Telugu దేశమును ప్రేమించుమన్నా - anilvaranasi/indianlanguages GitHub Wiki

త్‌ , క్ష త , రెలల్‌. ర్రల శతిపహసు! రిన్ష * ఎ ్గో లి ళె . అ త ఇ 9? ణః ల్‌ అననన అయి ॥ ఖి శో " వ్‌ లో శే

  • థి తో సో ఉ . - క తా ళా పై అ క్‌ ౧. త్‌ ఇ క్త న క ల! 1 క 7 బ్‌ గ్‌ | ల్‌ | గ! నా తూ గ్‌ . క్ష | ( , | క్‌ు ఫో లా అ ఖో షి ॥ ఠి |. న్‌ ॥ ,! , మ్‌. లి తొ తో త్‌ న క్‌ టీ గ్‌ 4 ల ఇ శ , క్‌ న్‌ త్‌ న్‌ ల నా త ఎఇ బే! గ | ఫె పటే సప, సో. స్‌ మో ఈ గో 1 [య =. " | =. నా శ యో యా. శ ళ్‌ లో స్య గ్‌ శ. గ | కా వ / ॥| | న్‌ | వి న్‌ ఉ ఉ . ళో నీ | క [ యం ! లు? జ క కటల లం 2 ల6ఉనతలీ / . మ ఇక్లీ /.. (గో మా. | ఉమ్మ్మ్మ స + క అవీటీతీలీ తి ఇ వణ సవ $ హు |; చళ్త.. “సర. . త్‌: న / /" అయ ఏపి. ఫు త ఖ్‌ ం అ క ధే " , లి. శు" ప (/. ఇవాల
  • వ్వా 14 శ్‌ ఖై ॥ క న |. ష్‌ ” మే తా స్స ” + త న. నా బవ: భ్‌ శక్యా న భ్‌ ల | 1. *ఖటీ ( | గ్‌ శా ] న్‌ ళ్‌ / | థి భే ళ్‌ జూ - శ కక్క. అస గా. వ నస సన అ | న్న క | ( | ॥ తం అదానిననానినినీనిన . ం _ సా

య

. [వ ర. [ఈ ప్రేమి భారా ంట్బ్వు భీ కె. యల్‌. కాంతారావు ధు వో క . చ వ ష్‌! స ము లో! అనీ 4న ప్రచురణ జనవిజ్ఞానవెదిక అల్‌ ఇండియా వీపుల్స్‌ వైన్స్‌ నెట్‌వర్క్‌ అనుబంధం

65200006 6601110140120008

రెండవ ముద్రణ : 1000

మూడవ ముద్రణ : 2017 మార్చి

కాపీలు 2౧000 కాపీలు

ప్రచురణ ;

జనవిజ్ఞాన వేదక (ఎ.పి)

ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌

ఎన్‌. శంకరయ్య, కన్వీనర్‌

సెల్‌ ; 94405 41020

3ల : 80/-

ప్రతులకు ;

జ. కృష్ణారెడ్డి జనవిజ్ఞానవేదిక పబ్లికేషన్స్‌

నెల్లూరు - 524 002

ఫోన్‌ ; ౦0861 - 2337450, 94933551 44 రోలీగెసీన్‌ ఫ్రంట్‌ రలు

85006 55599

ళ్‌ విద్యార్భుల్లొ స గే దేశభక్తి ప్రచారం అందుకు చేయాలి? 4ో గౌరవనీయులైన ఉపాధ్యాయ సోదరి, సోదరులారా, మీరు జాతి నిర్మాతలు. భావిభారత పౌరులకు, పరిపాలకులకు శిక్షకులు. భావిపౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని ఆనందంగా స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదెశ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే “ఆకాశం అంటుకొనే ధరలొకవైపు, అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు...” ఇంకా ఎన్నో ఎన్నెన్నో ! ఇన్ని సమస్యలు దేశాన్ని పట్టీ పీడిస్తుంటే, పెరుగుట విరుగుట కొరకేనని పల్లవి వినిపిస్తుంటే - ఈనాటి యువతరం పై సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తోందా? దేశ ప్రగతి సాధనలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోందా? లేదు. నేటి పౌరులు, రేపటి పౌరులు కూడా న్వార్ధ భావాలతో మునిగి తేలుతున్నారు. స్వాతంత్ర్య పోరాట కాలం నాటి త్యాగళీలత, అంకితభావం, ఉన్నత నైతిక విలువలు కొరవడినాయి. అమెరికా, జపాన్‌, చైనావంటి దేశాలు ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతుంటే భారతీయులు అశాస్త్రీయమైన ఆలోచనలతో, స్వార్ధపూరిత భావాలతో, కుల, మతాల కొట్లాటలతో దేశప్రగతి రథాన్ని వెనుకకు నడిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో దేశభక్తి కొరవడటమే! భారతీయులు ఈనాడు కులాభిమానమో, మత దురాభిమానమో, భాషా గర్వమో, ప్రాంతీయతా అహంకారమో కలిగి ఉంటున్నారే కాని తాము ఈ సువిశాల భారతదేశ పౌరులమనే భావనయే వారిలో తగ్గుతున్నది. ఇక దేశభక్తి భావన వారిలో ఎలా ఉద్దీపనమౌతుంది? దేశభక్తి విషయంలో భారతీయుల మనోభావాలకు సంబంధించిన ఒకటి రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం. ఒకసారి అమెరికాలో అంతర్జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. దానికి ఒక విలేఖరి ఒక విచిత్రమైన సర్వే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన కొన్ని వందల మందిని కలిశాడు. రెండే రెండు ప్రశ్నలు వేశారు. ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా వున్నాయి. జనవిజ్హానవేదిక------------------------కఖఫి------------ దేశమును ప్రేమించుమన్నా

నీ పేరు జార్జిబుష్‌ నీ వెవరు అమెరికన్‌ని నీపేరు 1 డిగాల్‌ నీవెవరు (ఫ్రెంచి దెశసుణ్ణి నీపేరు మార్గరెట్‌ నీవెవరు ఇంగ్లాండ్‌ దేశస్తురాల్ని నీపేరు ; చాంగ్‌చిన్‌ , నీవెవరు 1 చైనా దేశస్తుణ్ణి నీపేరు ; రామశాస్త్రి నీవెవరు 1 హిందూ బ్రాహ్మణుణ్జి నీపేరు అబ్బుల్లా నీవెవరు ముస్లింని నీపేరు ; రాజ్‌సింగ్‌ నీవెవరు ; రాజపుత్రుణ్లి నీపేరు ; సుందర రాజన్‌ నీవెవరు తమిళియన్‌ని

పై సమాధానాలన్నీ జాగ్రత్తగా గమనించి చివరికి ఆ విలేఖరి ఈ విధంగా కామెంట్‌చేశాడు. “భారతదేశంలో హిందువులున్నారు, ముస్తింలున్నారు, పంజాబీలున్నారు. మతం, ప్రాంత మొదలైన వాటిద్వారా గుర్తింపును కోరుతున్నారు. కానీ, భారతీయులుగా గుర్తింపుకు ప్రాధాన్యత నీయడం లేదు” అని ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో గమనించండి. మహాకవి వాల్మీకి “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అన్నాడు. అంటే తల్లి, మాతృదేశం రెండూ స్వర్గానికన్నా మిన్నయని దాని అర్ధం. మాతృదేశ భావనయే కోట్లాదిమంది భారతీయుల్లో లేనప్పుడు మాతృభూమిని స్వర్ణముకన్న మిన్నగా ఎలా దర్శించగలరు? దేశభక్తితో దేశ ప్రగతి కొరకు ఎలా కృషి చేయగలరు? అలాంటి దేశభక్తి కొరవడినందునే తమ కులంవారు మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నారు. జాతీయ నదుల జలాలు తమ ప్రాంతానికి పరిమితం కావాలని వాంఛిస్తున్నారు. న్వార్ధ బుద్ధితో అనేక వందల సంఖ్యలో విదేశీ బహుళజాతి కంపెనీలను, వారి షరతులకు అంగీకరించి మరీ ఆహ్వానిస్తున్నారు. ఒక ఈస్టిందియా కంపెనీకి, మనదేశంలో వ్యాపారా నికి అవకాశం కల్పించిన నేరానికి భారతదేశం 200 సంవత్సరాలు దాస్యంలో మగ్గవలసి వచ్చింది. ఈనాడు కొన్ని వందల విదేశీ కంపెనీలు అన్ని రంగాలకు విస్తరించుతున్నాయి. జనవిజ్ఞనవేదిక---------------భి--------------------- దేశమును ప్రేమించుమన్నా

ముఖ్యంగా అన్ని పరిశ్రమలకు మూల పరిశ్రమ అయిన విద్యుత్‌ రంగాన్ని కూడా ఆక్రమించుకోవడానికి, విదేశీ కంపెనీలకు వారి షరతులకు లోబడి అవకాశం ఇస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావి బారతదేశం ఎలా ఉంటుందో ఊహించుకోవ దానికే భయమేస్తోంది. ఐతే మనం భావి పౌరుల్లో దేశభక్తిని ప్రజ్వరిల్ల జేసే ప్రయత్నాలు జరపని కారణంగా నేటి విద్యార్థుల్లో దేశ (శ్రేయస్సుకంటే తమ స్వార్ధమే ప్రధానంగా కనిపిస్తోంది. వారి అమాయక హృదయాలకు దేశ సంపదను లూరీచేసి తీసుకపోయే విదేశీ కంపెనీలు మన స్వాతంత్రాన్ని క్రమంగా హరించే విషనాగుల్లాగా కనిపించడం ఖ లేదు. ఈ విషయంలో నాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీ ముందుంచుతాను. ఒకసారి నేను మరికొందరు మిత్రులతో కలసి రైల్లో ప్రయాణం చేయడం సంభవించింది. ఆ కంపార్టుమెంటులో ఉన్న ఒక విద్యార్థితో పరిచయం కలిగింది. అతనితో మాటల సందర్భంలో అతను వరంగల్‌ రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ కోర్స్‌ చదువుతున్నాడనీ, డిస్టెంక్షన్‌ మార్కులు తెచ్చుకునే తెలివైన విద్యార్థి అనీ అర్ధమైంది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. నేను : మంచి మార్కులతో పాసవుతానన్నావు. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? విద్యార్ధి :; ఏదైనా బహుళజాతి కంపెనీలో ఇంజనీరుగా చేరుదామనుకుంటున్నాను. నేను : ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేయవా? విద్యార్ధి : లేదండి. నేను : ఎందుకని? విద్యార్ధి ; బహుళజాతి కంపెసీలైతే మంచి జీతం, ఇతర అలవెన్సులు బాగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగమైతే అంతంత జీతాలు ఇవ్వరు. నేను : విదేశీ కంపెనీలు ప్రభుత్వం కన్న ఎక్కువ జీతాలు ఎందుకిస్తాయి? వాటికి డబ్బంటే చేదా? విద్యార్ధి : కాదండి వారు బాగా జీతాలిసారు. విపరీతంగా పని చేయించుకుంటారు. తద్వారా మంచి లాభాలు సంవాదిస్తారు. నేను : ఆ లాభాలను వాళ్లేం చేసుకుంటారు? విద్యార్థి : వాళ్ల దేశాలకు తీసుకుపోతారు. నేను : అంటే బహుళజాతి కంపెనీలు లాభాల పేరు మీద మనదేశ సంపదను విదేశాలకు తరలించే కార్యక్రమానికి నీవంతు సహకారం అందించ బోతున్నా వన్నమాట. జనవిజ్ఞానవేదిక ఎంంాశ్తుఖె------------------- దేశమును ప్రేమించుమన్నా

విద్యార్ధి : (మౌనం, నేను : స్వాతంత్ర పోరాట కాలంలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఎందుకు? ఇంగ్లీషు వాడిని వెళ్లగొట్టి మమ్మల్ని ఢిల్లీ సిహాసనం మీద కూర్చోబెట్టండి అని ఆ ప్రజలు అడిగారనా? లేక మరేదైనా కారణం ఉందా? విద్యార్ధి ౩; (మౌనం) నేను : ఆనాడు ఆంగ్రేయులు మన దేశ సంపదను, కోట్లాది రూపాయలను తమ దేశానికి తరలించుకు పోతుండేవారు. ఆంగ్లేయుల దోపిడీ కారణంగా భారత దేశం, భారతీయులు మరింత దరిద్రంలోకి నెట్టబడుతున్నారు. ఈ విషయాన్ని / శ్రీచిలకమర్తి నరసింహంగారు చాలా చక్కగా వివరించారు. “భారత ఖండదంబు చక్కని వాడియావు " హిందువులు లేగదూడలై వడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బవీగియగట్ట”. నీ బోటి మంచి విద్యార్థులు వారి లాభాల వేటలో, మనదేశ సంపదను వారి దేశాలకు తరలించుకు పోయే కార్యక్రమంలో అమాయకంగా సహకరిస్తున్నారు. ఇది మన దేశానికి మేలు కలిగిస్తుందా? కీడు చేస్తుందా? విద్యార్ధి : తప్పకుండా కీడు చేస్తుందండీ! నేను : మరి ఒక దేశభక్తి గల పారుడుగా బహుళజాతి కంపెనీల్లో పనిచేయడం మంచిదేనా? విద్యార్థి : కాదండీ. నేను :; మరి ఈ విషయాన్ని ఎప్పుడూ నీవు, నీ స్నేహితులు, నీ ఉవాధ్యాయులు చర్చించలేదా? విద్యార్థి : లేదండి. ఇంతవరకు ఈ విషయం మా స్కూల్లోగాని, కాలేజీలోగాని ఎవరూ బోధించలేదండి. నేను : నీకు ఈనాటి వరకు ఈ విషయం, నీ కర్తవ్యం తెలియకపోవదానికి కారణం బఏమిటంటావు? విద్యార్ధి : నిస్సందేహంగా మన విద్యా విధానమే సార్‌. నాకు ఇంగ్లీషు, లెక్కలు, సోషల్‌, సైన్స్‌ పాఠాలే నేర్పారు. కానీ దేశాన్ని దేశభక్తిని గూర్చి ప్రత్యేక బోధన లేదు. నాబోటి వారిలో దేశభక్తి లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే సార్‌. జనవిజ్ఞానవేదిక------------------------- €యి--------------------- దేశమును ప్రేమించుమన్నా

ఇదీ మా మధ్య జరిగిన సంభాషణ. దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో లేకపోతే ఎంత ప్రమాదమో ప్రఖ్యాత రచయిత, పత్రికా సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బారావు గారు ఏమన్నారో తెలుసా?

“దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో భాగంగా లేకపోతే మన దేశం ఈ తరాన్నేగాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపారులు దేశశ్రేయస్సు కంటే తమ (శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు.”

భావిపౌరుల్లో దేశభక్తిని జ్వలింపజేయవలసిన గురుతర బాధ్యత మీమీద ఉన్న

' దని సవినయంగా గుర్తుచేస్తున్నాను. ఈనాడు పౌరుల్లో దేశ సంపదను కాపాడుకోవాలనే శ్రద్ధలేదు. పరిశుభ్రతను కాపాడాలనే ఆసక్తిలేదు. క్రమశిక్షణ లెదు. అన్నిటికంటే ముఖ్యంగా

  • ఐకమత్యం లేదు. అశాస్త్రీయ ఆలోచనలతో కొట్టుకుపోతున్నారు. ఆధునిక మూఢనమ్మకాలను సృష్టించుకొని వాటికి బలయివోతున్నారు. దేశ సమస్యలను గూర్చి ఏమాత్రం పట్టంచు కోవడం లేదు. అవినీతిపరులు, అత్యాశపరులు, మతోన్నాదులు, రౌడీలు, గూండాలు దేశ పరిపాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకుంటుంటే తమకేమి పట్టనట్లు పేపర్లలో ఏదో సంచలన వార్త చదివినట్లు చదివి ఉదాసీనంగా ఊరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్వామి వివేకానంద చెప్పినట్లు మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోగా మరో నూరేళ్లలో మన దేశస్థులందరూ పిచ్చాసుపత్రిలో చేరే ప్రమాదముంది. కాబల్ట జాతి నిర్మాతలైన మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారంలో ఒక పిరియడ్‌ను దేశభక్తిని ప్రచారం చేసే పీరియడ్‌గా కేటాయించండి. విద్యార్థుల్లో దేశభక్తిని ప్రచారం చేయండి. సంకుచిత కులోన్నాద, మతోన్మాద భావాలను ఆ చిన్నారుల మనసుల నుండి చెరిపివేయండి. అవినీతి వ్యతిరేక పోరాట సైనికులుగా తయారు చేయండి. ప్రతి స్కూల్లో “జై భారత్‌ క్ల్షబొలు స్థాపించండి. ఆ క్లబ్‌ సభ్యుల సహకారంతో దేశశ్రేయస్సుకు ఉపయోగపడే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టండి. ఆ క్ల్షబ్‌సభ్యులు “జై భారత్‌” అనేటట్లుగా, కోట్లాదిమంది బారతీయులచే “జై భారత్‌” అని నినదింపజేసే సమర్భులుగా తయారు చేయండి. అ(గ్రరాజ్యాల సరసన మాతృభారతిని నిలిపే మహత్తర బాధ్యత మీ భుజస్కంధాల పై ఉంది. దానిని ఆనందంగా, దీక్షతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాను

శ శ శ

జనవిజ్ఞానవేదిక--------------౮-౮౮౮౮౮౮౮౮క్షఖి--------------- దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించుమన్నా!

“పిల్లలూ! ఈరోజు ఒకమంచి విషయం మీకు వివరించాలి అనుకుంటున్నాను”. క్లాసులోకి రాగానే మొదలు పెట్టారు విశ్వం మాష్టారు.

“ఏమిటి మాష్టారు?” ఆసక్తిగా అడిగారు పిల్లలు అందరూ.

“దెశభక్తి అనే అంశాన్ని గూర్చి ఈ రోజు మీకు వివరిస్తాను” అన్నారు మాష్టారు.

“చెప్పండి మాష్టారు” మరల పిల్లలు అందరూ ఏకగ్రీవంగా అడిగారు.

“చెప్తాను. ముందు ఎవరైనా దేశాన్నిగూర్చి పాట పాడగలరా? అడిగాడు

“నేను పాడతాను మాష్టారు” లేచి నిలబడి చెప్పాడు భాషా.

