Telugu జగద_తెలియదు డింగరి నరహరి (అను)_ - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఠి న్‌ు! కం న జక లు _ వో జి న్ / ఇ . ం చ్ . - / | ఇ ॥ జ ఖ్ ఇ ఉ ల ఎ 5 1! కి టా? ఇ. సక అము (అనువాద కథలు) | ం్క! వు న్‌్ (.. | ం . | / చ్ క త | శీ (| శ టీ ॥ గ్‌ా ో క త జి ॥ ఆ క జా ఏళ | , క్ టి! లత. 40 చ. ! ] (| | _ మరి... ఇ గ | "| | ॥ ఆ | కా / క స్ ల. వ స. ( " చ్లా. / | తనకు ర పటే వ. ఖు | | . - ॥ 1, / . ఇ .. ॥ 4 క "| | సాక ఫీవర్ భా న, చ |) 4 “+ మె త య. క కో ॥$ 11 | (౯/౯ ॥ వి గే (| అజ ఓ కలలు | _ న!
- [2 |! మ వం శ ష్ ఇశ్డే గ ళ్ ప జ్జ చనం క | ష జే గ వజ్ర వజ క ॥| ం ణ్ / ం | = , “గ శే ఇ శే నే ౩ | క ఆ ౯ న్ నో” న న ల్ శ .( గ్ తమ్మ. ళ్ క | , ,. షై జ ౧. యు _ ” ల / [ త... వ | | ॥ | య ఒ | . ై లఖ్లా ట్ - _ 1. న. | | ్ న క్ ణ్ అఆ కీ అ " ? - | వై (న్ శ్ | న క్ ( గా. య . ' | శ ల జై ఓ క " ళీ 1 ఫల 9 ( ॥ . 14 యో | సా నే ్శ్న . ల , ం' . 2114క = ( స్త్ ॥ జి | ష్ళై క్ శా లే - | | | , స ్న 11. టీ వ / , శా!) ణే న్ శే ॥ న్ 111 న్ న్ న్నే ల తో 4 | [1 / ఏ కి శు శ్ క్ శ శి స త ( ఎ 1 ్న | న | / / స! గ . . * అజ కా? షా ళ్ క శ ॥ స | ఓ ై - మ శ . గ స " | థీ" న! స్టే య త య్ నా! త క్ అ! |. ల మ, క క్ -ం ॥ ణీ శ , / షీ క! - ” కి ఈ _ ఇ | ॥ | జ మా! న! ॥ క | ః + ॥ “శే. | 1 క్ల | హు | | స ఖ్ .. ఆత్త , |. ల! క ళ్ : 1 | / ( క్ 7 - న్ వ క్‌ు డా ఉంగరి చే ల్‌రి ఆ [ | | . ం తకు న | న్ ము! లు
జగద డా॥ ఉింగరి నదవరి ఆచార్వ నకుతా ప్రచురణలు కరింకగర్
౮౧% 0గీ- (20312666 $10165)
ల 221 2202014202
(8 భా భా
౨౧౮13 ౮౦60061 గ్ల స గ్గ న య ౮౦016 1500 ల! గ్గ (41 న 0119166 0 (న ప | ఏ2002012 0210202100, " ళో ఇి+, కజరుయు 222 = స్తా (౦9165 27212016 26
5101౬ 0.60౦062 0ట1
0.10-3-321
*ర/2 2220 జరుగుం22జ505001:
౫400116: 9866650184
2౪0622 90010056 . ౧౫౦౩116102 వ్‌ఖుఖ నశజంయ్ కయ! 2062, కరేల౭086. +1941జ6మ02 3001 షంఉ8లు. సరల2026. వరం: 100. 70-00
౨06066 14 న్20జజడ/202 0ఈం[ గలు, 12046, కజు?882జ ౨01 0878-2243026.
అంపశయ్య నవీన్
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
ఇం.నెం.2-7-71, ఎక్సెజ్ కాలనీ
సుబేదారి. హన్మకొండ, వరంగల్ 506001.
తెలుగుకథలే అనిపించే సంస్కృత అనువాద కథలు
డింగరి నరహరి ఆచార్యగారు తెలుగు సంస్కృత భాషలలో మంచి పండితులు
ఆయన అనేక (గంధాలు రచించారు. “వీచిక* 'పేరుతో విమర్శనా వ్యాసాలను
ప్రచురించారు... “అభిరామం” అన్న (గ్రంధంలో తను జరిపిన అమెరికా పర్యటనకు
సంబందించిన అనుభవాలను కవిత్వీకరించారు. “వేళ్ళు” "పేరుతో వెలువరించిన వచన
కవితలున్నాయి. “శతకసుధ” అన్న శతకాన్ని కూడా రచించారు.ఇలా అనేక సాహితీ
ప్రక్రియల్లో కృషి చేసిన నరహరి ఆచార్య “జగద” అన్న పేరుతో సంస్కృతము నుండి
తెలుగులోకి అనువదించిన పదకొందు. కథల్ని రెండు తెలుగు కథల్ని కలిపి పుస్తకంగా
వెలువరిస్తున్నారు.
ఈ జగదలోని పదమూడు కథల్ని నేను చదివి ఆనందించాను అనువాదం చాలా సరళంగా చక్కని 'ప్రవాహ శీలమైన శైలితో సాగింది. ఈ కథల్ని చదువుతుంటే ఇవి అనువాదకథలని నా కెప్పుడూ అనిపించలేదు. అచ్చమైన. తెలుగుకథల్ని చదువుతున్నట్టుగానే నా కనిపించింది.
ఇప్పుడు సంస్కృత భాషను. సరళం చేసి సామాన్య ప్రజల్లోకి ఆభాషను తీసుకెళ్ళాలన్న ప్రయత్నాన్ని “సంస్కృత భారతి” అన్నసంస్థ చేపట్టింది. ఆప్రయత్నంలో భాగంగానే అనేక భారతీయ భాషల్లో రచించ బడిన కథల్ని నవలల్ని సంస్కృతం లోకి అనువాదం చేసి, పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అలాగే సంస్కృతంలో రచింపబడిన కథల్ని నవలల్ని ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు.
నరహరి ఆచార్య సంస్కృతంలో రచించబడిన కథల్ని ఎన్నుకొని వాటిని చక్కని తెలుగు నుడికారంతో ఇవి తెలుగు కథలే అన్నంత సహజంగా అనువదించారు.
ఈపదమూడు కథల్ని చదివితే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఈకథల్లోని సంఘటనలు పాత్రలు ఎంతో సహజంగా వాస్తవికంగా. రూపొందాయి ఎక్కడా అసహజమైన పాత్రలు కాని అవాస్తవికమైన సంఘటనలు కాని కనిపించవు. ఈ కథల్లో చిత్రించబడిన సమస్యలన్నీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం ఎదుర్శొనేవే. ఈ అనువాద కథలన్నీ ఇదివరకు “విపుల” మాస పత్రికలో వెలువడినవే, ప్రపంచ భాషల్లో వెలువడిన ఎన్నో గొప్ప కథల తెలుగు అనువాదాన్ని ప్రచురించడం కోసమే “విపుల” మాస పత్రిక కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సంపుటిలోని మొదటి కథ “*బ్రిగీటా" బ్రిగీటా అన్న ఒక జర్మన్ యువతిని ఈ. కథ చెప్తన్న వ్యక్తి ప్రేమిస్తాడు వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుంటారు, కాని బ్రిగీటాకు పర్యావరణ పరిరక్షణ మీద చాలా ఆసక్తి ఉంది. ఆమె నేను పెళ్ళి చేసుకోనని పర్యావరణ పరిరక్షణకే తన జీవితాన్ని అంకితం చేస్తానని తనను ప్రేమించిన భారతీయునికి తెలియజేస్తుంది.
“ఉచ్చు అనే కథలో అమెరికాలో వుంటున్న రమేశ్ అనే యువకుడు భారతదేశానికి వెళ్ళాలనుకుంటాడు. అతని దగ్గర ప్రయాణ ఖర్చులుండవు” నీకు రానుపోను టికట్లుకొనిపెడతాను నాకో సహాయం చెయ్యమని, రణరుద్దుడు అనే వ్యక్తి రమేశ్‌ని అడుగుతాడు: ఆ సహాయం ఏమిటంటే రణరుద్దుడు ఒక. సూట్‌కేస్ ఇచ్చి బ్యాంకాక్‌లో మా బందువులకు దాన్ని అప్పగించమంటాడు. రమేశ్ అందుకు అంగీకరిస్తాడు. బ్యాంకాక్ విమానాశ్రయంలో సెక్యూరిటీ వాళ్ళు ఆ. సూట్‌కేస్‌ను చెక్ చేయగా దాంట్లో హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఉన్నాయని తేలుతుంది చెయ్యని 'నేరానికి రమేశ్ అనేవాడు జైలు పాలవుతాడు,
“శత్రువు” కథలో భార్యాభర్తల మధ్య ఘర్షణ తన తండ్రిని తన భార్య సరిగా చూడడంలేదని భర్త, మీ తండ్రికి ఇంకో కొడుకున్నాడు కదా అతని దగ్గరికి పంపించండని భార్య. మామను ఏనాడు (ప్రేమగ్గా చూడని ఆ కొడుకు మామగారిని బయటకు పంపించాక మామగ్గారికి 'పదిలక్షల రూషాయలొచ్చాయని తెలిసినప్పుడు ఆయనను నేను (ప్రేమగా చూడకపోవడం 'పెద్దపారపాటేనని, ప్రేమగా చూసుంటే ఆ పదిలక్షల్లో కొంత తనకొచ్చేదని అనుకొంటుంది.. ఇలాంటి సంఘటనలు ఈ రోజుల్లో ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో జరుగుతున్నవే,
కద్రివ్రోదాసుకు 'పెళ్ళికాలేదని అందరూ అతబణ్లి అసహ్యించుకొంటారు.. అతడెంతోమంచివాడన్న విషం ఎవరికీ పట్టదు. ఈ సమస్యను “పాడుముఖం” అన్న కథ చిత్రించింది. ఓనానమ్మకు ఆమె మనవడికి మధ్య అనుబంధాన్ని “నానమ్మగెలుపు” కథ చిత్రించింది. “చావే నయం” అన్నకథలో ఓ వ్యక్తి తను చనిపోయినట్టుగా. కలగంటాడు. చనిపోయాక తన శవానికి అంత్యక్రియలు చేయడానికి ఎవరెవరు ఎలా ఆర్భాటం చేస్తారో కలలో చూస్తాడు, కలలోంచి మేలుకున్నాక అతడు రోజూ ఎదుర్శొనే సమస్యలు గుర్తొచ్చి బతకడం కంటే చావే నయం అనుకొంటాడు.
“జగద” అన్న కథలో ఓపనిపిల్లకు సంబందించిన కథ ఓ ఉద్యోగస్తురాలి ఇంట్లో పనిమనిషిగా పనిచేసే జగద మొదట్లో బాగా పనిచేస్తుందని మంచి పేరే తెచ్చుకుంటుంది, కానీ నెల రోజులనుండి ఆమె రోజూ పనికి ఆలస్యంగా వస్తుండటంతో యజమానురాలు ఆమెను పనిలోంచి తీసేస్తానని అంటుంది... కానీ జగద నాయనమ్మ ద్వారా జగద ఆలస్యంగా ఎందుకు వస్తున్నదో తెలుసుకున్నప్పుడు యజమానురాలి మనస్సు కరిగిపోతుంది. హృదయాన్ని జలదరింపచేసే కథ ఇది. “ఏది అసాధ్యం” అన్న కథలో ఓ పాఠశాలలో లెక్కల మాస్టారుకు జబ్బుచేసి లెక్కలు బోధించలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు లెక్కల్లో చాలా తెలివైన విష్ణు అనే ఓ విద్యార్ధే తన తోడి 10తరగతి విద్యార్ధులందరికి లెక్కలు బోధించి పరీక్షలో మంచి ఫలితాలను సాధింపజేసిన ఉదంతం చిత్రించబడింది. “మనోగతం” కథలో కొత్తగా ఉద్యోగంలో చేరిన కమల గోపాలక్రిష్ట అనే ఆఫీసులోని అధికారిని అపార్ధం చేసుకుంటుంది. తర్వాత అతదెంత మంచివాడో అర్ధం చేసుకుంటుంది.
“క్షమించు” కథలో భార్యను అపార్ధం చేసుకొన్న ఓ భర్త మనస్తత్వం చిత్రించబడింది. “ఆక్రమణ” కథ భార్యాభర్తల మధ్య ఏర్పడే గాఢమైన అనుబంధాన్ని చిత్రిస్తుంది. “కవిసామ్రాట్ కథలో కవిత్వం రాసే కవులకు కవిసామ్రాట్ బిరుదులిస్తారే తప్ప వాళ్ళకు ఆర్థికంగా సహాయపడడానికి ఎవరూ ముందుకు రాకపోవడమనే వాస్తవర చిత్రించబడింది. పుత్రుడే పున్నామనరకం నుండి కాపాడతాడని భావించి ఓ పుత్రుడిని కనడం ఆ పుత్రుడి వల్ల బోలెడు కష్టాలు పడటం పుత్రుడు తెలుసుకోవడం ఈ సమస్యను “పుత్రస్యాపిగతిర్నాస్తి” అన్న కథ చిత్రించింది.
ఇలా ఈ సంపుటిలోని కథల్ని మన సమాజం ముఖ్యంగా. మధ్యతరగతి సమాజం ఎదుర్కొంటున్న సజీవ సమస్యల్ని చిత్రించాయి. అనువాదం చాలా సాఫీగాసూటిగా, స్వేచ్చగా, ప్రవాహశీలంగా జరిగింది, సంస్కృతంలో వెలువడిన ఇన్ని మంచి కథల్ని ఇంత చక్కగా అనువదించి మన కందించిన డాక్టర్ డింగరి నరహరి ఆచార్యను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వరంగల్ అంపశయ్య నవీన్. 1
మనోభూమిక
సుమారు నలభై ఏళ్ళ (క్రితమే రచనా వ్యాసంగంలో ప్రవేశించిన నేను కవిత్వంతో షాటు కథారచన చేపట్టినా అవి అచ్చులో చూసుకోవాలన్న మార్గం తెలియక నడుస్తూ వచ్చాను. ఆ తర్వాత మిత్రుల సహచర్యంతో 1975లో కవిత్వంలోకి అడుగిడి గేయ కావ్యం సుభద్రాపరిణయం అచ్చులోకి తెచ్చాను. ఆ సందర్భంలోనే కొన్నికథలు ఓమూడు నవలలు (వ్రాసినా మూల ప్రతులను పోగొట్టుకున్నాను. ఆవిధంగా నాలో కథలు రాయాలన్న తపన దాగి ఉంది. ఆ పద్దతిలో కరింనగర్‌వచ్చాక మిత్రుడు డా॥నలిమెల భాస్కర్ ప్రోత్సాహంతో తిరిగి కథ వ్రాయడం ప్రారంభించి ఓ రెండు మూడు స్వతంత్ర కథలు వ్రాసి పత్రికల్లో చూసుకోగలిగాను. ఆసందర్భంలోనే భాస్మ్కర్‌గారి అనువాద కథలను చూసి ఈ సంస్కృతానువాద కథలు రాయడం మొదలు పెట్టాను. ఈ విషయంలో నన్ను పదే పదే ప్రోత్సాహించిన ఆ మిత్రునికి కృతజ్ఞతలు,
కొన్ని కథలు “విపులోవారి ఆదరణతో అచ్చుకావడంతో జ్ఞాపికగా వాటన్నిటిని ఒక సంకలన రూపంలో తీసుకు రావల్సిందిగా భాస్కర్‌గారు మిత్రులు డా॥గం(డ్ర లక్ష్మన్‌రావుగారు, వారాల ఆనంద్ గారు పదే పదే హెచ్చరించడంతో ఈ ముద్రణకు సాహసించాను. ముద్రణనమయంలో (ప్రూథులు సరిచేసిన మరో మిత్రులు. డా11బి.వి.యన్. స్వామి గారు ఇలా నా ఏడవ రచన వెలుగు చూడడానికి కారకులైన
ఈ పుస్తకానికి ముందుమాట కోరగానే అతిత్వరగా వ్రాసిపంపిన సాహితీవేత్త ప్రముఖ కథా నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ అంపశయ్య నవీన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ పుస్తకాన్ని డి.టి,పి.ద్వారా తీర్చిదిద్దిన శ్రీ బి.శ్రీనివాస్ గారికి అందంగా అచ్చువేసిన సత్యనారాయణ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ జక్కని ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు.
ప్రతి నా రచన వెనుక అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న నా (బ్రీమతి గోదాదేవికి, కుమారులు మురళీమోహన్, ్రీవర్ధన్, హరిచరణ్‌లకు నా రచనలను వినాలని అభిలషించే కోడళ్ళు నీత, కీర్తిశ్సీ (శ్రావణి మరియు చిరంజీవులు మనుమలు అభిరామ్, కౌస్తుభ్ మనుమరాలు వసుప్రద వైష్ణవిలకు నా శుభాశీస్సులు. రచయిత దొః। డింగరి నరహరి ఆచార్య ఛ్
అనువాద కథా సూచిక 1 టిగీటా క్ష 2. ఉచ్చు గ్ర శీ పాడుముఖం 29 ర్. నానమ్మగెలుపు 30 6, చావేనయం 89 8. ఏదీ అసాధ్యం శీ8 9. మనోగతం ర్‌తె 10. క్షమించు ర్7 11. ఆక్రమణ 65 12. కవిసమ్రాట్ "7/11 13. పుత్రస్యాపిగతిర్నాస్తి _ 76
ఇ11
బ్రిగీటా
జీవితం చాలా విచిత్రమైంది. ఒక్కొక్కప్పుడు అపరిచితులతో ఆకస్మికంగా పరిచయం. ఏర్పడి త్వరగా సన్నిహితులను, ఆత్మీయులను చేస్తుంది. కాని అంతలోనే అనూహ్యంగా వియోగం కలిగినప్పుడు ధైర్యవంతులమీద దాని ప్రభావం ఉండక పోవచ్చుగాని, దుర్చలులు మాత్రం ఆ వియోగం తట్టుకోలేక విలవిల్లాడేట్టు చేస్తుంది.
నాదీ బ్రిగీటాది ఒకేరకమైన అభిరుచి. అందుకే విచిత్రంగా మా ఇద్దరికి స్నేహం కలగడం, అనుకోకుండా దూరం కావడం: కూడా జరిగింది. -
.... పర్యావరణ రక్షణ అనే విషయంపై బెంగుళూరులో ఒక కవి సమ్మేళనం జరుగబోతోంది. ఆ సమ్మేళనంలో పాల్గొనడానికి బ్రిగీటా రాబోతోంది. ఆ విషయం తెలుపుతూ “అప్పుడు నన్నక్ష్మడ కలవండి” అంటూ ప్రేమతో లేఖ రాసిందామె. ఆమెతో కాలం గడపడం అంటే నాకెంతో ఆనందం. ఇక ఆమె కోరిక తీర్చకుండా ఆమెను కలవకుండా ఎలా ఉండగలను?
“బ్రిగీటా జర్మన్. అయినా మామధ్య అనూహ్యంగా స్నేహబంధం ఏర్పడింది. అప్పుడు నేను పి.జి, పూర్తిచేసి పరిశోధనా రంగంలో నిమగ్నుడనయి ఉన్నాను. పరమాణు, బౌతికశాస్తంలో జీవరసాయన నిర్మాణం ఎలా ఉంది. ఎలా ఉంటుంది?” అన్న విషయంపై నా పరిశోధనా పత్రాలను చూడాలని నాకు చాలా కోరిక, ఐన్‌స్టీన్, ప్లెంక్, హైసన్‌బర్ లాంటి భౌతిక శాస్త్రజ్ఞుల పరిశోధనా పత్రాలు జర్మన్ భాషలోనే చదువ దగ్గవి అన్న అభిప్రాయం నాకుండేది. అందుకే పట్టుదలతో జర్మన్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాను.
“నూతన భాషాధ్యయనం అంటే కొత్త ప్రపంచంతో పరిచయమే, భాష నేర్చుకోవడమంటేనే ఒక మధురానుభూతి. జర్మన్ భాష నేర్చుకోవడంలో నాకలాంటి అనుభూతి కలిగింది. అయినా ఆ భాష నేర్చుకోవడానికి చాలా అభ్యాసం చేయాల్సి వచ్చింది. కష్టం కూడా అయింది. కాని, నేను మాత్రం ఆ కష్టాన్నీ సంతోషంగానే ఫీలయ్యాను. నిపుణులైన వాళ్ళ దగ్గర చేరి కష్టపడసాగాను. తద్వారా అనేకంగా జర్మన్ ఆచార వ్యవహారాలు తెలిశాయి. జగద- అనువాదకథలు క్ష డా! డింగరి నరహరి ఆచార్య
జర్మన్ కవుల కవిత్వం కూడా కొంత చదివాను, 'బెర్లో అనే కవి అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అతని రచనలన్నింటినీ చదవాలనే సంకల్పం నాలో కలిగింది. కాని నా పరిశోధనా భారంవలన నా కోరిక తీర్చుకోవడానికి సమయం దొరకలేదు కొని రోజురోజుకి ఆ నాకోరిక మరింత బలపడుతూనే ఉంది
నాకు జర్మన్ భాష నేర్పుతున్న మాష్టారుతో మాటల సందర్భంలో ఈ విషయం చెబితే ఆయన నన్నభినందిస్తూ,
“అక్కడి సాహిత్య విధ్యార్థలతో కలం స్నేహం సంపాదించు” అని సలహాయిచ్చాడు
ఆ సలహా బాగుందనిపించి వెంటనే ఆయన ఇచ్చిన అడ్రసులకి లేఖలు రాశాను. వారిలో ఈ బ్రిగీటా వద్దనుండి అభిమానంతో కూడిన ప్రోత్సాహకరమైన జవాబు వచ్చింది
“ప్రియ సాహితీ బంధూ[”
మీ లేఖ అందింది. అది చదివి నేను ఆనంద సాగరంలో మునిపోయాను. ఎందుకంటే ఎవరైనా ఒక భారతీయునితో స్నేహం చేయాలని నాకు చాలా రోజులనుండి కోరికగా ఉంది. ఇప్పుడు అనుకోకుండా మీ ఉత్తరం అందింది. జర్మన్ కవుల భావుకతను, ఆలోచనా తరంగాలను మీకు రాయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ లేఖ చదివాక మీరు జర్మన్ భాష బాగా నేర్చుకున్నారనే అనిపిస్తోంది. మీరు కూడా నాకు భారతీయ సాహితీ సంస్కృతులు, తత్వ శాస్త్రాల పరిచయం కలిగించండి, నేనూ కొంచెం సంస్క లతే భాష నేర్చుకున్నాను. కాని భారతీయ తత్వశాస్త్ర అవగాహన సంపూర్ణంగా కలగాలంటే ఒక భారతీయునికే దానిని వివరించగలిగే శక్తి వుందని నా విశ్వాసం. ఇతర దేశీయులైన మాకు దాని లోతుపాతులు తెలియడం కష్టం. అందువల్ల దయచేసి ఆ విషయాన్ని నాకు లేఖలద్వారా సవివరంగా బోధించండి. నేను కూడా మీవంటి పరిశోధక విద్యార్థినే నాటకాల గూర్చి పరిశోధన చేస్తున్నాను.
మీ లేఖకై ఎదురుచూసే బ్రిగీటా,
ఆఅ లెఖ చదివిన నా ఆనందానికి అవధిలేదు. మా ఇద్దరి అభిరుచులు ఒకటే కాబట్టీ మా స్నేహం త్వరగా అభివృద్ది చెందింది. దూరంగా ఉన్నా మా మనస్సులు దగ్గరయ్యాయనే చెప్పాలి.
పంచతం(టత్రంలోని నీతులు, భగవద్గీతలో వర్ణింపబడ్డ నిష్కామ కర్మయోగం, జగద- అనువాదకధలు 0 డా! దింగరి నరహది ఆచార్య
రామాయణ, మహాభారతాల్లోని మానవ సంబంధరీతులు ఇలా అనేక విషయాలను గురించి బ్రిగీటాకు రాశాను. 'బిగీటా కూడా ప్రసిద్ద జర్మన్ సాహిత్యాకారుల పరిచయాన్ని ఉత్తరాల ద్వారా నాకు కలిగించింది. అలాగే జర్మన్ తత్వశాస్తాన్ని వివరించింది. ఇలా కొంతకాలం గడిచాక ఒకసారి లేఖతోపాటు తన ఫోటో కూడా పంపించింది. ఆమె అసాధారణ సౌందర్యం నన్ను ఆకట్టుకొంది. ఆమె కోరిక ప్రకారం నేను కూడానా ఫోటో పంపించాను,
మా ఇద్దరి మధ్య మెల్లమెల్లగా (ప్రేమలత అంకురించింది. అది నిత్యనూతనంగా పల్లవిస్తూ అభివృద్ది కాసాగింది. తద్వారా ఏర్పడ్డ సన్నిహితత్వం వల్ల *మీరు' అని రాసుకోవడం పోయి *“నీవు' అనేంత వరకు వచ్చింది. మేమిద్దరం అనేక (పేమ కవితలు 'రాసుకున్నాం. అందులో ఆమె ఏమి రాసిందో, నేను ఏమి రాశానో నాకిప్పుడు జ్ఞాపకం లేదు.
ఇలా కొన్ని నెలలు గడిచాయి, నా పరిశోధనా [గ్రంధం పూర్తయింది. విశ్వవిద్యాలయానికి సమర్పించాను. వైవా కూడా అయినాకు డాక్టరేటు వచ్చింది. నా పరిశోధనా కాలంలో నేను జర్మన్ ఫెలోషిప్ కోసం అప్లై చేశాను. అక్కడి ప్రొఫెసర్ ద్వారా ఆ అవకాశమూ. లభించింది. అందువల్ల కంప్యూటర్‌ద్వారా పరిశోధన చేసే అవకాశం ఏర్పడింది. .
అక్కడ 'బ్రిగీటా కూడా డాక్టరేటు తీసుకొని లెక్చరర్‌గా చేరింది. విచిత్రంగా నా పరిశోధన ఆమె పనిచేసే పట్టణంలోనే అవడంతో నాకెంతో ఆనందం కల్గింది. ఈవిధంగా బ్రిగీటాను ప్రత్యక్షంగా కలుసుకొనే అవకాశం లభించింది.
అనుకున్న రోజు విమానంలో జర్మనీలో బ్రిగీటా లెక్చరర్‌గా పనిచేసే నగరానికి వెళ్లాను. విమానాశ్రయంలోనే బబిగీటా. నాకు స్వాగతం పలికింది. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయిన ఆ అనుభూతిలో కాలం స్తంభించినట్లయింది. కొద్ది క్షణాలు ఆనందంతో బాహ్య ప్రపంచాన్ని మరచిపోయాం,
“ప్రయాణం ఏలా జరిగింది?” అని బ్రిగీటా అడిగింది. “సుఖంగానే *అంటూ తేరుకొని సమాధానమిచ్చాను,
“మీ కోరిక ప్రకారం ఒక ఇల్లు అద్దెకు మాట్లాడాను. అది మీకు బాగుంటుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనమక్కడికే వెళదాం” అని తన కారులో అక్కడకు తీసుకెళ్ళింది. జగద- అనువాదకథలు ప్రై డా! డింగరి నరహరి ఆచార్య
నా అభిప్రాయాలకు తగ్గట్టుగా బ్రిగీటా ఆ ఇంటిని అలంకరించి ఉంచింది. ఇంటి పరిసరాలు చాలా అహ్ల్హాదకరంగా ఉన్నాయి.
మా ఇద్దరి కోసం బిగీటాయే వంటచేసింది. మాట్లాడుతూ భోంచేశాం, ఆ తర్వాత కాసేపు మాట్లాడి తన నివాసానికి వెళ్ళిపోయింది బ్రిగీటా,
నా ప్రొఫెసర్ ఏగ్న్ ఏంతో సరళ హృదయుడు, మృదుస్పభావుడు. జీవరసాయన శాస్త్రంలో ఆయన గొప్ప జ్ఞాని, ఆయన మార్గదర్శకత్వంలో నా పరిశోధన ప్రారంభించాను.
ఏవిధంగా దినదినం నా పరిశోధన అభివృద్దిపథంలో నడుస్తుందో ట్రిగీటా స్నేహం కూడా అలాగే వృద్ది చెందింది. వారంలో రెండు సార్లెనా కలిసేవాళ్లం.. చాలాసేపు మాట్లాడుకునేవాళ్లం. చాలా విషయాలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి,
ఒకసారి రెస్టారెంట్‌లో కూర్చున్నప్పుడు బ్రిగిటా “మానవులమైన మన జీవన లక్ష్యం ఏమిటి?” అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్న మైత్రేయి యాజ్ఞవల్యుణ్ణి అడిగినట్లు అనిపించింది నాకు.
“తల్లిదండ్రుల్ని క్షేమంగా చూసుకోవడం. సంతానాన్ని ప్రేమతో పోషించడం” అన్నాను. “ఇంకా చెప్పండి ” అంది.
“క్క భూమిమీద ఉన్న ప్రకృతి సంపదంతా మనం అనుభవిస్తున్నాం. మన తర్వాత తరం కూడా. దీన్ని అనుభవిస్తారు. అలాగే మానవ సంతతి ఒకరితర్వాత ఒకరు ఈ ప్రకృతి సంపద అనుభవించాలి, కాని అది జరుగకుండా ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. అంతేకాక కొందరింకా గ్రహాల మీద నగరాలు నిర్మించి నివసించాలని
“అవున్సు నేను కూడా ఆకాశంలో నివసించడం గూర్చి కలలు కంటున్నాను.” అని మధ్యలో బిగీటా అంది.
“నేను మాత్రం అలా కోరుకోవడం లేదు, నేను భూమిపైనే జీవించడానికి ఇష్టపడతాను. ఈ చెట్లు, పర్వతాలు, మెఘాలు, జలపాతాలు అన్నీ నన్నాకట్టుకున్నాయి. వాటి వియోగాన్ని ఏమాత్రం సహించలేను. ఈ లోకం లోని నా బంధుమిత్రుల్లో తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా సరిగా దొరకని వాళ్లున్న ఈ పరిస్థితిలో ఆకాశవిహారం గురించి అక్కడే నివాసంలాంటి కలలు ఎలా కలుగుతాయి?” అని ప్రశ్నించాను. జగద- అనువాదకథలు శీ డా! డింగరి నరహరి ఆచార్య
“నీవెం మాట్లాడుతున్నావు? విజ్ఞాన రంగంలో మనం ప్రగతి సాధించాలని నీ ఆశయం కాదా?” ఆవేశంగా అడిగింది 'బ్రిగీటా;
“ప్రగతి అపేక్షించదగిందే కాని అది. మనిషి అస్థిత్వాన్ని నాశనం చేసేది కాకూడదు. ఆకాశంలో నిర్మించే ఆ నగరాలవల్ల వాయు మండలం కూడా కలుషితమయి మానవ అస్తిత్వం కోల్పోయే ప్రమాధం ఉంది. స్వచ్చమైన నీరు, నిర్మలమైన గాలి అందరికి జీవనాధారమే! వాటిని కలుషితం చేయడం మన ప్రగతి కాదు.:
మౌనంగా నామాటల్ని వింటూ ఏదో గంభీరమైన ఆలోచనలో పడిపోయింది బ్రిగీటా,
ఇలా మా ఇద్దరి మధ్య తరచు చర్చలు సాగుతూనే వున్నాయి.
ఇంతలో నా పరిశోధన పూర్తయ్యింది. అవార్డుకూడా ఇచ్చారు. మళ్లీ భారతదేశానికి వెళ్లే సమయం దగ్గరపడుతోంది. ఈమధ్యలో ్రిగీటాకు నాకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాం. నేనేమో ఇప్పుడే భారతదేశం వెళ్లాలి, కాని 'బ్రిగీటాకేమో జర్మనీలో చేయాల్సిన పనులింకావున్నాయి. కొన్ని నెలల తర్వాతే భారతదేశం వచ్చేవీలుంది. అందుకే భారతదేశం వచ్చాకే పెళ్ళి చేసుకోవడం, కలిసి జీవితం గడపడం... అనే స్థిర నిశ్చయానికి వచ్చాం. అశ్రునయనాలతో బ్రిగీటా నాకు వీడ్మోలిచ్చింది.
కాని, మనదేశం వచ్చిన నాకు నిరాశే ఎదురయింది. ఎందుకంటే స్వతంత్రంగా పరిశోధన చేసే అవకాశం నాకెక్కడా దొరకలేదు. స్వాతంత్యంలేని పరిశోధనపై నాకు ఆసక్తిలేక ఒక విద్యాలయంలో అధ్యాపకునిగా చేరాను, (్రిగీటా రాకకోసం నిరీక్షిస్తూ కాలం :గడపసాగాను.
ఈ మధ్యలో నాకు సాహిత్యంపై మరింత ఆసక్తి ఏర్పడింది. సంస్కృతాద్యయనం కూడా చేశాను. రామాయణ, మహాభారతాల లోతుపాతులు గ్రహించాను. నాలో భావనా బలం పెరిగింది. ఈ సాహిత్యాధ్యయనం ట్రిగీటా విరహాన్ని ఓర్చుకునే శక్తిని ప్రసాదించింది. .
ఇంతలో బ్రిగీటా వద్దనుండి అనుకోకుండా ఒక లేఖ వచ్చింది.
“ప్రియమిత్రమా! ఇప్పుడు నా జీవిత విధానమే మారిపోయింది. ఉచ్చనీచ భేదభావరహితమైన మానవ సమాజ నిర్మాణం చేయడమే జీవితలక్ష్యంగా మారింది. అందుకే నేను సమాజసేవికగా ఉండదలచుకున్నాను. ప్రకృతి నిర్మలంగా రక్షించబడితేనె జగద- అనువాదకథలు ర్ డా! దింగరి నరహరి ఆచార్య
మానవజీవితం నిర్మలంగా ఉంటుందనే అభిప్రాయంనాకు స్పష్టంగా గోచరిస్తోంది.కనుక నేను ఇక్కడ గ్రీన్స్ అనే పేరుగల సంస్థలో సభ్యత్వం స్వీకరించాను. ఆ సంస్థ ప్రకృతి విధ్వంస కార్యాలు నిరోధించడానికి కృషి చేస్తూ వుంది, నేను కూదా ఆ సభ్యులతో కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ సందర్భంలో నీవు చాలా జ్ఞాపకం వస్తున్నావు, ఎందుకో తెలుసా? ఈ సదభిప్రాయానికి పునాదులు వేసింది నీవే, మానవ జీవితం క్షణికమైంది.. అది స్వార్ధంకోసం ఉపయోగించు కోకూడదని నా నిర్ణయం. అందుకే వివాహా బంధంలో ఇరుక్కుపోకూడదని. నిశ్చయించుకున్నాను. నా పూర్తి జీవితాన్ని దీనికే వినియోగించాలని కోరుకుంటున్నాను. నీవు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. నిన్ను నిరా శపరుస్తున్నాను. ఇట్లు లేఖ చదివి నేను కింకర్షవ్య జిజ్ఞాసలో పడిపోయాను. అలాగే చాలాసేపు నిశ్చేష్టంగా కూర్చుండిపోయాను, అది భరించలేని విషయమే అయినా బాగా ఆలోచించి “నాకు ఏదైతే నష్టం కలిగించిందో అది సమాజానికి లాభం కల్గిస్తోంది" అనే తృప్తితో మనసును సమాధానపరిచాను. ఆ బ్రిగీటా ఇవ్వాళ ఇక్కడికి రాబోతోంది, నా మనస్సు ఉరకలు వేస్తోంది. ఆదర్శ లక్ష్యంగల ఆవాను నేనెలా కలువకుండా ఉండగలను; నిర్మొహమాటంగ్నా నిజాయితీగా తన అభిప్రాయం. స్పష్టం చేసిన ఆమె మీద కోపం లేదు సరిగదా గౌరవం పెరిగింది. నాలో, బెంగుళూరు ప్రయాణానికి సిద్ధం కాసాగాను. మూలరచయిత: వారణాసి రామబ్రహ్మం (వివుల సెప్టెంబరు 1998) జగద-+ అనువాదకథలు 6 దడా! దింగరి నరహాది ఆచార్య
ఉచ్చు
అది బాగా చలికాలం కావడంవల్ల చికాగో నగర వీధుల్లో మంచు కురుస్తోంది. చల్లని గాలులు వీస్తున్నాయి. సాయంకాలం అయీ అవగానే చీకటి. తన. రాజ్యాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఆ చీకటిని పారదోలేందుకు సూర్యుడు పంపిన భటులా అన్నట్టు విద్యుత్ దీపాలు తమ శక్తికొలదీ వెలుగునింపుతూ వెలుతుర్లో అన్నీ కనిపించేటట్లు చేస్తున్నాయి. ఆ చీకటిని, చలిని కూడా లెక్కచేయకుండా అనేక వాహనాలు ఏదో తొందరమీద అసంఖ్యాకంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి,
ఆ చలిని తట్టుకోవడానికి స్వెట్టరు, ఆపైన కోటు ధరించిన రమేళ్ బస్సులోనుండి దిగి తన గదివైపు నడుస్తున్నాడు. అతడి వసతి గృహం అక్కడికి దగ్గర్లోనే ఉంది. అక్కడికి చేరంతవరకు ఎలాగో చలి బాధను ఓర్చుకుంటూ నడుస్తున్నాడు. భవనం చేరుకుని ముఖద్వారం దాటి. లోపలికి రాగానే కాస్త వేడి వాతావరణం, అతగాడింతదాకా అనుభవించిన బాధను మరిపించి (ప్రాణాలు లేసొచ్చాయి, ఎలాగో మెట్లెక్కి రెండో అంతస్థులోని తన గదికి చేరుకుని తలుపులు తీసుకొని లోపలికి ప్రవేశించాడు. పుస్తకాల సంచీ మూలపడేస్కి కాళ్ళజోళ్లు పక్కగా విడిచి ఉస్సురంటూ మంచంమీద వాలిపోయాడు రిమోట్ ద్వారా టి.వి ఆన్‌చేసి. దాంట్లో ప్రసారమవుతున్న (పప్రేమదృశ్యాలను చూస్తూండిపోయాడు.
