Telugu కవి - anilvaranasi/indianlanguages GitHub Wiki
లి " " " ళీ ఖ్ య శ గ ప! న న్ ఈ: జు క ట్ న్ు క్ు ల ల | గ్ ఎ నాలా సా జు క ము మ్ ల , ం తై న ళా ా- శ న .. -
- చళ్ళ ను తో శే వా -, క " క్ష % సె ఉం 4 ఛ్ | జ శే ఆ. ము. జ్మా ఛ్ , శ క ౯ | | శె | ౫ ప ॥ సు = ఆ క న క . ల వా “ ం | వ | | ఎ గి | క్ , య ఎంగ 2! క. ను. [్ ఇ ౬ క త్ | క
- 1 శ్వా ఈ. న ర్” సా మక
క్షి జ కాం క సతయ స? = మేముముతి తలసాని నా న ఫ్ట ఫే క్ట ఫ్ క! +! ఫో +ళి వై ష్ గై కచ టీ కంల క్ షే గ్ ట్రై స్డ న శ్ ః నో త స స్ట న సం గ . సే సా
కవి నవల తీ మూలం ; హిందీ (౮ ; తో లో ఆ గ్ర యీ తెలుగు సేత : వసుమతి చలసాని ర్ మొదటి ముద్రణ : మార్చి 2015 (ప్రచురణ లో రాం య తై మాధురి (ప్రచురణలు, విజయవాడ గీ అ ఆ స | ఖచిత్రం :; సాయి అనిల్‌కుమార్ షర కీ ఓ న సీసీ, . ల్ డిజైనింగ్ ల్ బుక్‌మేకింగ్ చను వం. కలిమిశ్రీ, మల్లెతీగ ముద్రణలు, విజయవాడ సెల్ : 92464 15150 (ప్రతులకు ; వసుమతి చలసాని 60-5-2, సిద్ధార్ధనగర్, రవలైను, విజయవాద-520 0౦10 మొబైల్ : 99899 44126 వెల ; రు.75/- 2015 జనవరి చిత మాసపత్రిక అనుబంధ నవల లీ
వసుమతి గారి రచనాశైలిని గుప్పిట పట్టె నవల - కవి
తరతరాలుగా దొంగతనాలు, దౌర్థన్వాలే వృత్తిగా గల వంశంలో వుట్టిన యువకుడు నితాయి. ఆ దిశగానే తన జీవితాన్ని కొనసాగించాలని కుటుంబ నభ్యులు, బంధువులు నితాయిని బలవంతం చేనారు. రామాయణం, మవిో భారతం వంటి వలు ఆధ్యాత్భిక(గంధాల నారాన్ని చదివి ఒంటబట్టించుకున్న నితాయి అందుకు ఏమాత్రం అంగీకరించడు. సాపొత్వాన్ని గానాన్ని రెండు కళ్ళుగా భావించిన నితాయి ఇంటి నుండి బయటి వ్రవంచంలోకి అడుగు పెడతాడు. పట్టుదలతో కృషి చేసి పలురకాల కార్యక్రమాల్లో పాల్గొని కవి గాయ కుడిగా సువ్రనీద్దుడౌతాడు. ఆ వ్రయాణ ౦లో తనకు 'చిన్నరాఖి అనే పెళ్ళయిన వొలవీద్రి, నర్హకబ్బందంలో వసంత” అనే నాట్వగత్తె తారసపదతారు
టీ తాగదమంటే నితాయికి ఎంతో మక్కువ. శిత్తాయికి రోజూ వాలు వోయదానికి వస్తున్న 'చిన్నరాణి” నెవ్మదిగా నితాయి కవెతఆకు, గానానికి ఆకర్షితు రాలౌతుంది. చిన్నరాణి వేరొకరి భార్వ అని తెలుసుకున్న నితాయి '“చిన్నరాణి ని తన భర్తతో సుఖంగా వుందమని దీవించి, ఆమెకు దూరంగా వెళ్ళివోతాడు. నితాయి తనకు దూరమయ్యాదన్న బాధను భరించలేక చిన్నరాణి నితాయీపై విచ్చితో మాననీక వ్వధకు గురవుతుంది.
ఆ తర్వాత తన మజిలీలో నితాయీకి నర్హకబ్బందంలో నాట్యగళత్తెగా వనిచేనే వనంత తారసవడుతుంది. నితాయి కవితకు, గానానికి ఆకర్షితురాలైన వనంత నితాయిపై (పేమ పెంచుకుంటుంది. నితాయి నివనీంచే (ప్రాంతంలో ఒక కార్య (కమ నిర్వహణకోసం వచ్చిన వసంతకు నితాయి సవర్వలు చేస్తాడు. కవి గాయ కుడిగానే కాక వ్యక్తిగతంగా కూడా వనంతకు భాగా నచ్చుతాడు నితాయి స్రీ ఇష్టపదే ఉత్తమ లక్షణాలున్న నితాయిని తన జ్ధందంలోకి ఆవ్వ్యోనిస్తుంది వసంత వద్దని వృదువగా వారిన్తాడు నితాయి. అవ్పుటికి నితాయి దగ్ధర్నండి నెలవు తీసుకుని వెళ్ళీవోతుంది వసంత.
తర్వాత కొన్నాళ్ళకు తన ఊళ్ళో 'మవోత్సవం' జరుగుతుందని, అందులో ము పాట అవసరం ఎంతో వుందని నితాయిని తన ఊరికి ఆవ్యోనిస్తుంది వసంత,
శీల
భక్తికి భగవంతుడు లొంగివోయినట్లు, తన వొటను (కళను, గౌరవిన్తున్నందుకు ఆ ఊరికి వెళతాడు నితాయి అకుడ వసంత తన సవా నాట్వగత్తెలతో ఒక వేశ్వావాటికలో నివసిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గమనిన్తాడు. ఆ వాటికలో చివరిదశలో అనారోగ్యం పాలైన స్త్రీల వెతల్ని చూస్తాడు వసంతతో కలిసి జీవించడానికి నిరయించుకుంటాడు నితాయి. ఆమెకు అన్నీ తానే అయి సపర్యలు చేస్తాడు ఆరోగ్యం బాగా క్షీణించి వసంత మరణిస్తుంది. తానే స్వయంగా వనంత దహన నంస్పారాలు చేనీ స్మశాన వైరాగ్యానికి గురవుతాడు నితాయి
ఆ తర్వాత దిక్కుతోచని స్థితిలో తన ఊరికి వెళ్ళివోతాదు. అకుడ న్నేపొతుల ద్వారా చిన్నరాణి కూదా మరణించిందన్న నిజం తెలుసుకున్న నితాయి నిశ్చేవ్లుడిలా నిలబడివోతాదు.
ఇదీ క్షప్రంగా "కవి నవల సారాంశం. నితాయి, చిన్నరాణి, వసంతల మధ్య అనుబంధాన్ని వేశ్వావాటికలో స్రీలు అనుభవిస్తున్న వేదనల్ని రచయిత్రి వసుమతి గారు వర్ణించిన తీరు పారకుణ్ణి ఫుస్తకం మూయనివ్వదు మరే ఇతర ఆలోచనల్లోకి వెళ్ళునివ్వదు.
సాపొతీ సుమతి చలసాని వసుమతి గారు నాకు మాత్పసమానురాలు, ఆమె గతంలో వెలువరించిన (భ్రమరగీతం, యళోదకృృష్ణు చిత్రలేఖ, కుంతల, అహల్య, సుమిత్ర, గాజుల సవ్వడి గ్రంథాల కంటే ఇది మరింతగా వొరకుల మనసుల్లోకి చొచ్చుకుపోవాలని, పోగలదని నమ్ముతున్నాను.
అందమైన బొమ్మకు తెలుగుదనాన్నద్దిన బిత్రకారుడు బావు. బొమ్మకు ముందు ఆయన పేరు పెడితే గానీ ఆ వదానికి పరివూర్హత రాదు అవ్హుదే అది బాపు బొమ్మ” అవుతుంది. తన కుంచెలో ప్రపంచాన్ని చూవించిన 'బొమ్మర్షి వద్భశ్రీ బావు ఆయన మరణాన్ని జీర్థించుకోలేని మాత్చత్రీ చలసాని వసుమతి గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'సారీ బావూ' అంటూ ఆయనకు కవితా నీరాజనం సమర్పించారు. ఆ కవిత ఎంతోమంది ప్రశంసల్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆ కవిత విషయాన్ని గుర్తుచేయదడం వసుమతి గారి సాపీతీ అంతరంగాన్ని గుర్తు చేసుకోవదంగా నేను భావిస్తున్నాను.
=కలిమిశ్రీ, ఎడిటర్ న్ా సాహిత్య మాసపత్రిక శశ
] |
ఆనంద స్వరూపుడైన భగవంతుడు మూగవానిని వక్తగా మలచగలడదు. కుంటివాడిని కొండ ఎక్కించటం చేయగలడు. కనుకనే ఆయన సంకల్ప బలంతో దైత్యవంశంలో ప్రహ్లాదుడు జన్మించాడు. అలాగే రామాయణ కావ్య కవి వాల్మీకి బందిపోటు దొంగ. ఆయన (బ్రాహ్మణుడు. ఇప్పటికీ మహాకవిగా రాజిల్లుతున్నాదు.
నితాయీ చరణ్ పుట్టిన వంశం హిందూ సంఘంలో నీచమైనది, హేయమైనది. వీరు పట్టణం చివర ప్రాంతంలో గానీ, పల్లెల చివర గాని వుంటూ వుంటారు. అలా అని చిన్నచూపు లేదు. బాణాల కర్రలతో తలలు పగలగొట్టటంలో ప్రసిద్ధులు. ప్రాచీన కాలం నుండి వీరుల వంశమని పేరు వుంది. నవాబుల కాలంలో సైనికులుగా పేరుపొందిన వారు కూడా జమీం దారుల ఆశయం పోయిన తరువాత వీరందరూ బందిపోటు దొంగలుగా మారిపోయారు. ఇనుప సంకెళ్ళతో బిగించిన బేడిలతో కారాగారాల్లో మగ్గిపోతూ వుంటారు. ఇప్పటికీ అంతర్గతంగా నితాయిలో ప్రవహించే వీరి రక్తం ప్రవహిసూనే వుంది. నితాయి మేనమామ ఈ ప్రాంతంలో పేరుమోసిన బందిపోటు దొంగ. అండమాన్ దివుల్లో ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించి వచ్చాడు. నితాయి తండ్రి కన్నపు దొంగ. తాత కాళ్ళు విరగ్గాట్టైె దొంగ. ఇలా భంయకర చరిత్ర కలిగిన వంశంలో నితాయి చరణ్ జన్మించాడు.
కండలు తిరిగిన బలిష్టుడు. పొడగరి. అర్ధరాత్రి చీకటిలో కలిసిపోయే వసుమతి చలనాని ద్
నల్లని రంగు. కళ్ళు చాలా పెద్దవి. చిత్రంగా ఈ కళ్ళల్లో వంశంలో ప్రవహించే హింసా ప్రవృత్తి ఎంత వెతికినా కన్పించదు. వినయం, నమత, అణకువ, జాలి, దయ, [మేమ తొణికిసలాడుతూ వుంటాయి. ఇలాంటి వ్యక్తిత్వం గల నితాయి అకస్మాత్తుగా చండీమాత ఉత్సవాల సందర్భంగా వేదిక మీద కవిగా ప్రకటించుకున్నాడు. వినయంగా శిరసు వంచి చేతులు జోడించి సిగ్గును దాచుకుంటూ దరహాసం చేశాడు.
యాభై మహాపీరాలలో ఒక మహాపీరం ఈ గ్రామంలో వుంది. అధిష్టాన దేవత చాముండేశ్వరి. కాళికాదేవ్ అవతారంలో ఒకటి. మాఘపూర్ణిమనాడు పెద్ద జాతర జరుగుతుంది. చిరకాలం నుండి కవి గాయకుల పోటిలను కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవపాల్ కచేరీ జరుగుతోంది. వీరి ప్రాచుర్యం తెలిసిన జనం తండోపతండాలుగా మధ్యాహ్నం నుండి వస్తున్నారు. చీకటి పడగానే పెట్రోమ్యాక్స్ లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మహాదేవపాల్ సిద్ధంగా వేదిక మీద కూర్చున్నాడు. నోటన్దాసు రాలేదు. కొందరు అతని ఇంటికివెళ్ళి చూస్తే తాళం వేసి వుంది. వేరే ఊరికి వెళ్ళిపోయాడు, ఎక్కువ పారితోషికం వస్తుందని వెళ్ళినట్లు తెలిసింది.
నోటన్దాసు పారిపోయిన విషయం దేవపాల్ మనసులో కలవరం కలుగుతోంది సభలో వున్న జనంలో సహనం పోయింది వాళ్ళలో వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటూ నిశ్శబ్దాన్ని పాటించడం లేదు.
ఇంక సభ జరగదు, కవిగానం జరగదు అంటూ విన్సిస్తోంది. జమీం దారులు ఈ పరిస్థితికి మండిపడ్డారు. దేవపాల్కు వంత గాయకుడు కావాలి. ఇంతలో వినయంగా వేదిక మూల నమస్కరిస్తున్న నితాయి కన్పించాడు. దేవ్‌పాల్ ముఖంలో తేజం ఉట్టిపడింది.
కంగారులో చూడలేదు. వెంటనే నితాయి చెయి పట్టుకుని “మన నితాయి ఇక్కడే వున్నాడు. ఇతడు వంతపాట చాలా బాగా పడగలడు. ఎక్కడి వారక్కడ కూర్చొండి” అంటూ సంతోషంగా ప్రకటించాడు,
కవి గాయకులందరికీ తెలుసు నితాయి. మధురమైన కంరస్వరంతో 6 ఈ కవి నవల
గొంతులో గొంతు కలిపి పాడగలడు. ఆ ఊరివాడే కలకతా నుండి వచ్చిన ఒక ఉద్యోగి- “అలాగా మన నితాయ్ ఇంతటి గాయకుడా?” అంటూ 'వెరిగుడ్..యు ఆర్ ఏ పొయిటొ అంటూ దగ్గరగా వెళ్ళి చెవిలో “నెమ్మదిగా మీ వంశం తెలుసు నాకు. నీ విలాగే మలచుకో జీవితాన్ని. పొరపాటున కూడా నీ కులవృత్తి చేయవద్దు” అని అన్నాడు,
'బాబూ! నా పుట్టుక, నా కుటుంబం ఒక కల నాకు. పూర్తిగా అమ్మతో సహా అందరినీ వదిలివేసి వచ్చాను. ఈ బొందిలో ప్రాణమున్నంతవరకు అబద్ధం కూడా ఆడను, ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు వినయంగా.
“మీరు అభినందించారే అందుకు గాను ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ కవితా గానాన్ని వదిలిపెట్టను” స్థిరంగా చెప్పాడు నితాయి ఆ పెద్దమనిషి
అంత పేరు ఉన్న ఉద్యోగి తనను అలా మెచ్చుకునే సరికి ఎక్కడ లేని ఉత్సాహంతో పాల్ సమీపంలోనికి స్టేజీ మీదకు వచ్చాడు.
ఉక్చాత్రీ! అమావాస్య నాటి అవసరం గదుపుకోవాలి. కాకి కాక” అంటూ కేకలు విన్సించాయి సభలో నుండి.
ఇంతలో ఒక మృదువైన శృతిలో నితాయి పాట పాల్ కంరంతో కలిపి విన్సించింది. పాల్ కూడా నితాయిని ప్రోత్సహించాడు. మధురగానంతో సభ్యులను అబ్బుర పరిచాడు నితాయి. నిశ్శబ్దంగా ముగ్గులై వీనుల విందుగా వస్తున్న నితాయి గానం విని ఆనందించారు.
౭
రెండేళ్ల పాటు నితాయీ పారశాలలో చదివాడు. ఈ రెందేళ్లలోను తన వంశ సంప్రదాయానికి విరుద్ధమైన సాంప్రదాయంతోపాటు బహుమతుల రూపంలో, చొక్కా కండువా, లాంతరు మొదలయిన వస్తువులే కాక కొన్ని పుస్తకాలు కూడా సంపాదించుకున్నాడు. అవి శిశుబోధ రామాయణం, మహా భారతకధ, జంతువుల కధలు మొదలయిన పుస్తకాలు. అతడవన్నీ కంరస్థం చేశాడు. పరిస్టితులనుకూలిస్తే నితాయీ ఇంకా చదువుకునేవాడే. అయితే ఆ స్కూలులో ఒక్క నితాయీ తప్ప ఇంకొకరెవ్వరు అడుగుపెట్టనందువల్ల అది వసుమతి చలనాని 77
మూతపడింది. గత్యంతరం లేకపోయినందువల్ల నితాయీకిక పారశాల విడిచి పెట్టక తప్పలేదు. అప్పటికి అతని విద్యాభిలాష ఇంకొకమార్గంలో కూడా చివురించి విస్తరించింది. దేశంలో పాటకచేరీల పోటీలంటే అతనికి విపరీత మైన ఆసక్తి ఐర్పడింది.
వంగదేశంలో చదువు సంధ్యలేని జనమంతా కవిగానాల పోటీ పాటకచేరీ లంటే చెవికోసుకుంటారు. అయితే ఈ జనం మోటుహాస్య ధోరణులంటే కూడా ఉవ్విళ్లూరిపోతారు. కవి గానాలమీద వారిభక్తికిదే ప్రధానకారణం! అయితే నితాయీ ఆసక్తికి కారణాలు వేరు. పొరాణికగాధలు, గీతికలు, పాటలు, మధ్యమధ్యన చమత్కారాలు మొదలైనవెన్నో అతనికి ఆ కవి గానాల మీద విశేషాసక్తిని కలిగించాయి.
అతని మేనమామ, అతని సంతానం ఇన్నాళ్లనించి నితాయీని “పండిత మహాశయా!” అని పిలిచి వేళాకోళం చేస్తూందేవారు! కాని ఇప్పుడింక అతనిని తమ వెంటబెట్టుకుపోయి వృత్తి దిక్ష ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంటే అర్ధరాత్రివళ తమ దొంగలమురాలో చేర్చాలని ఆలోచించారన్నమాట!
మేనమామ గౌరీచరణ్ ఆ సమయానికి ఆయిదుసంవత్సరాల కారాగార శిక్ష అనుభవించి ఇంటికి తిరిగివచ్చాడు. అతదు ఒకనాడు తనచెల్లెల్ని పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు.
“నిత్రాయీకి చదువుసంధ్య లింక చాల్లే! ఈసారి మాతోబాటు బయటికి పంపించు!”
అతడంత తీవ్రంగా హెచ్చరించాడంటే గట్టిగా ఆజ్ఞాపించాడన్నమాటే! నితాయీ తల్లి అతనిదగ్గిరికివెళ్లి, “ఒరే! నితాయీ, నీవీసారి మురాతో కలిసి వెళ్లాలి మామ చెబుతున్నాడు మరి!” అన్నది,
నితాయీ కొన్ని క్షణాల వరకు ఏకాగ్రదృష్టితో తల్లికేసి చూసి కస్సు మన్నాడు
“ఛీ |! ఛీ 1ఛీ ! కన్నతల్లివై ఉండి, నీవీమాట నాతో అంటున్నావా?” అతని తల్లి నిశ్చేష్పురాలయింది.
మేనమామ కళ్ళెరజేసి, అతని దగ్గిరికి వచ్చి ఎదురుగా నిలబడి 68 ఈ కవి నవల
“ఏమిటెమిటి! అమ్మతో ఏమంటున్నావు?” అని గట్టిగా గర్జించాడు.
నితాయీ ఆ సమయంలో పాతరామాయజణ పుస్తకం చూసి, చూచివ్రాత అలవాటు చేసుకుంటున్నాడు. మామధోరణికి అతదేమాత్రం కంగారు పడకుండా నిర్భయంగా “నేనిప్పుడు రాసుకుంటున్నాను!” అన్నాడు.
“రాసుకుంటున్నావా? అలాగా?” అని గౌరిచరణ్ అతని దగ్గిరికి వచ్చి. పాతరామాయణం పుస్తకంతోబాటు మిగిలిన పుస్తకాలన్ని లాక్కుని దూరంగా విసిరివెశాడు! నితాయీ వెనువెంటనే లేచి నిలుచున్నాడు. నెమ్మదిగా ఆ పుస్తకాలన్ని పోగుజేసుకు మూటకట్టుకుని అదే క్షణంలో ఆ వాడనించి నిష్క్రమించాడు! ఆ గ్రామం అంతా తిరిగి అదేరోజున ఘనశ్యామ గోసాయీ ఇంటిదగ్గర నెలజీతానికి నాఖరుగా కుదిరిపోయాడు.
గోసాయీ వైష్ణవబ్రాహ్మణుడు. ఆయన ఇల్లాలికి సంతానం కలగలేదు. దంపతులిద్దరికి పాలమీద పిల్లికన్న మక్కువ ఎక్కువ! ఇంట రెందు ఆవు లున్నాయి. ఇన్నాళ్ళనించి ఆ ఆవులు రెండు, రాత్రి అంతా యధేచ్చగా తిరిగి మెతమేసి తెల్లవారేసరికి ఇంటికి తిరిగివచ్చి పుష్కలంగా పాలిచ్చాయి. అయితే ఈ మధ్యన కలికాలం బాగా పెచ్చుపెరిగిపోయినందువల్ల [గగ్రామస్తుల్లో గోబ్రాహ్మణ భక్తి అంతా అమాంతంగా హరించుకు పోయింది! ఇందువల్ల గ్రామస్తులు గడచిన రెండు నెలలలోను ఆ రెండు ఆవుల్ని పదిహేనుసార్లు బందెలదొడ్డికి తోలారు. అందువల్ల బాధ్యత గుర్తించుకున్న గోసాయీ ఆ ఆవుల సంరక్షణకోసం మనిషి అన్వేషణలో పద్దాడు. నితాయీ కంటపడగానే అతణ్జి నెలజీతంమీద కుదుర్చుకున్నాడు. అతనికి నితాయీకి మధ్య జరిగిన ఒప్పందం (ప్రకారం నితాయీ ఆవులసంగతి చూసుకోవాలి. ఆపైన అంట్లు, చెంబులు, పాత్రలు తోమాలి. ఏదయినా పని ఉంటే అక్కడికి ఇక్కడికి వెళ్లాలి. రాత్రి ఇంటి చుట్టూరా గస్తీ తిరగాలి.
గోసాయీ ధాన్యం కుదువ పెట్టించి, సొమ్ము వడీ కిచ్చే వ్యాపారం నొగిస్తుంటాడు అందువల్ల అతని మూలధనం ప్రస్తుతం నూరుమణుగుల ధాన్యంనించి ఐడువందల మణుగుల ధాన్యం దాకా పెరిగింది. అతని ఇంటి పెరటిలో ఉన్న గాదె గడిచిన పన్నెండు నెలలనించి పోసిన ధాన్యంతో పూర్తిగా మనవసుమతి భలనాంని ర
నిండింది. సొమ్ము అపు తీసుకున్న వారు ప్రతిరోజు వచ్చి ధాన్యం రూపంలో కొంత బాకీ చెల్లిస్తుంటారు. గోసాయీ బాగా నిండిన ఆ గాదెకేసి, చిక్కి శల్యమైన తన శరీరం కేసి చూసుకుని ఇంతకుమునుపు ఎంతో కంగారు పడుతూందేవాడు. బలిష్టయువకుడు నితాయీ తన దగ్గర కుదురుకున్న తరువాత గోసాయీ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని కంగారు, భయం అన్నీ పూర్తిగా తొలగిపోయాయి!
కొన్నాళ్లు గడిచాయి. అది గాఢాంధకార రాత్రి! ఆ రాత్రివేళ గోసాయీ “నితాయీ” అని పిలిచాడు. ఇంటి బయట అడుగుల చప్పుడు వినబడుతుంది. అందువల్లనే నితాయీకి మెలకువ వచ్చింది. అతడతి రహస్యంగా “చిత్తం బాబూ! నాకు మీమాట వినబడింది” అన్నాడు.
“గొదవచెయ్యకు! లేచిరాగొ అని ఆజ్ఞాపించి, గోసాయీ ముందు నదక సాగించాడు. బక్కచిక్కిన గోసాయీ ధైర్యం గమనించిన నితాయీ ఆశ్చర్యం, ఆసక్తి మరింతగా ఎక్కువై ఇనుమడించాయి. గోసాయీ నిశ్శబ్దంగా వీధితలుపు తెరిచి, ఏధిలోకి వెళ్లాడు. బయట నలుగురు మనుషులు. వారి శిరస్సులమీద గట్టిగా దట్టించిన నాలుగు ధాన్యం బస్తాలు. బస్తాల బరువుతో ఆ నలుగురు మనుషులు వగర్చుకుంటూ అటు, ఇటు తూలుతున్నారు. తలుపులు తెరిచీ తెరవగానే ఆ నలుగురు లోపలికివచ్చి పెరటిలో ఉన్న గాదెలో నాలుగు బస్తాల ధాన్యం పోశారు. ఆ గాఢాంధకారంలో కూడా నితాయీ కళ్ళముందు ధాన్యం తళతళలాదుతూ మెరిసింది ఆ మనుషులెవరో నితాయీకి ఇట్టే తెలిసిపోయింది. వారెవ్వరూ అతని బంధువులు కారు. కానీ వారు నలుగురు ఆ ప్రాంతంలో ప్రసిద్ధికెక్కిన ధాన్యపు దొంగలు!
మరునాడు ఉదయమే నితాయీ గోసాయీ దగ్గిరికి వెళ్ళి చేతులు రెండు జోడించి విన్నవించాడు.
“బాబూ! నేనింక తమదగ్గిర పనిచెయ్యలేను!”
“చెయ్యలేవా?”
“చిత్రం, మరి చెయ్యలేనండి!”
“అయితే నికొక్క పైసా కూడా కూలి ముట్టదు! ఈ సంగతి కనక ఎక్కడన్నా 10 + కవి నవల
పైకి పొక్కిందంటే మరి నీ ప్రాణాలు దక్కవు!”
నితాయీ సమాధానం చెప్పలేదు! తన మూట, ముల్లె చెతపట్టుకుని పీధిలోకి వెళ్ళిపోయాడు! ఆపైన ఆ గ్రామం స్టేషన్లో మకాం పెట్టాడు.
అదే స్టెషన్లో కూలీగా పని చేస్తున్న రాజాలాల్ ఒక అద్భుత వ్యక్తి. గడిచిన మహా సంగ్రామంలో నౌకరుగా వుండి చాలా ప్రాంతాలు తిరిగాడు. అది నచ్చక తిరిగివచ్చి ఈ స్టేషన్లో కూలీగా చేరాడు. మనసిచ్చి ప్రాణాలర్చించే స్నేహం అతభ్శ్సీ సహృదయుడిగా మలచింది. గడియారం ముల్లులాగా సైనికులలో వున్న క్రమశిక్షణ ఆచరించి రాజాను అందరూ గౌరవిస్తారు. ఎక్కువ టి తాగుతూ, మద్యం సేవిస్తూ గొంతు చించుకుని అరుస్తుంటాడు కూడా. కారణం భార్య నోటి దురుసుతనం.
నితాయికి రాజా చిత్రంగా పరిచయమయ్యాడు. రాజాలాల్ కుమారుడు వచ్చీరాని మాటలతో చిన్న గంటను తిప్పుతూ పదండి పదండి బండి వస్తుంది.. అంటూ ముద్దుగా మాట్లాడుతుంటే దగ్గరికి వెళ్ళి ఆ బాలుడిని ఎత్తుకుని మీనాన్న ఎక్కడ? పేరేమిటి? అని అడిగాడు. మా నాన్న రాజా అన్నాడు. అయితే నివు యువరాజా అన్నమాట అన్నాడు నితాయి నవ్వుతూ. ఆ బాలుడు నితాయి మీద నుండి దిగి నేను యువరాజాను అన్నాడు.. ఇదంతా దూరంగా వుండి గమనిస్తున్న తండ్రిని కౌగిలించుకున్నాడు రాజా వెంటనే చాలా బాగున్నాయి నీ మాటలు అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంతలో బండి వచ్చి వెళ్లిపోయింది.
త్రి
ట్రెయిన్ వెళ్ళీవెళ్ళగానే అతనిని వెంటబెట్టుకుని తన కుటీర నివాసంలోకి తీసుకువెళ్ళి భార్యతో “నా మిత్రుడు, చాలా హుందామనిషి మన అబ్బాయిని చూసి “రాజాకుమారుడు యువరాజుని పలకరించాడు” అని చెప్పి హాయిగా కలకలనవ్వాడు. నితాయీ ఉల్లాసంతో ఉప్పొంగి కవిగాయకుని ధోరణిలో చెక్కిలి మీద చెయ్యిపెట్టి వేరొకచెయ్యి ముఖానికి ఎదురుగా ఉంచి, రవంత ముందుకు వంగి రామాయణం జ్ఞప్తికి తెచ్చుకుని కవితాగానం ప్రారం ఖించాడు. వసుమతి చలనాఖి 1.
“జా కుమారుడు యువరాజు
లేజా కుమారుడు మహాతేజుడు!
తింటాడీతడు తియ్యని తినుబండారాలు!
తెలిసినదిది ఈ ఇలలో నెల్లరకు!”
రాజా ఒక్క గంతువెసి ఇంటిలోపలికి వెళ్ళ తన తండ్రికాలంనాట్ డోలు తాను సంపాదించిన కంజిరా పైకి తీశాడు. డోలు తాను చేతపట్టి, కంజిరా కొడుకు చేతికిచ్చాడు. మహేశపూర్లో జరిగిన తీరంలో రాజాతండై ఆ కంజిరా కొని అతనికి బహూకరించాడు. మధ్యాహ్నమే రాజా ఇంటిలో కవిగానం ప్రారంభమయింది. రాజాకుమారుణ్ణి యువరాజని పిలవడంతోనే నితాయీ అంతటితో సరిపెట్టలెదు. ఆపైన రాజా ఇల్లాలివైపు తిరిగాడు.
“ాజూగ్భృహంలో గృహిణి
ఆమె మాననీయురాలు మహారాణి
ఆ రాణి తియ్యని పెను తినుబండారాలారగిస్తుంది.
ఇది లోకం అంతా ఎలుగెత్తి చాటుతూంది!”
సరిగ్గా ఇదే సమయంలో 16,17 సంవత్సరాల యువతి అక్కడికి వచ్చింది. ఆమె శరిరచ్చాయ నలుపే. కాని చంపకపుష్పుం తొదిమలా, సన్నని సళాకులా పొడమైన ఆమె అపూర్వ సౌందర్యంతో నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంది. నెత్తిమీద బట్టతో చుట్టిన ఒక కుదురు. దానిమీద తళతళలాడుతున్న ఒక ఇత్తడి పాలకడవ. చేతిలో ఒక చిన్నగ్దాసు. ఆమె ముతకనూలుతో నేసిన దేశవాళీ పొట్టిచీర కట్టుకున్నది. బిగువుగా ఉన్న ఆ ముతకనూలు పొట్టిచీర వల్ల, స్పష్టంగా కొట్టవచ్చినట్టున్న శరీరం వంపులలో ఆమె ప్రసిద్ధ చిత్రకారుడు వేసిన బొమ్మలా మెరిసిపోతున్నది. ఆ యువతి రాజా మరదలు. పక్కపల్లెలో ఉన్న ఒక ఇంటివారి కోడలు. నానాటికి పెంపొందుతున్న ఈ గ్రామంలో పాల అమ్మకానికని ప్రతిదినం ఇక్కడికి వస్తూంటుంది. స్రెషన్లో బండివస్తుంది. సరిగ్గా అదే సమయానికి గడియారం ముల్లు చూపించినట్టు, ఈ యువతి కూడా రెండు జాములవేళ ఎండలో విటారుగా నిలుచున్న నీడలాగ సరిగ్గా వేళకే వస్తూంటుంది! అమాయకమైన ఆమె బెదురుచూపులలో ఆశ్చర్యం 12 + కవి నవల
కనిపిస్తుంది నల్లని తేటనీటి నైర్మల్యంలాగ సహజసిద్ధంగాను వుంటుంది. ఆ వేళ రాజా ఇంటిలో ఆకస్మాత్తుగా ఆ దృశ్యం కొన్ని క్షణాలవాటు చూసిన తరువాత ఆ యువతి మిక్కిలి ఆశ్చర్యపడి కలకలనవ్వడం (ప్రారంభించింది. అయితే రాజా భార్య గడసరి. ఆమె చెల్లెలి కేసి చురచుర చూసి చివాట్లు పెట్టింది.
“సిగ్గులేనిదానా, ఎందుకే ఆలాగ విరగబడి నవ్వుతావు? చాలు, చాలులే! ఇక ఆ నవ్వు కట్టిపెట్టు!” క్షణంలో చిన్నరాణి నవ్వు ఆగిపోయింది.
అయితే ఆమె కోపగించుకోవడంగాని, ఆంతర్యంలో బాధపదడంగాని జరగలేదు. తనంతట తానే అక్క ఆనతి పరిపాలించినట్టుగా సహజ వినయంతో తీగలా ఒదిగిపోయింది. అది ఆ యువతి కలవాటే. ఆమె శరీరం మాత్రమే కాక, మనసు కూడా పొడవయినా ఇట్టే ఒదిగిపోతుంది.
నితాయీ కూదా తన పాట నిలిపివేశాడు. తిరిగి (ప్రారంభించే వ్యవధి కూడా దాటిపోయింది. అయినా, నితాయీ పాట అందుకోకపోవడం గమ నించి రాజా కూడా తన వాద్యం నిలిపివేశాదు. ఆపైన మరదలకేసి చూశాడు.
“ఏమిటి అలాగ చూస్తున్నావు చిన్నరాణీ? ఇతను నా స్నేహితుడు. గొప్ప కవి గాయకుడు నాకు రాజా అని పేరు పెట్టాడు. అబ్బాయికి యువరాజా అని నామకరణం చేశాడు. మీ అక్కకి రాణి అని పేరు పెట్టాడు. తెలిసిందా?”
ఆపైన రాజా విరగబడి నవ్వాడు.
ఆ నవ్వుల సవ్వడి ఉల్లాసంలో రాణ కూడా కలకలనవ్వుంది. వెనువెంటనే చిన్నరాణి నవ్వు కూడా ప్రారంభమయింది అలా నవ్వతూంటే ఆమె శిరస్సు మీద ముసుగు తొలగిపోయింది. కన్నీరు జలజలా ప్రవహించింది! అయినా ఆమె నవ్వు ఆగలేదు! తన నవ్వు ముగించి రాజా నితాయివైపు తిరిగాడు.
“ఉస్తాద్, ఈ అమ్మాయి నా మరదలు. ఈమెకేం పేరు పెడితే బాగుంటుం దంటావు?”
నితాయీ సమ్ముగ్ధదృష్టితో ఆమెకేసి చూశాడు. పలుచని ఆకువంటి ఆ యువతి శరీరం సమస్తం కోమలశ్యామలకాంతి నిగనిగలతో తళతళలాడు తున్నది! ఆమె వైపు చూస్తూంటే వేళాకోళంగా మాట్లాడాలనిపించలేదు నితాయీకి. వెంటనే అతడందుకున్నాడు. వసుమతి చలనాని + 193
“అయితే ఆమె పేరు చిన్నరాణి. చిన్నరాజణీ, అంతేగాని ఆమెకింకొక వేరే పేరు అవసరం లేదు! ఇక ఆమె నాకు, రాజాకు, అందరికి చిన్నరాణ్! చిన్నరాజణీ!”
నితాయీ ఉత్సాహధోరణి గమనించిన పిమ్మట రాజాకిక నోటమాటే వెలువడలేదు! గంభీరంగా శిరస్సు పంకించి దానికి తన అంగీకారాన్ని తెలివాదు,
“అవునవును! ఆ పేదే బాగుంది! అన్నివిధాలా ఆ పేరే బాగుంది! అవునవును? చిన్నరాణి? చిన్నరాజణీ!
తరువాత రాజా మద్యంతో వున్న పాత్ర అందుకున్నాడు.
“ఉసాద్ భాయీ, రామరి! రా?”
వెంటనే చేతులు రెండు జోడించి, వేడుకున్నాడు నితాయీ, “దీనికి నన్ను మన్నించక తప్పదు రాజా! నేను మద్యం ముట్టను!”
“ర్పల్రాగా? అయితే నీవేమి తీసుకుంటావు?”
అంతలోనే చిన్నరాణి అందుకుని “వాలు తీసుకుంటారా, పాలు?
అమె కిలకిల నవ్వింది.
“నెంలకేం? పాలు తీసుకుంటాను. ఇటువంటి మద్యం భూమండలంలో ఇంకేమి ఉంది?” అన్నాడు నితాయీ నవ్వుతూ.
చిన్నరాణి నిజంగానే పాలకడవ నుండి కొలతగ్గాసుతో గ్లాసునిండా పాలుతీసి నితాయీ కందించింది. ఆ తరువాత తన కలవాటైన తొందర నడకతో ఒక్క పరుగు పెట్టినట్టే అక్కడినించి వెళ్లిపోయింది.
రాజా నితాయీ కిప్పుడు అత్యంతాత్మీయ మిత్రుడు. గుణగ్రాహి అయిన పరమభక్తుడు.
ఇందుచేతనే గోసాయీ దగ్గిర నౌఖరీకి స్వస్తి చెప్పిన నితాయీ తిన్నగా వచ్చి స్టేషన్లో మకాం పెట్టాడు. రాజా ఆ గాధ అంతా ఆమూలాగ్రంగా విని “చాలా మంచిపని చేశావు ఉస్తాద్! చాలా మంచిపని! అని అఖీ నందించాడు.
“అయితే నీవిక్కడ నా బస కవకాశం కల్పించాలి
14 ఈ కవి నవల
“ఓ దానికేం భాగ్యం! తప్పకుండా ఆ ఏర్పాటు చేస్తాను”
“అయితే నేనింక ఇక్కదే ఉండిపోతాను? ఆపైన స్టేషన్లో మూటలు మోస్తూంటాను. అందువల్ల నా అన్నప్రానాలకేవిధమైన లోటు లేకుండా గడిచివోతుంది.”
ఈ రైల్వే నిర్మించే సమయంలో ఇక్కడి స్టేషన్తోబాటు ఈ లైనంతా ఒక ప్రధాన కార్యాలయంగా పరిణమించింది. అప్పుడు అనేక ప్రయోజనాల కోసమని ఈ ప్రాంతంలో చిన్నచిన్న ఇళ్లు కొన్ని నిర్మించారు. ఆ ఇళ్లు కొన్ని ఇంకా అలాగే ఉండిపోయాయి వాటిలో ఒకదానిలో నివసించడానికి నితాయీకి ఆవసరమయిన ఏర్పాట్లన్ని చేశాడు రాజా. ఆపైన నితాయీ స్టేషన్లో కూలిపనులు చెయ్యడం మొదలుపెట్టాడు. అవసరమయినప్పుడు రైలు పెట్టెలలో సామానులు ఎక్కించడం, దింపడం మొదలైన పనులు చేశాడు. స్టేషన్నించి ప్రయాణీకుల సామానులు ఊళ్లోకి మోసుకువెళతాడు. మొత్తంమీద అతనికి కూలీ బాగానే ముడుతుంది. పెట్టెలలో నించి నామానులు దించడానికిగానీ, ఎక్కించదానికిగాని కూలి రెందేసి కాణీలు. గ్రామంలోకి సామానులు తీసుకువెడితే నాలుగు కాణీలు. పై ఊళ్లకుగాని సామాను తీసుకువెళితే దూరాన్ని బట్టి కూలీ ముట్టుతుంది. మిగిలిన కూలీలతో పోలిస్తే నితాయీ సంపాదన ఎక్కువే. రాజా అతనికన్ని విధాల చేదోదువాదోడుగా ఉండడమే దానికి కారణం.
స్టేషన్లో స్టాలు ఒకటి వారందరూ కలుసుకునేచోటు. స్టేషన్లో వెండరుగా పనిచేస్తున్న బనియామామ నితాయీతో కొంచెం వేళాకోళంగా “ఇతగాడు రాజ మిత్రుడు సుమా!” అని హెచ్చరిస్తూంటాడు.
బనియామామ దుకాణానికి విప్రపదుడని బ్రాహ్మణుడు ఒకాయన వస్తూంటాడు. ఆయన ఆ దుకాణానికి సజీవంగా ఉన్న ఒక పెద్ద పబ్లిసిటీ లాంటివాడు! వాతవ్యాధి వల్ల ఆయన కీళ్లు అంతగా స్వాధనంలో ఉండవు,
విప్రపదుడు ఒకనాడు నితాయీని ఉద్దెశించి “అబ్బాయీ, నువ్వు రాజాకి వట్టి స్నేహితుడవు మాత్రమేకావు! నిజం చెప్పదలచి వస్తే సాక్షాత్తూ అతని సభాకవివేౌ” అన్నాడు. వసుమతి చలనింని శత 15
సభాకవి అన్నమాట వినగానే నితాయీ కెంతయినా సంతోషం కలిగింది. వెంటనే విప్రపదుని పదధూళి స్వీకరించి తన పెదవుల కద్దుకున్నాడు. అతడంటే నితాయీ కెంతోమక్కువ. నిత్యము పట్టిపీడుస్తున్న వాతవ్యాధి యాతనలలో కూడా అలాగ ఆనందంగా కాలక్షేపం చెయ్యగలవ్యక్తి ఇంకెక్కడ కనిపించడు! ఆ రోగంతో అలా బాధపడుతున్నా ఆయన తెల్లవారగానేలేచి, కుంటుకుంటూ, కుంటుకుంటూ స్టేషన్కివచ్చి బనియామామ దుకాణంలో బెంచీమీద కూర్చుం టాడు. అనర్షళంగా పిచ్చాపాటీ మాట్లాడుతుంటాడు. వచ్చీపోయేవారి నందరిని టీ తాగమని ప్రోత్సహిస్తూ, మధ్యమధ్యన “మాంచి వేడివేడి టి! వేడి వేడి టీ!” అని కేకలు పెడుతుంటాడు. వాతవ్వాధివల్ల అతని శరీరం క్రమక్రమంగా దుర్చలమైనా, నోరుమాత్రం మరింతగా పెచ్చుపెరిగిపోతూనే ఉంది! ఆయన చాలా హాస్యప్రియుడు “వసుధైక కుటుంబమ్!” అనగల మనిషి! చీకటితోనే లేచి, మామ దుకాణానికివచ్చి, టీ తాగి బీడీలు కాలుస్తూ భోజనానికని పన్నెండుగంటలయ్యు సరికి ఇంటికి వెళ్లివోతాడు. భోజనం ముగించుకుని కొంతసేపు హాయిగా నిద్రపోయి మూడుగంటలయ్యేసరికి మళ్లీ కుంటుకుంటూ, కుంటుకుంటూ స్టేషన్‌కి వస్తాడు. రాత్రి పదిన్నరబండి వెళ్లిపోగానే తిరిగి ఇంటికి చేరుకుంటాడు. విప్రపదుడంటే నితాయీకి బాగా భక్తిప్రపత్తు లేర్చడ్డాయి. అతడు పాదధూళి స్వీకరించగానే విప్రపదుడు స్వయంగా రచించిన సంస్కృత శ్లోకంతో ఆశీర్వదిస్తాడు.
“భవకపి, మహాకపి, దగ్భాననసలాంగూల-”
“నీవాక మహాకపివగుదువుగాక!” అన్నది దాని సంగ్రహ సారాంశం! ఒకనాడా ఆశీర్వచనం ముగియకుండానే నితాయీ మధ్యనే అద్దుకుని చేతులు జోడించి “కపి అన్నమాటకి అర్థమేమిటో నాకు తెలుసు బాబూ!” అన్నాడు.
విప్రపదుడు నవ్వి తన పొరవాటు గుర్తించుకున్నాడు.
“కపికాదు! కపికాదు! కవి! కవి! నాదే పొరపాటు! నిజమే! నీవు కవివే! అయితే ఒకటి అడుగుతాను చెప్పు! శకుని జూదం అడాడు. అందువల్ల రాజ్యం సంపొదించుకున్నవాడు దుర్యోధనుడు. పందెం కాసినవాడు ధర్మరాజు. అయితే చిట్టచివరికి ఖీముడికొడుకు ఘటోత్కచుడెందుచేత చనిపోయాడు?” 16 + కవి నవల
నితాయీ అతసి వేళాకోళం గమనించి, దానికేవిధంగాను సమాధానం చెప్పలేదు. కాని వెంటనే లేచి నిలిచి ఎడమచెయ్యి ఎడవచెంపమీద ఆనించి కుడి చెయ్యి ముఖానికదురుగాఉంచి, కొంచెం ముందుకువంగి, రాగాలాపన (ప్రారంభించి
“ఆహా! ఆహాహా! ఘటో తృచుడెందుచేత మరణించాడు" అన్న అదేవాక్యం పాటగా పాదడం (ప్రారంభించాడు.
రాజా ఆ సమయంలో డోలుకూడా పట్టుకువస్తే బాగుండుననుకున్నాడు. కాని ఆ పని జరగలేదు. అంతలోనే పన్నెందుగంటల బంది గంటమోగింది.
దూరం నించి వచ్చేపోయే యాత్రికులలో చాలామంది ఇచ్చే కూలీ నితాయీకే దక్కుతుంది. స్టేషన్లో పనిచేస్తున్న రాజా సిఫారసు వల్లనే ఆ ప్రయాణీకులలో చాలామంది నితాయీకి పని అప్పగించడం జరుగుతున్నది. అంతేకాదు. నితాయీ నమత వల్ల కూడా అతనిమీద వారికెంతో మక్కువ కలుగుతున్నది.
కూలీ బేరందగ్గిర కూడా నితాయీ మిక్కిలి అణకువతో తన కష్టసుఖాలు వెళ్లబోసుకుంటాడు. “బాబూ, ఒక్కసారి ఆకాశం కేసిచూడండి! మందు వేసంగిలో సూర్యుడు కిరణాలతో నిప్పులు చెరిగిపోస్తున్న సంగతి కాస్త గమనించండి?”
అదే వర్షాక్రాలమైతే “ఆ నల్లనల్లని మేఘాల ఉరుములు, పిడుగులు గమనించాలి ప్రభువులు!” అని విన్నవిస్తాడు. అదే చలికాలమయితే “బాబూ, ఇది చలికాలమన్న మాటమాత్రం మరిచిపోకండి!” అని నెమ్మదిగా బ్రతిమాలు కుంటాడు
బనియామామ దుకాణంలో కూర్చున్న విప్రపదుడదే సమయంలో అందుకుని నితాయీని సమర్ధిస్తాడు.
“కాస్త అతనిమాట చిత్తగించండి బాబూ! మీకందరికి శాలువాలు, దుశాలువాలు ఉన్నాయి. కాని అతగాడికి అటువంటి శాలువాలేమీ లేవు! కాస్త కష్టం గమనించండి?”
ఎప్పుడయినా రెండుజాములవేళ బయటికి వెళ్లవలసివస్తే నితాయీ చమసుమతి చలనాని ఉ 17
రాజాని పిలిచి. “రాజా, చిన్నరాణివస్తే కాస్త పాలుతీసుకుని అట్టేపెట్టు?” అని చెబుతుంటాడు.
పన్నెండు గంటల బండి ఈ స్టేషన్లో ఆగుతుంది. అది వెళ్ళిపోగానే నితాయీ కొంచెం ముందుకు వెళ్ళి పాయింట్స్ దగ్గర రైల్వలైను పక్కనే ఉన్న గుల్మోహర్ చెట్టునీడలో నిలుచుంటాడు. పన్నెండు గంటలవేళ ఎండపడి రైలుపట్టాల పైభాగాలు సుదిర్హ రేఖల ఆకారంలో మిలమిల మెరుస్తూంటాయి. నితాయీ ఏకాగ్ర దృష్టితో రైల్వేలైను వంపుతిరిగిన వంకరవైపు నిశ్చలంగా నిరిక్షిస్తుంటాడు. ఆ ప్రదేశంలో మరికొంత సేపటికి తెల్లతెల్లని రేఖఒకటి కదులుతున్నట్టు గోచరిస్తుంది. నిటారుగా ఉన్న ఆ తెల్లని రేఖమీద ఒక బంగారు చుక్క సాక్షాత్కరిస్తుంది ఆ రఖ క్రమక్రమంగా మున్ముందుకు వస్తూ ఒక మానవాకారంలా పరిణమిస్తుంది. తెల్లగా పరిశుభ్రంగా ఉతికిన నేతచీర బిగువుగా కట్టుకున్న ఆకృతి నల్లగా పొడుగ్గా ఉన్న ఒక యువతి ఆమె శిరస్సుమీద ఉన్నది బాగా తోమడంవల్ల బంగారంలా తళతళలాడుతున్న ఒక ఇత్తడిబిందె, అయితే ఆమె దానిని చేత్తోపట్టుకోదు. ఒకచేతిలో పాలకొలత కనువైన వాలగ్గాసు, రెండవచెయ్యి అటు, ఇటు ఊగుతుంటుంది. ఆ యువతి వేరెవ్వరోకాదు. చిన్నరాణి.
నితాయీ నిషా వస్తువు లేవీ ముట్టడు. కాని పాలంటే చెవి కోసు కుంటాడు. క్రమక్రమంగా టీ మీద కూడా అతని ఆసక్తి పెరిగింది. ప్రతిదినము చిన్నరాణి దగ్గిర అతడు పావుసేరుపాలు తీసుకుంటాడు. పాలు రాగానే టీ కోసం పొయ్యిమీద నీళ్లు పెడతాడు. బనియా మామ దుకాణంలో టీ తాగా లంటే కప్పు టీకి రెండు కాణీలివ్వాలి. విప్రపదుడు నొమ్ము ఇవ్వనక్కర లేకుండానే టీ తాగుతూంటాడు. కాని నితాయీకి ఆ అధికారం లేదు! అదీగాక అతని ఆత్మగౌరవానికది బొత్తిగా సరిపడదు.
ప్రతిరోజు స్టెషన్లోకి అనేక ప్రాంతాల జనం వస్తూపోతూ ఉంటారు. స్టేషన్లో ఉంటూనే ఇరుగు పొరుగు గ్రామాల వృత్తాంతాలెన్నో తెలుసుకో వచ్చును. ఆ సమాచారాలలో కవితాగానాల వృత్తాంతాలు చెవిన పడగానే నితాయీ ఉబ్బి తబ్పిబ్బయిపోతాడు! ఆ రోజు ఒక కవి గానాల పోటీ వున్నది. 18 4 కవి నవల
ఆనాదతడు సాయంకాలం కాగానే శుభ్రంగా ఉతికిన ఎర్రంచు ధోతీ కట్టు కున్నాడు. పొట్టిచేతుల చొక్కా తొడుక్కున్నాడు నెత్తిమీద తలపాగా చుట్టు కున్నాడు. అంతేకాదు, మిలిటరీ ధోరణిలో తన విధులన్ని తు.చ. తప్పకుండా నెరవేర్చ రాజా ఎనిమిదిన్నర బండి ష్లాట్ఫారమ్ దాటి వెళ్ళగానే అతనికేసి చూసి “ఇంక అయిదే అయిదు నిమిషాల పని . వచ్చేస్తాను” అన్నాడు. అయితే అతనికి మూడు నిమిషాలు కూడా పట్టలేదు. ఆ లోగానే రైల్వేవారిచ్చిన నీలిజుబ్బా తొడుక్కుని, స్టేషన్ లాంతరు ఒక చేతితోను, కర్ర వేరొక చేతితోను పట్టుకుని, బయటికి వచ్చి వేశాడు. ఆ మరునాడు తెల్లవారకమునుపే రాజా తిరిగి స్టెషన్లో హాజర్ కావాలి. ఒక్క కవితాగానాలే కాక, నాటకాలలో పాటలు, ఆయా ఉత్సవాలలో పాదేపాటలు మొదలైన గేయాలంటే కూడా నితాయీకి ఎంతో ప్రీతి. “ఆహా! దీపాలకాంతులతో ధగధగ మెరిసిపోయే ఉత్సవాల కోలాహలాలలో కవితాగానాలతోనే జీవితం అంతా గడిచిపోతే ఇక అంతకన్న కావలిసిందేమిటి?” అని నితాయీ ఎంతో ఉబలాట పడి పోతుంటాడు. జ్తే
ఆలోచనలలో మునిగి తేలుతూ ఒక పాటలో రెండు చరణాలు కూడా రచించాడు నితాయీ. అటువంటప్పుడు అతడు ఎవ్వరులేని ఒక ప్రశాంత ప్రదేశానికి వెళ్ళి తన రచన తానే పాడుకుని ఆనందిస్తుంటాడు. లేకపోతే సహృదయుదైన స్నెహితుని కెవనికైనా పాడి వినిపిస్తాడు. ఆ సహృదయమిత్రు దెవ్వరోకాదు. రాజా! నితాయీ ఆ ఆల్మీయమిత్రునికి ఆ చరణాలు విని పించాడు.
“ఆంధకారమే లేని అత్యుజ్వల రాత్రివేళ,
అంతమే లేని గానోత్సవంలో” అంటూ మధురంగా గానం చేశాడు.
ఎన్నటికి నా గొంతు మేళవించగలదో కదా!
ఎన్నటికి నా కోరిక నెరవేరగలదో కదా!
సహృదయ రసిక మిత్రమా, భాయీ!
ఇది నేటికి కూడా నిశ్చయం కాలేదు గదా!” వసుమతి చలసాని ఈ 19
రాజా ఆ గానం విని “భేష్ భేషి అని అభినందించి నితాయీని గాధంగా తన గుందెకద్దుకున్నాడు.
“నిజంగా గేయాల చరణాలెన్నో రచించాడు నితాయీ. కాని ఒక్కపాట సంపూర్ణం కాలేదు. చాలావరకు ఇటువంటి చరణాలలాగే ఉండిపోయాయి. చండీదేవత ఉత్సవంతో పోటీపాటకచేరీ జరిగినప్పటి నుండి నితాయీ నిజంగానే అక్షరాల కవిగాయకుడన్న ఘనకీర్తి గడించుకున్నాడు!
పోటీ పాటకచేరీ ముగించుకుని, చండిమాత ప్రసాదంగా బహూకరించిన వాడిపోయిన బిల్వపత్రమాలిక గళంలో అలంకరించుకుని నితాయీ ఆ ఉత్సవం నించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడా తరుణంలో పురాతన కాలంలో మహారాజు అనుగ్రహించిన కంరమాలికతో కవితా దిగ్విజయం చేసిన కవిలాగ మెరిసిపోతున్నాడు! మహోత్సహ భావోన్మాదపారవశ్యంలో మునిగి తేలుతూ నడుస్తూంటే నితాయీ! ఆనాడు బాటబాట అంతా అటు ఇటు ఊగిపోతున్నట్లు కనిపించింది! అతడానాడు లోలోపల తానొక విశిష్ట వ్యక్తినని, కవినని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
భావనాదృష్టిలో అతనికీనాడు లోకమంతా అతి విచిత్రంగా తారుమారై నట్టు గోచరించింది! ఇన్నాళ్లనించి ఆపరిచితులైన వ్యక్తులంతా ఈనాడతని చుట్టూరా చేరి పెద్ద కోలాహాలంతో అభినందిస్తున్నారు! అయితే ఆ కోలాహలమే మాత్రం అతని చెవిని పడడమే లేదు!
రాజా అతనిని ఒరుసుకుని ఒరుసుకుని నడుస్తున్నాడు! ఉన్తాద్ నితాయీ మీది గౌరవంతో ఉత్సాహంతో వచ్చి అతని హృదయం మాటిమాటికి ఉప్పొంగి పోతున్నది! నితాయికి జరిగిన సన్మానంతో తలమునకలై మురిసిపోతూ నెమ్మది నెమ్మదిగా బాటలో సాగిపోతున్నాడు! అనర్దళ ధోరణితో మాటిమాటికి దారిలో నడుస్తున్నవారి నందరిని హెచ్చరిస్తున్నాడు. “తప్పుకోండి! తప్పుకోండి! ఏమిటలాగ మీదపడిపోతున్నారు? తప్పుకోండి! ఉత్సాహావేశం వల్ల ఈనాడతని తప్పుడు హిందీ మాట్లాడే ధోరణి బాగా మితిమీరిపోయింది! రాజాకు భార్య, చిన్నరాణి వెనకాల నడుస్తున్నారు. నితాయీ ఆల్మీయబంధువులతో కూడా రాజా అదే ధోరణితో మాట్లాడుతూ సన్నసన్నగా చివాట్లు పెడుతున్నాడు! 20౮ € కవి నవల
“ఇదిగో! ఈ నితాయీ మీవాదే! ఇతన్ని ఇంటిలోనించి గెంటివెశారు! ఆ పైన తిన్నగా వచ్చి స్టేషన్లో మకాం పెట్టాడు. మీ విధిగుమ్మంలోనించి చూస్తే ఇతడెక్కడ ఉన్నది ఇట్టే తెలిసిపోతుంది! ఇన్నాళ్లయింది గదా, ఇతడేమై పోయాడో ఎప్పుదైనా కాస్త కనుక్కున్నారా?” నితాయి కుటుంబీకులు అశ్చర్యపోతున్నారు రాజా ధోరణికి.
చిన్నరాణి చీకటిలో సాగిపోతూ, ఎవరన్నా నితాయీని గురించి మాట్లాడుతుంటే వారికేసి బెదురుతూ చూస్తున్నది. పక్కగ్రామంలోనే ఆమె అత్తవారి ఇల్గున్నది. ఈ ఉత్సవం కళ్లారా చూడాలని ఆమె అక్కగారింటికి వచ్చింది ఈ రాత్రికి ఇక్కడే ఉండి, తెల్లవారగానే మళ్ళీ వెళ్ళిపోతోంది. ఉస్తాద్‌తో మాట్లాడాలని, ఏవేవో అడగాలని ఆమె కోరుకుంది. “ఇవ్వన్ని మీరెలాగ నేర్చుకున్నారు? అకృగారింట్లో పాడినప్పుడు మేమంతా నవ్వశాము. అంతమంది జనం ముందు, అంతమంది కవిగాయకులతో కలిపి ఎలాగ పాడగలిగావు? అమ్మో! అంతమంది ముందే!”
అదంతా ఊహించుకుంటుంటే ఆ ఆంధకారంలో ఆమె కనుదోయి మాటి మాటికి మరింతగా విచ్చుకున్నాయి.
చండిమాత ఆలయంనించి స్టేషన్‌కి వెళ్లాలంటే ఎరుకులవాడ మధ్యనించే వెళ్లాలి. నితాయీ దగ్గరబంధువులు కొందరు అతనిని ఇంటికి తిరిగిరమ్మని ఆహ్వానించారు.
అతని తల్లి ఇప్పుడు ఈ గ్రామంలో ఉండడంలేదు. ఆమె తన కుమార్తె ఆశయం సంపాదించుకుని అల్లుడి ఇంట్లో ఉంటున్నది, అల్లుడు ఈ ప్రాంతంలో కొట్లాటలలో ఆరితేరి పేరు మోసిన పెద్దదొంగ! రాత్రివేళ బందిపోటు దొంగతనాలు చేస్తాడు. రహస్యంగా మద్యం తయారుచెయించి విక్రయిస్తాడు. మస్తుగా కాపు సారా పట్టిస్తాడు చేపలు విరివిగా కొంటుంటాడు. నితాయీతల్లి పట్టెడన్నం కోసమే కాక, చేపలమీద, మద్యంమీద బాగా ఆశపడి అతని పంచన చేరింది. నితాయీ పాడుపడిపోయిన తన ఇంటికేసి ఒకసారి చూసి నవ్వుకుని “కాదు! కాదు! నేనింక ఇక్కడికి రాను! తిన్నగా నా బసకే వెళ్ళి పోతాను?” అనుకున్నాడు. వసుమతి చలసాని ఈ 21
సరిగా ఇదే సమయంలో ఒక సంఘటన జరిగింది! మిక్కిలి పరుషమైన కంరస్వరంతో అత్యంత కరినమైన మాటలు కొన్ని నితాయీ చెవినపడ్డాయి అందువల్ల తలవని తలంపుగా ఎవ్వరో క్రూరాత్ళ్ములతనిని రాళ్లతో కొట్టి వేధించినంత యాతన కలిగింది!
“ఒరేయ్, గాడిదా! ఎక్కడికి వెడుతున్నావురా! ఆగు!”
అది నితాయీ మేనమామ గొంతు! అతడు ఈ (ప్రాంతంలో ఎరుకల కులపెద్ద కూడా. అర్ధరాత్రివెళ తన కులంవారి నందరిని కూడగట్టుకుని, వారిమిద అధికారం చలాయిస్తూ దొంగతనాలు చేయిస్తాడు. అగ్గిపిడుగు! అతనికిక అద్దు చెప్పేవారెవ్వరు లేరు! అనుకోకుండా మేనమామను చూసి నితాయీ తృళ్ళ్చపడ్డాడు!
ఎరుకులవాడలో ఒక సందు మొననించి ఇవతలికివచ్చి ప్రహ్లాదుని సమక్షంలో హిరణ్యకశిపుడులాగ మేనమామ అతని కట్టెదట నిలుచున్నాడు. హరాత్తుగా అతనిమెడ గట్టిగా పట్టుకుని హుంకరించాడు!
“అలాగ ఆ సభలో అందరిమధ్య కూర్చుని, నీ తండ్రిని, తాతని, నా తండ్రిని, నన్ను నానా తిట్లు తిట్టిస్తావురా? గాడిదకొడకా! పందివెధవా!”
ఒక్కమారుగా చుట్టూ వున్నవారెవ్వరినోట మాట వెలువడలేదు! రాజా సంగతి వేరుగా చెప్పనే అక్కరలేదు! నితాయీ మామ పిడికిలి పట్టకారుకన్న గట్టిది! ఆ చేతులతో ఇనప తాళాలిట్టె విరగగొట్టగలుగుతాడు! నితాయీ శ్వాస స్తంభించింది! అయితే కవితాగానాలారంభించినా అతడా మేనమామకు మేనల్లుడే! పైగా అదే వంశంలోనించి ఆవిర్భవించాడు! అతని దేహదారుధ్యంలో కూడా మేనల్లుడే! ఆపైన నవయౌవనంతో మిసమిసలాడుతున్నాడు! వెంటనే అతడు తన రెండుచెతులతోను మేనమామ చేతులు రెండు వేరుచేసి గట్టిగా పట్టుకున్నాడు! మరుక్షణంలోనే రాజూ మున్ముందుకురికి “విడిచిపెట్ప! విడిచిపెట్టు” అని గట్టిగా కేకలుపెట్టాడు.
నితాయీకి మనమామను హత్య చేయాలన్న ఆలోచనలేదు! అతనిని అదుపులో ఉంచాలనే అనుకున్నాడు. అంతే! అంతలోనే ఆ మేనమామ నితాయీని విడిచి పెట్టి తిరిగి గట్టిగా హెచ్చరించాడు. 22 + కవి నవల
“ధ్ధిి ఫో! ద్రిదిగి ఇంక ఈ వాడలో అడుగు పెట్టకు! తెలిసిందా! మహాదేవ కవి అన్న ఆ ఒక్కమాట మాత్రం అక్షరాలా నిజం! కుళ్లుగుంటలో పడి తిరుగుతున్న ఆకు స్వర్గాని కగరడానికి అర్రులు చాస్తూ ఆశిస్తున్నదిరా! ఆవా!”
అలాగని, అతదెంత తలవని తలంపుగా అకన్నాత్తుగా అక్కడ ప్రత్యక్ష మయ్యాడో, అలాగే క్షణంలో అక్కడినించి అదృశ్యుడయ్యాడు!
చుట్టూరా ఉన్నవారందరూ నిశ్చల శిలాఫప్రతిమలై అలాగే నిలుచుండి పోయారు! వారి ఆశ్చర్యానికవధిలేదు. ఒక్క రాజా మాత్రమే గట్టిగా కేకలు పెట్టాడు.
“ఏమిటీ అరాచకం! ఏమిటిదంతా? ఏమిటిది?”
అంతలోనే ఆ ఎరుకలవాడలో నించి “పోరా! పోరా! కూలీ బచ్చా! మరి అరవకు!” అని ఇంకొక కేక వినిపించింది.
నితాయీ వెంటనే రాజా చేతులు రెండు పట్టుకుని బ్రతిమాలుకున్నాడు
“రాజూ! మరి మాట్లాడకు! నడు! ఇదంతా నేను చేసుకున్న పాపం భాయీ!” అంతలోనే నవ్వి మళ్ళీ అన్నాడు.
“నే నీ వేళనించి ఒక అంతు దరిలేని ప్రవాహంలోపడి కొట్టకు పోతున్నాను. ఆ ప్రవాహంలో నీవు నాకొక తెప్పవు!”
రాజా ఎంతో ఆప్యాయంగా అతని రెండుచేతులు గట్టగా పట్టుకుని “నీవు నిజంగా నిజాయితీ పరుడివి, నితాయీ!” అన్నాడు.
ఆ మాటమీద ఉస్తాద్ చిన్నగా నవ్వాడు. వారివెనకే వున్న చిన్నరాణి నిశ్శబ్దంగా కుమిలి కుమిలి ఏడుస్తున్నది. రాజా భార్య ఆమెకేసి చూసి, “ఛి. ఎందుకలాగ ఐడుసావు అని రుసరుసలాడింది.
వారి చుట్టూరా ఉన్న గుంపు క్రమక్రమంగా పలచబడింది. మిగిలిన వారందరు తమతమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చిన్న రాణీ కూడా వెళ్ళిపోతోంది. నితాయీ రాజాలిద్దరు స్టెషన్కేసి నడక సాగించారు. తనయింటికి వెళ్ళిన తరువాత రాజా “ఐదైనా కొంచెం ఫలహారం చెయ్యిభాయీ!” అన్నాడు.
