Telugu గుర్రపుడెక్క - anilvaranasi/indianlanguages GitHub Wiki

క " | “ఓ 1కు . లా క! 7, వ ల్‌ గ | వా య న; చ తో ఆ! ఇ, ఇ న , ా అన్‌ ం శ్‌ వసస న. - అనేకము. “ఎ! ల లో యు ఇ జ శే! క్‌ లన టం. గ్‌! వ = జే -్‌ ఇ శః ॥ ఇ ై ఎల కీ న ల 2 (| న వాన... మ భ్‌ గ ॥ . న /. 1 లా క శ్రే || చే (| గేజ్‌ తు. _ 1 చ వ నీతికి వీ చ | క లే | కా లక్‌ క క ( =. తా 1 క |! షే చా? .. క. , (11 ఇగ. శ టు. ॥ - “ఎ యూ = ల హా 1 | వ శ కే అన్యే బ్‌ ల ఎం స. = న్‌ క్ర ఖ్ధి జు ॥ శ యః వ్‌ ! స వాతో (రై ప్‌ న. లకీ ఆ యు. (స్మ ల వ్య శం వ = ః న ణా శా గ న = అన గ క 1 = ఇ ా ఎ ఇ లి (ఇ ఎ క్‌ - క ప టై 1,1 | _ ననా | .- క్‌ 1?ణ్లె గ ఫి కం న క్‌ వజ! | ా , తీ క ఇకా డా - ౯ ప చ్‌ శ నే ఓ కే 2 క న! త్‌ | ్‌ యః కే క = చ ఆ ంి జవ " సై వ. న. జ శీ క 1 ఇ | శి - _ ల్స్‌ + జ ర్‌ _ న్‌: (1 / క శ్‌ % క న లా - రు .. వ ఇ 1 =. శే " వ జు ఇ " స / క ణా ల ో ఠః లా! క కీ ఫ్‌. (] వ క. తే ఛే ౪1 | |! గ. యా *4 జై ఇ జ , జీవ సం క క = బక న. నా | ల _ై త క్‌. ల శా ౬ ల కో ల గ వ న్‌ ॥ 1 తే ళం క న అనాం టై. వాయు. షు. టే. వే జీ న ్‌ శమ | స , కా. ఫీ | | మ లా ల గ్‌ గా క, క లో నం “ఎ. | , న్స ౧ !. క 11 న నలి జ ట్ల లా! . క. శ " స ( - ఎ ఎతత్‌, టై కం పు: సు [వ 5 కూ చ్‌ చ . [య అల నత ఖే 5. తీ శ న! శీ వ్‌ జా - ( _ క న = మా న = చ లో న్‌ కా త్‌ | _ ర శై / 7 || , క 4 న్‌ ళ జ ర్‌ ఖే “వ శ (౧ ఆకా! సక | న్‌ క. తెకన్యుటా--. . యో! ల శో ను న జి ప ట్‌ జై కం కీ! ౯ వ న ఆ వ జా | హై న మ | ॥ | సడక్‌. శ జే ! త్రో ! వ ఇక న న్‌ నే ఫి) హై దా మీ జే ; న ౨ "౬౯ గ్‌ న క లీ సంకల ప వ్‌ శన, | మా న! ట్రే |] ల్‌ ఎ క . ఆ షో ె త ఫి 12 [౯ న్‌! కా వ న న జా హా కా లా చనా హై చ శ న్న వ... న స మై. వ జ్‌ / | పే తే న! య [0

  • [ల “వ కే | శ కఫం. (= ను *' వశష క్‌ ( బ్‌ క అ

గురపుటు అపుటఎక్క నవల సలీం తా శ్రీ విజయలక్ష్మి పబ్లికేషన్స్‌ విజయవాడ

గుర్రపుడెక్క నవల (నవ్య వారపత్రికలో “అడవిపూలు"” పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల) సలీం కం ముద్రణ సెప్టెంబరు, 2013 య గ్గ ల ఆ

ర లో ప్రతులు 1000 (7 గ

/0 ఎల 120/-

న్‌

ముఖచిత్రం : శ్రీ జి. శేషగిరిరావు “బా ర

రీ

వో ప్రతులకు చ్‌ విశాంలాంధ్ర బుక్‌హౌస్‌ - అన్ని బ్రాంచీలు లి డ్‌ నవోదయ బుక్‌హౌస్‌ - కాచిగూడ, హైదరాబాద్‌ గ్య జ భ్‌ ప్రజాశక్తి బుక్‌హౌస్‌ - చిక్కడపల్లి, హైదరాబాద్‌ సలీం, ఫప్తాట్‌ నెం. 306, జె.బి. అపార్ట్‌మెంట్స్‌, దోమలగూడ, హైదరాబాద్‌. ముదణ : ప్రగతి ఆఫ్‌సెట్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

ము ందుగా, ఈతి

చం అడివి భిద్రలం... ఈ అడివిలోనే వుట్టాం.. ఈ తల్లి ఒడిలో పెరిగాం... ఈ అడివిలోనే నత్తాం. వెబుత్వం ఎన్ని లభచ్చలిబ్దినా ఈ అదివితల్లినొదలం దొరా” అని నిష్టుర్షగా చెప్పిన అప్పావూర్‌ చెంచుగూడెం పెద్దమనిషి ఎనభై యేళ్ళ తోకల మల్లయ్యకీ...

నల్లమల అదవిలో దాదాపు ఇరవై కిలోమీటర్ల లోవలున్న అట్సువూర్‌ వెంట, బౌరవ్మ చెరువు, ఈర్లపెంట, మేడివల్గల పెంట, రాంవూర్‌ చెంచుగూదేలకి వీల్చుకెళ్ళి తమ చెంచుల బీవన విధానాన్ని సంన్భృతినీ, భాషనీ, అదవినీ వరిచయం చేసిన తోకల గురవయ్యక్తూ భూమని రవీందకూ...

చెంచుల గురించి చళక్ళటి వ్యానాన్ని రాస్కి విల్డువన సమాచారాన్ని అందించిన భూమని రవీం(దకూ, (ప్రధానోవాధ్వాయులు, (వ్రభుత్వ గిరిజన నంక్షేమ ఆ(శమ వొఠశాల, పెదమంతనాలగూదెం, దోర్నాల మరియు దాసరి చిన్న మూగన్నకూ, టీచర్‌ ప్రభుత్వ (ప్రాధమిక వాఠశాల, చెర్లో చెంచుగూడదెం, య(ర్రగొందపాలెం...

'అదవివూలు” పేరుతో నవ్వ వారవ(త్రికలో ధారావావొకంగా వెలువరించిన సంపాదకులు శ్రీ జగన్నాధ శర్చగారికీ...

శిథిలమైన ఒండ్రుగొంద రాజ్యం గురించి చెప్పిన చరిత్రోపన్వానకులు శ్రీ సూర్వకుమార్‌ గారికీ...

ముఖిబిత్ర కల్పన చేసిన (శీ జి శేషగిరిరావు గారికీ...

(ప్రగతి వ్రీంటర్స్‌ అధినేత శ్రీ నరేంద్ర గారికీ...

ధన్యవాదాలు...

అ గుర్రపుటెక్క

౦లిళ్ళు ప్రయాణిస్తున్న కారు షంషాబాద్‌ ఫప్లయ్‌ఓవర్‌ దాటి కల్వకుర్తి వైపుకు దూసుకుపోతోంది. దాని వేగంతో పోటీ పడుతూ సూర్యకుమార్‌ ఆలోచనలు సాగుతున్నాయి. కదార్‌నాధ్‌కి విసుగనిపించింది. డైవర్‌ మస్తాన్‌ పెట్టిన రఫీ పాటల క్యాసెట్‌ అతని మనసుని తాకటం లేదు. “బ్యాంక్‌లో బోలెడు పని మిగిలిపోయింది. నెను రాలేను మొగ్రో అని మొత్తుకున్నా వినకుండా లాక్కొచ్చాడు సూర్యకుమార్‌. ఇపుదేమో తపస్సమాధిలో ఉన్న మునిలా మౌనంలో మునిగిపోయాడు.

నిద్రపోయేటప్పుడు తప్పు నోటికి విశ్రాంతినివ్వని సూర్యకుమార్‌ మౌనంగా ఉండటమ కేదార్‌నాధ్‌కి మింగుడు పడటం లేదు. ఒకట్రెండుసార్లు తల తిప్పి మాట్లాడడానికి ప్రయత్నించి, సూర్యకుమార్‌ కళ్ళు మూసుకుని దిర్దాలోచనలో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

వాళ్ళిద్దరిది ఒకటే వూరు... కలిసి చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక బ్యాంకు పరిక్షలు రాసి కెనరా బ్యాంకులో క్లర్క్‌ గా జాయినైన కేదార్‌నాథ్‌ ప్రస్తుతం హైద్రాబాద్‌ లోని గాంధీనగర్‌ బ్రాంచికి మేనేజర్‌గా పన్ఫెస్తున్నాడు. సూర్యకుమార్‌ హిస్టరిలో యం. ఏ పూర్తిచేసి నకిరేకల్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆర్కియాలజీ అంటే అమితాసక్తి. పురాతన శాసనాలు... లిపి మీద రీసెర్చ్‌ చేశాడు. ఏదైనా శాసనం తవ్వకాల్లో బైట పడితే దాన్ని చదవడానికి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు యితని సాయాన్ని తరచూ తీసుకుంటూ ఉంటారు.

“మన ప్రయాణం వృధా పోదుగా ” అన్నాడు కేదార్‌నాథ్‌ ఏదోలా సంభాషణ మొదలెటై ప్రయత్నంలో.

ఆ మాటకు కళ్ళు తెరిచి చూశాడు సూర్యకుమార్‌. అతని కళ్ళు నిద్ర లేమి వల్లనేమో ఎ(ర్రగా ఉన్నాయి. “మనం పొరపాటు పడటానికి అవకాశమే లేదు. డా. హైనీ తన దైరీలో రాసింది నిజమైతే మనం వెతికే వూరు యిక్కడెక్కడో దగ్గర్లోనే ఉండాలి” అన్నాడు.

మరలా తనే “పద్దెనిమిదవ శతాబ్దంలో దా. హైనీ మచిలీపట్నం నుంచి గోల్కొండ

తానే

గుర్రపుడెక్క నలీ౦ వస్తూ తన డైరీలో రికార్డ్‌ చేసినదాన్ని బట్టీ, రాబర్ట్‌ షోవెల్‌ రాసిన 'ఫర్‌గాటెన్‌ ఎంపయిర్‌' అనే పుస్తకంలో రాసిన విషయాల్ని బట్టి మహబూబ్‌ నగర్‌ జిల్లా లోని అమరాబాద్‌ మండలంలో ఉన్న మన్ననూర్‌ అనే గ్రామానికి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో మన్నుగొండ అనే రాజ్యం ఉందేది. దాన్ని పద్మనాయకుల వంశస్టుడైన అనపోతానిడు పరిపాలించిన కాలంలో శత్రు దుర్చిధ్యమైన కోట కఠల్స్పంచాడు. కొండమీద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలూ పునస్కారాలు నిత్యం జరిగేవి. కృష్ణదైవరాయల దండయాత్ర తర్వాత ఆ రాజ్యం అతని వశమైంది. కాలగతిలో ఆరాజ్యం శిధిలమై పోయింది.” అన్నాడు.

“అలాంటప్పుడు యిప్పుడు మనం వెతికినా ఏం దొరుకుతుంది?”

“మనకాకోట శిధిలాలు దొరికినా చాలు...నా శ్రమ ఫలించినట్లొ

“ఇదేదో ఆర్మియాలజీవాళ్ళకు చెప్తే వాళ్ళు చూసుకుంటారుగా కుమార్‌... మనకెందుకు చెప్పు” కేదార్‌నాథ్‌ స్వరంలో విస్పించిన నిరుత్సాహానికి దెబ్బతిన్నట్లు చూశాడు కుమార్‌.

“అజంతా ఎల్లోరా గుహల్ని ఓ ఆంగ్లేయుడు కనుక్కున్నాడని అందరం చెప్పుకుంటున్నాం కదా. అలానే శిధిలమైన మన్నుగొండ రాజ్యాన్ని కనుక్కున్న కీర్తి నాకు దక్సాలనేదే నా తాపత్రయం. దీని కోసం ఎన్ని రాత్రులు శ్రమించానో...ఎన్ని పురాతన గ్రంథాల్ని తిరగేశానో నీకు తెలీదు. నువ్వు రచయితవి. కీర్తికాంక్ష గురించి నీకు వేరే చెప్పాలా... చరిత్ర పుస్తకాల్లో నా పెరు చిరస్థాయిగా నిలబడిపోవాలంటే మనం దాన్ని కనుక్కుని తీరాలి. ఆర్మియాలజీవాళ్ళకి చెప్తె శ్రమ నాది క్రెడిట్‌ అంతా వాళ్ళదౌతుంది.”

షెర్లాక్‌ హోమ్స్‌ ఏదైనా కేస్‌ని పరిష్మరించేటపుడు తన వెంట డాక్టర్‌ వ్యాట్సన్ని తిప్పు కున్నట్టు, సూర్యకుమార్‌ యిలాంటి పరిశోధనలు చేసేటపుడు కేదార్‌ని వెంట పిల్చు౭ళ్లాడు. 'మనం చేస్తున్న పనిని అక్షరబద్ధం చేయాలి. చరిత్ర నీలాంటి వాళ్ళ వల్లే ముందు తరాలకు అందించబడ్డుంది. నువ్వు నవలా రచయితవి కదా. చెప్పాలనుకున్న విషయాన్ని రమ్యంగా చెప్పటం నీకే సాధ్యపడ్డ్తుంది అంటాడు. కల్పనతో ఓ నవల రాయడానికి చరిత్రని రాయడానికి చాలా తేడా ఉందని చెప్పినా ఒప్పుకోడు.

చిన్ననాటి స్నేహితుణ్సి చిన్నబుచ్చలేక వెంట వెళ్తుంటాడు కేదార్‌...రచయితగా కొత్త

గుర్రపుడెక్క సలీర విషయాల్ని, కొత్త పరిసరాల్ని అక్కడి మనుషుల జీవన విధానాల్ని పరిశీలించే అవకాశాన్ని వదులుకోలేకపోవటమూ ఓ కారణమే...

ఆమనగల్లు గ్రామం దాటాక మన్ననూర్‌ గ్రామాన్ని చేరుకున్నారు. ఓ చెట్టుకింద కారునాపించి యిద్దరూ దిగారు.

“యిక్కడెవర్నయినా వాకబు చెసి ముందుకు కదలటం మంచిది. ఈ వూళ్లో అరవై యేళ్ళు దాటిన ముసలోళ్ళని కదిపితే మనకవసరమైన సమాచారం దొరికే అవకాశముంది” అన్నాడు సూర్యకుమార్‌ ముందుకు నడుస్తూ.

ఓ యింటి ముందు నిలబడి “ఎవరూ లోపల” అంటూ పెద్దగా అరిచాడు.

దాదాపు ముప్పయ్యెళ్ళ లోపున్న ఓ యువకుడు బైటికొచ్చాదు. మాసివోయి, చిరిగిపోయిన బసీను... నల్లరంగు ప్యాంటు... రోజులో ఎక్కువ సమయం ఎండలో గడపటం వల్లనేమో నల్లగా పూతపూసినట్లున్న మొహం... అందులో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్న బెదురు...

“మము గవర్నమెంటు ఆఫీసోళ్ళం కాదు... భయపడకు” అని సూర్యకుమార్‌ అభయం యిచ్చాక అతనో కొద్దిగా జీవకళ కన్పించింది. నమ్మాలా వద్దా అనే సంశయంతోనే యిబ్బందిగా నవ్వడానికి ప్రయత్నిస్తూ 'కరెంటాపీసోల్లో బూమిశిస్తు వసూలోల్లో అనుకున్నా సారూ... మీర్యాడనుండి సారూ” అన్నాడు.

“మాది హైద్రాబాద్‌లే. ఈ వూళ్లో నువ్వెన్నాళ్ళనుంచి ఉంటున్నావు?” అని అడిగాడు సూర్యకుమార్‌.

“నేనిక్కడే పుట్టా సారూ, బుద్ది తెల్సినకాణ్ళించి యిదె వూల్లో ఉంటున్నా. ఎగసాయం సేస్తా. నాలుగెకరాల పొలం ఉంది. మెట్ట. నాకు సదువబ్బలేదు. అయ్య కూడా రైతే. నా పెంద్లయ్యాక నేనూ మా అన్న ఏరుపడ్డాం. మా అయ్య అన్నతో ఉంటడు. అవ్వ నాతో ఉంటది”

“తే ఈ వూరిలో ఉన్న మనుషుల గురించి నీకు బాగానే తెల్సి ఉంటుంది”

“గిదెంత వూరని సారూ... వంద గడపలు కూడా లేవాయె. సదూకున్న పోరగాల్లంతా పట్నాలకి వలస బోతుండె. యింగ మిగిలింది బూమిని నమ్ముకున్న నాబోటోళ్ళు...

గుర్రపుడెక్క నీలీర పిల్లలు వదిలేసినా పల్లెని వదల్లేని ముసలీ ముతకా. నీకెవురి సమాచారం కావాలో సెప్పు. సిటికెలో అన్ని ఇవరాలు సెప్తా”

చదువురాని పల్లెటూరివాదైనా సమాధానం కవితాత్మకంగా చెవ్పాడనిపించి ముచ్చటపడిపోయాడు కేదార్‌. “మీ వూళ్లో పండిపోయిన వృద్ధులు ఎంతమంది ఉంటారు?” అని అడిగాడు.

అతను కేదార్‌ వైపు బిత్తర చూపులు చూశాడు.

“నువ్వు కధల భాష మాట్లాడితే అతనికర్ధం కాదు” అని అతని వైపు తిరిగి “డెబ్బయ ఎనఖై యేళ్ళ ముసలోళ్ళు ఎంత మంది ఉంటారు? వాళ్ళ వివరాలు కావాలి” అన్నాడు సూర్యకుమార్‌.

అతను కొద్దిసెపు తల గోక్సొని, “మా మల్లవ్వ ఉంది సారూ...కల్లు కన్పడవ్‌. 'సెవులు యిన్సడవ్‌.. ఎనబై పైనే ఉంటది వయసు. గిదే దార్న పోండ్రి. జర ముందు౩ల్లి ఎడం వైపుకు మల్లితే సాలు ... మూడో గుడిసె... ఎవుర్నడిగినా సెప్తారు” అన్నాడు.

సూర్యకుమార్‌ మొహంలో వింత వెలుగు... నేను చెప్పాగా...మనం లక్ష్యానికి దగ్గరగా ఉన్నామని... అనేలా కేదార్‌ వైపు చూసి తలెగరేసి ముందుకు కదిలాడు.

“చాలా ధ్యాంక్స్‌... నీ పేరేమిటి?” అతనికి వీడ్కోలు చెప్తున్నట్లు చేయి వూపుతూ అడిగాడు కేదార్‌.

“నా పేరు కల్లు ఈరయ్య ...యింటి పేరు కల్లు... గానీ నెకల్లు తాగ” అన్నాడు నవ్వుతూ... కేదార్‌ కొంత దూరం వెళ్ళాక మెల్లగా “గుడంబా తాగుతా సారూ "అని వెనకనుండి విన్సిస్తే నవ్వుకున్నాడు... హాస్యప్రియత్వానికి చదువుతో సంబంధం లేదు. అది కొందరి జీన్స్‌లో స్వతహాగా ఉంటుందెమో అన్పించింది కేదార్శి.

మధ్యలో ఒకరిద్దర్ని వాకబు చేసి ఆ గుడిసె చెరుకున్నారు.

ఆమె మంచంలో పడుకుని ఉంది. ముగ్గుబుట్టలాంటి తల... చప్పి దవడలు... ముడతలు పడిన శరీరం... తను కాకుండా ఆ గదిలో యాభై యేళ్ళ మరో ఆవిడ వొయ్యి దగ్గర కూచుని వంట చేస్తోంది.

“మల్లవ్వంటే నువ్వనా?” అని అదిగాడు సూర్యకుమార్‌.

రి

గుర్రపుడెక్క సలీర

ముసలావిడ నుంచి సమాధానం రాలేదు.*వంటి చెస్తున్న స్రీ “బె సారూ.. ఏం పని ఉండాది మా అత్తతో” అంటూ పొయ్యి దగ్గర నుంచి లేచొచ్చి అడిగింది.

“ఆమె చిన్నప్పటీ విషయాలు కొన్ని అదగాలి”

“ముసిల్లానికి యిన్పడదు. గా సిన్నప్పటి యిసయాలు గిప్పుడెందుకు సారూ. టీవీ లో సూపితారా”

“కాదు. చాలా పాతకాలం నాటి విషయం ఒకటి అడగాలి. నా పరిశోధన కోసం అవసరం. చిక్కొచ్చిపడిందే.. మరిప్పుడెలా”

పరిశోధన కోసం అనే మాట అర్ధం కాకున్నా ఏదో చాలా ముఖ్యమైన అవసరమనేది ఆమెకర్ధమైంది. “ఫికర్‌ సేయకుండ్రి. నేనున్నాగా. మీకేం కావాల్నో అడగండ్ర అంటూ ఆమె మల్లవ్వ మంచం దగ్గర౭ళ్ళి నిలబడి, “ఈ సార్లు నిన్నదో అడుగుతుండ్రు” ఆమె చెవి దగ్గర నోరు పెట్టి పెద్దగా అరిచింది.

“తన చిన్నప్పుడు మన్నుగొండ అనే వూరిపేరు ఎప్పుడైనా విన్నదేమో అదుగమ్మా” అన్నాడు సూర్యకుమార్‌.

ఆమె అదే ప్రశ్చని ముసలావిడ చెవిలో పెద్దగా చెప్పింది.

మల్లవ్వకి సరిగా విన్సించలేదు. “వెండి కొండనా... ఎవరూ” అంది.

కోడలు విసుక్కుంటూ వాళ్ళకు విన్సించేలా “చెవిటి మాలోకం... సచ్చిపోతున్నా సారూ" అంటూ ఆమె చెవిలో మరలా “మన్ను గొండ... మన్ను గొండ” అని అరిచింది.

మల్లవ్వ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది.

కోడలికి అనుమానమొచ్చి “యిన్సడిందా” అని అడిగింది.

“యిన్సడిందిలేవే... గట్ల అరుస్తవెందుకు... మన్నుగొండ ... యిన్న పేరే... యాదిన్నానో యాదికి రాటంలా... ఆలోసిత్తున్నానే... ఆలోసించనీవా...” మల్లవ్వకి కోపం వచ్చినట్లుంది.

ఆ పేరు విన్నపేరే అని మల్లవ్వ అనటం ఆలస్యం, గడపబైట నిలబడి ఉన్నవాడు కాస్తా ఉద్విగ్నాన్ని ఆపుకోలేక ఆమె మంచం దగ్గరకెళ్ళి “తొందరగా ఆలోచించి చెప్పు ... ఎక్కడుంది ఆ వూరు... ఎంత దూరంలో ఉంది? యిప్పటికీ ఉందా... పేరు అదేనా... మారిపోయిందా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సూర్యకుమార్‌.

గుర్రవుడెక్క నలీర

“సారూ... నా అత్త తేడా మదిసి...నువ్వలా కంగారు పెడ్తి నోరే యిప్పదు. గప్పుడు బెమ్మదేవడు దిగొచ్చినా సచ్చిందాన్లా పడుకునిపోద్ది. జర ఆగుండ్రి. నేనున్నాగందా” అంది.

మల్లవ్వ తలని కోడలి వైపుకి తిప్పి “గిప్పుడు జర యాదికొచ్చింది. మా తాత సెప్తే యింటం తప్ప ఆ వూరు నేను సూళ్లా.”

“మీ తాతగారిది ఆ వూరేనా” అని సూర్యకుమార్‌ అడిగిన ప్రశ్నని ఆమె కోడలు చెవిలో పెద్దగా చెప్పింది.

“మా తాతవాల్లది పక్సూరని సెప్పేవాడు. ఆల్ల తాతలనాటి జమానాలో మన్నుగొండలో మడుసులుందేవాల్లనీ ఆ తాత సిన్నప్సుడె ఆ వూరంతా వల్లకాడైందని సెప్పినట్టు గుర్తు”

సూర్యకుమార్‌ మొహంలో నరాలు తెగిపోయేంత ఉత్మంఠ...“యిక్కడినుండి ఎంత దూరమో అడుగు” అన్నాడు ఆవిణ్సి తొందరపెట్టెస్తూ,

“ఈణ్దించి తూరుపు దిక్కుకి పొద్దుగల్ని ఎత్త ఎండ నడినెత్తికొచ్చి యేలకి ఆ వూరొచ్చుద్ది.

_ గిప్పుదక్కడ వూరెక్కడుందీ... మా తాత బతికున్న దినాల్లోనే సుట్టూతా పెద్దపెద్ద సెట్లన్నీ పెరిగి అదవైందనీ, సిరుత పులులూ పాములూ తిరుగాడ్తాయనీ సెప్పుకొంటుంటే యిన్నా” అంది మల్లవ్వ,

“థ్యాంక్స్‌ మల్లవ్వా. మీ అత్తకు థ్యాంక్స్‌ చెప్పు...నెను రాసే పుస్తకంలో తప్పకుండా మీ అత్త పేరు రాస్తానని చెప్పు” సూర్యకుమార్‌ పసిపిల్లాడిలా సంబరపడిపోవటం చూస్తుంటె కేదార్‌కి నవ్వొచ్చింది.

ఆ యింటినుంచి వడివడిగా బైటికొచ్చి “కేదార్‌... తొందరగా పోదాంపద... యింతకీ తూరుపెటు” అన్నాడు సూర్యకుమార్‌.

అతని కంగారు, తొందరపాటు చూసి నవ్వకూడదునుకొంటూనే నవ్వాడు కేదార్‌.

“నీ యిష్టం వచ్చినట్లు మనసారా నవ్వుకో... మనం ఆ వూరు కనుక్కున్నాక నా పేరు చరిత్ర పుస్తకాల్లోనో ఆర్కియాలజీ పుస్తకాల్లోనో చూసి అప్పుడు తాపీగా ఈర్ష్య పడుదువుగాస” అన్నాడు.

“ఆ పేరు పక్కన నా పేరు కూడా ఉంటుంది”

గుర్రపుడెక్క సలీర

“ఆశ... ఏదో స్నేహితుడివికదాని అందునా కధలో కవిత్వాలో గెలుకుతుంటావని పిల్చుకొచ్చా. నాకొచ్చే కీర్తి ప్రతిష్టల్లో భాగం యివ్వమంటే కుదరదు. ముందే చెప్తున్నా... తర్వాత తకరారు రాకూడదు” క్వాలిస్‌ వైపుకి నడుస్తూ అన్నాడు.

“సరే... అలాగే కానీ. నా స్నేహితుడికి పేరు రావటంలో నా సహకారంకూదడా ఉందన్న తృప్తి కన్నా ఈ పేరు ప్రతిష్టలు ఏవాటి”

“అబ్బ... రచయితవి అన్పించుకున్నావు... ఎంత టచింగ్‌గా చెప్పావో... ఈ మాటని గుర్తు పెట్టుకుంటాలే” అన్నాడు హాయిగా నవ్వుతూ.

రోడ్డుని వదిలేసి తూర్పు వైపుకి పోనివ్వమని (డ్రైవర్‌కి చెప్పారు. సరైన దారి లేకపోవటం వల్ల క్వాలిస్‌ మెల్లగా పోతోంది. కొంత దూరం వెళ్ళటం... ఏదో ఒకటి అద్దు రావటం... మళ్ళా వెనక్కి తిప్పి చుట్టూ తిరిగి... యిలా నానా అవస్ట్థలూ పడి దాదాపు పది మైళ్ళ దూరం వచ్చాక ఓ కుగ్రామం కన్పించింది.

మర్రిచెట్టుసీడలో యిద్దరు వ్యక్తులు పులీ మేక ఆడుతున్నారు.

“యిక్కడికి దగ్గరలో ఏదైనా అడవుందా?” వాళ్ళ దగ్గరకెళ్ళి అడిగాడు సూర్యకుమార్‌.

“అడవి సంగతి తర్వాత యిక్కడ నా మేకని పులి మింగేయబోతాంది” అన్నాడు ఒకతను. .

మరొకతను నవ్వుతూ, “సారూ...ఆ అగపడే తుమ్మ సెట్లు దాటుకుని రెండు మైల్లు పోతే అదడవొస్తది. అందులో నిజమైన పులులుంటాయి” అన్నాడు.

“మీ వూళ్లో ఎవరైనా ఆ అడవిలోకి వెళ్ళారా?”

“అడవి మద్యలోకి ఎల్లే దైర్నం ఎవ్వరికీ లేదు. అందులో పాములు, సిరుతపులులు, ఎలుగ్గొధ్గు దండిగా ఉన్నాయంట. కొద్ది మంది ఎల్లి తిరిగి రాలేదు. ఎలుగ్గొడ్లు సంపేశాయని అందరూ అనుకున” అన్నాదొకడు.

“అసలు రగస్యం అది కాదెహె. పట్నం నుంచొచ్చిన సారు వాల్లకి నిజాలు సెవ్వాల” అంటూ రెండో అతను “సారూ...ఆ అడవిలో మనుసుల్ని పట్టుకు పీక్కు తినేవాల్గున్నారంట. అందుకే ఆ సాయలకి ఎవ్వరం బోం” అన్నాడు.

“మీలో ఎవరైనా అలాంటివాళ్ళని చూశారా?”

గుర్రపుడెక్క సలీరి

“ఆల్లసలు బైటికే రారు. మనం అల్ల కల్లబడ్తే కాల్చుకు తినకుండా వదిలిపెట్టరు”

“అదవినుంచి ఎవ్వరూ బైటికి రారా?”

“చెంచులాళ్ళు వస్తారు సారూ... మూలికలు, పుట్టలేనె తెచ్చి అమ్ముతుంట్రు”

తనకవసరమైన సమాచారం దొరికిందన్న సంతృప్తితో కేదార్‌ వైపు చూసి యిక వెళ్తామా అన్నట్టు తలాడించాడు సూర్యకుమార్‌.

“అక్కడికి బండి వోదు సారూ... కాలినడకన ఎల్లుండ్ర అన్నాడొకడు వెనకనుంచి.

“సారు వాల్లని ఏ పులో తినేస్తుందేమోరా పాపం” మరొకడు అనటం విన్సించింది.

“పట్నంవాల్లు దిమాగ్‌ లేకుండా వచ్చిండ్రనుకున్నవురా... ఆల్ల దగ్గర బందూకులుంటయు. పులి కన్పడగానే ధాం అని కాల్చిస్తే సచ్చి వూర్ముంటది” అన్నాడు మరొకడు.

కేదార్‌కి కొద్దిగా భయమనిపించింది. నిజంగానే పులులుంటాయా... తమ దగ్గర వాళ్ళనుకుంటున్నట్లు తుపాకులున్నా బావుండు. సూర్యకుమార్‌కి అంతా తొందరె... అవసరమైన సరంజామా సమకూర్చుకునెవరకైనా ఓపిక పట్టాలా... వుహు... యిపుడు ఏ ఎలుగుబంటో ఎదురుపడితే ఏం చేసాడు?

అదే ప్రశ్నని వెస్తె సూర్యకుమార్‌ పెద్దగా నవ్వి, “మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో పరుగు పందేల్లో పాల్గొనెవాళ్ళం గుర్తుందా... అంతే... కాలికి బుద్ది చెప్పటము” అన్నాడు.

క్వాలిస్ని ఆ వూళ్లోనే వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

“నువ్వీ వూళ్ళోనే మకాం చేయి. యిరవై నాలుగు గంటలు దాటినా మెం బైటికి రాకపోతే మా సెల్‌కి ఫోన్‌ చేయి. రెన్సాన్స్‌ రాకున్నా వెంటనే కంగారు పడకు. మేం క్షేమంగా ఉన్నా సిగ్నల్‌ అందక పోవచ్చు. అప్పుడు మరో యిరవై నాలుగు గంటలు వేచి చూడు. అప్పటికీ మా సమాచారం తెలీకపోతే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్లో కంప్లెయింట్‌ చేయి” (డైవర్‌ మస్తాన్‌తో చెప్పాడు సూర్యకుమార్‌.

ఆహారపదార్థాలు, వాటర్‌ బాటిళ్ళు, జంగిల్‌ బూట్లు, రెండు కత్తులు, రెండు బ్యాట్లు భద్రపరిచిన బ్యాగొకటీ, యిద్దరు పడుకోడానికి వీలుగా ఉండే ఇన్‌స్టంట్‌ టెంట్‌, స్లీపింగ్‌ బ్యాగులున్న మరో బ్యాగు భుజాలకు తగిలించుకుని తుమ్మ చెట్లున్న వైపుకి నదక

గుర్రపుడెక్క సలీర నాగించారు.

“కిట్‌ బ్యాట్లెందుకు...” అని అడిగాడు కేదార్‌.

“పాములేమైనా కన్పిస్తే కొట్టి చంపడానికి”

“ఈ బ్యాట్‌కి రెండింతల పొడవున్న పాములుంటాయి. బ్యాట్‌ వాటికి తగిలేలోపల కాటేస్తాయి. వాటిని చంపాలంటే పొడవాటి కర్రలవసరం”

“ఈ షోల్డర్‌ బ్యాగుల్లో అంత పెద్ద కర్రలు పట్టవుగా”

హిస్టరి కదా చదివాడు. లాజిక్కి అందవు మాటలు...వూళ్లో వాళ్ళనడిగితే రెండు కర్రలు యిచ్చెవాళ్ళు కదా...తుపాకులెలాగూ లేవు... దూరంగా నిలబడి కొట్టడానికి ఏమీ లెకపోతే ఎలా.. పాములేమైనా క్రికెట్‌ బంతులా... దగ్గరకొచ్చేవరకూ ఆగి, రాగానే ఫట్‌మని కొట్టడానికి... అనుకున్నాడు కేదార్‌.

వోనుపోను తుమ్మ చెట్లు దట్టంగా మారుతున్నాయి. తుమ్మచెట్లతోపాటు రకరకాల చెట్లు కానవస్తున్నాయి. రావి, జువ్వ మర్రి, మామిడి, వేప, పేర్లు తెలీని యింకేవేవో చెట్లు... రెండు మైళ్ళు దాటేశామనీ అడవిలోపలికి వెళ్తున్నామని వాళ్ళకి అర్ధమైంది. యిద్దరూ బ్యాగుల్లొంచి జంగిల్‌ బూట్లని తీసి వేసుకున్నారు. రెయిన్‌ కోట్లని తొడుక్కుని నెత్తిమీదికి హ్యాట్‌లా లాక్కున్నారు.

ఎండ విపరితంగా ఉంది. రెయిన్‌ కోట్‌తో శరిరాన్ని పూర్తిగా కప్పేయటం వల్ల మరీ ఉక్కవోతగా ఉంది.

“పురుగులో, కందిరీగలో, తేనెటీగలో శరీరాన్ని కుట్టకుండా రక్షణకోసం కోటు తొడుక్కోక తప్పదు” అన్నాడు సూర్యకుమార్‌.

“యింత ఎండలో అవి బైటికొస్తాయంటావా?”

“మనం లోపలికెళ్ళకొద్ద యింత ఎండ ఉండకపోవచ్చు. అడవి కదా.. మనకు తెలీని పురుగూ పుట్రా ఉందొచ్చు. ముళ్ళపొాదల్లోంచి వెళ్ళేటప్పుడు గీరుకోకుండా కొద్దిగా ఐనా రక్షణ.. చెట్లమీంచి ఎగిరే పాములు కూడా ఉంటాయట కదా” అన్నాడు.

“అలాంటి పాములు మన రాష్టంలో ఉండవు”.

బుస్సుమనే శబ్దం వినొచ్చింది. కేదార్‌ ఆగిపోయాడు. అతనికి నాలుగడుగుల దూరంలో

వ్‌

గుర్రవుడెక్క నీల్‌ర సూర్యకుమార్‌ కూడా ఆగిపోయాడు. “నీకూ విన్పించిందా శబ్దం... నా భ్రమ కాదన్మాటొ అన్నాడు కేదార్‌ గుసగుసగా. “శ్చ” మాట్లాడకు అన్నట్లు నోటిమీద వేలుంచి సంజ్ఞ చేశాడు సూర్యకుమార్‌. అతను కేదార్‌ కాళ్ళ వైపే చూస్తున్నాడు. కేదార్‌ తల కిందికి వొంచి చూశాడు. అతని కుడికాలికి అడుగు దూరంలో నాలుగు మూరల పొడవున్న పాము. అది పడగ విప్పి బుసలు కొడ్డుంటే జాగ్రఫీ ఛానెల్లో చూసి ఆహా ఎంతందంగా ఉందిదృశ్యం అనుకున్నాడు చాలానార్లు... యిపుదదెే దృశ్యం ప్రత్యక్షంగా చూసేప్పటికి భయానకంగా ఉంది. అతను రాతి విగ్రహంలా నిలబడిపోయాడు. “కదలకు” అన్నాడు సూర్యకుమార్‌. తన భుజాన ఉన్న బ్యాగ్‌లోంచి బ్యాట్‌ తీసి ఒడుపుగా పట్టుకున్నాడు. అతను రెండడుగులు ముందుకేస్తే తప్పు వాముని కొట్టలేదు. అప్పటివరకూ అది చూస్తూ వూరుకుంటుందా... కాటేసి చక్సాపోతుంది... కేదార్‌కి వెన్నులో జలదరింపు... వాముకి కళ్ళుంటాయా... ఉంటాయి. చెవులుందవు. అడవిలోకి వెళ్ళబోతున్నామని తెలిశాక కూడా కనీసం నెట్‌ సాయంతో అడవుల్లో నివసించె జంతుజాలాలగురించి తెల్సుకోకపోవటం తను చెసిన పెద్ద తప్పు. సూర్యకుమార్‌ ఒకడుగు ముందుకేశాడు... కేదార్‌ వూపిరి బీగపట్టాడు. అతను మరో అడుగు స్లోమోషన్లోలా వేశాడు. కాలికింద ఎండిన పుల్లలున్నాయేమో

  • అవి ఫట్‌మని విరిగిన శబ్దం వచ్చింది. పాము క్షణాల్లో ప్రమాదాన్ని పసిగట్ట వేగంగా పదగని కొద్దిగా వొంచి కాలిమీద కాటేసి, అంతే వేగంగా జరజరా వాక్కుంటూ చెట్లలోపలికెళ్ళిపోయింది. కేదార్‌ నోటినుండి భయంతో కూడిన సన్నటికేక వెలువడింది. ఎటొచ్చీ కాలి దగ్గర చీమకుట్టినట్టుకూడా అన్సించలెదు. దళసరిగా ఉన్న జంగిల్‌ బూట్ల పైన అది కాటు వేసింది కాబట్ట దాని కోరలు దిగబడి ఉండవనుకున్నాడు. ఐనా ఎక్కడో ఏదోమూల అనుమానం పీడిస్తూ...*దాని కోరలు గుచ్చుకొని ఉంటాయంటావా?” అని అదిగాడు. భయంవల్ల మాటలో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. “అవకాశం తక్కువ” అన్నాడు తప్పు నో ఛాన్స్‌ అని కుమార్‌ అనకపోవటంతో మరింత క్‌

గుర్రపుడెక్క స్రలీరి భయమనిపించింది. కుడికాలి బూటు విప్పి నాక్స్‌ తొలగించి చూశాడు. గాట్లు లేవ. ప్రాణం మరలా లేచొచ్చింది. తన బ్యాగ్‌లో ఉన్న వాటర్‌ బాటిలో బూటుమీద పాము కాటేసిన ప్రాంతాన్ని కడిగి మరలా తొడుక్కున్నాడు.

“ఈ బూట్ల లేకపోతే ఈ పాటికి నురగలు కక్కుతూ చచ్చిపోయి ఉందేవాజణ్సి” అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.

“ఓవెళ అలాంటి ప్రమాదం జరిగినా భయం లేదు. యాంటివెనం యింజక్షన్లు కూడా తెచ్చాగా. అరడజను షాట్లకి సరిపడా యిందులో ఉన్నాయి” అన్నాడు తన భుజానికున్న బ్యాగ్‌ వైపు చూపిస్తూ,

'ఓరి దుర్మార్సడా... ఈ మాట ముందే చెప్పి ఉంటే యింత ప్రాణభయానికి లోనయ్యావాడిని కాదు కదా” అనుకున్నాడు కేదార్‌ మనసులో.

వోనుపోను ముందుకు కదలటం కష్టంగా ఉంది. యిద్దరూ తమ దగ్గరున్న పదునైన కత్తుల్తో అద్జొచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ మెల్లగా ముందుకు కదుల్తున్నారు. వాళ్ళ బూట్ల క్రింద ఏవేవో పురుగులు పడి చచ్చిపోతున్నాయి. సూర్వకుమార్‌ కాలికింద అరచేయంతవెడల్పున్న తేలు పడి పచ్చడికింద నలిగిపోయింది. కేదార్‌ ముందు నుంచి పొడవాటి జెర్రివంటిదెదో తన వేయి కాళ్ళతో వేగంగా వెళ్ళిపోయింది.

ఎండ తెలీటం లేదు. చెట్లు దట్టంగా ఉందటం వల్ల వెలుతురు కూడా అంతంత మాత్రంగానే ఉంది. విశ్చంఖలంగా విస్తరించిన అదవి అందంగానే కాదు భయానకంగా కూడా కన్పించింది కేదార్కి ఎంతటి పచ్చదనం... ఎటు చూసినా చెల్లె... హరితనృత్యం అన్ని వైపులా...రకరకాల పక్షులు... రంగురంగుల పక్షులు...ఎన్ని లక్షల జీవజాతులకు ఆవాసమో ఈ అడవి... చెంచులున్నారని పులీమేకా జూదం ఆడేవాళ్ళు చెప్పారుగా... చెంచుల్తోపాటు యింకా ఎన్నెన్ని తెగలమనుషులు ఈ అడవిమీద ఆధారపడి

యిందాక బుసకొట్టి కాటేసి తన నిరసన తెలిపిన పాము గుర్తొచ్చింది కేదార్మి తన రాజ్యంలోకి వేరేవాళ్ళు చొారబడటాన్ని ఎంత బలంగా ఎదుర్కోడానికి ప్రయత్నించిందో... నిజమే కదా ... వాటి మానాన అవి బతికేస్తుంటే యిలా మనుషులొచ్చి

గుర్రపుడెక్క నీలీం వాటి ప్రశాంతతని భగ్నం చేయటం ఎంత వరకు సబబు? అన్వాయం కదా...

సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. కేదార్కి ఆకలి దంచెస్తోంది. దానికి తోడు శరీరం అలసిపోయి విశ్రాంతి కోరుకుంటోంది. కాళ్ళు కదలనని మొరాయిస్తున్నాయి. అలవాటులేని (ప్రాణాలాయె.. వోయిగా ప్యాన్‌ కింద కూచుని ఉద్యోగాలు చేసుకునే కేదార్‌లాంటి వాళ్ళకి యింతింత నడకలు... ఇటువంట సాహసోపేతమైన ప్రయాణాలు ఎప్పటికి ఒంట బట్టేను?

మరికొంత దూరం వెళ్ళాక దారి విశాలమైంది. మైదానంలాంటి ప్రాంతం... చుట్టూతా రాళ్ళగుట్టలు... చిన్న సైజు కొందల్లా ఉన్నాయి... పెద్ద చెరువు... గట్టున మర్రి, వేపలాంటి మహావృక్షాలు...

అక్కడి వాతావరణం చూడగానె కేదార్‌ మనసు ఆహ్ష్ణాదంతో నిండిపోయింది. “ఎంత బావుందో ఇక్కడ...పడిన శ్రమంతా మర్చిపోయెంతగా పరవళ్ళు తొక్కుతున్న అందమైన, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం.. అరుదైన పిక్నిక్‌ న్పాట్‌లా...సినిమా వాళ్ళు చూస్తే షూటింగ్‌లకు ఎగబదడటం ఖాయం..” అనుకున్నాడు.

అతని సంతోషాన్ని తుంచేస్తూ “అడవి జంతువులు ఈ చెరువులోనే సళ్ళు తాగదానికి వస్తాయనుకుంటా” అన్నాడు సూర్యకుమార్‌. కేదార్‌ నాలుగు వైపులా జాగ్రత్తగా చూశాడు. పక్షులు తప్ప జంతువుల ఆనవాళ్ళమి కన్సించలేదు. ఐనా అతన్లో పడగ విప్పుతూ భయం.

“జంతువులంటే చిరుత పులులూ ఎలుగుబంట్లూ కూడానా”

“తప్పకుండా. వాటికీ దాహం వేస్తుందిగా” అన్నాడు సూర్యకుమార్‌,

“మరి చిరుత పులొస్తే ఏం చేద్దాం?”

“యిక్కడ ఎన్ని చెట్లున్నాయో చూశావా? ఎత్తుగా ఉన్న చెట్టు చూసుకుని ఎక్కద్దాం”

“బిరుతపులి మనకన్నా వేగంగా చెట్లెక్కుతుంది”

“వోనీ దూరంగా చిన్న కొండ కన్పిస్తోంది చూశావా... అటు వైపుకి పరుగెత్తి పోదాం”

“'బుర్రలేకుండా మాట్లాడావేంటీ... మనం పరుగెత్తి కొండ దిగువకు చేరేలోపలే పులి మనల్ని పట్టెసుకుని ఫలహారంలా తినేస్తుంది అనబోయి ఆగిపోయాడు. పంటి బిగువున

గుర్రపుడెక్క సలీర నవ్వునాపుకుంటున్న సూర్యకుమార్‌ని చూడగానే అతను ఆటపట్టిస్తున్నాడన్న విషయం కేదార్‌కి అర్ధమైంది. రెండడుగుల దూరంలో పాము పడగవిప్పి నిలబడిఉంటే అప్పుడు తెలిసేది ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాడు... తనింకా ఆ భయంలోంచి బైటికి రాలేకపోబట్టే ఇలా అహేతుకంగా మాట్లాడ్డున్నాదేమో...

మనసుని కొద్దిగా ప్రశాంతంగా పెట్టుకుని ఆలోచించాడు. పులుల సంఖ్య బాగా తగ్గిపోతోందనీ వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందసీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం గుర్తొచ్చింది. “యిక్కడ పులులుండకపోవచ్చు” అన్నాడు కేదార్‌. ఆమాట తనని ఉద్దేశించి అన్నా అది ముఖ్యంగా తనకు తాను ధైర్యం తెచ్చుకోడానికి చెప్పిన మాటల్లా అన్పించాయి సూర్యకుమార్శి

బాగా అలసివోయి ఉండటం వల్ల యిద్దరూ చెరువు గట్టునున్న ఓ చెట్టుకింద కూలబడ్డారు. సూర్యకుమార్‌ తన బ్యాగ్‌లోంచి చపాతీలు బంగాళాదుంప కూర తీసి పేపర్‌ ప్లేట్‌లో పెట్టి యిచ్చాడు. ఆకలి వల్లనో, పడిన శ్రమవల్లనో వాటిని తింటుంటే స్వరం కన్పించింది కేదార్మి భోజనం వెళకి ఏదో ఒకటి హడావిడిగా తినేసి, మరలా పనిలో నిమగ్నమైపోవటం అలవాటుగా మారటం వల్ల, తినే పదార్థాల్ని ఆస్వాదిస్తూ తినాలన్న విషయమే మర్చిపోయాడతడు... అందుకే అతనికీ రోజు చపాతీ బంగాళాదుంప కూర అమృతంలా అన్పించింది. శ్రామికులు తాము తినె పచ్చడి మెతుకులో తాగే గంజినీళ్లో ఎంత యిష్టంగా... ఎంత అపురూపంగా తింటారో అలా తిన్నారిద్ర్దరూ.

వాళ్లు తమ వెంట తెచ్చుకున్న మినరల్‌ వాటర్‌ని నాలుగు గుక్కలు తాగి, మరలా బ్యాగ్‌లో దాచేశారు. నేల పైకి పొడుచుకొచ్చిన ఆ చెట్టు వేళ్ళని తలగడగా చేసుకుని కొద్దిసేపు నడుం వాల్సారు. చెరువు మీంచి వీస్తున్న చల్లటి గాలి...బదలిక... కేదార్కి వెంటనె నిద్ర పట్టసింది.

“కేదార్‌.. లౌ” పెద్దగా కేక వేశాడు సూర్యకుమార్‌. కేదార్‌ మంచి నిద్రలో ఉన్నాడు. సన్నగా గురక కూడా పెడ్తున్నాడు.

“కేదార్‌...నిన్నె.. త్వరగా లే” యింకొద్దిగా గొంతు పెంచి లేపే ప్రయత్నం చెశాడు.

కక్‌

గుర్రపుడెక్క స్రీలీర ఫలితం కన్పించలేదు. దగ్గరకెళ్ళి తట్టి లేపాడు. కొద్దిగా కదిలి మళ్ళా నిద్రలోకి జారుకున్నాడు కేదార్‌.

“అమ్మో... చిరుత పులి... పరుగెత్తు” అంటూ అరిచాడు.

స్పింగ్‌లా లేచి కూచున్నాడు కేదార్‌. బెదురుచూపుల్తో చుట్టూ చూస్తూ “ఏది పులి? ఎటు వైపుంది?”” అన్నాడు కంగారుగా.

సూర్యకుమార్‌ నవ్వుతున్నాడు. “కుంభకర్ణున్ని లెపడానికి శూలాలో పొడిచినా గద్దిపోచల్లా అస్పించి విదిలించుకు పడుకున్నాట్ట. నిన్ను లేపడానికి చిరుతపులి సాయం తీసుకోవాల్సి వచ్చింది”

కేదార్‌ చిరాగ్గా మొహం పెట్టి టైం చూసుకున్నాడు. ఒకటీ ముప్పావు. అంటే కనీసం పావుగంట కూడా పడుకోనివ్వలేదు అనుకోగానే కోపమొచ్చింది.

“బంగారం లాంటి నిద్రని పాడు చేశావు కదా” అన్నాడు.

“మనం ఈ అడవిలో కొచ్చింది పిక్నిక్‌కి కాదు... చెట్ల కింద పడుకుని హాయిగా నిద్రపోవడానికి. ఇపుడు బంగారం కన్నా విలువైంది మన్నుగొందకి సంబంధించిన సమాచారం... మన్నుగొండ సంస్వానం ఇక్కడే ఉందేదనడానికి రుజువులు వెతకడమే మన పని ఇప్పటికే ఆలస్యమైంది. బయల్టెరు” తన బ్యాగ్‌ని భుజానికి తగిలించుకుంటూ అన్నాడు సూర్యకుమార్‌. కేదార్‌ కూడా బ్యాగ్‌ని భుజానికి తగిలించుకుని అతని వెనక నడిచాడు.

కొంత దూరం నడిచాక మైదానంలా ఉన్న ప్రాంతం అంతమై దట్టంగా మొలిచిన చెట్లు కన్పించాయి. సూర్యకుమార్‌ ఆగిపోయాడు. మొదట ఎటు వైపుకెళ్ళి వెతకాలో అద్ధం కావటం లేదు. చీకటి పడేలోపల వీలైనంత ఎక్కువ భాగాన్ని శోధించాలంటే ఇద్దరూ చెరో వైపు వెళ్ళటమే ఉత్తమమనిపించింది.

“మనం ఇక్కడ విడిపోదాం. నువ్వు తూర్పు దిక్కు కెళ్ళు. నెను దక్షిణం దిక్కున వెతుకుతా. సాయంత్రం వరకూ వెదికి మనలో మొదట ఎవరు తిరిగొచ్చినా ఇక్కడే ఇదే స్థలంలో రెండో వ్యక్తికోసంఎదురు చూడాలి. సరేనా” అన్నాడు కేదారో,

కేదార్‌ అతని వైపు నమ్మలేనట్లు చూశాడు. “నేనా...ఒంటరిగానా...ఈ అడవిలోనా..

గుర్రపుడెక్క సలీర నో ఛాన్స్‌”

“ఎందుకంత భయపడ్వావ్‌? ఈ అడవిలో పులులూ సింహాలు ఉండవు.”

“బెను.. నువ్వు చూసొచ్చావు” వెటకారంగా అన్నాడు కేదార్‌. “నువ్వు చెప్పింది నిజమేనని ఒప్పుకున్నా ఎలుగుబంట్లుంటాయిగా... వాములుంటాయిగా... ఒకటి ఆ(ైెడీ ప్రవేశ ద్వారం దగ్గరే తన కోరలో పలకరించి స్వాగతం పలికిందిగా. ఎన్నయినా చెప్పు. ఇద్దరం కలిసే వెదుకుదాం”

“ఇద్దరం చెరో వైపు వెళ్తేనే సాయంత్రంలోపల కొంతైనా కవర్‌ చేయగలం”

“తీరా లోపలికెళ్ళాక వచ్చిన దారి మర్చిపోతేనో... అసలే అడవి...జిగ్‌సా పజిల్‌లా పెరిగున్నాయి చెట్లు.. రాత్రంతా ఆ చెట్ల మధ్య తిరుగుతూ అరిచి గీపెట్టినా ఆదుకునే నాధుడే ఉండడు” అంటూనే సెల్‌ఫోన్‌ తీసి చూశాడు. '్పిగ్నల్స్‌ కూడా లేవ. ఒకవెళ ఉన్నా నువ్వన్న చోటికి ఎలా రావాలో తెలియాలిగా”

“దారి తప్పిపోయే ప్రసక్తే లేదు. మన కవసరమౌతాయనే రెండు కంపాస్‌లు తెచ్చాను నువ్వు వెళ్ళాల్సింది తూర్పుకి కదా.. కంవాస్‌ సాయంతో సరిగ్గా తూర్పు దిక్కుకే నేరుగా వెళ్ళు తిరిగొచ్చిటప్పుడు పడమటి దిక్కు ఎటుందో చూసుకుంటూ నేరుగా వెనక్కి రా..సింపులొ”

“చూడు బాబూ...నీకు సింపుల్‌ కావచ్చు. నాకు స్వెట్‌ఫుల్‌. కంపాస్‌లని నేనెప్పుడూ వాడిన పాపాన పోలేదు. అనుభవరాహిత్యం వల్ల తప్పు జరిగితే ఆ తర్వాత నిన్ను తిడ్దామన్నా తిట్టడానికి నెనుందక పోవచ్చు”

“అయ్యో కేదార్‌.. ఈ పరికరాన్ని వాడటం చాలా సులభం. నేను చూపిస్తా దగ్గరకు రా”

“వద్దు బాబూ... అవసరం లేదు. ఐనా నువ్వో విషయం మర్ప్చిపోతున్నావు. నేనొక్కడినే ఉన్నాననుకో... మన్నుగొండ సంస్వానానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికినా వాటిని గుర్తించకపోయ ప్రమాదముంది. నెను వెతికిన స్థలాల్లో నువ్వు మళ్ళా వెతకవు కాబట్టి అసలా శిధిలాలు మనకెప్పటికీ దొరక్కృపోయే అవకాశముంది ఆలోచించు” తన తెలివితెటల్ని ఉపయోగించి గాల్లో ఓ బాణం వేశాడు.

గుర్రపుడెక్క సలీం

సూర్యకుమార్‌ ఆలోచనలో పడ్డాడు. నిజమే.. అలా జరిగే అవకాశాన్ని కొట్టిపడేయడానికి లేదు. ఒకవేళ అలా జరిగి శిధిలాల్ని కనుక్కోలేకపోతే తను పడిన శ్రమంతా వృధా అవుతుంది. ఆలస్యమైనా సరే అడవిలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తను పరిశీలించటమే ఉత్తమమనిపించింది.

“సరే.. ఇద్దరం కలిసే వెదుకుదాం. పద. మొదట దక్షిణం దిక్కుకి వెళ్ళాం” అన్నాడు.

బతుకుజీవుడా అనుకుని గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాడు కేదార్‌.

ఎటు చూసినా చెట్ల పొదలు... దట్టంగా...దారి చూసుకుంటూ జా(గ్రత్తగా నడుస్తున్నారు. సూర్యకుమార్‌ తన చేతిలో ఉన్న కంపాస్‌ చూసుకుంటూ ముందు నడుస్తున్నాడు.

ఒకృసారిగా చెట్లలో కలకలం.. ఇద్దరూ అప్రమత్తమై చెట్ల పైకి చూశారు. కోతులు... గుంపులు గుంపులుగా కోతులు...మెడలు రిక్కించి వాళ్ళ వైపు చూస్తున్నాయి. కొన్ని కోతులు పళ్ళు బైటపెట్ట కిచకిచమని అరుస్తున్నాయి.

“ఆగకుండా మెల్లగా నడుస్తో ఉండు. వాటిని పట్టించుకోకు” అన్నాడు మంద్ర స్వరంతో సూర్యకుమార్‌,

కేదార్‌ నడుస్తూనే “వాటి వాలకం చూస్తే అవి ఏ క్షణమైనా మనల్ని ఎటాక్‌ చెసేలా ఉన్నాయి” అన్నాడు. భయంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి.

“వాటి మొహం నల్లగా ఉండి కనుబొమలు దట్టంగా ఉన్నాయి చూశావా..తోకలు పొడవుగా...ఇవి కొండముచ్చులు. వాటిని రెచ్చగొడితే తప్ప మనకొచ్చి ప్రమాదమేమీ లేదు. మన చేతుల్లో తినే వస్తువులు కన్పించినా వాటికోసం మనపైకి రావొచ్చు. మన భుజాలకున్న బ్యాగులు తప్ప వాటికెమీ కన్పించవు కాబట్టి భయపడకు... మెల్లగా నడుస్తో ఉందు చాలు”

కేదార్‌ నడుస్తూనే వెనక్కి తిరిగి చూశాడు.

రెండు పెద్ద కోతులు వాళ్ళ వెనకెనకే వస్తున్నాయి.

“కుమార్‌... మన వెనుక రెండు కోతులు” గుసగుసలుగా చెప్పాడు.

“నెనూ గమనించాలె. వాటికి మన వల్ల ఏమీ ప్రమాదం వాటిల్లదని నిర్ధారించుకునె

20,

గుర్రపుడెక్క సలీర వరకు మనల్ని అనుసరిస్తాయి. ఆ తర్వాత అవే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి” మరికొంత ముందుకు నడిచాక కేదార్‌ వెనక్కి తిరిగి చూస్తే ఆ కోతులు కన్పించలేదు అప్పటి వరకు బిగదిసుకుని నడిచిన కేదార్‌ అక్కడినుంచి వేగంగా అడుగులేశాడు గంటన్నరకు పైగా వెదికినా సూర్యకుమార్‌ వెదుకుతున్న ఆనవాళ్ళేమి కన్పించలేదు.

“ఇట్నుంచి తూర్పువైపుకు మళ్ళుదాం” అన్నాడు సూర్యకుమార్‌ కంపాస్‌ వైపు చూస్తూ

కేదార్‌ వాచీ చూసుకున్నాడు. మూడున్నర..

తూర్పు వైపు అడవి అంత దట్టంగా లేదు. కొన్ని చోట్ల చెట్లు పల్చగా ఉండి మైదానప్రాంతాలు కన్పిస్తున్నాయి.

“ఇక్కడ దారులు నలిగిఉన్నాయి చూశావా? మనుషులు నదవటం వల్ల ఏర్పడిన దారులివి. చెట్లు పల్చగా ఉండటానికి కూడా కారణం మనుషుల ఆవాసాలు సమీపంలో ఉండటంవల్ల కావచ్చు. ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం కోసం, వంట చెరుకు కోసం చెట్లని నరకటం వల్ల ఎర్చడిన మైదాన ్రాంతాల్లా కన్పిస్తున్నాయి” అన్నాడు సూర్యకుమార్‌.

“మనుషులంటే...”

“అదవి మీద ఆధారపడి బతికే జాతుల మనుషులు... చెంచులు, యానాదులు, కోయలు...”

కేదార్‌ ఆగిపోయాడు. దారికి కుడివైపున ఐదారు చెట్లు వృత్తాకారంలో నిలబడి ఉన్నాయి. మధ్యలో విశాలమైన మైదాన ప్రాంతం... అక్కడ మూడు రాళ్ళు పెట్టి చేసిన పొయ్యిలు రెండు కన్పించాయి. వాటిమీద ఏదో వండిన దానికి గుర్తుగా కట్టెలు కాలిన బూడిద... సగం కాలాక ఆర్పేసిన కట్టెలు...

చుట్టూ పగిలివోయిన కుండ పెంకులు...

కేదార్‌ వాటికి దగ్గరగా వెళ్ళి ఆ ముక్కల్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలించాడు. పొయ్యిల్లో ఉన్న బూడిదని తాకి చూశాడు. చల్లగా ఉంది. అంటే పొయ్యి ఆరిపోయి చాలా సమయం గడిచి ఉండాలి.

అతనెందుకు వాటినంత (శ్రద్ధగా పరిశీలిస్తున్నాడో సూర్యకుమార్‌కి అర్ధం కాలేదు “అవేమీ మనం వెతుకుతున్న లక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన

రే

గుర్రపుడెక్క నీలీర అవశేషాలో లేక మన్నుగొంద కోటకి సంబంధించిన శిధిలాలో కాదు.. ఒకప్పుడు బాగా బతికిన కుండల అవశేషాలు. .”అంటూ నవ్వాడు సూర్యకుమార్‌. “వాటిని కొంతమంది కుండ పెంకులని కూడా అంటారు.. ప్లీజ్‌ కేదార్‌... త్వరగా రా... మనం తిరగాల్సిన అడవి యింకా చాలా ఉంది” తొందరపెడ్డూ అన్నాదు.

“నువ్విటురా... ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది?”

“ఇందులో అన్సించడానికేముంది... ఎవరో ఇక్కడ వంట వండుకుని తిని ఉంటారు”

“ఏం వంట? పగిలిన ఈ పెంకుల్ని చూశావా? ఇవి కుంద పెంకులు కావు. పెద్ద బాన పెంకుల్లా ఎంత దళసరిగా ఉన్నాయో...పులిజూదం ఆడుతున్న వాళ్ళల్లో ఒకతను చెప్పినట్లు మనుషుల్ని తినే కేనిబాల్స్‌ ఈ అడవిలో ఉన్నారనిపిస్తోంది. ఈ అడవిలోకి వచ్చిన కొంతమంది మనుషులు జాడ తెలీకుండా పోయారని కూడా చెప్పాడుగా. దొరికిన వాళ్ళని పెద్ద పెద్ద బానల్లో వేసి ఇక్కడే వండెసి ఉంటారు”

“మరీ అజ్ఞానిలా మాట్లాడకు. వాళ్ళంటే నిరక్షరాస్యులైన పల్లెటూరి మూర్చులు మనుషుల్ని తినేంత అనాగరికమైన జాతులు మన అడవుల్లో లేరు”

“నీకెలా తెలుసు? మనకు తెలీకుండా మానవ నాగరికతకు దూరంగా బతుకుతున్న అడవిజాతి మనుషులుండే అవకాశం ఉంది”

“నేను హిస్టరి లెకృరర్ని అలాంటి జాతులుండే అవకాశమే లేదు. అనవసరంగా నీ రచయిత వూహలకు రెక్కలు మొలిపించకుండా వాటినిక్కడితో కత్తిరించి తొందరగా పద” కొద్దిగా విసుగ్గా అన్నాదు.

“అంతేనంటావా?”

“ముమ్మాటికీ అంతే”

మరో గంటన్నర వరకూ అడవిని నిశితంగా పరిశీలించినా ప్రయోజనం కన్సించలేదు. కొండలూ గుట్టలూ కన్పించాయి. పారే సెలయళ్ళు, దుమికే అందమైన జలపాతాలు కన్పించాయి. నెమళ్ళు, లేళ్ళు, దుప్పులూ కన్పించాయి. కుందేళ్ళు, అదవి పందులు కన్పించాయి. కానీ వాళ్ళు వెతుకుతున్న మన్నుగొంద ఆనవాళ్ళు మాత్రం కన్పించలేదు.

కేదార్‌ వాచ్‌ చూసుకున్నాడు. ఐదు గంటలైంది.

గుర్రపుడెక్క సీలీర

“ఎందుకు మాటీమాటీికి వాచ్‌ చూసుకుంటున్నావ్‌? సూర్యకుమార్‌ అడిగాడు.

“ఇప్పుడు ఐదు గంటలైంది. మనం ఈ అడవిలోంచి బెటపడాలంటే వేగంగా నడిచినా గంటో గంటన్నరో పట్టొచ్చు. చీకటి పదేలోపల మనం బైటపడాలంటే ఇప్పుడే బయల్లేరాలి”

“ఎక్కడికి?”

“అడవి బైటికి”

“టెంటులూ పడుకోడానికి స్లీపింగ్‌ బ్యాగులూ వూరికే మోత బరువుకోసం తెచ్చాననుకుంటున్నావా? మనం ఎక్కడికీ వెళ్ళటం లేదు. రాత్రికి మకాం అడవిలోనే”

“అడవిలోనా? నో ఛాన్స్‌... ఈగలు చూశావా ఎంతెంత లావున్నాయో. చీకటి పడ్డాక అడవి దోమలు దాడి చేస్తాయి. కుడ్తే మందులకు తగ్గని మలేరియాతో చావటం ఖాయం వద్దు. వెళ్ళిపోదాం”

“మనం వెదికింది కెవలం నాలుగైదు గంటలే...రెండు రోజులకు సరిపడా భోజన సామగ్రి, మంచి నీళ్ళు... వసతిగా పడుకోడానికి అవసరమైన సరంజామా... ఇవన్నీ ఎందుకు తెచ్చాననుకున్నావు? మన్నుగొండ సంస్థానం ఆనవాళ్ళు దొరికే వరకు ఈ అడవిలోంచి కదిలే ప్రసక్తే లేదు.”

“గుడారం వేసి పడుకోవటమంటే ఎత్తుగా మంచె వేసి దానిమీద పడుకున్నంత సేఫ్‌ అన్నట్లు మాట్లాడ్దావేంటి? పాములూ లేళ్ళు దర్హాగా వచ్చి మనతో పాటు పడుకోవచ్చు ఎలుగుబంట్లు రావొచ్చు. రాత్రుళ్ళు ఆహారం కోసం బైటికొచ్చే ఏ అడవి జంతువుకో మనం ఆహారం కావొచ్చు”

“మళ్ళా మళ్ళా రావటమంటే శ్రమతో కూడుకున్న పని కేదార్‌.. అర్ధం చేసుకోవెందుకు? నామాటిను. కొద్దిగా కష్టమైనా ఈ రాత్రి ఇక్కడే గడుపుదాం. అడవిలో ఓ రాత్రి గదడపటమంటేి ఎంత ధ్రిల్లింగ్‌గా ఉంటుందో తెలుసా?”

“ఆ ధ్రిల్‌ కోసం కావాలంటే నైట్‌ సఫారీ చేస్తాను గాని నువ్వు తెచ్చిన గుడారంలో మాత్రం గడపను” కరాఖండిగా చెప్పాడు కేదార్‌.

“అట్లా ఐతే మనం మళ్ళా రావాల్సి వస్తుంది”

“ఎన్ని సార్లయినా వద్దాం. పగలు మాత్రమే అడవిలో తిరగుదాం. ఇపుడు దారి

గుర్రపుడెక్క స్రలీరి తెలిసింది కాబట్ట ఉదయాన్నే బయల్బరి వస్తే పదింటికల్లా అడవిని చేరుకోవచ్చు. సాయంత్రం ఐదు వరకు అంటే ఏడు గంటలు అడవిని గాలించొచ్చు”

“అంతేనంటావా?”

“అంతే. తొందరగా నడువ్‌.. చీకటి పదేలోపల మనం అడవిని దాటెయ్యాలి” ముందుకు నడుస్తూ అన్నాడు కేదార్‌.

అయిష్టంగానే అతన్ని అనుసరించాడు సూర్యకుమార్‌.

యిద్దరూ వేగంగా నడుస్తున్నారు. దార్లో జింకలూ దుప్పులూ కన్పించాయి. కంచర గాదిదలూ, అడవి పందులు కూడా కస్పంచాయి.

తుప్పల్లో నేలని తవ్వుతున్న జంతువేదో అలికిడికి తవ్వటం ఆపి తల తిప్పి చూసింది. దాని తల పాము తలలా ఉంది. శరిరం నిండా పొలుసులు... చిన్న సైజు మొసలిలా ఉంది చూట్టానికి.

కేదార్‌ దాని వైపు అనుమానంగా చూసాడు. “అదేం జంతువు? ప్రమాదకరమైందా?” అని అడిగాడు.

“నువ్వు చీమవైతే ప్రమాదకరమైంది... వచ్చి తినేస్తుంది” నవ్వుతూ చెప్పాడు సూర్యకుమార్‌.

“ఓ.. చీమల్ని తినే ప్వాంగోలినా... జియోగ్రాఫిక్‌ ఛానెల్లో చూశాను గాని వెంటనే గుర్తుకు రాలా... అనవసరంగా కంగారు పడ్డాను”

అడవిలోంచి బైట పదేప్పటికే సూర్యాస్తమయమై అరగంట దాటింది.

క్వాలిస్లో కూచుని రఫీ పాటలు వింటున్న మస్తాన్‌ వీళ్ళను చూడగానే “గప్పుడె వచ్చేశారా సాబ్‌...యింకా రేప్పాద్దుగల్ల గానీ రారనుకున్నా” అన్నాడు.

సూర్యకుమార్‌ కేదార్‌ వైపు చూసి ఓ నిట్టూర్పు విడిచాడు.

అదేమీ పట్టించుకోకుండా కార్గో కూచుని బడలికగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కేదార్‌.... తీయగా విన్పిస్తోన్న రఫీ గొంతు... చల్లటి ఏస్‌ గాలి...నిద్రపట్టెసింది. హైద్రాబాద్‌ చేరేవరకు అతనికి మెలకువే రాలేదు.

గుర్రపుడెక్క సలీర

చలికాలం...మరో రెండు గంటలు గడిస్తేగాని పొద్దవాదవదు. చెంచు పెంటలోని జనాలందరూ మునగదీసుకుని పడుకుని ఉన్నారు. చలికాలంలో బాగా పొద్దెక్కితేగాని మగాళ్ళు వేటకు బయట్చెరరు. వేట పూర్తి చేసుకుని కుందేటి చుక్క పొడవకముందే గూదేనికి చేరుకుంటారు.

కానీ మల్లయ్యకు ఎప్పటికిమళ్లే మెలకువొచ్చింది. పీడకలనుంచి తప్పించుకోడానికి వచ్చే మెలకువ లాంటి మెలకువలే రోజూ. అంత చలిలోనూ చెమటలు పట్టెలా వెచ్చటి భయమెదో వళ్ళంతా వాకుతూ... కళ్ళు చిట్లించి చూశాడు. తన పక్కనే ఈత చాపమిద బుల్లన్న నిద్రపోతున్నాడు. వాడి పక్కనే అమ్మ... సన్నగా గురక పెద్తోంది. ఆ గురక పులిగాండ్రింపులా విన్పించి భయంతో వెన్నులో చలి పుట్టుకొచ్చింది.

'ముప్పొద్దులా మెక్కడానికి ముందుంటాడు ముదనట్టవోడు. ఏటకెల్లమంటే సీల్లుడు అంటూ తిట్ల పురాణం లంకించుకున్నట్లు వూహ మెదిలి ఉలిక్కిపడ్డాడు. పసరు పూసిన పదునైన అంబుల్లాంటి ఆమె తిట్లని భరించడం కంటే అడవిలో పొంచున్న చలిని ఎదుర్కోవటమే నయమనిపించి చిరు చీకట్లు తొలక్క్మముందే అడవిలోకెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నాడు. విల్లంబులు తీసుకుని, చురకత్తిని మొలలో దోపుకుని, వెదురుబద్దల్తో అల్లిన గుడిసె తలుపు తీశాడు. చలిగాలి రివ్వున సూదుల వర్షంలా కాటేసింది. మొలకు గోచీ తప్ప అనాచ్చాదితంగా ఉన్న అతని పల్చటి శరిరం విరుచుకుపడిన పెనుగాలికి వణికే చిగురుటాకులా కంపించింది.

గుడిసెలోపలికి దూరి, ఈతచాప మిద తమ్ముడు బుల్లన్న పక్షనే కాళ్ళు కడుపులో ముడ్డుకుని వెచ్చగా పడుకోవాలన్న కోరిక...బలంగా.. అమ్మో యింకేమైనా ఉందా? అమ్మ ఆడ ఎలుగుబంటిలా పైన పడి రక్క్మేయదూ...అందుకే ఆ కోరికని మెడ పిసికి బలవంతంగా చంపేశాడు. ఆమె కొట్టినా, రక్కినా శరీరం పైన ఎన్ని గాయాలు చేసినా ఆ బాధని భరించవచ్చు గానీ ఆమె మాటల్తో చేసే గాయాలే అతన్ని ఎక్కువ బాధిస్తాయి ఆమె మాటలు ఈటెల్లా గుండెలో లోతుగా గాయాలు చేస్తాయి.. ఎప్పటికీ మానని గాయాలు...తన శరీరంతోపాటు అతను నిరంతరం మోస్తున్న గాయాలు...

బాల్యం నుంచే ఎన్ని క్య్వల్ని ఎదుర్శొన్నాడో... దెబ్బలు తినీ తినీ శరీరమూ మనసూ రాటు దేలిపోయాయి. తనకీ చలి ఓ లెక్కా? అతను తన శరీరం ఐపు పూర్తి నమ్మకంతో

క్‌

గుర్రవుడెక్క నలీర చూసుకున్నాడు. పద్దెనిమిదేళ్ళ పదునైన వయసు... బిరు సెక్కిన భుజాలు... పొల్కి చెట్టునుంచి తీసిన చెక్కలా బిగుతైన వక్షస్థలం .రాళ్ళలా గట్టిపడిన కాలి పిక్కలు...

అతను బలంగా శ్వాస తీసుకున్నాడు. చలిగాలి వూపిరితిత్తుల్లోకి చొరబడి వెచ్చగామారి దిర్హమైన నిశ్వాసగా బయల్పడింది. ఛాతీ పొంగించి వేగంగా పాతిక బస్కీలు తీశాడు. వళ్ళు కొద్దిగా వెచ్చబడింది. తలయెత్తి ఆకాశంకేసి చూశాడు. అప్పుడే పొడిచిన రావెగాని చుక్క పల్కరించినట్లనిపించింది. నెను సిద్ధమే అన్నట్లు ఒళ్లు విరుచుకుని ముందుకు రెండు గెంతులు గెంతి, మళ్ళా వెనక్కి గెంతి, తోకూపుతూ అతని కాళ్ల దగ్గర నిలబడిన బైరిగాడు.. తనకు పదేళ్ల వయసున్నప్పుడు తెచ్చి పెంచుకున్న కుక్కపిల్ల... తనతోపాటు పెరిగి... పెద్దయి... తనకు తోడు... వేటలో చేదోడు...

అతను వెగంగా నడవడం ప్రారంభించాడు. పక్కనే బైరిగాడు... అలవాటైన దారి .. అమ్మలా పొదువుకునే అడవి... కాళ్ళకింద అప్పుడప్పుడూ చిదుగులు పడి శబ్దం చేస్తూ విరుగుతున్నాయి. కీటకాల రొద..చెట్ల కొమ్మల్లో పక్షులు రెక్కలు విదిల్చి వళ్ళు విరుచుకుంటున్నాయి. అవి చేస్తున్న వింత వింత శబ్గాలతో అడవి తన గాధనిద్రలోంచి మేల్నోడానికి సమాయత్తమౌతోంది.

గుడిసెలో గుర్రుపెట్టి నిద్రవోతున్న అమ్మ గుర్తొచ్చింది. యిపుడు కాళ్ళకింద పడి విరుగుతున్న ఎండు పుల్లల్లా తన లేత పృాదయం అమ్మ కాళ్ళకింద పడి ఎన్నిమార్లు ముక్కలయ్యిందో... అమ్మ కటువుగా మాట్లాడినపుడల్లా తను బేలగా బాధగా ఆమె వైపు చూసేవాడు. “నన్నెందుకు ప్రేమగా చూడవు? తమ్ముడ్ని లాలిస్తావె... ముద్దుచెస్తావే... మరి నన్నందుకు తమ్ముడితో వేరుగా చూస్తావు? బుల్లన్నని అక్కున చేర్చుకుంటావే . నన్నెందుకు అసప్యాంచుకుంటావు? మరో తల్లి కడుపున పుట్టడమె నెను చేసుకున్న పాపమా? నన్నూ నీ కొడుకుతో సమానంగా చూడమని అడగను. తక్కువగాఐనా సరే కొదుగ్గా చూస్తే చాలు. సవితి కొడుగ్గా ఆదరిస్తే చాలు... బుల్లన్నకు కుందేలు మాంసం వండి పెట్టినా నెనేమనుకోను. నేను వేటకెళ్ళి పట్టుకొచ్చిన కుందేలు కాబట్టి నాకూ దాని మాంసం తినే హక్కుందని నిన్నెప్తుడూ అడగను. నాకు ఆకలేస్తే పూటకింత గంజి పెట్టినా చాలు. తృప్తి పడతాను” అనే మూగ వెదన, జాలి గొలిపే అభ్యర్ధన నిండి ఉన్న

25,

గుర్రపుడెక్క సలీర

'ఏంటా సూపు? మిడిగుర్లసుకుని.. మింగేతావా? మిత్తవలా నీ అమ్మను మింగేశావుగా కడుపు నిండలేదా? నీ అయ్యనూ వొట్టన పెట్టుకున్నావుగదరా నీ బతుకు సెద. యింగ మిగిలింది నేనూ నా కొడుకే. దా.. మమ్మల్ని కూడా నీ నోట్లో ఏసుకో అంటూ పైపైకి వచ్చే అమ్మ. 'దెయ్యం పిల్లాడ్ని కని నా ఎదాన పదేసి పోయిందే అందుకు నీ అమ్మననాలి. నన్ను మారుమనువు సేస్ముని నట్టట్లో ముంచి పోయాడే నీ బాబుననాలి' అంటూ చనిపోయిన అమ్మానాన్నని నానా మాటలనే అమ్మ....

చలి భరించడం కష్టంగా ఉంది. పొట్టలోంచి వణుకు పుట్టకొన్తోంది. గుండెల్ని మండించే జ్ఞాపకాల సెగ ఓ వైపు.. శరీరాన్ని గడ్డకట్టించె చలి పొగ మరో వైపు...పరుగెత్తడం ప్రారంభించాడు... బాణంలా పరుగెత్తుతున్నాడు. కసితో నేలను తంతూ పరుగెత్తుతున్నాడు పసితనంలోనే అమ్మను తీ స్మెళ్ళిపోయిన దేవుడిమీద కసి... అర్జాంతరంగా నాన్నని కాటెసిన విధి మిద కసి...

అతని లక్ష్యం ఒక్కటే...ఆ గుడిసె నుంచి... అందులో ఉన్న మారు తల్లి నుంచి... ఆమె నోట్లోంచి పుట్టుకొచ్చి అసహ్యమైన తిట్ల నుంచి... అయిష్టాన్ని విషంలా వెళ్ళగక్క ఆమె చూపు నుంచి వీలైనంత దూరం పారిపోవటం... అతని గమ్యం ఒక్కటే. . అమ్మ చెట్టు.. సాంత్వన దొరికేది అక్కడే.

అతనికి అమ్మ జ్ఞాపకం చాలా లీలగా మాత్రమే గుర్తుంది. ఎంత ప్రయత్నించినా ఆమె రూపం అస్పష్టంగానే కన్పిస్తుంది. బలహీనమైన నల్లటి శరీరం.. మొహంలో నీరసం నిస్సత్తువ.. ఎండిన ఆమె గుండెలమీద ఆడుకుంటున్నాడు... అమ్మ నవ్వుతోంది .. ఉదాసీనంగా ఉన్న మొహంలో ఇప్పపూల మొగ్గలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నట్లు వెలుతురు పూచింది. ఇవే అమ్మను తల్చుకుంటే మదిలో మెదిలే దృశ్యాలు...