దృష్టి టీ.వి. మీద ఉన్నా అతడి మనస్సు మాత్రం. అక్కడ లేదు, అతడు భారతదేశం నుండి వచ్చి అప్పుడే ఏనిమిది మాసాలు గడిచిపోయాయి, చదువు కూడా సక్రమం: గానే సాగుతోంది. అక్కడి. పరీక్షలు ఓ: (ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. అందుకే వాటికోసం సిద్ధమవుతున్నాడు. భారతదేశం లోలాగా సమస్యలు లేనేలేవు. విదేశీజీవితం విచిత్రమైనా సుఖంగా ఉంది. నల్లాల్లో నీరు వన్నడూ కలుషితం కాదు, విద్యుచ్చక్తి పోవడమనేది లేనేలేదు. ఎడతెగని ఆహారపదార్థాలు ఏవంటే అవి లభిస్తాయి. తెల్లదొరసానులు చిరునవ్వులతో నయనానందం కలిగిస్తుంటారు. అన్నిరకాలుగా సుఖంగాానే ఉంది, అయినా వందుకో బంధువులను, సన్నిహితులను, హితులను విడిచి ఇంతదూరాన వుండడం ఏకాకి జీవితం గడపడం, ఎలా గడుస్తుందోననే భయం బాధిస్తూనె వుంది, జగద- అనువాదకథలు. 4 దా! డింగరి నరహరి ఆచార్య
పరీక్షల తర్వాత విద్వాలయానికి సెలవులినారు,
అప్పుడేం చేయాల్సి స్వదేశానికి వెళ్ళాలంటే రావడానికి పోవడానికి సుమారు రెండువేల డాలర్ల దాకా ఖర్చవుతుంది. తనకు వచ్చే స్కాలర్‌షిప్ రోజులు గడపడానికే సరిపోతోంది. తల్లిదండ్రులు చూద్దామా బీదవాళ్లు అరవైవేల రూపాయలు వాళ్ళెలా పంపించగలరు. ఇక్కడే ఉందామంటే మూడు నెలలు ఈ చికాగోలో ఒంటరితనం అనుభవిస్తూ ఏలా గడపడం. గ్రంథాలయంలో గ్రంథాలతో కుస్తీ పడుతూ కొంత సమయం గడపవచ్చు. టీ.వి. చూస్తూ చిత్రాలు చూస్తూ కొంతవరకు గడపవచ్చు రోజూ చూడడంవల్ల మనసుకు దానివల్ల కూడా ఆనందం లభించడంలేదు. ఇలా ఆలోచిస్తూ (ఫ్రిజ్ నుండి. వాల ఐస్[క్రీంకప్పులో వేసుకొని తినడానికి తయారయ్యాడు. కాని ఇంతలోనే ఫోన్ మోగడంతో రిసీవర్ ఎత్తి,
“హలో” అన్నాడు,
అవతలినుండి ఒక మధురమైన స్తీ కంఠస్వరం వినిపించింది. ఆ 'స్వరం ఇదివరకెక్కడా పరిచయమున్నదానిలా తోచలేదు. కాని కాస్త ఆలోచించగా ఎప్పుడో ఒకప్పుడు విన్నదానిలా తోచింది. సాంప్రదాయం ప్రకారం మొదటి మాటల తర్వాత ఆ యువతి.
“మీరు నన్ను గుర్తించారా?” విశ్వవిద్యాలయ 'గ్రంథాలయంలో మన పరిచయం అయింది, నేను థాయిలాండ్ దేశ విద్యార్థినినో అంది.
“జ్ఞాపకమొస్తోంది. అవును. ఆ తర్వాత మనమిద్దరం కలిసి హోటల్‌లో టీ తాగాం” అన్నాడు
“నిజం గుర్తించారు.. ఆమెనే నేను, అప్పుడు మీ గురించి నాకంతా వివరించారు. మీ దేశం వెళ్ళాలనుందని, అందుకు కావలసిన డబ్బు మీ దగ్గర లేదని బాధపడుతూ నాతో చెప్పారు. అదే విషయాన్ని గూర్చి ఏదో సందర్భంలో నా భర్తతో అన్నాను. ఆయన మీకోసం ఏదైనా ఉపాయం చేస్తానన్నారు, మీకు సాధ్యమయితే రేపొకసారి ఆ హోటల్ దగ్గరికి రండి, నేనూ నా భర్త అక్కడికి వస్తాం. టీ త్రాగుతూ అన్నీ మాట్లాడుకోవచ్చు సాధ్యమయితే ఆ పద్ధతిలో మీరు అనుకున్నప్పు డల్లా మీ దేశానికి వెళ్ళనూవచ్చు తిరిగి రానూవచ్చు. వమంటారు?” అంది,
“కొద్ది పరిచయంతోనే నామీద మీకెంతటి అభిమానం, దయ ఎలా మీకు కృతజ్ఞతలు తెలుపాలో తెలియడంలేదు” అన్నాడు రమేశ్. జగద- అనువాదకథలు రి డా! డింగరి నరహరి ఆచార్య
“విచారపడకండి! అలాంటి మాటలనకండి అంటూ అనునయంగా పలికింది.
ఆ తర్వాత ఎన్ని గంటలకు ఎలా కలుసుకునేది? ఎక్కడ కలుసుకునేది? అన్న విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.
'లోకంలో ఇంతటి దయగలవాళ్ళు కూడా ఉంటారా? ఆమె పరిచయం నా అదృష్టం వల్లనే ఏర్పడింది! అనుకుంటూ సంతోషంతో భవిష్యత్తు ఆలోచనల్లో మునిగిపోయాడు, మరుసటిరోజు అనుకున్న సమయానికన్నా ముందే హోటల్ సమీపంలో వారి కోసం ఎదురుచూడసాగాడు, ఆ ఉత్కంఠలో చలిగాలి కూడా అతన్ని వేధించడం లేదు.
అనుకున్న సమయానికి ఆ యువతి తన భర్తతోసహా కారులో దిగింది భర్తని పరిచయం చేసి హోటల్ లోకి. దారితీసింది. టీ ఆర్జరుచేసి టీ తాగుతూ మాటలు (ప్రారంభించారు. ఆ యువతి భర్త ముందుగ్గా,
“చూడండి! నా పేరు రణరుద్ద. నా భార్య మీ విషయం అంతా చెప్పింది. ఈ సెలవుల్లో మీకు భారతదేశం వెళ్ళాలనుందని, దానికోసం ధన సహాయం అవసర మని తెలిసింది. అలాంటి ధనసహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు కూడా నాకొక చిన్న సహాయం చేయాల్సివుంటుంది”
“ఆఅ పని ఏమిటో చెప్పండి నా వల్ల అయ్యేదయితే తప్పకుండా చేస్తాను” అన్నాడు అవకాశం జారిపోనివ్వకూడదన్నంత ఆత్రంగా రమేశ్.
“ప్రంలేదు మా దేశంలో మా బంధువుల వివాహం జరిగేది ఉంది. వారికోసం అక్కడ దొరకని కొన్ని విలువైన బట్టలు ఇక్కడినుండి పంపదలచుకున్నాను. నెనే వెళదామంటే. పనుల ఒత్తిడివల్ల ఇప్పుడు వెళ్ళలేను. నా భార్యనైనా పంపుదామంటే పరీక్షలకి సిద్ధం కావాలి కాబట్టి ఆమె కూడా వెళ్ళలేకపోతోంది. అందుకే మీకు థాయ్‌లాండ్ గుండా వెళ్ళేట్టు టిక్కట్టు వర్పాటుచేస్తాను. బాంకాక్ నగరంలో విమానం విశాంతికోసం ఆగుతుంది. మీరు విమానం దిగి విమానాశ్రయంలోనే ఉండండి. మీకేం (శమ కాదు. మా బంధు వొకడు వచ్చి నగరంలోకి తీసికెళతాడు, ఒకరోజు అక్కడ వుండి మా బంధువుల సత్కారాలు పొంది నేనిచ్చే ఈ బట్టలు వారి కందజేసి మరునాడు
మీ స్వదేశానికి వెళ్ళవచ్చు” అని రణరుద్ధుడు వివరించాడు
అన్నీ విన్న రమేశ్ సంతోషభరితుడైై “మరి తిరిగి ఇక్కడికి నేను రావడం ఎలా? అని సిగ్గుపడుతూనే, తప్పదుకదా అన్నట్లు అడిగాడు జగద- అనువాదకథలు రి డా॥ డింగరి నరహరి ఆచార్య
“తిరిగి రావడానికి వదో మార్గంగా మీకు నేను టిక్కట్టు అందించే ఏర్పాటు చేస్తాను అని సందేహనివృత్తి చేశాడు రణరుద్దుడు. *బాంకాక్ నగరంలో మీ బంధువులను నేనెలా తెలుసుకోవాలి? లేదా వాళ్షైనా నన్నెలా తెలుసుకోగలరు?” అమాయకంగా అదిగాడు,
“దాని గురించి మీకు బెంగవద్దు. మీ ఫొటో ఇప్పుడే మీ దగ్గర్నుండి తీసుకొని వాళ్ళకి పంపిస్తాను” అని అంటూనే రణరుద్దుడు కెమెరాతో క్షణంలో రమేశ్ ఫోటో తీశాడు. రమేశ్ ఏం మాట్లాడలేక ఊరకుండిపోయాడు.
“పరీక్షలు కాగానే ఆలస్యం చేయకుండా ప్రయాణానికి సిద్ధంకండి. కావలసిన ఏర్పాట్లన్నీ నేను సమకూర్చి పెడతాను” అన్నాడు రణరుద్ధడు.
పరీక్షల అనంతరం రెండు మూడు దినాల్లోనే రమేశ్‌కి టిక్కెట్ దొరికింది. త్వరగా ప్రయాణంరోజు రణరుద్ధుడు, అతని భార్య వచ్చి ఒక సూటుకేసును రమేశ్‌కి అప్పగించి తమ కారులోనే విమానాశ్రయందాకా తీసుకొచ్చారు. వాళ్ళిచ్చిన సూట్‌కేసు తీసుకొని బాంకాక్‌లో వాళ్ళ బంధువులతో మెలగ్గాల్సినవన్నీ తెలుసుకొని, సెలవు తీసుకొని విమానం ఎక్కాడు,
ఎగిరిన విమానంలో కూర్చుని కింద ఉన్న పర్వతాలను, నగరాలను,
అడవులను, సరస్సులను బొమ్మల్లా కనిపిస్తున్న ప్రకృతి చిత్రాలను చూస్తూ ఆనందంతో కళ్లు మూసుకుని కాస్సేపటికి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు.
నిద్ర మేల్మొనేసరికి విమానం బాంకాక్ విమానాశ్రయంలో దిగింది.
ప్రయాణీకులందరూ త్వరత్వరగా విమానం దిగడానికి సిద్దమవుతున్నారు. రమేశ్ కూడా కొత్త ప్రదేశంలో అడుగుపెట్టటోయే అనుభూతితో కలవరపడుతున్న హృదయంతో ఎలాగో అందరితో కలిసి విమానం దిగాడు. కానీ అక్కడివారీ మాట అతగాడికి తెలియదు: అదృష్టంకొద్దీ అక్కడక్కడ సూచికలుగా ఉన్న బోర్సులు మాత్రం ఇంగ్లీషులో ఉన్నాయి. వాటి సాయంతో ఏక్కడ చేరుకుని నిలవాలో అక్కడ నిలబడి తన రెండు సూటుకేసుల కోసం ఎదురు చూడసాగాడు,అవి రాగానే తీసుకొని బయటకు వెళ్ళేద్వారం దగ్గరకు చేరుకున్నాడు, తాను బయటకు వెళ్ళేసరికి రణరుద్దుని బంధువులు తనకు స్వాగతం పలుకుతారని ఆలోచిస్తూ తన రెండు పెట్టెలు పట్టుకొని ద్వారం దగ్గర ఉన్న వరుసలో నిలిచాడు. తనవంతు రాగ్గానే పాస్‌పోర్టు చూపించాడు, కస్టమ్స్‌వాళ్ళు తమ భాషలో ఏదో అడుగగా అతనేం సమాధానమవ్వలేకపోయాడు, అప్పుడు వాళ్ళే ఇంగ్లీషులో జగద- అనువాదకథలు 10 డా! డింగరి నరహరి ఆచార్య
“తిరిగి రావడానికి ఏదో మార్గంగా మీకు నేను టిక్కట్టు అందించే. ఏర్పాటు చేస్తాను అని సందేహనివృత్తి చేశాడు రణరుద్దుడు. “బాంకాక్ నగరంలో మీ బంధువులను నేనెలా తెలుసుకోవాలి? లేదా వాక్ళైనా నన్నెలా తెలుసుకోగలరు?” అమాయకంగా అడిగాడు,
“దాని గురించి మీకు బెంగవద్దు. మీ ఫొటో ఇప్పుడే మీ దగ్గర్నుండి తీసుకొని వాళ్ళకి పంపిస్తాను” అని అంటూనే రణరుద్దుడు కెమెరాతో క్షంలో రమేళ్ ఫోటో తీశాడు. రమేశ్ ఏం మాట్లాడలేక ఊరకుండిపోయాడు.
“పరీక్షలు కాగానే ఆలస్యం చేయకుండా ప్రయాణానికి సిద్ధంకండి. కావలసిన ఏర్పాట్లన్నీ నేను సమకూర్చి 'పెడతాను” అన్నాడు రణరుద్దుడు.
పరీక్షల అనంతరం రెండు మూడు దినాల్లోనే రమేశ్‌కి టిక్కెట్ దొరికింది, త్వరగా ప్రయాణంరోజు రణరుద్ధుడు, అతని భార్య వచ్చి ఒక సూటుకేసును రమేశ్‌కి అప్పగించి తమ కారులోనే విమానాశయందాకా తీసుకొచ్చారు. వాళ్ళిచ్చిన సూట్‌కేసు తీసుకొని బాంకాక్‌లో వాళ్ళ బంధువుల త్రో మెలగ్గాల్సిన వన్నీ తెలుసుకొని, సెలవ తీసుకొని విమానం ఎక్కాడు.
ఎగిరిన విమానంలో కూర్చుని కింద ఉన్న పర్వతాలను, నగరాలను, అడవులను, సరస్సులను బొమ్మల్లా కనిపిస్తున్న ప్రకృతి చిత్రాలను చూస్తూ ఆనందంతో కళ్లు మూసుకుని కాస్సేపటికి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు.
నిద్ర మేల్కొనేసరికి విమానం బాంకాక్ విమానాశ్రయంలో దిగింది. ప్రయాణీకులందరూ త్వరత్వరగా విమానం దిగడానికి సిద్ధమవుతున్నారు. రమేశ్ కూడా కొత్త ప్రదేశంలో అడుగుపెట్టబోయే అనుభూతితో కలవరపడుతున్న హృదయంతో ఎలాగో అందరితో కలిసి విమానం దిగాడు. కానీ అక్కడివారి మాట అతగాడికి తెలియదు. అదృష్టంకొద్దీ అక్కడక్కడ సూచికలుగా ఉన్న బోర్జులు మాత్రం ఇంగ్లీషులో ఉన్నాయి. వాటి సాయంతో ఏక్కడ చేరుకుని నిలవాలో అక్కడ నిలబడి తన రెండు సూటుకేసుల కోసం ఎదురు చూడసాగాడు,అవి రాగానే తీసుకొని బయటకు వెళ్ళేద్వారం దగ్గరకు చేరుకున్నాడు.. తాను బయటకు వెళ్ళేసరికి రణరుద్భని బంధువులు తనకు స్వాగతం పలుకుతారని ఆలోచిస్తూ తన రెండు పెట్టెలు పట్టుకొని ద్వారం దగ్గర ఉన్న వరుసలో నిలిచాడు. తనవంతు రాగ్గానే పాస్‌పోర్టు చూపించాడు, కస్టమ్స్‌వాళ్ళు తమ భాషలో ఏదో అడుగగా అతనేం సమాధానమివ్వలేకపోయాడు, అప్పుడు వాళ్ళే ఇంగ్లీషులో జగద- అనువాదకథలు 10 డా! డింగరి నరహరి ఆచార్య
“ఏమండీ! ఈ సూటకేసుల్లో ఉన్న వస్తువులు మీవేకదా?”
“అవును”
“ఇక్కడికి ఏం పనిమీద వచ్చారు?”
“మా దేశం వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడ ఒకరోజు ఉండి, చూడాల్సినవి చూసి మా వాళ్లను కలిసి వెళ్ళిపోతాను”
“సూట్‌కేసు తాళం తీయండి. లోపల నిషేధింపబడిన వస్తువులేవైనా ఉన్నాయేమో? చూస్తాం” అని వారనగానే తన సూటుకేసు తాళం తీశాడు,
దానిలోని వస్తువులన్నీ ఆ అధికారులు అటూ ఇటూ తిప్పి పరీక్షంచారు. తర్వాత వారి ఆదేశం ప్రకారం రణరుద్దుని సూట్‌కేసు తాళం తీశాడు. దాంట్లో అనేక రకాల బట్టలున్నాయి. అవి చూసి వెంటనే తనను వదిలేసారు కాబోలు అని రమేశ్ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఒక అధికారి అనుమానంగా రెందు మూడుమార్లు సూటుకేసును చూసి తన భాషలో అక్కడ ఒక సేవకుడిని పిలిచి ఏదో చెప్పాడు. వాడు తలవూపి వెళ్ళి వెంటనే ఓ కుక్కతోసహా వచ్చాడు. అది పెట్టెను వాసన చూసి పెద్దగా అరిచింది. అలా అనేకసార్లు వాసన చూస్తూ అరవసాగింది అప్పుడు అధికారి ఇంగ్లీషులో,
“*ప్రిమండీ! ఈ పెట్టెలో నిషేధింపబడిన. వస్తువులున్నట్లు కుక్క అరుసోందే?” అని కోపంగా చూస్తూ అడిగాడు.
“వ్పీరే చూస్తున్నారుకదా! మడత పెట్టబడిన బట్టలు తప్ప ఏమున్నాయి. అన్నీ పరీక్షించారుకదా” అని ధైర్యంగా సమాదానమిచ్చాదు.
“లేదు మాకు తెలియకుండా ఏదైనా ఉపాయంగా దాచారేమో![? అదే బయటపడుతుంది” అంటూ కత్తితో సూటుకేసు అడుగుకోశాడు.
ఏమవుతుందోనని. రమేశ్ భయపడసాగాడు. శరీరమంతా చెమట పట్టింది. 'రణరుద్ధడు తనను మోసం చేశాడేమో?” అని తనలో అనుకున్నాడు. అనుకున్నట్టుగానే పెట్టె అడుగులో ప్లాస్టిక్ సంచుల్లో తెల్లని పొడి నింపిన ప్యాకెట్లు బయటపడ్డాయి.
“క్ష! "హెరాయిన్! అంటూ ఆశ్చర్యంతో పలికాడు అధికారి,
“దొంగతనంగా మా దేశానికి ఇలా హెరాయిన్ తెస్తున్నావన్నమాట?” అంటూ ఉరిమిచూశాడు రమేశ్ వైపు.
“నన్ను క్షమించండి, నాకేం తెలియదు. నా పరిచయస్థుడొకరు నన్ను మోసగించి ఇది అంటగట్టాడు. ఇందులో బట్టలు మాత్రమే ఉన్నాయని. చెప్పాడు. అందుకే జగద- అనువాదకథలు. మే్ష డా! డింగరి నరహరి ఆచార్య
నెనీపెట్టె తీసుకున్నాను. ఇలా మోసగిస్తాడని నాకు తెలియదు” అని దీనంగా. తన తప్పేం లేదన్నట్టు వివరించాడు.
“అయితేసరే, ఈ విషయంలో నేను దయ చూపించదానికిగాని, నిన్ను వదలి వేయడానికిగాని నాకేం అధికారం లేదు, నీవు చాలా ఘోరమైన తప్పు చేశావు. బది పెద్దనేరం, నీవేం చెప్పదలచుకున్నావో అదంతా రేపు న్యాయాలయంలో చెప్పుకో” అంటూ అరెస్టు చేయించాడు. బేడీలు తగిలించి లాకప్‌లో పెట్టారు.
మరుసటిరోజు నిజాన్ని న్యాయాధికారికి చెప్పినా అతడు 'నమ్మలేదు..
“చూడు! రణరుద్భుని బంధువుల పేర్లు గాని ఫోటోగాని చూపించగలవా? ఒకవేళ అవి చూపించగలిగితే నీవు చెప్పేది నిజమని నమ్ముతాం. అయినా దానివల్ల నీవు పూర్తిగా నిర్జోషివి కాలేవు. కాకపోతే కొంత శిక్ష తగ్గుతుంది” అన్నాడు జడ్జి,
రమెశ్ దగ్గర అలాంటి సాక్ష్యాలు ఏవీ లేవు రణరుద్దుడు రమేశ్ ఫోటో తీసుకొని వాళ్ళ బంధువులకి పంవాడుగాని, వాళ్ళ బంధువులే స్వయంగా వచ్చి అక్కడ నిన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్పిన వారి అడ్రసు గాని, ఫొటోగాని ఇవ్వలేదు కనుక రమేశ్‌కి మౌనమే శరణ్యమయింది. రమేశ్ మౌనాన్ని చూసి జడ్జిగారు అతను “అపరాధి” అని
నిశ్చయించి అయిదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించాడు.
ఈవిధంగా అపరిచితదేశంలో చేయని నేరానికి రమేశ్ జైల్లో శిక్షను అనుభవిస్తూ
రోజులు లెక్కపెడుతున్నాడు. ఎప్పుడు తనకు విముక్తి అవుతుంది.. విడుదలయినా డబ్బులేని తాను స్వదేశం ఎలా వెళ్ళగలడు. వెళ్ళినా తల్లిదండ్రులకు, మిత్రులకు తన ముఖం ఎలా చూపించగలదు? ఏంత నష్టపోయాను? బతికి కూడా లాభంలేదు” అని ఏడుస్తూ రోజులు భారంగా. వెళ్ళబోస్తున్నాడు, లోకంలో దయగలవారుంటారు, అలాంటివారి పరిచయం కల్లడం మన అదృష్టం అని తొందరపడరాదు. మనం సహృదయులమని ఎదుటివారందరూ తమవంటి వారేనని నమ్మిన వాళ్ళగతి తనలాగే అవుతుందని, శన వంటి దౌర్భాగ్యుల గురించి ఆలోచిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు రమేశ్. మూలరచయిత; హెచ్, వి. నాగరాజారావు (వివుల జనవరి 1999)
జగద- అనువాదకథలు నేల డా॥ డింగరి నరహరి ఆచార్య
శత్రువు
రాంప్రకాశ్ ఇంట్లో కావలసినంత సంపదవుంది. అనేక విధాలుగా వచ్చి పడుతూనే వుంది. అయినా ఆయన భార్యకు తృప్తిలేదు. ఇంకా ఇంకా దబ్బు కావాలనే కోరిక, కాని స్వయంకృతాపరాధంగ్యా, దౌష్ట్రంగా ఇంటి తలుపులు మూసుకొని ఆ సంపదకు తానే చేతులడ్డం పెట్టుకొంది. కొంతమందికి ఎంత సంపదవున్నా ఇంకా కావాలనే ఆశతోవచ్చే దాన్ని కూడా వదిలేసి పశ్చాత్తాప పడతారు.
దూరదర్శన్‌లో ప్రత్యేక నాటకం చివరి ధారావాహికం ప్రసారం కాబోతోంది. ఆ నాటకం చూడ్డానికి ఉత్సాహంగా అందరూ గదిలో కూర్చున్నారు. రాంప్రకాళ్ భార్య దివ్య కొడుకు చంద్రదేవ్ నాటక సన్నివేశాల గూర్చి చర్చలో నిమగ్నమయి వున్నారు. పెద్దకూతురు శోభ కూడా అక్కడే కూర్చుంది. పక్కనే చిన్నపిల్లలిద్దరూ ఆటలో మునిగివున్నారు. ఇంతలో దివ్య శోభను చేసుకోబోయే పెళ్ళివారి విషయాల గూర్చి తన స్నేహితురాలితో టెలిఫోనులో సంభాషిస్తోంది. పెళ్ళికి ఏీమేం వంటకాలు చేయాలో ఏపెళ్ళి మంటపం బాగుంటుందో, అతి ఉత్సాహంగా చేతులూపుతూ, కళ్ళు తిప్పుతూ సంభాషణలో మునిగింది. |
దూరదర్శన్‌లో ఇంకా అడ్వర్టయిజుమెంట్ 'ప్రసారమే సాగుతోంది. అప్పుడే దివ్య టెలిఫోను సంభాషణ ఆపేసి రాంప్రకాణ్ దగ్గరికొచ్చి సోఫాలో కూర్చుండిపోయింది. రాంప్రకాశ్ మాత్రం 'పేపరు చదువుతూనే చిన్నకాడుకుతో “సూర్యదేవ్! త్వరగా: వెళ్ళి తాతను పిలుచుకురా! ఎందుకంటే నాటకం తొందరగా ప్రారంభమవుతుంది” అన్నాడు. “మళ్ళీ ఇప్పటికే వచ్చి వుండొచ్చు త్వరగా వెళ్ళిచూడు” అన్నాడు గడియారం చూస్తూ,
“ఇంతసేపు తాతయ్య బయట వుండనే వుండడు” సరే అయితె నేను వెళ్ళిచూస్తాను అనుకుని, సూర్యదేవ్ లేచిపోబోగా. మధ్యలోనే అడ్డుపడుతూ దివ్య తీవ్రస్వరంతో “మీవద్ద, ఏమవసరంలేదు నీవిక్కడే కూర్చో” అని విముఖంగా భర్తను చూస్తూ “ఎందుకండీ మీనాన్నగ్గారిని పిలుస్తున్నారు?” అంది
“ఏంలేదు నాటకం చివరిభాగం చూస్తాడని. ఈ ధారావాహిక నాటకమంటే ఎంత ఇష్టపడతాడో నీకు తెలుసు. ఈ చివరిభాగం చూడకపోతే చాలా. విచారిస్తాడు” అన్నాడు రాంప్రకా శ్, జగద- అనువాదకథలు 13 డా॥ డింగరి నరహరి. ఆచార్య
“ముసలితనానికి ఆయనగారి కోరికలు ఎక్కువవుతున్నాయి, రోజంతా తన గదిలో కూర్చని ఏదో చదువుతూనే వుంటాడు లేదా అయిదారు గంటలు పడుకొంటాడు.: సాయంకాలం కాగానే చిన్నపిల్లల్లా టి.వి. ముందరికి తయారవుతాడు ఇంతకన్నా ఆయనగారికి వేరే పనేముంది” మూతి వంకరగా తిప్పుతూ అంది
“అయితే ఏంచేయమంటావు వంటింట్లో అన్ని పనులూ చేయమంటావా?” అని నవ్వుతూ రాంప్రకాళశ్ అడిగాడు
“మీ కెప్పటికీ నవ్వులాటే, నామాటలన్నీ నవ్వలాటగానే తోస్తాయి” బాధపడుతూ అంది దివ్య, రాంప్రకాశ్ దినపత్రిక మడచిపెడుత్తూ
“ఏమిటి నీ వుద్దేశ్యం నాన్నగారి పక్షం ఏమీ మాట్లాడకూడదా?”
“అందరూ. మీ నాన్నగారిలాగేవున్నారా?” అంటూ తీవ్రస్వరంతో అంది.
“మరి ఎలా వున్నారు?” రాంప్రకాశ్ కూడా కోపంగా అడిగాడు.
“అవును మీ నాన్నగారు సాధువు, ఏ. పనీపాట లేకుండా తినుకుంటూ మంచంలో కూర్చుని హాయిగా వుంటాడు” వెక్కిరింపుగా అంది.
ఇలా ఆ దంపతులమధ్య ఉద్వేగపూరితమైన మాటల ద్వారా ఆవేశం పెరిగింది. అయినా కాస్త తమాయించుకొని రాంప్రకాళ్ బాధతో “పాపం ఈ అరవై అయిదేళ్ళ వయస్సులో ఏంచేయడానికి శక్తి వుంటుంది. పనిచేయకుండా తింటున్నాడంటున్నాన్, అదేమన్నా నీ బాబుగాడి సొమ్మా! ఇది నా తండ్రిగారి ఆస్తి. ఆయనకీషాటి సేవ నేను తప్పకుండా చేయాలి"
“మధ్యలో మానాన్ననెందుకు తీసుకొస్తారు?” అంది దివ్య
“నీవు మానాన్నను లేనిపోని మాటలనడంలేదా?* అంటూ రోషంగా: అడిగాడు రాంప్రకాళశ్, తల్లిదండ్రుల వాదన వింటున్న పిల్లలు
“నాన్నా దయచేసి శాంతించండి” అన్నారు,
“ఒరేయ్! మీరే చెప్పండి మీముందే మీనాన్నగార్నెవరైనా తిడితే మీరేంచేస్తారు” అన్నాడు,
“నేనైతే అసలే ఊర్బోను తోలుదీస్తాను” అంది శోభ
“మరయితే చూశావా? మీ అమ్మ మా నాన్నగారిని ఎలాంటి మాటలు. అంటోందో, నీవే చెప్పు నేనేం చేయాలో” రోషంగా అన్నాడు. జగద- అనువాదకథలు క్షేశ్ష దా! డింగరి నరహరి ఆచార్య
“నేనేం తప్పు మాట్లాడలేదు. ఆయనకు సేవచేయడానికి మీరొక్కరే వున్నారా! 'రెండో కొడుకు లేడా? వాళ్లింట్లో ఉండమనండి. ఆయనగారు కూడా తండ్రి 'సేవ చేసు కోవాలిగా” సాగదీస్తూ అంది దివ్య.
“మా తమ్ముడి ఆర్ధికపరిస్థితి నీకు తెలియదు. వాడికాశక్తిలేదు”
“ఒక్కరు కుటుంబంలో ఎక్కువయినంత మాత్రాన అందరూ ఆకలితో చావరు, అంత దరిద్రుదేంకాదు. మీ తమ్ముడు. కొన్ని రోజులు కన్నతండ్రిని సాకే శక్తిలేనివాదేం కాదు”
“వాడికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలన్నది మరచిపోయావు. వాడొక్కడే సంపాదించాలి. వాడి వేతనం కూడా నెలకు నాలుగువేల రూపాయలే కిరాయి అయిదొందల రూపాయలు కట్టడమే కష్టమవుతోందని చిన్న ఇంట్లో వుంటున్నాడు. నీవే చెప్పు. ఇక మిగిలిన మూడున్నరవేలతో ఇంత మండిపోతున్న ధరల కాలంలో ఎలా బతకగలడు? అవన్నీ ఊహించే నాన్నగారిని మన ఇంట్లో ఉంచుకుంటున్నాను” తమ్మునిపై జాలిచూపుతూ అన్నాడు,
“అవును మీనాన్నగారేమో ఆయన అవనరానికిచ్చిన అయిదొందల రూపాయలను కూడా మీ తమ్ముడి పిల్లలకోసం ఖర్చుచేస్తున్నాడు. ఇక ఆయనంటే వాళ్ళందరికీ ఎందుకిష్టం వుండదు”
“ఆయన ఇష్టం. ఆయన అవసరానికి వాడుకోవడానికి ఇచ్చిన డబ్బు ఏమన్నా చేసుకోనీ మనకెందుకు?”
“చేసుకోనీ. ఎందుకు చేసుకోవద్దు. నేను మాత్రం ఇక ఆయన "సేవ చేయలేను, ఆయన ఇక్కడుండడమే నాకిష్టంలేధు” ఆవేశంగా ఊగిపోతూ అంది దివ్య,
“నీవు సేవచేయవా? ఇది నా ఇల్లు... మా నాన్నగారిని ఇక్కడనుండి వెళ్ళగొడతావా? సరే నీకిష్టం లేకపోతే నీవు కూడా వుండకు, మీ తల్లిగారింటికి వెళ్లు. అక్కడికిపోయి మీ తండ్రిని మీ ఇంటినుండి వెళ్ళ గొట్టు. అప్పుడు తెలుస్తుంది కన్న తండ్రిని బయటకు నడిపే బాధంటే ఏమిటో” అని ఉద్రేకంగా అరుస్తూ అన్నాడు రాంప్రకాశ్ కూడా,
ఈ వాగ్వివాదం వింటూ వున్న రాంఫ్రకాళ్ పెద్దకొడుకు “అమ్మా! తాతగారు మనింట్లో అందరికన్నా పెద్దవాడు. ఇక్కడున్నందువల్ల మనకేం ఇబ్బంది.,,?” జగద- అనువాదకథలు 15 డా! డింగరి నరహరి ఆచార్య
“నీవు మాట్లాడకుండా వూరుకో” అంటూ బెదిరించే చూపులుచూసి “పెద్దవాళ్ళ మాటలమధ్య చిన్నపిల్లలు తలదూర్చకండి...” అంది.
“నీవు మాత్రం పెద్దల మాటకు విరోధంగా మాట్లాడొచ్చు. తాతయ్య పెద్దవాడు కాదా? మనమంటే ఏంత (ప్రేమగావుంటాడు” అని. తల్లిని నిలదీశాడు. .
“నీవు మాట్లాడకుండా 'వూరుకోకపోతే నాలుక పీకేస్తాను” కొడుకును మందలించింది.
“తాతయ్యతో కలిసి నీ గుణం కూడా చెడిపోతున్నది ఏలా మాట్లాడాలో తెలియడంలేదు. కొట్లాటలకు సిద్ధపడుతున్నావ్”
“చంద్ర మాత్రం ఏం చెడ్డమాటన్నాడు. వాడన్నది నిజమేకదా, నా మనసులో వున్న మాటే వాడు చెప్పాడు” కొడుకు పక్షంలో నిలిచి రాంప్రకాశ్ అన్నాడు.
“అవును ఇలా పిల్లలముందే నన్ను అవమానించండి. నా మనస్సులో ఆలోచనను కొంచెం కూడా అర్ధంచేసుకునే ప్రయత్నం. చేయరు” అంటూ కోపంతో ఎడుపుముఖం పెట్టి బాధగా అంది,
“నేను నిన్నేం అవమానించడంలేదు. నీవే నీపెద్దరికాన్ని పోగొట్టుకుంటున్నావ్” అని కాస్త మెత్తబడి “ఇంతకూ చివరికి నీవేం చెప్పదలచుకొన్నావో చెప్పు” అంటూ కాస్తశాంతంగాా అడిగాడు,
“అమ్మాయి వివాహం తర్వాత అల్లుడు కూడా వసాడు కదా! మీరే చెప్పండి, వాళ్ళే గదిలో వుంటారు?” వినయపూర్వకంగా భవిష్యత్తు ఆలోచన అందించినట్లు నచ్చ చెప్పే ధోరణితో అంది.
“వచ్చినప్పుడు ఏదో ఓ గదిలో వుంటారు. ఇదో సమస్యేకాదు. ఇంట్లోస్టలమే లేదా?” అ న్నాదు,
“అయినా ఏ గదిలో వుండమంటారు. కిందవున్న గదుల్లో ఏదీకూడా అల్లుడుండదగిందికాదు. ఒక మేడమీద గది మాత్రమే అనుకూలంగా ఉందికదా!” అంది దివ్య,
“కాని అక్కడ నాన్నగారుంటున్నారు కదా! అక్కడ అల్లుడిని వుంచితే నాన్నగారెక్కడ వుంటారు” _
“ఆయన చిన్న కొడుకు గారింట్లో... అంటే సూర్యప్రకాశ్ ఇంట్లోనే, ఆయన మాత్రం ఈయనగారికి కొడుకుకాదా! ఆయనకూడా కర్తవ్యమే కదా” జగద- అనువాదకథలు .. 16 దా! డింగరి నరహరి ఆచార్య
“కాని అక్కడయినా. ఏలా వుంటాడు. సూర్యప్రకాశ్ ఇల్లు కూడా చాలా చిన్నది. అక్కడ రెండు రూంలే వున్నాయి. అవికూడా చాలా చిన్నవి, వాళ్లే ఆ ఇంట్లో అతికష్టంగా
“అక్కడ రాత్రి మాత్రమే గడిపితే చాలు. డాబా మీద పగలు గడపొచ్చు మూదేళ్లక్రితం రెండు నెలలు అలాగే గడపలేదా?” అంది దివ్య,
“కాని దివ్యా! నాన్నగారికి డయాబెటిస్. కాక బ్లడ్‌ప్రషర్ కూడా ఎక్కువయి బాధపడుతున్నారు అందుకే మందులకోసం అయిదొందలు ఇస్తున్నాను, దాంతోనే కదా తమ్ముడు మందులిప్పిస్తున్నాడు అంతే కాక...”
“ఆయన హోమియో మందులిప్పిస్తున్నాడు. వాటి కోసం డబ్బు ఎక్కువ అవసరం వుండనే వుండదు.. అది సూర్యప్రకాశ్ కూడా ఇవ్వగలడు.”
“వైద్యం ఖర్చుతో కూడింది కాదా అన్నది. కాదు సమస్య, 'నేను మాత్రం నాన్నగారి వైద్యంకోసం అయిదొందలు ఇవ్వకుండా ఉండను” అన్నాడు
“ఎందుకని?” అంటూ కనుబొమలు ముడిపెట్టి అదోరకంగా చూసింది.
“ఎందుకంటే తమ్ముడికి తర్వాత చేసుకోవాల్సిన పనుల భారం చాలా వుంది పాపం. ముగ్గురు బిడ్డల పెళ్లీళ్ల్ణయితే చేయాలా? అందుకే ప్రతి నెలా మూడు వందల రూపాయలు ఆదా చేస్తున్నాడు. నాన్నగారి భారం పడితే పాపం వాడు ఇరవై రూపాయలు కూడా ఆదా చేయలేడు” “అబ్బ! ఆయనగారి బిడ్డల పెళ్లిళ్ల గురించి ఎంత ఆలోచిస్తున్నారో మీరు. అది ఆయన సమస్య మీకెందుకా బెంగ మన అమ్మాయి. పెళ్లి గురించి ఆలోచించండి. దాని పెళ్లి ఖర్చు గురించి ఎఏందుకాలోచించడం లేదు... ఆ సమస్య మాత్రం మనకు దూరంగా వుందా? ఆ బరువు గురించి ఆలోచించరేం?” అని నిలదీసింది.
