిష్టపడదు. శిక్షణనిచ్చి, వారి పరిస్థితుల కనుగుణంగా మార్చుకోవడం నేర్పుతుంది. అప్పుడే న్యాయం జరుగుతుందని భావిస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక దాకా ఈ అవకాశాన్ని ఎన్నో రాష్ట్రాలు ఉపయోగించుకొన్నాయి. ఇటీవల ఇథియోపియా ప్రభుత్వం సైతం వీరి ప్రయోగాన్ని బోధనా సామాగ్రిని పరిశీలించేందుకు వచ్చింది. వారూ ఈ పద్ధతిని పాటించేందుకు సహకారం కోరారు. దీంతో రుషీవాలి లోయను దాటి లోకం చుట్టి వచ్చినట్లయ్యింది. చివరగా ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. మన నిరుపేద పిల్లలు కూడా నేర్భ్చుకోగలరు. వాళ్ళమీ మొద్దులు గాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయంలో ఏమీ వెనకబడి లేరు. వాళ్ళ నాగరికత ఎంతో సమున్నతమైంది. వాళ్ళ తెలివితేటలు పట్టుదల సృజనశీలతా ఎవ్వరికన్నా | తీసిపోవు. కానీ కావల్సింది ఒక దృక్పథం. ఒక శాస్ర్తీయ ప్రణాళిక. ఇది కూడా మనకు సాధ్యమైంది కాదు. మనం పట్టుకోలేనంత బ్రహ్మ విద్యేమీ కాదు. మనసుంటే మార్గం వుంది. రుషీవాలీకి ఆ మనసుంది. అందుకే దానికి మార్గమూ దొరికింది. రుషీవాలీ కోరేదల్లా ఆ మనసు మాత్రమే. అది వుంటే తమ మార్గం తాము వెతుక్కొంటారని దాని నమ్మకం. ఆ వెతుక్కొనేప్పుడు తమ మార్గం ఏమైనా ఉపకరిస్తుందో చూడమని మాత్రమే అది కోరుతోంది. 31
జ ప్రాథమిక విద్యా పరిశోధనలో ఆ ఆ భష ప్రత్యామ్నాయాన్వేషణలో అగ్రగామి ఏకలవ్య విద్యా రంగంగలో పని చేసే సంస్థలకు మన దేశంలో కొదవలేదు. అయితే జీవితాశయమే విద్యారంగంగా పనిచేసేవారు కొందరే వుంటారు. కొన్ని సంస్థలే వుంటాయి. విద్యను ఓ విస్తృతార్ధంలో చూచినప్పుడే ఇలా ఎవరైనా ముందుకొస్తారు. అలా అనుక్షణం ' విద్యకోసం తపించి, శోధించి దేశంలోనే ఓ ఆదర్శాన్ని మనముందుంచుతున్న సంస్థ ఏకలవ్య, " 'పిల్లల ప్రపంచం వేరు మన పాఠ్య పుస్తకాలు వేరు. దేనికవే ఒకదాని కొకటి పొంతన లేనివి. పిల్లల అలినత, ఉదాసీనత విముఖతగా మారితే మనం ఎంత చెప్పినా, ఏం చేసినా ఫలితం వుండదు. ప్రతిదీ వాళ్ళ ప్రపంచంగా వుండాలి. వాళ్ళందులో విలీనం కావాలి. అక్కడి నుంచి మనం ఎంత దూరమైన తీసుకెళ్ళగలం. “భాష కేవలం భాష కోసం నేర్పడం సరిగాదు. అందువల్లనే ఇంట్లో మాట్లాడేది తరగతిలో తప్పుగా, తరగతిలో మాట్లాడేది ఇంట్లో విచిత్రంగా మారిన దుర్గతి మన పిల్లల భాషకు పడుతోంది. అసలు మధ్యప్రదేశ్‌లో గ్రామీణ పిల్లలు మాట్లాడే హిందీ హిందియేనా అన్పిస్తుంది. అలాంటి వారికెలాంటి హిందీ నేర్పుతున్నాం ? భాష వ్యవహారం కోసం అది విద్యార్ధి అనేకాంశాలు నేర్చుకోవడంలో మాధ్యమం. భాష లేకుంటే దేన్నీ తెలుసుకోవడం పిల్లలకి సాధ్యంగాదు. ఎంత చదివినా నాలుగు ముక్కలు స్వంతంగా రాయలేని దుస్థితి నుండి ఎప్పటికీ మన పిల్లలు బయటపడలేరు. ( “చరిత్ర, భూగోళం, పౌరశాస్తం అంటే ఏమిటి? వాటిని నేర్చుకోవడం అంటే ; ఏమిటి? “తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర సారం” అన్నట్టు ఏవో రాజుల పేర్తు, సూర్యచంద్రుల దూరాలు, ఎ చట్ట సభల్లో ఎందరు సభ్యులు ఇంతేనా ఇవంటే? అసలివి వేర్వేరు అంశాలా? వాటి మధ్య సంబంధం ఏమీ లేదా? సమాజం పట్ల అంచనా, దాని గమనాన్ని నిర్దశించే అంశాలూ, వాటి మూలాలూ తెలుసుకోవడం గదా విటిని నేర్చుకోవడంలో " అసలు నారాంశం?” “సైన్సు అంటే ప్రకృతినీ, ప్రపంచానీ అర్ధం చేసుకొనే విధానం, విశ్లేషణ, తార్మికత, ప్రతిదీ ప్రశ్నించడం ఇవీ సైన్సుకు మూలాధారాలు ప్రశ్నించడం, ఆసక్తి ఇవే సైన్సును ఇంత దూరం పయనింపజేశాయి. మరి సైన్సు బోధనా సారాంశం ఎలా ఉండాలి ? ఈ జిజ్ఞాస 32
కేవలం పాఠ్య పుస్తకాలు .వల్లించడంతోనే ఒంట పడుతుందా? క్లాసు రూములోనే సైన్సు
అంతా చెప్పగలమా? సైన్సు మేళాలు, సైన్సు క్లబ్బులు, సైన్సు యాత్రలు ఎందుకు మనం బోధనలో లేవు? ఇవేవీ లేకుండా పిల్లలెందుకు ఆసక్తిగా భాగస్వాములవుతారు ? ప్రశ్నించదం ఎలా వారి కబ్బుతుంది ?”
ఇవీ మధ్యప్రదేశ్‌లోని ఏకలవ్య” వేసుకొన్న ప్రశ్నలు. ఇవీ 26 ఏళ్ళ సుదీర్హ ప్రస్థానంలో వాళ్ళకు దొరికిన సమాధానాలు.
1982మార్చి 24న ఢిల్లీలో సుప్రసిద్ద శాస్త్రజ్ఞుడు డా॥ ఎం.ఎస్. స్వామినాధన్ _
అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఇందులో భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఎన్‌సిఇఆర్‌టి, ఎన్‌సిఎస్‌టిసి, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ
లాంటి సంస్థల్నించి కూడా అనేక మంది పాల్గొన్నారు. సమావేశం 'హౌషంగాబాద్ సైన్సు టీచింగ్ ప్రొగ్రామ్” (ఎంఎస్టిపి) ఫలితాల్ని సుదిర్హంగా చర్చించింది.
1 “ విద్యారంగంలో - మరీ ప్రాథమిక విద్యారంగంలో ఎంతో సృజనాత్మకత అవసరం. ఎంతో పరిశోధన అవసరం. స్వేచ్చ, వేయిపూలు వికసింపనీ, అనే తత్వం వుంటేనే ఇది
సాధ్యం. ఇప్పటికే ఎన్నో రంగాల్లో పని చేస్తున్న ఎంతో మంది ఇందులో ఎంతో ఆసక్తి గల వారున్నారు. వీరంతా ఒకటి గావాలి. ఓ దీక్షగా, దీర్హకాలిక లక్ష్యంతో వ్యూహంతో పని చేస్తేనే ఇది సాధ్యం. ప్రభుత్వం చట్రంలో ఇది సాధ్యం కాదు. హెచ్ఎస్టిపి లాంటివి ఎంత ముందు కొస్తే అంత మంచిది” అనే అభిప్రాయానికా సమావేశం వచ్చింది. ఫలితమే “ఏకలవ్య” ప్రాదుర్ధానం !
ఏకాభిప్రాయంతో పాటు విద్యా రంగానికి జీవితం అంకితం చేసేందుకు సిద్ధమైన వారినందర్నీ ఎక్కడెక్కడి వారినీ “ఏకలవ్య” ఆహ్వానించారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్
| విభాగం నుండి "సైన్సు టుడే పత్రికదాకా, ఐఐటిల నుండి ఫ్రాన్సులో ఖగోళ బోధన చెస్తున్న వారిదాకా అత్యున్నత పరిశోధకులూ, ప్రతిభావంతులు 28 మంది “ఏకలవ్య” పేర విద్యా పరిశోధనా సంస్థకు అంకురార్పరణ చేశారు. ప్రభుత్వం వీరికన్ని విధాల సాయం అందించింది.
ఏకలవ్య 28 మందికీ పరిమితం కాదలచుకోలేదు. కొద్ది కాలం వచ్చి పనిచెసేవారు
యూనివర్సిటీల్లోనే వుండొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లోనే వుండొచ్చు. ఇలాంటి వారిని కూడా కలుపుకొంది. వీరిలా పని చేసేందుకు ప్రభుత్వానుమతి లభించింది.
“ఎకలవ్య” విద్యారంగం పై లోతైన పరిశోధన సాగించింది. సైన్సు బోధనతో మొదలెట్టింది. ప్రభుత్వం మాధ్యమిక పాఠశాలల్లో సైన్సు టీచర్లకు శిక్షణ, సైన్సు పాఠ్య పుస్తకాల తయారీ, సైన్సు కిట్స్ తయారీ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం బాధ్యతల్ని తీసుకొనింది.
ఫి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అయినా అధిగమించి అద్భుత ఫలితాలు సాధించింది. తర్వాత ఫీల్చు సెంటర్లు అనేక జిల్లాలో ప్రారంభించింది. న్ధానిక పరిస్థితులు, అవసరాలు, స్థానిక టీచర్ల ప్రమేయం ఆధారంగా బోధనా సామాగ్రి తయారు చేసింది. సరి కొత్త ప్రయోగాలు చేసింది. 83
ఓ దశాబ్దం గడిచేప్పటికి ఏకలవ్య ఓ పెద్ద సంస్థగా రూపాంతరం చెందింది. వందలాది పాఠశాలల్లో దాని పుస్తకాలు, సామగ్రి ఉపయోగించుకొనే రోజు వచ్చేసింది. వందలాది టీచర్లు దానికి తోడయ్యారు. ఎక్కడి కక్కడ మంచి టీచర్ల బృందాలు ఏర్పడ్డాయి. చూస్తుండగానే 'ఎకలవ్వ్య' దేశంలోనే ప్రముఖ సంస్థగా ఎదిగి పోయింది.
ఏకలవ్య పని విధానం ఎవరికైనా అనుసరణీయమైనది. ఎప్పుడూ వారు రాజీ పడరు. ఎక్కడా ఒక అభిప్రాయానికే పీట వెయ్యరు. ప్రతిదానికీ 'ఫీడ్‌బ్యాక్' వుండాల్సిందే. మళ్ళీ అందరూ చర్చించాల్సిందే. పిల్లలు, ఉపాధ్యాయుడే అంతిమం. దానికనుగుణంగా దేన్నైనా, ఎన్నిసార్లైనా మార్చవలసిందే. అలా తయారైనవే వాళ్ళ పుస్తకాలు.
కొద్ది కాలం తర్వాత ఏకలవ్య ప్రాథమిక విద్యారంగంలోనూ ప్రవేశించింది. అక్కడ పునాది లేకుండా, అక్కడ సృజనాత్మకత లేకుండా పై తరగతుల్లో మన లక్ష్యం సాధించడం అసాధ్యమని గుర్తించింది. సైన్సుకే పరిమితం గారాదనీ భాషా, చరిత్రా తదితరాలూ సైతం పట్టకోవాలనీ నిర్ణయించుకొంది. తర్వాత నోషల్ సైన్సు టీచింగ్ ప్రోగ్రాం కూడా ప్రారంభించింది.
ఈ రోజు ఎకలవ్య అత్యున్నత మేధావుల సంస్థ, అత్యంత నిబద్ధతతో జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేసిన వారి సంస్థ, అంతర్జాతీయ స్థాయి నందుకొన్న విద్యా పరిశోధనా సంస్త, భారత ప్రభుత్వమే గాక అనేక రాష్ట్రాలు 'ఎకలవ్య” పరిశోధనల్ని (ప్రామాణికంగా అంగీకరిస్తున్నాయి. వారి విద్యాతత్వం. బోధనా విధానం పాఠ్య గ్రంథాలూ శాస్రీయమైనవిగా గుర్తిస్తున్నాయి. మధ్య (ప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మరో ముందదడుగేసి “ఏకలవ్య” పాఠ్య గ్రంథాల్నే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవెశపెట్టింది. 'లోక్ జంబుష్ కొన్ని జిల్లాల్ని “'ఏఏకలవ్వ' కప్పగించింది.
ఏకలవ్య పిల్లల కోసం ముచ్చటెన “చక్మక్' అనే మాసపత్రిక తెస్తోంది. ఉపాధ్యాయుల కోసం 'సందర్భ్, హొషంగాబాద్ విజ్ఞాన్ ప్రచురిస్తోంది. ఇవిగాక ఎన్నో పుస్తకాలు విద్యావేత్తలు కోసం, ఉపాధ్యాయుల కోసం ఏకలవ్య తయారు చేసింది. ఈ మధ్య 8వ తరగతి దాకా అన్ని సబ్జెక్టుల వాఠ్య గ్రంథాలూ సిద్ధం చెసింది. ఇటీవల వచ్చిన “ప్రాషిక ఎకలవ్య (ప్రాథమిక విద్యా పరిశోధనకూ, సృజనాత్మకతకూ అద్ధం పట్ట గ్రంథం.
ఎ అంశాన్నైనా పిల్లలకి చెప్పడంలో ఏకలవ్య ఒరవడి అద్భుతమైంది. అదో కొత్త ప్రపంచం, అయినా సగటు గ్రామీణ పేద పిల్లలకీ, ఉపాధ్యాయులకీ ఏ మాత్రం దూరమైన ప్రపంచంగాదిది. నేల విడిచిన సాముగాదది. అందులోనే వుంది ఏకలవ్య ప్రత్యేకత.
ఇప్పుడు “ఏకలవ్య” విద్యారంగంలో పని చేసే ప్రతి ఒక్కరికీ స్నేహ హస్తం అందిస్తోంది. ప్రతి వేసవిలో ఐచ్చికంగా హాజరయ్యే టీచర్లకు "సైన్సు బోధనా శిక్షణ” ఇసోంది. మానవ వనరుల శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తోంది. తనలాంటి అనేక సంస్థలతో తన ( అనుభవాల్ని పంచుకొంటోంది. “చదువు నాల్గక్షరాలకు పరిమితమైన అంశం గాదు. సమాజం పట్ల ఓ స్పష్టమైన దృకృథం వుంటేనే దాన్ని సరిగా అర్ధం చేసుకోగలం” అంటోంది ఏకలవ్య,
తక
సగటు టీచర్ల సృజనాత్మకతకు పతీక ద్ య! హ్ వ్ర 'అత్నాశి నలికలి అవును వాళ్ళంతా టీచర్లు. సగటు టీచర్లు. సర్మారు స్కూళ్ళలో పనిచేస్తూ అస్తుబిస్తు వసతులతో అరకొర ప్రోత్సాహంతో సతమతమవుతున్న మనలాంటి టీచర్లు. నిలువెల్లా నిష్ట దరిద్రం తాండవిస్తున్న హరిజనవాడల్లో, గూడేల్లో తరతరాలుగా అక్షర జ్ఞానానికి నోచుకోని నిరుపేదల పిల్లలకి చదువు చెపుతున్న టీచర్లు. అవును వాళ్ళంతా అచ్చం మనలాంటి టీచర్లు! అయితే వాళ్ళు వ్యవస్థను తిట్టు కొంటూ కూచోలేదు. కేవలం 15 మంది ఒకటిగా చేరి మొత్తం కర్ణాటక ప్రాథమిక విద్యారంగాన్నే మలుపు తిప్పారు. విద్యారంగంలో సృజనాత్మక విప్లవం తెచ్చేదీ తేగల్లిందీ ఒక్క టీచర్లు మాత్రమే అని వాళ్ళు రుజువు చేశారు, చేస్తున్నారు. ఇది “నలికలి” (ఆహ్లాదాత్మక అభ్యసనం) కథ. మన (ప్రకృనే వున్న కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లూ కథ. రుషీవాలీ ప్రేరణ ఈ పదిహేనుమంది టీచర్లూ హెగ్గడ దేవనకోట (హెచ్.డి.కోట) బ్లాకు టీచర్లు. దూరంగా విసిరేయ బడినట్లున్న గిరిజన ప్రాంతమిది. యునిసెఫ్ సహకారంతో వీళ్ళు 'రుషీ వాలీ” (మన మదనపల్లి రుషీవాలీనే!) సందర్శించారు. అక్కడ తమకన్నా తక్కువ విద్యార్హతలున్న టీచర్లు తమ దగ్గరున్న గిరిజన పిల్లల్లాంటి పిల్లలకు ఎంత అద్భుతంగా చదువు నేర్పుతున్నారో వీళ్ళు కళ్ళారా చూశారు. బోధనలో ముఖ్యంగా భాషాబోధనలో రుషీవాలీ ప్రయోగం పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకొంటున్న తీరూ, చిన్న చిన్న కృత్యాల ఆధారంగా సాగుతున్న అభ్యసనం వీళ్ళని ఆశ్చర్య పరిచింది. ఆర్భాటాలకూ, నానావిధ ప్రయోగాలకూ పరికరాలకూ తావులేని చిన్నచిన్న పద్ధతులతో ఇంత విప్లవం సాధించవచ్చని వీరు అర్ధం చేసుకొన్నారు. వెనక్కు తిరిగి ం తమ స్మూళ్ళకెళ్ళి తమ పరిస్థితుల కనుగుణంగా తరగతి గది రూపాన్నే వీళ్ళు మార్చివేశారు. ఇదంతా 1995 నాటి సంగతి. తర్
( మెల్లగా మరో 21మంది వీరికి చేరారు. మొత్తం వీరు 36 మంది అయ్యారు. క్రమంగా ఓ ఉద్యమంగా మారి ఏీరి ప్రయోగం 1995-96 నాటికి మైసూరు జిల్లాలో 270 స్కూళ్ళకు విస్తరించింది. ఇప్పుడిది మాండ్య, కోలార్, రాయచూర్, బెల్లాం జిల్లాల్లో వందలాది పాఠశాలలకు అల్గ్లుకొనిపోయింది.
'నాలుగైదేళ్ళు బడికొచ్చినా మన పిల్లలు పట్టుమని పది వాక్యాలు స్వంతంగా ఎందుకు రాయలేకపోతున్నారు? ఒక చిన్న కథను కూడా ఎందుకు ధారాళంగా చదివి స్వంతం చేసుకోలేకున్నారు? బడి బయట గల గలా మాట్లాడే పిల్లలు బడికొచ్చాక ఒక్క వాక్యం పలకడానిక్తీ, ఒక్క ప్రశ్న వేయడానికీ ఎందుకు చేతగాక ముడుచుకొని పోతున్నారు? ఇవన్నీ మనం కూడా వేసుకొనే ప్రశ్నలే. ఈ 15 మంది టీచర్లనూ ఇదే ప్రశ్నలు తొలుస్తుండేవి.
“ఇద్దరు టీచర్లు 5 క్లాసులు ఎలా చెప్పాలి? ఒక్కోక్లాసుకు మూడు నాలుగు సబ్దక్టులు ఒక్కో తరగతిలోని ౩-4 స్థాయిల విద్యార్థులకు ఎలా చెప్పాలి. ఇలా అష్టావధానం చెయ్యడం వల్ల ఎవ్వరి మీదా కేంద్రీకరించలేక పోవడంతో నష్టపోతున్నది పేదపిల్లలే గదా! అయిదో తరగతి" దాటినా వారు ఆచరణలో నిరక్షరాస్యులుగానే మారుతుంటే ఇంత కష్టానికీ అర్ధం ఏముంది? మనకులాగే కర్టాటక టీచర్లకూ ఈ సమస్యలే నిత్యం గుర్తుకొచ్చేవి.
రుషీవాలీలో వీళ్ళకి ఒక మేరకు ఈ ప్రశ్నలకు జవాబు చిక్కింది. పిల్లల్ని చిన్నచిన్న గ్రూపులు చెయ్యడం, ఎవరికి వాళ్ళు తమ పని తాము చేసుకొంటూ ఒక్కోమెట్టు ఎక్కిపోవడం, భాష గణితం రెంటిలో ఒక క్రమపద్ధతిలో సులభం నుంచి క్షిష్టంలోకి వీళ్ళు ముందు కెళ్ళుతుండటం, మరీ ముఖ్యంగా పర్యావరణ విజ్ఞానం మధ్యాహ్నం పూట దాదాపు చెట్టు చేమల మధ్యే సాగడం, ప్రతిదీ చర్చా పద్ధతిలో అటలతో, పాటలతో, నాటకాలతో, బొమ్మలాటలతో చదువు చెపుతున్నామన్న నేర్చుకొంటున్నా మన్న స్పృహ లేకుండానే జరిగి పోతుండటం ఈ రుషీ వాలీ ప్రత్యేకతలు. టీచర్లు వాచకాలు పట్టుకొని వల్లె వేయించే స్థితికి భిన్నంగా క్రియాశీలంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రక్రియలతో పిల్లల్ని ఉత్సాహపరచడం ఈ 15 మంది టీచర్లనూ ఆశ్చర్య పరిచింది.
ఇవన్నీ తాము చెయ్యగలమా? చెయ్యాలంటే ఏం కావాలి? ఈ రోజుల్లో విద్యా రంగంలోని ప్రతి వైఫల్యాన్ని టీచర్ల మీదే రుద్దే ఒక కొత్త ధోరణి పుట్టుకొచ్చింది. టీచర్ల నడిగితే సామాజిక సమస్యల్నీ వ్యవస్థ లోపాల్నీ ముందుకు తెస్తారు. ఎంతో ఆహ్లాదంగా ఎంతో కాంతివంతంగా వుండాల్సిన మన పసిపిల్లల కళ్ళల్లో బడిలోకి అడుగు పెట్టగానే చిమ్మచీకటి ఎందుకు తాండవిస్తున్నట్టు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవారే లేరు. కానీ ఈ 15 మంది టీచర్లు దీనికి ఖిన్నంగా జవాబును వెతుక్కొన్నారు.
86
గ్ జా
దీనికి అవసరమైన నాలుగు సంస్కరణల్ని వీరు గుర్తించారు. అవి :
- పిల్లలకు మొట్టమొదట కావల్సింది భాషా జ్ఞానం. ఎన్ని కనీస అభ్యసన ప్రమాణాల్ని వల్లించినా భాష రాకుంటే (చదవదడం,రాయడం) అంతా డొల్లే తప్పు ఏమీ వుండదు. భాషలలో ఇంత వెనకపద్డానికొక ప్రధాన కారణం మనం చెపుతున్న సాంప్రదాయక అక్షర
= పద్ధతి. అక్షరాలు రాయించి, గుణింతాలు దిద్దించి, ద్విత్వాలు సంయుకాలు నేర్పించి తర్వాత పదాలు, వాక్యాలు చెప్పే సాంప్రదాయక పద్ధతి పిల్లలు పసితనంలో భాష నేర్చుకొన్న పద్ధతికి విరుద్ధమైంది. ఇది మొరటు పద్ధతి. దీని స్థానే చిన్నచిన్న పదాలతో ప్రారంభించి మెట్లు మెట్లు
/ గా 7-8 దశల్లో ఒకటవ తరగతినీ, మరో 7-8 దశల్లో రెండవ తరగతిని పూర్తి చేయించవచ్చు. 1,2 తరగతుల్ని ఈ దృష్టితో ప్రత్యేకంగా చూడాలి. ప్రత్యేక (గద్ధ పెట్టాలి.
- సాంప్రదాయక ముద్రిత పాఠ్య పుస్తకాల్ని పూర్తిగా వదిలెయ్యలేకపోవచ్చు గానీ టీచర్లకు కొన్ని మార్గదర్శక సూత్రాల్ని ఇచ్చి వాటి ప్రాతిపదికన సృజనాత్మకంగా పాఠ్యాంశాల్ని రూపొందించుకొనే స్వేచ్చనివ్వాలి. కార్డులు, పోస్టర్లు, వర్క్‌బుక్కులు లాంటివి టీచర్లు ఎంతో
॥ అద్భుతంగా తయారు చేసుకోగలరు. మొత్తం మీద అవసరమైన పాఠ్యాంశాల రూపకల్పన ఉపాధ్యాయుడి చేతికి మారాలి.
-
కేవలం శిక్షణలతో సరిపోదు. ఉపాధ్యాయులకిచ్చే శిక్షణకూ వాళ్ళు తయారు చేయాల్సిన బోధనాభ్యాసన సామాగ్రికీ మధ్య ఒక లింకు వుండాలి. అంటే శిక్షణ పూర్తయ్యేసరికి టీచర్లు తమ కవసరమైన సామాగ్రిని ఉమ్మడి చర్చల ప్రాతిపదికన రూపొందించుకోవాలి.
-
తరగతి గదిని సాంప్రదాయక [క్రమ శిక్షణా దృష్టితో చూడరాదని మనం
ఐ గుర్తించాలి. పిల్లలు తరగతిలో తిరగడం, స్వంతంగా చెయ్యడం, చెప్పడం, తోటిపిల్లలతో చర్చించుకోవడం, పాడడం, ఆడటం, బొమ్మ లెయ్యడం, బ్లాకు బోర్డు మీద రాయడం, గుంపులుగా కూచోవడం లాంటివి కన్పించే తరగతిగదే నిజమైన తరగతి గది. అలా వుంటేనే అది న్యాయంగా, అభ్యసనానికి అనుకూలంగా ఉన్నట్టు! పిల్లలు కేవలం (శ్రోతలుగా వుండే పద్ధతికి స్వస్తి చెప్పాలి.
టీచరు కీలకం
ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. ముందు టీచరు దీన్ని వొప్పుకోవాలి. ఇది సులభమైందనీ, అవసరమైందనీ, ఉపయోగకర మైందనీ, వాప్పుకోవాలి. తన స్వంత సృజతన్నాకత అన్నిటికన్నా విద్యా బోధనలో కీలకమైందని ఆ శక్తి తనకు వుందని
క
గుర్తించాలి. ఇప్పటిదాకా తాను వ్యవహరించిన ఏకపక్ష అధికార ధోరణికి భిన్నంగా పిల్లలతో కలిసిమెలసి ఆడుకొనే, పాడుకొనే ఒక సాటి వ్యక్తిలా మారాలి.
నిజంగా మన టీచర్లిలా మారుతారా? తప్పకుండా మారుతారని 'నలికిలి అనుభవం చెపుతోంది. పిల్లలతో పాటు కింద కూచోవడం మొదట కష్టంగా అన్పించవచ్చు. పిల్లలు గొడవ చేస్తున్నట్టు అన్పించి 'ఇది న్యాయమా?” అని మొదట అనుకోవచ్చు. ఇవన్నీ వుంటాయి. ఎవరైనా వెంటనే మారరు. కానీ ఇది ఉపయోగకరం అనుకుంటే తప్పకుండా మారతారు.
టీచర్ల కింత శక్తి వుందా? వాళ్ళు స్వయంగా బోధనాభ్యసన సామాగ్రి చేసుకోగలరా? పరిక్షల్ని సైతం వాళ్ళకే వదిలేస్తే కొంపలు మునిగిపోవా? ఈ ప్రశ్నలూ వస్తాయి. కానీ మొదట మనం టీచర్లని నమ్మాలి. వాళ్ళ శక్తిని నిజాయితీని ఒప్పుకోవాలి. నిజంగా పిల్లలతో ఏగుతున్నది వాళ్ళు, ఎన్నెన్నో పద్దతులు అప్పటికప్పుడు శక్తికొలది వెతుక్కొంటున్నది వాళ్ళు, వాళ్ళ కంటే ఎవరు పండితులు? ఎవరు అనుభవజ్ఞులు? దీన్ని మనం ఒప్పుకొని విద్య నేర్పడం ఎంత అవసరమో, ఎంత శాప్రీయమో, విద్యా వ్యవస్థ టీచర్ల సామర్ద్యాన్ని ఒప్పుకోవడం కూడా అంతే అవసరం, అంతే శాప్రీయం. శిక్షణ-పాఠర్యాంశాలు
ఈ 36 మంది టీచర్ల అనుభవాన్ని డిసిఇపి సైతం తర్వాత (1998) స్వీకరించింది. ఈ నలికిలి పద్ధతిని పాటించకోదల్చుకొన్న ఇతర టీచర్లను ముందుకు రమ్మని పిలుపు నిచ్చింది. అప్పటికే ఇలాంటి పాఠశాలల సంఖ్య 322కు చేరుకుంది. టీచర్లు స్వచ్చందంగా మేము 1,2,3 తరగతుల్లో ఈ పద్దతి పాటిస్తామని వంద లాదిగా ముందుకు వచ్చారు.
ఇలాంటి వారికి 12 రోజుల శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన రిసోర్సు పర్సన్స్ ఎవరు? ఎవరు? రుషీవాలీ వెళ్లివచ్చి తమ స్కూళ్ళలో ఈ పద్ధతిని పాటిస్తున్నారో వారే! లేదా ఈ పద్దతిని పాటించడం మొదలెట్టిన టీచళ్లే. అంతేకానీ పరాయి వాళ్ళెవరూ ఈ శిక్షణలో రిసోర్సు పర్సన్స్‌గా లేరు. దీనివల్ల శిక్షణ పొందే టీచర్లుకు వీళ్ళ మీద ఒక నమ్మకం కుదిరింది. స్వయంగా చేసిందాన్ని వీళ్ళు మనకు నేర్పుతున్నారన్న భావన ఈ శిక్షణంలో ఎంతో విలువైన పాత్ర పోషించింది. '“ఇది మనం కూడా చెయ్యగలం” అనే ఆత్మ విశ్వాసం దీనికి తోదయింది. దింతో పాటు 'మేమిది చేస్తాం” అని స్వచ్చందంగా వచ్చినవారే ఈ శిక్షణార్థులు. శిక్షణలో విసృతంగా ప్రస్తుత పరిస్థితి పట్ల చర్చ జరిగేది. పిల్లలందరూ ఒకే స్థాయిలో నేర్చు కోలేరనీ, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే పిల్లలు బడి బాగా మానేస్తుంటారనీ, ఆడపిల్లల్ని బడికి రప్పించడం కష్టంగా వుందనీ, పండగలూ, పనుల సీజన్లూ వస్తే 2-8 నెలలు బడి మానుతున్నారనీ
38
టీచర్లు ఉన్నవి వున్నట్టు ఈ శిక్షణల్లో మాట్లాడుకొంటారు. అయితే మొత్తం మీద పిల్లల సామాజిక స్థితిగతుల్ని దృష్టిలో వుంచుకొని, సానుభూతితో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయుడికి వుందని అందరూ అంగీకరిస్తారు. భయపడకుండా వెనకబడ్డ పిల్లలు ముందుకెళ్ళేందుకు మన స్కూల్లో ఏర్పాటు వుండాలని అందరూ ఒప్పుకొంటారు. మనం ముందుగా అనుకొన్నట్టే ఈ 12 రోజుల శిక్షణలో టీచర్లు తమక్కావల్సిన ) బోధనా సామాగ్రి తయారు చేసుకొంటారు. ప్రతి సంవత్సరం ఇలాంటి శిక్షణే వుంటుంది. మధ్య మధ్య మళ్ళీ పునశ్చరణలుంటాయి. ఈ మూడేళ్ళలో టీచర్లు స్వయంగా ఆరు నెలలకొక సారి వంతున మూడేళ్లకు (మూడు తరగతులకు) అవసరమైన పాఠ్యాంశాల్ని సామాగ్రిని స్వంతంగా తయారు చేసుకొన్నారు. ప్రస్తుతం నాల్దవ తరగతి సామాగ్రి సిద్దం చేస్తున్నారు. పాఠ్యాంశాల ప్రత్యేకత ఈ సామాగ్రిలోని ప్రత్యేకత ఏమిట అనే ప్రశ్న మన ముందుకొస్తుంది. అన్ని తరగతుల సిలబసూ ఒక క్రమంలో వుంటుంది. నిజానికిదంతా ఒకటే. కాకుంటే చిన్నచిన్న యూనిట్లుగా విడగొట్టబడి వుంటుంది. పిల్లలందరూ ఒకే వేగంతో నేర్చుకోరు. అందువల్ల ఒక్కొక్క యూనిట్ ఒక్కో గ్రూపు వుంటుంది. ఎవరైనా ఏదైనా కారణం వల్ల వెనకబడితే తాము ఏ యూనిట్ దగ్గరుండాలో ఆ [గ్రూపు కెళతారు. ఇలా ప్రతి బిడ్డా మెట్లెక్కుతున్నట్టు తాను ఏ మెట్టు దగ్గరున్నాడో స్పష్టంగా వుంటాడు. ఇలా వివిధ దశలుగా కన్పించినా సంవత్సరం ముగిసేప్పటికి దాదాపు పిల్లలంతా ఒకే స్థాయిలో వుంటారు. ఒకవేళ ఎవరైనా వెనుకబడితే తర్వాతి తరగతిలో ముందు తానెక్కడ వదిలిపెట్టాదో. అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. భాషకు సంబంధించినంత వరకు 10 యూనిట్లు ఒకటో తరగతికీ, 10 యూనిట్లు రెండో తరగతికీ వున్నాయి. ప్రతి యూనిట్‌లోనూ అక్షరాల పరిచయం (పదరూపంలో), వాటిని నేర్చుకోవడం, స్టిరపరచుకోవడం, వినియోగంచు కోవడం అనే నాల్గు దశలుంటాయి. ఇవన్నీ పూర్తి చేస్తే ఆ యూనిట్ పూర్తయినట్టు లెక్క విద్యార్థులతో అట్టముక్కలతో, చార్జులతో తమకు తాము ఒక (గ్రూపుగా కూచుని నేర్చుకొంటారు. దాన్ని దాటిపోతే తమంతతామే మరో యూనిట్లోకి వెళ్ళిపోతారు. అలాగే గణితం కూడా 1-9, 0, 10-19. ఇలా యూనిట్లుగా విభజించి పరిచయం చేస్తారు. ప్రతిదాన్నీ కృత్యాల రూపంలో చెప్పడం దీని ప్రత్యేకత. శిక్షణలో నేర్చుకొన్నప్పుడు బాగానే వుంటుంది. అయినా క్లాసుల్లో చెప్పేటపుడు సమస్యలు రావచ్చు. దీనికోసం రిసోర్సు పర్సన్స్ ఒకరోజంతా వీళ్ళ పాఠశాలల్లో గడిపి సూచనలిస్తారు. వాళ్ళు బోధనలో పాల్గొని కిందిస్థాయి అనుభవాల్ని క్రోడీకరించుకొంటారు. నిజానికి రిసోర్సు పర్సన్స్ కూడా ఈ క్రమంలో ఒక శిక్షణార్థులే. త్ర లో
ప్రభుత్వం బాధ్యత
సమస్యలేమీ లేవా? అంటే వున్నాయి. దీనిక్కావల్సింది మొదట ప్రభుత్వ యంత్రాంగం నుంచి మద్దతు. ప్రధానోపాధ్యాయులు దీన్ని అంగీకరించాలి. 1,2 తరగతులకు టీచర్ల కేటాయింపు చాలా ముఖ్యమైంది. శిక్షణపొందిన (నకిలి పద్దతిలో) టీచర్లను ఆ తరగతులకు కేటాయించకపోవడం వల్ల కావల్సినంత నష్టం వస్తుంది. ఒక వ్యవస్థగా విద్యావ్యవస్థ ఆ పద్దతిని, ఇందులోని ప్రత్యేకతను మనసారా అంగీకరించి సహకరించాలి.
ఇందులో ఒడిదుడుకులుంటాయి. కొత్తని పట్టుకోవడం కొంచెం ఆలస్యమవుతుంది. దీన్ని దుర్భణీతో చూస్తే వింతగా వితండంగా కూడా సాంప్రదాయక అధికార్లకు కన్పించవచ్చు. టీచర్లు మారితే చాలదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని కనుగుణంగా మారాలనేగి ఒక గుణపాఠం.
'నలికిలి దేశవ్యాప్తంగా విద్యావేత్తలందర్నీ ఆకర్షించింది. ఎందుకంటే ఇది స్వయంగా పూనుకొని ప్రభుత్వ టీచర్లు మొదలెట్టిన ఉద్యమం. ఉపాధ్యాయవర్షం తమంత తాముగా అంగీకరించిన ఉద్యమం.
ఇదేదో కొందరు బెత్సాహికులు ఏళ్ళ తరబడి కూచుని ప్రయోగాత్మకంగా చేసిన కృషి కాదు. వృత్తి జీవితంలో భాగంగానే అత్యంత సహజంగా సాధారణ శైలిలో ఇది మొదలైంది. విస్తృతంగా అల్లుకొంది. ఇక్కడే దీని గొప్పతనం వుంది. అనుభవాలు - గుణపాఠాలు
డి.పి.ఇపి. కర్నాటకలో కాలు పెట్టెప్పటికి 'నలికిలికి ఒక గుర్తింపు వచ్చింది. దీన్ని డి.పి.ఇపి. గుర్తించి మరింత ముందుకు తీసుకెళ్ళింది. డి.పి.ఇపి కూడా ఇదొక అనుభవం, (ప్రాథమిక విద్యలంటే ఇటుకలూ, భవనాలూ, ప్రహారీగోడలూ మాత్రమే కాదని ఇది రుజువు చేసింది. టీచర్ని ఉత్తేజపరచాలి. అతని అంతర్గత శక్తుల్ని వెలికి తీయాలి. అతన్ని నమ్ముకొని తరగతి గదిని విప్లవీకరించాలి. డి.పి.ఇపి లక్ష్యం ఇదిగా వుండాలనేది కర్నాటక అనుభవం.
ఏ రంగంలోనైనా మహా మహా విప్లవాలు పండితుల నుంచీ, పై అధికార్ల నుంచీ రావు. అది సాధారణ ప్రజల్నించి వస్తాయి. నలికిలి కూడా దీన్నే మరోసారి మనకు గుర్తు చేస్తోంది. దీన్ని ప్రభుత్వం అంగీకరించి దీనికి తగిన మద్దతు ఇచ్చింది. తోడుగా నిలబడింది. ఇదేదో ఒక వ్యూహానికి, ప్రణాళికలకు సంబంధించిన సమస్యకాదు. ఇదొక దృక్పథానికి సంబంధించిన అంశం.
40
మరి టీచర్లు ఈ పనికి ఎందుకు పూనుకొన్నట్టు? ఈ ప్రశ్న అడిగితే మైసూరు టీచర్ల నుంచి వచ్చే సమాధానం దాదాపు ఒక్కటే. “50 శాతం మంది పిల్లలకు మేము ఎంత చెప్పినా చదవడం, రాయడం కూడా వచ్చేది కాదు. మరో సగం మందిపైగా బడి మానేసేవారు. దీనివల్ల మేము ఎంతో తంటాలు పడ్డాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. అందులో భాగంగానే 'నలికిలి' కూడా మొదలుపెట్టాం. కొంచెం తొంగి చూస్తే దాదాపు టీచర్లందరిలో ఈ వేదనా, తపనా వుంటాయి” ఇదీ వీరి సమాధానం. ఇప్పుడు కర్ణాటక 'నలికిలి' టీచర్లు ఎంతో భరోసాగా వున్నారు. తమ పిల్లలు చాలా బాగా నేర్చుకొంటున్నారనీ, వాళ్ళ అభ్యసన స్థాయి ఊహకందనంతగా వుందని, తల్లిదండ్రులు కూడా తమకు అంగీకరించారనీ ప్రకటిస్తున్నారు. 'నలికిలి తరగతి గదిలో తొణికిసలాడే " స్వేచ్చా సృజనశీలతలు భవిష్యత్ సమాజానికి ఎనలేని పెట్టుబడులని విద్యావేత్తలు ఊహిస్తున్నారు. సగటు టీచర్ల సామర్ధానికీ ఉద్యమం ప్రతీకగా ప్రతి ఒక్కరూ పరిగణిస్తున్నారు. (మరిన్ని వివరాల కోసం డిస్టెక్ట్ ప్రొజెక్ట్ కో ఆర్జినేటర్ డి.పి.ఇపి. డిస్రెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్, బి.ఎం. రోడ్, మైసూర్- 570007) న శే
అత అల ఈ రోజుల్లో క్లిష్టం చాలా సులభం, మిమీ విమ. | సులభం మాత్రం అసాధ్య గులభం మాత్రం అసాధ్యం
మన శాస్త్రజ్ఞులు అంతరిక్షాన్ని శోధిస్తున్నారు. పరమాణువును ఛేదిస్తున్నారు. సైన్యం అంబులపొదికి రోజుకొక్క ఆయుధాన్ని సమకూరుస్తున్నారు. హరిత, నీలి, శ్వేత విప్లవాల్ని తెస్తున్నారు. మానవ జీవితాన్ని ఈ అన్వేషణలు ఎన్నో మలుపులు తిప్పాయి. దీనికి మనమందరం గర్విద్దాం.
అయితే మనం స్వాతంత్ర్యం వచ్చిన నాడు కన్న కలలు కల్లల్లా మిగిలిపోయాయి. వాటిని వాస్తవం చేసుకోవడం కాదుగదా వాటి దరిదాపులకీ వెళ్ళలేక పోయాం. ఇక్కడ మనం అంటే స్వాతంత్ర్యం తర్వాత రంగంలోకి దిగిన నాలాంటీవాళ్ళమన్న మాట.
మన పిల్లల్లో సగం మంది బడి బయటే వున్నారు. పర్యావరణ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. మన నగరాలు మురికికూపాలు మంచినీళ్ళకైనా మన ప్రజలు సగం మంది నోచుకోలేదు. మరుగుదొడ్ల సంగతి చెప్పనక్కర లేదు. మతం పేర ప్రాంతం పేర, భాషల పేర, జాతుల పేర వివాదాలు మాత్రం నానాటికి విజృంభిస్తున్నాయి. నేరాలు పెరుగుతున్నాయి. జనాభా సమస్య ఎంత మొత్తుకున్నా ఒక కొలిక్కి వచ్చిన పాపాన పోలేదు. జనం సంగతి పట్టని సైనూ చదువులు
నిజానికి ఇంత శాస్త్రం, ఇంత సాంకేతికం పెరిగాక ఒక్క మనిషీ ఆకలితో వుండాల్సిన అవసరంలేదు. ఇంత చిన్న విషయాలు మనకెందుకు పట్టవో నాకర్ధం కావడంలేదు. గొప్ప గొప్ప పరిశోధనలకూ ఆవిష్మరణలకూ చాలా (శ్రమించాలి. జీవితాల్ని వెచ్చించాలి ఎంతో దూరదృష్టి, సృజనాత్మకత వుండాలి . స్వాప్నికత వుండాలి. ఈ సంగతి నాకు బాగా తెలుసు. మన మేధావులు ఇంత (శ్రమపడుతున్నారు. అయితే మన సాధారణ కష్టజీవుల కోసం, రెతుల కోసం, వృద్దుల కోసం, పిల్లల కోసం ఈపరిశోధకులు ఒక్క సానుభూతి వాక్యాన్నీ పలకరు. ఒక్కక్షణం మనసు పెట్టరు.
శబ (
మన సైన్సు మనల్ని ఇంత నిర్యయుల్నిగా మార్చిందా? మనల్ని ప్రపంచానికి ఇంత దూరంగా నెల్టందా? అత్యంత గహనమైనవి, సంక్షిష్టమైనవే మనకు తలకెక్కుతాయా? సామాన్య సమస్యలు, సామాన్యుల సమస్యలు మనకు పట్టవా? దైనందిన విషయాలు పరిశోధనాంశాలు కావా? ఓహో వాటిని పరిశోధిస్తే పైసలు రావేమో! ప్రమోషన్లు రావేమో! ప్రశంసాపత్రాలివ్వరేమో! ప్రతిష్టలూ అవార్డులూ దక్కవేమో! విచిత్రమైంది, వినూత్నమైంది, ఎవ్వరూ దరిచెరినిది, ఎక్కడా అంతుబట్టనిది ఎక్కడ దొరుకుతుందా... అనేనన్నమాట మన పరిశోధకుల వెంపర్లాట!
- “ఓ అఖంధ ప్రజ్ఞా దురంధరులారా! మీకు మీ శాస్త్ర సాంకేతిక మైకం తలకెక్కి ప్రపంచ గమనం అంతుబట్టడం లేదేమో నాకు తెలీదు గానీ సహ్రాబ్బాల తరబడి జనజీవిత జీవలక్షణాన్ని కాపాడుతున్న వ్యవహార విజ్ఞానం ఆలోచనా శైలి, సాంస్కృతిక సంపద ఈ అనామక జనుల సృష్టే సుమండీ! శక్తే సుమండీ! ఈ అనామకులే మనకు అన్నం పెడుతున్నారు. యంత్రభూతాల కోరలు తోముతున్నారు. గీత, సంగీత సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. భారత దేశం భారతదేశంగా వుండగల్లుతోందంటే ఈ ఆసంఖ్యాక అనామక జనక్రియాశీలత వల్లే
సుమండీ” అని ఎలుగెత్తి చెప్పొలనిపిస్తుంది నాకు. మన మహా కావ్యాలు కొందరు సుప్రసిద్ద కవుల పేర నేడు చలామణి కావచ్చు. కానీ వాటి మూలాల్ని సృష్టించిందెవరుకొన్నారు? ప్రచారం చేసిందెవరురనుకొన్నారు? రుషుల పేర, చారిత్రక పురుషుల పేర మనం పిలుస్తున్న బెషధాలు, అపురూప వస్తువులు ఎవరి అనుభవం లోంచి వెలికి వచ్చినవనుకొన్నారు? అంతే గాదు మహామహా తత్వ శాస్త్ర మూలాలైన ఆదిమ ఆలోచనలుసైతం సామాన్యులకే. ఇవన్నీ ఈ దేశంలో మూలమూలలా ప్రచారం ; పొందాయంటే వాటి ఆదిమ రూపాలు ఈ మట్టి నుంచి పుట్టి వుండాలే తప్ప మన మెదళ్ల నుంచి కాదని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకప్పుడు మేధావులు, రచయితలు ఇలా ఈ మట్టిలోని మాణిక్యాల్ని వెతికి తీసేవారు సాన పట్టెవారు. మనం విద్యాసంస్థలంటూ, పరిశోధనాగారాలంటూ ప్రారంభించాక (ప్రజల వ్యావహారిక జ్ఞానానికీ, సృజనశీలతకూ మనకూ మధ్య ఈ పారంపరిక సంబంధం తెగిపోయిందేమోనని నాకనిపిస్తుంది. పరస్పరా శ్రితమైన ఈ ఒరవడి ముగిసిపోయిందే మోనని నా సందేహం పాఠ్యాంశాల మధ్య అంతస్సంబంధం మనం మరచిపోతున్నాం. సమాజం అనే జీవి ఒకటి వుందని అది మన పరిశోధనల్ని. విజ్ఞానాన్ని అందుకోవాల్సి వుందని మనం విస్మరించడమే గాదు, సమాజం నుంచి మనం గ్రహించాల్సి వుందన్న సంవేదనాశీలతనూ పోగొట్టుకొన్నాం. ఎవరికి వారే యమునా తీరే అయ్యామన్నమాట. అందువల్లే మన సైన్సు ఇలా చిక్కిరి బిక్కిరి అడివిలా తయారైంది. అందువల్లే మన కోట్లాది ప్రజలు ఈ పాఠశాల విద్య మన పిల్లల్ని రెంటికీ చెడ్డరేవళ్ళుగా మారుస్తుందని భయ శత
పడుతున్నారు. మరో గుమస్తా కాదల్పు కొంటే, ఓ ఉపగ్రహంగా మారదల్చుకుంటే సరే ఈ చదువులు మీకు బాగానే సరిపోవచ్చు. కానీ సమాజం సంఘర్షణ ప్రాయం కారదనీ, అది సృజనశీల వురోగమనంతో సాగాలనీ కోరుకునట్లయితే అందులో నీకూ భాగం వుండాలనుకున్నట్లయితే ఈ చదువులెందుకూ పనికిరావు ఈ 'అలీన విద్యా విధానం' మనల్ని ఎంత వికృతంగా మార్చిందో అప్ప్తుదవగతమవుతుంది. మనమీ విద్వా, పరిశోధనా సంస్థల్ని ప్రారంభించుకొన్నపుడు మనకు లక్ష్యం వుందేది. విద్వావేత్తా, శాత్రవేత్త సామాజికోద్యమకారుడు కావాలన్న నిర్వచనం వుందేది. అంతరిక్ష పరిశోధకుడైనా సరే. తన పరిశోధనలో ఎంత తలమునకలైనా సరే అతనికో సామాజిక బాధ్యత వుందని మన పాతకాలపు వారు నమ్మేవారు. శాస్త్రం పని ప్రజలకి తలియజెయ్యడం వరకే కాదు, అది ప్రజల్ని ప్రభావితుల్ని చెయ్యాలి. అది లోక ప్రియం కావాలి. లోక ప్రియం కావాలంటే అది సమాజపరం కావాలి. మనకు సమాజం పట్ల ఓ సంవేదనా శీలత వుండాలి. సానుభూతి వుండాలి. సరిగ్గా ఇప్పుడదే కరువైంది. అందువల్ల గహనాతి గహాన, జటిలాతి జటిల ప్రకృతి రహన్యాల్ని ఛేదిస్తున్నాం. సంక్షిపాన్ని సులభంగా మారుస్తున్నాం. కానీ చాలా సులభమైనదనాన్ని మాత్రం సంస్థానాల ఒంటిస్తంభపు సౌధాలకి బందీ చేసి వీలున్నంత దూరంగా వుంచుతున్నాం. సామాన్యులు శాస్త్రజ్ఞులైన వేళ
నేనిక్కడ అత్యంత్య సామాన్యుల ప్రయత్నాల్ని రెంటిని ప్రస్తావిస్తాను. ఇంతకు వీటి మీద దృష్టి సారించిన శాస్రజ్ఞుడెవ్వరూ నాకు కనిపించలేదు. వాళ్ళ దృష్టిలో ఇవి చాలా అల్ప విషయాలు. ఒక్క పిహెచ్డి పత్రానికయినా పనికొచ్చేవి గాదు.
మూదేళ్ళనాటి మాట. పంజాబులో ఒక రెతుకు ఒక డీజల్ పంపుసెట్ వుందేది, ఈ పంపుసెట్ తోడితేనే అతని జీవితం. దాని అంగాంగమూ అతనికి తెలుసు దానిప్రతి కదలికా అతనికి కరతలామలకం. అది అతనికంత విశ్వసనీయమైంది కూడా, అప్పుడప్పుడూ అది చెడిపోయ్యేది. అయితేనేం దాన్ని బాగుచెయ్యడం అతనికి చిటికెలో పని. రైతుకి ఓ పదేళ్ళ కొడుకుందేవాడు. వాడిక్కూడా ఈ పంపుసెట్టు పనంటే మహా ఇష్టం మహా సులభం అతనికో రోజు చటుక్కున ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. డీజిల్ పంపుతో బండిచక్రాల్ని వదిలించగల్లితే ఎలా వుంటుంది? ఇదీ అతని ఆలోచన.
ఆలోచనలైతే ఎందరికో వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టడమే అందరికీ చేత గాదు. ఈరైతు ఓ వడ్రంగి సాయంతో ఓ బండి తయారు చేయించాడు. దాని చక్రాలకి టైర్లని తొడిగాడు. పంజాబులో చెడిపోయాక వదిలేసిన సైనిక జీపులకు కొరవేమీ వుండదు వాటి నుంచి కొన్ని భాగాల్ని సేకరించుకొన్నాడు. ఇంకేం మన బండికి నాలుగు చక్రాలతోపాటు స్పింగు షాక్ అబ్జ్దార్చర్లు, గేర్‌బాక్స్, క్లబ్ స్ట్రింగు అన్నీ సమకూరాయి. ఇప్పుడు మన రైతు
డ్తడ్ష
పంపుసెట్టును ఒక బెల్బుతో ఈ బండికి అనుసంధానించాడు. అంతా కలిసి రైతుకయిన ఖర్చు 40వేలు. ఇందులో 20 మంది ప్రయాణించవచ్చు. గంటకు 40 కి.మీ. పోతుందిది. దీన్ని నదపడం, పోషించుకోవడం చాల సులభమే గాదు సలీలసు కూదా.
మన రైతు మహశయుడు దీనికి మారుత అని నామకరణం చేశాడు. చల్‌చల్
బండి చలాకీ బండీ, అంటూ షికార్లు కొట్టసాగాడు ఇంకేముంది చూస్తుండగానే ఇతర రైతులూ ఇదే దారి పట్టారు. కొందరైతే ఈ వాహన తయారీలో నిపుణులై పొయ్యారు. జనం వాడుకలో
- దీని పేరు నేడు జుగాద్గా స్థిరపడిపోయింది.
ఇప్పుడు మన రోడ్డు రవాణాధికార్లు రంగంలోకి దిగారు. దీన్ని జాతీయ రహదార్లలో తిప్పగూడదని ఆజ్ఞలు జారీ చేశారు. అయినా ఎవరద్దుకోగలరు గనుక? ఈ బండ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయ్యాయి. పెరిగిపోతూనే వున్నాయి. పంజాబు నుంచి ఈ వాహనం హర్యానా లోకి ప్రవేశించింది. ఇక్కడి నుంచి రాజస్తాన్లోనికి అడుగుబెట్టింది. దిని ధర కూడా బాగా తగ్గిపోయింది. చక్కర్లు గొట్టి చక్కర్లు గొట్టి ఈ వాహనం పలైెటూళ్ళ టాక్సీగా మారి పోయింది. నేను రాజస్తాన్‌లో ఈబండి నడిపే వాళ్ళ నడిగాను... వాళ్లు ఇది చాలా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చారు. దీని రిపేర్లన్నీ తామే చేసుకోగలమన్నారు. అంతేగాదు మా యిష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకొంటున్నామని కూడా ముఖం చాటంత చేసుకొని చెప్పారు.
ఎవరైనా ఓ మంచి ఇంజనీరు దీంట్లో తలపెట్ట గల్లితే ఇది మరింత సమర్ధవంతంగా సురక్షితంగా తయారుకావచ్చు. కానీ నాకు తెలిసినంతవరకు ఏ ఇంజనీరూ దీన్ని తన ప్రాజెక్టు వర్కు కింద ఎంచుకొన్న దాఖలా లేదు. నేనొక పరిశ్రమాధిపతి నడిగితే వీటిని తక్షణం నిషేధించాలని సెలవిచ్చాడు. ఇదెలా పుట్టి పెరిగి ప్రచారంలోకి వచ్చిందో పరిశీలించారా అని పబ్లిక్ రిలేషన్ శాఖ వారి నడిగితే నోరెళ్ళబెట్టి, చప్పరించి వూరుకొన్నారు. ఏం చేద్దాం ఇలాంటివి ఆధునికులకి పట్టవు. మధ్య తరగతి మేధావులకి పనికిరావు. వాళ్ళ ఆలోచనల్లోనే ఇలాంటి ప్రస్తావనలు రాకూడదు ఒక రైతేమిటి? ఇలాంటి పనికి పూనుకోవడేమిటి? అంత సాహసం చెయ్యడమే. తమకేది మంచిదో, ఏది అవసరమో దాన్ని ఎన్నుకొని తయారు కూడా చేసుకొనె అధికారం ఈ ప్రజలకివ్వరిచ్చారు? తయారు చేసింది చాలక ప్రచారంలో పెట్టడం అది పనికి వచ్చిందని రుజువు కూడా చేసి చూపించడం అంతా వాళ్ళిష్టమేనన్నమాట. ఇలాంటి ధోరణి ప్రబలితే ఇంకేమైనా వుందా? అదే వాహనం ఏ చైనా నుంచో, ఇజ్రాయిల్నుంచో అక్కడి రైతు తయారుచేశాడని చెప్పి దిగుమతి చేసుకొని వుంటే అది వేరే సంగతి కానీ ఇలా తెలివి మీరడం భారతదేశంలో ఎంత క్షమించరాని నేరం!
ఇంకో నేరం కూడా చెపుతా వినండి మేము మూదేళ్ళ ముందు పాటియాలలోని ఓ వ్యవసాయ విజ్ఞాన కేంద్రానికి సాంకేతిక విద్వా కమిటీ సభ్యులంగా సందర్శించడానికి వెళ్లాం.
శీర్
ఈ కేంద్రానికి చాలా పేరు ప్రతిష్టలున్నై. వీరి పరిశోధనని ఆ ప్రాంత రైతులు చాలా చక్కగా ఉపయోగించుకొంటారని ప్రతీతి. ఇక్కడి రైతులు ఏడాదికి నాలుగు పంటలు పండిస్తారు.
అందువల్ల ఆసక్తితో రైతుల ఆలోచనలూ పరిశీలనలూ కూడా మీ పరిశోధనాంశాలుగా వుంటాయా అని నేను అక్కడి ఓ ప్రముఖ శాస్రజ్జుణ్ణి అడిగాను. అప్పుడాయన చెప్పింది వినండి,
ఒకసారి ఓ రైతు మా కేంద్రానికి వచ్చాడు. తానీసారి నాలుగు పంటలతో పాటు పొద్దు తిరుగుడు మధ్యంతర పంటగా వేశానని చెప్పాడు. మేం అతని అమాయకత్వానికి నవ్వు ఆపుకోలేక దీనివల్ల వచ్చే పక్షులు అసలు పంటను కూడా తినేస్తాయి. మొదటికే మోసం వస్తుందని చివాట్లు పెట్టాం. ఆ రైతు మమ్మల్ని పిచ్చోళ్లలా చూసి ఆ మాత్రం ఒక రైతుగా నేను ఊహించలేనటండీ! అందుకు నేను పొలంలో తేనెటీగల్ని పెంచుతున్నా అని జవాబిచ్చాడు.
