Telugu నేనూ సావిత్రి భాయిని - anilvaranasi/indianlanguages GitHub Wiki

ర్ట జ నిని &ి ఇ ళ్‌ | ॥ ఠి న! జీ థి | |] | జో ఇ షు , ౧ ర్‌ వా టా. అథి , న! శః అసం | | సా వ తటే 1 " అ అ [ | / కా (క భ్‌ | "1. | [= ఖే క త శ | జ ల డి శ జో! . గా | ల యాతి న! క ॥ గ ణీ నలు సం |! | 4 జ శ్‌ ” ! | (నీ | కి. నా (| న - లం ళ / " ఖ్‌ 1 లీ . వ్‌ జ్‌ మ. నీ మప జ్ఞ. “శ. ఇ క... / | 44 ( జ్‌

తక జ జ్‌” ళ్‌ ఖ

/చర1ద01గీ [5% ననూ... సావిత్రీ బాయిని . / మరారీ మూలం సుషమా దేశ్‌పాండే / ల అనువాదం | (ర్రచురణ: | జనవిజ్ఞాన వేదిక (ఆం.ప్ర) కాకినాడ జిల్లా కమిటీ /. గా

నేనూ... సావిత్రీ బాయిని మరాఠీ మూలం : సుషమా దేశ్‌పాండే తెలుగు అనువాదం ఓల్లా ప్రచురణ : డిసెంబర్‌, 2028 . ప్రతిపాదిత చందా : రూ. 80/- ప్రతులకు : కె.ఎమ్‌.ఎమ్‌.ఆర్‌. ప్రసాద్‌ - 90000 60987

వి. శ్రీరామారావు - 91777 98999

జి.ఎస్‌. హెచ్‌.పి. వర్మ - 85004 12734 వివరాలకు ఏ 1యయయి[2326)7/62200411.000

నొ

యుందుమాట

భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయిని ఆదర్శ మహిళ, బాలికల విద్యకోసం ముఖ్యంగా నిమ్న కులాల బాలికల కోసం ఎన్ని ఆటంకాలెదురైనా (1884 పూనా) పాఠశాలను స్థాపించడమే కాదు, నిబద్ధతతో, నిజాయితీతో, నిరంతరం

  • తపనతో తనదైన శైలిలో సమాజానికి ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత. 40కి పైగా పాఠశాలలను స్టాపించి చదువు నేర్పడం ఉద్యమంగా సాగించిన మనందరి అమ్మ న సావిత్రీబాయి.

ఆ రోజుల్లో ఆమె చదవడమే ఒక చరిత్ర బాలికల విద్యకోసం పాఠశాలలను స్థాపించడం చరిత్ర. ఆ పాఠశాలలో ఉవాధ్యాయినిగా పనిచేయడం మరో చరిత్ర - బ్రాహ్మణ వితంతువులకు గుండు చేయించకుండా క్షురకులతో సమ్మె చేయించడం చరిత్ర. తన భర్త చనిపోయినపుడు కుటుంబసభ్యులను, సమాజాన్ని లెక్క చేయకుండా చితికి నిప్పంటీించడం సాహసంతో కూడిన చరిత్ర. అందుకే “చరిత్రను అధ్యయనం చేయవచ్చు చరిత్రను రాయవచ్చు, చరిత్రను సృష్టించడమే ఆమోఘం, అనిర్వచనీయం”.

ం 1877లో కరువు వచ్చినపుడు ఓ తల్లి తనబిడ్డ ఆకలిని చూడలేక బిడ్డకు విషమిచ్చి తను కూడా విషంతాగిన సందర్భాలను తన కళ్ళారా చూసి చలించిన ం సావిత్రీబాయి రోజుకు రెండు వేల మందికి ఆకలి తీర్చిన అన్నదాత. బాలవితంతువులు గర్భందాల్చినపుడు ఆ పసిగుడ్దులను చంపేస్తుంటే వాళ్ళను చేరదీసి తన ఇల్లునే లేబర్‌ రూమ్‌గా మార్చి వాళ్ళకు తనే పురుళ్ళు పోసిన నిజమైన అమ్మ సావిత్రీబాయి.

పూనాలో స్లేగువ్యాధి ప్రబలినపుడు ప్రజలందరూ అడవుల్లోకి పారిపోతుంటే తన ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తూ ఆ వ్యాధికి తనే బలైయింది.

కాళోజీ అనట్లు

“పుటుక నీది,

చావు నీది,

బ్రతుకంతా దేశానిది”.

(౪ శ

మాటల సందర్భంలో ఓల్లా గారిని సాహిత్యంలో అన్ని ప్రక్రియలను సృజించిన మీరు పిల్లల కోసం ఓ పుస్తకం రాయొచ్చు కదా! అని అడిగినపుడు పిల్లల కోసం పుస్తకం రాయలేనని, కాని నా దగ్గర సావిత్రీబాయి పూలే పుస్తకముంది, ఆ పుస్తకం ఎక్కువ మంది చేత చదివించడం ప్రస్తుతకాలంలో ఎంతైనా అవసరమన్న ఆమె మాటే ఈ పుస్తకానికి ఊపిరి. ఈ పుస్తకం అనువాదమైనా సావిషత్రీబాయి మనతో మాట్లాడుతున్నదా అనిపించేలా రాయడం ఆమెకున్న గొప్ప నైపుణ్యం. ం జనవిజ్ఞానవెదిక కాకినాడ జిల్లా తరపున ఓల్లా గారికి ధన్యవాదములు.

ఈ పుస్తకం మొదట మరారీలోను, తరువాత ఇంగ్లీషులోను రాసిన రంగస్థల + కళాకారిణి సుషుమా దేశ్‌పాంధఢే గారికి జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా తరపున ధన్యవాదములు.

ఈ పుస్తకం ముద్రణకు సహకరించిన శ్రీమతి సిహెచ్‌. వేణు, శ్రీమతి సిహెచ్‌. ఉమారాజ మంగతాయారు, శ్రీమతి డి. శైలజ, శ్రీమతి కె.డి. సునంద కుమారి గార్లకు జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా తరపున ధన్యవాదములు.

జనవిజ్ఞానవేదిక కార్యకర్తలను తయారు చేయటానికి జె.వి. వి.ని ముందుకు తీసుకువెళ్ళటానికి నిరంతరం తపించే డా! సి. స్టాలిన్‌ గారికి, జనవిజ్ఞానవేదిక ం కాకినాడ జిల్లా పుస్తక ప్రచురణలకు ఆధ్యుడు డా॥ ఎల్‌ ్రతావ్‌ రెడ్డి గారికి, మాకు నిరంతరం సహకారాన్ని అందిస్తున్న అన్న శ్రీ ఐ. వేంకటేశ్వరరావు గ్రాడ్యుయెట్‌ ం ఎమ్‌.ఎల్‌.సి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వారికి, ఏదైనా పని తలపెట్టినపుడు నిరంతరం (శమించాలని నేర్పిన శ్రీ పెదవాటి నరసింహారావు గారికి, ఈ పుస్తకం అందంగా తయారవ్వటానికి కృషిచేసిన శ్రీ కె. శ్రీనివాసరావు గారికి, శ్రీ జి. మురళీధర్‌, శ్రీ క. త్రిమూర్తులు, శ్రీ వి. శ్రీరామారావు, శ్రీ బి.ఎస్‌. హెచ్‌.పి. వర్మ గార్లకు జనవిజ్ఞానవెదిక కాకినాడ జిల్లా తరపున ధన్యవాదములు.

కె.ఎమ్‌.ఎమ్‌.ఆర్‌. ప్రసాద్‌ జె.వి.వి. రాష్ట్ర కార్యదర్శి మరియు కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం, కాకినాడ జిల్లా |

నావివ్రీబాయి మాటలు ఐందాం!

1999వ సంవత్సరంలో 'అస్మితికు ఒక స్వంత గూడు ఏర్పడింది. ఆ సంబరం మిత్రులందరితో పంచుకోటానికి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో ముంబై నుంచి సుషమా దేశ్‌పాండే వచ్చి “నేను... సావిత్రిబాయిని”

ః అనే ఒక గంట నిడివిగల నాటకాన్ని హిందీలో ప్రదర్శిస్తారని అనుకున్నాం. అనుకున్నట్లుగానే సుషమ వచ్చారు. ఆమె ఒక్కతే అన్ని పాత్రలుగా మారి ప్రదర్శన

న చేస్తుంటే అందరూ మంత్రముగ్దుల్లా చూశారు. అంతవరకూ సావిత్రిబాయిని గురించి అంతగా తెలియని వారందరికీ ఆ రోజు ఆమె గొప్ప వ్యక్తిత్వం తెలియవచ్చింది. సుషమ సావి(త్రిబాయిగా జీవించింది. సుషమ ఒక వారం హైదరాబాదులో ఉండి మూడు చోట్ల ప్రదర్శనలు, రెండు వర్మ్‌షాపులూ నిర్వహించేలా అస్మిత నుంచి యెర్పాటు చేశాం. ఆమె ఆ పని చేసి వెళ్ళిపోయారు.

కానీ సావిత్రిబాయి జీవితం, ఆమె చేసిన పనులూ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. వీటిని అందరితో పంచుకోవాలనీ, తెలుగు పాఠకులకు సావి(త్రిబాయిని గట్టిగా పరిచయం చెయాలని చాలా తపన కలిగింది. సుషమ

దేశ్‌పాండే రాసినది ఇంగ్లీషులో కూడా ఉండటంతో ఆమె అనుమతితో దానిని తెలుగులోకి అనువాదం చేశాను. అస్మిత తరపున ప్రచురించాం (1999లో). నేను

. చాలా పుసకాలు అనువాదం చేశాను గానీ “నేను... సావిత్రిబాయిని” అనువదించటంలో పొందిన ఆనందాన్ని ఎన్నడూ పొందలేదు. ఆ అనుభూతి సాటిలేనిది. అమ్మ ఒడిలో చేరి ఆమె మాటలు వింటున్నట్టుగా అనిపించింది. అమ్మలకు అమ్మ మనందరి అమ్మ సావిత్రీబాయి. మన అమ్మ మాత్రమే కాదు. గురువు - మన దేశంలో తొలి ఉపాధ్యాయిని. అక్షరాలను దిద్దించటమే కాదు. సమాజాన్ని చక్కదిద్ది పనిలో నిమగ్నమైన గొప్ప సంస్కర్త. ప్రాత: స్మరణీయురాలు.