“మంచిది భాషా, పాదు నాయనా” అని ఉత్సాహ పరిచారు మాష్పారు.

“దేశమును (ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నాా”

పాడటం మొదలు పెట్టాడు భాషా

“బాగుంది భాషా. ఈ పాటను ఎవరు వ్రాశారో చెప్ప గలవా?”

“చెప్తాను మాష్టారూ! గురజాడ అప్పారావుగారు”

“కరెక్ట్‌. గురజాడవారు దేశమును (ప్రేమించమన్నారు గదా! అంటే మన దేశాన్ని మనం ప్రేమించాలన్నమాట. మనకు తల్లి ఎలాంటిదో దేశం కూడా అలాంటిది అన్నమాట. ఇంతకీ మనది ఏ దేశం. నువ్వు చెప్పు 'యాదగిరీ!” అడిగారు మాష్టారు.

“మాది పడమర దేశం. మీది తూర్పుదేశం. మా వీధిలో ఉండే సుబ్బరామన్‌ది అరవ దేశం”. .

పిల్లలు అందరూ ఫక్కున నవ్వారు.

“సైలెన్స్‌! పిల్లలూ! యాదగిరి చెప్పింది కరెక్టేనా?”

“కరెక్టు కాదు సార్‌” చాలామంది పిల్లలు పెద్దగా అరిచారు.

“మంచిది రవీ! నువ్వు చెప్పు”.

“మనది భారతదేశం” చెప్పాడు రవి.

“వెరిగుడ్‌. మనది భారతదేశం. అందులో తెలుగు మాట్లాడే మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్టం అంటారు. తమిళం మాట్లాడే సుబ్బరామన్‌ వాళ్ల ప్రాంతాన్ని తమిళ నాడు అంటారు. యాదగిరి మన రాష్ట్రంలోనే పడమర ప్రాంతం నుండి ఇక్కడకు వచ్చాడు. మనం మన రాష్ట్రంలోనే తూర్పు ప్రాంతంలో ఉంటున్నాం. యాదగిరి తండ్రి, తాతలు చదువు రానివారు కావడం వలన వాళ్లు నివశించిన ప్రాంతాన్ని ఒక దేశంగా భావించారు. అంతే! ఇప్పుడర్ధమైందా యాదగిరీ మీది, మాది, సుబ్బరామన్‌ది అందరిది ఏ దేశమో?”

“అర్ధమైంది మాష్టారు. మన దేశం భారతదేశం మనమంతా బారతీయులం”.

“అసలు దేశం అంటే ఏమిటి?” మరో ప్రశ్న అడిగారు మావారు.

“దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌” అని గురజాడ వారన్నారు. అందరూ అంగీకరిస్తున్నారు. కాబట్టి దేశభక్తి అంటే దేశంలోని కోట్లాదిమంది (ప్రజలు సుఖంగా, శాంతిగా ఉండాలనే కోరికగా చెప్పుకుందాము.

దేశంలోని ప్రజల కనీస అవసరాలేమిటి? తిండి, బట్ట, ఇల్లు, ఆరోగ్యం. ఇవి ప్రజలందరికీ ఉండాలనీ వారందరూ శాంతిగా జీవించాలని కోరుకోవడమే దేశభక్తి అని అర్ధం చేసుకుందాము. కార్పు, టీవీలు, విమానాలు, ప్రాణం కాపాడే మందులు ఇవన్నీ మానవులందరి సమిష్టి కృషి ఫలితంగా సాధించిన విజ్ఞాన శాస్త్ర పరిశోధనా ఫలితాలు. ఇవి మరలా కోట్లాది మంది ప్రజలకు అందాలని ఆశించడమే దేశభక్తి అని నిర్వచించుకుందాము ఒప్పుకుంటారా? అడిగాడు మాష్టారు.

ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేక పిల్లలందరూ ఒకరి మొగాలొకరు చూసుకోసాగారు. మాష్తారే కొనసాగించారు.

“మనమొక ఇంట్లో ఉన్నామనుకోండి అది అద్దె ఇల్లనుకోండి దానికేమైనా రిపేర్లు అవసరమైతే పట్టించుకుంటామా? స్వాతీ, నీవు చెప్పు”.

“పట్టించుకోం మాష్టారూ”

“అది మరీ శిధిలమవుతుంటే ఏం చేసాం?”

“ఆ ఇంట్లో నుంచి మరో మంచి ఇంటికి మారుతాం”.

“గుడ్‌ అదే స్వంత ఇల్లయితే? చందూ నీవు చెప్పు”.

“చిన్న రిపేరొచ్చినా వెంటనే చేయించాలని తాపత్రాయ పడతాం మావ్వారూ. ఇంటిని మరింత శుభ్రంగా ఉంచుకోవాలనీ, తోటను అందంగా తీర్చి దిద్దాలనీ కోరు కుంటాం. అవకాశం వస్తే మరో అంతస్తు లేపాలని అనుకుంటాం.” చందూ వివరంగా

సమాధానం ఇచ్చారు.

“అవును, ఇంటిని సుందరంగా తీర్చి దిద్దాలనే ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వెంకట్రావ్‌, నీవు చెప్పు”.

“ఆ ఇల్లు నాది అనే భావన ఉన్నప్పుడు మాష్టారూ.”

“కరెక్ట్‌. ఆ భావన లేనప్పుడు ఏ వ్యక్తికీ అలాంటి బాగోగులు పట్టవు. అదే రకంగా ఈ దేశం నాది, దేశంలోని కోట్లాదిమంది (ఘ్రజలు నావారు అనే భావన లేకపోతే వారి పురోగతి కోసం, వారందరి సుఖశాంతుల కోసం శ్రమించాలనీ, త్యాగాలు చేయాలనీ _ అనిపించదు. అందుకే ప్రతి వ్యక్తికీ దేశభక్తి ఉండాలి.

ముఖ్యంగా విద్యార్థుల్లో దెశభక్తి ప్రచారం జరక్కపోతే ఏం జరుతుతుందో తెలుసా? మీలో ఒకరు ఆంగ్రంలో పండితులు కావచ్చు. మరొకరు గణితంలో నిమ్రాతులు కావచ్చు లేదా కంప్యూటర్‌ ఇంజనీరుగానీ, సమర్ధుడైన డాక్టరుగానీ కావచ్చు. కానీ దేశభక్తి లేని కారణంగా పెద్దయిన తర్వాత స్వార్ధపరుడయ్యే అవకాశం ఉంది. అవినీతి పరుడయ్యే ప్రమాదం వుంది. అతడు కోట్లాది మంది సోదర భారతీయుల కనీసవసరాలను గురించి ఆలోచించడు. పైగా వారినెలా దోపిడిచేసి మరింత ధనం సంపాదించాలో ఆలోచిసాడు.

వినయ విధేయతలు నేర్పకుండా సాము గరిడీలు నేర్పిస్తే... “ఆర్నెల్లు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టాడని వెనుకటికో సామెతుంది. అలాగే దేశభక్తి నేర్పకుండా కేవలం ఇంగీషు, సైన్స్‌, గణితం లాంటివి మాత్రం నేర్పితే వారి విద్యా విజ్ఞానాలను పేదల దోపిదీకే ఉపయోగించే ప్రమాదం వుంది. అందుకే పౌరు లందరికీ విద్యార్థి దశలోనే దేశభక్తిని ప్రచారం చేయడం అవసరం” - ముగించారు మాపష్పారు.

ఒక్కనిముషం మౌనం. “పిల్లలూ! ఈ విషయంలో మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే అడగండి” ప్రశ్నించాడు మాప్పారు.

రాజు మెల్లగా లేచాడు. “మాష్టారూ! మా పక్కింటి అంకుల్‌ నన్నొక ప్రశ్న వేశారు. నేను సమాధానం చెప్పలేకపోయాను. మీరు దానికి సమాధానం చెబితే అది ఆయనకు చెప్పి గట్టిగా వాదిన్తాను అడగమంటారా?”

“తప్పకుండా రాజూ! ఏమిటా ప్రశ్న?” అడిగారు మాష్టారు.

“ఆయన అడిగిన (ప్రశ్న ఏమిటంటే “రాజూ నన్ను చూడు. నేను బాగా సంవాదించాను. వెంకయ్య అంకుల్‌, సురేందర్‌ అంకుల్‌ అలాగే లక్ష్మయ్య అంకుల్‌ను చూడు వాళ్లందరూ బాగా సంపాదించారు. మీ డాడీ, నువ్వు, మీ మాష్టారు అందరూ జనవిజ్ఞానవేదిక-------------------- ఈ[0------------------ దేశమును ప్రేమించుమన్నా

బాగా సంపాదిస్తే అందరూ అభివృద్ధి సాధించినట్లే గదా! దేశభక్తికల వాళ్లందరూ కోరుకునేది అదే కదా?” ఇదీ మాప్తారు ఆయన ప్రశ్న

“రాజా! నీవు చెప్పిన వారందరి విషయం నాకు తెలుసు. వారందరూ అవినీతి పరులు. అవినీతి మార్గాల ద్వారా కొద్దిమంది కోటిశ్వరులైనంత మాత్రాన దేశం అబివృద్ధి కాదు. పైగా మరికొంతమంది మరింత దరిద్రులౌతారు. అంతే దేశం మరింత దరిద్రంలోకి వెళ్తుంది. ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతాయి. ఉదాహరణకు మీకొక ఊరికథను

చెబుతాను వినండి. ఆ ఊరు మెయిన్‌ రోడ్‌కు 4 కి.మీల దూరంలో ఉంది. మెయిన్‌ రోడ్డు వరకు రావటానికి ఊళ్లో నుండి సరయిన వసతి లేదు. ఊరిలో ఆసుపత్రి లేదు. ఎవరైనా

రోగులనుకాని, గర్భిణీ ప్రీలనుగాని అర్జెంటుగా ఆసుపత్రికి తరలించాలంటే - ముఖ్యంగా వానాకాలంలో మంచాన్ని డోలీగా కట్టి మోసుకుపోవలసిందే! ఊరి చెరువులో ఉన్న బావి నీరే మంచినీటికి ఆధారం. అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకురావడం అంటే వానాకాలంలో ఊళ్లో అందరికీ నరకమే. బురదలో పడుత్త్హూ,లేస్తూ బిందెడు బరువుతో రావాలి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది కృషి వలన ఊళ్లో నుండి మెయిన్‌రోడ్డుకు కంకర రోడ్డు శాంక్షన్‌ అయింది. కంకర తోలారు. ఎర్రమట్టి తోలారు. ఇక పరవడమే తరువాయి.

ఈలోగా ఒకరిద్దరు పెద్దలు తమ ఇంటి ముందున్న కంకరును ఎర్రమట్టిని వారి ఆవరణలో పోసుకుని మెరక చేసుకున్నారు. వారిని చూసి మరికొందరు అదే పని చేశారు. వారి బాటలో వారి అనుచరులు నడిచారు. దూరాన వున్న కంకర, మట్టిని బండ్లతో తోలుకొని సందుల్లో వున్న ఇండ్లను కూడా మెరక చేసుకున్నారు. ఇదేమని అడిగిన యువకులను “అదిగో ఆయన చేయలేదా! ఇదిగో ఈయన చేయలేదా? వాళ్లందర్నీ ఆపండి. మేమూ తోలుకోవడం ఆపేస్తాం” అని పెడసరిగా సమాధానం చెప్పసాగారు. మొత్తానికి చాలామంది పెద్దలు ఇండ్లు మెరక అయినాయి. మరోపక్క కాంట్రాక్టరు, ఇంజనీర్లు కలిసి రోడ్డు వేసినట్లుగా రాసి బిల్లు తీసుకున్నారు. మళ్లీ వానాకాలం వచ్చింది. పెద్దల ఇండ్లలో నీళ్లు నిల్వ ఉండటం లేదు. వాన నీరంతా పల్లంగా ఉన్న రోడ్ల మీదకు వచ్చి అక్కడే నిల్వ ఉంటోంది. అయితే రోడ్డు పరిస్థితి పూర్వంలాగే ఉంది.

మంచినీళ్లు తెచ్చుకోవడానికి అవే ఇబ్బందులు తప్పడం లేదు. ఆ ఊరు పక్క ఊళ్ల వారి దృష్టిలో చులకన అయింది. ఆడపిల్లల కష్టాలు చూసి ఆ ఊరి యువకులకు పిల్లనీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులు, గర్భిణీ ప్రీలు సరయిన టైంలో వైద్య సహాయం అందక చనిపోతూనే ఉన్నారు. పిల్లలు వానాకాలం పొరుగూరు జనవిజ్ఞానవేదిక-------------౮౮౮౮౮౮౮€---------------- దేశమును ప్రేమించుమన్నా

హైస్కూలుకు వెళ్లి చదువుకోలేక చదువును ఆపివేస్తున్నారు.

కాబట్టి రాజూ! కొద్దిమంది ఇళ్లు మెరకలు అయినంత మాత్రాన ఆ ఊరు బాగుపడినట్లేనా? అదేవిధంగా కొద్దిమంది ఏదో విధంగా సంపాదించినంత మాత్రాన దేశం బాగుపడ్డట్టుకాదు. పైగా ఎక్కువమంది కప్పాలు అధికమౌతాయి. దేశం పరిస్థితి కూడా అంతే. ఇదీ మీ పక్కింటి అంకుల్‌కి మనం ఈయగలిగిన సమాధానం”. ముగించారు మాష్పారు.

గంట గణగణ మోగింది. మ

మాష్టారు, పిల్లలు మెల్లగా లేచారు.

మరునాడు క్లాసులోకి రాగానే మాష్టారు దేశభక్తి పాఠాన్ని ఇలా కొనసాగించారు.

“పిల్లలూ! నిన్నటి క్లాసులో దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాం. దేశభక్తి ఎందుకు కలిగి ఉండాలో అర్ధం చేసుకున్నాం. ఇప్పుడు మిమ్ములను ఓ ప్రశ్న వేసాను. మనం మన దేశభక్తిని ఎలా వ్యక్తీకరించాలి? రోజూ ఒక కాగితం మీద 100 సార్లు దేశభక్తి, దేశభక్తి అని రాస్తే సరిపోతుందా? నువ్వు చెప్పు గాబ్రియల్‌.”

“కాదు సార్‌, దేశభక్తి కల్గిన ప్రతి వ్యక్తీ ఆ దేశంలోని వ్యక్తులందర్నీ కులృ్యమత ప్రాంతీయ, భాషా విభేదాలు లేకుండా (ేమించాలి. తన కులంవాడు కాదనో తన మతంలో పుట్టలేదనో అనే కారణాలతో ద్వేషించకూడదు.

“మంచిది. అమ్మా శాంతీ! నువ్వు చెప్పు. దేశభక్తిని ఇంకా ఎలా వ్యక్తీకరించాలో”

“దేశభక్తి కలవారు తన దేశంలోని అణువణువునూ ప్రాణపదంగా చూచుకోవాలి. దెశ సంపదను నిరంతరం కాపాడుకోవాలి.”

“అవునమ్మా ఏయే దేశాల్లోనైతే తమ దేశ సంపదను ప్రాణపదంగా భావించి దాన్ని కాపాడటానికి ప్రజలు అందరూ నిరంతరం శమ పడతారో ఆయా దేశాలు మాత్రమే బ్రహాండమైన ప్రగతి సాధించాయి.

ఉదాహరణకు జపాన్‌ దేశాన్ని చూడండి. ఈరోజు ఆర్థిక రంగంలో ఆమెరికాను కూడా మించిన ప్రగతిని సాధించింది. దానికి కారణం జపాన్‌ ప్రజలందరూ తమ దేశ సంపదను ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఒక ఉదాహరణ చెపాను వినండి. మన రాష్ట్ర విద్యుత్‌ సంస్థలో పాల్‌గారని ఒక పెద్ద ఇంజనీర్‌ ఉందేవారు. ఆయన ఒకసారి జపాన్‌ వెళ్లడం జరిగింది. ఒకరోజు ఆయన రైల్లో ఫస్టుక్షాసు కంపార్పమెంటులో ప్రయాణిస్తున్నారు. ఆయన కెదురుగా సూటుబూటూ ధరించిన వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. జనవిజ్ఞానవేదిక------------------ ళయి------------------- దేశమును ప్రేమించుమన్నా

మన పాల్‌గారికి ఆశ్చర్యం వేసింది. మనిషి చూస్తే పెద్ద ఆఫీసర్‌లాగున్నాడు. కానీ సీటు చినుగులు కుడుతున్నాడు. ఇక ఉండబట్టలేక ఆయనే ్రశ్నించారట. “బాబూ, ఎవరు నువ్వు?” అని. ఆయన జపాన్‌లోని ఒక పెద్ద పరిశ్రమ పేరు చెప్పి దానికి జనరల్‌ మేనేజర్‌నని చెప్పారు. “మరి మీరు ఈ చినుగులు కుద్తున్నారెందుకు?” అని ప్రశ్నించారు. మన పాల్‌గారు.

అందుకు ఆయన నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు - అయ్యా! నిన్న నేను ఇదే రైలులో ఇదే సీటుపై కూర్చొని ప్రయాణం చేశాను. ఈ చిరుగు కనిపించింది. ఈ రోజు కూడా ఇదే రైల్లో ప్రయాణం చెయ్యాలి. ఈ చిరుగు కుట్టడానికి సూది, దారం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ రైలు నా దేశ సంపద. దీన్ని కాపాడుకోవడం దేశభక్తుడైన ప్రతి వ్యక్తి కర్తవ్యం. ఈ చిరుగుని ఇలాగే వదిలివేస్తే మరి కొన్ని రోజుల్లో ఇది పెద్దదై సీటు పనికి రాకుండా పోతుంది. అందుకని ఒక పౌరునిగా ఈ చిరుగు కుట్టడం అనే బాధ్యతను తీసుకున్నాను. అని చెప్పారట.

పాల్‌గారికి ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. వారి దేశభక్తి ఎంత గొప్పదో ఆ దేశభివృద్ధి యొక్క అసలు కారణం ఏమిటో తెలుసుకొని చాలా సంతోషించారు.

కానీ మన దేశంలో నేటి పరిస్థితి ఏమిటి? దేశసంపదలో భాగమైన బస్సులు, రైళ్లను మనం కాపాడుకుంటున్నామా? లేదు. పైగా అనేకమంది రాజకీయవాదులు ఉద్రేకపూరితమైన యువకులు రైళ్లను ధ్వంసం చేస్తున్నారు. బస్సులను తగులబెడుతున్నారు. టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీలను కూలగొడుతున్నారు. ఇదా మన దేశభక్తి? ఇదేనా మన దెశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టే పద్ధతి??”

