Telugu మాట్లాడే చేప - anilvaranasi/indianlanguages GitHub Wiki

్‌- భీ. (ా చన ” క న. వం క ష్‌ ఒం _ " ల సయానోంగో హః ఎత శ " థి అకా ౯

ల

| ఏం కటక్‌ ( & జజ ఖే ళా ళ న్న గబ పూని? లి నుం ః మ + నః న శ ఇ బం “భ. న క అం సా న. న ళల ॥ వ. ః ఇ టం, ( | ్‌ హ్స్‌ - " " ం లం యక్‌ | గ - 1 ల గై సుకు. . శి త్‌ య. జ 4 , /. | ॥ . / మి తజ. క్‌ 2 శీ. (| కం _ 4 , . . షష 2 శ్‌ టు . ఎ _ , | ల 2 క క్ష. లీ నో | ఇ (| || త సో | . = / | శః క. నం జం ॥ ॥ జ స. ల ॥ ప న హం / ్న్‌ మా ల 14 ఇ ॥ | న టే . | ॥ | ॥ ఎన్‌ న. ఆ స | వ |. ॥ ప , 7 _ ల లా , . హం. అ పైపం / [| 2 ఇఇ! ః క క 5 4 _ ం | , / వ ॥ ( ః న్‌ కీ ౯ “4 + | క్ష చే న. | ఒ _్‌ * శై క ర్ట | గ లల ంం | వాం ం ఇ న? ల | | ॥ కరం ౮ సట ఇ ( ల ట్‌ లి ర్త ర గ. జ్‌ + జీ స. థి | లం సె. ఆ? 4 భ్‌ కి ” కో గ జీ మ 2! న లే 2 న సు చ ॥ ఇ - ఫీ ల 7 ,. అక్ష | యా ర సగర మలు కా మ. ం స శ లం ఉత | | ౬ జం _్‌ . నః ల క హా. భీ! , న * య ॥ . త్త అని కతన + నా టే న | శంయ పే! లీగ్‌ క్‌ ఈ "౯ సని స జా కే | ళ్‌ వవ - గ్‌ న. లాం న! వమ రాలిన వెన! షరి ఎర, ఆ ఇొళ్లో / కము నం ంనేి " క న ళు. , ప్రస్‌? _ ఎత? జు శకిక ఓ న. అం, చ వ కోలు“ *” గ మ. శి యక. క సు స ఇగ జే | ల వళ్లుత్తుటైు న న ఎ డు న న టం స్‌ గై లం ఎ... క. స ప! తీ శ్‌ న! థి | ల్‌

లెవెల్‌ : 65 మాట్లాడే చేప సీరీస్‌ ఎడిటర్‌ వి. బాలసుబ్రమణ్యం మొదటి ముద్రణ : జూలై 2004 మూడవ ముద్రణ : అక్టోబరు 2009 వెల : రు. 12/- (ప్రతులకు : ప్రజాశక్తి బుక్‌హౌస్‌

  • క్ష-1-187/1/2 వివేక్‌నగర్‌, చిక్కడపల్లి, హైద్రాబాద్‌-20, ఫోన్‌ ; 27608107 సి మోహన్‌ . కన్వీనర్‌ - జె.వి.వి. ప్రచురణల విభాగం జి.ఎఫ్‌ -4, నీహారికా అపార్ట్‌మెంట్స్‌, గాయత్రి. నగర్‌, . ముత్యాలరెడ్డిపల్లి, తిరుపతి -517 502 ఫోన్‌ : 0877 -2244551 ముద్రణ : ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌ న్న

1 ధిర సం1౧2౨)

ఒకానొక ఊర్లో ఒకానొక ముసలామె వుండేది. ఒక రోజు పొద్దున్నే ఆమె కుంపటి రాజెయ్యడానికి బొగ్గులు వేసి, కొబ్బరి పీచు వేసి, అంటించి గాలి తగిలేలా పెట్టి ఏటికి బయలేర్టింది. బొగ్గులు మెల్లగా అంటుకోసాగాయి.

వీటిలో ఒక కుర్ర బొగ్గు “అబ్బా ఒకటే మంట. చురుక్కు చురుక్కుమంటోంది. ఈ ముసలిదాని కోసం నేనెందుకు తగలబదాలి” అంటూ అరిచి గీపెట్టి చటుక్కున కుంపటిలోంచి దూకేసింది.

అంటించగా మిగిలిన కొబ్బరిపీచు కుర్రబొగ్గు దూకడం చూచింది. “ఇక్కడుంటే నేనూ ఏదో ఒక రోజు తగలడాల్సిందే. పద నేనూ వస్తా” అంటూ కుర్ర బొగ్గుతో జత కలిసింది. “హమ్మయ్య మంచి తోడు దొరికింది. అనుకొంది” కుర్రబొగ్గు.

ఇదరూ కలినీ ఇంట్లోంచి వెల్లగా జారుకొందామని బయలుదేరుతుండగా వాటిని ఓ మూల బుట్టలో బద్ధకంగా కూచుని ఆవులిస్తున్న చిక్కుడుకాయ చూచింది. “ఎక్కడికో మిత్రులిద్దరూ బయళ్లేరారే? అంటూ వేళాకోళం చేసింది. కుర్రబొగ్గూ, కొబ్బరి పీచూ తమ కథంతా చెప్పాయి. దీంతో చిక్కుడు కాయ గుండె గుభేలుమంది. ఆలోచనలో పడింది. ముసలమ్మ వస్తే ఏమైనా వుందా? ముక్కలు ముక్కలుగా కోసి. నీళ్ళలో ఉదకేసి, ఉప్పూకారం కలిపి చిత్రహింస చేస్తుంది. అని 'నేను మీతో వసా అంటూ బుట్టలోంచి దూకి వెంటబడింది.

త

మూడు కలిసి పరుగు లంకించుకొన్నాయి. ముసలమ్మ వచ్చే లోగా వీధిదాటెయ్యాలి మరి. అతి కష్టం మీద దాటేసాయి. 'హమ్మయ్య? అనుకొని ఒక చోట చతికిలబడి, కొంచెం సేదతీర్చుకొని మెల్లగా నడక (ప్రారంభించాయి. వీధుల్లో హడావుడి మొదలైంది. ఎవరి పనుల్లో వారు తలమునకలై వున్నారు. దుకాణాలు తెరుస్తున్నారు. వాహనాలు వస్తూపోతున్నాయి. మాటల్లో వాటికి నడిచినట్లే లేదు. ముసలామె పీడ విరగదైందని వాటికి పట్టరాని సంబరంగా వుంది. ఇలా నడుసూ నడుస్తూ వీధి చివరికి వచ్చేశాయి. వీధి దాటితే ఊరి బయటికి-వచ్చేసినట్టై. 'మరిప్పుడేం చేద్దాం) అనింది కొబ్బరి పీచు. “ఎలాగూ ఇంత దూరం వచ్చాం. ఏటి ఒడ్డు కెళదాం. చల్లగా షికార్లు కొడదాం” అనింది చిక్కుడు కాయ. అన్నీ ఏటి ఒడ్డుకు చేరాయి. చిక్కుడుకాయకు ఉండబట్టలేదు. దాని హుషారు చెప్పనలవిగాకుండా వుంది. ఏరు దాటి అవతలకి పోదామా అని కొబ్బరి పీచునీ, కుర్ర బొగ్గునీ అడిగింది. 'మరి ఏరు దాటడం ఎలా! అని తర్జన భర్దన చేశాయి. చివరికి చిక్కుడుకాయకు ఒక ఆలోచన వచ్చింది. .