ఆ పుస్తకం అస్మిత ఎన్నిసార్లు ప్రచురించిందో లెక్కేలేదు. గ్రామిణ మహిళా సంఘాలన్నిటికీ ఆ పుస్తకాన్ని చేరవేశాం. బి.సి. సంఘాలు వందల కొలది పుస్తకాలను కొన్నాయి. సామాజిక కార్యకర్తలకు పంచిపెట్టాం ఐనా ఆమె గురించి తెలియని

గి ఎం

ప్రాంతాలు, ప్రజలు ఉండవచ్చు. అందుకే ఇపుడు “జనవిజ్ఞాన వేదిక” వారు అడగగానే ప్రచురించటానికి అనుమతి ఇచ్చాను. ఇది అందరూ చదివి తీరాల్సిన పుస్తకం. చదివించాల్సిన పుస్తకం. కొంతకాలం దీనిని పదవ తరగతి పిల్లలకు కాబోలు నాన్‌-డిటైల్‌ పుస్తకంగా సిలబస్‌లో ఉంచారు. చరిత్ర సృష్టించిన మహిళ సావిత్రీబాయి. ఇది చదివి బాల బాలికలు (పేరణ పొంది సమాజం గురించి, సంస్కరించుకోవాల్సిన అవసరం గురించీ ఆలోచిస్తే, ఒకరిద్దరైనా కార్యాచరణకు పూనుకుంటే అదే ఆమెకు నిజమైన నివాళి. జనవిజ్ఞాన వేదిక ఈ పని తలపెట్టినందుకు అభినందనలు.

  • ఓల్తా (౧ న్డ్‌

నమన్మారం! ఇవాళ మీ అందరితో మాట్లాడటానికి వచ్చాను. ఈ అమ్మాయి రూపంతో వచ్చాను. నేను కళ్ళు తెరిచి నా చుట్టు యేం జరుగుతోందని చూస్తే గుండె పగిలి పోతోంది. మా కాలం వెళ్లిపోయింది. కానీ మీరందరూ మా కాలంలో మేం యొక్కడున్నామో అక్కడే నిలబడిపోయారా అని ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందా అనుకుంటాను. నాకీరోజు మీతో యెంతో చెప్పాలని వుంది. ఎన్నో విషయాలు, మేం యెట్లా బతికాం, యేం చేశాం. అన్నీ! ఆగండి. మేమేదో గొప్ప ఘనకార్యాలు చేశామని చెప్పబోవటం లేదు. నా గురించి చెప్పాలంటే నేను సేఠ్‌జీ పెళ్లాన్ని కాగానే ఆయన చెసే "పనిలో చిక్కుకునిపొయ్యాను. ఆ పనేమిటో, దాని సంగతేమిటో తెలియకుండానే అందులో చిక్కుకున్నాను. అదెలా జరిగిందో తెలియకముందే అదంతా నా పని అనుకోవటం బొత్తిగా బాగోలేదు. మొదట్నించీ చెప్తా వినండి. నేను పుట్టిందేమో నైగావ్‌. అయ్యో అదెక్కడుందో. మీకు తెలియదుగదూ! మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో వుంది. అబ్బో యెంత కుగ్రామమనీ, అక్కడసలు మనుషులుంటారా అని అనుమానం కలిగేంత చిన్నవూరు. ఆ రోజుల్లో ఆ వూళ్లో అందరూ అందర్నీ యెరిగివుండేవాళ్లు. నేనా? పాటిల్‌ గారింట్లో పెద్ద కూతుర్ని మొదటి సంతానాన్ని అబ్బా మీకదంతా చూవించేదా? ఆ . చేలల్లో పడి పరిగెత్తుతూ, ఆ గులకరాళ్లను, దుమ్మునూ తన్నుకుంటూ-ముళ్లు గుచ్చుకోవా అంటున్నారా? ముళ్లూ గిళ్లూ యేవీ లెక్కలేదు నాకు. విరబోసుకున్న జుట్టు ముఖం మీద ం పడుతుంటే వెనక్కు తోసుకుంటూ వూరంతా వెర్రిగా పరిగెత్తేదాన్ని. నాలుగేళ్లు నిండాయోలేదో మా అమ్మ యిక మొదలుపెట్టింది. “ఇంక నువ్వు రొట్టెలు కాల్చడం నేర్చుకోవాలి. పెద్దదానివవుతున్నావు' అయితే నేను మాత్రం మట్టిలో నీళ్లు పోసి, పిసికి ముద్దచేసి ఆదేదాన్ని గానీ గోధుమపిండిలో నీళ్లుపోసి పింది ముద్దని కలిపేదాన్ని కాదు. అబ్బా మా అమ్మ యెట్లా అరిచేదనీ, చేతికి యేది దొరికితే అది తీసుకుని నా వెంటబడేది. పాడుపిల్లా, నీమెళ్లో పసుపుతాడు కట్టేవాడి కోసం వెతకలేక తిప్పలు పడుతుంటే నువ్విట్లా చేస్తావా అని తిట్టది. నాకేం లెక్కలేదు. నేను మా నాన్న వెనక దాక్కుంటే చాలు. ఎవ్వరూ యేం చెయ్యలేరు. చింతకాయలు కొట్టకు తినటం, రేగుపళ్లు కోసుకు తినటంలో నన్ను మించినవాళ్లు లేరు. ఒకరోజు యేమైందో తెలుసా - బెను మీరనుకుంటున్నట్టె జరిగింది. (1

నేనెక్కిన సీమ చింతచెట్టు కొమ్మ విరిగింది. నేనా కొమ్మపట్టుకుని వుయ్యాల వూగుతున్నా

  • సీమ చింతకాయలు నా పరికిణీలోంచి కింద పడిపోతున్నాయి. 'అమ్మా-నా సీమచింతకాయలు - నేను పడిపోతున్నా. కొమ్మవిరిగింది, పడిపోతున్నా' నా గోలకి అమ్మ పరిగెత్తుకొచ్చింది. వచ్చింది నన్ను దించొచ్చు కదా - ఉహూ - వెళ్లి మా నాన్నను పిల్చుకొచ్చింది. “చూడండి మీ ముద్దుల కూతురు యేం చేసిందో” అంటూ అమ్మ నా వైపు చూపిస్తూ, నేనేమో కొమ్మకు వేలాడుతూ, మా నాన్న విరగబడి నవ్వుతూ - ఎంత బాగుంది , కదూ.

నాన్న నన్ను కిందికి దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు 'ఈ పిల్లకు తొందరగా ణం పెళ్లి చేసి పంపించాలి. ఏకాలో చెయ్యో విరక్కొట్టుకుంటే యెవరు చేసుకుంటారు? గుదిబండలా మన మెడకు చుట్టుకు వేలాడుతుంది. అసలిది ఆడపిల్లేనా అంట?”

'నెను ఆడపిల్లను కాదమ్మా - యిదుగో ఈ సీమ చింతకాయ చూడు యెంత తియ్యగా వుందో నేను పెద్ద లొద్దని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్లీ పరుగుతీసేదాన్ని.

కానీ నాన్న కూడా ఈ పిల్లకు పెళ్లిచేసి పంపాలి అని అనుకోవటం మొదలుపెట్టాడు. పూనాలో వుండే పూలే కుటుంబంలో ఒక అబ్బాయితో నా పెళ్లి నిశ్చయించాడు. ఈ సేఠ్‌జీ యెట్లా వుంటాడబ్బా అనుకునేదాన్ని!

చింత చెట్లెక్కుతాడా?

బావిలో ఈత గొడతాడా? ]

రాత్రిళ్లు అరుబైట పడుకుని చుక్కలు లెక్కబెడతాడా?

ఎమో - ఎవరికి తెలుసు? బళ్లో చదువుకుంటున్నాడని చెప్పారుగా. పుస్తకాలు చదవగలదేమో!

అబ్బో - మీరేమైనా అనండి. పెళ్లి కుదిరిందనగానే నాకెంత సంబరమో. యెంత గర్వమో. అమ్మనీ, నాన్ననీ వొదిలి వెళ్లాలనే బాధ ఒక పక్కా వున్నానా హృదయం పురి విప్పిన నెమలి లాగా నాట్యం చేసింది. నేను పెద్ద పట్నానికి వెళ్తున్నాను. గుర్రబ్బండిలో కూచుని వెళ్తున్నాను. ఇక ఆ పట్నంలో చూద్దానికి యెన్ని వింతలైనా వుంటాయి.