క్లాసంతా మాస్తారి మాటలను నిశ్శబ్ధంగా వింటున్నారు.

ఒక నిముషం తర్వాత మాష్టారు “దేశభక్తిలోని మరో ముఖ్యమైన అంశాన్ని ఎవరైనా చెప్పగలరా?” అని అడిగారు.

“నెను చెబుతాను మాష్టారూ!” లేచి నిలబడ్డాడు లక్షణాచారి.

“చెప్పు లక్ష్మణా!”

“క్రమశిక్షణ మా్వరూ!”

“అవును క్రమశిక్షణ అంటే ప్రజలంతా మంచి మార్గంలో ఒక చక్కని పద్ధతిలో నడవడం. దీనికొక మంచి ఉదాహరణ చెప్తాను. క్రమశిక్షణ గల ప్రజలు ఒకదానిపై ఒకటి, ఒకదాని పక్కన మరొకటి పేర్చి, మధ్యలో సిమెంటుతో అనుసంధానం చేసిన జనవిజ్ఞానవేదిక----------౮౮౮౮౮౮౮౪€యి---------------- దేశమును ప్రేమించుమన్నా

ఇటుకల గోడవంటివారు. క్రమశిక్షణ లేని ప్రజలు ఒక పెద్ద కుప్పగా పోయబడిన ఇటుకలవంటివారు. మీరే చెప్పండి. చక్కగా కట్టబడిన ఇటుకల గోడను ఎవరైనా తేలికగా కూల్చగలరా?

“కూల్చలేరు మాష్టారు”

“ఆ గోడలో పాములు, మండ్రగబ్బలు కాపురం ఉండగలవా?”

“ఉండలేవు.”

“పెద్ద ఇటుకల కుప్పను పరిశీలించండి వాటిని ఎవరైనా ఎత్తుకు పోలేరా?” .

“ఎత్తుకు పోగలరు మాష్టారూ.”

“దానిలో పాములు, మంద్రగబ్బలు కాపురం ఉంటాయా?”

“ఉంటాయి మాష్టారూ. ఒకసారి నేను చూశాను అన్నాడు శ్రీను.

“దేశం విషయమైనా అంతే. దేశభక్తిగల పౌరులందరూ క్రమశిక్షణగా ఉండాలి. అప్పుడే ఆ దేశం ప్రగతిపథంలో పరుగులు తీస్తుంది. ఉదాహరణకు క్లాసురూమునే తీసుకోండి మీరు మాష్టారు చెప్పే పాఠం వినడం లేదనుకోండి. కబుర్లు చెప్పుకుంటూ, నిద్రవోతూ, పనికిరాని పుస్తకాలు చదువుతూ ఉన్నారనుకోండి. ఆ పిల్లల్లో క్రమశిక్షణ లేదంటాము. అటువంటి పిల్లలు పరీక్షలు పాసుకాగలరా? మంచి ఉద్యోగాలు చేయ గలరా? దేశానికి పేరు తేగలరా?”

“తీసుకురాలేరు మాష్టారూ” పిల్లలందరూ పెద్దగా అన్నారు.

“ప్రజలు క్రమశిక్షణ లేకుండా ఉంటే దేశం అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రగతి సాధించలేదు. పౌరులలో క్రమశిక్షణ లేకుంటే బలవంతులు, దౌర్జన్యం చేసే వారికే సౌకర్యాలు అమరుతాయి. బలహీనులు నలిగిపోతారు. ఇది దేశ ప్రజలలో అశాంతిని ఏర్పరుస్తుంది. ఇది మరింత అస్తవ్యస్త పరిస్థితులకు దారితీస్తుంది. దేశాభివృద్ధి మరింత కుంటుపడుతుంది.

ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. చీమలను, ఈగలను పరిశీలించడి. చీమలు ఒకదాని వెనుక ఒకటి చక్కగా క్రమశిక్షణగా నడుస్తాయి. కష్టపడి పుట్టలు పెడతాయి. ఎండాకాలమంతా శ్రమపడి ఆహారాన్ని సంపాదించి ఆ పుట్టలో దాచి పెడతాయి. అన్నీ కలసి పామునైనా కుట్టికుట్టి చంపుతాయి. కాని ఈగలను చూడండి. వాటికి క్రమశిక్షణ లేదు. ఎక్కడబడితే అక్కడ వాలుతాయి. ఏది దొరికితే అది తింటాయి. జనవిజ్ఞానవేదిక----------...---శఈమి------------------- దేశమును ప్రేమించుమన్నా

ఆహారాన్ని దాచుకోవు. చివరకు పెంటదిబ్బల మీద నివశిస్తాయి. అక్కడ గుడ్లు పెడతాయి. అక్కడే చనిపోతాయి. ఇప్పుడు చెప్పండి మనం చీమల్లోని క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకోవాలో! ఈగల విశ్చంఖల స్వేచ్చా విహారాన్ని ఆదర్శంగా కీసుకోవాలో!?”

“చీమలను ఆదర్శంగా తీసుకోవాలి మాష్టారూ!” పిల్లలందరూ పెద్దగా అరిచారు.

“కాబట్టీ దేశభక్తి గల పౌరులుగా మీరందరూ క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే దేశాన్ని ముందుకు నడిపించగలం.

ఒక్క నిముషం నిశృబ్దం తర్వాత మాష్టారు మళ్లీ కొనసాగించారు. “దేశభక్తికి సంబంధించి మరో ముఖ్యమైన అంశాన్ని ఎవరైనా చెప్పగలరా?” “నేను చెబుతాను మాష్టారూ! బాబూరావు అన్నాడు.

“చెప్పు”

“ఐకమత్యం మావ్వారూ”

“వెరీగుడ్‌. మంచిది. మంచి అంశం చెప్పావు బాబూరావు” ప్రోత్సాహంగా అన్నారు మావ్వురు.

ఇంతలో గంట గణగణ మోగింది.

“పిల్లలూ! టైమైపోయింది. ఈ ముఖ్యమైన అంశాన్ని తర్వాత క్లాసులో చెప్పుకుందాం” అంటూ మాష్టారు లేచారు.

మర్నాడు మాష్టారు క్లాసులోకి రాగానే పిల్లలందరూ పెద్దగా “మాష్టారూ! ఐకమత్యం” అని అరవనాగారు.

“పిల్లలూ! కేకలు వేయడంలో మీరు మంచి ఐకమత్యం చూపిస్తున్నారురా” మాష్టారు నవ్వుతూనే అన్నారు.

శాంతి లేచి నిలబడి “అదికాదు మాష్టారూ! ఈరోజు మీరు ఐకమత్యం అనె అంశాన్ని గురించి చెబుతున్నారు గదా! అందుకని...” మెల్లగా చెప్పింది.

“అసలు “ఐకమత్యం” అంటే ఏమిటి? నువ్వు చెప్పు లతా!” అడిగారు మావారు.

“ఐకమత్యం అంటే... ఐకమత్యంగా ఉండటం మాష్టారూ” అంది లత.

క్లాసంతా ఫక్కున నవ్వారు.

“సైలెన్స్‌! నువ్వే ప్రయత్నించి చెప్పమ్మా! ఐకమత్యంగా ఉండటం అంటే ఏమిటి?” మల్లీ ప్రశ్నించారు మాష్టారు.

“అంటే... అందరూ స్నేహంగా, కలసికట్టుగా ఉందటం” అంది లత.

“వెరీగుడ్‌. కరెక్టుగా చెప్పావమ్మా ఇప్పుడు ఐకమత్యం యొక్క అవసరాన్ని గురించి చెప్పుకుందాం. మీలో ఎవరికైనా సింహం. నాలుగు ఎద్దుల కథ తెలుసా?” అడిగారు మావారు

“నాకు తెలుసు మాష్టారూ” చెప్పాడు వేణు.

“ ఆ కథ చెప్పు వేణూ.”

“ఒక అడవిలో నాలుగు బలమైన ఎద్దులు నివళిస్తుండేవి. అవి ఎంతో ఐక + మత్యంగా జీవిస్తుండేవి. ఒకరోజు ఒక సింహం వాటిలో ఒక ఎద్దుని చంపాలని వచ్చింది. కాని ఆ నాలుగు ఎద్దులు కలసి సింహంతో పోరాడి, దాన్ని తరిమి కొట్టాయి. అప్పుడు సింహం ఏం చేసిందంటే, ఎద్దుల ఐకమత్యాన్ని చెడగొట్టడానికి ఒక నక్కను పంపింది. ఆ నక్క చాడీలు చెప్పి, ఎద్దుల్లో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టింది. అవి నాలుగూ తమలో తాము పోట్లాడుకోసాగాయి. అప్పుడు సింహం వచ్చి ఆ ఎద్దులను ఒకదాని తర్వాత మరొకదానిని చంపి తిని వేసింది. అంటూ క్లుప్తంగా చెప్పాడు వేణు.

“వెరీగుడ్‌ ఇపుడు ఈ కథనే మన దేశానికి అన్వయించి చూసుకుందాం. మన దేశంలో అనేక కులాలవారు, మతాలవారు ఉన్నారు. వివిధ భాషలు మాట్లాడేవారు వున్నారు. వీరందరూ తమలో తాము కలహించుకుంటున్నారనుకోండి. అప్పుడు ఏమవు తుంది? ఇతర దెశాలవారు వచ్చి మనలను జయించి మన దేశాన్ని పరిపాలిస్తారు. 200 సంవత్సరాల క్రింద ఏమైంది? మన దేశంలోని రాజులు తమలో తాము ఎప్పుడూ కలహించుకుంటూ ఉండేవారు. ఇంగ్లీషువారు మన కథలో సింహంలాగా వాళ్ళమధ్య అనైక్యత సృష్టించి రాజ్యాలను జయింపసాగారు. అప్పుడు రెండవ బహదూరుషా నాయకత్వంలో ర్లూన్సీలక్ష్మిబాయి, నానాసాహెబ్‌, తాంతియా తోపే మొదలైన వారందరూ కలసి 1857లో బ్రిటీష్‌ వారితో స్వతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించారు. కాని ఈనాడు రాజులు, మహారాజులుగా చలామని అవుతున్న వారంతా ఆనాడు ఏం చేసారు? ఆ ప్రథమ భారత సంగ్రామానికి వెన్నుపోటు పొడిచారు. బ్రిటీష్‌వారితో చేతులు కలిపారు. ఐకమత్యం లేని భారతీయుల్ని బ్రిటీషువారు ఓడించ గలిగారు. ఫలితం మరల దాదాపు 100 ఎళ్ళు మనం బానిసత్వంలో ('మగ్గవలసి వచ్చింది. మరలా గాంధీజీ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు భాషలవారు కలిసి ఐకమత్యంతో పోరాడాము కాబట్ట మనకు స్వతంత్రం వచ్చింది. పిల్లలూ, ఇప్పుడు అర్ధమైందా? మనలో ఐకమత్యం లేకపోతే మన దేశానికి ఎంత నష్టమో!?”

“అర్ధమైంది మాష్టారూ” పిల్లలందరూ ఏకకంఠంతో అన్నారు”.

“కాని ఈ రోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?” మాష్టారు చెప్పడం కొనసాగించారు. “ఈనాడు భారతీయులలో ఐకమత్యం తగ్గిపోతోంది. కులంపేరు మీద, మతం పేరుమీద ప్రజలు నిరంతరం కలహించుకుంటున్నారు. పెద్దమనుషులుగా పరిగణింప బడుతున్నవాళ్ళే కుల విద్వేషాలను పెంచి పోషిస్తున్నారు.

మీకొక ఉదాహరణ చెబుతాను వినండి. మనం ఇందాక చెప్పుకున్న ప్రథమ

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో రూన్సీ లక్ష్మిబాయితో మరొక స్త్రీ కూడా పాల్గొన్నది. ఆమె ఎవరో తెలుసా? బేగం హజరత్‌ మహల్‌ అనే ముస్లిం ప్రీ. ఆమె యుద్ధంలో లక్నో వద్ద వీరమరణం చెందింది. ఆమె జ్ఞాపకార్ధం లక్నోలో ఒక పార్కును నిర్మించి దానికి

“బేగం హజరత్‌ మహల్‌ పారూ అని పేరు పెట్టుకున్నారు ప్రజలు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కొంతమంది పెద్దమనుషులు ఆ పార్ముపేరును “ఊర్మిళా వాటికోగా మార్చి వేశారు. ర్లూన్సీ లక్ష్మీబాయిని వీరనారీగా కీర్తించే ఆ పెద్దలు బేగం హజరత్‌ మహల్‌ పేరును ప్రజల స్కృతిపథం నుంచి తొలగించి వెయాలని ఎందుకు అనుకున్నారు. కారణం ఆమె ముస్తిం కావడమే! ఇలాంటి చర్యలు ప్రజల్లో హిందూ-ముస్లింలు మధ్య మత ద్వేషాలకు, మత కలహాలకు తద్వారా మతోన్నాదానికి దారితీయవా? అవి దేశ సమైక్యతకు భంగం కలిగించవా?” ఆవేదనగా ప్రశ్నించారు మావారు.

క్లాసంతా నిశ్శబ్ధం ఆవహించింది. మాష్టారు మళ్లీ చెప్పడం కొనసాగించారు. “కాబట్టి మనమందరం కులాభిమానాలు వదిలివేయాలి. మతోన్మాదాలని మట్టు పెట్టాలి. ప్రాంతీయ ఆవేశాలు అణచివేయాలి. భాషా విద్వేషాలు తరిమి వేయాలి.

“మున దేశం భారతదేశం. మనమంతా భారతీయులం” అనే నినాదంతో అందరం ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండాలి. అప్పుడే మన దేశం ప్రగతి సాధిస్తుంది. ఇప్పుడు చెప్పండి పిల్లలూ! మనదేశం ప్రగతి సాధించాలంటే మనందరం ఎలా ఉందాలి?”

“మనమందరం ఐకమత్యంగా ఉండాలి” పిల్లలందరూ పెద్దగా ఒకేసారి అన్నారు.

“వెరిగుడ్‌ ఇప్పుడు దేశభక్తికి సంబంధించిన మరో అంశాన్ని తీసుకుందాం. అదేమిటంటే జాతీయ పతాకం, జాతీయ గీతాల ఎడల అత్యంత గౌరవం కలిగి ఉండ టం. ఇప్పుడు మీలో ఎవరైనా మన జాతీయ పతాకం ఎలా ఉంటుందో చెప్పగలరా?” ప్రశ్నించారు. మాష్టారు.

చాలామంది పిల్లలు మేమంటే మేం చెప్తామంటూ లేచి నిలబడ్డారు.

“నువ్వు చెప్పు వేణూ” అన్నారు మాష్టారు.

“మన జాతీయ పతాకం మూడు రంగుల జెండా. పైన కాషాయం రంగు, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగు ఉంటాయి. పతాకం మధ్యలో నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. అదే మన జాతీయ పతాకం మాష్టారూ!

“వెరిగుడ్‌ వర్మా! సీవు చెప్పు. మన జాతీయ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు?

“పింగళి వెంకయ్యగారు మావ్వారు!” ,

“గృడ్‌,. శాంతీ! నువ్వు చెప్పు మన జాతీయ గీతం ఏది?

“జనగణమన..౯ మాష్టారు. ః

“కరెక్ట్‌ పిల్లలూ! మీకు మన జాతీయ పతాకం, జాతీయగీతం తెలుసు. వీటిని మనం ఎంతో గౌరవించాలి. జాతీయ పతాకాన్ని ఎప్పుడూ కాలితో తొక్కరాదు. జాతీయ గీతం ఆలపించెటప్పుడు గౌరవసూచకంగా కదలకుండా నిలబడాలి. అలా తమ జాతీయ చిహ్నాలను గౌరవించడమంటే తమ జాతిని గౌరవించుకోవడమన్నమాట. ఆ విధంగా ఆత్మగౌరవాన్ని కలిగిన ప్రజల, తమ దేశాభివృద్ధికై కృషి చేస్తారు. తమ జాతీయ చిహ్నాలునే గౌరవించలేని ప్రజలు స్వాతంత్ర్యానికి బానిసత్వానికి తేడా తెలియక దేశం బానిసత్వంలో మగ్గుతున్నా పట్టించుకోరు. మనం ఒక్కసారి ప్రపంచ దేశాలను పరిశీలిద్ధాం. ఏ దేశాలైతే ప్రపంచంలో గొప్పరాజ్యాలుగా పేరు తెచ్చుకున్నాయో వాటిలో ఒకటైన ఇంగ్లాండు ఈనాటికీ అగ్రరాజ్యాల్లో ఒకటిగా చలామణి అవుతోంది. ఇంగ్లీషువాళ్ళు తమ జాతీయ చిహ్నం ఎడల ఎంత గౌరవం చూపిస్తారో తెలిపే ఒక సంఘటన వివరిసాను. వినండి.

పిల్లలు ఆసక్తిగా చెవులు రిక్కించి వింటున్నారు.

“ఇంగ్లాండు దేశంలో ఒకరోజు ఆ దేశంలోని రెండు టీముల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆట మధ్యలో ఇద్దరాటగాళ్ల మధ్య ఏదో విషయమై వివాదం మొదలైంది. అది పెరిగి పెరిగి కొట్లాటగా మారింది. అంతా గందరగోళం! ఎటుచూసినా భీభత్సం! కొట్లాట ఆపండని నిర్వాహకులు ఎన్నిసార్లు మైకులో విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం. చివరకు ఒక తెలివిగల (పేక్షకుడు తమ జాతీయ గీతం ప్లేటును తీసి, గ్రామఫోన్‌ మీదపెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు అంతే! ఎక్కడివారు అక్కదే ఆగిపోయారు. పాట అయిపోయే టప్పటికి అందరిలో ఆవేశాలు తగ్గి, ఆలోచన మొదలైంది. ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చున్నారు. ఆట కొనసాగింది. చూశారా వాళ్లకు తమ జాతీయ గీతమంటే ఎంత

గౌరవమో! మరి మనదేశ పరిస్థితి చూడండి. కొంతకాలం క్రితం ప్రజల్లో జాతీయ భావన పెంపొందించే ఉద్దేశంతో సినిమాహాళ్లలో సినిమా అయిపోయాక తెరమీద జాతీయ పతాకాన్ని చూపిస్తూ, జాతీయ గీతాన్ని వినిపించేవారు. కానీ (పేక్షకులు ఎవ్వరూ ఆగకుండా, ఆగిన వారిని కూడా తోసుకుంటూ బైటకు వెళ్లేవారు. దానికి కారణం ఏమిటి? మనదేశ ప్రజలకు తమ జాతీయ చిహ్నాలను గౌరవించడమంటే తమను తాము గౌరవించుకోవడమనే విషయం తెలియకపోవడమే”.