నితాయీ సమాధానం చెప్పాడు
“వద్దులే! పాడుతున్నాను విను” అన్నాడు. తన తియ్యని గొంతు కొంత వసుమతి చలనాని +ఉ 23
తగ్గించి వాట అందుకున్నాడు. “స్ప్రఖసారం కన్నీరే! కన్పీరే! మమి భాయీ! అవగత మయినది అంతా నా కిది (ప్రేమవల్లనె అన్నా! నే విలపింతును! నీవు నవ్వుదువు! కడిమి నీడలో మురళి మోగెరా! కన్నీరే! కన్నీరే! సుఖసారం మమి భాయీ!”
“వహవాన్టు వహవ్వా! చాలా బాగుంది! ఆ తరువాత?” అని ప్రశ్నించాడు
రాజా.
నితాయీ కనుదోయి నుండి కన్నీరదే పనిగా ప్రవహించింది. అతడది తుడుచుకుంటూ -
“అంతే! ఆపైన లేదు!” అన్నాడు
పైన వారిద్దరు ఒండొరుల సరసనే పక్కలు పరుచుకుని పడుకున్నారు. నితాయీకి గత సంఘటన లెన్నో జ్ఞప్తికి వచ్చాయి. మనమామవల్ల అవమానం ఫాందడం నితాయీకంత కొత్త విషయం కాదు. అతనివల్ల ఇదివర కెన్నోసార్లు దారుణావమానాలను అనుభవించాడు. మరచిపోవాలని ప్రయత్నిస్తూ ఇప్పుడతడు కవితాగానాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఆ ప్రాంతంలో అంతట ప్రత్యేకించి తారణమండలునిగాధ బాగా వ్వాప్తి పొందింది. అతడు ఏ సభలోనైనా పాడుతున్నాడంటే సరి! ఎంతమంది జనం! వేలకొలది జనం గుంపులు గుంపులుగా వచ్చి గుమిగూడదేవారు! తారణ మండలుని కవిగానం విన్ననాటిగాధ అంతా అతని హృదయంలో నేటిక్సి ఒక చిత్తరువులా తరళిస్తూనే ఉన్నది!
తారణమందల కవి బాగా పొడగరి. జుట్టు, మీసాలు పండిపోయాయి. నుదుటి మీద సింధూరతిలకం! మెడలో మెడల్స్ పేటలు పేటలుగా వేళ్లాడు తుండేవి. ఎర్రగా కెంపుల్లా మెరుస్తున్న నేత్రాలు! అతడు కంటపడగానే అందరు 24 ఈ కవి నవల
ఒక్కసారిగా నిశ్చేష్టికులయ్యేవారు. వేదికమీద ఒకవైపున బెంచీలమీద [గ్రామం లోని పెద్దమనుషులందరు సమావేశమయ్యేవారు. వారు కూడా కేవలం శిలాఫ్రతిమల్లా కూర్చుండిపోయవారు కవి గానానికి. ఆహా! ఏమి గానమది!
ఆ తరువాత ఆ పరిసరంలో ఎక్కడ కతారణకవి పాటకచేరీ జరిగినా, నితాయీ తప్పకుండా అక్కడ హాజరయ్యావాడు. ఒకసారి పెద్దగుంపులో జొరబడి చేతులు చాచి, పాదధూళి కూడా స్వీకరించాడు. ఆ క్షణంనించి తానొక కవిగాయకుడుగా ప్రసిద్ధి వొందాలని నితాయీ కలలు కన్నాడు. తారణకవి పాటకచేరీలో వంతగాయకుడుగా కుదురుకుని కవితాగాన పద్ధతి అభ్యసించాలని కూడా ఆలోచించాడు. కాని ఆపైన అనతికాలంలోనే ఆ కవి మరణించాడు. మద్యపానమే అతని మృతికి ప్రధానకారణం. తారణకవిలో ఉన్న లోపం ఇది ఒక్కటె! అది దారుణమద్యవానం! వేదికమీదనే అతని సరసనే బాటిలు, గ్లాసు ఉండేవి!
మంచినీళ్లని చెప్పి, అందరి సమక్షంలోనే మద్యం సేవిస్తూండెవాడు! అతని పాటలద్భుతం
“నీ కాలి తాపు నా హృదయంలో
మహ నీ యాళశీస్సు! నిను! దశననా!
నీ పాదధూళి నా నెమ్మనిమీద”
ఇలా గురువును తలుస్తూ వుంటాడు నితాయి. ఆ మద్యం వలనే అతనికి మృత్యువు త్వరగా వచ్చింది.
తారణకవి చనిపోవడం తన దురదృష్టం అని నితాయీకి అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది. అతనికి గురువెవ్వరు లభించలేదు! తారణకవివంటి గొప్ప గురువు లభించనప్పుడు గొప్ప కవికావడం సాధ్యపడుతుందా! నిజానికి కవితాగాన శాస్త్రానికి ఒక అంతం అంటూ ఉన్నదా? పుస్తకాలు చదువుతూ, కవితాగానాలు వింటూ అంతా నేర్చుకున్నంత మాత్రాన ఈ జన్మలో కవి గాయకుడు కావడం మరి జరగని పని! నితాయీకది బొత్తిగా బాగాలేదని తోచింది వెంటనే లేచి కూర్చుని లాంతరు వెలిగించాడు,
ఒక ఎగర్రనిగుడ్డతో గట్టిగా మూటకట్టి అతడు తన పుస్తకాలన్ని ఒక వసుమతి చలసాని + 2వ
చిన్న బల్లమీద పెట్టి జాగ్రత్త చేసుకున్నాడు. ఆ మూట విప్పి నితాయీ రామాయణం బయటికి తీశాడు ఆ మూట మధ్యలో పుస్తకాలెన్నో ఉన్నాయి. బడిలో చదువుకున్నప్పటినించి నేటివరకు పోగుచెసుకున్న పుస్తకాలన్ని అక్కడ ఉన్నాయి. బాటలో దొరికినవి కూడా భద్రపరుచుకున్నాడు. ఎక్కడైనా ఏదైనా కాగితం కనబడితే బాగా నచ్చిందంటే అది మరింత జాగ్రత్తగా దాచుకున్నాడు. మొత్తంమీద నితాయీ దాచుకున్న పుస్తకాలు చాలానే ఉన్నాయి. అవి కృత్తివాన రామాయణం, కాళీదాసు మహాభారతం, శ్రీకృష్ణశతనామావళి, శనిస్తోత్ర గీతికలు, గేయాలు, గంగామహాత్యం మొదలైన పుస్తకాలు. అదిగాక స్థానికంగా ఉన్న ధియేటర్ క్లబ్బు వీధిలోకి విసిరివేసిన చిరిగిపోయిన నాటకాలు కూడా కొన్ని భద్రపరుచుకున్నాడు. ఇవిగాక బడిలో చదువుకుంటున్నప్పటినించి జాగ్రత్త చేసుకున్న పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా రెండు మూడు భఖెండుపుస్తకాలు విరిగిపోయిన బలపం, ఒక లెడ్పెన్సిలు, ఒకచిన్న ఎరుపు, నీలిరంగుల పెన్సిలు ఏవో కొన్ని విడికాగితాలు కూదా ఆ మూట మధ్యలో ఉన్నాయి.
ఆ అర్ధర్రాతివేళే నితాయీ మిక్కిలి శ్రద్ధపెట్టి రామాయణంలో కాగితాలు అటు, ఇటు తిరగవెయ్యదం మొదలుపెట్టాడు. నిజమే! మహాదేవకవి వల్ట దబాయింపు వల్లనే తనని మాట్లాడకుండా చేశాడు పొరబాటు నితాయీది కాదు! మహాదేవ కవిదే! అయినా వట్టి దబాయింపుతోనే తనమాట నెగ్గించు కున్నాడు! అతడు నవ్వుకుని ఆ భాగం మూసివేసి, ఆ తరువాత రావణ విఖీషణుల వాగ్వాదభాగం తెరిచాడు. ఆ భాగం పూర్తిగా చదివి పుస్తకం మూసివేసి, పక్కమీద మేను వాల్చాడు. కాని బొత్తిగా నిద్రపట్టలేదు. గుండె గుబగుబ కొట్టుకుంటున్నది. డోలు, కంజిరా వాద్వాలు చెవులలో భోరుమని మారు(మోగుతున్నవి. మరికొంతసేపటికి ఆ సవ్వడులన్ని క్రమక్రమంగా నిలిచిపోయాయి. గాఢంగా నిద్రపట్టింది.
ఆ తరువాత మరికొంత సేపటికి రాజా పిలుపు వినిపించింది. నితాయీకి మెళకువ వచ్చింది. రాత్రి చాలాసేపు మేలుకున్నా మిలిటరీధోరణి వున్న రాజా పొద్దున్న సరిగా ఆరుగంటలకే పక్కృమీదనించి లేస్తాడు. ఏడుగంటల లయ్యే 260 + కవి నవల
సరికి ఈ లైన్లో ఎక్స్పెస్ బండి స్టెషన్దాటి వెళ్ళిపోతుంది. యుద్ధకాలంలో ఆలవాటయినందువల్ల రాజా టీ తాగుతాడు. స్టేషన్లో సిగ్నల్ ఇచ్చి గంటకొట్టి ఇంటికి తిరిగివచ్చి “ఉస్తాద్! ఉస్తాద్!” అని నితాయీని పిలిచాడు.
ఉస్తాద్ సరసన లేకపోతే రాజాకి టీ రుచించదు. రాజా భార్య ఇంకా నిద్రపోతూనే ఉన్నది. చిన్నరాణి రాజా లేవకమునుపే పాలిచ్చి తన ఇంటికి వెళ్లిపోయింది ఆమె అత్తగారు చాలా కరినురాలు. చిన్నరాణివంటి పిల్లనికూదా రాచి రంవానపెడుతుంది తన ఇల్లాలిని పెళ్ళిచేసుకోవడం చాలా వారబాటయి పోయిందని, చిన్న రాణినె పెళ్లిచేసుకుని ఉండవలసిందని రాజా అప్పుడప్పుడు లోలోపల పశ్చాత్తాప పడుతూంటాడు. గబాగబా నడిచిపోతూ, చకచకా మాట్లా డుతూ నవ్వుతూ, నవ్విస్తూ చిన్నరాణ్ తన మనోజ్జస్వభావంతో నలుగురిని ఇట్టే ఆకట్టుకుంది. ముటముటలాడుతున్న ముఖంతో నిప్పులు చెరిగిపోసె అక్కగారికన్న ఆమె అనేక విధాల మిన్న నితాయీ దగ్గరినుంచి సమాధానం రాకపోవడంతో రాజా తిరిగి “ఉస్తాద్! ఓ ఉస్తాద్!” అని పిలిచాడు. నితాయీ బద్ధకంగా “ఊ!” అన్నాడు.
“ట్రీ తయారయింది భాయీ
“డ్య!
“అదిగో, ట్రెయిన్ వస్తూంది భాయీ!”
ఈం!
రాజాకిక ఏమిచెయ్యడానికి పాలుపోక వెంటనే అక్కడినించి వెళ్లి పోయాడు. అంతేగాని తిరిగి పిలవలేదు 'నితాయీ, పాపం గతరాత్రి చాలా శ్రమపడ్డాడు. పోనీ, ఈవేళ మరికొంతసేపు పడుకోవడమె మంచిది...!” అనుకున్నాడు.
ఇంచుమించుగా తొమ్మిదిగంటలు కాగానే నితాయీ నిద్రలేచాడు. నవ్వుముఖంతోనె లేచాడు. ఆరోజు కవిగా మారినవేళ అతనికొక కలలాగే స్ఫురించింది. కనకనే అలాగ నవ్వుముఖంతో లేచాడు. ఆ కలకత్తా ఉద్యోగి నేడు తాను కంటపడగానే “నిజంగానే నీవాక కవివి! తెలిసిందా!” అని తిరిగి అభినందించగలడని. ఆపైన ఇంగ్లీషులో ఏవేవో మాట్లాడగలడని మొట్ట వసుమతి చలనాని ఈ 27
మొదటగా అతనిలో ఒక ఆలోచన మొలకెత్తింది.
జమీందారు భూతనాధ్ బాబు కూడా తాను కనిపించగానే “వహవ్వా! వహావ్వా నితాయీ! చాలా ఆద్భుతంగా పాడావు[ అని అఖినందించటం అతనికంతో సంతోషం కలిగింది. క్రమక్రమంగా గ్రామస్థులందరూ పట్టలేని ఆశ్చర్యంతో అభినందిస్తున్నట్టు అతని భావనావీధిలో భాసించింది. ఇక విప్రపదుని మాట చెప్పనే అక్కరలేదు! ఒక్కసారిగా పెద్దడోలాహలమే అతనినోట వెలువదగలదు!
ఈపాటికి ఆయన స్టేషన్‌కి వచ్చి ఉంటారు! ఈ తొమ్మిదిన్నరబండి ద్వారానే విప్రపదుని ముఖతః అతని ప్రఖ్యాతి ఒక్కసారిగా కాట్వా గ్రామం దాకా వ్యాపించిపోతుంది! నిన్నటి వాలు, టీ పొడి, పంచదార ఇంట్లోనే ఉన్నాయి. అయినా అతడీవేళ టీ తయారు చేసుకోలేదు టీ పాత్ర చేతపట్టి నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ స్టేషన్లో న్థాలు దగ్గిరికి వచ్చాడు. పెదవిమీద అదే మృదుమందహాసం!
విప్రపదుడు ఒక్కనూరుగా “ఓహో! నితాయీ!” అని తన ధోరణి ప్రారం భించాడు. ఆపైన “అందరూ నిశ్శబ్దం! నిశ్ళబ్దం!” అని కేకపెట్టి నోరారా నితాయీని అభినందించారు.
“బాగుంది నాయనా! చాలా బాగుంది!....జయరామచంద్రా!... అయితే నితాయీ, ఉత్సవ కచేరిలో నీవు బ్రహ్మాండంగా పాడేశావటే? చాలా బాగుంది! చాలా బాగుంది! చాలా బాగుంది కపివరా?” విప్రపదుని పాత వేళాకోళం నితాయీకి నేడెంతయినా మనస్తాపం కలిగింది. క్షణకాలం పాటు మూతి, ముక్కు ముడుచుకుని గంభీరంగా ఉండిపోయాడు.
అయితే విషప్రపదుడా సంగతే పట్టించుకోలేదు! నితాయీా సమాధాన మివ్వడం లేదని పసికట్టి మళ్ళీ అందుకున్నాడు.
“అయితే నితాయీ నీవు ఎలాంటి పాట పాడావు! హనుమంతుడిలాగ “ఉఫ్, ఉప్, ఉప్! మరి పాట కట్టిపెట్టరా, ఉప్, ఉప్, ఉప్ మహాదేవా! అన్నావా? అవునా? అంతేనా?”
అతడటు పిమ్మట అదేపనిగా విరగబడినవ్వడం (ప్రారంభించాడు.
ర ఈ కవి నవల
నితాయీ చేతులు జోడించి గంభీరస్వరంతో సమాధానం చెప్పాడు.
“చిత్తంబాబూ! నేను వట్టికోతిని! కొండముచ్చును! అంతేకాదు! మూర్చజ్ణి, అల్పుణ్ణి, లేకపోతే హనుమంతుణ్ణి! జాంబవంతుణ్లి! తక్కువకులంలో పుట్టిన వాణ్ణి! మీరేమన్నా అదే అక్షరాలా నిజం!”
అలాగన్నపిమ్మట అతడు బనియామామవైపు తిరిగి తన టీపాత్ర ఎత్తి పట్టుకుని “ఇదిగో, ఏమండోయ్, దుకాణ పెత్తనందారుగారూ! దీనిలో టీ పొయ్యండి!” అన్నాడు.
ఆపైన సొమ్మవ్వడంకోసం వెంటనే రొంటిముడి విప్పడం (వ్రారం భించాదు.
బనియామామ పాత్రలో టీ పోశాడు.
“మామా! అని పిలవడం మానేసి, దుకాణం పెత్తనందారుగారూ, అని ఏదో పెద్ద పేరుపెట్టి పిలుస్తున్నావే! బంధుత్వంగాని తెంచివేసుకోవాలని ఆలోచిస్తున్నావేమిటి?ొ విప్రపదుడి మాటలు పట్టించుకోలేదు ఇద్దరూ,
నితాయీ సమాధానం చెప్పలేదు. బనియామామే ఆప్వాయంగా (ప్రశంసించాడు,
“ఎవరేమన్నాసరేగాని, మా నితాయీ నిన్న చాలా ఆద్భుతంగా వొదాడు! చాలా కమ్మగా వొడాడు!”
విప్రపదుడు వెంటనే పిడక ఒకటి తీసుకువచ్చి దానికొక కన్నంపొడిచి, దానిలో ఒకతాడు దూరుస్తూ, దూరుస్తూ నెమ్మదిగా అందుకున్నాడు.
“అందుచేత మన కపీశ్వరుడికొక మెడల్ బహుమతిగా ఇవ్వాలి!”
అయితే దానికేమాత్రం అవకాశం ఇవ్వకుందానే నితాయీ తన టీపాత్ర తీసుకుని వెంటనే అక్కడనించి వెళ్ళిపోయాడు.
అంతలోనే తొమ్మదిన్నరబండి ష్లాట్ఫారమ్ మిదికి వచ్చి నిలబడింది. నితాయీ మూటలు మొయ్యడానికి అటువైపు వెళ్ళి ఉంటాడని బనియామామ, విప్రపదుడు ఊహించుకున్నారు. కాని వ్లాట్వారమ్ మీదినించే “ఉసాద్! ఉస్తాద్!” అని రాజా గట్టిగా పిలిచాడు.
సమాధానం రాకపోవడంవల్ల రాజా తానే స్టాలుదగ్గిరికి పరిగెత్తుకు వసుమతి చలనాని ఉ ౨0
వచ్చాడు. బనియామామ “ఇప్పుడే ఇక్కడినించి వెళ్ళాడే! ష్లాట్ఫారమ్ మీద కనిపించలేదా!” అని అడిగాడు రాజా నాలుగువైపులా జాగ్రత్తగా పరిశీ లించాడు. ఒక చెట్టుకిందినించి ఒదుగుతూ ఒదుగుతూ తన ఇంటివైపు నితాయీ కనిపించాడు. రాజా వెంటనె తొందరగా అతని దగ్గిరికి వెళ్ళాడు.
“గ్రామంలోకి ఒకమూట తీసుకువెళ్ళాలి భాయీ! ఒకసంచి, ఒకబెడ్డింగు తీసుకువెళ్ళాలి”
నితాయీ తల అడ్డంగా తిప్పి “నేను తీసుకువెళ్ళను!” అన్నాడు.
“ఆఅం, ఆయన ఎవరో తెలుసా? చాలా గొప్ప ఇంటివారి అల్లుడు! బాగా ఎక్కువగా ముడుతుంది”
“నేను వెళ్ళదలుచుకోలేదు!”
“ఏం ఒంట్లోగాని బాగాలేదా?”
“లేకేం? బాగానే ఉన్నాను! అయినా నేను వెళ్ళదలుచుకోలెదు! అంతే!”
“ఎందుచేత?” రాజా బాగా ఆశ్చర్యపడ్డాడు.
నితాయీ విషల్లవైఖరితో గంభీరంగా చిన్నగా నవ్వి అన్నాడు.
“నేనింక కూలీ, గీలీ చెయ్యదలుచుకోలేదు రాజా!”
ఈమారు రాజా నిలువునా నిర్దాంతపోయాడు.
నితాయీ ఇంటికి తిరిగివచ్చి, వెంటనే రామాయణపుస్తకం పైకి తీశాడు. ఉసూరుమని ఒక దీర్హనిశ్వాసం విడిచిపెట్టి అచంచలమైన ఏకాగ్రతతో ఆ పుస్తకం తెరిచాడు. విఫప్రపదుని వేళాకోళంవల్ల అతని హృదయాంతరాళంలో విపరీతమైన బాధ కలిగింది.
'మూర్చుడా బాపనయ్యకేమి తెలుసును? అనుకుని నితాయీ సమాధాన పడడానికి ప్రయత్నించాడు. కాని అతని మనస్సేమాత్రం శాంతించలేదు! అయినా నితాయీ రామాయణ పుస్తకం పుటలటు ఇటు తిరగవెస్తూ రత్నా కరుడన్న బందిపోటుదొంగ కధ దగ్గిరికి వచ్చాడు. ఆ కధ చదవడం ప్రారంభించాడు. అతడా కధ చాలాసారులే చదివాడు కాని నేడా కథ ఒక కొత్తరూపంతో, కొత్తఅర్ధంతో అతనికెంతో ఉత్సాహం కలిగించింది! అసలు అది చదవకమునుపే ఆ గాధ అంతా ఒక్కసారిగా అతని మనోనేత్రాల 30 ఈ కవి నవల
సమక్షంలో సాక్షాతృ్మరించింది! వెనువెంటనే నితాయీ కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి! కళ్లు తుడుచుకుని తిరిగి చదవడం మొదలు పెట్టాడు.
“బహ్మకొలువుకూటంలో రామనామం
సంపాదించుకున్నాడు రత్నాకరుడు!”
అంతలోనే వీధిలోనించి “ఉస్తాద్!” అన్న రాజా కేక వినిపించింది. అంటీ అంటనట్టు ముఖంపెట్టి “రా! రాజా! రా అని నితాయీ అతనిని లోపలి కాహ్వానించాడు.
రాజా లోపలికి వచ్చి కూర్చుంటూనే అడిగాడు
“ఏమిటికథ భాయీ! నీవింక కూలిపని చెయ్యవా?”
నితాయీ నవ్వాడు.
“విను! ముందీ కధ విను!”
“అదంతా అవతలపెట్టు! అసలీ చదువుసంధ్వల మూలాన్నేనీ తల తిరిగి పోయింది!”
నితాయీ అదే క్షణంలో తిరిగి చదవడం మొదలుపెట్టాడు. గత్యంతరంలేక రాజా ఒక బీడీ వెలిగించి పట్టుకుని వినడానికి సిద్ధపడ్డాడు. కృత్తివాస రామాయణాన్ని గానం చెస్తూ నితాయి పాడుతున్నాడు.
“వరం ప్రసాదించి బ్రహ్మ తన లోకానికి తరలిపోయె! కృత్తివాసకవ ఆదికాందగానం సమాప్తి నొందించె!”
వాడడం ముగించిన పిమ్మట నితాయీ రాజావైపు చూశాడు. అతడా గానంతో తన్మయుడై కరిగిపోయాడు!
“సీత్రారామ్! సీతారామ్!...చాలా బాగా చదివావు ఉస్తాద్! అద్భుతంగా చదివావు”
నితాయీని మనసారా అభినందించాడు. అతడీసారి గంభీరదృష్టితో తన అభిప్రాయం వ్యక్తీకరించాడు.
“ఇప్పుడింక నివే కాస్త లోతుగా ఆలోచించు భాయీ!”
రాజా ఆశ్చర్యపడి 'ఎమటది?” అని ప్రశ్నించాడు.
కిటికిలోనించి రైల్వేలైనుమీదుగా దూరంగా దృష్టిసారిస్తూ నితాయీ వసుమతి చలనాని ఈ ౨1
అందుకున్నాడు.
“రత్నాకరుడటుపిమ్మట కవీశ్వరుడయ్యాడనుకో! ఆ తరువాత కూడా అతడింకా బందిపోటుదొంగతనాలు చెయ్యాలంటావా? మనుషుల్ని చంపా అంటావా?ో
“కాదు కాదు ఉస్తాద్! ఎన్నటికి అలాగ జరగడానికి వీలులేదు! జ్ఞాపకం చేసుకో! నాలుగువైపుల నించి నిన్నందరు 'కవిగాయకుడు! కవిగాయకుడు!' అని ఆకాశానికే ఎత్తివేశారుగా!”
“అవును! ఆ మాట నిజమే! నీవన్నది నిజమే!”
“్రాజ్ఞా! అయితే నేనింక మూటలు నెత్తిమీద పెట్టుకుని మొయ్యడం బాగుంటుందా? వాల్మీకి మహర్షికధ అలాగుంచు? నక్క ఎక్కడ? నాగలోక మెక్కడ? ఆయన భగవానుని అంశంవల్ల అవతరించాడు! నాక్షాత్తు దైవాంశ సంభూతుడు!... అయితే నేను కూడా కవినే! అంత తక్కువవాజ్దేమికాదు!”
ఇప్పటికి రాజాకంతా అవగతమైంది! అత్యంత గౌరవంతో, ఆశ్చర్యంతో నోటమాటలేక నితాయీ వైపలాగే చూశాడు.
వెంటనే నితాయీ అందుకున్నాడు.
“మాట్టాడవెం రాజా! చెప్పు మరి! నేనింకా కూలి చెయ్యడం బాగుం టుందా? లోకులందరు ఛీ ఛీ అని మొహంమీద ఉమ్మెయ్యరూ? మాట్టాడవెం? కవి మూటలు మోస్తున్నాడని దుమ్మెత్తిపొాయ్యరూ?”
“అవును! ఆ మాట నిజమే!” అన్నాడు రాజా, కాని మరుక్షణంలోనె ..
“అయితే ఒకమాట ఆలోచించాలి-”
“సరే అదేమిటో బయటపెట్లు!”
రాజా ముఖంకేసి చూస్తూ అడిగాడు నితాయీ.
ఏదో ఒకపని చెయ్యకపోతే రోజు గడవదుగదా భాయీ! కాస్త అన్నవస్తాల మాట ఆలోచించుకోవాలిగదా!”
దానిమీద మాటిమాటికి తల అడ్డంగాతిప్పి అతనిమాట కొట్టిపారవేస్తూ నితాయీ అందుకున్నాడు.
“అదంతా నేనాలోచించడంలేదు రాజా! రోజు రెండుపూటలా కాక ఏది ఛీ కవి నవల
పోయినా ఒక్కపూటైనా భోజనం చెస్తాను. అది కూడా దొరక్కపోతే ఆ ఒక్క పూటకూడా ఉపవాసం ఉంటాను! తెలిసిందా!”
ఆపైన గంభీరకంరస్వరంతో, విపరీతావేశంతో మళ్లీ అన్నాడు.
“భగవంతుడు నన్నొక కవిగా సృష్టించాడు గదా! అప్పుడింకా-” అంటూ
నితాయీ తానంగీకరించేది లేదన్నట్టు తల అడ్డంగా తిప్పుతూ ఇక మూటలు మొయ్యదలుచుకో లేదని నిష్కర్షగా చెప్పివేశాడు
రాజా తీవ్రంగా ఆలోచిస్తూ ఒక సుదీర్హ నిశ్వాసం విడిచిపెట్టి
“నిజమే ఉస్తాద్! నీవింక తక్కువ పనులేవి చెయ్యకూడదు! అది బొత్తిగా బాగుండదు!
ఆపైన రాజామీద నితాయీకి కలిగిన ఆత్మీయత కవధిలేదు! తీవ్ర భావావేశంతో అదేమాట అన్నాడు.
“నీవు నాకు నిజమైన స్నేహితుడివి రాజా!”
“నిజంగా నీకు స్నేహితుడైనందుకు నేనెంతో అదృష్టవంతుణ్జి నితాయీ! ఎంతో అదృష్టవంతుణ్సి!” రాజా ఆవేశంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు!
అంతలోనే ఒక నిట్టూర్పు విడిచిపెట్టి ఉసూరుమన్నాడు నితాయీ.
“నాకీ రోజు ఏడుపు వచ్చింది భాయీ!” అన్నాడు నిట్టూరుస్తూ నితాయి.
“దుఃఖమా? ఎవరు నిన్నలాగ దుఃఖ పెట్టినవారు?”
“నీ విప్రపదుడు! నన్ను కపివరుడన్నారు. అంటే హనుమంతుడన్నమాట! నేనేమన్నా హనుమంతుణ్డా రాజా!”
క్షణంలో రాజా నిటారుగా కూర్చున్నాడు అతని మిలిటరీధోరణి అంతా ఒక్కనారిగా తల౩క్కింది. ఆగ్రహావేశంతో ఊగిపోతూ ప్రశ్నించాడు.
“అయితే నీవు వెంటనే దానికి జవాబెందు కివ్వలేదు?”
“జవాబు, నోటి చివరిదాకా వచ్చింది రాజా! కాని తమాయించుకున్నాను. బ్రాహ్మణజన్మ ఎత్తిన మూఢుడి కన్న కోతి అనేక విధాల గొప్పది!”
“నిజమే! నీవన్నది కాదనడం లేదు నితాయీ!”
అప్పుడే స్వయంగా రచించిన ఒకగీతిక చదివాడు.
“ప్రపంచంలో సర్వము సహించగలిగినవారే మహనీయులు! వనుమతి చలనింని + ఏ3
క్షమతో తుల్యమైన ధర్మం మరి లేదు!”
కవిత పరించి తిరిగి అన్నాడు నితాయీ.
“నేనాయన్ని మన్నించాను. తెలిసిందా రాజా? అసలె బ్రాహ్మణుడు. అందులో రోగిష్టి. ఆపైన మూర్చుడు! కనకనే నేను ఆయన్ని మన్నించాను”
రాజూ పరమానందభరితుడయ్యాదు. కొన్సిక్షణాలవరకు మౌనం వహించి స్వచ్చమైన వంగభాషలో చాలా మంచిపనే చేశావని మెచ్చుకున్నాడు.
“అయితే నీవు ఏంచేద్దా మనుకుంటున్నావు నితాయీ! ఏదో ఒకపని చెయ్యాలి గదా మరి! పొట్ట మనం చెప్పినమాట వినదే! అలాంటిది ఈ ప్రపంచంలో మరి లేదే!”
“ఒక దుకాణం పెట్టకుందా మనుకుంటున్నాను”
“దుకాణమా?”
“అవును దుకాణమే! వీడీలదుకాణం. నా అంతట నేనే బీడీలు తయారు చేస్తాను. అవన్నీ స్టేషన్ పక్కన మర్రిచెట్టుక్రింద పెట్టి అమ్ముతాను. రెండు మూడు సిగరెట్ పెట్టెలు కూడా ఆ దుకాణంలో పెడతాను”
రాజా బాగా ఉత్సాహపడ్డాడు.
“అయితే చాలా బాగా ఉంది ఈ ఆలోచన! అద్భుతంగా ఉంది!”
ఆయినా నితాయీ కొంచెం నిరుత్సాహంగానే అన్నాడు.
“బనియామామకు పోటీ అనుకుని మనసులో బాధపడతాడు, కాని-”
“జ్వంక్రా ఆ కాని ఎందుకు? అతగాడు బాధపడితే మనకేం? నీ కిందువల్ల కడుపునిండా తిండి దొరుకుతుంది”
“అదికాదు భాయీ, నే ననేది! ఎవ్వరికయినా సరే, నష్టం కలిగించడం నా కిష్టం లేదు! అదీగాక తమలపాకులు, టీ, నీళ్లు నేనిస్తే ఎవ్వరు ముట్టరు!” అలా అంటూనే నితాయీ ఒక్కమారుగా ఉప్పొంగిపోయాడు!
“అయితే రాజా, వెదుళ్లుకొని చిన్నచిన్న కుర్చీలు, పూలసజ్జలు చాలా అందంగా తయారుచేసి అమ్మితే ఎలా ఉంటుందంటావు?”
“అది అన్నింటికన్న చాలా మంచిపని!”
“కాని విప్రపదులేమంటారో తెలుసునా! నా ఎరుకుల వృత్తికేసి వేలెత్తి తగ థి కవీ నవల
చూపించి మదీ “ఎరుకల కుర్రవాడు? అని హేళన చేసారు!”
పళ్లు పటపటకొరికి కస్సుమన్నాడు రాజా,
“ఒక్కనాడు చెవులు రెండు పట్టుకుని గట్టిగా మెలిపెడితే సరి! బాపనయ్య రోగం కుదురుతుంది!”
“అలాగనకు రాజా! వెయ్యి తప్పుడు పనులు చేసినా ఆయన బ్రాహ్మడు! “బ్రాహ్మణుడు ఆగ్రహిస్తే మరి ప్రళభయమె! బ్రాహ్మణుడు సామాన్యుడు కాడు!” అని మన ధర్మ్శశాస్తాలంటున్నాయి. అదిగాక-”
కస్తూత్ర్! బ్రాహ్మడా! ఇలాంటివారు ఐదువందలమంది బ్రాహ్మలైనా ఒక్క కొంగతో సమానమే! ఆ పక్షికాళ్లు విరగ్గొట్టలేవూ?...[బ్రాహ్మడు!” రాజా మధ్యలోనే అద్దుకుని గర్జించాడు.
నితాయీ నవ్వాడు.
“అలాగనకు రాజా! పోనీలే! నన్ను ఎరుకుల కుర్రవాడనే కదా అన్నది. ఆ మాట మీద సిగ్గుపడద మెందుకు! ఎరుకలంటే తక్కువవారా! ఎరుకలూ మనుషులే! బాపనయ్యలూ మనుషులే!”
రాజా కిక ఆ మాటలో తప్పేమి కనబడలేదు!
“సరే, నీవు దుకాణం తెరవడం చాలా బాగుంది? ఆపైన పెళ్లి కూడా చేసుకో ఉస్తాద్! కాస్త కుటుంబం ఏర్పరుచుకో!” నెమ్మదిగా సలహా ఇచ్చాడు రాజా.
దానిమీద తన అయిష్టం వ్యక్తీకరించి, పెదవి విరిచి “ఆ సంగతి నా దగ్గిర తలపెట్టకు” అన్నాడు నితాయీ.
“ల్రదేం మాట భాయీ! నీ మాట నేను వినదలుచుకోలేదు! తెలిసిందా?”
“'జర్రే దీనికేంలేగాని, నేనాక కధ చెబుతాను, విను!”
కధలంటే చెవిచోసుకుంటాడు రాజా, వెంటనే ఒక బీడీ వెలిగించి కుదురుగా కూర్చున్నాడు. నితాయీ తోకతెగిన నక్కకధ మొదలుపెట్టాడు. అది పూర్తి చేసి తిరిగి అందుకున్నాడు.
“నీవు తోక తెగ్గోసుకుని నన్ను కూడా అదేపని చెయ్యమంటున్నావు! నేను దాని కంగీకరించేది లేదు!” వసుమతి చలనాని ఉ ఏ5
రాజా కొంచెం నవ్వాడు కాని వెంటనే మొదలుపెట్టాడు.
“నీ వంటున్నమాట బొత్తిగా బాగాలేదు. ప్రపంచంలో జన్మ ఎత్తిన తరు వాత పెళ్లి చేసుకోకపోతే మరేమిటి చేస్తావు?”
వెంటనే నితాయీ అందుకున్నాడు.
“నీక్సు మతిపోయింది రాజా! పెళ్లిచేసుకుంటే చిట్టచివరికి లేనిపోనిచిక్కుల్లో తల దూర్చాలి! అదీగాక మా కులంలో పిల్లలకి చదువుల మర్మాలెలాగ తెలుస్తాయి? రాత్రింబగళ్లు పిచ్చిపిచ్చి వాగుడు తప్ప వాళ్ళకేం తెలుసు?” అంటూ నితాయి ఏదో చెప్పబోయి ఆగి-
మాట పూర్తికాకమునుపే పకపకనవ్వాడు నితాయి.
రాజా బొమముడి విరిచి ప్రశ్నించాడు.
“జదేం మాట ఉస్తాద్! ఎందుకలాగ నవ్వుతావు?”
“నవ్వకేం జెయ్యమంటావు? నా మనసుకి నచ్చినపిల్ల ఎక్కడ దొరుకు తుంది?” అంటూ.
చిరునవ్వు చిలకరించి,
“చూడు భాయీ, నేనొక కవిగాయకుబ్లి! వట్టి సంసారపక్షం పిల్లమీద నా మనసు పోదు! తెలిసిందా?”
రాజా ఈసారి ఒక్కమారుగా విరగబడి నవ్వాడు! అతడు మనసారా నవ్వాడంటే గొంతుస్తాయి బాగా 'హెచ్చిపోతుంది! ఆ నవ్వు కొంత వెకిలిగా కూడా మారిపోతుంది! మరికొన్ని క్షణాలలోనే రాజా ఆ నవ్వు అపి, నితాయీ నీవు చెప్పింది ఆక్షరాలా నిజమే అని ఆంగీకరిస్తూ తన ఉత్సాహాన్ని వ్యక్తీక రించాడు.
ఆ విధంగా కొనసాగుతున్న వారిద్దరి సంభాషణ రాజాభార్య పెనుగొంతు విని ఆగిపోయింది ఆమె పెద్దగా కేకలు పెడుతున్నది! ఆ కేకల సారాంశం ఆమె తన దురదృష్టాన్ని నితాయితో రాజా స్నేహం ఒక తార్కాణంగా ఎత్తి చూపి, వాదివాడి ములుకులవంటి పలుకులతో మాటిమాటికి ఎత్తిపొడుస్తోంది.
“నా నుదుటిమీద రాత ఇలాగున్నప్పుడు. ఇంక ఎవరినంటే ఏం లాభం? తెల్లవారింధి మొదలు మధ్యాహ్నం రెండురూములదాకా ఆ మనిషి కింక 36 €: కవి నవల
ఇంటి సంగతే పట్టదు మరి!.. ఇంక నేనేమి చేసేది? అ పరమాత్ముడింక నా నెత్తిమీద ఇన్ని నిప్పులు పోసినా బాగుండును!... నేనింక బండరాయితో తల బద్దలు కొట్టుకున్నా బాగుండును!”
రాజా ముఖం క్షణంలో భయంకరంగా మారిపోయింది! అతడు తటాలున లేచి నిలుచున్నాడు! నితాయీ బాగా కంగారుపడి “ఎక్కడికి వెళుతున్నావు?”అని అదిగాడు.
“వస్తాను! ఇదిగో, ఇప్పుడే వస్తాను!” అని చెప్పి క్షణంలో అక్కడినించి వెళ్ళిపోయాడు రాజా!
“రాజా! రాజా!” అని పిలుస్తూ నితాయీ అతని వెనకాలే వెళ్ళి ద్వారందగ్గిర నిలబడిపోయాడు. విరగబడి నవ్వుతూ మరికొన్ని క్షణాలలోనే రాజా అక్కడికి తిరిగివచ్చాడు. అలాగ నవ్వుతూనే అతదక్కడ నేలమీద మేను వాలాడు. “ఎమిటి? ఎమిటి జరిగింది?” అని ప్రశ్నించాడు నితాయీ.
అయితే రాజా నవ్వు ప్రశ్నతో ఆగలేదు! అంత పెద్దగా అదేపనిగా నవ్వు తున్నప్పుడు నోటమాట వెలువడదు. అయినా అతికష్టంమీద “వారిపోయింది! ఆ పొలాలలోకి పారిపోయింది!” అన్నాడు రాజా మళ్ళీ అదేపనిగా ఆ ఎడతెగని నవ్వు! నితాయీకి అంతా అర్ధమైంది. నోటికి వచ్చినట్టు తిడుతూ కేకలు వేస్తున్న రాజాభార్య రౌద్రమూర్తి అయి భర్త ఇంటిలో అడుగుపెట్టగానే హడలెత్తి పోయి, పెరట్గుమ్మం తలుపు తెరిచి కాలికొద్ది పరుగుపెట్టింది! రాజూ లేచి నిలుచున్నాడు వెనక్కి తిరిగి చూచినట్టు అభినయించి నవ్వుతూనే,
“ఇదిగో ఇలాగే వెనక్కి తిరిగిచూసింది, నేనొక అడుగు ముందుకి వెయ్యగానే మళ్ళీ పరుగు లంకించుకుంది!”
అంటే రాజా ఒక అడుగు ముందుకి వెయ్యగానే అది చూసీ చూడగానే రాజా భార్య పరుగు పెట్టిందన్నమాట! ఆ తరువాత వెనక్కి తిరిగిచూసి, రాజా ముందుకి వస్తున్న సంగతి గమనించి మళ్ళీ పరుగు ప్రారంభించిందన్నమాట! రాజా పిడికిలి అంటి ఆమెకెంతయినా భయం! ఆ కధ అంతా చెబుతూ చెబుతూ రాజా తిరిగి అలాగే విరగబడి నవ్వాడు!
సరీగ్గా ఇదే సమయంలో చిన్నరాణి లోపలికి వచ్చి నిలుచున్నది. ఆమె వసుమతి చలనంని త ౩7
తెల్లగా ఉతికిన పొట్టిచీర కట్టుకున్నది. అది ముతకనూలుతో తయారుచెసిన నేతచీర, నెత్తిమీది చుట్టకుదురు, దానిమీద తళతళలాడుతున్న చిన్న ఇత్తడి పొలవీిందె, అది మిట్ట మధ్యాహ్నవేళ ఎండలో బంగారుబిందెలా మిలమల మెరుస్తున్నది
“రా! చిన్నరాణీ! రా!” అని నితాయీ ఎంతో ఆదరంగా లోపలి కాహ్వానించాడు.
రాజా ఆ విధంగా విరగబడి నవ్వడం చూసి, చిన్నరాజి ఆశ్చర్యపడింది. నితాయీని అదిగింది ఆశ్చర్యంగా.
“ఎందుకలాగ అంత ఇదిగా నవ్వుతున్నారు బావగారు?”
“ఆయన్నె అడిగి కనుక్కోరాదూ!” అన్నాడు నితాయీ నవ్వుతూ.
“అయ్యో! అయ్యో! ఎందుకండీ, అలాగ నవ్వుతున్నారు బావగారూ?” అడిగింది చిన్నరాణి. మరుక్షణంలోనే ఆ నవ్వుధోరణి ఆమెలో కూడా సంక్రమించి “హి హి హీ” అని నవ్వడం మొదలుపెట్టింది. అది మిక్కిలి మృదువైన వీణా రుంకారం వంటినవ్వు, అంతలోనె రాజా నవ్వు అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ఆ విధంగా నవ్వడంతో అతడొక్కసారి భగ్గుమని మండిపడ్డాడు! ఆ అమ్మాయి వెక్కిరించి వేళాకోళం చెస్తున్నదని అనుమానపడ్డాడు. పెద్దగా గొంతెత్తి “చాలు! చాలులే!” అని గట్టిగా హుంకరించి మందిలించాదు.
ఆ మందలింపుతో ఆ అమ్మాయి నవ్వుతో తటాలున నిలిచిపోయింది. అంతలోనే రాజా మళ్ళీ విరుచుకుపడ్డాడు.
“నల్లని రోడ్డుతారులాగున్నావే! అలాగ పళ్ళికిలించి నవ్వుతావెందుకు? బొత్తిగా సిగ్గలేదూ?”
ఈసారి చిన్నరాణి దెబ్బతిన్నట్టు నిర్దాంతవోయింది.
ఆపైన కొన్ని క్షణాలపాటు అలాగే ఉండిపోయి. చాలా తొందరగా వెళ్ళాలన్నట్లు ముఖం పెట్టీ
“మీ పాలు తొందరగా తీసుకోండి బాబూ! నాకు ఆలస్యమైపోతూంది! మా ఇంటిదగ్గిర కేకలెస్తారు!” 38 € కవి నవల
అంతలోనే రాజా మళ్ళీ కస్సుమన్నాడు.
“నీకు కూడా ఒకనాడు గట్టిగా తగలనియ్యాలి! అక్కలాగ పొలాలమ్మట పుట్టలమ్మట -”
చిన్నరాణి మరి నవ్వలేదు. తలవంచుకుని పాలబిందెలోనించి కొలత గ్లాసుతో పాలుతీసి, పట్టుకున్నది “ఏమండోయ్! మీగిన్నె తీసుకురండి!”
నితాయీ ఎంతో నొచ్చుకుని తన పాలగిన్నె ఆమె ముందుంచాడు.
“ఏం, కోపం వచ్చిందా చిన్నరాజీ! కోపగించుకోకు!” నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు నితాయి
చిన్నరాణి సమాధానం చెప్పలేదు. తనపని ముగించుకుని అలాగే నిశ్శబ్దంగా నడిచి వెళ్లిపోయింది. ఈసారి రాజా వెనకనించి వేళాకోళం పట్టంచాడు.
“ఓహ్! చిన్నరాణి మా మెయిల్గాడీ! అబ్బో! అబ్బో! ఎలాగ చకచకా నడిచిపోతూందో! అమ్మయ్యో!” అని అంటున్న బావగారి మాటలు పట్టించు కోలేదు. చిన్నరాణి మరి వెనకి తిరిగి చూడలేదు! ఆపైన నితాయీ అందుకున్నాడు.
“నీ విలాగ మాట్లాడడం బొత్తిగా తగనిపని భాయీ!”
“ఏం ఎందుచేత?” రాజా దానికంగీకరించలేదు.
మరుక్షణంలోనే అతడు లేచి నిలుచున్నాడు. ఒంటిగంటన్నర బండికి గంట కొట్టాలి. అది వచ్చిసమయం గుర్తించడానికి చిన్నరాణి ఒక సిగ్నల్! ఆమె నితాయీకి పాలుపోసి గ్రామంలోకి వెళ్లగానే వెంటనే రాజా స్టెషన్కి పరుగు పెట్టాలి అతడటువైపు బయలుదేరగానే దారిమధ్యలోనే స్టేషన్ మాష్టర్ “రాజా!” అని గట్టిగా పిలిచిన పిలుపు వినబడింది. వెంటనే రాజా “హుజూర్, హాజర్!” అని సమాధానం చెప్పాడు.
చిన్నరాణి, రాజా ఇద్దరు అక్కడినించి వెళ్లిపోయారు. నితాయీ ఒక్కడే దిగులుపడి అక్కడే నిలుచుండిపోయాడు. మనోజ్ఞస్వభావంగల, మధురమూర్తి చిన్నరాణిని రాజా అలాగ పరుషవాక్యాలతో తూలనాడడం బొత్తిగా బాగాలేదు! ప్రపంచంలో పలువురిని సంతోషపెట్టాలి! సుఖపెట్టాలి! మృదుమధురంగా వసుమతి చలనాని + ౨౦౮
ప్రసంగించాలి! అతనికి ఆ తరుణంలో గతరాత్రి పాడినపాట గుర్తువచ్చింది.
“సుఖసారం కన్నీరే! కన్పీరే!
సుమి భాయీ!
అవగతమయినది అంతా నాకిది
(ప్రేమవల్లనే అన్నాా”...అని వాడుకున్నాడు కవిగా నితాయి.
ఒక్క దిర్హనిశ్వాసం విడిచిపెట్టి నితాయీ తిరిగి తన దినచర్యలో పడ్డాడు. చిన్నరాణి పాలుపోసి వెళ్లింది. ఇక టి కాచాలి. లోపలికి వెళ్లి పొయ్యి వెలిగిం చాడు. బనీయామామ రెండుకానులు తీసుకుని కొలిచియిచ్చిన టీవల్ల అతనికి హుషారుగా ఉండడంలేదు.
అదీగాక ఈవేళ ఒళ్లుకూడా సరిగాలేదు. వేదిక మీద కవితా గానంతో క్రితం రాటత్రి పడినశఛ్రమవల్ల, ఆందోళన వల్ల, రాత్రంతా చాలావరకు నిద్ర లేనందువల్ల. ఈవేళ అంతా అతనికి ఒళ్లంతా హూనమయినట్టుంది. తల తిరుగుతూంది. చెవులలో ఇప్పటికి దోలు, కంజిరాల సవ్వడులు భోరుమని మారుమోగుతూనే ఉన్నాయి! కాస్త టీ గొంతులో పోసుకోకపోతే పరిస్థితి బాగుపడేటట్టు కనపబడడంలేదు!
పొయ్యి రాజుకున్న తరువాత కెటిల్కి బదులుగా ఒక మట్టిపాత్రలో నీళ్లుపోసి పోయ్యిమీది కెక్కించాడు నితాయీ. అతని మనసులో తిరిగి ఆందోళన బయలు దేరింది. రాజా చిన్నరాణినా విధంగా తూలనాడడం బొత్తిగా బాగాలెదు! చిన్నరాణి చాలా మంచిపిల్ల. ఈనాడామె తన దగ్గిర కూర్చుని ఎంతో కులాసాగా ఎన్నెన్నో కబుర్లు చెప్పి ఉండేది! అవును! తప్పకుండా చెప్పి ఉందేది! తను పాల్గొన్న గానం గురించి ఎంతో ఆశ్చర్యపడి ఎన్నెన్నో కధలు చెప్పి ఉందేది! కాని రాజా చివాట్లతో ఆ అమ్మాయి మనస్సెంతో గాయపడింది! కనకనే పెదవి కదపకుండా గిరుక్కున వెనక్సితిరిగి వెళ్లి పోయింది!
“రోడ్డుతారులాంటి నల్లనిరంగు” శ్రీ ఛీ! ఎందుకలాగ మాట్లాడడం? నలుపా? చిన్నరాణి నలుపా? రాజాకి కళ్లులేవు? ఆదీగాక నలుపేమైనా అంత తీసిపోయిందా? అంతతక్కువా? కృష్ణుడు నల్లనివాడు! కోకిల నల్లనిది! 40 + కవి నవల
కేశరాశి నలుపు! ఆహాహా! ఆహాహా! చాలా అందమైన తియ్యతియ్యని పాటచరణం మనస్సులో తిరుగుతున్నదే! ఆహా! ఎంతచక్కని చరణం!
“నల్లనల్లని నలుపే తీసిపోతే, తక్కువ అయితే,
తలనెరిసిన మరి కన్నీరేలా! కన్నీరెలా?”
ర్
చాలా సొగసైన చరణం వచ్చిందని నితాయీ తనంతట తానే ఉప్పాంగి పోయాడు!
“నల్లనల్లని నలుపే తీసిపోతే, తక్కువ అయితే,
తల నెరిసిన మరి కన్నీరేలా? కన్నిరలా?”
వహవాశ! వహవ్వా! వహవ్వా! బెను, కన్నీరేల?
ఎదురుగా పొయ్యిమీది కెక్కించిన నీళ్లు సలసలకాగుతూ పొంగు తున్నాయి. వెంటనే నితాయీ టీ పాత్ర దించి, టీ పొడుం నీటిలో వేసి కళాయి చేసిన పళ్లెం మూత పెట్టాడు. “పొంగుతున్న నీటిలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చెంచా చొప్పున టి పొడుంవేసి అయిదు నిమిషాలవరకు వేచి ఉండాలి” అన్న ప్రకటన అతడు బనీయామాను స్టాల్లో చదివాడు. ఆపైన మరి ఐమిచెయ్యాలి?
నితాయీ ఆ తరువాత తన మనసులో ఆ చరణం మాటిమాటికి పాడు కున్నాడు. కాని రెండదవచరణం స్ఫురించలేదు కిటికీలోనించి కనిపిస్తున్న నల్లనివస్తువు లన్నింటికేసి చూశాడు నితాయీ. అయినా ఆ రెందవచరణం రాలేదు. మిగిలిన రోజుల్లో అతడు వేడివేడినీటిలో టీ పొడుం వేసి మనసులో ఒకటిమొదలుకుని ఆరవైదాకా అయిదుసార్లు లెక్కిన్తాడు. ఆపైన వాలు, పంచదాం“పోసాడు. ఈనాడు ఆ విధంగా జరగలేదు. మాటిమాటికి ఆ రెండవ చరణం గురించి ఆలోచిస్తున్నాడు అంతలోనే అతనికి టీ సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే పాలు, పంచదారపోసి టీ వదడబోశాడు. కళాయి చేసిన ఒకపాత్రలో కొంత టీ పోసుకుని, మిగిలినది రాజుకోసం జాగ్రత్తచేసి, టీ తాగిన తరువాత నెమ్మదిగా నడిచివెళ్లి గుల్మోహర్ చెట్టునీడలో కూర్చు న్నాడు ఇది అతనికి చాలా ఇష్టమైన చోటు, నల్లనల్లని పలచని ఆకులతో వసుమతి చలనాని ఈ 411
పెద్ద గొడుగులాగ విస్తరించిన గుల్మోహర్! నితాయీ ఆ ఆకులకేసిచూస్తూ “చాలా సున్నితమైన ఆకులు!” చైత్రమాసం చివరిరోజులలో ఆ చెట్టు గుత్తులు గుత్తులుగా వికసించిన ఎర్రఎర్రని పూలతో కలకలలాడుతూంటుంది. నితాయీ ఆ సమయంలో సామాన్యంగా ప్రతిరోజు ఆ చెట్టునీడలో కూర్చుంటాడు. ఆ పువ్వులకోసం చిన్నపిల్లలు గుంపులు గుంపులుగా అక్కడికి వస్తూంటారు. అయితే నితాయీ రాలినపువ్వులు మాత్రమే వాళ్లకిచ్చి పంపించివేస్తాడు. చెట్టెక్కి పువ్వులు కొయ్యడానికి అంగీకరించడు.
స్టేషన్నించి రాజా గట్టిగా గొంతెత్తి పిలిచిన పిలుపు వినబడుతూంది. ఈ బండిలోనే గూడ్సుపెట్టెలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పెట్టెలు ఇక్కడ విడదీసారు. దానికోసం షంటింగు జరుగుతుంది.
ఇంతకుమునుపే ఏర్పరిచిన ఇంకొక కూలీతో కలిసి రాజా కూడా వెళ్ళి గూడ్సుపెట్టెలు ముందుకు తోస్తున్నాడు. వెంటనే అతని లోలోపల తిరుగుతున్న పాట ఆగిపోయింది. దానిస్థానంలో బ్రతుకు తెరువున ఎగురించి ఆలోచన పొటమరించింది. అతడొక కవిగాయకుడు! ఇంక కూలిపని చెయ్యడు! మరి కూలిపని చెయ్యకపోతే ఆ పూట గడవడమెలాగ!
ఆ ఆలోచనల మధ్యలోనే అల్లంతదూరంలో అతని కెదురుగా చరచరా సాగిపోతున్న చిన్నరాణి సాక్షాత్కరించింది! తెల్లని ముతకచిర ధరించిన ఆ యువతి రెల్లుపువ్వులా మెరిసిపోతున్నది! శిరస్సుమిద బంగారుకిరీటంలా తళతళలాడుతున్న చిన్న ఇత్తడిబిందె. ఆమె ఎంత తొందరగా మాట్లాడుతుందో అంత త్వరగా చరచరా సాగిపోతుంది! చిన్నరాణి అంతటి వొడగరికాదు. కాని పచ్చని పచ్చి వెదురు కణుపులవంటి నెమ్మేనివంపులతో ఆమె పరశ శరీరరేఖ కనుదోయి కానందం కలిగిస్తూ ఇట్టె ఆకర్షిస్తుంది. సన్నని తీగలా చిన్నరాణి శరీరభంగిమలే నితాయీకి అన్నింటికన్న మిన్నగా కనిపిస్తాయి. ఆపైన నల్లనల్లని ఛాయలోని మార్దవం గమనిస్తూంటె, అతని కిట్ట మైమరుపు కలుగుతుంది! మరింత తొందరగా చరచరా సాగిపోతున్నది! అది గమనించి అతడు మనసులో కొంచెం నవ్వుకున్నాడు. తనను చూస్తూనే అమె అలాగ అతిత్వరితంగా సాగిపోతూంటుంది! ఇంకా సత్తువఉంటే చిన్నరాణి నడకతో 42 ఈ కవి నవల
భూమి అదిరిపోయేది!
అయితే రాజా ఆమెనలాగ దులిపివెయ్యడం బొత్తిగా బాగాలేదు! తారులాగ నల్లని నలుపే! అంతమాత్రంచేత ఆమె నలాగ తీసిపారవెయ్యడం బాగా లేదు! నిజానికామె చకృనిచుక్క!
నల్లనిదయితేమాత్రం?
“నల్లనల్లని నలుపే తీసిపోతే, తక్కువ అయితే,
తలనెరిసిన మరి కన్నీరేలా? కన్నీరేలా?”
నితాయీ పిలిచాడు “చిన్నరాణీ? ఓ చిన్నరాణీ!”
ఆమె లక్ష్యపెట్టలేదు. అలాగే తొందరతొందరగా సాగిపోతున్నది!
“ఓ నా అందాలరాణీ!” నితాయీ మళ్లీ గల్ట్బగా పిలిచాడు.
చిన్నరాణి ఆశ్చర్యపడి తటాలున నిలిచివోయింది!
మృదుమధురస్వరంతో తొందర తొందరగా సమాధానం చెప్పింది.
“నాకు బొత్తిగా వ్యవధిలేదు! త్వరగా వెళ్లాలి!”
“ఒక్కమాట! విని వెళ్లుదువుగాని!”
ర్ట చెప్పేదేదో అక్కణ్సించె చెప్పరాదూ?”
“ర్చ నా అందాలరాణీ? చిన్నరాణీ!”
తొందర తొందరగా అడుగులు వేసుకుంటూ చిన్నరాణి ఈసారి అతని ౩దురుగా వచ్చి నిలబడింది.
“ఒకవేళ నీ అందాలరాణినని నేననుకోకపోతే?” చిన్నగా నవ్వుతూ అన్నది.
“అలాగనుకోకపోతే చాలా బాధపడతాను, అంతేకదా చిన్నరాణీ”
దాపరిక మేమాత్రములేని ఆత్మీయతతో ప్రసంగించాడు నితాయీ.
“అయితే ఆ చెప్పేదేదో త్వరగా తెమల్చ్బరాదూ?” అన్నది చిన్నరాణి కొంత స్పిమితపడిన కంరస్వరంతో.
ఆమె ముఖంవైపు చూస్తూ మధుర మందహాసంతో “కోపగించుకుంటు న్నావా?” అని ప్రశ్నించాడు నితాయీ.
క్షణకాలంలో చిన్నరాణి బెదురుచూపుల కళ్లనిండా నీరు నిండింది. వసుమతి చలసాని +శఈ 43
అయినా ఆమె బాగా నిబ్బరంగానే సమాధానం చెప్పింది.
“నేను నల్లనిదాన్ని! ఆపైన మాఇంట్లో పడి ఉంటున్నాను! నా కష్టసుఖాలేవి గమనించేవాళ్లేలేరు!”
నితాయీ చిన్నగా నవ్వాడు.
“అయితే నాకు నలుపంటేనే చాలా ఇష్టం చిన్నరాణీ!?”
ఆమె ముఖం నల్లదనంలో సిగ్గుపడిన ఎరుపుచాయ ఇంకా స్పష్టంగా పొడకట్టలేదు! గ్రహించాడు నితాయి. అయినా అది అతడంతగా గమ నించలెదు.
చెక్కిలిమిద అరచెయ్యి ఆనించి మృదుస్వరంతో వొట (ప్రారంభించాడు.
“నల్లనల్లని నలుపే తీసిపోతే, తక్కువ అయితే,
తలనెరిసిన మరి కన్నీరేలా? కన్పీరేలా?”
నునుసిగ్గుతో చిమిడిపోతున్న చిన్నరాణి ఈసారి ఎంతో ఆశ్చర్యపడి, మిక్కిలి గౌరవంతో అతనికేసిచూసి “కొత్తపాటా?” అని ప్రశ్నించింది. వెనువెంటనే.
“నిన్న చాలా బాగా పాడారు!” అని మనసారా అభినందించింది.
“నిజంగా నీకు బాగా నచ్చిందా నా పాట?”
“చాలా ఆద్భుతంగా ఉంది!”
“త్రోపలికిరా, చిన్నరాణీ, కాస్త టీ తాగుదువుగాని!”
“వద్దు! వద్దు!” అన్నది చిన్నరాణి, నిజానికి ఆమెకు టీ అంటే చాలాఇష్టం! కాని ఆమె ఆ మాటమాత్రం పైకి అనలేకపోయింది!
“నా అందాలరాణివి కదూ? నా అందాలరాణివి కదూ?” అని నితాయీ ఎెంతో అప్యాయంగా (బ్రతిమాలుకున్నాడు. ఆపైన లోపలికి వెళ్లాడు. రాజాకోసమని టీ కొంత మూతపెట్టి ఉంచాడు. అది ఇంకా పొయ్యిమీదనే ఉన్నది. ఆ టీ రెండు పాత్రలలో సరిసమానంగాపోసి, ఒకపాత్ర చిన్నరాణి ముందుంచాడు.
ఆమె మరింతగా సిగ్గుపడి “వద్దు! వద్దు! మీరు తీసుకోండి!” అన్నది.
“కాదు! కాదు! తీసుకోవాలి! లేకపోతే నామీద క్రోధం ఇంకా పోలేదన్న ల్యే ఛి కవి నవల
మాట!”
చిన్నరాణి ఆ పాత్ర తనముందుకు తీసుకుని గౌరవంతో మేళవించిన ఆశ్చర్యంతో “క్రోధం అంటే ఏమిటి?” అని అడిగింది.
“కోధం అంటే కోపం! అది నీ కోపం! కకాక రేఫ ఓకారాలతో ధకలిస్తే క్రోధం అవుతుంది. 'హింసాక్రోధాలు చాలా అల్పమైనవి! అవి ఎన్నడు మంచివి కావు! అన్నమాట లెన్నడు వినలేదూ! నేను చెప్పింది బోధపడిందా! నావంటి గాయకుణ్ణి సీ వెన్నడు హింసించకూడదుమరి! నామీద ఆగ్రహపడకూడదు. క్రోధమంటే చాలా చెడ్డది అని అర్ధం.
గంఖీరాశ్చర్యంతో ఆమె రెప్పవాల్బకుండా అలాగే అతనికేసిచూస్తూ అదిగింది.
“సరేగాని ఇవి అన్ని మీరెలాగ నేర్చుకున్నారు?”
నితాయీ తీవ్రంగా ఆకాశంవైపు దృష్టినాగించి, గొప్ప వేదాంతిలా (క్రసంగించాడు.
“ఇదంతా ఆ భగవానుని లీల చిన్నరాణీ! లేకపోతే నన్నాయన కవిగా సంకల్పించి ఎరుకుల కులంలో పుట్టించారెందుచేత! చెప్పు?”
చిన్నరాణి ఈమారు పట్టరాని ఆశ్చర్యంతో మూర్తీభవించిన గౌరవంతో రెప్పలు వాల్చకుండా నితాయీకేసి చూసింది. ఆ తరుణంలో ఆమె భావనా దృష్టిలో వేలకొలది (ప్రేక్షకులు ఆశ్చర్యనిశ్చేష్టితులై ఆ కవిగాయకుని గీతిక లాలకిస్తున్నారు! వారి సమక్షంలో కూర్చున్న నితాయీ స్వయంగా రచించిన గేయాలాలపిస్తున్నాడు!
అంతలోనే ఆకస్మాత్తుగా ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టి నితాయీ తన మనోవేదన వెళ్లబోసుకున్నాడు.
“అంతా ఆ దైవలీల! లేకపోతే నన్ను కపిలవరుడని- అంటే హనుమంతు దని వేళాకోళం ఎందుకు పట్టిస్తారు?”
“అతను చాలా చాలా మంచిమనిషి!” నితాయీ అదేమాట రెట్టించాడు.
“అయితే మిమ్మల్ని అలాగ వేళాకోళం చేసినవాదెవడు? ఆ సంగతి నాతో చెప్పి తీరాలి!... వాడిమొహం తగలబడా!” కసిగా అన్నది చిన్నరాణి. వసుమతి చలసాని ఈ ౫5
“అలాగ తిట్టకు చిన్నరాణీ! ఆయన పుట్టింది బ్రాహ్మణపుట్టుక! బనియా మామ దుకాణంలో అవ్జావక్రమునిలా కూర్చుని వటవట వాగుతుంటారు చూడు! ఆయనే! ఆ విప్రపదులే!”
“ఎందుకని అలాగ వేళాకోళం చేశారాయన?”
“వ్వకినీలే! ఆ గొడవ మరి ఎత్తవద్దు! ఆయన బ్రాహ్మణుడు! నేను తక్కువ కులంలో పుట్టాను! ఏమన్నా సరే! సహించాలి కదా!”
“అబ్బో! అబ్బో! చాలా గొప్పబాపనయ్య! మీరు అంత గొప్పగా పాటలు కట్టి, అంత అద్భుతంగా పాడుతున్నారైే! ఆ మాత్రం గమనించవద్దూ?”
చిన్నరాణ్ ఆవేశంతో ఊగిపోయింది. ఆ ఉద్వేగంలో ఆమె శిరస్సు మీది ముసుగు తటాలున తొలిగిపోయింది! అంతలోనే సమ్మోహిత మధురదృష్టితో నితాయీ ఆమెకేసి చూసి “చాలా చక్కగా అలంకరించుకున్నావే! చిన్నరాణీ!” అన్నాడు.
ఆమె నల్లనల్లని కురులమధ్య ఎర్ర ఎర్రని గుల్మోహర్ పూలగుత్తి ఒకటి అలంకరించుకున్నది. మరుక్షణంలోనే చిన్నరాణి ఎంతో సిగ్గుపడి, బెదిరిన ఆడ లేడిలాగ మిక్కిలి కంగారుపడి, చేతులతో ముసుగు పైకెత్తి శీఘ్రంగా శిరస్సుమీద కప్పివేసుకోబోయింది. కాని నితాయీ హరాత్తుగా ఆమెచెతులు రెండు పట్టుకుని అద్దుకున్నాడు.
“ఉండు! ఉండు! చిన్నరాణి! నన్ఫాక్క్మమారు చూడనీ!”
చిన్నరాణ్ వెంటనే శిరస్సు కిందికి వంచివేసి, మరింతగా కంగారు పడుతూ “విడవండి! విడవండి!?” అని తొందరపెట్టింది.
నితాయీ అంతలోనే పూర్తిగా తమాయించుకుని వెంటనే ఆమె చేతులు రెండు విడిచివెశాడు.