తనకు మూడెళ్ళ వయసున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ బాగా గుర్తున్నాయి. మెదడు పొరలమీద ఎవరో పచ్చపొడిచినట్లు.. అమ్మ కడుపు ఉబ్బుగా ఉంది. ఉదయంనుంచీ అమ్మ నొప్పితో మెలికలు తిరుగుతోంది. గుడిసెలో తాటాకు చాపమీద అమ్మ.. చుట్టూ తమ గూడెంలోని నలుగురు ఆదోళ్ళు. అయ్య గుడిసె బైట నిలబది ఆకాశం వైపుకు చూస్తూ దండాలు పెడ్తున్నాడు. తనకు గుడిసెలోపలికళ్ళి అమ్మను చూడాలని ఉంది. పోకూడదట. ఓసారి చటుక్కున లోపలికి

గుర్రపుడెక్క సలీం దూరాదు. అమ్మ మొహం మరోలా ఉంది తనకు తెల్సిన మొహం కాదది. అమ్మ పెద్దగా ఏడుస్తోంది. తనొచ్చినందుకు ఎవరో బాగా తిట్టి బైటికి నెట్టెసి తడికని లోపల్నుంచి తాడుతో కట్టెశారు. తను ఏడుస్తూ కింద పడి దొర్లాడు. అయ్య ఎత్తుకున్నాడు. తను ఏడ్చి ఏడ్సి అయ్య భుజం మీదే నిద్రపోయాడు.

పెద్దగా ఎవరో ఏడుస్తున్నారు. తనకు మెలకువొచ్చింది. అమ్మ గుడిసె బైట చాపమిద పడుకుని ఉంది. నిద్రపోతున్నట్లు మొహం ప్రశాంతంగా ఉంది. తనకు అలవాటైన అమ్మ మొహమే...ఇపుడు పొట్ట ఉబ్బరంగా లేదు. అయ్య ఏడుస్తున్నాడు. తను అమ్మ దగ్గరకెళ్ళి పక్కనే కూచున్నాడు. ఎంత కదిపినా కళ్ళు తెరవటం లేదు. ఎంత పిల్చినా పలకటం లేదు. ఎవరో వచ్చి తనని ఎత్తుకున్నారు.. సాయంత్రం అమ్మని చాపలో చుట్టి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మ ఎప్పుడూ తిరిగిరాలేదు. తను మరికొంత పెద్దయ్యాక అమ్మ ప్రసవం కష్టమై చనివోయిందని తెల్సుకున్నాడు.

తనకు వూహ బాగా వచ్చాక అమ్మ విలువెంటో తెలిసి వచ్చింది. అయ్య మారుమనువు చేసుకున్నాడు. మొదట్లో బాగానే చూసేది. బుల్లన్న పుట్లాక ఆమెలో మార్పొచ్చింది. ప్రతి చిన్నదానికి విసుక్కునెది. యిల్లు శుభ్రం చేయడం కాణ్ణించి పొయ్యి దగ్గర కూచుని గొట్టంతో పొయ్యి వూదడం దాకా అన్ని పనులూ చేయమనేది. అయ్యతో పాటు వెేటకెళ్ళమని బలవంతపెట్టెది.

'ఆడికింకా ఐదెళ్ళే సిన్న గుంటడు. ఆడ్ని ఆడుకోనీ. ఏటకు పిల్సుకెళ్లటానికి ఆడికి వయసు సాలదే అనేవాడు అయ్య,

'నువ్‌ నోర్ముయ్‌. నేను సెప్పింది సెయ్‌. నామాటిన్లైదనుకో... ఏం సేత్తానో తెల్సుగా. ఏ కాల్వలోనో సెర్వులోనో దూకి సచ్చిపోతా” అని బెదిరించేది.

ఆమె మాటలకు అయ్య ఆవు పులిని చూసి బిదిరినట్లు వణికిపోయేవాడు. మెతక మనిషి.. నోట్లో నాలుక లేని మనిషి ఆమె నోటికి జడిసి ఆమె చెప్పిందల్లా వినేవాడు. చెయ్యమన్నదల్లా చేసేవాడు.

తనకు అమ్మలేని లోటు మరీ కొట్టొచ్చినట్టు కన్పించినపుడు అడవి మధ్యలోకెళ్ళి ఒంటరిగా కూచుని ఏద్బెవాడు. చెట్టు బోదెల్ని కౌగిలించుకుంటే అమ్మ నడుంచుట్టూ

గుర్రవుడెక్క స్రలీర చేతులిసి పొట్టలో మొహం దాచుకున్నట్లుందేది. గడ్డిలో బోర్లా పడుకుంటె అమ్మ పొట్టమీద పడుకున్నట్లుందేది. కొమ్మలు ఆకుల చేతులో చెంపలు నిమిరేవి. ఆకలేసినపుడు అనాయాసంగా రాలేపళ్ళు అమ్మ కలిపి తిన్పించే బువ్వలా ఉందేవి. చాలా చిన్న వయసులోనే అతనికో విషయం అర్ధమైంది. ఈ అడవి తన అమ్మ. ఎప్పుడూ అందంగా నవ్వుతూ అక్కున చేర్చుకునే అమ్మ..ఎ సమయంలో చెయిచాపినా లేదనకుండా పందో దుంపో చేతిలో పెట్టే అన్నపూర్ణమ్మ తల్లి.

అతనికో సంఫుటన బాగా గుర్తుండిపోయింది. అప్పుడతనికి ఎనిమిదెళ్ళ వయసుంటుంది. అయ్యతో కలిసి వేటకు బయల్టరాడు. అయ్య వెనక నడుస్తుంటె అతని ముందు నిరాసక్తంగా నడుస్తున్నాడు వాడు.

మూగన్న మౌనంగా నడుస్తున్న కొడుకు వైపు చూశాడు. గూడెంలో ఆ వయసు పిల్లలందరి మొహాలు పుచ్చపువ్వులా విచ్చుకుని ఉంటే తన కొడుకు మొహమే తుమ్మల్లో వొద్దుగూకినట్లు ఎంత కళా విహినంగా ఉందో. అతనికి తన కొడుకు పరిస్థితి తల్చుకోగానే కడుపులో చేయి పెట్టి దేవినట్లయింది. సవత్తల్లి ఎంత హింస పెడ్డ్తుందో తెలిసి కూడా ఏమి చెయలేని నిస్సహాయత... వాడికి గంజి నీళ్ళుకూడా పోయకుండా బైటికి తరిమిందా మహాతల్లి.

“ఏరా మల్లయ్యా... ఆకలెత్తోందా? అంత నీర్సంగా నడుస్తున్నావ్‌" అన్నాడు కొడుకు వైపు ఆపేక్షగా చూసూ.

వాడికి ఆకలేస్తున్న మాట మాత్రం నిజమే. అమ్మ రాత్రి జొన్న రొట్టెలు చెసింది. మిగిలిన అడుగు బొడుగు ఏమైనా పెడ్తుందని ఎదురు చూశాడు. కనీసం అంబలి కాసి పోస్తుందని ఆశ పడ్డాడు. ఏమి పెట్టకుండానే అడవిలోకి పంపింది. మూగన్న మాత్రం రెండు ముద్దలు మెద్దులు తిన్నాడు. 'ఓముద్ద నువ్వూ తినరయ్యా. ఇది తింటే పొద్దు కాళ్ళేసేవరకు ఆకలెయ్యదు. దప్పిక కాదు. మన చెంచుల పాలిట అమురుతం ఇదేరయ్యా అంటూ కొదుకుని బతిమాలినా వాడు తిన్లేదు. వాదికి మెద్దులు సయించేవి కావ. యాపచెట్టు బెరడు కాల్చి ఆ బూడిదలో చింతపండు రసం కలిపి చేసే మెద్దులు.. ఆకలి చల్లార్చుకోడానికి చెంచులు ఆశ్రయించే మెద్దులు.. అది తిన్నప్పుడల్లా వాడికి కడుపు నొప్పి వచ్చెది.

క్‌

గుర్రపుడెక్క నలీర

'అసలే మాగిలి కాలం. జాము పొద్దెక్కినా సూడు సలెలా సంపేత్తోందో... సెప్తె యిన్నావు కాదు. ఓ ముద్ద మెద్దులు తినుంటే శకితొచ్చేది. మెద్దులు తిని పొద్దుగూకవరకు నడిసినా నీరసమనిపించదని సెప్పానా” అన్నాడు మూగన్న

'కడుపు నొసెాది. మొన్నోపాలి తింటె ఇరేసనాలైతే నువ్వెగా ఆరేకాకు రసం తాపించావు”

'సర్లే.. కొద్దిపాలి ఆ సెట్టుకింద కూసుందామా” కొడుకు వైపు వాత్సల్యంగా చూస్తూ అన్నాడు.

వాడి సమాధానం కోసం ఎదురుచూడకుండానే, ఆ చెట్టు బోదెనానుకుని కాళ్ళు చాపుకుని కూచున్నాడు.

'దా..కూసింత సేపు కూకో' అంటూ చేయి పట్టుకుని కొడుకుని తన పక్కన కూచోబెట్టుకున్నాడు

వాడు చెట్టు పైకి తలయొత్తి చూశాడు. వేప చెట్టు.. చాలా విశాలంగా విస్తరించిన కొమ్మలు... గాలికి వూగుతున్న కొమ్మలు అమ్మ ఒడిలో కెరింతలు కొడ్డ్తున్న ఆకతాయి పిల్లల్లా కన్పించాయి. తన వేనవేల ఆకుల కన్నుల్ని విప్పార్చి మల్లయ్య వైపు మురిపెంగా చూసిందా చెట్టు.

'నువ్విక్షదే కూకో. ఏమైనా పంధ్లు దొరుకుతాయేమో సూత్తా అంటూ లేచాడు మూగన్న

వాడు సరేనని తలవూపాడు. కొద్దిసేపైనాక తలయెత్తి ఆకాశం కన్పిస్తుందేమోనని చూశాడు. పచ్చటి మేఘమేదో వెచ్చగా కమ్మెసినట్లు నిందుగా కప్పెసిన ఆకులు తప్పు ఆకాశం కన్పడలేదు. వెడల్పాటి బోదె... పెద్దపెద్ద కొమ్మలుగా విడిపోయిన చోట కూచోదానికి అనువుగా తొట్టెలా విస్తరించి...

వాడికా చెట్టెక్కి అక్కడ కూచోవాలనిపించింది. కొమ్మల్ని పట్టుకుని కాళ్ళు పెనవెసి ఉయ్యాలలా వూగాలనిపించింది. నీరసం .. మనసు ఉవ్విళ్ళూరుతున్నా శరీరంలో సత్తువలిక కూచుండిపోయాడు.

అయ్య ఏమైనా తెచ్చిపెడితే తిన్నాక ఎక్కాలనుకున్నాడు.

ఆకలితో పాటు అసహనమనిపించి అయ్య కోసం చూశాడు. అలికిడి లేదు. యింకొద్దిసేపు ఎదురుచూశాడు. జూడ లేదు. వాడు లేచి కొంత ముందుకు నడిచి

30

గుర్రవుడెక్క సలీం కనుచూపు మేర పరికించి చూశాడు. అయ్య కన్పించలేదు.

వాడు అయ్యని వెతుక్కుంటూ ఏపుగా దట్టంగా పెరిగిన చెట్లని చేరుకున్నాడు. గుబురుగా పెరిగిన చెట్ల వొదలు... మట్ట...వాటి మధ్య మూగన్న కన్పించాడు. కొడుకుని చూడగానే ష్‌ అంటూ సైగ చెశాడు. శబ్దం చేయకుండా అడుగులో అడుగేసుకుంటూ వెనక్కి వచ్చాడు. కొడుకు పక్కకొచ్చి “అదుగో ఆ సెట్టు సూశావా... మోద్ద సెట్టు. దాని తొర్రలో సీ అంత పొడవున తేనె తుట్టె ఉంది. ఏడాది పొడుగూతా తిన్నంత తిని మిగిలింది బుద్దన్న కిస్తే బజారుకెళ్ళి అమ్ముకొస్తాడు” అన్నాడు. అంత పెద్ద తేనె పట్టు దొరికిందన్న సంతోషం అతని మొహంలో స్పష్టంగా కన్పిస్తోంది.

బుద్దన్న మల్లయ్యకు పెదనాన్న వరసౌతాడు. చెంచు పెంటలో వారం పొడుగూతా ఎవరెం సేకరించినా వాటిని బుడ్డన్నకిస్తారు. తేనె, బంక, కుంకుడు కాయలు. సీకాయ, అడ్డాకులు, బీడీ ఆకులు... వీటితోపాటు వైద్యానికి పనికొచ్చే మూలికలు, వేర్లు పట్టుకెళ్ళి ప్రతి గురువారం అడవి చుట్టుపక్కల వూళ్ళల్లో అమ్ముకుని వస్తాడు. ఆ డబ్బులో ఎవరికేం కావాలో వాటిని కొనుక్కొచ్చి ఇస్తాడు.

'ఈగలు పోవాలంటే సిడ సేసి పొగ పెట్టాల. సిడ సేయటంలో సాయం పట్టు" అన్నాడు కొడుకుతో. పచ్చి ఆకుల్ని కోసి, వాటితోపాటు మల్లయ్య ఏరుకొచ్చిన ఎండు పుల్లల్ని కలిపి రెండు చిన్న మోపులుగా కట్టాడు.

'నువ్వు కదలబాక. ఇక్కడే నిలబదాల. సెట్టు దాపులకు రావద్దు. పెద్దపెద్ద ఈగలు . కుద్దాయి” అని హెచ్చరించి తన దగ్గరున్న అగ్గిపుల్లతో ఒక మోపులోని ఎండు పుల్లల్ని అంటించి చెట్టు మొదల్లో పెట్టాడు. మరో సిడని అంటించి చెట్టు తొర్రలో వేసి లగెత్తుకుంటూ వచ్చి కొడుకు పక్కన నిలబడ్డాడు.

మెల్లగా వొగరావటం ప్రారంభమై దట్టంగా చెట్టంతా అల్లుకోసాగింది. ఒక్కసారిగా రుమ్మంటూ తేనెటీగలు పైకి లేచాయి. మూగన్న మెల్లగా చెట్టు వద్దకెళ్ళాడు. వెదురు చెక్కతో తయారు చేసిన చెల్లంతో అరచేయంత మందాన తేనెపట్టుని కోశాడు. ఈగలింకా అసహనంగా చెట్టు కొమ్మల్లో తిరుగుతున్నాయి. సిడలోంచి పొగ వెలువడూనే ఉంది

మూగన్న రెండు వెడల్పాటి ఆకుల్ని కోసి వాటితో దోనె చేశాడు.

3

గుర్రపుడెక్క సలీర

“పదరా అయ్య, మనం ఆ సేదేవ సెట్టుకింద కూసుని తిందాం) అన్నాడు ముందుకు

వేపచెట్టు బోదె నానుకుని మల్లయ్య కూచున్నాక వాడి చేతుల్లో ఆకుల దోనె ఉంచి,

రెండు చేతులో దాంట్లో తేనెని పిండాడు. దోనె నిండిపోయింది.

'ఇర్లా తిను. కడుపు నిండా తిను. అదయ్యాక యింకా పిండుతా అన్నాడు చెతిలోని పట్టు వైపు చూస్తూ, అందులోంచి తేనె దారాలుగా కారుతోంది.

'సాలయ్యా” అన్నాడు మల్లయ్య,

ఆకలికి ఆగలేక తేనెని నీళ్ళు తాగినట్లు తాగుతున్న కొడుకు వైపు జాలిగా చూసాడు. బిడకెంత ఆకలేసిందో అనుకోగానే అతని తండ్రి హృదయం బాధతో విలవిల్లాడింది.

దోనెలోని తేనెనంతా తాగేసిన కొడుకు వైపు చూస్తూ 'నీకెన్నిమార్లు సెప్పానొరే... తేనెని అలా తాక్కూడదని. పొర పోతే శానా పెమాదం తెలుసా...తెనెని మెల్లగా నాకుతూ తినాలి అన్నాడు.

'మర్పిపోయానయ్యా” అన్నాడు మల్లయ్య. వాడి మొహంలో యిపుడు నవ్వు

' పొద్దవొడిచినట్టు విచ్చుకుంది.

“సర్లె. యింకాత్త తిను అంటూ పిండబోయాడు.

'వద్దయ్యా... అజీర్నం సేస్తది'

“సేస్తే సేయనీ... ఏమైతది...ఓ మాంసం ముక్క తింటే సాలు యిరుగుడైపోద్ది. మాంసం తిని అజీర్నం 'సేసిందనుకో... తేనె నాకితే సాలు అజీర్నం, కడుపుబ్బరం తగ్గివోతాయి'

'వద్దయ్యా.. సాలు... నువ్వు తినయ్యా” అంటున్న కొడుకు కళ్ళలోకి చూశాడు. అవి తృప్తితో మెరుస్తున్నాయి. వాడి పక్కనె చెట్టుకి జారగిలబడి కూచుని తేనెపట్టులో చిన్నచిన్న ఉండలుగా ఉన్న పువ్వంని, మిగిలిన తేనెని తిన్నాడు మూగన్న.

ఓ నిమిషం (క్రితం తన కొడుకు కళ్ళలో కన్పించిన వెల్తురు ప్రస్తుతం లేకపోవడం చూసి మూగన్న కలవర పద్దాడు. ఇపుడా కళ్ళలో తిష్ట వేసుకున్న దిగులు అతని గుండెల్ని మెలిపెడుతోంది. తాను మారు మనువు చేసుకున్న కాణ్దించి వాడికళ్ళలో వేలాడుతున్న

వాణ్ని ఎట్లాగైనా సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో 'యింకేమైనా కావాల్నా అయ్యా..

గుర్రపుడెక్క సలీర సీకు ఉసుల్లు తినడం ఇట్టం కదా... ఉసుల్ల పుట్ట ఎతుకుదామా? పొద్దుగూకేక ఎనుపుకుని తినొచ్చు అన్నాడు.

'వద్దయ్యా'

షహోోనీ ఏం కావాల్నో అడుగురయ్యా. యిపుడు నువ్వు తిన్నావే.. అది తెంది లేనె. సిన్నసిన్న కంప తుప్పల్లో ఈగలు తేనెపట్టు పెడ్తాయే....వాటిలో జుంటి తేనే దొరుకుద్ది. శానా రుసి.. ఎతికి పెట్టనా?”

'వద్దయ్యా!

మూగన్న కొడుకు తలని (పేమగా నిమిరాడు. *నువ్వలా దిగులుగా ఉండబాకయ్యా, గుండె పట్టెస్తది. నువ్వు సంతోసంగా నవ్వుతా ఉండాలంటే ఏం సేయాలో సెప్పు. సేత్తా. ఏం కావాల్నో సెప్పు. ఇత్తా అన్నాడు.

కొన్ని క్షణాల మౌనం తర్వాత వాడు సమాధానం చెప్పాడు. 'అమ్మ కావాలి.

వూహించని జవాబు విని మూగన్న బాణం దెబ్బ తగిలిన పిట్టలా విలవిల్లాడాడు. కొడుకు వైపు నిస్సహాయంగా చూశాడు. మల్లయ్య కళ్ళల్లో నీళ్ళు...

కొన్ని నిముషాల వరకు ఏం చెప్పాలో, కొడుకునెలా సముదాయించాలో అతనికద్ధం కాలేదు.

చివరికి తన్ను తాను సంబాళించుకుంటూ అన్నాడు. 'ఒరే అయ్యా.. నువ్వంటే నాకెంతిట్టమో నీకు తెల్వదా? శానా ఇట్టంరా... నాకు పేనం. అందుకే గదరయ్యా నీకు మా తాత పేరు పెట్టుకుని ముర్సిపొయ్యా,.. నీ అమ్మ సచ్చిపోయాక నువ్వ కాదురా నేనూ బాగా నట్టవాయ్యా. అది బతికున్నప్పుడు దాని ఇలువేందో తెలీలా... అది పొయ్యాక తెలిసొచ్చింది అన్నాల్లూ కాపురం సేసింది దేవతలాటి ఆడదానో అని. మారు మనువాడింది దెయ్యంతో అని. నీకు సవిత్తల్లిని తెచ్చి నీ బతుకే కాదురొరే నా బతుక్కూడా బుగ్గిసేసుకున్నా. మారు మనువు సేస్కుంటే నీకు తల్లి లేని లోటు తీర్సుద్దని బెమ పద్దా. కానీ ఇలా రాచ్చసిలా నిన్నూ నన్నూ ఇర్సక తింటుందని వూహించలేదురయ్యా, తప్పయిపాయ్యింది. నాసేతుల్లోంచి అంతా జారివాయ్యింది. కొడుకు చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు.

మరికొంత విరామం తర్వాత “ఒరే అయ్యా...ఓ ఇసయం గవనం ఎట్టుకో. మన

గుర్రపుడెక్క నలీర చెంచు జాతికి తల్లి ఈ అడివి తల్లి. ఈ మలలమ్మ తల్లే మనందరికీ పెద్దమ్మ. ఆకలేత్తే అన్నం పెట్టె తల్లి... నిదరొత్తే వాల్లోకి లాక్కుని నిదర పుచ్చే తల్లి. ఈ అడివిలోని సెట్లూ పుట్లే మనకు అయ్యా అమ్మా. ఓ మాట సెప్తా ఇనుకోరయ్యా... ఈ సెట్టుంది సూశావూ... సేదేవ సెట్టు..ఇదే నీ తల్లనుకో. నీకేమైనా కట్టమనిపిత్తే దీన్లో సెప్పుకో. నీ మనసుకి నొప్పనిపిత్తే దీనికి ఇన్పించు. పతి సెట్టుమీద దేవతలు కూసుని ఉంటారట. మన పెద్దోల్లు సెప్పగా ఇన్నా. బదనికలంటారే...నువ్వూ ఇనే ఉంటావు. సచ్చిపోయిన మనోల్లంతా గాలిగా మారి ఈ సెట్లనే అంటిపెట్టుకుని ఉంటారని సెప్పుకుంటారు. నీ అమ్మకూడా ఈ సెట్టులో ఉండి నిన్ను సూస్కుంటా ఉంటది. ఇంకెప్పుడూ అమ్మ కావాల్నని కన్నీల్లు ఎట్టుకోమాక. ఇకపైన ఈ సెట్టె నీ అమ్మ. సరేనా?” అన్నాడు.

అర్ధమైనట్టు మల్లయ్య తల వూపాడు. లెచి నిలబడి ఆ చెట్టు వైపు చూశాడు. వూగుతున్న ఆ చెట్టు కొమ్మలు తనను చేతులు చాచి పిలుస్తున్నట్లనిపించింది. దాని బోదె చుట్టూ చేతులేసి కౌగిలించుకున్నాడు. చేతులు చాలనంత పేద్ద కాందం...

“ఇక ఎల్లామా ఏటకి' సంతోషంతో విప్పారిన కొడుకు ముఖం వైపు తృప్తిగా చూస్తూ అదిగాడు మూగన్నట

మల్లయ్య ఉత్సాహంగా 'అట్టగేనయ్యా” అన్నాడు. ముందుకు నడుస్తూనే వెనక్సి తిరిగి పదేపదే తన అమ్మ చెట్టుని చూస్మున్నాడు.

'మనం ఇందాక సూసిన తెంది తేనెపట్టుకు పొర్మపెట్టి ఎల్లాం” అన్నాడు మూగన్న

వాదికర్టం కాలేదు. పొర్కపెట్టటమనె మాటని మొదటి సారి వినడం వల్ల “అంటే ఏంటయ్యా” అని అడిగాడు.

“ఆ లేనెపట్టుని మొదలు మనం కదా సూశాం. ఆ తేనెపట్టుమీద హక్కు అధికారం మనదే. ఇంకెవ్వరూ దానిమీద సేయి వేయడాన్మి ఈల్లేదు. అది మనదె అని సెప్పడానికి గురుతుగా పెట్టేదాన్న పొర్మ అంటారు.”

మాటల్లోనే మట్టలో ఉన్న ఆ చెట్టుని సమీపించారు. పొగ రావడం బాగా తగ్గింది. తేనె టీగలన్నీ తేనెపట్టులోకి చేరుకున్నాయి. ఒకటైండు ఈగలు కొమ్మల్లో యింకా చక్కర్లు

మూగన్న తన బొడ్లో ఉన్న చాకు తీసి ఆ చెట్టు కాండం మీద నాలుగు చోట్ల గాట్లు

హో

గుర్రపుడెక్క సలీర పెట్టాడు. చెట్టు మొదల్లో ఓ రాయి తెచ్చి పెట్టాడు. ఆ చెట్టుకున్న చిన్నచిన్న కొమ్మలు విరిచి ఆ రాయిమిద పెట్టాడు. మళ్ళా వాటిమీద రెండు రాళ్ళు తెచ్చి బరువు పెట్టాడు.

'ఇక ఎల్టాం పద.. పొర్క ఎట్టడం ఐపాయ్యింది. మనం ఎప్పుడు కావాల్నంటే అప్పుడొచ్చి తేనె పట్టుని కోస్కోవచ్చు” అన్నాడు.

'నువ్వెట్టిన పొర్కతీసేసి ఎవులైనా దొంగిలిత్తేనో? నడుస్తూనే తన మనసులో మెదిలిన అనుమానాన్ని బైట పెట్టాడు మల్లయ్య,

'ఎవ్వలూ అలాంటి పని సేయరు. మన చెంచు జాతిలోనే ఆ నీతీ నేయం ఉన్నాయి"

“ఒకేల అలా సేత్తేనో?”

“శానా పెద్ద తప్పు సేసినట్టు...కుల పంచాయతీ పెట్టి ఆల్ల సేత తప్పు కట్టత్తారు. ఆ తేనెపట్టుకి ఎంత ఎల కడ్తె అన్ని పైసల్‌ కట్టాల. కాదంటే అలాంటి తేనెపట్టునే మరో సోట సూపించాల'”

'అసలా దొంగతనం సేసినోళ్ళు అలా సేసినట్టు సెప్పకపోతే ఆల్లే సేశారని ఎలా తెలుసుద్ది.

తన కొడుకు అడుగుతున్న అర్ధవంతమైన ప్రశ్నలకు మూగన్న ముచ్చటపడ్డాడు.

“ఎందుకు సెప్పరు? సెప్పి తీర్తారు. ఎవులైతే పొర్క పెట్టారో ఆల్లు దావర్కి మొక్కుకుంటే సాలు. దొంగ బైటికొతాడు”.

మల్లయ్యకా విషయం అర్ధం కాలెదు. దెవుణ్ణి మొక్కుకున్నంత మాత్రాన దొంగ తానే దొంగతనం చేసినట్టు ఎలా ఒప్పుకుంటాడు? ఎందుకు ఒప్పుకుంటాడు? దేవని మహిమ వల్ల బైట పడ్డాడా? దేవుడి శక్తికి భయపడి నిజం చెప్పేస్తాడా?

“ఏమని దావర్శి మొక్కుకుంటారయ్యా' అని మరో ప్రశ్న వేశాడు.

'సామి తండ్రి... దేవుడా...నా తెందిని తిన్నవారు ఎమ్మటే బైల పడాల. లేకపోతే ఆల్ల ఆల్లకే కొట్లాట పడి బైల పడాల అని మొక్కుకుంటే సాలు..తప్పక ఆల్లకేదో కీడు జరిగి బైల పద్దారు అన్నాడు మూగన్న.

ఆ వయసులోనే మల్లయ్య చిన్ని బుర్రకి రెండు విషయాలు అర్ధమైనాయి. దేన్నయినా మనదీ అని అధికారంతో చెప్పుకోవాలంటే, వేరేవాళ్ళెవ్వరికీ దానిమీద హక్కు లేకుండా చేయాలంటే పొర్క పెట్టాలి. ఎవరైనా మన సొమ్ము దొంగిలిస్తే దేవుణ్ణి మొక్కుకుంటే

ట్‌

గుర్రపుడెక్క స్రలీ6 చాలు, ఆ దేవుడే వాళ్ళ సంగతి చూసుకుంటాడు. వాళ్ళకు తగిన శిక్ష వేసాడు.

ఆ రోజంతా మల్లయ్య మనసు గాల్లో తేలిపోయింది. ఇన్నాళ్ళూ అడవి మొత్తాన్నె అమ్మ అనుకుని సాంత్వన పొందిన మల్లయ్యకు చనిపోయిన అమ్మ గాలిగా మారి ఏ చెట్టులో ఉందో తెలీటంతో అమ్మే దొరికినంత సంతోషంగా ఉంది. అమ్మ చెట్టు... చెట్టమ్మ,.. వేప చెట్టమ్మ... అమ్మో... ఎంత బావుందో... పచ్చగా కళకళలాడుతూ... ఎంతందంగా ఉందో... కొమ్మల్తో నృత్యం చేస్తూ. సంబరాలప్పుడు డప్పు శబ్దానికి లయగా కదిలే చెంచు యువతిలా...

మరునాడు తెల్లవారు రూమున చుక్క పొదవకముందే లేచి కూచున్నాడు. బైట చలిగా ఉన్నా లెక్క చేయక చెరువుకళ్ళి వేప్పుల్లతో పళ్ళు తోముకుని, నర్లింగ్‌ చెక్కతో వళ్ళంతా రుద్దుకుని, నున్నగా గుండ్రంగా ఉన్న చిన్న రాతితో తోమి, శుభ్రంగా స్నానం చేశాడు. అట్నుంచి నేరుగా తన అమ్మచెట్టు దగ్గరకళ్ళాడు.

వాణ్ణి అల్లంత దూరంలో చూడగానే వేపచెట్టు నవ్వినట్లనిపించింది... ఆడుకోడానికెళ్ళి తిరిగొచ్చిన బిడ్డను చూసి అమ్మ నవ్వె నవ్వులా....ఆ చెట్టుకింద నిలబడి తలయెత్తి కొమ్మల్లోకి చూశాడు. “రా...నా వొళ్ళోకి రా... అని పిలిచినట్లనిపించింది.

గబగబా చెట్టెక్కాడు. కొమ్మలుగా విడిపోయిన చోట కుదుర్హో కూచున్నాడు. కొమ్మలు గాలికి కదిలినపుడల్లా ఉయ్యాల వూగుతున్నట్లు హాయిగా ఉంది. ఓ కొమ్మ పైకి ఎగబాకి దానికి కాళ్లూ చేతులూ పెనవెసి వూగాడు. అమ్మ మెడలో చేతులేసి వీపు మీద వూగుతున్న అనుభూతి... వాడి వంటినిండా నవ్వు పాకుతోంది. వాడి రక్తం నిండా ఆనందం పారుతోంది.

'నువ్వగా నా అమ్మవి అని అడిగాడు.

కొమ్మలు శబ్దం చేస్తూ “వూ” అంటూ వూగాయి.

“నువ్వు నాకే అమ్మవు. యింకెవ్వరికీ అమ్మగా ఉందకూదదు. అట్లాగైతే ఇప్పుడున్నమ్మ బుల్లన్నని ముద్దు సేసి నన్ను ఒగ్గేసినట్లు నువ్వూ నన్ను దూరం సేస్తావ. నాకు మాత్తరమె అమ్మగా ఉంటావుగా అంటున్నప్పుడు వాడికి సవత్తల్లి ఆరళ్ళు గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళూరాయి.

కొమ్మలు బలంగా వూగి “వూ అంటూ శబ్దం చేశాయి.

ఏ

గుర్రపుడెక్క సలీర

'నువ్వు నాకే సొంతం కావాల్నంటే ఏం సేయాలో నాకు తెల్సు, అంటూ వాడు కిందికి దిగాడు. కోసుగా ఉన్న రాయిని వెతికి తెచ్చి దాంతో కాండం మీద నాలుగు గాట్లు పెట్టాడు. మళ్ళా పైకెక్కి చిన్నచిన్న వేప మండల్ని తెంపాడు. వాటిని నారతో కలిపి ఓ కొమ్మకు కట్టాడు. చెట్టు మొదల్లో ఓ రాయి పెట్టి దానిమీద మరికాన్ని కొమ్మల్ని పెట్టాడు. వాటిమీద మరో రెండు రాళ్ళు పెట్టాడు.

పైకి తలయెత్తి చూస్తూ 'పొర్మ పెట్టాగా. యింకెవ్వరూ నీ జోలికి రారు. నువ్వ యికనుంచీ నాకు మాత్తరమే అమ్మవు” అంటూ నవ్వాడు. వాడికి చాలా తృప్తిగా అన్పించింది. చాలా ధైర్యంగా కూడా అన్పించింది.

అప్పటినుండీ వాడికి సంతోషమన్సించినా దుఃఖమన్సించినా ఆ చెట్టు దగ్గరకెళ్ళి కూచుంటాడు. కొమ్మల మీద కూచుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు కొమ్మల్ని పట్టుకుని వూగుతాడు. చెట్టుచుట్టూ గెంతుతాడు.

అమ్మ తిట్టినా కొట్టినా ఆ చెట్టె వాడికి ఓదార్పు.

'నేనే తప్పు సేయకుండానే అమ్మ కొట్టంది సూడమ్మా..యిక్కడ సూడు ఎలా వాచిందో...ఎర్రగాతేలిన వాతలు కన్పడ్డాయా... తప్పంతా బుల్లన్నదే...తిట్లు తన్నులు నాకు” అంటూ ఎన్నిమార్లు ఏడ్చాడో.. వద్చి వఏద్చి మనసు తేలిక పడ్డాక, “నువ్వు మంచి అమ్మవు. నన్నెప్పుడూ కొట్టవు' అంటూ బాధంతా మర్చిపోయి ఆ చెట్టు బోదెని కౌగిలించుకుని మురిసిపోయేవాడు.

పెద్దయ్యేకొద్దీ చెట్టుతో మాట్లాడటం, కొమ్మల్ని పట్టుకుని ఏడ్వడం తగ్గినా చెట్టెక్కి కూచునే అలవాటు మాత్రం మారలేదు. ఆ చెట్టు అతనికి సాంత్వన... ఆ చెట్టు అతనికి అమ్మ ఒడి... అనంతమైన ఆత్మీయత... అంతులేని అనురాగం...

అందుకే చలికాలమైనా సరే ఉదయాన్నే ఆ చెట్టుని పల్మరించకుండా వేటకు పోడు. అమ్మ లేవక ముందే వచ్చేస్తే ఆమె తిట్ల దండకం వినే ఖర్మ తప్పుతుంది. చెట్టెక్కి కొద్దిసేపు కూచుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎండ పైకొచ్చాక వేటకు బయల్దేరతాడు. అలా అమ్మ చెట్టుని పరామర్శించాకే వెటకెళ్ళటం మల్లయ్య దినచర్యలో భాగమైపోయింది.

గుర్రపుడెక్క నీలీర

మల్లయ్య అమ్మ చెట్టుని సమీపించి చెట్టెక్కి కుదుర్లో కూచున్నాడు. యింకా మసకచికట్లు తొలగిపోలేదు. చెట్ల ఆకులమీద కురిసిన మంచు వల్ల ఆ కొమ్మల మధ్య మరింత చలిగా అన్నించింది. ఐనా అలానే ముడుచుకుని కూచున్నాడు. చెట్టు మొదల్లో బైరిగాడు తన యజమానికి కాపలా కాస్తున్నట్లు కూచున్నాడు.

కొద్దికొద్దిగా తెలవారుతోంది.

చెట్టు దిగబోతున్నప్పుడు కోయిల కుహూ అన్నట్లు ఎవరిదో తీయటి గొంతు విస్పించింది.

చెవులు రిక్కించి విన్నాడు. తనకు సమీపంలోనే ఎవరో స్త్రీ కూనిరాగం తీస్తోంది. చెట్టు కొమ్మలు గుబురుగా ఉందటం వల్ల ఆమె ఎక్కడుందో ఎటువైపునుండి ఆ శబ్దం వస్తుందో తెలియలిదు.

చెట్టు దిగి మళ్ళా విన్నాడు. వాట ఎ దిక్కునుంచి విన్సిస్తుందో గమనించి మెల్లగా చప్పుడు చేయకుండా అటువైపుకు నడిచాడు.

“కేకల పిట్టకు కేకలందం నా సామి

నెమలిపిట్టకు సోగలందం

నడుమునొచ్చే కర్రెపిల్లకు నా సామీ

ఎడమ చెతి గాజులందం”

చెట్లకావల ఓ పడుచు అటు వైపుకు తిరిగి గొంతుకు కూచుని పాడుకుంటూ నేలను తవ్వకోలతో తవ్వతోంది.

మల్లయ్య నిశ్శబ్దంగా వెళ్ళి ఆమె వెనక నిలబడ్డాడు.

“కట్టమీదా కలివి చెట్టూ నా సామి

పూతాతో బో తూగుతుంది ... ఓ తూగుతుంది...”

పాడుకుంటూనే వెనక అలికిడైతే తల తిప్పి చూసింది.

మేఘాల వలలోంచి అప్పుడే బైట పడిన నల్ల సూరిడులా వెలిగిపోతున్నట్టుందా మొహం. పదహారేళ్ళకు మించని వయసు... తెల్లకలువల్లాంటి పెద్ద కళ్ళు చెరువులోని చేపలల్లే కదుల్తున్నాయి. పెదాలు విల్లులా వంపు తిరిగి, చుబుకం కోసులా మొనదేలి... చూడంగానే సూదంటురాయిలా బలంగా ఆకర్షించే గుణమేదో ఆ పిల్ల మొహంలో ఉంది.

గుర్రపుడెక్క సలీర

పద్దెనిమిదేళ్ళ మల్లయ్య గుండె వెగంగా కొట్టుకోసాగింది. నాలిక తడారిపోయింది. వళ్ళంతా చెమట బిందువులు వొటమరిస్తున్నాయి. చిరుత ఎదురైనప్పుడు కూడా అంతట ఉద్వేగానికి లోనుకాలేదతను.

క్షణకాలం మాత్రమే అతని వైపు చూసి, తనకేమీ సంబంధం లేనట్లు మళ్ళా తను చేస్తున్న పనిలో నిమగ్నమైపోయింది.

మల్లయ్యకి అహం దెబ్బతింది. చెట్టంత ఎదిగిన నికార్సయిన తనలాంట్‌ యువకుడు పక్కన నిలబడి ఉన్నా పూచిక పుల్లని చూసినట్టు చూసి, విసిరి పారెసిందేనన్న ఉక్రోషం..

ఆమె పాటందుకుంది. “గుట్టమిదా గువ్వ పుట్టా నా సామీ

గోరు గోరు రగతమాయిీ నా సామీ..”

“ఏం సేస్తున్నావిక్కడ? నీ పేరేంటి?” గద్దించినట్లు అడిగాడు మల్లయ్య.

“ఏం? నీకు సెప్పి సేయాలా? ఈ అడివి నీ అయ్య సొత్తా” వెనక్కి తిరక్కుండానే సమాధానమిచ్చింది.

బెదిరిపోతుందనుకున్నాడు. బెదరగొట్టే రకమే కానీ బెదిరే రకం కాదని ఆ జవాబుతో అర్ధమైంది. బాగా వాగరుమోతుది అనుకున్నాడు. ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడి చూశాడు. భూమిలోంచి చెంచు గద్దలు తవ్వుతోంది.

ఇలా లాభం లేదనుకుని గొంతు తగ్గించి మంద్ర స్వరంతో “సీ పెరెంటి పిల్లా” అని అదిగాడు.

“నీకెందుకు పిల్లాడా” వెంటనే తిరుగు సమాధానమొచ్చింది.

ఈ పిల్ల గద్దించినా ఉలికేలా లేదు మృదువుగా పల్మరించినా పలికేలా లెదు అనుకున్నాడు. ఏం మాట్లాడాలో ఎలా మాట కలపాలో తెలీక రాతిబొమ్మలా అక్కడే నిలబడ్డ అతని వైపు ఓరకంట చూసి, “ఏటకెల్లే పన్లైదా? ఇక్కడెం సోద్యం ఉందనీ గుద్లప్పుగించి సూస్తూ నిలబడ్డావు? ఎల్లిల్లు. నీ పని సూస్కో ఇక్కడే నిలబడితే మాపటెలకి పొయ్యిమీద సట్టిలో కూరుండదు అంది.

తవ్వుకోలతో నేల మీద మరో చోట తవ్వతోంది. గడ్డ మొత్తాన్ని తవ్వేయకుందడా ఓ ముక్కని భూమిలోనే ఉంచి మిగతా గద్దని తవ్వుకుంటోంది. కొన్ని రోజులు పోతే ఆ

గుర్రవుడెక్క స్రీలీ6 ముక్కే మళ్ళా గడ్డలా పెరుగుతుంది. అడవి జంతువుల్ని అటవి సంపదని కాపాడుకోడానికి చెంచులు తమ సంతతికి తర్చదునిచ్చ వాటిల్లో ఇదొకటి కావడంతో ఆ పిల్ల చెంచు పిల్లేనని అతనికి రూఢి అయింది. ఎట్లాగయినా సరే ఆమె పాడిన పాట బావుందని చెప్పాలనుకున్నాడు.

ధైర్యం కూడగట్టుకుని,మాటలు కూదడబలుక్కుంటూ, “వీ పాట శానా బాగుంది. యిందాక పాడావే... కేకల పిట్ట అని.. నువ్వు పాడుతుంటే అచ్చంగా కోయిల పిట్ట పాడుతున్నట్లె ఉంది” అన్నాడు.

ఆ పొగడి పిల మొహంలో సిగ్గు తొంగి చూసింది. అప్పటవరకు ఆ అమ్మాయి మొహంలో కన్పించిన విసుగు, చిరాకు పోయి ప్రసన్నత చోటు చేసుకుంది.

“అంత బావుందా?” అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.

“శానా బావుంది. పెర తేనె తిన్నంత తీయగా ఉంది. మరోపాలి పాడవా... ఇంటాను”

ఆమె మొహంలో రంగులు మారాయి. చిరుకోపం అరుణిమలా కళ్ళల్లోకి పాకింది.

“నువ్వు పాడమన్నప్రుడల్లా పాటొస్తదా ఏంటి? కేకలపిట్ట ఎప్పుడంటే అప్పుడు పాదుద్దా? దానికి వాడాలని బుద్ది పుట్టినాక వాడుద్ది” అంది.

“సరే.. నీకు పాడాలని ఎప్పుడనిపిత్తాదో సెప్పు. అప్పుడొచ్చి యింటా”

అతని మాటలకు ఆ పిల్ల పకపకా నవ్వింది. యిప్ప పూలు దొంతర్లు దొంతర్లుగా రాలి పడ్డట్టు నవ్వింది.

“అలాగైతే దినాం నా సుట్టు సుట్టె తిరుగుతా ఉండాల. మరి కూడెట్టా దొరుకుద్ది?”

నీ చుట్టూ తిరుగుతా ఉంటె కూడు లికున్నా పర్లేదని చెప్పాలనుకున్నాడు. ధైర్యం చాల్లేదు.

“నీ పేరు సెప్పవా?” అన్నాడు బతిమాలుతున్నట్లు.

“లచ్చిమి”

“లచ్చనంగా ఉంది పేరు. నాపేరు మల్లయ్య”

ఆ పేరు వినగానే లచ్చిమి తెరలు తెరలుగా నవ్వింది. పున్నాగపూలు నక్షత్రాల్లా నేలమీద రాలిపడ్డట్లు నవ్వింది.

గుర్రపుడెక్క సలీం

“ఏంటీ... మల్లా సెప్పు... సీసైలం మల్లయ్యవా? బవురమ్మ కోసం ఎతుక్కోక ఇక్కడేం సేత్తున్నట్టో?”

మల్లయ్యకి ఆ భ్రమరాంబవి నువ్వెనని చెప్పాలనిపించింది. తిడ్తుందేమోనని భయం...తన వాలకం చూస్తుంటే తవ్వకోలతో గుండెల్లో పొడిచే రకంలా ఉంది. “అలా నవ్వబాక. దేవర పేరు. దేవర్కి కోపం వత్తే కట్టం.” అన్నాడు.

“లచ్చిమి అంటే ఇషు మూరితి దేవర్కి పెండ్లాం. సర్లె సర్లె. ఏమనుకోబాక. నవ్వాగలేదు” అంది అప్పటివరకు తవ్విన గడ్డల్ని వెదురు బుట్టలో వేసుకుంటూ.

“నన్ను సాయం రమ్మంటావా? సిటికెలో అన్ని గడ్డలూ తవ్వసి నీ బుట్టలో ఏస్తాను”

“నాకెవ్వరి సాయమూ అక్కరలేదు. తవ్వుకోల సేతిలో అట్టుకున్నానంటే ఈ అదవంతా ఛనంలో తవ్విపారియగలను” అంది లేచి నిలబడ్లూ. కూచున్నప్పటికన్నా లేచి నిలబడినపుడు మరి సన్నగా రివటలా కన్పించింది.

“మీరేం కుదురోళ్ళు?” ఆమె పక్శనే నడుస్తూ అడిగాడు.

“ఎందుకూ? మనువాడ్తావా?ొఅంటూ నవ్వింది.

నువ్వు వూ అనాలేగానీ అంతకంటే భాగ్యమా అనుకున్నాడు. పైకి మాత్రం “ఉట్టినే. తెల్సుకుందామనిొ అన్నాడు.

“పిట్టలోల్లం”

“మేము తోకలోల్లం. మాది ఈర్ల పెంట”

తన కుదురు పేరు చెప్పగానే ఆ పిల్ల కళ్ళు మెరవటం మల్లయ్య గమనించాడు.

“మల్లా రెప్పాద్దుట ఈ యేలకొస్తావా?”

“ఎందుకూ... అక్కడ గడ్డలేం లేవు. అన్నీ తవ్వేశాగా”

“వోనీ టైపు ఎల్లావో సెప్పు... నేనూ వత్తా”

“సాయం సేయడానికా... అక్కర లేదన్నాగా”

“అందుక్సాదు... నీ పాట ఇంటానికి”

లచ్చిమి గలగలా నవ్వింది. సెలయెటి జలజలలా నవ్వింది.

“సూడబోతే నాపాటని పటంగట్టి ని గుడిసెలో ఏలాడేసేలా ఉన్నావౌ” అంటూ వేగం మంచింది.

బ్‌

గుర్రపుడెక్క నీలీర మల్లయ్య ఆగిపోయాడు. ఆమె కొద్ది దూరం వెళ్ళాక ఆమెకు వినించేలా వెనకనుంచి పెద్దగా అరిచి చెప్పాడు. “రేప్పొద్దుగాల ఇదే యేలకి ఇక్కడ నీ కోసం ఎదురుసూత్తుంటా”.

ఆ పిల్ల విననట్టె వెళ్ళిపోయింది.

మల్లయ్య మనసంతా ఆ పిల్ల రూషమే నిండిపోయి... ఆలోచనలన్నీ ఆ పిల్ల చుట్టూతా అల్లుకుని...రోజంతా భారంగా గడిచింది. వేట చేయాలనిపించలా. ఆకలనిపించలా. దాహమూ వేయలేదు.

అడవిలోని ఏ చెట్టుని చూసినా లచ్చిమి గుర్తొస్తోంది. ఏ పక్షిని చూసినా లచ్చిమిలా అన్పిస్తోంది. కుందేలు కన్పిస్తే బాణం వేయబోయి ఆగిపోయాడు. అదీ లచ్చిమిలానే ఉంది. నీటికొంగలూ లచ్చిమే... నీటిలోని చేపలూ లచ్చిమే. ఉత్త చేతుల్లో గుడిసెకు తిరిగొచ్చిన మల్లయ్యకు తింది పెట్టకుండా రాత్రి పడుకునే వరకు వాళ్ళమ్మ తిడ్షోనే ఉంది. మల్లయ్యకు వాళ్ళమ్మ తిడ్డున్నా లచ్చిమి మాటలే విన్పిస్తున్నాయి...

లచ్చిమి పాడిన పాట ... పూతాతో బో తూగుతోంది... ఓ తూగుతోంది... జోలపాటలా, చెవులకింపుగా... పడుకుంటే కలలనిండా లచ్చిమి నవ్వే పువ్వులుగా విరగబూసి....

మరునాడుదయం రోజుకన్నా ముందుగానే మెలకువాొచ్చింది. ఎప్పటకి మల్లి అమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళకుండా నెరుగా లచ్చిమి కూచుని గడ్డలు తవ్వుకున్న చోటు దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.

ఆ (ప్రాంతం నిండా లచ్చిమి వెదజల్లి పోయిన మాటలు విత్తనాలై మొలిచినట్లు... ఆ చెట్లనిండా లచ్చిమి విరజిమ్మిపోయిన నవ్వులు పువ్వులై విరబూసినట్లు... తనకోసం తప్పకుండా వస్తుందన్న నమ్మకం... మిట్టమధ్యాహ్నం వరకు ఎదురుచూసాడు. రాలేదు. నిరాశపడి అన్వ్నమనస్క్మంగానే వేటకు వెళ్ళాడు.

ఆ రోజు ఏ జంతువునో పక్షినో కొట్టు౭ళ్ళకపోతే కూడు పెట్టనంది అమ్మ. ఆమె భయంతో అయిష్టంగానే వేట పూర్తి చేశాడు.

ఆ తర్వాత వరసగా నాలుగు రోజులు అదే పని. లచ్చిమి కూచున్న చోటు దగ్గరకిళ్ళటం.. అక్కడి చెట్లతోపాటు తనూ ఓ చెట్టులా మధ్యాహ్నం వరకు నిలబడి

లై

గుర్రపుడెక్క సీలీర ఎదురుచూడటం... నిరాశపడి నీరసంగా నిరాసక్తంగా వేటకెళ్ళటం... తిరిగి మొహం వెళ్ళాదేసుకుని గుడిసెకళ్ళటం...

ఐదో రోజు ఉదయం అతనక్కడికి చేరుకున్న గంటన్నర తర్వాత లచ్చిమి వస్తూ కన్పించింది. మొహమంతా వడలిపోయి... నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చింది.

లచ్చిమిని చూడగానే అతని మొహం వికసించింది. వెంటనే తను ఐదు రోజులుగా ఎదురు చూస్తున్న విషయం గురొచ్చి “నీ కోసరమని ఎన్ని దినాలుగా ఎదురు సూత్తున్నానో తెలుసా? దినాం పొద్దుపొాడవకముందే రావటం, పెకట్వాల వరకు ఇక్కడ నిలబడి ఎదురు సూట్టం, దిగాలు పడి ఎల్లివోవటం”అన్నాడు నిష్టూరంగా.

“నేనొత్తానని నీతో సెప్పలేదే” అక్కడ గొంతుక్కూచుని తవ్వుకోలతో నేలని తవ్వుతూ అంది.

అతను గతుక్కుమన్నాడు. నిజమే కదా..ఆ పిల్ల తప్పేం ఉందనీ..తను తప్పుకుండా వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూశాడు. అటువంటి నమ్మకాన్ని కలిగించే ఎటువంటి సూచనా ఆ పిల్ల చేయలేదు. ఏమనాలో తెలీక గుటకలు మింగుతూ “నువ్వాత్తావని పిచ్చి నమ్మకం... తప్పు నాదే” అన్నాడు.

“ఆ రోజలా ఎల్లానా...అప్పటి సంది జొరం. నాలుగు దినాలు లేవలా. ఈ దినం కొద్దిగా ఓపిక వత్తేనూ... మిగిలున్న కాసిని గడ్డల్ని తవ్వుకుందామని...” మాటల్ని మధ్య మధ్యలో తుంచుతూ చెప్పింది.

మల్లయ్య ఆ పిల్ల తవ్వుతున్న నెల వైపు చూశాడు. మట్టి గద్దలు తప్ప చెంచు గడ్డలేమీ కన్పించడం లేదక్కడ.

లచ్చిమి వచ్చింది తన కోసమే అని, గడ్డలు తవ్వుకోడానికని చెప్పటం సాకు మాత్రమేనని అర్ధమై మల్లయ్య ఛాతి సంతోషంతో పొంగింది.

“ఆఅ రోజు నన్ను అదాట్టుగా సూశావుగా.. జదుసుకుని ఉంటావు. జదుపు జొరం వచ్చి ఉంటది అన్నాడు నవ్వుతూ.

“ఓయబ్బో... ఇంతోటి మగాన్ని ఎప్పుడూ సూళ్ళిదనీ... నువ్వేమన్నా పెద్దపులివా? పెద్ద పులే ఎదురొచ్చినా నేను బయపడ. పెద్దపులి మీద పెద్దమ్మ సవారీ సేస్తుంటదని

గుర్రపుడెక్క సలీం కదా మన పెద్దల నమ్మకం... పులెదురుగ్గా నిలబడి దాని కల్లలోకి నేరుగా సూత్తా * ఓ పెద్దమ్మతల్లీ...నీ దారి నీది, నా దారి నాది, తప్పుకో అంటా”

“నాకెరుకైందిలే. నువ్వంతటి దైర్నం ఉన్నదానివె”

లచ్చిమి లేచి నిలబడి “ఆ దినం నాలుగైదు గడ్డలు ఇడిసిపెట్టి పోయినా. ఇపుడు తవ్వితే ఒక్కటీ తగలడం లేదు. సెవుల పిల్లులు తినేసి ఉంటాయి” అంది.

“అబద్దాలు అతికేలా సెప్పటం నీకు శాతకాదులే లచ్చిమీ. నువ్వొచ్చింది నాకోసరమని తెల్వదనుకున్నావా? ఒక్కపాలి సెప్పవా... నా కోసరమే వచ్చావని...సాలు ఈ అడవికి రాజైపోతా”

“ఓయబ్బో...రాకరాక నీ కోసరమే రావాల్నా... నీతోటి అందగాడు చెంచు పెంటలోనే లేడని రావాల్నా ఏమిటొ” అంటూనే మల్లయ్య మొహం వైపు చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది.

“దొంగ దొరికావుగా” అంటూ మల్లయ్య నవ్వాడు. లచ్చిమీ నవ్వింది. యిద్దరూ కలిసి నవ్వారు. మనసారా నవ్వుకున్నారు... తనివి తీరా నవ్వుకున్నారు.

లచ్చిమి పరిచయమైనాక మల్లయ్య జీవితమే మారిపోయింది. అమ్మ ఎన్ని తిట్టినా యింతకు ముందులా బాధనిపించడం లేదు. అమ్మ చెట్టు దగరకెళ్లాలనిపించడం లేదు. లచ్చిమి ఎక్కడుంటే అక్కడ ఉండాలనిపిస్తోంది. లచ్చిమితో మాట్లాడాలనిపిస్తోంది. లచ్చిమి పాడుతుంటే వినాలనిపిస్తోంది.

అడవి ఇపుడు మరింత అందంగా కన్పిస్తోంది. చలికాలం వెచ్చగా ఉండింది. ఎండాకాలం వచ్చినా ఎంద వెన్నెల్లా హాయిగా ఉంటోంది.

ఇపుదడతను అమ్మ (ప్రేమకోసం వెంపర్లాడటం లేదు. లచ్చిమి (ప్రేమ కోసం ఆరాటపడ్డున్నాడు. లచ్చిమి పొందుకోసం పరితపిస్తున్నాడు.

వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకునే మట్టలో ఎదురుచూస్తూ కూచున్నాడు మల్లయ్య. ఈపాటికి రావాలే.. ఎందుకు రాలెదబ్బా అని ఎన్నిమార్లు అనుకున్నాడో... తలయెత్తి ఆకాశం కేసి చూశాడు.

గుర్రపుడెక్క సనీర పొద్దు పడమరకి వాలబోతోంది. యిక రాదేమో అనుకుంటున్నప్రడు లచ్చిమి వచ్చింది. ఆమె మొహంలో కంగారు స్పష్టంగా తెలుస్తోంది.

“యింతాలీసెమైందెం.. పెకట్వాల కాబ్సించి ఎదురుసూత్తున్నాను తెలునా?” అన్నాడు కోపంగా.

“నీకేం మగాడివి... మా గూడెం జనాల కల్లబడకుండా రావాల్నంటే పేనం ఇస్మిపోతుంది తెలునా” అంది లచ్చిమి అతని పక్కన కూచుంటూ.

మల్లయ్యకు లచ్చిమి పడ్డున్న ఇబ్బంది తెలుసు. దానికో పరిష్కారం ఆలోచించి పెట్టుకున్నాడు.

“నీకు దూరంగా ఉండాల్నంటే కట్టంగా ఉంటోందే... నువ్వేమో రాడానికి కట్టపడ్డున్నావ్‌.. అందుకే రాతిరంతా ఆలోసించి ఓ నిర్నయానికొచ్చా. మనం లగ్గం సేస్క్ముందామ లచ్చ” అన్నాడు.

లచ్చిమి అతని వైపు కళ్ళు వివ్వార్చి ఆశ్చర్యంగా చూసింది. వెనువెంటనే ఆనందంగానూ చూసింది. “ఈ మాట సెప్పడానికి నీకిన్ని దినాలు పట్టిందా? బాగా దైర్నమున్న మగాడివనుకున్నా. పిరికోడివౌఅంటూ నవ్వింది.

“నిన్ను సూసిన ఛనమే పెల్లి సేస్కుందామని అడుగుదామనుకున్నా పులిసూపులా పదునైన నీ సూపు సూసి బయమెసి అదగలా”

ఆ మాటినగానే లచ్చిమి పడీపడి నవ్వింది. అరుణిమ పులుముకున్న ఆకాశం సిగ్గుతో కమిలిపోయేలా నవ్వింది.

“యింకాలిసెం సేయబాక. మీ పెద్దోల్లని పిల్సుకుని మా గంగసెర్ల పెంటకి రా...మా అయ్యతో లగ్గం ఇసయం మాటాడు”

“రేపే పిల్సుకొస్తా”

“ఇన్నాల్లూ లేని తొందర ఇపుడొచ్చిందే పిలగాడికి” అంటూ మళ్ళా కిలకిలా నవ్వింది.

“నువ్వు నవ్వుతా ఉంటే నెమిలిపిట్ట పింఛం ఇప్పుకుని ఆడుతున్నట్టు శానా అందంగా ఉంటావు తెలుసా”

ఆ పొగద్తకి మురిసిపోతుందనుకుంటే లచ్చిమి మూతి మూడువంకర్లు తిప్పి “అంటె నవ్వకుండా ఉన్నప్పుడు బావుందననేగా” అంది.

త్‌

గుర్రపుడెక్క సలీర మల్లయ్య కంగారుపడ్డాడు. “నా ఉద్దేశం అది కాదే.. నవ్వకుండా ఉన్నా బావుంటావు. నవ్వితే యింకా బావుంటావు”

లచ్చిమి కొద్దిసేపు మాట్లాడకుండా కూచుంది.

“ప్రంట్రీ మాట్లాదవు... మా అమ్మ పోలికొచ్చిందా?”

“అమ్మ పోలికేంటి? సీ అమ్మ మాట్లాడదా?”

ళా అమ్మకు మాటలు రావు. మూంగిది. గాలి బాగా ఈసినపుడు సేతులు వూపుతుంది. అంతే”

“మీ అమ్మ రాచ్చసని సెవ్పావుగా. దినాం తిడ్తుందని సెవ్వావు. ఇప్పుడేమో మాటలు రావంటున్నావు. అద్ధమయ్యేలా సెప్పు”

“ఈ అమ్మ ఆ అమ్మ కాదు. శానా మంచిది”

“సచ్చిపోయిన అత్త కాకుండా బతికున్న గయ్యాలి అత్త కాకుండా నాకు మరో అత్త ఉందన్నాట. ఎవరో ఇవరంగా సెప్పు... ఎక్కడుంటది... మీ గూడెంలోనా.. ఏరే గూదెంలోనా”

“లేదు. ఇక్కడే ఉంటది”

లచ్చిమి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.

“ఇక్కడా ... అంటే ఈ అదివిలోనా?”

“కాదు. ఈ సుట్టుపకృల్లు”

“ఈ సుట్పపక్కల్న గుడిసెలేం లేవే... కొందీసి ఈ సెట్ల మద్దిన తిరుగాడతా ఉంటదా ఎంటి?”

మల్లయ్య సమాధానం చెప్పలేదు.

“ఇదేదో ఇంటానికే ఇంతగా ఉందే.. నాకు సూపించు పద” లచ్చిమి లేచి నిలబడింది.

“ఎవరూ లేరు.. ఉత్తినే సెప్పినా” మల్లయ్య నీళ్ళు నమిలాడు.

“కాదు..నాకు మరో అత్తుంది. శానా మంచిది. నువ్వుత్తినే సెప్పే మడిసివి కాదు. ఆ అత్త దగరకు నన్ను తీస్కెల్లు... నేను సూడాల... మాట్లాడాల”

మల్లయ్య ఇబ్బందిగా లచ్చిమి కళ్ళలోకి చూశాడు. “నేనీ రగస్యం ఎవ్వురికి సెప్పలా..

తం

గుర్రపుడెక్క సలీర నీకూ ఇప్పటిదాకా సెప్పలా?”

“రగస్యమా? నాకెందుకు సెప్పలేదు?”

“యిన్నాక నువ్వు నవ్వుతావని”

ఆమె భృకుట ముడివేసింది. అతనంటున్నదేమిటో అర్ధం కావటం లేదు.

“అమ్మను సూపిత్తే నవ్వుతారా ఎవరైనా... నాకు సూపించు. నవ్వనులే. రాచ్చసి కాదు దేవత అంటున్నావుగా.. సేతులెత్తి మొక్కుతా ... పద సూద్దాం”

“ఉండు... తొందరపదకు.. ఇసయమేంటో 'సెప్పసీ”

“ఇందులో సెప్పడానికేముంది?”

“శానా ఉంది. తీరా అన్నాక నన్నో ఎర్రి ఎదవ కింద లెక్క కట్టకూడదు”

“సరే సెప్పు...” లచ్చిమి మళ్ళా కూచుంది.

“ఈ అడివిలోని సెట్లలో మన పెద్దల ఆత్మలు గాలిగా మారి తిరుగుతుంటాయని మా అయ్య సెప్పేటోడు. కొన్ని సెట్లలో దేవతలు కూసుని ఉంటారట. ఓ దినం అమ్మ లేదని నేను బాద పడ్తుంటే ఇక్కడున్న సేదేవ సెట్టుని సూపించి ఇదేరా నీ అమ్మ అన్నాడయ్య. నాక్కూడా అమ్మ ఆ సెట్టులో కూసుని నన్ను గమనించుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. అప్పటిసంది నాకేం కష్టం కలిగినా ఆ సెట్టుతో సెప్పుకునేటోడ్ని. ఏడుపొస్తె ఆ సెట్టుని సుట్టుకుని ఏద్సేటోడ్ని అలా నా బాదలన్నీ ఆ సెట్టు తల్లికి సెప్పుకుంటి గుండె బరువు తగ్గి తేలిగ్గా అన్పించేది. ఆ సెట్టే నా అమ్మ అమ్మ సెట్టు” మల్లయ్య ఏడుస్తున్నాడు.

లచ్చిమి అతని వైపు సానుభూతితో చూసింది.

“ఇంతకాలం ఈ ఇసయం నాకెందుకు సెప్పలేదు? ఎంత దుక్కపడి ఉంటావో కదా...నేను నవ్వుతానని ఎలా అనుకున్నావు? అమ్మ లేనోల్ల పరిస్థితి ఎంత గోరంగా ఉంటదో నాకు తెలుసు. మా యింట్లో నేనే పెద్దదాన్ని నా తర్వాత మా అమ్మకు నాలుగు కాన్సులైనాయి. ఐదో కాన్సులో బిడ్డ అడ్డం తిరిగి సచ్చివోయింది. నాకప్పుడు పదేళ్ళ వయసుంటది. అమ్మ లేని యింట్లో పిచ్చిపట్టినట్లుండేది. ఎటొచ్చి మీ అయ్యలా మా అయ్య మారుమనువు సేస్మోలేదు. మిగతా పిల్లల్ని అమ్మలా సాకడానికే పొద్దంతా సరిపొయ్యెది. దిగులు పడ్డానికి తీరికెక్కడ? నీ ఇసయం అలాకాదుగా. మగపిల్లాడివి.

గుర్రపుడెక్క సలీర సిన్నప్పుడె అమ్మ సచ్చిపోయింది. సవిత్తల్లి రాచి రంపాన పెట్టే మహాతల్లి. అమ్మ పేమకోసం అలమటించి ఉంటావు. ఆ సెట్టు ఆదరణే నిన్ను రచ్చించింది. ఆ సెట్టే నీకు ఆదారంగా దొరక్కపోయి ఉంటే ఈ పాటికి పిచ్చోడివై పోయేవాడివి. పద... మీ అమ్మ సెట్టుని సూసొద్దాం” అంది లేచి నిలబడ్డూ.

మల్లయ్యకు చాలా సంతోషమనిపించింది. ఓ చెట్టుతో మాట్లాడానని చెప్పే నవ్వుతుందనుకున్నాడు. చెట బోదెని కౌగిలించుకుని ఏద్చేవాద్నని తెలిస్తే పిచ్చనుకుంటుందని భయపడ్డాడు. లచ్చిమి ఎంత మంచిదో...తననీ తన కహ్టాన్న్‌ ఎంత బాగా అర్ధం చేసుకుందో.. నిజమే...ఆ చెట్టే లేకపోతే దుఃఖ భారంతో తన గుండె పగిలిపోయి ఉండేది. తన కష్టాల్నీ కన్నీళ్ళని పంచుకున్న చెట్టు... సుఖంలో దుఃఖంలో తనకు తోడుగా నిలిచిన చెట్టు... అమ్మ చెట్టు...

వెప చెట్టు వద్ద నిలబడి లచ్చిమితో “ఇదే నా చెట్టు తల్లి” అన్నాడు.

“ఈ సెట్టెనా... ఈ సెట్టు కింద కూసుని మనం శానా మార్లు కబుర్లు సెప్పుకున్నాం కదా”

“జెను. సీ పరిచయమైనాక అమ్మకు సూపిద్దామని మొదటిసారి పిల్సుకొచ్చినపుడు అమ్మ సెట్టు నిన్ను సూసి ఏమందో తెలుసా? నా కాబోయే కోడలు బంగారు బొమ్మలా ఉంది అంది”

చెట్టుతో నువ్వు మాట్లాడావు సరే... చెట్టు మాట్లాడటమేంటి నీ తలకాయ అని అన్లేదు లచ్చిమి. మోకాళ్ళమీద కూచుని ఆ చెట్టుకి భక్తితో నమస్కరించింది.

మల్లయ్య తలయొత్తి చెట్టు కొమ్మలవైపు చూశాడు. అవి గాలికి వూగి కిందికి వంగి “యిద్దరూ సల్లంగా ఉండండి అని దీవించినట్లనిపించింది.

లచ్చిమి ఆ క్షణమే మనసులో బలంగా అనుకుంది. “నీకు ఆలినౌతా. దాంతో పాటు అమ్మనూ బెతా. శానా పేమనందిత్తా. ఎంత పేమంటే ఈ అమ్మను మర్సిపోయేంత' అని..

అప్పుడే ఆకాశంలో ఎగురుతూ పోతున్న వడ్రంగి పిట్ట కూసింది.

మల్లయ్య తలయెత్తి చెట్టు కొమ్మల్లోకి ఆకుల సందుల్లోంచి కన్పిస్తున్న ఆకాశం కేసి చూనాడు.

తి

గుర్రపుడెక్క సలీర

“లచ్చి... ఇన్నావా... దావర్‌ పిట్ట ఎలిసింది. ఈ చల్ల పొద్దు ఎలిసిందంటే మనకంతా మంచే జరుగుద్ద” అన్నాడు సంబరపడిపోతూ.

లచ్చిమికి ఆ విషయం తెలుసు. పెద్దల నోటిద్వారా విని బలపడిన నమృకమది. వద్రంగి పిట్ట వాళ్ళ పాలిట దేవతా పక్షీ దేవదూతలా వచ్చి చెంచుల యోగక్షమాలు విచారించే పక్షి ఆపద పొంచి ఉంటే మధ్యాహ్నాలప్పుడు అరిచి రాబోయే కీడుని హెచ్చరిక ద్వారా తెలియచేస్తుందనీ, చల్లని పూట అరిస్తే చల్ల కబురు మోసుకొస్తుందనీ తనవాళ్ళ నమ్మకం...

లచ్చిమి ఆకాశం వైపుకు చేతులెత్తి ఆ పక్రికీ నమస్కరించింది.

పెళ్ళి విషయం మొదట తనకు పెదనాన్న వరసయ్యే బుడ్డన్న చెవిలో వేశాడు. ప్రస్తుతం బుడ్దన్న తోకలోల్ల కుదురుకి పెద్దమనిషి,

“మొదలు మీ అమ్మకు సెప్పావా?”

“లేదు. అమ్మ సంగతి నీకు తెల్వదా? ఆగమాగం సేస్తది. అమ్మతో నువ్వే సెప్పాల. లచ్చిమి ఆల్ల అయ్యతో కూడా నువ్వే మాట్లాడాల” అన్నాడు మల్లయ్య,

మల్లయ్యని సవత్తల్లి ఎన్ని కష్టాలు పెడ్తుందో గూడెంలోని చెంచులందరికీ తెలుసు. ఆమె గయ్యాళితనమూ తెలుసు.

“సర్లి.. మాపటేల వచ్చి మీ అమ్మతో మాట్లాడా. పిట్టల కుదురోళ్ళ పెద్దమదిసికి కూడా సెప్పాలిగా. అన్నీ నేను సూస్కుంటాలే” అన్నాడు బుద్దన్న అభయహస్తమిస్తూ,.

“మేం గుడిసె ఎక్కడెసుకోవాలో సెప్తే లగ్గమయ్యెలోపల గుడిసేసుకుంటా” మల్లయ్య సిగ్గు పడ్డూనే చెప్పాడు.

“ఓరోరి... అంతా తొందరే... అలా ఆడపిల్లలా సిగ్గడిపోతే కుదర్సురొరేయ్‌.. మగతనం సూవాల.. సర్లె. నా పెద్ద కొడుకు రాజన్న గుడిసె లేదూ... దాని పక్కనున్న స్టలంలో గుడిసేస్కో.. నేను తీర్మానం సేత్తున్నా” మల్లయ్య భుజం తడ్లూ చెప్పాడు.

పెళ్ళి విషయం తెలీగానే రుద్రకాళిలా విరుచుకు పడింది సవత్తల్లి.

“ఈడు లగ్గం సేస్కుని ఏరెల్లిపోతే నేనూ నా ఓడ్డా ఎట్టా బతకాల? నా మొగుడ్ని

బ్‌

గుర్రపుడెక్క నీలీర ఈడి నోట్లోనేగా ఏసుకున్నాడు? ఈడే మమ్మల్ని పోషించాల” అంది శోకాలు తీస్తూ, మల్లయ్య మాట్లాడకుండా తలొంచుకుని కూచున్నాడు.

“మూగన్న నావు రాసి పెట్టుంటే ఈడేం సేస్తాడు? మనల్ని రచ్చించేదీ ఈ అడివే... శిచ్చించేదీ ఈ అడివే... ఇసప్పురుగులు కాటెేసీ, ఎలుగ్గాడ్ల బారిన పడి, ఇసజ్వరాలొచ్చి మన గూడేల్లో ఎంత మంది సత్తున్నారో... ఇన్నాల్లూ మల్లయ్య ఏటకెల్లి మిమ్మల్ని పోసించేవాడు కాబట్టి రెండు ఇప్పసెట్లే మీ వాటాగా తీర్మానించా. ఇప్పుడీడు లగ్గం సేస్కుంటున్నాడు కాబట్టి ఆ సెట్లు ఈడి కిచ్చేసి మీ వాటాగా మూడు సెట్లు తీర్మానిత్తున్నా... నీకూ నీ బిడ్డకీ ఇబ్బంది ఉండదు అన్నాడు బుద్దన్న

“ఎటకవ్వులెల్ల్తారు? నా బిడ్డ సంటోడు. అందుకే ఈడు తెచ్చె ఏిటలో మాకు సగం ఇచ్చేలా తీర్మానం సెయ్యి” అంది.

బుద్దన్నకు కోపం వచ్చింది. ఐదడుగులకు మించని ఎత్తుతో పిట్టలా ఉందే బుద్దన్న కోపంతో తాటి చెట్టంత ఎత్తుకి ఎగిరిపడ్డాడు.

“ఏంటీ నీ బిడ్డ సంటోడా...మల్లయ్యని నువ్వు పెట్టిన ఆరళ్ళు ఎవ్వరికీ తెలీవనుకుంటున్నావా... మూగన్నని పాము కాటేసి సంపక ముందే నువ్వా నోరులేని మడిసిని బతికున్నప్పుడే సంపేశావని గూడెంలో అందరికి తెలుసు. మల్లయ్యని ఏటకల్లమని తరిమినప్పుడు ఆడి వయసు ఎనిమిదేల్లు. నువ్వు మరిసిపోయినా గూడెం మదుసులకు గుర్తే, నీ కొడుకు బుల్లన్నకిపుడు పద్నాలుగేళ్ళు. ఏటకు పంపకుండా ఎన్నాల్లు గుడిసెలో కూకోబెద్తావు? గూడెం పరువు తీసింది సాలు... ఆద్ని ఏటకు పంపించు”

ఆమె మళ్ళా శోకాలు అందుకుంది. “ఆడ్ని నా సొంత బిడ్డలా సాకినా తల్లోయ్‌. ఇపుడు నా నోట్లో మన్ను పోసి పోతున్నాడయ్యోయ్‌ి”.

“చస్‌ ఆపు నీ దొంగేడుపు... మొగుడు సచ్చిన ఆడోల్లని, అమ్మాఅయ్యా లేని పసోళ్ళని, అవకరం ఉన్నోళ్ళని కాపాడుకోవాలనే చెంచు జాతి నీతికి కట్టుబటి మూడిప్పసెట్లు అప్పగించినా. ఎక్కువ తక్కువ మాటాడితే ఆట్ని ఏరేవాల్లకిచ్చిత్తా” అన్నాడు.

ఆ బెదిరింపుకి ఆమె నోరు మూతబడింది.

“ఈడి లగ్గం రోజు లొల్లి సేయకు. నాలుగచ్చింతలు ఈళ్ళ నెత్తిన జల్లి నీ పరువు కాపాడుకో” అంటూ లేచాడు బుడ్డన్న.

క్‌

గుర్రపుడెక్క స్రలీర మరుసటి రోజునుంచీ మల్లయ్య తన పెళ్ళకవసరమైన పనుల్లో తలమునకలైపోయాడు. గుడిసె వేసుకోడానికి అవసరమైన పెద్ద వెదుర్లని, గుడిసె మధ్యన అవసరమైన వెదురు కట్టు బొద్దుని సమకూర్చుకుని గుడిసె వేసుకున్నాడు. పైనంతా గడ్డితో కప్పేశాడు. రోజంతా అడవిని గాలించి జిగురు, తేనె, కుంకుళ్ళు, అద్దాకులు, బీడీ ఆకులు తెచ్చి బుద్దన్న దగ్గర జమ చెస్తున్నాడు. పెళ్ళికవసరమైన ఖర్భులకోసం అహోరాత్రాలు శ్రమిస్తున్నాడు. అతను సేకరించి తెచ్చిన సరుకుల్ని బుద్దన్న కొడుకు రాజన్న చుట్టుపక్కల వూళ్ళల్తో అమ్ముకొస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుల్ని బుద్దన్న దగ్గర జమ చెస్తున్నాడు.

“జమైంది సాల్లేరయ్యా.. లగ్గం దగ్గరద్తోంది. కాసింత ఇ(శ్రాంతి తీసుకో” అని బుదన్న సలహా ఇచ్చినా విన్లదు. పెళ్ళి రేపనగా కూడా శ్రమపడి వైద్యానికి వాడే మూలికలూ, వేరూ, బెరళ్లూ, గింజలూ ఏరుకొచ్చి బుద్దన్న కిచ్చాడు.

మరునాదె పెళ్ళి...

మల్లయ్యకి మహదానందంగా ఉంది. తిండి లేనోడికి మృవ్వన్న భోజనం దొరికినంత సంతోషంగా ఉంది. చెతిలో పైసాలేని పేదోడికి బంగారు నాణేలున్న మల్లె కాళ్ళకు తగిలినంత సంబరంగా ఉంది.

ఆ రాత్రి మల్లయ్యకు నిద్ర పట్టలెదు.

అమ్మ (డైమ కోసం, అమ్మ లాలన కోసం తపించిన రోజులు గురొస్తున్నాయి. ఎంతటి ఒంటరితనాన్ని అనుభవించాడో తల్చుకుంటే మళ్ళా కన్నీళ్ళొస్తున్నాయి. ఇన్నాళ్ళూ అడవిలోని చెట్టు, పిట్టలు, పుట్టలు నేసాలైె వూరడించకపోతే తనేమై ఉండేవాడో... అమ్మ తిట్టినపుడు, కొట్టినపుడు చచ్చిపోతే బాగుందని ఎన్నిసార్లు అనుకున్నాడో... ఇన్నాళ్ళూ పడిన కష్టాలకు రేపే చరమ గీతం పాడబోతున్నాడు. తన జీవితంలోకి లచ్చిమి అడుగు పెట్టబోతోంది. అడవిలోకి వసంత రుతువు ప్రవేశించినట్లు...

అయ్య చనిపోయాక తన బతుకు మరి దుర్భరమైంది. అయ్యకు తనంటే ఎంత ఇష్టమో... ఎంతగా (్రమించేవాదో.. మారు మనువు చేసుకుని కొడుకు బతుకుని బండలు చేశానన్న అపరాధ భావనలో కుంగివోతూ... తన౩ళ్ళదురుగా కొడుకుని మారుతల్లి కష్టాలు పెద్ద్తున్నా ఏమీ చేయలేని తన నిస్సహాయతకు కుమిలిపోతూ,

అటువంటి సమయాల్లో తనతో ఎప్పుడూ ఓ యు గ్గ

నా, [॥ | జ (4 0.౫౦ కే

గుర్రపుడెక్క సలీం ఎల్లకాలం గవనం ఉంచుకో. నువ్వంటే నాకు పేనం. మీ అమ్మ శానా మంచిది. దాంతోపాటే నా సుకమూ సంతోసమూ సమాదులైనాయి. మీ అమ్మ సచ్చిపోయి నెను బతికున్నా నేనూ సచ్చినోడితో సమానమే. ఈ బతికే బతుక్కూడా నీ కోసమేరా అయ్యా... నా నీడ కూడా తొలగిపోతే ఈ రాచ్చసి నిన్ను బతకనీదన్న బయంతో బతుకీడుత్తున్నా! అని. నోట్లో నాలిక లేని అయ్య... సివంగిలాంటి కొత్తమ్మ ముందు కుందేలు పిల్లలా ఒదిగిపోయిన అయ్య...

రేపు తనకు లగ్గం జరగబోతుందన్న సంతోషం ఓ వైపున్నా మరో వైపు అయ్య లేదన్న దిగులు మెలిపెడ్డోంది. ఈ సమయంలో అయ్య బతికుంటే ఎంత బావుందేదో... తనని పెళ్ళీ కొడుకులా చూసి అయ్య ఎంత సంతోషపదేవాదో.. దేవతలాంటి కోడల్ని చూసుకుని ఎంత మురిసిపోయేవాడో...

అయ్యతో గడిపిన క్షణాలు... అయ్య మాట్లాడిన సుద్దులు... అయ్య నేర్పిన విద్యలు... అన్నీ గుర్తొస్తున్నాయి... జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుకుంటున్నాయి.

చెల్లంతో తేనెపట్టుని కోసి తేనె పుడ్మలో ఎలా వేసుకోవాలో నేర్పింది అయ్యన... లేనెల్లొ అన్ని రకాల తేనెలుంటాయని చిన్నప్పుడు తనకు తెలీదు. చెట్టుపైనున్న కొమ్మలకో, చట్రాల బండలకో వేలాడే తేనెపట్టు... పెద్ద ఈగలు పెట్టె పెర తేనెపట్టు... చెట్టు తొర్రలలో దొరికే తెంది తేనె... చిన్ని చిన్ని కంప తుప్పల్లో దొరికే జుంటి తేనె... పువ్వం చిన్న చిన్న ఉండలుగా ఉండి ఏ కాలంలో నైనా దొరికే మొసరు చేనె..

తినడానికి పనికొచ్చే పుట్టగొడుగుల్ని విషపూరితమైన పుట్టగొడుగుల్నించి వెరుగా ఎలా గుర్తించాలో నేర్పింది అయ్యె.. పుట్టకోకులు, ఎదురుకోకులు, జున్ను కోకులు, దసరా పండగ సమయంలో దొరికే దసరా కోకులు, దీపావళీ రోజుల్లో మొలిచె దీపాల కోకులు...వాటిని చూపించి ఇవన్ని తినడానికి పనికొచ్చెవని చెప్పేవాడు. తిక్కకోకులు తినకూడదని చెప్పేవాడు.

తనకు ఉసుళ్ళంటే చాలా ఇష్టం. ఉసుళ్ళని బాణలిలో వేసి ఎర్రటి మంటలో దోరగా వేయించుకుని తింటే ఎంత రుచిగా ఉంటాయో... అమ్మ ఉసుళ్ళతో పచ్చడి చేసేది.. పచ్చిమిరపకాయలూ చింతపండూ ఉప్పు వేసి ఉసుళ్ళతో కలిపి నూరి పచ్చడి. చేస్తే ఎంత బావుందేదో.. కొండజొన్నల్తో సంగటి చేసి అందులో ఉసుళ్ళ పచ్చడి కలుపుకు

52

గుర్రపుడెక్క సలీర తింటుంటే స్వర్ణం బెత్తెడు దూరంలో ఉన్నట్లుందేది.