మాకందరికీ తలలు కొటేసిట్టయిందనుకోండి. తేనెటీగలు ప్రత్యామ్నాయ ఆహారం పక్షులకి
సమకూర్చడం వల్ల పక్షులు పంటనాశించవు? ఈ రహస్యం 'మాకు అర్ధంగాక తల బాదుకొన్నాము. మేము అమాయక శిఖామణి కింద జమకట్టిన ఆ రైతు నాలుగు పంటలూ పొద్దు తిరుగుడుతో పాటు కావల్సినంత తేనె కూడా పండించాడన్న మాట, (అయ్యో ఈ శాస్రజ్ఞులెంత దురదృష్ట జాతకులో! ఈ రహస్యం వాళ్ళే కనిపెట్టీ వుంటే ఎంత ఖ్యాతి వచ్చేదో!) పాపం రైతుకు పిహెచ్డి ఇవ్వడానికి ఈ కేంద్రంగాదు గదా ఏ యూనివర్శిటీ అంగీకరించదనుకోండి, కనీసం పారితోషికమైనా ఇచ్చే నాథుడు లేడు గదా. ప్రజల కోసం సైన్సు
ఇలాంటికథలు నేనెన్నైనా చెప్పగలను నేను చాలా ఏళ్ళుగా ప్రజా సైన్సు ఉద్యమంలో వున్నాను. నేను యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు మాకో ఆలోచన వచ్చింది. ఒక్క సంవత్సరం మన విశ్వ విద్యాలయ విద్యనంతటినీ నాలుగు గోడల్నించి విముక్తం చేసి మన పళ్లెటూళ్ళకు తీసుకెళ్ళిత్తే వాటితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుందని భావించాము అక్కడ మనం నేర్పుదాం. నేర్చుకొందాం వాళ్ళతో కలిసి ఆలోచిద్దాం. సమాజం పట్ల ఓ సానుభూతిని, సంవేదనాశీలతను సంతరించుకొందాం. విద్యా సంస్థలకీ సమాజానికీ మధ్య ఇచ్చిపుచ్చుకోనే ఒక ఒరవడిని ప్రారంభిద్దాం అనుకొన్నాం. దీన్నుంచి జాతీయ పునరుజ్జవనం కోసం ప్రజా ఉద్యమం రూపకల్పన చేశాం. కొంత ఈ దారిలో పయనించే ప్రయత్నం చేశాంగానీ చెప్పుకోదగ్గది మాత్రం ఏదీ లేదు. 50వేల గ్రామాల్లో ఒక జాతా కూడా చేపట్టాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలూ జరిపాం.
ఈ ప్రయాసంతా దేనికి? మన పరిశోధనా సంస్థల్లో విజ్ఞానాన్ని వెలికి తీస్తున్న వారికీ, జ్ఞానాన్ని సంతరించుకొంటున్న వారికీ సమాజంతో సంబంధం వుండాలని మా తపన.
46
ఈ సంస్థల్లో పనిచేసే వారిలో చాలా మంది లబ్టిప్రతిష్టులు, విదేశాల్లో సైతం గుర్తింపు గలవారు, మేము సమాజంలో విస్త్రృతంగా పని చెయ్యాలంటే ముందు ప్రజలు ఈ పరిశోధనల్ని పరిష్టారాల్ని స్వీకరించడానికి సిద్ధంగా వుండాలి గదా అని వాళ్ళంటారు. ప్రజల్లో ఈ మార్పు ఎవరు తేవాలి? అది కూడా ఈ పరిశోధకుల, విద్యావేత్తల బాధ్యతేనని. నేనంటాను. వుధావుల్ని అంగీకరించలేకపోవడం సమాజపు అపరిణతికి దృష్టాంతం అని ఎవరైనా అనవచ్చు. సమాజంలోకి అడుగిడితే ప్రజల ఆగ్రహాలు, ఆందోళనలు, సమస్యలు ఇవన్నీ మనమీదికొచ్చిపడతాయి గదా అనేవారూ వుండొచ్చు. కానీ ఇది తప్పదు. మనం సమాజంలోకి అడుగు పెట్టినప్పుడే ఈ నిర్జీవ ప్రక్రియ నుంచి బయటపడతాం. అప్పుడు గానీ మనకు సమాజం పట్ల సంవేదన పట్టదు. అసలు సమస్య మన చదువుల్లో వుంది
ఇలా తర్మించుకొంటూ.- వెళుతుంటే నాకు అసలు సమస్య ఎక్కడుందో అర్ధమైంది. అసలు సమస్య దస్తాల కట్టల్లో వుంది. అంటే మన చదువుల్లో వుంది. మన పిల్లలు చాలా నెర్చుకొంటున్నారని మనమనుకొంటున్నాం. వాళ్ళని చాలా చదివించాలని ప్రయాసపడుతున్నాం. కానీ పిల్లలు చాలా విషయాలు 'గుర్తుంచుకొంటున్నారు. దాన్నే మనం “చదువు అనుకొంటున్నాం. 'తెలుసుకోవడంి మొత్తం మీద మన చదువులోంచి దూరమైపోయింది. దాని స్థానంలో “గుర్తుంచుకోవడం వచ్చి చేరింది. ॥
మన పాఠశాల తనకు తాను ఓ ప్రపంచంగా మారి కూచుంది. మనం జ్ఞానాన్ని గీత గీసి రెండు ముక్కలు చేశాం. బడిలో నేర్చుకొనేది ఒకటి. నిత్య జీవితంలోది మరొకటి. మొదటి దాన్ని రెండో దానితో, రెండో దాన్ని మొదటి దానితో సమన్వయం చేసుకోకుండా వుండడమే మనం బడిలో అడుగు పెట్టగానే పిల్లలకు నేర్పుతుండేది! చివరికీ రెండు జ్ఞానాలు పరస్పర విరుద్దాలవుతున్నాయి. దీని ఫలితం విద్యావంతులు సమాజం నుంచి దూరం కావడం, తమకు దూరమైన దాంతో తమకేం పని; అందువల్ల పిల్లలు బడి నుంచి పారిపోవడానికే చూసారు. మన చదువు జీవితం నుంచీ జనం నుంచి ఇంతగా వేరుపడ్డం మనందరి కళ్ళముందూ జరుగుతున్నా మనం చూడనట్ట వున్నాం. అదీ మన గొప్పదనం.
మరో అంశం. మన పరంపరాగత విజ్ఞానంతో, సామర్వాలతో, నైపుణ్యాలతో, కళలతో మన చదువులకు సంబంధం లేకపోవడం, వాటి నుంచి తీసుకోవల్సింది ఏదీ లేదని మనం నిర్ధారించుకొని మన బడి తలుపులు మూసెయ్యడం. మన.ఇంజనీర్లు బయటకెళ్ళి పని చెయ్యగలరు గానీ మన దేశంలో ఇక్కడి పరిస్థితులు అవసరాలు వారికే మాత్రం ఉత్సాహాన్ని కల్టించవు. అలా సమాజం - విద్య ఎవరికి వారే అయినంతకాలం మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు భారత దేశ పునర్నిర్మాణానికి ఉపకరిన్తాయన్న ఆశ మనం పెట్టుకోనక్కల్లేదని నా అభిప్రాయం.
- శ
దేశమంతా కేంద్రీకృత ఏక శిలాసదృశ్య విద్యా వ్యవస్థ వుండాలని మనం అనుకొన్నంత. కాలం ఈ వలయంలోంచి మనం బయటపడలేమని నాకన్పిస్తోంది. మన పాఠ్యాంశాలు స్థానిక పరిస్థితుల కనుగుణంగా వుండాలి. వాటిలో వైవిధ్యం వుండాలి. సృజనశీలత, శక్తిమంతత్వం వైవిధ్యం నుంచే వస్తాయి. ఏకరూపత ఎప్పుడూ సత్ఫలితాలకు అడ్డంకిగానే వుంటుంది.
అయితే ఎందుకు విద్యారంగంలో మనం ఈ కేంద్రికృత వ్యవస్థకు పట్టం గడుతున్నాం? ఇందులో మనకో సౌలభ్యం వుంది. అదేమంటే ఇలాంటి పాఠ్య గ్రంథాలు, విధానాలు వుంటె మనం '“పరీక్షలు' సమర్ధవంతంగా నిర్వహించగలం! ఇప్పుడు మన చదువులకీ పరీక్షలే పరమార్థాలూ, పరమార్ధ సాధనాలూ అయి కూచున్నై గదా! ఈ పరీక్షల్లో పిల్లలే గాదు మన విద్యా ప్రణాళికావేత్తలూ, ఉపాధ్యాయులూ కూడా గట్టెక్కాల్సి వుందాయె, అందుకోసం వైవిధ్యానికి మంగళం పాడక తప్పదు. సృజనాత్మకతకు సమాధి కట్టకా తప్పుదు!
ఇలా చూస్తే మన ఎన్నో సమస్యలకు మూలం మన విద్యా వ్యవస్థలోనే కన్పిస్తుంది. దీన్ని మార్చడం మనమనుకొంటే పెద్ద కష్టమేమీగాదు. చాలా సులభమే. అయితే చాలా సులభమైనవి నేడు అసాధ్యంగా మారిపోయాయని నేను ముందే చెప్పానుగా! ఏం చేద్దాం చెప్పండి!
1 భాష- భావం
5్0
మాట్లాదించడం మయి భాషాధ్యయానికి కీలకం ప్రార్ధన అనగానే సమావేశంలో అందరి కళ్ళు 'ఆ' టీచరు వైపే తిరుగుతాయి. ఆ స్థాన విద్వాంసులుగా ముద్రపడ్డ ఆ టీచరు ప్రార్ధన కానిస్తారు. ఇది మన ఉపాధ్యాయ కేంద్రాల్లో తరచూ కనబడే దృశ్యం. ఆ మాత్రం ప్రార్ధనా గీతం ఎవరైనా పాడలేరా ? పాడలేక కాదు - నిజానికి టీచరుగా తన తరగతి గదిలో అద్భుతంగా పని చేస్తున్నా కొందరు నలుగురిలో నోరు విప్పాలంటే గజగజలాడి పోతారు. ఏమిటి చిత్రం? చాలా మంది ఉన్నతోద్యోగులూ, విషయ నిపుణులూ సైతం పదుగుర్లో పెదవి విప్పాల్పొస్తే బలవంతాన పట్టిపట్టి నాలుగు ముక్కలు మాట్లాడి పెద్ద భారం దిగినట్లు ఫీలైపోతారు. ఎందుకిలా జరుగుతోంది ? నాలుగు గోడలు భవిష్యత్తును తీర్చిదిద్దే తరగతి గది పుణ్యమా ఇది. బళ్ళో అడుగు పెట్టెదాకా మాటల మూటలతో ప్రవాహంలా మాట్లాడే మన పిల్లలు - అదేంటి ? ఇదేంటి ? ఎందుకు ? ఏమిటి? అంటూ ప్రశ్నలతో హోరెత్తించే పిల్లలు ఐదేళ్ల (పదేళ్ళ?) చదువు పూర్తయ్య సరికి
-
మూగమొద్నుల్లా మారిపోతున్నారు. తమ భావాల్చ్సి అనుభూతుల్ని మాటల్లో (రాతలో కూడానా?) వ్యక్తపరచలేని అసహాయులై పోతున్నారు. ఐతే అందరూ ఇలా ఉన్నారన లేము. పిల్లల్ని మహా గొప్ప వక్తలుగానో, మైకు పిచ్చోళ్ళుగానో మార్చాలని కాదు. తమ భావాల్ని నిర్భయంగా, స్వేచ్చగా ప్రకటించ గలిగేలా తీర్చిదిద్దాలి. లోపం ఎక్కడుంది ?
-
_ బడిలో మాట్లాడటం నేర్చుకోవలసింది ఎవరు? మరి ఆ బడిలో ఎక్కువగా మాట్లాదేది ఎవరు? ఇదెక్కడి న్యాయం అంటూ జాన్హాల్ట్ ఆశ్చర్యపోయినా, ప్రశ్చించాల్సింది ఎవరు. మరి ప్రశ్నలతో ముంచెత్తేది ఎవరు అంటూ రామానుజన్ నిట్టూర్చినా సగటు పాఠశాలల్లో
ర్1
జరుగుతున్న తంతు ఇదే. పిల్లలు మాట్లాడడాన్ని గలాభాగా, క్రమశిక్షణా రాహిత్యంగానే మనం ఇంకా భావిస్తున్నాం. ప్రశ్నలకు సమాధానాలు బట్టీపట్టి పరీక్షలు రాయడమే చదువు అనుకొంటున్నాం. ఇంగ్లీషు మీడియం పాఠశాలలు మరో అడుగు ముందుకేసి సైలెంట్ బీ ల రీడింగ్ అంటూ పిల్లల నోరు నొక్కేస్తున్నాయి. రాయడం, చదవడ మొక్కటే చదువనుకొంటున్న టీచర్లు, మిగతా సామర్దాలు అభివృద్ధి చేయడం అనవసరంగా భావిస్తున్నారు. విచిత్రమేమంటే బడిమొగం చూడని పిల్లవాడిలో సహజంగా అభివృద్ధి చెందిన నైపుణ్యమే మన బడిలో పెరిగే పిల్లవాడి కన్నా అదనంగానే ఉంటుందనేది నిర్వివాదాంశం. మాట్టాదదడం ఎలా ?
ఇందులో విశేషం ఏముంది. ఏదైనా వైకల్యం ఉంటే తప్ప పిల్లలందరూ బాగానే మాట్లాడతారు కదా. ప్రత్యేకంగా నేర్పించాల్సింది ఏముంది అని సగటు టీచర్లు, తల్లిదండ్రులు అనుకుంటుంటారు. మానవ వికాస దశల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఎలిజబెత్ హుర్గాక్ నుండి వైగోట్సీ వరకూ వ్యక్తిత్వానికి మాటతీరు ఒక గీటురాయిగా సూచించారు. అందుకే కాక్రాస్ట్, గోర్టాన్ ఆల్పోర్ట్ మొదలైన విద్యా మనో వైజ్ఞానికులు పిల్లల్లో స్పష్టమైన భావ వ్యక్తీకరణ సామర్ధ్యం పెంపొందించడానికి తరగతి గది బాధ్యత వహించాలని నిర్దేశించారు.
కథ చెప్పమని వేధించే పిల్లలకు మనం మొహం చాటేస్తుండటం దాపరికం లేని విషయమే. కథలు, పాటలు కాలక్షేపాలుగా, అనవసర అంశాలుగా అనుకుంటున్నాం. సంభాషణలు వినడం, కథలు వినడమే సరిగా మాట్లాడడానికి పునాది. అపుడు మాత్రమే ఎవరైనా తన భావాల్ని అనుభూతుల్ని చక్కగా, స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. అలా జరగకపోవడం వల్లే సారస్వత సంఘ సమావేశాల్లో (మొక్కు బడిగాసాగే) పిల్లలు ఈనాటి చర్చనీయాంశం ఏమనగా అంటూ నీళ్ళు నమలడమో భట్టీ యం వేసింది గుర్తురాక బెంబేలు పడటమో జరుగుతుంది.. అది పాఠ్య విషయమైనా, ప్రాపంచిక విషయమైనా పిల్లలో చర్చించాలి. చర్చించడం, మాట్లాడ్డం పిల్లల ఆలోచనలకి ఎంతగా పదును పెడతాయో, భావవ్యక్తీకఠణ సామర్థ్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని మరెంత అభివృద్ధి చేస్తాయో ఈ ఉదాహరణ గమనిద్దాం. ఒక పాఠశాలలో 8వ తరగతి పిల్లలు 'మనం త్రాగేనీరు' పాఠంలో వర్షప్రునీరు స్వచ్చమైనదా? కాదా? అనే అంశం మీద సుదీర్ధంగా చర్చించారు. చర్చలో 'సముద్రపు నీరు ఆవిరై వర్షం కురుస్తుంది కదా! మరి సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నప్పుడు వాననీరు స్వచ్చమైనది ఎలా అవుతుంది' అనే అంశం వచ్చింది. ఈ సందర్భంలో టీచరు నీరు మరగటం, ఆవిరవడం గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో ఆలోచించండి. చర్చించడం వల్ల, ఒక అంశం గురించి మాట్లాడుకోవడం వల్ల ఆ విషయం పట్ల కలిగే అవధానం, ఎన్నిసార్లు వల్లె వేస్తే మాత్రం వస్తుంది? భాష్టైనా, గణితమైనా చివరికి పరిసరాల విజ్ఞానమైనా పిల్లల్లో చర్చకు
ర్2ై
పెడితే వాళ్ళని మాట్లాడనిస్తే మన పాఠ్య పుస్తక రూపకర్తలకు కూడా అందని ఆలోచనల్ని పిల్లలు వ్యక్తపరుస్తారు. నిజానికి నేర్చుకోవడం ఎలాగో నేర్పడం టీచరు పని. అన్నీ మనమే నేర్పాలనుకోవడం, ఆ దిశగా బలవంతపు శిక్షణ ఇవ్వడం మానవ నహజాతాలని మొద్దుబారుస్తున్నట్లే కదా !
'అమ్మ' అను 'అత్త' అను అంటూ చిలక పలుకులు నేర్పిస్తూ ఆనందించే అమ్మానాన్నలు నాలుగేళ్ల పిల్లాడు మాట్లాడబోతే ఒర్జి వాగుడుకాయ, మాటలు రాకున్నా భావుండేదంటూ విసుక్కుంటారు. తరగతి గదిలో టీచరు కళ్ళుగప్పి నోరువిప్పడం తప్ప మరో అవకాశమే లేదు. అందుకోసమే ఇంటర్వెల్స్ లాంగ్బెల్కి సంకెళ్లు తెగిన బానిసల్లా మహోత్సాహంగా పిల్లలు కేరింతలు కొడతారు. అదో ముగ్ధ్గమనోహర దృశ్యం. ఇక్కడోమాట దిగంతర్ లాంటి పాఠశాలల్లో ఈ వైచిత్రి వుండదు. ఎందుకంటే బడి ఓ బంధిఖానాగా నోరు కుట్టేసుకుని శిలావిగ్రహాల్లా ఉండాల్సిన అవసరం అక్కడ వుండదు. అనుభవాలు పంచుకోవడం, చర్చిస్తూ నేర్చుకోవడం, తగినంత స్వేచ్చ వుండటమే కారణం. బెంచీకి నలుగుర్ని కుక్కి కూచోబెట్టే ఎడ్యుకేషనల్ షాప్స్లాంటి కాన్వెంట్లలోనూ, ఒకే గదిలో ఐదు తరగతులతో కుస్తీ పట్టే ప్రభుత్వ బళ్ళోనూ పిల్లలకి స్వేచ్చ ఇవ్వాలంటే ఎండమావుల్లో స్ళ్ళు వెతుక్కోవడం లాంటిదవుతుంది.
శతకకారుడు పేర్కొన్నట్లు నొప్పించ కుండా తప్పించుకు తిరగడమే జీవితాన్ని
? జయించడమైతే ఆ దిశగా మన బడులు పిల్లలకి ఎంత మాత్రం శిక్షణ ఇస్తున్నాయి? అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా రేపటి పౌరుల కోసం గైడెన్స్, కౌన్సిలింగ్ సెంటర్లు మనకెక్కడివి. మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉండే సంబంధాలు పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ఏ మేరకు ఉపయోగపడతాయో ఆలోచించాల్సిందే. బెర్నాద్షా పేర్కొన్నట్లు మాట తీరు మనిషి నడవడిని తెలియజేస్తుంది. కాబట్టి ఆ సామర్చాన్ని అలవరచడం బడి చదువులో భాగంగానే భావించాల్సిన అవసరం ఎంతైనా వుంది. విచిత్రం ఏమంటే మన చదువులు మొగలుల పరిపాలనా విధానమెట్టిదో నేర్చుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యతను మనిషిగా మనుషుల్లో మెలగడమెలాగో నేర్పడానికి ఇవ్వడానికి సాహసించవు. జీవితానికి సంబంధించని అంశాలతో వీధి బడి నుండి యూనివర్శిటీ దాకా సాగుతున్నాయి. కర్తవ్యం
పిల్లలు బడిమాని వేయడానికి (ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో) అనేకానేక కారణాలున్నప్పటికీ ప్రధాన కారణం వాళ్ళ సామర్ధానికి, భావాలకు, అనుభూతులకు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత లేకపోవడం అనేది చాలా పరిశోధనల సారాంశం. ఎన్ని ఎక్కువ పుస్తకాలుంటే ఎంత ఎక్కువ హోమ్‌వర్క్ ఇస్తే, ఎంత తక్కువ సమయం ఇంట్లో ఉందేలా చూస్తే అదే
ర్
అద్భుతమైన చదువుగా, ఖచ్చితమైన బడిగా చదువరులైన తల్లిదండ్రులు, సూడో మేధావులు ఆలోచిస్తున్న రోజులివి. ఇక బడుగు బతుకుల ఆలోచనల్లో బడికి చోటెంత ఉంటుందో మన కందరికి తెలిసిందే. సహజంగా చైతన్యవంతులైన పిల్లలు బందిఖానాలాంటి బడి విధానాల వల్ల బండబారిపోకుండా చూడాలి. పిల్లలు తమ అభిప్రాయాలు స్వేచ్చగా వ్యక్తీకరించాలంటే
-
తరగతి గదిలో పాఠ్యాంశాలపై చర్చలు నిర్వహించాలి.
-
పరిష్కారాలు సూచించమనాలి.
-
అసంపూర్తి కథలు పూర్తి చేయమనాలి.
-
నువ్వైతే ఏం చేస్తావు ? అని అడగాలి.
-
కథలు, వాటలు చెప్పించాలి.
-
తాము చూసిన సినిమా గురించి చెప్పమనాలి.
-
సెలవు దినం తర్వాత రోజున టీచరు పిల్లల్లో కలిసి కూర్చొని సెలవు దినాన
ఏమేమి చేశారో మాట్లాడుకోవాలి.
ఇలా ఎన్నో సందర్భాలు సృష్టించుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే పిల్లలు మాట్లాడేటపుడూ, రాసేటపుడూ అప్పటికప్పుడే భాషాదోషాలు సవరించే ప్రయత్నం చేయకూడదు. ఇది వారి ఆలోచనా స్రవంతికి అవాంతరమవుతుంది.
మాట్లాడటమే చర్చ. చర్చ ప్రశ్నించడానికి దారి తీస్తుంది. ప్రశ్న చైతన్యానికి ప్రతీక. కాబట్టి మానవ సంఘ జీవనానికి మూలస్థంభమైన చైతన్యం వెల్లి విరియాలంటే పిల్లలు స్వేచ్చగా నోరువిప్పి మాట్లాడగలగాలి. ప్రశ్నించ గలగాలి. ఆ దిశగా మన బళ్ళు, చదువులు కళ్లు తెరవాలని ఆశిద్దాం. అప్పుడే తరగతి గదులే రేపటి తరగని నిధులవుతాయి.
- టి.వి.ఎస్. రమేష్, నెల్లూరు ర్డ
ల్సా పిల్లలూ - భాషా
మానవ నాగరికతను మలుపు తిప్పింది. భాష అని మనకు తెలుసు. భాష మానవుడి ప్రమేయాన్ని బయటి ప్రపంచంలో విప్లవీకరించడమే కాదు మానవుణ్ణి అంతర్గతంగా కూడా విప్లవీకరించింది. వానరుడి నుండి నరావతారం జరిగాక నరుడిలోని అనేక మార్పులకు భాష ఒక కారణమని ఆధునిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. అప్పటిదాకా బయటి శక్తులు పరిణామ (క్రమాన్ని నిర్ణయిస్తే భాష పుట్టాక అంతర్గత శక్తి (భాష) పరిణామాన్ని నిర్దేశించిందన్నమాట.
ఇప్పుడు భాష సార్వత్రికం, సార్వజనీనం, లిపిలేని భాషలెన్నైనా గానీ ధ్వనుల్లేని, మాటల్లేని భాషలిపుడే లేవు. అత్యంత ప్రాథమిక స్థాయి (0167ల భాష సైతం అద్భుతంగా ఆయా జాతుల అవసరాల్ని తీర్చగల స్థాయిలో వుంది. అలాగే అవసరాలు పెరిగే కొద్దీ భాష తనకు తొను అద్భుతంగా మార్పులకు లోనవుతుంది. ఎప్పటికప్పుడు జవసత్వాలు సమకూర్చు కొంటోంది. భాషా, మానవుడూ చెట్టా పట్టాలేసుకొని పొతాళపు పొరల్పీ గగనాంతరాళాల్నీ పిడికిట్లో బిగించుకొంటున్న యుగం మనది.
మనమందరం మాట్లాడుతున్నాం. అలవోకగా మాట్లాడుతున్నాం. మాట్లాడ్డమంత సులభం మరేముంది గనుక ? కానీ కొంచెం లోతుగా చూస్తే భాషకు ఎంత సంక్షిష్టం!!!
అలాగే భాషకున్న ఈ ప్రాథమిక నిబంధనల్నీ సార్వత్రికాలు, అన్ని భాషలకు సమానంగా వర్తించేవి.
- ప్రతి భాషలోనూ హల్లు - అచ్చు - హల్లు-అచ్చు పద్దతే వుంటుంది. హల్లుల్ని అచ్చులేకుండా పలకలేము. ఒకవేళ పలికినా రెండు మూడు హల్లులకు మించి ఒకటిగా పలకలేము. మూడు హల్లుల సంయుకాక్షరాలు గల పదాలు ఏ భాషలోనైనా పట్టుమని పది
ర్ర్
చెప్పండి... చూద్దాం. స్తీ, శాస్త్రం, ఫ్రీట్, స్ట్రక్చర్ ఇలా చెప్పొచ్చు. ఎంత చెప్పినా ఎస్టిఆర్ ధ్వనులతో తప్ప ఇతర ధ్వనులతో (హల్లులు) గల సంయుక్తాక్షరాలు ఎక్కడా చిక్కవు. ఇక నాల్గు హల్గులుగల సంయుక్తాక్షరం అసాధ్యం.
మన వాగ్యంత్రం ఎక్కువ హల్లుల కలయికను అంగీకరించదు. అందుకే మనం “'ఇస్మూలు” అంటాం. సూర్యుణ్ణి సూరీడు అని సరిపెట్టుకొంటాం.
-
ప్రతి భాషలోనూ మాటలకూ వాటి అర్జాలకూ సంబంధం లేదు. 'గాడిద' అని గుడ్డలు మోసేదాన్నే ఎందుకనాలి ? ఇంటిక్కావలి వుండే జంతువుని ఎందుకనగూడదు ? దీనికి జవాబెక్కడా చిక్కదు. అంటే మాటలన్నీ కేవలం కొండ గుర్తులు (సింబల్స్), అమూర్తాలు.
-
ఒక రకంగా చూస్తే భాష అత్యంత సంక్షిష్టమైంది. అంత ' కోడ్'లతోనే ఇందులో పని. చిన్న మార్పు చేసినా కొంప మునిగిపోతుంది.
సీత వంట చేస్తుంది
సీత వంట చేస్తూంది.
ఒక్క దీర్హమే తేడా, అర్ధంలో బోలెడు మార్చు.
రాముడు బడికి పోతున్నాడు. సీత బడికి పోతూ వుంది.
ఇక్కడ కర్త లింగాన్ని బట్టి క్రియ మారిపోతుంది. అదే సీత గానీ రాముడు గానీ తమను గురించి చెప్పుకొంటే “నేను బడికి పోతున్నాను అని ఒకే రకంగా చెప్పవచ్చు. ఇలా (ప్రతి భాషలోనూ చిన్నమార్పులు పెద్ద తేడాల్ని తెస్తుంటాయి.
- వాక్యాల్లోనూ ఇంతే. ఒక క్రమం వుంటుంది. మనం ఆ క్రమంలోనే మాట్లాడతాం.
“పోతున్నాడు బడికి రాముడు” అనొచ్చు, అయినా ఇది కృతకం.
-పదాలు కొన్నే వాక్యాలు లక్షలు. ఎన్ని వాక్యాలైనా మనం తయారు చేసుకోగలం. నిజానికి ఒకసారి చెసిన వాక్యం మరోసారి చెయ్యం.
అంతా సందర్భం మీద (0004/౪[21) ఆధారపడి వుంటుంది. అసలు భాష ఉనిక్తీ, బ్రతుకూ, పెరుగుదలా, ఉపయోగమూ అంతా సందర్భం నుంచే ! మూడేళ్ళ బిడ్డ భాషా పరంగా పెద్దవాడి కిందే (1201340 26410 లెక్క , 56
ఎప్పటికప్పుడు కొత్త వాక్యాల్ని సృష్టించుకోగలం. [ఘ్రతి భాషకూ అంత వివిధత, సృజనాత్మకత అత్యంత నాధారణం.
- భాష నిరంతరం పరిణామశీలి. ఒక లెక్క ప్రకారం మాట్లాడేవాడు చెప్పేదీ, వినేవాడు స్వీకరించేది నూటికి నూరుపాళ్ళు ఒక్కటిగానే వుండదు. తాత భాషా, తండ్రి భాషా, తన భాషా ఒకటి కానేగాదు. అసలు మనం మాట్ట్లాడేపుడు కూడా ఒకసారి ఒకచోట పలికేది, మరోసారి మరోచోట పలికేది ఒకటి గాదు.
భాషా పండితులు ఎంత గీ పెట్టినా సరే అది తనకు తాను మారుతూనే వుంటుంది. ఈ వాక్యాల కంటే పదాలు, పదాల కంటే ధ్వనులు ఎక్కువగా మార్పుకు లోనవుతై.
-
ఈ మార్పులు సందర్భాన్ని బట్టి వుంటాయి. అంతా సందర్భం మీద (601120 ఆధారపడి వుంటుంది. అసలు భాష ఉనికీ, బ్రతుకూ, పెరుగుదలా, ఉపయోగమూ అంతా సందర్భం నుంచే !
-
భాషకూ భావాలకూ మధ్య అంతుచిక్కని సంబంధం వుంటుంది. 'తోదేలు' అనగానే భయం” కమ్ముకొంటుంది. “ఐస్‌క్రీం అనగానే నోరు ఊరుతుంది.
-
ఒకే మాట పలుసందర్శ్భాల్లో పలు అర్జాలివ్వవచ్చు. 'నా మాట ఏం చేశావ్” అన్నప్పుడూ “మాటా మాటా పెరిగింది” అన్నపుడూ “మాటి వినడానికి ఒకటే. అర్ధం మాత్రం ఒకటి గాదు.
ఇలా చూస్తే భాష అత్యంత క్లిష్టమైంది, అత్యంత గహనమైంది. ఎవరైనా పరాయి భాషను వయసొచ్చాక నెర్చుకొంటూంటే ఈ సంక్లిష్టత అర్ధమవుతుంది. ఇంత 'న్యూసెన్సు' ఏమిటా అని తల తిరిగిపోతుంది. పిల్లలు భాష ఎలా నేర్చ కొంటారు ?
మరి ఇంత క్లిష్టమైన భాషని పిల్లలు అలవోకగా ఎలా నేర్చుకొంటున్నారు. ఒకటి గాదు రెండు మూడు భాషలు కూడా ఏకకాలంలో ఎలా నేర్చుకొంటున్నారు. అంటే మూడెళ్ళ బిడ్డ భాషాపరంగా పెద్దవాడి కిందే లెక్క
ప్రతి బిడ్డా మూడేళ్ళ వయసులో భాష నేర్చుకొంటోంది. ఇదొక సార్వ జనీన సూత్రం. కొంచెం క్రమంలో తేడా వుండవచ్చు వేగంలో అటూ ఇటూ వుండొచ్చు. కానీ మాతృభాష మాత్రం అందరికీ మూడేళ్ళలో అనర్గళంగా వచ్చి తీరుతుంది. ఇదెలా సాధ్యం?
ర్
విచిత్రమేమంటే పిల్లలు నేర్చుకొనే క్రమం కూడా ప్రపంచమంతా ఒక్కటే. ముందు చిన్న చిన్న సరళ వాక్యాలు మాట్లాడతారు. “నాన్ను అంటే అదీ వాక్యమే, “నాన్న వచ్చాడు” '“నాన్న పోతున్నాడు”, “నాన్న కన్పించడం లేదు” ఇలా ఏదైనా కావచ్చు ! ఆ తర్వాత రెండు పదాలతో వాక్యాలుంటాయి. సరళ వాక్యాల తర్వాత వ్యతిరేక వాక్యాలు పిల్లలకు వస్తాయి. ఆ తర్వాత ప్రశ్నార్ధకాలు నేర్చుకొంటారు. ప్రతి బిడ్డకూ హల్గు-అచ్చు, హల్లు- అచ్చు సూత్రం తెలుసు. వీటిని కలగాపులగం చేసి గందరగోళ పడినట్టు ఎక్కడా కన్పించదు. ఒక వాక్యాన్ని సందర్భానుసారంగా అర్ధం చేసుకోవడం పిల్లలకి వచ్చు. నవ్వుతూ 'నెను రాను అంటే “వస్తానులే అన్న ధ్వని అందులో వుందని బిడ్డకు తెలుసు. చివర మనం రి వ ణా ; ఆ శ ర ల్దా ఖో చేసే చిన్న మార్పు వల్ల ప్రశ్నలుగా వాక్యాలు మారుతుంటాయి. వీటిని పిల్లలు అట్టే పట్టెస్తారు. 'సీత పుస్తకం చదువుతున్నాడు అని మనం అంటే ఏ మూదేళ్ళ పాపైనా ' ఇందులో ఏదో తప్పుందన్నుట్టు మనల్ని వెక్కిరిస్తుంది. కాకుంటే తప్పేమిటో ఆ పిల్ల స్పష్టంగా చెప్పలేక పోవచ్చు. ఖీన్నార్ధాల మాటలని సందర్భాన్ని బట్టి పిల్లలు అర్ధం చేసుకొంటున్నారు. వాక్యంలోని పదాల (క్రమాల్ని కర్త ఆధారంగా (క్రియలో వచ్చే మార్పుల్ని కర్తా కర్మల విభక్తుల్ని తెలుసుకోడమేగాదు అవసరాన్ని బట్టి వాక్యాల్ని వివిధ విన్యాసం చేయగల నేర్చునీ పిల్లలు అత్యంత సహజంగా పొందుతున్నారు. అంతకంటే అద్భుతం తమకు తెలిసిన పరిమిత పదాలతోనే వారు వేలాది వాక్యాలు కొత్త కొత్తవి స్వంతంగా తయారు చేసుకొంటున్నారు. ఇదంతా పెద్దల్లాగానే వాళ్ళు చెయ్యగల్టుతున్నారు. మరీ విచిత్రం- పిల్లలు రెండు మూడు భాషల నియమాల్ని కూడా పట్టేస్తున్నారు. ఇంత సంక్షిష్ట నిర్మాణం గల నైరూప్య విషయాన్ని ఇంత సులభంగా పిల్లలెలా గ్రహిస్తున్నారు? ఇంత గొప్పగా ఎలా ఉపయోగించుకోగల్నుతున్నారు? దీన్ని భాషా శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్ర వేత్తలూ ఇలా విశ్లేషిస్తున్నారు.
- ఆసక్తికర వాతావరణంలోనే పిల్లలు భాష నేర్చుకొంటున్నారు. అవసరమైన వాతావరణమే ఆసక్తికరమైంది. సహజమైందిీ. ర్ి
- ఈ భాషభ్యసన క్రమంలో తప్పని సరిగా మనం అందజేసేది (ఇన్పుట్) వుంటుంది. కానీ (అవుట్ పుట్) వుండదు. అంటే ఇన్పుట్ = అవుట్‌పుట్. దీనర్ధం పిల్లలకి ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి. వాటిని వాళ్ళు కొన్నింటిని గ్రహిస్తుంటారు. గ్రహించినవి తిరిగి ఒప్పజెప్పాల్సిన అవసరం ఈ నేర్చుకొనే క్రమంలో లేదు.
ఒక్క సంవత్సరంపాటు పిల్లలు వింటూనే వుంటారు. జవాబు చెప్పాల్సిన, ఉపయోగించుకోవాల్సిన పని వుండదు. ఎవ్వరూ అలా ఒత్తిడి చెయ్యరు. ప్రతి చర్య అవసరం లేని స్వీకరణ ఇది. ఇదొక మౌన మహాయుగం
ప్రతీది సందర్భం నుంచే పిల్లలు నేర్చుకొంటారు. తాము పాల్గొనని తమకు సంబంధం లేని, అమూర్త నిర్వికారాంశాలకు ఇక్కడ తావులేదు.
-
ఇలా నేర్చుకొనేపుడు వాళ్లకేమో ఒక క్రమం లేదు. ముందు అక్షరాలు, తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు ఇలాంటి వరుస లేదు. ముందు 'అ చివర క్ష అనే క్రమం అసలే లేదు.
-
ముందు సులభం, తర్వాత క్లిష్టం అనే వరస కూడా లేదు. దిర్హాలు ముందు రావచ్చు. హ్రస్వాలు వెనక రావచ్చు. పిల్లలకందుతున్న భాష ఒక నిర్ధారిత క్రమంలో వుండదు. దానికో ప్రణాళికా, పద్ధతీ వ్లానింగూ, ఏమీ వుండవు.
ఈ అభ్యసన క్రమంలో ఏమి మాట్లాడారన్నది ప్రధానం కాదు. ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడకుందడానూ వుండొచ్చు. ఎలాంటి ఒత్తిడీ లేదు.
తమ స్వంత పద్ధతిలో పిల్లలు నేర్చుకొంటారు. దాన్ని ఎవ్వరూ రూప కల్పన చెయ్యరు. '“టీ* అనే ఒక మాటను ఒక పాప ఎలానైనా వాడు కొంటుంది. తాను పాలు తాగుతున్నా అమ్మమ్మ కాఫీ తాగుతున్నా నాన్నాటీ తాగుతున్నాా అన్నిటినీ (టీ) అనే అంటుంది.. ముందు తాను పట్టుకొన్న ఒక పేరు అన్నీ పానీయాలకూ పెట్టి, తర్వాత వేర్వేరు పేర్లు పెట్టుకొనే ఒక స్వంత క్రమం ఆ పాప ఏర్పరచుకొన్నదన్నమాట.
-
ప్రతి రూలునూ తనకు తానే బిడ్డ తెలుసుకొంటుంది. వ్యాకరణం ఎవ్వరూ చెప్పరు. 59
-
విచిత్రంగా అన్ని భాషల పిల్లలూ మొదట ప,బ,మ ధ్వనుల్ని ఇష్టపడతారు. “అమ్మి, బాబా, పావాొ” వంటివి వారికిష్టం.
భాష ఇంత సంక్షిష్టంగా వుందే అంశం కావడమేమిటే? నేర్చుకోవడం ఇంత సులభతరంగావడమేమిటి? భాషకున్న నిబంధనలు ఇంత సార్వత్రికం కావడమేమిటి? నేర్చుకొనే క్రమం ఇంత సార్వజనీనం కావడమేమిటి? అంతా విచిత్రంగా వుంది గదూ! అవును పెద్దలకు మనకు విచిత్రమే! పిల్లలకేమో ఇది అత్యంత సహజం,
ఇపుడు పెద్దలం మనం పట్టుకోవల్సిందల్లా ఈ అభ్యసన క్రమాన్నీ రహస్యాన్నీ.
60
ల్సి ప యం, (6 పిల్లలు భాష నేర్చు కొన్నట్టే రాయడమూ నేర్చుకోగలరా? భాషా, లిపీ ఈరెండిటి స్వభావం ఒకటేనా? పరిణామ వికాస క్రమాలూ ఒకటేనా? అలా అయితే భాష నేర్చుకొన్నట్టే అక్షరాల్నీ పిల్లలు సహజంగా నేర్చుకొనే వీలుందా? రెండిటి అభ్యసన (క్రమం సైతం ఒకటేనా? ఈ ప్రశ్నలు కొంచెం లోతైనవి. పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు. అన్న ప్రశ్నకు సందర్భం, స్వప్రమేయం, స్వీయావసరం, స్వేచ్చల ఆధారంగా నేర్చుకొంటారనీ, దీన్నే సహజ అభ్యసనమనీ ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. మరి . . లిపికీ (అక్షరాలకూ) ఇది వర్తిస్తుందా అంటే అంతే అని చెప్పడానికి మాత్రం వీళ్లలో చాలా మంది తటపటాయిసారు. అసలు మనం మాట్లాడ్డం నేర్పడం లేదు. పిల్లలే తమకు తాము నేర్చుకొంటున్నారు. కానీ ఏమీ నేర్చకుండా రాయడం నేర్చుకొనే వాళ్ళెవరున్నారు? కాబట్టి మాట్లాడ్డం రాయడం రెండూ ఒకేగాటన కట్టెయ్యదగినవి కావని ఎవరైనా తేలిగ్గా జవాబు చెప్పొచ్చు. మరికొంచెం లోతుగా చెప్పదల్సుకొంటే అసలు మాట్లాడ్డం ఒక తప్పనిసరి అవసరం. బిద్దకి ఆకలి వేసినపుడు దాన్ని ఏడుపు రూపంలో వ్యక్తం చేసినట్టే, ఆకలి తీరినపుడు దాన్ని కేరింత రూపంలో వ్యక్తం చేస్తుంది. దీన్ని భాషకు ప్రాథమిక రూపంగా మనం అనుకొంటే ఇది మనుగడకు సంబంధించిన సమస్య. ఇలా చూస్తే భాష ఓ విధంగా ఒక సహజాతం లాంటిది. అందుకు దీన్ని వ్యక్తీకరించేందుకు సహజమైన ఏర్పాటు వుంది. మన వాగ్యంత్రం ఇందులో భాగం. మరి లిపికీ స్వభావం ఎక్కడుంది. లిపి మనం అవసరం కొద్దీ కల్పించుకున్నది. రాసేందుకు వాదే సాధనాలు నోరులాగా, నాలుకలాగా సహజమైనవి గావు. అవి మనం సృష్టించుకొన్నవి. అవి మనిషి బాహిరమైనవి. అలాంటపుడు భాష నేర్చుకొన్నట్టే పిల్లలు లిపి ఎలా నేర్చుకోగలరు? దీనికి నేర్పడం తప్పనిసరి. ఒక క్రమంలో నేర్పడం మరింత తప్పనిసరి. ఈ రకమైన చర్చ ముందు కొస్తుంది. 61
అక్షరాల స్వభావం
దీన్ని తేల్చుకోవాలంటే లిపి స్వభావం లోకి మనం వెళ్ళాలి. దాని లక్షణాల్ని కొంచెం పరిశీలించాలి.
మొదటిది- మనం పెట్టుకొన్న పేరుకీ ఆ వస్తువుకీ ఎలా సంబంధం లేదో మనం రాస్తున్న అక్షరానికీ పలుకుతున్న ధ్వనికీ సైతం సంబంధం లేదు. గాడిదను గాడిద అనే ఎందుకనాలో చెప్పలేనట్టే ఒకానొక కంఠధ్వనికి “క అనే ఎందుకు రాయాలో కూడా మనం చెప్పలేము. గాడిదలాగే “కి కూడా మనం పెట్టుకొన్న ఓ సంకేతం. అమూర్త సంకేతం.
అందువల్లనే ఒక లిపిలో ఏ భాషనైనా రాయగలం అన్ని భాషల్నీ అన్ని లిపుల్లోనూ రాయగలం. -
ఇలా లిపి కేవలం సంకేతం మాత్రమే గాబట్టి ఏ లిపీ సమగ్రం, సంపూర్ణం కాదు. ఒక ధ్వనిని అనేక రూపాల్లో రాయడం సాధ్యం. ఒక అక్షరాన్ని అనేక విధాలుగా పలకడమూ జరుగుతున్నదే. బుషిని రుషి అని రాస్తే “అవును 'ఆజి అని రాస్తే ఒకటిని 'వొకటి” అని రాస్తే చదవడానికేమీ ఇబ్బంది వుండదు రెండు వస్తువులకు ఒకే పేరున్నటై రెండు ధ్వనులకు ఒకే అక్షరమూ మనం రాస్తున్నాం. ఒక ధ్వనిని ఒక చోట ఒకలాగా మరొకచోట మరోలాగా పలుకుతున్నట్టే ఒక అక్షరాన్ని ఒక చోట ఒక ధ్వనికీ, మరో చోట మరో ధ్వనికీ మనం ఉపయోగించుకొంటున్నాం. మనం చెప్పదల్పుకొన్న ప్రతిదానికి సరిపోయే మాటలు లేనట్టె మనం రాయదల్ఫు కొన్న ప్రతిధ్వనికీ సరిపోయే అక్షరాలూ లేవు. చేప, చాప, చాట ఈ మూడింటా పలుకుతున్న ధ్వనియేది? రాస్తున్నదేది? లేదా రాస్తున్నదేది? పలుకుతున్నదెది? లిపీ మారుతోంది
మరో అంశం పరిశీలిద్దాం. భాష రోజు రోజుకీ మారు తోంది. దాని పరిణామక్రమాన్ని మనం రికార్డు చెయ్యొచ్చుకూడా. గుర్రబు, గుర్రంబు, గుర్రంమ్ము, గుర్రము, గుర్రం. గుర్రం ఇలా రూపాంతరం చెందడం మన కళ్ళ ముందే చూస్తున్నాం. సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి వేగాన్ని బట్టి కూడా భాషలో మార్పులు కొల్లలుగా మనం చూడోచ్చు. ఇందులో ఏది సరైంది (లాక్షణికమైంది) ఏది సరైంది గాదు అని ్రశ్చిస్తే ఎవరికివారి భాష సరైంది అనడం కంటే జవాబు వుండదు. పిల్లవాడికి గుల్లం సరైంది. పండితుడికి గుర్రము సరైంది. మనకు గుర్రం సరైంది. స్కూలు మొహం ఎప్పుడూ చూడని వారికి ఇస్కూలు అంతే సరైంది. కాకుంటే మనం (అంటే సమాజం మీద ఒక పట్టుగల) ఒకానొక భాషని లాక్షణికం అంటున్నాం. అక్కడితో ఆగక ఈ లక్షణాలు తెలీని వారి భాషని గ్రామ్యం అనీ అచ్చ తెలుగులో అలగాజనం భాష అనీ కూడా ఎద్దేవా చేస్తున్నాం.
62
మరి లిపి కూడా ఇలానే మారుతోందా? మారుతోంది గానీ భాష మారినంత వేగంగా మారడం లేదు. దొనిక్కారణం భాషకున్నంత అవసరం, (ప్రాచుర్యం. సందర్భ వైవిధ్యం రాయడానికి లేకపోవడం గావచ్చు. కానీ మారుతుండటం మాత్రం అక్షరసత్యం. ఇప్పుడు కాఫీలోని ఫీకి కొత్త అక్షరం వచ్చింది. అమెరికన్లు డౌట్లో బి ఎందుకని ఎదురు తిరుగుతున్నారు. మన పిల్లలు బి, బిలకు ఎగనామం పెట్టేశారు. బండి '' తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది. వాపం 'బూ' అంతరించి “బు తోడులేక మినుకుమంటోంది శ, షు సలలో ఏదో ఒకదానికి తొందర్లోనే మూడేటట్టుంది. అసలు స(శు స(షు అని రాస్తే పోతుంది గదా అనే సవాలు వస్తోంది. అక్కడితో ఆగక అ ఒక్కటే మిగిలించి దానికి దీర్ధం గుడీ ఇత్యాదులిచ్చి ఆ, ఇ, ఈ అని పలికితే అక్షరాలు కలసి రావూ అనే పొదుపు ఉద్యమమూ తలెత్తుతోంది. ఎలక్షానిక్ యుగం ఇంకొంచెం ముదిరితే ఏ అక్షరాలు (పాపం వాటి పేరేమో అక్షరాలు -నశించనివి) ఎమవుతాయో ఎవరు చెప్పగలరు? ప్రపంచీకరణ తొండ ఊసిరవెల్లిగా మారితే అన్ని భాషలకీ ఒకే లిపి అనే చట్టం రాదని హామీ ఎవరివ్వగలరు? భాషకీ లిపికీ మధ్య ఓ అనిర్వచనీయమైన లయ వుంది గదా అనొచ్చు. లిపి ఏర్పడ్డాక ఆ లిపిలో మన భాషని ఏళ్ల తరబడి చూచుకోవడం అలవాటయ్యాక మనకలా కన్పిస్తోంది. ఇది కేవలం స్వీయ మానసిక విషయం. అంతేగానీ ఈ అనుబంధమేదీ భాషకీ లిపికీ మధ్య లేదని ఆధునిక లిపి శాస్రజ్ఞుల అభిప్రాయం. లిప- సహజాభ్యసనం భాషకీ లిపికీ మధ్య ఈ సాన్నిహిత్యం చూచాక ఇక లిపిని నేర్చుకోవడం దగ్గరికి వద్దాం. భాషలా లిపి ఒక సహజాతం లాంటిది కాదుగదా మరి సహజ అభ్యసనం ఎలా సాధ్యమనేది చాలా విలువైన ప్రశ్న పిల్లలు అవసరం వున్నా లేకున్నా ఏదో ఒకటి గొణక్కుంటుంటారు. ఏదో ఒక శబ్దం చేస్తూనే వుంటారు... ఇది చాలా చిన్న వయస్సు నుంచీ మనం చూస్తున్నాం. అలాగే పిల్లలు వదో ఒకటి నేల మీద, గోడల మీద గీయడమూ మనం గమనించొచ్చు. తాను భావిస్తున్న దానికి (ఆ మూర్త భావనకి) ఓ సంకేతం (మూర్త రూపం) కల్పించుకోవడంలో ఇది భాగమా? లిపికిదే ప్రాథమిక రూపమా? అసలు ఆదిమ మానవుడు మాటలు రాక సైగలు చేసుకొనే కాలంలోనే తన భావాల్ని బొమ్మల ద్వారా సంకేతాల ద్వారా తెలియజేసేవాదని చాలా ఆధారాలు కూదా మనకు దొరుకుతున్నై కదా! కాబట్టి భాష లానే రాత కూడా ఓ సమాజావసరం. సహజాతంలాంటిదనే వాదన కూడా ముందుకొస్తోంది. అదెలా వున్నా భాష నేర్చుకొనే క్రమానికీ, రాత నేర్చుకొనే క్రమానికీ మధ్య సామ్యం మాత్రం మనం గమనించి తీరాలి. అంగీకరించి తీరాలి. అసలు పిల్లలు భాషనీ అక్షరాల్నే గాదు నడక నేర్చుకోవడంలో కూదా ఓ క్రమం వుంది. ఓ వ్యాకరణం వుంది. ప్రతి అమూర్తంశాన్ని మనిషి తెలుసుకోడానికి ఒక క్రమం వుంది. ఈ క్రమాల మూల స్వభావం, లక్షణం ఒకటిగానే 63 -
వుంటై. దీన్ని అర్ధం చేసుకొంటే పిల్లలు రాయడం నేర్చుకోవడంలోనూ, భాషను నేర్చుకోవడంలో ఒక క్రమమే చాలా వరకు వుందని మనం అనుభవం నుంచి తెలుసుకోవచ్చు.
భాషని పిల్లలు ఒక సందర్భంలో నేర్చుకొంటారని మనం అంగీకరిస్తే లిపిని ఒంటరిగా గాక ఒక కాన్టెక్ట్స్లోనే పిల్లలు నేర్చుకొంటారు. మనం అలా నేర్పడమే సహజాభ్యసనం. అ, ఆ, ఇ అని దిద్దేపుడు ఏ సందర్భం వుంది?
పిల్లలు స్వప్రమేయంతోనే భాషను నేర్చు కొన్నట్టు రాయడంలో ఆ ప్రమెయం ఎంత కల్గిస్తే అంత సహజాభ్యసనం,( బొమ్మలు, గీసినట్టు అక్షరాలు స్వంతంగా గీయడానికి ఉద్యుక్తులు కావాలి)
పిల్లలు భాషని ముక్కలు ముక్కలుగా గాక సమ(గ్ర రూపంలోనే నేర్చుకొన్నట్టు లిపినీ అ ఆ ఇ ఈ అని ముక్కలు చెయ్యడం గాకుండా పదాలు, వాక్యాలుగా నేర్చుకోవడం( అదీ ఓ సందర్భంలో) సహజాభ్యసనం.
మనం పట్టుబట్టి ప్రతిమాటా నేర్పితే, వ్యాకరణం చెపితే పిల్లలకు భాషరాలేదు. అలాగే ఎంతసేపు దిద్దిస్తే అంతగా అక్షరాలు వస్తాయనేది మన భ్రమ. మాటాడుతున్న క్రమంలో భాష వచ్చినట్టే చదువుతున్న క్రమంలోనే రాయడం వస్తుంది.
తప్పులు మాటాడుతూనే బాగా మాట్లాడ్డం నేర్చుకొన్నట్టు తప్పులు రాస్తూనే పిల్లలు సరిగా రాయడం నేర్చుకొంటారు. '“గుల్లం' అనగానే మనం ఎలా బెంబేలు పడమో 'అమం' అని రాయగానే మనం అన్యాయం జరిగిపోయిందను కోకూడదు.
ఇన్‌ఫుట్ - బెట్ఫుట్ అనే సూత్రం భాషకు మళ్లే రాతకీ వర్తిస్తుంది. ఒక పదాన్ని చదవగల్లిన మరునాడే డిక్టేషన్ చెప్పడం అర్థరహితం. ఏడో పాఠంలో వున్నవాడు మూడో పాఠం పదాలు బాగా రాయగల్లితే చాలు రాస్తాడు. పరిసరాలు అనుకూలంగా వుంటే పిల్లలు రెండు భాషలూ మాట్లాడగల్గినట్టే రెండు లిపులూ నేర్చుకోగలరు. కానీ ఏ భాషా వాతావరణం ఎక్కువగా వుంటే ఆ భాషలో పట్టు చిక్కినట్టె. ఏ లిపి వాతావరణం ఎక్కువుంటే అందులో బాగా రాయగలరు.
ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు గానీ అసలు సూత్రం మాత్రం ఒక్కటే. అదేమంటే పిల్లలు దేన్నైనా నేర్చుకోడానికి ఓ క్రమం, ఓ పద్ధతి వుంటుంది. ఆ క్రమం, పద్ధతీ అన్నింటా దాదాపు ఒక్కటే. కావల్సిందల్లా దీన్ని మనం అర్ధం చేసుకోవడం, అంగీకరించడం.
64
రాతలో రమనీయకత
“నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు” అన్నాడు అభ్యుదయ కవి బాలగంగాధర్ తిలక్.
మన తెలుగు అక్షరాలు నిజంగా అంత అందమైనవి. ఎందుచేతనంటే తెలుగుభాషలోని ప్రతి అక్షరం గుండ్రంగా వుంటూ (0) సున్న నుండి రూపుదిద్దుకొంది. చక్కని చేతిరాత అందమైన మనస్సుకు ప్రతీక అని కొందరంటే, అందంగా రాయడం దేవుని వరం అంటారు మరికొందరు. గాంధీజీ సైతం తన చేతిరాత బాగా వుండనందుకు జీవితాంతం బాధపడుతూ “11206 1/0౧6082 13 16 81% 0604" అన్నాడట.
విశ్లేషించి చూస్తే చేతిరాత కేవలం భగవద్దత్తం అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ప్రాథమిక దశలోనే ఒక శాప్రీయమైన విధానం ప్రకారం మన బాలబాలికలకు చేతిరాత నేర్పితే తప్పకుండా వారికి మంచి దస్తూరి అలవడుతుంది. రాతకు సంసిద్ధత
ప్రారంభదశలో పిల్లలచేత బలవంతంగా రాతపని చేయించకూడదు. చిన్నారి బాలలకు చిరుతప్రాయంలో ఎక్కువ కష్టంతో కూడినది రాతపని. వాచక శిక్షణ, నటన శిక్షణ కొంతవరకు అలవడిన తరువాతనే రాతపని ప్రవేశపెట్టాలి.
విద్యార్థులకు అభిరుచి కలిగించే కథలు వినిపిస్తూ ఆసక్తిదాయకమైన కబుర్లు చెబుతూ
- ఆయా సందర్భాలలో వివిధ ఆకారాలు గల రేఖలను బోర్డు మీద గీయాలి. వాటిని పిల్లలు
అనుకరించి గీసారు,
శ్రైశవదశలో వారికి ఆసక్తి కలిగించే విషయాలు ఆటవస్తువులు, తినుబండారాలు, జామకాయలు, సపోటా, నేరేడు పండ్లు మొదలైనవి వారికి ఇష్టమైన ఖాద్య ఫలాలు, లడ్డు,
65
అరిసెలు, గారెలు మొదలైన పిండివంటలంటే వాళ్ళకు అమితటప్రీతి. దాదాపు ఇవన్నీ గుండ్రంగా వుంటాయి. రాతలో అన్నిటికంటే మొదటి సోపానం పిల్లల చేత సాధ్యమైనంత ఎక్కువసేపు సున్నాలు చుట్టించడం. ఎందుచేతనంటే మనం ముందే చెప్పుకొన్నాం కదా - మన భాషలో ప్రతి అక్షరానికి మాతృక 'సున్నాా అని ! అలాగే సాధన కొరకు వాళ్ళ చేత అర్ధవృత్తాలు కూడా చుల్టించవచ్చు. ఇందుకోసం వారిలో సహజమైన ప్రేరణ కలిగించాలి. సగం తుంచిన అరిసె, లేక బిస్కట్టు లేక ఆకాశంలో అర్ద చంద్రుడు వీటితో పోల్చి చెబుతూ గీయిస్తే పిల్లలకు చాలా సరదాగా వుంటుంది. ఆడ పిల్లలు వేసుకొనే గాజులు, పెట్టుకొనే నుదుటిబొట్టు, తిలకం - వీటి ఆకారాలన్నీ పిల్లల చేత గీయించవచ్చు. రాత ఎలా నేర్పాలి ? బాలబాలికల లేత కండరాలు, నరాలు బలపం లేక పెన్సిలు పట్టుకోవడానికి తగిన సామర్ధాన్ని పొందిన తర్వాతనే గీతలు గీయించాలి. వాళ్ళు చేతిలో బలపం లేక కలం పట్టుకొనే సరియైన పద్ధతి కూడా ఉపాధ్యాయుడు నేర్పించాలి. చక్కని వ్రాతను అభ్యసించడంలో లేఖన సామాగ్రిని కుదురుగా పట్టుకోవడం కూడా ఒక భాగమే. ఒక క్రమ విధానంలో పిల్లలకు రాత నేర్పాలి. ముందుగా వారికి పరిచితమైన పదాలతో చిన్న చిన్న మాటల ద్వారా రాత నేర్పాలి. ఉదా: పలక = అరక బంతిపువ్వు - జామపండు ఆ తర్వాత సరదాగా వుండే చిన్నచిన్న వాక్యాలు ప్రవేశపెట్టాలి. ఉదా : మల్లెపూవు తెలుపు చిలక ముక్కు ఎరుపు చింతపూత పులుపు ఈ వాక్యాలు పిల్లలకు పరిచిత మైనవిగా ఉండాలి. * కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ అరటితొక్క బల్లచెక్క రొట్టెముక్క 66 ఇ
వినసొంపైన ప్రాసతో, లయబద్ధంగా సాగే ఇలాంటి మాటలను పద్యాలను పిల్లలు ఆసక్తిదాయకంగా పలకడానికే కాకుండా, రాయడానికి కూడా ఇష్టపడతారు. రాతను అభ్యాసం చేయించే ప్రథమదశలో వాళ్ళకు ఇష్టమైనవాటినే రాయించాలి. తద్వారా పిల్లల్లో రాయాలనే ఉత్సాహం ద్విగుణీకృతమవుతుంది. కాపీ రాయించే పద్దతి
కాపీ పుస్తకాలలో పైన రాయబడిన 'మేలుబంతి” వాక్యం మంచి నమూనాలో పిల్లలు రాయగలిగేలా వుందో లేదో చూడాలి. మేలుబంతిలో వుండే అక్షరాల పరిమాణానికి, దానికింద పిల్లలు రాయడానికి వేయబడిన రూళ్లకు సంబంధం వుండేలా చూడాలి. వీలైతే ఉపాధ్యాయుడు తానే మేలు బంతి వాక్యాన్ని రాస్తే మంచిది. సాధ్యమైనంత వరకు వినసొంపుగా వుండి పిల్లలను ఆకర్షించే వాక్యాలు, పద్యగేయ వాక్యాలు రాస్తే మంచిది.
'దేశమును (ప్రేమించుమన్నా!