ఆ విధంగా విడుదలపొందిన చిన్నరాణి అలాగే తలవంచుకుని, ఆ పాత్ర శుభం చేసి కడిగి ఇచ్చె మిషతో అది అంది పుచ్చుకుని తటాలున అక్కడినించి పారిపోయింది! నితాయీ తాను చేసిన పనికి ఎంతో నొచ్చుకుని, నిశ్చేష్టితుడై శిరస్సు కొంచెం వంచుకుని, “అయ్యయ్యో! ఇలా చేశానెమిటి?” అనుకున్నాడు. బీద ఛి కఐి నవల
అతడలాగే తలవంచుకుని కూర్చున్నాడు. అంతలోనే హరాత్తుగా రంగు మన్న శబ్దం వినబడడంతో తలపైకెత్తి చూశాడు చిన్నరాణి టీ పాత్ర అక్కడ పెట్టీ తన పాలబిందె శిరస్సు మీద పెట్టుకుని చరచరా సాగిపోతున్నది. అటుపిమ్మట నెమ్మదిగా వెనుదిరిగి చూసింది. నునుసిగ్గుతో మేళవించిన చిరునవ్వుతో చిన్నరాణి లేతముఖం పొద్దుటి నీరెండలో చిగురుటాకులాగ మిలమిల మెరిసిపోతున్నది! నితాయీవైపు ఒక్కమారుచూసి ఆమె వెనువెంటనే వెనక్కి తిరిగి, తనకలవాటైన అదే త్వరితగమనంతో శీఘ్రంగా సాగిపోయింది. ఆ తొందరలో చిన్నరాణి ముసుగు తిరిగి తొలిగిపోయిందిగాని, ఆమె అది సవరించుకోకుండానే వెళ్లిపోయింది. నల్లనల్లని ఆమె కురులమధ్య ఆ గుల్మోహర్ పూలగుత్తి ఆకాశంలో తారలాగ అపూర్వ వైభవంతో ప్రకాళిస్తున్నది!
“లేదు! చిన్నరాణి నామీద కోపగించుకోలేదు! పైగా వెడుతూ వెడుతూ ఒక్కసారి వెనుదిరిగి చూసి నవ్వింది! ఆ నల్లని కురులమధ్య ఆ పూలగుత్తి ఎంత ఆద్భుతంగా మెరిసివోయింది!” అనుకున్నాడు నితాయీ. చిన్నరాణీి క్రమక్రమంగా రెల్లుపూవుమీద బంగారు బిందువులాగ బాటవంపులో లీన మయింది.
నితాయీ అలాగే కూర్చుని మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అంతలోనే అతని పాటలో రెండవచరణం స్ఫురించింది.
“కేశరాశిలో అరుణకుసుమమది కనుల వెలిగెనేల!”
6
నల్లని కెశరాశిమధ్య ఎర్రని పూలసాగసు పరిశీలిస్తూ పాటలు రచిస్తూ కవికావచ్చును! కాని ఆ అందంచూసి ఆనందిస్తూ దారమ్మట తిన్నగా నదవదం మాత్రం జరిగేపని కాదు! నిజంగా నితాయీ చాలా గట్టి ఇబ్బందిలో పడ్డాడు. కాలికి బాగా పెద్ద దెబ్బే తగిలింది! కాలిబొటనవేలిగోరు పూర్తిగా చిరుకుపోయి రక్తం ప్రవహించడం ప్రారంభించింది. అయినా అతను గానంలో తేలిపోతు న్నాడు. అతడాపాట ఆలోచిస్తూ చండీదేవాలయంవైపు నడిచిపోతున్నాడు. దారిలో ఎవ్వరు లేరు ఎడమచెయ్యి ఎడమ చెక్కిలిమిద అనించి, గొంతు వసుమతి చలనాని ఈ 417
బాగా హెచ్చించి అతడాపాట పాడుకుంటున్నాడు. మధ్యమధ్యన కుడిచేతి చూపుడువేలు పైకెత్తి ఎవ్వరివైపో నిర్దేశిస్తున్నాడు. అతనికా సమయంలో “నల్లని కేశరాశి మధ్య ఎర్ర ఎర్రని పువ్వు ఎదురుగా కనిపిస్తున్నది కాబోలు! చిన్నరాణి తొందర తొందరగా అడుగులు వేసుకుంటూ అతని సమక్షంలోనే శీఘ్రంగా సాగిపోతున్నది కాబోలును! ఆమె వినిలకేశరాశిలో గుల్మోహర్ పూలగుత్తి మిలమిలా మెరిసిపోతున్నది కాబోలును!
ఆదే సమయంలో కాలినొప్పి తీవ్రమయ్యే సరికి తటాలున నిలిచి పోయాడు నితాయి. అతడిటివల కొంచెం చిక్కాడు. దానిమీద కాలికి గట్టిదెబ్బ తగలడంతో తల తిరిగింది. నితాయీ ఇటీవల కొన్నాళ్ళనించి ఒక్కపూటే భోంచేస్తున్నాడు. ప్రస్తుతం సంపాదన లేదు. కూడబెట్టుకున్న సొమ్ము కొంత ఉన్నదిగాని అది చాలా తక్కువ. దానితోనే దుకాణంలో కావలసిన వస్తువులన్ని కొనుక్కోవాలి. కనకనే నితాయీ ఒకపూట భోజనం మానివెశాడు. ఆ ఒక్కపూట కూడా మధ్యాహ్నవేళ అతడొకసారి పాయసం తయారుచేసుకుంటున్నాడు. వేరొకసారి పులగం వండుకుంటున్నాడు. నితాయీ ఆ సంగతి రాజాకిగాని, చిన్నరాణికిగాని తలియనియ్యడం లేదు. వారికిద్దరికి ఆ సంగతి తెలిస్తై చాలా ఇరుకులో పడిపోతాడు. రాజా ఒక్కసారిగా అయిదారు రూపాయలతని చేతి లోకి విసిరివేసి, “ప్రస్తుతానికి వీటితో బండి నడిపించు! తిండికి లోటులేకుండా చూసుకో! మళ్లీ అవసరంవస్తే ఇస్తానులే!” అని అంటూ ఉండేవాడు! అటు వంటి పరిస్థితి ఏర్పడడం నితాయీ కిష్టంలేదు!
అయితే అతనికి రాజావంటి ఆత్మీయుడెవ్వడు లేడు! అతని వ్యవహారంలో రాజా నిజంగా ఒకరాజే! విప్రపదుడు అతనికి పెట్టినపెర్లు కొన్ని ఇప్పటికి కళుకు కళుకుమని వెధిస్తూనే ఉన్నాయి. కాని “రాజ సభాకవి” అని విప్రపదుడు పెళ్టన పేరు తలుచుకుంటేనే అతనికెంతో సంతోషం కలుగుతున్నది. రాజా దగ్గిర నితాయీకి ఎటువంటి సంకోచములెదు. నిజమే! కాని రాజా భార్య మాత్రం రాణికాదు! కేవలం రాక్షసి! కాలకూటవిషమే! అంతేకాదు? ఒళ్లంతా విషజ్వాలలే మండింపజేస్తుంది! మిలిటరీ మనిషి రాజా కమ్బీతో భార్య వీపు కాలుస్తూనే ఉంటాడు! అయినా ఆమె నోటివిషం దిగదు! దెబ్బలు తింటున్న 48 + కట్ నవల
ప్సుడే గొంతెత్తి గోలుగోలున ఏడుస్తూనే ఉంటుంది? ఎడతెరిపి లేకుండా తిడుతూనే ఉంటుంది!
ఆ తిట్లు సామాన్యమైన తిట్లుకావు! సూటిగా గుండెల్లో నాటుకుంటాయి! ఒళ్ళంతా భగభగ మండింపబేసాయి! రాజాభార్య అక్కస్సంతా ఒక్కొక్కప్పుడు భూలోకంమీదికే తిరుగుతుంటుంది! మధ్యమధ్యన ఆమె రైలుబళ్ళ మీదకూడా దుమ్మెత్తిపోస్తుంటుంది! బండివచ్చే వేళల్లో రాజా డ్యూటీకి వెళ్లిపోతాడు. అప్పుడు కనక అతని అవసరంవస్తై ఆమె స్టేషన్ మాస్టర్‌తో ప్రారంభించి గార్జుని, దైవర్ని, రైలుబండిని- అందరిని తిట్టిపోస్తుంది. ఆ తిట్లన్ని తలుచుకుంటే నితాయీ కెంతైనా వేదన కలుగుతుంది. అయినా అతడంతలోనే నవ్వు కుంటాడు. రాజాభార్య తిట్లధోరణి అపూర్వం! కవిగాయకులు కూడా అంత చమత్మారంగా కొత్తకొత్త తిట్లు సృష్టించలేరు! పొద్దున్నే లేస్తూనే ఆమె రైలుమీద శాపనార్థ్ధాలారంభీస్తుంది!
“ఆ వంతెన ఒక్కసారిగా కూలిపోయి, నీవు నరకానికి పోవాలే! నిప్పులు కురిపిస్తూ పరుగు పెడుతున్నావుటే! ఆ నిప్పులోపడి మండిపోవే! ఆ చక్రాలన్ని ఒక్కసారిగా విరిగిపోయి, దుమ్ములో కూరుకుపోవె! ఆ గొట్టం గొంతులో ఆలాగ కూస్తావెందుకే! ఛీ !ఛీ! నీ గొంతు ముక్కలైపోనూ! అలాగే తలకిందులై కూలిపోవే! పోవె! పోవే! నరకానికిపోవే?”
ఆహాహా! ఆ మవాదెవకవి “మురికిగుంటలో కుళ్లిన ఆకే” అని నితాయీని తిట్టిన తిట్టుకూడా ఏటికి దిగదుడుపే!
కాస్త అవకాశం కలిగినప్పుడల్లా రాజా తిన్నగా వచ్చి నితాయీ దగ్గర కూర్చుంటాడు. అంతలోనే రాజా భార్య అక్కసు ఆ కవిగాయకునిమీద అమాంతంగా పెచ్చుపెరిగివోతుంది! రాజాకనక వేళ కింటికి రాకపోతే, ఆమె నితాయీకి వినపడెటట్లు అతనిని అనేకవిధాల తిట్టిపోస్తుంది! అయినా నితాయీ తనకేమి పట్టనట్టు దులిపివేసుకుని నవ్వుతాడు. రాజా ఇప్పుడతనిని ఆర్ధికంగా ఆదుకోడానికి వీలుపడడం లేదు. అతడు ఆదుకోవడం మానడు. అయితే రహస్యంగా సాయపడడానికిష్టపడడు. అది ఎలాగో అలాగ రాణిచెవిని పడుతుంది. ఆమె మరి ఊరుకోదు! నిన్ననే ఇంకొక పెద్దగొడవ జరిగింది. వసుమతి చలసాని 49
నితాయీ ఇంట్లో చిన్నరాణి టీ తాగడం రాజాభార్య గమనించింది. ఎక్కడికో వెడుతున్నట్టుంది. నవ్వు సవ్వడివిని అమె అటువైపు తొంగిచూసింది. ఇద్దరిని ఒకచోట చూసి వెంటనే ముఖం ముడుచుకుని చరచరా సాగిపోయింది. అది గమనించి చిన్నరాణి, నితాయీ తెల్లబటోయారు మరుక్షణంలోనే రాజా ఇంటిలోనించి అతనిభార్య గొంతు వ్యంగ్యశ్లేషనిందారూపంలో (ప్రతిధ్వ నించింది.
“సిగ్గులేనిదానా! నవ్వకే! మరినవ్వబోకే!
ఉరిపోసుకుని సిగ్గుతో చచ్చిపోవే! సిగ్గులేదుటే!”
చిన్నరాణ్ మరి టీ తాగడం పడలేదు. క్రమంగా టీ చల్లారిపోయింది. అది అలాగే విడిచివేసి, ఆమె కొంచెం మంచినిళ్ళుతాగి అక్కడినించి వెళ్ళి పోయింది.
గ్
కాలిదెబ్బ బాధపెడుతున్నా అది భరిస్తూ నితాయీ చండీదేవాలయం చేరుకున్నాడు. ఆ దేవతామూర్తికి నమస్కరించిన పిమ్మట అతడు పురోహితుదైన మహంతు సమక్షంలో చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఆయన ఆప్యాయం గానే దగ్గరికి పిలిచాడు.
“రావయ్యా, కవీ! నితాయీ! రా! రా[
నితాయీ కృతార్థుడనైనానని భావించుకుని దగ్గిరికి వెళ్ళీ నమస్కరించాడు.
“జయోస్తు! ఏమిటి కధ! విశేషాలిమిటి!”
“దిత్తంబాబూ, తొము నాకు మెడల్ దయచేస్తామని మాట ఇచ్చారు”
“మెదలా?”
“బిత్తం!”
“అవును! అలాగే తీసుకుందువుగాని! దానికేం!”
అంతలోనే మహంతు బెదాసీన్యం వహించాడు. వెనువెంటనే చండీదేవత మహిమ తలుచుకుని గంభీరస్వరంతో “కాళీ కైవల్యదాయినీ!” అని ఎలుగెత్తి ప్రస్తుతించాడు. నితాయీ మరికొంతసేపటివరకు మాట్లాడకూరుకున్నాడు. మహంతు భావోద్వేగానికి, మౌనానికి విఘ్నం కలిగించడానికి సాహసించలేక ర్0 కవి నవల
పోయాడు. మరికొన్ని క్షణాలలాగ గడిచిపోయిన పిమ్మట చందిదేవాలయం ద్వారంలో గంట ఖంగుమని మారుమోగింది. మరికొంతసేపటికి మహంతు అక్కడినించి కదిలాడు. యాత్రికుడొకడు దేవతకొక రూపాయి సమర్పించి నట్టున్నాడు! కనకనే మహంతు అక్కడినించి కదిలివెళ్ళాడని నితాయీ (గ్రహించుకున్నాడు.
మహంతు తిరిగివచ్చిన తరువాత నితాయి చేతులు రెండు జోడిచి నిలుచునే వున్నాడు. నెమ్మదిగా “బాబూ!” అని పిలిచి హెచ్చరించాడు.
మహంతు బొమముడి కుంచించి సమాధానం చెప్పాడు.
“చెప్పానుగా! మున్ముందు ఏర్పాటు చెయిస్తానులె! మళ్లీ చందీమాత ఉత్సవం జరిగినప్పుడు సదస్యులందరి సమక్షంలోను నీకు మెడల్ బహుమతి ఇచ్చె ఏర్పాటు చేయిస్తాను”
“ఇప్పుదడేమయినా కొంచెం ఇప్పించండి!” నితాయీ మిక్కిలి అణకువతో విన్నవించాడు
“ఆ రూపాయా?”
“బిత్తంబాబూ!”
మహంతు విసుగ్గా కొన్ని క్షణాలవరకు నితాయీకేసి చూశాడు.
అటువంటి అనాదరణ దృష్టి కెదురుగా నిలబడడానికి నితాయీ కెంతో బాధ కలిగింది. అంతలోనే మహంతు ఆకస్మాత్తుగా అందుకున్నాడు.
“బాగుందిరా! నాయనా, బాగుంది! చాలా బాగా మాట్లాడడం నేర్చు కున్నావెే! ఆ రూపాయా! అమ్మవారి కర్పించిన రూపాయా? అమ్మవారి ఎదుట పాడడమే ఒక మహాభాగ్యమనుకోరా నాయనా!”
ఆ మాటలు వింటూంటే నితాయీకి కొరడాతో చెళ్తుమని తగిలించినట్లని పించింది! ఆపైన అతడెంతయినా కించపడ్డాడు. నిజమేమరి! అమ్మవారి సమక్షంలో పాడడమే ఒకగొప్ప అదృష్టం! ఆపైన ఏముఖం పెట్టుకుని సోమ్ము కావాలని అడగగలడు!
నితాయీ మరి ప్రతిసమాధానం్పడెప్తకోండాన్నాకట్నాలున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తిరిగివస్తూంటే "₹ నీరు న. వసుమతి చలసాని ఉ(466 1201613 % 51
మహాదేవకవి గీతిక తటాలున జ్ఞప్తికి వచ్చింది. ఆనాడు వేదికమీద కూర్చుని “మురికిగుంటలో కుళ్లిన ఆకే, స్వర్గాని కెగరాలని ఉబలాట పడుతున్నదిరా!” అని వాడి అధిక్షేపించాడు! మహాదెవకవిగాయకుడన్నమాట అక్షరాలా నిజం! మురికి గుంటలో కుళ్లిన ఆకు ఎన్నటికిని స్వర్గానికి వెళ్ళదు! వెళ్ళలేదు! మహాదేవకవి గాయకుడు అతనికన్న ఎన్నోరెట్లు గొప్పవాడు! ఆ కవి సరైన మాటే అన్నాడు! తానిక ఇప్పుడు కవికావడం అంటే మురికిగుంటలో కుళ్లినాకు స్వర్గానికి ఎగరడమన్నమాటే! రెండు సమానమే!
“ఆ మాట ఇంక విడిచిపెట్టివెయ్యవలసిందే!” ఆ మాటలు తనకు విన బడేటంత స్పష్టంగా అనుకుని గట్ట గా నిశ్చయించుకున్నాడు నితాయీ, అంటే తానిక కవి కావడమన్న సంగతే పూర్తిగా విడిచిపెట్టివెస్తున్నాడన్నమాట! ఆ విధంగా దృఢంగా నిశ్చయించుకున్న తరువాత పన్నెండు గంటలబంది రాగానే మళ్లీ మూటలు మొయ్యడం ప్రారంభించాలని కూడా ఆలోచించాడు.
విప్రపదులు వేళాకోళం చేస్తే చేస్తారు! చెయ్యనీ! ఇంక కవికావడమన్నది తన వల్ల అయ్యేపని కాదు! అటుపిమ్మట అతడెంతో ఉత్సాహంగా తిరిగి మహాదేవకవి పాడిన ఆ పాటే అందుకున్నాడు
చిన్నరాణి ఈ వాటికి ఇంటికివచ్చి తాళంవెసి ఉన్నట్టు గమనించి నిర్చాంతపడి నిలబడి ఉంటుంది! ఆమె ఇంక రాజా ఇంటీకి వెళ్ళదు. రాజా భార్య నిన్న ఆ విట్టుల గీతం పాడి ఎంత హేయంగా అవమానం చెసింది! వెనువెంటనే నితాయీ స్టెషన్వైపు పరుగుపెట్టాడు
ఒగర్భుకుంటూ, ఒగర్చుకుంటూ అతడు స్టేషన్లో అడుగుపెట్టేసరికి అప్పుడే ఆ బండి త్రాచులాగ పూర్తిగా స్టేషన్లోనించి దాటిపోయింది! నితాయీ హతాళుడై ఒక వేడినిట్టూర్చు విడిచిపెట్టి, అలాగే నిలచుండిపోయాడు! ఆవెళ కూలీ చెయ్యి దాటిపోయింది! చిన్నరాణికూడా వెళ్ళివోయింది!
ఆకస్నాత్తుగా “నితాయీ!” అన్న పిలుపు వినబడింది! స్టేషన్స్టాల్లో నిలబడిన బనియామామ అతనినిచూసి, ఎంతో ఉత్సాహంగా “నితాయీ! నితాయీ!” అని పిలుస్తున్నాడు!
వాతవ్యాధితో సతమతమవుతున్న విప్రపదుడు అతికష్టంమీద దేహంతో 52 + కవి నవల:
పాటు మెడతిప్పి నితాయీకేసి చూసి “కపివరా! కపివరా!” అని పిలిచాడు. నితాయీకి ఎంతయినా చిరాకు కలిగింది. వెనువెంటనే తగినట్టుగా
గట్టగా సమాధానం చెవ్సాలని స్టేషన్లోకి వచ్చి ఒకచోట కూర్చున్నాడు.
కాని అంతలోనే బనియామామ మరింతగా ఉత్సాహపడి అందుకున్నాడు.
“వూ నితాయీ నిజంగా సుగుణాలపుట్ట! నాయనా, మహాదేవకవి నీకోసం మనిషిని పంపించారురా! ఎక్కడో నీ పాటకోసం ఒప్పందం ఏర్పాటయ్యే టట్టుంది. నీవింక పాటకచేరీ జరపాలి!”
తలవని తలంపుగా ఎదురుపడిన ఆ వార్త వింటూనే నితాయీ ఆశ్చర్య పోయాడు.
మహాదివకవి స్వయంగా ఒక మనిషిని పంపించారు! అంతేకాదు. ఒక ఒప్పందం కూడా కుదరబోతున్నది అంతలోనే హరాత్తుగా రాజా పెట్టిన కేకతో అతని ఆశ్చర్య నిస్తబ్బ్దత అంతా ఒక్కమారుగా పటాపంచలైంది! ఉప్పాంగుతున్న అనంతోత్సాహాలతో “ఉస్తాద్! ఉస్తాద్!” అని రాజా తన యావచ్చక్తి విని యోగించి ఎలుగెత్తి కెకపెట్టాడు! _
వచ్చిన మనిషి మహాదేవకవి వంతగాయకుల బృందంలో వంత పాటగాడు వెనక జరిగిన పోటీపాటకచేరీలో పాల్గొన్నాడు. చూడగానే నితాయీ అతనిని గుర్తించాడు.
“ఒప్పందం ఏర్పాటయింది! ఉస్తాద్, ఒప్పందం ఏర్పాటయింది!” రాజా ఉల్లాసంతో ఊగిపోయాడు! ఆ కొత్తవ్యక్తి నితాయీకి సమస్మరించి కుశల ప్రశ్నలు వేశాడు.
వెంటనే నితాయీ ప్రతినమస్మారంచేసి మృదుస్వరంతో అన్నాడు.
“చిత్తం బాబూ! మీరంతా కుశలమా? మహదేవకవి బాగున్నారా?”
“చిత్తం . ఆయనే నన్ను మీ దగ్గిరికి పంపించాడు. మహాదేవకవి పాట కచెరీకి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మీరు దానిలో వంతపాట పాడాలి.
మహాదేవకవిగాయకుల ఒంట్లో బాగాలేదు. గొంతుపట్టేసింది. మీది చాలా కమ్మని గొంతు! ఉస్తాద్ స్వయంగా మిమ్మల్ని పాడవలిసిందని కోరు తున్నారు. మీరాపైన స్వతంత్రంగా కూడా పాట పాడుకోవచ్చును! మహాదేవకవి వసుమతి చలనగుంని +ఉ 53
కోరేది ఇంతే!” దానిమీద రాజా అందుకున్నాడు.
“అలాగే! నితాయీ తప్పకుండా పాడతాడు. తప్పకుండా అక్కడికి వస్తాడు. ఇంటికి వెడదాం రండి! టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చును!” అన్నాడు ఉత్సాహంగా రాజా.
నితాయీ రాజా చెప్పినదానికి తన అంగీకారం వ్యక్తీకరించాడు. ఈవేళ జరుగుతున్నదంతా అతనిని ఒక్కమారుగా ఆశ్చర్యంలో ముంచివేసింది! మహాదేవకవి స్వయంగా తన దగ్గిరికి మనిషిని పంపించారు! ఒప్పందం కూడా కుదిరిపోయింది! నితాయీ చాలా ఉత్సాహంగా వున్నాడు.
“అలాగే! అలాగే! తప్పకుండా వస్తాను! దయచెయ్యండి! టీ తాగుతూ మాట్లాడుకుందాము”
అయితే ఆ కొత్తవ్యక్తి కొంచెం తొందరపని ఉన్నదని చెప్పి మన్నించమని వేడుకుని అక్కడినించే తిరిగి వెళ్ళిపోయాడు.
రాజాతో కలిసి ఇంటికి తిరిగివచ్చి ద్వారం దగ్గిర నిలబడిన నితాయిీకి ఎంతో ఆశ్చర్యం కలిగింది! గుల్మోహర్ ఆ పొదలమాటున నిలుచున్న దెవరు!
చిన్నరాణి!
పట్టరాని ఆత్రుతతో అతనిని సమీపిస్తూనే చిన్నరాణి సిగ్గుతో ముడుచుకు పోయింది! కాని మరుక్షణంలో ఆ భావం పైకి ఏమాత్రం వ్యక్తం కానియ్యక ధైర్యంగానే మాట్లాడింది.
“ఎక్కడికి వెళ్ళారు బాబూ మీరు? ఎప్పటినించో పాలుపొయ్యడానికని నేనిక్కదే నిలుచున్నాను”
“రేపు కొంచెం ముందుగానే పాలుతెచ్చి పెట్టాలి చిన్నరాణి! నేను రేపు పన్నెండుగంటలకి బయలుదేరి కవితాగానానికి వెడుతున్నాను. కనక కాస్త బాగా ముందుగానే -”
అంతలోనే రాజా అందుకుని ఆ ప్రసంగం అంతటితో తుంచివేశాడు.
“ఆయ ఆం తప్పకుండా వస్తుంది! సరిగ్గా గడియారం ముల్లులాగ వస్తుంది మా చిన్నరాణ్ి!” ద్ ఈ కట్ నవల
రి
అయిదురోజుల తరువాత కార్యక్రమం అంతా ముగించుకుని నితాయీ తిరిగి వచ్చాడు. ట్రెయిన్లోనించి దిగాడు. కాని స్వరూపం అంతా పూర్తిగా మారిపోయింది. అతని పాదాలమీద తెల్లని కాన్వాస్బూట్లు! మాసిపోయిన పంచెమీద తెల్లగా ఇస్త్రీ చేసినట్టున్న ఒక కండువా! పెదవులమీద సన్నని చిరునవ్వు! అది మిక్కిలి అణకువతో మేళవించి మిసమిసలాడుతున్నది! టెయిన్లో ప్రయాణం చేస్తున్నంతసేపు నితాయీ ఊహాలోకంలో విహ రించాడు! స్టేషన్ మాస్టరు మొదలుకుని, అందరు తనకేసి చూసీ చూడగానే ఎంతో ఆశ్చర్యపడి మిక్కిలి గౌరవంతో భయభక్తులతో పలకరించగలరని ఉవ్విళ్ళూరివోయాడు!
“అరే! నితాయీ! అరే! చాలా చిత్రంగా ఉన్నావే! నిన్ను గుర్తేపట్టలేక పోయాం సుమా ఎవరో పలకరించారు! దానికి నితాయీ సరిగ్గానే సమాధానం ఇచ్చాడు.
“చిత్తం! ఈ కండువాను పెద్దలందరు కలిపి బహూకరించారు! కాలిజోడు మాత్రం నేనే కొనుక్కున్నాను”
గుల్మోహర్ కింద వపొదలమాటునించి తియ్యని వాట అతిమృదువుగా వినబడింది! ఎవరుచెప్కా, పాడుతున్నవారు? అసలే ఉప్పాంగుతున్న నదిమీది కొక్కమారుగా 'పెనువరద విరుచుకుపడినట్టయింది! ఆ వాడుతున్న దెవరో కాదు! చిన్నరాణి! ఆమె అతడు రచించిన పాటే పాడుతున్నది! రబ్బరుజోడుతో నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి, వెనక నిలబడి నితాయీ అదేపాట మృదుమధురస్వరంతో అందుకుని ఆమెతో గొంతు కలిపాడు.
చిన్నరాణి అడివిలేడిపిల్లలా తటాలున ఉలిక్కిపడి “అమృయ్యో! ఎవరు వారు!” అని కేకపెట్టింది! వెనువెంటనే వెనక్కి తిరిగిచూసి, నిలువునా నిర్దాంతపడి “కవిగాయకులా?” అన్నది.
నితాయీ మనసారా ఒక్కసారిగా పక్కుమని నవ్వాడు ప్రగాఢ స్నేహార్ట స్వరంతో ఆ అనురాగమూర్తి నెంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు.
“రా, చిన్నరాణ్! కాస్త టీ తాగుదువుగాని, రా[ొ వసుమతి చలనింని +శఈ 55
నితాయీ ఇంట్లోకివచ్చి భుజంమీద నించి కండువా తీసివెయ్యబోయాడు.
అంతలోనే చిన్నరాణి అతనిని అడ్డుకున్నది.
“త్రీసివెయ్యకండి! తీసివెయ్యకండి! కళ్ళారా ఒక్కసారి చూడనియ్యండి!” అంటూ మరికొంతసేపు అలాగ చూసి మనసారా మెచ్చుకున్నది.
“చాలా చక్కగా అలంకరించుకున్నారు! అచ్చంగా ముమ్మూర్తులా కవిగాయకులలాగే ఉన్నారు! చాలా అందంగా ఉన్నారు!”
“పెద్దలంతా కలిసి నాకీ కండువా తలపాగాగా బహూకరించారు” నితాయీ అన్నాడు.
“మరి మెడలేది? మెడలివ్వలేదా?”
“అది వచ్చేసారి ఇస్తారు. మెడలంటె దుకాణంలో తయారై సిద్ధంగా ఉంటుందనుకున్నావేమిటి చిన్నరాణీ?”
“ఆ కండువా చాలా బాగుంది! మీరు చాలా బాగా పాడి ఉంటారు! అవునా?”
“చాలా బాగా పాడాను! 'నల్లని నలుపే తక్కువ అయితే అన్న పాట కూడా పాడాను చిరునవ్వు చెంగలిస్తున్న ముఖంతో అన్నాడు నితాయీ.
వెనువెంటనే నల్లని చిన్నరాణి ముఖభంగిమ మారిపోయింది. ఆమె కనురెప్పలు వాలిపోయాయి. ఏదో బరువుతో కుంగిపోయినట్లున్న ఆ కనురెప్ప లలాగే వంచివేసి అన్నది
“అయ్యో! ఎందుకాపాట వాడారు! ఐం మనుషులండీ మీరు?”
నితాయీ నవ్వుతూ అన్నాడు.
“అన్నట్టు మరిచేపోయానుసుమా! ఉండు! ఉండు!”
“ఏమిటది?”
“ముందు కళ్ళురెండు మూసివెయ్యి మరి! లేకపోతే అంతే!”
“ఎందుకని?”
“ముయ్యమంటే ముయ్యకూడదూ? ఆ తరువాత మళ్ళీ తెరుద్దువుగానిలే!”
చిన్నరాణి కళ్ళురెండు మూసుకున్నది. అయితే రెప్పలసందులలో నించి రవంత తొంగిచూసింది! నితాయీ ఒకపొట్లం చెతిలో మూసిఉంచాడు. 56 ఈ కళు నవల
“అదిగో! కొంచెం తెరిచి చూస్తున్నావు!”
నితాయీ ఆమె చిలిపితనం పసికట్టివేశాడు.
“మూసెయ్యాలిమరి! బాగా గట్టిగా మూసెయ్యాలి!”
మరుక్షణంలోనే తన మెడలో ఏదో నెమ్మదిగా పడిందని చిన్నరాణి గుర్తించింది. ఎమిటది? కంగారుగా కళ్ళుతెరిచి చూసింది. సన్నగా సుతారంగా ఉన్న ఒక ఒంటిపెట గొలుసు తళతళలాడుతూ ఆమె మెడలో వేలాడుతున్నది!
చిన్నరాణి ఆశ్చర్యనందాలతో ఉక్సిరిబిక్కిరై నోటిమాట లేక నిర్దాంతపడి అదిగింది.
“జలంగారపుగొలుసా?”
“కాదు, ఇమిటేషన్ బంగారం! వీదవాణ్సికదా, బంగారం నా కెక్కడినించి వస్తుంది చెప్పు!”
చిన్నరాణి అంతర్యం సంతోషంతో ఉప్పొంగింది!
కర్మోన్సీ అలాగే కానీయండి! నాకిది బంగారంకన్నా చాలా విలువైనది!”
వసంతబిందువు మధ్యాహ్నకాలంలో గాలిలో కదలాడుతున్న చిన్నారి రావి చివురాకులాగ నితాయి మెడలో వేసిన హారం స్పర్శ ఆమె హృయాంత రాళంలో స్పందిస్తూ పులకరింపజేసింది.
“డిస్తాద్! ఉసాద్!”
రాజా వస్తున్నాడు. బండి వెళ్ళిపోయింది. తనడ్యూటీ పూర్తిచేసుకుని స్టేషన్ ప్తాట్ఫారమ్ మిదనించి కేకలు పెడుతూ వస్తున్నాడు.
చిన్నరాణి అదిరిపడింది. నితాయీ కూడా ఉలిక్కిపడ్డాడు. మరునిమిషం లోనే ఆమె మెడలోనించి ఆ హారం తీసివేసింది. కంగారుగా “బావగారు వస్తున్నట్టున్నారు!” అన్నది నెమ్మదిగా.
నితాయీకి ఏమి చెయ్యడానికి పాలుపోలేదు, “అయితేనేం? రానీ!” అన్నాడు. మరునిమిషంలోనే ఇంటిలోనించి ఇవతలికివచ్చి నిలుచున్నాడు. ఇప్పుడు కూడా అతనిమెడలో కండువా, కాళ్ళకి జోడు ఉన్నాయి. నాలుగై దడుగులు ముందుకు నడిచి, రాజా౩ందురుగా వచ్చి, సవినయంగా నమస్మరించి “ఇంట్లో అందరికి కుశలమేనా?” అని కుశలప్రశ్న వేశాడు నితాయీ. వసుమతి చలనాని శ 57
ఆశ్చర్యంతో, ఆనందంతో రాజా నేత్రాలు రెండు పెద్దగా వికసించాయి.
“ఆరెర! మెడలో ఆ కండువా-”
“అవును! పెద్దలందరు నా గానం విని ఆనందించి తలపాగా బహూ కరించారు” మధ్యలోనే అద్దుకుని అన్నాడు నితాయీ.
“నిజమేనా?”
“న్సిజ్రమ్లే[”
“ఆహా! ఎంతటి సంతోషవార్త చెప్పావు!” రాజా నితాయీని తనగుండె కదుముకున్నాడు. ఎంతో అ(ర్ధంగా ఆహ్వానించాడు.
“ర్తియిలే, రావయ్యా! కవీ! రా!”
“ఎక్కడికి?”
“అరే! రావయ్యా! ముందు నాతో రావయ్యా!”
రాజా నితాయీ చెయ్యి దొరకబుచ్చుకుని బనీయామామ టీ దుకాణం దగ్గిరికి లాక్కువెళ్ళాడు,.
“మామా! తీసుకురా మిఠాయి! టీ తయారుచెయ్యి!”
నితాయీ వేషం గమనించి బనియామామ కూడా నిశ్చేష్టితుయ్యాడు, వాత వ్యాధితో కాలు కదపలేని విప్రపదుడు వేరొకవైపు చూస్తూ కూర్చున్నాడు. అయినా కీళ్ళు పట్టివేసిన తన శరీరాన్ని అతికష్టం మీద వెనక్కితిప్పి నితాయీ రాక గమనించాడు. అతని కళ్ళల్లో కూడా అంతులేని ఆశ్చర్యం గూడు కట్టుకున్నది. నితాయీ అతని పాదధూళి స్వీకరించి పెదవుల కద్దుకున్నాడు.
“పెద్దలంతా ఈ కండువా తలవాగాగా బహూకరించారు బాబా!” అన్నాడు సవినయంగా నవ్వుతూ.
“నిత్రాయీ, మా అందరిచేత తీపి తినిపించాలి నీవుొ అన్నాడు బనియా మామ.
“తప్పకుండా, తీసుకో మామా! మిరాయి నీ దుకాణంలోనే ఉందిగదా, తీసుకో! ఖరీదు నేనిచ్చేస్తాను సరేనా!”
“కాదు! కాదు! నే నిస్తాను! దొన్నెలుచేసి సిద్ధంగాఉంచు!” కర్రతో చేసిన ప్యాకింగ్బాక్స్ ఒకటి పట్టిలాగి రాజా దానిమీద కూర్చున్నాడు. నితాయీ 55 € కవి నవల
చెయ్యిపట్టిలాగి తనపక్కజాగాలో కూర్చోబెట్టుకుని “నితాయీ! అక్కడ జరిగిన సభ గురించి చెప్త ఉత్సాహంగా అన్నాడు రాజా.
విజయమాలిక నీ గళసీమలో వ్రేలాడుగాక
సీ చరణపూజ నాకింక పెన్నిధి.
నీ పృాధయాగ్నిజ్వాల, నిజం!
నా హృదయంలోనే ప్రజ్వలిస్తున్నదిరా!”
వెనువెంటనే సభ అంతా ఒక్కసారిగా “వహవ్వా! వహవ్వా!” అన్న అభినందనలతో భోరుమని మారుమోగింది!
“అంతే కాదు నితాయీ, నీది ఇంత తియ్యని గొప్ప గొంతుకదా, వీధి నాటకాల్లో ఎందుకు చేరలేదు? కవితాగానాల్లో ఎందుకు పాల్గొంటున్నావు?” అక్కడే వున్న గిరిధరుడనే ఒక వంతగాయకుడు అడిగాడు,
అతని చరణధూళి స్వీకరించి శిరస్సుమీద ధరించి
“వీధినాటకాల్లో అయితే ఇతరుల పాటలు పాడవలసి వస్తుందొ అని అన్నాడు.
“ఇవి నీ పాటలా! గీరిధరుడు మిక్కిలి ఆశ్చర్యపడి ప్రశ్నించాడు.
“చిత్తంబాబూ!”
కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండి గిరిధరుడు తిరిగి “సరే, నీ పాటలే అవనీ! కాని--
“కాని అని ఆగిపోయారేమిటి బాబూ!” అని అడిగాను.
“క్రవిత్రా గానాలు నీకు బ్రతుకుతెరువు ఇసొాయని నమ్మకం లేదు కానీ ఈ కళ భగవంతుని కృప. వదలకూడదు. నమ్ముకుని నీవు ముందుకెళ్ళు. మంచి జరుగుతుంది” అని ఆశీర్వదించాడు.
“ఆ తరువాత ఆ రాత్రంతా ఉల్లాసం కలిగింది! ఆ రాత్రంతా మేలుకుని కలలు కంటూనే ఉన్నాను. ఎన్ని కలలో” అంటూ తన్మయత్వంతో చెబుతున్నాడు నితాయి.
ఆ మరునాడు ఆ ఉత్సవం ముగియగానే బజారుకివెళ్ళి కండువా చెప్పుల జత కొనుక్కుని చక్కగా ముస్తాబయ్యాను, లోలోపల అనేకవిధాల భవిష్యత్తును వసుమతి చలసాని 59
ఊహించుకుని ఇంటికి తిరిగి వచ్చాను. పెద్దలందరు తలవాగా బహూ కరించారు. ఆ సంగతి ప్రత్యేకించి వేరుగా వివరించనక్కరలేదు! దానికి కండువా ఒక్కటీ చాలు! అదే గొంతెత్తి వెల్లడిస్తుంది! “చూడండి! మీ అంతట మీరే చూడండి!” కాస్త గర్వం, ఉత్సాహం నిండి వున్నాయి నితాయి మాటల్లో.
ఆ విధంగా ఆ బహుమతీ కధ ముగించి, టీ తాగుతూంటే నితాయీకి తటాలున చిన్నరాణి సంగతి జ్ఞాపకం వచ్చింది! ఆమె ఇంకా తన ఇంటిలోనే అలాగే కనిపెట్టుకుని కూర్చున్నదా! నితాయా ఆ టీ కప్పు అలాగే చేత్తో పట్టుకుని శీఘ్రంగా నడిచివెళ్లి, ప్లాట్ఫారమ్మీద నిలబడి రైల్వేలైనుకేసి చూశాడు. ఆ లైను ఇనపకమ్మీలు రెండును తళతళమెరుస్తూ కొంతదూరంలో వంపులో ఒకే లైనుగా మారిపోయినట్లు అలవాటుగా చూశాడు.
ఎక్కడ ఉంది చిన్నరాణి? బంగారుబిందువు శిరస్సు మీద తళతళ లాడుతున్న రెల్లు పువ్వువంటి చిన్నరాణి అక్కడ కనిపించనేలేదు!
అయితే, ఆమె ఇప్పటికి ఇంకా ఇంటిలోనె ఉన్నట్లా?
దుకాణంలో కూర్చున్నరాజా “ఉస్తాద్! ఉస్తాద్!” అని గొంతెత్తి పిలిచాడు.
“ఆం వస్తున్నా వస్తున్నా! ఒక్కసారి ఇంటికి వెళ్లివనస్తాను!”
నితాయీ తొందర తొందరగా నడిచివెళ్లి ఇంట్లో ప్రవెశించాడు. అవును! ఇప్పటిదాకా చిన్నరాణ్ అక్కడే ఉన్నది! నితాయీని చూసీ చూడగానే ఆమె తటాలున లేచి నిలబడింది. మరి అతనితో మాట్లాడకుండా పక్కనించి తప్పు కుని వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. అయితే నితాయీ వెంటనే చిన్నరాణి చెయ్యి దొరకబుచ్చుకుని “కోపం వచ్చిందా?” అన్నాడు.
చిన్నరాణి, ఏడుపు మొదలుపెట్టింది.
“ఏమి చెయ్యమన్నావు చెప్పు! వాళ్లు ఒక్కపట్టాన విడిచిపెట్టలేదు! ఆపైన టీ” అంటూ సంజాయిషీ చెప్పుకున్నాడు నితాయి.
“నేనిక్కడ ఇలాగే పడిఉన్నాను! మీరక్కడ వాళ్ళందరితోను కులాసాగా కబుర్లు చెబుతూ కూర్చున్నారు!”
“న్సీ చేత్రులు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాను, చిన్నరాణీ!” అభివ యించాడు నితాయి. 60 + కథి నవల
ఈమారు ఆమె కలకల నవ్వుంది!
“జాగుంది! ఉండు, కాస్త టీ తాగుదువుగాని! ఇదిగో నీ కోసమని ఒక కొత్త కప్పు తీసుకువచ్చాను, చూడు!” నితాయీ పొట్లం విప్పి ఒక కొత్త స్టీలు కప్పు బయట పెట్టాడు.
“దీనిమాట ఈ తొందరలో మరిచేపోయాను, చిన్నరాణీ!” నవ్వాడు.
“జన్ముడు కాదు! నాకు వేళ మించిపోతూంది”” అలాగంటూనే ఆమె ఉలిక్కిపడింది!
“అమ్మయ్యో” అని తొందరగా అక్కడనించి బయలుదేరింది!
“క్క అలస్యానికి ఏమని సమాధానం చెప్పాలా? అని చిన్నరాణి దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉంది. అలాగ నడుస్తూంటే అకన్నాత్తుగా హారం మాట జ్ఞప్తికి వచ్చింది. చీరకొంగు ముడివిప్పి ఆ హారం బయటికి తీసింది. మెడలో వేసుకుంది. క్రమక్రమంగా ఇంటీదగ్గిర అడిగే ప్రశ్నల మాటే మరిచిఫోయింది!
ఆ దారిలో ఒక చిన్న నది. అది అంతగా లోతయినది కాదు. దాని తేటనీటిలో కదులుతూ ప్రతిబింబిస్తున్న చిన్నరాణి మూర్తి మెడలో హారంతో తళతళలాడింది. ఆమె ఆ ప్రతిబింబం కేసీ చూస్తూ అలాగే నిలుచుండి పోయింది. నీటిప్రవాహం చూసూ అలా నిలిచిపోయింది. మరికొంత సేపలాగే వారంతో తళతళలాడుతున్న తన మూర్తి కేసి చూసుకుని ఆమె ఆ హారం తీసివేసి, తిరిగి భద్రంగా కొంగున కట్టుకుంది. ఆపైన నెమ్మదిగా ఆ నదిదాటి తనగ్రామంలో ప్రవేశించింది.
ఆలస్యానికేమికారణమని అడిగితే ఏమి చెప్పాలో చిన్నరాణి ఇప్పటికి తిన్నగా నిశ్చయించుకోలేక పోయింది. మాటలేవయినా పడవలసి వస్తే సహించ వలసిందె అని నిర్ణయించుకుంది.
ర్తి
నితాయీ ఇప్పటిదాకా గుల్మోహర్ చెట్టునీడలోనే నిలుచున్నాడు. ఫాల్గుణ మాసం మధ్యాహ్నం రెండుజాములవేళ దిగంతాలన్ని ధూళిధూసరితాలై పొగగమ్మినట్టు కనిపించాయి. విపరితంగా గాలి వీస్తున్నది. ఆ గాలిలో వసుమతి చలసాని + 61
ఎగురుతున్న దుమ్మంతా దూరంలో ఒక నదీప్రవాహంలా కనిపించింది. నితాయీ మనస్సింకా ఉతృ్కంరతో తహతహలాడుతూనే ఉన్నది. నీలాకాశ మధ్యంలో అతనికింకా 'పెడిబిందువుతో తళతళలాడుతున్న రెల్లుపువ్వు గోచ రిస్తూనే ఉన్నట్టుంది! ఆకస్మాత్తుగా అతని మనస్సులో విచిత్రమయిన వివాదం ప్రారంభమయింది '*నే నిలాగని ఎందుకని ఈ బాటపక్కన నిలుచున్నాను?” అని తన్ను తానే ప్రశ్నించుకున్నాడు నితాయీ. చిన్నరాణి అతని కేమవతుంది? ధానిమీద ఆమె 'ఆత్మీయతా మూర్తి అని మనస్సే సమాధానం చెప్పింది. ఆ ఆత్మీయతామూర్తి కోసమే, ఆ ప్రేమమూర్తి కోసమే అతడీనాడు బాటపక్కన నిలుచున్నాడు వీలయితే ఆ బాటపక్షనే ఒక గృహం నిర్మించుకుని దానిలోనే నివసించాలి! ఆమె దారివైపే చూస్తూ అతడలాగే నిలుచున్నాడు. హఠాత్తుగా ఆమె వస్తున్న జాడ తళతళలాడుతూ సాక్షాత్మరించింది! అలాగ ఆలోచిస్తూంటే ఆ ఖావన అంతా అతని మనసులో స్వరతరంగాలలో లీలగా ఉయ్యాలూగింది! నితాయీ హృదయాంతరాళంలో ఒక గీతిక ప్రారంభమయింది.
“న్సీ జాడ, వెలుగు తరగలతో తళతళలాడుతూ!
నన్నెల్లవేళల ఆహ్వానిస్తూ ఆకర్షిస్తుంది సుమా!”
అతడంతవరకే ఆ గీతిక రచించాడు. ఆ బాటపక్సృనే ఇల్గుకట్టుకుని, ప్రతిదినం ద్వారంలో నిలబడి ఇక ఆ బాటవైపే నిరీక్షిస్తూంటాడు. శిరస్సు మీద చిన్నారి ఇత్తడిపాలబిందె పెట్టుకుని, ఆ బిందెమీద ప్రసరించిన సూర్య కిరణాలతో తళతళ మెరిసిపోతూ చిన్నరాణి అతని కనతిదూరంలో సాక్షా తృరిస్తుంది! ఆ గీతికతో సంగీతం మేళవించి పాటకట్టడం ప్రారంభించాడు సనితాయీ!
“ఓ నా హృదయాంతరాళ (ప్రేమమూర్తి!”
అన్నపాట ఇంకా పూర్తికాలేదు! అది మరి పూర్తికాదు కూడాను! ఈనాటి నించి అతడాపాట మరిచిపోతాడు! మరిపాడడు! తిరిగి ఆ లైనువంపు వైపు చూశాడు నితాయీ, తలమీద పాలబిందె, తెల్లతెల్లని చీరతో రెల్లుపువ్వులా మెరిసిపోతున్న చిన్నరాణి!
ఆమె తొందర తొందరగా నడిచివచ్చి అతనిముందు నిలుచున్నది! 62 + కవి నవల
చిన్నరాణి కేసిచూస్తూనే నితాయీ నవ్వాడు.
“మీరిలాగ ఎదురుచూస్తూ నిలబడడం బాగుండదు! లోకు లేమను కుంటారో కాస్త ఆలోచించారా?”
చిన్నరాణి నెమ్మదిగా చెప్పింది.
ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు నితాయీ.
“లోకు లేమంటారో నాకు తెలియదుగాని, నేనుమాత్రం నీతో ఒకమాట చెప్పాలని ఇక్కడ నిలుచున్నాను!”
నితాయీ సామాన్యంగా పెద్దమనుషులు మాట్లాడేభాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తూంటాడు. రాజా, చిన్నరాణ్, ఆ పెద్ద మనుషులభాషలో మాటల ధోరణి కెంతో ముచ్చట పడుతూంటారు. ఆయితే ఈనాడు ఆ ధోరణి తారు మారయింది! నితాయీ తన కలవాటయిన ధోరణిలోనే ప్రసంగించాడు.
ఆ మాటలు విని చిన్నరాణ్ జిజ్ఞాసలో, ఆందోళన మేళవించింది. అతని కేసి చూస్తూ నిలుచుండిపోయింది! ఇదేమిటి ఇలాగంటున్నారు? లోలోపల ఆమెగుండె గుబగుబ కొట్టుకుంది నెమ్మదిగా అడిగింది.
“ఈ వేళ మీరు ఇలాగ మాట్లాడుతున్నారెమిటి?”
“దాలారోజుల నించి ఈమాట చెప్పాలని అనుకుంటున్నాను! కాని-”
ఆపైన మరికొంతసేపు అలాగే మౌనంగా ఉండిపోయి తిరిగి అన్నాడు.
“క్క వేళనించి నాకింక పాలు అక్కరలేదు చిన్నరాణీ!”
క్షణంలో చిన్నరాణి తెల్లబోయింది! తానీమాట వినవలిసివస్తుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు! చిన్నరాణ్ ముఖం క్షణంలో హేమంతంలో పండు టాకులా వెలవెలబోయింది! నోటమాట రాక ఆమె అలాగే అతనికేసిచూస్తూ నిలుచుండిపోయింది నితాయీ మాటలు విన్నపిమ్మట తెల్లబోయిన చిన్నరాణి ముఖం మరి మారలేదు! పైన కొన్ని క్షణాల అనంతరమే ఆమె పెదవి కదప గలిగింది. గద్దదస్వరంతో ఆర్టిస్తూ అడిగింది.
“మ్పీరింక పాలు తీసుకోరా?”
“ఎందుచేత? నేనేం తప్పుచేశాను?” వసుమతి చలనాని ఈ 63
చిన్నరాణి కళ్ళనిండా నీరు నిండింది.
మరికొన్ని క్షణాలపాటు అలాగే మౌనంగా ఉండిపోయాడు నితాయీ. అతని కేమని సమాధానం చెప్పడానికి పాలుపోలేదు. చిట్టచివరికెలాగో అలాగ తన్ను తాను సంబాళించుకున్నాడు
“అబద్ధాలాడడమె ఒక మహాపాపం చిన్నరాణీ! ఆపైన నీదగ్గిర అబద్ధం చెబితే, ఇక ఆ మహా పాపానికి అంతుండదు! ఇందుచేతనే నాకేమనడానికి పాలు పోవడంలేదు!”
ఆపైన గంభీరంగా ఒక సుదీర్హ నిశ్వాసం విడిచిపెట్టి నెమ్మదిగా అన్నాడు నితాయీ.
“దరిద్రుడు కవి కావాలనుకోవడం చాలా కష్టాలు కలిగిస్తుంది చిన్నరాణీ!”
ఆ మాట మీద ఎంతో కంగారుపడుతూ బ్రతిమాలుకుంటూ చిన్నరాణి స్పష్టంగా చెప్పివేసింది.
“పాలకోసం మీరింక సొమ్ము ఇవ్వక్కరలేదు!”
ఎంతో ఆత్రంగా ఆమె అతని రెండుచేతులు పట్టుకున్నది.
నితాయీ ఆమె ముఖం కేసిచూస్తూ మరికొన్ని క్షణాలవాటు అలాగే మౌనంగా ఉందివోయాడు. ఆపైన నెమ్మదిగా అన్నాడు.
“ఈ సంగతి తెలిస్తే మీ ఆయన ఆగ్రహిస్తారు! అత్తగారు అవమానిస్తుంది. అడబడుచు తిడుతుంది! ఇవ్వన్ని ఆలోచించావా మరి?”
చిన్నరాణి వెనువెంటనే సూటిగా సమాధానం చెప్పింది.
“కాదు! కాదు! మీరేదో అపోహపడుతున్నట్టున్నారు! మా పుట్టింటివారికి స్వంతంగా ఒక ఆవుంది! నేను మా నాయనగారి ఇంటిదగ్గిరనించే ఈ పాలు తీసుకువస్తున్నాను! ఆ పాలే మీకు పోస్తున్నాను! తెలిసిందా!”
నితాయీ మరి మాట్లాడలేదు.
“మరి తీసుకోరా, కవిగారూ?ో
ఆమె కంరస్వరం గద్దదమయింది! కళ్ళమ్మట నీరు బొటబొట ప్రవ పిస్తున్నది.
చిన్నరాణని ఓదార్భడం కోసమే నితాయీ చిరునవ్వు చిలకరించాడు. ద4 € కటి నవల
వెంటనే ఆమె పెదవులమీద కూడా చిన్ననవ్వు మొలకెత్తింది. అతని ముఖంమీది మందహాసం గమనించగానే చిన్నరాణి కెంతయినా ఉత్సాహం కలిగింది. అది ఒక అంగీకారంగా స్వీకరించి, పులకించి, అమె తొందరగా అడుగులు వేసుకుంటూ అతనిని దాటిపోయి స్వయంగానే నితాయి ఇంటి తలుపు తెరిచింది. ఆ ఇల్లంతా చిన్నరాణికి సుపరిచితమె! పాలపాత్రతీసి, పాలు దానిలోపోసి, తిరిగి తొందరగా ఇవతలికి వచ్చి ఇంటివైపు దారితీసింది.
“చిన్నరాణీ!” వెనకనించి పిలిచాడు నితాయీ, ఆమెకింక ఆ పిలుపు వినవలసిన అవసరమున్నట్టే కనబడలేదు! అదీగాక తొందరపనులేవో ఉన్నట్టుగా కూడా కనబడింది. అయినా వెడుతూ, వెడుతూ క్షణకాలం నిలబడి చూసి వెంటనే త్వరగా వెళ్ళివోయింది!
చిన్నరాణి ఆ సమయంలో అలాగ తొందరగా వెళ్లిపోయినా, తరువాత కొంత సేపటికి తిరిగివచ్చి, నితాయీ ఇంటి వరండాలో నిలబడి “కాస్త టీ ఇవ్వండి! నా కొత్తకప్పులో పోసి ఇవ్వండి!” అని నవ్వుతూ అడిగింది. ఆ కొత్తకప్పుతో టీ అందిస్తూ నితాయీ అన్నాడు
“నే నొకమాట చెబుతానుగాని వింటావా చిన్నరాణీ!?”
టీ తాగుతూ చిన్నరాణి అన్నది, “చెప్పండి!”
“సొమ్ము తీసుకోకుండా నాకెందుకు పాలుపోస్తానన్నావు!”
ఆమె నిశ్చలంగా అతనివైపు చూసింది.
నితాయీ మళ్ళీ అడిగాడు. “సమాధానం చెప్పవేం?”
“నా ఇష్టం[”” అన్నది చిన్నరాణి.
“సీ ఇష్టమా?” నితాయీ ప్రశ్నించాడు.
“అవును! నా ఇష్టం! అంతే!” చిన్నరాణి నిశ్చలంగా సమాధానం చెప్పింది. ఆపైన చిరునవ్వుతో ముఖం పైకెత్తింది. “మీరు కపిశ్వరుడు! ఎంత గొప్పవారు!”
అలాగంటూనే ఆమె కప్పు కడిగేమిషతో వెలుపలికి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేసరికి నితాయీ నవ్వుతూ నిలుచున్నాడు. అతనిచెతిలో రెండు ఎ(ర్రని గుల్మోహర్ పువ్వులు! అవి రెండు ఆమె ముందుంచాడు,
“ర్రీస్పుళ్లో! కవిగాయకులచేతో ఇచ్చిన పువ్వులు తీసుకోవాలి!” వసుమతి చలసాని ఉఈ 65
చిన్నరాణి సిగ్గుతో ముఖం పక్కకు తిప్పి “వద్దు!” అన్నది,
“అయితే నేను కూడా పాలు తీసుకోను!
చిన్నరాణి ఆ పువ్వులు రెండు ఒక్కసారిగా అతని చేతిలోనించి లాక్కుని ఒక్క పరుగుతో అకృ్కడినించి పారిపోయింది!
నితాయీ కొత్తపాటలో కొత్తచరణాల రచనలో పడ్డాడు. ఈవేళ ఇంకొక కొత్తచరణం స్ఫురించింది. ఇంతకుమునుపు “ఓ నా హృదయాంతరాళ (ప్రమమూర్తి” అన్న పాటలో రెండుపాదాల రచనే కొనసాగింది. ఆపైన సాగలేదు. ఆ పాట మరిచిపోవాలని కూడా అతడాలోచించాడు. అయితే ఆ విధాత దానికనుమతించలేదు! అది పూర్తి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నితాయీ. చాలా అందమైన వాట అది.
“నీ జాడ వెలుగుతరగలతో తళతళలాడుతూ” అన్న చరణం లోలోపల పాడుకుంటూ పాడుకుంటూ కట్టెఒకటి పొయ్యిలో దూర్చాడు. బండి వెళ్లి పోయింది. ఈ పాటికి తన డ్యూటి ముగించుకుని రాజా పంచదార, టీ పొడుము తీసుకుని టీ తయారీలో పడతాడు. ఆపైన మళ్లీ ఒకసారి టీ తాగుతాడు.
కొత్తచరణం స్ఫురించింది! చాలా సొగసైన చరణం! ఆపైన? ఆ తెలి సింది! తెలిసింది! అతని కర్టమయింది! ఆ రాజమార్గంలో నలువైపుల మురళి మోోగుతున్నది! ఆ బాటలో నిలబడితే మరి దుఃఖంలేదు! కష్టంలెదు! మురళి (మోగుతున్నది! ఆ బాటలో నిలబడితే మరి దుఃఖంలేదు! కష్టంలేదు!
“బృందావనిలో నలువైపులలో
మురళి[మోగె నెవ్వరిదో!”
ఎవ్వరిదా మురళి? ఆ గొల్లపల్లెసిమ మురళి! అదే చిరకాలం నుండి మైోగుతున్నది! హృదయంలో (ప్రేమ ఉన్నప్పుడే అది వినబడుతుంది. లేకపోతే, వినిపించదు! ఈనాడతనికి విస్పష్టంగా అవగతమయింది'! తాను చిన్నరాణిని ప్రేమిస్తున్నాడు! తన్నామె ప్రేమిస్తున్నది! లోలోపల పాడుకుంటూ గేయపాదం పూదించాడు నితాయీ.
“క రాధా! రాధా! రాధా! అని అదే 56 ఈ కవి నవల
అదే మురళి మోగె నాతనిదే!”
ఆ తరువాత? ఆపైన? అదేమురళి! అవునదే!
“గృహం ప్రజ్బ్వలించింది- కాంతి సంగీతంలో, ఓహో!
హృదయం తన్మయమైనది! సుఖానికి అంతరాయమేమిటో?”
అంతరాయమే మరి! ఇది చాలా గొప్ప అంతరాయమే!
ఆకస్నాత్తుగా అతని గానం స్తంభించిపోయింది! ఒక సంగతి ఆలోచించ గానే ఆ పాట ఆగిపోయింది! విపరీతమైన సంకోచంతో ఆందోళనతో అతని వళ్లు వణికింది!
చిన్నరాణి కులం వేరు! నితాయీ కులం వేరు! ఆమెకింకొక వ్యక్తితో వివాహమైంది. ఇది మహావాపం! చాలా అపరాధం కూడా,
మరికొన్ని క్షణాలదాకా నితాయీ మౌనంగా ఉండిపోయాడు! ఎకాంతంగా కూర్చుని మాటిమాటికి తన మనస్సు నిగ్రహించుకోవాలని ప్రయత్నించాడు. ఆమె సంగతి తలుచుకోగానే నితాయీ శరీరం జలదరించింది! విశ్చంఖల మైన అతని మనస్సు ఎంతగా ప్రయత్నించినా అదుపులోకి రాలేదు! మనసులో ఏ మాత్రం లజ్జ పొటమరించడం లేదు! పైగా మాటిమాటికి తృప్తితో, సంతోషంతో ఉప్పాంగిపోతున్నది! నితాయీ ఇంటిలో ప్రతిచోట చిన్నరాణి నిలుచున్నట్టుగా నాక్షాత్మరిస్తున్నది! అంతేకాదు! నితాయీా మనస్సు లోతులవగాహన చేసుకున్నట్టు ఆమె కటిక చీకటి మధ్యలో కూడా తెల్లనిచిర ధరించి తఠతళలాడుతూ మెరిసిపోతున్నది! అతని మనసులో ధైర్యం క్షిణిం చింది. తటాలున లేచి కిటికీ తలుపు తెరిచాడు. ఉదాసీనదృష్టితో ఆ కిటికీలో నించి రైల్వే లైను కేసి చూస్తూ కూర్చున్నాడు. ఆ రెందు రైలుకష్మీలు వంపుతిరిగి ఒకటిగా మారివోయినట్టు కనిపిస్తున్న చోట అతనికొక బంగారుబవిందువు సుస్టిరంగా ఉన్నట్టు సాక్షాత్కరించింది! అది కదలడంలెదు! ముందుకిగాని వెనక్కిగాని వెళ్ళడంలేదు! అలాగే అచంచలంగా ఉండిపోయింది. చిన్నరాణి ఇంటిదగ్గిరనించి బయలుదేరి అక్కడికి వచ్చి అలాగే నిలుచుండిపోయి నట్టనిపించింది! కిటికీ తెరిచిన తరువాత రమ్మని తన్ను పిలవడంలేదేమని కోపగించి వెళ్ళిపోతూ వెళ్ళివోతూ వెనక్కి నిలుచున్నదేమో అన్నట్టున్నది ఆ వసుమతి చలసాని ఈ 67
ఆకృతి!
నితాయీ మనసంతా సంతాపంతో, ఆందోళనతో నిండిపోయింది. అతడు ఇంటి నించి ఇవతలికివచ్చి గుల్మోహర్ నీడలో నిలుచున్నాడు. ఆ చెట్టంతా ఎర్ర ఎర్రని పూలతో మిరుమిట్లు కలిగిస్తోంది. పచ్చపచ్చని లేతలేత ఆకులచివర గుత్తులుగుత్తులుగా ఎర్ర ఎర్రని పువ్వులు! గుల్మోహర్లో అంతటి ఆపూర్వమైన సౌందర్యం నితాయీ అంతకుమును పెన్నడు చూడలేదు! ఎదురుగా రైల్వే లైను అవతలివైపు నించి అడివిపూల మనోహర పరిమళం నలువైపుల వ్యాపిస్తోంది. కదంబతరువుల చివుళ్లు కనుదోయి కానందం కలిగిస్తున్నాయి! వర్షాకాలం రాగానే కడిమిపూలు కన్నులపండువుగా విక సిస్తాయి సంపన్నుల మామిడితోపులో నించి కోకిలలు రెండు పోటిపాటకచేరీ లారంభించాయి! పిట్టఒకటి చండీదేవాలయాల పరిసరాలనుండి ఆహ్వా నిస్తున్నది. తేనె లారగించే పులుగులు ఆకాశంలో పల్రీలుకొడుతూ ఎగురు తున్నాయి! గుల్మోహర్ నలువైపుల రంగురంగుల సీతాకోకచిలకలు చిత్ర చిత్రంగా ఎగురుతూ ఒక మహోత్సవం జరుపుకుంటున్నాయి
చిన్నరాణి తొందరగా అడుగులు వేసుకుంటూ అతనివైపే నడిచి వస్తున్నట్ట నిపించింది! నితాయీ శరీరం అంతా ఒక్కమారుగా నిశ్చేష్టితమయింది! కళ్లుమూసుకుని కూర్చున్నాడు. లోలోపల ఆమె నాహ్వానించాడు. రాజా రావటం చూసి నితాయీ నవ్వాడు
“పాట! రాజా, పాట! చాలా గొప్పపాట వచ్చిం దివేళీ పొలాలమృటపడి తిరుగుతూ అదేపాట రచిస్తున్నాను!”
“చాలా గొప్ప పాటా?”
“అవును, రాజా! చాలా గొప్పతరహావాట[
“అయితే ఉండు! నేనిప్పుడే డోలు తీసుకువస్తాను”
రాజా డోలుతోబాటు అక్కడికివచ్చి కూర్చున్నాడు.
నితాయీ తన్మయుడై “చందమామవు నీవు! ఆకాశంలోనే నిలిచిపో! అన్నపాట అందుకుని వాడుతున్నాడు
రాజా హఠాత్తుగా డోలువాయించడం నిలిపివేళాడు. 668 + కవి నవల
“అరే, అదేమిటి నీకళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి?”
నితాయీ కళ్లు తుడుచుకున్నాడు.
“అవును రాజా, కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఏం చెయ్యమన్నావు? కన్నీళ్ళు నామాట పాటించడం లేదు!”
10
మరునాడు పొద్దుటినించి నితాయీ గుల్మోహర్ నీడలోనే కూర్చున్నాడు. ఇప్పుడతని మనసులో పశ్చాత్తాపంగాని, సంతృప్తిగాని కలగడంలేదు! నితాయీ కేవలం వైరాగ్యధోరణిలో పడిపోయినట్టయిపోయాడు.
ఇప్పుడతడు రాత్రింబగళ్ళు అదేపనిగా అనేక విషయాలాలోచిస్తున్నాడు! సాయంకాలం కాగానే రాజా ఇంటికి వెళ్లాడు. అతనిభార్య ఎల్లప్పుడు పటపట వాగుతూంటుంది. ఈమధ్యన రాజా నితాయీని అనేకవిధాల ఆదుకుంటున్నా దని ఆమె ఆ కవిగాయకుని పేరు చెబితేనే ధుమధమలాడుతోంది. అయినా సంకోచించకుండా రాజా ఇంటికి వెళ్లాడు. దానికి రాజా చాలా ఆనందించాడు. ఆశ్చర్యం ఏమిటంటే నిన్న రాజా భార్య కూడా నితాయీతో ఎంతో ఆదరంగా సంభాషించింది. మేలిముసుగులోనించే “అయితే మెము అదృష్టవంతులమె. కాస్త ఉన్నాద్ గారికి జ్ఞాపకం వచ్చాం!” అన్నది.