కానీ మారుటి తల్లి పదనిచ్చేది కాదు. అయ్య ఉసుళ్ళు పట్టి తెచ్చినా వాటిని వేయించి బుల్లన్నకు పెట్టెది తప్ప తనకు కనీసం గుప్పెడుకూడా విదిలించేది కాదు. అయ్య బాధపడేవాడు తప్ప అమ్మనేమీ అనేవాడు కాదు. ఉసుళ్ళు తెచ్చినా అమ్మ తనకు పెట్టదని అర్ధమైనప్పటినుండి తనకోసం వరే ఏర్పాటు చేయడం మొదలెట్టాడు. ఉసుళ్ళని పట్టి యింటికి తీ స్మెళ్ళకుండా అక్కడె మూడు రాళ్ళు పెట్టి వాయ్యిలా చేసి చిదుగులో మంట పెట్టి యినుప రేకుమీదో పగిలిన కుండ పెంకు మీదో వాటిని వేయించి పెట్టేవాడు.

మారుటి తల్లి తిండి పెట్టక కడుపు మాద్చినా అడవిలోకెళ్ళాక పండో దుంపో పెట్టి తన ఆకలి తీర్చేవాడు. అయ్య చనిపోయాక ఎన్ని మార్లు ఆకలికి తట్టుకోలేక నాన బెట్టుకున్న కొండగోగు బంక తిని కాళ్ళు ముడుచుకుని పడుకున్నాదో..

'ని అయ్యను నోట్లో వెసుకుని మింగేశావు కదరా” అంటూ సవత్తల్లి తిట్టే తిట్లు గుర్తొచ్చాయి.

తన అయ్యను తనెందుకు చంపుకుంటాడు? తన వెలితో ఎవరైనా తన కన్న పొడుచుకుంటారా? కానీ అయ్య చచ్చిపోయింది మాత్రం తన కోసమే.. తనని బతికించడం కోసం అయ్య చచ్చిపోయాడు. తనప్రాణాలు పణంగా పెట్టి తన ప్రాణంలో ప్రాణమైన కొడుకుని రక్షించుకున్నాడు.

ఆ రోజు జరిగిన సంఘటన అతనికి బాగా గుర్తుంది. జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకమది. తను బతికున్నంత కాలం ప్రతిక్షణం గురొచ్చి వేధించే సంఘటన...

ఆ సంఘటన మరోసారి అతని మనోఫలకం మీద పునరుజ్జీవించబడింది...

'అయ్యా.. నీకు ఉసుల్లంటే శానా ఇట్టం కదా. నేనో పెద్ద పుట్టని సూసినా. ఐదారు అద్దలకు సరిపడా ఉసుల్లుంటాయి. అయన్నీ నీకే ఏయించి పెద్దా. ఆటిని పట్టాక ఎ సెట్టు తొర్రలోనో దాసి పెద్దా. ఆట్ని ఎండబెట్టాక నువ్వు తినాలనుకున్నప్పుడు ఏయించి పెద్దా అన్నాడు.

వేట పూర్తి చేసుకుని గూడేనికి తిరిగిపోయేముందు ఆ పుట్ట దగ్గరకు తీస్కెళ్ళి చూపించాడు.

చాలా పెద్ద పుట్ట...నెలకు మూడడుగుల ఎత్తున లేచిన పుట్ట... ఎన్ని రంధ్రాలున్నాయో

గుర్రపుడెక్క నలీర పుట్టకి... పదికి పైగా...

'సూశావురయ్యా ఈ 'సెదల పుట్టని... ఈ ముసుర్‌ కాలం పొయ్యే వరకు దినాం తిన్నా సరిపోయటన్ని ఉసుల్లుంటాయిందులో అంటూ నవ్వాడు అయ్య,

తన వెంట తెచ్చుకున్న బూరతో గుంటల్లో నిలువున్న వర్షం నీళ్ళు నింపుకొచ్చి ఆ పుట్ట రంధ్రాల్లో పోశాడు.

“నీల్లు పోశాగా... మూడు దినాలు పోయాక వద్దాం. అప్పటికి పుట్టలు పదునెక్కుతాయి. పుట్టని కప్పి ఉసుల్లు పదదాం...” అన్నాడు.

మూడు రోజులైనాక అయ్య తనని పుట్ట దగ్గరకు పిల్చుకెళ్ళాడు. పుట్ట పక్కనే మట్టిని అలికి ఉసుల సోల చేశాడు... పుట్టచుట్టూతా వెదురుబద్దల్లో విరిగిన పుల్లల్తో చుట్టు గుడిసెలా తయారు చేశాడు. చెట్ల ఆకులు దూసి దాన్ని పూర్తిగా ఆకుల్లో కప్పేశాడు. పుర్తాపు గింజల పొడిని నిప్పుల మీద వేసి ఆ పొగ పుట్ట కోమల్లోకి, రంధ్రాల్లోకి పోయెలా వుఫ్‌ వుఫ్‌ అని వూదాడు.

“ఈ పొగకి ఇంపటేల్లన్నీ పైకొచ్చి ఉసుల సోలలో పడాలి అన్నాడు.

“అయ్యా... ఈ పుట్టలో పాములుండవా?” మల్లయ్య తనలో మెదుల్తున్న అనుమానాన్ని బైట పెట్టాడు.

“ఇది వొములు పెట్టిన పుట్ట కాదు. చెదళ్ళ పుట. వొములు పాక్కుంటా వచ్చి ఈ పుట్టల్లోకి దూరి పడుకునే పెమాదముంది. ఐనా పుర్తాప్‌ గింజల పొగకి అయ్యి బైటికి రావు. మత్తుగా పుట్టలోపలే పడుకుండి పోతాయి”

మల్లయ్య ఆతురతగా చుట్టుగుడిసె వైపు చూస్తున్నాడు. ఉసుళ్ళ నోల ఎపుడు నిండుతుందా ఎపుడెపుడు పెనం మీద వెపుకుని తిందామా అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వినబడింది వెనక నుంచి బుస్‌ మనే శబ్దం... నాగువాము పడగ విప్పి మల్లయ్య వెనకాల అతి సమీపంగా నిలబడి ఉంది.

మూగన్న శిలలా నిలబడిపోయాడు. ఓ క్షణం అతనికేం చేయాలో అర్దం కాలేదు. కాళ్లూ చేతులు ఆడలేదు. పాము బుసలు కొడ్డోంది. మల్లయ్య దానికి కాటు దూరంలో నిలబది ఉన్నాడు.

'అయ్యా.. కదలమాకి అంటూనే అసంకల్పితంగా ముందుకురికి మల్లయ్య ని రెండు

లో

గుర్రపుడెక్క సలీర చెతులో ఎత్తుకుని భుజం మీద వేసుకుని వేగంగా వెనక్కి పరుగెత్తాడు. ఆ అదురుకి పాము అప్రమత్తమై మూగన్న వెనక్కి తిరిగి వెళ్ళబోతున్నప్పుడు కుడి పిక్కమీద కస్సుమని కాటేసి చరచరా వొక్కుంటా దాపునే ఉన్న తన పుట్టలోకి వెళ్ళివోయింది.

పాము తనని కాటేసిన విషయం మొదట మూగన్న గమనించుకోలేదు. తన కొడుకుని పాము బారినుంచి రక్షించుకున్నానన్న సంతోషంలో పిక్క మీద చురుక్కుమంటున్నా పట్టించుకోకుండా “అమ్మో.. ఎన్ని బారెల పొడుగుందో నాగుబాము... ఎలబారిపోయిందిలే.. నీకేం కాలేదుగా” అంటూ మల్లయ్యని దింపి వళ్ళంతా తడిమాడు.

“తల దిమ్ముగా ఉందేంటోనయ్యా,... కల్లు మసకబారుతున్నాయి. వొము నన్ను ముట్టిందేమోనని అనుమానంగా ఉందిరయ్యా” అంటూనే తన కాళ్ళ వైపు చూసుకున్నాడు. కుడి పిక్కమీద కాటేసిన గుర్తు...'పాము కుట్టిందయ్యా... ఇసం పాకుతున్నట్లుంది” అంటూనే కింద పడిపోయాడు.

అయ్యను పాము కాటేసిందని తెలీగానే మల్లయ్య దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనె తేరుకుని సాయం కోసం పెద్దగా కేకలు పెట్టాదు. ఎవ్వరూ రాలెదు. నాగముపష్టి వెరు కోసం చుట్టుపక్కల వెదికాడు. దొరకలేదు. నల్లీశ్వరి వేరో తల్లీశ్వరి వేరో దొరికినా బావుందని వెదికాడు. సమయానికి అవి కన్పించలేదు. మళ్ళా వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయ్య నోట్లోంచి నురగ వస్తోంది. పిక్క మీద పాము కాటేసిన చోట కత్తితో గాటు పెట్టీ నోటితో విషం లాగడానికి ప్రయత్నించాడు. అప్పటికే విషం వళ్ళంతా వాకింది.

చావబోయేముందు మల్లయ్యను దగ్గరకు తీసుకుని “ఒరే అయ్యా... నేనిక బతకను. సచ్చిపోతున్నా నువ్వూ నాలానే నోట్లో నాలిక లేనోడివి. ఎర్రోడివి. ఎలా బతుకుతావో ఏమో..నిన్నా లింగమయ్యె కాపాడాలి అంటూ ప్రాణాలు వదిలాడు.

ఆ సంఘటన ఈ క్షణంలోనే కళ్ళముందు జరిగినట్లు గుర్తుకు రావటంతో మల్లయ్యకు ఏడుపు ఆగలేదు. తనకోసం ప్రాణాలు వదిలిన అయ్యను తల్చుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. రేపు లగ్గమనగా ఈరోజు ఏడ్వటం అశుభమని తెలిసీ ఏడ్చాడు. 'అయ్యా.. రేపే నా లగ్గం... నువ్వు టి సెట్టులో టి గాలిలోఉన్నావో... నన్నూ లచ్చిమిని దీవించయ్యా! అని మనసులో అనుకున్నాడు. ల

ల్‌,

గుర్రవుడెక్క సీలీర

అక్కదంతా కోలాహలంగా ఉంది. ఆ గూడెం నిండా పెళ్ళి సందడి.. నిన్న సాయంత్రమే మల్లయ్య బంధువుల్లో పాటు తోకలోళ్ళ కుదురోళ్ళ్గంతా విట్టల కుదురోళ్ళుందే పెంటకు చేరుకున్నారు.

లచ్చిమి వాళ్ళ గుడిసె ముందు వేసిన పందిరిలోనే వాళ్ళకు విడిది ఎర్పాటు చేశారు. పదేళ్ళ వయసున్న రాజన్న కొడుకుని తోడుపెళ్ళి కొడుకుని చెసి మల్లయ్య పక్కన కూచోబెట్టారు. ఇద్దరు వ్యక్తులు డప్పులు మోగిస్తుంటి ఆడా మగా కలిసి ఆ శబాలకు లయబద్ధంగా శరీరాల్ని కదుపుతూ నాట్యం చేశారు. మల్లయ్యకు రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. మాగన్నుగా నిద్ర పట్టనా కలలు... కలల్లో లచ్చిమి... పాట పాడుతూ... పాటకు అనుగుణంగా పాదం కదుపుతూ...

సూర్యోదయం కాకముందే హడావిడి మొదలైంది. రెండు కుండల్లో స్‌ళ్ళు నింపి మైదానంలో మూడు మూడు రాళ్ళు పెట్టి రెండు పొయ్యిలు తయారు చెసి సళ్ళను కాగబెట్టారు. అక్కడే రెండు పీటలు వేసి మల్లయ్య ని లచ్చిమిని వాటిమీద కూచోబెట్టారు. పెళ్ళి జరిపించే కోలగాడు ఉత్తలూరి గురవయ్య స్నానాలకు ఏర్పాట్లు చేయందని తొందరపెడ్తున్నాడు. ఐదుగురు ఆడంగులు లచ్చిమికి న్నానం చేయించడానికి ముందుకొచ్చారు. ఆమె కాళ్ళకు చేతులకు మొహానికి పసుపు పారాణి పూశారు. యిరు కుదుర్లలోని పెద్ద మనుషులు మల్లయ్యకు న్నానం చేయించడానికి సన్నద్ధమైనారు. డప్పుల శబ్దం వూపందుకుంది.

కోలగాడు డప్పులు వాయించే వాళ్ళని ఆపమని సంజ్ఞ చేసి అక్కడ పెళ్ళి వేడుక చూడటానికి గుమి కూడిన జనాల్ని ఉద్దేశించి పెద్దగా చెవ్పాడు. “తోకలోల్ల మల్లయ్యకు పిట్టలోల్ల లచ్చిమికి లగ్గం జరగబోతోంది. ఇప్పుడు ఇద్దరికీ తానాలు సేయించాల. మీ అందరికీ సమ్మతమేనా”. అందరూ ఏక కంఠంతో సమ్మతమే అని అరిచారు. “ఇక తానం సేయించండి” అని చెప్పగానే మల్లయ్య నెత్తిమీద చెంబుతో సీళ్ళు కుమ్మరించారు. లచ్చిమి తలమీద ఆడంగులు సళ్ళు పోశారు. న్నానాల కార్యక్రమం జరుగుతున్నప్పుడే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి మధ్య ఆట మొదలయ్యింది. మల్లయ్య చెంబు లాక్కుని ఆ నీళ్ళని లచ్చిమి పైకి విసిరాడు. లచ్చిమి చెతికి నీళ్ళ చెంబు ఇచ్చి “అడి దిమ్మ తిరిగేలా ఇసరవే” అని రెచ్చగొట్టారు ఆడవాళ్ళు. లచ్చిమి బలం కొద్దీ మల్లయ్య మొహం మిదికి

రర

గుర్రపుడెక్క సలీర నీళ్ళని విసిరింది. మల్లయ్య లేచి నిలబడి కుండలో మిగిలున్న నీళ్ళని లచ్చిమి పైకి విసిరాడు. “మనం ఓడిపోకూడదే లచ్చీ.. నువ్వూ కాసీయ్‌” అన్నారు చెంచు యువతులు, లచ్చిమి కుండ నెత్తి మల్లయ్య కూచున్న చోటికొచ్చి అతని నెత్తిమీద కుండని బోర్లించింది. ఆ చర్యకు ఆదోళ్ళందరూ పగలబడి నవ్వారు.

ఇద్దర్నీ తది బట్టల్తోనే వేర్వేరు గుడిసెల్లోకి తీసుకెళ్ళారు. వాళ్ళు బట్టలు మార్చుకుని పొడి బట్టలు కట్టుకుని వచ్చిలోపల కోలగాడు పెళ్ళి కవసరమైన సామగ్రిని తయారు చేసుకోవటంలో నిమగ్నమైనాడు. అంతా సిద్ధమైనాక గురవయ్య బాసింపట్టు వేసుకుని కూచున్నాడు. అతని ఎదురుగా ఓ చాటలో పసుపు కలిపిన బియ్యం, ఎండిన కొబ్బరి చిప్పలు రెందు పెట్టారు. పెద్ద కీటకు పసుపు పూసి అతని ముందు పెట్టారు. రండు బాణాల్ని ఆ పీటకు చెరోవైపు గుచ్చారు. పెళ్ళి కూతురుని పెళ్ళికొడుకుని ముస్తాబు చేసి కూచోబెట్టారు. వాళ్ళిద్దర్నీ పెళ్ళి జరిగే వేదిక దగ్గరకు పిల్చుకొచ్చె బాధ్యత పెళ్ళి కూతురి మేనమామది. నలుగురు కుర్రాళ్ళు దుప్పటిలాంటి వస్త్రాన్ని నాలుగు కొనల్లో పట్టుకుని పెళ్ళికొడుక్కీ పెళ్ళికూతురికీ గొడుగులా చేసి సగౌరవంగా మండపంలోకి పిల్చుకొచ్చారు.

లచ్చిమి చేతులనిండా రంగు రంగుల గాజులు... మెడలో తెల్లటి పూసల దండ వేశారు. ఓ మోస్తరుగా ఉన్న చీర... జాకెట్టు... మల్లయ్య భుజాలమీదుగా ఓ తువ్వాలు కప్పారు. బాణాలు గుచ్చిన పీటకు చెరోవైపు పెళ్ళికూతుర్ని, పెళ్ళికొడుకుని కూచోబెట్టారు. కోలగాడు వాళ్ళ తలలమీద అక్షింతలు చల్లాడు. అతని సూచన మేరకు మల్లయ్య ఎండు కొబ్బరి చిప్పని తీసుకుని లచ్చిమి తలమీద పెట్టి రెండు చేతుల్లో ఫట్‌ మని శబ్దం వచ్చేలా విరిచాడు. లచ్చిమి కూడా అలానే అతని తలమీద కొబ్బరి చిప్ప ఉంచి కష్టపడి దాన్ని విరిచింది. తర్వాత అతని కుడిచేతికి దారంతో కంకణం కట్టింది. ఆమె కుడి చేతికి అతను కూడా కంకణం కట్టాడు. చుట్టూ చేరిన గూడెంవాళ్ళ అరుపులూ, కేరింతలతో డప్పుల మోతతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

గురవయ్య వాళ్ళిద్దర్నీ లెమ్మని చెప్పి మూడు నాలుగు సార్లు కూచుని నిలబడాలని, ఆ పని వేగంగా చెయాలని చెప్పాడు. వాళ్ళిద్దరూ అలా చేశాక “నీకంటే ఈ పిల్లే నయం. బాగా సేసింది” అన్నాడు మల్లయ్యతో., లచ్చిమి సిగ్గుపడివోయింది.

లచ్చిమిని నిలబడి కుడికాలు పీటమీద పెట్టమన్నాడు. మల్లయ్యతో తన ఎడంకాలితో

క్‌!

గుర్రపుడెక్క నీలీం ఆమె పాదంమీద బలంగా నొక్కమని చెప్పాడు. మల్లయ్య లచ్చిమి పాదం మీద తన ఎడం కాలు అదిమి పెట్టీ, గట్టగా నొక్తితే ఎక్కడ నొప్పెడుతుందోనన్న భయంతో సుతారంగా నొక్కాడు.

“యింతేనా నీ బలం... నొక్కు... గట్టగా తొక్కు” చుట్టూ చేరిన మగాళ్ళు రెచ్చగొట్టారు.

మల్లయ్యకు రోషం వచ్చింది. ఈ సారి బలమంతా ఉపయోగించి తొక్కాడు.

“సాల్లే నీ పెతాపం...ఎంత సేపు నొక్కుతావు? యిపుడు అమ్మాయి వంతు. ని కుడికాలు ముందు పెట్టు” అన్నాడు గురవయ్య,

అతను కుడికాలు ఎత్తి పీటమీద పెట్టాడు.

“నీ కుడికాలితో ఆడి పాదాన్ని తొక్కూ పెళ్ళికూతురితో అన్నాడు.

లచ్చిమి తన కసినంతా చూపుతూ అతని వాదాన్ని తొక్కింది.

“యింకా తొక్కు ఆడు బాథతో గిలగిల్లాడిపోవాల” అన్నారు ఆడంగులు.

“పెల్లయ్యాక ఆడి బతుకంతా సేయబోయేది అదేగా” అంటూ హాస్యమాడారు పెళ్ళికాని యువకులు.

“మా సెల్లి బంగారం. ఆడికి అదురుష్టం ఉండబట్టి ఆద్న లగ్గం సేస్కుంటుంది. పెల్లయ్యాక సారగం సూపిత్తది” ఆడవాళ్ళలో పెళ్ళికూతురికి వరసకి అక్క ఎవరో మాటకు మాట జవాబిచ్చింది.

డప్పుల మోత వూపందుకుంది. మల్లయ్య లచ్చిమి మెడలో పసుపు కొమ్ము కట్టాడు... పెళ్ళయిపోయింది.

ఆరుబయట చెట్లకింద వంట ప్రయత్నాలు మొదలయ్యాయి. నాలుగు కోడి పుంజుల్ని కోసి శుభ్రం చేస్తున్నారు. రాళ్ళు పెట్టి చేసిన పొయ్యిలు వెలిగించి వాటిమీద మట్టి వొత్రలు పెట్టారు. ఒకదాన్లో వెదురు బియ్యంతో అన్నం వండటానికి ఎసరు మరిగిస్తున్నారు. అరవైయేళ్ళ కొక్కసారి మాత్రమే పండే పంట వెదురొడ్లు. పంట పండిన తర్వాత ముళ్లిదురు, శాసన వెదుర్లు చచ్చిపోతాయి. వెదురు బియ్యంతో, వెదురు జొన్నల్లో చేసిన అన్నం తినాలని చెంచులు బాగా కోరుకుంటారు. మరో పాత్రలో మసాలాలు వేసి కోడికూర వందే ప్రయత్నం జరుగుతోంది.

రి

గుర్రపుడెక్క సీలీర

ఈ లోపల రెండు కుండలు తెచ్చి అక్కడ పెట్టారు. ఓ కుండనిండా పైకి తెల్లటి నురగ కన్పిస్తా కల్లు... మరో కుండలో యిప్పసారా... వాటితో పాటు చిన్న చిన్న మట్టి ముంతలు కూడా తెచ్చారు.

యిద్దరు చెంచు యువకులు లయబద్ధంగా డప్పు వాయించటం (ప్రారంభించారు. ఆడామగా తేడాలేకుండా కుండల దగ్గరకెళ్ళి కల్లు గానీ యిప్పసారా గాన్‌ పట్టించి ఆ డప్పు శబ్లానికనుగుణంగా నృత్యం చేస్తున్నారు. ముసలీ ముతకా కూడా ఉత్సాహంగా ఎగురుతున్నారు. దప్పు శబ్దం జోరందుకుంది. డప్పుల శబ్లానికి అనుగుణంగా చిందూ జోరందుకుంది.

కోడికూర ఉడుకుతున్న వాసన కమ్మగా వస్తోంది. వెదురు బియ్యంతో వండిన అన్నం తిని ఎన్ని రోజులైందో... అనుకుంటా కోడికూర కలుపుకుని తృప్తిగా తిన్నారందరూ. మల్లయ్యకు అయ్య లేని లోటు తెలీకుండా బుడ్డన్న దగ్గరుండి ఎంత బాగా లగ్గం జరిపించాడో.. పెళ్ళీ విందు ఎంత రుచిగా ఉందో అనుకున్నారందరూ.

లచ్చిమి పొద్దుపొాడవకముందె లేచి కసువూద్సి గుడిసె ముందు కళ్ళాపు చల్లింది. స్నానంచెసి పెళ్ళీ కోసం కొన్న రెండు కట్టుడు చీరల్లోంచి ఓ చిరని ఎన్నుకుని కట్టుకుంది. చేతి అద్దంలో చూసుకుంటూ మొహానికి పొడర్‌ రాసుకుంది. నుదుట తిలకం పెట్టుకుంది.

“రాతిరేల కురిసే సుక్కల ఎలుగంతా నీ మొగంలో కన్పడతా ఉందే లచ్చీ. ఎంత సక్కగున్నావో”

తన భార్య అందానికి మురిసిపోతూ అన్నాడు మల్లయ్య,

“సాల్లె పొగిడింది... వంటీ తీరిగ్గా కూసున్నావ్‌? ఏటకెల్లవా?” అతన్ని ఉదికిస్తూ అంది. అతనీ రోజు తనని వదిలి బైటికెళ్ళలేడని తెలిసే అడిగింది.

“నిన్న లగ్గమైళే ఈ రోజు ఏటకెల్లమంటావా? నువ్వసలు మొగుడ్ని పేమించే పెల్లానివేనా”

మల్లయ్య మొహంలో నీలి నీడలు....కొద్దిసెపాగి మొహం జాలిగా పెట్టి “ఈ దినమంతా నీ మాటలు ఇనుకుంటా నీ నవ్వు మొగం సూస్మ్కుంటా గడిపేత్తానౌ” అన్నాడు.

గుర్రపుడెక్క సలీర

“పెల్లాన్ని కాబట్టె సెప్తన్నా... పేముంటే సాలా, తిండి తినొద్దా... ఏటకెళ్లకపోతే నా మొగుడికి ఏం వండి పెట్టాలో సెప్పు? నా నవ్వుల్లో కూర సేసి నామాటల్ని దోరగా ఎఏయించి పెట్టమంటావా?”

“అదా నీ సింత? ఈ రోజు వంట సేయక్కరలా. కొండజొన్న కూడు, కోడికూర బుద్దన్న వాల్లు వండి పంపిత్తామన్నారు. మనం ఆరారగా కబుర్లు సెప్పుకోటమే పని”

లచ్చిమి నవ్వింది. “నాకూ తెలుసులెయ్యా.. అత్త సెప్పిందిలే. అత్తంటే నీ సవత్తల్లి అనుకునేవు. బుద్దన్న పెల్లాం... ఉత్తినే నిన్ను ఏడిపిద్దామని అట్టాగన్నా.. నువ్విరోజు అడవికి ఎల్తానన్నా ఎల్లనియ్యను. సరెనా... మొగం అలా దిగులుగా పెట్టమాక... నేను సూళ్ళీను” అతన్ని లతలా అల్లుకుపోతూ అంది.

మల్లయ్య కంగారు పద్దాడు. ఈ రోజు లచ్చిమితో కలిసి అడవిలోకెల్లాలని అతని కోరిక..

“ఏటకెల్లనన్నాగానీ అడవికెల్లనన్నానా.. నీతో కలిసి అడవిలోకెల్లాల... శానా పనుంది”

“ఏం పనో అది..నాకు సెప్పవా?” లచ్చిమి సిగ్గుపడ్తూనే అడిగింది. పెళ్ళయిన చెంచు జంటలు అడవిలోకెందుకెళ్ళాలనుకుంటారో లచ్చిమికి తెలుసు.

మల్లయ్య ఉద్దేశం వేరు. అందుకే లచ్చిమి ఎందుకు సిగ్గుపడ్తుందో అతనికి వెంటనే అర్ధం కాలేదు. “లగ్గమైన ఎమ్మట్నే నిన్ను తీస్మ్కొచ్చి సూపిత్తానని మా అయ్యకు మాటిచ్చినా”

లచ్చిమి మల్లయ్య వైపు అనుమానంగా చూసింది. “అయ్యనా...మీ అయ్య సచ్చివోయాడుగా. మరి ఈ అయ్య ఎవరు? ఎక్కడున్నాడు?”

“నన్ను కాపాడే అయ్య.. అడవిలో ఉందే అయ్య...”

“ఓ అర్ధమైంది. అమ్మ సెట్టులా అయ్య సెట్టుని కూడా ఎతికి పెట్టకున్నావన్నాట” అంటూ నవ్వింది లచ్చిమి. మళ్ళా వెంటనె “అయన్నీ నీ ఇట్టం. ఇంకా కావాల్నంటే మామ సెట్టు, అత్త సెట్టు కూడా ఎతుక్కో. పెల్లాం సెట్టు మాత్తరం ఎతుక్కోమాక. నేను తట్టుకోలేను” అంటూ పడీపడీ నవ్వింది. .

గుడిసె నిండా ఇంద్రధనుస్సులు విరిసినట్టనిపించింది మల్లయ్యకు. అదే విషయం చెప్పాడు లచ్చిమితో. *నువ్‌ నవ్వితే టింగ్‌టిలు గుడిసెనిండా పరుసుకున్నట్టుందె”

60,

గుర్రవుడెక్క సలీర

“సాల్లె సాల్లె..ని అయ్య సెట్టు కతేంటో సెప్పు” ఆ పొగడ్తకి మురిసిపోతూనే అడిగింది.

“సెట్టు కాదు.. సామి దేవర”

“ఏ సామి? శీశైల మల్లికార్జున నామినా? ఆ నామి అయ్య కాదు. మన బ్రమరాంబని లగ్గమాది చెంచులకు అల్లుడైనాడుగా”

“ఆ నామి కాదు.. నర్సిమ్మనామి.. నన్ను ఆదుకునే సామి”

“ఓ నర్సిమ్మ సామినా. మన చెంచు లచ్చిమినెగా మనువాడింది” పెద్దగా దీర్హం తీస్తూ అంది.

“ఇస్‌... పెద్దగా అరవమాక...ఆ సామి అడివిలో ఉన్న ఇసయం గూడెంలో ఎవ్వరికీ తెల్వదు”

“అంత రగస్యం ఎందుకు? నీకు సామి ఐతే అందరికీ సామినే. గూడెంలో అందరికి సూపిత్తే మన చెంచులోల్లందరూ సామిని మొక్కుతారుగా” అంది.

“వద్దాద్దు..ఆ సామి నాకు మాత్తరమే సామి. ఏరే వాల్లకి సామి ఇసయం సెప్పను. ఆల్లకు సామిని సూపించను. నీకు సూపిత్తా. నీతో లగ్గమైతే ఎమ్మట్న నిన్ను పిల్సుకొస్తానని నామికి మొక్కుకున్నా”

లచ్చిమికి మల్లయ్య మంకుతనం అర్ధం కాలేదు. చెట్టుని తల్లి చెట్టనుకున్నాడు. తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. వూరట పొందాడు. ఆ చెట్టు తనకే చెందాలనుకోవడంలో అర్దం ఉంది. కానీ దేవుడు అందరికీ చెందుతాడు కదా. ఆ దేవుడు కూడా తనకే పరిమితం కావాలనుకోవడం స్వార్ధమనిపించింది. పెళ్ళయిన కొత్త... వాదులాడి అతని మనసు నొప్పించటం ఇష్టం లేక మిన్నకుండిపోయింది.

లచ్చిమి మాట్లాడకపోవటం చూసి మళ్ళా మల్లయ్యా అన్నాడు. “ఆ సామిని నేనె మొదలు సూసినా.. మట్టిలో పదుంటే తీసి సుబ్బరంగా తుడిసినా. సుట్టుపక్కల వూద్చనా.. దినాం సామికి పందోకాయో వైద్యం పెట్టినా... పూలతో పూజ సేసినా.. నూనెపోసి దీపం ఎలిగించినా.. సామి నా సామి”

“సర్లె... నీ సామినే... ఎవ్వరూ ఎత్తుకెల్లర్ల” అనగానే తేలికపడిన మనసుతో నవ్వాడు.

“ఎల్లాం పద... నా సామిని సూపిత్తా” అన్నాడు లేచి నిలబడుతూ...

గుర్రపుడెక్క నలీర

లచ్చిమి అతని పక్కనే నడుస్తోంది. సూర్యుని బంగారు కిరణాలు లచ్చిమి చెక్కిళ్ళ మీద పడి ముఖమల్‌ సోయగాల్ని తలపిస్తున్నాయి. నడుస్తూనే ఓరకంట లచ్చిమి అందాల్ని కళ్ళారా చూసుకుంటూ పొంగివోతున్నాడు మల్లయ్య. లచ్చిమి నడుస్తుంటే అతనికి సివంగి నడక గుర్తు కొసోంది.

ఎదురుగా చెరువు కట్ట కన్పించగానే లచ్చిమి చిన్న పిల్లలా సంబర పడింది. “ఈ సెరువుదగ్గరా నీ సామి ఉంది? ఈ సుట్టుపక్కలంతా నాకు తెల్సిందే. ఈ సెరువు నీల్లయితే కొబ్బరి నీల్లలా తీయగా ఉంటాయి”

“నా దేవర ఉంది ఇక్కడ కాదు... అదుగో ఆ గుట్ట కన్చదడతా ఉందె. దానిమీదున్నాడు” అంటూ లచ్చిమి చేయి పట్టుకుని గుట్టపైకి ఎక్కించాడు.

గుట్టమీద నేలంతా చదునుగా ఉంది. ఓ వైపు శిథిలమైన మొండి గోడలు కన్పిస్తున్నాయి.

“నా సామి లోపలున్నాడు. దా సూపిత్తా లచ్చిమిని లోపలికి పిల్చుకెళ్ళాడు.

లోపల ఆరడుగుల రాతి పలక నేలలో సగం వరకు దిగబడిపోయి ఉంది. దానిమీద నరసింహస్వామి బొమ్మ అరిగిపోయి అస్పష్టంగా కన్పిస్తోంది. నేలమీద కొండ ఈత పళ్ళు, బలుసు పళ్ళు పెట్టి ఉన్నాయి. మట్టీ దివ్వెలో నూనె లేకపోవటం వల్ల ఆరిపోయి ఉంది.

“ఇదుగో నా సామి... నన్ను రచ్చించిన నర్సిమ్మ సామి. నన్ను కాపాడే దేవర.. మన లగ్గానికి ముందు రోజు సామికి ఈ పళ్ళు తెచ్చి నైద్యం పెట్టినా. అయ్యో... దీపం ఆరిపొయ్యింది... నేను దినాంవచ్చి దీపం ఎలిగిత్తా... లగ్గం రోజే రాలా...” అంటూ ఓ మూలలో దాచి పెట్టిన సీసా తెచ్చి అందులోంచి కొంత నూనె దివ్వెలో పోసి వత్తిని గిల్లి వెలిగించాడు. అప్పటివరకూ చీకటిగా ఉన్న ఆ చోటులో సన్నటి వెల్తురు పర్చుకుంది. ఇప్పుడు నరసింహన్వామి జూలు, సింహం తల స్పష్టంగా కన్పిస్తున్నాయి.

“నిన్ను మొదలు సూసిన రోజే ఈ సామితో సెప్పుకున్నా సీతో లగ్గం జరిపించమని ఏడుకున్నా. సామి నా కోరిక తీర్చాడు. మహిమగల సామి” మల్లయ్య మోకాళ్ళమీద కూచుని చేతులు జోడించాడు. లచ్చిమి కూడా భక్తితో నమస్కరించింది.

గుట్టకు మరో చివర్న ఉన్న నేలమీద ఏపుగా ఎదిగిన రెండు చెట్లున్నాయి. ఓ

క్‌

గుర్రపుడెక్క సలీ6 చెట్టునానుకుని కూచున్నారిద్దరూ. అక్కడ కూచుని చూస్తే అడవంతా మూడువైపులా మనోహరంగా కన్పిస్తోంది.

“అబ్బ... ఎంతందంగా ఉందో అడివి అంది లచ్చిమి.

“జను. నాక్కూడా మొన్నటివరకూ ఈ అడివి శానా అందంగా కన్పదేది”

“మరిప్పుడో” కళ్ళు ఆశ్చర్యంతో టపటపలాడిస్తూ అడిగింది.

“ఈ అదివికన్నా నా లచ్చిమే అందంగా ఉంది”

అతని మాటలకు లచ్చిమి పొంగిపోయింది. సిగ్గుతో మొహం ఎర్రబడింది.

నర్సింహస్వామి ఈ గుట్టమీద వెలిశాడని చెంచు గూడెంలో అందరికీ తెలిస్తే స్వామికి పూజలూ నైవేద్యాలు బాగా జరుగుతాయి కదా అన్పించిందామెకు. అదే మాట మల్లయ్యతో అంది.

“ఈ సామి గురించి మనోల్లందరికి సెప్తే సామికీ మంచి జరుగుద్ది. మనోల్లకూ మంచి జరుగుద్ది. నర్సిమ్మ నామి కదా. మన చెంచులకు ఇలవేల్పు. గూడెంలో అందరూ మొక్కుకుంటారు కదా”.

“వద్దొద్దు... ఆ పని మాత్తరం సెయబాక. నువ్వంటె నాకిట్టం కదా... అచ్చంగా నువ్వు నాకే కావాల. అట్లాగే ఈ సామి కూడా నాకే కావాల”.

ఈ స్వామిని మొదట చూసింది తనే కాబట్టి ఆ స్వామిని పూజించే హక్కు తనదే అనటంలో మల్లయ్య ఆంతర్యం ఆమె కర్టం కావటం లేదు. అమ్మ చిన్నప్పుడే చనివోవటం... అయ్య అర్దాంతరంగా మృత్యువాత పడటం... సవత్తల్లి ఆరళ్ళు... చిన్న వయసులోనే సంసారభారం నెత్తిమీద పడటం... వీటన్నిటివల్ల ఏర్పడిన అభద్రతా భావం నుంచి పుట్టుకొచ్చిన ప్రతిది తనక స్వంతం కావాలన్న స్వార్ధం.. తనకు ఆలంబనగా దొరికిన గడ్డిపోచనైనా సరే ఎవ్వరితో పంచుకోకుండా అమూల్యంగా దాచుకునే మల్లయ్య మనస్తత్వం ఆమెకు అర్ధం కాకున్నా అతన్ని అపార్ధం చేసుకోనంత సహృదయం ఆమెకుంది.

అందుకే ఆ విషయాన్ని సాగదీయకుండా అంతటితో వదిలేసి “సర్ల.. ఈ సామి మొదలు నీకెలా కన్పద్దాడో సెప్పు” అంది.

ఆ విషయం అడక్సున్నా చెవ్పాలని ఉబలాటపడ్డ్తున్న మల్లయ్య ఆమె అడగ్గానే ఉత్సాహంగా చెప్పటం మొదలెట్టాడు.

గుర్రపుడెక్క సలీం

“ఆ రోజు అమ్మ శానా తిట్టంది. మూడు పూట్ల గంజినీల్లు కూడా పొయ్యలా. 'ఎందుకి ఎదవ జనమ? ఏట్లో దూకి సావరాదా... పీడా ఇరగడైపోద్ది అంది. దుక్కంతో వాటు పొరుసమూ వచ్చింది.

మరుసటి దినం సచ్చిపోవాలని తీర్మానించుకున్నాా సచ్చిపోతే అమ్మనూ అయ్యనూ కల్పుకోవచ్చన్న కోరిక... సచ్చిపోయాక నాకిట్టమైన ఈ సెట్లల్లో పుట్టల్లో ఆత్మగా గాలిగా తిరుగాడాలన్న కోరిక. ఆకలికి సిక్కకుండా అమ్మ తిట్లకి దొరక్కుండా ఆకాశంలోకి అక్కడ కన్సడే కుందేటి సుక్కలోకి సేరిపోవాలన్న కోరిక...

అదుగో కన్సడుతుందే ఆ సెరువులోకి దూకి సచ్చిపోదామని పొద్దుగల్న వచ్చినా. అప్పుడు నాకు పదారేళ్ళుండొచ్చు. ఆ కట్ట మీద నిలబడి విల్లు అంబులు కింద పెట్టా. మొలనున్న బాకు తీయబోయేంతలో ఎనక అలికిడైంది. తిరిగి సూత్తే ఏముంది... సిరుత. ఆకలి కల్లతో నా వైపే సూతోంది.

అప్పటివరకూ సచ్చిపోదామనుకున్నా కదా. సిరుతకి పలహారమై సచ్చిపోవచ్చుగా..కానీ సిరుతపులినలా సూడగానే బయమేసింది. బాణమేసి సంపెద్దామంటే విల్లు అంబులు కింద పెట్టానాయె. వంగి వాటిని అందుకునే లోపల పులి నామీద పడేలా ఉంది. అప్పుడీ గుట్ట మీదికి లగెత్తినా... సిరుత నా ఎంట పడింది.

గుట్ట ఏటవాలుగా ఉండటం వల్ల సిరుత శానామార్లు కిందికి జారి మల్లా ఎక్కే పనిలో పడింది. నేను గుట్టమీదికి జేరుకున్నా. ఎక్కడైనా దాక్కుందామని సూత్తే అదుగో సామి ఉన్న మొండి గోడలు కన్పడ్డాయి. లోపలికెల్లి సూశా...నరసిమ్మ సామి కన్పడ్డాడు. అంతే... నాలో మొండి ధైర్నం వచ్చేసింది. యిక్కడ దాక్కున్నా సిరుత లోపలికి రాకుండా మానదనుకున్నా. అది సిరుతైతే నెను చెంచు పద్సడ్ని. అదో నేనో తేల్సుకోవాలనుకున్నా. సచ్చినా దాంతో పోరాడి దాన్ని సంపేసిగాని సావకూడదనుకున్నా.

బాకు తీసి సేతిలో అట్టుకుని బైటికొచ్చా. సిరుత ఇదుగో ఈ సెట్ల మద్దిన నిలబడి ఉంది. దాని కల్లల్లోకి కల్లు పెట్టి సూడంగానే పౌరుసం పొంగుకొచ్చింది. అది ఎగిరి నామీదకు దుమికింది. ఆ అదురుకి దూరంగా ఎల్లి పద్దా. కింద పడుకునే బాకుని రెండు సేతుల్తో పట్టుకుని 'దావే..నువ్వో నేనో సూస్కుందాం” అని సవాల్‌ ఇసిరా. అది ఎగిరి నామీద పడబోయింది. బాకు దాని పొట్టలోకి దూరిపోయింది. అప్పటికే నా

క్‌

గుర్రపుడెక్క సలీర వంటీ నిండా దాని పంజా దెబ్బలు పడ్డాయి. ఆటినుండి రగతం కారతా ఉంది.

సిరుత నామెడ దొరకబుచ్చుకుందామని తెగ గింజుకుంది. బాకుని పొట్టలోంచి లాగి మల్లా దాని పక్కలో మరో పొటు పొడిసినా. అంతే నా పైనుంచి దుమికి ఈసెట్ల దాకా పారిపోయింది. నేనుదాని ఎంట పద్డా. పెద్దగా అరిసి నాతో కలబడ్డది. రెండు నోట్ల పొడిసినా దాని పొగరణగలా. దానికి మెడ దొరక్కుండా కాసుకుంటూనే ఉన్నా. కానీ అది నా ఎడం బుజాన్ని నోట కర్సుకుని పళ్ళతో కొరికింది. పేనం గిలగిల్లాదిపోయింది. బాదనలానె పళ్ళ బిగువున బిగపట్టి బాకుతో దాని గొంతులో పొడిశా. ఓ మూలుగు మూల్లి బుజాన్ని వదిలెసి పారిపోయింది. అడవిలోకెల్లి సచ్చిపోయి ఉంటది.

దానికి నా మెడ దొరికుంటే నేను సచ్చిపోయేటోద్ని. వాల్లంతా రగతం..ఎడం బుజం నమిలి పడేసింది. ఇదుగో ఎడం బుజం మీద కన్సడతా ఉంది సూడు అర సేయంత ఎడల్పుగా మచ్చ... ఐనా బతికున్నందుకు సంతోసమనిపించింది. పారిపోయిన సిరుతను తల్సుకుంటే నమ్మబుద్ది కాలా.. నేనేనా సిరుతతో పోరాడింది? నేనే.. నాకా ధైర్నం ఈ సామిని సూశాకే వచ్చింది. నన్ను రచ్చించిందీ నా పేనాలు కాపాడింది ఈ సామి దేవరే. మల్లా లోపలికెల్లి సామికి దండం ఎట్టుకున్నా. దినాం వచ్చి నైద్యం ఎడ్దానని నామికి మాటిచ్చినా.

నిన్నటి వరకూ ఈ సామి నా సామి. ఈ రోజు నుంచి మన యిద్దరికీ సామి దేవర... అంతే... మనిద్దరికే... ఇంకెవ్వరికీ సెప్పమాక” అంటూ ముగించాడు.

పదహారెళ్ళకే చిరుతపులితో కలబడిన తన భర్త వైపు గర్వంగా చూసుకుంది లచ్చిమి. నా మగాడు చెంచు వీరుడు అనుకుని పొంగిపోయింది.

“మనం కల్సుకున్న కొత్తలో నాతో మాట్లాడటానికే బయపడితే పిరికోడివనుకున్నా. కాదు. రోసమున్న మగాడివే” అంది మెచ్చుకోలుగా.

“ిర్చుత్రో లెక్కా నాకు? పెద్దపులితోనైనా కలబడి పోరాడతా. కాని నీ కల్లల్లోకి సూత్తే సాలే గుండె జారిపోద్ది. మాట పెగల్టు” అన్నాడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ.

లచ్చిమి పకపకా నవ్వింది. ఇప్ప పూలు రాలి కొప్పులో పడ్డట్లు నవ్వింది.

గుట్టదిగి కిందికొచ్చాక “ఇపుడెం సేద్దాం” అని అడిగాడు.

,0క్‌

గుర్రపుడెక్క సలీం

“మనం ఎప్పుడూ కలుసుకునే మట్ట ఉందిగా.. సెట్ల గుబుర్లు.. అక్కడ కూసుని కబుర్లు సెప్పుకుందాం”

యిద్దరూ గుంపుగా పెరిగిన చెట్ల పొదని చేరుకున్నాక మల్లయ్య ఓ చెట్టు బోదెనానుకుని కాళ్ళు చాపుకుని కూచున్నాడు. అతని పక్కనే అతన్ని ఆనుకుని కూచుంది లచ్చిమి.

“కబుర్లు సెప్పుకుందామన్నావుగా.. ఐమైనా సెప్పు ఇంటాను” అన్నాడు.

“రాతిరంతా సెప్పుకున్నాంగా... ఇంకేం ఉంటాయి? వూటలా వూర్తాయేంటి మాటలు?”

“వోనీ పాట పాడు..ఆ రోజు పాడావు సూడు. కేకల పిట్టకు కేకలందం నా సామీ అంటూ.. పాడవా యిని శానా దినాలైంది”

“ఇప్పుడు పాడాలని లేదయ్యా”

“మరేం సేద్దాం... కబుర్లు సెప్పుకుందామని నువ్వేగా సెప్పావు?”” మల్లయ్యకి ఆమె ఆంతర్యం అర్ధం కాక అదిగాడు.

“మాటా పాటలేనా? ముల్లేరాలని లేదా ఏంటి” అంది అధాట్టుగా.

మొదట మల్లయ్యకు అర్ధం కాలేదు. లచ్చిమి అతని వైపు సిగ్గుపద్డూ చూసింది. మల్లయ్యకు వెంటనె అర్ధమైంది... ఇన్నాళ్ళూ దాచుకున్న అమృత కలశం నీకోసమే అనేలా కవ్విస్తూ లచ్చిమి.. ఆకాశంలా పరువాల్ని పరిచింది జాబిల్లిలా నువ్వు ఈదడానికే అంటూ అరమోడ్పులవుతున్న కళ్ళు... మకరందాల్ని అందివ్వడానికి మెత్తటి పూరెకుల్లా విచ్చుకున్న పెదాలు...

మల్లయ్యకు పధ్నాలుగేళ్ళ వయసులోనే స్తీ పురుష సమాగమానికి సంబంధించిన విషయాలు తెలిశాయి. చెంచు జాతి మొగుడూ పెళ్ళాలు రాత్రుళ్ళు కలవటం అరిష్టమని వాళ్ళ నమ్మకం. అందుకే పగటి పూట అదవి మధ్యలో ఏ పొదల మాటునో.. రాళ్ళ చాటునో సంగమిస్తారు. చనిపోయిన చెంచుల ఆత్మలు అడవిలో తిరుగుతుంటాయని... ఆరుబయట చెట్ల మధ్యలో కలిసే దంపతుల్ని దీవిస్తాయని బాగా నమ్ముతారు.

అలా కలిసే ముందు ఆడది నేలమీద పడుకోడానికి వీలుగా ఆ మగాడు అక్కడున్న రాళ్ళనీ ముళ్ళనీ గుచ్చుకోకుండా ఏరి పడేస్తాడు. ఆ తర్వాతే ఆడదాని పొందు... మగాడు ముళ్ళేరమంటావా అని అడిగాడంటె అర్ధం కలయికకు తయారుగా ఉన్నావా అని.

లచ్చిమి పరిచయమైన కొన్నిరోజుల తర్వాత ఈ పొదల మాటునే కబుర్లాడు

రర

గుర్రపుడెక్క సలీర కుంటున్నప్పుడు కోరికనాపుకోలేక 'ముళ్లేరమంటావా? అని అడిగాడు మల్లయ్య,

సీ సిగ్గులేదా నీకు... అయన్నీ లగ్గమయ్యాకే' అంది లచ్చిమి.

అది గుర్తుపెట్టుకుని 'ముళ్లెరవా' అని అడిగిన లచ్చిమి ఎంత గడుసుదో అర్ధమై మల్లయ్య మురిసిపోయాడు.

“సరే నీ ఇట్టం.. కబుర్లు సెప్పుకుందామా?” అల్లరిగా అదిగింది లచ్చిమి.

“వద్వ”

“పాట పాడనా? కట్టకింది బావిలోకి నా సామీ

సీల్లాకు నెనెల్లిపోతే... ఆ నేనెల్లిపోతే...”

“వద్దు ఆపు. నాకు పాటినాలని లేదు”

“మరి లచ్చిమి నవ్వుని మునిపంట నొక్కి పద్దూ అదిగింది.

“అయన్నీ తర్వాత.. మొదలు ముళ్లేరతా” అన్నాడు మల్లయ్య,

లచ్చిమి విరబూసిన పొగడ చెట్టులా నవ్వింది.

ఆ చెట్ల పొదలమధ్య, చెట్టు దుప్పటిలా పరిచి ఉంచిన చల్లటి నీడలో, కొమ్మల్లో వీస్తున్న వింజామరల హాయిని అనుభవిస్తూ లచ్చిమి మల్లయ్య శారీరికంగా ఒక్కటెనారు.

చుట్టూ కాపలాగా నిలబది ఉన్న చెట్లూ వాటీని అల్లుకుని ఉన్న చెంచుల ఆత్మలూ, చల్లంగా ఉండందని దీవిస్తున్న అనుభూతి మల్లయ్యకు.....

మసక చికటి.. చిరు చలిగాలి శరిరాన్ని తాకి గిలిగింతలు పెడ్డోంది. మల్లయ్య గుట్టకు సమీపాన ఉన్న చెరువు వైపుకి మెల్లగా నడుస్తున్నాడు. అలవాటైన దారైనా అతని కళ్ళు పరిసరాల్ని నిశితంగా పరీశీలిస్తున్నాయి. చిన్న శబ్దం విన్సించినా దాన్ని అందుకోడానికి చెవులు, విశ్లేషించడానికి మెదడు సమాయత్తమై ఉన్నాయి. ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్మోడానికి శరీరం మనసూ అప్రమత్తంగా ఉన్నాయి...

వీటన్నిటితోపాటు కళ్ళముందున్న అనంత సౌందర్యాన్ని అతను ఆనాంతం ఆస్వాదిస్తున్నాడు. తనకు వూహ తెలిసినప్పటినుండి ఈ అడవితో (ప్రేమలో పడ్డాడు... ఇక్కడి చెట్టూ పుట్టా చెరువూ గుట్టా అన్నీ ఇష్టం... అడవి అన్నపూర్ణమ్మ తల్లి.

గుర్రపుడెక్క స్రలీ౦

అతని మనసంతా ఉద్వేగభరితమైపోయింది. అప్రయత్నంగానే మోకాళ్ళమీద కూచుని అడవికి నమస్కరించాడు. “తల్లీ... నన్నూ నా వాళ్ళనీ సల్లంగ సూడు అని మొక్కుకున్నాడు. లేచి మళ్ళా చెరువు వైపుకు నడకసాగించాడు. గుట్టమీదున్న సామిని దర్శించుకుని వేటకు బయళ్ళెరటం అతని దినచర్య,

పక్కన పొదల్లో ఏదో కదిలినట్లనిపించింది. నడుస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయి కదుల్తున్న పొదవైపు చూశాడు. చెవులు రిక్కించి విన్నాడు. వాము బుసలా ఉంది.. ఒకటి కాదు రెండు పొములు.. మరికొద్ది సేపు నిలబడ్డాడు. అతని శరీరం వంచిన విల్లంబులా తయారుగా ఉంది. పారిపోవడానికో అవసరమైతే కలియబడటానికో... పొదలో కదలిక ఆగింది. ప్రమాదమేమి అన్సించకపోవడంతో అడుగు ముందుకేయబోయి ఆగిపోయాడు. ఎవరిదో నవ్వు... సన్నగా... ఆడదాని నవ్వు. గాజుల శబ్దం మంద్రంగా. వొద మళ్ళా కదిలింది. వాగ వస్తోందిపుడు.

మల్లయ్య మెల్లగా అడుగులో అడుగేస్తూ పొదని సమీపించి బాణంతో ఎడం చేసి చూట్టానికి ప్రయత్నించాడు. పొద దట్టంగా ఉండటం వల్ల వీలు కాలేదు. దాని చుట్టూ తిరిగి పొద వెనక్కి వెళ్ళాడు. అతన్ని చూడగానె ఓ ఆడా మగా అదురుపాటుతో లేచి నిలబడ్డారు. అస్తవ్యస్తంగా ఉన్న చీరని సర్దుకుంటూ ఆమె... తలవాంచుకుని నేల చూపులు చూస్తూ ఆమె.. తన మరదలు... తన తమ్ముడు బుల్లన్న భార్య.. పెళ్ళయి ఎదాది కూడా కాలేదు. యిపుడిలా మరో మగాడితో...

“ఎంకటమ్మా... నువ్వా?” అన్నాడు. అతనికి ఆశ్చర్యంతోనో ఆవేదనతోనో తర్వాతి మాటలు బైటికి రాలేదు.

ఆమెతో పాటున్న వ్యక్తి తన చేతిలోని బీదీని కింద పడేసి వేగంగా అక్కడినుంచి వెళ్ళివోయాడు.

“అతడు పులిచెర్ల లింగన్న కదూ” అన్నాడు.

ఆమె మాట్లాడలేదు. పది క్షణాల విరామం తర్వాత మెల్లగా వెనక్కి జరిగి పరుగెత్తుకుంటూ గూడెం వైపుకు వెళ్ళిపోయింది.

మల్లయ్య మనసంతా సంక్షుభిత సంద్రంలా ఉంది. గుట్టమీదికెళ్ళి తన దేవర్షి చూడాలన్న కోరిక చచ్చిపోయింది.

క్‌

గుర్రపుడెక్క నీలీర

సీరసంగా తిరిగొచ్చిన మల్లయ్యని చూసి “ఏందయ్యా.. పేనం బాలేదా..జొరం వచ్చిందా?” అంటూ కంగారుపడిపోయింది లచ్చిమి.

“ఏం లేదు” మల్లయ్య చాప పర్చుకుని దానిమీద మునగదీసుకుని పడుకున్నాడు.

లచ్చిమి అతని నుదుటిమీద అరచేయి ఉంచి, “ఏడిగా ఉందయ్యా.. తలనొప్పిగా ఉందా? నొక్క మంటావా?” అంది.

“వద్దు. నాకేం కాలేదన్నానా..” విసుగ్గా అన్నాడు.

తన భర్త మనస్తత్వం లచ్చిమికు బాగా తెలుసు. పెళ్ళయిన ఈ నాలుగేళ్ళలో మల్లయ్య ని ఆసాంతం చదివేసిందామె. పసిపిల్లాడి మనస్తత్వం... గూడెంలోని మిగతా మగాళ్ళలా తోలు మందం కాదు.. మందారపూవంత సున్నితం... అలా విసుక్కుంటున్నాడంటే అతని మనసుకి కష్టం కలిగేదేదో జరిగి ఉంటుందని ఆమెకర్టమైంది. అదెంటో చెప్పమని ఆమె రొక్కించి అదగలేదు. కొద్దిసెపు ఓపిక పడ్తే అతడే చెప్పేస్తాడని ఆమెకు తెలుసు. మనసులో ఏదీ ఉంచుకోలేడు. శొంఠి ముక్కని బండమీద రుద్ది చిక్కటి రసం తీసింది.

మల్లయ్య నుదుటిమీద పట్టిలా ఆ రసాన్ని రాసింది.

“ఏం లేదన్నా యినవే” అంటూ కోప్పడినా వద్దని మాత్రం వారించలేదతను.

“కాసేప్రంచుకుని కడిగేసుకుంటే పోయేదానికి ఇంత నీలుగుడెందుకో” లచ్చిమి కూడా ముద్దుగా విసుక్కుంది.

పదినిముషాలాగి మల్లయ్య పక్కన కూచుని అతని తల వెండ్రుకల్లో వేళ్ళు జొనిపి లాలనగా నిమురుతూ, “ఏం జరిగిందయ్యా... సెప్పు... నాక్కాకపోతే ఎవుర్తో సెప్తావు? నీ మనసుకేదో ఈత ముల్లులా గుచ్చుకుంది. అదేంటో సెప్పు. ఈలైతే దాన్ని నాపళ్ళతో లాగి పదేసా” అంది.

“పళ్ళతో పీకితే పోయేది కాదు”

“అదేదో సెప్తే కదా తెలిసేది? నీ సవత్తల్లి యామైనా అందా? సిన్నప్పటినుండి ఆమె అనడం నువ్వు పదటం సీకలవాటేగా... అందులో బాద పదే ఇసయం ఏముందని?”

“అది కాదు... ఏం లేదన్నాగా.. నువ్వెల్లి పని సూస్మో”

“ఎన్ని సార్లంటావు అదేమాట? నీ గురించి నాకు ఎరికేగా.. నీలో దాసుకుని

గుర్రపుడెక్క నీలీర కుమిలిపోతే ఏమొస్తది సెప్పు...నీ సవిత్తమ్ముడు బుల్లన్న గొడవపడ్డాడా? అది అలవాటైపోలా... నేను కాపురానికొచ్చాక పాతిక సార్లు యింటిమీదికి తగాదాకొచ్చి ఉంటాడు. పెద్దమడిసి దగ్గర ఎన్ని మార్లు పంచాయతీ పెట్టలేదు? కొందరు మడుసులంతే అని వదిలెయ్యాల. పట్టుకుని కూకుంటే మనకే నష్టం.. మన మనసుకే కట్టం”

భి, ఎదవ గోల... సెప్తే యినవేం.. అసమంటివేమీ జరగలేదు”

“ని సిన్నప్పటి ఇసయాలు యాదికొచ్చి బాదపడ్డున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. మర్పిపో.. యిపుడు సీకు నేనున్నాను. నాకు నువ్వన్నావు. సాలు”

ఆ మాటలు వినగానే అతని మనసంతా మంచులా కరిగిపోయింది. చిన్నపిల్లాడు తల్లి వెపు సాయం కోసం చూసినట్లు బేలగా చూశాడు. “నెను సూసిన గోరాన్ని ఆల్లకి సెప్పాలో సెప్పకూడదో తెలీటం లేదే..ఎటూ తేల్సుకోలేక పంజరంలో పచ్చిలా గిలగిల కొట్టుకుంటున్నా” అన్నాడు.

“ఏమిటా గోరం? ఎవర్తో సెప్పాల? యివరంగా సెప్పవయ్యా”

“నెను పొద్దుట్నె ఎంకటమ్మని సూశా”

“నెనూ సూశా.. నీల్ల కోసరం ఎల్లినపుడు బిందె సంకన పెట్టుకుని నాతో పాటేగా వచ్చింది. అందులో యిసిత్రం ఏముంది?”

“నెను సూసింది పొదల సాటున.. పులిచెర్ల లింగన్నతో సరసమాడ్లూ”

మల్లయ్య చెప్పిన విషయం మెదళ్ళో యింకడానికి కొద్ది సమయం పట్టింది. జరిగిన సంఘటనలోని గాధత అర్హమయ్యేకొద్దీ లచ్చిమికు నోట మాట రాలేదు. పెళ్ళయిన ఆడది మరో మగాడితో సన్నిహితంగా ఉంటే పెద్దమడుసుల దగ్గర పంచాయతీ పెట్టంచాలి. వాళ్ళ తీర్పుకి లోబడి శిక్షని అనుభవించాలి. కానీ ఇప్పుడు తమ ముందున్న పెద్ద సమస్య ఎంకటమ్మ మల్లయ్యకు సవత్తమ్ముడి భార్య కావటమె. తన భర్త వూసెత్తితేనే మరిది మందడి పద్తాదని తెలుసు. ఈ విషయం పంచాయతీలో పెడ్తే, కావాలని అక్కసుతో తన భార్యమీద నింద మోపుతున్నాడని అనొచ్చు. అసలే తనంటే విషం కక్కే తన అత్త కక్ష పెట్టుకుని తన మీద లెనిపోనివి కల్పించి చెప్పవచ్చు.

లచ్చిమి మౌనంగా ఉండటం చూసి “ఏం సేద్దామంటావు? ఈ యిసయం బుల్లన్నత్రో

గుర్రపుడెక్క సీలీర సెప్పాలా వద్దా? నేను సెప్పింది ఆడు నమ్ముతాడంటావా? మనకెందుకు లెమ్మని గమ్మునుందామా?ఆళ్ళు నన్నెంత బాదపెట్టినా ఆళ్ళు తప్ప నాకవరున్నారు? ఆమె మా అమ్మ.. వాడు నా తమ్ముడు. ఆడి సంసారం గుల్లవుతుంటే సూసీ సూడనట్టు ఎలా ఉందమంటావు?” అన్నాడు.

లచ్చిమి మనసులో కూడా అలాంటి తర్జన భర్దనే జరుగుతోంది.

“బుల్లన్న కదా తన పెళ్లాన్ని అదుపులో పెట్టుకోవాల్సింది. ఎంకటమ్మ తప్పు సేస్తే శిచ్చ వయాలో శెమించి వదిలెయాలో తీర్మానించాల్సింది బుల్లన్న. నువ్వు తల దూర్చి ఆల్లందరికీ చెద్ద కావటం ఎందుకయ్యా, గమ్మునుండు. చెట్టుల్లో పుట్టల్లో రంకు సేస్తే ఎన్నాల్లని దాగుతుంది? ఏదో రోజు బుల్లన్నకి తెలుస్తుంది. ఏం సేయాలో ఆళ్లే సూస్కుంటారు” అందామె.

“అప్పటిదాకా నా మరదలు పులిచెర్ల కుదురోళ్ళ మగాడితో తిరుగుతుంటే సూస్తూ కూసోమంటావా? నా వల్ల కాదు. బుల్లన్నని పిలిసి నెను సూసిందంతా సెప్పేస్తా” అంటూ లేచాడు.

“వద్దయ్యా... నా మాటీను. ఆ తల్లీ కొడుకులు నమ్మరు... నువ్వు మిగతా గూడెం జనాల్ని ఎలా నమ్మిస్తావు? సాచ్చికాలేవీ? నీకూ బుల్లన్నకి పడదు కాబట్టి పగతో కట్టుకథలల్లావంటే కాదని నువ్వెలా రుజువు సేస్కుంటావు?”

“నేను నాకళ్ళతో సూశాను. లేదని ఎంకటమ్మని సెప్పమను సూద్దాం”

“తప్పు సేసిన ఆదది సేశానని పదిమంది ముందు ఒప్పుకుంటుందా నీ ఎర్రిగాని”

“మల్లయ్యా... మల్లయ్యా” గుడిసె బైటనుంచి పిలుస్తున్నారెవరో.

“మన బుడ్డన్న గొంతు... ఎతకబోయిన తీగె కాలికి తగిలినట్లు వచ్చాడు. మన కుదురుకి పెద్ద మడిసి బుడ్దన్నేగా. జరిగిన ఇసయం చెవినేసి ఏం సేయమంటావని అడుగుతా” అంటూ తడిక తీసి “లోపలికి రా పెద్దయ్యా... ఏదో పని పడి వచ్చినట్టున్నావు.. ఏందో సెప్పు” అన్నాడు.

బుద్దన్న చాప మీద కూచున్నాడు. మల్లయ్య పీట లాక్కుని అతని౭దురుగా కూచున్నాడు.

“సాయంత్రం పంచాయతీ పెట్టాల. పులిచెర్ల కుదురోళ్ళ పెద్ద మడిసి ఈరయ్యని

గుర్రపుడెక్క నల్‌ర కూడా పిలిపించాల. ఇసయం నీ కుటుంబానికి సంబంధించింది కాబట్టి ముందుగా సీకు సెప్పడానికొచ్చాను” అన్నాడు బుడ్డన్న.

“నా కుటుంబ ఇసయమా.. పంచాయతీ పెట్టంత తప్పు చెశామా.. ఎవరు పెద్దయ్యా... నేనా లేక లచ్చిమినా?”

“సీ మరదలు ఎంకటమ్మ”

మల్లయ్యకి ఆశ్చర్యమేసింది. తను చూసిన విషయం లచ్చిమితో తప్ప ఎవ్వరితో చెప్పలేదే.. చెప్పకుండానే ఈ బుడ్డన్నకెలా తెలిసింది? ఎమైనా తనకు తనుగా బైటపడకూడదనుకుని “మాబుల్లన్న పెల్లామా? ఏం సేసింది?” అని అడిగాడు.

“పులిచెర్ల కుదురోళ్ళ లింగన్న లేడూ... ఆడితో తిరుగుతోంది”

“అవునా... ఎంకటమ్మ అస్మంటీది కాదే”

“కాకపోవటమేమిటి... నేను నాకళ్ళతో సూశాను.”

మల్లయ్య లచ్చిమి వైపు చూశాడు. ఆమెకళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి. యిప్పటివరకూ వేధించిన సమస్య దూదిపింజలా తేలిపోయింది.

“పొద్దుగూకకముందే ఏపసెట్టు వద్దకొచ్చేయి.. తీర్మానం జరిగిపోవాల” బుడ్డన్న వెళ్ళిపోయాడు.

“మనల్ని ఆ గారెల మైసమ్మ తల్లే కాపాడింది” లచ్చిమి ఆకాశం కేసి చూసి దండం పెట్టుకుంది.

కాదు.. గుట్టమిది నర్సిమ్మసామ కాపాడాడు అనుకున్నాడు మల్లయ్య...

సాయంత్రం ఐదింటికి తోకల కుదురోళ్ళు పులిచెర్ల కుదురోళ్ళు ఒక్కొక్కరు వచ్చి వేపచెట్టు దగ్గర గుమి కూడారు. చెట్టుకింద ఉన్న రాతిబండ మీద బుడ్దన్న పులిచెర్ల పెద్దమనిషి ఈరయ్య కూచున్నారు. వారి ముందు ఓ వైపున ఎంకటమ్మ, మరో వైపున పులిచెర్ల లింగన్న నిలబడి ఉన్నారు.

మల్లయ్య తన సవత్తల్లి కోసం వెతికాడు. కన్పించలేదు. “నీ అత్తేదే కన్పడటంలేదు” పక్శనే నిలబడి ఉన్న లచ్చిమిని అడిగాడు.

“జొరం వచ్చి గుడిసెలో పడుకుండిపోయిందట. ఎంకటమ్మ ఎవుర్తోనో సెప్తంటే

గుర్రపుడెక్క సలీరి యిన్నా"

“అయ్యో... అమ్మకు జొరమా...పంచాయతీ అయ్యాక ఎల్లి సూసొస్తా..”

“సాల్లే సంబడం.. నిజం జొరం కాదట.. ఉత్తుత్తి జొరమట... కోడలు సేసిన పనికి మొహం సెల్లక చాటేసి ఉంటది”

బుడ్డన్న గొంతు ఖంగుమని విన్పించింది. “ఈ రోజు పొద్దున కల్లు దింపుదామని తాటి సెట్టెక్కినా.. పై నుండి సూస్తే పొదల మాటున మన ఎంకటమ్మ పులిచెర్ల లింగన్నతో కలిసుండగా నాకంట బడింది. కల్లు కుండని దింపుకుని కిందికొచ్చాక ఆ వొద దగ్గరకెళ్ళి చూశా. అప్పటికే ఇద్దరూ ఎల్లి పోయారు. పెల్లయిన ఎంకటమ్మతో లింగన్న అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం. అందుకు తగిన శిచ్చ కరారు సేయడానికే ఈ పంచాయతీ పెల్టనాం.”

ఈరయ్య లింగన్నని ఉద్దేశించి “లింగన్నా... పెద్దమదిసి సెప్పింది యిన్నావుగా... నువ్వేమంటావు” అన్నాడు.

లింగన్న తలొంచుకుని “తప్పు ఒప్పుకుంటున్నా” అన్నాడు.

బుద్దన్న ఎంకటమ్మ నుద్దెశించి “నువ్వేమైనా సెప్పుకునేదుందా?” అని అడిగాడు.

ఏమీ లేదన్నట్లు తల వొంచుకునే అడ్డంగా వూపింది.

“పులిచెర్ల లింగన్న తప్పు సేశాడు కాబట్టి శిచ్చగా గూడెం జనాలందరికీ ఇందు సేయాల. ఇదే నా తీర్మానం” అన్నాడు బుద్దన్న దానికి పులిచెర్ల పెద్ద మనిషి తన ఆమోదం తెలిపాక పంచాయతీ ముగిసింది.

ఆదివారం ఉదయం ఐదింటికే సూర్యకుమార్‌, కేదార్‌ క్వాలిస్లో బయల్టేరారు. అప్పటికింకా చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. కేదార్‌కి నిద్ర మత్తు వదల్లేదు. కూచునె కళ్ళు మూసుకుని జోగుతున్నాడు.

సూర్యకుమార్‌ ఉదయిస్తున్న సూర్యపీంబం వైపు సాలోచనగా చూస్తున్నాడు. తన పరిశోధన విషయంలో చికట్లు ఎప్పుడు తొలుగుతాయో అర్ధం కావటం లేదు. ఎన్నాళ్ళనుంచో చేస్తున్న వెతుకులాటకి అంతం ఎప్పుడో తెలీటం లేదు. అదవిలోకి

గుర్రపుడెక్క సలీం వెళ్ళటం ఇది ఐదోసారి. వెళ్ళిన ప్రతిసారీ కాళ్ళరిగేలా తిరగటం.. కళ్ళు అలిసేలా వెతకటం... నిరాశతో తిరిగి రావటం. కేదార్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కావటం వల్ల అతనికి సమయం సానుకూలపదేవరకు వేచి ఉండాల్సి రావటం వల్ల ఇన్నెళ్ళలో నాలుగు సార్లు మాత్రమే అడవిలోకి వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా కేదార్లోని ఉదాసీనత... అడవంటే అతన్లో తొలిగిపోని భయం... రకరకాలుగా బతిమాలుకుని పలు రకాలుగా భంగపడితే కాని శాల్తీ కదలటం లేదాయె. కేదార్‌ లేకుండానే వెళ్లామని ఒకటైండు సార్లు అనుకున్నాడు గానీ మనసొప్పలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ కేదార్‌ పక్కన లేకుండా తను ఇలాంటి పరిశోధనలకు పూనుకోలేదు.

కేదార్కి మెలకువ వొచ్చినట్టుంది. కళ్ళు తెర్చి బద్ధకంగా కారు అద్దాల్ని తాకుతున్న వెలుతురు మరకల వైపు ఓ సారి చూసి మళ్ళా కళ్ళు మూసుకున్నాడు.

“మీ హైద్రాబాద్‌లో ఇంతందమైన సూర్యోదయాలు కన్పించటం అరుదు. అపురూపమైన ఈ అనుభవాన్ని ఆస్వాదించకుండా పడుకుంటావేంటి” అన్నాడు సూర్యకుమార్‌.

“రేపటి సూర్యోదయాన్ని తప్పకుండా చూస్తామన్న గ్యారంటీ లేనపుడు ఇపుడు కన్పిస్తున్న సూర్యోదయం అందంగా ఉండదు”

“అడవిలోకి వెళ్తున్న ప్రతిసారి ఇలానే అన్నావు. మనం నాలుగు సార్లు వెళ్ళాం. ఏం జరగలేదుగా.. ఆ అడవిలో మనుషుల్ని తినేసే భయంకర జంతువెదైనా ఉండి ఉంటే ఈ పాటికి మన కళ్ళబడి ఉండేదిగా”

“మన కళ్ళల్లో అది బడటం కాదు బాబూ దాని కళ్ళల్లో మనం పడి ఉంటే ఇప్పుడిలా సూర్యోదయం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఉండేవారు కాదు”

“అలా జరగలేదుగా”

“అదే నేననేది. అన్ని సార్లూ ఏమీ జరక్కవోవటం మన అదృష్టం కావచ్చుగా. అప్పుడు జరగలేదు కాబట్ట ఇప్పుడు జరక్కూడదని రూలుందా? ఏమో... ఈ సారి మన దురదృష్టం మనల్ని వెంటాడి... ఏ జంతువు బారినో పడి...”

“నువ్వు బ్యాంకు మేనేజర్‌ ఎలా అయ్యావో అర్ధం కావటంలేదు. అపశకునాలు అపభ్రంశపు మాటలు తప్ప పాజిటివ్‌ ఆలోచనలు రావా? చావంటే అంత భయపడావు

గుర్రపుడెక్క స్రీలీరి దేనికి?”

“నీకేంలే... ఏక్‌ నిరంజన్‌వి... పెళ్ళాం బిడ్డలుంటే తెలుస్తుంది.. అప్పుడు చావంటే భయం తన్నుకుంటూ వస్తుంది. అందునా ఎటువంటి చావని? జంతువుల చేత పీక్కు తినబడి చావటం... తల్చుకుంటేనే వళ్ళు జలదరిస్తోంది”

“ఇక చాల్లే ఆపు.... అటువంటి పరిస్థితే వస్తే నీ ప్రాణానికి నాప్రాణం అద్దస్తాను. సరేనా”

“అబ్బ. థ్యాంక్స్‌.. ఎంత రిలీఫ్‌గా ఉందో ఇపుడు.. ఏ ఎలుగుబంటో నన్ను పట్టుకుని చంపబోతుంటే నువ్వు చేతులు జోడించి నా గ్రెంద్‌ని వదిలేయ.. కావాలంటే నన్ను చంపెయి అనగానె నీ త్యాగనిరతికి మెచ్చి కడుంగడు సంతసించి, సజల నయనాలతో అలాగేనండీ సూర్యకుమార్‌ గారూ... మీస్నేహధర్నానికి తల వొంచుతున్నానని చెప్పి...”

“చాల్లే వ్యంగ్యం...జింకలూ దుప్పులూ తప్ప ఏమున్నాయని ఆ అడవిలో... అడవి మధ్యలో ఎలుగుబంటి కన్పిస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో చూద్దామని తహతహలాడ్డున్నాను తెలుసా.. ఏదీ... కన్పిస్తేగా” అంటూ నవ్వాడు సూర్యకుమార్‌.

వాళ్ళు మస్తాన్‌కి ఎప్పటికి మల్లే జాగ్రత్తలు చెప్పి అడవిలోకి ప్రవేశించారు. దారి బాగా ఎరిగినదే కావటం వల్ల ఎక్కువ ఇబ్బంది లేకుండానే ముందుకు నడుస్తున్నారు.

కేదార్‌ అనుమానంగా తలయెత్తి చెట్ల వైపుకు చూశాడు. కొమ్మలు కదలటం లేదు. గాలి స్తంభీంచినట్లు... ఆకుపచ్చటి మైనపు బొమ్మల్లా నిలబడి ఉన్న చెట్లు...కేదార్‌ అనుమానం బలపడింది. ఎవరో తమ ఇద్దర్నీ గమనిస్తున్నారు. రెండు కళ్ళు... పెద్ద కళ్ళు... ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కుని... నడక వెగం పెంచాడు. ఆ చెట్టుని దాటెశాడు. కొంత దూరం వెళ్ళి తలతిప్పి చూశాడు. అవే కళ్ళు... వెంటాడుతూ... మరికొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆ కళ్ళు చూస్తూనే ఉన్నాయి. భయపెట్టెలా ఉన్న కళ్ళు...

“వముందక్కడ? కోతులా?” నడుస్తూనే అడిగాడు సూర్యకుమార్‌.

“కాదు... రెండు కళ్ళు”

“కళ్ళా... ఎక్కడా?” సూర్యక్షుమార్‌ కంగారుగా అడిగాడు.

“అదుగో ఆ చెట్టు పైనుంచి మనల్ని ఎవరో గమనిస్తున్నారు”

గుర్రపుడెక్క సలీం

కేదార్‌ చూపించిన చెట్టు వైపు కళ్ళు చిట్లించి చూశాడు. అతనికేమీ కన్పించలేదు. ఆ చెట్టు దూరంగా ఉండటం వల్ల, బాగా ఎత్తుగా కూడా ఉండటం వల్ల స్పష్టంగా కన్పించడం లేదు.

“సరిగ్గా చూడు... కొద్దిగా ఇటు వైపుకొచ్చి చూడు. కన్పిస్తాయి” అన్నాడు కేదార్‌.

ఐనా కన్పించలేదు.

“ఎవరైతే ఏంలె... మనమేం చేయగలం? తొందరగా ఇక్కణ్నించి వెళ్ళిపోదాం పద” అన్నాడు కేదార్‌.

“అనుమాన నివృత్తి చేసుకోకుండా కదిలే ప్రసక్తే లేదు” అంటూనే తన బ్యాగ్‌లో వెతికి చిన్న బైనాక్యులర్స్‌ బైటికి తీశాడు. కళ్ళ దగ్గర పెట్టుకుని ఆ చెట్టు స్పష్టంగా కన్పించేలా సరిచేసుకున్నాడు. ఇపుడా చెట్టు కొమ్మలు దగ్గరగా కన్పిస్తున్నాయి. ఆకుల మధ్యలో రెండు కళ్ళు...

సూర్యకుమార్‌ బిగ్గరగా నవ్వాడు. పొట్ట చేత పట్టుకుని మరీ నవ్వాడు.

“ఎందుకు నవ్వుతావు? ఆ కళ్ళు కన్చించలేదా? భ్రమ పడ్డాననుకుంటున్నావా? లేదు. నేను చూసాను. నమ్మకపోతే పో... నా కళ్ళు నన్ను మోసం చేయవు”

సూర్యకుమార్‌ నవ్వాపుకుంటూ చెవడు. “నువ్వు చెప్పింది నిజమె. రెండు కళ్ళు... పెద్దకళ్ళు... మనిషివి కాదు... గుడ్లగూబవి”

“గృడ్డ గూబనా” కేదార్‌ సిగ్గుపడ్డాడు. “ఏవో కొన్ని హారర్‌ సినిమాల్లో చూడటం తప్ప గుడ్లగూబ కళ్ళని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి”

“జయం మనుషుల్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు రజ్జు సర్ప (భ్రాంతికి గురి చేస్తుంది. నీ విషయంలో జరిగిందదే. ఎవరైనా గమనిస్తున్నారేమో ఏ జంతువైనా వెంటాడుతుందేమోనని వూహించుకుంటుంటే నీడ కదలికలు కూడా నిజ రూపాలై కళ్ళముందు నిలబడ్డాయి”

“నాది భయం కాదు... జాగ్రత్త తనను తాను సమర్ధించుకుంటూ అన్నాడు కేదార్‌.

“సర్లె..అతి జాగ్రత్త అంటూ నవ్వాడు సూర్యకుమార్‌. “నీకు గుర్లగూబల గురించి ఓ విషయం తెలుసా... మిగతా అన్ని పక్షులకు కింది కనురెప్ప మాత్రమే కదుల్తుంది.

గుర్రపుడెక్క సీలీర గుద్గగూబలకు మాత్రం మనుషులకు మల్లి పై కనురెప్ప కదుల్తుంది” అన్నాడు.

“ఓ అలానా...నీకివస్నీ ఎలా తెలుసు?”

“ఆ బ్యాంక్‌ సీటుకి అంటుకుపోయి. ఎప్పుడూ డెబిట్లూ క్రెడిట్లూ చూసుకుంటూ కూచుంటే ఎలా తెలుస్తాయి? ప్రకృతి ఒడిలో పరవశించటం తెలీని నువ్వు రచయితవి ఎలా అయ్యావో అర్ధం కావటం లెదు”

“ప్రకృతి ఒడి నిజమే. దాంతో పాటు కొండచిలువలా మింగేయడానికి నోరు తెర్పుకుని ఉన్న భయంకరమైన అడవి కూడా అన్న స్పృహ ఉందటం వల్ల”

“అడవి అను ఒప్పుకుంటా... భయంకరమైన అడవి అంటే ససేమిరా ఒప్పుకోను. అమెరికాలోని అమెజాన్‌ అడవులు అలాంటి వర్ణనకు సరితూగుతాయి”

వాళ్ళిద్దరూ సేద తీర్చుకోడానికి అలవాటు పడిన చెరువుని సమీపించారు.

“కాద్దిసెపు విశ్రాంతి తీసుకుంటే కానీ శరీరం రీచార్జ్‌ కాదు” అంటూ గట్టుమీదున్న మర్రిచెట్టు కింద కూచున్నాడు కేదార్‌. పక్కనే సూర్యకుమార్‌ కూడా కూచున్నాడు. బ్యాగ్‌ లోంచి మంచిసీళ్ళ బాటిల్‌ తీసి నాలుగు గుక్కలు తాగి బాటిల్‌ని కేదార్కి అందించాడు

విశాలమైన మైదానం కావటం వల్లేమో అప్పటివరకూ గడ్డకట్టినట్టు బిగుసుకున్న గాలిలో చలనం వచ్చింది. చెరువులోని నీటి ఉపరితలం గాలికి వయ్యారంగా అలలు అలలుగా కదులోంది. చల్లటి గాలి... వింజామరల్లా... చేపలు సళ్ళలో ఈతకాొడ్తున్న సుందర దృశ్యం .. నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయో!

