Telugu నిత్య జీవితంలో నమ్మకాలు వాస్తవాలు - anilvaranasi/indianlanguages GitHub Wiki
వత, వవివంల; అల్లికలు - వోస్తఎంలు) జనవిజ్ఞాన వేదిక ప్రచురణ
గా ఈ.
ఆ ల టంిగీ 1 నిత్యజీవితంలో రచన; క,యల. కాంతారావు ప్రచురణ జనవిజ్ఞానవేదిక ఆల్ ఇండియా వీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధం |
నిత్యజీవితంలో నమ్మకాలు - వాస్తవాలు మొదటి ముద్రణ : అక్షోబర్ 2004 రెండవ ముద్రణ _ : అక్టోబర్ 2009 మూడవ ముద్రణ :; మార్చి 2017 ప్రతులు ఏ 2000 (మ్రచురణ జనవిజ్ఞానవేదిక (ఆం.ప్ర) ఎన్. శంకరయ్య, కన్వీనర్ (ఘ్రచురణల విభాగం మ ఫోన్ : 9440541020 [8 - 40౮/- (ప్రతులకు బి.కృష్ణారెడ్డి జనవిజ్ఞానవేదిక పబ్లికేషన్స్ డా! శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, అపోలో హాస్పటల్ ఎదురు, హరినాధపురం, నెల్లూరు - 4 ఫోన్ ; 0861-2337450, సెల్ ; 9849877169 ముద్రణ ప్రోగ్రెసివ్ ప్రింట్ వరల్డ్ ఐలూరు - విజయవాడ, 85006 55599 ద్
ఇందులో...
-
శాప్రీయంగా ఆలోచిద్దాం 2, పప్పు తింటే చీము పడుతుందా?
-
పొట్లకాయ, కోడిగుడ్డు కూర కలిపి తినవచ్చా
-
_ నిమ్మరసం తాగితే జలుబు వస్తుందా?
-
_ ఆపిల్ కన్నా అరటి మిన్నా
-
తప్పు ఎవరిది?
-
_ బొప్పాయి పండు తింటే గర్భం పోతుందా?
-
బాలింతరాలు పథ్యం చేయాలా?
-
_ హార్లిక్స్, బూస్ట్ పేరేదైనా వేస్ట్
-
టానిక్ బాటిల్ ఫుల్ - పోషక విలువలు నిల్
-
గ్రహణ మొర్రి నిజమేనా?
-
ఆడబీడ్డ పుట్టడానికి బాధ్యత ఎవరిది?
-
జలుబు మందు వాడితే వారం రోజులు, వాదకపోతే ఏడురోజులు
-
యాంటీ బయాటిక్స్ కోర్సు పూర్తిగా వాడకపోతే
-
దయ్యాలు లేవని గంతులు వేసిన పిల్లలు
-
పాముపగ - మంత్రం వాస్తవమేనా?
-
ఎవరి ముఖం చూశానో... " 18. అపశకునం మంచిది. 19, అన్నీ మంచి రోజులే...
-
జ్యోతిష్యం శాస్తమేనా?
-
జ్యోతిష్యులు లాటరీ పారని వేళ....
-
హస్త సాముద్రికం ద్వారా భవిష్యత్తును చెప్పటం సాద్యమేనా? లో
-
ఆంధ్ర దేశంలో అన్ని ఇళ్లకూ వాస్తు దోషం వుంది... ౧4. బాణామతి బండారం...
-
బాణామతి బాధితులు - మానసిక జబ్బుల పీడితులు
-
మామిడాకు తోరణాలు ఆక్సిజన్ అందిస్తాయా?
-
ఆడవాళ్లు కాళ్లకు పసుపెందుకు రాసుకుంటారు? ౧8. పిలకముదడి కరెంటు అవుతుందా? ౧౦. ఆధునిక మూధనమ్మకాలు మూఢనమ్మకాల పై జనవిజ్ఞానవేదిక జరిపిన మరికొన్ని సత్యశోధనలు:
-
ఎవరికి పిచ్చి...?
-
గుప్త నిధుల కోసం...?
-
పిల్లలెందుకు చనివోతున్నారు?
-
భయమే దెయ్యం...
-
మంత్రాల పాములు కావు... మామూలు పాములే
-
క(ర్రన్వామి కటకటాలవాలు
-
కంటిచూపు న్వామికి అరదండాలు.
. క్
రొ శాస్త్రీయంగా ఆలోచిద్దాం! ౯ అడ్డువడుతున్తాయి హర టి గే! గ్ (శు జహా తను అ జు సా క్ ల్ మగ! .ళో ళ్ “పిల్లలూ ! మీకు ఒక కథ చెప్పనా?” అన్నారు విశ్వం మాస్టారు. | “చెప్పంది మాస్టారూ!” అన్నారు పిల్లలందరూ “ఇది ఈ మధ్యనే అమెరికాలో నిజంగా జరిగిన సంఘటని అని మొదలెట్టారు మాష్టారు. అదేమిటంటే, ఒకాయన ఒక కొత్త కారును కొన్నాడు. శ దానిలో తిరుగుతున్నాడు. ఒక రోజున ఒక షాపు ముందు కారును ఆపి పిల్లల | కోసం బిస్కట్ల పాకెట్ కొన్నాడు. కారులో కూర్చొని దానిని స్టార్ట్ చేయబోయాడు. కానీ కారు స్టార్ కాలేదు. 4,5 నిముషాలు ప్రయత్నించిన తర్వాత స్టార్టయింది. మరునాడు కూడా బిస్కట్ల పాకెట్ కొని, కారు స్టార్ట్ చేయబోతే మరల అదే . సమస్య 4,5 నిముషాల దాకా కారు స్టార్టు కాలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది. ప ట్
అంతకు ముందు ఏ షాపులోనైనా పిజ్ఞాగానీ, బర్గర్కాని కొని పాక్ చేయించుకొని కారులో కూర్చోగానే కారు స్టార్దయ్యాది. కానీ బిస్కట్లు కొంటే మాత్రం 4,5 నిముషాలు ఇబ్బంది పెట్టిన తర్వాత గాని స్టార్ట్ కావడం లేదు. కార్లు రిపెర్లు చేసే ఇంజనీరు దగ్గరకు వెళ్లి విషయం వివరించాడు. ఆ ఇంజనీరు కూడా ఆ కారులో వెళ్ళి ఏదైనా వస్తువును కొని, పాక్ చేయించుకొని కారులో కూర్చోగానే కారు స్టార్హయ్యేది. బిస్కట్ల పాకెట్ కొని కారులో కూర్చోగానే కారు స్టార్హయ్యెది కాదు.
ఐనా ఆ ఇంజనీరు కంగారుపడలేదు. విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలించాడు. ప్రతి వస్తువును కొన్న తర్వాత దగ్గరకు వచ్చిన కాలాన్ని కారు ఆపినప్పటి నుండి కారు మరల స్టార్ అవుతున్న కాలాన్ని గమనించాడు. అతనికి సమస్య మూలం అర్ధమయింది. అదేమిటంటే ఆ కారుకు “నీటి ఆవిరి తాళం” అనె పద్దతి పెట్టబడింది. దాని కారణంగా కారును ఆపిన తర్వాత “నిటి ఆవిరితాళం” దానంతటదే విడిపోతుంది. ఈపని జరగటానికి 4 నిముషాలు పడుతుంది. షాపు ముందు కారాపి, పిజ్ఞాలాంటివి కొని, ప్యాక్ చేయించుకోని రావడానికి 45 నిముషాలు టైం పడుతుంది. అందువలన అవి కొని కారు స్టార్ట్ చేస్తే అప్పటికే “నీటి ఆవిరితాళం” విడిపోయి కారు స్టార్దవుతుంది. బిస్కట్లకు పాకింగ్ పని ఉండదు. కాబట్టీ దాన్ని కొనుక్కొని రావడానికి 4 నిముషాలు పట్టదుకదా? అందువలన కారును నార్ చేసినా 4,5 నిముషాలు బయలుదేరనని మొరాయిస్తుంది. ఇదీ బిస్మట్ల వెనుక ఉన్న యంత్ర మహిమ, ఇందులో మంత్రం లేదు, తంత్రం లేదు. అర్ధమైందా?”
అర్ధమైందన్నట్లుగా తలూపారు పిల్లలు.
“ఇప్పుడు మా స్నేహితుడి కారుకు సంబంధించిన మరో విషయం చెబుతాను వినండి అంటూ మరల మొదలెట్టారు. మాష్టారు.
“ మా స్నెహితుడొకరు కారును కొన్నాడు. కొత్త కారులో రూమ్మని తిరుగుతున్నాడు. కానీ కారును కొన్న వారం రోజుల లోపలే ప్రమాదం జరిగి అతనికి దెబ్బలు తగిలాయి. కారు కొద్దిగా దెబ్బతిన్నది. పాం ర
అతను ఆ ప్రమాదానికి కారణమేమిటని ఒక స్నేహితుణ్ణి అడిగాడు. అతను “కారుకి నిమ్మకాయలు కట్టకపోవడమే ప్రమాదానికి కారణమన్నాడు. మా స్నేహితుడు కారుకు నిమ్మకాయలు కట్టీ మరల రూమ్మని తిరగసాగాడు. వారంలో ఇంకో ప్రమాదం. కొద్ది గాయాలతో మరల బయట పడ్డాడు. దానికి కారణమేమిటని నన్ను అడిగాడు. “మిత్రమా! నీకు కారు డైవింగ్ బాగారాదు. అయినా ఇంత పట్టణంలో రద్దివీధుల్లో స్పీడుగా (డైవ్ చేస్తున్నావు. కారు ప్రమాదాలకు అసలు కారణం ఇదీ” అన్నాను. ఐనా అతను నా మాట వినకుండా ఒక పురోహితుణ్సి సలహ అడిగాడు. అతను “నీవు బుధవారం బండి బయటకు తీశావు. శాంతి చేయించాల్సి వుంటుంది” అన్నాడు. ప్రమాదాలకు నిమ్మకాయలకి లేదా బుధవారం సంబంధం అంటగడతారు. అసలు నిమ్మకాలకు, కారు ప్రమాదానికి ఎందుకు సంబంధం ఉంటుంది చెప్పండి. దైవింగ్ చేతకానితనానికి, ప్రమాదాలకి సంబంధం ఉంటుంది గాని మన దేశంలో అశాప్రీయంగా ఆలోచించేవారు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో చాలా కొద్ది మంది ఉన్నారు. ఏ దేశంలోనైనా ఎక్కువ మంది ప్రజలు అశాస్త్రీయంగా ఆలోచిస్తారో, ఆ దేశం శాస్ర విజ్ఞాన రంగాలలో వెనుకబడి ఉంటుంది. శాస్త విజ్ఞానరంగాలలో వెనుకడితే ఆ దేశం విద్య, వైద్యం, ఆరోగ్యం, రక్షణ ఇలా అన్ని రంగాలలో వెనుకబడి పోతుంది. అలా వెనుకబడిన దేశాన్ని అందరూ చులకనగా చూస్తారు. అలా కాకుండా శాస్త్రీయంగా ఆలోచించే ప్రజలున్న దేశం అన్ని రంగాలలో ఓ ముందుండి అగ్రరాజ్యంగా పిలవబడుతుంది. కాబట్టి మనదేశం కూడా అగ్ర రాజ్యంగా ఎదగాలంటే మనమేం చేయాలి? అన్ని ప్రశ్నించారు విశ్వం మానస్తారు. “మన దేశస్థులందరం శాస్త్రీయంగా ఆలోచించాలి. మా మామయ్య చెప్పినట్లు పిడుక్కీ బియ్యానికి ముడిపెట్టటూడదు”. సమాధానమిచ్చింది శాంతి. క్లాసంతా గొల్లున నవ్వింది. మాస్టారు కూడా ఆనందంగా నవ్వారు. ల అతత
పప్ప తింటే చీము పడుతుందా?
నెనోకసారి వెళ్ళిన మీటింగులో చిన్న టీ పార్టీ ఏర్పాటు చేశారు. ముందు ప్లేట్లలో టిఫిన్ వచ్చింది. నా ప్రక్క్మన ఉన్న ఒక ఇంజనీర్ ఆయన ప్లేటు తన చూస్తూనే * వద్దు వద్దు” అంటూ చేయి వెనుక్కు తీసుకున్నాడు. నేను “అదేంటండి! టీఫిన్ వద్దంటున్నారెందుకు?”” అని అడిగాను “ఏం లేదండి! నాకు కాలిమీద కురుపు లేచింది” అంటూ నసిగాడు. “కాలిమీద కురుపులేస్తే నోటితో తింటాని కేమిటి?” అంటూ జోక్ చేశాను.
“అది కాదండీ! శనగపిండి లడ్డూ, మిక్చర్ తింటే కురుపు చీము పడుతుంది కదా” అన్నాడాయన. నేను నవ్వాను.
“బిము ఎందుకు పడుతుందో తెలుసా?” అని అడిగాను.
“పప్పు తింటే చిము పడుతుంది” అని మళ్ళా దబాయించాడాయన.
“కాదు చీమెందుకు పడుతుందో చెబుతాను వినండి. ఇది ఏ పదవ తరగతి విద్యార్ధి అయినా చెప్పగలడు. మన శరీరంలోని రక్తంలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్తకణాలు అనేవి ఉంటాయని తెలుసుగదా?
“ తెలుసు”
“తెల్ల రక్తకణాల పనేమిటో తెలుసా?”
“మీ పదవ తరగతి జీవశాస్రం విజ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోండి”
ఆయన నవ్వాడు. తల అడ్డంగా ఊపాడు. నేను కొనసాగించాను.
“శరీగ్రానికి దెబ్బతగిలినపుడు లేదా కురుపు లేచినపుడు ఆ గాయం లేదా కురుపు నుండి అనేక రకాల బ్యాక్టీరియాలు శరీరం లోపలికి ప్రవేశించి మనకు హానిచెయడానికి ప్రయత్నిస్తాయి. వాటిని రక్తంలోని తెల్లకణాలు అద్దు కుంటాయి. అంటే ఒకరంగా తెల్లకణాలు మనశరీరంలోని సైనికులన్నమాట. శత్రువు లోపలికి రాకుండా వోరాదతాయన్నమాట. ఆ పోరాటంలో చనిపోయిన తెల్లకణాలే చీము అనే పేరు మీద బయటకు వస్తాయి. తెల్లకణాలు బలంగా ఉంటే అవి తక్కువ చనిపోయి, శత్రు బ్యాక్టీరియాను చంపుతాయి. తెల్లకణాలు బలహీనంగా ఉంటే అవి ఎక్కువగా చచ్చిపోతాయి. అంటే అప్పుడు చీము ఎక్కువ వస్తుంది. గాయం తగిలినపుడు లేదా కురుపు లేచినపుడు తెల్లకణాలకు బలమైన ఆహారం ఇస్తే చీము తక్కువ పడుతుందన్నమాట. అంతేగదాా. నతన ట్ర యి...
“అంతే! అంతే!”
“ తెల్లకణాలకు బలాన్నిచ్చే ఆహారమేది? * శరీరానికి శక్తినిచ్చేది పిండి పదార్ధం. ఇది బియ్యం, బంగాళదుంపలు మొదలైన వాటిలో ఉంటుంది. కణాలకు బలాన్నిచ్చెది మాంసకృతులు. ఈ విషయం, హైస్కూలు స్థాయిలోనే బోధించబడుతుంది. మరి మాంసకృతులు ఏ పదార్థంలో ఉంటాయి?
“మాంసంలో” అన్నాడు ఉత్సాహంగా మా ఇంజనీరు గారు
“ఇంకా ఏ పదార్థాల్లో ఉంటాయి” ఇంజనీరు గారు మౌనం.
“ఇదే ఈ విషయానికి కీలకమైన విషయం. మాంసకృత్తులు అన్ని పప్పులలోనూ ఉంటాయి. అంటే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పులలోనూ ఉంటాయి. పైగా మాంసం కన్నా ఇవి చౌక. అందువలన గాయం లేదా కురుపు కలిగినపుడు తెల్లకణాలకు బలం పెరిగి, తక్కువ నష్టంతో ఎక్కువ బ్యాక్టీరియాలను చంపుతాయి. అంటే తక్కువ చీము పట్టి గాయం లేక కురుపు త్వరగా మానుతుందన్నమాటా”.
“ కాంతారావు గారూ! మీరు చెప్పినట్లు, గాయం తగిలినపుడు కందిపప్పు తినవచ్చుగాని పెసరపప్పు తింటే మాత్రం చీముపడుతుందండీ ప్రక్శనే ఉన్న బ్వాంక్ ఆఫీసర్‌గారు అన్నారు. ఆయన ఎం.కాం. చదివారు.
నెను నవ్వాను. “కందిపప్పులో ఏ మాంసకృత్తులైతే ఉన్నవో, పెసరపప్పు లోనూ అవే ఉన్నాయి. పెసరపప్పు హానికరమెలా అవుతుంది? అన్నాను.
బ్యాంకు ఆఫీసర్ మౌనం. “పప్పుల సంగతేమోగాని మజ్జిగ తాగితే చీము పెరుగుతుంది” అన్నాడు రామానుజాచార్యులు.
“మజ్జిగ వాలపదార్ధం. అది ఆరోగ్యకరమేగాని అనారోగ్యం కలిగిం చదు. అసలు విషయమేమిటంటే గాయం తగలగానే తెలిసీ తెలియక మన , _(ామస్ఫులు గాయం మీద జల్లించిన దుమ్ము పోస్తారు. నెత్తురు ఆగుతుందని. లేదా కడగకుండా, మందువేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అప్పుడు తప్పనిసరిగా గాయం పెరిగి చీము పెరుగుతుంది. ఆ పెరిగిన చీముకు కారణాన్ని పెసరపప్పుకో, మజ్జిగకో ఆపాదిస్తారు. అంతే” అని ముగించాను. మా ఇంజనీరు గారికి విషయం అర్ధమయ్యింది. మెల్లగా స్వీటు, హాటు
స్లెటు తీసుకోని తినడం మొదలెట్టాడు. లత భి తపప
పొట్లకాయ కూర, కోడెగుడ్దు కూర కలిపి తినవచ్చా?
నేను * విశ్వశాంతి విద్యాకేంద్రం” నిర్వహిస్తున్న రోజుల్లో ఒక మీటింగ్ నిమిత్తం ప్రకాశం జిల్లా గంగవరం గ్రామానికి వెళ్ళాను. మీటింగ్ తర్వాత వెంకట్రామయ్య మాస్తారు గారింట్లో భోజనం ఏర్పాటు చేశారు. నేను, మాస్టారు ఇద్దరం భోజనానికి కూర్చున్నాము. భోజనంలో మానస్తారు భార్య ఆయనకు కోడిగుడ్డు కూర, నాకు పొట్లకాయ కూర వడ్డంచింది. ఆయన నవ్వుతూ" అదేంటి? ఇద్దరికీ చెరొక కూర వడ్డించావు? అన్నారు.
“ ఏంలేదండి! మనకోసం కోడిగుద్దుకూర చేశాను. కాంతారావు మాస్తారు భోజనానికి వస్తున్నారని మీరు చెబితే, ఆయన కోడిగుద్దుకూర తినరేమోనని పొట్లకాయ కూరచేశాను” అంది మాస్టారి భార్య,
“ నిజమె! వండిన రెందు కూరలు ఇద్దరికీ వెయ్యవచ్చు, ఆయన కోడిగుడ్డు తింటారు”
“అమ్మో! పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి తినడమే? రెండూ కలిస్తె విషమౌతుంది” అందామే.
“ అదంతా మూఢనమ్మకం. ఎక్కడో ఒకసారి విషపూరితమైన ఇత్తడి ల లలత
గిన్నెలో పొట్లకాయ కూర వండి ఉంటారు. ఆ రోజున అనుకోకుండా కోడిగుద్దు కూడా చేసి ఉంటారు. తిన్నవాళ్ళకి వాంతులు అయినాయి. అసలు కారణం విషపూరితమైన, శుభం చేయని ఇత్తడిగిన్నె కాగా పొట్లకాయ, గుడ్డుల కలయికలకి దోషం ఆపాదించారు. అంటే పొట్లకాయ, కోడిగుడ్డు కలిపితింటే ఏంకాదు. నాకు కూడ పొట్లకాయ కూర వెయ్యి” అన్నారు. వెంకట్రామయ్య మాస్తారు. ఎక్కడికైనా వెళ్తే పెట్టింది తినడమేకాని పదార్థాలు అడిగి మరీ వేయించుకొనే అలవాటు నాకు లేదు. ఐనా సత్యనిరూపణ కోసం వెంకట్రామయ్య మాస్టారికి సహరించాలనిపించింది. వెంటనే అమ్మా! నాకు కూడా "కోడిగుడ్డు కూర వేయ్యండి" అన్నాను.
మాస్తారి భార్య సందేహిస్తూనే మాస్టారికి పొట్లకాయ కూర, నాకు కోడిగుడ్డు కూరవేసింది. ఇద్దరం ఆ రెండు రూరలు కలుపుకొని తిని, కాసేపు మాట్లాడుకొని, నిద్రకుపక్రమించాము. ఆ రాత్రి మా ఇద్దరికి ఏ ఇబ్బంది కలుగలేదు.
మరునాడు ఉదయం మామూలుగానే లేచాము. దినచర్యకుపక్ర మించాము. ఈలోగా మాస్తారి భార్య ద్వారా రాత్రి జరిగిన సంఘటననను విన్న ఇరుగుపొరుగువారు మమ్మల్ని విచిత్రంగా చూశారు. అయితే ఆ సంఘటనతో ఆ గ్రామంలో పొట్లకాయ, కోడిగుద్దు కలయికకు సంబంధించిన మూఢనమ్మకం తొలగిపోయింది.
|
నిమ్మరీసీం తాగితే జలుబు చేస్తుందా? ఆ ॥ న్ హ్
అవి నేను మాచర్లలో ఎ.ఇ.గా పనిచేస్తున్న రోజులు. ఒక రోజు మాపాపకు జ్వరం వచ్చింది. అప్పుడా పాప వయస్సు నాలుగేళ్ళు. పాపను చూద్దామని మా మిత్రుడు డా॥ అంకయ్యగారు వచ్చారు. పాపకు మందుల సిరప్పులు వ్రాసి తెచ్చివాడమన్నారు. “పాప బాగా నీరసంగా ఉంది. ఏదైనా పండ్లరసం త్రాగించండి” అన్నారు. నేను “ఇంట్లో పండ్లేమిలేవు, నిమ్మపండ్లు తప్ప” అన్నాను.
ఆయన * అయితే నిమ్మరసం త్రాగించంద” అన్నారు నవ్వుతూ.
నేను సీరియస్‌గా మొఖం పెట్టీ “అదేమిటండి! జ్వరం వచ్చిన పాపకు నిమ్మరసమా! జలుబు చేయదూ! అన్నాను.
“ నిమ్మరసం త్రాగితే జలుబు చేయదండీ! తగ్గుతుంది”
“అదెలాగా?”
“నిమ్మరసంలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే సి విటమిన్ తీసుకుంటే లోనికి ప్రవేశించిన జ్వరానికి సంబంధించిన వైరస్‌తో పోరాడే శక్తి శరీరానికి పెరుగుతుంది. అదే కదా ఇప్పుడు కావలసింది? అంతేకాని నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందనుకోవడం వట్ట మూఢనమ్మకం. ఇంక నేనేమి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నిమ్మకాయలతో రసం తీయించి పాపకు గంట గంటకు పట్టాను.
పాపకు జలుబు చేయలేదు. జ్వరం తగ్గిపోయింది. త 2
ఆపిల్ కన్నా అరటి మిన్న క్ష | యం! “ “ పిల్లలూ! ఆరోగ్యానికి ఆపిల్ పండు మంచిదా? అరటిపండు మంచిదా? ప్రశ్నించారు విశ్వం మాస్తారు. “ఆపిల్ పండు! ఆపిల్‌పండు”! ఎక్కువ మంది పిల్లలు అరిచారు. “అరటపండు” కొద్దిమంది పిల్లలు అరిచారు. గ “ముందు అరటిపండు గ్రూపు వాళ్ళును అడుగుతాను. అరటిపండు ఆపిల్కన్నా ఎందుకు మంచిది?” అరటిపండు [గ్రూపు గట్టిగా సమాదానం చెప్పలేకపోయారు. “మరి ఆపిల్ పండు ఎందుకు మంచిది?”
- “ఆపిల్‌పండు బాగా బలమిస్తుందిొ రాజు సమాధానం. “ఆపిల్‌పండు తింటె పిల్లలు ఆపిల్‌పండు లాగా ఎర్రగా, బొద్దుగా తయారవుతారు” న్వాతి సమాధానం. “ఆపిల్పండులో బోలెడన్ని విటమిన్తుంటాయి” చక్రి సమాధానం. అన్నీ విని మాస్తారు “ఇవన్ని మీకు ఎవరు చెప్పారు?” అడిగారు. తతత క్షత లత
స్వాతి సణుగుతూ “ఆపిల్‌పండును చూస్తేనే తెలుస్తుంది మాన్యారూ! అది తింటే దానిలాగా తయారవుతామని పైగా మా అమ్మ చెప్పింది కూడా! అంది.
- ఏ విషయమైనా దానికి సంబంధించిన వారు చెబితేనే నమ్మాలి. చట్టాన్ని గురించి లాయర్లు చెప్పింది నమ్మినట్లె, ఆహారపు విలువలను గూర్చ“పోషకాహార నిపుణులు” అంటే * న్యూట్రిషనిస్పులు” చెప్పింది నమ్మాలి. ఆపిల్పండ్లు, అరటి పండ్లను గూర్చి పోషకాహార నిపుణులు ఏం చెప్పారంటే ఒక 100 గ్రాముల బరువు తూగే అరటిపండులో ఎంత పిండి పదార్ధం, ఎంత ఎ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, అలాగే అతి తక్కువ స్టాయిలో ఇతర విటమిన్లు ఉన్నాయో, అంతే పరిమాణంలో పిండిపదార్థం, విటమిన్లు 100 గ్రాముల ఆపిల్ ముక్కలో కూడా ఉన్నాయి. ఎక్కువ ఏమీలేవు. అందుకని పోషకవిలువలలో అరటి కన్నా ఆపిల్ ఎక్కువెం కాదు. అరటిపండు వల్ల మరో లాభం ఉంది. అది ఏమిటి? చెప్పుకోండి చూద్దాం” అడిగారు విశ్వం
“ నెను చెబుతాను మాస్టారు” లేచాడు సుబ్బారావు.
“ఊఊ! చెప్పు”
“ అరటిపండు జత 5 రూవాయలుంటుంది. 2 అరటిపళ్ళకు సమానమైన సైజుండే ఆపిల్ వెల 20 రూపాయలుంటుంది. కాబట్టి అరటిపండు చౌకగదా!
“ కరెక్ట్. 5 రూపాయల అరటిపండ్లలో అభించె పోషక విలువలను 20 రూ॥లకు ఎందుకు కొనాలి? కాబట్ట మనమందరం ఒక మాట చెబుదాం. అదేమిటంటే “ఆపిల్కన్నా అరటి మిన్న” అని సరేనా?” అన్నారు. మాస్తారు.
“అవును మాస్టారు! ఆపిల్ కన్నా అరటి మిన్న” పెద్దగా అన్నారు పిల్లలందరూ.
త త లలా
తీర్చు రరిది? దాదాపు 60 ఏళ్ళనాటి మాట. ప్రకాశం జిల్లా వెంపల్లిలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో భార్య, భర్త, అతని తల్లి ఉండేవారు. అత్త కోడలిని విపరీతంగా వేధించేది, బాధించేది. అయినా అతను తల్లిని ఒక్కమాట అనేవాడు కాదు. కోడలు గర్భం ధరించింది. అయినా అత్త సాధింపులు, వేధింపులు తగ్గలేదు. ఆ అమ్మాయికి 9వ నెల వచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా ఆమె బిందె తీసుకొని ఏటికిపోయి నీళ్ళు తేక తప్పేదికాదు. అసలే వైశాఖ మాసం, ఆపై తొమ్మిదో నెల. అయినా ఆమె తప్పనిసరై నీళ్ళకోసం ఏటికి వెళ్ళింది. ఆ ఎండలో వెళ్ళి, దిగి, నీరు ముంచుకని పైకి వచ్చేటప్పటికా ఆమెకు నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పటికి పూర్తిగా లేవలేనంత బలహీనమైపోయింది. నీరసంగా పడి పోయింది. నొప్పులు మొదలైనాయి. కష్టం మీద ప్రసవించింది. పండంటి మగ పిల్లవాడు. కాని అసలే నీరసంగా ఉన్న ఆమె కాన్పు కష్టమవడంతో చనిపోయింది. వెంటనే తండ్రి, నాయనమ్మలతో సహా అందరూ ఆ పసివాదిని “దురదృష్టజాతకుడు” “తల్లిని చంపి పుట్టనవాడు” అంటూ చీదరించుకోవడం మొదలు పెట్టారు. ఊహ తెలియని వయస్సులో ఆ చీదరింపుల ఆ పిల్లవాడిని ఎంతో బాధించేవి. న అసలు తప్పు ఎవరిది? సరైన పోషణ చేయక వధించి, బాధించి, ఆమె చావుకు కారకురాలైన అత్త, భర్తలదా? అమాయకుడైన ఆ పిల్లవాడిదా? “దోషులను వదిలేసి, మూఢనమ్మకాలతో అమాయకులైన వారిని మానసికంగా బాధించే ఈ సమాజానిదా? వత క్షన్ లాలా
బొప్పాయి పండు తింటే గర్భం పోతుందా? ౧౧ ర త ల్ ప
ఒకసారి జనవిజ్ఞాన వేదిక నిర్వహించే అక్షర కేంద్రాలలో పాల్గొనే వయోజన విద్యార్థులకు ఒక (ప్రశ్న వేశాను.
“గర్భవతి బొవ్పాయి పండు తింటే గర్భనావమౌతుందా?” అని. చాలామంది గర్భస్రావం అవుతుందన్నారు. ఒకరిద్దరు తెలియదన్నారు.
“బొవ్పాయి పండు తింటే గర్భస్రావం ఎందుకవుతుంది?” ప్రశ్నించాను.
“బొవ్వాయి పండు తింటే వెడి చేసి గర్భం పోతుంది” రామకృష్ణ సమాధానమిచ్చాడు.
“ మీరు పెద్ద డాక్టరుని ఎవరినైనా అడగండి. వేడి అంటే ఏమిటో?”
“ నేను అడిగాను సార్. వేడి అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదట.
శరిరంలో నీరు తక్కువై మూత్రం పోసేటప్పుడు మంట వస్తుంది. దాన్ని వేడి అంటారు. ఎక్కువ నీళ్ళు తాగితే ఆ “ వేడి” పోతుంది. ఎండాకాలంలో శరిరం మీద చెమటపట్టి, దాని మీద దుమ్ముచేరి, ఆ దుమ్ములోని బ్యాక్టీరియా కారణంగా కురుపులు లేస్తే మామిడి పళ్ళు తిన్నందువలన “వేడి” కురుపులు లేచాయంటాము. అంతేకాని రోగాలకి అసలు కారణం మీద దృష్టి పెట్టం అన్నారందడీ” అన్నాడు శ్రీనివాసు. తతత కధ ల
“అలాంటి అపోహయే బొప్పాయి పండ్ల విషయంలో కూడ ఎర్పడింది. ఎవరో బొప్పాయి పండు తిన్న తరువాత ఇతర కారణాల వలన గర్భం పోతే వెంటనే బొవ్వొాయి పండు వలన గర్భం పోతుంది” అని తప్పుగా అన్వయించారు మన పెద్దలు.
