Telugu జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005 - anilvaranasi/indianlanguages GitHub Wiki

6

"౮౬01 జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం- 20ల0౦6 (41౦౫౧౬ ౧౮౧౫౦౮1౬44 ౧15 0% -2005) . సంక్రైిప్త రూపం శని; ్న | ఈ. టి క్‌

యి ఇ జే 1! ో భా (క్రచురణ :; జనవిజ్ఞాన వేదిక (ఆం.ప్ర న క్ట

ఈవి; క ౫4110%41. ౧౮౧౧1౦౮౬48! ౧415 011 -2005 సంక్షిప్తరూపం ప్రచురణ : 2005 డిసెంబరు మూలం : ౫౦౮౬౧1 4 అనువాదం, సంక్షిప్తీకరణ : వి. బాలసుబ్రహ్మణ్యం, క్‌ వెల :; 15-00 ప్రతులకు : కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం 27-1-1304, బాలాజీనగర్‌, నెల్లూరు-524002, ఫోన్‌ : 0861-2320610 ఫారాష్స, పథల్లా చష్టంపి సీ! "సథవ్ని సూత్రం షాక్షాల్లాసా చష్టాద్దు సార్క్‌ ర్న తు క్ష ఫ్యా ర జ్యో ఇథి నగ (మాపి త్మ జ రో

. '/66116014-[62_ ఈవి: క జాతీయ పాఠ్య ప్రణా౭కా చట్రం- 2006 (4౦౫4 ౧౮థగాాంలటు 412 ౪౦% - 2005) ._ _సంక్రప్తరూపం వం నా ౫ ( | (ప్రచురణ : జనవిజ్ఞాన వెదిక (ఆం.ప్ర) న్‌ా

“నా చిన్నతనంలో చాలా చిన్నబిన్న వస్తువులతో నొక్కావాల్సిన బొత్ములు చేసుకొనే స్వేఛ్స నాకుండేది. ఊఫాంబి కొత్తకొత్త అటిల్ని నేను సృసఫ్రించుకొనేొణ్సి. నా ఆనందంలో నా తోటి అల్లలకూ భాగం ఉండ్సేది. నిజానికి లెళ్ళు నాతో కలివి అఆడుకోఠడం మీదనే నా ఆనందకుంతా అధిరఠడివుండేది. ఒకరోజు నాబాల్యపు స్వర్గంలోకి అద్దల క్రుఠంచపు కూర్కెట్‌ మోళాం జొరబడింది. నొతోటి మిత్రుడొకడు ఒక ఇంగ్రికు దుకాణం నుంచి ఓ బొకును తీసుకొచ్చాడు. అది చాలా అద్ద బొక్కు ం అందంగా, అద్భుతంగా, జీవకళ ఉట్టిలడేలా ఉండ్సేది. బొక్కుణిక్కగానే తొడికి గర్వం కట్టుకొంది. ఆవిలమీద కును తగ్గింది. ఆ ఖరీనైన బొక్కుని కాడు భూకందకుండా దూరంగా అట్టాడు. తొడికొక్కడికే అలాంటి బొక్కు వుందని తొడనుకొనేాడు. భూ చబొక్టులు కొడికి నాజైరకంగా కనిఫించేఐ. ఇల్సటి కున ఆధునిక చరిత్రుబభాళషలో చెప్పాలంవ్‌ అంత గొల్ప బొక్సు ఉన్నందుకు తొడు భూకంట చాలా 'నాగరికుడూ న్నతూటి.

“ఆ సందర్భంలో అంతప్రథభినమైందిగా కన్సింణి ఉండకపోతచ్చుగానీ,

ఆ భాఠోద్వేగంలో అతనొకటి గుర్తించలేకపోయాడు. బొక్కు అట్ల అతని మోళాం అసనైలుసైనలైన బాల్యవు శ్యక్తీకరణను అదృత్త్యం చేసింది. ఇది * నొళ్ముకంటే అంతో ఐలు2ైంది. ఆ బొళక్కు అతని భౌతిక సంతదను భూత్రుమే శ ఫ్రుదర్శింతశయగలిగింది. అతని సృజనార్మకత్తిని, ఆటల్లో లభించే సహజ ఆల్డోదెన్ని క్రీడా శ్రతంచంలోకి చేతులిత్తి తోటి ఫల్టలందర్నీ అఆళ్వోనించ అతని సలాజలక్షణాన్ని భూత్రుం ప్రుదర్శించలేకభోయింది.”

  • రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, (0111946400 జగ4 ౫09655 నుంచి)

|

1968లో భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని (౫24౦౧౭41 ౨010 01 ౬4102600) ప్రకటించింది. దేశం మొత్తం ఒకే విధమైన (?44ఆ౫) విద్యా దశల్చి వివిధ దశల అభివృద్ధి న్థాయిలకి సంబంధించిన సూత్రాల్ని పాలసీల్ని ఇది నిర్ణయించింది. దీని కనుగుణంగా భారత దేశ వ్యాప్తంగా ఒకే 10+2+8 వ్యవస్థ 1970లో వచ్చింది.

దీనికోసం పాఠశాల పాఠ్య ప్రణాళికను (౧ట౫య!జు) ఆధునికీకరించడానికి ౫05, 06 ంటగంట!200 [08 16 10 964 50100! - 2 జుం ఇంట 0 సంద (1975) ను తీసుకొని వచ్చింది. ఇలా తరగతి వారీ స్థాయిలకు తగిన పాఠ్య ప్రణాళిక రూపు దిద్దు కొనింది.

దీన్ని విస్త్రృతపరిచి 1986లో పార్లమెంటు 12400241 ?౦%0 05 £4షంఇళం[ ను ప్రకటించింది. కులం, జాతి, స్థానికత, లింగంతో నిమిత్తం లేకుండా అందరికీ సమానమైన

విద్య నందించాలని ఈ పాలసీ పేర్మానింది. దీనికి తగ్గట్టు ౧౦౧౧౧10 0018 ను మన పాఠ్య ప్రణాళికలో తప్పనిసరి చేసింది. వివిధ రామ్రైాలం అవసరాలకు తగ్గట్టు సరళంగా ([ల401ల) గా వుంటూనే ఈ ౧౦౧౧౧౫౦౧ 60౯౭ను నొక్కి వక్కాణించడం జరిగింది. “మన విద్యా కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా లౌకిక విలువలకు లోబడి వుండాలి” అనేది ఈ ౧౦౧౫౫౫౦౧ 60016 సారాంశం.

దీని కనుగుణంగా [05౯7 ప్రాథమిక, సెకండరీ పాఠ్య ప్రణాళికా చట్రం (1988) (౫260౦౧21 ౧౧౯1౦12002 01 5160601207 & 560016420౧ క£44ష02640౧ (౦౬£55)ని రూపొందించింది. దీన్నాధారం చేసుకొని సిలబసు, పొఠ్య (గ్రంథాలు, మార్గదర్శక సూత్రాలు వచ్చాయి. 1989లో మొదలై అన్ని రాష్ట్రాలు దీని కనుగుణంగా ప్రయాణించాయి. 1992లో ం్ర్రాడటుం6 01 2ంషం౧ దీని అమలును సమీక్షించింది. ఆ తర్వాత + 2కు కూడా 7/05 వార్య ప్రణాళికను రూపొందించింది. సామాజిక శాస్త్రాల అధ్యయనంపై ౫[0షగొ ఒక పరిశీలన కూడా చేసింది. కొన్ని బలహీనతలున్నప్పటికి మొత్తంమీద సామాజిక శాస్త్రాల అధ్యయనంలో కూడా ఒక సామాన్యత్వం వచ్చిందని అభిప్రాయ పడింది. జాతీయ విద్యా వ్యవస్థ (240౧21 కళల ౦01 ౬64410240౧) ఎర్బద్డానికి ప్రధాన మెట్టుగా ఇది ఉపయోగ పడింది.

ఈ దశలో 1998లో ౫0॥ ప్రభుత్వం వచ్చింది. భారతీయకరణ, జాతీయకరణ, ఆధ్యాత్మీకరణ మన వాఠ్య ప్రణాళికకు అవసరమని 1998 అక్టోబరులో జరిగిన విద్యా మంత్రుల సమావేశంలో విద్వాభారత్‌ సంస్యాన్‌ ప్రణాళికను ౫౨॥ ప్రభుత్వం ముందుకు

తెచ్చింది. ఇది తీవ్రంగా విమర్శల పాలైంది.

పై ప్రణాళికకు అనుగుణంగా గింది] 260౧41 ౧టా1ంటజర 2006 011 101 5౭001644) 2440260 (2000)ను తెచ్చింది. 2001లో దీన్నాధారం చేసుకొని పాఠ్య పుస్తకాలు రావడం మొదలై 2004-05లో 8వ తరగతి పాఠ్య [గ్రంథాలు (చివరి విడత) వచ్చాయి. ఇది మన '౫|2క౦౧21 24ల౧౧ ౦౧ 6440240 ముందుకు తెచ్చిన '00%2%001% 0018' కు తీవ్ర అఘాతం కల్గించే ప్రయత్నమని సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తాయి. వివాదాలు చెలరేగాయి.

ఈ దశలో | ప్రభుత్వం వచ్చి దీన్ని సరి చెయ్యాలని పూనుకొంది. దీని ఫలితమే మన ముందున్న ఈ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005.

77

భుందుభూట

మన పిల్లలపై పాఠ్యగ్రంధాల బరువును గురించి ఈ డాక్యుఎంటు మాటిమాటికీ చర్చిస్తుంది. ఈ విషయంలో మాత్రం మనం ఓ పెద్ద అగాధంలో పడిపొయ్యామన్నిస్తోంది. స్వల్పకాలంపాటు సమాచారాన్ని నిల్వచేసుకొనే “జ్ఞాపకాన్ని మనం అవగాహనగా పొరపడుతున్నాం. ఇది మారాలి. ఎందుకంటే కాలం మారింది. మనపిల్లలు జ్ఞాపకం పెట్టుకోవల్సిన సమాచారం నానాటికీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. విషయాన్ని అర్థం చేసుకోవడంలోని రుచిని మన పిల్లలకు అందించాలి. ఫలితంగా వాళ్ళు ప్రపంచాన్ని, జీవితాన్ని ఎదుర్కొనేవుడు స్వంతంగా వ్యవహరించగల్న్గుతారు. స్వంత జ్ఞానాన్ని పెంపొందించుకోగల్లుతారు. ఇలాంటివారు సమగ్రమైన, సృజనాత్మకమైన, సంతోషభరితమైన + వ్యక్తులుగా మారుతారు. కేవలం పరీక్షల పోటీలో తలపడేందుకు లేనిపోని సమాచారాన్నంతా మెదడులో కుక్కుకోవాల్సిన భారం వాళ్ళకి తప్పుతుంది. ఈ అంశంలో మనం ఏ కొంచెం ం ముందుకెళ్ళగల్లినా మన పిల్లల అభ్యసనా సామర్శ్య్యాన్ని గుర్తించగళ్లిన వాళ్ళమవుతాం. ఎర్రసిరాతో, కంప్యూటర్‌ డిస్క్‌ బిట్స్‌తో కొలిచి పిల్లల మెదళ్ళకు ధట్టిస్తున్న సమాచారం ఎంత దండగమారిదో అప్పడు మనకు తెలిసొస్తుంది.

విద్య అంటే 'పోస్టుద్వారానో, టీచరు ద్వారానో చేరవేసే వస్తువు కాదు. నిజమైన విద్య బిడ్డ భౌతిక, సాంస్కృతిక క్షేత్రంలో సృష్టించబడుతుంది. దాగి వుంటుంది. తల్లిదండ్రులతో, టీచర్లతో, తోటి పిల్లలతో, సమాజంతో నెరపే ప్రతిచర్య ద్వారా అది క్రమ వికాసం పొందుతుంది. ఇలాంటి విద్య పటిష్టంగా, ఫలప్రదంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడి పాతను, బెన్నత్యాన్ని మనం గుర్తించాలి, దృఢపరచాలి. జ్ఞాన సముపార్దన ఎప్పుడూ పరస్పరాశ్రితంగా ఉంటుంది. పిల్లల నుంచి టీచరు నేర్చుకొనేదికూడా ఎంతో ఉంటుంది. కాకుంటే టీచరు పిల్లలకు మౌనముద్ర వేసి మూగమొద్బల్లా కూచోబెట్టకుంటేనే ఇది సాధ్యమవుతుంది. పెద్దలకంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు. బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్శ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన పిల్లలతో మాట్లాడ్డం వల్లనే లభించిందని అనుభవంతో నేను చెపుతున్నాను. ్న ఈ అంశాన్ని ఈ డాక్యుమెంట్‌ (౫0౧) విస్తారంగా ప్రస్తావించింది.

'బహుళత్వం), సమాన న్యాయం, 'సమానత్వం' అనే మాటలు ఈ డాక్యుమెంటులో మాటిమాటికీ వస్తాయి. ఇవేమీ రాజకీయ ప్రచార నినాదాలు కాదు. ఎందుకంటే ఇంత / విసృతంగా చేసిన చర్చలో మేమెక్కడా రాజకీయాల జోలికి పోలేదు. మనదేశంలో నాల్గింట మూడు వంతులుగా ఉన్న అధో జగత్‌ సోదరుల్లోనే మన శక్తి మన గొప్పతనం దాగివుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ నమ్మకం నుంచే పైమాటలు వచ్చాయి. ఈ వర్గం సామాజిక జీవితం నుంచి సంపాదించుకొన్న సామర్భ్యాల్నీ నైపుణ్యాల్నీ మన బోధనాంశాలతో జతపరచగల్లితే అద్భుతాలు జరుగుతాయి.

-యశపాల్‌ అధ్యక్షులు, జాతీయ సారధ్య సంఘం (

జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005 (౪41101౧141. ౧౮౮ ంలక4ి ౯౧4|౧8 1021 2005) కేపరిచయం

మన విద్యారంగంలో చాలా అపసవ్యతలు కూడా ఉన్నాయి. (అ) మన విద్యా వ్యవస్థ మారడానికి ససేమిరా అంగీకరించదు. అలా బిగుసుకు పోయింది. (ఆ) జ్ఞానాన్ని తమ నిత్య జీవితంతో అనుసంధానించుకొని సజీవాభ్యసనం చేసే అవకాశం మన పిల్లలకు తక్కువ. అభ్యసనాన్ని మనం ఒంటరి ప్రక్రియగా చూస్తాం. (ఇ) సృజనాత్మకంగా ఆలోచించడాన్ని అంతర్జర్భనాన్ని మన పాఠశాలలు నిరోధిస్తాయి. (ఈ) అభ్యసనం పేరుతో మనం పాఠశాలల్లో అందిస్తున్నదీ, (ప్రసారం చేస్తున్నదీ నూతన జ్ఞానాన్ని సృష్టించుకోగల మానవ సామర్జాన్ని త్రోసిరాజనడమే. (ఉ) విద్యార్థి “భవిష్యత్తు ముందుకొచ్చి “వర్తమానం” వెనక్కు పోయింది. ఇది విద్యార్థికీ, సమాజానికీ, జాతికీ అన్నింటి శ్రేయస్సుకూ భంగకరమై కూచుంది.

పిల్లలు తమ జీవితంపట్ల స్పృహను పెంచుకోవడం, తమ అంతర్జత శక్తుల్ని ఉద్దీప్తం చేసుకోవడం, ఒక లక్ష్యాన్ని నిర్వచించుకొని దాన్ని సాధించడంకోసం ప్రయత్నించడం, ఇతరులు కూడా ఇలాగే వ్యవహరించేందుకుగల హక్కును అంగీకరించడం అనే విద్యాలక్షణాలు ఈనాటికీ ఎవ్వరూ కాదనలేనివి.

పాఠ్య పుస్తకాల్ని పరీక్షలకోసంగా భావించే సంప్రదాయంలో ఇరుక్కున్నంత కాలం, పిల్లల్ని జ్ఞాన (గ్రహీతలుగా మాత్రమే భావించినంతకాలం స్కూళ్ళలో ఆహ్ష్హాదకరమైన బోధన అసాధ్యమని '“భారంలేని విద్య” ([1౭2002009 ౪190౯4 కూరలు) నివేదిక స్పష్టం చేసింది. పిల్లలకు అంతర్గతంగానే సృజనాత్మక శక్తి ఉంటుందని, వాళ్ళు తమ అనుభవాలనుంచే జ్ఞానాన్ని నిర్మించుకొంటారనీ నమ్మనందువల్లనే ప్రతి ఒక్కటీ మనమే బోధించాలనే దుగ్ధలోకి మనం పడిపోతున్నాం. పాఠ్య పుస్తకాల సైజు ప్రతి ఏడాదికీ పెరిగిపోతోంది. కొత్త కొత్త అంశాలు వచ్చి చేరేకొద్దీ జ్ఞానానికి సమగ్రత ఉంటుందన్న స్పృహ బలహీన పడుతోంది. పాఠ్యపుస్తకాల భారం, సిలబసు మోత, విద్యార్థిని విద్యాకేంద్రంగా చూడనీకుండా చేసే వ్యవన్థాగతాంశాలుగా మారాయి. విజ్ఞాన సర్వస్వాల్లాంటి పాఠ్య గ్రంథాల్ని రాసే ఈ రచయితలు విజ్ఞాన విస్ఫోటనం జరిగిపోయిందనీ, దీన్నంతా మన పిల్లల గొంతులోకిగుక్కకపోతే వాళ్ళు ఇతర దేశాల పిల్లలకంటే వెనకపడి పోతారనీ భ్రమ పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని “భారంలేని విద్య" నివేదిక సిలబసు, పాఠ్య గ్రంథాల రూపకల్పనలో తీవ్రమైన మార్పులు అవసరమని సిఫార్సు చేసింది. వయసుకు మించిన ప్రతిభ ప్రదర్శించాలని, పోటీ పడాలని పిల్లలపై ఒత్తిడి పెట్టే పాఠశాల పద్ధతుల్ని ఇది ప్రశ్నించింది. బోధన పిల్లల స్వాభావిక సృజనాత్మకతను వెలికితీసేదిగా ఉండాలంటే మన సిలబసులో సమూల మార్పులు అవసరమని సూచించింది. సమాచారాన్ని కంఠస్తం చేసి కక్కేసే పరీక్షా విధానం మారాలని కోరింది. పరీక్షలకోసమే నేర్చుకోవడమనే యాంత్రిక ధోరణి పిల్లల బాల్యానందాన్ని హరిస్తుంది. నిత్య జీవిత జ్ఞానం నుంచిపాఠశాల

|

జ్ఞానాన్ని వేరుచేస్తుంది. తీవ్రమైన సంన్ధాగత సమస్యగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ "౫౦ డాక్యుమెంటు 'భారంలేని విద్య” నివేదికలోని లోతైన అంశాల్ని విస్తారంగా ప్రస్తావిస్తుంది. చర్చకు పెతుంది.

ఈ దాక్యుమెంటు దేన్నీ నిర్దేశించదు. దీనికి బదులు సిలబసును, పాఠ్యగ్రంథాల్నిి పరీక్షల్ని సంస్కరించే ప్రయత్నంలో టీచర్లు, అధికార్లు, ఇతర సంస్థలు హేతుబద్ధమైనవాటిని ఎన్నుకొని తమకు తాము నిర్ణయాలు తీసుకోవాలని కోరుకొంటుంది. దీనివల్ల స్థానికంగా, వినూత్నమైన ప్రణాళికల్ని రూపొందించుకొనే అవకాశం ఉంటుంది. సమకాలీన, సామాజిక వాస్తవికత ఆధారంగా పాఠ్యప్రణాళికను రూపొందించే సందర్భంలో ఎదురయ్యే కొన్ని ప్రత్యేక | సమస్యల్ని మాత్రం ఈ డాక్యుమెంటు మన దృష్టికి తెస్తుంది.

తరచుగా మన విద్య పిల్లల హృదయాల్లోకి సాంస్కృతిక అసహనత్వాన్ని ఎక్కిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది కపటపూరితంగా వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తుంది. మానవుల మూల భావావేశాల్ని వివిధ నాగరికతల అన్వేషణా ఫలితాలైన గొప్ప సత్యాల్ని ఈ ధోరణి చూడనిరాకరిస్తుంది. విద్య శాంతిని జీవన విధానంగా అలవరచుకొనేటట్టు చెయ్యాలి. ఘర్షణలు తలెత్తినపుడు సాక్షీభూతులుగా వుండి పోవడం గాదు వాటిని నివారించగల్దేలా చెయ్యాలి. మన పాఠ్యాంశాల్లో శాంతి అంతర్భాగమైతే అది జాతి గాయాల్ని మాన్పుతుంది. మనల్ని పునరుజ్జీవితం చేస్తుంది.

అనేక ప్రాంతీయ, స్థానిక సంస్కృతులతో నిర్మించబడ్డ బహుళ సంస్కృతుల సమాజం మనది. మతవిశ్వానాలు, జీవన విధానం, సామాజిక సంబంధాలు, ఒకరికున్నట్టు మనదేశంలో మరొకరికి ఉండవు. ఇలా సహజీవనం చేస్తూ అభివృద్ది చెందే హక్కు అన్ని సామాజిక బృందాలకు సమానంగా ఉంది. మనదేశంలోని ఈ సాంస్కృతిక బహుళత్వానికి తగ్గట్టుగా మన విద్యారంగం ఉండాలి.

విపరీతంగా పెరిగిపోతున్న (ప్రైవేట్‌ రంగానికి; వనరుళ్లేక, ఉన్న వనరులూ సమానంగా + అందక సతమతమవుతున్న ప్రభుత్వ రంగానికి మధ్య విద్యావ్యవస్థ ప్రస్తుతం విభజింపబడి వుంది. ఈ స్థితిలో నాణ్యత అనగానే కొన్ని సంక్లిష్ట తాత్వికాంశాలు, ఆచరణలో ఎదురయ్యే సమస్యలు మనముందుకొచ్చాయి. ప్రైవేట్‌ స్కూళ్ళకు సంబంధించినంతవరకు నాణ్యత అంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు, ఎక్కువ ఫలితాలు సాధించడం. వీటిలో మాతృభాషకు ప్రాధాన్యత ఉండదు.” మరి విద్యార్ధి అర్ధవంతమైన పద్ధతుల్లో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఈ పాఠశాలలు అందిస్తున్న అవకాశాలేమిటి? ఈ స్కూళ్ళలో పేదపిల్లలకు ప్రవేశమే ఉండదు. తరగతి గదిలోని భిన్న సామాజికార్థిక సంస్కృతీ నేపధ్యాల పిల్లలతో కలిసిమెలసి ఉందే అవకాశం, వీళ్ళనుంచి నేర్చుకొనే అవకాశం (పైవేట్‌ స్కూలు పిల్లలకెక్కడుంది? ఇదికూడా గొప్ప అభ్యసనావకాశాల్ని కోల్పోవడమేగదా?

2

విద్యా నామాజిక సందర్భం పట్టణాల ధనిక వర్గపు పిల్లలు చదువుకొనే ఖరీదైన 'పబ్లిక్‌” (ప్రైవేట్‌ స్కూళ్ళు ఒకవైపు, ఇంతకుముందు చెప్పుకొన్న అణగారిన వర్గాల పిల్లలు అత్యధికంగా చేరే, అధ్వాన్న స్థానిక సంస్థల స్కూళ్ళు ఒకవైపు మనకు సర్వత్రా దర్శన మిస్తాయి. ఈ రెండో రకం స్కూళ్ళు పైకిమాత్రం '“ఉచితం'గా విద్యనందిస్తున్నట్టు కన్పిస్తాయి. ఒక కిలోమీటరు లోపల ఒక స్కూలు ఉండాలని, ప్రతి జనావానానికి బడి ఉండాలని, విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తిని గమనంలో ఉంచుకోవాలని మనం పెట్టుకొన్న నియమాల్ని యాంత్రికంగా అమలు చేసిన ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో బహుళ తరగతి పాఠశాలలు విపరీతంగా ఇటీవల పెరిగాయి. ఈ స్కూళ్ళకు ఎలాంటి పాఠ్య ప్రణాళిక, ఎలాంటి బోధన, ఎలాంటి సామగ్రి అవసరమో ఎవ్వరికీ స్పష్టత లేదు. మనకు తెలియకుండానే ఈ పరిస్థితి కొందరి ఆధిక్యతను పెంచింది. కొందరికి నాసిరకం చదువును మిగిల్చింది. సామాజిక న్యాయం, అందరికీ సమానావకాశాలు అనే రాజ్యాంగ విలువల్ని హరింపజేసింది. ప్రపంచీకరణ, సమాజంలోని ప్రతి రంగంలోను మార్కెట్‌ సంబంధాల విస్తరణ విద్యమీద కూడా తీవ్ర ప్రభావాన్ని కల్గిస్తున్నాయి. ఒకవైపున విద్యారంగం చాలా వేగంగా వ్యాపారంగా మారుతోంది. మరొకవైపున ప్రభుత్వ నిధులు అరకొరగా మాత్రమే అందడంతో అధికార్లు 'ప్రత్యామ్నాయ” పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు. విద్యా బాధ్యత క్రమంగా ప్రభుత్వం నుంచి దూరమై కుటుంబాల మీద, సమాజం మీద పదుతోంది. విద్యా లక్ష్యాలు విద్యాలక్ష్యాలు పాఠశాలల్లోనూ, ఇతర విద్యాసంస్థల్లోనూ చేపట్టే వివిధ కార్యకలాపాన్ని సృజనాత్మకంగా మార్చి వాటికి “విద్యాపరమైని లక్షణాన్ని ఆపాదిస్తాయి. ఏ విద్యాలక్ష్యమైనా ఉవాధ్యాయురాలికి తన ప్రస్తుత తరగతి గది కార్యకలాపాల్ని అభిలషణీయభవిష్యత్తుగా మార్చుకోగలిగే అవకాశాన్నిస్తుంది. కాని ఆ ప్రయత్నంలో దాన్ని యాంత్రికం కానివ్వదు. అంతేకాక, ప్రస్తుత సమస్యలనుండి ఎడంకానివ్వకుండానే దానికొక దిశానిర్దెశాన్నిస్తుంది. ఆ విధంగా చూస్తే, ఒక లక్ష్యమంటే మనం ముందే ఆశించిన ఒక ఫలితంగా చెప్పవచ్చు. అదొక ్రేక్షకపాత్ర ధరించిన సోమరి దృక్పథం కాదు, అంతకు మించి ఆ గమ్యాన్ని చేరే ప్రతి అడుగునూ ప్రభావితం చేసే ప్రక్రియ అనవచ్చు. ఏ లక్ష్యమైనా దూరదృష్టిని ప్రసాదించాలి. దానికి మూడు మార్గాలున్నాయి. ఒకటి, అది నిర్దశించుకున్న లక్ష్యాన్ని చేరడానికి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఖ సాధనసంపత్తి లభ్యంగా ఉందో సునిశితంగా పరీక్షించడం. ఆ మార్గంలోని ఆటంకాల్ని గుర్తెరగడం. ఇందుకుగాను, పిల్లల్ని సవివరంగా పరిశీలించవలసి ఉంటుంది. వాళ్ళు వివిధవయస్సుల్లో ఏమి అభ్యసించగలుగుతారో పరిశీలించవలసిఉంటుంది. ఇక రెండవది, ఆ దూరదృష్టి మన లక్ష్యసాధనకి అనువైన క్రమాన్ని మార్గాన్ని సూచిస్తుంది. మూడవది, ఆ క్రమంలో, వివిధ ప్రత్యామ్నాయాల్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. కాబట్టి ఒక లక్ష్యానికి అనుగుణంగా తె

ప్రయత్నించడం మనకొక చాకచక్యాన్ని కలిగిస్తుంది. పాఠశాల, తరగతి గది, ఇతర సంబంధిత అభ్యాసస్టలాలు విద్యాభ్యాసంలో ముఖ్యమైన రంగస్థలాలు. ఇవి అభ్యాసకులు తమ ఆకాంక్షిత కరికులర్‌ లక్ష్యాల్ని సాధించుకోవడానికి సహకరించే స్థలాలు కావాలి. అభ్యాసకుల గురించిన అవగాహన, విద్యాలక్ష్యాలు, జ్ఞాన స్వభావం, సాంఘిక స్థలంగా పాఠశాల స్వభావం మన తరగతి గది ఆచరణల్ని నిర్దేశించే కొన్ని సూత్రాల్ని మనకందిస్తాయి. ప్రజాస్వామిక విలువల పట్ల నిబద్ధత కలిగిఉండటం. హేతుబద్ధ వివేచనమీదా, అవగాహనమీదా ఆధారపడ్డ ఇటువంటి విలువల పట్ల నిబద్ధతను పెంపొందించడానికి విద్య కృషి చెయ్యాలి. అటువంటి నిబద్ధతను విద్యార్భలలో కలిగించడానికి పాఠశాలలో చర్చ, సంవాదం కొనసాగే దిశగా కరికులం కృషి చేయవలసిఉంటుంది. | అలాగే స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా పనిచెయ్యడమనేవి వ్యష్టిగానూ, సమిష్టిగానూ కూడా జాగ్రత్తగా పరిశీలించి విలువలకు కట్టుబడి నిర్ణయాల్ని తీసుకునే సామర్ధాన్ని , పెంపొందించే గుణగణాలు. ఇతరుల సంక్షేమం పట్లా, వారి అనుభూతల పట్లా సున్నితంగా స్పందించడం, ప్రపంచం గురించిన జ్ఞానం, అవగాహనా విలువలకు కట్టుబడటానికొక హేతుశీలతను నేర్చుకోవడమెట్లానో నేర్చుకోవడం, నేర్చుకున్నదాన్ని అవసరమైతే వదిలిపెట్టగలగడం లేదా సవరించుకోగలగడం అనేవి కొత్త సందర్బాలకు సరళంగా, సృజనాత్మకంగా ప్రతిస్పందించడాన్ని నేర్ప క్రమంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇటువంటి జ్ఞాననిర్మాణ ప్రక్రియల్ని నాక్కి చెప్పవలసిన బాధ్యత కరికులంకి ఎంతైనా ఉంది. 2. జ్ఞాన నిర్మాణం-బోధన పిల్లలు స్వయంగా పాల్గొంటూ జ్ఞానాన్ని నిర్మించుకొనే క్రమంలో టీచర్లుకూడా క్రియాశీల భాగస్వాములు కాగల్లితే వారి పాత్రకు ప్రాధాన్యత పెరుగుతుంది. నేర్చుకొనే క్రమంలో బిడ్డ తాను పాల్గొంటూ జ్ఞానాన్ని నిర్మించుకొంటుంది. పిల్లలు ప్రశ్నించడం, బడిలో " నేర్చుకొన్నదాన్ని బయట అనుభవాలతో అన్వ్నయించుకోవడం మౌనవ్రతధారణ చెయ్యకుండా వుండటం, ఒకేవిధమైన “'సరైని జవాబులు చెప్పేందుకు బదులు పలురూపాల్లో స్పందించడం ళ్‌ ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాలుగా కన్పించవచ్చు. కానీ పిల్లల అవగాహన పెరగడంలో మాత్రం ఇవన్నీ చాలా కీలకమైన మెట్లు. పిల్లలకు తరచుగా తమ అనుభావాల నుంచిగానీ, ప్రసార మాధ్యమాల నుంచిగాని కొత్తకొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఉపాధ్యాయుడికి నచ్చే విధంగా వాటిని చెప్పడం పిల్లలకు చేతగాకపోవచ్చు. పూర్తిగా తెలిసినదానికీ, దాదాపు తెలిసినదానికీ మధ్య ఒక 'జోన్‌” ఉంటుంది. అక్కడే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఈ జ్ఞానం నైపుణ్యాలుగా రూపాంతరం చెందుతుంది. స్కూలు బయటా, ఇంటిలో, సమాజం మధ్యా పనిచేసే క్రమంలో ఈ నైపుణ్యాలు పదునెక్కుతాయి. మనం ఈ నైపుణ్యాలన్నిటిని గౌరవించాలి. దే

ఈ కీలకం తెలిసిన ఉపాధ్యాయుడు పిల్లలు తమ శక్తిని తాము గుర్తించడానికి తగిన విధంగా పిల్లలకు లక్ష్యాలు ఇన్తాడు. ప్రశ్నల్ని అందిసాడు. మన భావాల్లో మార్పురాదు ఎందుకు? పాఠశాలల్లో చదువు ఎప్పుడూ అందుబాటు లేని దళితుల గిరిజనుల, వెనుకబడిన వర్గాల పిల్లల్ని గురించి మనల్ని చిరకాలంగా పట్టి వేళ్ళాడుతున్న భావాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎంతకాలానికీ మారకపోవడం చాల ఆందోళనకరమైన అంశం. చారిత్రకంగానే కొందరు పిల్లలు చదువుకోవడానికి పనికిరారని, కొద్దిగా మాత్రమే చదువుకోగలరని, నెమ్మదిగా మాత్రమే చదవగలరని, చదువంటే భయపడతారని మనం భావిస్తుంటాం, అలాగే వారిని చూస్తుంటాం. ఇంతే ఆడపిల్లలకు సంబంధించికూడా వాళ్ళకు ఆటలంటే ఇష్టముండదనీ, గణితం, సైన్స్‌ అంటే వాళ్ళకి ఆసక్తి ఉండదనీ ఒక అభిప్రాయాన్ని స్థిరంగా మనం ఏర్పరచుకుని ఉంటాం. అంగవైకల్యం గల పిల్లల్ని ఇతర పిల్లలతోబాటు కూర్చోబెట్టి చదువునేర్పటం సాధ్యంకాదని కూడా మన నమ్మకం. లైంగికంలోను, కులంలోను, భౌతికంగాను, మేధస్సులోను అసమానతలు, వెనుకబాటుతనాలు,

_ అంతర్‌గర్భితంగానే దాగి ఉంటాయని, వాటిని మార్చలేమని మనం నమ్మినందువల్లే ఇలాంటి అభిప్రాయాలు వర్పడిపోయాయి. కొంతమంది ఇలాంటి భావాలనుంచి బయటపడి ఉండవచ్చు కానీ ఎక్కువమందిలో ఈ భావాలు గడ్డకట్టుకునిపోయి ఉన్నాయి. పిల్లలందర్నీ సమానంగా చూచే విధంగా మనం ఉపాధ్యాయుల్ని సిద్ధపరచినపుడే మనం రాజ్యాంగంలో నిర్దేశించుచున్న సమానత్వం సాధ్యమవుతుంది. పిల్లలు తమతోపాటు మన పాఠశాలకు తీసుకొని వచ్చే సాంస్కృతిక, సామాజిక ఆర్థిక భిన్నత్వాలను అర్ధం చేసుకొనే విధంగా మన టీచర్లకు శిక్షణ ఇవ్వాలి.