“క్క చెరువులోని నీళ్ళని చూశావా...ఎంత లోతు వరకు స్పష్టంగా కన్పిస్తున్నాయో... నీళ్ళలోకి చూస్తున్నట్టు లేదు... పారదర్శకమైన అద్ధంలోంచి చూస్తున్నట్లుంది. కాలుష్యం కాటేయని చెరువు... అమాయకమైన పల్లెటూరి కన్నెపిల్లలా ఎంత స్వచ్చంగా ఎంతందంగా ఉందో” అన్నాడు కేదార్‌.

“కవుల కన్ను పడితే ఇంకేముంది? వికసించని మొగ్గలు కూడా ముగ్గలై విప్పారతాయిగా”

“ఈ చెరువుమీద తేలియాడుతున్న అల లతాంగులు... ఈ గట్టు...కాపలా కాస్తున్న ఈ చెట్లు... విస్తున్న చల్లటి గాలి... అందులో కలిసిపోయి వస్తున్న అడవి మల్లెల మత్తైన

_

గుర్రపుడెక్క స్రల్‌6 తీయటి వాసన... ఏ కవికైనా కవిత్వం పరవళ్ళు తొక్కుతూ జాలువారటం ఖాయం”

“కిష్టశాప్రిగారి భావకవిత్వంలానా”

“అంతేగా మరి.. విప్లవ కవిత్వం ఎలా వస్తుంది?”

“బిటీష్‌ తెల్లదొరలు అడవుల్ని దోచుకుంటున్నారనీ, చెంచుల విల్లంబులు లాక్కుని బానిసలుగా మార్చ ప్రయత్నం చేస్తున్నారనీ చెంచు యువకుల్నందర్నీ కూడగట్టుకుని బాణాల్తోనే తెల్లదొరతనాన్ని ఎదుర్కొన్న పెద్ద బైలోడు చరిత్ర తెలిస్తే భావ కవిత్వం రాదు. పర్దన్య శంఖం పూరించాలన్నంత ఆవేశం ఉబికి వస్తుంది”

కేదార్‌ ఏదో సమాధానం చెప్పెలోపల సూర్యకుమార్‌ ఒక్క ఉదుటన లేచి చెట్టు చాటుకి గెంతాడు. కేదార్ని చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. ఎమైంది అన్నట్లు చూస్తున్న కేదార్తో “శబ్దం చేయకు” అనేలా సైగ చేసి ఉద్వేగంగా ఏదో చెవిలో చెప్పాడు. కేదార్మి అతనేమంటున్నాడో సరిగ్గా విన్సించలేదు. చెరువులో సళ్ళు తాగడానికి ఏదైనా జంతువు వచ్చిందేమోనని చెరువు వైపు చూశాడు కేదార్‌. అక్కడేమీ లేదు. సూర్యకుమార్‌ తర్దనితో చెరువుని దాటుకుని అటువైపున్న కొండ గుట్టవైపుకు చూపించడంతో అటువైపుకి చూశాడు.

ఎవరో మనిషి. గోచీ తప్ప మిగతా అంతా అనాచ్చాదితంగా ఉన్న నల్లటి శరిరం... భుజానికి విల్లంబు... మనిషి బాణం కర్రలా సన్నగా, రివటలా ఉన్నాడు. అంత దూరం నుంచి అతని వయసుని అంచనా వేయటం కష్టమైనా అతను కొండగుట్ట మీదికి చకచకా ఎక్కేస్తున్న వైనాన్నిబట్ట తప్పకుండా యువకుడై ఉంటాదనిపించింది...

చెట్టుబోదె అడ్డంగా ఉండటం వల్ల అతనికి వీళ్ళు కన్పించే అవకాశం లెదు. అతను మాత్రం గుట్టని ఎక్కేపనిలో మునిగిపోయి పరిసరాల్ని పట్టించుకోవటం లేదు. బాగా అలవాటైన పనిలా చులాగ్గా ఎక్కేస్తున్నాడు. అతని వీపు మాత్రమే వీళ్ళకు కన్పిస్తోంది.

“అతనా గుట్టమీదికి ఎందుకు ఎక్కుతున్నాడో కనుక్కోవాలి. వేటకోసం మాత్రం కాదు. అక్కడేదో తప్పకుండా ఉండి ఉంటుంది. పద వెళ్తాం” అన్నాడు సూర్యకుమార్‌.

బ్యాగులు భుజాలకు తగిలించుకుని ఆ గుట్ట వాదం దగ్గర నిలబడ్డారు. అతను ఎక్కింది యిటువైపునుంచే...

“మళ్ళా యిటు రాకుండా అటువైపునుంచి దిగిపోతేనో” అన్నాడు కేదార్‌.

గుర్రపుడెక్క నీల్‌ర

సూర్యకుమార్‌ అతనెక్మివెళ్ళిన దారివైపు నిశితంగా చూసి చెప్పాడు. “లేదు. యిటే దిగుతాడు. ఆ బాట చూశావా... నలిగిపోయి ఉంది. ప్రతి రోజూ తిరగటం వల్లగానీ లేకపోతె ఒకసారి చాలా మంది మనుషులు తిరగటం వల్లగానీ అలా దారి ఏర్పడుతుంది. వేచి చూద్దాం” అన్నాడు.

దాదాపు ఇరవై నిముషాలు వేచి చూశాక అతను గుట్ట దిగుతూ కన్పించాడు. యిద్దరూ చెట్ల చాటుకు తప్పుకున్నారు.

అతను కిందికొచ్చాక వీళ్ళు నిలబడి ఉన్న వైపుకే వడివడిగా నడుస్తూ అలికిడికి ఒక్కసారిగా అప్రమత్తమై విల్లంబు ఒడుపుగా లాగి బాణం సంధిస్తూ వాళ్ళ వైపు చూశాడు. సూర్యకుమార్‌ కూడా అసంకల్పితంగా తన చేతిలోని కత్తిని ఎత్తి పట్టుకుని దాడికి

మనుషుల్ని ఆ అడవిలో చూడటం అలవాటు లేనందువల్లనేమో మల్లయ్య దిగ్ర్భాంతికి లోనైనాడు. అడవి జంతువేమోననుకుని విల్లంబు ఎక్కుపెట్టాడు... పట్నం మనుషుల్ని చూడగానే మెల్లగా బాణాన్ని తీసి కుడి చేతిలో పట్టుకుని, రెండడుగులు వెనక్కి వెసి పరుగు లంకించుకున్నాడు.

ముందుగా తేరుకున్న కేదార్‌ అతని వెంట బడ్డాడు. అతని వెనకే సూర్యకుమార్‌ “ఐయ్‌... ఆగూఅంటూ పరుగెత్తాడు. కొద్ది దూరం వరకూ కన్పించి అక్కడ గుబురుగా ఉన్న చెట్లలో అదృశ్యమైపోయాడతడు.

సూర్యకుమార్‌ అన్ని వైపులా వెతికి వచ్చాడు. అతడు కన్పించలేదు. “యిలా మాయమైపోయాడంటావు? యింతలోనె కనికట్టు చేసినట్టు ఎటువైపుకళ్ళాడు?” అంటూ ఆశ్యర్యపోయాడు. కేదార్కి మాత్రం అతనికడే ఎక్కడో ఉండి తమని గమనిస్తున్నాదని అన్పించింది.

“నువ్వు కత్తి పట్టుకుని పొడవడానికి రెడీగా ఉన్నట్టు పోజు పెట్టావుగా. భయపడి వొారివోయాడు అన్నాడు.

“వాడు బాణం గురిపెట్టడంవల్ల వచ్చిన రిఫ్లెక్స్‌ రియాక్షన్‌”

“వాడు నిజంగానే బాణం వేస్తే నీ చేతిలో కత్తి ఏం రక్షిస్తుంది? జాకీ ఛాన్‌ సినిమాలోలా కత్తితో నీవైపుకు దూసుకు వస్తున్న బాణాన్ని ముక్కలు చేద్దామని ష్లానా”

గుర్రపుడెక్క నీలీర

“అవన్నీ ఆలోచించే వ్యవధి ఎక్కడిది?” అన్నాడు అతన్ని వెతికే ప్రయత్నాన్ని ఆపకుండా.

తమని అతను గమనిస్తూ ఉంటే అతని భయం పోగొట్టడం మంచిదనిపించి అతన్ని ఉద్దెశించి పెద్దగా చెవ్పాడు కేదార్‌. “మేము నీకు హాని చేసేవాళ్ళం కాదు. స్నేహితులం. మాకు నీ సాయం కావాలి. నువ్వికృదే ఉన్నావని మాకు తెలుసు. బైటికి రా. నీతో మాట్లాడాలి”

పొదలమాటున నక్కి ఉన్న మల్లయ్యకు అతని మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి. కాని వాటిని నమ్మాలో లేదో తెలియకపోవటం వల్ల అక్కదే పొంచి ఉండి వాళ్ళ కదలికల్ని గమనించసాగాడు. అసలు వాళ్ళెవరు? అడవిలోకి ఎందుకొచ్చారు? కలపను దొంగిలించడానికి కొంత మంది అడవిలోకి రావటం మామూలే. మరికొంతమంది అటవీ సంపద కొల్లగొట్టడానికో వన్యప్రాణుల్ని వెటాడి పట్టుకెళ్ళడానికో వస్తుంటారు. తమకు అన్నం పెడ్తున్న అడవి తల్లిని రక్షించుకోవాల్సిన బాధ్యత తమ మీదె ఉందని బుద్దన్న చెంచుపెంటల్లో ఉన్న జనాలందర్ని సమావేశపరచి చెవ్పాడు. దానికోసం ఏంచేయాలో కొన్ని కిటుకులు కూడా చెప్పాడు.

తేనె, కుంకుడు కాయలు, బెరళ్ళు, వేర్లు అమ్మడానికి వూళ్ళలోపలికళ్ళినపుడల్లా అడవిలో చిరుత పులులున్నాయని, తన చెంచు పెంటలోనే యిద్దరు యువకుల్ని చంపి తినేశాయని పని గట్టుకుని ప్రచారం చేయటం మొదలెట్టారు. దాంతోపాటు అడవిలో మనుషుల్ని తినే ఆదిమజాతి వాళ్ళున్నారని ఎలాగో ప్రచారం జరిగింది. అప్పటినుండి అడవిలోకి బైటి మనుషుల రాక బాగా తగ్గింది. ఇప్పుడు వచ్చిన ఈ ఇద్దరు మనుషుల్ని భయపెట్టి పారిపోయేలా చేయాలా లేక వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి తనే అక్కడి నుండి పారిపోవాలా అనే సందిగ్ధత మల్లయ్యలో...

వాళ్ళ గురించి మరికొంత సమాచారం తెలిసేవరకు ఏ నిర్ణయమూ తీసుకోకూడదని నిశ్శబ్దంగా వాళ్ళను పరిశీలిస్తూ కూచున్నాడు.

కేదార్‌ రెణ్సిమిషాలు వేచి చూశాడు. తన మాటల ప్రభావం అతనిమీద పడలేదని అర్ధమైంది.

అతను రాలేదు. అసలు తన భాష అతనికర్టమైందో లేదోననె అనుమానం...

“అతన్ని చూస్తే సీకేమనిపించింది” అని అడిగాడు.

గుర్రపుడెక్క సీలీర

“అతని రూపం, వస్త్రధారణ చూస్తే చెంచు యువకుడిలా ఉన్నాడు.”

చెంచు యువకుడు వెళ్ళిన వైపుకు తిరిగి కేదార్‌ మరోసారి “మేమీ అడవిలోకి దారి తప్పి వచ్చాం. నిన్నేమీ చేయం. మేము బైటికలా వెళ్ళాలో చెప్తే చాలు. ఒకృసారి బైటికొచ్చి కన్పించుూ అన్నాడు పెద్దగా.

మరికొద్దిసేపు వేచి చూసినా అతని అలికిడి విన్సించలేదు.

సూర్యకుమార్‌ వైపు తిరిగి ఏం చేద్దాం అన్నట్లు చూసాడు.

“యిక్కడ ఉండి ప్రయోజనం లేదు. మనం ఆ గుట్టనెక్కి అక్కద ఏం ఉందో, ఈ చెంచు యువకుడు అక్కడికెందుకెళ్ళాడో చూద్దాం పద” అన్నాడు.

“యింతకీ నేను మాట్లాడిన తెలుగు భాష వాడికి అర్ధమై ఉంటుందా ” అన్నాడు కేదార్‌ గుట్ట పాదం వైపుకి నడుస్తూ...

“ఉఅత్రను చెంచు జాతి యువకుడు... వాళ్ళు మాట్లాడే చెంచు భాషని చెంచుకూలమ అంటారు. దాంతోపాటు తెలుగు కూడా కొద్దిగా యాసగా మాట్లాడతారు. వేటాడి తమ పొట్టపోసుకునే వీళ్ళు చాలా ధైర్యస్టులు. ఎటొచ్చీ మనం పట్నం వాళ్ళం కదా . వాడి కళ్ళకి చిరుతపులి కన్నా భయంకరంగా కన్పించామేమో” అంటూ నవ్వాడు సూర్యకుమార్‌.

గుట్టపైకి మెల్లగా ఎక్కడం ప్రారంభించారు. భుజాన ఉన్న బ్యాగు మాటిమాటికి జారిపోతోంది. కాళ్ళ కింద నెల పట్టు జారుతోంది. రాళ్ళవల్ల చేతులూ కాళ్ళు ఒరుసుకుపోతున్నాయి. ఆ చెంచు యువకుడు ఐదారు నిముషాల్లో ఎక్మేస్తే వాళ్ళకు దాదాపు అరగంట పట్టింది.

మల్లయ్యకు వాళ్ళెందుకొచ్చారో అర్ధమైంది. తన నర్సిమ్మ సామిని ఎత్తుకళ్ళడానికి వచ్చి ఉంటారు. లేకపోతే గుట్ట ఎక్కాల్సిన పనేం ఉంది? అమ్మా... తన సామి.. తన దేవర... ప్రాణాలు ఒడ్డయినా సరే తన దేవుణ్ణి కాపాడుకోవాలి. అలా అనుకున్న వెంటనే పొదల్నుంచి వెగంగా బైటికొచ్చి గుట్టని చకచకా ఎక్కేశాడు.

పైకి చేరుకున్నాక చుట్టూ చూశాడు కేదార్‌. నేలంతా దాదాపు చదునుగా ఉంది. ఓ చివర్న రెండు చెట్లున్నాయి. మరో చివర్న శిథిలమైన నిర్మాణమేదో కన్పిస్తోంది. విరిగిపడిన మొండి గోడల వైపుకి సూర్యకుమార్‌ నాలుగడుగులు వేసి వెనకేదో అలికిడి కావటం వల్ల ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

గుర్రపుడెక్క సలీం

ఆ చెంచు యువకుడు చెట్ల కింద నిలబడి ఉన్నాడు. వాడి చేతిలో ఎక్కుపెట్టిన విల్లంబు... సూర్యకుమార్‌ గుండెలకు గురిపెట్టిన బాణం..

“ఎవరు మీరు? ఏం కావాలి? యిక్కడికెందుకొచ్చారు?” అని అడిగాడతను.

సూర్యకుమార్‌ ఓ క్షణం చకితుడైనాడు. మాట పెగల్లేదు. గుట్ట కింద బాణం ఎక్కుపెట్టినపుడు అతని కళ్ళల్లో భయం కస్పించింది. ఇపుడా కళ్ళల్లో కోపం ఉంది. అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపాలన్న కోరికా ఉంది. అందుకే తొందరపడి మాట జారి మరణాన్ని కొని తెచ్చుకోదల్పుకోలేదు.

కేదార్‌ కూడా కొద్దిసేపు రాయిలా నిలబడిపోయినా తొందరగా తేరుకున్నాడు. తనున్న చోటు నుంచి కదలకుండానే “ఆగు.. తొందరపడకు.. పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తినాలని ఉందా ఎంటి” అన్నాడు.

పోలీసుల మాట వినగానే మల్లయ్య కొద్దిగా జంకాడు. ఐనా పట్నమోళ్ళు మాయచెస్తారని బుద్దన్న చాలా మార్లు హెచ్చరించి ఉండటంవల్ల విల్లంబుని దింపలేదు. ఎటొచ్చీ ఇపుడా కళ్ళలో క్రోధం లేదు. జాగరూకత ఉంది.

తన మాటలు అతని మీద ప్రభావం చూపించాయని అర్ధమై కేదార్‌ కొద్దిగా ముందుకెళ్ళి చెప్పాడు. “మేము అడవుల్లో నివసించే జాతుల జీవనవిధానం గురించి తెల్సుకునే ప్రయత్నంలో యిక్కడికొచ్చాం. మమ్మల్ని ప్రభుత్వం పంపించింది. మీ జీవితాల్లో కష్టాల్ని తొలగించి, మీ బతుకులు బాగు చేయడానికి ఏమేం చేయాలో మేం తిరిగివెళ్ళి ప్రభుత్వానికి తెలియచేస్తాం. నువ్వలా బాణం ఎక్కుపెట్టడం నేరం తెలుసా? నీ మీద ఫిర్యాదు చేస్తే పట్టుకళ్ళి జైల్లో పెడ్తారు”

(ప్రభుత్వం, జైలు అనే మాటలు వినగానే మల్లయ్య కళ్ళలో భయం కస్పించింది. విల్లుని కిందికి దించి బాణాన్ని తీసి కుడిచేతిలో పట్టుకున్నాడు. అప్పటికీ అతని అనుమానం తీరలేదు.

“ఈ గుట్టమీద మీకేం పని? మా గురించి తెల్ఫుకోడానికి మా పెంటకు కదా రావాల” అన్నాడు.

తెలివైనవాడే.. యితన్తో జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు కేదార్‌.

“నువ్వు గుట్ట ఎక్కి దిగావు కదా... మీ జాతి వాళ్ళు యిక్కడ ఉన్నారేమోనని..”

రం

గుర్రపుడెక్క సలీర అంటూ చుట్టూచూశాడు. “యిక్కడెవరూ లేరె... మరి నువ్వెందుకు గుట్టపైకొచ్చావు? వచ్చి ఏం చేశావు? ఏమైనా దొంగతనం చేస్తున్నావా? దొంగతనం చేసినవాటిని యిక్కడ దాచిపెట్టడానికొచ్చావా?” కొద్దిగా తీవ్రంగానె అడిగాడు.

యిందాక పులిలా లంఘఫించబోయిన మల్లయ్య ఆ మాటలు విని పిల్లిలా మారిపోయాడు. తనని దొంగ అన్నందుకు ఉక్రోషం వచ్చింది. పరాయి వాడెవడో మనింటికి వచ్చి మనల్ని దొంగ అంటే వచ్చెలాంటి కోపం... కానీ ప్రభుత్వమూ పోలీసులూ అన్న మాటలు గుర్తొచ్చి కోపాన్ని దిగమింగి అన్నాడు.

“లేదు సామీ...అడవిలో దొంగిలించాల్సిన కర్మ మాకేం పట్టలా... ఈ అదవి తల్లి మాతల్లి... మాకు బువ్వపెట్టె అమ్మ... యిక్కడి సెట్లూ పుట్టలూ అన్నీ మావేగా సామి... మావి మేమెందుకు దొంగిలించాల... బైట్నుంచి వచ్చే పరాయోల్లు సేయాలగాని”.

మాటకారే... దొంగతనమంటూ చేస్తే మీరే చేయాలి అనే భావం వచ్చిలా ఎంత బాగా ఎదురు సమాధానం చెప్పాడో అనుకున్నాడు సూర్యకుమార్‌. * మరి యిక్కడ ఏముందని వచ్చావు?పద...ఆ విరిగిన గోడల లోపల ఏముందో చూద్దాం” అంటూ అటు వైపుకి కదిలాడు.

“వద్దు సామీ.. అందులో నర్సిమ్మ సామి ఉన్నాడు.. నేను దినాం పూజ సేస్తా... అందుకే యిందాక ఈగుట్టనెక్కినా” కంగారుగా ముందుకొచ్చి దారికడ్డంగా నిలబడ్డూ అన్నాడు మల్లయ్య,

“నర్సిమ్మసామినా?”

“దేవర సామీ... మహిమ గల దేవర”

“దేవుదే ఐతే నువ్వొక్కడివే దొంగలా వెళ్ళి రావటం దేనికి? మీ వాళ్ళందర్ని

పిల్చుకళ్ళొచ్చుగా” అని అడిగాడు సూర్యకుమార్‌.

“ఈ దేవర నాకే అగిపించినాడు సామీ. మా కన్నడికి శివలింగం కన్పడినట్లు. అందుకే ఎవ్వరికీ సెప్పలా... నాకు దొరికిన దేముడు నాదేముడని నేనే దినాం పూజసేసి సామికి నైద్యం పెట్టి ఎల్తుంటా” ఈసారి కొద్దిగా సిగ్గుపడ్డట్టు మొహం పెట్టాదు.

ళ్ట్యర్రే చూద్దాం పద మీ దేవరని అంటూ సూర్యకుమార్‌ ఆ శిధిలాల మధ్యకి కదిలాడు. మల్లయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. అతన్ని ఆపితే మళ్ళా పోలీసులూ కేసులూ

గుర్రపుడెక్క నలీం అంటాదని భయం... గత్యంతరం లేక అతని వెనకే వెళ్ళాడు. కేదార్‌ వాళ్ళను అనుసరించాడు.

లోపల మట్టిలో కూరుకుపోయిన ఆరడుగుల పలక మీద చెక్కిన నరసింహన్నామి రూపం కాలగతిలో బాగా అరిగిపోయి అస్పష్టంగా గోచరిస్తోంది. జూలూ, కళ్ళూ ముక్కు తప్ప మిగతా భాగాలేవీ కన్సించటం లేదు. దాని ముందు చిన్న మట్టిదివ్వెలో దీపం వెలుగుతోంది. జాంపళ్ళు రెండు, సీమరేగు పళ్ళు రెండు పెట్టి ఉన్నాయి.

సూర్యకుమార్‌ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. తన ఇన్నాళ్ళ వెతుకులాట దేనికోసమో అదిప్పుడు తన ఎదురుగా ... సాకారమై.. తన కలలు నిజమైనాయి. తన పరిశోధన సఫలీకృతమైంది. ఆ రాతి పలకని కర్చీఫ్‌తో తుడిచి కళ్ళద్దాలు సరి చేసుకుని దాని మీద రాసిఉన్న అక్షరాల్ని కూదబలుక్కుంటూ చదివాడు శీ లక్షీ నరసింహ న్న్వామి'. వెంటనే ఆ చెంచుయువకుడి వైపు తిరిగి “నువ్వు నాకెంత సాయం చేసావో చెప్పలేను. మహోపకారం చేశావు. ధ్యాంక్స్‌... నికెన్ని థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే” అంటూ కౌగిలించుకున్నాడు.

సూర్యకుమార్‌ అంటున్నదేమిటో మల్లయ్యకి అర్ధం కాలెదు.

ఆర్కియాలజీ గురించి, పురాతనమైన ఈ ఆలయాన్ని కనుక్కోవటం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పటం వల్ల అతను మరింత తికమకపదే అవకాశం ఉంది కాబట్ట మాట మారుస్తూ “నీ పేరేమిటి?” అని అడిగాడు కేదార్‌.

“మల్లయ్య సామీ” అన్నాడు.

“యిక్కడ దెవుని విగ్రహం ఉందని మీవాళ్ళలో యింకెవరికైనా తెలుసా”

“లెదు సామీ... ఈ దేవర్షి నేనే సూసినా.. నా దేవర... నర్సిమ్మ సామి కోసరం ! అవసరమైతే నా పేనమైనా యితాను సామీ... మా కన్నడు తన రెండు కల్లు బాణంతో వూదబెరికి యిచ్చినట్లు”

“నీకెలా తెలిసింది యిక్కడ దేవుడున్నాడని” సూర్యకుమార్‌ అడిగాడు.

“అదుగో అక్కడ సెరువుందే... దాంట్లో తానమాడదామని ఓ దినం వచ్చినా. నా కంట సిరుతపులి పద్దాది”

“ఈ అడవిలో చిరుతలు కూడా ఉన్నాయా?” అన్నాడు కేదార్‌.

ర

గుర్రపుడెక్క సీలీర

“ఉన్నాయి దొరా...ఎక్కువగా ఎలుగ్గొఢ్గున్నాయి”

“సరే... తర్వాతేమయింది” మల్లయ్య మాటలకు అడ్షొచ్చిన కేదార్‌ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు సూర్యకుమార్‌.

శక్పెరుతని సూడంగానే మొదట బయపదడ్డా. లగెత్తుకుంటా ఈ గుట్టనెక్కినా. సిరుత నన్నాదల్లా... అదీ నాయెంట ఈడిదాకా వచ్చింది...” చిరుత పులితో తనెలా పోరాడాడదో పట్నం వాళ్ళకు చెప్పే అవకాశం వచ్చినందుకు సంబరపడ్డూ గుండెల్ని పొంగిస్తూ చెప్పాడు మల్లయ్య. “అప్పుడు సూసినా ఈ దేవర్‌ని”.

సూర్యకుమార్‌ మెఘాల్లో లేలిపోతున్నాడు. శిధిలమైన ఆలయానికి సంబంధించిన మిగతా ఆనవాళ్ళకోసం నిశితంగా ఆ ప్రాంతమంతా పరిశీలించాడు. తను తెచ్చిన డిజిటల్‌ కెమేరాలో అవసరమైనన్ని ఫోటోలు తీసుకున్నాడు.

అది చూసి మల్లయ్య, “దొరా.. నెనూ పొటో దిగుతా” అన్నాడు.

“సరే... నాపైన బాణం ఎక్కుపెట్టావే... అలా నిలబడు. తీస్తాను” అన్నాడు సూర్యకుమార్‌.

మల్లయ్య సిగ్గుపడ్డాడు. “సెమించాలి దొరా.. నా సామిని ఎత్తుకళ్ళడానికొచ్చా రనుకున్నా” అంటూ “నా సామితో పాటు పొటో దిగుతా దొరా అన్నాడు.

వీడికెంత స్వామిభక్తో అనుకున్నాడు కేదార్‌. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ముందు మల్లయ్యని చెతులు జోడించి నిలబడమని చెప్పి రెండు మూడు ఫొటోలు తీశాడు సూర్యకుమార్‌.

“నాకు యిత్తావా దొరా... గుడిసెలో పటం కట్టి పెట్టుకుంటా” అన్నాడు మల్లయ్య.

“యిపుడు కాదు...నేను మళ్ళా హైద్రాబాద్‌ వెళ్ళి తిరిగొస్తాను చూడు అప్పుడు నెనే (ఫం కట్టించి తెస్తాను”

మల్లయ్యకి ఫ్రేం అనె మాట అర్ధం కాకున్నా తల వూపాడు. తను తీసిన ఫొటో ఎలా వచ్చిందో కెమెరాలోనే చూపిస్తే మురిసిపోయాడు.

“యిక్కడ స్వామివారి విగ్రహం ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పకు” అన్నాడు సూర్యకుమార్‌.

“నేనెందుకు సెపాను దొరా...”

గుర్రపుడెక్క నీలీర చెప్తే గిప్త్పే మీరే చెప్పాలి అనేలా మల్లయ్య వాళ్ళ వైపు చూశాడు తప్ప అలా అనదు. ముగ్గురూ గుట్ట దిగారు. ముందు మల్లయ్య దిగుతుంటే అతని అడుగు జాడల్లో అడుగేసి దిగటం వల్ల చాలా సునాయాసంగా వాళ్ళిద్దరూ దిగిపోయారు.

“యిక అనుమానం లేదు. యిదే ఒకనాటి మన్నుగొండ. ఆ విగ్రహ ఫలకం మీద రాసి ఉన్న అక్షరాలు గమనించావా? అది పధ్నాల్లవ శతాబ్దపు లిపి. మనకు మల్లవ్వ చెప్పిన దేవాలయం యిదే. యిక్కడే నిత్యం పూజలు జరిగేవి. కాలగతిలో ఈ గుడి పాడుపడిపోయి శిధిలమైపోయి ఉంటుంది” కేదార్తో అన్నాడు సూర్యకుమార్‌.

“బిడ్డను చంకలో పెట్టుకుని వూరంతా వెతికినట్లు... మనం చూశావా... మొట్టమొదటి సారి వచ్చినపుడు కూడా ఈ చెరువు గట్టునే కూచున్నాం. చిరుత వెంటపడితే గుట్టమిదికి పారిపోదామని జోకులు కూడా వేసుకున్నాం. అడవంతా గాలించాం తప్ప ఈ గుట్టనెక్కి చూడాలన్న ఆలోచనే రాలెదు” అన్నాడు కేదార్‌.

“తప్పు నాదే..లక్ష్మీ నర్సింహస్వామి గుడి పెద్ద కొండ మీద ఉండి ఉంటుందన్న నమ్మకంతో ఈ అడవిలోని రాతి గుట్టలన్నీ వెదికాం తప్పు ఇలా మట్టితో ఎర్పడిన గుట్టమీద ఉంటుందని వూహించలెదు”.

“ఇది ఒండ్రుమట్టితో ఏర్పడిన గుట్ట. రాయికన్నా గట్టిగా ఉంటుంది. అందుకేనెమో దీనికి మన్నుగొండ అనే పెరొచ్చింది”

“అవకాశం ఉంది. ఆ రోజుల్లో రాజుగారు తన పరివారంతో వచ్చి ఇక్కడ పూజలు జరిపేవారని దాక్టర్‌ షైనీ రాసాడు. కాబట్టి తప్పకుండా యిక్కడికి రెండు మూడు కిలోమీటర్ల వైశాల్యంలోనే కోట గూడా ఉండి ఉండాలి. పద వెదుకుదాం” అన్నాడు సూర్యకుమార్‌.

“మనం ఇప్పటికి నాలుగు నార్లు వెతికాం. ప్రయోజనం శూన్యం. ఇపుడు వెతికినా ఫలితం మరోలా ఉంటుందని అనుకోను”

“మనకి తోడు మల్లయ్య ఉన్నాడుగా. తప్పకుండా దారి చూపుతాడు” అంటూ అతని వైపు తిరిగి “మల్లయ్యా... నీకీ అడవంతా బాగా తెలుసు కదా అని అడిగాడు.

“తెలుసు సామీ... ఏటకోసరం ఈ అడవంతా తిరిగినోణ్సి”” అతని కంఠంలో తొణికిసలాడిన గర్వం...

“ఎప్పుడైనా పగిలిపోయిన విరిగిపోయిన కోట గోడల్లాంటివి ఎక్కడైనా కన్పించాయా?”

ర్‌

గుర్రపుడెక్క సలీర

“అంటే ఏంటి సామీ?”

“జుగారు తన కోసమని పెద్ద కోట కట్టుకుంటారు చూడు... శత్రువులెవరూ సులభంగా ప్రవేశించడానికి వీల్లేకుండా బలమైన గోడలో కదారు... అలాంటిది” కేదార్‌ వివరించాడు.

అతనికి కొద్దిగా అర్ధమైనట్టుంది. “అస్మంటివి ఎక్కడా కన్చడలేదు సామీ” అన్నాడు.

“నువ్వు చూసి ఉంటావు మల్లయ్యా... కానీ అవి శిధిలమైన కోటవని నీకు అర్ధమై ఉందదు. నువ్వు మా ముందు నడుస్తూ దారి చూపించు. ఈ అడవి నాలుగు వైపులా మూడు కిలోమీటర్ల వైశాల్యంలో వెదుకుదాం. తప్పకుండా కన్పిస్తుంది” అన్నాడు సూర్యకుమార్‌,

మల్లయ్య దారి చూపిస్తుంటే సాయంత్రం వరకూ వెదికారు. ఫలితం శూన్యం.

సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి.

మల్లయ్య తలెత్తి ఆకాశం వైపుకు చూసాడు. “సామీ... అడవిలో బేగీ సీకటిపడిపోతుంది. సీకట్లో తిరగడం శానా పెమాదం సామీ.. జంతువులు వాటి తిండి కోసం బైటికొచ్చి యేళయింది.” అన్నాడు

“అయ్యో ... మరెలా”

“ర్రేప్పు ఎతుకుదాం సామీ...”

“ఈ రాత్రికి మేమెక్కడుండాలి? ఈ అడవిలో గుడారాలేస్సుని ఉందమంటే నా చాత కాదు” అన్నాడు కేదార్‌.

“మా చెంచు పెంటకి ఎల్లాం సామీ. మీకక్కడ బస ఏర్పాటు సేస్తా. మేం ఉడకేసుకున్న తిండే మీకూ పెద్దా... మా తిండి మీకు నచ్చుద్దొ లేదో... మా లచ్చిమి మాంసం కూర శానా రుచిగా వండుద్ది సామి” అంటూ ఆగి వాళ్ళ వైపు చూసి, “మీరు మాంసం తింటారా... తినకపోతే సెప్పండి. మా లచ్చిమి తవ్వి తెచ్చిన నల్ల గడ్డ, చెంచు గడ్డ, చామ గద్ద దుంపలుంటాయి. అవి వండి పెడ్తుంది” అన్నాడు.

“లచిమి ఎవరూ?” అని అడిగాడు కేదార్‌.

“నా ఆదది” అన్నాడు సిగ్గుపడిపోతూ... మళ్ళా అతనే, “లచ్చిమి శానా సురుకైంది

గుర్రపుడెక్క నీలీర సామీ..ఆడ సిరుత పులితో సమానం... తవ్వుకోల సేతపట్టిందంటే మగాడిలా పని సేత్తాది. కండ బలంగల మడిసి” అన్నాడు.

మగవాళ్ళని వర్ణించినట్లు మల్లయ్య తన భార్యని కండబలం గలది అన్నందుకు నవ్వొచ్చింది వాళ్ళకి.

“మేమూ మాంసం తింటాం సరే.. యింతకీ ఏం మాంసం” సూర్యకుమార్‌ అనుమానంగా అదిగాడు.

“మీరు పట్నపోల్లని మర్పిపోతానా సామీ... మీకోసరం సెవులపిల్లి మాంసమో... కౌజు పిట్ట మాంసమో వండిస్తా. మెం ఉడతల్నీ ఉడుంమాంసాన్ని కూడా తింటాం, అస్మంటివి మీకు పెట్టంలే సామీ” అంటూ నవ్వాడు మల్లయ్య,

ఈసారి అతని వైపు పరిశీలనగా చూశాడు కేదార్‌. వయసు యిరవై రెండుకి మించి ఉండదు. దూరం నుంచి చూసినపుడు పొడవుగా కన్పించాడుగానీ ఐదడుగుల మూడంగుళాల ఎత్తుంటాడు. చిన్నికళ్ళు , చప్పిడి ముక్కు విశాలంగా ఉన్న మొహం... రింగులు తిరిగిన జుట్టు... నల్లటి దేహభఛాయ.. సన్నగా ఉన్నా దృధంగా ఉన్న శరిరం... నవ్వినపుడు మబ్బులచాటున సూర్యకాంతి మెరిసినట్లు అన్పిస్తోంది.

“మీరు కన్స్చడకపోయి ఉంటే, దేవర్కి పూజ సేశాక ఏటకెల్లి ఏ జంతువునో ఈపాటికి కొట్టుకుని వచ్చేవాడిని. సామీ... మీ పట్నపోల్లు అసయ్యించుకుంటారుగాని ఒక్కసారి ఉడుం మాంసం తింటే మళ్ళా వదిలిపెట్టరు. అంత రుసి, మగతనం పెంచే బలం కూడా” అన్నాడు చుట్టూ చూస్తూ... అతను మాట్లాడుతున్నాదే గానీ అతని కళ్ళు డేగ కళ్ళలా నలువైపులా పరిశీలిస్తున్నాయి.

దూరంగా చెరువులో నాలుగు అడవికొంగలు కన్పించాయి. మల్లయ్య విల్లులో బాణాన్ని సంధించి శబ్దం చేయకుండా మెల్లగా ముందుకు కదిలాడు. ఆహారాన్ని వేటాదే సమయంలో చిరుత వెసే అడుగుల్లా అన్పించి ఆ దృశ్యాన్ని కళ్ళప్పగించి చూశాడు కేదార్‌. మల్లయ్య మరింత ముందుకు కదిలాడు.

బాణానికి అందే దూరం చేరుకున్నాక నిటారుగా నిలబడి బాణాన్ని గురిపెట్టాడు. అవి ఎలా పసిగట్టాయో ఒక్కసారిగా శబ్దం చెస్తూ పైకెగిరాయి. సర్రున దూసుకెళ్ళిన

గుర్రపుడెక్క స్రలీర బాణం ఓ పక్షి రెక్కల్లో గుచ్చుకోవటం అది టపటపా కొట్టుకుంటూ చెరువులో పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఎంత గురి.. ఒలింపిక్‌ పోటిల్లో ఆర్భరీ విభాగంలో యిలాంటి వాణ్ని పెడ్తేనా మనకు గోల్డ్‌ మెడల్‌ ఖాయం... కానీ మన ప్రభుత్వానికి యిలాంటి వాళ్ళు కనస్సించకపోవటం మన దురదృష్టం... అనుకున్నాడు కేదార్‌.

మల్లయ్య బాణంలా పరుగెత్తాడు. చెరువులోకి గెంతి ఈదుకుంటూ వెళ్ళి నీళ్ళమీద తేలుతున్న కొంగని పట్టుకుని విజయగర్వంతో వచ్చాడు.

“ఈ పూటకి తింది దొరికింది సామి... ఎల్లాం పదండి అంటూ ముందుకు కదిలాడు. వాళ్ళతన్ని అనుసరించారు.

ఓ అరగంట నడిచాక చెంచుపెంట చేరుకున్నారు. చెంచు గ్రామమంటే నలభయ్యో యాభయ్యో యిళ్ళుంటాయనుకున్నాడు కేదార్‌. అక్కడ ఎనిమిది యిళ్ళు మాత్రమే ఉన్నాయి. గుడిసెలు.... గుండ్రంగా ఉంది మధ్యలో కొనదెలి ఉన్నాయి.

మల్లయ్య గుడిసెలోపలికెళ్ళి “లచ్చిమీ.. మనింటికి సుట్టాలొచ్చారే” అన్నాడు. “సుట్టాలంటే నీ బందుగులో నా బందుగులో కాదులే. పట్నం దొరలు. పెబుత్వం దొరలు. మా లచ్చిమి మాంసం కూర వండితే సట్టిలోని కూడంతా తిన్నా ఇంకా తినాలనిపిత్తదని సెప్పినా. నా మాట నిలబెట్టాలొ అంటూ నవ్వాడు. లచ్చిమి అతని చేతిలో ఉన్న అదవి కొంగని అందుకుంది.

మల్లయ్య లోపల్నుంచి చాప తెచ్చి కొద్దిగా ఎడంగా ఉన్న జువ్వి చెట్టుకింద పరిచాడు.

వాళ్ళు కూచున్నాక వాళ్ళకెడంగా మల్లయ్య నిలబడ్డాడు.పట్నం నుండి గవర్నమెంటోళ్ళు వచ్చారని విని పిల్లాజెల్లా ముసలీ ముతకా అందరూ వచ్చి దండాలు పెట్టి వాళ్ళకు కొద్ది దూరంలో నిలబడి వింత చూసినట్లు కొద్దిసేపు చూశారు.

“ఏవుందిక్కడ సూట్టానికి... ఎల్లెండెల్లండి. దొరలకు కోపం వస్తది” అంటూ అదిలించాడు ఆ గుంపులోనే ఉన్న బుద్దన్న...

“మా చెంచుపెంటకి పెద్దమదిసి.. తోకల బుద్దన్న మల్లయ్య అతన్ని దగ్గరకు పిలిచి వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు. వాళ్ళు తమ పక్కన చాపమీద కూచోమన్నా కూచోకుందడా

గుర్రపుడెక్క సలీం “దండాలు దొరా... నేను కిందనే కూసుంటా దొరా” అంటూ అతను మోకాళ్ళ మీద కూచున్నాడు. మల్లయ్య గుడిసెలోకెళ్ళి పిట తెచ్చి వేశాడు. బుడ్డన్న ఆ పీటమీద జంకుతూ కూచున్నాడు.

బుడ్డన్న వయసు అరవైకి పైగా ఉండొచ్చనుకున్నాడు కేదార్‌. “అడవుల్లో వేటమీద ఆధారపడి బతి౩ చెంచుల్లో అరవై యళ్ళు పైబడి బతికే వాళ్ళు అరుదు. రోగాల బారిన పడో జంతువుల బారిన పదో అర్జాంతరంగా మృత్యువాత పడేవాళ్ళ సంఖ్యే ఎక్కువ” అన్నాడు సూర్యకుమార్‌.

“గూదేనికి పెద్దమనిషంటే అందరికంటే వయసులో పెద్దవాదనా?” అనుమాన నివృత్తికోసం అడిగాడు కేదార్‌.

“వయసుతో సంబంధం లేదు. ఓ రకంగా నాయకుడన్నాట. ఈ చెంచు గూదేనికంతా పెద్ద యితనె. వమైనాతగాదాలొచ్చినపుడు ఇతనే తీర్పునిస్తాడు. గూడెంలోని మిగతా వాళ్ళందరూ యితని మాటని గౌరవిస్తారు” చెవ్పాడు సూర్యకుమార్‌.

లచ్చిమి వంట పనిలో నిమగ్నమైపోయింది. చాలా శ్రద్ధగా చేస్తోంది. ఓ వైపు వంట చేస్తున్నా ఆమె మనసంతా ఆలోచనల్లో కీకారణ్యంలా ఉంది. గజిబిజి ఆలోచనలు... భయపెట్టె ఆలోచనలు..

ఎప్పుడూ లేనిది ప్రశాంతంగా ఉన్న అడవిలోకి ప్రభుత్వం వాళ్ళిందుకొచ్చారు? తన జాతికి మేలు చేసేవాళ్ళా కీడు చేసేవాళ్ళా? మల్లయ్యని వివరాలడుగుదామనుకునేలోపలే బైటిళ్ళి వోయాడు.

అడవికొంగ మాంసం ఉడుకుతున్న వాసన కమ్మగా వస్తోంది. *'ఏం మసాలాలు వేశారో... బహుశా అడవిలో దొరికే బెరళ్లో వేర్లో వాడ్తారేమో... ఆ వాసనే మత్తుగా ఆకలి పెంచేదిలా ఉంది అనుకున్నాడు కేదార్‌.

“బుడ్డన్నా... ఈ అడవిలో ఉంది ఎనిమిది కుటుంబాలేనా” అని అడిగాడు..

“ఈ చెంచుపెంటలో ఉంది మా ఎనిమిది కుటుంబాలే దొరా. చెంచోళ్ళలో యిరవై ఆరు వరకు కుదుర్లున్నాయి దొరా... నిమ్మలోల్లు, మర్రైపాలోల్తు, చిగుర్లోల్లు, గడ్డమోల్లు, పిట్టలోల్టు, దాసరోల్లు, తోకలోల్లు... మేం తోకలోల్లం...యిటు ఉత్తరం దిక్కుగా ఎల్త

క్‌

గుర్రపుడెక్క సీర మరో నాలుగు గుడిసెలున్నాయి దొరా. పులిచెర్లోల్లవి.. పిట్టలోల్లవి. లగ్గాలు సేస్కోటానికి మేం మా పోరగాల్లకి ఏరే కుదుర్తో పిల్లని ఎతుకుతాం. మా తోకలోల్లం తోకలోల్లపిల్లని సేస్కోం దొరా. మాకది శానా తప్పు” అన్నాడు బుడ్డన్న

సగోత్రయుల మధ్య పెళ్ళిళ్ళ నిషేధం వీళ్ళల్లో కూడా ఉందన్న్నాట అనుకున్నాడు కేదార్‌. మెల్లగా చీకట్లు దట్టమౌతున్నాయి. గుడిసెలోపల దీపం వెలిగించింది లచ్చిమి. పగటి పూట చాలా అందంగా కన్పించిన అదవి చీకటిలో భయం గొలిపేలా ఉంది.

“బుద్డన్నా... ఈ అడవిలో పాడుపడిపోయిన రాజుగారికోటగానీ దాని ఆనవాళ్ళుగాని అంటే విరిగిపోయిన గోడల్లాంటివి ఎపుడైనా చూసావా” అని అదిగాడు సూర్యకుమార్‌.

వెలుగుతున్న బుడ్దిదీపం వెల్తురుకన్నా పొయ్యిలోని కట్టెల మంట ప్రకాశవంతంగా ఉంది. అడవిలో ఓ రాత్రి గడపబోతున్న అరుదైన అనుభవాన్ని ఆస్వాదించకుండా పురాతన కోట గురించి అడుగుతున్న సూర్యకుమార్‌ వైపు విసుగ్గా చూశాడు కేదార్‌.

“లేదు దొరా” అన్నాడు బుడ్డన్న.

మెల్లగా వెన్నెల పర్చుకుంటోంది. యిందాక చీకటిలో భయపెట్టన అడవి యిపుడు వెన్నెట్లో తడిసి కొత్త సోయగాల్ని సంతరించుకుంటోంది. కొండ మీంచి జారుతున్న జలపాతంకింద స్నానం చేసి కురులారబోసుకుంటున్న అందమైన అతివలా ఉంది అడవి.

దూరంగా విరగపూసిన పూలచెట్లు...లేత ఆకుపచ్చ పసుప్పచ్చ పూలు...

“అవేం చెట్లు” అని అడిగాడు కేదార్‌.

మల్లయ్య తలతిప్పి వాటి వైపు చూసి, “అవి యిప్ప సెట్లు దొరా.. ఈ కాలంలో యిప్పపూలు పూస్తాయి. వాటిని ఎందబెట్టుకుని తింటాం. ఈ పూలతో యిప్పసారా కాస్తారు. శానా బాగుంటది దొరా” అన్నాడు.

పుస్తకాల్లో చదవటం తప్ప ఎన్నడూ చూడని ఆ చెట్ల సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయాడు కేదార్‌.

“ఒక్కో చెట్టునుండి దాదాపు యిరవై కేజీల యిప్పపూలు లభిస్తాయి. యిరవై కేజీల విత్తనాలు కూడా దొరుకుతాయి. ఆ విత్తనాల్లోంచి తీసిన నూనెని వంటనూనెగా వాడారు.

క్‌

గుర్రపుడెక్క నలీర దిని బెరడుతో మందులు చేస్తారు. అందుకే ఈ చెట్టు వీళ్ళ పాలిట కల్పవృక్షం లాంటిది” అన్నాడు సూర్యకుమార్‌.

“యిప్పపూలు ఎండ బెట్టి తింటామంటున్నారు కదా... మరి యిక్కడున్న ఎనిమిది కుటుంబాలు ఆ పూలు మావంటే మావని కొట్టుకోరా” అని అడిగాడు కేదార్‌..

“లేదు దొరా... అక్కడున్న సెట్లలో ఒక్కో కుటుంబానికెన్ని సెట్లో తీర్మానం సెసినా. ఆ సెట్లనుదాటి మిగతాసెట్ల జోలిఆంవ్వడూ పోడు” అన్నాడు బుద్దన్న.

“మా అడవి తల్లి సల్లంగున్నంతకాలం మాకు దిగుల్లిదు సామీ. దొంగతనం సేసి పొట్ట నింపుకోవాల్సిన కర్మ మా చెంచుపెంట వాల్లకి పట్టలా. పంద్పు, దుంపలు, పిట్టలు, జంతువులు ...అడవిని నమ్ముకున్నోల్లకి తిండానికి ఏదోటి దొరక్కుండా పోదు సామీ. అందుకే రేపటి తిండి గురించి మాకు బెంగే ఉండదు” అన్నాడు మల్లయ్య.

“మనం ఆ చెట్ల దగ్గరకెళ్ళి చూడొచ్చా” అన్నాడు కేదార్‌,

“రేపు పొద్దుగల్న ఎల్లి సూత్తే పూలన్నీ రాలి కన్పిత్తాయి. యిపుడు పురుగూ పుట్రా ఉంటాయి దొరా అన్నాడు బుద్దన్న

“మీరేం అనుకోనంటే ఓ ముచ్చట సెప్ప్తా దొరా... యిప్పసారా తాగుతారా... యింట్లో ఉంది. నా కొడుక్కిచ్చి పంపిత్తా” అన్నాడు బుద్దన్న లెచి నిలబడూ,

కేదార్‌ సమాధానం చెప్పలేదు. బుద్డన్న సూర్యకుమార్‌ వైపు అనుమతికోసం చూశాడు. అతను 'నువ్వెమంటావ్‌ అనేలా కేదార్‌ వైపు చూస్తున్నాడు. బుద్దన్న వెళ్ళిపోయాడు. యిప్పసారా రుచి ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక తీరకుండా పోతున్నందుకు కేదార్లో నిరాశ... మౌనం అర్జాంగీకారమని చెంచులకి కూడా తెలునో లేదో అనుకుంటున్నంతలోనే బుద్దన్న వెళ్ళిన ఐదు నిముషాలకు ముప్పయ్‌ ఐదు నలభైయళ్ళ మధ్య వయసున్న ఒకతను సొరకాయ దొప్పల్లో యిప్పసారా తెచ్చిచ్చాడు.

యిప్పసారా తాగి, కొండ జొన్నల్లో లచ్చిమి చేసిన రొట్టెల్లో అదవి కొంగ మాంసం నంజుకుని తింటుంటే స్వర్గం ఎక్కడో లేదు యిక్కడే ఉందనిపించింది కేదార్‌కి.

ఇన్‌స్టంట్‌ టెంట్లు వేసుకుని స్లీపింగ్‌ బ్యాగ్గలో పడుకున్నారిద్దరూ. కేదార్కి ఎంత హాయిగా నిద్రపట్టిందంటే సూర్యోదయం కావడానికి గంట ముందు మల్లయ్య

క్ని

గుర్రపుడెక్క సలీర తట్టిలెపెవరకు స్పృహ లేదు.

పక్కన సూర్యకుమార్‌ యింకా నిద్రపోతూనే ఉన్నాడు. అతన్ని లేపబోతే వద్దని వారించాడు.

“యిప్పపూల సెట్లని సూత్తానన్నావుగా సామీ...రా ఎల్లాం” అన్నాడు.

వాళ్ళు వెళ్ళేప్పటికి చెట్ల కింద పది ఉన్న పూలని బుట్టలోకి ఎత్తుకోడానికి తయారుగా ఉంది లచ్చిమి.

“నా ఆడది సామీ. లచ్చిమి” అంటూ పరిచయం చేసాడు. లచ్చిమి ఓ పక్కకు తొలుగుతూనే “దండాలు దొరా” అంది.

కేదార్‌ ఆమె వైపు పరిశీలనగా చూసాడు. ఎర్రని మిరపపండు రంగు జాకెట్టు... పచ్చటి ముతక చీర... మెళ్లో పూసల గొలుసు... చెవులకు రాగితో చేసిన కమ్మలు... రంగు నలుపైనా మొహం కళగా ఉంది.

“నిన్న రాత్రి వండిపెట్టన జొన్న రొట్టెలు, అదవికొంగ మాంసం చాలా రుచిగా ఉన్నాయి. మల్లయ్య చెప్పింది నిజమే. నీ చేతి వంట అమృతం.. ఒక్క పూట తిండికే విందు భోజనంలా అన్పిస్తే రోజూ తినే మల్లయ్య యింకెంత అదృష్టవంతుడో” అన్నాడు. లచ్చిమి సిగ్గుపడివోయింది. చెట్ల కింద పసుప్పచ్చటి తివాచి కప్పినట్లు యిప్పపూల సోయగం...

ఓ చెట్టుకింద నిలబడి తల పై3త్తి చూసాడు కేదార్‌....రాతిరంతా నక్ష శ్రాల్ని మల్లెపూల వొన్సులా చేసుకుని పవ్వళించిన ఆకాశం, సూర్యోదయానికి పూర్వం దుప్పటిని దులిపేసినట్టు...నిన్న చూసినపుడు చెట్టు తన తలలో తురుముకున్న వందల వేల పూలన్నీ యిపుడు నేలమీద రాలిన నక్షత్రాల్లా పడి ఉన్నాయి.

లచ్చిమి పూలని ఏరే ముందు చెతులు జోడించి “అమ్మా గారెల మైసమ్మా... నిన్న నమ్ముకున్నాం. దయసూడు తల్ల” అని ప్రార్ధించి పని ప్రారంభించింది. కెదార్‌కి కూదా ఆ చెట్టుకి మొక్కాలనిపించింది. రాత్రి యిప్పనారా తాగటం వల్ల తనూ ఆ చెట్టుకి రుణపడిపోయాడు మరి.

రాత్రంతా నిశ్శబ్దంలో ముడుచుకున్న అడవి ఒక్కసారిగా పక్షుల అరుపులో ఒళ్ళు

క్‌

గుర్రపుడెక్క సలీర విరుచుకుంది.

వాళ్ళు తిరిగి గుదిసెకు చేరుకునెప్పటికే సూర్యకుమార్‌ లేచి ఉన్నాడు.

బేక్‌ ఖాస్ట్‌ కోసం వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులోంచి బ్రెడ్‌ తీసి దాని మీద జాం రాసి తిన్నారు. మల్లయ్య ఎర్రగా ఉన్న జాం వైపు వింతగా చూశాడు. “ఏంటి సామీ అది?” అని అదిగాడు.

కేదార్‌ రెండు బెద్‌ ముక్కలు తీసి వాటికి జాం రాసి వాటిని ఒకదానిమిద ఒకటి పెట్ట అతనికిచ్చాడు. “తిని చూడు. బావుంటుంది. ఎర్రగా ఉన్నదాన్ని జూం అంటారు. తీయగా ఉంటుంది” అన్నాడు

మల్లయ్య ఒక వైపు కొరికి తిన్నాడు. నమిలేకొద్దీ చాలా రుచిగా అన్పించింది. “బావుంది సామీ” అన్నాడు మిగతాది తినకుండా. “మొత్తం తిను” అంటే “నా లచ్చిమి కోసరం సామీ” అన్నాడు సిగ్గు పడ్డూ,

“లచ్చిమికి వెరే ఇస్తాలే. నువ్వు తిను” అంటూ కేదార్‌ మరో రెండు బెద్‌ ముక్కలకి జాం రాసి మల్లయ్యకిచ్చాడు. అతను గుడి సెలోపలికెళ్ళి లచ్చిమి కిస్తూ “తిను. శానా రుచిగా ఉన్నాయి. తేనె పూసి తిన్నంత తీయగా... అదేదో జామట.. పూసిచ్చారు” అన్నాడు.

“మన మల్లయ్యకు పెళ్ళామంటె ఎంత (ప్రేమో గమనించావా” అంటూ నవ్వాడు కేదార్‌.

వాళ్ళు బయట్దెరబోయే ముందు ఏదో బూడిదలో చింత పండు రసం కలుపుకుని ముద్ద చేసుకుని తిన్నాడు మల్లయ్య,

“ఏంటది?” కుతూహలాన్ని ఆపుకోలేక అడిగాడు కేదార్‌.

“మెద్దులు సామీ... యాప బెరడుని కాలిస్తే వచ్చిన బూడిద. అందులో సింతపండు కలుపుకుని తింటె పొద్దుగూకేవరకూ ఆకలేయదు.. దాహమేయదు. ఎంత దూరం నడిసినా కట్టమనిపించదు. నా సిన్నప్పుడు మా అయ్య బతిమాలినా తినెటోట్జి కాదు. వాంతికొచ్చెది. దీని గునమేంటో ఈ మద్దిన తెలిసొచ్చింది సామీ. మా చెంచులపాలిట అమురుతం ఇదే” అన్నాడు.

“యాపచెట్టు బెరడంటే వేపచెట్టనుకునేవు. కాదు. వీళ్ళలో పోషకాహారలోపం

గుర్రపుడెక్క స్రీలీ6 గమనించావా? ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన విటమిన్లు మినరల్స్‌ దొరికే పౌప్టికాహారం తినరు. తరతరాలుగా వేళ్ళూనుకున్న నమ్మకం మెద్దులు తింటే ఆకలీ దాహం వేయవని. ఇది తినటం వల్ల కడుపు నొప్పులో ఎసిడిటితో అల్సర్లతో బాధలు పడ్డుంటారు. ఐనా ఈ అనారోగ్యాలన్నీ దానివల్ల అనుకోరు.. మొరటు మనుషులు... వీళ్ళని విద్యావంతుల్ని చేస్తే తప్ప మూఢనమ్మకాల్నుంచి బైటపడలేరు” కేదార్మి మాత్రమే విన్సించేలా మెల్లగా చెప్పాడు సూర్యకుమార్‌.

మల్లయ్య తన విల్లు, అంబులు తీసుకుని అడవిలోఇళ్ళటానికి సిద్ధమైనాడు. అతనోపాటు తయారైన కుక్కని చూపిస్తూ “నా బైరిగాడు సామీ. శానా ఉషారు. వఏటలో నాకు సాయం ఈదే” అని పరిచయం చేశాడు.

“కోట ఎతకడానికేగా ఎల్తోంది... నేనూ మీతోపాటే వత్తాను దొరా” అంటూ బుడ్దన్న కూడా తయారైనాడు.

నెరిసిన తల... ముడతలు పడిన శరీరం... గోచి బిగించిన మొలతాడుకి ఎడం పక్కన గుడ్డతో కుట్టిన ఒరలాంటి సంచిలో చిన్న కత్తి కుడి చేతిలో గొడ్డలి, ఎడం భుజానికి వేలాడుతున్న విల్లు, ఎడంచేతిలో నాలుగు అంబులు... యుద్దానికి బయల్లెరిన ముసలి యోధుడిలా ఉన్నాడు బుడ్డన్న

“అదెక్కడుందో వెతకాలికదా. చాలా దూరం నడవాల్సి రావొచ్చు. నీకెందుకు శ్రమ? యింట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుకదా” అన్నాడు కేదార్‌.

“నన్ను బుజాన ఏసుకుని ఈ అడవంతా తిరిగి రమ్మంటే చులాగ్గా తిరిగొత్తాడు మా పెద్దయ్య. మనం అలసివోయి ఆగివోవాల. పెద్దయ్య సూట్టానికలా ఉన్నాడు గాని ఈ వయసులో కూడా మొన్నో ఎలుగ్గొద్దుతో ఒంటి సెత్తో కలబడినాడు” అన్నాడు మల్లయ్య,

బుడ్డ్దన్న కులాసాగా నవ్వాడు. కేదార్‌ రాత్రి సరిగ్గా గమనించలేదు... అతని కుడి దవడలో కింది వరుసలో రెండు పళ్ళు వూడిపోయినాయి. నవ్వినపుడు గాలి ఆ సందుగుండా బైటికి రావటం వల్ల తమాషా శబ్దం వస్తోంది.

గుట్ట పక్కనున్న చెరువు దగ్గరకొచ్చి ఆగిపోయారు.

“యిక్కడనుండి మొదట ఉత్తరందిక్కుకళ్ళి చూద్దాం” అన్నాడు సూర్యకుమార్‌.

విగ్రహం ఉన్న గుట్టవైపుకి చూపు తిప్పకుండా ఉత్తరం దిక్కుకి నడక నాగించారు.

ర్‌

గుర్రపుడెక్క సలీం మొదట పల్చగా విస్తరించి ఉన్న చెట్లు రాను రాను దట్టంగా ఉండి ముందుకు కదలటం కష్టమైంది. మల్లయ్య తన చేతిలోని కత్తితో, బుడ్డ్దన్న గొడ్డలితో అడ్డొచ్చిన కొమ్మల్ని నరుకుతుంటే మెల్లగా ముందుకు కదుల్తున్నారు.

టక్కున బుద్దన్న ఆగివోయాడు... దూరంగా గాల్లో ముక్కుని రిక్కించి వాసన చూసుకుంటూ వసోంది ఎలుగుబంటు.

బుద్దన్న శబ్దం చేయకుండా అడుగులు వెనక్కి వెసాడు. మిగతా ముగ్గురూ అతన్ని అనుసరించారు. ఒక పొదని చాటుగా చేసుకుని నక్కి కూచున్నారు. బైరిగాడు కూడా బాగా అనుభవం ఉన్నోడిలా శబ్దం చెయకుండా నిలబడ్డాడు. ఎలుగుబంటు గాల్లో వాసన చూసుకుంటూ వాళ్ళకు కొద్ది దూరంలో నిలబడింది. వాళ్ళు దాగి ఉన్న పొదవైపు చూసి గుర్‌ గుర్‌ అంటూ శబ్దం చేసింది. “అది మనుషుల వాసన పసిగట్టి ఉంటుంది, తమ వైపుకి దూకి అటాక్‌ చేస్తుందనిపించింది కేదార్శి,

బుడ్డన్న అప్రమత్తమయ్యాడు. గొడ్డలిమీద అతని చేయి బిగుసుకుంది. మల్లయ్య బాణం సంధించి పొదల మధ్యలో కన్పిస్తున్న సందుల గుండా దానివైపుకి గురి పెట్టాడు. అది అటువైపుకి మూతిని తిప్పి గాల్లో వాసన చూసి మెల్లగా ముందుకు కదిలి చెరువున్న వైపు౭ళ్ళిపోయింది.

గండం గదిచినందుకు హాయిగా వూపిరి పీల్చుకున్నాడు కేదార్‌. ఎటొచ్చీ మనసులో ఏదో నిరాశ. (థ్రిల్‌ ఏదో మీస్స్పయిందన్న భావన... మల్లయ్య చిరుతపులితో కలబడ్డానన్నాడు. బుద్దన్న ఎలుగ్గొడ్డుతో పోరాటం చెశాడు. కానీ ఆ పోరాటాల్ని ప్రత్య క్షంగా చూసే అవకాశం తప్పిపోయింది. మరో పదినిముషాలు ఆగాక అది తిరిగి రాదని నిర్ధారించుకుని బుడ్డన్న లేచాడు. “యింక బయంలదు. ఎల్జాం పదండి” అన్నాడు.

“ఎందుకు బుద్దన్నా దాన్ని చూసి భయపడి దాక్కున్నావు? ఒంటి చేతో ఎలుగ్గొద్దుని ఓడించావని మల్లయ్య చెప్పాడుగా... యిష్పుదైతే నీ చెతిలో గొడ్డలి ఉంది. నీకు తోడుగా మల్లయ్య ఉన్నాడు. ఎందుకొదిలేశావు దాన్ని” అని అడిగాడు కేదార్‌.

బుడ్డన్న తమామషా శబ్దం వచ్చెలా నవ్వాడు. “అది సిన్నపిల్ల దొరా. మనం రాజుగారి కోటని ఎతుక్కుంటా పోతున్నట్లు అది తేనెపట్టు వాసన పసిగట్టి దాన్ని ఎతుక్కుంటా పోతోంది. మనమీద కలబడి మన పేనాలమీదికొత్తే తప్ప దాన్నెందుకు సంపాలి దొరా...

రం

గుర్రపుడెక్క సలీర అది బతకాల... మేమూ బతకాల. మేం ఈ అడవి తల్లిని నమ్ముకుని ఎలా బతుకుతున్నామో యిందులో ఉన్న పచ్చులు, జంతువులూ అన్నీ కూడ అడవి తల్లి సల్లటి సూపులోనే బతుకుతా ఉండాయి. ఆకలి సల్లార్చుకోడానికి సిన్నసిన్న జంతువుల్ని ఎటాడ్డం వరకు తప్పులెదారా. ఉత్తి పున్నానే దాన్నెందుకు సంపాలి? పాపం తగులుద్ది” అన్నాడు బుద్దన్న.

అతని మాటల్లో వ్యక్తమైన జంతు ప్రేమకి... ధర్శనిరతికి చాలా ముచ్చటేసింది కేదార్ని అదే విషయాన్ని ప్రస్తావించినపుడు అటవీ సంరక్షణ కోసం చెంచులు తీసుకునే జా(గ్రత్తల్ని వివరించాడు సూర్యకుమార్‌. “పిళ్ళ జీవితాలు అడవితో ఎంత మమేకమై ఉంటాయంటే చివరికి కుదుర్ల పేర్లు కూడా అడవిలోని ఏ చెట్టుపేరో, పిట్ట పేరో, జంతువు పేరో కలిగి ఉంటాయి. లేత వెదుర్లని కానీ లేత బీడీ ఆకుల్ని కానీ కోయరు. చీపురు పుల్లల్ని కూడా పూర్తిగా ఎదిగినవాటినే ఏరుకుంటారు. మళ్ళా పంట రావడం కోసం వాటి విత్తనాలు నేలమీద పడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కడుపుతో ఉన్న జంతువుల్ని చంపరు. పసికూనల్ని వేటాడరు. దుంపల్సి వేర్లని తవ్వుకునెేటప్పుడు కూడా కొంత భాగం నెలలో మిగిలిపోయేలా చూస్తారు. కొన్నాళ్ళకు మళ్ళా ఆ దుంప లేదా వేరు పెద్దదవుతుంది. ఏళ్ళు అటవీ సంపదను నాశనం చేయరు. దాన్ని పరిరక్షిస్తూనే కొంత. ఫలసాయాన్ని అనుభవిస్తారు. అంతే”

వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా చెట్లు తప్ప విరిగిన గోడల్లాంటివి ఎక్కడా కానరాలేదు. నడిచీ నడిచీ కేదార్కి కాళ్ళు లాగేస్తున్నాయి. ఉత్తర దిక్కున అడవి చివరంటా వెళ్ళి వెనక్కి తిరిగారు.

“ఎన్నో యేళ్ళు. గడిచిపోయాయిగా. ఆ శిధిలాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి” అన్నాడు కేదార్‌. అతని గొంతులో స్పష్టంగా ధ్వనిస్తూ నీరసం...

“వెదికితే ఏదో ఒక ఆనవాలు దొరక్కపోదు” అన్నాడు సూర్యకుమార్‌.

ఎండ నదినెత్తికొచ్చింది. జువ్వి చెట్టు కన్పిస్తే దాని నీడలో కూచుండిపోయాడు కేదార్‌. ఆకలి... అలసట... వెంట తెచ్చుకున్న నాలుగు బెడ్‌ ముక్కల్లో రెండు తీసుకుని మిగతా రఠం0దు సూర్యకుమార్‌ కోసం ఉంచి, జాం రాసి తిన్నాడు. ఆకలి తీరలేదు.

“ఓ చెనంలో వతాను దొరా అంటూ మల్లయ్య చుట్టుపక్కలంతా వెదకి దోసిలినిండా కొండ రేగుపళ్ళు కోసుకొచ్చి యిచ్చాడు. అవి తిన్నాక కొద్దిగా కడుపుమంట తగ్గింది.

[క్‌

సూర్యకుమార్‌, కేదార్‌ విశ్రాంతి తీసుకుంటుంటే మల్లయ్యా బుడ్దన్న కలిసి చెట్లని గాలించటం మొదలెట్టారు. వాళ్ళ వెనకే బైరిగాడు.... పళ్ళ కోసమనుకున్నాడు కదార్‌... కాదు.. చెట్టు తొర్రల్లో దేనికోసమో వెదుకుతున్నారు. బుడ్డన్న గొడ్డలిపిడితో చెట్టు కాండాన్ని కొట్టి ఏవోశబ్లాలు వినడానికి ప్రయత్నిస్తున్నాడు. కేదార్‌ వాళ్ళనె జాగ్రత్తగా గమనిస్తూ కూచున్నాడు. కొద్దిగా ఎండినట్టున్న తుమ్మ చెట్టు వైపు చూస్తూ బైరిగాడు మొరిగాడు. దాని చుట్టూ తిరుగుతూ కాళ్ళతో గీరుతున్నాడు. బుడ్డ్దన్న ఆ చెట్టు కాండంమీద గొడ్డలితో కొట్టి, చెవానించి విన్నాక మల్లయ్యకేదో సైగ చేశాడు. ఉత్సుకతని ఆపుకోలేక కెదార్‌ వేగంగా నడిచి ఆ చెట్టు దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. మల్లయ్య చెట్టుకటువైపెళ్ళి నిలబడ్డాడు. బుడ్డ్గన్న చెట్లు తొర్రలో చేయి పెట్టి దేని తోకనో పట్టి లాగి వదిలాడు. అటు వైపున్న

(౪ లు లు ని వ్‌ మల్లయ్య బైటికొస్తున్న ఆ జీవిని కుడిచేత్తో ఒడిసి పట్టుకున్నాడు. కేదార్‌ కళ్ళు విప్పార్చి దాని వైపు చూశాడు. బాగా బలిసిన ఉడుం...

మల్లయ్య కత్తితో దాని తలమీద ఒక వేటు వెశాడు. బుద్దన్న చిదుగులు ఏరి తన దగ్గిరున్న అగ్గిపుల్లతో మంట రాజేశాడు. మల్లయ్య దాన్ని తోక దగ్గర పట్టుకుని ఆ సెగమీద దాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చాడు. అటు వైపు సరిగ్గా కాలాక ఓ పుల్లని దాని పొట్టలో గుచ్చి తోక వైపు కూడా కాల్చాడు.

యిద్గరూ అక్కడే కూచుని కాలిన దాని మాంసాన్ని వూదుకుంటూ తినటం ప్రారంభించారు. బైరిగాడికి ఓ ముక్క వేశారు. అది తోకూపుకుంటూ తింది. కేదార్‌ తిరిగొచ్చి సూర్యకుమార్‌ పక్కన కూచున్నాడు. సూర్యకుమార్‌ మొహంలో వికారం... చెట్ల చాటుకెళ్ళు వాంతి చేసుకున్నాడు. “ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి... అసహ్వించుకుంటె ఎట్లా... పాముల్ని కప్పల్ని తినేవాళ్ళున్నారుగా... వీళ్ళు మన ఎదురుగా ఉడుంని తిన్నారు. కొంతలో కొంత నయం” అన్నాడు కేదార్‌.

“సారీ...ఎంత ఆపుకున్నా ఆగలేదు” సంజాయిషీగా అన్నాడు సూర్యకుమార్‌.

పొదల మధ్యన చిన్న కుంటలో నీళ్ళు నిలిచి ఉన్నాయి. మల్లయ్యా బుద్దన్నా ఆ కుంట దగ్గరకెళ్ళి నిలబడ్డారు. కెదార్‌ కంగారు పడ్డాడు. “ఏయ్‌... ఏం చేయబోతున్నారు?” అంటూ వాళ్ళ వెనక పరుగెత్తాడు. అప్పటికే ఇద్దరూ చేతుల్ని ఆ నీళ్ళలో కడుక్కున్నారు. బుద్దన్న మోకాళ్ళమీద కూచున్నాడు.

05

గుర్రపుడెక్క వ్రల్‌ర

“ఏయ్‌...ఆగు” అన్నాడు కేదార్‌,

బుడ్దన్న కేదార్‌ వైపు చూసి నవ్వుతూ “దాహంగా ఉంది దొరా” అన్నాడు.

“ఐతే ఆ నీళ్ళు తాగుతారా ఎవరైనా? ఎంత మురిగ్గా ఉన్నాయో చూశావా? రోగాలొస్తాయి. డిసెంట్రీ పట్టుకుని ఛస్తారు”

“ఏం క్రాదు సామీ... మా కలవాటే. ఈ సుట్టపక్కల సెరువులేం లేవు. ఈ సీల్లే తాగాల” అన్నాడు మల్లయ్య,

“వద్గొద్వ. నామాటినండి. నా బ్యాగ్‌లో మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ఉంది. ఈ నీళ్ళు తాగండి” బ్యాగ్‌ లోంచి నీళ్ళ బాటిల్‌ తీసి వాళ్ళ వైపుకు చావాడు.

“మీ అస్మంటి దొరలు తాగే నీల్లు మాకెందుకు దొరా. ఇస్మంటీ సెలమళల్లో నీల్లుతాగే మా పోరగాల్లందరూ పెద్దయితరు” అంటూ ఆ నీళ్ళ మీద తన బొడ్లో దొపుకొచ్చిన గుద్దని తీసి పరిచాడు. మల్లయ్య గులకరాయినొకదాన్ని ఏరుకొచ్చి దాని మధ్యలో వేశాడు. గుడ్డ మధ్య భాగం సీళ్ళలో మునిగింది. ఇరువైపులా అంచుల్ని చెత్తో పట్టుకుని, వొంగి, నోటితో ఆ నీళ్ళను తాగాడు బుడ్డన్న

“అయ్యో... చెప్తుంటే అర్ధం కాదా? ఎన్ని బ్యాక్టీరియాలుంటాయో ఆ సళ్ళలో... ప్రమాదం” అంటూనే ఉన్నాడు కేదార్‌. అతని మాటల్ని పట్టించుకోకుండా మల్లయ్య కూడా అలానే నీళ్ళు తాగాడు.

ఈసారి పడమరవైపుకి బయల్దేరారు. కేదార్‌ మనసంతా దిగులు.. ఏంటి వీళ్ళ జీవితం? బైటి ప్రపంచంలోని మనిషి వేగంగా ఇరవై ఒకటో శతాబ్బంలోకి దూసుకుపోతుంటిే, వీళ్ళింత అనాగరికంగా జంతువుల్లా బతుకుతున్నారేమిటి? ప్రభుత్వం ఎందుకు విళ్ళని నాగరిక సమాజంలోకి తెచ్చె ప్రయత్నం చేయదు? పోషకాహారలేమితో, సరైన బట్టలు లేకుండా వైద్య సదుపాయం లేకుండా విళ్ళంతా ఆదిమమానవుల్లా బతుకుతున్నారే.. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న వీళ్ళ బాగు కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు.

“ఏంటీ దిర్దంగా ఆలోచిస్తున్నావు? ఇందాక వాళ్ళు తాగిన స్‌ళ్ళ గురించేనా?” సూర్యకుమార్‌ అడిగాడు.

“జను. నువ్వు చూళ్ళేదుగానీ కుమార్‌, ఎంత మురిగ్గా ఉన్నాయో... పైన ఏవో

గుర్రపుడెక్క సలీ౦ పురుగులు తేల్తున్నాయి. స్టమక్‌ ఇన్ఫెక్షన్‌ రావటం ఖాయం”

“గుడ్డతో వడగట్టాడుగా”

కేదార్‌ కోపంగా చూశాడు. “నేను మాట్లాడుతుంది హార్మ్‌ఫుల్‌ బ్యాక్టిరియా గురించి”

సూర్యకుమార్‌ నవ్వాడు. “ఏమీ కాదు కేదార్‌. వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బలంగా ఉంటుంది. కొన్ని తరాలుగా ఇటువంటి నీళ్ళు తాగుతూ ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియాని తట్టుకునే బీన్స్‌ వీళ్ళ శరీరంలో ఉంటాయి. వాళ్ళు సళ్ళు తాగిన విధానం గమనిం చావా? దోసిళ్ళతో కాకుండా నేరుగా నోటితో... చెరువులోని నిళ్ళని జంతువులు ఎలా తాగుతాయో అలా... అదే బ్యూటీ.. ప్రకృతితో మమేకమై... ఇక్కడి జంతువుల్లో మమేకమై”

“మనుషులై ఉండి జంతువుల్లా బతకడం బ్యూటీనా? వాళ్ళలా బతుకుతున్నందుకు, అన్ని రంగాల్లో అభివృద్దిని సాధించామని విర్రపిగుతున్న మనం సిగ్గుపడాలి”

సూర్యకుమార్‌ నవ్వి వూర్మున్నాడు.

అప్పటికే చాలా దూరం నడిచారు... దాదాపు గంటన్నర నడిచాక ఎర్రమట్టి నేలలా కన్పించింది... గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రాళ్ళు... మట్టి... సూర్యకుమార్‌ మోకాళ్ళమిద కూచుని వాటిలో వెదికాడు. పురాతన కోట గోడల అవశేషాలు కన్పించాయి. అతని ఆనందానికి అవధులు లేవు. మల్లయ్య నీ, బుద్డన్ననీ కౌగిలించుకుని “థ్యాంక్యూ... థ్యాంక్యూ” అన్నాడు.

వాటికి సంబంధించిన విషయాల్ని తన డైరీలో రాసుకుని డిజిటల్‌ కెమేరాతో ఫొటోలు తీశాదు. “నా థమ ఫలించింది. నా పేరు చిరన్వాయిగా చరిత్రపుసకాల్లో నిలబదిపోతుంది. మన్నుగొండ రాజ్య అవశేషాల్ని లక్షినరసింహస్వామి వారి శిధిలమైన ఆలయాన్ని కనుగొన్నది సూర్యకుమార్‌ అనే హిస్టరీ లెక్బరర్‌.... అని రాస్తారు... ఓహ్‌... నాకెంత సంతోషంగా ఉందో” అన్నాడు.

“నా రిపోర్ట్‌లో మీ యిద్దరి పేర్లు కూడా రాస్తా..మీ ఫొటోలు కూడా వేయిస్తా” అన్నాడు. మల్లయ్యకూ బుడ్గన్నకూ అతను ఏం చెప్తన్నాడో అర్ధం కాకున్నా చాలా సంతోషపడ్డున్నాడని అర్ధమై వాళ్ళిద్దరూ అతని సంతోషంలో పాలుపంచుకున్నారు.

“సీకటి పదడేలోపల గూదేనికెల్లాల. తొరగా నడువు దొరా” అంటూ మల్లయ్య తొందరపెట్టాడు. నలుగురూ వేగంగా నడుస్తున్నారు. ఒకచోటికి రాగానే బుద్దన్న నడక

గుర్రపుడెక్క సలీర వేగాన్ని తగ్గించాడు.

అక్కడ చాలా ఎత్తెన వృక్షాలున్నాయి. బుడ్డన్న ఆకాశం వైపుకి తలయెత్తి నలువైపులా తిరిగి గాల్లో తేలి వస్తున్న వాసన చూనాడు... అచ్చం ఉదయం కన్పించిన ఎలుగ్గొడ్డు వాసన చూసినట్లు... ఓ చెట్టు దగ్గరకొచ్చి ఆగివోయాడు.

“ఈ సెట్టుకి తేనెతుట్టె ఉంది. దినికోసమే ఎలుగ్గొద్దు ఎతుకుతా ఉండింది. నిటారుగా ఉన్న సెట్టెక్కలెక ఎలివోయి ఉంటది” అన్నాడు.

ఆ చెట్టు ఆకాశాన్ని తాకుతున్నట్లుంది.

“త్రేనె కొట్టుకు వోదాం జరసేపు నిలబడు దొరా... చనంలో పనికానిత్త” అన్నాడు బుద్దన్న.

యిపుడీ బక్కపల్చని బుడ్డ్దన్న అంతెత్తున్న చెట్టెక్కి తేనేటీగల్ని అదిలించి తేనె తెస్తాడా... చూడాల్సిన సీనే అనుకుని నిలబడిపోయాడు కేదార్‌.

కత్తిని పెట్టుకున్న గుద్డసంచీలోంచి దారపు ఉండని తీసాడు బుద్దన్న బాణానికి చివర్లో దారాన్ని కట్టి విల్లు ఎక్కుపెట్టి గురిచూసి వదిలాడు. బాణం రివ్వున దూసుకెళ్ళి తేనెతుట్టెలో దిగబడింది. కొన్ని తేనె టీగలు ఎగిరి కొంత సేపు శబ్దం చెసి మళ్ళా సర్దుకున్నాయి. తన చేతికందే ఎత్తులో దారాన్ని కత్తితో కోసి ఆ దారపుకొన దగ్గర అక్కడే దొరికిన వెడల్పాటి ఆకుల్తో చుట్టిన దోనెని పట్టుకుని నిలబడ్డాడు. ఆ దారంవెంబడి మెల్లగా జారుతూ మొదటి తేనె చుక్క పడింది. దాని వెంటే సన్నటి దారంలా తేనె దాదాపు పావుగంట వరకు పడూనే ఉంది. దోనె ముప్పావు నిండాక అందులో వేలు ముంచి తేనె చప్పరిస్తూ “శానా బావుంది దొరా. యిక సాలు. పోదాం” అన్నాడు బుద్రన్న దారాన్ని పట్టుకుని మెల్లగా లాగాడు. బాణం వూడి కింద పదడబోతున్నప్పుడు లాఘవంగా పట్టుకుని దాని కొనని నోట్లో పెట్టుకుని చప్పరించి, దాన్నుంచి దారాన్ని విడదిశాడు.

గూదెనికి దగ్గరగా వచ్చినపుడు దైవర్‌తో చెప్పిన విషయం గుర్తొచ్చింది కెదార్మి అప్పటివరకూ సెల్‌ విషయమే మర్చిపోయారిద్దరూ... కేదార్‌ తన సెల్‌ బైటికి తీసి చూసాడు. సిగ్నల్‌ లేదు. అందుకే నిన్నటి నుండి సెల్‌ మోగలేదు. అంటే రేపదయంలోపల దైవర్‌కి మెసేజ్‌ యివ్వకపోయినా వాళ్ళు తిరిగి వెళ్ళకపోయినా పోలీస్‌ స్టేషన్లో మిస్సింగ్‌ కేస్‌ కింద కంప్లెయింట్‌ నమోదవుతుంది. అదే విషయం సూర్యకుమార్‌కి గుర్తు చేసాడు.