“ఈ కొబ్బరిపీచు నీళ్ళలో మునగదు గదా. దీని మీదెక్కి అవతలికి పోతేసరి” అని తన ఆలోచన ఇద్దరి ముందూ పెట్టింది. కొబ్బరిపీచుకు కొంచెం భయం వేసింది. కుర్రబొగ్గుకేమో లోలోపల ముచ్చటగా వుంది. అందరూ కలిసి కొబ్బరి పీచును ఒప్పించాయి.

అయితే పీచు ఓ తిరకాసుపెట్టింది. “ఇద్దర్నీ ఒకేసారి నేను మొయ్యలేను. ఇంత బరువుతో ఈదలేను. ఒక్కోసారి ఒక్కొక్కర్ని తీసుకెళతా” అనింది. నిజమే పాపం కొబ్బరి పీచు శక్తి అంతే.

“అయితే ముందు నన్ను తీసుకెళ్ళాలి. ఈ ఆలోచన ముందుగా నాకేగా వచ్చింది”. అని చిక్కుడుకాయ ముందుకొచ్చి నిలబడింది. కుర్రబొగ్గు పోటికి రాలేదు. “పోనీలే తర్వాతే వెళతా” అనుకొంది.

చిక్కుడు కాయ కొబ్బరిపీచు మీదకెక్కింది. పీచు ఏటిలోకి దిగింది. మెల్లగా ఈదనాగింది. చల్లటి ఏరు, చల్లటి గాలి, అలల మీద ప్రయాణం చిక్కుడుకాయకు స్వర్ణంలోవున్నట్లే వుంది. తానెంత అదృష్టవంతురాలినోగదా అని దానికెక్కడలేని పొగరు వుట్టుకొచ్చింది. నవ్వుతూ కేరింతలుకొట్టసాగింది. కొబ్బరి పీచు చాలా సార్లు హెచ్చరించి గట్టు దగ్గరి కొచ్చేదాకా ఓపిక పట్టమంది. ఎలాగైతేనేం గట్టు వచ్చెసింది. చిక్కుడుకాయ చటుక్కున గట్టు మీదికి దూకింది. గంతులు వేసింది.

కొబ్బరిపీచు ఈదుకొంటూ వెనక్కు వచ్చింది. కుర్రబొగ్గు పాపం బిక్కు బక్కుమంటూ కాచుక్కూచుని వుంది. పీచు దాన్నక్కించుకొని ఏటిలో ఈదసాగింది. రెంటికీ ఎంతో హాయిగా వుంది. జీవితంలో ఇంతసాహసం చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు.

ఇలా వోతుండగా జరగరానిది జరిగిపోయింది. ఓ పడవ వాటిని ఢీ కొట్టేసింది. ఇంకేముంది? కుర్రబొగ్గు బుడుంగున మునిగిపోయింది.

ద్‌

చు ఎక్కడో పడిపోయింది. అవి లబోదిబోమన్నాయి. ఎవరికి వారై పొయ్యాయి. "కాపాడండి, కాపాడండి” అని కేకలేశాయి. మునుగుతూ _ తేలుతూ కొట్టుకుపోసాగాయి. . చిక్కుడుకాయు వాటిని చూచి నవ్వాపవుకోలేక పోయింది. . _జాలిపడాల్సిందిపోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వనాగింది., ఎగిరిగిరి గంతులెయ్యసాగింది. అప్పుడేం జరిగిందో తెలుసా? నిజంగానే చిక్కుడుకాయ పొట్ట చెక్కలయ్యింది. పొట్టలోంచి గింజల్ను బుడుంగున బయటికొచ్చి చెల్లాచెదురుగా పడిపోయాయి. పాపం దానికి భయమేసించి. ఏడుపొచ్చింది. పరుగెత్తి పరుగెత్తి గింజలన్నీ ఏరుకొంది. ' ఎలాగో ఒకలా తంటాలు పడి గింజల్ని పొట్టలో గుక్కుకొనింది. అయితే -ఏం లాభం? జారిపోకుండా ఏం చెయ్యాలి? చివరికి దానికో ఆలోచన-వచ్చింది. టైలరు మస్తాను గుర్తుకొచ్చాడు. వెతుక్కొంటూ వెళ్ళింది. పొట్టను కుట్టెయ్యమని బతిమాలుకొంది. ఆయన జాలిపడి పొట్టను నిలువునా నాజూగ్గా దారంతో కుట్టెశాడు. చిక్కుడు కాయ పొట్టను తడిమిచూచుకొంది. తన పొట్టను చూస్తె దానికే ముచ్చటేసింది. సన్నగా ఈకొస నుంచి ఆ కొస దాకా కుట్టిన దారం వల్ల తాను ఎంత అందగత్తెగా మారేనో గదా అన్పించింది దానికి. గంతులేస్తూ బయల్టేరింది. నుస్తాను కుట్టిన దారమేనండీ మనం చిక్కుడు కాయకు తీసే పీచు. ఆ రోజు టైలరు ఆపని చెయ్యకపోతే మనం చిక్కుడుకాయల్ని కోసేపుడు పీచు తీసేపనే వుండేది కాదు! 6

టక్కరి నక్క

అనగనగా ఒక నక్క నక్కంటే ఇక చెప్పాల్సిందేముంది? అది బలే టక్కరిది. ఎంత వాళ్ళనైనా సరే ఇంతలో బోల్తా గొట్టించేది.

ఒక రోజు అది అడవిలో తిరుగుతుండగా దానికొక ఏనుగు శవం కన్పించింది. ఇంకేముంది? నక్క ఎగిరి గంతేసింది. ఈ మధ్య దానికి ఏనుగు మాంసం ఎప్పుడూ చిక్కలేదు. ఏనుగంటే మాటలా? దాన్ని చంపడం సింహానికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. అటువంటి ఏనుగు అనుకోకుండా తనకు దక్కింది. అంతేనా? ఏనుగంటే చిన్నదిగాదు. చిన్న కొండంత వుంటుంది. కనీసం ఓ నెలరోజులైనా హాయిగా తినొచ్చు. నెలనాళ్ళు తిండి కోసం వెతుక్కోనక్కరలేదు.

ఇలా ఇలా అనుకొంటూ, నోట్లో నీళ్ళు వూరుతుంటే నక్క ఏనుగు దగ్గరకెళ్ళింది. చర్మాన్ని చీలుద్దామని చూచింది. అయేతేవనుగు చర్మం చాలా మందం. చాలాగట్టి కదా. నక్క గోళ్ళేమో అంత వాడిగా లేవు. ఏంచెయ్యాలబ్బా అనుకొంటూ చూస్తూ కూచుంది. '

ఇంతలో ఓ సింహం అటు వచ్చింది. నక్క గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. 'ఈ సింహం ఏనుగుని వదిలిపెడుతుందా? పెట్టదు. పీకల దాకామెక్కుతుంది. తర్వాత తన పెళ్ళాన్నీ బిడ్డల్నీ తీసుకొచ్చి వాటికీ మేపుతుంది. ఇక తనకి వట్టి ఎముకలు తప్ప ఏమీ మిగలవు. సరే అయినా ఏదో ఒకటి చెయ్యాలి” అనుకొంది నక్క

.