ఆపైన వారిద్దరితోను జరిపిన ప్రసంగంలోనే నితాయీ చిన్నరాణిభర్త వృత్తాంతం సమస్తం అవగాహన చేసుకున్నాడు. ఆమె భర్త మొత్తం మీద అందగాళ్ళలో లెకే అదేమాట రాజా అన్నాడు.
“ఒంటిచాయ చాలావరకు తెల్లనితెలుపే! మనిషి కూడా చూడడానికి బాగుంటాడు. అదీగాక చాలా మంచివాడు. దంపతులిద్దరిమధ్య అన్యోన్నత సంగతి మరి చెప్పనే అక్కరలెదు!”
కుటుంబపరిస్థితి కూడా బాగానే ఉంది బాగా కలిగి ఉన్న సంసారం. ఆపైన రాజా భార్య అందుకున్నది.
“బాగా కలిగిఉన్న సంసారమే! ఆవులు, ఎద్దులు పదిపన్నెండుదాకా ఉన్నాయి అందులో రెండు ఎడ్లు. కవుల ంతీసుకుని చేస్తున్న వృవసాయం కూడా బాగానే సాగుతున్నది. మీవంటివారి ఆశీర్వాదం ఉంటే చిన్నరాణి వసుమతి చలనాంని +ఈ 69
సంసారం సుఖంగానే సాగిపోతుంది!”
నితాయీ వెంటనే అందుకున్నాడు.
“తప్పకుండా! వొద్దస్తమానము నే నెల్లవేళల ఆశీర్వదిస్తూనే ఉంటాను మహారాబీ!”
రాజా ఇల్లాలు స్వభావం చాలా విచిత్రమయినది! ఈ క్షణందాకా ఆమె బాగా ఉల్లాసంగానే ఉన్నది! కాని “మహారాణీ!” అన్నపిలుపు వినగానే ఎండుగడ్డి మంటలా ఒక్కసారిగా భగ్గుమని ప్రజ్వలించింది!
“అదిగో, అదిగో ఆ మాట మాత్రం నేను సహించేదిలేదు! మహారాణీ! నా బ్రతుకంతా మహారాణీ బ్రతుకులాగే ఉంది! నాకన్నా దాసీవాళ్ళు నయం! ఒకకొంపలేదు! గోడులిదు! తలుపులిదు! ద్వారబంధంలేదు! ఈ పాములపుట్టలో కాపరం! ఈవేళ ఇక్కడ! రేపు ఇంకోచోట!”
ఆపైన రాజా ఆగ్గిమీద గుగ్గిలమే అయిపోయాడు!
“ఏమిటే, దౌర్భాగ్యురాలా! ఏమిటంటున్నావు?”
“ఏమిటంటున్నావేమిటి? ఉన్నమాట కాస్తా అంటున్నాను! భయ మెందుకు?”
ఆపైన ఒక పెద్ద కురుక్ష్మత్ర సంగ్రామం ప్రారంభమయింది! రాజా ఒక్కమారుగా భార్యజుట్టు పట్టుకున్నాడు! అతనిని శాంతపరచడానికి నితాయీ మాటిమాటికి ప్రయత్నించాడు. కాని ప్రయోజనం కలగలెదు. రాత్రి పన్నెండు గంటలదాకా రాజాభార్య ఏడుసూనే ఉన్నది. మధ్యమధ్యన నితాయీని, రాజాని ఇద్దరిని కలిపి తిడుతూనే ఉన్నది! ఆ ధోరణి ఈవేళ పొద్దున్న మరో మలుపు తిరిగింది. నితాయి పట్టించుకోలదు
“నీవు చిన్నరాణిని (ప్రేమిస్తూనే ఉండు! అయితే ఆ మాట నీ లోలోపలే దాచివేసుకో! ఎవ్వరికి చెప్పవద్దు! చిన్నరాణికి కూడా తెలియనియ్యవద్వ! .ఆమె గృహం, సంనారం నిత్యకల్యాణాలతో, పచ్చతోరణాలతో కళకళలాదడుగాక! చిన్నరాణి మర్యాద నేలపాలుచేసి, సుఖంగా సాగిపోతున్న ఆమె సంసారంలో అగ్గిపెట్టకు! నా మాటవిను!” నితాయి నిర్ణయించుకున్నాడు.
సరిగ్గా రెండు జాములయ్యెసరికి చిన్నరాణి గడియారం ముల్లులా అతని 704 కవి నవల
ఇంటి ముంగిట ప్రత్యక్షమయింది! అంతకుమునువు ఆమె శిరస్సు మీది పాలబిందె దూరంలో రైల్వే లైను మీద బంగారుబిందువులా తళతళలాడింది. ఆపైన కదిలి వస్తున్న రెల్లుపువ్వులా ఒకతెల్లనిరేఖ సాక్షాత్కరించింది. క్రమ క్రమంగా ఆమె సమీపించింది. చిరునవ్వుతో ఎదురుగా నిలబడి “కవిగారూ!” అని పిలిచింది,
అ(శ్రుపూర్ణకంరంతో నితాయా సమాధానం చెవ్ప్సొడు.
కజ్షంట్రిలో వాలగిన్నె ఉన్నది, వాలు దానిలో పొయ్యి”
అకారణంగా అతని నేత్రాలలో కన్నీరెందుకు నిలిచిందో ఆమె [గ్రహించు కోలేక పోయింది.
“నాకు అదంతా తెలియదు బాబూ! కాస్త మీరుకూడా లోపలికి రండి! ఆపైన-”
“ఆపైన?” ప్రశ్నించాడు నితాయీ.
“ఎండలో నడిచివచ్చాను, కాస్సేపు కూర్చుందామని”
“వద్దు చిన్నరాణీ! నీ విలాగ మా ఇంట్లో విశ్రమించడం బాగుండదు. ఎవరైనా చూస్తే మరోలాగనుకుంటారు!”
చిన్నరాణి నిర్దాంతపడి నిశ్చలంగా అతనికేసి చూస్తూ నిలుచుండి పోయింది.
నితాయీ మళ్ళీ అన్నాడు,
“విశ్రమించాలనుకుంటే మీ అక్కగారింటికివెళ్లి విశ్రమించు, నేనిక్కడ ఒంటరిగా ఉంటున్నాను. ఇలాంటప్పుడు నలుగురు ఏమన్నా అనుకుంటే తప్పువాళ్ళది కాదు! కాస్త నీ అంతట నీవే ఆలోచించి చూడు చిన్నరాణీ!”
అతని ముఖంమీద మరి గత్యంతరం లెదన్న సానుభూతితో నిండిన చిరునవ్వు పొటమరించింది.
చిన్నరాణి చరచరా నడిచి వెళ్లిపోయింది.
నితాయీ ఒక దీర్జనిశ్వాసం విడిచిపెట్టి, నిశ్చేష్టితుడై అలాగే కూర్చుండి పోయాడు.
“నీతో ఒకమాట చెప్పాలి. కాస్త ఆగు” అన్నాడు బిగ్గరగా. చిన్నరాణికి వసుమతి చలసాని ఈ 71
అతని మాటలు వినబడ్డాయి. కాని ఆమె నిలబడలేదు. ఒకసారి ముఖం వెనక్కితిప్పి నితాయీకేసి చూసి, అంతలోనే తిరిగి వెళ్ళబోయింది.
నితాయీ “తిరిగి వెళ్ళకు చిన్నరాణీ! ఒక చిన్నమాట విని వెళ్లు!” అన్నాడు.
ఈసారి చిన్నరాణి ఆగింది.
“కాస్త ఇటువైపు తిరుగు”
చిన్నరాణి వెనుదిరిగి నిలబడింది. అదే సమయంలో నితాయీకళ్ళలో నీరు నిండింది. కాని మరు నిముషంలోనే అతడు వెనక్కి తిరిగి నిలబడి చేతితో సంజ్ఞచెసి అన్నాడు.
“క్షాదు, కాదు! చిన్నరాణీ! నీవిప్పుడు వెళ్లిపో! చెబుతానులే! ఎప్పుడైనా ఒకనాడు చెబుతానులే!”
చిన్నరాణి ఆ తరువాత మరి నిలబడలేదు! కదిలి వెళ్లిపోయింది.
మరి కొన్నిరోజులు యధాప్రకారంగానే గడిచిపోయాయి. వారిలో ఎవ్వరు ఒకరితో ఒకరు మాట్లాడలేదు. మరికొన్నాళ్ళ తరువాత చిన్నరాణి నితాయీ ఇంట్లో పాలుపోసి, మరికొంతసేపు నిలబడి నెమ్మదిగా అదిగింది.
“ఆవేళ నాతో ఏదో చెబుతానన్నారు, మరి చెప్పరా?”
“చెబుతాను”
“చెప్పండి మరి
మరికొన్ని నిమిషాలదాకా మౌనంగా ఉన్నాడు నితాయీ.
“వృదొకనాడు ఎప్పుడయినా చెబుతానులే, చిన్నరాణీ!”
ఆమె చిరునవ్వు చిలకరించింది. ఆ నవ్వు చూడగానే అతని గుండెలో నుండి ఒక పెద్ద నిట్టూర్పు వెలువడింది! చిన్నరాణి వెనుదిరిగి వెంటనే అక్కడి నించి వెళ్ళివోయింది! ఆ విధంగా సుదిర్హంగా నిట్టూర్చిన పిమ్మట నితాయీ గుండెనుండి ఒకపాట వెలువడింది. అతడు చిన్నరాణితో చెప్పలేనిమాటే నా పాటగా పరిణమించింది
“ఉనృందెలో ఈ మాట ఉండిపోవునుగాక!
ఆ రహస్యం నన్ను అడుగకుము నెచ్చెలీ!!”
ఆరోజు నితాయీ నిశ్చలంగా కూర్చున్నాడు. అంతలోనే రాజా ఆగ్రహా 72 శి కవి నవల
వేశంతో మండిపడి పెట్టిన పెనుకేక అతని నిశ్చలత కొక్కమారుగా అంత రాయం కలిగించింది! నితాయీ ఉలిక్కిపడి లేచి నిలుచున్నాడు. రాజా ఎవరినో ఉద్ధిశించి, “నోరుముయ్యి!” అని గొంతెత్తి గర్జించాడు.
మరుక్షణంలోనే కర్కశమైన ఒక ప్రీగొంతు తీవ్రాతితీవ్రంగా ప్రతిధ్వ నించింది.
“ఆ పంచదార టీ పొడుము ఎవరికోసం? ఎందుకలాగ తీసుకువెళ్లడం? బొత్తిగా సిగ్గు, లజ్జ లేదా? కళ్లేమన్నా నెత్తిమీదికి వచ్చాయా?”
ఆ తరువాత మాటలేవి వినబడలేదుగాని, ధపధపమన్న పెద్ద పెద్ద దెబ్బల సవ్వడి మాత్రం వినబడింది! ఆపైన మరింత పెద్దగా ఆ ప్రీ ఆక్రోశధ్వని! రాజా తన భార్యను కొడుతున్నాడు. ఆమె మరింతగా గొంతెత్తి ఆక్రోశిస్తున్నది. నితాయీ ఆ పరిస్థితికెంతో అసహ్యపడి ఆపివేయాలని నిశ్చయించుకున్నాడు.
“ఉస్తాద్! ఉస్తాద్!” ఇల్లాలి నలాగకొట్టి రాజా క్రోధంగా బయటకు వచ్చే శాదు. నితాయిని మాట్లాడనివ్వలేదు. రాజా నితాయీ ఇంట్లోకి ప్రవేశించాడు
“టీ తయారుచెయ్యి! పదిహేను పదహారుమందికి సరిపోయేటంత టీ తయారు కావాలి!”
“దాదాపు పావుసేరు టీ పొడుము, ఆర్ధసేరు పంచదార అతనిచేతి కందించాడు రాజూ. అటువంటప్పుడు రాజాభార్య తప్పేమున్నది? ఎవ్వరైనా అంత దుబారా సహించగలరా? అయినా ఇంత టీ, పంచదార ఎందుకు రాజా7”అన్నాదు నితాయీ గంభీరంగా.
అయితే అతడాతనిమాట బొత్తిగా చెవినిపెట్టలేదు! తిన్నగా వీధిలోకి వెళ్ళివోయి, ద్వారానికి ఎదురుగా నిలబడి గట్టిగా పిలిచాడు
“ఇదిగో, బాబూ! అందరు ఇక్కడికి రండి! ఇక్కడికి! ఇక్కడికి! అందరు రండి!”
నితాయీ అటువైపు ఆశ్చర్యంగా చూశాడు.
ప్రీ పురుషులబ్బందం ఒకటి అక్కడికి వచ్చింది. డోలు, ట్రంకుపెట్టెలు, కర్రపెట్టెలు, మూటలు, ఇంకా ఏవేవో సామానులు ఆ దళంవెంట వస్తున్నాయి. ప్రీల చీరలు, నగలు, వేషం విచిత్రంగా ఉన్నాయి. పురుషుల ముఖాలలో వనుమతి చలనింని +ఈ 73
కూడా ఒక విశిష్టమైన వ్యక్తిత్వముద్ర కానవస్తున్నది. నితాయీకి అది సుపరిచితమ!
“కాస్త టీ ఇయ్యవయ్యా! బొత్తిగా గొంతెండి చచ్చివోతున్నాను!”
ఆ మాటలన్న వ్యక్తి ఆ బృందానికంతటికి వెనకనే ఉన్నదిగాని ఆ బృందం నిలబడగానే దాని ముందుకువచ్చి నిలుచున్నది. సళాకులా, సన్నగా పొడుగ్గా ఉన్న ఆమె పసినిమ్మపండులా మిసమిసలాడుతున్నది. పెద్దపెద్ద తెల్లని నేత్రాలు. ఆ తెల్లదనంలో చికిలిచేసిన చురకత్తుల తళతళలు! ఆ నేత్రాలలో సర్వదా ఉల్లాసంతో కుతూహలంతో మిలమిలలాడుతున్న కనుపాపలు. అవి రెండు వైశాఖమాసం మధ్యాహ్నపు టెండలో పరిభ్రమించి తియ్యని తేనె ఆన్వాదించి మత్తిల్లి మరలివచ్చిన గండుతుమ్మెదల్లా సంచరిస్తున్నాయి.
ఆపైన ఆ జవ్వని రాజాకేసి చూసి “మీ ఉస్తాదో, ఫోస్తాదో ఎవరో మరి! ఆయన ఎక్కడ? అని అడిగింది.
రాజా నితాయీని చూపించి “ఇతనే మా ఉస్తాద్!” అని పరిచయం కలిగించాడు.
నితాయీకి నోటమాట వెలువడలేదు? ఆ బృందంవైపు చూడగానే అతనికి దానిలోనివారెవరో బోధపడింది. అది రుముర్ సంప్రదాయం నర్తకీగాయకుల బృందం, అయితే ఆ బృందం అంతా ఎక్కడినించివచ్చినట్టు? ఆ సంగతి నితాయీ అడిగి తెలుసుకోవలిసిన అవసరమే లేకపోయింది. రాజా తనంతట తానే చెప్పాడు.
“లండిలో నించి బలవంతం చేసి దింపాను. ఈవేళ ఇక్కడ పాటకచేరీ జరుగుతుంది, ఉస్తాద్, నీవు కూడా పాదవలసి ఉంటుంది తెలుసునా?”
అంతలోనే ఆ యువతి పెదవి వంకరగా తిప్పి తటాలున అన్నది.
“ఈయనా మీ ఉస్తాద్? అమ్మయ్యో!”
అలాగంటూనే ఆమె కిలకిలనవ్వింది. సన్నని సళాకువంటి ఆమె శరీరం అంతా ఆ నవ్వుతో జవజవలాడింది. ఆ యువతి నోరారా మాత్రమె నవ్వలేదు! ఆమె శరీరం అంతా ఆ నవ్వుతో వన్న పులుముకుంది ఆ కలకలనవ్వుతో ఎంతటివాడైనా మానవుల అంతరాంతరాలు తుత్తునియలుగా విదిలించి 74 4 కవి నవల
దూరదూరంగా ధూల్లిలోకి విసిరి వెయ్యగల నవ్వు! క్షే
ప్రవాహమధ్యంలో చురకత్తితో పొడిస్తే నీటిమిద ఆ పోటుగుర్హు కూడా కనపడదు. క్షణంలో ఒకరేఖ గోచరించఛి మరుక్షణంలోనే సీటిప్రవాహంలో అదృశ్వమైపోతుంది. అదేవిధంగా నితాయీ చిరునవ్వు ఆ యువతి కలకలల హాసం ప్రవాహంలోపడి కొట్టుకుపోయింది.
నితాయి చిరునవ్వు కూడా చురకత్తి అయినా ఆమె నవ్వుల తరంగిణిని ఖండించలేకపోయింది పైగా అతని నవ్వవల్ల ఆమె ధోరణి మరింతగా తీవ్రమైంది. ఆమె ఏదో అనబోయింది. అయితే అంతలోనే అందరిని సవినయంగా ఆహ్వానించాడు నితాయీ,
“రండి! రండి! దయచెయ్యండి!”
నితాయీ తన ఇంటి మధ్యవైపు దారితీశాడు. అందరు అతని ననుస రించారు. కూలీల, ఈ రైల్వేలైను నిర్మించే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ఇంజనీర్లకు ఆఫీస్ ఉండేది. ఆ సమయంలో ఇక్కడి అవసరాల కోసమని కొన్ని ఇళ్ళు నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ ఇళ్ళలో ఎవరు ఉండడంలేదు. నితాయీ ఉంటున్న క్వార్టర్లో ఒక వరండా ఉన్నది అది తళతళలాడుతున్న మెత్తని సిమెంటుతో నిర్మించినది. అలాగే సిమెంటుతో చక్కగా చదును చేసిన పెరడు కూదా ఆ ఇంటి చుట్టూరా విస్తరించుకుంది. ఆ పెరటిలోను దాని మధ్యన కట్టిన అరుగుమీద ఆ నర్తకీ గాయకబ్బందం విశ్రమించింది.
ఈ బృందం బహు ప్రాచీనకాలంలో ప్రసిద్ధి పొందిన రుముర్ నర్తకీ గొయకుల బృందం వంటిది కాదు. ఇప్పుడిటువంటి బృందాలలో తక్కువరకం వేశ్యాగాయినులు, వెర్వేరు వాద్యాలు వాయించే వ్యక్తులు ఉంటున్నారు.
ప్రస్తుత బృందం కూడా ఇటువంటిదే! అది ఈవేళ ఇక్కడ మకాం వేస్తుంది. రేపు మరి ఒకచోట, అలాగ తిరుగుతూ తిరుగుతూ పెద్దపెద్ద చెట్లకిందే మకాం వేస్తూంటుంది. ఎవరైనా పిలిచినా పిలవకపోయినా కొంచెం చీకటిపడగానే ఈ బృందంలోని వారంతా కలిసి ఆ యా బాటలకూడలులలోనే తమ నృత్యగానాలారంభిస్తారు. వేశ్యలు మోటుతరహా పాటలు పాడుతూ వసుమతి చలనాని ఈ 7ద5్
నృత్యాలు కొననాగిస్తారు. ఇటువంటి మోటుపాటలు విని ఆనందించే రసికులంతా జుంజుమృ్మని మారుమోగే ఈగలలాగ అక్కడ గుమిగూడతారు!
ఆ నృత్యాల సమయంలో అప్పుడప్పుడు కొద్దిమొత్తాల బహుమతుల మూటలు కూడా వచ్చి పడుతూంటాయి. రాత్రికాగానే చికటిమాటున బృందంలో గణికలు తమవృత్తి వ్యాపారం కొనసాగిస్తారు. ఇంతటితోనే అంతా ముగిసిపోలేదు. ఈ గణికలు పురాతన సంగీత కృతులు కూడా కొన్ని వాడ గలరు. విని ఆనందించగలిగిన రసికులున్నప్పుడు అవి వాది రక్తికట్టిస్తుంటారు. బృందంలో ఆయా వాద్యాలు వాయించేవారిలో నితాయీవంటి కవిగాయకులు కూడా ఒకరిద్దరున్నారు, అవసరం వచ్చినప్పుడు వీరు పోటిపాటకచేరీలలో వంతగానాలు కూడా నిర్వహిస్తూంటారు ఆపైన తగినంత అవకాశం కలిగి నప్పుడు నితాయీలాగ కవిగాయక పదవులు కూడా చేపట్టి పోటీలలో వొల్గొంటారు.
మొత్తం దళమంతా పెరటిలో ప్రవేశించి, ఉసూరుమని ఒక వెడినిట్టూర్పు విడిచిపెట్ట, ఆ ప్రదేశం అంతా హాయిగా ఉన్నదనుకున్నది. ఆ బృందంలోని వారందరూ చెట్లకింద, రోడ్లపక్కన మకాము లేర్పరుచుకుని రాత్రింబగళ్లు సునాయాసంగా గడిపివేస్తూంటారు అటువంటి పరిస్థితులలో చక్కగా సిమెంటు చేసిన పెరడు, అరుగు లభ్యం కాగానే మిక్కిలి అదృష్టవంతులమని ఆనందించారు. ఉత్సాహంగా తాటాకుల చాపలు పరచడం (ప్రారంభించారు. సన్నగా సళాకులా పొడుగ్గా ఉన్న తరుణి సిమెంట్‌తో కట్టిన అరుగుమిది కెక్కి పొడుగ్గా బోర్లా పడుకున్నది చల్లని సిమెంటు స్పర్శ అనుభవించి “అమ్మయ్యా!” అని హాయిగా ఒక నిట్టూర్పు విడిచిపెట్టింది ఆ కంరస్వరంలో అంతులేని బడలిక, నిస్స్బృహతో నిండిన జాలి ప్రతిధ్వనించాయి. దానితో ఆమె ఓర్పుకు కూడా పరీక్ష అయింది
“వసంతా!” ఆ బృందం గణికలలో ఒక ప్రాధకంరస్వరమది, ఆమె ఆ బృందానికంతటికి అధికారిణి నాయకురాలు! అలాగ పిలిచి, “పసంతా! జ్వరం వస్తోంది కదా! ఆ చల్లని సిమెంటు చప్తామిద పడుకుంటావెందుకు?”
ఆ తరుణి పేరే వసంత, ఆమె ప్రాఢ అన్నదానికి ఎవిధంగాను సమాధానం 7/76 ఈ కవి నవల
చెప్పలేదు. గొంతు హెచ్చించి, “బద్రిగో, ఏమండోయ్, ఓ ఉనాద్గారూ, ఉసాద్ గారూ, కాస్త టీ ఇప్పించంది?”అన్నది.
నితాయీ అప్పుడే టీ కాచడం ప్రారంభించాడు. అదేమాట అన్నాడు.
“ఇదిగో, అయిపోయింది! సరిగ్గా అయిదే అయిదు నిమిషాలు! జ్వరంగా ఉంది కదా, అలాంటప్పుడు ఆ చల్లని గచ్చునెలమీద పడుకోవడం ఎందుకని? ఏదేనా కాస్త నేలమీద వెయ్యనా? చాప తీసుకురానా?”
వసంత కళ్లు తెరవలేదు, అలాగే కళ్లు మూసుకుని కిలకిలనవ్వింది.
“ఏమండోయ్! బావయ్యగారూ! మీమీద నాకెంతయినా (ప్రేమ కలిగింది! మీరు వట్టి బావయ్యగారు కారండి! దారిలో అద్దుపడి ఆదుకున్న బావయ్యగారు! నాకసలు మిమ్మల్ని చూసీచూడగానే ప్రేమకలిగింది! తెలిసిందా! దానితో నేను ఒక్కసారిగా తలమునకలయ్యాను!” ఆమె పక్కనే ఉన్న మిగిలిన గణికలు ఆ మాటలు వింటూనే కలకలనవ్వారు.
చిన్నరాణికి బహూకరించిన పాత్రలోనే టీ పోసి నితాయీ వసంత ముందుంచి చమత్మృరించాడు.
“ఈ టీ కాస్త జాగ్రత్తగా ముందే ఆలోచించుకుని తీసుకోవాలి. తెలుసునా? దినిలో (పేమ కలిగించే మత్తుమందు రసం కూడా కలిపాను!”
కవిగాయకుదు నితాయీ రసవ్యంగ్యవ్యవహారంలో గట్టి నిపుణుడు! తనకు తగిన సమ ఉజ్జీ దొరికిందన్న ఆనందంతో అతడు ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు!
టీ సువాసనతోబాటు టీ పాత్ర సవ్వడి వినీ వినగానే వసంత దప్పికతో తహతహలాడి పోతున్నంత ఆత్రతతో తటాలున లేచి, మూతి ఒయ్యారంగా తిప్పింది. నితాయీ నిశిత చూపులతో తన అందమైన కళ్లచూపులు కలిపి నవ్వింది.
“నిజమే బావయ్యగారూ, ప్రేమ ఉన్నంతమాత్రాన దానివల్ల పని జరగదు! సంతృప్తి కలగదు! కాస్త మత్తుమందు రసం కూడా కలపవలిసిందే!”
ఆ తరువాత మిగిలిన వారందరికి టీ అందిస్తూ నితాయీ పాట అందు కున్నాడు,
“వలపు మొలనూలి శృంఖలవాని బంధింప వసుమతి చలనాని ఉ 77
వశము కాలే దక్కటా!
రాధ సిందూరతిలకము వాని మోముపై
రమ్యమై వెలసెనయ్యో!
వేరుపాయములేదు! లెదు! బృందా! ఇంక
వేవే వశీకరణలతిక కొనిరావె!”
అది నితాయీ స్వయంగా రచించిన పాటకాదు! ఆ కవిగాయకుని ఆదర్శ కవితారణమోరల్ గీతిక- అతనికి కంరస్థము.
ఈ బృందంలో తరుణులు సంఘంలో అట్టడుగు అంతస్తుకి చెందినవారు. వారికి అక్షరజ్ఞానం కూడా లేదు.అయితే సంగీతానికి సంబంధించిన అత్యద్భుత సంస్కృతి సంపత్తి ఉన్నది. ప్రాచినకృతులద్వారా వారికి చక్కని పురాణగాధల అవగాహన ఏర్పడింది. అంతేకాదు! ఆ గాధలద్వారా విసిరిన వ్యంగాలు, శ్లేషలు చమత్కృతులు కూడా బోధపరుచుకోగలరు. అభినందించి ఆనందించ గలరు. నితాయీ పాడిన గీతిక అర్ధం అంతా వసంత పూర్తిగా అవగాహన చేసుకోగలిగింది. ఆమెనేత్రాలు రెండు ఒక్కమారుగా పదునుపెట్టిన చురకత్తుల్లా తళతళలాడాయి. అయితే మరుక్షణంలోనే తలవంచుకుని టి తాగింది.
జ్ర బృందంలో ఒకవ్యక్తి అన్నాడు.
“భేష్ష! చాలా బాగుంది ఉస్తాద్! చాలా బాగుందిగొ
జఅ్రవునవును! చాలా బాగుంది!” అని ఇంకొక వ్యక్తి వంతవాదాదు.
“చాలా అత్యద్భుతంగా ఉంది! అచ్చంగా మైనాగోరువంకే అనాలి!”
కనుభొమలుముడిచి ఒక యువతి మెచ్చుకున్నది. నితాయీ వాడిన గీలికలో లోపలి వ్యంగ్యము, చమత్కారము ఒక్క వసంతకేగాక మిగిలిన యువతులకందరికి బాగా ఒంటపడ్దాయి. అంతలోనే వసంత అందుకున్నది.
“పాయ్యిలోనించి తీసిన నల్లనిబొగ్గులో అగ్గి అంటుకోగానే మళ్ళీ రాజు కుని ఒళ్ళు కాలుస్తాయి! కొంచెం జాగ్రత్తగా ఉండాలిమరి!”
నితాయీ నవ్వాడు.
“కాదు! కాదు! అలాగవద్దు! ఎందుకంటుకుంటాయి? నీమీద (ప్రమకలగ కుండా ఉండాలంటే అది నావల్ల అవుతుందా? నీవొక వికసించిన పుష్వానివి! 78 ఈ కవి నవల
నేను వట్టి ధూళినిమాత్రమే! పూలబాటలో బావయ్యగారు వట్లి దుమ్మే!”
అలాగంటూనె తిరిగి అతడింకొకపాట అందుకున్నాడు.
“పూలపైపూల కామనిలోన లోలోన,
వలపు కలుగగబోదు నిజమెయగు నీమాట!
కాని పుష్పమ్ము లాకాశాన జాఓల్లి
గనుగొన్న వికసించి మనములో నుప్పొంగు!
రాలిపోయిన విరులధూళి తనహృదయాన
జాలిగా హత్తుకొను! లాలాటలిఖీత మిది!”
ఆశ్చర్యవిస్సారిత నేత్రాలతో అతనివైపు చూస్తూ వసంత “ఎంతటి వింతవ్యక్తి!? అనుకున్నది.
ప్రాధన్యాయాధిపతిలాగ హుందాగా ఒక చిరునవ్వు చిందించింది.
“చూశావా? పిల్లా, నీవు ఓడిపోయావు మరి! తిన్నగా సమాధానమె చెప్పలేక పోయావు! అయితే బాబూ, ఈ పాటలన్ని నీవు స్వయంగా రచించి స్వరపరిచినవెనా?”
నితాయీ సవినయంగా సమాధానం చెవ్వాడు.
“క్కప్రాట అల్లడానికి రవంత ప్రయత్నిస్తానంతే! వేదికమీద కూర్చున్న పుడు ఆశువుగా కూడా అల్లగలను! ఇవన్నీ నెను రచించిన పాటలే!”
“పదాలు చాలా బాగున్నాయి!” ప్రాఢ మెచ్చుకున్నది.
నితాయీ చేతులు రెండుజోడించి శిరస్సుమీద ఉంచి “ఇదంతా మీ దయ?” అన్నాడు.
వసంత ఆపైన మరి మాట్లాడలేదు! నిశ్శబ్దంగా టీ తాగడం పూర్తిచేసి, ఆ వాత్రకింద పెట్టీ గచ్చునేలమీద విశమించింది. రాజా అదే సమయంలో లోపలికి వచ్చాడు. అతని చేతుల్లో ఒక పళ్ళెం, సారపత్రాలకట్ట ఉన్నాయి. మిలిటరీలో పనిచేసిన రాజా ఆదే ధోరణిలో తాను చేసిన ఏర్పాటంతా తెలియబేశాదు.
“ఇదిగో, బాబూ, ఆ మర్రిచెట్టుకింద జాగా అంతా శుభ్రంగా తయారైంది. ఇంక మరి వంటగింట అంతా కానివ్వండి వసుమతి చలనాని + 79
ఆ తరువాత రాజా ఒంటరిగా ఉన్న సమయంలో నితాయీ రహస్యంగా అడిగాడు.
“రాజా, ఈ ఖర్భంతా-”
రాజాకున్న వ్యవధి చాలా తక్కువ. అదీగాక సంసార వ్యవహారాలలో అతడేది దాచడు. అంతా బాహాటంగానే వెల్లడిస్తాడు ఆ విధంగా నితాయీ మాటకడద్దుపడి తనకలవాటైన ధోరణిలోనే గొంతు హెచ్చించి అన్నాడు.
“వ్యవహారం అంతా సజావుగా సాగివబోయింది భాయీ! బనియామామ ఎనిమిది అణాలిచ్చాడు. బొగ్గులమ్మే ఆసామీ నాలుగణాలు. దుకాణదారుడు ఎనిమిదణాలు, స్టేషన్ మాష్టరుగారు ఎనిమిది అణాలిచ్చారు. గోడౌన్ కీపరు ఎనిమిది అణాలు. గార్జు ఎనిమిది అణాలు, గూడ్సు బండి ైవరు ఎనిమిది అణాలు. నేనొక రూపాయి వేశాను. ఆపైన నీవొకరూపాయి, బియ్యం, పప్పు, ఉప్పు మొదలైన సామానులన్నీ ఈ సొమ్ము ఖర్చుపెట్టి కొన్నాను”
అలాగంటూనే శీఘ్రంగా అక్కడనించి వెళ్ళిపోయాడు
అటువైపున స్టేషన్లో రైలుపెట్టెలకూర్పు జరుగుతున్నది. కూలీలు బ్రాంచిలైను నుండి బండిని వాయంట్స్ దగ్గిరికి నెట్టకురావడం చాలావరకు పూర్తయింది.
నితాయీ చెట్టుకిందికివచ్చి నిలుచున్నాడు. ఆ నర్తకీ గాయకదళం సర్వదా పరిభ్రమిస్తూంటుంది. అందువల్లనే ఆ బృందం శీఘ్రంగా ఆ చెట్టుకింద తన సరంజామా అంతా పరిచింది. ఆ దళంలోనివారప్పుడే ఒకపొయ్యి ఏర్పరిచి వెలిగించారు. ఒక ్రీ నీళ్ళు తీసుకువచ్చింది. ఇంకొకయువతి కూరలు తరుగుతుంది. ప్రాథఢ పొయ్యిముందుకూర్చుని కొద్దినిమిషాలలోనే ఒకపెద్దకుందడ శుభ్రంగా కడిగి దానిమీద కెక్కించింది. పురుషులు ఒంటిమిద నూనె మర్ధించు కుంటున్నారు. అప్పటికప్పుడే ప్రీలస్నానం పూర్తయింది. వారందరి తడిసిన శిరోజాలు వెనకవైపున వలాడుతున్నాయి. జుట్టుచివర జారుముడి వేను కున్నారు. అయితే ఈ ప్రాంతంలో సన్నగా సళాకిలా ఉన్న వసంతమాత్రమే కానరాలేదు. ప్రౌఢ నితాయీని తన దగ్గిరికి పిలిచి ఎంతో ఆదరంతో సంభాషణ (ప్రారంభించింది. 80 + కవి నవల
“రా! నాయనా! రా
అంతలోనే దగ్గిరలోనే ఉన్న ఒకవ్యక్తి అన్నాడు.
“ఏమిటండీ! అలాగే నీలుచుండిపోయారు! రండి! ఇలాగరండి!”
పొయ్యిలో ఒకకర్రపెట్టి ప్రౌఢ “మా నాయన గొంతు చాలా కమ్మనిది!” అన్నది. ఆపైన నిశ్చలంగా అతనిముఖం కేసిచూసి చిరునవ్వు చిందించింది.
“ఈ సంగీతంలైనులోనే ఉంటావా బాబా? లేక మరోపని, పాటుకూడా చేస్తున్నావా? లేక అది, ఇది కూడా చెయ్యాలని ఉందా?”
“ఈ లైనులోనే ఉండాలని నా కోరిక, ఆపైన చూద్దాం!”
“పెళ్ళి, గిళ్ళి అయిందా? ఇంట్లొ ఎవరున్నారు?”
“పెళ్ళా?” అని నవ్వాడు నితాయీ, మళ్ళీ నవ్వుతూ అందుకున్నాడు.
“ఇంటిదగ్గిర మా అమ్మ, చెల్లెలు ఉన్నారు. అమ్మ చెల్లెలిదగ్గిరే ఉంటుంది. నేను ఒంటరిగాణ్డి”
“అయితే మా బృందంలో చేరకూడదూ?”
దీనికి వెనువెంటనే సమాధానం చెప్పలేకపోయాడు నితాయీ, పోనీ ఒప్పుకుందామనుకుంటే, రాజా తటాలున జ్ఞప్తికివచ్చాడు! భూమి సంపెంగ పువ్వు తొడిమవంటి మృదుల శరీరచ్చాయతో నిగనిగలాడుతున్న చిన్నరాణి జ్ఞాపకం వచ్చింది. అతనిమీద పంచప్రాణాలు పెట్టుకున్న ఆత్మీయురాలామె! అతడలాగే మౌనంగా ఉండిపోయాడు.
“ఏం మాట్లాడవు బాబూ?” మరికొన్ని క్షణాలపాటు ఊరుకుని అడిగింది ప్రధ,
“మీ బాబు మనసులో లోపలి మనిషిని గురించి మధనపడుతున్నారు!” అన్న మాటలు మున్ముందుగా వినిపించాయి! అంతలోనే కిలకిలనవ్వు! నితాయీ వెనక్కి తిరిగిచూశాడు! అప్పుడే స్నానం ముగించుకుని తడిచీరతో నిలుచున్న వసంత! ఆమె స్నానంచేసి, ఒళ్ళుగాని జుట్టుగాని తుడుచుకోలేదు. ఆఖరికి జుట్టు ఒక్కసారి దులుపుకోవడం కూడా జరగలేదు! తల వెండ్రుకల చివళ్ళనుండి నీటిబొట్లు ఇంకా జారిపడుతూనే ఉన్నాయి నితాయీ ఆమెకేసి చూసి నోటమాట లేక నిర్దాతపోయాడు. వసంత నవ్వింది. వసుమతి చలనాంని శ 81
“మనసు లోలోపల అణిగిమణిగి ఉన్న ఆ పెళ్లికూతురెవ్వరు? ప్రతి చరణంలోను వశీకరణలతో ఆ సుందరిని బంధించడం జరిగిపోతున్నదిలా ఉంది!” వసంత నిశిత దృష్టికి.
నితాయీ మరింతగా ఆశ్చర్యపడి అడిగాడు.
“జర్వం కాస్తున్నా స్నానం చేశా వెందుచెిత?”
“జర్వం గిరం అంతా ఎగరగొట్టెశాను! ఇది రాధ (ప్రమజ్వరంగాని మరొకటికాదు గదా!”
అలాగంటూనే ఆమె విరగబడి నవ్వింది! వెనువెంటనే తడిసిన చీరలో నించి సుస్పష్టంగా కనిపిస్తున్న వసంత శరీరం కూడా అలాగే విరగబడి నవ్వింది. అది గమనించి నితాయీ బీడియపడ్డాడు.
అంతలోనే ప్రాధ అందుకున్నది.
“అదేమిటి వసంతా, అలాగ స్నానంచేసి వచ్చావు! వెళ్లు! వెళ్లు! త్వరగా ఆ తడిబట్టలు విడిచి రా! ఇలాగ చేస్తూంటే ఎప్పుడో ఓనాడు 'హరీ" అంటావు!
వసంత విచిత్రంగా నవ్వింది.
“వోనీలి! ఆపైన ఈడ్చి పారవేద్దువుగాని! అందుకని స్నానం చెయ్యకుండా ఉండలేను సుమా! స్నానం చెయ్యకుండా ఉండడమే! అమ్మో! ఇంకేమయినా ఉందా? ఒళ్ళంతా వాసనకొట్టదూ?” అంతలోనే ఆ పక్కనే ఉన్న ఒక తరుణి చిన్నగా నవ్వింది.
“స్నానం చెయ్యకపోతే జుట్టు లొంగదు! అందుకని, అవునా[”
వసంత చేతో జుట్టు ఒత్తుకుంటూ సమాధానం చెప్పింది.
“నేను జుత్తుతో సరసుల పాదాలొత్తలేదు కదా! అలాంటప్పుడు కాస్త తల దువ్వుకోకపోతే మరి చేసేదేముంది?”
సరసులనేకులతో సంబంధాలు పెంపొందించుకుంటారే తరుణులు, అయితే స్రీ హృదయానికి సహజమైన ధోరణిమాత్రం విడనాడలేరు! ఈ బృందంలో ప్రతియువతికి కలిసిమెలిసి తిరిగేవారిలో ఒకొక్క పురుషునిమీద ప్రత్యేకంగా ప్రేమ వుంటుంది. అందువల్ల వీరికి అనేకవిధాలైన మానసిక వ్యధ లేర్చడుతుంటాయి. అయితే వసంతకు మాత్రం ప్రత్యేకించి ప్రేమాస్పదు 82 + కథి నవల
డైన వ్యక్తి ఎవ్వడు లేడు. ఆమె బృందంలో పురుషుడెవ్వడైనా వసంతకనుదోయి తీవతరళదృష్టి కెంతో సమ్మోహితుడై దిపంపురుగులాగ సమీపిస్తాడు దానితో ఆ వ్యక్తి రెక్కలే కాదు! హృదయాంతరాళం కూడా భగ్గుమని మండి భస్మమయి పోతుంది! కనకనే వసంత తన సరసనే ఉన్న తరుణితో అలాగ మాట్లాడింది! అందువల్ల వారిద్దరిమధ్య తగాదా ప్రారంభమయ్యేదే! బాగా దెబ్బతిన్న ఆ తరుణి పడగెత్తి కస్సుమని బుసకొట్టింది. కాని బృందం నాయకురాలు ప్రౌఢ అంతలోనే అడ్డుకుని వేరొక విషయం మీదికి సంభాషణ మరలించివెస్తూ నవ్వుతూ అందుకున్నది.
“వినవే, వసంతా, మన ఉస్తాద్ ఈవేళ ఎంత చక్కగా ఉన్నాడో చూడు!”
ఆమె మాటలింకా పూర్తికాకుండానే వసంత పెను నవ్వు సవ్వడిలో మునిగిపోయాయి! అనతిదూరంలోనే ఉన్న నితాయీకి ఆ పరిస్థితిలో ముచ్చె మటలు పోశాయి! వెంటనే ప్రౌఢ వసంత కేసి చూసి గట్టిగా మందిలించింది.
“సిగ్గు! సిగ్గుచేటు! ఎందుకలాగ పెద్దగా విరగబడి నవ్వుతావు?”
వసంత తన నవ్వు ఆపివేసింది.
“స్పిగ్సచేటు నీకు కాదు! నాకు!”
“ఎందుచేత?”
“అమ్మో, ఉస్తాద్ ఎంత నల్లగా ఉన్నారో!”
నోటమాటలేక అందరు నిర్దాంతపడ్డ్దారు.
వసంత మళ్లీ అందుకుంది.
“ఆ నల్లని ఒంటిమీద చెయ్యివేస్తే నెను కూడా మసిబొగ్గులా మారిపోతాను పిన్నీ!”
ఆపైన మూతి వంకరగా తిప్పి, రవంత నవ్వి మల్లీ మొదలుపెట్టింది,
“ఇదిగో, నేను వెళ్లిపోతాను, పొడిచీర కట్టుకువస్తాను. లేకపోతే *నిమూ నియా వస్తుందేమో! ఏమిటి చేసేది?”
అలాగంటూనే ఆమె ఎంతో ఒయ్యారంగా నడుస్తూ అక్కడినించి కదిలి వెళ్ళివోయింది.
ఒక యువతి అది గమనించి 'భీ! సిగ్గుమాలినదానా! ని గొంతుని ఉరి వసుమతి చలనాని + 83
బిగించుకువోనూ!” అని ఈసడించింది. ప్రాఢ ఆ యువతిని గట్టిగా చీవాట్లు పెట్టింది.
“నోరు సంభాళించుకోవే! దెబ్బలాడకే!”
ఆ యువతి వెనువెంటనే మాట్లాడకూరుకుంది. అయితే లోలోపలే మండిపడుతూ రుసరుసలాడింది నితాయీ అంతర్యంలో నవ్వుకున్నాడు. పసిమి వన్నెతో మిసమిసలాడుతున్న ఆ గర్విష్టి వసంత గురించి ఆలోచిస్తుంటే అతనికి మరింతగా నవ్వు వచ్చింది. అయినా అతడది అంతా లోలోపలే అణిచి వేసుకున్నాడు. తన పైడివన్నెతో ప్రపంచం కళ్లు ఒక్కసారిగా జిగేలుమని గుద్దివైపోతాయని వసంత విర్రవీగి పోతున్నదని అతని కనిపించింది! లోకంలో అందరు తనకోసం మిక్కిలి ఉవ్విళ్లూరిపోతున్నారని ఆమె అహంకారం! అయ్యయ్యో!
“నాయనా, ఇదిగో! మాట” ప్రాధ పిలిచింది.
“నన్నెనా పిలుస్తూంట!” నితాయీ అడిగాదు.
“అవును! *'నాయనా! అని పిలిస్తే నిన్నె అన్నమాట!”
“అలాగ పిలిస్తే కోపగించుకోరు కదా!” అన్నాడింకొక వ్యక్తి
“లేదు! లేదు! కోపగించుకోవదమెందుకు?” అన్నాడు నితాయీ, పిన్ని అలాగ పిలవడమె అతనికెంతో బాగుంది.
“ఏమంటావు? ఇదే లైనులో ఉండదలుచుకున్నప్పుడు మా బృందంలో చేరి పోకూడదూ?”
“వరిపోలేను!” నితాయీ ఖచ్చితంగా తన అభిప్రాయం వెల్లడించాడు.
అందరు మాట్లాడకూరుకున్నారు. నితాయీ లేచినిలుచున్నాడు.
“మరి నెనిక్కడినించి వెళ్లిపోతాను, ఇంటిదగ్గిర వంట గింట చూసు కోవాలి”
“కకృహో! నా బొగ్గులమణీ!”
వసంత గొంతు సవ్వడి! నితాయీ వెనక్కితిరిగి చూశాడు. ఆమెజుట్టు చక్కగా దువ్వకుంటున్నది. ఆందంగా సిగచుట్టుకుని అలంకరించుకోడానికి అనువైన జుట్టది! ఒత్తుగా పొడుగ్గా వెలాడుతున్నది! నుదిటిమీద సిందూర 84 ఈ క£థి నవల
తిలకం సరిదిద్వుకున్నది. తళతళలాడుతున్న ఎర్రని మిల్లుచీర కట్టుకున్నది.
వసంత చిన్నగా నవ్వింది.
“బొగ్గులమాణిక్యమని మీకొకపేరు పెట్టాను! లేకపోతే “నీలమణీ!” అని పిలవనా?”
ఆమె చేతులు రెండు జోడించి తన బొగ్గులమణికి నమస్కరించింది.
నితాయీ నవ్వాడు.
“బాగుంది! బాగుంది! చాలా బాగుంది! నన్ను మలినమాణిక్యమని పిలిచినా పిలవవచ్చును”
“అది బొగ్గుల మాణిక్వంలోనే ఉందిగా!? వసంత మూతి వంకరగా తిప్పింది
“అందులోనే ఉంది నిజమే! మలినమంటే కాస్త చెవికింపుగా ఉంది! సంగీతం తెలిసినవాళ్సి కనక అంటున్నాను. అంతేగాని నల్లనివాణ్ణి గదా, అని చెప్పడం లేదు! ఏమంటారు?”
వసంత రవంతసేపు ఊరుకుని “అన్నట్టు నాకొన చిన్నపని చేసిపెట్ట గలరా?” అంది.
“ఏమిటది?”
“క్షాస్త నాలుగుకాసుల చేపలు తెచ్చిపెట్టగలరా? అవి లేకపోతే నాకు బొత్తిగా అన్నం సయించడం లెదు! తెచ్చిపెట్టరూ?”
“దానికేం? ఇవ్వండి”
నితాయీ కాణీలకోసం చెయ్యి చాచాదు. అయితే వసంత ఆ కాసులివ్వ దానికి చాచినచెయ్యి కొంచెం వెనక్కి లాక్కున్నది
“ముట్టుకుంటారు సుమంది! ముట్టుకోకండి!”
“ఎందుకని? స్నానం అయిపోయింది కదా?”
వసంత పెదవుల చివరలు రెండు క్షణంలో నారి జోరుగా లాగిన వఎింటిజంటలా వంకరగా మారిపోయాయి.
“ఎ(రనిచేతుల కొకవేళ బొగ్గునలుపు మాలిన్యం అంటుకుంటుందేమో!” నితాయీ నవ్వాడు. వసుమతి చలనాని +ఈ [85
వసంత చెతిలోనించి ఎగిరినకాబీలు నితాయీచేతిలో పడ్డాయి క్షణంలో వింటి జోడువంపులవంటి ఆమె పెదవుల చివరలు రెండు విచ్చుకున్నాయి. అయితే మరునిమిషంలోనే వక్రదరహాసంలో ఆ పెదవుల చలనం మేళవించి అదృశ్యమై వేరొకరూపం ధరించింది. అది గమనించిన నితాయీ ఆశ్చర్యానికిక అంతే లేకపోయింది! ఆమె పురాణకధలో మాయావిని వంటిదని అనుకున్నాడు. శత్రువు నాగుబామయితే ఆ మాయావిని క్షణంలో ముంగిసగా మారిపోతుంది! శత్రువొక పిల్లిగామారి ముంగిసరూపంలోఉన్న తన మీది కురకబోతున్నప్పుడు అది వెనువెంటనే పెద్దపులిగా మారిపోతుంది! ఆమె దుఃభోద్వేగం త్రుటి కాలంలో వక్రదరహాసంతో తారుమారైంది! అంతలోనే వసంత అలతిగా నవ్వి, “కనకనే ముట్టుకోకుండా ఇచ్చాను!” అన్నది.
చెపలకోసం జాలరిపేటలోకి వెళ్ళేదారిలో నితాయీ మనస్సులో ఒకపాట పొటమరించింది అది సరికొత్తపాట! 'వసంత కేదయినా మంచి ఉపమానం దొరుకుతుందా?” అని అతడాలోచిస్తున్నాడు. అది పిలుకుపత్తిపువ్వు! ఆపాట. ఆలోచిస్తూ మనస్సులో అల్లుకుంటూ “ఆహా!” అనుకున్నాడు నితాయీ.
“ఎరుపే! ఎరుపే ఓ పగడాల పత్తిపువ్వా!
ఆహా! ఆహా! నీ అందానికంతటికి సారం!”
12
కొంచెం చీకటిపడగానే రాజూ పాటకచేరికోసం సమావేశం ఏర్పాటు చెశాడు. దానికి సేనాధిపతిలాగ తన యావచ్చక్తి వినియోగించి ప్రయత్నిం చాడు. విప్రపదుడొకరాజులాగ సభలో కూర్చున్నాడు వాతవ్యాధివల్ల అతనికి అటుఇటు నడుస్తూ హంగామా చెయ్యడానికి వీలుకలగలేదు. పెద్దపెద్ద కేకలు పెడుతూ బాగా గొడవ చేశాడు అంతే! నిజానికి దగ్గిరఉండి చేయించ వలసిన పనులు స్వయంగా చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి. చిల్లరదుకాణ దారు, బొగ్గులమ్మేమనిషి విప్రపదుని వ్యంగ్యశ్లేషార్ధాలమాటలకెంతో భయపడి తమ జంబుఖానాలు బయటికి తీసుకువచ్చి ఇచ్చారు. బనియీమామ తన పెట్రోమాక్స్లైటు పట్టుకువచ్చి, స్వయంగానే కిరసనాయిలుపోసి వెలిగించి ఇచ్చాడు. ఆ సమావెశానికి మొత్తం మీద చాలామందే వచ్చారు! వది ఈ కవి నవల
అత్యంత గౌరవనీయులైన వ్యక్తులెవరు అక్కడ హాజరుకాకపోయినా, ఆ యా దుకాణదారులు చాలామంది చక్కగా ముస్తాబయి ఆ సభలో బారులు దీరి కూర్చున్నారు. ఇక మదీ అలగాజనం సభచుట్టూరా గుంపులుగుంపులుగా గుమిగూడి నిలుచున్నారు. ఆ సమావేశానికి మధ్యగా వేశ్యల నృత్యగానాలకోస మొకవెదిక ఏర్పరిచారు ఆ దళంలోగల కవిగాయకులతో పోటీ పాటకచేరీలో వాల్గొనాలని నితాయీ ఎంతయినా ఉవ్విళ్ళూరిపోయాడు. కొన్నికొన్ని రుముర్ నర్తకీబ్బందాలలో తక్కువరకం కవిగాయకులు కూడా కొందరుంటారు. వీరికి స్వతంత్రంగా కవితా గానాలాలాపించె శక్తిసామర్హాలుండవు. కనకనే రుముర్ నర్తకీబ్బందాల నాశ్రయించుకుని కాలక్షేపం చేస్తూంటారు. ఎక్కడైనా ఏదైనా గగ్రామంలోగాని, ఉత్సవంలోగాని కాస్తమంచి రుముర్ నర్తకీబృందాల నృత్యగానాలతో బాటు కవిగాయకుల గానాలుకహూడా మేళవిస్తే అటువంటి సమావేశాలు మరింత గొప్పగా రక్తికడతాయి.
ప్రౌాధ ఆధ్వర్వంలో నడుస్తున్న ఈ రుుముర్ నర్తకీబ్బందంలో కవి గాయకుడొకడున్నాడు. అయితే దళంతోబాటు ఇక్కడికిరాలిదు. ఏదో పనిమీద దారిలో దిగబడిపోయాడు. ఆ కవిగాయకుడు అక్కడికి రెండురోజులలో వచ్చి అందుకోగలడని అందరు అనుకుంటున్నారు అలాగ రాకపోతే నితాయీకి కచెరీలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది. ఆ కవిగాయకుడు లేకపోయి నందువల్ల నృత్యగానాలకు సంబంధించిన వారే వేదికమీదికి వచ్చారు.
డోలు, తబలా, హార్మోనియం, ఫిడేలు మొదలైన వాద్యాలతో రుముర్ బృందంలో పురుషులు కొందరు వేదికమీద కూర్చున్నారు. వారి శిరోజాలు నూనెతో జిద్దు ఓడుతున్నాయి. వారవి అందమైన తలకట్టులుగా మలుచు కున్నారు. రండు రంగుల చొక్కాలు తొడుక్కున్నారు ఇక వేశ్వలలంక రించుకున్నవన్నీ గొల్లునగలు, వారు వేర్వెరు కర్ణాభరణాలు, హారాలు, దండకడియాలు మొదలైనవన్ని ఎంతో సొగసుగా అలంకరించుకున్నారు. ధరించిన రంగురంగుల చీరలు పాతకాలంనాటి ఫ్యాషన్లకు సంబంధించినవి. అయినా వారి అలంకరణలో కొత్తధోరణు లవలంభించాలన్న వ్యర్ధప్రయత్నం కొట్టవచ్చినట్టు కానవస్తున్నది. చెక్కిళ్ళమీద, పెదవుల మీద ఎ(ర్రనిరంగుతో నసుమతి చలనాని ఈ 67
బాటు, స్పో పొడరుల పూతలుకూడా గోచరిస్తున్నాయి. పాదాలకు పారాణి, హసాలకు కావిరంగు పూత.
(పేక్షకుల మనస్సులలో ఈ ధోరణి వేషభూషణా లెంతయినా చమత్కారం కలిగించాయి. యువతులందరిలోను ఒక్క వసంతే కలకలలాడుతూ అందంగా కనిపించింది. నిజంగా ఆమె అందగళత్తే! మనిషిలో కొంత మంచి అభిరుచికూడా ఉన్నది. ఆపైన చాలా చక్కగా ముస్తాబయింది. కవిగాయకుడు నితాయీ చక్కగా ఉతికిన పంచె కట్టుకున్నాడు. దానిమీద జుబ్బా తొడుక్కున్నాడు. నర్తకీ గాయకుల బృందంతో కలిసిమెలిసి కూర్చున్నాడు. అతని ముఖంమీద హుందాతనం చిరునవ్వు! నితాయీ ఆ వేదికమీద ఒక విశిష్టవ్యక్తి! కవి గాయకుడు కదా మరి! కనకనే అతని కంతటి ప్రత్యేకత!
గానం ప్రారంభమైంది. అది ఖేమటా అన్న నృత్యాన్ని అనుకరిస్తున్న నృత్యగానాలధోరణి. తరుణులు మొట్టమొదటగా పాటలందుకున్నారు ఆపైన వంతగాయకులవి తిరిగిపాడారు. వెంటనే తరుణులు నృత్యం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఖేమటాన్ఫత్యం బాగా ప్రచారంలోకి వచ్చింది. కనకనె రుముర్ అన్న తమ ప్రత్యేక నృత్యపద్ధతి నిడిచిపెట్టి నర్తడీగాయకుల బృందం ఆ ధోరణి అవలభించింది అయితే దానిలో కొంత రుముర్ ధోరణికూడా లేకపోలేదు. కానీ అది అంతా అసభ్యతతో నిండినది.
తమలపాకుల జంగిడి ముందుంచుకుని ప్రాధ వారందరిమధ్య కూర్చు న్నది. నితాయీ కేసి తిరిగి “బాబూ, నీవు కూడా మొదలుపెట్టు మరి!” అన్నది.
నితాయీ నవ్వాడు. అయితే అతడు వంతగాయకులతో గొంతు కలప లేదు. మొట్టమొదటిపాట పూర్తికాగానే నర్తకీబ్బందం రవంత విశ్రాంతి తీసుకున్నది. వెంటనే నితాయీ లేచి నిలుచున్నాడు కవిగాయకుని వైఖరిలో కండువా నడుముచుట్టూ బిగించుకుని చేతులు రెండు జోడించాడు.
“నా విజ్ఞప్తి ఒకటి చిత్తగించండి!”
సభలో నలువైపుల ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
“బపూనా?”
088 + కఖి నవల
“క్తూర్తో కూర!”
“వియ్! నితాయీ!”
అంతలోనే ఒక రసికుడు అందుకున్నాడు.
“శల గొరిగించుకుని కూర్చో! తల గొరిగించుకోగ
ఆకస్మాత్తుగా ఆ కలకలం అంతా అణిగించివేస్తూ రాజా హుమ్మని హుంకరించి “అంతా నిశ్శబ్ధంగా ఉండండి! నిశ్శబ్దం!” అని హెచ్చరించాడు.
“ఆయ్!” అని విప్రపదుడతనికి వంతవాడాడు.
సభలో అంతట నిశ్శబ్దం వ్యాపించింది నితాయీ ఆ సమయంలో “తమ సన్నిధిలో నేనొక పదం పాడాలని అనుకుంటున్నాను” అన్నాడు.
“మొదలుపెట్టు ఉస్తాద్, మొదలుపెట్టు!” రాజా కంరస్వరం!
నితాయీ పాట అందుకున్నాడు. ఎమమచెయ్యి చెక్కిలిమీద ఆనించి, కుడిచెయ్యి ముఖాని కెదురుగా ఉంచి రవంత ముందుకు పంగాడు.
“ఆహా! పిలుకు పత్తిపూవు సోయగమంతా దాని కావిరంగే!
ఓ సఖీ, దాని సౌందర్యం తిలకించావా[”
ఆ విధంగా ఆపాట మొదటిచరణం ముగించిన పిదప, రెండవనారి తిరిగి అదే చరణం అందుకోకమునుపే నితాయీ చేతితో తాళంవేసి చూపిస్తూ ఏజద్రిగో, ఇలాగ, ఇలాగ వాయించు!” అని తబలా వాయించే వ్యక్తికి నిర్దశించి మళ్ళీ పాడడం ప్రారంభించాడు.
“వట్టి కావిరంగే! ఒక్క చుక్కయినా తేనె లేదు!
చెట్టంతా గట్టిగట్టి వాదిముళ్ళు!
సీ మనస్సు దాని దరిదామానికి కూడా పోనీయకు!”
నితాయీ గొంతు తియ్యనిదేకాక నిండైనది. అది త్రుటికాలంలో శ్రోతల నాకట్టుకోగలదు! ఆనాడలాగే జరిగింది (శ్రోతలు సామాన్యంగా “గ-గోవు-” వంటి తమాషాపాటల కద్దు చెబుతారు. కాని ఇప్పుడు అతడెత్తుకున్న పాటలో చూచాయగా నయినా అటువంటి ధోరణిలేదు. కనక అందరు వీనులొగ్లి ఏనడం (ప్రారంభించారు,
“వాహ్వా ! ఉస్తాద్! ” గట్టిగా గొంతెత్తి అభినందించాడు రాజా, వనుమతి చలనాని శ 809
“చాలా బాగుంది!” అన్నాడు విఫప్రపదుడు.
“బ్లాగు బాగు! ఉస్తాద్! బాగుంది!” అన్నాడు బనియామామ- జనం కూడా “సెహబాష్” అని అభినందించారు.
నితాయీ ఉత్సాహావేశంతో రవంత నృత్యం కూడా (మారంభించాడు. ఒకసారి నలువైపుల పరిశీలించాడు. అతని పెదవిమీద చిరునవ్వు చెంగలించింది. రాజా వెనకాలే అతనిభార్య కూర్చున్నది. ఆమె వెనకాల చిన్నరాణి! ఆశ్చర్యవిప్పారిత నేత్రాలతో ఆమె అతనివైపే చూస్తున్నది. అంతేగాని గొంతెత్తి అభినందించలేదు.
ఒకవేళ ఆ చిన్నరాణి వేళాకోళంగా అలాగ కూర్చున్నదేమో అనుకున్నాడు నితాయీ. మరుక్షణంలోనే తనపాట మరిచిపోయాడు! నిజానికి చిన్నరాణ్ అతని నేమాత్రం అవ హేళదృష్టితో చూడలేదు. అతనిమిద గౌరవం అంతా అంతర్యంలోనే అణిగించివేసుకుని కూర్చున్నది. అయితే అతడంతలోనే ఆ పాటలో తరువాత వచ్చేమాటే మరిచిపోయాడు!
అదే సమయంలో తగినంత అవకాశం లభించిందని డోలువాలా రెట్టిం చిన ఉత్సాహంతో డోలు వాయించటం మొదలుపెట్టాడు. కాని “తాళం తప్పిందిక్కడ!” అని హెచ్చరించాడు. నితాయీ క్షణంలో పాట ఆపి, చేతితో తాళం తిరిగి తిన్నగా అందుకున్నాడు. అటుపిమ్మట హుమ్మని రాగాలాపన ప్రారంభించి పాట మొదలుపెట్టాడు.
“పళ్ళు పండదు పత్తి!
అందానికి బదులు అందవికారమే దాని రూపంలో!”
అలాగ పాడుతూనే అతడు తిరిగి నృత్యం ప్రారంభించాడు. పైచరణం అందుకుని పాడడానికదే అవకాశం. నృత్యం చేస్తూ వెనక్కితిరిగి వేదికవైపు చూశాడు. బృందంలోని యువతులు కొందరు చిరునవ్వులు వెలువరిస్తున్నారు. ఒక్క వసంత నేత్రాలలో మాత్రమే చురకత్తివాడి అంచు తళతళ! నితాయీ ఆమెకేసి చూస్తూనే తిరిగి పాట మొదలుపెట్టాడు
“తనవెలకే, తగినవెలకే
ఆమ్ముడువోవును పూవు! 00 4 కవి నవల
ఒదిగి ఒదిగి గళమాలికలో
వేలాడును పూవు”
అదే సమయంలో నితాయీ వసంతల చూపులు ఒండొంటితో మేళ వించాయి! ఆమెకొక్కమారుగా కోపం తలకెక్కింది! తటాలున లేచినిలుచుని ప్రాధతో చెప్పింది.
“నేను వెళ్ళిపోతున్నాను పిన్నీ” సిలుకుపత్తి పువ్వుమీది పాట అంతా ఆమూలా[గ్రంగా ఆమె కవగతమయింది!
“ఎక్కడికి!”
“ఇంటికివెళ్ళి నిద్రపోతాను"
“నిద్ర వస్తూందా[”
“అవును[ో
“నికేమైనా మతిగాని పోయిందేమిటి? కూర్చో!”
“కూర్చోను! ఇంక నేనిక్కడ పాట పాడను! కోతి నృత్యం చేస్తున్న చోట నేను నృత్యం చెయ్యను!”
బాగా గట్టిగానే వారిద్దరిమధ్య సంభాషణ జరిగింది. నితాయీ ఆశ్చర్య పోయాడు (పేకకులలో చాలామంది “ఏయ్! తగ్గు! తగ్గు!” అని కేకలా రంభించారు.
రాజా కోపావేశంతో తటాలున లేచి నిలబడి, “ఏమిటిది?” అని గద్దిం చాడు!
వసంత ఎవ్వరికి సమాధానం చెప్పలేదు! ఒక్కసారి తల వంకరగాతిప్పి, కేవలం నిర్లక్షవైఖరితో ఒకచూపు విసిరి వేదికమీది నించిదిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. నలువైపుల ఒక్కటేగోల! కొందరు నితాయీమీద ఆగ్రహించి కకలారంభించారు. మరికొందరు సొమ్ము తీసుకుని అమ్ముడుపోయే హీనవేశ్య దురహంకారం గమనించి మండిపడి ఇష్టంవచ్చినట్టు తూలనాడారు! అయితే వారెవ్వరి మాటలు ఆమె ఆవంతయినా లక్ష్యపెట్టలేదు! ఎదురుగా నిలబడిన మనుషుల కేసి చూసి, “నన్ను పోనియ్యండి! తప్పుకోండి! ” అని హెచ్చరించింది.
ఆ మనుషులు ఆమెకు దారి ఇవ్వకమునుపే, వెనకనించి తొందరగా వసుమతి చలనాంని ఛ 91
నడిచి వచ్చి ఎదురుగా నిలిచి దారికద్దుపడి సవినయంగా నిలుచున్నాడు నితాయీ. చేతులు జోడించి నవ్వుముఖంతో నెమ్మదిగా వేడుకున్నాడు. “నావల్ల పొరబాటే జరిగిపోయింది. వెళ్లవద్వ! మన్నించవలసిందని కోరుతున్నాను"
వసంత బదులుపలకలేదు. కాని తిరిగివచ్చి వేదికమీద కూర్చున్నది. గొడవంతా పూర్తిగా తగ్గిపోగానే లేచి నిలిచి పాట ప్రారంభించింది. అది చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసినపాట. తగుమనుషులున్నచోట అశ్లీలగేయాలు మొదలుపెడితే బాగుండదు. కనకనే వసంత తన గేయభాండారంలోనించి ఆ గీతిక ఎన్నికచెసింది. ఆమెకు అటువంటివాట లెన్నోవచ్చును. ఆ గీతకలంటె వసంత చెవికోసుకుంటుంది. 'పైగా అది నృత్యలయకెంతో అనువైనవాట,.
అదే పాదడం మొదలుపెట్టింది.