“మా తెలుగుతల్లికి మలళ్లెపూదంది
ఉపాధ్యాయుని ఒరవడి
ఉపాధ్యాయుడు సైతం చక్కని రాత రాయగలిగితే.... పసిడికి పరిమళం అబ్బినటే! ఎందుకంటే ఉపాధ్యాయుని రాత ప్రభావం విద్యార్థులపై అణువణువునా వుంటుంది. అందుకే ఉపాధ్యాయుడు బోర్డు మీద రాసేటప్పుడు ఆదర్శవంతమైన దస్తూరి రాయాలి. అతని అక్షరాలు చక్కని కుదిరిక కలిగినవై ఉండాలి. తనకు నచ్చిన రకరకాల చేతిరాతలను విద్యార్థులకు ప్రదర్శించి చూపి విద్యార్థులలో రాతపట్ల అభిరుచి కలిగించాలి.
అందమే ఆనందం. చక్కని రాత కళాభిరుచికీ, సౌందర్యాభిరుచికీ దోహదం చేస్తుంది. పిల్లల్లోని సౌందర్య పిపాసను వెలికి తీస్తుంది. ఒక మహాకవి చెప్పినట్లు - భగవంతుడు సైతం గొప్ప లేఖకుడు! అనంతమైన ఆకాశం ఆయనకు కాగితమైతే, అందమైన నక్ష్మత్రాలే దేవుని లేఖిని నుండి జాలువారే సుందరమైన అక్షరాలు! అరుజోదయానికి స్వాగతం పలుకుతూ ఆయన రాసిన లేఖకు పుల్‌స్టాప్ - వేగుచుక్క!
= కుందా భాస్కరరావు, డి.ఐ.ఇటి., నరసారావుపేట 67
భాషా బోధనలో భిన్న ధోరణులు
ఖాషను అభివృద్ధి చెందిన మానవుడి మెదడుకు ఫలితంగానే గాక మానవుడి మెదడు అభివృద్ధికి ఒకానొక హేతువుగా కూడా నేదు పరిగణిస్తున్నారు. సైగల రూపంలో, చిన్నచిన్న ధ్వనుల రూపంలో మొదలైన భాష నెడు అత్యంత విసృతంగా, సంక్షిష్టంగా కూడా పరిణతి చెంది మన అవసరాల్ని అద్భుతంగా నెరవేరుస్తోంది.
భాషా నిర్మాణం వాస్తవానికి అంత సరళమైంది ఏమీ కాదు. (ప్రతి భాషకూ తనదైన నిర్మాణ పద్ధతి వుంది. అదే సందర్భంలో అన్ని భాషలకూ సమానమైన కొన్ని నియమాలు వున్నాయి. ఏ చిన్న నియమాన్ని ఉల్లంమ్ంచినా, చిన్న పొరపాటు చేసినా మొత్తం చెప్పదల్భుకొన్నదే తారుమారయ్యే ప్రమాదం వుంది. “వేసవిలో సంపన్నులు తాళలేక ఊటీ, సిమ్లా వంటి శీతల ప్రదేశాలకు వెళుతుంటారు” అనే వాక్యంలో “తాళలేక అనే పదాన్ని 'తాళంలేక' అని చదివితే ఏమవుతుంది? ఇలాంటివి ఉదాహరణలు ఎన్నైనా మనం నిత్య జీవితంలో చూడవచ్చు.
వచనం మారినపుడు, లింగం వేరైనపుడు, కాలాల్లో భేదం వచ్చినపుడు (క్రియల్లో వచ్చే మార్పులకు మనం అలవాటు పడ్డాం గాబట్టి మాతృభాషలో సవాళ్ళుగా కన్పించవు గానీ ఇతర భాషల్లోనైతే తలనొప్పిగా వుంటాయి. సంస్కృత భాషలో 'దారా:” (భార్యలు) అనేది పుంభింగం. అది బహువచనంలో మాత్రమే వుంటుంది. హిందీలో నపుంసన లింగం లేదు. ఉన్నదల్లా స్రీ పురుషాలే. హిందీలో 'నే' ప్రత్యయం వచ్చినపుడు క్రియ కర్తనుబట్టి గాక కర్మను బట్టి మారుతుంది. ఆంగ్లంలో కర్మణే పదిక (02531౪76 ౪0106) ప్రాధాన్యత ఎక్కువ.
ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నైనా చెప్పవచ్చు. మరి ఇంత సంక్లిష్టమైన, దేనికది ప్రత్యేకమైన భాషల్ని మనం ఇంత అలవోకగా ఎలా నేర్చుకొంటున్నాం? మనలో ధారాళంగా మాట్లాడ్డం గానీ, అభివ్రాయాలు వ్యక్తం చెయ్యడం గానీ చేతగాని వాళ్లు ఎవ్వరూ లేరు. అందరం కొంచెం అటూ ఇటూగా అత్యంత సమర్ధవంతంగా విని అర్ధం చేసుకొంటున్నాం.
68 న
మాట్లాడుతున్నాం. ఈ నైపుణ్య సంపాదనా క్రమంలో కూడా మన మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. అందరం ఒకే వయస్సులో ఒకే 'పాండిత్యం” సంపాదిస్తున్నాం. మన పిల్లలకు గల పద జాల సంపద కూడా దాదాపు ఒకే మోతాదులో వుంటోంది. ఇదెలా సాధ్యమవుతోంది?
మనమెవ్వరమూ ముందు వ్యాకరణం నేర్చుకొని తర్వాత మాట్లాడ్డం మొదలు పెట్టలేదు. ప్రతిదీ ఎవరో ఒకరు పట్టుపట్టి, చెవిమెలిపెట్టి నేర్చితేనే మనకిది వొంటపట్టలేదు. అన్నిటికంటె మించి ఒక పద్ధతి, ఒక క్రమం ఎవరో నిగ్దేశిస్తే దాని ప్రకారం మనం నేర్చుకోలేదు.
మరి చదవడం రాయడం దగ్గరికొచ్చెప్పటికి ఇలా జరగడం లేదు. ఎక్కువమంది ఇందులో వెనకబడిపోతున్నారు. కొందరు సాధ్యం గాదని పారిపోతున్నారు. చాలామంది పెద్ద భారంగా ఈదలేక సతమతమవుతున్నారు. దీనిక్కారణాలేమిటి? ఈ నైపుణ్యాలు (చదవడం, రాయడం, వినడం, మాట్లాడ్డం కంటె చాలా సంక్షిష్టమైనవా? మనిషి మెదడు ఈ నైపుణ్యాల్ని సంతరించుకోవడానికి వెనకబదేంత బలహీనమైందా? ఒకేసారి రెండు మూడు భాషలు కూదా మాట్లాడగల్లుతున్న పిల్లలు మాతృభాషను కూడా ఎందుకు చదవలేకపోతున్నారు? సంవత్సరాల తరబడి శ్రమించినా ఎందుకు అనుకొన్న ఫలితాలు సాధించలేకపోతున్నారు?
పిల్లలు సహజమైన సందర్భాల్లో స్వేచ్చగా పాల్గొనడం వల్ల మాట్లాడ్డం అంత సులభంగా నేర్చుకోగల్టుతున్నారని ఇప్పుడందరం అంగీకరిస్తున్నాం. భయం, ఒత్తిడీ లేని వాతావరణంలో తప్పుల్ని లెక్కించి ప్రతిది సరిచేసే పరిస్థితి లేనిచోట, ఎంత నేర్చుకొన్నారని అడుగడుగునా మూల్యాంకనం చేయని పద్ధతిలో వారు నేర్చుకొంటున్నారు.
అంతేకాదు. పిల్లలు భాషను అవసరాల ప్రాతిపదికన నేర్చుకొంటున్నారు. వినత సమాచారం అందుబాటులో వుండటంతో పాటు అందులోంచి తమ ఇష్టం వచ్చింది, తమక్కావల్సింది ఉపయోగించుకొనే, సం(గ్రహించుకొనే స్వేచ్చ కూడా వారికి వుంది. తమ అవసరాల్ని ఏది తీరుస్తుందో దాన్ని మాత్రమే పిల్లలు అభివృద్ధి చేసుకొంటారు. ఈ క్రమం నుంచే పిల్లలు నేర్చుకొంటున్నారు.
భాషాతత్వవేత్తలు దీనిమీద ఇప్పటికే కావల్సినన్ని తర్జనభర్జనలు చేశారు. మళ్ళీ దీని జోలికి మనమిక్కడ వెళ్లనక్కరలేదు. కానీ ఈ నేపథ్యంలో మనం భాషను తరగతి గదిలో నేర్పుతున్న పద్ధతిని మాత్రం సమీక్షించుకోవలసి వుంది.
సాధారణంగా మనమందరం నేర్చుకొన్నదీ, నేర్చుతున్నదీ అక్షరాల్ని ఒక వరుస క్రమంలో రాయించే (దిద్దించే) పద్ధతి. దీన్ని అక్షరపద్ధతి అంటున్నాం. ప్రతి భాషకూ ఒక అక్షరమాల వుంటుంది. అందులోని అక్షరాలకు ఒక వరస వుంటుంది. ఈ వరస ప్రకారం పలికించడం (గుర్తించడం), రాయించడం నేర్చడంతో మనం భాషాబోధనను ప్రారంభిస్తున్నాం.
69
ఆంగ్లం లాంటి భాషకున్న అక్షరమాల చిన్నది. తమిళం లాంటి భాషకు గల అక్షరమాల చాలా సరళమైంది. ప్రతిధ్వనికీ ఒక అక్షరం ఆ భాషల్లో లేదు. సందర్భాన్నిబట్టి ఒకే అక్షరాన్ని పలు ధ్వనులతో పలకడం వారి సంప్రదాయం. సంస్కృతంలో, తెలుగులో అలా కాదు. అక్షర మాల చాలా పెద్దది. వీటికి తోడు గుణింతాలు, ద్విత్వాలు, సంయుక్తాలు, సంశ్లిష్టాలు కూడా కలిపితే ఇది చాలా పెద్దదవుతుంది. ఇవన్నీ నేర్చుకోవడమే, గుర్తించి రాయగల్గడమే భాష నేర్చుకోవడంగా మనం పరిగణిస్తున్నాం.
ఒక్క మన భాషకే గాదు, మనదేశంలోనే కాదు ప్రపంచమంతా ఈ పద్ధతి చాలా కాలం నుంచి, బహుశా లిపి ఏర్పడినప్పటి నుంచి కొంచెం తరతమ తేడాలతో కొనసాగుతోంది. దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా చాలా వాదనలున్నాయి. వినడం, మాట్లాడ్డం చెసినట్టె చదవడం, రాయడం నేర్చుకోలేమేమో అనేదానిపై తర్దనభర్దనలున్నాయి.
అనుకూలంగా మాట్లాడేవారు, “అసలు అక్షరాలు రాకుండా చదవడం ఎవరైనా ఎలా నేర్చుకొంటారు" అని ప్రశ్నిస్తారు. ఒక ఇల్లు కట్టడానికి వరసగా ఇటుకలు పేర్చినట్టే ముందు అక్షరాలు నేర్చుకొన్నాకే రాయడం వస్తుంది. అప్పుడీ అక్షరాల్ని కలుపుకొంటే సరిపోతుందనేది సాధారణమైన సమాధానం.
ప్రతి భాషకూ ఒక లిపి వుంటుంది. ఆ లిపి ఆ భాషకు స్వంతం. భాషా హృదయం లేదా సౌందర్యం (లయ) లిపిలో దాగి వుంటుంది. అందువల్ల భాష నుంచి లిపిని విడదీయలేము. ఉదాహరణకు తెలుగులోని అచ్చులు వాటిలోని హ్రస్వదీర్చాలు ఒకానొక పద్ధతిలో (లయాత్మకంగా) వున్నాయి. వాటిని అదే వరసలో నేర్చుకోవడం తప్పనిసరి. అలా నేర్చుకోవడం వల్ల ధ్వనుల్ని గుర్తించడం తేలిక, వాటిలోని భేదాల్ని లేదా సామాన్యుల్ని గుర్తించడం తేలిక అనేది మరో వివరణ. శ ష స అనేవి మూడు ఒక వరుసలో వుండటం వళ్లే వాటిలోని సున్నితమైన తేడాని గుర్తించగల్లుతున్నాం. అఆ ఇ ఈ ఉ ఊ లలో ఒక క్రమం ఉంది. ఒక లయ వుంది. అవి (అచ్చులు) నేర్పాక హల్లులు నేర్పితే గుణింతాలు నేర్పడం తేలిక, శాప్రీయం కూడా. చాలామంది అభి'ప్రాయమిది.
వినడం, మాట్లాడ్డం నేర్చుకొన్నట్టుగా, అంత సహజంగా మనం చదవడం రాయడం నేర్చుకోలేము. భాష మౌఖికంగా అందుబాటులో వున్నంతగా రాతలో అందుబాటులో వుండదు. అంటే వాతావరణం, సందర్భం కల్పించడంలో శ్రవణ భాషణ నైపుణ్యాలకున్న అవకాశం పఠన లేఖన నైపుణ్యాలకు లేదు. ఆవశ్యకత ప్రాతిపదికన చూసినా మొదటి రెండింటికి గల ప్రాధాన్యత రెండోవాటికి లేదు. అందువల్ల కూడా రెండూ ఒకే రకంగా నేర్చుకోగల్లడం అసాధ్యం. మరో అంశం ఏమంటే మానవ శరీరాంతర్గతంగానే స్వర యంత్రం వుంది. అత్యంత సహజంగా ఇతరావయవాలు స్పందించినట్లే ఇదీ స్పందించి ధ్వనుల్ని ఉత్పత్తి చేయగలదు. వినడం, మాట్లాడ్డం
70
అనేవి ఒక రకమైన స్పందనలు, కానీ చదవడం, రాయడం అలా కాదు. వీటికోసం బయటి పరిసరాల మీద ఆధారపడాల్సి వుంది. ఇదొక అదనపు నైపుణ్యమే తప్ప అత్యవసర సహజావసరం కాదు, స్పందనా కాదు. అందువల్ల ఒకేలా నేర్చుకోవడం మొదటి రెండు నైపుణ్యాలకూ, తర్వాతి రెండు నైపుణ్యాలకూ కుదరదనేది మరో సమాధానం.
ఇక రెండో వాదన ఇటీవలది. ఇది ఎక్కువగా భాషా శాస్త్రం మీద, మానవ అభ్యసన పరిశోధనల మీద, మానసిక తత్వశాస్త్రం మీద ఆధారపడి వుంది. సాపేక్షంగా ఇది ఆధునిక వాదం.
భాషకు లిపి మనం కల్పించుకొన్నదే. అక్షరమాల, అందులోని క్రమం మనకు మనం పెట్టుకొన్నదే. అందువల్ల ఒక్కో భాషకు ఒక్కో క్రమం వుంటుంది. ఒకవేళ ఒకే క్రమం వున్నట్లు కన్పించినా (ఉదా; ద్రావిడ, ఆర్య భాషలు వేరైనా అక్షర మాలాక్రమం ఒకటిగానే వుంది) అది ముందుగా ఒక భాష ఏర్పరుచుకొన్న క్రమాన్ని అనుసరించి మరొక భాషవారు పెట్టుకొన్నదే తప్ప మరొకటి కాదు. చాలాకాలం ఒకే వరసలో చదివీ చదివీ అలవాటుపడి దాన్ని సహజ (క్రమంగా, ఆ భాషకు మాత్రమే సరిపోయే స్వంత (క్రమంగా మనం బ్రమపడుతున్నాం. లయ అనబదేది కూడా చాలావరకు అంతే. సంస్కృతం లాంటి భాషలు వర్ణమాలలోని అక్షరాల్ని వాటి ఉత్పత్తి స్థానాల ఆధారంగా నిర్ణయించాయి. (ఆ-కంఠ్యం, ఆ-తాలవ్యం,). కొన్ని సుదూర భాషల వర్ణమాలల మొదటి అక్షరాలు ఒకటి రెండు ఒకే ధ్వని గలవి వుండొచ్చు. అది కొంత యాదృచ్చికం, కొంత ధ్వనికి గల ప్రాధాన్యత ప్రాచుర్యం, సౌలభ్యం మీద (ఉదా; ఆంగ్లం ఎ, తెలుగు అ రెండూ మొదట వున్నాయి) ఆధారపడిన విషయం. అంతకు మించి శాస్త్రీయత అక్కదేమీ లేదు. కాబట్టి ఇదే క్రమంలో నేర్చుకోవడం వల్ల భాష నేర్చుకోవడంలో వారిగేదేమీ వుండదని వీరి అభిప్రాయం. అంతేగాదు ఈ రోజు కాకుంటే రేపైనా అన్ని భాషలకూ ఓ లిపి (అంతర్జాతీయ లిపి) వీలున్నన్ని తక్కువ అక్షరాలతో వస్తుందని ఇది లిపి పరిణామక్రమమని వీరు నమ్ముతున్నారు. మనం ఎంత కావాలనుకొన్నా కొన్ని అక్షరాలు అదృశ్య్వమవుతున్నాయి. కొన్ని కొత్తవీ వచ్చి చేరుతున్నాయి. బాగా అభివృద్ధి చెందిన భాషలు అక్షరాల్ని మరి తగ్గించుకొంటున్నాయి. ఇవన్నీ కూడా లిపి-భాషల మధ్య విడదీయరాని సంబంధం వుందనడాన్ని వ్యతిరేకిస్తున్న అంశాలుగా వీరు పేర్కొంటున్నారు.
అన్నిటికంటె ముఖ్యమైంది మరొకటి వుంది. అదేమంటే మనం భాషను ముక్కలు ముక్కలుగా నేర్చుకొవడం లేదు. మొత్తంగానే నేర్చుకొంటున్నాము. పిల్లలు చెసే చిన్నచిన్న ధ్వనులు కూడా సారాంశంలో వాక్యాలే. అలాగే వాళ్ళు వచ్చీ రాక పలికే చిన్నచిన్న పదాలు కూడా వాక్యాలే. 'అమ్మ' అంటే అమ్మ వచ్చిందనో, కొట్టిందనో, కావాలనో అర్ధం మనం
గ!
మొదట చిన్న చిన్న ధ్వనులు, తర్వాత పదాలు, వాక్యాలు భాషా నిబంధనలు నేర్చుకోవడం లేదు. ఒకే రకమైన ధ్వనుల్ని ముందుగానూ, మరొక రకమైనవి తర్వాత నేర్చుకోవడమూ లేదు.
కేవలం గుర్తు పెట్టుకోవడం ద్వారా, అంటే జ్ఞాపకశక్తి మీద ఆధారపడి కూడా మనం భాషను నేర్చుకోవడం లేదు. అనేక సందర్భాల్లో పాల్గొంటూ మన అవసరాల్ని మాటిమాటికీ ఉపయోగించుకొంటున్నందువల్లనే ఏమాటలైనా మనం నేర్చుకోగల్లుతున్నాం. వినియోగం లేనివి మనం వదిలేస్తాం లేదా మరిచిపోతాం. అలాగాక అక్షరాలు నేర్చే పద్దతిలో కేవలం అక్షరాల్ని వేరుగా నేర్చుతున్నాం. అంటే భాషను ముక్కలు ముక్కలుగా చేసి ఒక క్రమం పెట్టి నేర్పుతున్నా మన్నమాట. అంతేగాక అక్షరాలకి అర్ధం లేదు. స్వంతంగా వినియోగం లేదు. ఒక రకంగా మొండిగా గుర్తుంచుకొనే సర్మసు తప్ప మరొకటి లేదు. ఇది కృత్రిమమైన క్లిష్టమైన పద్ధతి. ఎన్ని అక్షరాలు నేర్చినా పదాలు రావు. అప్పటి దాకా నేర్చుకొన్న అక్షరాలు ఏమాత్రం వినియోగంలోకి రావు. అలాంటివి ఎలా గుర్తుంటాయి? ఎందుకు గుర్తుండాలి? మానవ అభ్యసన విధానానికే ఇది విరుద్ధం. ఇలా ఈ పద్ధతిని నేడు చాలామంది వృతిరేకించి సమగ్ర దృక్పథాన్ని భాషాభ్యసనంలో శాస్రీయమైనదిగా ముందుకు తెస్తున్నారు.
పూర్వం మనం ముందు అక్షరాలన్నీ ఒక్కటి కూడా పొల్లు పోకుండా నేర్చుకొని, తర్వాత వాటి గుణింతాలు, ఆ తర్వాత వాటి వొత్తులు నేర్చుకొని అప్పుడు మాత్రమే పదాలు రాసేవాళ్ళం. నిజానికి “అ నుంచి *కి వరకు నేర్చుకోగానే ఎవరైనా “ఈక, 'ఒకి లాంటి పదాలు నెర్చుకోవచ్చు. ఇది కూడా మనం చేసేవాళ్ళం గాదు.
క్రమక్రమంగా సాంప్రదాయిక అక్షర పద్ధతిలో కూడా మార్పులు వస్తున్నాయి. అవసరం లేని బు బూ లాంటివి మనమే తొలగించేశాం. అంతగా (ప్రాచుర్యం లేని మహా ప్రాణాలను (ఖఘ,ఛ,రు,ఠ,ఢ,థ,ధ,ఫ,భ) వరుస నుంచి తప్పించి చివర నేర్పుతున్నాం. కొన్ని అక్షరాలు నేర్చగానె వాటితో వచ్చే పదాలు నేర్చి, ఆ అక్షరాల్ని కల్పిస్తున్నాం. (కొందరైతే మరో ముందడుగు వేసి పదాలతోనే భాష నేర్పడం కూడా చేస్తున్నారు. అర్ధంలేని, స్వంతంగా వినియోగంలో లేని అక్షరాల్ని నేర్పడం వల్ల వాటిని గుర్తుంచుకోవడం అసాధ్యమన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు.)
ఈ పద్ధతిలో అక్షరాల్ని వరుస క్రమంలో నేర్చడం వుండదు. బాగా ప్రాచుర్యంగల, వాడుకలోని పదాల్ని నేర్పి వాటిలోని అక్షరాల్ని కూడా పరిచయం చేస్తారు. దీనివల్ల పదజాలం పిల్లలకి మొదటి నుంచే అందుబాటులో వుంటుంది. నేర్చుకొన్న ప్రతిదీ వినియోగంలోకి వస్తుంది. గుడ్డిగా గుర్తుంచుకో నక్కరలేదు.
72
కొద్ది పదాలు నేర్చగానె చిన్నచిన్న వాక్యాలు కూడా నేర్చవచ్చు. అప్పుడు నేర్చుకొన్నది మరింత వినియోగంలోకి వస్తుంది. ప్రతిదీ అర్ధవంతంగా కన్పిస్తుంది.
అక్షర పద్ధతి మీద మరొక సవాలు కూడా చాలా విలువైంది వుంది. ఈ పద్ధతిలో మొదట రాయడం తర్వాత చదవడం నేర్పుతున్నాం. భాషాభ్యసన క్రమానికిది విరుద్ధం. ముందు చదవడం తర్వాత మాత్రమే రాయడమనేది శాస్త్రీయం. ముందు చదవాలంటే అవి గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవడం వినియోగించుకొనే క్రమంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు చదవగల వారు మాత్రమే రాయగల్గుతారు. మనం ఎంత దిద్దినా హిందీ అక్షరాల్ని ఇప్పుదేంతమంది గుర్తుంచుకో గల్గుతున్నాం? దీనిక్కారణం వీటిని వినియోగించుకోలేకపోవడమే. మన మెదడుకు అవసరం ప్రాతిపదికన ఎన్నిటినైనా గుర్తుంచుకొనే సామర్ధ్యం అద్భుతంగా వుంది.
దీనికి మరో ముక్తాయింపు కూడా లేక పోలేదు. అసలు ఏ విద్యావంతుదైనా చదవడానికి వినియోగించుకోవడంలో 10వ వంతు కూడా రాయడానికి భాషను వినియోగించుకోడు. మహా కవులకు కూడా ఇది వర్తిస్తుంది. గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు వయోజన విద్య నేర్పించేపుడు పలకా బలపాలుండేవి కాదు. వారి విద్యలో రాయడానికి స్థానమే లేదు. కేవలం చదవడం మాత్రమే నేర్చవారు. దీనర్ధం మనం రాయడం నేర్చనక్కర లేదని కాదు చదవడానికి రాయడం నేర్చుకోవడం తప్పనిసరి అవసరం కాదని చెప్పడానికి మాత్రమే.
మరి ఈ పద పద్ధతిలో కూడా వున్న దేమిటి? ప్రాచుర్యం గలవి, సులభమైనవి అనే పేర కొన్ని పదాల్ని వాటి అక్షరాల్ని ఎంపిక చేసి మళ్ళీ ఒక క్రమాన్ని నిర్దేశించుకొని భాష నేర్చడమే గదా! నేర్పినవి వినియోగంలోకి రావడం తప్ప, అర్ధవంతంగా నేర్చుకోవడం తప్ప వినడంలా, మాట్లాడ్డంలా ఇది భాషను మొత్తంగా నేర్పడం కాదుగదా. ఇది సహజమైన ప్రక్రియ కాదుగదా! ఇంకా చెప్పాలంటే ఒకరకంగా అక్షరాలు ముందు నేర్చే పద్ధతికి అంతో ఇంతో దగ్గరిదే గదా! ఈ చర్చా లేకపోలేదు.
భాషా ప్రపంచాన్ని (అక్షరాలు, పదాలు, సంభాషణలు, పాటలు, కథలు) విద్యార్థికి వీలున్నంత అందుబాటులో వుంచి పలు సందర్భాల్లో వాటిని విరివిగా వినియోగించుకొనేట్లు చేయడం ద్వారా భాషను మొత్తంగానే నేర్పవచ్చు అనే వాదమొకటి బలంగా వుంది.
ఇందులో ఏ క్రమమూ వుండదు. ఏ నిర్దశమూ వుండదు. మాట్లాడ్డం నెర్చుకొన్నట్టై పిల్లలు మొత్తంగా భాషను నేర్చుకొంటారు. ఇది కూడా సాధ్యమే అనడం కన్నా ఇదే శాప్రీయం అనేవాళ్ళూ నేడు తక్కువగా లేరు.
౮/8
లిపి మానవుడికి తెలిసి కొన్ని వేల సంవత్సరాలు గడిచినా దీన్ని నేర్పడం పట్ల ఇంత తర్జనభర్ణ్దనలు ఇప్పటికీ జరగడం విచిత్రంగా మనకు కన్పించవచ్చు. కానీ శాస్తం పెరుగుతున్న కొద్దీ, పరిశోధనలు నూతనాంశాల్ని అవిష్కరిస్తున్న కొద్దీ ఇలాంటి తర్కాలు ముందుకు వస్తూనే వుంటాయి. ఆచరణలో ఏవి సాధ్యమైతే అవి నిలుస్తాయి. మిగిలినవి అవి ఎంత ఆధునికమైనవైనా, ఎంత ప్రాచీనమైనవైనా గతిస్తాయి.
ఎటొచ్చీ పిల్లల్ని హింసించకుండా, వారి సహజ స్వభావానికి, అభ్యసన క్రమానికి సంబంధం లేకుండా గుడ్డిగా యాంత్రికంగా నేర్పడం ఒక్క భాషకే కాదు దేనికైనా న్యాయం చేకూర్చదు. ఇది అన్నిటికి వర్తించే సాధారణ సూత్రం. దీన్ని మనసులో వుంచుకొన్నపుడు మనం పాటించే పద్ధతుల్లో ఏ లోపాలున్నాయో మనకే సులభంగా అర్ధమవుతుంది.
గ
భాషా బోధన అంటే భాషా హృదయాన్ని పిల్లలకి పట్టివ్వడమే!
చదువు : భాష నేర్పడం మీద ఎన్నో తర్జన భర్దనలు జరుగుతున్నాయి. మరి మీరు భాషా బోధనలో కీలకాంశంగా దేన్ని భావిస్తున్నారు? శివరాం భాషాబోధనకు సంబంధించిన మన ఆలోచనలన్నీ సాంకేతిక అంశాలకు పరిమితమవుతున్నాయి. ఏవో కొన్ని ఎయిడ్స్ చెయ్యడం, కొన్ని టెక్నిక్కులు పిల్లల మీద ప్రయోగించడం వల్ల వాొరిగేదేమీ వుండదు. అసలు విషయం భాషకో హృదయం వుంది. దానికో నాడి ఉంది. దాన్ని పట్టుకోవాలి. ఆ హృదయం లయలో వుంటుంది. దాన్ని గుర్తించాలి. దీనికి భాషను ప్రేమించే స్వభావం మనకుండాలి. ఎలీనావాట్స్ తన పిల్లవాడికి గంటల తరబడి కథలు చెప్పేది. వాడు మహారాజులా వింటుండేవాడు చాసో కథల్ని చదవండి. మాండలికం మనల్ని ఎంతముగ్దుల్ని చేస్తుందో! ఈ భాషా హృదయాన్ని ముందుగా పట్టుకోవాలి. పిల్లలకు పట్టివ్వాలి. మనం ఈ పని చేయడంలేదు. ఆధునిక కవిత్వానికి కూడా వ్యాకరణ విశ్లేషణ చేసేబుద్ధి మనది. మనదంతా మొనాటనస్ గా ఉంటుంది. గుడ్డికంఠస్తం చెయడం తప్ప మనం పిల్లల్నించి ఏమీ ఆశించడంలేదు. భాషంటే ఏమిటి? మన బాధ. మన (పేమ, మన ఉద్వేగం. మన ఆరాధన. మన కసి అన్నీ అందులో ఉంటాయి. ఆటల్లో కానివ్వండి అసెంల్లీలో కానివ్వండి పిల్లల్ని 6160411 చెయ్యించేది భాష వైయుక్తికంగా నేర్చినా. సమిష్టిగా నేర్చినా భాషకున్న హృదయాన్ని పట్టివ్వడమే భాషాబోధనలో కీలకాంశం. దురదృష్టవశాత్తు మన పాఠ్యపుస్తకాలు భాషను కూనీ చేస్తున్నాయి.
చదువు : మీరు చెపుతున్నది చాలా పెద్ద విషయముగా అన్పిస్తోంది. అనుభవంలోంచి కొంచెం వివరించండి.
శివరాం : ప్రతీ సందర్భాన్ని మనం భాషలోకి ఇముడ్భుకోవడం నేర్చుకొవాలి. అప్పుడు ఎంత చిన్న విషయమైన భాషా హృదయాన్ని పట్టిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లలెంత సృజనాత్మకంగా వ్యవహరిస్తారో చూస్తే మనమే ఆశ్చర్యపోతాము. (ప్రపంచ
- 5
ప్రసిద్ధి చిత్రకారుడు సిజిక్ 14 ఏళ్ళలోపు పిల్లలు వేసిన బొమ్మలు చూసి ఇక తాను బొమ్మలు వేయ్యనవసరం లేదని మానుకున్న సంగతి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.)
శ్రీశ్రీ 'బాబాబీవీ కవితకు (రెండు నెంబర్లకు) పారడీ చెప్పమంటే పిల్లలిలా చెప్పారు. ఇది చాలా చిన్నపిల్లలు చెప్పిన పారడీ. ఒకొక్కరు ఒక్కొకటి చెపుతూపోతే కవిత ఎంత దూరం వెళ్ళిందో మీరే చూడండి.
రండు గుండ్లు
రెందు చర్మాలు
రెండు చేతులు -హీహీహీహీ
రెండు చెవిదిద్దులు
రెండు ట్యూబులైట్లు
రెండు గాజులు -లాలాలాలా
రెండు మూరల మల్లెపూలు
రెండు డజన్ల అరటిపళ్ళు
రెండు చాకిలెట్లు - ఆహ ఓహో
రెండు ముక్కు పుల్లలు
రెందు తెల్ల కాగితాలు
రెండు ఎద్దులు, జాజాబీజీ
రెండు సీతాకోక చిలుకలు
రెండు కాకులు
రెండు కార్లు - టాకా టీకీ
రెండు పకృపిన్నులు
రెండు చెట్లు
రెండు రిబ్బన్లు - దా డా డుందుం
రెండు దీపాలు
రెండు చెప్పులు
రెండు కవ్వాలు - కాకా క్రీర్రీ
౮/6
రెండు గొరిల్లాలు
రెండు ఐనుగు తొండాలు
రెండు దంతాలు - గోగో గీగీ
రెండు నెమళ్ళు
రెండు కోతులు
రెండు గద్ద ముక్కులు - మేమే మీమీ
రెండు చిరుకప్పలు
రెండు మనసులు
రెండు కాలిమువ్వలు - లేరారారా
రెండు జంటల (ప్రేమలు
రెండు హృదయాలు
రెండు జంటల పావురాలు - డీండీం డిమింగామ్
చివరదాన్ని కొంచెం సవరించి ముగింపులాగా మేము మార్చాం. అందువల్ల కొంచెం పెద్ద వారి రచనలా కన్పించవచ్చు.
ఒకసారి వాన వస్తోంది. దాని మీద అందరం కలిసి ఓ పాట రాసి పాడుకొందామని ష్లాన్ చేశాం. దీనికి ముందు మనం కూడా పాట రాయగలమని కొంచెం భరోసా ఇచ్చాను. కొన్ని క్లూలు ఇచ్చాను. నేను మొదటి చరణం చెప్పాను. ఇక ఒక్కొక్కరు ఒక్కో చరణం చెప్పడం మొదలెట్టారు. తొమ్మిది మందిమి కలిసి తొమ్మిది చరణాలు చెప్పాం. వీటిని ఒక వరసలో తర్వాత పెట్టాం. ముగింపును చేరాం. ఈ పాట ఇలా తయారైంది-
వానా వానా విల్లువాయ
పువ్వులన్నీ విరిసిపోయె
చెరువులు, కుంటలు నిండిపాయె
పంటలు బాగా పండిపాయె
పచ్చని పైర్లు పండుగాయె
ధాన్యం గింజలు పట్నం వాయె
గాగ
కరువు గిరువు ఎగిరిపాయె
చేతుల డబ్బులు నిండిపాయె
తెలుగు తల్లి పొంగిపాయె
ఒకసారి శ్రీశ్రీగారి “నీ పేరే రాస్తా గేయానికి అనుకరణ చేద్దామనుకొన్నాం. మా పిల్లల్లో చాలా చిన్న పిల్లలేకాదు చాలా పెద్ద పిల్లలు కూడా వున్నారు. ఇక కవిత్వం మొదలైంది. ఒక్కో 'మహాకవి” గొంతు సవరించి 'కవితాగానం' చెయ్యసాగాడు. ఆకతాయి పిల్లలు ఆకతాయి కవులుగానే మారారు. (మేం వండిన ఈ పంచకూళ్ళ కవిత్వం తింటే శ్రీశ్రీ పొట్ట ఎంత ఉబ్బిపొయ్యేదో!)
గులాబి పువ్వు ఆకుల మీద
సోడా మీద, బోర్డు మీద
తాతగుండు మీద నీ పేరే రాస్తాను
తామర మీద, ముద్దబంతి మీద
కదలాడే కనురెప్పల మీద
మాటాడే పెదవుల మీద నీ పేరే రాస్తాను
చెప్పుల మీద, హృదయ స్పందన మీద
వెన్నెల మీద, సూర్య కిరణాల మీద
అమ్మ తినిపించే పాల బువ్వ మీద
నీ పేరే రాస్తాను
పువ్వుల మీద వాలిన తుమ్మెద రెక్కల
మీద ఆకాశంలో అందాలు వాలికించే జాబిల్లి మీద
తళతళలాడే నక్షత్రాల మీద నీ పేరే రాస్తాను
చిలక ముక్కు మీద
కోయిల పాట మీద
పాచిపళ్ళ మీద నీ పేరే రాస్తాను
గాండ్రించే సింహం మీద
7/8
ఘీంకరించే ఏనుగు తొండం మీద
పందిపిల్ల తోక మీద నీ పేరే రాస్తాను
నిగనిగలాడే నిమ్మకాయ మీద
కరెస్సీ నోటు మీద
దువ్వెన పళ్ళ మీద
పిట్టరెట్ట మీద నీ పేరే రాస్తాను
నారింజకాయమీద
బట్టతలమీద, చర్మంమీద
గడియారం ముల్నమీద నీపేరే రాస్తాను
కరెంటు తీగెల మీద
కాలి బంతిమీద, చీమల కాళ్ళ మీద
చెవి దుద్దుల మీద నీ పేరే రాస్తాను
ఆస్వాదిస్తే ఇందులో ఎంత మాధుర్యం లేదు? 'చెవి దిద్దుల మీద” అనేది ఎంత మంచి పదం. ఈ పిల్లలే చెప్పకుంటే మన 'దుద్దులు” కాలగర్భంలో కలిసిపోవూ? “అమ్మ తినిపించే బువ్వలో ఎంత రుచి వుంది కోయిల పాట మీద ఎలా రాస్తారు? పంది పిల్ల తోక మీద రాయడమేమిటి? చీమకాళ్ళ మీద ఎలా రాయాలనుకొన్నారు? ఒకరి చూపు తళతళలాదే నక్షత్రాల మీదికిపోతే మరొకరి బుద్ది పాచిపళ్ళ మీదికెందుకు వెళ్ళినట్టు? గడియారం ముల్లు మీద రాయాలన్పించడం అద్భుతంగా లేదూ? పిట్ట రెట్ట మీద పాచిపళ్ళ మీద రాస్తానని చెప్పినందుకు నాకేమీ కోపం లేదు. అలా చెప్పడానికి విసుగు కారణం కావచ్చు. కొంటెతనం కారణం కావచ్చు. పెద్ద పిల్లల తెలివి మీరినతనం కారణం కావచ్చు. నాక్కావల్సింది అదిగాదు. ఎంతమంది అద్భుతంగా తమ హృదయం పెట్టారన్నది నాక్కావాలి. భాషా హృదయాన్ని ఎంత బాగా పట్టుకోగల్లారన్నది నాకు కావాలి. భాష నేర్పడం ఇలా వుంటుంది మరి!
చదువు : ఇలానే చదవడం,రాయడం కూడా వస్తుందంటారా?
శివరాం: తప్పకుండా వస్తుంది. పిల్లలకి మనం చదివి వినిపించాలి. ఎంత వినిపిస్తే అంత మంచిది. పిల్లల్ని వొళ్ళో కూచో పెట్టుకొని చదివించాలి. ్రతిరాత్రీ ఎలీనా వాట్స్ని ఆమె కొడుకు కథ చెప్పమని మారాం చేస్తాడు. ఆవిడ చెపుతుంది. ఈ క్రమంలో పిల్లల్లో భాష క్రియేట్ అవుతుంది. మాంటిస్సోరి కూడా ఇదే అంటుంది. భాషను ఎమోషన్స్ నుంచే పెంచాలంటుందామె. ఆవిడ పరిశీలన ప్రకారం పిల్లలు అయిదేళ్ళకే డిసైడ్ అయిపోతారు.
70
పిల్లలది గ్రామర్ మైండ్ కాదు. వాళ్ళది ఫొటోగ్రాఫిక్ మైండ్! అయిదేళ్ళ తర్వాత ఇది లాజికల్‌గా మారుతుంది. అందువల్ల ఐదు సంవత్సరాలకు ముందు పిల్లలు ఎన్ని భాషలైనా నేర్చుకొంటారు మనం ఎత్తుకోగానె మొత్తుకోళ్ళన్నట్టు రాయడం నేర్పడానికి పూనుకొంటున్నాం. ముందు వినికిడి నేర్పాలి. మనం లయ ఎప్పుడు నేర్పాం? కథలు ఎప్పుడు చెప్పాం? ఎపుడైనా మన పిల్లలు బుర్రకథ విన్నారా?
ఎలీనావాట్స్ తన కొడుక్కి బకాసురుడి కథ చెపుతూ, 'బకాసురుడిక్కావల్సిన ఆహార పదార్థాలు ప్రజలు ఏమేమి చేశారో చెపుతూ ఇడ్లీల్ని కూడా అందులో చేర్చుతుంది. వాళ్ళబ్బాయి 'సాంబారు...? అంటాడు. ఇలా వుంటుంది కథ చెప్పడమంటే.
వినికిడి, మాట్లాడ్డం పిల్లలు అద్భుతంగా చెయ్యగలరు. దీన్నించి మనం చదివించడం, తర్వాత రాయించడంలోకి వెళ్ళవచ్చు. పిల్లలు ముక్కలుగా ముందు అక్షరాలు, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు నేర్చుకోరు. మొత్తంగానే నేర్చుకొంటారు.
అంతేకాదు పిల్లలకి భాషా భేదం కూడా లేదు. మాతృ భాష ఏదయినా కావచ్చు. కావల్సింది పల్స్ పట్టుకోవడం. దాన్ని పట్టిస్తే భాషనైనా ఇట్టె నేర్చుకొంటారు.
చదువు: మీరు “సృజనలో భాష ఎలా నేర్ప వారు?
శివరాం: భాష నేర్పడానికి సంబంధించి నంతవరకు 'శిల్వా' గ్రంథం 'ది టీచర్” మనందరికీ ఒక అద్భుతమైన గైడుగా ఉపయోగపడుతుంది. నా దృష్టిలో ఇదొక మహత్తర కావ్యం. పిల్లలు మాట్లాడ్డం, కధలు, ఘటనలు చెప్పడం లోంచి మనం కొన్ని కీ వర్ట్స్ను గుర్తించవచ్చు. వాళ్ళ వాక్యాలకు ఒక క్రమం, ఒక లయ కూడా ఉంటుందని పసిగట్టవచ్చు. ఆ పదాలతోనే మనం చదవడం, రాయడం నేర్పించవచ్చు. 'మేము సృజనలో ఇదే పద్ధతి పాటించాం. ఇలాంటి సందర్భాల్లో తరగతిలోని ఒక్కో విద్యార్ధికి ఒక్కో రకమైన పదాలతో చెప్పాల్సి ఉంటుంది. దీన్నే మేం చేశాం. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
చదువు: ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడికి ఎలాంటి ప్రతిభ ఉండాలి?
శివరాం: పిల్లలు 5-10 నిమిషాలకి మించి ఒకే పని చేస్తూ కూచోలేరు. వారి కోసం మనం ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెడుతుండాలి. పిల్లలతో సన్నిహితంగా మెలగే టీచర్లకు, పిల్లలతో కలిసి ఆదానప్రదాన రూపంలో బోధన చేసే టీచరుకు ఇలాంటి లక్షణం సహజంగానే అబ్బుతుంది.
అన్నీ ఏ గైడులోనో, శిక్షణ లోనో టీచరుకు లభించవు. అప్పటికప్పుడు అవసరానికి తగినట్టు తయారుకావాలి. టీచరుకు 5001201607 వుండాలి. ఒకసారి మా తరగతి విద్యార్థి తాత చనిపొయ్యాడు. ఆయన శవాన్ని తీసుకొని పోతుండటంతో పిల్లలంతా అటే చూస్తూ
80
ఉండిపొయ్యారు. పిల్లల్ని మన మూడ్‌లోకి తీసుకొని రావాలి. దానికోసం అప్పటికప్పుడు ఒక ఆట మొదలెట్టాం. అది శవయాత్ర ఆట! మా పిల్లల్లో ఒకడు దభీలుమని పడిపొయ్యాడు. వాడిని నలుగురు మోసుకొని పోతున్నారు. వెనక మిగతా వాళ్ళు పోతున్నారు. అలా చనిపొయ్యినట్టు నటిస్తున్న వాడికి వడ లంటే ఇష్టమట. పిల్లల్లో ఒకడు నెత్తిన చేతులు పెట్టుకొని (వడల బుట్ట, “'వడలో వడలు అంటూ అరిచాడు. ఇంకేముంది? మన 'వడల ప్రియ మిత్రుడు” ఠపీమని లేచి కూచున్నాడు. తరగతిలో ఒకటే నవ్వులనుకోండి.
చదువు : మిగిలిన సబ్దక్టులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తున్నందువల్ల భాషలో వెనకబడిపోతున్నారనే అభిప్రాయం ఉంది. మీరేమంటారు?
శివరాం: అసలు భాష అన్నిటికి మూలం అదలా వుంచితే ఏ సబ్దక్టు చెపుతూ నైనా భాషను నేర్పించవచ్చు. విజ్ఞాన శాస్త్రంలో మునిగేవి, తేలేవి నేర్చేటపుడు 'మునాగానాం తేలా నాం) అని భాషలోకి పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు వ్యాయామం చేయించేటపుడూ అంతే. అసలు వ్యాయామమే శరీర భాష అనుకోండి. ఆటలు ఆడించేటపుడిక చెప్పనక్కరలేదు. (ప్రతి ఆటకూ ఒక పాటను జతపరచవచ్చు. పిల్లల్ని పాటల్ని ఎప్పటినుంచో ఆటలతోపాటు పాడుతున్నారు కూడా! మాష్టారికి భాషా హృదయం తెలిస్తే ఇవన్నీ అద్భుతంగా జరిగిపోతాయి.
చదువు: ఇలాంటి పద్ధతులు పాటించడం చాలా ఖర్చుతో, (శ్రమతో కూడిన పని కాదా?
శివరాం: మా 'సృజని అనుభవం ప్రకారం క్వాలిటీ చదువంటే కాస్ట్లీ చదువుకాదు. మా దృష్టిలో విద్య చాలా చవకగా దొరికేది. సహజంమైనదెపుడూ కాస్ట్ లీగా వుండదు. మనం అవకాశాల్ని కల్పించాలి. పరిస్థితుల్ని సృష్టించాలి. 'అవ్వ-ముల్లంగి' కథను పాటగానో, నాటకం గానో మలచడానికి ఏం ఖర్చవుతుంది? అందులోంచి ఎంత సృజనాత్మకతను వెలికితీయవచ్చు! అసలు “ఎయిడ్స్ అంటే (బోధనోపకరణాలు సుమండీ!) తరగతి గది నిండా ఎక్కడెక్కడి వస్తువుల్నో చేసి పెట్టడం కాదు. ఒక కథని, పాటని, సందర్భాన్ని కూడా ఎయిడ్‌గా మార్చుకోవచ్చు. పిల్లలు చిన్నపుడు ఇలానే నేర్చుకొంటారు. మరి బడిలో మాత్రం ఖర్చు దేనికి? శఛమదేనికి?
చదువు: మన విద్యావ్యవస్థలో రావల్సిన మార్పుల్ని గురించి ఏమైనా చెపుతారా?
శివరాం: ఎంతో సృజనాత్మకంగా వుండాల్సిన విద్య 101101010౪3గా మారిపోయింది. ఇది మారాలి. దీనివల్ల విద్యారంగానికి చెప్పలేనంత నష్టం జరిగిపోతోంది. చరిత్రలో విజ్ఞాన శాస్త్ర పురోగమనం కూడా ముందుకు సాగక ౧010101015 గా మారిన సందర్భాలున్నాయి. అప్పుడు శతాబ్దాల తరబడి శాస్త్రం $50010 అయిపోయింది. అరిస్తాటిల్ అంతటి వాణ్ణి గెలీలియో ప్రశ్నించాడు. అలా ప్రశ్నించి ఎదురు దాడికి దిగినప్పుడు మళ్ళీ
ట్రే
విజ్ఞాన శాస్త్రం ఒక గంతు ముందుకేసింది. విద్యా రంగానిక్కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుత 110-10101045 ధోరణి మీద ధిక్కారం ఎక్కడి నుంచో ఒకచోటి నుంచి మొదలు కావాలి.
చదువు: ఈ యాంత్రిక యుగంలో ఇవన్నీ ఎవరిక్కావాలి? ఇదంతా ఒక పిచ్చికింద జమకట్టే ప్రమాదం లేదంటారా?
శివరాం: చదువంటే పాస్ కావడం, మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడంకాదు. చదువు వల్ల మనుషులకు యోగ్యత రావాలి. అలాంటి మనుషులుండే ప్రపంచాన్ని నమ్ముకొన్న పిచ్చివాళ్ళం మేము. నిజమే మాది పిచ్చి. పిల్లల పిచ్చి. మంచి చదువుల పిచ్చి (మీరూ ఇలాంటివారే అనుకోండి!) ఇప్పుడు కావల్సింది ఇలాంటి మరింత మంది పిచ్చి వాళ్ళని తయారు చెయ్యడం.
చదువు: 'సృజన” లాంటి చిన్న చిన్న ప్రయోగాల వల్ల ఎంత మార్పును మనం ఆశించగలం? విస్తృతమైన విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యా విధానం మారకుంటే మీరాశించే మార్పు సాధ్యమంటారా?
శివరాం: చాలా పెద్ద ప్రయత్నాలకూ, చాలా పెద్ద విషయాలకూ ఎంత ప్రాధాన్యత వుంటుందో ప్రపంచంలో చాలా చిన్న ప్రయత్నాలకూ, చాలా చిన్న విషయాలకూ కూడా అంతే (ప్రాధాన్యత వుంటుంది. పెద్ద పెద్ద మార్పుల కోసం కలగనేవాళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలతోనే ప్రారంభించాలి. వాటిని ఎప్పుడూ తక్కువగా అంచనా వెయ్యకూడదని నా అభిప్రాయం. సృజన అలాంటి '(ప్రయత్నం” అలాంటి “ప్రారంభం”.
- దాః సి.ఎ. ప్రసాద్, జ్ఞనవిజ్హాన వేదిక ద్రఖ్లి
111 కథలే పాఠాలు
మ!
లి ఆహ ఆస పిల్లల చేత కథల పుసకాలు ఎలా చదివించాలి?
ప్రపంచంలోని పిల్లలందరూ కథా ప్రియులే నన్న సంగతి మనందరికీ తెలుసు. కథలు వినడం పిల్లలకి మహా సరదా. (సరదాగా చెపితే!) మరి చదవడమో? అక్కడే ఉంది చిక్కంతా. కథ విన్నా చదివినా కథ కథే. కానీ చదవాలంటే భాష రావాలి. పిల్లలు నేర్చుకొనే భాషాస్థాయికి తగిన పుస్తకాలుండాలి. కథలు చదవడం, చదివించడం కూడా చదువేనన్న లక్షణం మన చదువులకుందడాలి.
కథల్ని ఎలా చదివించాలి అనేది కూడా ఒక ప్రశ్నేనా అనిపించవచ్చు. కాసీ అది చాలా విలువైన ప్రశ్న అక్షరాలు, గుణింతాలూ అన్నీ వచ్చేశాక ఇక పిల్లలేం చెయ్యాలి? తమ ఆనందమయ ప్రపంచాన్ని ఆ అక్షరాల్లో వాళ్ళు వెతుక్కోవాలి. అంటే పుస్తకాలు చదువుకోవాలి. ఇదొక దాహం, తపన! ఆ అక్షరాలు గట్టిపడి అందులో నైపుణ్యం రావాలి. అదొక అవసరం. మేథస్సు పెరిగి, హృదయం పరిమళించాలి. ఇదొక లక్ష్యం. ఇదంతా బహుశా మన మూడో తరగతిలో ప్రారంభం కావాలి. దీన్ని గుర్తించిన కొన్ని సంస్థలు ౩-4, 5-6, 6-7, 8-10 తరగతుల స్థాయి పిల్లల్ని దృష్టిలో వుంచుకొని కథా పుస్తకాల సీరిస్‌లను తెస్తున్నాయి. అయితే క్లాసురూములో జరుగుతున్న తప్పంతా వాటిని కూడా పాఠ్య పుస్తకాల్లా చూడడంలోనే వుంది. స్వేచ్చగా, ఒక వినోదంగా వాటిని పిల్లల కివ్వడం, పరిచయం చేసి చదివేలా ప్రోత్సహిం చడం. భాషాభ్యాసనంలో అదొక అవిభాజ్య కృషిగా అర్ధం చేసుకోవడం లేనపుడు ఫలితం ఏమీ ఉండదు. మళ్ళీ జవాబులు రాయడానికో, లేనిపోని పరీక్షలు ఎదుర్కోవడానికో ఈ కథల పుస్తకాలు చదవాల్సి వస్తుందను కొంటే పిల్లలు వీటికి వీలైనంత దూరంగా వుంటారు,
క్లాసురూములో చదవడమా? అల్లరై పోతుందని కొందరికి భయం. ఇంటికిస్తే పాడు చేస్తారని భయం. అందరూ చదువుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది? అందుకని ఒకర్ని లేపి
85
చదివిస్తే అందరూ వింటారు. వినని వాళ్ళని మందలించ వచ్చునుకోవడం మరీ విచిత్రం, దీనికి బదులు మనమే చదివి విన్పిస్తే సరిపోదా? అనేదీ లేకపోలేదు.
కథల పుస్తకాల్ని చదివిస్తున్నామంటే పిల్లలచేత సాహసాలు చేయిస్తున్నామన్న మాట. సాహసంలో ఆనందముంది, కష్టమూ ఉంది. అద్భుత కల్పనా ప్రపంచంలో ఆనందంతో కూడిన చదువు చదవడం కష్టం. అడుగడుగునా అడ్డంకులు పెడుతూ, క్రమశిక్షణ కోసం తపిస్తూ పిల్లల్ని కథా ప్రపంచంలోకి తీసుకెళ్ళ లేము.
చదువుతూ పిల్లలు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవాలి. అనుభూతి వ్యక్తం చేయకుండా ఎవ్వరూ వుండలేరు. ఆ వ్యక్తీకరణలో ఆనందం వుంది. పిల్లల అభివృద్ధీ దాగి వుంది.
కథలు చదివాక టీచరు పిల్లల్లో ఒకడిగా మారిపోవాలి. “అవునా? భలే జరిగిందే. అప్పుడే ఏమైంది?” సొంత మాటలతో పిల్లల చేత కథలను అందరికీ చెప్పించవచ్చు. ఇలా పిల్లల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళవచ్చు. అయితే చెప్పేటప్పుడు మనం కథలు వినే పిల్లాడిలా మారిపోవాలి! వారిలా మన అనుభూతిని వ్యక్తం చెయ్యాలి.
చదివిన కథల్ని నాటకాలుగా మార్చిస్తే! పిల్లలకి కావల్సిన పాత్రలు కోరుకొమ్మని డైలాగులు వాళ్ళనే చెప్పమంటే! మరీ మజాగా వుంటుంది. అంతేనా? కాల్పనిక ప్రశ్నలు మనం వేసి కథని చర్చింప చెయ్యవచ్చు. వొత్రల మంచిచెడ్డల్ని ఈ ప్రశ్నలతోనే చర్చించవచ్చు. బొమ్మల్ని చూపించి కథ చెప్పమనడం మామూలుగా మనం చేస్తుంటాం. మరి పిల్లలు చదివిన కథలకి బొమ్మలు వెయ్యమనొచ్చు. కథని వాటగా మార్చొచ్చు. కథ ఆధారంగా కొన్ని ప్రశ్నల్ని పిల్లలు టీచరును ప్రశ్నించడానికి తయారు చెయ్యమనవచ్చు.
అన్నింటికంటే అద్భుతం పిల్లలతో గంటల తరబడి మనం హాయిగా గడపొచ్చు. మన పెద్దలందరికీ లోకజ్ఞానం ఎలా అబ్బింది? అదంతా (శ్రుత పొండిత్యమేనని మనం మరిచి పోగూడదు. ఎన్ని పురాణ కథలు ఎన్నెన్ని రోజులు చెప్పేవారు! వినేవారు! చర్చించు కొనేవారు! ఇదంతా చదువే. చదువంటే ఇది మనం ఒప్పుకొంటే కథల పుస్తకాల్నించి ఎన్ని అద్భుతాలనైనా సృష్టించవచ్చు.
86
ల్సి ఆబ ఆ పిల్లలు చదివే పుసకాలేవీ, కథలేవీ? ళ్ జో థి
మన దేశంలో బాలసాహిత్యమంటూ ఇప్పుడిప్పుడే వస్తున్నది. బెంగాలీ, హిందీ మొదలైన భాషలలో రెండవ ప్రపంచ యుద్దానికి పూర్వం కూడా బాలపత్రికలుండినట్టు తెలుస్తోంది. తెలుగులో మాత్రం బాల పత్రికలు స్వాతంత్ర్యం వచ్చే రోజుల్లోనే బయలుదేరాయి.
నా చిన్నతనంలో బాలసాహిత్యమంటూ వేరే లేదు. నాకు చదవటమూ, రాయటమూ రాగానే సుమతీ శతకం కంఠస్థం చెయ్యమన్నారు. వావిలకొలను వారు రచించిన పాకెట్ సైజ్ కథల పుస్తకాలేవో ఉండేవి. భాగవతం నుంచి కుచేలోపాఖ్యానం, రుక్కిజీ కల్యాణం, (ప్రహ్లవ చరిత్ర, గజేంద్ర మోక్షం లాంటి కథలు చదివాను. వాటిలోని కొన్ని పద్యాలు నాకిప్పటికింకా జ్ఞాపకం ఉన్నాయి.
అర్ధ శతాబ్ధం క్రితం ఇదే బాల సాహిత్యం, నిజానికిది పిల్లల కోసం ప్రత్యేకించి రాసిన సాహిత్యం కాదు. పెద్దల సాహిత్యమే. పెద్దల సాహిత్యం కాదు. పిల్లల సాహిత్యమే. పెద్దల సాహిత్యంలో పిల్లలకు పనికి వచ్చేదంతా పిల్లల సాహిత్యంగా చలామణీ కావటం మన సంప్రదాయం. మనం ఈ రోజు బాల సాహిత్యం గురించి పాశ్చాత్యుల అభిప్రాయాలు అరువు తెచ్చుకొని లాభం లేదు.
ఇంచుమించు ఇరవై ఏళ్ళుగా బాల సాహిత్యంతో నాకు గల సంబంధాన్ని బట్టి బాల సాపాత్యం ఎలా వుండాలి. ఎలా వుండకూడదు అన్న అభిప్రాయాలు కొ న్ని ఏర్పరుచుకొన్నాను. కొంత కాలమయ్యాక వాటికి కాలదోషం పట్టవచ్చు. ప్రస్తుతానికి ఈ నా అభిప్రాయాలు సముచితమైనవని భావించి వాటిని ఇక్కడ చెబుతున్నాను.
పశుపక్ష్యాదులు పాత్రగా గల నీతి కథలూ, దేవతలూ, రాక్షసులూ, మాంత్రికులూ, అతీత శక్తులూ మొదలైన వాటితో కూడిన దేవతా కథలూ గడిచిపోయిన యుగాలకూ,
8
సమాజానికీ సంబంధించిన జానపద కథలూ బాల సాహిత్యంలో ప్రముఖ స్థానం కలిగి ఉంటాయి. - వాస్తవికత
పైన చెప్పిన కథలలో వాస్తవికతకు చోటు లేదు. “బుల్లి చేపల చేత మాట్లాడించటం లోనే ఉన్నది చిక్కంతా!” అన్నాడట ఆలివర్ గోల్డ్స్మెత్, చేపలు, కాకులూ, ఎలుకలూ మాట్లాడటం వల్ల వాస్తవికత పోతుందని అతడు భయపడి ఉంటాడు. కాని బాల సాహిత్యంలో అలాంటి వాస్తవికత అనవసరం. పిల్లలు తాము వినే (చదివే) కథలలోని సన్నివేశాలనూ, సంఘటనలనూ తమపరంగా అన్వయించు కోనవసరం లేదు. వాళ్ళు వాటికి ఎడంగా ఉండే ఆనందం పొందాలి. “అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండవేశారు... ఏ రాజు? ఏడుగురు వేటకు పోయి ఏడు చేపలనా తెచ్చారు? ఏడు చేపలు ఎండేస్తే ఎవరి ముక్కులోకి?” ఇలాంటి సందేహాలు వేటికీ కథలో తావులేదు.