సింహానికి ఎదురు వెళ్ళి “మహారాజా! వచ్చారా! తమ కోసమే ఎదురుచూస్తున్నాను. ఈ ఏనుగును బోల్తా కొట్టించి చంపాను. కానీ ఏనుగంటే రాజావారికిష్టమని తెలినిందాన్ని కాబట్టి మీ కోనం ఎదురుచూస్తూ, దీన్ని ఏ జంతువూ ఎంగిలి చెయ్యకుండా కాపలా కాస్తున్నాను. ఆరగించండి” అని ఎక్కడలేని గౌరవం వుట్టిపదేలా అనింది.

'నక్క ఏనుగును చంపడం, దాన్ని నేను తినడమా? ఎంత సిగ్గు చేటు అనుకొంది సింహం. 'నక్కబావా! ఇది నీ సొమ్ము. నీ కష్టార్దితం. ఇది నీకే దక్కడం న్యాయం) అంటూ వెళ్ళిపోయింది.

“హమ్మయ్య గండం గడిచింది" అని నక్క మళ్ళీ ఏనుగు చర్మాన్ని చీల్చడానికి కూర్చుంది. ఎంత చీల్చినా చీలితేగా. నక్క ఇలా తంటాలుపడుతుంటే 'పెద్ద పులి ఒకటి ఎదురుగా వస్తోంది. “చచ్చాంరా బాబూ. ఇది యమ తిండిపోతు. పైగా దీనికి గంపెడు సంసారం. ఒక ముక్క కూడా నాకు మిగల్బదు అనుకొంది నక్క “అయినా సింహాన్నే బురిడీ కొట్టించిన నాకు పులి ఒక లెక్కా అనుకొని “రా పులి బావా రా! ఎంతైనా నువ్వు అదృష్టజాతకుడివి. ఇప్పుడదే సింహం ఈ ఏనుగుని చంపి న్నానానికి వెళ్ళింది. వచ్చేదాకా ఏ పులీ దీన్ని తాకకుండా చూడమని నన్ను

8

కాపలా పెట్టింది. అయినా ఈ పాడు సింహానికి పులులంటే చచ్చేంత కోపం ఎందుకనో? పులిని తలుచుకొంటేనే ఒంటికాలు మీద లేసోంది. ఇంతకు ముందు ఇలానే సింహం ఓ ఏనుగును చంపి స్నానానికెళితే ఒక పులి వచ్చి ఏనుగు మెదడు కాస్తా తినేసిందట గదా!” అని రాగాలు తీసూ చెప్పింది. పులికి పై ప్రాణాలు పైనే పొయ్యాయి. “అవును తాను ఎంతైనా అదృష్టజాతకుడే. ఒక్కనిమిషం ముందు వచ్చివుంటే ఏమై వుండేది? సింహం

. చేతిలో కుక్క చావు చావల్సి వచ్చేది. ఇప్పుడైనా ఈ నక్క చెప్పబట్టి సరిపొయ్యింది. లేకపోతే ఈ ఏనుగును తినబోయి సింహం నోట్లో పడేదాన్ని” అనుకొని ఒకే పరుగు లంకించుకొంది. దాని పరుగు చూసి నక్క నవ్వు ఆపుకోలేకపోయ్యింది.

మళ్ళీ ఏనుగును చీల్చడానికి పూనుకొని ఐనుగు చర్మాన్ని పీకింది నక్క ఎంత లాగినా చర్మం చీలితేగా. ఛ6్రమ తప్ప ఫలితం దక్కడం లేదు. ఈసారి ఎవరు వస్తారోనని అనుమానంగా అటూ ఇటూ చూసింది. అనుకొన్నంత పని జరగనే జరిగింది. అల్లంత దూరం నుంచి ఓ చిరుతపులి వసోంది.

" చిరుత పులి చారల చారల తోలు చూస్తేనే నక్కకు చచ్చేంత భయం. పైగా చిరుతపులి మహా కోపిష్టి ఏమాటా చెప్పే దాకా వినదు. బలే దుడుకు. “ఏం చెయ్యాలి?” అనుకొంటుండగానే జొల్లు కార్చుకొంటూ చిరుత రానే వచ్చేసింది. నక్క తక్కువ తినిందా! ఓ ఉపాయం పన్నింది. “చిరుత గోళ్ళు, కోరలు చాలా వాడిగా వుంటాయి. దానిచేత ఏనుగు చర్మాన్ని చీల్చిస్తే తొందరగా తినొచ్చు” అనుకొంది.

“చిరుత బావా! రారా! సమయానికి వచ్చావు. ఈ ఏనుగును సింహం చంపి నన్ను కాపలా పెట్టింది. స్నానానికి వెళ్ళి వస్తానంది. ఎమైనా అది రావడానికి గంటయినా పడుతుంది. ఇంతలో ఆ పక్కకొంచెం లాగించెయ్‌. అడిగితే నేనేదో చెపుతాగా. కాపలా కాసినందుకు నాకు భాగం పెట్టిందిలే. అది నీకిస్తా అంతే. ఎంతైనా నువ్వు నాకు కావల్సిన వాడివి. పైగా పాపం ఆకలితో వున్నట్టున్నావు” అంది.

చిరుతకు ఏనుగు మాంసమంటే నోరూరుతోంది. సింహమంటే గుండెల్లో గుభీలుమంటోంది. “ఆ పాపిష్టి సింహంతో పనిగాదు. అనుమానం

' వచ్చి వెనక్కి వచ్చినా వస్తుంది. బతికుంటే బలుసాకు తినొచ్చు. నాకంత అదృష్టం లేదులే నక్కబావా” అని చిరుత వాపోయింది.

“ఏం ఫరవాలేదు చిరుతా! నేను కాపలా వుంటాగా. కానీయ్‌, ఇదిగో నేనీ రాయిమీధ ఎక్కి చూస్తుంటా. సింహం వచ్చే దారి నాకు తెలుసుగా. కన్పించగానే అరుస్తా. బొక్కిందే దక్కింది అనుకొని పరుగెత్తు” అని భరోసా యిచ్చింది నక్క |

చిరుత ఆకల్ని చంపుకోలేకపోయ్యింది. ఏనుగు దగ్గరికొచ్చి వాసన చూసింది. తర్వాత రంగంలోకి దిగింది. వాడి గోళ్ళతో, కోరలతో చర్మాన్ని చీల్చింది. ఇక నోరు పెట్టబోతోంది. అంతే సింహం వచ్చేసింది, వచ్చేసింది? అని నక్క గావు కేకలు పెట్టింది.

ఇక చిరుత క్షణం వుంటే వొట్టు. ఒంటి కాలు మీద దౌడు తీసి ఆమడదూరం పరుగెత్తింది.

నక్క లక్షణంగా లొట్టలు వేస్తూ ఏనుగుని ఆరగించింది. ఒక్క రోజుగాదు నెల రోజులు పీకల దాకా మెక్కింది.