కాసేపాగి మాష్టారు చెప్పడం కొనసాగించారు.

“దేశభక్తికి సంబంధించిన మరో అంశమేదైనా చెప్పగలరా?” “నేను చెప్పగలను మాష్టారూ!” లేచి నిలబడ్డాడు రవి.

“చెప్పు రవి

“దేశ ప్రజలందరూ నీతి కలిగి ఉండటం.”

“కరెక్టుగా చెప్పగలిగావు రవి! వెరీగుడ్‌! ఈ విషయాన్ని వివరించు చూద్దాం.

“దేశంలోని ప్రజలు నీతిపరులుగా ఉండాలి. ప్రజలు అవినీతిపరులైతే ప్రభుత్వో ద్యోగులు లంచగొండులైతే దేశం ప్రగతి సాధించదు. ప్రభుత్వ ధనం ప్రజల అవసరాలు తీర్చడానికి కాకుండా కొద్దిమంది లక్షాధికార్లు, కోటీశ్వర్లు కావడానికి ఉపయోగపడుతుంది.

“గృడ్‌ కాళ్ళీర్‌ మహాకవి క్షేమేంద్రుడు అవినీతిని గూర్చి ఏం చెప్పాడంటే “వేరు పురుగులు చేరి వృక్షాన్ని తొలిచినట్లు లంచగొండులైన నాయకులు దెశద్రోహులై ప్రభుత్వాలను పరాయి రాజుల వశం చేశారు. చేసారు కూడా” అందుకే దేశాభివృద్ధికి ప్రజలు, నాయకులు, ఉద్యోగులు నీతిమంతులై ఉండాలి.

ఇపుడు ఈనాటి దేశ పరిస్థితిని పరిశీలిద్దాం. నీతిమంతులు రోజు రోజుకు తగ్గి పోతున్నారు. వారిని ప్రజలు చేతకాని వారుగా పరిగణిస్తున్నారు. అవినీతి మార్గాల ద్వారా బాగా ధనం సంపాదించిన వారే ఎంతో గొప్పవారుగా గౌరవించబడుతున్నారు. అర్ధమైందా?” అడిగాడు మాప్పారు.

“అర్ధమైంది మాష్టారూ” పిల్లలందరూ గట్టిగా అన్నారు. “దేశభక్తికి సంబంధించిన మరో అంశం...” అంటూ మాష్టారు అనబోతుండగా”

“పరిశుభ్రత మాష్తారూ” అంటూ రాము లేచాడు.

“కరెక్ట్‌. నీకెవరు చెప్పారు ఈ విషయం?” జనవిజ్హానవేదిక---------ాలాాాలాా ళా దేశమును ప్రేమించుమన్నా

“అమెరికా నుంచి వచ్చిన మా మామయ్య మావ్వారూ. అమెరికా అంత అభివృద్ధి కావడానికి కారణం ఆ దేశ ప్రజలకు తమ దేశం పరిశుభ్రత పట్ల ఆసక్తేనట. రోడ్ల మీద చెత్తా చెదారం, కనీసం సిగరెట్‌ పీకలు కూడా వేయరట. ఒకరోజు మా మామయ్య రోడ్డు మీద సిగరెట్‌ త్రాగిన తర్వాత సిగరెట్‌ పీకను రోడ్డు మీదకు నిర్లక్ష్యంగా విసిరివేసి ముందుకు సాగాడట. ప్రక్శనే ఉన్న ఓ సూటు-బూటువాలా గభాలున వంగి ఆ సిగరెట్‌ పీకను తీసుకుని కొన్ని గజాలు వెళ్లి అక్కడ ఒక డస్ట్‌బిన్‌ వుంటే దానిలో పారవేశాడట. తను చేసిన పొరపాటు మా మామయ్యకు అప్పుడు అర్ధమైంది. అలా ప్రతి ఒక్కరు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని! కాబట్టి ఆ దేశం అంత గొప్పదై ఉంటుందంటారు మా మామయ్య” అని ముగించాడు రాము.

“వైనాలో ప్రజలు కూడా తమ దేశం ఎంతో శుభ్రంగా ఉంచుతారట మాష్టారూ. అందుకనే ఆ దేశం చాలా కొద్దికాలంలో అంత గొప్ప దేశం కాగలిగిందట” రాముకు పోటీగా నిలబడి చెప్పాడు హమీద్‌.

“నికెవరు చెప్పారు హమీద్‌?” నవ్వుతూ ప్రశ్నించారు. మాష్టారు.

మా అబ్బాసు బాబాయి, మాష్టారూ! మా బాబాయి చైనా వెళ్ళి ఆ దేశమంతా తిరిగి వచ్చాడు మాష్టారూ! ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డు పక్క టీ కొట్టుకు వెళ్లినా అక్కడ ఒక ఈగ కూడా కనిపించదట. కలరా, టైఫాయిడ్‌, విరోచనాల వంటి వ్యాధులు అసలు రావట” చెప్పాడు హమీద్‌.

ఇక చివరిగా “దేశభక్తికి సంబంధించిన మరో అంశం వుంది. ఎవరైనా చెప్పగలరా?” ప్రశ్నించాడు మాష్టారు.

ఎవరూ మాట్లాడలేదు.

ఈ రోజు మన దేశస్థులలో కొరవడినదీ, అభివృద్ధి చెందిన దేశాల్లో దేశస్థులందరు చాలా ప్రముఖంగా పాటించేదీ అయిన అంశం అదే! ఆలోచించండి.”

మళ్లీ క్షాసులో మౌనం.

“సరే. నేనే చెప్తాను, అదే టైం సెన్స్‌ అంటే కాలాన్ని సక్రమంగా పాటించే గుణం అన్నమాట. మన దేశంలో ఈ రోజు ఏ కార్వ్యక్రమమైనా గమనించండి. అది ఒక సమావేశం కానీయండి, బహిరంగసభ కానీయండి -- ఏదైనా అనుకున్న కాలానికి కొన్ని గంటలు ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. ఈ గుణానికే మనం ఇండియన్‌ పంక్షువాలిటీ అని పేరు పెట్టుకొని సరిపెట్టుకుంటున్నాం. ఆంగ్లేయుల టైం సెన్స్‌ను జనవిజ్ఞానవేదిక----------------.ట్ర)------------ దేశమును ప్రేమించుమన్నా

తెలియజేసే సంఘటన ఒకటి చెబుతాను వినండి. ఇటీవల లండన్‌లో ఒక సభ జరిగింది. దానికి ఒక భారతీయుడిని ప్రధాన వక్షగా పిలిచారు. ఆయన ఆ సమావేశం టైంకు 10 నిమిషాలు మాత్రమే లేటుగా వెళ్ళాడు. హాలులో ఎవ్వరూ కనిపించలేదు. “ఈ ఆంగ్రేయులకు టైం సెన్స్‌ ఉందంటారు. సమావేశం టైంకు 10 నిముషాలు దాటినా ఎవ్వరూ రాలేదేమిటబ్బా” అనుకొని మరో 5 నిముషాలు వేచి చూశారు. అయినా ఎవ్వరూ రాలేదు. విసుగ్గా అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ను అడిగాడు. “బాబూ, ఆరు గంటలకు మీటింగ్‌ అన్నారు. ఆరుంపావైనా నిర్వాహకులు కూడా రాలేదేంటి?” అని అడిగాడు.

..... దానికతడు “అయ్యా! చాలామంది 5.55కి రావడం చూశాను. 6.15కి వెళ్లిపోవడం చూశాను. మీటింగు సంగతి నాకు తెలియదు” అన్నాడట.

పిల్లలూ! పై విషయాలన్నీ మీకు చెప్పింది విదేశీయుల్ని పొగడటానికి, మన దేశాన్ని కించపరచడానికి కాదు. ఏ రంగంలోనైనా విజయం సాధించిన వ్యక్తిలోని గొప్ప గుణాలు తెలుసుకోవాలి. వాటిని అలవర్చుకుంటే మనం కూడా విజయాలు సాధించగలం. కాబట్టీ మనం మన దేశభక్తిని పెంపొందించుకోవాలి. కుల, మత, ప్రాంత, భాషా విభేదాలు లేకుండా మనం భారతీయులం మాత్రమేననే భావనతో జీవించాలి. దేశ ప్రగతికై పాటుపడాలి. క్రమశిక్షణగా మెలగాలి. ఐకమత్యంగా ఉండాలి. నీతి మార్గాన్ని అనుసరించాలి. జాతీయ చిహ్నాలను గౌరవించాలి. దేశ సంపదను కంటికి రెప్పలా కాపాడాలి. పరిశుభ్రతను పాటించాలి. ఏ పనికైనా ఖచ్చితంగా టైంకు హాజరవ్వాలి. ఇలా మన దేశ పౌరులందరూ దేశభక్తులై, దేశ ప్రగతికోసం కృషి చేస్తే మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఆదర్శవంతమైన దేశంగా ప్రపంచ దేశాల మధ్య గర్వంగా నిలబెట్టగలం. కాబట్ట పిల్లలూ! మీరందరూ దేశభక్తులై, దేశ ప్రగతి కోసం కృషి చేస్తారు గదూ!” అన్నారు మాష్టారు.

“తప్పక కృషి చేస్తాం మాష్టారూ!” పిల్లలంతా ఒకే కంఠంతో గట్టిగా సమాధాన మిచ్చారు. శ శ ఈ

జనవిజ్ఞానవేదిక----------౪ఫి----------------- దేశమును ప్రేమించుమన్నా

( ఫి ప్రభుత్వ ఫనం 008 : 15-0-1800 000 : 12-04-1002

“పిల్లలూ! ఈ రోజు నుండి అప్పుడప్పుడూ మోరల్స్‌ పీరియడ్‌లో దేశభక్తుల కవితల్లో మనకు స్పూర్తి నిచ్చెవీ దేశభక్తిని పెంపొందించేవీ అయిన సంఘటనలు చెబుతాను. వింటారా?” అడిగారు మావారు.

“వింటాం మావ్టారూ!” కొన్ని కంఠాలు గట్టిగా జవాబిచ్చాయి.

“మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే పేరు విన్నారా?”

“విన్నాం మాప్పారూ”

“ఆయన గూర్చి మీకేం తెలుసు? రవీ! నువ్వు చెప్పు” అడిగాడు మావారు.

“ఆయన ఒక గొప్ప ఇంజనీరు మాష్టారూ! మన దేశంలో అనేక ద్యాములకు రూపకల్పన చేసిందీ, కట్టించింది ఆయనే. ఆయనకు “భారతరత్న” బీరుదు ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది రవి లేచి నిలబడి జవాబిచ్చాడు.

“గుడ్‌! కూర్చో రవి! ఖాసిం! నువ్వు ఆయన కట్టిన డ్యాముల్లో ఒక ద్యాము పేరు చెప్పగలవా?” అడిగారు మాష్టారు.

“మైసూరు దగ్గర కట్టబడిన కృష్ణరాజసాగర్‌ మాష్టారూ! దాని ప్రక్కనే బృందావన్‌ గౌద్దెన్‌ వుంది” జవాబిచ్చాడు ఖాసీం.

“వెరిగుడ్‌! కూర్చో! ఆయన గొప్ప ఇంజనీరే కాదు గొప్ప పాలనాదక్షుడు కూడ. అందుకే ఆయనకు “భారతరత్న” బిరుదు ఇచ్చి గౌరవించింది. ఆయన జీవితంలో మనకు ఆదర్శప్రాయమైన ఒక సంఘటన చెబుతాను, వినండి” అని మాష్టారు చెప్పడం మొదలు పెట్టారు. జనవిజ్ఞానవేదిక----------------- €లు------------------ దేశమును ప్రేమించుమన్నా

“విశ్వేశ్వరయ్యగారు ఒకసారి ఒక ్రాజెక్టు గురించి సర్వే జరిపేందుకు ఊరికి దూరంగా ఒక చోట గుడారం వేసుకుని పని చేయాల్సి వచ్చింది. ఒకరోజు పగలంతా పనిజేసి రాత్రికి గుడారం చేరిన తర్వాత, భోజనం చేసి ఒక కొవ్యొత్తి వెలుగులో ఏవో ఆఫీసు కాగితాలు చూడసాగారు. కొంతసేపటికాయన తన ముందున్న కొవ్వొత్తిని ఆర్పి, వేరే కొవ్వొత్తిని వెలిగించి ఏదో రాసుకోసాగారు. పక్కనే ఉన్న ఉద్యోగికి కొంచెం ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆయన శ్రీ విశ్వేశ్వరయ్యగారితో...

అయ్యా! మీరు ఒక కొవ్వొత్తిని ఆర్బి వేరే కొవ్వొత్తిని వెలిచించారెందుకు? ఆ కొవ్వాత్తి వెలుగులోనే రాసుకోవచ్చుగదా” అని అడిగారు. దానికాయన నవ్వుతూ “బాబూ మొదట నేను చూసింది ఆఫీసు కాగితాలు. అప్పుడు వాడింది ఆఫీసు కొవ్వొత్తి. ఇప్పుడు నేను చేస్తున్నది మా యింటికి ఉత్తరం రాయడం. ఇది నా స్వంత పని. అందుకని ఆఫీసు కొవ్వొత్తిని ఆర్పి నా స్వంత కొవ్వొత్తిని వెలిగించాను” అన్నారు.

ఆ సమాధానానికి విశ్వేశ్య్వరయ్యగారి నైతిక బెన్నత్యానికి ఆ ఉద్యోగి ఆశ్చర్య పోయాడు. ఆ మహావ్యక్తికి చేతులెత్తి నమస్కరించాడు.

విన్నారా! బాలలూ! ఇంటికి ఉత్తరం రాసే కాలంలోనైనా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చెయ్యని విశ్వేశ్వరయ్యగారెక్కడ? ప్రభుత్వ ధనాన్ని సామాగ్రిని, వాహనా లను సొంతానికి విపరీతంగా వాడుకుంటున్న నేటి ఉద్యోగులు, నాయకులెక్కడ? కనీసం మీరైనా మీ తరంలోనైనా కోటాను కోట్ల విశ్వేశ్చ్వరయ్యలు తయారు కావాలి. అత్యున్నత నైతిక విలువలు కలిగి ఉండాలి. భారతమాత గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టాలి అని

7 ఆవేశంతో ముగించారు విశ్వం మాష్టారు. “అలాగే తప్పక నిలబెడతాం మాష్టారూ!” అంటూ పిల్లందరూ ఏక కంఠంతో నినదించారు. శ ఈ ఈ జనవిజ్హానవేదిక---------లాాాాాా టు దేశమును ప్రేమించుమన్నా

ప! ప్రజల భుఖ౦ కోనీ౦ ప. నరక బాధలకు సిద్ధపడ్డ శ వి

“పిల్లలూ! భరతమాత ముద్దుబిడ్డల జీవితాల నుండి మనకు స్ఫూర్తినిచ్చే సంఘ

టనలను మీకు అప్పుడప్పుడూ వివరిస్తున్నాను గదా!” అంటూ మొదలెట్టారు మాష్టారు.

“అవును మాష్టారూ!” సమాధాన మిచ్చారు పిల్లలందరూ ఏకకంఠంతో.

“ఈ రోజు ప్రజలకు తాను నమ్మిన సుఖాన్ని ప్రసాదించడం కోసం నరకబాధలను

అనుభవించడానికి సిద్దపడ్డ మరో మహామనిషి గూర్చి చెబుతాను” అన్నారు మాష్టారు.

“చెప్పండి మాష్టారూ!” అడిగారు పిల్లలందరూ ఆతృతతో.

“ఆ మహావ్యక్తి పేరు రామానుజాచార్యులు. ఆయన పేరు మీరెప్పుడైనా విన్నారా?

నీవు చెప్పు శ్రీనూ!” అడిగారు మాష్టారు.

“విన్నాం మాష్టారు! మా సోషల్‌ పుస్తకాల్లో ఆయన్ను గూర్చి వివరించబడింది”

శ్రీను లేచి నిలబడి చెప్పాడు.

ఏమని వివరించబడి ఉంది? శాంతీ, నీవు చెప్పమ్మ! అడిగారు మాష్టారు.

ఆయన విశిష్టాద్వైతమతం అనేదాన్ని స్థాపించాడు మాష్టారూ!” శాంతి

సమాధానం చెప్పింది. ల “అవునమ్మ! ఆయన మత సిద్దాంతాన్ని గూర్చి నేనిప్పుడు వివరించబోవదడం

లేదు. మనకందరికీ ఆదర్శప్రాయమైన ఆయన జీవితంలోని ఒక సఘటనను మీకు

వివరిస్తాను.

రామానుజాచార్యులవారి గురువుగారు ఆయనకు *నమో నారాయణాయ”

అనే మంత్రాన్ని చెవిలో రహాస్యంగా చెప్పారు. ఆ మంత్రాన్ని నిష్టతో జపిస్తే మరణించిన తర్వాత ఎంతో సుఖం దక్కుతుందని, దాని పేరు స్వర్ణమనీ చెప్పారు. అయితే ఆ మంత్రాన్ని అనుమతి లేకుండా ఎవరికీ చెప్పవద్దని ఆంక్ష విధించారు.”

అలా చిబితే ఏమవుతుంది స్వామీ!” అని గురువుగారిని రామానుజాచార్యులు

అడిగాడు. “నరకానికి పోతావు” అని కఠినంగా సమాధానమిచ్చాడు గురువుగారు. జనవిజ్ఞానవేదిక-----------------. అుు------------------- దేశమును ప్రేమించుమన్నా

|

“నరకమంటే ఏమిటి మాష్టారూ?” మాష్టారికథకు అడ్డం వచ్చి అడిగాడు ఖాశిం.