“ఏం బరువు?” ఆశ్చర్యంగా అన్నాడు రాంప్రకాశ్,
కద్రాని "పెళ్లయ్యాక అల్లుదుగ్గాని, వాళ్ల బంధువులుగాని అప్పుడప్పుడూ వస్తూవుంటారు. వాళ్లను గౌరవించాలంటే మనకు నెలకు వెయ్యో రెండు. వేలో అదనంగా ఖర్చు చేయాల్సి వుంటుంది. దాని కోసం డబ్బెక్కడినుండి వస్తుంది”
శబ్రద్రి అప్పుడు చూసుకొందాం, నీవిప్పటి నుండే ఆలోచించి ఎందుకు అధైర్యపడుతున్నావు?” అన్నాడు. జగద- అనువాదకథలు [7 డా॥1 డింగరి నరహరి ఆచార్య
“అవును ఇప్పుడే ఆలోచించాలి, పెళ్లి దగ్గరలోనే వుందికదా! అతిథులు వస్తారు. పైన గది మీ నాన్నగారి ఆధీనంలో ఉందాయే. అందుకే అది ఎలాగైనా ఖాళీ చేయించాలి” అంది.
రాంప్రకాశ్ భార్య మాటలతో కాస్త ఆలోచనలో పడ్డాడు. చెప్పగ్గా చెప్పగా అబద్ధం కూడా నిజమనిపించినట్లు రాం(్రకాళ్ ఆలోచించి |
“నివు చెప్పేది నిజమె. చివరగా సూర్యప్రకాశ్ ఏమంటాడో, అయినా నాన్నగారిని తమ్ముడింటికెళ్లమని. ఏవిధంగా చెప్పాలో అర్ధం కావడంలేదు” కాస్త బాధపడుతూ. సాలోచనగా అన్నాడు,
ఇంతలోనే ఎదురుచూస్తున్న నాటకం చివరి భాగం ప్రసారమవుతోందని ఎనౌన్స్ చేశారు... అడ్వర్దయిజ్‌మెంట్లు మొదలయ్యాయి. అందరూ నాటకం కోసం నిరీక్షిస్తూ శ్రద్ధతో కూర్చున్నారు. అదే సమయంలో రాంప్రకాశ్ తండ్రి సంచీ పట్టుకొని ఆ గదిలోకి ప్రవేశించాడు. నాన్నా! ఈ సమయంలో మోరు.,, ఎక్కడికయినా వెళ్తున్నారా?”
“అవును సూర్యప్రకాళ్ ఇంట్లోనే వుండాలని వెళ్తున్నాను” అంటూ కాస్త ఆగి మళ్లీ “మీరు నాకు చాలాసేవ చేశారు. గౌరవించారు కోడలు పిల్ల కూడా నాకోసం చాలా సేవచేసింది. మీకు నా కృతజ్ఞతలు ఈ పిల్లలని ఎప్పటికీ మరచిపోలేను” అన్నాడు కాస్త వేదనాభరితంగా.
మధ్యలోనే చిన్న మనుమడు లేచి “తాతయ్యా! మమ్మల్ని విడచి మీరెక్కడికీ
వెళ్లద్దు" అన్నాడు గోముగా. “నువ్వూరుకో... అంటూ దివ్య కొడుకును గట్టిగా మందలించింది. “ఆయన ఇష్టం, ఆయనకెక్కడ 'స్వెచ్చగా, ప్రశాంతంగా వుంటుందో అక్కడికే వెళ్లన్సీ” అంది. “నాన్నా! ఏమిటిది? మా మాటలు మీరు విన్నారా ఏమిటీ?” సిగ్గుతో అన్నాడు రాం(ప్రకాశ్.
“విన్నానురా! కొన్ని రోజులనుండి కోడలు పిల్ల నడవడిక కూడా చూశాను, ఈ ఇంట్లో ఈ ఇంటి యజమాని హృదయంలో రోజు రోజుకీ నా పట్ల అనాదరణ భావం 'పెరిగి పోతూ వుంది” అని నిర్మాహమాటంగా, స్పష్టంగా: తన మనోభావాలను విశదికరించ ప్రారంభించాడు... “సరే నాయనా! తల్లిదండ్రులు డబ్బులేని వాళ్లు, చేతకాని వాళ్లు ఎప్పుడవుతారో అప్పుడే కొడుకులు స్వార్ధపరులు మమకారంలేని వాళ్లూ అవుతున్నారు. వాళ్ల రక్తం కూడా తెల్లబడిషోతుంది” జగద- అనువాదకథలు 18 దా॥ దింగరి 'నరహది ఆచార్య
“అలా అనకండి నాన్నా! నిజంగా అలాంటిదేం లేదు, అసలు నాన్నా! విషయమేమిటంటే మేమనుకునేది, సమస్యేమిటంటే., . అంటూ రాం్రకాళ్ ఏదో వివరించే వ్రయత్నం చేయబోయాడు, కానీ మాటలు తడబడి భావాన్ని అందించలేకపోయాయి.
“హు తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే అనేక సమస్యలు కొడుకులకు ఉత్పన్నమవుతాయి. నిన్ను పెంచి పోషించడానికి కూడా అప్పుడు నాకూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. సమస్యలనేవి ఏప్పుడు ఎవరికి వుండవు? కానీ, నిన్ను ఇంట్లోంచి బయటకు నడపాలనే ఆలోచన నాకెన్నడూ రాలేదు. బిచ్చమెత్తడానికిగాని, పనులు చేయడానికిగాని వెనుకంజ వేయలేదు, మేం ఆకలితో బాధపడ్డా నీకు ఆకలి లేకుండా చూసుకున్నాం. నీ తల్లి బతికుంటే ఇదంతా యదార్ధమని చెప్పేది, ఆమె. త్యాగానికి, బలిదానానికి మారుపేరయి నిలిచింది. ఉండనీ,, అంటూ అతడు ఉద్వేగాలతో కాస్త ఆగి, దీర్హంగా నిట్టూర్చి మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. “కథలు చెప్పడంవల్ల లాభమేమిటీ? నేను సూర్యప్రకాశ్ ఇంటికే వెళతాను. వాడి. దగ్గర దబ్బు లేకున్నా మనసులోకాని, ఇంట్లోకానీ నాకో స్థానం మిగిలివుంది. వాడిదింకా విశాల హృదయమే...”
“రిక్షా పిలుచుకు రమ్మంటారా మామయ్యా!” అంటూ దివ్య వెంటనే ఉత్కంఠతో, పీడ విరగడవుతుందన్నంత తొందరతో అంది, మళ్లీ “ఆహా ఎందుకంటే మీరు అక్కడే దూరదర్శన్ సీరియల్ నాటకాన్ని చూడొచ్చు అయిదారు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారుకదా! ఈరోజు అదృశ్య శత్రువు, నాటకం చివరిభాగం ప్రసారమవుతుంది” అంది,
“విన్నావా నాయనా!” రిక్షాకాని, ఆటోకాని త్వరగా తీసుకురాకొ అన్నాడు కొడుకుతో. రాంప్రకాశ్ 'పెద్ద కొడుకు రిక్షా తీసుకురావడానికి వెళ్తాడు,
శ్రీదత్తుడు మళ్ళీ “మీ కోసం ఎన్నో ఇవ్వాలనుకున్నాను, కాని మీరు నాకా అవకాశం ఇవ్వలేదు” విచారంగా అన్నాడు,
“మీ సహాయం సూర్యప్రకాశ్‌కి అవసరం, ఆయన కుటుంబానికి మీ సహాయం చేయండి, మీరేం ఇవ్వదలచుకొన్నారో అది. వాళ్ళకే ఇవ్వండి. మాకేం అవసరంలేదు” అంది వ్యంగ్యంగా.
“అలాగే కానీయమ్మా. అలాగే ఇస్తాను” అంటూ చిరునవ్వుతో భావస్పోరకంగాా జగద- అనువాదకథలు 19 డా! డింగరి నరహరి ఆచార్య
అన్నాడు శ్రీదత్తుడు. ఆ సమయంలో ఆయన కళ్లలో కదలాడిన విజయహాసాన్ని రాం్రకాళ్, దివ్య ఇద్దరూ గమనించారు మళ్ళీ నవ్వుతూనే “సూర్యప్రకాశ్ వాళ్ళకే ఈ అదృష్టం రాసివుంటే నేనేం చేస్తాను. కానీయండి వాళ్ళకే ఇస్తాను అన్నాడు.
ఇంతలో పెద్ద మనుమడు వచ్చి “రిక్షావచ్చింది” అంటూ మెల్లగా తాతగ్గారిని రిక్షా దగ్గరికి తీసుకెళుతూ వుంటే సాలోచనగా దివ్య రాం్రకాశ్‌తో “ఏమండీ! ఏమిటి మీ నాన్నగారు మనకివ్వదలచుకొన్నది” అంటూ ఆసక్తితో అడిగింది.
“నాకేం తెలుసు” రాంప్రకాళ్ భుజాలెగరేస్తూ చిత్రంగా పెదవులు విరుస్తూ అన్నాడు. “మన మాటలు విని బాగా బాధపడి వుంటాడు. అందుకే ఆయన కాస్తకటువుగా మాట్లాడినట్లుంది. లేక ఆయన దాచుకున్న డబ్బు కొంతవుంది. బహుశా ఆ ఇరవైవేలు ఎవరికైనా ఇవ్వదలచుకున్నాడేమో? లేదా ఎవరికైనా ఇచ్చేశాదేమో, లేక ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ చేసి వుంచాడేమో? అది తీసుకోవడానికేమో ప్రతిరోజు ఏటో వెళ్ళివస్తూవుంటాడు, ఆయన ఆలోచనలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. ఏదైనా కాని భగవంతుని దయవల్ల ఆయన సూర్యప్రకాళ్ ఇంట్లో క్షేమంగా ఉంటే చాలు”
“చాలా ఆశ్చర్యం! మీరైతే ఆ ఇరవైవేల రూపాయల గూర్చి చెప్పనేలేదు. కనీసం తీసుకోలేదు. నా దగ్గిర ఎప్పుడూ. ఆ చర్చ కూడా చేయలేదు” కోపంగా అంది దివ్య
“అది ఆయన వేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్, నీతో చెప్పివుంటే ఏంచేసేదానివి?” అన్నాడు రాంప్రకాశ్.
“మన శోభ పెళ్ళికోసం అడిగేదాన్ని. ఆ డబ్బు ఎవ్వరికీ ఇవ్వలేదా! ఎవ్వరికో ఇచ్చేవుంటాడు” అంది విచారంగా దివ్య
“నాక్కూడా అదే అనుమానం, అయినా: దానితో మనకేం పని. ఆ కొద్ది
డబ్బుతో మనకేపని అవుతుంది; అదీ ఆయన దగ్గరవుంటే సంతోషంగ్గానైనా వుంటాడు”
ఇంతలో దూరదర్శన్ నాటకం (ప్రారంభం అయింది. పిల్లలంతా “దయచేసి ఇప్పటికయినా మీ మాటలు చాలిస్తారా! నాటకం మొదలవుతోంది” అన్నారు,
నాటకంలోని కథాంశం, పాత్రలు మొదలైన వాటి. గురించి చూడ్డం అయ్యాక (ప్రశంసలు కురిపిస్తూ వాదోపవాదాలు సాగిస్తూ అంతా విడిపోయారు. భోజనాల దగ్గర కూడా అదే. విషయం చర్చిస్తూ కాలం' గడిషారు దివ్య భర్తను చూస్తూ శోభ వివాహానికి మూడు లక్షల రూవాయలు భూమి అమ్మగా వచ్చిన డబ్బు వుంది అవికాక మూడు లక్షలు బ్యాంక్‌లో వుంది. ఇంకా రెండు లక్షల రూపాయలు కావాలి. ఏలాగో తక్కువలో జగద- అనువాధకథలు 20 డా॥ డింగరి నరహరి ఆచార్య
తక్కువ. ఎనిమిది లక్షల రూపాయలైతే అవసరం అవుతాయికదా” అంది ఆలోచనగా
“దానికోసం నేను ధర్మరాజును మొదలే అడిగిపెట్టాను ఏర్పాటు జరగ్గానే మనకతడు చెపుతాడు” అన్నాడు రాంప్రకాశ్,
ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో రాం్రకాళశ్ కొడుకుతో “వెళ్ళిచూడు ఎవరొచ్చారో. లోపలికి రమ్మను” అన్నాడు.
కొద్దిక్షణాల తర్వాత చంద్రదేవ్ వచ్చి ధర్మరాజు వచ్చాడని తాత గూర్చి అడుగు
“అరె! ఇది మన అదృష్టమే. ఇప్పుడే మనం ఆయన గూర్చి అనుకుంటున్నాం రానేవచ్చాడు. మీరు వెళ్ళి మనమడిగిన దబ్బు గూర్చి వాకబు చేయండి” అని దివ్య భర్తతో అంది.
రాంప్రకాశ్ తక్షణమే. డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. ఆయన వెంటే దివ్య కూడా ప్రవేశించింది.
“అరే శ్రీదత్తులవారు ఏక్కడున్నారు?” అని ధర్మరాజు అడిగాడు,
“ఆయన మా తమ్ముడు సూర్యప్రకాళ్ ఇంట్లో కొన్నిరోజులుంటానని వెళ్లాడు” అన్నాడు రాంప్రకాశ్, కొంతసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడాక రాం్రకాళ్ మెల్లిగా “అమ్మాయి పెళ్ళి నిశ్చయమయింది. అరు లక్షలయితే జమకూడాయి.. ఇంకా రెండు లక్షల రూపాయలు కావాలి. మీకిదివరకే చెప్పాను. దయచేసి కాస్త త్వరగా ఇప్పిస్తేచాలు. పెళ్ళయ్యాక మిగిలిన భూమి అమ్మి మీ డబ్బు మీకిస్తాను” అన్నాడు.
“రెండు లక్షలేమిటి మూడు లక్షలు తీసుకోండి. కాని మీ నాన్నగారినే ఈ డబ్బు ఎందుకడగకూడదు” అన్నాడు ధర్మరాజు.
“అదేమిటండీ! మా నాన్నగారి దగ్గరే, అంత' డబ్బుంటే. మిమ్మల్నెందుకు అడుగుతాను. మీకంతా తెలుసుకదా” అన్నాడు రాంఫ్రకాశ్,
“ఏమిటి మీరనేది. మీనాన్న దగ్గర డబ్బు లేదని ఎవడన్నాడు? అరె, ఆయన మీకేం చెప్పలేదా? ఈరోజే ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి పది లక్షల రూపాయలు వచ్చాయి. పొద్దున్నే నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ విషయంలోనే డిన్నర్ పార్టీ కోసం వచ్చాను. న న్నిక్కడికే రమ్మని కూడా అన్నాదే! కానీ అక స్మాత్తు గా సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్ళా లనే ఆలోచన ఎందుకు వచ్చిందో, కానీండి. నేను సూర్యప్రకాశ్ ఇంటికే వెళతాను” అంటూ వెంటనే వెళ్ళాడు. జగద- అనువాదకథలు లో డా! డింగరి నరహరి ఆచార్య
“ఏంటీ! పదిలక్షల రూపాయలు వచ్చాయా?” దివ్య ఆశ్చర్యంగా. కళ్ళు తెరుచుకొని. అంది, ఆమెకు అంతరంగంలో తెలియని దురవస్థ కలిగింది. తానెంత బుద్ధి తక్కువపని. చేసిందో అర్ధమయింది. ఏం చేయలేని నిస్సహాయస్టితి!
ఒక్కోసారి ఇలాగే మనం. గొప్ప ఆలోచనలు చేస్తున్నామనుకొని, మనలోనే దాగిన అంత:శత్రువుని గుర్తించలేం. అలాంటి అంతరంగంలో అదృశ్యశత్రువుల్ని జయించ లేక దివ్యలాగా మనకు మనమే ద్రోహం చేసుకుంటాం, ఇలాంటి అంత: శత్రువుల్ని జయించగలిగినప్పుడే మనిషి లాభాల్ని పొందగలడు. ఓర్వలేనితనంతో రాబోయే అదృష్టాన్ని కూడా కాలదన్నుకోవడమంటే ఇదే! ఇదే దురవస్థలో కూరుకుపోయి నిశ్చేష్టురాలయి, అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతూ. వుండిపోయింది దివ్య,
మూలరచయిత; డా॥ప్రశాస్యమి(త్రశాస్తి (వివుల ఏప్రిల్ 2004) జగద- అనువాదకథలు బెల్లి దా! డింగరి నరహరి ఆచార్య
పాడుముఖం
“దివోదాను ఈమధ్య ఎప్పుదైనా మనింటికి వచ్చాడా?” అంటూ శ్రీమతినడిగాను.
“ఏం” ఆయనద్వారా చేయాల్సిన ఘనకార్యాలేవైనా ఉన్నాయా?” ఏదురు ప్రశ్నించింది శ్రీమతి.
“అదేం కాదు, గతవారం నుండి కాని, అంతకు ముందు వారం కాని అతడు కనిపించ లేదు.;: అందుకని అడిగాను”
“అవును మీకు ఆత్మీయమి(త్రుడు కదా అతను. అతను కనిపించక పోతే మీకు అన్నం కూడా రుచించదను కుంటాను”
“అతన్ని గూర్చి ఎందుకలా మాట్లాడుతావు, అతనితో కలిసివుందడం నీకెందుకు ఇష్టం వుండదో నా కర్ధంకావడంలేదు, అతనెంతో మంచివాడు. అంత మంచిగుణం వున్నవాడు ఆత్మీయుడు కావడానికి అర్హుడు కాడా? అతనిలో ఏం లోపం చూశావు? అతనేం అపరాధం చేశాడు”
“మాడు ముఖం. ఆ ముఖం చూడడమే. పాపం. ఈ మాట వూరంతా ఎవరిని గూర్చి అనుకుంటుందో అతనిలో మీకేం లోపం కన్పించలేదా..,; ఏం. విచిత్రంో చేతులూపుతూ అంది.
“ అనవసరంగా “పాడుముఖరి అని ఊరి వాళ్ళు ఆరోపించారు. కాని. అతని ముఖంలో అంత అశుభ చిహ్నాలేమున్నాయో నాకర్థం కాలెదు”
“అయ్యో! అతని పేరు తలుస్తేనే మీ హృదయం ద్రవించిపోతుంది. కాని ప్రొద్దున్నే లేచి అతడి ముఖం చూడ్డానికి ఈ వూరిలో ఎవరూ యిష్టపడరు, పెళ్ళికానందువల్ల, సంతానం లేనందువల్ల విధవతో సమానం, విధవ ముఖం చూస్తే 'పనులు చెడిపోతాయి. అలాగే ఇది కూడా, అందుకే వూరివాళ్లకుగాని నాకుగాని అతనంటే అసహ్యం”
“అతని ముఖం చూడడంవల్ల నీపనులెప్పుడైనా చెడిపోయాయా?” కాస్త కోపంగా ప్రశ్నించాను.
“నా ప్రనులేం చెడిపోలేదుకాని ఊళ్లో చాలా మందికి పనులు చెడిపోయాయి
జగద-- అనువాదకథలు 02 డా॥ డింగరి నరహరి ఆచార్య
“హు! ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను, ఏదో కాకతాళీయంగా కొందరి పనులు చెడిపోయి వుండవచ్చు. కాని అతని ముఖం చూడడంవల్ల మాత్రం కాదు, ఈ విషయంలో అనవసరమైన వదంతులే ఎక్కువ వ్యాపించాయి”
“హు! వదంతులు, విష్ణురావు బిడ్డ వివాహ్రసక్తి ఎందుకు చెడిపోయింది. అమ్మాయిని చూడవచ్చే వరుని వాళ్లు ఇతని పోడుముఖం చూడబట్టే కదా! ఎన్నో బలమైన సాక్ష్యాలున్నా శ్రీధర్ కోర్టులో ఏందుకోడిపోయాడు. అలా ఎందుకు జరిగింది. తీర్చు రోజున పొద్దున్నే శ్రీధర్ ఇతగాడి పాడుముఖం చూడ్డంవల్లనే” నిరాదరణగా నిర్దాక్షిణ్యంగా అంది.
“చాలు చాలు ఆ మాటలు. ఇటువంటివి చాలా విన్నాను. వదో కాకతాళీయంగా జరిగిన సంఘటనలకు దివోదాసేం చేస్తాడు, అతడాబాధ్యుడు? మందభాగ్యుడు అతడిలాంటివన్నీ విని సహిస్తున్నాడు. దరిద్రుడు అనాథ అయినందువల్ల యౌవనంలో అతనికి పెళ్ళికాలేదు. వయసు ముదిరాక అతనికి వివాహ జీవితం మీద ఆసక్తి తగ్గింది. అందువల్ల అతని ముఖం పాడుముఖం ఎందుకవుతుంది. తెలివితక్కువ జనాలకు”
“జనం తెలివితక్కువ వాళ్లు, మీరు తెలివిగలవాళ్లు. తెలివిగల మీరేం చేయదలచుకున్నారు. పాడుముఖం, దరిద్రుడు వాడెక్కడ, గ్రామస్థలతో గొరవింపబదే మీరెక్కడ, అయినా వాడంటే మీరెందుకింత యిదవుతారు” అంది.
“ఓ. అయితే ఎవరైనా ధనవంతులైతేనే గౌరవింపబడుతారా! అతనెవరికీ అపకారం చేయలేదు. దరి(ద్రుడైనా తన శక్తి కొద్దీ ఎందరికో సాయపడ్డాడు కూడా, అతడే లేకుంటే నిజంగా మన ఇల్లు ఇలా నిలబడేది. కాదన్నా అతిశయోక్తి కాదు”
“ఏం. గొప్ప మేలు చేశాడు. మన ఇల్లు అంటుకున్నప్పుడు కాస్త సాయంచేసి ఇల్లు నిలబడేట్టు చేశాడు. అందుకు తగిన డబ్బు తీసుకున్నాడు కదా”
“పేర్తుకేగాని ఆ డబ్బు ఏప్పుడు తీసుకున్నాడు. ఎన్నోసార్లు నేను ఇవ్వడానికి ప్రయత్నించినా అతడు వినయంగాతోసిపుచ్చాడు, “అది మీ దగ్గరే వుంచండి. ఇంకా
ఇంటిని బాగుచేసుకోవడానికి అక్కరకొన్తుంది. నాకవసరమయినప్పుడు అడిగి తీసుకుంటాలెండి” అన్నాడు. కాని ఇంతవరకూ ఆ దబ్బు తీసుకోనేలేదు. నీకు తెలునా?”
“తీసుకోకుండా ఉంటాడా లెండి సంబరపడకండి ఎప్పుడో తీసుకుంటాడు లెండి” మూతివంకరగా తిప్పుతూ అంది. జగద- అనువాదకథలు బడ దా॥ డింగరి నరహరి ఆచార్య
“ల్రీసుకోడు... మన. ఇల్లు కాలినప్పుడు సంవత్సరం మన ఇంట్లో జీతం లేకుండా పనిచేశాడు. తన పొట్టపోసుకోవడానకి అప్పు తీసుకున్నాడు. లేదా ఉపవాసమున్నాడు. నాకు మనోధైర్యం కలగడానికి ఆ సమయంలో ఎన్నో చేశాడు. నిజంగా పొద్దున్నే లేచి తలచుకోవలసినవాడు”
“అలాగే కోరికదీరేట్టు పొద్దున్నే లేచి అతని నామం జపంచేయండి. నేను మాత్రం ఆ పాడుముఖం చూడను, దౌర్భాగ్య దేవతకు స్వాగతం పలకడం నాకిష్టంలేదు”
పెళ్ళి కాకపోవడం, డబ్బులేకపోవడం వల్ల మంచివాడైనా అతన్ని చూడరాని వాదనే ఈ జనాన్ని చూస్తే నాకు నిజంగా జాలి 'కలుగుతోంది. లోకం ఎంత విచిత్రమయింది”
“అక్కరకురాని మాటలు చాలు, నాకు అవతల బోలెడు పని వుంది. వంటింట్లోకి వెళ్తున్నాను మీరు మాత్రం దివోదాసును చూడ్డానికి వెళ్లేలా కనిపిస్తున్నారు”
“అవును అతనికేదో తీవ్రమయిన అస్వస్థత అయి వుంటుందని నా అంతరంగం. చెబుతోంది. లేకపోతే అతను; ఒక్క సారైనా కలిసేవాదే”
*ప్పమో! అతడు రాకపోవడానికి అనారోగ్యమే కావచ్చు లేక ఇష్టం వచ్చినట్లు తిరగడం కావచ్చు మనకేం తెలుసు. మీరు మాత్రం కోరిక తీర్చుకోండి. గంటలకొద్దీ మాట్లాడుతూ కూర్చోండి. అనారోగ్యంగా ఉంటే డబ్బు ఖర్చుపెట్టి చికిత్స కూడా చేయించండి. కాని మనయింటికి మాత్రం పిలవకండి. నాకు మాత్రం ఆ ముఖం చూడ్డం ఇష్టంలేదు” అని ఖచ్చితంగా చెప్పింది.
నా శ్రీమతి ఆలోచనలు నాకు ఆశ్చర్యాన్ని ఆవేదననూ కలిగించాయి. ఇలాంటి వాళ్ళీవూళ్ళో చాలామంది వున్నారు. వాళ్ల మూర్ధత్వాన్ని చూసి ఏడవాలో నవ్వాలో నాకర్టంకావడంలేదు.
మరో ఆశ్చర్య విషయం ఏమిటంటే ఇలాంటి వాళ్ల గూర్చీ దివోదాసు బాధపడుతుంటాడు. “దురదృష్టవంతుల గూర్చి ఎలా మసలుకోవాలో వీళ్లకు తెలియదు” అని బాధపడుతూ. అలాంటివారి గూర్చి జాలిపడుతుంటాడు కూడా, అలా ఉపేక్షించే వాళ్లపై దయచూపడం అనేది దివోదాసుకే సాధ్యం, కాని మనలాంటి స్థిరంలేని వాళ్లకు సాధ్యం కానేకాదు,
అతనిది పాడుముఖమని జనాలు తమ పిల్లలను అతని దగ్గరకు వెళ్లనివ్వరు, పిల్లల మనస్సు ఆకర్షించి వాళ్ల ముఖాలు నాశనం చేస్తాడని వాళ్ళ నమ్మకం.. కాని జగద- అనువాదకథలు 25 ద్వా! డింగరి నరహరి ఆచార్య
దివోదాసుకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తాను సంపాదించిన కొద్ది డబ్బు ఆ పిల్లలకు తినుబండారాలు కొనదానికే ఖర్చుచేసేవాడు. అలా అతనిచ్చిన తినే వస్తువులను తల్లిదండ్రులతనిముందే లాగేసి విసిరి కొట్టేవారు. “ఇలా పిల్లలకేమీ. ఇవ్వవద్దు” అని గట్టిగా మందలించే వారు కూడా అయినా అలాంటి వాళ్లకు చిరునవ్వు సమాధానంగా చూపేవాడు. ఎన్నోసార్లు అలా జరిగినా పిల్లలు కనిపిస్తే చాలు మిఠాయిలు కొనియివ్వడం మానలేదు, అందుకే పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా అతని దగ్గరకు చేరేవారు.
దివోదాసు ఒక చిన్న కుటీరంలో ఉంటాడు. వంటకు రెండుమూడు మట్టి పాత్రలు, పడుకోవడానికో కుక్కిమంచం, కొన్ని చిరిగిన బట్టలు ఇవే అతని ఆస్తి. ఇతరుల దగ్గర సేవ చేయడమే అతని వృత్తి అయినా అతను తృప్తిగా జీవిస్తున్నాడు. ఇతరులకు ఉపకారం చేయడమే అతని ప్రవృత్తి. తసకున్న డబ్బు ఇతరులకు దానంచేసి అతనెన్నిరోజులు ఉపవాసాలున్నాడో భగవంతునికే ఎరుక, మావంటివాళ్లు బలంగా ఇచ్చినదేదైనా అతడు స్వీకరించేవాడు కాదు.
పెళ్ళికానందువల్ల అతనిది పాడుముఖం అని జనం అంటుంటే అది విని నేను సహించలేక ఒకసారతనితో ఇలా అన్నాను. “దివోదాస! నీవు వయస్సులో వున్నప్పుడు నీ పెళ్లిగూర్చి ఎవ్వరూ ఆలోచించలేదా? పోనీ ఇప్పుడైనా పెళ్ళిచేసుకోవచ్చుకదా! కుటుంబ జీవనంమీద నీకు ఆసక్తి లేకనేమో? కాని నీది పాదుముఖం అనే వాళ్లనోళ్లు మూయించడానికైనా పెళ్ళి చేసుకోవచ్చు కదా! వివాహభారమంతా నేను నిర్వహిస్తాను ఏమంటావు?” అని అడిగాను,
నా మాటలన్నీ విని గట్టిగా నవ్వి దివోదాసిలా అన్నాడు, “నా వివాహంవల్ల సమస్య పరిష్కారమవుతుందని మీరు భ్రమ పడుతున్నారు. నాకు భార్యగా వచ్చి నావిడ నా నిరాస్తక్తతను చూచి కాని, నా దారిద్ర్యాన్ని చూచిగాని ఎవడితోనో లేచిపోతుంది. అప్పుడు ఇంతకన్నా అవమానం భరించాల్సివస్తుంది, పోనీ ఒకవేళ సంసారం చేసినా పిల్లలు కలుగకపోతే, సంతానహీనుని.ముఖం. చూడవద్దని అప్పుడు కూడా ఈ జనం ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నిశ్చింతగానూ, స్వతంత్రంగానూ, హాయిగా ఉన్నాను. అలాంటి సంశయాలు పెట్టుకోవడం నాకిష్టంలేదు. మీరు నా మేలు కోరేవారు కాబట్టి ఈ ప్రస్తావన చేశారు. అందుకు కృతజ్ఞతలు. వైవాహిక జీవనానికి దూరంగా ఉండడానికే నిశ్చయించుకొని దానికో దండం సమర్పిస్తున్నాను అని నిర్లిప్తంగా అన్నాడు. జగద- అనువాదకథలు 26 డా॥ డింగరి నరహరి ఆచార్య
“వాడుముఖం అనేమాట వింటే నీకు బాధ కలగడం లేదా?* అని ఆశ్చర్యంగా అడిగాను. ఓలి
“అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కాని జనం అనుకున్నట్టుగా జీవించడానికి నాకు కోరికలేదు”
“జనం చేసే ఇలాంటి అవమానాన్ని ఎలా. భరిస్తున్నావు నీవు?”
“దానికి ఊరుకోవడమే మందు. చాలా మంది ఎంత డబ్బుయిచ్చినా అంతే తీసుకొని మాట్లాడకుండా పని చేస్తానని వాళ్ల పనులకోసం వాడుకొంటున్నారు నన్ను కాని “ప్రొద్దున్నే రాకు, కాస్త ఆలస్యంగారా అంటారు, పొద్దున్నే నా ముఖం చూస్తే వారి పనులు చెడిపోతాయే మోనని అనుమానం పండుగ దినాల్లో అయితే నాఉనికినే వాళ్లు సహించరు. మంగళ కార్యాలకయితే నన్ను ఉపయోగించుకోనే ఉపయోగించుకోరు. తినబోయేవాళ్లు నా ముఖం చూడకూడదనుకుంటారు భోజనం. లేకుండా పోతుందని. పెళ్ళి కార్యాలవారు 'పెళ్లయ్యే 'దాకా నాముఖం చూడకూడదనుకుంటారు పెళ్ళి చెడిపోతుందని, ప్రసూతికి సిద్ధంగా ఉన్నవాళ్లు పుట్టిన శిశువు మరణిస్తుందేమోనని నాముఖం చూడరు. ఇలా నా విషయంలో లోకం వింతగా (ప్రవర్తిస్తున్నది. దీనికి నేనేం చేయగలను ఊరుకోవడం తప్ప” అంటూ ఆవేదనతో అతనన్న మాటలకు నేనేం జవాబివ్వలేకపోయాను మౌనమే శరణ్యమయింది.
నేను దివోదాసు ఇంటికి వెళ్లేవరకు ఏ చడీచప్పుడు లేకుండా ఉంది. గుడిసెకి తాళంవేసి లేదు, అంటే దివోదాసు కుటీరంలో ఉన్నాడన్నమాట అని ఊహిస్తూ లోపలికి ప్రవేశించాను. జ్వరంతో బాధపడుతూ దివోదాసు మంచంలో పడివున్నాడు, అతని శరీరం కంపించిపోతోంది.
“ఇదేమిటి దివోధాస[! ఈ అవస్థ ఎప్పటి నుండి” అని అడిగాను. “ధృదిరోజులు దాటింది. ఇలాగే అనారోగ్యంగా ఉంది.” క్షీణస్వరంతో మూల్గుతూ. బాధతో అన్నాడు. . “ఏమైనా మందు తీసుకున్నావా లేదా?” “జ్వరానికి కాస్త కషాయం చేసుకుని తాగాను కాని ఈ 'జ్వరం పోయేలా కనిపించడంలేదు” మళ్ళీ మూలుగుతూ జవాబిచ్చాడు, “ఆహారం ఏం తీసుకుంటున్నావు. ఏలా తీసుకుంటున్నావు.” జగద- అనువాదకథలు 27/7 డా॥ డింగరి నరహరి ఆచార్య
“నిన్నటిదాకా జావ చేసుకుని తాగ్గాను. నిన్న ఓ. అబ్బాయి అలాగే కొంత
“ఇవ్వాళ మాత్రం నీకు లేవడానికే శక్తి లేదు. తయారుచేసిచ్చేవాడు కూడా ఎవడు లేడు. పొద్దుటినుండి ఉపవాసమే. అంతేనా? మేము బతికున్నామనుకున్నావా లేదాగొ చాలా బాధ పడుతూ కాస్త నిష్టూరంగా అడిగాను,
“అలా అనకండయ్యా! నేను ఇతరులకు సేవ చేయదగిన వాడిని కాని, నాకు ఇంకొకరు సేవచేయడం తగదు” అనే నా ఉద్దేశ్యం,
“ఇలాంటి తప్పుడాలోచనే నిన్న యమలోకం పంపిస్తుంది”
“అలా అయితే నా దిగులు పరిహారమౌతుంది” దీనంగా అన్నాడు,
“నన్ను క్షమించు. నీకు తెలిసి రావాలని అలా అనడం నా 'మూర్ధత్వమే అయింది. నేను కొంత జావ చేసిస్తాను. అది తాగి నిద్రపో. ఆ తర్వాత డాక్టరుని తీసుకొస్తానూ అంటూ పొయ్యి మండించసాగాను,
“అయ్యా! డాక్టరుని ఎందుకు తీసుకొస్తారు. త్వరగానే జ్వరం తగ్గిపోతుంది,
“పోయేది జ్వరంకాదు, ప్రాణం. నువ్వూరుకో వైద్యం గురించి నేనేం ఆలోచిస్తున్నానో అది చేసి తీరుతాను. నేనీ జావ చేసేవరకు మాట్లాడకుండా పడుకో” అని జావ తయారుచేసి అతగాడి చేత తాగించి డాక్టరుని తీసుకొచ్చాను.
దాక్టరు పరీక్షనేసి రోగి పరిస్థితి విచారకర పరిస్థితిలో వుంది. తగిన మందిస్తాను (శ్రద్ధగా వాడండి” అంటూ మందులిచ్చి వెళ్ళాడు. నాకు కోర్టు వ్యవహారంకోసం పట్నం వెళ్ళి సాయంకాలంలోగా ప్లీడరును కలవాల్సిన పని వుండడంవల్ల,. ఇలాంటి స్థితిలో దివోదాసుడిని ఒక్కడినే వదలడానికి మనస్మరించలేదు ఊరివాళ్లు అతని గూర్చి ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు ఎవరి సాయం అతనికి వుండదు. చాలా ఆలోచించి నా పలుకుబడితో వలాగోలాగు పొరుగు పిల్లాడినాకడిని బతిమాలి దివోదాసు దగ్గర వుంచి సమయానికి. మందివ్వడం మరచిపోవద్దని పదేపదే చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. కావలసిన కాగితాలు తీసికొని పట్నానికి వెళ్లాను.
పట్నంలో కలవాల్సిన ప్లీడరు లేడు, రాత్రికి గాని రాదని తెలిసింది. అతనితో కలిసిగాని తిరిగి ఇంటికి వెళ్లడానికి వీల్లేదు. అందుకోసం విధిలేక ఆరోజు అక్కదే గద పాల్పొస్తుందేమోనని అనుకుంట్టూ నేను వెళ్లేవరకూ ఆ పారుగు పిల్లవాడు దివోదాసు యోగక్షేమాలు నిర్వహిస్తాడనే ఆశతో లోలోపల అనుమానం పీకుతున్నా తృప్తిపడ్డాను. జగద- అనువాదకథలు 28 డా॥ డఢింగరి నరహరి ఆచార్య
పట్నంలో పని పూర్తిచేసుకుని నడిరాశ్రే బయలుదేరి తెల్లారేసరికల్లా ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరగానే శ్రీమతి దివోదాసు దివంగతుడయ్యాడనే వార్త చెప్పింది. ఏది కావద్దని నేను 'ప్రయత్నించానో అది ఫలించలేదు. పరుగెత్తుకొని దివోదాసు గుడిసెకి చేరాను. మంది గుమిగూడి వున్నారు. డాక్టరు కూడా అక్కడే వున్నాడు.