గుర్రపుడెక్క నీలీర

“మెమొచ్చిన పనైపోయింది మల్లయ్యా,. గూడెంకెళ్ళాక మా సామాన్లు తీసుకుని బయళట్దెరతాం. మెం అడవి దాటి వెళ్ళేవరకు తోడొస్తే చాలు” అన్నాడు సూర్యకుమార్‌.

అప్పటికే మెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి.

_“శీక్రటి పడ్డోంది సామీ. గిప్పుడు అడవిలోంచి ఎల్లటం శానా పెమాదం. రేపు పొద్దుగల్న ఎల్లొచ్చు. ఈ రాత్తిరికి ఉండిపొండి” అన్నాడు మల్లయ్య.

“దొరా..ఈ రాత్తిరి గూడెంలో సంబరముంది. మా తోకల కుదురోళ్ళు, పులిచెర్ల కుదురోళ్ళు కలిసి విందు సేస్కుంటున్నాం. కోడి మాంసం.. యిప్పసారా... తాటికల్లు...” అలా అంటున్నప్పుడు బుడ్డన్నలో ఉరకలెత్తుతున్న ఉత్సాహం...

“ఈ రోజేమైనా పండగ ఉందా ?” అని అడిగాడు కేదార్‌.

“లేద్గారా... పొద్దుగల సన్న సీకట్లో మా తోకల ఆడది, పులిచెర్ల లింగన్న పొదల మాటున కలుస్తాఉంటే నేనే సూసినా. కల్లు ముంత దింపుదామని తాటి సెట్టెక్కినా. నా కల్లకు ఆల్లిద్దరూ జత కడా అగుపించారు. ఆ రోజు మాపట్‌జామ్‌న ఆల్లిద్దర్నీ పిలిసి పంచాయతీ పెట్టినా. ఆల్ల కుదురు పెద్ద మడిసిని కూడా పిల్సినా. తప్పు సెసిన ఆభ్లిద్దరూ తప్పాప్పుకున్నారు. జరిమానా కట్టాలని తీర్చిచ్చినా. అందుకే పులిచెర్ల లింగన్న తన కర్సుతో గూడెంలో అందరికీ ఈ రాత్తిరికి విందు ఏర్పాటు సేశాడు” అన్నాడు బుద్డన్న.

“జరిమానా ఎంత? ఎలా లెక్క కద్దారు? ఎవరికి చెల్లించాలి?” కేదార్‌ అడిగాడు.

“విందుకయ్యే ఖర్చే జరిమానా. గూడెంలోని అందరికీ మందు, విందు భోజనం ఏర్పాటు చేయడం ద్వారా ఎవరైనా సరే తాము చేసిన తప్పుని మాఫీ చేసుకున్నట్లె” సూర్యకుమార్‌ చెప్పాడు.

“తప్పు సేసింది ఎవరో కాదు, మల్లయ్య మరదలు ఎంకటమ్మే” అన్నాదు బుద్దన్న.

గూడెం చెరుకునేప్పటికే అక్కడంతా చాలా కోలాహలంగా ఉంది. ఆరుబయట చెట్లకింద వంట ప్రయత్నాలు మొదలయ్యాయి. నాలుగు కోడి పుంజుల్ని కోసి శుభం చెస్తున్నారు. మూడు రాళ్ళు పెట్టీ చేసిన పొయ్యిలు రెండు వెలిగించి వాటిమీద మట్టి వా(త్రలు పెట్టారు. ఒకదాన్లో కొండ జొన్నలో అన్నంవండటానికి ఎసరు మరిగిస్తున్నారు. మరోదాంట్లో మసాలాలు వేసి కోడికూర వండే ప్రయత్నం జరుగుతోంది.

వేపచెట్టు కిందున్న రాతి బండ మీద బుడ్దన్న కూచున్నాడు. అతని పక్షనే కేదార్‌,

గుర్రపుడెక్క స్రలీరి సూర్యకుమార్‌ కూచున్నారు. మల్లయ్య తాటికల్లు, ఇప్పసారా తీసుకురావడానికి వెళ్ళాడు.

పులిచెర్ల కుదురు వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళ పెద్దమనిషి పులిచెర్ల ఈరయ్య రాగానే బుడ్డ్దన్న అతన్ని పరిచయం చేసాడు. “దండాలు దొరా” యిద్దరికీ వేరు వేరుగా దండాలు పెల్ట అతను బుద్దన్న పక్కనే కూచున్నాడు.

చాలా కోలాహలంగా ఉంది. సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడిసెల్లో బుద్ది దీపాలు వెలిగించే పనిలో ఆడోళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ లోపల మల్లయ్య రెండు కుండలు మోసుకొచ్చి అక్కడ పెట్టాడు.

“ఈ ఖర్చంతా లింగన్నదేనా” బుద్దన్నని అదిగాడు కేదార్‌.

“ఆ దొరా... అంతా లింగన్నే సూస్మ్కోవాల” బుడ్డన్న బదులు ఈరయ్య సమాధానమిచ్చాడు.

“యింత ఖర్చు చేస్తున్నాడంటే డబ్బులు బాగానే కూదబెట్ట ఉండాలి”

ఆ మాటకు కేదార్‌ వైపు వింతగా చూసాడు ఈరయ్య, “మా చెంచు పెంటలో ఏ గుడిసెలో కెల్లి సూసినా రెండు మూడు కుండలు, తవ్వుకోల, విల్లు అంబులు తప్ప ఏమి ఉండవు దొరా.. రేపటి గురించి చింతే పడని జాతి మాది. ఏ పూట కాపూట తిండి కోసం ఎతుకులాట్టం... దొరికితే తింటం లేకపోతే యాప బూడిదలో సింతకాయ గుజ్జు కలుపుకుని తిని మునగదీసి పడుకోటం... అంతే దొరా... లింగన్నకు పెద్దమడుసులం సిచ్చ ఎశాక జరిమానా సెల్లించడానికి శానా కట్టబడ్డాడు దొరా. తేనె, సింతపండు, ఎలగపండు, యిప్పపూలు, మూలికలు... ఒకటని లేదనుకో... ఏద్దారికితే దాన్ని అడవికి బైటున్న వూల్లల్లో అమ్మి పైసా పైసా కూడబెట్టాడు. ఈ విందు కర్సుకి సరిపడా పైసలు పోగేయడానికి ఆడికి నెలరోజులు పట్టింది. కడుపుకి తినీ తినకా దాసిపెట్టి ఉంటాడు అన్నాడు.

ఎంత పెద్ద తప్పు చేసినా గూడెంజనాలకి తిన్పించి తాపిస్తే తప్పు మాఫ్‌ అయిపోతుందని, యిదేదో చాలా తేలికైన వ్యవహారమనీ యిప్పటివరకూ అనుకుంటున్న కేదార్‌కు ఈరయ్య మాటలు విన్నాక జరిమానా చెల్లించడానికి ఎంత కష్టపడాలో అర్ధమై అది పెద్ద శిక్ష అనిపించింది.

“అవునుగాని ఈరయ్యా! మార్కెట్లో ఏది ఎంతకి అమ్మాలో మీవాళ్ళకి తెలుసా?”

గుర్రవుడెక్క సలీర కేదార్‌ మనసులో తొలుస్తున్న ప్రశ్నని సూర్యకుమార్‌ అడిగాడు.

“అది తెల్వకనేగా దొరా మా వాల్లంతా మోసపోతుంది. ఈ అడవితల్లి, మా గారెల మైసమ్మ తల్లి దయతో మా సేతికందించే పుట్టతేనె, సింతపందు, జిగురు, మూలికలు... వాటినమ్మంగా వచ్చేపైసలు ఆడోళ్ళకి సీరలు, రవికెలు కొంటానికే సరిపోవు దొరా”

“మీనుంచి సేకరించిన కొన్ని వేర్లనుంచి కూల్‌ డ్రింకులు తయారు చేసి అమ్ముతారు తెలునా”

“తెల్సినా మేమేం సేయగలం దొరా... అమ్మడానికి సరుకుని బైటికి తీస్మెల్లాక ఎంతోకొంతకి అమ్మేసి రావటం తప్ప మాకు ఏరేదారి లేదు”

“మీరు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి గిరిజన సహకార సంఘాలు తోడ్పడతాయని మీకు తెలుసా.. మీకోసం ప్రభుత్వం వెలుగు పధకాన్ని ప్రవేశపెట్టింది. ఆ విషయం తెలుసా”

“తెల్వదు దొరా”

“ఎట్లా తెలుస్తుంది? మీరిక్కడ ఉన్నారని ప్రభుత్వానికి తెలిసే అవకాశమెది? మీరు బ్లేటి ప్రపంచంలోకి వచ్చి ప్రయత్నం చెస్తేగా... ఈ అడవికి పక్కనున్న వూళ్ళలోకి కూడా ఎప్పుడో తప్ప వెళ్ళరాయి. దారీ తెన్నూ లేని ఈ అడవి మధ్యలో ఉండటం వల్ల బైటి వాళ్ళు మీ దగ్గరకు రావడానికి వీల్లదాయె. మీరెందుకిలా అభివృద్ధిలేకుండా నాగరిక జీవితానికి దూరంగా బతుకుతున్నారో నాకర్దం కావటంలేదు?” అన్నాడు కదార్‌.

“ఆటీ గురించి మేమూ యిన్నాం దొరా. మా చెంచుపెంటల్ని వదిలెసి ఎల్లమంటారట. మేం అడవి బిడ్డలం. ఈ అడవిలోనే పుట్టాం... ఈ తల్లి ఒడిలో పెరిగాం. ఈ అడవిలోనే సత్తాం. నల్లమల అదవుల్లో పులుల్ని రచ్చించాలట. అక్కదెవరూ మాబోటోల్లు ఉండకూడదట. మాకు వూల్లో ఎక్కడో యిల్లు కట్టిత్తారట. యిదేం అన్నేయం దొరా... ఆల్లు సేయాలనుకున్న మంచి 'పనులేవో ఆ సవుకర్యాలేవో యిక్కడే మా చెంచుపెంటల్లోనె సేయవచ్చుగా. ఈపెబుత్వం మాకెన్ని పైసలిచ్చినా ఈ అడవితల్లినాదలం దొరా. మా బతుకూ సావు యిక్కడే” అన్నాడు ఈరయ్య,

“నల్లమల అటపి ప్రాంతంలోని ఐదు జిల్లాల్ని పులుల అభయారణ్యంగా ప్రకటించారు. శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేని నో మాన్‌ లాండ్‌గా ప్రకటించి అక్కడి

గుర్రపుడెక్క సీలీర చెంచుజాతివాళ్ళకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. వీరికి తమ మూలాల్ని తమ సంస్కృతినీ వదులుకోవటం యిష్టం లేదు. పేదరికాన్నయినా యిష్టపద్దారు గాని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పధకాల ద్వారా లబ్టి పొందాలని మాత్రం అనుకోరు” అన్నాడు కేదారో సూర్యకుమార్‌.

“పీళ్ళకు వైద్యం ఎంత అవసరమో ఎందుకాలోచించరు? ఎలుగు బంటి బారిన పడి ఎంత మందికి గాయాలౌతాయో... ఎంత మంది పాము కాటుకు గురై చనిపోతున్నారో... జ్వరాలూ రోగాలు వస్తే వీళ్ళ గతేమిటి?” అన్నాడు కేదార్‌.

దానికి బుడ్డన్న సమాధానం చెప్పాడు. “మాకెందుకు దొరా వయిద్యం... మా డాకటెరు కూడా ఈ అడవి తల్లే. పాము కాటెస్తే విషముష్టి బెరడు తీసి మెత్తగా నూరి ముద్దచెసి గోమూత్రంతో కలిపి తిన్పిస్తే సాలు. విషం దెబ్బకి దిగిపోద్ది. వుడుగు వేరుని కషాయం సేసి తాగినా సరిపోద్ది. జొరమొస్తే నక్కపీసిరి వేరుని నలిపి వాసిన సూస్తే సాలాయు. మా కాడలేని వయిద్యం మీ పట్నాల్లో ఎక్కడుంది” అలా అంటున్నప్పుడు అతనిలో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం చూసి కేదార్‌ నోరు మెదపలకపోయాడు.

అప్పటికి గూడెంలోని ఆడంగులు కూడా బైటికొచ్చెసారు. సన్నటి వెన్నెల... కోడికూర ఉడుకుతున్న వాసన... లయబద్ధంగా డప్పు శబ్దం...ఆ డప్పు శబ్దానికనుగుణంగా నృత్యం చేస్తున్న ఆడా మగా.

“ఆ దప్పు శబ్దం విన్నావా? ఎన్ని రకాలుగా వాయిస్తున్నారో గమనించు. రకరకాల దరువులు.. వాటి పేర్లు కూడా అడవికి సంబంధించినవే ఉంటాయి” అంటూ బుడ్డన్న వైపు తిరిగి “ఇదేం దరువు?”అని అడిగాడు సూర్యకుమార్‌.

“ద్రార్రా,, అది జింకనాక దరువు... ఇందాక వాయించారే అది కాలిదోవ పులి తిరుగుత దరువు”

“ఇంకా ఎన్ని రకాల దరువులున్నాయి?”

“శానా ఉన్నాయి దొరా..దున్నవోతు దరువు, చుక్క దరువు, జుగునక దరువు”

కేదార్‌ ఆనక్తి అందులో లేదు. చిందేస్తున్న వాళ్ళలో లింగన్న ఎవరో చూడాలనిపించింది.

“ఈరయ్యా...లింగన్న వచ్చాడా” అని అడిగాడు.

గుర్రపుడెక్క సలీం

“ఆడు రాకుండా విందెలా జరుగుద్ది దొరా... అడుగో అక్కడ చిందేస్తున్నాడు సూడు. అదే”

అతను చూపించిన వ్యక్త్‌వెపు చూశాడు. ఐదడుగుల రెండంగుళాలకు మించని ఎత్తు... సన్నగా ఉన్నాడు... హాయిగా చిందేస్తున్నాడు.

“అతని పక్కన జతగా ఆడుతున్నతనెవరు?”

“ఆడే మల్లయ్య వాళ్ళ సవిత్తమ్ముడు బుల్లన్న ఆడి పెళ్ళాంతోనే ఈడు వొదలచాటున సరసాలాడ్డూ దొరికిపోయింది. అదిగో అక్కడ ఆడుతోందే...ఎర్రంచు సింతపిక్క రంగు సీర.. ఆమే మల్లయ్య మరదలు ఎంకటమ్మ” బుద్దన్న సమాధానం చెప్పాడు.

తనెరిగిన సమాజంలో యిలాంటిది జరిగి, రంకు బైటపడితే పగతో రగిలిపోయి తలలైనా నరుక్కుంటారు లేదా ఆ మగాడు స్త్రీని అసహ్వించుకుని వదిలేయనైనా వదిలేస్తాడు. బతుకుని సంతోషంగా గడపటం వీళ్ళకు చాతనైనట్లు బైటి ప్రపంచానికి చాతకాదేమో...తన సమాజంలో ఎన్ని భేషజాలు... ఎన్ని మాయోవాయాలు... ఎన్ని కుట్రలు... ఎన్ని కుతంత్రాలు... ఎన్నెన్ని ముసుగులు... పైకి నవ్వతూనె లోపల విషం కక్కుతూ... తన భార్య ఏ మగాడితో కలిసి తప్పు చేసిందో ఆ మగాడి పక్కన ఎటువంటి అరమరికలు లేకుండా ఎంత హాయిగా అతను చిందేస్తున్నాడో... ఏ మరకలూ కల్మవాలు అంటని తెల్లకాగితం లాంట్‌ మనసులు వీళ్ళవి... మంచులో తడిసి పునీతమైన అదవిపూలు విళ్ళ్శందరూ... అనుకున్నాడు కేదార్‌.

బుడ్డన్నా ఈరయ్యా కలిసెళ్ళి యిప్పసారా పట్టించారు.

“ఇక్కడి కల్లు బావుంటుంది... తాటి చెట్లనుండి తీసిన స్వచ్చమైన కల్లు... తీయగా ఉంటుంది. పద తాగుదాం” సూర్యకుమార్‌ లెచి కల్లు కుండలవైపుకి నడుస్తూ అన్నాడు.

“నాకొద్వ”

సూర్యకుమార్‌ కల్లు ముంతని తెచ్చుకుని మంచంమీదే కూచున్నాడు.

వెన్నెల విరగకాస్తోంది.

దప్పు శబ్దం వూపందుకుంది. మగపిల్లలు గోచీలేస్సుని కుడివైపుకోసారి ఎడంవైపుకు మరోసారి తిరుగుతూ నృత్యం చేస్తున్నారు. రంగు రంగుల గోచీలు... ఎర్రవి... తెల్లవి... నల్లవి... రంగు రంగుల చొక్కాల్లా. వాళ్ళ భవిష్యత్తేమిటి...తంద్రుల్లానే విల్లంబులు పట్టుకుని

గుర్రపుడెక్క సలీర అడవిలోకళ్ళి కుందెళ్ళనో, ఉదుంలనో పట్టుకొచ్చి కడుపు నింపుకుంటారా? తరతరాలుగా యిలానే కొనసాగితే వీళ్ళలో మార్చొచ్చేదెన్నడు... వీళ్ళు బాగుపడెదెన్నడు... అని ఆలోచిస్తున్నాడు కేదార్‌.

మాంసం కూర ఉడికింది. గుడిసెల్లోంచి తెచ్చుకున్న పళ్ళేలలో అన్నం కూర వడ్దించుకుని తింటున్నారు కొంత మంది. బుడ్దన్న కంచం తెచ్చుకుని పక్కన కూచుని తింటూ, “దొరా... నాటుకోడి కూర... అబ్బో.... ఏం రుసిగుందో. నువ్వూ తెచ్చుకో పో” అన్నాడు కేదార్తో. అప్పటికి సూర్యకుమార్‌ రెండో ముంతని లాగించె ప్రయత్నంలో ఉన్నాడు. మల్లయ్య అతని పక్కనే నిలబడి ఇప్పసారా పట్టిస్తూ “సామీ. ఈ దినమే కాసిన సారా. శానా బావుంది. ఓ ముంత అట్టుకురానా?” అన్నాడు కేదార్తో.

“వద్దు. ఎలా ఉంటుందో రుచి చూడాలనిపించి నిన్న కొద్దిగా తీసుకున్నానంతే. ఇంతకూ ఇప్పనసారా ఎలా తయారు చేసారు?”

“ఇప్పపూలని మూడు రోజులు నానబెదాం సామీ. పాత వూటని కొంచెం తోడులా కలుపుతాం. దాన్లో తెల్ల తుమ్మ, కరక సెక్క సామి సెక్కకలిపి కుండలో ఏసి, మరగబెడ్దాం. దాన్నుంచి వచ్చె ఆవిరిని మరో కుండలో పడ్డూ దాని సుట్టూతా సల్లటి నీల్లు సల్గ్లుతూ ఉంటే ఇప్పసారా తయారవుతది. ఓ పుల్లని దాన్లో ముంచి నిప్పులో ఏస్తే నీలం మంట రావాల. అప్పుడది నికార్సయిన నారా అని లక్క

ఎవరో పిలిస్తే మల్లయ్య అటుకెళ్ళిపోయాడు.

“మీపిలగాళ్ళని స్కూలుకి పంపి చదివించొచ్చుగా” తన మనసులో నలుగుతున్న మాటని బుద్దన్న ముందుపెట్టాడు కేదార్‌.

బుద్దన్న శబ్దం వచ్చేలా నవ్వాడు. “మా పిలకాయలకెందుకు దొరా సదువులు... సదివి ఏం సేయాలా... ఉద్లోగాలు సేయాలా వూళ్ళేలాలా”

“అలా అంటావేమిటి? అంటే వీళ్ళుకూడా తమ తాతల్లా తండ్రుల్లా గోచీలు పెట్టుకుని ఉదయాన్న వేటకెళ్ళి ఏ జంతువునో పక్షినో వేటాడి తెచ్చి...ఆ పూట గడుపుకుని మళ్ళా మరునాడు తిండికోసం వెతుకులాడుకుంటూ... యింఠేనా జీవితం? మంచి బట్టలు, మంచి తిండి, సౌకర్యాలు, మంచి ఆరోగ్యం యివేవీ మీకు అక్కరలెదా... మీకు సరే... మీ ముందు తరాల వారైనా వీటిని అనుభవించాలని అనుకోరా...” కేదార్లో తెలీకుండానే

గుర్రపుడెక్క నీలీ6 పొంగుకొచ్చిన ఆవెశం... వీళ్ళ దైన్య స్థితిని చూసి కలిగిన ఆక్రోశం...

“సదూకుని ఉద్దోగాలు సేస్తే పైసలొస్తయేమో... సంతోసం ఉంటుందా దొరా...మాకీ జీవితమే కావాల... మేం అడవి బిడ్డలం... ఈ సెట్లకీ, జంతువులకీ దూరమై బతకలేం డొరా”

స్లట్లో కోడికూర వేసుకుని కొండ జొన్నల్తో చేసిన అన్నం పెట్టుకుని వచ్చి కూచుంటూ అన్నాడు సూర్యకుమార్‌. “నీ ఉద్దేశంలో విళ్ళు గోచీలు కాకుండా మనలా ప్వ్యాంట్లూ షర్టులూ వేసుకుని, ఫ్యాన్ల కింద కూచుని ఫైళ్ళు చూస్తూ దబ్బులు సంపాయిస్తే అభివృద్ధి సాధించినట్లా.. జీవితానికి పరమార్ధం ఆనందంగా జీవించటమే... దానిక్కావల్సింది ఆత్మ తృప్తి. అది విళ్ళలో పుష్కలంగా ఉంది. చదువుకున్నవాళ్ళలో నేడు కోరలు సాచి కన్పిస్తున్న ధనదాహం వీళ్ళలో లేదు. పది తరాలకు సరిపడా దోచుకుని దాచుకోవాలనే స్వార్ధం లేని జాతి. ప్రకృతితో కల్సిపోయి బివించడం కన్నా భాగ్యం ఏముంటుంది... విళ్ళని నాగరీకుల్లో కలిపి పొల్యూట్‌ చేయటం మంచిది కాదు. మనం అడవిలో చూసిన జలాశయంలోని తెటనీటిలా... యిలానే బతకనీ... స్వచ్చంగా .. నిర్మలంగా...”

కేదార్కి అతని వాదన నచ్చలేదు. మనసంతా బాధతో నిండి పోయింది. మల్లయ్య

'బలవంతం మీద కొద్దిగా ఎంగిలి పడ్డాడు. నిన్న తాగిన యిప్పనారా రుచి వూరిస్తున్నా దాన్నీ ముట్టుకోలేదు. దప్పుకొట్టేవాళ్ళుకూడా అన్నాలు తినేశారు. పొయ్యిలో మంటల్ని స్‌ళ్ళు చల్లి ఆర్పేశారు.

ఆ రాత్రి కేదార్‌కి సరిగా నిద్ర పట్టలేదు. సూర్యకుమార్‌ చెప్పిందే కరెక్టా.. ఎలా అవుతుంది? అందరూ యిరవై ఒకటో శతాబ్దంలోకి ప్రయాణిస్తుంటే, కొన్ని జాతులిలా ఆటవికుల్లా అనాగరికుల్లా బతుకుతుంటే చూస్తూ వూరుకోవటం న్యాయమా... శారీరక శ్రమ వీళ్ళకలవాటే ఐనా అందరిలో రక్తహీనత, విటమిన్ల లోపం కన్పిస్తోంది. రోగాల్తో ఎంత మంది చచ్చిపోతున్నారో... ప్రసవం సమయంలో సరైన వైద్య సదుపాయం లేక ఎంత మంది తల్లులు చనిపోతున్నారో...

ఈ విషయం చర్చకు వచ్చినపుడు సూర్యకుమార్‌ చెప్పిన గణాంకాలు గురొచ్చాయి. పుట్టిన వెయ్యిమంది పిల్లల్లో చనిపోతున్నవాళ్ళ సంఖ్య దేశంలో సరాసరిన ఎనఖై ఉంటే అదే సంఖ్య చెంచుల్లో రెండు వందల పదిహేను ఉందట. ప్రసవంలో చనిపోయేవారి

గుర్రపుడెక్క సీలీర సంఖ్య మిగతా జాతుల్లో వెయ్యికి నాలుగుంటే చెంచుల్లో అదే ఏడు వరకుందట. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ చెంచులు బతుకులు వెళ్ళదిస్తున్నారో తల్చుకుంటే గుండె తరుక్కుపోతోంది.

సూర్యోదయానికి పూర్వమే మల్లయ్య వాళ్ళని నిద్రలేపాడు. తమ సామాన్లన్నీ సర్దుకుని జంగిల్‌ బూట్లు, కోటు తొడుక్కున్నారు. ఇన్‌స్టంట్‌ టెంట్‌ని, స్లిపింగ్‌ బ్యాగ్స్‌ని మడిచి షోల్డర్‌ బ్యాగుల్లో కుక్కేశారు. మల్లయ్య భార్య లచ్చిమి వాళ్ళకు వీడ్కోలు యివ్వడానికి యిపుపూల చెట్లదాకా వచ్చింది.

ఆమె వెనుదిరిగే ముందు ఆమె చేతిలో మూడొందలు పెట్టి “చీర కొనుక్కో.” అన్నాడు కేదార్‌.

“వద్దొద్దు... నాకెందుకు పైసల్‌ అందామె.

్పీ అన్నయ్య యిస్తే తీసుకోవా... ఈ రెండ్రోజులు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో... ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఇది నా సంతృప్తి కోసం. అంతె” అన్నాడు.

ఆమె మల్లయ్య అనుమతి కోసం అతని వైపు చూసింది. “తీసుకో... పర్నేదులే” అన్నాడతను నవ్వుతూ. డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆమె కళ్ళు మెరవటం గమనించాడు కేదార్‌.

మల్లయ్య ముందు నడుస్తుంటే వాళ్ళిద్ధరూ అతన్ని అనుసరించారు. వాళ్లు వచ్చిన దోవ కాదది. మరో తోవ...ఏ రకమైన యిబ్బందీ అద్దంకీ లేకుండా సజావుగా ఉందా తోవ. పదిహేను యిరవై నిముషాల్లోనే అడవి చివరికొచ్చెశారు.

మల్లయ్య అక్కడే ఆగిపోయాడు. “సామీ... ఈ తోవ మేం వూల్లోకి ఎల్లటానికి వాడతాం. ఈ దారి వూల్లో వాల్లకి తెలిస్తే పెమాదం. మీరు బైటికెల్లే ముందు అటూ యిటూ సూస్ముని ఎవ్వలూ సూడకుండా ఎల్లండొ అన్నాడు.

అతని దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేస్తుంటే వెనక నుంచి “సామీ నా నర్సిమ్మసామి పొటో గమనం ఉంచుకో అన్నాడు సూర్యకుమార్‌తో.

మల్లయ్య చెప్పినట్లే బైటికొచ్చేముందు వూరివాళ్ళెవరూ గమనించటం లేదని నిర్ధారించుకుని వూళ్ళోకి ప్రవెశించారు. (దైవర్‌ మస్తాన్‌ అప్పటికె కంగారు పడ్డున్నాడు.

109

గుర్రపుడెక్క నీలీర విళ్ళని చూడగానే అతనికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లనిపించింది. “అబ్‌ తక్‌ బహుత్‌ పరేషాన్‌ హోగయాధా సాబ్‌... ఏమైన జరక్కూడనిది జరిగిందేమోనని భయపద్డా.. అల్లాకా లాఖ్‌ లాఖ్‌ సుకర్‌ హై...ఆప్‌ దోనోం సహి సలామత్‌ హై” అన్నాడు సంతోషంగా.

వాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి మొదటిసారి వచ్చినపుడు మర్రిచెట్టుకింద కూచుని పులీ మేకా ఆడుతూ కన్పించిన యిద్దరిలో ఒకతను వెప్పుల్లతో పళ్ళు తోముకుంటూ వాళ్ళని చూసి గుర్తు పట్టి ముందుకొచ్చాడు.

“మీరు బతికే ఉన్నారా... నిన్న రాతిరి వరకూ సూసి ఈ మస్తాన్‌ భాయ్‌ బేదైన్‌ అయిండు. ఏ పులో తినేసిందని సోచాయించినం. అడవిల పులి, ఎలుగ్గొద్దు యిస్మంటివేమీ కన్సడలేదా” అని అడిగాడు.

“మెల్లగా అంటావేమిటి... అమ్మో...చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైందనుకో” అన్నాడు సూర్యకుమార్‌.

“గట్లనా... ఏమైందో పూరా సెప్పరాదే”

“గా అదడవిల మడుసులు తినె రాచ్చసులున్నరు. మమ్మల్ని పట్టకవోయి పేద్ద బానలో ఏసి నీల్లు నింపి కింద మంట పెట్టిండ్రు” తను నేర్చుకున్న నకిరేకిల్‌ యాసలో చెప్పాడు.

“గట్లనా...మరెట్టా బతికిపోయిండ్రు”

“ఎలుగ్గొద్దుని సూసి ఆల్లందరు ఎంట పది. మేము కుండ పగలకొట్ళుని లగెత్తుకొచ్చినం”

“ఆ...” నోరెళ్ళబెట్టాదతను.

సూర్యకుమార్‌లో ఉరకలు వేస్తున్న ఉత్సాహం... టీనేజ్‌లో గప్పాలు కొట్టినట్టు కొద్దున్నాడు.

“శానా అదురుష్టం” అన్నాడతను.

“టె మల్ల.. ఎల్లే దార్ల నక్కతోకని తొక్కినం గందా” అన్నాడు సూర్యకుమార్‌.

నవ్వుకుంటూ కారెక్కినారు.

సూర్యకుమార్‌ తన పరిశోధన వివరాల్ని ఫొటోలతో సహా ఆర్కియాలజీ డైరెక్టర్‌ గారికి అందించాడు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నుంచి కొంతమంది అధికార్లు

కే0

గుర్రపుడెక్క స్రలీరీ సూర్యకుమార్తి కలిసి రెండు మూడు సార్లు అడవిలోకి వెళ్ళి గుట్టమీది శిథిలమైపోయిన గుడిని, అక్కడి పరిసరాల్ని పరిశీలించి వచ్చారు. దాదాపు ఆరేదు నెలలు దానికి సంబంధించిన ఫైలు ప్రభుత్వ శాఖల్లో నలిగాక చివరికి అదే స్థలంలో గుడిని కట్టి థ్రీ లక్ష్మీ నరసింహస్వామి వి[గ్రహాన్ని పునః ప్రతిష్టించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరో మూజణ్జెల్లు గడిచాక అడవిలో గుట్ట మీద గుడిని కట్టె పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని కేదార్కి వార్త అందింది. అతనికి వెంటనే గుర్తొచ్చింది మల్లయ్య, యిప్పటికీ గుట్టపైకళ్ళి దేవుడికి నైవేద్యం పెడ్తున్నాడా...యిప్పుడు గుడి కడ్డున్నారుగా, అవకాశం ఉండి ఉండదు... ఈపాటికి అక్కడి శిథిలమైన గుడి విషయం చెంచుపెంటలో అందరికీ తెలినిపోయి. ఉంటుంది. ఓసారి వెళ్ళ చూని రావాలన్న కుతూహలం... సూర్యకుమారి అడిగితే ఏదో పనిలో తలమునకలై ఉన్నాననీ రాలేనని చెప్పాడు. అతను రాకున్నా సరే తనొక్కడే వెళ్ళడానికి నిర్ణయించుకుని ఓ శనివారం రోజు శెలవ పెట్టి మన్నుగొండ బయల్లేరాడు.

మల్లయ్య చూపించిన దారిని గుర్తుకు తెచ్చుకుంటూ అడవిలోకి నడిచాడు. సునాయాసంగా అరగంటలో చెంచుపెంట చేరుకున్నాడు. సమయం మధ్యాహ్నం పన్నండు గంటలు కావస్తోంది. మల్లయ్య ఆహార సముపార్టనకోసం వేటకెళ్ళి ఉంటాడనుకున్నాడు. కాసీ అతను గుడిసెలోనే ఉన్నాడు. చాపమీద పడుకుని మూల్గుతున్నాడు. మనిషి బలహీనంగా ఉన్నాడు. మొహంలో అనంతమైన దుఃఖ భారాన్ని మోస్తున్నట్లు... తను తొమ్మిది నెలల క్రితం చూసిన మల్లయ్య కాదితడు. అతడు నిత్య చైతన్యంతో ఎగసిపడే కడలి కెరటం... ఈ మల్లయ్య ఘనీభవించిన సముద్రంలా ఉన్నాడు.

కెదార్ని చూడగానే లేచొచ్చి చేతులు పట్టుకుని, “దొరా... నా నర్సిమ్మసామిని నాక్కాకుండా సేత్తున్నారు. నా సామిని సూడసీకుందా అద్దుపడ్డున్నారు... ఆల్లకి సెప్పి నా నామిని నాకు యిప్పించు దొరా అన్నాడు.

“అసలేం జరిగింది?” లచ్చిమి వైపు చూస్తూ అడిగాడు కేదార్‌.

“గుట్టమీద సామిని సూట్టానికి పోతే దాపుకే రానివ్వకుండా తిట్టి తరిమేశారట. గవుర్నమెంటోల్లు అక్కడే గుడి కడ్తున్నారట కదా. మడిసి దిగుల్తో సూడెట్టాగైపోయాదో... ఎన్ని కషాయాలు తాపించినా గునం కన్పిత్తేగా.. మడిసికి జబ్బొత్తే మందుంది. ఈడి

గుర్రపుడెక్క సలీం మనసుకి జబ్బు సేసింది దొరా. ఏం సేయాలో తోచటంల్వా” అందామె.

“నా సామిని రోజుకో పాలి సూస్మోనిత్తే సాలు దొరా. నీ కాల్మొక్త. ఆల్లతో మాట్లాడు. నాసామికి పూజ సేస్కుంటా... రాచ్చసుల్లా నా సామిని నాకాక్కుండా సేత్తున్నారు” మల్లయ్య గొంతు దుఃఖంతో వణికింది.

కేదార్‌ వచ్చాడని తెలిసి బుద్దన్న పల్కరించడానికొచ్చాడు.

“ఈ పిలగాడ్ని సూత్తే గుండె తరక్కపోతాంది దొరా. నర్సిమ్మసామి యిగ్రహం గుట్టమిదుందని మా సెవిన వసుంటే సామిని తెచ్చి మా గూడెంలోనె గుడి కట్టెవాల్లం. సెప్తేగా... సామి ఈడికొక్కడికే సామినా... మా చెంచుజాతికంతా సామి ఆయనేగా... యిపుడు సూడు దొరా ఎట్ట్లాగైెందో.. గవుర్నమెంటోల్ల సేతుల్లోకి మా సామి ఎలిపోయాడు. అంతా ఈడివల్లే. ఏదో మహా రగస్యం దాసినట్లు దాసుకున్నాడాయె” అన్నాడు బుడ్డన్న

“శ్రీశైలం మల్లికార్డునన్వామి దేవాలయం, అహోబిల లక్షినర్శింహస్వామి దేవాలయాలు [వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలో ఉండేవని చదివాను. నిజమేనా”

“నిజమేదొరా... మాకు సదువా లేదాయె. పెబుత్వంతో ఏం మాటాడాలో ఎలాగ మాటాడాలో తెలీదాయె. మా సొత్తుల్ని పటపోలు దోచుకుంది సాలక మా దేవుల్లని కూడా మాక్సాకుండా సేశారు. శ్రీశైల మల్లన్న సామి అర్చకులుగా మా చెంచుల గజ్జల కొందడడు, మల్లయ్య తాత పన్ఫెసేవాల్లు. మా వాల్లక్‌ ఆ గుళ్ళలో బదైనా పసివ్వొచ్చుగా దొరా... అది సేయరు. మా దేవుల్ల దగ్గర మమ్మల్ని అంటరాని వాల్లని 'సెసేశారు దొరా, ఎంత అన్నేయమో నువ్వె సెప్పు” అన్నాడు.

కేదార్కి చప్పున ఓ ఆలోచన వచ్చింది. యిపుడు కడ్డున్న శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి గుళ్లో మల్లయ్యని ఏదో ఓ పనిలో పెట్టించగలిగితే... తను ఆరాధించే దేవుడి సాన్నిధ్యంలో ఉండటం వల్ల అతని మనసుకి ప్రశాంతత దొరుకుతుంది.

“ఈ దినం బాగొచ్చినావు దొరా... ఈ దినం నా పడ్డ పెల్లి పులిసెర్ల ఈరయ్య కొడుకు సింగన్నకిచ్చి సేత్తున్నా రాత్తిరికి పెల్లి విందు. నువ్వు తప్పక రావాల్న” అన్నాడు బుద్దన్న

“చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. నీ బిద్ద పెళ్ళా... నీకు కొడుకులే తప్ప కూతుర్లు లేరు కదా బుడ్డ్దన్నా” అన్నాడు కేదార్‌.

గుర్రపుడెక్క సీలీర

“నా పెద్ద కొడుకు బీడ్డ దొరా... నా మనవరాలు. దాని ఎల్లి

“నాకూ మీ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చూడాలని ఉంది. మల్లయ్యని చూసెసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ రాత్రికి ఉండిపోతాను. నీ మనవరాలి పెళ్ళి చూసి, రేపుదయం తిరిగెళ్తాను. పర్లేదా మల్లయ్యా,.. మీకేమీ యిబ్బంది కాదుగా” అని అదిగాడు.

మల్లయ్య బలహీనంగా నవ్వాడు. “మాకేం యిబ్బంది దొరా... మా గుడిసెలో కాసింత సోటివ్వలేమా... మేం తినేదే పెద్దాం.. నువ్వే సద్వుకోవాల. పట్నం దొరవి”

మధ్యాహ్నం భోజనంలోకి జొన్న రొట్ట, ఉల్లివాయ నంజుకుని తిన్నాక, లచ్చిమి గాసులో సగానికి పైగా తేనె యిచ్చి తాగమంది.

అలవాటు లేని ప్రాణం... ఒకేసారి యింత తేనె తాగితే ఆరోగ్యం పాడవుతుందని భయం...

“శానా మంచిగుంటది దొరా... తాగు” అంది.

“పెంచాలో సగం తేనె నింపుకుని వారానికో నెలకో ఓ సారి తాగటమే గగనం, అలాంటిది యింత తేనె తాగితే అరుగుతుందంటావా” అనుమానంగా అడిగాడు కేదార్‌.

“సాయంతరం గొరివిసెట్టు బెరడుతో కషాయం సేసి పట్టిస్తే రాళ్ళు తిన్నా అరిగిపోద్ది దొరా” అన్నాడు మల్లయ్య,

తేనె మెల్లగా తింటూ లచ్చిమి వైపు పరిశీలనగా చూశాడు. మనిషి నునుపు తేలింది. వొట్ట దగ్గర ఉబ్బుగా ఉంది.

“ఎన్నో నెల?” లచ్చిమి వైపు చూసి అడిగాడు.

“బడు” అందామె సిగ్గుపడ్డూ,.

“పెళ్ళయిన ఇన్నెళ్ళకి కడుపు పండి మొదటి బిడ్డకి జన్మనివ్వబోతున్న సమయంలో ఎంత సంతోషంగా ఉండాలి... పండగ చేస్మోవాల్సింది పోయి ఈ దిగుళ్ళూ విచారాలేమిటి మల్లయ్యా” అంటూ ఓదార్హాడు

రెండు గంటలు జువ్వి చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నాక, “గుడిని ఎలా కడ్డున్నారో చూసొద్దామా అని మల్లయ్యనడగటమే తరువాయి ఎక్కడలేని ఉత్సాహంతో లెచి కూచున్నాడు.

గుర్రపుడిక్క నలీ౦ వాళ్ళతోపాటు బుద్దన్నాా అతని యిద్దరు కొడుకులు, మల్లయ్య బావమరుదులు కూడా బయల్బెరారు.

గుట్టమిద కూలీలు హడావిడిగా పనులు చేస్తున్నారు. గుడి కట్టడంతో వాటు కింది నుంచి మెట్లుకూడా పెడ్డున్నట్లుంది. మేప్తీలు కూలీల్ని అదిలిస్తున్నారు.

“నా నర్సిమ్మసామిని అదిగో అందులో దాసిపెట్టారు దొరా... దానికి తాలం ఏసి పెట్టారు. పాపం సామి...సీకట్లో దీపం లేకుండా ఎలా ఉంటున్నాడో...సుక్క మంచినీల్లు యియ్యకుండా నా సామిని ఆకలితో మాద్చేత్తున్నారు దొరా” మల్లయ్య బాధపడ్డూ అన్నాడు,

“నోర్ముయ్యహే... సామి నీకేనా దేముడు... ఆల్లకీ దేముడే..ఆల్లకి తెల్వదా ఎలా సూస్మోవాలో.. నువ్వు బక్త కన్నప్ప అనుకుంటం మానేయ్‌ మొదలు.. బాగుపద్దావ్‌” కసురుకున్నాడు బుద్దన్న

“యిక్కడ గుడి కట్టడం వల్ల మా చెంచుల జీవితాల్లో దిని పెబావం ఏమైనా ఉంటుందా దొరా” కేదార్ని బుడ్డ్దన్న అడిగాడు.

“ఏమీ ఉండదు... మీరు వేటకెళ్ళేముందు గారెల మైసమ్మని మొక్కుకున్నట్లే యికృడికొచ్చి లక్ష్మీ నరసింహస్వామిని కూడా మొక్కుకుని వెళ్ళొచ్చు”

“మమ్మల్ని గుల్లోకి రానితారంటావా దొరా” బుడ్దన్న తన భయాన్ని బయట పెట్టాడు.

“ఎందుకు రానివ్వరు? మనది సెక్యులర్‌ దెశం. దెవుడిమీద పేటెంట్‌ రైట్‌ కొందరికే ఉందనడం అన్యాయం. అలా చేస్తే వూర్ముంటామా ..నేనే కోర్టులో కేస్‌ వెసా... మిమ్మల్ని గుళ్లోపలికి అనుమతించాలని” ఆవేశాన్ని ఆపుకోలేక అన్నాడు కేదార్‌. అతను మాట్లాడిన మాటల్లో సెక్యులర్‌, పేటెంట్‌ రైట్‌ లాంటి పదాలు వాళ్ళకి అర్ధం కాకున్నా వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడ్తున్నాడని అర్ధమైంది.

“ఆల్లతో తగువులు మాకొద్దులే దొరా... ఆల్లలాగంటే యిక్కన్నుంచే సామికి దండాలు పెట్టుకుని ఎల్తాం... దేవర ఎక్కడ లేడూ... అన్ని సోట్లా ఉన్నాడు. ఈ సెట్టులో ఆ పుట్టలో ఈ పిట్టలో... మా చెంచితని లగ్గం సెస్కున్న నర్శిమ్మసామి స్తంబంలోంచి రాలేదా... ఈ గుట్టమీద దేముడున్నాడంటే ఈ గుట్ట కూడా దేముడే.. ఆకాసదేముడ్ని మొక్కినట్టు ఈ గుట్ట దేముడ్ని మొక్కుకుంటాం” అన్నాడు బుద్దన్న చెంచులు ఎంతటి సాహసవంతులో తెల్సిన కేదార్కి వాళ్ళెంత శాంతి కాముకులో కూడా అర్ధమైంది.

గుర్రపుడెక్క సలీర

అక్కడి వాతావరణం చాలా కొత్తగా అన్పించింది. తనూ సూర్యకుమార్‌ మొట్టమొదటినారి వచ్చినపుడు కన్పించిన హరిత సౌందర్యం, ప్రశాంతత, పవిత్రత... వీటిలో ఏదో వెలితి... అందమైన వర్ణ చిత్రం పైన నల్లటి సిరా ఒలికి

చెరువులో నీళ్ళు తేటగా లేవు.. వాటిలో తేలుతూ ఏదో మురికి... సిమెంటు యిసుకా పడటం వల్లనేమో...యింత గొడవగా ఉంటే ఈ చెరువులో స్‌ళ్ళు తాగడానికి జంతువులు ఎలా వస్తాయి? మరి అవి ఎక్కడికెళ్ళి తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయో...

చెరువులో మొలుస్తున్న గ్నురపుడెక్క..

గుండెనెవరో యినుప పిడికిళ్ళతో పిసికినట్లనిపించింది కేదార్కి

“రాత్తిరి పెల్లికి తేనె కావాల. సరై తీయడానికెల్లాలొ అన్నాడు బుడ్డన్న పెద్దకొడుకు రాజన్న

అతని భుజానికి తేనె పుడ్క వేలాడుతోంది. దానిలో అల్యూమినియం గిన్నె మోకు, సర్రైెకొండపై కట్టె నారపట్ట 'మోము” ఉన్నాయి. వాళ్ళు అందుకోసమే షాన్‌ చేసుకుని వచ్చారని కేదార్శి అర్ధమైంది.

“నువ్వు గూదేనికల్లిపో దొరా... మేం తేనె పట్టు కొట్టుకుని వత్తాం. మా మల్లయ్య నీకు తోడొస్తాడు” అన్నాడు రాజన్న.

“గూడెనిఇళ్ళి చేసేదేముంది? నేనూ వస్తాను పదండి” అన్నాడు కేదార్‌.

అందరూ అడవిలోపలికెళ్లారు. అక్కడ ఎత్తుగా ఉన్న రాతి కొండలున్నాయి. ఓ వైపు వాలుగా మరో వైపు నిలువుగా మొలిచినట్టు... వాలుగా ఉన్న వైపునించి కొండపైకి మల్లయ్య బామ్మర్దులు, రాజన్న బుడ్డన్ను కేదార్‌ ఎక్సారు. మలలమ్మ తల్లిని, సరై కాపు కాసే దేవతల్ని మొక్కుకున్నారు. బుడ్డన్న రెండో కొదుకు, మల్లయ్య కిందనే ఉండి ఎండిన వెదురు పుల్లలు, జావిరాకు, పచ్చరాకు, గద్ది ఒకచోట చేర్చి నిలువుగా ఉన్న చట్రాళ్ళ కింద మంట పెట్టారు... పొగ దట్టంగా అలుముకుంది. దాదాపు పావుగంట గడిచాక రాజన్న నడుముకి వెదురునారతో చేసిన పగ్గాన్ని చుట్టుకున్నాడు. దాని రెండో కొనని గుట్టమీదున్న చెట్టు బోదెకి కట్టి, మల్లయ్య బామ్మర్చులు గట్టిగా పట్టుకున్నారు. సర్రెపగ్గాలు చెట్టుకి కట్టి మోముతో పాటు బావ ప్రాణాలు కాపాడేవాడు బావమరిది అని చెంచుల

గుర్రపుడెక్క సలీం విశ్వాసం. బావమరిది బతుకు కోర్తాడని నమ్మకం. రాజన్న మెల్లగా నిలువుగా ఉన్న చట్రాళ్ళ వైపుకి దిగాడు. అప్పటికి పాగ వస్తున్నా అంత దట్టంగా లేదు.ఆ పొగకి తేనెటీగలు శబ్దం చేస్తూ పైకిలిచాయి.

వాళ్ళు చెస్తున్న పనిని శ్రద్దగా గమనిస్తున్నాడు కేదార్‌.

ఆ పగ్గం ఆధారంగా అతను గాల్లో వూగుతూ ఓ రాతి చట్రం సమీపించాక ఆపమన్నట్టు తాదుని లాగి సంజ్ఞ చేశాడు. అక్కద అలా వూగుతూనే తన చేతిలో ఉన్న కర్రతో ఆ రాతి మూలలో పొడిచాడు. తేనెపట్టు వూడి పడ్డున్న సమయంలో మరో భుజానికున్న తేనె పుడ్మలో దాన్ని పట్టుకున్నాడు. మరో రెండు మూడు సార్లు కర్రతో పొడిచి మిగిలిన లేనె పట్టుని కూడా బుట్టలో పట్టుకున్నాక పైకిలాగమని సంజ్ఞ చేస్తూ తాడుని కదిపాడు. అప్పటికే మల్లయ్యా, బుద్దన్న రెండో కొదుకు కొంద పైకొచ్చారు. అందరూ కలిసి అతన్ని పైకి చేదుకున్నారు.

బుడ్డన్న రెండో కొడుకు తన దగ్గరున్న కత్తితో తెనె పట్టుని చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. ఆ ముక్కల్ని రెందు చేతుల మధ్య పట్టుకుని వెంట తెచ్చుకున్న అల్యూమినియం పాత్రలో గట్టగా పిండాడు. మొత్తం ముక్కల్ని పిండేప్పటికి తేనెతో గిన్నె దాదాపు నిండి పోయింది.

ఆ ఫీట్ని చూడాల్సిందె తప్పు వర్ణించటం నాధ్యం కాదనిపించింది కేదార్శ్కి ఎంత లాఘవంగా కొండ చరియల్లో ఉన్న తేనెపట్టుని పైకి తెచ్చారో ... తల్ఫుకుంటే వళ్ళు జలదరిస్తుంది. (ప్రాణాలకు తెగించి...పగ్గం వూడిపోతే... పట్టు జారిపోతే మనిషి ముక్కలైవోతాడు. ఈ మాత్రం తేనెకోసం యింతటి సాహసం చేయాలా... ఆహార సముపార్దన కోసం ప్రాణాల్ని పణంగా పెడ్తున్న ఈ చెంచు జాతిని చూస్తుంటే హృదయం ద్రవించి పోతోంది. వీళ్ళు రేపటి గురించి ఎందుకాలోచించరు? కష్టకాలంలో తిండి దొరక్కపోతే ఏం చెస్తారు? పిల్లలకేం పెద్దారు? యిలాంటి సందర్భాల్లో కిందపడి కాలో చేయో విరగటమో, ఎలుగుబంట్ల బారినో మరే అడవి జంతువుల బారినో పడి గాయపడటమో జరిగితే అతని మీద ఆధారపడిన కుటుంబం గతేమిటి?

తనతోపాటు హ్యాండిక్యామ్‌ తెచ్చుకోనందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. ఎంత గొప్పు సర్మస్‌లో కూడా యింత రిస్కి ఫీట్‌ ఉండదేమో...

గుర్రపుడెక్క సలీర వాళ్ళు గూదినికి తిరిగొచ్చె సమయానికి పెళ్ళి హడావిడి ప్రారంభమైంది. ఏ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిగిన ఆ పెళ్ళి చూసినపుడు, పట్టణాల్లో పెళ్ళిళ్ళ పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేసి డబ్బుని దుబారా చేసే వైనం గుర్తొచ్చింది కేదార్శి చెంచులనుంచి పట్నవాసం వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాడు.

రాత్రి చాలా సేపు మల్మొని ఉండటం వల్ల ఉదయం పొద్దుపోయేవరకు అతనికి మెలకువ రాలేదు.

నిద్రలేచి చూసేప్పటికి మల్లయ్య లేడు. లచ్చిమి గుడిసె బైట కూచుని తను కోసుకొచ్చిన చింతకాయల్ని శుభ్రం చేసుకుంటోంది.

“ఏదీ మల్లయ్య?” లచ్చిమినడిగాడు.

“నువ్వొచ్చావుగా దొరా. ఆడి పెనం బాగున్నట్టుంది. శానా సురుకైపోయాడు. పొద్దుగల్ని లేసి యిల్లంబులు అట్టుకుని ఎటకెల్లాడు” అంది సంతోషంగా.

అతనికీ సంతోషమనిపించింది. మనోవ్యాధి ఉన్నప్పుడు 'మన' అనుకున్న ఆత్మీయులు నాలుగు సాంత్వన వచనాలు మాట్లాడితే చాలు... మనిషికి కొండంత బలం వస్తుంది. మనోరుగ్మత నుంచి బైటపడ్డాడు.

అతను తిరుగు ప్రయాణానికి సిద్ధమై లచ్చిమితో వెళ్ళొన్తానని చెవ్పాడు.

“ఆడొచ్చిదాకా ఉండొచ్చుగా దొరా. ఎల్లి శానా సేపైందిగా. వచ్చెత్తా ఉంటాడు.” అంది.

“అసలు నిన్ననే వెళ్ళివోవాల్సింది. బుడ్దన్న ఉందడమన్నాదని ఉండిపోయా. యిప్తటికే ఆలస్యమైంది. రేపు మరలా డ్యూటీకెళ్ళాలి కదా. మల్లయ్యతో చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. సీకు బాబో పాపో పుట్టాక చూసి పోవడానికి తప్పకుండా వస్తాను” అన్నాడు.

నల్లగా నిగనిగలాడ్తున్న ఆమె చెంపల్లో అరుణోదయమైైంది. కడుపుతో ఉండటం వల్లనేమో మెరుస్తోన్న నేరేడుపండులా ఉందామె.

నాలుగడుగులు వెసి ఉంటాడెమో...రాజన్న పరుగెత్తుకుంటా రావటం కన్పించింది. పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఆవేశంలోనో, కోపంలోనో, బాధలోనో వేగంగా మాట్లాడటం వల్ల కొద్దిసేపటి వరకూ అతనేమంటున్నాడో ఎవ్వరికీ అర్ధం కాలేదు.

గుర్రపుడెక్క స్రీలీర

“ఏం జరిగింది... మెల్లగా అద్దమయ్యేలా చెప్పు” అన్నాడు కేదార్‌ వెనక్కి తిరిగొచ్చి,

“మల్లయ్య ని సెట్టుకి కట్టెసి కొడ్తున్నారు దొరా” అన్నాడు.

“ఎవరు? ఎక్కద?”

“గుడి కడ్డున్నారే... ఆల్ల మడుసులు... సెరువు కట్టమీద ఎపసెట్టుందిగా. దానికి తాళ్ళతో కట్టెసారు.”

“ఎందుకో కనుక్కున్నావా?”

“లేద్దారా... అది సూడంగానే నా రకతం బదెక్కి పోయింది. లగెత్తుకొచ్చినా. ఆల్లని వదలను దొరా... అడవి జంతువులో తలపడినోడ్ని. ఆల్లని బాణాలేసి సంపేత్తా” అంటూ ఆవెశంగా తన గుడిసెలోకి దూరి విల్లంబులు, చేతిలో గొడ్డలి పట్టుకుని బైటకొచ్చాడు.

ఆ వార్త దావానలంలా గూడెం అంతా పాకిపోయింది. తోకల, పులిచెర్ల కుదుర్లలోని మగాళ్ళంతా ఏకమైపోయారు. అందరి చెతుల్లో విల్లంబులు... కత్తులూ గొద్దళ్ళూ.. యుద్దానికి సన్నద్ధమై వెళ్తున్న సైనికుల్లా ముందుకు కదిలారు. వాళ్ళ ఆవేశం చూసి కేదార్కి భయమేసింది. నిన్ననేగా విళ్ళని శాంతి కాముకులని కితాబిచ్చాడు. యిపుడు చూస్తే ప్రాణాలివ్వదానికైనా ప్రాణాలు తీయడానికైనా తయారుగా ఉన్నట్టున్నారు.

కారణం తెలియకుండా ఆవేశపడిపోవటం అనర్జాలకు దారి తీయవచ్చు. వాళ్ళనెలా శాంతింప జేయాలో తెలీలేదు. వాళ్ళతోపాటు అతనూ బయట్టేరాడు.

మైదాన ప్రాంతంలోకి రాగానే చెరువు గట్టుమీద చెట్టుకు కట్టేసిన మల్లయ్య... అతని చుట్టూ మూగి ఉన్న అరడజను మంది మనుషులు అల్లంత దూరం నుంచే కన్పించారు. చెంచుల్లో ఒక్కసారిగా ఆవేశం పెల్లుబికింది. బాణాలు ఎక్కుపెట్ట ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.

“తొందర పడకండి. నేను మాట్లాడి విషయం వంటో కనుక్కుంటాను. అప్పటిదాకా శాంతంగా ఉండండి” అన్నాడు కేదార్‌.

అంతమంది చెంచుల్ని అలా విల్లంబులెక్కు పెట్టి ముందుకు రావటం చూడంగానే మల్లయ్యని పట్టుకుని కొడ్డున్న మనుషులు అప్రమత్తమైనారు.

కెదార్‌ వేగంగా ముందుకు నడిచి, “ఏం జరిగింది? ఎందుకతన్ని చెట్టుకు కట్టేశారు”

గుర్రపుడెక్క సీలీర అని ప్రశ్నించాడు.

“మీ రెవరు? ఈ చెంచులకూ మీకు ఏమిటి సంబంధం” వాళ్ళలో ఒకతను ముందుకొచ్చి అడిగాడు. ఆరడుగుల ఎత్తు, ఎర్రటి జీరలున్న కళ్ళు, నల్లటి దేహ చాయ... వోతవోసిన విగ్రహంలా ఉన్నాడతడు.

“నా పేరు కేదార్‌నాధ్‌. బ్యాంకు మేనేజర్ని. ప్రస్తుతానికి వీళ్ళకి ప్రతినిధిని. చెప్పుండి”

బ్యాంకు మేనేజర్‌ అని చెప్పగానే అతని కళ్ళల్లో గౌరవం స్పష్టంగా కన్పించింది. మాటల్లో సౌమ్యత చోటు చేసుకుంది.

“సార్‌. నాపేరు కనకారావు. ఈ గుడి కట్టిస్తున్న కాంట్రాక్టర్ని యితడు యింతకు ముందు కూడా చాలాసార్లు సైట్‌ దగ్గరకొచ్చి చూస్తూ నిలబడేవాడు. మొదట్లో ఏ సిమెంటో స్టీలో లేకపోతే యిటుకలో ఎత్తుకెళ్ళడానికొచ్చాడని వర్మర్లు అనుకుని తిట్టి పంపించేవారు. ఈ ఉదయం ఏకంగా గుట్టమీదికొచ్చేశాడు. మా కూలీలు అప్పటికింకా రాలెదు. మావాళ్ళొచ్చి చూసే సమయానికి అదుగో ఆ గది తాళం తన దగ్గరున్న గొడ్డలితో పగులకొడ్డూ కన్పించాడు. దొంగతనం చేయడానికొచ్చాడని రుజువుల్తో సహా పట్టుబడ్డాక చెట్టుకి కట్టేశారు”

“ఆ గదిలో ఏం ఉన్నాయి?”

“విలువైన సామానంతా ఆ గదిలోనే పెట్టి తాళం వెస్తుంటాం”

“లక్మి నరసింహస్వామి విగ్రహం ఎక్కడ పెట్టారు?”

“దాన్ని కూడా ఆ గదిలోనే భద్రంగా దాచిపెట్టాం”

ఏం జరిగి ఉంటుందో కేదార్శి అర్ధమైంది. “యితని పేరు మల్లయ్య. ఆ దేవుడంటే పరమ భక్తి. అతనొచ్చింది మీ విలువైన సామాన్లు దొంగిలించడానికి కాదు. తను ఆరాధించే దేవుణ్ణి చూసిపోదామని వచ్చాడు”

“మంచోరే సార్‌... రూం కేసిన తాళాన్ని పగులకొట్టి లోపలికెళ్ళటం దొంగతనం కాదా? మేం చూడకుండా ఉండి ఉంటే దేవుడి విగ్రహాన్న ఎత్తుకెళ్ళివాడు. అది ఎడొందల యేళ్ళ నాటి విగ్రహం. మార్కెట్లో లక్షల విలువ చేస్తుందని మీకూ తెలుసు”

“నిజమే. ఆ విషయం మీకూ నాకూ తెలుసు. అమాయకులైన ఈ చెంచులకు తెలీదు. వీళ్ళు చాలా మంచివారు. దొంగతనాలు చేయరు”

గుర్రపుడెక్క నీలీ6

ఆ మాటకు కనకారావు పదీ పడీ నవ్వాడు. * సార్‌... నేను కాంట్రాక్టర్ని కాబట్టి ఏమీ చదువుకోలేదనుకుంటున్నారేమో... నేను ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బియ్యే పాసైన వాణ్ణి. చెంచుల గురించి నాకు బాగా తెలుసు. ఈ అడవిలో గుట్టమిద గుడిని కట్టే పని నా చేతికందగానే మొదట చేసిన పని ఈ చెంచుల గురించి వివరాలు తెల్సుకోవటం... విళ్ళు దొంగనాయాళ్ళు సార్‌... మంగళగిరి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడిగారి హయాంలో ఈ చెంచులు గ్రామాలమీద పడి దోచుకునేవారు. ఆ కాలంలో జమీందారుగారు నూటయాభైమంది చెంచు నాయకుల్ని చర్చలకని ఆహ్వానించి అందర్నీ అక్కడికక్కడే మట్టు పెట్టెశాడు. దారినపోయే బాటసారుల్ని దోచుకోవటంలో వీళ్ళు సిద్ధ హస్తులు సార్‌...ఆ జాతి లక్షణం ఎక్కడికి వోతుంది? రక్తంలో యింకిపోయి ఉంటుంది” వాళ్ళ వైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ అన్నాడు.

“పొట్టకూటికోసం చేస్తే చేసి ఉండొచ్చు. అడవుల్లో స్వేచ్చగా తిరిగే చెంచుల్ని అక్కడినుండి తరిమేస్తే ఆహారం కోసం అడ్డదార్లు తొక్కక ఏం చెస్తారు? ఐనా ఆ జమీందారెవరో చేసినట్లు వళ్ళు నమ్మక ద్రోహాలు చేయరు. నమ్మి వచ్చిన మనుషుల్ని మట్టుపెట్టదం ఎంతటి కిరాతకం?”

“తర్వాత ఆ జమీందారుగారు పశ్చాత్తాపపడి గుళ్ళూ గోపురాలు కట్టించాడట. అది వేరే విషయం. ఏమైనా వీడు దొంగతనం చేయడమైతే నిజం”

“మొదట అతన్ని వదిలేయండి. లేకపోతే వాళ్ళ బాణాలు మిమ్మల్ని చీల్చి చెండాడటం ఖాయం”

“ఏం సార్‌ బెదిరిస్తున్నారా? పోలీసులకి యిప్పుడే ఫోన్‌ చేసి పిలిపిన్తా. ఈ వ్యవహారమేదో వాళ్ళే చూసుకుంటారు.” అతను సెల్‌ఫోన్‌ బెటికి తీసాడు.

“మీ ఫోన్‌ కాల్‌ అందుకుని వాళ్ళొచ్చెలోపల మిరెవరూ మిగలరు కదా”

“తర్వాతైనా వీళ్ళన్ని అరెస్ట్‌ చేసి జైల్లో వెయరా?”

“ఈ అడవిలో వాళ్ళ బతుకులు జైలు జీవితం కన్నా అధ్వాన్నమన్న విషయం మికు తెలీదు. యిక్కడ రోజూ తిండి సంపాదనకోసం ప్రాణాల్ని పణంగా పెద్దారు వీళ్ళు. జైల్లో మూడు పూటలా తిండి దొరుకుద్ది. జైల్లో పడే శ్రమ ఈ అడవిలో పడె (మకన్నా ఎన్నో రెట్లు తక్కువ. చెప్పటం నా ధర్మం అనుకుని మీకు నచ్చ చెప్పడానికి

120,

గుర్రపుడెక్క సీలీర ప్రయత్నించాను. మూర్ధంగా ప్రవర్తిస్తానంటే మీ యిష్టం.. నేను ఆపను”

చెంచుల దగ్గరకొచ్చి బుద్దన్నతో విషయం చెప్పాడు కేదార్‌.

వాళ్ళు బాణాలు ఎక్కుపెట్టి మరికొంత ముందుకొచ్చారు. కనకారావుతోపాటు ఉన్న మనుషులు ఆ స్థలాన్ని వదిలి గుట్టమీదికి పారిపోయారు. కనకారావు చెట్టు దగ్గరఇళ్ళి మల్లయ్య కట్లు విప్పదీసి తనూ గుట్టమీదికెళ్ళిపోయాడు.

మల్లయ్య శోషాచ్చి పడిపోయేలా ఉన్నాడు. అతన్ని దాదాపు మోసుకుంటూనే చెంచులు తమ గూడెం వైపుకు కదిలారు. జువ్వి చెట్టుకింద చాపేసి పడుకోబెట్టారు. మల్లయ్యని ఆ స్థితిలో చూసి లచ్చిమి గొల్లుమంది. సుగంధి వేళ్ళని నానబెట్టి చెసిన షర్బత్‌ని తెచ్చి మల్లయ్య చేత తాగించింది. మనిషి కొద్దిగా కుదుట పడ్డాడు. లెచి కూచుని కదార్‌ వైపు చూసి “దొరా... నా సామిని నాకిప్పించు.” అన్నాడు.

“ధత్ర్‌ మల్లా అదే మాట. పిచ్చివర్లేమన్నా తొక్కొచ్చావా... సెప్తే తల౭క్కదా.. జరంత ఆలీసెమైతే నిన్ను సంపేసేటోల్లు. అప్పుడు నీ పెల్లాం ఏ ఆకాస దేముడితో మొరెట్టుకున్నా నాబం ఉండేదా సెప్పు. నామాటినుకోరా ... దేముడు మనకాదే ఉన్నాడ్రా... ఎక్కడికో ఎల్లి ఎతకక్కరల్యా” అన్నాడు బుడ్డన్న.

కేదార్‌ మల్లయ్య పక్కన కూచున్నాడు.

అతని వైపు ఆశసనిండిన కళ్ళతో చూశాడు మల్లయ్య, 'నీవే తప్ప నితపరంబెరుగి అన్నట్టు... వరాలిచ్చె దేవుడివైపు చూసె భక్తుడిలా... చూశాడు.

“మల్లయ్యా... నీకో మాట చెప్పనా. నర్సింహ స్వామంటే నీకెంతిష్టమో ఆ స్వామికీ నువ్వన్నా అంతే యిష్టం. అందుకే రెండు మూడు నెలలాగితే నీ యింట్లోనే లచ్చిమి కడుపులోంచి పుట్టుకొద్దామని ఆరాటపడ్డున్నాడు. వాడికి స్వామి పేరే పెట్టు. దేవుడ్ని ఎంత ప్రేమగా చూసుకున్నావో నీ బిడ్డసీ అంతే ప్రేమగా చూసుకో” అన్నాడు కేదార్‌.

మల్లయ్య కళ్ళు సంతోషంతో మెరిశాయి. “నిజమా సామీ... నిజంగానె లచ్చి కడుపున నా దేవర పుదాడా?”

“తప్పకుందా.. నామాట వమ్ము కాదు చూడూ అన్నాడు బయటల్చెరబోతూ,

మల్లయ్య మొహంలో కళ వచ్చెసింది. ఆ సందర్భానికలా అనేశాడు గానీ మగపిల్లాడు కాకుండా ఆడపిల్ల పుడ్తే ఏం చెప్పాలని ఆలోచించాడు కేదార్‌. అప్పుడు గారెల మైసమ్మె

గుర్రపుడెక్క స్రలీ6 పుట్టిందనో లేకపోతే భమరాంబో, చెంచులక్ష్మినో పుట్టందని చెప్పి సద్దియవచ్చని నిర్ణయించుకున్నాడు.

పని వత్తిడి వల్ల మళ్ళా మన్నుగొండ వెళ్ళటం కుదరనే లేదు కేదార్కి తన కొడుకుని చూట్టానికి వస్తానని లచ్చిమికి మాటిచ్చిన విషయం చాలా సార్లు గురొచ్చింది. కొడుకు పుట్టాడో లేక కూతురో. ఎప్పడికప్పుడు వెళ్లామనుకోవటం, ఏదో పని అద్జొచ్చి వాయిదా పడిపోవటం... యిలా ఆర్ష్నాల్లు గడిచి పోయాయి.

ఓ రోజు ఉదయాన్న సూర్యకుమార్‌ వూడి పడ్డాడు.

“మనం రెపు మన్నుగొండ వెళ్తున్నాం. ఏర్పాట్లు చేసుకో” అన్నాడు.

“నేనూ ఎప్పట్నుంచో అనుకుంటున్నా. నువ్వూ వస్తానంటే అంతకంటే కావల్సింది ఏముంది? రెపంటే వర్కింగ్‌ డే కదా. శెలవ పెట్టాలి. చాలా పనుంది. శెలవ పెట్టడానికి కుదర్దు. వచ్చి ఆదివారం వెళ్లాం”

“తప్పదు. శెలవ పెట్టెయి”

“నీకేం బాబూ ఏమైనా చెప్తావు. లెక్సరర్‌వి కదా... శెలవ పెట్టనంత మాత్రాన ఏమీ మునిగిపోదు. ని స్పూడెంట్లు... నీ పాఠాలు అన్నీ భద్రంగా ఉంటాయి. నాకలా కాదే. దబ్బు వ్యవహారాలు... బాధ్యత గల ఉద్యోగం”

“అబ్బ సర్ల.. ఒప్పుకున్నా. నిదే బాధ్యత గల ఉద్యోగం... మాది బేవార్సు ఉద్యోగం. మన్నుగొండలో కట్టించిన శ్రీ లక్షి నర్సింహస్వామి వారి దేవాలయంలో రేపు విగ్రహ ప్రతిష్ట. పూజా కార్యక్రమం ఉన్నాయి. శిధిలమైన ఆ దేవాలయాన్ని కనుగొన్నది మనమే కాబట్టి మనిద్దరం ప్రత్యేక ఆహ్వానితులం. వెళ్ళక తప్పదు” అన్నాడు.

మరునాడు శెలవపెట్టి సూర్యకుమార్తో కలిసి బయట్టైరాడు కేదార్‌. ముహూరానికి రెండు గంటల ముందె వూరు చేరుకోవటం వల్ల మొదట చెంచుపెంటకెళ్ళారు. లచ్చిమి తన గుడిసెబైట పీటమీద కూచుని, కాళ్ళమీద బాబుని పడుకోబెట్టుకుని స్నానం చేయిసోంది.

వీళ్ళని చూడగానే మల్లయ్య మొహం విప్పారింది. “సామీ.. నువ్వు సెప్పినట్టై నా లచ్చి కడుపున నర్సిమ్మ సామి పుట్టాడు” అన్నాడు కేదారో, స్నానమైనాక బాబుని పొడిగుడ్డతో

గుర్రపుడెక్క సలీర తుడిచి లచ్చమ్మ తన భర్త చేతికిచ్చింది.

“సామీ... నా నర్సిమ్మ సామి యిడుగో అంటూ బాబుని చూస్ముని మురిసిపోతూ కేదార్‌ చేతుల్లోకిచ్చాడు. నల్ల ద్రాక్షపండులా ముద్దుగా ఉన్నాడు వాడు.

“నీ నర్సింహ స్వామి ఈ ఫొటోలో కూడా ఉన్నాడు చూడు తను అందంగా (ఫం కట్టించి తెచ్చిన ఫోటోని మల్లయ్య చేతిలో పెట్టాడు సూర్యకుమార్‌. ఆ ఫోటోలో కన్పిస్తున్న స్వామివారినీ స్వామివారికి దండం పెడ్తున్న ఫోజులో తననీ చూసుకుని మల్లయ్య మురిసి పోయాడు. గూదెంలోని జనాల్ని పెరు పేరున పిల్సి చూపించాడు.

“దొరా... ఈ దినం గుళ్లో సామివారికి పూజలు సేస్తారటగదా... వూల్లో మడుసులు సెప్పుకుంటుంటే తెల్సినాది. మా గూడెపోల్లందరం ఎల్లామని బుడ్డన్న సెప్పాడు. నా సామిని కళ్ళారా సూసి ఎన్ని దినాలైందో” అన్నాడు. అతని కళ్ళు భక్తితో తన్మయత్వంతో అర్ధనిమీలితాలు కావడం గమనించాడు కేదార్‌.

“మనల్ని ప్రత్యేకంగా ఆహ్వానించటం కాదు ..మొదట వాళ్ళు మల్లయ్యని ఆహ్వానించాలి. ఆ విగ్రహాన్ని మొదట చూసింది మల్లయ్య, కానీ అతనికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదు” అన్నాడు కేదార్‌.

“నిజమె... విగ్రహ ప్రతివ్యపనకి మనం మల్లయ్యని కూడా పిల్చుకెళ్ళాం. మిగతా గూడెం వాళ్ళు పూజా కార్యకమం చూస్తారు అన్నాడు సూర్యకుమార్‌.

వాళ్ళిద్దరూ మల్లయ్య ని పిల్చుకుని గుట్టవైపుకి బయళ్చెరారు. మైదాన ప్రాంతంలోకి ప్రవేశించగానే గుట్టమీది కోవెల మణిదీపంలా మెరుస్తూ కన్పించింది. గుట్టమీదికెక్కడానికి చక్కగా మెట్లు కట్టారు. మెట్లెక్కబోతున్న వాళ్ళని పంచెకట్టులో ఉన్న ఓ వ్యక్తి ఆపి సూర్యకుమార్‌ వైపు పరిశీలనగా చూస్తూ “తమరు సూర్యకుమారి కదా” అన్నాడు.

“ఈయనే సూర్యకుమార్‌. ఇక్కడ శిథిలమైన గుడి ఉందని పరిశోధించి కనుక్కుంది ఈయనే” కేదార్‌ సమాధానం చెప్పాడు.

“మీ గురించి విన్నాను. చాలా సంతోషం. దేవుడు మీ ద్వారా భక్తులకు తన కరుణా కటాక్షాలను ప్రసాదించాలనేది భగవత్సంకల్పం. మిమ్మల్ని సగౌరవంగా తోడ్కొని రమ్మని నాకు పురమాయించబట్టే యిక్కడ ఎదురుచూస్తూ నిలబడ్డాను. మీ ఫొటో భక్తి సుధలో చూశాను. సులభంగా గుర్తు పట్టగలననే అనుకున్నాను. నాపేరు రామశర్మ. ప్రధాన

గుర్రపుడెక్క సలీం అర్చకుల వారికి సహాయకుణ్లి. పదండి. పైకి వెళ్తాం” చెతులు జోడించి సూర్యకుమార్‌కి నమస్కరిస్తూ వినయం ఉట్టిపడేలా అన్నాడు.

ముగ్గురూ ముందుకు కదలబోయారు. రామశర్మ మళ్ళా వాళ్ళని ఆపేశాడు. “క్షమించాలి. మీరు వెళ్ళొచ్చు. యితనికి మాత్రం ప్రవేశం నిషిద్ధం” అన్నాడు మల్లయ్యని చూపిసూ.

“రామశర్మ గారూ. యితను మల్లయ్య... చెంచు యువకుడు. మొదట శిధిలమైన ఈ గుడిని, స్వామివారి విగ్రహాన్ని చూసింది యితనే. యితని సాయం వల్లనే మేము శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారిని కనుక్కోగలిగాం. ఆ విధంగా గుళ్లోకి రావడానికి మాకంటే యితనికె ఎక్కువ అర్హత ఉంది” అన్నాడు సూర్యకుమార్‌.

అతను మరోసారి మల్లయ్య వైపు నఖశిఖపర్యంతం చూశాడు. ఆ చూపులోనే ఏహ్వ్యత...

“క్షమించాలి. పవిత్రమైన ఆలయంలోకి శుచీ శుభ్రం తెలీని ఇటువంటీవాళ్ళు ప్రవేశిస్తే మాలిన్యం అంటుకోదా... ఎంతటి అపచారం...”

“స్వామివారి విగ్రహాన్ని ఈ శుచి శుభం తెలీని మనిషే రోజూ తన చేతులో శుభ్రంగా తుడిచి పళ్ళో ఫలహారాలో నైవేద్యంగా సమర్పించాదన్న విషయం మీరు మర్చిపోతున్నారు” అన్నాడు కేదార్‌.

“మీరు చెప్పిన దాన్లో నిజానిజాలు ఆ పరాత్పరుడికే తెలియాలి. ఓవేళ అది నిజమైనప్పటికీ యిప్పుడు స్వామివారి విగ్రహం శాస్త్రోక్తంగా శుద్ధి చేయబడి ఆగమశాస్త్ర నియమాల (ప్రకారం ప్రతిష్టించబడ్డోంది. వీదు పాదం మోవితే ఆలయం అపవిత్రమైపోతుంది”

“శ్రీశైల మల్లికార్డునస్వామిని చెంచులు దర్శించుకుంటారని మీకు తెలుసు కదా. అది నిషిద్ధం కానపుడు ఈ గుళ్ళోకి మల్లయ్య ప్రవెశించడం ఎలా నిషిద్ధమౌతుంది?”

“అయ్యా... భక్తుల కోసం గుడిద్వారాలు తెర్చుకున్నాక దూరం నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు. విగ్రహ ప్రతివ్వాపన జరుగుతున్న సమయంలో గుడిలోపలికి ఇతనిలాంటి వాళ్ళకు ప్రవేశం నిషిద్ధమనేదే నా విన్నపం. ఐనా మీతో వాదించేంత వాణ్లికాదు. నాకప్పగించిన పని మిమ్మల్ని తోడ్కొని గుళ్ళోకి తీస్మెళ్ళటం. యిక వీడి విషయమంటారా... మీరు ఆలయ ప్రధాన అర్చకులైన నారాయణాచార్యులు గారి అనుమతి తీసుకోండి.

గుర్రపుడెక్క స్రలీర వారు సరేనంటే నాకేమీ అభ్యంతరం లేదు. యిప్పటికే సమయాతీతమైంది. పైకి పదండి” అన్నాడు.

మల్లయ్య వైపు తిరిగి, “నువ్వీ మెట్లెక్కే సాహసం చేయకు. భగవంతుడికి అపచారం చేసినవాడివవుతావు. కళ్ళు పేలిపోతాయి. జాగ్రత్త అసింట దూరంగా నిలబడు” అన్నాడు.

“మిగతా గూడెంవాళ్ళు వచ్చివరకు యిక్కడే ఉండు మల్లయ్యా” అన్నాడు కేదార్‌.

రామశర్మ కేదార్‌ వైపు అదోలా చూసాడు. ఏదో అడుగబోయాడు. వెంటనే విరమించుకుని మౌనంగా మెట్లెక్కడంలో నిమగ్నమైపోయాడు.

నారాయణాచార్యుల వయసు యాభైకి పైనే ఉంటుంది. దబ్బపండులాంటి శరిర చాయ, వింత తేజస్సుతో మెరుస్తోన్న కళ్ళు, విశాలమైన నుదురు, తిరునామాలు, గోష్సాదం... చూడగానే గౌరవభావం కలిగేలా... దైవసాన్నిధ్యంలో గడుపుతూ మనసా వాచా కర్మణా దైవధ్యానంలో బతికే వ్యక్తి మొహంలో కన్పించే అద్భుతమైన ప్రశాంతత...

రామశర్మ విషయాన్ని వివరించినట్టున్నాడు.

“విష్ణుమూర్తి వరాహావతారమెత్తాడని మనం నమ్ముతాం. అలాగని వరాహాల్ని గుళ్ళోకి రానిస్తామా... కాలభ్రైరవుణ్ణి పూజిస్తాం... కానీ కుక్కలు యింట్లొకి దూరితే వూర్ముంటామా... కర్రతో కొడ్డాం. యిదీ అంతే సూర్యకుమార్‌ గారు. జంతువుల్ని ప్రమగా, దయగా చూడాలనేదే అంతరార్ధం తప్ప గుళ్లోపలికి వాటిని సాదరంగా ఆహ్వానించవచ్చని దాని మర్శం కాదు. మీరు చెప్పింది నిజమే. చెంచులూ మనలాంటి మనుషులే. కాదని ఎవరన్నారు? వాళ్ళని (ప్రేమగా చూద్దాం. దూరంగా నిల్చోబెట్టి ప్రనాదం యిద్దాం, అంతే తప్ప ఈ సమయంలో గుళ్లోపలికి రావడానికి మాత్రం వీళ్లీదు” అన్నాడాయన.

“మనం వాళ్ళ అడవిలోకి వచ్చాం. వాళ్ళు తిరుగాడే స్థలంలో గుడి కట్టాం. కాసీ వాళ్ళకి మాత్రం ్రవేశార్జత లేదంటున్నాం. నా ఉడ్దెశంలో గుళ్ళోకి ప్రవశించడానికి కావల్సిన ముఖ్యమైన అర్హత ఆ దేవుడిమీదుండే అచంచలమైన భక్తి అది చెంచుల్లో పుష్మలంగా ఉంది” అన్నాడు కేదార్‌.

అక్కడె ఉన్న ఈవో గారు కలుగచేసుకున్నారు. “చెంచులు పాతిక ముప్పయ్‌ మంది నివసిస్తున్నంత మాత్రాన అడవి చెంచుల స్వంతమైపోతుందా? ఈ అడవి ప్రభుత్వానిది. ఈ గుడి ప్రభుత్వానిది.