10

౬ ల్యాగ్‌ శ్రీషృష్ణదేవరాయలు సభలో కొలువుదీరాడు. కొలువంతా. మం(తులతో “సేనాపతులతో, పండితులతో, కవులతో కిటకిట లాదుతోంది' రశయలవారు కవుల్ల' వైవు 'చూచారు. వాళ్ళకేదైనా మంచి పరిక్ష అ అ ప్రశ్న వేసాను. దీనికి ఎవరు చెపుతారో వాళ్ళని (౫ ..ఎబను ఒక ప్రశ్న ది! వరు జవాబు చెపుతారా వాళ్ళ నగొష సభలో సన్నానం చేస్తాము.” అన్నాడు కెల్లా గొప్పవాడని గుర్తించి సభలొ సన్నానం ఏ.” అన్నాడు. (టా 1 (౫ తాం టూ న ం న్‌ (“7 శా ఖ్‌ ళా శి | ఇ య వర టన... ం ం య . | న్‌ థ ౧. ౮౮! లట 7 శ (|. (|. నా .. టో! చ చం సట _ 1 -! టి స్నా ళీ న మం? ఢా . ల = ల" _ శ! - ఈ ల ॥ శ ల || ళ్‌ ః ః న న్యా తఎ 'రెత్టుసృన్ల “అనగానే 'కవులందరికీ 'ఆశ 'పుట్లింది: 'అలతలోనే సన్మానం" అ వులం పుట్టింది. అల లౌంలటి(ల్య అతి | ర్త న చం మ హు . ఎం ॥ | జ న 1 ల ళన్యా . అద్‌ 1. ౦. ఓ ఓ తురదోనసేీ భయం కూడా పట్టుకుంది. లు గ

రాయలవారు వేసిన ప్రశ్న ఇది : ఒక వాక్యం ఉండాలి. అందులో అయిదు అక్షరాలు ఉండాలి. విడివిడిగా చూస్తే ఏ అక్షరానికా అక్షరానికి అర్ధం ఉండాలి. అది ఒకే అర్ధమై ఉండాలి. ఆ అయిదు అక్షరాలు అయిదు భాషలల్లో ఉండాలి. అన్ని అక్షరాలు కలిపి చదివితే మరొక అర్ధం రావాలి. సభలోని కవులందరికీ మతిపోయినట్టయింది. అక్షరానికో అర్ధం ఉంటుందా? ఇది చాలక అయిదు భాషలా? అంతా తికమకగా ఉంది ఎవ్వరికీ ఆలోచన రాలేదు. సరే, ఈ రోజు చెప్పలేకుంటే వారం రోజుల తర్వాత చెప్పండి అన్నాడు రాయలవారు. సభలో కవులందరూ వెళ్ళిపోయారు. రాత్రింబవళ్ళు దీన్ని గురించే ఆలోచించడం (ప్రారంభించారు. కవులంతా ఎక్కడెక్కడి గ్రంథాలూ తిరగేశారు. రకరకాల భాషల పండితుల్ని అడిగారు. తలలు పగలగొట్టుకున్నారు. అయినా జవాబు చిక్కడంలేదు. రామలింగడికి దీనికి జవాబు చెప్పి ఎలాగైనా సన్మానం కొట్టెయ్యాలని ఉంది. అతడు (ప్రతిక్షణం దీన్నే ఆలోచింపసాగాడు. ఎవరు ఏం మాట్లాడినా ప్రతి అక్షరాన్ని పరిశీలించసాగాడు. రాత్రంతా అదే ఆలోచనలో ఉన్నాడు. అసలు ఇంట్లో అయితే ఎవరో ఒకరు వచ్చి చెడగొడుతుంటారని పశువుల పాకలో మంచం వేసుకున్నాడు ఆలోచించసాగాడు. ఒక రోజు అర్ధరాత్రి కావచ్చింది. ఆ సమయంలో పాకలో ఒక ఆవు ఈనింది. ఆవుకు మంచి కోడెదూడ పుట్టింది. చూడ ముచ్చటగా ఉంది. రామలింగడు నంతోవషంతో తన బావ మరిదికి .

చెపుదామనుకున్నాడు. బావమరిది ఇంట్లో ఉంటే పిల్చి 'బావా! బావా! ఈనిందిరా” డు. ఆవు ౦దిరా' అన్నా! / ర గీ ళ్‌ న రామలింగడి బావమరిది మంచి నిద్రలో ఉన్నాడు. బావగారి అరుపులకు ఉన్నట్లుండి నిద్ర లేచాడు. నిద్ర మత్తులోనే కళ్ళు నలుపుకొంటూ 'ఎ ఆవ్‌రా బావా అన్నాడు. అంటే 'ఏ ఆవు ఈనిందిరా' అని అతని ఉద్దేశం. రామలింగడికి ఈ వాక్యంలో ఏదో తమాషా ఉన్నట్లనింపించింది. తనకి క్కావల్సింది ఇందులో దొరికిందనిపించిది. వాటిని మననం చెయ్యసాగాడు. ఇందులో అయిదు అక్షరాలున్నాయి. ఏ,ఆవ్‌, రా, బా, వా అనేవి ఈ అక్షరాలు. వీటిలో రామలింగడికి కావల్సినవి ఉన్నాయి. ఇంకేం? రామలింగడు పొద్యన్నే నిద్రలేచాడు. తొందరగా స్నానంగీనం తీర్చుకున్నాడు. హుషారుగా కొలువుకు బయళల్చేరాడు. కొలువు ఎప్పటిలాగే కిటకిటలాడుతోంది. 3

: .- రాయలవారు కవుల వైపు చూచాడు. “ ఈ, రోజైనా. జవాబు చెపుతారా? అందరూ సిద్ధమా?” అని ప్రశ్నించాడు. కవులెవ్వరూ ఉలకలేదు. పలకలేదు. రామలింగడు మాత్రం లేచి నిలబడ్డాడు. నేను జవాబు చెపుతానన్నాడు. “చమత్కారం చేసి సరిపెట్టడం గాదు, సరేనా? అన్నాడు రాయలవారు. “లేదు రాజా! అయిదు భాషల్నీ చిలికి. పారెశాను. అందులోంచి వెన్న తీశాను. చూస్తారుగా?” అస్నాడు, జనం, అందరూ “ఇతగాడు ఏం చమత్కారం చేసాడో” అని రామలింగడి వేపు చూస్తున్నారు. రామలింగడు మీ ప్రశ్నకు 'ఏఏ ఆవ్‌ రా బావా అనేది జవాబు అన్నాడు.అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. “ఇందులో ఏముంది? ఆవులు, బావలు తప్ప” అని గొణుక్కోసాగారు. , + రామలింగడు దానికి వివరణ ఇచ్చాడు. (౨. షి “బి కు మరాఠీ భాషలో 'రా అని అర్థం, " ప . . 'ఆవ్‌కు హిందీ భాషలో రా అని అర్ధం. _ ంం. ) ల (1 “రా కు తెలుగు భాషలో 'రా అని అర్ధం. న. “బా కు కన్నడభాషలో “రా అని అర్ధం. . ” .. " “వాకు తమిళ భాషలో 'రా అని అర్ధం: | అర్థం. అన్నిటినీ కలిపితే 'ఏ అవురా బావా' అని తెలుగులో అర్ధర ఉండ్‌నే ఉంది. రామలింగడి వివరణకు జనం, ఆనందంతో కొట్టిన - చప్పట్లతో సభ మారుమోగిందీ. రాయలవారికి కూడా పట్టరాని సంతోషం కలిగింది. తన కొలువులో ఇంతటి కవి పండితులున్నారని ఆయన మురిసిపోయాడు. రామలింగడిని ఘనంగా సన్మానించాడు. “2” -.2ఎ3 గఆడిట్టైడి గత

. మాట్లాడే చేప . ౧... “ఒక ఉళ్ళో ఒక బీదవాడుండేవాడు. ఒకరోజున వాడు చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఓ చిన్న అందమైన చేప ఆ బీదవాడికి దొరికింది. . అకస్మాత్తుగా చేవవిల్ల మానవ కంఠంతో మాట్లాడటం 7 మొదలుపెట్ట 9ది.- “చూడు అన్నయ్యా, నేను ఏదో ఆడుకొంటూ ఏమరిపోయి, నీకు దొరికిపోయాను... నా మీద దయ చూపించు. నన్ను మళ్ళీ నీళ్ళలో పారెయ్యి!” అని బతిమాలుకొంది. పేదవాడికి జాలేసి ఆ చేపని నీళ్ళల్లో పడేశాడు. ఇంకెప్పుడూ చేపలు పట్టకూడదనుకొన్నాడు.