అసలు రహస్యమేమిటంటే బొప్పాయి పండులో గర్భంలో పిండానికి బలం కలిగించే “ఎ” విటమిన్ ఉంటుంది. బొప్పాయి పండ్లు ఎన్ని ఎక్కువ తింటే అంత ఆరోగ్యవంతుడైన బిద్దపుడతాడు. నా భార్య రెండుసార్లు గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు బాగా బొప్పాయి పండ్లు తిని పించాను. ఇద్దరూ పిల్లలూ బలంగా, ఆరోగ్యంగా పుట్టారు. మీరు కూడా మీ ఇళ్ళలో గర్భవతులకు బొప్పాయి పండ్లు పెట్టడాన్ని ప్రోత్సహించండి అంటూ ఆరోజు మంచి విషయం” ముగించాను.
రామకృష్ణ ఈ విషయాన్ని గర్భవతియైన తన భార్యకు, తల్లికి చెప్పాడట. భార్య అర్ధం చెసుకున్నది గాని అతని తల్లి “ఈ డాక్టర్లు, నార్లకు ఏం తెలుసు? మా కాలంలో మెం బొప్పాయి పంధ్లు తినకుండానే పండంటి పిల్లలను కనలేదా? పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఏమో? పెద్దవాళ్ళు చెప్పినట్లు చేద్దాం” అన్నదట. అయినా అతను వినకుండా భార్య చేత బొప్పాయి పండు రోజు తినిపిస్తున్నాడట. పై విషయం వారం రోజుల తర్వాత వయోజన విద్యాకేంద్రంలో చెప్పాడు. ఆరు నెలల తర్వాత అతనికి పండంటి ఆడపిల్ల పుట్టింది. తత లా
బాలింతరాలు పథ్యం చేయాలా?
మా రెండో బావగారు బెంగుళూరు బి.ఇఎల్లో ఉద్యోగి. మా చెల్లెలు రెండవ కాను బి.ఇ ఎల్. ఆస్పత్రిలోనే అయింది. పండంటి మగబీడ్డను కన్నది. మా అమ్మ తనకు తెలిసిన “విజ్ఞానాన్ని” మా చెల్లెలికి బోధించడం మొదలు పెట్టింది. “అమ్మాయ! మంచి నీళ్ళు ఎక్కువ తాగకమ్మా! పొట్ట వస్తుంది. పప్పుకూరలు, మజ్జిగ లేకుండా చిన్న ఉల్లిపాయ కారం, నెయ్యి, పథ్యం తెస్తాను. అది తిను. మజ్జిగ వేసుకుంటే జలుబు చెస్తుంది. నిద్దుర ఎక్కువ పోకు” అప్పుడే గదిలోకి వచ్చిన డాక్టరు నవ్వుతూ ఇలా అన్నది. “మామ్మగారు! మీరు చెప్పినవన్నీ చాదస్తాలు. మీరు చెప్పినట్లు చేస్తే తల్లికి పాలు పడవు. మంచినీళ్ళు తాగితే జలుబు చేయదు. పప్పు కూరలు లేకుండా ఎక్కువ రోజలు ఆహారం పెడితే పోషకాహారం తల్లికెలా అందుతుంది? ఆమెకు బలమెలావస్తుంది? పాలెలా పడతాయి? అంతేకాదు కాన్పు కారణంగా అమ్మాయి నీరసించి ఉంటుంది. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత త్వరగా కోలుకుంటుంది. అమ్మాయిని నిద్రపోనివ్వండి” ఇలా వివరంగా చెప్పి ఆమె వెళ్ళింది.
కాని మా అమ్మకు ఆమె మాటల మీద నమ్మకం కుదలేదు. మా చెల్లి బ్రతిమలాడినా, దప్పిక అవుతున్నదన్నా ఎక్కువ నీళ్ళు త్రాగనియ్యలేదు. ఇంటికి వెళ్ళి కారం అన్నం, నెయ్యి వేసుకుని కారియర్ తెచ్చింది. తినమని మా చెల్లెలిని బలవంతం చేస్తున్నది. హాస్పిటల్ వాళ్ళు పప్పు, కూరలు, సాంబారు, పెరుగుతో పంపిన కారియర్ పక్కన పెట్టింది. అనుకోకుండా అదే సమయానికి ఆ డాక్టరు మరలా వచ్చింది. సన్నివేశాన్ని చూసింది. కొంచెం కఠినంగా “మామ్మగారూ! ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఇక మీ అమ్మాయి మా అమ్మాయే. మామీద నమ్మకం ఉంటే మేము చెప్పినట్లు చేయండి. లేదా మీ బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళి మీకు తోచిన పథ్యం పెట్టండి” అంది.
మా అమ్మ కొంచెం ఇబ్బందిగా * అబ్బెబ్బె మీ ఇష్ట ప్రకారం చేస్తానమ్మా!” అని చెప్పి ఆస్పత్రి కారియర్ తీసి అన్ని పదార్దాలతో అన్నం తినిపించింది. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ చక్కగా నిద్రపోనిచ్చింది. కడుపునిండా సళ్ళు తాగించింది. తల్లి, పిల్లవాడు పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరారు. ఇంటి దగ్గర కూడ పథ్యం అనకుండా అన్ని పదార్థాలు వేసి అన్నం పెట్టింది. ఇంక తర్వాత మా యింటిలో ఎవరు ప్రసవించినా పథ్యం ప్రసక్తే లేకుండా బాలింతలు అన్ని పదార్ధాలతో తినసాగారు.
ళ్ సర్గూర్స్, బూస్స్ పేరేదైనా వేస్ట చ ఇ “పిల్లలూ మీకు బలం రావడానికి మీ అమ్మగారు ఉదయం, సాయంత్రం వాలు తాగిస్తుంటారా? రామూ” అడిగారు మాస్టారు. “ మా అమ్మ తాగిస్తుంటుంది మాష్టారూ! కాని వాలు ఒక్కటే కాదు బూస్ట్ కలిపిస్తుంది. బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ!” రాము గట్టిగా అన్నాడు. క్షాసంతా నవ్వారు. మాస్టారు కూడా నవ్వుతూ “ఖాసిం! నీ సంగతేమిటి?” అన్నారు. మా అమ్మ పాలల్లో కాంప్లాన్ కలుపుతుంది. అయామ్ ఎ కాంప్లాన్ బాయ్” మరల క్లాస్‌లో నవ్వులు. మొత్తానికి క్లాసులోని పిల్లలలో ఎక్కువ మంది కాంవ్హాన్, బూస్స్,
- బోర్నవిటా, హార్లిక్స్ ఏదో ఒకటి పాలలో కలుపుకొని తాగుతామని చెప్పారు. జ అప్పుడు మాస్టారు ఇలా అడిగారు. శ “హార్లిక్స్ గాని, ఇతర పొడులు గాని కిలో ఖరీదు ఎంత ఉంటుంది”? | “౩300 రూపాయలుంటుంది". రంగారావు సమాధానమిచ్చాడు. “ఆ పొడుల్లో ఏ పదార్ధాలుంటాయో తెలుసా?” “తెలియదు మాసారూ!” “ఒక కిలో హార్లిక్స్‌లో సుమారు 800 గ్రాములు గోధుమ పిండి, వత కేటి తతా
100 (గ్రాముల పాలపొడి, 100 గ్రాముల చెక్కెరపొడి ఉంటాయి. అంతే” అన్నారు. మాస్టారు నవ్వుతూ.
“అంలేనా?” పిల్లలందరూ నవ్వసాగారు.
“అవును. ఇప్పుడు లెక్క వెద్దాం. ఒక కిలో హార్లిక్స్ లేక బోర్నవిటా తయారుచేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో. 800 (గ్రాముల గోధుమ పిండి వెల 18 రూపాయలు, ఒక వంద గ్రాముల పాలపొడి వెల 3 రూవాయలు. వంద (గ్రాముల చెక్కెర 2 రూపాయలు, సీసా వెల 4 రూపాయలు వేసుకొన్నా ఇతర ఖర్చులు కలుపుకున్నా ఒక కిలో పొడి ఖరీదు 80-00. కాని ఆ పొడిని 300 రూవాయలకి అమ్ముతున్నారు. అంటే 10 రెట్ల లాభం అన్నమాట. లేదా 380 రూపాయల పొడికి 270 రూ॥ లాభమన్నమాట. ఈ పొడుల కారణంగానే సంవత్సరానికి విదేశీ కంపెనీలు 3000 కోట్ల రూపాయల లాభాన్ని వాళ్ళ దేశాలకు తరలించుకుపోతున్నారు. మన దేశ సంపద ఈ పొడుల మూలంగా ఎంత తరలిపోతున్నదో చూడండి. ముంబైలో ఒక స్వచ్చంద సంస్థ 50 మంది పిల్లలను సెలక్ట్ చేసి వారిలో 25 మందికి హార్లిక్స్ లాంటి పొడులు, 25 మందికి గోధుమపిండి, పాలపొడి, చక్కెర కలిపిన పొడి ౩ నెలలు ఇచ్చారు. రెందు [గ్రూపుల పిల్లలూ సమానంగా బరువు పెరిగారు. కాబట్ట అనవసరంగా హార్లిక్స్ లాంటి పొడుల కొనకండి. హార్లిక్స్, బోర్నవిటాలతో బలమొస్తుందనేది ఆధునిక మూధనమ్మకంగా చెవొచ్చు. వాటి బదులు గోధుమ పిండి, పాలపొడి, చక్కర, జీడిపప్పులు, యాలకులు పొడి కలిపిన పొడిని రోజు 45 చెంచాలు తింటే అదే బలం వస్తుంది. డబ్బు ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. అర్ధమైందా?
“అర్ధమైంది మాస్టారు” పిల్లలందరూ అరిచారు.
“జనవిజ్ఞాన వేదిక మిత్రులు గోడల మీద రాశారు చూశారుగదా? “హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లాన్, బూస్ట్, పేరేదైనా సరే వేస్ట్ అని మీరందరూ మి ఇళ్ళలో ఆ నినాదాన్ని ప్రచారంలో పెట్టాలి.
“అలాగే మాస్టారు!” పిల్లలందరూ మరల పెద్దగా అన్నారు. లాం 20
ఓంణుక్ బంటెల్ పుత్ వెతకచ్న్మక మలువలు ణుణ్ నాకు దోయక్ 70డు నీగాల టాంక్ రాయగ్గిది భజ్రూడూ! సయ 1 | జంగా ళా నేను భద్రాచలంలో ఒక మీటింగుకు వెళ్ళాను. అందులో ప్రసంగిస్తూ హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్లన్నీ వేస్టెనని 80 రూ1! విలువగల గోధుమ పిండి, వొలపాొడి, చక్కెర కలిపి రూ॥ 800కు అమ్ముతున్నారని అందువలన పిల్లల | ఆరోగ్యం కోసం పాలలో జీడిపప్పులు, యాలకులు కలిపి తాగిస్తే రుచిగా, | కమ్మగా ఉన్న ఆ పాలను పిల్లలు ఇష్టంగా తాగుతారనీ, పాలతో పాటు కొంచెం గోధుమపిండి, కొంచెం చక్కెర ఒక గిన్నెలో ఇస్తే హార్లిక్స్లా తింటారని దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతారనీ, దబ్బు బాగా ఆదా అవుతుందని చెప్పి కూర్చున్నాను. నా తర్వాత వక్త డా॥ రాజేంద్రప్రసాద్ గారు. ఆయన లేచి “ఒక డాక్టరు వేదిక మీద ఉన్నాడు కాబట్టి కాంతారావుగారు టానిక్కులు కూడా వేస్ట్ అని చెప్పడానికి మొహమాటపడి ఉంటారు. ఇప్పుడు టానిక్కులను గూర్చి నేను వివరిస్తాను. 100 రూ॥లు పెట్టికొనే టానిక్ సీసాలో ఎన్ని రూపాయల పోషకవిలువలున్నాయి? ఎవరైనా చెప్పండి అని ప్రశ్నించారు. ప 2
ఒక (శ్రోత లేచి *“50రూ॥ విలువ గల పదార్ధం” అన్నాడు.
డాక్టరు గారు తల అడ్డంగా ఊపారు.
“30 రూపాయలు” ఇంకో (శ్రోత
“10 రూపాయలు”
“ఒక రూపాయి” ఒక (శోత
సభీకులంతా బీగ్గరగా నవ్వారు.
డాక్టరుగారు నవ్వకుండా, సీరియస్‌గా “ఆయన చెప్పినది కరెక్ట్. పోషక విలువలు 100 రూ! బాటిల్లో ఒక రూపాయి విలువ గలవే ఉంటాయి. మిగిలిన పదార్గం ఏదో తెలుసా?. అని అడిగి నవ్వారు.
(౪
సభ్యులలో నిశ్శబ్దం. “ఆల్మహాల్” డాక్టరుగారు జవాబు కొనసాగించారు. “టానిక్‌లో ఉండేది ప్రధానంగా ఆల్మహాల్ మాత్రమే. అది కొద్ది మోతాదులో తీసుకున్నప్పుడు “ఎపెటైజర్”గా పనిచేసి ఆకలి పెంచుతుంది. అప్పుడు వ్యక్తి కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. “తిండి గలిగితే కండ గలదోయ్” అని గురజాడ వారు చెప్పినట్లుగా, టానిక్ తాగిన వ్యక్తి కొద్దిగా బలం పెంచుకుంటాడు. ఇదీ టానిక్కులలోని రహస్యం. టానిక్కు తాగిన తర్వాత మావాడు కొద్దిగా ఒళ్ళు చేశాడండీ అని కొంతమంది తల్లులు అంటుంటారు. దానికి కారణం ఇదే. “ కాబట్టి టానిక్ బాటిల్ ఫుల్ -పోషక విలువలు నిల్” అని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రచారం చేయవచ్చా?” అని నెను వేదిక మీద నుండే ఆయనను అడిగాను.
“నిరభ్యంతరంగా[”” అన్నారు డాక్టరుగారు. ప తతత
గ్రహణం మొర్రి నిజమేనా?
“మా అబ్బాయికి [గ్రహణం మొగి కారణంగా పై పెదవి చిలి పోయిందండీ. ప్లాస్టిక్ సర్జరీ చేసి సరిచేయాలి. “డాక్టరు సుబ్బారావుగారిని అడిగాడు వావారావు.
డాక్టరు సుబ్బారావు జన విజ్ఞాన వేదిక సభ్యుడు. పైగా ఓపిక ఎక్కువ. పేషంట్లకు అవసరమైన విజ్ఞాన విషయాలు ఓపికగా వివరిస్తుంటారు. వొపారావు సమస్య వినగానే డాక్టరుగారు వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే” మీది మేనరికం వివాహం గదా?” అని.
“అరే! మీకెలా తెలుసు. నేను మీకు ఇంతకు ముందె తెలుసా?” ఆశ్చ ర్యంగా అడిగాడు పాపారావు. ఒక్కసారే డాక్టరుగారు, ఆయనతో పని ఉండి వచ్చిన నేనూ పక్కున నవ్వాం. ఎ
“మీరు ఇంతకు ముందు నాకు తెలియదు. ఒక రోగానికి కారణం పలానా అని అంచనా వెసాం కాబట్ట ఆ ప్రశ్న వేశాను. ఇంతకు మీ పిల్లవాడి పెదవి చీలి ఉండటానికి కారణం [గ్రహణం మొర్రి అనుకుంటున్నారా?” డాక్టరు గారు అడిగారు.
ణు “అవునండీ”
“ఎందుకనీ?”
“ఎందుకనేమిటండీ. వద్దన్నా వినకుండా గర్భంతో ఉన్న నా భార్య క్రిందటి సూర్యగ్రహణం టైములో మంచం మీద పూర్తి విశ్రాంతి తీసుకోకుండా గదిలో అటూ ఇటూ తిరిగింది. అందుకని గ్రహణం మొర్రి వచ్చింది.” ల ల 2 లలత
“పాపారావుగారూ! గ్రహణం టైములో గదిలోనే కాదు, బైట సూర్య కాంతిలో తిరిగినా గర్భంలో ఉన్న బిడ్డకు మొగర్రిరాదు. అది మీ మూఢ నమ్మకం మాత్రమే”
“కాదు డాక్టరుగారూ! ఆ టైములో సూర్యుడి నుండి మరిన్ని ఆల్లా వయొలెట్ కాంతి రేఖలు భూమి మీదకు వసాయట గదా? వాటి తీవ్ర ప్రభావం వలన గర్భంలో పిండానికి మొర్రి వస్తుందట గదా?”
“అలాంటిది ఇంతవరకు శాప్రీయంగా నిరూపించబడలేదు. దానిని ఏ సైంటిస్టు ఇంతవరకు అంగీకరించలెదు. గ్రహణం మొర్రిని అనాది నుండి నమ్ముతున్న మన ఛాందసులు, తమ సిద్ధాంతాలకు శాస్త్ర జ్ఞానాన్ని జోడించాలనే తాపత్రయంతో చేసే సూడో శాస్త్రీయ వివరణయే యీ ఆల్హా వయొలెట్ కిరణాల వాదం. అందులో శాస్త్రియత ఏమీలేదు. వారు తమ వాదాన్ని బలపర్చు కోవడానికి అమెరికాలో పరిశోధనల్లో గ్రహణం మొర్రి నిజమని బుజువైందని, రష్యా శాస్త్రజ్ఞులు పుస్తకాలలో దానిని వివరించారనీ ఏవేవో చెబుతుంటారు. అవన్నీ అబద్దాలే. అనేకమంది అభ్యుదయవాదులు, హేతువాదులు గ్రహణం మొర్రి అబద్దమని ప్రాక్టికల్‌గా నిరూపించారు. ప్రఖ్యాత నాస్తికులు గోరా గారు, ఆయన శిష్యులు తమ భార్యలు గర్భంతో ఉన్నపుడు సూర్యగ్రహణం టైములో వారిని బయట తిప్పారు. వాళ్ళకు ఎంతో ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టారు. అంతేకాదు ఈయన మా మిత్రుడు కాంతారావు గారు 1980లో వచ్చిన సూర్యగ్రహణం టైములో గర్భవతిగా ఉన్న తన భార్యను వీధుల్లో తిప్పాడు. వారికి ఆరోగ్యవంతుడైన బిడ్డ పుట్టాడు. అసలు విషయం ఏమింటే మేన కోడళ్ళను గాని, మేనత్త మేనమామ బిడ్డలను గాని వివాహం చేసుకుంటే ఆ దంపతులకు జెనిటిక్ లోపాలున్న పిల్లలు పుడతారు. ఇది సైన్సు నిరూపించిన విషయం. ఇది అర్ధం చెసుకోండి. జరిగిందేదో జరిగింది. ఇకనుండి అతి దగ్గర బందువులతో వివాహాలు చేసుకోకూడదనీ, దానివలన అంగవికలురూ, మానసిక వికలాంగులూ, తొర్రి, మొగగ్రి పిల్లలూ పుడతారని ఇతరులకు తెలియ జెస్తే చాలు. ఏది ఏమైనా మీ పిల్లవాడికి ష్లాస్టిక్ సర్జరీ చేసి బాగు చేస్తాను” అంటూ ముగించాడు! సుబ్బారావుగారు. త 2కి
ఆక్ శే లా ఆడబిడ్డ పుట్టడానికి బాద్యత ఎవరిది?
"కుళ్ళి ఆడబిడ్డ ఫుట్సిందా?” పెదవి విరిచింది లక్ష్మి అత్తగారు సీతారావమ్మ.
“ఆడపిల్లల తండ్రి అనె బిరుదు ఇక నీకు ఇవ్వవచ్చన్న మాట” ఎగతాళి చేశాడు రామారావు, లక్ష్మి భర్త వెంకట్రావును.
“ఛీ! ఇదంతా దీనివల్లే జరిగింది. ఇక నేను (ఫెండ్స్ దగ్గర గర్వంగా తలెత్తుకొని తిరగగలనా?” ఛీదరించాడు. లక్ష్మిని వెంకట్రావు.
“ఇక దినికి మగపిల్లలు పుట్టరురా! ఇంకో పెళ్ళి చేసుకో. లక్షణంగా మగపిల్లవాడు పుడతాడు” రెచ్చగొతుతోంది సీతారావమ్మగారు కొడుకును.
(రుసూతి గది ముందు జరుగుతున్న సంభాషణనంతా శ్రద్ధగా వింటోంది లోనుండి డా॥శాంతి.
చివరగా సీతారావమ్మ గారన్న మాటలకు ఉలిక్కిపడి బయటకు వచ్చి “మీ అబ్బాయికి ఇంకో పెళ్ళి చేస్తే మగపిల్లవాడు పుడతాడనుకుంటున్నారా? అసలు ఆడపిల్ల పుట్టడానికి కారకుడు మగవాడో, ఆదదో మీకు తెలుసా సీతారావమ్మ గారూ?” కొంచెం గట్టిగా అదిగింది.
సీతారావమ్మగారు కొంచెం గొంతు తగ్గించి “అదేందండీ డాక్టరుగారూ! మా కోడలు లక్ష్మికి మగపిల్లలనుకనే లక్షణాలే లేవు. అందుకే ఆడపిల్లలు
పుడుతున్నారు” అంది. “అది మీ మూఢనమ్మకం. ఆడపిల్లను కనడంలో స్తీ
ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మగవాడి మీద ఆధారపడి ఉంటుంది” అంది దృధంగా శాంతి.
“నిజమేనా! అదెట్లా”
“చెబుతాను వినండి. మానవుల శరీరంలో క్రోమోజోములు జతలు తపప 2
జతలుగా ఉంటాయి. మగాడి వీర్యంలో )(/ అనే క్రోమోజోములు, స్రీ అండంలో )0(అనే క్రోమోజోములు ఉంటాయి. ప్రీ అండంలోని కు పురుషుని వీర్యంలో ౫ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది.
అట్లా కాకుండా స్రీ అండములోని % తో పురుషుని౪ కలిస్తే మగ పిల్లవాడు పుడతాడు. కాబట్టి ఎ ఆడదాని అండంలోనైనా ౫ లే ఉంటాయి. బిడ్డ ఆడా, మగా అని నిర్ణయించే అవకాశం స్త్రీ అండానికి లేదు. పురుషుని వీర్యంలోని (లేదా *కి మాత్రమే ఆ నిర్ణయాధికారం ఉంటుంది. ఎంతమంది భార్యలను మార్చినా క్రోమోజోము వాళ్ళ అండాల్లో ఉండదు కదా? అది అందించవలసింది మీ అబ్బాయే కదా? మరి అన్యాయంగా కోడలిని ఆడి పోసుకుంటారెందుకు?” అన్నారు డాక్టర్‌గారు.
“విషయం తెలియకనే నమ్మా. తప్పంతా మా అబ్బాయిదే అయినప్పుడు లక్ష్మీదేవిలాంటి కోడలిని చీదరించుకున్నాను” బాధపడుతూ అంది సీతారావమ్మ. “సారీ డాక్టరుగారూ! తెలియక నా భార్యను అవమానకరంగా మాట్లా దాను ఇక నుండి లక్ష్మిని, పిల్లలను బాగా చూసుకుంటాను. నా ఆడపిల్లలనే మగ పిల్లల్లాగా దర్జాగా పెంచుతాను” అంటూ పెద్ద పిల్లలు ఇద్దరిని తీసుకొని చిరునవ్వుతో ప్రసూతి గదిలోకి అడుగు పెట్టాడు వెంకట్రావు.
డా శాంతి ముఖంలో ఆనందం, తృప్తి వెల్లివిరిశాయి.
పటము 1 .. స || [హం అడపిల్ల మగపిల్లవాడు (క్రోమోజోములు)
లా 26 లత
జలుబుకు మందు వాడితే వారం రోజుల్లో తగ్గిపోతుంది. వాడకపోతే 7 రోజులు పడుకుంది. జటబుకు అన్నిన్ని టొబ్లెట్సీ పంటకు? 0 అ కాన్ని రోజుట నిమ్మా స ఆ్యాస్ట్వ్రన ది. ళ్ న్ |! . | జల జో కనా ఊునో
ఒకసారి జలుబు చేస్తే మందు కోసం నా మిత్రుడు డా॥ అంకయ్యగారి దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను పరీక్షించి కొన్ని మందులు వ్రాసి “కాంతారావు గారూ! ఇవి కేవలం జలుబు, దగ్గుల తీవ్రతను తగ్గించె తాత్భాలిక ఉపశమనం ఓళ్ళలు మాత్రమె. మీరోక 5,6 రోజుల జలుబు, దగ్గుతో బాధ పడవలసిందే” అన్నారు. అదేమిటండీ! మార్కెట్లో అనేక జలుబు నివారణా మందులూ, దగ్గు తగ్గించే సిరప్లు దొరుకుతుంటే మీరు జలుబు తగ్గించే మందులు ఇవ్వలేకపోవడమేమిటి?” అన్నాను ఆశ్చర్యంగా డాక్టరుగారితో.
“అవునండీ! ఇది పచ్చినిజం. జలుబుకు కారణమైన వెరస్‌ను చంపే మందు ఇంతవరకు కనిపెట్టబడలేదు. కేవలం తీవ్రతను తగ్గించే నివారణ మందులు తాత్మాలిక ఉపశమనం కల్పించే సిరప్లూ కనుగొన్నారు. వాటితోనే సంవత్సరానికి కొన్ని వందలకోట్ల వ్యావారం బహుళజాతి కంపెనీలు చేస్తు న్నాయి. పైగా బామ్ సీసాలపై “జలుబు పోగొట్టే మందు” అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. జలుబు వచ్చిన తర్వాత వారం రోజులు బాధపడవలసిందే” అన్నారు డాక్టరుగారు.
“అయితే జలుబుకు మందు వాడితే వారం రోజుల్లో తగ్గిపోతుంది. వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది. అంతేకదా?” అన్నాను నవ్వుతూ.
“అంతే! అంతే!” అన్నాడాయన కూడ నవ్వుతూ.
|
యాంటీ బయాటిక్ కోర్సు పూర్తిగా వాడకపోతే ప్రమాదం
ఒక రోజు పాల్వంచలో డా॥ రామమోహనరావు గారి ఆస్పత్రిలో ఆయన దగ్గర కూర్చోని ఉన్నాను. మా కొలీగ్ ఇంజనీరు రమణారావుగారు విరోచనాలంటూ వచ్చాడు. ఆయనను పరీక్షించి డాక్టరుగారు టాబ్లెట్స్ వ్రాసి రోజు ౩చొప్పున 10 టాబ్లెట్లు వాడమన్నారు. రమణారావుగారికి ఆ డాక్టరుగారి దగ్గర చనువుంది. ఆయన కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి “10 టాబ్లెట్లు ఎందుకు డాక్టరుగారూ! 2 వాడితే విరోచనాలు కట్టుకుంటాయిగా? అనవ సరంగా ఎక్కువ టాబ్లెట్లు వాడితే వెడి చెస్తుందిగదా?” అన్నారు. డాక్టరు గారు కొంచెం ఆశ్చర్యపోయి “రమణారావు గారూ! మీరు సమయానికి మంచి ప్రశ్న వెసి ఇబ్బంది రాకుండా చేసుకున్నారు. 10 టాబ్లెట్లు ఒక కోర్సు. అది పూర్తిగా వాడకపోతే జరిగే ప్రమాదం వినండి. మీకు విరోచనాలకు కారణమైన బాక్టీరియా మీ శరీరరంలో ప్రస్తుతం ఒక కోటి ఉన్నాయనుకోండి. మొదటి టాబ్లెట్‌కి అందులో 90 లక్షలు చచ్చిపోతాయి. మిగిలిన 10 లక్షలలో రెండవ టాబ్లెట్‌కి 9 లక్షలు తగ్గిపోతాయి. మీరన్నట్లు 2 టాబ్లెట్లుకే విరోచనాలు తగ్గుముఖం పడతాయి. కాని శరీరంలో విరోచనాకారకాలైన బాక్టీరియా ఇంకా ఎన్ని వున్నాయి? ఒక లక్ష మునుపటి కోటితో పోలిస్తే ఇవి చాలా తక్కువే. కాని వాటినలా శరీరంలో వదలివేస్తే అవి టాబ్లెట్ల నిరోధక శక్తిని పెంచుకుని సంతానం వృద్ధి చేసుకుంటాయి. అట్లాకాకుండా టాబ్లెట్లు కోర్సు పూర్తిగా వాడితే ౩వ టాబ్లెట్‌కి 90 వెలు, నాల్బవ టాబ్లెట్‌కి 9 వేలు, అలా 10వ టాబ్లెట్‌కి అన్నీ లం 2
చనిపోతాయి. బాక్టీరియా చనిపోవడం నేను చెప్పిన లెక్కలోనే ఉండదు. మీరు అద్ధం కావడానికి ఒక లెక్క చెప్పాను అంతే.
దేశంలో టి.బి కంట్రోలు కాకపోవడానికి అసలు కారంణం టి.బి రోగులు 9 నెలల కోర్సును పూర్తిగా వాడకపోవడమే. 2,8 నెలల్లో వ్యాధి తీవ్రత తగ్గగానే మీరన్నట్లు డోస్ ఎక్కువవుతుందనీ, వెడి చేస్తుందని రకరకాల కారణాలు. వాళ్ళే ఊహించుకొని గవర్నమెంటు మందులు ఉచితంగా సప్లై చెస్తున్నా కోర్సుపూర్తిగా వాడక తమకే కాదు, సమాజానికి కూడా హాని చేస్తున్నారు. ఇక వేడి అంటారా? విరోచనాల కారణంగా నీరసం వచ్చి కాళ్ళు గుంజుతున్నా.
' కళ్ళు మండుతున్నా దానికి వెడి అని పేరు పెట్టుకొని కంగారు పడుతున్నారు.
అంతే మీరు 10 టాబ్లెట్లు కోర్సు పూర్తిగా వాడండి. విరోచనాలు పూర్తిగా తగ్గివోతాయి” అని ఓపికగా వివరించారు.
రమణారావుగారు టాబ్లెట్లు సక్రకమంగా వాడతానని చెప్పి వెళ్ళి పోయాడు. ఆయన వెళ్ళిపోయాక నేను డాక్టరుగారితో “థ్యాంక్సండీ” అన్నా. “నాకెందుకండి థ్యాంక్సు. మీకేం ట్రీటుమెంటు ఇవ్వలేదుగా” అన్నారాయన. “ట్రిట్మెంటు కంటే విలువయిన సమాచారం చెప్పారు. అందుకు థాంక్స్” అన్నాను నవ్వుతూ. డాక్టరు గారు కూడా నా నవ్వుతో శృతి కలిపారు. అ పాం 2 యా
అవి కూల్ డ్రింకులు కాదు కాన్సర్ కారకాలు గీ నన్ను శ్రమించి తీరౌలి శొదంటే శ? మూత్శ్రీంక్ త్రానీ లత్కహత్య చిసుకుంటా. ... ((€ ఖీ // స వ్
“దప్పికవుతున్నది రా! వాటర్ వ్యాకెట్లు కొనుక్కొని తాగుదామురా!” అన్నాడు వెంకట్రావు మిత్రుడు కోటేశ్వరరావుతో.
“వాటర్ పాకెట్లెందుకురా? సరదాగా, మజాగా కోకో కోలా తాగుదాం నాకుబాగా వేడిచేసింది. కోకో కోలా తాగితే వేడి తగ్గుతుంది” అన్నాడు కోటేశ్వర రావ. “అమ్మో కోకో కోలాలో క్యాన్సర్‌ను కలిగించే విష రసాయనాలున్నాయి. అది వద్దూ” అన్నాడు వెంకట్రావు. నా పా
“అయితే థమ్స్‌ప్ తాగుదాం”
“థమ్స్‌ప్ కాదు, గోల్ట్స్పాట్, మిరిండా, పెప్సీ ఏ కూల్డ్రింకులోనైనా కాన్సర్ కారకాలు ఉన్నాయి. మనం తాగవద్ద.