గుర్రపుడెక్క నీలీర

ఈ దేవుడుకూడా ప్రభుత్వానికే స్వంతం అనేలా ఉన్నాడతను. కిందికి చూసాడు కదార్‌. చెంచు గూడెం అంతా కదిలి వచ్చినట్టుంది. కింది నుంచే చేతులు రెండూ పైళత్తి న్వామివారికి దండాలు పెడ్డున్నారు.

ఈ అడవిలోకి తనూ, సూర్యకుమార్‌ మొదటిసారి ప్రవేశించినపుడు తమ న్థావరాల్లోకి పరాయి వాళ్ళొస్తున్నందుకు బుసకొట్టి కాటెసి తన నిరసన తెల్పిన పాము గుర్తొచ్చింది కేదార్కి కింద నిలబడి ఉన్న చెంచులు వానపాొముల్లా కన్పిస్తున్నారు.

తల తిప్పి చెరువు వైపు చూశాడు. సగానికి పైగా ఆక్రమించిన గుర్రపుడెక్క.. వాచి పట్ట ఆకుపచ్చగా కన్పిస్తున్న నీళ్ళు...

“శుచి శుభ్రత లేని అడవి మనుషులు. గుళ్లోకి ఎలా రానిసాము చెప్పండి” ఈవో గారితో అంటున్న ప్రధాన అర్భకుడి మీద కేదార్శి గొరవం వోయింది.

“ఆ శుచి శుభ్రత శరీరం కన్నా మనసుకే ముఖ్యం” అన్నాడు కేదార్‌ వెటకారంగా.

“మనసుల్లో ఏముందో తెలుస్తుందటండీ... అసలే కలికాలం... వితండవాదం కాకపోతేనూ” అంటూ నారాయణాచార్యులు గర్భగుడిలోపలికెళ్ళాడు.

ఈవోగారేమనుకున్నారో ఏమో కేదార్‌ వైపు తిరిగి, “మీకీ చెంచులంటే బాగా అభీమానమున్నట్టుంది. విళ్ళకోసం నాదగ్గరో ప్లాన్‌ ఉంది. ఈ ఆలయం అడవికి మధ్యలో ఉంది కాబట్టి, యింకా సరైన రవాణామార్దం వర్చడలెదు కాబట్టీ వాళ్ళలో ఓ నలుగుర్ని భక్తుల సౌకర్యార్ధం గైడ్గుగా నియమిద్దాం. పక్కనున్న వూరినుంచి భక్తుల్ని జాగ్రత్తగా అడవిదారిలో ఏ ప్రమాదం జరక్కుండా ఆలయం దగ్గరకు తీసుకురావటం, వాళ్ళ సామాన్లు మోయటం, మళ్ళా భద్రంగా అడవి బైటి వరకు తీస్కెళ్ళి వదిలి రావటం వాళ్ళ డ్యూటి. ఆ భక్తులిచ్చె కూలి తప్ప ఆలయం తరఫున ఏమీ చెల్లించం. ప్రసాదం మిగిలే వాళ్ళకోసం కిందికి ఎవరిచేళతైనా పంపించమని పూజారిగారికి చెపాను. అంతే. ఆ నలుగురెవరో గూడెం పెద్దనే నిర్ణయించమనండి. నా తరఫున స్వచ్చందంగా మల్లయ్యని నియమిస్తున్నా” అన్నాడు.

“చాలా మంచి నిర్ణయం. మీ దయకు పాత్రులు కావటం వాళ్ళు చేసుకున్న అద్బష్టం. ఈ విధంగానైనా వాళ్ళ ఆర్ధిక పరిస్థితి మెరుగు పడ్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళుండరు.” అన్నాడు కేదార్‌. సూర్యకుమార్‌ ఎందుకో ముభావంగా ఉండిపోయాడు.

నే25

గుర్రపుడెక్క సలీర

“వాళ్ళు భక్తుల్ని మరీ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. లగేజీ ఏమి లేకపోతే ఒక్కరికైనా ఫ్యామిలీ మొత్తానికైనా పాతిక రూపాయలు కూలిగా నిర్ణయిద్దాం. యిక లగేజ్‌ బరువని బట్టీ దాన్ని పెంచుకోవచ్చు. బమంటారు” అన్నాడు.

“రీజనబుల్లా ఉంది. మిగతా ముగ్గురు ఎవరనే విషయం వాళ్ళతో మాట్లాడాక మీకు తెలియచేస్తాను” అన్నాడు కేదార్‌.

తన వల్ల ఈ చెంచులకు కొంతైనా సాయం అందబోతుందన్న సంతోషం అతనిలో.

విగ్రహ ప్రతిష్ట తదుపరి పూజా కార్ర్యకమం ముగిసేవరకు చెంచులంతా గుట్టకింద అలా చేతులు జోడించి నిలబడే ఉన్నారు.

గుట్ట దిగాక బుడ్డన్నతో విషయం చెప్పాడు కేదార్‌. తోకల రాజన్న మల్లయ్య, పులిచెర్ల కుదురునుంచి లింగన్న ఈరయ్య కొడుకు లింగయ్యలని ఆ పనిలోకి కుదిర్చట్టు నిర్ణయం జరిగింది.

గూదేనికి చేరుకున్నాక “మల్లయ్యా...యిక నుంచి సీయింట్లో డబ్బులకి కొదవె ఉండదు. నీకు కొడుకు పుట్టాక అదృష్టం ఎలా కలిసొచ్చిందో చూశావా” అన్నాడు.

“పెసలకోసం కాద్దారా నేనొప్పుకుందీ...నా సామికి దగ్గరగా ఉండొచ్చని... దినాం నా సామి కోవెలని రెండు మూడు సార్లయినా సూసుకోవచ్చని” అన్నాడు.

అమాయకత్వంలో ఎంతటి దైవత్వమో... ఎంతటి నిన్వార్ధ (ప్రేమో... అన్పించింది కేదార్శి

తిరుగు ప్రయాణంలో సూర్యకుమారి అదిగాడు. “వాళ్ళకో జీవనాధారం కల్పించిన ఈవోకి నువ్వు ధ్యాంక్స్‌ కూడా చెప్పలేదు. నీ మొహంలో సంతోషఛాయలు కన్పించలేదెందుకు?”

“నువ్వు వాళ్ళు సంపాదించబోయే డబ్బు గురించి వూరించి వూరించి చెప్పి బలవంతంగా ఒప్పించినట్లు అన్పిస్తోంది కేదార్‌. బుడ్డన్న మొహంలో అసంతృప్తి నువ్వు గమనించలేదు. నీ ఉత్సాహంలో నువ్వున్నావు. ఒక్క మల్లయ్య తప్ప మిగతా వాళ్ళెవరూ మనస్పూర్తిగా సమ్మతించలేదు”

“ఏరోజు ఆహారం ఆ రోజు సంపాయించుకునే పీళ్ళకి ఈ విధంగా కూడబెట్టుకున్న డబ్బులు కష్టకాలంలో అక్కరకు వస్తాయి కదా. ఏ జబ్బో జాడ్యమో చేస్తే మంచి వైద్యానికో,

గుర్రపుడక్క నీలీర వేటకెళ్ళలేని పరిస్థితి దాపురిస్తే తిండిగింజలు కొనుక్కోడానికో ఉపయోగపడ్డాయి కదా. ఎందుకా అయిష్టత?”

“కఈవోగారు మాట్లాడేటప్పుడు ఓ పదాన్ని వాడారు గమనించావా... భక్తులిచ్చి కూలి డబ్బులు తీసుకోవాలని. కూలి... అంటే ఒకరికింద వూడిగం చేస్తే వచ్చే డబ్బు... చెంచులు న్వాతంత్రప్రియులు. స్వేచ్చా జీవులు. ఈ పనివల్ల మనం వాళ్ళని కట్టిపదేస్తున్నాం. డబ్బుకి బానిసల్ని చేస్తున్నామేమో ఆలోచించు. వేటాడి తెచ్చుకున్న ఏ 'జంతువు మాంసమో పక్షి మాంసమో తిని యిప్పసారానో తాటి కల్లో తాగి, తృప్తిగా జీవితాన్ని గడుపుతున్న ఏళ్ళు డబ్బు సంపాదనలో పడితే మనలానే అసంతృప్తికి, అసహనానికి, ఈర్చ్యాడ్వషాలకి లోనైపోయి తమ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది”

సూర్యకుమార్‌ వాదనతో కేదార్‌ ఏకీభవించలేకపోయాడు. ఆర్ధిక పరిస్టితి మెరుగుపడితే వాళ్ళ జీవన స్టితిగతులుకూడా మెరుగుపడ్తాయన్న నమ్మకం ... ఆటవిక జీవితం గడుపుతున్న చెంచుల జీవితాల్లోకి కొంతైనా నాగరికత ్రవేశిస్తుందన్న నమ్మకం...

మన్నుగొండలో వెలసిన లక్షీ నర్సింహన్వామి మహిమ గల దేవుదని అత్యల్ప కాలంలో అతి వేగంగా భక్తుల్లో నమ్మకం పెరిగింది. ఓ స్థలంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుంటే వీసా వస్తుందని ప్రచారం జరిగినట్టుగానె మన్నుగొండలో ఉన్న గుడికి వెళ్ళి మొక్కుకుంటే చాలు సాప్ట్‌వేర్‌ ఉద్యోగం ఖాయం అనే ప్రచారం బాగా జరిగింది. ఆలయ పూజారులే పని గట్టుకుని ఇటువంటి ప్రచారం చేయిస్తున్నారని కూడా కొంత మంది అనుకున్నారు. వార్తాపత్రికల్లో దాని గురించి కధనాలు వెలువడ్డాయి.

టీవీ మీడియాలో స్పెషల్‌ బులెటిన్లు ప్రసారమయ్యాయి. సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న యువకుల్ని 'మీరీ రోజు నెలకు ముప్పయ్‌ వేల జీతంతో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఈ ఉద్యోగం మికెలా వచ్చింది అని యాంకర్‌ అడగ్గానే 'అంతా మన్నుగొండలో వెలసిన లక్షీ నర్సింహస్వామి దయ. యింజనీరింగ్‌ పాసైనాక ఎన్ని యింటర్యూలకెళ్ళినా ఉద్యోగం రాక నిరాశపడిపోయి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నామిత్రుడు ఈ దెవుడి మహత్తు గురించి చెప్పినపుడు నేను నమ్మలేదు. వాడే బలవంతంగా పిల్చుకెళ్ళి దర్శనం చేయించాడు. అంతే... వారంలోపలే యింటర్వ్యూ జరగడం,

[ల

గుర్రపుడెక్క సలీరి అప్పాయింట్‌మెంట్‌ ఆర్దర్‌ చేతికందడం జరిగిపోయాయి అన్నాడతను. ఆ నమ్మకం సామాన్య ప్రజల్లో ఎంత బలంగా నాటుకు పోయిందంటే కంప్యూటర్‌ సైన్స్‌లో యింజనీరింగ్‌ చదివే విద్యార్దులు స్పెషల్‌ బస్సులు మాట్లాడుకుని మన్నుగొండకు రావడం ప్రారంభించారు. భక్తుల రద్ది పెరగటంతో ఆర్టీసి వాళ్ళు భక్తుల సౌకర్యార్ధం మన్నుగొండ నుంచి ఐకంగా నాలుగు బస్సులు నడుపుతున్నారు.

దారి మధ్యలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి, వూళ్లోంచి గుడిదాకా మొదట సిమెంట్‌ రోడ్డు వేసారు. రోద్దుకిరువైపులా చిన్నచిన్న దుకాణాలు వెలిశాయి. వూళ్లో కాఫీ హోటళ్ళు, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపులు తెరిచారు. సిమెంటు రోడ్దు కాసా తార్రోద్దుగా మారింది. బస్సులు నేరుగా గుడి దాకా వెళ్తున్నాయి.

వూళ్లోని కొంత మంది కుర్రాళ్ళు ఆటోలు నడపటం ప్రారంభించారు. వూళ్ళో మిలట్రీ హోటల్‌ పెట్టారు. దానికి దగ్గర్లోనే వైన్‌ షాప్‌ తెరిచారు. ఏడాది తిరక్కుండానే వూరి స్వరూపమంతా మారిపోయింది.

గుది దగ్గర గుట్ట దిగువన పూలూ, కొబ్బరికాయలు, పండ్లూ అమ్మె షాపులు...కాఫీ హోటళ్ళు... దేవుని విగ్రహాలు, ఫోటోలు అమ్మే షాపులు... మెట్ల దగ్గర గేట్లు పెట్టారు. మెట్లు ఎక్కేటపుడు సులభంగా ఉండటానికి యిరువైపులా స్టీల్‌ రాడ్లు వెసి, పైన ఎండ తగలకుండా ఫ్లాస్టిక్‌ షీట్లతో కవర్‌ చేశారు. ప్రసాదం కొనుక్కోడానికో కౌంటర్‌, స్పెషల్‌ పూజ చేయించడానికిచ్చే టిక్కెట్లకో కౌంటర్‌...

చెంచుల ఆర్ధిక పరిస్థితి మెరుగు పడ్తుందన్న ఆశతో వాళ్ళకప్పగించిన పని.. యాత్రీకుల్ని గుడి దాకా అడవిదారిగుండా తీస్మెళ్ళే పని.. మూణ్డాల్ల ముచ్చటగా ముగిసింది.

సాయంత్రం ఐదు దాటింది. వేటకెళ్ళిన చెంచులు గూదేనికి చేరుకుంటున్నారు. చలికాలం కావటం వల్ల ఎండ వొడ తగ్గక ముందే గుడిసెల్లోకి చేరిపోవాలన్న ఆతురత వాళ్ళల్లో... ఆడవాళ్ళు కట్టె పొయ్యిలు వెలిగించి వంట పనిలో నిమగ్నమౌతున్నారు.

ఒక్కనారిగా కోళ్ళు అరవటం ప్రారంభించాయి. కుక్కలు ఒకదానికొకటి పోటీ పడి మొరుగుతున్నాయి. బైరిగాడు సింహంలా మొరుగుతున్నాడు.

ఈతచాపమీద కూచుని లచ్చిమితో కబుర్గాడుతున్న మల్లయ్య అప్రమత్తమైనాడు.

_ _గుర్రపుడెక్క నలీ౦ చిరుతపులిలాంటి క్రూరమైన జంతువు కళ్ళ పడ్డప్పుదే కుక్కలలా అరుస్తాయి. కోళ్ళు బెదిరిపోతాయి. దబ్బ ఎడం చేతిలో పట్టుకుని, రెండంబులు కుడిచేత్తో పట్టుకుని బైటికొచ్చాడు మల్లయ్య, అప్పటిక చెతిలో గొడ్డలితో బుడ్డన్న కూడా బైటికొచ్చాడు.

పులి కాదు.. కాంట్రాక్టర్‌ కనకారావు వస్తూ కన్పించాడు. అతని పక్కన ఇద్దరు వస్తాదుల్లాంటి మనుషులున్నారు.

“ఐం బుడ్దన్నా... మంచిగున్నవా?” అన్నాడు బుద్దన్నని పల్కరిస్తూ.

బుద్దన్న తన చేతిలో ఉన్న గొడ్డలిని కింద పదెసి, కొద్దిగా వొంగి “దండాలు దొరా. దండాలు” అన్నాడు.

మల్లయ్య భృకుటి ముడిపడింది. తనని చెట్టుకి కట్టెసి కొట్టిన కనకారావును చూడగానే రక్తం సలసలా మరిగింది. అతని పిడికిలి విల్లమీద బిగుసుకోవటం చూసి కనకారావు తోదేలులా నవ్వాడు. “ఏం మల్లయ్యా... బాణాల్తో బెదిరిస్తున్నావె. నెను మీ అందరి మేలు కోరి వచ్చా... ఆ తర్వాత మీ ఇష్టం” అన్నాడు.

మల్లయ్య తన చేతిలోని దబ్బనీ అంబుల్ని గుడిసెలోకి విసిరేసి, అక్కదే నిలబడ్డాడు.

“బుడ్డన్నా.. నువ్వగా గూదెనికి పెద్దమనిషివి. నీతో ఓ యవ్వారం మాట్లాడదామని వచ్చా” అన్నాడు కనకారావు.

“అయ్యో దొరా... కబురెడ్తె నెనె వత్తాగా. మీ అసంటి పెద్ద మడుసులొస్తే మా కాడ కూకోడానికి కురిసీలుందవు” బుద్దన్న మనస్పూర్తిగా నొచ్చుకుంటూ అన్నాడు.

“కుర్చీలేం ఖర్మ బుడ్దన్నా.. మీరు కోరుకుంటే ఇళ్ళలోకి బీరువాలు, మంచాలు, టీవీలు, ఫ్రిజ్‌లు అన్నీ నడిచొస్తాయి. అదంతా ఇపుడు నీ చేతిలో ఉంది. మీ గూడెంలోని అందరితో సావకాశంగా మాట్లాడాల బుడ్దన్నా అందర్ని బైటికి పిలువ్‌” అన్నాడు కనకారావు.

మల్లయ్య మనసు కిడుని శంకించింది. కనకారావు నవ్వులో విషం... మాటలు మృదువుగా (పేమగా ఉన్నా వాటిలో రహస్యంగా దాచిన చురకత్తులేవో కన్పిస్తున్నాయి. కనకారావు తమ గూదేనికి రావటంలోని అంతరార్థవేమిటో జాగ్రత్తగా పరిశీలించాలనుకున్నాడు.

30

గుర్రపుడెక్క సీలీర

“అట్టగే దొరా. అదుగో ఆ సెట్టుకింద బంద లేదూ.. అక్కడ కూసోండి” అంటూనే మల్లయ్య వైపు తిరిగి “దొరగోరిని అక్కడ కూసోబెట్టి రా” అన్నాడు బుడ్డన్న.

మల్లయ్య ముభావంగా వాళ్ళతో పాటు నడిచాడు. చెట్టుకిందున్న బండ మీద వాళ్ళు కూచున్నాక వెనుతిరగబోతున్న మల్లయ్యతో “మీ జీవితాలు మారిపోబోతున్నాయి. పూటపూటకి తిండికి వెదుక్సునే ఖర్మ ఇకనుంచి ఉండదు. దర్జాగా మహరాజులా బతికే అవకాశం మోసుకొచ్చాను. మీరందరూ వూ అంటే చాలు మీ ఇంట్లో లక్ష్మి తిరుగాడుద్ది” అన్నాడు కనకారావు.

“నా గుడిసెలో ఉన్న లచ్చిమి సాలు సామీ. మరో లచ్చిమి నాకక్కరలేదు” అన్నాడు మల్లయ్య,

“ఓరి నీ దుంప తెగ. నీకు జోకులెయ్యటం కూడా వచ్చటరా” వెకిలి నవ్వు నవ్వాడు కనకారావు. బుద్దన్నలాంటి ముసలోళ్ళు తను చూపించే ప్రలోభాలకు లొంగరనీ, వయసులో ఉన్నవాళ్ళే తన బుట్టలో పడిపోతారని అనుకున్నాడు కనకారావు. కానీ మల్లయ్య లాంటి యువకులు కూడా తన మాయాజాలంలో పడకపోవచ్చని ఇపుడు భయమేస్తోందతనికి.

బుద్దన్న తన గూదెంలోని జనాలందర్ని పిల్చుకుని రాతిబండ దగ్గరకొచ్చాడు.

“రా బుద్దన్నా.. నువ్వీ గూదేనికి పెద్ద మనిషివి. నిలబదడకూడదదు. వచ్చి ఇక్కడ కూచో” తన పక్కన చోటు చూపిస్తూ అన్నాడు కనకారావు.

“పర్నదు దొరా.. నిలబడుకుంటా”

“అరే రావయ్యా రా.. సిగ్గుపడ్డావేంటొ” కనకారావు లేచొచ్చి బుడ్డన్న చేయి పట్టుకుని తీస్కెళ్ళి బండ మీద కూచోబెట్టాడు. బుడ్డన్న చివరికంటా జరిగి కూచున్నాడు.

మల్లయ్యకు అతను చూపిస్తున్న అతి ప్రేమలో కపటం స్పష్టంగా కన్పిస్తోంది. పులిని పట్టడానికి మేకపిల్లను ఎరవెసినట్లు.. చేప గొంతులో గాలాన్ని గుచ్చేముందు బలిచేసే వానవాములా కన్పించాడు బుడ్డన్న...

“మీ గూడెం వాళ్ళందరికీ ఓ శుభవార్త చెబ్బామని వచ్చాను. ఈ అడవిలో ఆకలితో, అనారోగ్యంతో, పేదరికంతో ఎన్నాళ్ళు కష్టపడ్డారు? మీ కోసం ఓ అద్భుతమైన అవకాశం వెదుక్కుంటా వచ్చింది. గుడికి వచ్చి భక్తుల కోసం కాటేజీలు కట్టడానికి ప్రభుత్వం నాకు

గుర్రపుడెక్క సలీం కాంట్రాక్ట్‌ పని అప్పగించింది. దానికీ స్టలం అనువుగా ఉంటుందని ఇంజనీర్లు సలహా ఇచ్చారు....”

అతని మాటల్ని మధ్యలోనే అద్దుకున్నాడు మల్లయ్య, “ఈ అడివి మాది. ఈ గూడెం మాది. ఇక్కడి బూమిని మేం వదులుకోం. ఆల్లకోసరమెదో కట్టడానికి మా బూమిని లాగేసుకుంటానంటే మేం ఎవ్వలం ఒప్పుకోం” అన్నాడు కోపంగా.

కనకారావు అతని వైపు ఓరి అమాయకుడా అన్నట్లు చూశాడు. “చూడు మల్లయ్యా, ఈ అడవి గవర్నమెంటోళ్ళది. మీరు గుడిసెలేసుకున్నంత మాత్రాన ఈ భూమి మీ స్వంతమైపోదు. మీకి భూమి మీద ఏ రకమైన హక్కు లేదు” అంటూ బుడ్దన్న వైపు తిరిగి “నువ్వెమంటావు బుద్దన్నా” అన్నాడు.

“నిజమే దొరా. ఐనా ఎన్నో యళ్ళుగా ఈ అదవితల్లిని నమ్ముకుని బతుకుతున్నాం. దయ సూపండి దొరా. గూడెంలో ఉన్న పన్నెండు కుటుంబాలు రోడ్డున పద్తాయి. ఈల్ల గతేం కావాల?”

“ఆ విషయం చెప్పడానికే వచ్చింది. మీ అందరికి మన్నుగొండ వూర్లో పక్కా ఇళ్ళు కట్టిస్తాను. దానికి చెంచుపాలెం అనో చెంచులక్ష్మి అనో పెరు పెద్దాను. ఇలా గుడిసెల్లో ఉండి ఈగలు, దోమలు, పురుగులో సవాజీవనం చేయాల్సిన ఖర్మ ఇక ఉండదు. చలి బాధించదు. కాంక్రిట్‌తో కట్టిన యిళ్ళు కదా వెచ్చగా ఉంటాయి. ఓ వంట గది, ఓ బిగర్రూం... అందులో మంచాలు, కుర్చిలు, బీరువాలు...” కనకారావు వాళ్ళ మొహాల వైపు పరిశీలనగా చూశాడు... అందరి కళ్ళల్లొ మెరుపు...

“అయన్నీ మాకెందుకు దొరా..మెం మలలమ్మ తల్లి దయతో బతికేటోల్లం. అడవి తల్లి పెట్టే తిండి తినేటోల్లం. మమ్మల్నిలానే బతకనీ దొరా. ఇది మా కర్మ అని మెమెవ్వలం అనుకోటం లేదు. మేం ఇలానే సంతోసంగా ఉన్నాం. మా సావైనా బతుకైనా ఇక్కడే దొరా” అన్నాడు బుద్దన్న.

“మీరు కట్టిచ్చే ఇల్లలోకి ఎలిపోయాక మాకు తిండెలా దొరుకుద్ది? మెం అడివిలోకి ఏటకి ఎల్లొచ్చా?” రాజన్న అడిగాడు.

“లేదు. మీరీ అడవిలోకి రావడానికి వీల్లేదు. మీ తిండికి ఏ లోటూ రాకుండా నేను ఏర్పాటు చేస్తున్నా. మీరీ గూడెం ఖాళీ చేయడానికి ఒప్పుకుంటే నేను యమ్మార్వో గారితో

గుర్రపుడెక్క స్రీలీ6 మాట్లాడి ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రెండెకరాల సాగుభూమిని ఇప్పిసా. వ్యవసాయం చేసుకుంటూ దర్దాగా బతకొచ్చు. ఎమంటారు”

“మరి ఎగసాయం సెయాలంటె పైసల్‌ కావాద్దా? ఇత్తనాలు కొనాల, ఎరువులేయాల, కోత కోయాల... అప్పటిదాకా మా గతేంటి?” బుల్లన్న ప్రశ్నించాడు.

అలా అడుగుతున్నారంటే తన గుప్పెట్లోకి వస్తున్నట్టేనని సంతోషపడ్డూ రెచ్చిపోయాడు కనకారావు. “నెనియన్నీ ఆలోచించలేదనుకుంటున్నారా? మీ భవిష్యత్తు గురించి మీ తాతలూ తండ్రులు కూడా ఆలోచించి ఉండరు. నేనాలోచించా.. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ పిల్లల మొహాల్లో నవ్వులు పూయించాలని కంకణం కట్టుకున్నా. మిమ్మల్ని మొదటిసారి చూసినపుడు మీ దయనీయమైన, దుర్భరమైన పరిస్థితి చూసి కడుపు తరుక్కుపోయిందంటే నమ్మండి. మీరు సేద్యం చేసుకోడానికి నా వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి పదిహేను వేలిస్తాను. సంతోషమేనా?”

“ఆ పైసల్‌ శానా తక్కువ దొరా” అన్నాడు రాజన్న

వెంటనే బుద్దన్న కలగచేసుకుని “మనకెందుకు పైసల్‌? ఏం సేస్కోవాల ఆటితో? పైసల్‌కి ఆశపడి కన్నతల్లిని అమ్ముకునే జాతి కాదు మాది. దొరా శమించాల. ఎగసాయమే సేయాల్నంటే మాకు బూమికేం కొదువ? ఈ అడవంతా బంగారం పండే బూమేగా, ఇత్తనాలు నాటక్కరలా.. గింజల్ని ఇసిరేసినా ఇరగకాసే బూమి...మాకు ఎగసాయం సేయటం రాదు. శాతకాదు. ఈ అడివిలోని సెట్లమీద, పుట్లమీద, పిట్టలమీద, నేల్లోని గడ్డలమీద బతికేటోళ్ళం. ఈల్లందరూ పిలకాయలు. ఈల్లకు జుట్టేదో తోకేదో తెలీదు. నేను సెప్తున్నా ఇనుకోండి. మేం అడవిని వదిలిపెట్టే సమస్యే లేదు” అంటూ విసురుగా లేచాడు.

ఆ ముసలోడిలో అంతటి వూపు చూసి కనకారావు ఆశ్చర్యపోయాడు. “నామాటిని మీరు ఖాళీ చేస్తే ఈ సౌకర్యాలన్నీ లభిస్తాయి. మీరు వెళ్ళనని మొండికేసినా పోలీసులొచ్చి లాఠీల్తో కుమ్మి మిమ్మల్ని ఈ అడవిలోంచి గెంటేస్తారు. అప్పుడేం చేస్తారు? ఆలోచించుకోండి. ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఎన్నాళ్ళు బతగ్గలరు?” కనకారావు దండోపాయాన్ని ప్రయోగించాడు.

“మేం ఇల్లంబులో పోరాడదాం. మా పేనాలు పోయినా సరే గూడెంని వదిలేది లేదు”

గుర్రపుడెక్క స్రీలీ6 కోపంగా అన్నాడు మల్లయ్య,

“వాళ్ళ చేతుల్లో తుపాకులుంటాయి. మి పూచిక పుల్లల్లాంటి బాణాలేం చెస్తాయి? మూర్ధంగా చచ్చిపోవాలని మీరందరూ నిర్ణయించుకుంటే మీ ఇష్టం” కనకారావు కూడా లేచి నిలబడ్డాడు.

“మా పెద్ద బైలోడు తెల్ల దొరల్ని ఎదిరించి ఆల్లని ముప్పుతిప్పలు పెట్టింది ఈ అంబుల్తోటేగా సామీ. మా అంబు దెబ్బతింటే సాలు తుపాకులు బేర్‌ మనాల” అన్నాడు మల్లయ్య,

వాదన పెంచడం మంచిది కాదనుకున్నాడు కనకారావ. “సరే. నేను చెవ్ఫాలనుకున్నది చెవాను. కయ్యానికి కాలు దువ్వుకుంటారో, చేతినిండా డబ్బుల్తో వంటినిండా బట్టల్తో, ఆదవాళ్ళ మెడలో నగల్తో పక్కా యిళ్ళల్లో సుఖంగా ఉండాలనుకుంటారో మీరే తేల్చుకోండి. అక్కడ మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. మంచి వైద్య సదుపాయం పొందొచ్చు. మనుషుల్లా బతకండిరా అని చెప్తంటే, లేదు అడవిలో జంతువుల్లా బతుకుతామంటున్నారు. మి ఇష్టం.. మీ ఖర్మ”

వెళ్ళబోతూ రాజన్న దగ్గరకొచ్చి ఆగాడు. “నీ పేరెమిటి?”

“రాజన్న దొరా. బుద్దన్న మా అయ్య దొరా.

“బుడ్డన్న తర్వాత గూడేనికి కాబోయే పెద్దమనిషివి నువ్వేనన్మాట. మీ అయ్యకు వయసైపోయింది. వూళ్ళోకొచ్చి సుఖపడాలన్న కోరికేం ఉంటుంది? మీరందరూ కుర్రాళ్ళు. కోరికల్ని ఎందుకు చంపుకుంటారు? మివాళ్ళ తరఫున నువ్వొచ్చి మాట్లాడాలనుకుంటే గుడి దగ్గరకు రా. నేనిస్తనన్న పైసలు తక్కువనిపిస్తే కూచుని మాట్లాడుకుందాం. నా మాట వినండి. బాగుపడ్డారు” కనకారావు అక్కడినుండి వేగంగా వెళ్ళిపోయాడు.

అతను కనుమరుగు కావడమే ఆలస్యం, “అయ్యా.. ఆ దొర సెప్పింది మా అందరికీ ఇట్టమైంది. నువ్వెందుకు అడ్డుపడ్డున్నావు? నెను సరుకులు అమ్మడానికి వూల్షు౭ల్లినపుడు సూత్తుంటాను కదా ఆల్లందరూ ఎంత సుకంగా ఉన్నారో. మనకూ అస్మంటీ బతుకునిత్తానంటే కాలడ్డం పెద్దావెందుకు?” బుడ్డన్నతో కోపంగా అన్నాడు రాజన్న.

“సుకంగా ఉండటమంటే కుర్సీలు, మంచాలు ఉండటమా? మన సుకానికేం

గుర్రపుడెక్క సలీర తక్కువైంది? సెర్వులో ఈదులాడే సేపల్లా, గాల్లో ఎగిరే పచ్చుల్లా ఎంత సొతంతరంగా బతుకుతున్నామో.. పైసలుంటేనే సుకమా? మనలా సంతోసంగా ఉండటం ఆల్లకు చాతనవుద్ద్ధా?” అన్నాడు మల్లయ్య,

“వూల్లో౭ెల్లి ఎపుడైనా ఓటెల్లో పైసల్‌ పెట్టి తిన్నవా? తింటే ఇలా మాట్లాడవు. రకరకాల రుచులు.. ఉడకబెట్లో కాల్ఫుకునో తినే మాంసంలో ఏముంది? అక్కడ ఎన్ని రకాల వంటలో. ఎన్నాళ్ళు ఈ దుంపలూ, గద్ది, పళ్ళు తింటూ బతకాల?ఆల్లలా మనమూ రకరకాల తిండి తినాల... మంచి బట్ట కట్టుకోవాల. పిల్లగాళ్ళని సదివించి దొరబాబుల్ని సేయాల. ఇయన్నీ నీకు వద్దేమో, మాకు కావాల. మా పిల్లలకు జొరాలొచ్చినా జబ్బులొచ్చినా ఆల్లు సావకుండా బతకాల. మీరేమంటారు?” అంటూ మిగతా వాళ్ళవైపు తిరిగి అడిగాడు.

“బె మాకూ అట్టాంటీ సుకాలే కావాల. పట్నంలో రాజన్న సినేమాకెల్లాడట. కత నాకు సెప్పాడు. మనం ఎప్పుడైనా సినేమా ఎట్లాగుంటదో సూశామా? వూళ్లల్లో శానా ఇల్లల్లో టీవీలుంటాయట. ఆ సుకాలేమిటో సూడకుండానే సచ్చిపోయే బతుకు ఏం బతుకు? అదురుట్టం తడిక తడ్డుంటే సీపో అంటామా? రాజన్న సెప్పిందే సేద్దాం” అన్నాడు బుల్లన్న,

“తొందరపడకండి. మన గూదిెనికి పెద్దమదిసి బుడ్దన్న పెద్దయ్య మాట ఇనంది. అనుబవంతో సెప్తన్న మాట పెడసెవిన పెడితే పెమాదం” అన్నాడు మల్లయ్య.

అక్కదున్న పన్నెండు కుటుంబాలు రెందు వర్గాలుగా చీలిపోయాయి. ఓ వైపు బుద్దన్నా మల్లయ్యా, మరో వైపు గూడెంలోని మిగతా జనాలు.

బుద్దన్నకు వాళ్ళకెలా నచ్చచెప్పాలో అర్ధం కావటం లేదు. తన చెంచులు అమాయకులు. కుట్రలూ కుతంత్రాలు తెలీని పసిపిల్లల్లాంటి వారు. నడిచే నాగుబాములు తిరిగే నాగరిక ప్రపంచంలోకెళ్ళి ఇమదగలరా?

అతనికి అడవిని వదిలి వెళ్ళటం ఇష్టంలేదు. కానీ కనకారావు బెదిరింపు అతని చెవుల్లో మార్మోగుతోంది. పోలీసుల్ని పంపించి లాఠిల్తో కొట్టించి తరిమేస్తే తమ గతేమిటి? అతనికి మరో అనుమానం కూడా వచ్చింది. పోలీసులో తరిమేస్తే ప్రజలే వాళ్ళని తప్పు పట్టవచ్చు. కనకారావు అసలే నాగుపాములాంటి వాడు. అందుకని నక్సలైట్లకు

గుర్రపుడెక్క నీలీర కొరియర్లుగా పన్పేస్తున్నారని కేసు పెట్టి జైల్లో తోయిస్తేనో...

తన మాటని గూడెం వాళ్ళు గౌరవించేలా లేరు. తన కొడుకే ఎదురుతిరిగితే మిగతా వాళ్ళు ఎందుకు వింటారు? గుండెల్ని మెలిపెడుతూ బాధ..తన గూడెం జనాల్ని కాపాడమని మలలమ్మ తల్లిని వేడుకుంటూ, బరువైన గుండెతో గుడిసెలోకి వెళ్ళిపోయాడు. అతన్నోపాటే మల్లయ్య కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

“మనందరి తరఫున రేపెళ్ళి కనకారావుతో మాట్లాడతా” అన్నాడు రాజన్న

బుద్దన్న రెండో కొడుక్కి ఓ అనుమానం $ీకుతోంది. అక్షరజ్ఞానం లేని తమని కనకారావు మోసం చేయదని నమ్మకమెమిటి? అదేమాట రాజన్నతో అన్నాడు. “పట్నం నుంచొచ్చిన కేదార్‌ దొర గారిని పిలిపిత్తే మంచిదన్నా రాతకోతల ఎవ్వారంలో సదూకున్న ఆ దొర మన తట్టుంటే మనకు అన్నేయం జరగదు. మన తరఫున కనకారావుతో ఆ దొర మాట్టాడ్తే బూావుంటది. ృబమంటావు?”

ఆ ఆలోచన అందరికీ నచ్చింది. మరునాడు వూళ్ళోకెళ్ళి కేదార్‌నాధ్‌కి ఫోన్‌ చేస్తానన్నాడు రాజన్న

అందరి మనసుల్లో ఏదో తెలీని ఉద్విగ్నత.. వాళ్ళ జీవితాల్లోకి కొత్త వెలుగు రాబోతుందన్న ఆశ. అడవిలో చీకట్లు మెల్లగా ముసురుకుంటున్నాయి. కొన్ని నిముషాల్లోనే ఆ గూడెం అంధకారంలో మునిగిపోయింది.

మరునాడు రాజన్న వూళ్ళోకెళ్ళి కేదార్‌ సెల్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

“చాలా మంచి వార్త చెప్పావు రాజన్నా. మీరూ నాగరికుల్లా బతకాలన్న నాకోరిక తీరబోతోంది. నేను రేపే శెలవపెట్టేసి వస్తాను. మీ తరఫున కనకారావుతో మాట్లాడ్తాను” అన్నాడు కేదార్‌.

సూర్యకుమార్శి ఫోన్‌ చేస్తే పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి రాలేనని చెప్పాడు. కేదార్‌ ఒక్కడే కారు మాట్లాడుకుని బయల్టేరాడు. గుడిలో విగ్రహ ప్రతిష్ట రోజు వెళ్ళిందే. ఆ తర్వాత మళ్ళా ఇదే మన్నుగొండ వెళ్ళటం.. మూడేళ్ళు గడిచిపోయాయి. ఎటొచ్చీ మన్నుగొండ దేవాలయానికి సంబంధించిన వార్తల్ని తరచూ వింటూనే ఉన్నాడు.

గుర్రపుడెక్క సీలీ6

కారు మన్ననూరు దాటి ఎడమ వైపుకు తిరిగింది. తనకు తెలిసిన వూరు కాదది. అంతా కొత్తగా ఉంది. పరిచయంలేని ప్రాంతానికొచ్చినట్లు...తను మూడెళ్ళ (క్రీతం చూసిన చెట్లు లేవు. దగ్గర్లో అడవి ఉన్న ఆనవాళ్ళు కూడా కన్సించలిదు. మన్నుగొండ వూరు పల్లిటూరులా లేదు... చిన్న సైజు పట్నంలా విస్తరించి ఉంది. భక్తులతో కిటకిటలాదుతూ గంటకో బస్‌ గుడివెపుకి దూసుకెళోంది. ఆ వూరినుంచి గుడికి రెందు కిలోమీటర్ల మేర తాగర్రోడ్డు పడింది. అక్కడ అంత వేగంగా జరిగిన అభివృద్ధికి ఆశ్చర్యమేసింది.

కారు గుడి దగ్గరకు రాగానే అతని కోసమ ఎదురుచూస్తున్న రాజన్నా మల్లయ్యా “దండాలు దొరా” అని స్వాగతించారు. చెరువుకి కొద్ది దూరంలో చెట్లన్నీ నరికసి విశాలమైన మైదానంలా చేసి, అందులో కాటేజీల నిర్మాణం చేపట్టారు. కింద ఆఫీస్‌ గదిలో కనకారావు ఉన్నాడని తెల్సుకుని, రాజన్ననీ మల్లయ్యసీ అక్కడే నిలబడమని చెప్పి కేదార్‌ లోపలికెళ్ళాడు.

కేదార్ని చూడగానే కనకారావు తన సీట్లోంచి లేచొచ్చి “రండి సార్‌..మేనేజర్‌ గారు బ్యాంకునొదిలి పెట్టి మా దాకా వచ్చారంటే పెద్ద విశషమ ఉంటుంది” అన్నాడు.

“చెంచు గూదడేనికెళ్ళి ఏదో ప్రపోజల్‌ పెట్టారట కదా. ఆ విషయం మాట్లాడ్డామని వచ్చాను” కేదార్‌ ఓ కుర్చీలో కూచుంటూ అన్నాడు.

“ఓ.. మరిచేపోయాను. మీరీ చెంచులకు ప్రతినిధి కదా” అంటూ వంకరగా నవ్వాడు కనకారావు. “ఇంతకూ మీరా ముసలోడు బుద్దన్నలా పోట్లాడటానికొచ్చారా లేక ఇంకమైనా కందిషన్లు పెట్టడానికొచ్చారా?”

“మీరంతమంచి ప్రపోజల్‌ తెచ్చాక ఎందుకు పోట్లాడ్దాను? ఆధునిక సమాజం అనుభవిస్తున్న జీవితాన్ని వీళ్ళకెలా అందుబాటులోకి తేవాలా అని మధన పదెవాడ్డి. వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించి నాగరిక ప్రపంచంలోకి తీసుకురావాలన్న మీ ఆలోచన ప్రశంసనీయం”

అప్పటివరకూ టెన్షన్లో సీటు ముందుకి ఒంగి వింటున్న కనకారావు అతని మాటలు వినగానే హాయిగా వూపిరి పీల్చుకుని వెనక్కి వాలాడు.

“ఎట్లయినా చదువుకున్న వాళ్ళకున్న జ్ఞానం, ముందుచూపు అదవిలో పెరిగే

_గుర్రపుడెక్క స్రలీర అక్షరమ్ముక్క రాని చెంచులకేం ఉంటుంది? వాళ్ళకో పక్కా యిల్లు, ఒక్కో కుటుంబానికి రెండెకరాల భూమి ఇప్పిస్తానని చెవ్వాను. నా తరఫున ఒక్కో కుటుంబానికి సేద్యం ఖర్చుల నిమిత్తం పదిహేను వెలిస్తానని చెప్పాను. మీరేమంటారు?”

“బాగానే ఉంది. ఎటొచ్చీ మనం ఏది అనుకున్నా దాన్ని కాగితం మీద పెడితే మంచిదని నా అభిప్రాయం”

“బ్యాంకు మేనేజర్‌ అన్పించుకున్నారు సార్‌. అట్లాగే కానివ్వండి. స్టాంప్‌ పేపర్లు రేపు తెప్పించి పెద్దాను. రాతకోతలు పూర్తి చేద్దాం”

“నెను స్టాంప్‌ పేపర్లు తీసుకునే వచ్చాను”

“అమ్మో... మీది చాలా ముందు చూపు సార్‌” కనకారావు వెకిలిగా నవ్వాడు.

“పక్కా ఇల్లంటే ఏమిటో, దాని కొలతలేమిటో, ఏ లొకేషనో, స్పెసిఫికేషన్లేమిటో మనం ఒకసారి అనుకుని వాటినే అగ్రిమెంట్లో పొందు పరిస్తే బావుంటుంది”

కనకారావు ఇబ్బందిగా కదిలాడు. అమాయకమైన చెంచుల్ని ఏమార్చి, నాలుగు గోడలు వేసి గుడిసెకన్నా కాసింత మెరుగైన యిల్లు కట్టిస్తే చాలనుకున్నాడు. వాళ్ళ మధ్యవర్తిగా తనెదురుగా బ్యాంక్‌ మేనేజర్‌ కూచుని ఉన్నాడు. మోసం చేయడానికి అవకాశం లేకుండా స్టాంప్‌ పేపర్‌ మీద ఆ వివరాలన్నీ పెట్టమంటున్నాడు. అతని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

“ఒక బెడ్రూం, కిచెన్‌, హాల్‌ ఉండేలా కట్టించండి. బాగా గాలీ వెల్తురూ వచ్చేలా ష్లాన్‌ చేయండి. పాన్‌ కాపీని నా మెయిల్‌కి పంపించండి. నా మెయిల్‌ అడ్రస్‌ ఇసాను. ఇంటి ముందు బాగా ఖాళీ స్టలం ఉందేలా చూడండి. కనీసం ఐదారు వందల చదరపు అడుగులకు తగ్గకుండా కట్టివ్వండి” అన్నాడు కేదార్‌.

మళ్ళా తనే అన్నాడు. “మీరు ఇప్పిస్తానన్న రెండెకరాలు సాగుభూమి అయ్యేలా చూడండి”

“అయ్యో... ఆ విషయం మీరు చెవ్పాలా? ప్రభుత్వం చెంచులకోసం ఇచ్చె భూమందీ. చక్కటి సారవంతమైన భూమి. వూరినుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలు. మీకా పొలాల్ని ఇల్లు కట్టించే స్థలాన్ని చూపిస్తాను” అన్నాడు కనకారావు.

గుర్రపుడెక్క సీలీర

“అంతా బాగానే ఉంది. ఎటొచ్చీ వ్యవసాయానికి మీరిస్తానన్న దబ్బి చాలా తక్కువ. కనీసం యాఖిె వేలైనా లేకుండా...”

“సరే యాభై వేలు ఇవ్వడానికి నేను తయారుగా ఉన్నాను”

“డఉందంది మరి...ఆ పంట చేతికొచ్చేవరకు వాళ్ళకు భుక్తి గడవాలిగా. అన్నీ కలిపి లక్ష రూపాయలు ఇప్పిస్తే వాళ్ళు సంతోషిసారు”

“వాళ్ళ విషయమేమోకాని మీరు బాగా సంతోషించేలా ఉన్నారు” అన్నాడు కనకారావు ఏద్వలేక నవ్వుతూ...

గూదేనికి తిరిగెళ్తున్నప్పుడు తనకు పరిచయమైన చెరువు దగ్గర ఆగాడు కేదార్‌. చెరువునిండా గుర్రపు దెక్క..గుండెనెవరో ఇనుప పాదాలకింద వేసి నలిపెస్తున్న ట్లనిపించింది.

గూడెం చేరుకున్నాక అగ్రిమెంట్‌ కాగితాల మీద బుడ్దన్న వేలిముద్రలు తీసుకున్నాడు. వేలి ముద్ర వేస్తున్నప్పుడు బుద్దన్న కళ్ళల్లో తడి కన్పించి కేదార్‌ విచలితుడైనాడు.

“ఎందుకు బాధ పడ్డున్నావు బుడ్దన్నా ఇదంతా మీ మంచి కోసమే జరుగుతోంది. నీ వల్ల ఈ గూడెంలోని చెంచులందరూ హాయిగా నాగరికుల్లా బతకబోతున్నందుకు నువ్వు గర్వపడాలి” అన్నాడు.

“లేదు దొరా...నా సేతులారా నా వాల్లని నాశనం సేస్కుంటున్నా కుర్రాల్లందరూ వూల్లోని మడుసుల్ని సూసి అలా సోకులు సెస్కోవాలని, సుకాలు అనుబగించాలని కోరుకుంటుంటే, మా తాతలు అయ్యల నుంచి మాకట్బీన ఇద్యలన్నీ సచ్చిపోతాయమోనని బయమేస్తాంది దొరా. మా జాతి అడవిని దాటి బైటి పెపంచకంలోకి అడుగుపెడితే ఆల్లి అలవాట్లన్నీ అబ్బి, చెంచుల్లా బతకటం మానేత్తే.. అప్పుడు నా జాతి మిగల్టు దొరా... మిగల్టు” బుడ్డన్న భోరుమని ఏడ్చాడు. అతని కన్నీళ్ళతో వేలి ముద్రలు తడిసి అలికినట్లయిపోయాయి.

చెంచులు తమ గూదేన్ని వదిలి పక్కా ఇళ్ళల్లోకి మారే రోజు దగ్గర పడింది. పన్నెండిళ్ళకు ముఖద్వారంలా రెండు స్తంభాలు నాటి, సిమెంటుతో ఆర్చిలా కట్టి దానిమీద “చెంచు

గుర్రవుడక్క నీలీర పేటి అని చెక్కించారు.

పక్కా ఇళ్ళల్తొకి మారే ముందే ఆడవాళ్ళకు జత చీరలు, రవికలు, మగవాళ్ళకు రెండేసి వ్యాంట్లూ షర్దులూ ఇప్పించాలని కనకారావుని ఒప్పించాడు కేదార్‌. మల్లయ్య, బుద్దన్న తప్ప మిగతా మగవాళ్ళు సంబరపడివోయారు.

“పట్నపోల్లలా మమెందుకు బట్టలు ఏసుకోవాలి సామీ? మా తాతలూ అయ్యలూ ఇలానే గోచీలో తిరిగారు. మేమూ అలానె ఉంటాం. గూడెం వదిలేసినంత మాత్తరాన మేం చెంచులం కాకుండా పోతామా ఏంటి” అన్నాడు బుడ్డన్న

“నిజమే బుడ్దన్నా. మీరెక్కడ ఉన్నా చెంచు జాతికే చెందుతారు. సమాజం ఎంతో అభివృద్ధి చెంది పురోగమిస్తుంటే మీరు గోచీల్తో ఉంటాననడం నాగరికత అన్పించుకోదు. నువ్వు ప్యాంటూ షర్టూ తొడుక్కున్నా చెంచువె కదా. అటువంటప్పుడు అభ్యంతరమెందుకు? సభ్య సమాజం ఎలా ఉంటుందో మీరూ అలా ఉండాలని కదా నా తాపత్రయం” అన్నాడు కేదార్‌.

“అల్లంత దూరం నుంచి సూసినా ఈడు చెంచు పద్దుడు అన్ఫప్పటానికి గురుతులు కొన్ని ఉన్నాయి సామీ. దబ్బలెకున్నా అంబులు లెకున్నా తవ్వకోల లేకున్నాా సెతిలో గొడ్డలి లేకున్నా చెంచోల్లమే. కానీ సిగ తెగ్లోసి, సీర వూడదీసిన ఆడదానిలా బోసి బతుకై వోద్ది. మాకిలా గోచిలే సుకంగా ఉంటాయి” అని బుడ్డ్దన్న అన్నప్పుడు కేదార్‌ పెద్దగా నవ్వాడు.

“మీ జాతంతా కొత్తరాతియుగం మనుషుల్లా బతుకీడుస్తున్నారు తప్ప శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి వల్ల ఒనగూడిన సదుపాయాల్ని వినియోగించుకోవటం లేదు. నా మాట వినండి. అందరూ ప్యాంట్లు వేసుకుని ఉంటే మీరు గోచీల్తో కన్పిస్తే వూరి జనాలందరూ మీవైపు వింతగా చూస్తారు. వాళ్ళతో మీరు కల్సిపోవాలని కదా ఈ ప్రయత్నమంతా” అన్నాడు.

చివరికి మోకాళ్ళ వరకూ వేలాడే పొడవాటి చొక్కా వేసుకోడానికి బుద్దన్నని ఒప్పించారు.

చెంచుల గృహసముదాయ ప్రారంభోత్సవానికి హైద్రాబాద్‌ నుండి నాంస్కృతిక శాఖ మంత్రిగారొచ్చారు. పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని మీడియా వాళ్ళు దిగిపోయారు.

140

గుర్రపుడెక్క సీలీర

ఆ రోజు ప్యాంటూ షర్టూ తొడుక్కున్న మల్లయ్యని చూసి లచ్చిమి మురిసిపోయింది. “ఎంత సక్కగున్నవో.. దొరబాబులా” అంది. మల్లయ్యకు దుఃఖం పొంగుకొచ్చింది. తనకు దొరబాబులా ఉండాలని లెదు... చక్కటి చెంచు పడుచోడిలా ఉండాలని ఉంది.

ముఖద్వారం దగ్గరున్న ఆర్చిని పూలతో అలంకరించారు. ఇళ్ళముందు రంగు రంగుల ముగ్గులు వెశారు.

చెంచు యువతులందరూ రంగురంగుల సిల్కు చీరల్లో మెరిసిపోయారు. ఫోటోగ్రాపర్లు ఫొటోలు తీస్తుంటే సిగ్గుతో మొహాలకు చేతులు అడ్డం పెట్టుకున్నారు.

బుద్దన్నకూ మల్లయ్యకు తప్ప అందరికీ పండగలా అన్పించింది.

మంత్రి గారు ఎర్ర రిబ్బను కత్తిరించగానె అందరూ చప్పట్లు కొట్టారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద నిలబడి మంత్రిగారు మాట్లాడటం ప్రారంభించారు.

“అడవిలో జంతువుల్లా దుర్భరమైన బతుకు బతుకుతున్న చెంచు జాతిని ఉద్ధరించాలని కంకణం కట్టుకుంది మా ప్రభుత్వం. సభ్య సమాజానికి దూరంగా ఆటవికుల్లా గడుపుతున్న చెంచుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అవసరమైన అన్ని చర్యలూ మేం తీసుకుంటున్నాం. చెంచులకు పునరావాసం కల్పించడంతో వాటు స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక్కో కుటుంబానికి రందెకరాల సాగుభూమి పట్టాల్సి ఇవ్వడానికి సంకల్పించాం....” అంటూ అరగంట తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పధకాల గురించి ఏకరువు పెట్టాడు.

మంత్రిగారు తన మంది మార్చలంతో వెళ్ళిపోయే సమయానికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. వాళ్ళను సాగనంపాక కనకారావు చెంచుపేటకు తిరిగొచ్చాడు. రాజన్నను బైటికి పిలిచి, “ఇపుడిచెంచు పేటకు పెద్దమనిషివి నువ్వే, నీ యింట్లోనే సామాన్లు లేకపోతే ఏం బావుంటుంది చెప్పు. నేను పట్నం నుంచి మీక్సావల్సిన ఫర్నీచర్‌ అంతా తెప్పిన్తాను. మీ వాళ్ళలో ఎవరెవరికి ఏమేం కావాలో కనుక్కో రేపు సాయంత్రానికంతా లారీలో సామాను వచ్చిస్తుంది” అన్నాడు.

ఒక్క మల్లయ్య తప్ప మిగతా అందరూ ఫర్నీచర్‌, కలర్‌ టీవీ కావాలని చెప్పారు.

గుర్రపుడెక్క నలీర

“ఒకో కుటుంబానికి రమారమిగా ముప్పయ్‌ వేలవుతుంది. ఖర్చు పెరగొచ్చు కూడా. నేనివ్వాల్సిన లక్షలో కోసేసుకుంటా. సమ్మతమెనా?” అన్నాడు కనకారావు. అందరూ గా(ర్రైల్లా తలలూవారు.

“మీ అందరికీ ఈ రోజు భోజనం నేనే ఏర్పాటు చేస్తున్నాను. నాతోపాటు రండి” అన్నాడు.

మల్లయ్య, బుద్దన్న తప్ప మిగతా మగవాళ్ళంతా పొలోమని అతని వెంట వెళ్ళారు.

“ఇప్పసారా తాగడానికి అలవాటు పడిన వాళ్ళాయె. నాలిక పీకేస్తా ఉంటది. మీలాంటివాళ్ళ కోసమనే ఈ వైన్‌ షాప్‌ తెరిచాను. కె.కె వైన్‌ షాప్‌ అంటె కె.కనకారావు వైన్‌ షాప్‌. నికార్సయిన సీమ సరుకు. కావల్సినంత తాగండి. స్వర్గం కన్పించటం ఖాయం” అన్నాడు కనకారావు.

షాపులో కూచున్నతనితో “ఇదిగో చూడు.. వీళ్చందర్ని గుర్తు పెట్టుకో. ఎప్పుదదిగినా కాదనకుండా సరుకివ్వు బ్రాందీ విస్కి రమ్ము వీర్‌.. వాళ్ళష్టం. దడబ్బులదక్కు ఒక్కొక్నరి పేరుతో ఖాతా తెరిచి పద్దు రాసుకో తను తెప్పించిన (ఫై చెసిన జీడిపప్పుని వాళ్ళ ముందుంచుతూ అన్నాడు.

అందరూ ఫుల్లుగా తాగారు. పక్శనే ఉన్న మిలట్రీ హోటల్‌ నుంచి చికెన్‌ బర్యాని పొట్లాలు తెప్పించి ఇచ్చాడు. వాళ్ళకు బిర్యాని రుచి బాగా నచ్చింది. ఆవురావురుమంటూ తిన్నారు.

“మీకెప్పుడు బిర్యానీ తినాలనిపించినా ఈడితో చెప్పండి. ఎన్ని కావాలంటే అన్ని తెప్పించి ఇస్తాడు. డబ్బులివ్వక్కరలెదు. పద్దు రాసుకుంటాడు. ఇప్పుడర్ధమైందా ఇన్నాళ్ళూ ఇలాంటి ఎన్ని సుఖాలకి మీరు దూరమైనారో” అన్నాడు కనకారావు.

“సత్తెం దొరా అందరూ మత్తుగా తలలూవారు.

బిర్యాని పొట్లాలు పారెల్‌ కట్టించి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. “మీ ఇళ్ళల్లో ఆడోళ్ళకీ పిల్లలకీ కూడా తిన్సించండి. సంబరం చేసుకోండి” అన్నాడు.

కనకారావు వాళ్ళ కళ్ళకు దేవుడిలా కన్పించాడు. “నువ్వు శానా మంచోడివి దొరా... మా పాలిట దేవరవి నువ్వే దొరా అంటూ దండాలు పెట్టారు.

గుర్రపుడెక్క సలీర

ఒక్కొక్కరి చెతిలో పదివెల రూపాయలున్న కవర్‌ పెట్టి “మిగతా డబ్బంతా నా దగ్గర భద్రంగా ఉంటది. మీరు బ్యాంకులో దాచుకున్నట్ల. మీకవసరమొచ్చినపుడల్లా ఇస్తుంటాను” అన్నాడు కనకారావు.

వాళ్ళు చెంచుపేట వైపుకు తూలుకుంటూ వెళ్ళిపోగానే, వైన్‌ షాపులో కౌంటర్లో కూచున్న వ్యక్తితో చెప్పాడు. “ఒక్కో నాకొడుకు ఎంతెంత తాగాదో చూశావా? మంచినీళ్ళు తాగినట్లు సీసాలు సీసాలు...ఇంతకీ పద్దు సరిగ్గా రాశావా?”

“రాశాను సారొ తన దగ్గరున్న నోట్‌ పుస్తకం చూపించాడు.

“అంతా తప్పుడు లెక్కలు రాశావు”

“లేదు సార్‌. కరెక్టుగానే రాశాను. రాజన్న పీటర్‌ స్కాట్‌ ఫుల్‌ బాటిల్‌, మూడు సోడాలు... ఇంకా...”

కనకారావు కరుగ్గా నవ్వాడు. “అంత కరెక్ట్‌గా రాస్తే పైకొప్పుడొస్తావ్‌? తప్పుడు లెక్కలు రాస్తెనే సరిగ్గా రాసినట్లు, అర్ధమైందా? ఏళ్ళు ఒక బాటిల్‌ తాగితే రెండని రాయి. ఆ బాటిల్లో సగం సళ్ళు కలిపి తాగించు. జీడిపప్పు ఖరీదు మూడింతలు రాయి. బిర్యాని పొట్లాల ఖరీదు నాలుగింతలు వేయి. ప్రతినెలా వందకి ఐదురూపాయల చొప్పున వడ్డీ లెక్కకట్టి పద్దు తిరగరాయి. నేనిస్తానన్న డబ్బు పోను వాళ్ళే నాకు అప్పు తేలాల. అది ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. అర్దమైందా?”

“అర్ధమైంది సార్‌” అన్నాడతను నోట్‌ పుస్తకంలో అంకెల్ని కలుపుతూ..

చెంచుపేటలో పండుగ వాతావరణం నెలకొంది. బుద్దన్న చెత కూడా చికెన్‌ బిర్యాని తిన్సించాడు రాజన్న.

మల్లయ్య కొని తెచ్చిన జొన్న పిండితో రొట్టెలు చేసింది లచ్చిమి. వాటిలో ఉల్లి గడ్డ నంజుకుని తిన్నారు.

మల్లయ్య తన భార్య వైపు చూస్తూ “ఈ దినం అందరూ బిర్యాని తిన్నారు. సీకే ఏమి పెట్టలకపోయాను. బాద పడ్డున్నావా?” అన్నాడు.

“లేదు మామా..నీ జాగర్త సూసి సంతోసపడ్డున్నా” అంది మనస్పూర్తిగా.

మల్లయ్య కొత్త యింటినోసారి పరిశీలించాడు. గదుల్లో పెట్టడానికి సామాన్లు ఏమీ

గుర్రపుడెక్క స్రీలీర లీవు. తమ గుడిసెలోంచి తెచ్చుకున్న రెండు ఈత చాపలు, రెండు మట్టికుండలు, అల్యూమినియం గిన్నెలు రెండు, ఓ దుప్పటి, కొన్ని బట్టలు... అంతే. వాటితో పాటు వెంట తెచ్చుకున్న మూడు కోళ్ళు, కుక్క బైరిగాడు...

“లచ్చీ.. ఈ కొత్తిల్లు నీకు సంతోసాన్నిచ్చిందా? ఇన్నాల్లూ బుడ్డిదిపం ఎల్తురే. ఇపుడు కరెంటు లైటు.. గాలి రావడానికి పంకా అన్నీ ఉన్నాయి... నీకు బాగుందిగా” అన్నాడు.

“సీకు నచ్చనిది నాకెలా నచ్చుద్ది మామా. ఈ ఇంటికన్నా లగ్గమయ్యాక మనం కొత్తగా కాపురం పెట్టన ఆ గుడిసె శానా బాగుంది. పైన పంకా తిరుగుతున్నా ఎంత ఏడిగా ఉందో సూశావా? అదే మన గూడెంలో ఎంత సల్లటి గాలి.. సెట్లన్నీ పంకాలుగా మారి గాలిని గుడిసెలోకి వూదేవేమో” అంటూ నవ్వింది.

మరునాడు సాయంత్రానికల్లా చెంచుపేటలోని ఇళ్ళ స్వరూపమే మారిపోయింది. ప్లాస్టిక్‌ కుర్చీలొచ్చాయి, నవారు మంచాలొచ్చాయి, దిళ్ళూ దుప్పట్లూ వచ్చాయి, బీరువాలొచ్చాయి.. వాటితో పాటు కలర్‌ టీవీకూడా వచ్చింది. నెలరోజులు తిరిగేసరికి వాళ్ళల్లో ఎంత మార్పు వచ్చిందంటి మొన్నటివరకూ అడవిమీద ఆధారపడి బతికిన చెంచులు వీళ్ళేనంటే నమ్మలెనంత.. మగవాళ్ళు సెలూన్‌ కళ్ళి జుట్టుని స్టయిల్‌గా కత్తిరించుకున్నారు. కొత్తకొత్త (డైస్‌లు కుట్టించుకున్నారు. కొంతమంది బూట్లు కొనుక్కున్నారు. ఆడవాళ్ళు కుండలూ సత్తుగిన్నెలూ పదెసి సీల్‌ సామాన్లు కొనుక్కున్నారు. కొత్త చీరలూ, పౌడర్లూ స్ప్నోలు..

చెతిలో డబ్బులాడ్డున్నాయి కాబట్టి శ్రమపడాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచీ పిల్లాజెల్లా అందరూ టీవీకి అతుక్కుని కూచుంటారు... నాయంత్రం కావటం ఆలస్యం మగాళ్ళంతా 3 3 వైన్‌ వాపు౩ళ్ళి పీకల్లాక తాగేసి, షాపులో ఉన్నతను తెప్పించి ఇచ్చిన బిర్వాని పొట్లాలు తీసుకుని తూలుకుంటూ ఇళ్ళకు చేరుకుంటారు.

మల్లయ్యని మాత్రం అడవితో అల్లుకున్న జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. అతడి మనసు నిండా అడవే. కలల్నిండా అడవె...లచ్చిమితో కబుర్లలోనూ అడదవే...

గుర్రపుడెక్క సలీర

“వురీ అంతలావు బెంగెట్టుకోమాకయ్యా, బెంగ జొరం పట్టుకుంటది” అంది లచ్చిమి. మల్లయ్య వాలకం చూస్తే ఆమెకు దిగులేస్తుంది. మనిషి కడుపునిండా తినటం లేదు. కంటినిండా నిద్రపోవటం లేదు.

“ఇక నేనుండలేనే... అడివిలో౭ళ్ళొత్తా” అన్నాడో ఉదయం.

“వద్దుమామా.. మళ్ళా అడివిలోకి ఎల్లమని ఆ కనకారావుకి మాటిచ్చాం గదా”

“అడివి ఆడి బాబు సొతా... అది అందరిది... అడవి మా తల్లి... ఆడెవడు ఆపడానికి?”

“మాటిచ్చి తప్పితే మన పెద్దమడిసికి మాటరాదా...నామాటీను మామా”

“అది కాదే లచ్చీ.. ఆల్లడిగింది మల్లా అడవికి ఏటకోసరం ఎల్లకూడదని.. పళ్ళూ దుంపలు ఏరుకోకూడదని.. సూట్టానికి ఎల్తే తప్పేం లేదులే, రాతిరంతా కలల్లో అడివిలోని మానులూ పచ్చులే కన్చడ్డాయి. ఓ వాలెల్లి పల్మరించి వత్తానే” అన్నాడు బేలగా..

లచ్చిమి గుండె కరిగి నీరైంది. “నేనూ వత్తా మామా అంది.

నర్సిమ్మని భుజాల మీద కూచోబెట్టుకుని అడవిలోకి బయళ్చెరారు. బెరిగాడు నేనూ వసానంటూ మొరిగాడు.

మొదట తమ గూడెం ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు. అక్కడ గుడిసెలు లేవు. నేలంతా చదునుగా ఉంది. ఇప్పచెట్లు వేప చెట్లు జువ్వి చెట్లూ ... అన్నీ నరికేశారు. ఒకప్పుడు చెంచులు సంతోషంగా తిరుగాడిన చెంచుపెంటలా లేదా స్టలం. స్మశానంలా ఉంది.. అడవిని చంపేసి భూమిలో పూద్చిపెట్టి, పైనంతా మట్టి కప్పేసి చదును చేసినట్లు...

నెలక్రితం జవజీవాలో తుళ్ళిపడిన నేల.. కోళ్ళ అరుపులు... మొరిగే కుక్కలు... పక్షుల కూతలు.. చెంచు యువతుల నవ్వులు... దప్పు శబ్దాలు... దరువుకి దీటుగా లయగా కదిలే పాదాలు... ఏవీ లేవక్కడ. అంతా నిశ్ళబ్దం...భయపెట్టై నిశ్శబ్దం.. గుండెల్ని మెలిపెట్టె నిశ్శబ్దం...

మల్లయ్య అక్కడే కూలబడి మోకాళ్ళలో తల పెట్టుకుని ఎడ్చాడు. లచ్చిమి ఎంత సముదాయించినా అతని ఏడుపు ఆగలేదు.

“ఈల్లు అడివిని బతకనీరు లచ్చిమీ. మనల్ని తరిమేసినట్టై ఈ అడివిలోని జంతువుల్ని పిట్టల చెట్లనీ అన్నిటినీ తరిమేస్తారు. అప్పుడు అడివి సచ్చిపోతుంది. నా అడివితల్లిని

గుర్రపుడెక్క సలీం సంపేత్తున్నారు లచ్చిమీ” అంటూ తన కొడుకుని కౌగిలించుకుని ఎడ్వాడు.

లచ్చిమి అతన్ని లేపి నడుం చుట్టూ చేయి వేసి నడుపించుకుపోతూ “పెతి వొద్దూ ఒకేలా ఉండదుగా మామా. మారిపోతా ఉంటది. ఈ అడివీ మారిపోతది. మన సేతుల్లో ఏముంది సెప్పు” అంది.

“సత్తెమే. మారుపు తప్పదు. కాదన్ను. కానీ లచ్చిమీ.. అది మంచి మారుపు కాకుండా ముదనట్టపు మారుపైతే మనసులో ముల్లులా గుచ్చుకుంటది” అన్నాడు.

అతన్ని ఉత్సాహపర్పాలనె ఉద్దెశంతో “పద మామా.. మనం కలిసిన సోటునీ, అక్కడి మట్టనసీ బర్మనీ సూసొద్దాం” అంది.

“అమ్మ సెట్టుని సూడొద్దా? ఎన్ని దినాలైందో సూసి...మన బుడ్డోడికి కూడా సూపించాల. మన లగ్గమయ్యాక అమ్మ సెట్టుని మర్సేపోయానే లచ్చ” మల్లయ్య మొహం కళకళలాడింది.

“నువ్వు మరిసిపోలేదు మామా..నా పేమతో మురిపించి నువ్వు మరిసిపొయ్యేలా సేశా” లచ్చిమి బొండు మల్లెలు విచ్చుకున్నట్లు నవ్వింది.

విళ్ళను అల్లంత దూరంలో చూడగానే వేపచెట్టు తన కొమ్మల తలల్ని వూపి ఆనందాన్ని వ్యక్తం చెసింది.

కొడుకునెత్తుకుని చెట్టుని చూపిస్తూ “ఒరె నర్సిమ్మా. ఇదేరా నా అమ్మసెట్టు” అన్నాడు. వాడు దిగి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకున్నాడు. లచ్చిమీ మల్లయ్య ఆ చెట్టు బోదెనానుకుని కూచున్నారు.

“కఈడికి అడివితల్లి సల్లని నీడలో ఎదిగే అదురుట్టం లదు మామా అంది లచ్చిమి.

“జెనె..నాకూ అదే దిగులుగా ఉంది. ఈడింకాస్త పెద్దయ్యాక అడివిలోకి లాక్కొత్తా, నాకు తెల్సిన ఇద్యలన్నీ నేర్చిత్తా. అడుగుల గుర్తుల్ని బట్టి అవి ఏ జంతువ్వో తెల్సుకోటం, సెద పుట్టల్ని సూసి అందులో ఉసుళ్ళున్నాయో పొములున్నాయో సెప్పే ఇద్య, ఏ జంతువు ఎప్పుడు జత కడ్తుందో, దాని అలవాట్లు, కోపాలు సిరాకులు, ఎప్పుడది పెమాదకరమో, ఏ డొంకల్లో తిరుగాడుద్దో అన్నీ నేర్పిత్తా అంబులేయటంలో ఈణ్ని చెంచు ఈరుజ్జి సేత్తా” అన్నాడు.

నగర

గుర్రపుడెక్క సీలీర

“అబ్బో.. అయ్యకు తగ్గ కొడుకుని సేత్తావన్మాట”

“అంతేగా మరి” అంటూ నవ్వాడు మల్లయ్య.

పొలాల పట్లాలు చేతికొచ్చి మూడు నెలలైపోయాయి. ఈ మధ్య కాలంలో బుడ్డన్నతో ఒకటైండు సార్లు సేద్యం గురించి కదిపి చూశాడు మల్లయ్య. 'ఈ ఎండాకాలం పోయి ఓ సినుకు పడనీ అనడం వల్ల ఓపిగ్గా ఎదురు చూశాడు.

తొలకరికింకా నెలోజులుందనగా కనకారావు నుంచి చెంచులందరికీ పిలుపొచ్చింది. ఒకప్పటి చెంచుపెంట స్థలంలో పునాదులు తవ్విస్తున్నాడని తెలుసుకుని అందరూ అక్కడికెళ్ళారు. తమ గుడిసెలున్న చోట్లో మనిషిలోతు గుంటలు తవ్వి ఉండటం చూసి మల్లయ్య వ్రాణం గిలగిల్లాడింది. అక్కడి పనుల్ని అజమాయిషీ చేస్తున్న కనకారావు ఏీళ్ళను చూడగానే “రండి రండి... అయ్యో ఇక్కడికొచ్చారా? గుడి దగ్గరున్న ఆఫీస్‌కు వస్తారనుకున్నానే... పర్లేదు. నిలబడే మాట్లాడుకుందాం” అన్నాడు. ఈ వ్యవహారాన్ని వేగంగా తెమల్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళను రమ్మన్న సమయానికి ఆఫీస్‌ గదిలో లేకుండా ఇక్కడి కొచ్చాడతను. వాళ్ళకు ఆలోచించుకునే వ్యవధి కాని, వరెవాళ్ళని సంప్రదించేంత సమయం కాని ఇవ్వకుండా తన పాచిక పారేలా చేసుకోవాలనెదే అతని ఆలోచన.

“పొలాల్ని దుక్కి దున్ని విత్తనాలు నాటాల్సిన సమయం దగ్గరపడ్డోంది. మీ పొలాల్లో ఏం పంట వేయాలనుకుంటున్నారు?” అన్నాడు అందర్ని ఉద్దెశించి.

“ఏ పంట ఏయాలో మాకేం తెలుస్తది దొరా.. మీరేం సేయమంటి అదే సేత్తాం” వినయంగా చేతులు కట్టుకుని చెవ్పాడు రాజన్న

“పంటదేముంది ఏదైనా పండించొచ్చు. జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, మొక్కజొన్న. అనుభవం ఉంటే చాలు. కానీ మీకెవ్వరికీ అనుభవం లేదే. పది పాతికేళ్ళుగా సేద్యం చెస్తున్న రైతులు కూడా వర్షాలు పదక కొన్నళ్ళు, వర్నాలెక్కువై వరదలొచ్చి కొన్నళ్ళు.. తాలు గింజలో పంట ఎదక్క. ఎరువులు దొరక్క పంట ఏపుగా ఎదిగినా కోత సమయానికి పురుగు పట్టి.. రకరకాలుగా నష్టపోతున్నారు. చెసిన

గుర్రపుడెక్క నలీరి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటప్పుడు వ్యవసాయం గురించి ఏమీ తెలీని మీరు పంట వేశాక చేతులు కాల్చుకుని మిగిలిన కాసిని డబ్బులు కూడా వోగొట్టుకుంటారని నా భయం” అన్నాడు.

“మరి మమ్మల్ని ఏం సేయమంటావ దొరా” మళ్ళా రాజన్న అడిగాడు.

“మీకు ప్రభుత్వం వాళ్ళిచ్చిన వొలాలకు ఆనుకునే నా పొలాలున్నాయి. నేనెలాగూ కూలీల్ని పెట్టి వ్యవసాయం చేయిస్తుంటాను. మీ పొలాల్ని కూడా నాకు కౌలుకిచ్చేస్తే సరి. మీకే దిగులూ ఉండదు”

“కౌలంటే ఏంటి దొరా” బుల్లన్న అడిగాడు.

“మీ పొలాల్లో పంట పండించుకుంటున్నందుకు ఏడాదికింతని మీకు పైసలిసాను. పంట పందకవోయినా, కరువొచ్చినా వరదొచ్చినా కష్టం నష్టం నావే. మీకు మాత్రం కౌలు డబ్బులు ముద్దాయి. అంటే శమ లేకుండా ఫలితం పొందటం అన్మాట” అంటూ నవ్వాడు.

అప్పటివరకూ తమ కిచ్చిన పొలాల్లో వ్యవసాయం ఎలా చేయాలో ఎన్ని ఇకృట్లు పడాలో అని మల్లగుల్లాలు పద్ద్తున్న చెంచులకు కనకారావు మాటలు వినగానే నెత్తి మీద పాలు పోసినట్లనిపించింది.

ఎకరాకి ఎంత కౌలిస్తాడో కనుక్కోకుండానే “అట్లాగే నా పొలం తీసుకో దొరా” అన్నాడు రాజన్న మల్లయ్య తప్ప తమ పొలాన్ని కౌలుకివ్వడానికి అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు.

“కాలు పైసలు ఎంతిస్తావు దొరా” బుడ్డ్దన్న అడిగాడు.

“పెద్దమనిషి వనిపించావు బుద్దన్నా. నేను మీ అందరి మేలు కోరేవాడిని. మీకన్యాయం చేస్తానా? మిగతా రైతులు ఏ రేటుకైతే కౌలుకి తీసుకుంటున్నారో మీకూ అదే రేటు కట్టిన్తా” అన్నాడు. మల్లయ్య వైపు తిరిగి “నీ సంగతేమిటి మల్లయ్యా”అని అదిగాడు.

“నేను ఎగసాయం సేస్తాను దొరా” అన్నాడు మల్లయ్య,

ఓరి పిచ్చోడా అన్నట్లు పెద్దగా నవ్వాడు కనకారావు. లోపల ఎగసిపడ్డున్న క్రోధాగ్నిని నవ్వు వెనక దాచేస్తూ “సరే నీ ఇష్టం. మరి పొలం పనులకు కూలీలు అవసరమౌతారు

గరి,

గుర్రపుడెక్క సఫీర కదా. ఎవరూ తెలీదే నీకు”అన్నాడు.

“నేనూ నా ఆడది సాలు దొరా. ఏరే కూలీలు మాకెందుకు?”

కనకారావులో రగులుతూ ద్వేషం.. తనకు ప్రతి చోటా ఎదురు తిరుగుతున్న వీడ్ని అవకాశం దొరికితే పాతాళానికి తొక్కేయాలన్నంత కోపం.. అవేమీ పైకి కన్పించనీయకుండా * సరే. మల్లయ్య తప్ప మిగతా అందరూ వచ్చి ఈ కాగితాల మీద వేలిముద్రలు వేయండి” అన్నాడు.

కారు బోనెట్‌ పైన తెల్లకాగితాలను ఉంచి వాటిమీద వేలి ముద్రలు తీసుకున్నాడు.

“మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎలాగూ మీరందరూ పనిలేక ఖాళీగానే ఉన్నారుగా. వ్యవసాయపనులకు వరే కూలీల్ని పెట్టుకునే బదులు అదే కూలి మీకిస్తాను. అంటే మీకు రెండు రకాలుగా దబ్బులొస్తాయన్నాట. ఓ వైపు కౌలు దబ్బులు, మరో వైపు వారం తిరిగేసరికల్లా కూలిడబ్బులు.. ఏమంటారు?” అన్నాడు.

“శానా మంచిగుంది దొరా. నువ్వు సల్లంగా ఉండాల” రాజన్న వంగి వంగి దండాలు పెట్టాడు.

అందరూ తిరిగివెళ్ళనా మల్లయ్య అక్కడే నిలబడి ఉండటం చూసి “ఏం మల్లయ్యా.. మనసు మార్చుకున్నావా?” అన్నాడు కనకారావు.

“లేడ్దారా.. పైసలడుగుదామని నిలబడ్డా”

“ఏం పైసలు?”

“మాకిత్తానన్న లచ్చ రూపాయలు దొరా. పంట ఏయాలంటే పైసల్‌ కావాలిగా దొరా”

కనకారావు అతని వైపు దిర్ధంగా చూశాడు. “రాజన్న చేతికిచ్చి పదివేలు పంపించాను. అందలేదా?”

“అందినయ్‌ దొరా. మిగతా తొంబై ఏలిప్పిత్తే...”

“తాంభై వెలేమిటి? నీ యింటికి కరెంటు కనెక్షన్‌ ఇప్పించా... నీళ్ళ పంపు పెట్టించా..గదుల్లో లైట్లూ, ఫ్యాన్లు పెట్టించా. పైపులు పెట్టించా.. వీటన్నిటికి దడబ్బులెవడిస్తాడనుకున్నావు?”

గుర్రపుడెక్క సలీం

“కేదార్‌ దొరగారికి ఇచ్చిన మాట ....”

“యిల్లు కట్టిస్తానన్నా గాసీ కరెంటు పెట్టిస్తానన్నానా.... సళ్ళ కనెక్షన్‌ ఇప్పిస్తానన్నానా? వీటన్నిటికీ ఒక్కో యింటికి నలఖెై వేలు ఖర్చయింది. అది తెగ్గొట్టి మిగతా దబ్బులిస్తా. ఓ వారం తర్వాత కన్వించు. ప్రస్తుతం నా దగ్గర డబ్బుల్లేవు” అనేసి మరో మాటకు తావివ్వకుండా కారెక్కి వెళ్ళివోయాడు.

తమ యిళ్ళ ముందున్న ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు నాటాడు బుడ్డన్న. ఉదయాన్నే వాటికి సళ్ళు పోస్తూ ఆలోచిస్తున్నాడు. కనకారావు తమకు మేలు చేస్తున్నాడని అందరూ మురిసిపోతున్నారు. కానీ కనకారావుకు సమీపంగా నిలబడినప్పుడల్లా ప్రమాదకరమైన జంతువేదో పక్కనే ఉందన్న భావన బుడ్డన్నని వీడటం లేదు. గాలిలో తేలుతూ వచ్చే వాసనల్ని బట్టి దాపులో ఉన్న జంతువేదో అది ప్రమాదకారో కాదో గ్రహించే శక్తి చెంచులకు స్వతహాగా వంటబడ్ద్డుంది. కనకారావు కపటపు నవ్వు అతన్ని మోసపుచ్చలికపోతోంది. లేడికూనలమీదికి దుమకడానికి ఆయత్తమైన చిరుతపులి కళ్ళలోని ఆకలి తనకు కనకారావు కళ్ళల్లో కన్పిస్తుంది. అతని శ్వాస పాము బుసలా.. అతని మాట చావు దప్పులా..

కాని ప్రస్తుతం తను అశక్తుడు. తన మాట వినే స్థాయిని దాటిబోయారందరూ. నాగరికత వ్యామోహంలో తమ సంస్కృతీ నాంప్రదాయాలను బలిచ్చుకుంటున్నారు. మైదానాల్లో నివసించే మనుషుల తళుకు బెళుకులు వీళ్ళ కళ్ళకు పొరల్లా కప్పేశాయి. యిపుడు తన పెద్దరికం ఎవ్వరికి అక్కరలేదు. తన సలహా ఎవ్వరూ ఆలకించరు. మలలమ్మా తల్ల... నా జాతిని కాపాడు అని వెడుకుని ఓ దీర్హమైన నిట్టూర్పు విడిచాడు.