“మనలో ఆత్మనేది ఒకటుంటుందనీ, మనం తప్పుడు పనులు చేస్తే చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్లే చోటే నరకం అనీ, అక్కడ ఆత్మ ఎన్నో కష్టాలు పడుతుందని మనలో కొంతమంది విశ్వాసం ఖాశిం?” అని సమాధానమిచ్చి కథను కొనసాగించారు మాఫ్టారు.

“అయితే మీ అనుమతి తీసుకోకుండానే, నేను ఎవరికైనా ఆ మంత్రం ఉప దేశిస్తే, వారికేమవుతుంది స్వామీ అని అడిగారు రామానుజాచార్యులు. “వారు తప్పక స్వర్గానికి వెళ్లతారు” గురువుగారు సమాధానమిచ్చారు.

అంతే! రామానుజాచార్యులు శ్రీరంగపట్నం అంతటా ప్రచారం చేయించారు. ఏమని? ఆ రోజు సాయంత్రం శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథాలయం గాలి గోపురం పైనుండి శ్రీ రామానుజాచార్యులవారు ఒక మహా మంత్రం ఉపదేశిస్తారనీ, ఆ ఉపదేశం పొందినవారు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారనీ! ఆ విషయం విన్న వేలాదిమంది ప్రజలు ఆశతో గాలిగోపురం వద్దకు చేరారు. సాయంత్రమయింది. రామానుజాచార్యులు గాలి గోపురం ఎక్కారు. బీగ్గరగా “నమో నారాయాణాయ” అన్నారు. ప్రజలందరూ బిగ్గరగా తిరిగి పలికారు. తామందరూ చనిపోయిన తర్వాత స్వరానికి పోతామన్న ఆనందంతో వారందరూ ఉప్పి తప్బిబ్బవుటున్నారు. ఈలోగా విషయం విన్న రామానుజుల గురువుగారు అక్కడికి చెరుకున్నారు. శిష్యుని కిందకి పిలిపించి, ఇలా అన్నారు. “ఎంత పని చేశావు నాయనా! నా అనుమతి లేకుండా వీరందరికీ నారాయణ మంత్రోపదేశం చేశావే. వారు స్వర్గానికి వెళ్లారుగాని, నీవు నరకానికి వెళ్తావు గదా?”

దానికి రామానుజులు ఏమని సమాధానం చెప్పారో తెలుసా? “గురువుగారూ! నావలన ఇన్ని వేలమంది స్వర్గ సుఖాలను అనుభవించబోతున్నప్పుడు, వారందరి సుఖం కోసం నేనొక్కడిని నరక బాధలను సంతోషంగా అనుభవిస్తాను. వేలాదిమంది సుఖమే

, నాకు నిజమైన సుఖం స్వామీ!”

“చూశారా, పిల్లలూ! తాను ఏదైతే వేలాదిమంది ప్రజలకు సుఖం లభించే మార్గం అని నమ్మాడో, ఆ సుఖం వారికి లభించదం కోసం నరక బాధలు అనుభవించ డానికి రామానుజులు సిద్ధపడ్డారు. ఆయన మతాన్ని మీలో కొందరు అంగీకరించక పోవచ్చు. అసలు స్వర్గాన్నీ, నరకాన్ని నమ్మకపోవచ్చు, కాని ఇతరుల సుఖం కోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తాననే ఆయన ఆవేదనను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన నుండి స్పూర్తిని పొందాలి. అదే నా కోరికొ ముగించారు విశ్వం మాష్టారు.

“రామానుజుల త్యాగశీలతను ఆదర్శంగా తీసుకుంటాం మావ్వారూ!” కిరణ్‌ ఆవేశంగా అన్నాడు. అంగీకార సూచకంగా పిల్లలందరూ తలలూపారు. జనవిజ్ఞానవేదిక----ాాలాాలాలాలాలాలాలాళ్ర్య-----------------౮ దేశమును ప్రేమించుమన్నా

స్తు జే. మారుపేరు శ్రళ/ చటేచంద్ర విద్యాసాగర్‌

“పిల్లలూ మీరు ఒక వ్యక్తిని చూడగానే అతను గొప్పవాడని చెప్పగలరా?” అడిగారు విశ్వం మాష్టారు.

“కొంతవరకు చెప్పగలం మాష్టారూ!” సమాధానం ఇచ్చాడు, శ్రీను.

“ఎలా?”

“కొంచెం ఖరీదైన బట్టలు వేసుకుంటాడు. పాలిష్‌ చేసిన షూస్‌ వేసుకుంటారు. కళ్లకు అద్దాలు, నోట్లో సిగరెట్‌ ఇలా ఉంటే అతను గొప్ప వ్యక్తని చెప్పవచ్చు నార్‌”.

నవ్వాడు మాష్టారు.

“ఖరీదైన బట్టలు, బూట్లు ఒక వ్యక్తి బాహ్యాడంబరాన్ని సూచిస్తాయి గాని, అతని గొప్పతనాన్ని సూచించవు. గొప్ప విజ్ఞానం, వ్యక్తిత్వం ఉండాలేగాని, వేసుకున్న వేషంలో గొప్పదనం ఉండదని నిరూపించిన వ్యక్తిని గూర్తి చెప్పమంటారా?”

“చెప్పండి మాష్టారూ!” పిల్లలందరూ అడిగారు, ఒక్కసారిగా

“ఆయన పేరు ఈశ్వరచంద్ర విద్యానాగర్‌. ఆయన మహా పండితుడు. వేదాల నుండి ఆంగ్ల సాహిత్యం వరకు అన్నీ కంఠతా వచ్చు. బ్రహ్మ సమాజమనే మత శాఖకు నాయకుడు. ఈ శాఖవారు ఏకేశ్వరోపాశకులు. ఈశ్వరచంద్రులు బ్రహ్మసమాజ నాయకులుగా హిందూమతంలో అనేక సంస్కరణలకు ప్రయత్నించారు. వాటిలో వితంతు పునర్వివాహం ఒకటీ. ఆయనలో ఉన్న మరో గొప్పు విశేషం వకృృత్వం. అంటే ఆయన గొప్ప వక్త అన్నమాట. ఆయన ఉపన్యాసాలు వినడానికి చాలా దూరం నుంచి గూడా విద్యాధికులు వస్తూ ఉండేవారు. ఒకసారి ఏమైందో తెలుసా?” చెప్పడం ఆపారు మాష్టారు.

“చెప్పండి మావ్వారూ!” ఆతృతగా అడిగాడు. రవి.

“ఒకనారి ఈశ్వరచంద్రుల ఉపన్యాసాన్ని ఒక పట్టణంలో ఏర్పాటు చేశారు. ఉదయానికే ఆయన రైల్లో ఆ పట్టణానికి చేరుకున్నారు. ప్తాట్‌ఫారం మీద నిలబడి జనవిజ్ఞానవేదిక---------------------------- ళయి-------------------- దేశమును ప్రేమించుమన్నా

ఉన్నారు. ముతక ఖద్దరు చొక్కా ధోవతి, పై కండువా, మాసిన గడ్డం - ఇదీ ఆయన అవతారం. అదే రైల్లో మరో విద్యాధికుడు వేరే పట్టణం నుండి వచ్చి దిగాడు. ఎందుకో తెలుసా? ఈశ్వరచంద్రుని ఉపన్వాసం వినడానికి. అతను సూటూ-బూటూ వేసుకొని, హ్యాట్‌ పెట్టుకున్నాడు. చేతిలో ఒక చిన్న సూట్‌కేస్‌ ఉంది. అది పెద్దగా బరువులేదు. అయినా అతను దానిని మోయడానికి పోర్టరు కొరకు నలుదిక్కులా చూసాడు. ఎవ్వరూ కన్పించలేదు. ఎదురుగా ఈశ్వరచంద్రులు ఒక పల్లెటూరి మనిషిగా కన్పించాడు. ఆ విద్యాధికుడు వెంటనే ఈశ్వరచంద్రుని “ఏయ్‌, ఇలారా!” అన్నాడు. “ఈ పెట్టెను తీసుకురా” అని ఆజ్ఞాపించాడు. ఈశ్వరచంద్రుడు ఆపెట్టెను తీసుకొని నెత్తిన పెట్టుకున్నాడు. ముందు ఆ విద్యాధికుడు, వెనుక నెత్తిన సూట్‌కేసుతో ఈశ్వరచంద్రులు బయటకు వచ్చిన తర్వాత విద్యాధికుడు ఈశ్వరచంద్రులకు డబ్బులు ఈయబోయాడు. ఆయన సున్నితంగా తిరస్క రించి వెళ్లిపోయాడు. అతను పైసలు లేకుండా పెట్టెను మోసుకొనొచ్చిన “పల్లెటూరి బైత అమాయకత్వానికి నవ్వుకున్నాడు. సాయంకాలం అయింది. విద్యాధికుడు సూటు

  • బూటుతో నీటుగా తయారై సభకు వెళ్లాడు. సభ ప్రారంభమైంది. నిర్వాహకులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ని వేదికమీదికి ఆహ్వానించారు. వేదికమీదికి వచ్చిన విద్యా సాగర్‌ని చూచిన విద్యాధికునికి ఆశ్చర్యంతో పాటు ఎంతో బాధ కలిగింది. *ఈ మహావ్యక్తి చేతనా తాను ఉదయం సూటుకేస్‌ మోయించింది? “ఈ నిరాడంబర వ్యక్తినా తాను పల్లెటూరిబైతు అనుకొని నవ్వకున్నది?” అని ఎంతో విచారించసాగాడు. ఈశ్వర చంద్రుని ఉపన్యాసం అనర్గళంగా ఎంతో విజ్ఞానదాయకంగా ఒక గంటసేపు సాగింది. ఉపన్యాసం అయిన వెంటనే ఈశ్వరచంద్రులు వేదిక దిగుతున్నారు. అంతే? ఒక్క ఉదుటున మన విద్యాధికుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకొని బావురుమంటూ ఏడ్వసాగాడు. తనను క్షమించ మని వేడుకోసాగాడు. ఈశ్వరచంద్రులు అతనిని గుర్తు పట్టారు. అతన్ని పైకి లేపి ప్రశాంతంగా ఇలా అన్నారు. “నాయనా! అహంభావాన్ని వదిలివేయి. ఆడంబరాలకు ప్రాధాన్యత నీయకు, సాటివారిని ఆదరంగా చూడు. అదే నీ నుండి నేను ఆశించేది. విద్యాధికుడు ఆనందంతో ఆయన వాక్వాలకు అంగీకార సూచకంగా తలూపాడు.

“పిల్లలూ పై సంఘటన నుండి మీరు నేర్చుకున్న ఆదర్శం ఏమిటి?” అనే ప్రశ్నతో ముగించారు, మాస్తారు.

“ఈశ్వరచంద్రునిలాగా మంచి పాండిత్యం సంపాదించి, దేశభక్తిని ప్రచారం చెన్త” మాష్టారూ! అదే సమయంలో ఆయన యొక్క నిరాడంబరతను అనుసరిస్తాం. మెల్లగా ధృడంగా అన్నాడు సుందరరావు. మాష్టారి ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసింది.

క * *

నోబుల్‌ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదరథెరిస్సా

“పిల్లలూ! మీకొక పొడుపు కథను చెబుతాను. విప్పుతారా?” విశ్వం మాష్టారు అదిగాడు.

“విప్పుతాం మావ్టారూ!” పిల్లలందరూ ఉత్సాహంగా అరిచారు.

“అయితే జాగ్రత్తగా వినండి.” మొదలు పెట్టారు మాష్టారు. “ఎక్కడో పుట్టింది. ఇక్కడకు వచ్చింది. ప్రజల బాధలు చూసి కన్నీరు కార్చింది. తల్లిగా మారింది. సేవలను చేసింది. భారతరత్నమై మన్ననలు పొందింది. ఎవరో చెప్పుకోండి చూద్దాం!” అడిగారు విశ్వం మాష్పారు.

ఒక్క క్షణం నిశ్శబ్దం, వెంటనె దాదాపు అందరు పిల్లలూ ఒక్కసారిగా మదర్‌ థెరిన్సా, మదర్‌ థెరిన్సా అని అన్నారు.

“కరెక్ట్‌, మీరందరూ కరెక్టుగా చెప్పారు. మదర్‌ థెరిస్సా భారతరత్న (గ్రహీత. ఆమె మన దేశంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టిందో తెలుసా? నీవు చెప్పు వెంకట్రావ్‌”.

“యుగోస్లోవియాలో మాష్టారూ!” వెంకట్రావ్‌ లేచి నిలబడి చెప్పాడు.

“గుడ్‌ కూర్చో ఆమె పుట్టింది యుగోస్తోవియాలో అయినా 18 ఏళ్ల వయసులో జాగ్రఫీ టీచరుగా భారతదేశంలో అడుగు పెట్టారు. దేశంలోని పేదల బాధలకు చలించారు. వారికి జీవితాంతం సేవలు చేశారు. ఆమె జీవితంలో మనకు ఆదర్శ ప్రాయమైన సంఘటనను ఒకదాన్ని వివరిస్తాను వినండి. జనవిజ్ఞానవేదిక-------------------..-- ళఉ్య----------------------- దేశమును ప్రేమించుమన్నా

మదర్‌ థెరిస్సా తన సేవా కార్యక్రమాలు కలకత్తాలో ఆరంభించారు. ఆ రోజుల్లో ఆమె చేసే సేవా కార్యక్రమాల వలన ప్రభావితులై అనేకమంది ఆమె స్ధాపించిన సంఘంలో చేరుతుండేవారు. అందువలన కొంతమంది మతోన్నాదులకు ఆగ్రహం కలిగింది. థెరిన్నా మతాంతరీకరణ చేసే మోసగత్తె అని ప్రచారం ప్రారంభించారు. అయినా ఆమె చలించ లేదు. ఆమెను కొట్టి, కలకత్తా నుండి వెళ్లగొట్టాలనుకున్నారు. దానికోసమై కొంతమంది గూండాలను నియమించారు. ఆ గూండాలు ఆమె నివాస గృహానికి వచ్చారు. తలుపులు వేసిఉన్నాయి. లోపల మదర్‌థెరిస్సా తన రక్షణకోసం ఎంతమంది గూండాలను పెట్టు కున్నదో చూచి, జాగ్రత్తగా దాడి చేద్దామనుకొని వాళ్లు కిటికీలో నుండి తొంగి చేశారు. ఆశ్చర్యం! లోపల థెరిస్సా మరియు ఒకరిద్దరు ఆమె సహచరులు కొంతమంది కుష్టు రోగులకు సేవలు చేస్తున్నారు. మదర్‌ థెరిస్సా స్వయంగా దూదితో ఒక కుష్టురోగి కురుపుల నుండి కారుతున్న చీమును తుడుస్తుంది. లోపలెవ్వరూ లేరు. వచ్చిన గూండాలకు విషయం అర్ధమైంది. ఆమె సేవామూర్తి! త్యాగశీలి! ఆదర్శ వనిత! ఆమెనా మేము కొట్టీ బాధించడానికి వచ్చింది?” అని వారు చాలా బాధపడ్డారు. తలుపులు తట్టారు. థిరిన్సా తలుపు తీసింది. వెంటనే గూండాలు వడ్వడం ప్రారంభించారు. “అమ్మా! సేవకు ప్రతి రూపానివి. అమ్మలాంటి దానివి. కొందరు దుర్మార్గుల (ప్రేరణతో నిన్ను కొట్టాలని వచ్చాం. మమ్మల్ని క్షమించు” అంటూ ఆమె కాళ్లపై బడ్డారు. ఆమె ప్రశాంతంగా వారితో “నాయన లారా! అందరినీ ఆ ప్రభువు కాపాడుతాడు అంటూ వారిని సాగనంపింది.

“చూశారా, పిల్లలూ! థెరిస్సా సేవా నిరతి, మతోన్మాదులు ఎవరినైతే వీధుల్లో కనిపిస్తేనే చీదరించుకునేవారో వారి కురుపుల చీమును తానే స్వయంగా తుడిచి, ఆదరించే అమ్మ అనిపించుకుంది. భారతీయులందరిచే భారతరత్న బిరుదుతో గౌరవించబడింది. ఆమె సేవాసక్తి మీకు అందరికీ ఆదర్శం కావాలి” అని ముగించారు. విశ్వం మాప్పారు.

“అమ్మ బాటలో నడిచి మేమందరం దీనజన సేవ, పీడిత ప్రజా ఉద్ధరణ చేస్తాం మాష్టారూ” పిల్లలందరూ ముక్త కంఠంతో పలికారు.

మాష్టారి ముఖంలో ఆనందం తొణికిసలాడింది.

శక శ *

జనవిజ్ఞానవేదిక-----------------౮౮౮ా(లు--------------- దేశమును ప్రేమించుమన్నా

ళా, అని చాటిన

“పెల్లలూ! మన దేశంలో హిందూ మతస్థులు, మహ్మదీయులు, క్రైస్తవులు ఇంకా అనేక మతాలవారు ఉన్నారు గదా! వారిలో హిందూవుల దేవాలయం ఏది? నీవు చెప్పు అక్బర్‌” ప్రశ్నించారు, విశ్వం మాష్టారు.

అక్బర్‌ లేచి నిలబడి సమాధానం చెవ్పొడు.

“చాలా దేవాలయాలున్నాయి మాష్టారు! రామాలయం, శివాలయం, దుర్గాలయం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.”

“మరి క్రైస్తవుల దేవాలయం?”

“ఏసు దేవాలయం, మేరీమాత దేవాలయం” చెప్పాడు ఇస్రాయల్‌.

“మహ్మృదీయుల దేవాలయం”

“మసీదు” సమాధానమిచ్చాడు జనార్ధన్‌.

“మరి మీరందరూ భారతీయులుగదా అందరికీ చెందిన దేవాలయం ఏదైనా ఉన్నదా! ఉంటే అదేదో చెప్ప గలరా?”

క్షాసంతా మౌనం వహించింది.

మాష్టారే సమాధానం చెప్పారు.

“భారతదేశమే భారతీయులందరి దేవాలయం. అవునా?”

“అవును మాష్టారూ!” చిరునవ్వుతో పిల్లలందరూ అరిచారు.

“దేశమే నా దేవాలయం అని మొట్టమొదటగా చాటిన మహావ్యక్తి ఎవరో తెలుసా? రమేష్‌ నీవు చెప్పు” అడిగారు మాష్టారు.

