Telugu పాము కాటుకు నాటు వైద్యమా నేటి వైద్యమా - anilvaranasi/indianlanguages GitHub Wiki
న ఎన్నా | ళి శ క క కై థి ం ళ్ళ ౪9 క | అ అక వా రడ లా లో శా లతో (అనుభవాలు జూ గుణపాఠాలు) ॥ + క. లం క్ లే | కా అనా , రా. క _ . - క) లో. మ స ని . .. , టు వ 7 చా " ॥ న . ళీ ॥ ఉపా కేం 1? | నక ః ( స - నక +] ॥. | సల , , . గీ జస" మ్య ఇతే కా - . -! న క . , న వ . న ల్లీ ( ౯ సు సా . నో | ా ౯ జె ణా | కి ల , | న! . ॥ శ వ్ | వ జం ఖతి త గ ॥ వా స న. | గో జో గ గ్ ౯ నా | లా శా ॥ ] య న శే భమ ఫలాన తా అననడ టలు! జ్ త. ల | శ బు ట్ (= క ల | భె , ఇట్ ం లచ్చా $ ఎక్ట,న శ్. '__ ళా ణీ ఫే ఊప తాజా వం త్ అ | ఇ న మల క్ హ్ న న్ వఫెత్రపా జూ?! [మాం న | న ర. వ. ఆ ఎరా క న = జాడలు - ౯ క హాడ్. వాతా ఎ సస గ ప వోన్ న ఆ మే ॥ ణ్ & | ఆన లని న న అన్. శల " | [2 వ న | | నా! త క్ కోకా జి నానా! గ్ ననన. 1 కినమ్‌ని పం లాలు చెప్యునా గ్‌ా ఎ అ నీ | న ౭ జ గ శా అంట అ న యా ఇ || కం ల సహా శ జ 1|క్ళా క్ శ ॥ ఇ ౨ జు -7 4 శే తా శ్వ శి 2 అన గ్! ఖ్ ॥ న్ అక శేదా నా క న్స ఇ లేం న వ అవా క | టు టి చీ ఆ... కాట్లు వ్యూ! క్ నః లా న క శే. అ ఖ ఇ క క తతా సాం కాను క్ ఎట! 7 ట్వి ర ఉంగా కోనెతన.నం- డా న! జె ఇ యం. ం మం కా అం రం! ర ర లం గ న మ వయం క న. వ్ ల త - వ క న మి యు ఉనకనా ౯ శ వళ ళ్ జా, తు శో త. కాజ మ్ కట. ఇక న న చు ణ్ ల వ. లే. “మి అణా లా క | ల. నాలు కన అ జరి అజ / ” " క్ " ఆ శ ( ఇ ” శం: య్ ్య ఇ క! [క
- " రె - టి. వానా మం " న. అను క ' 1 ః ! " లే అ శ క ॥ తలే నాన్ క్ . 4 ॥ = ఓ ఫు ( ఇ శ్ పం న్ ర్ మ న్ మా క్‌ి ల త. షల న . | (= ఇ. ఠి ణ్ శి 1 ] న! ల అం | జూ క టి | 4 ఇ 4 తి కా ఇక కీ | 4 శ్! వ య ఒం “మాతు లె ః క్ నే ల్ _ శ లం + 4కు లో వం. పాతు ( త్. తో వ. | త లి "ఈ '' వ్ అం. ఆ న! ఆ 7 క 1 గా 1.” ॥ న. పీ శ క. శ చా ఫె క క |, అణు బీ కః - | జ "కర "క . ఉ జా ఇ న న జ ఆఅ ఆ ఇ ఆ ల అణ అం ₹ కా గ న! హా. వ్ "| ల్ శ న శ జ | యా జు సే వ జు గ్ , - 14లో జు రీ . ం సై జీ. అ క న మ టకం క క ॥ “అనాన్ను ” పీ వ. శ ౩ “౨ ఒ. యదు ' న 2 కీ" యా జన్య! జ్య ణి ఉడా ( లా | లా ళ్ క జ స. ళ లు జ - _ స శె య న వై / . క శ. న్వు! యు వా 1 కై అగ టి ల? ఇ బా 1 న్‌ు ॥ | లు , [౯ న్ ఈ శా ల. ర శ క్ట ః , 1; ఓ | కీ నా! క లై క ల ప జే ఉత న క లు వ నత ఆ ఫే. క ॥
- న! ” (| , అ ఇ | జే క శో | |. "౧ . . క | - | జ క వవ్ గ్ ఇ శ - ॥ _ 7 న. ో | ఏ4 ధో శ - ఎ = . [ ల? " శం . వ. = న. | " న్న్న జః ఎ ఓ కా జా శా ర్ లీ భ్" లం. క్ ఫే సం. శ [1 నో స్ట వీ ఒం - శ్ క్ న్ జ న - ళా || ల + క ॥ -శే [| గగ పళ బో శ క ( క” =," 2 ం"€ | క, , జాన /" / | బం ॥ | ॥ శ _ ల! జ | న = | "| “41 ఇ | . న. / శ ల / క ” ఖై క్ష "+ వ్. ల! ల! ్న్నా “ థీ, థి గే ( జ య లి | | ణి - / , ॥ . ం ్ న | 1 8 ॥| . | 0. శ్ ళీ | " | లీ చ [1 4 వ. " | ప! ఎక్ | నా శే ఖీ ' 2 శ శ శ 1 నాకనా | లలి ( లు కొ, సా తొ + ఈ హా ॥ జా లి ఉం (| ల 4. , ఆస జె - తకు” ॥ వ్ షే . ॥ లి.” = న ళీ ళ్ య. శ్ యం జు | ఏచి స సై ఇ ళా + న | ళ్ , = | ఆం జర్ స నాం న | కి వ కి | | గ్ ః "44 స ॥ ౨ శ్లో ః . . బ్ ఆస వ. | . ॥ ॥ | జి | అ | నా ల /| ॥ 1. ॥ శ వ 1 _ ళీ 2 ఎ శ. శ + యో ం ప జి ఖ ఫి ళీ" టు "! ( | అళ్ళటో టం క ( ళీ ' న. . కె | ఎ 7 + ఛ్ జ || ళ్ ॥ శ శ . జ ః “ వ ఎ? గ శ్ర న్నా. ' ॥ వ టు... త = “టల = ౯ం , ఫో, శి ఇ ఆః న. న. క క ఇ లం టై!!! | |! లీ టే. - 1 షి స క క జ ట్ల. ఈ, ర. న 43 . - . / జ /| గా - . ఇషు కొ వో క కీ ఛీ న గ్. . న. | శ . శ శ టీ ” శు. 4 శి జ | శా ళ ల 4 లీ | మ 14 . న || ల” షు, ళా . శ (ఖ్న ఈ తా "తి ఈ "తీ [ . నం. ఎ ! క్ , | . తీ ల ఖని క శా శ గ్ ళ్ లం. ఇకిచీగ నంట 4 న్ . ఇ ళా , లో టీ! ఇ స తళ న్ ॥
- త 2 ఖ్. త్ - న తు ఈ జీ. బ్ | త | జ్ || వో ఆ స | ట్” తో శ్ జ్ క గ లో క్ష | ఫ్ |. ళ్శే . త స = ల ఏ న భా ? లో - జ ళ్ క్ న యా =ై 1 తా న. క్ ” 1 ం వ శ ఆ 1 . ఓ ! వ శ్ జ కా | | ' క! టీ త్త | ఖగ ల ఒ క్ట తా” ఇం | సె న. ఖ్ అ క వాతి ం రల చా న్ జే ర. .. న్న " గ్ " - . క్ ల! త _్ | ణీ ॥ టో , ి ॥ మ్ ల సట జా టహమలా లు. మా” గ మాన్ ఇ ట్ర జ క! లి 1 "4 లీ " నా 8!!! , " ః. తా . * జ క + | ం చ గ సాఫ్ర ॥ . | భూ, “కొం . | . తటే = క్ట ల లీల || / కో ః. గ ంం. = , శి ॥ కి ,. లీ ళా | జ కి = థ్ , _ . | లే . క తీ టం =" / ॥ ఆ | ణి ల |. శ | క్ క్ | ల ॥ ఇ, ం , ' చి .. _ | వ. 1 టీ , న. ల ॥ టే + _ ః ఈ. ఏ వి ట్ నా జీ [1] గ్గ క్ , శా గ. , స ఠా అ | ఆం నా జె శ జ క్ట ల లీ ల కో; న! క శ , ॥ క | బ్ | ॥ 4 ॥ | | ॥ ॥ లు గ్ ॥ ॥ ళ్ళి త్యం ల | | ॥ న = న మా ! ఉ , + / న. న. శం ఇ గిపుద్యాలోలాం క ఆ ల్ | గ్‌ా గ్‌ా! ౯ | జ | క్ సై | | 1 , టక. _ |. . ఇ క. “ఖు ల పా ॥ న. తా | న ఓ శ . . | క్ష క్ట శ్ ఖీ న్‌్ న్ | , శ జే క వ , _ _ అ న్ ల న వ వత తా ॥ జి న్‌ా ఇ స వ = | త ల _ నా న _ ళో చి _ / స్తే ణో శ ల క ఇ జ న _ జూ ఇ ॥ ॥ యే. క ॥ యా 4 జ జా | శీ 1 ॥ ఎకి త ॥ కో టై (సు . . 1 కీజా మై న | _ | ఈ ఊఉ అ శ . ఇ ం = న “|| . వజ జ ॥ . 41, | ॥| ల ; త్తం. . ౪ లా . . క్ వ... ఖై ,. జ అ 72 1. | తీ, వా క ఇ వ. ళ్ జ | సే. ఎ శిల. 1 ౮ - | ఇ . చే"! య క. బా ఉట జా మ క. | వ. శె ఇ క ళీ జు 4 న వ్ . ల శ ఉం శ గ " . - 4 న " ళ్ ఇ , గ్ జో న న గ్ సా ఖు క గ న ఇ స ఇ ల శీ | ॥ ఎ క ! | చా క్ | ప. జ షి షి. ఆ బై గి ఇ క్ట క లో - శ . * సాజ్ స్టే + ( _ క. క్ కి | [ల " జి | జ మ టా. హ్ ఇష్హ్ ౯ "ళా ఇఇ ఆ ౨ స్త. లం | లి. = క్ [5 న్ పై = . | 4 వ ” టీ " న 4 ర ప లో క [* ( జ్ 4 =) ( |. (| య ఇ " ” = ఇ ఇ 17 వం అ కల” షః ఖా టట మెల అయ కా. ర. 1 లిం క్. డే య
- న. జీ ” శ్” ష్ ః బి = , శ గా , వా | పం! న. ॥ . శ్వాశ / | హా. = ఓ ॥ ం 1౯ | . 1 శ క్ క్ ణః ఠి | ం, క్కు న ॥ శ , ను. న్ ; టం | తక , శ త్య బ్ నా + ఆ ఇళ జః మా లీ ॥ ం 7 | ॥ _ | - త + వ. ఆ జ శ , ్టః ం | ఎ సు . | 1. _ ఇ లు! 1 య అ ఇ న ఆజ్ న క ॥ జూ | శ -” ఇ /. ( (. ॥ - చేల ్ + వే " శా వై ౯! నా! చియమొలా్యా న్ అన్నా జొ నాం క శకి ౯ ౬ స యచన ప కం తీ మా! దార్. శాఖే శణార 2 రజా! 2 అం నా అః ట్; లా కా ఊనాల లా వాపీ అ తాం | న్ క న్‌ా || శ్ | క నా | ల! క ఆ ఇ ం అ ఇ | కె = ర టం చ య. | 1 బ్యా జా క. |. . ౨. , | | న క న్‌ా | ఎ జీ జ వజ శ న్ మా. శం అోనేీ ం ॥ అ నాబ్... జ్ ల్ అ అః బ్ / | | | జా అః 11" [టల జ్ | ఖం ౫ డా . [3 గ్ల ॥్ | ఇ. త జె | త్, క ॥! జ సై ఖ్. క్ క క కి ఖ్ శ జీ న్ | ల! స్వేన 88 || క ॥ = ల! క్ష్ జ్ 1] స్ ్య + " క్ష్; జ న లః ఖ్ ॥ క్ష్ | న ప అ! - క స [క ్ వ్ చా న = | [| (1 ల్ క కక్ 1 క్ ల +. జ్ 5 ఇ / ॥ = క ౫॥ 8 1 "2 ఇ ; జ [| వ బీ క ః కీ శ క ళ్ క్ |] ఓ పీ” క్ష కీ ఎ వా మా నం అత. వ న్ న్ వ వ ై టట అ! న