ఆ రోజుల్లో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగి పెద్దయ్యేసరికి - లక్ష్మణుడు గీసిన గీత దాటటం వల్లనే సీతమ్మ వారిని రావణాసురుడు యెత్తుకుపోయాడనే

కథ యెన్ని వందలసార్లు వింటుందో యెవరూ లెక్కబెట్టలేరు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పాయ్యికీ కట్టుబడి వుండాలి. పొయ్యిలో కట్టెలు, పొయ్య వూదే గొట్టం ఆ పిల్ల చేతిలో వుండాల్సిందే. ఆ పిల్ల ఆ గొట్టం గుండా వూపిరంతా పొయ్యిలోకి వూదాల్సిందే. భర్తనీ, అత్త మామల్ని సేవించుకోవాలి. అంతే యిక నీ పని. ఇప్పుడు మీ పిల్లలు రెండో తరగతి చదువుతుంటే, మీరు బుజ్జగిస్తుంటారే - ఆ వయసులో మేం మా అత్తగారింట్లొ , వుండేవాళ్లం. ఇది వినండి. నా పెళ్లిలో - అదే మా పెళ్లిలో - పెద్ద గుంపు చేరింది. నా | పరికిణీ తీసేసి చీర చుట్టబెట్టారుగా, నేవో దిష్టిబొమ్మలా వున్నాను గాస్‌ పెద్ద రాణిగారిలా చూస్తున్నా అందర్నీ నా తలమీద పెళ్లి ముసుగు దాని మీదుగా పూలహారాలు వేలాడుతుండగా నా పక్కనున్న యింకో దిష్టిబొమ్మను వోరగంట చూశాను. అదే - నా మొగుడు గారిని, అబ్బా నవ్వాపుకోలేకపోయా. అతనేమో తెలివిగలవాడంటారు చూడ్డానికి యెట్లా వున్నాడో చెప్పలేం. సరే నేను మాత్రం రంభనా యేమిట్లే అనుకుంటుండగా యేదో పురుగునా చీరెలో జొరబడి చెప్పరాని చోట కుట్టింది.

“అమ్మో - అమ్మా - యేంటో కుట్టిందే' ఆ పందిరంతా పరిగెత్తుతున్నాను. చీరె సగం వూడిపోయింది. అమ్మ అరుస్తోంది. 'సావీ - సావీ - చీరె సరిగ్గా చూసుకో - అడదానివి కాదూ -' “అమ్మా - నన్నేదో కుట్టిందే' నెను పిచ్చిగా గంతులేస్తూనే వున్నా 'ని

అల్లరి ఆపుతావా లేదా? అత్తా మామల ముందేనా నీ ఆగడం, సిగ్గులేదూ? మా పరువు త్రీస్తున్నావు. నువ్వు ఆడదానివి. ఎంత నొప్పయినా వోర్చుకోవాల్సిందే. ఏదన్నా కుడితే

  • చప్పుడు చెయ్యకుండా ఓ మూలకు పోయి పురుగుని తీసి పారెయ్యాలి గానీ వూరూ వాడలూ యేకంచేస్తావా?” కానీ మా అమ్మ తిట్లు నా గంతుల్ని ఆపలేకపోయాయి. అప్పుడు సేఠ్‌జీ, నా సేఠర్‌జీ మా అమ్మతో అన్నాడు. 'ఆ అమ్మాయిని తిట్టకండది. ఆడవపిల్లయితే యేమైంది? పురుగు కుట్టటానికి అడా మగా వుండదు. ఆమె చీరలో యేం దూరిందో తీసుకెళ్లి చూడండి” అన్నాడు. చీరె నా వెనకాల యీడ్చుకుంటూ నేను గదిలోకి వెళ్లాను ఆ పురుగు తీసిపారేశాను. నా గుండెలో సేఠర్‌జీ మాటలు దీపంలా వెలుగుతున్నాయి. నా భర్త, నా దేవుడు.

మా అత్తగారింట్లో నేనెన్నడూ పరాయి దానిలాగా అనుకోలేదు. అదే అసలు సీ యిల్లని ఆడపిల్ల రక్తంలో యింకిపోయేట్లు చెప్తారనుకోండి. కాని మా మామగారు చాలా మంచి మనిషి, నేను అచ్చంగాయాలు ఆడుకుంటున్నప్పుడే, ఆయనకు యేదన్నా కావల్సి

(౩౫

వస్తె యెంత నెమ్మదిగా పిల్చేవాడనీ! ఇక మా సేఠ్‌జీకి యెప్పుడూ బడీ, పుస్తకాలు, చదువు, యిదే ప్రపంచం. ఇంతింత లావు పుస్తకాలు ముందేసుకుని యెప్పుడూ చదువుతానే వుండేవాడు. రాస్తూనే వుండేవాడు. వాళ్ల పంతులుగారికి ఈయనంటే పరమ యిష్టమంట. ఆం! ఎప్పుడూ పుస్తకాల్లో మునిగివుంటే యెందుకిష్టం వుండదూ? ఒక్కసారి వచ్చి నాతో ఆడుకోమని అడిగితే యిక చిరునవ్వు చిందిస్తాడు. అన్నీ తనకే తెలుసన్నట్లు బడాయి.

సేఠ్‌జీ సావాసగాళ్ళు - నాకు ఆయన్ని సేర్‌జీ అని పిలవటమే యిష్టం. సేర్‌జీ , అని యలాంటి మనిషిని పిలుసారో మీకు తెలియదూ? వొడుగ్గా, గర్వంగా, అందంగా వుందేవాళ్లని, సేఠర్‌జీ సావాసగాళ్లు యింటికొస్తుండేవాళ్లు సదాశివ బల్లాల్‌ గోవింద, మోరో విఠల్‌ వాల్వకర్‌, సుఖారామ్‌ పరాంజపే వీళ్లంతా వచ్చేవాళ్లు. అంతా కలిసి యెట్లా చదివేవాళ్లో

  • ఒకటే మాటలు. ఎప్పుడూ ముచ్చట్లే అంతుందేది కాదు. ఒక కులం వాళ్లు కాదు. ఒక మతం వాళ్లు కాదు. ఎవరి కులంలో యెట్లాంటి పద్దతులుంటాయో అవన్నీ చెప్పుకునే వాళ్లు. ఒకనారి మా మామగారు సేఠ్‌జీని స్కూల్లోంచి తీసేయించి, యింట్లో వుండమన్నారు. ఆ విషయం గురించి స్నేహితులంతా మాట్లాడుకుంటుంటే నేను చాటునుంచీ విన్నాను. గోవింద అంటున్నాడు. '“నిన్నెందుకు బళ్లోనించి తీసేశారు?”

“అదంతా మా కులపెద్దల పనిరా. కొంతమంది గవర్నమెంటు వుద్యోగులు చేశారీ పని”,

“ఎందుకురా?”

'ఆం - మన కులపు పిల్లవాళ్లు బడికెందుకు పోవాలి అన్నారు”.

'వెళ్తే తప్పేంటి?”

'బుర్రలో జ్ఞానం చేరి దాన్ని పనిచేయిస్తుంది. నేను బడికెళ్తే సోమరిపోతునవుతానంట, పొలం పని చెయ్యటానికి పనికిరానంట, మోట కొట్టలేనంట, పార పట్టలేనంట.

'మీ నాన్న అట్టా అన్నాడా?

'మా నాన్న అన్లేదురా వెర్రాడా. ఆయన నేనెంత చదివితే అంత చదివిసాననే అన్నాడు. కానీ మా మేనమామ - యింకా ఈ వుద్యోగస్తులూ కలిసి ఆయన బుర్ర తిన్నారు”.

'మరి మళ్లీ బడికెలా పంపించారు.

'మా తోట దగ్గర గఫార్‌ బేగ్‌ మున్నీ వుంటాడే - తెలుసా నీకూ!

'ఆ ముస్లీమా?

“జెను. చాలా తెలివైనవాడు, పండితుడు. ఆయనా మిస్టర్‌ లెజిట్‌ కలిని మా నాన్నతో చెప్పారు నన్ను చదివించమని',

'బడికి రానప్పుడు నువ్వేం చేసే వాడివిరా?

“తోటలో పనిచేశా. ఇంకేజేస్తాను? వాళ్లిద్దరూ విద్య యెంత అమూల్యమైనదో చెవ్చారు.

“నువ్వు కష్టపడి చదవబట్టె యిదంతా కుదిరిందిరా'. బెను. అది మాత్రం నిజం, అతనికి పెళ్లయింది. చదువుకుంటున్నాడు అన్నీ తెలిసినట్లు మాట్లాడతాడు. మంచిదే, నీకన్నీ తెలుసు కానీ యేమీ తెలియని నీ పెళ్ళాం సంగతి కూడా కాస్త చూడాలా లేదా? నాలో నేనే అనుకునేదాన్ని. లేకపోతే అచ్చంగిల్లాలతో చెప్పుకునెదాన్ని నిజం చెప్తున్నా. పొద్దుగూకూలూ బడే. బడి, ఇంట్లో వుంటే యిది చదవాలి. అది చదవాలి. అదీ కాదంటే లాహూజీ బావా దగ్గరకు వెళ్లి కత్తియుద్దాలు, కసరత్తులూ నేర్చుకోవటం. ఇక నేనూరుకోలేక అడిగేశాను. 'రోజంతా బళ్ళోనో, కసరత్తులోనో గడుపుతున్నావు. బాగానే వుంది. మరిక్కడ

నా గతేమిటి? ఆడుకోటానికి యెవరూ లేక తోచక చస్తున్నా? అని. సేర్‌జీ పెద్ద మనిషిలాగా సమాధానం యిచ్చాడు. " 'మంచి మెదడుకి తోడుగా ఆరోగ్యకరమైన శరీరం వుంటే యే పనైనా తేలిగ్గా చేయగలం. నీ పెళ్ళాంతో ఆడుకోవటం పని కాదా” అని అడగబోతున్నాను. అంతలో మా మామగారొచ్చారు. నేను అవతలకు పరిగెత్తాను. ఆయన ముందు సేఠ్‌జీతో మాట్లాడటమే! మీకు తెలుసా! నాకు తోచక చస్తున్నాననేది నిజం కాదు. వంట చెయ్యటం నేర్చుకున్నానా. ఇల్లూడ్చి, తుడిచి నీళ్ళు తెచ్చేదాన్నా! కానీ కాసేపన్నా సేర్‌జీ నాతో మాట్లాడితే బాగుండే అని కోరిక ఆయన్ని ఏమడిగినా చిరునవ్వే సమాధానం. ఐనా సరే నాకాయన మీద కోపం వచ్చేదే కాదు. ఒకరోజు నేను యిల్లు సర్పతున్నాను. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నాను. ఇల్లు శుభ్రంగా వుంచాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు.