“యుమరుమర్తుమమని అదిగో!
(మోగినది నగారా!
చరణనూపురము లాగకనె సం
చలించె నౌరా!
రావే, సకియా, రా!
నీరు నేలపైవంచి, నీ కడవ నడుముపైనుంచి,
రావే, సకియా, రా!
వేకువ సలసలవేగి! రాతిరి తెలతెలవారె!
రావే, సకియా, రా!
చరణనూపురము లాగకనే సంచలించెనౌరా!
రుమరుమరుమమని అదిగో,
(మయోగినది నగారా[”
వెనువెంటనే ఆ రుమరుమ పదాలతోనే ఆరంభమయింది నృత్యం. సభ సభ అంతా నిశ్చలమయింది! ఆఖరికి కృద్దుడై విజృంభించిన రాజా కూడా ముగ్గుడయినాడు! వసంత చాలా చక్కనిది. గొంతు కమ్మనిది. చురకత్తి అంచులా నిశితంగా మారుమోగిన నిందైన పెనుసవ్వడి! ఆపైన ఆమె తన గానంలోను, నృత్యంలోను సంపూర్ణంగా లీనమైపోయింది! ద్రుతద్రుత 92 4 కవి నవల
తరగతులతో గానం, నృత్యం ముగించి వసంత ఒకక్షణంలో పరిపూర్ణ విరామంలా నిశ్చలంగా నిలుచున్నది. అదే నిమిషంలో సభలో అంతట “వహవ్వా! వహవ్వా!” అన్న అభినందనల పరంపర భోరుమని మారుమోగింది! నలువైపులనించి బహుమతుల వర్షం కురిసింది! కాసులు, అణాలు, రెండణాలు, పావలాలు విరివిగా పడ్డాయి. ఆ నాణాలలో రెండర్ధలు కూడా ఉన్నాయి. దుకాణదారుడు ఘనశ్వామదత్తు ఒక రూవాయి బహూకరించాడు. వసంత కా బహుమతులవైపు చూడడానికి వ్యవధేలేదు! ఒళ్లంతా చెమట పట్టింది. గుండె తిత్తిలా గుబగుబ కొట్టుకుంటున్నది. పసుపుపచ్చనిముఖం రక్తం కమ్ముకున్నట్టు ఎ(ర్రబడింది. ప్రాఢ స్వయంగా ఆ బహుమతులన్ని పోగుజేసుకున్నది.
“మరోసారి! మరోసారిగొ నలువైపుల నించి కేకలు వినిపించాయి! నితాయీ వసంతకేసి చూశాడు. వారిద్దరికళ్లు కలుసుకున్నాయి! అతడు నమస్కరించి మనసారా అభినందించాడు!
ప్రాఢధ వసంత ఒంటిమీద చెయ్యివెసి “నృత్యం వ్రారంభించు!” అన్నది. వెనువెంటనే మిక్కిలి కంగారుపడి “ఇదేమిటి వసంతా! ఒళ్లు ఇలాగ కాలిపోతున్నది!” అని ఆశ్చర్యపడింది.
వసంత నవ్వుతూ “కొంచెం మద్యం ఉంటే ఇవ్వు!” అని అడిగింది.
బాగా పక్కకి తప్పుకుని ఆమె ఆ మద్యం సీళ్లు కలపకుండానే సేవించి, తిరిగి వేదికమీదికి వచ్చి నిలబడింది. కాని మొదట కనిపించినంతటి గతి లాలిత్యంకాని, ఆవేశంకాని ఆ నృత్యంలో కొంచెం కూడా కానరాలేదు! పైగా మాటిమాటికి ఆయాసపడింది ఆయా గతులలో బడలిక విస్పష్టంగా గోచరిం చింది. పాట ప్రారంభించినా బాగా పాదలేకపోయింది. వంత గాయకులే ఆమె వొట అందుకుని ముగించారు. ఆ మిగిలిన భాగంనించి నృత్యం పూర్తిచేసి తడబడుతున్న అడుగులతో ఆమె వేదిక దిగి ఇవతలికి వచ్చింది. వసంత పడినశ్రమకు ప్రతిఫలం దక్కలేదు. ఎవ్వరు పెదవి కదిపి అభినందించలేదు! నృత్యగానాలతో సరిపోలిస్తే ఆ బహుమతులన్ని కలిసినా తృణప్రాయాలె! ఆమెకడ్డుగా నిలబడినవారు రవంత తప్పుకుని దారి ఇచ్చారు. అంతె! వసంత నసుమతి చలనాని ఉ 93
ఆ బహుమతుల సంగతిగాని, వారిసంగతిగాని ఆవంతయినా లక్ష్యపెట్టకుండా చర్రున దూసుకుపోయింది!
“చూడుబాబూ, ఎంతటి తిక్కమనిషోగ” అన్నది ప్రొాఢ నితాయీతో.
అతడు కూడా వెలుపలికి వెళ్లిపోయాడు వసంతకోసం నలువైపుల పరిశీలించాడు. నిజానికి ఆమె దగ్గిర తాను పూర్తిగా ఓడిపోయినట్టు భావించు కున్నాడు నితాయీ. పలుకుపత్తిపువ్వుతో సరిపోల్చి ఆ సుందరిమీద గేయం రచించడం చాలా అన్యాయమే. అన్యాయమే కాదు. పెద్ద అపరాధం కూడా. ఆ కొత్తపాటలో వెరొకచరణం నితాయీ మనసులో జుంజుమ్మని మారు (మోగింది. ఇంతకి వసంత ఎక్కడికి వెళ్లింది?
ఆ దగ్గిరలో చెట్టుకిందే నర్తకీబ్బందం తన వసతి ఏర్పరుచుకున్నది. ఆ చెట్టు కింద ఒక వ్యక్తి చాపమిద కూర్చున్నాడు. అతడు ఆ బృందంలోని వారందరికన్నా మహాబలాధ్యుడు. దున్నపోతులాగుంటాడు. అటువంటిదే శరీరచ్భాయ. ఎర్రని కళ్లు. మూగలాగ నోరు కదపడు. దప్పికగొన్నదున్న సీరు తెగతాగినట్టే అదేపనిగా మద్యం సేవిస్తాడు. పగలంతా నిద్రపోతూనే ఉంటాడు. రాత్రికాగానే అతగాడి జాగరణం ప్రారంభమవుతుంది. ఒక మంట కెదురుగా కూర్చుని దాని వెలుగులో బృందం సామానులన్నీ కాపలా కాస్తుంటాడు. నితాయీకి ఆ పరిసరాలలో కూడా వసంత కనిపించలేదు. వెన్నెలలో నలువైపుల దృష్టి ప్రసరింపజేశాదు. ఇదేమిటి? అతని ఇంటిగుమ్మాని కెదురుగా ఎవరో కొందరు నిలుచున్నారు? ఎందుకలాగ నిలుచున్నారు? అతడు అక్కడికి నడిచివెళ్లి ప్రశ్నించాడు.
“ఎవరు మీరు?”
“మ్పేమ్రే!”
నితాయీ గుర్తించాడు. వ్యాపారి కాసెద్సేఖ్ కుమారుడు నయాన్సేఖ్తో బాటు అతని నావాసగాళ్లు.
“ఎందుకని ఇక్కడ నిలుచున్నారు!” అడిగాడు నితాయీ,
“ఆ పిల్ల మీ ఇంటిలో దూరింది!”
“అలాగా! అయితే మీరిక్కడ నిలుచున్నారెందుకని?” రగ ఈ కవి నవల
ఆ బృందం బృందం అంతా పకపకనవ్వింది.
నితాయీ కస్సుమన్నాడు.
“దిండి మీరంతా ఇక్కడినించి! లేకపోతే చాలా గొడవవుతుంది తెలు సునా? నేను రాజాని పిలుస్తాను! ఆ పైన కానిస్టేబులున్నాడు! అతన్ని కూడా పిలునాను! జాగ్రత్త!”
అయితే నయాన్సేఖ్ నితాయీని అంతగా లక్ష్యపెట్టలేదు! కాని రాజా అంటే అతనికి బాగా బెదురు! అయినా ఒకమాట అనకుండా విడిచిపెట్టలేదు!
“కొంచెం నా మాటవినండి నితాయీ! మీకేమయినా బహుమతి ఇస్తాను!”
నితాయీ అతనికేసి బాగా అవహేళనగా చూసి, ఈసడించుకుని తలుపు తెరిచి లోపలికి వెల్లి గట్టిగా గడియ బిగించాడు. అయితే వసంత ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడలేదు! లోపలిగది తలుపు బిడాయించి ఉంది. గట్టిగా తోశాడు, అవును లోపల గొళ్లెం పెట్టి ఉంది! నితాయీ పిలిచాడు.
“జ్బద్రిగో! వసంతా! నేను! నేనుగొ
కవరు?”
జన్ఫ్ బొగ్గులమణిని!”
“ఎవరు? ఉసాదా?”
“ఉస్తాద్ అన్నా సరే, ఫోస్తాద్ అన్నా సరే! నేనే!”
ఈసారి తలుపు తెరుచుకుంది నితాయి లోపలికివెళ్ళి చూశాడు. వసంత నితాయీ పరుపుమీదే హాయిగా పడుకుంది.
“కలుపు గడియ పెట్టండి!” వసంత అన్నది.
“వీధి తలుపు గడియవెశాను”
“ఎవరన్నా గోడదూకి లోపలికివస్తారేమో! గడియపెట్టండి!”
వసంత పెదవి మీద ఒడలిన విచిత్రమందహాసం.
నితాయీ ఆమె నుదుటిమీద చెయ్యివేసి, బాగా కంగారుపడ్డాడు.
“జదెమిటి? ఇంత జ్వరంగా ఉందేమిటి?”
“కాస్త కణతలమీద రుద్దుతారా?”
నితాయీ నవ్వుతూ ఆమె కణతలమీద రుద్దుతూ కూర్చున్నాడు. వసంత వసుమతి చలసాని + 905
నవ్వింది.
“పీరు ఫోస్తాడ్కాదు! మాంచి ఉస్తాదులు! పాటలు చాలా బాగున్నాయి. మేరు రచించినవేనా?”
“వును నేను రచించినవే! కాని ఇకముందు ఈ పాటలు పాడను"
“ఎందుకని?” వసంత కళ్లుమూసుకుని అడిగింది.
“అదంతా నా పొరబాటు?”
అమె సమాధానమేమి చెప్పలేదు! చిన్నగా నవ్వింది.
“మళ్లీ ఒక కొత్తపాట అల్లాను రవంత రాగలాపనతో అతడాపాట అందుకున్నాడు.
“పరిమళముతో నింపి మనసు మత్తిలజేసె!
కరకురంపపు ముళ్ళ ముసుగులో మొగలి!
పొరబదితినిది నేను అరయలేకక్కటా! -”
వసంత పెదవి మీద మృదుల మందహాసం చేసింది. “ఆపైన?” అని (ప్రశ్నించింది.
“ఆపైన పాట ఇంకా రాయలేదు"
“పూర్తిచేసి అది నాకు రాసి ఇవ్వండి!”
“రాసి ఇవ్వడమెందుకు? అదిగాని పొడతారా?”
“జవను, పాడాలని ఉంది”
కిటిరీలోనించిచూస్తూ అన్నాడు నితాయీ,
“క్కవేళే పూర్తి చేస్తాను! ఏవరు? ఎవరువారు? కిటికీపక్కనించి చల్లచల్లగా జారివోతున్న వారెవరు చెవ్మా”” వసంత నవ్వింది.
“ఇంకవ్వరు? ఆ కుర్రవాళ్ళమూక”
అయితే నితాయీ ఆ మాట నమ్మి మాట్లాడకూరుకోలేకపోయాడు. తొంద రగా వెళ్ళి ఆ కిటికీ పక్కనే నిలుచున్నాడు. చూడగానే అతని కంతా అవగత మైంది. ఆ అవును.. అ పాలవెన్నెలలో ఒక వ్యక్తి రైల్వే లైను కేసి నడిచి పోతున్నట్టు కనబడింది. తొందరతొందరగా కదిలిపోతున్న తెల్లతెల్లని రెల్లు పువ్వవంటి మనిషి శిరస్సుమీద ఒక్క బంగారుచుక్క మాత్రమ లేదు! అంతే! ఆమె చిన్నరాణి! 96 ఈ కణి నవల
18
తేటవెన్నెల తెల్లదనంలో త్వరితంగా నాగిపోతున్న రెల్లుపువ్వు క్రమ క్రమంగా లీనమైపోతున్నట్టు పొడకట్టింది. నితాయీ నిశ్చేష్టితుడై కిటికిపక్కనే నిలుచుండిపోయాడు. అతని నేత్రాలలో అర్ధశూన్యమైన నిశ్చలదృష్టి మనసులో ఒక దారి తెన్నులేని అస్పష్టభావాలు. శరీరానుభూతివల్ల హృదయంలో ఒకే గంభీర వ్యధ! అతడొక్కమారుగా నిశ్చలశిలలా మారిపోయాడు. ఆ విశాల థవళకౌముదీ మధ్యలో చిన్నరాణి అదృశ్యమై పోవడంతో అతని జీవితంలో సమస్తం ఒక్కసారిగా హరించుకువోయినట్టయింది.
అతని ధోరణి గమనించి ఆస్పైరిణి ఒంట్లో బాగుండకపోయినా ఎంతో ఉత్కంఠతో లేచి కూర్చున్నది! ఆమె జీవితాలను అవగాహన చేసుకునే తీరు అత్యంత అద్భుతమైనది. అధమశ్రేణి వేశ్య అయినా అర్దరాత్రులు జరిగే కదలికలను సూక్ష్మదృష్టితో అర్ధం చేసుకోగలదు. లేచి కూర్చుంది వసంత. ఇంతకు మునుపు వచ్చినవాళ్ళే మరికొంతమందితో కలిసి ఇంటిచుట్టూరా తిరుగుతున్నారని, వారిలో తనమీది వ్యామోహం మరింతగా పెచ్చుపెరిగి వుందవచ్చునని ఆమె ఊహించుకున్నది! పైగా ఇంటి మీద విరుచుకుపడాలని ఆలోచిస్తున్నారని కూడా అనుమానించింది. మరింతగా కంగారుపడి గొంతు బాగా తగ్గించి “ఎమిటది?” అని అడిగింది.
నితాయీ సమాధానం చెప్పలేదు. అతడలాగే కేవలం శిలామూర్తిలా నిలుచుండిపోయాడు. చిన్నరాణి కోపం ఎటువంటిదో అతడెరుగును! వెడుతూ వెడుతూ ఆమె ఆగి, వెనుదిరిగి నిరీక్షించింది.
“ఎప్పటిలాగ నన్ను పిలుస్తారు! పిలిచాక వెడతాను!” అని ఆలోచిస్తుంది! అదే ఆమె కోపం దోరణి! ఈవేళ అలాగ నిలబదకుండానే వెళ్ళిపోయింది! ఆవేళ ఈరాత్రి ఒంటరిగానే వెళ్ళిపోయింది! అర్దరాత్రివెళ నిశ్శబ్ద ధవళచంద్ర కాంతిలో ఒక్కత్తే వెళ్ళిపోయింది. స్టబ్బుడై నిలిచిన నితాయిని చూసి గ్రహించి వేసింది వసంత.
వసంత లేచి, నితాయీ పక్శనే నిలబడి జ్వరంతో కాలిపోతున్న చేతితో అతని చెయ్యి పట్టుకుని “ఎక్కడ?” అని అడిగింది. రూపంలో, గుణంలో వసుమతి చలసాని + 97
క్షురధారవంటి ఆ స్వేచ్చాచారిణి ముఖంలో, ప్రజ్వలిస్తున్నట్టున్న పెద్ద పెద్దకళ్లలో అంతులేని బడలిక! గంభీరాందోళన! నితాయీ ఆమెవైపు నిశ్చలంగా చూసి, స్నేహార్ధతను పంచకుండా ఉండలేకపోయాడు! ఎంతో ఆప్యాయతతో అల్లన నవ్వి శిరస్సుమీద, నుదుటిమీద నిమురుతూ అన్నాడు.
“ఇంత జ్వరంతో లేచావెందుకు వసంతా! వెళ్లి పడుకో! ఓహ్! ఒంటిమీద వడ్డుచల్లితే పేలాలయ్యేటట్టుంది! ఎంతవెడి!”
“కత్తులు, కర్రలు పట్టుకుని రౌడీలు ఇంటిచుట్టూరా తిరుగుతున్నారా!”
“ర్రాడ్రీలేమిటి”” నితాయీ ఆశ్చర్యపడి అడిగాడు.
వసంత ఊహాంచలంలోకి ఆవంతయినా చొచ్చుకుపోలేకపోయాడు నితాయీ! ఈమారు ఆమె ముఖంమీద బొమముడి తిరిగింది. ఒరలోనించి పదును గల కత్తి తళతళలాదినట్టు వసంత చూపులు మెరుస్తున్నాయి. నెమ్మదిగా అడిగింది.
“అయితే ఎవరలాగ వెళ్ళారు! మీరేమి చూశారు?”
ఈసారి నితాయీ క్షణంలో ఆమె ఆందోళనకు కారణం, ఆలోచనాధోరణి పసికల్టీ నవ్వాడు.
“కాదు! వాళ్లెవళ్లు కాదు! భయమేమిలేదు! వెళ్లిపడుకో!” అతడామె చెయ్యి పట్టుకుని లాగాడు.
“ఎవరలాగ వెళ్ళారు? ఎవరికేసి చూస్తున్నారు? ఎవరన్నా తొంగి చూశారా? ఎవరు వారు?”
“ఎవరో మరి! నేను తిన్నగా గుర్తుపట్టలేక పోయాను!”
“గుర్తుపట్టలేదా?”
“ల్రేద్రు[”
“అయితే సమస్తం హరించుకుపోయినట్ట అలాగ నిలుచుండి పోయా రెందుచేత?”
చీకటిలో కూడా వసంత నిశితదృష్టి తఠతళమెరిసింది.
నితాయీ మరి సమాధానం చెప్పలేదు? శుష్కదరహాసంతో ఆమెవైపలాగే చూసూ నిలుచుండిపోయాడు. 08 4 కవి నవల
అక్కస్మాత్తుగా వసంత కిలకిలనవ్వింది! తీవ్ర త్వరితహాసమది! ఆపైన (ప్రశ్నించింది.
“అయ్యో! నా కళ్లు గుడ్డివైయాయే! నెనెంతటి తెలివితక్కువదాన్ని! ఆ తొంగిచూసిన వారి నెత్తిమీద ముసుగుంది! అవునా? ఓ! ఆపైన నన్నుచూసి”
అమె మళ్ళీ అదేవిధంగా విరగబడి కిలకిలనవ్వంది! నితాయీ ఆపాద మస్తకం స్తంభించిపోయాడు! వసంత అలాగ నవ్వుతూ నవ్వుతూనే తలుపు గడియతీసి వీధిలోకి వెళ్లిపోయింది!
“వసంతా! ఓ వసంతా!” నితాయీ పిలిచాడు.
“వసంతకాదు! మొగలిపువ్వు! మొగలిపువ్వు! చేతితో పట్టుకుని లాగి కోస్తే రంపపుముళ్లతో ఒళ్లంతా చీరివేస్తుంది!” వీధిలోనించి సమాధానం వినవచ్చింది.
నితాయీ అప్పటికి ద్వారం వెలువలే నిలుచున్నాడు.
వేశ్య ఆ క్షణంలో కాసేద్సేఖ్ కుమారుడు నయాన్సేఖ్తో మాట్లాడు తుంది,
ఆ పరిస్థితిలో తిరిగి పిలవలేకపోయాడు నితాయీ. సంకోచం అడ్డు పడింది. తన ఇంటిగుమ్మం దగ్గిరే నిశ్చేష్టితుడై నిలుచుండిపోయాడు. స్టేషన్ సమీపంలో వేదికమీదనించి సంగీతం వినబడుతూంది. వెన్నెల వెలుతురు చెట్లకొమ్మలలో నించి ప్రసరించి అక్కడక్కడ తళతళలాడుతుంది. ఇటువైపు ఎక్కడ జనసంచారం లేదు. పడమటిదిక్కున చందమామ అస్తమిస్తున్నాడు. తూర్పుదిక్కున చీకటి పేరుకుంటుంది. వేశ్య వసంత కెక్కడ ఎమాత్రం సిగ్గు, లజ్జ లేదు! కిలకిలనవ్వుతూ, మధ్య మధ్య కలబుర్హాడుతూ నయాన్సేఖ్తో కలిసి తూర్పువైపు అంధకారమధ్యంలో మాయమైంది? నితాయీ ఆకాశం కేసిచూస్తూ ఒంటిరిగా నిలుచున్నాడు. అలాగ నిలుచున్న సమయంలో అతని పృాదయంలో ఒక కొత్తవాట జుంజుమ్మని మారుమోగింది. భగవానుడు మానవుని మనసుతో ఎంతటి మజా అయిన నాటకమైనా ఆడగలడు! ఒక సంఘటన జరుగుతుంది. మానవుడు తన పొరబాటువల్ల వేరొకటి సందర్శి స్తాడు! చిన్నరాణి వసంత కేసిచూస్తూనే తటాలున కదిలివెళ్ళిపోయింది! వసంత వసుమతి చలనాని + 99
చిన్నరాణిని చూసి తటాలున వీధిలోకి వెళ్ళిపోయింది! లోలోపల రాగాలాపనతో అతడదే సంఘటన మీద ఒకపాట రచించడం (ప్రారంభించాడు.
“వక్రమార్షవిహారి! ఓ హరి!
నీ హృదయమే వంకరగదా!”
నితాయీకి ఈ సంఘటనలో ఆ దైవ నిర్దితమైన ఖేలనమో, లేక వేళాకోళమో గోచరించింది! ఈ క్రూరపరిహాసం కూడా అస్పృశ్యకులంలో తన జన్మవంటిదే! ఆ పాట ఆలోచిస్తున్న తరుణంలో అతడొక్కమారు ఆ భగ వానుని సంస్మరించకుండా ఉండలేకపోయాడు.
తెల్లవారేవేళ రాజా వేసీన కేకతో అతనికి నిద్రాభంగమైంది. నితాయీ ఇంటిలో కూర్చుని ఆ పాట రచిస్తూ రచిస్తూ అలాగే నిద్రించాడు. తెలివిరాగానే మొట్టమొదటగా అదేపాట అతని హృదయంలో మారు(మోగింది.
“వక్రమార్గవిహారీ! ఓ హరీ!
నీ హృదయమే వంకరగదా!
కుటిలకౌతుకంతో నీవాఘటన సంఘటన
కూర్చకుండ ఉండలేవుగదా!”
మళ్లీ రాజా పిలుపు ప్రారంభమైంది. క్రమక్రమంగా అతని గొంతు పెచ్చుపెరిగిపోయింది. ఏదో విషయం మీద కొత్తగా అభినందించడానికని రాజా తలుపు దగ్గిర నిలిచి ఉండవచ్చునని నితాయీకి తోచింది. అతడింక అగలేకపోయాడు. స్వభావసిద్ధమైన మృదుమందస్మితంతో తలుపు తెరిచాడు. ద్వారం అవతల నిలుచున్నాడు రాజా. అతని వెనకాల నర్తకీ గాయక బృందం నాయకురాలు ప్రౌఢ! రాజా తిన్నగా ఇంటిలోకి వచ్చి నలువైపుల చూస్తూ ఎంతో ఆత్రంగా ఎవరినో వెతుకుతున్నట్లు కనిపించాడు.
నితాయీ నిర్హాంతపడి “ఎమిటది?” అని అడిగాడు.
“ఎక్కడ? ఉన్తాద్ భార్య ఎక్కడ ఉన్నట్టు?”
“ఉస్తాద్ భార్యా?”
పకపక నవ్వాడు రాజా,
“ఉస్తాద్, అంతా తెలిసిపోయిందిలే! అంతా తెలిసిపోయింది! నిన్నరాత్రి-” 1004 కవి నవల
మళ్లీ పకపకనవ్వుతూ ముగించాడు రాజా. అంతేగాని ఆ మాటే పూర్తిచెయ్యలేక పోయాడు.
అప్పటికి కూడా నితాయీకి అసలు సంగతేమిటో బోధపడలేదు!
ప్రాధ అతనికిది వివరించి చెప్పింది. అంతవరకు ఆమె ద్వారం దగ్గిరే నిలబడింది. అటుపిమ్మటే లోపలికివచ్చి అన్నది.
“అయ్యో! వసంతా! ఇంకా తిరిగిరాలేదేమిటే! మేమంతా ఈ బండికే వెళ్ళి పోతున్నామే!”
“ఆమె ఇక్కడలేదు!” అన్నాడు నితాయీ.
“లేదా? లేకపోవడమేమిటి? వేదికమీది నించి దిగి నీతోనేకదా కలిసి వచ్చింది! అంతకుమునుపే కదా నీతో నేను మాట్లాడాను! ఆ తరువాతనించి వెతుకుతూనే ఉన్నాను! నీతోనే కలిసి వెళ్ళిందని విన్నాను. మీ ఇంట్లోనే... ౫
నితాయీ సమాధానం చెవ్పాడు.
“ఏవరో గొడవచేస్తున్నారని మా ఇంటికి వచ్చిందట! నేను లోపలికి వెళ్ళీ చూసేసరికి పడుకుని ఉంది! ఒళ్లంతా జ్వరంతో పేలిపోతూంది! కాని మరికొంత సేపటిలోనే ఆ గొడవచేస్తున్న మనిషితోనే కలిసి వెళ్లిపోయింది!”
ప్రౌఢ ఆలోచనలో పడింది. రాజా వాస్యధోరణి అంతా మటుమాయ మైంది! నితాయీ మళ్ళీ మొదలుపెట్టాడు.
“కాసేద్సేఖ్ కుమారుడు నయాన్సేఖ్తో కలిసి వెళ్లిపోయింది! ఆ పొదవంటి మర్రిచెట్టు నీడకిందికి వెళ్లింది మరి, రండి, ఒకసారి అటుకేసి వెళ్లిచూద్దాం రండి!”
అందరూ అటుకేసివెళ్లారు. వసంత వారికక్కడ కనబడింది. అయితే ఆమెకే కోశానా ఒంటిమీద స్పృహేలేదు! దుస్తులు చాలావరకు తొలగి పోయాయి.
మర్రిచెట్టునీడ దట్టంగా పడినంతమేర నేలమీద బొత్తిగా గడ్డిమొలవక అది అంతా శుభ్రంగా తుడిచి బాగుచేసినట్టుంది. అక్కడే వట్లినెలమీద ఒకచోట వసంత గాధనిద్రలో నిశ్చైతన్యంగా పడి ఉంది ఆమె కేశరాశి అటు, ఇటుపడి జీరాడుతూంది. ఒంటినిండా దుమ్ము అంటుకుంది. ముఖంమీద కొన్ని వసుమతి చలనాని + 101
దోమలు, ఈగలు ఎగురుతూ జుంజుమ్మని ధ్వని చేస్తున్నాయి. పక్కనే ఒక పానపాత్ర ఖాళీగా పడి ఉంది. దానిపక్కనే ఫలహారం చేసిన తరువాత మిగిలిన విస్తరాకు. ఆమె దగ్గిరికి వెళ్లగానే దేశవాళీ మద్యం వాసన గుప్పుమన్నది!
“వసంతా! వసంతా! చిట్టచివరికి ఎప్పుడో ఒకనాడు ఇలాగే చచ్చిపోతావె, దౌర్భాగ్యురాలా!” ప్రాఢ అన్నది.
“ఒంటిమీద బొత్తిగా స్మారకం తప్పిపోయినట్టుందే!” రాజా నవ్వుతూ అన్నాడు.
నితాయీ వెంటనే అక్కడినించి వెళ్లిపోయి మరికొన్ని క్షణాలలోనే వేడివేడి నిండు టీ కప్పుతో తిరిగివచ్చాడు. అది పాలు కలపని వట్టి టీ, దానిలో నిమ్మపండు రసం మాత్రమే కలిపాడు, అంతే, అలాంటి వట్టి టీ తాగితే మద్యపానం నిషా పూర్తిగా తగ్గివోతుంది. మహాదేవకవిగాయకుడు అటువంటి టీ తాగడం నితాయీ చూశాడు. వసంత ఆపైన లేచికూర్చున్నా అటు, ఇటు తూలుతూ కునికివాట్లు పడుతుంది.
“ఇదిగో నేను! ఏం జరిగిందో గ్రహించుకున్నావా? కాస్త ఈ టీ తాగు, నిషా వెంటనే తగ్గిపోతుంది”
టీ తాగిన తరువాత వసంత కొంచెం కుదుటపడింది. ఎరుపెక్కిన పెద్ద పెద్ద కళ్లు తెరిచి నితాయీ కేసి చూసింది,
అంతలోనే ప్రొధ తొందరపెట్టింది.
“ఇక కదిలి లేచిరా! మరి!”
“స్వానం చేస్తే బాగుంటుంది. అదీగాక ఒళ్లంతా దుమ్ము అంటుకుంది-” నితాయీ అన్నాడు.
పూర్తిగా నిషా తగ్గని వసంత కిలకిలనవ్వు సవ్వడితో అతనిమాట లింక వినబడలేదు! ఆమె తూలుతూ తూలుతూ లేచినిలబడి నితాయీ ఆదురుగావచ్చి, బొంగురు గొంతుతో అడిగింది.
“కాస్త ఒళ్లు తుడుస్తారా? చూడండి, ఎలాగయిపోయిందో!”
నితాయీ ఆమె ముఖం కేసి చూసి చిన్నగా నవ్వాడు.
పైమీద తువ్వాలుతీసి వసంత ఒంటిమీద దుమ్మంతా జాగ్రత్తగా తుడిచి 102 కవి నవల
వేశాడు. ఆపైన “నేను వస్తాను మరి! నమస్కారం!” అని అక్కడినించి బయలు దేరాడు.
“బాబూ!” అంతలోనే అతనిని ప్రాఢ పిలిచింది నితాయీ వెనక్సితిరిగాడు.
“మామాట ఏంచేశావు బాబూ! అదే మా బృందంలో చేరేమాట!”
నితాయీ సమాధానం చెప్పకమునుపే ఒళ్ళిరగని మైకంలోఉన్న వసంత తిరిగి అదేవిధంగా వెర్రిగా కిలకిలమని నవ్వడం మొదలుపెట్టింది, ఆ నవ్వ మరి ఆగేటట్టు కనబడలేదు! ఆపైన ప్రౌఢ బాగా చిరాకుపడింది.
“ఇంతటి ఆపదలో ఉన్నా ఎందుకే అలాగే బొత్తిగా సిగ్గు, లజ్జ లేకుందా నవ్వుతావు! ఊపిరాడక చచ్చిపోతావె”
ఆ విపరీతమైన వెర్రినవ్వుతోనే వసంత ఎలాగో అలాగ అతికష్టం మీద సమాధానం చెప్పగలిగింది.
“ఒసే పిన్నీ నా బొగ్గులమణి మనసులో ఒక (ప్రేయసి ఉందే! నిన్నరాత్రి- హిహిహీ!- హిహిహీ! హిహిహీ! హిహిహీ-”
రాజా ఈమారు మరి చిరాకు భరించలేక ఆమె కేసి చూసి గట్టిగా మందలించాడు,
“ఎందుకలాగ పకపకా విరగబది నవ్వుతావు?”
వసంత నేత్రాలొక్కమారుగా కోపంతో జేవురించాయి! కాని మరుక్షణం లోనే ఆమె మళ్ళీ “హిహిహీ!” అని అదేపనిగా నవ్వడం మొదలుపెట్టింది!
అదేసమయంలో అనతిదూరంలో స్టేషన్లో గంటకొట్టింది. స్టేషన్ మాష్టరు తానే గంటకొడుతూ “రాజా! ఓ రాజా!” అని గట్టిగా గొంతెత్తి పిలిచాడు.
జరగరానిదేదో జరిగిఉంటుందన్న ఆత్రతతో రాజా అదేపనిగా స్టేషన్వైప్ల పరుగు పెట్టాడు!
నితాయీ నవ్వి, “మరి నేను వెడతాను” అని చెప్పి వెంటనే తన ఇంటివైపు వెళ్ళివోయాడు.
ప్రాఢ ఈమారు మిక్కిలి కరినస్వరంతో వసంతకేసిచూసి మందలించింది.
“రసంత్రా! ఎందుకే ఇలాగ ఒళ్లు తలియకుందడా తాగుతావు? నడు” వసుమతి చలసాని +* 103
ఆమె బడలికతో తడబడుతున్న అడుగులతో నదక ప్రారంభించింది. కాని వసంత నవ్వు మాత్రం కూడా ముగియలేదు! వెంటనే వెనక వున్న ప్రౌఢ కేసిచూసి చేతితో సంజ్ఞచేసి “అయితే నడు మరి పోదాం!” ఆని అరిచింది! 00౮00 నితాయీ గుల్మొహర్ చెట్టుకింద కూర్చున్నాడు. అనతిదూరంలో స్టేషన్ విడిచిపెల్టన బంది పెద్ద రాదతో అతని సమక్షంలో నించే సాగిపోతున్నది. ఒక పెట్టె తరువాత వేరొకపెట్టె! ఆ పెట్టెలలో ఒకదానిలో అతనికి రుమర్నర్తకీ గాయకబ్బందం కనిపించింది. వసంత దానిలో తలుపు పక్కనే వున్న కిటికీనానుకుని వేలాడిపోతున్నట్లు కూర్చున్నది! అద్భుతవ్యక్తి వసంత! నితాయీ నవ్వుకున్నాడు. అతడనేక నర్తకీగాయక బృందాలలో కవితాగానాలలో పాల్గొన్నాడు. కాని చురకత్తి అంచువంటి వ్యక్తి నెక్కడా చూడలేదు. వట్టి క్షురధార మాత్రమే కాదు. సాక్షాత్తు అగ్నిజ్వాల! ఆమె ప్రజ్వలిస్తున్నట్టే కనిపిస్తుంది. అయినా ఆమెలో రూపసంపత్తిగాని, గుణ సంపత్తిగాని కొరతపడలేదు. గతరాత్రి రఛచిస్తున్నపాట అతనికా తరుణంలో జ్ఞప్తికి వచ్చింది. “పరిమళముతో నింపి, మనసు మత్తిలజే సె! కరకురంపపు ముళ్ళముసుగులో మొగలి! పొరబడితి, నిది నేను అరయలేకక్కటా!” బండి వెళ్లిపోయింది. అతడలాగే నిలుచుండిపోయాడు. ఆ తరువాత ఆ రైల్వేలైను వంపులో రెండు కమ్మీలు ఒకటిగా మారిపోయినట్టున్న ప్రదేశం వెపు చూశాడు. వసంత వెళ్లిపోయిది. తిరిగి మళ్లీ ఇక ఎప్పుడు కనబడకనే పోవచ్చును. ఎంతటి విచిత్రమైనవ్యక్తి వసంత! ప్రతినిముషం ఒక్కొక్క వినూత్న రూపం ధరిస్తుంది. ఒక్క రాత్రిలో ఆమెనుద్దేశించి మూడుపాటలు ఆవిర్భ వించాయి! మరికొంతసెపటికి నితాయీ రవంత ఉదాసీనదృష్టి అవలంబించాడు. అంతలోనే ఎక్కడినుంచో ఒక చైతన్య ప్రవాహం విరుచుకుపడి అకస్మాత్తుగా 1044 కవి నవల
అతనినాక్కృమారుగా కుదిపీవేసింది! ఆ రైల్వేలైను వంపులో బంగారుబిందువు తళతళ మెరిసింది. ఆ తరువాత ఆ పైడిబిందువుకింద చలిస్తున్న రెల్లుపూవు! ఆ దృశ్యం చూడగానే అతని కళ్ళు జిగేలుమని మెరిశాయి. అసమాప్తంగా వదిలిన పాట అతనిలో తిరిగి జుంజుమ్మని మారుమోగింది.
అదే మార్గంలో అలాగే నిశ్చలదృష్టి నిలిపి నిరంతర నిరీక్షణలో మైమరచి నాడు నితాయీ.
చిన్నరాణి ఎప్పటికి వస్తుంది? ఎప్పటికి సమీపిస్తుందో? అదిగో, ఆ వస్తున్నది ఆమే, కాదు! కాదు! ఆమె కాదు! అది అతని భ్రమ మాత్రమే! మానసిక భావన మాత్రమే! ఆవైపు ఎండలో మరుభూమిలో భ్రాంతిదృశ్యాలలాగ అప్పుడప్పుడు ఏవేవో మానసికకల్చనలావిర్భవిస్తుంటాయి! అంతేగాని వానిలో వాస్తవికత లేదు! ఇప్పుడు కనిపించి మరుక్షణంలోనే మాయమైపోతాయి! నితాయీ నవ్వుకున్నాడు. ఇప్పటికి పదిగంటలు మాత్రమే అయింది! చిన్నరాణి పన్నెండుకాగానే ఖచ్చితంగా గడియారం ముల్లులాగ వచ్చివెస్తుంది!
అయినా అతని కక్కడినుంచి లేవ బుద్ధిపుట్టలేదు! చెట్టుమొదలుమీద ఆనుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. నేడు కాలం ఎంతసేపటికి కదులు తున్నట్టే కనబడడంలేదు!
అదిగో! ఆ వస్తున్నది ఆమే! ఒక తెల్లని పొడవైన రేఖ. దానిమీద ఒక చుక్క కాని ఆ రేఖ చిన్నరాణికాదు! ఆమె గమనభంగిమ వేరు, ప్రస్తుత రేఖగతి వైఖరిలో చిన్నరాణి గమనంలో ఉన్నంతవేగం లేదు! అదీగాక ఈ రేఖ అంత పొడవుగా కూడాలేదు! అది వేరొకరేఖ. చిన్నరాణిరేఖ కాదు!
నితాయీ పొరబడలేదు. ఆ రేఖలు నారీస్వరూపాలతో సమీపించాయి. వారి శిరస్సులమీద చిన్న చిన్న బిందెలు కూడా ఉన్నాయి. వారు పాల అమ్మ కానికే వస్తున్నారు. కాని వారిలో ఎవ్వరు చిన్నరాణి కానేకారు! వారిలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ప్రత్యేకత.
అయితే చిన్నరాణి ఎక్కడ ఉన్నట్టు?
చిట్టచివరికి పన్నెందుగంటల బందికూడా వెళ్లిపోయింది.
రాజా దగ్గిరికివస్తూ “ఉస్తాద్!” అని పిలిచాడు. వసుమతి చలనాని + 105
ఉలిక్కిపడి నితాయీ అల్లననవ్వి “రాజా?” అన్నాదు.
“ఇక్కడ కూర్చుని ఏమిటలాగ ఆలోచిస్తున్నావు? కొత్తపాట ఏదైనా పూర్తయిందా?”
“ఇంకా లేదు” పరధ్యానంగా ఉన్నట్టు నితాయీ చిన్నగా నవ్వాడు.
“నీ మీద నాకు చాలా కోపం వచ్చింది ఉస్తాద్!”
“ఏందుకు రాజా, ఎందుకని? నేనేమి అపరాధం చేశాను?”
“ఆ భోగంపిల్ల నీ మనసులో వున్నది. నీ హృదయంలో ప్రియురాలు. అవును కదూ...”
నితాయీ పకపక నవ్వాడు. ఆపైన రాజా చెయ్యి పట్టుకుని లాగి అన్నాదు.
“౮! కాస్త టీ తాగుదాము. ఈవేళ అసలు టీ తాగనేలేదు! చిన్నరాణి పాలు పొయ్యడానికి రానేలేదు! ఆ భోగంపిల్ల మాటలు నీవు నమ్ముతున్నావా రాజా! సీవన్నమాట నిజమే! నా మనసులో వ్యక్తి ఉన్నమాట నిజమె! ఆ వ్యక్తి నీవే! నీవే!”
“నేనా?” రాజా వికటాట్టహాసంతో ఆ పరిసరమంతా ప్రతిధ్వనించింది! అటు పిమ్మట నితాయిీని గాధంగా కౌగలించుకుని “ముద్దు పెట్టుకుంటున్నాను ఉస్తాద్! నిన్ను” అన్నాడు. ఆపైన తిరిగి అదే వికటాట్టహాసం, దాని ప్రతిధ్వనితో ఆకాశమే నవ్వడం ప్రారంభించింది! పరిసరమారుతమె నవ్వడం మొదలు పెల్చంది!
క్షేగ్షే
ఒకరోజు, రెండు రోజులు! మూడు రోజులు!
ఆ మూడు రోజులు చిన్నరాణి రానేలేదు! నాలుగవనాడు మరి ఆ ఆత్రుత భరించలేని నితాయీ ఒక నిశ్చయానికి వచ్చివేశాడు. ఈ వేళ కూడా చిన్నరాణి రాకపోతే ఆమె (గ్రామానికి వెళ్ళీ ఆరా తీయాలని నిర్ణయించుకున్నాడు.
పన్నెండు గంటలబంది వెళ్ళిపోయింది! ఆ వేళకూడా చిన్నరాణ్ రాలేదు! మిగిలిన పాలమ్మే పడతులంతా యధా్రకారంగా వచ్చి వెళ్లిపోయారు. వారిని పలకరించి చిన్నరాణి సంగతి కనుక్కోవాలని నితాయీ ఆలోచించాడు. కాని చిట్టచివరికి ఆ ఆలోచన కూడా విరమించుకున్నాడు. లోలోపల కొంచెం 106 € కవి నవల
సంకోచించాడు. అయితే “ఎందుకీ సంకోచం? ఎవరికోసమీ సంకోచం?*అని మాటిమాటికీ ప్రశ్చించుకుని తన సంకోచానికి తానే ఆశ్చర్యపడ్డాడు. కాని ఇ సంకోచం తొలగించుకోలేకపోయాడు.
నితాయీ ఇంటిలో కూర్చుని ఆలోచించడం ప్రారంభించాడు. ఏదో కారణం మీద చిన్నరాణి మామగారి గ్రామానికి వెళ్ళడానికి వలుపడదా? బాతుగాని, కోడిపెట్టగాని, కోడిగుడ్డుగాని కొనే మిషమీద అక్కడికి వెళ్ళవచ్చునని నితాయీ నిశ్చయించుకున్నాడు. చిన్నరాణి మామగారి ఇంట బాతులు, కోడి పెట్టలు ఉన్నాయని అతడంతకు మునుపే ఎరుగును. తన సంసారంలో అత్యంత స్వల్పవిషయాన్ని గురించి కూడా చిన్నరాణి నితాయీకి చెప్పింది. ఆమె ఇంటిద్వారంలో ఎక్కడో ఒకచోట సూదిగుచ్చి ఉంటే, కళ్లు మూసుకున్నా దాన్ని కూడా అతడిట్టై పట్టివియగలడు!
“ఇంట్లో ఉన్నావా, ఉస్తాద్!” రాజా పిలుపు, నితాయీ ఆశ్చర్యపడ్డాడు. రాజా వంగభాషలో సంభాషణ ప్రారంభించాడు. అయితే అతనికి హిందీభాష లోనే సమాధానం చెప్పాడు నితాయీ.
“రా మహారాజా! ఏమిటి విశేషాలు?”
రాజా కూర్చుని మిక్కిలి విషల్ణధోరణితో వంగభాషలోనే సమాధానం చెవ్పాడు.
“చాలా దుర్వార్త ఉస్తాద్! చిన్నరాణి వ్యవహారం బాగా గడ్డుపరిస్థితిలో పడింది.”
నితాయీ గుండె గబగబా కొట్టుకుంది. అయినా పెదవి కదిపి అతడేమి అడగలేకపోయాడు. ఎంతో ఆత్రుతతో అవాక్కయి రాజా ముఖం వైపు చూస్తూ కూర్చుండిపోయాడు.
“అప్పుదె మూడు రోజులైంది, ఈ పరిస్థితి ప్రారంభమై. చిన్నరాణి చాలా మంచిపిల్ల సాక్షాత్తూ లక్ష్మిదేవి! అటువంటి చిన్నరాణి అత్తమామలతోను, ఆడబడుచులతోను, భర్తతోను అందరితోను అదేపనిగా పోట్లాడుతున్నది! తల గోడకేసి కొట్టుకుంటున్నది గతరాత్రినుంచి మూర్చవస్తున్నది. పళ్లు పటపట కొరుకుతున్నది! కాళ్లు చేతులు కొయ్యబారిపోతున్నాయి.” వసుమతి చలసాని + 107
అంతులేని ఆవేదనతో నితాయీ హృదయం ద్రవించింది. ఆపైన రాజా చేతులు రెండు గట్టిగా పట్టుకొని అడిగాడు.
“నీవు చూడడానికి వెళ్ళడం లేదా రాజా!”
“మా ఆవిడ వెళ్లింది, తిరిగి వచ్చిన తరువాత వెడతాను.”
“అయితే నేను కూడా వసాను!”
నితాయీ కళ్లనిండా నీళ్లు నిండాయి. తల కిందికి వంచివేసుకుని అతడా పరిస్థితిని మరుగుపరిచాడు.
రాజా సుదీర్హంగా నిశ్వసించాదు.
“బిన్నరాణి చాలా మంచిపిల్ల ఉస్తాద్!” ఆపైన మరికొన్ని క్షణాలవరకు మాట్లాడలేదు, మళ్లీ అన్నాడు.
“పాపం చిన్నరాణి భర్త ఎంత బాధపడుతున్నాడని! “అయ్యూ! అయ్యో!” అని ఒకటే ఏడుపు! చిన్నరాణి అంటే అతనికి ప్రాణమే! పాపం! ఎంతగానో ఏడుస్తున్నాడు!”
ఆపైన రాజా పెదవిమీద చిరునవ్వు పూర్తిగా వాడిపోయింది.
ఈమారు నితాయీ నేత్రాలనుండి రెండు కన్నీటి బిందువులు టపటప మని నేలమీద పడ్డాయి. ఏదో యధాలాపంగా చెయ్యి కదిపినట్టు కదిపి, వేలితో ఆ రెండు కన్నీటిబిందువుల గుర్తులు పూర్తిగా తుడిచివేశాడు. మరికొన్ని క్షణాలు గడిచిన పిమ్మట ఒక గంభీర దీర్హవిశ్వాసం విడిచిపెట్టి “రాజా!” అని పిలిచాడు.
“ఉసాద్!”
“డాక్టర్” ఎవరైనా వచ్చి, చిన్నరాణి పరిస్థితి పరీక్షించడం జరీగిందా[”
“ఆశలౌ”దన్నట్లు పెదవి విరిచి రాజూ అన్నాడు.
“ఇటువంటి పరిస్థితిలో డాక్టర్లేం చెయ్యగలరు ఉస్తాద్! ఇదంతా చూస్తే చిన్న రాణికి దయ్యమేదయినా పట్టి ఉండాలి! లేకపోతే దుష్పులెవరో చేతబడి చేయించి ఉండాలి... అంతే!”
ఆ మాట నితాయీ మనసులో గట్టిగా పట్టుకుంది! 'ఒకవేళ ఇదంతా చురకత్తిలాంటి భోగంపిల్ల ప్రయోగం కాదుగదా!” అన్న ఆలోచన తటాలున 108 € కవి నవల
స్ఫురించింది. రయుమర్ నర్తకీగాయకుల బృందంలో వేశ్యల కెన్నో విద్యలు బాగా తెలిసి ఉంటాయి. ఇక వశీకరణంలో వారంతా సిద్ధహస్తులే! అంతలోనే రాజా మళ్లీ మొదలుపెట్టాడు.
“కవేళ చిన్నరాణిని కాళీమాత దేవాలయానికి తీసుకువెళ్లి మంత్రతంత్రా లతో పూజాపునస్కారాలు జరిపిస్తున్నాం. అసలు సంగతేమిటో ఈ వేళతో పూర్తిగా తేలిపోతుంది!”
మరికొంత సేపలాగే మౌనంగా ఉండిపోయి. లేచి నిలబడి నితాయీ చెయ్యి పట్టుకుని లాగుతూ రాజా అన్నాడు.
“రా.. భాయీ, కాస్త టీ తాగుదాము!'
ఇప్పుడతడు తిరిగి హిందీలోనే మాట్లాడాడు. అలాగ కొంతసేపు గడిచిన తరువాత రాజా స్వభావసిద్ధమైన తన అలవాటులో పడ్డాడు.
రాజా ఇంటిలోనే కూర్చున్నాడు నితాయీ, రాజా భార్య చిన్నరాణి మామగారి ఇంటికి వెళ్లింది. ఇంతవరకు తిరిగి రాలేదు. చండీదేవాలయంలో పూజా పునస్కారాలు ముగియగానే చిన్నరాణి అసలు పరిస్థితి ఏమిటో తెలుసు కుని తిరిగివస్తుంది.
ఆమె అసలు పరిస్థితిని గురించిన వర్తమానం తెలుసుకోవాలన్న నిరీక్షణ తోనే, తహతహతోనే నితాయీ రాజా ఇంట్లో వేచి ఉన్నాడు. దుఃఖంలో, కష్టంలో, వ్యధలో అన్నింటిలోను రాజా ఎల్లప్పుడు రాజులాగే ఉంటాడు. విసారంగా పేలాలు, వంకాయలు, బంగాళదుంపల ముక్కలు, పచ్చిమిరప కాయలు, ఉల్లిపాయలు, వాటితోబాటు మరికొన్ని తియ్యటి తినుబండారాలు తీసుకుని రాజా ఇంటికితిరిగి వచ్చాడు. నితాయీ నవ్వాడు.
“ఇవన్నీ ఎందుకు రాజా?”
ఈ హంగామా అతనికి నచ్చలేదు!”
“ఏదో మరి! పొట్టనిండాలి గదా భాయీ! కడుపు మనమాట గౌర విస్తుందా? కనకనే ముందు భోజనం సంగతి చూసుకోవాలి!”
ఆపైన రాజా “ఒరే, అబ్బాయీ, కుర్రాడా!” అని గట్టిగా కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. వసుమతి చలనాని ఈ 109
రాజూ కుమారునిది అదొకతరహా ధోరణి! పాతకాలంనాటి యువరాజు లాగే వ్యవహరిస్తూంటాడు ఆ కుర్రవాడు. రాత్రింబగళ్లు వేటలోనే తనకాలం అంతా గడిపివేస్తాడు. ఒక పంగలకర్ర చేతపట్టి పొలాల్లో తిరుగుతూ గోరింకలు, కోకిలలు మొదలైన కనబడిన పక్షులన్నింటిని వేటాడుతుంటాడు. ప్రత్యేకించి ఆ పక్షుల్ని వేటాడి చంపడమే అతని లక్ష్యం! అంతేగాని ఆ పక్షుల మాంసం కోసం చంపడు! ఒకొక్కప్పుడు ఆ పక్షుల పిల్లల్ని పట్టుకొని పెంచుతాడు. వాటికోసమని మిడతల్ని పట్టుకొని చంపుతూ పొలాల్లో తిరుగుతాడు. ఈవెళ ఆ కుర్రవాడు ఎక్కడికో దూరంగా వెళ్లిపోయాడు. ఎక్కడ అతి,గతి లేదు! రాజా మండిపడుతూ అలాగే కేకలు పెడుతూ పిలుస్తూనే ఉన్నాడు. “ఒరేయ్, పంది వెధవా! దౌర్భాగ్యుడా!?” అయినా ఎక్కడి నించి ప్రతి సమాధానం వినబడలేదు. ఆపైన రాజా నితాయీతో “ఎక్కడికో వెళ్లావు నీ ఆలోచనలతో ఉస్తాద్?” అని నవ్వి “ఓహ్! అదా? నువ్వు అప్పుడప్పుడంటూంటావు ? ఆ స్వప్పలోకానికి వెళ్లావా? అక్కడ ఒక మాయావిని ఉంది కదూ? అవునా? అక్కడికేనా?” అన్నాడు. నితాయి బాధపడుతున్నాదని తెలుసుకున్నాడు రాజా. “బహుశః మీ యువరాజా స్వప్నలోకంలో మిడతల వెనుక పక్షుల వెనక పరిగెడుతుంటాడు.” మాట మార్చాడు నితాయి అయితే అతనికీవేళ ఈ సంభాషణ ధోరణి రుచించలేదు. ఒక సుదిర్హ విశ్వాసం విడిచిపెట్టి కేవలం రాజా సంతోషం కోసమని కొంచెం పొడిగా నవ్వి ఊరుకున్నాడు అంతే! రాజా ఆపైన కేకవేసి ఆ పిల్లవాణ్సి పిలవలేదు! లోపలికివెళ్లి భోజనంతో నిండిన రెండు పాత్రలు తీసుకువచ్చి, ఒకటి నితాయీ ముందుంచి, తానొకటి తీసుకుని మరి మాట్లాడకుండా భోజనం ప్రారంభించాడు. మరికొంతసేపటికి నెమ్మదిగా అన్నాడు. “పోనీలే ఉస్తాద్! ఆ సంగతి మరి తలపెట్టకు! భగవంతుడు వాడినుదుటిన అదృష్టం రాసిపెట్టలేదు! మనమేమిచెయ్యగలం చెప్పు?” అతడు చిన్నరాణి సంగతే ఆలోచిస్తున్నాడు. నితాయీ కట్టెదుట హెమంత కాలంలో వరిచేలు పసుపుపచ్చని కాంతితో మిలమిల మెరిసిపోతున్నాయి. 1104 కవి నవల
ఆ చేలరంగులో ఎండ కూడా పచ్చని మిసిమీతో తఠతళలాడుతున్నది. నాలుగు వైపుల పైపైన ఆకాశం నెమ్మదిగా కదులుతున్నట్లు భాసిస్తున్నది! ఎక్కడచూసినా బంగారుబిందువు శిరస్సుమీద తళతళలాడుతున్న రెల్లు పువ్వె! అంతేకాదు! అక్కడ, ఇక్కడ, ఆ దిక్కున, ఈ దిక్కున ఏ క్షణంలో చూసినా స్వర్ణబీందువు శిరస్సుమీద మెరిసిపోతున్న కాశపుష్పుం దూర దిగంతరాళ మధ్యంలో కదులుతూ వెలుగుతున్నది!
ఆకలి ఆత్రుతతో శీఘ్రంగా తన భోజనం ముగించుకుని “ఇదేమిటి భోజనం చెయ్యవేమిటి ఉన్తాద్?” అని ప్రశ్నించాడు రాజా.
వాడిపోయిన చిరునవ్వుతో “వద్దులే!” అన్నాడు నితాయీ.
“బ్చాల్రు చాలులే! మరి మాట్లాడకుండా భోంచెయ్యి! కడుపునిండితే అన్ని తిన్నబడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.”
“ఆరోగ్యం బాగానే వుంది రాజా! కాని నా నోటికే సయించడంలేదు.”
“ఎందుచేత? ఎందుకు సయించడంలేదు?”
ఆపైన రాజా రెండు చేతులు పట్టుకుని తటాలున తన ఆంతర్యం సంగతి ప్రసావించాడు నితాయీ.
“ఆవేళ నీవు నా మనసులో లోపలి ఆత్మీయవ్యక్తి సంగతి ప్రస్తావించావు. జ్ఞాపకం వుందా?”
“అవును!” అసలు సంగతేమిటో రాజాకవగాహన కాలేదు! ఉసాద్ ముఖరే 5సి అలాగే చూస్తూ కూర్చున్నాడు.
పూజ్ఞా నా లోపలి ఆత్మీయవ్యక్తి వేరెవ్వరో కాదు, ఆ చిన్నరాణి!”
అలాగంటూనే నితాయీ వలవల విలపించాడు. రాజా భోజనం తటా లున నిలిచిపోయింది. ఆశ్చర్యవిస్పారిత నేత్రాలతో ఆ కవిగాయకునికేసి చూస్తూ కూర్చున్నాడు. నితాయీ మాట నమ్మలేకపోయాడు రాజా. మరో సమయంలో అయితే ఇదంతా వట్టి వేళాకోళమని కొట్టీ పారవేసి ప్రపంచంలో నలుమూలల చాటించి వచ్చెవాడే! కాని ఇప్పుడతనికి కూడా మనసు చిన్నరాణిని గురించి బాగా దిగులుపడుతూంది. అందువల్ల అటువంటి అప హాస్య వైఖరి అవలంబించలేకపోయాడు. వసుమతి చలసాని ఈ 111
కొన్ని నిమివాల వరకు వారిద్దరు నిశ్చెష్టితులై కూర్చున్నారు. అంతలోనే పెద్ద పెద్ద కేకలువేస్తూ రాజా భార్య అక్కడికి వచ్చింది. ఎంతో ఆందోళనతో తహతహలాడుతున్న నితాయీ మనసులో ఒక్కనారిగా వందలకొలది ప్రశ్చలావిర్భవించాయి. అయితే గద్దద స్వరంతో అతనినోట “ఏమైంది?”అన్న చిన్న ప్రశ్న మాత్రమే అతికష్టం మీద వెలువడింది.
అంతలోనే రాజా భార్య ఒక్కమారుగా అతని మీద అగ్నిగోళవర్షంలా విరుచుకుపడి “రాక్షసుడా! పిశాచమా!” అని నోటికొద్ది తిట్టింది. ఆపైన అనరాని వినరాని తిట్లతో దుమ్మెత్తిపోసింది! నితాయీ ముఖంమీద వేలెత్తి నిర్దశించి “నువ్వే కారణం నువ్వే! నువ్వె!” అని గొంతెత్తి అరిచింది.
“నీ ద్రిష్టి తగలడం మూలానే ఆ పిల్ల కిటువంటి దురవస్థ కలిగింది! నీ కింత స్వార్ధమేమిటి? నీకింతటి పాపిష్టి ఆలోచన ఏల?”
ఆ విధంగా ఎడతెగకుండా కొనసాగిన దూషణల నించి అసలు జరిగిన సంగతి అంతా బయటపడింది. ఈవేళ చిన్నరాణిని కాళీమాత సన్నిధిని నిలబెల్ట మంత్రతంత్రాలతో పూజాపునస్కారాలారంభించారు. పొద్దుటినించి ఆమెచేత కటికి ఉపవాసం చేయించారు. ఆపైన మిట్టమధ్యాహ్నపు టెండలో ఒకపీట మీద నిలుచునేటట్టు చేశారు. కాళీ దేవాలయం పూజారి చిన్నరాణి కెదురుగా దూపంవేసి ఒక చిన్న కొమ్మ చెతబట్టి ఎదురుగా నిలబడి ప్రశ్నల ధోరణి ప్రారంభించాడు.
“క్షాల్టీ! కరాళీ! నరకపాలధారిజణీ! నీవు భూతడ్రేత డాకినీ, యోగినీ, హాకినీ పిశాచ రాక్షస గణాల నన్నింటిని సంహరించివేస్తున్నావు. నివింక వాటినన్నింటిని పట్టి బంధించి, ఆ గణాల రక్తపానంతో సంతృప్తి పొందుదువు గాక!”
ఆ ధోరణితో హడలెత్తిపోయి చిన్నరాణి గజగజ వణికిపోతున్నది! అదే తరుణంలో ఆ పూజారి తీవ్రంగా ప్రశ్నించాడు.
“వెప్పు! చెప్పు! ఆ కాళీమాత సాక్షిగా బయటపెట్టు! నీకింతటి దురవస్థ కలిగించిన దుర్మార్డులెవ్వరు?” అటువంటి పరిస్థితిలో కూడా చిన్నరాణి సమా ధానమేమి చెప్పలేదు. కేవలం పిచ్చిపట్టినదానిలా వెర్రిగా చూస్తూ అలాగే 1124 కవి నవల
గజగజ వణికిపోతున్నది! పూజారి గంభీర గర్జనతో తిరిగి మంత్రోచ్చారణ (వ్రొారంభించాడు. ఆపైన మంత్రించిన ఆ కొమ్మతో చిన్నరాణిని అదేపనిగా బాదడం మొదలు పెట్టాడు! అప్పటికి బాగా బెంబేలు పడిపోయిన ఆమె “చెబుతాను! చెబుతాను! నేనింక చెబుతాను!” అని మొరపెట్టుకున్నది!
ఆ తరుణంలో చిన్నరాణి నితాయీ పేరెత్తింది. “ఉస్తాద్! కవిగాయకులు!” అంటూ “నాకొక ఎ(ర్రని పువ్వు కూడా ఇచ్చారు.. ఉస్తాద్ చాలా మంచివాడు” అని చెప్పింది. ఆపైన మరింతగా గాభరాపడిపోయి, వణుకుతున్న మంద్ర స్వరంతో పాడడం ప్రారంభించింది.
“నల్లని కురులం దె(రని కుసుమము కాంచితివా! కనులారా!”
నితాయీ ఒకప్పుడు చిన్నరాణి ముంగురులలో పూవొకటి తురుము తూంటే, కిటికీలోనించి అదే సమయంలో రాజా భార్య కంటపడింది. ఆ సంఘటన దృశ్యం నేడు రాజాభార్య మనోవీధిలో తటాలున మెరిసింది. అదే సంగతి ఇప్పుడామె పెద్దపెద్ద కేకలు పెడుతూ అందరిఎదుట వెల్లడించింది.
ఇక ఆ పైన చిన్నరాణి మాట్లాడలేదట. కాని రాజా భార్య కేకలతో ఆ వ్యవహారం అంతా ఆమూలా[గ్రంగా అందరికి తెలిసివోయింది! ఆ తరువాత రాజా భార్య దూషణల శరపరంపర కురిపించింది. అందువల్ల అంపశయ్య మీదికొరిగినపోయిన భీష్ముడే అయ్యాడు నితాయీ.
మరొకనాడయితే జుట్టుపట్టుకొని కమ్బీతో కొట్టి, భార్య నోరు మూయించే వాడే రాజా! కాని నీడు అతడు కూడా వట్టి కుంటివాడయి తాను కూర్చున్న చోటినుంచి బొత్తిగా కదలలేకపోయాడు!
తలవంచుకుని కూర్చున్న నితాయీ మరి శిరస్సు పైకెత్తలేదు. రాజాభార్య నిందలతోపాటు, చిన్నరాణి చెప్పిన మాటలు విన్న పిమ్మట అతనికిక నోట మాట పెగలలేదు. నిద్దవశిలలా నిశ్చష్టితుడయినాడు!
మరికొన్ని క్షణాల తర్వాత స్టేషన్లో గంటలధ్వని విన్న రాజా ఒక్క మారుగా తృళ్ళపడ్డాడు. అది మూడుగంటల బంది, దానికప్పుడే గంటకొట్టారు! స్టేషన్‌కి వెడుతున్నానని నితాయీతో అన్నాడు రాజా. వసుమతి చలనాని +ఈ 113
“లే ఉస్తాద్! నేనేం చెయ్యగలను చెప్పు! స్టైషన్కి వెళ్లాలి మరి!” అంటూ విష్ణవదనంతో వెళ్లిపోయాడు రాజా,
నితాయీ లేచివెళ్లి గుల్మొహర్ నీడలో కూర్చున్నాడు. నిశ్చలంగా కూర్చుని ఉదాసీన దృష్టితో ఆలోచించడం ప్రారంభించాడు. ఇక ఈ ప్రదేశం నుంచి వేరొకచోటికి వెళ్లిపోవడం తప్ప అతనికేది మార్గాంతరం కనిపించడం లేదు. ఏ మార్గంలో ప్రయాణిస్తే అతనికింక ఈ తలవంపునుండి విముక్తి లభిస్తుంది? ఎక్కడికి వెళితే జీవితానికింత ప్రశాంతి లభిస్తుంది? ఏ బాటలో నడిచిపోవాలి? విధి విలాసం ఎలా వుంది?
సరిగా ఇదే సమయంలో అతనికెదురుగా ఒక వ్యక్తి నిలుచున్నాడు. నెమ్మదిగా పిలిచాడు.
“డిస్తాద్!”
నితాయీ మరింత తటస్ట దృష్టితో అతనికేసి చూశాడు. మరికొన్ని నిమిషాలలోనే అతని ముఖం వికసించింది.
“మీరా!” అన్నాడు.
“అవును నేనే బాబూ! మీ కోసమే వచ్చాను.” ఆ నూతనవ్యక్తి అన్నాడు.
“నా కోసమా?”
“అవును! చాలా పెద్ద బరువొకటి మీదపడింది! అందుకే వసంత పంపించింది! ”
“వసంతా?”
“అవును, మా నర్తకీ గాయక బృందనాయక వసంతే కదా!”
ఆ కొత్తవ్యక్త్ ఆ బృందంలో ఫిడేలు వాయిస్తాడు.
ఆపైన కొన్ని గంటల తరవాత-
అది హేమంతకాలం సంధ్యా సమయం. రక్తం వంటి ఆ సంజవెలుగుతో గ్రామంలో ఇళ్లలోనించి పైకివెడుతున్న పొగ మళవించింది. పైగా అది ధూళీధూసరితమై నలువైపుల అలముతున్నది. ఒకవైపునుంచి సాయంకాలం బండి వస్తున్నది. అది పడమటి నుంచి తూర్పు వైపుగా కాట్వా వెడుతుంది, రాజా సిగ్నల్ కిందికిదించి రైల్వేలైను పాయింట్ మీద నీలంరంగు లాంతరు 114 + కవి నవల
చేతబట్టి నిలుచున్నాడు. చీకటిలో నిశ్శబ్దంగా నడిచివచ్చి నితాయీ అతని పక్కనే నిలబడి “రాజా” అని పిలిచాడు.
అతడు పక్కకి తిరిగి చూశాడు. నితాయీ! అతని కాళ్లకు కాన్వాస్ బూట్లు, శరీరంమీద జుబ్బా, మెడమీద కండువా, చంకన ఒక మూట, రాజూ ఆ వేషం చూసి ఆశ్చర్యపడ్డాడు.
“ఎక్కడికీ ప్రయాణం ఉస్తాద్?”
అయిదు రూపాయలతని చేతిలో పెట్టాడు నితాయీ.