ల్ ఉ
“౧ ౧ఉ16€014 (16 మళ్ళులు లగు నన = 6 ఫయమాం ఆలో ఉఓంఖిం లకోటీ వాముకాటుకు నాటువైద్యమా? నటి వైద్యమా? _ అనుభవాలు - గరుణవారాలు డాక్టర్ డి.ఆర్.క. ప్రసాద్ . జనవిజ్ఞాన వేదిక (గఉ|౧౨|| అనుబందం చల్లపల్లి |,
పాముకాటుకు నాటువైద్యమా? నెది వైద్యమా? | (అనుభనాలు - రుణపాఠాలు రచన ; డా! డి.ఆర్.కె. ప్రసాద్, చల్లపల్లి _ ప్రథమ ముద్రణ : 01-01-2006 ప్రతులు : 1200 పుస్తకాల ట్రాప్తి స్థానం ; డొ॥ డి.ఆర్.కె. ప్రసాద్ 11.8.8.5., 0.3.0. పద్మావతి హాస్పిటల్ చల్లపల్లి-521 126, కృష్ణా జిల్తా ఫోన్ ; 222350, 222443 (08671) ప్రజాశక్తి బుక్ హౌస్ విశాలాంద్ర బుక్ హౌస్ నవోదయ పబ్లిషర్స్ " అన్ని బ్రాంచీలలోను డిజైనింగ్ & ప్రింటింగ్ [0550149 0౬51611౬౧5 & గ౧౧|౧|1౬౧5 5[%0౧ ౦. 27, ఉఆడ/&41 0౪/6౧, 565166 ౧౦11౦9 ౦౦౧1/౦| ౧౦౦౧౫౫, (0౪6గ౧౦గ౧౦1, ౪/12/24/4ర64-520 002. 6! : 5543344 వెల :రూ॥ 15/-
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే విషయంలో ప్రజలకు శాస్త్రీయ అవగాహన కోసం జనవిజ్ఞాన వేదిక, చల్లపల్లి శాఖ 1988 నుండి సభల ద్వారా, కరపత్రాల ద్వారా నిరంతర కృషి చేస్తున్నది. పాములు కూడ మనందరివలెనే యీ సృష్టిలో భాగం. పౌరాణికుల కల్చ్పనలలో మాత్రం అవి నాగదేవతలు! సామాన్యుల హృదయాల్లో అర్జంటుగా భయభక్తుల్ని రేకత్తించే యీ ప్రాణులు జీవశాస్త్రవేత్తల వాస్తవిక పరిశీలనలో పర్యావరణ పరిరక్షకాలు! మన ఈ ప్రకృతిలోని ఆహారపు గొలుసులో తప్పనిసరి లింకుగా శాస్త్రజ్ఞులు వీటిని పరిగణిస్తారు. బస్తీలలో కాదుగాని, పల్లెల్లో పాము కాటు గురించీ, ఆఅవైద్యం గురించీ చర్చోపచర్చలు సర్వసాధారణాలు. ఒక్క కృష్ణాజిల్హాలోనే ప్రతిఎటా 555కు పైగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రజలలో తగినంత అవగాహన కలిగి, పాముకరిచిన వెంటనే అర్హులైన డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకొంటే పై మరణాలలో 96 శాతం నివారించవచ్చు. పాముకాటు వైద్యం విషయంలో దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన విధానమేదీ లేదనీ, ఎవరి అనుభవంతో వారు ముందుకు సాగుతున్నారనీ తెలుస్తున్నది. ఈ వైద్యంపై సక్రమ అవగాహనను కల్గించే ఉడతా ప్రయత్నమే యీ చిరుపుస్తకం. ఒకటి రెండు చోట్ల వ్యక్తుల పేర్లు మారడంతప్ప ఇందులోని విషయాలన్నీ యదార్థాలు, రచయిత స్వానుభవాలే. భవదీయ జన విజ్ఞాన వేదిక, చల్లపల్లి
పాము కాటుకు నాటు వైద్యమా? నటి వైద్యమా?
నేను ఎం.బి.బి.ఎస్. చదివేరోజుల్లో మా తాతగారి దగ్గర పనిచేసే
పైడియ్యని త్రాచుపాము కరచింది. వెంటనే అక్కడికి దగ్గర ఉన్న పామగ్రులోని ' పాము కాటు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళారు. అతడు ఏదో మందువేసి | _
నీకేమీ ఫర్వాలేదని ధైర్యం చెప్పాడు! కాని ఒక గంట అయినా గడవకుండానే పైడియ్య పరిస్థితి విషమించగా “ఎం.బి.బి.ఎస్. డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్లండి. మ అని చెప్పి ఆ నాటు వైద్యుడు చేతులు దులిపేసుకున్నాడు. డాక్టరు దగ్గరకు వెళ్ళిన కొద్దిసేపటికే పైడియ్య మరణించాడు. అప్పటికీ ఇప్పటికీ మా కుటుంబానికి అదొక బాధాకరమైన జ్ఞాపకం.
నేను చల్లపల్లిలో ఆసుపత్రి పెట్టిన మొదటి రోజు నుండి యాంటి స్నేక్
వీనమ్ మూడు డోసులు అట్టి పెట్టుకున్నాను. అప్పట్లో ఈ మందు మార్కెట్లో
అంతగా దొరికేది కాదు. బ్లాక్ మార్కెట్లో కొనవలసిన పరిస్టితి! విషపు పాము కరిచిన మనిషికి ఆ మూడు డోసులు ఏ మూలకీ చాలదని గ్రహించటానికి చాలా కాలం పట్టింది. ఆ రోజుల్లో పాము కాటు కేసులు నాటు వైద్యుల దగ్గరకు, మంత్రగాళ్ళ దగ్గరకు తప్ప ఎం.బి.బి.ఎస్. డాక్టర్ల దగ్గరకు వచ్చేవే కావు. పాము కరిచిన ఒక మహిళ తొలి కేసుగా నా దగ్గరకు వచ్చినపుడు ఎందరో సీనియర్ డాక్టర్లకు, నా డాక్టరు మిత్రులకు ఫోన్ చేసి, “రోగిలో ఎ లక్షణాలు మొదలైనపుడు యాంటిస్పేక్ వీనమ్ చేయాలి? ఎన్ని డోసులు ఇవ్వాలి? ఎంత సమయం పరిశీలిస్తూ వుండాలి? ఎప్పుడు రోగిని డిశ్చార్డి చేయవచ్చు?... ఇలాంటి ఒక వంద ప్రశ్శలడిగాను. నేను హౌస్ నర్జన్ చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోగాని, రెండు సంవత్సరాలు పనిచేసిన ఒంగోలు ఆసుపత్రిలోగాని పాము కాటు కేసు ఒక్కటైనా రాలేదు. పాము విషానికి యాంటి స్నేక్ వీనమ్ ఇవ్వాలని తెలుసు గాని వాస్తవంగా రంగంలోకి దిగినపుడు పై సందేహాలకు సమాధానాలే దొరక లేదు.
అసలు పాము కాటుకు వైద్యం అంటే నోట్లో పసరు, కంట్లో కలికం లేక చెవిలో మంత్రం మాత్రమేనని ఎక్కువ మంది విశ్వాసం! ప్రతి మూడు నాలుగు ఊళ్ళకు ఒక నాటు వైద్యుడో మంత్రగాడో వుంటాడు. రోగి కళ్ళల్లో కలికం వేసి, నోట్లో పసరు పోసి, వేరు నమిలించే వైద్యాలు చేస్తుంటాడు.
ఎక్కడో సుదూరంగా వున్న హనుమాన్ జంక్షన్‌లోని పెద్ద మంత్రగాడు
మంత్రం వేస్తే ఎంత పెద్ద పాము కరిచిన వాడైనా బ్రతుకుతాడని చల్లపల్లి
పరిసర జనాల ప్రగాఢ విశ్వాసం. పాము కరిచినపుడు జంక్షన్ మంత్రగాడికి
ఫోన్ చేయవలసి వస్తే ఎస్.టి.డి. సౌకర్యం లేని ఆ రోజుల్లో టెలిఫోన్ ఎక్సేంజ్
" వాళ్ళు మానవతా దృకృధంతో లైటనింగ్ కాల్ ఇచ్చేవారు! కొంతమంది బతికి
బట్టకట్టెవారు. మరి కొంత మంది చనిపోయేవారు. మంత్రం అద్భుతంగా పనిచేసి
" రోగులు బ్రతికారని ప్రజలలో ప్రచారం జరిగేది. మృతిచెందినవారి విషయంలో
వాళ్ళకు కాలం తీరిందని, విధిరాతనీ, లేక మరొక కారణమనీ జనం సానుభూతి
పూర్వకంగా సర్ది చెప్పుకొనేవారు. అనివార్య మరణమా?
ఒక సాయంత్రం ఓ.పి.లో ఉండగా ఒక ప్రముఖ వ్యక్తి నా దగ్గరకు
హడావిడిగా వచ్చి “డాక్టర్ గారూ! మా ఊళ్ళో ఫలానా వ్యక్తిని పాము కరిచింది.
దయచేసి, ఉన్నఫళాన నాతో బయట్టెరి రండి... అని కంగారు పెట్టారు. ఒక్క
' నిమిషం పాటు నేనాయన కంగారును తగ్గించి రోగికి ఏ.ఎస్.వి. (యాంటీ స్నేక్
వీనమ్) ఆస్పత్రిలో మాత్రమే యివ్వాలని, తక్షణమే ఆసుపత్రికే రోగిని
తీసుకురమ్మనీ, నేను సర్వసన్నద్ధంగా ఉంటాననీ” చెప్పి పంపాను. సుమారు
గంట తర్వాత లారీలో తీసుకు వచ్చారు. పాము కరిచిన వ్యక్తిని కాదు, అతని
మృతదేహాన్ని! ఓపికగా విచారిస్తే తేలిందేమంటే - అతణ్ణి పాలంలో పాము కరిచి
2 1/2 నుండి 3౩ గంటలు గడిచింది. పొరుగూరి నాటు వైద్యుని దగ్గర పసరు
వైద్యం చేయించి, పరిస్టితి విషమించాకే నన్ను సంప్రదించారు. దశాబ్దాల తరబడి
ప్రపంచమంతా అమలు జరుగుతున్న, సమీపంలోనే ఉన్న అసలైన శాస్త్రీయ
వైద్యాన్ని చేరుకోకముందే ఒక నిండు ప్రాణానికి పుణ్యకాలం ముగిసి పోయింది.