“ఎవరు చెప్పారురా ఆమాట. డబ్బులు ఖర్చు అవుతాయని మీ నాన్న అని ఉంటాడు. అవునా?”
“కాదురా, అన్ని పేపర్లలోనూ యీ విషయం వార్తగా వచ్చింది”. ఢిల్లీలో “సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ అనె ఒక సైన్సు సంస్థ ఉంది. ఆ సంస్థ కూల్‌డ్రింక్స్ బాటిళ్ళను పరీక్షించి వాటిలో కాన్సర్‌ను కలిగించే విష రసాయనాలు ఉన్నాయని ప్రకటించింది. ఆ ప్రకటన ఒక సైన్సు సంస్థ చెసిన పరిశోధనా ఫలితం. ఎవరైనా ఒప్పుకొని తీరాలి. అయినా దానిని కోకో కోలా, పెప్సీ కంపెనీలు ఒప్పుకోలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పై విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేసింది. ఆ సంఘం విపులంగా పరిశోధించి, అందరి వాదనలు విని చివరకు సైన్సు సంస్థ “సిఎస్ఇ” చెప్పిందె కరెక్టు అని తేల్చింది. అయినా నిలాంటి వాళ్లు తెలియక కొంతమంది వేడి తగ్గిస్తుందనే మూధఢనమ్మకంతో ఇంకా కూల్ డ్రింకులు తాగుతూనే ఉన్నారు. డాక్టర్లు చెప్పేదేమటంటే “వేడి” అనే జబ్బు లేదని. అందుకని కాన్సరు అనే భయంకర వ్యాధిని తెచ్చే కూల్ డ్రింకులను మానేసి కాచి చల్లార్చిన మంచిసీళ్లు త్రాగుదాం.”
“సరే అలాగే. మంచినీళ్లే త్రాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పద” అంటూ కోటేశ్వరరావు అతన్ని అనుసరిస్తూ వెంకట్రావు బయట్చేరారు. కా తతత టే లలా
“దడ్భూలు లేక్రు” అశి గంతులేనిన బిల్లలు” థ్ న నం డల తి నన్నానీ జ ౮ లీ అంల నతు న గ్ల సే న ప్ర న్నాం అకితుం. ./!! 14 / లాగా వు రే డవ గ్
ఇది 1977నాటి మాట. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో “విశ్వశాంతి విద్యా కేంద్రం” నడుపుతూ 9, 10 తరగతుల పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేవాదిని. పాఠాలతోపాటు శాప్రీయ అవగాహనను పెంచే విషయాలు బోధిస్తుండే వాడిని. వాటిలో “దయ్యాలు లేవు” అనే విషయం ఒకటి. మనం అకస్మాత్తుగా తీవ్రమైన భయాందోళనలకు గురియైనపుడు, ఎదురుగా లేనివి కనబడినట్లూ ఎవరో మాట్లాడుతుంటే వినబడినట్లూ అనిపి స్తుంటాయి. వీటినే “114910౧5”, “061440౧9” అంటే తెలుగులో “భ్రమలు” మరియు “బ్రాంతులు” అంటారనీ, ఆదశలో మన అనుభూతులనే “దయ్యాలు” అనుకుంటామని నెను విద్యార్థులకు వివరించాను. దయ్యాలు లేవనే విషయం డా॥కోవూరులాంటి వారు సోదహరణంగా వివరించా రని తెలియజేశాను.
గోవిందరాజులు అనే విద్యార్ధి లేచి “మాస్టారూ! రావినూతల కుర్రవాని పాలెంలో గ్రామాల మధ్యలో ఒక పెద్ద చెట్టువుంది. దాని మీద దయ్యాలు వున్నాయి. ఆ దయ్యాలు అత్తలమీద, మొగుళ్ల మీద కోపాలొచ్చి చావదల్సుకున్న ఆడవాళ్లు ఆ బావిలో పడి చచ్చిపోయో వాళ్లు. వాళ్లే దయ్యాలుగా మారి ఆ చెట్టు మీదికి చేరేవాళ్లు. వాటిని చాలామంది చూశారు. మేంకూడా సినిమా చూసి కుర్రవాని పాలెం వెళ్తుంటే మాకు కూడ కనిపించాయి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని పెద్దగా అరుస్తూ పోతుంటే అవి మాయమైపోయాయి. అవి దయ్యాలు కావంటారా!” అని అర్హిగాడు.
- గోవిందరాజులు! మంచి ప్రశ్న వేశావయ్యా? అవి దయ్యాలు కావు. రాత్రిపూట ఆ ప్రాంతానికి వెళ్లినపుడు, మీరెంత ధైర్యవంతులైనా దయ్యాలున్నా యనీ, అవి పీడిస్తాయనీ నమ్ముతున్న వాళ్లు కాబట్టి, ఆ సమయంలో మీ మనస్సు అనుకోకుండా తీవ్రమైన భయాందోళనలకు లోనవుతుంది. అపుడు మానసిక జబ్బులైన “భమలు “భ్రాంతులు” మిమ్ములను తాత్కాలికంగా ఆవహి స్తాయి. వీటి కారణంగా మీకు ఏవో ఆకారాలు కనిపిస్తాయి. ఏవేవో మాటలు వినిపి స్తాయి. ఎవరోమీదికి ఎక్కి తొక్కుతున్నట్లు అనిపిస్తాయి. వాటికే మీరు దయ్యాలు అని పేరు పెట్టుకున్నారు. ఆంజనేయ నామస్మరణ చేయగానే మీకు ధైర్యం వస్తున్నది. భయాందోళనలు తగ్గుముఖం పట్టీ (భ్రమలు, (బాంతులు తొలగిపోతాయి. అంటే దయ్యాలు పారిపోయాయన్నమాట” అని నవ్వాను.
“అక్కడ దయ్యాలు లేవని మీరు నిరూపించగలరా?” వెంకట్రావు లేచి అడిగాడు.
“నిరూపిస్తాను. మామూలు రోజుల్లో కాదు. అమావాస్య రోజున. సరినా?” అన్నాను. “ఎలా?” అన్నాడు వీరయ్య,
ఉ్రాబోయే అమావాస్య రోజున నేను ఒక టార్చిలైటు మాత్రం తీసుకొని ఆ చెట్టు క్రింద, దాని దగ్గరలోని బావి గట్టుమీద అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక పావుగంట కూర్చోని వస్తాను. నాకేమి కాకపోతే దయ్యాలు లేవని నమ్ముతారా?” అని అడిగాను.
“మీరు ఆ చెట్టు, బావి దగ్గరకు వెళ్లినట్లు మాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు రామాంజనేయులు.
“ఒక పని చేస్తాను. చెట్టుక్రిందికి చేరగానే ఒకసారి, బావి దగ్గరకు చేరగానే ఒకసారి టార్చిలైటు ఫోకసు మీవైపు వేస్తాను. అక్కడ పావుగంట కూర్చున్నాక ఆ బావి చుట్టూ ఉన్న మొక్కలపూలు కొన్ని కోసుకొని వసాను. ఆ పూలమొక్కలు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేవని మీకు తెలుసుగదా?” అని అడిగాను.
“అవును మీరు చేస్తానన్న పని బాగుంది” అన్నాడు. శ్రీను,
అమావాస్య వచ్చింది. “విశ్వశాంతి విద్యా కేంద్రంలో చదువుతున్న పిల్లలు రాత్రి విద్వా కేంద్రంలోనే పడుకుంటారు. వారిలో ఒక పదిమంది పిల్లతో కలిసి రాత్రి 11-30కి బయలుదేరాను. పిల్లలు ఒక అర కిలోమీటరు ల చ లా
దూరంలో ఆగారు. నేను టార్చిలైటు పిల్లల వైపు ఫోకసుచేసి ఆర్పి పదినిముమాలు కూర్చున్నాను. తర్వాత మరల లేచి బయలు దేరి చేలలో బావి దగ్గరకు వెళ్లి మరల పిల్లలకు ఫోకసు చేశాను. అక్కడ కూడా, బావి గట్టుమీద 10 నిమిషాలు కూర్చోని లేచి టార్చిలైటు వెలగులో కొన్ని పూలు కోసుకొని తిరిగి పిల్లల దగ్గరకు చేరి వారికి ఆ పూలు చూపించాను.
“ఇపుడు దయ్యాలు లేవని నమ్ముతారా?”
“నమ్ముతాం” అన్నారు పిల్లలందరూ,
“నిజంగా నమ్మితే, మీలో ఒకరు టార్చిలైటు తీసుకోని వాటి దగ్గరకు పోయి కూర్వొని రావాలి” అన్నాను.
“నేను రెడీ మాస్టారూ!” అన్నాడు వెంకట్రావు.
“సరె పోయిరా! అని చెప్పి టార్చిలైటు ఇచ్చాను. వెంకట్రావు వెళ్లి నేను చేసినట్లే చేసి పూలతో తిరిగి వచ్చాడు. ఇంకెవరైనా వెళ్లగలరా? అని అడిగాను. రామాంజనేయులు ముందుకు వచ్చాడు.
తర్వాత వీరయ్య, శ్రీను ఇలా 5,6 గురు వెళ్లి తిరిగి వచ్చారు. ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి ౩ గం! అయ్యింది. అందరం తిరిగి వచ్చి పడుకున్నాము. తెల్లవారు రూమున “విద్యా కేంద్రంలోని పిల్లలందరికీ యీ విషయం తెలసి వాళ్లుకూడా దయ్యాలు లేవని నమ్ముతాము” అన్నారు. కొసమెరుపు: -
మరునాడు ఉదయం 9 గం1॥లకు కు(రవానివాలెం నుండి రావినూతల హైస్కూలుకు వచ్చే 6,7 తరగతుల పిల్లలు ఐదారుగురు రోజూ మాదిరిగానే ఆ బావి దగ్గరకు వచ్చి, పూలుకోసి గట్టు మీద పెట్టి చేతులు జోడించి “అమ్మలూ! దయ్యాలు” మీకు దణ్ణం పెడుతున్నాము. మమ్మల్నేం చేయకండి అని ప్రొర్ధిస్తున్నారు. ఆదోవన స్కూలుకు పోతున్న “విద్యాకేంద్రం” పిల్లలు బావి దగ్గరకు వెళ్లి “ఒరేయ! ఇక్కడ దయ్యాలు లేవురా! అసలు దయ్యాలే లేవని మా మాస్టారు నిరూపించారు. అన్నారు. ఎలా? అని అడిగారు వాళ్లు. రాత్రి జరిగిన సంఘటనను వాళ్లు చిన్నపిల్లలకు వివరాంచారు. అంతే ఆ పిల్లలు గట్టుమీదున్న పూలను క్రిందికి తోసి కాళ్లతో తొక్కుతూ దయ్యాలు లేవు, దయ్యాలు లేవు” అని అరుస్తూ గంతులేయసాగారు.
ల పథ
వాము పగ - మంత్రం వాస్తవమేనా? రో నయము. ల
“బంము పగపడుతుందా మాన్తారు! అడిగాడు రఘు
“ఖచ్చితంగా పగబట్టదు” ధృడంగా అన్నారు విశ్వం మాన్యారు.
“తాచువాము కూడానా” అడిగాడు వెంకట్రావు
“అసలు తాచుపామే పగబట్టెది. మిగతా పాములు పగపట్టవు కదా మాస్టారూ! అడిగాడు ఆంజనేయులు.
“తాచుపాము కూడా పగబట్టదు. మాప్పారి సమాధానం
“ఎందుకని మాస్టారూ! తాచువాము పగబట్టదని ఎలా చెప్పదలరు. ? దానికేమైనా శాప్రీయ ఆధారాలున్నాయా? వివరంగా అడిగింది శాంతి.
“చెబుతానమ్మా! శాస్ర్తీయ ఆధారాలతో చెబుతాను. నువ్వు 7,8 నెలల పసిపిల్లవాడిని కొట్టావనుకో వాడు పగబట్టి మళ్ళీ నిన్ను తర్వాత కొడతాడా?” కొట్టడు. ఒకసారి పెద్దగా ఎద్బి ఊరుకుంటాడు. ఎందుకని?
“ఎందుకనంటే... ఎందుకనంటే...” నసగసాగింది శాంతి.
“నేను చెబుతాను. పసిపిల్లవాడితో చాల చిన్న సైజులో మెదడు వుంటుంది. కాబట్టి ఆ మెదడు దేన్నీ జ్ఞాపకం పెట్టుకోలేదు. జ్ఞాపకమే లేనప్పుడు
పగపట్టె పరిస్థితి ఎముంటుంది? అలాగే తాచుపాము మెదడు కూడ పసిపిల్లవాడి
మెదడుకంటే చిన్నది. అది ఏ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోలేదు. అందువలన పగ అనే ప్రశ్నేరాదు.
“అలాగైతే మా చిన్నతాత పొలంలో ఒక పామును కొడితే అది రాత్రి ఇంటికి వచ్చి మా తాత దొడ్షో ఉండగా కాటువేసింది. ఇది ఎలా జరిగింది. అదిగాడు బాలయ్య, 5
“పాములను గూర్చి ఒక ముఖ్య విషయం చెబుతాను వినండి. మన ఊళ్లలో వీధికి కొన్ని కుక్కలుంటాయి. అవి వీధి చివర వరకే అరుస్తు వెంట పడతాయి. పాములుకూడా అంతే పొలంలో పాములు పొలాల్లోనే తిరుగు తాయి. పొలంలో మీ తాత ఒక పామును కొడితే అది ప్రక్కకు తప్పుకొని ఏ గడ్డిలోనో దాక్కుంటుంది. కాసేపటికి ఎలుకల వేటకు బయలుదేరుతుంది. సామాన్యంగా పొలంలో ఒక పామును చూసి 2,3 రోజులలో ఏదైన పాము ఇంటిలో కనిపిస్తే అది పొలంలో పామేనని, పగబట్టి వచ్చిందని అనుకుంటారు. అది కాటేస్తే పగతో కాటు వేసిందనుకుంటారు. ఒకసారి చూసిన గేదెను మనం సాయంత్రానికి గుర్తుపట్టం. అలాంటిది కంగారులో ఉదయం చూసిన పాము, రాత్రి చూసిన పాము ఒకటేనని ఎలా గుర్తు పట్టగలం? అసలు రాత్రిపూట పామును స్పష్టంగా చూడలేము గదా? ఉదయం కొట్టిన పాము, రాత్రి వచ్చిన వొము రెండూ ఖచ్చితంగా వేర్వేరు పాములే.
అంతేకాదు మీకు ఇంకో శాప్రీయ ఆధారం చెబుతాను. నేను మద్రాసులో స్నేక్ పార్కుకు వెళ్ళాను. అక్కడ చాలా పాములు ఒక పెద్దకుండ లాంటి దానిలో వదిలారు. అది పైకి రాకుండా కుండ పైభాగం లాగా కట్టారు. పాములు దానిలో నుండి బైటికి రాలేవు. అక్కడ కాపలా ఉన్న వ్యక్తిని “బాబు ఇందులో తాచుపాములున్నాయి గదా? అవి పగబడతాయా?” అని అడిగాను. “అబ్బ పగబట్టవండీ” అన్నాడు “ఎలా చెప్పగలవు?” అని అడిగాను. “ఎవరైనా తుంటరి కుర్రవాళ్ళు మేము పరాకుగా ఉన్న సమయంలో వాటిని రాళ్ళతో కొడతారు. అవి ఒక్కసారి బుస్‌మంటూ అటూ ఇటూ చూసి మరల మామూలుగా వెళ్ళి పోతాయి. వాటిముందు పడవేసిన ఎలుకలు, కప్పలు, గుడ్లను తినడంలో మునిగి పోతాయి” అన్నాడు. పాముకు పగ లేవనెందుకు ఇంతకంటే సాక్ష్యం కావాలా?” అని అడిగారు మాస్టారు.
“ఎవరైనా కొడితే పాములు పగబడతాయనీ, ఆ పగ తీరేవరకు ఆహారం ముట్టవనీ విన్నాం మాస్టారూ. అది అంతా అబద్దమని ఇప్పుడర్ధ్భమైపోయింది” ఖాసిం అన్నాడు.
“మరి పాము మంత్రం వేస్తే పాము విషం విరిగిపోయి, పాము కరచిన వ్యక్తి ఆరోగ్యవంతుడౌతాడని అంటారు గదా? ఇది నిజమేనా మాస్టారూ?” అదిగాడు కిరణ్. “ఇది కూడా అబద్దమె, పాము నిజంగా విషపూరితమైనదైతే
ఆ విషం ఏ మంత్రానికి విరగదు” “అదెట్లా మాస్తారూ! పాముల నర్సయ్యగారు మంత్రం పెడితే పాము విషం నిర్విర్యమై అనేక మంది బతికారని మా తాతయ్య చెప్పారు. మరి మంత్రాలు అబద్దాలెట్లా అవుతాయి?” ప్రశ్నించాడు వెంకట్రావు.
“అసలు విషయం చెబుతాను వినండి. మన దేశంలో 100 రకాల పాములున్నాయి. వాటిలో 96 రకాల పాములకు విషముండదు. మిగిలిన 4 రకాల పాములకు అంటే త్రాచుపాము, కట్లపాము, రక్తపింజరి, సముద్రపు పాముల్లో ఒకరకం పాముల్లో మాత్రమే విషముంటుంది. అంటే భూమి మీద తిరిగే పాముల్లో 8 రకాల పాముల్లోనే విషముంటుంది. మన ఇళ్ళ చుట్టూ తిరిగే ఆరడగుల జెర్రిగొడ్దు కూడ విషరహితం. అది ఎలుకలను తింటుంది. అందువలన అది పొలాల్లో రైతులకు మిత్రుడన్నమాట. కాని దానికీ, త్రాచుపాముకీ పోలికలున్నందు వలన, వాటికి విషముండదని తెలియకపోవడం వలన జిర్రిగొడ్లను కూడా చంపుతున్నాము.
మనల్ని చూస్తే ఏ పామయినా వీలయినంత వరకూ తప్పుకొని పారి పోవాలని చూస్తుంది. పొరపాటున దాన్ని తొక్కితే మాత్రం మనల్ని కాటువెస్తుంది. అది విషరహితమైనదైతే ఏ మంత్రం, చికిత్స లేకుండానే నీలోని విషాన్ని నిర్విషం చేశానని” ఎవరైనా దృఢంగా చెబితే అతనిలోని భయంపోయి అతను తిరిగి. మామూలు మనిషిగా మారుతాడు. దీన్నే ఇంగ్రీషులో “ఫెయిత్ హీలింగ్” అంటాము. అంటే “నమ్మకం చికిత్స” అన్నమాట. తనలో మంత్రముందనీ, ఆ మంత్రంతో విషాన్ని నిర్వీర్యం చేశాననీ మంత్రగాడు నమ్మకం కలిగిస్తాడు. దానితో ఆ వ్యక్తి మామూలు మనిషవుతాడు.
అయితే ముఖ్యమైన విషయమేమిటంటే నిజంగా విషమున్న 8 రకాల పాములు కరిస్తే ఏ మంత్రం పనిచేయదు. దానకి “యాంటీ వీనమ్” ఇంజక్షన్ ఇప్పించవలసిందే. లేకపోతే వ్యక్తి చనిపోతాడు. అందుకే తాచుపాము లాంటివి కాటు వేసినపుడు మంత్రం వేసినా వ్యక్తులు చనిపోతే మంత్రం పని చేయలేదను కొరు. “అప్పటికే విషం బాగా తలకెక్కిందనీ, లేటుగా తీసుకువచ్చారనీ లేకపోతే బ్రతికేవాడొనీ సరిపెట్టుకుంటారు.
చివరగా పాముల నర్సయ్యగారి మంత్రాల శక్తి మీద డా॥ మిత్రాగారి పరిశోధన ఫలితాలు మీకు చెబుతాను. లం తతత
డా! మిత్రగారని ఒకాయన పాముల నరసయ్యతో వాదానికి దిగారు. తాను 20కుక్కలను, 20 త్రాచుపాములను తెప్పిస్తాననీ, కుక్కలన్నిటినీ పాములచే కరిపిస్తాననీ వాటిలో 10కుక్కలకు పాముల నర్సయ్య మంత్రం వేసి బ్రతికించా లనీ, మిగిలిన కుక్కలను కట్టివేసి ఉంచుతామనీ అవి ఏమవుతాయో గమనిద్దాం వీషరపాొతీ మైబున జెర్రీగార్డ్యవి [ ళ్లు / జో వ ౧1|| చావటం ఏమిటి? విష్ణూశం.. న 0: న ాంాకాఆటచమబచ ని అన్నాడు. నర్సయ్య సరేనన్నాడు. న పందెం రోజున ముందుగా అనుకున్న ప్రకారం 10 కుక్కలను ఒక వరుసలో మరో 10 కుక్కలను ఇంకో వరుసలో కట్టారు. అన్ని కుక్కలను పాముల చెత కరిపించారు. ఒక వరుసలో ఉన్న 10 కుక్కలకు పాముల నర్సయ్య మంత్రం వెసాడు. గంట గడిచింది. మంత్రం వేసిన కుక్కలు రెందు, మంత్రం వేయని కుక్కలు రెండు చనిపోయాయి. మరో మూడు గంటలు గడిచాయి. మంత్రం వేసినవి మరో రెండు వేయనివి మరో రెండూ చని పోయాయి. అంటే మంత్రం వేసిన కుక్కలు 6, మంత్రమేయని కుక్కలు 5 చనిపోయాయి. ఇప్పుడేమంటారని డా॥ మిత్రా నర్సయ్యని అడిగాడు. నర్సయ్య ఏ మాత్రం మాట్లడలేక పోయాడు. అప్పుడు డా॥ మిత్రా ఇలా వివరించారు. “కుక్కలు మంత్రం వేసినా, వేయకపోయినా విషానికి చనిపోతాయి. కాబట్టి చనిపోయాయి. మంత్రం అంతా మన మూధనమ్మకమె. కాకపోతే 9 కుక్కలకు శరీరంలో యాంటివీనమ్ తయారై వాటిల్లో విషనిరోధక శక్తి పెరిగి అవి బ్రతికాయి అంతే నర్సయ్య పై విషయాన్ని ఒప్పుకోక తప్పలేదు. కాబట్టీ పాము మంత్రంతో విషం విరుగుడౌతుందనేది వట్ట మూఢ నమ్మకం మాత్రమే. దానిని నమ్మకండి అంటూ ముగించారు మాస్టారు. లత పట్ర
ఎవరి ముఖం చూసానో నృేఎవల మనిరి ల (ువరముషం బూ ర్స యానా” వళి 7. తా! [3 క! నమా కమా విశ్వం మాస్టారు నిద్ర లేచేటప్పటికి ప్రక్కవాటా నుండి పెద్దపెద్దగా కేకలు వినిపిస్తున్నాయి. “దరిద్రపు మొఖందానా! ప్రొద్దున్నే లేవగానే నీవెదురైనా వేమే? ఇవాళ బ్యాంకులో లోన్ దొరికినట్లే! నిన్నగూడ నిద్రలేవగానే నీవే ఎదురై నావు. బ్యాంకులో వాళ్ళు రేపు రమ్మన్నారు. నా సంపాదనంతా నీ మూలాన బ్యాంకు చుట్టూ తిరగడానికే సరిపోతుంది.” అని ప్రక్కింటి వావారావు అరుస్తున్నాడు. ఎవరిమీద ఈ అరుపులు? సాక్షాత్తు కన్నతల్లి మీద. పాపారావు తండ్రి చనిపోయాడు. ఆమె విధవరాలు. అందువలన పొద్దున్న లేవగానే ఆమె ముఖం అంటే సాక్షాత్తు కన్నతల్లి ముఖం చూడగూడదనీ, చూస్తే ఆ రోజున పనులు కావనీ అతని నమ్మకం. అతను తన తల్లిని అలా తిట్టడం మాస్తారుకి చాలా బాధ కలిగించింది. కాని అప్పటికి ఊరుకున్నాడు. వొపారావు ఒక గంట తరువాత మాస్తారి ఇంటికి వచ్చాడు. చిన్నగా నసుగుతూ న ధి
“మాస్తారూ! ఒక యాభై రూపాయలు అప్పుంటే ఇవ్వండి. ఒంగోలు పోయి రావాలి. ఈ రోజన్నా బ్యాంకులో లోను దొరుకుతుందేమో! అన్నాడు. మాస్టారు నవ్వుతూ “కూర్చో పాపారావు ఒంగోలు బస్సుకింకా చాలా టైముందిలే. నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు. వాొవారావు కూర్చున్నాడు.
“ప్రొద్దున ఎవరినో పెద్దగా విసుక్కుంటున్నావు? అమ్మనేనా? ఎందు కయ్యా అలా విసుక్కుంటావు?” అని ప్రశ్నించారు మాస్టారు. ఐం చేయమంటారు ఎంత చెప్పినా వినదు. పిల్లల పక్కలు సర్దుతూనో, ఇంట్లో పనిచేసుకుంటూనో అక్కడే తిరుగుతుంటుంది. పొద్దున్నే లేవగానే మొఖం చూపిస్తుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా పని కావదడం లేదు. కావాలంటే చూడండి. నిన్న బ్యాంకు లోను పని సున్నా అయ్యింది. అన్నాడు పాపారావు.
“పాపారావు విధవరాలి మొహం ప్రొద్దున్నే చూస్తే ఆరోజు పని కాదా?”
“అదేంటి మాస్టారూ! అన్నీ తెలిసినవారు మీరే అట్లడిగితే ఎట్లా?”
“నీవు చెప్పిందే నిజమైతే, నిన్న లోనుకోసం నీతో ఒంగోలు వచ్చిన రామయ్య, సుబ్బారావులకు కూడ లోను ఎందుకు శాంక్షను కాలేదు. వాళ్ళు ప్రొద్దున లేవగానే వాళ్ళ భార్యల ముఖాలో, పిల్లల ముఖాలో చూసెివుంటారు కదా?”
“నిన్ననే జిన్నింగ్ మిల్లు జంగయ్యగార్మి 5 లక్షలు రూలు లోను శాంక్షన్ అయింది తెలుసుకదా?”
“అవునండి”
“మరి రైతులు మీకు లోను ఎందుకు శాంక్షన్ కాలేదు? పారిశ్రామికవెత్త జంగయ్యగారికి ఎందుకయ్యింది? ఎప్పుడైనా ఆలోచించావా?”
“అదికాదండి.... ఈ రోజు రమ్మన్నారండి...” నసిగాడు వొవారావు.
“నెల రోజుల నుండి తిరుగుతున్న సుబ్బారావు, రామయ్యలకు శాంక్షన్ నవ టట తతా
కాని లోను రెండు రోజుల్లో నీకవుతుందనుకుంటున్నావా?”
“అసలు విషయం చెబుతాను విను. బ్యాంకు మేనేజరు లంచగొండి. మిరు లంచం ఇవ్వలేరు. జంగయ్య గారు లంచం ఇవ్వగలరు. ఇచ్చాడు. వెంటనే లోన్ శాంక్షన్ అయ్యిపోయింది. ఇక్కడ ఇచ్చే లంచానికీ, లోనుకు సంబంధం ఉందిగాని నీతల్లి ముఖానికీ, బ్యాంకులోను ఇవ్వకపోవడానికి సంబంధంలేదు. అర్ధం చేసుకో”
“మరి పెద్దవాళ్ళు నిద్రలేవగానే విధవరాలి ముఖం చూడొద్దంటారు గదా?”
“వాళ్ళు నీలాగా అమాయకంగా నమ్మి తర్వాత తరాలకు అందిస్తున్న వారే. అయితే జంగయ్యకూ, జంగయ్య మిత్రుడు రాఘవయ్య సిద్ధాంతికి విధవరాలి ముఖం చూడ్డానికీ పనికాకపోవడానికీ సంబంధం లేదని మీ తోటి వాళ్ల కష్టాలకు, నజ్బాలకు కారణం తాము చేసే మోసం, దోపిడీలేనని వాళ్లకు తెలుసు. అది మీరు తెలుసుకోకూడదు. అందువలన మీ కజ్టాలకు కారణం ఎవరి ముఖమో, ముక్కో కారణమంటారు. ఇంట్లో తిరుగుతున్న వాళ్ళ ముఖం చూడకుండా ఉండలేరుగదా?చూసారు సహాజంగానే కష్టాలతో ప్రతిరోజు గడుస్తుంటుంది. దానికి కారణం కన్నతల్లిని కూడా మీరు అనుమానించేట్లు చేయడమే వాళ్ళ గొప్పదనం. అర్ధమైందా?” అన్నాడు మాస్టారు.
“అర్ధమైంది మాస్టారు. మరి లోను కావాలంటే మెమిప్పుడేం చేయాలి”?
“మీరందూ కలసి పై ఆఫీసర్లకు కంప్లయింట్ చేస్తామని హెచ్చరించంది. పత్రికలకు విషయం చెబుతామని బెదిరించండి. దిగివచ్చి లోను ఇస్తారు.”
“మంచిదిమాస్తారూ! అలాగే చేసాను” పట్టుదలతో కదిలాడు పాపారావు. లా
|
ఏ శకునం మంచిది? క్యు తమరవపేత్తు నం మంజజ/ మ అ సు గ!
“పిల్లలూ! శకునాల గురించి మీరెప్పుడైనా విన్నారా?”
“విశ్వశాంతి విద్వాకేంద్రం”లోని విద్యార్థలనుద్దెశించి నేను అడిగాను.
“విన్నాం మాస్టారూ!” పిల్లలందరూ పెద్దగా కేకలు వేశారు.
ఇప్పుడు శకునాల గురించి నేను ఒక ప్రశ్న వెస్తాను.
“సరే” నన్నారు పిల్లలు.
“నేను పనిమీద బజారుకు బయలుదేరాను. ఒక కుక్క నాకెదురైంది. అది కుడినుండి ఎడమకు పోతే మంచిదా? ఎడమనుండి కుడికిపోతే మంచిదా?”
“కొందరు పిల్లలు కుడినుండి ఎడమకు పోతే మంచిదన్నారు. మరి కొందరు ఎడమ నుండి కుడికి పోతే మంచిదన్నారు. ఎందుకని అని అడిగితే కారణం చెప్పలేకపోయారు. ఆ రెండూ సరైన సమాధానాలు కావు” అన్నాన్నెను.
“మరి సరైన సమాధానమేది?” అడిగాడు రాము.
“కుక్క ఎటునుంచి ఎటువైపు వెళ్ళినా కరవకుండా వెళ్తే మంచిది” నవ్వుతూ అన్నాను.
పిల్లలందరూ పక్కున నవ్వారు. నేను ఇలా కొనసాగించాను.
“మనం ప్రయాణానికి గానీ, పనిమీద గాని బయలుదేరినపుడు పిల్లి, విధవరాలు గానీ, కట్టెల మోపుగానీ ఎదురురాకూడదనీ, ఎవరూ తుమ్మకూడదనీ లా 2
అలా జరిగితే పనికాదనీ అంటారు. మన ఇంటి ముందు తిరిగే పిల్లికీ, దొవనపోయే విధవరాలికీ, కట్టెలమోపు వాడికీ మనం వెళ్ళబోయే పనిని చెడగొట్టటోయేంత శక్తి ఉందా? భర్త చనిపోగానే ఆమెకి ఆ శక్తి వస్తుందా? ఎలా వస్తుంది. ? ఎందుకని వస్తుంది.? ఇక తుమ్ములంటారా? మన ముక్కులోకి దుమ్ము కణాలు ఎక్కువగా పోయినా, జలుబు చేసినా తుమ్ములు వస్తాయి. అది మానవ సహజం. ఆ దుమ్ము కణాలకు మన పనిని చెడగొట్టె శక్తి ఎక్కడనుండి వచ్చింది.? ఆలోచించండి? ఇవన్నీ మూఢనమ్మకాలు.