“ఇది వాలకివ్వవలసిన సొమ్ము. చిన్నరాణ్ కిచ్చివెయ్యి”
రాజా మిక్కిలి రహస్యంగా అతని చెవిలో చెప్పాడు.
“చిన్నరాణిని వివాహం చేసుకుంటావా ఉస్తాద్?” ఆదుర్దాగా అడిగాడు రాజా.
నితాయీ నిర్హాంతపడి అతనికేసి చూశాడు.
“చిన్నరాణి వివాహం రద్దు చేయిస్తాను! మళ్లీ నీతో వివాహం జరిపిస్తాను. మీ ఇద్దరికీ పొత్తు కుదురుస్తాను.”
నితాయీ తలవంచుకుని కొన్ని క్షణాలపాటు నేలకేసి చూశాడు. ఆపైన శిరస్సు పైకెత్తి “ఛీ!” అని ఒకే ఒక మాటతో తన అభిప్రాయం వ్యక్తికరించాడు.
“లీ అంటావెందుకు?”ో
'జొంప కూల్చమంటావా రాజా! చాలా అన్యాయం”
రాజా ఒక సుదిర్హ నిశ్వాసం విడిచిపెట్టి మాట్టాడకూరుకున్నాడు. అంతలోనే నితాయీ అందుకున్నాడు.
“నమ్ము రాజా నా మాట! నేను కవితాగానం చెయ్యగలనుగాని, మంత్ర తంత్రాల సంగతి నాకేమి తెలియదు. నేనటువంటి పనులేవి చెయ్యలేను! అయితే ఒక్కమాట! చిన్నరాణిని ప్రేిమించానంతే! అంతమాత్రం చేత నేనామె కేవిధమైన హాని కలిగించలేదు!”
రైల్వే లైను వంపులో నుంచి ట్రెయిన్ సెర్చిలైటు సంధ్యాంధకారం చిల్చు కుంటూ కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ప్రజ్వలించింది. బండి ఆ వైపునుంచి స్టేషన్లో ్రవేశిస్తున్నది. నితాయీ తొందరగా స్టేషన్‌కేసి నడిచాడు. వసుమతి చలనాని శ 115
అదే క్షణంలో సెర్చీలైటు వెలుగు అతని వేషం మీద, మూట మీద ప్రసరించి రాజా కళ్లు ఒక్కమారుగా కళ్ళు సత్యాన్ని గ్రహించాయి. నితాయీ ఎక్కడికో వెళ్లిపోతున్నాడని, మరి మరలిరాడని అతనికొక్క క్షణంలో అవగత మైంది. ఇంతవరకు ఈ సంగతే ఆలోచించలేదు. ఈసారి కొంచెంగట్టిగా కేకవేసి “ఎక్కడికి వెడుతున్నావు ఉస్తాద్?” అని అడిగాడు.
అదే సమయంలో పెద్ద ధ్వనితో బండి దగ్గరికి వచ్చి నిలిచింది. ఆ రణగొణధ్వనిలో నితాయీ చెప్పింది రాజాకేమి అవగాహన కాలేదు. బండి స్టేషన్లో ప్రవేశించగానే పాయింట్ విడిచిపెట్టి ప్లాట్ ఫారం మీదికి పరిగెత్తుకు వచ్చాడు రాజా.
“ఉస్తాద్! ఉస్తాద్!”
అప్పటికి నితాయీ బండిలో కూర్చున్నాడు. కిటికీలోనించి తల ఇవతలికి పెట్టీ “రాజా!” అన్నాడు.
ఉట్టి పడుతున్న ఆత్రతతో రాజా “ఎక్కడికి వెడుతున్నావు భాయీ!” అని ప్రశ్నించాడు.
సహజ మృదు మందహాసంతో సమాధానం చెప్పాడు నితాయీ.
“సంగీత కచేరీకి ఒప్పందం ఒకటి కుదిరింది. ఆ ఉత్సవానికి వెడుతున్నాను”
పెద్ద వర్పాటుతో ఆలోపూరులో ఒక ఉత్సవం జరుగుతుంది. అయికే ఒప్పందం ఎక్కడినించి వచ్చింది?
రాజా మనసులో హరాత్తుగా ఒక అనుమానం పొటమరించింది.
చిన్నరాణికివ్వవలసిన అయిదు రూపాయలు ఇచ్చివేసి, ఒప్పందం బజానా సొమ్ము తీసుకుని కవితాగానం కోసం వెడుతున్నాడా? అబద్ధం! అదేమాట నితాయీతో అన్నాడు.
“కాదు రాజా! ఇదిగో, ఈయన నా కోసం వచ్చారు చూడు!”
రాజా గుర్తు పట్టాడు. అతడా బృందంలో ఫిడేల్ వాయించే వ్యక్తి. ఉత్స వానికి నితాయీని తీసుకుని రమ్మని దళనాయకురాలు అతనిని పంపించింది. ఆ బృందంలో ఇంతకు ముందున్న కవి గాయకుడు ఎక్కడికో పారిపోయాడు, 1166 కి నవల
వసంత అతనితో పెద్ద తగాదా పెట్టుకుని కాలితోతన్ని అవమానించింది. ఫిదేల్వాలా రాజాకు వివరించాడు.
ఇలా నితాయీ తన ప్రయాణం వివరాలు వెల్లడించాడు.
“ముందుగా ఆలోపూర్, అక్కడినుండి కాందరా, అక్కడినుండి కాట్సా, కాట్వా నుండి అగ్రద్వీపం, అగ్రద్వీపం నుంచి...”
ట్రెయిన్ కూతలో అతని మాటలు కలిసిపోయాయి.
కూత ఆగింది. బండి కదలడం ప్రారంభించింది. రాజూ దానితోబాటే ఫరుగు పెడుతూ అదిగాడు
“ఆ అ(గ్రద్వీపం నించి ఎక్కడికి వెడతావు? ప్రపంచం అంతటినించి బయానా వచ్చిందేమిటి? దిగిరా, ఉస్తాద్, దిగిరా!”
వేదనతో ఎంతో ఆప్వాయంగా, పిలిచిన ఆ పిలుపు వినగానే నితాయీ గుండె కదిలిపోయింది. ఉత్తరక్షణంలోనే పూర్తిగా తమాయించుకుని చిన్నగా నవ్వాడు. “అవును! ప్రపంచం అంతటినించి బయానా వచ్చింది!” అని ఆంతర్యంలో అనుకున్నాడు.
అంతలోనే బండి పష్లాట్ఫాఠమ్ విడిచిపెట్టి ద్విగుణీకృత వేగంతో మున్ముందుకు సాగివోయింది,
శుక్ల చతుర్ధశి. చంద్రుడు ఉదయిస్తున్నాడు పలుచని మబ్బుతెరల మధ్య వసుపుతో పెళ్ళికొడుకులా చంద్రుడు కన్పించాడు. చిన్నరాణి, విపప్రదుడు ఇలా తనకు సంబంధమున్న వారంతా తన ముందున్నారు. రాజా... చిన్నరాణి ఇకముందు ఆలోచన ఆగిపోయింది. ప్రక్క స్టేషన్లో దిగిపోదామనుకున్నాడు, దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. పై పంచె ముఖానికి అడ్డం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంతలో తనతో ప్రయాణిస్తున్న గాయకుల బృందం డోలుకంజీరా వాయిద్య సంగీతాన్ని ప్రారంభించటంతో నితాయీని ఎవరూ గమనించలేదు.
జీవంలేని చిరునవ్వుతో మనసు కుదుట పరుచుకుని, బృందగానంలో “తానానా” అంటూ స్వరాలు కూర్చుకోవటంలో లీనమయ్యాడు.
ఫీదేలు వాలా నిషాలో ఉన్నా ఆశ్చర్యంగా చూశాడు నితాయీనస్,
“చాలా మధురమైన కంరం” మెచ్చుకుని శృతులు సరిచేశాడు. వసుమతి చలనాని ఉ 117
స్టేషన్ నుండి రెండు మైళ్ళు కాలిబాటలో, పాటలు పాడుకుంటూ ఉత్సవం దగరకు వెళుతూనే నితాయీ నిరుత్సాహం తొలగిపోయింది. తండోప తండాలుగా ఉన్న జన సమూహం, తెల్లని వెన్నెలలో కొంచెం దూరం నుండే అద్భుతంగా అన్పించింది నితాయీకి, ఇక్కడ ప్రదేశం చూడగానే తను ఒక పర్యాయం వచ్చినట్లనిపించింది. ఊహలలో తేలిపోతున్నాడు.
మహాజ్వలంగా మెరిసిపోతున్న వేదికలు, నాటికలు నృత్యగానాలు, సంకీర్తనలు, కవితాగానాలు ఇలాంటి వేదిక మీద తన కచేచీ జరగబోతోంది. “నీవు ఒక్కడివే కవితా గానం చేయవలసి ఉంది. ఇంతకుముందు వసంతతో వాగ్యుద్ధం జరిగి వెళ్ళిపోయాడు. ఇలా గాయకుడు ఫిడదేలువాలా ఇలా చెపు తూనే ఉన్నాడు కలలు కంటున్న నితాయీ ఒక రమ్యమైన పాటకు పదాలు స్పురించాయి. వెంటనే వేదిక మీద ఆలాపన ప్రారంభించి (ప్రేక్షకులను ముగ్గులను గావించాడు. నితాయీని ఆకర్షించిన ఈ వేడుకలు అతని దుః ఖాన్ని కప్పి వేశాయి.
తరువాత వేదిక నుండి నృత్యం చేయబోయే సుందరి మిమ్ములను మరింత మైమరిపిస్తుంది అంటూ ప్రకటించారు. ఇంతలో ఫిడేల్వాలా
“ఉస్తాద్! ఏమిటా పరధ్యానం. కలలు కంటున్నావా! వచ్చిశాం చూడు” అన్నమాటలు విన్పించి ఈ లోకంలోనికి వచ్చాడు ఉస్తాద్. ఎదురుగా నిర్మలమ్మ.
“వచ్చావా బాబూ! ఎంత ఎదురు చూస్తున్నానో నీ కోసం” అంటూ (ప్రేమతో ఆహ్వానించింది.
మైదానంలా ఉన్న ప్రదేశంలో వరుసగా కుటీరాలున్నాయి. ఇవే వేశ్యల వాటికలు. లేనెపట్టులా అన్పించాయి ఆ కుటీరాలు నితాయీకి, మద్యవాన మత్తులో తూగుతున్నారు అందరూ. స్త్రీ పురుషుల హాస్యోక్తులతో తాంబూలంతో ఎర్రపడిన ఆధరాలతో ఆకర్షిస్తున్నారు. వక్కలు కత్తిరిస్తున్నారు కొందరు వేశ్యలు.
“నితాయీ వచ్చాడు. టీ ఇవ్వండి” అంటూ కేకలు వెసింది నిర్మలమ్మ”
దీపం వెలుగుతో ఉన్న ఒక కుటీరం ముందు నిలబడి ఒక యువతి
“వసంతా! కవి గాయకులు వచ్చారే” అంటూ కేకలు వేసింది. నీలమణి 1184 కవి నవల
అంటూ కలవరిస్తున్నావు కదే!
నితాయి నవ్వుతూ “ీలమణి కాదు బొగ్గుమణి” అని సవరించాదడు.
మైకంలో ఉన్న వసంత “నిజమా! గాఢంగా కౌగిలించుకుంటానే! ఎందుకంటే త్రాగి పడిపోయిన నన్ను శుభ్రం చేసి వేళగాని వేళ టీ పెట్టి నన్ను సేదతీరారే, బావలందరూ వెళ్ళివోండి ఇక ముందు రావద్దు” తూలుతూ అంటున్న వసంత వైపు జాలిగా చూశాడు నితాయీ కుటీరం వెలుపల నుండి.
అకస్మాత్తుగా వసంత వడిగా వచ్చి నితాయీకి చుట్టుకువోయింది.
“నన్ను లలితను, లక్ష్మిని కాలదన్ని అందరినీ వెళ్ళమంటున్నావా! ఇలా మాట్లాడితే శిక్ష తప్పదు నీకు” బెదిరించింది నిర్మలమ్మ నవ్వుతూ.
నితాయీ వసంతను విడిపించుకోవాలని ప్రయత్నించాడు. మద్యం ఉంది పద ఇంట్లోనికి అంటూ చేయి పట్లి లాగుతోంది.
“వదులు, నేను మద్యం ముట్టుకోను”
“అదేమిటి త్రాగకపోతే నేను అంగీకరించను. నా మాట మన్నించండి”
నిర్మలమ్మ “వసంతా! నితాయీ చెయ్యి వదులూ అని గర్జించింది. వసంత లోపలికి వెళ్ళిపోయింది. బాధ పడిన నిర్మలమ్మ బాబూ ఇలా త్రాగిప్రాణం మీదికి తెచ్చుకుంటోంది.
ఇంతలో లక్ష్మీ అనే యువతి టీ తీసుకువచ్చింది.
“మా వసంత అక్కను రక్షిస్తావనుకుంటాను” అంది దిగులుగా. ఉస్తాద్‌ను అన్నా అని పిలువు. పండుగనాడు బొట్టు పెట్టి అన్న నుండి చీర బహుమతి పొందాలి లక్ష్మి” అన్నది నిర్మలమ్మ.
“తప్పక అలాగే ఇస్తాను చీర” నితాయీ కూడ నవ్వాడు. మరో యువతి వచ్చి “మంచిది, చిన్నరాణితో బంధుత్వం కలుపుకుంటాను” అన్నది నవ్వుతూ.
నితాయీ చేతిలోని టీ జారి క్రిందపడిపోయింది. “చిన్నరాణి” స్వగతంలో విస్పించింది.
కేర్
ఈ ఉత్సవాల వెనుక బీభత్సమైన దృశ్వాలున్నాయి. అంధకారం నుంది ఆదిమానవుని ప్రాకృతిలా పరుగులు తీసి బుసలు కొడుతున్నాయి. తను వసుమతి చలసాని + 1139
కూడా ఇలాంటి అంధకారం లోనే జన్మించాడు. నాగరిక మాలిన్యమంతా ఈ చీకటి కోణంలోనే విడిచివేస్తుంది. ఇంత ప్రత్యక్షంగా ప్రధమంగా చూస్తున్నా నితాయీకి తిరిగి వెళ్ళి పోవాలన్పించింది. వణికిపోతున్నాడు. కుటీరాలన్నిటిలో చిన్న చిన్న వెలుగులు మాత్రమే ఉన్నాయి. లక్ష్మి వెనుక ఇద్దరు పురుషులు వెళ్ళారు. వసంత కుటీరం నుండి ఒక పురుషుడు బయటకువచ్చాడు. రెండవ వాడు వెళ్ళాడు. వెనుతిరిగి వెడితే చిన్నరాణి జీవితం మీద వచ్చిన కళంకం నిజమవుతుంది. కాపురం కూలిపోతుంది. ఇప్పటికే కూలిపోయిన చిన్నరాణి జీవితం తను వెళ్ళకపోతే కాలం తనలోనికి ఇముడ్చుకుని పరిస్థితులను చక్క దిద్దుతాయి. మరచిపోతుంది చిన్నరాణి, బిడ్డలు కలిగి సౌభాగ్యవతిగా సుఖంగా నూరేళ్ళు ఉండాలి అనుకుని దీవించుకున్నాడు తన (పప్రయసిని. ఆ రాత్రి నిదురలేదు నితాయీకి. ఉదయమే లేచి ఊరిబయటకు వచ్చాడు. తక్షణమ ఇక్కడనుండి వెళ్ళిపోవాలి. విశాల ప్రపంచం చాలా ఉంది. కాని తొందర పడకూడదనుకున్నాడు. వ్యాసపూర్ణిమ ఉత్సవాలలో వసంతోత్సవం. పుష్కరిణి తీరాన కూర్చున్నాడు నితాయీ. తరువాత స్నానం చేసి ప్రక్కన ఉన్న దేవాలయం లోనికి వెళ్ళాడు. చుట్టూ గోపికలు, మధ్య గోవిందుడు. యుగళరూపంలో స్రోత్ర కృతిని గేయంగా పాడుకున్నాడు. తరువాత బిగ్గరగా పాడుతూ ఉంటె చాలామంది అక్కడ గుమిగూడారు.
'మాధుర్యమదిగో యుగళరూపాని అంటూ ఆలాపిస్తుంటే పులకరిం చింది. పూజారి తన్మయంతో కనులు మూసుకుని ఆనందభరితుడై వింటు న్నాడు. పూర్తయిన తరువాత “నీ కంరం చాలా మధురంగా ఉంది బాబూ” అని ప్రశంసిసూ “పదాలు పొడగలవా నాయనా” అన్నాడు. కాని నితాయీకి ప్రక్కన డోలు శబ్దంలో వినిపించక “ఎమన్నారు బాబూ” అన్నాడు వినయంతో.
“మహనీయులు చందీదాసు, విద్యావతి జ్ఞానదాసు వ్రాసినవి స్ఫురింప చేస్తున్నాయి నాయనా నీ గానంలోని పదాలు” అన్నాడు తన్మయత్వంతో. “కాబా ఈ సేవకుడు అధమ కులంలో జన్మించాడు. అటువంటి మహాను భావులతో పోల్చవద్వు” అంటూ నమస్కరించాడు నితాయీ,
“నాయనా! జన్మకంటె కర్మ గొప్పది. మహా ప్రభువు రాధా గోవిందుడు 120ఈ కవి నవల
చండాలులను కూడా తన వడిలోనికి తీసుకున్నాడు” అన్నాడు పూజారి. “నితాయీ కనుల నీరు తిరిగింది. నేను చేస్తున్న కర్మ కూడా నీచమైనదే బాబూ! రుమర్ బృందంలో ఉన్న వేశ్యలతో కలసి ఉంటున్నాను. కవితాగానం చేస్తున్నాను స్వామీ” అన్నాడు నితాయీ వినయంతో.
“కవిత్రాగానం?” కవులే ఈ ప్రపంచంలో మహనీయులు. వారే సాధకులు. వారి ఈ గానం విని భగవానుడు మైమరిచిపోతాడు. చండీదాసు పాడుతుంటే, మహాప్రభు నిత్యానందులు భావావేశంతో నృత్యం చేశాడు.
కనుల నీరు కారిపోతోంది నితాయీకి. “నిచులైన వేశ్యా సాంగత్యం చేయవలసి వచ్చింది” అన్నాడు రోదిస్తూనె.
భగవానుడికి నీచులెవరూ లేరు నాయనా! చింతామణి నాటిక చూసే ఉంటావు. బిల్వమంగళుడి గురువై గురుపీరం మీద కూర్చోగలిగింది తన భక్తితో.
పూజారిగారి విశాల మనస్సుకు నితాయీ ఆశ్చర్యపోయాడు. బృందంలో ఉన్న కళాకారుల కౌశలాన్ని ఆదరిస్తూ ఏరి మధ్యకు వచ్చిన నితాయీకి ఇప్పుడు మనసంతా ఆనందంగా ఉంది. గోవిందునికి, పూజారికి నిర్మల హృదయంలో మరోసారి నమస్కరించి వెనుతిరిగాడు.
వెనుతిరిగిన నితాయీ వింతగా చూశాడు. ప్రీలందరూ తలస్నానాలు చేసి పువ్వులను తీసుకుని బృందాలుగా కూర్చుని గోవిందుడికి మాలలు కడు తున్నారు. ఆవుపేడతో గుడి చుట్టూ కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి పూలు విరజిమ్మారు. వసంత వెనుతిరిగి కూర్చుంది. ప్రీలందరూ ఎవరి పనులలో వారు లీనమయ్యారు. లక్ష్మి మరో యువతి లలిత నితాయీని చూసి పలుక రించారు.
“క్క రోజు లక్ష్మిదేవి పూజ” అన్నది లక్ష్మ,
“అయితే ఈ బృందానికి కూడా పూజలు, ధర్మకార్యాలు ఉన్నాయన్న మాట” అనుకున్నాడు నితాయీ.
“పౌర్ణమినాడు వచ్చే గురువారం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. మీరు రాత్రికి పాటలు పాడే వేళ ప్రారంభమవుతుందీ పూజ” లక్ష్మి చెపుతూ వసుమతి చలనాని అ 121
ఉండగానే వసంత ఒక గ్లాసుతో వచ్చి నితాయీకిచ్చింది.
తీసుకోని నితాయీని ఉద్దేశించి నవ్వుతూ వసంత
“మద్యం కాదులెండి త్రాగండి అన్నది.
ఇంతలో లలిత “త్రాగకండి వశీకరణ మందు కలిపింది దానిలో” అంటూ క్రీగంట నితాయీని చూస్తూ ఆటపట్టించింది.
“నీ ముఖం తగలబడుతుంది” అని వెక్కిరించింది వసంత, లక్ష్నీని చూస్తూ
“పోనీలే ఆ అగ్నికి నా నలుపంతా ఎగిరిపోతుంది”
ఆ తిట్లు తనకే అన్వయించుకుని చమత్మరించాడు నితాయీ.
వసంతకు నితాయీ మీద (ప్రేమ వాత్సల్యం గౌరవం కలిగింది.
ప్రీలంతా ఉపవాసాలు చేశారు, చాలా కరిన నియమాలన్నీ పాటిస్తుంటె గమనిస్తున్నాడు ఆశ్చర్యంగా నితాయీ. సాయంత్రం కాగానే ఫలాలతో తీయని తినుబండారాలతో పాలు, పెరుగు, నెయ్యి ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీపూజ విధిగా నిర్వర్తించారు. పురుషులంతా మద్యం తాగి ఫిడేలు మద్దెల, డోలు, సరిచేసుకుంటున్నారు.
ఈ బృందానికి కాపలాదారుడు భారీ శరీరంతో అగ్నిని వెలిగించాడు. కాని కట్టెలు వేయలేక వేస్తున్నాడు. స్రీలందరూ చుట్టూ కూర్చుంటె మధ్యన ఒక యువతి వ్రత కధ విన్పించింది. పూర్తయిన తరువాత మంగళ సూచిక ధ్వనులతో ఆ దేవికి నమస్కారం చేసి ప్రసాదాలు తీసుకుని అందరూ బయలుదేరారు.
నితాయీ కూడా వెంబడించి ఒకచెట్టు క్రింద కూర్చున్నాడు. ఇంతలో వసంత వచ్చి పిలిచింది.
లోపలికి వెళ్ళిన నితాయీకి మర్యాద చేసి, ఆకులో పళ్ళు తీయని తిను బందారాలు చేతికందించింది. పూజారిణిలా ఉన్న ఆమె మోహనరూపం చూస్తూ ముగ్దుడయ్యాడు నితాయీ.
“మీకు అన్నీ విజయాలే” అని ఆశీర్వదించాడు ఆనందంగా నవ్వుతూ,
“కొద్దిగా ప్రనాదం వదలండి”
122 ఈ కవి నవల
ఆశ్చర్యంతో “ఎందుకు” అన్నాడు నితాయా.
“ఈరోజు సరసులు వదిలిన ప్రసాదం మేము తినాలి అంటూ నవ్వింది. ఇంతవరకు చూడలేదు వసంత నవ్వులో ఉన్న ఇంతటి అందాన్ని నితాయీ. ఒక గేయాన్ని పాడింది వసంత.
నా ప్రాణముల్ నేడు (ప్రేమ వాగురలోన
నీ చరణములు జిక్కెడస్సి
జాతికుల మానాఖిమానముల్ విదనాడ
నిశ్చయించెను ఈ చరణ దాసి"
వహ్వా అంటూ నితాయీ అభినందిస్తుంటే
“ఇది చండీదాసు పాట” ఆకులు తీస్తూ అన్నది.
“ఆ మహనీయుల పాటలు మీకు తెలుసునా” అంటూ నివ్వెరపోయాడు నితాయీ.
16
రాత్రి తొమ్మిదికి పాట కచేరి ప్రారంభమైంది. కానీ మహనీయుల పదాలు కావు. పూర్తిగా శృంగారాన్ని రెచ్చగొట్టె పాటలు. వక్షోజాల మధ్య తహ తహతో ఆనందంతో మేళవించి నురుగులు క్రక్కుతున్న మద్యరసంలోని పాటలు. నగ్నజీవిత వ్యామోహాలకు సంబంధించిన పాటలు.
అందరూ కలసి నితాయీని కృష్ణుడిగా రూపొందించారు. రాధ గోవిం దుని దూషణ చేస్తున్నట్లు పాడుతున్న కవిగాయకుడి గానంలోని అర్ధాన్ని గ్రహించిన నితాయీ వేదిక మీద అభినయాన్ని చేయలేకపోయాడు. మోటుగా, వినతగని ఆ జావళీలు వింటున్న నితాయీకి చాలా బాధ కలిగింది. అంతేకాదు వసంతపై కక్షపెంచుకున్న మరో గాయకుడు వసంతను కావాలనే అసభ్య పదాలతో అలా అవమానిస్తుంటే భరించలేని నితాయీ.
ముక్తుడై వసంతను పరిశీలించాడు. ఆమెలో చలనం లేదు. చిరునవ్వుతో నితాయీ వైపే చూసోంది. నితాయీకి రాత్రి వసంత అన్నమాటలు గుర్హుకు వచ్చాయి. “మీరు నా బొగ్గుల మాణిక్యం కాదు. నీలమణివి. ఓటికుండలో నీళ్ళు నిండించి నాకు గౌరవాన్నిచ్చారు” అన్నది. మద్యం తీసుకోని వసంత వసుమతి చలనిని + 1203
కడిగిన ముత్యంలా ఉంది. అనిర్వచనీయమైన తేజంతో అద్భుతంగా కన్పిం చింది ఆ వేదిక మీద వసంత.
వేదిక వెనుక, చీకటి ప్రీ పురుషుల హాస్యోక్తులతో మలినమయిందని [గ్రహించాడు నితాయీ. ఈ మద్యంలో మునిగి ఈ నిర్భాగ్యులకు నేనేమి ఉపకారం చేయగలననిపించింది. మద్యం వలన వచ్చే (ప్రమాదం స్ఫురించెలా ఒక గేయాన్ని గానం చేశాడు.
తరువాత చంద్రావళి, రాధ వసంత ఒక్కరె అంటూ వసంతను అభీనం దించారు కవితా చాతుర్యంతో, వసంత తన్మయత్వంతో నృత్యం చేస్తోంది. ఆమె మనసు శరీరం ఒకటై ఆమె నృత్యానికి ప్రాధాన్యానిచ్చాయి.
(పేక్షకుల నుండి నాణాలు పడసాగాయి. కాని ఆశించినంతగా కానుకలు రాలేదు. నితాయీ వేదాంత ధోరణి గానానికి అందరూ లేచిపోసాగారు. పాపం ఈ వేశ్యల జీవితాలు పురుషుల కోరికల, ధునితో తగలబడిపోతున్నాయి అని బాధపడ్డాడు. కాని ఆ నిర్మలమ్మ మాత్రం బుషులు, మునులు లాంటి వారే కామశాస్త్ర చర్చలతో పరాజితులయ్యారు అని అంటుంది. కవి గాయకు లకు, నర్తకీ బృందానికి ఓటమి ఆవరించింది. కారణం నితాయీ వైరాగ్య కవితా గానం. అందరూ లేచిపోయారు. వసంత కృంగిపోయింది. పరాజయ భారంతో వేదిక దిగి వెళ్ళిపొయింది. నితాయీ అలాగే నిస్తబ్బుడయి, నిత్తేజంగా కూర్చుండిపోయాడు.
నిర్మలమ్మ వెనుకగా వెళ్ళి “వసంతా” అని ఆప్యాయంగా పిలిచింది.
“అలసిపోయాను పిన్నీ”
“ఇదంతా ఉస్తాద్ వలనే కదా” వసంత వెనుతిరిగి అక్కడే నిలబడిన నితాయీ వైపు చురకత్తిలా చూసింది.
నిర్మలమ్మ అద్భుత వ్యక్తి, సహజధోరణిలో వెళ్ళి ఆ కానుకల పళ్ళెం తీసుకురా అని ఫిడేలువాలాకు చెప్పింది. రెండు రూపాయలున్నాయి. ఖాలీగా ఉంది.
పెద్ద ఉత్సవం కదా. అందులో తమాషాలు, జావళీలు. చమత్మారాలు కావాలి ఇక్కడ జనాసికి. ముఖ్యంగా శృంగార జావళీలు కావాలి. కాని 1244 కవి నవల
నితాయీ పాడిన పాట లేమన్నా రసికులకు ఆనందాన్నిస్తాయూ? అందుకే పళ్ళెం కాళీగా ఉంది” అన్నది నిర్మలమ్మ నిరాశగా. వారిలో వారు మాట్లాడు కుంటున్నారు. అంతా విన్న నితాయీ మాట్లాడలేదు.
లలిత, లక్ష్మి మౌనంగా ఉండే సరికి తన వలన వీరందరికీ నష్టం. అవమానం జరిగిందన్న విషయం బోధపడింది. అతని శిరస్సు మీద అవమానం విరుచుకుపడినట్లనిపించింది. వేదనగా తలపట్టుకుని కూలబడిపోయాడు. ఈ దుర్భర వ్యధ అతనిది, ఇక్కడ వేదిక మీద ఇక ముందు తన కవితలు పాడకూడదు. పాడడు అనే భావాన్ని కలిగించింది. ఇంతలో డోలు ధ్వని విన్సించింది. మరో కవి గాయకుడు అందుకున్నాడు. “హుక్కా సేవించింది రాధ” అంటూ అసభ్యంగా పాడుతున్న పాటలకు సభికులు రెచ్చిపోయారు. ఈలలు కేకలతో ప్రతిధ్వనించింది.
నితాయీ కోపగించుకోలేదు. సభ అయిన తరువాత నర్తకీ నర్తకులను అభినందించాడు. సభనుండి వచ్చి వసంత కుటిరం వైపు నడిచాడు. లోపల సన్నని వెలుతురుంది. తొంగి చూశాడు. ఆ దిపానికి కొద్ది దూరం దున్న పోతులా ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను అడుగుల సవ్వడి విని నితా యీని చూసి మౌనంగా ఉండిపోయాడు. లోపలికి వెళ్ళే సాహసం చేయలేక అలాగే నిలబడిపోయాడు.
ధైర్యంగా “వసంతా” అని పిలిచాడు. మగతలో ఉన్న వసంత కళ్ళు తెరిచింది. “చిన్న పని ఉంది బయటకు వస్తావా” అన్నాడు నితాయీ. తడ బడుతూ వస్తోంది కరవాలంలా ఉంది. ఎ(రనికాంతితో ముఖమంతా కంది పోయి ఉంది. మధ్యాహ్నం పూజలో పుణ్యవతిలా ఉన్న వసంత కాదు. రక్తంతో స్నానం చేసిన రౌద్రమూర్తిలా ఉంది. కవి హృదయం భయాందోళనతో నిండి ఉంది.
“మీరెంకుకు వచ్చారు?”
తీవ్రంగా ఉంది కంరం మత్తులో కూడ మౌనం వహించాడు నితాయీ. ఆకస్మాత్తుగా వసంత చెంపదెబ్బ కొట్టింది. మతిలేదా! మాట రావటం లేదా? అంతే తీవ్రతతో లోనికి వెళ్ళిపోయింది. వసుమతి చలనాని +ఉఅ 195
అలాగే కొన్ని నిముషాలు శిలలా నిలబడిన నితాయీ కాపలా దారుడిని పిలిచాడు.
“నీ దగర మద్యం ఉన్నాదా!” అని అడిగాడు.
సమాధానం ఇవ్వకుండానే బాటిల్ తెచ్చి నితాయీకందించాడు. అతను క్షణం ఆలోచించి ఒకే గుక్కలో అంతా త్రాగివేశాడు. గొంతు మండింది. పొంగుకొచ్చిన వాంతి. కష్టం మీద నిభాయించుకున్నాడు. ఒక్క పర్యాయం భూమి కదిలివోయినట్లయింది. అణచుకోలేని చాంచల్యం. ఛీ [గ్రపంచమంతా అసహ్యమైంది. ఇప్పుడు నాకు కావసినది లభ్యం కావాలి. తూగుతున్నాడు. వీరులు క్టూరులు, దుర్మార్గులు దొంగలైన వంశంలో జన్మించిన బీజాలు విజ్బృంథించాయి.
మరల మరల మద్యం తీసుకున్నాడు. వేదిక వైపు నడిచాడు. వేరొక వ్యక్తిగా రూపొందాడు. నీతి, పాపం, పుణ్యం మనస్సులో నుండి తుడిచి వేసుకున్నాడు. అళ్లిలం స్వరాలల్లుకుంటూ పాడసాగాడు. నగ్నమైన అశ్లీలత గూడు కట్టుకున్న సముదాయంలో పుట్టి, దారిద్రంతో మగ్గివోయి దురభ్యానాల మధ్య పెరిగిన సంతానంతో ఒకడు నితాయీ మోటుతుట్లతో తల్లి పెంచింది. పని కట్టుకుని అసభ్యాలను అలవాటు చేసింది. భగవంతుని కృపవలన కవితా గాన రక్షణలో తన వాస్తవ జీవితాన్ని ఇప్పటివరకు మరుగు పరుచుకోగలిగాడు. కాసి వసంత చెంప చెళ్ళుమనిపించే సరికి దానితో తన తలరాతను మార్చుకో వాలనుకున్నాడు. ఎదురు చూదని ఆహార్యంతో నితాయీ పునఃప్రవేశం వాద్య గాళ్ళను అవాక్కుచేసింది. నితాయి గానంలోని అసభ్యపదాలు శరపరంపరంగా దూసుకువచ్చి తిరిగి వెళ్ళబోతున్న సదస్యులను రెట్టింప చేసింది. అంతేకాదు లలిత, లక్ష్మీ వసంత ఇద్దరిద్దరుగా తన గానానికి ప్రాణం పోస్తూ తూలుతూ నృత్యం చేస్తుంటె నీతి, పాప పుణ్యాలు అన్నీ మరచి అసభ్యమైన పదాలతో తనను తానే మరచి నృత్యం చేస్తూ పాడసాగాడు. నెరజాణ నిర్మలమ్మ [గ్రహిం చింది మారిపోయిన నితాయీని సదస్సులు పళ్ళెం నిండా కానుకలను నింపి వేస్తున్నారు.
“సెభాష్ ఉస్తాద్” అంటూ ఉత్సాహంతో చప్పట్లు చరుస్తూ తను కూడ 126 €* కటి నవల
నాట్యం చేసింది నిర్మలమ్మ
పనికి మాలిన చోట ధర్మాలెందుకు
చల్లని నీట దాహం తీరనపుడు
చింత నిప్పుల కషాయమే మందు” అంటూ పాడుతున్న నితాయీలో విచక్షణ కోపంగా మారి పదాలు మారి జల్లులా పడుతూ మైకం కలిగిస్తోంది ఆ ప్రాంతమంతా. నల్లని జాబిల్లి అంటూ (ప్రేక్షకులనుండి కేకలు విన్సించాయి. నితాయీకి అందరూ రెండుగా కన్పించనాగారు. వసంత కూడ ఇద్దరిగా నృత్యం చేస్తున్నట్లుంది. అసభ్య ధోరణి రెట్టింపయింది నితాయీ పదాలతో, చివరి మెట్టు తారస్థాయిని అందుకుని శ్రోతల అట్టహాసాలతో, చీకటి రాత్రి అయిపోయింది.
పూర్తి చేసిన నితాయీ అభినందనల వర్షంలో తడుస్తూ గొంతు వరకు మునిగిపోయిన మత్తులో తూలుతూ కూర్చుండిపోయాడు. నిర్మలమ్మ వచ్చి సెభాష్ బాబూ ఎలాంటి పెళ్ళి అయినా అలాంటి మంత్రాలే చదవాలి. ఇలాంటి సమయాల్లో మారిపోవాలి. మంచి పని చేశావు” అన్నది సంతోషాతిరేకంతో.
ఎదురుగా వసంత, తనను లెంపకాయ కొల్టి అవమానించింది. కాసి ఇప్పుడు విజయ దర్చంతో ఉప్పాంగిన ఉల్లాసంతో కన్పించింది నితాయీకి,
ఇవ్వు మరో గ్లాసు అంటూ చేయి అందించాడు. వసంతకు నితాయీ. “పద ఇంటికి, మంచి మద్యముంది ఇన్తాను” అంటూ దాదాపు నితాయీని లాక్కుంటూ తీసుకువెళ్ళింది. అతసిలో మద్యతృష్ట విజృంభించింది. కళ్ళు విప్పార్చి తననే చూస్తున్న నితాయీని చూసి మొదటిసారిగా సిగ్గుపడింది. బ్రాంది, విస్కీ అందించింది. సంఘంలో అట్టడుగు శరీర వ్యాపారి అయిన వసంత బాటలమ్మట సాగిపోతూ వ్యాపారం సాగిస్తుంది. సిగ్గే తెలియదు. సిగ్గుంటెే వ్యావారం నాగదు వదలివెసిన సిగ్గు ప్రధమంగా తిరిగి వచ్చింది.
“నిలబడు వసంతా నిన్నాకనారి తృప్తిగా చూడాలని ఉంది” తమకంగా చూస్తూ అన్నాడు నితాయీ.
అంతలోనే దుఃఖం ముంచుకొచ్చింది వసంతకు. “ఎందుకేడుస్తున్నావు? ఆప్యాయంగా అడిగాడు నితాయీ, వసుమతి చలసాని త 127
“నాకు దగ్గు ఉంది. తరచూ రక్తం పడుతుంది. జ్వరం కూడా వస్తుంది.” వెక్కి వెక్కి ఏడుస్తూ చెంగుతో తడుచుకుంది.
నితాయీ హృదయాంతరాళం జాలితో నిండిపోయింది. అనాగరికులైన వీరుల వంశంలో జన్మించిన అతని మూర్తి స్టిరమైన పౌరుషంతో భయానకంగా ముందుకొచ్చింది. ఇలాంటి భీకరమూర్తిని చిన్నరాణి అయితే సహించేది కాదు. రుమర్ బృందంలో యుక్తవయస్సు నుండి ఊరూ ఊరు తిరిగే వసంతకే ఇలాంటి వ్యక్తులను ఆహ్వానించగలిగే శక్తి ఉంటుంది. నితాయీ ముందుకు వస్తుంటే విషళ్ఞా వదనంతో నిశ్చలంగా ఉండివోయింది. నితాయీ ప్రగాఢ ఆలింగనంలో నలిగిపోయింది.
మధురమైన కవితలు పాడుకుంటూ అంతులేని సుఖాన్ని పొందారు నితాయా వసంత. అవధులు లేని ఆనందంతో వసంత ముద్దల వర్షం కురిపించింది, నితాయీని అల్లుకుపోయి.
క!
మరునాడు లేచేసరికి నాలుక నుండి పొట్ట వరకు చేదుగా వుంది. నఖశిఖ పర్యంతం శరీరమంతా ఒకటే మంట ఊపిరి కూడా దుర్గంధంగా వుంది. చెమటతో తడిచిపోయి వున్నాడు. అసలే చలికాలం, ఆపైన తెల్లవారే వేళ! అయినా ఒళ్లంతా చెమటపట్టింది. విపరీతమైన నొప్పితో వేదనతో శిరస్సంతా పెలిపోతున్నది! గ్రీష్మకాల మధ్యాహ్నవేళ వేడిదుమ్ముతో నిండిన ఆకాశంలాగ నితాయీ శరీరం సమస్తం అట్టుడికినట్టు ఉదికిపోతున్నది. కడుపు, గుండె లోలోపల అంతట మందిపోతున్నది! ఒళ్లంతా క్రమక్రమంగా కొయ్య బారివోతున్నది.
వసంత ఇంట్లోనే ఉన్నా వేరొక పనిలో నిమగ్బురాలైంది ఆ ఇల్లు కొన్నాళ్ల పాటు ఉండడానికి మాత్రమే కట్టినది. అందుచేత దాని సర్దుబాటు పనిలో పడింది. పొద్దున్న లేచేసరికి, ఆయా గృహకృత్యాలన్ని గొంతెత్తి పిలుస్తు న్నట్టనిపించింది. ఉత్సవంలో ఆమె చిత్రపటాలు కొన్ని కొన్నది. వాటిలో ఒకటి రాధాకృష్ణుల (ప్రమలీలల చిత్రపటం. అది జర్మనీలో తయారైంది, విదేశీయ వర్ద్జాలతో చవకబారు చిత్రకారులు చిత్రించిన చిత్తరువది. ఆ 128 + కవి నవల
చిత్రపటాలలో రెండు దొరసానుల నగ్నచిత్రాలు, ఆ పటాలన్నీ వసంత ఆ ఇంటి వెదురు స్తంభంమీద వేలాడవేస్తున్నది. నితాయీ ని[ద్రలేచినట్లు గమనించి చిన్నగా నవ్వి “లేచారా?” అన్నది.
ఆ ప్రశ్న ఆ నవ్వు నేడు అతనికి బాగా చిరాకు కలిగించాయి. ఎర్రబారిన కళ్లతో కరినంగా ఆమెకేసి చూసి, కటువుగా “ఊలొ అన్నాడు అంతే.
ఆ ధోరణి గమనించి వసంత అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ పైన నవ్వంది.
“బొత్తిగా ఒంట్లో బాగాలేదుకదూ? అవునుమరి! మొట్టమొదటినాడే అంత మద్యం పట్టిస్తే ఎలాగ? కాస్త కాళ్లు, ముఖము కడుక్కుని టీ తాగండి! తరవాత స్నానం చెయ్యండి. వాలు కలపకుండా వట్ట టీ కాచి ఇస్తాను. ఆనాడు మీరు నాకు అలాంటి టీయే ఇచ్చి చాలా ఉపకారం చేశారు.”
నితాయీ సమాధానం చెప్పలేదు తూలుతూ తూలుతూ బయటికి వెళ్లాడు. ఇప్పటికి కూడా అతనికి కాళ్లకింది నేల కంపిస్తున్నట్లే ఉన్నది! ప్రాతః కాలకృత్యాలన్నీ ముగించుకుని తిరిగి వచ్చెసరికి అతనికి కొంత స్వస్థత కలిగింది. తలనొప్పి తగ్గడానికని చెరువు నీళ్లతో చాలాసారులు తల అంతా కడుక్కున్నాడు. తడిసిన జుట్టు చివరల నుండి శరీరం అంతటిమీద సీళ్లు పడ్డాయి. బాగా వేడెక్కిన లోహపాత్రమీద సీటి బిందువులు పడ్డట్టు ఆ నీళ్లు అతని ఒంటిమీద జారాయి. వసంత అప్పుడొక బట్టలమూట పట్టుకుని ఉతకడానికి బయటికి వెళ్లబోయింది. కాని నితాయీని చూసీ చూడగానే ఆ మూట ఒక పక్కనపెట్టి వెంటనే టీ చేసి చేతికందించింది. నిమ్మపళ్ల రసంతో కలిపిన ఆ వట్టి టీ పుచ్చుకున్న తరవాత నితాయీ పరిస్థితి బాగాకుదుట పడింది. టీ తాగడం ముగించగానే నేలమీద పరిచిన గడ్డిమిద మనువాల్చాడు. వెంటనే అతనికి నిద్రపట్టింది. కాని అది కొంత మగతనిద్ర. మరికొంతసేపటికి అదే మగతనిద్రలో “వట్టి గడ్డిమీదే పడుకున్నారె!” అన్న వసంత మాటలు వినిపించాయి.
నితాయీ కళ్లు తెరిచి చూశాడు, వసంత తడిసిన బట్టలు కొన్ని భుజం మీద వేసుకున్నది. ఒళ్లంతా తడిసిన ఆమె ఇంటి గుమ్మం మీద నిలబడి వసుమతి చలనాని + 120
పిలుస్తున్నది.
“లేవండి! ఒక చాపవేసి దానిమీదికి ఒక బాలీసు ఇస్తాను. ఏమే, నిర్మలా, మీ అన్నయ్యగారికి ఒక చాప, ఒక బాలీసు తీసుకురావె! నా ఒళ్లంతా తడిసింది మరి!”
నితాయీ కళ్లుమూసుకుని అస్పష్ట స్వరంతో అక్కరలేదన్నాడు.
ఈసారి వసంత అతని సరసనే కూర్చుని చెయ్యిపట్టుకుని లాగుతూ అధికార పూరిత స్వరంతో “కాదు, లేవాలి, లేవాలి మరి!” అన్నది.
నితాయీ ఈసారి లేచి విస్పారిత నేత్రాలతో వసంతవైపు చూశాడు.
“ఎక్కడ? అన్నయ్య ఎక్కడ ఉన్నాడు?” అని అడుగుతూ నిర్మల నవ్వు ముఖంతో లోపలికి వచ్చింది. చాప, బాలీసు తీసుకువచ్చి ఇస్తూ అన్నది.
“మా అన్నయ్య చాలా మంచివాడు! ఏమిపాట పాడాడు నిన్న!”
ఇదే సమయంలో పక్కనే ఉన్న ఒక కుటీరంలో నుండి ప్రౌఢ వచ్చింది. నెమ్మదిగా “మా బాబు మేలుకున్నాడా?” అని అదిగింది. మరుక్షణంలోనే మిక్కిలి కంగారుపడింది.
“అమ్మయ్యో ఏమిటి వసంతా ఈ గందరగోళం అంతా? జ్వరం రావడం మానేసి నాలుగునాళ్లయినా కాలేదు కదా! అప్పుడే ఇలాగ నీటిలో నానిపోతున్నా వేమిటి?”
వసంత మృదువుగా నవ్వింది.
“కాస్త బట్టలుతికి అంతా కడగవలసివచ్చింది పిన్నీ! ఈసారికి మాత్రం స్నానం చేస్తాను. అంతే!”
“అంతటి అవసరం ఎమి వచ్చింది వసంతా?”
నిర్మల కిలకిలా నవ్వింది.
“ప్రేమంటే సామాన్యం కాదు పిన్నీ! అన్నయ్య నిన్న వాంతిచేసుకుసి పక్కబట్టలన్నీ తడిపెశారు!”
ఈమారు ప్రాఢ మృదువుగా నవ్వి వసంతతో అన్నది. “వెళ్లు, వెళ్లు! అతడి బట్టలన్నీ ఒక మూలపెట్టి స్నానం చేసిరా! ఆ వెంటనే ఆ చీరవిడిచి ఆరవెయ్యి!” 130€ కణి నవల
నితాయీ ఎంతో ఆశ్చర్యపడి కళ్లు రెండు పెద్దవిచెసి అడిగాడు.
“నేను వాంతి చేసుకున్నానా?”
నిర్మల మళ్లీ కిలకిల నవ్వడం వ్రారంభించింది.
నితాయీ తలవంచుకుని ఆలోచించడం (ప్రారంభించాడు. అయితే ఈ దుర్గంధం అంతా తన వాంతి దుర్దంధమే అన్నమాట! ఒళ్లంతా ఆ వాంతినీళ్లే పడ్డాయని స్ఫురించింది. ఈ దుర్వాసన వల్లనే లోలోపల అంత గాభరా బయలుదేరిందని కూడా నితాయీకి తోచింది. తన ఒంటికి పట్టిన చెమట మీద అతనికాక్కృమారుగా అసహ్యం వేసింది.
“తలనొప్పిగాని వచ్చిందేమిటి అన్నయ్యా! అయితే పడుకో! నేను కణతల మీద రుద్దుతాను!”
నిర్మల అతని తలమీద చెయ్యివేసింది. ఆమె చెయ్యి ఎంతో చల్లగా మృదువుగా ఉన్నట్లనిపించింది నితాయీకి. శిరస్సంతా క్రమక్రమంగా చల్ల బడుతున్నట్లు తోచింది. ఎంతో హాయిగా ఉన్నట్లనిపించింది. అయితే నితాయీ మరి స్నానం చెయ్యకుండా ఉండలేకపోయాడు. లేచి నిలుచున్నాడు. “నేనింక స్నానం చేసి వస్తాను.” అన్నాడు.
వసంత తన భుజం మీద ఉన్న బట్టలన్నీ ఒకచోట పెట్టంది.
“నిర్మలా, ఇదిగో ఇలా చూడు! నా పెట్టె పక్కనే అత్తరు సీసా ఉంది! అది తీసుకువచ్చి, ఆ తైలంతో మర్దన చెయ్యి!” అటుపిమ్మట నితాయీకేసి తిరిగింది, “ఆ తైలంతో మద్దన చెస్తే చాలా మంచిగుణం కనబడుతుంది, ఒళ్లంతా చక్కగా చల్లబడుతుంది. శరీరానికంతో హాయి అనిపిస్తుంది. ఆపైన సబ్బు కూడా కావలసివస్తే అదికూడా తీసుకువెళ్లవచ్చు. వసంతవైపు చూడలేదు నితాయి.
“అక్కరలేదు!” అని చెప్పి అలాగే బయటికి వెళ్లిపోయాడు నితాయీ., అతనికి ఒక్కమారుగా నీళ్లలో ములిగి చచ్చిపోవాలనిపించింది. గట్టిగా కేకలు పెట్టాలని కోరిక కలిగింది!
స్నానం ముగించుకుని తిరిగి వచ్చెసరికి వసంత చీరమార్చుకుని తన పెట్టైదగ్గర కూర్చుని ఏమెమో చేస్తున్నది. నితాయీ లోపలికి రాగానే అల్లన వసుమతి చలనాని + 131
నవ్వింది.
“ఈవేళ నేనెలాగ ముస్తాబవుతానో చూద్దురుగాని! ఇదుగో, అక్కడ అద్దం ఉంది, దువ్వాన ఉంది, స్నో ఉంది. అది కాస్త ముఖానికి పూసుకోండి!”
స్నానం చేసిన తరువాత నితాయీకి స్వస్తత కలిగిన మాట నిజమె. అయితే మనసులో మాత్రం అశాంతి, ఆందోళన బాగా పెరిగిపోయాయి! ఛీ! ఛీ! ఇదేమిటి ఇలాగ చేశాను. స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు దారిలోనే గట్టగా సంకల్పించుకున్నాడు. ఈవేళ ఇక్కడినుంచి పారిపోవాలనుకున్నాడు. కేవలం పారిపోవడం కన్న గత్యంతరమది లేదని ఒక నిశ్చయానికి వచ్చివేశాడు. లేకపోతే ఈ నర్తకీ బృందం కాలుకదపనివ్వదని కూడా ఆలోచించాడు. తన వస్తువులేవయినా, ఇక్కడ ఉండిపోతే, పోనీ అనుకున్నాడు. ఈసారి బజారంతా తిరిగి వస్తానని చెప్పి, అక్కడినించి అలాగే ఉదాయించాలని ఆలోచించు కున్నాడు. ఇక్కడ విడిచి వేసిన సామాన్య వస్తువులను గురించి అంతగా ఆలోచించవలసిన అవసరమేమి లేదు.. ఇంతకి ఆ వస్తువులు మాత్రం ఎన్ని ఉన్నాయి కనుక! కొన్ని బట్టలు! అంతే! రెండు చొక్కాలు, ఒక కంబళి, రెండు బొంతలు! ఒక బాలీసు ఇక్కడ ఉన్నవన్నీ కలిపి అంతే! అయితే విచారమంతా పుస్తకాల మూట గురించే అది కండువాలోచుట్టి చంకన పెట్టి పట్టుకుపోవ దానికి తగినంత చిన్నమూటిం కాదు! బాగా పెద్దమూట! రామాయణం, మహాభారతం మొదలైన పుస్తకాలతో అది నానాటికీ బాగా పెరిగిపోయింది. ఉత్సవాలు, తీర్ధాలు మొదలైన చోట్లలో అతడు అప్పుడప్పుడు రెండు, మూడు పుస్తకాలు కొంటూ వచ్చాడు. కవితాగానాలు, పదాలు, కృత్తివాస రామాయణం, కాశీదాసు మహాభారతం, చండీ మాహాత్యం, సత్యపీర్ పాటలు, కవికంకణ చండి, అన్నదామంగళం మొదలైన పుస్తకాలెన్నో కొన్నాడు. అదీగాక సంపన్ను లైనవారు అప్పుడప్పుడు వీధిలోకి విసిరివేసిన చెత్తపుస్తకాలలోనించి మంచివి కొన్ని ఏరి జాగ్రత్త చేసుకోవడం నితాయీకి ఒక అలవాటుగా పరిపాటిగా తయారైంది! ఆపైన ఆయా నాటకశాలల సమీపంలో మొదలు, తుదిలేని చిరిగిన పుస్తకాలు మరికొన్ని జాగ్రత్త చేశాడు. అదీ గాక తాను స్వయంగా (వ్రాసుకున్న పాటల పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవి అన్ని తాను పాదే పాటల 1324 కవి నవల
బైండు పుస్తకాలు!
అంతలోనే ఒకచీర పైకి తీసి దానికేసి చూసి వసంత అన్నది.
“ఇది బాగా నాజూకైన సన్ననేతచీర! నే సీవేళ ఇది కట్టుకుంటాను!”
దాని అంతరార్థం నితాయీడి ఇట్టె బోధపడిపోయింది! వసంత ఈనాడు చాలా వరకు నగ్నంగానే నృత్యం చెయ్యబోతున్నదన్నమాట! నితాయీ ఒళ్లు జలదరించింది. వసంత అందుకున్నది.
“ఈ వేళ మీ పాటే గొప్పగా ఉంటుందో, లేక నా నృత్యమే గొప్పగా ఉంటుందో... చిట్టచివరికి ఈ పందెంలో ఎవరు గెలుస్తారో చూద్దాం!”
అద్దమూ, దువ్వెన అవి ఉన్నచోటే పెట్ట నితాయీ జుబ్బా తొడుక్కోవడం మొదలుపెట్టాడు. క్షణంలో అతడొక నిశ్చయానికి వచ్చిశాడు! ఆ పుస్తకాల మూట అక్కడే ఉండిపోతుంది పోనీ! తాను వెళ్లి తీరతాడు! అంతే! ఇక ఇక్కడ ఉండలేడు!”
“ఇదేమిటి? జుబ్బా తొడుక్కున్నారు? ఎక్కడికి వెడుతున్నారు?
“ఇప్పుడే వచ్చిస్తాను!”
అతనిలో అకస్మాత్తుగా బయలుదేరిన ఈ తొందరపాటు గమనించి వసంత ఆశ్చర్యపడి అడిగింది.
“అంటే?”
“కొంచెం బజారులో తిరిగి వస్తాను.”
“వద్వ! ఇప్పుడు బజారుకేసి వెళ్లవద్దు! మళ్లీ కొంతసేపు నిద్రపొండి! ఇదిగో, కొంచెం మద్యం పోశాను, అది తీసుకుంటే నిద్రమత్తంతా వదిలి పోతుంది!”
“అక్కరలేదు! నేనాకసారి దేవాలయానికి వెళ్లివస్తాను”
“దెవాలయానికా?”
“అవును.”
“ఒకసారి బజారుకి వెడతానంటారు! ఇంకొకసారి దేవాలయానికి వెడతానంటారు! ఎక్కడికి వెళ్లేది స్పష్టంగా చెప్పరెందుచేత?”
“బజారుకివెళ్లి ఆపైన రాధాగోవిందుల దేవాలయానికి వెడతాను! వసుమతి చలసాని +ఉ 133
“అయితే నేను కూడా వసాను! నడవండి!”
అనుకున్నదంతా తలక్రిందులైందని నితాయీ నిశ్శబ్దంగా వసంత ముఖం వైపు చూస్తూ సిలుచున్నాడు.
శరీరవ్యాపారిణిది అత్యద్భుతవమైన నిశితదృష్టి! నితాయీ ముఖంకేసి అలాగే చూస్తూ అల్లన నవ్వింది!
“ఏమని ఆలోచిస్తున్నారో కాస్త చెప్పకూడదా?”
నితాయీ సమాధానం చెప్పలేదు.
వసంత మళ్లీ మొదలుపెట్టింది.
“నా సాంగత్యం విడిచిపెట్టి పోవాలని ఆలోచిస్తున్నారు కదూ? ఏం నాతో ఉందదానికి తలవంపుగా ఉందా?”
దానికి బదులు చెప్పడానికి సిద్ధంగా లేదు నితాయీ. తలవని తలంపుగా హరాత్తుగా అడిగిన ఆ ప్రశ్నతో నిలువునా నిర్దాంతపడ్డాడు. వెనువెంటనే బాగా కంగారుపడ్డాడు.
“లేదు! లేదు! లేదు! అదేమిటి ఆలాగ మాట్లాడతావు వసంతా? చాలు, చాలులే”
“ముఖంకేసి చూస్తే నాకలాగే అనిపించింది మరి! పారిపోతే ప్రాణాలు దక్కుతాయన్నట్టున్నారు మీరు! ఎవరో మిమ్మల్ని తాళ్లతో కట్టివేసినట్టు మాట్టాడుతున్నారు! సరే.. మీరు వీధిలో నిలబడండి! నేను చీర మార్చుకుని వసాను!”
నితాయీకి ఆపైన నోట మాట వెలువడలేదు! వసంత చూపుల అంచులే కావ! సూదుల మొనలు! అవి గుండె లోలోపలికి చొచ్చుకుపోయి ప్రత్యణువు నిశితంగా పరిశీలించగలవు! అతడు వెలుపలికివెళ్లి నిలబడ్డాడు. వసంత నెలాగ తప్పించుకుని పారిపోవాలి. ఆ సంగతే ఆలోచించడం ప్రారంభించాడు.
ఆమె చాలా అపురూప వ్యక్తి! పెదవులమీద చిరునవ్వు చెంగలిస్తూనే ఉంటుంది! కాని అంతలోనే కళ్లు రెండు కళ్ళు బాగా తెరచి గంభీరంగా మారిపోతుంది. బృందంలోని వారందరు ఆ కళ్లకేసి చూస్తూనే హడిలిపోతారు. మళ్లీ మరుక్షణంలోనే ఆమె పెదవుల మీద చిరునవ్వు! పాటలన్ని పాడగలదు. 1344 కవి నవల
రాని పాటంటూలేదు! ఇరవైనాలుగు గంటలు పాడుకుంటూనె గృహకృత్యాలలో మునిగి ఉంటుంది. మదించి మైమరిచిన గుర్రాలనన్నింటిని పగ్గాలతో అదిమి పట్టి జాగ్రత్తగా నడిపిస్తూంటుంది! రధము. రథికుడు, సారధి - సమస్తము ఆ దళ నాయకురాలే! వంట ఇంట్లో ఏదో వేయించుతోంది.
ఇంతలో నిర్మల నవ్వుతూ బయటకు వచ్చింది,
“ఇదిగో, అన్నా కాస్త ఈ బీద చెల్లెలింటికి ఒకసారి రా”
“ఏమిటి మీ ఇంట్లో విశేషం?” నితాయీ నవ్వుతూ అడిగాడు.
“లక్ష్మివారం కదా; పొద్దున్న భోజనం ముగిస్తాను. అన్నట్లు వసంత ఎక్కడ?” అంటూ ఇంట్లో మద్యం బాటిల్ నితాయికిస్తూ ఆమె కిలకిలా నవ్వింది.
నితాయీ రెండు చేతులూ జోడించి మన్నించవలసిందని నిశ్శబ్దంగా సవినయంగా వేడుకున్నాడు.
అదే సమయంలో నితాయీ వెనకవైపునే వసంత గొంతు వేళాకోళం ధోరణిలో ప్రతిధ్వనించింది.
“అయితే తల ఇప్పుడు పుణ్యం చెయ్యడంకోసం బయలుదేరింది. దాని వెంటనే చెవి కూడా వెళ్లవలిసి ఉంటుంది. అయినా చెవికోసి తీసుకు వెళ్లాలనుకుంటే అది వేరే కధ!”
వసంత ప్రసంగం వింటుంటే నితాయీకెంతో సంతోషం కలిగింది. “వసంత ఎంత చమతారంగా మాట్లాడుతుంది?! అనుకున్నాడు, వెనక్కి తిరిగి చూశాడు. మిక్కిలి భక్తిశద్ధలున్న పూజారిణిలా మున్తాబయింది వసంత! ఆమె నవ్వుతూ “నడవండి మరి!” అన్నది.
వారిద్దరూ నడుస్తున్న దారిపొడుగునా రెండువైవులా దుకాణాలెన్నో ఉన్నాయి. ఫలాల కోసం, మిగిలిన పూజాద్రవ్యాలకోసం, మిరాయికోసం వసంత పూర్తిగా ఒక రూపాయి ఖర్చు చేసింది. ఒక పావలా మార్చి అన్నీ అర్ధణాలు తీసుకుని నితాయీ దోసిట్లోపోసి “జేబులో ఉంచండి” అన్నది.
అదే సమయంలో నితాయీ లోతుగా ఆలోచిస్తున్నాడు. 'ఈ బంధనంలో నించి తప్పించుకుని బయటపడడమెలాగ!? అదే ఆలోచన! రాధాగోవింద వసుమతి చలనాని + 135
దేవాలయం నించి తిరిగి వస్తున్న సమయంలోనే వ్యవహారం అంతా ఆమెతో చెప్పివేయాలి! అయితే వసంత అంగీకరించదు! తీవ్రక్రార్యంతో ఒక్కసారిగా చురకత్తి అంచులా మండిపడుతుంది! గతరాత్రి వసంత మూర్తి అతనికట్టెదుట ఇంకా అలాగే తళతళలాడుతూ కనిపిస్తోంది. కనుక ఇంకొకమార్గం ఆలో చించాలి. తిరిగి వచ్చే సమయంలోనే వసంతనింటికి పంపించివేసి, అక్కడి నుండే అలాగే చల్లచల్లగా జారిపోవాలి! దానికి ఏదో ఒకవంక దొరకకపోదు. గ్రామస్యలెవరితోనో మాట్లాడవలసినపని ఉందని, అలా తిరిగివన్తానని చెబుతాడు! ఆ వంక బాగానే అతికిందని అదే గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు, అదే సమయంలో వసంత అతని దోసిట్లొ అర్ధణాకాసులు పోసింది.
కనుబొమలు ముడిచి “ఎందుకివి?” అని అదిగాడు నితాయీ.
“అమ్మయ్యా! దేశంలో ఉన్న కుంటివాళ్లు, గుడ్డివాళ్లు అందరూ దేవాల యానికి వెళ్లే దారిలోనే పోగుపడ్డట్టుంటారు! దానం చేద్దాం!”
మృదువుగా నవ్వి నితాయీకేసి చూసింది వసంత. అంతలోనే ఎంతో ఆశ్చర్యపడి బొమముడివిడిచి అడిగింది
“ఏమిటలాగ ఆలోచిస్తున్నారు?”
కంగారుపడి, అంతలోనే అదేమి లేదన్నట్టు అభినయిస్తూ నవ్వాడు నితాయీ.
“ఏమీ ఆలోచించడంలేదే?!౫”
“ఏమీ ఆలోచించడంలేదా?”
నితాయీ మళ్లీ అభినయం మొదలు పెట్టాడు.
“నిన్ను అర్ధం చేసుకోలేకపోతున్నానే! అని ఆలోచిస్తున్నాను వసంతా!” చిన్నగా నవ్వాదు.
ఆ అభినయం చూసి వసంత ఎంతో ముగ్భురాలయింది!
“పాపం, ఈ కుంటివాళ్లు, గుడ్డివాళ్లు ఎన్నెన్ని కష్టాలనుభవిస్తున్నారో చూడండి! అయ్యయ్యో!”
అలాగంటూనే ఆమె నిలువునా వణికింది. నితాయీ ఈమారు నిజంగానే నిర్దాంతపడ్డాడు! ఇదేమిటి? వసంత కళ్లనిండా నీళ్లునిండి చెక్కిళ్లమీద ప్రవ 1364 కవి నవల
హిస్తున్నాయి!
కళ్లు రెండు తుడుచుకుని ఆమె మళ్లీ నవ్వింది. ఆ నవ్వు చాలా విచిత్ర మైంది. నితాయీ తన జీవితంలో అటువంటి నవ్వు ఎన్నడూ చూడలేదు! అలాగ నవ్వుతూనే వసంత మొదలుపెట్టింది.
“నా నెత్తిమీద కూడా కష్టాలెన్నో విరుచుకుపడ్డాయి!
నిన్ననే కదా దగ్గుతోపాటు రక్తం పడుతున్నదని మీతో చెప్పింది! నాది చాలా గడ్డయిన దగ్గురోగం! కనకనే తాంబూలంలో పొగాకు కొంచెం కలిపి వేసుకుంటున్నాను. రక్తం పడిందంటే, అది తెలిస్తే నలుగురు నా మీద జాలి పడరు! ఆ రక్తం చూస్తే నా మటుకి నాకే భయంవేస్తుంది! దానికేసి చూడ కుండా ఉంటేనే హాయిగా ఉంటుంది! ఈ సంగతి మా బృందంలో వాళ్లకెవళ్లకి తెలియదు! కాని ఒక్క పిన్నికి మాత్రమే తెలుసును! అయినా ఇప్పటికి కూడా చక్కగా వాడగలను! నృత్యం చెయ్యగలను! అందచందాలున్నాయిగదా అని, అందరు మెచ్చుకుంటున్నారు కదా అని నన్నింకా ఈ బృందంలో అట్టెబెట్టారు! ఎన్నడయినా నాలుగు రోజులపాటు మంచానపడితే నన్నింక ఈ బృందంలో ఉందనివ్వరు! కాస్త మంచితనం చూపించాలనుకుంటే ఎవరినైనా తోడు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. లేకపోతే ఎక్కడ రోగం ముదిరితే అక్కదే విడిచిపెట్టి వెళ్లిపోతారు! ఇలాగ చెట్టుకింద పడి చావాలి! ఇంకా ఊపిరిఉండగానే నక్కలు, కుక్కలు పీక్కుతింటూ వుంటాయి!”...అని ఆమె చెప్పిన సత్యాలలో వున్న సంఘటనలు అలాగే నితాయీ హృదయంలో నాటుకుపోయాయి! ఆపైన అతని భూతభవిష్యత్తులు రెండు ఒక్కమారుగా హరించుకుపోయాయి. హృదయం ద్రవించిపోయింది. ఇక ఆమెనలాగ విడిచిపెట్ట పొరిపోవాలన్న ఆలోచనే అతనిలో మొలకెత్తలేదు! ఇంక ఏదో వంక పెట్టాలన్న మాటే పూర్తిగా మరిచిపోయాడు! తలవంచుకుని నిశ్శబ్దంగా వసంతననుసరించాడు
మరికొన్ని క్షణాల తర్వాత ఆమె తిరిగి మొదలుపెట్టింది. ఇప్పుడు వసంత గొంతులో విషాదచ్చాయకూడా స్ఫురించలేదు! పరిహాసధోరణిలోనే మృదువుగా నవ్వింది.