“ప్రాణాలు ఎప్పుడు పోయాయి అని ఆవేదనతో అడిగాను *నడిరాశ్రే అయ్యుంటుంది. “నా పాడుముఖం చనిపోయాక కూడా పొద్దున్నే ఎవరూ చూడకూడదని కాబోలు పాపం ముందే ఊహించి తన ముఖంమీద బట్ట కప్పుకున్నాడు. అతని మాటలు పూర్తికాకముందే వినలేక లోపలికి వెళ్లాను. అతనికి సేవచేయడానికి నేనుంచిన పిల్లవాడో మూలను కూర్చుని ఉన్నాడు. నేనడగకముందే నన్ను చూడగానే నా ముందరికి వచ్చి వివరంగా ఇలా చెప్పసాగాడు.
“మీరు వెళ్లాక కొంచెమైనా నీరు కూడా తీసుకోలేదు. మండు, నీళ్లు తీసుకోనని పట్టుపట్టాడు. పక్కనే కూర్చుని కూడా ఏం చేయలేకపోయాను నిద్రపోయాను, పొద్దున్నే లేచి ఎంత పిలిచినా ఉలుకూపలకూ లేదు. శరీరం కట్టె కరుచుకుపోయి చల్లబడింది. భయపడి మా నాన్నని తీసుకొచ్చాను, నాన్న అందరికీ చెప్పాడు. డాక్టరును కూడా
“చాలు నాయానా చాలు నీ బాధ్యత నీవు నిర్వర్తించావు. చిన్నవాడివైనా నీ చేతనయినంత చేశావు” అని ఆ పిల్లవాడిని ఓదార్చి గుడిసెనుండి భారంగా బయటకు
అంతిమయాత్రకై నా తృప్తికోసం ఇష్టంలేకున్నా కొందరు వచ్చారు, కాని చివరి దశలో కూడా నా ముఖం వవరూ చూడకూడదన్నట్లుగా వారికి కీడు జరుగకూడదని దివోదాసు ముఖంపై బట్టకప్పుకొని (ప్రాణాలు విడవడం ఆశ్చర్యపరచింది. 'అనాయాసేన మరణం. వినాదైన్యేన జీవనం అని దివోదాసు అంటుండేవాడు. ఎప్పుడూ అలాగే జీవించాడు కూడా, లోకాన్ని బాగా చదివినాడతడు. కాని అందరికీ సేవచేసిన అతడి *“వాడుముఖం' అంటూనే తమ అవసరాలు తీర్చుకున్న జనం విజ్ఞులో, చివది దశలో కూడా ఎవరికీ బాధకలగకూడదన్నట్లుగా అలాచేసిన దివోదాసు గొప్పవాడో మీరే అర్ధం చేసుకోండి. 'అసలు వవరివి పాడుముఖాలు, ఎవరివి పాడు ఆలోచనలు” ఈ జనం ఈ సత్యాలు ఎప్పుడు గుర్తిస్తుందోనని బాధపడుతూ దహన కార్యక్రమానంతరం దివోదాసుని తలుస్తూ ఇంటికి చేరాను, మూలరచయిత: డావనమాలి విశ్వాల్
(వివృల అక్టోబర్ 2004) జగద- అనువాదకథలు 2౮ దొ॥ డింగరి నరహరి ఆచార్య
“నానమ్మా! ఇవాళ్ళ కూడా మా అమ్మా నాన్న రాలేదేం? పొద్దున్నె ఇంటి పనులు పూర్తి చేసుకోవాలనే తొందరలో ఉన్న నానమ్మ వెనుక వెనుకనే తిరుగుతూ ఈ మాట అనిల్ ఇరవై సార్లైనా అడిగి ఉంటాడు.
నానమ్మ లక్ష్మికి ఆ మాట వినగానే కాస్త కోపం వచ్చింది. అందుకే అసహనంగా, “వస్తారులే, రైలు రావడం లేటయ్యుంటుంది. మాటిమాటికి ఎందుకడుగుతున్నాన్. వెళ్ళు వెళ్ళి బొమ్మలతో ఆదకో పో నాపని చెడగొట్టకు” అంది. ముఖం చిన్నబుచ్చుకొని అనిల్ తన ఆట వస్తువుల దగ్గరికి వెళ్లాడు. కాని వాడి మనస్సులో విచారం, ఆందోళన మొదలయింది.
“ఎప్పుడూ (ప్రేమతో మాట్లాడి, అడిగిందల్లా తినడానికిస్తూ కథలు చెపుతూ, పద్యాలు నేర్పుతూ, పాటలు పాడి నిద్ర పుచ్చుతూ ఉందే నానమ్మ నాన్న రాసిన ఉత్తరం చదివినప్పటి నుండి ఇలా అయిందేం?' అని ఆలోచించాడు. కాని చిన్న పిల్లాడైన వాడి ఊహకు కారణం అందలేదు. ఎందుకో నానమ్మ బాధపడుతోంది. మధ్య మధ్యలో ఏడుస్తోంది. అప్పుడప్పుడూ మధ్యలో నన్ను కౌగలించుకుంటోంది. “నేను లేకుండా అక్కడ ఎలా ఉంటావు? అని బాధపడుతూ అంటోంది. ఓ యాఖైసార్లయినా నాన్నను తలచుకొంది. నేను అడిగితే మాత్రం ఏం చెప్పడం లేదు, నేనిక్కడ ఉండను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను తీసుకుపోవడానికే అమ్మావాళ్ళు రావాలి. తను వాళ్లతోనే వెళ్లివోవాలి. నానమ్మ దగ్గర ఉండడు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు అనిల్, ఆ ఆలోచనలో బొమ్మలన్నీ చిందర వందరగా పారేశాడు,
తల్లిదండ్రులు వస్తారని తెలియగానే ఎలా తయారయ్యాడు వీడు. బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని మూడు నెలల పసిగుడ్డును వదిలి పెట్టింది వీళ్లమ్మ. తల్లి దగ్గర లేని వీడిని ఏంత జాగ్రత్తగా సాకాల్సి వచ్చిందో ఆ కష్టనష్టాలు తనకే తెలుసు. పీకతో పాలు పట్టించడం, రోగాలు వచ్చినప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొని సేవలు చేయడం, ఒక సారైతే తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న వీణ్ణి ఒళ్ళో పెట్టుకొని తెల్లార్లూ జాగారం చేసింది, ఎంత (ప్రేమ చూపించింది. ముసలితనంలో చిన్న పిల్లల్ని సాదటం కష్టమైన పనేకదా! ఏమన్నా సుఖంగా చేసే పనా? అయినా తన మనుమడు అన్న జగద- అనువాదకథలు 30 దా॥ డింగరి నరహరి ఆచార్య
ఆపేక్షతో ఈ. పనులన్నీ చేసిందే, ఆ త్యాగాలకు విలువుందా? ఎప్పుడూ నీరు పల్లానికే జారుతుందన్నది నిజం పైకి, ఎత్తుకు ఎలా పారుతుంది నా పిచ్చిగాని తల్లిదండ్రుల ముందర నానమ్మ విలువ ఎంత మనసులో తల్లడిల్లుతోంది లక్ష్మి. తనలో తానే గొణుక్కుంటోంది.. ఎగిసిపడే మనోవేదనను ఆపుకోలేకపోతోంది. ఆ ఆవేదన వేగానికి కాస్త కోపం కూడా వచ్చింది అందుకే మనుమడిని కసురుకుంది, కోవం తీర్చుకోవడానికన్నట్లు కూరగాయలు తరగడంలో దాన్ని 'ప్రదర్శించసాగింది.
దూరంనుండే “పాం పాం” అని శబ్దం చేస్తూ ఆటో ఆగిన చప్పుడు కాగానే “అమ్మ వచ్చింది. నాన్న వచ్చాడు. అని బిగ్గరగా అరుస్తూ ద్వారంవైపు పరుగెత్తాడు అనిల్, ఆటోనుండి దిగుతున్న వాళ్ళమ్మ దగ్గరకు పరుగు పరుగున ఉరికాడు ఆ తల్లి వెంటనే కొడుకు 'నెత్తుకొని నుదుటిపై ముద్దు 'పెట్టింది. కోతిపిల్లలాగా వాళ్ళ అమ్మకి అతుక్కుపోయాడు అనిల్, పైగా “నాన్న నాన్న” అంటూ కేరింతలతో తండ్రిని చూసి అరుస్తున్నాడు. ఆటోనుండి బరువైన 'పెట్టెను దించుకుని ఊర్మిళా, రమేశ్‌లు ఇంట్లోకి అడుగుపెట్టారు. అనిల్ అరుపులు వింటూనే లోపలి నుండి నీళ్ళచెంబు తీసుకొని పాతకాలం సంప్రదాయం ప్రకారం వచ్చింది లక్ష్మి. గడపలోకి అడుగుపెడుతున్న కొడుకు, కోడల్ని చూసి “అక్కడే ఆగండి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి” అంటూ నీళ్ళచెంబులోని నీళ్ళు కొడుకు కాళ్లమీద గుమ్మరించింది. అది చూసి అనిల్ తల్లి చంక దిగకుండానే “నానమ్మా మా నాన్న ఏమన్నా చిన్నపిల్లాడా? కాళ్ళ మీద నీళ్ళు పోశావు” అన్నాడు,
“కాకపోతే ఏంటిరా? నీకు నాన్నకాని నాకు కొడుకేనాయే: నాకింకా చిన్నపిల్లవాడే” అంది నవ్వుతూ లక్ష్మి
ఊర్మిళ్ళా రమేశ్‌లు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి లక్ష్మికి నమస్కరించారు. వాళ్ళను ఆశీర్వదించి వంట కార్యక్రమం మొదలెట్టాలని వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి
అమ్మా నాన్న వచ్చిన సంతోషంలో అనిల్‌కి ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో తెలియడం లేదు, ఒక క్షణం అమ్మ దగ్గర చేరి మాట్లాడం మరొకసారి తండ్రితో మాట్లాడటం ఇలా వాడి అల్లరితో ఇల్లంతా కళ కళలాడుతోంది. ఊర్మిళ కూడా తన కొడుకును ఒక క్షణం కూడా వదలి ఉండలేకపోతోంది. అనిల్ కూడా అమ్మ ఒడిని విడిచి అడుగు ముందుకేయడం లేదు. కొడుకు స్నేహాన్ని అనుభవిస్తూ ఆ తల్లి గట్టిగా కౌగలించుకొని యుగాలు అలాగే గడవాలని ఆలోచిస్తోంది.
“ధన్” మనే పాత్ర చప్పుడు వంటింట్లో నుండి రావడంతో ఊర్మిళ లేచి జగద- అనువాదకథలు త డా॥ డింగరి నరహరి ఆచార్య
గబగబా అటువైపు నడిచింది. వచ్చినప్పటి నుండి తాను కొడుకుతోనే మురిసిపోతోంది.
ఇది మంచిది కాదనుకొని సిగ్గుపడింది కూడా,. అందుకే వినయంగా “అత్తయ్యా! ఏదో పాత్ర పడ్డ శబ్దం అయ్యింది. కాలు మీద పడలేదు కదా” అంటూ ఆత్రుత కనబరుస్తూ అడిగింది.
“ఆహా! ఏం కాలేదు ముసలిదాన్నయ్యాను కదా ఇలాగే” అంటూ విచారంగా “స్నేహపూర్వకంగా కోడలి పరామర్శకు సంతోషించినట్లుగా లక్ష్మి జవాబిచ్చింది.
“మీరు కూర్చోండి! నేనిప్పుడే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వస్తాను. వంట నేనే చేస్తాను” అంది ఊర్మిళ,
“హాయిగా నీ పనులు నీవు చేసుకో. వంటపూర్తి కావచ్చింది” అన్న అత్తగారి మాటలతో ఆ ప్రయత్నం మాని స్నానం చేయడానికి బాత్రూం వైపు వెళ్ళింది ఊర్మిళ
కోడలి మాటలకు. , 'మర్యాదకు అలా అంది కాని వచ్చినప్పటినుండి కొడుకునెత్తుకొని పార్వతీదేవిలా కూర్చుంటోంది. హూ! పైగా ఇంటిపని తనే చేస్తానని అంటోంది. ఈవిడొచ్చి ఇప్పుడు, పని చేస్తుందా? అత్త ఉండనే ఉండే కష్టాలు అనుభవించడానికి. ఇదంతా వట్టి పైపై ప్రదర్శన మాత్రమే. నాకు మా బాగ్గా తెలుసు. ఎందుకిలా అంటోందో” అని కోపంలో వదో ఊహించుకుంటూ తనలో తానే గొణుక్కుంటూ అందరి అత్తల్లాగా ఆలోచిస్తోంది లక్ష్మి.
_ అప్పుడే శుభ్రంగా స్నానం చేసి నీటుగా తయారయి వచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు రమేశ్. ప్రేమగా తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా స్పృశిస్తూ అడిగాడు “అమ్మా! ఎలా ఉన్నావు అనిల్ నిన్ను బాగా కష్టపెడుతున్నాడనుకుంటా!”
కొడుకు సాన్నిహిత్యంతో ఆర్దమయిన మనస్సుతో లక్ష్మి “ఇప్పుడే నా కొడుకు తొడపై తల పెట్టుకుని శాంతి ననుభవిస్తాను అని అనుకొని కొడుకునో కోరిక కోరాలనుకుంది. 'అరే రమేశ్, నీవు నా దగ్గర ఉండకున్నానా మనవడినైనా నా నుండి దూరం చేయకురా? ఈ ముసలిదాన్ని ఏకాకిగా ఉంచొద్దు' అని గట్టిగా అడగాలనే అనుకుంది. నాలుక చివరిదాకా రాబోయిన ఆ మాటలను నోటిలోనే అణిచేసుకుని మౌనంగా ఉండిపోయింది. తల్లిమౌనాన్ని చూసి రమేశ్ “ఏమైందమ్మా! ఎందుకు మౌనంగా, విచారంగా ఉన్నావు?” అన్నాడు.
“అబ్బే ఏంలేదు! నాకేం విచారం. క్షణకాలం నీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో పడ్డాను జగద- అనువాదకథలు 32 డా॥ డింగరి నరహరి ఆచార్య
అంతే + చిన్నప్పుడు నువ్వు ఇలాగే నా దగ్గర కూర్చుని మీ. టీచర్ల సంగతి, స్నేహితుల సంగతి చెపుతుండేవాడివి నాకంత ఆనందంగా ఉందేదో” భావోద్వేగంతో అంది లక్ష్మి. కొడుకు బాల్యాన్ని సంపూర్ణంగా రుచిచూసిందావిడ, అందుకే ఆ మాటలు మనస్పూర్తిగా మాట్లాడినవే. తనకు అనిల్ గూర్చిన మధురస్మృతులు లేనే లేవు. వాణ్ణి కనడం మాత్రమే తన వంతయింది. ఈ బ్యాంక్ ఉద్యోగం కొడుక్కి తనమధ్య విషసర్పంలా తయారయింది * తన భుజాలమీదవాదు పడుకోవడం గానీ వాడికేం కావాలో అది తినిపించడం: గానీ లాలి పాటలు పాడటం గానీ, గట్టిగా గుండెలకు హత్తుకొని పడుకోవడం గానీ, వాడికి చేయూతనిచ్చి తప్పటడుగుల కాలంలో నడిపించడం గానీ, ఏదీ? అత్తగారు మాత్రం కొడుకే గాక, మనమడి పోషణతో రెండు సార్లు ఆ ఆనందం అనుభవించగల్లింది. అందుకే ఎట్టి పరిస్థి౦తుల్లోనూ అనిల్‌ని దూరంగా ఉంచకుండా తన దగ్గరే ఉంచుకోవాలి. స్నానాల గదినుండి వచ్చి చీరకట్టు కొంటూ తల్లీకొడుకుల మాటలు విన్న ఊర్మిళ అనుకుంది.
ఇంటి పనంతా అత్తగారి నుండి అందుకుని తనే చేసింది ఊర్మిళ, రమేశ్ కూడా “అమ్మా! ఇన్నాళ్ళూ చేసి చేసి నువ్వు అలిసిపోయావు. హాయిగా విశ్రాంతి తీసుకో. అన్ని పనులు ఊర్మిళే చూసుకుంటుంది” అన్నాడు. కొడుకు మాటలకు ఎంతో సంతృప్తి చేందింది లక్ష్మి అక్కదే, అమ్మా నాన్నలు తెచ్చిన బొమ్మలతో ఆటల్లో మునిగిపోయాడు అనిల్. ఆడుకొంటున్న కొడుకు దగ్గరకు వచ్చి రమేళ్ రైలు, బస్సు బొమ్మలకు ఎలా కీ ఇవ్వాలో చూపిస్తూ వాటి నడకను చూపెడుతున్నాడు. కొడుకు ఆనందంలో పాలు పంచుకొంటూ పొంగిపోతున్నాడు.
ఆ దృశ్యం చూసిన లక్ష్మి 'ఇలాంటి 'పెద్ద పెద్ద బొమ్మలు తానెక్కడ నుండి తేగలదు. అన్నన్ని మిఠాయిలు ఎలా తెచ్చివ్వగలదు, తన: దగ్గరేం వుంది. ఆయన సంపాదిందిన ఈ పాత ఇల్లు, కొడుకు పంపే కొద్దిపాటి డబ్బు, ఇంటి ముందున్న చెట్టు. ఇదే తన ఆస్తీ. వీటన్నింటినీ మించిన ప్రేమ వుంది. దానికి విలువ లేదా? ఎంత (ప్రేమగా సాకింది వాడిని. లాలించి తినిపించి, చేతుల్లో ఉయ్యాల ఊపి, కళ్ళతో హారతి పట్టి ఎంత గారాబంగా: పెంచింది. కాని ఏం. లాభం? వాడిని ప్రలోభ పెట్టగలిగేంత డబ్బు తన దగ్గర లేదు. కోడలు ఉద్యోగం 'చేసుకుంటానంటే వేలెడంత పిల్లవాడిని చేరదీసి ఆప్యాయంగా. పెంచింది. కాని వీడు తల్లిదండ్రుల్ని చూడగానే. ఎలా అతుక్కుపోయాడు, అవును, పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులంటేనే ఎక్కువ (ప్రేమ. దాంట్నో జగద- అనువాదకథలు 33 దా॥ డింగరి నరహరి ఆచార్య
తాను ఆశ్చర్యపడాల్సిందేంలేదు. అనేక విధాలుగా ఆలోచిస్తూనే తనను తాను సమాధానపరచుకో చూసింది.
1 భోజనానికి రమ్మని ఊర్మిళ పిలవడంతో అంతా భోజనాలు చేశారు.
అనిల్ వాళ్ళమ్మ తొడమీద తల నాన్న తొడలమీద కాళ్ళు చాపి పడుకొన్నాడు, వాడిలోవాడు ఏదేదో మాట్లాడుకుంటూ మెల్లగా కళ్లు మూతలు: వేస్తున్నాడు. క్షణకాలం “నానమ్మ నానమ్మ” అంటూ ఏదో మాట్లాడుకుంటూనే తల్లి ఒడిలో నిద్రపోయాడు.
రెండు రోజులు బంధువుల రాకతో, వాళ్ళతో ముచ్చట్లతో కాలం హాయిగా గడిచింది, మరో రెండు రోజులు తాము చేయాల్సిన పూజలు, దైవకార్యాలు, సత్యనారాయణ వ్రతం మొదలైనవన్నీ పూర్తి చేసుకున్నారు ఊర్మిళా రమేశ్‌లు.
ఇక తిరిగి వెళ్ళాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. ఆ సందర్భంలో రమేశ్ వాళ్ళమ్మతో “అమ్మా! అనిల్‌ను మేం తీసుకెళదామనుకుంటున్నాం” అన్నాడు.
దేనికైతే తాను సిద్ధంగా లేదో అదే విషయం తన ముందుకు వచ్చింది. అయినా ఓర్పుతో లక్ష్మి. “వం తొందర... ఇంకో ఏడాది ఇక్కడే నా దగ్గరే ఉండనీయండి” అంది.
“నిజమే తొందరేం లేదు. కాని వాడికి మూడేళ్ళు నిండాయి, వాడిని మంచి స్కూల్లో చేర్చిద్దామని ఉంది” అన్నాడు రమేశ్
“అయితే ఏం? ఇక్కడ లేదా స్కూల్? అది మంచి స్ఫూలే, నువ్వు చదువు కోలేదా ఇక్కడ?” అని మనుమడిని పంపడం ఇష్టం లేదనే ఉద్దేశ్యాన్ని తెలియజేసేట్లుగా అంది.
“ఆ కాలం వేరు, ఈ కాలం వెరమ్మా! అద్భష్టవశాత్తు 'నేను పెద్ద సిటీలో ఉండగలుగుతున్నాను. మంచి స్కూల్లో చదివి వాడు గొప్పవాడు కావాలని నా కోరిక” అని రమేశ్ తన దృఢ నిశ్చయాన్ని తెలియజేశాడు.
“అరేయ్ రమేశ్, మీరిద్దరూ ఉద్యోగానికి వెళతారు ఉదయం నుంచి నాయంత్రమయ్యె దాకా ఆఫీసు పనిలో తీరిక లేకుండా ఉంటారు; ఆ సమయమంతా వాదేం చేయాలి?” అని జాలిగా అంది లక్ష్మి,
“ఏదో ఉపాయం ఆలోచిస్తాం, ఇంట్లో పని వాళ్ళున్నారు, గూర్చ్ధా ఉంటాడు మా దగ్గరే కేర్ సెంటర్ ఉంది” అన్నాడు రమేశ్, జగద- అనువాదకథలు 34 * డా! డింగరి నరహరి ఆచార్య
“అది కాదురా! అపరిచితుల మధ్య ఎలా ఉంటాడురా? చిన్న పిల్లవాడు. వాడికింకా ఏం తెలియదు" విచారంగా ధ్వనించిందామె స్వరం
“అపరిచితులేంటమ్మా! 'మేం కూడా అక్కదే. ఉంటాంకదా, కాకపోతే కొన్ని గంటలు మాత్రమే. ఇలా దూరంగా ఉంటే వాడు మమ్మల్ని పూర్తిగా మరచిపోయేట్టున్నాడు. రానురాను మా మీద ్రేమ కూడా లేకుండా పోతుంది వాడి మనస్సులో” కొంచెం బాధతో భవిష్యత్తు నూహించుకుంటూ అన్నాడు.
“ఇదంతా ఎందుకండీ! వాడినే అడగండి. అమ్మా నాన్నలతో ఉండకుండా ఉంటాడా?” అంది ఊర్మిళ... అత్తగారు తన కొడుకును తనకు ఇవ్వడానికి పెట్టే అభ్యంతరాలకు కొంచెం మనస్సు నొచ్చుకుంటూ,
ఆ మాటలకు “అనిల్ అని కొడుకుని పిలిచాడు రమేశ్ “ఏంటి నాన్నా అంటూ పరుగెత్తుకొని వచ్చిన కొడుకుతో,
“ఏరా! మాతో వస్తావా?” అని అడిగాడు.
“ఓ[7 అంటూ అమ్మ ఒడిలో తల పెట్టి అటు ఇటు తిప్పుతూ చెప్పాడు అనిల్ అమాయకంగా,
“ఏరా! నన్ను వదలిపెట్టి ఉంటావా? నేను లెకుండా అక్కడ ఉండగలవా?” మనవణ్ణి అడిగింది లక్ష్మీ
“ఆ, అమ్మా నాన్న ఉంటారుగా అక్కడ” అని తిరిగి అమాయకంగా అన్నాడు
అనిల్,
“అక్కడ చాలామంది ఉంటారు. రద్దీగా ఉంటుంది. బస్సులు, కార్లు బాగా తిరుగుతుంటాయి. అంతా అల్లరల్లరిగా ఉంటుంది. బడికెట్లా వెళతావు? బడి అయిపోయాక ఇంట్లో ఒక్కడివే ఎలా ఉంటావు?” అని అనిల్‌కి ఆ వాతావరణం భయం కలిగించేలా అడిగింది.
అత్తగారి ధోరణి ఊర్మిళకు నచ్చలేదు. “వేమిటీవిడ. తమతో రమ్మంటే రాదు. ఇక్కడే ఈ యింట్లోనే తన జీవితం వెళ్ళాలంటుంది. అక్కడ. ఆచార సంప్రదాయాలు
ఇ. 'నడవవని భయం. ఈ మునలాళ్ళతో ఇదే తంటా' అని తన మనన్సులో రుసరుసలాడుకొంది. అనిల్ “బడికి అమ్మే నన్ను తీసుకెళుతుంది” అని అమ్మ ముఖం చూస్తూ *కదూ”! అన్నట్లుగా అన్నాడు. జగద-' అనువాదకథలు తెర్ డా! డింగరి నరహరి ఆచార్య
రోజూ తీసికెళ్లాలంటే అమ్మకి కష్టం కదా” అంది. లక్ష్మి. “అయ్యో! నాకేం కష్టం. ఏ తల్లెనా కొడుకు పని చేయడం కష్టం అనుకుంటుందా?” అని వెంటనే అంది ఊర్మిళ, .
“అమ్మా! వాణ్ణి మా దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాం, ఈ. ఉద్యోగాలు చెసేది వాడు మాకెప్పుడూ దూరంగా ఉండడానికి కాదుగా” రమేశ్ ఖచ్చితంగా పిల్లవాడిని తీసుకు పోతాం అన్నట్లుగా మాట్లాడాడు. “మీరు నిర్ణయించుకున్నాక నేనెందుకు అడ్డం వస్తాను. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. మీకు కష్టం కలగొద్దనే నా ఉద్దేశ్యం” తప్పదన్న విధంగా లక్ష్మి బదులు చెప్పింది.
“ఇప్పుడలాగే అనిపిస్తుంది 'ఏం కష్టం అని, వాడికీ కాస్తకాస్తగా అన్నీ అర్ధమవుతున్నాయి. చెప్పగలుగుతున్నాడు. కాని చిన్నతనం నుండి. ఇప్పటిదాకా వాణ్ణి పెంచడానికి అన్ని కష్టాలు పడ్డాను. ఇవ్వాళ్ళ తల్లి (ప్రమ అంటూ తీసుకెళుతున్నారు, సరే, ఏంతో గారాబంగా ఇక్కడ పెరిగిన వీడు అక్కడి వాతావరణంలో ఎలా తట్టుకుంటాడో” మనమడి గూర్చి. బెంగగా మనసులో అనుకుంది లక్ష్మి.
అయిదు రోజులు గడిచాయి, రమేశ్, ఊర్మిళ వెళ్లేరోజు రానే వచ్చింది. అనిల్ తన ఆట వస్తువులన్నీ సర్టుకోవడంలో మునిగిపోయాడు. ఆటో వచ్చేసింది, అందరికంటే ముందే అనిల్ వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు, “నేను బొంబాయి వెళుతున్నాను” అని మురుస్తూ తన. 'స్నెపితులతో చెప్పాడు కూడా సూటు కేసులన్నీ సర్దేశారు ఆటోలో, లక్ష్మికి నమస్కరించి రమేశ్, ఊర్మిళ ప్రయాణానికి సిద్దమయ్యారు. తన కొడుకు గురించి అత్తగారు అప్పటిదాకా పడ్డ (శ్రమను తలచుకోగానే ఊర్మిళకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ అతా కోడల్లిద్దరు పరస్పరం అభిమానాలు, (ప్రేమలు ఉన్నవారే. కాని అప్పుడప్పుడూ మామూలు ఆడవాళ్లలా మారడం తప్పడం లేదు.
నమస్కరించిన కొడుకును కోడలును ఆశీర్వదించి మనమడు తనకు దూరమౌతున్నందుకు మనస్సులో అనేక విధాలుగా ఆలోచించుకుంటూ ఆందోళన పడసాగింది లక్ష్మి. పైగా కనీసం తనకు చెప్పకుండానే వెళ్ళి ఆటోలో కూర్చున్న మనుమడి మీధ కోపం కూడా వచ్చింది. తన (ప్రేమను ధిక్కరించినట్లుగా భావించింది. అయినా మనసులోని ప్రేమపాశం ఆమెని ఆపలేకపోయింది,
“అరే అనిల్, నానమ్మకు ఒక్క ముద్దిచ్చిపో” అంటూ పిలిచింది. ఆ పిలుపులో ఏం మహాత్యం ఉందో, ఏం మాధుర్యం ఉందో కానీ అనిల్ వెంటనే ఆటోలో నుండి జగద- అనువాదకథలు 836 దా! డింగరి నరహరి ఆచార్య
దిగి పరుగెత్తుకుంటూ వచ్చి నానమ్మ చేతుల్లో వాలాడు. లక్ష్మి వాడినలాగే 'పైకెత్తి గట్టిగా కౌగలించుకొని గబగబా ముద్దులు పెట్టింది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్పించసాగ్గాయి. “ఏరా! అనిల్ ఈ నానమ్మను విడిచిపెట్టి పోతున్నావా? అంది. నానమ్మ మాటలు, కన్నీళ్ళు ఏం చమత్కారం చేశాయో తెలియదు, తన బుల్లిచేతులతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ, “నానమ్మా! నానమ్మా, వడవక్కు నేను వెళుతున్నానని ఏడుస్తున్నావా? ఏడవకు నేనేం వెళ్లను. ఇక్కడే ఉంటాను అన్నాడు, “వద్దు వద్దు అమ్మానాన్న కోప్పడతారు. వాళ్ళ మనస్సు కష్టపెట్టాద్దు, వాళ్ళతోనే వెళ్ళు” మనమడి మాటలకు సంతోషం కలిగినా పైకి మాత్రం అలా అంది లక్ష్మి, ఆమె చేతుల్లో నుండి అనిల్‌ని తీసుకొని ఊర్మిళ, “అనిల్ ఇక్కడెందుకు ఉండడం అక్కడ నీకు బోల్డు ఆటబొమ్మలు కొనిస్తాను. మిఠాయిలు తెస్తాను. కలు, కారు బస్సుల్లో అన్ని ఊళ్లు తిరగొచ్చు” అంది. కాని ఏడుస్తున్న నానమ్మను వదిలి అనిల్ పోలేకపోతున్నాడు. ఎంతో బుజ్జగించగా సరేనన్నవాడు అమాయకంగా “మిఠాయిలిస్తావు, బొమ్మలిస్తావు, కాని సాయంత్రం “శుభం కరోతి” అనే శ్లోకం ఏవరు చెప్పుతారు? నీకు రాదుగా, కథ లెవరు చెపుతారు. నాతో కలిసి ఎవరు ఆడుకుంటారు, తొదలమీద పడుకోబెట్టుకొని జోలపాట ఎవరు పాడతారు. నన్నింటికెవ్వరు తీసుకొస్తారు?” అంటూ అవన్నీ నానమ్మ అయితేనే చేయగల్గుతుందన్నట్లు మాట్లాడాడు. రాననీ మొరాయించాడు. మారాం చేయడం మొదలెట్టాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం చూసి ఊర్మిళ, కొడుకు వేసిన ప్రశ్నలు మనసులో మెదలడంతో “నిజమేవాడడిగినవన్నీ ప్రేమతో తాను చేయగలదా? తనకంత తీరికుందా, బతుకుదెరువు కోసం బ్యాంక్ ఉద్యోగం చేయక తప్పదు. ఒక్కోసారి లెక్కలు తేలక రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర కూడా అవుతుంది.. తనకన్నా వాడి నాన్నమ్మే అవన్నీ చేయగలదు. ఏం చేయడం? వాడిని బలవంతంగా తీసికెళ్ళి ఒంటరివాడిని చేసి బాధించడమా? వాడి: సుఖం చూడడమా? వాడికింకా కొంత ఊహ వచ్చేదాకా అత్తగారి దగ్గర పెరగడమే ధర్మం అనుకుంది ఊర్మిళ, . _ 'రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది. కొడుకును వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు ఊర్శిళకి. అయినా కృష్ణుడి క్షేమాన్ని కోరిన దేవకి ఆనాడు తను కారాగారంలో మగ్గుతూనే యశోదకు అప్పగించినట్లు కొడుకును వదలి వెళ్ళే బాధను లోలోపలే దిగమింగి, జగద అనువాదకథలు ప్ర డా॥ డింగరి నరహరి ఆచార్య
ఉద్యోగ మనే కారాగ్గారానికే వెళ్ళడానికి నిశ్చయించు కొంది.
ఆటో ముందుకు కదిలింది. భారంగా, ఊర్మిళ్ళ రమేశ్‌లు వీడ్కోలు చెపుతూ చేతులూపారు. నానమ్మ చంకనెక్కిన అనిల్ సంతోషంగా చేతులూపుతూ అమ్మా నాన్నలకు వీడ్కోలు చెప్పాడు. వెళ్లనని మొరాయించి మనుమడు. తన దగ్గరే ఉంటానన్నందుకు పొంగిపోతూ ఆనందా(శ్రువులు రాల్చింది లక్ష్మి. వాడైనా తన మనసునర్థం చేసుకున్నాడని ఉప్పాంగిపోయింది వాణ్సి గుండెలకు హత్తుకుంటూ,
మూలరచయిత; సరోజ్ ధన్‌పాల్ చౌగులే (వివుల అక్టోబర్ 2005) జగద- అనువాదకథలు 38 డా॥ డింగరి నరహరి ఆచార్య
చావే నయం ఇంత పొద్దున్నే ఏమిటా సరదడి, ఏదో కోలాహలం వినఐడుతోందే. హాయిగా స్వేచ్చగా. పడుకొనే అదృష్టం కూడా మనిషికి లేదే అని ఆలోచిస్తూ మెల్ల మెల్లగా కళ్ళు విప్పి చూసే ప్రయత్నం చేశాను నేను, కాని ఎందుకో కళ్ళు విప్పలేకపోయాను. ఎందుకో ఆ శక్తి నాలో లేకుండా పోయింది.. ఎవరో కట్టిపదేసి నట్లు కళ్ళు స్తబ్బంగా ఉండిపోయాయి. కాని పూర్తిగా మూసుకుపోయినట్లు గాక కొంత అస్పష్టంగా నా కంటికి కనబడుతూనే వుంది. 'నా బంధువులు భార్యాపుత్రులు నా చుట్టూ కూర్చొని వుండడం కనిపిస్తున్నది. నా మనస్సు బాధపడింది, “పాపం. అది ఎందుకేడుస్తోందో?” తల నిమిరి అనునయంగా ఓదార్చితే బాగుండుననే కోరిక కలిగింది. కాని నా చేయి కదలదేం? ఇంతలోనే అదిగో కొందరితో కలిసి మా (గ్రామపెద్ద వచ్చాడు. ఆయన కాసేపు నా ముందు మౌనంగా నిలబడి ఆ తర్వాత అతని దగ్గరే నిలబడిన ఒకతన్ని “ఎప్పుడు జరిగింది? ” అని అడిగాడు. | “ర్రాత్రో లేదా పొద్దున్నో జరీగివుంటుంది. పూర్తిగా తెలియదు నాకు కూడా. ఆయన భార్య పొద్దున్నే పిలిచినా పలకడంలేదేం అని చూసే వరకు ఆ శరీరం నిశ్చలంగా ఉన్న సంగతి ఆవిడకూ తెలియదు, వెంటనే వైద్యున్ని పిలిచి పరీక్ష చేయిస్తేగానీ ఆయన చనిపోయిన సంగతి నిర్దారణ కాలేదు. చావు ఎప్పుడు. ఎలా వస్తుందో చెప్పడం ఎవరికి సాధ్యమౌతుందండి” అన్నాడు నిట్టూరుస్తూ. ఇంతలో ఒకావిడ వచ్చి నా భార్యను బలవంతంగా వేరే గదిలోకి తీసుకెళ్ళింది. కొంతమంది నన్ను చేతులతో ఎత్తుకొని ఇంటి వెనక్కి తీసుకెళ్ళారు. వాళ్ళంతా నా చుట్టూ నిలబడి “నా బట్టలు ఒక్కొక్కటే విప్పసాగారు. ఆ సమయంలో చలి నన్ను బాగా బాధించసాగింది. అంతేకాదు వొళ్ళలా చేస్తుంటే నాకు సిగ్గుగా కూడా వుంది, “ఎవరైనా వచ్చి నన్ను అలా చూస్తే...” భరించలేక నేను కళ్ళు మూసుకున్నాను. వాళ్ళు నాకు న్నానం పోశారు... కాని సబ్బుతో రుద్దలేదు మూర్చలు. ఆ... ఫరవాలేదు. ఒంటికి మంచి సెంటు రాశారులే. కొత్త బట్టలు కట్టారు. తిరిగి నన్ను మళ్లీ ఇంటిలోకి వాళ్ళ చేతులమీద ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇల్లంతా కమ్మనివాసనతో నిండిపోయింది. జగద- అనువాదకథలు 39 డా! డింగరి నరహరి ఆచార్య
ఆ గదిలోకి రాగానే ఒక తెల్లని విశాలమైన బట్టలో నన్ను పడుకోబెట్టారు. ఆ తర్వాత ఒకతను మరో తెల్లబట్టతో పూర్తిగా కప్పాడు. మరొకతను నా తలవైపు, పాదాలవైపు దీపాలు వెలిగించి పెట్టి ఆ పక్కనే కొబ్బరి ముక్కలు వుంచాడు. మరోపక్క ఊదుబత్తులు వెలిగించాడు, దీపాల నుండి, ఊదుబత్తుల నుండి వస్తున్న పొగ నన్ను ఊపిరాదకుండా చేసి బాధించసాగింది.
ఆ సమయంలో మొదట మాట్లాడిన పెద్దమనిషి మళ్లీ లోపలికి వచ్చి “ఆరె తెలివి లేదా' మీకు, ఏం చూస్తున్నారు మీరు, ఆ ముక్కు రంధ్రాల్లో పత్తిని దూర్చండి, కాలివేళ్ళు తాదుతో కట్టండి” అన్నాడు, ఆ మాటలు చెప్పి అతనక్కడి నుండి మళ్లీ మాయమయ్యాడు. ఇలాంటి వాళ్లు లోకంలో భలే గమ్మత్తుగా ఉంటారు, ఆదేశాల్విడం, ఆదర్శాలు వల్లించడం, బోధనలు చేయడం, వెంటనే వెళ్లిపోవడం,
ఆ ఆదేశాలు పాటించడానికేనన్నట్టు నిలబడ్డ సురేశ్ నా బాల్యమిత్రుడు వెంటనే ముక్కురంధ్రాల్లో దూది పెట్టాడు. ఇంతకు ముందు కాస్త బతికే అవకాశం ఉన్నా వాడికి శ్వాస కూడా ఆడకుండా చేసి ఇక బతికే అవకాశం లేకుండా చేయడానికన్నట్లు ఆ పనిచేశాడు. ఎంతదూరమైనా నాతో కలిసి నడిచే మిత్రుడు. నా నడకకు బంధనం వేసినట్లుగా నా కాళ్ల వేళ్ళు తాడుతో కట్టి పడేశాడు.