జ్ఞానము-అవగాహన

ప్రతి వ్యక్తికి ఎలాంటి సామర్ధ్యాలు, విలువలు అవసరం అనే దార్భనికతను బట్టి, సమాజానికి ఎలాంటి సామాజిక, రాజకీయ సొంస్కృతిక స్వభావం అవసరం అనే దృక్పధాన్ని బట్టి విద్యాలక్ష్యాలు ఉంటాయి. ఎలాంటి విద్యాలక్ష్యాలు అవసరమనుకుంటున్నామో దాన్నిబట్టి పిల్లలకు ఏమిచెప్పాలి? అనే ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఇది ఒకే ఒక లక్ష్యం కాదు. అనేక లక్ష్యాల సముదాయం. మనం ఎన్నుకునే భోదనాంశం ఈ అన్ని లక్ష్యాలకు న్యాయం చేయాలి. ఇది సమగ్రంగా, సమతుల్యంగా ఉండాలి. మన పాఠ్యప్రణాళిక ఒక జ్ఞాన పునాదిని ఏర్పరచే అనుభవాలతో నిండి ఉండాలి. తార్కికంగా ఆలోచించగల సామర్ధ్యం, ప్రపంచాన్ని వివిధ అంశాలద్వారా అర్ధం చేసుకోగలగడం, సౌందర్యారాధన, ఇతరులపట్ల స్పందన, తార్మికాభివృద్ధికోసం ఇతరులతో కలిసి పనిచేయడంలాంటివి ఈ జ్ఞానపునాదివల్ల మానవుడిలో అభివృద్ధి చెందుతాయి. ఈ అధ్యాయం పాఠ్యప్రణాళిక రూపకల్పనలో, విషయ నిర్ధారణలో అవసరమైన జ్ఞానరూపాల గురించి, అవగాహన గురించి చర్చిస్తుంది. క్రమబద్ధమైన అనుభవమే

క్‌

జ్ఞానంగా మనం పరిగణిస్తున్నాం. ఇది భాషద్వారా భావనారూపాలుగా ఏర్పడి అర్ధాన్ని నృష్టిన్తుంది. వలితంగా మనం జీవిన్తున్న (వ్రపంచాన్ని అర్భం చేనుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని మనం ఆచరణ పద్దతులుగా లేదా ఆలోచనలతో కూడిన శారీరక నైపుణ్యంగా కూడా భావించవచ్చు. ఇది వస్తూత్పత్తి ద్వారా సమాజ పురోగమనానికి దోహదం చేస్తుంది. చారిత్రక క్రమంలో మానవులు వివిధ ఆలోచనలు, భావాలు గల విజ్ఞానమూర్తులుగా, వస్తూత్పత్తి చేయగల సమర్భులుగా పరిణితిచెంది మరింత జ్ఞానాన్ని నిర్మించుకున్నారు. పిల్లలందరూ ఈ జ్ఞాన సంపదను తమకుతాము పునరుత్పత్తి చేసుకోవాలి. మరింత సమర్థవంతంగా ఈ ప్రపంచంలో వ్యవహరించెందుకు కావల్సిన మరిన్ని ఆలోచనలు దీనివల్ల వారికి లభిస్తాయి. పిల్లలు ఈ జ్ఞానోత్పత్తి క్రమంలో ఎలా భాగస్వాములు కావాలో నేర్చుకోవాలి. ఉత్పత్తి క్రమంలో కూడా వారు భాగస్వాములు కావాలి. ఈ రూపంలో మనం జ్ఞానాన్ని అర్ధం చేసుకుంటే అప్పుడు మనం జ్ఞానాన్ని కేవలం ఒక ఉత్పత్తిగా చూడం. ఇది ఎలా సృష్టింపబడుతుందో, ఎలా క్రమవికాసం చెందుతుందో, ఎవరికిది అందుబాటులో ఉందో, దేనికోసం దీన్ని ఉపయోగిస్తున్నారో ఇవన్నీ జ్ఞానానికి సంబంధించి అంతర్‌గర్భిత సూత్రాలని మనకప్పుడు అర్ధమవుతుంది. ఈ అవగాహనతో మన పాఠ్యప్రణాళికను రూపొందిస్తే పిల్లల అభ్యసనా క్రమానికి ఇందులో ఎక్కువ పాత్ర ఉంటుంది. పిల్లలు తాము పాల్గొంటూ జ్ఞాన నిర్మాణం ఎలా చేసుకుంటారో, ఏమి నేర్చుకుంటారోకూడా మన పాఠ్యప్రణాళికలో (ప్రతిబింబిస్తుంది. అలాగాక జ్ఞానాన్ని మనం తయారుచేసిన ఉత్పత్తిగా భావించినట్లయితే అది సమాచార రూపంలో మారి పిల్లల మెదళ్ళలోకి బదలాయించడమేజరుగుతుంది. అప్పుడు అభ్యాసకులు కేవలం సంగ్రహీతలుగా మారతారు. అభ్యసనంలో వారి ప్రమేయమేమీ ఉండదు. దీనికి భిన్నమైన దృక్పథం మనకుంటే పిల్లల్ని ప్రపంచాన్ని పరిశీలిస్తూ, ప్రపంచంపట్ల స్పందిస్తూ, ప్రపంచంలో పనిచేస్తూ, భాగస్వాములవుతూ నేర్చుకునేవాళ్ళుగా మనం చూడగలం. మనం ఎంచుకున్న విద్యాలక్ష్యాలను సాధించడానికి, కావల్సిన సామర్భాలు చాలా విస్తృతమైనవి. “కేవలం విద్యద్వారానే వీటన్నిటినీ అభివృద్ధి చేయలేం. మన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కొన్ని అంశాలకు మాత్రమే బోధనాజ్ఞానం పరిమితం కావల్సి ఉంటుంది. = అనుభవంలోని జ్ఞానం చేతివృత్తులు, వృత్తులు, కళలకు సంబంధించిన జ్ఞానం నిరంతరం అభివృద్ధి _ చెందుతూ, అనుభవంద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతుంటుంది. కాబట్టి వీటిలోని ప్రతిఒక్కటీ ఒక ఆచరణాత్మక జ్ఞానంగా మనం గుర్తించాలి. ఇలాంటి జ్ఞానం భారతదేశంలో ఎంతో విస్తృతంగా, వైవిధ్యభరితంగా, సుసంపన్నంగా లభిస్తోంది. ఉత్పత్తి నైపుణ్యాలలాగానే మనకు ఆర్థికంగా ఇవి ఎంతో విలువైనవి. వీటిని అధ్యయనం చేయడానికి, వీటిలోని జ్ఞాన నిర్మాణాల్ని గుర్తించడానికి మరింత పరిశోధన అవసరం. వీటిని ఎలా నిర్వహించేవారు? ఎలా నేర్చుకునేవారు? నేర్చుకున్నవాటిని ఎలా ఉపయోగించుకునేవారు? 6

అనే ప్రశ్నలు సామాజికంగా ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ వృత్తులు మన దేశంలో కులాలతో, స్త్రీ పురుష అంశాలతో ముడిపడి ఉన్నాయి. వీటిని మన పాఠ్యప్రణాళికలో (ఛమరూపాలుగాగాక విజ్ఞానరూపాలుగా గుర్తించి ఇముడ్చుకోవలసి ఉంది. ఇవి ఇతర అంశాలు నేర్చుకోవడానికి ఒక మాధ్యమంగా కూడా ఉపయోగపడతాయి. ఎంతో విలువైన ఈ మానవ సమాజ జ్ఞానం మన పాఠ్యప్రణాళికలో ముఖ్యమైన భాగంగా మారాల్సి ఉంది. జ్ఞాన పునఃసృజన భారతదేశంలో సబ్జెక్టుల ఆధారంగా పాఠ్యప్రణాళికల్ని రూపొందించడం జరుగుతోంది. దీనివల్ల జ్ఞానాన్ని దేనికదిగా విదదీసి చూడ్డం జరుగుతోంది. దీనికితోడు పరీక్షల తతంగం, సామర్దానికి గీటురాళ్ళుగా మార్కులు ఉండనేవున్నాయి. ఈ ధోరణి మన విద్యారంగంలో బోలెడు సమస్యల్ని తెచ్చిపెట్టింది. పాఠ్యగ్రంథాల్లోలేనివి, పరీక్షల్లో మార్కులురానివి పక్కకు నెట్టివేయబడ్డాయి. ఇవి పాఠ్యేతరాంశాలుగాను, అనుబంధ పాఠ్యాంశాలుగాను మారి పాఠ్యప్రణాళికలో అంతర్భాగాలు కాకుండాపోయాయి. వీటికి పాఠశాలలో ఏ ప్రాధాన్యతా ఉండదు. నైపుణ్యాల అభివృద్ధికి, సౌందర్యాస్వాదనకు, సృజనాత్మకతకు, సమిష్టికృషికి ఎంతో ఉపయోగపడే హస్తకళలు, క్రీడలు కూడా ప్రాధాన్యతను పోగొట్టుకున్నాయి. ఇక శ్రమ (పని), వ్యవహార జ్ఞానం అనేవాటికి పాఠ్యప్రణాళికలో స్థానమే లేదు. ఇప్పటికీ ఈ రంగాల్ని దృష్టిలో ఉంచుకొన్న సరైన పాఠ్యప్రణాళికా దృక్పథం మనకులేదు. రెండోది మన సబ్జైక్సులన్నీ దేనికవిగా ఉంటాయి. ఫలితంగా మన జ్ఞానం పరస్పరాధారితంగా ఉండదు. ఉమ్మడిదిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. బిడ్డ ప్రపంచాన్ని దర్శించే పద్ధతికి ఈ సబ్జెక్టుల విభజన పూర్తి భిన్నంగా ఉంటుంది. పాఠశాల బయటి జ్ఞానానికి, లోపలి జ్ఞానానికీ పొంతనే ఉండదు. దేని సరిహద్దుల్లో అది ఉండిపోతుంది. మూడవది బిడ్డకు సహజంగా జ్ఞానాన్ని నిర్మించుకొనేందుకు, వినూత్న పద్ధతుల్ని జ్ఞానంకోసం వెతుక్కొనేందుకు అద్భుతమైన సామర్థం ఉంటుందని మనం మరచిపోతున్నాం. జ్ఞానంగా నిర్ణయించెసినదాన్ని పిల్లలకందించేసి మనపని అయిపోయిందన్పించుకొంటున్నాం. ఫలితంగా జ్ఞానాన్ని తోసేసి సమాచారం ముందుకొచ్చి కూచుంటుంది. దీనివల్ల ఇంతేసిలా వుండే పాఠ్యగ్రంథాలు, 'క్విజ్‌ పద్ధతులు, అవగాహనకు సమస్యాసాధనకు బదులు యాంత్రిక వల్లింపులు విద్యను నేడు శాసించే పరిస్థితి ఏర్పడింది. నాల్గవది కొత్త సబ్జెక్టుల్ని ప్రవేశపెట్టడం. సమకాలీన సమాజానికవసరమైన సబ్జెక్టుల అవసరాన్ని ఎవ్వరూ కాదనలేరు. వాటి ప్రాధాన్యత వాటికుంది. కానీ మన పాఠ్యప్రణాళికలోకి కొత్త సబ్దెక్టుల్ని సృష్టించి దూర్చడం, దీనికితగ్గ పాఠ్యగ్రంథాలు, పరీక్ష పద్ధతులు రూపొందించడం మాత్రం పైప్రాధాన్యతను అపార్ధం చేసుకోవడం తప్ప మరొక్కటిగాదు. వీటిని ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో, ప్రస్తుత కృత్యాల్లోనే చేర్చవచ్చు. కొత్త సబ్జెక్టుల్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా చేర్చడం మన పాఠ్యప్రణాళిక బరువు పెంచుతుంది. జ్ఞానాన్ని ముక్కలుముక్కలుగా చేస్తుంది. గ్‌

పిల్లల జ్ఞానం, న్ధానిక జ్ఞానం

పిల్లలు స్థానిక పరిసరాల నుంచి, న్థానిక సమాజం నుంచి అభ్యసనాన్ని (ప్రారంభిసారు. జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. వాళ్ళు తమచుట్టూ ఉన్న వాతావరణంతో జరిపే ప్రతిచర్య వల్లనే వారి జ్ఞానం అర్ధవంతమౌతుంది. అందువల్ల ఈ పరిసరాలకు స్థానిక సమాజానికీ ఎంతో వ్రాధాన్యత ఉంది. అయినప్పటికీ పాఠ్యప్రణాళికల్ని రూపొందించేటప్పుడుగానీ, బోధనలోగానీ వీటిని మనం పట్టించుకోవడంలేదు. అందువల్ల ఈ డాక్యుమెంటు విద్య సందర్భవంతంగా ఉండాలని, అభ్యసనాన్ని బిడ్డ సందర్భం నుంచి చూడాలని నొక్కిచెబుతోంది. పాఠశాల వాతావరణానికి, సామాజిక వాతావరణానికి మధ్య అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటోంది. స్థానిక వాతావరణం, పిల్లల స్వీయానుభవాలు స్కూల్లో మనమందించే జ్ఞానానికి ప్రవేశకాలుగా ఉపయోగపడతాయనే పరిమిత దృష్టిలోంచి దీన్ని మేము చెప్పడంలేదు. జ్ఞానాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించుకోవలసి ఉంది. అందుకోసమే దీన్ని నొక్కి చెప్పవలసి వస్తోంది. ఇది ఒక లక్ష్యాన్ని సాధించడానికి సాధనం కాదు. ఇది సాధనమూ, లక్ష్యమూకూడా. అట్లాగే జ్ఞానాన్ని మన రోజువారీ కార్యక్రమాలకు పరిమితమైనదిగా భావించనక్కరలేదు. ప్రపంచంతో అనుసంధానింపజేసుకోవడంతోనే పాఠశాల జ్ఞానం పరిపక్వమౌతుంది. అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు

ప్రాథమిక విద్యదాకా అన్నిరకాల కృత్యాలలోను భాషకు, గణితానికి (ప్రాధాన్యతనివ్వాలి. ఈదశలో ఈ రెండింటినీ కూడా వేరువేరు సబ్జెక్టులుగా విభజించుకోవాల్సిన అవసరం లేదు. రెండింటినీ కలిపి సమిష్టిగా చెప్పవచ్చు. అయితే తమ పరిసరాల అనుభవాల రూపంలోనే వీటి అభ్యసనం సాగాలి. తమచుట్టూ ఉన్న ప్రాకృతిక, సామాజిక పరిసరాలతో పిల్లలు చేసే నిరంతర ప్రతిచర్యద్వారా, పనులద్వారా, తమ సమాజంతోటి అనుబంధంద్వారా, తమ సౌందర్యాస్వాదన సామర్భాలు పెంచుకోవడంద్వారా పిల్లలు ఈదశలో అభ్యసనం కొనసాగిస్తారు. ఈ అనుభవాలే తరువాత మాధ్యమిక విద్యాదశలో సైన్సు, సామాజిక శాస్తాలుగా విడిపోతాయి. మాధ్యమిక విద్యాదశలో పైన చెప్పిన వివిధరూపాల జ్ఞానం దెనికదిగా నిర్వచించబడడం ప్రారంభమవుతుంది.

  1. పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనం . భాష పుట్టుకతోనే పిల్లలకు అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది. ఎంతో సంక్లిష్టమైన

నియమాలుగల భాషలో పిల్లలు మన బడికి రాకముందే ప్రావీణ్యం కల్గివుందటం మనకందరికీ అనుభవమే. అందరు పిల్లలకూ భాషా సామర్ధ్వాలు పుష్కలంగా ఉండడం కూడా మనకు తెలుసు. భాషనేర్చే ఉపాధ్యాయుడు పిల్లల్లోని ఈ సామర్వాన్ని ఒక గొప్ప వనరుగా మొదట గుర్తించాలి. ప్రామాణిక వ్యావహారిక భాషను ఉచ్చరించడంలో వెనకబడ్డ పిల్లలుకూడా తమ . అనుభవాల్ని వ్యక్తీకరించడానికి, సమాచారాన్ని అందించడానికి కొన్ని గుర్తుల్ని సంకేతాల్ని అభివృద్ధి చేసుకొంటారు. ఈ సామర్ధాలమీద ఆధారపడి భాషల్ని మనం నేర్పించాల్సి ఉంటుంది.

8

భారతదేశపు భాషా బహుళత్వం మనముందుకు కొన్ని సవాళ్ళు తెస్తున్న మాట వాస్తవం. కానీ ఇది కొన్ని అవకాశాల్ని అందించడం కూడా అంతే వాస్తవం. బహుళ భాషలుందడం మనకు ఒక గొప్ప సాంస్కృతిక వనరు. బహుభాషలుందదం మన విశిష్టత కాగా, ఆ భాషలు వివిధ భాషా కుటుంబాలకు చెందినవి గావదం మరింత విశిష్టత. రెండు భాషలు, లేదా బహుళ భాషలు జ్ఞానాభివృద్ధికి చాలా మంచి అవకాశాలని ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. రెండు భాషలు జన్మతః నేర్చుకొనే అవకాశం ఉన్న వాళ్ళ జ్ఞానం మరింత త్వరగా పెరుగుతుందని చాలా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. క్రింది సూత్రాల్ని సాధించడంద్వారా మన లక్ష్యాల్ని సాధించవచ్చు.

  • మన పాఠశాలల్లో పిల్లల మాతృభాష(లు) బోధనా మాధ్యమంగా ఉండాలి.
  • (ప్రాంతీయ భాష మాతృభాష ఒకటి కాకపోతే మొదటి రెండు సంవత్సరాలు మాతృభాషలోనే విద్య సాగాలి.
  • ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాష తప్పనిసరి సబ్దక్టుగా ఉండాలి. = మాధ్యమిక స్థాయిల్లో ప్రాంతీయ భాష(లుతోపాటు ఇంగ్రీషుకూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. = హిందీయేతర రాష్ట్రాల్లో పిల్లలు హిందీ నేర్చుకోవాలి. హిందీ ప్రాంతాల పిల్లలు హిందీతోపాటే ఆ ప్రాంతంలో మాట్లాడని మరో భాష నేర్చుకోవాలి. వీటితోపాటు సంస్కృతాన్ని కూడా నేర్చుకోవచ్చు.
  • ఉన్నత వాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాషను, హైయ్యర్‌ సెకండరీ స్థాయిలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు. ౪ ప్రల్రు భాషల్ని నేర్పడం ద్వారానేగాదు తరగతి గదిలోగల బహు భాషావకాశాల్ని ఉపయోగించుకోవడం ద్వారా కూడా బోధనా వ్యూహాల్ని రూపొందించుకోవాలి. ప్రథమ భాషా విద్య కుటుంబంతో, చుట్టూవున్న వారితో ప్రతిచర్య జరపడం ద్వారా పిల్లలు భాషను లేదా భాషల్ని స్వంతం చేసుకుంటారనేది మనకు తెలుసు. ఇలా పిల్లలు కావల్సినంత సంభాషణా నైపుణ్యంతో మన బడిలోకి ప్రవేశిసారు. ఈ నైపుణ్యాన్ని మనం సానబెట్టాలి. మరింత వేగంగా సంభాషించగల సామర్దాన్ని, తద్వారా జ్ఞాన సామర్ధాల్ని మనం తరగతి గదిలో అభివృద్ధి చెయ్యాలి. ఇది ప్రథమ భాషా లక్ష్యం. సంభాషణా నైపుణ్యాల్ని మరింత అభివృద్ధి చెయ్యడంకోసం, విమర్శనాత్మకంగా ఆలోచించగల్గడం కోసం మనం మూడవ తరగతినుంచి మౌఖిక లేఖన సాధనాల్ని ప్రవేశపెట్టాలి. ప్రారంభ దశలో బిడ్ద స్వంత భాషను మనం తప్పనిసరిగా అంగీకరించాలి. దీన్ని సరిచెయ్యదానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకూడదు. నాల్లవ తరగతి నుంచి ప్రామాణిక భాషను, సక్రమ ఉచ్చారణను పిల్లలకు నేర్పించాలి. ఇదే సందర్భంలో పిల్లల ఇంటి భాష(ల)ను మనం గౌరవించితీరాలి. తప్పులనేవి నేర్చుకోవడంలో తప్పునిసరైనవి. వాటిని నేర్చుకోగల దశ వచ్చినప్పుడు పిల్లలు తమకు తామేవాటిని 0

'సరిదిద్దుకొంటారు. పిల్లల తప్పుల పై కేంద్రీకరించేబదులు పిల్లలకు సమగ్రమైన ఆసక్తికరమైన, సవాళ్ళతోకూడిన అంశాల్ని అందించడం మంచిది. భాషావిద్య భాషా తరగతి గదికి మాత్రమే పరిమితమైంది కాదు. నిజానికి సైన్సు, సామాజిక శాస్ర్తాలు, గణితం బోధించే కాసులు కూడా భాషా క్షాసులే. ఒక సబ్జెక్టును నేర్చుకోవడం అంటే ఏమిటి? ఆ విషయంలోని పారిభాషిక పదాల్ని నేర్చుకోవడం. ఆ విషయాన్ని చర్చించడం. దాన్ని విమర్శనాత్మకంగా రాయడం. ఇవన్నీ భాషా విద్యలోనివే గదా! అన్ని సబ్జెక్టులలో భాష సాంప్రదాయక శిక్షణ పొందిన భాషా ఉపాధ్యాయులకు ఎ తప్పులూలేని భాషోచ్చారణ మాత్రమే పరమార్ధం. భాషకు వ్యక్తీకరణ ధర్మం కూడా ముఖ్యమని వారు గుర్తించరు. తరగతిలో మాట్లాడ్డానికి ప్రతికూల విలువ మాత్రమే ఉండే వ్యవస్థ మనది. పిల్లల్ని మౌనంగా కూచోబెట్టడానికే మన టీచర్ల శక్తి అంతా ఖర్చయిపోతుంది. ఉచ్భారణ రూపాల్ని సవరించడానికే “ పుణ్యకాలమంతా సరిపోతుంది. పిల్లలు మాట్లాడ్డాన్ని ఒక తలనొప్పిగా చూడకుండా వాళ్ళని అభివృద్ధి చెయ్యడానికి అదొక వనరుగా టీచరు చూడాలి. అప్పుడు నియంత్రణ ప్రతిఘటన అనే విషవలయం వ్యక్తీకరణ, స్పందన అనే ఒక మంచి వలయంగా మారుతుంది. భాషను గొప్ప బోధనావనరుగా ఎలా ఉపయోగించుకోవచ్చునో తెలియజేసే పరిజ్ఞానం ఇప్పుడు మనవద్ద కావల్సినంత ఉంది. సర్వీసుకు ముందు, సర్వీసు మధ్యలో ఇచ్చే శిక్షణలో దీన్ని ఉపాధ్యాయులకందించాలి. ద్వితీయ భాషా బోధన రెండవ భాషను ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ లక్ష్యంతో చెప్పాలి అనేవి పిల్లలకు ఆ భాష ఎంత సన్నిహితమైంది అనేదాన్నిబట్టి, ఆ భాషను వారెందుకు నేర్చుకొంటున్నారు అనేదాన్నిబట్సి ఉంటాయి. ద్వితీయ భాషా వాచకాల్ని ఎంపిక చేసుకొనేప్పుడు అవి పిల్లల్ని ఆకర్షించేలా? ఆ భాష ్రత్యేకతలని, గొప్పదనాన్ని ప్రతిబింబించేలా, సజీవ భాషలో ఉండేలా చూసుకోవాలి. ఏదో ఒక సంస్కృతిని, కొన్ని నీతుల్ని ప్రబోధిస్తే సరిపోదు. ॥ ఇంగ్లీషు మన భాషా పాఠ్య ప్రణాళికల్లో ఇంగ్లీషు బోధన ఇప్పుడొక పెద్ద ప్రశ్న ఇది దేశంలోని ॥ అన్ని స్కూళ్ళకు వర్తించే సమస్య. ఒకవైపు 10వ తరగతిలో ఎక్కువమంది పిల్లలు ఇంగ్లీషువల్ల తప్పిపోతున్నారు. పిల్లలవైపు నుంచి చూస్తే ఇదొక అన్యాయమైన తీర్పు. ఇంకోవైపు మాధ్యమంగా గాక పోయినా కనీసం భాషగానైనా ఒకటవ తరగతినుంచే ఇంగ్లీషు నేర్పాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇలా చిన్నతనంలోనే మనం మాతృభాషల స్థానంలో ఇంగ్లీషును తెచ్చిపెడితే అప్పుడు ఇంగ్లీషు పదజాలంతో తమ పరిసరాల్ని అనుసంధానించుకోవడం పిల్లలకు అసాధ్యమవుతుంది. అదే సందర్భంలో ఇంగ్లీషు నేర్చుకోవడమూ అవసరమే. మన ఆకాంక్షలు, బ్రతుకుతెరువు, అవకాశాలు, జ్ఞానం అన్నీ ఇంగ్రీషుతో ముడిపడివున్న రోజులివి. 10

ఇంగ్లీషు : ఒక సబ్దెక్టా లేక మాధ్యమమా? ఒకటవ తరగతినుంచే ఇంగ్లీషు నేర్పించాలని వస్తున్న డిమాండు కేవలం నూతన ఆకాంక్షలవల్లనో, మారిన రాజకీయ పరిస్థితువల్లనో వచ్చింది గాదు. ఇప్పుడు మనం ఇంగ్లీషు నేర్పుతున్న విధానం, మనం వాడుతున్న పాఠ్య ప్రణాళికలు కూడా దీనికి కారణాలు. ఇంగ్లీషు బోధనకు సంబంధించి మన అధ్యయన సంస్థలు చేస్తున్న పరిశోధనల వైఫల్యం కూడా దీనికి కారణమే. నాల్లవ తరగతి నుంచి 10వ తరగతి దాకా మనం ఇంగ్లీషు నేర్చుతున్నాం. మనం పాటించే పద్ధతులవల్ల ఇంగ్లీషు ధారాళంగా వచ్చి ఉంటే పై డిమాండు వచ్చి వుండేదే కాదు. మన పరిశోధన అంతా ఇంగ్లీషు మాధ్యమంగా చదువుకొనే మధ్యతరగతి వర్షపు స్కూళ్ళ అవసరాలపైనే జరిగింది. ప్రాంతీయ భాషా మాధ్యమాల స్కూళ్ళలో రెండో భాషగా నేర్పే ఇంగ్లీషు మీద జరగలేదు. ఇంగ్లీషు కోసం వస్తున్న డిమాండు న్యాయమైందని మనం అంగీకరిస్తే మనం దీనికితగ్గ బోధనా వ్యూహాన్ని | పాఠ్యప్రణాళికను వెంటనే రూపొందించుకోవాలి. ఇంగ్లీషు నేర్ప్వడంలో రాబోయే అయిదారేళ్ళలో గనుక మనం చెప్పుకోదగ్గ విజయం సాధించకపోతే అన్ని స్మూళ్ళు ఇంగ్లీషు మీడియంలోనే ఉండాలనే రాజకీయ డిమాండు ముందుకొచ్చి తీరుతుంది. తమ పిల్లలకు ఇంగ్లీషులో నైపుణ్యం ఉండితీరాలని; తమ ఆకాంక్షలకు; ఆశలకు ఇంగ్లీషు ఒక అడ్డంకిగా మారకూడదనీ, తల్లిదండ్రులు డిమాండు చేస్తే ప్రభుత్వానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి ఎర్చ్పడుతుంది. గణితం గణితవిద్య ముఖ్యోద్దేశం పిల్లలలో గణితాత్మక సామర్థ్యాలు పెంపొందించడం. పాఠశాల దశలో - బెపయోగిక సామర్జాలు అభివృద్ధిేచేయడం అనే పరిమిత లక్ష్యానికి అనగా సంఖ్యలు-సంబంధాలు, చతుర్విధ ప్రక్రియలకు (ప్రాధాన్యత వుంటుంది. (కొలతలు, దశాంశభిన్నాలు, శాతాలు మొ) గణితపరంగా ఆలోచించడం, కారణాలు వెతకడం వంటివి పిల్లలలో పెంపొందించడం ఉన్నత దశా లక్ష్యంగా ఉంటుంది. పరికల్పనలు చేయడం, తార్మికంగా ఆలోచించి నిర్ణయానికి రావడం, అమూర్త భావాలు అర్ధం చేసుకోవడం వంటి అంశాలకు ఈదశలో స్థానం ఉంటుంది. దీనిలో సమన్వా పరివార సాధనా పద్ధతులు, సామర్ధాలు, అభిరుచులు ఇమిడి ఉంటాయి. పాఠశాల గణితంలో మన దృష్టి

  • గణితం అంటే పిల్లలు భయపడకుండా ఉల్లాసంగా నేర్చుకోగలగాలి.

  • పిల్లలు గణితం నేర్చుకోవడం అంటే సూత్రాలు, పద్ధతులు నేర్చుకోవడం గాదు. దాని ప్రాధాన్యతను నేర్చుకోవాలి. = గణితాన్ని ఇతరులతో చర్చించేదిగా, పరస్పరం అందించుకునేదిగా, వ్యక్తీకరించేదిగా, కలసి పనిచేసేదిగా పిల్లలు చూడగలగాలి. శే్షే

  • సమస్యల (అర్ధవంతమైన) ను పరిష్కరించడంతోపాటు సమస్యలు సంధించగలగాలి.

  • సంబంధాలను గుర్తించడంలో, నిర్మాణాల్ని అర్ధం చేసుకోవడంలో, కారణాలు వెతకడంలో, తప్పు ఒప్పులను గురించి తర్మించడంలో పిల్లలకు గణితం ఉపయోగపడాలి.

  • అంకగణితం, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి మొదలైన అంశాలన్నింటిలోగల ప్రాథమిక భావనలను, విద్యార్థులు అర్ధం చేసుకోవాలి. ఈ ప్రాథమిక గణిత భావనలు, గుణవిశేషత, నిర్మిత క్రమానుగత, సాధారణీకరణత బోధనా విధానాలలో ్రతిఫలించాలి. = తరగతిలో ప్రతి విద్యార్థీ గణితం నేర్చుకొనగలిగేలా ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్ధితోనూ గడపగలగాలి. పాఠ్యప్రణాళిక పూర్వ (ప్రాథమిక స్థాయిలో అభ్యసనం బోధనారూపంలో ఉండకూడదు. ఆడుతూవాడుతూ నేర్పించేదిగా ఉండాలి. సంఖ్యల్ని వరుసగా బట్టీపట్టడం కాకుండా అర్ధం చేసుకుంటూ అవసరంగా నేర్చుకోగలగాలి. ఈ సందర్భంలో పదానికి, లెక్కకు; గణనకూ, పరిమాణానికి సంబంధాన్ని బిడ్డ గుర్తించగలగాలి. చిన్నచిన్న పోలికల్ని గుర్తించాలి. వర్గీకరణ చేయగలగాలి. ఆకారాలు, సౌష్టవాలు గుర్తించగలిగే నైపుణ్యం రావాలి. మన సాంప్రదాయక పద్ధతులలో బోధించకుండా పిల్లలు తమ స్వంత భాషలో ఆలోచనలను, అనుభూతులను వ్యక్తీకరించడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ తరువాత స్థాయిల్లోనూ ఇది అవసరమే. గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడం ప్రాథమిక స్థాయినుండే అభివృద్ధి చెందాలి. తద్వారా పిల్లల జ్ఞానాత్మక నైపుణ్యాలు, భావనలు పొందగలుగుతారు. గణితక్రీడలు, పజిల్స్‌, కథలు ఈవిధమైన అనుకూల అభిరుచులు పెంపొందించుకోవడానికి తోడ్పడుతాయి. గణితం అంటే కేవలం లెక్కింపు (అంకగణితం) మాత్రమే కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలతోబాటు వివిధ ఆకారాలు, (శ్రేణులు, కొలతలు, సమాచార నిర్వహణ తదితరాలన్నీ ఉండాలి. గణితంలో గణిత ప్రణాళికలు, అంశాలు తెలిసిన దానినుండి తెలియనివి నేర్చుకొనే క్రమంలో వుండాలి. గణన నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ గుర్తించడానికి, వ్యక్తీకరించడానికి, క్రమానుగతాలు వివరించడానికీ కూడా ప్రాధాన్యత ఉండాలి. సమస్య పరిష్కారాన్ని ఊహించడం, అంచనా వేయడంలాంటి వాటితోపాటు తార్మికమైన భాషా నైపుణ్యాలుకూడా అభివృద్ధి చెందాలి. 4 మాధ్యమిక స్థాయి పిల్లలు తాము గతంలో నేర్చుకొన్న అనుభవాలను, అమూర్త గణిత భావనలలో వినియోగించడంద్వారా మొదటిసారిగా గణితానందాన్ని పొందుతారు. అనగా ప్రాథమికస్థాయిలో నేర్చుకొన్న నైపుణ్యాలను నూతన సన్నివేశాలలో తిరిగి సందర్శిస్తారు. దీనినే మనం సార్వత్రిక గణితాక్షరాస్యతా సాధనగా భావిస్తాం. బీజగణిత ప్రక్రియలు ఉపయోగించడంద్వారా బీజగణిత సమస్యల సాధనకు, సాధారణీకరించడానికి పిల్లల్ని సిద్ధం చెయ్యగలం. ఇది పిల్లలు “జీవన నైపుణ్యాలు” సాధించడానికి తోద్పడుతుంది. 12

'సెకందరీ న్థాయిలో గణితం ఒక ప్రత్యేక కోర్సుగా చదవడం (ప్రారంభమవుతుంది. గణిత సంబంధిత లక్షణాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ఈ దశలో పిల్లలు నిర్వచించబడిన పదాలకు, భావనలను సంకేతం ద్వారా వ్యక్తపరచగలుగుతారు. నిరూపణలను సరైన పరిమాణాలలో వ్యక్తపరచగలుగుతారు. బీజగణితం, రేఖాగణిత ఆధారాలద్వారా నిరూపణలు చేయగలుగుతారు. సమస్యా పరిష్కార సన్నివేశాలలో వివిధరకాల భావనలను, నైపుణ్యాలను ఏకీకృతం చేయగలుగుతారు. గణిత నమూనాలు, సమాచార విశ్లేషణలు ఊహలు మొత్తం గణిత పరిజ్ఞానాన్ని పెంచుతాయి. వైయక్తిక, జట్టు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి కంప్యూటర్లు, నమూనాలు ఇతర పరికరాలు ఈ దశలో ఉపయోగించడం అవసరం.