కొన్ని నీతి కథలను కొందరు ఆధునికం చేయ్యాలని ప్రయత్నిస్తారు. ఇది పొరపాటు. మాంసం ముక్క నోట కరుచుకొన్న కాకిని నక్క “* కాకిబావా, కాకిబావా! ఒక్క పాటపాడు!” అనగానే ఈ ఆధునిక కాకి మాంసం ముక్కను కాలి కింద పెట్టుకొని, పాటపాడి నక్కను 'ఫూలొ చేస్తుంది. ఇది నీతికథ కాదు, జర్నలిజం.
పిల్లల కథలు వర్తమాన జీవితానికి సంబంధించి ఉండాలనీ, అందులో వాస్తవికతకు చోటు కలిగించాలనీ కొందరు కొన్ని రకాల రచనలు చేస్తారు. మాటవరసకు సీత పుట్టిన రోజు పండుగ అనుకోండి. సీతకు పుట్టిన రోజు పండుగ చేస్తారు. బామ్మ తలంటి పోస్తుంది. నాన్నారు తెచ్చిన కొత్త పూల పరికిణి కట్టుకుంటుంది. మామయ్య తెచ్చిన పూల జాకెట్టు వేసుకొంటుంది. అన్న తెచ్చిన కొత్త రిబ్బను ఎంచక్కా పెట్టుకొంటుంది. అమ్మ పూరీలు, జిలేబీలు, మైసూర్వాకూ, బాదం హల్వా చేసి పెడుతుంది.
ఇదే విధంగా తంతు జరిగిపోతుంది. ఇది పిల్లల కథ కాదు. పెద్దవాళ్ళు నెలల పిల్లలతో (వాళ్ళకర్దమవుతుందనుకొనీ, వాళ్ళ భాషే మాట్లాడ్తున్నామనుకొనీ) 'ఓంతిలా? ఆయి కావాలా?” అన్నట్టుగానే ఉంటుంది ఇలాంటి కథ కూడానూ. ఇటువంటి కథలు మరీ జాస్తిగా చదివితే పిల్లలకు తమ పరిసరాల మీద చాలా రోత పుడుతుంది. సినిమాలలో చూపే (ప్రేమ నిజమనుకొన్నవాడు వాస్తవ జీవితంలోని (ప్రేమ చూసి అనుకొన్నట్లుగా పిల్లలు పెద్దలయ్యాక, వంచింపబడ్డామనుకోగలరు. ఎందుకంటే ఈ కథల్లో ఉండేది "స్టెరిలైజ్ చేసిన జీవితం
8జి
వాస్తవంగా వున్నట్లు భ్రమగొల్పే అవాస్తవం. చేపలూ, కొంగలూ మాట్లాడే కథలు ఇలా మోసం చెయ్యవు, మౌలిక భావాలు
బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావాలను బలంగా నాటాలి. ధైర్య సాహసాలు, నిజాయితీ, స్నేహ పాత్రత, త్యాగబుద్దీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి. అన్యాయాన్ని జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు ఎంత అవాస్తవంగా వున్నా, పిలల మనస్సులకు చాలా మేలు చేస్తాయి. దురాశా, ఓర్వలేని తనమూ, అధికార గర్వమూ, (క్రూరత్వమూ, కృతఘ్నతా, అధర్మమూ, స్వార్ధ్థమూ మొదలైనవి శిక్షించబడటం కూడా పిల్లలకు తృప్తినివ్వాలి,
కొన్ని కొన్ని సద్దుణాలు ఒక్కొక్క సమయంలో దౌర్భల్యంగా పరిణమించటమూ, ప్రమాదం తెచ్చిపెట్టటమూ జరుగుతుంది. భూతదయ చాలా మంచిది. నిస్సహాయుల పట్ల దయ చూపటం వరకూ ఇబ్బంది లేదు. కాని దుర్మార్గుల పట్ల చూపే దయ (ప్రమాదాలకు దారి తీస్తుంది. అందుచేతనే బోను నుంచి పులిని విడిపించిన బ్రాహ్మడి కథలో ముఖ్యాంశం బ్రాహ్మడి జాలికాదు. అది తెచ్చి పెట్టిన ప్రమాదమే. ఆ ప్రమాదాన్ని నక్క యుక్తిగా తప్పిస్తుంది. యుక్తి కథలకు బాల సాహిత్యంలో చాలా స్థానం ఉంది.
స్థూలంగా చెప్పాలంటే పిల్లలలో దౌర్చల్యాన్ని పెంపొందించెది మంచి బాల సాహిత్యం కాదు. మహాసత్తుల కథలు ఉత్తమ బాల నాహిత్యం. ఒక లక్ష్యం పెట్టుకొన్నాక మహాసత్త్యుడైన వాడు ఎన్ని ప్రమాదాలనూ లక్ష్య పెట్టడు. అటు వంటి వొత్రలు గల కథలు ఎంత హెచ్చుగా చదివితే పిల్లలకు కారెక్టర్ అంత బాగా ఎర్చడుతుంది. మన దేశాలవంటి పేద దేశాలలో పిల్లలకు డబ్బు మీద దృష్టి ఏర్పడటం కన్నా 'కారెక్టరొ ఏర్పడటం చాలా అవసరం.
రాక్షసులను మనుషులు జయించటమూ, ధనికులను వాళ్ళ సేవకులు భంగ పరచటమూ, అతి సామాన్యమైన వ్యక్తులలో అసాధారణ శక్తులుండటమూ లేదా వారికవి లభ్యం కావటమూ- ఇలాంటి ఇతివృత్తాలు గల జానపద కథలు ప్రపంచ మంతటా ఉన్నాయి. వాస్తవ సంప్రదాయాలకు ఎదురు వెళ్ళే ఈ కథలు చదవటం వల్ల కూడా పిల్లలకు కొంత లాభం ఉన్నది. ముఖ్యంగా చిన్న పిలలకు దొంగల భయమూ, దయ్యాల భయమూ లాంటివి అతి తేలికగా అబ్బుతాయి. ఆ భయాలను తగ్గించే దొంగల కథలూ, దయ్యాల కథలూ పిల్లలు చదివి వుండటం మంచిది.
దేవుడి మీద భక్తినీ, మత విశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథల్లో దేవతలూ, భక్తులూ వుండరాదని కాదు.
89
దేవుణ్ణి నమ్ముకొంటే అన్ని సుఖాలూ ఒనగూడతాయన్న అభిప్రాయాన్ని పెద్దలు కలిగి ఉండటం ఎంత తప్పో, పిల్లలకు యివ్వటం అంతకు పదింతలు తప్పు. కథలో నెగ్గవలసినది మనుషయత్నమూ, మనిషి సద్బుద్ధినూ, ఇది చాలా ముఖ్యం. రచనా విధానం
బాల సాహిత్యం రాసేటప్పుడు కథనం పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడుతున్నట్టుం డాలనుకోవటం నా బుద్దికి చాదస్తంగా కనిపిస్తుంది. * అప్పుదడేమయిందనుకొన్నారూ” “రాజుకో కూతురుందనుకొన్నాం కాదూ?.. చూశారా, వాడి దుర్మార్గం వాణ్ణి ఏ స్థితిలోకి తెచ్చిందో?” ఇలా అడుగడుగునా బాల పాఠకులను తట్టుతూ ఉండటం అనవసరం అనుకొంటాను.
రచనలో వ్యర్ధపదాలూ, ప్రకృతి వర్ణనలూ, సౌందర్య వర్ణనలూ పిల్లలను అంతగా ఆకట్టవు. “కీకారణ్యం, “ కటికచీకటి” 'పండువెన్నెలి, “పెద్ద కెరటాలతో ఉప్పెని ఇలాంటి మాటలతో వాళ్ళు ఎంతైనా ఊహించుకోగలరు.
పాత్రలు చాలా మంచివాళ్ళయినా కావాలి, చాలా చెడ్దవాళ్ళయినా కావాలి. చాలా తెలివిగల వాళ్ళయినా కావాలి. వట్టి మూర్చులైనా కావాలి. చాలా అందంగానైనా ఉండాలి. వికారంగానైనా ఉండాలి. ఓ మాదిరి మంచీ, సుమారైన తెలివీ, ఎటూగాని అండమూ బాల సాహిత్యానికి అనవసరం. పాత్రల అంతస్సంఘర్షణలు కూడా అంతే.
పిల్లల కోసం రాయటం ఒక గొప్ప కళ. తెలుగులో ఆ కళను చెప్పుకోదగినంతగా వృద్ది చేసినవారెవరూ ఉన్నట్టు కనబడదు. కొందరు పాత్రోచిత భాష ప్రవేశపెట్టాలని హీన పాత్రల చేత యాసగా మాట్లాడించటం లాంటి ప్రయోగాలు చేస్తారు. నా దృష్టిలో ఇది గూడా ఈనాటికి పొరపాటే. కథల్లో సంభాషణలు వుండక తప్పదు. కాని వాటిలో అంత వాస్తవికత
" నిరుపయోగం.
బాలగేయాలు, ఇతర రచనలు
ఆద్భృష్టవశాత్తూ ఈనాడు మనలో చక్కని బాలగేయాలు రాసేవారున్నారు. నిజానికి పెద్ద వాళ్ళకన్నా పిల్లలు గేయాలను ఎక్కువగా ఆనందించగలరు. బాలగేయ రచనలు పిల్లలకు ఎంతగా అందుతున్నాయో నాకు తెలీదు. కొన్నిటికి బవువుతులు కూదా లభించాయనుకొంటాను,
పెల్లలకు విజ్ఞానం కూడా కొంతవరకూ అవసరమే. ఈ స్పుత్నిక్ - హైడ్రోజన్ బాంబు యుగంలో వాళ్ళు తెలుసుకోదగిన వైజ్ఞానిక విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆకాశానా,
900
భూమిమీదా, సముద్రం అడుగునా ఎన్నో పరిశోధనలు జరుగు తున్నాయి. ఆరోగ్య సంబంధమైన అంశాలు చిన్నతనం నుంచీ తెలుసుకోదగినవి ఎన్నయినా ఉన్నాయి. అడవిలో చెట్లలాగా ఈనాటి పిల్లలు వీటిని గురించి ఏమీ తెలుసు కోకుండా పెరగటం చాలా తప్పు. బాల గ్రంథాలు
బాల (గ్రంథాలు చూడటానికి అందంగా ఉండాలి. అచ్చు చక్కగా ఉండాలి. బొమ్మలు ఊహలను కదిలించేవిగా ఉండాలి. వాటిలో ఎలాంటి అచ్చుతప్పులు ఉండరాదు. అవి చవగ్గా కూడా ఉండాలి.
వ్యాపార యుగంలో ఈ రెండూ కుదరవు. అందుకని సోషలిజం వచ్చేదాకా ఈ సమస్యను తడిపి వుంచడానికి వీల్లేదు. ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రస్తుతం ఉన్న మార్గాలు ఏవంటే.
-
పిల్లల కోసం వేసే పుస్తకాలకు ప్రభుత్వం, లేక ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వటం,
-
ప్రచురణ కర్తలు ఈ పుస్తకాలను అనేక వేల సంఖ్యలో ముద్రించటం(లక్షల సంఖ్యలో కాకపోతే).
పుట్టిన రోజు పండుగలకూ, ఇతర పండుగలకూ పెద్ద వాళ్ళు పిల్లలకు మిఠాయి వగైరాలతో బాటు చక్కని పుస్తకాలు కూడా బహూకరించడం. ఇతర దేశాలలో ఇరవై అయిదు రూపాయలు ఖరీదు చేసే పిల్లల పుస్తకాలు సైతం అచ్చు అవుతున్నాయి. పెద్ద వాళ్ళు బహూకరించకపోతే నిత్య ఖర్చులో నుంచి పిల్లలు అలాంటి పుస్తకాలు కొనటం సాధ్యమా?
పిల్లల పుస్తకాల ప్రచురణ ఆంధ్రలోనే చాలా వెనుకబడి ఉన్నట్టు కనబడుతుంది. మంచి ముద్రణాలయాలు లేకపోవటమూ, బాల పుస్తకాల ప్రచురణ పెట్టుబడిదార్లను ఆకర్షించలేకపోవటమూ, అందుకు కారణాలు కావచ్చు. పిల్లలకు తగినట్టుగా బొమ్మలు వేసే చిత్రకారులు కూడా చాలా తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తారు.
పిల్లలు పుస్తకాలకు గిరాకీ రాగానే అందరూ బొమ్మల రామాయణాలు, భారతాలూ ప్రచురించారు. రామాయణ, భారతాలు పిల్లలకు అనవసరమననుగానీ, వాటికన్నా చాలా మంచి బాల సాహిత్యం ఉన్నది. రాసేవాళ్ళూ, వేసేవాళ్ళూ ఉంటే.
- కొడవటిగంటి కుటుంబరావు, 'సంవేదన', 1968 అక్టోబర్ ఫ్రే
మన చదువుల్లో కథల స్టానం ఏమిటి?
మన స్కూళ్ళలో ఒకటీ రెండు తరగతులకైనా రోజూ ఒక పీరియడ్ కథలు చెప్పుకోడానికుంటే ఎంత బావుంటుంది! ప్ప! మన పిల్లలు ఆ మాత్రం భాగ్యానికైనా నోచుకోలేక పోతున్నారు. ఈ అవకాశమే వుంటే బడిలో చేరిన పిల్లలు బడి నుంచి జారిపోకుండా సగం సమస్య పరిష్కార మయ్యేది. * కథలు చెప్పుకొంటే ద్రాపౌట్ తగ్గుతారా' అని నన్ను చాలా మంది ఎగతాళిగా చూడొచ్చు. ఇంత పెద్ద సమస్యను ఇంత తక్కువగా పరిగణిస్తున్నాని నన్ను ఎద్దేవా చెయ్యొచ్చు. ఇలాంటి సలహా నేనిచ్చినపుడు నాపట్ల వెటకారంగా (సానుభూతితోనూ) చూచిన సీనియర్ అధికార్ల నెందరినో నేనెరుగుదును. ఏం చేద్దాం మరి? వారి “అపార పరివాలనానుభవంి వాళ్ళనలా తయారుచేసింది! ఒకప్పుడు ఈ అధికార్లూ నాలానే ఎంతో కొంత ఆలోచించి వుండక పోరు, కానీ పాపం వాళ్ళు సీనియర్లయి పొయ్యాక ఇలా మారిపోయ్యారు!
ఇంతకన్నా ఘోరం ఏమంటే మన ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో కథలకు కాసింత చోటయినా చిక్కడం లేదు. కాకుంటే *' కథల ప్రాధాన్యం” మీద మొత్తం శిక్షణా కోర్సుల్లో ఎక్కడయినా ఓ పాఠం ఉంటే వుండొచ్చు. అంతకంటే కొంచెం లోతుకు పోయిన పాపాన ఈ సంస్థలెప్పుడూ పోవు.
నాకో తీరని కల వుంది. అదేమంటే మన టీచర్లకు కనీసార్హతగా ముప్పై కథలయినా తడుముకోకుండా చెప్పడం వుందే రోజు ఎప్పుడొస్తుందా అని. మన (ప్రాచీన కథల మీద ఈ మాత్రం పట్టు వుండే టీచర్లుంటే ఎంత అద్భుతంగా వుంటుందో గదా అని ! “పట్టు అంటే గందరగోళపరచకుండా, గజిబిజి చెయ్యకుండా సాఫీగా చెప్పగల్లడం అన్నమాట.
కథలు చెప్పుకోవడం మన సమాజపు సహస్రాబ్దాల సంప్రదాయం, వారసత్వం! ఒకటీ రెండా? వేలాది సాంప్రదాయక కథలు చెవి నుంచి చెవికి, గుండె నుంచి గుండెకు ఎన్ని శతాబ్దాల వాటు ఎక్కిపొయ్యాయో! అంత దూరం నేనాశించడం లేదు గానీ కనీసం
ఏ2
ముప్పై కథలు చెప్పగల్లితే మన ఒకటిరెండు తరగతుల పిల్లలు ఎన్నో విలువలు నేర్చుకొంటారు. ఇతర సబ్దక్టులతో పాటు కథలకింత చోటివ్వగల్లితే ఎన్నో విషయాలు పిల్లలకు తెలుస్తాయి. మనం చెప్పే ఇతరు పాఠ్యాంశాలు కూడా కావల్సినన్ని తెలుస్తాయి. కథ లక్కడ దొరుకుతాయి?
సాంప్రదాయిక కథలంటే ఏమిటి? వీటి వ్రాధాన్యత ఏమిటి? దీన్ని మనం పరిశీలించాలి. ఈ కాలపు కుర్ర టీచర్లను కథలు చెప్పమంటే పిల్లల పత్రికల్ని తిరగేస్తున్నారు. కామిక్స్‌ను, వాస్తవగాథల్ని చివరికి పెద్ద పెద్ద జోక్స్‌ను సైతం పిల్లలకి కథలుగా చెప్పడానికి పూనుకొంటున్నారు. ఇవన్నీ కథల జాబితాలోనే వస్తాయా? వస్తే రావచ్చు. కానీ మన ఆరేదేళ్ళ పిల్లల్ని ఇవి మన పాత కథలంత ప్రభావితం చేస్తాయా అనేది మాత్రం అనుమానాస్పదం.
మన సాంప్రదాయక కథలకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు ప్రస్తుత పత్రికల్లో వస్తున్న కథల్లో కన్పించడం లేదు. మంచి కథకుందే లక్షణాలేమిటి? వీటిని తర్వాత పరిశీలిద్దాం. దీనికి ముందు ఇలాంటి మంచి కథలెక్కడ దొరుకుతాయో చూద్దాం.
పంచతంత్రం, జాతక కథలు, మహాభారతం, అరేబియన్ నైట్స్, విక్రమాదిత్య కథలు, వివిధ ప్రాంతాల జానపద కథలు మనకు ఎన్ని మంచి కథల్నయినా అందిస్తాయి. ఇదొక పెద్ద భాండాగారం. కొంచెం కష్టపడగల్టితే కథా సరిత్సాగరం, గులిస్తాన్, బోస్టన్, బీర్చల్, తెనాలి రామలింగడు, జానపదాలు లాంటివి కావల్సినన్ని దొరుకుతాయి. ఒక్క మన దేశానికే గాదు ప్రపంచమంతా మంచి కథలు కోకొల్లలు. ' ఇంత పరిశోధన మాకెక్కడ సాధ్యం” అని మీరనవచ్చు. కథలు చెప్పాలనే అనుకొంటే మంచి కథల్ని ఎన్నుకోవడం, వెతుక్కోవడం చాలా చిన్నపని అని నా అభిప్రాయం. మంచి కథ ఎలా పుంటుంది?
ఏది మంచికథ అని నన్నెవరైనా ప్రశ్నిస్తే పిల్లలు తరతరాల నుంచి దేన్ని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారో అదే మంచి కథ అని నేను జవాబిస్తాను. ఇక్కడ న్యాయ నిర్దేతలు పిల్లలే తప్ప మనం కాదని నా దృఢ విశ్వాసం. మన పంచతంత్రంలోని “ సింహం కుందేలు” కథనే తీసుకోండి. దీన్ని మనం చాలా సీదాసాదా కథగా భావిస్తాం. కానీ లోతుల్లోకి వెళ్ళితే ఇందులోని మంచి కథ లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. ఈ కథలోని మలుపుల్ని ఇప్పుడు కొంచెం పరిశీలిద్దాం. _
మన బుజ్జి కుందేలు సింహానికి కవళంగా వెళ్ళాల్సిన దుర్దినం వచ్చింది. తీరిగ్గా కుందేలు సింహం గుహ దగ్గరకెళ్ళేప్పటికి ఆకలితో సింహం నకనకలాడిపోతోంది. మిన్నూ
08
మన్నూ తెలిసే స్థితిలో లేదది. ఇప్పుడు మన కుందేలు తన అబద్దాల పురాణాన్ని ప్రారంభించాలి. సింహంతో కనీసం మాట్లాడ్డానికయినా తగిన సందర్భమేనా యిది? ఏ మాత్రం కాదని కథ వినే వాళ్ళందరికీ తెలుసు. అయినా కుందేలు తానెందుకు ఆలస్యంగా రావల్సి వచ్చిందో, దారిలో తనని మరో సింహం ఎలా అడ్డగించిందో ప్రాణాలకు తెగించి చెప్పింది. ఆకలి కంటే కోపం తీవ్రమైందని కుందేలుకు తెలుసు. సరిగ్గా ఆ పాయింటునే అది పట్టుకొంది. పెత్తందార్లకు అహంకారం ఎక్కువ. అది ఏ మాత్రం దెబ్బతిన్నా వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకే సింహం ఆకల్ని అవతలబెట్టి శత్రువు సంగతి తేల్చుకోవాలని కుందేలు వెంట నడిచింది. గుడ్డి బావి దగ్గరికి చేరింది.
మళ్ళీ ఇది కుందేలుకు కష్టకాలం (కథలో ఇదో మలుపు). ఇక్కడ కూడా కుందేలు తెలివిగా సింహం తెలివితక్కువ ఆవేశం మీదా, అసూయ మీద ఆధారపడింది. సింహం బావిలోకి చూచి తన బింబాన్ని శత్రుసింహం అనుకొని దూకి దిక్కులేని చావు చచ్చింది.
ఇన్నాళ్ళూ ఇంత ప్రచారం పొందిన ఈ కథను ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ కథా వస్తువేమీ సామాన్యమైంది కాదు. దుర్మార్గమైన అధికార పిశాచం ముందు ప్రాణాల్ని నుంచి బయటపడ్డం దాదాపు అసాధ్యమైన వేళ కుందేలు లాంటి బడుగు ప్రాణి పాపం ఏం చెయ్యాలి? అనేది ఇక్కడున్న సమస్య, నిజానికిది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంత పెద్ద విషయాల్ని మనం పిల్లలకు దూరంగా వుంచాలనుకొంటాం. విచిత్రమేమంటే పిల్లలు ఇంత పెద్ద విషయాన్నే ఇష్టపడతారు! ఎందుకిష్టపడతారు? దాన్ని తర్వాత పరిశీలిద్దాం.
ఇక్కడ మరో అంశం కూడా మనం పరిశీలించాలి. ఒక బక్క ప్రాణి మహా బలవంతుడైన ఒక శత్రువు బారిన పడి కష్టాల్లో చిక్కుకొన్న సందర్భమిది. ఇందులోంచి బయటపద్డానికి ఈ బక్క జీవి ఒక ఎత్తుగడ వేసింది. ఈ ఎత్తుగడలో ఏ మాత్రం ' నీతి లేదు. మరో సందర్భంలో ఇలాంటి అబద్దాలు చెపితే మనం కుందేల్ని టక్కరి కుందేలు కింద లెక్కగడతాం. కాని ఇక్కడ ఈ బడుగు ప్రాణి అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. అమోఘమైన ధైర్యాన్నీ ఆత్మ విశ్వాసాన్ని చూపింది. చిట్టచివరి దాకా ఏ మాత్రం తొణక్కుండా నిలబడికార్యం సాధించింది. ఇందుకోసం ఒక పెత్తందారుతో సాధారణ బడుగు వ్యక్తి మాట్లాడినట్టే భయం భయంగా మాట్లాడింది. అనుకొన్న పని నెరవేర్చుకొంది.
ఈ కథ నడకను కూడా మనం పరిశీలించాలి. కథారంభంలో జంతువులు సింహంతో కుదుర్చుకొన్న ఒప్పందం ఫలితంగా ఒక వింత శాంతి నెలకొంటుంది. పైకి కాలం సజావుగా నడుస్తున్నట్లు కన్పించినా ఇది దినదినగండమే. ఉన్నట్టుండి కుందేలు వంతు రావడంతో అసలు కథ తెరమీదికి వచ్చేస్తుంది.
ఇక మన కథ ఒక్కక్షణం కూడా ఆగకుండా చకచకా సాగిపోతుంది. మన కుందేలు ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఒక్క నిమిషం వ్యర్థం చేసినా కొంప మునుగుతుంది.
ప!
అదొక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడేమీ నల్లేరు మీద నడక కాదు. మహా ప్రమాదకరమైంది. అయినా కుందేలు దానికే పూనుకొంది. (శోతకిక్కడ గుక్క తిప్పుకొనే వీలుండదు. ఏ మాత్రం తటపటాయింపుకు అవకాశం ఉండదు. అతడిప్పుడు కుందేలు పక్షపాతి. అది ఏం చేసినా అతనికది ఎంత న్యాయంగా వుంటుంది! ప్రతిదీ మన (శ్రోత కుందేలు వైపు నుంచే ఆలోచించడం మొదలు పెదతాదు!
ఈ కథని పిల్లలెందుకంతగా ఇష్టపడుతున్నారో గుర్తించడానికి ఈ పరిశీలన సరిపోతుందనుకొంటాను. తమను అందులో చూచుకొని మమైకం కాగల ఒక పాత్ర, ఒక హీరో ఈ కథలో వారికి చిక్కింది. అదే కుందేలు, పిల్లల రోజువారీ జీవితంలో కూడా కుందేలు ఎదుర్కొన్న సవాళ్ళ వంటివి ఎన్నో ఎదురవుతుంటాయి.
పిల్లలు చిన్నవాళ్ళు, బలహీనులు, ఎక్కువ సందర్భాల్లో వాళ్ళకిష్టం లేనిదాన్ని వాళ్ళు చెయ్యాల్సి వస్తుంటుంది. అధికారం శారీరకాధిక్యత గల వారి వల్ల వాళ్ళెప్పుడూ కష్టాల వాలవుతుంటారు. భయాందోళనలకు గురవుతుంటారు. కుందేలు ఎదుర్శొనే సవాళ్ళతో పిల్లలెదుర్కొనే సవాళ్ళకెంతో సామ్యం వుంది. దీన్ని మనం ఎప్పుడూ గుర్తించం. మన పద్ధతిలో మనం అధికారమంతా మన చెతిలోనే పెట్టుకొని వాళ్ళతో నిత్యవ్యవహారాలు జరుపుతుంటాం.
హఠాత్తుగా ఒక బంధువో, మరొకరో చనిపోతే పిల్లల మీద అది ఎంత ప్రభావం కల్టిస్తుందో, వాళ్ళింత ఆందోళనకు గురవుతారో మనం గుర్తించం. అలాగే వాళ్ళు తమ కంటే శక్తివంతులైన పెద్దలతో పడే ఘర్షణను కూడా మనం గమనించం.
అందువల్లనే కథా ప్రారంభంలోనే పిల్లలు కుందేలులో తమను చూచుకొంటారు. కథ నడిచే కొలదీ కుందేలు వారికి పెద్ద ఆకర్షణగా మారుతుంది. కుందేలు ఒక ఎత్తుగడ పన్నింది. అది ఫలించింది. దీంతో తన సమస్యనేగాదు అందరి సమస్యనూ కుందేలు పరిష్కరించింది. పిల్లలు ఇలాంటి పరిష్కారాన్నే (ప్రేమిస్తారు. కుందేలు ఎత్తుగడలో పిల్లలకు ఇచ్చే మరో అంశం కూడా వుంది. అదేమంటే ఏదో ఒక సాకు చెప్పి అది తప్పించుకొన జూడ్డం. ఎందుకు ఆలస్యమైంది? అని సింహం అడిగితే కుందేలు చెప్పిన సాకు పిల్లల్ని ఎందుకాకర్షిస్తుందో చెప్పగలరా? ఎందుకేముంది పిల్లలు కూడా ఇలా సాకులు చెప్పి * కప్పాల్నించి” బయటపడేవాళ్ళే గదా! అందుకని ఈ ఎత్తుగడతో కుందేలు తనను కాపాడుకోవడమే గాదు సింహాన్ని అంతం చేసింది. శత్రువును హతమారిస్తే తప్ప పాపం కుందేలు ప్రమాదం నుంచి బయటపడలేదు. అంటే ఈ కథ మనుగడ కోసం సాహసంతో చేసే విధ్వంసాన్ని నాటకీయంగా మన ముందు పెడుతోంది. ఇందులో ఏమి నీతి వుంది? మనుగదకోసం చేసే పోరాటం తప్ప ఇందులో ఏ నీతి లేదు. పిల్లల వైపు నుంచి చూస్తే తప్ప నిజానికి కథలో మనం అభినందించదగ్గది ఏదీ లేదు. పెద్దలుగా మనం చూస్తే ఈ కథ నీతిలేని కథ. కుందేలు చేసింది పచ్చి మోసం తప్ప మరేమీ కాదు.
9గ్
కథల ప్రయోజనం ఏమిటి?
అంటే పిల్లలకు చెప్పడానికి ఎన్నుకొనే మంచి కథల్లో నీతి తప్పనిసరి కాదన్నమాట! అయితే సింహం - కుందేలు కథలో ప్రత్యక్ష నీతి గాకపోయినా పరోక్షనీతి లేకపోలేదు. పిల్లల్ని భావోద్రేకానికి గురిచేసే అంశం ఇందులో ఒకటి వుంది. ఒక ప్రమాదం ముంచుకొచ్చినపుడు ఎంత నిబ్బరంగా నిదానంగా వుండాలో అది చెపుతుంది. సరైన ఆలోచన చురుకుదనం అప్పుడే సాధ్యమని కూడా ఈ కథ చెపుతుంది.
కానీ సాంప్రదాయకార్ధంలో ఇలాంటి పరోక్ష నీతిని కథా నీతిగా లెక్కించలేము. నీతి స్పష్టంగా వుండాలి గానీ ఏదో డొంక తిరుగుడుగా వెతికి వెతికి చూస్తే తప్ప కనబడకుండేదిగా వుండకూడదు.
ఈ చర్చా సారంశం ఏమిటి? పిల్లల్లో నైతిక విలువల్ని పెంచడం మన సాంప్రదాయక కథల ప్రధానోద్దేశం కాదు. కథలు చెప్పడం వల్ల వచ్చే అసలైన లాభాలు వేరే వున్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం.
మంచి (శోత అంటే ఎవరు? చివరి దాకా వినేవాడే మంచి శ్రోత. కానీ చాలా మంది అలా చివరిదాకా వినరు.మనం పిచ్చాపాటీ మాట్లాదేటపుడు కూడా చాలామంది మధ్యలోనే అడ్డం వస్తుంటారు. మనం చెప్పబొయ్యేది ముందే తెలిసి వాళ్ళిలా చేస్తే కొంత అర్ధం చేసుకోవచ్చు కానీ అసలు వీళ్ళకి అంతదూరం వినడానికే ఓపిక ఉండదు. పెద్ద పెద్ద మేనేజిమెంటు, పరిపాలనా కోర్సుల్లో సైతం ఈ రోజుల్లో ఓపిగ్గా వినడాన్ని ఓ నైపుణ్యంగానే గాక ఓ మంచి లక్షణంగా కూడా పరిగణిస్తున్నారు. కథలు చెప్పడం చాలా చిన్న వయస్సు నుంచే ఇలా జాగ్రత్తగా ఓపిగ్గా వినే లక్షణాన్ని పెంపొందిస్తుంది. పెద్దయ్యాక ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కథలు చెప్పడం వినడం ఒక మహత్తర సంప్రదాయంగా గల మన దేశంలో ఎదుటి వాడిని ఓపిగ్గా వినేవాళ్ళు సంఖ్య ఈ రోజుల్లో తగ్గిపోవడం చాలా విచిత్రంగా అన్పించవచ్చు. కాదిది వాస్తవం. చిన్న వయస్సులో పిల్లలకు కథలు చెప్పకపోవడం దీనికొక ప్రధాన కారణమని నా అభిప్రాయం. నాగరికత పెరిగాక పిల్లలకు కథలు చెప్పడానికి మనకు తీరిక చిక్కడం లేదు. దీని ఫలితం మనల్ని ఈ దుస్థితికి తెచ్చింది.
046
ఊహంచడం, తర్మించడం
తమకు నచ్చిన కథను పిల్లలు మళ్ళీ మళ్ళీ వినాలనుకొంటారు. తమకు తెలియకుండా ఇలాంటి కథల పట్ల వాళ్ళు మక్కువ పెంచుకొంటారు. రెండోసారో మూడోసారో కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందో ముందే వాళ్ళు చెప్పగల్లుతారు. ఇలా జరగబోయేది ముందుగా చెప్పగల్గడం ఒక సామర్ధ్యం. మళ్ళీ మళ్ళీ ఒకే కథ వినడం వల్ల ఇలాంటి సామర్ధ్యం పెరుగుతుంది. వాళ్ళ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికిది దోహదపడుతుంది. మొదటి రెండు తరగతుల పిల్లలు చదవడం నేర్చుకొనేదశలో ఈ “ముందుగా చెప్పగల్గడం'” అనే సామర్ధ్యం ఎంతైనా ఉపయోగపడుతుంది.
గణితం నేర్చుకోవడంలో కూడా ఈ సామర్థ్యం విలువ ఎనలేనిది. గణిత సూత్రాలన్నీ
'ముందుగా ఊహించి చెప్పగల్లడం' మీదనే కదా ఆధారపడతాయి. అందువల్ల గణిత అభ్యసనానికీ ఈ కథా (శవణ సామర్ధ్యానికి మధ్య ఓ సామ్యం, సంబంధం వుందని నా అభిప్రాయం. కథకు కూడా కొన్ని నిబంధనలు, పద్దతులు వుంటాయి. వాటిని పిల్లలు కథలు వినే కొద్దీ పట్టుకొంటారు. ఇలా పట్టుకొనే కొద్ది వాళ్ళు ముందుగా ఏం జరగబొయ్యేదీ ఊహించి మరింత బాగా చెప్పగల్టుతారు. అలాంటి పిల్లలు గణిత సూత్రాల్ని కూడా ఇంతే బాగా పట్టుకోగలుగుతారు. మరో ప్రపంచం
పిల్లలు తమ చుట్టూ చూస్తున్న ప్రపంచాన్ని కథలు విస్తృత పరుస్తాయి. తాము ఎప్పుడూ పాల్గొనని సందర్భాలను, చూడని మనుషులను, పాత్రలను వాళ్ళు కథల్లో చూస్తారు. ఇలాంటి వాటితో మనకేం పని అని మీరనుకోవచ్చు. కానీ ఇవి కూడా మన జీవితంలో భాగాలు! వాటిని ఎప్పుడూ మనం చూడకున్నా అవి మనల్ని మన ఆలోచనల్ని కదిలిస్తాయి. చిన్న వయస్సులో ఈ కదలిక మరింత ఎక్కువగా వుంటుంది. జీవితాంతం ఈ [క్రమం కొనసాగుతూనే వుంటుంది. తమ చుట్టూ ఒక్క చెడ్డమనిషి కూడా లేకున్నా పిల్లలు చెడ్డవాళ్ళను గురించి ఆలోచిస్తారు. అలాగే అసాధారణ ప్రతిభావంతుల్నీ బుద్దిమంతుల్న అందగాళ్ళనూ కలుసుకొనే ఛాన్సు తమకెప్పుడైనా దక్కకపోతుందా అని ఆరాటపడతారు. ఆదర్శమూర్తుల్ని అభిమానించడం పిల్లల మనస్తత్వంలో ఒక భాగం. అలాగే ప్రమాదాలన్నాా దుష్టశక్తులన్నా భయపడ్డం కూడా వాళ్ళ స్వభావంలో భాగం. మన సాంప్రదాయక కథలు పిల్లల ఈ మనస్తత్వాని కనుగుణంగా వుండటం వల్లనే ఇంతకాలం పిల్లల్నిలా ఆకర్షింపగల్టుతున్నాయి. అక్షర ప్రపంచంలోకి ఇంకా అడుగు పెట్టని బిడ్డ ఓ అమ్మమ్మ కథలో అద్భుతమైన మరో ప్రపంచాన్ని చూస్తుంది. అది తన వాస్తవ ప్రపంచం కంటే ఎంతో విసృతంగా వుంటుంది. పిల్లలకు కథల్లో
7
కన్పించే ఈ మరో ప్రపంచం గజిబిజిగా గందరగోళంగా వుండదు. అందులో ఓ క్రమ బద్ధత ఉంటుంది. ఆ క్రమబద్ధతలోనే కొన్ని నైతిక విలువ లుంటాయి. కానీ ఆ విలువలు మనం నమ్మే సాంప్రదాయకార్థంలో వుండవు. ఆ కథల్లో వంచితుడే గెలుస్తాడు. అయితే ఇలా గెలవడానికి వాడు కొన్ని పద్ధతులు పాటిస్తాడు. అవి అనైతికమైనవిగా మనకు సాంప్రదాయ కార్ధంలో కన్పించవచ్చు. ఆకలితో నకనకలాడే సింహానికి కుందేలు చెప్పిన అబద్దాలు ఇలాంటివే, నూతన పదజాలం
కథలు చెప్పడం పిల్లల భాషా ప్రపంచాన్ని ఎలా విస్తృతం చేస్తుందో కూడా మనం చూడొచ్చు. మాటలు పూర్తిగా వ్యక్తిగత ఆస్తి, ఆ మాటలతో ప్రపంచానికి మనం పేర్లు పెట్టే తీరు కూడా వ్యక్తిగతమైనదే. కానీ ఇదే పదజాలం సామాజిక ఆస్తి కూడా. ఎందుకంటే మన అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి ఈ మాటలే ఆధారం పదాలకున్న ఈ వ్యక్తిగత, సామాజిక లక్షణాలే పదాల అర్ద్జాల్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు పిల్లవాడికి ఆకలి” అంటే ఏమిటో అనుభవం నుంచి తెలుసు. దీన్నుంచే సింహం 'ఆకలి'తో వున్నపుడు ఎలా వుండి ఉంటుందో పిల్లవాడు గ్రహించగలడు. ఇలా 'ఆకలి' అనే తనకు తెలిసిన పదం సింహానికి కూడా వర్తింప చేసుకునేలా ఈ కథ (శ్రోతకు సహకరిస్తుంది. మరికొన్ని కథలు వినేకొలదీ మరికొన్ని పదాల సామాజికార్థాలు పిల్లలకు తెలుస్తాయి. తన స్వంత పదజాలాన్ని ఇతరులకు వర్తింప జేసుకొనే క్రమం వేగిరమవుతుంది. తర్వాత 'చదవడం'లోకి వెళ్ళే పిల్లలకు ఇది చాలా ఉపకరిస్తుంది.
పైన మనం చెప్పుకొన్న నాలుగు కథాప్రయోజనాల్లోని అంశాలు చదవడాని క్కూడా వర్తిస్తాయి. పిల్లలు చదివేకొలదీ భాషాసూత్రాలను, నిర్మాణాన్ని అర్ధం చేసుకో గల్గుతారు. ముందుగా ఊహించి చెప్పగల్గడం పెరిగే కొలదీ చదవడంలో సామర్ధ్యం పెరుగుతుంది. భాషా నిర్మాణంలో సూత్రాలతో పరిచయం పెరిగే కొద్దీ వాక్యంలో తర్వాత ఏమీ వచ్చేదీ పిల్లలు గ్రహిస్తారు. ఇలా చూస్తే కథలు చెప్పడం పిల్లల భాషా జ్ఞానాన్ని పెంచడానికి అమోఘంగా ఉపకరిస్తుంది! కథా నైపుణ్యం
కథలు చెప్పాలనుకొన్నపుడు మనకా కథ బాగా మనసుకు పట్టి వుండాలి. అందులో తడబాటు ఏమి వుండకూడదు. తడబడితే మధ్యలో కొతుకు కన్పిస్తే కథను ఖూనీ చేసినట్టే లెక్క బాగా మనసుకు పట్టిన కథ అయితే మనం సాఫీగా చెప్పగలం. అలా చెప్పగల్లి నప్పుడే కథ చెప్పేవారికీ, వినేవారికీ మధ్య ఒక సజీవ సంబంధం వుంటుంది.
098
అలాగే కథ బాగా మన మనసుకు పట్లి ఉంటే ఆ కథకు సంబంధించిన ఒక స్కెచ్ మన మనస్సులో ఉంటుంది. అప్పుడు శ్రోతల పరిస్థితిని బట్టి మనం ఇష్టం వచ్చినట్లు దాన్ని మార్చుకోగలం. ఒక్కోసారి కథను పెంచాల్సి వస్తుంది. ఒక్కోసారి తగ్గించాల్సి వస్తుంది. కుందేలు సింహం ముందు నిలబడ్డప్పుడు కథను మనం సాగదియ్యలేం. అక్కడే వేగంగా కథ నడవాలి. సింహం ఆకలితో నకనక లాడుతూ ఆలోచిస్తున్నప్పుడు కథను మనం నెమ్మదిగా చెప్పొచ్చు. అలాగే కుందేలు భయం భయంగా తన ఎత్తుగడను నెమరేసుకొంటూ అడవిలోంచి వస్తున్నపుడు కథను అంత వేగంగా చెప్పాల్సిన అవసరం వుండదు. ఇదంతా మనకు కథ మీద వున్న పట్టునుబట్టి వుంటుంది.
ఇక కథలోని సంభాషణల సంగతేమిటి? వాటినెలా చెప్పాలి అనే ప్రశ్నలున్నాయి. దీనికి మనం పలు మార్గాల్ని రెండు రకాల స్వరాలతో పలకొచ్చు. హావభావాల్ని ప్రదర్శిస్తూ చెప్పొచ్చు. చిన్నసైజు తోలుబొమ్మల్ని ఆడిస్తూ చెప్పడం వల్ల సంభాషణలు చాలా రక్తికడతాయి. ఒక్కో పాత్రను గురించి చెపుతున్నపుడు తరగతి గదికి ఈవైపు నుంచి ఆవైపునకు పచార్లు చేస్తూ చెప్పొచ్చు. ఇలా ఎన్నో సృజనాత్మకత పద్ధతుల్ని పాటించవచ్చు. ఇవన్నీ పిల్లలకు చాలా ఉత్తేజాన్నిస్తాయి. ఒకే కథను ప్రతి సంవత్సరం చెప్పాల్సిరావచ్చు. ఒకే కథను ఒకే సంవత్సరంలో పలుసార్లు చెప్పాల్సి రావచ్చు. దీనికి తగ్గట్టుగా మనం తయారు కావాలి. ఒక కళగా కథా కథనాన్ని అధ్యయనం చెయ్యాలి. అలవరచుకోవాలి. ఇది ప్రతి టీచరుకూ ఒక తప్పనిసరి సవాలు.
కథలు చెప్పడం తన జీవితంలో విడదీయరాని భాగమైతే ఏ టీచరు జీవితమూ నిన్స్ఫారంగా వుండదని నా గట్టీ నమ్మకం. ఇది జరగాలంటే ప్రాథమిక పాఠశాలల పాఠ్యాంశాల పట్ల మన దృక్పథంలో కూడా తీవ్రమైన మార్పు రావాలని నా దృధ విశ్వాసం.
- ప్రొ కృష్ణకుమార్, ఢిల్లీ త్రం
అభినయ గేయాలు - ఆంతర్యాలు అభినయ గేయాలను ఏవో చిన్న పిల్లలు పాడుకునే పిచ్చిపిచ్చి పాటల్లెద్దూ అని నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలంతా సరదాగా ఆడుతూ, గెంతుతూ పాడే ఈ పాటల్లో వైద్యశాస్త్ర విశేషాలు, జీవితాన్ని నడుపు కోవలసిన తీరుతెన్నులు, వ్యాయామ విశేషాలు.... కనిపిస్తాయి.
-
_ చెమ్మ చెక్క - చారెడేసిమొగ్గ అట్లుపోయంగ - ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులేయంగ రత్నాల చెమ్మచెక్క - రంగులేయంగ పగడాల చెమ్మచెక్క - పందిరేయంగ సుబ్బరాయుడి పెళ్ళి - చూచివద్దాంరండి మాయింట్లో పెళ్ళి - మళ్ళీ వద్దాంరండి ఈ పాటపాడుతూ రెండు చేతుల్నీ వెనక్కి లాగి ముందుకు తెచ్చి ముందున్న బాలిక అరచేతులమీద అరచేతులతో కొట్టడం వలన ఊపిరితిత్తులలోకి గాలి బలంగా వెళ్ళడం. లోపలి నుండి నిశ్వాసం కూడా బలంగా రావడం జరుగుతుంది. చేతుల్ని ముందుకీ, వెనక్కి కదపడం, కాళ్ళతో ముందుకీ, వెనక్కి కదపడం, కాళ్ళతో ముందుకీ, వెనక్కీ పాటకి అనుగుణంగా గెంతడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకీ వ్యాయామం చేసినట్టవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఒక విశేషం. ఇకపోతే చెమ్మకాయలనే పేరుగల ఒక కూరగాయ వుంది. దానితో ఆట్లుపోసుకుని తింటే స్రీలకి బుతుదోషాలు వుండవు. ఇది మరో విశేషం. 100
-
చిట్కా వైద్యాల్లో సాధారణంగా ఇంట్లో వైద్యురాలు తల్లే కాబట్టి, ముందునాటికి తల్లికాబోయే బాలికకి, పిల్లలందరితో కలిసి తిరగడం వల్ల వచ్చే అంటువ్యాధి అయిన 'గజ్జికి ఏం చేయాలో ఆ వైద్యన్ని ఆ పాటలో కూర్చారు.
“కాళ్ళా గజ్జీ - కంకోలమ్మ
వేగూచుక్కా - వెలగామొగ్గ
మొగ్గాకాదు - మోదుగబావి
నీరూకాదూ - నిమ్మలవారీ
వారీకాదూ - వావింటాకు
ఆకుకాదూ - గుమ్మడిపండి
కాల్టీసి కడగాపెట్టు”
“గజ్జి అంటుకుంటే 'కంకోలం” అనే ఆకుని రుబ్బిరాయాలి. దానికి తగ్గకపోతే వేకువజామున లేత వెలక్కాయలోని గుజ్జు రాయాలి. దానికీ తగ్గకపోతే ముదిరిన గజ్జికి మోదుగ ఆకుని రుబ్బిరాయాలి. తగ్గడం ప్రారంభించినా నిమ్మరసాన్ని బాగా పలుచని చేసి కడగాలి. ఇంకా మాదక పోతే వావింటాకు రాయాలి. అలాగే గుమ్మడిపండులోని గుజ్జు కూడా గజ్జికి ఒక మందే. గజ్జి తగ్గింది కాబట్టి వ్యాధి తగ్గిన కాలుని తీసి ఇటు పక్కగా పెట్టేయి అని ఈ పాట ముగుస్తుంది. ఇలా ఒక వ్యాధికి ఎన్ని విధాలైన మందులున్నాయో అన్న విషయాన్ని ఈ గేయాలలో ఇమిడ్చిన పూర్వుల దూరదృష్టి ఎంత గొప్పదో గమనించాలి.
- బాగా అల్లరి చేసే పిల్లని “కొక్కిరాయి” అని పిలుస్తారు. ఆ కొక్కిరాయి కాలుజారి పడినా, 'ఆదరా-బాదరా” నడుస్తుంటే ఎదురుదెబ్బ తగిలి గాయమైనా ఏం చేయాలో ఈ పాట చెబుతుంది.
చేతులు పట్టుకుని గుండ్రంగా నిలబడి ఈ పాట పాడతారు.
“కొండమీద గుండుజారి కొక్కిరాయి కాలువిరిగె దానికేమ్మందు? వేపాకు పసుపూ - వెల్లుల్లిపాయ నూనెమ్మ బొట్టు - నూటొక్కసారి నూరీ పూటకొక్కసారీ - పూయవోయ్”! 101
కాలికి ఇలాంటి గాయమైతే... వేపొకుని పసుపు, వెల్లుల్లిపాయతో నూరుతూ నూనెబొట్టువేసి బాగా మర్ధన చేసి (నూటొక్క సారి అంటే మెత్తగా వచ్చేలా) పూటకొక్కసారి రాయాలంట.
దెబ్బతగిలిందనగానే వైద్యుని దగ్గరకు వెళ్ళి వైద్యపరీక్షలు మందుల పేరిట కొంత రుసుం వదుల్భుకోవటం, చిన్న గాయాలకు సైతం ఎన్నో మందులు మింగాల్సి రావడం - ఇటువంటివి ఏమీ లేకుండా వైద్యాన్ని అరచేతిలో అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పే ఈ పాటలు ప్రజానీకానికి ఎంతటి మిత్రులో వూహించండి.
ఇద్దరాడపిల్లలు కలిపి * ఒప్పులకుప్ప అంటూ ఆడతారు.
“ఒప్పులకువ్వా - ఒయ్యారిభామా!
సన్నా బీయ్యం - ఛాయాపప్పు
చిన్నా మువ్వ - సన్నాగాజూ
కొబ్బరి కోరు - బెల్లపు అచ్చు
రోట్లో తవుడూ - నీమొగుడెవరు?
గూట్లోరూపాయ్ - నీ మొగుడు సిపాయ్!!
ఈ ఆటలో తమ రెండు చేతులను ఎదురుబదురుగా నిలబడి పట్టుకుని కాళ్ళని నేలకి బలంగా తన్నిపట్టి ఒకసారి గుండ్రంగా తిరుగుతూ ఈ పాటపాడుతారు. ఈ విధంగా తిరగడం వలన నడుం నొప్పులు, వెన్నెముక దోషాలు, మడమ నొప్పులు రానే రావు. శరీరంలో రక్త ప్రసారం బాగా సాగుతుంది.
ఆ తర్వాత నూకల బియ్యాన్ని ఛాయమినపప్పుతో నూరుతూ... కొబ్బరి కోరుని, బెల్లపు అచ్చునీ కలిపి, రోట్లో కొద్ది తవుడు పోసి రుబ్బి వ్యక్తి ఆకారాన్ని చేసి, సన్న గాజుల్ని అటు, ఇటు చెవుల్లాగాను, రూపాయ బిళ్ళ కళ్ళలాగానూ ఏర్పాటు చేస్తే ఏర్పడ్డ ఆ రూపం ఆమె మొగుడట - ఇదో తీరు వేళాకోళం చేయడం మరోపక్క బొమ్మల్ని తయారు చేయడం నేర్పడం.
ఇవన్ని ఒకెత్తయితే జీవితానికి పనికి వచ్చే ఉపదేశాత్మక గీతాలుండడం ఈ గేయాల్లో ఒక ఎత్తు.
102
“బిమడకే చిమడకే ఓచింతకాయ! నీవెంత చిమిడినా నీ పులుపు పోదు!! ఉడకకే ఉదకకే ఓ ఉల్లిపాయ ఎంతెంత వుడికినా నీకంపు పోదు. వ్యక్తికి ఉండే సహజగుణం పోదు అనేది ఇందులోని ఆంతర్యం. తర్వాత ఐదువేళ్ళని తెరచి ఒక్కొక్క వేలునీ మడుస్తూ ఈ పాట పాడుతారు. “తిందాం తిందా ఒక వేలూ ఎట్లాతిందాం ఒక వేలూ అప్పు చేసి తిందాం ఒకవేలూ అప్పెట్ల తీరుద్దాం ఒక వేలూ పొట్టి వాజ్డి, గట్టివాణ్సి బొటనవెలుగాణ్ణి అప్పు చేయకుండానే - ఉన్నదాంట్లో తిందాం” ఎంత చక్కని జీవన విధానాన్ని తెల్పుతుందీపాట! ఒకప్రక్క వ్యాయామం, మరోపక్క వైద్యరహస్యాలు, బొమ్మల్ని చేయడం నేర్పడం, ఉపదేశాత్మక గేయాలు, జీవన విధానాలు తెల్చేవి... ఇలా ఎన్నో అంశాలు నేర్పే ఈ పాటలు ఆడుతూ, పాడుతూ నేర్భుకునేవే తప్ప నిర్బంధంతో నెర్పవి కావు. = ఎ. సరళమ్మ డి.ఆర్.పి, జి.ది. నెల్లూరు మందలం 103
మౌఖికం నుంచి లేఖనానికి మారే దశలో లా న నా ఛ్ ఎల్లలూ - పుస్తక ప్రపంచం నాలుగైదేళ్ళ పిల్లల్లో వస్తున్న మార్పును మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మార్చు ఇంటి వాతావరణం నుంచి బడి వాతా వరణంలోకి అడుగుపెట్టడమే గదా అని మీరనవచ్చూ, కానీ ఈ మార్పులో అంతర్లీనంగా ఓ అంశం దాగి వుంది. అదేమంటే ఈ వయస్సులోనే పిల్లలు తమ అభిప్రాయాల్ని, ఆసక్తుల్ని మౌఖిక పద్ధతి నుండి అక్షర పద్ధతిలో అభివ్యక్తీకరించడం ప్రారంభిస్తారు. బడికే రానిది అక్షరాలెక్కడివి? అక్షర పద్ధతిలో అభివ్యక్తీకరణ ఎక్కడిది అని మీరనవచ్చు. అక్షర ప్రపంచంలోకి తొలి అడుగు ఈ అంశం మీద చాలా పరిశోధనలు ఇటీవల ' జరిగాయి. భాషాతత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేశారు. మాటల్లోంచి రాతల్లోకి మారే ఈ పరిణామ క్రమాన్ని మనం పిల్లలు చేసుకొనే ఆట వస్తువుల్లో, వేసుకొనే బొమ్మల్లో, గీసుకొనే పిచ్చిరాతల్లో, ఎర్పరుచుకొనే గుర్తుల్లో, అమూర్త సంకేతాల్లో మనం గమనించవచ్చు. పెద్దల్లాగా వ్యవహరించాలని పిల్లలకు అంతులేని ఉబలాటం ఉంటుంది. ఇందు కోసం పిల్లలు పై పద్దతుల్ని కనిపెడ తారు. కొత్త సమాచార వ్యవస్థను రూపొందించుకొంటారు. అక్షర ప్రపంచంలోకి ఇలానే వాళ్ళు అదుగిడతారని మనం గుర్తుంచు కోవాలి. ఆటల్లో పిల్లలకు ఓ చిన్న పెట్టె ఇల్లుగా మారిపోతుంది. ఓ కర్రపుల్ల గుర్రం అయి వోతుంది. మట్టిలో చిన్నపుల్లతో వాళ్ళు రాసే గీతల్లో ఎక్కడెక్కడి ఊహలూ సాక్షాత్కరిస్తాయి. పెద్దలు చేసే పనులన్నీ వీళ్ళిలా చేస్తుంటారు. మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం చేసే చెష్టలన్నీ పిల్లలు కొత్త రూపాల్లో చేస్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. 104
ఈ సం-ఎశాల్ని పిల్లలు ఎక్కడి నుండి సంపాదించుకొంటారు? తమ వాతావరణం నుంచే సంపాదించుకొంటారు. మరి పల్లెటూరి పిల్లల వాతావరణం, పరిసరాలు వేరు. పట్టణ విద్యాధిక కుటుంబాల్లోని పిల్లల పరిసరాలు వేరు. సహజంగానే అక్షరాలు, చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు, గ్రామీణ పిల్లలకు అందుబాటులో ఉండవు. పుస్తకాలు వారికి దొరకవు. మౌఖికంగా అందే పాటలు, కథలు, జోకులు, వినోదాంశాలు కూడా ధనికుల పిల్లల కందుబాటులో వున్నట్టు పేదపిల్లల కందుబాటులో వుండవు. టి.వి.లో, అగ్గిపెట్టెల మీద, వస్తువుల ప్వాకెట్ల మీద కన్పించే అక్షరాలే వీళ్ళకి అక్షర ప్రపంచం! ఇక తమ తల్లిదండ్రులు కాగితాలతో, కలంతో పనిచెయ్యడం వీళ్ళ ఊహక్కూడా అందని విషయం. కనీసం క్యాలెండర్లు, ఫోటోలు, దృశ్యాల క్కూడా అవకాశం ఉండదు. బడిలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళవన్నీ చూస్తారు. బడిలో వున్నంతసేపు మాత్రమే వాళ్ళకీ అవకాశం వుంటుంది. మన పద్ధతి = మన వాచకాలు
ఇక పిల్లలు చదవడం, రాయడం ఎలా నేర్చుకొంటారో చూద్దాం. అక్షరాలంటే ధ్వనుల సంకేత రూపాలు. అక్షర రూపానికీ ధ్వనికీ సంబంధం ఏమీ ఉండదు. ధ్వనులను పేర్చి పదాలు, పదాల్ని కూర్చి వాక్యాలు రూపొందించాలి. ఇదొక సంక్షిష్ట ప్రక్రియ. అయితే వాస్తవానికి వినడం, మాట్లాడ్డం కూడా ఇలాంటి ప్రక్రియే. వేల ధ్వనులుంటాయి. వేల పదాలుంటాయి. వస్తువుకీ పదాలకీ మధ్య సంబంధం ఏమీ ఉండదు. ఒక వాక్య నిర్మాణం సరేసరి. అయినా పిల్లలు అద్భుతంగా చెప్పింది అర్ధంచేసుకొంటున్నారు. మాట్లాడుతున్నారు. ఇదెలా జరుగుతోంది?
భయం, జంకూ లేకుండా మాట్లాడనిచ్చినందువళ్లే పిల్లలు మాటలు నేర్చుకొంటు న్నారు. రాయడం కూడా అంతే! ఇష్టం వచ్చినవి - అవి అనుభవాలు కావచ్చు, ఊహలు కావచ్చు, పిచ్చిపిచ్చివి కావచ్చు. వాగదానికి వీలుండబట్టే పిల్లలు మాటకార్లుగా మారుతున్నారు.
రాతలోనూ అంతే. అసలు పిల్లలకో లోకం వుంటుంది. ఆ లోకాన్ని వ్యక్తీకరించుకొనే రూపంలోనే భాష వారికి పట్టుబడుతుంది. భాషలోని ఏ నైపుణ్యమైనా ఇలానే వంటబడుతుంది.
ఇప్పుడు మన స్కూళ్ళ దగ్గర కొద్దాం. అక్షరాలతో మనం ప్రారంభిస్తాం. ఈ అక్షరాలు కేవలం అమూర్త సంకేతాలు, ఆ అక్షరాలు కూడా ఒక క్రమంలోనే వుంటాయి. ఆ క్రమం వల్ల పిల్లలకి వొరిగేదేమిటో ఎవ్వరికీ తెలియదు. పిల్లలక్కావల్సింది తమ ఆసక్తుల్ని వ్యక్తీకరించడం తప్ప అక్షరమాలలోని హ్రస్వ దీర్జాల్ని, పరుష సరళాల్ని గుర్తించడం కాదు. వ్యాకరణ పాండిత్యం కాదు. దీన్ని మనం మరచిపోతాం,
105
అక్కడితో ఆగదు. ఈ అక్షరాలన్నిటినీ గుర్తుంచుకోవాలి. ఎప్పుడో ఏడాది తర్వాత వాడుకోవాలి (పదాలుగా!). ఇక అక్షరాల్ని వాడుకోవడంలో మనం పెట్టే ఆంక్షలు కోకొల్లలు. మూసపోసినట్టు పిల్లలందరూ ఒకే పదాలు వల్లించాలి. ఒకే వాక్యాలు చదవాలి. ఈ పదాలకీ పిల్లల అవసరాలకీ సంబంధం వుండదు. వీళ్ళ లోకంతో అసలే సంబంధం వుండదు. అంతా మనం బిగించిన చట్రంలోనే జరగాలి.
అక్షరమాలను రుద్దించే పద్ధతి ఎంత వికృతమైందో మన వాచకాలు కూడా అంతే వికృతంగా వుంటాయి. వాచక నిర్మాణం ధ్వనుల క్రమాన్ని పరిచయం చెయ్యడంతో ముడిపడి వుండటం ఒక వికారమైతే అపరిచిత, అర్ధరహిత, కృత్రిమ పదాలూ, వాక్యాలూ మరో వికారం. “తమది అని ఆనందించే అంశం వీటిలో పిల్లలకి ఒక్కటీ వుండదు.