అదిగో మళ్లీ ఆ పెద్దమనిషి లోపలికొచ్చాడు. “సురేశ్ ఆ కిటికీలు తీసిపెట్టు. గాలి వెలుతురు వస్తుంది. అందరూ వస్తే ఇదంతా నిండిపోయేట్టుంది. కాబట్టి కొందరు బయట నిలబడి కిటకీల నుండైనా చూసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆడవాళ్ళను పిలిచి లోపల కూర్చోమనండి” అని. ఆదేశించాడు.
ఇలా స్పష్టంగా ఆదేశించిన ఆ మనిషి అరరే మళ్ళీ నాకు కన్పించడం లేదు. మళ్లీ మాయమయ్యాఢడే, ఇలాకాక సులభంగా ఓ పనిచేస్తే బాగుంటుందాయనకు. ఇటు వంటి మాటలన్నీ టేప్‌రికార్దర్‌లో నింపి ఆన్‌చేసి ఇక దగ్గర సుఖంగా కూర్చోవచ్చుగా, ఇలా అనుకుంటుండగానే కొందరు ఆడవాళ్ళు లోపలికి వచ్చి నా చుట్టు కూర్వోసాగారు.
ఒకావిడ నా భార్యను తీసుకొని వచ్చినా పక్కనే. కూర్చోబెట్టింది, నా భార్య “నన్ను అనాాధను చెసి సుఖంగా నీ దారి నీవు చూసుకున్నావా?” అని నన్ను చూసు కుంటూ ఏడవసాగింది, ఆమెకు ప్రకాశంగా సమాధానం ఇవ్వాలని. నాకున్నా సాధ్యం కావడం లేదు.
ఆడవాళ్ళంతా. గోప్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. జగద- అనువాదకథలు త్త డా॥ డింగరి నరహరి ఆచార్య
అబ్బా! రహస్యాలు మాట్లాడుకోవడంలో ఆడవాళ్ళను 'ప్రశంసింపక తప్పదు (బ్రహ్మ సాక్షాత్మారం పొందిన యోగులు కూడా వీళ్ళ మాటలను, మనస్సును తెలుసుకోవడం సాధ్యం కాదు. వాళ్ళల్లో నా చెల్లెళ్లు భార్య తరపు, నా తరపు బంధువులు కూడా వున్నారు.
ఒకతను ద్వారం దగ్గరే కూర్చుని బయటివైపు దృష్టి నిలిపి చూస్తున్నాడు. 'పైగా ఎవరైనా కొత్తవాళ్లు వస్తున్నారనగానే వెంటనే లోపలికి సూచన చేస్తున్నాడు. ఆ సూచన అందగానే అందరు ఆడవాళ్ళు లోపల ఎవరో చనిపోయినట్లుగా. ఒకేసారి
“నా శిష్యుల్లో ఇతను చాలా గొప్పవాడు, ఇటువంటి వానికి ఇప్పుడె ఈ దుర్గతి... అంతా ఒక ఆట...” అంటూ ఏవరో అన్న మాటలు కిటికీ గుండా నా చెవుల్లో వడ్డాయి, ఆయన శంకర్ సార్‌లా వుంది. అవును ఆయనే. నాకు పాఠాలు బోధించినవాడు. మలయాళ భాషాధ్యాపకుడు హిందీ ఏలా బోధించాలో తెలియనివాడు, ఇంటర్ మీడియట్ చదివేరోజుల్లో ఆయన బిడ్డకి (ప్రేమలేఖ రాశానని నన్ను ఇంటి దాకా పరుగెత్తించి కొట్టినవాడు.. ఆ మూర్చుడు ఇపుడిలా అంటున్నాడు, పైగా మా నాన్నకు చెప్పి కొట్టించాడు కూడా “జీవితంలో ఈ శిష్యున్ని మరచిపోతానా నేన్ము మరవను, మరువలేను కూడా” అని అంటున్నాడు. ఆ మాటలు వ్యంగ్యంగా వున్నాయి. అవును నిజమే? నేను కూడా మరచిపోలేను. మనసు బాధగా మూలిగింది.
“అందరితో సమభావనతోన్తూ సోదర భావంతోనూ మెదిలేవాడు. ఇలాంటి మనిషి లభించడు. ఇవ్వాళ మృత్యువాతపడి మావంటి వాళ్ళకు విచారాన్ని, దుఃఖాన్ని మిగిల్బాడు” అంటున్నాడొకాయన,
“అయ్యో! ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. మా ఊరిలో ఇతనిదొక్కటే దుకాణం, దానికధికారి ఇతనేకదా. నేను ఇవ్వాల్సిన దబ్బు ఒక వారం ఆలస్యం అయిందని నా భార్య కుట్టుమిషన్ పట్టుకెళ్ళాడు, హు! ఏంత ప్రేమ హృదయం. ఆ తర్వాత దబ్బు అంది ఇస్తానన్నా అక్కర్లేదని, అటు డబ్బూ తీసుకోక మిషనూ ఇవ్వకుండా వ్యవహారం నడిపిన మనిషి. ఆ తర్వాత ఒక్కరోజూ సఖ్యంగా ఉండలేదు. నాతో, ఇవ్వాళ్ళ ఇలా మాట్లాడు తున్నాడు” అని నేననుకుంటుండగా ఒక పెద్దమనిషి వచ్చి నా నోటిలో ఏదో ఉంచాడు. అరరే ఇది తాంబూలంలా వుందే! అవును దాన్నాకసాారి గట్టిగా నొక్కి ఆనందం పొందసాగాను.
“మాపం ఇదంటే చాలా ఇష్టపడేవారు. ఎప్పుడు చూసినా ఆ నోటిలో తాంబూలం జగద- అనువాదకథలు త్తే డా॥ డింగరి నరహరి ఆచార్య
ఉండేది అంటూ కళ్లనిండా కన్నీరు నింపుతుండగా చూసిన మా నాన్న ఆప్త మిత్రుడు రాధాకృష్ణ అది భరించలేనట్లు బాధతో బయటికి నడిచాడు.
“ఓ! ఈశ్వరా! ఈయన ఎవరు? ఓహో గణేశ్! నా 'స్టేహీతుడే. నా కళ్లు నమ్మలేకపోతున్నాయి. బాల్యమిత్రుడంటే, బాల్యం లోనే మిత్రుడు. మా ఊళ్లో ఉన్న ఒకే ఒక ప్రింటింగ్ (్రెస్‌కి అధికారి. ఇవాళ ఊళ్ళో లెక్కించదగ్గ ధనవంతుల్లో ఈయనొకడు.
నా అంతిమయాత్ర సూచించే వాక్యాలు రాయించుకొని ముద్రించడానికి తీసుకెళ్తాడు. అందుకే వచ్చాడు. ఎందుకు రాడు. ఆయన వచ్చిన ఉద్దేశం అవగతమౌతూనే ఉంది.
“ఎప్పుడు తీసుకెళ్తారు? ఎవరి కోసమైనా ఎదురుచూస్తున్నారా? అందరికీ చాలా పనులున్నాయి. మీకు తెలుసుకదా! సమయం చాలా విలువైనది. పోయినవాడు ఎలాగూ పోయినవాడే కదా, కానీయండి” అని తొందర చేస్తున్నాడొకాయన.
వీడు సోహనే కావచ్చు అవును, అతనే అతగాడీకి ఎప్పుడూ పనుల ఒత్తిడే. ఉదయం తొమ్మిదింటి నుండి రాత్రి పన్నెండు దాకా పనిచేన్తూ చాలా కష్టపడతాడు అని అందరూ అంటుంటారు. -.
పల్లెలో కొంత పొలం ఉంది. కాని చాలా రోజుల 'నుండి అక్కడ వ్యవసాయ పనులే నదడవడంలేదు.. రాత్రిళ్లు పొలాల నుండో కొబ్బరి తోటల నుండో ఉదయానికి కావల్సిన భోజన పదార్థాలు సంపాదిస్తుంటాడు. అంటే అర్ధ్థమయిందనుకుంటాను. అలాంటివాడు. ఇలా అనేక పనులుంటాయని, త్వరగా కానీయండి అనడంలో ఆశ్చర్యమేముంది. వాడో మూర్చుడు. దొంగ ఇలాకాక వలా మాట్లాడతాడు
ఇంతలో ఏదో మోటారు వచ్చిన ధ్వని నా చెవుల్లో పడింది. ఒకతను లోపలికి వచ్చాడు. ఎవడతను, ఎవడైనా గాని, వాడు నా దగ్గరకు వచ్చి తల వంచి నిలబడతాడు గదా! అప్పుడు తెలుస్తాడులే. ఈ సత్యాన్ని ఎవరూ (గ్రహించలేరు, చావంటే ఒక విజయ స్థానమే. ఏందుకంటే ఇక్కడ శత్రువులు కూడా తలవంచి నిలబడతారు. చావు మొదటిరోజే ఇదంతా అనుభవిస్తాం, ఈ ఒక్కరోబే. ఏడుపు గానీ సంతాపం గానీ, శోకదినంగా కనిపిస్తుంది. ఆ మరుసటి రోజునుండి ఒక ఉత్సవ వాతావరణం ఏర్పడుతుంది.
“ఇదిగో తీసుకెళ్ళే వాహనం వచ్చింది. త్వరగా కానీయండి, త్వరగా తీసుకెళ్టాం. సమయం. లేదు, ఇంకోచోటికి పోవాలని అతగాడు తొందరపడుతున్నాడు, జగద- అనువాదకథలు శై డా॥ డింగరి నరహరి ఆచార్య
త్వరత్వరగా కానీయండి” అని మళ్ళీ మందలించాడు.
వాళ్ళ ఉత్సాహం చూసి నాకు అనుమానం కలిగింది. తొందర మోటారు వాడిద్హా వీళ్ళదా? ఇంతలో ఆడవాళ్ళంతా. తమ పనిని ప్రారంభించారు. నా భార్య నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నాలో కూడా శోకసంద్రం ఎగిసింది. ఏందుకంటే ఆడవాళ్ళు నా భార్యను నానుండి బలవంతంగా వేరుచేశారు,
“వద్దు వద్దు... నన్ను తీసుకెళ్ళకండి, దయచేసి నన్ను తీసుకెళ్ళకండి. అయ్యో వద్దంటుంటే వినరేం? నాకింకా బతకాల నుంది, నా భార్యా బిడ్డలతో కలిసి ఇంకా జీవించాలనుంది. వదలండి! నన్ను వదలండి!” అని అరుస్తున్నా... నా మాటలు ఎవరూ. లెకృచేయచం లేదు. ఒకడు నా కాళ్ళు పట్టుకున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అరుస్తూ ఒక్క తన్ను తన్ని వాణ్ణి దూరంగా పడేట్టు చేశాను. వాడు లేచి నా చెంపలు వాయించాడు. నేను కోపంతో అరుస్తూ లేచి కూర్యున్నాను. చూడగానే నా భార్య 'పైకిలేస్తూ ఏడుస్తూ కనపడింది.
“సంధ్యా! ఏమిటి? ఏమయింది?” అని అడిగాను. “బాగుంది కాలితో తన్ని నన్ను కింద పడేసి వమయిందని అడుగుతున్నారా? అయ్యో... అమ్మా! నా నడుం విరిగింది. పక్కలో పుట్‌బాల్ అడుతున్నారా? ఏమయింది మీకు” అంది.
“క్షమించు... నేనొక కలగన్నాను. అక్కడ నా చావు నేను. చూశాను. జనం నన్ను శృశానం తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు... అప్పుడు... ఇలా అయింది. కాని ఇప్పుడు నాకు చాలా సంతోషంగావుంది. ఎందుకంటే నిజంగా నేను చావలేదు కదా” మెల్లిగా సిగ్గుపడుతూ ఆగుతూ ఆగుతూ పలికాను.
“ఇం తక న్న చావే నయం అనిపిస్తున్నది, అరే, అమ్మా, అయ్యో! నా నడుం.,, ఏంచేయాలి, ఇలా రోజూ చేసెట్టుంటే ముందే. చెప్పండి. ఈ సంసారం ఈదడం నా వల్ల కాదు.ఈ గడియారం అమ్మి ఈ రోజుకి వంట సరుకులు తెస్తాను, మా నాయనే.., కలలట కలలు” అంటూ ఆమె మూతి విరుస్తూ బయటకు నడిచింది.
“కరి భగవంతుడా! మళ్ళీ తెల్లారిందా. ఈ రోజు అప్పులవాడు బాకీ కోసం వస్తాడు కాబోలు. సాయంకాలం లోపల ఆ డబ్బు ఎక్కడ నుండి తేవాలి. దినం గడవడమే కష్టంగా వుంది. నా భార్య. నిజమే చెప్పింది, ఇంతకన్నా “చావే నయం అనిపిస్తున్నది. అందరి పొగడ్డలు పొందచ్చు ఈ లోకంలో జీవించడం కన్నా “చావే నయరలీ అన్నది నిజమనిపిస్తున్నది” మూలరచయిత: మనోజ్‌భావన
(వివుల మార్చి 2008) జగద- అనువాదకథలు శప డా! డింగరి నరహరి ఆచార్య
“ఆగు! రావద్ద! ఒక్కడుగు ముందుకేసినా కొడతాను” అన్న లక్ష్మి మాటలతో పాద్దున్నే నిద్రాభంగం అయింది రాఘవకు. కార్తీకమాసపు ఆ చల్లని ఉదయంలో హాయిగా ముసుగేసి పడుకున్న ఆయనకి ఆ సుఖాన్ని దూరంచేయక తప్ప లేదు. లేచి బయటకు వచ్చి ముఖం కదుక్కున్నాడు.
“ఎడు గంటలయింది. ఇప్పుడెందుకు వచ్చావ్? ఇల్లు తుడుచుకోవడం, ఊడవడం అన్నీ అయిపోయాయి. కాఫీ తాగే వేళకు వచ్చి నువ్వేం చేస్తావ్? వద్దు... వద్దు నీ అవసరం లేదు” అంటూ లక్ష్మి చూపుడు వేలుతో బెదిరిస్తూ తీవ్రంగా అంటోంది. ఎదురుగా పదకొండేళ్ళ పనిపిల్ల, భయంగా నిలుచుని వుంది.
ఆ దృశ్యం రాఘవ చూశాడు “ఆ మాటే మెల్లగా చెప్పరాదూ” అన్నాడు భార్యతో.
“ఆ! మెల్లగా చెపుతా మీరు చేయబట్టే ఇలా తయారయింది. చూడు దాని ధైర్యం! వారంలో నాలుగు రోజులిలాగే ఆలస్యంగా వస్తుంది. అన్నీ పనులు నేనే చేసుకోవడం, మీకు చెప్పి ఏం ప్రయోజనం? కాఫీ తీసుకోండి!” అంటూ టీపాయ్ మీద కాఫ్ కప్పు ఉంచింది. మాట్లాడకుండా రాఘవ కాఫీతాగాడు “హు! తాగి దినపత్రిక చదువు కోండి, ఇక టివి కూడా ఉంది కదా? వార్తలు వినండి, అంతానా దౌర్భాగ్యం, ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. స్కూల్లో పిల్లలకి పాఠాలు నోరు నొప్పి పెట్టేట్టు అరచి చెవ్వాలి, అంతా కంఠశోష. నా తలరాత, చావే నయం దీని కన్నా” ఇంకేం మాట్లాడలేక పైకి వస్తున్న దు:ఖాన్ని బాధను దిగమింగుకుంది.
నిజానికి లక్ష్మి తప్పేం లేదు పొద్దునే వడున్నరకల్లా స్కూల్‌కి బయలుదేరి ఎనిమిదిన్నరకల్లా అక్కడ ఉండాలి, అందుకే పనిపిల్ల మీద విసుగు. పనిపిల్ల *జగద' పాపం అలాగే బయట నిలబడిపోయింది, మెల్లిగా లోపలికి వచ్చి ఇల్లు ఊడవడానికి తయారయింది. ఇది దాదాపు రోజూ జరిగే తంతే. కోపంలో లక్ష్మి ఏవో మాటలు అంటుంది. జగద మౌనంగా పనిలో ఒదిగిపోతుంది. ఇవ్వాళ అదే జరిగింది. కొంతసేపయ్యాక లక్ష్మి కోపం వదలి జగదకు కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ చూసి చూడనట్లుండిపోయింది జగద. అది చూసి లక్ష్మి మళ్ళీ కోపంగా “ఏం..ఇవ్వాళ రోషం వచ్చిందా? కాఫీ తాగడంలేదెందుకు?” అంది, జగద మౌనంగా కాఫీ తాగింది.
జగద ఆలస్యంగా వచ్చినప్పుడల్లా లక్ష్మి కోపంగా ఇలాగే అరుస్తుంది, జగద జగద- అనువాదకథలు న! దా॥ డింగరి నరహరి ఆచార్య
కూడా అలాగే మౌనంగా ఉండిపోతుంది. “ఇలాగే ఆలస్యంగా రా! కొంచెం కూడా సిగ్గులేదు నీకు అంది. లక్ష్మి. ఆ మాటలు వినగానే జగద ముఖంలో దుఃఖం తన్నుకు రాసాగింది. అయినా బలవంతంగా అణచుకొని నవ్వు ప్రకటిస్తూనే కాఫీ తాగింది.
జగద! ఈ యింట్లో పాత్రలు కడగడం ఇల్లు ఊడవడం మొదలైన పనులు చేస్తోంది. అది చూడ్డానికి వాళ్ళ బిడ్డకన్నా అందంగా ఉంటుంది. రెందేళ్ళు చిన్నది కూడా. వాళ్ళ బిడ్డ దోమతెర లోపల సుఖంగా హాయిగా నిద్రపోతోంది.
నడిమింట్లో ఊడవడానికి జగద 'రాగానే మళ్ళీ “వెళ్ళిపో. ఈ రోజునుండి నీవు రావాల్సిన అవసరంలేదు. వెళ్ళు ఇక్కడి నుండి” లక్ష్మి గట్టిగా అరిచింది, జగద రాఘవవైపు దీనంగా చూడ సాగింది దాని కళ్ళు ఎరుపెక్కి వున్నాయి రాత్రంతా నిద్రలేనట్టు. అది చూసి “లక్ష్మీ” అన్నాడు రాఘవ, ఇక ఊరుకో అన్నట్లుగా. “మీరూరుకోండి! ఇది రావాల్సిన అవసరం లేదు. నేను భరించలేను. చాలు దాని సహకారం” అని రుసరుసలాడింది.
“చిన్నపిల్ల కదా!” అన్నాడు రాఘవ. “అలా అనకండి. ఈ పిల్ల నా యింటికి రానవసరం లేదు” అంది. ఆ వెంటనే రాఘవ “జగదా! ఎందుకు ఆలస్యంగా వస్తున్నావ్” అని, అడిగాడు. జగద మౌనంగా: నిలుచుంది.. వెంటనే లక్ష్మి కోపంగా “రాత్రి సినిమా చూడ్డానికి వెళ్ళిందేమో?” అంది.
“ఏం.. సినిమా చూడ్డానికి వెళ్ళావా?” అన్నాడు, జగద మౌనంగా తలవూపుతూ
అంగీకారాన్ని తెలిపింది.
“ఒక్క వారంలో మూడు రోజులు సినిమా చూడ్డానికి వెళ్తుందీవిడగారు” వెటకారంగా అంది లక్ష్మి,
“డబ్బు లెక్కడనుండి వస్తాయి నీకు?” అన్నాడు రాఘవ.
“నానమ్మ ఇచ్చింది” అంది. “అలాగా మీ నానమ్మను ఇప్పుడే తీసుకురా!” అంది లక్ష్మి ఆవేశంగా, తిరిగి రాఘవనుద్దేశించి “చూడండి! ఆ ముసలిది వచ్చినట్లయితే జీతం ఇచ్చి పంపేయండి” అని ఆదేశించింది. జగదతో “వెళ్ళు వెళ్ళు మీ నానమ్మను తీసుకురా” అని మాటలు ఆపేసింది. జగద రాఘవను చూడసాగింది. ఆమె కళ్ళలోంచి నీళ్ళు కారసాగాయి. అమాయక బాలిక చాలాసేపు అలా నిలబడింది. ఆ చూపులు రాఘవ హృదయాన్ని కదిలించివేశాయి.'జగద చాలా బుద్ధిమంతురాలు, ఆదివారం టీవీలో దూరదర్శన్‌లో సినిమా చూడ్డానికి తప్పక వస్తుంది. చిత్రహార్ కూడా తప్పు కుండా జగద- అనువాదకథలు శీర్ డా! డింగరి నరహరి ఆచార్య
చూస్తుంది. అందులో పాత్రలు పాటలు వారి నటన అన్నీ విడవకుండా (శ్రద్ధగా
గమనిస్తుంది... ఇతరులు తెలుసుకోలేని ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. అంత శ్రద్ధ. జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. నిజంగా బడికి వెళ్ళి చదువుకుంటే....కానీ అది అసంభవం, అనాధ్యం' ఇలా ఆలోచిస్తున్నాడు రాఘవ.
పాపం నాలుగేళ్ళ వయస్సులోనే జగద తల్లి చనిపోయింది. తండ్రి గురించి తెలియనే తెలియదు. అప్పటి నుండి నానమ్మే ఆమెకన్నీీ అంతేకాదు వాళ్ళ అన్నయ్యను కూడా వాళ్ళ నానమ్మే పోషిస్తోంది. మధ్యాహ్నం ఆఫీసర్లకు భోజనం తీసుకువెళుతూ డబ్బు సంపాదిస్తూ నాకింది. ఎక్కడో ఊరి చివర చెరువు దగ్గర చిన్న గుడిసె వారి నివాసం. జగద అన్నరిక్షా నడుపుతాడు, ముసలావిడ చూపు మందగించినప్పటి నుండి తన శక్తి సన్నగిల్లింది కనుక ఇంటిపనులు చేయడానికి జగదను రాఘవ యింట్లో కుదిర్చింది.
జగద అన్ని పనులూ బాగా చేస్తుంది. చిన్నప్పటి నుండే ఆట పాటల్లో గాని, వినోదంగా మాట్లాడడంలో గాని చాలా. హుషారైన పిల్ల కానీ ఎందుకో రెండునెలల నుండి ఇలా. ఆలస్యంగా వస్తోంది, ఎన్నోసార్లు ఇలా చెప్పించుకుంది. పాపం అమాయకురాలు, అర్ధరాత్రిదాకా సినిమా చూసి పొద్దున్నే లేవడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇలా అవుతోంది. సోమవారం సినిమా చూడ్డానికి వెళ్ళింది. వాళ్ళ అన్నయ్య దానికి డబ్బులిచ్చాడు. మళ్ళీ బుధవారం వెళ్ళింది. నానమ్మ డబ్బులిచ్చింది. శనివారం కూడా ఇదే కథ. పాపం దాని ముఖం వాడిపోయింది నిద్ర లేకపోవడమే కాదు, సినిమా చూఢడ్దంవల్ల కూడా అలినిపోయింది. దూరదర్శన్‌లో హీరో హీరోయిన్లు కౌగలించుకున్నప్పుడు జగద ముఖంలో ఒక విశిష్టమైన నవ్వు కనబడుతుంది. ఇదీ కారణం.
సాయంకాలం ఆరుగంటలకు జగద వాళ్ళ నానమ్మను తీసుకొని వచ్చింది, “చూడు పిచ్చమ్మా! ప్రొద్దున్నే ఆరుగంటల కన్న ముందే వాకిలి ఊడవాలి. ముగ్గువేయాలి. కాని నీ మనుమరాలు అంతా అయ్యాక వస్తుంది. అన్ని పనులూ నేనే చేసుకోవాలి. ఇక దీనికెందుకు జీతమివ్వాలి. ఇదేం బాగుండలేదు” అంది లక్ష్మి,
“అమ్మా! అట్టంటే ఎట్టా తల్లీ! అదెక్కడికి పోవాలి? అది మీబిడ్డ వంటిదే. చిన్నపిల్ల కదా, అని ముసలిది దీనంగా అంది,
“ఎక్కడికి పోతుందో నాకేం తెలుసు, అదంతా నాకెందుకు?” జగద - అనువాదకథలు 46 దాః! డింగరి నరహరి. ఆచార్య
“ఏం చెయ్యాలమ్మా! దాని ఖర్మ, నిద్ర లేదు కనుక అలా అవుతోంది” “ఏందుకు నిద్రలేదు... ప్రతిరోజూ సినిమా చూశాక ఇలాగే వుంటుంది” మాటల మధ్యలో రాఘవ వచ్చి “చూడమ్మా! ఈ చిన్నపిల్లను రోజూ సినిమా చూడ్డానికి ఎందుకు పంపుతున్నావ్?” మందలింపుగా అన్నాడు. ఆమె కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆపుకోలేక పైకే ఏడవసాగింది. “పిచ్చమ్మా! ఇలా ఏడవడం వల్ల లాభమేముంది? జీతం తీసుకో...వెళ్ళు నీ అవసరం లేదు మాకు” అని లక్ష్మి కటువుగా మాట్లాడింది. తిరిగి ముసల్ది ఏడుస్తూ “నేనేం చెయ్యాలమ్మా! నా మనవడికి ఈ మధ్యనే పెళ్ళయింది. గుడిసెలో ఒకే గది. దాంట్లోనే అడ్డుగా తెరగట్టి వాళ్ళు పడుకునేందుకు ఏర్పాటు చేశా. ఇంతవరకు దీనితోపాటు నేను బయట ఉండేదాన్ని, ఎక్కడో అక్కడ ఓ మూల ఒదిగి రాత్రులు గడిపే వాళ్ళం. ఇప్పుడేమో వర్షాకాలం. బయట పడుకు నేట్టు లేదు. అయినా నేను ఎక్కడో ఓ మూల ఒదిగి రాత్రి గడువుతున్నాను, ఇదా,. చిన్నపిల్ల! నిద్ర ఆపుకోవడం వల్ల కాదు, అందుకే ఇతర పిల్లలతోపాటు రెండో ఆట సినిమాకి 'రెండురోజులకోసారైనా పంపిస్తున్నాను, అంతకన్నా ఏం చేయలేకపోతున్నా* అంది సిగ్గుతో చెప్పలేక చెప్పలేక బాధపడుతూ. స్రీ హృదయం. గల లక్ష్మికి ఇంకేమి అనడానకి నోట మాట రాలేదు. పనికి రాలేదన్న కోపమే గానీ జగద అంటే ఆమెకు ప్రేమే. లక్ష్మిది సహజంగా జాలి గుందె, పని ఒత్తిడితో అలా అంది; ఈ పరిస్థితి తెలిశాక ఇక ఏమీ అనలేకపోయింది. “సరే వెళ్ళండి”! అని అంగీకారం తెలిపింది. ఆ రాత్రి లక్ష్మి రాఘవ గుండెలపై తల పెట్టి “జగదా జగదా” అని బాధపడింది. “అయ్యో ఏమిటిది లక్ష్మీ! ఎందుకేడుస్తున్నావ్? రేపటి నుండి ఇంటిపనికి రమ్మని చెప్పావుకదా!” అనునయించాడు రాఘవ. “జగద కూడా రేపు ఓ రిక్షావాడిని చేసుకుంటుంది. మొగుడితో సహా రిక్షాలో సినిమా చూడ్డానికి వెళ్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ రాఘవ కూడా నిద్రలోకి జారుకున్నాడు. మూలరచయిత; కాశ్యపన్ (వివుల నవంబరు 2010) జగద- అనువాదకథలు త్న డా! డింగరి నరహరి ఆచార్య
ఎది అసాధ్యం?
అందమైన పర్వత శిఖరాలతో, పచ్చదనం ఉట్టిపడే చెట్లతో ఆదో చిన్న గ్రామం దాని పేరు కందరవాడ. దానికి తగ్గట్లు ఓ చిన్న ప్రాథమిక పాఠశాల. నాలుగో తరగతిదాకా పిల్లలు అక్కడే చదువుకునే అవకాశం వుంది.. కానీ ఇది అంత మాత్రం చదువుతో సరిపోయే కాలంకాదు కదా! అందువల్ల, పై చదువులు కావాలను కునే వాళ్ళు నగరానికి వెళ్ళక తప్పడం లేదు.
పట్టణాల్లో చదువంటే మాటలా? చాలా డబ్బు కావాలి, ఆ వూరి జనం అంత న్టోమత కలవాళ్ళేమీ కాదు. అందుకే చాలామందికి చదువుకోవాలని వున్నా నాలుగో తరగతితోనే ఆపేసి, తల్లిదండ్రులతో వ్యవసాయం పనులకు సాయం వెళుతూ జీవనం గడుపుతున్నారు.
గ్రామస్థులంతా కలిసి ఆలోచన చేశారు. పాఠశాలను అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. మిడిల్ స్కూల్‌దాకా పెంచుకుంటూ, సమైక్యంగా అలా తొమ్మిదో తరగతిదాకా తీసుకొచ్చారు. కష్టపడి ఈ సంవత్సరమే పదో తరగతిని కూడా ఉత్సాహంతో (ప్రారంభించారు, దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చదువుకుంటున్నారు,
పదో తరగతి అంటే ఆ వూరి వాళ్ళకు కాస్త పెద్ద చదువే. అది పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన తరగతి, ఇంకా 'పై చదువులు చదవాలనుకునే విద్యార్థుల భవిష్యత్తుకది
ఓ రోజు హెడ్‌మాస్టర్ పవార్ ఒక సభ ఏర్పాటుచేశారు. “బాగా చదివించి పిల్లలకు ర్యాంకులు వచ్చేట్టు చేయాలి. దీనివల్ల మన వూరికి పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఇందుకు అందరి కృషీ అవసరం” అన్నారాయన,
అప్పటినుండి పిల్లలంతా పాఠాలను (శ్రద్ధగా చదువుతున్నారు. ఉపాధ్యాయులూ మరింతగా (శ్రమిస్తున్నారు.
ఇంతలోనే. ఓ గద్దు సమస్య అడ్డంవచ్చింది. కలలో కూడా ఊహించని ఆ సమస్య అందరి మనసుల్నీ తీవ్రంగా తొలిచేయసాగింది.
ఆ సమస్య ఏమంటే... లెక్కల మాస్టారు ఆకాశ్‌కి తీవ్రమైన అస్వస్థత! ఆయన లెక్కలు చెప్పడంలో దిట్ట పిల్లలతో చేయంచడంలోనూ మేటి శద్ధగల మాస్తారు. లెక్కలంటూ జగద- అనువాదకథలు 48 డా! డింగరి నరహరి ఆచార్య
వస్తే జీవితంలో ఎన్ని సమస్యలనైనా ఎదుర్కోవచ్చని పిల్లలకి చెప్పేవాడు. హైస్కూల్
తరగతులన్నీ ఓపిగ్గా తానొక్కడే నిర్వహించేవాడు, అలాంటి ఆయన. ఆకస్మాత్తుగా
వ్యాధి[గ్రస్థడయ్యాడు. బొంబాయి పంపించి వైద్యం చేయిస్తే తప్ప లాభంలేదని
వైద్యులన్నారు. ఒక సంవత్సరం అలా ట్రీట్‌మెంటు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామస్థులకు ఏంచేయాలో తోచలేదు. మాస్పారైతే చికిత్సకోసం బొంబాయి
వెళ్ళి పోయాడు, అప్పటినుండి ఆ స్కూల్ వ్యవస్థ రెక్కలు తెగిన పక్షిలా తయారయింది. ఏం చేయాలా? దీన్నెలా ఎదుర్కోవాలా? అని అందరూ నిరంతరం ఆలోచిస్తున్నారు,
'హెడ్‌మాస్టరు అన్నివిధాలుగా పరిస్థితిని సమీక్షించుకున్నారు. లెక్కలు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. చాలామంది. లెక్కల ఉపాధ్యాయులు వుండవచ్చు. కానీ మంచిపట్టు, ఎంతో ఆసక్తి వున్నవాళ్ళు కావాలి. సంవత్సరం. పాటు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా వున్నారా అని ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కానీ, లెక్కల మాస్తాల్లెవరూ ఆ పల్లెటూళ్లో వుండడానికి ఇష్టపడడం లేదు. 'పైగా అలాంటివాళ్ళు తమ ప్రతిభతో నాలుగు డబ్బులు ఎక్కువగా సంపాదించు కోడానికి నగరాల్లోనే మకాం పెట్టడానికి సిద్ధమయ్యారు.
ఏంచేయాలో పవార్‌కి తోచలేదు, అందుకే ఓ సమావేశం ఏర్పాటుచేశారు, 'అ సంకటస్థితిని తొలగించుకోవాలంటే, ప్రతీ ఉపాధ్యాయుడూ లెక్కల బాధ్యతను తమ భుజాలమీద మోయాలి. ఏ మాస్తారైనా ఏంతో కొంత లెక్కల బోధన సాగించే ప్రయత్నంచేయాలి. కాదనకుండా ఎలగోలాగ పిల్లలకు బోధన చేయాలి" ఇదీ ఆయన
ఉపాధ్యాయులంతా తమకది ఇష్టమయింది కాకపోయిన్నా బడి భవిష్యత్తు గురించి ఒప్పుకోక తప్పలేదు. ఆ స్కూల్‌తో వారికున్న అనుబంధం. అలాంటిది, ఒప్పుకున్నారు కానీ, వారి బోధన వారికే సంతృప్తిగా లేదు.
"పైగా అంతగా రాని అంశం గురించి వారు 'ప్రిపేరు కావడం, బోధనకు ముందు చాలా సమయం వెచ్చించడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇది గమనిస్తున్న పవార్‌కి మరింత బాధగా వుంది, సమస్యను ఎలా అధిగమించాలో ఎంతకీ తెలియడం లేదు.
అది సోమవారం సాయం్రం.. అయిదు గంటలకల్లా బడి అయివోయింది, అయిదున్నర దాటుతున్నా. పవార్ తన కార్యాలయంలో కూర్చుని సమస్య గురించి జగద- అనువాదకథలు శ్వర డా! డింగరి నరహరి ఆచార్య
ఆలోచిస్తున్నారు, కొంతసేపయ్యాక కుర్ఫీలోంచి లేచి కిటికీ దగ్గరకొచ్చి బయటకు చూశారు, దగ్గరలోనే వున్న మామిడిచెట్టు కింద కొంతమంది పిల్లలు గుంపుగా వున్నారు, చెట్టుకింద ఒక అబ్బాయి చేతులూపుతూ ఏదో చెపుతున్నాడు. చెయ్యి పై కెత్తి వూపుతున్నాడు. ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు. మాటిమాటికి తల వూపుతున్నాడు.
“ఎమిటి వాళ్ళ చర్చ? ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? ఏదైనా ఆట గురించి చెప్తన్నాడా? కానీ అలా కనిపించడం లేదు. మరెందుకు ఆ పిల్లలంతా గుమిగూడారు? ఇంతదాకా. ఇంటికి వెళ్ళకుండా వాళ్లంతా ఏం చేస్తున్నారు? పిలిచి అడుగుదామను కున్నారు పవార్.
ఇంతలో ఏదో అతిముఖ్యమైన పని గుర్తుకువచ్చి. కాగితాలు ముందేసుకుని కూర్చుండిపోయారు.
రెండోరోజు సాయంకాలమూ అదే దృశ్యం కనిపించిందాయనకు, విద్యార్థుల గుంపు పెరిగింది. వాతావరణం ఇంకా ఉద్విగ్నంగా ఉన్నట్టు కనిపించింది.
మూడోరోజు కూడా విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగింది..ఈసారి గుంపులుగా కాకుండా చెట్లకింద బృందాలుగా కనివించారు. ఒక్కో గుంవ్చుకి ఒక్కో నాయకుడున్నట్టుగా, విద్యార్ధి ఒకడు నిలబడి చెప్తున్నాడు. అందరూ అతడిని చూస్తున్నారు. (శద్ధగా వింటున్నారు.
పవార్‌కి కుతూహలం ఎక్కువయింది. అదేమిటో తెలుసుకోవాలని బయటికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి చేరారు. అక్కడ జరుగుతోంది చూసి చాలా చాలా ఆశ్చర్యపోయారు.
ఒకచోట విష్ణుపాటిల్ అనే విద్యార్థి ఇతర పిల్లలకి చదువు చెప్తన్నాడు. అతనేం చెప్తన్నాడా అనే ఉత్సుకత ఆయనలో ఏక్కువయింది.