మనం ఒక పని మీద వెళితే, పని జరగడానికి గానీ, జరగకపోవదానికి కానీ “భౌతికమైన సహజమైన కారణాలు అనేకం ఉంటాయి. ఆ కారణాల మీద కార్యం జరగడం, జరగకపోవడం ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీరు పరీక్ష వ్రాసినపుడు, బయలుదేరినప్పటికి శకునం మీద ఫలితం ఆధారపడి ఉండదు. మా మాస్దారుగారి ఉదాహరణ చెబుతాను.
ఆయనకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. మేము పరీక్షలకు బయలు దేరితే కాకి కుడివైపు నుండి ఎడమవైపుకు పోతే మంచిదనీ, ఎడమవైపు నుండి కుడివైపుకు పోతే చెడు జరుగుతుందనీ ఆయన నమ్మకం. పరీక్ష రోజున మమ్మల్నందరిని ప్రొద్దున్న వాళ్ళంటికి రమ్మనెవాడు. వాళ్ళింటిలో వాకిలికి రెండు ప్రక్కల రెందు పెద్ద చెట్లుండేవి. పరీక్షకు మేము బయలు దేరబోయి ముందు ఆయన ఎడమ చెట్టు మీద కాకుల్ని రాళ్లు విసిరి తరిమి కొట్టించెవాడు. అప్పుడొక విద్యార్ధిని కుడివైపు చెట్టుమీదకి రాళ్ళు విసరమనేవాడు. కాకులన్నీ పెకి లేచేవి. అందులో కొన్ని అటునుండి ఎడమవైపుకు ఎగురుకుంటూ పోయేవి. మేమందరం పోలోమంటూ బయటకి వెళ్ళేవాళ్ళం. పరిక్షలు అయిపోయి ఫలితాలు వచ్చెవి. అవి మామూలే. బాగా చదివి వ్రాసిన వాళ్ళు పాసయ్యువాళ్ళం బాగా చదవని వాళ్ళు తప్పేవాళ్ళు. విచిత్రమేమిటంటే మా మాస్టారి చర్యల వలన మాకు శకునాల మీద నమ్మకం పోయింది. ఇంకో విషయం రేపు హాఫియర్లీలో పరీక్షలకు బయలు దేరబోయే ముందు మీలో మంచి మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులు చెడు శకునం అని పెద్దలు చెప్తున్నవి, చూసుకొని బయలుదేరండి. అయినా మీరందరూ మంచి మార్కులతోనే పాసవుతారు. ఈ ప్రయోగానికి మీరు సిద్ధమెనా?
“సిద్దమే” అన్నారు చాలా మంది పిల్లలు. అనుక్నుట్లుగానే విద్యార్థులలో తమ చదువు మీద నమ్మకం ఉన్న విద్యార్థులందరూ పిల్లి, ఒంట బ్రాహ్మణుడో, కట్టెలమోపో ఎదురువచ్చింతవరకూ ల్తిగి వెంటనే బయలుదేరారు. కొందరు
ఎదైనా తుమ్ము వినగానే బయలుదేరారు. పెద్దవాళ్లు ఈ చర్య కొంత అయిష్టం గానూ, కొంత హాఫియర్లీ పరీక్షలు అయినందునా అంగీకరించారు. ఫలితాలు వచ్చాయి. బాగా చదివిన విద్యార్థులందరికీ మంచి మార్కులు వచ్చాయి. దీనితో విద్యార్థులలో పూర్తిగానూ, వారి తల్లిదండ్రులలో కొంతమేరకూ శకునాల మీద నమ్మకం సడలివోయింది. తర్వాత కొంత కాలానికి మరో సంఘటన జరిగింది. “విశ్వశాంతి విద్యా కేంద్రం” విద్యార్ధి హరిబాబు ఒక రోజు సాయంత్రం స్కూలు నుండి దీనికి కూడు శళుసేం ఏమిటండీ ఇంటికి వచాడు. గాబు రాసు రాను మీళు రాస ఎమేాపే సం నిండా నీళ్లా వోని న టాం ఆయా డా(ాోళా తర్వాతనే అతడు సాయం 1555 అ కా స. త్రం ట్యూషన్‌కు వచ్చె ల్ ల [జ్ర వాడు. ఆరోజు కూడా టో ధ్ నో ష్ట తీసుకొని బావి దగ్గరకు || | బయలుదేరాడు. ఎవరో అవా తువ్మారు. వాళ్ళమ్మ అతనిని ఆపి “తుమ్ముతుమ్మారు, బయలు దేరకు” అంది అతను వినిపించు కోకుండా కావడి తీసుకొని ముందుకు సాగాడు. 2,8 కావళ్ళు తెచ్చిన తర్వాత బావినుండి వస్తుండగా కాలుజారి పడ్డాడు. కాలు విరిగింది. ఒంగోలు ఆస్పత్రిలో చేర్చి కాలుకు కట్టు కట్టించారు. మరునాడు ఉదయం వాళ్ళమ్మ బాధపడుతూ “ఒరేయ్ తుమ్ముతుండగా బయలుదేరవద్ద్గంటే బయలుదేరావు. చూడు ఏమైందో?” అన్నది. దానికి హరిబాబు “అమ్మా! నేనంటే తుమ్ముతుంటే బయలు దేరాను కాబట్టి కాలు జారిందంటున్నావు. ఈ ఆస్సత్రిలో, ఈ వార్డులో బెడ్దమీద ఇప్పుడు ఇరవైమంది ఉన్నారు. పీళ్ళందరూ తుమ్ములూ, దగ్గులూ, మంచి రోజులూ, వర్వాలు, శకునాలు అన్నీ చూసుకొనే పనులకు బయలుదేరి ఉ ౦టారు కదా? వాళ్లెందుకు ఇక్కడున్నారు అన్నాడు. వాళ్ళమ్మ ఏమీ మాట్లాడలేదు. “నాకు ప్రమాదం జరిగింది తుమ్మువల్లకాదు. బావి దగ్గర నీరు నిలువ ఉండి కాలు జారుతున్నది. తొందరగా వద్దామని గబగబా అడుగులేసి జారి పడ్డాను. అదీ అసలు కారణం. అర్ధంచెసుకో” అన్నాడు. వాళ్ళమ్మ ఇంకేమి మాట్లాడలేక పోయింది. త దడే
అన్నీ మంచి రోజులే రాహుకాలం అంటా, ఇస్వుడు రొసంటున్నాడు... నా లు కకక ? క 44 కాగ ఆ ఆ ల ల్ల
నేను రావినూతలలో “విశ్వశాంతి విద్యాకేంద్రం” నెలకొల్పి 9,10 తరగతుల పిల్లలకు ట్యూషన్లు చెప్పే రోజుల్లో 10వ తరగతి పిల్లలకు పబ్లిక్ పరీక్ష సెంటరు రావినూతలలో ఉండేది కాదు. 20కి.మీ దూరంలోని మద్ది పాడులో ఉండేది. 19777 మార్చిలో జరిగిన పబ్లిక్ పరిక్షలకు నా విద్యార్థులను మద్దిపాడు తీసుకు వెళ్ళవలసి వచ్చింది. మొదటి పరీక్ష శ్రీరామనవమి మరునాడు ఉదయం 11గంటలకు మొదలవుతుంది. అంటే దశమినాడన్న మాట. నేను నా విద్యార్థులకు ఇలా చెప్పాను. “పరిక్షలు సోమవారం నుండి మొదలవుతాయి. ఆరోజు దశమి. మద్దిపాడులో ఒకహాస్టల్లో మీకు వసతి, భోజనం ఎర్పాటు చేశాను. మనం శనివారం బయలు దేరితే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోజు కొద్దిగా విశ్రాంతి తీసుకొని, రాత్రికి కొత్త చోటుకు అలవాడు పడితే ఆదివారం ప్రశాంతంగా చదువుకొని సోమవారం పరీక్షకు హాజరు కావచ్చు. ఇంకా ముందుగా బయలు దేరితే డబ్బుదండగ, లేటుగా బయలు దేరితే కొత్త చోటుకు అలవాటు పడేటప్పటికీ పరీక్ష ముంచు కొస్తుంది.
అయితే శనివారం నాడు అష్టమి, ఆదివారం నవమి, అష్టమి, నవములు మంచిరోజులు కావనే నమ్మకం మీ పెద్దవాళ్లలో కొంతమందికి ఉండవచ్చు. సోమవారం నాడు బయలు దేరితే ప్రయాణ బడలిక హాస్టల్లో వస్తువులు సరుకోవడంతో టైం సరిపోతుం గాని పరీక్షముందు ప్రశాంతంగా చదువు ఎ. న డేట్ తతా
కోలేరు. అష్టమి, నవములు లేదా చవితి, అమావాస్యలు మంచిరోజులు కావని, విదియ, సప్తమి, దశమిలాంటి కొన్ని రోజులు మంచివని కొందరి నమ్మకం. ఇది కేవలం మూధనమ్మకమే. ఎందుకంటే కాలాన్ని విభజించడం కోసం మన పూర్వికులులోని ఖగోళ శాస్రజ్జులు కాలాన్ని సంవత్సరాలు, నెలలుగా విభజించి నెలలోని 80 రోజులకు కొన్ని పేర్లుపెట్టారు. కాలగణనంలోని అన్ని రోజులు మంచివే. ఉదాహరణకు అమెరికా, ఇంగ్లాండు, జపాన్‌లాంటి దేశాల్లో మంచిరోజులు చూడకుండా అనుకూలంగా ఉన్న రోజే పనులు మొదలు పెడ తారు. వారు మనకంటె అభివృద్ధిని, విజయాలను సాధించలేదా? అందువలన అన్ని రోజులూ మంచివే. మీ పెద్దలకు ఈ విషయం చెప్పి వారు అనుమతిస్తు రాగల్లిన వారు శనివారం ఉదయం 6 గంటలకు విద్యా కెంద్రానికి పుస్తకాలు, బట్టలతోరండి మీకోసం మీ సామాన్లకోసం ఒక లారీని మాట్లాడతాను.
ఆనందకరమైన విషయం ఏమిటంటే విద్యాకేంద్రంలోని త్త౦ విద్యార్థుల్లో 386 మంది విద్యార్దుల తల్లిదండ్రులు తమ అనుమతినిచ్చారు. నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు శనివారంనాడు పంపుటకు అంగీకరించక, తామే సోమవారం నాడు పిల్లలను తీసుకువచ్చి మేము బసచేసిన హాస్టల్లో నాకు అప్పుజెబుతామన్నారు.
శనివారం ఉదయం 8-30గంటలకు లారీవచ్చింది. సామాన్లు లారీలో పెట్టాం... 9-45కె బయలుదేరబోతున్నాం. ఇంతలో ఒక విద్యార్ధి తండ్రి “మాస్దారూ! ఒక్క 5 ని॥లు ఆగండి ఇప్పుడే వస్తాను” అని చెప్పి వెళ్ళాడు. 9-50, 9-55, 10-00 గంటలయింది. ఆ విద్యార్ధి తండ్రి రాలేదు. విద్యార్థు లందరూ అసహనంగా ఉన్నారు. నెను “సత్యనారాయణా! నీవు మీ ఇంటికి వెళ్ళీ మీ నాన్నతో త్వరగా రమ్మని చెప్పి తీసుకురా” అన్నాను.
సత్యనారాయణ నవ్వుతూ “మాస్టారూ! మా నాన్న పదీ ముప్పావు దాక రాడు” అన్నాడు.
“ఎందుకని”
“ఈరోజు రాహుకాలం 10-80 దాకా ఉందట” ఎంత అష్టమము రోజుని బయలు దేరినా, కనీసం రాహుకాలం దాటి బయలు దేరండిరా అని మా
నాన్న అన్నాడంది.
“కాలాన్ని లెక్కించేటప్పుడు రాహుకాలం అనేది చెడ్డకాలమని ఎలా నిర్ణయించారు?” అని నేను అడిగాను. ఆయన సమాధనాం చెప్పలేక ఈ ష్లాన్ వేశాడు అన్నాడు.
నేను “ఏం చేద్దామని” విద్యార్థులను అడిగాను.
“వెంటనే బయలుదేరుదాం” అన్నారు వాళ్ళు.
అంతే లారీ 10-05కు బయలుదేరింది.
ఫలితాలు వచ్చాయి. లారీలో వచ్చిన 36గురు పాసయినారు. దశమి నాడు బయలు దేరిన నలుగురు ఫెయిలయినారు.
నేను విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా చెప్పాను.
“అష్టమినాడు బయలుదేరిన మీరందరూ పాసయినారు కాబట్టి అష్టమి మంచి రోజని, దశమినాడు బయలుదేరిన వాళ్లు ఫెయిల్ అయినారు కాబట్టి దశమి చెడ్డ రోజనీ కొత్త మూఢనమ్మకం ప్రబలే ప్రమాదముంది. అది సరికాదు. మీలో 86 గురు బాగా కష్టపడి చదివారు. హాఫియర్లీ, ప్రీ పబ్లిక్ పరిక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. పన్లిక్ పరిక్షలు ముందు కూడా ప్రశాంతంగా చదివారు. కాబట్టి వాసయినారు. ఆ నలుగురు హాఫియర్సీ, ఫ్రీ పబ్లిక్ పరీక్షలలో కూడా మంచి మార్కులు తెచ్చుకోలెదు. పైగా పరీక్ష రోజు ఉదయం అంతా ప్రయాణంతోనే సరిపోయింది. ఇటువంటి భౌతిక కారణాల వలన ఫలితాలు నిర్ణయమవుతాయి గాని అష్టమి, దశమిలలో ప్రత్యేకత ఏమీలేదనీ, అన్ని రోజులూ మంచివేననీ, వరాలు, రాహుకాలాలు మూధనమ్మకాలేననీ మనం ఇతరులకు నచ్చజెవ్వాలి.
అష్టమినాడు, రాహుకాలంలో బయలుదేరిన విద్యార్థులందరూ పాసయ్యారనే వార్త రావినూతలలో అందరినీ తీవ్రంగా ఆలోచింపజేసింది. దానికి తోడు “అన్ని రోజులు మంచివే” అనే విద్యార్దుల ప్రచారం వారిలో మార్పు తీసుకువచ్చింది. శ్ లా డై తా
జ్యోతిష్య శాస్త్రమా? నాయనా! సురుడు పైకి యాస్తారాలు + ర గో మనం వూ. క్ గ్ా క్యా ($ “మాస్తారూ! శకునాలు, మంచిరోజులు, వర్వాలు ఇవన్నీ మూఢనమ్మకా లన్నారు గదా? మరి జ్యోతిష్యం మూఢనమ్మకమేనా? లేక దాన్ని నమ్మవచ్చా?” అని అదిగాడు వెంకట్రావు. “జ్యోతిష్యం శాస్తమైతే నమ్మవచ్చు. శాస్త్రం కాక కేవలం నమ్మకమైతే దాన్ని అంగీకరించకూడదు నవ్వుతూ సమాధానమిచ్చాడు విశ్వం మాస్పారు. . “మరి జ్యోతిష్యం శాస్రమా? నమ్మకమా?” అడిగాడు అహమ్మద్. “అది మీ చేతనే చెప్పిస్తాను. శాస్తమంటే ఏమిటి?”
“అన్ని కాలల్లో అన్ని దేశాల్లో ఒక విషయంపై ప్రయోగం చేసినపుడు ఒకేరకమైన ఫలితాన్నిచ్చేదాన్ని శాస్త్రం అంటాము.” వివరంగా నిర్వచించాడు డానియెల్.
“శాన్రానికి ఒక ఉదాహరణ చెప్పు రాము?
“నిప్పులో వేలుపెడితే కాలుతుంది అనేది శాస్త్రీయ విషయం. ఎందు
కంటే నిప్పులో వేలు పెట్టడం అనే ప్రయోగాన్ని ఏ కాలంలో, ఏ దేశంలో ఎవరు చేసినా కాలుతుంది” రామూ సమాధానమిచ్చాడు.
“ఇప్పుడు జ్యోతిష్యాన్ని గూర్చి అన్ని కోణాలలో పరిశీలిద్దాం. ముందు
సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. తా ట్ర తతా
జ్యోతిష్య ప్రకారం ఈ విశ్వానికి భూమి కెంద్రంగా స్థిరంగా ఉంటుంది. దానీ చుట్టూ సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, శని, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, రాహువు, కేతువు అనే నవగ్రహాలు తిరుగుతుంటాయి. దీనినే భూ కేంద్రక సిద్దాంతమంటారు. ఇది కరక్టేనా?”
చకాదు మాస్తారూ!” ఆంజనేయులు సమాధానం.
“మరి ఎది కరెక్టు?”
“ఈ విశ్వానికి కాదు. మన సౌరకుటుంబానికి కేంద్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ భూమి, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని, యురేనస్, నెఫ్టాన్ గ్రహాలు తిరుగుతుంటాయి. రాహు, కేతులనే (గ్రహాలు లేవు. చంద్రుడు ఒక గ్రహము కాదు. ఉపగ్రహము మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని సూర్యకేంద్ర సిద్ధాంతం అంటారు. దీన్నె సైన్సు నిరూపించింది.
“జ్యోతిషానికి మూలమైన భూకేంద్రక సిదాంతం తప్పు అయి నపుడు ఆ సిద్ధాంతం మీద ఆధారపడ్డ జ్యోతిష్య ఫలితాలు శాస్త్రీయం ఎలా అవుతాయి. ౯”
“కాదు మాన్దారూ! అవి కేవలం ఊహలు మాత్రమె” అన్నాడు వినోద్.
“మరో అంశం చెబుతాను. జీవశాస్త్రం ప్రకారం శిశువు భౌతిక ఆకారం, రంగు, మానసిక లక్షణాలు, వ్యక్తిత్వం, ఆడా, మగా అనే అంశాలన్ని గర్భదారణ సమయంలోనే తల్లిదండ్రుల లక్షణాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. ఇది సైన్సు నిరూపించిన విషయం. పురాణాల కథలు కూడా దీన్ని అంగీకరిస్తున్నాయి. సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు తండ్రి చెప్పిన వ్యూహానికి “ఊ” కొట్టాడట అంటే అప్పటికే అభిమన్యుడు ప్రాణం పోసుకున్నట్లె కదా? కాని జ్యోతిష్యం ప్రకారం శిశువు శారీరక మానసిక లక్షణాలన్నీ ప్రసవ సమయాన్ని బట్టి అంటె ప్రసవ సమయంలో [గ్రహాల పరిస్థితిని బట్టీ నిర్ణయించబడతాయి. ఈ విషయాన్ని ఇంతవరకూ ఏ జ్యోతిష్యుడూ (ఘ్రయోగ పద్ధతిలో నిరూపించలెక పోయాడు. దీనిని బట్టి ఏ నిర్ధారణకు రాగలం?” “జ్యోతిష్యం వట్టి నమ్మకమెగాని శాస్త్రం కాదు.” అని కృష్ణారెడ్డి సమాధానమిచ్చాడు.
“మరయితే కొన్ని కరక్టయ్యాయని మా తాతగారు చెబుతుంటారు. అవి కరెక్ట్ అయ్యాయంటే జ్యోతిష్యం శా(స్రం కదా?” సుందర్రావు అదిగాడు.
“సుందర్రావు! ఫలితాల విశ్లేషనను కూడ అనేకమంది జర్నలిస్టులు, హేతువాదులు చాలా లీవ్రంగా చేశారు. ఉదాహరణకు అమెరికాలో రోగర్ లలల టట తతత
కల్వర్, ఫిలిప్టౌనా అనేవారు ప్రఖ్యాత జ్యోతిష్కులు, జ్యోతిష్య పత్రికలలో ప్రచురించిన ఫలితాలను 5 సం॥రాల పాటు పరిశోధించారు. మొత్తం 3011 జ్యోతిష్య ఊహలకుగాను, 338 మాత్రమే నిజమైనాయని 2673 తప్పయి నాయని అంటే విజయశాతం 11 మాత్రమేనని తేల్చి చెప్పారు. ఎవరైనా 11% మార్కులు తెచ్చుకుంటే అతడు పాసు అయినాదని చెప్పలేము. ఇక క్లాసు వచ్చిందని ఎలా చెప్పగలం? అలాగే జ్యోతిష్యులు కూడ ఏవో ఊహి స్తుంటారు. వాటిలో నూటికి 89 ఊహలు తపైపోతుంటై. అయినా నిజమైన అతికొద్ది ఊహలను ఆధారం చేసుకొని మా శాస్త్రం నిజమని నమ్మమంటారు. అంతేకాదు రాజకీయాల విషయంలో వర్తమాన రాజకీయ విషయాలను బాగా స్టడీ చేసి మనలాగానే ఊహిస్తున్నారు. కాకపోతే ఆ ఫలితాలకు ముందు “శని పైకి చూస్తున్నాడు. గురుడు క్రిందికి చూస్తున్నాడు. బుధుడు ప్రక్కకు చూస్తున్నాడు. కాబట్టీ ఫలితం రాబోతుంది”అని ఏవేవో కల్పిస్తారు. ఒక ఉదాహరణ చూడండి.
1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో టి.వెంకట్రావనే ఒకాయన జ్యోతిష్యానికి సంబంధించి ఒక పరిశోధన చెపట్టారు. ఆయన పత్రికా ముఖంగా 8 ప్రశ్నలు వేశారు. అవి-1. మన రాష్ట్రంలో 42 పార్లమెంటు సీట్లలో ఏ
నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది.
-
మన రాష్ట్రంలో టి పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నది?
-
కాబోయే ప్రధానమంత్రి ఎవరు?
పై మూడు ప్రశ్నలకూ ఖచ్చితంగా సమాధానాలిచ్చిన వారికి 5000 రూలు బహుమతి ప్రకటించారు. ఆయన ప్రకటించిన పోటీలో 50 మంది జ్యోతిష్యులు వొల్గొన్నారు. అందరూ తమకు జ్యోతిష్వరత్సృ జ్యోతిషప్యమార్తాండ లాంటి వీరుదులున్నాయని ప్రకటించుకున్నవారి. వారి సమాధానాలన్నీ అవాస్తవాలే. ఉదాహరణకు మొదటి ప్రశ్నకు వారందరూ శ్రీకాకుళం నుండి నందమూరి జయకృష్ణ, హైదరాబాదులో వెంకయ్యనాయుడు గెలుస్తాడని ప్రటిం చారు. ఎందుకని? మనలాగానే వారు కూడా రాజకీయాలు స్టడీచేశారు. ఎన్.టి రామారావు కొడుకు జయకృష్ణ ఓడిపోవదమా? పెద్ద నాయకుడు వెంకయ్య నాయుడు గెలవకపోవడమా? అని తమ రాజకీయ అంచనాలకు జ్యోతిష అంచనాలని పెర్లు పెట్టారు. ఫలితాలు ఏమైనాయి.? వారిద్దరూ ఓడిపోయారు.
అలాగే రెండవ ప్రశ్నకు సమాధానంగా 38 మంది లక్ష్మి పార్వతి తెలుగుదేశానికి కొన్ని సీట్లు వస్తాయని ప్రకటించారు. కానీ ఆమె పెర్టీ
పార్లమెంటుకు ఒక్క సీటులో కూడా నెగ్గలేదు.
ఇక మూడవ ప్రశ్నకు సగం మంది పి.వి నరసింహారావు (ప్రధాని అవుతాదని వ్రాసారు. కాని వాజ్వాయ్ ప్రధాని అయ్యారు. మొత్తానికి మూడు ప్రశ్నలకు ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆ విధంగా జ్యోతిష్యం అంటే “వేధ్రావుల ఊహాగానాల సముదాయం” మాత్రమెనని నిరూపించారు.”
“మరి సైంటిస్టు లెవరూ జ్యోతిష్యాన్ని ఖండించలేదా? మాస్తారూ?” ప్రశ్నించింది రమ్య.
“ఖందించారమ్మా! ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞులు 186 కలిసి 1975 అక్టోబరులో “దిహూమనిస్ట్” అనే అమెరికన్ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. వారిలో 19 మంది నోబుల్ బహుమతి గ్రహితలు కూడా ఉన్నారు. వారి ప్రకటనలో “జ్యోతిష్యం మూఢనమ్మకమేగాని, శాస్త్రం కాదనీ, జ్యోతిష ప్రకటనలను నేరుగా, శక్తివంతంగా సవాలు చేయవలసిన సమయం వచ్చిందని మెము నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.
“జ్యోతిష్యం మతపరమైన అంశంకదా? దానిని మతనాయకులు ఖండిస్తే శక్తివంతంగా ఉంటుందిగాని, శాస్త్రజ్ఞులు మత విషయాలను ఖండిస్తే విలువె ముంటుంది?” ప్రశ్నించాడు కిరణ్.
“నిజమే జ్యోతిష్యాన్ని ఒకమత విషయంకాదు మార్మిక విషయమన్నాడు. “జ్యోతిష్యం, ఇతర మార్మిక విషయాలు మానసిక బలహీనతకు గుర్తుగా మీరు తెలుసుకోండి. అవి ఎప్పుడైతే మన మనస్సులలో ప్రాధాన్యత గల విషయాలౌతాయో, మనం ఒక డాక్టరును సంప్రదించాలి. మంచి ఆహారం, చక్కటీ విశ్రాంతి తీసుకోవాలి” అని వివేకానందులు చేసిన ప్రకటనను 10-4-01న “హిందూ” పత్రిక ప్రచురించింది.
అలాగే పోప్‌జాన్‌పాల్ * భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధరించకునెందుకు జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్తముద్రికుల దగరకు వెళ్లవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు” అని విస్పష్టంగా ప్రకటించారు. (ఈనాడు 17-9-98) కాబట్టి శాస్తజ్జులు, మతనాయకులు ఖండించిన జ్యోతిషమన మార్మిక విషయాన్ని శాస్రమందామా? మూఢనమ్మకమందామా? “మూఢనమ్మకమేె” విద్యార్థు లందరూ ఏకగ్రీవంగా పలికారు.
జ్యోతిష్యుల లాటరీ పారనివేళ! ఇన?
అది 1999 జులై 4వ తేది, కాలం ఆ తేదీలోకి అడుగు పెట్టనప్పుటి సెకను నుండి ప్రపంచమంతటా కోట్లాదిమంది ప్రజలు ఊపిరి ఓగపట్టుకొని ఏంజరుగు తుందోనని ఆతృతగా ఎదురుచూడసాగారు. సెకన్లు, నిమిషాలు, గంటలు గడిచి పోయాయి. జులై4వ తేది వెళ్ళివోయింది. ప్రజలందరూ భయం వదిలి నిట్టూర్పులు విడిచారు. ఆందోళన పడ్డ ప్రజలను చూసి నవ్వుకున్నారు.
1999 జులై 4 విశేషమేమిటి? ప్రజ లంతా ఆ రోజు ఆందోళనతో ఎందుకు గడిపారు? కారణమేమంటే... 400 సం॥ల క్రితం ఫ్రాన్సు దేశానికి చెందిన నోషస్టడేమస్ అనే ప్రఖ్యాత జ్యోతిష్యుడు ఆ రోజున కలియుగం అంతమౌతుందనీ, భయంకర యుద్ధం వస్తుందనీ, దానిలో కోట్లాడిమంది పాపులు చనిపోతారనీ జోస్యం చెవ్పాడు. 400 ఎళ్ళ నుండి ఇప్పటి వరకూ ఆయన చెప్పినవన్నీ జరిగాయనీ, కాబట్ట కలియుగంకూడ ఆయన చెప్పిట్లు అంతమౌతుందని కోట్లాది మంది నమ్మారు. జరిగిన సంఘటనలను ఆయన చెప్పిన జోస్యానికి ముడి వేసి, భవిష్యత్తును కరెక్టుగా చెప్పే జ్యోతిష్య పండితునిగా ఆయన్ని ఆకాశాని కెత్తేశారు. ఆయన చెప్పినవన్నీ బోగస్ అని ఆనాదే హేతువాదులు కొట్టిపారేశారు.
కలియుగాంతాన్ని గూర్చి ఆయన జోస్యాన్ని బలపరుస్తూ అనేక ఇతర ఆధారాలు ఇవిగో అంటూ 1990లో డజన్లు కొద్ది జ్యోతిష్యగ్రంథాలు వెలు వడ్డాయి. వాటిలో వేదవ్యాస రాసిన * 1999 కలియుగాంతం” ఒకటి. దానిలో
వేదవ్వాస నోస్టడేమస్ను సమర్థిస్తూ మహాభారతం నుండి, భవిష్యపురాణం నుండి, పోతులూరి వీరబ్రహ్మేందస్వాములవారి కాలజ్ఞానం నుండి, పెరాలకు పేరాలు కొటేషన్లు ఇచ్చి కచ్చితంగా 1999లో కలియుగం అంతమౌతుందని నిర్దారించారు. పుస్తకం బాగా అమ్ముడయింది. రచయితకు లక్షలలో ఆదాయం తెచ్చింది. 1999 వచ్చింది, పోయింది కాని ఏ విచిత్రమూ, ఏ విశేషమూ జరగలేదు. జోస్యాల బండారం మాత్రం బట్టబయలైంది. ఇటీవల 2003లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్ పోటీల సందర్భంగా అనేక మంది జోతిష్య పండితులు ఆకాశంలో తారల గమనాన్ని అంకెల ఫలితంగా కలగలిపి, అంటె జ్యోతిషాన్ని, న్యూమరాలజీని మిళితం చేసి, ప్రపంచకప్ మనదేనని ఏకగ్రీవంగా ప్రక టించారు. ఆ జోస్యాన్ని దాదాపు అన్ని పత్రికలూ ప్రకటీంచాయి. ఒక తెలుగు దినపత్రికైతే ఏకంగా ఆ అంశాన్ని ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఫలితం ఏమైంది? ప్రపంచకప్‌ను ఆస్టేలియా గెలుచుకుంది. జోస్యం అభాసుపాలైంది.
పెద్దపెద్ద జ్యోతిష్య పండితులని పేర్కొనబడ్డ వారి జోస్యాలు కూడా అనేకం ఇలాగే తుస్సుమన్నాయి. వారి జోస్యాలన్నీ కేవలం లాటరీల్లాంటివెనని తేలాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్రవెేత్తలందరూ భవిష్యత్తును గూర్చి తెలివితేటలతో, లోకజ్ఞానంతో లాటరీ వేస్తారని, అవి నూటికి 6 శాతం మాత్రమ కరెక్టవుతాయని అనేక పరిశోధనా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అలాంటి 94% తప్పుడు జోస్వాలలో ముఖ్యమైన వాటిని కొన్నింటిని పరిశీలిద్దాం.
- ప్రముఖ హనుమాన్ ఉవాసకులు దైవజ్ఞ సార్వభౌమ నిమ్మగడ్డ పొండురంగ విఠల్ శర్మ ఇలా పేర్కొన్నారు. ఈ ఏడాది (1999) ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉప్పెన వస్తుంది. సముద్రం వొంగి జననష్టం అధికంగా ఉంటుంది” (ప్రజాతంత్ర- 14-8-1999) ఆయన చెప్పిన మరో జోస్యం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి దిగ్విజయసింగ్కు త్వరలో పదవి ఊడిపోతుంది. ప్రజాతంత్ర
- (14-3-1999). కాని ఆయన 2003లో కూడా అధికారంలో కొనసాగారు.