'నా పుస్తకాలనేం చేస్తున్నావు? 'దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా?” “పెజీలు పోగొడతావ్‌ జాగ్రత్త?” “ఎక్కడికి పోవు, అన్నీ వుంటాయి. యిదేంటో మరి? 'ఏపేజీ అది 'ఏపేజీనో యేంటో నాకేం తెలుస్తుంది? ఏదైతే యేమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు? 'అవన్నీ జీవితచరిత్రలు. యిదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫొటో యిది. ఇక్కడ వాషింగ్‌టన్‌ గురించి రాశారు. ఇది ఆయన ఫొటో. 'ఎవరూ! శివాజీ నాకూ తెలుసు. మనవాదేకదా - కానీ ఈయనెవరూ?” పరాయి, దేశం మనిషిలాగా వున్నాడు. 'మనదేశం అయితేనేం - కాకపోతేనేం. మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి. 'అబ్బో ఈ సంగతులన్నీ మీ బుర్రలో వున్నట్టే చెప్తున్నారే'. 'బుర్రలో వుంచాలనే ప్రయత్నిస్తున్నా ఈ పుస్తకం చూడు. ఇది థామస్‌ పెన్‌ రాసిన 'మానవుని హక్కులు అన్న పుస్తకం. మనిషికున్న హక్కులేమిటో బాధ్యతలేమిటో అన్నీ ఈ పుస్తకంలో రాసివున్నాయి'. = “నిజంగానా? నీకూ రాయటం వచ్చుగా. యిలాంటి పుస్తకాలు రాసావా?” 'రాయొచ్చు.. రాస్తే అవి నాకు చదివి వినిపిసావా?' నేనూ వూరికినే అడిగా, ఎలాగోలా నాతో మాట్లాడుతున్నాడు. ఆయనకు పుస్తకాల గురించి మాట్లాడటం యిష్టమైతే నేను అవే మాట్లాడతాను. 'సెఠ్‌జీ అని మొదటుపెట్టాను. పొరపాటును ఆ పేరుతో ఆయన్ని పైకి పిలిచేశాను. 'ఎమన్నావ్‌' అన్నాడాయన. (క

'అబ్బే - యేం లేదు! చెప్పాల్సిందే 'నేను చెప్పను “నాకిది చెప్పావంటే, రోజూ నీకు యేదో వొకటి చదివి వినిపిస్తా 'ఒట్టూ! ప్రతిరోజూ? “ప్రతిరోజూ! యిప్పుడు చెప్పు యిందాకా యేమన్నావ్‌?” “నిన్ను - నిన్ను సేఠ్‌జీ అని పిల్చాను. నేనలాగే పిల్చుకుంటాను' ఆయన నవ్వాడు. “నీకు కోపం రాలేదుగా? నిజం చెప్పు. రాలా, నాకా పేరు చాలా బాగుంది. 'మరి రేపట్నించీ చదవాలి. ప్రతిరోజూ”. సేఠ్‌జీ ఒప్పుకున్నాడు. నేను పైకి యేమీ అనలేదుగొనీ నా మనసు సంతోషంతో పాట పాడుతోంది. సేఠ్‌జీ నా కోసం చదువుతాడు. ఇంటిచుట్టూ పరుగెత్తాలనిపించింది. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఈ తలుపులోంచి ఆ తలుపులోకి గొంతెత్తి అరుస్తూ పరిగెత్తాలనిపించింది. ప్రతిరోజూ సేఠ్‌జీ నాకు యేదో వొకటి చదివి విన్సించేవాడు. మధ్యలో ప్రపంచం గురించి, మనచుట్టూ వుందే ప్రపంచం గురించి నాకర్థమయ్యేలా చెప్పటం కోసం ఆపేవాడు. " హిందూ ముస్లిం మతాల మధ్య వున్న తేడాలేమిటి? కైస్తవ మతం మనిషి గురించి యేం చెప్తుంది? మన కులవ్యవస్థ మన సమాజాన్ని యెట్లా నాశనం చేస్తోందో చెప్పేవాడు. స్రీలకు యే హక్కులూ యివ్వకుండా యొట్లా అణచి వేస్తున్నారో చెప్పేవాడు. వీటన్నిటి గురించీ ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించుకుని వినేదాన్ని. ఈ మనిషి తలలోకి ఈ ఆలోచనలన్నీ యెక్కడనించి వచ్చాయి? నా భర్త యెంత తెలివైనవాడు! ఒక రోజు పక్కింటి చంద్రక్క అడిగింది. “ఏఏవమ్మా - యివాళా రేపూ మధ్యాన్నాలు, నాయంత్రాలు కనిపించటం మానేశావు. యేం చేస్తున్నావేంటి? (7

'మా ఆయన పుస్తకాలు చదువుతుంటే వింటున్నాను.

'అవన్ని వింటే యేమొస్తుందేం? రొట్టెలు మెత్తగా కాల్చటం వస్తుందా? వూరగాయిలూ వడియాలు పెట్టటం వస్తుందా?

“అదేం కాదు. ఆయన చదువుతున్నాడు కాబట్టి వింటున్నాను. ఆయన మాట యొట్లా కాదనాలి?”

'ఆం! పిల్లలు పుట్టుకొస్తే అన్నీ ఆటలూ కట్టవుతాయి'.

'పుట్టనివ్వు - అప్పటి దాకానైతే వినటం వినటమే”, అన్నాను నేను.

ఇప్పుడు ప్రపంచం యిట్లా వుంది - అంటూ చదివేవాడతను. తమ భార్యలకు యింత శ్రద్ధగా చదివే భర్తలు యెంత మంది వుంటారంటారూ? నా భర్త ఒక్కడే. అది మా యిద్దరి వ్యవహారం. దాని గురించి యెవరైనా యెందుకు జోక్యం కలిగించుకోవాలి? మా మామగారు చెప్పటానికి కూడా యమీ లేదు. వాళ్లు యేమనుకున్నా ప్రయోజనం లేదు. ఆయన చదవటం మానడు. నేను వినటం మానను.

ఎందుకు మానాలి? ఆ సమయంలోనే ఆయన నాతో ఉండేది. రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజు సేఠ్‌జీ తన బ్రాహ్మణ స్నేహితుని పెళ్లికి వెళ్లాడు. తిరిగి వచ్చేప్పుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

'వాళ్లు యేమనుకుంటున్నారు ఎక్కడ్నించి దిగొచ్చామనుకుంటున్నారు?'

'ఎమయింది?” అని అడిగాను మంచినీళ్లు యిసూ,

“పెళ్ళీ జరుగుతోంది. పెళ్ళి వూరేగింపు మొదలవుతుందగా. ఆ బ్రాహ్మణులు నా గురించి గొణుక్కుంటున్నారు. మన బ్రాహ్మలతో కలిసి నడవటానికి వీడికెంత ధైర్యం, వాళ్లలో ఒకడు నా దగ్గరికొచ్చి యిదే మాట అడిగాడు - బ్రాహ్మలతో కలిసి రోద్దువీద నడిచేంత మొనగాడివా? నీ శూద్రపుటక మర్చి పోయావా? నీకో జాతి నీతీ లేదా? మాతో సమానమనుకుంటున్నావా? నువ్వెవరివనుకుంటున్నావసలు? నాలుగక్షరాలు నేర్చుకోగానే నీకులం మారిపోతుందా? నీ యిష్టా రాజ్యంగా వుండటానికి ఈ ఇంగ్లీషు ప్రభుత్వం లైసెన్సు యిచ్చిందనుకుంటున్నావేమో - జాగ్రత్త,

రోడ్డుమీద నిలబెట్టి యిట్లా అడిగారంట.

'మరి నువ్వెమన్నావు?”

'ఏమంటాను? అక్కడే నిలబడి వింటున్నాను. ఈ కులపిచ్చి గురించి నేను నీతో చెప్పిన విషయాలు గుర్తున్నాయా?

'మరి అవన్నీ వాళ్లతోయెందుకు చెప్పలేదు?

“ఎంటమ్మా చెప్పేది అంటూ వచ్చారు మా మామగారు. ఆయన మా మాటలన్నీ వింటూనే వున్నారు.

చూడు జ్యోతి - మనం తక్కువ కులం వాళ్ళం. బ్రాహ్మణులతో సమానులం యెట్లా అవుతాం?” . ఎందుకు కాకూడదు?”

“ఏఏంటబ్బాయ్‌, ఏం తెలియనట్లు మాట్లాడతావు. సంఘ నియమాన్ని ఒప్పుకోవాలి. దాన్ని నువ్వు మార్చలేవు. మత విషయాల్లో, సంఘవిషయాల్లో వాళ్ళెప్పుడూ మనకంటే ముందున్నారు. నిన్నేం చెయ్యకుండా మాటలతో వొదిలేసినందుకు సంతోషించు.

'సంతోషించాలా” అయన కోపంతో మండిపడ్డాడు.

“ఈ అన్యాయాన్ని నేను సహించను నాన్నా!

'ఏమంటున్నావ్‌ జ్యోతి! ఇదే పీష్వాల కాలంలో అయితే వాళ్లు నిన్నో తిరుగుబాటు

దారుడివని వురితీసేవారు'.

'దీనికి తలొగేకంటే మరణశిక్ష మంచిది. నన్ను కించవరున్తూ

యెవరేమన్నానేనెందుకు మింగేసి వూరుకోవాలి? నాకు ఆత్మగౌరవం లేదా? మనం మనుషులం కాదా?