ఇవన్నీ చాలక తప్పులెక్కడా దొర్లకూడదని మనం గొంతు మీద కత్తి పెడతాము. కొత్త విషయాల్లోకి పోతే తప్పులొస్తాయి. అందువల్ల వాచకం వేదమవుతుంది. కంఠస్తం పరమార్ధమవుతుంది. ఇక్కడితో పిలల ఊహలు ఖతం. ఆసక్తులు ఖతం. ఆలోచనలు ఖతం. అత్యున్నత వర్గాల స్ఫూల్లోనైనా, మామూలు ప్రభుత్వ స్కూల్లోనైనా సారాంశం మాత్రం ఇదే. పుస్తకాలూ - పిల్లలూ
పిల్లలు అక్షర ప్రపంచంలోకి ఎలా అడుగిడతారో మనం మొదట చూశాం. దీనికి కొనసాగింపుగా మన పాఠశాలల్లో ఏమైనా చెయ్యగలమా? పేదపిల్లలు ఇంట్లో అక్షర ప్రపంచానికి దూరమెలా అవుతారో మనం చూశాం. దీనికి పరిష్కారం మనం బడిలో ఏమైనా చూపగలమా? (ప్రాథమిక స్థాయిలో అక్షరలోకంలోకి అడుగిదే మన పిల్లలకి పుస్తకాలు ఏమైనా పని సాధించిపెడతాయా అనేది ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నా అనుభవాలు కొన్ని చెపుతాను.
1990 ప్రారంభంలో ఎస్.సి.ఇ. ఆర్.టి. ఢిల్లీలో ఒక ప్రాజెక్టును (ప్రారంభించింది. ఇది 12 మున్సిపల్ స్కూళ్ళలో అమలు జరిగింది. మూడవ తరగతి న్థాయిలో ఎక్కువమంది పిల్లలు బడి మానేస్తున్నారని గుర్తించి ఈ ప్రాజెక్టు చేపట్టారు. 38వ తరగతి పిల్లల్ని కొందర్ని గుర్తించారు. వీరికి శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా 1,2 తరగతుల పిల్లల్ని నూతన పద్ధతిలో అక్షర ప్రపంచంలోకి అడుగిడేలా చెయ్యడం దీని లక్ష్యం.
ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించగానే 1,2 తరగతుల పిల్లలకు వాచకాలు తప్ప ఎలాంటి పుస్తకాలు అందుబాటులో లేవని మాకు తేలిపోయింది. దాదాపు పిల్లలందరూ చదవాలన్నాా రాయాలన్నా సతమతమవుతున్నారు. వాచకాల్లోని వాక్యాల్ని కొంచెం తారుమారు చేస్తేచాలు వాళ్ళు చదవలేకపోతున్నారు. వాళ్ళర్దవంతంగా ఏమీ చదవడంలేదని, కేవలం వల్లిస్తున్నారని మాకర్ధమైపోయింది. అదే సమయంలో ఈ పిల్లలకి చదవాలనే తృష్ణ విపరీతంగా వుండటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.
106
మొదట మేం కథలు చెప్పడంతో మొదలెట్టాం. తెలిసిన కథలు, కొత్త కథలు లెక్కలేనన్ని పిల్లల నుంచే పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కథను మధ్యలో ఆపేసి తర్వాత ఏం జరిగిందో చెప్పమన్నాం. ఒక్కొక్కరు ఒక్కోలా ముగించారు. తాము స్వంతంగా కథలు అల్లినట్టు పిల్లలు ముచ్చటపడ్డారు. వాచకాల్ని వదిలేసి ఆ తర్వాత కథలు పెద్దగా చదివి విన్పించనసాగాము. పిల్లలు స్వేచ్చగా ఆరుబయట ఎవరిష్టం వచ్చినట్టు వారు కూర్చునే వారు. కథలు వినేవారు. చిన్నపిల్లల కోసం పెద్ద పిల్లలు పుస్తకాలు సేకరించారు. ఆదివారం దినపత్రికలు పట్టుకొచ్చారు. పిల్లలు వీటిలోని బొమ్మల్ని చూసేవారు. తమలో తాము మాట్లాడుకొనేవారు. విచిత్రం ఏమంటే మనం చాలా చిన్నవని, పనికిరానివనీ అనుకొన్నవి కూడా పిల్లల్లో మహా ఉత్సాహం కలిగించేవి. పిట్టలు, పురుగులు, జంతువులు, ఆకులు, పూలు కూడా వాళ్ళతో గుసగుసలాదేవి. ఇలా పుస్తకాల్ని 'చదవడం' పిల్లలు మొదలెట్టారు. ఈ “' చదవడంి విచిత్రంగా వుండేది. ఓ సింహం బొమ్మ ఉందనుకోండి. 'నేను కూడా అడవికి వెళ్ళా. పెద్ద సింహాన్ని గుహలో చూశా” అని ఓ పిల్ల తన ఉత్తుత్తి 'అనుభవాన్నిి దీనికి జోడించేది. ఓ పువ్వు కన్పిస్తే చాలు” ఇలాంటి పూలు మా వూళ్ళో బోలెడు పూస్తాయి' అని మరో పిల్ల అనేది. అంటే పిల్లలీ బొమ్మలతో, కథలతో మమేకమై వాటిని స్వంతం చేసుకొనేవారు. ఆ స్కూళ్ళ టీచర్లు మొదట దీన్ని అర్ధం చేసుకోలేక పొయ్యారు. వాళ్ళ దృష్టిలో పలకలమీద రాయడమే అక్షరాలు నేర్చుకోవడం. ఇదంతా దండగమారి పని అనీ, వాళ్ళ సమయం వృథా అవుతోందనీ వాళ్ళ అభిప్రాయం. కానీ తర్వాత భాష నేర్చుకోవడంలో దీని ప్రాధాన్యత గుర్తించి వాళ్ళు కూడా క్లాసులో కథలు మొదలెట్టారు.
దీన్ని మేం మరికొంత విస్తృతం చేశాం. అక్షరాలతో, పదాలతో ఆటలాడ్డం, అంత్యానుప్రసాలు, స్వంతవాక్యాలు చెప్పడం నుంచి నచ్చిన పదాల్ని చూసి రాయడం దాకా దీనికి జోడించాం. పిల్లలకు అక్షరాలు, పదాలు, వాక్యాలు ఇలా పరిచయమయ్యాయి. అక్షరాల రూపాలతో పాటు కొన్ని అక్షరాలు ఎడమ నుంచి కుడికి వరుసగా పేరిస్తే పదాలుగా, పదాల్ని పేరిస్తే వాక్యాలుగా మారతాయనే సంగతీ వాళ్ళు పసిగట్టారు. వాళ్ళు బొమ్మలే సేటపుడు, పిచ్చిరాతలు కూడా వాక్యాల్లా వరుసగా వుండేవి. కొందరైతే పదాల్ని రాసేవారు. బొమ్మలకు పేర్లు పెట్టేవారు. బొమ్మలేసి అది చేస్తున్న పనిని చిక్కిరిబిక్కిరిగా రాసేవారు.
అన్నిటికంటే విశేషం గంటల తరబడి పిల్లలీ పుస్తకాలతో గడపడం. వాటిని తిప్పుతూ బొమ్మల్ని వేళ్ళు పెట్టి చూస్తూ, చేతులతో తడుముతూ, ముద్దు పెట్టుకొంటూ వాళ్ళు ఏమేమో చేసేవారు. వాళ్ళకి చాలామందికి చదవడం ఏమీరాదు. అయినా చదువుతున్నట్టే తల పుస్తకంలో పెట్టి ఏమేమో మాట్లాడేవారు. వాటి మీద రాసేవారు. కాపీ చేసేవారు. ప్రతి దానికీ తమ
107
జీవితాన్ని, అనుభవాన్ని జోడించె వారు. స్వేచ్చగా వదిలినందువల్లనే ఇది సాధ్యమైంది. ' ఇలాకాదు ఇలా చెప్పాలి అని ప్రతిసారీ తప్పులు వెతకడం లేనందువల్లే ఇది వీలైంది. ఒక్కోమెట్టు పైపైకి
ఈ ఉత్సాహం మాకు మరింత పని పెట్టింది. మేం మరిన్ని సేకరించాల్సి వచ్చింది. 'సేకరించాం. ఛార్జులు, బొమ్మలు గోడకు వేలాడదీశాం. పిల్లల రాతల్ని కూడా గోదకు తగిలించాం. వాళ్ళ బొమ్మల్ని ప్రదర్శించ సాగాం. ఇవన్నీ పిల్లలు చూడ్డానికి ( చదవడానికి) అందుబాట్లో వుండేంత ఎత్తులో వుంచాం. ఇలా మాకూ కొత్త కొత్త ఆలోచనలు రాసాగాయి. గోడ మీద రకరకాల సంజ్ఞలు రాయడం ఈ ఆలోచనల్లో ఒకటి. ఈ సంజ్ఞలు ఒక్క వాక్యంలో వుంటాయి. ఉదాహరణకి * మీ చేతులు పైకెత్తండి', 'ఆడుకొందాంరండి), * అదిగో ఆ చెట్టును తాకి పరిగెత్తిరండి' ఇలాంటి సంజ్ఞలన్నమాట. వీటిని పిల్లలు చదివి అలా చేసేవారు. చూస్తుండగానే ఇదొక ఆటలా మారిపొయ్యింది. పెద్ద పిల్లల్ని ఈ సంజ్ఞలు రాయమనేవాళ్ళం,. వాళ్ళు పోటీ పడెవాళ్ళు. అలాగే ఆసక్తి కలిగించే శీర్షికలున్న బొమ్మల్ని తగిలించే వాళ్ళం, పుస్తకాల పేర్లు బోర్డు మీద రాసి ఆ పుస్తకాల్ని గుర్తించమనేవాళ్ళం. పొడుపు కథలు రాసేవాళ్ళం. ఇలా పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు మామ్టార్లయి పోయారు!
దీన్ని ఇంకో మెట్టు ఎక్కించడానికి మరో ఆలోచన చేశాం. పిల్లల అనుభవాల్ని రన్నింగు బోర్డు మీద రాయించాం. మొదటి దశలో ఇవి చిన్న చిన్న ఆలోచనలే కావచ్చు. 'నేనీరోజు ఒక పిట్టను చూశా”, 'నిన్న మా ఇంటికి ఒక కుక్క వచ్చింది, 'నా పుస్తకం చినిగిపొయ్యింది. నాకు వడుపొచ్చింది.* ఇలాంటి అనుభవాలన్నమాట. ఇలా రాయడంలో పిల్లలు చాలా “తప్పులు రాసేవాళ్ళు. మాక్కావల్సింది ఆలోచనలేగాని వ్యాకరణం కాదుగా. ఇష్టారాజ్యంగా రాయమనేవాళ్ళం. పిల్లలు ఈ రాతల చుట్టూ మూగేవాళ్ళు. చదివేవాళ్ళు. చర్చించుకొనేవాళ్ళు. చదవలెనివాళ్ళు చదవగలవాళ్ళ దగ్గర చెప్పించుకొనేవాళ్ళు. అక్షరాల్ని మెల్లమెల్లగా గుర్తించేవాళ్ళు.
ఇంకో తమాషా పని ఏమంటే చిన్న పిల్లల అనుభవాల్ని పెద్ద పిల్లలు రాయడం, చిన్న పిల్లలు ఏవేవో చెప్పేవాళ్ళు. పెద్ద వాక్యాలుగా, పిచ్చి పిచ్చి వాక్యాలుగా అవి వుందేవి. వాటిని అలానే రాయమనేవాళ్ళం. వాటిని మళ్ళీ చదివి వాళ్ళకి విన్సించేవాళ్ళం. వాటిని గోడకు వేలాడతీసేవాళ్ళం. ఆ తర్వాత చిన్న పిల్లలు కూడా రాయసాగారు. అలా రాయడానికి వాళ్ళకంత భాష రాదుగదా అందుకోసం ఒక బొమ్మ వెయ్యమనేవాళ్ళం. ఆ బొమ్మ కింద ఏదో ఒకటి రాయమనేవాళ్ళం లేదా పెద్ద పిల్లల చేత రాయించేవాళ్ళం. అయితే ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకొనేవాళ్ళం. అదేమంటే ఏం రాసినా పిల్లల భాషలోనే వుండాలి.
108
ఈ అనుభవాన్ని నేను మాటల్లో చెప్పలేను. పిల్లలు ఎంత ఆనందిసారో! ఎంత వుబలాటపడతారో! కానీ మనం గమనిస్తే ఇందులో చదవడం, రాయడం నేర్చుకోవడంలోని ప్రాథమిక దశ వుంది. అచ్చం ఇది వినడం, మాట్లాడ్డం నేర్చుకొనే దశలాంటిది? సంచీలో పుస్తకాలు
కొంతకాలం నేనూ, మా పిల్లలు కలిసి ఒక గ్రామంలో ఒక (గ్రంథాలయం నడీపాం. (గ్రంథాలయం అంటే ఏమిటో అనుకొనేరు. ఒక సంచిలో పుస్తకాలు.... అంతే. వీటిని ప్రతి శుక్రవారం బడికి తీసుకెళ్ళే వాళ్ళం, పుస్తకాల్లోని కథలు చదివి విన్పించే వాళ్ళం. ప్రశ్నలు వేసేవాళ్ళం. పిల్లలచేత ఆ కథల్ని పలురకాల ముగింపులతో తిరగచెప్పించే వాళ్ళం. కొంత కాలం తర్వాత పుస్తకాలు ఇంటికిచ్చి మళ్ళీ శుక్రవారం తీసుకొనేవాళ్ళం,. ఎనభైశాతం పిల్లలు పుస్తకాలు ఏమాత్రం చించకుండా తెచ్చేవాళ్ళు. పుస్తకాలతో వాటు ఆటలు, పాటలు, పొడుపు కథలు, అక్షరాలతో క్రీడలు, స్వీయ కథనాలు, బొమ్మలు వెయ్యడాలు, కథలు రాయడాలు, పాటలు రాయదడాలు కూదా చేశాం. ఇదంతా పెద్ద హంగామాగా మారిపొయ్యింది. శుక్రవారం వస్తోందంటే చాలు పిల్లలు ఎక్కడలేని సంబరాన్ని ప్రదర్శించేవారు. క్రమంగా ఇది పెద్ద పిల్లలకు, బడి మానేసిన అమ్మాయిలకు పాకింది. వాళ్ళని సభ్యులుగా చేర్చుకొని పుస్తకాలు ఇవ్వసాగాం. ఆ చిన్న వూళ్ళో మాకు 120 మంది సభ్యులయ్యారు. చినిగిపోయిన పుస్తకాల్ని అతికించడం, అట్టలు వేయించడం, మరీ చినిగిపోయినవి కత్తిరించి ఛార్చులుగా మార్చడం- ఇవన్నీ పిల్లలే చేసే వారు. ఈ అనుభవం మాకు నేర్పిందేమంటే పిల్లల ఉత్సాహానికి తగినన్ని పుస్తకాలు మా
వద్ద లేవు. ఈ దేశంలో చిన్నారిపిల్లల పుస్తకాల క్కూడా ఎంత దారిద్ర్యమో! భోజన విరామంలో పుస్తక పఠనం
నా మరో అనుభవం చెపుతా వినండి. మా స్కూల్లో మధ్యాహ్న విరామ సమయంలో నేను ఇలాంటి [గ్రంథాలయాన్నె నడిపాను. పుస్తకాలు తీసుకెళ్ళడం ఒక రూంలో తాళ్ళకి వేలాడదీయడం నా పని. పిల్లలు మెల్లగా గుమిగూడ్డం ప్రారంభించేవారు. కొందరు దూరంగా నిలబడి చూచేవారు. కొందరు బొమ్మల్ని తిరగేసేవారు. మరికొందరు తీసికొని చదివేవారు. ఇలా క్రమంగా నా లైబ్రరీ *' జనాదరణి పొందసాగింది. లంచ్టైంలో నేను స్టాఫ్రూంలో లేకుండా ఏమైపోతున్నానో నా తోటి టీచర్లకు కొన్నాళ్ళు తెలిసేది కాదు. ఆ తర్వాత వాళ్ళు అర్ధం చేసుకొన్నారనుకోండి. క్రమంగా నేను పుస్తక మిత్రుల్ని తయారుచేసుకొన్నాను. వాళ్ళకి పుస్తకాలు ఇంటి కివ్వడం మొదలుపెట్టాను. ఇక్కడ కూడా నన్ను వెంటాడిన సమస్య పుస్తకాల కొరత. మంచి పిల్లల పుస్తకాల కొరత.
109
చివరిగా ఒక్కమాట. పిల్లలకి పుస్తకాల్ని తమవిగా అన్పించేలా చెయ్యాలి. అంటే వాళ్ళు స్వంతం చేసుకోవాలి. అప్పుడు పిల్లలు పుస్తకాల వెంట పడతారు. పిల్లలు ఈ చిన్న లైబరీల్ని అద్భుతంగా నిర్వహిస్తారు. రెండోది వాళ్ళ ప్రపంచం వాళ్ళకి అందులో కన్పించాలి. అలాంటి పుస్తకాలుండాలి. మూడోది స్వేచ్చగా వాళ్ళిష్టం వచ్చినట్లు వాళ్ళు పుస్తకాల్ని వాడుకోనివ్వాలి. చూడ్డం కూడా చదవడమే అని మనం గుర్తించాలి. నాలుగవది పుస్తకాల చుట్టూ మనం రకరకాల కృత్యాలు చేపట్టాలి. పిల్లల ఆసక్తులు, ఆనందాతిరేకాలు, అనుభూతులు రాబట్టాలి. వాటితో భాషను అనుసంధానం చెయ్యాలి. అప్పుడు వాళ్ళ స్వప్నలోకమంతా మన ముందు సాక్షాత్మరి స్తుంది. ప్రాథమికదశలో ఇలా చెయ్యడం భాష నేర్చుకోవడంలో (చదవడం, రాయడంలో) చాలా కీలకపాత్ర వహిస్తుందని మనం నమ్మితేనే ఇలా చెయ్యగలం. వాచకాలు
వల్లించడమే భాష నేర్చుకోవడం కాదని మనం ఒప్పుకొంటేనే ఇది సాధ్యం!
- క్రీర్తి జయరాం
10
కథలోంచి భాష నేర్పడం ఎలా?
అమ్మమ్మ ఒడిలోనో తాతయ్య పక్కలోనో అతుక్కుపోయి మంత్రాలు దయ్యాలు భూతాలు కథల్లో వస్తుంటే బిక్కుబిక్కుమంటూనే ఊ ఊ అంటూ కథలు విన్నకాలం కంటె బాల్యంలో తీపి గుర్తు ఎవరికైన ఏముంటుంది? తల్లిదండ్రులూ టీచర్లూ బోధనలో అభ్యసన ప్రక్రియలో ఈ కథలకెంత ప్రాధాన్యత వుందీ ఇంకా గుర్తించలేదు. మన బోధనా వైఫల్యాల్లో ఇదొకటి. కథలంటే పిల్లల ప్రపంచం
పిల్లలు ఒక కథ వింటున్నారంటే దానివల్ల వాళ్ళలో మనకు తెలియకుండానే అనేక సామర్థ్యాలు ఏర్పడుతుంటాయి. ఓర్పుగా (శ్రద్ధగా వినే నైపుణ్యం వాళ్ళకి కథల వళ్లే వస్తుంది. కథ ముగిసేదాకా పాత్రల చేష్టల్ని ఘటనల్ని వాళ్ళు కెమెరాలోలాగా మనసులో బంధించి పెట్టుకొంటారు. కథకి సరికొత్త మలుపుల్ని ముగింపుల్ని వాళ్ళు ఊహించుకొంటారు. కథలో ఓ ఆసక్తికరమైన వాళ్ళ స్వంత ప్రపంచం వుంటుంది. అందులోకి వాళ్ళు ప్రవేశిస్తారు.
చదవడం, రాయడంలోకి వెళ్ళడం ఈ ప్రపంచంలోనే జరగాలి. అప్పుడే దానికర్ధం వుంటుంది.
పిల్లలకి తెలిసిన కథను మనం చదివి విన్పిస్తున్నపుడు పిల్లల అనుభూతుల్ని చేష్టల్ని గమనించండి. ఒక వాక్యం మనం చదివాక తర్వాత ఏ వాక్యం వస్తుందో వాళ్ళు ముందుగానే ఊహిస్తారు. చెప్పేస్తారు. అంటే పిల్లలకి చదవడం నేర్చడంలో కీలకాంశం వాళ్ళకి అర్ధవంతమైందిగా వున్న దాన్ని చదివించడంలో వుంది. అలాగాక అక్షరాలో, పదాలో ఒంటరిగా చదివించడానికి పూనుకోవడం అర్ధరహితం. మనం పిల్లలకి వీలున్నంత విషయాన్ని - వాళ్ళకి
11
అర్దవంతమైందిగా వున్న దాన్ని అందించాలి. ఇలాంటి విషయాలు కథల కంటే మంచివీ, ఆసక్తికరమైనవీ, ఏవీ వుండవు. కథ చదివి విన్నించదడం
పిల్లలు ఒక కథను విని, తోటి పిల్లలతో చర్చించుకొని, స్వంతంగా చదివిన తర్వాత మనం ఎన్నైనా అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు.
మనం మొదట చెయ్యవల్సింది కథని చదివి విన్సించడం. ఇలా విన్పించడం పదాల్ని తప్పుల్లేకుండా గుర్తించదానికో, వాక్య విన్యాసాల్ని అర్ధం చేసుకోవడానికో, కొత్తపదాల్ని నెర్చడానికో కాదు. ఇవన్నీ చాలా సంక్షిషమైన వ్యవహారాలు. ఒక క్రమంలో పిల్లలే వీటిని గుర్తించి పట్టుకొంటారు. మాట్లాదేపుడు వాళ్ళు ఈ నియమాలన్నిటినీ అలాగే ఒక క్రమంలో (గ్రహించారు. కథ విన్పించడం కథని ఆస్వాదించడానికి మాత్రమేనని మనం ముందు వొప్పుకోవాలి.
ప్రతి దాన్నీ మనం ప్రశ్నించి ఎంత వచ్చిందో రాబట్టుకొనేందుకు ప్రయత్నించడం ద్వారా భాషను ఎప్పటీకీ నేర్చలేము. వింటూ, చూస్తూ, చదువుతూ, రాస్తూ వుండే క్రమంలో భాషా నియమాల్ని పిల్లలే స్వంతంగా గ్రహిస్తారు. దీన్ని మనం మొదట అంగీకరించాలి. కథని బాగా చదివి విన్పించండి. తర్వాత ఇతర సంగతులు వాటికంత అవే జరిగిపోతాయి. కథ నుంచి రాయడంలోకి....
మరో విషయం పిల్లలు విన్న కథని తమలో తాము చిత్రించుకొంటారు. దాన్ని బొమ్మల రూపంలో “రాయాలని కోరుకొంటారు. ఈ బొమ్మలు మనకి పెద్దవాళ్లకి అర్ధం లేనివిగా అన్పించవచ్చు. అయినా సరే మనం వాటిని ప్రోత్సహించాలి. పిల్లల మెదళ్లలోని అర్ధంగాని అనేక మిస్టరీలను ఇవి విప్పి చెపుతాయి. కొంచెం మనసు పెడితే ఈ బొమ్మలకర్థం మనక్కూడా తెలుస్తుంది.
పిల్లలు ఈ బొమ్మల కింద ఏదో ఒకటి రాయాలని ఉబలాట పడతారు. అవి పదాలు కావచ్చు. వాక్యాలు కావచ్చు. సవాలక్ష తప్పులతో వుండొచ్చు. అయినా వాళ్లకవి ప్రాధాన్యత గల 'విషయాలు". రాయడం నేర్పించడంలో ఇదొక ముఖ్యమైన మొదటి అడుగు.
112
ఇక్కడ కీలకమైన అంశం పిల్లలు తప్పుల్లేకుండా రాయడం కాదు. అది ఓ (క్రమంలో అలవడుతుంది. కీలకమైంది వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం రాస్తున్నారా అనేది. నటనలోకి, ఊహల్లోకి...
కథకు “చదివించడం, “చిత్రించడం, “రాయించడం” జతపరిచినట్టే నాటకీకరణను కూడా జోడింపవచ్చు. పిల్లల్ని గ్రూపుల్లో చర్చించుకోనివ్వండి. కథను పూర్తిగానో, ఒక ఘట్టాన్నో నాటకంగా వెయ్యమనండి. పాత్రల్ని వాళ్ళే నిర్ణయించుకొంటారు. సంభాషణల్ని వాళ్ళే తయారుచేసుకొంటారు. ఎలా నటించాలో వారే నిర్ధారించుకొంటారు.
కథలోని పాత్రలు తమాషాగా వుంటాయి. ఒక్కో వాత్రకు ఒక్కో వ్లాన్ వుంటుంది. దాని చేష్టల్లో అది బయట పడుతుంది. పిల్లలకి ఈ పాత్రల ఆలోచనలు, చేష్టలూ అంటే మహా యిష్టం. మరి అవే పాత్రలు సరికొత్త ఆలోచనలూ, చేష్టలూ చేసేలా పిల్లల్ని ఊహించమనండి. కథని పిల్లలకిష్టమొచ్చిన మలుపు తిప్పమనండి. ఇష్టం వచ్చిన ముగింపు చెయ్యమనండి వొత్రల్ని మంచివి టక్కరివిగా, మొద్దువి తెలివైనవిగా పిల్లలు మార్చెస్తారు. ఇలా పిల్లలు కథల్ని 'స్వంతం' చేసుకొంటారు. ఏ అంశమైనా పిల్లల స్వంతమయ్యాక అందులోంచి ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి! వ్యాకరణంలోకి...
వయస్సును బట్టి మానసిక న్థాయినిబట్టి ఇక కథ ద్వారా మనం ఎన్ని అంశాలనైనా రాబట్టవచ్చు. నామవాచకాల్సిి క్రియల్ని విశేషణాల్ని క్రియా విశేషణాల్ని ఆ పేరు చెప్పకుండా ఎన్నిటినైనా రాబట్టవచ్చు. వాక్యాల్ని వాటి నిర్మాణ పద్ధతుల్ని పసిగట్టేలా చెయ్యవచ్చు. ఒకే ధ్వనిగల పదాల్ని క్రోడీకరింప చెయ్యవచ్చు. మనం వ్యాకరణం అని దేన్ని చెపుతున్నామో దాన్నంతా ఆ పేరు చెప్పకుండా ఎంతయినా నేర్పించవచ్చు. దీనికోసం పిల్లలు కథను మళ్ళీ మళ్ళీ చదువుతారు. చదివే కొలదీ భాషా రహస్యాలన్నీ ఒక్కొక్కటీ బట్టబయలవుతాయి. అక్షరాలతో, పదాలతో ఆటలు తయారవుతాయి. భాషా సౌందర్యం, చమత్నారం, రహస్యం ఒక్కొక్కటీ ఆవిష్టత మవుతాయి. అసలు విషయం పిల్లలు స్వంతం చేసుకోవడం
పిల్లలచేత కథను తిరగరాయించవచ్చు. వాళ్ళ వాక్యాలు ఏలాగైనా వుండనియండి అక్షరాలతో, పదాలతో భాష నేర్పడం ప్రారంభించేవాళ్ళు, సందర్భంలేని వాక్యాల్ని పిల్లలకి నేర్చేవాళ్ళు భాష నేర్చడమంటే ఇంతేనని నమ్ముతారు. పిల్లల శక్తిపట్ల వాళ్ళకి నమ్మకం తక్కువ,
118
పెద్ద పెద్ద వాక్యాల్ని పిల్లలు పట్టుకోలేరని వాళ్ళను కొంటారు. కఠినమైన పదాల్ని రాయలేరని వాళ్ళు అనుకొంటారు. ఇందులో ఏమాత్రం వాస్తవంలేదు. విషయం ఎంత విలువైనదన్నది ప్రధానం. చదవడంగానీ, రాయడంగానీ విషయాన్ని పిల్లలు ఎంత స్వంతం చేసుకొన్నారనే దానిమీద, ఎంత స్వంతం చేసుకొనగల్డేలాగా ఆ విషయం వుందనే దాని మీద ఆధారపడి వుంటాయి. విషయం స్వంతమైనపుడు అందులోని వ్యాకరణమంతా పిల్లలకి కరతలామలకమవుతుంది. ఈ క్రమంలో పిల్లల్ని ప్రతిదాన్నీ ప్రశ్నించి ఎంత తెలుసుకొన్నారో మనం పరీక్షించనక్కరలేదు. సమాధానం ఎంత ఖచ్చితంగా చెప్పగల్లు తున్నారని కాదు మనం చూడాల్సింది. పిల్లవాడి పరిశీలన ఎంత చురుకుగా సాగుతున్నదీ మనం చూడాలి. ఈ క్రమాన్ని మనం వొప్పుకొంటే చాలు. అసలు మనం భాషను గురించి పట్టించుకోకూడదు. భాష నేర్చుకొంటున్నా మన్న స్పృహ లేనపుడే భాష వాంటబడుతుంది! భాష నేర్ప్చడంలో మనం గుర్తించాల్సిన రహస్యాల్లోకెల్లా పరమ రహస్యమిది. క్షే శశ
ఇ ఇ ఆల కాకి నలుపు
చాలాకాలం నాటి సంగతి. అప్పుడు కాకులన్నీ తెల్లగా వుందేవట! అవును. అచ్చం మన కొంగల్లాగే కాకులన్నీ తెల్లగా వుందేవట.
అప్పుడు గుడ్లగూబలు అద్దకం పని చేసేవట. అద్దకం పనంటే తెలుసుగా. గుడ్డలకు రంగులు వెయ్యడం. తెల్లగుడ్డలకు నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలి వంటి రంగులు వెయ్యడం.
ఓ రోజు గుడ్లగూబ రంగులు వేసేచోటికి ఒక కాకి వచ్చింది. అది వేసే రకరకాల రంగులు చూసి “అబ్బ! రంగులు ఎంత బావున్నాయో” అనుకొంది.
'ఛ... నా రంగు ఏమీ బాలేదు. తెల్లగా పాలిపోయినట్టుంది. ఆ నీలిరంగు ఎంత ముచ్చటగా వుందో! అలాంటి రంగు వుంటే ఎంత బావుణ్ణు అనుకొంది కాకి. గుద్గగూబ దగ్గరికి వచ్చి “గుడ్లగూబ బావా! గుడ్లగూబ బావా! నాకు కొంచెం నీలి రంగు వేసి పెట్టవూ? అనడిగింది.
“ఎవరి రంగు వారికుంటే మంచిది. మనమేమన్నా గుడ్డలమా! రంగులు మార్చెసు కోడానికి అంది గుడ్లగూబ. అయినా కాకి వినలేదు. నీలిరంగు వెయ్యమని కాళ్ళా వెళ్ళా పడింది. గుడ్లగూబ సరేనంది.
రంగులు కలుపుకోడానికి గుడ్లగూబ దగ్గర పెద్దపెద్ద కుండలున్నాయి. ఆ కుండల నిండా రంగులున్నాయి. ఒక్కో కుండలో ఒక్కో రంగు వుంది. ఒక్క తెలుపు తప్ప ఎన్ని రంగులో! కావాల్సిన ప్రతి రంగూ వుంది గుడ్లగూబ దగ్గర.
గుద్గగూబ కాకిని ఒక పెద్ద కుండ మీద నిలబడమని చెప్పింది. ఇక నీలి రంగు వేయడం మొదలు పెట్టింది. కాకి రెక్కలు బాగా విప్పుకొని రంగు వేయించుకోసాగింది.
కాకికి ఎంత సంతోషంగా వుందో చెప్పలేము. “కాకులన్నిటిలోకి నేనే సీలిరంగు కాకిని కాబోతున్నాను. అందరూ నన్ను చూసి అసూయపడిపోతారు. వెంటబడతారు” అనుకుంది.
క్షే15
ఈ ఆలోచన రావడంతో దానికి కొంచెం గర్వం కూడా పుట్టుకొచ్చింది. ఎప్పుడెప్పుడు రంగు వెయ్యడం పూర్తవుతుందా, ఎగిరిపోదామా అనుకోసాగింది. గుడ్లగూబ రంగు వేస్తుండగానే తన రెక్కల్ని అటూ ఇటూ ఆడిస్తూ చూసుకోసాగింది.
“ఇదిగో ఇలా కదిలితే రంగు వెయ్యడం కుదరదు. కొంచెం ఓపిగ్గా వుందాలి. రంగు వేయించుకోగానే సరిపోదు. బాగా ఆరబెట్టుకోవాలి. అప్పటిదాకా ఎగరకూడదు. తెలిసిందా” అని జాగ్రత్తలు చెబుతూ రంగు వెస్తోంది గుడ్లగూబ.
అయినా మన కాకి వింటేగా. దాని ముచ్చటలో అది వుంది. తన రెక్కల్ని తిప్పుకొంటూ చూచుకోసాగింది.
ఇంతలో జరగరానిది జరిగిపోయింది. కాకి కాలుజారి కుండలో పడిపోయింది. ఆ కుండలో ఏముందనుకొన్నారు? నల్లరంగు. అలాంటిలాంటి నల్లరంగు కాదు. చీకటిలాంటి నలుపు. కాటుక లాంటి నలుపు.
ఇంకేముంది? కాకి ఆ రంగులో మునిగిపోయింది. బయటికి రావడానికి నానా తంటాలు పదింది. గిలగిలా కొట్టకొంది.
ఆఖరుకు ఎలాగోలా కుండలోంచి ఎగిరి బయటపడింది కాకి. ఒక కొమ్మ మీద కూర్చొని తన శరీరమంతా చూచుకొంది.
చూస్తే ఏముంది? రెక్కలనిండా నల్లటి నలుపు. కాళ్ళు, ముక్కు తల... ప్రతి ఒక్కటి నల్లగా వున్నాయి. కాటుకంత నల్లగా వున్నాయి. తన నిగనిగలాడే నీలిరంగు కనిపిస్తే వొట్టు. సొంతరంగు తెలుపైనా మిగల్లేదు.
కాకికి కడుపు మండిపోయింది. ఏడుపు ముంచుకొచ్చింది. గుడ్లగూబ మీద ఎక్కడలేని కోపం వచ్చింది. “అంతా దీని చేతగానితనం, దీని దుర్మార్దం” అనుకొంది.
అమాంతం దాని మీద పడి చీల్చేయాలనుకొని వెంటబడింది. గుడ్లగూబకు భయం పట్టుకొంది. పరిగెత్తి కన్పించకుండా దూరంగా పారిపోయింది.
అప్పటి నుంచి కాకులన్నీ నల్లగా అయిపోయాయి. గుడ్లగూబలకు, కాకులకు పదకుండా పోయింది. ఒకదానికొకటి శత్రువులుగా మారి పోయాయి. గుడ్లగూబలు కాకుల కంటబడకుండా రాత్రుళ్ళు మాత్రం తిరగడం మొదలుపెట్టాయి. పగళ్ళు ఏ చెట్టు తొర్రల్లోనో దాక్కొని కాలం గడపసాగాయి. ఎందుకంటారా? కొంచెం చీకటిపడితేచాలు కాకులకు కళ్ళు కనపదవుగా! అందుకని. .
చూడండి. ఒక్కకాకికి నీలిరంగు వేసుకోవాలన్న కోరిక పుట్టడం ఎంత గొడవకు దారి తీసిందో. కాకులకు, గుడ్లగూబలకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో.
లు 116
మంచి కథ ఇలా ఉంటుంది !
“కాకి నలుపు” కథ చదివాను. కథలు రెండు రకాలు. ఒకటి చదివి ఆనందించేవి, రెండు విని ఆనందించేవి. పిల్లలు ఎక్కువగా కథలు విని ఆనందిస్తారు. కథలో కథనం బాగుండాలి. కథనం అంటే కథను నడిపిన తీరన్నమాట. కథనాన్ని బట్టె విన్నవాడు మరొకరికి ఆ కథను చెప్పాలని ఉబలాటపదతాదడు. అందులోనూ కథలో అద్భుత విషయాలు చోటు చేసుకుంటే ఆ కుతూహలం మరింత ఇనుమడిస్తుంది. అద్భుత విషయాలున్న కథను (శ్రోత చెవులు నిక్కించి వింటాడు. కథన విధానమే ఆ కథలో ఉన్న అభూత కల్పనలన్నింటికీ జీవం పోస్తుంది. మరి "కాకి నలుపు కథలోని అద్భుత విషయాలేమిటో ఆలోచిద్దాం.
-
పూర్వం కాకులన్ని కొంగల్లా తెల్లగా వుండడం.
-
తాను తెల్లగా పాలిపోయినట్లు వుండడం కాకికి ఇష్టం లేక నీలిరంగు కావాలని కోరుకోవడం.
-
ఈ వ్యవహారంలో కాకులకు, గుడ్రగూబలకు శత్రుత్వం ఏర్పడడం.
-
గుడ్లగూబలు కాకులకు భయపడి రాత్రిళ్లు మాత్రమే తిరగగం.
-
కాకులు చీకటిపడితే చూడకపోవడం.
ఈ ప్రత్యేక విషయాలను కథకు జోడించుకోవడం వల్లనే కథనం చక్కగా నడపడానికి తోద్పడింది. ఇలాంటి కథలు ఎలాంటి మూగిబసవన్నలనైనా మాట్లాడింప చేస్తాయి. ఇతరులతో మాట్లాడే అలవాటును పెంపొందిస్తాయి. కనుక ఇలాంటి కథలు పిల్లలకు చెప్పడం చాలా అవసరం. ఇందులోని సత్వాసత్యాల మాట వేరుగా ఉంచుదాం. దీన్ని ఓ 'కట్టుకథి (ఫిక్షన్)గా భాపించాలి.
కేషే/ -
ఇక కథకుడు (కథ చెప్పేవాడు) ఈ క్రింది విషయాలను గమనించాల్సి ఉంది.
-
కథకుడు కథను మంచి ఎత్తుగడతో ప్రారంభించాలి. కథను అతి చాకచక్యంగా నడవాలి.
-
కథలో ఎక్కువగా ఉండేవట, వినేవట, చూచేవట అనే క్రియాపదాలను వాడడం కథకు ఒక కొత్త అందం.
-
కథలో అక్కడక్కడ సందర్భోచితంగా తగిన సామెతలు, జాతీయాలు, నుడికారాలు ప్రయోగించి కథకు అలంకారం తేవాలి. *కాకి నలుపు కథలో చూడండి - కాళ్లావేళ్లా పడడం, పాలిపోయినట్లు, దాని ముచ్చట దానిది, చికటి లాంటి నలుపు, కాటుకలాంటి నలుపు, నానాతంటాలు పదడం, గిలగిలా కొట్టుకొంది, నిగనిగలాడడం, కనిపిస్తే వొట్టి, కదడుపుమందు, ముంచుకొచ్చు, కోరికపుట్టు మొదలైనవి ఎన్నో ప్రయోగించడం వల్ల కథకు మంచి అలంకారం ఏర్పడింది.
-
కథలో పిల్లలకు కొన్ని అర్ధం కాని పదాలు ఏవైనా ఎదురైతే వాటిని అక్కడికక్కడే వివరిస్తూ కథను ముందుకు సాగించాలి. కాకి నలుపు కథలో అద్దకం పనిని గూర్చి వివరించడం, మీరు చదివే వుంటారు.
-
అలాగే కథలోని కొన్ని పాత్రల మనోగతాలను కూడా అవసరమైన చోట కథకుడు వివరించాలి. ఈ కథలో కాకి తన మనసులో అనుకొనే మాటలు ఒకసారి చదివితే మీకు గుర్తుకొస్తుంది.
-
కథకుడు అప్పుడప్పుడు హావభావాలు చూపుతూ, నటన ద్వారా కథను చెప్పాలి. అప్పుడే కథ రసపట్టులో సాగుతుంది.
కాకి నలుపు” కథలో “ఇదిగో ఇలా కదిలితే రంగు వేయడం కుదరదు... తెలిసిందా” అని జాగ్రత్తలు చెప్పే ఘట్టం.
- ప్రతి కథకు ఒక్కచక్కటి మలుపు ఉండాలి. ఆ మలుపు ఎలా ఉంటే బాగుంటుందో కథకుడే ఎన్నిక చేసుకోవాలి. మలుపు దగ్గర ఉత్మంఠతను కలిగించాలి. జరగబోయే కథ ఎలా ఉంటుందో కదా అనే ఉత్సుకతను రేకెత్తించాలి. అప్పుడే కథను పిల్లలు తుది వరకు వినగలుగుతారు. కథ చెప్పినందుకు కథకునికి కూడా సంపూర్ణ ఫలితం దక్కుతుంది.
118
కాకి నలుపు కథలోని మలుపును చూడండి.
.. ఇంతలో జరగరానిది జరిగింది. కాకి కాలుజారి కుండలో పడిపోయింది. ఆ కుండలో ఏముందనుకున్నారో తెలుసా!” (కథకుడు ఎంత ఆశ్చర్యాన్ని ప్రకటిస్తే కథ అంత రక్తి కడుతుంది)
- కథలో నవరసాలకు స్థానం ఉండాలి. దుఃఖ సన్నివేశాలలో పాత్రలపై సానుభూతి చూపడం కూడా కథకుడు చేయాలి. వినేవారు “అయ్యో పాపం[ి అని అనుకొనేలా ఉందాలి.
కాకి నలుపు కథలో - కాకి ఒక కొమ్మ మీద కూర్చొని తన ఒళ్లంతా చూసుకొంది. చూస్తే ఏముంది? రెక్కలంతా నలుపు, కాళ్లు, ముక్కు కళ్లు, తల, తోక (ఒళ్లంతా అని చెప్పిన తరువాత విడివిడిగా ఈ శరీర భాగాలను గూర్చి చెప్పవలసిన పని లేదు. అయినా కథలో కాకి యొక్క విషమ పరిస్థితిని గూర్చి పదేపదే ఏకరువు పెట్టడం... దిని ద్వారా సానుభూతి పుట్టుకొస్తుందన్నమాట,) (ప్రతి ఒక్కటి నలుపు, కాటుక నలుపు...” ఈ రితిగా చెప్పడం “'పూసగుచ్చినట్లో అవుతుంది కదా!
- ఇక కథకు పతాక సన్నివేశం ఉందాలి కదా! ఈ సన్నివేశం కథకు ప్రాణం. ఈ సన్నివేశం ఎంత చక్కగా రసపట్టుగా ఇమిడితే కథ అంతకాలం పిల్లల నోట్లో జీవిస్తుంది. ఆ పతాక సన్నివేశం కాకి నలుపు కథలో ఉందో లేదో చూద్దాం.
“క్రాక్రి కడుపు మండిపోయింది..... గుడ్లగూబ మీద ఎక్కడలేని కోపం వచ్చింది..... అమాంతం దాని మీదపడి చీల్చేయాలనుకొని వెంటబడింది. గుడ్డ్గగూబకు భయం పుట్టుకొచ్చింది.... పారిపోయింది. అప్పటి నుండి కాకులన్నీ నల్లగా అయిపోయాయి. గుడ్లగూబలకు, కాకులకు పడకుండా పోయింది... చీకటి పడితే కాకులకు కళ్లు కనబడవుగా, అందుకనసి....”.
ఈ విధంగా కాకుల నుండి తప్పించుకోవడానికే గుడ్లగూబలు రాత్రిళ్లు తిరుగుతాయని, పగలు చెట్టు తొలజ్జల్లో వుంటాయని సమర్ధించుకోవడం జరుగుతుందన్నమాట.
- కథకు ముగింపు. ఇది సుఖాంతం కావచ్చు, దుఃఖాంతం కావచ్చు. ప్రతి కథ ముగింపు నీతిని బోధించేలా వుండాలా ? అది అవసరమా? అన్న సందిగ్గాన్ని కథకుడు పెట్టుకోవలసిన పని లేదు. కథకుడే కథలోని ముఖ్య విషయాలను (నీతిదాయకమైనవి) శ్రోతకు నొక్కి చెబుతూ వుంటాడు కనుక అందులోని నీతిని శ్రోతే గమనిస్తాడు, గుర్తిస్తాడు, గ్రహిస్తాడు కూడాను. ఆ జ్ఞానం అతనికుంది. ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
119
“కాకి నలుపు” కథలో “చూడండి. ఒక్క కాకికి నీలిరంగు కోసం కోరిక పుట్టడం ఎంత గొడవకు దారితీసిందో?” అని ముగించడంలోనే నీతి తెలిసిపోతుంది.
ఈ విధంగా ఈ కథ అన్ని కోణాల్లోను ఆలోచిస్తే ఒక అద్భుత కథనం కలిగిన కథగా చెప్పవచ్చు. రచయితలు పిల్లల కోసం ఇలాంటి కథలనే వ్రాయాలని వాటిని యథాతథంగా చదివి పిల్లలకు వినిపిస్తూ పై సూచనలు పాటించాలని, అప్పుడే కథలపైన పిల్లలకు ఆసక్తి వినడంలోను, చదవడంలోను, వ్రాయడంలోను పెంపొందుతుందని నా అభిప్రాయం. ముఖ్యంగా ఉవాధ్యాయులు కథలు వినిపించడంలో కృతకృత్యులు కావాలని విజ్ఞప్తి.
- కల్లూరు రాఘవేంద్రరావు, ఆబాద్పేట, హిందూపురం క్షం0
క బోధన - శోధన
క22
బుదిబుది బుడతలు బడిలో అడుగు పెట్టగానే మనమేం చెయ్యాలి ?
మంచి బడికి లక్షణాలేమిటి? అని చర్చించుకొంటే మూడంశాలు మనం తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకటి ఊళ్ళోని పిల్లలందర్నీ తనలో ఇముడ్చుకోగల్గడం. రెండు చెరిన పిల్లల్ని బయటి కెళ్ళనీకుండా నిలుపుకోగల్దడం. మూడు ఒక కనీస విద్యను నమ్మకంగా అందించగల్గడం. ఇంతమాత్రం అనుకోడానికి పెద్ద సిద్ధాంత చర్చలేమీ అక్కర్లేదు. ఒక ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూలుకైతే మొదటి రెండింటితో అవసరం లేదు. కానీ మన ప్రభుత్వ గ్రామీణ పాఠశాలలకు చాలా సందర్భాల్లో మూడవ లక్షణం కన్నా మొదటి రెండు లక్షణాలే ముఖ్యమవుతుంటాయి.
పిల్లల్ని బడికి దూరం చేస్తున్న సామాజికార్ధికాంశాల్ని అలా పక్కన పెడితే మనం పట్టించుకోని అంశం పిల్లల ప్రపంచాన్ని బళ్ళో మనం ఆవిష్కరించలేక పోవడమనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉంది. మన పాఠ్య పుస్తకాలూ, మన బోధనారీతులూ, మనం పిల్లల్ని అర్ధం చేసుకొనే వైఖరీ, అసలు చదువు పట్ల మనకున్న తాత్వికతా ఇందులోకి వస్తాయి. ఇవన్నీ కేవలం సాంకేతికాంశాలు గాదు. మనం నివసిస్తున్న సమాజం తరతరాలుగా ఒక సంస్కృతిగా అలవర్చిన లక్షణాలు. మనం నమ్మ ఒంటబట్టించుకొన్న లక్షణాలు.
పిల్లలు బడిలో చేరగానే మనం అ, అలు దిద్దిస్తాం. అసలు బడికీ పిల్లలకీ, టీచర్లకీ ఈ అ, ఆలు దిద్దించడంతోనే సంబంధం మొదలవుతుంది. చాలా సందర్భాల్లో ఈ సంబంధం ఇక్కడితోనే ముగుస్తుంది కూడా |!
వర్ణమాల మీద ఆధిపత్యం సంపాదించడమే ప్రారంభ విద్యకు గీటురాయిగా ఉండాలా? తడుముకోకుండా ఏ అక్షరం చెపితే ఆ అక్షరం రాయగల్గడం అనేది ఎలా సాధ్యం? ఎప్పటికి సాధ్యం ? దీనిపైన మనమేమైనా మనసు పెట్టి ఇది ఇంతేనా ఇంతకన్నా మరో పద్దతి ఏమైనా ఉందా అని ఆలోచించలేమా ?
క$ే28
శ్ య లలత
'అక్షరాలు యాంత్రికంగా దిద్దించడం వల్ల వాళ్ళ స్వంత ప్రపంచం నుంచి, సహజ అభ్యసన పద్ధతి నుంచి చదువు పిల్లల్ని దూరం చేస్తుంది” అనేది ఇప్పుడు భాషాశాస్త్రవేత్తలూ, మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారించిన అంశం. ఇలా దిద్దడంలో పిల్లలు తెలుసుకొంటున్నది ఏదీ లేదు. స్పందించ వల్సింది ఏదీ లేదు. ఇప్పటి దాకా తనకు తెలిసిన ప్రపంచంతో, తాను తెలుసు కోవాల్సిన ప్రపంచంతో దీనికేమీ సంబంధం లేదు. అసలిక్కడ నేర్చుకోవడం ఏమీ లేదు. కేవలం గుర్తుంచుకోవడమే తప్ప.
ఇప్పటి దాకా చదువును గురించి పిల్లలు చాలా విని వచ్చి వుంటారు. చదువు కోవడం చాలా గొప్ప విషయమని వాళ్ళు నమ్మి కూడా ఉంటారు. కానీ ఈ దిద్దించడంతో ఈ నమ్మకానికీ తీవ్ర విఘాతం కల్గుతుంది. తెలిసి తెలిసీ ఒక ఊబిలో ఇరుక్కుపోయినట్టు వీళ్ళకన్పిస్తుంది. ఇప్పటిదాకా తాను చెయ్యని, నేర్వని, ఊహించని, తనకే మాత్రం సహజం కాని ఒకానొక ప్రక్రియలోకి వీళ్ళు నెట్టబడుతున్నారు.
నేర్చుకోవడంలో ఒక ఉత్పత్తి ప్రక్రియ కూడా ఉంటుంది. అది బిడ్ద నేర్చుకోవడం ప్రారంభించడంతోనే మొదలవుతుంది. అసలీ ఉత్పత్తీ, నేర్చుకోడమూ వేర్వరుగా ఉండవు. బిడ్డ తాను పాల్గొంటూ, తాను కొత్తవి జోడిస్తూ కొత్తవి తెలుసుకోవడం బడిలోకి వచ్చె ముందు దాకా జరిగిన ప్రక్రియ. దీనికి దిద్దించడం భిన్నమైన, వ్యతిరేకమైన ప్రక్రియ.
ఒకటిగాదు పాతిక అక్షరాలు గుర్తుంచుకొన్నా వాటితో బిడ్డ చేసే ఉత్పత్తి ఏమీ ఉండదు. ఎప్పుడో వాటి వినియోగం వస్తుందని అప్పటిదాకా అన్నిటినీ మెదళ్ళో ఒక మూల దాచిపెట్టుకోవాలని బిడ్డ ఊహించనైనా ఊహించలేదు. ఇది ఆమెకు అనుభవం లేని అసాధ్యమైన అంశం. ఈ పద్ధతి నుంచి వాళ్ళకి కొత్త నైపుణ్యాలు దక్కే సంగతి దేవుడెరుగు వున్నవి వూడిపోయే ప్రమాదం ఎక్కువ. ఒక యాంత్రికతను సంతరించుకోవాల్సి రావడంతో బిడ్డ బడికి మొదట మానసికంగా దూరమవుతుంది. తర్వాత పారిపోతుంది.
నేర్చుకోవడం ఆహ్లాదం లేని యాంత్రికం కావడమే పిల్లలు బడిమానేసి మానసిక స్టితిని కల్పిస్తున్నదని నేడు అనేక పరిశీలనలు నిరూపిస్తున్నాయి. ఈ యాంత్రికత మనం కావాలని రుద్దుతున్నది కాదు. ఇదే సరైందని మనం నమ్మి రుద్దుతున్నది. ఇదీ సమస్యకు అసలు మూలం.
“అసలు చదవడం అంటే ఏమిటి” అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి (వినడంలాగే) చదవడం ముక్కలు ముక్కలుగా ఉండదు. కొన్ని సంజ్ఞల్ని విడగొట్టుకోవడం వుండదు. అక్షరాలు అలాంటి ముక్కలు వాటి గుణింతాల్సి వొత్తుల్ని ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని వాటిని కలుపుకొని చదువుకోవడం కింద నుంచి పైకి భాషను నేర్చుకొనే పద్ధతి. ఇందులో సమగ్రత, అర్ధం, భాగస్వామ్యం ఏమి వుండవు, ఉపయోగంలోకి వచ్చే అంశం ఇందులో ఏమీ ఉండదు. ఇది భాషను అర్ధరహితమైన పనిగా మారుస్తుంది.
న!
ఇప్పటిదాకా పిల్లలు నేర్చుకొన్న పగ్ధతికిది భిన్నమైంది. పిల్లలు మొత్తంగానే భాషను నేర్చుకొన్నారు. వినియోగంలోకి వచ్చేలానే నేర్చుకున్నారు.
మరి ఈ సహజ పద్ధతి బడిలో అమలులోకి వస్తే ఎలా ఉంటుంది? దీనిపై కావల్సినంత పరిశోధన జరిగింది. ఈ పద్ధతిలో అర్హం ముఖ్యం. పదాల క్రమం ముఖ్యం. అక్షరాలు వాటి ఉచ్చారణ ముఖ్యం కాదు.
అంటే తెలిసిన పదాల్ని అంశాల్ని చదవడం, రాయడం రూపంలో ఈ పద్ధతి ఉంటుంది. టీచరుకు ఇష్టం వచ్చిన ధ్వనినో (అక్షరం), పదాన్నో రుద్దే రూపంలో ఇది వుండదు. పిల్లల కిష్టమైన పదాల్ని చెప్పమంటారు. వాటిని బోర్డు మీద రాసారు. వాక్యాలు, వొటలు కూడా. వాటి నుంచి ఒక క్రమంలో అక్షరాల్ని పిల్లలు గుర్తించి మరొక చోట వాడుకొనే స్థితికి
ఇదేమీ మనం పెద్ద కష్టపడి చెయ్యాల్సిన పద్ధతి కాదు. యం.వి.యఫ్.లాంటి సంస్థల వాలెంటీర్లు బడి మొహం తెలీని బాలకార్మికులకు వేలాది మందికి చెపుతున్న పద్ధతి ఇదే. నిజానికి దీనికి వాచకాలతో పనే లేదు.
రెండవ దోరణి ప్రతి దాన్నీ తప్పు పట్టడం, సరిదిద్దె ప్రయత్నం చెయ్యడం, ఇలా కూడా పిల్లలు నేర్చుకోరు. భాషా ప్రపంచంలోకి ఎంత ఎక్కువగా ప్రవేశిస్తే అంత త్వరగా వాళ్ళు తప్పులు చెయ్యడం మానేస్తారు. ఎంత స్వేచ్చగా పాల్గొనేలా చేస్తే అంత సమర్ధవంతంగా భాషను నేర్చుకోగల్లుతారు. తప్పుల్ని క్షణక్షణం సరి చెయ్యడంలో జరిగేదేమంటే పాల్గొనే ప్రక్రియను అద్దుకోడం. బిడ్డని పరిమితం చెయ్యడం. సాంకేతికాంశాల్ని వివరించడం ద్వారా (వ్యాకరణం) భాష నెర్పించవచ్చుననే మన ధోరణి దీనిక్కారణం. ఇలా మనం నమ్ముతుండ బట్టే ఈ పని చేస్తున్నాం.
పరిశీలనలు నిరూపించిందేమంటే పిల్లలు పిచ్చిపిచ్చిగా చదవడం, పుస్తకాలు తిరగెయ్యడం, ఎక్కువ పుస్తకాల్ని తిరిగేస్తుండటం వల్ల చదవడం చాలా బాగా, చాలా త్వరగా వస్తుందని! అక్షర ప్రపంచానికి దగ్గర కావడం వల్లనే చదవడం వస్తుంది తప్ప అక్షరాల రూపురేఖల్ని విడమర్చి తెలుసుకోవడం వల్ల కాదని దీని సారాంశం. ఇలా నేర్చుకొనేపుడు తప్పులు వెతికే ప్రశ్న ఉండదు. పాల్గొంటూ పోతూ వుంటే తప్పులు తమంత తాము తెలిసివసాయి.
దీన్ని మన క్లాసురూంలోకి తేవడమంటే ఏమిటి ? మన బడి గోడలకు పిల్లలకు అర్ధమయ్యే ఆసక్తి కల్గించే వాక్యాలు, పాటలు, బొమ్మల పేర్లు ఇంకా, ఇంకా ఎన్నైనా తగిలించవచ్చు. రాయించవచ్చు. (అర్ధంకాని సంస్కృత సూక్తులు కాదు సుమా) పిల్లలకి
క్ 125
పుస్తకాలు ఇవ్వవచ్చు. వాటిని వాళ్ళిష్టం వచ్చినట్టు చూచుకొనే ఏర్పాటు చెయ్యవచ్చు. ఫ్లాష్ కార్డులు అందుబాటులో వుంచవచ్చు. పెద్దగా చదివి వినించి వాటినే పుస్తకాల్లో చూడమని చెప్పవచ్చు. ఇది ఎంత ఎక్కువగా జరిగితే, ఇలాంటి సామాగ్రి ఎంత ఎక్కువగా వుంటే చదవడం అంత సులభంగా త్వరగా వస్తుంది.
ఈ కాలంలో ఇదేమంత పెద్ద సమస్య కాదు.
ఈ కోణం నుంచి చూచినప్పుడు మన వాచకాల వాత్ర ఏమిటో తెలుస్తుంది. వాటిలో వున్నదంతా అత్యంత కృత్రిమ భాష కొన్ని గుణింతాల్ని అక్షరాల్ని పరిచయం చెయ్యడం కోసం అల్లిన వాక్యాలివి. వాటికి అర్ధం పర్ధం ఏమీ వుండదు. అవి పిల్లలవి కాదు. మనం వండిపెట్టిన కృత్రిమ వంటకమది. ఇటీవల హిందీ వాచకాలపై జరిగిన ఒక పరిశీలన ఈ వాచకాల్లోని వాక్యాలు ఎంత వికారంగా వున్నాయో తేటతెల్లం చేసింది (దా॥ శోభాసిన్హా.
రెండోది వాచకాలు తప్ప మన పిల్లలు చదవడానికి ఇంకేమీ లేకపోవడం. పిల్లల్ని దృష్టిలో వుంచుకొని - మరీ ఒకటి రెండు మూడు తరగతుల పిల్లల్ని దృష్టిలో వుంచుకొని రాసిన పిల్లల పుస్తకాలు మనకు లేవు. పిల్లల పుస్తకాలంటే భాష అంతా వచ్చాక దాన్ని నిలబెట్టుకోడానికి అవసరమయ్యేవి అని తప్ప ప్రాథమిక దశలో భాషను నేర్చుకోవడానికి ఉపకరించేవి అనే అర్ధంలో మనం బాలసాహిత్యాన్ని చూడలేదు. అలాంటి గ్రంథాలయాల్ని మనం రూపొందించుకోలేదు. అయితే ఉన్నంతలో సగటు టీచరు రూ.500-600 ఖర్చు పెడితే వీటిని సంపాదించుకోవచ్చు. తెలుగులో తొలి ప్రయత్నం ఇప్పుడే మొదలైంది. ఉన్న పుస్తకాల్ని కూడా వాడకుండా (చించేస్తారని) పెట్టెలో పెట్టి తాళం వెయ్యడమంటారా. అది మన భాష దారిద్యానికి పరాకాష్ట -
మనం పలకా బలపం పట్టించి, దిద్దించి, తప్పుల్ని సరిచేసి మళ్ళీ మళ్ళీ దిద్దించేందుకు పడే శ్రమ పిల్లలకి పుస్తకాలిచ్చి, పెద్దగా మనం చదివి, పరిచయం చెసి పిల్లల మాటల్ని పాటల్ని బోర్డు మీద రాసి, చెప్పించి, పలు రూపాల్లో పిల్లల్ని భాషా ప్రపంచంలోకి నెట్టడం కోసం ఉపయోగిస్తే పిల్లలు ఆనందం అనుభవిస్తారు. భాషనూ నేర్చుకొంటారు.