-
2001 మార్చిలో ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ప్రముఖ పండితుడు మాడుగుల నాగఫణి శర్మ ఇలా పేర్కొన్నారు. పశునాయకుడు శ్రీ కృష్ణుడైనందున ఈ సంవత్సరం పాడిపంటలు పొంగిపార్లుతాయి, నందిశ్వరుడు బంగారు పంటలు పండించనున్నాడు. (వార్త 27-03-2001) కాని వాస్తవంగా జరిగిందేమిటి? అప్పటి నుండి రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంది. లల ట3 ాతతతా
-
ఆంధ్రజ్యోతి 24-4-1999 వార్త ప్రకారం “రాబోయే మధ్యంతర ఎన్నికలలో కాంగ్రేస్ అధికారంలోకి రావడం కాయమని * ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ శైవపీఠం మహోపాధ్యాయులు పండిట్ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ తెలిపారు. కాని జరిగిందేమిటి? కాంగ్రేస్ ఘోరంగా ఓడిపోయింది. ఎన్.డి.ఎ అధికారంలోకి వచ్చింది! ఆయన చెప్పిన మరో జోస్యం “ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తు, ఎన్నికల సమయంలో ఎవరెవరు పొత్తులు కలుస్తారో దానిపై ఆదారపడి అధికారం ఉంటుందని” తెలిపారు. (ఆంధ్రజ్యోతి 24-4-1999) ఇది నిజం! పొత్తులను బట్టి అధికారం ఉంటుందని చెప్పడం జోస్యమా! లౌక్యమా!
-
“టైమ్స్ ఆఫ్ ఇండియా”లో ఆ్రోఫోకస్ శీర్షికను నిర్వహించే సుశీల్ చతుర్వేది 1996లో ఇలా జోస్యం చెప్పారు. “సోనియా రాజకీయాల్లోకి రావడం అస్సలు జరగదు” (వార్త 9-6-96) కాని సోనియా రాజకీయాల్లోకి రావడం, అఖిల భారతీయ కాంగ్రేస్ అధ్యక్షురాలిగా కొనసాగడం వర్తమాన చరిత్ర!
-
మరో ప్రముఖ జోస్యాన్ని ముచ్చటించుకుందాం.
సుసాన్ అనే పర్షియా దేశపు జ్యోతిష్య శాస్రజ్ఞురాలు 98లో హైదరా బాద్‌లో పత్రికల వారికి కొన్ని జోస్వాలు చెవ్సారు. (ఎ) “వాజ్‌పేయి మరో రెందేళ్లు అంటే 2000 వరకే అధికారంలో ఉంటారు. (బి) ప్రియాంకగాంధి 2002లో ప్రధానమంత్రి అవుతారు. (సి) చంద్రబాబునాయుడు 1999లో పదవినుండి తొలగించబదతాడు. అప్పట నుండి హరికృష్ణ తెలుగుదేశం పగ్గాలు చేపడతారు” (దక్కన్ క్రానికల్-?7. 2. 1998)
ఈ జోస్యాలన్నీ వాస్తవంలో తలకిందులయ్యాయి. జోస్యాలను నమ్మడం అనే మానసిక బలహీనతను ప్రజలు త్వరలో పోగొట్టుకుంటారని ఆశిద్దాం.
పలల డే తపా
బల్? హొస్తనౌాముద్రికం ద్వారా భటిట్యత్తును బెప్పడం నాధ్వ్యమా? 'కావీ'కాడితే పరీక్షలలో హ్రైసవుతావు. | న్న (గ 'లంచం' బుస్తే టద్యోం పస్తుంది. సి “కట్నం ' ఆశంచకుం పెళ్ళ అపుత్తుంది. (ష్ టో ఏ అనారోగ్యం రాకుంటే ' సూకు' , ర. (1 వే!
ఈ సంఘటన 1978లో జరిగింది. మా ఊరికి ఒక పెద్ద హస్త సాముద్రికుడు వచ్చాడని, భవిష్యత్తు గురించి కూడా అతడు చెప్పింది కరెక్టెనని అందరూ నమ్ముతున్నారనీ విన్నాను. అతడి బండారాన్ని హస్త నాముద్రికం లోని అశాస్తీయతను ఒక ప్రయోగం ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించదలిచాను. సమాజ సేవా కార్యక్రమాల కోసం విద్యార్థులు దాచుకున్న పైకాన్ని తీశాను. విద్యార్థులు చేయవలసిన కార్యక్రమాన్ని వివరించాను. హస్త సాముద్రికుడిని సాదరంగా మా ట్యూషన్ సెంటర్‌కు ఆహ్వానించాము. ఒక మా ప్రయోగం ప్రారంభయ్యింది.
మొదటి విద్యార్ధి సాముద్రిక పండితుడికి పైసలిచ్చి చెయి చూపాడు. అతను ఇస్రీ చొక్కా ప్యాంటు వేసుకొని, నున్నటి క్రాఫ్, చేతిలో పుస్తకాలతో బుద్ధివంతుడిలా వచ్చి కూర్చున్నాడు. సాముద్రికుడు చెప్పడం మొదలు పెట్టాడు. నీవు బాగా చదువుకుంటావు. బాగా సంపాదిస్తావు, డబ్బును నిలవచేసావు. సీ భార్య అనుకూలవతిగా ఉంటుంది. నీ జీవితం సుఖంగా సాగిపోతుంది” ఇవీ అతను చెప్పిన వాటిలో ముఖ్య విషయాలు అతని తర్వాత 2వ విద్యార్ధి, తర్వాత మూడవ విద్యార్ధి ఇలా విద్యార్థులు వరుసగా చేయి చూపించుకుంటున్నారు. అందరికీ దాదాపు ఒకే రకమైన భావిసూచనలు, బాగా చదువుకుంటువనీ, మంచి భార్యను పొందుతావనీ- ఇలా ఉంటున్న కాకపోతే ఒక విద్యార్ధికి 9వ తప కన్
ఏట గండమనీ, ఒక విద్యార్థికి 24వ ఏట గండమని కొద్ది మార్పులు అటుయిటూ చేశాడు. 10వ విద్యార్ధి చేయి చూసి చెబుతున్నాడు సాముద్రికుడు.
చినిగిన బనియన్, పాతలాగు, నెత్తిన వాత టవల్‌ను తలవాగా లాగ చుట్టుకొని, చేతిలో కర్రతో ఉన్న ఒక బాలుడు బయట నిలబడి లోపలి చోద్యాన్ని వింతగా చూస్తున్నాడు. ఒక విద్యార్ది అతనిని చూసి “ఒరెయ్ రాముడూ! ఇటు రారా! నీ చేయి చూపించుకొని నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందువు గాని” అన్నాడు. అందుకు రాము అనేబాలుడు “హె పోరా! నేను గొర్లకాడికి వెళ్లాలి. ఇపుడు నాకు టైములేదు” అన్నాడు. మరొక బాలుడు “ఒక్క ఐదు నిమిషాలు చాలురా లోపలికి రా. నీ జాతకం చెప్పించుకుందువుగాని” అన్నాడు. అప్పుడా అబ్బాయి “నేను రానురా, నా దగ్గర డబ్బులు లేవు” అన్నాడు. మరొక విద్యార్ధి “నేనిస్తాను రారా” అన్నాడు. అప్పటికే 10వ విద్యార్థికి చెయి చూసి చెప్పడం పూర్తయింది.
మన కొత్త అబ్బాయి సాముద్రికుడి ముందు కూర్చున్నాడు. చెయి చాపాడు. మరో విద్యార్ధి డబ్బులిచ్చాడు. సాముద్రికుడు చెప్పడం మొదలెట్టాడు. “అబ్బాయికి చదువురాదు. బాగా కష్టపడితేగాని సంపాదించలేడు. సంపా దించినా చేతిలో పైసా నిలవదు. ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఇతని భార్య ఇతని మాట వినదు. భార్యాభర్తలు ఎపుడూ కీచులాడు కుంటుంటారు” ఇలా సాగుతున్నది సాముద్రికుడి ధోరణి. ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. పకపకా నవ్వసాగారు. కారణం తెలుసా? ఆ కొత్త అబ్బాయి ఎవరో కాదు మొట్టమొదటి విద్యార్ధియ. ముందు అనుకున్న ష్లాను ప్రకారం, వేషం మార్చుకొని వచ్చి, భాష మార్చి మాట్లాడాడు. అంతే ఇక తెల్లబోవడం సాముద్రికుడి వంతయింది. మారు మాట్లాడకుండా అక్కడ నుండి లెచి వెళ్ళాడు. అప్పుడు విద్యార్ధుల హస్త సాముద్రికాన్ని గూర్చి ఇలా వివరించాను.
“విద్యార్థులారా! హస్త సాముద్రికమంటే చెతిలో రఖలు చూసి గతాన్ని, భవిష్యత్తును వివరించడం, ఈ రేఖలకు మన జీవితానికి సంబంధంలేదు. తల్లి గర్భంలో ఉండగా చేతులు ఏ ప్రకారం ముడుచుకుంటే ఆ ప్రకారంగా రేఖలు పడతాయి. అంతకంటే అందులో విశేషం లేదు. నేను ఆ శాస్త్రాన్ని చదివాను. పరిశోధన చేశాను. బిచ్చగాళ్లకు దానం చేసే నెపంతో నాణెం పట్టుకొని కొద్ది సేపు వేయకుండా వాళ్ల రేఖలు పరిశీలించాను. అనేక మందికి ధనరేఖ చాలా పొదవగా ఉందటం గమనించ్వాన్దు, భార్యరేఖ(లేక వివాహరేఖ) ఒక్కటే
ఉండటం గమనించాను. రేఖల (ప్రకారం భార్యాభర్తలిద్దరి చేతులలో అనుకూల దాంపత్య రేఖలున్నావారు విడాకులు తీసుకోవడం, ఆ రేఖలు కలిసి యుందని భార్యాభర్తలు అనుకూల దాంపత్యం కలిగి ఉండటం చూశాను. సంతాన రేఖలకూ పిల్లలకూ సంబంధం లేని సందర్భాలు అనేకం. కేవలం లాటరీయే.
ఇంక గండాల విషయం. సాముద్రికుడు ఏ సంవత్సరంలో గండమని చెప్పినా, పక్కనున్నవారు దానిని ఏదో ఒక చిన్న ప్రమాదానికి అన్వయిస్తారు. “అవునురా! ఆ సంవత్సరం బావిలో పదడబోయావు. అవునవును ఆ సంవత్సరం పాము కాటువేయబోతే తప్పించుకున్నావు. ఇలా మానవ జీవితంలో ఏ ప్రమాదం లేకుండా ఎవరి జీవితం ఉంటుంది చెప్పుండి. కానీ చేతిమీద గీతతో సంబంధ మెలా ఉంటుంది?
మరో ముఖ్య విషయం. సాముద్రికం రెండు రకాలు. భారతీయ హస్త సాముద్రికమనీ, కైరోమాన్సీ అని, భారతీయ సాముద్రికం ప్రకారం మగవారికి కుడిచేయి, ఆడవారికి ఎడమ చేయిచూడాలి. కైరామాన్సీలో ఖేదం లేదు. ఎవరి సాముద్రికం కరెక్ట్? సాముద్రికలు ఎక్కువ భాగం మన వేష భాష నదవదిని బట్టి చెబుతారు. దానికి రుజువు ఈరోజే దొరికింది గదా? అని ముగించాను.
తెల్లవారే సరికి హస్త ముద్రికుడు ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. మా ట్యూషన్ సెంటరులో జరిగిన విషయం విద్యార్దుల ద్వారా తల్లిదండ్రులకు తెలిసి, హస్త ముద్రికంపై వారి నమ్మకాలు సన్నగిల్లాయి. లం న తతా
ఆంధ్రప్రదేశీలో ఆన్ని ఆళ్లకూ వాస్తు దోషం ఉంది. వాస్తు పేని ఇంట్లొ నేసే టయేనేనే... గ్ భె న టు.
- ॥ 6 నే ఆ ఆ ్నే పల మా! కా టట లం. / లి క కో మా అవ్పారావు అమెరికాలో ఆరెళ్ళు ఉండి బాగా సంపాదించాడు. మాతృదేశం మీది [శ్రమతో ఇండియాకు తిరిగివచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే సెటిలై శేషజీవితాన్ని సంఘం సేవలో గడపాలనుకున్నాడు. కొన్నాళ్ళు దగ్గర బంధువులు, దూరపు చుట్టాలను, బాల్యమిత్రులను కలుసుకొని, తర్వాత ఏదో ఊళ్లో ఇల్లు కొనుక్కొని సెటిలవ్వాలని, రాష్ట్ర యాత్ర చేయనారంభించాడు. ఏ పట్టణం వెళ్ళినా, అక్కడి రైల్వే స్టషన్లోనో, బస్ స్టెషన్లోనో అతనిని ఒక విషయం విపరింగా ఆకర్షించింది. అక్కడొక బుక్‌షాపు ఉంటే చాలు. ఆషాపులో 'వాస్తు మీద ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల పుస్తకాలు ఉంటున్నాయి.” “మీ ఇంటి వాస్తు ఎలా ఉండాలి? ” ఇలా అనేక పుస్తకాలు. ఇల్లు కొనడమో, కట్టడమో చేద్దామనుకుంటున్నాడు కాబట్టి, ఆసక్తి కొద్ది ఆ పుస్తకాలన్నీ కొని చదివాడు. చదివిన కొద్దీ అతనికి గందరగోళం, భయం ఎక్కువై, ఏదైనా ఇల్లు కొనబోయే ముందు మంచి వాస్తు విద్వాంసుని సంప్రదించాలనిపించింది. బాల్యమిత్రుడినైన నెను ప్రాచిన వాస్తు గ్రంథాలు చాలా పఠించానని ఇతర మిత్రుల ద్వారా తెలుసకొని, నా సలహా ప్రకారం ఇల్లు కొందామనుకున్నాడు. ఇళ్ళ (బ్రోకర్ల ద్వారా హైదరాబాదులో, బంజారాహిల్స్‌లో ఉన్న ఒక ఇల్లు చూద్దామని నన్ను వెంట తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు అంతా పరిశీలించి ఇలా లలా దట తా
అన్నాను. “అప్పారావ్! ఈ ఇళ్లీకాదు, బంజారాహిల్స్‌లోనే ఎక్కడా ఇల్లు కొనవద్దు. ఈ ప్రాంతమంతా వాస్తు దోషమున్నదే” అవ్వారావు ఆశ్చర్యపోయాడు.
“ఈ ఇంటాయన ఏ వాస్తు విద్వాంసుని సంప్రదించాడో నాకు తెలియదు. నేను మాత్రం వాస్తుకు సంబంధించిన మూల గ్రంథాలైన మయ మతం, మానసారం, విశ్వకర్మ ప్రకాశిక, భృగుసంహిత, నారద సంహిత, వశిష్టసంహిత, వాస్తు ప్రదీపము, వాస్తు కల్చద్రువం లాంటి పుస్తకాల సారాంశాన్ని మధించి ఈ విషయం చెబుతున్నాను” అన్నాను.
“ఈ ఇంటి వాస్తు దోషాలేమిటి?” అన్ని పుస్తకాల పేర్లు విని ఆసక్తితో ప్రశ్నించాడు అప్పారావు.
“బంజారా హిల్స్ అంటే ఏమిటి?” ఎదురు ప్రశ్నించాను.
“బంజారా గుట్టలు అని అద్ధం”
“వాస్తు ప్రదీపం అనే గ్రంథంలో ఏముందో తెలుసా? 'విషమాశతృవర్ధినీ అని అంటే నేల ఎత్తు పల్లాలుగా ఉంటే శతృవులు పెరుగుతారు. అని అర్ధం ఈ నెలంతా ఎత్తుపల్లాలుగా ఉందా? లేదా?”
“ఎత్తు పల్లాలుగానే ఉంది”
అలాగే “మహాపాషాణ సంయుతాం.. పర్వతాగ్రేషు సంలగ్నాం... వివర్ద యతి” అని “విశ్వకర్మ ప్రకాశిక చెబుతోంది. అనగా "పెద్దపెద్ద రాళ్ళతో ఉన్న ట్ట్యు, పర్వతాగ్రము పై ఉన్న భూమి గృహనిర్నాణనికి పనికిరాదు. అట్టి భూమి మూర్చులు, దరిద్రులు అగు పుత్రుల నుదయింపజేయును అని అర్ధం.
ఇంకా “'గృమమును నిర్మించు ప్రదేశమునందుగాని, గృహావరణము నందు గానీ భూమి యందు 3 గజములలోతు రాళ్ళుండినచో పాషాణ వేధా దోషము సంభవించును. దీని వలన దిర్హ వ్యాధులును, మృత్యువును కలుగును” అని గుప్తవాస్తు 148వ పేజీలో ఉంది. అదే పుస్తకం, అదే పేజీలో, పర్వతా గ్రమున గాని, పర్వత మధ్యభాగము నందుగానీ, పర్వతము క్రింది భాగము నందుగానీ గృహము నిర్మించుటవలన పర్వతవేధా దోషము సంభవించును. ఈ దోషము గృహా యజమానునకు దారిద్రమును కలుగజేయుననీ ఉంది. ఇపుడు చెప్పు. ఈ నేలంతా పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉందా లేదా? వా కట
“నిండి ఉంది”.... ఈ ్రదేశములోని స్థలాలన్నీ గుట్టలపైన గాని, మధ్యన గాని, క్రింది భాగమున గాని ఉన్నవేగదా?
“ఉన్నవే”
“అంటే యీ స్థలాలన్నింటికీ పర్వతవేధాదోషం, పాషాణవేధాదోషం జమిలిగా ఉన్నాయి గదా? ఈ ప్రదేశంలో ఇల్లు కొంటావా?”
“అమ్మో ఇక్కడి ఇల్లు కొననే కొనను. విజయవాడలో ఒక అపార్ట్మెంటు ఉంది చూద్దాంపద” అని నన్ను విజయవాడ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక అపార్ట్మెంటు చూశాము. దానిని చూస్తూనె ఈ అపార్ట్మెంటుకు కూడా వాస్తు దోషం ఉంది అప్పారావ్!” అన్నాను.
“దీనికి కూడా వాస్తు దోషమా?” ఏమిటది?
“నల్రపు రంగులో ఉండి, బీటలు పడిపోయి, అనేక రకములయిన గడ్డి మొలుచుచున్న భూమి వాస్తు శాస్తం (కకారం అధమాధమ భూమియని చెప్పబడుతోంది. అక్కడ ఇల్లు కట్టగూడదు. అంతేకాదు “వాస్తు ప్రదీపం” ప్రకారం “స్ఫుటితాచసశల్యాచ.... కర్తురా యుర్ధనాపహా” అంటే “గృహమును నిర్మించుచున్న భూమి బీటలువారి యున్నను భూమి లోపల ఎముకలున్నను మరణమును కల్గించును” అని అర్ధం. మరో ముఖ్యవిషయం.
“పిపీ లికాషోడశపక్షనిద్రా
భవంతి చేతత్రవ సేన్నకరా
తుషాసి చిరణి తథైవ భస్మా
న్యందాని సర్పామరణ (ప్రదాస్యు” అని గూడ వాస్తు ప్రదీపం చెబుతోంది. “చీమలు, కప్పలు ఉన్న యెడల ఆ ప్రదేశమందు గృహమును నిర్మించకూడదు. ఊక, ఎముకలు, బూడిద, గుద్దు, వాములు ఉన్న యెడల యజమానికి మరణము కలుగును అని దాని అర్ధం.
మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా చీమలు, ఎముకలు, గుడ్లు పాములు లేని స్టలం ఉందా? అందులోనూ ఎముకలు భూమిలో 8 అడుగుల లోతున ఉండకూడదు. అంత లోతున, ఒక ఎముక ముక్క ఉన్నా ప్రాచిన వాస్తు గ్రంథాల ప్రకారం యజమానికి మరణమే. అంటే పై గ్రంథాల ప్రకారం భారతదేశంలో అన్ని ఇళ్ళూ వాస్తు విరుద్ధంగా కొనసాగుతున్నవే. కాని ఫలితం మాత్రం వాస్తు వా ఈటల
పుస్తకాలలో చెప్పినట్లు ఉండటంలేదు. అంటే వాస్తు విరుద్ధంగా గృహాలు ఉ న్నంత మాత్రాన దుష్పలితాలేం జరగవన్నమాట” గీమిటా ఎతువముత్వూడు? గ ఇత మట తం చోటు కోసం ఈ ఈలాట చోత ఇబ్ల కథలకు. / 1 తా, గ త టోఫూ సాడు న వ టంలో
“నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది కాంతారావ్!” గందరగోళం నుండి బయటపడుతూ అన్నాడు అప్పారావు.
“నీక్సుబ్రాగా అర్ధంకావడానికి మరికొన్ని లక్షల కేసులు చెబుతాను విను. ఇంటి ప్రధాన ద్వారానికి ఒక వైపున మాత్రమే కిటికీ ఉండి రెండో వైపున కిటికీ లేకపోతే “విచ్చిద్రంది శికాణకం” అనే శాస్రానునారం ఆ ఇంటికి కాణవేధాదోషము తగులుతుంది. * కాణేంధత్వం ప్రజాయతే అను న్యాయము చొప్పున యీ కాణవేధను పొందిన గహ యజమానికి గుడ్డితనము వస్తుంది. మరియు గుడ్డి, మూగ మున్నగు లక్షణాలతో కూడిన బడ్డలు పుడతారు. కాణవేధాదోషము మధ్యతరగతి వారు నివసించే గృహాలన్నింటికీ ఉంటోంది. కాని ఆ గృహాల యజమానులు గుద్ది వాళ్లవుతున్నారా? వారి పిల్లలు గుడ్డి, మూగ వాళ్లవుతున్నారా? అంటే లక్షలాది ఇళ్ళు వాస్తువిరుద్ధంగా ఉన్నా దుష్ఫలితాలు ఏమి జరగటంలేదు గదా?
“ర్సీవ్పు చెప్పిన విషయం దిర్హంగా ఆలోచిస్తే నిజమేనని నమ్మవలసి వస్తోంది” కొంచెం దృఢంగా అన్నాడు అప్పారావు.
“ఇప్పుడు వేధాదోషం పని చేయని కోటీ ఇళ్ళ వివరం చెప్పమంటావా?”
“చెప్పు”
|
“గృహము యొక్క ముఖ ద్వారమున కిరువైపులా కిటికీలు లేకపోతే “అంధకంచి(ద్ర హీనం న్యాత్” అను ప్రాచీన గ్రంథ వాక్యము ననుసరించి ఆ ఇంటికి “అంధక వేధ అను దోషం ఉంటుంది” *“అంధకేరోగమతులం న్యాత్” అను శాస్త్రము ననుసరించి అంధకవేద పొందిన గృహ యజమానికి ఎల్లప్పుడూ రోగబాధ, సంతాన నష్టము కలుగును. భారతదేశంలో పేదవారు నివసిస్తున్న లక్షలాది పూరి గుడిసెలను పరిశీలించు. ఆ గుదిసెలకు ఒక ద్వారం ఉంటుంది. మిగిలిన భాగమంతా గోడ. ఒక్కకిటికీ కూడ ఉండదు. ఆ యజమానులందరూ కూడా రోగాలతో బాధపడుతున్నారా? వారి ఇళ్ళముందు పసిపిల్లలు కేరింతలు కొట్టడం లేదా?”
“నువ్వు చెప్పింది నిజమె. ఆ ఇళ్ళ యజమానులకు అంధకవేధ అనే దోషం తగిలినట్టయితే భారతదేశంలో ఇప్పుడున్నట్లుగా కోట్లాది పూరి గుడిసెలు ఉండేవి కావు. ఎందుకంటే యజమానికి రోగం, పిల్లలకు మరణం సంభవిస్తుంది కాబట్ట”
అప్పారావ్ మరో లక్ష కేసులకు సంబంధించిన వాస్తు దోషాన్ని చెబుతా విను. “వాస్తు రాజవల్లభం” అనే గ్రంథంలో “వృక్ష దుస్ధనకంట కాశ్సపలినస్త్వాజా గృహాద్దూరత” అని చెప్పబడింది. అంటే “గృహావరణములో వొలుగారు వృక్షాలు గాస్, ముళ్ళుగల చెట్లుగానీ, ఫలవృక్షములుగాని ఉండుట దూపష్యము అని అర్ధం. ఇంకా వివరంగా చెప్పాలంటే కుర్వంతితే కంటకనోరిభీతి:” అనగా ముళ్ళుగల చెట్లున్నచో శతృభయమన్, “ప్రజా వినాశం ఫలినస్సమీపే” అనగా ఫలవృక్షములున్నయెదల సంతాన నాశనమనీ, “సదుగ్ధవృక్షాద్రవిదస్యనాశం” అంటే పాలుగారు వృక్షములున్నయెడల ధన నాశనము కలుగుననీ ఉంది. కాని ధనవంతుల ఇళ్ళన్నింటిలోను గులాబీ అనే ముళ్ళచెట్లు పెంచుతున్నారు. మధ్యతరగతి బాదం, నిమ్మ, జామ, సపోటాలలో ఏదో ఒక పండ్ల చెట్టు వుంటోంది. అనేక ప్రాంతాలలో ప్రతి ఇంటా బొప్పాయి, పనసవంటి పాలుగారే చెట్లు ఉంటున్నాయి. ఆ గృహాలలో ధననాశనం గానీ, సంతాన నాశనంగానీ ఉంటుందా? అంతే కాదు గులాబీలాంటి చెట్లు పేదల గృహాలలో కనిపంచవు. అంటె వాస్తు బద్ధంగా ఉంటే ద్రవ్యనాశం ఉంటుందన్నమాట. ఇక వాస్తుకు విలువెందుకీయాలి? అని ప్రశ్నించాను. తతత ఛ2ై లప
“అవును. వాస్తుబద్ధంగా ఉంటేనే ద్రవ్యనాశమయ్యేటట్లుంది” నవ్వాడు అప్పారావు.
“ఇంకోక ముఖ్యమైన అంశం చెబుతాను విను. ఇది కూడా కనీసం లక్ష ఇళ్ళకు సంబంధించినదే”
“చెప్పు” ఆసక్తిగా అడిగాడు అప్పారావు.
ఇళ్ళకు పై అంతస్తులు నిర్మించేటప్పుడు “బృహత్సంహిత ద్వాదశ భాగేనోవోభూమే భూమే సమసానాం” అని చెబుతోంది. అంటే క్రింది భాగము ఎత్తులో దాని యొక్క పన్నెండవ వంతును తీసివేయగా ఎంత అగునో, అంత ఎత్తులో మాత్రమే అంతస్తును వేయవలెను. ఈ ప్రకారముగనే మూడవ అంతస్తు యొక్క ఎత్తు తగ్గవలెను. ఆపై అంతస్తులకు గూడ ఇదే నియమము వొటించవలెను. ఈనాడు 10 అంతస్తుల బిల్టింగ్ అయినా క్రింది అంతస్తు ఎత్తులోనే పై అంతస్తులు లేపుతున్నారు. ఇక్కడ మెడ అయినా పై వాస్తు సూత్రం ప్రకారం కట్టబడి ఉందా? లేదే? అయినా ఆ గృహాల యజమానులు లక్షాధికారుల నుంది కోటీశ్వరుల స్థాయికి, అక్కడ నుంది శతకోటీశ్వరుల న్ధాయికి ఎదుగుతున్నారే? వారికి వాస్తు దోష ఫలితం అంటడంలేదు గదా? మరి ఇంకా వాస్తును ఎందుకు నమ్మాలి. వాస్తు విరుద్ధమైన భూమిలో ఇల్లు కట్టుకొని సుఖపడుతున్న కోట్లాలది మందిని చూచి గూడ నుయ్యి, పొయ్యిల లాంటి చిన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఎందుకీయాలి?”
“నీవు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాంతారావ్! ఇన్ని లక్షల కుటుంబాల వారు వాస్తు విరుద్ధమైన గృహాలలో ఉంటున్నా, అపకారమేమి జరుగలేదని నిరూపించాక ఇంకా వాస్తును నమ్ముతానా? చక్కని గాలి, వెలుతురు వచ్చి రీతిలో ఆక్కిటెక్సృరల్ ఇంజనీరు డిజైన్ చేసిన ఇంటిని కొనడమో, కట్టడమో చేస్తాను”
“మంచిది అప్పారావ్, ఒక మిత్రుడు చెప్పినట్లు ప్రస్తుతం మన రాష్ట్రంలో “లేనివాడు పస్తులతో చస్తుంటే ఉన్నవాడు వాస్తుతో అవస్థలు పడుతున్నాడు.” గృహ యజమానులందరిలో నీలాంటి మార్చే రావాలని ఆశిస్తున్నాను. ” లలల ధవ పా
బాణామీతి బంఢారీల
“పిల్లలూ! ఈరోజు ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. దాన్ని మీకు వివరిస్తాను వింటారా!” ప్రశ్నించారు విశ్వం మాస్టారు.
“వింటాం! మాస్టారూ!” పిల్లలందరూ పెద్దగా అరిచారు.
“మీ కష్టడిలో ఉన్న వ్యక్తులను మా కప్పగించండి. మెం వాళ్ళను చంపుతాం అని ఎవరైనా పోలీసులనే అడగటం మీరెప్పుడైనా విన్నారా?”
“అమ్మో అడగడమే? పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టరూ?” భయంగా అన్నాడు సుబ్బారావు.
నిజమె కాని కొన్ని రోజుల (క్రితం అలాంటి సంఘటన నిజంగా జరిగింది అన్నారు మాస్టారు. “ఎప్పుడు మాస్టారూ! ఎక్కడ?” ప్రశ్నలు కురిపించాడు యాదగిరి. “చెబుతా చెబుతా. ఈ సంఘటన 2002వ సంవత్సరం జులైలో జరిగింది. ఒక రోజున నల్గొండ జిల్లా చిట్యాల పోలీసు స్టేషన్ ముందు దాదాపు వెయ్యి మంది నిలబడి రాస్తారోకో చేస్తున్నారు. వాళ్ళంతా చిట్యాల మండలం శివనేనిగూడెం వాళ్ళు. ఆ పోలీసు స్టేషన్ ముందు రాస్తారోకో చెస్తున్నందువలన రోడ్ మీద ట్రాఫిక్ జాంఅయ్యింది. కిలోమీటరు దూరం వరకు బస్సులు, లారీలు, జీపులు అన్నీ వాహనాలు ఆగిపోయాయి. వాళ్లలో పోలీసు స్టేషనుకు దగ్గరగా ఆగిన బస్సుల్లో వాళ్ళకు ఆ గ్రామస్తుల కేకలు వినబడుతున్నై. ఒక బస్సులో నేనున్నాను. “వాళ్ళను మా కప్పగించండి. మేము వాళ్ళని చంపాలి” అని వాళ్ళు అరుస్తుంటే, అదీ పోలీసు స్టేషను ముందు, మాకు ఆశ్చర్యం, భయం కలిగింది. బస్సు దగ్గరలో ఉన్న పోలీసు కానిస్టెబుల్‌ని పిలిచి విషయం ఏమిటిని అడిగాము. అతను చెప్పిందేమిటంటే...