ఆయన కోపాన్ని పట్టలేకుండా వున్నారు. మామగారు యింకేం మాట్లాడకుండా వెళ్లిపోయారు.

(ఎట్లా ఒణికిపోతున్నావో చూడు. కాస్త స్థిమితంగా శాంతంగా కూర్చో.

'స్టిమితం శాంతం యెలా వస్తాయి సావిత్రి? బైట ఆ జనం నన్ను అవమానిస్తున్నారు. నాన్న కూడ అదే సరైందంటున్నారు.

'దయచేసి నా మాట వినండి. మామగారు మీలాగ చదువుకోలేదు గదా. ఆయనట్లాగే అంటారు”.

(క

'మనం యింకెంత కాలం యిట్లా బాధలు పడాలి? మనం దీనికి ఒప్పుకోకపోతే యేమవుతుంది? ఇట్లా బతకటమంటే చస్తూ బతకటమే - దానికంటే చావటం నయం.

'ఆ మాట అనకంది.

“సావిత్రీ, ఒక్కమాట చెప్పు. నేను ఈ పద్ధతి మీద తిరగబడదల్ఫుకుంటే నువ్వు నా వెనక వుంటావా? ఏం జరిగినా సరే నా వెనక నిలబదగలవా?”

“తప్పకుండా నిలబడతాను. నేను మీ భార్యను కాదా? మీరేం చేస్తే యెటు " నడిస్తే నేను అలాగే చేస్తాను. ఆ బాటనే నడుస్తాను.

ఆ రోజుని నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయన నాతోడు కావాలని అడిగాడు. + నెను - అక్షరం ముక్కరానిదాన్ని! నేనేం చెయ్యాలో నా కేమీ తెలియదు. కానీ ఆ రాత్రి నాకళ్ళు ఆయన్ని నింపుకుని యెంత అందంగా ్రకాశించాయో, నా జీవిత సూత్రాలు ఆయన జీవన సూత్రాలతో పూర్తిగా కలిసిపోయాయి. పడుగుపేకల్లా కలిసిపోయాం యిద్దరం, నా సహాయం కావాలని అడిగాడు. నన్ను గౌరవించాడు. నాకు మళ్ళీ మళ్ళీ ఆయనో చెప్పాలనిపించింది. 'సేఠ్‌జీ నేను నీ దాన్ని పూర్తిగా నీ దాన్ని!”

ప.

ఆ రోజునుంచే సేఠ్‌జీకి విశ్రాంతన్నది లేదు. హిందూ మత గ్రంథాలు చదవటం మొదలెట్టాడు. కబీర్‌, తుకారాం, ధ్యానేశ్వర్‌ వంటి భక్తుల సాహిత్యం చదువుతున్నాడు. భక్తి మార్గాన్ని గురించీ చదివాడు. మార్చిన్‌ లూథర్‌ జీవిత చరిత్రా చదివాడు. హిందూమతం గురించి విలియమ్‌ జోన్స్‌, ప్రొఫెసర్‌ విల్సన్‌లు రాసిన గ్రంథాలు చదివాడు. బుద్దుడు, బసవేశ్వరుడు, తీర్థంకరుడు మొదలైన మతసంస్కర్తల రచనలూ చదివాడు. రోజంతా చదవటమే, చదివాక అవన్నీ నాతో చెప్పేవాడు. స్నేహితులతో చర్చించేవాడు. “ఇదంతా చదివితే నీకే మొస్తుంది” ఆపుకోలేక ఒక రోజు అడిగేశాను. హిందూ మతంలో అన్యాయం, అవినీతి చోటుచేసుకున్నాయి. వొత కాలం నుంచి అదెంతో మారుతూ వచ్చింది. ఒకప్పుడు మంచిగా ఉండేది. ఇప్పుడు మూర్ధపు ఆచారాలతో సంప్రదాయాలలో చిక్కుకుపోయింది. వీటన్నిటినీ రూపుమాపాలి.' 'ఆపని నువ్వు చెయ్యబోతున్నావా?' “చెయ్యాలి. మనందరం ఒక దేవుడి బిడ్డలం. దేవుడు మనందర్నీ సమానంగా ప్రేమిస్తాడు”. 'నువ్వు నన్ను పేమించినంతగానా?” “అవును అంతగా బ్రాహ్మణులే ఈ కుల విభజన చెశారు. ఆయనలా చెప్పుకుపోతున్నాడు. 'ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజన వల్లే వచ్చాయి.

  • మామూలు మనుషులందరికీ చదువు యెందుకుండ కూడదు? ఎందుకంటే బ్రాహ్మణులే అందరికంటే పైన వుండాలి గాబట్టి. తక్కువ కులాల వాళ్ళు తెలివిగా వుందకూదదని, జ్ఞానం పొందకూడదని అట్లా చేశారు. ఆ బ్రాహ్మణుల స్వార్ధంతో మతం నాశనమైంది, సామాన్య ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. పీష్యాల కాలంలో ఈ ఎక్కువ తక్కువ కులాల గొడవలు తారస్థాయికీ చేరటం వల్లనే బ్రిటీష్‌ వాళ్ళు మన దేశంలోకి చొచ్చుకు రాగలిగారు. ఈ తేడాలు చదువు వల్ల మాత్రమే పోతాయి. విద్యే ఈ వివక్షలను పొగట్టగలుగుతుంది. అదే - ఆ విద్యే మన ధ్యేయం కావాలి. అణచివేయబడ్డ వర్గాల ప్రజలకు చదువు చెప్పాలి. విద్యావంతుల్ని చెయ్యాలి”. 'అయితే నువ్వు చదువు చెబుతుంటే నేను చూస్తూ వుండాలా? లేకపోతే వంట చేసి పెట్టాలా?

సేఠ్‌జీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. కళ్ళముందున్న భార్య కూడా కనపడటం లేదు. విద్య అనే తపన ఆవహించిన మహావృక్షంలా వున్నాడు.

కొన్ని రోజుల తర్వాత సేఠ్‌జీ సాగర్‌ వెళ్ళాడు. ఆయన బుర్రలో ఒకే ఒక్కవిషయం తిరుగుతోంది. చదువు, చదువు, చదువు. సదాశివ గోవందే ఆ రోజుల్లో సాగర్‌లో వుండేవారు. ఆయన సేఠ్‌జీని ఫర్రార్‌ అనే ఆమె నడిపే బడికి తీసికెళ్ళాడు. ఆమె తెల్లజాతి మనిషి. వీళ్ళిద్దరూ బళ్లో యేం నేర్పాలి, యెట్లా నేర్పాలి అని ఆమెనడగటానికి వెళ్లారు. ం ఆమె అందిగదా, “ఇంటికి కేంద్రం ఆడమనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే లేదు. మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవటం అన్యాయం, ఘోరం” అన్నది.

అంతే, సేఠ్‌జీ తలలో తొలుస్తున్న పురుగు తన దారి కాస్త మార్చుకుంది. ప్రతి మగవాడూ, తన భార్య చదువు నేర్పాలి. అక్కడ్నించి రావటం రావటమే పలక, బలపం, పుస్తకాలతో వచ్చాడు. నేనప్పుడే రొట్టెలు కాల్చటం అయిపోయిందని పొయ్యి దగ్గర శుభ్రం చేస్తున్నాను. ఇక పొయ్యి అర్పబోతుండగా ఆయన ముఖం వెలిగిపోతూ వచ్చాడు. కాళ్ళు, చేతులూ కడుక్కుంటూనే నన్ను కేకేశాడు. “అంతా సిద్ధంగావుంది. రొట్టెలూ, కూర అన్నీ వున్నాయి. నీదే ఆలస్యం” అని నేను కేకపెట్టాను.

“నా కిప్పుడు రొట్టే గిట్టే యేమీ వొద్దు. నువ్వు ముందిటురా!” అబ్బబ్బా యివ్వాళా సేఠ్‌జీకేమయింది అనుకుంటూ వచ్చాను. చేతులు కడుక్కుని బైటికి మ్తో యేముంది! పుస్తకాల రాసి.

పలక.

“ఎంటి పిల్పావ్‌?” అన్నాను.

“ఇటు చూడు” అన్నాడు.

“చూశాలే. యేంటిదంతా”

“నేను నీకు చదువు చెబుతా. బెను. నిజం”

“ఏంటి!”

“చదవటం, రాయటం నేర్పుతా”.

“ఎవరికి?”

కర్చీద్రే?

“ఎంటి?”

“అంతా - అన్నీ”

“నీలాగా - నీలాగా చదవటం రాయటం నేర్పుతావా? సేర్‌జీ లాగా”

. “జెనుూ అంటూ నవ్వాడు.

పలక తీసుకుని 'సే-ర్‌-జీ అని రాసి దిద్దమన్నాడు.

॥ వరసగా “అ, ఆ, ఇ, ఈ”లు ఆ తర్వాత “క గ ఘ”లు అచ్చులు, హల్లులు - అన్నీ అవే మళ్లీ దిద్దించాడు. నాకు విసుగుపుట్టింది. కానీ ఆయన నా ముందు పీఠం వేసుకుకూర్చున్నాడాయే. అక్కడికీ వేళ్ళు నొప్పెడుతున్నాయి. నా చెయ్యి పట్టుకుని దిద్దించమన్నాను. కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూశాడు. ఇక చేసేదేముంది - రాస్తూ

రెండొకట్ల రెండు, రెండు రెళ్ళు నాలుగు, రెండు మూళ్లు ఆరు నేను కావాలని తప్పు రాసేదాన్ని ఆయన నాచెయ్యి పట్టుకుని సరిగ్గా రాయించేవాడు. నేను నోరు తెరిచి చూసేదాన్ని ఈయన నాకు మొగుడా? లేకపోతే బడిపంతులా? ఆయన నోరు విప్పి “సావీ, ఇక యివాల్టికి చాల్లే, నీ వేళ్ళు నొప్పిపెడతాయి” అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటాడేమోనని చూసేదాన్ని. అట్లా అనకపోగా “సావీ - నీ వేళ్ళు నొప్పెట్టినా సరే యివాళ యిది రాసెయ్యాల్సిందే” అనేవాడు.