చావుకీ, బ్రతుక్కీ సంధి కాలమైన ఆ అరగంట ముందే ఎ.ఎస్.వి. ఇంజక్షన్
యివ్వలేకపోతినే అనే వేదన మాత్రం మిగిలింది. నిస్పందేహంగా యిది నివార్యమరణం. (2/8౪76౧12016 06411)
1989లో ఈ దుస్పంఘటన జరిగిన తక్షణం జనవిజ్ఞాన వేదిక (చల్లపల్లి
శాఖ) కమిటి సమావేశమై, ఇకముందిలాంటి మరణాల నివారణ కోసం "పాము
కాటు నుండి రక్షించేది ఎ.ఎస్.వి. మాత్రమెనని, అశాస్త్రీయ, మంత్రతంత్రాల,
ఆకు పసరుల వైద్యం కానే కాదనే వాస్తవాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించింది. 7000 కరపత్రాలు ప్రచురించి చల్లపల్లి, పరిసర ప్రాంతాలలో పంచిపెట్టాం. ఎ , గ్రామంలోని ఎ ఫంక్షన్‌కు వెళ్ళినా గ్రామ పెద్దలకు పదేపదే యీ విషయాన్ని చెప్పిచూశాం. ప్రతి గ్రామ పంచాయితీ కనీసం 2 ఎ.ఎస్.వి. వైల్స్ నిలువ చేసుకొని, విష సర్పం కరచిన వ్యక్తి కా రెండు డోసులూ యిచ్చి, ఆ వెంటనే సమిపంలో " ఎ డాక్టర్ దగ్గరకైనా రోగిని తీసుకు పొమ్మని విన్నవించాం. ఐతే, దురదృష్టవశాత్తూ మా ప్రచారాలేవి ప్రజలమీద చేయవలసినంతగా పనిచేయలేదు. " ఒక స్కూల్ వార్పికోత్సవ సభలో ఇదే విషయాలను సవివరంగా చెప్పి, వేదిక దిగానో లేదో - ఒకాయన నా చేయి పట్టుకొని ఆపి “రెండో చేత్తో తనజుట్టు పట్టి చూపిస్తూ పిచ్చి డాక్టరు గారూ! నా జీవితంలో ఇదిగో యింత మందికి నాటువైద్యం చేశాను. ఒక్కడైనా చనిపోలేదు. వేల కొద్ద ఖర్చయ్యే ఇంజక్షన్ల ఇంగ్లీషు వైద్యం వేస్టు. నాటు వైద్యమే బెస్టు... అని ఎగతాళిగా నవ్వాడు. నేనూ... నవ్వాను నిస్సహాయంగా! అతను ఆవూరి నాటు వైద్యుడు. అన్ని వ్యయప్రయాసలతో అంతకాలం మేంచేసిన ప్రచారం ఏమై పోయినట్వ? మరి జనం మీద ఆ ప్రచార ప్రభావమే ఉంటే ఆసుపత్రులకు పాము కాటు కేసులు రావాలిగదా? నిరాశచెంది, మా ప్రచారాన్ని నిలిపేశాం. ఆయాచిత వరం... రోటరీ పధకం... ఇది జరిగిన కొన్నేళ్ళకు కె.సి.పి. మెడికల్ ఆఫీసరైన డాక్టర్ నారాయణరావు గారు మాకు ఫోన్ చేసి “పాము కాటు, కుక్క కాటులకు మందుల్ని రోటరీ క్షబ్ తరపున ఒక సంవత్సరం పాటు ఉచితంగా యివ్వదలచుకొన్నాం. కుక్క కాటు “ | మందును మాకెసిపి. క్లినిక్‌లో యిస్తాం. పాము కాటు కేసులన్నీ మీరు చూడండి. ఏ.ఎస్.వి. వైల్స్ ఉచితంగా యిస్తాం” అని చెప్పారు. - పాము కాటు రోగులు అర్హులైన డాక్టర్ల దగ్గరకు రారనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న నేను పై సూచను వెనువెంటనే అంగీకరించలేకపోయాను. ఐనా ఆ డాక్టర్ గారి మీద నాకున్న గౌరవం వల్ల, ఆయనలోని సేవాదీక్ష్సను గమనించ, ఒప్పుకొన్నాను. తరువాత కొద్ది రోజులకు రోటరీ తరుపున అప్పటి కెసి.పి. మేనేజర్ ఆంజనేయులు గారు లాంఛనంగా యీ ఉచిత ఏ.ఎస్.వి. పథకాన్ని షక
ప్రారంభించిన రోజుకు గూడా పాముకాటు రోగులు నాటు వైద్యుల దగ్గరకూ, మంత్రగాళ్ళ వద్దకు తప్ప మా ఆస్పత్రికి వస్తారని నమ్మకం నాకైతే లేదు. కాని, అనూహ్యంగా పాముకాటు కేసులు మా దగ్గరకు రావటం మొదలయింది. అందుకు కారణమిది - చెరుకు పొలాల్లో రక్తపింజెరలుంటాయి. వ్యవసాయ కూలీలు చెరుకు నరికే సమయంలో అవి వారిని కరవడం పరిపాటి. . కె.సి.పి.కి చెందిన ఫీల్డ్ మాన్ ప్రతి ఊళ్ళో ఉంటాడు. అతడు “విషపు పాముల | కాటుకు మందులను రోటరీ తరుపున చల్లపల్లిలోని ఫలాన ఆసుపత్రిలో ఉంచాం. ఇంజెక్షన్లు ఉచితం. వెళ్ళండి అని ముందుగా ఊరూరా చెప్పి ఉంచారు. ఆ విధంగా రోగులు రావటం మొదలుపెట్టారు. కేసులు వచ్చేప్పటికి నాకు ఆసక్తయితే బాగా పెరిగింది గాని, వైద్యం మొదలయ్యాక సవాలక్ష సందేహాలు! ప్రతి జబ్బు వైద్యానికీ ఒక ప్రొటోకాల్ | ఉంటుంది. ఉదాహరణకు గుండెనొప్పి రోగికి వైద్యంలో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్... ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఎమి చేయాలో నిర్దిష్టమైన విధివిధానం ఉన్నది. కానీ, పాము కాటుకు అలాంటి ప్రొటోకాల్ మా పాఠ్య గ్రంథాల్లో ఎక్కడా లేదు. మెడికల్ కాన్ఫరెన్సులకు పోయినప్పుడల్తా నాకు తెలిసిన, తెలియని వైద్యులతో పాము కాటు వైద్యాన్ని గూర్చి చర్చలు పదే పదే జరిపినా సంతృప్తికర సమాధానాలు దొరకటానికెక్కువ కాలమే పట్టింది. అంతిమంగా మద్రాస్ కాన్ఫరెన్స్‌లో కేరళ గ్రామిణ ప్రాంతాన పదేళ్ళకు పైగా వైద్య వృత్తి నిర్వహిస్తూ, అత్యధికంగా పాముకాటు కేసుల్ని విజయవంతంగా నిర్వహించిన ఒక డాక్షర్ గారు ఈ ప్రత్యేక విషయం మీద ఇచ్చిన ఉపన్యాసంతో నా బుర్రలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఆ కాన్ఫరెన్స్ ముగిశాక గూడ అరగంటసేపా డాక్టర్‌ను ప్రశ్నలతో వేధించి, సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గాని, ఈ వైద్యంలో నాకు పూర్తి ఆత్మవిశ్వాసం కలుగలేదు. మద్రాస్ రామచంద్రా మెడికల్ కాలేజి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఈ వైద్యాన్ని సన్నిహితంగా పరిశీలించాను. కేరళలోని “తిరువెళ్ళ' ఆసుపత్రి వారి “15 ఎళ్ళ పాము కాటు వైద్యం - 1500 కేసులు [గ్రంథం చదివాక నా అవగాహన మరింత విస్తృతమైంది. బ్‌ో
రాజేశ్వరి ఉదంతం
మద్రాస్ కాన్ఫరెన్స్‌కు వెళ్ళే నెల రోజుల ముందే ఒకరోజు రాత్రి 11-30 కు నేను నిద్రకు ఉపగక్రమిస్తుండగా పాముకాటు రోగి వచ్చిందని కాంపొండరు ఫోన్ చేసాడు. ఐదే నిముషాల్లో రోగి వద్ద హాజరయ్యాను. 6 నెలల గర్భవతియైన | ఆ పేషెంట్ పేరు రాజేశ్వరి. పాము కరచిన 3 1/2 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వాళ్ళ ప్రక్క ఊరి నాటు వైద్యుడామె కంట్లో కలికం, నోట్లో పసరు | దట్టించాడు. గంట గడిచాక వాంతులు మొదలైనపుడు - రాత్రి 10 గంటల వేళ | పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని పంపేశాడు. రిక్షాలో 4 కిలోమిటర్ల దూరం నుండి మా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కలికంవల్లనో, విషప్రభావంతోనో గాని కళ్ళు తెరవలేకపోతున్నది. మా ఈ సందిగ్దం తీరక ముందే వాంతి చేసుకొన్నది. వాంతులు విషం వల్లనా, పసరు వల్లనా అని తేల్చుకోలేకపోతుండగానే ఆమె. ఊపిరి ఆగిపోయింది. ఊపిరితిత్తుల్లోకి కృత్రిమ శ్వాస గొట్టం (ఎండో టబ్రేఖియల్ ట్యూబ్) పంపి, కృత్రిమ శ్వాస కల్పించాం. నాడి, రక్తపోటు తగినంతగా ఉన్నాయి. నా దగ్గర ఉన్న 3 కాక, చల్లపల్లిలో దొరికిన 4తో గలిపి మొత్తం 7 ఎ.ఎస్.వి. ఇంజక్షన్లు యిచ్చాం. ఇంకా ఎన్ని యివ్వాలో తెలియలేదు. ఐనా సరే, మరిన్ని ఏ.ఎస్.వి.ల కోసం బందరు పంపాను. యాంబు బ్యాగ్‌తో ఒక కాంపౌండర్ కృత్రిమ శ్వాస యిస్తూనే ఉన్నాడు. వెంటిలేటర్ మిషన్ మా దగ్గర లేదు.
| విజయవాడ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లలో ఉంటుంది గాని ఆ ఖర్చు భరించే
స్తోమత రోగికి లేదు. అందుచేత అలా 4 గంటలకు పైగా చేతితో ఆ బ్యాగ్‌ను వంతుల వారీగా వత్తుతూనే ఉన్నాం. ఇంకెన్ని గంటలలా శ్వాస యివ్వగలమో ॥ తెలియదు. వేకువ 3-30 దాటినా బందరు నుండి ఏ.ఎస్.వి.లు రాలేదు. ఆశ నిరాశల అయోమయం! అప్పుడు రోగి కనురెప్పలు కొద్దిగా కదలడం " గమనించాను. రాజేశ్వరీ.. రాజేశ్వరీ.. అని పిలవగా, పిలవగా ఆమెలో స్పందన మొదలైంది. తను బ్రతుకుతుందనే ధైర్యం కలిగి, పట్టరాని సంతోషం కలిగింది.
తెలవారీ నమయానికామె తనంతట తానే ఊపిరి పీల్చుకోవటం మొదలు పెట్టంది. గొంతులోని “శ్వాస గొట్టం, తీసేశాం. మరి కాసేపట్లో మాట్లాడటం మొదలుపెట్టింది. రాత్రంతా నిద్ర లేక శ్రమించిన మా8మంది. సంతోషం వర్ణనాతీతం.
ఆ విధంగా మృత్యువును జయించిన రాజేశ్వరి కాలు వాచి ఇన్ఫెక్షన్ రావడంతో గాయం మానడానికి నెల పట్టింది. మరో రెండు నెలల తర్వాత ఆమె చక్కటి బిడ్డను కన్నది.
క్ ఇక, యీ కేసు అనుభవం నుండి నేను గ్రహించిన గుణపాఠాలివి :
-
కళ్ళలో కలికం, నోట్లో పసరు పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, క్ట విష ప్రభావాన్ని అంచనా కట్టడంలో ఆలన్యం జరిగి, రోగికి నష్టం వాటిల్లుతుంది.
-
పాము కరచిన రోగిని సాధ్యమైనంత తొందరగా ఎం.బి.బి.ఎస్. డాక్టర్. ఆసుపత్రికి మాత్రమే తీసికెళ్ళి అడ్మిట్ చేయాలి. మరికొన్ని నిముషాలు ఆలస్యమైనా పై రోగిని మేము కాపాడగలిగే వాళ్ళం కాదు.
-
లక్షల విలువైన వెంటిలేటర్ లేకున్నా, కేవలం 2000/- ఖరీదైన యాంబు బ్యాగ్‌తో కృత్రిమ శ్వాసనిస్తూగూడ ప్రాణం నిలబెట్టవచ్చు.
కాలమే వ్ర్రాణప్రదాయిని 1౧౫6 542౪69 1116) చల్లపల్లికి 26 కి.మీ. దూరంలో ఉన్న కోడూరుకు చెందిన ఒక కుర్రవాడిని పాము కరవగా, సుమారు 4 గంటల తర్వాత మా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు- సాంప్రదాయ నాటు వైద్యాలన్నీ చేసి చూసిన తర్వాత! చల్లపల్లికి 2 కి.మీ. దూరంలో ఉండగానే చనిపోగా, మృతదేహాన్ని మాత్రం నాకు తెచ్చి చూపారు. ఇతర వైద్యాల కోసం సమయం వృథా చేయక, మరో అరగంట ముందుగా
వచ్చి ఉంటే - యీ బాలుడు కూడా రాజేశ్వరిలాగా బ్రతికేవాడేమో!