ఇంకో అంశం బొమ్మలెయ్యడం బొమ్మలు వెయ్యడమంటే ఏదో కళాతృష్ణను తీర్చుకోవదడమని మన అభిప్రాయం. పిల్లలు లిఖిత ప్రపంచంలోకి అరాగు పెట్టడం ఇలానే మొదలవుతుంది. 'తమ ఆలోచనల్ని ఊహల్ని పిల్లలు బొమ్మల్లో రాస్తారు. ప్రారంభ లేఖనం బొమ్మలతోనే మొదలవుతుంది" అని మనం గుర్తిస్తే పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు బొమ్మలు వేసుకోడానికి అనుమతిస్తాం. ఏర్పాటు చేస్తాం. ఆ బొమ్మలు ఏం చేస్తున్నాయో పిల్లలు రాస్తారు. మొదట బొమ్మ రూపంలో వ్యక్తమైన ఊహ, తర్వాత అక్షర రూపంలో వ్యాఖ్యానింపబడుతుంది.
126
దీనిపైన సైతం కావల్సినంత పరిశోధన జరిగింది.
పై మూడు అంశాల్లో అంతర్లీనంగా మరొక అంశం దాగి ఉంది. అది పిల్లలు తమ అనుభవాల్ని ఊహల్ని మనతో పంచుకోవడం, ఒక పరస్పరాధార ప్రధాన కార్యక్రమం. ఇక్కడ పిల్లలు తమకు తాము వ్యక్తం చేసుకొంటారు. వ్యక్తం చేసుకొనే క్రమంలో నేర్చుకొంటారు. భాషలోని పఠన, లేఖన నైపుణ్యాల్ని కూడా నేర్చుకొంటారు.
ఈ అభ్యసనానికి సబీవత్వం ఉంటుంది. హృదయం వుంటుంది. ఇందులో ఆవేశం, లయా వుంటాయి. మనిషి భాష ద్వారా వ్యక్తమయ్యేది ఈ రూపంలోనే. మనిషి సార్ధకతా, భాష సార్ధకతా ఇమిడి వుండేది యిందులోనే.
ఈ క్రమంలో టీచర్లంగా మనమూ చాలా నేర్చుకొంటాం. ఈ నేర్చుకోవడంలో ముఖ్యమైంది మనం పిల్లల కంటే చాలా గొప్ప వాళ్ళం ఏమీ కాదనేది. వాళ్ళ సామర్ధ్యం అఖందమైనదనేది రెండవది. అసలైన బోధన ఎంత తియ్యగా వుంటుందో అర్ధం కావడం మూడవది.
ఇంత చెప్పుకొచ్చాక బుడిబుడి బుడతలు బడిలోకి అడుగు పెట్టగానే మనం ఏం చెయ్యాలి అనేది మళ్ళీ చెవొలంటారా !
127
మన తరగతి గదిలో జరుగుతున్నదేమిటి?! అదొక పెద్ద స్కూలు. ఢిల్లీలోని అత్యున్నత అధికార సేవకుల పిల్లల కోసం నడుస్తున్న మున్సిపల్ స్కూలు. ఆ అధికార్ల దర్పం ఆ స్కూల్లోనూ తొణికిసలాడు తుంటుంది. అందమైన అన్ని వసతులూ ఉన్న భవనం, విశాలమైన గదులు, అద్దాల కిటికీలు, చక్కటి ఫర్నీచర్ ఆ స్కూలు వైభవాన్ని అడుగడుగునా '్రదర్శిస్తుంటాయి. ఇప్పుడు మనం ఆ స్కూల్లో మూడవ తరగతి రూంలోకి వెళదాం.
అక్కడ పరిసరాల విజ్ఞానంలోని “గాలి పాఠాన్ని పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుడు గాలి ధర్మాల్ని పిల్లలకు నూరిపోస్తున్నాడు. పిల్లలంతా ఆ ధర్మాల్ని గొంతెత్తి వల్లిస్తున్నారు. అచ్చం మంత్రాల్లాగే వల్లిస్తున్నారు. పాఠ్య పుస్తకంలోని వాక్యాలు పొల్లుపోకుండా పలుకుతున్నారు.
గాలి సర్వత్రా ఉంటుంది !
గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది!
గాలికి స్వంతంగా ఆకారం ఉండదు !
గాలి పలు వాయువుల (గ్యాస్‌ల) సమ్మేళనం!
గాలి కూడదా పదార్ధపు ఒకానొక రూపం!
ఇవీ గాలి ధర్మాలు.
పిల్లలు గొంతులన్నీ కలిపి పైకప్పు ఎగిరిపోయ్యేలా అరుస్తున్న ధర్మాలు.
పిల్లలకి తెలుస్తున్నదేంటి?
ఈ వాక్యాలకేమైనా అర్ధం ఉందా? ఉండొచ్చు. అదేమైనా 9ల్లలకి తెలుస్తోందా? ఏమో భగవంతుడి కెరుక. అన్నట్టు భగవంతుదెక్కడున్నాదు అంటే (ప్రహ్లాదుడు ఇందు గలడందులేడన్నట్టు... గాలి కూడా ఇందుగలదందులేదు. అంతకంటే ఆ పసిపిల్లలకేం తెలిదు. తెలిసే అవకాశం ఏమీలేదు.
ఏమైనా తెలుసునేమోనని మేం కొంచెం అనుమానపద్ద్డాం. ఆ అనుమానం తీర్చుకొందామని పిల్లల మధ్య కూర్చున్నాం.
128
మీరు గాలి సర్వత్రా ఉందంటున్నారు. ఎక్కడ వెతికినా దొరుకుతుందంటున్నారు. మరి గాలి మీ స్కూల్ బ్యాగులో ఉందా?” అని అడిగాం.
పాపం పిల్లలీ ప్రశ్నతో బిత్తర పొయ్యారనుకొండి. “మా బ్యాగులో ఎక్కడుంది?” అని కొందరంటే నిజంగా అలాంటి విచిత్ర పదార్ధం తమకు తెలీకుండా తమ బ్యాగుల్లోకి దూరి కూచుందేమోనని కొందరమాయక చక్రవర్తులు సంచీలు తెరిచి వెతికారు కూడా !
ఇదీ ఆ స్కూలు సంగతి. ఢిల్లీలోని అత్యున్నత స్థాయి స్కూలు సంగతి! దేశంలోని ఏ స్కూలు సంగతైనా ఇంతేనంటారా? ఇంతకంటే ఏమైనా ఉంటుందంటారా? ఉంటే మీరు చెప్పాలి గాలిని ఇంతకంటే భిన్నంగా చెప్పడం ఎక్కడైనా ఉంటుందంటారా? అదీ మీరే చెప్పాలి.
ఈ 'మంత్రాలు' మన చదువుల్లో భాగాలైపోయ్యాయి. గాలి ఉండటం అంటే ఏమిటో, సర్వత్రా ఉండటం ఎలా వాస్తవమో మన పిల్లల్లో ఒక్కరికైనా తెలిసే వీలే లేదు. పన్నెండేళ్ళ పిల్లలు సైతం దీన్నిలానే వల్లిస్తారు. గాలిని గురించి మన పిల్లలకేం తెలుసు ?
చలిగాలి చల్లగా తగలడం తెలుసు. పెద్దగా గాలి వీచడం తెలుసు. బస్సులోను, రైల్లోను వెళుతున్నపుడు గాలి తోసుకొని రావడం తెలుసు. మరి గాలి తమ బ్యాగులతో సహా అన్ని ఖాళీ పాత్రల్లో సైతం ఉందని వాళ్ళూహించనైనా ఊహిస్తున్నారా? లేదు. ఈ స్కూల్లో ఒకమ్మాయి బయటికెళ్ళి గాలికెదురుగా పరిగెత్తుతూ ఒక ప్లాస్టిక్ సంచిని పట్టుకొంటే అందులోకి గాలి దూరుతుందని చెప్పింది. మరి ఆ ప్లాస్టిక్ సంచిలో అంతకు ముందే గాలి ఉందని అంటే ఆ అమ్మాయి ఏం చెపుతుంది? ఏమీ చెప్పలేదు. పరీక్షల్లో అడిగితే మాత్రం గాలి సర్వత్రా ఉంటుంది అని రాసేస్తుంది. అంటే దీనర్ధం ఏమిటి? భగవంతుడు సర్వత్రా ఉన్నాడని మనం విశ్వసించినట్లు మన పిల్లలు గాలి సర్వత్రా ఉందని విశ్వసిస్తున్నారన్నమాట. ఇక ఇందులో ప్రశ్నించడానికి, వెతుక్కోడానికీ పిల్లలకేమీ లేదన్నమాట. . . మన వాచకాలు
గాలి సర్వత్రా ఉంటుందో, ఉండదో అలా ఉంచండి. ఈ మధ్య మరి అనియత విద్యా వాచకాలు చూచాం. ఇదే పాఠం ఆ పుస్తకాల్లో ఎలా ఉందో చూస్తై మా మతికాస్తా పోయింది. బడికి రాని పిల్లలు రోజుకు రెండు గంటలు చదివేసి, రెగ్యులర్ పిల్లలకన్నా చాలా
తక్కువ కాలంలో ఓక్కో మెట్టు ఎక్కి ఆకాశపుటంచులు తాకదానికీ పుస్తకాలు రాశారట. వీటి భాష చూస్తే తల తిరిగిపోతుంది. వాతావరణం అనేది ఇందులో ఒక పాఠం. అందులో వర్షాలు, మేఘ నిర్మాణం, న నీటి ఆవిరి మంచు రూపాంతరాలు, గాలులు ఒక్కటేమిటి వాతావరణ చక్రమంతా దొర్లించేశారనుకోండి. ఇవన్నీ పెట్టే తికమక చాలక అందులో ఒక బొమ్మ కూడా ఉంది. ఇందులో మైక్రోస్కోపులోంచి చూస్తే మంచు ఎలాంటి స్పటిక రూపంలో ఉంటుందో చూపారు. క్షే20
సృటిక నిర్మాణమనేది ఏ ఇంటర్మీడియట్లోనో ఉండాల్సిన వ్యవహారం. అక్కడితో ఆగక రెండు ప్రయోగాల్ని కూడా ఇందులో చేర్చి, సమానాకృతులు, పరిమాణాలు గల రెండు లోహపు పలకల్ని తీసుకోండి" అని ప్రయోగం ఎలా చెయ్యాలో మొదలు పెట్టారు! *“కొంచెం నీళ్ళు, కొంచెం మంచు ఒక స్వచ్చమైన గాజు వబీకర్లోకి తీసుకోండి' అని కూడా సెలవిచ్చారు! అనియత విద్యా తరగతులు జరిగేదెక్కడ? అ పాఠాలు చెప్పే వాలెంటీల్లెవ్వరు? వాళ్ళ స్థాయి ఏమిటి? ఈ చెట్టు కింద బళ్ళలో మైక్రోస్మోపు లెక్కడివి? ఈ స్వచ్చమైన గాజు బీకర్లెక్కడివి? లోహపు పలకలనకుండా మరోలా అనలేరా? పరిమాణం ఆకారం అనకుండా మరేమీ అనలేరా? మన వాచకం అంతా ఆగమ్యంగా, అంతా నిరామయ వస్తువుల్ని చెపితే తప్ప, పిల్లలకి దానిపైన గురి కుదరదా ఏమిటి? మామూలు మాటల్లో వాన, మంచు, మబ్బు, ఇనుము, రకం లాంటి మాటలతో ఈ విషయాల్ని చెపితే వాచకాలకుండాల్సిన 'అధికారికత” అన్యాయమై పోతుందేమిటి? “భూమి అంతర్భాగంలో” అనే బదులు నేల లోపల అంటే పుస్తకం పలచబడి పోతుందేమిటి? అలా పలచబడుతుందనే మన రచయితల నమ్మకం. అంతా చెప్పెయ్యాలి. సైద్ధాంతికంగా ఏమీ మిగల్బకూడదు అనేది ఒక ధోరణి అయితే దాన్ని మూడో తరగతి నుంచే సంస్కృతీకరించి సైద్దాంతిక సాంకేతిక భాషలో చెప్పాలి అనేది ఇంకో ధోరణి. ఇలాంటి పుస్తకాల్ని చూసే ప్రా॥ యశళశ్పాల్ కమిటీ తన నివేదికలో ఇలా పేర్కొనింది. “మన పుస్తకాల్ని పిల్లల వైపు నుంచి చూచి మనం రాయం. ఎంచుకొన్న అంశాలు, చెప్పే భాష, వివరించే విధానం ఏవీ పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉండవు. (పాఠశాలకో ప్రపంచం ఉంటుంది. అందులోకి పిల్లల్ని లాక్కెళ్ళాలనేది మన తపన) పిల్లలు చూచే వస్తువులు, వాడి పదాలు మన వాచకాల్లో ఎక్కడా ఉండవు. జీవితాన్నించి జ్ఞానాన్ని విడదీసే సాంప్రదాయక ్రక్రియ ఈ భాష రూపంలోనే ప్రారంభమవుతుంది. పాఠ్య పుస్తకాల భాష ఒక భారంగా మన పిల్లల నెత్తికెక్కుతుంది. బోధించడం అంటే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్‌లోని మారుమూల ఓ ప్రభుత్వ పాఠశాల కెళదాం. అయిదు క్లాసులు, ఇద్దరు టీచర్లు చాలీచాలని వసతి. అన్ని వయస్సుల పిల్లలతో నిండిన తరగతి గదులు, కనీసం చదరంగానైనా లేని నేలతో కన్పించే మన దేశపు సగటు పాఠశాలిది. బడిలోకి వెళ్ళేటప్పటికి మంత్రోచ్చారణ లాంటి ఘోష వినపడుతోంది. పిల్లలు దేన్నో వల్లె వేస్తున్నారు. పిల్లల నవ్వులుగాని, కేరింతలు గాని అక్కడ కన్పించవు. నల్గురు కూచుని ఏదో సృజనాత్మకతం చెయ్యడంగాని, ఆసక్తిగా ప్రశ్నించడం గాని, అన్వేషణా ధోరణిగాని అక్కడ అసలుండవు. అంత పకద్చం దీగా చదువు సాగుతుంది. ఇంత పద్ధతిగా ఉన్నా అక్కడ చదువులెందుకు చట్టుబండలుగా ఉన్నాయి అంటే దానికి జవాబు దొరకదు. న్ 1-8 తరగతుల పిల్లలు వరండాలో ఒకరి మీద ఒకరు కూచుని ఉన్నారు. 4-5 తరగతుల పిల్లలు లోపలి ఇరుకు గదుల్లో ఉన్నారు. వరండాలోని టీచరు మంచి టీచర్లా ఇ 130
కన్పిస్తున్నాడుగానీ నానా వయస్సుల పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలో పోలీసు పాత్ర పోషించడానికే ఆయన పని అయిపోతున్నట్టుంది. వాచకాన్ని పెద్దగా చదవడం ఆయన పని. కాపీ రాయడం పిల్లలపని. ఈ వాచక పఠనాన్నే 'బోధన” అంటారా స్ఫూల్లో!
అసలు బోధించడం అంటే సమాచారాన్ని అందివ్వడం” అని మన నిర్వచనమాయె. దీనికి తగ్గట్టుకాక టీచరెలా ఉంటాడు? అందువల్ల అప్పుడప్పుడూ పిల్లల్ని స్వంతంగా చదవమనడం, ఏదో ఒక పిల్లవాడిచేత పెద్దగా చదివించడం, బోర్డు మీద నాలుగు పదాలు రాయడం, పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలకు సరైన సమాధానాలు పిల్లలకు డిక్లేట్ చెయ్యడం టీచరు చేస్తుంటాడు. అతని దృష్టిలో అదే బోధన ఆయన చదువుకొన్నది కూడా ఇంతే. ఇలాగే, బాగా చెప్పే టీచర్లు సైతం ఇంత కంటే చెప్పాల్సింది ఏముంటుంది? అనే ధోరణిలోకి వెళ్ళిపోతుంటారు.
ఫలితంగా మన పాఠ్య గ్రంథాలు వేదాలుగా మారుతున్నాయి. అందులో ఉన్న దానిచుట్టూనె “విద్య' అల్లుకొని ఉంటుంది. టీచర్లు ఇంతకంటే ప్రయత్నం ఏమీ చెయ్యరు. చెయ్యదానికి ఈ పాఠ్య పుస్తకాలు అనుమతించవుకూడా, పేరుకు కృత్యాధార బోధన అంటారుగానీ ఒక ఉదతను, ఆకును చూడాలన్నా పిల్లలు పుస్తకాల్లో చూడాల్సిందే తప్ప బయటికెళ్ళి చూద్దం గురించి ఈ పుస్తకాలు చెప్పవు. బాధితులే నేరస్తులు
ఇంకో స్కూలు చూద్దాం రండి. అది ఢిల్లి దగ్గరి తుగ్రకాబాద్ స్కూలు. అందులో ఉన్నదంతా రాళ్లు కొట్టే వాళ్ళ పిల్లలు. ఆ స్కూల్లో 12 మంది టీచర్లున్నారు. వీళ్ళల్లో ఒక్కరూ ఈ పిల్లల సామాజిక వర్షానికి చెందినవారుకాదు. వాళ్ళలో కొందరు పేద వర్షాల్నించి వచ్చినా ఆ నేపథ్యాన్ని వాళ్ళెప్పుడో మరిచిపోయుంటారు. వాళ్ళెప్పుడూ ఈ పిల్లల ఇళ్ళలోని హింస, తాగుడు, నిరక్షరాస్యత, నిర్భాధరతల్ని గురించి ఫిర్యాదు చేస్తుంటారు.
ఇలా ఈ స్కూలు (శమజీవులకు ఆమడదూరంలో ఉంటుంది. ఈ దూరాన్ని పెంచేది టీచరు. అతడు చెప్పే పాఠ్య పుస్తకాల్లోని అంశాలు. బోధనలో, ఈ పుస్తకాల్లో ఛ్రమజీవుల విలువలుండవు. బతుకులుండవు. ఎంతసేపూ గొప్ప గొప్ప వారిని గురించే పొగడ్తలుంటాయి. ఇలా పిల్లలు తమకు తాము ఈ పాఠశాల ప్రపంచానికి సరితూగలేక దూరమైపోతారు.
ఎంతసేపూ ఈ పిల్లల ఇంటి వాతావరణాన్ని నిందించడం తప్ప తమ బాధ్యతని ఈ టీచర్లు ఒప్పుకోరు. గుర్తుంచుకోరు. కొందరు తమకు తెలీకుండానే చెయ్యాల్సిన పనికి
. దూరమవుతారు. కొందరు నిరాశకు లోనవుతారు. “మన టీచర్ టైనింగ్ స్కూలు వాస్తవిక దృశ్యాన్ని మాముందు ఎప్పుడూ పెట్టి ఎరగదు. ఇక దండన తప్ప నాకేమీ మార్గం కన్పించడంలేదు. దండన అంటే తన్నడమే కానక్కరలేదు. పిల్లల్ని దూరంగా నెట్టెయ్యడం... అంతే” అంటాడొక టీచరు. “ఈ పిల్లలకు ఉచితంగా గుడ్డలివ్వడం దండగ. పుస్తకాలివ్వడం దండగ, వీళ్ళు శుభంగా ఉండరు. పుస్తకాల్ని జాగ్రత్తగా ఉంచుకోరు. వీళ్ళక్తీ, వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం (బ్రహ్మతరం గాదు” అనేది మరో టీచరు నిర్వేదం. *ఈ పిల్లలకి చదువా? రెండు గంటల చెపుతా. అంతకంటే వీళ్ళకి చెప్పడం దండగ. నాకు బోలెడుపని. అది చూచుకుంటే చాలు” అనేది ఇంకో టీచరు నిర్ణయం. ఇక్కడ పిల్లల్ని ఇష్టమొచ్చిన చాకిరీకి 131
వాడుకోవడం చాలా మామూలు విషయం. వీళ్ళకి తగ్గట్టు టీచర్లు మారరు. పిల్లల మీదే నెడతారు. మన బడి, మనం, మన బోధన, విళ్ళకి సరిపోవడం లేదని ఎప్పుడూ అనుకోము. దీనర్ధం ఏమిటి? ఎవరు బాధితులో వాళ్ళనే నేరస్తుల్ని చెయ్యడం అన్నమాట.
చివరకు మిగిలేది?
మన పాఠ్య పుస్తకాలీ పిల్లల మీద సాంస్కృతిక పెత్తనాన్ని సాగిస్తాయి. కోటీశ్వరులా, నిరుపేదలా అనే రెండు భావాల్ని స్థిరీకరిస్తాయి. కొందరలా, కొందరిలా ఉండటం (ప్రకృతి ధర్మమని ప్రవచిస్తాయి. దీనికోసం తేనెటీగల్ని జంతువుల్ని దృష్టాంతాలుగా చూపుతాయి. ఈ పుస్తకాల్లోని మహాత్ములంతా మేధావులు, తమలా శ్రమజీవులు గాదు. అందువల్ల తాము చాకిరీకే పుట్టాం అనే భావన పిల్లల్లో స్థిరపడుతుంది. చివరికి కథలు కూడా అంతే. ఈ కథల్లో ఒక్కోసారి నిరుపేదలు రాజులవుతారు. ఎలా? తమ తెలివితేటలతో! ఇలాంటి తెలివితేటలు తమకు లేవని పిల్లలకి తెలుస్తూనే ఉంటుంది. పుస్తకాల్లోని ముద్రలన్నీ అగ్రకులాలనీ, ఆధిపత్య వర్గాలనే తప్ప శ్రమజీవులవీ, నిమ్న కులాల వారివీ కాదు. నాగరికతకు బాటలు వేసిన శ్రమకెక్కడా స్థానం ఉండదు. గౌరవం ఉండదు. ఒక పరాజిత మనస్తత్వాన్ని, తమ అల్పత్వాన్ని ఇవన్నీ పేద పిల్లలకు నూరిపోస్తాయి. అడుగడుగునా వెనక్కు లాగుతాయి.
ఒక పాఠం ఉంది. అది చాలా చిన్న పిల్లల పాఠం. అందులో ఒక 'జూ' ఉంటుంది. ఆ జూ అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడి జంతువులకి ఎలాంటి రోగాలూ రావు. అలా వాటిని కాపాడారు. పౌష్టికాహారం అందిస్తారు. జబ్బు వచ్చిన జంతువులకు ఆసుపత్రుల్లో వైద్యం చేస్తారు.
ఈ పాఠం ఈ స్కూలు పిల్లల ముందు ఏ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది? వాస్తవిక జీవితాన్ని అందులోని వైరుధ్యాన్ని ఈ జూలో సైతం వాళ్ళు చూడాలన్నమాట. దిగమింగాలనమాట. టీచర్లకిదేం పట్టదు. ఇదేం అర్ధంగాదు. పుస్తకం, ప్రపంచం వీటి మధ్య ఉన్న సంబంధం గుర్హుకైనా రాదు.
ఒక్కమాటలో చెప్పాలంటే మన స్కూళ్ళని, మన చదువుల్ని నిర్దేశిస్తున్నది. టీచర్లుగాదు, పాఠ్యాంశాలూ కాదు. ఇవి కేవలం నిమిత్తమాత్రాలు, తరగతి బయటి సంబంధాలు, పరిస్థితులు వీటిని నియంత్రిస్తున్నాయి. ఈ పరిస్థితుల పరిష్వంగంలో టీచర్లు బందీలు, పాఠ్యాంశాలు పనిముట్లు అంతే.
188
పిల్లల పట్ల, వారు నేర్చుకొనే విధానం పట్ల మనకున్న అభిప్రాయాలు సమంజసమైనవేనా?
పిల్లలు మనం నేర్పే విధానంలోనే నేర్చుకోవాలి”.
పిల్లలు మనం ప్రస్తుతం నేర్పే విధానంలోనే బాగా నేర్చుకొంటారు. కొత్త పద్దతులు, విధానాల ద్వారా పిల్లలను అనవసరంగా తికమకపెట్టిన వారవుతాం. దీనివల్ల పిల్లల అభ్యసనం కుంటు పడుతుంది.
మనం పిల్లలుగా నేర్చుకొన్నది పాతపద్ధతిలోనే గదా! మన టీచర్లు పాఠ పద్గతుల్లో చెబితే మనకేమైనా చదువు రాలేదా?”
ఇవి ఒక సగటు టీచరుగా పిల్లలు, వారు నేర్చుకొనే విధానంపై మనం వ్యక్తం చెసే కొన్ని అభిప్రాయాలు, మరి ఇవి వాస్తవాలేనా? వీటి నిజం నిగ్గు తేల్చుకోవలసిన బాధ్యత మనపై లేదా?
పిల్లలు, వారు నేర్చుకొనే విధానంపై మనకున్న అభిప్రాయాల వాస్తవికతను తెలుసుకోవాలంటే మనం వాటి మూలాల్ని శోధించాల్సి ఉంది.
ఒక వ్యక్తికి ఏదైనా ఒక అంశం, విషయం పట్ల సదభిప్రాయం గానీ, దురభిప్రాయంగానీ ఏర్పడడానికి స్నేహితులు, కుటుంబ నేపథ్యం, సామాజిక నేపథ్యం దోహదం చేస్తాయని మనస్తత్వ శాస్తం చెబుతుంది. అలాగే మనకు పిల్లల పట్ల, వారు నేర్చుకొనే విధానం పట్ల ఉన్న కొన్ని అభివ్రాయాలు కూడా మన చిన్ననాటి బడి అనుభవాలు, మనం
బడిలో నేర్చుకొన్న విధానం, మనం మొదటిసారిగా ఉపాధ్యాయవృత్తిలో చేరిన పాఠశాల
పరిస్థితుల పట్ల వ్యవహరించిన తీరు, పాఠాలు నేర్పిన విధానం మన అభిప్రాయాలను ఇంకా బలపడేట్టు చేశాయి.
అందుకే పిల్లలు, వారు నేర్చుకొనే విధానం పట్ల ప్రస్తుతం మనకున్న అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏదైనా చెబితే మనం అంగీకరించం. దీనికొక ఉదాహరణ చూద్దాం. కొత్తగా నియమితురాలైన ఒక ఉవాధ్యాయురాలిని ఒకటవ తరగతికి వెళ్ళమన్నారు. ఒకటొ తరగతి
కేతతి
పిల్లలకు పద పద్ధతిలో అక్షరాలను నేర్పమన్నారు. అప్పుడు ఉపాధ్యాయురాలు అఆ ఇ ఈ ..... రాని వారికి పదాలెలా నేర్పడం కుదురుతుంది” అని ఎదురు (ప్రశ్నించింది.
ఇంకా మనం మన అభిప్రాయాలే సరైనవని వాదిస్తుంటాం కూడా. మన వాదనను సమర్ధించుకోవడానికి ఎన్నో ఉదాహరణలు చూపుతాం. అదెలాగంటే మేం చిన్నప్పుడు ఇదే పద్దతిలో నేర్చుకొంటే మాకు చదువురాలేదా? ప్రస్తుతం ఉద్యోగం చేయడంలేదా? అలాగే మేం ఇన్నేళ్ళుగా ఇవే పద్ధతుల్లో చదువు నేర్చలేదా? కానీ మన వాదనలో తార్మికత ఎంత మేరకుంది?
ఎక్కాలు నేర్పే విధానం, రాసే విధానంపై మనకు ఖిన్నాభిప్రాయాలున్నాయి. ఎవరి అభిప్రాయాలను వారు సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పిల్లలు దృష్ట్యా ఆలోచించడం లేదు. అదెలాగో పరిశీలిద్దాం.
మన రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలో ఎక్కాలను కింది విధంగా రాయించడం చదివించడం జరుగుతుంది.
ఉదా ; 2వ ఎక్కం
రాసే విధానం చదివే విధానం
2౮1 = 2 రెండు ఒకట్లు రెండు
2౫౮2 = శ్వ రెందు రెండ్లు నాలుగు
2)(౩=6 రెండు మూళ్ళు ఆరు
౫ శవ= 8 రెండు నాలుగులు ఎనిమిది
2౫45=10 ర0డు ఐదులు పది
మరికొన్ని జిల్లాలో ఇదే ఎక్కాన్ని రాసి, చదివే విధానం కింది విధంగా వుంది.
రాసే విధానం చదివే విధానం
1%42=2 ఒకటి రెండ్లు రెండు
2౫౮2 = 4 రండు రెండ్లు నాలుగు
3౩౫2 =6 మూడు రెండ్లు ఆరు
134
శతీ౫౮2= ర నాలుగు రెండ్లు ఎనిమిది
ర ం2 = 10 ఐదు రెండ్లు పది
పై రెండు పద్ధతుల్లో ఏది సరైనదను విషయమై చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ పద్ధతి సరియైనదని సమర్ధించుకొంటున్నారు.
మొదటి పద్ధతిలో ఎక్కాలు నేర్పేవారు తాము రాసే విధానం సరైనదనీ, ఎందుకంటే 2వ ఎక్కం అయినందున 2ను మొదట రాయాలంటారు. కానీ రెండో పద్ధతిలో 2ను మొదట రాయడం లేదంటారు. దీనివలన ఎక్కం యొక్క ప్రాధాన్యత దెబ్బతింటుందంటారు.
ఇక రెండవ పద్ధతిని అవలంభిస్తున్న వారు మొదటి పద్ధతిని అర్ధవంతమైన విధానం కాదంటారు. అదెలాగంటే 2౫483 = 6 ను రెండు మూడులు ఆరు అని చదవడంలో అర్ధం లేదంటారు. మనం మూడును రెండుసార్లు కూడుతున్నామనే భావన కలుగుతుందంటారు. కానీ మనం 2వ ఎక్కం రాసినందున రెండును మూడుసార్లు (2+2+2) కూడాలి. అనగా ఇది మూడు రెండ్లు కావాలి. మనం చదవడానికి, రాయడానికి పొంతన లేదని వాదిస్తారు.
మొదటి పద్ధతిని అవలంభిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు దీనిని అంగీకరి స్తున్నారు. మరికొందరు ఎంతకీ అంగీకరించరు. అయితే ఇలా అంగీకరించిన ఉపాధ్యాయులు కూడా తాము ఎక్కాలు నేర్చే పద్ధతిని రెండవ పద్ధతిలో మాదిరిగా మార్చుకోవడానికి అంగీకరించరు. దానికెన్నో కారణాలు వెతికి చెబుతారు. మేం ఎక్కాలు ఇలాగే నేర్చుకొన్నాం. ఇన్నాళ్ళుగా ఇలాగే నేర్పుతున్నాం. ఎక్కాలు పిల్లలకు వస్తున్నాయి. ఇప్పుడు పద్ధతి మార్చుకొనే అవసరమే లేదు” అంటారు.
ఇన్ని రోజులు 2% 3 = 6 అని రాయించి రెండు మూడులు ఆరు అని చదివించి, ఇప్పుడు మరొక విధంగా నేర్పితే పిల్లలు తికమకకు గురవుతారంటారు. ఈ కొత్త పద్ధతిని పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వాదిస్తారు. పిల్లలు అర్ధం చేసుకొని ఎక్కాలు చదివేస్థాయిలో ఉండరనీ, బట్టీ, పట్టిస్తే ఎక్కాలు అవే వస్తాయనీ, కావున ఎక్కాలు ఎలా నేర్చినా నష్టమేం లేదంటారు. ఇలా పలురకాలుగా వాదిస్తూ తాము ఎక్కాలు నేర్పుతున్న విధానమే సరియైనదని సమర్ధించు కొంటున్నారు. చాలా మంది టీచర్లు, మన దృష్టిలో పిల్లలు అర్ధరహితం కాబట్టి బట్టీ పట్టినా సరిపోతుందనుకొంటున్నాం.
అమెరికాలోని ఒక యూనివర్సిటీలో కుక్కకు ఎక్కాలు నేర్పారు. మనం పలికే శబ్దం ఆధారంగా లబ్బాన్ని తల ఊపి చూపుతుంది. మనం 2౫3 అంటే, అది ఆరుసార్లు తల ఊపుతుంది.
183ర్
అంటే మనిషికి, కుక్కకు తేడాలేదా? కుక్క ఎలాగైతే అర్ధం తెలియకుండా ఎక్కాలు నేర్చుకొందో ఆలోచనా శక్తిగల మనిషికీ అలాగే అర్ధం లేకుండా ఎక్కాలు నేర్పడం సమంజసమేనా? మన వాదనలో తార్మికత ఎంత మేరకుంది?
దీని ద్వారా మనకు తెలుస్తున్నదేమిటి? మనలో పిల్లలు, వారు నేర్చుకొనే విధానం పట్ల కొన్ని అభిప్రాయాలు నాటుకుపోయి ఉన్నాయి. వాటి సమంజసమేనా? మన వాదనలో తార్మికత ఎంత మేరకుంది?
దీని ద్వారా మనకు తెలుస్తున్నదేమిటి? మనలో పిల్లలు, వారు నేర్చుకొనే విధానం పట్ల కొన్ని అభిప్రాయాలు నాటుకుపోయి ఉన్నాయి. వాటి సమంజసత్వాన్ని ప్రశ్నించుకోకుందా, సమర్ధించు కోవడానికి ప్రయత్నిస్తున్నామనే గదా మనకు తెలిసింది. అందుకే మనం పిల్లలపై వారునే రృుకొనే విధానంపై మనకు గల అభబి[ప్రాయాలను తర్కించుకోవాలి. సంస్కరించుకోవాలి.
- పోరెడ్డి అశోక్, ప్రధానోపాధ్యాయుడు, తరోడ (బి), ఆదిలాబాద్ జిల్లా. 136
ప్రాథమిక స్తాయిలో విద్యాబోధన గో కీ గురుశిష్యుల సంబంధం
ఒక విద్యావేత్త ఉపాధ్యాయుడిగా తన అనుభవసారాన్ని ఇలా వ్యక్తీకరించాడు. “ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో నాదే నిర్ణయాత్మకమైన పాత్ర అని గుర్తించాను. నా దృక్పథమే తరగతి గది వాతావరణాన్ని సృజిస్తుంది. పిల్లవాడి జీవితాన్ని విచారంతోగాని సంతోషంతో గాని నింపే అద్భుతమైన శక్తి నాకుంది. నేను హింసించే ఆయుధాన్ని కాగలను. గొప్ప ప్రేరణనిచ్చే ఉపకరణాన్ని కూడా కాగలను. నేను పిల్లవాణ్ణి సిగ్గిల్లేలాగా చేయగలను. లేదా సంతోషంతో ముంచెత్తగలను. బాధపెట్టగలను. లేదా ఓదార్చగలను. ఎటువంటి పరిస్థితిలోనైనా నా దృక్పథం, నా విధానం సమస్యను పెంచగలదు లేదా తగ్గించగలదు. నేను పిల్లవాడిని మానవుడి గానో లేక దానవుడిగానో చేయగలను”.
ఈ అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు నిజం. విద్యా వ్యాసాంగంలో, అందునా ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడిది కీలక పాత్ర. విద్య అంటే ఏమిటో ఎంతో మంది తత్వవేత్తలు, విద్యావేత్తలు ఎన్నో అభిప్రాయాలు వ్యక్తీకరించారు. మాటలు వేరైనా వారందరి అభిప్రాయం ఒకటే. మనిషిని మనిషిగా తీర్చి దిద్దేదే విద్య అవుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే విద్య అంటే తెలుసుకోవడం, తరచి విచారణ చేయడం నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అంటే ఏమిటి? ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? - అన్నీ ప్రశ్నలే. జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో “హేతుబద్దంగాను, భ్రాంతికి లోనవకుండానూ ఆలోచించగలిగే శక్తి సామర్ధ్యాలను పెంచుకోవడం విద్య. ఏ విధమైన నిర్భంధమూ లేనప్పుడే నేర్చుకోవడం అనేది నాధ్యం.”
సుమారు 5-10 సంవత్సరాల మధ్య గల వయసు పిల్లలు పాల్గొనే విద్యా కార్యక్రమాన్ని ప్రాథమిక విద్య అంటున్నాం. పిల్లల చదువుకు, ప్రవర్తనకు ప్రాథమిక స్థాయి పునాది. ప్రాథమిక స్థాయి సరిగ్గా ఉన్నప్పుడే సెకండరీ స్ధాయి విద్య, ఉన్నత విద్య సరైన మార్గంలో జరపటానికి వీలవుతుంది. ప్రాథమిక విద్యా లక్ష్యాలుగా ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చును.
187
- _ప్రశ్నించడాన్ని ప్రోత్సహించడం.
- నేర్చుకోవడంలో ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచడం.
- చేసే ప్రతిపనిలోనూ (శ్రద్ధను పెంచడం.
- గ్రహణశక్తి, ఆలోచనాశక్తి ఊహాశక్తి, కల్పనాశక్తులకు పునాది వేయడం.
- తన ఆలోచనలను, భావాలను స్పష్టంగా, నిర్దుష్టంగా, ధారాళంగా తెలియజేయడానికి మాతృభాషలో పూర్తి తర్చీదు నివ్వడం.
- గుప్తంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసుకొనిరావడం.
- మంచి ప్రవర్తనకు దోహదం చేయడం. పై లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొనే ప్రాథమిక విద్యలోని వివిధ కార్యక్రమాలను రూపొందించుకోవాలి. వాటిని అమలు జరపాలి. ఏ కార్యక్రమమైనా మంచి టీచరు చేతుల్లోనే ఉత్సాహ భరితంగా, ఉత్తేజకరంగా రూపుదిద్దుకొంటుంది. విద్యా కార్యక్రమాల సాఫల్యత మొదట టీచరు సామర్ధ్యం మీద, తరువాత విద్యార్థి ప్రతిస్పందనల మీద ఆధారపడి ఉంటుంది. టీచరు నిరంతరమూ తననూ, తన కార్యక్రమాలనూ, తనకూ - విద్యార్థులకూ ఉన్న సంబంధాన్ని తరచి చూసుకొంటూ ఉందాలి. పై లక్ష్యాలు అనే అద్దంలో తన ప్రతిబింబాన్ని ఎప్పటికప్పుడు చూసుకొంటుండటం, అవసరమైనప్పుడు సరిదిద్దుకోవడం తప్పనిసరి. ప్రశ్నల్ని వ్రోతృహించదం ప్రాథమిక న్థాయిలో విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. తమను తాము వ్యక్తీకరించుకోవడానికి ఇష్టపడతారు. ప్రతిదీ అనుభవం కావాలి వాళ్ళకు. పిల్లలు ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తున్నానా? పరోక్షంగానైనా నిరుత్సాహపరుస్తున్నానా? ఎప్పుడూ నేనే మాట్లాడుతున్నానా? వారి మాటలు వినటానికి ప్రయత్నిస్తున్నానా? వాళ్ళతో కలిసి అన్వేషణలో పాల్గొంటున్నానా? వారి తెలియని తనాన్ని ఎత్తి చూపిస్తున్నానా? నాది పిల్లల క్షాసులాగా ఉంటోందా? నా క్లాసులా ఉంటోందా ? ఇలా తనను తాను ప్రశ్నించుకొంటూ, తననుతాను సరిదిద్దుకొంటూ చైతన్యవంతంగా విద్యాకార్యక్రమం జరపటం ప్రాథమిక స్థాయిలో అత్యంత కీలకమైనది. నిన్న ఉన్నట్లుగా ఈ రోజుండదు. ఈ రోజున్నట్లుగా రేపు ఉండాలనుకోకూడదు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అంటే సమాచారాన్ని అందివ్వడం కాదు. తరచి చూడగల, విచారణ చేయగల మనసును వికసింపజేయడం. నేర్చుకోవాలనే కాంక్ష పిల్లలలో సహజంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు చాలా చాకచక్యంగా ఈ సహజ లక్షణాన్ని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించగలిగినప్పుడు ఏ విషయాన్నైనా నేర్చుకోవడంలో పిల్లలకుగానీ, నేర్పించడంలో ఉపాధ్యాయుడికి గానీ సమస్య ఉండదు. పైగా నేర్చుకోవడం అనేది సంతోషకరమైన అనుభవంగా ఉంటుంది. ఆ అనుభవం కోసం పిల్లలూ, టీచరు ఎదురు చూస్తుంటారు. 138
కీలకమైంది ప్రేమ
నేర్చుకోవడం అనేది సంతోషకరమైన అనుభవం కావాలంటే గురు-శిష్య సంబంధంలో, పాఠశాల వాతావరణంలో (పేమ, సున్నితత్వం, సానుభూతి, స్పష్టత, పారదర్శకత ఉండాలి. ప్రేమ అంటే సెంటిమెంటు కాదు. భక్తి (శ్రద్ధలు కూడా కాదు. (ప్రేమంటే - వినమ్రత సౌమ్యత, ఉదారత్వం, సహనం, మర్యాద, మన్నన - అన్నీ కలిపి అంటారు కృష్ణాజీ.
టీచరు స్వభావంలోనే (ప్రేమ మళితమై ఉందాలి. టీచరుకు - విద్యార్థికి మధ్యగల సంబంధంలో భయానికి చోటుందకూడదు. విద్యార్థిలో ఈ భయభావనకు కారణాలు -- పరాధీనభావం, భద్రతారాహిత్యం, తెలిసో, తెలియకో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా భద్రతాభావాన్ని పెంపొందిస్తున్నామనుకొంటూ, నిజానికి పరాధీనత్వాన్ని పెంపొందిస్తారు. పరాధినత్వాన్ని అంటి పెట్టుకొనే ఉంటుంది భయమనేది. టీచరు విద్యార్థితో తన సంబంధాన్ని (ప్రేమతో నింపినపుడు భయమనేది పోతుంది. భద్రత ఉంటుంది. విద్యార్థి తనకు టీచరుకు గల సంబంధ బాంధవ్యాలలో భద్రత ఉన్నట్లు భావించినప్పుడే మానసిక నిషపటతను, సున్నితత్వాన్ని అలవరచుకోగలుగుతాడు. ఈ టీచరు దగ్గర హాయిగా ఉండొచ్చు అనే విశ్వాసం పిల్లవాడికి కలగాలి. ఆ విశ్వాసాన్ని టీచరు తన ప్రవర్తన ద్వారా, ప్రతిస్పందనల ద్వారా పిల్లలలో కలిగించాలి. ఉపాధ్యాయుని దగ్గర భద్రతా భావం ఉన్న పిల్లలు, ఆయన పట్ల ప్రేమ ఉన్న పిల్లలు, తమకు సహజమైన రీతిలో తమ టీచర్ల పట్ల, ఇతరుల పట్ల గౌరవం ప్రదర్శిస్తారు. సానుకూలత కనబరుస్తారు. పిల్లల ప్రవర్తనలో ప్రతికూలత, మొండితనం, తొందరపాటు ఉందవు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు సాధించవలసింది ఇదే. స్వేచ్చ
స్వేచ్చాపూరితమైన వాతావరణంలోనే నిజమైన విద్యాభ్యాసం వీలవుతుంది. అయితే స్వెచ్చ అంటే ఏమిటో మనం స్పష్టం చేసుకోవలసి ఉంది. స్వేచ్చ అంటే ఎవరిష్టం వచ్చినట్లు వారు చేయడం కాదు. ఉపాధ్యాయుడు కానివ్వండి, పిల్లలు కానివ్వండి - ఎవరికీ అలాంటి స్వేచ్చ ఉండకూడదు. తాను ఉపాధ్యాయుడు గనుక తనకు విశిష్టమైన అధికారాలున్నాయని అనుకోవడానికీ, తాను అన్నీ తెలిసినవాడిని అనే ఆధిపత్యభావానికీ విద్యాబోధనలో స్థానం లేదని టీచరు గుర్తించి తీరాలి. అలాంటి భావనలున్న టీచరు పిల్లలు సొంతంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించదు. ఉపాధ్యాయుని ఆధిపత్యం, అహంభావం కారణంగా విద్యార్థులలో తెలివితేటలు, వివేకం అణగారిపోతాయి.
“అసలు భయం లేకపోతే పిల్లవాడు పాడైపోడూ! అధికారం ప్రదర్శించకుండా, శిక్షించకుండా పిల్లలలో క్రమశిక్షణ తీసుకు రావడం అసాధ్యం” అనేవారు మన సమాజంలో ఎక్కువగా ఉన్నారు. కాని భయపెట్టటం ద్వారా కాన్సీ, శిక్షించడం ద్వారా కానీ ఆర్దర్ రాదు. ఆ వచ్చేదేదైనా తాత్కాలికమైన 5400163366 51216. ఆస్థితిలో పిల్లవాడి శక్తులన్నీ అణగారి పోతాయి. మానసిక వైకల్యం జరిగే ప్రమాదం కూడా ఉన్నది. స్కూలు పద్ధతులకు అనుగుణంగానే
139
స్వేచ్చాపూరిత వాతావరణం కల్పించవచ్చు. నిజమైన ప్రజాన్వామ్య పద్ధతిలో వ్యక్తి స్వేచ్చకు విలువ ఉన్నది. స్వేచ్చ అనేదే ఆర్జర్కు మూలం. స్వేచ్చ నుండి స్వతంత్రం, దాన్నుండి ఆర్టర్ రావడమే విద్య ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ప్రాథమిక స్థాయిలో నిర్లక్ష్యం చేయబడినట్లయితే తరువాత స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలూ ఏమీ చేయలెవు.
కేంద్రం బిద్ద
టీచరు తాను రూపొందించుకొన్న విద్వా కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు ప్రతి పిల్లవాడు వాని స్థాయిలో ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో పాల్గొనేట్లు చూడాలి. ఇలా జరగాలంటే బోధన పిల్లవాడు కేంద్రంగా జరగాలి. పిల్లవాడు కేంద్రంగా విద్యావ్యాసంగం జరగాలి అంటే టీచరు ఒకే క్లాసు పిల్లల్లోనే - శక్తులు, ఆసక్తులు, అభిరుచులు, స్పందనలలో తేడాలుంటాయనే విషయాన్ని గమనించాలి. ప్రతి పిల్లవాడు ఒక విశిష్టవ్యక్తి అనీ, ఇంటి దగ్గర వాతావరణం అందరిదీ ఒకేమాదిరిగా ఉండదనీ టీచరు నిరంతరం గుర్తుంచుకోవాలి. పిల్లలలోని ఈ రకమైన తేడాలను గుర్తించి ఆ తేడాలకు అనుగుణంగా విద్యాబోధన, ప్రోత్సాహం చేయలేని ఉపాధ్యాయులు విద్యార్థులను తమతో పాటు తీసుకొని వెళ్ళలేరు. విద్యార్థులందరిలోనూ వారివారి వేగాలకు తగినట్లుగా టీచరు ప్రయాణం చేసినప్పుడే విద్యార్థులందరూ వారి వారి వేగాలతో టీచరుతో కలిసి ప్రయాణం చేస్తారు. కలిసి ప్రయాణం చేయడం టీచరుకు, విద్యార్థులకూ కూడా గొప్ప అనుభవం.
పిల్లలతో అనుబంధంలో టీచరు తనను తాను చెక్ చేసుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి. ఈ పిల్లవాడు తెలివిగలవాడు, ఆ పిల్లవాడు తెలివితక్కువవాడు అని పిల్లలపై ముద్రలు వేయడం, వారి ముందే అలా అనటం పెద్ద తప్పు. విద్యార్థుల శక్తి సామర్ధాలను పోలుస్తూ పదేపదే వ్యాఖ్యానించడం విద్యాబోధకుడు చేయవలసిన పనికాదు. ఈ పోలిక విద్యార్థులలో ఆశాభంగాలు కలిగిస్తుంది. అసూయను ప్రోత్సహిస్తుంది. నేర్చుకోవడమనే (ప్రక్రియకు ఆటంకం అవుతుంది. బాగా చదివే విద్యార్ధిని అతిగా మెచ్చుకోవడం, సందర్భరపహితంగా మెచ్చుకోవడం, చదవని విద్యార్థిని తక్కువ చూపుతో చూడటం ఉపాధ్యాయులెంతో మంది తెలిసి చేసే పెద్ద తప్పు.
'రవీ! ఈ టెస్టులో గణితంలో నీవు బాగా చేసావు” అని మెచ్చుకోవడం మంచిదే. కానీ మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి. పదేపదే అదే విషయాన్ని పిల్లలకూ, రవికీ జ్ఞాపకం చేయకూడదు. టీచరు మనసుపైనా దాని ప్రభావం లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం పక్షపాతంగానీ, మొగ్గుగానీ రవి అనే వ్యక్తి పట్ల ఉండకూడదు. క్లాసులో పిల్లలందరిపైనా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకేరకమైన ప్రేమ, ఒకే రకమైన (శ్రద్ధ చూపించాలి. టీచరు అలా నటించాలి అని అనటం లేదు. టీచరు ఎంతో బాలెన్స్‌తో వ్యవహరించాలి. తనను తాను మలచుకోవాలి అంటున్నాను. అలాగే ప్రసాద్ ఒక టెస్టులో ఇంగ్లీషులో బాగా చేయలేదను కోండి. “ప్రసాద్! నీవు ఈ సారి ఇంగ్రీషు పరీక్షలో ఈ పొరపాట్లు చేశావు. ఇలా సరిదిద్దుకోవటానికి కృషి చేయి. ఈసారి తప్పకుండా బాగా చేయగలవు) అంటూ ప్రసాద్ పొరపాట్లు గుర్తు చేస్తూనే
140
వాటిని అతను అధిగమించటానికి ప్రోత్సహించాలి. ప్రసాద్ పట్ల ఇంగ్లీషు టీచరుకు (ప్రేమ తగ్గకూడదు. పిల్లలను వారి వైఫల్యాలతో, వారి పరిమితులతో, వారి మంచిచెడ్దలతో - వారిని వారిగా అంగీకరించి ప్రేమించడం, ఎలాంటి పక్షపాతవైఖరి లేకుండా ప్రవర్తించడం, క్లాసులో 30 మంది పిల్లలుంటే అందరి విశ్వాసాన్నీ చూరగొనే స్థాయికి ఎదగటం - ఈ స్థాయికి చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. చేరామనుకొన్న వాళ్ళు క్రిందికి పడిపోకుండా ఉండటానికి కూడా ప్రయత్నించాలి. నిరంతర ప్రయత్నం లేకపోయినట్లయితే ఆ స్టాయికి చేరినవాళ్ళు కూడా ఏ క్షణమైనా క్రిందికి పడిపోవచ్చును. ప్రాథమిక స్థాయిలోనే టీచర్లు విద్యార్దుల పై వేసే ముద్రలవల్ల, పోలికల వల్ల, పోటీ వల్ల, స్పర్ధల వల్ల చాలా మంది విద్యార్థులు ప్రారంభంలోనే నేర్చుకోవడం పట్ల విముఖతను, భయాన్ని పెంచుకొంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వెనక్కు తగ్గుతారు.
పాఠశాలలో ఉపాధ్యాయులు, హెడ్ మాస్టరు పిల్లలు పాటించవలసిన నియమాలను గురించి, వివిధ కార్యక్రమాల ప్రణాళిక గురించి, క్రమశిక్షణ గురించి ఎన్నో నిర్ణయాలు తీసుకొంటారు. ఈ నిర్ణయాలలో పిల్లల అభిప్రాయం, వారి అంగీకారం అవసరం అని చాలా మంది గుర్తించరు. మనం నిర్ణయాలు చేస్తాం. విద్యార్థులు పాటించాలి. అంతే. ఇది సరైన పద్దతి కాదు. మన అభిప్రాయాలను, నిర్ణయాలను, పద్ధతులను పిల్లలపై బలంవంతంగా రుద్దటం ద్వారా మనం విద్యార్థులలో వ్యతిరేకతను, ద్వేషాన్ని కలిగిస్తున్నామన్నమాట. మనకు వారు విధయంగా ఉంటే చాలు. వారి ప్రేమతో, ద్వేషంతో మనకు పనిలేదు అనుకొంటే అది తప్పు అభిప్రాయం అవుతుంది. ఎందుకంటే తాము ద్వేషించే ఉపాధ్యాయుడి నుంచి పిల్లలు ఏమీ నెర్చుకోరు (ఉపాధ్యాయుడు ఎంతటి విజ్ఞాని అయినా). తన వృత్తి పట్ల అంకిత భావం, పిల్లల పట్ల శ్రద్ధ ఉన్న ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో అన్ని విషయాలలోనూ ఒక ఒప్పందానికి రావాలి. ఆ ఒప్పందానికి తాను కట్టుబడి ఉండాలి. అది గుర్తించిన పిల్లలు తాము కూడా ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటారు. వేళకు బడికి రావటం, చేయవలసిన పనులను సక్రమంగా సకాలంలో చేయడం, స్కూలు పద్ధతులకు అనుగుణంగా నదుచుకోవటం, తోటి విద్యార్థులతో మెలగటం, క్రమశిక్షణతో ప్రవర్తించటం - వీటన్నింటిలోను ఆ ఒప్పందం యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది.
పైన చెప్పుకొన్నవన్నీ ఒక ఎత్తు. పిల్లలతో సంబంధంలో '“అహింసిను పాటించటం ఇంకో ఎత్తు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బట్టి తెలుస్తున్నదేమంటే - బిడ్డ పుట్టినప్పట్నించి ఆరు సంవత్సరాల వయసు వరకు - ఆ బవీడ్డ మనసు మీద చుట్టూ ఉన్న ప్రపంచ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చుట్టూ ఉన్న మనుషుల మాటల్నుంచీ, బోధనల్నుంచీ నేర్చుకొనే దానికంటే ఆ మనుషుల ప్రవర్తన నుంచీ నేర్చుకొని ప్రభావితులవుతారు. పిల్లలతో సంబంధంలో అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్లు 'అహింసిను పాటించాలి. అహింసను క!
పాటించాలంటే ఎంతో ఓర్పు అవనరం. అహింసను పాటించాలి అని మనసులో నిర్ణయించుకొన్నాా ఎన్నో సందర్భాలలో ఓర్పును కోల్పోయి హింసకు పాల్పడతాం. టీచరు ఎదుర్శొనే సమస్యలలో అతి క్లిష్టమైన సమస్య ఇది. “ఎందుకురా ప్రక్కవాణ్ణి కొట్టావు” అని అడుగుతూ కొన్నిసార్లు మనమూ అసంకల్పితంగా దెబ్బ వేస్తాం. మనం కావాలనుకొన్నట్లుగా పిల్లలు ప్రవర్తించనప్పుడు ఎంతో ఓర్చువహించి తిట్టకున్నా, కొట్టకున్నా మన చూపుల్లో క్రౌర్యాన్ని ప్రదర్శిస్తాం. అదీ హింసే, హింసను వ్వతిరేకించని సమాజం, ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో హింసను చూపించే ఇళ్ళు, స్కూళ్ళు, టి. వి. కార్యక్రమాలు బు బిడ్డ మనసు మీద నిజానికి హింస ప్రభావమే ఎక్కువ. ఆ ్రభావంతోనే ౧9౫౦110 ౫౦0/౦ (మాంటిస్సోరి మాటల్లో) ఎదుగుతుంది. మనిషి స్వభావంలోనే, నైజంలోనే 'అహింసాప్రవృత్తి' ఉంటే తప్ప అహింసను పాటించటం సాధ్యంకాదు. బయట మాత్రం పూర్తి హింసా ప్రవృత్తి - స్కూలు సమయంలో, అదీ పిల్లలతో మాత్రం అహింస - ఇది సాధ్యమా? సహనం, 0017106401 తోదైతే సాధ్యమే. టీచరు - పిల్లల సంబంధంలో ఎలాంటి హింసకూ చోటుండకూడదు అనే విషయంలో మాత్రం సందేహం లేదు.
కొంతమంది పిల్లలు కారణం లేకుండా తోటి పిల్లలను కొడుతూ ఉంటారు. రకరకాలుగా హింసిస్తుంటారు. స్కూలుకు సంబంధం లేని కారణాలెన్నో ఈ రకమైన పిల్లల . ప్రవర్తనకు కారణాలు కావచ్చు.. మరి అలాంటి పిల్లల సంగతేమిటి ? పొంసా ప్రవృత్తి గల పిల్లలను కూడా అహింసామార్గంలోనే మార్చడం సాధ్యమా ? వీరి పట్ల హింసను అవలంభించకూడదా ? అనే ప్రశ్నలొస్తాయి. నా ఉద్దేశ్యం వీరిని కూదా అహింసామార్దంలోనే మార్చవచ్చునని. ప్రాథమిక స్థాయి పిల్లలలో తప్పకుండా సాధ్యమని నమ్ముతున్నాను. కాని ఎంతో ప్రయత్నం అవసరం. ఎంతో సమయం వెచ్చించవలసి ఉంటుంది. ఇలాంటి పిల్లలను సరైన మార్గంలోనికి తేవటానికి తల్లిదండ్రులు, టీచర్లు కలిసి ప్రత్యేక కృషి చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో గురు - శిష్యుల సంబంధం పుస్తకాలకు, చదువులకు, పాఠశాలకు మాత్రమే పరిమితం కాకూడదు. విద్యార్ధి ప్రపంచంతో - అంటే తనచుట్టూ ఉన్న మనుషులతో, ప్రకృతితో, తన జీవన విధానంతో సామరస్యాన్ని కలిగించుకోవడంలో ఉపాధ్యాయుడు స్ఫూర్తి కాగలగాలి. పిల్లవాడు తన ఉపాధ్యాయుడిలో తన తోటి అన్వేషకుడిని చూడగలగాలి. తన దుఃఖాన్ని సంతోషాన్ని, తన రహస్యాలను టీచరు దగ్గర చెప్పుకోగలగాలి. అంతటి విశిష్టమైన
సంబంధం పిల్లవాడికి - టీచరుకు మధ్య ఉండాలి.
- వ్రః। బి.వి. అప్పారావు, ఆర్.ఇసి.. వరంగల్
కేశ
ఆరి సాన తళ ల య్ న్ అ పదకొందేళ్ళ పిల్లలతో ఓ డైలాగ్
టీచర్ టీచింగ్ పేరుతో పాఠాల్ని వల్లిస్తారు. పిల్లలూ అదే చేస్తారు. కొత్త టీచర్‌కు కూడా కొంతకాలానికి ఈ పాడిందే పాట అలవాటవుతుంది. జీవితం అంతా ఈ పాటతో ' గడిచిపోతుంది. టీచర్కిదొక భరోసా.
అలాగే పిల్లల్ని వినోదాలకి మరపడం అంటే నేర్చుకోవడం నుంచి పక్కదారి పట్టించడమే అవుతుంది. వినోదాల్ని మరిగిన వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. సీరియస్ వాతావరణం నుంచి వాళ్ళు పారిపోతుంటారు. వినోదం వ్యసనంగా మారుతుంది వీళ్ళకి. వ్యసనంలో ఏకాగ్రత ఎప్పుడూ వుండదు. ఎరుక లోపిస్తే నేర్చుకోవడమూ ఉండదు.
టీచర్ పిల్లలకి వినోదం మప్పదడం మానెయ్యాలి. వాళ్ళు ఎలా నేర్చుకొంటున్నారు?