“మనం ఇద్దరం కలిసి జోడుగా పెళ్లిముళ్లు వెసుకుందామా? పెళ్లినాటి వసుమతి చలనాని ఛి 137
కొంగుముళ్లు!”
వసంత ఆ మాటలన్ని బాగా వేళాకోళంగానే చెప్పింది! ఎంతటి విచిత్ర వ్యక్తి వసంత! ఇప్పుడిప్పుడే ఆమె తన మృతి సంగతి ప్రస్తావించింది! కాని అంతలోనే అది అంతా మరిచిపోయింది!”
నితాయీ కళ్లెత్తి వసంత ముఖంకేసి చూశాడు. మరికొన్ని క్షణాలవరకు అలాగే రెప్పపాటు లేకుండా చూశాడు. పదునుపెట్టిన చురకత్తిలా తళతళలాడే వసంత నేత్రాంచలాలు ఎప్పుడో ఒకనాడు క్షీణించి ఉక్కుపొడిలా చిన్నచిన్న శకలాలై పోగలవని స్ఫురించగానే అతనికెంతో ఆవెదన కలిగింది.
“చూశారా?” వసంత నవ్వింది.
“ఆం చూశాను!”
“ఏమిటి చూశారు? మొగిలిపువ్వు కూడా ఎండివోతున్నది! కళ్లచివరలు నల్లబదిపోతున్నాయి!”
అప్పుడు కూడా వసంత పెదవులమీద అదే దరహాసరేఖ! అది చాలా అద్భుతమైన నవ్వు!
నితాయీ నోటితో సమాధానమేమి చెప్పలేదు! కాని చెయ్యిచాచి వసంత చీర చెరగు అందిపుచ్చుకుని తన కండువా అంచుతో ముడివెయ్యడం ప్రారం భించాడు. అది గమనించి వసంత అదిరిపడింది!
“అదేమిటి అలాగ ముడివేస్తున్నారు?”
అది ఒక విచిత్రవేదనతో మేళవించిన ఉద్వేగము! ఆపైన ఆమె తనచీర చెరగు వెనక్కిలాక్కుంటూ అన్నది.
“వద్దు, వద్దు! వద! ఛీ! అదేమిటి? ఆ మాట నేను ఊరికే వేళాకోళానికని అన్నాను! అంతే! అదంతా నిజమే అనుకున్నారా?”
ప్రసన్నహాసంతో నితాయీ ముఖం ప్రఫుల్లమై వికసించింది. అతదన్నాడు.
“ముడి ఇంతకు మునుపే పడిపోయింది వసంతా! మరి లాగకు! నేనేకనక ముందే చనిపోతే, ఆనాడు నీవీ ముడివిప్పివేద్దువుగాని! ఒకవేళ నీవే కనక ముందు మరణిస్తే ఆనాడు నేనీ ముడి విప్పివేస్తాను!”
వసంత ముఖం క్షణంలో వేరొకవిధంగా మారిపోయింది! గాలివానలో 135 € కవి నవల
పచ్చబడిన రావి ఆకులు కదలాడినట్లు ఆమె పెదవులు కంపించడం ప్రారంభించాయి. ఎర్రని ముఖం వెంటనే తెల్లబడిపోయింది. అభిమానవతి, గర్విప్త్పురాలు వసంత అదేక్షణంలో వట్టి బిచ్చకత్తెలా మారిపోయింది!
నితాయీ ఈనారి నవ్వుతూ అన్నాడు.
“రా, రా, మరి! నాకింక ఓరిమిలేదు! దేవాలయం గడపలో అడుగుపెట్టిన తరవాత కోపగించకూడదు!”
“కోపమా! నాకుగాని కోపంవస్తే మీరది సహించగలరా?”
“కాళ్లు పట్టుకుని బ్రతిమాలుకుంటాను! రా మరి! రా” నితాయీ నవ్వాడు.
వారిద్దరూ ఇంటికి తిరిగి రాగానే పెద్ద కోలాహలం చెలరేగింది! లలితా నిర్మలల మద్యపానోన్మత్తత ఆ సమయంలో మరింతగా పెచ్చుపెరిగిపోయి వుంది! మెడలలో పూలదందలతో పెళ్లిముడులతో వసంతా నితాయీలిద్దరూ కంటబడగానే వారుభయులు మంగళసూచక ధ్వనులతో అభినందించారు. ఆ ముడులు వివ్వాలని వసంత గాని, నితాయీగాని మరి తలపెట్టనే లేదు!
నితాయీ నవ్వడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం! అతనికేమాత్రం పశ్చాత్తాపం గాని, సంకోచంగాని, బిడియంగాని కలగలేదు! అన్నింటికన్న మించిన ఆశ్చర్యం ఇంకొకటి! వసంత ఎంతో సిగ్గుపడింది! ముడివెసిఉన్న నితాయీ ఉత్తరీయం పట్టుకుని లాగుతూ సిగ్గుతో తలవంచుకుని అల్లనల్లన నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది!
కతి
ఫిడేల్వాలా గురించి కొంత తెలుసుకున్నాడు నితాయి. ఫిడేల్ చేత్తో పట్టుకుని కూర్చుంటాదని, ఎన్నడు ఏ పాట వాయించనే వాయించదని అందరు ఆశ్చర్యపడుతూంటారు. కమానులాగుతూ (శ్రుతులు సరిచెయ్యడంతోనే జీవితం అంతా వెళ్లిపోతుంది! అయితే ఒకొక్కనాడు ఒకొక్కప్పుడు అర్ధరాత్రవళ అందరు నిద్రిస్తున్న సమయంలో చాలాసేపు ఫిడేలు వాయిస్తాడు. అది ఒక విశిషమ్టుయిన సంగీతం! అన్నాళ్ళపాటు అలాగ మాట్లాడకూరుకుని, ఒక్కనాడలాగ వాయించ డానికి ఒక కారణమున్నది. ఆ కారణమేదో నితాయీ కనిపెట్టాడు. ఆగంతకులు కొందరు నిర్మల ఇంటికి వచ్చి రాత్రి తెల్లవార్లు ఒక మహోత్సవం జరిపినప్పుదే వసుమతి చలసాని + 1309
అతడలాగ వాయిసాడు. కనకనే ఈవేళ తప్పకుండా ఫిడేల్ వాద్యం నిరం తరంగా కొనసాగగలదని నితాయీ నిర్ణయించుకుంటాడు.
అది చాలా అద్భుతమైన సంగీతం. దానికి సంబంధించిన వాద్యం ప్రారంభం కాగానే నితాయీ జాగ్రత్తగా వింటాడు. కటిక చీకటిలో ఒంటరిగా ఒక చెట్పకింద కూర్చుని ఫిడేల్వాలా ఆ అద్భుత సంగీతం ప్రారంభినాడు. కాని ఎవరైనా దగ్గరకి వచ్చి కూర్చున్నారంటే సరి, వెంటనె ఫిడెల్ కింద పెట్టెస్తాడు. అంతరాత్రివేళ, అంటె నిర్మల ఇంట పెద్ద ఉత్సవం జరుగుతున్న నాటి అర్ధరాత్రివెళ ఆ సంగీతం వినటం కోసమే నితాయీ నిద్రామధ్యంలో కూడా మేలుకుని అలాగే పడుకుని ఉంటాడు ఇలా తరచూ జరుగుతూ వుంటుంది. అర్ధరాత్రివెళ ఫిడేలు సవ్వడి వినబడీ వినబడగానే అతనికి మెలకువ వస్తుంది. కాని లేచి కూర్చోడు. అలాగే పడుకుని వింటాడు. ఇంక దున్నవంటి ఆ వ్యక్తి ఒక్కడున్నాడు! కాని ఫిదేల్వాలా అతని మాటే పట్టించుకోడు. అతని దృష్టిలో ఆ దున్న ఒక మనిషేకాదు. వల్టీ జదపదార్ధము. అతగాడు నిశ్శబ్దంగా పడిఉండి, ఎర్రని కళ్లు రెండు తెరిచి మదవిహ్వలదృష్టితో అంధకారంకేసి చూస్తూంటాడు. అంతే!
అతనికెంతో ఆత్మీయుడు వంతగాయకుడు. అతదెప్పుడు ఏదో ఒక దానిమీద వాదోపవాదాలు సాగిస్తూ ఉంటాడు. ఆ వాదోపవాదాలన్ని చాలా వరకు తబలావాలాతోనే సాగుతుంటాయి. తబలా వాద్యంలో స్వరతాళాలమీదే వారిద్దరి మధ్య వాదం బయలుదేరుతుంది. వంతగాయకుడు, అప్పుడప్పుడు లలితతో కూడా తగాదా పెట్టుకుంటాడు. ఆ పైన ఆమె అతనిని ఇంటిలోనించి బయటికి పంపించివేస్తుంది. వంతగాయకుడటు పిమ్మట ఆ విషయం ప్రాఢ దగ్గిర ఫిర్యాదు చేస్తాడు. ఆమె తీర్పులో ఓటమి ఎవరిదైనా, అతడే లలిత దగ్గిర క్షమాపణ వెడుకుంటాడు. 'తప్పంతా నాదే! ఓడిపోయానని ఒప్పుకుంటు న్నాను! మరి ఎన్నడు ఇటువంటి పని చెయ్యను. చెవులు రెండు నులుము కుంటున్నాను!” అంటాడు. వంతగాయకుడు నిజంగానే చెవులు రెండు నులుముకుంటాడు!
ఒకరోజు నిర్మల, లలిత ఇద్దరు కలిసి 'వసంతకోకిలి అని నితాయీకొక 1404 కు నవల
పేరు పెట్టారు.
ఆ సంగతిని విని వసంత, నితాయీ నవ్వుకున్నారు.
నూతన జీవితంలో ఈ పరిస్టితులమధ్య నితాయీ రోజులు గడిపివెస్తు న్నాడు. జీవిత ప్రవాహంలో పడి ఎక్కడినుండి ఎక్కడికి కొట్టుకువచ్చాడు? చిన్నరాణి అక్కడ అదృశ్యమైపోయింది. రాజా ఎక్కడ ఉన్నాడో? ఇవన్నీ ఆలో చిస్తుంటే అతని హృదయంలో చెయ్యి పెట్టి కలగించి వేసినట్లయింది వెంటనే అక్కడినుంచి పారిపోవాలనిపించింది. కాని వసంతముఖంకేసి చూచి ఆ పని చెయ్యలేకపోయాడు. అతను వేసిన ముడి నానాటికి బిగిసిపోతున్నది కాని ఆవంతయినా సడలడంలేదు! ప్రతిదినం అనెకమైన కష్టనప్పాలనన ఎభవిస్తున్నాడు. ఒకచేత్తో కన్నీరు తడుచుకుంటున్నాడు. పాటకచేరీలలో వేరొకచెయ్యి ప్రేక్షకులవైపు చాచుతున్నాడు. ఆ విధంగా నిస్పృహతో, విరక్తితో ఒకవిధమైన ముసుగు కల్పించుకున్నాడు. అందువల్ల నితాయీ ఎటువంటి పరిస్థితి అయినా తేలికగా సహించగలుగుతున్నాడు. అయితే ఈ సహనశీలత అవధి అతని కేమాత్రం సంకుచిత్వం కలిగించలేదు! వసంత నాతడు (ప్రేమిస్తు న్నాడు! బిగి కౌగిలింతతో గుండెకదుముకుంటున్నాడు! అంతమాత్రముచేత చిన్నరాణిని మరిచిపోలేదు! వసంత ఇంటి కెవరైనా నూతన రసికులు వచ్చి నప్పుడు చెట్టుకింద పడుకుని చిన్నరాణిని గురించి ఆలోచిస్తున్నాడు. ఒకొక్క ప్పుడు ఆమెనుద్దేశించి విరహగీతిక లల్లుతున్నాడు. అతని హృదయంలో ప్రతి దినము కొత్తగీతికల చరణాలు జుంజుమ్మని మారుమోగుతున్నాయి! 'వసంత కోకిల” అన్న పేరుమీద అతడొక గేయం రచించాడు. కవితాగానాల పోటీపాట కచేరీలో ఏదో మాటమీద పట్టుదల వచ్చి ఆ పాట కాస్త పాదేశాడు!
“వసంతకోకిల గీతిక రయుంకారం వినలేదా మీరు!
వీణావేణువులు రెండు దానిముందు తీసికట్టే! ఆ గీతిక ముందున్న అన్ని పాటలు శిరస్సులు వంచివేశాయి!”
అతని 'కోకిలి అన్న పేరే నలువైపులా మారు(మోగింది. ఇంకా “నల్లని కోకిలి అన్న పేరుతో కూడా అందరికి సుపరిచితుడయినాడు.
ఇంత ప్రసిద్ధి రాకమునుపే అతదెన్నో కొత్తపాటలు నేర్చుకున్నాడు. వసుమతి చలనాని ఛి 141
మరికొన్ని కొత్త కొత్త కృతులు సేకరించాడు. ప్రసిద్దులైన పురాతన కవిగాయకుల కృతులెన్నో అతనికి కంరస్థంగా వచ్చాయి. హరురాకూరు, గోపాల్ ఉరియా, వాశ్వాత్య కవిగాయకుడు అంటనీ సాహెబ్, భోలామయరా మొదలైన కవిగాయకుల కృతులు మొదలుకొని, నితాయీ గురుపీరంలో ్రతిష్టించుకున్న తారణమండలకవిగాయకుని కృతులవరకు- అన్ని సేకరించుకున్నాడు. ఇంకా వాటికి సంబంధించిన కొన్ని గాధలు కూడా సేకరించాడు నితాయీ. ఆయా అవకాశాలలో అతని భావన అనేక నూతన మార్గాలలో పరుగులు 'పెట్టంది. ఒకనాడతడు నర్తకీ గాయక బృందం స్లీల లక్ష్మీవ్రతం ఆచరిస్తున్న సమయంలో లక్ష్మిదేవి మీద శ్లోకం లాంటిది రచించాడు నితాయి.
ఇంట్లోకి వెళ్లి భోజనం ఏర్పాటులన్ని ముగించుకుని నితాయీ చేతికి (ప్రనాదం అందించింది
ఆ సమయంలో అడిగాడు కవిగాయకుడు,
“ఏవతకధ వినడం అంతా పూర్తయిందా!”
“అయింది
“అయితే నా దగ్గిర కూడా ఇంకొకసారి విను!”
“ఏమిటది?” వసంత ఆశ్చర్యపడి అడిగింది.
“లక్ష్మిసోత్రం”
అలాగంటూనే చెయ్యి వసంతవైపు చాచి కవితాగానం సంప్రదాయ ధోరణిలో రాగవరసలో పాడాడు!
“నమో నమో లక్ష్మీదేవి, నమో నమో నారాయణీ!
వైకుంర నాధుని రాణీ! జననీ! సువర్ణ స్వరూపిణీ!
నూరురేకుల కెందామరపై నీ నివాసము!
కావుననే 'కమలా” అన్న సువిఖ్యాత నామధేయము!
సహించవేమాత్రము పాతిత్య కృత్యాలు!
కనకనే నీవు సర్వదా సంచలమూర్తివి తల్లీ!”
అది విన్న పిమ్మట మరి వసంతనోట మాటే వెలువడలేద! మిక్కిలి జిజ్ఞాసతో అదిగింది. 1424 కవి నవల
“ఎక్కడనుంచి సంపాదించారిది! కొత్తవాటల పుస్తక మొకటి కొన్నారు గదా! దానిలోనించే సేకరించారనుకుంటాను!”
సమాధానం చెప్పకుండా నితాయీ నవ్వాడంతే!
“సమాధానం చెప్పరెందువల్ల?”
ముందు నా పాట పూర్తిగా వినవేమి? ఆఖరిచరణం వింటే అంతా నీకే తెలుస్తుంది కదా?”
“అధముడు నితాయీ వసంతకోకిల!
లక్ష్మిదేవి కంజలిఘటించి రచించె నిది అంతయు వినుడీ[ొ
ఉల్లాసంతో, ఆశ్చర్యంతో ఉప్పాంగిపోతూ కంగారుపడుతూ గర్వాభిమాన వతి వసంత పరిగిత్తుకెళ్లి అందరిని ఎలుగెత్తి పిలిచింది.
“ఓ పిన్నీ! లక్ష్మిదేవి పాట రచించారు! రండి! రండి! వినండి!”
“ఏమిటి? ఎవరు?” ప్రాఢ ఇనుమడించిన జిజ్ఞాసతో ప్రశ్నించింది. వసంత వగర్భుకుంటూ సమాధానం చెప్పింది.
“లక్ష్మిదేవి మీద పాట! రచించినవారెవరో కాదు! నీ అల్లుడుగారు!”
ఆ వేళ సాయంత్రం తన ఇంట్లో ఒక సభ ఏర్పరచి అందరికీ ఆ కవి గాయకుని పాట వినిపించేదాకా ఆమె విడిచిపెట్టలేదు.
ఆ కృతి విని బృందంలోనివారు చాలా ఆశ్చర్యపడ్డారు. నిజంగానే ఆ పాట మాధుర్యంగా వుంది నితాయీకి సుపరిచితులైన కవిగాయకులు కొందరు కవితాగానాలతోపాటు, కృతులు, చిన్న చిన్న పాటలు, కొన్ని గేయాలు అప్పు డప్పుడు రచిస్తుంటారు. కాని ఇలాగ ఒక పుణ్యవ్రత కధ తీసుకుని గీతికలు రచించరు. ప్రాచినకాలంలో గొప్పు గొప్పు కవిగాయకులు రచించిన గీతికలే నేటికి అమలులో ఉన్నాయి. అవే అందరూ పాడుతుంటారు. నితాయీ ఆ విధంగా నమస్మరించదగిన గొప్ప గీతిక రచించాడని అందరికీ తెలిసింది, ఆశ్చర్యపడ్డారు. అందువల్ల ఆనాటినుంచి అతని గౌరవం మరింతగా పెరిగింది.
అంతేకాదు, నితాయీ గీతికలే ఆనాటినుంచి ఆ బృందం వ్రతంలో ఒక పాటగా మారిపోయాయి. అలాగే మిగిలిన అయిదారు బృందాల కవి గాయ కులు కూడా అవె పాటలు వ్రాసుకుని తీసుకువెళ్లారు. పూర్ణిమతో కలిసిన వసుమతి చలణనంని అ 1403
గురువారంనాడు బృందంలోని స్రీలందరు తాను రచించిన గీతికలు పాడు కుంటున్న సమయంలో నితాయీ గంభీరంగా మారిపోతాడు. దేశదేశాలలో ప్రతివారి ముఖంలోను ప్రతిధ్వనించె పాటలింకా కొన్ని రచించాలని ఉవ్వి ళ్లూరిపోతాడు! అతని పాటల పుస్తకాల మూట క్రమక్రమంగా పెద్దదయింది. ఉత్సవంలో ఇంకా అనేక పుస్తకాలు కొన్నాడు. ఇటీవల కలకతా నుంచి కూడా పుస్తకాలు వస్తున్నాయి. పిన్ని దీనికి సంబంధించిన విషయాలన్ని నితాయీ కెరిగిస్తున్నది. దళనాయకురాలు అనేకవిషయా లఅెరుగును. అవి అన్ని వింటూ నితాయీ నిశ్చేష్ణడయిపోతాడు. అతని విషయంలో ఆమె నిజంగానే మిక్కిలి శ్రద్ధ వహిస్తున్నది. “విద్యాసుందర” [గ్రంధంతో దళనాయకురాలే సన్నిహిత పరి చయం కలిగించింది. వసంత ఒకనాడు కొప్పుపెట్టుకోకుండా జడ అల్లుకుని అది వేలాడవేసుకుని ఏదో పనిమీద వీధిలోకి వచ్చింది. నితాయీ ఆమెవైపు చూసి “వసంతా! నీకు జడే చాలా బాగుంటుంది! కొప్పు అంతగా భాగుందదు. మరి అది పెట్టుకోకు! జడే అల్లుకో!” అని అభినందించాడు. “దుస్పహర వితాపమ్మున దడస్సిన సర్పమ్ము వేగ వంకర వాల్దడవోలిక వచ్చి కలుగులోన జొచ్చె!” “విద్యాసుందర (గ్రంధాన్ని గురించి నీవెన్నడు విననేలేదా బాబూ? రాయ్ గుణాకరుని విద్యాసుందర[గ్రంధం?” లలిత, నిర్మల, వసంత అంతలోనే ఆమె చుట్టూ మూగి ఆ విద్వాసుందర గ్రంధాన్ని గురించి వివరంగా ప్రసంగించాలని బలవంత పెట్టారు. “అదంతా నాకిప్పుడు గుర్తులేదమ్మా! అంతా మరిచిపోయాను!” “అయితే ఆ పుస్తకంలో నిన్ను గురించిన కధ ఉన్నది గదా! అది నికు జ్ఞాపకం ఉండి ఉంటుంది!” ఆ మాటలంటూ వసంత విరగబడి నవ్వింది “ఆ ప్రుస్తకంలో మాలిని పిన్ని మాటేనా నీవడుగుతున్నది?” అని ప్రాఢ 144 ఈ కటి నవల
ఆ పిన్నిని గురించిన గీతిక మొదలుపెట్టింది. “పలుకులు పదునైన వజ్రాల ములుకులు! అందువల్లనే ఆమె నామధేయం హీర! పళ్ళన్నీ బయటపెట్టి, ఒళ్లంతా ఒయ్యారంగా తిప్పి మాటిమాటికి అదేపనిగా కలకలనవ్వు నా హీర!” పిన్ని తిరిగి అలాగు గబగబా చదివింది, “తగాదా కోసం పొరుగువారెవ్వరూ లేనప్పుడు తానే గాలిలో వల విసిరివేసి, తగాదా మొదలు 'పెడుతూంది[” నితాయీ పిన్నిని సమీపించి ఎంతో అణకువతో అడిగాడు. “అ పాటలన్ని గీతికలన్ని నాకు చెప్పు పిన్నీ! నేనవి వ్రాసుకుంటాను!” “నాకవ్వన్నీ నోటికి రావు బాబూ! నీవా విద్యాసుందర పుస్తకం తీసుకు రాకూడదా! అది వటతల ముద్రణాలయంలో దొరుకుతుందిగదా! పంచాంగం అట్టమీద ఆ ముద్రణాలయం చిరునామా దొరుకుతుందిగదా!” విద్యాసుందర పుస్తకంతోపాటు అన్నదామంగలమన్న పుస్తకం కూడా సంవాదించుకున్నాడు నితాయీ. ఆ కొత్త పుస్తకం అట్టమీద ఉన్న ప్రకటన చూసి దాశురాయ్ గీతికలు, ఉదృటుని కవితల పుస్తకం కూడా కొనుక్కున్నాడు. దాశురాయ్ పుస్తకం చదివిన తరువాత అతని మనసులో అంతకు మునుపు ఉన్న సంశయమొకటి తొలగిపోయింది. తనకు కంరతఃవచ్చిన కొన్ని గీతికలు ఆ దాశురాయ్ రచించినవే అని, అవి వేరొకరి గీతికలు కావని స్పష్టంగా తెలిసింది. ఇక జావళీలవంటి శృంగార గీతికల రచనలో దాశురాయ్కన్న అధికులు లేరని కూడా అతడు [గగ్రహించుకున్నాడు. వేదిక మీద అటువంటి పాటలు పాడినప్పుడు ఆంతర్యంలో ఆ కవి కొక్కమారు నమస్కరించాడు. నితాయీకి కేవలం సభారంజనం కోసమని అంత గొప్పుగా శృంగార గీతికలు పాడదవలసిన అవసరమే లేకపోయింది. అటువంటి పాటలు పాడడా నికి పూర్వంలా అతనికే మాత్రం సంకోచం లేదు గనుక! కవిగాయకులమధ్య, (శోతలమధ్య నితాయీకి అతనికాలంలోనే అపూర్వమైన ఖ్యాతికలిగింది. వసుమతి చలనాని ఈ 145
అందువల్ల శ్రోతలకతనిమీద భక్తిశద్ధలినుమడించాయి. మోటు శృంగార గీతికలుగాని, దూషణలతో నిండిన పాటలుగాని వేళాకోళం ధోరణితో ప్రారంభించినా సదస్యుల నుండి గౌరవాదరాభిమానేలేమాత్రం తగ్గలేదు. పైగా ఇనుమడించాయి. కొన్నాళ్లకు పూర్వం సరిగా ఇటువంటి కవి గాయకునితోనే నితాయాీ కొకమారు పోటీ ఏర్పడింది. ఆ కవిగాయకుడు వృద్ధుడు. అతని అసభ్యత కూడా దానితోపాటే సరిసమానంగా మితిమీరిపోయింది. శృంగార పదాల పాటల తోనే ఆ కవిగాయకునికెక్కువగా ఖ్యాతి లభీంచింది. అందువల్లనే అతనికా విషయంలో బెబ్బులి అన్న బిరుదం కూడా లభించింది.
“అయ్యో ముసలిది చావడం లేదు! చావు రావడం లేదు! ఓ! యముడే భయపడుతున్నట్టున్నాడు! లేకపోతే సీ దగ్గరి కెందుకురాడు? కనకనే చావు రావడం లేదు!”
సహజంగా శాంతమూర్తి నితాయీ ఇప్పుడింకొక వ్యక్తిగా మారివోయాడు! వసంత నెంతో ప్రయత్న పూర్వకంగా ఆదరంతో ఆప్యాయతతో ముంచెత్తి వేస్తుంది. కాని పూర్తిగా ఆమె గుప్పిట చిక్కిపోకుండా తాను తానుగా వేరుగానే నిలుచుండిపోయాడు.
వసంత తనంతట తానే అతనిని బిగి కౌగిలింతతో బంధించివేసింది. అటువంటప్పుడు నితాయీ ఆమెను మరింత దగ్గరగా లాక్కుని గుండదెకదుముకో లేదు. అలాగని వసంత కౌగిలింత నుండి విడిపించుకో లెదు. ఆమె శిరస్సు మీద, వీపుమీద ఎంతో ఆప్యాయంగా నిమిరాడంతే! వసంత ఒక పసిపిల్ల అన్నట్టు ఆత్మీయంగా బుజ్జగించాడు ఆమెనే విషయంలోను ఏ మాత్రం నొప్పించ లేదు. వారిద్దరి మధ్య ఆ విధంగా ఎంతో ఆత్మీయత పెంపొందింది.
వసంత ఏదో ఒక కారణం మీద అప్పుడప్పుడు మూతిముక్కు బిగించు కుని ఏడుపు మొదలు పెడుతుంది.
నితాయీ నవ్వుతూ ఆమె కన్నీరు తుడుస్తాడు. “నీవు కంట నీరు పెట్టు కుంటే నా గుండె చెక్కలవుతుంది వసంతా!” అంటాడు. ఆపైన రాగాలాపనతో పాట అందుకుంటాడు.
“నిశ్చయముగ ప్రాణాధిక వివెసుమా! నా (ప్రేయసి!
146+ కవి నవల
నీ కన్నీరది చూచిన, నిజము లోకమంధకారము!
వసంత ఆంతర్యంలో ఉపొంగివోతుంది! ఆమె ముఖం మీద వాసరేఖ వ్రాదుర్భవిస్తుంది. తనంతట తానే కన్నీరు తుడుచుకుని మొదలుపెడుతుంది.
“మీరంతమాట అనక్కరలేదు! నా కోకిలే కదా మీరు! చాలా అందమైన పాట ప్రారంభించావు. అది పూర్తి చెయ్యండి! వ్రాసి జాగ్రత్తగా పెట్టుకుంటాను, పూర్తిచెయ్యకపోతే నేను వ్రాసుకోవడం పడదు. పూర్తికాని పాట అలాగే అదృశ్యమైవోతుంది!”
ఇదే సమయంలో నితాయీ వేరొకపాట పాడుతుంటే అది విన్న వసంత దుఃఖం రెళ్టంపయ్యింది. అప్పుడతనికి మిలమిల మెరుస్తున్న వసంత మొట్ట మొదటి చూపు జ్ఞప్తికి వచ్చింది.
ఏమి ఆశ్చర్యం! ఇప్పుడు ఆ వసంతే పసిపాపలా విలపిస్తున్నది! నితాయీ అల్లన నవ్వుతూ పాట అందుకున్నాడు.
“అ అగ్నిజ్వాల లేమయిపోయినవి?
సఖీ! నీ నేత్రాంచలాలలో తళతళలాడిన
ఆ అగ్నిజ్వాలలమైపోయినవి?
ఆ పాట వినగానే వసంత కన్నీరు, దుఃఖం ఇనుమడించాయి! ఎంతో ప్రయత్నం మీద ఆమె మనస్సు తిరిగి స్తిమితపడింది.
మరునాడు పొద్దున్న మేలుకుంటూనే “పాట పూర్తయిందా? అది నేర్చు కున్న తరవాతే నేను లేస్తాను” అన్నది ఆపైన నెమ్మదిగా అడిగింది.
“నామీద కోపమా?”
“అబ్బే! మరేం లేదు! ఊరికే వేళాకోళంగా అడిగానంతే! - అయితే మీరు నా వేళాకోళం గ్రహించలేదన్నమాట!” ఆమె నవ్వింది.
వసంత నితాయీకి ఎన్నో నేర్పింది. అతడామె దగ్గిర అందమైన పల్లె (ప్రేమగీతాలు కొన్ని నేర్చుకున్నాడు.
నితాయీకి ఆ పాటలంటే ప్రాణం! పాటలంటే అవే! మహనీయులైన పురాతన కవుల పదాలలో (ప్రమపద్ధతి వేరు! ఈ పాటలలో వలపుధోరణి వేరు! ఈ (పేమగీతికలలో గృహమాధుర్యం వెల్లివిరుస్తున్నది! వీటితోబాటు వసుమతి చలనింని త 14/7
విధుబాబు పేరు కూడా విన్నాడు నితాయీ. అతడే ఈ గీతికలు రచించిన కవి. ఆ కవి పుట్టుపూర్వోత్తరాలన్ని వసంతే చెప్పింది. అవి వింటూనే మనస్సులో వేయి అభినందనలందించాడు కవిగాయకుడు! నిజంగా విధుబాబు పాటలే వాటలు!
“నిన్నెలాగ విస్మరించగలను?
నా ప్రాణాలే సమర్పించాను గదా, నా జీవనమాధురీగొఅంతేకాదు!
“ప్రేమకోసమే ప్రేమిస్తున్నా ననుకుంటున్నావేమో సుమా!
కాదు! కాదు! నా సహజ స్వభావమే ప్రేమ!
నీవు కాక నాకింకేమి తెలియనే తెలియదు సుమా”
అహహా! ఇది కేవలం అచ్చమైన పంచదార పానకమ! ఈ పాటల సంగతి ఆలోచిస్తూ నితాయీ ఆ పానకం మాట కూడా పూర్తిగా మరిచి పోయాడు. సరిగ్గా అటువంటి గేయాలే రచించాలని ఎంతైనా ఉవ్విళ్లూరిపో యాడు. తాను మరణినాడు. ఆపైన నూతన కవిగాయకులు కొత్తకొత్త శిష్యులను చేర్చుకుని వారికి తన పాటలన్ని నేర్పుతూ “వహవ్వా! వహవ్వా!” అని అభినందిసారు! ప్రతిదినము నితాయీ హృదయంలో నూతన గీతికల చరణాలెన్నో జుంజుమ్మని ప్రతిధ్వనించాయి!
అయితే అప్పుడప్పుడు అతని మనస్సు దిగులుపడడం ప్రారంభించింది. ఆ స్టేషను, దానితోపాటు చిన్నరాణి జ్ఞాపకం వస్తూ వుంటారు.
మిట్టమధ్యాహ్నంవేళ పల్లైెదారులమ్మట పడి నడుస్తుంటే, దారి మలుపులో అతని కట్టెదుట అకన్మాత్తుగా బంగారు బీందువొకటి తళతళలాడుతుంది. పల్లెసీమలలో ఇదే ఫలహార సమయం! ఇదే సమయంలో పల్లెపడుచులు పొలాలలో ఉన్న తమ వారి కోసం ఫలహారాలు తీసుకువెడతారు. ఆయా గృహస్థుల ఇళ్లకు వెళ్లి పాలుపోసే సమయం కూడా ఇదె! పొలాలదారులలో, [గ్రామం బాటలలో బిందెలు శిరస్సులమీద ఉంచుకుని స్రీలు సాగిపోయే సమయంలో ఆ బిందెలు మధ్యాహ్న కాంతిలో తళతళలాడగానే నితాయీ మనస్సులో దిగులు బయలుదేరుతుంది.
పాలబిందె నెత్తిమీద పెట్టుకుని సాగిపోతున్న చిన్నరాణి అదే సమయంలో 1484 కవి నవల
అతనికి జ్ఞాపకం వస్తుంది! వెంటనె జీవితం అంతా వెగటుగా స్ఫురిస్తుంది! ఏదీ రుచించదు! వెంటనే అక్కడినించి బయలుదేరి చిన్నరాణి గ్రామానికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. గుల్మొహర్ చెట్టుకింద కూర్చుని రైల్వేలైను వంపువైపు చూస్తూ కూర్పోవాలన్న తహతహ బయలుదేరుతుంది. వెనువెంటనే అతని హృదయంలో పూర్వం రచించిన వాట స్ఫురిస్తుంది.
“ఓ నా హృదయాంతరాళ ప్రమమూర్తి!
నీ కోసమె బాటపక్కనే గృహం నిర్మించుకున్నాను!”
అంతలోనే నితాయీ ఆ సంకల్పం పూర్తిగా విరమించుకుంటాడు. మరుక్షణంలోనె సుదీర్హ నిశ్వాసమొకటి విడిచిపెట్టి గొణుక్కుంటాడు!
“కాదు, ఓ జాబిల్లీ, నీవాకాశంలోనే ఉండిపో! చిన్నరాణీ! నీ వన్నివిధాల సుఖింతువుగాక! నీ కుటుంబం సర్వదా వర్ధిల్లుగాక!”
అదీగాక తిరిగి అక్కడికి వెళ్ళడానికి నితాయీకి వ్యవధి ఎక్కడిది? ఇంకా అయిదురోజులు దాకా ఇక్కడే పాటకచేరీలున్నాయి. ఇప్పుడింక రుమర్ దళం కవితో పోటీ పాటకచేరీ లేదు! నిజమే! కాని తారణ కవిగాయకుడు, మహాదేవ కవిగాయకుడువంటి అసలైన పెద్ద పెద్ద కవిగాయకులతో పోటీజరుగుతుంది. నిజానికి ఈ ఉత్సవంలో పోటీ పాటకచేరీలు జరపడానికేగదా అతడంగీక రించాడు. రయుమర్ దళం కవిగాయకునితో పోటిలో పాల్గొానవలసిన అవసరమేమీ లేదు. అయినా నితాయీ కాదనలేకపోయాడు. అది వేరే కధ,
ఇక్కడి పాటకచేరీల ఒప్పందం ముగిసిపోగానే నర్తకీగాయక బృందం మరో ప్రాంతానికి వెళ్లిపోతుంది. అటువంటప్పుడు తనదారి తాను చూసుకుంటే వాళ్లగతి వమవుతుంది? అది కేవలం విశ్వాసఘాతుకత కాదా? వసంత ఉన్నది గదా! ఆమెనెన్నో విధాల నమ్మించి మాటిచ్చాడాయె మరి!
ఆమె జీవించి ఉన్నంతకాలం తానామెను విడిచిపెట్టి వెళ్లలేదు. అదే సమయంలో పెళ్లిముడి సంగతి నితాయీకి జ్ఞప్తికి వచ్చింది. ఇద్దరిలోనూ ఎవ్వరైనా ముందుగా మరణిస్తే మిగిలినవారా ముడి ముందుగా విప్పాలి. ఆ సంగతిని గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నిలువునా వణికాడు నితాయీ. తాను వసంత చనిపోవాలని కోరుకుంటున్నాడా? లేదు! లేదు! చిన్నరాణీ! వసుమతి చలనాని + 149
నీవు దూరంగానే ఉండిపో! అన్ని విధాల సుఖంగా ఉండు! బహుశః నిన్నింక చూడడమే పదకపోవచ్చును. అతడిక నల్లని వసంతకోకిల! వసంత ఉన్నచోటు విడిచి వేరొకచోటికి ఎక్కడికీ వెళ్లలేడు! వసంత చిరకాలం జీవించుగాక! ఆమెకింకా పరిపూర్ణారోగ్యం కలుగుగాక! ఇక వసంతతోనే తన జీవితం అంతా గడిపేసాడు. ఈ బ్రతుకంతా మూణ్ణాళ్ల ముచ్చట బ్రతుకు! ఇంతలోనే వసంత మీద ప్రేమకింక స్వస్తి చెప్పాలా? ఆపైన మళ్లీ చిన్నరాణిని (ప్రేమిం చాలా? ఒకనాడు చిన్నరాణి ప్రేమగాధ అసమాప్తంగానే ఉంచివేసి, వసంత పప్రేమమాధుర్యం చవిచూశాడు. ఇక ఆమెనే మనసారా (పెైమించాలని నిర్హ యించుకున్నాడు. ఇప్పుడిక వసంత మాటే తలపెట్టక చిన్నరాణి దగ్గిరికి వెళ్లి పోవడమా? కాదు! అది ఎన్నటికీ జరగజాలదు! ఇక్కడే ఉండిపోవడం మంచిది! అంతే!
అయినా ఆ నిర్ణయం నితాయీకి పూర్తిగా రుచించలేదు! ఒకొక్కప్పుడు దళం నించి బయటికివచ్చి పొలాల్లో పచార్లు చెయ్యడం మొదలుపెట్టాడు మరికొంత సేపటికి ఉలిక్కిపడి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఒకొక్కప్పుడు దళంలోంచి ఎవరో వచ్చి పిలిచినదాకా ఇంటికి వెళ్లడు.
“ఇదిగో చూడండి! మీకు బొత్తిగా మతిపోతున్నట్టున్నది!” ఒకనాడు వసంత అన్నది.
ఏకాగ్రచిత్తంతోనే అల్లన నవ్వాడు నితాయీ.
“ఎందుచేత? ఏమయింది?”
“పొద్దుటినుంచి పొలాల్లో పడి తిరుగుతున్నారు! ఇంక తింది తిప్పలమాట ఆలోచించక్కరలేదా?!”
“మహా చక్కని చరణం వచ్చింది వసంతా! విను.”
“ఇప్పుడు కాదు! ముందు భోజనం సంగతి-”
“కాదు! కాదు! ముందీపాటవిను!” అలాగంటూనే రాగవరసతో చదవడం మొదలుపెట్టాడు.
“ఇదే నా హృదయాంతరాళంలో నిరంతర ఖేదము!
ఆశ (ప్రేమతో పరిపూర్ణత నందనేరదుగదా!
1504 కవి సవల
(బ్రతుకేమో నా చేతిలో లేదుగదా!
అయ్యో, మనుగడ ఇంతగా
సంకుచితమై, అల్పమైపోయినదేమి?
ఇదేనా పహృదయాంతరాళంలో నిరంతరఖేదము!”
ఆ పాట పూర్తికాగానే వసంతా నితాయీల మధ్య పెద్ద రగడ బయలు దేరింది. వసంత నిశ్చల దృష్టితో నితాయీ ముఖంకేసి చూస్తూ పాటవిన్నది. అది వింటూనే శిలలా మారిపోయింది.
నితాయీ ఆశ్చర్యపడి ప్రశ్నించాడు.
“ఏమిటి వసంతా, అలాగయిపోయావు!”
వసంత నేత్రాల నుండి నెమ్మది నెమ్మదిగా రెండు కస్నీటి బిందువులు దిగజారాయి.
“క పాట మీరెందుకు వ్రాశారు?”
“ఎందుకేమిటి వసంతా?”
అలిసిన విషణ్ణ కంరంతో ఆమె అడిగింది.
“నేనిప్పటికి కులాసాగానే ఉన్నాను! ఎవరో మీ మనస్సులో ఉన్నారు! లేకపోతే బ్రతుకింత సంకుచితమైపోయిందని ఎందుకు వ్రాస్తారు?”
కారణమేమీ లేకపోయినా నితాయీ గుండె గుబగుబ కొట్టుకున్నది.
19
నిజంగా వసంత ఇప్పుడారోగ్యంగానె ఉన్నది. బాగా ఆరోగ్యంగా ఉన్నదనే అనాలి. మద్యం ఇప్పుడు చాలా తక్కువగానే తీసుకుంటున్నది. పూర్వం గరిక గడ్డి రసం నియమ ప్రకారం తీసుకోవడానికి వీలుపడేదికాదు. ఇప్పుడు నియమ (ప్రకారం తెల్లవారురూమునే లేచి, గరిక రసం తీసుకుని, ఆపైనే మిగిలిన పనులారంభిస్తున్నది. అందువల్ల శరీరానికి బాగా స్వస్థత చేకూరింది. చిక్కి శల్యమైన ముఖం రక్తం పట్టి గుండ్రనయింది. తెల్లగా పాలిపోయిన శరిరంమిద తిరిగి రవంత శ్యామల వర్ణం పొడకలట్టింది. గొంతు సవ్వడిలో పదునున్నది. కాని తీవ్రతతో నిండిన వేడిమి లేదు. ఇప్పుడామె రీక్షణ కంరస్వరంతో కిలకిల నవ్వడం లేదు. మృదువుగా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నది అంతే! మవమసుమతి చలనాని అ 151
లలిత, నిర్మల ఇద్దరూ వసంత నదేపనిగా వేళాకోళం పట్టించడం బాగా పెచ్చుపెరిగిపోయింది! వసంత ఎప్పుడైనా నితాయీకేదైనా పనిచేసి పెడు తుంది. ఆ సమయంలో లలిత, నిర్మల “అయ్యో! సఖీ! చిట్టచివరికి-” అని ఒక గేయం చరణాలాలాపిస్తూ వేళాకోళంగా మాట్లాడుకుంటారు.
“ఒకప్పుడు (ప్రమలంటే వసంత ఈసడించేది కాని, ఇప్పుడామె అదే (ప్రమలో పడిపోయింది!” అని దాని భావం.
వసంత ఆ మాటల మీద కోపగించుకోదు. ముసిముసి నవ్వులు చిలక రిస్తుంది. ఆ పైన *చాలు చాల్లెండి” అంటుంది. అంతే!
“బొధఢకూడా నవ్వుతోంది. ఆమె కూడా మధ్యమధ్య నాలుగైదు వేళా కోళాలు విసురుతుంది.
“వసంతా, పువ్వులు వికసిస్తున్నాయి గదా! మరి నీ ఉసాద్ కోకిలనామం తీసి వేసి 'తుమ్మెది అని పెరుపెట్టు! కోకిలా నలుపే! ఏమంటావు?”
దానిమీద వసంత నవ్వుతుంది.
అయితే ఒకే ఒక్క సమయంలో వసంత పూర్వపు వసంతగా మారి పోతుంది. అది సాయం సమయంలో జరుగుతుంది. చీకటి పడగానే వసంత తీవ్రంగా మారిపోతుంది. అది శరీరవ్వ్యాపారం జరిపేవేళ. కొంచెం చీకటిపడ గానే ఆమెకోసం పురుషులక్కడికి రావడం వ్రారంభమౌతుంది. నరకీ గాయక బృందంలో స్త్రీలు స్నానం చేసి అలంకరణ పూర్తి చేసి సిద్ధంగా కూర్చుంటారు. అప్పుడు వసంత, నిర్మల, లలిత ముగ్గురు ఒకేచోట కూర్చుంటారు. లేకపోతే తమతమ ఇళ్లలో బల్లలమీద కూర్చుంటారు. కాని సామాన్యంగా కలిసే కూర్చుంటారు. ఈ సమయంలో ఆయా శృంగార (ప్రేమవ్యవహారాలను గురించి స్త్రీలే తమలో తాము కులాసాగా కబుర్లు చెప్పుకుంటారు. అంతేగాని పురుషుల గోడు పట్టించుకోరు. వారి విషయంలో వట్టి తటస్టభావమె! అంలేకాదు. శ్లేషార్ధాల పదాలతో అసభ్య ధోరణులతో అనేక (ప్రమ శృంగార రహస్యాలు తమలో తాము కులాసాగా ముచ్చటించుకుంటారు.
“ని-వ-ని-న-ని-న్తోఅని నిర్మల మృదువుగా పిలుస్తుంది. అంటే “ని” అన్న అక్షరం వెనకచేర్చి “వసంత” అని పిలిచినదన్నమాట! 1524 కవి నవల
*ని_ ఏమిటి? అంటే అర్ధమెమ్టి? * అని వసంత అడుగుతుంది. ఈ “ని” అన్న అక్షరంతో కలిపి పిలవడం మీదే ఒక అసభ్యమైన రహస్యాన్ని గురించి సంభాషణ కొనసాగుతుంది. అది ఏదో ఒకనాటి వ్యభిచార విలాసాల కథ!
ఆ సంగతి ముచ్చటించుకుంటూ వారందరూ విరగబడి నవ్వుకుంటారు. అందువల్ల మున్ముందు జరగబోయే దేహవ్యాపారం మీద వారి మనస్సులన్ని బాగా పదును దేలుతాయి. ఈ వ్యవహారం నించి వారికిక విముక్తి లేనేలెదు. ఒకనాడు కాస్త ఖాలీగా ఉందామనుకుంటే దానికి ప్రాఢ ఒప్పుకోదు! ఇక గత్యంతర మేమున్నది?
పురుషుల ధోరణి కూడా సాధారణంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాదిలో చాలామందికి ఈ స్రీలతో సంబంధం తాత్సాలికమ! ఆ వేళతోనే అది తెగిపోతుంది. కేవలం తటస్థంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. చాలామంది.
ఆ నర్తకీగాయకబృందం విడిదిలో నితాయీ బాగా ఏకాంతంగా ఉన్నచోటు ఒకటి ఎన్నుకుంటాడు. లాంతరు వెలిగించి పుస్తకాల మూట విప్పుతాడు. ఏదో చదువుకుంటూ, వ్రాసుకుంటూ కాలక్షేపం చేస్తాడు. వసంత ఇంట మద్యపానం మైకంతో మైమరిచిన సరసుల గొంతుల సవ్వడి మారు మోగుతుంది. నితాయీా రామాయణం చదువుతాడు. శ్రీకృష్ణలీలల [గ్రంధం పరిశీలిస్తాడు. పాటలు రచిసాడు.
“అయ్యో! ఇక ఎంతకాలం దాకా
మేడిపళ్లకేసి చూసి భ్రమిస్తానే ఓ మనసా!”
“కరుణించి నా కర్మఫలితాలన్ని మన్నించి దొలగింపుము! హరీ!
నాజన్మకింక సార్ధకత ప్రనాదింపుమో ప్రభూ!”
నితాయీ ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప కవిగాయకులను గురించి ఆలో చిస్తాడు. వారే నిజమైన కవిగాయకులని అతని నమ్మిక. రయుమర్ నృత్య పద్ధతిలో వారి కృతులేవి పాడరు. అటువంటి కృతులు వేరే వేదికమీదినించి పాడే ఒప్పందాలు రెండు మూడు అతనికిటీవలే కుదిరాయి. ఇటువంటి పరి వసుమతి చలణనాంని ఈ 153
స్థితిలో నితాయీ ఈ నర్తకీ గాయకబ్బందం విడిచిపెట్టి వెళ్లిపోవడమే మంచిది! దీనికి వసంత అద్దుగా నిలుస్తున్నది. వెళ్లిపోవడానికి ఆమె ఏమాత్రం అంగీక రించదు! అతని కివ్వస్నీ పూర్తిగా తెలుసును. అయినా ఈ దళాన్ని విడిచిపెళ్టీ వెళ్ళలేడు! అదే అతనికొక వింతగా తోచింది! తనలో తానే నవ్వుకున్నాడు సనితాయీ,
“మీలో మీరే నవ్వుకుంటున్నారే! ఏమిటి కధ?” నితాయీ నవ్వుతూ చూశాడు. ఫిడేల్ వాలా అతనికేసి వస్తూ అడిగాడు. అతడు నితాయీ దగ్గిర కూర్చుని ఫిడేల్ వాద్యంలో పడ్డాడు. దానికి శ్రుతి సరిచెయ్యడం ఒక పట్టాన కుదిరేటట్ట్లు కనపడడం లేదు! ఎలాగో అలాగ (శ్రుతిచెసి, కమాను లాగాడు. ఆ తరువాత శృతి పిడి లాగడం మొదలుపెట్టాడు. త్రీగ పుటుక్కుమని తెగింది! మళ్లీ ఇంకొక తీగ వెయ్యడం మొదలుపెట్టాడు. ఆ పైన కమానుకి మణిపూస పూశాడు. అది ఫిదేల్కు కూడా కొంత పూశాడు. మధ్య మధ్య వార్నిస్ సీసాలోనించి తీసి అది పుయ్యదం (ప్రారంభించాడు
అంతలోనే నిర్మల ఇంట ఒక పెద్ద కలవరం విస్పించింది. ఎవరూ పట్టించుకోలేదు
ఫిదేల్వాలా ఫిడేల్ మీద కమానువేసి వాద్యం ప్రారంభించాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కూడా అతనివాద్యం తిన్నగా దారిని పడదు. రాత్రి పన్నెండు దాటిన తరవాత ఫిడేల్ వాలా చెయ్యి ఒక్క మాదిరిగా విచ్చు కుంటుంది గాబోలు! ఆ తరువాత అత్యద్భుతమైన సంగీత మది! సుదీర్దమైన ఒకటే స్వరం! అది వణుకుతూ వణుకుతూ మారు మోగుతుంది! మధ్యమధ్యన అకస్మాత్తుగా మిక్కిలి మృదువై శరీరం జలదరింపజేస్తుంది! సమస్తం నిశ్శబ్దమై పోయినట్టు. నాలుగు వైపుల మంచుకమ్ముకున్నట్టు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది! శోతలకొక్కమారుగా కాళ్లుచేతులు అక్కడక్కడ చల్లనివైపోతు న్నట్టనిపిస్తుంది! మనస్సులలో వున్న ఆలోచనలు, భావనలు, అన్ని అంత రిసాయి!
వంతగాయకుడు తబలావాలాతో వాదం మొదలుపెట్టాడు. తబలావాలా మీద ఎన్నడు ఎవరినీడ పడలేదు! అతనికి (ప్రమపాత్రులైన వ్యక్తులెవ్వరు 154€ కవి నవల
లేరు! తబలావాలా గొంతెత్తి పెద్దగా నవ్వుతాడు. మధ్యమధ్యన తబలావాయిస్తూ వంతగాయకుని వాదానికి తగిన సమాధానం చెబుతాడు. మధ్యమధ్యన స్రీల ఇళ్లకువెళ్లి మద్యం సేవిస్తూ కూర్పొంటాడు. ఆ మద్యంలో కొంత ఫీడేల్వాలా కోసం కూడా తీసుకువస్తాడు. ఆపైన కునికిపాట్లు ప్రారంభం కాగానే బిచానా పరుచుకుని పడుకుంటాడు
వసంతగాయకుడానాడు లలిత ఇంటికివెళ్లి ఆమెతో తగాదా మొదలు పెట్టాడు.
దున్నవంటివ్యక్తి మంటముందు కూర్చున్నాడు. ప్రాఢ ఇరుగుపొరుగున ఉన్న ఇళ్లన్నిటిమీద ఒక కన్ను వేసి వక్కలు ముక్కలుగా నరుకుతూ కూర్చున్నది. సరసులు కొంతమంది వచ్చి, వేశ్యల నివతలికి రప్పించి వారితో మాటలా రంభించారు.
బేరం కుదిరిన తరువాత సొమ్ము ఇవ్వడం జరుగుతుంది. కొంత రహ స్యంగా మద్యవిక్రయం కూడా ఇప్పుడే జరుగుతుంది. ఇటువంటి సమయాలలో ప్రౌధవ్యక్తిత్వం స్వతంత్రంగా, సంపూర్ణంగా ఒకవిధమైన ప్రత్యేకంగా కస్సి స్తుంది. ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది. గంభీరంగా కూర్చుంటుంది. నేత్రాలమీద కనుబొమలు రెండు కుచించి, తీవ్రంగా బొామముడి విరుస్తుంది. ఆ వైఖరి గమనించగానే బృందంలోని వారందరూ హడిలివోతారు. వసంత కూడా ఒక్కొక్కప్పుడు మందిపడి శరీర వ్యాపారం సాగించబోతున్న సరసులతో తగాదా పెట్టుకుంటుంది. ప్రౌఢ అప్పుడు అక్కడే నిలబడి ఉంటుంది. ఆ పరిస్థితిలో వసంత కేసి చూసి గట్టిగా మందలిస్తుంది.
“ఏమే వసంతా, ఏమిటా గొడవ? దెబ్బలాడుతున్నావెందుకే?”
“ఇంకా దెబ్బలాడతాను. నన్ను మద్యం తాగమంటున్నారు! నేను మద్యం తాగను”
“కొంచెం పుచ్చుకుంటే ఏం పోయింది చెప్పు? అది బొత్తిగా వద్దంటే ఎలాగ? మనుషులింకనీ గడప తొక్కుతారా?”
“వోనీలే! రాకపోతే పోని! ఎవళ్ళయినా సరే, నా ఇంటికి రావలసిన అవసరమేమిలేదు!” వసుమతి చలసాని + 155
“అవసరమేమీ లేదా?”
“లెదు!”
“బాగుంది! అయితే రేపు చీకటితోనే ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపో! నీకింక ఇక్కడ చోటులేదు!”
ఒక్క వసంతేకాదు! అప్పుడప్పుడు నిర్మల, లలిత కూడా బాగా అలసి పోయి వగరుస్తూ పడిపోయి, “ఇంక అక్కరలేదు! నేను మరి భరించలేను!” అని బ్రతిమాలుకుంటారు. కాని పిన్నికమాత్రం అలసటగాని, బడలికగాని స్ఫురించదు! ఆమె చెప్పేది ఎప్పుడు ఒక్కటే సమాధానం! అది ఎక్కడ తిణకకుండా బెణకకుండా సుస్థిరస్వరంతో చెప్పే సమాధానం! “అయితే మీరు లేకపోతే మరి మా బృందం వ్యవహారం నదవదనుకుంటున్నారేమో! అదేమీ కుదరదు! అలాగైతే ఇంక మీదారి మీరు చూసుకోవలిసిందే! అని అరుస్తుంది. ఇది యుమర్ సంప్రదాయం అని ఆ యువతులను నితాయి వెళ్లి శాంతపరుస్తాడు. స్తిమితపడిన తరవాత “ఎందుకలాగ గొడవ చేసావు వసంతా?” అని అడిగుతాదు. ఆమె పరుపుమీద బోర్లా పడుకుంటుంది.
“మో! నాకు తెలియదు!”
నితాయీ శిరస్సు మీద చెయ్యివేసి నెమ్మదిగా నిమిరుతాడు.
రాబడి బాగా తగ్గివోయినప్పుడు ప్రాఢ కొత్త పద్ధతి అవలంబిస్తుంది. యువతుల నందరిని పిలుస్తుంది.
“ఈవేళ బాగా ముస్తాబవండి! ఒకసారి బఐజారమ్మట షికారుగా వెళ్లివద్దాం!”
అంటే అందరిని బజారమ్మట తిప్పి, జనానికి బాహాటంగా చూపిస్తుందన్న మాట!
తరుణులందరు సబ్బుబిళ్లలు పట్టుకుని ముఖాలు కడుక్కోవడానికి ఎంతో ఉత్సాహంగా చెరువుదగ్గిరికి వెడతారు.
స్పో పౌడరు, సింధూర తిలకం సీసా మొదలైనవి తీసుకుని అలంకరణ లారంభిస్తారు. అయితే వసంత దానికి పెద్ద గొడవ లేవదీస్తుంది. ఒకొక్కనాడు ఆమె వారితో కలిసి వెళ్లనే వెళ్లదు. ఒకొక్కనాడు వెడుతుంది. వెళ్లడానికి 1564 కవి నవల
అంగీకరించనప్పుడు పిన్ని ఒక పన్నాగం పన్నుతుంది. మున్ముందుగానే వసంత చేత కొంత మద్యం తాగిస్తుంది. తప్పకుండా తాగడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తుంది. నెమ్మది నెమ్మదిగా మరిపింపజేస్తుంది!
శుభ్రంగా ఉతికిన చీర కట్టుకుని, నోటినిండా తాంబూలం వేసుకుని ప్రౌఢ వారందరితోను కలిసి బజారువైపు బయలుదేరుతుంది.
ఈ యువతుల శరిర వ్యాపారం వ్యవహారంలో పిన్నికి కూడా భాగ ముంది. ఈ సంపాదన అంతా మూడు భాగాలు చేసారు. వీటిలో ఒకవంతు ప్రాధ తీసుకుంటుంది. సొమ్ము సంవాదించిన యువతికి రెండు వంతులు. ఇదీ ఏర్పాటు. పాట కచేరీల సంపాదనలో ఇలాంటి ఏర్పాటే ఉన్నది. అది అంతా ఎనిమిది వంతులుగా విభజిస్తారు. యువతులు ముగ్గురు- అంటే వసంత, లలిత, నిర్మల ఒకొక్కరు ఒకొక్క భాగం తీసుకుంటారు. ప్రొఢ వేరాకభాగం తీసుకుంటుంది. కవిగాయకుడు రెండు భాగాలు, ఫిదేలు వాలా ఒకభాగం తీసుకుంటారు. ఇక మిగిలిన భాగం సగం వంతగాయకునిది. మగిలిన సగం తబలావాలాది. ఏదో విధంగా నొమ్ము సంపాదించలేని వారి నెవ్వరిని ప్రాఢ ఒక్కక్షణమైనా తన బృందంలో ఉండనియ్యదు! సంపాదన పద్దతులవైపు ఎంతో ఆత్రంగా తీవ్రదృష్టితో ఎదురుతెన్నులు చూస్తూంటుంది. ఎక్కణ్ణించి అయినా రవంత తక్కువగా ముట్టగలదేమో అన్న అనుమానం కలగగానే తియ్యతియ్యని సరస ప్రసంగంతో లోపలికి పిలుస్తుంది.
“ఎవరుబాబూ మీరు? రండి! రండి! ఎందుకలాగ అనుమానిసారు? రండి బాబూ దయచెయ్యండి!”
ఆగంతుకుడు లోపల అడుగుపెట్టగానే కుర్ఫివేసి కూర్చోబెట్టి, తాంబూలం చేతికందించి గౌరవిస్తుంది. ఆ పైన నెమ్మదిగా అడుగుతుంది.
“ముందుగా తాంబూలానికి రెందణాలు ఇవ్వాలి బాబా! ఇవ్వాలిమరి!”
ఆ రెండణాలు కొంగుముడిలో కట్టుకుని యువతులనాహా్వానిస్తుంది.
“ఒసే వసంతా, నిర్మలా! ఇదిగో! ఇక్కడికి రండి! లలితా! ఏంచేస్తున్నావే? బంగారపు దుద్దులు పెట్టుకున్నావా?” అంటూ
ఇంకొకనాదు పిన్ని పిలిచింది. వసుమతి చలనానవి + 157
“వసంతా, ఇదిగో ఎవరో ఒకాయన నీ కోసం వచ్చారే! ఆయన ఇంతకు మునుపే నిన్నెరుగుదునంటున్నారే!”
ఆనాడు వసంత విసుగ్గా సమాధానం చెప్పింది.
“నా వంట్లో ఈవేళ అదోలాగుంది పిన్నీ! బొత్తిగా బాగాలేదు!”
“ఇంతటిలోనే నీ ఒంటికి ఏం వచ్చిపడిందే! అబ్బి ఏమీలేదు! కాస్త నా మాట విను! కొంచెం మద్యం సేవించావంటే చురుకెక్కువవుతుంది! కాస్త నా మాట విని ఇక్కడికి రా[”
అది పిలుపే! కాని శిరసావహించవలసిన ఆజ్ఞ! తిరస్మరించడానికికింక గత్యంతరంలేదు! వసంత వెలుపలికి వచ్చింది. చక్కగా ముస్తాబయి, ఒంటి కంతటికీ అత్తరు పూసుకుని బయటకు వచ్చింది. పెద్దమనిషి ఒకాయన ఎదురుగా నిలుచున్నాడు! అంతలోనే పిన్ని అందుకున్నది.
“ఏదీ! నీ ఒళ్లు ఒకసారి చూడనీ!...చాలా బాగుంది! ఏమిటి అలాగం టావు? నీ ఒంటికన్నా నా వళ్లే వెచ్చగా ఉందే! బాబూ! ఈ వేళ దినివంట్లో కొంచెం నలతగా ఉన్నట్టుంది ఒకచుక్క వేసుకుంటే అన్నీ సర్దుకుంటాయి!”
ఆపైన సరసధోరణిలో మృదువుగా ఒక చిరునవ్వు చిలకరించింది
“మద్యం నా దగ్గరే ఉంది బాబూ!” అంటుంది.
ఈ వేశ్యాబ్బందానికి భోగాలమీద అంతులేని ఆశ. చక్కగా ముస్తాబైన ఆ సంపన్నవ్యక్తి వైపు చూడగానే వసంత ఆ భోగాలమీద మమత మెలుకున్నది! క్రీగంట చూచి, ముసిముసినవ్వులతో అతని చెయ్యి పట్టుకుని వసంత లోపలికి వెళ్లిపోయింది.
పిన్ని కూడా నవ్వింది. ఆ విషం పూర్తిగా తలకెక్కిన పిమ్మట (ప్రమామృత సముద్రంతోనైనా సరే దానిని తొలగించడం మిక్కిలి కష్టమని ఆమె ఎరుగును!
ఆ వ్యక్తి వెళ్లిపోగానే వసంత మైకం అంతా పూర్తిగా తొలగిపోయింది. మైకానికి విరుగుడువంటి ఒక తీవ్రవైఖరి ఆమెలో మొలకెత్తింది. మైకంలో ఉన్నట్లె పడిఉండి వసంత వలవల విలపించింది. రేపు ఉదయమే నితాయీతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అదే పరిస్థితిలో పడి ఉండి కలలు కన్నది! అంతేకాదు! ఆనాడే వెళ్లిపోవాలని కూడా ఆలోచించింది. కాని అలాగ వెళ్లి 158 + కవి నవల
పోవడం అనుకున్నంత తేలికకాదు! ఎక్కడికి వెళ్లిపోతుంది? పిన్ని నిర్మల, లలిత- వీరుకాక అమెకాత్మీయులెవ్వరున్నారు? విస్తృతమైన ఈ ప్రపంచంలో ఇదేదారికాక వసంతకింక వేరొక స్వస్టలమెది ఉన్నది?
ఒకవారం రోజులలాగ గడిచిపోయాయి!
వసంత గజగజ వణికిపోతూ పిన్ని దగ్గిరికి వచ్చి ఎంతో ఆత్రంగా జ్పిన్నీ!” అని పిలిచింది.
ఆ కంరస్వరం విని ఆమె ఉలిక్కిపడింది! అది పూర్వపు వసంతగొంతు!
“ఏమిటి వసంతా?”
పిన్ని చెవి దగ్గిర ముఖంపెట్టి గొణుగుతూ అదే వెనకటి కాలపు వసంత నెమ్మదిగా నసిగింది.
“మందుకావాలి పిన్నీ! నాకు బాగా జబ్బుగా ఉంది!”
“జబ్బా? దగ్గేనా?”
“కాదమ్మా! కాదు! కాదు!”
వసంత కళ్లలో చురకత్తుల తళతళలావిర్భవించాయి.
ఆ కళ్లకేసి చూడగానే ప్రాఢ తన పొరపాటు [గగ్రహించుకున్నది. వెంటనే నవ్వి ఓదారుస్తూ నచ్చ చెప్పింది.
“దీనికోసం భయమెందుకు వసంతా? ఈవేళే మందు తయారుచేసి ఇస్తాను. మూడు రోజుల్లో పూర్తిగా నయమవుతుంది.”
వీరి జీవితాలలో ఇది ఒక ప్రత్యేకాధ్యాయం! ఇది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. మనుషుల జీవితంలో ఏ సమయంలో ఏ కారణం వల్ల ఈ రుగ్మత ఉద్భవిస్తుంది! ఇది కేవలం రోగనిపుణుల పదిశోధన విషయం! ఏది ఏమైనా వీరికి రుగ్మత వచ్చి తీరుతుంది! ఇది అనివార్య రోగం మాత్రమే కాదు! దీనివల్ల చిక్కి శల్యాలై వారికి జీవితశేషం అంతా గడిపివేయవలసి వస్తుంది. ఈ రుగ్మత విషమ తమ దగ్గిరికి వచ్చిన వారందరిలోను వ్యాపింప చేస్తూ వీరందరు తమ దారిని తాము తరలిపోతారు. డాక్టర్లకుగాని, ఆయుర్వేద వైద్యులకుగాని తమ రోగం సంగతి వెల్లడించరు. తమంతట తామే ఈ రోగానికి చికిత్స చేసుకుంటారు! చికిత్స అంటే చిరకాలంనుంచి ప్రసిద్ధమైన వసుమతి చలనాని + 1509
గచ్చాకు మందులన్నమాట! అందువల్ల పైకి పొక్కినవ్యాధి శరీరం లోలోపలికి వెళ్లిపోతుంది. రక్త ప్రవాహంలో కలిసి బాహాటంగా వ్యాపిస్తుంది. దానికి ఫలితంగా భవిష్యజ్జీవితంలో ఏదో ఒక ప్రబలవ్యాధిగా ఆవిర్భవించి, ఈ దురదృష్టవంతుల బ్రతుకులు ధూళిలోకి విసిరివేసి, చావుబ్రతుకుల మధ్య పడవేస్తుంది!