హయ్యర్‌ సెకండరీ స్థాయిలో గణితానికి గల బహుళ ప్రయోజనాల్ని విద్యార్ధి అవగతం చేసుకోవడం గణిత వొఠ్యప్రణాళికా లక్ష్యంగా ఉండాలి. ఈ ప్రయోజనాల్ని నాధించడానికి

అవసరమైన (ప్రాథమిక సాధనాల్ని అతడు గుర్తించాలి. విస్త్రతావగాహన అవసరమా, లోతైన అవగాహన అవసరమా అనే ప్రశ్చ్నకీదశలో సమాధానం లభించాలి. ఒక విభాగంగా గణితం శరవేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా గణిత శీర్చికల్ని ప్రవేశపెట్టాలి. శీర్షికలు సహజమైనవిగా ఉండి, గణిత అంతర్జష్టిని కలిగించి, పిల్లలు గణిత అధ్యయనంలో ఇష్టంగా పాల్గొనగలిగేలా ఉండాలి.

ప్రకృతి సూత్రాలు

సైన్సు ఎంతో గతిశీలమైంది. నూతన అనుభవాలతో నానాటికీ విస్తరిస్తున్న జ్ఞానరంగమిది. జీవితంలోని అనేక సంక్షిమ్రాంశాలలాగానే సైన్సు పద్ధతిని ఆచరించడం కష్టం. పరిశీలన, సామాన్యాంశాల క్రోడీకరణ, ఊహించడం, నాణ్యమైన, తార్మికమైన నమూనాల్ని రూపొందించడం, పరిశోధనలద్వారా, పరిశీలనద్వారా సిద్ధాంతాల్ని సరిచూచుకోవడం అవి సరైనవో కావో తేల్చుకోవడం చివరకు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న సూత్రాల్ని ఆవిష్కరించడం ఇదంతా సైన్సు పద్ధతి. ఇదంతా ఇదే వరుసలో జరగాలనేమీలేదు. ఒకప్పుడొక సిద్దాంతం

ఒక కొత్త ప్రయోగాన్ని ముందుకు తేవచ్చు. అలానే ఓ కొత్త ప్రయోగం ఒక కొత్త సిద్ధాంత

నమూనాకు దారితీయవచ్చు. సైన్సులో ఊహలక్కూడా అవకాశముంది. కానీ అవి ప్రయోగాలద్వారా / పరిశీలనలద్వారా రుజువు కావల్సివుంటుంది. సైన్సు సిద్ధాంతాల్ని శాశ్వత సత్యాలుగా ఎవ్వరూ భావించరు. ఇప్పటికే ఎంతో దృఢంగా ఖరారైన సిద్ధాంతాలు, విశ్వజనీన సైన్సు సూత్రాలు కూడా తాత్కాలికమైనవే అని సైన్సు భావిస్తుంది. కొత్త పరిశీలన, విశ్లేషణ, ప్రయోగాలు జరిగితే వీటినికూడా సవరించాల్సి వస్తుందని నమ్ముతుంది.

నిజమైన శాస్త్ర విద్య అంటే పిల్లవాడికి తన జీవితం గురించి, శాస్త్రీయంగా నిజానిజాలు చెప్పడమే. ఇదీ సైన్స్‌ పాఠ్యప్రణాళికలో ప్రధానమైన అంశం - కొన్ని పరిశీలనలు :

  1. పిల్లల వయసుకు తగిన విషయం, పద్ధతి, భాష్క బోధనా అనుభవాలతో కూడిన జ్ఞానాన్ని కలిగించేలా పాఠ్యప్రణాళిక (కరికులం) ఉండాలి. అపుడే అది పిల్లలకు అందుబాటులో వుంటుంది.

క్షేత్ర

  1. సైన్సులో చెప్పే అంశాలు శాస్రీయమైనవిగా ఉండాలి. పిల్లల స్థాయికితగ్గట్టు చెప్పడంకోసం మనం విషయాల్ని సరళీకరించడంవల్ల అర్ధరాహిత్యానికి, శాస్రీయతకు దారి తీయగూడదు.

  2. పిల్లల్లోగల సహజమైన కుతూహలం, సృజనాత్మకతలను మెరుగుపరచేలా నేర్చుకొనే పద్ధతులు, విధానాలు ఉండాలి. ఇది పిల్లలకు నేర్చుకోవడం ఎలాగో నేర్చుకునేందుకు పురికొల్పుతుంది.

  3. శాస్తం దాని చారిత్రక ప్రగతి, కాలానుగుణంగా సైన్స్‌లో వస్తున్న మార్పులు తెలుసుకునేందుకు సైన్సు చరిత్రకు తగిన ప్రాధాన్యత ఉండాలి. దీనివల్ల పిల్లవాడు సామాజిక నేపధ్యంలో శాస్త్రాన్ని అర్ధం చేసుకోగలుగుతాడు. సామాజిక కారకాలు శాస్త ప్రగతిమీద ఎలా (ప్రభావాన్ని కలిగిసాయో తెలుసుకొనే వీలు కలుగుతుంది.

  4. స్థానిక పరిసరాలనుండి ప్రపంచం వరకు అర్థం చేసుకోవడానికి విద్యా ప్రణాళికలో పరిసరాలకు తగిన ప్రాధాన్యత ఉండాలి. పని ప్రపంచంలో అడుగుపెట్టాలంటే తన పరిసరాలలోని శాస్త్ర, సాంకేతిక, సామాజిక అంశాలను గురించిన జ్ఞానం కలిగించేలా (ప్రణాళిక రూపొందించాలి.

  5. నీతి, నిజాయితి, సహకారం, బాధల నుండి, భయాలనుండి స్వేచ్చ ప్రసాదించే నైతిక అంశాలు కూడా ప్రణాళికలో భాగం కావాలి. తనచుట్టూ ఉన్న పరిసరాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ మానవుడు దానిని సంరక్షించుకొనేందుకు శ్రద్ధ పెట్టేలా సైన్సు బోధనాంశాలుందాలి.

వివిధ స్థాయిలలో విద్యా ప్రణాళిక

సైన్సు విద్యా ప్రణాళికకు సంబంధించి లక్ష్యాలు, విషయం, బోధనా విధానాలు, మూల్యాంకన పద్ధతి ప్రాధాన్యతలు వివిధ స్థాయిలలో క్రింది విధంగా ఉంటాయి.

శ్రీ ప్రాథమిక స్థాయిలో విద్యార్ధి తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా

' తెలుసుకుంటూ దానితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం అవసరం. అందువల్ల పిల్లల్లో ప్రపంచం

గురించి తెలుసుకోవాలనుకునే కుతూహలాన్ని మరింతగా పెంచి పోషించడం ఈ దశలో

మన లక్ష్యంగా ఉండాలి. పిల్లలు వివిధ కృత్యాలు చేస్తూ ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో

పరిశీలించడం, వర్గీకరించడం, ఒక నిర్ణయానికి రావడం మొదలైనవి ఉంటాయి. వాటిద్వారా ' జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక నైపుణ్యాలు పెంపొందుతాయి. ఈ దశలోని నమూనాలు, నిర్మాణాలు, అంచనాలు, కొలతలు మొదలైనవాటికి మనమిచ్చే ప్రాధాన్యత తరువాత దశలో అభివృద్ధి చెందబోయే సాంకేతిక, పరిమాణాత్మక నైపుణ్యాలకు పునాదిగా ఉంటుంది. భాషా నైపుణ్యాలు సైన్స్‌ను అర్ధం చేసుకొనడానికేగాదు, సైన్స్‌ భాషాఖి వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సైన్సును, సామాజిక శాస్తాల్ని కలిపి పర్యావరణ విద్యగా మనం బోధిస్తున్నాం. ఆరోగ్యానికి ఇందులో చాలా ప్రాధాన్యతనిస్తున్నాం. శాస్త్ర, సామాజిక అంశాలు రెండూ కలిపి పరిసరాల విజ్ఞానాలుగా పరిగణిస్తున్నాం. ప్రాధమికన్థాయిలో ఎక్కడా

' పీరియాడికల్‌ పరీక్షలు, మార్కులు, (గ్రేడులు నిర్ణయించడాలు, అదే తరగతిలోనే మళ్ళీ చదివించడాలు వుండకూడదు.

శ్షేగ

శీ మాధ్యమిక స్థాయిలో పిల్లలు శాస్రీయ సూత్రాలను పరిచితమైన ప్రయోగాల ద్వారా, సరళమైన సాంకేతిక డిజైనులు, నమూనాల నిర్మాణం ద్వారా నేర్చుకోవాలి. వివిధ కృత్యాలు, సర్వేలలో పాల్గొనడం ద్వారా పరిసరాలగురించి, ఆరోగ్యం చురించి మరింతగా తెలుసుకోవాలి. శాస్త్రీయ భావనలు ప్రధానంగా కృత్యాలు, ప్రయోగాల ద్వారానే రావాలి. ఈ స్థాయిలోని మనం చెప్పే సైన్సు మనం సెకండరీ స్థాయిలో చెప్పబోయే సైన్సుకు పలచబార్చినరూపంగా చూడనక్కరలేదు. గ్రూపు కృత్యాలు చేయడం, తోటివారితో, టీచర్లతో చర్చలలో పాల్గొనడం, సర్వేలు చేయడం రాబట్టిన విషయ సమాచారాన్ని ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శించడం మొదలైనవి విద్యా విధానంలో ప్రధానమైనవిగా ఉండాలి. ఈ స్థాయిలో నిరంతర, నియమిత కాలవ్యవధి మూల్యాంకనాలు (యూనిట్‌ పరీక్షలు, టెర్మినల్‌ పరీక్షలు) ఉండాలి. పత్యక్ష పద్ధతి ద్వారానే గ్రేడింగ్‌ ఇవ్వాలి. ఇది నిరంతరం కొనసాగాలి. 8 సం॥ల విద్య పూర్తిచేసుకున్న ప్రతి పిల్లవాడికి 9వ తరగతిలో చేరే అవకాశం ఉండాలి. పరీక్షల్లో తప్పిపోవడం ఉండరాదు.

శ సెకండరీ స్థాయి విద్యా ప్రణాళికలో విద్యార్ధి వివిధ అంశాలతోకూడిన శిక్షణ ద్వారా సైన్స్‌ను నేర్చుకోవాలి. మాధ్యమిక న్యాయికన్నా మరింత మెరుగైన సాంకేతిక అంశాలను, పరికరాలను ఉపయోగించి చేస్తూ నేర్చుకోవాలి. చుట్టూ ఉన్న పరిసరాలు, ఆరోగ్యం వంటి అంశాలు కూడా కృత్యాలు, విశ్లేషణల ద్వారా నేర్చబడాలి. సిద్ధాంతపరంగా ఉన్న సూత్రాలను క్రమబద్ధమైన ప్రయోగాలు చేయడంద్వారా అర్ధం చేసుకోవాలి. స్థానిక ప్రాధాన్యత గల ప్రాజెక్టులమీద పనిచేయడాన్ని శాస్త్ర సాంకేతిక అక్షరాస్యత (51.7)గా గుర్తిస్తారు. దీనికి సెకండరీ స్థాయి ప్రణాళికలో అత్యంత ప్రాధాన్యత ఉండాలి.

శ హయ్యర్‌ సెకండరీ స్థాయిలో సైన్స్‌ ఒక ప్రత్యేకమైన అంశంగా నేర్పబడాలి. దీనిలో ప్రయోగాలకు, సాంకేతిక అంశాలకు, సమస్యా పరిష్కారాలకు ప్రాధాన్యత ఉండాలి. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రస్తుతం సైన్స్‌ విద్యాపరమైన, వృత్తిపరమైన విభాగాలుగా పరిగణింపబడుతోంది. దీనిని పునః పరిశీలించవలసిన అవసరం ఉంది. విద్యార్ధికి తన అభిరుచికి అనువైన అంశాన్ని ఎన్నుకొని చదువుకొనే స్వేచ్చ ఉండాలి. అయితే ప్రతి పాఠశాలలోనూ అన్ని సబ్బెక్టులు ప్రవేశపెట్టడం సాధ్యంకాకపోవచ్చు. సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్థాయిల మధ్య మరింత వ్యత్యాసం రాకుండా విద్యాప్రణాళికాభారాన్ని రేషనలైజ్‌ చేయాలి. కానీ, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండేటట్లు జాగ్రత్తపడాలి.

ప్రాంతీయ, కుల, మత, వర్ద, లింగ, ధనిక, పేద వివక్షతలను, అసమానతలను తొలగించేసామాజిక మార్పుకు దారి తీసేందుకు శాస్త్ర విద్యను ఒక పనిముట్టుగా ఉపయోగించాలి. సమానత్వాన్ని సాధించే దిశలో ప్రాథమిక పరికరంగా పాఠ్యపుస్తకాన్ని మనం ఉపయోగించాలి. మన లక్షలాది పిల్లలకు, టీచర్లకు పాఠ్యపుస్తకం కంటే పెద్ద వనరు ప్రస్తుతం ఏదీలేదు. జాతీయ విద్యాప్రణాళిక చట్రానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పాఠ్య గ్రంథాలు రాసేందుకు దేశవ్యాప్తంగా కృషిచేయాలి. రచయితల్ని దీనికి ప్రోత్సహించాలి. ఈ పాఠ్యగ్రంథాలు కృత్యాలు, పరిశీలనలు, ప్రయోగాలతో నిండి ఉండాలి. 15

స్వేచ్చ, న్యాయం, వైవిధ్యాలపట్ల గౌరవం లాంటి మానవ విలువల్ని పెంపొందించి సుస్థిరం చేసే బాధ్యత సామాజిక శాస్త్రాలపై ఉంది. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించేందుకు, వివేచించుకొనేందుకు అవసరమైన మానసిక సామర్భ్జాలకోసం సామాజిక శాస్త్రాలు తగిన పునాదిని వెయ్యాలి. ఉన్నత విలువల్ని ధ్వంసంచేసే శక్తుల్ని ఎదుర్శొనే పౌరులుగా, వ్యక్తిత్వాన్ని కోల్పోని యువకులుగా పిల్లల్ని తీర్చిదిద్దాల్సింది సామాజిక శాస్త్రాలే. వ్యక్తి ప్రయోజనాలకు, సమిష్టి ప్రయోజనాలకు మధ్య అగాధం ఏర్పుడకూడదు. అవి రెండూ కలిసే ఉండాలి. అలాగాక, ఈ సంబంధాలకు వివూతం కల్గించేసామాజికాంశాలని సామాజిక శాస్త విద్యార్థి విమర్శనాత్మకంగా అర్ధం చేసుకోగల్లాలి, తగినట్లు ప్రతిస్పందించాలి. సామాజిక శాస్త్రాలు

సామాజిక శాస్త్రాల్లో చరిత్ర, భూగోళం, రాజనీతిశాస్త్రం, అర్ధశాస్త్రం మొదలైనవాటికి దేనికిదాని స్వంత పరిధి ఉంటుంది. నిజమే! కానీ వీలున్నంతవరకు ఈ పరిధుల్ని చెరి పెయ్యాలి. ఒక అంశాన్ని చెప్పడానికి బహుళ పద్ధతుల్ని పాటించాలి. పలు అంశాలమధ్య అనుబంధం ఉండేలా చూడ్డం మంచి పాఠ్యప్రణాళిక లక్ష్యం. కొన్ని తాత్వికాంశాలు కొన్ని ప్రధానమైన జ్ఞానాంశాలు, తార్మికాంశాలు ఆధారంగా నూతన సిలబస్‌ రూపొందించాలి. అవి. క్షే. విద్యా ప్రణాళిక స్థానికప్రజలలో జాతీయత, జాతిసమైక్యత వంటి అంశాలను పెంపొందించేలా ఆయా అంశాలలో జ్ఞానాన్ని కలిగించేలా ఉండాలి. ప్రణాళికా రూపకల్పనలో స్టానికాంశాలే ప్రతిబింబించాలి. ల పాఠ్యగ్రంథం కేవలం విషయజ్ఞానం కలిగించేదిగా కాకుండా సహాయకారిగా కూడా ఉండాలి. అంటే పాఠ్యగ్రంథం నుండి బయటికెళ్ళి కూడా నేర్చుకొనే వీలుండాలి. ఇతరత్రా అంశాలు చదవడం ద్వారా గ్రంథంలో ఇవ్వబడిన సామాజిక దృగ్విషయాలను అర్ధంచేసుకొనే విధానం ఉండాలి. 8. మన సామాజిక శాస్త్రాల్లో బెపయోగిక ప్రయోజనాలెక్కువ. అభివృద్ధిపై కేంద్రీకరణ ఎక్కువ. సమానత్వం, న్యాయం, సామాజిక గౌరవంలాంటి వాటికి అవకాశం తక్కువ. వ్యక్తి “అభివృద్ధి' కోసం నిర్వహించగల పాత్రను నిర్ధెశించడంతో సామాజిక శాస్తాలు సరిపెట్టుకోకూడదు. ఈ వ్యత్యాసాన్ని భర్తిేచేయడానికి జొిపయోగికతనుంచి సమానత్వంవైపు ఈ శాస్త్రాలు మొగ్గాలి. త్త పౌరశాస్త్రం పేరును రాజనీతి శాస్త్రంగా మార్చాలి. 'రాజ్యం' పట్ల నానాటికీ “అవిధేయత పెరుగుతున్న వలసవాద యుగంలో మన దేశంలోని పాఠ్యప్రణాళికలోకి పౌరశాస్త్రం వచ్చి చేరింది. వినయం, విధేయత గల్టిన ప్రజల్ని అప్పటికి నిర్ధశించుకొన్న విశ్వజనీన

16

అభివృద్ధి సూత్రాలకనుగుణమైన సమాజాన్ని నిర్మించడం ఆ కాలపు పౌరశాస్త్ర లక్ష్యం. దీనికనుగుణంగానే ఇందులోని అంశాలుండేది. ఇప్పుడు మన సమాజం ప్రజాస్వామిక నమాజంగా వరిణితి చెందింది. వన రాజకీయ వ్యవనృలో భాగస్వామ్య ప్రజాస్వామ్యానికవసరమైన విలువలను అధ్యయనం చేసేందుకు మనకిప్పుడు అవకాశం, . అధికారం రెండూ ఉన్నాయి. ప్రత్యేకించి సమానత్వం, న్యాయంలాంటి విలువల్ని దృష్టిలో ఉంచుకొన్నప్పుడు పీడితుల, అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్యలను చర్చించుకొనేలా పిల్లల్ని ఉవాధ్యాయుల్ని మనం ప్రోత్సహించాలి. దీనికనుగుణంగా రాజనీతిశాస్తం ఉండాలి. రాజనీతిశాస్తం సమకాలీన సామాజికాంశాన్ని అధ్యయనం చేసే వీలుకల్పిస్తుంది. ఫలితంగా మరింత బాధ్యతాయుతమైన పౌరుల్ని రూపొందించుకోవచ్చు. ర్‌, అది “గతానికి సంబంధించిందిగావచ్చు, (ప్రస్తుతానికి సంబంధించింది గావచ్చు, చారిత్రక ఘటనను చర్చించేటపుడైనా స్రీల విషయం మర్చిపోగూడదు. స్రీలు చరిత్రలో చేసిన, చేస్తున్న మహత్తర పోరాటాల్ని మనం ముందుకు తీసుకువచ్చి చర్చించాలి. పితృస్వామిక వ్యవస్యాచట్రాన్ని ఛేదించేవైెపుకు మన వొఠ్యప్రణాళిక మొగ్గాలి. మానవ హక్కుల భావన ఒక విశ్వవ్యాప్త భావన. పిల్లలు చిన్నవారుగా ఉన్నపుడే మానవ హక్కుల గురించిన విషయాలు వారికి తెలపాలి. పెరిగే వయసుతోపాటు వారు తమ హక్కుల గురించి కూడా అధ్యయనం చేసే అవకాశం ఉండాలి. మానవ హక్కుల గురించిన జ్ఞానం అటు సాంఘిక శాస్త్రాలు, ఇటు జీవశాస్తాలు రెండింటిద్వారా అందించాలి. తమకోసం వివిధ వనరులను సృష్టించేవారిపట్ల వారి పనులపట్ల పిల్లలకు గౌరవం కలిగించాలి. విద్యా ప్రణాళిక అమలు ప్రాథమిక స్థాయిలో జీవ, సామాజిక పరిసరాలను భాష, గణితాలతోమిళితం చేసి బోధించడం జరుగుతోంది. స్త్రీ, పురుష స్పృహతో జీవ, సాంఘిక పరిసరాలను అర్ధం చేసుకోవడానికి పిల్లలకు అనేక కృత్యాల్ని యిందుకోసం కల్పించాలి. ఈ దశలో పరిశీలనద్వారా, దృశ్యీకరణ ద్వారా పిల్లలు విషయావగాహన చేసుకుంటారు. అమూర్తాంశాలకు ఇక్కడ తావులేదు. ఇవి జీవితపు భౌతిక, జీవ, సాంఘిక, సాంస్కృతిక అంశాలనుండి తీసుకొన్నవై ఉండాలి. పిల్లల్లో పరిశీలన, గుర్తింపు, వర్గీకరణ నైపుణ్యాలను అభివృద్ది చేయడం అవసరం. 3 నుంచి 5వ తరగతి వరకు జీవ, సాంఘిక పరిసరాల మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి గుర్తించడానికి పరిసరాల విజ్ఞానంలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. వారు జీవ వైవిధ్యానికి; సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యానికి గల ప్రాధాన్యతలను, సంబంధాలను గుర్తించగలగాలి. అనగా సాంఘిక శాస్త్రాల బోధన కూడా పరిశీలనలు, ప్రయోగాలమీద ఆధారపడి జ్ఞానాత్మక సామర్థ్యాలను పిల్లలలో పెంపొందించడానికి ఉపయోగపడాలి. పిల్లలు తమ కుటుంబం నుండి ప్రారంభించి సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించే విధంగా ఈస్థాయి (ప్రణాళిక ఉందాలి. శే/

మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భూగోళం, రాజనీతి శాస్త్రం, ఆర్ధిక శాస్తం, మొదలైన అంశాలను ప్రవేశపెట్టాలి. వాటితోపాటు సమాజంలోని సాంఘిక, ఆర్ధిక సమస్యలను అందుకు కారణాలను వివిధ కోణాల నుంచి గమనించడానికి అవకాశం ఉండాలి. పేదరికం, నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ, కుల-వర్డ, వివక్ష మానవహక్కులు మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఉండాలి. పరిసరాల గురించి, వనరుల గురించి వివిధస్థాయిలలో అర్ధం చేసుకోవడానికి భూగోళం, అర్ధశాస్త్రం అంశాలు కలిసి తోద్పడాలి. స్ధానిక, రాష్ట్ర కేంద స్థాయిల్లో,ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటును గురించి, పనితీరుల్ని గురించి కూడా తెలియజేయాలి. ఒకపౌరుడుగా రూపొందడానికి అవసరమైన చారిత్రక నేపధ్యాలను చరిత్ర ద్వారా విద్యార్థులకు తెలియచేయాలి. మాధ్యమిక స్థాయిలోనే విద్యార్థి 1 గడచిన చరిత్రలను, అందులోని ఆసక్తిదాయకమైన విశేషాలను తెలుసుకోగలగాలి. అందుకుగాను విద్యా ప్రణాళిక పాత పద్ధతులను విడనాడాలి. ఈ పద్ధతులు పిల్లల జ్ఞానాభివృద్ధిని, సామర్భాన్ని ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా ఆ ప్రాంతాల రాజకీయ సరిహద్దుల్ని చారిత్రక యుగాల్ని చరిత్రపేరుతో చెబుతుంటాయి. స్థానికంగా ఉండే చారిత్రక స్థలాలను, మ్యూజియంలను సందర్శించడంద్వారా మనం పిల్లలకు చారిత్రక సాక్ష్యాలను దృశ్యాత్మకంగా చూపొచ్చు. దీనివల్ల చరిత్ర బోధనలో తీవ్రమైన మార్పు వస్తుంది.

సెకండరీ స్థాయిలోకూడా చరిత్ర, భూగోళశాస్త్రం, రాజనీతిశాస్త్రం, ఆర్థిక శాస్తాలకుసంబంధించిన కీలకాంశాలకు (ప్రాధాన్యతనివ్వాలి. వాటిమధ్య ఒక అంతస్సూత్రం ఉండాలి. విద్యా ప్రణాళికలో భారతదేశీయ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. సామాజిక, ఆర్ధిక రంగాలలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను అర్ధం చేసుకొనేందుకు విద్యార్థికి శిక్షణనివ్వాలి. దళితులు, ఆదివాసీలు మొదలగు ఇతర ప్రత్యేక తరగతుల జనాభా గురించిన విశేషాలను చర్చించాలి. పిల్లల దైనందిన జీవితాలకు సంబంధించిన అంశాలకు మరింత (ప్రాధాన్యత ఇవ్వాలి.

భారతీయ స్వాతంత్రోద్యమాన్ని అందులో వివిధ ప్రాంతాల, తరగతుల ప్రజల భాగస్వామ్యాన్ని చెవ్పాలి. మారుతున్న ఆధునిక ప్రపంచ నేపధ్యంలో భారత జాతీయోద్యమాన్ని | గురించి, తరువాత భారతదేశంగా మనదేశం అవతరించడాన్ని గురించి తెలియజెప్పాలి.

పరిసరాల వినియోగాన్ని పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని విద్యార్థికి భౌగోళికశాస్త అంశాలను బోధించాలి. భారత రాజ్యాంగ విలువల, తాత్విక పునాదుల ఆధారంగా రాజనీతి శాస్త్ర అంశాలను చర్చించాలి. సమానత్వం, స్వేచ్చ, న్యాయం, సౌభ్రాతృత్వం, గౌరవం, శ్రమదోపిడి నుండి స్వేచ్చలాంటి అంశాలపై లోతుగా చర్చ జరగాలి. చర్చనీయాంశాల్ని సగటు ప్రజల మనోగతాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. ఉదాహరణకు పేదరికం, నిరుద్యోగంలాంటి అంశాల్ని ఆర్ధిక సంస్థల పనితీరు ఆధారంగా, అసమానతల్ని ఆర్థిక సంబంధాల ఆధారంగా పిల్లలు చర్చించవచ్చు.

186

హయ్యర్‌ సెకండరీ స్థాయిలోని అంశాలు విద్యార్థుల అవసరాలు, అభిరుచులు, అభిప్రాయాలకు అనుకూలంగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఈ దశ విద్య తరువాత చదువు ముగించి పనులలో చేరిపోతారు. మిగిలినవారికి ఉన్నత విద్యకు ఇది పునాదిగా ఉంటుంది. ఇలాంటివారు (ప్రత్యేకమైన అకడమిక్‌ కోర్సులను లేదా వృత్తిపరమైన కోర్సులను ఎన్నుకుంటారు. కాబట్టి వీరికి మనం కల్పించే (వ్రాధమిక జ్ఞానం భవిష్యత్తు కోసం తాను ఎన్నుకున్న రంగంలో నైపుణ్యాన్ని అభిరుచిని పెంచుకొనేందుకు ఉపయోగపడాలి. సామాజిక శాస్త్రాల్లో, వాణిజ్య శాస్త్రాల్లో వీలున్నన్ని ఎక్కువ కోర్సులుండాలి. విద్యార్థులు వారికి నచ్చిన కోర్సులపట్ల ఆకర్షితులౌతారు. అలాంటివాటికి ప్రాధాన్యతనివ్వాలి. సబ్జెక్టులను, కోర్సులను వేరువేరుగా వర్టీకరించనవసరంలేదు. పిల్లలకు వారి అవసరాలకు, అభిరుచులకుఅనుగుణంగా ఏది కావలిస్తే ఆ గ్రూపును ఎన్నుకొనే అవకాశం ఇవ్వాలి. ఈ న్థాయిలో సాంఘిక శాస్త్రాల్లో రాజనీతిశాస్తం, భూగోళం, చరిత్ర, నిర్మాణశాస్త్రం, అర్ధశాస్త్రం, సామాజిక శాస్త్రం, మనో వైజ్ఞానిక శాస్త్రంలాంటివి ప్రవేశపెట్టాలి. హైయ్యర్‌ సెకండరీ స్థాయిలో వీటిని చదవడంద్వారా న్యాయాన్యాయాలపై తీర్పునివ్వగల సామర్థ్యం, భిన్న వాదనల్ని విశ్లేషించగల సామర్ధ్యం లభిన్తాయి. చర్చలలో పాల్గొనడం, వివిధ వనరులను ఉపయోగించుకొని, వ్యక్తిగతంగా ప్రాజెక్టులు నిర్వహించడం వంటివికూడా పిల్లలు చేయగల్లుతారు. కళావిద్య ఎన్నో దశాబ్దాలుగా విద్యారంగంలో కళావిద్య ప్రాముఖ్యత గురించి ఎన్నెన్నో చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎన్నో సిఫార్సుల్ని ఎన్నో కమిటీలు చేశాయి. అయినా ఇందులో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. నియత పాఠశాల విద్యలో కళావిద్యను అంతర్భాగం చేయవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. మన సాంస్కృతిక సంపద, దానిలోని భీన్నత్వం, ఉన్నతత్వం విద్యార్థులకు తెలియజేయాల్సిన తరుణమిది. సృజనాత్మకతగల పిల్లలు ఎవరైనా కళా విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడితే దాన్ని మనం నిరుత్సాహపరుస్తున్నాం. దిన్ని ఒక ఉపయోగపడని అలవాటుగానో లేక కాలక్షేపంగానో లెక్కిస్తున్నాం. పాఠశాలలో జరిగే స్వాతంత్ర్యదినం రోజునో, వ్యవస్థాపక దినంరోజునో, వార్షికోత్సవం రోజునో, తనిఖీల సందర్భంగానో అలంకరణకోసం తప్ప దీన్నొక విద్యగా పరిగణించడంలేదు. పాఠశాలలో మనం కళావిద్యను పక్కనబెట్టి మిగిలిన సబ్బెక్సల వెంట పిల్లల్ని పరుగెత్తిస్తున్నాం. విద్యార్థులకేకాదు తల్లిదండ్రులకు, టీచర్లకు, విద్యావేత్తలకు చివరికి విధాన నిర్దేతలకు సైతం దీనిపట్ల నిర్లక్ష్యభావం ఏర్పడిపోయింది. దృశ్య ప్రదర్శనా రూపాల కళలన్నీ మన విద్యాలయాలలో ప్రధానాంశాలుగా ఉండాలి. ఈ రంగంలో సాధించే నైపుణ్యాలు, సామర్థాలు కాలక్షేపానికన్నట్లు ఉండరాదు. వీటిద్వారా సుసంపన్నమైన, బహువిధమైన భారతీయ సాంస్కృతిక సంపదను గురించి పిల్లలు తెలుసుకోగలగాలి. కళావిద్య ఒక సాధనంగానూ, ఒక సబ్జెక్టుగానూ (ప్రతి పాఠశాలలో (10వ తరగతి వరకు) తప్పనిసరి విషయంగా అమలు చేయాలి. దీనిలో నాలుగు ప్రధానాంశాలెన 19

సంగీతం, నాట్యం, చిత్రకళ థియేటర్‌ ఆర్ట్‌ లాంటి అంశాలన్నీ మన పాఠశాలల్లో ఉందాలి. లలిత కళల్స్ని సాంస్కృతిక హస్తకళల్ని నేర్పడానికి ప్రతి పాఠశాలలో తగినన్ని

వనరులుండాలి. కళాకృత్యాలకోసం విద్యాప్రణాళికలో తగినంత సమయాన్ని కేటాయించాలి. గంట లేదా గంటన్నర సమయంగల పీరియడ్‌లు థియేటర్‌ ఆర్ట్స్‌కు, డ్యాన్స్‌లకు అవసరం. మృణ్మ్యయకళ కూడా ఇంతే సమయం తీసుకుంటుంది. పెద్దల నైపుణ్యాన్ని పిల్లలు ప్రదర్శించాలని తాపత్రయపడకూడదు. పిల్లలు తమ స్వంత శైలిలో తమనుతాము అఖభివ్యక్తీకరించుకొనే అవకాశం ఇవ్వాలి. దీనికవసరమైన సామగ్రిని, సాంకేతిక సహకారాన్ని అందించాలి. అట్లని వారిపై ఒత్తిడి పెట్టకూడదు. కాలక్రమంలో విల్లలే తమ న్వంత టప్రాజెక్ట్సలు రూపాందించుకుంటారు. నుందర కళారూపాల్ని ఆవిష్కరించి తమ నైపుణ్యాల్ని ప్రదర్శించుకుంటారు. ఆరోగ్యవిద్య - వ్యాయామ విద్య

ఆరోగ్యం ఒక బహుముఖమైన భావన. ఇది జీవ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ కారణాలచే ప్రభావితమవుతుంది. సామాన్య అవసరాలైన ఆహారం, రక్షిత మంచినీటి సరఫరా, గృహవసతి, మరుగుదొడ్డు, మురికినీటి పథకాలు, ఆరోగ్య సేవలు అన్నీ ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. ఇవన్నీ జీవన ప్రమాణాల్లో, పౌష్టికాహారంలో ప్రతిబింబిస్తాయి. పిల్లవాడి సంపూర్జాభివృద్ధిలో ఆరోగ్యానిదే ప్రధానపాత్ర. ఆరోగ్యవంతుడైన పిల్లవాడు పాఠశాలలో నమోదైన తర్వాత విద్య పూర్తయ్యేదాకా కొనసాగుతాడు. ఆరోగ్యం, వ్యాయామం మన విద్యా ప్రణాళికలో సమ(గ్రరూపంలో ఉండగల్లితే (1101940) పిల్లవాడి భౌతిక, సాంఘిక, మానసిక, ఉద్వేగ వికాసాలకు ఇదెంతో తోద్చడుతుంది.