మృత్యుంజయుడు - రామకృష్ణ
చిట్టూర్పు ప్రభాకరరావు మాస్టారి వద్ద చదువుకుంటున్న 12 ఏళ్ళ రామకృష్ణకు తెల్లవారుజాము 3 గంటలకు మూత్ర వినర్జ్దనకు బైటకు వచ్చినప్పుడేదో కుట్టినట్రనిపించింది. మాస్టార్ని లేపి, ఆ విషయాన్ని చెప్తే, అది పాము కాటే కావచ్చని, మోటర్ సైకిల్‌పైన 3-30 కి మా ఆసుపత్రికి తీసికొచ్చారు. = మరొక్క పావుగంటలో అతని శ్వాస ఆగిపోయింది. చకచకా ఊపిరితిత్తుల్లోకి గొట్టం వేసి కృత్రిమ శ్వాస కల్పించి, ఏ.ఎస్.వి. ఇంజెక్షన్సు 10 యిచ్చాం. రెండు
రోజులపాటు మేం వంతుల ప్రకారం ఒకరి తర్వాత ఒకరం యాంబూ బ్యాగ్‌ను వత్తుతూనే ఉన్నాం. అతనికిచ్చిన మొత్తం ఎ.ఎస్.వి. ఇంజక్షన్లు 30! అప్పటికిగాని, అతను సహజ శ్వాసలోకి రాలేదు. ఇప్పుడు అతను చక్కగా చదువుకొంటూనేె డప్పుల బృందంలో ముఖ్యుడై, జిల్లా కలెక్టరు ఎదుట, తిరుపతి బ్రహ్మోత్సవాలలో డప్పు మోగించి ప్రసిదృడౌతున్నాడు. పాము కరచిన గంట తర్వాతే విషంతో మరణం సంభవిస్తుందని, గంటలలోపు చనిపోతే అది భయం వలన వచ్చిన షాక్‌తో మాత్రమేనని, కొందరు ఇ భావించడం తప్పని యిప్పుడు తేలింది. రామకృష్ణను పాము కరచిన 45 నిమిషాలలోపే శ్వాస ఆగిపోయింది. మరొక్క 5 నిముషాలు గడిస్తే కృత్రిమ శ్వాసకు గూడ కాలాతీతమై, అతడు దక్కేవాడు కాదు. సరాసరి రక్తనాళాలలోనికి పాము విషం ఎక్కితే బహుశా 15 నిమిషాలకే రోగి చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే - పాము కాటు రోగికి డాక్టర్ వైద్యం ఎంత ముఖ్యమో సకాలంలో ఆస్పత్రిలో చేరడం కూడొ అంతే ముఖ్యం. మెదడు స్తంభించిన మరణమేనా? (19 1187210 06410?) + ఒకనాటి ఉదయం 3.30 గంటల సమయం ఎనిమిదేళ్ళ శ్రీలతను కట్టపాము కరిస్తే ఆ పాపను చంపిన పాముతో సహా తీసుకు వచ్చారు. కొద్ది నిముషాలు నాతో బాగా మాట్టాడింది. “నాకు ఇంజక్షన్‌లు చెయ్యవద్దు అని | బ్రతిమాలింది. కాని, కాసేపటికే మాట్లాడటం ఆగిపోయి నిశ్శబ్దంగా పడుకున్నది. |, కాళ్ళూ, చేతులూ కొట్టుకోవడం మొదలైంది. నాడి నమోదు యంత్రం (౧4156 0౫/౧6(6౧ లో ఆక్సిజన్ శాతం తగ్గుతూ వచ్చింది. సాధారణ స్థాయి 100 కాగా, 90 వద్దకు పడిపోగానే, ఊపిరితిత్తుల లోనికి గొట్టంవేసి, యాంబు బ్యాగ్‌తో కృత్రిమశ్వాస ఎర్పాటుచేశాం,. శ్రీలత తల్లిదండ్రులు ఇంటెన్సివ్ కేర్ ఖర్చు భరించగలరు. పాపను సమిప నగరానికి తరలించి 10౮లో వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస ఎర్పాటు మంచిదని సలహాయిచ్చాను. దాన్ని వారు తక్షణమే అంగీకరించారు. వెంటనే ఫోన్‌చేసి, కృత్రిమ శ్వాస యంత్రం (వెంటిలేటర్)ితో సహా అంబులెన్స్‌నూ, ఇంటెన్సివ్‌కేర్ నిపుణుడినీ రప్పించాం. ఆ స్పెషలిస్ట్ శ్రీలతను పరీక్షించి, గుండైతే పనిచేస్తున్నది
గాని, మెదడు స్తంభించిందనీ, “ఇది బ్రెయిన్ డెత్‌కేసు' అని అభిప్రాయపడ్డాడు.. అది బ్రెయిన్ డెడ్ కేసుకాదనీ, 3౩ రోజులపాటు వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస యిస్తూ, వైద్యం చేస్తే రోగి చక్కగా కోలుకుంటుందనీ, ఇటువంటి మా ఎడెనిమిది పాము కాటు కేసుల అనుభవాన్ని ఆ డాక్టర్‌కు వివరించాను. క్ట “కంటిపాప పూర్తిగా వ్యాకోచించింది. కనీస స్పందనకూడా లేదు. ఈ పరిస్థితిలో, ఇంత అధిక వ్యయంతో పేషెంట్‌ను ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌కు = తరలించినా ప్రయోజనం ఉండదు అని ఆ స్పెషలిస్టు, ఆయనపై అధికారి చాల మర్యాదగా నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ స్పెషలిస్తు అంబులెన్స్‌తో సహా తిరిగి వెళ్ళారు. ఆ తరువాత కథ మామూలే! ఒకరి తర్వాత ఒకరం, నేనూ, మా సిబ్బందీ ' రెండు రోజులపాటు నిర్విరామంగా యాంబు బ్యాగ్‌తో శ్రీలతకు కృత్రిమ. , శ్వాసకల్పిస్తూనే ఉన్నాం. సుదీర్ధ వైద్యం తర్వాత ముందుగా ఆమె కనురెప్పలలో చిన్న కదలిక! ఆ పిదప ఆమె కాలివేళ్ళకొనలలో మరికొన్ని స్వల్పచలనాలు. అప్పడిక నెమ్మదిగా కళ్ళు విచ్చుకొన్నాయి. మా మాటలకామెలో ప్రతి స్పందనలు మొదలయినవి. నెమ్మదిగా తానే శ్వాస పీల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నది. మరో ఐదారు గంటలపాటు కృత్రిమ శ్వాస కొనసాగించిన తర్వాత శ్వాసగొట్టాన్ని ఊపిరితిత్తుల నుండి తీసేశాం. మరొక్కరోజు తర్వాత తానే లేచి కూర్చున్నది. తర్వాత మంచందిగి నడవ గల్సింది. ఆ మరుచటి రోజే ఆసుపత్రి నుండి ఆమెను డిశ్చార్జి చేశాం. త్రాచు, కట్ల పాములు కరిచిన కేసులలో కనుపాపల ప్రతి ససందనలతో నిమిత్తం లేదని యీ కేసుతో మా కర్థమయింది. పాము కాటు వైద్యంలో మాకిదొక వినూత్న, ఉత్కంఠ భరితమైన ॥ అనుభవం! రామసుబ్బయ్య ఉదంతం నిత్యం మందహాసంతో కనిపించే మంచిమనిషి రామసుబ్బయ్య 16 ఎళ్ళుగా నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్‌ను. ఓ ఆదివారం ఉదయం వాంతులై నీరనసించిపోతే ఆనువత్రికి తీసుకువచ్చారు. అప్పటికి 32 గంటల క్రితం ఆయన్ను పాము కరిచిందట! ,
“సార్! పాముకాటుకు వైద్యమంతా మేం చేయించాం. వాంతులు తగ్గేందుకొక ఇంజక్షను చేసి, నీరసం తగ్గేందుకు సెలైన్ పెట్టండి... అని వారి బంధువులు నన్నడిగారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండ, అన్ని పరీక్షలూ చేసి చూస్తే- ఆయన. రీనల్ ఫెయిల్యూర్ (మూత్రపిండ వైఫల్యం) లో ఉన్నాడు. ఆయన్ని కరిచింది న _రక్తపింజరై ఉండాలి. మూత్రపిండాల్ని పాడుచేసి, రక్తం గడ్డకట్టనియని లక్షణం ఆ పాము విషానికే ఉంటుంది మరి. శ అర్జెంటుగా నెఫ్రాలజిన్స (మూత్రపిండాల స్పెషలిస్టు) దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పాను. ఓ ప్రక్క రోగి పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తూంటే - రోగికి వైద్యం చేసిన నాటువైద్యునితోపాటు, వచ్చిన బంధువులంతా - అవసరం లేదు సార్! రామసుబ్బయ్య భార్యకు పాము కరిస్తే యితడే వైద్యం చేశాడు.. ఇదిగో ఆమె నిక్షేపంగా ఉంది చూశారా? మా ఊళ్ళల్లో ఎంతమందినీయన బ్రతికించాడో తెలుసా? రామసుబ్బయ్యకు కూడ యీయన చేయవలసిన వైద్యం పూర్తిగా చేశాడు. మీరిప్పుడతనికి నీరసం తగ్గేందుకు సైలైన్ పెట్టండి చాలు . అని నాకే భరోసా యిచ్చారు. ఐనా, పరిస్టితి గమనించిన నేను పట్టుబట్టి బలవంతాన విజయవాడలోని మూత్రపిండాల స్పెషలిస్టు దగ్గరకు పంపాను. అక్కడ లక్షన్నరతో అత్యుత్తమమైన వైద్యమే జరిగిందికాని, అప్పటికే ఆలస్యమవ్వడంవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా అతబ్ని వారం రోజులు మాత్రమె బ్రతికించగలిగారు. ఆలస్యంగా డాక్టరు దగ్గరకు వస్తే ఎంత మంచి వైద్యమైనా ప్రయోజనం ఉండదు. తిరువూరు డాక్టరు అనుభవం తిరువూరులోని నా మిత్రుడు డాక్టర్ రవీంద్ర వద్దకు ఒక రాత్రి 11గంటల సమయంలో ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. “ఉదయం 8 గంటలకు పాము కరిచింది. మేం పొద్దునే వైద్యమంతా చేయించాం. సాయంత్రం నుంచి వాంతులై నీరసంగా ఉన్నాడు. నీరసానికి మందు వాడండి అని అడిగారట. అర్జంటుగా | ఏ.ఎస్.వి. చెయ్యాలని డాక్టర్ ఎంత చెప్పినా వాళ్ళ తలకెక్కలేదు. బంధువులంతా సెలైన్ పెట్టండి చాలని ఏకగ్రీవంగా పట్టుపట్టారు. ' నేను చెప్పింది నచ్చకపోతే 2
మరొక డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఒక్క నిముషం ఆలస్యం కూడ ప్రమాదమే ' అని డా॥ రవీంద్ర ఎంత వెఎత్తుకున్నా వినకుండా రోగిని యింటికి తీసుకుపోయారు. కనీనం మరో డౌక్ట్సర్ నలహా కూడ తీనుకోలేదు! తెల్లవారుజామున 4 గంటలకు అత్యంత ప్రమాదకర స్టితిలో వేరే డాక్టర్ వద్దకు తీసుకుపోతే, ఆయన ఎ.ఎస్.వి. చేసి, వెంటనే హైదరాబాదు పంపాడు. అక్కడ 40 వేలకు పైగా ఖర్చయింది గానీ, మనిషి దక్కలేదు. క తగిన సమయంలో ఎ.ఎస్.వి. ఇవ్వకపోవడమే యిక్కడ జరిగిన లోపం. ఒక డాక్టరు గారి సందిగ్ధం ఒకరోజు రాత్రి 11 గంటలకు ఒక డాక్టర్ మిత్రుని నుంచి ఫోన్. “ఒక వ్యక్తి కాలుకు పాము కరిచింది. ఏ పామో తెలియదు. నొప్పి విపరీతంగా ఉంది” అని. బడ్ క్లాటింగ్‌టైం (రక్తం గడ్డకట్టే సమయం)తో సహా కొన్ని రక్త పరీక్షలు చేయించమన్నాను. క్లాటింగ్ టైమ్ 4 నిముషాలని మళ్ళీ ఫోన్‌లో చెప్పారు. పాము కరచిన కాలివైపు గజ్జల్లో బిళ్ళ కట్టిందని, నొక్కితే భరించరానంత నొప్పిగా ఉందనీ చెప్పారు. కాలిక్రైతే గజ్జల్లోనూ, చేతికైతే చంకల్లోనూ బిళ్ళలు కట్టి నొప్పి వచ్చేది రక్తపింజర కరిస్తేనే. అందుకని, నేను మళ్ళీ ఫోన్‌లోనే క్షాటింగ్ టైమ్ రిపోర్టు తప్పేమో. ఈ సారి స్వయంగా నువ్వే ఆ టెస్టు చేసిచూడు అని చెప్పాను. ఆయన చేసిన క్షాటింగ్ టెస్ట్‌లో నాలుగు కాదు - 20 నిముషాలు దాటినా రక్తం గడ్డకట్టలేదు! మరింక అనుమానమే లేదు. ఆ రోగిని కరిచింది రక్తపింజరే. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఏ.ఎస్.వి. పది ఇంజెక్షన్లు యివ్వమని చెప్పాను. ఆ విధంగా అరేడుగంటల పోరాటంతో ఆ వ్యక్తి బ్రతికిపోయాడు. లేబొరేటరీ పరీక్షనే పూర్తిగా నమ్ముకొని పాముకాటుకు వైద్యం చేయరాదు. ... | అవసరమైతే డాక్టర్ స్వయంగా పునః పరీక్షించి, ధృవీకరించుకోవాలి. అంతేగాదు, క్లినికల్ కండిషన్, లాబొరేటరీ డేటా ఎకభవించనపుడు క్లినికల్ ఎవాల్యుయేషన్ ప్రకారమే వైద్యం చేయాలి. జనారణ్యంలో విష సర్పాలా? హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ మెడికల్ కాన్సరెన్స్ జరిగినపుడు అపోలో ఎమర్జన్సీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్‌గార్ని “సార్! మి