క్రితంరోజు రాత్రి ఎస్.ఐగారు, కానిస్టేబిళ్ళు విధి నిర్వహణలో వున్నారు. ఇంతలో ఫోను మోగింది. అది శివనేని గూడెం నుండి వచ్చింది. ఆ గ్రామంలో ఆరుగురిని కొద్ది నిమిషాల్లో గ్రామస్తులందరూ కలిసి సజీవదహనం చెయ పం ఈడ లా
బోతున్నారనీ, త్వరగా వచ్చి ఆ అమాయకుల ప్రాణాలు కాపాదమనీ ఆ ఫోను సారాంశం. వెంటనే ఎస్.ఐ గారు సిబ్బందితో ఆ [గ్రామానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఊరివారంతా గుమిగూడి ఉన్నారు. అక్కడి చెట్లకు ఆరుగురిని కట్టెశారు. అందులో ఇద్దరు ఆడవాళ్ళు. వారందరి చుట్లు కట్టెలు పెర్పారు. వాటి మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. మంటు అపుడే పైకి వస్తున్నాయి. సరిగ్గా ఆ టైంలో పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. వెంటనే మంటలను ఆర్పి చెట్లకు కట్టి ఉన్న వాళ్ళను విడిపించి స్టేషనుకు తీసుకు వచ్చారు. పోలీసు బృందం కొద్ది నిముషాలు ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఆ ఆరుగురు సజీవ దహనమై పోయేవారు”
ఒక్కనిముషం నిశ్శబ్దం
“ఏమిటీ దారుణ సంఘటన? ఎందుకీ అమానుష హింసాకాండ?” మరల మాస్తారు కొనసాగించారు. “శివనేనిగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం వరుసగా నలుగురు పిల్లలు చనిపోయారు. ఈవిధంగా వరుసగా పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? అని ఊరంతా అనుకోసాగింది. ఎవరో అనుమానం వెలిబుచ్చారు. ఇది బాణామతి చర్య అని, గ్రామంలో ఎవరో పిల్లలపై బాణామతి ప్రయోగంచేసి చంపేస్తున్నారని. అంతే! గ్రామంలో మాదిగ కులం, యాదవ కులాలకు చెంది, పూజలు చేసుకుంటున్న ఆరుగురు వ్యక్తుల మీదకు అనుమానం మళ్ళింది. వెంటనె ఆ ఆరుగురిని ఊరివారంతా పట్టుకున్నారు. అందరూకలసి వాళ్లను కర్రలతో, చెప్పులతో కొట్టుకుంటూ ఊరి మధ్యకు తీసుకువచ్చి చెట్లకు కట్టారు” “వాళ్ళను చంపాలి! చంపకపోతే మనఊళ్లో పిల్లలు బతకరు. వీళ్ళు బాణామతి ప్రయోగం చేసి పిల్లలను చంపేస్తారు. అందుకని వీళ్లను చంపాల్సిందే” అని అరవడం ప్రారంభించారు. అలా అరుస్తున్న వారిలో చదువుకున్నవారు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్లపై కిరోసిన్ పోసి తగుల బెట్టంతలో పోలీసులు వచ్చి వాళ్లను కాపాడి తీసుకుపోయారు”
“పిల్లలపై బాణామతి ప్రయోగం అంటున్నారు. అసలు బాణామతి అంటె ఏమిటి మాస్టారూ!” మధ్యలో కల్పించుకొని అడిగాడు చందు.
“మంచి ప్రశ్న వేశావు చందు! బాణామతి అంటే కొన్ని క్షుద్రశక్తులను సాధించి, వాటి సహాయంతో ఎవరికైనా హాని కలిగించే విద్య అనీ, మరికొన్ని క్షుద్రశక్తుల సహాయంతో ఆ హానికి విరుగుడు చేయడం అనేదికూడా ఆ విద్యలో న చ.
భాగమని అమాయక ప్రజలు నమ్ముతున్నారు. ఈ విద్యనే తెలంగాణాలో బాణామతి అనీ, దక్షిణాంధ్రలో చేతబడనీ, ఉత్తరాంధ్రలో చిల్లంగనీ, హిందీలో బాన్మతని పిలుస్తారు. ఇందాక చెప్పానే, ఆ గ్రామంలో ప్రజలందరూ, ఆరుగురు వ్యక్తులకు క్ష్మద్ర విద్య వచ్చనీ, వారు ఆ విద్య సహాయంతో పిల్లలను చంపుతున్నారసీ నమ్ముతున్నారన్నమాట”
“మరి ఆ విద్యను ఎలా నేర్చుకుంటారు! ” అడిగాడు బాలయ్య,
“బాణామతి విద్యను నేర్చుకోవాలంటే, నేర్చుకునే వ్యక్తికేకాదు, నేర్పే వ్యక్తికి కూడా ఎదుటీవ్యక్తికి నేర్పాలనె ఆసక్తి ఉండాలట. ఆ విద్య నేర్చుకోవడానికి, అంటే బాణామతి శక్తిని లొంగదీసుకోవడానికి నేర్చుకొనే వ్యక్తి కొన్ని కఠినమైన పనులు చేయవలసి ఉంటుందిట. ఎముకలు కొరికే చల్లని నీటిలో గొంతు వరకు మునిగి, అలాగే కొంతసేపు ఉండాలి, తాను విసర్జించిన మల, మూత్రా లను తానే సేకరించి పెట్టుకోవాలి, ఆ తర్వాత జంతుబలులు చేస్తూ గురువు నుండి శిష్యుడు ఆ మంత్రాలు నేర్చుకోవాలి”
“బాణామతి ఎలా ప్రయోగిసారు?” అడిగాడు మూర్తి.
“ఈ విద్య నేర్చుకున్న వాళ్ల నమ్మకమేమంటే 64 రకాల కలపలుంటా యనీ, ఒకొక్కరకం కలప ఒక్కొచెడు ఫలితాన్నిస్తుందనీ నమ్ముతారు. ఏ రకమైన హాని తలపెడతే ఆ రకం కలప బొమ్మను సెలెక్టు చేసుకుంటారు. బాణామతిని ఎవరిమీద ప్రయోగించాలని అనుకుంటున్నారో, ఆ వ్యక్తికి సంబంధించిన గోళ్ళు, వెంట్రుకలుగానీ, విడిచిన గుడ్డలో చిన్న ముక్కగానీ, చివరకు అవేమి దొరక్కపోతే ఆ వ్యక్తి నడిచిన తర్వాత కాళ్ళ క్రింది మట్టికాని సేకరిస్తారు. అమావాస్య నాడు ఆ బొమ్మను స్మశానానికి తీసుకువెళ్ళి పసుపు కుంకుమలతో అక్కడ చతుర్భుజాకారంలోగాని, వృత్తాకారంలోగానీ ఓ ముగ్గు గీస్తారు. దానిలో ఇలా రాస్తారు” అని మాస్తారు నల్లబల్లపై ఈ క్రింది విధంగా వ్రానారు.
పరాయ. కం ఓం గం య యం గం రిరిరి౦ వా ఈ లలా
తర్వాత తాము తెచ్చిన బొమ్మకు,తమ శత్రువు యొక్క గోళ్తులాంటివి కడతారు. ఆ బొమ్మను ముగ్గు మధ్య భాగంలో ఉంచుతారు. “ఓం హ్రీం హ్రీం శ్రీంరం ఊం త్రూం ప్టిం” అంటూ కొన్ని మంత్రాలు చదివితే బాణామతి శక్తి ఆ బొమ్మపైకి వస్తుందని నమ్ముతారు. తర్వాత హాని చేయదలచిన వ్యక్తి గొంతు నొప్పితో చనిపోవాలనుకుంటున్నాడనుకోండి. అప్పుడు మంత్రాలు చదువుతూ ఆ బొమ్మ గొంతులో సూది గుచ్చుతారు. లేకపోతే పొట్టలో గుచ్చితే కడుపులో భరించలేని నొప్పితో చచ్చివోతాదని వాళ్ళ నమ్మకం.
పిచ్చివాడు కావడానికి, శరీరం మీద వాపులు కల్పించడానికి, లైంగిక శక్తి సన్నగిల్లడానికి రకరకాల పనులు చేస్తారని అమాయక ప్రజల నమ్మకం.”
“నమ్మకం, నమ్మకం అంటున్నారు అది కేవలం నమ్మకమేనా? ఆ విద్య నిజంగా లేదా?” అద్దువచ్చాడు ఉదయ్.
“వట్ట నమ్మకమేకాదు, మూధనమ్మకం కూడ. అది వివరించడానికే నేను ఒక గ్రామంలో జరిగిన సంఘటన వివరించాను. అసలు సైన్సు ప్రకారం ఒక బొమ్మను సూదితో గుచ్చితే దానికి ఒక వ్యక్తి యొక్క గోళ్ళో, వెంట్రుకలో కట్టినంత మాత్రాన ఆ వ్యక్తికి సూదిగుచ్చిన బాధ కలుగుతుందని ఎలా అను కుంటున్నారు. సైన్సు ప్రయోగాలలో ఎప్పుడైనా, ఏదేశంలోనైనా ఇది నిరూపించ బడిందా? ఇది మూధనమ్మకమని వీరేశలింగం పంతులుగారు ఏనాడో నిరూపించారు. ఆయన జీవితంలోని ఒక సంఘటనలను వివరిసాను వినండి.
గమ్ దల్బణ మూ సుదువ్రువు డబుజ రో గ్గ ( అండ నరా లో పాం ఈం లతా
కందుకూరి వారు వితంతు పునర్వివాహాలు చాల చేయించి, ఆనాటి సాంఘిక దురాచారానికి వ్యతిరెకంగా పోరాదారని మీకు తెలుసుగదా? అందు వలన ఆ మూఢాచారాన్ని కొనసాగించాలని కోరుకున్న ఛాందసవాదులు ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి చెతబడి చేసి చంపాలను కున్నారు. క్షుద్ర మాంత్రికుడుగా చెలామణి అవుతున్న ఒక వ్యక్తిని రాజమండ్రి తీసుకువచ్చారు. వీరేశలింగంగారి వెంట్రుకలు సేకరించారు. ఇంకేముంది? మాంత్రికుడు మంత్రాలు చదివి, హంగామా చేసి “విరేశలింగంపై చేతబడి చేశాను. అతను త్వరలో వాంతులు, విరోచనాలతో చసాడు” అని ప్రకటించాడు. వీరేశలింగంగారి పీడ విరగడౌతుందనే ఆనందం పట్టలేక ఒక చాందసుడు ఆయన దగ్గరకు వచ్చి “నీవింక వాంతులు, విరోచనాలతో చచ్చిపోతావు! నీకు చెతబడి చేయించా” అని అన్నాడు. వీరేశలింగం గారికీ నమ్మకాలేవి లేవ. ఆయన నవ్వుతూ “నెను వాడికి ప్రతి చేతబడి చేశాను. వాడే వారంలో వాంతులు, విరోచనాలతో చచ్చిపోతాడు” అని ఎగతాళిగా అన్నాడు.
అవి వర్షాకాలం రోజులు. గోదావరిలో వరదనీరు, బురదనీరు త్రాగిన కారణంగా వాడికి నిజంగానె కలుషిత నీరువలన విరోచనాలు, వాంతులు పట్టుకున్నాయి. వాడికీ, మిగిలిన ఛాందసులుకి విపరీతంగా భయం పట్టుకుంది. వీరేశలింగం మహా మాంత్రికుడనీ, అతను తమ చేతబడికి, ప్రతిచేతబడి చేశాడనీ ఇకముందు మాంత్రికుడు మందులు వేసుకోనందువలనా, కలుషిత నీరు మరిన్ని త్రాగడం వలనా విరోచనాలు మరింత పెరిగినాయి. గాభరాపడి వీరెశలింగం గారి వద్దకు పరిగెత్తుకు వచ్చి, కాళ్ళపై బడి తనను రక్షించమని కోరాడు. వీరేశలింగంగారు తాను మాంత్రికుడు కాననీ, ఎవరైనా డాక్టరు వద్దకు త్వరగా వెళ్ళమనసీ ఎంత చెప్పినా వినలేదు. చివరకు వీరేశలింగంగారు తన శిష్యుల సహాయంతో ఆ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రికి చెర్చి, సెలైన్లు కల్టంచి, మందులు ఇప్పించిన తర్వాత అతని విరోచనాలు తగ్గాయి.
ఈ సంఘటనతో రాజమండ్రిలో చాలామంది చేతబడులు, చిల్లంగుల బాణామతులు మూధనమ్మకాలు మాత్రమెనని అర్ధం చేసుకున్నారు” అని ముగిం చారు మాస్తారు. “మరి నల్గొండ జిల్లా శివనెనిగూడంలో ప్రజల మూధనమ్మకాలు పోగొట్టడానికి, ఎవరూ, ఏమీ చేయలేదా మాస్తారూ?” అడిగింది శాంతి.
“చేశారమ్మా! జనవిజ్ఞానవదిక వాళ్ళు చాలా కృషి చేశారు. అక్కదేం
జరిగిందంటే ఆ ఆరుగురినీ బ్రతకనీయ కూడదన్సీ, విళ్ళు ఎప్పుడు, ఎక్కడ దొరికినా చంపేయాలని ఆ ఊరివారంతా ఎదురు చూడసాగారు. చివరకు మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా “ఇలాంటి వాళ్ళను బతకనీయ కూడదు” అని అనుకోనసాగారు. మండలం అంతా ఉద్రిక్తంగా ఉంది. పెద్ద శాంతి భద్రతల సమస్యగా మారింది. అప్పుడు ఎస్.ఐ గారు మండల పరిషత్ అధ్యక్షుడు జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీని సంప్రదించారు. వెంటనే జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీటి.రమేష్ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలతో చర్చించారు. చిట్వాల మండలంలోని యువకులకు ఒక వర్క్‌షాపు నిర్వహించి బాణామతి ఒక మూధఢనమ్మకమని, పిల్లలు చనిపోవడానికి కారణం విషజ్వరాలనీ, వాళ్ళు వైద్యసహాయం లేక చనిపోయారని మూధనమ్మకాలను నమ్మవద్దసీ వివరించారు.
వర్క్‌షాపులో ప్రఖ్యాత హేతువారి శ్రీప్రేమానంద్ రెండు రోజులు పాల్గొ న్నారు. చివరి రోజు సాయంత్రం చిట్యాలలోని ఉన్నత పాఠశాల మైదానంలో పెద్దఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ ప్రదర్శన గురించి 2,3 రోజులపాటు మండలంలోని ప్రతిగ్రామంలో ప్రచారం చేయబడింది. “బాణా మతి అబద్ధం-అమాయకులను చంపొద్దు” అని ఒక కటౌట్ వర్పాటు చేయ బడింది. ఈ (ప్రచారం కారణంగా దాదాపు ఏడువేలమంది ప్రదర్శనకు హాజ రయ్యారు. మంత్రతంత్రాలు లేవని బాణామతి, చేతబడి అనేవి లేవని, వాటి పేరుతో పేదలు తమ మధ్య వైషమ్యాలు పెట్టుకోవవద్దనీ చెప్పడం జరిగింది. దానిలో జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలే కాక, ప్రజలుకూడా పెద్ద ఎత్తున పాల్గొని నిపులపైన నడిచారు.
ఈ ప్రదర్శనలో (గేమానంద్, రమేష్ ఎస్.ఎస్. ఖాన్, చంద్రయ్యలు ఇంద్రజాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంతో ఆ మండల (ప్రజలు బాణామతిని గూర్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించారు. గ్రామాలలో ఉద్రిక్తతలు తగ్గాయి అని ముగించారు విశ్వం మాస్తారు. ఎలా రం తపా
బాణామతి బంధములు ఇ౪3టు యుంనునిక జబ్బుల కుదెటులు
అది కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని పడసవలి గ్రామం. ఆ గ్రామంలో అనేకమంది బాణామతి ప్రయోగం కారణంగా బాధలు పడుతు న్నారని పత్రికల్లో విపరీతంగా ప్రచారం వచ్చింది. దానిని పరిశోధించి నిజాన్ని వెలికితీయడానికి డాక్టర్ల బృందం ఒకటి ఆ గ్రామానికి వెళ్ళింది. వారు ఆ గ్రామానికి వెళ్ళగానే గ్రామస్తులంతా వాళ్ళచుట్టూ బిలబిలా మూగారు. బాణా మతి మంత్రాలకు ప్రతి మంత్రాలు వేసె వాళ్ళు “ఇంగ్లీషు చదువులు చదివిన వాళ్ళు కాబోలనుకున్నారు. వీళ్ళకేం మంత్రాలు వచ్చు” అని కొందరు చప్ప రించారు కూడా. అయినా కొంతమంది యువకులు బాణామతితో బాధింపబడు తున్నట్లుగా ప్రచారంలో ఉ న్నవాళ్ళని వాళ్ల ముందుకు తీసుకువచ్చారు. ముందుగా ఒక తొమ్మిదేళ్ళ కుర్రవాణ్ణి తీసుకు వచ్చారు. ఆ టీంలోని ఒక డాక్టరు అతనిని ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
డాక్టరు: నీవేం చదువుతున్నావు?
పిల్లవాడు; నాల్లవ తరగతి
డాక్టరు : సీ సమస్య ఏంటి?
పిల్లవాడు ; నా మీద ఎవరో బాణామతి చేశారు.
డాక్టరు: నీపై బాణామతి ప్రయోగం జరిగిందని ఎందుకను
కుంటున్నావు?
పిల్లవాడు: నేను ఇంటినుండి, పాఠశాలనుంచి గానీ బయటకు రాగానే ఇద్దరు వ్యక్తులు నన్ను ముందుకు నడవమని చెబుతారు. అలా వాళ్ళు చెప్పినంత దూరం ముందుకు వెళ్తూనే ఉంటాను. వాళ్ళు చెప్పడం ఆపివేయగానే స్పృహలో కొచ్చి ఇంటికి వస్తాను.
డాక్టరు: సీవు వారి మాటలు స్పష్టంగా వింటావా?
పిల్లవాడు: ఆ ! వారి మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తాయి.
డాక్టరు; ఎప్పటినుండి అలా వినిపిస్తున్నాయి?
పిల్లవాడు: ప్రక్కగ్రామంలో మేజిక్ చెస్తున్న ఇద్దరు వ్యక్తులు కొన్నాళ్ళ క్రితం నన్ను భయపెట్టారు. అప్పటినుండి.
తర్వాత ఆ డాక్టరు ఆ విద్యార్ధి స్నేహితులను పిలిపించి ఇలా అడిగాడు. ల టి తతా
డాక్టరు: ఈ అబ్బాయి ఏ విషయంలోనైనా అసంతృప్తి పడ్డట్లుగా మీతో చెప్పేవాడా?
ఒక పిల్లవాడు మందుకు వచ్చి ఇలా అన్నాడు. “మా రామప్ప చాలా తెలివిగల వాడండీ. క్లాసులో ఎప్పుడూ రెండో ర్యాంకో, మూదో ర్యాంకో తెచ్చుకుంటుండేవాడు. ఫస్వు ర్యాంకు ఎప్పుడూ రాలేదని బాధపడుతుందేవాడు.
అప్పుడు డాక్టరు ఆ కుర్రవాడి లక్షణాలన్నీ విశ్లేషించి ఇలా అన్నాడు.
“ఈ పిల్లవాడు చాల సెన్సిటివ్. చదువులో ఫస్టుర్యాంకు రాలేదని చాలా బాధపడుతుందేవాడు. దానికితోడు మెజీషియన్లు విపరీతంగా భయపెట్టారు. తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన భయాందోళనలు కలిసి ఈ పిల్లవాడిలో “హిస్టిరికల్ న్యూరోసిన్” అనే మానసిక వ్యాధికి కారణమైంది. దాని కారణంగా ఇద్దరు వ్యక్తులు తనకు ఏవో సూచనలిస్తున్నట్టు భ్రమ చెందుతున్నాడు. ఈ మానసిక వ్యాధి సాధారణంగా ్రీలలో, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీళ్ళు ఇతరుల అధిపత్యాన్ని ఎంత మాత్రం సహించలేరు. ఇతనికి మందులిస్తే మానసిక జబ్బు తగ్గి, ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తున్న భ్రమలు తగ్గి మామూలు మనిషి అవుతాడు.”
డాక్టరుగారు ఆ పిల్లవాడికి కొన్ని మందులు వ్రాసి, అవి విడవకుండా వాడమని తల్లిదండ్రులకు చెప్పాడు. తర్వాత దాక్టరుగారి ముందుకు 65సం॥ల ఓ అవ్వను తీసుకొచ్చారు. ఆఅవ్వలో కూడా 6నెలల నుంచి వింత ప్రవర్తన కనిపిస్తోందని ఆమె తనలో తానే మాట్లాడుకుంటోంది, ఏడుస్తోందనిచుట్టు ప్రక్కల వాళ్ళు అన్నారు.
డాక్టరుగారు ఆమెతో “అవ్వా! నీవెందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. ఆమె “అదుగో కొంతమంది నన్ను వెంబడిస్తున్నారు. నన్ను భయపెడు తున్నారు. వాళ్ళ మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అని అరవసాగింది. అంతలో గజగజ వణికి పోసాగింది. ఆమెను డాక్టర్‌గారు వివరంగా పరీక్ష చేశారు. ఆశ్చర్యం! ఆమెకు చెవుడు! మరి మాటలిెలా వినిపిస్తున్నాయి? డాక్టరుగారు ఇలా అన్నారు. “ఈమె పారాప్రేనియా అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నది. చెముడుతో బాధపడుతున్న వృద్ధులకు ఈ మానసిక జబ్బు వస్తుంది. వారు ఏవో స్పష్టంగా విన్నట్లుగా ఊహించుకుంటారు” డాక్టరుగారు ఆమెకు కూడ మందులిచ్చి క్రమం తప్పకుండా వాడితే ఆమె జబ్బు నయ మౌతుందని చెప్పారు.
తర్వాత గ్రామస్థులు ఆ బృందం ముందుకు ఒకముస్లీం యువకుణ్ణి పట్టు కొచ్చారు. అతను పనీపాట లేకుండా రోడ్లమీద తిరుగుతుంటాదనీ, రాత్రిళ్ళు కూడా నిద్రపోడనీ, అర్ధంపర్ధం లేకుండా తనలో తనే మాట్లాడు కుంటుంటాడనీ గ్రామస్థులు చెప్పారు. అంతేకాదు, ఏమీ అనకపోయినా కనిపించిన వాళ్ళని తిడు తుంటాదనీ, ప లత
బాణామతి ప్రయోగం జరిగిన తర్వాతే అతనిలా మారాడని వాళ్ళన్నారు.
డాక్టరుగారు అతనిని అలా ఎందుకు చేస్తున్నావని అడిగారు. దానికతను “ఎవరో ఒక ఆడ, మగ ఎపుడూ నాకేవెవో చెప్త్ప్తంటారు. వాళ్ల సలహా ప్రకారంగా నేను ప్రవర్తిస్తుంటాను” అన్నాడు.
డాక్టరుగారు అతనిని క్షుజ్జ్ఞంగా పరీక్షించి “ఇతనిది కూడా మానసిక జబ్బె, దీనిపేరు “షిజోఫ్రినియా” అన్నాడు.
“ఆ జబ్బు లక్షణాలేమిటండీ” మరో యువకుడు అడిగాడు.
ఈ మానసిక వ్యాధి సోకిన వారు సరిగ్గా ఆలోచించలేరు. విచక్షణ నశిస్తుంది. అనవసరమైన అపోహలు ఎక్కున అవుతాయి. పరస్పర విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఏవో వింటున్నట్లు, ఎవరినో చూస్తున్నట్లు భమలు-- బ్రాంతులుకు లోనవుతారు. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి మందులు వాడకపోతే వ్యాధితీవ్రమై, దినచర్యలు సైతం ఈరోగులు మరిచిపోతారు”.
“అయితే మా అబ్బాయికి కూడా మందులిస్తే నయమవుతుందా? బాణామతి ప్రయోగం కదా?” అని కుర్రవాడి తల్లిదండ్రులు ఆత్రంగా అడిగారు.
“తప్పకుండా నయమవుతుంది. బాణామతిని పారద్రోలడం పేరుతో క్షుద్ర వైద్యుల చుట్టూ తిరిగితే వ్యాధి ఇంకా ముదురుతుంది. .
“అయితే దయచేసి మా అబ్బాయికి కూడ మందులివ్వండి” అని డాక్టరు గారిని ఆ కుర్రవాడి తండ్రి వేడుకున్నాడు.
డాక్టరుగారు మందులు వ్రాసి యిచ్చి ఈ మందులు క్రమం తప్పకుండా చాలాకాలంవాటు వాడాలి. చాలామంది కొద్ది నెలలు వాడి వ్యాధి తగ్గిందనుకొని, డాక్టర్ల సలహా పట్టించుకోకుండా మానేస్తారు. తర్వాత వ్యాధి తిరగబెడుతుంది. అపుడు డాక్టర్ల వలన ఏమవుతుంది? అని చప్పరించెస్తారు. కొన్ని కొన్ని సందర్భా లలో అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండవు” అని చెప్పారు.
తర్వాత బాణామతి బాధితురాలుగా బావిస్తున్న ఓ పదహరేళ్ళ పడుచును తీసుకువచ్చారు. ఆమెకు ఆ మధ్యే పెళ్ళయింది. హఠాత్తుగా పొట్టమీద, చేతుల మీద నల్ల మచ్చలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోయింది. ఆ టీం దగ్గరకు రాగానే హఠాత్తుగా చేతులూపుతూ “ఇద్దరు పనిచేయాల - ఆరుగురు తినాల” అని అరవడం మొదలెట్టింది. ఆ టీంసభ్యులు ఆమెను తన ఇంటిలోనికి తీసుకు వెళ్ళి ఆ ఇంటివారిని, ఆమెను మెల్లమెల్లగా ప్రశ్నించగా ఆమెకు “హిస్టీరియా” అనే మానసిక జబ్బు న ల ల
వచ్చిందనీ, దాని కారణంగా ఆమెకు శారీరక బాధలు కల్గుతున్నట్లు అనిపిస్తుందనీ అర్ధం చేసుకున్నారు. ఆమె తన కోరికలు, బాధలు వ్యక్తపరచలెని స్థితిలో ఉంది. కాని మస్తిష్కంలో ఎక్కడో అవి ఆమెను తట్ట లేపడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇతరుల సానుభూతికి ప్రాకులాడటం ఆ జబ్బు ప్రత్యేక లక్షణం, గట్టిగా అరవడం, ఏద్వడం వంటివి సాధారణ లక్షణాలు.
అయితే ఆ జబ్బు ఆమెకు రావడానికి కారణమేమిటి? ఆమె కుటంబ పరిస్థితే దానికి కారణం. ఆమెది పెద్దకుటుంబం. కుటుంబంలో ఆరుగురు సభ్యులున్నారు. సంపాదన ఆమె భర్త ఒక్కడే చేస్తున్నాడు. ఇంటి చాకిరి అంతా ఆమె ఒక్కదానిమీదే పడింది. ఆ పరిస్థితిలో తన బాధ, తన కోరికలు ఎవరికీ చెప్పుకోలెని పరిస్థితి. అది తీవ్రమైన హిస్టీరియాకు దారితీసింది. ఆమె వంటిపై వచ్చిన మచ్చలను పరిక్షించి అవి ఒక రకం చెట్టు గింజల నుంచి వచ్చే నూనె శరిరం మీద పడితే అలాంటి మచ్చలువచ్చి, నొప్పి పుడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు కూడ డాక్టరుగారు మందులిచ్చి క్రమబద్దంగా వాడితే ఆమె వ్యాధి నయమౌతుందని చెవ్వారు.
ఈ మానసిక జబ్బులకు కారణం “న్యూరో ట్రాన్మిటార్స్” మెదడుకు చేరే నరాలలో న్యూరో ట్రాన్మిటార్స్ ఎక్కువ శాతం ఉంటే అలాంటివారు అతిగా ప్రవర్తిస్తారు. కోపాన్ని ఆపుకోలేరు. మనస్సుని శాంతంగా ఉంచుకోలేరు. అలాకాకుండా “న్యూరో ట్రాన్మిటార్స్” తక్కువ శాతంలో ఉంటే అన్ని విషయాల మీద అనాసక్తత, ఏదో కోల్పోయినట్లు ఎప్పుడూ దిగులుగా ఉండటం, అనవ సరంగా ఐదవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం చేసారు. కాని అమాయక (ప్రజలు శారీరక రోగాలు అంగీకరించినంత తేలికగా మానసిక రోగాలున్నాయని అంగీకరించరు. ఆ రోగాల బారినా పడ్డవాళ్ల విపరిత చేష్టలకు కారణం వారిపై ఎవరో బాణామతి ప్రయోగం చేయడమే అని నమ్ముతారు. పగలు పెంచు కుంటారు. మానవత్వం మరిచివోతారు. తమను, తమ చుట్టూ సమాజాన్ని భయంకర కష్టాలపాలు చెస్తారు. ఈ అమానుషత్వం నశించాలంటే బాణామతి వట్టి మూఢ నమ్మకమేనని, బాణామతి చేష్టలన్నీ మానసిక జబ్బులేననే ఆలోచన ప్రజలలో పెరగాలి. ఆ దిశగా ప్రభుత్వమూ, స్వచ్చంద సంస్థలూ తీవ్రంగా కృషి చేయాలి. ప చ
బూమిడాకు తోరణాలు ఆక్సిజన్ని అందిస్తాయా?” పాపయ్యశాప్రిగారింట్లో పెళ్ళికి వెళ్ళాను. భోజనాలైన తర్వాత మిత్రు లందరం ఒకచోట కూర్చోని మాట్లాడుకుంటున్నాము. చాలాకాలం తర్వాత కలుసుకున్నాము. గనుక సంభాషణలో చాలా విషయాలు దొర్లుతున్నాయి. “ఈ మామిడాకు తోరణాలు పందిరికి నిండుదన మిచ్చాయండీ. కాగితాల తోరణాలు ఎన్ని కట్టినా ఈ నిండుదనం రాదు” అన్నాడు బాబూరావు. “నిండుతనమే కాదండీ. ఈ మామిడాకులు మనం విడిచే కార్భన్ దయాక్సైద్ను పీల్చుకొని ఆక్సిజన్ అందించుతాయి” అన్నాడు వెంకయ్య. “ఈ విషయాన్ని పూర్తికులెప్పుడో తెలుసుకొనబట్టే ఈ ఏర్పాటు చెశారు. మన పూర్వికులు చాలాజ్ఞానులందిీ!” ఆయనను సమర్ధించాడు విద్యాసాగర్. బాటనీ లెక్సరర్ భాష్యంగారు నవ్వారు. “ఎందుకండీ నవ్వుతున్నారు?” అడిగాడు నరేంద్ర “ఏం లేదండీ! మామిడాకుతోరణాలు పందిరికి నిండుదనమిచ్చాయి. అంతవరకు అంగీకరిస్తున్నారు. అలంకారం కోసం పెట్టిన ఒక సంప్రదాయానికి, మన పూర్వికుల జ్ఞానానికీ ముడిపెదితే నవ్వు వచ్చింది. అన్నారు భాష్యంగారు. “అయితే మామిడాకు తోరణాలు ఆక్సిజన్‌ను అందించవా?” అడిగాడు విద్యాసాగర్. “అందించవు” అని దృఢంగా అన్నారు భాష్యంగారు “ఎందుకని? చెట్ల ఆకులు కార్భన్డయాక్షడును పీల్చుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను వదులుతాయని ఐ పదవ తరగతి విద్యార్థి నడిగినా చెబుతాడు గదా?” వెంకయ్య ప్రశ్న “చెట్లఆకులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను వదులు తాయి. ఎప్పుడు? చెట్లకున్నప్పుడు మాత్రమే. ఆ ప్రక్రియలో వెర్లనుండి స్ళ్ళం దాలి. ఆకులు గాలి పీల్చుకోగలగాలి. అప్పుడు ఆకులు కార్భన్దయాక్సెడ్ పీల్చుకొని, పై ప్రక్రియను జరిపి, ఆక్సిజన్‌ను వదులుతాయి. ఆకులను చెట్టు నుండి కోసివేసిన మరు నిముషము వాటికి నీళ్ళు అందవు. పైగా గాలిని పీల్చుకొనే శక్తిని కోల్పోతాయి. ఇక ఏం ప్రక్రియ జరుగుతుంది? ఆక్సిజన్ ఎందుకు వెలువడుతంది?” ప్రశ్నించాడు భాష్యంగారు. నిజమెనన్నట్లు తల పంకించారు మిత్రులందరూ వెంకయ్య, విద్యాసాగర్‌లతో సహా, భుక్తాయాసం తీరి మిత్రులందరం ఇళ్ళతోవపట్టాము. త చా
అడవాళ్లు కాళ్ళకు పసుపెందుకు రాసుకుంటారు.?