వాళ్ళతో కలిసి తాను ఎలా నేర్చుకోవాలి అనేదే ముఖ్యం కావాలి. జోక్స్ చెప్పడం, కథల్లో మైమరిపించడం ఇవన్నీ నేర్చుకోవడంలో భాగంగా ఉండాలి గానీ వ్యసనంగా మార్చగూడదు. నేర్చుకోవడం లోనే ప్రతిదాని ఉపయోగమూ దాగి ఉంటుంది.
పిల్లలు గమనించడం నుంచి టీచరు ఎంతో నేర్చుకొంటాడు. క్లాస్‌రూంను ఎప్పుడూ బోసిగా వుంచగూడదు. పిల్లలు గమనించడానికి తగినట్టు అందులో ఏదో ఒకటి వుండాలి. స్వతఃసిద్ధత, సద్యః స్ఫురణ టీచర్‌కి ఉండాలి. అట్లని టీచర్ ప్రిపేర్ కాకుండా క్లాసులోకి వెళ్ళగూడదు. రాత్రి నిద్రపోయ్యేటప్పుడు కూడా టీచర్ ప్రిపేర్‌కావాలి. మళ్ళీ దాన్నంతా పిల్లల మీద రుద్దకూడదు. ముఖ్యంగా విషయాన్ని సమాచారాన్ని, వివరాల్ని పిల్లల మీద రుద్దకూడదు.
ఒక రోజు మా తరగతి గదిలో ఏం జరిగిందో చూడండి.
పిల్లలందరూ జె.కె. సెంటర్‌కు వస్తున్నారు. లోపలికి వస్తుండగానే వాళ్ళని గ్లాస్లో అమర్చబడ్డ పూలు ఆకర్షించాయి. అవి కాక్టస్ పూలు. పిల్లలు ఒక్కొక్కరూ ఆ పూల వాసన చూచారు. వాటి అందానికి ముగ్సలయ్యారు. ఆ పూల పేరు ఎవ్వరికీ తెలీదు. టీచర్‌కి కూడా
143
తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. మరి ప్రతిదానికీ ఒక పేరుండాలి గదా! పిల్లల్లో గుసగుసలు మొదలయ్యాయి. 'అవి కాక్టస్పూలు”. * కాదు మల్లెలు * కాదు సంపెంగలు, చూడండి ఆ వాసన. అవి ఆకాశ మల్లెలు ఇలా పిల్లలు ఆ పూలని ఎన్ని పేర్లతో పిలిచారో? అయితే ఆ పూలు ఈ పేర్లని వేటినీ పట్టించుకోలేదనుకోండి.
పిల్లల ధ్యాసంతా పూల మీదే వుండటం గమనించి పూలగ్గాసుని ఎత్తి పట్టుకొని ఆ పూల గురించే మాట్లాడుతూ పొయ్యాము. పిల్లలు ఎంతో (శ్రద్ధతో వినసాగారు. క్లాసులో ఏమీ లేకుండా పిల్లలతో డైలాగ్ ప్రారంభించడం కంటే ఏదో ఒకటి ప్రత్యక్షంగా వుంటే మాట్లాడ్డంలో చాలా శ్రద్ధని పెంచగలం. డైలాగ్ ఇలా మొదలైంది.
పగలంతా బయట చెట్టు వద్ద కాచుకొని వున్నాను. ఆ పూలమొగ్గల కాడలు వికసించనేలేదు. అర్ధరాత్రి తలుపులు తెరిచి బయటకొచ్చాను. చిరు వెన్నెట్లో, సుతారంగా ఏదో వాసన పిలుస్తోంది రారమ్మని దగ్గరికి పోయి చూస్తే నాలుగు పూలు విచ్చుకొని వున్నై అని ప్రారంభించాను నేను.
“తీరా అవి విచ్చుకొన్నాక మీరు చూడ్డం కాదు. అవి రెక్కరెక్కా వచ్చుకొంటున్నప్పుడు అప్పుడే చూడాల్సింది ఓ అమ్మాయి అంది.
“అవును ఆ పని చేసి వుండాల్సింది. ఇప్పుడు చూడండి ఆ పూలకాడ, ఆ పూల రేకులు పొడుగ్గా, తెల్లగా, అందంగా ఎంత బాగున్నాయో ఆ వాసన చూడండి ఎంత సుతారంగా, మత్తెక్కించేలా వుందో, ఆ తొడిమకి నాలుక ఆడించి చూచాను. ఎలా వుందనుకొన్నారు.
“తియ్యగా వుంటుంది
“కాదు చేదుగా వుంది”
'అరె తియ్యగా వుండాల్సింది చేదుగా ఎందుకుంది?”
“ఆ పూల రేకుల మధ్య గర్భాశయంలో నాలుకతో నాకి చూడాల్సింది. అక్కడ తియ్యగా వుంటుంది.”
“అవును. ఆ పని నేను చేశా. అక్కడ తియ్యగా వుంది.
'సరిగ్గా తేనెటీగలు అక్కడే వాలి, పూల తేనెను పీల్చుకొని తేనెపట్టులో కూడబెడతాయి.
మీకు తెలుసా?”
“అవును తెల్పు! ,
తెల్సంటే ఎలా తెల్సు”
మేం దీని రుచి చూశాం. లేనె రుచి చూశాం. 'రెండూ ఒకటిగానే వున్నై.”
క్షేర్తడ్ష
'ఆ తేనె పువ్వల్నించి వచ్చిందేనని తెల్సింది.”
'ఓహో! అలా తెల్సిందా. మరి మీరు తేనెటీగల్లాగా పువ్వుల్నించి డైరెక్టుగా తేనె తీసుకొని కూడబెట్టగలరా?'
“ఊహు. మా చేతకాదు. కాకపోతే రుచి చూడగలం. అంతే
'మధువు అంటారు తేనెని, మధుపం అంటారు తేనెటీగని"
“ఇంగ్లీషు వాళ్ళయితే బీ అంటారు"
“అవును అంటారు అలాగే!
'ఆ పూలని గ్లాసునీళ్ళలో ఎందుకుంచాం'”
“అవి వాడిపోకుండా”
'అవి ఎప్పుడూ వాడిపోవా?”
'పోత్రాయ్. నీళ్ళలో వున్నాయి గాబట్టి త్వరగా వాడిపోవు'
“ఈ పూలరేకులు తెల్లగా వున్నాయి గదా. ఈ గ్లాసు నీళ్ళలో ఎరుపు ఇంక్ కలుపుదాం. అప్పుడు ఏమవుతుంది?”
“సరే కొంచెంసేపు తర్వాత మీరే చూద్దురుగాని'
'అరే ఆ రేకులు ఎరుపయ్యాయ్? ఎలా జరిగిందిది?”
“జడ నుంచి నీళ్ళను పీల్చుకొన్నాయ్. ఆ పీల్చుకొన్న నీళ్ళరంగు పూలకి వాకింది”
'మనం పెయింట్ వేసినట్టుందే?
'అవును అచ్చం అలానే వుంది"
“చిత్రంగా లేదూ?”
“అవును చిత్రమే”
'నల్ల ఇంకు పోశామనుకో అప్పుడేమవుతుంది?
“నల్లరంగు రేకులు వస్తాయి
“అంత నల్లగా రావు. కొంచెం నల్లగా వన్తాయి”
'మీరు ఊహిస్తున్నారు. కేవలం ఊహించడం కాదు సైన్సు అంటే పరిశీలించడం, ఊహించడం, అది నిజమో కాదోనని చేసి చూసి తేల్చుకోవడం. అదీ సైన్సు అంటే.”
కేర్
మేం ఇంటికళ్ళాక చేసి చూస్తాం, పరిశోధన చేస్తాం. ' .'..
. "= “అవును. ప్రతిదీ స్కూల్లో, క్లాస్‌లో చెయ్యరు: చేసి చూపించరు. మీరు ఇంటిలో చేసి చూడాలి. పరిశీలించాలి. ఇంటిలోనూ నేర్చుకోవాలి. బజార్లో నడిచిపోతూనూ నేర్చుకోవాలి. నిద్రబోతూనూ నేర్చుకోవాలి.” _ . . (
నిద్రపోతూ ఎలా నేర్చుకొంటాం.”. ౧... ౯ “కలలు వస్తాయ్గా” . 'కలల్లో నేర్చుకొంటామా? కలలు జ్ఞాపకముంటాయా? . _ -:' జ్ఞాపకం వుండటమే నేర్చుకోవమా? '* .-౧ ౨ జ్ఞాపకం లేకుండా నేర్చుకోవడం వుండదా?” . 'వంటుంది' [ “ఉయా ఉండదు "౧ +? "అది సరే. ఈ పూవుకి ఈ వాసన ఎలా వచ్చింది? ఈ ఆకారం ఎలా వచ్చింది? ఈ రంగు ఎలా వచ్చింది? అది పెరిగిన మట్టిలోంచి వచ్చిందా? పీల్చిన నీళ్ళలోంచి వచ్చిందా? దాన్ని పోషించిన సూర్యరళ్ళ్మిలోంచి వచ్చిందా? 'ఈ అన్నిటిలోంచి వచ్చింది.! |. “కాదు అన్నిటిలోంచి బలం వచ్చింది? . . | .
(ఏం బలం' . ఇ . మ 'చెట్టుకి బలం” మం మ ' 'మనకి బలం ఎలా వస్తుంది?” - టు 'మనం తినే ఆహారం నుంచి” లం 'ఆహారం నుంచేనా? మనం తాగే నీళ్ళలోంచి, పీల్చే గాలిలోంచీ కూడా” “అవును! ఆ అన్నిటి నుంచి వస్తుంది" క. 'ఇప్పుడు మిరపకాయ వుందనుకో, దాన్ని కొరికిచూద్దాం. అది ఎట్లాగుంటుంది.?
౫ కారంగా వుంటుంది” . 0 || - | వ. ల .
కేశ 6
నస ఎ కొరంగా. వుంటుంది. మరి దానికి కారం, ఇ,.గుణం ఎట్లా వచ్చింది? దానికా స్వభావం ఎలా వచ్చింది... 2-౮. హం పంటల రం “దాని విత్తనంలో వుంటుంది” వ. “విత్తనంలో ఇంకా ఏముంటుంది? దాని గుణాలు, స్వభావాలు...” _ “ఇంకా....' . 'రంగు, రుచి, వాసనా...... ఇంకా......” . 'మరి మనిషిలో అంటే మనలో గుణాలు ఎలా వస్తాయి”? అందరూ నవ్వుతారు. _ . “అందరూ నవ్వుతారెందుకని? ఇందులో నవ్నాల్సింది ఏముంది?" - “అమ్మ నుంచి వస్తాయ్” * వ. జ్రేవలం అమ్మలో నుంచేనా” ” *” ల సుంల్నే ల కాదు నాన్నలో నుంచీ వస్తాయా “౧౨౨ చవట “= జామరి అమ్మానాన్నలకి ఎలావస్తాయ' (౨-౨౫ ౨౦౨. “వాళ్ళ అమ్మానాన్నల నుంచో ౨౮ ౨ ర లచల లో “మరి వాళ్ళకి . 'వాళ్ళ అమ్మానాన్నల నుంచీ వ. “తొట్టతొలి అమ్మానాన్నల నుంచీ” లలి జ వలి న. 'మనలోపల వున్న గుణాలు అంటే ఏమిటి?” . . " ల . గుణాలు అంటే గుణాలు... అవ్వన్నీ! ల .. “అవన్నీ అంటే... కోపం, రోషం, సంతోషం, తియ్యగా వుండటం.” మం మ తియ్యగా, వుండటమా? అంటే ఇప్పుడు నన్ను కొరికి చూడాల్నా?” “అవును కొరికి చూస్తే తియ్యగా... “ఉహుం ఉప్పగా వుంటుంది” 'కొరికాక వాసన చూస్తే గబ్బువాసని “అవును అట్లాంటి వాసనే వస్తుంది” కేశ
'అలా అసపహ్యాంచుకొంటే నేర్చుకోగలమా? డాక్టరు చిము పట్టిన పుండును అసహ్యించుకొంటాడా? అసహ్యించుకొంటే తట్టుకోగలదా? అపుడు వైద్యం చెయ్యగలడా?...
“ఊహు చెయ్యలేడు"
'అంటే అసహ్యించుకోకుండా పరిశీలించడంవల్లే ఏమైనా నేర్చుకోగలం”
“అవును
'మీరు ఎవళ్ళయినా మర్రి విత్తనం చూశారా?”
“చూశాం, చిన్నగా ఉంటుంది.”
“అవును చాలా చిన్నగా వుంటుంది”
'అంత చిన్న విత్తనంలో అంత మర్రిమాను వుంటుందని ఊహించగలరా?”
“తిమ్మమ్మ మర్రిమానట. టీవీలో చూపించారు. 10 ఎకరాలు వుందట.”
మొదలెక్కడుందో కనుక్కోలేమన్నారు”
'అవును. అంత చిన్న విత్తనంలో అంత చెట్టు వుండటం విచిత్రంగా వుంది గదూ!”
'అవును విచిత్రమే. అరటిపువ్వులో అరటిగెల వుండటం కూడా విచిత్రమే”
'మీ ఇంటి లో ఇలాంటివన్నీ పరిశీలిస్తుంటారా?”
'ఆ పరిశీలిస్తుంటాం'”
“ఎప్పుడన్నా పరిశీలిస్తుంటాం'
“ఎప్పుడన్నా కాదు. ఎప్పుడూ పరిశీలిస్తే అప్పుడు పరిశీలనలోంచి ప్రతిదీ నేర్చుకోగలుగుతాం'
148
పిల్లలు ఎలా నేర్చుకొంటారు ?
ఒకసారి హజరత్ నిజాముద్దీన్ దగ్గరికి ఇద్దరు శిష్యులొచ్చారు. ఇద్దరికీ ఓ సందేహం పట్టుకొంది.
సూఫీ సంప్రదాయం ప్రకారం ప్రజలు రెండు రకాలు. వీళ్ళలో ఒక రకం ఎప్పుడూ ఏ తప్పు చెయ్యనివారు. ఇంకో రకం తప్పులు చేసినా సరిదిద్దుకొనేవారు. ఈ రెండు వర్గాల్లో ఎవరు గొప్పవారు ? ఇదీ శిష్యుల సందేహం,
నిజాముద్దీన్ మహా పండితుడు. సుఫీ వేదాంతి ఆ కాలంలో సుప్రసిద్ధ కళాకారుల నుండి సుల్తానుల దాకా ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే. అంతటి నిజాముద్దీన్ ఏ జవాబు చెప్పకుండా దాటవేశాడు. 'నాకు దైవ (ప్రేరణ లేకుండా మీకు సమాధానం చెప్పలేను. ఎప్పటికా డ్రురణ కల్గుతుందో చెప్పడం కష్టం. ఇంతలోపల ఒక పని చెయ్యండి మీరిద్దరూ ఒకే ఇంటిలో ఒక రాత్రి గడపండి. రేపు ఉదయం మీకు మొట్ట మొదట ఎవరు కన్పిస్తే వారినీ ప్రశ్న అడగండి అంటే సరి పెట్టాడాయన.
శిష్యులిద్దరూ ఒక చోట పండుకొని ఉదయమే లేచారు. వీధిలో వస్తుండగా ఒక సాలెవాడు కన్పించాడు. ఆయనకు చేతులెత్తి దండం పెట్టి “మహానుభావా ఎప్పుడూ తప్పు చెయ్యనివాడు గొప్పవాడా? తప్పులు చేసి సరిదిద్దుకొనేవాడు గొప్పవాడా ?” చెప్పండి అంటూ సాగిలబడ్డారు. పాపం సాలెవాడికి ఇదేమీ అర్ధంగాలేదు. “ఇంత పండితులేమిటి తన కాళ్ళ మీద పడడమేటి ?” కొంచెం తేరుకొని * అయ్యా మీరు గొప్ప స్వాముల్లా వున్నారు. నేనేమో అక్షరం రానివాడిని, నేత నేసుకొని బతికేవాడిని. ఇంతటి ప్రశ్నకు నేనేం జవాబు చెప్పగలను” అంటూ ఒక్క విషయం మాత్రం నా అనుభవం. ఎక్కడా ఒక్క పోగూ తెగని దారం కంటే అక్కడక్కడా పోగులు తెగి ముడివేసిన దారాలే గట్టిగా వుంటాయి. నేతకు బాగా పనికొస్తాయి” అని తప్పుకొన్నాడు.
శిష్యులు తెల్ల మొహం వేసుకొని మళ్ళీ నిజాముద్దీన్ దగ్గరికి వచ్చారు. “అవును అతడు చెప్పిందే సరైంది. దైవప్రేరణ వల్ల నాకూ ఇదే తెలిసింది” అన్నాడాయన.
435
సుఫీ వేదాంతం ఏమి చెపుతోందా అనేదిగాదు. మనముందున్న ప్రశ్న అసలు
మనమెలా దేన్నైనా నేర్చుకొంటాం? ఒకసారి చూడగానే ఏ వస్తువైనా, వినగానే ఏ విషయమైనా ఎంత కాలం గుర్తుంటుంది? ఎంత మనసు దానిమీద నిలబడుతుంది? అలాగాక ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఇల్లాంటి సందేహాలు 'ఇక్కొక్కటే మనలో, మునకు ' పుట్టి' వాటిని తర్కించి తెలుసుకొన్నవి ఎంత కాలం గుర్తుంటై? ్క ..
అలానే మన పిల్లలూ, రెండంకెల కూడిక చెయ్యమంటే ఒక వరుస స్థానంలో మరో అంకె వేస్తారు. *'చీమి రాయమంటే “చిమ” అనీ, “అమ్మ రాయమంటే '“అంమ' అనీ రాస్తారు.: అప్పుడు మనం బెంబేలు పడిపోతాం. ఎంతకూ నేర్చుకోని . మొద్దు, కింద జమ చేస్తాం. హైరానాపడి, పిల్లల్ని హైరానా చేస్తాం. . "ఎల = మరి అదే పిల్లలు చిన్నప్పుడు నడక. నేర్చుకొంటూ తడబడి కిందబడితే మనమేం చేస్తాం? ఆ " బుడి బుడి నడకల్ని చూసి మురిసిపోతాం. .మరి. అయ్యో నా బిడ్డకు అడుగు లెయ్యడమే రావడం లేదే” అని దిగులు పడిపొయ్యామనుకోండి. ఏమవుతుంది? కోటి అనమంటే కోతి అంటారు, మన,పిల్లలు అప్పుడు మనమేం చేస్తాం? అదే మాట మళ్ళీ మళ్ళీ పలికించి నవ్వుకొంటాం,. 'ముద్దాడుతా, “టి పలకడం రాలేదని చెంపలు వాయించామనుకోండి ఏమవుతుంది? ప్రతి తప్పుకూ. దండిస్తూ, ప్రతిదాన్నీ తప్పుపడుతూ నడకనూ, . మాటల్నీ, మనం నేర్చి వుంటే ఎప్పటికీ నడకా వచ్చేదిగాదు. మాటలూ వచ్చేవి గావు.” _ , ఎ = మరి తరగతి గదిలోనూ అంతే. తప్పు చేస్తున్నారంటే నేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం. తప్పులు చెయ్యడం నేర్చుకోవడంలో భాగం ఇంట్లో ఒప్పుకొన్న దీన్ని బడిలో మన మెందుకు అర్ధం చేసుకోం? అంగీకరించం? ఇలా అంగీకరించ నందువల్ల జరుగుతున్న నష్టం. ఎంత? అడుగడుగునా మనం పెట్టుకొనే జోక్యం వల్ల ఎందరు పిల్లలు వారిపోతున్నారు?..ఎంత చిన్న అంశాలు ఎంత సంక్లిష్టంగా వాళ్ళకి తయారవుతున్నాయి? బడి బయట ఊహించనైనా వీలులేని విషయాల్ని అమోఘంగా నేర్చుకొంటున్న పిల్లలు బడిలో అతి చిన్న అంశాల్ని సైతం పట్టుకొలేకపోవడం ఇందువల్లనే గదూ 1. __:......
150
పెలలూ -అంతరగతశకులూ! _... వెన్నెల రాత్రి కావడంతో పిల్లలంతా వీధిలో ఆటలాడ్డున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రుడిని కప్పివేసింది. వెన్నెలమాయమవడంతో పిల్లలకు బ్రేక్ పడింది. ఇంతలో 8 సంవత్సరాల బుడతడు అరుగు మీద దుప్పటి కప్పుకు కూర్చున్న తాత దగ్గరకు పరుగెత్తాడు. “తాతా! చందమామకు చలివేసిందా? నల్లటి దుప్పటి కప్పుకొన్నాడు' అని ప్రశ్నించాడు. ఏమి చెప్పాలో తెలియక తాత అయోమయంలో పడ్డాడు. . . పై సంఘటనను విశ్లేషించి చూస్తే 8 సంవత్సరాల బుడతడికి ఈ [క్రింది శక్తులున్నాయని మనం గ్రహించవచ్చు. |. పరిశీలించడం, విశ్లేషించడం,పోల్టడం,ప్రశ్నించడం . 3-4 సంవత్సరాల బుడతల మాటలు, చేష్టలు జ్ఞప్తికి తెచ్చుకోండి. విశ్లేషించి చూడండి. ఈ వయస్సులో ఉన్న ప్రతి బిడ్డకు కింది సామర్భాలున్నాయని మీరు గ్రహించవచ్చు. . * _ = పరిశీలించడం, విశ్లేషించడం, పోల్చడం, ప్రశ్నించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, ఊహించడం, సృజనాత్మకత, వర్గికరించడం, ప్రయోగంచేయడం, నిర్దారణకు రావడం, అంచనావేయడం, అన్వ్నయించుకోవడం, జతపరచడం, మ్యాపింగ్, సాధారణీకరించడం. ఈ సామర్జాలను పిల్లలు పుట్టుకతోనే పొంది వుంటారు. అందుకే వాటిని అంతర్గత శక్తులంటారు.' .
“త సంవత్సరాల పిల్లలు అనర్గళంగా మాట్లాడుతున్నారే ! ఇది ఎలా సాధ్యమైంది. తమిళనాడు బోర్దరులోని ఇలాంటి పిల్లలందరు తెలుగు, తమిళం అవలీలగా మాట్లాడుతున్నారే! ఇది ఎలా సాధ్యమైంది... ఈ, అద్భుతం ఎలా జరుగుతోంది. నగరాలలో అపార్చుమెంట్స్లో నివసిస్తున్న 'ఇదే వయసు పిల్లలు 2-8 భాషలలో మాట్లాడడం నేర్చుకొంటున్నారే ! ఈ
కేర్!
భాషలన్నింటిని ఎవరు నేర్పారు ఈ బుడతలకి ? పిల్లలందరిలో కొన్ని అంతర్గత సామర్భ్యాలున్నాయి. తమకిష్టమైన సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఈ అంతర్గత సామర్భాలనుపయోగించి పిల్లలు నేర్చుకొంటారు. బడితో సంబంధం లేకుండా పిల్లలు నేర్చుకొంటున్న అన్ని విషయాలూ ఇలా నేర్చుకొన్నవే. మన బడిలో పిల్లలకు ఎలానేర్పాలి? .
ప్రభుత్వ పాఠశాలలు మొదటితరం అభ్యాసకులతో నిండుతున్నాయి. ఈ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు (శ్రద్ధ చూపరు. పిల్లలు ఇష్టపడితే బడికి వస్తారు లేకపోతే బడి మానివేస్తారు. చదవడం, రాయడం వచ్చిన ఏ పిల్లలూ బడి మానివేయరు. మరి చదవడం రావాలంటే అక్షరాలు గుర్తించగలగాలి కదా! ఎందువల్ల ఎక్కువమంది పిల్లలు రెండు తరగతులు పూర్తి చేసినా అక్షరాలను గుర్తించలేక పోతున్నారు? అసలు అక్షరాలను గుర్తించాలంటే పిల్లలు ఏ అంతర్దత శక్తులను ఉపయోగించాలి? పరిశీలించడం, జ్ఞప్తికి తెచ్చు కోవడం, గుర్తించడం కదా! మరి ఎందుకు పిల్లలు తమ అంతర్గత శక్తులు ఉపయోగించడం లేదు? పిల్లలో లోపమా? మన బోధనలలో లోపమా? పిల్లలో లోపమైతే తమ చుట్టూ వున్న అన్ని జంతువులను, మొక్కలను, వస్తువులను ఎలా గురించ గలుగుతున్నారు? లోపం తరగతి గదిలోనే ఉంది. ఈ లోపాన్ని ఎలా సవరించాలి?
పిల్లల అంతర్గత శక్తులను రెచ్చగొట్టడం లోనే అంతా ఆధారపడి ఉంది. సహేతుకమైన సవాలు ఉన్న సన్నివేశంలో ఇది సాథ్యం?
= 8 .రామమూర్తి హైదరాబాద్
(మీకెదురైన ఇలాంటి 'పిల్లల సహజ అభ్యసన అనుభవాలు రాసి పంపండి. చర్చించుకొందాం - సంపాదకుడు) భాషాబోధన:ః4వతరగతికి.
మొదట నేను క్రియా పదాలు తీసుకొన్నాను. విద్యార్ధులకు చదవటం వచ్చు. నేను వాళ్ళకు వివరించాను - 'నేను బోర్డు మీద ఏ మాట రాస్తే ఆ పని మీరు చేయండి. నేను క్రియను రాస్తాను. మీరు క్రియను చేయండి. నేను ఎవరివైపు సంజ్ఞ చేస్తే వాళ్ళే చేయాలి.
నేను బోర్జుమీద రాశాను - లే, కూర్చో, పరుగెత్తు, నిద్రపో, చదువుకో, రాయి, ఎగురు, దుముకు ఈ క్రియలన్నీ చేస్తూ వుంటే పిల్లలకు చాలా ఆనందం కలిగింది. వాళ్ళన్నారు- “ఇంకా రాయండి” నేను అటువంటి శబ్దాలు ఆలోచిస్తూ, రాస్తూ వున్నాను. వాళ్ళు ఆ క్రియలు
152
చేస్తూ వచ్చారు. మరుసటి రోజు నేను కార్టు మీద "కొన్ని క్రియా పదాలు -లే, కూర్చో, పరుగెత్తు, పోట్లాడు, మాట్లాడు మొదలైనవి రాశాను. వాటిని అందరూ చదివారు.
మూడో రోజున ఒక అట్టపెట్టె తెచ్చాను. దాని మీద *'క్రియా పదాలు అని రాశాను. పిల్లలు పెట్టె తెరిచారు. అందులో నుంచి క్రియా పదాలు ఎత్తుకొన్నారు - పరుగెత్తు, కిందపడు, కొట్టు, నెట్టు, అడు, పాడు మొదలైన క్రియాపదాలు చదువుతూ ఆ క్రియను చేస్తూ పోయారు. తరువాత నేను *చూడండి, ఇప్పుడు మీరు కొన్ని క్రియా పదాలు రాసి తీసుకొనిరండి'- అని చెప్పాను. వాళ్ళు కొన్ని క్రియాపదాలు రాసి చూపించారు. ం.
నేను మరో ఆట ప్రారంభించాను. వాళ్ళతో చెప్పాను 'చూడండీ, నేను ఒకరికి ఏదో పని చేయమని చెపుతాను. అతను ఆ పని చేస్తాడు. మీరు అతడు ఏమి చేస్తున్నది చెప్పి నా చేతే బోర్డు మీద రాయించాలి.!
నేను జగజ్జీవన్తో 'పరుగెత్తు' అన్నా. అతడు పరుగెత్తాడు, నేను అడిగాను 'జగజీవన్ ఏం చేస్తున్నాడు;?'.. ఒకడు చెప్పాడు- పరుగెత్తుతున్నాడు”- రెండోవాడిని అడిగాను “జగజ్జీవన్ ఏం చేస్తున్నాడు? వాడు '“జగబ్జీవన్ పరుగెడుతున్నాడు” అని చెప్పాడు. తరువాత నేను కొందరు పిల్లలను “పరుగెత్తు, దుముకు, చదువు, రాయి' అని ఆదెశించాను. వాళ్ళు ఏం చేస్తున్నదీ బోర్డు మీద రాయమన్నాను. వాళ్ళు తప్పులు లేకుండా బాగానే రాశారు. కాని కొద్దిమంది అర్ధం చేసుకోలేని వాళ్లూ, రాయలేని వాళ్లూ వున్నారు. ఒకడు అక్కడక్కడ తప్పుగా కూడా రాశాడు.
నేను ఈ విధంగానే మళ్ళీ చెప్పాను - “ఇపుడు మీలో ఎవరు ఏ పని చేస్తున్నారో దానిని కూడా రాయంది.”
. ఇలా ఆటలు సాగుతూ వున్నాయి. నేను పిల్లలకు వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవడానికీ,
అవి రాసుకోవడానికీ స్వేచ్చను ఇచ్చేశాను. చాలా ఉత్సాహంతో వాళ్ళు రోజంతా ఆడుతూ ఉండేవాళ్ళు.
_ కాదేదీ పరీక్ష కనర్గం కేరళ డి.పి.ఇపి. వినూత్నప్రయోగం! ..
.... భీనమ్ పండుగ ఇక అయిదు రోజులే ఉంది. పేదా, ధనికా, ఆడా మగా సమానత్వాన్ని తన పాలనలో ప్రజలందరికీ పంచిపెట్టిన బలి చక్రవర్తి మాట నిలుపుకొని మలయాళీలని “పలకరించడానికి రాబోతున్నాడు. ఏ వూరు చూసినా ఒకే సందడి. ఏ నాలుగురోడ్ల కూడలి చూసినా ఒకే హడావుడి. అప్పటికే అయిదారు రోజుల్నించి ఎక్కడెక్కడి పూలు తెచ్చి ముంగిళ్ల ముందు పెట్టీ బలి మహారాజుకు స్వాగతాలు పల్ఫుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. కొన్ని గుండ్రంగా , కొన్ని యజ్ఞవాటికల్లా, కొన్ని నక్ష్మత్రాల్లా, కొన్ని అష్టదళ పద్మాల్లా ఎవరి నైపుణ్యం వాళ్లు ప్రదర్శిస్తున్నారు. రంగులరంగుల పూలతో రకరకాల డిజైన్లు సృష్టిస్తున్నారు. దేని అందం దానిదే. దేని ప్రత్యేకత దానిదే. గ.
..* వ = కేరళ సంస్కృతీ సౌరభాల్ని ఆస్వాదిస్తూ 'చదువు' గ్రామాలు తిరుగుతూ, పాఠశాలలు వెతుక్కొంటూ 'పెరింగమ్మలై బడిలో దూరింది. ఓనం సెలవులు దగ్గర కొచ్చిశాయి. దానికి ముందు పరీక్షలు (తైమాసిక) జరుగుతున్నాయని టీచర్లు చెప్పారు. ఏ క్లాసులోకి తొంగి చూసినా పరీక్షల ఊసే లేదు... పరీక్ష పేపర్లు లేవు, బారులుగా కూర్చున్న ముచ్చటే లేదు. మాష్టారు బెత్తం పట్టుకుని పర్యవేక్షించడం అసలే లేదు. పిల్లలు ఒకచోట కుదురుగ్గా కూర్చున్న దాఖలాలూ లేవు ! ఇవేం పరీక్షలో మరి! ౧, ఎ మూడవ తరగతి క్లాసురూంలోకి జొరబడ్డాను. పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారు. అచ్చం వాళ్ళమ్మల్లాగే పూలు పేరుస్తున్నారు. ఎక్కడెక్కడి పూలో ఏరుకొని వచ్చినట్టుంది. వాళ్ళలో వాళ్ళే తర్జనభర్జనలు పడుతున్నారు. ఒక (గ్రూపు గుండ్రంగా నాలుగైదు వలయాలుగా, ఒక్కో వలయంలో ఒక్కో రంగు పూలుండేలా పేర్చింది. మరో గ్రూపు నక్ష్మత్రంలా పేర్చి చివర్ల ఒక్కో రంగు పూలు అమర్చింది. ఇంకో [గ్రూపు చతురస్రాకారంలో పూలు అమర్చి మధ్య పూలగుత్తిని పెట్టింది. పూలను రేకులుగా విడదీసేవాళ్ళు, రంగురంగుల పూలని వేర్వేరుగా
కేర్ర్శీ
పెట్టేవాళ్ళు, 'ఇదిగాదు ఈ రంగుండాలోని వ్యాఖ్యాలు చేసేవాళ్ళు ఇలా పిల్లలు ఎవరి లోకంలో వాళ్ళున్నారు. నేనలానే చూస్తూ నిలబడ్డాను. రల ం. ల ఆ కాసు పిలల్ని మాష్టారు నాలుగు గ్రూపులుగా చేశారు. ఒక్కో (గ్రూపులో 6-7 మంది ఉన్నారు. పొద్దునే వాళ్ళు పూలు తమ ఇళ్ల నుండి, చుట్టుపక్కల చెట్ల నుండి తీసుకొచ్చారు. ముందురోజు ఎవరేం చెయ్యాలో 'ష్లాన్ చేసుకొన్నారు కూడా. . చివరికి పూలు పేర్చడం ముగిసింది. ఒక్క గ్రూపు మాత్రం ఇంకా సతమతమవుతూ ఉంది. అర్జాంతరంగా ముగించి 'మాచేత గాదు అన్నట్లు ఉండిపోయింది. మాష్టారు పిల్లలందర్నీ కలిపేసి కూచోబెట్టారు. ఒక్కొక్కర్నీ లేపి ఏ [గ్రూపుది తనకు నచ్చిందో చెప్పమన్నారు. (గ్రూపు పేర్లు బోర్డు మీద రాసి వాటికెదురుగా నిలువు గీతలు గీసి ఎవరికెన్ని మార్కులు వచ్చాయో తేల్చారు. లల లి స శ. / ఇక్కడో విచిత్రం ఉంది. నిజానికి ఏ గ్రూపువారు ఆ గగ్రూపుకి మార్కులు వేసుకోవాలి. అలా చెయ్యలేదు... పూల అమరిక చూచి మాత్రమే తమ అభిప్రాయం చెపుతున్నారు. అర్ధాంతరంగా ముగించిన [గ్రూపు వాళ్లు కూడ బాగుందనలేదన్న మాట! . "ఇంతకూ ఈ తతంగమంతా ఎందుకని మీరడగవచ్చు. ఇది తతంగం కాదు. తమాషా కాదు. ఇదో పరీక్ష అవును అక్షరాలా మూడవ తరగతి పరీక్షల్లో ఇదొకటి. ఏ సబ్దెక్టు పరీక్షో మీరే తేల్చుకోండి! . వ. ం “౯ ఎ ఇక మరో స్కూలు పరీక్షలు చూడండి. ఆ వూరు “కురుబుది. స్కూలు చూడముచ్చటగా ఉంది. అన్ని వసతులూ ఉన్న అందమైన బడి. చుట్టూ కావల్సినన్ని చెట్లు, ప్రకృతి ఒడిలో పర్ణశాలలా ఉంది,” ౨౨౨వ నాం
- *... అక్కడ రెండో తరగతిలోకి వెళ్ళాను. ఒక్క పిట్ట లేదు. మేడమ్గార్ని అడిగాను. మా పిల్లలు పరీక్షలు రాయడాని౭ళ్ళారన్నార్రావిడ.. ఎక్కడి౭ళ్ళారు? ఎక్కడికీ వెళ్ళలేదు. చెట్టుకొకరు పుట్టకొకరుగా అక్కడక్కడా ముగ్గురు నలుగురు చేరివున్నారు. వాళ్ల చేతుల్లో పుస్తకాలూ పెన్సిళ్ళూ ఉన్నాయి. దగ్గరికెళ్లి చూస్తే వాళ్ళల్లో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరి పుస్తకంలో వాళ్ళు చటుక్కున రాసి, మళ్ళీ చర్చలోకి దిగుతున్నారు. ఎవరికి వాళ్ళు గెంతుకుంటూ ముచ్చట్లాడుతున్నట్లుంది గానీ 'పరీక్ష అన్న భావనేలేదు. - - '.. -' * " "ఇంతకూ ఇదేం పరీక్ష” అని అడిగాను. టీచరు ముందురోజు ఈ పిల్లలకి ఓ పని అప్పు చెప్పారు. ముగ్గురు నలుగురు ఒక్కో గ్రూపుగా వూరంతా తిరగాలి. జంతువుల్ని చూచి గుర్తుంచుకోవాలి. వాటి ఆహారం ఏమిటో కనుక్కొని రావాలి. వాటినన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకొని (అయ్యోరామ! అంత కాపీలమయంగా ఉంది కదూ 1) ఎవరి పుస్తకంలో వారు రాయాలి. వాళ్ళిష్టం వచ్చినచోటికి వెళ్ళొచ్చు. గంట కొట్టెలోగా రాసుకొని రావాలి. రక్
ఇదో పరీక్ష! 'అందరూ రాయగలరా అని టీచర్ని అడిగాను. 'చాలామంది రాస్తారు. రాయలేని వాళ్ల చేత రాయగల్లిన వాళ్ళు రాయిస్తారు. రాయడమే గాక చెప్పమని కూడా అడుగుతాము. రాసిన దానికి రెండు రెట్లు చెపుతారు. రాయలేని వాళ్లు చెప్పడంలో చాలా ముందుంటారు కూడా. వాళ్ళకి విషయజ్ఞానం పుష్కలంగా ఉన్నట్టేగదా. అంతకంటే ఏం కావాలి? చిన్నగా రాయడం నేర్చుకొంటారు అని టీచరు చెప్పారు.
ఇదే స్కూల్లో మూడవ తరగతికి లెక్కల పరీక్ష కూడా జరుగుతోంది. పిల్లలు ముగ్గురు నలుగురు వంతున (గ్రూపులుగా విడిపోయారు. ప్రతి క్లాసుకీ వెళ్ళి ఈ [గ్రూపులు మొత్తం పిల్లల్ని ఆడమగ పిల్లల్ని లెక్కించి రాసుకోవాలి. ఆ క్లాసు టీచర్ని అడిగి పోయిన సంవత్సరం అదే క్లాసులో ఎందరు పిల్లలున్నారు, వాళ్ళలో ఆదపిల్లలెందరు, మగపిల్లలెందరో కూడా తెలుసుకోవాలి. టీచరు దగ్గర రిజిస్టరు తీసుకొని చూసైనా తెలుసుకోవచ్చు.
ఈ తతంగమంతా ఒకరోజు జరుగుతుంది. రెండోరోజు తరగతి వారీగా పిల్లల సంఖ్య, ఎందరు తగ్గిందీ, ఎందరు ఎక్కువైంది, ప్రతి గ్రూపూ తయారుచెయ్యాలి. విషయ సేకరణ (గగ్రూపువారీగా చేసినా నోట్సు రాయడం మాత్రం ఎవరికి వారు రాయాలి.
మరో స్కూల్లో 4వ తరగతి పిల్లలకి 'కార్టిలొ పరీక్ష పెట్టామన్నారు. "కార్గిల్ పరిక్షమిటి' అని మనం విస్తుపోవచ్చు. ఈ పరీక్ష కొన్ని రోజులు జరుగుతుంది. పిల్లలు కార్గిల్ యుద్దానికి సంబంధించిన వార్తా పత్రికల్లో బొమ్మల్ని కత్తిరించుకొని ఆల్బమ్స్‌గా చెయ్యాలి. ముగ్గురు నల్గురొక గ్రూపుగా చెయ్యాలి. ఇదో పరీక్ష తిరువనంతపురం జిల్లావారు యుద్ధంలో ఎవరెవరు మరణించారు, వారి పేర్తు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళకు పిల్లలుంటే వాళ్ల వివరాలు సేకరించి ఎవరి నోట్సులో వాళ్లను రాయమన్నారు. ఇదో పరీక్ష ఒక్కొక్క జవానుకు ప్రభుత్వం ఎంత సొమ్ము సహాయం చేస్తోంది. మొత్తం జవానులకు ప్రభుత్వానికెంత ఖర్చవుతుంది? అదో పరిక్ష, యుద్ధంలో వాడిన తుపాకులు, విమానాలు, తదితరాల పేర్లు సేకరించండి, కొన్ని సంఘటనల్ని (సచికేత బందీ కావడం) సేకరించడం ఇంకో పరీక్ష మొత్తం కార్గిల్ చుట్టూనే అన్ని సబ్దెక్టులు పరీక్షలూ జరుగుతున్నాయన్నమాట.
పరీక్షకు ఓనం, కార్గిల్ మాత్రమే గాదు. రబ్బరు తోట నుండి, రోడ్డు రవాణా బస్సుదాకా ఏదైనా కావాచ్చు. ఆగస్టు 15 నుండి ఆకులతో వైద్యం దాకా దేన్నైనా తీసుకోవచ్చు.
మరీ చిన్నపిల్లల్నించి పెద్దలదాకా హాజరయ్యే పరీక్ష కూడా ఒకటుంది. కథలు చెప్పడం, వాటిని నాటకంగా అభినయించి చూపడం. అది అందరికీ పనికొచ్చే కామన్ పరీక్ష. ఒక క్లాసులో టీచరు కూడ పిల్లలతో కలిసి (ఒక గ్రూపులో) ఈ పరీక్షకు హాజరవుతోంది!
156
ఇదంతా చూచాక మనకు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటిలో మొదటిది పరీక్ష వ్యక్తిగత సామర్దాన్ని కొలిచేదిగా ఉండాలి గానీ గ్రూపు స్థాయిని నిర్ణయించేదిగా
ఉంటే ఎలా? అనేది. పిల్లలు కలిసిమెలిసి ఒకరి నుండి ఒకరు నేర్చుకొన్నప్పుడు వాళ్ళని అలాగే అంచనా వెయ్యడమే అర్ధవంతం. ఇందులో వ్యక్తి వెనకబడ్డం అనేదేమీ లేదు. ఎవరి నోట్సులో వాళ్ళు రాయవల్సిందే ఐచ్చికంగా ప్రతి ఒక్కరూ పాల్గొనడంలోనే వ్యక్తిగత సామర్ధ్యమూ బయట పడుతుంది,
రెండోది మార్కులు, ప్రోగ్రెస్ రిపోర్టులు లాంటివి ఉండాలి గదా, ఇందులో మార్కులే లేవే అనే ప్రశ్న నిజమే ఇందులో మార్ములుండవు. ఉపాధ్యాయుడి అంచనా తప్ప! “అమ్మలూ! మీ బిడ్డను గురించి తెలుసుకోండి!” అనే చిన్న పుస్తకం (రికార్డు) ఒకటి ప్రతి విద్యార్థికీ ఉంటుంది. అందులో విద్యార్ధి ప్రగతిని పలురూపాల్లో అ౧చనాకట్టి తల్లులకి వివరిస్తారు. అంతేగానీ పిల్లలకి మార్కులు వేయడం, చెప్పడం అనేది ఉండదు. పరీక్ష అంచనా కోసమే అయినప్పుడు జ్ఞాపకశక్తిని కొలిచే మార్కులెందుకు?
మూడోది ఇలాంటి పరీక్షల్ని ఎవరు రూపొందిస్తారనేది. మన పరీక్షలకైతే రెడీమేడ్ ప్రశ్నపత్రాలుంటాయి. కవరు విప్పి పిలలకి పంచడం తప్ప మాప్పారికి పనేమీ ఉండదు. మనం ఇంతవరకూ చెప్పుకొన్న పరీక్షల్ని క్షస్పర్లో స్థాయిలో (సెంటు క్లాసు) ఉపాధ్యాయులే రూపొందించుకొంటారు. అయితే కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటిస్తారు. క్షస్టర్లోని ప్రతి స్కూలూ ఇదే పాటించాలని కూడా లేదు. కానీ ఏం చేస్తారో మాత్రం ముందుగా చెప్పాలి. వాటి బాగోగులు అందరూ కలిసి చర్చిస్తారు. “ఏ కృత్యం వల్ల ఏమి ఆశిస్తున్నాం, ఏ దశలో ఎలాంటిది ఇవ్వాలి” అనే అంచనా ఉంటుంది. దాని ప్రాతిపదికన ఇవి రూపొందించుకొంటారు.
నాలుగోది తల్లిదండ్రులు దీన్ని అంగీకరిస్తారా? అనే ప్రశ్న కేరళ ప్రాథమిక విద్యారంగం మొత్తం విప్లవీకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ పరీక్షా విధానమూ వచ్చింది. పాత పద్ధతులకి మంగళం పాడేసి ప్రతి అంశమూ స్థానిక ప్రమేయంతో, కృత్యరూపంలో, ఆడుతూ పాడుతూ నేర్చుకొనే విధానం ప్రవేశించింది. పాఠ్యగ్రంథాలు దీనికనుగుణంగా పూర్తిగా మారిపోయాయి. ప్రతి టీచరుకూ మొదట 5 రోజులు తర్వాత దశల వారీగా 80 రోజులు శిక్షణ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో కూడా రిసోర్సు [గ్రూపులు ఏర్పడ్డాయి. యాంత్రిక ధోరణికి కాలం చెల్లిపోతోంది. ఇక పాఠశాలల నిర్ణాణం పూర్తిగా తల్లిదండ్రుల సంఘాలకే అప్పగించేశారు. ఇందులో ఎవరి ప్రమేయానికి అవకాశం లేదు.
“ఈ నేపథ్యంలో గత రెండేళ్ళుగా వేలాది తల్లిదండ్రుల సమావేశాలు ఊరూరా జరుపుతున్నారు. ఈ మార్పులపై తల్లిదండ్రుల కోసం ఒక చిన్న పుస్తకం తెచ్చారు. ఒక్క పరీక్షలేమిటి “హోమ్‌వర్క్ పెద్ద సమస్య, ఈ పద్ధతికి తగినట్టు తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్లో
15%
చెప్పలేకపోవడం మరో సమస్య. కృత్యాధార అభ్యసనానికి తగినట్లు పిల్లలకి అమ్మానాన్నలు సహకరించడం ఇంకో సమస్య ఇవన్నీ ముందుకు వచ్చాయి. 'అసలు దీని వల్ల మన పిల్లలు ఇంగ్లీషు మీడియం పిల్లల కన్నా వెనకబడిపోతారా' అనే భయం ఉండనే ఉంటుంది. వీటిన్నిటినీ తల్లిదండ్రుల స్థాయిలో ఒప్పించి ఫలితాలు చూపించగల్లారు. . _. _,. ౨౨౨, "= ఇప్పుడొకసారి మన పరీక్షలతో వీటిని పోల్చుకొందాం. ఫరీక్షలనగానే మన పిల్లలకి ఎక్కడలేని భయం. ఏదో ఒకటి ముక్కున పెట్టుకొని ఆ గంటలో ఎలాగో ఒకలాగున తుమ్మేస్తే చాలునని నానాతంటాలు పడతారు మన పిల్లలు. ఒక జ్ఞాపక శక్తికి తప్ప, అదీ కంఠస్థం చేసి దానికి తప్ప మన పరీక్షల్లో చోటు దేనికుంది? నిజానికి విద్యార్ధి సామర్థ్యం ఎక్కడ బహిర్గతమవుతోంది? వాడి ఐచ్చిక ప్రమయం ఇందులో ఏముంది? మనసు పెట్టడం ఎక్కడుంది? అంతా యాంత్రికం. ఆ యాంత్రికమే సర్వస్వం ! మన చదువంతా పరీక్ష కోసమే. అందులో ఏదో ఒకలాగున గట్టెక్కితే చదువంతా అవపోసన పట్టిన వాడి కింద లెక్క ఈ పరీక్షా విధానం ముదిరి పాఠ్యపుస్తకాల స్టానే గైడ్గు, గైడ్ల స్థానే క్వశ్చన్ బ్యాంకులు వచ్చి కూర్చున్నాయి. ఇక సబ్జెక్టు చదివేదేముంది? మనసుకెక్కించుకోవడం ఎక్కడుంది? .
___ దీనికి భిన్నంగా లేవూ ఈ పరీక్షలు (వీటిని “పరీక్షలు” అనడం వినఢానికి కష్టంగా ఉందనుకోండి). ఇవి రోజూ పాఠాలు నేర్చుకోవడం లాంటివే. పాఠశాలలు కూడా కృత్యాలుగా, గ్రూపులుగా నేర్చుకొనే పిల్లలకి ఇవి పరీక్షలే గాదు. అంతే గాదు ప్రతిదీ తమ చుట్టూ ఉన్నదే. దాన్నే పిల్లలు పరిశీలిస్తారు. వాటి నుందే విషయం సేకరణ చేస్తారు. దాన్నే ఒక పద్దతిలో రాయడం ద్వారా గానీ, చెప్పడం ద్వారాగానీ వ్యక్తీకరిస్తారు. తమకు అతీతంమైంది తమ శక్తికి మించింది. పిల్లలకి ఏమీ కన్పించదు,. ఇలా అన్పించాక వాళ్ళలోని అసాధారణ సృజనాత్మకత వెల్లువలా ముందుకొస్తుంది. ఈ సృజనాత్మకతని పెంచడం, దాన్ని అంచనా వెయ్యడం కదూ చదువంటే, పరీక్షలంటే. "౩౨ హన
. , - అవును కేరళలో అక్షరాల ఈ చదువే సాగుతోందిప్పుడు. పరీక్షల జోలికి పోవడమంటే చిన్న సంగతి కాదు. దానికే సమూల సంస్కరణ మొదలెట్టడమంటే సాహసమే. ఈ సాహసానికి కేరళ డిపిఇపి ఫూనుకొంది. రెండేళ్ళ నిరంతర ప్రయత్న ఫలంగా ప్రాథమిక విద్యలో ఈ (ప్రజా స్వామిక విప్లవం క్రమంగా దృఢంగా వేళ్ళూనుకొంటోంది.... .. ౨.౨.౨...
- "దీన్ని కళ్ళారా చూడ్డం “చదువుకు కొత్త అనుభవం... ( . " య . కేర్రి
౨౨ ౨ఎబట్టిపట్టడమే. ..”. __ అరినరాల విజ్ఞాన అభ్యసనమా? -+* ..... పిల్లల్లో పరిసరాల విజ్ఞాన సంబంధిత అంశాల అభ్యసనం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు 'అవును*,' 'కాదు'ల్లో ఏదైనా కావచ్చు. కానీ మన విద్యార్థులకు పరిసరాల విజ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నామో మనందరికి తెలిసిందే. మరి పిల్లలు పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలను చదివిందే మళ్లీ ఛదువుతూ జ్ఞాపకం (బట్టీ) పట్టాల్సిన అవసరంముందనే కదా మనకు అనిపిస్తోంది. అయితే వారికి పరిసరాల గురించి ఏమీ తెలియదా? వారీ పరిసరాల్లో నివసించడం లేదని అనుకుందామా? రోజూ తమ పరిసరాల్లో జరుగుతున్న విషయాలను గమనించడం లేదనుకొందామా? ఇవన్నీ మనం “జ్ఞాపకం” చేయించడం ద్వారానే తెలుస్తుంది కద! ౨౨౫౨౧” | మూడో తరగతిలో “మనకు నోరు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్న వుంది. “నోరు మనకు మాట్లాడడానికి, ఆహారాన్ని తినడానికి ఉపయోగపడుతుంది” అని జవాబు రాయిస్తున్నాం. పిల్లల చే'బట్టీ * పట్టిస్తున్నాం. పరీక్షల్లో అక్షరం పొల్లుబోకుందడా రాస్తేనే మార్ములిస్తున్నాం. ఇదంతా సరైందేనంటారా? పిల్లలకు ఈ ప్రశ్నకు సమాధానం మొదలే తెలియదను కొందామా! వారిని స్వేచ్చగా మాట్లాడిస్తే, లేదా రాయమంటే చెప్పలేరా? రాయలేరా? తప్పకుండా, ఎందుకంటే విద్యార్థులకు నోరు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనుభవం ద్వారా పరిసరాల్లోనే నేర్చుకున్నారు. ఇంకా మనం చెప్పేది ఏముంది. ఇదే ప్రశ్నకు పిల్లలు మరొక విధంగా కూడా సమాధానం చెప్పవచ్చు. వస్తువులను పట్టుకోవడానికి నోరు ఉపయోగ పడుతుందని చెప్పవచ్చు. అలాగే వారి అనుభవం లోకి గనుక వస్తే నోరు ఇతరులను కొరకడానికి కూడా పనికొస్తుందనవచ్చు కదా! వీటిని కాదందామా? "౫౫౫ " * “చ్చేత్రులతో చేసే పనులను తెలపండి? * అనే ప్రశ్నకు “చేతులతో మనం వస్తువులను పట్టుకుంటాం, ఆహారం తింటాం” అని రాయించాలా? ఇవేమి వారికి తెలియవా? వాళ్ళ అనుభవంలోని చేతులతో చేసే ఇతర పనులేవీ కూడా పనులు కావని అనుకోవాలా? చేతులతో 1539
పిల్లలు ఆటలాడుతారు, పాలు, నీళ్ళు తాగుతారు. ఇవేవీ పనులు కావనే కదా మన దృష్టిలో. అయితే పసిపిల్లలను అయోమయానికి గురి చేయడమే మన చదువుల ఉద్దెశ్యమా!
ఇలా చెప్పుకొంటూ వెళ్తే పరిసరాల విజ్ఞానంలోని మన శరీరం, మనం పీల్చేగాలి, తాగేనీరు, తినే ఆహారం, ధరించే దుస్తులు నివసించే ఇండ్లు లాంటి అంశాలన్నిటి గురించి విద్యార్థులకు ముందే తెలుసు. అయితే ఇట్లి పూర్వ జ్ఞానం సరియైంది కావచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పు కూడా కావచ్చు. పిల్లలు కలిగియున్న సరియైన అభిప్రాయాన్ని బలపరిచేదిగా బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలి. తప్పుడు అభివ్రాయం కలిగి ఉంటే దానిని సవరించాలి. ఈ విధంగా పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన భావనలను విద్యార్థుల్లో పెంపొందించడానికి “బట్టీ” పట్టించకపోతే ఏం చేయాలన్నది కూడా ఒక ప్రశ్నే. దీనికై పిల్లలచే వివిధ విషయాలను పరిశీలింపజేయాలి. పరిశీలించిన విషయాన్ని అందరికీ చెప్పడాన్ని ప్రోత్సాహించాలి. విద్యార్థులకు వివిధ అంశాలపై చర్చించునట్టు చేయాలి. ఇట్టి చర్చల్లో ఒకరికి ఏదైనా అంశంపై గల భావనను ఇతరులు గగ్రహించునట్లు చేయాలి. విద్యార్యల్లో ప్రశ్నించే అలవాటును పెంపొందించాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అని తనకుతాను ప్రశ్నించుకోవడంతో పాటు, అవసరమైతే ఇతరులను ్రశ్నించడాన్ని అలవాటు చేయాలి. ప్రతి విద్యార్ధి తనకు తెలిసిన విషయాలను ఇతరుల ముందు స్వేచ్చగా ్రతిపాదించునట్లు చూడాలి. అవసరమైతే చిన్న చిన్న ప్రయోగాలు చేయడానికి, తమ భావనలు సరియైనవో పరీక్షించుకోవడానికి అవకాశం కల్గించాలి. ఉపాధ్యాయునిగా మనమే ప్రతిభావనను వివరిస్తూ పోయేకంటే విద్యార్ధి సయంగా తెలుసుకునేట్లు చేయడమే ఉత్తమం. ఒక సందర్భంలో కలిగిన అనుభవాన్ని మరొక సందర్భంలో వినియోగించునట్లు, సాధారణీకరించునట్లు చేయడం ద్వారా పరిసరాల విజ్ఞాన అభ్యసనం జరిగే అవకాశముంది.
ఈ సందర్భంగా ఒక తొమ్మిదేళ్ల పాప అనుభవాన్ని చూద్దాం. ఒక 9 సంవత్సరాల బాలిక తన చిరిగిన పుస్తకాన్ని బఐంక(గమ్) తో అతికించాలనుకొంది. కానీ బంక గడ్డ కళ్టీంది. బంక ఎలా కరుగుతుందని నన్ను అడిగింది. బాలికనే ఆలోచించి చెప్పమన్నాను. ఎండలో ఉంచితే కరుగుతుందని చెప్పింది. అలాగే చేయమన్నాను. కానీ బంకను ఎండలో ఉంచితే కరుగుతుందా? ఎంతకీ కరగలేదు. వేడి చేసింది. అయినా కరగలేదు. బాలిక విసుగు చెందినట్లు కనబడ్డది. ఇంకా బాలిక సహనానికి పరీక్ష పెట్టకుండా నీళ్ళు పోసి చూడమన్నాను.
కొద్దిసేపటికి బంక కరిగింది. ఇలా ఆమె బంక కరిగే విధానం తెలుసుకొంది.
ఇక్కడ బాలిక మొదట్లో ఘనీభవించిన అన్ని వస్తువులను వేడిచేయడం ద్వారా
ద్రవీభవనం చెందించవచ్చనుకొంది. ఉదా : నెయ్యి, మంచుముక్కలు మొదలగు మాదిరిగా,
కాని వివిధ పరీక్షలు చేసి పరిశీలించి తన అభిప్రాయాన్ని మార్చుకొంది. ఇలాంటి అభ్యసనం 160
శాశ్వతంగా ఉందే అవకాశముంది. “బట్టీ! పట్టించాల్సిన అవసరంలేదు. అలాగే మా పాఠశాల గల గ్రామంలోని నది, బావి, బోరునీళ్ళలో కఠిన జలమేది? అని ప్రశ్నిస్తే విభిన్న సమాధానాలు వచ్చాయి. నీరు సబ్బుతో నురగనిచ్చే విధానాన్ని బట్టి కఠిన జలాన్ని గుర్తించమనడం జరిగింది. దీనికై ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. రాశా నా బావినీు బోరునీరు ఇలా విద్యార్థులు పట్టిక పూరించి కఠిన జలమేదో తెలుసుకున్నారు. ఇలాంటి అభ్యసనాన్ని వ్రోత్సాహించడం ద్వారా పరిసరాల విజ్ఞాన అధ్యయనం, అభ్యసనం, సులభతరం, శాశ్వతమయ్యే అవకాశముంది. ఇలా చేయడం ద్వారా “బట్టి పట్టించే అవసరం లేదు మరి. కే6కే
మన చదువులు - మన ఆలోచనలు
దయ్యాల్ని భూతాల్ని గురించి మనం కథలు చెప్పుకొంటుంటాం. అవి న్డలా మనుషుల్ని పట్టి వెంటాడుతుంటాయనీ, ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంటాయనీ, ఒకసారి అవి పట్టుకొంటే అంత సులభంగా వదిలిపెట్టవనీ కూడా వింటుంటాం. ఆధునిక యుగంలో దయ్యాల్ని నమ్మడం తెలివితక్కువే గానీ దయ్యాల్లాంటి ఆలోచనల్నీీ ధోరణుల్ని దృకృథాల్ని మాత్రం తక్కువగా అంచనా వెయ్యకూడదు. ఇవి మన నడకను నియంత్రిస్తాయి. మన రోజువారీ అన్ని కార్యక్రమాల్ని వికృతం చేస్తాయి. తెలియకుండానే మనల్ని వెన్నాడి వేధిస్తుంటాయి. విద్యారంగమూ దీనికి మినహాయింపు కాదు.
విద్య చుట్టూ అందులో కీలకపాత్ర ధారులైన టీచర్ల చుట్టూ, పిల్లల చుట్టూ ఎలాంటి ఆలోచనలు ముసురుకొని వున్నాయో కొంచెం పరిశీలిద్దాం. టీచర్ల పట్ల సమాజానికేమి దృక్పథం వుంది? పిల్లల పట్ల టీచర్ల దృక్పథం ఎమిటి? అనేవి ఇక్కడ మనం చర్చించుకొందాం. పిల్లలన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులూ రంగంలోకి రాకతప్పదు. వాళ్ళ గురించి మన దృక్పథమేమిటి అనేదే కొంచెం చర్చించుకొందాం.