ఆసుపత్రిలో స్నేక్ పాయిజన్ ట్రీట్‌మెంట్ ప్రాటోకాల్ ఎమిటి?” అని అడిగితే ఆయన బిగ్గరగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారని అడిగితే, "ఈ హైదరాబాద్ మహానగరంలోకి పాము వస్తుందా? వచ్చి బ్రతుకుతుందా? పాము కాటు కేసులు మాకు రానూరావు. మాకా అనుభవమూ లేదు' అని వివరించారు. నిజమే! పట్టణాల్లో పాములుండవు. పల్లెటూళ్ళలోనే పాములుంటాయి, | కరుస్తాయి కాని, ఆ పాముకాటు కేసులు అర్హులైన డాక్టర్ల దగ్గరకు కాక, నాటు వైద్యుల దగ్గరకో, మంత్రగాళ్ళ దగ్గరకో పోతాయి. ఇదీ పరిస్థితి! శి అన్ని ర్మాష్టాల డాక్టర్లు పాల్గొన్న ఆ సమావేశంలోనే పాము కాటు కేసుల మీద ఆసక్తి ఉన్న 50-60 మందిమి ఓ గంటకు పైగా ప్రత్యేకంగా దీన్ని గురించి చర్చించాం. చర్చల సారాంశమిది : ఎవరి అనుభవాన్ని బట్టి వారు పాముకాటుకు వైద్యాలు చేస్తున్నారే తప్ప ఒక నిర్దిష్ట విధానమేమీ లేదు. ' పాము విషానికి విరుగుడు ఏ.ఎస్.వి. తప్ప మరొకటి లేదు”. అనే విషయంలో మాత్రం అందరిదీ ఎకాభిప్రాయమే. ' నాటు వైద్యంతో బ్రతకటం నిజమా? నాటు వైద్యంతో, మంత్రంతో బ్రతికిన వాళ్ళను చాలామందిని చూశాం! చాలెంజ్‌లాంటి ఈ మాటను గ్రామీణ ప్రాంతాల్లో మనం తరచూ వింటుంటాం. మనం కూడ అలా బ్రతికిన అదృష్టవంతుల్ని చూసే ఉండొచ్చు. అన్ని పాములూ విష సర్పాలు కావు. విషం లేని పాములు కరిస్తే, ఎ రకమైన వైద్యం చేసినా, అసలు చేయకపోయినా, ప్రాణహాని ఉండదు. మహా ఐతే కరచిన చోట కొంచెం వాపురావచ్చు. నొప్పి కలుగవచ్చు. ఇలాంటి వారికి మంత్రాలు, నాటు వైద్యాలు కొంత ధైర్యాన్ని కల్షించడం మినహా మరే | ప్రయోజనమూ ఉండదు, ॥ మన దేశంలో మనిషికి ప్రమాదం చేయగల విషసర్పాలు నాలుగే రకాలు. త్రాచు పాము, కట్లపాము, రక్తపింజెర (దీన్నే గుమ్మడిత్తుల పెంజర, పాడపాము అనికూడా అంటారు), సాస్కేల్డ్‌వైపర్ (పుర్చా). విటిలో మొదటి మూడు రకాలే మన ప్రాంతంలో ఉంటాయి. నాల్గవ రకమైన సాస్కేల్డ్‌వైపర్ ఉత్తర భారతదేశంలో ఉంటుంది. సముద్రపు పాములన్స్నీ విషపూరితాలే కాని, మనదేశంలో ఆ పాము కాటు చాలా అరుదు.
ననన ననన ననన ననన ననన ననన ననన నను! ," సే | ఇవే విష సర్పాలు | | | | | ాన........ త్ శే 4 ॥ క ' ము ఒకా) /(.! 1 | సి ఠి వశే తో “1 కో . - శ + ల క్క
- ఆ మిక? న. వ. - న్ ఈ! . | శ, న | లి కళ ం ॥ వే. " ఫి న న క్ష న్ ౫ టం (౮ శం అ అట్ ఖీ వ. ర్, క్ త్ ౯ నర = త్రాచుబొాము | , | గ్ టా వ. ట్య, - వే | ణే ళ్ ర్ట | ( . . . _ న ళో డాం అం ఓ స న. ఆగం న. అ - .! తా త చి వీ లి నా జీ నో న్ ళో శ శ్రే | ల్ గ ౯ ఖ | | స అ - ' . | _ జై ' శా జీ స్స్ ఇ | క, . - /. భ్ . | ని. ్ శే శ వ = ” శీ ఉత ఖ = ఇ ఖు శ ॥ జో 1 క! క స శ లాలా బం. గ్ శ్ర " ” న్‌్. ఖ్ [1 న్. జ ఈజీ స మన్య... మట జీ క! క్ జ్ ణ్ (| (| శ త్ య. కటవొము రక పింబజెర టం. అణాటీ జ్ క్ జ క ఇ... లై న. న తా | న్ గ్ ఖీ 7) తో ఇ టు న్న] మ ఎ గ _ జ చె . ; | ల్ న కులతాత / ం ఏ అల.ఉట్రటీ మ త్ స్ట టీ | ల! చా /. క్ న న ః॥ జో ఇ _ | | ఖా ల ఎ ః శ . నీక త “” అఈయిెిల +. ౯ భ్. వ న్ నయ చా ళ్ వ. థి తి - & త లే ప. "+ శా - | , ఇ 1. న క ల్సి శ 7 క ల ఆత అ ము అక్సా. నీ ్ల గ్ టో టీ త్ వాం , “ ॥ శీ ళీ ఈ ల * క్ష 1 క ఖణ [”
- ॥ వ. - స్ క్స్ ఇ ఇ ష్ లే -ం ॥ ళ అ ఖా క ల. బా అప ఒల్లో ఒల్లో ౮డ౦ఉ జా ౧ | | లో
. ఇలా రెండో, మూడో గొట్లుంటే - విషసర్వం కరిచినట్టు. సమయా శ కక! త్రాచు, కట్లపాము కొట్లతో శ్వొస ఆగినపుడు రోగికి . యాంబు బ్య్వాగ్‌తో కృత్రిమ శ్వాస ఎర్పాటు. టు - న స బస గీ.5.౪/., కృత్రిమ శ్వాసలతో 24 గంటల పిదప కోలుకుని, కులాసాగా ఉన్నరోగి. దనన ననన 140
త్రాచు లేక కట్ల పాముకాటు రోగి తొలి లక్షణం 8170515 రామకృష్ణ కళ్ళు మూతలు పడుతున్న ప్పితి ల థఖ . శౌ 48 గంటల పాటు యాంబు బ్యాగ్ వెంటిలేషన్ తర్వాత, సహజ శ్వాసలో రామకృష్ణ. ల జఇజిగభ?:క |" . జక! స్త్ కీ మూడు రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న రామకృష్ణ. 14
" న ళ రక్తపింజెర విషం వల్ల కంటిలో రక్తస్రావం . జ. . శీ ౭ 7ల్ల 1! ఎ! భ్ తనం రక్తపింజెర విషంతో వాచిన కాలు ను కా... . రక్తపింజెర విషం వలన నిర్దీవమెన మోచేతి క్రింది భాగం స క ॥
"పై నాలుగు విషసర్పాలు కరిచినా, నాటు వైద్యంతో బతికిన వాళ్ళను చూశాం..." అంటారా? అది నిజమే గానీ పాక్షిక సత్యం! ఎలాగంటారా? ఒకరోజు ప్రొద్దుటే 6 గంటలకు ఒక యువకుడు తనను కరచిన రక్త పింజరను చంపి, తీసుకొనివచ్చాడు. సాధారణంగా పాము కాటుతో వచ్చిన వారందర్నీ 24 గంటల హాస్పిటల్‌లో ఉంచి, నిరంతర పరిశీలన (అబ్బర్వేషన్) లో ఉంచుతాం. ఆ సమయంలో నోటి ద్వారా ఆహారం యివ్వం. అలాగే యీ యువకునికి గూడ టెట్వాక్ యింజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టి పరిశీలన లో ఉంచాం. అదేరోజు సాయంత్రం 6 గంటలకు వేరే గ్రామం నుండి ఇంకొకాయన రూడా తనను కరిచిన పామును చంపి తీసుకొచ్చాడు. అదీ రక్తపింజరే. ఇతడిని కూడ అబ్ద్బర్వేషన్‌లో ఉంచాం. మరొక రెండు గంటల్లోనే యితడు పెద్ద నెత్తురు వాంతి చేసుకొన్నాడు. పింజెర విషప్రభావం అది. చిగుళ్ళ నుండి, నోటి నుండి, మూత్రనాళం నుండి, ఆసనం నుండి, సెలైన్ పెట్టిన రంధ్రం నుండి, పాము ' | కరచిన గొట్ల నుండి... ఎక్కడ నుండైనా యీ రక్తస్రావం జరగొచ్చు. ఇతనికి జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి, నోటిద్వారా పెద్ద రక్తపు వాంతి అయింది. అప్పుడిక వరుసగా 10 ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు చేశాం. అర్ధరాత్రి దాటాక నెమ్మదిగా కోలుకున్నాడు. ఈ వ్యక్తికి విషప్రభావం కనిపించిన కొద్ది సేపటికే విరుగుడు మందు ఇవ్వడం వల్లనే బ్రతికాడు. నాటు వైద్యంతో గానీ, మంత్రవైద్యంతోగాని బ్రతికే అవకాశం లేనేలేదు. ఇక మొదటి వ్యక్తి సంగతి. మర్నాడు ఉదయం 6 గంటల వరకు పరీశీలనతో ఉంచినా, ఎలాంటి విష లక్షణాలూ కనిపించలేదు. ఐతే అతడిని కరిచిందీ రక్తపింజరే. అందులో సందేహమేలేదు. అతని వంటిపై పాముగాటూ, అతడే స్వయంగా చంపి తెచ్చిన రక్తపింజెరా అందుకు తిరుగులేని సాక్ష్యాలు. మరినేను మందు వేయకుండానే అతడెలా బతికాడు? అతడిని ఆ పాము కరిచిందేగాని, విషం ఎక్కించలేదు. ఇతనికి నాటు వైద్యం చేసినా, నోరులేని మూగవాడు మంత్రం చదివినా, చారెడు దుమ్మో, ' నీళ్ళో పైన చల్లి, అదే వైద్యమన్నా కూడ యిలాగే బతికేవాడు! 24 గంటల తర్వాత ఇతడిని ఇంటికి పంపించాం. టేక్
ఉత్తుత్తి వొముకొటులు (౨౧/ 81169) విష సర్పాల కాటులలో సుమారు 30 శాతం విషం ఎక్కని, ఉత్తుత్తి కాటులే ఉంటాయి. అనేక కారణాల వల్ల విషసర్పాలు కరిచిన ప్రతిసారీ తగిన మోతాదులో విషం ఎక్కక పోవచ్చు. విటినే డైబైట్స్ అంటారు. ఈ ఉత్తుత్తి కాటులే నాటు వైద్యులకు, మంత్రగాళ్ళకు గుర్తింపును, కీర్తిని తెచ్చిపెట్టేవి! సరైన మోతాదులో పాము విషం శరీరంలోకి ఎక్కితే ఎ.ఎస్.వి.తో తప్ప ఈ ప్రపంచంలో మరే వైద్యం వల్లనైనా ఎవరైనా బ్రతికిన దాఖలా యింతవరకూ లేదు. వాముకొటులు - విష లక్షణాలు త్రాచుపాము, కట్టపాముల్లో ఉండే విషం 'న్యూరోటాక్సిన్. ఈ విషం నరాల మీద, కండరాల మీద ప్రభావం చూపటం వల్ల పాముకాటు రోగులకు కండరాలు పనిచేయవు.