పొలానికని బయళ్టెరిన మల్లయ్య మొక్కల దగ్గర దిగులుగా కూచుని ఉన్న బుడ్డన్నని చూసి “ఏంది పెద్దయ్యా.. ఏదో ఆలోసిత్తున్నావౌ” అన్నాడు.

“అడివి గురుతుకొస్తోంది. అలా గురుతొచ్చినపుడల్లా గుండెల్లో ఏదో బరువుగా అన్పిస్తాంది” అన్నాడు గుండెమీద చేయి వెసి రుద్దుకుంటూ.

ఆ బాధ ఎంత పదునుగా ఉంటుందో ఎంత లోతుగా గాయం చేస్తుందో మల్లయ్యకి

గుర్రపుడెక్క సలీర అనుభవమే. “పొలం సూత్తానికెల్తున్నా. వత్తావా” అని అడిగాడు.

బుడ్డన్న ఉత్సాహంగా లేచాడు. “పద. ఇన్ని దినాలు మనం యిత్తనం నాటకుండానే పెరిగిన సెట్ల మద్దిన పుట్ల మద్దిన తిరిగాం. ఇపుడు మనమే పైరుని పెంచబోతున్నాం. నువ్వు శానా మంచి పని సేశావు మల్లయ్యా, నీ పొలాన్ని నువ్వే సాగు సేయబోతున్నావు” అన్నాడు.

వాళ్ళు పొలాల దగ్గరకెళ్ళిటప్పటికి చెంచుల పొలాల్ని ట్రాక్టర్‌తో ఎవరో దున్నిస్తున్నారు.

“ఆ నామినడుగుదామా నా పొలాన్ని కూడా దున్నమని అన్నాడు మల్లయ్య.

“వద్దు. పైసల్‌ శానా కర్పవుతాయి” అంటూ చూట్టూ చూసాడు బుద్డన్న దూరంగా పొలంలో కాడెద్దులతో దున్నుతున్నాడో రైతు. “అక్కడిళల్లి ఇవరాలు కనుక్కుందాం” అన్నాడు.

ఇద్దరూ అతన్ని సమీపించారు.

“దండాలు సామి” అన్నాడు మల్లయ్య. బుడ్దన్న కూడా దండం పెట్టాడు.

తను అందరికీ దండాలు పెడ్తుంటే తనకు దండాలు పెడ్తుంది ఎవరబ్బా అని ఆశ్చర్యపోతూ ఎద్దుల్ని నిలిపి “ఎవరు మిరు” అని అడిగాడు కొమరయ్య,

“నా పేరు మల్లయ్య సామీ. ఈయన మా పెద్దయ్య బుడ్డన్న మెం చెంచులోల్లం సామీ. మన్నుగొండ వూరు”

“ఓ.. అడవిలోంచి తెచ్చి వూర్లో యిళ్ళు కట్టించి యిచ్చింది మీకేనా? ప్రభుత్వం సాగు చేసుకోమని మీకిచ్చిన భూముల్లో కనకారావు ట్రాక్టర్‌ పెట్టి దున్నిస్తున్నాదేమిటి?”

“మా వాల్లందరూ పాలాల్ని కనకారావుకు కౌలు కిచ్చారు దొరా. ఈ మల్లయ్య తప్పు” అన్నాడు బుడ్డన్న.

కనకారావు ఎంతటి దుర్మారుడో కొమరయ్యకు తెలుసు. తన పొలాన్ని కూడా కాబేయడానికి కుట్ర పన్నిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎదిరించి స్వంతంగా వ్యవసాయం చెయడానికి సిద్ధపడిన మల్లయ్యను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు.

“ఇంతకూ ఏం పనిమీదొచ్చారు?” అని అడిగాడు.

“నా రెండెకరాల పొలాన్ని కూడా దున్నించాల సామి... నీ కాడెద్దులు అరువిత్తే... ఎన్ని

గుర్రపుడెక్క నలీర పైసలైతే అంత యిచ్చుకుంటా సామీ” అన్నాడు మల్లయ్య,

“వ్యవసాయం చేయటంలో అనుభవముందా?”

“లేదు సామీ”

“ఏం పంట వేయాలో ఆలోచించుకున్నావా?”

“లేదు సామీ”

“కాదెద్దుల్ని అరువిస్తే దుక్కి దున్నటం చెతనవుతుందా?”

“లేదు సామీ”

అతని అమాయకత్వం చూస్తే జాలి పడాలో కోప్పడాలో అర్ధం కాలేదతనికి. ఎటొచ్చీ సాయం చేయాలని మాత్రం అనుకున్నాడు.

“వీ బంద బడ. ఏ పంటకి ఎంత నీరు పెట్టాలో, ఎంత ఎరువేయాలో, ఎన్ని గింజలు నాటాలో ఎంత ఎడంలో నాటాలో తెలీకపోతే వృవసాయం ఎలా చేస్తావు? సరే. నేను నా పొలంలో మొక్కజొన్న వేస్తున్నా నువ్వూ అదే పంట వేయి. ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో చెప్తంటాను అన్నాడు.

“మరి వొలం దున్నటానికి...”

“మరో రెండ్రోజుల్లో ఈపొలం దున్నడం ఐపోతుంది. తర్వాత నీ పొలం పని... రేపుదయం మా యింటికి రా. కిరాణా షాపు కాడకొచ్చి కొమరయ్య ఇల్లెక్కడంటే ఎవరైనా చెపారు. విత్తనాలు కొనడానికి శ్రీశైలం వెళ్తున్నా నువ్వూ పైసల్‌ తెచ్చుకో”

“ఎన్ని పైసలైతయ దొరా” బుడ్దన్న అడిగాడు.

“రెండెకరాలకి పదహారు కిలోల విత్తనాలు అవసరమౌతాయి. అగ్రికల్చరల్‌ మార్కెట్లో సబ్సిడి ఇస్తారు...”

అతన్ని మధ్యలోనే అద్దుకుంటూ “ల్రయి కూడా కొనాలా సామీ” అని అడిగాడు మల్లయ్య,

కొమరయ్య పెద్దగా నవ్వాడు. “నీ బండ బడ. సబ్సిడీ అంటే సగం పైసలు ప్రభుత్వమె భరిస్తుందన్నాట. ఓ రెండొందలు తెచ్చుకో. బేగీ వచ్చేయ్‌. ఎనిమిదింటి బస్‌లో వెళ్ళాం”

మల్లయ్య సంతోషానికి అవధుల్లేవు. తనకిపుడో ఆధారం దొరికింది. “అట్టాగే సామీ.

గుర్రపుడెక్క సలీర నువ్వొట్లా సెపితే అట్టా ఇనుకుంటా నామి. నా పొలంలో పంట బాగా పండాల. అంతే నాలు” అన్నాడు.

“సర్ల, మొక్కజొన్న బాగా లాభాలొచ్చే పంట. మనం పెట్టిన పెట్టుబదికి రెండింతల లాభం వస్తుంది”

“ఎన్ని దినాలకి పంట సేతికొత్తుంది సామీ” వెళ్ళబోతున్నవాడల్లా ఆగి అడిగాడు మల్లయ్య,

“కరి నీ బండబడ. బాగా తొందరగా ఉన్నటుందే నీకు... నాలుగు నెలలు కష్టపడాల. అప్పుడే పంట కోతకొస్తుంది. ఇగ నూ బో.. రేపు పెందళకడనే రా అంటూ ఎడ్లను అదిలించి నాగలి కొర్రుని అదిమి పట్టుకున్నాడు కొమరయ్య,

మల్లయ్య పొలాన్ని తన కాడెద్దులతో మూడుసార్లు దుక్కిదున్నాడు కొమరయ్య. కాడిని పట్టకోవడంలో మల్లయ్య నాయువడ్డాడు. ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నారు. కొమరయ్య కొని తెచ్చిన మందులో విత్తనాల్ని శుద్ధి చేశాక బోదెకు కుడివైపున ఒక్కో చోట రెండు మూడు విత్తనాల చొప్పున నాటారు మల్లయ్యా లచ్చిమి కలిసి...రెండు మొక్కజొన్న చాళ్ళ మధ్య ఒక చాలు కంది గింజల్ని నాటారు. రెండ్రోజుల తర్వాత కలుపు మందుని సీళ్ళలోకలిపి పిచికారి చెశారు.

పదిరోజులాగాక విత్తిన చోట రెండు మూడు మొక్కలు మొలిస్తే వాటిలో ఒక మొక్క మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కల్ని పీకేశారు. మొక్కలకు చీడ పట్టకుండా కొమరయ్య క్రిమిసంహారక మందులు చల్లితే, మల్లయ్య వేపాకులు, సీతాఫల ఆకులు, వావిలాకులను మెత్తగా నూరి రసం తీసి వడబోడి నీళ్ళలో కలిపి మొక్కలమీద చల్లాడు.

నెలరోజుల్లోనే మొక్క మోకాళ్ళ ఎత్తువరకు పెరిగింది. మల్లయ్య సంతోషానికి అవధుల్లేవు. తన చుట్టుపక్కల పొలాల్లో తోటి చెంచులు కూలీలుగా పని చేస్తుంటె, తన పొలంలో తనే రైతుగా పంట పండించడం చాలా తృప్తిగా అన్పిస్తోంది.

కనకారావు తను కౌలుకు తీసుకున్న పొలాల్లో వొద్దు తిరుగుడు పూవు పండిస్తున్నాడు. మొక్కజొన్న పూతకొచ్చింది.

గుర్రపుడెక్క నీలీర

“పూత సమయంలో, మళ్ళా గింజ పాలు పోసుకునెటప్పుడు బాగా నీరు పట్టాలి” అని కొమరయ్య చెప్పాడు. వర్షాలు ఆశించినంతగా పడకపోవడం వల్ల కొమరయ్య పొలంలోని బోరు బావిలోంచి బిందెల్ల్తో నీరు పట్టి మొక్కలకు పోశారు మల్లయ్యా లచ్చిమి.

గింజ వాలు పోసుకుంది.

పక్కపొలాల్లో వొద్దు తిరుగుడు పూవు కూడా పచ్చగా విచ్చుకుంది.

పంట కోత కొచ్చినపుడు కంకులపై పొడలు ఎండినట్లు కస్పిస్తాయని, గింజను గోటితో నొక్కినా గట్టిగా ఉండి నొక్కులు పడవనీ చెప్పాడు కొమరయ్య. మల్లయ్య కంకుల్లోని గింజను నొక్కి చూశాడు. నొక్కు పడలెదు. ఎందుకైనా మంచిదని కొమరయ్యను పిలిచి చూపించాడు.

“నీ శమ ఫలించింది మల్లయ్యా, పంట బాగా పండింది. మరో నాలుగురోజులాగి కండెల్ని కోయించు” అన్నాడు కొమరయ్య. “కందెల్ని వేరు చేశాక మూణ్నాలుగు రోజులు బాగా ఎండలో ఆరబెట్టాల. గింజల నూర్పిడి తర్వాత కూడా మూడు నాలుగు రోజులు గింజల్ని ఎండబెట్టాక సంచుల్లో నింపాల. గుర్తు పెట్టుకో” అన్నాడు.

మూడ్రోజులు ఎపుడౌతాయా అన్నట్లు ఎదురుచూశారిద్దరూ.

రేపే పంట కోసే రోజు. షాపుకెళ్ళి రందు కొదవళ్ళు కొని పదును పెట్టంచాడు మల్లయ్య. ఎకరాకు యాభై బన్తాల కంకులొస్తాయని కొమరయ్య చెప్పడం వల్ల కంకుల్ని వెయడం కోసం వంద గోనెసంచుల్ని కొన్నాడు. వాటిని కుట్టడానికి దబ్బనం, పురికొస కొన్నాడు.

ఆ రాత్రి యిద్దరికీ నిద్ర పట్టలేదు.

“ఇన్నాల్లూ అడివితల్లి పండించి ఇచ్చిన పళ్లూ గడ్డలు తిని బతికాం. ఇప్పుడు మనం కట్టబడి పండించిన గింజల్ని తెచ్చుకోబోతున్నాం. పంట పందించటంలో ఎంత సంతోసం ఉందో ఇప్పుడు తెలిసొస్తోందే లచ్చిమి” అన్నాడు మల్లయ్య,

పొద్దుపొాడవక ముందే ఖాళీ గోనె సంచుల్ని నెత్తిమీద పెట్టుకుని తమ పొలం వైపుకు బయల్లెరారు. తమపాలం చుట్టూ ఉన్న పొలాల్లో పొద్దుతిరుగుడు పూలు అరచెయంత మందాన విచ్చుకుని కనుల కింపుగా కన్పిస్తున్నాయి. వాటిని దాటుకుని తన పొలంలోకి

గుర్రపుడెక్క సలీర అడుగు పెట్టగానే పెద్దగా అరిచి అక్కడే కూలబదిపోయాడు మల్లయ్య. లచ్చిమి నోటమాట రాక స్థాణువులా నిలబడిపోయింది.

కంకులు లేని మొండి చెట్లు మిగిలున్నాయక్కడ. తల తెగ్గొట్టిన మొందాల్లా... ఒక్క కంకి మిగల్లేదు.

మల్లయ్య నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. లచ్చిమికి ఏడుపు రావటం లేదు. అనంత దుఃఖంతో కన్నీళ్ళు గడ్డకట్టుకుపోయాయి. నిన్నటి వరకూ కంకుల్లో నిండు గర్భిణిలా కన్పించిన వొలం ఉదయానికల్లా గొద్దుబోతులా మారిపోవడాన్ని పొలంపన్లకి వచ్చిన మిగతా చెంచులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలీని భయం జీరాడుతోంది.

ఎంత ఓదార్చినా మల్లయ్య ఏడుపు ఆగటం లెదు. కళ్ళల్లోంచి కన్నీళ్ళకు బదులు రక్తం కారేలా ఏడుస్తున్నాడు. లచ్చిమి అతన్ని ఓదారుస్తున్నదన్నమాటె గాని ఆమె నిలువెల్లా దుఃఖమై ప్రవహిసోంది.

తన పొలం కోతలకని తయారైవచ్చిన కొమరయ్య కూడా నిర్దాంతపాయ్యాడు. “మల్లయ్యా. ఇదెవరో కావాలని నీమీద కక్షతో చెసిన పని. ఇలాంటి దుర్మార్గపు పనులు కనకారావు మాత్రమే చేయగలడు. నువ్వతని మీద పోలీస్‌ కేస్‌ పెట్టు. ని పంట దొంగతనానికి గురయిందని కేస్‌ పెట్ట అన్నాడు.

మల్లయ్యకు కళ్ళముందు కుప్పకూలిన తన నాలుగు నెలల కష్టం కన్పిస్తోంది. తనూ లచ్చిమి కార్చిన చెమట చుక్కలు కన్నీటి చెలమలై బాధిస్తున్నాయి. తను పెట్టిన పెట్టుబడి బూడిదై కన్పిస్తోంది. ఇంత నీచమైన పని కనకారావే చేయించాడని అతనికి తెలుసు. తోటి చెంచులందరికీ తెలుసు. కానీ ఎదురు తిరగలేని అశక్తత... నిలదీయలేని నిస్సహాయత...

మల్లయ్య నడుస్తున్న శవంలా ఇల్లు చేరుకున్నాడు. ఓ వారం వరకూ కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉన్నాడు. అతనికి తన దుఃఖాన్ని దిగమింగే కొద్ది కనకారావు మీద కోపం పెచ్చుమీరసాగింది. కేదార్‌ చెప్పిన నాగరీకులు వీళ్ళినా? ఎదుటి వ్యక్తి శమని అన్యాయంగా దోచుకోవటమేనా నాగరికత అంటే?

గుర్రపుడెక్క నలీరి అడవిలో దొరికే కందమూలాలు తిని పక్షల్నో చిన్నచిన్న జంతువుల్నో వేటాడి తింటూ తమ మానాన తాము బతికే చెంచులు అనాగరికులా? తేనెపట్టున్న చెట్టుకి పొర్క పెద్దే రో చెంచు తాకడానికి కూడా భయపడ్డాదే.. ఎవరిది సంస్కారం? ఎవరిది మెరుగైన థేమాజం? చెంచులు పురోగమించాలని కదా కేదార్‌ అన్నాదు. అభివృద్ధి అంటే సాటి మనిషిని మోసం చేయడమా? తన మాటకు ఎదురు చెప్పాడన్న కోపంతో తోటి మనిషి జీవితాన్ని కర్మశంగా కాలరాయడమా? తమ చెంచు జాతికున్న సీతి విళ్ళలో ఎక్కడుంది? విళ్ళది సభ్య సమాజమా? వీళ్ళకన్నా అడవి మృగాలు నయం. ఆకలెస్తేనె వేటు వేస్తాయి. కొద్దిగా కోలుకున్నాక పోలీస్‌ కేస్‌ పెట్టడానికి బయల్దేరాడు మల్లయ్య, బుడ్డన్న అడ్డుపడ్డాడు. “వద్దు. నామాటిను. కనకారావుతో వైరం మంచిది కాదు” అన్నాడు.

“ఏం... ఎందుకని? నాకన్నెయం సేసింది ఆదేగా..ఆడూ మడిసే నేనూ మడిసినే. ఆడు రాచ్చసుడని నాకు మొదల్నుంచీ అనుమానంగానే ఉంది. ఆడ్ని ఇట్లాగే వదిలేత్తే మన వాల్లందర్నీ నంజుకు తినేస్తాడు. ఆడ్ని జైలుకు పంపాల. అప్పటీగ్గాని నాకు సుకంగా నిద్దర పట్టదు”

“కాని ఆడి దగ్గర దండిగ పైసలున్నయ. సర్మారు వాల్లందరూ ఆడి మాట ఇంటారు. పోలీసులు కూడా ఆడు ఆడమన్నట్టు ఆడ్డారు. ఆడితో ఎట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్ట”

“దొంగెవురో దొంగతనం ఎందుకు జరిగిందో తెలిసీ నోర్ముసుకోవాల్నా?”

“అంతకంటే మనమేం సేయగలం? ఇది మన అడివి కాదు. నేయం దర్శం అన్ని ఇక్కడ పైసలో కొంటారు. నీల్లలో ఉన్నప్పుడు మొసలికెంత బలమో తెలుసుగా. బైటికొత్తే కుక్కకూడా దాన్ని కొరికి సంపేత్తది. మనకిప్పుడు తానబలం లేదు. నీల్లలోంచి బైటికిసిరేసిన సేపల్లా గిలగిల్లాడుతున్నాం. గమ్మునుండు”

“ఆడద్ని వదిలిపెట్టెదే లేదు”

“పిచ్చిగా మాటాడకు. కనకారావే సేయించాదని నీ వద్ద నాచ్చికం ఎముంది?”

ఆ మాట వినగానే మల్లయ్య ఆవేశం చప్పున చల్లారిపోయింది. నిజమే. కనకారావు చేయించాడని అందరికీ తెలుసు. కానీ నాక్ష్యం ఎముంది?

గుర్రపుడెక్క సలీర

“ఈ దినం మేం కనకారావు వద్దకెల్తున్నాం. పంట కోతకొచ్చినా ఇప్పడిదాకా సేసిందానికి కూలి ఇయ్యలా. ఆ ఇసయం అడగడానికెల్తున్నాం. నీ ఇసయం కదిపి సూత్తా. ఆడి కడుపులో ఉన్న విషం బైటికొత్తాది” అన్నాడు బుద్దన్న

మల్లయ్య తప్ప మిగతా అందరూ కలిసి కనకారావు ఆఫీస్‌ కెళ్ళారు. వాళ్ళను చూడగానే నవ్వుతూ “ఏంటీ అందరూ దాడికొచ్చినట్టు వచ్చారు? ఒక్కటే తేడా. ఇపుడు మీ చేతుల్లో విల్లంబులు లేవు” అన్నాడు.

“దండాలు దొరా. మా కట్ట సుకాలు సెప్పుకోడానికొచ్చాం దేవరా” అన్నాడు రాజన్న.

“నేనెప్పటికీ మీ మేలుకోరేవాడినే. మీ జీవితాలు బాగుపడటం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే” అంటూ బుడ్దన్న వైపు చూసి “మీ మల్లయ్య ఎలా ఉన్నాడు? పంట ఎవరో కోసుకెళ్ళారని తెలిసి చాలా బాధపడ్డాను. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. పొలాన్ని కాలుకివ్వమని. వింటేగా...ఐనా చేతికొచ్చిన పంటకి కాపలా పెట్టాలన్న ధ్యాసకూడా లేకపోతే రైతుగా ఎలా నెగ్గుకొస్తాడు?” అన్నాడు.

“అడవిలో పెరిగినోల్లం దొరా. అడివిలోని సెట్లకీ పుట్లకీ ఎవురూ కాపలా కాయరు. ఐనా ఆటినెవరూ దొంగతనం సేయరు. గట్లనే అనుకుని ఉంటడు”

“ఇది అదవి కాదు. చాలా జాగ్రత్తగా ఉండాల. మన వెనక నిడలా నడుస్తూనే మనల్ని కూడా కాజేసే మనుషులుంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తన పొలాన్ని కూడా కౌలుకి తీసుకోడానికి నేను తయారుగా ఉన్నాను.”

“లేడ్డారా . మల్లా పంట పండిత్తాడంట”

“పిచ్చా వెర్రా మల్లయ్యకి. మళ్ళా దొంగతనం జరిగితేనో”

“ఈపాలి రత్తిరీ పగలూ పొలం గట్టునే కాపలా కూసుంటాడట దొరా. ఎవ్వడైనా దొంగతనానికి వత్తే నాయాల్ది అంబుల్తో అడివి పందిని సంపినట్టు సంపుతానన్నాడు దొరా”

ఆ మాట వినగానే కనకారావకి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. మల్లయ్య ఎప్పటికైనా తన పాలిట ఈతముల్లే. కాల్లో దూరి గుండెల దాకా పాకే రకం. ఎట్ట్లాగయినా వీణ్ణి ఏరి వేయాలి అని మనసులో తీర్మానించుకున్నాడు.

గుర్రపుడెక్క నలీర

“సర్లె.మీ విషయం చెప్పండి. అందరూ కట్ట గట్టుకుని వచ్చారంటే ఏదో విశేషమే ఉంది ఉంటుంది” అన్నాడు.

“దొరా. మాకు రావాల్సిన పైసల్‌ అడగడానికొచ్చాం” రాజన్న బదులిచ్చాడు.

“పెసలా? ఐం పైసల”

రాజన్న ఖంగు తిన్నాడు. ఒక్కసారిగా భయం కమ్మెసింది. “అదే దొరా. మా కౌలు పైసల్‌ పొలంలో దినాం కూలి సేసిన పైసల్‌

“ఓ... అవా” అంటూ పెద్దగా నవ్వాడు కనకారావు. “అవెక్కడికి పోతాయి? నా దగ్గర ఉంటే ఇనప్పెట్టెలో భద్రంగా ఉన్నట్లె. ఒక్కొక్కరికంతెంత రావాలో అణా పైసల్తో సహా లెక్కలు రాయించి పెట్టా”

“ఆ లెక్కలేవో సూసి మాకు రావాల్సిన పైసల్‌ ఇప్పించు దొరా” చేతులు నలుపుకుంటూ అన్నాడు.

“ఎందుకురా మీకు పైసలు? చెతిలో డబ్బులుంటే తాగి తగలేస్తారు. మీ మంచి కోసమే నా దగ్గర దాచి పెడ్తున్నా. నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉంచడం కన్నా భద్రం తెలుసా. బ్యాంకులైనా దివాలా తీస్తాయేమోగాని నేను దివాలా తీయను” అంటూ భూకంపం వచ్చినట్లు నవ్వాడు.

“ఓ పాలి లెక్కలు సూసి ఒక్కొక్కరి పెరున ఎంత జమైందో సెబితే బాగుంటది దొరా” బుడ్డన్న నీళ్ళు నములుతూ చెప్పాడు.

“ఎందుకూ? నామీద నమ్మకం లేదా? మీరు పెదోళ్ళని నాకు తెలీదా? పేదోళ్ళ దబ్బు తినాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకే లక్షల ఆస్తి ఉంది. మీ డబ్బు నాకందుకు? నామీద నమ్మకం లేదంటే చెప్పుంది. ఇపుడే లెక్కలు తేల్చుకుందాం” కొద్దిగా కోపంగా అన్నాదు.

బుద్దన్నకేం చెప్పాలో అర్ధం కాలేదు. అంత పెద్ద మనిషిని పట్టుకుని మొహం మీద నువ్వంటే నమ్మకం లేదని చెప్పటం ఎలానో తెలియలేదు. గమ్మునుండివోయాడు.

“సరే వెళ్ళంది. నేనిచ్చిన పైసలింకా మిగిలే ఉంటాయిగా. అవి ఐపోయాక రండి. మీకు రావాల్సిన పైసలు మొత్తం ఇచ్చేస్తా అని లేచి నిలబడ్డాడు.

50,

గుర్రపుడెక్క సలీర

అందరూ వెళ్ళబోతున్నప్పుడు “ఉండండి. మరో విషయం చెప్పటం మరిచెపాయ్యా, మరో వారం పది రోజుల్లో పొలం పనులు పూర్తయిపోతాయి. మీకు వేరే పనేం లేదుగా, ఖాళీగా ఉండే బదులు కట్టుడు పనుల్లోకి రండి. ఆడా మగా అందరికీ పని ఉంటుంది. మీరింతకు ముందున్న చెంచుపెంట స్థలంలో పని ప్రారంభమైంది. అకృడికొచ్చెయండది. సరేనా అన్నాడు.

“అట్టాగే దొరా” అందరూ దండాలు పెట్టి బైటికొచ్చారు.

బుద్దన్న తప్ప మిగతా వాళ్ళందరూ కట్టుడు పనికి వోతున్నారు. మల్లయ్య మళ్ళా పంట వేసే అదునుకోసం ఎదురు చూస్తున్నాడు. అతనిలో పట్టుదల పెరిగింది. ఈ సారి పంటని కళ్ళల్లో వత్తులెసుకునైనా కాపాడి, ఆ పంటను అమ్మి తన కొచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలని. సమయం దొరికినపుడల్లా వెళ్ళి కొమరయ్య దగ్గర వ్యవసాయానికి సంబంధించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు.

రబీ పంట మరో రెండు మూడు రోజుల్లో వేయాలని కొమరయ్య చెప్పాడు. విత్తనాలు కొనడానికి ఎప్పుడెళ్ళాలో కనుక్కుందామని మల్లయ్య అతనసింటికెళ్ళాడు. ఆ సమయానికి కొమరయ్య ఇంట్లో లేడు. చీకటి పడింది. అపుడొస్తాడు ఇపుడొస్తాడనుకుని దాదాపు రెండు గంటలు ఎదురు చూసాక కొమరయ్య వచ్చాడు. ఏఎం పంట వేయాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించాక, విత్తనాలు కొనడానికి మరునాడుదయం వెళ్ళ్లామన్నాడు కొమరయ్య,

మల్లయ్య తిరిగి చెంచుపేటకు బయక్చైరేటప్పటికి సమయం తొమ్మిదిగంటలైంది. మన్నుగొండనుంచి పట్నానికి వేళ్ళే చివరి బస్‌ ఎనిమిదిన్నరకే వెళ్ళిపోయింది.

ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మల్లయ్య ఆడపిల్ల ఏడుపు విన్పించి ఆగిపోయాడు. బన్వాండ్‌ దగ్గర నలుగురు కుర్రాళ్ళు ఓ అమ్మాయిని అల్లరి చేస్తున్నారు. వాళ్ళు కార్లో వచ్చినట్టున్నారు. రోడ్డుకి పక్కగా కొద్ది దూరంలో కారుంది. వాళ్ళు ఆ అమ్మాయి గుండెల్ని తాకి రాక్షసానందం పొందుతున్నారు. ఆ పిల్ల వాళ్ళ చర్యల్ని బలంగా ప్రతిఘటిస్తోంది. ఆ పిల్ల రవిక కొంత చినిగిపోయి ఓ వెపు వక్షం కన్పిస్తోంది. ఒకడు సెల్‌ఫోన్లో తమ

గుర్రపుడెక్క నల్‌ర వికృత చర్యల్ని చిత్రీకరిస్తున్నాడు.

మల్లయ్య మరికొంత ముందుకు నడిచి చూశాడు. తన గూడెం పిల్ల... రాజన్న చిన్న కూతురు.. అతన్లో అవేశం ఉప్పెనలా పొంగుకొచ్చింది. “ఏం చెస్తున్నారు మీరు?” అంటూ పెద్దగా అరిచాడు.

వాళ్ళు క్షణం సేపు తమ చెష్టల్ని ఆపి కేక వేసిన వ్యక్తి వైపు చూశారు. ఐదడుగుల మూడంగుళాలకు మించని ఎత్తు, బలహీనంగా రివటలా కన్పిస్తున్న వ్యక్తి... చుట్టూ కలియచూశారు. ఒకరిద్దరు గమనిస్తున్నా తమకెందుకు లెమ్మని చూడనట్టు తొలగివోతున్నారు.

“నీకెందుకురా... పోపో... నీ పని చూసుకో పో” వాళ్ళల్లో ఒకడు మల్లయ్యని అదిలించాదు.

మల్లయ్య వాళ్ళకు మరికొంత సమీపంగా వెళ్ళి నిలబడి “ఆ పిల్ల మా గూడెం పిల్ల” అన్నాదు.

“ఒరేయ్‌. ఇతనికి తెలిసిన అమ్మాయటరా” అన్నాడొకడు మిగతా ముగ్గురితో.

“అమ్మో అలానా... భయమెస్తోందిరా”” మరొకడు భయాన్ని నటిస్తూ అన్నాడు.

“పడికి తెల్సిన పిల్లయితే ఏంటట? దిన్ని లాక్కెళ్ళి కార్లో వేయండి. హైద్రాబాద్‌ చేరుకోడానికి మూడు గంటలు పడ్డుంది.ఆ మూడు గంటలూ మజా చేసుకోవచ్చు. ఎవరద్దాస్తారో నేను చూసుకుంటాను” అన్నాడు మరొకడు.

“ఆ పిల్లను ఒగ్గేసి మీ దారిన మీరెల్లండి సామీ” అన్నాడు మల్లయ్య స్థిరంగా.

“పోరా పో. ఒక్క గుద్దు గుద్దితే లీటర్‌ రక్తం కక్కుకుని చస్తావ్‌” అన్నాడు వాడు.

“ఆ పిల్ల మీద సేయి పడితే మీ పేనాలు పోతాయి. లొల్లి సేయకుండా ఎల్లిపొండి సామీ. అది మా చెంచుగూడెం పిల్ల, పరువు కోసం పేనాలు తీయడానికైనా పేనాలు ఇయ్యడానికైనా తయారుగా ఉందే జాతి మాది. ఎల్లిపొండి సామీ”

“ఒరేయ్‌ విడెవడో సినిమా డైలాగులు బాగా చెప్తున్నాడ్రా. ఇంతకూ ఇది చెంచు జాతి పిల్లన్మాట. చెంచితొ ఒకడు నవ్వాడు.

“కాదురా... చెంచులక్ష్మి మరొకడు వంత పాడాడు.

“ఐతే తప్పకుండా దీన్ని తేనె జుర్రుకున్నట్లు తాగేయాలిరా. లాక్కెళ్ళి కార్లో పడేయండి”

గుర్రపుడెక్క స్రలీ6 అన్నాడొకడు.

వేటగాడు పులిని చూసినట్టు చూశాడు మల్లయ్య, నలుగురూ ఆంబోతుల్లా అంతెత్తున బలంగా ఉన్నారు.

మల్లయ్య గిరుక్కున వెనక్కి తిరిగి బాణంలా పరుగెత్తాడు. వెనకనుంచి పెద్దగా నవ్వులు ఏవిస్పించాయి.

“పిరికోడురా.. పారిపోతున్నాడు”

మూడు ఫర్లాంగుల దూరమున్న చెంచు పేటని రెండు నిముషాల్లో చేరుకున్నాడు. మిగతా చెంచుల్ని కూడగట్టుకుని రావాలన్న ఆలోచనే రాలేదతనికి. మనసులో ఒక్కటే లక్ష్యం... ఆ పిల్లను రక్షించటం.. అది తన చెంచు జాతి పిల్లయినందుకే కాదు. అసహాయ స్థితిలో ఉన్న ఆడపిల్ల కాబల్టీ..

విల్లు ఎడం చేతిలో పట్టుకుని నాలుగు అంబులు కుడిచేతిలో పట్టుకుని అంతే వేగంగా వెనక్కి పరుగెత్తాడు.

“ఏంటి మామా... ఏమైంది?” అని లచ్చిమి వెనకనుంచి అరుస్తున్నా పట్టించుకోకుండా పరుగెత్తాడు.

వాళ్ళు నలుగురూ అల్లంత దూరంలో ఉండగానే విల్లులో బాణాన్ని సంధించి ముందుకు పరుగెత్తాడు. అప్పటికే ఒకడు ఆ పిల్లని భుజం మీద వెసుకుని కారు వైపుకు నడుస్తున్నాడు.

“ఆగరా..ఆ పిల్లను కిందికి దించు. లేదా నీ గుండెల్లోకి ఈ అంబు దిగిపోద్ది” పెద్దగా హూంకరించాడు మల్లయ్య,

కుర్రాళ్ళు ఆగిపోయి వెనుదిరిగి మల్లయ్య వైపు చూసి [మాన్సడివోయారు. అతని చేతిలో ఎక్కు పెట్టిన విల్లు. బాణం కొన పదునుగా చెక్కి ఉంది. నేరుగా గుండెల్లోకి దిగిపోవటం ఖాయం...

“ఒరేయ్‌ దింపెయ్యరా.. చెంచు జాతి వాళ్ళు వేటాడ్డంలో దిట్టలు. గురి తప్పుదు” అన్నాడొకడు.

వాడు భుజం మీదనుంచి అమ్మాయిని దింపెశాడు. ఆ పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి మల్లయ్య వెనక నిలబడింది.

మల్లయ్య వాళ్ళ వైపు బాణాన్ని గురిపెట్టి వదలబోతున్నట్లు చేతిని కదిపాడు.

గుర్రపుడెక్క స్రలీర

“ఏయ్‌..ఆగు. పిచ్చా నీకు? జైలుకెళ్ళాలని ఉందా?” వెనక్కెనక్కి వెళ్తూ అన్నాడొకడు. వాడి చేతిలో సెల్‌ఫోన్‌ ఉంది. మల్లయ్యని ఫోటోలు తీస్తున్నాడు.

“అడివిలో పాములో పులులో కలిసి బతికినోల్లం. జైల్లన్నా పోలీసులన్నా నాకు బయం లేదు” మరికొంత ముందుకు నడుస్తూ అన్నాడు మల్లయ్య,

“ఒరేయ్‌... వాడు చెప్పింది చేసేలా ఉన్నాడ్రా..పరుగెత్తండి” అంటూ నలుగురూ కారు వైపుకి పరుగెత్తి కార్లో కూచున్నారు. కారు కదిలింది.

మల్లయ్యలో ఆవేశం చల్లారలేదు. టబైర్‌కి గురిపెట్టి బాణం వదిలాడు. సర్రున దూసుకెళ్ళి టైర్లో దిగిపోయి విరిగిపోయింది. కారు వేగంగా ముందుకెళ్ళి పోయింది.

లచ్చిమి మిగతా గూడెం జనాల్ని అప్రమత్తం చేయటం వల్ల ఆడా మగా అందరూ పొలోమంటూ వచ్చిశారు. “ఏం జరిగింది ఏం జరిగింది అంటూ వాళ్ళిద్దరి చుట్టూ మూగారు.

ఆ పిల్ల ఏం జరిగిందో వెక్కిళ్ళ మధ్య చెప్పింది.

“అంబు దూరిందంటున్నావుగా. కారు ఎంతో దూరం వెల్లదు. ఆగిపోయి ఉంటది. పదండి. ఆల్ల పని పడదాం” అన్నాడు ఉదైకంతో వూగిపోతూ రాజన్న.

బుడ్డన్న ఆపేశాడు.*“ఆల్లు పారిపోయారుగా. మనపిల్లకెం కాలెదు. పదండి. ఎనక్షెల్లిపోదాం” అన్నాడు. “అడివిలో తిరుగాడే పులులూ సింహాల కన్నా ఈ నాగరీక సంగంలో మగాళ్ళు శానా పెమాదంగా ఉన్నారే” అన్నాడు నడుస్తూ మల్లయ్యతో.

మల్లయ్య దానికి బదులివ్వకుండా ఆపిల్లనుద్దేశించి “ఇంత రాతిరేల నువ్వెందుకు బైటికొచ్చావ్‌” అని అడిగాడు.

“అమ్మకి జొరం. అయ్యని లేపినా లేవలేదు. కసురుకుని పడుకుండిపొయ్యాడు. మందుల దుకానానికెల్లి మాత్తర్లు కొందామని వచ్చినా” అందాపిల్ల. యింకా ఆ పిల్లలో బెదురు తగ్గలేదు. పులినోట్లో చిక్కుకుని బైటపడ్డ జింకపిల్లలా వణుకుతోంది.

మల్లయ్య రాజన్న వైపు కోపంగా చూశాడు. తాగిన మత్తు యింకా పూర్తిగా దిగినట్టులేదు. మనిషి తూలుతూ నదుస్తున్నాడు. మాట తడబడుతోంది. వయసులో తనకంటె పెద్దవాడు కావటం వల్ల ఏమనాలో తెలీక బుడ్డన్నతో “ఈ తాగుడు అలవాటు

గుర్రపుడెక్క సలీ6 మన చెంచు జాతినే నాశనం సేసేలా ఉంది పెద్దయ్యా. కట్టపడి సంపాయించుకున్న పైసల్ని నట్టపోవటమే కాకుండా వల్లంతా గుల్ల సేస్కుంటున్నారు. మన ఆడోల్లకి రచ్చన లెకుండా సేత్తున్నారు. నువ్వే అద్దుపడాల” అన్నాడు.

బుడ్డన్న సమాధానం చెప్పలేదు. అతని మౌనంలో అనంత దుఃఖాన్ని దాచుకున్నాడు. తన మాటెవరు వింటారిప్పుడు? చెంచు పెంట కళ్ళముందే మంచు ముద్దలా కరిగిపోయాక, యిక పెద్దమనిషి అవసరమేముంది? తనిప్పుడు చివికిపోయి, ఎండిపోయిన చెట్టు. కాల్చడానికి తప్ప దేనికీ పనికిరాడు. ఆ చీకట్లో అతని కళ్ళు చెమ్మగిల్లటం ఎవరూ గమనించలేదు.

మల్లయ్యకు మరో విషయం కూడా బాధని కలిగించింది. చెంచుపెంటలో

ఉన్నన్ని రోజులు జ్వరాలొచ్చినా జబ్బులొచ్చినా చెట్టు బెరదో, మూలికలో వాడి తగ్గించుకున్నారు తప్ప మాత్రలు కొని వాడాలన్న ఆలోచనే లేదు. ఇన్నాళ్ళూ తన జాతిని నిలబెట్టిన అంతర్గత శక్తేదో బలహీన పడ్తున్న భావన..తమ మూలాల్ని బాహ్య శక్తులేవో పెకలించే ప్రయత్నం చేస్తున్నాయన్న భయం...

మరునాడుదయం విత్తనాలు కొనడానికి మల్లయ్య బయళల్షేరబోతున్నప్పుడు చెంచు పేటకి పోలీస్‌ కానిస్టేబుల్‌ వచ్చాడు. అతని చెతిలో బాణం ఎక్కుపెట్టి నిలబడిన మల్లయ్య ఫోటో ఉంది.

“ఎవదీడు? ఈడి పేరేంటి? పిలువ్‌ నా కొడుకుని బైటికి అని అరుస్తున్నాడు.

మల్లయ్య బైటికొచ్చి “వంటి దొరా” అని అడిగాడు. తన చేతిలో ఉన్న ఫొటో వైపూ తన ఎదురుగా నిలబడిన శాల్తీ వైపు మార్చి మార్చి చూశాడా పోలీస్‌. “ఓ నువ్వేనా బాణాల్తో మనషుల్ని చంపడానికి బయళ్చేరిన ర్యాంబోవి. నీ పేరేంటి?” గద్దిస్తూ అడిగాడు.

“మల్లయ్య దొరా”

అప్పటికే చెంచులందరూ తమ ఇళ్ళల్లోంచి బైటికొచ్చి గుమ కూడారు.

“స్టేషన్‌కి పద. నిన్ను యస్సయ్‌ దొరగారు పిలుస్తున్నారు”

“ఎందుకు దొరా?”

గుర్రపుడెక్క సలీం

“ఎందుకా? నిన్న రాత్రి బాణంతో నలుగురు కుర్రాళ్ళని చంపబోయింది కాక ఎందుకని అడుగుతున్నావా? ఒరేయ్‌ చెంచు నా కొడకా...నీ ఆటలు నాదగ్గర కాదురా. పదా స్టేషన్‌కి” లాఠితో కాళ్ళమీద కొడ్డూ అన్నాడు.

ఆ దెబ్బల్ని భరిస్తూనె “ఆల్డు మా గూడెం పిల్లని అల్లరిసేస్తుంటే సూస్తూ వూర్మోవాలా? మా పిల్లని మేం రచ్చించుకోవద్దా” అన్నాడు.

“అందుకని చంపెస్తావురా వాళ్ళని? ఎం చేశారు వాళ్ళు? మాన భంగం చేశారా? చెయబోయారా? రుజువుందా? ఉంటే చూపించు. సాక్షులున్నారా ఎవరైనా? ఉంటే పిల్ఫుకురా”

మల్లయ్యకు వెంటనే ఓ విషయం అర్ధమైంది. వాళ్ళు అల్లరి చేశారనడానికి రుజువులేదు. ఆపిల్లని ఎత్తుకెళ్ళటోయారనడానికి రుజువు లేదు. కానీ తను బాణం వేయబోయిన దానికి రుజువుంది. వాడెవడో దాన్ని ఫొటో తీశాడు.

“మేం అందరం సాచ్చికం దొరా. ఆల్లు మా పిల్లని కార్షోకి లాక్కెల్తుంటే అద్దుపడినాం దొరా” అన్నాడు బుద్దన్న

“ఏరా ముసలోడా... మీవాడ్ని రక్షించుకోవడం కోసం దొంగ నాక్ష్యం చెప్పే నమ్ముతారనుకున్నావా?” అంటూ మల్లయ్య వైపు తిరిగి “ఏరా ఇంకా నిలబడ్దావ్‌.. పద స్టేషన్‌కి” మరోసారి కాళ్ళ మీద లాఠీతో కొట్టాడు.

“అయ్యా.. ఆద్ని కొట్టకండయ్యా, మీ కాళ్ళట్టుకుంటా” భోరున ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడింది లచ్చిమి.

మల్లయ్య వెనకే పోలీస్‌ స్టేషన్‌కి చెంచు పేటంతా కదిలి వెళ్ళింది. నర్సిమ్మని భుజం మీద వెస్కుని పరుగెత్తుతున్న లచ్చిమి లేగదూడని కసాయి వాళ్ళు లాక్కెళుతుంటే అంబా అని ఏడుస్తూ వెంట వెళ్ళే ఆవులా ఉంది.

మల్లయ్యని చూడగానె యస్సయ్‌ లేచొచ్చి “వీడేనా” అని కానిస్టేబుల్‌ నడిగి “ఏరా... చదువుకునే కుర్రాళ్ళు నీకళ్ళకు కుందేలు పిల్లల్లా కన్పిస్తున్నారా బాణం వేసి వేటాడ్డానికి” అంటూ ఫెడీ ఫెడీమని కొట్టాడు.

బుద్దన్న ముందుకెళ్ళి "దొరా... దండాలు. నేను గూడెం 'పెద్దమదిసిని. నా పేరు

కేక

గుర్రపుడెక్క సలీర బుడ్డ్దన్న” అన్నాడు

“మన రానికి గవర్నర్‌ అన్నట్లు చెప్తన్నావే.. ఏరా ముసలోడా... నీ వాళ్ళని అదుపులో ఉంచడం చాతకాకపోతే వెళ్ళి ఏ చెట్టుకో వురేసుకుని చావరాదుట్రా. ఒక్కొక్మర్ని లాకెళ్ళి బొక్కలో వేసి మక్కెలిరగ దంతేగాని మీకు బుద్ధి రాదురా”

“దొరా... మా గూడెం పిల్లని ఎత్తుకెల్లబోతుంటే...”

“ఎవరా పిల్ల? ఏదీ పిలువ్‌.. ఏమేం చేశారో అడుగుతాను”

“రయిక సింపేసినారు దొరా.. తాక్కూడని సోట్లలో తాకి కార్లోకి లాక్కెల్తుంటే...”

“రుజువుందా? కోర్చుకొచ్చి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? విడు బాణం ఎక్కుపెట్టిన దానికి సాక్ష్యం ఉంది. వీడేసిన బాణం ముక్క టైర్లో దొరికింది. దానిమీద వీడి వేలిముద్రలుంటాయి. ఈ రుజువులు చాలు వీణ్ని పదెళ్ళు బెలుకి పంపడానికి”

“వద్దు దొరా.. నీ కాల్నొక్కుతా.. నువ్వే తప్పు కాయాల.. ఆడు శానా మంచోడు దొరా”

“దెన్రా..హత్య చేయడానికి పూనుకున్న వీడేమో మంచోడు. వీడికి భయపడి ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని పారిపోయిన కుర్రోళ్ళిమో దుర్శార్లులు. అవునా?”

“అవును అనబోయి బుద్దన్న ఆగిపోయాడు. నోరు పెగళ్లదు.

చెంచులందరూ పోలీస్‌ స్టేషన్‌ బైట దూరంగా కూచున్నారు. లచ్చిమికి దుఃఖంతో ప్రాణం కడగటెలా ఉంది. మల్లయ్యని లోపల కొడ్డున్నారేమోనన్న వూహకే ఆమె ప్రాణం గిలగిల్లాడుతోంది.

ఓ గంట గడిచాక కార్లోంచి కనకారావు దిగుతూ కన్పించాడు. చెంచులందరూ పరుగెత్తుకుంటూ వెళ్ళి “దండాలు దొరా అన్నారు. రాజన్న అతనో పాటు కొంత ముందుకెళ్ళి “దొరా. నువ్వ కాపాడాల. నువ్వే మా దేవరవి” అన్నాడు.

“అందుకేగా వచ్చాను. బావుందిరా... మీరు నేరం చేయడం.. నేను తప్పించడం. ఐనా మీ మేలు కోరెవాణ్ణి కాబట్టి తప్పదు నాకూ” అంటూ స్టేషన్‌ లోపలికెళ్ళాడు.

హెద్రాబాద్‌లో హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్‌ చదువుతున్న కొడుకునుండి నిన్న రాత్రి ఫోన్‌ రాగానే అతని బుర్రలో ఓ పధకం రూపు దిద్దుకుంది. ఆ కుర్రాడు తాము చేసిన నిర్వాకం అంతా చెప్పకుండా ఆ పిల్లని సరదాగా టీజ్‌ చేస్తుంటే ఓ చెంచు యువకుదొచ్చి

గుర్రపుడెక్క నీలీ6 బాణం ఎక్కు పెట్టేడనీ తన స్నేహితుడొకడు సెల్‌ ఫోన్లో వీడియో తీశాడని చెప్పాడు. అతను చెప్పిన పోలికల్ని బట్టి ఆ చెంచు యువకుడు మల్లయ్యెనని నిర్దారించుకుని యస్సయుకి ఫోన్‌ చేశాడు.

“నాకేంటి లాభం” అడిగాడు యస్పయ్‌.

“నేను పదివేలిసా”

“అంలేనా... అట్నుంచేమీ గిట్టుబాటు కాదుగా. తిండికి గతి లేని చెంచులంటున్నారుగా”

“అక్కడే పొరబడ్డారు. వాడి దగ్గర నేనిచ్చిన లక్ష రూపాయల్లో కొంత మిగిలే ఉంది”

ఆ మాట వినగానే యస్సయ్‌కి కేస్‌లో ఆసక్తి పెరిగింది.

“మిరే వాళ్ళతో మాట్లాడి సెటిల్‌ చెయాలి”

“సరే. ఇరవై ఇప్పిస్తా... ఓకేనా”

“మీరు చెప్పాక ఓకే కాకుండా ఉంటుందా సార్‌” అన్నాడు యస్సయ్‌ హుషారుగా.

“నాకూ ఓ చిన్న సాయం చేసి పెట్టాల” తనకేం కావాలో చెప్పాడు కనకారావు.

ఆ విధంగా ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్లో జరుగుతున్న నాటకానికి తెర లేచింది.

కనకారావు లోపలికి రాగానే “నమస్మారం సార్‌.. మీరేంటి ఇలా వచ్చారు?” అన్నాడు యస్సయ.

“వాళ్ళందరూ మనోళ్ళ యస్సయ్‌ గారూ బైట నిలబడి ఉన్న చెంచుల్ని చూపిస్తూ అన్నాడు కనకారావు. మల్లయ్య భుజం మీద చేయి వేసి “వీడూ మనోడే. నాకు బాగా కావల్సిన వాడు. అరెస్ట్‌ చేశారని తెలిసి విషయమేంటో కనుక్కుందామని వచ్చాను” అన్నాడు.

“జ అలగా నాయాళ్ళతో మీకేం సంబంధం సార్‌. ఈడేం చేశాడో తెలుసా? నలుగురు కుర్రాళ్ళని బాణం వెసి చంపబోయాడు. అటెంప్ట్‌ టు మర్దర్‌...పక్కా ఎవిడెన్స్‌ ఉంది నార్‌. పదేళ్ళకు తక్కువ కాకుండా చిప్పకూడు తప్పదు”

బుడ్డన్న కనకారావు కాళ్ళ మీద పడిపోయాడు. “దొరా... ఆడు అస్మంటోడు కాదు. నువ్వే ఆద్ని సేదుకోవాల”

“నువ్వుండు. నేను మాట్టాడ్తున్నాగా” అని యస్సయ్‌ వైపు తిరిగి “జరిగిందేదో

166,

గుర్రపుడెక్క సీలీర జరిగిపోయింది. నేనాకుర్రాళ్ళతో మాట్లాడి కేస్‌ విత్‌డ్రా చేసుకోమని చెప్తాను. మీరు దయతో ఈ కేస్‌ని ఇంతటితో క్లోజ్‌ చేస్తే...” అంటూ స్వరం తగ్గించి మెల్లగా “మీ రుణం ఉంచుకోం” అన్నాడు కనకారావు,

“కుదర్ప్వు నార్‌. ఇదేమి చిన్న విషయం కాదు. మర్దర్‌ కస్‌. నలుగుర్ని హత్య చేయబోయాడీ దుర్మార్గుడు. ఎంత అమాయకంగా కన్పిస్తున్నాడో చూశారా? మోస్ట్‌ దేంజరస్‌ ఫెలో” లారీతో మల్లయ్య భుజం విరిగేలా కొట్టాడు.

“మిరే అలా అంటే వాళ్ళేమైపోతారు? చాలా చిన్న వాళ్ళు. మీరు పెద్ద మనసు చెస్ముని కొద్దిగా శాంతించి వాళ్ళని కనికరించండి. నేను వాళ్ళతో మాట్లాడి వస్తా” అంటూ బుడ్దన్నని బైటకి పిల్చుకెళ్ళాడు.

“చూడు బుద్దన్నా. పెద్దకేసయ్యేలా ఉంది. ఎంతో కొంత ముట్టచెప్తేకాని మాటినేలా లేదు. నువ్వు సరేనంటే యస్సయతో మాట్లాడతా” అన్నాడు కనకారావు.

అల్లంత దూరంలో ఉన్న లచ్చిమి పరుగెత్తుకుంటూ వచ్చింది. “దొరా. నువ్వెలా సెబితే అలా ఇనుకుంటా. నా మామని ఇడిపించు. సాలు” కన్నీళ్ళతో అతని పాదాలు కడుగుతూ అంది. “సరే. ఓ ఇరవై వేలు.. యస్సయ్‌కీ.. మిగతా కానిస్టేబుళ్ళందరికి కలిపి... మాట్లాదమంటావా?”

“అన్ని పైసలా దొరా. ఆడేమీ తప్పు సేయకున్నా...” బుద్దన్న మాటని మధ్యలోనే తుంచెేస్తూ “సరే నీ ఇష్టం. మీ పాట్లెవో మీరే పడండి. నేవెళ్తున్నా” అన్నాడు కనకారావు.

వెంటనే కల్పించుకుంటూ “నీ ఇట్టం దొరా. అలాగే కాని. పైసల్‌ నేను తెచ్చిస్తా అంది లచ్చిమి.

అతను లోపలికెళ్ళి “వాళ్ళతో మాట్లాడాను. బడుగు జనం... మీరు దయచూపాలి. మీ రుణం ఉంచుకోరు. సాయంత్రానికల్లా మీకందాల్సింది అందుతుంది. నేను హామీ” అన్నాడు.

“సరే సార్‌. మీరింతగా చెప్తున్నారు కాబట్టి విడిచిపెడ్తున్నా” అన్నాడు యస్సయ్‌. మల్లయ్య చేతిలో తెల్లకాగితం పెట్టి వేలి ముద్ర వేయమన్నాడు.

“ఎందుకు?” మల్లయ్య అనుమానంగా ప్రశ్నించాడు.

గుర్రపుడెక్క సలీం

అతని మొహం మీద ఫెడీమని గుద్ది “నీ అయ్య.. ఎంత పొగర్రా నీకు? నన్నే ప్రశ్చిస్తావా? నోర్మూసుకుని చెప్పింది చెయ” అన్నాడు యస్సయ్‌.

బుద్దన్నకు భయమేసింది. యస్సయ్‌ కాళ్ళమీద పది “పారవాటైెంది దొరా. ఆడద్ని సెమించు దొరా అన్నాడు.

“సరే చెప్తన్నా విను. ఇది నీ పొలాన్ని కనకారావు గారికి కౌలుకిస్తున్నట్టు రాసిచ్చి పత్రం. ఇప్పుడు వెయి వేలిముద్ర” అన్నాడు యస్సయ్‌.

“నేను జైలుకైనా ఎల్లా గాని పొలాన్ని కౌలుకివ్వను” మొండిగా అన్నాడు మల్లయ్య,

మళ్ళా కొట్టడానికి చేయి ఎత్తిన యస్సయతో “దొరా. ఓ ఛనం. ఈడద్పో నేను మాట్లాడతా” అంటూ మల్లయ్యని బరబరా బైటకి లాక్కొచ్చాడు బుద్దన్న.

విషయం విన్న చెంచులందరూ పొలం ఇచ్చేయమనే చెప్పారు. “ఆడసలే నాగుబాము. పోనీలే మల్లయ్యా. పేనం కంటే పొలం ముక్యం కాదు” అన్నాడు రాజన్న

“నాకు పొలమే ముక్యం. పేనం కాదు” అన్నాడు మల్లయ్య,

లచ్చిమి అతన్ని పట్టుకుని వలవలా ఎద్చ్బింది. కొడుకుని అతని ముందు నిలబెట్టి “ఇటు సూడు మామా. మన నర్చిమ్మ మొగం సూడు. నువ్వు పదేల్లు జైల్లో ఉంటే ఈడి బతుకేం కావాల? నా బతుకేం కావాల? మాకంటే నీకా పొలమె ముక్యమనుకుంటే నీ ఇట్టం మామా” అంది.

మల్లయ్య తన కొడుకు నర్సిమ్మ వైపు చూసాడు. తను లెకపోతే వాడి భవిష్యత్తేమౌతుంది అనుకోగానే అతను చప్పబడిపోయాడు. తనకు తన పిల్లలే ముఖ్యం, వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవాలి, వాళ్ళ ముద్దూ ముచ్చటా చూసుకోవాలి. వాళ్ళతో ఆడుకోవాలి. అదవి గురించి చెప్పాలి. అడవిలోని జంతువుల గురించి పక్షుల గురించి చెవ్సొలి. తమ చెంచుల సాహసాల గురించి కథలు కథలుగా చెవ్సాలి, వీటన్నింటి ముందు ఆ పొలం తనకో లెక్క కాదు.

లోపలికెళ్ళి తెల్ల కాగితం మీద వెలిముద్ర వెశాడు.

ఒక్కో కుటుంబం వెయ్యి రూపాయల చొప్పున జమచెయాలనీ మిగతా తొమ్మది వేలు మల్లయ్య కట్టాలని తీర్మానం చేశాడు బుడ్డన్న

గుర్రపుడెక్క సలీ6

“మీరందరూ ఎందుకు తప్పు కట్టాల? సిచ్చ నాకు కదా పడాల” అన్నాడు మల్లయ్య,

“నువ్వు రచ్చించింది మన జాతి పిల్లని. దానికోసరం జాతంతా రునం తీర్సుకోవాల”

“ఏ జాతి పిల్లయినా అట్లాగే అద్దుపడెటోద్ని”

“చెంచు పెంటలో ఉన్న దినాల్లో పెద్ద జంతువునో పచ్చినో బటాడి తెస్తే అన్ని ఇల్లకీ వంతులు ఏసే ఆచారం ఉందిగా. ఇదీ అంతే. వంతులు ఏయాల్సిందొ అన్నాడు బుడ్డన్న.

ఆ సాయంత్రం ఇరవై వేలు జమ చేసి యస్సయకి సమర్పించాడు బుడ్డన్న.

తను తప్పుచేయకున్నా తనని దండించి, తప్పుచేసిన వాళ్ళని వదిలేసిన పోలీసులు గుర్తొచ్చి తుపుక్కున వూశాడు మల్లయ్య, కడుపుకు పెదైనా కలిసికట్టుగా తనని ఆదుకున్న తన జాతికున్న కారుణ్యం, న్యాయాన్యాయాల స్పృహ తల్చుకుని గర్వపడ్డాడు. ఎవరిది నాగరికత? తన జాతిదా లేక చదువుకుని ఉద్యోగాలు చెస్తున్న ఈ మైదానప్రాంతం వాళ్ళదా? అసలు అడవిలో ఓ చెంచు జాతి స్త్రీకి ఎప్పుదైనా ఇంతటి భయంకరమైన అనుభవం ఎదురౌతుందా? లెదు. అటువంటి దుర్మార్గాలు అనైతిక చర్యలు కేదార్‌ చెప్పిన సభ్య సమాజంలోనె జరుగుతాయి. ఎంత రాత్రయినా చెంచు వనితలు ధైర్యంగా తిరగుతారు. పులులూ ఎలుగుబంట్లు దాడి చేస్తాయేమోనని భయపదతారుగాని మగవాడికి భయపడరు. మానభంగాలు, అసభ్యంగా ప్రవర్తించడాలు ఉండవు. ఆడదాని ఇవ్వానికి విరుద్ధంగా చెంచు మగవాళ్ళు ఆ స్రీని అనుభవించడానికి సాహసించరు. ఎవరిది నాగరికత? తమదా లేక మృగాలకన్నా హీనంగా ప్రవర్తించే మగజాతి ఉన్న మైదానప్రాంతం వాళ్ళదా?

తను చెంచు జాతిలో పుట్టనందుకు, అదవి తల్లి ఒడిలో పెరిగినందుకు మల్లయ్య గర్వపడ్డాడు.

తన పొలంలో తనే కూలిగా పనిచేయటం మల్లయ్యకు ఇష్టం లేదు. చెంచు పెంటలో తమ గుడిసెలు పీకేసి కనకారావు కట్టిస్తున్న విడిది గృహాల కట్టుడు పనిలో పన్నేయటమూ ఇష్టం లేదు. అందుకే బైట ఎక్కడైనా పని దొరుకుతుందని వారం రోజులుగా తిరుగుతున్నాడు.

గుర్రపుడెక్క నీలీర

వూరికి దూరంగా మెయిన్‌ రోడ్డు పక్కనున్న క్రిష్హా టింబర్‌ డిపోలో పనివాళ్ళ అవసరముందని చెప్తె వెళ్ళి దాని యజమాని రామక్రిష్టని కలిశాడు. అతనికి యాభై యుళ్ళ పైనే ఉంటుంది వయసు. బట్టతల... కుండలా పెరిగిన బొజ్జ.

“ఏం పని చేయగలవు?” అని అడిగాడతను.

“ఏ పని సెప్పినా సెత్తాను సామ” వినయంగా సమాధానమిచ్చాడు మల్లయ్య,

“మీరేంటోళ్ళు?”

“చెంచులం సామీ. ఉండేది మన్నుగొండలో చెంచుపేటలో సామీ”

“ఓ.. చెంచుపేటనా.. మిమ్మల్ని అడవిలోంచి బైటికి తెచ్చి పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చి మీకు మహోపకారం చేశాడు కనకారావు. మహానుభావుడు... మీ చెంచులంటే అతనికి వల్లమాలిన అభఖీమానం”

మల్లయ్య బదులేమీ చెప్పకుండా నిలబడ్డాడు.

శామ్యూల్‌ అనే వ్యక్తిని పిలిచి మల్లయ్యకు పని నెర్పాల్సిందిగా ఆదేశాలిచ్చాడు రామక్రిష్ణ, రంపంతో దుంగల్ని కోసే పని.. శామ్యూల్‌ మల్లయ్యని చూస్తూ పలకరింపుగా నవ్వాడు. ఎప్పుడూ మృదువుగా, నెమ్మదిగా మాట్లాడే శామ్యూల్‌ మల్లయ్యకు బాగా నచ్చాడు. తనకంటే పది పన్నెండెళ్ళు పెద్ద... అంతే. కానీ మాటలన్నీ వేదాంతిలా జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తిలా మాట్లాడతాడు.

రంపాన్ని ఎలా పట్టుకోవాలో, దుంగల్ని కోసేటప్పుడు ఎటువంటి మెళకువలు పాటించాలో నేర్పాడు. కలపలో రకాలు, ఏది మేలిమి కలప, దేని ఖరీదెంత లాంటి విషయాలన్ని మెల్లమెల్లగా మల్లయ్య తెల్సుకున్నాడు.

ఖరీఫ్‌ పంట వేసె కాలం వచ్చింది. చెంచులందరూ కనకారావుకి కౌలుకిచ్చిన పొలాల్లో కూలీలుగా పన్స్ఫెశారు. పంట కోత కొచ్చింది. కనకారావు కూలి దబ్బుల విషయమే ఎత్తటం లేదు. వైన్‌ షావులో అరువివ్వటం మానేశాడు. దాచుకున్న డబ్బులెప్పుడో ఐపోయాయి. రోజూ చీకటి పడగానే తాగుడుకి అలవాటు పడిన చెంచులు యింట్లోని వస్తువుల్ని ఒక్కటొక్కటిగా అమ్ముకుని తాగుతున్నారు. రోజు గడవటమే దుర్భరమైవోయింది. ఇహ లాభం లేదని అందరూ కలిసి కనకారావుని నిలదీశారు.

గుర్రపుడెక్క సలీర

“సరే. మీకెంత రావాలో లెక్క చెప్పాలి. అంతేగా. పొలంలో పనులైనాక సాయంత్రం వైన్‌ షాపు దగ్గరకు రండి. ఒక్కొక్కరికి ఎంతెంత రావాలో మీ పద్దు చూసి ఇచ్చెస్తాను” అన్నాడు.

అప్పటివరకూ తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఏదో ఓ మెలిక పెద్దాదేమోనని భయపడ్డ చెంచుల మొహాల్లో ఆశ చిగురించింది. అతడు తామనుకుంటున్నంత చెడ్డవాడు కాదని అనుకున్నారు.

పొలంలో కోత పనులు ముగించుకుని సాయంత్రానికల్లా చెంచులందరూ వైన్‌ షాపు ముందట నిలబడ్డారు. కౌంటర్లో ఉందే వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ కుర్చీలో కనకారావు కూచుని తనముందున్న పద్దు పుస్తకాల్లోని పేజీలు తిరగేస్తున్నాడు.

వాళ్ళవైపోసారి చూసి “అందరూ వచ్చారా? మీ పద్దు జాగత్తగా చూశాను. ఇదిగో ఈ పుస్తకంలో ఎవరెవరు ఏ రోజు ఎంతెంత తాగారో ఎన్ని పొట్లాల చికెన్‌ బిర్యానీలు మటన్‌ బిర్యానీలు తీసుకున్నారో రాసి ఉంది. ఇది నాకు రావాల్సిన పైసల లెక్క ఇదిగో ఈ నోట్‌ పుస్తకంలో మీరెన్ని దినాలు కూలిపని కొచ్చారో.. పొలం పని ఎన్ని రోజులు చేశారో కట్టుడు పని ఎన్ని రోజులు చేశారో రాసి ఉంది. ఇది మీకు ఇవ్వాల్సిన పైసల లెక్క ఈరెండూ కలిపి చూస్తే మీరే నాకు బాకీ తేలుతున్నారు. నాకెవరెవరు ఎంతెంత బాకీనో చెప్తాను వినండి” అన్నాడు కనకారావు.

తామే అతనికి బాకీ ఉన్నామన్న విషయం వినగానే చెంచుల గుండెలు జారిపోయాయి. దుఃఖంతో నోరు పెగల్లేదు.

“రాజన్న బాకీ అరవై ఆరువేల ఎనిమిది వందల యాభై రూపాయలు..”

రాజన్న గుండెల్లో ఏనుగులదండు దూరి విశ్చంఖలంగా రెచ్చిపోయినంత బాధ.. అరవై ఆరు వేలా.. అంత బాకీ పద్దాడా.. ఆర్నిల్లనుంచి ఈ షాపు వాడు అరువు కూడా ఇవ్వటం లేదు. యింట్లోని వస్తువులు తాకట్టు పెట్టో అమ్ముకునో తాగుతున్నారు. మరి ఇన్నాళ్ళుగా రెక్కలు ముక్కలు చేసుకుని చేస్తున్న కూలి పనికి రావాల్సిన డబ్బులేమైనాయి?

భయపడూనె “అంత తాగానా దొరా?” అని అడిగాడు.

గుర్రపుడెక్క నలీర

“మరి నువ్వు తాగింది కల్లో సారాయో అనుకుంటున్నావా? సీమ సరుకు... బాగా ఖరీదైంది”

“నేనూ నా ఆదది రెండేళ్ళుగా పొలంలో, కట్టుడు పనిలో పన్ఫెసిందానికి కూలిడబ్బులు మొత్తం లెక్క ఏశావా దొరా? మాకిత్తానన్న లచ్చలో మిగులు పైసలు రావాలిగా దొరా”

కనకారావు కోపంతో లేచి నిలబడ్డాడు. “తొత్తు కొడకల్లారా.. అంటే నేను దొంగలెక్కలు రాశాననా మీ ఉద్దెశం. ఇదిగో ఈ రెండు పుస్తకాలు తీసుకెళ్ళి ఎవరికి చూపించుకుంటారో చూపించుకోండి. అణా పైసల్తో సహా లెక్కరాసి పెట్టాను. సీసాలు సీసాలు తప్పతాగింది కాక నన్నే నిలదిసి ప్రశ్నిస్తారా? ఇదిగో చెప్తున్నా విను. నువ్వూ నీ పెళ్ళాం మరో ఏడాది పొడుగూతా కూలి చేస్తేగాని నా బాకీ తీరదు. అర్ధమైందా?”

రాజన్న రాతి బొమ్మలా నిలబడిపోయాడు. అతని గుండె ఆగిపోతుందేమోనన్నంత వేగంగా కొట్టుకుంటోంది. తమకు అన్యాయం జరిగిందని మనసు ఆక్రోశిస్తోంది. కానీ ఏమీ చేయలెని నిస్సహాయత...

“ఇక బుల్లన్న లెక్క. బుల్లన్నా! నువ్వూ నీ పెళ్ళాం, నీ అమ్మ... ముగ్గురి కూలీ లెక్క వేశాను. నలభై వేల ఎనిమిది వందలు నువ్వు నాకు బాకీ. గుర్తు పెట్టుకో... ఎందుకైనా మంచిది ఎక్కడైనా రాసి పెట్టుకో”

అక్కడ గుమికూడిన అందరూ కనకారావు లెక్కల ప్రకారం వేలల్లో అతనికి బాకీ తేలారు.

“ముందే చెస్తున్నా. జాగ్రత్తగా వినండి. నా బాకీ తీరేవరకు నావద్దే పన్చేయాలి. బాకీ ఎగ్గొట్టి ఎవరైనా వూరొదిలి పారిపోయారో మీరడవిలో దాక్కున్నా లాక్కొచ్చి కుళ్ళబొడిపించి జైల్లో వేయిసాను” కనకారావు హూంకరించాడు.

చెంచులకిపుడు కనకారావు వేయి తలల రాక్షసుడిలా కన్సిస్తున్నాడు.

“మరో విషయం. మీ బాకీ తీరేవరకు ప్రతినెలా నూటికి ఐదు రూపాయల చొప్పున వడ్డీ కట్టి బాకీకి కలుపుతాను” అన్నాడు కనకారావు.

“ఐదు రూపాయల వడ్దినా?” రాజన్న గుడ్లు తేలేశాడు.

“ఏం.. ఎక్కువా? బైట పది రూపాయలిస్తానన్నా వద్దికి పైసల్‌ దొరకటం లేదు. నేను మీ మేలు కోరి వాణ్సి కాబట్టి ఐదు రూపాయల వడ్డినే తీసుకుంటున్నా. వడ్డి

గుర్రపుడెక్క సలీర కట్టకూడదనుకుంటే మీ బాకీని రేపటిలోపల తీర్చేయండి. ఏమంటారు?”

ఎవ్వరూ నోరు తెరిచి ఏమీ అనే పరిస్థితిలో లేరు. బతికున్న శవాల్లా వెనక్కి తిరిగి వచ్చెశారు. చెంచు పేట చేరుకోగానే బుడ్డ్దన్నకు విషయమంతా చెప్పి భోరుమని ఏడ్చేశారు.

చెంచుపేటంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ రోజు రాత్రి ఎవ్వరూ వంట చేయలేదు. ఎవ్వరూ మెతుకు ముట్టలేదు. తమ జీవితాల్లో మొట్టమొదటి సారి వాళ్ళకి బతుకంటే భయం పట్టుకుంది.

శిఖరం కూలినట్ట బుడ్డన్న లోపల్లోపలే కూలిపోయాడు. తన జాతిని

కాపాడుకోలెకపోయాననే వ్యధ అతన్ని క్యాన్సర్‌లా తినేయసాగింది. తనని కాదని రాజన్న తన వాళ్ళ తరఫున కనకారావుకు మాటీచ్చినపుడు పెద్దమనిషిగా అతన్ని మందలించాల్సింది పోయి మిన్నకుండిపోయి ఎంత తప్పు చేశాడో ఇపుడర్ధమౌతోంది. తన కళ్ళిదుటే తన జాతి పతనమైపోతుంటే రక్షించాల్సిన తనే పట్టించుకోకుండా ఉండివోయినందుకు తన్ను తాను క్షమించుకోలేకపోతున్నాడు.

కనకారావు చేసిన కుట్ర ఏమిటో, చెంచులందరూ అతని వలలో ఎలా చిక్కుకున్నారో ఇపుడతనికి స్పష్టంగా అర్థమౌతోంది. మొదట పక్కా ఇళ్ళని ఆశ చూవాడు. లక్ష రూవాయల్ని కళ్ళముందు ఆడించాడు. టీవీలు కుర్చీలు మంచాలు అంటూ రంగురంగుల దృశ్యాలు చూపించాడు. ఇప్పసారానో, కల్లో తాగేవాళ్ళకి సీమసరుకంటూ బ్రాందీలు విస్కీలు అలవాటు చెసాడు. పైసలివ్వక్కరలేదనీ అరువిస్తానని చెప్పి తాగుడుకి బానిసల్ని చేశాడు. బాకీకి వడ్దీలమీద వడ్డిలు కలిపి అందర్నీ తనకు కట్టుబానిసలుగా మార్చేసుకున్నాడు. తన జాతి కనకారావుకే కాదు నాగరికతకు కూదా బానిసలా మారిపోయిందిపుడు.

బుద్దన్నని దిగులు చెదలా తినెస్తోంది. బాగా జబ్బున పడ్డాడు. అంత జబ్బులోనూ వెళ్ళీ కనకారావు కాళ్ళమీద పది కనికరించమని వేడుకున్నాడు. “ల్రిండిలేక అల్లాదిపోతున్నాం దొరా. పిల్లలు సచ్చిపోయేలా ఉన్నారు. నువ్వే దయ సూడాల. నీ వద్ద కూలిపని సేయాలన్నా ఒంట్లో సత్తువ కావాలిగా దొరా. ఇలాగే కొన్ని దినాలు పోతే ఆకలే ఆల్లని తినేత్తాది దొరా” అని మొరపెట్టుకున్నాడు.

ఒక్కో కుటుంబానికి నెలకు ఆరొందలు అప్పుగా ఇవ్వడానికి కనకారావు ఒప్పు కున్నాడు. “దీనిక్కూడా వడ్డీ కడ్డాను. ఇష్టమైతేనే తీసుకోండి” అన్నాడు. అదే మహద్భాగ్యం

గుర్రపుడెక్క సలీం అనుకున్నారు. పాతిక కేజీల జొన్నలు కొనుక్కుని రొట్టెలు చెసుకుని పచ్చడో మిరపకాయో ఉల్లిగడ్డో నంజుకుని తింటున్నారు. అందరి మొహాల్లో నవ్వు మాయమైంది. బాకి తీర్చాలి కాబట్టి పళ్ళ బిగువున కూలికెళ్తున్నారు.

ఎన్ని మూలికలు తిన్పించినా ఎన్ని కషాయాలు తాగించినా బుడ్దన్న ఆరోగ్యం కుదుటపడటం లేదు. అందరూ పన్లలోకి వెళ్ళాక యింటిముందు తను పెంచిన చెట్ల కింద కూచుని అడవి దిక్కుకి తల తిప్పి ఆకాశంలోకి చూస్తూ తనలో తను గొణుక్కుంటుంటాదు.

ఆ రోజు బుద్దన్న మరింత బలహీనపడ్డాడు. కట్టుడు పన్గోకెళ్ళి ఇంటికొచ్చిన రాజన్న జ్వరంతో వణికి పోతున్న తండ్రిని చూసి కలవరపడ్డాడు. తనకు వూహ తెలిశాక అయ్య జ్వరంతో పడుకోవటం ఎన్నడూ చూళ్ళేదు.

అతను వద్దంటున్నా వినకుండా ఆ వూళ్లో క్లినిక్‌ నడుపుతున్న డాక్టర్‌ దగ్గరకు బలవంతంగా పిల్చు౭ళ్ళాడు. డాక్టర్‌ పరీక్షించి ఏవో మాత్రలు రాసిచ్చాడు. అవి వాడినా నాలుగు రోజుల వరకు జ్వరం తగ్గలెదు. ఐదో రోజు బుడ్డన్న పలవరించనాగాడు.

మల్లయ్యకు కబురందింది. తన యజమాని దగ్గర అనుమతి తీసుకుని చెంచుపెట చేరుకున్నాడు.

బుద్దన్నని చెట్లకింద ఈత చాపమీద పడుకోబెట్టారు. అతని బలహీనమైన శరీరం చిగురుటాకులా వణికిపోతోంది. ఎన్ని దుప్పట్లు కప్పినా వణుకు తగ్గటం లెదు.

పెద్దపెద్దగా పలవరిస్తున్నాడు. “నా అడివి... నా చెంచు జాతి..తప్పు నాదే... ఎంత పెద్ద తప్పు... నా జాతికి అన్నేయం సేశా.. నా జాతిని సాదుకోలేకపోయా.. అంతా నాశనం సేశా..”

మల్లయ్య వైపు చూసి “ఒరే అయ్యా..మనం ఇక్కడ ఉండొద్దు. మన అడివిలోకి ఎల్లిపోదాం.. మన అడివి తల్లి. మనల్ని సల్లగా కాపాడే మలలమ్మ తల్లి. పెద్దోడు పెద్దపులీ, సిరుతమామ, ఎలుగు బావ ఉన్నారక్కడ.. అందరం కలిసి ఉందాంరయ్యా,. ఇక్కడొద్దు. ఈల్లకంటే అడివిలోని జంతువులే నయం.. ఆటి జోలికెలకపోతే అయి మన జోలికి రావు. ఈ మడుసులు అలా కాదురయ్యా.. మదుసుల్ని పీక్కుతినే రాబందులు.. రక్తాన్ని తాగే రాచ్ససులు. మనం ఇంకో ఛనం ఇక్కడ ఉండొద్దు. ఎల్లివోదాం పదండి”

గుర్రపుడెక్క సలీర అంటూ అరుస్తున్నాడు. ఏడుస్తున్నాడు.

అంతిమ ఘడియలు సమీపించాయని అందరికీ అర్ధమైంది. అతని చుట్టూతా అందరూ వలయాకారంలో నిలబడ్డారు. అతనోసారి అందరి మొహాల్తోకి చూశాడు. తన బంధు గణం.. తన జాతి.. ఒక్కసారిగా దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చి కళ్ళెమ్మట బొటబొటా కన్నీరు ఏరులై ప్రవహించింది.

“అడివిలో ఎలా బతికినోల్లం... సొతంత్రంగా.. దొరబాబుల్లా.. అడివికి మనమే రాజులైనట్టు రొమ్ము ఇరుసుకుని బతికాం. ఒక్కొక్కరి మొగం ఎలిగిపోతా ఎలా ఉందేదో.. కొండ గోగు పూవు ఇచ్చుకున్నట్టు... ఇప్పుడు సూదు.. ఒక్కడి మొగంలోనూ ఎల్లురు లేదు... మబ్బు కమ్మెసినట్టు.. ఈ నాగరిక సంగం మన సంతోసాన్ని మింగేసిందిరయ్యా.. కొంద సిలువలా మన జాతిని సుట్టెసి నలిపేసింది. ఎవ్వరూ బతకరు. సచ్చివోతారు. నా మాటినుకొండి. అడివిలోకి పారిపొండి. అదుగో అడివి తల్లి. నన్ను పిలుత్తోంది” అంటూ రాజన్న వైపు తిరిగి “ఒరే అయ్యా, నేను సచ్చిపోయాక నన్ను అడివితల్లి కడుపులోనే పూడ్చాల. పచ్చటి సెట్లకింద, సల్లటి నీడలో, తీయటి అడివి వాసనల మద్దిన.. నేను సుకంగా పడుకోవాల” అంటూ చివరి శ్వాస వదిలాడు.

చీకటి పదటంతో బుద్దన్న శవాన్ని తల దక్షిణం వైపు ఉండేలా తిప్పి పడుకోబెట్టి, రాత్రంతా తల దగ్గర నెగడు వెలిగించి పెట్టారు. రాత్రంతా నిద్ర పోకుండా అందరూ జాగారం చేశారు. పొద్దు పొడవక ముందే చిరు చీకట్లో శవాన్ని మోసుకెళ్ళి అడవి మధ్యలో చెట్ల నీడన గొయ్యి తవ్వి పాతిపెట్టారు.

బుడ్డ్గన్న చనిపోయి మూదేళ్ళు. ఈ మూదేళ్ళలో చెంచుపేట రూపురేఖలే మారిపోయాయి. కనకారావుకు వూడిగం చేయలేక ఎంత కష్టపడినా తీరని అతని బాకీని తట్టుకోలేక, ఆకలికి తాళలేక, అనారోగ్యాలకు అల్లాడిపోయి.. చాలా కుటుంబాలు వలసెళ్ళిపోయాయి. రాజన్న మాత్రం ఎంత కష్టమైనా సరే చివరివరకు అక్కడే ఉండటానికి ప్రయత్నించాడు. అతనికి మన్నుగొండ వదలటం ఇష్టంలేదు. తన అయ్యకు ప్రాణమైన ఆ అడవికి దూరంగా వెళ్ళటానికి మనసొప్పలేదు. అయ్యకు ఎదురుతిరిగి, గూడెం జనాల జీవితాల్ని నాశనం చేశానన్న అపరాధ భావన అతని గుందెల్ని మెలి పెట్టని

గుర్రపుడెక్క నీలీర రోజు లేదు. గూడెం వదలకుండా ఉండిఉంటే తను చెంచుపెంటకు పెద్దమనిషి అయ్యేవాడు. తన అయ్య అడుగుజాడల్లో నడుస్తూ తన జాతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అడవిలో సంతోషంగా బతుకుతుండేవాడు. ఈ బానిస బతుకు, వెట్టి చాకిరి ఉందేది కాదు.