చేపలు పట్టకుండా ఇంకేం చెయ్యాలో తెలియక విచారిస్తూ ఇంటి దారిపట్టాడు. అతడలా నడిచివోతుండగా, ఆకస్మాత్తుగా ఒక పెద్ద పిశాచం వాడికి కనిపించింది. ఆ పిశాచం ఒక చక్కని ఆవుని తోలుకు వస్తోంది. “నమస్కారం అన్నగారూ, ఏదో విచారంగా కనబడుతున్నారు?” = "అంది పిశాచం. పనివాడు తన కథంతా చెవ్పొడు. ఇక ఈ రోజు నుంచి

  • ఎలా బతకాలో తెలియడంలేదని వాపోయాడు. ౯ ౧. అపుడా పిశాచం, “చూడు నెస్తం, ఈ ఆవుని చూడు! ఈ ఆవుని _ మూడు సంవత్సరాలు నీ దగ్గర అట్టే పెట్టుకో! ప్రతి రోజూ ఈ ఆవు : కావలసినన్ని పాలు ఇస్తుంది. నీకూ, నీ భార్యకూ ఆకలి బాధ ఉండదు. .. అయితే ఒక షరతుంది.. మూడు సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను. సరియైన సమాధానాలు ఇవ్వగలిగావా, ఈ ఆవు నీదే. ఇవ్వలేకపోతే మాత్రం ' ఆవునీ, మిమ్మలిద్దర్నీ కూడా 15

తీసుకుపోతా ఏమంటావు?” అంది. “ఆకలితో మాదేకంటే ఆవుని తీసుకోవడమే మంచిది” అని పనివాడు అనుకొన్నాడు. పిశాచం చెప్పిన షరతుకి ఒప్పుకొని ఆవుని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. - మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. పిశాచం ఇచ్చిన గడువు సమయం దగ్గర పడింది. చివరిరోజు ఒక చక్కని అందమైన యువడొకడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. లో | ఆ స్తే ంయో “నేను. చాలా అలసిపోయి ఉన్నాను. చీకటి పడిపోతోంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండటానికి అనుమతినివ్వండి” అని అడిగాడు. “మాకేమీ అభ్యంతరం లేదుకాని, నీకే ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాం. మూడేళ్ళకు ముందు మేమో పిశాచం దగ్గర ఒక ఆవును తీసుకొన్నాం. ఆ ఆవుతో ఇన్నాళ్ళూ సుఖంగా బతికాం. కాని పిశాచం పెట్టిన షరతు ప్రకారం మూడేళ్ళ తరువాత అది వచ్చి కొన్ని ప్రశ్నలడుగుతుందట. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే ఆవు మాదే! చెప్పలేకపోతే ఆవుతో బాటు మమ్మల్నీ ఆ పిశాచం తీసుకెళ్ళి పోతుంది”. అన్నారు దంపతులు. 16

“అంతేకదా! నన్ను ఈ పూట మీతో బాటు ఉండనివ్వండి. పిశాచం అడిగే ప్రశ్నలకు వీలైతే నేనే సమాధానం ఇస్తాను”. అన్నాడు ఆ యువకుడు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి పిశాచం తలుపుతట్టింది.

“మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానాలు కావాలి అంది.

“నీ ప్రశ్నేదో అడుగు. సమాధానం చెబుతాను” అన్నాడు కొత్తగా వచ్చిన యువకుడు.

పిశాచం కొత్త గొంతు విని “నువ్వెక్కడ నుంచి వచ్చావు?” అని అదిగింది.

“సముద్రంలో నుంచి”

“ఇక్కడికెలా వచ్చావు”

“కుంటి ఈగనెక్కి”

“అయితే సముద్రం చాలా చిన్నదన్నమాట”

.._ “క్రాదు ఒక డేగ కూడా సముద్రానికి ఈ పక్కనుంచి ఆ పక్కకి ఎగరలేదు”.

“అయితే ఆ డేగ ఏమీ చేతగాని పిట్టన్నమాట”

“ఎంత మాత్రం కాదు. దాని రెక్కల నీడ ఒక మహానగరాన్ని కప్పగలదు”.

“అయితే ఆ పట్టణం చాలా చిన్నదన్నమాట.”

1/7

_.. “కాదు ఒక కుందేలు కూడా ఆ పట్టణానికి ఈ, మూల నుంచి ఆ మూలకి పరుగెత్తలేదు.” . . ..

“అయితే ఆ కుందేలు చాలా చిన్నదయి ఉండాలి.” స. .,. “ఎంత మాత్రం కాదు. దాని చర్మం ఒక మనిషి బొచ్చు కోటుకీ, అతని చెవు ల్లో పడదు”. రర వ చటం

“కాదు ఎక్కడో పర్వతాల్లో లేడి గడ్డి కొరికితే ఆ శబ్దం అతనికి వినబడుతుంది”. .

ఈ సమాధానాలు విన్న పిశాచానికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక పైన ఏమి అడగడానికి దానికి తోచలేదు. తలుపు"దగ్గర' కొంతసేపు నిశ్శబ్దంగా నిలుచుని చీకట్లోకి మాయమయ్యుంది. ౨.

. 'బీదవాడూ! “భార్యా చాలా"సంతోషించారు. ' తెలతెలవారుతూ ఉండగా ఆ యువకుడు పేద దంపతుల దగ్గర సెలవు తీసుకొంటూ “అయ్యా! నేనెవరో నువ్వు గుర్తుపట్టలేదు కదూ? 'ఆ రోజు' నువ్వు జాలిపడి నదిలో వేశసీన మాట్లాడే చేపనే నేను” అన్నాడు. ఆ దంపతులు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఆ యువకుడు అదృశ్యం అయ్యాడు. ”. గ (రష్యన్‌ జానపద కథ .అనువాదం : పి. చిరంజీవిని కుమారి)