మన పూర్వీకులు చాలా మేధావులందీ! వాళ్ళకు చాలా విషయాలు తెలుసు” మార్నింగ్ వాక్ మధ్యలో మొదలెట్టాడు మధుసూధనరావు.
“ఏ విషయం మీరు మాట్లాడుతున్నారు” నేను అడిగాను.
“కాళ్ళకు పసుపు రాసుకొని, పుట్టలో పాలుపోయడానికి వెళ్తున్న ఆ ముత్తైదువలను చూడండి. వాళ్ళుకాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల ఉపయోగ మేమిటో తెలుసా? పసుపు యాంటీబయాటిక్. నీళ్లలో తిరిగినా, దుమ్ములో తిరిగినా పసుపు కాళ్ళకు రాసుకుంటే కాళ్ళకింది దుమ్ములోని సూక్ష్మక్రిములు శరీరంలోకి చేరకుండా ఉంటాయి. అది తెలుసుకున్న వాళ్లు, ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకోవాలని ఒక సాంప్రదాయం ఏర్పరిచారు”
“మరయితే ఎక్కువగా నీళ్ళలో తిరుగుతూ మాగాణి చేలల్లో పని చెసె వాళ్లకు ఈ సాంప్రదాయం ఎందుకు పెట్టలేదు. పూర్వకాలంలో విధవరాళ్లు వంటింటికే అతుక్కుపోయేవారు. నీళ్ళలో నాని, నాని కాళ్లు పాచిపట్టెవి. వాళ్ళ కాళ్ళకు పసుపు రాసుకోకూడదని ఎందుకని నిషేదించారు? వాళ్ళకాళ్లు పాచి పోయినా, అనారోగ్యం పాలైనా పర్వాలేదనా?” అడిగాడు వెంకట్రామయ్య.
మధుసూదనరావేం మాట్లాడలేదు. మెల్లగా నడకసాగించాడు.
“ఆ సాంప్రదాయం అలంకరణలోంచి వచ్చింది. ముత్తెదువులైన ఆడ వాళ్ళ అందంకోసం కాళ్ళకూ, ముఖానికీ పసుపు రాసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆడవాళ్లు ముఖానికి పసుపు పూసుకుంటారు. ఇతర క్రీములు అలవాటైన చోట్ల ముఖానికి పసుపు రాసుకోవడం తగ్గింది. అది అలంకారానికి సంబంధించిన విషయమెగాని, యాంటిబయాటిక్ విజ్ఞానా నికి సంబంధించిన విషయం కాదు. యాంటిబయాటిక్ల విజ్ఞానమే ఆనాటికి మన వాళ్లకుంటే శ్రామికులందరిని కాళ్ళకు పసుపు రాసుకోవడం సార్వత్రిక సంప్రదాయంగా తప్పనిసరిగా మార్చవాళ్లు” వివరించాడు వెంకట్రామయ్య.
అంగీకార సూచకంగా తలపంకించాడు మధుసూధనరావు. ఎవరి ఇళ్ళవైపు వాళ్ళు సాగివోయాం.
ల రన్ తతత
పిలకముది కరెంటును అవుతుందా? చాలా ఎళ్ళ[క్రితం రేడియోలో ఒక శిష్యుడు ఇలా ప్రశ్నించాడు. “గురువు గారూ! బ్రాహ్మణులు గుండుచేయించుకోని పిలకలు ధరిస్తారు గదా? ఎందుకు? ఆ ఆం... ఎవెలగటం లదేంటి 7 జప మ్మా . // శ గ న్ా గ క. శమోనన / [ న్ .(₹/తా ఖ తల, కవ ళ్ట ఎర దానికి గురువుగారి సమాధానం “నాయనా! మానవ శరీరంలో విద్యుత్ శక్తి ఉంటుంది. అది వెంట్రుకల ద్వారా బయటకు పోతుంది. అలా పోకుండా ఉండి, ఆ శక్తి మానవునికి ఉపయోగపడాలంటే తలమీద వెంట్రుకలను దాదాపు గొరిగి వెయాలి. కొద్ది పరిణామంలో వాటిని అట్టిపెట్టి ఆ వెంట్రుకల కొసలను ముడి వెస్తే శరీరంలోని విద్యుత్ శక్తి ఆముడి దగ్గర ఆగిపోతుంది. మానవునిలోని శక్తి పెరుగుతుంది. ఇది మన పూర్వులైన మహర్షులు కనుగొన్న సత్యమోయీ!” ఇది విన్న నాకు ఆశ్చర్యం వెసింది. ఎందుకంటే నేను ఒక ఎలక్టికల్ ఇంజనీరును. విద్యుత్తు తీగకు ఎన్ని ముడులు వేసినా, ఆ తీగలో ఈ కొస నుంది ఆ కొసకు విద్యుత్తు ప్రవహిస్తుందనీ, ముడుల దగ్గం సెకనులో 50వంతు సమయం కూడ ఆగదనీ, ఒక కొసను ప్లగ్గులో పెట్ట, రెండవ కొసను పట్టుకున్న షాకు కొడుతుందనీ నాకు తెలుసు. మరి ఈ “అజ్ఞానభరిత విజ్ఞాన ప్రచారాన్ని” ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలెదు. వవ రధ
ఆధునిక మూథ నమ్మకాలు
పిల్లలూ! శకునాలు, మంచిరోజులు, వర్వాలు, వారాలు వీటికీ మనం బయలుదేరిన పనికి సంబంధంలేదని తెలుసుకున్నాము గదా?
తుమ్ముకీ, మనం చేయాలనుకున్న పని జయాపజయాలకు ఏదో అలౌకిక సంబంధం ఉందను కోవడం మూధనమ్మకం.
విధవరాలు ఎదురైతే మనం తలపెట్టిన పని కాదను కోవడం మరో మూధనమ్మకం.
ఇవన్నీ చిన్నతనం నుండి నమ్మితే ఏమౌతుందో తెలుసా? మీరు పెద్దవారైన తర్వాత ఆధునిక ముధఢనమ్మకాలు “కని పెడతారు” ఉదాహరణకు ఇటీవల హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన సంఘటనను వివరిస్తాను.
ఒక బి.యే విద్యార్ధి ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాయడానికి కాలేజీకి వచ్చాడు. పరీక్షకింకా కొంచెం టైముంది. అందుకని ఆవరణలో ఒకచెట్టు క్రింద కూర్చొని ఆ కొద్దిసేపు చదువుకున్నాడు. పరీక్షకు వెళ్ళాడు. బాగా వ్రాశాడు. అంతే! అతనొక “సత్యాన్ని” కనుగున్నాడు. ఆ చెట్టు క్రింద కూర్చొని పది నిముషాలు చదువుకుంటే పరీక్ష బాగా నవ్రాస్తారని. కాబట్టి మరునాడు కూడ పరీక్షకు ముందు ఆ చెట్టు క్రింద కూర్చొని పది నిముషాలు చదువుకొని లోనికి వెళ్ళాడు. పరీక్ష బాగా వ్రాశాడు. అతని “నమ్మకం” గట్టిపడింది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2-80కి. మరునాడు అతను 2-25కి కాలేజికి వచ్చాడు. అయినా తాను కనుగొన్న మూఢనమ్మకం వెంటాడగా, ఆ చెట్టు క్రింద 5 నిముషాలు చదువుకొని బయలుదేరాడు. ఏమయింది? పరీక్ష హలులోకి అడుగు పెట్టక ముందే అరగంట బెల్ కొట్టేశారు. అతనిని ఆరోజు పరీక్షకు రానీయలేదు. ఫలితం? టోటల్‌గా పరీక్ష తప్పాడు. ఇది విద్యార్ధి లోకంలో కొంత ఆలోచనను పెంచింది.
కాబట్టి పిల్లికి, కుక్కకీ మన పరీక్షా ఫలితాన్ని ప్రభావితం చేసే శక్తి ఎలాగైతే లేదో, చెట్టుకీ, పుట్టకీ అలాగే ఉండదని తెలుసుకోండి. ఆధునిక మూధనమ్మకాలను సృష్టించే మేధావులుగా తయారుకాకంది.
సందర్భం వచ్చింది కాబట్టి మీకొక సంఘటన చెబుతాను. ఒకాయన ఒక విషయాన్ని పరిశోధన చేస్తున్నాడు. ఆయన పరిశోధానంశమేమిటో తెలుసా? “శవపేటిక ఏవెపున నడిస్తే మేలు? ఏవైపున నడిస్తే కీడు” అనే అంశం ఆయనతో కొంతమంది పండితులు శవపేటికకు కుడివైపున నడిస్తే మెలన్నారు. కొందరు “అనుభవజ్జులు” శవపేటిక ముందు నడిస్తే మేలన్నారు. ఇంకొందరు శ్రేయోభిలా షులు దానికి వెనుకనడిస్తే మలన్నారు.
ఆయన నజీరుద్దీన్ అనేవ్యక్తిని ఈ ప్రశ్చవేశాడు. నజీరుద్దిన్ మహామెధావి. ఇలాంటి ప్రశ్నలకు చురకల్లాంట సమాధానా లిచ్చేవాడు. ఆ మేధావి పై ప్రశ్నకు ఏమని సమాధాన మిచ్చాడో తెలుసా? “నాయనా! శవపెటికకు ఏవైపున పోయినా పర్వాలేదుగాని శవపేటికలో మాత్రం పోకూడదు అన్నాడు.
క్లాసులో పిల్లలంతా పెద్దగా నవ్వారు.
మాస్తారు కొనసాగించారు.
“కాబట్టీ పరిశోధనల పేరిట, స్వంత అనుభవాల పేరిట మీరు మరి కొన్ని మూఢనమ్మకాలు పొతవాటీికి చెర్చకంది.
“శ్రాప్రీయంగా ఆలోచించండి శాప్రీయ దృష్టి కలిగి ఉందండి. శాప్రీయ అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం ఒక అగ్రదేశంగా ఎదుగుతాం. మన విజ్ఞాన వీచికలతో ప్రపంచాన్ని పులకితం చేస్తాం. అలా మీ తరంలోనైనా చేయాలనేదే నా ఆకాంక్ష
“మీ కలలను నిజం చేస్తాం మాస్టారూ!” దృడంగా అన్నాడు. శ్రీను.
మిగిలిన విద్యార్థులందరూ దానికి అంగీకార సూచకంగా హర్షధ్వానాలు చేశారు. నం గట లలా
మూఢనమ్మకాలపై జనవిజ్ఞాన వేదిక జరిపిన మరికొన్ని సత్యళోధనలు బీనీరికీ పిచ్చి....? రచన: టి. రమేష్ బిందెల కొద్ది సళ్ళు తాగుతున్నారు
పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతున్నారు
పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తి విసిరెస్తున్నారు
మట్టిని తింటున్నారు
బట్టలు లేకుండా తిరుగుతున్నారు.
పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ ఊరిలో ఆడవాళ్లు విపరీతంగా ప్రవర్తిస్తు న్నారు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళ శరీరం మీద బట్టలు మాయమవుతున్నాయి. ఈ విధమైన వార్తలు ఒక రోజు వివిధ పత్రికల్లో వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని ఒక ఊరిలోని కొంతమంది మహిళలు పౌర్టమి రోజున ఈ విధంగా ్రవర్తిస్తు న్నారని, పౌర్ణమి వస్తుందంటే చాలు గ్రామస్తులు ఏం జరుగుతుందోనని వణికి పోతున్నారని పత్రికల్లో వార్తలు.
ఇలా ఆడవాళ్ళు పిచ్చిపట్టినట్లు ఎందుకు ప్రవర్తిస్తారు? ఇందుకు ఏమిటీ కారణాలు? మనమేం చేయాలి? జనవిజ్ఞాన వెదిక వాళ్ళం చర్చించుకొన్నా. దీనిని మాస్‌హిస్టీరియా అంటారని, వారికి ఒపికగా కౌన్సిలింగ్ చేసి, హాస్పిటల్‌కు పంపించాలని అనుకున్నాం. జిల్లా యంత్రాంగంతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళి అనేక విధాలుగా ఒపికగా వారి నచ్చచెప్పి చికిత్స చేయడం జరిగింది.
ఈ మాస్ హిస్టీరియా ఎందుకు వస్తుంది.? ముఖ్యంగా మహిళలే ఈ మాస్ హిస్టీరియాకు ఎందుకు గురవుతారు? అని ప్రశ్నలు వేసుకొని ఆ ఊరిలో హిస్టిరియాకు గురైన మహిళల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఆ కుటుంబం వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, హాస్పిటల్ సిబ్బందితో, బాధిత మహిళలతో అనేకసార్లు రకరకాల పద్ధతిలో చర్చలు జరివాము.
ఇది ఒకరకమైన మానసిక వ్యాధి. దీనిని వైధ్యపరిభాసలో హిప్టీరికల్ లవ రట తతత
న్యూరోసిస్ అంటారు. ఈ వ్యాధికి గురైన మహిళలు విపరితంగా ్రవర్తి స్తుంటారు. హిస్టీరికల్ న్యూరోసిస్ ఈ మహిళలకు ఎందుకు వచ్చింది? దాని వెనుక కారణాలు మా పరిశీలనలో తెలిసినవి. ముగ్గురు, నలుగురు మహిళలకు సంబంధించినవి పరిశీలిస్తే మహిళలే ఎక్కువగా ఈ హిస్టిరియాకు ఎందుకు గురవుతారో తెలుస్తుంది. ఒంటిమిద బట్టలు మాయం:
ఒకామె ఒంటిమీద (శరీరంమీద) బట్టలు ఉన్నట్టుండి మాయం అవు తున్నాయి. ఆమె దిగంబరంగా ఇంటిలో నుండి బయటకు పరుగెత్తుకు వస్తున్న దని అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె ఇంటికి వెళ్ళి పరిశీలించాం.
ఆమె పేరు మంగమ్మ. ఇంట్లో పెద్దవాళ్లు అంతా మంగి అని పిలుస్తారు. మా పరిశీలన తరువాత అర్ధమైందేమంటే ఆమె బట్టలు మాయం కావడం లేదని, ఆమె ఒక విధమైన మానసిక అచేతనావస్థలో తన బట్టలను తీసివెసి కేకలు వేస్తూ దిశమొలతో ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుతున్నదని. ఇది చిలువలు పలువలై వంటిమీద బట్టలు మాయమవుతున్నాయనేదిగా మారింది. ఎందుకు ఆమె ఈ విధంగా చేస్తున్నది? అని పరిశీలిద్ధాం?
ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళ అయింది. రజస్వల కాగానే అత్త వారింటికి తీసుకొచ్చారు. అప్పటికి ఆమెకు 15 ఏళ్ళు. ఆమెభర్తకు 18ఏళ్లు, వాళ్ళది పూరి గుడిసె. అందులోనే ఒకటిరెండు అరలు(గదులు) వాటికి అడ్డంగా తడికలు. ఎమూల కొద్దిగాగట్టిగా మాట్లాడుకున్నా ఇల్లంతా వినబడుతుంది.
చీకటి పడగానే మంగ ఇంటిపని అంతా ముగించుకొని తన అరలోకి వెళ్ళేది. అప్పటికే భర్త పడుకొని ఎదురుచూస్తుండేవాడు. తను తడికే అడ్డంగా పెట్టి వెళ్ళి పడుకునేది. బెరకు, బెరుకుగా సిగ్గుగా ఉండేది. తన మాటలు, శబ్ధాలు ఇంట్లోవాళ్ళకు వినబదడతాయని వీలైనంత మేరకు నిశ్శబ్దం పాటించేది.
ఆ ఇంట్లో వాళ్ళతో పాటు అత్త, మామ, మరిది ఉండేవారు. మరిది వయసు 16సం॥లు. ఇంటర్ చదువుతున్నాడు. వయసులో తనకన్నా పెద్ద. వరుసకు మరిది. తన భర్తేమో వ్యవసాయం చేస్తున్నాడు. మరిదేమో చదువు తున్నాడు. ఆ ఇంట్లో చదువుకునేవాడు అతనే కాబట్టి అందరూ ప్రేమగా గౌరవంగా చూసేవారు. తా పం
ఇతనికి రాత్రికి రాగానే తాను చూసిన సినిమాలు గురొచ్చివి. చిన్నగా తడికె చాటుగా ఉండి ఆ గదిలో ఏమి జరుగుతుందా అని వినేవాడు. చూడటా నికి ప్రయత్నించెవాడు. పొద్దునె ఎవరూ ఇంట్లో లేని సందర్భంలో వదినా అని పిలిచి రాత్రి మాటలను చెప్పి వేధిస్తుందేవాడు. చివరకు రాత్రి అయిందంటే చాలు మంగకి బిడియంగా, సిగ్గుగా ఉండేది. భర్త గదిలోకి వెళ్ళాలనిపించేది కాదు. కానీ భయంతో మొగుడు పిలవగానే వెళ్ళేది. బయట ఎవరో చూస్తున్నా రని, వింటున్నారని చాలా సిగ్గుగా బెదురుగా ఉందేది. కానీ తప్పదు.
ఒకసారి ధైర్యంచేసి మొగుడుకి చెప్పాలని ప్రయత్నించింది. కానీ మా తమ్ముడి గురించి ఇంకెప్పుడు తప్పుడుగా మాట్లాడకు అని గద్దించాడు. వాపం మంగ ముఖం చిన్నబోయింది. ఇది విన్న మరిది మరుసటి రోజునుండి మరీ రెచ్చిపోయాడు. పొద్దున్నె స్నానం చెస్తుంటే చూడటం, రకరకాలుగా వేధించే వాడు. మరిది అది చూశాను ఇది చూశాను అని అంగాంగాన్ని వరన చేసేవాడు. ఆ వేధింపులతో మంగ తనలో తాను కుమిలిపోయేది. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. చివరకు హిస్టీరికల్ న్యూరోసిస్కు గురైంది. దానితో ఒక్కొక్కసారి ఉ న్మాద స్థితిలోకి వెళ్ళేది. తాను ఏం చేస్తున్నదో తనకు తెలియకుండానే చేసేది. ఇంకా చూడటానికి నా దగ్గర ఏం ఉన్నది? ఏమి చూసుకుంటావో చూసుకో అని తనని విధిస్తున్న మరిదిని దిక్కరిస్తున్నట్టు బట్టలు విప్పి పరిగెల్తేది. మట్టి తినడం:
మట్టీ, ఇసుక తింటున్న ఒక మహిళను పరిశీలించాం. ఆమె గురించి తెలుసుకున్నాం. ఆమె మొగుడు పెద్ద అనుమానం పిశాచం. ఎవరితో మాట్లాడినా అనుమానిసాడు. నిరంతరం చిత్రహింసలకు గురి చేసేవాడు. “అనుమానం పెనురోగం” అని అనుమానం బాగా ముదిరినప్పుడు అన్నం పెట్టకుండా ఉప వాసం ఉంచేవాడు. ఆకలి, ఆకలి అని బతిమిలాడితే తినే అన్నంలో ఉప్పువేసి ఇక తిను అని కోపంగా అరిచేవాడు. ఈ రకమైన చిత్రహింసలకు గురైన ఆమె తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. దానితో హిస్టిరికల్ న్యూరోసిస్కు గురైంది. తాను అప్పుడప్పుడు ట్రాన్స్‌లోకి వెళ్ళేది. ఆ ట్రాన్స్‌లో తాను ఎలాగూ తినేది మట్టితో సమానం కదా అనుకుని మట్టిని, ఇసుకను తినెది. మెట్టెలు నోట్లో పెట్టుకుని ఊయడం:
మరోకామె కాలికున్న మెట్టెలను తీసి నోట్లో పెట్టుకుని ఉమ్మివేసెది. తం పిల తతా
ఇలా తిరిగి తిరిగి చేసేది. ఎందుకిలా చేస్తున్నదని తెలుసుకుంటే ఆమెకు కొత్తగా పెళ్లెంది. పెళ్ళి కాకముందు తమ ఊరిలో తనకు ఏది కావాలంటే అది దొరికేది, ఏది తినాలనుకుంటే అది తినేది. తోటి పిల్లలతో ఆడుకునేది. ఏపని చేయాలని పిస్తే ఆ పని చేసేది. చిన్న వయసులోనే పెళ్ళి అయింది. అత్తవారింటికి వెళ్లింది. అన్నీ బంద్ అయ్యాయి. తన ఇష్టాఇష్టాలన్నీ నిరోధించబడ్డాయి. తను మర మనిషిలా మారిపోయింది. తన ఆలోచనలు, బాధలు తనలోనే ఉంచుకొని కుళ్ళిపోయేది. తన అభిరుచులకు వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వచ్చెది. తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తన ఈ కప్పాలన్నింటికి కారణం పెళ్ళికావడము. అంతకుముందు బాగానే ఉండేది అనుకునేది. దానితో పెళ్ళిమీద కోపం కట్టలు తెంచుకునేది. పెళ్లిని అసహ్వించుకునేది. ఆ అసహ్యంతో, కోపంతో మెట్టెలను నోట్లో ఉంచుకుని ఉమ్మేసేది. తను ట్రాన్స్‌లో ఉండగా తనకు తెలియకుండానే ఇలా చేసేది. తన కోపాన్ని ట్రాన్స్లోనె తీర్చుకునేది. రజనీ ఘటన:
రజనీకి చిన్నప్పటి నుండి క్రికెట్ ప్లేయర్ కావాలని ఉండేది. టీవిలో క్రికెట్ చూసినప్పుడల్లా తాను అలా బ్యాట్ తీసుకొని బంతిని బాగా కొట్టాలని, సిక్సర్లు, ఫోర్లు కొట్టాలని ఉబలాటపడేది. తనొక పెద్ద క్రీడాకారిణి అయినట్లు అందరూ టి.విలో తనను చూసి చప్పట్లు కొడుతున్నట్లు అభినందిస్తున్నట్లు కలలు కనేది. తమ ఊరిలో మగ పిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు తాను వెళ్ళి వాళ్లతో కలిసి ఆడేది. ఇది వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి రజనీని బాగా కోప్పడ్డారు. మగరాయుడ్డా ఏమిటా ఆటలు? నీవు ఆడపిల్లవు గుర్తుంచుకో పెళ్ళయి అత్త వారింటికి వెళ్ళాల్సిన దానివి. వంటా,వార్చు నేర్చుకో ఈ ఆటలు మానుకోమని తిట్టారు. రజనీ ఏడుస్తూ వెళ్ళిపోయింది. రోజు ఏడుస్తూనే ఉండెది.
క్రిఆట్ ఆదే మగపిల్లలను చూసి తాను ఎందుకని వారిలా ఆడలేదు. తన కోరిక తీరే అవకాశం లేదా? అని నిరంతరం బాధపడేది. ఇంతలో తాను బాలికగా ఉండగానే పెళ్ళి జరిగిపోయింది. తాను తన ఆశలను, కలలను చంపుకొని ఇంకొకరి కోరికలు తీర్చ యంత్రంలాగా మారిపోవాలని తెలియ వచ్చింది. తాను ఆడపిల్లగా పుట్టడం తన వాపమా? శాపమా? అని నిరంతరం మధనపడేది. తాను ఇల్లాలిగా, కోడలుగా, తల్లిగా మారాల్సిందే కాని తన ఆశలకనుగుణంగా క్రీడాకారిణి మాత్రం కాలేను అని దిగాలుగా ఆలోచించేది. తన ఆశలు, కలలు, భావాలు అన్నీ అణగద్రొక్కృబడినవని బాధపడేది. ఈ లం బి2 తా
విధమైన నిరంతర బాధతో హిస్టీరికల్ న్యూరోసిస్కు గురైంది. మల్లమ్మ ఘటన:
మల్లమ్మ చిన్నప్పుడే పెళ్ళి అయింది. తనకు 19 ఏళ్ళు వచ్చెసరికి ఒక యాక్సిడెంట్లో మొగుడు చనిపోయాడు. అప్పటి నుండి తాను ఒంటరిగానే బతుకిదుస్తున్నది. చుట్టూ ఉన్నవాళ్ళు చేసే అనేకకామెంట్లు మౌనంగానే భరిస్తు న్నది. కూలీకివెళ్లిన దగ్గర మేస్త్రీ వేధింపులకు గురిచేసేవాడు. తనకు ఉంపుడు గత్తెగా ఉండమని బెదిరించేవాడు. అతనేకాక ఇంకా ఒకరిద్దరు మగవాళ్లు కూడా వేధిసూనే ఉండేవారు. మరోవైపు తనకు ఇంకొకతనికి అక్రమ సంబంధం అంటగట్ట పుకార్లు ప్రచారం జరిగేది. వీటన్నిటితో మానసికంగా కుంగిపోయేది. కానీ తిండికోసం కూలీ చేయక తప్పేదికాదు. తాను ఏ పాపం చేయకున్నా ఎందుకు ఈ విధంగా జరుగుతోంది. ఒంటరి ఆడదాని జీవితం నరకమేనా? నాకు చావు తప్ప పరిష్కారం లేదా అని నిరంతర ఆలోచనలతో మానసిక క్షోభకు గురైంది. హిస్టీరికల్ న్యూరోసిస్ బారిన పడింది.
ఈ ఘటనలు పరిశీలించిన తరువాత ఎక్కువగా మహిళలే ఎందుకు గురవుతారో అర్ధం చేసుకోవచ్చు. సమాజం మహిళల పట్ల వివక్షత చూపు తున్నది. అన్ని రకాలుగా అణచివేస్తున్నది. లైంగిక వేధింపులకు గుర చెస్తున్నది. మహిళలు సామాజిక అభద్రతకు గురవుతున్నారు. వీటి ఫలితంగానే మహిళలు హిప్టీరియాకు గురవుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఒక్కొకరికి ఓపికగా కౌన్సిలింగ్ చేసి, మానసిక చికిత్స జరిపి వారికి స్వాంతన చేకూర్చవచ్చు. సమస్య వారి వరకు పరివారం కావచ్చు. కాని మరో రోజు మరో దగ్గర వేరేవారు గురవుతూనె ఉ ౦టారు. ఇది శాశ్వతంగా రూపుమాప బడాలంటే సమాజానికి చికిత్స జరగాలి. మహిళలకు కూడా మనసు ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ఆశలు, ఆశయాలు ఉంటాయని గుర్తించాలి. వాటిని తీర్చుకునే అవకాశాలు కల్పించబడాలి. వాటీని అణచివేసే ప్రయత్నాలు అవాలి. మహిళలు ఇతరుల కోసం జీవించడం కాదు. వారి కోసం వారు జీవించాలి.
మహిళలను వేధించడం ఆపాలి. వారిపట్ల అపోహలను కలిగించే విధంగా ఎవరూ మాట్లాడరాదు. పుకార్లను అసలు ప్రచారం చేయరాదు. వారికి సామాజిక భద్రత కల్పించాలి. ఇందుకోసం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకనుగుణంగా మారాలి.
గుప్తే నిధులక్షోనీం?
రచన: కె.ఎల్ కాంతారావు అది అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రమైన తనకల్లు గ్రామం. ఆ (గ్రామంలో 2008వ సంవత్సరం ఎండాకాలంలో వింత వింత చర్యలు జరగడం మొదలైనాయి. హటాత్తుగా గుడిసెలు కాలిపోవడం, ఆకాశం నుండి రాళ్ళు పడటం, ఇంటిముందు ఆరవేసిన బట్టలు కాలిపోవడం మొదలైన “విచిత్రాలూ జరగసాగాయి. ఈ చర్యలన్నీ “దయ్యాల చేష్టలూగా (గ్రామ (ప్రజలు భావించనాగారు. పై విచిత్ర చర్యలను అన్ని ప్రముఖ పత్రికలూ ప్రచురించాయి. వార్తలకు జోడింపుగా “జనవిజ్ఞానవేదిక వాళ్లు పై సంఘటనలలోని నిజాలను
వెలికి తీయాలని కూడా విలేఖరులు వ్రాశారు.
ఈ సంఘటనలను పరిశీలించి అందులోని రహస్యాన్ని బట్టబయలు చెయటానికి ఒక జెవివి బృందం అక్కడకు వెళ్ళింది. ఆ బృందంలో ఎస్. ఎస్, ఖాన్, యు.రాంమోహన్, మహబూబ్ బాషా, నాగరాజు, నూర్లు ఉన్నారు.
ఆ బృందం గ్రామంలోని ఎస్.సి కాలనీకి చెరిటప్పటికి ఎదురైన దృశ్యమే మంటె కాలుతున్న ఒక ఇంటిని ఊరివారంతా ఆర్పి ప్రయత్నంలో ఉన్నారు. మంటలను ఆర్పిన తర్వాత జెవివి బృందం “మంటలు ఎక్కడ ప్రారంభమైనాయి? ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నారా?” అని అడిగారు. దానికి అసలెప్తుడు మంట ప్రారంభమైనా ఎవరూ పారిపోతూ ఉండటం చూడలేదనీ అన్నారు. బృందం సభ్యులు గుడిసె వాసులందరినీ ఒక చోట కూర్చోబెట్టి కొన్ని ప్రయోగాలు చేసి అకస్మాత్తుగా మంట వచ్చి విధానాన్ని చూపించారు. ఈ ప్రయోగాలు, గుడిసెలు తగలబడుతున్న విధానం ఒకే విధంగా ఉన్నాయని ప్రజలు గమనించారు. ఈ బృందంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. “ఎవరో ఈ విధంగా రసాయనాలతో వతతతతతతతతతతతతతడాడలవయయయయంంంం ఈడే లలత
ఆ గుడిసెలను తగులబెడ్డున్నారని” బృందం వాళ్ళు చెప్పిన మాటలకు ప్రజలు అర్ధం చేసుకున్నారు.