శ రోగుల వెందటి లక్షణం కళ్ళు మూతవడిపోవడం. మనం కళ్ళు తెరవమంటుంటే భృకుటి ముడి పడుతుందే గాని, కనురెప్పలు సరిగా | తెరవలేరు.
౫ రెండోది వాంతి కాబోతున్నట్లనిపించడం, కొంతసేపటికి నిజంగానే వాంతులు కావడం.
౫ ఒకే మనిషి ఇద్దరుగా కనపడటం.
౫: చేతులు, కాళ్ళు కొట్టుకోవడం,
-
మరికొంత సేపటికి శ్వాస కండరాలు పనిచేయక ఊపిరి ఆగిపోవడం.
-
ఆ తరువాత గుండె కొట్టుకోవటం ఆగి, రెండు లేక మూడు నిమిషాలకు మెదడు స్తంభించి, (బ్రెయిన్ డెత్) మరణం ప్రాప్తించడం.
-
రక్తపింజర విషం శరీరంలోని ఎ భాగంలోకి ఎక్కితే ఆ భాగం వాస్తుంది. దగ్గరలో ఉన్న లింపఫు గ్రంథులూ వాస్తాయి. గజ్జల్లోనో, చంకల్లోనో బిళ్ళలు కడతాయి. భరించలేనంతగా నొప్పి వస్తుంది. ఆ తరువాత రక్తస్రావం మొదలౌతుంది. శరీరంలోని ఎ భాగం నుండైనా యీ రక్తస్రావం జరగవచ్చు. మెదడులోగనుక జరిగితే రోగి కోమాలోకి వెళ్ళిపోతాడు.
-
ఒక్కోసారి రక్తపింజరవిషం మూత్రపిండాలను దెబ్బ తీస్తుంది. కిడ్నీలు పని చేయకపోతే రక్తంలోని వ్యర్థ పదార్ధాలు శరీరంలో పెరిగిపోయి - యురీమియా వల్ల మరణం సంభవిస్తుంది.
సామాజిక నేపధ్యం మా పరిశీలనను బట్టి - పాము కాటుకు గురయ్యే వారిలో నూటికి 80 మంది రెక్కడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలే. చెరకు జడవే సేప్పుడో, చెరకు కోతలవుడో, మినవ పీకుడు నమయుంలోనో, వాముల్లోంచి వరిగడ్డిలాగేప్పుడో పాములు కరుస్తుంటాయి. అప్పుడప్పుడు గృహిణులు కూడ పాముకాట్లకు గురౌవుతున్నారు. పూరిపాకల్లో, పెంకుటిళ్ళలో నివసించే వారికే గాక, డాబాల్లో ఉంటూ నేలమీద నిద్రించే వారికి గూడ పాము కాట్లు తప్పడం
లేదు.
ఎక్కువ సందర్భాల్లో పాము కాటుకు 5 నుండి 10 వరకు ఎ.ఎస్.వి. _డోసులివ్వవలసి వస్తుంది. ఒక్కోడోసు రు. 400/- చొప్పున కేవలం ఇంజెక్షన్లకే
4000/- ఖర్చవుతుంది. ఇతర వైద్య ఖర్చులు మరో నాలుగు వేలనుకుంటే
సంవత్సరమంతా ఇంటిల్లపాదీ కూలి చేసినా ఎనిమిది వేలు కళ్ళజూడలేని
కుటుంబాలెన్నో! ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 1 లేక 2 డోసులు ఏ.ఎస్.వి. ఉంచితే అవే మూలకు చాలేను? గత్యంతరం లేక తలలు తాకట్టు
పెట్టి అప్పులు చేసి, మందులు కొని [పైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొంటే ,
రోగి బ్రతికినా, కుటుంబమంతా అప్పుల ఊబిలో మునగక తప్పదు!
పాపం కోటేశ్వరమ్మ! ఆమెది కొక్కిలిగడ్డ కొత్తపాలెం. వయస్సు 40 ఎళ్ళు. రక్తపింజెర కరచిన గంటలోపే తీసుకువచ్చారు. మూడు గంటల తర్వాత కరచిన చోట వాపు పెరిగి గజ్జెల్లో బిళ్ళు కట్టింది. రక్తం గడ్డ కట్టడం లేదు. 10 ఎ.ఎస్.వి.లు యిచ్చాక ప్రాణగండం తప్పింది గాని, మూత్రపిండాలు పాక్షికంగా దెబ్బతిన్నవి. విజయవాడ నెష్రాలజిస్టు దగ్గరికి తీసికెళ్ళి ఒకటి రెండు సార్లు డయాలసిస్ చేస్తే తప్ప ఆమె ఎక్కువ కాలం బ్రతకదని వివరించి చెప్పాను. ఐతే ఆమెది దయనీయమైన ఆర్థికస్థితి. సెంటు భూమి లేదు, గేదెలు కాచుకొని బ్రతుకీడుస్తున్నది. బంధువులు క్ట
తలా పదీ, పరకా వేసుకొని, నా ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా నాకు వివరించి వాళ్ళు నిస్సహాయంగా తమ ఊరికి తిరిగి వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. నేను మళ్ళీ వాళ్ళను ఆపి, విజయవాడలోని నెవ్రాలజిస్పు డాక్టర్ అమ్మన్న గారికి ఉన్న పరిస్థితంతా వివరించి చెప్తే, ఆయన పెద్ద మనస్సుతో - మందులు మాత్రం వాళ్ళు కొనుక్కోగలిగితే, నేను వైద్యమంతా ఉచితంగా చేస్తా నన్నారు. నా ఆస్పత్రి ఫీజులకు, బిల్లులకు వారేమీ చెల్లించనవసరంలేదనీ, ఆడబ్బుతో విజయవాడలో మందులు కొనవచ్చనీ, వారిని ఒప్పించి, ఎలాగో విజయవాడ పంపించగా, డయాలసిస్ జరిగి, ఇప్పుడా కోటేశ్వరమ్మ యధావిధిగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నది. నానుకూల పరిణామం
రోటరీ వారి పుణ్యమా అని మూడు సంవత్సరాలు పాటు ఎఏ.ఎస్.వి.లు ఉచితంగా పొంది చాలామంది బ్రతికి బట్టకట్టారు. ఆ ఉచిత పథకం ఆ తర్వాత ఆగిపోయినా పాము కాటు రోగులు డాక్టర్ల దగ్గరకు బాగానే వస్తున్నారు. పాము విషానికి నాటు వైద్యమే సరైనదని, ఇంగ్లీషు వైద్యం దండగమారిదనె బలమైన నమ్మకం సడలిపోయి, ఎ.ఎస్.వి. అనే విరుగుడు మందే నమ్ముకో దగిందనే గట్టి విశ్వాసం ఇటీవలి కాలంలో చల్లపల్లి ప్రాంతపు జనంలో బలపడుతున్నది.
ఆయన్న వేయు కరిబిస్తే దాటు వైమ్మడు ఇప్పుట ఇంగ్లయ ఏైధుడు ల్. గ క కేక న్నే? క, 6 శ కావాల (1 మ 18
ఇప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని పాము కాటు కేసులు నాటు వైద్యుల దగ్గరకు వెళుతున్నా ఎం.బి.బి.ఎస్. డాక్టర్ల దగ్గరకు పోయి, ప్రాణగండం దాటుతున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఈ ప్రాంతంలో వచ్చిన యీ పరిణామక్రమానికీ ఎక్కువగా రోటరీ - కె.సిపి. సంస్థలూ, పరిమితంగా జనవిజ్ఞానవేదికా కారణభూతాలని చెప్పాలి. చల్లపల్లి సమీప గ్రామములోని ఒక ప్రముఖ సీనియర్ నాటు వైద్యుడు తన బంధువును పాము కరిస్తే తాను చేయవలసిన వైద్యం చేసి వెంటనే ఆ పేషెంట్‌ను ఇంగ్లీషు వైద్యం కోసం నా దగ్గరకు పంపారు.
క్రిష్టాజిల్లాలో పేపర్లో పడిన పాముకాటు మరణాలు ఒక సంవత్సరంలో 55 దాక లెక్కించాం. పేపర్ కందని దురదృష్ట మరణాలెన్నో మరి! విరిలో కనీసం 52 మందిని పల్లెప్రాంతాల ఎం.బి.బి.ఎస్. డాక్టర్లు బ్రతికించగలరనేది మా అనుభవపూర్వకమైన అంచనా.
ఇక మిగిలిన ఆ రెండు మూడు కేసులకూ స్పెషలిస్క్ప డాక్టర్స్ అవసరమౌతారు - రక్త పింజెర కాటు వల్ల మూత్రపిండాలు చెడినప్పుడో, రక్త స్రావ మధికమై తీవ్ర ప్రమాదంలో ఉంటేనో. మిగతా అన్ని కేసులకూ గ్రామిణ ప్రాంతపు ఎం.బి.బి.ఎస్. డాక్టర్లూ, [పైమరీ హెల్త్ సెంటర్స్ వైద్యులూ సరిపోతారు. ఇందుకోసం వాడే పరికరాల ఖరీదు నాలుగైదువేలకు మించదు.
ఎ.ఎస్.వి. అంటే
యాంటీ స్నేక్ వినమ్. పాము విషానికి విరుగుడు మందన్నమాట. ఒకప్పుడీ ఇంజక్షన్లు సులభంగా దొరికేవి కావు. అదృష్టవశాత్తు ప్రస్తుతం ౩ కంపెనీలు తయారుచేస్తున్న ఏ.ఎస్.వి.లు డిమాండ్‌కు సరిపడా మార్కెట్లో దొరుకుతున్నాయి.
ప్రధాన విష సర్పాలైన త్రాచు, రక్త పింజర, సాస్కేల్స్‌వైపర్ (పుర్చా), కట్లపాముల విషాలను విడివిడిగా అతి తక్కువ మోతాదుల్తా గుర్రాల శరీరాల్లోనికెక్కించినప్పుడు వాటిలో “యాంటీబాడీస్ తయారౌతాయి. అప్పుడా నాలుగు రకాల గుర్రాల యాంటీబాడీస్ నుండి యాంటీ స్నేక్ వీనమ్ (ఎ.ఎస్.వి.. తయారౌతుంది. ఇది పై నాలుగు రకాల పాము విషాలకూ విరుగుడుగా పని
చేస్తుంది. గర్భవతులకు, పసిపిల్లలకు కూడ ఈ ఇంజక్షన్లు యివ్వవలసిందే.
ప్రభుత్వం అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 10 ఎ.ఎస్.వి.ల
చొప్పున నిల్వ ఉంచాలి.
మరి ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకోవాలంటే ప్రజల నుండి వత్తిడి రావాలి. పంచాయితీ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంఎపి.టి.సి., జడ్.పిటి.సి. మెంబర్జు, ఎమ్మెల్యే, ఎం.పి.లతో సహా ప్రజా ప్రతినిధులందరికీ పాము కాటు మరణాలు - వైద్యాలపై అవగాహన కల్పించాలి. ఇవన్నీ జరిగినప్పుడు రెండు మూడేళ్ళలో యీ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు.
పాము కాటుకు ప్రథమ చికిత్సను గూర్చి అందరికీ కనీస అవగాహన ॥ కల్పించాలి. పాఠశాలల విద్యార్భలకూ యీ అవగాహన అవసరం. ఏ.ఎస్.వి. మాత్రమే పాము విషాన్నుంచి రక్షించగలదనే ప్రాథమిక అవగాహనను విసృతంగా | ప్రజలంతా ఒకరితో ఒకరు చర్చించాలి. పాము కాటు రోగి చుట్టూ పది మంది చేరి నిరుపయోగమైన పలురకాల సలహాలిచ్చే సమయంలో యీ అవగాహన ఉన్నవారే గట్టిగా వాదించి, నాటు, మంత్ర వైద్యాల బారిన పడకుండ సదరు రోగిని రక్షించగలరు. ఇలాంటి ఒక ఉదంతం గత నెలలో ఇక్కడికి సమీప (గ్రామములో జరిగినపుడు అవగాహనా రాహిత్యంతో నాటు వైద్యానికి పోయి, పుణ్యకాలం కాస్తా హరించుకుపోయి, చివరకు నా దగ్గరకు తీసుకొచ్చారు -
_ఆరున్నరడుగుల మృతదేహాన్ని!