18

రతు కొడుకులు యా అనగనగా ఒక రైతు, ఆ రైతుకు ముగ్గురు కొడుకులు. పేరుకు రైతే గానీ పాపం ఆయనకు పొలంలో ఏమీ పండేది గాదు. ఎప్పుడూ _పస్తులతోనే గడిచేది. అయితేనేం కొడుకులు చాలా తెలివిగలవారు. రైతు ముసలివాడైపొయ్యాడు. నాయనలారా! మీరు రాజు'దగ్గరికి పొండి. మీ తెలివితేటలు చూపించి కొలువులో ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని బతకండి” అని చెప్పి చనిపొయ్యాడు. చక న్‌ సడే కకం ళ్‌ కట నా (తాం, 1, ర ముం ఉన? క్ల ాయుళడు రైతు కొడుకులు తండ్రి మాట ప్రకారం రాజధానికి బయలుదేరారు. . ఆరోజుల్లో రైళ్ళూ, బస్సులూ లేవుగా. అందువల్ల కాలినడకనే ప్రయాణం సాగిస్తున్నారు. రైతు కొడుకులు దారిలో ప్రతిదాన్నీ గమనిస్తూ నడుస్తున్నారు. ఇలా నడుస్తుంటే వాళ్ళకి ఒక వ్యాపారి ఎదురయ్యాడు. “అయ్యా మీకు దార్లో ఎక్కడైనా గుర్రం కన్పించిందా నా గుర్రం పొయ్యింది” అని అడిగాడు. 19

మొదటి కొడుకు “గుర్రం ఈ దారినే పొయ్యింది” అన్నాడు. రెండో వాడు “ఆ గుర్రానికి కుడికన్ను గుడ్డిది కదూ” అన్నాడు. మూడో వాడు “ఆ గుర్రం మీద ఓ పిల్లవాడు కూచుని వున్నాడు. గదండీ” అన్నాడు.

వ్యావారికి పట్టరాని సంతోషం కల్టింది. “ఎంత మంచి సంగతి చెప్పారు బాబూ! గుర్రాన్ని ఎక్కడ చూశారు” అని ఆత్రుతతో అడిగాడు.

“అబ్బే! మేం గుర్రం చూడనే లేదండీ” అన్నారు, ముగ్గురన్నదమ్ములూ.

“గుర్రాన్ని చూడనే లేదా? అయితే అది ఈ దారిన పొయ్యిందనీ, దాని కుడికన్ను గుడ్డిదనీ, దాని మీద పిల్లాడు వున్నాడనీ ఎలా చెప్పారు?” అని కోపంగా అడిగాడు వ్యాపారి.

“అది మా తెలివితేటలతో చెప్పాం” అని జవాబిచ్చారు రైతు కొదుకులు.

వ్యాపారికి వొళ్ళు మండిపొయ్యింది. “ఓహో! తెలివితో చెప్పారా? చూస్తే మీరే నా గుర్రాన్ని దొంగిలించినట్టుంది. పదండి రాజు దగ్గరికి' అని దబాయించాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళి సంగతంతా చెప్పాడు.

“ఏం మీరు గుర్రాన్ని దొంగిలించారా?” అని అడిగాడు రాజు.

“లేదు మహారాజా! మేం దాన్ని చూడనేలేదు. మా తెలివి తేటలతో చెప్పాము అంతే” అని దండం పెడుతూ చెప్పారు అన్నదమ్ములు.

2౦

“తెలివితో చెప్పారా? ఎలా చెప్పారు? నిజం చెప్పండి. లేకుంటే శిక్ష తప్పదు” అని హుంకరించాడు రాజు.

“రాజా! దాని అడుగుల గుర్తుల్ని బట్టి అది గుర్రమనీ, ఆ దారిలో వెళ్ళిందనీ గుర్తించి చెప్పా” అన్నాడు మొదటివాడు.

“మహారాజా! దార్లో ఎడంవైపు మొక్కలూ, చెట్టూ ఏదో జంతువు మేసినట్టుంది. కుడివైపు ఎక్కడా మెయ్యలేదు. అందువల్ల దానికి కుడికన్ను గుడ్డిదని కనిపెట్టాం” అన్నాడు రెండోవాడు.

“ప్రభూ! దారిలో ఒక మడుగు వుంది. దాని దగ్గర గుర్రం అడుగులు, చిన్నపిల్లవాడి అడుగులు కనబడ్డాయి. వాళ్ళు దాంట్లో నీళ్ళు తాగినట్టుంది. దీన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడున్నాడని వూహించా అన్నాడు మూడోవాడు.

రాజు వాళ్ళ తెలివికి విస్తుపొయ్యాడు. అయినా ఇంకో పరీక్ష పెట్టాలన్తుకొన్నాడు. భటులకు సైగచేసి వదో చెప్పాడు. కొంతసేపటికి వాళ్ళు ఒక పెట్టెను మోసుకొచ్చారు.

“ఈ పెట్టెలో ఏముందో చెప్పండి. అప్పుడు గానీ మీ మాటల్ని నమ్మను” అని సవాలు విసిరాడు రాజు. సభలో వున్నవారంతా “వీళ్ళేం చెపుతారా?” అని కళ్ళప్పగించి చూడసాగారు.

“రాజా! పెట్టెలో తేలికైనవి వున్నాయి” అన్నాడు మొదటివాడు. “ప్రభూ! అవి గుండ్రటివిి అన్నాడు రెండోవాడు. “మహారాజా! అవి మామిడికాయలు” అన్నాడు మూడోవాడు.

( 21

వాళ్ళు చెప్పింది సరిగ్గా సరిపొయ్యింది. రాజు క్కూడా "ఎంత అద్భుతం” అన్పించింది. “ఎలా చెప్పారు అని వాళ్ళనడిగాడు.

“భటులు తేలిగ్గా మొయ్యడాన్ని బట్టి అవి తేలికైనవని గుర్తించా” ;న్నాడు మొదటివాడు. పెట్టెలో అటూ ఇటూ దొర్లుతుండడంబట్టి అవి ండ్రనివని చెపా' అన్నాడు రెండోవాడు. “ఏముంది రాజా! భటులు తూర్పు ంక్రిలి నుంచి పెట్టెను తెచ్చారు. ఆ వైపు మామిడితోపు వుంది. ఇదీ ;0డాకాలం. ఇప్పుడు కాచేది మామీడికాయలేగా! అందువల్ల చెప్పగలిగా'

రాజుకు రైతు కొడుకుల తెలివితేటలు ఎంతో ముచ్చటేశాయి. 'మరి ఘగ్రాన్ని మీరెలా గుర్తించారో వ్యాపారికెందుకు చెప్పలేదు?” అని

ప్రశ్నించాడు.

“రాజా! మేం చెప్పలేదు. కాబట్టే వ్యాపారి మమ్మల్ని మీ కొలువుకు తీసుకొచ్చాడు. తమ దర్శనం సులభంగా దొరికింది. లేకుంటే ఈ పల్లెటూరి రైతు బిడ్డలకి మీ కొలువులోకి (పవేళశం దారికేదా? మీతో మాట్లాడగలిగేవాళ్ళమా?” అని రైతు కొడుకులు వినయంగా చెప్పారు.

రాజుగార్మి వాళ్ళ తెలివితేటలు తెలిసొచ్చాయి. ఎంతో ముచ్చటేశాయి కూడా. అలాంటి వాళ్ళు తన కొలువులో తప్పకుండా వుండాలని ముగ్గురికి మంచి కానుకలిచ్చాడు. ఉద్యోగాలిచ్చాడు. అంత తెలివిగల వాళ్ళని తన దగ్గరికి తెచ్చినందుకు వ్యావారి క్కూడా కానుకలిచ్చాడు.