“ఎందుకీ చదువు? ఇద్దరం చదువుకుంటున్నా పెత్తనం నీదేగా” అనేదాన్ని ఆయన నవ్వి “నిజమే” అనేవాడు.

నాకిప్పుడు చదవటం వచ్చింది. నిన్న మొన్ననేగా సేర్‌జీ నాకు అన్ని చదివి వినిపించేవాడు. ఇప్పుడేమో నేను మాటలు గుర్తుపడుతున్నా అక్షరాలు, మాటలు, వాక్యాలూ నా ముందు నాట్యం చేస్తున్నాయి. గొబ్బిళ్ళ పాటలన్నీ రాయాలనిపించేది. నా పేరురాయాలనీ, దాన్ని నావేళ్ళతో తాకి చూసుకోవాలని అనిపించేది. నేను పొడుపు కథలు రాస్తుంటే చూసినవాళ్ళు “ఎందుకీ చదువు - చట్టు బండలు. బ్రాహ్మణ పుట్టుక పుట్టాననుకుంటుందా యేంటి?” అనే వాళ్లు. నేను లెక్కచేసే దాన్ని కాదు. మొదట్లో నేను మంచిగా రాస్తే చదివితే ఆయన ప్రేమగా నా భుజం మీద తడతాడు కదా అని చదివేదాన్ని. కానీ నెమ్మదిగా నాకు చదవటమంటే చాల యిష్టం కలిగింది.

ఒకరోజు మామగారు అడగనే అడిగారు “జ్యోతి - సావిత్రి కెందుకు చదువు నేరుపుతున్నావు?”

“ఎందుకు నేర్చకూడదు?”

“అసలు మన కులం వాళ్లమే చదువుకోకూడదు. ఐనా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు”,

“ఆమె కూడా మనిషేగా? కాదంటే చెప్పు”, |

“నిజమే కావచ్చు. కానీ ఆదదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది. బుద్దిలేనిదవుతుంది”. +

“నాన్న - సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్దాలని నిరూపిస్తుంది”.

“అది కాదయ్య - ఆడది చదువుకుంటే మొగుడికి ఆయుక్షీణం. విధవరాలవుతుంది. నీకు తెలియదు?”

“అదెట్లా జరుగుతుందో చూద్దాం”

“జరిగింతర్వాత యింకేంటి చూసేది? విషాన్ని పరీక్షించటం యెందుకు?”

“ఎందుకంటే పరీక్షించి తీరాలి గాబట్టి. నిజమేమిటో తేలాలి గాబట్టి”.

“నాయనా - అట్లా కాదు” +

మామగారు యింకేమీ చెప్పలేకపోయారు. వెళ్ళిపోయారు.

“మావగారు చెప్పింది నిజమేనా? అనడిగాను”, "

“నెను నీ కోసం మంచి పుస్తకాలు చదివి వినిపిస్తున్నా నీ అంతట నువ్వే కొన్ని చదువుతున్నావు. ఇంకా ఈ పిచ్చి ప్రశ్నలడుగుతావెందుకు?”

“అట్లా కాదు. నా చెయ్యి పట్టుకో”.

“ఎందుకు?”

“నాకు భయంగా వుంది?”

“దేని గురించి భయం?”

“నీకు తెలియదు. నన్నొదిలి వెళ్లొద్దు”

“నావీ - ఈ కథలన్నీ చెత్త, ఒట్టి కట్టు కథలు. నేను నీ దగ్గర లేనూ! మన కులం వాళ్ళే నాన్నకు యివన్నీ యొక్కించి పంపించారు. నువ్వు భయపదకు”. ఆ రోజంతా నేను ఒక ముక్కకూడా చదవలేదు. సేర్‌జీ చెయ్యి గట్టిగా పట్టుకు కూర్చున్నాను. రాత్రంతా ఆయన నాతో మాట్లాడుతూనే వున్నాడు. మేం చదివిన సంగతులు గుర్తు చేస్తున్నాడు. తెల్లారే సరికి భయాలన్నీ పటాపంచలై పోయాయి. నేను చదువుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. అది మాత్రం కచ్చితం. ఆ నిర్ణయం జరిగిపోయింది. “అంటే యిప్పుడు చదువుకునేది తక్కువ కులాల మగవాళ్ళే కాదన్న మాట. క ఆదపిల్లలూ తగుదునమ్మా అని చదువుకి బైల్షరారన్నమాట”. “ఇది అవినీతి, ఆనాచారం తప్ప వేరు కాదు”. “కాలం-వాడైన కాలం వచ్చిపడింది”, కాలానికేమయింది? శుభ్రంగా వుంది. బడి కూడా బ్రహ్మాండంగా వుంది. అన్నా సాహెబ్‌ చిప్‌లూంకర్‌ భవనంలో ఆడపిల్లలకోసం రెండో బడి కూడా మొదలైంది. కేశవరావ్‌ భవాల్మర్‌, జగన్నాథ్‌ సదాశివ్‌, అన్నా శాస్త్రబుద్ధి, బాపూరావ్‌జీ మందే, విష్ణు మొరేశ్వర్‌ భిదేకృష్ణశాస్తి చిప్‌లూంకర్‌ - విళ్ళ్శందరూ కార్యనిర్వాహకులుగా వున్నారు. ఆ బడి కూడా చక్కగా నడుస్తోంది. ఆ స్కూల్లో పంతులుగా విష్ణువంత్‌ ధట్టె అనే బ్రాహ్మణుడు ల * వున్నాడు. ఇక యెవరెంత అరిచి గీపెట్టినా బడిమూతపడదు. అందుకని జనం పంతులుగార్ని హింసించటం మొదలుపెట్టారు. క “నువ్వా బడి మానెయ్యకపోతే నిన్ను కులంలోంచి వెలివేస్తాం” అన్నాడొకడు. “నువ్వు చేసే పనికి నీ కూతురు ఫలితం అనుభవిస్తుంది”. యింకో గొంతు లేచింది. ఇదిలా సాగుతోంది. పంతులుగారికి భయం పెరిగి ఒక రోజ బడి మానేశాడు. ఆరోజు సాయంత్రం సేఠ్‌జీ మొఖం వేలాడేసుకుని వచ్చాడు. ఏం జరిగిందని అడిగాను. ఆయన మాట్లాడకుండా అటూ యిటూ అశాంతిగా తిరుగుతున్నాడు మళ్ళీ అడిగాను “ఏమైంది? జరగరానిది జరిగిందా?” “పంతులుగారు బడి మానేశారు? “మరిట్లా యిప్తుడూ?” “అదే - బడి చక్కగా సాగుతోంది. ఇప్పుడేం చెయ్యాలి?”

“మనమేం చెయ్యగలం?” “నాకూ తెలియటంలా. కానీ తక్కువ కులాలవాళ్ళు కూడా చదువుకుని టీచర్లు కావాలి. కానీ అంతవరకూ యేం చెయ్యాలి?” ఇక వేరే ఆలోచన లేదు మనిషికి. తిండీ తిప్పలు లేవు. నేనిక భరించలేక “ఇంకో పంతులుగారు దొరుకుతాడ్ల” అన్నాను. “దొరుకుతారు. కానీ అంతవరకూ బడి మూసెయ్యలేం గదా” “ఐనా యింత భయం యొందుకీ మనుషులకు? నాకు తెలియక అడుగుతా”. నిజమే, కొందరు చాలా పిరికివాళ్ళుంటారు. యేదైనా తట్టుకోలేరు గానీ. నీ సంగతేమిటి? + నీకు ధైర్యం వుందా? “ఆం వుంది. నీ భార్యను గదూ!” “ఐతే రేపు నువ్వు బడికి రావాలి”. “ఎందుకు?” “ఆ పిల్లలకు పుస్తుకాలుచదివి వినిపించుదువుగాని. ఆ లోపల మనం కాస్త వూపిరి పీల్చుకుని ఆలోచించుకోవచ్చు”.

“నేనా!” చదువు చెప్పటమా? నా వల్లకాదు”. , నేను చెప్పేది వినిపించుకోకుండానే సేర్‌జీ భావాల్కర్‌తో మాట్లాడటానికి వెళ్లిపోయాడు. వాళ్ళేం మాట్లాడుకున్నారో దేవుడికి తెలియాలి. భావాల్కర్‌ గారు వెంటనే | మా యింటికొచ్చారు. “అంతా నిర్ణయమైపోయింది. రేపట్నించి నువ్వు బడికొచ్చి పిల్లలకు

చదువు చెప్పాలి?”

“నేనెట్లా చెప్తాను? ఏం చెప్తాను?”

“నువ్వు చెప్తావు. అంతే - ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా”.

వాళ్ళిద్దరూ కూడా నేను చెప్పేది వినిపించుకునే స్థితిలో లేరు. వెళ్లిపోయారు. మర్నాడు పొద్దున్న మొదలయింది.