మనదేశంలో పౌష్టికాహారలోపం, అంటువ్యాధులు, పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం కలిగిస్తున్నాయి. ఇది పూర్వ ప్రాథమిక విద్య దశనుండి ఉన్నత విద్య వరకు కనిపిస్తోన్న నిజం. కాబట్టీ పాఠశాలలో అన్ని స్థాయిల్లోనూ బలహీనవర్గాల పిల్లల, ముఖ్యంగా బాలికల ఆరోగ్యంపట్ల మనం (శ్రద్ధ వహించాలి.

సర్వతోముఖాభివృద్దికి తోడ్పడే ఈ సబ్బెక్టుకు సంబంధించి మన పాలసీ నిర్ణితలకు ఇతర టీచర్లందరికీ ఒక అవగాహన కల్పించాలి. వారు దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవాలి. తదనుగుణంగా పాలసీల్లో మార్పు రావాలి. అవసరమైన వస్తువులు, పరికరాలు (వ్యాయామ, యోగా) నిర్వాహకులకు అందించాలి. దీనితోబాటు డాక్టర్లు, వైద్యరంగంలోని వ్యక్తులు పాఠశాలలను తరచుగా సందర్శిస్తుండాలి. హయ్యర్‌ సెకండరీ స్థాయిలో దీన్ని ఒక ఐచ్చిక అంశంగా చదివే అవకాశం కల్పించాలి.

యోగా కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయిలోనే అనియతంగా ప్రవేశపెట్టాలి. అయితే ఆసనాలు, ధ్యానం 6వ తరగతినుండి నియతరూపంగా ఉండవచ్చు. ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పిల్లల నిత్యజీవితంతో సమన్వయం చేయాలి. స్థానిక ఆటలకు, క్రీడలకు ఎక్కువ

20

ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతర ప్రాంతాల, దేశాల ఆటలుకూడా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. పని - విద్య స్థూలంగా శ్రమతోకూడిన కార్యాన్ని 'పనిగా మనం భావిస్తాం. ఇది సమాజానికి ఉపయోగపడేవాటిని తయారుచేస్తుంది. మరోరకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన శ్రమద్వారా, సామర్ధ్యంద్వారా ఇతరుల ప్రయోజనాలను తీర్చడానికి శ్రమిస్తాడు. దీనిద్వారా ఆర్థిక ఫలితాన్ని వొందుతాడు. ప్రజల భౌతిక, మానసిక అవసరాల్ని తీర్చే ఆహారోత్పత్తి, వస్తువుల తయారీలాంటివి కొన్ని ఈకోవలోకి వస్తాయి. ఇతర పనులు పరిపాలనకు, సామాజిక నిరర్వహణకుసంబంధించినవి. ఏ సమాజంలోనైనా ఈరెండు రకాల పనులేగాక ప్రజల అవసరాల్ని తీర్చడానికి ఇతర పనులుకూడా ఉంటాయి. అన్వేషణలు, కళలు, క్రీడలు ఈ కోవలోకి వస్తాయి. పాఠశాలలో పనిలో పాల్గొనడం ద్వారా కలిగే అనుభవం సామాజిక జీవితంలోకూడా పని విలువను గుర్తించడానికి, గౌరవించడానికి తోద్చడుతుంది. పనిచేసే తత్వంవల్ల సమాజంలో

  • ఇతరులతో చక్కటి నన్నిపిత నంబంధాలు ఏర్పడతాయి. వరన్పర నవాకారం పెంపొందించుకోగల్పుతాము. పనిద్వారానే వ్యక్తికి ఒక స్థానం, ఒక గుర్తింపు లభిస్తుంది. మనిషి అఖండ (ప్రతిభను వెలికితీసే అద్భుత విద్యాకృత్యం పని. పనికి స్పష్టమైన లక్ష్యాలు కలిగివుంటాయి. పరస్పరాధారితత్వం ఉంటుంది. క్రమబద్ధంగా సామర్జాలు వినియోగించడం పనిలో జరుగుతుంది. అందువల్ల స్వయం నియంత్రణా సామర్ధ్యం కలుగుతుంది. మానసిక శక్తులను, ఉద్వేగాలను నియంత్రించుకొనే వీలుంటుంది. నైప్రుజవంతమైన పనులలో పాల్గొనడం వలన స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది. వ్యక్తి మరొక వ్యక్తితో పనిచేసేటప్పటికన్నా వస్తువుతో (బంకమట్టి లేదా చెక్క పనిచేసేటపుడు ఏర్పడే క్రమశిక్షణలో గుణాత్మకత ఎక్కువగా ఉంటుంది. పనిలో పలురకాల వస్తువుల్ని వాడాల్సివుంటుంది. మనుషులతో సంబంధాల్ని పెట్టుకోవల్సి ఉంటుంది. వీటివల్ల వ్రాకృతిక జ్ఞానం లభిస్తుంది. మానవులతో సంబంధాలు వర్పడతాయి. వృత్తిపరమైన నైపుణ్యం సాధించడం, బ్రతుకుతెరువును సంపాదించుకోవడంతోపాటు అదనంగా లభించే లాభాలివి. దీన్ని బట్టి పనికి జ్ఞాన నిర్మాణంలోగల పాత్ర ఎంత గొప్పదో అర్ధమౌతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళికలో పనికి మనం న్ధానం కల్పించాల్సి ఉంటుంది. మన పాఠ్యప్రణాళికలో పని అంతర్భాగమైనప్పుడే పైఫలితాలను మనం శ్రమద్వారా సాధించగలం. మనదేశంలో పిల్లలు ఇతర పనుల్ని చేస్తూ, వృత్తిపనుల్లో తోద్పడుతూ, కుటుంబానికి తోద్పడుతుంటారు. ఇదొక జీవన విధానం. క్రమంగా ఈ విధానం మారుతోంది. స్కూల్లో ఒత్తిడిపెరిగి పిల్లలకు ఈ పనులు చేసేందుకు సమయం ఉండడంలేదు. పాఠశాలల్లో పెరుగుతున్న పోటీ మన పిల్లలకు సమాచారాన్ని వల్లెవేసుకోడానికే సమయమంతా సరిపోయేలా చేస్తున్నది. మన ప్రాథమిక పాఠశాలల్లో జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. అట్లని బడిలోనే అన్ని పనులూ చేయించలేము. మన పాఠ్యప్రణాళికలో 21

శ్రమను ఎలా అంతర్భాగం చేయవచ్చో, దీన్ని ఎలా మూల్యాంకనం చేయవచ్చో మనం ' జాగ్రత్తగా ఆలోచించాలి. ఇందుకోసం బోధనా వ్యూహంపై మనకు స్పష్టత ఉండాలి.

పనికి అకడమిక్‌ స్వభావం తోదైతే అత్యధ్భ్బుతమైన సృజనాత్మకావిష్క్మరణలు . జరుగుతాయి. పని స్వభావంలోనే పెద్ద .మార్చు వస్తుంది. పని పలు అంశాలతో ముడిపడివుంటుంది. దీనికి భిన్నంగా మన పాఠశాల విద్య ఒకే అంశంచుట్టూ తిరుగుతూ ఉంటుంది. పనికి, అకడమిక్‌ కృషికి మధ్య ఒక సంబంధం నెలకొల్పగల్లితే, సమాంతరంగా అది కలిసి పయనించగలిగితే గొప్ప సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. చేతిపంపులు ఇలానే అభివృద్ది చెందాయి. పూర్వకాలంలో - స్ర్ప్రాటోస్పియర్‌లోకి ప్రవెశపెట్టబడిన ఎక్కువ ఎత్తు ఎగిరే పాలిధీన్‌ బెలూన్‌లు పగిలిపోవడం సాధారణంగా జరిగేది. శాస్త్రీయంగా అలోచించగలిగిన | ఒకపనివాడు ఇచ్చిన సూచన చక్కని పరిష్కారం ఇచ్చింది. అదేమిటంటే - ఒక చిన్న కార్బన్‌ ముక్కను అందులో ఉంచినట్లయితే సూర్యునివేడి గ్రహించి బెలూన్ను వెచ్చగా ఉంచుతుంది. | నిజానికి చాలామంది పరిశోధకులు పనివారే కావడం గమనార్హం.

ఎడిసన్‌, ఫోర్డ్‌, ఫారిడ్‌ ఇలాంటివారే. మొదట టెలిప్కోపును కనుగొన్నది. కళ్ళజోడు కనుగొన్నదికూడా ఇలాంటివారే. సంప్రదాయ అంశాలైన కుండలు చేయడం, నేతృవ్యవసాయం, వైద్యం కూడా ఇంతే. శారీరక శ్రమ, మేధోశ్రమ రెండూ మిళితమైనప్పుడే ఇలాంటి ఆవిష్కరణలు జరిగాయి. ఆవిధమైన జ్ఞానకాంక్ష్మ శమచేసే సాంప్రదాయం విద్యద్వారా మన పిల్లలకు అందించవలసిన అవసరం ఉంది.

పాఠశాల కరికులంలో పొందుపరిచే పనికార్యక్రమాలుసృజనాత్మకంగా, విస్తృత ఆలోచనా పరిధితో వుండాలి. మూసపోసినట్లుండే ఉత్పాదక కృత్యాలనుంచి మనం బయటపడాలి. కొన్ని వర్గాల పిల్లలలో గల పని నైపుణ్యం, విషయపరిజ్ఞానం వారికి ఎలా వచ్చిందో పరిశీలించడం అవసరం. తరువాత దీనిని పిల్లలు ఒకరినుండి ఒకరు నేర్చుకోవడానికి తగిన వనరుగా ఉపయోగించుకోవాలి. ఉన్నత, మధ్య తరగతుల మధ్యగల అంతరాలు తగ్గించడానికి పని అనుభవం తోద్పడుతుంది. పిల్లల సాంస్కృతిక మూలాలు పనిలో ముఖ్యపాత్ర వహిస్తాయి. సమాజంలోని విస్తృత ఉత్పాదక రంగ పరిజ్ఞానాన్ని విద్యారంగంలోకి బదిలీచేసుకోవాలి. ఉత్పాదక రంగంలో ఉన్న మహిళల దగ్గర, ఇతర వెనుకబడ్డ సమూహాలలో గల విలువైన అంశాల్ని పరిశీలించి ఉపయోగించుకోవాలి. పని అనుభవకార్యక్రమం మన విద్యాప్రణాళికలో కేంద్రబిందువు కావాలి. కేవలం పుస్తక జ్ఞానమేకాకుండా పిల్లల జీవితావసరాలు తీర్చెందుకుకూడా అనువైన అంశాలుండాలి. పనితత్వాన్ని ఒక ముఖ్యమైన పరికరంగా అటు బాల్యదశలోనూ, ఇటు కౌమార దశలోనూ అన్ని స్థాయిలలో ప్రవేశపెట్టాలి. అలా జరిగినపుడే “వృత్తి విద్య*, 'పని కేంద్రీకృత విద్యగా మారుతుంది. వృత్తి విద్యలు - శిక్షణ

మనం పనికేంద్రంగా గల 10 నుంచి 12 సంవత్సరాల వృత్తివిద్యను, శిక్షణను

22

మన స్కూళ్ళలో ఒక క్రమపద్ధతిలో అమలు జరపాలని ఆలోచిస్తున్నాం. వ్యవస్థాగతంగా చూస్తే ఇది స్కూలు బయట ఉంటుంది. దీన్ని ఒక ఉద్యమరూపంలో పెద్దయెత్తున చేపట్టాల్సివుంది. దీనికోసం ప్రత్యేకంగా వృత్తివిద్యా శిక్షణాసంస్థలు స్థాపించడం అవసరం. ప్రస్తుతం అందుబాటులోవున్న [౫ లు, వాలిటెక్సిక్‌ సంస్థలు, మెడికల్‌ కాలేజీలు, సహకార సంస్థలు మొదలగువాటితోగల సంబంధాలను విస్తృతం చేసుకోవడం అవసరం. వృత్తివిద్య ద్వారా జీవనోపాధి పొందాలనుకునేవారికి అదనపు నైపుణ్యాలు కలిగించడానికి వీలుగా వీటిని నిర్మించాలి. ఏదో గతిలేని మార్గంగాకాక గౌరవప్రదమైన మార్గంగా ఇది ఉండాలవి. పాఠశాలల్లాగానే ఇవికూడా వెనకబడ్డ వర్గాలవారికి తగినట్టుగా ఉండాలి. సెకండరీ మరియు హయ్యర్‌ సెకండరీ స్థాయిలో పిల్లలకు, వృత్తిపరమైన సైకాలజీ, కౌన్సిలింగ్‌ ఏర్పాట్లుకూడా

అవసరం. దీనివల్ల పిల్లలు తమకు కావల్సిన వృత్తి విద్యల్ని ఎన్నుకుంటారు.

ప్రాథమిక స్టాయినుండదే పిల్లల్లో చేతిపనులు నేర్చుకోవడం ఒక అలవాటుగా మారేటట్లు ౪౯ కేంద్రాలు పనిచేయాలి. పాఠశాల పని గంటల తర్వాత కూడా ఇవి వారికి అందుబాటులో ఉండాలి, చేతివృత్తులవారు, మెకానిక్‌లు, కమ్మరి, వెదురుపనివారు మొదలగు నిపుణులైన పనివారి సేవల్ని పాఠశాలలు వినియోగించుకోవాలి నైపుణ్యం గలిగిన పనివాళ్ళను స్థానికంగా ఉపయోగించుకోవాలి. వారి అభివృద్ధికి కూడా తోడ్పడాలి. శాంతికోసం విద్య

మనం (ప్రస్తుతం హింసాపూరిత సమాజంలో నివసిస్తున్నాం. అసహనం, గొడవలు, గందరగోళాలు, మోసాలు, దౌర్దన్యాలు రాజ్యం చేస్తున్నాయి. నీతినియమాలు, శాంతి, సంక్షేమం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో పాఠశాల విద్యాప్రణాళికలో శాంతి విద్యను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేతనే ప్రస్తుత డాక్యుమెంటు (2 ఈ అంశంపై దృష్టిసారించింది. స్థానికంగా మొదలుపెట్టి జాతీయస్తాయికి, ప్రపంచమంతటికీ హింస, దౌర్జన్యాలు ఇప్పుడు ఎగబ్రాకుతున్నాయి. శాంతి సహనాలు, న్యాయం, సంస్కృతుల మధ్య అవగాహన, వ్యక్తిగత బాధ్యతల్ని గుర్తించడం విద్యకు దీర్హకాలిక లక్ష్యంగా ఉండాలి. ప్రస్తుతం మన పాఠశాలల్లో ప్రత్యక్షంగానూ, సంకేతాల రూపంలోనూ హింసావాదం కనిపిస్తూనే ఉంది. కాబట్టి మన పాఠశాల ప్రణాళికలో విద్యను పునర్‌నిర్వచించుకోవలసిన అవసరం ఉంది. శాంతి తన అద్దంకులన్నింటి సీ అధిగమించి ముందుకు రావాలి. అప్పుడు మనం కోరుకున్న విలువలు సాక్షాత్కరిస్తాయి. కాబట్టి ప్రణాళికలో అన్ని స్థాయిలలో దీనిని ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను చైతన్యవంతం చేయాలి.

శాంతి విద్య విలువలతో కూడిన, యితరులతో తనకుతాను సౌభ్రాతృత్వంతో, సంతోషంతో మనగల్లిన దృక్పధాన్ని నైపుణ్యాన్ని కల్గిస్తుంది. శాంతి విద్యలో బ్రతకడంలో ఆనందం, మానవహక్కుల పట్ల బాధ్యత, న్యాయం, సహకారం, సహనం, సాంస్కృతిక అంతరాల్ని గౌరవించడంలాంటి అంశాలుండాలి. వీటితోపాటుగా ప్రజాస్వామ్యంపట్ల అంకితభావాన్ని అహింసపట్ల నమ్మకాన్ని ఇది కల్లించాలి. (ప్రేమ, ధైర్యం, ఆశ లాంటి అంశాలు

23 క

వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. వీటిని విద్యలో భాగం చేయాలి. శాంతి విద్య

పాఠశాల జీవనంతో పెనవేసుకోవాలి. విద్యాప్రణాళికల్లో, పాఠ్యప్రణాళికల్లో, తరగతి

వాతావరణంలో, పాఠశాల నిర్వహణలో, ఉపాధ్యాయుల్లో, పిల్లల మధ్య సంబంధాల్లో,

బోధనాభ్యసన ప్రక్రియల్లో అన్ని అంశాల్లో శాంతి విద్య ప్రతిబింబించాలి. విద్యాప్రణాళికలో,

పరీక్షా విధానంలో ఈరకమైన విద్యను ఎలా అందించాలో విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని

పరిశీలించాలి. పిల్లల్లో గల అభద్రతాభావం, అసహనం, విసుగు అసందర్భంగా ప్రవర్తించడం

వంటి అంశాల ద్వారా శాంతి విద్యను పరీక్షించాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న

హింసాధోరణులు,ప్రసార మాధ్యమాలు మనమీద ప్రభావం చూపుతున్నాయి. ఈ పెడధోరణుల

స్థానంలో వారి మనసుల్లో నీతినియమాలు, శాంతియుత జీవనశైలిని నిలపాలి. విద్య వ్యక్తులల్లోని ... విలువలకు మరింత ఊతమివ్వాలి. వారి మాటలు, చేతలు శాంతియుతమైనవిగా ఉండేట్లు

చేయగలగాలి. హింస స్థానంలో శాంతిని ఎన్నుకొనేటట్లు చేయాలి. వారు శాంతి అనుభవిస్తే

చాలదు, శాంతికాముకులుగా, శాంతి న్థాపకులుగా వ్యవహరించగలగాలి. [

వ్యూహాలు

నీతి నియమాలను పెంపొందించుకోవడమంటే వవిచేయాలో, ఏవి చేయకూడదో

టీచర్లు రుద్దడం కాదు. ఏది సరైందో, ఏది కాదో, దేన్ని కరుణ అంటారో, విస్తృత ప్రయోజనాల్ని

సామాజిక విలువల్ని దృష్టిలో ఉంచుకుంటే ఏది అందరికీ మంచిదో పిల్లలు తమకుతామే

తెలుసుకొనేలా మనం సహాయపడడం. దీనికనువైన సాధనాల్ని మార్గాల్ని వెతకడం ఇదీ

అసలైన శాంతివిద్య. పిల్లలు తాము వినిన ఏ విషయాన్నైనా దాదాపు అర్ధం చేసుకొంటారు.

చెప్పినదానికీ, చేసినదానికీ మధ్యగల వైరుధ్యాన్ని మాత్రం గుర్తించలేరు. ఇంటిలో ఏదైనా

విషయాలలో పిల్లలకు అంగీకారం కుదరనపుడు అది వారిమీద ఎక్కువగా ప్రభావం

చూపుతుంది. పెద్దలమధ్య అభిప్రాయ భీదాలుండడం, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం,

పిల్లల్లో అంతులేని భయాన్ని అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. ఇది కొన్నాళ్ళయ్యాక యవ్వనదశలో

తిరుగుబాటుగా పరిణమిస్తుంది. తల్లిదండ్రుల్ని టీచర్లను ఒకదగ్గరికి చేర్చి ఇలాంటి విషయాలు

చర్చించాలి. వ్యక్తిగత నీతినియమాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులదో,

ఇటు పాఠశాలదో ఏ ఒక్కరిదీ కాదు. ఇద్దరిదీ!

మంచి విలువల్ని బోధించడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం.

'అమోదయోగ్యంకాని, 'అవాంఛితమైని కోరికల్సి భావాల్ని అణచివేస్తుంటాం. ఇది పిల్లల

నిజమైన భావాల్సి, కోరికల్ని ఆలోచనల్ని నమ్మకాల్ని అణిచివేస్తుంది. మనం చెప్పే నీతిబోధల్ని ఏదో మాటమాత్రంగా వారు స్వీకరిస్తారు. వాటిమీద వారికేమీ నమ్మకం, నిబద్ధత ఉండవు.

పిల్లలకు వదో అలవోకగా కొన్ని మాటలు, కొన్ని అనుభవాలు చెబితే చాలదు. మన జీవితంలోని

నీతి నియమాల్లోని మంచిచెడ్డలు, వాటి సంక్లిష్టతలు పిల్లలు అర్ధంచేసుకోగల్లాలి, ,

పరిశీలించగల్లాలి.

= 2డీ వజ

బాల్యారంభ విద్య (208 6 లేదా 8 ఏళ్ళ వయస్సుకు ముందరి బాల్యారంభ దశ ఎంతో కీలకమైంది. జీవిత పర్యంతం జరగాల్సిన అభివృద్ధికి ఈదశలోనే పునాదులు ఏర్పడతాయి. తరువాత నేర్చుకోబోయే అభిరుచులు, విలువల మీద ఈ దశ ఎంతో ప్రభావం చూపుతుంది. బాల్యారంభ సంరక్షణా విద్యాతత్వం (£05) లోని కీలకాంశం పిల్లలకు రక్షణ, అవకాశాలు, అనుభవాలు కల్పించడం. తద్వారా వారి భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసానికి తోడ్పడటం. పాఠశాలకు సంసిద్ధం చేయడం. పిల్లల ఆరోగ్యాన్ని పౌష్టికాహార అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని వారి మానసిక, విద్యాపరమైన అభివృద్ధికి దోహదపడే సమగ్ర దృక్పధం దీనికి అవసరం. ఏకీకృత 1 విధానం దీనికి అవసరం. మన పాఠ్యప్రణాళిక, బోధన ఈ దృక్పథంతో ఉండాలి. పిల్లలకు సహజంగానే తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ దశలో బోధన అంతా పిల్లల కోరికలు, ప్రాధాన్యాలు, వారి అనుభవాల ఆధారంగానే ఉండాలి. నియంత్రించినట్లు ఉండకూడదు. పిల్లలలో చక్కని ప్రేరణలు, అనుభవాలు కలిగించే వాతావరణం ఉండాలి. పరిశీలించడానికి, ప్రయోగాలు చేయడానికి, స్వేచ్చగా భావాన్ని వ్యక్తం చేయడానికి, సామాజిక సంబంధాలు కలిగివుండడానికి అవకాశం ఉండాలి. వారికి అనువైన రక్షణనిచ్చి నమ్మకం కలిగించాలి. క్రీడలు, సంగీతం, అభినయ గీతాలు, కళలు మొదలైన వాటిని పలు కృత్యాల ద్వారా నిర్వహించాలి. వినడం, మాట్లాడడం, వ్యక్తీకరించడం వంటి అంశాల్ని నేర్పాలి. ఈ దశలో వినియోగించే బోధనా భాష పిల్లలకి బాగా పరిచయమైనదిగా ఉండాలి. వీరిలో శిశువుల నుండి పూర్వ ప్రాథమిక న్థాయి వరకు విభిన్న సమూహాల పిల్లలుంటారు. మనం కల్పించే కృత్యాలన్నీ ఈ అన్ని దశల పిల్లల అభివృద్ధికి దోహదపడేవిగా ఉండాలి. శిశువులు తమ చుట్టూ ఉన్న పరిసరాలకు ్రతిస్పందిన్తారు. అందుచేత వీరికి పాటలు, అభినయగీతాలు, చేతులతోచేసే కృత్యాలు ఎక్కువగా ఉందాలి.

పసితనంలో పిల్లలో కలిగే వైకల్యాలను గుర్తించడానికి వీలుకలుగుతుంది. అందుచేత ఎక్కువకాలం గుర్తించలేకపోవడంవల్ల కలిగే నష్టాలను కొంతవరకు తగ్గించుకోవడానికి వీలుకలుగుతుంది. పిల్లలను రాయడానికి బలవంతం చేయకూడదు. ఇంగ్రీషును ద్వితీయ

, భాషగా నేర్పాలనుకొంటే చదవడానికి ముందుగా భాషను పరిచయం చెయ్యాలి. అంటే విన్పించాలి. మాట్లాడించాలి. అయితే పూర్వ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలో చేరడానికి శిక్షణనిచ్చే వ్యవస్థగా మార్చకూడదు. £008౬ 0-8 సం॥ల వరకు వయస్సుగల పిల్లలందరికీ అనుకూలంగా ఉండాలి. బోధనా విధానం ఏకీకృతంగా ఉండి, కృత్యాధార పద్ధతిని అనుసరించేదిగా ఉండాలి. రాతనేర్చుకోవడానికన్నా ముందు వినడం, మాట్లాడడం తర్వాత చదవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇంటికి, బడికి మధ్య ఇది వారధిగా ఉండాలి. చాలా తేలికగా సహజంగా ప్రాథమిక విద్యలోకి ప్రవెశపెట్టెదిగా ఉండాలి.

200% కార్యక్రమాలు పిల్లల సంపూర్ణ వికాసానికి దోహదపడాలి. పిల్లలందరికీ బాల్యారంభ విద్య అందుకునే హక్కువుంది. దురదృష్టవశాత్తు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో 0-6 సం॥ల వయోసమూహాన్ని చదువుకునే హక్కునుండి మినహాయించారు. దీనితోపాటు

25

వీటిలో చేరే పిల్లలకుకూడా అభ్యసన లక్ష్యాల్ని ముడిపెట్టడం జరుగుతోంది. పిల్లలందరికీ _ 7 200% విద్య సమానంగా అందించాలంటే తగినంత వనరులు సమకూర్చాలి. ప్రాథమిక విద్య క

పిల్లలలో భాషాసామర్థ్యం పెంపొందించడమే (ప్రాథమిక పాఠశాల మొదట ధారాళంగా, అర్ధవంతంగా మాట్లాడ్డం మొదట నేర్పాలి. దీనితోపాటు భాష పలురూపాల్లో వినియోగించుకోవడానికి, ఆలోచించడానికి, ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకొని తన భావాలు వ్యక్తంచేయడానికి ఉపయోగపడాలి. తమ మాతృభాష నేర్చుకోగోరేవారికి ప్రత్యేకావకాశాల్ని కల్పించాలి. తక్కువ సంఖ్యలో పిల్లలున్నప్పటికీ షెడ్యూల్డు తెగల జాతుల , పిల్లలకోసం ప్రత్యేక భాషా ప్యాకేజీలు తయారుచేయాలి. ఇలాంటి అవకాశాల్ని ( కల్పించడంతోపాటు, భవిష్యత్‌ అవసరాల్ని కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు _ చేసుకోవాలి. దీనిమీదనే గుణాత్మక విద్యనందించడానికి గల మన సామర్థ్యం ఎంతటిదో - తెలుస్తుంది. దీన్ని సాధించాలంటే భారతదేశ ప్రజల బహుళ భాషా ప్రతిభను గుర్తించి దాన్ని నిలబెట్టాలి. ఈ దశలో ఇంగ్లీషు కూడా నేర్పొచ్చు. కానీ ఇందుకోసం భారతీయ భాషల్ని. మాత్రం బలిపెట్టకూడదు.

అంకెలతో (ప్రారంభమై, అమూర్తభావాలవైపు ఆహ్లాదంగా సాగే గణిత ఆలోచనా పద్ధతి వికసించాలంటే నిర్దష్టమైన అనుభవాల్ని గణితానికి జోడించాలి. ఓవ తరగతి వరకు ఈ దశలో అభ్యసనంలోని ఇబ్బందుల్ని మనం గుర్తించి సరిచేయాలి. భాషలోనూ, గణితంలోనూ పునశ్చరణ చేసి దిశానిద్దేశం చేయాలి.

తమచుట్టూ ఉన్న పరిసరాల్ని అధ్యయనం చేయడానికి ఇలాంటి నిర్దుష్ట అనుభవాలు ఎంతైనా అవసరం. పిల్లలు పాఠశాలలో లోకజ్ఞానాన్ని దీనిద్వారా అనుసంధానించుకోగల్లుతారు. కాలం గడిచేకొద్దీ సబ్జెక్టుల పరంగా దేనికదిగా విభజించుకోవడం జరుగుతుంది. భావనలు అఖీవృద్ధి చెందుతాయి. ఆయా సబ్జెక్టుల పద్ధతులు, భాష అవగతమౌతాయి.

ఆటలద్వారా శారీరక అభివృద్ధిని సాధించడం తప్పనిసరి అంశంగా ఉండాలి.

సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం, కార్యక్రమాలు నిర్వహించడం, పాఠశాల బయటి. ప్రదేశాలకు వెళ్ళడం వంటివి పాఠ్యప్రణాళికలో భాగం కావాలి. ,॥ సెకండరీ విద్య

సెకండరీ పాఠశాల కాలంలో పిల్లవానిలో అనేక శారీరక మార్పులు వస్తాయి. వ్యక్తిగా గుర్తింపబడే కాలమిది. శక్తిసామర్థ్యాలు తొణికిసలాడే దశ యిది. ఈ దశలో పిల్లలు తార్కిక ఆలోచనలు కలిగివుంటారు. విషయాన్ని అర్థం చేసుకోవడం, జ్ఞానాన్ని రూపొందించుకోవడం ఈ దశలో చాలావేగంగా జరుగుతాయి. తనను గురించి తాను అర్ధం చేసుకోవడంతోపాటు సమాజంతో సంబంధాలు పెంపొందించుకొనేందుకు ఉత్సాహపడే కాలంగా దీనిని పరిగణిస్తారు. ఈ స్థాయిలో ప్రవేశపెట్టబడే కోర్సులు వివిధ అంశాలతో

26

కూడి విభిన్నంగా ఉండాలి. ఇష్టం వచ్చినవాటిని నేర్చుకునేందుకు పిల్లలు తమ సామర్థ్యాలను వినియోగించుకునే అవకాశం ఉండాలి. ఇందువల్ల వారు తమ అభిరుచులకు, కోరికలకు అనుగుణమైన కోర్సుల్ని ఎంచుకోగలుగుతారు. చాలా మంది పిల్లలు ఈ దశలోనే పాఠశాల మూనివేని ఉత్పాదక రంగంలో చేరిపోతారు. దానిక్కావల్సిన నైమణ్యాలు పెంపొందించుకుంటారు. ఎక్కువమంది పిల్లలు ఆర్థిక సామాజిక కారణాలవలననే బడి మానివేస్తారు. సెకండరీ విద్యనుసార్వ్పత్రికం చేయాలంటే పిల్లలకు అవసరమైన పని అనుభావాలు ప్రవేశపెట్టి అందులో తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రంథాలయాలు అందుబాటులో ఉండడం, ప్రయోగశాలలద్వారా అనుభవం సాధించడం జరగాలి. పిల్లలందరికీ ఈవిధమైన అవకాశాలు కల్పించడానికి దృఢమైన కృషి జరగాలి. . ఈ రెండు సంవత్సరాల విద్యపై (9-10) 'బోర్డు పరీక్షల” నీలినీడ పడుతుంది. , పరీక్షలలో వచ్చే మార్కులే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలా పాఠశాలలు మొదటి టర్మ్‌ పూర్తయ్యేసరికి 10వ తరగతి సిలబస్‌ పూర్తిచేసేస్తాయి! మిగిలిన సంవత్సర కాలమంతా ఆ పాఠాలు రివిజన్‌ చేస్తుంటాయి. అందువల్ల పిల్లలు పరీక్షలకు “చక్కగా” సంసిద్భలౌతారు. 9-11 తరగతుల్లో పరీక్షలు లేవనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా పరీక్షలకోసం సాగే చదువుల తంతు అభ్యసనం మీద హానికరమైన ప్రభావం కలిగిస్తుంది. దీన్ని పునఃపరిశీలించాలి. సవాలు చెయ్యాలి. ఎంతో ఫలవంతమైన బాల్యజీవితాన్ని వాఠశాల చదువు పేరుతో ఇలా ఉత్పాదరహిత కార్యక్రమంలో వెచ్చించడం నిష్ప్రయోజనం. సంవత్సరమంతా జరగాల్సిన దానిని సంక్షిప్తంచేసి పక్కగా దారిమళ్ళించడం యోగ్యమైనదికాదు. ఇలా పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి పిల్లల్ని సంసిద్ధం చేయాల్సిన అవసరం ఎంతమేరకు ఉందో సరైందో టీచర్లు గుర్తించాలి. వివిధ ప్రణాళికా అంశాలు, ముఖ్యంగా ఆటలు, కళలు కూడా పరీక్షలలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరగాలి. ఒక రాజీ దీనికోసం కుదరాలి. దీనితోబాటు పరీక్షా విధానంలో సవరణలు తేవాలి. పాఠ్య, సహపాఠ్య అంశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే విధానంరావాలి. కొన్ని బోర్పులు మాత్రం ఐచ్చికాంశాలను ఎన్నుకోవడంలో పరిధిని విస్తృతం చేశాయి. స పిల్లల అభిరుచి మేరకు ఆర్థికశాస్త్రం, సంగీతం, మృణ్మ్యయశాస్త్రంలాంటి అంశాలు కూడా ఎన్నుకొనే వీలుకల్పించాయి. ఈవిధమైన అవకాశాలను మరింత మెరుగుపరిచి, సంప్రదాయ వృత్తులను నేర్చుకొనే అవకాశం కల్పించాలి. మన వృత్తికోర్సులు స్థానిక సమాజానికి సంబంధించి ఉత్పాదకతతో ముడిపడినవిగా ఉండాలి. ఉదాహరణకు గ్యారేజి నిర్వహణ, కుట్టుపని, పారామెడికల్‌ సేవలు మొదలైన అర్ధవంతమైన వృత్తివిద్యా కోర్సులుండాలి. పాఠశాల బోర్డులు అధ్యయన కేంద్రాలను పాఠశాల వెలుపల కూడా ఎన్నుకొనేందుకు వీలుకల్పించాలి. మనదేశంలో చాలా వృత్తి విద్యాకోర్సులు గుణాత్మకతను కోల్పోయి పిల్లలకు అర్ధవంతమైన జ్ఞానాన్ని నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. ఇవి చాలా వరకు యోగ్యతా పత్రాలను ఇచ్చే కోర్సులుగా మారాయి. ఇవి ఉద్యోగం చేయడం నేర్చుకోవడానికి, ఉద్యోగం పొందడం నేర్చుకోవడానికి మధ్య వ్యత్యాసం లేకుండా చేశాయి. 27

హయ్యర్‌ సెకండరీ విద్య

హయ్యర్‌ సెకండరీ స్కూలు స్థాయిలో మనం బోధిస్తున్న విద్యాపరమైన వృత్తివిద్యాపరమైన అంశాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. బోర్డు పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేయడం, “అకడమిక్‌ స్రవంతి” అనబదేదానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, వృత్తివిద్యలు చతికిలబడడం ఈ దశలోని మన ప్రధాన వైఫల్యాలు. వీటిని మొత్తం పునఃపరీక్షించాలి. ఈ రెండు సం॥లు దశలో విద్యార్ధి అతని అభిరుచులను అభిప్రాయాలకు, భవిష్యత్తు అవసరాలకు తగిన కోర్సును ఎన్నుకొనే అవకాశం ఉండాలి.

ఐచ్చికాంశాలు ఎన్నుకోవడంలో పిల్లలకు వాటి అవసరం, వాటిలో తేడాలు ముందుగా తెలిసివుండాలి. వ్యక్తి అభిరుచులు, భవిష్యత్‌ జీవితం రెండూ ప్రధానంగా భావించాలి. వివిధ - అంశాలను సంగ్రహించడం, వాటి అంతఃసంబంధాల్ని గుర్తించడం అవసరం. చదవడానికి ఎంపికచెసుకొన్న సబ్దెక్టుల్ని ఆ సబ్జెక్టు అవతల అంశాల్ని అన్వేషించడం అవసరం.

చాలా బోర్డులు విభిన్నమైన అంశాలను అధ్యయనాంశాలుగా ప్రవేశపెడుతున్నాయి. వీటిలో తప్పని సరిగా భాషలు ఉంటున్నాయి. పిల్లలు సబ్జెక్టులను ఎన్నుకోవడంలో నియత, అనియత నిర్భంధాలు పనిచేస్తున్నాయి. చాలా బోర్డులు అధ్యయనాంశాలపై సైన్స్‌ విభాగం, ఆర్ట్స్‌ విభాగం, కామర్స్‌ విభాగం అని నిర్భంధ విభజనలు విధించాయి. అయితే 085 మాత్రం అధ్యయనాంశాల కాంబినేషన్ల పై నిర్భంధం విధించదు. కానీ కొన్ని విభాగాలకు ఎక్కువ ప్రాచుర్యం లభించడం వల్ల వాటిని చదివేవారి సంఖ్య పెరిగింది. చాలా విభాగాలు పిల్లలు లేకపోవడం వలన మూసివేయడం జరుగుతోంది. భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలుకూడా అంశాలలోనే కోర్సులు నిర్వహించే పరిస్థితి వస్తుంది. +2 స్థాయిల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన కోర్సులకే విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా స్థానం ఉంటుందన్నమాట. దీనికి భిన్నంగా వివిధ కాంబినేషన్ల కోర్సులకు అవకాశం ఉండాలి. ఉదాహరణకు గణితం, భౌతికశాస్త్రం, తత్వశాస్త్రం లేదా సాహిత్యం, జీవశాస్త్రం, చరిత్రలాంటి కాంబినేషన్లు పిల్లలకు లభించాలి.

ఆధునిక కాలంలో పాఠశాలలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సులకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వీటికిగల ప్రాచుర్యం వల్ల ఎక్కువమంది వీటినే ఎన్నుకుంటున్నారు. దేశంలో చాలాచోట్ల ఆర్ట్స్‌, ఇతర సాధారణ అంశాలు అధ్యయనాంశాలుగా ఎన్నుకొనే పిల్లలకు అవకాశాలు తగ్గివోతున్నాయి. పాఠశాలలు సంప్రదాయేతర నూతన అధ్యయనాంశాల్ని ఎన్నుకోవడాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి. టైంటేబిల్‌ కుదరదని చెప్పి ఇలా చేస్తున్నాయి. ఇది సరికాదు. అన్ని అధ్యయనాంశాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి.

అకడమిక్‌ విద్య ద్వారా వృత్తివిద్యలకు వెళ్ళేవారి కోసమో, అధ్యయనం, పరిశోధన చెయ్యాలనుకొన్న వారికోసమోగాదు మన వృత్తి విద్యలుందేది. చదువు మధ్యలో పని నేర్చుకోవాలనుకొనేవారికోసమే మన వృత్తివిద్యలు ఉద్దేశింపబడ్డాయి. కానీ మేము అకడమిక్‌ వృత్తివిద్యాకోర్సుల్ని రెండింటినీ మిళితం చేయమంటున్నాము. దీనికి మూడు కారణాలున్నాయి.

28

మొదటిది వృత్తివిద్యల్లో కూడా చాలా మార్పులవసరమవుతున్నాయి. వీటి పాఠ్య ప్రణాళికలో అకడమిక్‌ పునాది, అకడమిక్‌ నైపుణ్యంగల అంశాలుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోది అకడమిక్‌ ్రవంతిలో చదువుతున్న పిల్లలు వారు చదువుతున్న కోర్సులకనుగుణమైన వృత్తివిద్యాకోర్సుల్ని ఎన్నుకోవల్సిన అవసరం నేడెంతైనా ఉంది. చివరగా మన పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరాలన్నాా విస్తృతావకాశాల్ని పొందాలన్నా అకడమిక్‌, వృత్తికోర్సుల్ని ఒకటిగా మార్చడం అవసరం. కాలక్రమంలో ఇలాంటి విద్య రావాలి. ఓపెన్‌ స్కూళ్ళు, బ్రిడ్జి స్కూళ్ళు నేషనల్‌ ఓపెన్‌ స్కూలుతో ప్రారంభించి ఇపుడు దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఓపెన్‌ స్కూళ్ళు నడుపుతున్నాయి. ఇవి పిల్లలకు తగిన వెసులుబాటు కల్పిస్తాయి. వీటిలో విస్తృత పరిధిలో అధ్యయనాంశాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షల వ్యవస్థ కూడా సరళంగా ఉంటుంది. ఒక బోర్టు నుండి మరొక బోర్టుకు సులభంగా మారవచ్చు. ఇవి మానవీయకోణంలో బోధనను అందజేస్తున్నాయి. ఓపెన్‌ స్కూళ్ళ సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందాలి. బోర్జు పరీక్షల కంటే వీటి పరీక్షల స్థాయి తక్కువనే దురభిప్రాయాన్ని పోగొట్టాలి. ఇతర బోర్డు పరీక్షలలాగే ఓపన్‌ స్కూళ్ళ పరీక్షలు కూడా దగ్గర దగ్గరగా జరపడం ద్వారా విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితిరాకుందడా నివారించవచ్చు. బడి బయట ఉండే పిల్లలు ఒక స్టాయికి చేరుకొని, తమ వయస్సుకు తగిన తరగతిలో మన పాఠశాలల్లో చేరడానికి బ్రిడ్జి స్కూళ్ళు మనదేశంలో చాలాచోట్ల నిర్వహిస్తున్నారు. ఈ బ్రిడ్జి స్మూళ్ళకోసం జా(గత్తగా ఆలోచించి నిర్ణయించిన పొఠ్యప్రణాళిక ఉండాలి. అప్పుడే వీటి లక్ష్యం నెరవేరుతుంది. లేకుంటే వాళ్ళ బాల్యపు హక్కులు భంగం కావడమే మిగులుతుంది. ఈ స్కూళ్ళకు కావల్సిన బోధనా సామగ్రి మీదా, బోధనా వ్యూహాలమీదా మంచి పరిశోధన జరగాలి. ఖచ్చితంగా ఇవి అమలు అయ్యేలా నియమనిబంధనలుండాలి. వీటిని పాటించే , పద్ధతులుండాలి. ఈ స్కూళ్ళకు తగిన వసతులు, సదుపాయాలు ఉండాలి. చివరగా ముఖ్యంగా రెగ్యులర్‌ పాఠశాలల్లో చేర్చాక ఈ పిల్లలకు వీరికి విద్యాపరంగా, సామాజికంగా మద్ధతు ఉండాలి. మూల్యాంకనం విద్య వ్యక్తికి అర్ధవంతమైన జీవితాన్ని ఇచ్చే కార్యక్రమం. ఈ క్రమంలో ఈ విద్య ఎంతవరకు ఫలప్రదంగా ఉపయోగపడింది అనే విషయాన్ని విశ్వసనీయ పద్ధతిలో లెక్కించడమే మూల్యాంకనం. ప్రస్తుతం అమలులోఉన్న మూల్యాంకనా విధానాలతో తక్కు పరిధిగల అంశాలను మాత్రమే అంచనా వేయగలం. ఈ పద్ధతికి ఆచరణ యోగ్యత లేదు. ఇది వ్యక్తి పూర్తిన్యాయి సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడదు. నిర్ణయించిన విద్యాలక్ష్యాలు సాధించడానికి కూదా అంతగా ఉపయోగపడదు. ఈ పరిమితమైన ప్రయోజనాన్ని సాధించాలన్నా, విద్యార్థిలోని అకడమిక్‌ అభివృద్ధిని 20

౮ మాత్రమె పరీక్షించాలన్నా ఉపాధ్యాయుడు తాను పాఠం బోధించడానికి ముందే దీనికి తగ్గట్టు సింసిద్భుడై ఉండాలి. మూల్యాంకనా పద్ధతులేగాదు ఏ ప్రమాణాల ప్రాతిపదికన మూల్యాంకనం చెయ్యాలో, ఏరకమైన సాధనాల్ని దీనికోసం ఉపయోగించాలో కూడా ఉపాధ్యాయుడు నిర్ణయించుకొని వుండాలి. విద్యార్ధి సాధించాల్సిన ఫలితంపట్ల కూడా ఉపాధ్యాయుడికి స్పష్టత వుందాలి. మూల్యాంకన ఉద్దేశ్యం ఇది కాదు పిల్లలు భయంతో చదువుకునేలా ్రేరేపించడంకోసం పిల్లల్ని 'నిదానంగా నేర్చుకునేవారు” 'తెలివిగలవారు'” 'సామన్యాత్మక పిల్లలు అని ముద్రవేయడంకోసం, పిల్లవాడి మీదనే బాధ్యతనంతా పెట్టీ బోధనా పద్ధతుల బాధ్యతను తప్పించడంకోసం. పునశ్చరణ అవసరమైన విద్యార్థుల్ని గుర్తించడం కోసం (ఇది బోర్డు పరీక్షల్లోగాదు, టీచరు పాఠం బోధిస్తున్న క్రమంలోనే ఇలాంటి వారిని అంచనా వేస్తాడు) నేర్చుకోవడంలోని కష్టాలు, సమస్యాత్మకాంశాలు గుర్తించడంకోసం. పిల్లల గుణాత్మకతను అంచనా వేయడానికి నిరంతర పరిశీలన అవసరం. వీటికోసం ప్రత్యేక పరీక్షలు అవసరంలేదు. రోజువారీ డైరీ నిర్వహించడంవల్ల నిరంతరం సమ(గంగా మూల్యాంకనం చేయడానికి వీలుకలుగుతుంది. దడైరీనుండి ఒక వారంలో సేకరించిన సమాచారం (ఉదా :-*కిరణ్‌ తన పనిలో ఉత్సాహంగా ఉన్నాడు. అతను పుస్తకాలంటే ఇష్టపడతాడు. సంక్షిప్తంగా, సరళంగా ఉండే స్పష్టమైన భాషను ఇష్టపడతాడు. అలావుంటే సులభంగా అర్ధం చేసుకోగలడట. జవాబులు క్లుప్తంగా రాస్తాడు. ప్రయోగాలద్వారా నేర్చుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం”) ద్వారా, వివిధ స్థాయిల సమాచారంతో ఉపాధ్యాయుడు, పిల్లల అభ్యసన విధానాన్ని క్రమబద్ధంగా రికార్డు చేయడానికి వీలుకలుగుతుంది. మార్కులకోసం పరీక్షించకూదని విద్యాప్రణాళికాంశాలు విద్యాప్రణాళికలోని ప్రతి అంశాన్ని పరీక్షించవలసిన అవసరంలేదు. ఒకవేళవిషయం తప్పనిసరిగా నేర్చుకోవలసినయినదప్పటికీ పరీక్షించడమనే దృష్టితో చూడకూడదు. ఉదా:- పని అనుభవం, వ్యాయామ విద్య, సంగీతం, కళలు ఇవన్నీ విద్యాప్రణాళికాంశాలే. అలాగని పరీక్షలు వీటిలోకూడా నిర్వహించాలనుకోరాదు. పరీక్షలు లేనందువల్ల ఈ అంశాలకు విద్యాప్రణాళికలో తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కాదు. మూల్యాంకనా రూపకల్పన నిర్వహణ మూల్యాంకనాలు, పరీక్షలు విశ్వసనీయంగా నమ్మదగినవిగా ఉండాలి. ఇవి సరైన, న్యాయమైన పద్ధతుల్లో అభ్యసనాన్ని కొలవగలగాలి. చాలాకాలంగా మన పరీక్షలు “పాఠ్య 30

పుస్తకాలలోని అంశాలను పిల్లలు ఎంతవరకు గుర్తు పెట్టుకోగలిగారు, ఎంతవరకు గుర్తుతెచ్చుకోగలిగారు” అనేదాన్ని మాత్రమే అంచనా వేసేవిగా ఉన్నాయి. ఈ పరిస్థితి కొనసాగినంతవరకు మన విద్యాప్రణాళికకు, అభ్యసనానికి విఘాతం తప్ప మరేమీ జరగదు. మొదట జ్ఞానాధారిత అంశాల్ని పరీక్షించాలి. పిల్లలు ఏమి నేర్చుకున్నారో, నేర్చుకొన్న జ్ఞానాన్ని సమస్యా పరిష్కారానికి ఏమాత్రం వాడుకోగల్లుతున్నారో, వినియోగించుకోగల్లుతున్నారో తర్వాత పరీక్షించాలి. పిల్లల ఆలోచనాక్రమాన్ని సమాచారాన్ని సేకరించగల సామర్దాన్ని దాన్ని ఉపయోగించుకోగల నేర్పును, దాన్ని విశ్లేషించి నిగ్గు తేల్చుకొనే నైపుణ్యాన్ని కూడా అంచనా దిద్దిన సమాధాన పత్రాల్ని పిల్లలకివ్వాలి. వాటిని చూచి పిల్లలు మళ్ళీ సరైన సమాధానాలతో రాస్తారు. వాటిని టీచరు పరిశీలించి ఈ పద్ధతిద్వారా పిల్లలు ఎంత నేర్చుకోగలిగారో తెలుసుకుంటారు. మూల్యాంకనం కోసం రూపొందించే ప్రశ్నలు పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. తరచుగా టీచర్లు గెడ్‌లలో ఉండే సమాచారం తప్ప అదనంగా నేర్చుకొని రాయడానికి పిల్లలకు అనుమతి, అవకాశం ఇవ్వరు. ప్రశ్నలు ముగింపు లేనివిగా, సవాలు విసిరేవిగా ఉండాలి. చక్కని ప్రశ్నలను రూపొందించడం ఒక కళ. ఉపాధ్యాయుడు సమయాన్ని వెచ్చించి, ఆలోచించి అలాంటి మంచి ప్రశ్నలను తయారుచేసుకోవాలి. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించి ఈ విధమైన చక్కని ప్రశ్నలు రాబట్టవచ్చు. అన్ని ప్రశ్నాపత్రాల్ని కఠినత్వస్థాయినిబట్టి గేడ్‌ చేయాలి. అందువల్ల పిల్లలందరూ తమ సామర్య్యాన్ని ఒక స్థాయి వరకు ప్రదర్శించుకోగల్లుతారు. పిల్లలకు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విశ్వాసం దీనివల్ల ఏర్పడతాయి. పుస్తకాలు చూసి రాసే పరీక్షా పద్దతి పరీక్షా పద్ధతుల్లో ఒక సవాలు. దీన్ని మనం ._ స్వీకరించి అన్ని దశల్లోనూ మన పాఠశాలల్లో అమలు పరచాలి. అభ్యసనాన్ని ఇతరత్రా అన్వయించడం, విషయాన్ని వ్యాఖ్యానించడం పై కేంద్రీకరించిన ప్రశ్నలు దీనికవసరం. దీన్ని ఉపాధ్యాయులకు, ప్రశ్నాపత్రాల రూపకర్తలు నేర్చుకోవాలి. ఇలాంటి పరిక్షల్ని పెద్దఎత్తున నిర్వహించి అందరికీ పరిచయం చెయ్యాలి. దీనివల్ల ఉపాధ్యాయులకు ఈ పరీక్షా ఫలితాలమీద విశ్వాసం కుదురుతుంది. అలాగే వ్రాజిక్టు పనుల్ని ప్రయోగశాలలోని ప్రయోగాలను కూడా సమర్ధవంతంగా విశ్వసనీయ పద్ధతుల్లో పరీక్షించాల్సివుంటుంది. పోటీ ప్రేరణ గల్లించవచ్చు. కానీ ఈ (ప్రేరణ సహజమైందిగాదు. బయటనుంచి వచ్చింది. ఈ రకమైన ప్రేరణని కల్గించడం సులభం. అందువల్ల టీచర్లు పిల్లలు ప్రతిభను ప్రదర్శించడానికి ఈ మార్గాన్ని ఎన్నుకొంటారు. పోటీతత్వం పెంచాలనే ఉద్దేశ్యంతో పూర్వప్రాధమిక స్థాయినుంచే ఉపాధ్యాయులకు ర్యాంకులిస్తుంటారు. ఈ పోటీ ధోరణి పిల్లల అభ్యసనంమీద వ్యతిరేక ప్రభావం కల్లిస్తుంది. పైపైన చదివితేచాలు ఈ పరీక్షల్లో సులభంగా త్ర

రాణించవచ్చు. అందువల్ల పిల్లలు స్వంత ప్రయత్నాల్ని మానుకొంటారు. స్వంత అభిరుచుల్ని వదులుకొంటారు. మార్కులతో సంబంధంలేని అంశాల్ని వదిలేస్తారు. ఇది పాఠశాల సంస్కృతిపైన చెడు ప్రభావం కల్గిస్తుంది. వ్యక్తిగత ధోరణిని పెంచుతుంది. సమిష్ట పని విధానానికి నష్టం చేస్తుంది. మరీ ఘోరమేమంటే తైమాసిక, అర్దసంవత్సర పరీక్షల్నికూడా కఠినంగా మార్చడం, పరిశీలకుల్ని పెట్టి, పరీక్షా పత్రాన్ని రహస్యంగా ఉంచి వీటికి అనవసరమైన ప్రాధాన్యతను కల్గించడం. మాధ్యమిక పాఠశాల దశదాకా ఈ విధానం పిల్లలమీద ఎలాంటి చెడు ప్రభావాన్ని కల్గించిందో తెలియకపోవచ్చు. కానీ ఇవి పిల్లలమీద తీవ్ర ఒత్తిడిని పెడతాయి. పాఠశాలలు ఉపాధ్యాయులు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఈ విధానాల వల్ల ఐమైనా ఫలితం ఉందా? అభ్యసనానికి ఈ విధమైన మార్ములు, ర్యాంకులు నిజంగా అవసరమా?

మనం పునరాలోచించాల్సిన అంశాలు

నిరంతరం, సమగ్రమైన పద్ధతితో జాగ్రత్తగా ఆలోచించి చేసే మూల్యాంకనమె అర్ధవంతమైన మూల్యాంకనం. దీన్ని ఎప్పుడు ఏ పద్ధతిలో చెయ్యాలో మనం ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇలాంటి మూల్యాంకనం చెయ్యాలంటే టీచర్లు ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎక్కువ రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మూల్యాంకనానికి అర్ధం, విశ్వసనీయత వుంటుంది. ప్రతి అంశాన్ని మనం పరీక్షిస్తున్నామనే అభిప్రాయం కల్లి పిల్లలపై ఒత్తిడి పెరిగితే, ప్రతిచోటా ఉపాధ్యాయుడి “అధిక=రం” కనిపిస్తూ ఉంటే అది మన విద్యాలక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. పై అంశాల మూల్యాంకనానికి ఒక నిర్దుష్టమైన పద్ధతి ఏర్పడెదాకా ఆగాలి. అప్పటి వీలున్నన్ని ఎక్కువ అంశాల్ని మూల్యాంకనం చెయ్యడంకోసం ఎన్నుకోవడంద్వారా మూల్యాంకనాన్ని అర్దవంతంచెయ్యవచ్చు. వివిధ స్థాయిల్లో మూల్యాంకనంవిద్యా సామాజిక సందర్భం

బాల్యారంభ విద్య, 1-2 తరగతులు : ఈ దశలో పిల్లలు వివిధ సందర్భాల్లో చేసిన కృత్యాల్ని వారి ఆరోగ్యాన్ని శారీరకాభివృద్దిని మనం మూల్యాంకనం చెయ్యాల్సివుంటుంది. పిల్లలతో ప్రతిరోజూ చేసేప్రతిచర్యపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ దశల్లో మౌఖికమైనదైనా, లిఖతపూర్వకమైనా ఇలాంటి పరీక్ష పెట్టగూడదు.

3-8 తరగతులు : పరిశీలనలు, మౌఖిక లిఖిత పరీక్షలులాంటి పలు పద్ధతుల్ని ఈ దశలో ఉపయోగించవచ్చు. తమని పరీక్షిస్తున్నట్టు పిల్లలకు తెలియాలి. కానీ ఇది తమ రోజువారీ చదువులో భాగమని వారనుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీటిని చూచి భయపడకూడదు. గుణాత్మకమైన రిపోర్చులతోపాటు మార్కులు, (గ్రేడులు కూడా ఈ దశలోని మూల్యాంకనంలో ఉంటాయి. 5వ తరగతి నుంచి పిల్లల స్వయం మూల్యాంకనాన్ని కూడా రిపోర్టుకార్డులో నమోదు చెయ్యాలి. సంవత్సర పరీక్షలకు, టెర్మినల్‌ పరీక్షలు, 8వ తరగతి నుండి ఉండాలి. అప్పటికి పరిక్షలకు సిద్ధమయ్యేందుకు కావల్సిన శారిరక సామర్ధ్యం పిల్లలకు ఉంటుంది. ఎక్కువకాలం జవాబులు రాస్తూ పరీక్షల్లో కూర్చుండగల్లిన శక్తి కూడా అప్పటికి ఉంటుంది.

౩32

వీరికిచ్చే రిపోర్టు కార్డులో ఆరోగ్యం, శారీరకశక్తిలాంటి సాధారణ పరిశీలనలన్నీ కూడా చేర్చాలి. దీంతోపాటు విద్యార్థి మొత్తంమీద సాధించిన అభివృద్ధిని తల్లిదండ్రులకు తిలియజెయ్యాలి.

9-12 తరగతులు : స్వీయ. మూల్యాంకనంతోపాటు ఈ దశలో ఎక్కువగా పరీక్షల మీద ప్రాజెక్టుల మీద ఆధారపడి పాఠ్య జ్ఞానాన్ని మూల్యాంకనం చెయ్యాలి. మిగిలిన అంశాల్ని పరిశీలనద్వారా అంచనా వెయ్యొచ్చు.

ఈ దశలో మనం ఇచ్చే రిపోర్టు రికార్డుల్లో పిల్లల నైపుణ్యాలు, జ్ఞానానికి సంబంధించిన

విశ్లేషణ ఎక్కువగా ఉండాలి. దీనిద్వారా పిల్లలు తాము దృష్టిపెట్టాల్సిన బోధనాంశాల్ని గుర్తిస్తారు. తర్వాతి కాలంలో ఏమి చదవాలో ఎన్నుకొనేందుకు కూడా దీనివల్ల అవకాశం కల్గుతుంది. పాఠశాల గది తరగతి వాతావరణం

పిల్లలకీ ఉపాధ్యాయులకు మధ్య జరిగే పరస్పర చర్య (అది వ్యావహారికంగా గావచ్చు . మరో రూపంలోగావచ్చు) ఫలితంగా ఏర్పడే సంబంధాల నుంచి అభ్యసనం అనేప్రక్రియ జరుగుతుంది. 'అభ్యాసక సమాజం” ఉండే సంస్థారూప క్షేత్రాలు పాఠశాలలు. ఈ సమాజంలో ఉపాధ్యాయులూ ఉంటారు, పిల్లలూ ఉంటారు. ఆటస్థలంలో తోటి మిత్రులతో ఆడుకోవడం, పోట్లాడుకోవడం, విరామసమయాల్లో బెంచీల మీద కూచుని స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడ్డం, ఉదయం అసెంబ్లీలో చేరడం, పరీక్షకు ముందు ఆత్రుతగా పేజీలు తిరగెయ్యడం, పాఠశాలకు దూరంగా తోటిపిల్లలతో, టీచర్లతో కలిసి విహారయాత్రలు చెయ్యడంలాంటివన్నీ ఈ సమాజాన్ని కలిసికట్టుగా ఉండేలా చేస్తాయి. పీటివల్లనే ఈ సమాజానికి “అభ్యాసకుల సమాజుి లక్షణం వస్తుంది.

మొదట మన తరగతి గదుల్లోకి వీలున్నంత వెలుతురు వచ్చేలా చూడాలి. తర్వాత పిల్లలు చేసిన వస్తువుల్ని, వేసిన బొమ్మల్ని గోడలమీద, ఇతరత్రా ప్రదర్శనకు పెట్టాలి. ఇలా కళాకృతుల్ని, చిత్రలేఖనాన్ని హస్తకళల్ని గోడల పైనా, షెల్ఫుల్లో పెట్టడం పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి గొప్ప సందేశాన్నిస్తుంది. తమ కృషి గుర్తింపుకొచ్చిందని వాళ్ళు ఆనందిస్తారు. ఇలాంటివి ప్రదర్శనగా పెట్టెప్పుడు పిల్లలు చూడ్డానికి, తీసుకోడానికి అందుబాటులో ఉండేంత ఎత్తులో, ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. సామాన్యంగా మన పాఠశాలలు శిధిలావస్థలో ఉంటాయి. . మసకబారి దయనీయంగా ఉంటాయి. ఇలాంటి స్కూళ్ళ నుంచి ఏ ఉత్సాహం పిల్లలకి కల్గుతుంది?

భవనాలే మన స్మూళ్ళకున్న ఖరీదైన ఆస్తులు. వీటివల్ల విద్యావిలువ గరిష్టంగా పెరుగుతుంది. ఈ భవనాలకు మరమ్మత్తులు చేసి, మరికొంత పెంచి, కొత్త భవనాల్ని నిర్మిస్తే ఈ విలువ మరింత గరిష్టంగా పెరుగుతుంది. బడి అందంలో మాత్రమే దీనివల్ల మార్పు వస్తుందనుకొంటే పొరపాటు. భౌతిక వసతులకు బోధనతోనూ, పిల్లలతోనూ ఒక

వ3

అంతస్సంబంధం ఉంటుంది. దీనివల్ల బోధనాభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. దేశంలోని చాలా స్మూళ్ళల్లో తరగతి గది గోడలకు పెద్దపెద్ద చిత్రాల పెయింటింగులు మనం చూస్తుంటాం. కొంత కాలం తర్వాత ఇవి మొహమ్మొత్తుతాయి. దీనికంటే జాగ్రత్తగా చేసుకొన్న చిన్నసైజు బొమ్మలవల్ల గోడలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే పిల్లలు స్వయంగా తయారుచేసిన వస్తువుల్ని ఉపాధ్యాయుడు చేసిన చార్జులు మొదలైన వాటిని ప్రదర్శించడం మంచిది. వీటిని నెలకొకసారి మారుస్తుండాలి.

తరగతి గది స్థలం పిల్లలకు అవసరమైనట్టు మార్చుకోవడానికి తగినట్టుగా ఉండాలి. ఇందువల్ల చిన్నచిన్న బృందాలుగా పిల్లలు కలిసి కూర్చోవచ్చు. కథలు చెప్పేటప్పుడు పెద్దపెద్ద వృత్తాకారంలో కూర్చోవచ్చు. ఎవరికివారు రాసుకోవడానికి, చదువుకోవడానికి తగినట్లుగా కూర్చునే వీలు; రేడియో, టి.వి. ప్రసారాలు వచ్చేటప్పుడు ఒకే బృందంగా కూర్పోడానికి అవకాశం దీనివల్ల ఏర్పడతాయి. ఇందుకోసం బల్లల్ని కుర్చీలను, బెంచీలను, చాపలను ఇటుఅటు సర్దకోవలసి ఉంటుంది. దిన్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్కూళ్ళు పిల్లలు కూర్చోవడానికి అవసరమయ్యే సామగ్రిని సమకూర్చుకుంటున్నారు.

తరగతి గదిలో అందుబాటులో గల అవకాశాల్సి బోధనా వనరులుగా మనం గరిష్టన్ధాయిలో వాడుకోవాలి. కొన్నిచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో క్లాస్‌రూం గోడలకు నాలుగు అడుగుల ఎత్తువరకు నల్లరంగు వేస్తున్నారు. పిల్లలు దీన్ని స్వేచ్చగా పలకలాగా, డ్రాయింగు బోర్డులాగా వాడుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో నేలమీద వివిధ రేఖాగణిత రూపాల్ని వేస్తున్నారు. ఇవి కూడా రకరకాల కృత్యాలకు ఉపయోగపడతాయి. గది మూలల్ని అభ్యసన సామగ్రిని, కథల పుస్తకాలను, రకరకాల కార్డులను పెట్టు కొనడానికి ఉపయోగించుకోవచ్చు. అప్పుడు ఇవి పిల్లలకు అందుబాటులో ఉంటాయి. సమర్థవంతమైన వాతావరణాన్ని పెంపొందించుకోడం

పాఠశాలలు ప్రజోపయోగకర ప్రదేశాలు. వీటిలో సమానత్వం, సామాజిక న్యాయం, వైవిధ్యంవట్ల గౌరవం, పిల్లల హక్కులు లాంటి విలువలు ఉండి తీరాలి. వీటిని ప్రయత్నపూర్వకంగా మన స్కూళ్ళలో అంతర్భాగం చేయాలి. పాఠశాలలోని మన ఆచరణకు ఈ విలువలు పునాదిగా ఉండాలి. సమర్థవంతమైన వాతావరణంలో పిల్లలకు శుభ్రత ఉంటుంది. భయం ఉండదు. సమానత్వం ప్రాతిపదికన, సమాన న్యాయం (ప్రాతిపదికన నిర్మించబడ్డ సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా చేయవలసింది ఏమీలేదు. పిల్లల మధ్య విచక్షణ చూపకుండా సమానంగా చూస్తేచాలు.