“తెలియదు మాష్టారూ!” మెల్లగా సమాధానమిచ్చాడు రమేష్‌,

“ఆయనే స్వాతంత్ర సమరయోధుడు బాపట్‌. ప్రజలు ఆయన్ను గౌరవంగా “సేనాపతి బాపట్‌ొ అని పిలిచేవారు. ఆయన ఆ నినాదాన్ని ఏ సందర్భంలో ఇచ్చారో జనవిజ్ఞానవేదిక-----------------------ళు------------------ దేశమును ప్రేమించుమన్నా

తెలుసుకోవాలని ఉందా?”

“ఉంది మాష్టారూ! చెప్పండి” పిల్లలందరూ ఆసక్తితో అడిగారు.

“అవి స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రంగా సాగే రోజులు. బాపట్‌ విద్యాభ్యాసం ముగించుకున్నాడు. స్వాతంత్రోద్యమంలోకి దూకాలని నిశ్చయించుకున్నాడు. మొదటగా తన స్వగ్రామంలోనే ఉద్యమం ప్రారంభించాడు. ఆయన చేపట్టిన మొదటి కార్యక్రమం ఏమిటో మీకు తెలుసా? వీధులూడ్వడం. రోజూ తన గ్రామంలో వీధులన్నీ శుభ్రంగా ఊద్చేవాడు. సనాతన భావాలు కలిగిన ఆయన తండ్రికి ఈ విషయం తెలిసింది. ఆయన బాపట్‌ని పిలిచి మందలించబోయాడు. అప్పుడు బాపట్‌ తండ్రిని ఒక ప్రశ్న వేశాడు.

“నాన్న! ప్రతిరోజూ నీవు మన ఇంట్లో దైవపూజ చేస్తావు గదా! పూజకు ముందు నీవు ఏమి చేస్తున్నావు?”

“పూజకు ముందు దేవుని విగ్రహం చుట్టూఉన్న వాడిపోయిన పూలను తీసి వేసి, విగ్రహాన్ని శుభమైన బట్టతో తుడుసాను” అని సమాధానమిచ్చాడు. బాపట్‌ తండ్రి.

“నాన్న నీవు ఆ విగ్రహాన్ని దేవుడుగానూ, మన పూజా మందిరాన్నే దేవాలయం గానూ భావిస్తున్నావు. అందుకనే ఆ విగ్రహాన్ని సేవిస్తున్నావు. పూజా మందిరాన్ని ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నావు. “నాకు దేశమే దేవాలయం. ప్రజలే నా దేవుళ్ల” అందుకే నా దేశాన్ని ప్రతిరోజూ నాశక్తి మేరకు ఊడ్చి శుభ్రం చేస్తున్నాను. నా ప్రజల సేవకే నా జీవితాన్ని అంకితం చేశాను. నీ దేవాలయాన్ని నీవు ప్రతిరోజూ శుభ్రం చేయడం మంచి పని ఐనప్పుడు, నా దేవాలయాన్ని నేను ప్రతిరోజు ఊది శుభ్రం చేయడం తప్పు అవుతుందా నాన్నా? ప్రశాంతంగా తండ్రిని ప్రశ్నించాడు, బాపట్‌.

బాపట్‌ తండ్రి కనులవెంట ఆనందభాష్పాలు రాలాయి. “లేదునాయనా! నీవు చేసె పని ఎంతమాత్రం తప్పుకాదు. ఒక ఉత్తమమైన మార్గాన్ని ఎనుకున్నావు. ఆ బాట వెంట జీవితాంతం నీవు నడవాలని నిన్ను కోరుకుంటున్నాను” అని ప్రేమతో అన్నాడాయన.

“కాబట్టి పిల్లలూ! మనలో ఎన్ని మతాలవారున్నాా మన ఆరాధనా పద్ధతులు ఎన్ని విధాలగా ఉన్నా మనందరికీ ఒక ఉమ్మడి దేవాలయం ఉంది. అదే మన పవిత్ర భారతదేశం. మనందరికీ దేవుళ్ళు ఆకలితో అలమటించే మన ప్రజలు. ఆ ప్రజల సేవయే మన ధ్యేయం కావాలి. వారి ఆకలి తీర్చడమే మన లక్ష్యం కావాలి. ఇదే స్వాతంత్ర్య ఉద్యమ సేనానాయకుడు బాపట్‌ మనకిచ్చిన సందేశం” అన్నారు మాష్టారు.

సేనాపతి బాపట్‌ ఆశించిన భారతావనిని నిర్మిస్తాం మాష్టారూ!” ఏక కంఠంతో పిల్లలందరూ ఇచ్చి సమాధానంతో సంతృప్తిగా చిరునవ్వు నవ్వారు విశ్వం మాష్టారు. జనవిజ్ఞానవేదిక---ాాలాాా---ళభు----------- దేశమును ప్రేమించుమన్నా

న్‌ “కా. ' తెల్లవానికి గుణపాఠం నేర్పిన ల్‌ స్వామి వివేకానంద

“పిల్లలూ! స్వామి వివేకానంద పేరు విన్నారా?” అడిగాడు విశ్వం మాష్టారు.

“విన్నాం మాష్టారూ!” పిల్లలందరూ ఎక కంఠంతో సమాధానమిచ్చారు.

“వెరీగుడ్‌. ఆయనను గూర్చి నీకు తెలిసిన విషయాలు చెప్పు స్వాతీ!”

“19వ శతాబ్దంలో భారతదేశం బానిసత్వంతో మగ్గుతున్న రోజుల్లో, కోట్లాది మంది భారతీయులు ఇంగ్రీషువారే అధికులని, మనం తక్కువ వాళ్లం” అని ఆత్మన్యూనతా భావంతో ఉండేవాళ్లు. అలాంటి పరిస్థితులలో భారతీయులు తెల్లవాళ్ల కంటే ఏ విషయంలోను తక్కువ వాళ్లు కాదు. పైగా వారికంటే అనేక విషయాల్లో అధికులు అని స్వామి వివేకానంద తమ ఉపన్యాసాలద్వారా కోట్లాదిమంది భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు మాష్టారు! తన జీవితాన్ని హిందూ ధర్మ ప్రచారానికి అంకితం చేశారు. అయినా గానీ నా మతమే గొప్పది, ఇతర మతాలన్నింటినీ నిర్మూలిస్తాను అని ఎవరైనా అనుకుంటె వాడొక పిచ్చివాడే అని చాటి, నూరేళ్లనాడే మతోన్నాదాన్ని తీవ్రంగా ఖండించిన ఉత్తమ దేశభక్తుడు వివేకానందుడు అంటూ ముగించింది. స్వాతి సంక్షిప్తంగా అయినా చక్కగా చెప్పావమ్మా. ఆయన మాటలతోనే కాదు, ఆయన చేతులతో కూడా భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడారు. అలాంటి సంఘటనను వివరిన్తాను. వింటారా?”

“వింటాం మావ్వరూ” అన్నారు. పిల్లలందరూ.

“ఒక్కసారి స్వామి వివేకానందులు రైల్లో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తున్నారు. అదే పెట్టెలో ఆయనకు ఎదురు బెర్తు మీద ఒక ఆంగ్లేయుడు ప్రయాణిస్తున్నాడు.

అతనికి తనతో ఒక భారతీయుడు ప్రయాణించడం అగౌరవంగానూ, అవమాన కరంగానూ తోచింది. వివెకానందులు తలకు పాగా చుట్టుకొని, పాదుకలు, కాషాయం జనవిజ్ఞానవేదిక-------------------------------- €ొ------------------ దేశమును ప్రేమించుమన్నా

గుడ్డలు ధరించి ఉన్నారు. ఆంగ్లేయుడు ఈ భారతీయ సన్యాసిని ఇబ్బంది పెట్టి అగౌరవ పర్పాలనుకున్నాడు. ఎలా అని ఆలోచించాడు. రాత్రి 9 గంటలు అయింది. వివేకా నందులు తలపాగాతీసి పక్కన పెట్టి, పావుకోళ్లు విడిచి నిద్రకు ఉపక్రమించాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఆంగ్రేయుడు వివేకానందుని తలపాగను, పావుకోళ్లను రైల్లోనుండి బయటికి విసిరివేసాడు. తన పనికితానే మురిసిపోయి. కొంతసేపటికి నిద్ర పోయాడు. అర్ధరాత్రి మన స్వామీజీకి మెలుకువ వచ్చి చూస్తే తలపాగా, పావుకోళ్లు కనిపించలేదు. ఆయనకు విషయం అర్ధమైంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తీయాలను కున్నాడు. వెంటనే తన చేతి కర్రతో ఆంగ్రేయుడి బూట్లను, హ్యాట్‌ను రైల్లో నుండి బయటికి విసరివేసి మరల నిద్రించసాగాడు. కొంతసేపటికి ఆంగ్రేయుడు లేచాడు. తన హ్యాటు, బూట్లు కనిపించడం లేదు. ఎదురుగా పడుకున్న భారతీయ సన్యాసియే వాటిని బయటకు పారవేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చాడు. కోపంతో చిందులు తొక్కుతూ సామీజీని “ఏయ్‌, ఇండియన్‌! లేలే!” అని లేపాడు. వివేకానందుడు నిద్రలేచి సంగతి ఏమిటి అన్నట్లు చూశాడు. అతడు “నా హ్యాటు, బూట్లు ఎమైనాయ్‌?” అని గద్దించాడు. దానికి స్వామీజీ ప్రశాంతంగా “నీవు పారవేసిన నా తలపాగా, పావుకోళ్లను వెతుక్కు రావడానికి వెళ్లి ఉంటాయి” అన్నాడు. తెల్లవాడికి కోపం మరింత పెరిగింది. “ఏయ్‌! నేనేం చేస్తానో చూడు” అంటూ మీదకు రాబోయాడు. స్వామీజీ తన కాషాయ చొక్కా చేతులు పైకి మడచి తన కండలు చూపుతూ “మిష్టర్‌! జాగ్రత్త. నేను వట్టిసన్యాసినే కాదు. పూర్వా (శమంలో పహిల్వాన్‌ను కూడా, నా జోలికి వచ్చావంటే నీ వస్తువులు లాగే నిన్ను కూడా ఎత్తి బయటకి విసరివెస్తాను” అన్నాడు. ఆయన ఆకారాన్ని మాటతీరును గమనించిన తెల్లవాడు మెత్తబడ్డాడు. గొణుక్కుంటూ సీటుమీద కూర్చున్నాడు. “ఇంకెప్పుడు భారతీయు లను అవమానించడానికి ప్రయత్నించకు” అని వార్నింగ్‌ ఇచ్చి తన సీటు మీద కూర్చున్నాడు. వివేకానందులు” అని ముగించారు మాష్టారు.

పిల్లలందరూ పకపకా నవ్వసాగారు. “వివేకానందుల వారిని అవమానించడానికి ప్రయత్నించిన తెల్లవాడికి మంచి శాస్తి జరిగింది” అంటూ ఖాశీం నవ్వాడు. “స్వామీజీ ఆంగ్లేయునికి మంచి గుణపాఠం నేర్పారు” అంటూ మేరీ కూడా (శ్రుతి కలిపింది. పిల్లలందరి నవ్వులతో క్లాసు ముగిసింది.

శ * ఈ

జనవిజ్ఞానవేదిక ళు దేశమును ప్రేమించుమన్నా

“పిల్లలూ! సంకోచించకుండా నిర్భయంగా చెప్పండి, మీరు ఎలాంటి జీవితం గడపాలని కోరుకుంటున్నారు?” అడిగారు విశ్వం మాష్టారు.

శ్రీధర్‌ లేచాడు. “బాగా చదివి, మంచి ఉద్యోగం చెద్దామనుకుంటున్నాను. మాష్టారూ!” అన్నాడు.

“ఇంకా?”

“నీత్రిగా, నిజాయితీగా జీవితం గడుపుతూ, నాకు చేతనైనంత దేశసేవ చేద్దామనుకుంటున్నాను?”

“న్సీవ్ర చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి. నేను మరో ముఖ్య విషయం అడుగుతున్నాను. జీవితంలో పెళ్లి చేసుకొని, మంచి సంతానాన్ని కని, వారిని పెంచి పెద్దజేసి, వారిని కూడా దేశభక్తి గల పౌరులుగా చేద్దామనుకుంటున్నావా? లేదా?”

“అనుకుంటున్నాను మాష్టారూ?” సిగ్గుపడుతూ చెవ్పాడు శ్రీధర్‌.

“ఇంతకంటే విభిన్నమైన జీవితం గడపాలని మీలో ఎవరైనా కోరుకుంటుంటే లేచి నిలబడండి” అన్నారు మాష్టారు.

ఎవరూ లేచి నిలబడలేదు.

“మంచిది. పిల్లలూ! మీరు ఆలోచనలను నిర్భయంగా చెప్పినందుకు చాలా సంతోషం. అయితే ఉద్యోగం, పెళ్లి సొంతలాభం కొంతమానుకొని దేశసేవ చేయడం. ఇలాంటి జీవితం కాకుండా దేశం కోసం అసలు పెళ్లే వద్దనుకున్న మహాత్యాగజీవులు అనేకమంది, భారతమ్మ ముద్దుబిడ్డలు ఉన్నారు. వారిలో ఒక మహోన్నత వ్యక్తి సరార్‌ భగత్‌సింగ్‌. ఆయనను గూర్చి తెలుసుకుందాం. జనవిజ్ఞానవేదిక-------------------- ళొ---------------------- దేశమును ప్రేమించుమన్నా

భగత్‌సింగ్‌ 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌లో స్వాతంత్ర పోరాటయోధుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి, తాతలు స్వాతంత్రోద్యమంలో వాల్గొన్నారు. పినతండ్రి మాండలే జైలుకు బ్రిటీష్‌ ప్రభుత్వంచే పంపబడ్డ స్వాతంత్ర్య యోధుడు. అలాంటి కుటుంబంలో జన్మించిన భగత్‌సింగ్‌కు చిన్ననాటి నుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలనే ఉత్సాహం ఉందేది. పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. ఆయనకు పెళ్ళీడు వచ్చింది. అప్పుడాయన తన పోరాట కార్యక్రమాలకు పెళ్లి ఒక అడ్డంకి అని అర్ధం చెసుకున్నాడు. దేశం కోసం తన జీవితాన్ని అర్పణ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తండ్రి మాత్రం తన కుమారుడు తన లాగా పెళ్లి చేసుకొని ఏదో ఒక వృత్తి చేస్తూ, మిగిలిన కాలాన్ని దేశసేవకర్పిస్తే చాలనుకున్నాడు. అందుకని ఆయన భగత్‌సింగ్‌కు పెళ్లిచేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ విషయం భగత్‌సింగ్‌కు తెలిసింది. తన భవిష్యత్‌ కార్యక్రమాలకు పెళ్లి ప్రధాన అడ్డంకి అనుకుంటున్నాడు గదా! అయినా ఆ మిషయం పెద్దలతో చర్చించదలచుకోలేదు. చర్చకు పెడితే ఏడుపులు, ఒత్తిళ్లు, మెడలు వంచి పెళ్లిచేసే ప్రయత్నాలూ ఇవన్నీ ఉంటాయి. అందుకని తన నిర్ణయాన్ని పెద్దలతో ముఖాముఖీ చెప్పలేదు. ఒక ఉత్తరం రాసి, గదిలో పెట్టి, ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి వెళ్లిపోయాడు. దానిలో ఇలా రాశాడు - “నా జీవితాన్ని ఒక ఉన్నతాశయం కోసం అంకితం చేశాను. భారతదేశ స్వాతంత్ర్య సాధన అనేదే నా ఆశయం. అందువలన భౌతిక సుఖాలు, ప్రాపంచికమైన కోరికలు నన్ను ఆకర్షించలేకపోతున్నాయి. నేను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నన్ను మీరు క్షమిస్తారని ఆశిస్తున్నాను.

తర్వాత ఆయన స్వాతంత్ర్య సాధన కోసం “హిందుస్తాన్‌ సోషలిస్తు రిపబ్లిక్‌ ఆర్మీ అనే సంఘాన్ని స్థాపించి బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. శాండర్స్‌ అనే కిరాతక బ్రిటీష్‌ ఆఫీసర్‌ను సహచరులు రాజగురు, సుఖదేవ్‌లతో కలిసి చంపేశారు. చివరికి బ్రిటీష్‌ వారికి పట్టుబడి 1931 మార్చి 21న సహచరులతో కలిసి ఉరితీయబడ్డాడు. ఉరితీసే సమయంలో కూడా ఆయన పెదాలపై చిరునవ్వు చెక్కు చెదరలేదు. భారత దేశ స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తి కేంద్రమై నిలచాడు. ఈనాటికీ మరెందరో దేశ సేవకులకు స్ఫూర్తి కేంద్రమై నిలుస్తున్నారు. మీరు కూడా ఆయన జీవితాన్ని ఆశయంగా తీసుకొని దేశ ప్రగతికోసం, దేశ సమైక్యత కోసం, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధం కావాలి. ఆయన వంటి మహానుభావుల త్యాగంతో తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మరల విదేశీ శక్తుల చేతుల్లో పడనీయకూడదు. అందుకు మీరు సిద్ధమేనా?” ఆవెశంగా అడిగారు మాష్టారు.

“ఏ త్యాగానికైనా సిద్ధమె మావ్వారూ!” పిడికిళ్లు బిగించి పలికారు పిల్లలందరూ. జనవిజ్లానవేదిక----ాాాాాాాాళమై---------------- దేశమును ప్రేమించుమన్నా

పరస్త్రీని అమ్మగా భావించిన మహావ్యక్తులు శివాజీ, టిప్ప సుల్తాన్‌

“పిల్లలూ! మీకిప్పుడు ఒక కథ చెబుతాను. జాగ్రత్తగా విని ఆ కథా నాయకుడెవరో చెప్పాలి.” అన్నారు విశ్వం మాష్టారు.

“అలాగే మాష్టారూ!” అని ఉత్సాహంగా అన్నారు పిల్లలందరూ.

మాష్టారు కథ చెప్పడం మొదలెట్టారు.