“తొందరగా పని కానివ్వు - బడికి వేళవుతోంది”. నేను బెననలేను. కాదనలేను. లోపల్నించి భయం పుట్టుకొస్తుంది. పెదాలు ఒణకుతున్నాయి. నేను యెన్నడూ యిల్లు

విడిచి బైటికెళ్లిందాన్ని కాదు. బడికి వెళ్లి పాఠాలు చెప్పటం యేంటి? యెట్లా? ఇప్పుడిప్పుడే చదవటం, రాయటం నేర్చుకున్నాను - నేనో పెద్ద బారిష్టరుననుకొని తిరగటం యొట్లా? మరి నేను వెళ్లకపోతే మేం మొదలెట్టిన పనికాస్తా ఆగిపోతుందే - సేఠర్‌జీ మాటనెట్లా తీసెయ్యగలనూ? నేనే మనసు గట్టీచేసుకుని ఆ పనిచెయ్యాలి. అట్లాగే మనసులో గట్టి నిర్ణయం చేసుకుని బైటికి అడుగుపెట్టాను. కానీ బైటికి అడుగుపెట్టగానే నా నిర్ణయం కాస్తా జారిపోవటం మొదలయింది. నేను వేగంగా తలొంచకు నడుస్తున్నాను. నాతో “ సేఠ్‌జీ కూడా వున్నాడు. కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు పనికోసం బైటికి వెళ్ళే వాళ్ళు కాదు గదా - జనం నివ్వెరపోయి మమ్మల్ని చూస్తున్నారు. “ఎవరా పొయ్యేది?” “అంత వేగంగా నడుస్తోంది - నెత్తిన కొంగు కప్పుకుంది”. “పఫ్పూల్రే యెవర్నయినా వుంచుకున్నా దంటావా?” నేను తడబడ్డాను. గానీ యేమీ పట్టించుకోకుండా నడిచాను. “సరేగాని యెక్కడికి పోతోంది?” “చూద్దాం....” జనం మా వెనకా, చుట్టూతా చేరి మాతోపాటు నడుస్తున్నారు. మేం బడి దగ్గరకొచ్చిసరికి వాళ్ళకు అర్ధమైంది. “ఓహో - ఫూలే పెల్టన బడికి వెళోందిరా”

  • ఆ వార్త పూనా పట్టణమంతా కార్చిచ్చులా అంటుకుంది. “ఫూలే తన భార్యనే పంతులమ్మని చేశాడు”. “ఇక యిదే మిగిలింది” “ఆడది - చదువు చెప్పటమా?” “భగవంతుడా - ఈ కలికాలం యెప్పుడు అంతమవుతుంది తండ్రీ”, ఇక నా సంగతా? బడి ముందు పోగయిన పది మంది అమ్మాయిల్ని చూడగానే కాస్త భయం వదలింది. “ఇవాళే నేను చదువు చెప్పటం మొదలు. ఎట్లా చెప్తానో తెలియదు గానీ మీకు చదువు మాత్రం నేర్పిస్తాను”. (౫

నేను మా పుట్టిల్లు వొదిలాక మనసు విప్పి మాట్లాడింది. ఒక్క సేఠ్‌జీతోనే. ఐనా ఆ పిల్లలతో బాగానే మాట్లాడా. ఇక పొద్దన పూట ఈ బడయితే, సాయంత్రం యింటి దగ్గర పాఠాలు యెలా చెప్పాలో నేర్చె బడి నా కోసం యింకొకటి వుండేది. అట్లా రోజులు పరిగెత్తి పోయాయి. ఐలే నేను పాఠాలు చెబుతున్న కొద్దీ జనం యింకా యింకా రెచ్చిపోయారు. నేను సేఠ్‌జీతో అన్నాను. “జనానికి నేను పాఠాలుచెప్పటం యిష్టంగా లేదు. నీకు నా కారణంగా సమస్యలు | రావటం నాకిష్టం లేదు. యింకో పంతులు గారిని యెవరినన్నా చూసుకోండి. ఆయనొచ్చేంత వరకూ యొలాగో నెట్టుకొస్తాను”. “సెల్‌జీది ఒకటే మాట సనమన్యలొస్తే యెదురు నిలవటమే, నేను చదువుకుంటున్నప్పుడు కూడా వీళ్లలాగే యేడ్చారు. జీతం లేని టీచరయితే మనకు సులువుగా వుంటుంది కదా”. నేను బడికిపోతుంటే జనం కిటికీల వెనక నిలబడి తిట్టేవారు. శాసనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్ళగానే అక్కడ తలుపులు కిటికీలు మూసేసేదాన్ని. లోపల పిల్లలకు సుమతీ శతకం, కూడికలు, తీసివేతలూ, భూగోళశాస్త్రం, మరాఠా చరిత్ర యివన్నీ చెప్పేదాన్ని. సేఠర్‌జీ మాల మాదిగల పేటలకు వెళ్లి చదువు యెంత అవసరమో ప్రచారం చేస్తుండేవాడు. “ఒక కులం తక్కువ ఆడది బళ్ళో చదువు చెప్పటమా? ఎంత పాపకార్యం!” “ఆ! అసలే లంజకొడుకులు పొగరెక్కి కొట్టుకుంటున్నార్లే' “ఆడదానికంత సాహసం వుండకూడదు. వాళ్ళనిప్పుడే తుంచెయ్యకపోతే మరీ కొమ్ములొస్తాయి”. “ఆ! దీన్ని యింట్లోకి నెట్టడం యెంత సేపూ” జనం యిట్లా మాట్లాడుకుంటూనే వున్నారు. “ఒక ఆడది టీచర్‌ అయింది. యుద్ధం మొదలయింది”. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కారించలేం. తాము భగవంతుడి నోట్లోంచి వూడిపడ్డామనుకునే కులం వాళ్ళు నన్ను వీధుల్లో వేధించటం మొదలు పెట్టారు. ఒక్కోరు నా దగ్గరకు వచ్చి వుమ్మేసేవారు. యింకోళ్ళు నా దారికి అడ్డంగా వచ్చి సకిలించేవాళు ల్ది నేను పెళ్ళయిన ఆడదాన్ని - ఎంత భయపడి పోయేదాన్నో చెప్పలేను. ఒకరోజు యెవళ్ళో నా మీదికి మట్టీ విసిరారు. ఇంకో రోజు నా తల మీదకు రాయి విసిరారు. ఒకసారి నా చుట్టూ గుంపుగా జనం చేరారు. నాకు గుండె నోట్లోకి వచ్చినట్లయింది.

నోటమాట లేకుండా నిలబడిపోయాను. ఏం చెయ్యాలో తోచ లేదు. చివరికెలాగో ధైర్యం కూడగట్టుకుని తలయెత్తి సూర్యుని దిక్కు చేతులు జోడించి “భగవంతుడా - నేనునా బాధ్యత నెరవేరుస్తున్నాను... దేవుడు మిమ్మల్ని క్షమించి దీవించాలి” అన్నాను. నాలో నెనె దైవ ప్రార్ధన చేసుకుంటున్నాను. నెమ్మదిగా జనం యెవరిదారిన వాళ్ళు వెళ్ళారు. నేను స్కూలుకి వచ్చిపడ్డాను గానీ నా గుండె దడ తగ్గలేదు. ఇది జరిగిన తర్వాత సేఠ్‌జీ నా వెంట స్ఫూల్‌ ప్యూన్‌ను తోడుగా పంపేవాడు. నేను సమాజానికీ, మతానికీ వ్యతిరకమయ్యానని అందరూ అన్నారు. నా గురించి పూనా . అంతా ఆగ్రహంతో వుడికిపోతుంది. నా వల్ల దేశానికే అవమానం జరిగిందంట. నాకు తెలియకడుగుతాను. మీరన్నా చెప్పండి - ఒక ఆడది బళ్ళోపంతులమ్మయితే పూనా మొత్తం యెందుకు వుడికిపోవాలి? ఇవాళా రేపూ యే చెత్త విషయానికైనా పూనా నగరానికి కోపం వసోంది! నాకెందుకు కోపం వస్తుందంటే యెప్పుడు కోపం రావాలో అప్పుడు పూనాకు కోపం రానే రాదు. లాహూజీబా మాంగ్‌, రన్‌బా మహర్‌లు వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తూ నాకు రక్షణగా వస్తున్నారు. బళ్ళోపని యెక్కువగానే వుంటోంది. ఒక బడికాదుగా - రస్తాపెట, బుధవారపెట, విఠల్‌పేట - అన్ని చోట్లా బడులు పెట్టాం. మామగారు ఆయన పనులో ఆయన సతమతమవుతున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను సేఠ్‌జీతో అన్నాను గదా. “ఎందుకో మామగారు చాలా ఆందోళనగా వున్నారు” సేఠ్‌జీకి నా మాటలు పట్టించుకునే

  • తీరికెక్కడిది? బడి, తన వుద్యోగం ఒక్క పనికాదుగా. మా జీవనభృతి కూడా కావాలిగా. మా బండి నడపమని యెవర్నడుగుతాం. అందులో మా బండి - యేదో మంచి స్నేహితులు, ఆలోచించే మనుషులూ వున్నారు గాబట్టీ, యెలాగో బతికాం ఆ రోజుల్లో, నా పనులన్నీ ముగించుకున్నాక నేను చదువుకునేదాన్ని రాసుకునేదాన్ని మా మామగారి కంట్లో అది పడితే ఆయనట్లాగే చూసేవాడు. ఒకరోజు రాత్రి నేను మామగారు అన్నం తినేశాం, గిన్నెలన్నీ సర్దేసి సేఠ్‌జీ కోసం యెదురు చూస్తూ చదువుకుంటున్నాను. మామగారు వాకిట్లో కూర్చున్నారు. సేర్‌జీ వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. వీధులన్నీ నల్లగా చీకట్లో కలిసిపోయాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. సెర్‌జీ వచ్చి మామగారింకా మేలుకుని వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. “నాన్నా - ఇంతసేపెందుకు మేలుకున్నావు. పోయి పడుకో” అంటూ సేర్‌జీ లోపలికొచ్చాడు.

“జనా? ఆలస్యమైందా? మరి నువ్వు యిప్పుడా యింటికొచ్చేది. నేను మెలుకున్నానంటే అది నా తప్పా?”