పిల్లల మధ్య సంబంధాలు, ఉవాధ్యాయుడి ధోరణి, పాఠశాల సంస్కృతిలో భాగమైన నియమాలు, విలువలు పిల్లలకు ఒక అవ్యక్త సందేశాన్ని అందిస్తాయి. ఇది పాఠశాల విద్యార్థులకు నిత్యం అనుభవంలో ఉన్నదే. మన సామాజిక దొంతర్లలో నిత్యం కనిపించే

చెడ్తీ

పవిత్రతా, అపవిత్రా భావనలు, పురుషత్వ స్రీత్వాలకు మనం నిర్దేశించుకున్న అర్హతలు, పట్టణ మధ్యతరగతి జీవనవిధానాన్ని ఆదర్శంగా తీసుకొనే ధోరణి, మనంతప్పు ప్రపంచంలో ఇతరులెవ్వరూ లేరనే భావన మన పిల్లల్లో స్టిరపడ్డానికి పాఠశాల సంస్కృతి కూడా సహకరించడం బాధాకరం. దళితులు మొదలైన నిమ్నవర్థాల పిల్లలను, సామాజిక వివక్షకు గురయ్యే సెక్స్‌ వర్కర్ల, హెచ్‌.ఐ.వి. రోగుల పిల్లల్ని ఉపాధ్యాయులేకాదు తోటి విద్యార్థులు కూడా పాఠశాలలో హీనంగా చూస్తారు. భవిష్యత్తులో భార్యలుగా, తల్లులుగా తప్ప తమ సామర్థాల్ని హక్కుల్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఆడపిల్లల్ని చూడకపోవటం మరొక దుర్లక్షణం. ఇక వికలాంగులైన పిల్లల అవసరాల్ని గురించి ఎవరూ పట్టించుకోరు. పాఠశాల వాతావరణం వాళ్ళ సమస్యలపట్ల ఏమాత్రం స్పందించేదిగా ఉండదు. నిమ్న కులాలవారు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు తరగతిలో వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుంది. ఎట్టి పరిస్థితుల్లోను వీరికి అవకాశాల్ని నిరాకరించకూడదు. అలాంటి వాతావరణాన్ని పాఠశాలలు ప్రయత్నపూర్వకంగా కల్పించాలి. విద్యార్థులందర్ని అభ్యాసకులుగా మాత్రమే గుర్తించే సంస్కృతి మన స్కూళ్ళలో ఏర్పడాలి. ప్రతి బిడ్డ ఆసక్తి, సామర్ధ్యం వికసించే విధంగా పాఠశాల వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. పోటీ సామర్ధ్యం

పోటీతత్వం మీద అతి శ్రద్ధ పెట్టడం, వ్యక్తిగత విషయాల్ని ఆకాశానికెత్తడం ఇటీవల బాగా పెరిగింది. పట్టణ మధ్యతరగతి వర్గాల పిల్లలుండే స్కూళ్ళలో ఇది మరి పెరిగింది. పిల్లలు చేరీచేరకముందే వారిని సముదాయాలుగా విభజిస్తున్నారు. ఏడాది పొడుగునా చేసేప్రతిదాన్నీ జమచేసి, సంవత్సరం చివర మొత్తం తూకంవేసి ఆ సముదాయానికి బహుమతులిస్తున్నారు. దీనివల్ల జరిగేదేమిటి? అందరు పిల్లలు వీటిలో భాగస్వాములు కాలేరు. విజయంకోసం తమ సముదాయానికి పాయింట్లు సంపాదించుకోవడమే పిల్లల లక్ష్యంగా మారుతుంది. ఇది విద్యా లక్ష్యాలకే విఘాతం కల్గించే అంశం. ఇలాంటి పోటీ ఎక్కడికి దారితీస్తుంది? పిల్లలు తమ తృప్తికోసమో, తమ ప్రతిభను పెంచుకోడమో పనిచెయ్యడం మానేసి ఇతరులకంటే మిన్నగా కనిపించడానికే పనిచేస్తారు. ఇదే వారి లక్ష్యంగా మారుతుంది. ఇది పిల్లల మధ్య ఉండాల్సిన సామాజిక సంబంధాల్ని కూడా దెబ్బతీస్తుంది. పరస్పర సహకార స్వభావాన్ని ఇతరుల్ని అర్ధం చేసుకొనే లక్షణాన్ని కూడా ఇది దూరం చేస్తుంది. పాఠశాల జీవితంలోని ప్రతి పాఠ్యాంశానికి ఈ పోటీతత్వ ధోరణి ఎలా విస్తరిస్తోందో, ఆసక్తిని అభ్యసన (క్రమాన్ని వేగిరం చేసే బదులు నియంత్రణను, క్రమశిక్షణను ఎలా పెంచి పోషిస్తుందో ఉపాధ్యాయ వర్షం గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైంది.

అవి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్‌ పాఠశాలలు కావచ్చు. తీవ్రమైన పోటీని ప్రోత్సహించే స్కూళ్ళను ఆదర్శంగా మనం తీసుకోకూడదు. అందరికీ ఒకేరకమైన స్కూళ్ళు ఉండాలని కొఠారీ కమీషన్‌ పేర్కొనింది. ఇదిప్పుడు మరింత అవసరం. అప్పుడు మాత్రమె మనం రాజ్యాంగంలో నిర్ధశించుకొన్న విలువలు సాధ్యం. ప్రతి బిడ్డా ఆనందంగా, నిబ్బరంగా

35

వుండగల్టినప్పుడే పాఠశాలల్లో రాజ్యాంగం చెప్పిన ఈ విలువల్ని సాధించగలం. గతంకంటే ఇప్పుడిది మరింత అవసరం. ఎందుకంటే సార్వత్రిక విద్య ప్రస్తుతం మన లక్ష్యం. లక్షలాదిమంది పిల్లలిప్పుడు మన స్కూళ్ళలో చేరుతున్నారు. వీళ్ళందర్నీ స్కూళ్ళలో కొనసాగించాలంటే పిల్లల బాల్యాలన్నీ ఒకేరకంగా ఉండవనీ; వాళ్ళ నామర్ధాలు, వ్యక్తిత్వాలు, ఆకాంక్షలు కూడా ఒకేరకంగా ఉండవనీీ ప్రైవేటు పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలు గుర్తించాలి. వివిధ సామాజికార్ధిక సాంస్కృతిక నేపధ్యాలున్న పిల్లలు, వివిధ న్థాయిల సామర్భ్యాలున్న పిల్లలు ఒకేచోట చదువుకొనేటప్పుడు తరగతి గది మరింత ఉత్తేజకరంగా, మరింత సుసంపన్నంగా ఉంటుంది. దీన్ని మన పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు గుర్తించాలి. పాఠశాలల్లో క్రమశిక్షణ

మన స్మూళ్ళలోపిల్లలకు వ్యక్తిగతంగాగానీ, బృందాలుగాగానీ “మంచి, 'సరైని ప్రవర్తనను నిర్ణయించే కొన్ని సాంప్రదాయక నియమాలుంటాయి. ఉపాధ్యాయులకేగాదు (సామాన్యంగా ఇది వ్యాయామోపాధ్యాయుడి పని) స్కూల్లోని పెద్దలందరికీ స్కూల్లో క్రమశిక్షణ అమలుచెయ్యడం ఒక తప్పనిసరి కర్తవ్యంగా ఉంటుంది. తరచుగా కొందరు పిల్లల్ని లీడర్లుగా పెట్టి, తమ అధికారాల్ని టీచర్లు వీళ్ళకి బదలాయిస్తుంటారు. శిక్షించడం, బహుమతులివ్వడం (క్రమశిక్షణలో భాగం. నామాన్యంగా క్రమళిక్షణను అమలుచే సేవాళ్ళెవ్వరూ దీని మంచి చెడ్డల్ని ప్రశ్చించరు. పిల్లల అభివృద్ధిపై దిని ప్రభావాన్ని గురించి పట్టించుకోరు. పిల్లల ఆత్మగౌరవాన్ని అభ్యసనంలో వారి ఆసక్తిని అసలు పట్టించుకోరు. సాటి పిల్లల సమక్షంలో కించపరచడం, శారీరక దండన, తిట్టడం ఇవన్నీ చాలా స్కూళ్ళలో మామూలు విషయాలు. దీర్హకాలికంగా జరిగే అనర్జాల్ని ఏమాత్రం గుర్తించకుండా టీచర్లేగారు తల్లిదండ్రులు సైతం ఈ శిక్షల్ని చాలా అవసరమైనవని ఆహ్వానించడం బాధాకరం.

మన పాఠశాలల నిర్వహణలో కన్పించే ఈ నియమ నిబంధనల్లోని సామంజస్యాన్ని మొదట టీచర్లు ప్రశ్నించాలి. మన విద్యా లక్ష్యాలకివి అవసరమా అని కూడా వీళ్ళు ప్రశ్నించుకోవాలి. మేజోళ్ళు పొడుగ్గా ఉండాలని, వ్యాయామ దుస్తులు తెల్లగా ఉండాలని మనం పెట్టే నిబంధనలకూ విద్యకూ ఏం సంబంధం? ఇవి ఉండడంవల్ల పిల్లలకు బాగా చదువొస్తుందా? కాస్‌రూంలో నిశ్శబ్దంగా ఉండటం, టీచరు అడిగే ప్రశ్నకు ఒక్కరే జవాబు చెప్పడం, సరైన సమాధానం తెలిస్తేనే చెప్పడం లేకుంటే చెప్పకపోవడం ఇవన్నీ మన పిల్లలకు దక్కాల్సిన సమానావకాశాల్ని హరించే అంశాలు. సమానత్వ విలువలకి విఘాతాలు. పిల్లల సహజ అభ్యసన క్రమాన్నివి కుంటుపరుసాయి. “సిలబస్‌ పూర్తి చేసెయ్యడానికి, “తరగతిని అదుపులో పెట్టకోడానికీ ఈ పద్ధతులు పనికొస్తాయేమో గానీ పిల్లలమధ్య సౌహారదం పెంచడానికి మాత్రం ఇవి ఏమాత్రం పనికిరావు.

పిల్లల క్రమబద్ధ అభ్యసనానికీ, ఆసక్తులకీ, సామర్భాలకీ కావల్సింది స్వయంక్రమశిక్షణ. క్రమశిక్షణ వల్ల పిల్లల పనితనం పెరగాలి. ఉత్సాహంతో తమకిచ్చిన పనిని చేసేందుకది తోద్పదాలి. పిల్లలకూ, టీచర్లకూ అది స్వేచ్చనివ్వాలి. స్వయం ప్రతిపత్తి నివ్వాలి. నిబంధనల్ని

చం

రూపొందించేప్పుడు పిల్లల్ని భాగస్వాముల్ని చెయ్యాలి. ఫలితంగా ఆ నిబంధనలెంత అవసరమో వాళ్ళు గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళు వాటిని వొటిన్తారు.

మన సూళ్ళలోకి సమాజాన్ని కూడా ఆహ్వానించాలి. పాఠ్య ప్రణాళికను అమలు చెయ్యడంలోసమాజాన్ని కూడా భాగస్వామిని చెయ్యాలి. స్కూల్లో చెబుతున్న ఒక అంశాన్ని పిల్లల తల్లిదండ్రులు వచ్చి తమ అనుభవాలతో, అవగాహనతో వివరించవచ్చు. ఉదాహరణకు యంత్రాల పాఠాల్ని చెప్పేందుకు స్థానిక మెకానిక్కు బడికి రావచ్చు. తాను ఎలా యంత్రాల్ని రిపేరు చేస్తాడో, దాన్నెలా తాను నేర్చుకొన్నాడో తన అనుభవంతో అతడు వివరించవచ్చు. అలాగే పిల్లలకు ఇంటి భాషను గురించి, దాన్ని పాఠశాల భాషగా మార్చుకోవడాన్ని గురించి మనం చెప్పేటప్పుడు స్థానిక భాష బాగా మాట్లాడగలవారిని పిలిపించవచ్చు. మాతృభాషను బోధించడానికి, దానికవసరమైన సామగ్రిని తయారు చెయ్యడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇదంతా నిర్దిష్ట పాఠ్యాంశాల్ని బట్టీ, స్థానిక నైపుణ్యాల్నిబట్టి, వాటి అందుబాటును బట్టీ ఉంటుంది. ఇలా స్కూల్లో తల్లిదండ్రుల్ని సమాజాన్ని అభ్యసన క్రమంలో భాగస్వాముల్ని చెయ్యాలి. సంస్థాగతంగా మనం చేసే బోధన, మనం చెప్పే సబ్లైక్టుల్లోని అంశాలు దీనివల్ల మరింత పరిపుష్టమవుతాయి.

అన్ని స్కూళ్ళు, పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా చూడాలి. చాలా స్కూళ్ళు తల్లిదండ్రులు ్రళ్ళిస్తే ఒప్పుకోలేవు. వాళ్ళ ప్రశ్నలకి ఏమీ విలువలేనట్టు, అర్ధం లేనట్టు భావిస్తాయి. ప్రైవేటు స్కూళ్ళయితే తల్లిదండ్రుల్ని కేవలం వినియోగదారులుగా చూస్తాయి. స్కూలు విషయాలు నచ్చకపోతే పిల్లల్ని మాన్పించి తీసుకెళ్ళమంటాయి. ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని గూర్చి, స్కూలు విషయాల్ని గురించి తెలుసుకొనే అర్హతే లేనట్టు భావిస్తాయి. మనం ఇంటికి పంపే రిపోర్టు కార్జుల్లో మార్కులు, ర్యాంకులు తప్ప ఏమీ ఉండవు. తమ పిల్లలు బడిలో ఎలా నేర్చుకుంటున్నారో, వాళ్ళకి తాము నిర్దిష్టంగా ఏమి చెయ్యాలో తెలియజేసే విధంగా ఇవి రూపొందించాలి. వాఠ్యపుస్తకాలు, పుస్తకాలు

పాఠ్యప్రణాళికలు రూపొందించడంలో పాఠ్యపుస్తకాలు కీలకమైనవని సర్వత్రా ఒక అభిప్రాయం ఉండి. నిజానికి పాఠర్యప్రణాళికను రూపొందించదాన్ని ఇంతకంటే విస్తృతార్ధంలో మనం చూడాలి. కానీ పాఠ్యపుస్తకాలు మార్చడం తప్ప మరేమీ మనం పట్టించుకోము. పాఠ్యపుస్తకాల్ని మంచి భాషలో రాస్తే సరిపోదు. బాగా డిజైన్‌ చేస్తే సరిపోదు. నైపుణ్యంతో ఎడిట్‌ చేస్తేనూ సరిపోదు. అవి పరస్పర చర్యకు తగ్గట్టుగా ఉండాలి. అయితే వీటికితోడు ఇతర పలురకాలు అభ్యసన సామగ్రి కూడా ఉండడం మరీ అవసరం. ఉదాహరణకు సబ్బ్లెక్టు నిఘంటువుల్నే తీసుకోండి. మన పాఠ్యపుస్తకాలు నిర్వచనాలతో, పారిభాషికాలతో, విజ్ఞాన సర్వస్వాల్లా మారేప్రమాదం వీటివల్ల తప్పుతుంది. ఉపాధ్యాయుడు పాఠ్యాంశభావనలు మాత్రం బోధిస్తే సరిపోతుంది. క్లాస్‌రూం బోధనలో వేగం, బోలెడు హోంవర్క్‌ (పైవేటు ట్యూషన్లు మన చదువుల్లో ఒక త్రికోణం. ఇదే తీవ్రమైన ఒత్తిడికి మూలం. పాఠ్యగ్రంథ రచయితలు

త్ర /

భావనల వివరణకు, కృత్యాలకు, ఆలోచనల్ని రేకెత్తించే అభ్యాసాలకు, చిన్నచిన్న సమూహాలుగా పిల్లలు చెయ్యగల ప్రాజెక్టులకు పాఠ్యగ్రంథాల్లో ప్రాధాన్యత నిచ్చి, నిర్వచనాల్ని సబ్జెక్టు నిఘంటువులకు వదిలెయ్యడం మంచిది. (గ్రంథాలయాలు

వొాఠశాల గ్రంథాలయాల గురించి ఎంతోకాలంగా ఎన్నో సిఖార్సులున్నాయి. కానీ స్కూళ్ళలో వీటి స్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మన భవిష్యత్‌ ప్రణాళికల్లో అన్ని స్థాయిల్లోనూ గ్రంథాలయాలకు మనం పెద్దపీట వెయ్యాలి. ఇది చాలా అవసరం. గ్రంథాలయాల్ని అభ్యసనానికి, ఆహ్లాదానికి, ఏకాగ్రతకు ఎలా ఉపయోగించుకోవాలో పిల్లలకూ, టీచర్లకూ ఇద్దరికీ శిక్షణ అవసరం,

వొఠశాల దైనందిన కార్యక్రమాల్లో గ్రంథాలయం పలురూపాల్లో ఉపయోగపడుతుంది. వారానికొకరోజు గ్రంథాలయంకోసం కేటాయిస్తే సరిపోదు. పుస్తకాలు చదవడంలోని రుచి ఇంతమాత్రాన ఒంటబట్టదు. బయటికి తీసుకెళ్ళేందుకు వీలుగా పిల్లలకు పుస్తకాలివ్వాలి. ఎలా ఇవ్వాలో, ఎలా తిరిగి తీసుకోవాలో, టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. గ్రంథాలయానికి మంచి గది ఉంటే అందులో పిల్లలు కూచుని చదువుకొనేందుకు బల్లలు సమకూర్చాలి. తగిన వెలుతురు ఉండేలా చూడాలి. గ్రంథాలయంలోనే టీచరు క్లాసును నిర్వహించుకోవచ్చు. వసతిని బట్టీ దీన్ని ఒక చర్చాస్థలంగా మార్చవచ్చు. ఒక వృత్తి నిపుణుడిచేత ఇందులో ప్రదర్శన ఇప్పించవచ్చు. కథలు చెప్పించవచ్చు. క్లస్టర్‌, బ్లాకు స్థాయి (గ్రంథాలయాలు ఏర్పడితే ఇది టీచర్లకు తమ పాఠ్యప్రణాళికల్ని రూపొందించుకోవడంలో ఎంతో తోడుగా ఉంటాయి. ఒక్కో బ్లాకు (గ్రంథాలయం ఒక్కో ప్రత్యేక విషయక (గ్రంథాలతో, సమాచారంతో నిండివుంటే మొత్తం జిల్లా గ్రంథాలయానికి ఒక సంపూర్ణత, సమగ్రత వస్తుంది. విద్యా సాంకేతిక పరిజ్ఞానం

పాఠ్యప్రణాళికా తయారిలో విద్యాసాంకేతిక జ్ఞానం ఎంత ముఖ్యమైందో ఇప్పుడు మనమందరం గుర్తిస్తున్నాం. కానీ దాన్ని వీలున్నంత ఎక్కువగా వాడుకొనేందుకవసరమైన వ్యూహాలు, ఏర్పాట్లు అందుబాటులోకి తెచ్చుకోలేకపోయాం. సామాన్యంగా మనం సాంకేతిక విజ్ఞానాన్ని విస్తరణ మాధ్యమంగా ఉపయోగిస్తాం. ఉపాధ్యాయుల నియామకాల్లో సరైన పద్ధతులులేని ప్రాంతాల్లో మంచి ఉపాధ్యాయులు లేని కొరతను దీంతో తీర్చుకొంటాం. నాణ్యమైన బోధన కోసమే విద్యాసాంకేతిక విజ్ఞానాన్ని వాడేటట్టయితే దీనివల్ల టీచర్లకు బోధనపట్ల విశ్వాసం సడలుతుంది. పాఠ్యప్రణాళిక సంస్కరణకు ఈ సాంకేతిక విజ్ఞానాన్ని సాధనంగా మనం వాడుకోవాలంటే మెజారిటీ టీచర్లను, పిల్లలను మనం కేవలం వినియోగదారులుగా చూడగూడదు. ఉత్పత్తిదారులుగా చూడాలి.

ఇప్పటికే లభిస్తున్న నాణ్యమైన ఆడియో వీడియో సామగ్రిని, ఇంటర్నెట్‌ నుంచి లభించే సమాచారాన్ని ఉపయోగించుకొని మన పాఠ్యగ్రంథాల్లో, ఉపాధ్యాయ కరదీపికల్లో

౩38

మార్పులు తేవాలి. పాత, గొప్ప సినిమాల్ని కూడా ఇందుకోసం వాడుకోవచ్చు. ఉదాహరణానికి గ్రామీణ జీవితాన్ని గురించి పిల్లలు చదువుతున్నప్పుడు సత్యజిత్‌రే గారి 'పథేర్‌ పొంచాలిని చూపొచ్చు. ఇందుకోసం క్లస్టర్‌ రిసోర్సు సెంటర్సును, వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు. మన భవిష్యత్‌ పాఠ్యపుస్తకాల్లో వివిధ సబ్జెక్టుల జ్ఞానం సమ్మిశ్రితంగా లభించాలి. ఉదాహరణకు రాజస్థాన్‌ చరిత్రని పిల్లలు చదువుతుంటే మీరాబాయి భజనగీతం పిల్లలకందుబాటులో ఉండాలి. అది ఏ ప్రాచీన భాండాగారం నుంచి సంపాదించారో పిల్లలకు చెప్పాలి. యం.యస్‌. సుబ్బులక్ష్మి పాడిన ఆ గీతాన్ని విన్పించాలి. ఇన్ని అనుభవాలు ఒకేసారి లభించినపుడు పిల్లలు జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా స్వంతం చేసుకోగల్లుతారు.

ఇలా అనుభవం, జ్ఞానం దగ్గరైనపుడు ఇప్పటిలా చదువు భారమనిపించదు, విసుగనిపించదు. బహుళ పాఠ్యగ్రంథాలు, ప్రత్యామ్నాయ నామగ్రి

భారతీయ సమాజం బహుళత్వంతో, వైవిధ్యంతో కూడింది. ఎంతో వైవిధ్యం గల పాఠ్యగ్రంథాలు, సామగ్రి రూపొందించుకునేందుకు మనకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సామగ్రి మన పిల్లల సృజన శీలతను, భాగస్వామ్యాన్ని ఆసక్తిని పెంచి అభ్యసనానికి దోహదపడుతుంది. వివిధ సమూహాల పిల్లల వివిధ అవసరాలకు సరిపోయే ఒకే పాఠ్యపుస్తకం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అంతేగాక ఒకే విషయాన్ని భావనను పలు పద్ధతుల్లో బోధించవచ్చు. ప్రభుత్వ స్మూళ్ళుగాని, ప్రైవేటు స్కూళ్ళుగాని తమకు నచ్చిన పాఠ్యపుస్తకాల్ని ఎంపికచేసుకొనే అవకాశం ఉండాలి. అలాగే పుస్తకాలను రూపొందించే సంస్థలు, బోర్డులు . కూడా రకరకాల పుస్తకాలను తయారుచేయాలి. ఇతర ప్రచురణ సంస్థలకు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలి. పాఠ్య పుస్తకాల్లోని లోపాలను తొలగించేందుకు సెకండరీ విద్యాకమిషన్‌ 1958కు ముందే “ఏ సబ్జెక్టుకు కూడా ఒకే పాఠ్య పుస్తకాన్ని నిర్దెశించకూడదు. నిర్దిష్ట ప్రయోగాలకు లోబడి వీలున్నన్ని పుస్తకాలుండాలి. వీటిలో నచ్చిన వాటిని ఎంపికచేసుకునే అవకాశం ఆయా పాఠరశాలలకుండాలి” అని సిఫార్సు చేసింది. అలాగే కొఠారీ కమీషన్‌ నివేదికలోని “పాఠ్యప్రణాళికాభివృద్ధిలో తప్పనిసరి అంశాలు” అనే భాగంలో కూడా మన పాఠ్య పుస్తకాల ప్రస్తావన ఉంది. మనం తాత్కాలిక పద్ధతిలో పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని, రాష్ట్ర కేంద్రంలో తయారుచేసి అన్ని స్కూళ్ళు వీటిని ఒకేవిధంగా ఉపయోగించాలని ఆదెశిస్తామని ఈ నివేదిక పేర్కొంది. దీనివల్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉండదు. మన పాఠ్యప్రణాళిక సంస్కరణకోసం చేసే ఏ (ప్రయత్నమైనా విజయవంతం కావడం పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ కరదీపికలు, ఇతర బోధనాసామగ్రి తయారుచేయడంలో పాటించే మెళకువల మీద ఆధారపడివుందని కూడా కొఠారీ కమీషన్‌ పేర్కొంది.

వం /.

పాఠ్యప్రణాళికలో భాగమౌతుంది. అది ఎక్కడ చేయబడింది. ఎలా చేయబడింది అనే దానితో సంబంధంలేదు. మన పాఠ్యప్రణాళికను గురించిన ఈ శాస్త్రీయమైన అవగాహనను గురించి మన అధికారులకు కూడా ఒక అవగాహన ఉండాలి. వారి మద్ధతు, ఆమోదం లేకుంటే ఇలాంటి ప్రయత్నాలు ముందుకుపోలేవు. వనరుల సమీకరణ నిర్వహణ బోధనోపకరణాలు, ఇతర సామగ్రి, పుస్తకాలు, ఆటవస్తువులు బడిని పిల్లలకు ఆహ్లాదకరంగా మారుస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో డి.పి.ఇ.పి. నిధుల్ని ఉపయోగించుకొని మంచి బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో చాలా సామగ్రి లభిస్తోందికూడా. టీచర్లకు, క్లస్టర్‌, బ్లాకుస్థాయి రిసోర్స్‌పర్సన్స్‌కు వీటి వివరాలు, వాడే విధం తిలిసివుండాలి. కొన్ని చిన్న సంస్థలు, స్వచ్చంద సంస్థలుకూడా ఇలాంటివి తయారుచేస్తున్నాయి. ఇవిగాక స్థానికంగా ఏమీ ఖర్చులేకుండా లభించే వస్తువులుకూడా ఉంటాయి. ఇవికూడా మన స్కూళ్ళకు ప్రత్యేకించి ప్రాథమిక స్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. టీచర్లు రకరకాల సామగ్రిని సేకరించుకోవాలి. మ్యాపులు, బొమ్మల ఫోల్డర్లు లాంటివి క్లస్టర్‌ రిసోర్సు సెంటర్లలో ఉండాలి. అక్కడనుంచి స్కూళ్ళు తెచ్చుకొని ఉపయోగించుకొని తిరిగివ్వాలి. తర్వాత మరో స్కూలు తీసుకొంటుంది. ఇలా పంచుకోవాలి. అయితే ఇదంతా జరగాలంటే నిధులందాలి. దురదృష్టవశాత్తు చాలినంత నిధులు లభించడంలేదు. పిల్లల్ని భాగస్వాముల్ని చేసి, వారి అవగాహనను పెంచాలంటే ఇలాంటి సామగిని ఉపయోగించుకోవదానికి సరైన ప్రణాళిక ఉండాలి. క్లాసులో వాటిని ప్రదర్శించడానికి ఉపాధ్యాయులు ముందుగా సిద్ధం కావాలి. దీనికో ప్రణాళికంటూ ఉంటే పిల్లలకు (గ్రూపులుగాగానీ, వ్యక్తిగతంగాగానీ అందరికీ ఈ సామగ్రి అందించడానికి వీలవుతుంది. అలాగాక ఒక విద్యార్థికి దీన్ని ఇచ్చి మిగిలిన వాళ్ళంతా ప్రేక్షకుల్లా కూచోబెడితే ఏ ఫలితమూ ఉండదు. సమయం పాఠశాల బోధనా సమయాన్ని గురించి గత డాక్యుమెంట్లన్నీ ప్రస్తావించాయి. వీటినుంచి మనం గుర్తించాల్సిందేమంటే మనం ఎట్టి పరిస్థితుల్లో సంస్థ పనిదినాల విషయాల్లో రాజీపడడానికి వీల్లేదు. సంవత్సరానికి 200 పనిదినాలుండాలని 10౯ (1988) పేర్కొనింది. 10% వివిధ సబ్జెక్టులకోసం నిర్దేశించిన సమయాన్ని ఒక మార్గదర్శకంగా మనం భావించవచ్చు. 40

స్థానిక వాతావరణాన్నిబట్టి మన వార్షిక ప్రణాళికలో చాలా మార్పులు అవసరం కావచ్చు. ఉదాహరణకు రుతుపవనాల్ని వరదల్ని దృష్టిలో ఉంచుకొని ఆరోజుల్లో స్కూళ్ళకు సెలవులివ్వొచ్చు. వేసవికాలం పిల్లలు బయట ఆడుకోవడం కూడా కష్టంగాబట్టి స్కూళ్ళు పెడితే మంచిదని కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు అడుగుతుంటారు. పంట కోతకొచ్చిన సమయంలో సెలవులిస్తే పనుల్లో పిల్లలు పాల్గొనే అవకాశం ఉంటుందనే డిమాండు కూడా ఉంది. దీనివల్ల పిల్లలు తాము జీవిస్తున్న ప్రపంచం నుంచి కూడా ఎంతో నేర్చుకోవడానికి వీలుంటుంది. చదువుపేర స్కూలు కోసం స్థానిక, స్వంత సమాజం నుండి వేరుపడకుండా ఉండగల్టుతారు. బతకడానికి అవసరమైన నైపుణ్యాలు కూదా సంపాదించుకొంటారు.

అయితే ఇలా పని సమయాల్ని ఎక్కడి పరిస్టితులకనుగుణంగా అక్కడ సరళతరం చేసుకోవడంలో జాగ్రత్త పడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక సమాజం సాంప్రదాయిక సాంస్కృతికాచారాల్ని బడిలోకి చొప్పితే ప్రమాదం ఉంది. ఎక్కువగా ఇవి కులం, మతంపై ఆధారపడి స్రీలపట్ల విచక్షణ చూపేలా ఉండే ప్రమాదమూ లేకపోలేదు బాలకార్మికుల్ని ప్రోత్సహించడంగా కూడా మన వ్లానింగు మారగూడదు. పిల్లలకు ఆడుకోవడానికి విశ్రాంతిగా ఉండటానికి అవకాశం ఉండాలి. ఇది వారి హక్కు

[గ్రామ పంచాయతీలతో సంప్రదించి పిల్లలు నడిచి బడికి రావడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల పనివేళల్ని పాఠశాల స్థాయిలో నిర్ణయించాలి. పనివేళల్ని సరళం చెయ్యడం పిల్లలందరూ బడికి సకాలంలో రావడానికి మాత్రమే ఉద్దేశించిందని మరిచిపోగూడదు. ఇలా చేసేపుడు పాఠశాలల్లో పిల్లలుందే కాలం, అభ్యసనం సాగే కాలం ఏ పిరిస్టితుల్లోనూ 6 గంటల కంటె తగ్గకుండా (బాల్యారంభ కేంద్రాలకు మూడు గంటలు) జాగ్రత్త పడాలి. పిల్లలు, టీచర్లు దూరంనుంచి బడికి రావల్సివచ్చే పరిస్థితి ఉంటే బస్సులు తదనుగుణంగా వచ్చేలా సమాజం చూడాలి. ఆలస్యంగా వచ్చి, ముందుగా వెళ్ళే పరిస్థితి " మాత్రం ఉండకూడదు.

చాలా డాక్యుమెంట్లు పీరియడ్‌ అంటే 45 నిమిషాలుగా ఉండాలని, అలా టెంటేబుల్‌లో కేటాయించుకోవాలని చెపుతున్నాయి. కానీ సామాన్యంగా ఇది 30-35 నిమిషాలుగా మాత్రమే ఉంటోంది. అభ్యాసానికిదే మాత్రం న్యాయమైందికాదు. మనం పీరియడ్‌ను ప్రాథమిక యూనిట్‌గా పరిగణిస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లోని పాఠాల్నికూడా పీరియడ్‌ యూనిట్‌గా పెట్టుకొని మనం బోధిస్తుంటాం.