తన తండ్రి చావుకి కూడా తనే కారణమన్న బాధ రాజన్నకు మనశ్శాంతి లెకుండా చేసింది. బుద్దన్న చనిపోయిన రెండెళ్ళకు రాజన్నకూడా ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. చివరికి మల్లయ్య కుటుంబం ఒక్కటే చెంచుపేటలో మిగిలిపోయింది.

కనకారావు కోరుకుంది కూడా అదే. 'మీరెవరైనా వూరొదిలి పారిపోతే పోలీసులకు చెప్పి పట్టి తెన్తాను” అని బెదిరించడం వెనుక వాళ్ళలా వెళ్ళివోవాలన్న కోరికే బలంగా ఉందింది. ఇప్పుడు వాళ్ళ పొలాలే కాదు వాళ్ళకోసం కల్టించిన పక్కా ఇళ్ళు కూడా తనవే. వాళ్ళొదిలి వెళ్ళిపోయిన పదకొండు ఇళ్ళనూ అద్దెలకిచ్చుకున్నాడు. ఎటొచ్చీ మల్లయ్య ఒక్కడే గొంతులో ఇరుక్కున్న చేపముల్లులా బాధ పెడ్తున్నాడు.

నర్సిమ్మకు ఏడేళ్ళు నిండాయి. టింబర్‌ డిపోనుంచి రాత్రి ఎనిమిది దాటాక తిరిగొచ్చి అయ్య కోసం ఎదురుచూస్తూ గడపలో కూచుంటాడు. వాడికి అయ్య చెప్పే కబుర్లు వినటం ఇష్టం. ఆ కబుర్లనిండా పర్చుకుని అడవి అందాలుంటాయి. చెంచుల జీవితాలుంటాయి. జంతువులూ పక్షులతో వాళ్ళ నాహచర్యం ఉంటుంది. వాళ్ళ సాహసగాధలూ ఉంటాయి. అందునా రెందు సంఘటనల్ని పదేపదే చెప్పించుకుని వినటం మరింత ఇష్టం. “అయ్యా మల్లా సెప్పవా' అని వాడడగటం, “ఎన్ని సార్లు సెప్పాలా' అంటూ ముద్వగా కొడుకుని విసుక్కుంటూన మల్లయ్య చెప్పటం.. అవి మల్లయ్య చిరుతపులితో కలబడి, దాన్ని కత్తితో గాయపరిచిన వీరోచిత గాథ ఒకటైతే మరొకటి బుద్దన్న తాత ఎలుగుబంటి జుట్టుపట్టుకుని పీకి “నమ్మకద్రోహం సేస్తావా' అని నిలదిసిన సంఘటన...

ఆ రోజు వెన్నెల విరగకాస్తోంది. ఆరుబయట చెట్ల కింద ఈత చాప పరిచి, పక్కన తన కొడుకుని పడుకోబెట్టుకుని, ఆకాశంలో తేలియాడ్డ్తున్న చంద్రుడ్ని చూస్తూ అడవి జ్ఞాపకాల్లో మునిగిపోయాడు మల్లయ్య. తన చిన్నపుడు ఇలాంటి వెన్నెట్లొ గూడెం

గుర్రపుడెక్క సలీర పిల్లలందరూ ఎన్ని ఆటలు ఆదడుకునెవారో.. ఎలుగాట, పామాట, పులాట, కొండముచ్చాట, ఎండావానా, గద్దా కోడిపిల్ల, సిరిపెంట.. అడవిలో కాసె వెన్నాల ఇప్పపూల జల్లులా ఎంతందంగా ఉందేదో.. వళ్ళంతా చల్లటీ లేపనమేదో పూసినట్లు... ఆకాశంలోంచి అమృతహస్తమెదో వచ్చి శరీరాన్ని ప్రేమగా నిమిరినట్లు..

అయ్య గమ్మునుండటం చూసి నర్సిమ్మ చేత్తో కదిపాడు. “అయ్యా..నువ్వు సిరుత పులితో కలబద్దావే ఆ కత సెప్పువా?”

మల్లయ్య తన కొడుకు వైపు (ప్రేమగా చూశాడు. సరైన తిండి లెక బలహీనంగా ఉన్న కొడుకు.. మల్లయ్యకు చాలా బాధేసింది. అడవిలో సమృద్ధిగా దొరిక తెనె తాగి, పళ్ళూ దుంపలు తిని, వేటలో దొరికే చెవులపిల్లి, అడవికొంగ, ఉడుం మాంసం తిని, బలంగా ఎదగాల్సిన వాడు.. దేవదారు ఆకుని ఉడకబెట్టి, నీళ్ళను పిండేసి, తేనె కలుపుకుని తింటే ఎంత రుచిగా ఉందేదో.. దేవదారుఆకు, ఇప్పపూవు కలిపి కూరొండేది లచ్చిమి.

“అయ్యా.. అడివి కబుర్లు ఏమైనా సెప్పవా?” మళ్ళా అడిగాడు వాడు.

మల్లయ్య ఆలోచనల్లోంచి బైట పడ్డాడు. “మొన్న ఆదోరం సేపలకూర తిన్నావు గవనం ఉందా” అని అదిగాడు.

“ఓ.. శానా బావుందినాయి కదయ్యా” బదులిచ్చాడు నర్సిమ్మ.

“అస్మంటి సేపలు అడివిలో పుడ్మలకొద్ది దొరుకుతాయి తెలుసా. గూడెంలో ఎవులూ సేపలు కొనే వాల్లం కాదు. సేపలేం కర్మ... ఏవీ కొన్నక్కరలే.. అన్నీ అడివి తల్లి పిలిసి మరీ ఇచ్చెది”

“సేపలు పట్టుకుంటే దొరికేవా?”

“లేదు. సర్రున జారి నీల్లలోకి దూరిపోయేవి. సెర్వులనిండా కాల్వలనిండా అబ్బో ఎన్ని సేపలో. తలతలా మెరుస్తా నీల్ల పైనే జిల్లని తిరుగాడేవి”

“మరెలా పట్టెటోల్లు?”

“ఈ మడుసుల్లా వలలూ గాలాలు మేం ఎరగం. చిల్లకాయ గుజ్జుని త్‌సి...”

వాడు మధ్యలో అద్దు తగిలి “చిల్ల కాయంటే” అని అడిగాడు.

మల్లయ్యకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. కొడుకుని అడవిలోకి పిల్చుకెళ్ళీ అన్నీ చూపించాలని నిర్ణయించుకున్నాడు. “సెప్తే తెలీదు నీకు. ఓ దినం

గుర్రపుడెక్క సలీం అడివిలోకి తీస్కెల్లి సూపిత్తాలే” అన్నాడు. “చిల్లగింజల్ని తినేటోల్లం. ఆ కాయ గుజ్జుని తీసి చెరువులోని నీళ్ళలో కలిపి బాగా గిలక్కొట్టె వాల్లం., సేపలన్నీ రెందు గంటలవరకు మత్తుగా పడుకుని నీల్ల పైకి తేలేవి. ఆటిని పట్టుకుని పుడ్మలో ఏస్సుని తేవటమే”

“ఆయ్‌.. బలేబలే” నర్సిమ్మ చప్పట్లు కొడుతూ ఆనందించాడు.

“చిల్లకాయ గుజ్జు దొరక్కపోతే నేరేడు స్తెక్కని మెత్తగా నూరి ఇసకలో కలిపి నీల్లమీద సల్లితే సాలు సేపలన్నీ పైకి తేల్తాయి”

తనకు తెల్సిన విద్యలనీ తన కొడుక్కి చెప్పాలన్న ఆరాటం మల్లయ్యలో...

“అయ్యా... ఏదైనా కత సెప్పవా” వాడు ఆవులిస్తూనె అడిగాడు.

“సరె. మన చెంచు జాతి ఈరుడు పెదబైలోడి కత సెప్తా ఇను” అంటూ మొదలెట్టాడు.

“పెద్ద బైలోడు మూలికల్తో పసర్లతో వయిద్యం సేసేటోడు. పెద్దపెద్ద రాజులు కూడా మన చెంచులు సేసే వయిద్యం కోసరం నల్లమల అడివిలోకి వచ్చేటోరు. పెద్ద బైలోడి వద్దకు తెల్లదొరలొచ్చి పసర్ల మందు తాగేటోల్లు. మనోల్లు వెదురు, జువ్వి, సంజీవి వంటి బదనికలతో సావబోతున్న వార్ని కూడా బతికించే వాల్లని మా అయ్య సెప్పేటోడు.

దేవతలకు కోపాలు రాకూడదని అనవసరంగా సెట్లని నరకడం, నీల్లున్న సోట రోత సేయటం, అడివిని కాల్చటం, పెద్దగా కేకలేయడదం, అరవడం వంటివి సేయకూడదని, చెల్లెట్లు వేయరాదని పెద్దలు పిల్లలకి సెప్పేటోల్లు. సచ్చిపోయిన చెంచులు రాత్రీ పగలు అదివిలో పెశాంతంగా తిరగకుండా తెల్లదొరలు పులుల్ని ఏటాడ్డం, సెట్లని నరకడం, తుపాకులతో జంతువుల్ని సంపడం సేస్తుందేది.

పెద్దబైలోడికి కోపం వచ్చి ఆల్లని ఎదిరించాడు. దొరల వద్ద తువాకులు, గుర్రాలు ఉన్నయ్‌. ఆల్ల బలం తెల్సుకుని కొండ గుండ్ల సందుల్లో దాక్కుని ఆల్లపై అంబుల వర్షం కురిపించేవోడు. తెల్లోళ్ళు అందరి దబ్బలు, అంబులు లాక్షెల్లే వాల్లు, మన చెంచులు రాత్రికి రాత్రి విల్లంబులు తయారు సేస్మునేటోల్లు. మొసరు తేనెటీగల మైనం అంబులకి రాసి దానికి పసరు పూసి కొడితే వనుగు తలలు కూడా బద్దలయ్యావని పెద్దలు సెప్పెవాల్లు.

పెద్ద బైలోడిని సంపి ఆడి తల తెచ్చినోడికి పదివేలిత్తామని సాటింపు ఏశారు. పెద్దబైలోడు చెంచు కుర్రోళ్ళతో తెల్లాళ్ళమిద ఎలా కొట్లాడాలో మాట్లాడాడు.

గుర్రపుడెక్క సలీర

“పెద్దబైలా.. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అస్తం. మన అదవిల ఈ తెల్లోల్లను లేకుండా తర్ముదం* అన్నారందరూ.

'మనం ముసురు కాలందాకా ఆగుదాం. ఆల్లు వానలకు బైటికి రాకుండా గుడారాల్లో ఉంటరు. గుడారాలకే అంబులేస్తే ఆళ్లందరూ చస్తరు” అన్నాడు పెద్ద బైలోడు.

మరో ఈరుడు సిగనాయకుడు 'సామి పెద్ద బైలా.. ఈ తెల్లోల్లతో లిగిడి పడలేకున్నాం. ఒక్కంబుకు పత్తలలు తెగి పడాలి అన్నాడు.

'నా అంబులకు సెట్ల పసర్లు పూసినాన్‌. ఒక్క అంబుకు ధుసి వూద్పడాలి అన్నాడు పెద్ద బైలోడు.

అందరూ పెద్దచామగూడెంలో ఉన్న తెల్లోల్ల పైకి యుద్దానికి పోయారు. గియ్‌ మని అంబులు సాల్వ గద్దలా, కొండనాగ్‌ పామ్‌లా పడ్డాయి. తెల్లోల్లకి గుండెల్‌ జార్జవి.

'ఓరి తెల్లోడా.. పెద్ద చామ మా బంగారు పెంట. ఇడ్సిపో. లేకపోతే దబ్బ తెక్కి సంప్తన్‌ అని అరిచాడు.

తెల్లోల్లు తుపాకుల్తో కాల్పారు. తూటాలు అయిపోయవరకు గమ్మునుండి ఆ తర్వాత గూడెం మీద పది దొరికిన తెల్లోల్లనందర్ని సంపిరి. పెద్ద చెర్వు చెంచుగూడెంలో బందీలుగా ఉన్న చెంచుల్ని ఇద్చించారు. పెద్ద బైలోడద్ని సంపటానికి తెల్ల దొరలు పరుగులు పెట్టారు. వెదురుకి నిప్పుపెట్టి దివిటీ సేసి మల్ల గుండంలోకి ఇసిరేశాడు బైలోడు. నిప్పుకి బెదిరి గుర్రాలు ఉర్మినవి. లోయలోని గుండంలో ఒకరిమీద ఒకరు పడి అందరూ సచ్చినారు. ఇన్నావా మన చెంచు జాతిలో ఎంత గొప్ప ఈరులున్నారో?” చాలా ఉత్సాహంగా పెద్ద బైలోడి వీరగాథ కొడుక్కి చెప్తన్న మల్లయ్య తలతిప్పి చూశాడు.

అప్పటికే నర్సిమ్మ నిద్రలోకి జారుకున్నాడు.

మల్లయ్య తన కొడుకు శరిరాన్ని ఆప్యాయంగా నిమిరాడు. వీడు చెంచు యువకుడిలా ఎదుగుతాడా లేక మైదానాల్లో పెరిగే కుర్రాళ్ళలా మారిపోతాడా అనే ఆలోచన.. అడవినుంచి ఈ పక్కా ఇళ్ళల్తొకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన గురొచ్చిందతనికి.

చెంచు జాతి పిల్లలు ఉసుళ్ళన్‌, చిమల్సి ఎలుకల్సి ఉడుతల్ని ఏవి దొరికితే వాటిని అసహ్యించుకోకుండా తినెలా తయారుచేయడానికి పాలు తాగే పిల్లలకు ఈగల్ని మెత్తగా

గుర్రపుడెక్క స్రలీరి నలిపి పాలతోపాటు కలిపి పట్టిస్తారు. ఆ రోజు లచ్చిమి ఈగను పట్టుకుని దాని రెక్కల్ని తుంచెసి, తల భాగాన్ని తీసేసి మిగిలిన దాన్ని మెత్తగా నలుపుతుంటి చూసి మల్లయ్య విషాదంగా నవ్వాడు.

“ఎందుకు మావా నవ్వుతావు?” చిన్న గరిటెలో చనుబాలు పిండి దాంట్లో నలిపిన గుజ్జుని కలుపుతూ అంది లచ్చిమి.

“ఎందుకే లచ్చీ అయన్స్నీ. ఈడు పెద్దయి అడివికెప్పుడు ఎల్లాల? ఎల్లి ఉసుల్లని తింటాడా ఉదతల్ని తింటాడా? అడివే దూరమైనాక అయన్నీ ఉత్తి మాటలే. మనకు పుట్టినాడు కాబట్టి ఈడు చెంచు జాతోదే. కానీ మైదానాల్లో పెరిగి ఈడు పూర్తి చెంచులా ఎదగడే. అడవి గాలి తగలకుండా పెరిగినోడు చెంచు బిడ్డ ఎలాగవుతాడు? ఈడు సగం చెంచు మాత్తరమేని అంటూ బాధపడ్డాడు.

మళ్ళా తనే అన్నాడు.'*ఈడి గురించి ఎన్ని కలలు కన్నానో.. అడివిలోకి నేనూ నర్సిమ్మా ఎల్తాం. ఈడు తన బుల్లి బుల్లి పాదాలో సన్నసన్నగా నాముందు నడుస్తుంటాడు. నెను ఆదికి అంబులెలా ఏయాలో నేర్పిస్తా ఉసుళ్ళు పట్టడం నేర్పిస్తా. సరై తీయటం నేర్పిస్తా. కానీ అయన్నీ కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయే” అన్నాడు.

అవన్నీ కేవలం కలలే. ఎన్నటికీ నిజం కాని కలలు...దుఃఖంతో మల్లయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.

టింబర్‌ డిపోలో పనిలోకి చెరాక మల్లయ్యకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. శామ్యూల్‌ అతనికి నాగరీక సమాజం ఎంత మేడిపండో వివరంగా చెప్తున్నాడు. లోపల విషాన్ని దాచుకుని పైకి నవ్వు ముసుగులు తొడుక్కునే మనుషులు... వికృత మనస్తత్వాలు... మోనాలు.. కుట్రలు.. కుతంత్రాలు.

టింబర్‌ దిపో యజమాని రామక్రిస్టకి సంబంధించిన రహస్యాలన్నీ శామ్యూల్‌కి తెలుసు. అన్ని ఒక్కటొక్కటిగా తెలిసే కొద్ది మల్లయ్యలో అసహ్యం, జుగుప్ప...

ఓ రోజు సేల్స్‌ టాక్స్‌ వాళ్ళు డిపోమిద రెయిడ్‌ చేశారు. అప్పటివరకు మల్లయ్యకు వ్యాపారం చేసేవాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టాలన్న విషయం తెలియదు.

గుర్రపుడెక్క సీలీర

“పెబుత్వానికి కట్టాల్సిన శిస్తు ఎందుకు కట్టడు?” అని శామ్యూల్‌ని అడిగాడు.

“ప్రభుత్వాన్నీ ప్రజల్ని మోసం చేయకపోతే లక్షలకు లక్షలు కూడబెట్టడం కష్టం కదా. ఫారెస్ట్‌ వాళ్ళ నుంచి వేలం పాటలో ఈ కలపని కొంటాడు కదా. కానీ అసలైన ధర చూపించడు. అందులో ఐదో వంతో ఆరో వంతో చూపిస్తాడు. అసలు ధర చూపిస్తే సేల్స్‌ టాక్స్‌ ఐదారింతలు కట్టాల్సి వస్తుంది కదా.. అందుకని” అన్నాడు శామ్యూల్‌.

“మరిప్పుడు ఆల్లందరూ కట్టగట్టుకుని వచ్చారుగా. అంతకంత తప్పు కట్టించుకోరా?”

“పిచ్చోడిలా ఉన్నావే. అంతా నాటకం.. వచ్చిన వాళ్ళ జేబుల్లో మన ఓనర్‌ నోట్లు కుక్కుతాడు. వాళ్ళ నోళ్ళు మూతబడ్దాయి. చెతులు సచ్చుబడిపోతాయి. ఈ ఇంటికి కాపలా ఉండే కుక్కల్లా తోకాడించుకుంటూ వెళ్ళిపోతారు”

“మరి పెబుత్వం సూస్తూ వూర్ముంటుందా?”

“వూర్మోక వురేసుకుంటుందా? ఆల్లీగా ప్రభుత్వం. అందరూ లంచాలు మరిగినోళ్ళ. మన దేశంలో డబ్బుంటే చాలు పది మందిని ఖూనసి చేసి బైట దర్హాగా పెద్ద మనిషిలా తిరగొచ్చు”

“లంచాలా.. అంటే ఏంటి?”

“ఒరేయ్‌ ఎర్రి నాగన్నా లంచాలంటే ఇందాక చెప్పానే పన్ను కట్టకుందా ఆళ్ళ నోళ్ళల్లో నోట్లు కుక్కుతాడని.. అదీ”

“ఆల్లే పెబుత్వం అన్నావుగా సామీ. మరి ఆల్లకే పైసలిస్తే తప్పు కట్టినట్టగా”

“ఆళ్ళు ప్రభుత్వమే. కాని తీసుకున్న డబ్బు ప్రభుత్వానికెళ్ళదు. ఆళ్ళ స్వంత ఖర్చులకోసం ఆళ్ళ ఇళ్ళకళ్తుంది”

మల్లయ్యకు కొంత అర్ధమైంది. కొంత అర్ధం కాలేదు.

“శిస్తు కట్టలేకపోతున్నాడంటే అందుకు సరిపడా పైసళ్లేవేమో సామీ” అన్నాడు.

“పైెసలా... మన ఓనర్‌ దగ్గిరా... బస్తాల్లో మూలుగుతున్నాయి తెలుసా? హైద్రాబాద్‌లో రండళ్ళున్నాయి. నాలుగో ఐదో ఇళ్ళ స్టలాలున్నాయి. శ్రీ శెలంలో ఇల్లుంది. వందెకరాల పొలం ఉంది. ఇంట్లో మంచాల కిందా పరుపుల్లో దిళ్ళల్లో నోట్ల కట్టలు కూరి పెద్దాదని అందరూ అనుకుంటారు”

గుర్రపుడెక్క నీల్‌ర

మల్లయ్యకో విషయం అర్ధం కాలెదు. తనకూ తన పిల్లలకు సరిపడా సంపాయించి దాచుకోవడం వరకు సరే. ఇంతింత డబ్బు దాచిపెట్టి ఏం చెస్తారు? ఎందుకలా దాచి పెడారు?

“ఎడు తరాల వరకు కూచుని తిన్నా తరగనంత సంపాయించి పెట్టాడు. అవకాశం దొరికితే దెశాన్ని మొత్తాన్ని దోచుకుని యింట్లో గొయ్యి తవ్వి దాచిపెట్టుకునే రకం. ఈడదనే కాదు. చానామంది ఇంతే...”

ఏపూటకు సరిపడా తిండిని ఆ పూటకు సంపాయించుకుని రేపటి గురించి ఆలోచించకుండా నిశ్చింతగా నిద్రపోయే తన జాతికి, కొన్ని తరాలకు సరిపడా అన్యాయంగా అక్రమంగా సంపాయించి మురగబెడ్డున్న నాగరికులకు ఎంత తేడా అనుకున్నాడు. అవసరాలకు మించిన డబ్బుని దాచుకుని ఏం చేసుకుంటారో ఎంత ఆలోచించినా అతనికి అర్ధం కాలేదు.

ఓ రోజు పని చేసుకుంటూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. శామ్యూల్‌ ఇంటినుంచి కబురొచ్చింది అతని భార్యకు నొప్పులొస్తున్నాయని.

“నిన్ననేగా డాక్టర్‌ వద్దకు పిల్చుకెళ్తే కాన్పుకింకా వారం రోజులుందని చెప్పింది. ఇదేంటబ్బా విచిత్రం” అనుకుంటా ఓనర్లో చెప్పి ఇంటికి బయట్టెరాడు శామ్యూల్‌,

“నెనూ సాయం వత్తాను సామీ. నీకు తోడుంటా” అన్నాడు మల్లయ్య,

ఇద్దరూ ఇంటికెళ్ళటప్పటికే శామ్యూల్‌ భార్య నొప్పికి తాళలిక మెలికలు తిరుగుతోంది.

మల్లయ్య ఆటో మాట్లాడుకుని వచ్చాడు. వూళ్లోనే ఉన్న (పైమరి హెల్త్‌ సెంటర్‌కి పిల్చుకెళ్ళారు.

అక్కడున్న నర్స్‌ “యింటికి పిల్చు౩ళ్ళివాంది. మా దగ్గర బెద్స్‌ ఖాలీగా లేవు” అంటూ నిర్లక్ష్యంగా చెప్పింది.

“అయ్యో... అలాగంటే ఎలానమ్మా.. నువ్వూ ఆడదానివే. నా భార్యని చూడెలా బాధపడ్డుందో.. కనికరించు తల్లీ” అంటూ శామ్యూల్‌ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు.

ఆమె కాళ్ళని వదిలించుకుంటూ “పిల్లలు కావాలంటే నొప్పులు పడకుండానే పుడ్తారా? ఎల్లెల్లు. డాక్టరమ్మ కూడా లేదు. మేమేం చేయలేం” అంది.

శామ్యూల్‌కి ఏం చేయాలో తోచలేదు. నొప్పికి తాళలేకపోతున్న భార్యని పొదివి

గుర్రపుడెక్క సీలీరి పట్టుకున్నాడు.

“దాక్టరమ్మ ఎక్కడుంటారో సెప్తె నేనెల్లి పిల్సుకొత్తానమ్మా” అన్నాడు మల్లయ్య, అతని వైపు పురుగుని చూసినట్లు చూసి “డాక్టరమ్మ ఢిల్లీ వెళ్ళింది. పో పిల్చుకురా పో” అందామె.

గేట్‌ దగ్గర ఉన్న వాచ్‌మన్‌ సైగ చెసి మల్లయ్యను దగ్గరకు పిలిచాడు. “ఎప్పుడూ ప్రభుత్వాసుపత్రికి రాలేదా? కొత్తా అని అడిగాడు.

“అవును సామీ. ఆడకూతురి బాద సూళ్ళేకుండా ఉన్నా సామీ. నువ్వే నర్సమ్మకి సెప్పి పున్నెం కట్టుకో సామీ” అన్నాడు.

“ఇందులో పున్నెం లేదు. పాపం లేదు. ఆ నర్స్‌ చేతిలో ఐదొందలు పెట్టు. బెడ్‌ దొరుకుద్ది. దాక్టరమ్మ చేతిలో వెయ్యో రెండు వేలో పెడ్తే కాన్పు జరుగుద్ద” అన్నాడు.

మల్లయ్య ఆ విషయం శామ్యూల్‌ చెవిలో వేశాడు.

“ధర్మాసుపత్రి కదా. డబ్బులివ్వందే పనులు జరగవని తెలుసు. కాని ఇంతింత డబ్బులడుగుతారని వూహించలేదు మల్లయ్యా. వందో రెండొందలో చెతిలో పెడ్దే చాలనుకున్నాను. నా దగ్గర అంతకన్నా లేవు. వెళ్ళి మరోసారి నర్సు కాళ్ళు పట్టుకుంటాను. ఆ తల్లి గుండె కరక్కవోతుందా? చూస్తాను” అన్నాడు శామ్యూల్‌.

నర్స్‌ దగ్గరకెళ్ళి తన చేతిలో ఉన్న మూడొందలు ఆమె ముందు పెట్టి దండం పెట్టాడు.

“ఏంటిది?” అందామె కోపంగా.

“నా వద్ద అంతే ఉంది తల్లీ. పేదోణ్ణి. కూలి చేసుకుని బతికేటోణ్సి. దయ చూడమ్మా” అన్నాడు.

“ముప్పేస్తున్నావా... పోపో... అన్నీ నాటకాలు. మా దగ్గరకొచ్చేప్పటికే బీద అరుపులు అరుస్తారు. (ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వేలకు వేలు కట్టడానికి మాత్రం డబ్బులుంటాయి. బెడ్‌ ఖాళీ లేదన్నాగా. ఒక్కసారిచెప్తె అర్ధం కాదా. ఇంటికి తీ స్మెళ్ళు” అందామె విసురుగా డబ్బుల్ని నెట్టెస్తూ,.

శామ్యూల్‌ భార్యకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం. ఎండ మండిపోతోంది. ఏం చేయాలో తెలీక ఆమెను చెరో వైపు పట్టుకుని ఎలాగోలా ఆస్పత్రి బైటికి తెచ్చారు. ఆటోరిక్షాలెవీ కన్పించలేదు. కొద్ది దూరం అలానె లాక్మెళ్ళారు. ఆమె నడవలేక పోతోంది. రోడ్దు పెనంలా కాలుతున్నా నిలబడలేక రోడ్డుమీదే

గుర్రపుడెక్క నీలీర కాళ్ళు బార్లా చాపుకుని కూచుండిపోయింది.

ఆటో దొరుకుతుందేమోనని మల్లయ్య రోడ్దు చివరివరకూ వెళ్ళి తిరిగొచ్చాడు.

ఉమ్మసీటితో రోద్దు తడిచిపోతోంది. నొప్పులు తీవ్రంగా వస్తున్నాయి. “నాకు కాన్సయ్యేలా ఉందయ్యా” అంత బాధలోనూ స్తీ సహజమైన సిగ్గు ముంచుకురాగా నాలుగు వైపులా చూసూ తన భర్తతో అందామె.

శామ్యూల్‌ చాటుకోసం చుట్టూ వెదికాడు. కొద్ది దూరంలో తుమ్మ చెట్ల గుబురు కన్పించింది. ఇద్దరూ ఆమెను మోసుకుని చెట్ల చాటుకి తీసుకెళ్ళారు. మల్లయ్య వచ్చి రోడ్డుమీద నిలబడ్డాడు. ఆమె కేకలు పెడోంది. శామ్యూల్‌ బెంబేలెత్తిపోతున్నాడు. ఆస్పత్రికి పిల్ళుకొచ్చి ఎంత తప్పు చేశాడో అర్ధమౌతోందతనికి. ఇంటి దగ్గర ఉన్నా చుట్టుపక్కల ఆడాళ్ళ సాయం ఉండేది. భార్య కష్టం చూళ్ళేక ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే భార్యతో ఓర్చుకోమని చెప్తున్నాడు. పట్ట పగలు, ఆరుబయట, చెట్ల పరదాల చాటున ఆమెకు ఆదపిల్ల పుట్టంది. మల్లయ్య దగ్గరున్న చురకత్తితో బొద్దు తాడు కోశాడు శామ్యూల్‌. ఈ లోపల మల్లయ్య ఆటోని పిల్చుకొచ్చాడు. ఆస్పత్రి వాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ తన భార్యనీ పసిగుద్దుని ఇంటికి పిల్చుకెళ్ళాడు శామ్యూల్‌.

టింబర్‌ డిపో వైపుకు మెల్లగా నడుస్తున్న మల్లయ్యకు తమ గూడెంలో జరిగిన కాన్సులు గుర్తుకు వచ్చాయి. నిండు గర్భిణులైనా కాన్సయ్యె క్షణం వరకు చెంచు స్త్రీలు ఏదో ఒక పని చేసూనె ఉంటారు.

గడ్డలు తవ్వకు రావడానికో, వంట చెరుక్కోసమో, గడ్డి గింజలకోసమో అడవిలోకి వెళ్తారు. అలా పన్లో కెళ్ళిన స్త్రీకి అక్కడే కాన్సు జరిగి, చేతిలో ఉన్న కత్తితోనో కొడవలితోనో బిడ్ద పేగు తెగ్గోసి, బిడ్డను గుడిసెకు ఎత్తుకొచ్చిన సంఘటనలెన్నో..

నాగరీక సమాజంలో కొస్తే ప్రీలకు కాన్పులప్పుడు వైద్యసాయం అందుతుందనీ, తద్వారా ప్రసవ సమయంలో జరిగే శిశు మరణాల్సి ప్రీల మరణాల్ని నివారించవచ్చనీ కేదార్‌ చెప్పిన విషయం గుర్తొచ్చింది. కానీ మల్లయ్యకు అడవికీ బైటి సమాజానికీ తేడా కన్పించలేది విషయంలో. శామ్యూల్‌ భార్య చెట్ల చాటునే ప్రసవించింది. అడవే నయం.. ఇక్కడ మరీ అమానుషం. డబ్బుకోసం కాన్పు చేయకుండా బైటికి గేంటేయడం ఈ సభ్య సమాజానికే చెల్లింది. చెంచుపెంటల్లో కాన్పులు చేసే మంత్రసాని ఎప్పుడూ డబ్బులాశించి

గుర్రపుడెక్క సలీ6 పని చెయ్యదు. చెంచులెవరూ డబ్బులకోసం మంచితనాన్ని మానవత్వాన్ని పణంగా పెట్టరు.

మల్లయ్యకో విషయం స్పష్టంగా అర్ధమైంది. కేదార్‌ చెప్పిన నాగరిక సమాజపు వసతులు, సౌకర్యాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఫలాలు, చివరికి ఉచితంగా అందాల్సిన వైద్య సదువాయాలు కూడా డబ్బున్నవాళ్ళకే లభిసాయి. పేదవాడి బతుకు అడవిలో ఉన్నా నాగరిక సమాజంలో ఉన్నా దుర్భరమే. పక్కవాడు చావుబతుకుల్లో గిలగిల్లాడుతున్నా గుక్కడు మంచిసీళ్ళు దొరకవీ నాగరిక సమాజంలో. అడవే నయం... అవసరాల్లో అమ్మలా ఆదుకుంటుంది.

“అయ్యా.. అడివి సూపితానంటివే. ఎల్జ్లామా” అన్నాడు నర్సిమ్మ.

అలా రోజూ అడుగుతూనే ఉన్నాడు. ఏదో ఒకపని.. తీరికే దొరకని జీవితం.. పరుగు.. మల్లయ్యకు కుదరటమే లేదు.

ఆ రోజు ఆదివారం. ఎట్లాగయినా సరే కొడుకుని అడవికి పిల్చుకెళ్ళి వాడితో తన జ్ఞాపకాల్ని, అడవితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

విల్లంబులు గొడ్డలి లేకుందా, నదుముకి బెల్దులా కట్టుకున్న తబిశనార పట్టాలో చిన్న కత్తిని దోపుకుని, నర్సిమ్మ వేలు పట్టుకుని అడవిలోకి బయట్టెరాడు. తోకూపుకుంటూ పక్కనే బైరిగాడు నడుస్తున్నాడు. కొడుకు వేలు పట్టుకుని నడుస్తూ మహదానంద పడిపోతున్నాడు మల్లయ్య. చాన్నాళ్ళ తర్వాత పుట్టి పెరిగిన వూరికి వెళ్ళేటప్పుడు కలిగే తీయటి అనుభూతి నరనరాన పాకుతూ...

ఎంత దూరం నడిచినా అడవి కన్సించటం లేదు. రోడ్లు. రోద్దుపక్కన షాపులు... విస్తరించిన ఇళ్ళు.. ఇళ్ళ స్థలాలు... ఎటు చూసినా ఏదో ఒక కట్టుడు పని నడుస్తోంది. కూలీలు ఇటుకలు మోస్తూనో, గోడలు కడ్తూనో, పునాదులు తవ్వుతూనో, బండలు పరుస్తూనో కన్పిస్తున్నారు.

గుడి దగ్గర చెరువుని సమీపిస్తూ “ఈ సెర్వులో నీల్లు కొబ్బరినీల్లలా తీయగా ఉంటాయి తెలుసా.. నేనీ సెర్వులో ఈత కొట్టెటోణ్ణి” అన్నాడు కొడుకుతో. తీరా చెరువుని చేరుకుని నోరెళ్ళబెట్టాడు. అక్కద చెరువులేదు. పూడ్చెశారు. గట్టుమీద ఉండాల్సిన పెద్దపెద్ద

గుర్రపుడెక్క నీలీర చెట్లు లెవు. కొట్టేశారు. కొంత మంది కూలీలు గట్టుని తవ్వి పోస్తున్నారు.

“ఇక్కడి సెట్లెవి? గట్టునెందుకు తవ్వతున్నారు” వాళ్ళల్లో ఒకతన్ని అడిగాడు.

“ఇంకెక్కడి సెట్లు? ఏనాడో కొట్టేశారు. ఇక్కడ ఆపీసర్లకోసం బిల్లింగ్‌ కడ్డారట. అందుకే సదును సేత్తున్నాం” అన్నాడతను.

“మరి సెరువో?”

“ఎప్పుడో పూదిపోయిందిగా. సెరువున్న సోటే బిల్దింగ్‌ లేపుతారు”

మల్లయ్యను పెను తుఫానులా చుట్టెస్తూ దుఃఖం... చెంచు గూడేలన్నిటికి ప్రాణాధారమైన చెరువు. తనూ తన అయ్య, తన తాత ఈ చెరువు స్‌ళ్ళే తాగారు. ఈ నాగరిక మనుషులు జొరబడ్డాక గుర్రపుడెక్క చెరువుని కొండచిలువలా మింగేసింది. చివరికి చెరువునే చంపేశారు.

బరువెక్కిన గుండెతో తన కొడుకు చేయి పట్టుకుని అడవిని వెతుక్కుంటూ ముందుకు కదిలాదు.

ఒకప్పుడు తమ చెంచు గూడెం ఉన్న చోటుకి రాగానే ఉద్విగ్నతకు లోనైనాడు. “అదిగో... అక్కడే మా గూడెం ఉండేది” అన్నాడు నర్సిమ్మతో.

“ఏదయ్యా... ఏదీ.. ఎక్కడా?”

బెిను. ఏదీ తమ చెంచు గూడెం? ఎక్కడుంది? ఐ శిధిలాల కింద సమాధిగా మారిపోయిందో... ఇపుడక్కడ ఐదంతస్టుల భవనం దర్జాగా, రీవిగా నిలబడి ఉంది. తమ గుడిసెల్ని మింగేసి శ్రేనుస్తున్న రాక్షసుడిలా ఉందా భవనం...

బైరిగాడు ఆ స్థలాన్ని గుర్తుపట్టి ఉత్సాహంగా మొరిగి, రెండు మూడు చక్కర్లు కొట్ట తిరిగొచ్చాడు.

మల్లయ్య తల వొంచుకుని ఉదాసీనంగా నడుస్తున్నాడు. అక్కడినుంచి చాలా దూరం నడిస్తెగాని చెట్లు కన్చించలేదు. దాదాపు ముప్పావు భాగం అడవిని ఆక్రమించి, చెట్లను నరికేసి, నేలను చదును చేసి ఇళ్ళ స్థలాలుగా మార్చేశారని అర్ధమైంది.

ముందుకెళ్ళే కొద్ది చెట్లు చిక్కబడ్తున్నాయి. తనకు పరిచయమైన అడవిలోకి అడుగుపెట్టిన భావన... మల్లయ్య మోకాళ్ళ మీద కూచుని నేలకు నమస్కరించాడు.

85,

గుర్రపుడెక్క సలీర చుట్టూ ఉన్న చెట్లకు నమస్కరించాడు. ఆ తర్వాత ఆకాశం వైపుకు చెతులెత్తి గాలిలో కలిసి పోయిన చెంచు పెద్దలందరికి నమస్కరించి ముందుకు కదిలాడు.

“అయ్యా.. ఇపుడు పులొస్తే నువ్వు దాంతో కలబడి సంపేత్తావా” నర్సిమ్మ అడిగాడు.

“లేదు. మన చెంచులు ఉత్తి పున్నెన జంతువుల్ని సంపరు. దాని దోవ దాంది మన దోవ మనది”

“అది మనల్నేమీ సేయదా?”

“దాని కల్లల్లోకి కల్లు పెట్టి సూడకుండా పక్కనుంచి ఎల్లా 'ఎరా పెద్గోడా.. మదుసులకు అగపద్డానికి సిగ్రనిపించటంలా.. పిల్లలు అదురుకుంటారు. దాపుకుపోరా' అంటే సాలు మనల్నేమీ సేయకుండా సెట్లలోకి పారిపోతుంది”

రెండు బండకోళ్ళు కన్పించెటప్పటికి మల్లయ్యకు ఆత్మబంధువులు కన్పించినంత సంతోషమనిపించింది. గడ్డిలోని మట్టిని లికి పురుగుల్ని తింటున్న బంద కోళ్ళు తల యెత్తి అన్ని వైపులా చూసి, వింత శబ్దం చేస్తూ పారిపోయాయి.

ఆ శబ్దం దేనికి సంకేతమో మల్లయ్యకు తెలుసు. అతను అప్రమత్తమైనాడు. చెవులు రిక్కించి ఏదైనా జంతువు అలికిడి విన్పిస్తుందేమోనని విన్నాడు. గాల్లో తేలి వస్తున్న వాసనని బట్టి అది ఏ జంతువో ఎటు వైపునుంచి వస్తుందో పసిగట్టడానికి ప్రయత్నించాడు. ఏమీ తెలీటం లేదు. అతనికి భయమేసింది. తనకు తెల్సిన విద్యలన్నీ వఏమైపోయాయి? ఆరేళ్ళ విరామం వాటిని నిరర్ధకం చెసిందా? చెంచు జాతికి వరమైన ఆ విద్యలు మటుమాయమయ్యాయా లేక బలహీనపదడ్డాయా...

మల్లయ్య నర్సిమ్మని తీసుకుని చెట్ల చాటుకళ్ళ నిలబడ్డాడు. అతని సైగల్ని గ్రహించి బైరిగాడు కూడా నిశ్శబ్దంగా నక్కి కూచున్నాడు. ఎదురు పొదల్లోంచి అడవి పంది తన పిల్లల్తోపాటు గుర్‌ గుర్‌ అంటూ బైటికొచ్చింది. అదెళ్ళేవరకూ వేచి ఉండి అదెళ్ళాక బైటికొచ్చి మళ్ళా నడక సాగించాడు.

“ఎందుకయ్యా దాక్కున్నావు? అదేమైనా సేత్తదనా?” కుతూహలంగా అడిగాడు నర్సిమ్మ.

“పిల్లల్ని కన్నాక కొన్ని దినాల వరకు అడవి జంతువు శానా పెమాదకరంగా ఉంటది. దాని దాపులకెల్తే తన పిల్లల్ని ఏదో సేయడానికొత్తున్నారని పైన పడి సంపేత్తది.

గుర్రవుడెక్క నీలీర

మన చెంచులకి అడివిలోని పెతి జంతువు సమాచారం తెల్సి ఉండాల. అవి ఏమేం

తింటాయి ఎప్పుడు ఏటకి బయళ్లెైరతాయి, ఎప్పుడు పెమాదకరంగా ఉంటాయి.. ఇయన్నీ

తెలిత్తేనే పెనాల్తో మనం బతికుండేది. లేదంటే ఏ జంతువో గుటుక్కున మనల్ని మింగేస్తది” తన అయ్య చెప్పే విషయాల్ని శ్రద్ధగా ఆసక్తిగా వింటూ నడుస్తున్నాడు నర్సిమ్మ. మల్లయ్య ఆగిపోయి చెట్లల్లో పొదల్లో దేనికోసమో వెతుకుతున్నాడు.

“ఏందయ్యా ఎతుకుతున్నావు?” అనడుగుతున్న కొడుకు వైపు ప్రమగా చూశాడు మల్లయ్య,

“కన్నుగుల్ల తేనె పట్టు కోసం”

తేనె అంటే ఏంటో వాడికి తెలుసు. కానీ ఈ తేనె గురించి ఎప్పుడూ వినని కారణంగా “అంటి ఏంటయ్యా” అని అడిగాడు.

“చెంచులకు బాగా కట్టపడితే గాని దొరకనివి రెండు. ఒకటి ఈ కన్నుగుల్ల తేనె. రెండోది మెట్ట తాబేలు పిల్ల. మీ అమ్మను మనువాడిన కొత్తలో అడివినుండి నీ కోసరం ఏం తెమ్మంటావని అడిగా. నీఇట్టం అంది. ఎట్టయినా సరే మెట్ట తాబేలు పిల్లని అట్టుకుని దాని గుండె కార్ల్టం వండి అమ్మకు తిన్పించాలనుకున్నా”

“రుచిగా ఉంటాయా?”

“ఓ బెమ్మాండంగా ఉంటాయి. చెంచులు ఆటికోసరం ఎగబడ్డారు. కానీ మెట్ట తాబేలు పిల్లని పసిగట్టటం శానా కట్టం. కల్లు పొడుకుని సూసినా కన్పడవు. రాల్ల మాదిరే ఆటితో కల్సిపోయి ఉంటాయి. అవి కదిల్తే తప్ప తెలీదు అది రాయి కాదు తాబేలు డిప్ప అని. రెండు దినాలు అడివంతా ఎతికినా కన్సడలా. ఇగ లాబం లిదని కన్ను గుల్ల తేనె కోసం ఎదికినా. శానా సిన్నసిన్న ఈగలు.. సిన్న లేనెతుట్టె. కల్లు పోయేలా ఎదికినా కన్చడి సావవు. సివరికో దినం తేనెపట్టుని కనిపెట్టినా. నీకి దినం ఆ తేనె రుచి సూపిద్దామని ఎతుకుతున్నా” అన్నాడు.

ఓ గంట వెతికాక కన్పించింది చిన్న రాయంత తేనెపట్టు. కింద వాగ బెట్టి సగం తేనె తుట్టెని తెంపుకొచ్చి అడ్డాకు దోనెలో తేనె పిండి నర్సిమ్మకిచ్చాడు. మిగిలిన భాగాన్ని బైరిగాడికేశాడు. వాడు తాగబోతుంటిె “తేనె ఏల్తో తీసుకుని నాకాలి. తాక్కూడదు” అన్నాడు.

గుర్రపుడెక్క సీలీర చప్పున అతనికి వాళ్ళయ్య మూగన్న గుర్తొచ్చాడు. తన చిన్నప్పుడు ఇదే మాట తన అయ్య తనతో అన్నాడు. ఇపుడు తను తన కొడుకుతో అన్నాడు. కానీ తన కొడుకు అతని కొడుకుతో ఇలా అనే అవకాశం వస్తుందా? ఇప్పటికే అడవి మూడొంతులు అదృశ్యమైపోయింది. అప్పటికసలు అడవంటూ ఉంటుందా?

“శానా బాగుందయ్యా.. శానా రుచిగా ఉంది” నర్సిమ్మ లొట్టలేసుకుంటూ తిన్నాడు.

“మా అమ్మసెట్టుని సూసొద్దాం పదరా” అన్నాడు కొడుకుతో.

ఎన్నెళ్ళయిందో అమ్మచెట్టుని చూసి...ఎలా ఉందో? ఇది పూత పూసే కాలం. చెట్టంతా తెల్లటి పూతతో సింగారించుకుని నిండుగా ఉంటుందేమో.

ఆలోచిస్తూ నడుస్తున్న మల్లయ్య అనుమానం వచ్చి ఆగిపోయాడు. తను సరిగ్గానె నడుస్తున్నాడా.. దోవ తప్పలేదుగా.. చుట్టూ పరికించి చూశాడు. తనకు బాగా అలవాటైన దోవ.. ఇక్కడే ఉండాలి అమ్మ చెట్టు...కాని అక్కడ లేదు. అక్కడ ఏ చెట్టూ లేదు. తనూ లచ్చిమి కల్సుకున్న మట్ట కూడా లేదు.

నేలంతా చదునుగా ఉంది. కొన్ని చోట్ల చెట్లు నరికేసిన దానికి గుర్తుగా మొండాలు కన్పస్తున్నాయి.

తన అమ్మ చెట్పని కూడా నరికేశారెవరో... దుర్మార్గులు... కిరాతకులు..తన అమ్మ చెట్టుని చంపేశారు. తనకు మరోసారి అమ్మను లేకుండా చేశారు.

మల్లయ్య అక్కడే కూలబడి మోకాళ్ళలో తల పెట్టుకుని వెక్కివెక్కి ఎడ్చాడు.

నర్సిమ్మ బిక్క మొగం వేసుకుని “ఎందుకేడుత్తున్నావయ్యా,. ఏమైనా కుట్టిందా” అని అడిగాడు.

“మా అమ్మ సెట్టుని సంపేశార్రా.. మా అమ్మను పొట్టన పెట్టుకున్నార్రా రాచ్చసులు” అంటూ నర్సిమ్మను కౌగిలించుకుని వాగిలివాగిలి ఎడ్చాడు.

మల్లయ్య పనిచేస్తున్నాడన్న మాటే గాని అన్యమనస్కంగా ఉంటున్నాడు. శామ్యూల్‌ చెప్పే మాటల్ని వింటున్నట్లె కన్పిస్తున్నాడుగౌని మనసంతా మాయమైపోతున్న అడవి ధ్యాసే. రోజు రోజుకు తరిగిపోతున్న తరులగురించిన చింతే.. ఆలోచించే కొద్ది దుఃఖం

గుర్రపుడెక్క నలీర పొంగుకొస్తుంది. ఏడుపు పొర్లు కొస్తుంది.

“ఏంటి మల్లయ్యా.. ప్రాణం బాగోలేదా... ఈ మధ్యన అదోలా ఉంటున్నావు” శామ్యూల్‌ అడిగాడు.

“పెనానికేంలే సామి.. బాగానే ఉంది. మనసే ముల్ల సాపలా ఉంది”

“ఏమైంది? యింట్లో ఏమైనా గొడవ పడ్డావా?”

“లేదు సామీ. మొన్నాదివారం పొద్దుటేల అడవిలోకెల్లిన. సెట్లన్నీ నరికేశారు సామీ. మా తాతలకు అయ్యలకు తిండి పెట్టిన సెట్లు... సల్లని గాలిచ్చిన సెట్లు... సీడనిచ్చిన సెట్లు. సెల్లే లేకపోతే ఆటిమీద బతికే పచ్చులేమైపోవాల.. అడివిని నమ్ముకుని బతికే జంతువులేమైపోవాల.. అన్నీ అనాధలైపోవా సామీ”

“రోజుకు పది పదిహేను లారీలనిండా కలపని టింబర్‌ డిపోలకు తోలాలంటే ఎన్ని వందల చెట్లు నరకాలో ఆలోచించు. మన డిపోకి కూడా మన్నుగొండ అడవినుంచి కలప సప్లయ్‌ అవుతోంది తెలుసా?”

“మన దిపోకా ... మా అడివినుంచా మల్లయ్య షాక్‌ తగిలినట్లు మ్రాన్సడిపోయాడు.

“జను. అందులో అంతాశ్చర్యపోవాల్సింది ఏముంది?”

ఇన్నాళ్ళూ తన యజమాని ఏదో వూరు బస్‌లో వెళ్ళి, వేలంపాటలో కలపని పాడుకుని ఏ అడవినుంచో లారీలో వేసుకుని తెస్తాడని మాత్రమే తెలుసు మల్లయ్యకు.

“అంటే సామి! మనం రంపంతో సెక్కలుగా కోస్తున్న సెట్లు మన్నుగొండ అడవిలోవా? ఏరే వూర్లోకి కదా ఎల్లి తెస్తాడు?”

“టను. అది లెక్కల్లో చూపించే కలప. మన అడవిలోంచి తెచ్చేది దొంగతనంగా తెచ్చె కలప. ఎవరికివ్వాల్సిన లంచాలు వాళ్ళకిచ్చి చెట్లని నరికేయించి డిపోకి తరలించుకుంటాడు”

అప్పటివరకూ రంపంతో దుంగని కోస్తున్న మల్లయ్య ఆగిపోయాడు. “ఇది కూడా మా అడివిలోంచే వచ్చి ఉంటదా?”

“అవకాశం ఉంది”

“ఐతే నేను ఆటిని నాసేతులో ముక్కలుగా కోయలేను సామీ. ఇప్పటికే శానా పాపం

గుర్రపుడెక్క సలీర సేశాను. అడివిలో ఈ సెట్లు మాతోపాటే కలిసి పెరిగాయి. వీటిని కోస్తుంటే నా అన్నల్ని తమ్ముళ్ళని రంపంతో కోస్తున్నట్లే ఉంది సామీ.. ఇక నావల్ల కాదు. నేనీ పని సేయలేను” అంటూ అక్కడే విరిగిన మానులా కూలబడిపోయాడు.

శామ్యూల్‌కి అతని బాధ అర్ధమైంది. అతని పక్షనే కూచుని భుజం మీద చేయి వేసి చెప్పాడు. “చూడు మల్లయ్యా. ఇది మన వృత్తి. పొట్టకూటికోసం చేస్తున్న పని. పాపం ఏదైనా ఉంటే అదంతా ఆ చెట్లు నరికిన వాళ్ళదే. నీదీ నాదీ కాదు. మన ఓనర్‌ ఎన్ని దుర్మార్గాలు చెసి డబ్బులు కూడబెట్టుకున్నా మనకు కూలి ఇవ్వడంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఈ పనే లేకపోతే ఇంట్లో పెళ్ళాం బిడ్డలు పస్తులుండాలి. మరీ చిన్నపిల్లాడిలా బాధపదితే ఎలా చెప్పు”

“లేదు సామీ. ఈ సేతులోటే నా అమ్మసెట్టునికూడా ఆ రంపంతో ముక్కలుగా చీల్చి ఉంటాను. తన కొమ్మల్లో నన్ను వుయ్యాల లూపితే, నేను ఎంత పాపిస్టివాణ్లో, ఆ తల్లి గుందెనీ, ఆ అమ్మ కదుపునీ నా సేతులో నరికేశాను సామీ” అంటూ తల బాదుకున్నాడు.

శామ్యూల్‌కి అతను చెప్తన్నదేమిటో అర్ధం కాలేదు.

“అమ్మచెట్టెమిటి మల్లయ్యా” అన్నాడు.

“నీకు తెలీదులే సామీ. నా అమ్మ సెట్టు... నన్ను తన వాళ్లో పెట్టుకుని సాకిన సెట్టు”

“పోన్లి మల్లయ్యా..ఆ చెట్టు ఈ డిపోకే రావాలని ఎక్కడుంది? మనూళ్లో ఇంకా రెండు డిపోలున్నాయి. వేరే వూళ్ళల్లో దిపోలకి కూడా తరలించి ఉండొచ్చుగా” అతనికి నాంత్వన ఇవ్వాలని శామ్యూల్‌ ప్రయత్నించాడు.

బతిమాలగా బతిమాలగా మల్లయ్య అయిష్టంగానే రంపం పట్టుకున్నాడు. కాని దుంగను కోస్తున్నప్పుడల్లా అది తన అడవిలోంచి కోసిన చెట్టుదేమోనని అనుమానం. భార్యా పిల్లల్ని పోషించటం కోసం తన సోదరుల్నే కోస్తున్నంత బాధ.

మల్లయ్య రోజురోజుకు మానసికంగా కుంగిపోతున్నాడు. అతని ఆరోగ్యం కీణించసాగింది. దగ్గు తెరలు తెరలుగా వస్తోంది. ఎన్ని కషాయాలు వాడినా దగ్గు తగ్గడం లెదు.

లచ్చిమి బలవంతంమీద టింబర్‌ డిపోలో వనికెళ్ళటం మానేశాడు.

గుర్రపుడెక్క సలీర కొన్నాళ్ళు వూళ్లోని మిలట్రీ హోటల్లో పన్చేశాడు. రాత్రుళ్ళు ఇంటికి వచ్చేప్పటికే పది దాటేది. దాని వల్ల ఆరోగ్యం మరింత పాడైంది.

ఆ పని కూడా మాన్సించింది లచ్చిమి. తనే ఇటుకలు మోసే పనికెళోంది. ఐనా మల్లయ్యలో మార్పు లేదు. ఎప్పుడూ దిగులుగా కూచుంటాడు. నర్సిమ్మని చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నిద్దట్లో *నా అడివి.. నా చెంచులు" అంటూ కలవరిస్తుంటాడు.

లచ్చిమికి భయం పట్టుకుంది. కళ్ళముందు బుడ్డన్న చావు కన్పిస్తోంది. తన భర్త కూడా బుద్దన్నలానె మనోవ్యథతో కుంగిపోతున్నాడు. అడవి అదవంటూ కలవరిస్తున్నాడు. తన భర్తను ఎలా కాపాడుకోవాలో ఆమెకు అర్ధం కాలేదు.

“మనం ఈ వూరాదిలి ఎల్లిపోదాం మామా అందో రోజు,

“ఎక్కడికెల్లాం”

“అడివిలోకెల్దాం”

“ఇంకెక్కడి అడివే లచ్చి. సెట్లన్న్‌ మాయం సేసి సిమెంటు గోడల్ని మొలిపించారుగా నాగరీకులు”

“మన అడివినైతే సంపేసినారు గానీ మామా, యింకా శానా అడివులు బతికే ఉన్నాయి. మనం శీశైలం ఎల్ఫాం. నల్లమల అదివిలో మనోల్ల గూడేలున్నాయి. మనం అడివిలోకెళ్లే బతుకుదాం మామా”

అప్పటివరకూ నీరసంగా పడుకుని ఉన్న మల్లయ్య చప్పున లేచి కూచున్నాడు, అతని మొహంలోకి జీవకళ వూటలా వూరింది.

“నిజంగానా లచ్చి. సీకూ అడివిలోకెల్లి బతకటమే ఇట్టమా? నా కోసరం సెప్తన్నావా?”

“అదేంటి మామా అట్టగంటావ్‌.. నేనూ అడివి బిడ్డనే. మన బిడ్డ సాచ్చికంగా సెస్తన్నా. నాకీ వూల్లో బతుకుతున్న బతుకు ఇట్టంలేదు. ఇది బానిస బతుకు. మనం అడివిలో౭ల్లి సాతంత్రంగా బతుకుదాం మామా”

“ఇన్ని దినాలు నీకు మైదానంలో బతకడమే ఇట్టమమోనని అడివిలోకెల్లాలన్న నా కోరికని సంపుకుంటూ వచ్చానే. ఇంక నాకు దిగుల్లేదు. మన నర్సిమ్మ చెంచు పెంటలో

గుర్రపుడెక్క సలీర పెద్దాడవుతాడు. చెంచు ఈరుదిలా ఎటకెల్తాడు. వాడు సగం చెంచు కాదు. పూర్తిగా చెంచు” అంటూ చిన్నపిల్లాడిలా సంబరపడివోయాడు.

ఎక్కడినుంచొచ్చిందో ఓపిక, టింబర్‌ దివోకెళ్ళి శామ్యూల్‌తో తను అడవికెళ్ళిపోతున్న విషయం చెప్పాడు. శామ్యూల్‌ కూడా సంతోషపడ్డాడు. మల్లయ్యనతను పూర్తిగా అర్దం చేసుకున్నాడు. ఏ నీళ్ళలో పెరిగిన చేప ఆ నీళ్ళలో ఉంటేనే బతుకుతుంది. చెరువులో పెరిగే చేపల్ని ఉప్పునీళ్ళలో వదిత్తే వూపిరాడక చచ్చిపోతాయి. చెరువుకన్నా సముద్రం విశాలం కావచ్చు. రకరకాల రంగురంగుల చేపలుండొచ్చు. వాటితో పాటు తిమింగలాలూ ఉంటాయి. అందుకే తాము పెరిగిన ఆ చిన్ని చెరువె వాటికి స్వర్గ తుల్యం.

కొమరయ్య దగ్గర వీడ్కోలు తీసుకుందామని ఇంటి3ళ్ళాడు. అతను వాలం దగ్గర ఉన్నాడని తెల్సుకుని వాలం దగ్గరకెళ్ళాడు. మల్లయ్యను చూడగానే చెస్తున్న పనిని ఆపి గట్టుమీదకొచ్చి ఆప్యాయంగా పల్మరించాడు కొమరయ్య,

“సామీ.. నేను అడివికెల్తున్నా నల్లమల అడివిలోకి.. మా అడివితల్లి ఒడిలోకెల్తున్నా. ఎగసాయం ఎట్టా సేయాలో నేర్పావుగా. అడివిలో ఎగసాయం సేస్తా అక్కడ పొలం లాక్కునే కనకారావులుండరు సామీ. అడివి మాది.. మా అమ్మ” అన్నాడు సంతోషంగా.

అడవిలో మల్లయ్యకు కనకారావులాంటి మానవమృగాలు ఎదురుపడకూడదని మనస్పూర్తిగా కోరుకున్నాడు కొమరయ్య, “నిన్నూ నీ కుటుంబాన్ని మనూరి గుట్టమీదున్న లక్షీనర్సింహస్వామి, శ్రీశైల మల్లికార్జునస్వామి తప్పకుండా కాపాడ్దారు మల్లయ్యా, నీకెప్పుడే అవసరమొచ్చినా మన్నుగొండలో నేనున్నానని మర్చిపోకు” అన్నాడు.

మరునాడు యింట్లో ఉన్న కాసిని వస్తువుల్ని రెండు మూటలుగా కట్టి, ఒకదాన్ని లచ్చిమి కిచ్చి మరొకటి తన భుజానికి తగిలించుకున్నాడు. నర్సిమ్మని మెడమీద కూచోబెట్టుకుని యింటి తలుపు జేరవెస్తున్నప్పుడు అతనికి ఏడుపొచ్చింది. మన్నుగొండ అడవిలో గడిపిన జీవితం, చెంచుపేటకు రావడం, వ్యవసాయం, తన వాళ్ళందరూ చెల్లాచెదురైవోవటం, బుడ్డ్దన్న మరణం అన్నీ గురొచ్చి గుండె చెరువయ్యింది.

“పద మామా.. ఆలీసెమయితే పొద్దుగూకేలోపల అడవిని చేరుకోలేం. అక్కడికెల్లాక చెంచు గూడేల్ని ఎతుక్ళోవాలిగా” అంది లచ్చిమి తొందరపెడ్డూ.

గుర్రపుడెక్క సలీం

మల్లయ్య గుట్ట వైపు తిరిగి మనసులోనే లక్ష్మి నరసింహస్వామికి దండాలు పెట్టాడు. చెంచుపేటలో బుడ్డ్దన్న పెంచి పెద్ద చేసిన చెట్లకు దండాలు పెట్టాడు. లచ్చిమి పక్కన నడుస్తుంటే ముందుకు కదిలాడు. మన్నుగొండ బస్టాండ్‌ దాటి మిలట్రీ హోటల్‌ దాటుతున్నప్తుడు తనతో పాటు హోటల్లో పని చేసిన కుర్రాడు లోపల్నుంచే పెద్దగా పెలిచాడు. “ఓ మల్లన్నా. ఎక్కడకి మూటా ముల్లె సర్దుకుని బయట్దెరావు?”

మల్లయ్య విప్పారిన మొహంతో సమాధానమిచ్చాడు. “అడివికల్తున్నాం. మా గూడెం మడుసులో కలిసి మంచిగ బతుకుదమని ఎల్తున్నాంో

శ్రీతైలం రోడ్డు మీద నడుస్తూ అడవిని చేరాలని ఆరాటపపడ్డున్న మల్లయ్య గుండెల్సో చెట్లు హరిత నృత్యం చేస్తున్నాయి. పక్షుల అరుపులు కమ్మని సంగీతంలా విన్పిస్తున్నాయి. కళ్ళల్లో వందల హరివిల్లులు విరిసి మురుస్తున్నాయి. మల్లయ్య కలల్లో తేలిపోతున్నాడు. అడవి వాళ్ళని అక్కున చేర్చుకోడానికి తన వేన వేల హస్తాలు సాచి ఎదురుచూసోంది.

కేదార్‌నాధ్‌కి భోపాల్‌ ట్రాన్స్‌ఫరైంది. అక్కడ మూడేళ్ళు చేసాక మళ్ళా హైద్రాబాద్‌, కూకట్‌ పల్లి బ్రాంచికి ట్రాన్స్‌ఫరైంది.

బాబు యింజనీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నాడు. అమ్మాయి ఇంటర్‌లో జాయినయింది. పిల్లల చదువులు... ఉద్యోగ బాధ్యతలు... వూపిరాడనంత పని... తీరికేలేని పని... జీవితం అంటె దెనికోసమో పరుగుపెడ్డున్నట్లే ఉంది. ఎన్ని అందుకున్నా యింకా దేన్నో అందుకోవాలన్న ఆరాటం...

మన్నుగొండ వెళ్ళి మల్లయ్యా, బుద్దన్నాా రాజన్నా.. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసిరావాలని చాలాసార్లు అన్పించినా కదలడానికి వీల్లేకుండా కాళ్ళకు రకరకాల నిగళాలు... కొన్ని తనకు తను వేసుకున్న సంకెళ్ళయితే మరికొన్ని వాటికవే వచ్చి తగులుకున్నవి. ఆరు సంవత్సరాల కాలం రెక్కలు తగిలించుకుని కానరాని దవ్వలకు ఎగిరెళ్ళిపోయింది.

శనివారం సాయంత్రం ఐదు గంటలు... బ్యాంకు పనయ్యాక యింటికి బయళట్లేరాడు. కారుని మెల్లగా నడుపుతున్నాడు... ఆలోచనలు వేగంగా వస్తున్నాయి. రకరకాల

గుర్రపుడెక్క నీలీర ఆలోచనలు... ఈ సంవత్సరం వేరే స్టేట్‌కి ప్రమోషన్‌ మీద ట్రాన్స్‌ఫర్‌ రావొచ్చు. పిల్లల చదువులు సగంలో ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీని షిఫ్ట చేయదానికుండదు. తనే వారాంతాల్లో షటిల్‌ చేయాల్సి రావొచ్చు.

సిగ్నల్స్‌ దగ్గర రెడ్‌ లైట్‌ పడింది. కారుని ఆపి మరలా ఆలోచనల్లో కెళ్ళిపోయాడు. అడుక్కునేవాళ్ళు... విందో గ్లాస్‌ మీద కొట్టీ మరీ అడుగుతోందో బిచ్చగత్తె. న్యూసెన్స్‌... విసుగ్గా చూశాడు. గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. గ్లాస్‌ వేసిఉండటం వల్ల తెలీలేదుగాని తప్పకుండా తిట్టుకుంటూ వోయి ఉంటుంది. ఎంత జబర్దస్తీనో విళ్ళది!

మళ్ళా ఎవరో విండో గ్లాస్‌ మీద టకటకా అని కొట్టాడు. తిద్దామన్నంత కోపం వచ్చింది. గ్లాస్‌ని దింపి తిట్టటోయి ఆగిపోయాడు. తనకు తెల్సిన మొహంలా అన్పించింది. ఎక్కడో చూసిన మొహం...

అతనూ “అయ్యా దరమం” అన్నాక తనమొహం వైపు చూసి బొమ్మలా నిలబడిపోయాడు. అతనికి చప్పున గుర్తొచ్చింది. అతను బుడ్డన్న పెద్ద కొడుకు రాజన్న. అతని చింపిరి జుట్టు, పీక్కుపోయిన దవడలు చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. పైనంతా అనాచ్చాదితంగా ఉంది.. గోచీకి బదులుగా నడుముకి తువ్వాల్లాంటిది చుట్టుకుని ఉన్నాడు.

“రాజన్నా.. నువ్వా? ఏంటిది” అన్నాడు కేదార్‌.

“దొరా” సమాధానం చెప్పకుండా తలొంచుకున్నాడు.

సిగ్నల్‌ గ్రీన్‌కి మారింది. వెనకనుంచి హారన్ల మోత...

“మొదట కారెక్కూ” అన్నాడు.

రాజన్నకి వం చేయాలో అర్ధం కాక మళ్ళా “దొరా” అన్నాడు.

ముందు దోర్‌ తీసి రా.. ఎక్కు మొదట” అన్నాడు.

అతను సీట్లో కూచోడానికి శమ పడ్తున్నప్పుడు గమనించాడు. కుడికాలు మోకాలికింద నుంచీ లేదు. ఆ స్థానంలో కొయ్యకాలుంది.

ఏమైందని అడగబోయి ఆగిపోయాడు. యింటికి చేరాక అతను చెక్కకాలితో మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. కుర్పిలో కూచోమన్నా కూచోకుండా కింద గోడకానుకుని

గుర్రపుడెక్క నీలీర కూచున్నాడు.

“కాఫీ తాగుతావా?”

“తాగుతా దొరా”

కాఫీ బిస్కెట్లు యిద్దరికీ పట్రమ్మని భార్యకు పురమాయించి, “యిప్పుడు చెప్పు. ఏం జరిగింది? మన్నుగొంద వదిలి ఎందుకొచ్చావు? యిలా అడుక్కోవటమేమిటి?” అని అదిగాడు.

రాజన్న వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏడుపు ఆపేవరకు ఏమీ చెప్పడని అర్ధమై కాఫీ రాగానే “మొదట బిస్కట్లు తిని కాఫీ తాగు. తర్వాత మాట్లాడుకుందాం” అన్నాడు. అతను రెండు బిస్కట్లు తిని వూదుకుంటా కాఫీని మెల్లగా తాగుతున్నాడు.

“యింతకూ బుద్దన్న ఎలా ఉన్నాడు? అతనూ సీతోపాటే వచ్చెసాడా” అని అడిగాడు.

“అయ్య సచ్చిపోయి ఐదేల్లయ్యింది దొరా”

“చనిపోయాడా... నేను చూసినప్పుడుకూడా కుర్రాడిలా ఉరకలేస్తూ మాతోపాటు తిరిగాడే.. వయసు అరవై దాటినా రాయిలా ఉండేవాడు. ఎలా చనిపోయాడు?” దిగులు ఆశ్చర్యం కలగలిసివోయిన వింత స్టితి అతనిది.

బుడ్డ్దన్నతో ముడిపడి ఎన్ని జ్ఞాపకాలో...మన్నుగొండ అనగానె మల్లయ్య ఎలా గుర్తుకొస్తాడో బుద్దన్న కూడా అలానే గుర్తుకొస్తాడతనికి.

“మా చెంచుపెంట నాశనమైపోయింది దొరా. సెట్టుకొకడు పుట్టకొకడుగా సెదిరిపోయారు.యియన్ని సూళ్ళేక దిగుల్తో అయ్య గుండె ఆగి సచ్చిపోయాడు. పెద్దమడిసిగా ఉండికూడా తన గూదెన్ని కాపాడుకోలెకపోయానని, తన వల్లె యింత యిపరీతం జరిగిపోయిందని మనోవ్వాధితో సచ్చివోయాడు దొరా” మరోసారి రాజన్న గొల్లుమన్నాడు.

“మీరందరూ పొలాలు సాగుచేసుకుంటా కనకారావు ఇచ్చిన లక్షరూపాయలో సుఖంగా బతుకుతుంటారని అనుకున్నానె. ఇలా అడుక్కోవాల్సిన గతి ఎందుకు పట్టింది రాజన్నా?”

“మా కర్మ దొరా. కనకారావు మోసం సేసి పొలాలు రాయించుకున్నాడు. మేం ఎదవల్లా తాగుడుకి బానిసలై అన్నీ పోగొట్టుకున్నాం దొరా. అతని దగ్గర ఎట్టిసాకిరి

గుర్రపుడెక్క సలీర సేయలేక కూలి పన్లు ఎతుక్కుంటా ఈదురుగాలికి సెల్లాసెదురైన పచ్చుల్లా ఎవరికి తోసిన వూరికి ఆల్లెల్లిపోయారు. నేను నా పెల్లాం బిడ్డల్తో ఈ పట్నం వచ్చినా. లారిలమిదికి బస్తాలు మోసే పన్లో జేరినా. కొన్నాల్లు బాగానే జరిగింది. ఓ దినం కారు టక్కర్‌ యిచ్చి ఎల్లిపోయింది దొరా... కాలిరిగి పోయింది. బరువు పన్లు సేయలేక బీచ్చమెత్తుకుంటున్నా డొరా”

“మల్లయ్య ఎలా ఉన్నాడు?”

“ఏమో తెల్వదు దొరా. నేనా వూరొదిలి శానా దినాలైంది. వూరొదిలి వచ్చేముందు మల్లయ్యకు సెప్పాలనే అనుకున్నా మనసొప్పలే దొరా. బతుకలేక ఓడిపొయినోద్ని. మొగం సూపించలేక వచ్చెసినా”

కనకారావు అమాయకులైన చెంచుల్ని ఎలా మోసం చేశాడో వివరంగా కనుక్కున్నాడు. రాత్రికి భోజనం పెట్టంచాక రాజన్నతో చెప్పాడు. “మా బ్యాంకు నువ్వు కన్పించిన చౌరాస్తాకి దగ్గర్లోనే ఉంది. ఎవర్నడిగినా చెప్తారు. రేపు ఆదివారం. సోమవారం ఉదయంరా. నీకేమైనా పని వెతికి పెద్దాను. బిచ్చమెత్తుకోవటం మానేయి”. చేతిలో వంద రూపాయలు పెట్టి తన పాత బట్టలు రెండు జతలిచ్చి “బ్యాంక్‌కి వచ్చేముందు ఈ బట్టలేసుకుని రా” అని చెప్పి పంపించాడు.

సూర్యకుమార్శి ఫోన్‌ చేసి మరునాడు మన్నుగొండ వెళ్తున్నట్టు చెప్పాడు.

“నేను పనిమీద ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉన్నాను. నేనూ వస్తాను. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ తెల్సుగా. రేపుదయం పదింటికి అక్కడికొచ్చి నన్ను పికప్‌ చేసుకో” అన్నాడు సూర్యకుమార్‌.

మరునాడు బ్యాంక్‌కి శెలవు పెట్టి, క్వాలిస్‌ మాట్లాడుకుని దార్లో సూర్యకుమారి ఎక్కించుకుని మన్నుగొండకి ప్రయాణమైనాడు. అతనికి మల్లయ్య ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో కనుక్కోవాలని ఉంది. వీలైతే నగరానికి పిల్చుకొచ్చి ఏదో ఒక జీవిక ఏర్పాటు చేయాలని ఉంది.

కేదార్కి చెంచుల విషయంలో జరిగింది తల్చుకుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ జీవితాలు బాగు పడాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం అతనికి మింగుడు పడటం

గుర్రపుడెక్క స్రలీ6 లేదు. అపరాధ భావనతో మనసు క్షోభిసోంది.

దార్లో వాళ్ళేమీ మాట్లాడుకోలేదు. గుండెలు దుఃఖభారంతో బరువెక్కితే మాటలు కరువౌతాయి.

కారు చెంచుపేట ముందాపి ఇద్దరూ దిగారు. ఆ పన్నెండు ఇళ్ళకు ముఖద్వారంలా కర్టన ఆర్చి మీద సిమెంట్‌తో చెక్కిన చెంచుపేట అనే అక్షరాలు అరిగిపోయి గుర్తుపట్టడానిక్‌ విళ్లేకుండా ఉన్నాయి.

కారు ఇళ్ళముందు ఆగటం చూసి ఒకరిద్దరు తమ ఇళ్ళలోంచి బైటకొచ్చి నిలబడ్డారు.

“ఇక్కడ మల్లయ్య...చెంచు మల్లయ్య ఉండాలి. ఏ ఇల్లతనిది?” అని అడిగాడు కేదార్‌.

“లేడు. ఇల్లొదిలేసి ఎల్లిపోయాడు” అన్నాడొకతను.

“ఎక్కడిళ్ళాడు?”

“తెల్వదు”

“ఎప్పుడెళ్ళాడు?”

“ఎప్పుడెళ్ళాడో మెం చూళ్ళేదు. నిన్న కనకారావు వచ్చి ఇల్లు వేరేవాళ్ళకి అద్దెకిస్తె మాకు తెలిసొచ్చింది. అదుగో... ఆ యిల్ల” తన యింటికి రెందిళ్ళవతల ఉన్న యింటీని చూపించాడు. కొత్తగా అద్దెకుదిగిన కుటుంబం కూడా బైట నిలబడి చోద్యం చూస్తోంది.

వాళ్ళనుంచి ఎటువంటి సమాచారం దొరకదని అర్ధమై కార్గో బస్టాండ్‌ దాకా వెళ్ళారు. కేదార్‌ అక్కడున్న ఒకరిద్దర్ని అడిగి చూశాడు.

కొద్ది దూరంలో ఉన్న ఆటో స్టాండ్‌లో మూడు ఆటోలు నిలబెట్టి ఉన్నాయి. వాళ్ళకేమైనా తెలుస్తుందేమోనని ఓఆటో (డ్రైవర్ని అడిగాడు. “తెల్వద్‌” అన్నాడు. అతని పక్కన నిలబడి సిగరెట్‌ తాగుతున్న వ్యక్తి తన వైపు తదేకంగా చూస్తూ “నిన్నెక్కడో చూసినట్టుంది నారూ. యాదికి రాటంలా ” అన్నాడు. కొన్ని సెకన్ల విరామం తర్వాత “ఆ..గ్యాపకం వచ్చింది. ఆ దినాం అడవిలకెల్లి మడుసుల్ని తినే వాల్లనుంచి బచాయించుకొచ్చింద్రని సెప్పింది నువ్వేగా సారూ. పరాసికాలాడిండ్రు. ఈ అడవిల్ల అస్మంటివాల్లు ఎవరూ లేరని నాకెరికైందిలే”” అన్నాడు నవ్వుతూ.

గుర్రపుడెక్క సలీర మొదటి సారి తామీ వూరికి వచ్చినపుడు మర్రిచెట్టు కింద పులీ మకా ఆడుతూ కన్పించిన వ్యక్తులో ఇతను ఒకడని కేదార్కి గుర్తొచ్చింది.

“బావున్నావా” అని అడిగాడు సూర్యకుమార్‌.

“బావున్నా సారూ. ఆటో కిరాయికి నడుపుతున్నా. మస్తు బేరాలు తగుల్తున్నయ్‌. ఈ గుడి సల్లంగుండ, సుకంగా ఉన్నా సారూ”

“చెంచుపేటలో ఉండే మల్లయ్య ఎక్కడికెళ్ళాడో ఏమైనా తెలుసా?” అని అడిగాడు కేదార్‌.

“వారం క్రితం మూటా ముళల్లి సర్దుకుని వోతూ కన్పద్దాడు నారూ. ఓటెల్‌ వోరడు ఎక్కడికన్నా అని అడిగిందు. అడవికెల్తున్నమని సెప్పిందు. తమ గూడెలకెల్తున్నట్టు సెప్తంటె ఇన్నా నారూ అన్నాడు.

“యింక ఈ వూళ్లో మనకేం పని లేదు పద. నీళ్ళలోంచి గట్టుమాదికి విసిరివియబడ్డ చేప, కొంత సేపు గిలగిలా కొటుకుని, ఎట్టాగయితేనేం మళ్ళా నీళ్ళలోకే చేరింది. మల్లయ్య తనకిష్టమైన అదవి దారి పట్టనందుకు సంతోషంగా ఉంది” అన్నాడు సూర్యకుమార్‌.

కేదార్‌కి చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు గురొచ్చారు. ఇప్పసారానో కల్లో తాగి దొరికిందేదో తిని తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన చెంచులు... తమ వల్ల బానిసలుగా బతికి, చెల్లా చెదరైపోయి... ఎవరెవరు ఎక్కడున్నారో... ఎన్ని ఇక్కట్లు పడ్డున్నారో... అతనికందుకో ఏడుపు తన్నుకొస్తోంది. గుండె బరువు దిగేలా ఏద్వాలని ఉంది. సముద్రమంత కస్నీరు కార్సినా తరిగేదా ఈ బరువు?

సూర్యకుమార్‌కి కేదార్‌ సున్నితమైన మనసులో చెలరేగుతున్న తుఫాన్లు అర్ధమై, అతని భుజం మీద చేయి వేసి శదార్సే ప్రయత్నం చేశాడు. కానీ అతన్లోనూ అపరాధ భావన పడగవిప్పి బాధపెద్దోంది,

“శిధిలమై పోయిన మన్నుగొండ కోటని,. లక్షీనర్శింహస్వామ్‌ ఆలయాన్ని కనుగొన్నానని ఇన్నాళ్ళూ గర్వపడ్డాను. ఈ వూరు నా కారణంగా మళ్ళా పిల్లా పాపల్తో ధనధాన్యాలతో సుభిక్షంగా మారినందుకు సంతోషించాను. కానీ క్యాన్సర్‌ శరీరభాగాల్ని కొద్దికొద్దిగా

గుర్రపుడెక్క స్రలీరి తినేసినట్లు చెంచుల జీవితాల్లోకి చెదపురుగుల్ని చేరవేశానని యిప్పుదనిపిస్తోంది. హాయిగా స్వేచ్చగా అడవి తల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బీడ్రల్ని ఆ తల్లి నుంచి వేరు చేసి అనాథల్ని చేసిన పాపం కూడా నాదేనన్న పశ్వాత్తాపం నన్ను దహించి వేస్తోంది” అన్నాడు.

“మనం చూసిన అందమైన అడవి... రకరకాల జంతువులకు, పక్షులకూ, చెంచులకూ ఆలవాలమైన అడవి... మాయమైంది. యిప్పుడక్కడ జనారణ్యం మొలిచింది... భస్మాసుర హస్తం కింద మనుషులు బూడిదైెపోయినట్లు మనం అడవిలోకి మోపిన పాదం భస్మాసురపాదంలా మారి ఈ చెంచుల జీవితాల్ని మాద్చి మసి చేసేసింది” అంటున్నప్పుడు సూర్యకుమార్‌ కళ్ళలో తది...

కెదార్కి గుట్ట దగ్గర చెరువులో మొలిచిన గుర్రపు దెక్క గుర్తొచ్చింది. తేటగా తీయగా ఉన్న నిటిని కలుషితం చేసి చివరికి ఆ చెరువునే మాయం చేసిన గుర్రపు దెక్క..

తనని ఓదారుస్తాడనుకున్న సూర్యకుమార్‌ కన్నీళ్ళు పెట్టుకోవడంతో కేదారే అతన్ని ఓదార్చాడు. గుండెల్లో అడవితా- విన్తరిస్తోన్న దుఖాన్ని మోసుకుంటూ ఇద్దరూ హైద్రాబాద్‌కి తిరుగు ప్రయాణమైనారు.

ళ్‌ జ్యూ గైంరాలయ గా గీ ఘః చ క

౬4 (0.12 16% / కు జి ((1110041(10616164 .. - సే ల! [11 ౨౧/00/) అు౦దమైన అడవి... రకరకాల పక్షులకూ, జంతువులకూ, చెంచులకూ ఆలవాలమైన అడవి... మాయమైంది. యిప్పుదక్కడ జనారణ్యం మొలిచింది. చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు... ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన ( చెంచులు... అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాథల్ని చేసిన పాపం ఎవరిది? స్వచ్చమైన నీటికొలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ _ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంనానికి వాల్పడిన గుర్రపుదెక్క ఎవరో ఏమిటో చర్చించిన నవల. ॥ 'నవ్య' వారపత్రికలో “అడవిపూలు” పేరుతో ధారావాహికంగా / వెలువడిన నవల.

  • శ్రీ విజయలుక్షు వభ్లికవల్స్‌ + జ