నిజానికి విష్ణు పదో తరగతి విద్యార్థి. లెక్కలంటే ప్రాణం. లెక్కలు చేయడమంటే, ఆటలాడుకున్నంత తేలిక అతనికి. ఖాళీ దొరికినప్పుడల్లా లెక్కలు చేస్తూ కూర్చుంటాడు. లెక్కలు వినగానే అవి చేయడానికి ఎంతో ఉత్సాహం చూపుతాడు. ఎప్పుడైనా లెక్కల ప్రశ్నపత్రం చూడగానే, ఇచ్చిన సమయంకన్నా సగంలోనే దాన్ని పూర్తి చేసాడు. అంత వేగం! హాయిగా పరీక్ష రాసి వెళుతుంటాడు, చిన్నప్పటి నుండీ అదే ప్రతిభ. లెక్కలే సాధన, అదే బహుమతిగా ఫీలవుతాడు. ముందు క్లాసులు లెక్క చేయగల సత్తా చాలా వుంది. అందుకే లెక్కల మాస్తారుకి అతనంటే అమితమైన (ప్రేమ, జగద- అనువాదకథలు 50 డా॥ డింగరి నరహరి ఆచార్య
పవార్ ఆ పిల్లవాడొధగ్షరళిక్హాల్లి అడిగారు ఏమసటోసరదరూ ఇక్కడ ఎందుకు వున్నారు” అని,
“ఏంలేదు సార్! లెక్కలంటే రథచక్రానికి వుండే ఇరుసులాంటిది. అదే బలహీనంగా వుంటే, బండి ఎలా నడుస్తుంది చెప్పండి? ఇప్పుడు మన బడి పరిస్థితి సరిచేయడానికి మేమూ ప్రయత్నిస్తున్నాం” అన్నాడు,
హెడ్ మాస్టరు అక్కడే వున్న ఓ బండమీద కూర్చుని “వివరంగా చెప్పండి. ఏం చేస్తున్నారు?” అన్నాడు కుతూహలంగా
“సార్! బడి అయిపోగానే, ఇక్కడ ఒక్కో బృందంగా చెట్లకింద చేరుతున్నాం, ఒక గంటసేపు లెక్కలు. చెప్ప్తన్నాం.. పిల్లలమే. ఉపాధ్యాయులుగా మారి షాఠాలు చెప్పుకుంటున్నాం... నేను పదో తరగతి లెక్కలు. నిరుడు తొమ్మిదో తరగతిలో ఎక్కువ మార్కులు లెక్కల్లో సాధించినతను, ఇప్పుడు ఆ తరగతికి లెక్కలు చెప్తున్నాడు. అలాగే ఏనిమిదో తరగతి లెక్కల్లో గత సంవత్సరం అధిక మార్కులు వచ్చిన విద్యార్థి ప్రస్తుతం ఎనిమిదో తరగతికి. ఈవిధంగా అన్ని తరగతులకూ లెక్కలు చెప్తన్నాం.. లెక్కల్లో మన విద్యార్థులు నష్టపోకూడదని ఇలా ఏర్పాటుచేసుకున్నాం. వారంలో నాలుగురోజులిలా పాఠాలు చెప్పాక, మిగిలిన శుక్ర, శని, ఆది వారాల్లో... అలా టీచర్లుగా వున్నవాళ్లకి.. నేను చెప్తున్నాను సార్” అన్నాడు,
కాస్త ఆగి “కానీ ఇలా బయట చెప్పడం వల్ల, ఒక్కొక్కరికీ చెప్పాల్సి వస్తోంది, ఎందుకంటే ఇక్కడ బోర్జు, చాక్‌పీసులు లేవు కదా సార్” అన్నాడు విచారంగా,
ఆ పిల్లల ఐకమత్యం, దృధసంకల్పం చూసి ఆయనకి ఆనందం కలిగింది. “మీరు చేస్తున్న ఈ మంచి పనికి మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఎందుకురా బాధపడతారు? ఇలా చెట్లకింద ఏందుకు? మీరు బళ్లోనే ఈ పని చేయండి. బడి అయిపోయాక ఎందుకు? బడి సమయంలో కూడా ఓ గంట చెప్పండి. లెక్కల గంటను ఇలాగే నడిపిద్దాం, లోటులేకుండా' చేసుకుందాం” అంటూ వాళ్ళని వ్రోత్సహించారు. వారీ ఆధ్వర్యంలో లెక్కల పాఠాలు జరిగేటట్టు చేశారు.
పిల్ల ల్లో పట్టుద ల ఉత్సాహం ఎక్కువైంది. పెద్దలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు హెడ్ మాస్టరుకి అనిపించింది. పిల్లలు ఇలా వాళ్ళలో వాళ్ళు పాఠాల చెప్పుకోవడం మంచి ప్రభావమే కలిగిస్తుంది. పాఠ్యాంశాలు వాళ్ల మనసులో బలంగా నాటుకుంటాయి. జగద- అనువాదకథలు ర్ 1. డా! డింగరి నరహరి ఆచార్య
ఎందుకంటే వాళ్ళ భాష్క వాళ్ళ స్థాయి మిగతా పిల్లల స్థాయికి సరిపడేలా వుంటుంది... అని గ్రహించారాయన. పిల్లల్లోని ఉత్సాహానికి ఉపాధ్యాయులు ఊతమిచ్చారు, విద్యాలయ వాతావరణం చైతన్యంతో నిండిపోయింది. కలిసి నడుద్దాం, కలిసి పలుకుదాం కలిసి చదువుదాం అనే ముందు పాఠం ఇలా ఓ రూపానికి వచ్చినట్లు అనిపించింది. పరీక్ష ఫలితాలు బాగా వచ్చాయి, విద్యార్థులందరూ ఏగిరి గంతులేస్తు ఆనందాన్ని ప్రకటించారు. విష్ణును వారు భుజాలమీదకు ఎత్తుకుని ఊళ్లో ఊరేగించారు. ఒక విద్యార్థి అతని చిత్రపటాన్ని గీశాడు. అదే బొమ్మను పాఠశాలలో పెట్టించారు ఆ తర్వాత్మ ఆరోగ్యం బాగుపడటంతో ఆకాళ్ మళ్ళీ పాఠశాలలో చేరాడు. తన ప్రియశిష్యుడు చేసిన పనికి ఆయన చాలా ఆనందించాడు. సంతోషంతో అతణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు.,, ఆ విద్యార్ధి చిత్రపటం కింద 'అసాధ్యమంటూ ఏదీ లేదు” అని పెద్దపెద్ద అక్షరాలతో రాయించి ప్రదర్శించాడాయన,. మూలరచయిత; కోల్పటకర్ (వివుల జులై 2011) జగద- అనువాదకథలు: రజ డా! డింగరి నరహరి ఆచార్య
మనోగతం
ఆ రోజు కమల చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే, ఆమెకి ఉద్యోగం దొరికింది. డబ్బుకోసం నాన్నమీద కానీ, అన్నయ్య మీద కానీ. ఆధారపడాల్సిన అవసరం ఇక లేదు. చిన్న పనికోసం కూడా వారిని అడగాల్సిన అవసరమేదీ ఉండదు. తనిక స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోగలదు. ఇంట్లోకి అవసరమైన వస్తువులు కూడా. కొని తేగలదు, “మొదటి వేతనంలో కొంత ఖర్చుచేసి అమ్మకు ఓ మంచి చీర కొనిపెట్టాలి' అనుకుందామె. అలా ఆలోచిస్తూనే తల్లికీ తండ్రికీ నమస్కరించి, ఆఫీసుకి బయల్లేరింది.
ఆఫీసు చాలా ఆధునిక సౌకర్యాలతో ఉంది. విదేశాలకు వెళ్లేవారి అవసరాల్ని పూర్తిచేసే ఆఫీసు. అది, ఎంతోమంది ఉద్యోగులు, ఎంతో పని!
ఆమె పనిచేసే విభాగంలో ఆడవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళు వేసుకున్న దుస్తులు, మాట్లాడే పద్ధతులు బాగున్నాయి. వాటికి తగ్గట్టు హావభావాలతో ఎంతో దర్పంగా కనిపిస్తున్నారు.
కమలకు అదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ. వింత లోకంలోకి ప్రవేశించినట్టుగానూ ఉంది. కానీ వాళ్ళందరి కన్నాతనే అందంగా ఉన్నానన్నది కూడా (గ్రహించిందామె, తనవైపు కాస్తంత అసూయగా చూడసాగారు. కమలకి అందమే కాక మాట చాతుర్యం కూడా ఉంది. తన పని తాను చక్కగా చేసుకుపోయే స్వభావమూ ఉంది.
ఇన్ని మంచి గుణాలున్న ఆమె కొద్దిరోజుల్లోనే అందరి దృష్టినీ ఆకర్షించింది, మొదటినెల జీతం రాగానే తను ముందే అనుకున్నట్లు తల్లికి చీర కొంది. నాన్నకు ధోవతులు, అన్నయ్యకొక మంచి పెన్నుు వదినకి మేకప్ కిట్టు కూడా కొని తెచ్చింది. వాళ్ళు చాలా సంతోషించారు.
కమల పనిచేసే సంస్థను నడిపే ఉన్నతాధికారులు విదేశాల నుండి వస్తుండటంతో, చక్కని స్వాగతం ఏర్పాట్లు చేయాలని నిశ్చయించారు. అదీ ఆఫీసులోని అందమైన అమ్మాయి ద్వారా చేయించాలని నిర్ణయించారు. అందమూ మాటచాతుర్యమూ ఉన్న కమలనే ఎంపిక చేశారు. వచ్చేవారికి స్వాగతర పలుకుతూబొకే అందించేలా ఆమెను సిద్ధంచేశారు, జగద-: అనువాదకథలు ర్‌తే డా॥ డింగరి నరహరి ఆచార్య
ఆ. రోజు రానేవచ్చింది. అంతా అనుకున్నట్లే జరిపారు. కమలనుండి పుష్పగుచ్చాన్ని అందుకున్న పెద్ద అధికారి చాలా సంతోషించాడు,
మీటింగ్ అయ్యాక, ఆమెను అందరూ అభినందించారు. ఆఫీసు మేనేజర్ గోపాలకృష్ణయ్య మరింతగా పొగిడాడు. అందరు హాలులో కలిసి భోజనం చేస్తారు. అధికారులు మాత్రం ఎవరి. గదిలో వాళ్ళు చేస్తారు.
ఒకరోజు గోపాలకృష్ణ “అక్కడ హాల్లో వందుకు? ఇక్కడ నా గదిలో నాతో పాటు తినమిని కమలని: ఆహ్వానించాడు. ఆమెకది ఇష్టంలేదు, అయినా తన "పై అధి కారి కదా,,, కాదంటే పమనుకుంటాడోనని మౌనంగా అంగీకరించింది.
అప్పుడే ఆఫీసులో ఉన్న మిగతావాళ్ళంతా ఆమెను అదోలా చూడడం మొదలెట్టారు, సహోద్యోగి రేఖ “కమలా! నువ్వెంత అదృష్టవంతురాలివో! పైఅధికారి దృష్టిలో పడ్డావు. ఆనందం అనుభవించు. త్వరలోనే (ప్రమోషన్ కూడా తీసుకుంటావని అనుకుంటా” అంది.
ఆ మాటల్లోని భావం (గ్రహించిన ఆమెకు. కోపం వచ్చింది*చూడూ! అలాంటి మాటలు, మాట్లాడకు వదో ఆఫీసరు కద్వా,; ఆయన మాట ఏలా తీసెయ్యాలని అనుకుని ఆయనతో కలిసి భోజనం చేశాను. దీనికి వేరే అర్జాలు కల్పించకు” అని గట్టిగానే అంది.
రేఖ నవ్వుతూ “అయ్యో! చూస్తాంలే ముందు ముందు” అంది.
కమల ముఖం చిన్నబుచ్చుకుంది. ఆ మాటలు హృదయాన్ని తొలిచేస్తున్నా, మౌనంగా ఉండి... ఏలాగో ఆఫీసుపని ముగించుకొని ఇంటికి చేరింది.
మరునాడు మళ్ళీ అలాగే భోజనం చేయడానికి గోపాలకృష్ణ ఆహ్వానించాడు ఏం చేయాలో తోచని ఆమె., రేఖ మొదలైనవాళ్ళంతా నవ్వుతూ తననే చూస్తుండడం గమనించింది... అందుకే “నాకివ్వాళ ఆకలిగా లేదు. క్షమించండి" అంటూ. ఆయన ఆహ్వానాన్ని తోసి పుచ్చింది. తెచ్చుకున్న భోజనం కూడా చేయకుండా అలాగే ఉండి పోయింది.
తర్వాత కూడా కమల ఆలోచన సాగించింది. *'ఈ మహానుభావుడు నామీద ఎందుకింత ఆసక్తి చూపుతున్నాడో? నన్ను అపహాస్యంపాలు చేయాలని చూస్తున్నాడా? అనుకుంటూ బాధపదసాగింది.
ఓరోజు మరో సహ ఉద్యోగిని ఆమెతో రహస్యంగా అంది “కమలా! నేను నీ జగద- అనువాదకథలు ర్4 దా! డింగరి నరహరి ఆచార్య
మంచి కోరేదాన్ని. ఇలా చెప్తన్నానని వేరే అనుకోకు. అసలీ ఆఫీసర్లు నమ్మరాని వాళ్ళు గోపాలకృష్ణ నిన్ను ఆసక్తితో చూస్తున్నాడన్నది. నేను ఇదివరకే గమనించాను ఎంతైనా నువ్వు జాగ్రత్తగా ఉందాలి. ఆయనకి ఇదివరకే పెళ్ళి అయింది. భార్య పిల్లలు ఉన్నారు. అటువంటివాడు ఇప్పుడు నీమీద ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడో నాకూ అ ర్థంకావడం లేదు: తియ్యటి మాటలతో నిన్ను మోసంచెయ్యాలని చూస్తున్నాడేమో! నువ్వు ఆ మాయలో పడవద్దని చెబుతున్నా తర్వాత నీ యిష్టం” అని చెప్పి వెళ్ళింది.
ఆ మాటలు వినగానే కమల 'హృదయం భగ్గుమంది. గోపాలకృష్ణమిద ఒక రకమైన అస్తహ్యం వేసింది *ఏం చెయ్యాలి? ఇక్కడ ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకెక్క డయినా వెతుక్కోవాలి, అంతగా అయితే, ఈయన చేతిలో మాత్రం పడకూడదు. ఈ మానసిక క్షోభ భరించడం మాత్రం కష్టం.. అనుకుంది. ఇలా ఆలోచిస్తూ, కల వరపడుతూ, ఆ రోజు ఎలాగో గడిపి, పని పూర్తిచేసి ఇంటిదారి పట్టింది,
తర్వాత రోజు కూడా గోపాలకృష్ణ అటెండరును పంపి, ఆమెను తన రూంలోకి పిలిచాడు. కమలకు కోపం కూడా కలిగింది. 'సరే.. ఇవ్వాళ అతను ఏమయినా అనుచితంగా ప్రవర్తిస్తే ఉగ్రరూపం చూపక తప్పదనుకుంది 'ఈ ఉద్యోగం ఉన్నా ఫరవాలేదు, ఫోయినా ఫరవాలేదు. అతనికి మాత్రం మరచిపోలేని పాఠం చెప్పాల్సిందే! అని దృఢంగా నిశ్చయించుకుని మరీ ఆ గదిలోకి వెళ్లింది.
తలుపుతీసి గదిలోకి ప్రవేశించిన ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.
“రా! రా! కూర్చో” అంటూ గోపాలకృష్ణ సాదరంగా ఆహ్వానించాడు; ఆమె మాట్లాడకుండా, అతని ఎదురుగా కూర్చుంది.
అప్పుడతను మెల్లగా “కమలా! నెను నీతో ఆత్మీయంగా ఒకటి మాట్లాడదలిచాను. * విను. నువ్వు నచ్చావు, నీ ప్రవర్తన చాలా నచ్చింది. అందుకే బాగా ఆలోచించి మరీ ఇది. చెబుతున్నా. నా మాటలు నువ్వు విని తీరాలన్న నిర్బంధమేదీ లేదు. ఇక్కడ నీ ఇష్టమే ముఖ్యం అని మాట్లాడడం కొనసాగించాడు
కమల.. అతను ఏం చెప్పబోతున్నాడో, ఏం అడగబోతున్నాడోనని ఉత్కంఠగా ఉంది,
“కమలా! నా చిన్న తమ్ముడు. ఆమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. వాడికి పెళ్ళిచేయాల్సి ఉంది. అందుక్షే తగిన అమ్మాయి కోసం వెదుకుతున్నాను. నిన్ను
జగద-. అనువాదకథలు ర్‌ర్ డా! డింగరి. నరహరి ఆచార్య
చూసినప్పటి నుండీ.. వయసులో రూపంలో 'సంస్కారంలో, మంచి గుణాల్లో నువ్వే వాడికి తగినదానివన్న అభివ్రాయం నాకు కలిగింది, వాడు వచ్చే ఆదివారమే ఇండియాకి వస్తున్నాడు. నువ్వు అనుమతిస్తే మీ అమ్మానాన్నలతో మాట్లాడి, పెళ్ళి చూపులకి ఏర్పాట్లు చేస్తా నా తమ్ముడు బంగారంలాంటివాడు. నువ్వు రత్నంలాంటిదానివి. అందుకే మీ ఇద్దరి కలయికా చాలా బాగుంటుందని నా నమ్మకం. ఇక నీ అభిప్రాయం చెప్పు. నేను మీ. ఆఫీసరునని మరిచిప్తో నన్ను నీ అన్నయ్యలాగా భావించి, నిస్సంకోచంగా నీ అభిప్రాయం చెప్పు” అంటూ మాట్లాడాడు.
ఆ మాటలు వినగానే కమల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. *దైవ సమానుడైన ఈయన గురించి ఎలాంటి ఆలోచన చేశాను! వంత తప్పుగా అనుకున్నాను! ఇందుకు పకృవాళ్ళు కల్పించిన ఆలోచనలూ తోడైనాయి.. అందుకే ఎప్పుడూ కూడా. ఎదుటివారి మనోగతం తెలుసుకోకుండా, మనకి మనం ఊహలు చేయకూడదు అనుకుంది. చింతిస్తూ వెంటనే కుర్ఫీ లోంచి లేచి ఆయన కాళ్ళకు. నమస్కరించింది. “నన్ను క్షమించండి సార్! నేను మీ గురించి వేరేలా భయపడ్డాను. మా నాన్నగారిని ఇక మీ దగ్గరికి పంపిస్తాను. మీరు వారితో మాట్లాడి నిర్ణయం చేయండి. మీ ఆప్యాయతకు చాలా చాలా థ్యాంక్స్” అంటూ గదినుండి బయటపడిందామె.
మూలరచయిత; నాగరాజారావు (వివుల ఏప్రీల్ 2012) జగదడ- అనువాదకథలు ర్6 డా! డింగరి నరహరి ఆచార్య
క్షమించు!
నా పెళ్ళి ముప్పయి అయిదేళ్ళకు అయింది
అసలు నా పెళ్ళి ప్రస్తావనే ఏడేళ్ళ క్రితం వచ్చింది. అదీ... అనేకసార్లు! కానీ ఉద్యోగం దొరికిన తర్వాతనే పెళ్ళి చేసుకోవాలని, అప్పట్లోనే దృఢ నిశ్చయానికి వచ్చేశాను.
ముప్పయి రెందేళ్ళపుడు నాకు మంచి ఉద్యోగం దొరికింది. అప్పుడే నేనడగ కుండానే అనేకమంది సంబంధాలకొచ్చారు.. నేను కూడా అలా వచ్చినవాళ్ళని ఒక్కొక్క రినీ బాగా పరిశీలించాను. తొందరపడలేదు. పొట్టిగా ఉన్నారన్ని పొడుగ్గా ఉన్నారని,గ్రహ నక్షత్రాలు సరిగా కుదరలేదని, అందంగా. లేరని... ఇలా చాలామందిని తిరస్మ్కరించాను,.
నా బాల్య, యవ్వన దశలన్నీ గ్రామీణ వాతావరణంలోనే కొనసాగాయి. అందువల్ల పట్టణం వాళ్ళలో ఉండే అనేక రకాల వ్యవహారాలు నాకస్సలే రుచించలేదు.
ఉత్తరప్రదేశ్ రాజధానిలోని లక్ష్మణపురంలో పదిహేనేళ్ళ నుండి నివాస ముంటున్నాా నా స్వభావం పల్లెటూరి వారిలాగే ఉంది. స్త్రీల గురించి, వారి స్వభావాల గురించి కావ్యాల్లో, శాస్త్రాల్లో చదివాను, సుభాషితాలు చదివాను. వాత్స్యాయన గ్రంధాలు అనేకసార్లు చదివాను. వరహమిహిరుని. కన్యాలక్షణం నేనెప్పుడూ మరచిపోలేను, పుస్తకాల్లోని ఆయా. లక్షణాలన్నిటినీ గ్రహించాను, చివరికి ఒక సైనికాధికారి కూతురు “మేనకను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించాను.
ఆమెను చూడ్డానికి వెళ్ళినపుడు, నిజంగా పేరుకు తగ్గట్టు ఉంది. అందంగా ఉండి, విశ్వామిత్రుడి మనసుని ఆకర్షించినట్లు నన్ను ఆకర్షించింది. ఆమె తెల్లనైన దేహ సౌందర్యం, నవ్వు ముఖం, వంకీలు తిరిగిన నల్లని జుట్టు, చిగురాకులవంటి చేతి వేళ్ళకొసలుు, నల్ల కలువల్ని మించిన నేత్ర సౌందర్యం., అద్బుతం, ఆ చూపుల్ని చూడగానే నాలో కాళిదాసు విరచిత “అనాఘ్రాత పుష్పం” మెదిలింది. ఎన్నో జన్మలనుండి చెసుకున్న పుణ్యఫలం ఇదనుకున్నాను, ఈ విధంగా బ్రహ్మదేవుడు నా కోసమే అంత అందమైన రూపాన్ని తయారుచేశాడని భావించాను. అందుకే మొదటి చూపులోనే ఆమె నా మదిని ఆక్రమించింది. నా అదృష్టానికి మనసులోనే మురిసిపోత్తూ వెంటనే పెళ్ళి చేసుకోవడానికి అంగీకారం తెలిపాను.
ఆమె సెక్రటేరియట్‌లో పనిచేస్తోంది. 'రెండేళ్ళలో సెక్షన్ ఆఫీసర్ కూడా
అవుతుందని తెలిసింది. "పెళ్ళయ్యాక కూడా ఆమె ఉద్యోగం చేయాలని ఆశించాను. జగద-' అనువాదకథలు ర్ డా॥ డింగరి నరహరి ఆచార్య
జీవితం అభివృద్ది దిశగా సాగాలని, కలలుకన్నాను. పెళ్ళయ్యాక ఆమెనాపై చూపిన అనురాగాన్ని నేను కలలో కూడా అంతగా ఊహించలేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకొనేవరకు నా 'స్మరణే, నా మంచితనాన్ని పొగడటమే! నాకు అనుకూలంగా. నిరంతరం నడుచుకోసాగింది. పెద్ద చదువు, అంతేకాక మంచి ఉన్నతోద్యోగం ఉన్న ఆమె ఇలా ఉంటుందని మొదట్లో నా ఊహకు కూడా తోచలేదు. ఆమె ఆదర్శ గృహిణిగా ఉండటం చూసి, నజంగా నేను ధన్యుజ్ణయ్యాననే అనుకున్నాను, ఒక 'సెలవరోజు మేనక “ఏవండీ టైలర్‌షాప్‌కి వెళదాం. అవి ఇచ్చాక కాస్త బజారుకు కూడా వెళ్ళొద్దామా?” అని అడిగింది. కాదనలేక త్వరగా తయారయ్యాను. కులాసాగా మాట్లాడుకుంటూ బట్టల్ని టైలర్‌కివ్వడానికి వెళ్ళాం. అక్కడ టైలర్‌కి ఆమె తాను తెచ్చిన బట్టలు చూపిస్తూ “సరిగా కుట్టాలి, ఎక్కువ తక్కువలు లేకుండా” అంది. “చూడ్డూ, ఈ గుడ్డ చాలా ఖరీదైంది” అని కూడా అంది. వాడు “అలాగేనండీ* అంటూ ఆమెను ముట్టుకుంటూ చుట్టుకొలతలు తీసుకొసాగాదు, అది చూస్తుంటే, నా మనసంతా అదోలా అయింది, మేనక అతడితో వదో చెప్తోంది. ఐనా అవేమీ నా చెవికెక్షడం లేదు. నామనసు వేరే ఆలోచిస్తోంది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎప్పుడూ ఎదురుకాలేదు, పరాయి పురుషుడు ఇలా స్త్రీలను తగలవచ్చని కానీ, వాళ్ళను తడమవచ్చని కానీ... నేను కనీసం ఊహించలేకపోతున్నాను. దారిపొడవునా నేనేమీ మాట్లాడకుండా ఉండిపోయాను. మౌనంగా. ఉండడంతో పాటు నాముఖంలోని భావాల్ని చూసిన ఆమె “ఎందుకలా ఉన్నారు?” అని అనేకసార్లు అడిగింది. నేను మాత్రం “ఏంలేదు... తలనొప్పి” అని ఆమె అడిగినప్పుడల్లా సమాధానమిస్తూ వచ్చాను. . ఇంటికి వచ్చాక నా ఒళ్ళో తల. పెట్టుకున్న ఆమె, నాకు తెలుసు.. ఈ తలనొప్పికి కారణం! అంది. మళ్లీ తనే నవ్వుతూ “మీకు టైలర్‌షాపులోనే తలనొప్పి ప్రారంభమయ్యింది! నేనేం చేయాలి? అక్కడ నేనేమీ అనలేను కదా! వాళ్ళు కుట్టింది సరిగా లేకపోతే మనం వేసుకోలేం కదా! ఏవో వేసుకొని ఆఫీసుకు వెళ్ళలేను” అంది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి, మళ్ళీ ఆమే “నేనాక్ష్మదాన్నే కాదు, అక్కడికివచ్చే ఏ ఆడవాళ్ళయినా అలా ఉండక తప్పదంది.” “మీ కది నచ్చకపోతే నేనిక ఎప్పుడూ టైలర్ షాపుకి వెళ్ళనంది.” జగద- అనువాదకథలు ర్8ి డా! డింగరి నరహరి ఆచార్య
అలా కళ్ళనీళ్ళు పెట్టుకున్న మేనకను. చూడగానే నా వివేకం వెన్నుతట్టింది, వెంటనే “అలా ఎందుకు? కుట్టించుకో కానీ, ఆ సందర్భంలో నువ్వొక్కదానివే వెళ్ళు. నేను రాను ఎందుకంటే, అలా వాడు నిన్ను తాకుతుంటే చూడలేను” అన్నాను, తర్వాత చాలా కాలం నా మనసులో ఆ టైలర్ దృశ్యమే తిష్టవేసుకొని ఉండిపోయింది.
శీతాకాలంలో సచివాలయ ఉద్యోగులందరూ ఢిల్లీలో అఖిలభారత సమ్మేళనం ఉంటే వెళ్ళారు. మేనక రమ్మనడంతో, నేను కూడా ఆ అవకాశాన్ని వినియోగించు కుందామని వెళ్ళాను. అక్కడ. అనేక ్రదేశాలనుండి మాలాగే జంటలు జంటలుగా చాలామంది వచ్చారు, రెండు రోజులు సమావేశాలు, రాత్రిపూట సంగీత నృత్య సమ్మేళ నాలు, పరస్పర పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేనకకి పరిచయం ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆమె కూడా తన పరిచయస్థులందరికీ నన్ను ఉల్లాసంగా పరిచయం చేసింది.
సాయంకాలం నాలుగు గంటలప్పుడు మేనక, నాకు ఒకరిని పరిచయం చేసింది. అతనితో కలిసి మాటలు, సాగిస్తూ కూర్చున్నాను. ఆ సందర్భంలో ఆమె “మీరు మాట్లాడుతూ ఉండండి. నా చిన్ననాటి క్లాస్‌మేట్ ఒకతన్ని కలిసి ఇప్పుదే వస్తాను” అని చెప్పి, పరిగెత్తినట్టుగా గబగబా నడుస్తూ, ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్ళింది,
టీ తాగడం పూర్తిచేసి చాలాసేపు మేం ఢిల్లి విషయాలు, సచివాలయ పద్దతులు, రాష్ట్ర వార్తలు ముచ్చటిస్తూనే ఉన్నాం. మధ్యమధ్యలో నేను గడియారం వైపు దృష్టి సారిస్తున్నాను. గంటన్నర గడిచినా మేనక రాలేదు! నా ధైర్యం సడలిపోనాగింది.... “క్షమించండి, మనం మళ్లీ కలుద్దాంోఅని అతనితో అంటూనే. ప్రధానద్వారం నుంచీ బయటకు వచ్చాను. ఆమె రాకకు ఎదురుచూస్తూ ఇటూ అటూ తిరగసాగాను.
కొద్దిదూరంలోనే ఫలహారశాల ఉంది. మేనక అక్కడ ఒక యువకునితో ఉంది! నవ్వుతూ అతని చేతులు పట్టుకుని ఊపుతూ కనబడింది. ఆ దృశ్యం చూసి నా హృదయం జ్వలించిపోయింది. ఆ శీతాకాల సమయంలో కూడా నా శరీరమంతా చెమట పట్టింది. నేనక్కడే కాసేపుండి వాళ్ళిద్దరి చేష్టలనీ గమనిద్దామని ఉన్నా ఉండబుద్ది కాలేదు. కోపంతో శరీరమంతా వణకసాగింది. అనేక రకాల ఆలోచనలు నన్ను నీరస పరచసాగాయి,
పది నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరారు, వాళ్ళు నన్ను చూడకూడదని గబగబా ప్రధానద్వారం దగ్గరికి చేరాను. మేనక ఆ యువకుడిని నా దగ్గరకు తెచ్చి జగద- అనువాదకథలు ర్9 దా! డింగరి నరహరి ఆచార్య
పరిచయం చేస్తూ “ఇతను నా ప్రియ మిత్రుడు రాజీవ్. యూనివర్సిటీలో మూదేళ్ళు మేం కలిసి చదువుకున్నాం. ఇప్పుడతను చెన్నయ్ సచివాలయంలో ఉద్యోగ 'సంఘ నాయకుడిగా ఉన్నాడు” అంది. మళ్ళీ అతగాడికి నన్ను చూపెడుతూ “ఈయన మావారు” అని. నవ్వుతూ చెప్పింది.
నా మౌనంలోని అంతరార్థం మేనక కనిపెట్టేసింది. క్షోభ ననుభవిస్తున్నాని (గ్రహించి. ఉంటుంది, ఆ రాత్రి నాకు భోజనం చేయాలనిపించలేదు, తలనొప్పి తీవ్రంగా. బాధిస్తుండడంతో, త్వరగా ఇంటికొచ్చి పడుకొన్నాను.
“కాస్త అమృతాంజనం. రాసుకోండి, నేను రాయనా?” అంటూ మేనక చాలాసార్లు అడిగింది. అయినా నేను “నన్ను ఇలా వదిలిపెట్టు, ఏదీ. వద్దు. కాసేపు పడుకోవాలనిపిస్తుంది” అంటూ దుప్పట్లో ముఖం దాచుకున్నాను, .
రాత్రి రెండు గంటలదాకా నాకు నిద్ర రాలేదు. అటూ ఇటూ దొర్లుతూ కాలం గడివాను, నీళ్ళు తాగాలనిపించింది. లేచి చూద్దును కదా... తను పక్కమీద అలాగే కూచుని విచారంగా ఉంది. ఏడ్చినట్టుగా కూడా కనబడుతోంది. అది చూసి అడిగాను
పెద్దగా నిట్టూరుస్తూ “నా వల్ల మీకిలా భాధలు కలుగుతాయని అనుకోలేదు. నేను మాత్రం ఎప్పుడూ మీ సుఖాన్నే కోరుకుంటున్నాను. అలాగే నడుచుకుంటున్నాను కూడా.. కాన్సీ మీరు.” అంటూ మధ్యలోనే ఆపి రోదించసాగింది.
ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. “నన్ను వదిలెపెట్టి నువ్వ ఇంకెవరితోనో తిరుగుతున్నావ్! నువ్వు ఏమేం చేశావో నాకంత తెలుసు, నన్ను మూర్చుడికింద జమకట్టకు” అన్నాను,
“నాకు తెలుసు... మీ అనుమానం! మీ మనసు ఇంత కలుషితమని అర్ధమైంది. రాజీవ్ నాకు పదేళ్ళ తర్వాత కలిశాడు. చదువుల్లో పోటీల్లో పరీక్షల్లో ఆనాడు నాకు చాలా సహాయం చేశాడు. మన, పెళ్ళి సమయంలో తను విదేశాల్లో ఉన్నందువల్ల రాలేకపోయాడు. లేకపోతే అతనే 'పెళ్ళికి ముఖ్య అతిథి అయ్యేవాడు. అతను చాలా మంచివాడు. నాకి ష్టమైన మిత్రుడు. మామ ధ్య పవిత్రమైన స్నేహ ౦ మాత్రమే ఉంది” అంది మేనక.
ఆ మాటలు విని నాకు ఇంకా కోపం వచ్చింది. “బెను, నాకు ఈ మగవాళ్ళ సంగతి బాగా తెలుసు. మనువు కూడా అదే అన్నాడు, స్త్రీ అంటే నేతి పాత్రతో సమానం, జగద-- అనువాదకథలు 60 దా! డింగరి నరహరి ఆచార్య
పురుషుడు జ్వలించే అగ్నిహోదత్రం అని! అలాంటి స్తీ పురుషులు దగ్గరయితే, వికారం తప్పకుండా పుడుతుంది” అన్నాను,
మేనక తీవ్రంగా స్పందించింది..*మీ ఆలోచన ఏమిటి? కలిసి చదువుకున్న ఆదా మగా అంతా చెడు నదత కలవాళ్లనేనా? అనేక కార్వాలయాల్లో ఒకే దగ్గర కలిసి పనిచేసే స్రీ పురుషులంతా శీలంలేని వాళ్ళనేనా? మనవాళ్ళంతా ఇంజనీర్లు, డాక్టర్లుగా వేరువేరు రంగాల్లో కలిసి తిరగడం లేదా?” అని.
ఆమె మాటలకు అద్దుచెప్పేలోగా, మేనక మళ్ళీఅందిోవినండి. మీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటే. మీరు పల్లెటూరి పిల్లనే చేసుకొని ఉండాల్సింది! ఆమె అయితే ఎప్పుడూ ఎవరికీ కనపడకుండా ముసుగేసుకొని ఉండేది. బాగా చదువుకున్నదాన్ని మగాళ్ళతో కలిసి ఆఫీసులో పనిచేసే నాలాంటిదాన్ని ఎందుకు చేసుకున్నారు?”
ఆ మాటలకు నా దగ్గర జవాబులేదు. అలా వాదించి ఇద్దరం ఆ తర్వాత నిద్రపోయాం, తెల్లవారే సమ్మేళనం ముగిసింది. ఇంటికి తిరిగి వచ్చేశాం.
నేను లక్ష్మణపూర్‌లోని గోమతీనగరంలో నా ఆఫీసులో కూర్చుని బాగా: ఆలోచించాను...*పాతకాలం మనిషిలా సంకుచితంగా ఆలోచిస్తున్నానా? ఈ శతాబ్దంలో కూడా ఆధునిక వ్యవహారం తెలియనివాడిలా ఉంటున్నానా? మేనక అన్నట్లు... రాజీవ్‌తో 'స్నేహం పవిత్రమైనదే అయితే... దోషంనా దృష్టిలోనే ఉందా? నేను కళ్ళారా చూ శానే..., మేనకా అతనూ చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం! కానీ చేతులు పట్టుకున్నంత మాత్రాన అదేం. పెద్ద నేరం కాదే! కానీ నాకు పాడు పనిలా కనిపించిందేమో! నా ఆలోచన తప్పేమో!' ఇలా పరిపరివిధాలుగా ఆలోచించాను. “నిజమే, తొందరపడ్డాను. తప్పుడు ఆలోచన చేశాను. నాదే దోషం! అని సమాధానపడ్డాను.
చలికాలం తర్వాత గ్రీష్మ రుతువు వచ్చింది. కరెంటు సరిగా ఉండడంలేదు. కనుక మనసు ఉల్లాసంగా లేదు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళే... ఎండను ఏక్కువ భరించలేరు. వాళ్ళకింకా కష్టం.
అందుకే ఓనాడు. మేనక అంది “ఏమండీ! స్విమ్మింగ్‌స్కూల్‌కి వెళదామా! అక్కడ ఈత నేర్చుకోవచ్చు” అని అలా తన కోరిక బహిర్గతం చేసింది. అక్కడ ఆడవాళ్ళకు మంచి వసతే ఉందని నాకు తెలుసు, కొలను నిర్వహకులకు కూడా నేను బాగా తెలుసు. అందుకేనేమో., సంతోషంగా ఆమె కోరికను అంగీకరించాను.
ఆమె రోజు సాయంకాలం స్విమ్మంగ్‌కి వెళుతోంది. ఆ సమయంలో నేను జగద- అనువాదకథలు 61. డా! డింగరి నరహరి ఆచార్య
పురుషుడు జ్వలించే అగ్నిహోదత్రం అని! అలాంటి స్తీ పురుషులు దగ్గరయితే, వికారం తప్పకుండా పుడుతుంది” అన్నాను,
మేనక తీవ్రంగా స్పందించింది..*మీ ఆలోచన ఏమిటి? కలిసి చదువుకున్న ఆదా మగా అంతా చెడు నదత కలవాళ్లనేనా? అనేక కార్వాలయాల్లో ఒకే దగ్గర కలిసి పనిచేసే స్రీ పురుషులంతా శీలంలేని వాళ్ళనేనా? మనవాళ్ళంతా ఇంజనీర్లు, డాక్టర్లుగా వేరువేరు రంగాల్లో కలిసి తిరగడం లేదా?” అని.
ఆమె మాటలకు అద్దుచెప్పేలోగా, మేనక మళ్ళీఅందిోవినండి. మీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటే. మీరు పల్లెటూరి పిల్లనే చేసుకొని ఉండాల్సింది! ఆమె అయితే ఎప్పుడూ ఎవరికీ కనపడకుండా ముసుగేసుకొని ఉండేది. బాగా చదువుకున్నదాన్ని మగాళ్ళతో కలిసి ఆఫీసులో పనిచేసే నాలాంటిదాన్ని ఎందుకు చేసుకున్నారు?”
ఆ మాటలకు నా దగ్గర జవాబులేదు. అలా వాదించి ఇద్దరం ఆ తర్వాత నిద్రపోయాం, తెల్లవారే సమ్మేళనం ముగిసింది. ఇంటికి తిరిగి వచ్చేశాం.