ఈ (ప్రాధాన్యతను మనం మనస్సులో ఉంచుకోవాలి. హస్తకళలు, (ప్రాజెక్టులు, ప్రయోగాల్లాంటి వాటికోసం పెద్ద పీరియడ్లు ఉండాలి. గంట, ఒకటిన్నరగంట (రండు పీరియడ్లు) ఉండే పెద్ద పీరియడ్లు ఇలాంటి వాటికవసరం. ఇలాంటి పీరియడ్గ్లు ఒక సబ్దెక్టుకు పరిమితంకాని అంశాల బోధనకు, గ్రూపు కృత్యాలకు కూడా కావల్సి వస్తాయి. బహుళన్థాయి తరగతుల్లో టీచరు చెప్పడానికి, పిల్లలు స్వయంగా చెయ్యడానికి, రెండుమూడు (గ్రేడ్ర పిల్లలు కలిసి

ర్త

చెయ్యడానికి తగ్గట్టుగా పీరయడ్లు ఉండాలి. వారం టైంటేబుళ్ళలో భిన్నత్వం ఉండాలి. భాష, గణితం లాంటి సబ్జెక్టులకు ప్రతిరోజూ పీరియడ్‌ ఉండాలి. మిగిలినవాటికా అవసరం ఉండదు. వారం టైంటేబిళ్ళలో భిన్నత్వం కన్పించాలిగానీ అది సమతుల్యంగా ఉండేలా చూచుకోవాలి. మొత్తంమీద వివిధ సబ్జెక్టులు నేర్చుకోడానికి ఎంత సమయం అవసరం అనేది గమనించి, ప్లాన్‌ చేసుకోవాలి. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేపుడు తక్కువ సమయమే సరిపోవచ్చు. ఎక్కువ సమయం పట్టొచ్చు. వాస్తవిక దృష్టితో వీటిని గుర్తించి వారం టైంటేబిల్‌ రూపొందించుకోవాలి. ఉవాధ్యాయుడికి స్వతంత్ర ప్రతిపత్తి, వృత్తి స్వేచ్చ

పిలల రకరకాల అవసరాలకు తగిన అభ్యసన వాతావరణం ఉండాలంటే ఉపాధ్యాయుడికి స్వయంప్రతిపత్తి అవసరం. స్వేచ్చ, సరళత, గౌరవం విద్యార్ధిింత అవసరమో ఉపాధ్యాయుడికి అంతే అవసరం. ప్రస్తుత పాలనా వ్యవస్థలోని దొంతరలు, నియంత్రణ, పరీక్షలు, కేంద్రీకృత పాఠ్యప్రణాళికా రచన మొదలైనవన్నీ ఉపాధ్యాయుడి స్వేచ్చకు, ప్రధానోపాధ్యాయుడికి స్వతంత్రతకు అడ్డంకిగా ఉన్నాయి. ఒకవేళ పాఠ్యప్రణాళిక స్వేచ్చ ఇచ్చినప్పటికీ తాము చేసేది సరిగాలేదని అధికారులు ఎక్కడ తప్పుపడతారోనని టీచర్లు భయపడుతుంటారు. అందువల్ల తరగతి గదిలో, పాఠశాలలో మనం ఎలాంటి ప్రజాస్వామిక సంస్కృతి ఉండాలని కోరుకుంటున్నామో పాలనా వ్యవస్థలోకూడా అదే ప్రజాస్వామిక సంస్కృతి అవసరం. ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇవ్వడమేగాదు వాళ్ళు చెప్పేదికూడా వినాలి. అధికారులు తీసుకునే నిర్ణయాలు నేరుగా క్లాస్‌రూం జీవితాన్ని సంస్కృతిని ప్రభావితం చేస్తాయన్న సంగతి మరిచిపోకూడదు. అలాగే ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మధ్య సమానత్వం, పరస్పర గౌరవం ఉండాలి. ఒకరితోఒకరు సంప్రదించుకుని, చర్చించుకుని మాత్రమే నిర్ణయాలు చేయాలి. మన సంవత్సర, మాస, వార క్యాలెండర్లలో ఇలాంటి చర్చల్నికూడా చేర్చాలి. ఉపాధ్యాయుల మధ్య కూడా సమిష్టి కృషికి అవసరమైన ఏర్పాటు ఉండాలి. ఘర్షణ ఏర్పడితే తొలగించుకునేందుకు తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి.

  1. సంస్థాగత సంస్కరణలు

సామాజిక స్పృహతోకూడిన విద్యావిలువల ఆధారంగా రూపొందించిన జాతీయ వాఠ్యప్రణాళికాంశాల్ని గత అధ్యాయాల్లో చర్చించాము. పిల్లలు స్వయంగా, సమిష్టిగా తమకు తాము పాల్గొనడంద్వారా జ్ఞానాన్ని నిర్ణయించుకొంటారని ఇందులో (ప్రధానంగా ప్రతిపాదించాము. పిల్లల్ని కేవలం గ్రహీతలుగా చూడగూడదని చెప్పుకొన్నాము. ఇలాంటి దృక్పథానికి వ్యవస్థాగతమైన సపోర్టు అవసరం. పేదపిల్లల్ని దగ్గరకుతీసి, వారి అభ్యసన నామర్భాన్ని వికసింపజేసే సంస్థలు మనకిప్పుడు కావాలి. దీనికి కావల్సిన వాటిలో మొదటిది పర్యవేక్షణ ద్వారా, అకడమిక్‌ నాయకత్వం ద్వారా ఉపాధ్యాయులకు అందాల్సిన సహకారం. రెండోది పాఠ్యపుస్తకాల్ని పాఠ్యసామగ్రిని రూపొందించడం. మూడవది వికేంద్రీకరణ,

ర్తీ2

పంచాయతీ సంస్థల భాగస్వామ్యం. నాల్గవది అతి ముఖ్యమైంది మన పరీక్షా విధానం. నాణ్యత పట్ల (శ్రద్ధ వివిధస్థాయిల్లో నాణ్యతగల విద్యనందించడం ఎలా అన్నదే పాఠ్యప్రణాళికా సంస్కరణల్లో కీలకమైంది. ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఏమిటి? దీన్నెలా మనం మార్చుకోవాలి? అనేవి మనముందున్న సమస్యలు. మొదట జ్ఞానాన్ని సమాచారాన్ని కలగాపులగం చేసి గందరగోళపడకూడదు. ఈ ధోరణి పైనుంచి కిందికి రకరకాల సమాచారాల్ని బదలాయించడాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది. పిల్లల జ్ఞానాభివృద్ధికి సంబంధించి కొన్ని సూత్రాలున్నాయి. అభ్యసనం అనేది ఒంటరిది కాదు, అదొక సమగ్ర పద్ధతి. ౬౯, 1986, 9౨04, 1992 నొక్కి చెప్పిన విధంగా మన పాఠ్యప్రణాళిక పిల్లల వాస్తవ సందర్బాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందాలి. అది సరళంగా ఉండాలి. వివిధ ఆలోచనలకనువుగా ఉండాలి. ఛటోపాధ్యాయ కమిషన్‌, 1984 ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాల్ని గురించి అనేక సిఫార్సుల్ని చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు, సర్వీసుకు ముందు, సర్వీసు మధ్యలో వారికిచ్చే శిక్షణలు, వారి పని నిబంధనలు ఈ సిఫొార్ప్సులకనుగుణంగా ఉండాలి. క్తాస్‌ రూం బోధనలోనైనా, ఉపాధ్యాయ శిక్షణలోనైనా కృత్యాలమీద ఆధారపడ్డ అనుభవమే (ప్రధానం. విద్యాసాంకేతిక విజ్ఞానం దీనికి సహాయకారిగా ఉండాలితప్ప ప్రత్యామ్నాయం కారాదు. నాణ్యత అనేది బోధనకో, సాధనకో ఒక రూపమేకాదు. అది వ్యవస్థాగతంగా ఉందే అంశం. దీన్ని మనం మనసులో ఉంచుకోవాలి. తన బలహీనతల్ని తాను సరిచేసుకొని, నూతన సామర్ధాల్ని సంతరించుకోవడం, తననుతాను సంస్కరించుకోవడానికి సిద్ధపడడం వ్యవస్థలో రావల్సిన కీలకమైన మార్పులు. వ౦0గ “మన విద్యా వ్యవస్థ మరింత సరళంగా ఉండేలా ఆధునీకరింపబడాలి” అని చెప్పింది. ఇప్పుడు సరిగ్గా జరగాల్సింది ఇదే. వికేంద్రీకృత వ్యవస్థకు అనుగుణంగా మన పాఠ్యప్రణాళిక, శిక్షణా పద్ధతులు మారాలంటే స్పష్టమైన నిర్దిష్టమైన సంస్కరణలు అవసరం. ఇందుకోసం ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి.

  • సామగ్రి కొనుగోలు, స్ధానిక సంస్థ్టలతోసమన్వయం, ప్రైవేట్‌ స్కూళ్ళతో భాగస్వామ్యం లాంటి విషయాల్లో పాఠశాలలకు స్వతంత్ర నిర్ణయాధికారం.

  • సిలబస్‌ రూపకల్పనలో, పాఠ్య గ్రంథాల తయారీలో, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతవాఠశాలల మధ్య అనుసంధానం. ర్త

  • _సిలబసు, పాఠ్యపుస్తకాలు రూపొందించేందుకు ఉన్నత విద్యాసంస్థల నుంచి నిపుణుల్ని ఉపాధ్యాయుల్ని తీసుకొనేందుకు వ్యవస్థాగత ఏర్పాట్లు. ఆ న్థానికసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలసి పనిచేసి పాఠశాల సామర్దాన్ని పరిపుష్టంచేసేందుకు అవకాశాలు కల్పించడం. జా నిర్ణయాధికార సంస్థలకు, స్వచ్చంద సంస్థలకు మధ్య సహకారం,

  • _ విధాన నిర్ణయాలు చేసే పలు దొంతరల సంస్థల మధ్య మరింత సంబంధం, పారదర్శకత. నాణ్యతకోసం విద్యా ప్రణాళికా పర్యవేక్షణ వాఠశాల విద్యకోసం ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రణాళికలు ఎక్కువగా "పైనుంచి కిందికి దిగుమతి అయ్యేవిగా ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల్లోని అంశాలు ఆ సంవత్సరంలో బోధించేందుకు ఎంత బోధనా సమయాన్ని వేటాయించుకోవాలి అనేదానిపైనే ఈ ప్రణాళికలు కేంద్రీకరిస్తున్నాయి. దీంతోపాటు పాఠశాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలకు కేటాయించుకోవలసిన సమయాన్ని గురించి కూడా ఈ ప్రణాళికలు మనసుపెడుతున్నాయి. ఎక్కువగా వీటిని 5052%, పాఠశాల విద్యా డైరెక్టరు కార్యాలయం రూపొందించి ఇవి రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళలో ఒకే విధంగా అమలుకావాలని నిర్దేశిస్తుంటాయి. కానీ కొఠారి కమీషన్‌ దీనికి ఖీన్నంగా పాఠశాల స్థాయి (ప్రణాళిక అవసరమని నొక్కిచెప్పింది. ప్రతి పాఠశాలకు ఒక సంస్థాగత ప్రణాళిక, నిర్దిష్టాలంలో చేయవలసిన ప్రోగ్రాం ఉండాలని సూచించింది. ఉపాధ్యాయుల మధ్య, ప్రధానోపాధ్యాయుడి మధ్య భాగస్వామ్య విధానం ఉంటేనే అర్ధవంతమైన విద్యాప్రణాళిక రూపొందుతుంది. ఈ (ప్రణాళికలో స్థానిక భౌతిక వనరుల్ని వాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ఒక ముఖ్యాంశంగా ఉండాలి. రెండో అంశం పిల్లల వివిధ అవసరాల్ని ఈ ప్రణాళిక గమనంలో ఉంచుకోవాలి. దీనికనుగుణంగా ఆ పాఠశాలకి ఏరకమైన సహకారం అవసరమో ఇందులో ఉండాలి. పాఠశాల ప్రణాళికల్లో విస్తృత సమాజం నుంచి పిల్లల విద్యకోసం ఎలాంటి మద్దతును, సహకారాన్ని కూడగట్టాలో పేర్కొనడం చాలా అవసరం. పాఠశాల విద్యా కమిటీల్లాంటి రాజ్యాంగబద్ధ సంస్థల భాగస్వామ్యాన్ని గురించి కూడా ఈ ప్రణాళికల్లో పేర్కొనాలి. పాఠశాలకు సంబంధించిన అన్ని వివరాలతోకూడిన రిపోర్టులు (బడికిరాని పిల్లలు, హాజరు ధోరణి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు మొదలగునవి) గ్రామస్థాయిలోనే తయారుకావాలి. ఇలాంటి రివోర్టువల్ల వాస్తవిక దృక్సథంతో మన అవసరాల్ని తీర్చేందుకు కావల్సిన మానవ వనరుల్ని గుర్తించే వీలుంటుంది. పాఠశాలలకు మరింత స్వాతంత్ర్యం లభించాలంటే, అవి తమ ప్రణాళికల్ని స్వేచ్చగా అమలుచేసుకునే అవకాశం ఉండాలంటే రకరకాల పథకాలకు సంబంధించిన కేటాయింపుల్లో సరళత ఉండాలి. పారదర్శకత, జవాబుదారీతనం కూడా నిధుల కేటాయింపులోను, ఖర్చు చేయడంలోను కనిపించాలి. రాష్ట్ర కేంద్రం నుంచి, జాతీయ కేంద్రం నుంచి రూపొందించిన కార్యక్రమాలకు యూనిట్‌ ఖర్చుల లక్కల్ని తయారుచేసి కిందికి పంపే పద్ధతికి బదులు అట్టడుగు న్ధ్థాయినుంచి ర్న

నాణ్యమైన ప్రణాలికల్ని రూపొందించుకునే విధానం అవసరం. అప్పుడే ఉపాధ్యాయులకు, పాఠశాలలకు 'స్వయం ప్రతిపత్తి, “ఎంపిక చేసుకునే అవకాశం” ఉంటుంది. పిల్లల అవసరాలను తీర్చడంలో పాఠశాలకున్న బాధ్యతలు కూడా స్పష్టంగా ఉంటాయి. మొదట పాఠశాల న్థాయినుంచి (ప్రారంభించి, క్షస్టరు స్థాయిలో, తర్వాత బ్లాకు స్థాయిలో తమ అవసరాలకు తగినట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అప్పుడు న్యాయమైన జిల్లా ప్రణాళిక రూపొందుతుంది. ఖచ్చితమైన లక్ష్యాల్ని నిర్దేశించటం, వాటిని అమలుచేసే బాధ్యతల్ని నిర్ణయించడం కూడా అన్ని స్థాయిల్లో అప్పుడే సాధ్యమవుతుంది.

ప్రస్తుతం పాఠశాల నాణ్యతను పెంచడం అనే పేరుతో రకరకాల కార్యక్రమాల్ని రుద్దుతున్నారు. ఆరోగ్యం, పర్యావరణం లాంటి సామాజిక విషయాలుకూడా పాఠశాల కార్యక్రమాలుగా మారుతున్నాయి. ఇవన్నీ ప్రధానోపాధ్యాయులపై పడుతున్నాయి. ఈ కార్యక్రమాల లక్ష్యాలపట్ల నిర్వహణపట్ల స్పష్టత ఎవ్వరికీ ఉండదు. చాలా సందర్భాల్లో ఇవి కలగాపులగంగా ఉంటాయి. పాఠశాల ప్రణాళికలు రూపొందించెటప్పుడు ఇలాంటివి తమకెంత అవసరమో, వీటిని పాఠశాల కార్యక్రమాలలో అంతర్తీనం ఎలా చేయవచ్చో చర్చించాలి. వీటిని ఆ తరువాత క్లస్టరు, బ్లాకు స్థాయిల్లో సమన్వయం చేయాలి.

పాఠశాల పర్యవేక్షణను సాంప్రదాయికంగా ఇన్‌స్పెక్టర్లు చేస్తుంటారు. ఎక్కువగా అధికారం చెలాయించడం, నియంత్రించడం తప్ప ఈ వ్యవస్థ ఉపాధ్యాయులకి అకడమిక్‌ సహకారం అందించేదిగా ఉండడంలేదు. అప్పుడప్పుడు పాఠశాలల్ని సందర్శించే పనితోపాటు ఈ ఇన్‌ స్పెక్టర్లకు బోలెడు ఇతర పనులు కూడా ఉంటాయి. వీళ్ళు సామాన్యంగా స్క్మూళ్ళను ఎప్పుడో సందర్శిస్తారు. ఆ సమయానికి వాస్తవ పరిస్థితులు కనిపించకుండా పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి బడిని బాగా తీర్చిదిద్దుతారు. దింతో పర్యవేక్షణ సానుకూలంగా ముగుస్తుంది. పర్యవేక్షణ అంటే ఇదికాదు. తరగతిగదిలోని నిర్దిష్ట సందర్భంలోని బోధన, అభ్యసనం ఎలా ఉన్నాయో నిర్మాణాత్మకంగా చూడాలి. ఇదే నాణ్యమైన పర్యవేక్షణ. కాబట్టీ మన పర్యవేక్షణా వ్యవస్థ లక్ష్యాలేమిటో కూడా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. వీటిని సాధించడానికి ఎలాంటి పద్ధతులు, కార్యాచరణ అవసరమో, వీటిని సంస్థాగతం చేయడమెలాగో కూడా స్పష్టంగా చూచుకోవాలి. పంచాయితీలు, విద్య

ప్రజలు తమ సమిష్టి అవసరాలను నిర్ణయించుకొని వాటిని తీర్చుకానడానికి, అభివృద్ధి క్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరగడానికి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు సమగ్రంగా రూపొందించుకుని అమలు చేసుకోవడానికి గ్రామ, తాలూకా, జిల్లా స్థాయిల మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ రాజ్యాంగంలోని 73వ అధికరణాన్ని సవరించడం ద్వారా ఏర్పడింది. పంచాయితీలకు కేటాయించవలసిన 29 అంశాలను ఈ రాజ్యాంగ సవరణ గుర్తించింది. ఇందులో (ప్రాథమిక, సెకండరీ విద్యలు, వయోజన, అనియత విద్యలు, (గ్రంథాలయాలు, సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య మొదలైనవన్నీ ఉన్నాయి. వికేంద్రీకృత ప్రజాస్వామ్యం, అభివృద్ధి

డేర్‌

దీనివల్ల సాధ్యమౌతుందని గుర్తించి చాలా రాష్ట్రాలు పంచాయతీరాజ్‌ చట్టాలను తెచ్చాయి.

జిల్లా సాక్షరతా సమితి, డి.పి.ఇ.పి., సర్వశిక్షా అభియాన్‌లాంటి సమాంతర సంస్థలు రాష్ట్రన్ధ్థాయిలోనూ, ఇతర సంస్థలు తాలూకా, (గ్రామస్థాయిల్లోనూ ఏర్పరచడంవల్ల పంచాయితీరాజ్‌ సంస్థల అధికారాలకు విఘాతం కలుగుతోంది. ఇటీవల కాలంలో చాలా రంగాల్లో ఇలాంటి సంస్థలు అసంఖ్యాకంగా ఏర్పడుతున్నాయి. గ్రామ విద్యా కమిటీలు, వాటర్‌షెడ్‌ కమిటీలు, రైతుమిత్ర కమిటీలు, వనసంరక్షణ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాలు లాంటివి [గ్రామ(గ్రామాన వెలుస్తున్నాయి. ఇవేవీ పంచాయితీలకు జవాబుదారీగా ఉండవు. బయటి సహాయక సంస్థల్నించి విపరీతంగా వీటికి నిధులు వస్తున్నాయి. గ్రామంలోని సంపన్నులు వీటిమీద అధికారం చెలాయిస్తున్నారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే పంచాయితీరాజ్‌ సంస్థల విధినిర్వహణలో ఎదురౌతున్న సమస్యలివి : నిధుల కేటాయింపులోగానీ, వివిధ స్థాయిల సంస్థలకు అప్పగించబడిన కార్యక్రమాల్లోగానీ ఒకదానికొకటి సంబంధం వుండంలేదు. గ్రామస్థాయిలో ఎన్నికైన సంస్థల్ని కాదని నెలకొల్పిన సమాంతర సంస్థలు స్టానిక ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని అపవాస్యం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పాఠశాలలో చేరినవారు, బడి మానివేసినవారు, వారు సాధించిన లక్ష్యాలు ఇలా రకరకాల అంశాల్ని పొందుపరచిన గణాంక వివరాలు, తాలూకా, జిల్లాస్థాయిల్లో సేకరించడంమీద చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పాఠశాల నిర్వహణకు, పర్యవేక్షణకు కూడా ఇవే గీటురాళ్ళుగా చెలామణి అవుతున్నాయి. పాఠశాలల్లో వీటన్నిటికీ సంబంధించిన రికార్డుల్ని తయారుచేయడం పెద్ద భారంగా పరిణమించింది. అకడమిక్‌ ప్రణాళికలు, పాఠ్యప్రణాళికా బోధన తదితర అంశాల్ని పక్కనబెట్టి, ఈ లెక్కలతోనే పాఠశాల నాణ్యతను లెక్కకట్టడం ప్రారంభమైంది. వాఠ్యప్రణాళికా రచన, ఉపాధ్యాయ విద్య

1960 నుంచే ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్నాన్ని పెంచాల్సిన అవసరం అన్నిటికంటే ముఖ్యమైనదని గుర్తించడం జరిగింది. కానీ కింది వాస్తవిక పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఉవాధ్యాయ విద్యను మన విద్యాకోర్సుల ప్రధాన స్రవంతిలోకి తీసుకుని రావాలని కొఠారీ కమీషను (1964-66) పేర్కొనింది. కానీ ఈనాటికీ ఉపాధ్యాయ విద్యా (శిక్షణ) సంస్థలు మాత్రం ఒంటిరిగా, ఇతర విద్యా సంస్థలతో ఏమీ సంబంధం లేకుండా ఉండిపోయాయి పన్నెందేళ్ళ విద్య తరువాత సెకండరీ టీచరుకు అయిదేళ్ళ శిక్షణ అవసరమని ఛటోపాధ్యా కమిటీ (1983-85) పేర్కానింది. సైన్సు, ఆర్ట్స్‌ కళాశాలల్లో ఉపాధ్యాయ విద్య కూడా ఒక కోర్సుగా ఉందాలని ఈ కమిటీ సూచించింది. దీనివల్ల విద్యార్థులు ఉపాధ్యాయ విద్యాకోర్సుల్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని కూడా అది పేర్కొనింది. ఉపాధ్యాయ శిక్షణ పొందేవారు స్వయం అభ్యసన సామర్దాన్ని పొందేటట్టు, స్వతంత్రంగా ఆలోచించేటట్టు ఉండాలని యళ్‌పాల్‌ కమిటీ రిపోర్టు (1993) (భారంలేని అభ్యసన సామర్దాన్ని పొందేటట్టు, స్వతంత్రంగా ఆలోచించేటట్టు ఉండాలని యశ్‌పాల్‌ కమిటీ రిపోర్టు (1993) (భారంలేని అభ్యసనం) చెబుతోంది.

46

ప్రస్తుత విద్యావ్యవస్థలో విద్య అంటే సమాచారప్రసారమనే భావన పెరిగిపోతోంది. ఉపాధ్యాయుల్ని దీనికనుగుణంగా సర్దుబాటు అయ్యేటట్టు చెయ్యడంతప్ప మన ఉవాధ్యాయ శిక్షణ పైలక్ష్యాలకు అనుగుణంగా లేదు. పాఠ్యప్రణాళికా సంస్కరణలో ఉపాధ్యాయ విద్యకు సరైన స్థానం ఉండటం లేదు. పారా టీచర్లను విపరీతంగా నియమించడంవల్ల ఉపాధ్యాయుల వృత్తి నిపుణతకు గుర్తింపే లేకుండా పోయింది. ఉపాధ్యాయుడి వృత్తి గౌరవాన్ని పెంచడం

విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుడే కేంద్రం అని మనం విశ్వసించి, ఈ విశ్వాసాన్ని పునఃప్రతిష్ట చేయాలంటే సర్వీసుకు ముందు ఇచ్చే ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెరగాలి. ఇది మనం తీసుకోవలసిన మొట్టమొదటి చర్య. ఉపాధ్యాయుల వృత్తి శిక్షణను వివిధ పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులతో అనుసంధానం చేయాలి. దీనివల్ల వివిధ సబ్జెక్టుల మధ్యగల అంతస్సంబంధం వీరికి అర్ధమౌతుంది. ఇందుకోసం గ్రాడ్యుయెట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిల్లో ఉపాధ్యాయ విద్యాకోర్సుకూడా ఒక కోర్సుగా ఉండాలి. గ్రాడ్యుయేషన్‌కు ముందుకూడా ఇదేవిధంగా ఇతర కోర్సుల్లో భాగంగా ఉవాధ్యాయ విద్య ఉందాలి. ప్రాథమికోపాధ్యాయులకిచ్చే 8౯ కోర్సు దీనికి మంచి ఉదాహరణ. సాధారణ కళాశాలల్లోని కోర్సుల్లో ఒకటిగా ఉపాధ్యాయ విద్యను చేర్చడంవల్ల దీనికున్న ఒంటరితనం పోతుంది. అదేవిధంగా పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఉపాధ్యాయ విద్యను ఒక కోర్సుగా చేర్చడంవల్ల దీన్ని విద్యార్థులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశోధన చేసుకోవడానికి, పునశ్చరణ చేసుకోవడానికీ కూడా విద్యార్థులకు అవకాశం ఉంటుంది. రూపకల్పనలో, ఆచరణలో కీలకాంశాలు

ఉపాధ్యాయుడి భాషాప్రావీణ్యం పెంచడం ప్రస్తుతం చాలా అవసరమని చాలా

పరిశోధనలు చెప్తున్నాయి. ఉపాధ్యాయ శిక్షణలో భాషా ప్రావిణ్యం సాధించేందుకు తగిన

. కోర్సులు తప్పనిసరిగా ఉందాలి. పిల్లల అభివృద్ధికి సంబంధించి, బోధనా పద్ధతులకు సంబంధించి మనకున్న అభిప్రాయాలు చాలావరకు సరైనవి కావు. మనం బోధిస్తున్న పద్దతుల్లో చాలా లోపం ఉంది. దీనికి సంబంధించి మనకిప్పటికే స్థిరపడి ఉన్న భావాలు కూడా సరైనవికావు. ఉపాధ్యాయ విద్య ఈ అంశాలను మరింత లోతుగా అవగాహన చేసుకునేవిధంగా ఉందాలి.

(ప్రస్తుతం మన ఉవాధ్యాయ విద్య జ్ఞానాన్ని “ఇచ్చే! వస్తువుగా భావిసోంది. శిక్షణ పొందేవారికి పాఠ్యప్రణాళికను, సిలబస్‌ను, పాఠ్యగ్రంధాలను విమర్శనాత్మకంగా పరిశీలించే అవకాశం ఉండటంలేదు. ఇప్పటికే స్థిరపడి ఉన్న వాస్తవ పరిస్థితులకు సర్దుకుపోవడాన్ని మాత్రమే ఇది నేర్పిస్తున్నది. పిల్లలకు సంబంధించి, జ్ఞానానికి, అభ్యసనానికి సంబంధించి, మనకున్న ప్రస్తుత దృక్పథాలు చాలా సులభంగా మారతాయని అనుకోవడం కూడా సరికాదు. మన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు శిక్షణ పొందేవారికి ఇప్పటికే ఉన్న భావాల్ని గురించికానీ, అనుభవాల గురించిగానీ పట్టించుకోవడంలేదు. వాటిని మార్చడానికి ప్రయత్నం చేయడంలేదు.

త్త

పిల్లల అవసరాలకు, వారి అభ్యసనానికి అనుగుణంగా స్పందించే ఉపాధ్యాయుల్ని తయారుచేయడం మన కర్తవ్యం. మన విద్య ఏ విస్తృత సందర్భంలో సాగుతోందో శిక్షణ పొందేవారు తెలుసుకునేలా శిక్షణాంశాలు ఉండాలి. వాస్తవ సందర్పాల్లో తెలివితో ఎలా వ్యవహరించాలో ఇది నేర్పాలి. జ్ఞానం, అభ్యసనాలకు సంబంధించి; కులం, లింగం, సమానత్వం, న్యాయం మొదలైన అంశాలకు సంబంధించి వారి విశ్వాసాలను వారే విమర్శనాత్మకంగా ప్రశ్నించుకునేలా ఉపాధ్యాయ శిక్షణ ఉండాలి. స్వతంత్రంగా ఆలోచించడానికి, స్వంతంగా నేర్చుకోవడానికి, పిల్లల అవసరాలకు తగినట్లుగా స్పందించడానికి తగినట్టు శిక్షణా కార్యక్రమాలుండాలి. తమ స్వంత అనుభవాల్చిి పిల్లల సామాజిక నేపధ్యాన్ని కలుపుకుని స్వంతంగా ఆలోచించే లక్షణం ఉపాధ్యాయుల్లో పెంపొందాలి. ఇందుకోసం ఈ క్రింది ప్రయత్నాలు చేయవచ్చు. తనను, ఇతరుల్ని (స్వీయ విశ్వాసాల్ని. భావాల్చి ఆవేశాన్ని) అర్ధం చేసుకునే సామర్ధ్యాన్ని పెంచుకోవడం, స్వీయ విశ్లేషణ, స్వీయ మూల్యాంకనం, పరిస్థితులకనుగుణంగా మారడం, సరళంగా ఉండడం, సృజనాత్మకత, అన్వేషణ, స్వీయ అభ్యసనం, పునశ్చరణ, కొత్త ఆలోచనల్ని స్వీకరించడం, ఎంచుకోవడం ఉపాధ్యాయులకవసరం. దీనివల్ల ఉపాధ్యాయులు తాము నిర్దేశించుకున్న పద్ధతిలో నేర్చుకోవడానికి, విమర్శనాత్మకంగా వ్యవహరించడానికి, సమిష్టిగా పనిచేయడానికి వీలవుతుంది. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, వారితో మాట్లాడడం, వారిని పరిశీలించడం, అవగాహనను పెంచుకోవడం, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, సామాజిక వాస్తవాల్ని అర్ధం చేసుకోవడం, సామాజిక నేపధ్యాలతోసబ్దెక్టు అంశాల్ని అనుసంధానింపచేసుకోవడం, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అకడమిక్‌ జ్ఞానాన్ని శారీరక శ్రమతో సమన్వయం చేసుకోవడం టీచర్లు అలవరుచుకోవాలి. టిచర్లు వీటికి సిద్ధపడాలి

పిల్లల పట్ల (శ్రద్ధ పెంచుకోవడం, వారిని (ప్రేమించటం

నామాజిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భాలను గమనంలో ఉంచుకుని పిల్లల్ని అర్ధం

చేసుకోవడం.

స్వీకరించడానికి సిద్దపడడం, నిరంతరం నేర్చుకోవడం.

స్వీయ అనుభవాలనుంచి ఒక అర్జాన్ని వెతుక్కోవడమే అభ్యాసమని, జ్ఞానోత్బత్తి ఒక

నిరంతర ప్రక్రియ అని గుర్తించడం.

జ్ఞానం, మన అనుభవాలతో సంబంధంలేని పాఠ్యపుస్తకాలకు మాత్రం పరిమితమైన

అంశం కాదని గుర్తించడం.

స్వీయ అనుభవం నుంచి బోధనాభ్యసన ప్రక్రియలో జరిగే ఆదానప్రదానాలనుంచి

జరుగుతోందని గుర్తించడం.

మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నించడం, సమాజంపట్ల బాధ్యత వహించడం.

దరి

వృత్య్యంతర విద్య

ఉపాధ్యాయుల అవసరాల్ని గుర్తించడమే నాణ్యమైన శిక్షణకు గీటురాయి. కానీ ఎక్కువ శిక్షణల్లో ఇది కన్పించదు. ఈ శికణలన్నీ ఉపన్యాస పద్ధతిలో ఉంటాయి. శిక్షణార్థుల భాగస్వామ్యం ఏమీ ఉండదు. కృత్యాధార బోధన, పెద్దపెద్ద తరగతి గదుల నిర్వహణ, ఉమ్మడి బోధన, ప్రత్యక్ష బహుళ తరగతుల బోధనలాంటివన్నీ ఉపన్వాస పద్ధతిలో తెలియజిప్పడం జరుగుతుంది. పాఠశాలల్లో దీని అమలును పరిశీలించడం అసలే కరువైంది ఉపాధ్యాయులు సమిష్టిగా ప్లాన్‌ చేసుకొనేందుకు తగ్గట్లుగా, వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి తగ్గట్టుగా క్లస్టర్‌ స్థాయి సమావేశాలు జరగడంలేదు.

' ఏ పాఠర్యప్రణాళికాసంస్క్మరణ అయినా బాగా ఆలోచించి రూపొందించే వృత్యంతర శిక్షణమీద, ఉపాధ్యాయుడికి స్కూలు స్థాయిలో మనమిచ్చే సహకారం మీద ఆధారపడి విజయవంతమవుతుంది. వృత్యంతర శిక్షణ ఒక సంఘటనగా మారకూడదు. అదొక క్రమం. అందులో జ్ఞానం, అభివృద్ధి, దృక్పధాల్లో మార్పులు, నైపుణ్యాలు, ఇష్టాలు, పరస్పర చర్యలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇది కేవలం నిపుణుల నుంచి జ్ఞాన సంగ్రహణ రూపంలో ఉండదు. అనుభవాలతో కూడిన అభ్యసనాన్నిి ఉపాధ్యాయులు (క్రియాశీల అభ్యానకులుగా వ్యవహరించడాన్ని తోటి ఉపాధ్యాయులతో కలిసి తమనుతాము సమీక్షించుకోవడాన్ని ప్రోత్సహించే విధంగా వృత్య్యంతర శిక్షణ ఉండాలి. ఇది మూసపోసిన పద్ధతిలో ఉందకూడదు. వికేంద్రీకృత [ప్రణాళిక ద్వారా స్పష్టమైన లక్ష్యాల్ని పద్ధతుల్ని నిర్దేశించుకుని ఈ శిక్షణనివ్వాలి. కొన్ని సందర్భాల్లో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎక్కువమందికి ఒకేసారి శిక్షణ ఇవ్వవచ్చు. కానీ సర్వీసులో ఉన్న టీచర్ల అవసరాల్ని తీర్చేవిధంగా నిజాయితీతో, ధైర్యంతో, సృజనాత్మకతతో శిక్షణలను రూపొందించుకోవడం అవసరం. పరీక్షల సంస్కరణములు

విషయాధారిత పరీక్షకు బదులు అవగాహనపై సమస్యల సాధనపై ఆధారపడ్డ పరీక్షా విధానం కావాలి.