శశ ఈ 22

కుక్కకాటుకు చెప్పు దెబ్ల బెం

అనగనగా ఒక ఊళ్లో ఇద్దరన్నముబుఐడేవారు. వాళ్లు పాపం చలా బీదవాళ్ళు. కుటుంబాన్ని ఎలా పోషించటమా అని ఆలోచించి, ఆలోచించి అన్న ఎవరైనా పెద్ద భూ కామందు యింట్లో పనిచేసి కుటుంబానికి దబ్బు పంవాలని నిర్ణయం చేసుకున్నాడు. అన్న పై ఊరిలో ఒక ధనికుడి దగ్గరకు పనికోసం వెళ్ళాడు.

ఆ ధనికుడు.పని యివ్వడానికి వొప్పుకున్నాడు. పనివాడతని వద్ద వసంతకాలం వచ్చేదాకా పనిచెయ్యాలి. అంటే మొదటి కోకిల కూత వినబదేదాకా పనిలో ఉందాలన్నమాట. అయితే ధనికుదొక షరతు పెట్టాడు. “మనలో ఎవరికైనా రెందవ వాని మీద కోపం వస్తే మాత్రం వాడు జరిమానా చెల్లించాలి. నాకు నీ మీద కోపం వస్తేనేను నీకు వెయ్యి రూపాయలిస్తాను. నీకు నా మీద కోపం వచ్చినా అంతే” అన్నాడు.

“మరి నా దగ్గర డబ్బు లేదే” అన్నాడు పనివాడు.

“పర్వాలేదులే. నువ్వు గనక అలా కోపం తెచ్చుకుంటే డబ్బుకి బదులు ఒక పది సంవత్సరాలు జీతంలేకుందడా పనిచెయ్యి” అని చెప్పాడు యజమాని.

పనివాడు మొదట ఈ షరతుకి వొప్పుకోకూడదనుకున్నాడు. మళ్లీ ఆలోచించి “నెను నిగ్రహించుకోగలను కాని యజమానికి కోపం వస్తే వెయ్యి రూపాయిలిస్తాడు కదా! నాకేం నష్టం లేదు” అనుకుని పనిలో. కుదిరాడు.

మరునాడు పొద్నన్నే యజమాని పనివాణ్శి పొలంలోకి పంపించాడు.

23

“కొడవలి తీసుకుని, వెలుతురున్నంత వరకు గడ్డి కొయ్యి” అని చెవాడు. పనివాడు రోజంతా పనిచేసి అలసిపోయి, సాయంత్రం ఇంటికి వచ్చాడు.

“ఇంత వేగంగా యింటికి వచ్చేశావం?” అన్నాడు యజమాని.

“అదేమిటండీ! పొద్దుపోయింది కదా వచ్చేశాను” అన్నాడు పనివాడు.

“అయితే మాత్రం? వెలుతురున్నంత సేపూ పని చెయ్యాలన్నాను కదా? సూర్యుడు వెళ్లిపోతే చంద్రుడు రాడూ? పనికి సరిపోయేటంత వెలుతురు ఉంది కదా?”

“అయితే నాకు యింక నిద్ర అక్కర లేదంటారా?”

“అదిగో నీకు కోపం వచ్చేస్తోంది.”

వెంటనే పనివాడు సర్దుకొని “క్రోవం కాదండి. కొంచెం అలసిపోయాను. అంతే. విశాంతి తీసుకుని మళ్ళీ పొలంలోకి వెడతాను” అన్నాడు. అతడా రాత్రంతా పనిచేశాడు. అయితే చంద్రుడు వెళ్లిపోగానే మళ్ళీ సూర్యుడు వచ్చేడు. పాపం వాడికి ఎంతో అలసట వచ్చింది. బొత్తిగా నీరసించిపోయి యాజమానిని తిట్టుకోవడం మొదలెట్టాడు.

“నీ పొలమూ, నీ పనీ, నీ డబ్బూ అన్నీ మండినట్టే ఉన్నాయి అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి యజమాని వాడి దగ్గరకు వచ్చి “స్యద్రే నీకు కోపం వచ్చింది. మన ఒప్పందం మర్చిపోకు. ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలైనా ఇయ్యి లేదా పది సంవత్సరాలైనా నా దగ్గర పనిచెయ్యి” అన్నాడు. పనివాడికేం చెయ్యాలో తెలియలేదు. అతని దగ్గర డబ్బు లేదు. అలాగని యిటువంటి యజమాని దగ్గరి పది సంవత్సరాలు పని చెయ్యలేడు. చివరికి వెయ్యి రూవాయలకి ఒక కాగితం రాసి యాజమాని కిచ్చాడు.

24

ఖాళీ చేతులతో యింటికి చక్కావచ్చాడు. దిగాలు పడుతున్న అన్న ముఖం చూసి తమ్ముడు ఏం జరిగింది అని అడిగాడు. జరిగిన కథ అన్న చెప్పాడు.

తమ్ముడు బయలుదేరి అన్నగారు పనిచేసిన యజమాని దగ్గరకి వెళ్లి తనను పనిలో పెట్టుకోమని అడిగాడు. యజమాని పూర్వపు షరతు మళ్ళీ పెట్టాడు. పనివాడికి కోపం వస్తే యజమానికి వెయ్యి రూపాలివ్వాలి. లేకపోతే పది సంవత్సరాలుజీతం లేకుండా పనైనా చెయ్యాలి. యజమానికి కోపం వస్తే పనివాడికి వెయ్యి రూపాయలిచ్చి వాణ్ని స్వతంత్రంగా పోనివ్వాలి. అన్నీ మామూలుగా జరిగేటట్లయితే పని వాడు మొదటి కోయిల కూసేదాకా పనిచెయ్యాలి.

“అబ్బే యివేం షరతులండీ?” అన్నాడు పనివాడు. 'వెయ్యి రూపాయలుకాదు. మీకు కోపం వస్తే రెండు వేలు పెట్టాలి. నాకు కోపం వస్తే రెండువేల రూపాయలైనా యిస్తాను. లేదా ఇరవై సంవత్సరాలు మీ దగ్గర పనిచేస్తాను.” అన్నాడు.

యజమాని మరింత సంతోషం కలిగి “సరే ఒప్పేసుకున్నాను” అని పనిలో పెట్టుకున్నాడు తమ్ముణ్ణి. ఆ మరునాడు ఉదయం సూర్యుడు బాగా నెత్తిమీదికి వచ్చాడు. పనివాడు యింకా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. “లే! లే! యింకా పడుకున్నావేమిటి? పొద్దెక్కిపోయింది” “ఇంకా పనిలోకి వెళ్లలేదేం?” అన్నాడు యజమాని. పని వాడు కళ్లు తెరచి “మీకు కోపం వచ్చిందా?” అన్నాడు.

“అహ! కోపం లేదు. ఊరకనే - పనిలోకి వెళ్లే సమయం అయింది. పొలానికి కోతకి వెళ్లాలి. అని గుర్తు చేస్తున్నానంతే” అన్నాడు, యజమాని.

“దానికింకా సమయం ఉందిలెండి” అన్నాడు పనివాడు బద్ధకంగా. “చివరికి ఎలాగో ఒక లాగ లేచి తీరుబడిగా జోళ్లు తొడుక్కుంటున్నాడు పనివాడు. యజమాని “కొంచెం తొందరగా బయలుదేరలేవూ?” అన్నాడు.

25

మీకు కోపం వచ్చేస్తోంది” అన్నాడు పనివాడు.

“లేదు, లేదు, నువ్వు ఆలస్యం చేస్తున్నావంటున్నాను.”