నేను లక్ష్మణపూర్‌లోని గోమతీనగరంలో నా ఆఫీసులో కూర్చుని బాగా: ఆలోచించాను...*పాతకాలం మనిషిలా సంకుచితంగా ఆలోచిస్తున్నానా? ఈ శతాబ్దంలో కూడా ఆధునిక వ్యవహారం తెలియనివాడిలా ఉంటున్నానా? మేనక అన్నట్లు... రాజీవ్‌తో 'స్నేహం పవిత్రమైనదే అయితే... దోషంనా దృష్టిలోనే ఉందా? నేను కళ్ళారా చూ శానే..., మేనకా అతనూ చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం! కానీ చేతులు పట్టుకున్నంత మాత్రాన అదేం. పెద్ద నేరం కాదే! కానీ నాకు పాడు పనిలా కనిపించిందేమో! నా ఆలోచన తప్పేమో!' ఇలా పరిపరివిధాలుగా ఆలోచించాను. “నిజమే, తొందరపడ్డాను. తప్పుడు ఆలోచన చేశాను. నాదే దోషం! అని సమాధానపడ్డాను.
చలికాలం తర్వాత గ్రీష్మ రుతువు వచ్చింది. కరెంటు సరిగా ఉండడంలేదు. కనుక మనసు ఉల్లాసంగా లేదు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళే... ఎండను ఏక్కువ భరించలేరు. వాళ్ళకింకా కష్టం.
అందుకే ఓనాడు. మేనక అంది “ఏమండీ! స్విమ్మింగ్‌స్కూల్‌కి వెళదామా! అక్కడ ఈత నేర్చుకోవచ్చు” అని అలా తన కోరిక బహిర్గతం చేసింది. అక్కడ ఆడవాళ్ళకు మంచి వసతే ఉందని నాకు తెలుసు, కొలను నిర్వహకులకు కూడా నేను బాగా తెలుసు. అందుకేనేమో., సంతోషంగా ఆమె కోరికను అంగీకరించాను.
ఆమె రోజు సాయంకాలం స్విమ్మంగ్‌కి వెళుతోంది. ఆ సమయంలో నేను జగద- అనువాదకథలు 61. డా! డింగరి నరహరి ఆచార్య
ఇంట్లొనే ఉంటున్నాను. ఒకరోజు సాయంకాలం 'మా ఆఫీసర్... త్వరగా రమ్మంటూ ఫోన్‌చేశాడు, వాహనం మేనక తీసుకెళ్ళింది. సరే,. ఎలాగో కొలను దగ్గరికి వెళ్ళి, నా కారు తీసుకొని వెళదామని నిశ్చయించుకున్నా.
అక్కడ ఉందే వ్యక్తి నన్ను చూసి “సార్! మేనకగారు. లోపలున్నారు. మీరు వెళ్ళండి అన్నారు.
.... లోపల కొలను చుట్టు అనేకమంది మహిళలు కూర్చొని ఉన్నారు. కొందరు తిరుగుతూ, కొందరు స్నానం చేస్తూ., ఇలా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఒకవైపు మేనక కనపడింది! నీళ్ళలో ఉన్న ఆమె భుజంమీద ఈత నేర్వేవాడి చేయి ఉంది! ఆమె తో ఏదో నేర్పుతూ ఉన్నాడు. అలా అక్కడ మగవాళ్ళుంటారని' నేనూహించలేదు! ఈత దుస్తుల్లో ఉన్న ఆమెను చూడడంకూడా బాగనిపించలేదు. అందుకే వెంటనే ముందు హాలులోకి వచ్చి అక్కడే ఉండి పనిమనిషి ద్వారా కారు తాళాలు తెప్పించుకొని బయటపడ్డాను.
మేం ఆ రాత్రి ఎక్కువగా మాట్లాడుకోలేదు. “ఇంకా ఎంతకాలం ఈతకి వెళతావు?” అన్న నా ప్రశ్నకు “వారం తర్వాత... నేర్పే ఆయన బయటకు వెళతాడట. అప్పుడిక ఈతకు వెళ్ళను” అని క్లుప్తంగా సమాధానమిచ్చింది, సమ్మేళన సమయంలోని వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, నేను దీని గురించి ఎక్కువగా. మాట్లాడలేదు చూడలేదన్నట్లుగా వ్యవహరించాలనుకున్నాను.
మేనక మాత్రం నామీద ఎప్పటిలా ్రేమగానే ఉంటోంది. పైగా ఆమె నడతలో ఏ లోపమూ లేదు. అయినా కొన్ని కొన్ని వ్యవహారాల వల్ల నా మనసుకు బాధ కలుగుతూనే ఉంది,
ఒకసారి మేనకే అంది “మీ వంటి వారిని భర్తగా పొంది ప్రశాంతంగా ఉండ గలుగుతున్నాను” అని, “హాయిగా, నిశ్చింతగా: నిద్రపోతున్నాను, అందుకే కాబోలు కాస్త ఒళ్ళు చేసింది కూడా! చూడండీ... కాస్తోలావైనట్లు లేనూ? ఇలాగే అయితే మీరు నన్ను వదిలేస్తారెమో!” అంది నవ్వుతూ,
“అలా మాట్లాడకు. ఎప్పటికీ అలా కాదు.. మరో జన్మలో కూడా నేను నిన్ను వదిలిపెట్టను తెలుసా! నిజం. 'ప్రతిజ్ఞ చేస్తున్నాను నీవంటి భార్య నా అదృష్టం కొద్దీ దొరికింది” అన్నాను. ప్రేమ పొంగి గాఢంగా కౌగలించుకొని ముద్దుపెట్టాను. జగద- అనువాదకథలు 62 డా॥ డింగరి నరహరి ఆచార్య
ఆమె నన్ను ప్రేమగా చూస్తూ “ఏవండీ! నేను రేపటి నుండి జిమ్‌కి వెళతాను” అని అడిగింది, పాపం స్థూలకాయం రాకుండా తాపత్రయపడుతోందని అనుకున్నాను. ఆ కోరికను కాదనలేక సరేనన్నాను. నాలో కూడా ఆమె స్లిమ్‌గా ఉండాలనే కోరిక ఉంది. 'పైగా ఆరోగ్యరీత్యా మంచిదే కాబట్టి కాదనలేకపోయాను.
ఇప్పుడు మేనక ఇంకా సంతోషంగా కనిపిస్తోంది. ఏకాంతంలో శరీర సౌందర్యాన్ని వర్ణిస్తోంది. పైగా: నా ముందు ప్రదర్శిస్తోంది కూడా! ఒకసారి నాతో “ఏవండీ! వ్యాయామశాలలో వచ్చేవారంలో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు సెలవు కూదా. మీరూ రావాలి” అంది.
ఆదివారం రోజు మేనకతో సహావెళ్ళాను. అక్కడ అనేకమంది స్త్రీలూ పురుషులూ ఉన్నారు. నేను ముందు వరుస కుర్చీల్లో ప్రత్యేక స్థలంలో కూర్చున్నాను. వేదిక మీదకు వరుసగా మహిళలు వచ్చి తమ. శరీర వన్వాసాలు. చూపుతున్నారు. మేనక కూడా ప్రదర్శిస్తుంటే, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను, ఆమెను అంతా పొగుడుతూ ఉంటే, సంతోషపద్డాను.
ఆమెకు మొదటి ప్రైజు వచ్చింది. వేదిక మీద ఆ బహుమతి తీసుకుంటుంటే చూసి ఇంకా సంతోషించాను, పురన్నారం తీసుకున్న మేనక. .-. ముఖ్య అతిథిని కాగలించి, తనచెక్కిలిని అతని చెక్కిలికి తాకించింది! వెంటనే అక్కడినుండి లేచి వెళ్ళి, కారులో కూర్చుండిపోయాను.
కొద్దిక్షణాల్లో ఆనందంతో నవ్వులు చిందిస్తూ మేనక' వచ్చింది, నా పక్కన కూర్చుని “ఏమిటిలా తొందరగా వచ్చేశారు? ఎలా ఉంది నా ప్రదర్శన?” అని అడిగింది.
స్పష్టంగా అన్నాను. “నువ్వు ఇరవై ఒకటో శతాబ్దపు స్రీవా? పదహారో శతాబ్దం దానివా? ఇప్పుడు స్త్రీలు పురుషులతో సమానంగా అందరి గౌరవాలు పొందె పనులెన్నో చేస్తున్నారు, కానీ నువ్వుచేసిన కొన్ని కొన్ని పనులకు సంబంధించే ఇప్పుడు చెప్తున్నా ఆయా సందర్భాల్లో నీ పనులు కొన్నింటిని చూడలేకపోయా, అప్పుడు నాలో కలిగిన స్పందనల్ని నువ్వు చూశావ్. వాటికి బాగా నొచ్చుకున్నావ్.. అవన్ని ఇక నువ్వు మరిచిపో, నేను భరించలేను” అన్నాను. ఆ తర్వాత మరి ఇంకేమీ వినలేక, కారు వేగంగా నడుపుకొంటూ ఇంటికి వచ్చేశాను.
రాత్రి నాపక్కలో పడుకొని నిద్రపోతున్న మేనకను చూసి మరింత ఆలోచనలో పడ్డాను, “నిజంగా నేను ఆధునికుణ్డా? ప్రస్తుతం స్రీలు ఎన్నో పనులు నిర్వహిస్తున్నారు. జగద = అనువాదకథలు 65 డాః! డింగరి నరహరి. ఆచార్య
పాలనా బాధ్యతలు వహిస్తున్నారు. వారిమీద కొందరు లేనిపోని నిందలు వేస్తున్నారు, అయినా మన్గోధైర్యమున్న మహిళలు ఎంతైనా చేయగలరు, వారిని మెచ్చుకోవాలి కాన్, తప్పు పట్టకూడదు... ఏదైనా మనం చూసే చూపులోనే ఉంది. మేనకది ఏ మాత్రం దోషం కాదు, నా బుద్దే ప్రతిదానికి అధోరకంగ్లా ఆలోచిస్తుంది. దర్జీ దగ్గర ఆమె... బట్టలు కుట్టడం గురించి చెప్పిందే తప్ప మరేదీ కాదు.. చిన్ననాటి: స్నేహితుదైన రాజీవ్‌తో, సమావేశ సంర్భంలో చేతులు కలిపింది అది తప్పా? ఈతకొలనులో నేర్పేవాడు ఆ మాత్రం పట్టుకోకుండా, ఈత సాధ్యమవుతోందా? వ్యాయామశాలలో కూడా అంతే కదా! నేనే అనుచితంగా ఆలోచించాను. మేనక పూర్తిగా తన మనసుని నాకు అర్పించింది. నా ఆనందం, నా సౌఖ్యం కోసమే పరితపించింది, అలాంటి నా భార్యను అనుమానించడం నిజంగా నాదే తప్పు! పాపం... తనెంత నొచ్చుకుందో? ఇప్పుడే నిద్రలేపి క్షమించమని అడగ్గాలి, నా తప్పు నేను ఒప్పుకుని ప్రక్షాళన చేసుకోవాలి, మూలరచయిత;: నాగేంద్ర పాండ్య (వివుల అక్టోబర్ 2012) జగద- అనువాదకథలు 64 డా॥ డింగరి నరహరి ఆచార్య
ఆ[క్రమణ
(ప్రొద్దున్నే ఇంట్లో పనులన్ని త్వరగా ముగించుకొని కాలం 9 గంటలకల్లా అబ్బాయి ఆఫీసుకు వెళతాడు. 9, 15కల్లా మనుమడు వాడి ఇంగ్లీషు మీడియం స్కూలుకి వెళ్ళాలి, కోడలు కూడా టీచరు కాబట్టీ 10 గంటలకల్లా పాఠశాలకు వెళ్ళాలి. ఇవన్నీ సకాలంలో అందరికీ అందాలంటే పాపం కోడలికి చాలా కష్టంగా ఉంది. కోడలి అవస్థ తొందర చూసి మామగారికి మనసులో జాలి వేసింది అందుకే యధాశక్తి తాను కూడా కోడలికి సహాయపడాలి అని అనుకొని వంటింట్లోకి నడిచాడు కాని ఆయన వంటింట్లోకి అడుగు పెట్టగానే కోడలు పెద్ద గొంతుకతో అరచినట్లుగా “ఏంకావాలి మీకు! క్ నిమిషాల ముందే టీ ఇచ్చాను కదా ఇలా మాటి మాటికి వంటింట్లోకి రాకండి అదే మంచిది అంది. * అయ్యో! టీ కోసం కాదు నీకే ఏదైనా సహాయం చేద్దామని వచ్చా, అన్నాడు.” హా! సహాయం, చాలు, మీరు వచ్చి నా పనులు పాడు చేయకపోతే అదే పదివేలు వాటిని మళ్ళీ సరిదిద్దుకోలేక ఇంకింత 1శమ పడాల్సి వస్తుంది. “అదికాదు బిడ్డ” అని ఆయన అనబోగా “ఇక చాలు అది కాదు, ఇది కాదు అన్మి బయటకు పోయి ప్రశాంతంగా డ్రాయింగ్‌రూంలో కూర్చోండి. ఇవ్వాళ కొత్తగా ఏముంది” అంది. వెటకారంగా, “కాదమ్మా ఎందుకు పాడుచేస్తాను వంట చేయటంలో నాకు కూడా అనుభవం ఉంది కదా అందుకే నీకు సహాయపడి కొంత శ్రమ తగ్గిద్దామని వచ్చాను” “నా కిష్టంలేదు మీ సహాయం కొంచెం కూడా అక్కర్లేదు వంటింట్లోకి మగవాళ్ళు రావడం నాకస్సలు ఇష్టముండదు” అని నిష్కర్షగా పలికి తన పని తాను చేసుకోసాగింది.
పాపం: మామగారు అప్పటికి ఎక్కువగా మాట్లాడం ఎందుకని. నిట్టూరుస్తూ బయటకు వచ్చాడు. మధ్యగదిలోకి వచ్చి తూగుటుయ్యాల బల్లమీద కూర్చొని మనస్సులోని ఆందోళనలతో సమానమైన వేగంతో ఊగసాగాడు.
తన ఇంటిలోనే. తన మంచితనానికి ఈ విధంగా అవమానం జరుగుతున్నది ఇలాంటి సంఘటనలే ఇటువంటి మాటలే మాటిమాటికి జరుగుతున్నాయి, తన బాధను ఎవరితో చెప్పుకోగలడు. కోడలిని ఏమైనా అంటే కొడుక్కి కోపం వస్తుంది.
“ఏమండీ వంటయింట్లో మీరు 'ప్రవేశించడం కోడలి కోపానికి కారణ మౌతుందని తెలుసుకోండి. అని తన భార్య మధురమ్మ అంటున్నట్లుగా స్మరించుకో సాగాడు. జగద- అనువాదకథలు 65 డా! డింగరి నరహరి ఆచార్య
ఆమె ఎంత స్నేహంగా ప్రేమగా: ఉందేది. తన ప్రతి పనిని ఎంతో (ప్రేమతో చేసేది, అన్ని రకాలుగా తన బాగోగులు చూసుకొనేది కాని జీవితంలో మధ్యలోనే తన పాత్ర ముగించుకొని తన తోవలో తాను వెళ్ళిపోయింది. ఆలోచించసాగాడు ఆయన జీవితం మధురమ్మ అకాల మరణంతో ఇటువంటి దీనావస్థకు గురి అయింది.
“ఇప్పుడు మధుర ఎక్కడున్నది నా దీనావస్థను చూసే స్థితి ఉందా! ఆమె యుక్షవయస్కురాలైనప్పటినుండి సంపూర్ణంగా తనతో గడిపిన జీవిత కాలమంతా తీపి జ్ఞాపకాలతో కూడుకున్నదే కాని ఈ 'జీవన సంధ్యాకాలంలో ముసలి తనాన్ని ఏలా అనుభవించాలి, ఏత్రోవ కనిపించడం లేదు ఏంచేయాలో కూడా అర్ధం కావడం లేదు” అని ఆలోచిస్తూ తనలో తానే 'సంభాషించుకోసాగాడు. ఇంతలో కడుపులో ఆకలి బాధ కూడా ఎక్కువయింది. వంట ఇంట్లో నుండి వంట అయిపోయిన వాసన వస్తుంది, అది తలచుకోగానే ఆకలి బాధ మరింత ఎక్కువైంది. వంటింట్లో కెళ్ళి తానే వడ్డించుకొని ఇష్టపూర్తిగా తినాలి అని కూడా ఆలోచించాడు కానీ ఇంతకు ముందే కోడలి రుసరుసల రుచి చూసి ఉన్నాడు గనుక అది తలచుకోగానే అతని కాళ్ళలో చేతుల్లో నీరసం ఆవహించింది. లోలోపలే బాధపడుతూ ఏం చేయలేక అక్కడే కూచుండి పోయాడు.
మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఎన్నో రోజులు తానే స్వయంగా వండుకున్నాడు. శ్రీధర్ నాలుగేళ్ళున్నప్పుడే మధుర స్వర్గస్థురాలైంది అప్పటినుండి వంట చేశాడు మొదట్లో అన్నీ కారంగానూ ఉప్పగాను ఉడికీ ఉడకకనో అయ్యేవి కాని రాను రాను పాక కళా 'ప్రవీణుడయ్యాడు. పూరీలు చపాతీలు పాయసం పులిహోరలాంటి వివిధరకాల వంటలు చాలా నేర్చుగా చేయడం నేర్చాడు. కొడుకు శ్రీధర్‌ని కూడా చాలా శ్రద్దగా నేర్పుగా సాది అభివృద్దిలోకి తెచ్చాడు. కానీ ఇప్పుడు కోడలు రాగానే వంట ఇంటి అధికారం చేపట్టింది అటువైపు తన ప్రవేశాన్నే దాదాపు నిషేధించింది పాపం ఆయనకి ఉన్న వయస్సుకన్నా ఎక్కువైనంత బాధ కలిగింది. మనస్సులోనే బాధపడుతూ మోకాళ్ళ మధ్య తల ఇరికించుకుని మౌనంగా మధనపడనాగాడు..
ఎందుకో జీవన మంతా దయనీయంగా వివర్ణంగా' మొదటి నుండీ గడిచిందనాలి, ఆయన బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని వాత్సల్యానికి కరువయ్యాడు. అనాధగా బంధువుల దయా దాక్షిణ్యాల మీదనే గడుపుతూ వచ్చాడు. అందుకే దీనంగా: దుఃుఖమయంగా దరిద్రంగా నిరాసక్తంగా గడిచింది క్షానీ ఇంత దయ నీయమైన ఆయన జీవితం ఎప్పుడైతే మధురమ్మతో ముడి పడిందో అప్పటినుండి జగద- అనువాదకథలు 66 దా! డింగరి నరహరి ఆచార్య
ఎంతో రంగులమయంగా ఆనందంగా సుఖమయంగా. మారిపోయింది. మధురమ్మ అడుగుల చప్పుళ్ళ లయబద్ధమైన 'మధుర నాదాలతో జీవితం వెళ్ళింది ఆమె తన ఆరో (ప్రాణంగా చూసుకున్నాడు కూడా,
కొద్ది కాలానికే వారి కుటుంబ జీవన సాఫల్యంగా ఓ కాయ కాచింది మధురమ్మ. (శీధరునికి జన్మనిచ్చింది. వారి ఆనందానికి అవధిలేదు. జీవితం అత్యానందంతో నిండుగా కనిపించింది. కొడుకును సాకడంలో వాడి అభివృద్ది ఆలోచనలతో భార్యతో సహా ఆనందాన్ననుభవించాడు. 'శ్రీధర్ బాల్య చేష్టలను దినమంతా చూస్తూ గడపడంలో తృప్తిపడ్డాడు. ఎప్పుడైతే మనిషి సుఖాలతీరం చేరినట్టుగా ఉన్నత శిఖరాల 'నధిరోహించి నట్లుగా భావిస్తాడో అప్పుడే దిగిపోవడం కూడా ]ప్రారంభమవుతుంది. అది దుఃఖానికి హేతువవుతుంది. ఉత్సాహంగా సంతోషంగా గడుస్తున్న ఆ సంసార క్రీడ మధ్యలో మధురమ్మ అలసినట్లుగా విశ్రాంతికన్నట్లుగా ఈలోకం వదిలి వెళ్ళిపోయింది. తప్పనిస్థితిలో భార్య మరణాన్ని విధిలేక విషం. లాగ దిగమింగాల్సి, వచ్చింది ఎంతమంది ఓదార్చినా ఆయన దు:ఖం శాంతించలేదు. కాని మధురమ్మ ప్రతిరూపమైన శ్రీధర్ తండ్రి మెడకు చేతులు వేసి కౌగలించుకొని ఆయన. కళ్ళుతుడుస్తూ దాదా ఏడువకు మీరేడిస్తే నాకు ఏడుపొస్తుంది... నాకు అమ్మ బాగా జ్ఞాపకం. వస్తున్నది, అన్న మాటలతో ఆ క్షణం నుండే తన దు:ఖాన్ని ఆపుకొని పిల్లవాడిని చూసుకోవాలని గంభీరంగా వాడిని దగ్గరకు తీసుకున్నాడు. మనస్సులో ఏడవ కూడదని నిశ్చయించుకున్నాడు, తల్లి తండ్రి తానే అయి కష్టపడి సాదుకోవాలని ధృడ 'సంకల్పానికి వచ్చాడు.
_ అనుకోనైతే అనుకున్నాడు కాని అనుకున్నంత తేలికేం కాదు ఆ రెండు పాత్రలూ పోషించడం ఎంతో కష్టం, ఏ తండైనా తండ్రిగా పిల్లలను ఆదరించగలడేమో కానీ తల్లిగా. పనులు నిర్వహించడం అనేది కఠిన పరిక్షై కాని ఆ కఠిన పరీక్షలో కూడా ఆయనే నెగ్గాడు. అందుకే వాడికి సవతి తల్లి కష్టాలు తేవద్దనుకున్నాడు. రెండో పెళ్ళి చేసుకోకుండా ఉండి పోయాడు. తానే అన్ని అయి ఎన్ని కష్టాలైనా ఏదుర్భున్నాడు. అందుకే కొడుకు తిండి సుఖాన్ననుభవించాలనే వాడికి అన్నీ చేసిపెట్టాలని కష్టపడి వంటలన్ని నేర్చుకోవడమే కాక రుచిగా కూడా చేయడం నేర్చుకున్నాడు. శ్రీధర్ కూడా తండ్రి. అంటే అతి (ప్రేమగా ఉండేవాడు దాని వల్ల సుఖపడాల్సిన ఆయనకు ఆరోజులు: అలాకష్టాలతో గడిచిపోయాయి. ఇవ్వాళ్ళ శ్రీధర్‌కి ఇరవైఎనిమిదేళ్ళు ఉత్తమ పౌరునిగాను జగద- అనువాదకథలు. 67 డా॥ డింగరి నరహరి ఆచార్య
తన పని చేయడంలోను పదిమందిలో పేరు సంపాదించి మంచి వాడన్న పేరు తెచ్చుకున్నాడు. అందుకే కొడుకు గురించి విన్నప్పుడు ఆయన కష్టాన్ని మరచి ఆనందభాష్పాలు రాలుస్తాడు. అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం కూడ దొరికింది అందుకే అమ్మాయిల తండ్రుల. చూపు అతనిపై పడింది వాళ్ళలో ఒక అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడటం త్రో 'పెళ్ళి కూడా చేశాడు. కాని, కాని, ఈ కాని అనే పదం ఎవరి జీవితంలో రాదో వాళ్ళ జీవితాల్లో దు;ఖమనేదే ఉండదు అయితే మనిషి ఏది రావద్దనుకుంటాడో అదే అతని ముందుకు వచ్చి కూర్చుంటుంది.
దాదా మహోదయ ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశాడు. ఇక ఏ పని లేదు. అతడికి దినాలన్ని ఎలా గడపాలో అర్ధం కావడం లేదు. ఆయన కెక్కువగా కలిగే చింత అద్నే పూర్వం పషొద్దటినుండి సాయంకాలర దాకా ఉద్యోగమే 'కాకుండా 'ఇంట్లో వంట దగ్గరనుండి ఇంటి కవసరమైన సరుకులు కొనుక్కరావడంతోనూ అన్ని పనులతో కాలం హాయిగా గడచిపోయేది ఇప్పుడో వంటయిల్లు కోడలు స్వాధీనమయిపోయింది, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడాయె మనుమడితో ఆడుతూ గడిపే అవసరం కొంచెం కూడా లేకుండ యింది. ఎందుకంటే ప్రొద్దున్నే వాడు అన్ని సబ్జెక్టుల కోసం ట్యూషన్‌కి వెళతాడు. మధ్యాహ్నం బడికి, సాయంకాలం రాగ్లానే టి.వి, చూస్తూ కూర్చుంటాడు. ఇక తాతయ్య చెప్పే పూర్వకాలం. కథలు వాదెక్కడ వింటాడు. ఆ విధంగా మెల్లమెల్లగా ఆయన అన్ని పనులకూ అందరికీ దూరమవసాగాడు. అందువల్లే ఆయనలో ఏదో విరక్తి ప్రవేశించ సాగింది. అన్నిటినుండి విరక్తుడైనా కానీ అతని మనస్సు మాత్రం వంట యింటినుండి విరక్తిని చూపలేక పోతోంది. అంతేకాదు స్వయంగా రుచిగా చేసుకున్న మనిషి కనుక కోడలు పెట్టే పరిమిత ఆహారమే కాకుండా కొద్దిగా మనస్సుకు రుచించే విధంగా కూడా ఉండడం: లేదు, కొనుక్కొచ్చిన వస్తువులు ఆయనకు నచ్చదు. అందువల్లనే అతడికి తృప్తిగా తిన్నట్లుండడంలేదు, మిక్కిలి ఆకలిబాధ వున్నా అన్నం తినాలన్నా ఆపేక్ష తగ్గుతూ ఉంది. ఏదో కష్టంగా నాలుగు మెతుకులు బలవంతంగా తిన్నట్టు చేసి సగం ఆకలితోనే లేచేస్తున్నాడు. అది కోడలికి నచ్చక షోవడమే కాక ఆమెకు కోపం కూడా తెప్పిస్తున్నది. ఏవో ఏవో మాటలు అంటుందేది. కరువు దినాల్లో ఇట్లా అన్నాన్ని వదిలివేయడం మంచిది కాదు వూరికే రావడంలేదు ఎంతో కష్టపడితే దొరుకుతున్నది. లాంటి మాటలు ఆయనను మిక్కిలి బాధిస్తున్నాయి, జగద- అనువాదకథలు 68 దా॥ డింగరి నరహరి ఆచార్య
ఇవన్నీ కొడుక్కి చెప్పి కోడలు మీద షికాయత్ చేయాలన్నది కూడా ఆయనకు నచ్చనిది. కొడుకు కూడా “నాన్నా ఇప్పటిదాకా నా కోసం ఏళ్ళుగా వండిపెట్టారు కదా ఎంతో కష్టపడ్డారు మళ్ళీ వంటింట్లోకి ఎందుకు వెళతారు, మంచిగా హాయిగా కోడలు వండిపెడితే వేడి పదార్థాలు తినక? మిగిలిన జీవితాన్ని సుఖంగా శాంతంగా ఆనందంగా గడపండి విశ్రాంతి తీసుకోండి” అన్నాడు, అదే అతడిని బాధించేది. వంటయింటికి దూరం చేయడంతో అతనికి తాను అనాధ ఐనట్లు ఫీలయ్యాడు. మనస్సులో ఇది అతడిని బాగా బాధించనాగింది. కాని వంచేయాలి ఇతరులకు ఇలాంటీ ఆక్రమణ నిరోధం గూర్చి ఎలా. చెప్పుకోవాలి, చెప్పుకోరాదు కూడా అందుకే ఆయన మనసులోనే దు;ఖపడుతూ మౌనవేదన అనుభవిస్తున్నాడు. మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆయనను చూసి కొడుకూ కోడలూ నిశ్చింత చేసుకున్నారు. తమ. నర్ధం చేసుకున్నాడని కాని ఆయన తన అభిలాషను వ్యక్తం చేయలేక బలవంతంగా అణచుకొని తననుండి ఏదో దూరమైనట్లుగా బాధపడుతూ దినదీినం కృశించిపోతూ దుర్చలుడౌతున్నాడు.
ఈ రోజు “అవిధవానవమి' అనగా భర్త ఉండగా చనిపోయిన భార్యలకు పూజ చేసే దినం. హాయిగా మరణం వచ్చిన భార్యలను పూజీంచే స్మారకదినం అందుకే అతగాడు చాలా ప్రొద్దున్నే లేచాడు గబగబా స్నానాదికాలు పూర్తి చేసుకొని పూజా కార్య క్రమాన్ని కూడా పూర్తి గావించి ఉతికిన ధోవతీ కట్పకొని శుచిగా '్రసాదం వంట (ప్రారంభం చేశాడు.
పూర్వం ప్రతి సంవత్సరం మధురమ్మకు ఇష్టమైన వంటకాలను రకరకాలుగా చేసి నైవేద్యంగా పెట్టేవాడు. ఎప్పుద్రేతే కోడలు వచ్చిందోఆమెనే ఈ పని చేసి 'పెద్డున్నది. కొని ఆమెకు ఆ పదార్థాలు చేయడంలో ఏ మాత్రం (ప్రేమకాని 'శ్రద్దకాని లేదు ఏదో ధర్మ కార్యం చేసినట్లుగా చేయక తప్పదన్నట్లుగా తన ఇష్టం వచ్చింది వండి పెడుతుంది. అందుకే ఈ రోజు అతగాడు ధృడనిశ్చయానికి వచ్చాడు. “ఏమైనా కాని ఏ పరిణామమైనా లెక్కచెయ్యదలచుకోలేదు స్వహస్తాలతో అన్ని వంటలు చేసి మధురకు నైవేద్యం. పెట్టాలి” అనుకున్నాడు. అటుతర్వాత తాను కూడా తృప్తిగా భోంచేయాలనుకున్నాడు. అందుకే కోడలు లేవకముందే వంట అంతా పూర్తి కావాలనుకొని పొద్దున్నే లేచి వంట ప్రారంభించి 6 గంటల వరకల్లా అన్నీ సిద్దం చేశాడు. ఒక పెద్ద పళ్ళెంలో పదార్థాలన్నీ సద్ది ఒక్కసారి తృప్తిగా చూసుకున్నాడు. దేవుడి గదిలో ఆమె పటం ముందు వాటిని ఉంచాడు. ఆమె జగద- అనువాదకథలు 69 'డా॥ డింగరి నరహరి ఆచార్య
పటాన్ని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు తీర్చిదిద్ది ఒక నూతన వస్త్రం చుట్టి మల్లెపూలదండ ఒకటి జడలో పెట్టినట్టు దానికి వేసి ఒక పీట మీద దాన్నుంచి ఎదురుగా నైవేద్యం పెట్టాడు. అంతకు ముందే ఆ చోట ముగ్గు కూడా వేశాడు. అగరువత్తులు వెలిగించాడు. ప్రశాంత సౌమ్యమైన మనస్సుతో నీరాజనం సమర్పించాడు. ఇప్పుడాయన మనస్సు నిండా తృప్తి ఆనందం నిండుకొంది నైవేద్యం మీద నీళ్ళు ప్రోక్షించి ఎదురుగా తాను ఒక పీట మీద పద్మాసనం వేసుకొని కూర్చుండి ధ్యానం చేయసాగాడు. మనసులోనే మధురమ్మతో మాట్లాడసాగాడు. “ప్రియమైన మధురా ఇది నా చేతులతో స్వయంగా అర్పిస్తున్న అంతిమ నైవేధ్యం. నీవు లేకుండా ఈ జీవితం చాలా ఏళ్ళు గడిపాను, ఇవ్వాళ నా ఇంట్లోనే నేనొక కొత్తమనిషిలా వుండాల్సి వస్తోంది. ఇందులో తప్పొప్పుల ప్రసక్తిలేదు నామనసెందుకో అది సహించలేక పోతోంది.. నీకే కాదు ఇది నాకు కూడా చివరి భోజనం కావాలని కోరుకుంటున్నాను వింటున్నావా మధురా! త్వరగా నాకు నీ దగ్గరికి రావాలనిపిస్తోంది” అనుకున్నాడు మనస్సులో,
ఆయన కళ్ళనుండి కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి దేహమంతా శోకావేగం చెత కంపించి పోతోంది. మధురమ్మ ఫోటో ముందు ఆయన తల వాలిపోయింది. భోజనం చేయకముందే స్వర్గస్థడయ్యాడు. ఆయన ఇన్నాళ్ళూ అస్వతం'త్రుణ్జి చేస్తూ ఏదో ఆక్రమించిందనుకున్నాడు. కానీ. ఇప్పుడు స్వతంద్రుడిని చేస్తూ మృత్యువు ఆ(క్రమించింది, ముక్తుడయ్యాడు.
మూలరచయిత; సరోజ్ ధన్‌పాల్‌చౌగ్‌లే
జగద- అనువాదకథలు 70 డా| డింగరి నరహరి ఆచార్య
కవి సమ్రాట్
కాలు విరగిన కుర్చీకి ఏలాగో అవస్థపడి కుర్చి కాలుకి మెకు బిగించి గోడకు అన్సి టేబులు మీద వున్న తన కథలు, గేయాల రచనల కట్టలు, సన్మాన సంచికను చూస్తూ కూర్చున్నాడు. కవి సమ్రాట్ బిరుదాంకితుడు “సుమనశ్రీ ఉరఫ్ బలరాం,
వంట ఇంటిలో (శ్రీమతి గిన్నెల చప్పుళ్ళు టిఫిన్ కాలేదన్న మిషతో చిటపట లాడుతున్న పెద్దవాడు కుమార్, చిన్నవాడు రమేశ్ రాగాలాపన, ఊయలలో పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తున్న పాప ఏడుపు, ఇవేవి బాహ్య ప్రపంచంలోకి తీసుకరాలేక పోయాయి కవిగారిని.
అన్న రాగానికి శృతి నందుకున్న పాపరోదన ఆగకుండా సాగడంతో, బయటే ఉన్న భర్త కవేవీ వినిపించడంలేదా అని రుసరుసలాడుత్తూ,. కలుపుతున్న కూరగంటె అలాగే చేతిలో పట్టుకొని బయటికి వచ్చి, బలరాంను చూసి ఏమండీ! పాప ఏడుపు వినిపించడంలేదా? అంటూ గబగబా ఉయ్యాలవద్దకు వెళ్ళి ఒకృతోపుతోసి ఊపి వచ్చినంత వేగంగా కూరమాడుతుందేమోననే భయంతో వంటింట్లో కెళ్ళింది.
తల్లి తోసిన తోపు స్పీడుకి ఉయ్యాల గోడకు గుద్దుకోవడంతో ఉలిక్కిపడ్డ పాప తన ఏడుపు శృతి పెంచడంతో తప్పనిసరిగారావలసివచ్చింది బలరాంకు, పాపను భుజాన వేసుకొని ఊరడించి జోకొడుతూ తనేనా కవిసమ్రాట్ అని ఆలోచించసాగాడు.
జీవితంలో తాను బుద్ది తక్కువ పనులు చేసినట్టుగా జ్ఞాపకం లేదు. ఎందుకంటే దరిద్రం అనుభవిస్తూనే, కాస్తో కూస్తో చదువుకున్నాడు. తల్లీతండ్రి తెచ్చిన సంబంధాన్ని నోరుమెదపకుండా చేసుకున్నాడు, “బాబూ! ఇక నావల్ల కాదురా! అని కుటుంబ భారాన్ని మోయమని. ఇచ్చిన నాన్నగారి బరువును, తనకున్న విద్యతో ఒక '్రెస్సులో చేరి పలైత్తకుండా మోశాడు. తనకు తెలిసినంతవరకు తల్లిదండ్రుల నాదరంగానే చూశాడు. రమేశ్ కడుపులో వున్నప్పుడే తల్లిదండ్రీ వారంరోజుల తేదాతో పోయిన ధైర్యం చిక్కబట్టుకున్నాడు. ప్రెస్సులో అనుభవాన్ని పురస్కరించుకొని తంటాలు పడి 'మమత' పత్రికాలయంలో ్రూఫ్‌రీడరుగ్గా చేరాడు. అప్పుడే కథలుగాని, కవితలుగాని రాయాలన్న భావం కలిగి రాయడం మొదలు పెట్టి ఇంతవాడయ్యాడు, గవర్నమెంటు చెప్పినట్టుగా చిన్న కుటుంబమైతే చింతలుండవని బుద్దిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశాడు. కాని ఈ కవిసార్వభౌమ బిరుదు వచ్చిన నాటినుండి కనీసం భాగ్యవంతులం కావాలని కోరకున్నా జగద- అనువాదకథలు 1 డా॥ డింగరి నరహరి ఆచార్య
తన బిడ్డలడిగిన చిన్న సరదాలు కూడా. తీర్చలేక పోతున్నాననే బాధ పడసాగాడు. వాళ్ళడిగిన ఏ చిన్నకోరికా తీర్చలేకపోతున్నాడు ఎందుకిలా అయింది. ఆలోచిస్తున్న బలరాంకి “వంటయింది న్నానం చేయండి,” అన్న భార్య పిలుపు విని భుజం మీదే నిద్రపోయిన పాపను ఊయల్లో పడేసి స్నానానికి బయలుదేరాడు.
ఆనాటికి మూడురోజులైన రమేశ్‌కి వచ్చిన ప్లూజ్వరం తగ్గకపోవడంతో డాక్టరుని తీసుకొచ్చి చూపెట్టాడు. ఆయన రాసిచ్చిన మందులు ఎలా తేవాలి? అని ఆలోచిస్తున్న బలరాంకి ఏమండీ! ఎక్కడైనా డబ్బు సంపాదించి ఆ మందులు తీసుకురండి అన్న భార్య మాటలకు తేరుకొని సరేనని అప్పుకోసం నడిచాడు విధిలేక,
... చెప్పులేసుకొని బయట అడుగుపెట్టాడో లేదో తను వంద రూపాయలు
ఇవ్వాల్సిన సేటు ఎదురుగ్గా రావడంచూసి గుండె గుభేలుమంది, దగ్గరకు వచ్చిన సేఠ్ “నమస్కారమండీ! కవిగారు అనడంతో”. నమస్తే! అన్నాడు. బొత్తిగా మమ్మల్ని మరచిపోయారు... అన్న ఆయన వ్యంగ్య ధోరణిని అర్ధం చేసుకున్న బలరాం “లేదు సేఠ్‌జీ! గుర్తుంది అన్నాడు వినయంగా, ఏంగుర్లో లెండి, తీసుకెళ్ళినప్పుడే గాని ఇచ్చేప్పు దెక్కడుంటుంది. చెప్పులరిగేలా తిరగాల్సిందే, అన్నాడు నిష్టరంగా, వందరూపాయలకే అంతమాటలంటున్నా చేసేదేంలేక మౌనం వహించి శాంతంగా అబ్బే అలా అనకండి! త్వరలోనే ఇస్తాను అని, ఇక ఆగితే తన దీనావస్థ ఎందరికంట్లో పడుతుందోననే భయంతో బజార్లోకి నడిచాడు. “సరే అది చూస్తాను అన్న మాటలు శూలాల్లా తగిలాయి. అతను తన వెనుక రావడంలేదని తెలిసి దీర్హంగా నిట్టూర్చి తనకు తెలిసివున్న ఓ మిత్రుడింటికి వెళ్ళాడు.