ఈ సంఘటన తర్వాత 15 రోజులకే ఆ పక్క ఊళ్ళోనే ఒక కుర్రాడికి పాము కరిస్తే యధావిధిగా, ఇరుగు పొరుగు అనుభవజ్ఞులంతా ఐకమత్యంతో నాటు వైద్యుని దగ్గరకు తీసుకెళ్తుంటే, ఒకే ఒక్క వ్యక్తి అది తప్పని గట్టిగా వాదించి, చల్లపల్లిలోని ఎం.బి.బి.ఎస్. డాక్షర్ దగ్గరకే వెళ్ళాలని ఒప్పించి, ఎక్కువ సమయం వృథా కాకుండానే ఆసుపత్రికి తరలించాడు. నా దగ్గరకు వచ్చిన . పావుగంటకే వాంతులై పరిస్థితి విషమించింది. 10 ఎ.ఎస్.వి. డోసులిస్తేగాని కోలుకోలేదు.
మరి యీ కుర్రాడి ప్రాణాలు కాపాడింది డాక్టరా? సరైన సమయంలో
| సరైన నిర్ణయం తీసుకొని రోగిని ఆస్పత్రికి తరలించిన వ్యక్షా? నిస్సందేహంగా యీ పుణ్యం సదరు గ్రామస్తునికే దక్కుతుంది. ఎందుకంటే - ఇక్కడ డాక్టర్‌ది వృత్తి ధర్మం. గ్రామస్తునిది అయాచిత మానవతా సాయం! ఎంత ఎక్కువ మందికి ఈ కనీస అవగాహన ఉండి, సామాజిక బాధ్యతాయుతంగా మెలిగితే, ఎందరు తగిన సమయంలో గట్టిగా వాదించి, ఒప్పించగలిగితే - అన్ని నిండు ప్రాణాల్ని డాక్టర్లు రక్షించగలరు.
జనాన్ని విస్తృతంగా చైతన్యవంతుల్ని చేయందే పాము కాటు మరణాలనరికట్టడం సాధ్యపడదని జనవిజ్ఞానవేదిక తొలి నుంచీ వాదిస్తూనే ఉన్నది.
పాముకాటు - ప్రథమ చికిత్స ;:
పాము కరచిన వెంటనే ముందుగా చేయవలసిన పని అది ఏ పామో గుర్తించడం. ఐతే ఈ ప్రయత్నంలో ఎక్కువ సమయం వృథా చేయకూడదు. వెంటాడి, వేటాడి, చంపి, ఆ పామును ఆస్పత్రికి తీసుకుపోనవసరం లేదు. కరిచిన విషసర్పాన్ని ప్రత్యక్షంగా డాక్టర్‌కు చూపినా, ఉన్న పళాన ఏ.ఎస్.వి. ఇంజక్షన్ చేయడు. ప్రాధమిక లక్షణాలు రోగిలో గమనించినప్పుడు మాత్రమే వైద్యం చేస్తారు. మరైతే - కరిచిన పాము కులగోత్రాలు గుర్తించడమెందుకంటారా? అది విష సర్పం కాదని తేలితే రోగి కంగారు పడకుండ స్తిమితంగా ఉండొచ్చనే!
- పాము కరిచిన వ్యక్తి హఠాత్తుగా భయాందోళనలు చెందుతుంటాడు. |
. చనిపోతున్నానని తనకుతానే తీర్మానించుకొని, అయిన వాళ్ళకు అప్పగింతలు పెట్టుతుంటే - ఇరుగు పొరుగు వాళ్ళూ అతనితో బాటు ఆరున్నాక్క శృతిలొ రాగాలాపన చేయకూడదు. రోగికి ధైర్యం చెప్పాలి. పాము విషానికి విరుగుడు
.. ఇంజెక్షన్లున్నాయనీ, డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రమాదం నుండి బైట పడతావనీ ధీమా కల్గించాలి. వైద్యంతో బ్రతికి, నిక్షేపంలా ఉన్న వాళ్ళను పదేపదే గుర్తుచేయాలి.
_* పాము కరిచిన శరీర భాగానికి కొంతపై భాగంలో తుండుతోనో, చేతి రుమాలుతోనో సుమారుగా బిగించి కట్టాలి. తాడుతోనో, ప్లాస్టిక్ వైరుతోనో మరీ గట్టిగా లాగి బిగించి కట్టకూడదు. అందువల్ల రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయి, సదరు శరీరభాగం ఆస్పత్రికి వెళ్ళే సరికే కుళ్ళిపోవచ్చు.
. _కట్టులోంచి ఒకవేలు దూరేంతగా బిగించి కడితే చాలు. తలపై కరిస్తే మాత్రం కట్టనవసరంలేదు.
- కరిచిన చోట ప్రత్యేకించి చేయవలసిందేమి లేదు. గాట్లను పరిశీలించి, గుర్తించగల్లితే చాలు. రెండు లేక మూడు గాట్ట్లుంటే విష సర్పమనీ, అంతకుమించి గాట్టుంటే అది సాధారణ సర్పమనీ గ్రహించవచ్చు.
*ః పాము కరిచిన గాట్ల దగ్గర నోరుంచి, విషంతో నహా రక్తాన్ని పీల్చి ఉమ్మేయటం సినిమాల్లో చూపిస్తుంటారు. ఐతే అది మంచిపని కాదు. ఒకటి - అలా విషపూరిత రక్తాన్నంతా పీలేయటం సాధ్యపడదు. రెండు - పీల్చేవాడి నోట్లో ఎంత చిన్న పుండున్నా అతనికీ ప్రమాదం.
పొమీ కరిచిన చోట నోటితో వష భా వీళ్లే స్తానర్హడు. ఇష్పుయాదు గ న మదకి పైన్ కా వి 44, / కుమ్మ బాస
-
రాగయుక్తంగా, అభినయపూర్వకంగా ప్రార్థిస్తే కరిచిన పామే చచ్చినట్లు మళ్ళీ వెనక్కి వచ్చి, తన విషాన్ని మాత్రమే గాయం నుండి పీల్చేసుకొని వెళ్ళిపోవటాన్ని గూడా పెక్కు సినిమాల్లో చూపిస్తుంటారు. ఐతే, యిది నిజమేనని నమ్మి పాము కరిచినపుడు శ్రావ్యంగా భక్తిగీతాలు పాడుతుండే వాళ్ళను మాత్రం నిజజీవితంలో నేను చూడలేదు.
-
పాము గాట్ల దగ్గర కొంత కండను కోసి తీసేస్తారు కొందరు. అలా చేస్తే చిన్నగాటు పెద్దగాయమై, దానికి మళ్ళీ అదనపు వైద్యం చేయవలసి వచ్చి, కోతి పుండు బ్రహ్మరాక్షసి కావడం తప్ప ఎ ఉపయోగమూ లేదు.
-
రోగిని నడిపించకూడదు. సైకిలు, స్కూటరు, కారు - దేనిమీదైనా ఎక్కించుకొని, సాధ్యమైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఎం.బి.బిఎస్. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి.
-
పాము కరచిన రోగికి నోటి ద్వారా ఎలాంటి ఆహారమూ ఇవ్వొద్దు.
22
డాక్టర్ చేసే వైద్యం
- కొన్ని ఇతర వైద్యాలతో పోల్చినప్పుడు ఇది సంక్షిష్ట వైద్యమేం కాదు.
- రోగికి ధైర్యం నూరిపోస్తూ, ఆస్పత్రిలో ఎడ్కిట్ చేసుకోవాలి. _ * ఆహారమేమీ ఇవ్వకుండా సెలైన్ ఎక్కించాలి... శ ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్తగా టెట్వాక్ యింజక్షన్ చేయాలి. | ఓ రోగిని పరిశీలిస్తూ విషప్రభావం కనిపించినపుడు ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు చేయాలి.
- విష లక్షణాలేవి కనిపించకపోతే 24 గంటల తర్వాత రోగిని ఆస్పత్రి నుంచి పంపించివేయచ్చు. ౪ పాము కరిచిన చేతికో, కాలికో ఒక్కోసారి చీము పట్టవచ్చు. అప్పుడు అవసరమనుకొంటే డాక్టర్ అక్కడ ఒక కోత పెట్టి చీము తొలగిస్తాడు.
- ఎప్పుడైనా రక్తపింజర విషం వల్ల మూత్రపిండాలు చెడితేనో, మెదడులో రక్త | __ఫ్రావమై కోమాలోనికి వెళితేనో - నెఫ్రాలజిస్టు వద్దకో, న్యూరోసర్దన్ వద్దకో పంపుతాడు. ఐతే నూటికి 98 సందర్భాల్లో ఇలాంటి అవసరాలు రావు. నివారణలు వ్యవసాయ ప్రధానమైన మన దేశ గ్రామీణ ప్రాంతంలో పాము కాటును వూర్తిగా నివారించటం అసాధ్యం. వ్యవసాయ భూముల దగర పాములుంటాయి. పగలు చెట్టుచేమల దగ్గర ఎమరుపాటుగా ఉన్నా, రాత్రి పూట లైటు లేకుండ నడిచినా, నేలపై పడుకొని నిద్రించినా పాము | కాటులకవకాశాలుండనే ఉంటాయి. వ్యవసాయ కూలీలు చెరుకు తోటల్లో పనిచేసే సమయంలో చేతులకు తొడుగులు, మోకాళ్ళ వరకు బూట్లూ వేసుకోవడం మంచిది. రోగి బంధువుల విచిత్రాలు నంప్రదాయుం - అది మంచిదో, చెడ్డదో - దాని బలం ఎలా ఉంటుందనేందుకొక ఉదాహరణ చిత్తగించండి. రెండేళ్ళ క్రిందట ఒక మిట్ట మధ్యాహ్నం మంచి ఒడ్డూ పొడుగూ ఉన్న | ఆసామి తన బంధువును త్రాచుపాము కరిచిందని తీసుకువచ్చాడు. నాటు
వైద్యుని దగ్గరకు తీసికెళ్ళాలనే బంధువుల జత్తిళ్ళను లెక్కచేయక కరచిన అరగంటలోపే సరాసరి ఆసుపత్రికే తీసుకువచ్చినందుకు నేను సంతోషించాను. ఐతే, సూటిగా నిర్మొహమాటంగా అతడు నన్నిలా అడిగాడు. “డాక్టర్ గారూ. నా నమ్మకం నాది. ప్రక్క ఊళ్ళో నాటు వైద్యం చేయించి, మరొక్క గంటలో రోగిని మళ్ళీ మీ దగ్గరకు తీసుకొస్తాను. అప్పుడు మీరు వైద్యం చేద్దురుగాని... నేను గూడ ఇంచుమించు ఆయనంత స్థిరంగానే చెప్పాను. “మీకా నాటువైద్యం కావాలనుకుంటే అలాగే వెళ్ళండి. కానీ అది ఎంతో రిస్క్ తీసుకోవడం. ఎ వైద్యం కావాలో త్వరగా నిర్ణయించుకోండి అని. కొంతసేపు వాళ్ళలో వాళ్లీ తర్దన భర్దనలు పడ్డారు. నాటు వైద్యం కాదనుకొని, చివరకు మా ఆసుపత్రి వైద్యాన్న ఎన్నుకున్నారు. ఐతే బలిష్టుడైన ఆ ఆసామి మాత్రం ని వైద్యంతో తగ్గక మావాడికేదైనా జరిగితే నీ సంగతి తేలుస్తా..... అన్నట్లుగా నాకేసి చూసిన చూపు యిప్పటికీ నాకు మరపురాదు! సరే, ఆ రోగి పూర్తి స్వస్ఫుడై తిరిగి వెళ్ళడంతో అక్కడికి కథ సుఖాంతమైంది. సంప్రదాయ ఆధునిక ఇంగ్లీషు వైద్యాలలో ఎదో ఒకటి ఎన్నుకోక తప్పని సన్నివేశంలో సగటు ప్రజల డోలాయమాన మానసిక స్థితికిదొక మంచి ఉదాహరణ! నేను వైద్యం చేసిన పాము కాటు కేసుల్లో అధిక భాగం నాటు, పసరు, మంత్ర వైద్యాల తర్వాత వచ్చినవే! ఆసుపత్రిలో రోగిని చేర్చాక, నాటు వైద్యం వంకకు మొగ్గినవారు కొందరున్నారు. మరికొందరైతే నా వైద్యశాలకే నాటు వైద్యులను తీసుకునివచ్చి, ఎక కాలంలో రెండు వైద్యాలను పొందాలని ప్రయత్నించారు. ఇందులో ఉన్న ఇబ్బందులు రెండు. నాటు, మంత్ర వైద్యాలతో కాలహరణం మొదటిది. కలికం కళ్ళల్లో పోయటంతో అవి ఎగర్రబారి పాము విష ప్రభావం ఎంతో నాటు వైద్యమహిమెంతో తెలియని గందరగోళ పరిస్థితిలోకి " వైద్యుణ్లీ నెట్టడం ర0డోది. నోట్లో పసరు పోయటం వల్ల వాంతులు అయినవో, విషప్రభావంతో అయినవో తెలుసుకోవడం కష్టం. ఈ రెండు సందర్భాలలోను రోగికి ప్రమాద ఘటికలు మోగుతూనే ఉంటాయి. నాటు వైద్యం చేయించి ఆసుపత్రికి తీసుకువస్తే ఆధునిక వైద్యం చేశానుకాని ఆసుపత్రిలో చేర్పించిన తరువాత నాటు వైద్యాన్ని ఇంతవరకూ అంగీకరించలేదు.