“అలాగా, కాని మన ఒప్పందం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి.”

పనివాడు తయారై పొలంలోకి వెళ్లే సరికి మిట్ట మధ్యాహ్నం అయింది.

“ఇంక యిప్పుడు పనిచేయడం ఏమిటి? అంతా భోజనాలు చేస్తున్నారు. మనం కూడా అన్నం తిందాం” అని పనివాడు తీరుబడిగా యజమానితో కలిసి భోజనం ముగించాడు. అన్నం తిన్న తర్వాత యు

“చూడండి - నేను కష్టపడి పనిచేసేవాణ్ణి. అంచేత అన్నం తినగానే నాకు కొంచెం విశ్రాంతి కావాలి. అప్పుడు గాని నాకు బలం ఉండదు” అంటూ పని వాడు నిద్రపోయాడు. అలా సాయంత్రం దాకా నిద్రపోతూనే యజమాని అతణ్ని చూసి “ఏయ్‌. యీ నిద్ర ఏమిటి? సిగ్గులేదూ నీకు? ఇరుగుపొరుగు వాళ్లంతా పొలంకోత పూర్తి చేశారు. మనం పొలం

26

మీద చెయ్యైనా వెయ్యలేదు. ఎంత గొప్ప పనివాడివి నువ్వు” అని విసుక్కున్నాడు. పనివాడు తలెత్తి చూసి “అయితే మీకు నిజంగానే కోపం వచ్చినట్లు కనబడుతోంది” అన్నాడు. యజమాని బెదరిపోయి *ఏం కోపం లేదు. ఇకళ్లకి వెళ్లే సమయం అయిందంటున్నాను” అన్నాడు. “అయితే పదండి యింటికి పోదాం” అన్నాడు. వాళ్లింటికి వచ్చేసరికి యింట్లో యజమాని తాలూకు చుట్టాలు వచ్చి ఉన్నారు. చుట్టాలకి విందు చెయ్యడానికి గొ(రైనొకదానిని చంపి పట్టుకురమ్మని యజమాని పనివాడితో చెప్పాడు. “ఏ గొరైను చంపను?” అని అడిగాడు ,పనివాడు. -. “చేతికి ఏది దొరికితే దాన్ని చంపు” “సరే” అని పనివాడు వెళ్లిపోయాడు. కొంచెం సేపటికి. ఇరుగుపొరుగు వాళ్ళు కేకలు పెట్టుకుంటూ యజమాని దగ్గరకు వచ్చారు. “ఏమండోయ్‌! మీ పనివాడికి పిచ్చెత్తినట్టుంది. గొర్రెలన్నిటినీ చంపి పారేస్తున్నాడు” అన్నారు. యజమాని పరుగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి ఏముంది, పనివాడు గొర్రెలన్నిటినీ నరికి పోగులెట్టేసాడు. 'ఎంత పని చేశావురా! దౌర్భాగ్యుడా!! నన్ను నాశనం చేసేశావు. నా ఉసురు నీకు కొట్టకుండా ఉండదు” అని ధనికుడు తిట్టాడు. “మరి చేతి కందిన గొరైను చంపమని మీరే అన్నారు కదా! అన్నీ చేతికందాయి. చంపేశాను. అయితే మీకు కోపం వచ్చినట్లేనా?” అన్నాడు. .. “లేదు - లేదు, నా గొరైల నన్నిటినీ చంపేశావు అని ఏడుస్తున్నానంతే” అన్నాడు యజమాని. . 27

“సరే మీకు కోపం రాకపోతే మీ దగ్గర యిలా పనిచేస్తూ ఉండివోతాను” అన్నాడు పనివాడు. తరువాత కొన్ని నెలలు పనివాడు ఆ ధనికుని వద్ద పనిచేసేసరికి యజమానికి తల తిరగేంతపనయ్యింది. వాడి ఎత్తులు భరించలేక చివరికి వాణ్ని పనిలోంచి వెళ్లగొట్టడానికి నిశ్చయించుకున్నాడు. కాని ఒప్పందం ప్రకారం మొదటి కోకిల కూత కూసే వరకు ఉండాలి కదా! చలి కాలం ఇప్పుడే (ప్రారంభం అయింది. వసంతం యిప్పుడప్పుడే రాదు. కోకిలలు అప్పుటి దాకా కుయ్యవు. అంచేత ఆ యజమాని ఒక పన్నాగం పన్నాడు. తన భార్యను అడివిలో చెట్లలోకి తీసుకువెళ్లి, ఒక చెట్టు తొర్రలో కూర్చోబెట్టి_కోకిల కూసినట్లు కుయ్యమన్నాడు. తను ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా వాళ్ళూ అక్కడికి వచ్చెసరికి యజమాని భార్య కోకిల లాగ కూ-కూ అని అరిచింది. యజమాని “శృఖం, మొదటి కోకిల కూసింది. నువ్వింక స్వేచ్చగా వెళ్లవచ్చు” అన్నాడు. పనివాడు యిందులో ఏదో గమ్మత్తు ఉందని పసిగట్టాడు.

'లేదు చలికాలం యింకా మొదలైనా పెట్టకుండా కోకిల కూత ఏమిటి? ఇది చాల గమ్మత్తు కోకిల లాగుంది. ఎలాగూ వేటకి వచ్చాం కదా. దీన్ని చంపి పట్టుకుందాం ఉండండి” అని తువాకి యజమాని భార్య దాగున్న చెట్టువైపుకు గురిపెట్టాడు. వెంటనే యజమాని పనివాడి మీద పడి “ఓరి దుర్మార్డుడా! నీ దౌర్దన్యం యింక నేను సహించలేను” అని

వాడితో కుస్తీ పట్టి చేతుల్లో తుపాకీ లాక్కున్నాడు.

“ఇప్పుడు మీకు నిజంగానే కోపం వచ్చింది” అన్నాడు పనివాడు.

“అవును. నాకు వళ్ళు మండిపోతోందిరా! నీ రెందు వేల రూపాయలు నికిచ్చెస్తాను. వెంటనే మా యిల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఎవరు తీసిన గోతిలో వాడే పడతాడన్న సామెత అర్ధమై నాకు బాగా బుద్ధి వచ్చింది”. అన్నాడు.

అన్న అప్పు తీర్చి, ఒక వేయి రూపాయలు చక్కగా చేతిలో వేసుకుని తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు.

( 28

ణి ణి

టఫ్‌ ఫ్‌

“/ ౧షఫీం[ ౧251

బడిలో అప్పుడే చెరిన వాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు చదవగలరా?వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాసారా? ఇప్పుడివన్నీ అర్ధంలేని ప్రశ్నలు. పిల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు పలకల్ని, బలవాల్ని అరగదియ్య పన్లదు. గుడ్డి కంఠసాలు, ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లదు. అసలు మనం నెత్తి మీద కూచుని భాష నేర్పనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష నేర్చుకోడానికి ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు నాలుగు గ్రేడ్ద, 50 పుస్తకాల సీరీస్‌లోవి. ఇది 1-2 తరగతుల పిల్లలకోసం.

జనవిజ్ఞాన కన

మవసు ఫౌండేషన్‌

4 గ మ రా గ[థె | సం తననన

సే 10 6

పేజీలుపరిచూపివది | గో యయ కం __బైండింగుచేపిపది. | అననని ననన చై ము న నన