ఎదురుగానేవున్న స్నేహితుడు రావోయ్ రా! అంటూ కుర్చీ చూపించి ఆప్యాయం గా పలకరించి కాఫీ కూడా పోశాడు. కానీ ఏవో సంభాషణలు జరిపి అడగవలసిన విషయం జ్ఞప్తికి వున్నా అభిమానం అడ్డుపడి అడగనివ్వక పోవడంతో సెలవు తీసుకొని బయట' పడ్డాడు.
జ్వరంతో బాధపడుతున్న రమేశ్ రూపం కళ్ళముందు మెదలడంతో కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. తుడుచుకుని “కవిత” పత్రికా కార్యాలయంలోకి అడుగుపెట్టాడు.
పత్రికాధిపతి “రండి,రండి! మీరడుగుపెట్టడంతో ఈ. కార్యాలయమే పావనమైంది” అని పౌరాణిక ఫక్కీలో పొగడడం మొదలు పెట్టాడు. అవి 'సహించని బలరాం, “చూడండి నాకు కాస్త పనుండి వచ్చాను” అన్నాడు నసుగుతూ, “అయ్యయ్యో జగద- అనువాదకథలు 72 డా! డింగరి నరహరి ఆచార్య
ఎంతమాట! చెప్పండి ఏం కావాలో క్షణంలో చేసి పెడతాను.”
“ఏం లేదు రామ్మూర్తిగారు అవసరంగా ఓ యాభై రూపాయలు కావాలి. మళ్ళీ వారంలోగా ఇస్తాను” అన్నాడు సిగ్గుపడుతూనే. ఆ మాటలు వినగానే అతగాడి ముఖ కవళికలు వెంటవెంటనే మారిపోయాయి,
“అన్నట్టు మీరు 'మమత' పత్రికలో పనిచేయడం మానుకున్నారట, అయినా మీలాంటి ఉత్తములు, పెద్దలు ఆ పని చేయడమేమిటి లెండి” అన్నాడు చిరునవ్వు లొలకబోస్తూ,
హు! తాను మానుకోవడమా! ఈ కవిసమ్రాట్ బిరుదు రావడంతో మీలాంటి వారు ఈ పని చేయడం బాగుండదు. ఎవరైనా చూస్తే మమ్మల్నే తప్పుపడతారు అని తీసేశారు. ఇప్పుడీయనేమంటున్నాడు! 'మీలాంటివారు ఆ పని చేయడమేమిటి" అనా! అదే'కాదు, ఏ ఉద్యోగంలేని తాను తన చిన్న కుటుంబాన్ని సాకడానికి, అంటే తిండికోసం ఏ పని చెప్పినా చేయడానికి సిద్దంగా ఉన్నాడు. వాళ్ళు అలా తీసేశారని చెప్పుకోలేక ఈ కథలూ కవితలతో వచ్చే డబ్బుతో సంసారాన్ని ఈదలేక సతమతమవుతున్నాడు... అతని ప్రశ్చకేమని సమాధానమివ్వగలడు. అందుకే, “అవునండీ!” అన్నాడు. ఏమీ చెప్పుకోలేక ఇతగాడు తన డబ్బు తిరిగి ఎలా ఇవ్వగలదని ఆలోచిస్తున్నట్టుందని, “చూడండీ! కొన్ని కొత్త ఆర్టికల్స్ పంపిస్తాను కావాలంటే.,.* అన్నాడు బలరాం.
“క్షమించాలి రూల్స్ మారిపోయాయి ఇప్పుడు ఇక్కడ చేరిన వాటికే స్థానం లేకుండా పడిపోయాయి, అందుకని దయచేసి మీరు ఇప్పట్లో ఏమీ పంపకండి, నేనే వచ్చి అవసరమున్నప్పుడు పట్పకొచ్చుకుంటాను” అని నిర్మొహమాటంగా చెప్పడంతో విషం తిని చచ్చినా బాగుండుననిపించి సుమనశ్రీ నాలుక పిడుచకట్టుకుపోగా, “వస్తాను!” అని బయటపడ్డాడు.
సంవత్సరం క్రితం ఎంత డబ్బడిగినా ఇచ్చే ఇతను తన అవసరం తీరి పత్రికకి పేరు సంపాదించిపెట్టిన తననే మరచిపోయాడు, ఏంతలో ఎంత మార్చు. నోరు జారవిడిచినా పరువు నిలువలేదు. కళ్ళు బైర్లు కమ్మసాగాయి. భారంగా అడుగులు వేస్తూ తన ఇంటి వైపు నడవసాగాడు,
“హలో బలరాం! బాగున్నావా?” అన్న పిలుపువిని, తల పైకెత్తాడు.
“హలో హరిశ్చంద్రా! బాగున్నావా?” అన్నాడు బలరాం. హరిశ్చంద్ర ఎల్.ఐ.సి, లో పనిచేస్తూ హాయిగా జీవితం గడుపుతున్నాడు. బలరాం సన్నిహిత మి(త్రుడు.. జగద- అనువాదకథలు "78 డా॥ డింగరి నరహరి ఆచార్య
“ఆ” అని సమాధానం చెప్పి, “అదేమిటి బలరాం! అలా ఉన్నావు?” అని ప్రశ్నించాడు. “ఏంలేదు” అని సందేహిస్తూనే, చూడు హరిశ్చంద్రా! అవసరంగా ఉంది ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు ఇంట్లో పిల్లాడికేం బాగాలేదు” అన్నాడు. “అరెరే! నీ వడిగిన రోజే లేకుండా పోయిందే. సరే, నా అవసరానికి దాచుకున్న ఈ పదీ ఉంచు” అంటూ:'పది రూపాయల నోట్ల కట్టనుండి' ఓ నోటు తీసి చేతిలో పెట్టి అక్కడే ఉంటే ఇంకేమైనా అడుగుతాదేమో “వస్తాను, క్లబ్బుకి లేటైంది” అంటూ గబగబా వెళ్ళిపోయాడు.
తనలో తనే నవ్వకుని బలరాం ఆ పదిరూపాయలు ఏం చేసుకోవాలో తెలియక ఇంకెక్కడా ముఖం చూపించలేక ఇంటికొచ్చాడు.
ఎదురుగా సన్మాన సంచిక, తనకిచ్చిన బిరుదు పత్రం వెక్కిరిస్తున్నట్లుగా కనిపించాయి. “ఏమయిందండీ!” అన్న భార్యకి జవాబివ్వలేక తల వంచుకున్నాడు, “బాబు కెలా ఉంది?” అని ప్రశ్నించాడు. “కొద్దిగా తగ్గుబుఖం పట్టినట్టే పట్టి మళ్ళీ ఈ సాయంత్రం నుండి ఉధృతమవుతున్నది” అంది విచారంగా, ఆ మాటలు విని కూడా చేసేదేమీ లేక అప్పునెవరినీ అడగలేక భగవంతుడిపై భారాన్ని వేసే ఊరుకున్నాడు.
మింగుడు పదని అన్నంలో చేయి కడిగి లేచిపోతున్న భర్తవైపు దీనంగా చూస్తూ నిలబడింది బలరాం భార్య గదిలోకి వచ్చి పడుకున్నాడే కాని ఎదతెగని ఆలోచనలు నిద్రపట్టనివ్వడంలేదు.
“త్రానేం పాపంచేశాడు కథలు, కవితలు రాయడం తప్పా! కనీసం కడుపునిండి తృప్తిగా ఉంటున్నాడనుకుంటున్న సమయంలో ప్రభుత్వం వారు తన “క్రాంతిపథా”నికి బహుమతి ప్రకటించి ఆ భాగ్యానికి నోచుకోకుండా చేసింది. (ప్రభుత్వ బహుమతిని షాందిన నాటినుండి ఉన్న గౌరవం” పోయింది, అత్తిగౌారవంతో ఎవరూ దగ్గరకు రానివ్వడంలేదు, పత్రికాధిపతులు గౌరవిస్తున్నారే. తప్ప జీవనాధారం చూపడం లేదు, బిరుదువల్ల కడుపులు నిండవు కదా! ఈ దేశంలో సామాన్య జీవితం గడుపుతామన్నా మధ్యతరగతి వాడికి సాధ్యపడడం లేదు. కవిత్వం రాసిన పాపానికి 'కవిసమ్రాట్ అని బిరుదిచ్చి ఆనాటి శ్రీనాథుని చివరి దశ చవిచూడమన్నది. సభలని,సన్నానాలని మోయలేని దండలువేసి పొగిడారే కాని కనీసం బీక్షమెత్తే అర్హత కూడా తొలగించామని గుర్తెరిగిందా ఈ ప్రజ. నాకు పట్టిన ఈ దీనావస్థనుఆలోచించే మనిషున్నాడా ఈ లోకంలో, పత్రికలానాడు తన జీవితాన్ని ఇంతవాడు, అంతవాడు అని పరిచయం చేసాయి. కాని ఈనాడున్న స్థితిని విప్పి చెప్పదేం. బిరుదులు, సన్మానాలు గౌరవదాయకాలని అనుకున్నాడే జగద- అనువాదకథలు గ డా॥ డింగరి నరహరి ఆచార్య
కాని ఉన్న ఉద్యోగాన్ని ఊడగొడుతుందని ఊహించలేదు. “భగవాన్! ఇదేం న్యాయం? ఒక మనిషి మంచి మాటలతో (బ్రతకడని, అతనికి సమాజం ద్వారా అన్ని అండదండలు కావాలని, ఉన్నవాడు లేనివాడిని ఆదుకోవాలని తెలుసుకునే శక్తిని నీ సృష్టిలో ఏందుకు కలిగించలేదు. కవిత రాయడంకాదు, తెల్లవారితే ఎలాగడుస్తుందా? అనే ఆలోచనలతో దినం గడుస్తున్నది. 'ఈ బిరుదులేనప్పుడు అందరూ సన్నిహితంగా తిరిగారు. హాయిగా అందరితో కలిసి జీవించాడు.. దీనివల్ల దగ్గరి మిత్రులు కూడా తనేదో పెద్దవాడినని దగ్గరగా రాలేక పోతున్నారు. నోరు విడిచి అడిగినా హరిశ్చంద్ర పది రూపాయలు విదిల్పాడు. తనని తిరిగి ఎలా అడగాలని అతగాడి ఆలోచన.. కేవలం కవితలనాదరించి (బ్రతుకుదెరువు కల్పించే సమాజంకాదు మనది. సమాజ ఉద్దరణకేనని చేపట్టిన ఈ వ్యాసంగం కడుపు కూడా కొంత నింపగలుగుతున్నదని కొన్ని రోజులు సంతోషించాడు. ఎన్ని రాతలు రాసినా మనిషి మనుగడలో మార్పు రాలేదు, అది లేని నాడు ఈ సన్మానాలు, సభలూ తనకక్కరలేదు. కడుపే నిండని తనకు “కవిసమ్రాట్ బిరుదుతో పనిలేదు, బిరుదు పత్రాన్ని చూస్తే విసిరివేయాలనిపిస్తున్నది, చించి వేయాలనిపిస్తున్నది. “వద్దు, వద్దు! తనకీ జీవితం వద్దు..ఈ బిరుదులు వదిలి తానంటే తెలియని దేశానికి వెళ్ళి మామూలు మనిషిగా బ్రతకాలి. ఆ జీవితం కావాలి. ఈ దేశంలో మామూలు నాయకత్వం పనిచేసిన రాజకీయ చతురులకు పించన్లున్నాయి. దేశోద్దరణకు కవిత్వం రాసిన కవికి ఫించనులేదు. ఉన్నా ఎందుకూ చాలని, ముష్టి
“వద్దువద్దు, నాకీ సన్మానం వద్దు, మీరు నా ముఖం కూడా బజారులో తిరిగే అర్హత పోగొట్టవద్దు. వద్దు వద్దు. నేను రానీ అని పలవరిస్తున్న, కేకలు వేస్తున్న భర్తను “ఏమండీ, ఏమండీ!” అని తట్టిలేపింది బలరాం భార్య.
కళ్లు తెరచిన బలరాంకి “మళ్ళీ తనకి సన్మానం చేస్తామని: మొత్తం దేశంలోనే మీకు పేరు వస్తుందని పెద్దపెద్ద వాళ్ళు రావడంతో భయపడి తాను అలా అరవడం గుర్తుకు వచ్చి అదంతా కలేనని తెలిసి కొంత సంతృప్తి చెంది నిట్టూర్చాడు.
“ఏమయిందందీ!” అని అంటున్న భార్యకు “ఏమీలేదు, నువ్వు పదుకో[” అని మరోవైపు తిరిగి బిరుదులకు దూరంగా ఉండి బ్రతుకనున్న తాను ఆ కొత్త ప్రపంచాన్ని ఊహిస్తూ నిద్రకు ఉపక్రమించాడు. కవిసమ్రాట్ “సుమనశ్రీ ఉరఫ్ బలరాం అనే అభాగ్యజీవి. (ఆదివారం ఆంధ్రవ్రభ జూన్ 1996) జగద- అనువాదకథలు ౯7గ్ర్ డా! డింగరి నరహరి ఆచార్య
“పుత్రస్యాపి గతిర్నాస్తి”
ఉదయం నుంచి ఆకాశం నిండా ముసురుకొని జగత్తంతా చీకటి చేసిన మబ్బు విడవకుండా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్టుగా ఉంది. అంతకంతకూ. జోరుగా "కురుస్తున్నదే తప్ప ఆగేట్టు కన్పించడం లేదు. ఆ ఇంట్లో గాలికి రెపరెపలాడుతూ తనకంటే బలమైన గాలి దేవుడితో యుద్దం చేస్తూ గెలుపుకోసం తంటాలు పడుతున్నది. దీపం, వర్షం గాలికి కరెంటు ఎప్పుడో పోయింది. ఎప్పటికొస్తుందో చెప్పేవీలులేదు.
గోడ మీద దీపం, ఆ ప్రక్కనే మంచంలో నరసింహం మాస్టారు పడుకొని ఉన్నాడు. పడుకున్నాదేగానీ నిద్ర రావడంలేదు... వానలాగే ఆలోచనలు ముసురుకొని నిద్రకు దూరం చేశాయి. మంచం ప్రక్కనే చాప చిరుగు పరుచుకొని పడుకొంది భార్య లక్ష్మి.
అరవైదాటిన మాస్టారును ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది. కాని ఆ రెంటి మధ్య నలిగిపోతున్న అల్పప్రాణి ఆయనది. మాస్టారు ఊరు విడవడానికి సిద్దంగానే ఉన్నాడు కాని ఆ దేవుడికే దయ రావడంలేదు. వచ్చే పెన్షన్ డబ్బులతో జీవితం గడపడం దుర్భరంగా ఉంది. ఏనాడో పని' చేసిందానికి జ్ఞాపకంగా ప్రభుత్వం కృతజ్ఞతగా ఆ మాత్రం సౌకర్యాల్ని కల్పించి ముసలితనంలో ఆదుకుంటున్నది.
పొరలు పొరలుగా వస్తున్న దగ్గుతో కుస్తీ పడుతున్న మాస్త్టార్ని చూసి లక్షి లేచి మంచంక్రింది చెంబులోని నీళ్ళు గ్లాసులో పోసి అందించింది. దాంతో శాంతి చెంది మళ్ళీ ఆలోచిస్తూ పడుకున్నాడు.
శాస్త్రాలు ధర్మాలు 'అపుత్రస్య గతిర్నాస్తి' అన్నాయి. అంటే పుత్రులు లేని వానికి గతులు లేవని, వాడికి పిండ ప్రదానం చేయకుంటే (ప్రేతాత్మ అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటుందని, ఇటు ఈ లోకానికి అటు ఆ పై లోకానికి చెందదని అంటారు, అంతేకాదు పున్నామ నరకం నురిడి రక్షించేవాడు కనుకే పుత్రుడట, మరి తనకి గతులు లేవా? తన ఆత్మకూడా అంతరిక్షంలోనే తిరుగుతూ. ఉంటుందా? అయితే తను చేసిన పాపమేమిటి తనకెందుకీలాంటి థాత రాశాడు భగవంతుడు, తెలిసితానెవరికీ అపకారం: చేయలేదే, పల్లెత్తుమాట కూడా జారినవాడు కాదే, తనకీ పున్నామ నరకం నుండి తప్పించుకునే మార్గంలేదా? ఎంత హేయమైన స్థితి తనది, పుత్రులే లేని వాళ్ళు ఇలా జగద- అనువాదకథలు 76 దాః డింగరి నరహరి ఆచార్య
ఆలోచించే బాధ వేరు, తన బాధ అలాంటిది కాదే, అలా కొందరిలాగా తనకూ కొడుకనేవాడు లేడని కొంత సంతృప్తి పడేవాడు. కానీ అలా కాదే తన చేతుల మీదుగా గారాబంగా పెంచి పెద్దచేసి విద్యాబుద్దులు చెప్పించి, ఓ ఇంటివాడిని కూడా చేసిన కొడుకున్నాడే, మరి. ఇప్పుడు తనకి మాత్రం అపుత్రకులకు పట్టే గతి పట్టనుంది. తనవాడు తనను ఇలాంటి ముసలితనంలో ఆదుకుంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు ఏం చేశాడు. తానుగా వానికెన్నో చేశాడు. తన రెక్కల కష్టం సర్వం ధారపోశాడు, కాని తనకు .వాఢు మిగిల్సిపోయింది మాత్రం ఇలా కుమిలి కుమిలి ఏడ్వడం మాత్రమే. ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక్కసారి బాధగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు. చెలియలి కట్ట దాటిన నీరులా కన్నీళ్ళు టపటపా చెక్కిళ్ళ మీదుగా జారిపోయాయి. ఎక్కడో పిడుగు పడిన చప్పుడు. ఆ చప్పుడుకి లక్ష్మి నిద్రలో మూలుగుతూ కదిలి మరో ప్రక్కకి తిరిగి పడుకున్న భార్యను చూశాడు. అమాయకంగా నిద్రిస్తున్న ఆమెను చూస్తుంటే, గతం ఆయన కళ్ళముందు సినిమా రీలులాగ వరుసగా తిరగసాగింది.
పూజ ముగించి టిఫిన్ చేస్తున్న నరసింహం మాస్త్టారుతో “ఏమండీ శ్రీశైలం దాకా వెళ్ళి మల్లిఖార్జునుడిని దర్శించి వద్దాం” అంది లక్ష్మి.
ఆ మాటలకు చిన్నగా నవ్వి “నీ పిచ్చిగాని ఇక ఆశ వదులుకో, మన నొసటిన సంతాన గీత రాయలేదా దైవం” అన్నాడు నిరాశగా మాస్టారు.
“అలా అనకండి. ఏదో మన ప్రయత్నం మనం చేసి కాకుంటే ఆ తరువాత దేవుడి మీద భారం వేద్దాం. నా కెందుకో అక్కడికి వెళ్ళి వద్దామని ఉంది.”
“పిచ్చి లక్ష్మీ! నాకు మాత్రం సంతానం కావాలని లేదా? సరే నీ ఇష్టం. 'నేనెందుకు కాదంటాను.. అలాగే వెళ్తాం” అన్నాడు విశ్వాసం లేకున్నా.
దేవుడే కనికరించాడో లేక ఇల్లాలి నొసటన సంతాన గీత రాసి ఉందో మొత్తానికి కానక కన్న సంతానంగా మల్లిఖార్జునరావు పుట్టాడు. ఆ దంపతులు అతి గారాబంగా "పెంచారు... అపురూపంగా ఇంకొకరిని ముట్టనివ్వకుందడా నిరంతరం చేతుల మీదే 'పెంచారు. ఏ మాత్రం ఆ పసికందుకు బాధ కలిగినా తల్లడిల్లిపోయేవారు. చీమ కుడితే పాము కుట్టినంతగా బాధపడేవారు. ఇది చూసి కొందరు 'అంత గారాబం చేయకండి మాస్టారు అంటే సహించేవాడు కాదు.
“నామాట వినండి” దీనంగా అంది లక్ష్మి,
జగద - అనువాదకథలు 7/7౯ డా! డింగరి నరహరి ఆచార్య
“ఏం అంటావు, ఎలా వినమంటావ్? వాడు చదువుతానంటే మాత్రం నాలో అంత శక్తి ఉండొద్దు” విసుగ్గా అన్నాడు మాస్టారు.
“అలా. అంటే ఎలాగండి. వాడి ఇష్టాన్ని కూడా చూడాలిగా, నచ్చని చదువు చదవమంటే ఎలాగో మీరే ఆలోచించండి” ..
“చూడు లక్ష్మీ! ఆ డిగ్రీ కాస్త పూర్తిచేస్తే ఎలాగోలా నేను వాడికో ఉద్యోగం సంపాదించొచ్చు. కానీ దాక్టరీ చదివించేంత సోమత మనకుందా?” అన్నాడు విచారంగా,
“మీరు తలచుకుంటే అదెంత పని” అంది లక్ష్మి వినయంగా,
“అంటే ఏం చెయ్యమంటావ్?” అన్నట్లుగా అర్ధంకాక చూశాడు భార్యవైపు దానికి సమాధానమన్నట్లు.
“ఏం. లేదు ఎలాగూ మనకుపయోగ పడకుండా "ఊళ్లో వున్న ఆ ఇల్లు అమ్మేయండి. ఆహా! తాతల నాటి ఇల్లు అమ్మడానికి మనసొప్పదని తెలుసు. అయినా వాడు ('ప్రయోజకుదైతే అంతకన్నా మించిందే కట్టుకోగలడు,*” అనునయంగా ఒప్పుకోమన్నట్లుగా ఉన్న ఆమె మాటల్ని విన్న మాస్టారు ఇష్టం లేకున్నా కొడుకు అఖీష్టసిద్ది కోసం ఇల్లమ్మేసి చదివించాడు కూడా.. ఎందుకు చేశాడా పని తనను ఉద్దరిస్తాడనేగా, ఈనాడు తనకు నిలువ నీడ లేకుండా పోయిందంటే కారణం ఎవరు? ఆ ప్రశ్న నరసింహం మాస్టారుకి గుండెమీద వెయ్యి ఏనుగుల బరువు వేసినట్లయింది, ఒక్కమారు నిట్టూర్చి ప్రక్కకు తిరిగాడు. భార్య నిశ్చింతగా నిద్రపోతోంది, “అమాయకురాలు” అనుకున్నాడు.
ఈ అమాయకతే కొడుకుని దూరం చేసింది. పై చదువులకి అమెరికా వంటి. దేశాల కెళ్ళేవానికి ఆవకాయ జాడీలు సిద్దం చేసిన అమ్మ అమాయకత్వాన్ని ఓదార్చాడు మల్లిఖార్జునరావు. కానీ మరో విషయం విదేశాల నుండి రాగానే పూర్తిగా మారిపోతారన్న ఇరుగు పొరుగు అంచనాలను కూడా తారుమారు చేసి ఎలా వెళ్ళాడో అలాగే బుద్ది మంతుడిలా తిరిగి వచ్చాడు,
తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని ఒప్పుకుని వనజ మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు. కోడలిని అతి గారాబంగా చూసుకోవాలని జడ దగ్గరనుండి బొట్టు దాకా సవరిద్దామనుకున్న లక్ష్మికి చికాకుతో చీదరించుకున్న కోడలితో ఎదురయ్యాయి చిక్కులు.
“అలా జడముందుగా వెసుకొని వంట చేస్తే ఎలారా? కూరల్లో అన్నంలో ఎక్కడ పడితే అక్కడ వంట ఇంట్లో వెంట్రుకలు పడవూ” అని కొడుకుతో ప్రతి చిన్న జగద- అనువాదకథలు 78 డా! డింగరి నరహరి ఆచార్య
విషయం చెప్పేది తనతప్పు లేనట్లు, మల్లిఖార్జునరావు మాత్రం ఏంచేస్తాడు. కొన్నాళ్ళు పెళ్ళానికి చెప్పి చూశాడు.. మార్పు రాలేదు. తల్లి ప్రతి విషయాన్ని తెచ్చి చూపడంలో “అమ్మా ఎలా ఉంటే నీకేమిటి?” అంటూ విసుగ్గా అన్న కొడుకును చూసి కంటికి రెప్పలా చూసుకున్న తనకొడుకేనా అని తెల్లార్లూ ఏడ్పింది ఆ తల్లి. ప్రతి చిన్న విషయానికి 'మడి' 'అంట్లూ అని అత్తగారంటే, మడి లేకుండా. శుభ్రత ఉంటే చాలు అనే కోడలు. ఇలా ఒకరికొకరు వాదులాడుతూనే ఉన్నారు. 'కరవమంటే కప్పకుకోపం విడవమంటే పాముకి కోపం' అన్న స్థితిలో ఆ కొడుకూ వంచేయలేకపోయాడు. పైగా హాస్పిటల్ నుండి రాగానే ఈ పితూరీలు వినడానికి విసుగ్గా ఉండ్కి ఆ కోపంతో ఏదో అనేవాడు. దాంతో ఆ తల్లి 'తన కొడుకేనా?” అని వాపోయేది భర్తతో చెప్పుకొని ఏడ్చేది. ఇంత చదువు చదివి వీళ్ళ కెందుకింత ఓపికుండదో అని మాస్టారు అనుకొనేవారు. భార్య బాధ చూడలేక ఆ మాటే అన్నారోసారి. “ఏరా! కంటికి రెప్పలా కాపాడిన. మీ అమ్మ మనసు నొప్పించడం బాగాలేదు” అని “అంటే? అమ్మను నేను కష్టపెడుతున్నా నంటున్నారా?” అని నిలదీసి అడిగితే ఏం 'చెప్పాలో తెలియక అవాక్కయిపోయాడు. “అమ్మ పెద్దది పాతకాలపుది. వనజ ఏదో ఆధునికురాలు, చదువుకున్నది. దాని ఆశలు దానివి. వాటికి ఆంక్షలు పెట్టకుండా వుంటే సరికదా” అని వాదిస్తున్న కొడుక్కి అద్దువచ్చి, అమ్మ పాతది కావచ్చురా, దాని ఆప్యాయత పాతది కాదు, పాతబడ్డదని మూలకి విసిరివేసే వస్తువు కాదు అమ్మ. ఆవు ముసలిదైనా అదిచ్చే పాడి ఎప్పటిలాగే రుచిగా ఉంటుందని తెలుసుకోరా? అని వివరించి, చెప్పాలని అనుకొనేవాడు. అయినా లాభం. ఉండదని తెలుసు కనుక చెప్పలేకపోయాడు. “అడ్డాలలో బిడ్డలుగాని గడ్డాలలో గాదే' అని భార్యకే ఇలా ఉన్న ఆ సంసారంలో కాశీయాత్రకు వెళ్తామని డబ్బడిగిన రోజున చిచ్చు సంభవించింది. “మీకేం కాశీ వెళ్తారు గయా. వెళ్తారు. డబ్బుకెంత ఇబ్బందవుతుందో మీరే మాత్రమయినా గమనిస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అన్న కోడలి మాటలకి జవాబు చెప్పకుండా ఉండలేకపోయారు మాస్తారు, “ఏమమ్మా! మేం యాత్రల కెళ్తేనే మీకు దబ్బుకిబ్బందా?” అని ప్రశ్నించాడు. అలా అంటారేం మామగారు. మీ వయసునాడు ఎన్నో తీర్థాలు, యాత్రలు తిరిగారుగా, కనీసం అలా ముచ్చటగా తిరిగి రండని మమ్మల్ని అనే బదులు ఇంకా మీరే తిరుగుతామంటే ఏం బాగు” అని మరోవంక చూసిన కోడలి వైఖరికి బాధపడ్డ మాస్తారు “చూశావురా! నీ భార్య మాటలు” అన్నారు, జగద- అనువాదకథలు 79 డా! డింగరి నరహరి ఆచార్య
ఇన్నాళ్ళూ ప్రతి విషయానికి తమనసహ్యంగా చూస్తున్న కోడలి ప్రవర్తన ఆయనలో దాగి వుండి ఈ రోజు బయటకు వచ్చింది. “ఏమిటి నాన్నా మీరూ మరీ చిన్న పిల్లల్లా!” అంటూ వెళ్ళిపోయాడు విసుక్కుంటూ, కొడుకు ధోరణి చూస్తూ విస్తు పోయారు. రాబోయే దు;ఖాశ్రువుల్ని ఆపేసుకున్నారు.
“భళీ! ఈ కొంపలో ఆయనకి క్షణం ప్రశాంతి దొరకడం కల్ల” అన్న కోడలి మాటలు హృదయంలో బల్లెంతో గుచ్చినట్లయింది.
చిలికి చిలికి గాలివానలా కోడలి బోధనలవల్ల దూరతీరలకి (ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళాడు. అయినా ఏమీ అనలేదు. అప్పూడవ్వుడూ పంపుతున్న మనియార్దర్లూ ఆగి ఆరేళ్ళయ్యింది. తాను జబ్బు పడ్డానన్నా రాలేదు. తన తంటాలేవో మళ్ళీ తానే పడుతున్నాడు, ఇలాంటి వాడిని ఎన్నో నోములు నోచి కన్నాడు. వీదేనా పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. తనకు గతులు చూపించేవాడు. భగవంతుడా ఎందుకిలా చేశావు. పుత్రులు లేని, వాళ్ళకు గతులు లేవని ఏందుకు తెలిపావు. ఆ గతులేమో కాని ఇప్పుడు మాత్రం తమను పలకరించే దిక్కు లేకుండా పోయింది. “పున్నామ నరకాత్రాయత ఇతిపుత్ర:' 'అపుత్రస్య గతిర్నాస్తి' అని ఎవరో అరుస్తున్న వాక్యాలు అప(శ్రుతుల్లా వినపడుతున్నాయి. ఆయన అంతరాత్మ 'పుత్రస్యాపి గతిర్నాస్తి అని మూలిగింది. పుత్రులున్నా కొందరికి గతులు లేవని నవ్వుకొన్నారు, వర్షంవెలుస్తుంది. చీకట్లు తొలగి కొంత వెలుగు ప్రసరిస్తోంది, ఆ తెల్లవారుజామునే గతంలో లేని గతి ఇప్పుడెక్కడిదనుకుంటూ మగత నిద్రలోకి జారుకున్నారు మాస్టారు నరసింహం,
ఆదివారం ఆంధ్రభూమి నవంబర్ 19097 జగద- అనువాదకథలు 80 డా! డింగరి నరహరి ఆచార్య
పరిచయం పేరు ఏడా! డింగరి నరహరి ఆచార్య తల్లదం(డ్రులు కీ॥1శే!॥గోదాదేవి - వేంకటాచార్యులు [గ్రామం £మల్గ్లారర (వేములవాడ మండలం) (ప్రస్తుత నివాసం 10-8-3221, విద్యానగర్, కరీంనగర్. ఫోన్; 0878-2256408, సెల్: 9866500184. విద్యార్టతలు 2 బి.ఓ.యల్. (వ్యాకరణ సంస్కృత) ఎం.ఏ.(తెలుగు, పండిత శిక్షణ, సాహిత్య సుధాకర్ (హిందీ) పి, హెచ్.డి. ఉన్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగం: $ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు ఎస్, ఆర్.ఆర్, డిగ్రీకళాశాల, కరీంనగర్. ముద్రితాలు వ సుభద్రా పరిణయం (గేయకావ్యం)-3975 వీచిక (వ్యాస సంపుటి)2001 వేళ్ళు (వచన కవితా సంకలనం) 2005 అభిరామం మరియు సియాటిల్ అందాలు పద్య మరియు గేయకావ్యాలు-2007 వానమామలై జగన్నాథాచార్యుల రచనలు భాషా సాహిత్య పరిశీలన (సిద్ధాంత గ్రంధం)2008 శతక సుధ (పద్య) 2010 అవార్చులు | పురస్కారాలు న 1967లో సెవెన్ స్టార్ సిండికేట్ వారి నాటక పోటీలలో ప్రత్యేక ఉత్తమ నటుడి..అవార్డు. 1997 కరీంనగర్ జన్మభూమి ఉపన్యాస పోటీలలో రజతపతక బహుకరణ, 1998లో రాష్ట ప్రభుత్వ ఉత్తమఉవాధ్యాయ అవార్వు 2000లో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వారి గ్రామీణ కళాజ్యోతి అవార్డు, వ!
2005లో జి.వి. ఆర్.కల్చరల్ ఫౌందేషన్(హైద్రాబాద్) రాష్టన్థాయి కవితల పోటీలలో ప్రథమ బహుమతి 2007లో “మై గిఫ్ట్ పురస్కార్ (మై గిఫ్ట్ యువసంస్థ కరీంనగర్ జిల్లా) 2008లో ఉభయ భాషా ప్రవీణ (కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల, జగిత్యాల) 2011 బొందుగులపాటి ఆహాల్య సుంద(ర్రావు స్మారక సాహితీ గౌతమి: అవార్డు. (పిహెచ్ డి.సిద్దాంత (గ్రంధానికి) 2018 ధర్మనిధి పురస్కారం, సర్వవైదిక సంస్థానం యజ్ఞవరహ క్షేత్రం, కరీంనగర్, ఇతర విశేషాలు ఫ నాటికలు, ఒగ్గుకథలు, ప్రసంగాలు ఆకాశవాణి 'హైదరాబాద్, వరంగల్ కేంద్రాల నుండి కథలు, వ్యాసాలు, కవితలు, పలుపత్రికల్లో ('ప్రచురితాలు, ళా వ
(౫౧౩18166 51016 1౧ 191400) = లగ ల5/౧ర2గ గీ2జగిడగ ఉంగిడగిచి చ. టి ఈ కథల్లోని సంఘటనలు పాత్రలు ఎంతో . సహజంగా వాస్తవికంగా రూపొందాయి.ఎక్కడా .. . అసహజమైన పొత్రలు కాని' అవాస్తవికమైన [: సంఘటనలు కాని కనిపించవు. అనువాదం. ప్రవాహశీలంగా జరిగింది. . దాః! అంపశయ్య నవీన్ - / . అ - ॥ ఇ జ + = ను =
“అది కాదురా! అపరిచితుల మధ్య ఏలా ఉంటాడురా? చిన్న పిల్లవాడు. వాడికింకా ఏం తెలియదు” విచారంగా ధ్వనించిందామె. స్వరం
“అపరిచితులేంటమ్మా! మేం కూడా అక్కడే ఉంటాంకదా. కాకపోతే కొన్ని గంటలు మాత్రమే. ఇలా దూరంగా ఉంటే వాడు మమ్మల్ని పూర్తిగా మరచిపోయేట్టున్నాడు. రానురాను మా మీద (్రేమ కూడా లేకుందా పోతుంది వాడి మనస్సులో” కొంచెం బాధతో భవిష్యత్తు నూహించుకుంటూ అన్నాడు,
“ఇదంతా ఎందుకండీ! వాడినే అడగండి. అమ్మా నాన్నలతో ఉండకుండా ఉంటాడా?” అంది ఊర్మిళ. అత్తగారు తన కొడుకును తనకు ఇవ్వడానికి పెట్టే అభ్యంతరాలకు కొంచెం మనస్సు నొచ్చుకుంటూ.
ఆ మాటలకు “అనిల్” అని కొడుకుని పిలిచాడు రమేశ్ “ఏంటి నాన్నా” అంటూ పరుగెత్తుకొని వచ్చిన కొడుకుతో,
“ఏరా! మాతో వస్తావా?” అని అడిగాడు.
“ఓ[7 అంటూ అమ్మ ఒడిలో తల పెట్టి అటు ఇటు తిప్పుతూ చెప్పాడు అనిల్ అమాయకంగా,
“ఏరా! నన్ను వదలిపెట్టి ఉంటావా? నేను లేకుండా అక్కడ ఉండగలవా?” మనవళణ్ణి అడిగింది లక్ష్మీ
“ఆ, అమ్మా నాన్న ఉంటారుగా అక్కడ” అని తిరిగి అమాయకంగా అన్నాడు అనిల్,
“అక్కడ చాలామంది ఉంటారు. రద్దీగా ఉంటుంది. బస్సులు, కార్లు బాగా తిరుగుతుంటాయి. అంతా అల్లరల్లరిగా ఉంటుంది. బడికెట్లా వెళతావు? బడి అయిపోయాక ఇంట్లో ఒక్కడివే ఎలా ఉంటావు?” అని అనిల్‌కి ఆ వాతావరణం భయం కలిగించేలా అడిగింది.
అత్తగారి ధోరణి ఊర్మిళకు నచ్చలేదు. “ఏమిటీవిడ. తమతో రమ్మంటే రాదు. ఇక్కడే ఈ యింట్లోనే తన జీవితం వెళ్ళాలంటుంది. అక్కడ. ఆచార సంప్రదాయాలు నడవవని భయం, ఈ మునలాళ్ళతో ఇదే తంటా' అని తన మనన్సులో రుసరుసలాదుకొంది.. అనిల్ బడికి అమ్మే నన్ను తీసుకెళుతుంది” అని అమ్మ ముఖం చూస్తూకదూ”! అన్నట్లుగా అన్నాడు. జగద- అనువాదకథలు 3ెర్ డా! డింగరి నరహరి ఆచార్య