“నువ్వు పెద్దవాడివి గదా నాన్నా”

“నా వయసు సంగతి సరే - నువీ కష్టాలెందుకు కొనితెచ్చుకుంటున్నావు?” “కష్టాలా?” వాళ్ళ నాన్న దేనిగురించి మాట్లాడుతున్నాడో తెలియనట్లు నటించాడు సేఠ్‌జీ.

“కాకపోతే యేంటీ? అసలు మళ్ళీ నిన్ను బడికి పంపించటం నాదీ తప్పు. నువ్వు ఈ యింట్లో పుట్టావు. ఐనా చదువుకోవాలనుకున్నావు. చదివావు. కానీనీ పెళ్ళానికి చదువెందుకు?”

మామగారి కోపం కట్టలు తెంచుకుంది. నా నోట మాటరాలేదు.

“నాన్నా, నేను చేసేది సరైన పనే”

“మాట్లాడకురా - సమాజం వొద్దన్న పనిచేస్తున్నావు. ఎందుకు? జనమంతా పొలం దగ్గరకొచ్చి నన్నడుగుతున్నారు. మొదట్లో మర్యాదగా అడిగారు. ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇక కొదతామంటున్నారు”.

“ఎవరు నాన్నా ఆ మాటలనేది?”

“నేను చెప్పను ఈ నాటకాలతో నువ్వు సాధించేదేంటి?”

“నాటకాలా! అణగారిన వాళ్ళంతా నా పనులతో పైకి లేస్తారు”.

“లేస్తారు. సరే - కానీ నా కోడలు నా యింటి గుమ్మం యెందుకు దాటాలి?”

“దాంట్లో తప్పేముంది నాన్న సావిత్రి చదువుకుంది. ఇప్పుడు దాన్ని నలుగురికీ నేర్పుతోంది. అందువల్లనే మనం మిగిలిన ఆడవాళ్ళకు చదువుకుని బాగుపడమని చెప్పగలుగుతున్నాం. ఆలోచించమని చెప్పగలుగుతున్నాం.

“వాళ్ళెందుకు ఆలోచించాలి? వున్న విషయాల్ని వున్నట్లుగానే కొనసాగించాలని మన బాబాగారు చెప్తున్నారు. నీకు అర్ధం కావటం లేదా? కోరి కష్టాలెందుకు కొనితెచ్చుకుంటున్నావు?”.

“నాన్నా నా పని నాకు ముఖ్యం. మనుషులందరూ సమానులే ఒకరి కంటే ఒకరు యెక్కువెట్లా అవుతారు? ఆడవాళ్ళు తక్కువని మనమెందుకు అనుకోవాలి? ఏదేమైనా

ఒకసారి ఒకపని మనం చేపట్టామంటే - యింక మిన్ను విరిగిమిదపడ్డా దాన్ని ఒదలకూడదు”.

“పని గురించి నాకు చెప్పొద్దు. నీకిష్టమైన పని నువ్వు చేసుకో. కానీ నా కోడల్ని మాత్రం యింట్లోంచి బైటికి తీసుకెళ్ళొద్దు. నీతో యిట్లా మాట్లాడటం నాకేం సుఖంగా లేదు. నువ్వచెప్పేదేంటో నాకర్థమవుతోంది. కానీ బెటికెళ్తే వాళ్ళనే మాటలు నేను వినలేను,

, భయంగా వుంది”. “నాన్నా - నేను చావుకి కూడా భయపడను. కానీ పని మాత్రం మానను. నా

, పని ఆపానంటే సమాజానికి యెంతో నష్టం జరుగుతుంది”.

“నీ ప్రని నీ యిష్టం. నేను మాట్లాడేది సావిత్రి గురించి”.

“సావిత్రి కూడా పని మానదు. మనం ఒక్కసారి భయపడ్డట్టు కనిపించామా యిక మన పని అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఆగే ప్రశ్నలేదు నాన్నా”.

“జ్యోతీ ఆ నన్నేం చెయ్యమంటావు? ఈ ముసలి తండ్రిని యేం చెయ్యమంటావు? కళాపెళా కాగే నూనెవున్న గంగాళంలో వేసి తెద్దుతో తిప్పుతున్నట్లుగా వుంది నా పరిస్థితి. జ్యోతి - యివాళ నేను వాళ్ళతో చెప్పేశాను - మీరిద్దరూ పనైనా మానేస్తారు లేదా ఈ యింట్లో నుంచైనా బైటికి నడుస్తారు”.

  • “నాన్నా”

“అంతే జ్యోతి - నిన్ను గానీ సావిత్రిని గానీ యిల్లొదిలి పొమ్మని నేనెట్లా

$ అనగలుగుతాను? కానీ!”

నేను లోపల కూచుని వెక్కిళ్ళు పెడుతున్నాను. మామగారు తన గదిలోకి వెళ్ళారు. భోజనం అట్లాగే వుంది. సేఠ్‌జీ నేను యెదురెదురుగా కూచున్నాం. ఎవ్వరం మాట్లాడటం లేదు. నా కన్నీళ్ళు ఆగటం లేదు. సేర్‌జీ కూడా కళ్ళు తుడుచుకుంటున్నాడు. తొలికోడి కూసే దాకా ఆట్లాగే కూచున్నాం. అప్పుడు సేర్‌జీ - “కాసేపు పడుకుంటాను. పొద్దున్న వెళ్ళిపోదాం”.

పడుకోవటమా? ఎట్లా?

“సత్యమేదో అసత్యమేదో మన బుద్ధితో మనం తెలుసుకోవాలి ప్రపంచం

ం చెప్పినదాన్ని గుడ్డిగా ఆమోదించకూదడదు”. తెల్లవారింది. నేను స్నానం చేసి బట్టలు

సర్దుకున్నాను. మామగారి కాళ్ళకు దణ్ణం పెడుతూ యేద్చేశాడు. నాకేం చెయ్యాలో తెలియదు. ఆయన కూడా యొడుస్తున్నాడు. నన్ను పైకి లేవదీశాడు. నేను యెక్కడ పెరిగి పెద్దయ్యానో, యెక్కడ చదవటం రాయటం నేర్చుకున్నానో ఆ యిల్లు వదిలి వెళుతున్నాను. మళ్ళీ యిక్కడికిక రాను. ఇంట్లోంచి వస్తుంటే నా అడుగులు తడబడుతున్నాయి. లోపలంతా యెవరో చెయ్యి పెట్టి తిప్పినట్టే వుంది. జనమంతా అంటున్నారు.

“పూలే తానొక్కడే యిల్లొదిలి పోవటం లేదు. పెళ్ళాన్ని కూడా తీసుకుపోతున్నాడు. వీళ్ళ పాపం యెప్పుడు పండుతుందో” మన తప్పులకు మనదే బాధ్యత అయినట్లు. కానీ సేఠ్‌జీ మిత్రలూ వాళ్ళ భార్యలూ మా వైపే గట్టగా నిలబడ్డారు. సరస్వతీబాయి గోపందే ఆ శ రోజంతా నాతోనే వుంది. జనం చంపుతారు, కానీ జనమే రక్షిస్తారు కూడా. అది సత్యం. ఇప్పుడు మేమే మా యజమానులం. మా పని తప్ప మాకు మరో లోకం లేదు. మా యింట్లో యెన్ని చర్చలో రేగేవి. పని పెరుగుతూ వుంది. చివరకు మాలమాదిగల పిల్లలు కూడా బడికి వస్తున్నారు. మరిప్పిడింకా గ్రామాల్లో ఆడపిల్లలు యింట్లో యెందుకుంటున్నారు? రొట్టెలు కాలుస్తూ తమ్ముళ్ళనూ చెల్లెళ్ళనూ చూసుకుంటూ వుండే పరిస్థితి యింకా యెందుకుంది? అలా వుండకూడదు. 'ప్రతివాళ్ళూ చదువుకోవాలి. ఆ రోజుల నాటి విషయం ఒకటి గురొసోంది. చెప్పనివ్వంది. ఒకరోజు రక్ష అనే 13 యేళ్ళ అమ్మాయి ఒక వ్యాసం రాయమంటేరాసింది. అందరికంటే ముందు రాసి లేచి నిలబడి చదివింది. ఆ వ్యాసం పేరు “నేను-నా మతము”. -

“బ్రాహ్మలు వేదాలు మా స్వంతం. మా ఆస్తి అంటారు. మేమే చదువుకోవాలి అంటారు. అంటే మనకు యే వేదాలూ లేవన్నమాట. వేదాలు బ్రాహ్మలవైతే వాళ్ళే వేదాల ం ప్రకారం నడుచుకోవాలి. వేదాలు మనకు చెందినవి కాకపోతే మనం చదవకపోతే ఆ మత బోధనలు మనకు వర్తించవు గదా. కాబట్టీ ఓ భగవంతుడా మా మతమేదో మాకు తేల్చిచెప్పు. అప్పుడు ఆ మత బోధనల ప్రకారం నడుచుకుంటాం”.

అమ్మో! చూశారా-ఎలా రాసిందో ఆ చిన్నపిల్ల. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఆ పిల్లలకు చదువు చెప్పటానికి నెను పడ్డ కష్టమంతా ఫలించిందనివించింది. కానీ యివాళ పరిస్థితి చూస్తె అదంతా వ్యర్థమైందా అనిపిస్తోంది. గోపాలహరి దేశ్‌ముఖ్‌ లోకహితవాది వీళ్ళేమనేవారో తెలుసా? “మాదిగలను తక్కువగా చూసి, వాళ్ళను అంటుకోని బ్రాహ్మలు బ్రిటీష్‌ వాళ్ళతో కలిసి యెట్లా తిరుగుతున్నారు? వేదాలు మాదిగలైనా ఫరవాలేదంటాయి గానీ బ్రాహ్మలు మచ్చులతో కలవగూడదని నిషేధించాయి గదా!

(బ్ర