“అది భారతదేశంలో ఒక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తుందేవాడు. ఒకనారి ఆయనకు ఒక శతృరాజుతో యుద్ధం జరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తన సేనా నాయకుల్లో ఒకణ్ణి, ఆ శతృరాజును జయించి రమ్మని సైన్యాన్నిచ్చి పంపాడు. ఆ సేనా నాయకుడు శతృరాజును జయించాడు. వస్తూవస్తూ తమ రాజుగారికి ఒక కానుకను తీసుకువచ్చాడు. ఆ కానుక ఏమిటో మీకు తెలుసా? శతృరాజు పరివారంలోని ఒక అందమైన వివాహిత స్తీ. ఆమెను సేనానాయకుడు పల్లకీలో తీసుకువచ్చి, పల్లకీని రాజుముందు దింపించాడు. రాజు పల్లకీ తెర తొలగించారు. ఎదురుగా ఎంతో అందమైన స్త్రీ. రాజు తీవ్రమైన స్వరంతో సేనానాయకుణ్తి చూసి “ఎవరీమె?” అన్నాడు. “ఈమె తమరి కొరకు నేను తెచ్చిన కానుక” అన్నాడు నవ్వుతూ, రాజు ఆమెవైపు చూశాడు. ఆమె గజగజ వణుకుతూ నిలబడి ఉంది. రాజు చాలా మంచివాడు. పరస్త్రీ అంటే అమ్మలాగా బావించేవాడు. అందువలన తన సేనానాయకుని పని ఆయనకు అసహ్యంగా తోచింది. కోపంతో ఊగిపోతూ “సేనానాయకా! నా ఆజ్ఞను మీరు మరిచారా! యుద్ధం సందర్భంగా స్త్రీలను అగౌరవ పరచరాదనీ, ఇతర మత [గ్రంథాలను పవిత్రంగా చూడాలనీ, జనవిజ్ఞానవేదిక -------------ళుి----------------------- దేశమును ప్రేమించుమన్నా

స్త్రీలపై అత్యాచారాలుగానీ, మత [గ్రంథాలను అపవిత్రం చేయడం గానీ, చేయకూడదని శాసనం చేశానే! దాన్ని ఎందుకు ఉల్లంఘించారు?” అని ప్రశ్నించాడు.

సేనా నాయకుడి ఉత్సాహమంతా నీరుగారి పోయింది. తమ కానుకగా తెచ్చిన అందమైన స్త్రీని చూచి, రాజు తనను మెచ్చుకుంటాడనుకున్నాడు గాని, ఇలా కోపం తెచ్చుకుంటాడనుకోలేదు. చేసిన తప్పును గ్రహించి తలదించుకున్నాడు. తర్వాత రాజు ఆమెవైపు తిరిగి ప్రశాంతంగా “అమ్మా నన్ను క్షమించు. మా సేనాపతి చేసిన తప్పును మన్నించు. ఈ జన్మలో నీ కన్నబిడ్డగా జన్మించే అదృష్టం నాకులేదు. వచ్చే జన్మలోనైనా నీ కన్నవిడ్డగా జన్మించే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. నిన్ను నీ భర్త వద్దకు

సగౌరవంగా నా సేనాపతి తీసుకెళ్లాడు. వెళ్లిరామ్మా” అన్నాడు.

ఈ స్రీతోబాటు సైన్యానికంతటికీ ఆశ్చర్యం, ఆనందం కలిగింది. సైన్యమంతా రాజు చేసిన గొప్ప పనికి, ఆయనకు జయజయ ధ్వానాలు పలికింది. తర్వాత ఆ ప్రీ ఆమె భర్త వద్దకు సగౌరవంగా చేర్చబడింది.

“ఇప్పుడు చెప్పండి పిల్లలూ! ఆ రాజు పేరేమిటో?” ప్రశ్నతో కథ ముగించారు.

“నేను చెబుతాను మాష్టారు! ఆ రాజు పేరు శివాజీ!” సమాధానమిచ్చాడు రవి.

“కాదు మాష్టారూ! ఆ రాజుపేరు టిప్పు సుల్తాన్‌” అరిచింది శాంతి.

“కాదు. ఆయన శివాజీనౌ” గట్టిగా అరిచాడు రవి.

“కాదు. ఆ మహావ్యక్తి టిప్పు సుల్తాన” అంతకంటే గట్టిగా అరిచింది శాంతి.

ఇద్దరి అరుపులను మౌనంగా వింటూ, చిరునవ్వులు నవ్వుతున్నారు మావ్వరు.

క్లాసులోని మిగతా పిల్లలు కూడా ఈ వాదనలో జోక్యం చేసుకొని కొందరు శివాజీ అని, కొందరు టిప్పు సుల్తాన్‌ అనీ అరవసాగారు.

కొంతసేపు నవ్వుతూ ఊరుకొని తర్వాత “సైలెన్స్‌” అని పెద్దగా అన్నారు.

అంతే! క్లాసంతా నిశ్వబ్దం! వెంటనే మాష్టారు “రవీ! నీవు చెప్పు ఆ మహావ్యక్తి శివాజీ అని నీకెవరు చెప్పారు? అని అడిగాడు.

రవి చిన్నగా “నేనొక కథల పుస్తకంలో చదివాను మాష్టారూ!” అన్నాడు.

“అమ్మా! శాంతీ! టిప్పుసుల్తాన్‌ అని నీకెవరు చెప్పారు?”

“టి.పవీలో టిప్పు సుల్తాన్‌ సీరియల్‌లో చూశాను మాష్టారూ!”

“మరి రవి చదివిన కథల పుస్తకం నీవు చదవలేదా?”

“లేదు మాష్టారూ!”

“నేను చిన్నపిల్లల కార్టూన్‌ సీరియల్స్‌ తప్పితే ఇంకేమీ చూడను మాష్టారూ! అందువలన ఆ సీరియల్‌ చూడలేదు.

“అందుకనే వీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నాడు. క్లాసులో అందరి పరిస్థితి ఇంతే అయివుంటుంది. మీరిద్దరు చెప్పింది కరెక్టే. పరస్త్రీని అమ్మగా చూడటం అనే అత్యున్నత శీలాన్ని శివాజీ, టిప్పుసుల్తాన్‌ ఇద్దరూ కలిగి వున్నారు. ఇద్దరి జీవితాలలలోను ఒకే రకమైన సంఘటన జరిగింది. ఇద్దరి మతాలు వేరైనా మహోన్నత గుణాలు ఇద్దరూ కలిగి ఉండి, ఉత్తమ గుణాలకు, మతాలకు సంబంధం లేదని నిరూపించారు. భారతాంబ ముద్దబిడ్డలని నిరూపిచుకున్నారు. అలాంటి ఉత్తమ గుణాలు అభివృద్ధి చేసుకొని భారత మాతకు మంచి బిడ్డలుగా మీరు కూడా పేరు తెచ్చుకుంటారా?”

“పేరు తెచ్చుకుంటాం మాష్టారూ!” అన్నారు పిల్లలందరూ ఒక్కసారిగా, సంతృప్తితో చిరునవ్వు నవ్వారు మాప్ప్టారు.

కష శ ఇ

తరతరాలుగా శాస్ర ప్రచారాన్ని ఆటంక పరుస్తున్న శక్తులు

మనం శాస్త్ర విజ్ఞాన ఫలితాలను కోట్లాది జనసామాన్యానికి అందించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నాం. దేశ ప్రజలకోసం సైన్స్‌, దేశప్రగతి కోసం సైన్స్‌ అనే నినాదాల స్పూర్తితో నిరంతరం (శ్రమిస్తున్నాం. ఈనాడు కొందరు వ్యక్తులు కొన్ని శక్తులు శాస్త్ర విజ్ఞాన ఫలితాలను సామాన్యులకు అందకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, దేశ ప్రగతిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయని మనకు తెలుసు. ఆయితే ఆ శక్తులు ఈనాడే పని చేయడం ప్రారంభించాయా లేక వాటి మూలాలు చరిత్రలో చాలా లోతుగా పాతుకొని ఉన్నాయా? -- పరిశీలిద్దాం.

మనదేశంలో వేదకాలంలో అనగా క్రీ.పూ. 2000 - 1000 సంవత్సరాల మధ్యలో శాస్త ప్రగతికి ఎంతో ప్రాధాన్యత ఈయబడింది. శాస్త్రవేత్తలకు ఎంతో గౌరవం లభించింది. శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి అన్ని శక్తుల తోడ్పాటు లభించింది. ఉదాహరణకు వైద్యశాస్త్రం, చేతివృత్తులను తీసుకుందాం. వేద కాలంలో వైద్యులను అత్యంత గౌరవనీయులుగా భావించేవారు. వారి పరిశోధనలను పొగిదేవారు. వారి అభివృద్ధిని కోరేవారు. బుగ్వేదమంత్రాల్లో వైద్యులను గురించి ఇలా పొగడ బడింది. “నాట్యం చేస్తున్న ఓ మరుత్తులారా! మీరు మా కోసం బెషదాలను తీసుకొని వస్తారు. సింధూ, ఆశిక్ని నదుల్లో, సముద్రం లోపల, పర్వతాల మీద వున్న బెషధాలు మీకు బాగా తెలుసు. మా సంక్షేమం కోసం వాటిని తీసుకురండి. వాటి సహాయంతో మా శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో, మా వ్యాధుల్ని ఎలా నయం చేసుకోవాలో మాకు నేర్పండి. మాలో రోగాలతో బాధ పడుతున్న వారికి నయం చేయండి. మా శరీరాల్లో లోపాలను తొలగించండి”

“ఓ అశ్వనీ దేవతలారా! మీరు మానవులను పీడించే వ్యాధులను కూడా నయం చేసే దేవ వైద్యులు. చాలా దయగలవారు.” అంతేకాదు. “మీతో స్నేహం చెడిపోకుండు గాక, మేము మా వ్యాధుల నుండి విముక్తులం అగుదుముగాక” -

అంటుంది. అశ్వనీదేవతల నుద్దేశించిన మరో బుగ్వేదమంత్రం కానీ వేదాంగాలుగా పేర్కొనబడే బ్రాహ్మణ కాలం లేదా ఉపనిషత్తుల కాలం నాటికి అనగా క్రీ.పూ. 1000-600 సంవత్సరాల నాటికి వైద్యుల స్థాయి తగ్గించబడింది. శతపద బ్రహ్మణంలో ఇలా చెప్పబడింది. “వరుణుడు నిస్సందేహంగా ఉన్నత వంశీయుడు. ఇంద్రుడు ఉన్నత వంశీయుడు. మరత్తులు సామాన్యప్రజలు”. ఈ కాలంలో భౌతిక శాస్త్ర పరిశోధన మరింతగా వ్య్వతిరేకించబడింది. ప్రగతి నిరోధించబడింది. అన్ని ఉపనిసత్తుల్లోను ఇవ్వబడిన ధర్మ భ్రష్ణుల జాబితాలో చేతి పనులు మీద బ్రతికేవారు, వ్యాధులు నయంచేసే వాళ్లు చేర్చబడ్డారు. ఉపనిషత్తుల సిద్దాంత తత్వానికి గొప్ప వ్యాఖ్యాత అయిన యాజ్ఞవల్యుడు బృహదారణ్యకోపనిషత్తులో ఇలా అంటాడు. “ఇంద్రియ జ్ఞానానికి సంబంధంలేనిది మాత్రమే దేవతలకు ఇష్టం. అంతే కాదు సరాసరి మనకళ్లతో మనం చూసే విషయాలను వారు అసహ్యించుకుంటారు. ఉపనిషత్‌కాలంలో వైద్యుల పరిస్థితికి సంబంధించి ఒక ఉదాహరణ మన ముందుంది. తైత్తరీయ సంహిత అనే గ్రంథంలో ఇలా ఉంది - “యజ్ఞం (యజ్ఞ పురుషుడి) తల నరికి వేయబడింది. దేవతలు అశ్వినులు వద్దకు పరిగెత్తుకు వెళ్లి ఆ తలను మళ్లీ అతికించమని కోరారు. అందుకు అశ్వినులు ఒప్పుకున్నారు. కానీ, ఒక షరతు పెట్టారు. తమకు ఇతర దేవతలతో కలసి సోమరసాన్ని తాగే అవకాశం ఇవ్వాలన్నారు. అందుకు దేవతలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. “వైద్యు లుగా మానవుల మధ్య తిరుగాడుతున్న అశ్వినులు అపవి(త్రులు” అన్నారు. అంతేకాదు, “బ్రాహ్మణుడు వైద్యవృత్తి చేయకూడదు. వైద్యుడు అపవిత్రుడు. యజ్ఞానికి అర్హత లేనివాడు అని కూడా అన్నారు. అయితే బుద్దుని కాలం నుండి అంటే క్రీ.పూ. 600 నుండి క్రీ.శ4ీవ శతాబ్ధం వరకు అనగా బౌద్ధం భారతదేశంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న రోజుల్లో భౌతికశాస్త్ర పరిశోధనలు కొనసాగాయి. అనేక శాస్త్రాల్లో గొప్ప ప్రగతి సాధించబడింది. ఉదాహరణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అనేక పరిశోధనలు కొనసాగాయి. అనేక శాస్త్రాల్లో గొప్ప ప్రగతి సాధించబడింది. నాగార్జురుడు స్వయంగా అపరామృతము (దీర్దాయువును ప్రసాదించే బెషదం) అనే బెషధాన్ని కనుగొన్నాడు. ఇంకా ఈ విశ్వ విద్యాలయంలో భౌతిక, రసాయనిక వైద్య శాస్త్రాల్లో అనేక పరిశోధనలు కొనసాగాయని చరిత్ర చెబుతోంది. కాని తర్వాత బౌద్దాన్ని నాశనం చేసి హిందూత్వ మరల విజృంభించిన _ జనవిజ్ఞానవేదిక ---ాాభళు------ దేశమును ప్రేమించుమన్నా

తర్వాత భౌతికశాస్తాలపై ఆదరణ తగ్గింది. మహాభారత రచనా కాలం నాటికి (క్రీవ 4-5 శతాబ్దాలు) ఈ నిరాదరణ మొదలై క్రీశ 10 -12 శతాబ్ధాల నాటికి తీవ్రమైంది. అందుకే భారతంలో వైద్యుణ్సి, వైద్య శాస్త్రాన్ని అవమానిస్తున్న కథ మనకు కన్పిస్తుంది.

“చ్యవన మహర్షి ఆశ్వినులచేత వైద్యం చేయించుకొని మళ్లీ ఆరోగ్య వంతుడైన తర్వాత ఇంద్రుని వద్దకు వెళ్లి ఇతర దేవతలతో కలిపి అశ్వినులు సోమ పానం చేయడానికి అనుమతించమని కోరతాడు. అందుకు ఇంద్రుడు ఇలా సమా ధానం చెబుతాడు. “ఓ మహాత్మా! మాదృష్టిలో అశ్వినులు వెలివేయబడ్డారు. వారు ఎంతో పతనమై పోయినారు. కాబట్టి వారితో కలిసి సోమపానం చేయడం అసాధ్యం. “అశ్వినులు సూర్యపుత్రులు అందుచేత ఇతర దేవతలతో కలిసి సోమపానం చేసే హక్కు వారికి ఉందొని చ్యవన మహర్షి వాదిన్తాడు. కాని ఇంద్రుడు ఆ వాదనను అంగీకరించడు.

మనుస్మృతి కాలం నాటికి భౌతిక శాస్త్రాలపై నిరాదరణ అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. మనువు ఈ క్రింది అపవిత్రులుగా పేర్ళొని వీరు ఏ మత కర్మల లోను చివరకు అంత్యక్రియల్లో కూడా పాల్గొనకూడదని శాసించాడు. ఆ జాబితా ఇది. శూద్రులు, చేతివృత్తులవారు, వడ్రంగులు, కమ్మర్హు, చాకళ్లు, చర్మకారులు, నేరస్తులు, దొంగలు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారులు, స్మృతి కారుల్లో అ(గ్రేసరుదైన మనువు వైద్యుని కిచ్చిన ఆహారం, వైద్యుని వద్ద నుండి తీసుకొనిన ఆహారం చీములాగా అసహ్వ్యమైనది అంటాడు. అంతేకాదు విశ్వాసం లేని వారున్న రాజ్యం అనతికాలంలోనే అంతరించిపోతుంది”. (మనుస్మ బ్రతి 8-22) మనువుకు వ్యాక్యాత అయిన మేధాతిధి పై విషయాన్ని వ్యాఖ్యానిస్తూ విశ్వాసం లేనివారు అంటే భౌతికవాదులు, తార్మికులు మొదలైన పరలోకాన్ని నమ్మనివారు అని వివరి సారు. ఇలా నిరాదరణకు గురైన భౌతిక శాస్త్రవేత్తలు అయోమయంలో పడిపోయారు. తర్వాత కాలం నాటి భౌతిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ఫలితాలను ధైర్యంగా వ్యక్తం చేయలేక, చేయకుండా ఉండలేక సతమత మయ్యారు.

అలా సతమతమైన శాస్రవేత్తల్లో ఒక శాస్త్రవేత్తను పరిశీలిద్దాం. ఆయన బ్రహ్మగుప్తుడు. ఈయన 7-8 శతాబ్దాలకు చెందిన ఖగోళశాస్రవేత్త ఈయన “బ్రహ్మ సిద్దాంతం” అనే గ్రంథాన్ని రచించాడు. దానిలో మొదట్లోనే ఇలా అంటాడు. “కొంతమంది గ్రహణానికి రాహు శిరస్సు కారణం కాదని భావిస్తారు. ఇది చాలా

బుద్ధిలెని ఆలోచన. ఎందుకంటే రాహువే గ్రహణానికి కారణం ప్రపంచంలోని ప్రజానీకం రాహువు వల్లనే గ్రహణం కలుగుతుందని నమ్ముతారు. కాని వరాహ మిహిరుడు, ర్రీ సేనుడు, ఆర్యభట్టు, విష్ణుచంద్రుదు రాహువు వల్ల గ్రహణం రాదని వాదిస్తారు. రాహువు శిరస్సు వల్ల గ్రహణం కలగకపోతే బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, పూజలు (మొదలైనవి) భ్రమ కావాలి. ప్రజలు ఈ ప్రసిద్ధ ఆచారాలను అనుసరిస్తున్నారు. ఈ రచయితలు అనుసరిస్తున్నారు. ఈ రచయితలు ప్రజాభిప్రా యాన్ని వ్యతిరకించడం మానుకోవాలి” ఇలా బ్రాహ్మణులు పురోహిత వర్షం ముందు సావ్టాంగ నమస్మారం చేసిన తర్వాత బ్రహ్మగుప్తుడు అదే గ్రంథంలోనే గ్రహణాలకు సూర్య-చంద్ర-భూమి సిద్దాంతాన్ని వివరిస్తాడు.