“మరి అయితే రాళ్లు ఎలా పడుతున్నాయి?” అని ప్రశ్నించారు. మేము ఇక్కడే ఉండి పరిశీలిస్తాం” అని బృందసభ్యులు చెప్పారు. కాలనీ అంతా తిరిగి చూశారు. కాలనీ వెనకాలే ఒక చిన్నకొండ ఉన్నది. ఆ కొండపైకి వెళ్ళి చూడగా అక్కడ కంక రాళ్ళు, ఇటుకలు, మట్టి పెళ్లలు కుప్పలుగా పోసిఉన్నాయి. వీటిని పరిశీలిస్తుండగా ఒక రాయి చాలా వేగంగా ఎస్.ఎస్. ఖాన్ పకృనే పడింది. ఇంకొక రాయి ఒక ఇంటి వంటగదిలో పడింది. ఇంకొద్ది దూరం వెళ్ళి పరిశీలిస్తుండగా ఒకడు మరలా రాయివేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతడిని గమనించిన బ '* సభ్యుడు మహబూబ్ బాషా వెంబడించగా అతను పారి పోయాడు. ఇది ,..-నించిన ప్రజలంతా ఈ రాళ్లు మనుషులే వేస్తున్నారని తెలుసుకున్నారు. రాత్రిబ్బందం సభ్యులు గ్రామస్థులను అనెక విషయాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరుసటిరోజు ఉదయం ఆ కాలనీ వాసులందరిని కూర్చోబెట్టి అక్కడ కొంతమంది గుప్తనిధులు బయటకు తీయాలని ప్రయత్నిస్తు న్నారు. అవి తీయలనుకుంటే ప్రజలు ఇక్కడ ఉంటే కుదరదు. అందుకని ఇండ్లు ఖాళీ చేయించాలని, ప్రజలను ఈ విధంగా భయబ్రాంతులకు గురిచేస్తు న్నారని వివరించడం జరిగింది. గుప్త నిధులంటూ ఏమీ ఉండవు. అంతా ఐక్యంగా ఉండి అత్యాశతో సమాజానికి హానిచేస్తున్న ఇలాంటి వారిని ఎదుర్కొవా లని చెప్పివచ్చారు. అప్పటీనుందడి ఆ గ్రామంలో మరలా గుడిసెలు తగలబడడం గానీ, రాళ్లు పడడంగానీ జరగలేదు. ఆ గ్రామస్తులకు దయ్యాల భయం వదిలి పోయింది. లా టక్ లా
పిల్లలందుకు చనివోతున్నారు? రచన: టి.రమేష్ “ఈరోజు మన ఊరికి చేతబడిని చేసినవారిని పట్టుకొనే వారు వస్తారు. ఎవరూ బయటకు వెళ్ళరాదు. అందరూ ఊళ్లోనే ఉండాలి. ఎవరైతే ఊరుదాటి బయటకు వెళతారో వారే చేతబడి చేసినట్టు” ఇదీ గ్రామకూడళ్ళలో జరుగుతున్న డప్పు ప్రచారం సారాంశం. “ఎవరు చేతబడి చేసారో? ఎవరు దొరుకుతారో? వారిని రాళ్ళతో కొట్టి చంపుతారా? సజీవదహనం చేసారా? పళ్ళూడగొడతారా?” ఈ విధమైన ప్రచారంతో, చర్చలతో ఊరంతా హాడావుడిగా, అలజడిగా ఉంది. మెము అక్కడికి వెళ్ళేసరికి ఈ విధమైన చర్చలతో ఉన్న ప్రజలు మమ్ములను భయం భయంగా, వింత వింతగా చూస్తున్నారు. వ్యాంట్టు, చొక్కాలు వేసుకున్నారు. ధోవతిలేదు. పెద్ద, పెద్ద మీసాలు లేవు. కుర్రాళ్ళు విళ్ళం మంత్రగాళ్ళను పడతారు? అని కొంతమంది అనుమానంగా చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20కిమీ దూరంలో ఉన్నది. ఆ గ్రామం దానిపేరు చొప్పదండి. ఆ గ్రామంలో వరుసగా నలుగురైదుగురు పిల్లలు చనిపోయారు. దానితో ఎవరో చేతబడి చేసారని ఊరంతా భయంతో వణికి పోతున్నది. మంత్రగాళ్ళను పిలిచారు. ఎవరో చేతబడి చేసారని చెప్పారు. దానితో చేసిన వారెవరో కనుక్కొని వాళ్ళఅంతు చూడాలని ఊరంతా ఒక్కతాటిపై నిలబది చూస్తున్నది. ఇక్కడ హత్యలు జరుగుతాయని ఈ ప్రమాదాన్ని నివారించాలని పోలీ సులు భావించారు. దానితో వారు స్టానిక జనవిజ్ఞానవేదిక మండల కమిటీని సంప్రదించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు వెంటనె రాష్ట్ర కేంద్రాన్ని సంప్రదించగా టి.రమెష్, ఎస్.ఎస్.ఖాన్, చంద్రయ్య బృందం ఆ గ్రామానికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళిసరికి మొదట మనం చూసిన పరిస్థితి ఉన్నది. చైతన్య పరచడానికి జెవివి బృందం వెళ్ళింది. కానీ స్థానిక సర్పంచ్ ఇతరులలో వాలా కధ పా
సమాచార లోపం కొంత, “రుజలు ఇలాఅయితే అధికసంఖ్యలో వసారు. అనే ఆలోచన మరికొంత కలిసి ఆ విధంగా ప్రచారం చేసారు. మేము పోయింది. ఒకందుకు అయితే ఇందుకు విరుద్ధంగా [గ్రామంలో వాతావరణం ఉంది. అప్పుడు స్థానిక నాయకులు, మేము కూర్చొని చర్చించుకొని గ్రామంలోని యువకులను సంప్రదించి ఒక వర్క్‌షాపు నిర్వహించాం. అక్కడ బాణామతి, చేతబడి, మంత్రాలు, తంత్రాలు లేవని ఆ యువకులకు అర్ధం చేయించడానికి ప్రయత్నించాం. కొంతమంది యువకులు గ్రామంలోనికి వెళ్ళి మరి మరికొంత మందికి “బాణామతి, ఇవన్ని లేవు. ఇదంతా బూటకం. ఆవిషయం చెప్పడానికే జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చారు” అని చెప్పారు.
ఈ విధంగా మా కార్యక్రమం గురించి సానుకూలంగా ఆలోచించే వాళ్లు కొంతమంది గ్రామంలో తయారైనారు. వారందరి సహకారంతో సాయం త్రం గ్రామంలో ప్రదర్శన ఏర్పాటుచేశాం. మంత్రాలు, తంత్రాలు లేవని చెప్పాం. ఎవరూ బాణామతి చేయలేరని చెప్పాం. ఇవన్నీ ఓపికగా వారికి అర్ధమయ్యేలా వివరించాం. ప్రదర్శనలో స్థానిక ఎస్. ఐగారు కూడా వచ్చి పాల్గొన్నారు. ప్రదర్శ నను ఆమె ప్రారంభించారు. పిల్లలు చనిపోయినవారి తల్లులు పిల్లల ఫోటోలు పట్టుకొని వచ్చి “మా పిల్లలు ఎందుకు చనివోయారని?” అడిగారు. “మీ పిల్లలే కాదు ఈ కరీంనగర్ జిల్లాలో వందలమంది పిల్లలు విషజ్వరాలతో చని పోయారు. ఇది చాలా (గ్రామాల్లో జరిగింది. వీటికి అపరిశుభ్ర పరిసరాలు, దోమలు కారణాలు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు లేకుండా చూడండి. మరింతమంది పిల్లలు చనిపోకుండా చూడండి”అని చెవ్పాం.
వారు మమ్ములను అర్ధం చేసుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గాయి. మేము వెళ్ళేటప్పటికి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న గ్రామం మా ప్రదర్శన అయిపోయేసరికి ఉద్రిక్తతలు తగ్గి ఆలోచించడం మొదలు అయింది. వా ప తా
భయతు దడద్కం రచన: కె. ఎల్ కాంతారావు 2003 జూన్ 25 అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామంలో ఒక వ్యక్తి మరణించారు. చనివోవడానికి కొన్ని రోజుల ముందు నుండి “నన్ను ఎవరో తీసుకుపోతున్నారు చుట్టూ వారంతా ఉండి, మధ్యలో నన్ను కూర్చోబెట్టేవారు. చిన్న పిల్లలు రాళ్లతో కొట్టేవారు. ఇలా చాలా కాలంగా జరుగుతున్నదనీ తమ్మునితో, ఒకరిద్దరు మిత్రులతో చెప్పందేవాడు. అతని మరణంతో మరుసటి నెల అదే తారీఖున అంటే జులై 25న అదే ఇంటిలో ఇంతకుముందు చనిపోయిన వ్యక్తి తమ్ముడు చనిపోయాడు. దీనితో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. దానికి కారణాన్ని తెలుసు కోవడానికి మంత్రగాళ్లను ఆశ్రయించారు. వాళ్లు ఆ ఇంట్లోనేకాదు, చుట్టు ప్రక్కల ఇళ్లలో కూడ దయ్యాలు తిరుగుతున్నాయని ఆ ఇండ్లను 21 రోజులు ఖాలీగా ఉంచాలనీ, తర్వాత శాంతులు జరిపించి ఇళ్ళలోకి రావాలనీ చెప్పడం మొదలెట్టారు. ఈ వార్త అన్ని పత్రికల్లోను ప్రముఖంగా వచ్చింది. ఆ ప్రాంతంలో పెద్ద అలజడిని కలిగించింది. జిల్లా వైద్వాధికారి అన్నదమ్ముల మరణాలకు శాప్రీయ వివరణ ఇద్దా మని తన సిబ్బందితో ఈ గ్రామానికి వెళ్ళారు కాని ప్రజలు అడిగే ప్రశ్నలకు తట్టుకోలేక వెనుకకు వచ్చారు. స్టానిక జెవివి కార్యకర్త డాక్టర్ కృష్ణయ్య జెవివి జిల్లా కమిటీ సూచనతో ఒక సత్య పరిశోధక బృందం ఆ గ్రామానికి వెళ్ళింది. బృందసభ్యులు గ్రామంలో తిరిగి పరిశీలించారు. ఆ ఇంటిని కూడ పరిశీ లించారు. గ్రామంలో ఒక ప్రదర్శనఇచ్చి మూఢనమ్మకాల గురించి వివరిం చారు. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి గాని ఆ ఇంటిలో జూన్, జులై నెలలో 25 తేదీన రాత్రి వేళల్లో మరణాలు సంభవించాయి. మీరు ఆ ఇంటిలో ఆగస్టు 25 రాత్రి పదుకొని ప్రాణాలతో బయటకు వస్తే దయ్యాలు లేవని మెం నమ్ముతామని ఆ గ్రామస్ఫులు అడిగారు. జెవివి బృందం తప్పకుండా పడుకుంటాం. అని హామీ ఇచ్చి తిరిగి వచ్చింది. చెప్పిన విధంగానే ఆగస్టు 25న జెవివి బృందం ఆ గ్రామానికి చేరు లాం పి లా
కున్నది. ఆ బృందంలో ఎస్.ఎస్.ఖాన్, డా॥ శైలజానాద్(ప్రస్తుత ఎం. ఎల్. ఏ) రామ్మాహన్, రవి, రాఘవేంద్రలు ఉన్నారు. “మీరు కేవలం పడుకోవడమే
. కాదు అర్ధరాత్రి 12 గంటలకు ఏదైనా మాంసాహారం తింటే దయ్యాలు తప్పక వస్తాయని ఆ గ్రామస్థులు చెప్పారు. అంతే, కోడికూర సిద్ధమైంది. ఆ బృందానికి అందించి వారు ఆ ఇంటిని శుభ్రంచేసి వదిలి వెళ్లారు గ్రామస్థులు. గగ్రామస్సు లిచ్చిన టార్చిలైట్ సహాయంతో ఆ ఇంటిలో కొంతసేపు గడిపారు.
అర్ధరాత్రి 12 గంటలయింది. సిద్దంగా ఉంచుకున్న కోడికూరను జెవివి బృందసభ్యులు తృప్తిగా భోంచేసి, బ్రేవ్‌మని శ్రేన్పి, నిద్రకుపక్రమించారు. చక్కగా నిద్రపోయి ఉదయమే లేచారు. గ్రామంలోని అనేకమంది ఆందోళనతో నిద్రలేని రాత్రి గడిపారు. తెల్లవారి బయటికి వచ్చిన జెవివి సభ్యులను ఆశ్యర్యంతో, ఆనందంతో చూశారు.
ఉదయమే ఊరివారందరినీ కూర్చోబెట్టి బృందసభ్యులు తమ పరిశీల నాంశాలను వివరించారు.
ఆ గ్రామంలో గుప్తనిధుల తవ్వకానికి వెళ్ళేవారు. పగలు పనికి వెళ్ళే వారు. దానితో వారి ఆరోగ్యం దెబ్బతిన్నది. మరోప్రక్క గుప్తనిధుల నావహించిన శక్తులు తమనేవో చేసాయని భయం పట్టుకుంది. ముందుగా అన్న ఈ భయానికి లోనయ్యాడు. తమ్మునితో రకరకాలుగా కలవరించేవాడు. చివరకు ఆ భయం తోనే మరణించాడు. దానితో తమ్మునిలో భయం కూడ తీవ్రమైంది. 'అన్న చని పోయిన 25వ తేదిన షాక్‌తో మరణించాడు. ఆ విధంగా ఇద్దరి మరణం ఒకే తేదిన సంభవించింది. మంత్రగాళ్ళు దయ్యాలున్నాయని చెప్పడం పెద్దమోసం దయ్యాలులేవు, ఏమిలేవు.
పై విధంగా పరిస్థితిని వివరించిన జెవివి బృందం సభ్యులు ఆ ఇంటీ వారిని, చుట్టుప్రక్కల వారిని నిరభ్యంతరంగా మీ ఇళ్ళలో ప్రవేశించమనీ, శాంతులేమీ అవసరం లేదనీ చెప్పారు. వారు స్వానుభవంతో, శాప్రీయంగా చెప్పిన విషయాలను గ్రామస్థులు అర్ధం చేసుకొని తమ ఇళ్ళలో ప్రవేశించి నిశ్చింతగా నివసంచనాగారు. పవ ప్ర పప
మంక్రిల పాముల కొవు మాములు పాములే రచన: కె. ఎల్.కొంతారావు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలంలోని కొండారెడ్డిపల్లి అనె గ్రామంలో 2003 ఆగస్టు 20వ లేది నుండి కొన్నివారాల వ్యవధిలో వివిధ కారణాలు వలన ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆసక్తికరమైన విషయమేమంటే వారందరూ ఒకే కులంవారు కావడం. చనిపోయిన వారిలో ముగ్గురు వ్యక్తులు వాము కాటు వల్ల మరణించారు. దానితో ఆ కులంవారంతా ఎవరో మంత్రపు పాములను పంపిస్తున్నారనీ, అవి కాటువేసి మాయమౌతున్నాయనీ ఆందోళన పడసాగారు. దానికితోడు ఆ ఊరిలోని ఒక మహిళకు పూనకం వచ్చి ఆ కులంవారిని చంపడానికి ఎవరో చేతబడి చేశారని చెప్పింది. శాంతిగా దున్నపోతును బలివ్వాలసీ, (బ్రతికి వున్న పందులను ఊరుచుట్టూ వాతి పెట్టాలని చెప్పింది. దానితో ఊరంతా ఉ (ద్రిక్తంగా మారింది.
ఈ పరిస్థితుల్లో వాస్తవాలను శాప్రియంగా వివరించి ఉద్రిక్తతలను తగ్గించ డానికి జనవిజ్ఞానవెదిక సహకారం అవసరమని భావించిన జిల్లా యంత్రాంగం వేదిక జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావును సంప్రదించింది. జెవివి పరిశీలనా కమిటీ ఆగ్రామాన్ని సందర్శించి నిశితంగా పరిశీలించి, తన పరిశీలనాంశాలను ఆ గ్రామ స్థుల ముందుంచింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే ఆ గ్రామం తీవ్రమైన అపరిశుభ్ర వాతావరణంలో ఉంది. గ్రామంలో ఒక వొడుబడ్డబావి ఉంది. మృతుల కుంటుంబాలు అన్నీ ఆ పాడుబడ్డ బావి చుట్టూ నివశిస్తున్నాయి. ఆ బావిలో ఎన్నో రకాల పాములు ఉండే అవకాశము ఉంది. దీనిని గ్రామస్తులు కూడా అంగీక రించారు. బావి, ఆ చుట్టు ప్రక్కల ఇళ్లస్టలాలలో తిరిగే పాములను పొరబాటున రాత్రిపూట ఆ కుటుంబాల వ్యక్తులు తొక్కడం, అవి కరవడం జరిగింది. దానితో వారు చనిపోయారు. కరచిన పాములు, చీకట్లో పారిపోగా అవి మాయమైనాయనీ, మంత్రాల పాములని ప్రజలు భ్రమించినారు. పై విషయాన్ని వివరించడంతో బాటు చేతబడులు లేవనే విషయాన్ని జెవివి పరిశీలనా బృందం గ్రామ రచ్చబండ దగ్గర వివిధ కార్యక్రమాల ద్వారా వివరించింది. ఆ కార్యక్రమానికి ఎమ్. ఆర్.ఓ, ఎమ్దిఓ, ఇద్దరుఎస్.ఐలు (గ్రామసర్పంచి, ఎమ్పిటిసిలు హాజరైనారు. ఆ కార క్రమాల సారాంశాన్ని గ్రహించి జెవివిపరిశీలనను అంగీకరించి, గ్రామస్థులు వెంటనే స్పందించారు. వాములకు మూలమైన ఆ బావిని పూడ్చెసి, చుట్టుప్రక్కల ద్రాంతాన్ని శుభ్రంచెశారు. తర్వాత ఆ (గగ్రామంలో పాముకాటు మరణాలు ఆగిపోయాయి. కొసమెరుపు; జెవివి బృందం గ్రామంలో అడుగు పెట్టగానే పూనకం వచ్చిన
మహిళ వారివీయింద్భి
కర్రప్త్రామిది కటకటాల ఫాల్టేఫిన జెవివి
రచన; కె ఎల్ కాంతారావు అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కేంద్రం. కర్నాటక సరిహద్దు దగ్గర ప్రాంతం. మండలం కేంద్రంనుండి 2కిమీ దూరంలో నక్కల గుట్ట అనె ఒక కొందప్రాంతలో 27 సంలు ఒక స్వామీజి తనచెతిలో ఉన్న కర్రతో కొడితే రోగాలు నయమవుతాయంటూ ప్రచారం చేసుకోసాగాడు. ఎవరైనా రోగం అని వస్తే రోగిని కరత్రో కొట్టడమే అతను చేసే వైద్యం.
అందుకే అతనిని కర్రస్వామి అని జనం పిలవడం మొదలుపెట్టారు. ఇంతకీ కర్రస్వామి ఎవరు? ఇతను చదువుల పేరుతో కొంతకాలం పెనుగొండ, చెన్నైలలో చాలాకాలం తిరిగి, తిరిగి చివరికి స్వగ్రామం పోమందే పల్లి చేరుకున్నాడు. కొన్ని నెలల క్రితం స్థానిక ఆర్.ఎమ్‌పి డాక్టరు ఇంటిలో ఒక గది బాడుగకు తీసుకొని, “కర్రవైద్యం” ప్రారంభించాడు. తర్వాత కొంత కాలానికి సోమందేపల్లి దగ్గరలో గల నక్కలగుట్టకు మకాం మార్చి అక్కడ ఒక కుటీరం నిర్మించుకున్నాడు. ఆ కర్రస్వామి వైద్యాన్ని గూర్చి ఆ గ్రామంలోని ఆర్.ఎమ్.పి డాక్టరు, అతని అన్న మరి కొంతమంది వ్యక్తులతో యీ స్వామి
క(రతో కొడితే రోగాలు నయమవుతాయని ప్రచారం చేయించాడు.
ఈ అనుచరగణం గ్రామాలు తిరుగుతూ, హోటల్లో దగ్గర, కూడళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురుచేరి “స్వామిజీ దగ్గరకు వెళ్ళాను, కర్రతో కొట్టాడు. నా రోగం తగ్గింది. ఎంతమంది డాక్టర్లచుట్టూ తిరిగినా తగ్గలేదు” అని మాట్లాడు కొనేవారు. ఇది విని చుట్టూ ఉన్న వాళ్ళు ఆసక్తిగా “స్వామిజీ ఎవరు? ఆయన వివరాలు ఏమిటి?” అని అడిగేవారు. ఈ విధంగా ప్రచారం చేసేవారు.
పైరకమైన ప్రచారానికి సోమందేపల్లి మాజీసర్పంచ్, పెనుగొండ మాజీ సర్పంచ్ మరియు ఒక వ్యాపారస్తుడు చేయి కలిపారు. భక్తులను ఆకట్టుకోడానికి రకరకాలుగా ప్రచారాలు చేసేవారు. అనంతపురం జిల్లా ఎస్.పి స్వామీజీ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి పోయాడని, హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ సుఖన్సేఠ్, స్వామిజి తన వ్యాధిని నయం చేశాడని ఒక కారు బహుమతిగా ఇచ్చాడనీ అబద్దపు ప్రచారం చేశారు.
దీనితో స్వామి పోలీసులు, మీడియా దృష్టిలో పడ్డాడు. పత్రికల్లో “అసత్య స్వామి కధాకమామీషు” అని వార్తలు వచ్చాయి. టి.విలో కూడా వార్తలు వచ్చాయి. దీనితో సత్య నిరూపణ కోసం, జూన్ 5, 2004న జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.గేయానంద్ నేతృత్వంలో ఒక బృందం సోమందేపల్లి చేరుకున్నది. ఆ గ్రామంలో విచారించగా, స్వామీజీ అసలు పేరు సత్యప్రసాద్‌రెడ్డి అని తెలిసింది. అతనిని సత్యస్వామి అని కూడ పిలుస్తున్నారు. గ్రామం నుండి జనవిజ్ఞానవెదిక బృందం నక్కలగుట్ట చేరి స్వామిజీతో వారు తమను రోగ బాధితులుగా పరిచయం చేసుకొని తమకు నొప్పులు, షుగర్, బిపిలాంటి వ్యాధులు ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరారు. ప్రస్తుతం 6-30 గంటల యిందని, ధ్యానసమయం ముగిసిందని, అమావాస్య, పౌర్ణమి రోజు రావాలని, వారికి స్వామి తెలియజేశారు. కర్రతో కొడితే ప్రజల నొప్పులు, రోగాలు ఎలా తగ్గివోతాయి? ఇది ప్రజలను మోసగిండం కాదా? అని బృందం సభ్యులు ప్రశ్నించారు. తనలో ఏదో అలౌకిమైన శక్తి ఉందని స్వామిచెప్పగా ఆ శక్తే వుంటే రెండు, మూడు చోట్లకు ఎందుకు మారావని ప్రశ్నించారు. అంతేకాదు బృందం సభ్యులు ఖాన్, భాస్కర్, రవిలు చేతిలో కర్పూరం వెలిగించి నోటిలో వేసుకొని మింగివేశారు. తమకు ఎన్నో విద్యలు తెలుసన్నారు. ప్రజలను కర్రతో కొట్టడం నెరమనీ, నీవు నేరం చేస్తున్న విషయం పోలీసులకు తెలియజేస్తామని అన్నారు. సత్యన్వామి సోదరుడు నాగభూషణరెడ్డి, రవినాయక్, జయప్పు, గంగప్పలు జనవిజ్ఞానవేదిక సభ్యులు ఖాన్, రవి, నూర్‌మహమ్మద్, భాస్మర్లతో వాగ్వివాదానికి దిగారు. అక్కడున్న కొందరు భక్తులు(తమ ప్రచార కార్యకర్తలు)తో స్వామి మహిమలను గూర్చి చెప్పించారు. వేదిక సభ్యులు “సత్యప్రసాద్!నీకు చిన్న వయస్సు, పెళ్ళి చెసుకొని సంసారం చేసుకో! ఎంతో భవిష్యత్తు ఉంది. పాడుచేసుకోకు, అని స్వామికి చివరి వార్నింగ్ ఇచ్చి, అనంతరం వారు సోమందిే పల్లి స్టేషనుకు చేరుకుని ఎస్.ఐ శ్రీ పవన్‌కుమార్‌కు, ఫోనులో సి.ఐ రమణకు ఫిర్యాదు చేశారు. అంతేకాక రవికుమార్ అనే వ్యక్తి ద్వారా అతని అనుభవాన్ని మరో ఫిర్యాదుగా ఇప్పించారు. దాని ప్రకారం “రవికుమార్ చాలా కాలం నుంది కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. కర్రవైద్యం ద్వారా నయం చేస్తాడనే నమ్మకంతో న్వామివద్దకు వచ్చాడు. తన దగ్గరున్న రూ11500/-లు తాంబూ లంలో పెట్టి స్వామికి ఇస్తే స్వామి రవికుమార్‌ను కాళ్ళపై విపరీతంగా కొట్టాడు. దానితో నొప్పులు తగ్గకపోగా మరిర్శత ఎక్కువయ్యాయి. అతనిని కర్రతో
కొడుతున్నపుడు అనంతపురానికి చెందిన నూర్ మహ్మద్, భాస్కర్, ఖాన్లు చూశారు” ఈ ఫిర్యాదు ఆధారంగా పెనుగొండ డి.ఎస్.పి, శ్రీపి. కన్నాజీరావు, సి.ఐ ల్రీజి.వి. రమణ, ఎస్.ఐ శ్రీ పవన్‌కుమార్‌లు 6-6-04న మధ్యాహ్నం కర్రస్వామిని అరెస్టు చెశారు. అతనిపై ప్రజలను చీటింగ్ చేస్తున్నందుకు ఐ.పి.సి 420, 324 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. య్ క్ క. పం వటం వయ కతా... రల అనంతరం అక్కడ ఎర్సాటు చేసిన కొట్టాలను, సత్యన్వామి ఫోటోలను పోలీసులు పెరికి వేశారు. అలాగే న్వామి కుటీరం ఎర్పాటు చేసుకున్న భూమి ప్రభుత్వానిదని, దానిని రంగేపల్లి గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తికి పట్టా మంజూరు చేశారని, ఆ పట్టాలను రద్దు చేయాల్సిందిగా ఏమ్మార్వోను కోరనున్నట్లు సి.ఐ తెలిపారు. రాం ఖు నే న. షప లా ద త చ ల లత న పే లా స్ట 1 ష్ట్ర! సా ర , హరు యయిన ద్ర ఆర ఆలో ఆ విధంగా కర్రన్వామని కటకటాల పాట్టేసి మరో మోసపు స్వామి బండారాన్ని జనవిజ్ఞానవెదిక బట్టబయలు చేసింది. లం భై త
కందిచూపు స్వామికి అరదండాలు రచన; కె. ఎల్ కాంతారావు అది ఆంధ్రప్రదేశ్‌లో ఆధునికతకు, నాగరికతకు భౌగోళిక కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న సున్నపు బట్టీల సెంటర్లోని ఒక కుటీరం. అయితే దానిలో జరుగుతున్నది అభివృద్ధి, నాగరికతను సవాలు చూస్తూ మూఢనమ్మకాలను 'పెంపొందిచే కొత్త రకం భాగోతం. అదే “కంటిచూపు వైద్యం” దీని నిర్వాహకుడు “పెద్దన్వామిగా పిలువబడే గారోజి కనకాచారి. ఈయన గత కొంత కాలంగా ఈ కంటిచూపు వైద్వాన్ని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. “మీకు జ్వరమా? కీళ్ళ నొప్పులా? బి.పి.యా? షుగరా? కాన్సర్ లేక ఎయిద్స్తో బాధపడుతున్నారా? అన్ని జబ్బులనూ కంటి చూపుతో నయం చెస్తాను.” ఇదీ ఆయన ప్రచారసరళి. ఈ కనకాచారి బి.టెక్ చదివి నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో గతంలో ఉద్యోగం కూడా చేశారు. ప్రస్తుతం కొంతమంది “పెద్దల” అండతో ఈ “సకల రోగ నివారిణి” చికిత్సను చేస్తున్నట్లుగా ప్రచారం పొందుతున్నాడు.
ఈ విషయం జనవిజ్ఞానవేదిక కృష్ణాజిల్లా కమిటీ దృష్టికి వచ్చింది. కంటిచూపు స్వామి మోనాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించింది. వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవి.శివ ప్రసాద్, కోశాధికారి వెలగా శ్రీనివాస్, బి.జె సుందరరావు, క. వెంకటేశ్వరరావులు ఇతర సభ్యులతో కలసి 17-2-2003న “కంటిచూపు స్వామి” వద్దకు శివ అనే కీళ్ళ జబ్బు పేషంటును తీసుకెళ్ళి అతని రోగం నయం చేయమని కోరారు. “స్వామి” తన కంటిచూపు వైద్యాన్ని నాలుగుసార్లు ప్రయోగించినా రోగం నయం కాలేదు. దీనితో వేదిక సభ్యులకు “స్వామీజి”కి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివారం జరిగింది. జనవిజ్ఞాన వేదిక నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దశలో ప్రముఖ పారిశ్రామికవేత్త సిరిస్ కంపెనీ అధినేత శ్రీజి. యస్.రాజు రంగప్రవేశం చేసి “స్వామీజికి” మద్దతుగా జనవిజ్ఞాన వేదిక సభ్యులతో వాదించసాగారు. అప్పటికే ఖర్వాదునందుకున్న పోలీసులు వచ్చి “స్వామీజి"ని అరెస్టు చెసేందుకు ప్రయత్నించడంతో శ్రీ జి.యస్. రాజు అద్దుపది స్వామీజీ 15-2-2003 మంగళవారం నాడు ప్రభుత్వ లతలా అడే
ఆస్పత్రిలో కొందరు రోగులను కంటిచూపు వైద్యంతో నయం చేస్తారని హామీ ఇచ్చి అరెస్టు కాకుండా అద్దుపడ్డారు.
18-2-20038న జనవిజ్ఞాన వెదిక సభ్యులు ప్రముఖ వైద్యులు డా॥ గోపాళం శివన్నారాయణగారు, డా॥జి.సమరం, డా॥జి. గంగాధర్ మరికొందరు వైద్యులతో కలిసి ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చారు. విషయం తెలిసి నగరంలోని అన్ని పత్రికల విలేఖరులు, ఫోటోగ్రాఫర్లు అన్ని టి.వి ఛానళ్ళ విలేఖర్లు, వీడియో గ్రాఫర్లు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెడెంట్, వాయకాపురం ప్రకాళశ్నగర్కు చెందిన వెంకటేశ్వరరావు అనే టి.బి రోగిపై “స్వామి” చూపు వైద్యానికి అనుమ తించారు. ముందుగా డా॥[సమరం రోగి టెంపరేచర్ నమోదు చేశారు. అది 103సి నమోదైంది. “న్వామి కంటిచూపు వైద్యం ప్రారంభమైంది. అరగంట గడిచింది. మరల రోగి టెంపరేచర్‌ను పరిక్షించారు. అది 104.3సికు పెరిగింది. కంటిచూపు వైద్యం బండారం బయటపడింది. వెంటనే పోలీసులు మోసపు వైద్యాన్ని చెస్తున్న కనకాచారి ఉరఫ్ కంటి చూపు స్వామిపై ఛీటింగ్ కేసు నమోదుచేసి ఆయనను అరెస్టు చెసి, పోలీసు స్టేషనుకు తరలించారు.
న న్ గ
ట్ర
ఆ (ప్రకారం జనవిజ్ఞానవెదిక కృషితో విజయవాడ నడిబోద్దున జరుగు తున్న మోసపు స్వామి బండారం బట్టబయలై మరో మూఢనమ్మకం గుట్ట రట్టయ్యింది. న న.
కి న! క! ఫ్ర న! ఖై . గల థి న! ఇ.
౧1.
మ ఓ001గ-18ఓ ఇవన్నీ మనం అడుగడుగునా నమ్ముతున్న విషయాలు అలవాటుగాచేస్తున్నవి. వీటిలో నిజమెంత? , అని మనమెప్పుడూ ఆలోచించం. అసలు ఆలోచించాలన్న ఆలోచనే మనకు రాదు. ఒకవైపు సైన్స్ పెరుగుతున్నా మరోవైపు మన చుట్టూ ముసురుకుంటున్న ఇలాంటి మూఢ నమ్మకాల్ని అందులోని డొల్లతనాన్ని ఈ పుస్తకంలో మీరు చూసారు. శాస్త్రానికి జీవితానికీ ఇంత ఎడం వుంటుందా అని మీరు ఆశ్చర్య పోతారు. ఊరుకొక్క బాబా వెలుస్తున్న కాలమిది ఒక్కరిది ఒక్కో వేషం ఒకొక్క ప్రచారం. ఇటీలవ కాలంలో జనవిజ్ఞానవేదిక వెంటబడి ర్ వీళ్ళ బండారాల్ని బట్టబయలు చేసింది. యా వీటిలో కొన్నింటిని మీరిందిలో చదువుతారు. కూ జనవిజ్హాన వేదిక ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధం
మవసు ఫౌండేషన్ శ ప్రష్తూం వరిశీలవాపట్టక “భావాల గరగ గ [ద తారలు ౮ ్న౧ంవ ాయుందలట్ట్ వ మక్తవతలు | (0౧1 రాం నం అయం. (౧౧౦6, ఈవల కం షమ భజలవడకివు. | ()గ||౧౦| లాతాక్చెయ్యనవ (నా చావును (ర నార వనననినిను 06 = వన