విషయాధారిత పరీక్షా విధానం లోపభూయిష్టమైన బోధనా పద్ధతులకు, కంఠస్తం చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల పరీక్షలంటే చాలు ఒత్తిడి పెరిగిపోతుంది. జ్ఞాపకం పెట్టుకునే అవసరం లేకుండా ఫార్ములాలు, ప్రాధమిక టేబుల్స్‌ పిల్లలకు పరీక్షల్లో అందించాలి. విశ్లేషతకు, అన్వయానికి ప్రాధాన్యత ఉండేవిధంగా ప్రశ్నలుండాలి. 25 నుంచి 40 శాతం లిఖీత సమాధానాలు, మిగిలినవి చాలా జాగ్రత్తగా రూపొందించి బహుళ సమాధాన ప్రశ్నలు ఉండేవిధంగా చిన్నచిన్న పరీక్షలు నిర్వహించాలి. పరీక్షకు హాజరయ్యే 90 శాతం మంది విద్యార్ధులు వీటిని పూర్తిచ్చేయగల విధంగా ఉందాలి.

పరీక్షల్ని పిల్లలు చదివే స్కూల్లోనే నిర్వహించాలి. తప్పుడు పద్ధతులను నిరోధించడానికి బయటి పాఠశాలల ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించాలి.

ఠం

పరీక్షల్ని ఏ పరిస్థితుల్లోను వాయిదా వేయకూడదు.

పిల్లలు వీలున్నన్ని సబ్జెక్టుల్లో పరీక్షకు సిద్ధమయ్యేందుకు అంగీకరించాలి. మూడేళ్ళలో అన్ని సబ్జెక్టులు పూర్తిచెయాలి. దీనివల్ల పిల్లలు ఎప్పుడు పరీక్షకు సిద్ధమైతే అప్పుడు పరీక్షలు పెట్టవచ్చు. అప్పుడు పిల్లలే పరీక్ష పెట్టాల్సిందిగా డిమాండు చేస్తారు.

పాస్‌, ఫెయిల్‌ అనే పదాల్ని తొలగించాలి. తగినంత ప్రావీణ్యం సంపాదించ లేకపోతే “మళ్ళీ పరీక్షకు సిఫార్సుచేయడమైనది” అనాలి.

పరీక్షా ఫలితాలు రాగానే సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించాలి. ఇందువల్ల పిల్లలు వీటికి హాజరై తప్పిపోయిన ఒకటి, రెందు పరీక్షలు రాసారు. ఒక సంవత్సరమంతా వృధా అయ్యే పరిస్థితి తప్పుతుంది. గణితం, ఇంగ్రీషులాంటి సబ్జెక్టులను సాధారణస్థాయి, ఉన్నతస్థాయి అని రెండు దశలుగా పరీక్షించాలి.

తరువాత అన్ని సబ్జెక్టులకు ఇదే పద్దతిని ప్రవేశపెట్టాలి. దీనివల్ల రెండు, మూడు పరీక్షల్ని ఒకదశలో, మూడు, నాలుగు పరీక్షల్ని మరొకదశలో ఎంచుకుంటారు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షలు, నివేదికలు

ప్రస్తుత పరీక్షల నాణ్యత పెరగాలంటే ప్రశ్నాపత్రాల్ని రూపొందించే పద్ధతి మారాలి. ప్రశ్నాపత్రాన్ని రూపొందించడంమీద కంటే ప్రశ్నల్ని రూపొందించడం మీద ఎక్కువ (శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి ప్రశ్నల్ని నిపుణులు మాత్రమే తయారుచేయాల్సిన అవసరం లేదు. విస్తృత ప్రచారం ద్వారా సంవత్సరం పొడుగునా ఉపాధ్యాయుల నుండి, కళాశాల అధ్యాపకుల నుండి, ఇతర రాన్ర్రాల ఉపాధ్యాయుల నుండి, చివరకు విద్యార్థులనుండి కూడా ప్రశ్చల్ని సమీకరించవచ్చు. ఆ తరువాత వీటిని కిష్టత, విషయం, భావన, తదితర అంశాల ప్రాతిపదికన నిపుణులు విభజిస్తారు. వీటికి సమాధానాలు రాయడానికి ఎంత సమయం పడుతుందో నిర్ణయిన్తారు. ప్రశ్నాపత్రాల తయారీ సందర్భంగా వీటికొక రికార్డుకూడా తయారు చేస్తారు. ఇతర స్టాయిల్లోని ప్రవేశ పరీక్షలు, బోర్జు పరీక్షలు

ప్రవేశ పరీక్షలు, బోర్డు పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోను 5, 8, 11 తరగతులకు పరీక్షలు జరపకూడదు. 11వ తరగతిలో చేరాలనుకునేవారికి మాత్రమే పదవ తరగతిలో పబ్లిక్‌ పరీక్ష పెట్టాలి. మిగిలినవారికి పాఠశాల నుంచి సర్టిఫికేటు ఇవ్వాలి. పోటీపరీక్షల నుంచి, ప్రవేశ పరీక్షల నుంచి పాఠశాల విద్యానంతర పరీక్షల్ని వేరుచేయాలి. తక్కువమంది పిల్లలు హాజరైతే ఈ ప్రవేశ పరీక్షలు రాసేవారిలో ఒత్తిడి తగ్గుతుంది పరీక్షలకు రూపకల్పన చేసి నిర్వహించడం కోసం ఒక మోడల్‌ సంస్థను గుర్తించాలి. ఇది సంవత్సరంలో మొత్తం దేశంలోని కొన్ని కేంద్రాల్లో పలుమార్లు పరీక్షలు నిర్వహిస్తుంది. సకాలంలో పరీక్షలు జరిగేలా, ఫలితాలు ప్రకటించబడదేలా చూస్తుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కుల్నిబట్టి విద్యా సంస్థలు పిల్లల్ని చేర్చుకోవాలి.

50

వినూత్నాలోచనలు, ప్రయోగాలు : బహుళ పాఠ్య (గ్రంథాలు, నూతన ప్రయత్నాలకు వ్రోత్సాహం

పాఠ్యప్రణాళికల్లో పిల్లల అనుభవాల్ని అర్ధవంతంగా ఇముడ్చుకోవాలంటే, పిల్లల సాంస్కృతిక సందర్భాలు, భాషలు వీటిలో ప్రతిబింబించాలంటే మొదట పాఠ్యగ్రంథ రచనను వికేంద్రీకరించాలి. అయితే ఈ సందర్భంలో ఇందుక్కావల్సిన సామర్వాలను, వ్యవస్థను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పాఠ్యగ్రంధ రచనకు పరిశోధన అవసరం. అకడమిక్‌ నైపుణ్యం అవసరం. పిల్లల అభివృద్ధి దశల్ని అర్ధం చేసుకోవడం కూడా అవసరం. పాఠ్యగ్రంథ రచయితలకు సంభాషణా నైపుణ్యం ఉండాలి. ప్రస్తుతం పాఠ్యగ్రంధ రచనా బాధ్యతలను 50” చూస్తోంది. ఈ స్థితి కొనసాగాలి. అయితే ఈ పాఠ్యగ్రంథ రచన వ్యక్తిగత పద్ధతిలో కాకుండా సమిష్టి కృషిగా జరగాలి. ఇలాంటి సమిష్టితత్వం ఎందుకంటే పాఠ్యగ్రంథ రచనలో చాలా అంశాలు కీలకపాత్ర వహిస్తాయి. దార్శనికత, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేదానిపై స్పష్టత, సబ్జెక్టు జ్ఞానాన్ని పునః పరిశీలించడం, పరిశోధనలాంటివి ఇందులో కొన్ని. దీంతోపాటు పిల్లలకు విషయాన్ని అందించే పద్ధతి కూడా తెలిసుండాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాల పరిశోధనల్ని స్వచ్చంద సంస్థల అనుభవాల్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు సమగ్రంగా ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో వాటిలోని అంశాలు చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ. విద్యా సంవత్సరంలో ఏ సబ్జెక్టు ఏ కాలంలో చెబితే న్యాయంగా ఉంటుందో ఈ పాఠాలు దృష్టిలో ఉంచుకోవు. కనీసం ప్రారంభ పాఠాల్ని ప్రయోగాత్మకంగా పిల్లలకు బోధించి, ఉపాధ్యాయులు, పిల్లలు వాటిని ఎలా స్వీకరిస్తున్నారో చూడ్డం అవసరం. పాఠ్యపుస్తకాల విషయంలో నూతన మార్పులు చేసేటప్పుడు తరగతి గదిలోని వాస్తవాల్ని, ఉపాధ్యాయుల, పిల్లల సంసిద్ధతని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఉపాధ్యాయులు ఎంపికచేసుకోవడానికి అనువుగా, పిల్లల అవసరాల్సి ఆసక్తుల్ని గమనంలో ఉంచుకుని బహుళ పాఠ్యగ్రంథాలు రూపొందాలి. వివిధ పుస్తకాలు, అనుబంధ సామగ్రి అందుబాటులో ఉంటే ఏవి తమ పిల్లలకు నిర్దిష్టంగా సరిపోతాయో వాటిని ఉపాధ్యాయులు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇది ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తిని పెంచుతుంది. ఉపాధ్యాయులు కూడా ఒకే విషయాన్ని పలురూపాల్లో ఎలా పిల్లలకు తెలియజెప్పవచ్చో దీనివల్ల నేర్చుకుంటారు. ఇలాంటి టీచర్లు పిల్లల్నికూడా ఇలాగే ప్రోత్సహిస్తారు. ఈ పద్ధతి గ్రంథాలయాలను ఉపయోగించుకోవడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. వినూత్న పద్ధతుల్ని ప్రోత్సహించడం

తన నిర్దిష్ట క్లాస్‌రూం అవసరాలకనుగుణంగా సందర్భ్బాన్నిబట్ట కొందరు ఉవాధ్యాయులు పాఠ్యప్రణాళికా బోధనలో కొత్తపుంతల్ని తొక్కుతుంటారు (స్థలం, పిల్లల సంఖ్య, బోధనోపకారణాల లేమి, విద్యార్థుల్లో వైవిధ్యం, తప్పనిసరైన పరిక్షలు లాంటి సమస్యలున్నప్పటికి) ఇవి ఎంతో ఆచరణాత్మకంగానేగాదు సృజనాత్మకంగాకూడా ఉంటాయి. స్కూల్లోగానీ, ఉపాధ్యాయ సమాజంలోగానీ వీటినెవరూ పట్టించుకోరు. అసలా ఉపాధ్యాయులు

ర్‌క్షే

వీటికింత విలువ ఉందా అని గమనించరు. ఈ టీచర్ల అనుభవాల్ని కూడా తరగతిలో ఆచరణల్ని ఒకరికొకరు పంచుకోవాలి. మంచి టీచరుతో చేసే ఇలాంటి ప్రతిచర్యవల్ల, ఒకరినుంచి ఒకరు ఇలా నేర్చుకోవడంవల్ల ఒక అకడమిక్‌ మధనం జరుగుతుంది. నూతనాలోచనలు పుడతాయి. నూతనావిష్మరణ, నూతన ప్రయోగాలు జరుగుతాయి. ఇలాంటి టీచర్ల సృజనాత్మక చర్యల్ని ప్రోత్సహించడమెలా? వీటికెలాంటి మద్ధతు, సహకారం అందించాలి? ఇది వ్యవస్థలో భాగంగా మారేలా ఎలా ఉపయోగించుకోవాలి? ఇందుకోసం స్కూల్లో తగిన ఏర్పాటు ఉండాలి. క్లస్టర్‌, బ్లాకు స్థాయిల్లో టీచర్ల మధ్య ఇలాంటి అనుభవాల ఆదానప్రదానాలు జరగాలి. ఇవి చాలా ఉపయుక్తమైనవని తేలితే వీటిని కొనసాగించే ఏర్పాటుచెసుకోవాలి. పాఠశాల స్థాయిలో లేదా కొన్ని పాఠశాలల సముదాయాల న్థాయిలో టీచర్ల బృందాల్ని గుర్తించి వారికి కావల్సిన వనరుల్ని అందించాలి. వారలా బృందాలుగా పనిచేసే అవకాశం కల్పించాలి. నూతన భాగస్వామ్యం స్వచ్చంద సంస్థల, పొర సమాజబ్బందాల, ఉపాధ్యాయ సంఘాల పాత్ర

విద్యారంగంలో స్వచ్చంద సంస్థలు పౌర సమాజబ్బందాలు క్రియాశీలంగా పాల్గొనడం ఇటీవల వచ్చిన పెద్ద పరిణామం. వినూత్న ఆవిష్మరణల్ని చెయ్యడంలో; ఉపాధ్యాయ శిక్షణల్లో, వాఠ్యగ్రంథాల్ని ఇతర సామగ్రిని తయారుచెయ్యడంలో; ప్రజల్ని సమైక్యపరచడంలో, సహకారాన్ని అందించడంలో స్వచ్చంద సంస్థల పొత్ర చాలా గొప్పది. రిసోర్సు సెంటర్లలో వాళ్ళ (క్రియాశీల భాగస్వామ్యం పెరగడం చాలా అవసరం. ఇది వొాఠ్యప్రణాళికాభివృద్దికి అకడమిక్‌ సపోర్చుకు,పర్యవేక్షణకు, పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది. స్వచ్చంద సంస్థలు విద్యకు ఒక గుర్తింపు తెచ్చి, అందరికీ పరిచయం చేసి సమాజపు అజెండాలో చేర్చాయి. పిల్లల హక్కులపై విస్తృత ప్రచారం చేసి దీన్ని చర్చనీయాంశంగా మార్చాయి. 107 దృక్పథాన్ని, ఆలోచనల్ని విస్తృతంగా ప్రజలదగ్గరికి తీసుకెళ్ళేందుకు; వీటిని స్కూల్లో, సమాజంలో కూడా ఆచరణలోకి తెచ్చేందుకు; పిల్లల విద్య ఒక హక్కుగా సమాజం గుర్తించే వాతావరణాన్ని నెలకొల్పేందుకు, పాఠ్యప్రణాళికలోని వివిధ అంశాలపై కిందిస్థాయి అనుభవాల్ని పరిశీలించేందుకు మనం స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచెయ్యాలి. భిన్న పొర సమాజ బృందాల భాగస్వామ్యాన్ని పెంచాలి.

పాఠశాల విద్యను బలోపేతం చెయ్యడానికి ఉపాధ్యాయ సంఘాల పాత్ర ఎంతో విలువైంది. గతంలో ఎప్పుడూలేని అవకాశమిది. జవాబుదారీతనపు నంస్కృతిని నెలకొల్పేందుకు, పాఠశాల పనితీరుకవసరమైన నిబంధనల్ని రూపొందించేందుకు, తదనుగుణంగా ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయసంఘాలు ఎంతో అవసరం. పాఠ్యప్రణాళికను సమర్థవంతంగా పిల్లలకందించేందుకుప్రభుత్వం ఇస్తున్న మద్దతుప్పె, వనరులపైన కూడా ఉపాధ్యాయ సంఘాలు మనసుపెట్టాలి. పాఠశాల వనరులు, విద్యానాణ్యత, ఉపాధ్యాయ విద్య, వృత్తి నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకోసం ఉపాధ్యాయ సంఘాల నిర్మాణాత్మకమైన ఒత్తిడిని తెచ్చే సంస్థలుగా ఉండాలి.

52

పాఠ్యప్రణాళికా లక్ష్యాలకనుగుణంగా విద్యారంగంలో బహుళత్వాన్ని ప్రోత్స హించదడానికి, పిల్లల అవసరాల్ని గుర్తించడానికి, నూతన పాఠ్య ప్రణాళికాంశాల్ని జోడించడానికి యూనివర్శిటీలు పూనుకోవాలి. పిల్లల భిన్న సామాజిక సాంస్కృతిక నేపథ్యాలను దృష్టిలో పెట్టుకుని, భారతదేశపు తరగతి గదుల్లోని సంక్షిష్టతల్ని గమనంలోనికి తీసుకుని విద్యా జ్ఞానానికి సంబంధించిన పునాదిని విస్తృతం చేసుకోవడం ఇప్పుడు తక్షణావసరం. తమ పరిశోధనలో భాగంగా యూనివర్శిటీల్లోని విద్యావిభాగాలు, సామాజిక శాస్త్రాల, విజ్ఞాన శాస్త్రాల విభాగాలు విద్యను ఒక పరిశోధనాంశంగా తీసుకోవాలి. పాఠ్యప్రణాళికా చట్రంలోని లక్ష్యాల్ని ఆలోచనల్ని తరగతిగదిలో ఆచరణకు తెచ్చేందుకవసరమైన పరిశోధన జరగాలంటే వివిధ విభాగాలకు చెందిన నిపుణులు సమష్టిగా కృషిచేయడం, పరిశోధించడం అవసరం. దీనితోపాటు పాఠశాలల్లో విద్య పూర్తిచేసిన విద్యార్థులు తమకిష్టమైన సరికొత్త సబ్దెక్టుల్ని ఎంచుకునేందుకు అనుగుణంగా కూడా విశ్వవిద్యాలయాలుండాలి. ముగింపు మన పిల్లలకు ఏది కావాలో దానికి సంబంధించిన ఒక దార్భనికతను ఈ . పాఠ్యప్రణాళికా చట్రం మీముందుంచుతోంది. పిల్లలతో, వారి విద్యతో నంబంధం ఉన్నవారందరూ ఈ పాఠ్యప్రణాళికను పరిపుష్టం చేయడంలో సహకరించాలి. ఇందుకు ఏమిచేయాలో తెలియజెప్పాలి. దీనివల్ల పిల్లల అభ్యసనాన్ని గురించి, జ్ఞాన స్వభావాన్ని గురించి, ఒక సంస్థగా పాఠశాలను గురించి అవగాహన చేసుకునే వీలు కలుగుతుంది. పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఈ దృక్పథాన్ని గురించి చర్చించేటప్పుడు పాఠశాల పద్ధతులు, సంస్కృతి, టీచర్లు తరగతిగదిలో చేసే ఆచరణలు, స్కూలు బయట నేర్చుకునేందుకు గల అవకాశాలు, వివిధ అభ్యసన వనరులు, వ్యవస్థను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయగల అంశాలు మొదలైనవన్నీ గమనంలో ఉంచుకోవాలి. పెద్దఎత్తున పాఠ్యప్రణాళికను రూపొందించడం, సిలబస్‌ పాఠ్యగ్రంథాలు తయారుచేయడానికి పరీక్షల సంస్కరణలకు ఒక అనుసంధానం ఉండాలి. అప్పుడే మన పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు, విద్యా లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుంది. ౫౦౬౫౫ చెసిన ప్రకటనలకు సంబంధించి ఈ జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం కోసం తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి వందలాది సూచనలు వచ్చాయి. ముంబాయిలోని శ్రీమతి నీతా మెహతా తల్లిగా, టీచర్‌గా పంపిన సందేశం వీటిలో ఒకటి. ఆమె ఇలా వ్రాసింది “ఈరోజు మా పిల్లలు నేను ఏళ్ళకు ముందు ఎలా చదువుకున్నానో అదే పద్ధతిలోచదువుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యాబోధనలో, మూల్యాంకనంలో ఎన్నో నూతన పద్ధతులు వచ్చాయి. కానీ మా పిల్లలు మాత్రం బోర్జుమీద రాసిన అభ్యాసాల్ని కాపీ చేసుకోవడం, వాటిని కంఠస్తం చేయడం, పరీక్షల్లో వాటిని రాయడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. వచ్చిన మార్పులేమైనా ఉంటే వాటివల్ల మరింత నష్టం తప్ప మేలు జరగడంలేదు. ఒకవైపు ఇప్పటి పిల్లలకు ఎక్కువ సమాచారం అందించడానికి బోలెడు ఇతర మార్గాలున్నాయి, అవకాశాలున్నాయి. కానీ దీన్ని గుర్తించకుండా మన పాఠశాల సంచి మాత్రం 53

బరువెక్కిపోతోంది. కొత్తగా కంప్యూటర్‌ కోర్సులు, నైతిక సైన్సు వచ్చాయి. జనరల్‌ నాలెడ్దిని కూడా ఒక కొత్త సబ్బెక్టుగా ప్రవేశపెట్టారు. "కౌన్‌ బనేగా కరోడ్‌పతి” ప్రసార మయ్యాక క్విజ్‌ కోసం ఇది అవసరమైనట్టుంది” మన నిలబన్‌ వివరీతంగా పెరిగిపోయింది. ఇది ఉపాధ్యాయుల శక్తికి

మించిపోయింది. అందువల్ల వాళ్ళు విసుగుపుట్టించే వద్ధతిలో మాత్రమే బోధించ గలుగుతున్నారు. తరగతి గదుల్లో ఏకాగ్రతతో ఉండటానికి అవసరమైన వ్యవధి పిల్లలకు ఉండడంలేదు. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కలగడంలేదు. పాత అంశాలలోకి వెళ్ళీవెళ్ళకముందే సబ్జెక్టుల్లోకి కొత్తకొత్త అంశాలు వచ్చిచేరుతున్నాయి. ఫలితంగా ఈ భారం తల్లిదండ్రులపై, ట్యూషన్‌ క్లాసుల మీద పడుతోంది. “బాల్యాన్ని వదులుకుని తమ భుజాలమీద చిన్నపిల్లలు విద్యాభారాన్ని మోస్తున్నారు. అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి కొందరు పిల్లలు శక్తికి మించి శ్రమిస్తున్నారు. ఎక్కువమంది పిల్లలపై తల్లిదండ్రుల, టీచర్లపై ఒత్తిడి పెరుగుతోంది. మరింత కష్టపడాలని పిల్లలను వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. చివరకు కొంతమంది దీనివల్ల ఆసుపత్రుల్లో చేరాల్సివస్తోంది కూడా. ముఖ్యమైన సబ్బెక్టులలో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించిన పిల్లలే విజేతలుగా పరిగణింపబడుతున్నారు. క్రీడలు, కళలు లాంటి అంశాల్లో సామర్ధ్యం ఉన్నవారిని ఎవరూ గుర్తించడంలేదు. మార్కులకు పనికిరావు గాబట్టి ఆటలు, అభిరుచులు అవసరంలేదనే రోజులొచ్చాయి. ఫలితంగా మన విద్యార్థులు వాస్తవిక ప్రపంచానికి దూరమౌతున్నారు. పుస్తకాల్లో ఇరుక్కునిపోతున్నారు. మార్కుల పరుగుపందెంలో నిలబడాలంటే ఆరోతరగతి విద్యార్ధి కూడా స్కూలు బయట కనీసం 4 గంటలు చదవాల్సిన స్థితి ఏర్పడింది. ఎదగాల్సిన వయసులో బయటి ప్రపంచాన్ని వదిలేసి పుస్తకాల్లో ఎక్కువకాలం ఉండిపోతే పిల్లలు ముడుచుకునిపోతారు. విద్య ఒక (్రతికూలాంశంగా మారుతుంది. ఇది విద్యార్థి మెదడును రెండుగా విడగొడుతుంది. ఇందులో ఒకటి సమగ్ర అవగాహన లేకుండా కంఠస్తం చేసే పుస్తకాలకు పరిమితమైన ప్రపంచం ఒకటైతే, రెండోది తనకు పట్టు ఏమీలేని వాస్తవిక ప్రపంచం. ఉదాహరణకు ఒక నాలుగవ తరగతి విద్యార్ధిని తీసుకుందాం. ఆమెకు కొండల్లో మెకల్ని మేపడాన్ని నిరోధించడం ద్వారా నేలకోతను ఎలా నివారించవచ్వో తెలుసు. కానీ తన నోటు పుస్తకాలను, పెన్సిళ్ళను ఎలా జాగ్రత్త చేసుకోవాలో మాత్రం తెలియదు. చివరకు బోలెడంత జ్ఞానంతో ఈమె పెరిగి పెద్దదవుతుంది. ఇంగితజ్ఞానం మాత్రం ఉండదు. చదువుకున్న మూర్చురాలిగా మారుతుందన్నమాట. పిల్లల్ని జాగ్రత్తగా అభీవృద్ధి చేస్తే మంచి వ్యక్తిత్వం,

మంచి ప్రవర్తన ఏర్పడుతాయి. దీనికి బదులు తమచుట్టూ ఉన్న ప్రపంచానికి, అనుభవాలకు ఏమీ సంబంధంలేని బోలెడు విషయాల్ని పిల్లలకు బోధించడం జరుగుతోంది. ఇలాంటి

పగటికలలకు పనికొచ్చె విద్యవల్ల ఫలితమేమీ ఉండదు. పైగా ప్రమాదకరమైనప్రభావాలు

పదే అవకాశం మాత్రం పెరుగుతుంది. ప్రస్తుతం పిల్లలకు కావల్సిన మద్దతు, సహకారం అందించే వ్యవస్థ కూడా ఏమీ లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల్లాగా ఒత్తిడికి లోనవుతున్నారు. బోర్జ్చులు నిర్వహించే పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల్లో 40 శాతం మంది ఒత్తిడికి సంబంధించిన సమస్యతో సతమతమవుతున్నారు.

5డీ

ప్రస్తుతం మనం నీతామెహతా చేసిన కొన్ని నిర్దిష్ట సూచనలను పరిశీలిద్దాం.

  • ఎంతనేర్చుకోగలమో అంత మాత్రమే బోధించే విధంగా ఒక సమతుల్యత ఉండాలి. మన శారీరక వ్యవస్థలు అద్భుతమైన నిర్మాణం కలవి. ఇందులోని ప్రతిభాగం మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసుకుని పనిచేస్తుంది. విశాల విద్యా లక్ష్యాలకనుగుణమైన పాఠ్యప్రణాళికను రూపొందించుకోవడం, వాస్తవిక అవకాశాలను, అడ్డంకులను గుర్తించి దాన్ని అమలుచేయడం ప్రస్తుతం కీలకమైన విషయాలు. ఏదో కొద్దిమంది రాణించేవిధంగా కాకుండా ఎక్కువమంది అభ్యసన ప్రక్రియలో భాగస్వాములయ్యె విధంగా మన విద్యావ్యవస్థ ఉందాలి,

  • విద్య సంపూర్ణ జీవితానికి అవసరమైన దృఢమైన పునాదిని వేయాలి. మనం నిర్మించే స్తంభాలుకూడా భిన్నంగా ఉండాలి. వ్యక్తిత్వం, సదత్ష్రవర్తన, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు ఇవన్నీ పాత గణితం, సైన్సు, చరిత్రలతోపాటు నిర్మించాల్సిన నూతన స్తంభాలు.

  • జీవితంలో, బ్రతుకుతెరువులో, వివిధదశల్లో ఎదురయ్యే సవాళ్ళతో మనం నేర్పే విషయాలకు సంబంధం ఉండాలి. వీటిపై దృష్టిపెట్టడానికి తగినంత సమయం ఉపాధ్యాయులకు, పిల్లలకు ఉండాలి. పిల్లల స్వీయ అభిరుచుల్సి, స్వీయ అన్వేషణల్ని వికసింపజేయడానికి ఉపయోగపడే జ్ఞానం అవసరం. దీన్ని సాధించాలంటే ప్రత్యామ్నాయ అభ్యసన పద్ధతులు కావాలి. ప్రాజెక్సులద్వారా, పుస్తకాల్ని చూచిరాసే పరీక్షలద్వారా ప్రత్యామ్నాయ మూల్యాంకనాలద్వారా ఇది సాధ్యమవుతుంది. మనం విత్తనాలు నాటాలే తప్ప మొత్తం చెట్లను పెంచాల్సిన పనిలేదు. జీవితంకోసం నిరంతరం నేర్చుకునేవాళ్ళనుగా విద్య పిల్లల్ని తీర్చిదిద్దాలి.

  • మనం విద్యను మానవీకరించాలి. మానవుల విస్తృత బహుళ అర్హతలకు తగినట్టుగా మన విద్య ఉండాలి. మన విల్లల్లో పలురకాల నైపుణ్యాలుంటాయి. వాటిని ప్రోత్సపించేవిధంగావ్రన్వ్తుతం నూతన మూల్యాంకనా విధానం అవనరం. విద్యాప్రమాణాలను సాధించినట్టే క్రీడలు, కళలు, హస్తకళలు మొదలైన అంశాల్లో ప్రావీణ్యం సంపాదించినవారికి కూడా తగిన గుర్తింపు ఉండాలి. ఇలా చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒకేరకమైన విద్యలోకి నెట్టకుండా పలురకాల విద్యల్లోకి పంపుతారు. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి (గ్రేడింగ్‌వల్ల సమాజం దృష్టిలో కూడా మార్పు వస్తుంది.

శ్రే రే రే ఈ 55

కురోసారి గుర్తించుకొందిం |

  • పేదపిల్లల్ని బడిలో ఇముడ్చుకొనే విద్య ఒక కార్యక్రమం కాదు. ఒక లక్ష్యం.

  • పొఠశాల ప్రవేశ నిబంధనల పేరుతో విద్యార్థి ప్రవేశాన్ని నిరోధించే ఏ పద్దతులు స్కూళ్ళలో పాటించకూడదు.

  • పిల్లలు రాణించలేదంటే స్కూలు రాణించడంలేదని లెక్క

  • భిన్నత్వాన్ని అంగీకరించాలి. వైవిధ్యాన్ని స్వాగతించాలి.

  • మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి. తప్పిదాల్ని జయించాలి.

  • అవకాశాల్ని కల్పించాలిగానీ, కత్తిరింంచగూడదు. పిల్లలకు తగ్గట్లు మనం సర్దుబాటుకావాలి.

  • పాఠశాల-సమాజం, పాఠశాల-టీచర్లు, టీచర్లు-టీచర్జు, పిల్లలు-పిల్లలు, పిల్లలు-టీచర్లు, టీచర్లు-టీచర్లు ఇలా అందరి మధ్య పరస్పరానుబంధం మన బలం. ఇవికొన్ని స్కూల్లో జరిగేవి, మరికొన్ని స్కూలు బయట జరిగేవి కావచ్చు.

  • పేద పిల్లల్ని బడిలోకి ఇముడ్చుకొనే పద్ధతులన్నీ మంచి పద్ధతులే.

  • బాగా బోధించాలంటే ముందు పిల్లల్నించి నేర్చుకోవాలి. పిల్లల పరిమితుల్నిగాదు నామర్భ్యాల్ని గుర్తించాలి.

జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు = స్కూళ్ళకోసం, టీచర్లకోసం

  1. కథలంటే మాకిష్టం రు. 40.00 (151 కథల సంకలనం,

  2. పాటలంటే మాకిష్టం రు. 20.00 (102 పిల్లల వాటల సంకలనం,

  3. ఆటలంటే మాకిష్టం రు. 80.00 (91 పిల్లల ఆటల సంకలనం,

శ. _నేర్చుకోడం మాకిష్టం రు. 20.00 (59 పిల్లల కృత్యాల సంకలనం,

  1. వాడుకొందాం రు. 20.00

(58 దేశభక్తి, విద్య, ఆరోగ్యం, పర్యావరణం పాటలు)

  1. అక్షరాలతో ఆటలు రు. 80.00 (భాషాక్రీడలు)

7, తేట తెలుగు - 1 (ఆధునిక తెలుగు వాచకం) రు. 30.00

8, తేట తెలుగు - 2 (ఆధునిక తెలుగు వాచకం) రు. 80.00

  1. ఉపాధ్యాయవృత్తి అనుభవాలు జ్ఞాపకాలు రు. 75.00

పిల్లల కోసం

1, 1-2 తరగతుల పిల్లల నాహిత్యం రు. 100.00 (10 పుస్తకాల సెట్స్‌

  1. 2-8 తరగతుల పిల్లల నాహిత్యం రు. 120.00 (10 పుస్తకాల సెట్‌

  2. 8-4 తరగతుల పిల్లల నాహిత్యం రు. 140.00 (10 పుస్తకాల సెట్‌)

  3. 4-85 తరగతుల పిల్లల సాహిత్యం రు. 140.00 (10 పుస్తకాల సెట్‌)

  4. 6నుంచి పైతరగతుల పిల్లల నాహిత్యం రు. 150.00 (10 పుస్తకాల సెట్‌)

సైన్సు పుస్తకాలు

  1. మ్యాజిక్‌ మ్యాజిక్‌ రు. 25.00

  2. విశ్వం రు. 15.00

  3. చేసి చూద్దాం రు. 20.00

శీ తెలుసుకొందాం రు. 10.00

  1. మన శరీరం రు. 10.00

  2. నమ్మకాలు-వాస్తవాలు రు. 20.00

  3. ప్రకృతి సూత్రాలు రు. 30.00

  4. ప్రజా శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రు. 20.00

  5. చరిత్రలో సైన్సు (4 భాగాలు) రు. 400.00

క్షే

)/ ౬511601414. కున ఐనది లక్ష్వాల మీద, తదగతి గదుల మీద, వైఖదుల మీద ఆలోచనల మీద, పార్వ గ్రుంఖిలమీద, బోధనా రీతులమీద, నిద్వలాజా క్యదస్థలమీద, స్తుత సాకూజిక సందర్శ్యంలో తలెత్తుతున్న ధోదబులమీద ౫౦090] దమూపొందించిన సాధికాదీ కత్రుముది. ఐస్త్రృత చర్చకోసం దిన్ని నంఖ్షైకరించి అందిస్తున్నాం.

  • జనవిజ్ఞాన వేదిక స 5ర్‌

మవసు ఫౌండేషన్‌

జప టట _ఈంతాఖ గరగ దరద ద శా --__తర[నధ కను న ను. తా. పైకం రా న క ననన

క కం అననా రయం మరా నాన ₹ వాం “వా కంచం ాడాాాాలాోాోాాాాాాాా ప డం! నారా తా జాన [6ట కా.