ఆనాటి భారత శాస్త్రవెత్తల మానసిక పరిస్థితిని గూర్చి మధ్య ఆసియాకు చెందిన అల్‌బెరోని వివరంగా ప్రస్తావించారు. ఈయన 1017-1080 మధ్య భారతదేశంలో పర్యటించారు. ఈయన మన శాస్త్రవేత్తలను గురించి ఇలా అన్నారు. “వారు పూర్తిగా గందరగోళంలో ఉన్నారు. ఆలోచనలో తర్కం ఎంతమాత్రం లేదు. వారి గణిత శాస్త్ర, ఖగోళశాస్త్ర విజ్ఞానాన్ని గులకరాళ్లు కలిసిన మిశ్రమంగా మాత్రమే పరిగణించగలను. భారతదేశం సంపూర్ణంగా శాస్త్రీయమైన నిగమన పద్ధతి దాక ఎదగలేదు. “బ్రహ్మగుప్తని ఖగోళశాస్త్ర విజ్ఞానంలోని అయోమయావస్థకు కారణం అల్ప్బెరోని ఇలా పేర్కొంటాడు.

“బ్రహ్మగుప్తుడు ద్వంద్వ అభిప్రాయాలు చెప్పడానికి కారణం అతని భద్రతకు గొప్ప ప్రమాదం రావటమే (సోక్రటీసులాగా) కారణమై ఉంటుందని నా విశ్వాసం. అతని విజ్ఞానం, బుద్ధికుశలత, నిండు యవ్వనం ఆ ప్రమాదం ముందు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బ్రహ్మసిద్ధాంతం రాసేనాటికి అతని వయసు 80 సంవత్సరాలే”. భౌతికశాస్త్ర రంగాల్లో మన పతనాన్ని గూర్చిన కారణాలను అనేక మంది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు. వారిలో శ్రీ ప్రపుల్ల చంద్రరే ముఖ్యుడు. ఈయన గొప్ప దెశభక్తుడు. రసాయన శాస్త్రవేత్త “ఏ హిస్టరీ ఆఫ్‌ హిందూ కెమిస్ట్రీ ఫ్రం ది ఎర్లియెస్ట్‌ టు ది మిడిల్‌ ఆఫ్‌ది సిక్టీన్త్‌ సెంచరీ” అన్న రెండు సంపుటాల (గ్రంథాన్ని రాశారు. మొదటి సంపుటం 1903లోనూ, రెండవ సంపుటం 1905లోనూ ప్రచురితమయ్యాయి. అందులో “సాంకేతిక కళల విజ్ఞానం

  • శాప్రీయ దృష్టి పతనం” అన్న అధ్యాయం నుంచి ఈ క్రింది వ్యాక్యాలను చూడండి. జనవిజ్ఞానవేదిక-------------------ాి------------------ దేశమును ప్రేమించుమన్నా

వేదకాలంలో బుషులు, పురోహితులు ఇక ప్రత్యేక కులానికి చెందిన వారుకారు. తన అనుకూలతను బట్టి, అభిరుచుల్ని బట్టి వివిధ వృత్తుల్ని అవలంభించే వారు. కాని బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని మరోకసారి న్థాపించుకున్న తర్వాత అంటే బౌద్ధమతం పతనమైన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్ణవ్యవస్థ ఇంతకు ముందుకంటే కటినమైన రూపంలో పున: స్థాపించబడింది. మనుధర్శశా'స్తం, పురాణాలు పురోహిత వర్షాన్ని కీర్తించడానికే రచించబడ్డాయి.

పురోహితవర్గం భయంకరమైన అసహ్యకరమైన డాంభికత్వానికి అలవాలమై వోయింది. శు(శ్రుతుని ప్రకారం శస్త్రచికిత్సా విద్యార్ధి తప్పనిసరిగా శవాలను కోసి ప్రత్యక్షంగా పరిశీలించి తన విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ మనువు దీన్ని ఆమోదించడు. బ్రాహ్మణుడు శవాన్ని తాకితేనే మైలపడి పోతాడు” అని అతని అభిప్రాయం. అలా వాగ్భటుని తర్వాత కొంత కాలానికి శస్త్ర చికిత్సకు ప్రోత్సాహం నశించింది. శరీర నిర్మాణ శాస్త్రం, శస్త్ర చికిత్సా శాస్తం మరుగున పడి పోయాయి. ఆ శాస్త్రాలను హిందువులు పోగొట్టుకున్నారు. అలాగే కొలిమి వద్ద కూర్చొని శారీరక శమ చేయడం కూడా గౌరవహీనంగా పరిగణించబడింది. ప్రాచీన సంస్కృతి సాహిత్యంలో ఎంతో గొప్పగా కీర్తించబడ్డ కళలు కూడా మరుగున పడిపోయాయి. సమాజంలో ఉన్నత, నాగరిక వర్ణాలవారు వాటిని సాధన చేసే అవకాశం లేక పోయింది.

కళలు తక్కువ కులాలవారికి కేటాయించబడ్డాయి. క్రమంగా అవి వంశ పారంపర్యంగా రూపొందాయి. అందుచేత నేర్పరితనం కొద్దిగా అభివృద్ది చెందిన మాట నిజమె. కావచ్చుగానీ, చాలా పెద్ద అపకారం కూడా జరిగింది. కళలునుండి మేధావి వర్షం దూరమైపోయాక ఎలా, ఎందుకు అన్న ఆలోచన కూడా కళలనుంచి దూరమైంది. పరిశోధన తగ్గిపోయిన సమాజం క్రమంగా అతీంద్రియ విజ్ఞానంలో కూరుకుపోయింది. భారతదేశం ప్రాయోగిక, నిగమ శాస్త్రాలకు (ఇందక్టివ్‌ సైన్స్‌లు) భరతవాక్యం పలికింది. అందుచేత ఈ దేశం బోయిల్‌, దెకార్ట్‌, న్యూటన్‌ వంటివారు పుట్టడానికి అనర్హమైపోయింది. ప్రపంచ పటంలోంచి సైన్సుకు సంబంధించినంత వరకు భారతదేశం పెరు తుడిచివేయబడింది.

తెలివి తేటలకు సంబంధించిన నిస్సబ్ధత, నిర్విర్భతలకు మారుపేరైన ఈ దేశంలో చేతివృస్తల వారు తమ స్వంత తెలివి తేటల మీద, లోకజ్ఞానం మీద

మాత్రమె ఆధారపడవలసి వచ్చింది. అవి మాత్రమే వారికి వంశపారం పర్యంగా సంక్రమించింది. వాటి సహాయంతో మాత్రమే వారు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెట్టారు. “లోహాలు, దంతం మీద చెక్కడం పనిలో, ఎనామిల్‌ పనిలో, బట్టలు నేయడంలో, అద్ధకం పనిలో, లేసులు అల్లడంలో, ఆభణాలు చేయడంలో అసాధారణ మైన నేర్పరితనాన్ని చూపించారు.”

ఆనాడే కాదు నేడు కూడా సైన్సును తక్కువ చేసే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. ఉదాహరణకు 1981 అక్టోబరు 10న “మెయిన్‌ ట్రీ” పత్రికలో ప్రచురించబడిన శ్రీ ఆశీష్‌నంది వ్యాసంలోని ఈ భాగాలను పరిశీలించండి - “ఈనాడు మూఢవిశ్వానాలకు ప్రధానమైన ఆధారం సైన్స్‌, వైద్యశాస్త్రం, వ్యవసాయ శాస్తం మొదలైన దయా(ర్దమైన సైన్సులు కూడా నరహంతక ఉద్యమాలేనని మాటిమాటికీ తెలుస్తోంది. అంతేకాదు కొన్ని దేశాల్లో అవి అనేక బాధలకు, చావులకు కారణం అని కూడా తెలుసోంది.

గెలిలియోను ఏకపక్షంగా చర్చి వ్యవస్థ హింసించలేదని ఈలోగా సాక్ష్యా ధారాలు లభిస్తున్నాయి. ప్రజలు దృక్పథంలో మార్పు రావాలి. కాని ఆ మార్పు అశాస్త్రీయ దృక్పథం నుంచి శాప్రీయ దృక్పదానికి మాత్రం కాదు. సైన్సు ఆధిపత్యాన్ని అంగీకరించే దృక్పథం నుంచి మానవ బెన్నత్యాన్ని, ఆ బెన్నత్యానికి పునాదిచేసే జీవిత పరిస్థితులను మళ్లీ ప్రచారంలోకి తీసుకొని వచ్చే దృక్పథానికి ఆ మార్పు రావాలి. ఆ పునాదిలో అనేక సాంప్రదాయాలు, మతం, పురాణగ్రంథాలు ఉంటాయి.

వైద్య శాస్తం కూడా నరహంతక ఉద్యమమేనని చెప్పడం, వ్యవసాయ శాస్త్రం అనెక దేశాల్లో చావులకు కారణం అని వక్కాణించడం ద్వారా ఆళశిష్‌నంది వంటి రచయితలు వాస్తవాన్ని భయంకరంగా వక్రీకరించి చెప్పడం గమనించవచ్చు. మతం పునాదిగా గత దృక్పథానికి మరలమని కోరదమే కదా! ఇది మానవ సమాజాన్ని ఎంతటి అజ్ఞానపు అంచులకు తీసుకెళుతుందో ఆలోచించడానికే భయమేసోంది!

క శం ఈ

జినవిజ్ఞానవేదిక----------------.---- €ఈం------------- దేమును ప్రేమించుమన్నా

(మిత్రులారా,

శాస్త్ర విజ్ఞాన ఫలితాలను కోట్లాది జన సామాన్యానికి అందించాలనే ఆశయంతో మనం కృషి చేస్తున్నాం. కాని ఆ పరిశోధ నల పీక నులిమిన ఆనాటి పరిస్థితులను కూడా అధ్యయ నం చేయాలి. శాస్త పరిశోదనా ఫలితాలను తమ స్వంతం చేసు కొని, కోట్లాది మందికి అందకుండా చేస్తున్న ఈనాటి స్వార్ధపర శక్తులను గూర్చి వివరంగా తెలుసుకోవాలి. మనకు కోట్లాది మంది ప్రజలకు మధ్య అడ్డుగా నిలిచే శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే స్వార్ధపర అశాస్త్రీయ శక్తులదే పైచేయి అవు తుందని గ్రహించ వలసిందిగా మనవి చేస్తున్నాను. పై అశాస్త్రీయ శక్తుల విషయంలో మరింత పరిశీలన, పరి శోధన అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాను.

జనవిజ్ఞానవేదిక--------------౮భి------------- దేశమును ప్రేమించుమన్నా

ఎీనరు ఆదర్శం

విశ్వం మాష్టారు క్లాసులోకి వచ్చి మౌనంగా కుర్చిలో కూర్చున్నారు. ప్రతి రోజూ ఆ పీరియడ్‌లో మాష్టారు పిల్లలకు దేశభక్తిని గూర్చి బోధిస్తుంటారు. కాని, ఆ రోజున ఎందుకో మైనంగా కూర్చున్నారు.

ఐదు నిముషాలు గడిచాయి. కానీ, ఆ రోజు దేశభక్తిని గురించి చెప్పటం మొదలు పెట్టలేదు. ఆయన ముఖం అంతా ఆందోళనతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది.

చివరికి రవి మెల్లగా “మాప్పారు, దేశభక్తిని గూర్చి ఏదైన చెప్పండి” అన్నాడు.

మాప్పారు ఒక నిముషం మౌనంగా ఊర్మ్శాని, గంభీరంగా మొదలుపెట్టారు. “పిల్లలూ మీకు ఆదర్వ వ్యక్తి ఎవరు. ఒక్కొక్కరూ లేచి చెప్పండి” అన్నారు.

“గాంధజీ” అన్నది రమ.

“భగత్‌సింగ్‌” అన్నాడు శ్యామ్యూల్‌.

“అల్లూరి సీతారామరాజు” అన్నాడు షేక్‌చాంద్‌.

“సుభాష్‌ చంద్రబోస్‌” అన్నది శాంతి.

ఇకచాలు అన్నట్లు మాష్టారు సైగ చేశారు. “చాలా సంతోషం పిల్లలూ, దేశ స్వాతంత్ర్యం కోసం, భారతమాత బానిస సంకెళ్లు తెంచడం కోసం త్యాగాలు, ప్రాణత్యాగాలు చేసిన వారిని ఆదర్శ వ్యక్తులుగా మీరు ఎంచుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. కానీ, ఈనాటి యువతరం పరిస్థితి తలచుకుంటే చాలా బాధ వేస్తోంది. ఈ రోజు జరిగిన ఒక సంఘటనను మీకు చెబుతాను, వినండి”

“నేను బస్సులో వస్తున్నాను. నా ముందు సీట్లలో చాలామంది యువకులు కూర్చొని ఉన్నారు. వారు ఏవేవో విషయాలు పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక యువకుడు ఇలా అన్నాడు. “వాడురా, మగవాడంగే, వాళ్లే ఆదర్శంగా తీసుకోవాలిరా మనం” ఆ మాటలతో నాలో ఆసక్తి పెరిగింది. ఈ యువకుడుకి ఆదర్శవ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలనిపించింది. జనవిజ్ఞానవేదిక--------------ళై-------------------- దేశమును ప్రేమించుమన్నా

“ఎవరా న్‌ ఆదర్శ వ్యక్త ప్రశ్నించాడు అతని ప్రక్కన ఉన్న యువకుడు.

“ఇంకెవర్రా, హర్షద్‌ మెహతా, మోసాలు చేసైనా వాడిలాగా వందల కోట్లు సంపాయించాలి” అన్నాడు మొదటి యువకుడు.

“అవున్రా, నువ్వు చెప్పిందే రైట్‌. ఎట్లా సంపాదించాం అనేది కాదు (ప్రశ్న. ఎంత సంపాదించాం అనేదాన్ని బట్టి మన లెవెల్‌ ఉంటుంది అన్నాడు అతని ప్రక్కనున్న మరో యువకుడు.

వందల కోట్ల హర్షద్‌ మెహతా గురించి చెప్తావేంట్రా “హీరోలాగా అందరూ చూస్తుండగానే దేశం దాటి వేల కోట్లతో పారిపోయిన లిక్కర్‌ కింగ్‌”రా మనకి ఆదర్శం అన్నాడు ఇంకో యువకుడు.

“లిక్షర్‌ కింగా” ఎవడ్రా వాడు అన్నాడు ఇంకొకడు.

“అదేరా విజయమాల్యారా” అన్నాడు మొదటివాడు.

“అవున్రా, నిజంగా ఢిల్లీనుండి గల్లీ వరకు అందరూ చూస్తుండగానే ఉడా యించాడ్రాొ వాడు మగాడ్రా బుజ్జిగా అన్నాడు సినిమా ఫక్కీలో...

“అవునవును అని మిగతా యువకులు వంతపాడారు.

నేను దిగ్భ్రాంతి చెందాను. చాలా బాధపడ్డాను. నేటి యువకులకు ఆదర్శం మోసగాళ్లు హర్షద్‌ మెహతా, విజయమాల్యాలా, దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులు ఆదర్శం కారా, అయినా ఆశ చావక వారిని కొన్ని ప్రశ్నలు అడిగాను.

“బాబూ, భగత్‌సింగ్‌ ఎవరు అని అడిగాను.

| “అజయ్‌ దేవగన్‌” అన్నారందరూ ముక్త కంఠంతో...

“సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు” అని అడిగాను, ఒక యువకుడు “బోస్‌ అంటే మా ప్రక్క ఇంటి ఆయనేనండీ” అన్నాడు.

“నెహ్రూ ఎవరన్నాను.

“గాంధి గారి కొడుకన్నాడు”. ఇదీ పిల్లలూ నేటి యువతరం పరిస్థితి.

న్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆనాటి త్యాగమూర్తుల బలిదానాలు, ఆత్సా ర్చణలు తర్వాతి తరం విద్యార్థులకు అందించకపోవడం అనే తప్పు జరిగింది. జనవిజ్ఞానవేదిక--------------------- €ళు--------- దేశమును ప్రేమించుమన్నా

దాని వలననే వారి దృష్టిలో బాగా డబ్బు సంపాదించిన వాడే ఆదర్శమూర్తి అయ్యాడు.

దేశ స్వాతంత్ర్యం, స్వావలంబన కోసమై జరిగిన మహత్తర స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలంతా కదిలి వారి జీవితాల్ని త్వాగం చేసారు. కానీ, నేడు ఉప్పె నలా వచ్చి పడుతున్న విదేశీ కంపెనీలు దేశీయ వస్తువులను, పరిశ్రమలను ధ్వంసం చేస్తున్నాయి. రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తుంది. దీనికోసమేనా స్వాతంత్ర సమర యోధులు అంత పెద్దఎత్తున ఉద్యమించింది.

కనీసం మీ తరం వారైనా పెద్దవారై ఆనాటి త్యాగమూర్తుల అడుగుజాడల్లో నడిచి దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని కోరుతున్నాను. అని ముగించారు మాష్టారు.

“మీ కోరిక ప్రకారమే ప్రవర్తిస్తాం మాష్టారూ” పిల్లలందరూ ముక్త కంఠంతో అన్నారు. మాప్పారి ముఖం మీద చిరునవ్వు వెలిసింది.

మ నము ఇ; టీ. లలల

జనవిజ్ఞానవేదిక------------------ళు----------------- దేశమును ప్రేమించుమన్నా

న

ఖ్య శ జో

షే న్‌

'ంల1బి౦ం1౧ ౪వ దేశభక్షి | ఆం అన అత మంచి యన్నది పెంచుమస్నారా | ఆట. దేశాభమానమునాక్టుకద్దని ష,..త్నీ పూని యేదైనాను వ్లాక వ్లేఫ్‌ జ ౨. దేశమంటే మట్టి కాదోయ్‌ . జనవిజ్ఞాన వేదిక

మవసు ఫౌండేషన్‌

కల | “రధ యయా వటం బచాాం వక (లో లట __లీవిపీల [౮ __శయారుచేపెవది (ర్య (లంగ యయ _వీజీలవిడదీపితం | (ఢగ్యగ్రీగ1[గి న్‌ చేపం స ని [ యింయల్‌0 __్లుపరిచూపవది లలల అననని __పిలీంగుచేసినది | యయ రాలా __నివ్‌చెయ్యవివి యయ రాలా వు [6 తం వినని