టీచరంటే సకల విద్యా సంపన్నుడని మన అభిప్రాయం. సర్వసద్దుణ సంపన్సుడై వుండాలనీ మన అభిమతం. టీచరు చేతిలో ఓ మంత్రదండం వుంటుందనీ అతగాడు తన విద్యార్థలందర్నీ అఖండ ప్రజ్ఞాదురంధల్నిగా మార్చెయ్యగలడనీ కూడా మన విశ్వాసం. అలాగే విద్యార్ధి అంటే పరిశుభ్రమైన పలక లాంటి బు(ర్రగలవాడనీ, బడిలోనే ఆ బుర్రలోకి ఆలోచనలు, అక్షరాలు ఎక్కుతాయనీ, అప్పటి దాకా వాడు నిర్గుణ నిరాకార బ్రహ్మ స్వరూపుడసీ మనం నమ్ముతాం. ప్రతిదీ అనుకరణతో, అభ్యాసంతో మాత్రమే వాడు నేర్చుకొంటాడనీ మన ట్రైనింగుల్లో కూడా చెపుతుంటారు.
162
ఈ దృక్పథాలు వాస్తవాలా? టీచర్లు కూడా మానవమాత్రులే కదా! పిల్లలు బడికి వచ్చెప్పటికి ఎన్నో నేర్చుకొని ఎంతో జ్ఞానంతో రావడం లేదా? ఎన్నిసార్లు చెప్పుకొన్నా ఎంత మొత్తుకొన్నా వీటిని మనం వొప్పుకోం. వొప్పుకోలేం.
ఈ దృక్పథాలు మన విద్యారంగాన్నీ ముఖ్యంగా మన తరగతిని శాసిస్తాయి. అయితే సమస్యల్లా ఏమంటే ఏటిని విశ్లేషించడం కష్టం. వీటి మూలాలు పట్టుకోవడం కష్టం. మనిషి ప్రవర్తనను పరిశీలించడం కష్టం కాదు గానీ దృక్పథాల్ని పసికట్టడం మహాకష్టం. ప్రవర్తనను బట్టి దృక్పథాన్ని విశ్లేషించ బూనుకొందామంటే చాలా సందర్భాల్లో మనం తప్పుడు నిర్ణయాలకు రావల్సి వస్తుంది. ఎందుకంటే దృక్పథాలు మస్తిష్టపు పొరల్లో ఎక్కడో నక్కి వుంటాయి. అవి మాటల్లొ బయటపడవు. మన సామాజిక రాజకీయ జీవితం మీద ఈ దృక్చథాల ప్రభావం ఎంత అనేది కూదా అంత సులభంగా చెప్పలేం.
అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. సామాజిక, భౌతిక పరిస్థితులే మన దృక్చథాల్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ వున్న సామాజిక వాస్తవాలకవి ఛాయారూపాలు. ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు. పేదల పట్ట, వాళ్ళ ప్రవర్తనల పట్ల కొన్ని భావాలు కలిగి ఉంటారు. ఈ భావాలు న్యాయమైనవేనా? వాస్తవమైనవేనా అని వాళ్ళు ఆలోచించరు. తమకు తెలీకుండానే ఈ భావాలు వాళ్ళని ఆవహిస్తాయి. ఆవహించడం దయ్యాల చేష్ట అని మనకు తెలుసు.
ఒక మురికి పేదపిల్ల ఒక ధనికుడికి కన్పించిందనుకోండి. అతనిలో ఒక భావం ముద్రపడిపోతుంది. అతనికి తెలికుందానే (గతానుగతికంగా) ఈ ముద్ర పడిపోతుంది. " పేదపిల్లలు మురికివాళ్ళు, మందమతులు, మంచి నడక ఎరగని వాళ్ళు అనేది ఈ ముద్ర. ఈ ముద్ర ఒక టీచరు మెదళ్ళో పడిందనుకోండి అప్పుడు క్లాస్‌రూంలో ఏం జరుగుతుంది? పాఠం మొదలెట్టక ముందే * తక్కువ కులం వాళ్ళకి చదువు చెప్పడం దండగ, ఎంత చెప్పినా వారింతే' అనే భూతం టీచర్ని ఆవహించేస్తుంది.
ఒక అభిప్రాయం ఏర్పడ్డాక అదోక విశ్వాసంగా మారుతుంది. దానిచుట్టూ ఒక ఆవేశం అల్లుకొంటుంది. దీనికి తగ్గట్టు మన కార్యాచరణలో మార్పు వస్తుంది. ఈ అభి'ప్రాయాలకి హేతుబద్ధత ఏమీ ఉండదు. హేతువులోకి తొంగిచూసే ప్రయత్నం కూడా మనం చెయ్యం. అంతా మూసపోసినట్టు గతానుగతికంగా, “సహజంగా” జరిగిపోతుంది. ఒక ఊబిలో మనం ఇరుక్కువోతాం.
దీన్నించి ఎలా బయటపడ్డమంటారా? ప్రయత్న పూర్వకంగా మాత్రమే దీన్నించి బయట పడగలం. నీలో తళుక్కున మెరిసిన ఆలోచనల్ని అభిప్రాయాల్ని నువ్వు ప్రశ్నించాలి. ' పిల్లలు శుద్ద బుద్దావతారాల్లా, ఒట్టి అజ్ఞానులుగా బడికి వస్తారన్నది నిజమా? ఆడపిల్లలు
163
మగపిల్లల కంటే గణితంలో వెనుకబడి ఉంటారన్నది వాస్తవమా?” అని నీ భావముద్రల్ని నువ్వు ప్రశ్నించాలి. అప్పుడు లేనిపోని ఆవేశాల్లోొకి నువ్వు వెళ్ళవు. దానికనుగుణంగా ప్రవర్తనలో మార్పు ప్రారంభమవు తుంది. స్వేచ్చ, సమానత్వం, న్యాయం అనే వాటిని నువ్వు నమ్ముతున్నట్టయితే ఈ విలువల్ని మొగ్గలోనే తుంచేసే భూతాలు నీ మెదళ్ళోకి దూరుతున్నాయని నువ్వు పసిగట్టాల్సి ఉంటుంది. వీటిని వెనక్కు నెట్టాల్సి ఉంటుంది. ఈ దయ్యాలు ఎంత తీవ్రంగా నీ మెదడును ఆవహిస్తే ఎదుటివాడు చెప్పేది ఏ మాత్రం వినలేనంతగా ఇనుపగోడల మధ్య నువ్వు అంతగా ఇరుక్కున్నావని గుర్తించాలి. సమాజానికి టీచర్ల పట్ల ఉన్న దృక్పథం చాలా విచిత్రమైంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా పరస్పర విరుద్ధంగా ఇది ఉంటుంది. మరోవైపు స్కూలు భౌతిక పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. టీచర్ల పని విధానాన్ని ప్రశ్నించేటపుడు వీటిని కొంచెం మనం గమనించాలి. సాంప్రదాయకంగా చూస్తే మన సమాజంలో టీచరంటే దేవుడి తర్వాత దేవుడంతటివాడు. నిస్వార్ధ, నిరాడంబర ఆదర్శ్భజీవి. జ్ఞాన ప్రసారం తప్ప అతనికి మరో వ్యాపకం ఉందదు. ఇది వాస్తవమా? టీచరు కూడా మానవమాత్రుడే కదా! సగటు మానవుడి అవసరాలు, ఆశలు, కోరికలు, కష్టాలు టీచరుకూ ఉంటాయి గదా! కనీస సౌకర్యాల్లేకుంటే ఏ టీచరైనా ఎం చేస్తార్డు? ఈ సాంప్రదాయక దృక్పథంలో ఇవేవీ చర్చకు రావు. సమాజానికి టీచరు పట్ల ఉన్న మరో దృక్పథం ఏమంటే “ అతగాడు ఒట్టి సోమరి. అతని వల్ల సమాజానికి ఒరిగేదేమీ లేదు. సెలవులు అనుభవించడంలో అతనికతడే సాటి. కావల్సినంత జీతం. కాసింత పనికూడా లేకపోవడం సగటు టీచరు లక్షణం” అనెది. మొదటి అభిప్రాయానికి విరుద్ధమైంది. ఇందులో వాస్తవం ఎంత? మన స్మూళ్ళు ఎలా వున్నాయి? అక్కడి వసతుల మాటేమిటి? బ్లాక్ బోర్డుకైనా గతి ఉందా? సగటు స్కూలు వాతావరణమేమిటి? అక్కడ ఏ కొత్త ఆలోచనలకైనా అవకాశం ఉందా? స్వేచ్చ ఉందా? అసలు టీచరుకు తీరికైనా ఉందా? అతని మానాన అఆన్ని పనిచెయ్యనిస్తారా? సవాలక్ష సర్వేల మాటేమిటి? ఉన్నట్టుండి ఊడగొట్టి శంకరగిరి మాన్యాలకు తరలించరని భరోసా వుందా? వీటన్నిటితో నిమిత్తం లేకుండా టిచరు పరమాదర్శమూర్తిగా పని చెయ్యాలని మనం కోరుకొంటాం. అందరు పిల్లలు బడికొచ్చేలా టీచరు చూడాలి. నిబంధనల్ని నియమిత సూత్రాల్ని తు.చ తప్పకుండా అతడు బోధించాలి. సిలబసు పూర్తి చెయ్యాలి. భిన్న సంస్కృతుల నుండి, 164
వాతావరణాల నుండి, ఆర్థిక స్థితిగతుల నుండి వచ్చిన పిల్లలందర్నీ ఒకేస్థాయికి అతడు చిరునవ్వులు చిందిస్తూ మెలగాలి. సింగిల్ టీచర్ కూడా ఇవన్నీ నిఖార్సుగా చెయ్యాలి. అయిదు క్లాసులూ బోధిస్తూ ఇవన్నీ నెరవేర్చాలి.
దిగంతర్ ప్రయోక్త రోహిత్ దినకర్ మాటల్లో చెప్పాలంటే * టీచర్లు ఈ వైరుధ్యంలో నలిగిపోతున్నారు. క్రియాశీలతను కోల్పోతున్నారు. సృజనాత్మకతకు దూరమవుతున్నారు. ఈ సంక్షిష్ట పరిస్థితుల్లో అతడెలా నెట్టుకొని రావాలో అతడికే శిక్షణలోనూ చెప్పలేదు. అతన్ని వెన్నుదట్టి నిలబెట్టేవారూ లేరు. ఈ వైరుధ్యం నుంచి టీచరు కూడా కొన్ని వికారాల్ని సంతరించుకొంటున్నాడు. తనకు తాను సర్వజ్ఞుడిననే భ్రమల్లోకి జారిపోతున్నాడు. కర్ర పట్టుకొని క్రమశిక్షణను నేర్చడంగా తన విధిని తాను నిర్వచించుకొంటున్నాడు. అతని మెదళ్ళోకి దయ్యాలు జొరబడుతున్నాయి. ఆ దయ్యాలు -
ఓ ఈ పిల్లలంతా అజ్ఞానులు.
ఓ నాకు సర్వం తెలుసు.
ఓ నేను జ్ఞానాన్ని అందించేవాడిని. పిల్లలు పుచ్చుకొనేవాళ్ళు.
ఓ అభ్యసనం సాగాలంటే ముందు క్లాసు రూం కంట్రోల్లో వుండాలి.
ఓ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తే నెత్తికెక్కి చెడిపోతారు.
ఓ విధేయత, పరిశుభ్రత అనేవి అభ్యసనానికి అత్యవసరాలు.
అనే దృక్పథం రూపంలో వ్యక్తమవుతుంటాయి.”
పిల్లలు శూన్యమతులనుకొన్నాక టిచరు ఆ శూన్యాన్ని భర్తీ చేసే కళాకోవిదుడిగా మారతాడు. ముక్కలు ముక్కలుగా జ్ఞానాన్ని ఎక్కించడంగా బోధన మారుతుంది. జ్ఞాన సంపాదన ఒక నిరంతర క్రియాశీల ప్రక్రియగా అతనికే మాత్రం అనిపించదు. అది సకపక్షంగా వుండదని ఉమ్మడి క్రియగా ఉంటుందని అతడు మరిచిపోతాడు. * నేను ముప్పై ఏళ్ళ నుంచి ఒకే క్లాసుకు, ఒకే పాఠ్యాంశం బోధిస్తున్నా ఒక్కలమ:: అటూ ఇటూ వెయ్యకుండా పద్ధతిగా లాక్కొస్తున్నా” అని గొప్పలు చెప్పుకొనే టీచన్లు కూడా ఉన్నారు. వారెంత యంత్రాలుగా మారిపొయ్యారో వాళ్ళు మరిచిపోతున్నారు.
ఆధునిక బోధనారీతుల్ని మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనల్ని, ప్రయోగాల్ని టీచర్లకు మనం ఎప్పుడందించాం కనుక? అసలు అధికార్లకు, యజమానులకు వీటిని గురించి ఏ మాత్రం తెలుసు గనుక?
165
పిల్లల పట్ల మన అవగాహన, మన ప్రవర్తన, మన స్పందన, మన సంబంధాలు అనేవి అభ్యసన సూత్రాల్లో కీలకాతి కీలకాలు. దీన్ని గుర్తించకపోవడం మన విద్యారంగంలోని మేధో దారిద్ర్యం. అభ్యసన క్రమాన్ని జ్ఞానసముపార్జ్దనా స్వభావాన్ని మనం ఎంత బాగా అవగాహన చేసుకుంటే అంత తొందరగా మనల్ని ఈ పై దయ్యాలు వదిలిపెట్టి పారిపోతాయి. లేనంతకాలం తిష్ట వేసుకొని ఉంటాయి.
టీచర్లతో సహా మనం పిల్లల్లో కొందరు అఖండ ప్రజ్ఞావంతులని, కొందరు మందమతులని నమ్ముతాం. పిల్లలందరికీ ఒక సామాన్య ప్రజ్ఞ ఉంటుందని మనం ఒప్పుకోం. ఒక్కో బిడ్డకు ఒక్కో అంశంలో ప్రతిభ ఉంటుందని కూడా మనం ఒప్పుకోం పిల్లల సృజనాత్మక ప్రవర్తనతో నిమిత్తం లేకుండా, అందులోని వైవిధ్యంతో నిమిత్తం లేకుండా, మనం అందర్నీ ఒకే కొలబద్దతో కొలత వేస్తాం.
ప్రతి బిడ్డా ఐన్‌స్టీన్ కావాలేమిటి? ప్రతివాడూ టెండూల్కర్ కావాలేమిటి? అసలు ఐన్‌స్టీన్ మాత్రం ఓ పన్నెందేళ్ళ గ్రామీణ పిల్లలా చపాతీలు చెయ్యగలదని మనం చెప్పగలమా? సరైన వాతావరణం, అవకాశం, ప్రోత్సాహం ఇస్తే పిల్లలందరూ సమానంగానే నేర్చుకొంటారు. కాకుంటే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో నెర్చుకొంటారు. నాలుగేళ్ళ లోపునే ప్రతిబిడ్డా అత్యంత సంక్షిష్ట నిర్మాణంగల భాషను అత్యంత ధారాళంగా నేర్చుకోడం లేదేమిటి? -
టీచర్లు ఈ అంశాల్ని తమలో తాము చర్చించుకోవాలి. చదవాలి. వాటిపై తమ అనుభవాల్ని రాయాలి. ఇలాంటి చర్చ జరిగినపుడు చాలా విషయాలు ముందుకొస్తాయి. మనకు స్పష్టత ఏర్పడుతుంది. * ఎకలవ్వ ఇలాంటి ప్రయత్నం చేసినపుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
మన టీచర్ల శిక్షణలో ఈ చర్చ ఎంత ఎక్కువుంటే అంత మంచిది. ఈ చర్చల్లో పాల్గొన్న టీచర్లు పిల్లల్ని ప్రేమించడం, గౌరవించడంలో గొప్పతనాన్ని అభ్యసన ప్రక్రియలో దాని ప్రభావాన్ని ఎంతో బాగా గుర్తించినట్టు, దీన్ని తను తరగతి గదిలో అమలు చెసి, పిల్లలు నేర్చుకోవడంలో అందుకొన్న వేగాన్ని చూచి ఆశ్చర్యం ప్రకటించినట్లు ఏకలవ్య అనుభవం చెపుతుంది.
ఒకసారి టీచర్లు తమ ఆలోచనల్లోని లోపాల్ని వైరుధ్యాల్ని పిల్లల పట్ల తమ వివక్షల్ని గుర్తించడం ప్రారంభించినట్లయితే వాటి నుంచి బయటపడ్డానికి కృషి ప్రారంభిస్తారు. ఈ చర్చలు మొదట కొద్దిమంది టీచర్ల మధ్య జరగాలి. క్రమక్రమంగా ఇది విస్తరించాలి. పిల్లలకీ టీచర్లకీ మధ్య ఉండాల్సిన సంబంధాలపై జరిగే ఈ చర్చలు నిరంతరం జరుగుతుండాలి. పలు ముఖాలుగా జరుగుతుండాలి,
166
విద్యావేత్తలు, ప్రయోక్తల రచనల్ని మన టీచర్లు చదవాలి. వాటిలోని ఏదో ఒక అధ్యాయాన్ని సమిష్టిగా చిన్న టీచర్ల గ్రూపు అనువాదం చేసిందనుకోండి. ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మన టైనింగుల్లో ఇలాంటి పని ఎప్పుడూ ఉండాలి.
ఇలాంటి ప్రయత్నాల వల్ల మాత్రమే మనం మన మెదళ్ళను ఆవహించిన దయ్యాల్ని వదిలించుకోగలం.
దురదృష్టవశాత్తు మనది ఎగుడు దిగుడు సమాజం. నిచ్చెనమెట్ల సమాజం. పిల్లల పట్ల, టీచర్ల పట్ల మన అభిప్రాయాలన్నీ ఈ సమాజ గర్భంలోంచి పుట్టుకొచ్చినవే. ఇలాంటి సమాజంలో పేరుకు * అందరికీ సమాన విద్య” అని చెప్పుకొన్నా ఆచరణలో ఉన్నత వరాలకు మాత్రమే ఉత్తమ విద్య లభిస్తుంది. నిమ్న కుల బాలికలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు మంచి విద్యను గురించి మనం ఆలోచించలెం.
మన అభిప్రాయాలు ఈ సామాజిక పరిస్థితి కనుగుణంగా ఉంటాయి. “వీళ్ళు మొద్దులు, వీళ్ళ తల్లిదండ్రులు మూర్చులు. వీళ్ళకి చదువెందుకు? రెండు మూడెళ్ళు బడికొస్తారు. ఏదో ఒక పని చేర్చుకోవడం కోసం ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. వీళ్ళకి చదువు విలువ ఎలా తెలుస్తుంది? వీళ్ళ భాష పరమ అనాగరికంగా ఉంటుంది. వీళ్ళ సంస్కృతీ అంతే. సైన్సుని అర్ధం చేసుకోవడం ఈ అడవి జాతి పిల్లలకి సాధ్యమయ్యే పనికాదు.” ఇలాంటి వ్యాఖ్యలు మనం చేస్తుంటాం. తప్పంతా వీళ్ళ సామాజిక నేపధ్యం మీదా, తల్లిదండ్రుల మీదా నెట్టుతుంటాం. ఎవరు దగాపడ్డారో వాళ్ళనే నేరస్తులుగా లెక్కిస్తుంటాం.
బాలికలది మరీ ఘోరం. మనకు తెలియకుండానే వాళ్ళని క్లాసులో వేరుగా చూస్తాం.
. వేరుగా కూచోబెడతాం. పాఠం చెప్పెేటపుడు, (ప్రశ్నలడిగేటపుడు, రాయించేపుడు,
ప్రోత్సహించేటపుడు మన దృష్టి అంతా మగపిల్లల మీద ఉంటుంది. ఆడపిల్లలు తల్లులుగా బీడ్డలకు, అక్కలుగా తమ్ముళ్ళకు, కూతుళ్ళుగా కుటుంబాలకు, భార్యలు భర్తలకు సేవచేసే వారుగానే మనకు కన్పిస్తారు. అలాంటి ముచ్చట్లే వాళ్ళతో చేన్తాం. మన పాఠ్యగ్రంథాలూ అలానే ఉంటాయి. ఆడపిల్లలకు బళ్ళో కూడా అలాంటి పనులే పెడతాం. మొత్తం మీద 'పని' ఆడవాళ్ళది 'తెలివిి మగవాళ్ళది అన్న భావం వాళ్ళకి బడిలోనే స్థిరపడిపోతుంది.
ఇంకొక్క మాట కూడా మనం చెప్పుకోవాలి. హేతురహితమైన అశాస్రీయ భావాలు ఎప్పుడూ ఆవేశాల్ని సెంటిమెంట్లని పట్టుకొని బతుకుతుంటాయి. హేతువుతో టిని ఎదుర్శొనదానికి పూనుకొంటే ఘర్షణలు పుట్టుకొస్తాయి. విద్యారంగం చుట్టూ వున్న భావాల సంగతీ ఇంతే! ఒక నిర్ధిష్ట సమాజం తన ఉనికి కోసం ఇలాంటి భావజాలాన్ని పొషిస్తుంది. వాటి నీడన తాను బతకాలను కొంటుంది.
167
అయినా మన కృషి మనం చెయ్యాలి. అలాంటి కృషి జరిగిన చోట టీచర్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పులొచ్చాయో మనం చూశాం. ఇలాంటి మార్పు మన మొత్తం విద్యారంగం పట్ల మొత్తం సమాజంలో రావాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య పట్ల మన సమాజ దృక్పథంలో తీవ్రమైన మార్పు వచ్చేందుకు ఒక నిరంతర ప్రయత్నం మన నుంచి సాగాలి.
ఈ ప్రయత్నం టీచర్ల పట్ల సానుకూల హేతుబద్ధ దృక్పథాన్ని సమాజానికందిస్తుంది. టీచర్లకు పిల్లల పట్ల, వారి సామాజిక నేపథ్యంపట్ల సానుభూతిని, స్నేహాన్ని కలిగిస్తుంది. కొంచెం కాలం పట్టవచ్చు. దార్లో కొన్ని కష్టాలూ ఎదురు కావచ్చు. కానీ ప్రయత్నం మాత్రం మనం తక్షణం ప్రారంభించాలి. దీన్ని చివరి దాకా కొనసాగించాలి. విద్యను గురించి, సామాజిక
. పరివర్తనలో దాని పాత్రను గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి కర్తవ్యం ఇది. ప్రొ॥ రమాకాంత అగ్నిహోత్రి (విద్యారంగంతో దీర్హకాలంగా అనుబంధ బాంధవ్యాలు గల రోహిత్ దినకర్ - దిగంతర్, హెచ్.కె. దేవాన్ - విద్యాభవన్, అంజలి నొరోహ్నా- ఏకలవ్వ. మినాతి పండా - ఎన్‌సిఇఆర్‌టి, మహేంద్ర మిశ్రా - డిపిఇపి, దీపాదాస్ - ఇడి. సి.ఐ.ఎల్.ల పరిశీలన ఆధారంగా రచయిత ఈ వ్యాసాన్ని రచించారు.) 168
స్కూలు అసెంబ్లీని ప్రతిభావంతంగా నిర్వహించుకోవడం ఎలా? 3.10.2002వ తేదీ, గురువారం నుంచి ప్రభుత్వపు స్కూళ్ళన్నిటిలోను అసెంబ్లీల్ని డిఫరెంటుగా నిర్వహించాలని ప్రభుత్వం, ఎన్.సి.ఇ ఆర్.టి., ఎస్.సి.ఇ. ఆర్.టి. నిర్ణయించినట్లు పత్రికల్లో ప్రకటన వెలువడింది.
ఇంతకాలం మన స్కూలు అసెంల్లీ నిర్వహణ ఏదో మొక్కుబడి తతంగంలాగా లేదూ?
గబగబ జనగణమన, గడగడమని వందేమాతరం వల్లించడం అదీ అప్పజెప్పినట్లుగా... చివర్లో స్లెడ్డ్ పలికించడం, తరువాత పొలోమని ఎవరి క్లాసులకు వారు వెళ్ళిపోవడం - ఇదంతా ఒక తంతుగా జరిగిపోతున్నది. ఎళ్ళు పూళ్ళుగా అలా కాకుండా అసెంబ్లీని విద్యలో విలువల్ని పూరించే విధంగా, సృజనాత్మకంగా నిర్వహించాలని గురువారం నుంచి అది అమలు చేయాలని ప్రభుత్వం గురువులకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాన్ని దీని వెనకాల స్పూర్తిని సరిగా అర్ధం చేసుకోకపోతే దీన్ని సృజనాత్మకంగా అమలు జరపడానికి అవసరమైన ప్రిపరెషన్, గాఢమైన అవలోకనం ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి లేకపోతే అసెంబ్లీలు మళ్ళీ యాంత్రికపు తతంగాలుగా మారే ప్రమాదముంది.
ప్రభుత్వం ఏయే మార్పుల్ని సూచించింది? జనగణమన, వందేమాతరం పాడించండది. మధ్యలో మరేదైనా స్ఫూర్తినిచ్చే పాట పాడించండి. విలువల్ని నిర్మించే విధంగా కొన్ని మాటల్ని మాట్లాడండి - ఇదీ క్లుప్తంగా. అయితే ఇదంతా కొన్ని నిమిషాల కార్యక్రమం. కనీసం 25 నిమిషాల కార్యక్రమంగా ఆ ఆదేశాల్ని సృజనాత్మకంగా మార్చుకోవటంలో ఉంది పాఠశాల నిర్వాహకుల ప్రతిభ. ఒక ప్రయోజనాత్మకంగా అసెంల్లీని నిర్వహించుకోవడం గురించి ప్రభుత్వం, ఎన్.సి.ఇ ఆర్. టి. ఎంతో ఆలోచించాల్సి ఉంది. విద్యలో విలువల్ని ప్రతిష్టించడం అంటే అంతర్జాతీయంగా మనుషులందరూ స్నేహం, (ప్రేమల తోటి చట్టాపట్టాలేసుకొని నడువవలెనోయ్ అని గ్రహించగలిగిన వాతావరణం కల్పించడం కాదా?
ఏ సమస్యనైనా దేశీయత, జాతీయతా పరిధుల్లో మాత్రమే పరిష్కరించలేమని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. అంతర్జాతీయతా స్ఫూర్తితో కులం, వర్గం, మతం, జాతి - ఈ పరిధుల్ని సంకుచిత తత్వాల్ని అధిగమించిన అంతర్జాతీయ మానవతా అనుభూతి, అవగాహనలతోనే సమస్యల్ని మనం పరిష్కరించుకోగలం. ఉదయం పాఠశాల అసెంస్లీలో పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి ఆ అవగాహనను ఆ కొన్ని క్షణాల్లో తమలోకి ఆవహించు కోవలసిన అవసరం లేదంటారా? దీన్ని గురించి అందరం కలిసి ఆలోచించాల్సి ఉంది.
169
మార్నింగ్ అసెంబ్లీల్ని డిఫరెంట్‌గా నిర్వహిస్తూ ఆ క్షణాల్ని అనుభూతులుగా అందరిలో రంగరిస్తున్న బుషివ్వాలి, సుమవనం, శాంతి విద్యావనం, విద్యార్థి, వికాస విద్వ్యావనం, వికాసభారతి, అభయ, శ్లోకా - ఈ వాఠశాలలు, ఈ అందరి అనుభవాల్నించి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వాళ్ళందరిలో ఆ కార్యక్రమాలు బ్లూప్రింట్స్గా ఒకే రకంగా లేవు. ఎవరి విధానంలో వాళ్ళు నిర్వహిస్తారు. ప్రతి వాళ్ళు డిఫరెంట్‌గా, ఎఫెక్టివ్‌గా, సృజనాత్మకంగా, అదీ ప్రతిరోజూ వెనుకటి రోజుకు కార్చన్కాపీ కాకుండా నిర్వహిస్తారు. ప్రభుత్వం దాన్నంతా అధ్యయనంలోకి తీసుకొని ఆయా సృజనాత్మకతల్ని గుర్తించి, వాటిని గురించి వర్క్‌షాప్స్ నిర్వహించి పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యంతో దాన్నంతా ఎలా అమలులో ఉంచాలన్న దాన్ని స్పష్టంగా నిర్వచించాల్సి ఉంది.
దా॥ సి.ఎ. ప్రసాద్ ఇంటర్నేషనల్ స్టెప్ అధ్యయనంలో భాగంగా ఈ స్టడీని కొనసాగించడమే కాకుండా తమ స్టెప్ వర్క్‌షాప్ ద్వారా ఆ స్టటీని అందరితో పంచుకొంటున్నారు.
ఉదయంపూట గాఢమైన అనుభూతుల్ని పిల్లలు ఆవహించుకోవాలి. అందరూ కలిసి ధ్యానంలో గడపాలి. తరువాత ఆ గాఢమైన నిశ్శబ్దాన్ని ధ్యానాన్ని తరగతులలోకి తీసుకెళ్ళాలి. ఆ విధంగా తరగతులలో ఉపాధ్యాయులు పాఠాలను బోధిస్తున్నపుడు వినటానికి అవసరమైన ఏకాగ్రత వాళ్ళలో నెలకొంటుంది. ఉదయం అసెంబ్లీలో ఏకాగ్రత ద్వారా స్థిత ప్రజ్ఞతను గాధఢతలో స్పందనలో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఆ ఏకాగ్రత, వాళ్ళలో సావధాన మనస్తత్వం, స్థిమితత్వం ఉన్నప్పుడు ఆ తరగతి గదులలో వాళ్ళు పాఠాల్ని విని అర్ధం చేసుకోవడానికి సహకరిస్తుంది. సృజనాత్మకతతో స్పందించగలుగుతారు.
భయము, ఉద్వేగము లేని నిర్భయమైన [ప్రశాంత వాతావరణం ఉందాలి. స్కూళ్ళలో అప్పుడే అందరూ కలిసి ధ్యానస్థితిలో కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. పై స్కూళ్ళలో అసెంబ్లీలో ఒకరోజు ఛాటింగ్స్, ఒక రోజు వాద్య సంగీతం, ఒక రోజు అందరూ కలిసి పాదే బృందగానం, జానపద నృత్యం, కోలాటం, బుర్రకథ అలా ఉంటాయి. పిల్లలు తమంత తాము సద్యఃస్ఫురణతో స్పందిస్తూ చిన్నచిన్న స్కిట్స్‌ని, నాటికలను ప్రదర్శిస్తారు. చిన్నపిల్లలు నర్సరీ రైమ్స్‌ను చిలుక పలుకలతోటి వినిపిస్తారు. టీచర్స్, ఆయాలు డ్రామాలు వేస్తారు. కొందరు పిల్లలు కరెంట్ టాపిక్స్ మీద మాట్లాడతారు. కొందరు ఆర్ట్స్, క్రాఫ్ట్‌లో తాము తయారుచేసినవాటిని అందరికీ చూపించి వాటిని తాము ఎలా చేసింది వివరిసారు. కొందరు తమ కవితల్ని కథల్ని, జోకుల్ని వినిపిస్తారు. అసెంస్లీలో దేన్నైనా పుస్తకంలోంచి చూసి చదవటం చేయకూడదు. ఓరల్‌గా, స్పాంటినియస్‌గా హావభావాల్ని ప్రదర్శిస్తూ అందరి అటెన్షన్‌ను కీప్ ఆప్ చేసే విధంగా కార్యక్రమాల్ని నిర్వహించుకోవాల్సి ఉంది. పిల్లలు వాటలు రాసి, ఆ పాటలకు తామే ట్యూన్స్ కట్టి పాడతారు. ధక్కీ కంజీరా వాయిద్యాల్ని పాటలకు తోడుగా ఉపయోగిస్తారు. వాయిద్యాలు జోడిస్తే పాటలు, డ్యాన్స్‌లు మరింతగా రక్తి కడతాయి. పిల్లలు అక్కడికక్కడ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో జవాబివ్వడం, చర్చకు పెట్టడం జరుగుతుంది. కొందరు పిల్లలు చిట్స్‌లో ప్రశ్నలు రాసి పంపుతారు. వాటిని గురించి స్పందించడం జరుగుతుంది. పిల్లల్నించి నిర్భయంగా వాళ్ళ అభిప్రాయాల్ని ప్రశ్నలను రాబట్టాలని ఓ వోస్టుబాక్సు ఉంచుతున్నారు. అది పిల్లల ప్రశ్నలతో, రాతలతో నిండిపోతుంది. ఆకాశరామన్న పేరుతోను రాస్తారు పిల్లలు. 'ఈ టీచరు మమ్మల్ని కొడతారు, గద్దిస్తారు", 'ఈ టీచరు మమ్మల్ని భయపెడుతుంది'. ఇలాగ అసెంబ్లీలో అవన్నీ చర్చకు వస్తాయి. అదంతా గ్రహించిన టీచర్లు తమ ప్రవర్తనలో లోపాలు సర్దుకొంటారు.
క్ష౯70
'గోడ పత్రికలో నా కథను ప్రచురించలేదా చూసుకో నీ ఆట పడతాం” అనే హెచ్చరికలు, బెదిరింపులు పోస్టుబాక్సులో ఉంటాయి. 'గోడ పత్రికలో పేజీలు పెంచండి” అంటూ సలహాలు ఉంటాయి. ప్రతిదీ అసెంబ్లీలో చర్చకు వస్తుంది. అదంతా ప్రజాస్వామ్యానికి సయంపరిపాలనకు అద్దం పడుతూ భవిష్యత్తులో ఉపయోగపడేదిగా ఉంటుంది.
'ఇదిగోనండి స్కూల్లో లెట్రిన్ కడగడం లేదు. వాసన కొడుతుంటే వాటిని మేం ఉపయోగించుకోలేకపోతున్నాం” పోస్టుబాక్సులో అదొక ప్రశ్న వెంటనే మర్నాడు అసెంబ్లీలో ఇది చర్చకు వచ్చింది. “ఏంటి లెట్రిన్స్ను ఆయాలు కడగడకపోతే మనం విసిగిపోవాలా, మనమే నీళ్ళు పోసి వాటిని ఎందుకు కడుక్కోకూడదు?' అన్నారు కొందరు. అంతే. పిల్లలు పనిలోకి ప్రవేశించారు. క్లీనింగ్ ఆరంభించారు.
'పచ్చదనం - పరిశుభ్రత'లో భాగంగా పిల్లలు అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేస్తారు. 'మేం అందరం చెట్లను నాటాం - వాటిని నాటడమే కాదు వాటికి నీళ్ళు పోసి పెంచుకొంటారంి అని. ఆ పని సక్రమంగా జరుగుతున్నదా లేదా అసెంబ్లీలో చర్చకు వచ్చేది. 'ఆ పిల్లలు ఎండలో పడి నీళ్ళు పోయటం మేం చూశాం” అని గుర్తించి మాట్లాడ్డం జరిగేది. దాంతో వాళ్ళ సిన్సియారిటీకి గుర్తింపు వచ్చిది.
అసెంబ్లీలు ధ్యానమయంగా, అవధానతకు పునాదిగా ఉండాలి. గందరగోళం, అయోమయం ఉండకూడదు. హాస్యమైనా హుందాగా ధ్యానస్థితిలో ఇమిడిపోయదిగా ఉండాలి. ఒక పాటను అందరు కలిసి ఒకే గొంతుతో ఒకే పిచ్‌లో పాడటంలో ఎంతో సౌందర్యముంటుంది. ఆ సౌందర్యంలోనే ఆనందముంటుంది. ఆ ఆనందమే అసెంబ్లీలో పిల్లల్ని, పెద్దల్ని ఆవహిస్తుంది.
ఒక టీచర్ తానే అన్ని పాత్రలుగా నటిస్తూ బాల కార్మికుల దీనావస్థను కళ్ళకు కట్టిస్తాడు. ప్రతి మాటను తూటాగా పేలుస్తాడు. పిల్లలు వెంటనే దాన్నంతా పట్టేసుకొంటారు. ఈ అసెంబ్లీలు ఎప్పుడూ బోర్ కొట్టించవు. ఒక అమ్మాయి తీయగా గొంతెత్తి పాడేటప్పుడు మిగతా పిల్లలు గొంతు కలుపుతారు. వెంటనే వాతావరణంలో విద్యుత్తు ప్రసరిస్తుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది.
ఒక నాన్నవచ్చి * పొద్దున్న లేచాడు ఖాదరయ్య - కాళ్ళు మొగం కడిగినాడు ఖాదరయ్య” అనే పాటతో గొంతెతాడు అసెంబ్లీలో. పిల్లలంతా ఆయనతో కలిసి గొంతు కలిపారు. ఒక పేరెంట్ సితార వాయించాడు. పిల్లలు అలా ధ్యానంలోంచి వింటూ పోయారు. ఒక స్టూడెంట్ తాను తయారుచేసిన ఎలక్ట్రికల్ పరికరాన్ని ప్రదర్శించాడు. పిల్లల్లో సైన్స్ గురించి జిజ్ఞాస రేకెత్తింది. ఒక అమ్మాయి అసెంబ్లీలో ఆ లిమిటెడ్ టైమ్‌లో రెండే రెండు సైన్సు ప్రయోగాలు ప్రదర్శించింది. పిల్లల్లో ప్రయోగాల మీద ఆసక్తి పెరిగింది. చాలాసార్లు టీచర్లు పిల్లల్నుంచి నేర్చుకొన్నారు. ఒక అమ్మాయి ఇంటిలో బంకమట్టితో తాను తయారుచేసిన శిల్పాన్ని అసెంబ్లీలో ప్రదర్శించింది. నిజానికి అదె హోమ్‌వర్క్ మిగతా పిల్లలు బొమ్మలు తయారుచేయడానికి పూనుకొన్నారు. న్యూస్ పేపర్లో వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించి విభిన్న అంశాలపైన పిల్లలు మాట్లాడారు.
ఒక స్టూడెంట్ తను చూసిన ఒక మంచి సినిమా గురించి రివ్యూ చేశాడు. ఒక టీచరు తను చదివిన మంచి పుస్తకం గురించి సమీక్షించారు. ఒకరు హిందూ 'యంగ్వరల్డొలో తనకు
నచ్చినవాటిని ప్రజంట్ చేశారు. తరువాత 'యంగ్వరల్డ్ను గోడకు అతికిస్తే అందరూ చదువుకొన్నారు.
అలాగే హలోబుజ్జి, “చదువు, సిసింద్రీ, “మొగ్గ వాటిని గురించి స్పందించి గోడకు అతికించి
అందరూ చదువుకొనే అవకాశం కల్పించారు. ఇదంతా ఉదయం అసెంబ్లీలో కల్పించిన స్ఫూర్తి. క్ష]
వాళ్ళు ఆ సమయాల్లో చదివే కవితలు, కథలూ తరువాత వారం వారం గోడ పత్రికగా రూపొందుకొన్నాయి. అలానే వాళ్ళు అసెంబ్లీలో ప్రదర్శించే నాటికల వల్ల రిహార్సల్స్ ప్రాక్టీసు అవసరం లేకుండానే స్కూలు నిర్వహించే ప్రత్యేక ఫంక్షన్స్ ఆగస్టు 15, రిపబ్లిక్‌డే, స్కూల్ దే మిగతా ఫంక్షన్స్‌లో ఆటపాటలతో పాటు డ్రామాల్ని అలవోకగా ప్రదర్శించే అవకాశం కలిగింది.
ఒక అసెంబ్లీలో కొందరు చేరి మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఎంతో కెమిట్టీ సబ్జెక్టు దాగుందని పిల్లలు గ్రహించారు. సైంటిఫిక్‌గా ఆలోచించగలిగితే మాయలు, మంత్రాలు విటిని ఎవ్వరు నమ్మరనెదాన్ని ఆ కొన్ని నిమిషాల ప్రదర్శనలో వాళ్ళు చెప్పారు.
ఒక అసెంబ్లీలో చెట్లు నరికితే వచ్చే అనర్జాల గురించి చెప్పారు. కొందరు పచ్చటి ఆకులు మేకప్‌గా చెట్లుగా నిల్చుంటే, కొందరు ఆచెట్లను కౌగిలించుకొని వాటిని నరకసీయకుందడా అడ్డుపడి, చిప్కో ఉద్యమాన్ని ప్రదర్శించారు. వనదేవతగా ఒకరిని నిలుచో పెట్టి ఆమె చుట్టూ నృత్యం చేస్తూ పచ్చదనం - పరిశుభ్రత సందేశాన్ని అడవుల పెంపకం సందేశాన్ని కళాత్మకంగా అందించారు.
ఉదయం ఏది మాట్లాడినా ఆ ఇన్స్టక్షన్స్ అందరికీ నేరుగా, తాజాగా ప్రసారమవుతాయి. వాటిని అందించటానికి ఆ సమయం తగినదిగా ఉంటుంది. ఎవరైనా స్పాంటేనియస్‌గా స్పందించడంలోనే జీవితం ఉంటుంది.
మన అన్ని స్మూళ్ళలో స్తబ్దత కూరుకుపోయి, ఉత్సాహాలు చచ్చిపోయి, యాంత్రికంగా పిండి రుబ్చినట్లు పాఠాల్ని రుబ్బుతూ, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్లు పాఠాల్ని మళ్ళీ మళ్ళీ వల్లిస్తూ ఏ మాత్రం ఉల్లాసం, ఆహ్లాదం లేకుండా, ఒకవేళ పిల్లల్లో అవి మిగిలున్నా వాటిని పట్టి పట్టి చంపేలా ఉంది. అసెంన్లీలో సృజనాత్మకత అనుభవంలోకి రాగలిగితే, దాని ప్రభావం మూలంగా మిగతా పీరియద్స్లోకి ఆ ఉత్సాహం ఎలక్టిఫై అయ్యి విద్యా విధానం మారే అవకాశం ఉంటుంది.
అసెంబ్లీలంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి నిర్భ్వయతలోంచి ఆ కొన్ని క్షణాలు ఒకే హృదయంగా, ఒకే ప్రపంచంగా, ఒకే ఊపిరిగా, ఒకే ఆవేదనగా, ఒకే ఆవేశంగా, ఒకే ఆనందంగా కలిసి స్పందించడం, కలిసి పాడడం, కలిసి నర్తించడం, కలిసి ఏడవడం, కలిసి నవ్వడం, కలిసి మాట్లాడ్డం, మౌనంలో కలిసి ధ్యానించడం! అదే మార్నింగ్ అసెంబ్లీలో రావలసిన మార్పు. ఈ విధంగా ఉదయం 25 నిమిషాలు అసెంవ్లీలు సృజనాత్మకంగా రూపొందగలిగితే మొత్తం విద్య అంతా మారిపోగలిగే అవకాశం ఉంది.
“ మేం పిల్లలం రేపు పెద్దలం - రేపటి ఈ సమాజానికి రూపుదిద్దుతాం. భూగోళం మీదనున్న ఏ దేశం పిల్లలైనా - ఏ భాషను మాట్లాడినా ఏ వేషం వేసుకొన్నా అందరం, అందరినీ (ప్రేమిస్తాం - ప్రేమిస్తాం - ప్రేమిసాం. - *
ఇది మన మానిఫెస్టో అవుతుందప్పుడు.
- ఎం. శివరాం, స్టెప్, శాంతి విద్యాపీఠం, విజయవాడ, 1/2
ఊహించడం ప్రతిభకు సంకేతమా ?
నేనాక రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కోసం క్యూలో వుండగా ఎదురుగ్గా ఒక ప్రకటన చూచాను. 'మీకు స్పష్టంగా తెలియనప్పుడు అడిగి తెలుసుకోండి గానీ ఊహించకండి. మీ తప్పుడు ఊహల వల్ల చాలా నష్టం జరగొచ్చు” అనేది ఆ ప్రకటన. రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఈ ప్రకటన సరిపోతుందేమోగానీ మరి ఊహించడం నిత్యజీవితంలో ఎలా తప్పవుతుంది? పిల్లలు ఊహించడాన్ని మనం నిరోధిస్తె ఏమవుతుంది?
స్పష్టమైన సమాచారం లేనపుడు మనం ఊపహొస్తాం. ఉజ్ఞ్జాయింపు చెస్తాం. అంటే దీనర్ధం మన ఊహలో ఏ ఆలోచనా లేదనా? ఏ అంచనా లేదనా? ఇలా అనుకొంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. ఒకానొక పరిస్థితికి ఆలోచనాత్మక ప్రతిస్పందనగా ఊహించడాన్ని మనం లెక్కించాలి. సమగ్ర సమాచారం లేనపుడు మనం చేసే ఒకానొక వ్యక్తీకరణ ఊహ. అప్పటికి మన ముందున్న పరిస్థితి, మనకు అంతకుముందే గల జ్ఞానం ఆధారంగా మనం ఊపహిొస్తుంటాం.
పిల్లలు ఆడుకోవడం మనం చూస్తుంటాం. ఒక పిల్ల మనసులో ఏదో ఒకటి అనుకొంటుంది. ఒక పందిని అనుకొనిందనుకోండి. ఎదుటి పిల్లలు దీన్ని కనుక్కోవాలి. దీనికోసం వాళ్ళు ఇరవై ప్రశ్నలు వెయ్యొచ్చు. ఆ ప్రశ్నలు “అవును / కాదు” అని మాత్రమే
(| జవాబు వచ్చేవిగా ఉండాలి. (ఇది జంతువా? దీనికి రెండు కాళ్ళుంటాయా? ఇలాంటి ప్రశ్నలు)
ఈ ప్రశ్నల కొచ్చే జవాబును బట్టి ఊహించి మరి కొన్ని ప్రశ్నలు వేస్తారు. వీటికొచ్చె జవాబుల్ని బట్టి ఆ అమ్మాయి మనసులో ఏమనుకొనిందో ఊహిస్తారు.
ఇదెలా సాధ్యమవు తుంది? కేవలం “అవును / కాదు అనే జవాబుల నుంచే కొంత సమాచారం ఆ పిల్లలు సంగ్రహిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా వాళ్ళొక అంచనాకు రాగల్గుతున్నారు. దీని వల్ల మరింత సూటి ప్రశ్నలు వెయ్యగల్గుతున్నారు. చివరగా సరైన జవాబును ఊహించి చెపుతున్నారు.
11/3
ఊహ - ప్రతిభ
ఊహించడం కూడా ప్రతిభకు సంకేతమే ! ఈ ప్రతిభ మనందరిలోనూ ఉంటుంది. పలు సందర్భాల్లో మన నిత్య జీవితంలో ఇది వ్యక్తమవుతుంటుంది. అలా ఊహించడమే లేకుంటే మనం చాలా పనులు చెయ్యలేం. మనమో కొత్త చోటుకి పోవాలనుకోండి. అప్పుడేం చేసాం? ముందు మనం 'ఫలానా విధంగా వెళ్ళొచ్చెమో, ఇంత సమయం పడుతుందేమో” అనుకొంటాం. దీనికి తగ్గట్టు ముందుకు పోతాం. అవసరమనిపిస్తేనే ఎవరినైనా అడుగుతాం. ప్రతి సందర్శ్భానికీ, ప్రతి పనికీ తగినట్టు సకల సమాచారమూ మన చేతుల్లో ఉండదు. కానీ మనం ఊహించి ముందుకెళ్ళగల సమాచారం మాత్రం వుండనే వుంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఏదో కొంత సమాచారం ఆధారంగా చాలా వాటిని మనకు మనం అంచనా వెసుకొంటాం. నిర్ణయాలకు వస్తాం.
నిజమే ఇలా ఊహించేపుడు కొన్ని తప్పులు జరుగుతాయి. కొంత ఇబ్బంది కూడా కల్టుతుంది. అయితే ఈ తప్పుల్నించి మనం నేర్చుకొంటాం. జాగ్రత్త పడతాం. రైల్వే బుకింగ్ ఆఫీసు దగ్గర ఈ తప్పు మనకు చాలా నష్టం తేవచ్చు. అందువల్ల ఎవరినైనా అడిగి మరీ జాగ్రత్తపడ్డం తప్పనిసరి కావచ్చు. కానీ అన్ని తప్పులూ అంత చెడ్డవి మాత్రం కావు. మన ఊహ సరైనదైనా, పొరపాటుదైనా ఈ రెండు రకాల అనుభవాలూ మనకు మరింత జ్ఞానాన్ని సంతరించి పెడతాయి. ఫలితంగా భవిష్యత్తులో మరింత తెలివిగా మనం వ్యవహరించగల్టుతాం. ఇలా ఈ ఊహల్నించి, ఉజ్జాయింపుల నుంచి మనం నేర్చుకోవడమే లేకపోతే, అసలీ ఊహలకే స్వస్తి చెపితే ఏమవుతుంది ? అప్పుడు గత జ్ఞానానికి మనం పరిమితమవుతాం. లేకుంటే యంత్రాల్లాగా ఎవరో సూచనలిస్తేనే పనిచేసే వాళ్ళంగా మారుతాం. ఒకరి పని నుంచీ, ఒకరి సూచనల నుంచి నేర్చుకోవడం తప్ప ఇక మరో నేర్చుకోవడం లేకపోవడమంటే మానవ ప్రతిభను ఘోరంగా కుదించడమే అవుతుంది. అలా మానవమేధ వికసించడం అసంభవం. మరి మన తరగతి గదిలోనో ?
మరి ఈ ఊహల్ని రైల్వే బుకింగు దగ్గరేనా నిషేధిస్తున్నది ! మన తరగతి గదుల సంగతి ఎమిటి? ఇక్కడ మనం ఊహల్ని రెక్కతొడగనిస్తున్నామా? పేరుకు మన తరగతి గదులు పిల్లల ప్రతిభా పాటవాల్ని అంతర్దత శక్తుల్ని వెలికి తీయడానికి కంకణం కట్టుకొన్నవి, కానీ అక్కడ చిన్న తప్పు చెయ్యడం కూడా పెద్ద నేరంగా, ప్రమాదంగా మనం లెక్సిస్తాం. 'పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. దానికోసం వాళ్ళు ఇంటికెళ్ళి కూడా పుస్తకాల పురుగులు కావాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి. చదివింది గుర్తుంచుకోవాలి. ఆ పని చెయ్యనివాళ్ళే ఊహించి జవాబులు చెపుతుంటారు. పామరులూ, మందబుద్దులూ చేసే పని ఇది” ఇలా మనం ఉపాధ్యాయులం, తల్లిదండ్రులం ఒక అవగాహనకు వచ్చి పిలల ఊహల్ని ప్రమాదకరంగా భావిస్తున్నాం.
కే (4
మామూలుగా మన స్కూల్లో జరిగేదేనిటి? మనం ప్రశ్న్చలడుగుతుంటాం. జరిగిన పాఠాల్ని మళ్లీ చెపుతూ పిల్లల్ని మూల్యాకనం చేస్తుంటాం. భూగోళం తిరగేస్తూ 'జైరే' దేశం ఎక్కడుంది ? అని మనం అడుగుతాం. 'అక్కడ ఎక్కువగా వానా వేడీ వుంటాయి మేడం ! అందువల్ల అది భూమధ్యరేఖ దగ్గరగా వుంటుంది" అనే జవాబు ఓ పిల్ల చెప్పిందనుకోండి. “ఇదిగో నువ్వు ఊహించి చెపుతున్నావ్! ఈ పాఠం ఎన్నాళ్ళైంది చదివి ?” అని నిలదీస్తాం.
నిజమే ఇక్కడ విద్యార్థికి జవాబు ఖచ్చితమైంది తెలియదు. కానీ తనకు గుర్తున్న సమాచారం ఆధారంగా ఆ అమ్మాయి ఊహిస్తోంది. ఆమెకు జైరే వాతావరణం గుర్హుంది. దీన్ని ఆధారం చేసుకొని అది భూమధ్యరేఖ దగ్గరగా వుందని ఊహించింది. వాస్తవానికి ఆ పిల్లక్కూడదా ఆ జవాబుపట్ల అనుమానం వుంది. కానీ ఆమె అంచనాలో ఒక హేతుబద్దత వుంది. దీన్ని టీచరుగా మనం ముందు అభినందించాలి. అదే దారిలో మరికొంచెం ముందుకళ్ళమని ప్రోత్సహించాలి. భూమధ్యరేఖ దగ్గరగా వెళుతున్న ఖండాలేవో ఒకసారి గుర్తుకు తెచ్చుకొమ్మనాలి. అలాగే 'జైరే దేశపు ఇతర సమాచారాన్ని మరోమారు నెమరు వేసుకొమ్మనాలి. ఆ దేశ ప్రజల్ని గురించి ఏమైనా తెలుసునేమో దాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకొమ్మనాలి. అప్పుడు ఆ దేశం ఎక్కడ వుందో మరింత జాగ్రత్తగా ఊహించమని చెప్పాలి. అలా అలా జవాబు రాబట్టాలి.
పై సంఘటనలో విద్యార్ధి ఊహలో కొంత హెతుబద్దత వుంది. అలా గాక ఆ అమ్మాయి జైరే దేశం యూరపులో వుంది” అని చెప్పిందనుకోండి. అప్పుడు మనమేం చేస్తాం? అలా చెప్పడానికి క్కూడా ఆ పిల్లకు ఏ ఆలోచనా వుండదని మనం అనుకోనక్కరలెదు. మనక్సావలసింది వాస్తవ సమాధానం తప్పు మరేమీ కాదనుకొంటే నిర్ద్వంద్వంగా ఈ అమ్మాయిని తిరస్కరిస్తాం. అంతటితో ఆ పిల్ల పని అయిపోయినట్లై లెక్క ఇక “ఎందుకు అది యూరపులో లేదో” ఊహించే అవకాశమే ఆమెకు లేదు. అలాగాక ఆ అమ్మాయి ఊహకు ఆధారమేమిటో అడగొచ్చు. “అక్కడి వాతావరణం ఎలా వుంటుంది అని మరో ప్రశ్న వెయ్యవచ్చు. “అక్కడ వేడిగా వుంటుంది అని చెపితే మరి యూరపులో వాతావరణం ఎలా ఉంటుంది' అని ఇంకో ప్రశ్నలోకి వెళ్ళవచ్చు. ఇలా ఊహల్ని మరింత ముందు తీసుకెళ్ళి మరిన్ని కణాల్నించి ఆలోచింపజేసి, ఫలితంగా వచ్చిన సమాచారంతో సరైన జవాబు దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. ఊహ - ఓ బోధనోపకరణం
అంటే విద్యార్ధి ఊహని ఒక బోధనోపకరణంగా మనం ఎలా వాడుకోగలమా అనేది ఇక్కడ కీలకాంశం. దీని ద్వారా అతని జ్ఞానాన్ని ఎలా ఒక రూపంలోకి తీసుకొని రాగలమా, ఒక క్రమంలో పెట్టే ప్రయత్నం చెయ్యగలమా అనేది మన ముందున్న ప్రశ్న ఊహకి ఊహను జతచేసి మరింత హేతుయుక్తంగా మార్చి లక్ష్యానికి దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలా అనేది బోధనా
కేన్
కళ. అలాగాక ప్రశ్న అడగడమంటే “గుర్తున్నదా” లేదా అని తెలుసుకోడానికో, “నేర్చుకోవడం స్పందించడానికి మాత్రమే' అనట్లు మన తరగతి గది ఉంటే, “అదే విద్యకు అసలైన పరమార్ధం” అనుకొంటే అంతకన్నా ఘోరం ఏమీ ఉండదు. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నదదే.
తప్పులు చెప్పడానిక్కూడా మనం చాలా విలువ కడుతుంటాం. ఎంతో నష్టం జరిగిందనుకొంటాం. నిజానికి విద్యార్ధి ఊహతో చెప్పే తప్పుకు అలాంటి విలువ ఏదీ వుండనక్కరలేదు. ఒకవేళ దాని వల్ల రెండు మార్కులు తగ్గినా మునిగిపోయింది లేదు. ప్రమాదం ఎక్కడ వుందంటే అసలు ఊహల రెక్కల్నే తుంచెయ్యడంలో దీనివల్ల వచ్చే నష్టం అపారం.
ఊహించడం ద్వారా పిల్లలు ప్రకటించే ప్రతిభని ప్రోత్సహించ కుండా అదేదో చెడ్డపిల్లలు చేసే తప్పుడు చేష్టగా మనం పరిగణిస్తున్నాం. 'మంచి పిల్లాడంటే ఠక్కున జవాబు చెప్పెయ్యాలి గానీ ఊహాలోకంలో విహరించడమేమిటి? అని మనం అడ్డంగా ఆలోచిస్తున్నాం, నమ్ముతున్నాం.
మన పిల్లలు అన్ని సందర్భాల్లోనూ అన్ని సవాళ్ళనూ ఎదుర్కొనగల వారుగా మన స్కూళ్ళలో తయారు కావాలి. మన తరగతి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఊహించడానికి, అంచనా వెయ్యడానికి, తర్దనభర్దన చెయ్యడాన్ని తమ పద్ధతిలో తాము జవాబును వెతుక్కోవడాన్ని ప్రోత్సహించేదిగానే గాదు ఈ పద్ధతిని శాప్రీయ బోధనా కళగా కూడా అంగీకరించేదిగా వుండాలి. ప్రతి జవాబు 'సరైందిగా”నే వుండాలనుకోవడమంటే మిగిలినవన్నీ అసందర్భాలుగా ముద్ర వెయ్యడమంటే పిల్లల్లోని సజీవ మానవాత్మ ను నిరాకరించడం మినహా మరేమీ కాదు.
మిత్రులారా! ప్రతిభంటే ఇచ్చిన సూచనల్ని ఖచ్చితంగా పాటించడం గాదు. నమ్మకంగా అనుసరించడం గాదు. ఖచ్చితమైన జవాబులు, నిర్ధిష్ట నిష్మర్షలు మాత్రమే గాదు. ప్రతిభ అంతకన్నా చాలా విశాలమైంది. చాలా విలక్షణమైంది. మానవ జీవితం రైల్వే రిజర్వేషన్ కన్నా ఎంతో సువిశాలం సుమండీ.
- పద్మా సారంగపాణి 176
(కరా
లో ( ॥ | క... శ | | 6 | _ 4 | | | | | | | ఆధునిక కాలంలొ విద్యా బోధన మప్రజానామికంగానూ పిల్లల భాగసాామాని్ని . _ పెంచేవిధంగానూ వుండాలన్న భావంతో | “షి లా | ఎకిభవించని వారుందరు. అలాటి ప్రయోగాత్మక | | లి లా లా || | ప్రత్యామ్నాయ విద్వాసంసలు నడిపి చక్కటి లా ఆ (క ఖా
ఫలితాలు నాధించిన ఉదాహరణలూ వున్నాయి. పత్యావ్నాయు ఖావాలను తీర్చిదిదిన | | | మప్రముఖులూ వున్నారు. అన్నిటి ని మించి బోధనాపద్దతులకు సంబంధించి ఉపాధ్యాయుల
లలి ఇర శారద చ ప్రతృక్షానుభవాలు కూడదా వున్నాయి. ఈ మూడు - | అంశాలను మెళవింపుగా ప్రస్తుత సంకలనం రూపొందింది. . నట .
నా మవసు ఫౌండేషన్ వహంపఖ్య | నలి జలతి పు1వ వా అ యో ావాసాాాాోోాాాో య ాాా కలన యా నా లావ | రీతి ాఖళవల ర యేర [50,0412 న నవాని లాననతవం ల్ రా పనా చ లాం వనం ాభషకచయ్యవవా నా ఇ నాననా |