చివరగా
మార్పు అనేది యీ లోకం యొక్క సహజ లక్షణం. గత నాలుగైదేళ్ళలో చల్లపల్లి పరిసర మండలాలలో పాముకాటు వైద్యంలో స్పష్టమైన మార్చు వచ్చింది. సంప్రదాయ వైద్యాలైన మంత్రాల, ఆకుపసరుల వైద్యం నుండి శాస్త్రీయ ఆధునిక వైద్యం వైపు జనం మారుతున్నారంటే ఇందుకు ముఖ్య కారణం రోటరీ
- కె.సి.పి. సంస్థల కృషేనని చెప్పాలి.
ఈ చిన్న పుస్తకాన్ని చదివి విజ్ఞులు అందలి ప్రధాన విషయాన్ని, పది మందితో చర్చించి, ప్రజల అవగాహన పెంచాలని మనవి. జనం మధ్య అలాంటి అవగాహన పెరిగి, పాము కాటు మరణాలు క్రమేపీ తగ్గితే అదే యీ పుస్తకానికి సార్ధక్యం!
ఇండియాలోని ప్రముఖ హెర్పిటాలజిస్ట్ (పాము శాస్త్రజ్ఞుడు) రోములస్ విటేకర్ అభిప్రాయమిది....
'“అనలే వైద్యమూ లేకున్నా నగం మంది పాముకాటు రోగులు బ్రతుకుతారు. కొన్ని చిన్న జబ్బులకు మీరే వైద్యాలైనా చేయండి; పాము కాటుకు
/ మాత్రం మంత్రతంత్రాల, పసరు వైద్యం చేసి, ఒక్క రోగి చనిపోయినా ఆ వైద్యుణ్ణి హంతకుడుగానే భావించాలి”. 25
డా! వి. కళైలఅరసన్ (డైరెక్టర్, చెన్నై స్నేక్ పార్క్‌తో ఇంటర్‌వ్యూ
నా ప్రశ్న: డాక్టర్ అరసన్! విష సర్పాల నుండి తీసే విషం వల్ల ప్రయోజనాలేమిటి?
జవాబు ; ఇందులో 99% విషం యాంటీ స్నేక్ వినవ్ తయారీలో ఉవయోగవడుతున్నది. మిగిలిన ఒక్కశాతం పరిశోధనల కోనం వాడుతున్నారు. “బోట్రపేస్” అనే మందు తయారు చేయటానికి పాము విషాన్ని ఉపయోగించేవారు. ఇదివరలో రక్తస్రావాన్ని అరికట్టటానికి '801/20&86' ను వైద్యులు వాడేవారు.
ప్రశ్న : మన దేశంలో సంవత్సరానికెన్ని 5౪ లు తయారవుతున్నాయి? ఎన్ని
ఎక్కడ ఖర్పవుతున్నాయి?
జవాబు : ప్రస్తుతం ఇండియాలో ఏటా సుమారు పది లక్షల యాంటీ స్నేక్ వీనమ్ వెల్స్ తయారవుతున్నాయి. ఇందులో లక్షన్నర ఇంజక్షన్లు తమిళనాడు ప్రభుత్వం, లక్షన్నర ఇంజక్షన్లు మహారాష్ట ప్రభుత్వం, యాఖైవేలు కేరళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు యాఖైవేలు మాత్రం కొనుగోలు చేస్తున్నది.
ప్రశ్న : 'హెర్పిటాలజీ' అంటే ఎమిటి?
జవాబు : సరీసృపాల, ఉభయచరాల అధ్యయనం.
ప్రశ్న : 'ఓఫియాలజీ' అంటే ఎమిటి?
జవాబు : సర్పాల అధ్యయనాన్ని 'ఓఫియాలజీ అంటారు. డాక్టర్ పాట్రిక్ రస్సెల్‌ను 'ఓఫియాలజీ పితామహుడు (౯41601 0౧0౧10100౫) గా వర్ణిస్తారు. 1727లో ఇంగ్లాండ్‌లో జన్మించిన పాట్రిక్ రస్సెల్ 125 ఎళ్ళ క్రిందట విశాఖపట్నంలో పనిచేశారు. వైద్యశాస్త్రంలో పట్టాపొంది, పాముల మీద విసృతంగా పరిశోధనలు చేశారు. విశాఖ ప్రాంతాలలో ఎక్కువగా వుండే “కాటుక రేకుల పొడ పాము” (గుమ్మడిత్తుల పెంజెర) మీద పరిశోధనలు చేశారు. అందుకే ఆయన మరణానంతరం ఆ పెంజెరకు “రస్సెల్స్ వైపర్ అని ఆయన పేరే పెట్టారు. తన 78వ ఎట 1805లో ఆయన మరణించారు.
ప్రశ్న : సముద్రపు పాముల సమాచారం వివరిస్తారా? జవాబు : భారతదేశంలో ఉన్న 20 జాతుల సముద్ర సర్పాలన్నీ విషపూరితాలే. అయితే మన దేశంలో ఈ పాము కాట్లు చాలా అరుదు. ఆస్టేలియా, జపాన్ వంటి దేశాలలో 564 800/8 ఎక్కువ. సముద్ర పాము కాటులు కూడా ఆ దేశాలలో ఎక్కువే. ఇండియాలో సముద్ర సర్పాల విషాలకు విరుగుడు (యాంటీ 'స్నేక్ వినమ్) తయారీ లేదుగానీ జపాన్, ఆస్టేలియా మార్కెట్లలో దొరుకుతుంది. ప్రశ్న : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పొము ఎది? జవాబు : అతి ప్రమాదకర విషసర్పం 7108. దీన్నే టైగర్ స్నేక్ అని కూడా అంటారు. ఆ(స్టైలియాలో ఉంటుంది. దీని తర్వాత ప్రమాదకరమైనది మన దేశంలోని కట్లపాము. ప్రశ్న : త్రాచుపాము పగ పడ్తుందనే ప్రజల నమ్మకం మీద మీ అభిప్రాయం? జవాబు : పగబట్టేందుకు అవసరమయ్యే జ్ఞాపకశక్తి, మెదడు పాములకు లేనే లేదు. ప్రశ్న : అంటే.. మామూలు త్రాచుకాశక్తి లేదు కానీ, కింగ్ కోబ్రాకు పగబట్టే శక్తి ఉందని కొందరి ఊహ... | జవాబు : ఈ ప్రపంచంలో ఏ జాతి పాముకైనా పగబట్టేంత మేధాశక్తి లేదుగాక లేదు. ప్రశ్న : కింగ్ కోబ్రా కరిస్తే ఎం చేయాలి? జవాబు : అది చాలా పెద్దసైజు పాము కనుక కరిచినపుడు ఎక్కువ విషాన్ని శరీరంలోకి ఎక్కించగలదు. కింగ్‌కోబ్రా విషంలోని రసాయన నిర్మాణం కూడా త్రాచుపాము విషంలాగానే ఉంటుంది. కాకపోతే త్రాచు విషంకన్నా కాస్త పలచగా ఉంటుంది(0॥4166 ౧015100). కింగ్‌కోబ్రా విషానికి కూడా మార్కెట్లో దొరికే యాంటీ స్నేక్ వీనమ్ విరుగుడుగా పని చేస్తుంది. ప్రశ్న : మీ చెన్నై స్నేక్ పార్క్' ఆశయాలేమిటి? జవాబు : ఇదొక “సర్చ విద్యాసంస్థ . ప్రకృతిలోని “ఆహారపు గొలుసు లో పాములు అనివార్య జీవులు. పర్యావరణ సమతుల్యత కోసం పాముల మనుగడ తప్పదని మేము ప్రజలకు వివరిస్తాం. థ్యాంక్ అరసన్ గారూ] నమస్తే డార్టర్!
౪ సచిత్రు వ్వానుకు మీద
చదుకకుల అకూల్వ అభిప్రాయాలు, సూచనలు
తెలియజేప్తి పుయోజనకరంగా ఉంటుంది. డాక్టర్ డి.ఆర్.క. ప్రసాద్ పద్మావతి హాస్పిటల్
చల్లపల్లి-521 126. కృ్దు జిల్తా.
ఫోన్ : 222350, 222443 (08671)
వి
క్ర రాాానాాపాడా- న్న. 00 (౧4గర్ నన క నప... పట్టడం ఒక బ్రహ్మాండమైన కల్పన! స్త వని ల్సి ద్వేషించి చంపవద్దు; పూజించి మొక్కవద్దు. ఈ ప్రకృతిలో అవీ ___మెనివంట్ ప్రాణులే. నవాణణణణల్లణక్టాష్యకలోసత్రహారపు గొలుసులో పాము పాత్ర తప్పనిసరి. పర్యావరణ రక్షణకోసం పాముల్ని బ్రతకనీయండి. . అణనాణనల్లానాన్యాల్లతాల్హా వ్రాలి స్టో పడిన పాముకాటు మరణాలు ఒక సంవత్సరంలో అవాాాాాతక్‌దాకలెనీంచాం. పేపర్ కందని దురదృష్ట మరజాలెన్నో మరి! వీరిలో .. శఈనీనం 52 మందిని వల్సెప్రాంతాల ఎం.బి.బి.ఎన్. డాక్టర్లు అనుభవపూర్వకమైన అంచనా. అణాల పీముప్తక్తుకి కొటులలో సుమారు 30 శాతం విషం ఎక్కని, ఉత్తుత్తి. __ కాటులేఉంటాయి. అనేక కారణాల వల్ల విషసర్పాలు కరిచిన ప్రతిసారీ ణాణవాణంం- “తగిన చెకుదులో విషం ఎక్కక పోవచ్చు. వీటినే డైబైట్స్ అంటారు. ఈ ఉత్తుత్తి కాటులే నాటు వైద్యులకు, మంత్రగాళ్ళకు గుర్తింపును, కీర్తిని తిచ్చ పెట్టేవి! . | అఅణజజాలిక్ సరైన మోతాదులో పాము విషం శరీరంలోకి ఎక్కితే ఏ.ఎస్.వితోతప్పు ఈ ప్రపంచంలో మరే వైద్యం వల్లనైనా ఎవరైనా బ్రతికిన దాఖలా .'. యింతవరరకూ లేదు. అననతట్యోాను ద్రొన్సి న్వల్ప అన్వన్ఫతలకు మీరేవైద్యాలనైనా చేసుకోండి కాని, పాముకాటుకు నాటు, మంత్రవైద్యంతో ఒక్కరోగి మరణించినా, సదరు వైద్యుడిని హంతకుడుగానే భావించాలి... న. - రొమొలస్ విటేకర్, ప్రముఖ 'హెర్పిటాలజిస్ట్ టు నాగుపాము తలపై నుండే “నాగమణి' చుట్టూ ఎన్నెన్ని సినిమాలు, సరియళ్ళు, నవలలు వచ్చాయో! అసలు నాగమణే ఒక అభూతకల్పన. వననలలనానాా స్రాన్సి. (వ్రధ్రమిక్ర ఆరోగ్య కేంద్రాలలో కనీసం పది డోసుల “ఏంటీ స్నేక్ , వనమ్ చొప్పున నిల్వ వుంచాలి.
మవసు ఫౌండేషన్ జ్ పుస్తకాల పరిశీలనాపట్టిక , _ంవళ (గద ౧న [[ద్ గ _ముందుఅ (కా మక శ .కకొనల ౧౧ ం టం
టర డా (చద (౮౦౧౦౮ (కంగు చని (ర్ చెయ్యనీ సం రిం _--పింనం | ౦రిగ్|!