వీరు ఇది ఆలోచించరు. ఈ వ్యాధికి కారణాలేవో కూడా వీరెరుగరు? రుగ్మత ప్రవేశించగానే తాత్యాలికంగా ఆందోళన పడతారు.
వసంత కూడా కంగారుపడి పిన్ని దగ్గిరికి వచ్చింది. ఆమెకీ రోగ చికిత్స తెలుసును.
వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో లజ్ఞా సంకోచాలేవి లేవు! అంటు వ్యాధి కావడంవల్ల కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కలిగింది. రోగం వచ్చినవారి బట్టలు మొదలైనవాటి స్పర్శ విషయంలో జాగ్రత్త పడాలి. కనకనే కొంత అసహ్యం, కొంత దూరంగా వుండాలన్న ఆత్రత కలుగుతాయి.
వసంత చీరలు, రవికలు, మొదలైన దుస్తులన్ని భద్రంగా ఒకచోట ఉంచి లలిత, నిర్మల తిరిగి ఆమె దగ్గిరికి వచ్చి కూర్చున్నారు.
వసంత వారెవ్వరికేసి కన్నెత్తి చూడలేదు.
నిర్మల పక్కనే కూర్చుని నెమ్మదిగా చెప్పింది.
“తల దువ్వకోలేదులా ఉంది. నేను తలదువ్వతాను.”
గతరాత్రికి సంబంధించిన అంట్ల చెంబులు మొదలైనవి తీసుకుని నితాయీ బయటికి వెదుతున్నాడు.
“వద్దని చెప్పు,” వసంత నిర్మలతో అన్నది. ఈనాడామె కళ్లెత్తి నితాయీ కేసి చూడలేకపోతున్నది.
“అన్నా! అన్నో” నిర్మల పిలిచింది
“ఎందుకంత భయం వసంతా? నీవేమి భయపడకు! నాకేమి ఇబ్బంది కలగదులే!” నితాయీ నవ్వుతూ చెప్పాడు.
నిర్మల నిలువునా నిర్జాంతపడింది. 160 € కవి నవల
మూదు రోజులలో నిమ్మళించవలసిన వ్యాధి తొమ్మది రోజులదాకా తగ్గలెదు. వసంత పరుపు మీద పడి అటు, ఇటు దొర్లడం ప్రారంభించింది. ఆమె శరిరం నిండా చిన్న చిన్న పొక్కులు లేచాయి. ఒళ్లంతా సిరా పోసినట్లు నల్లబడింది. దిపం వెలిగించి అర్ధరాత్రిదాకా వసంత తలవైపున కూర్చుని నితాయీ నెమ్మది నెమ్మదిగా విసురుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో వ్యాధి(గ్రస్త అయిన స్త్రీల బాధలకు అంతే ఉండదు. (ప్రేమపాత్రులైన పురుషులు వారి సమీపానికి కూడా వెళ్ళరు. మరొకళ్ళయితే బృందం విడిచిపెట్టి పారిపోవడం కూడా కద్దు రోగగ్రస్తురాలు ఒంటరిగా పడి ఉండాలి. బృందంలోని స్త్రీలే కొద్ద గొప్పో పరిచర్య చెస్తూ కాస్త శ్రద్ధ వహిస్తారు. కాని నితాయీ మాత్రం ప్రశాంత దరహాసంతో తలవైపునే కూర్చున్నాడు!
ఆ వేళ రాత్రి నిశ్శబ్దంగా నెమ్మది నెమ్మదిగా సాగిపోతూ మొదటిజాము దాటి రెండవజాము సమీపించబోతున్నది అకస్మాత్తుగా ఆ రాత్రి నీరవత భేదిస్తూ సంగీతం ప్రారంభమైంది. నితాయీ మేలుకునే ఉన్నాడు. కాని మధ్య మధ్యన నిద్ర బరువుతో జోగుతున్నాడు. సంగీతం చెవిని పడగానే అతనికి పూర్తిగా మెళకువ వచ్చింది రవంత నవ్వకుండా ఉండలేకపోయాడు. ఫిడేల్ వాలా కేమి బుద్ధి పుట్టిందో మరి! ఫిడేల్ వాయిస్తున్నాడు. ఈవేళ నిర్మల ఇంట బీభత్సమైన మహోత్సవం జరుగుతున్నది. అందువల్ల అతనికలాగ అకస్మాత్తుగా ఫిడేలు వాయించాలని బుద్ధి పుట్టడంలో ఆశ్చర్యంలేదు! నితాయీ చీకటి పడినప్పటినుంచి ఈ సంగీతం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఫిడేల్ వాలాది మహ తియ్యని చెయ్యి! చాలా అత్యద్భుతమైన సంగీతం! బేహాగ్ రాగచ్చాయ ఆ సంగీతంలో వినవస్తున్నది. అది వింటూంటే, గంభీర గాఢాంధ కారంలో ఆ రాత్రివేళ సమస్తం అదృశ్యమై లీనమైపోతున్నట్లు స్ఫురించింది.
“ఆం ళీ, ఛీ, ఛీ!” వసంత లేచి కూర్చున్నది!
“ఏమిటి వసంతా? ఏమి జరిగింది?” నితాయీ కంగారుపడి అడిగాడు.
“అది ఆపివేయించండి! ఆ వాద్యం నిలిపివయంచండి!”
“బాగా లేదా నీకు?”
“కాదు! కాదు! నా కాళ్లు చేతులు చల్లబడిపోతున్నాయి.” వసుమతి చలనాని + 161
వసంత వగరుస్తూ వగరుస్తూ సమాధానం చెప్పింది. కమాను గీస్తుంటే బయలుదేరిన స్వరం దిర్హ కరుణస్వరంతో కంపిస్తూ, కంపిస్తూ ఆ రాత్రి గాథధాంధకారంలో పోయి క్రమక్రమంగా ఏకీభవించింది!
20
పూర్తిగా ఒక మాసం గడిచిపోయింది. ఆపైన వసంత ఎలాగో అలాగ అతికష్టం మీద రోగశయ్య విడిచిపెట్టింది. కాని ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయింది! ఆ పూర్వపు వసంతే అని గుర్తించడం చాలా కష్టం. ఆ కుత్సితవ్యాధి తన నాలుకల విషజ్వాలలతో వసంత శరీరవర్హం, ఆమె ఉజ్బ్వలత అందచందాలు అన్నీ ఒక్కమారుగా పూర్తిగా తుడిచివసింది. ఆమె ఒళ్లంతా నల్లని మసిపూసినట్లయింది. పొడవైన నల్లని కురులు బాగా పలచబడి పచ్చనై బిరుసుగా మారిపోయాయి. శరీర వర్ణమే కాదు. దాని మిసమిస తారళ్యము అన్ని అంతరించాయి. నునుపుచేరి నిగనిగలాడుతున్న శరీరం కేవలం అస్ధి పంజరంలా మారిపోయింది! వసంత స్వకీయ శరీర సౌందర్యం చూసుకుని ఎంతో మురిసిపోయెది. అటువంటి ఆమె బక్కచిక్కిన ముఖంలో ఇప్పుడు పెద్దపెద్ద కళ్లు రెండు మాత్రమే ఆ అందాని*కైక చిహ్నాలై నిలిచినాయి. ఇప్పుడు వసంత స్తబ్దంగా నిశ్చలంగా పడి ఉన్నది. భస్మరాశిలో ఎర్రగా ప్రజ్వలిస్తున్న బొగ్గులలాగ ఆమె నేత్రాలు రెండు మాత్రమ తళతళలాడుతూ మెరుస్తున్నాయి!
“ఒళ్లంతా దట్టంగా పసుపు పూసుకుని స్నానం చేస్తే చాలా మంచి పని చేస్తుంది. వసంతా! ఈ వెళ అలాగ స్నానం చెయ్యరాదుటే!” పిన్ని అన్నది.
ఆమె రెప్పపాటు లేకుండా చూస్తూ కూర్చున్నది. అంతేగాని దానికి సమాధానం చెప్పలేదు, కదలలేదు, ఉలకలేదు, పలకలేదు. అదే నిశ్చలదృష్టి!
ప్రౌఢ మళ్లీ చెప్పింది.
“చూడమ్మా, అలాగ స్నానం చేశావంటే శరీరం దుర్వాసన పోతుంది. ఆ నలుపుతోపాటు, అందవికారం కూడా ఎక్కడిక్కడ ఎగిరిపోతుంది! ఒళ్లంతా హాయిగా ఉంటుంది!”
అయినా వసంత అలాగే నిశ్శబ్దంగా రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంది!
పిన్ని ఈమారు ఆమె దగ్గిరికి వెళ్లి, శరీరంమీద చీర తొలగించి, చేతితో 162 కవి నవల
నిమిరింది. ఆపైన లలితతో చెప్పింది.
“లలితా! ఆ బాటిల్లో ఉన్న నూనె వెచ్చజేసి, దానితోబాటు కొంచెం పసుపు కూడా తీసుకురా[
ఆ తరువాత నితాయీని పిలిచింది.
“బాబూ! ఎక్కడున్నావు నీవు?”
నితాయీ ఇంట్లో వసంత పడుకున్న పరుపుమీది బట్టలు తీసివేస్తున్నాడు. అవి అన్నీ ఇవతలికి తీసుకువచ్చి ఎండలో ఆరవేశాడు.
“నన్ను పిలిచావా పిన్నీ?” అన్నాడు.
“నీవ చాలా మంచఛచివాడవు బాబూ! అదీగాక మాకెంతో కావలసినవాదవు! నిజమైన మనిషివి నీవే! అమ్మాయి పిలుస్తూంది- నేనన్నమాట బోధపడలేదూ?” ఆమె అల్లన నవ్వింది. నితాయీ కూడా నవ్వుతూనే అడిగాడు.
“ఏమిటి పిన్నీ నీవనేది?”
“ఒక్కసారి వసంత నూనెసీసా, దువ్వెన ఇలాగ తీసుకురా బాబూ! జుట్టంతా జడలుకట్టి పోయింది! కాస్త దువ్వుతాను.”
ఇప్పటికి వసంత పెదవి కదిపింది. ఎండలో ఆరుతున్న బట్టలకేసి వేలెత్తి చూపించింది.
“అయితే మరి వాటి మాటేమిటి?”
ఇంట్లో ఉన్న నూనెసీసా కోసం దువ్వెనకోసం వెడుతున్న నితాయీ రవంత సేపు ఆగి, “అవ్వన్నీ ఉతకాలి!” అన్నాడు. వసంత తీవ్రస్వరంతో గట్టిగా అరిచింది.
“వల్లకాదు! వద్ద! వద్ద!
అలాగంటూనే వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆ ఏడుపు మరి తగ్గలేదు! నితాయీ నిజంగానే అద్భుతవ్యక్తి! అనుకుంది వసంత. అతడు నవ్వుతూనే వసంత నోదారుస్తూ అన్నాడు.
“పిన్ని చెప్పిన మాటలన్ని విను వసంతా! అంతేగాని మిగిలిన గొడవలన్నీ నీకెందుకు?”
అయినా వసంత ఏడుపు తగ్గలేదు. వసుమతి చలనాని +*అ 163
నితాయీ మళ్లీ మొదలు పెట్టాడు.
“నాది కూడా మానవశరీరమేగా! నా కెప్పుడైనా జబ్బుచేస్తే వడ్డీతో సహా అన్ని తీర్చేద్దువుగానిలే! నేను మరీ షావుకారులాగ అంత రొక్కాయించి పుచ్చుకోనులే! ఏమంటావు పిన్నీ!”
అతడలాగ నవ్వుతూనే లోపలికి వెళ్లి నూనెసీసా, దువ్వెన తీసుకువచ్చి ఇచ్చి, మళ్లీ మరికొన్ని బట్టలు తీసుకుని వీధిలోకి వెళ్లాడు.
రోగం చెమటతో తడిసిన బట్టలన్ని తీసుకువెళ్లి శుభ్రంగా ఉతికి తీసుకు వచ్చాడు నితాయీ. లలిత, నిర్మల ఇద్దరు వేశ్యావృత్తిలోనే జీవిస్తున్నారు. వారి జీవితాలలో (ప్రేమ శరత్కాల మేఘంలా ఇట్టెవచ్చి, ఇట్ట వెళ్లిపోతుంది. హేమంతంలో చలి గాలిలాగ కొన్నాళ్లపాటు సుస్థిరంగా ఉన్నా ఆ శరీర వ్యాపారిణుల కేమాత్రమైనా రవంత అస్వస్థత కలగగానే వెంటనె అదృశ్యమై పోతుంది! నిర్మలకీ వ్యాధి మూడుసారులు వచ్చింది. లలిత కూడా ఇదే వ్యాధితో రెండుసార్లు మంచాన పడింది. రోగం కాస్త పైకి పొక్కగానే వారి ప్రేమికులు అక్కడినుంచి పారిపోయారు!
నిర్మల ప్రేమించిన వ్యక్తి ఒకడున్నాడు. రోగం కనబడీ కనబడగానే ఆమె దాచుకున్న సొమ్మంతా పూర్తిగా చేజిక్కించుకుని ఉడాయించాడు. అందు వల్లనే నితాయీ ధోరణి గమనించి ఆశ్చర్యపడుతున్నారు. తమ జీవితాలలోనే కాదు! తమవంటివారి బ్రతుకులలో కూడా వారెన్నడు ఇటువంటి సంఘటన గమనించలేదు!
బట్టలన్నీ చక్కగా ఉతికి శుభ్రంచేసి వచ్చిన తరువాత తిరిగివచ్చి చూస్తే వసంత అలాగే నోటమాట లేకుండా నిశ్చలంగా చూస్తూ కూర్చున్నది. నితాయీ మరికొంత సేపు ఆమెవైపు చూసి రవంత సంతృప్తి పడ్డాడు. నూనెతో పసుపుతో స్నానం ముగించి వచ్చిన పిమ్మట వసంత తన వెనుకటి రూపు సంతరించు కున్నది. ప్రౌఢ ఆమె తల చక్కగా దువ్వి జారుడు కొప్పువేసింది. ముఖంమీద సింధూర తిలకం తీర్చిదిద్దింది.
రోగంతో తీసుకున్న వసంత ఆ విధంగా ఆరోగ్యంతో కొంతవరకు స్పిమితపడిన తరవాత నితాయీ నిజంగానే చాలా ఆనందించాడు.
1644 కవి నవల
“నీవు బాగా ఆరోగ్యంగా ఉన్న మనిషిలాగే కనిపిస్తున్నావు వసంతా!”
వసంత రవంత నవ్వింది. ఆపైన సుదిర్హనిశ్వాసమొకటి విడిచిపెట్టింది. నితాయీ మాటలన్ని కలిసి ఆమె నవ్వుతో తుత్తినియలై ఆ సుదీర్హ నిశ్వాసంతో ఎక్కడికో ఎగిరిపోయినట్టున్నాయి! ఆ నవ్వులో వెటకారంతోబాటు ఎంతో దుఃఖం గూడుకట్టుకున్నది! అదంతా గమనించి నితాయీ కంగారుపడదకుం౦ందా ఉండలేకపోయాడు!
అయినా త భావం సపైకేమాత్రం వ్యక్తం కానియ్యక నెమ్మదిగా బుజ్జ్ఞ గించాదు.
“నేను అబద్ధం చెప్పడంలేదు వసంతా! మళ్లీ నీ ఒంటికంతటికీ ఆ వెనకటి రంగు వచ్చేసింది. కొంచెం నీరసంగా ఉన్నావనుకో! దానికేమిటిలే! ముఖంమీద ఆ జబ్బు చిన్నెలేవి మది కనిపించడంలేదు. తెలుసునా? నా మాట మీద నమ్మకం లేకపోతే ని అంతట నీవే ఒకసారి అద్దంలో చూసుకో!
అటుపిమ్మట వెనకముందులాట్టే ఆలోచించకుండా ఆ అద్దంతోబాటు వసంత కెదురుగా నిలుచున్నాడు.
ఆమె విశాలనేత్రాల కటాక్షాలనుండి అగ్నిస్ఫులింగాలుదృవించి, బాగా ఎండిన తుపాకీమందులో పడ్డట్టుగా ఆమె శరీరం అంతా ఒక్కమారుగా భగ్గుమని ప్రజ్వలింపజేశాయి! క్షణంలో విద్యుద్వేగంతో ముందుకువచ్చి, అతని చేతినుండి ఆ అద్దం లాక్కుని, వసంత అది చెతికొద్ది విసరికొట్టింది. ఆమె ఆ సమయంలో పిచ్చిపట్టినట్టు మారిపోయింది. నితాయీ వెనువెంటనే తల పక్కకి తిప్పి వేశాడు. అదీగాక వసంత చేతులు బక్కచిక్కి ఉన్నాయి! అందువల్లనే ఆ లక్ష్యం తప్పిపోయింది. నితాయీ దెబ్బతగలకుండా తప్పించుకోగలిగాడు. ఆ విసిరికొట్టిన అద్దం పక్కనే ఉన్న బొంగు వెదురుస్తంభానికి తగిలి నాలుగైదు ముక్కలై నేలమీద పడింది!
నితాయీ చిన్నగా నవ్వి ఆ అద్దం ముక్కలన్ని ఏరడం ్రారంభించాడు. అదే క్షణంలో కరినమైన కంరస్వరమొకటి దారుణంగా మారుమోగింది!
నితాయీ ముఖం వెనక్కి తప్పిచూశాడు. పిన్ని! తిరిగి ఆమె అదే కరోర గంభీరస్వరంతో గర్జించింది! వసుమతి చలసాని + 165
“వసంతా!”
వసంత నిశృబ్దంగా, నిశ్చలంగా అలాగే నిలుచున్నది. ఆమె నేత్రాలకింక రెప్పపాటేలేదు!
“పపంచంలో ఇంకెవ్వరికి జబ్బు చెయ్యదా? వారంతా నీలాగే తయార య్యారా? ఆయనే కనక ఇక్కడలేకపోతే, నిన్నీపాటికి పాకివాళ్లు ఈడ్చిపారేసి ఉండేవాళ్లు! తెలుసునా?”
అప్పటికి కూడా వసంత సమాధానం చెప్పలేదు! ఆ భీకరమూర్తి ప్రౌఢ కెదురుగా నిలబడి సమాధానం చెప్పడానికి శక్తిగాని సాహసం గాని ఆమెలో ఉందే అవకాశమేలెదు! ఇప్పుడిక్కడ నిలబడిన పిన్ని కేవలం వేరొక తరహావ్యక్తి! క్రూరంగా, కరినంగా ఉత్తరువులిచ్చే బృందనాయకురాలు! స్త్రిలు, పురుషులు, (ప్రేమించేవ్యక్తులు, భయంకరమూర్తి ఆ దున్నపోతువంటి వ్యక్తి- అందరు భీషణమూర్తి ప్రాఢ కట్టెదుట నిలబడడానికే హడిలిపోతారు! నితాయీ కూడా అద్దం ముక్కలన్ని ఏరడం పూర్తిచేసి నిశ్చష్టితుడై ఆమెకేసి చూస్తు అలాగే నిశ్చలంగా నిలుచుండిపోయాడు. అతడు ఇటువంటి ప్రాఢస్వరూపం సంద ర్ఫించడం ఇదే మొదలు!
పిన్ని తిరిగి మరింత కరినంగా గొంతెత్తి గర్జించింది.
“ఏం వసంతా! నేనడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పవేం?”
వసంత ఈమారు కూడా రెప్పపాటులేని నిశ్చలదృష్టితో అలాగే పిన్నికెసి చూస్తూ నిలుచుండిపోయింది! వెనువెంటనే నితాయీ వారిద్దరి మధ్య నిలు చున్నాడు. రాత్రివేళ బెబ్బులికళ్లలా భయంకరంగా తళతళలాడుతూ మెరు స్తున్నాయి ప్రాధనెత్రాలు! ఇక వసంత విలోచనాలు రెండుకేవలం అగ్ని జ్వాలల! ఆ కళ్లలో చైతన్యం లేదు! భయం కూడా లేదు! కేవలం దహనశక్తితోనే ఆ నేత్రాలలాగ ప్రజ్వలిస్తున్నాయి! నితాయీ సవినయంగానే నవ్వాడు. కాని దృఢ స్వరంతోనే చెప్పాడు.
“బయటికి వెళ్లిపో పిన్నీ! ఛీ! ఛీ ఏమిటిది? జబ్బుచేసిన-”
జబ్బు చేసిన మనిషా? ప్రపంచంలో ఇంకవ్వరికి జబ్బు చెయ్యదా? వారందరు ఇలాగే ఉంటున్నారా? చీపురుకట్ట చేత్తో-”
166 ఈ కవి నవల
“భ్ఫీ ఛీ! పిన్నీ ఏమిటిది?”
“ళ్ళి ఎందుకని? ఆ ఛీ ఎందుకో చెప్పు?”
“ల్రసలైే జబ్బుమనిషి! అదిగాక నీ ఎడల ఎటువంటి అపరాధం చెయ్య లేదు!”
నా బృందంలో ఉన్న మనిషికి అపరాధం చేసింది! అటువంటప్పుడు ఇంకనా బృందంలో ఉందడం ఎందుకు? కవీ, నీవునా బృందంలో వ్యక్తివి!”
ప్రశాంత దృఢస్వరంతో నవ్వుతూనే సమాధానం చెప్పాడు నితాయీ,
“అవును నిజమే! ఆయితే వసంత కోసమే మీ దళంలో ఉన్నాను పిన్నీ లేకపోతే-”
రవంత సేపాగి మల్లీ అందుకున్నాడు.
“వెళ్ళు పిన్నీ! నీవు బయటికివెళ్లి తీరాలి!”
ప్రౌఢ నితాయీకేసి నిశ్చలంగా చూసింది. బృందంలో ప్రతివ్యక్తి సహజం గానే ప్రాఢ ఆజ్జశిరసా వహిస్తాడు. ఆ సంగతి దళనాయకురాలికి బాగా తెలుసును! బృందంలో ప్రతివిషయం ఆమె అధికారం ప్రకారం సాగిపోవాలి! ప్రతిచిల్లిగవ్వ దళనాయకురాలి చేతిలోనుండి ఖర్చు కావాలి. ఈ దళంలోని వారు తమవేషభూషణాలు, అధికారాలు అన్ని ప్రాధనుండే స్వీకరించాలి! ఇప్పటి దళనాయకురాలు తన యౌవ్వనకాలంలో తన దళనాయకురాలి అజ్జలన్ని అక్షరాల శిరసావహించింది. దళంలోని వారందరు ఇన్నాళ్లనించి ఆమె ఆజ్ఞలన్ని, కట్టడులన్నిి సలహాలన్ని తు.చ. తప్పకుండా అనుసరించారు. నేడు ఆ ధోరణికొక అడ్డంకి ఏర్పడగానే ప్రౌఢ నిలువునా నిర్దాంతపోయింది! ఇటువంటి పరిస్థితిలో ఆమెకాగ్రహం కలిగిందంటే వెంటనే ఆ దున్నవంటి వ్యక్తికి ఉత్తరువులిస్తుంది! కాని రెండు మూడుమారులు నితాయీ కేసి చూసిన తరువాత ప్రొాధకటువంటి ఆలోచనే కలగలేదు! అదీగాక నితాయీ ఎప్పుడు ఆమె ఆజ్ఞ శిరసావహించేవాడు. ఈనాడామె ఆజ్ఞ కెదురు చెప్పాడు. నిజమె! కాని దానిలో మొండితనంగాని, గర్వంగాని అస్వాభికతకాని ఆవంతయినా కానరాలేదు! ఇదీకాక నితాయీ ఆమెనేవిధంగాను కించపరచలేదు!
అలాగే మరికొన్ని క్షణాలపాటు అతనికేసి చూసి ప్రాఢ ఉసూరుమని వసుమతి చలనింని + 167
నిట్టూర్చింది.
“బాబూ, నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాను. వెయ్యేళ్లు వర్దిల్లు నాయనా! ఈవేళనించి నేనింక నీకు పిన్నిగాకాక తల్లిగానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగైతే అంత్యకాలానికి నేనేమి దిగులుపడనక్కరలేదు! తెలిసిందా?”
“పిన్ని అన్నా తల్లి అన్నా ఒక్కటే పిన్నీ! ఇంక ఇక్కడినించి వెళ్లుమరి! కొడుకు, కోడలు తగాదాపడితే, పిన్నిగాని తల్లిగాని అది వినకూడదు”
పిన్ని మారు చెప్పకుండా నితాయీ మాట మన్నించి అక్కడినించి వెళ్లి పోయింది. నితాయీ వసంతకేసి చూశాడు.
లల్చీ! ఛీ! వసంతా! ఏమిటిది? జబ్బుపడి అలాగ మండిపడిపోతావేమిటి? కోపంతో శరీరారోగ్యం పాడైపోతుంది తెలుసునా?”
వసంత అంతలోనే వట్టి నేలమీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవడం 'పారంభించింది. నితాయీ ఎంతో ఆప్యాయంగా అదిగాడు.
“ఈవేళ పొద్వటినించి ఇలాగ ఏడుపు మొదలుపెట్టావెందుచేత వసంతా?”
ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది! అందువల్ల మరి ఊపిరి తిరగదేమో అని కూడా ఆత్రపడ్డాడు నితాయీ. నెమ్మదిగా శిరస్సుమీద చెయ్యివేసి నిమురుతూ అన్నాడు.
“కలకత్తాలో మందుల దుకాణానికి నిన్ననే ఉత్తరం రాశాను. మూడు సారసవరిల్లా సీసాలు కావాలని ఆర్దరిచ్చాను. ఆ మందు తాగితే ఆరోగ్యం వెంటనే బాగుపడుతుంది. రక్తంలో దోషాలన్ని పూర్తిగా తొలగిపోతాయి. అన్ని నయమవుతాయి.”
ఊపిరి తిరగనియ్యని ఎడతెగని ఏడుపువల్ల వసంత దగ్గడం ప్రారంభిం చింది. అలాగ దగ్గిదగ్గి శ్లేష్మం ఉమ్మివేసి ప్రాణం పోయినట్లు పడిపోయినది. ఆపైన నెమ్మది నెమ్మదిగా వేలెత్తి అటు చూపించింది.
“ఏమిటది?” అడిగాడు నితాయీ. క్షణంసేపు ఊరుకుని, అద్భుతంగా ఒక చిరునవ్వు చిలకరించి, “రక్తంగ”అని సమాధానం చెప్పింది వసంత.
“రక్తమా!”
168 4 కవి నవల
“అవును! అదే ప్రాణం తీసే రోగం!”
వసంత ఈమారు నవ్వింది. ఇంతసేపటినించి ఈ సంగతి చెప్పలేక ఫోవడం వల్లనే ఆమె అలాగ విలపించింది. ఆ మాట కాస్త అనేశాక ఆమె ఎడుపు తగ్గింది. నితాయీ ఏకాగ్రదృష్టితో ఆ శ్లేష్మంవైపు చూశాడు. దానిమధ్య ఎర్రని రక్తం విస్పష్టంగా కనిపించింది. ఒక సుదీర్హ విశ్వాసం విడిచిపెట్టి, మరికొన్ని క్షణాల వరకు మౌనంగా ఉండిపోయాడు. వసంత రెండు చేతుల తోను నితాయీని గాఢంగా కౌగలించుకున్నది.
ఈ బృందంలోకి మీరెందుకు వచ్చారా అని నేనాలోచిస్తున్నాను. అంతే గాని చనిపోతానని నాకెన్నడు భయంలేదు! కాని ఇటుపిమ్మట నాకు చచ్చి పోవాలని అనిపించడంలేదు!” బక్కచిక్కిన ముఖమంతా రవంత చిరునవ్వు పులుముకుని ఆమె తదేకదృష్టితో నితాయీకేసి చూసింది. అతడుకూడా చిక్కి శల్యమైన ఒక పసిపాప నదిమిపట్టుకున్నట్టు ఆమెనాలింగనంలో బంధించాడు.
“ఇంత మాత్రానికి భయమెందుకు వసంతా? రోగం రాగానే చనిపోతారా ఎవరైనా? శరీరం బాగానే ఉంది. ఇంక రోగం కూడా తగ్గిపోతుంది ౫”
ఈమారు వసంత విచిత్రంగా నవ్వింది. మౌనంగానే “తగ్గదు! తగ్గదు! తగ్గదు!” అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. మరికొన్ని క్షణాలతరవాత స్పష్టం గానే ముఖతః చెప్పివేసింది. “నేనింక జీవించను!” అంతలోనే తిరిగి అకన్నాత్తుగా అన్నది,
“నాకిదంతా ముందే తెలుసును! మీరానాడు ఆ పాట పాడారే! ఆనాడే నాకిది అంతా తెలిసిపోయింది!”
“ఏమిటా పాట వసంతా?”
“అయ్యో! మనుగడ ఇంతగా అల్పమై
సంకుచితమై పోయినదేమి?”
ఆ చరణం ముగిస్తూనే ఆమె వలవల విలపించింది. నితాయీ నేత్రాలలో కూడా బాష్సాలొకటి రెండు తరళించాయి. వెంటవెంటనే అసమాప్తమైన ఆ పాట అతని హృదయంలో మారుమైోగుతుంది.
“ఇదే నా హృదయాంతరాళ నిరంతరభఖేదము! వసుమతి చలనాని + 169
ఆశ (ప్రమతో పరిపూర్ణత నందనేరదుగదా! (బతుకేమో నా చేతిలో లేదుగదా!
అయ్యో! మనుగడ ఇంతగా అల్పమై సంకుచితమై పోయినదేమి?
ఇదే నా హృదయాంతరాళ నిరంతర భేదము!”
ఆ పైన? అటు పిమ్మట ఆ పాట రచన కొనసాగలేదు! అది అసమాప్తం గానే ఉండిపోయింది! నితాయీ ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరెరుగుదురు?
వసంత దిగులుగా చూస్తూ
“నాకిదంతా పూర్తిగా తెలిసిపోయింది! ఫిదేల్వాలా మునుపు ఫిడేలు వాయించినప్పుడు అది ఎంత బాగుందేది? ఇప్పుదెందుచేతనో భయంగా ఉంది! ఎవరో నా పక్షనే నిలబడి అదేపనిగా కుమిలి కుమిలి ఆక్రోశిస్తున్నట్లని పిస్తున్నది! ప్రతిదినం నా మనసు మరణాన్ని గురించే ఆలోచిస్తున్నది! ఇదంతా అబద్ధమై పోతుందా? ఆ పైన మీరా పాట వ్రాశారైరి! ఇది ఇలాగ ఎందుకు జరిగింది?” అన్నది.
వసంత మనోభావన అసత్యం కాలేదు! అది దివ్యమణిలా యధార్ధమే అయింది!
మరికొన్ని దినాలలోనే సాయంత్రం అయ్యేసరికి వసంత శరీరంలో జ్వరం విస్పష్టంగా కనిపించింది. ఆమె నితాయిీని పిలిచి చేతిలో చెయ్యివెసింది.
“చూడండి. ఒళ్లు ఎంత వేడిగా ఉందో!”
నితాయీ వసంతకేసి చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
“అయ్యో! మనుగడ ఇంతగా అల్బమై
సంకుచిత మయిపోయిందేమి? కవి!”
ఈ వృత్తాంతం అంతా ఖాట్వా అన్న చిన్న పట్టణంలో జరుగుతున్నది. ఆ నగరంలో ఒక ప్రాంతంలో శిధిలమైన చిన్న ఇల్గొకటి వారిద్దరు అద్దెకు తీసుకున్నారు.
“లలితనొకసారి పిలుస్తాను. ఆమె నీ దగ్గిర ఉంటుంది. ఈలోగా నేనొక 1704 కవి నవల
డాక్టర్ని వెంటపెట్టుకువస్తాను.” నితాయీ అన్నాడు,
“వద్వ! వద్దువసంత బాగా కంగారుపడింది.
“త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. ఒక అరగంట కంటే ఎక్కువసెపు పట్టదు!”
“వద్ద! వద్ద! వద్దు! దగ్గువస్తె! రక్తం కనబడితే? అప్పుడు నన్ను ఇలాగే ఈ దారి మధ్యలోనే విసిరివేసి ఈవేశే అందరూ ఇక్కడినుండి పారిపోతారు. వెళ్లవద్దు! మీరు వెళ్లవద్దు!”
గత్యంతరంలేక నితాయీ అక్కడే కూర్చుండిపోయాడు. రక్తం పడుతున్న సంగతి ఈవేళదాకా ఎవ్వరికి తెలియనియ్యకుండా అతి రహస్యంగా దాచారు.
ఈవేళ జ్వరం మరింతగా పేల్సిపోసింది. గతరాత్రి మొదటిజాము గడిచిన కొంతసేపటికి చెమటపట్టి జ్వరం పూర్తిగా తగ్గింది. వసంత బాగా స్తిమిత పడింది. ఈవేళ చెమట పట్టలేదు. దానితోబాటు స్తిమితత కూడా చేకూరలేదు! జ్వరం పేల్చివేస్తూంటే వసంత బాగా వివశురాలై అప్పుడప్పుడు నితాయీకోసం వెతుకుతూ నలువైపుల కలయజూసింది. ఆ పైన కళ్లు రెండు మూసుకుని మాటి మాటికి ఒకవైపు నుండి మరొకవైపు దొర్లింది. ఈవేళ వసంత ఆందోళన బాగా పెచ్చు పెరిగిపోయింది!
నితాయీకి ఆమె చూపుల అద్ధం బోధపడింది. తనకోసం వెతుకుతూ చూసినప్పుడల్లా “నేను ఇక్కడే ఉన్నాను వసంతా!”అని ఓదార్చాడు.
అది ఆ రాత్రి చిట్టచివరి జాము. నితాయీ నిద్రబరువుతో జోగుతూ గోడమీదికి వాలి నిద్రపోతున్నాడు.
నాలుగోజాము అద్భుతమైన కాలం! ఈ సమయంలో పగలంతా పుంజీభ వించిన వేడిమి పూర్తిగా తగ్గివోతుంది అనూహ్యమైన అతిలోక సాంద్రశీతలత ఆ వేడిమిని పూర్తిగా అణచివేసి, నెమ్మది నెమ్మదిగా పై పైకి పెల్లుబుకుతుంది. అది నుదురు మీద చల్లగా తగలగానే చైతన్యం సమస్తం సమాచ్చాదితమై నిద్రిస్తుంది. తరంగాలేమాత్రం లేని వాయుమండలంలో దట్టంగా పొగకమ్ము కున్నట్టు ఆ నీరవవేళలో అతి లోకమైన పొగమంచు సృష్టినంతటిని నెమ్మది నెమ్మదిగా ఆవరిస్తున్నది భూగర్భంలోను, చెట్ల ఆకులలోను నిండిన అసంఖ్యాక కీటకాలకోటులా సమయంలో తమ తమ కోలాహలాలు చాలించి, నిశ్శబ్దంగా వసుమతి చలసాని అ 1711
నిక్రైతన్యంగా పడి నిద్రిస్తూంటాయి భూగర్భంలో ప్రతి రంధ్రంలోనికి ఈ హిమప్రవాహం ప్రసరిస్తుంది. చైతన్యమయమైన జీవలోకంలోను, మానవ లోకంలోను కూడా ఈ దట్టమైన పొగమంచు అలాగే వ్యాపించి కమ్ము కుంటుంది. ఆ పైన ఇంద్రియాలకన్నింటికి ఒక్కమారుగా ఆవశత కలిగిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో తారకలన్ని వెలవెలబోతాయి! బహుశః అక్కడికి కూడా ఈ హిమసమూహం వ్యాపిస్తుంది కాబోలు! నిశ్చలరాత్రి దేవత నెన్ను దుటి మీది నేత్రంలాగ కేవలం శుక్రతారక ఒక్కటే ఆగ్నేయదిశలో తళతళ లాడుతూ మెరుస్తుంది. ఈ అతిలోకమైన గంభీర హిమశీతలత నెమ్మది నెమ్మదిగా నితాయీని కూడా కమ్ముకుని కప్పివేసింది. శతవిధాల ప్రయ త్నించినా అతడు మేలుకుని ఉండలేకపోయాడు. మైకం కమ్ముకున్నట్టు గోడమీదికి వాలి క్రమక్రమంగా గాఢంగా నిద్రించాడు.
వసంత చెయ్యి పట్టుకుని లాగడంతో అకస్మాత్తుగా అతనికొక్క మారుగా తెలివి వచ్చింది. ఆమె ఎప్పుడో మేలుకున్నది. రెండుచేతులలోను అతనికంరం కౌగిలించుకుని “ఇదిగో! ఇదిగో!” అని పిలుస్తున్నది!
ఎంతో ఆర్తమై, విహ్వలమై మారుమోగింది ఆ గొంతుసవ్వడి!
“ఏమిటి వసంతా! ఏమిటి? ఎందుకలాగలేచి కూర్చున్నావు? నిద్రపో! నిద్రపో!”
ఆమె చేతులు రెండు మంచుగడ్డల్లా బాగా చల్లగా ఉన్నాయి. ఆ హిమ ప్రవాహం చేతులమీదుగా ఒకసర్పంలా చల్లచల్లగా పాకి, నిశ్శబ్దంగా శరిరం అంతట వ్యాపిస్తున్నది. ఆమె ఒళ్లంతా దట్టంగా చెమటపట్టంది.
“అది ఆపివెయ్యండి! ఆపివెయ్యండి!”
“ఐమిటది?”
“ఫిడేలు! ఆ ఫిడేలు వాద్యం వెంటనే నిలిపి వెయ్యండి!”
“ఫిడేలు వాద్యమా? ఎక్కడ?”
నితాయీ చెవులు రిక్కించి విన్నాడు. కాని ఆ నీరవ వేళలో తెల్లవారు జామున తమ ఇద్దరిశ్వాసల సవ్వడి తప్ప అతనికి ఇంకేవిధమైన ధ్వని వినిపించలేదు. 1/24 కని నవల
“అదిగో! వినిపించడంలేదా? ఆ ఫిడేలు ఒక్కటే మారుమోగుతోంది”
అకన్మ్నాత్తుగా అతనికి ఒక సంగతి తటాలున జ్ఞప్తికి వచ్చింది! వసంత శరీరం స్పృశించగానే నితాయీ నెవ్వరో వెన్నుమిద చరిచినట్లయింది. చెయ్యి పట్టుకుని నాడి పరిశీలించి ఎంతో జాలిగా చూసి బ్రతిమాలుకున్నాడు.
“గోవింద దేవుని నామధేయమొకమారు స్మరించుకో వసంతా!”
వసంత భయపడుతూ అతని మీద నిశ్చలంగా దృష్టినిలిపి చంచలకంర స్వరంతో “ఎందుకని?” అని ప్రశ్నించింది
నితాయీ ఆ ప్రశ్చకే విధంగానూ సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె మృతి సమయంలో చెలరేగుతున్న ఆందోళనలో కూడా క్షణకాలం స్టిమితపడి, పెద్దపెద్ద కళ్లు మరింత పెద్దవిగా చేసి నిశ్చలంగా చూస్తూ వసంత ప్రశ్నించింది.
“నేను చనిపోతున్నానా?”
వాడిపోతున్న చిరునవ్వుతో నితాయీ ఆమె శిరస్సుమీద చెయ్యివేసి ఎంతో ఆవ్వ్యాయంగా నిమిరాడు.
“భగవంతునిపేరు ఒక్కనారి తలచుకో కష్టాలు తగ్గిపోతాయి వసంతా?
ఒక్కమారుగా తెగిన విల్లులా వసంత తటాలున పక్కమీద పడిపోయి అన్నది.
“తక్రల్రవను. తలవను..తలవదలుచుకోలేదు! ఆ భగవంతుడు నా కేమి చాడు? భర్త, పుత్రులు, ఇల్లు, సంసారం- ఏమి ఇచ్చాడని ! నేనుచ్చరించను!”
తప్పుచెసినవాడిలా మాట్లాడకూరుకున్నాడు నితాయీ. ఆమె ఈశ్వరుని మీద ఫిర్యాదు చేసింది. దానికి అందరు సమాధానం చెప్పవలసినవారే! అయితే ఎందుచేతనోగాని ఆ బాధ్యత అంతా తన నెత్తిమీదనే పడినట్లు భావించు కున్నాడా కవి గాయకుడు
అంతలోనే వసంత అతనివైపు తిరిగిచూస్తూ నెమ్మదిగా గొణుక్కున్నది.
“గోవిందా! రాధానాధా! కరుణించు ప్రభూ! వచ్చేజన్మలోనైనా దయదలిచి కరుణించు ప్రభూ”
వర్షం పడిన తామర రేకుల్లా ఆమె రెండు నేత్రాలు కన్నీటితో నిండి సంచలించాయి. నితాయీ తన కండువా అంచుతో ఆ కళ్లు రెండూ తుడిచి వసుమతి చలనాని ఈత 173
రవంత ముందుకు వంగి ఎంతో ఆత్రంగా పిలిచాడు.
“వసంతా! వసంతా!”
“వద్దు! వద్దు! నన్నింక పిలవవద్వు!”
అలాగంటూనే ఆమె చేతులు రెండు చాచి, శూన్యంలో ఏదో పట్టుకో బోతున్నట్ట విపరీత వేదనతో విలవిలలాడిపోతూ లేచి కూర్చున్నది!
మరుక్షణంలో వసంత తటాలున నితాయీ ఒళ్లో తూలిపడింది!
నితాయి మనసు వికలమైంది
మరణం అంటే ఏమిటి? పురాణాలలో చదివిన మరణ వివరణలన్నీ అతనికా సమయంలో జ్ఞాపకం వచ్చాయి. మనిషి ఆయుర్దాయం పూర్తికాగానే అతని ఆత్మను వెంట తీసుకురమ్మని యమధర్మరాజు తన అనుచరులకా దేశిస్తాడు. అదృశ్యులైన ఆ అనుచరులు వేలెడంతటి ఆకారంలో వున్న ఆ మనిషి ఆత్మను తమతో తీసుకుపోతారు. ధర్మరాజు తన న్యాయస్థానంలో త్ర మనిషి చేసిన పనులన్నీ పరిశీలిస్తాడు. ఆపైన స్వర్ణంలో కానీ, నరకంలో కానీ నివసించదలచిందని ఆదెశిస్తాడు. ఆయా కర్మల పుణ్యఫలాలు, పాప ఫలాలు నితాయి అవగాహన చేసుకున్నాడు. అతడు కూడా ఎప్పుడో ఆ యమధర్మరాజు సమక్షంలో నిలబడాలి. వసంత చేసిన పనులకు అతడు చేసిన పనులకు మధ్య తేడా లేదనిపించింది నితాయికి. అందుకే వసంత వెళ్ళే లోకానికి తానూ వెళ్ళగలదని ఆనందించాడు.
“ఇదే నా హృదయాంతరాళ నిరంతర ఖేదం.
బ్రతుకే నా చేతిలో లేదు కదా!
మనుగడ అల్పమయ్యా అయ్యో సంకురాతమయ్య” విలవిలలాడాడు నితాయి. విలపిస్తున్నాడు.
మృత్యువు చాలా అద్భుతమైనది. నగలమీద వసంత కెంతటి మమత. అటువంటి నగలే పిన్ని స్వయంగా వలచి వేసింది. అయినా వసంత పెదవి విప్పలేదు. శరీరం మీద ఆమెకెంత మక్కువ. కాస్త మట్టి అంటితే ఎంత జ్వరమైనా స్నానం చేసేది. కొద్ది బాధైనా విలవిలలాడేది. అటువంటి శరిరమె తన చేతులతోనే బూడిదగా మార్చివేశాడు. కష్టసుఖాలు లోభమోహాలకు 174ఛ కవి నవల
దూరంగా వెళ్ళిపోయింది మరల తనల్లుకున్న వాట మనసులో మెదిలింది.
దహన సంస్కారం పూర్తయింది. సూర్యాస్తమయమైంది. సూర్యుడు అస్తమించకపోయినా, కన్నీళ్ళు ఆగకపోయినా కాలం ఆగదు. సూర్యుడు అస్తమిస్తుండగా నితాయి వసంతకు అంత్యక్రియలు జరిగిన ప్రదెశానికి వెళ్ళి ఒక గుట్టమీద కూర్చున్నాడు. ఎదురుగా జనశూన్య శ్మశానం. చితుల నుండి కొద్దికొద్దిగా పొగ వస్తోంది. కాలిన దేహాల వాసన గాలిలో వ్యాపిస్తోంది. నిశ్శబ్దంగా కూర్చున్న నితాయి ఇంత దగ్గరగా వంటరిగా స్మశానంలో కూర్చుని ఎరుగడు ఇప్పటివరకు. జీవితానికి అవతలవైపు ఎన్నడూ చూడలేదు. ఆలోచిస్తే ఈ జీవితానికి అటు దిక్కులో మృత్యుపురమున్నది. అక్కడే మృతి మకాం పెడుతుంది అన్పించింది నితాయికి.
మరణంతో పెనుగులాడిన వసంత తన ఒడిలో ప్రధమంగా మృత్యువుతో పరిచయం కల్గించింది.
తన వంశంలో మానవరూపం ధరించిన రాక్షసులు మృత్యువుతో ఆడు కుంటారు. కానీ తనకింత సున్నితమైన మనసునిచ్చి కవి హృదయాన్ని కరిగించి పోతపోసి రూపొందించాడా భగవంతుడు? ఈ తపన, ఈ బాధ లేకుంటేనే బాగుంటుందేమో! ఇంతకుముందే చూశాడు వసంత ఇంటిని ఆక్రమించేశారు. వసంత స్థానంలో వుండేవారు వచ్చిశారు. పరిచయాలు జారిపోవటాలు జరిగి పోతున్నాయి. అసలే వేశ్యలు. కుతుకుల వరకు మద్యం సేవించారు. నిర్మల పిన్ని లలిత ఆత్మీయంగానే దుఃఫీించినా కొద్దిసేపె. పిన్ని రంగంలోనికి దింపి అసభ్యమైన ఆలోచనలు చేయటం ప్రారంభించింది. పైగా బాబూ! వసంతకు నగల మీద మహా ప్రీతి. కానీ ఈ నగలు నాకే చెందుతాయి అన్నది. చాలా వెగటుగా తోచింది.
గోలగోలగా వుంది వాతావరణం. తననికృడే ఉండమని బలవంతం చేసూ మత్తులో అసభ్యమైన మాటలు విసురుతున్నాడు.
అందుకే ప్రశాంతత కోసం ఇక్కడకు వచ్చాడు తను. కానీ రెండవ రూమున భయంకర నిశ్శబ్దంలో ఏవో వింత వింత శబ్దాలతో భీతిగొలిపే ఈ శృశానం బ్రతకాలని ఆశవున్న ఆత్మ, తనవారిని వదలలేక మమత కొద్ది వసుమతి చలసాని + 175
ఏడుస్తూ ఇక్కడే తిరుగుతూ వుంటారనే తలంపు రాగానే నిలువునా వణికి పోయాడు నితాయి. వసంత చితి దగ్గరే కూర్చున్న నితాయి శరీరమంతా జలదరించినట్లయి ఒకలాంటి భయం కలిగింది. స్మశానంలో తిరిగే జీవాల మధ్యనే గడిపి వేశాడు. గంగానది కెరటాలలో నుండి జలచరాలు ఎగిరి పడుతున్నాయి. నక్షత్రాలు రాలిపడుతున్నాయి. ఈ నక్షత్రం కింద వసంత తప్పక వుండి వుంటుంది. తనను ఇలా చూసి నాకు జీవించాలని వుంది అని దుఃఖీస్తుంది.
మరణమా! నా లోపలి పేమ
కదంబ తరువు నీడలోనే
యుగయుగాల నుండి మురళి మోగించే
నా మోహనమూర్తి
వియోగం ఎక్కడ!
తిరిగి బృందం దగ్గరకు వెళ్లాడు.
ఇదేమిటి బావయ్యగారూ! మీరు బూడిదను పూసుకుని సన్యాసుల్లో చేరిపోయారా |! నిర్మల ఆవ్యాయంగా పలుకరించింది.
నిన్నటినుండి ఏమీ తినలేదు బాబూ! అటుకులతోపాటు ఇవిగో అంటూ చాలా తినుబండారాలు తెచ్చి ఇచ్చింది.
అయితే పిన్నిని కూడా మరిచి స్మశానంలోనే వున్నావన్నమాట. నిష్టూ రంగా అన్నది.
“కాదు ..ఏమిటి ఉస్తాద్! రాత్రంతా ఎక్కడున్నావు?” అనుమానంగా అడిగిన తబలావాలా వైపు చిత్రంగా చూశాడు నితాయి.
ఇంతలో పిన్ని మాట మరచిపోయావా బాబూ! అని అడిగింది ్రాఢ.
లేదు లేదు కన్నతల్లిని, పిన్నిని మరచిపోతారా? నిన్నెప్పుడూ మరచిపోను పిన్నీ! అన్నాడు నితాయి.
కానీ నితాయికి ఊరికి వళ్ళాలనిపించలేదు. గౌరీశంకర శిఖరం మానస సరోవరం మానువులు ఇంకపైకి వెళ్ళలేని చివరి అవకాశాలు. వెళ్ళి ఆ హిమాలయాల్లో తన విరాగిగా మారి కవితలను వ్రాస్తూ ప్రయాజీకులను 176 కవి నవల
అలరించవచ్చు. ఇప్పటివరకు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. తనిప్పుడు బాటసారి. ఎవరో ప్రకృవారు కాళీ గురించి చెప్పుకుంటుంటే నితాయి మనసు కాశీ విశ్వనాధుని స్మరించుకుంది. తల్లీ అన్నపూర్లా తల్లీ! శరీరమంతా పులక రించిపోయింది. కాశీ నుండి అయోధ్య సీతారాములు. అక్కడ నుండి రాధా గోవిందుల'పదాలతో పునీతమైన మధురానగరి. రాజ్యప్రలోభంతో గోపాలుడు రాధారాణిని బాధించాడు. లేదు నేను వెళ్ళను. హరిద్వారం వెడతాను అనేక విధాల కనుల ముందు ప్రత్యక్షమయ్యే భగవద్భావనలు ్రజ్వలించాయి. ప్రక్కష్టెషన్లో దిగి కాశీ టికెట్ తీసుకున్నాడు. ఖే
పూలసజ్జతో తెల్లని చీరతో హుందాగా నడిచి వెడుతున్న ఒక స్తీ కని పించింది. తన గ్రామదేవత బంగారుతల్లి చల్లని తల్లిగా అన్పించింది. ఆమె ముందు నిలబడి దారితప్పిన పసివాడిలా చేతులు జోడించాడు. “మీరు దేవతలా ఉన్నారు అన్నాడు. నితాయి తలచింది నిజమే అయింది. ఆమె ఒక వితంతువు. ఆమె మణికర్ణికా ఘట్టం నుండి విశ్వనాధుని దర్శించుకోవాలని వెడుతూ వినయ విధేయతలు, అలౌకికశక్తిని వెదజల్లే అతని నేత్రాలు ఆమెనాకర్షించాయి. ఆశ్చర్యంగా చూసింది. నేలమీద పడుకుని నమస్కరిస్తూ తల్లీ! తల్లిలేని బిడ్డను, ఆదరించమ్మా! అన్నాడు దీనంగా నితాయి.
పల్లెనుండి వచ్చినవాడు, ఏదో ఆపద అంటున్నాడని ఆర్రంగా అడిగింది “ఆపద ఐమిటి బాబూ అని.
“ఇక్కడ భాష తెలియదు. పైగా బీదవాడిని అమ్మా”
ఆమె హృదయం ద్రవించింది. ఇంటికి తీసుకెళ్ళింది. కారుణ్యమూర్తి వయ్యా విశ్వనాధా! చల్లనితల్లి యశోదమ్మను ఇచ్చావు.. అని నమస్కరించు కున్నాడు నితాయి. ఈ కొత్త అమ్మ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. గల్లీలో ఒక చిన్న ఇల్లు అది సందేహించాడు నితాయి.
“చాలా తక్కువ కులం వాడినమ్మా! బయట కూర్చుంటాను” అన్నాడు సంకోచంతో. ఈమె నిజంగా బృందావన మాత సందేహం లేదు అనుకున్నాడు. కళ్ళనిండా సళ్ళు నిండాయి. లోపలికి వెళ్ళీ ఒక మూలగా కూర్చున్నాడు. వసుమతి చలణంని 177
“నాయనా! ఇదుగో ప్రసాదం” అంటూ ప్రసాదం పెట్టింది. ఆత్మీయంగా జిల్లా, ఊరు, ఇల్లు పోస్టాఫీసు ఎన్నో వివరాలు అడిగింది. అన్నదమ్ములు, అమ్మానాన్న అందరూ ఉన్నారా? వివాహమైందా? అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు కానీ చిన్నరాణి వసంత గుర్తుకు వచ్చి మౌనంగా రెండు నిమిషాలాగి-ఇంకా వివాహం కాలేదమ్మా అన్నాడు.
“మీ ఊరిలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని కులాల వారున్నారు? ఎన్ని తోటలున్నాయి. దెవాలయం ఉందా?” ఇలా ఆ తల్లి అడుగుతుంటే నితాయికి తన ఊరు జ్ఞప్తికి వచ్చి కన్నీరు ఉబికింది.
“కృష్ణుదెక్కడున్నాడురా?” అని అరిచే పక్షులున్నాయా? వసువుగా వుంటుంది. తల నలుపు ముక్యంగా ఎరుపు. కాటుక పిట్టలని పిలిచేవాళ్ళం.
ఆమె కనుల వెంట నీరు కారుతోంది. ఏడుస్తూనే యశోదమ్మను కన్నయ్య వదిలివెళ్ళపోతే ఆమె విడిచిన కన్నీరు ఈ పక్షిమీద పడిందట. ఆ వెడివలన శిరసు కమిలి నల్లబడిందట. కన్నీటితో పాటు రక్తం కూడా పడిందట ఆ రక్తపు బొట్టుతో ఆ పక్షి ముక్కు ఎర్రబడిందట. యశోదమ్మ తనతో దుఃఖాన్ని పంచుకున్న ఆ పక్షిని “నా కృష్ణుదెక్కడున్నాడో వెళ్ళి నా దుఃఖాన్ని వివరించి చెప్పు అని వద్పిందట..”అంటూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.
“ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు?” ఆ(ర్రంగా అడిగాడు నితాయి.
నా ఏకైక కుమారుడు మరణించాడు నాయనా! కాశీకి మరణించాలని వచ్చేవారిలో నేనూ ఒకదాన్ని అంటూ కుమిలి కుమిలి ఏడుస్తోంది.
“క వయసులో నీవెందుకు వచ్చావు నాయనా[ొ అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ.
“అమ్మా మిమ్ములను చూడగానే అమ్మ జ్ఞప్తికి వచ్చింది. నిజం చెపుతా నమ్మా! నేను ఎరుకల జాతి వాడని బందిపోటుల కుటుంబం నాది. ఎప్పుడైనా ఊళ్ళల్లో కవితాగానాలు విన్నారా అమ్మా!”
“ఎందుకు వినలేదు బాబూ! కొత్త పంట రాగానే అన్నపూర్ణాదేవి పూజ జరుపుతూ నాట్యగానాలు, కవితా గానాలు జరిపేవారు”
“అలాగే నేను ఒక కవి గాయకుడినమ్మా” అన్నాడు నితాయి 1/78 4 కవి నవల.
తలవంచుకుని. ఆ తల్లి సంతోషాన్ని గమనించాడు. ఆమె లేచి భోజనం పెట్టింది. నితాయీ విశ్వనాధునికి నమస్కరించుకున్నాదు
“నాయనా! ఈ చిన్న ఇంట్లో ఎలా వుండగలవు? నా కృష్ణుడు తిరిగి వచ్చాడన్నంత సంతోషం కలిగినా నీకు నీడనియ్యలేను. బంధువులను, వితంతువుకు రావలసిన భరణిని అన్నీ విడిచి వచ్చేశాను బాబూ! ఆ విశ్వనాధుని నమ్ముకున్నాను.
ఉపవాసాలు అవసరం కదా వితంతువులకు, అందువలన తిందికి బట్టకు ఇబ్బందిలేదు” అన్నది నిర్లిప్లంగా.
అయ్యో తల్లీ! అందులో నాకు కూడా పెట్టారా భోజనం” అని వాపోయాడు నితాయి.
తరువాత చాలాసేపు తన వృత్తాంతాన్ని ఆవేదననీ, సంతోషాన్ని అన్నీ కలిపి వర్ణించి చెప్పాడు తల్లికి. సేద తీరాడు. ఆమె దగ్గర సెలవు తీసుకుని దేవాలయం దగ్గరగా వెళ్ళాడు. పండు వెన్నెల, విశ్వనాధుని ఆలయ శిఖరం, ఆ వెన్నెలలో ఈ సృష్టి శాశ్వతం కాదు నేనే శాశ్వతమన్నట్లు కాంతులీనుతోంది. ఎన్నో కవితలు ఆవిర్భవించాయి. నితాయి మధురంగా గానం చేశాడు. ప్రయా ణీకులు కొందరు అటు వచ్చి ఏకాంతంలో ఆ వెన్నెలలో వచ్చి ఆ మధుర గీతాలు విని నితాయి ఒడిలో డబ్బులు విసిరేశారు. అలా ఒక నెల గడిచి పోయింది. యశోదమ్మ దగర మధ్యమధ్యలో సేదతీరాడు. వెళ్ళివస్తానమ్మా అని సెలవు తీసుకున్నాడు.
నితాయీకి ఆ పరిస్థితి బొత్తిగా రుచించలేదు! ఏమీ బాగాలేదు! అలాగే బిచ్చమెత్తుకోవడం కూడా బాగుండలేదు! అది కాశీయె అగుగాక! విశ్వనాథుని సామ్రాజ్యమే అగుగాక! స్వర్గరాజ్య సింహద్వారమే అగుగాక! అయినా అతనికది బొత్తిగా బాగుండలేదు! అదీగాక మహనీయులైన పదకర్తల పదాలేవీ అతని కంత బాగా రావు! ఆ పదాలెంత గొప్పవైనా, తన పాటలన్ని విడిచిపెట్టి అవి పాడుతూ కూరోవడం కూడా నితాయీకి నచ్చలేదు! అటువంటి ఆలోచనే అతనికి రుచించలేదు! అదిగాక ఈ భిక్షావృత్తివల్ల కూడా అతనికేమాత్రం సంతోషం కలగడంలేదు! వసుమతి చలనాంణి + 170
ఎక్కడ ఉంది సంతోషం! ఎక్కడ ఉంది ఆనందం! చిట్టచివరికది లభించటమే లేదు! కవిగానాల సమావేశాలు, తళతళలాడే దీపాలు, వేలకొలది శోతల ఆసక్తి మొదలైనవన్ని కూడా నితాయీకేమాత్రం సంతృప్తికరంగా, సంతోషప్రదంగా కనిపించలేదు!
అదే సమయంలో అతనికి ఆ కొత్త అమ్మ చెప్పిన కొన్ని మాటలు గుర్హు వచ్చాయి. “నీవు కవిగాయకుడవు! తిరిగి వెళ్ళిపో!” అన్నదామె! ఆపైన మరికొన్ని క్షణాలదాకా ఏమి జరిగిందో నితాయీకి గుర్తులేదు. ఆ ప్రాంతంలో మనుషుల కోలాహలమంతా పూర్తిగా తగ్గిపోయిందని ఆ తరువాత గ్రహించు కున్నాడు. వెనువెంటనే నలువైపుల కలయజూశాడు. ఎక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు! వారందరూ తమతమ ఇళ్లకు వెళ్ళిపోయి ఉంటారని ఊహించుకున్నాడు. ఘట్టంలో ఇద్గరు ముగ్గురు మనుషులు గాఢంగా నిద్రిస్తున్నారు. నితాయీ కూడా అక్కడే పడుకున్నాడు.
ఈ అర్ధరాత్రివేళ గుర్తుతెలియని పట్టణంలో దారి కనుక్కుంటూ వెళ్లటానికి వీలుపడదు. అదిగాక ఎక్కడికని వెళ్లడం! నలువైపుల అంతట నిశ్చలంగా స్తబ్ధంగా ఉన్నది. ఘట్టం దిగువ గంగాప్రవాహపు మంద్రమం(ద్ర ధ్వనిమాత్రమే వినవస్తున్నది. ఆ సవ్వడి వినడం మొదలుపెట్టాడు. బొత్తిగా పరిచయంలేని పరిస్థితులమధ్య పడి సతమతమైన అతని మనసు భావనాలోకంలో విహరిం చడం ప్రారంభించింది. గంగాతరంగాల మంద్ర మంద్ర ధ్వని వింటున్నకొద్ది నితాయీకి ఆ నది ఏదో అర్ధం కాని భాష మాట్లాడుతున్నదసి తోచింది. కాట్వాలో, నవద్వీపంలో అతడనేక పర్యాయాలు ఆ ఏటి అలల నవ్వడి విన్నాడు. వసంతదేహానికి దహన సంస్కారం జరిపిననాడు అక్కడ గంగ విస్పష్టంగా అర్ధమవుతున్న భాషలోనే ప్రసంగించింది. ఇక్కడ ఇది అంతా కేవలం అర్ధంకాని భాషలా మారిపోయిందేమిటి?
అదే సమయంలో అతనికి ఆ కొత్త అమ్మ చెప్పిన మరికొన్ని మాటలు గుర్తు వచ్చాయి. ఇక్కడ నితాయీ ఆయా పిట్టల కూతలెన్నో విన్నాడు. పగలంతా అతనికవి వినిపిస్తూనే ఉన్నాయి. కాని ఏ పక్షి “కవూ కధా కవో” అన్నట్టు వినబడలేదు. ఏ పులుగు “కృష్ణుడు ఎక్కడ ఉన్నాడురా!” అని కూసినట్టు 180€ కవి నవల
స్ఫురించలెదు! ఈ కాశీలో కాకుల అరుపులు కూడా విభిన్నంగానే ఉన్నట్టు వినిపిస్తున్నాయి! ఆ కొత్త అమ్మ చెప్పినవన్ని అక్షరాలా నిజమే.
అకస్మాత్తుగా కాళీవిశ్వనాధ దైవతం సంగతి గుర్తు వచ్చింది నితాయీకి. అతడు విశ్వనాధుదేనా? అతడీ రాజ్యానికి రాజే! అవును! నిజమే! అయితే ఆ దేవుడు ఈ దేశం భాషే మాట్లాదతాడా? అతని భక్తుల మాదిరిగానే తన మాటలు కాని, తన నమస్మారాలు కాని అవగాహన చేసుకోలేడా? హిందీ కీర్తనలేనా ఆ దైవతానికి బోధపదేది! అవి వింటేనేనా ఆ విశ్వనాధుని కానందం కలిగేది? ఆ అన్నపూర్ణమ్మ తల్లికూడా హిందీ భాషే మాట్లాడుతుందా? ఆకలి వేసినప్పుడు ఆ అన్నపూర్ణమ్మ తనతో మాట్లాడేది హిందీలోనేనా? అయితే తానింక ఎవరికి తనపాటలు వినిపిస్తాడు? తిరిగి అతనికి తన గ్రామంలో అమ్మవారు చండీమాత జ్ఞప్తికి వచ్చింది. వెనువెంటనే ఆ మాతతోబాటే ముదుసలి శంకరుడు గుర్తు వచ్చాడు. పిచ్చి అమ్మ! పిచ్చి శివుడు!
“దిశాంబరి ఈ ఉమాదేవి నటియించెనదే!”
వెనువెంటనే ఆమె మరింతగా మత్తిల్లి నృత్యం చేసింది!
“అస్థిమాలికలు గళమున నెగురగ
హరదేవుడు నర్తించెనదే!”
బోలానాధుడా శివదేవుడు మైమరిచి నృత్యం చేస్తున్నాడు! అతనితోబాటు ఆ దైవతం భక్తులు కూడా నృత్యం చెస్తున్నారు! పంక్తులు పంక్తులుగా వేలకొలది శివభక్తులు వారి పార్వ్వాలలో నిలబడి ఉన్నారు. వారు కూడా తన్మయులై తమ అంతరంగాలలో నృత్యం చేస్తున్నారు.
ఆపైన జుట్టు విరబోసుకున్న సర్వవినాశిని ధోరణిలో చందీమాత ఆ దేవదేవుని కెదురుగా నిలుచున్నది, సమస్త ప్రజ ఆమె వెనకాలే సాక్షాత్క రించారు! వారినందరిని నితాయీ గుర్తు చేసుకున్నాడు.
మొట్టమొదటగా రుుముర్ సంప్రదాయం నర్తకీ గాయకబ్బందం జ్ఞప్తికి వచ్చింది! ఆ తరువాత చెల్లెలు నిర్మల గుర్తుకి వచ్చింది. అదేసమయంలో లలిత కూడా జ్ఞాపకం వచ్చింది. చిత్రం! “బాబూ!” అని పిలిచి పిన్ని అతని కెదురుగా నిలుచున్నది! ఫిడెల్వాలా, వంతగాయకుడు, తబలావాలా, రాజా, వసుమతి చలనాని అ 181
బనియామామ, విప్రపదుడు- అందరు గుమిగూడి అతనికదురుగా నిలు చున్నారు! చిన్నరాణి కూడా అదే తరుణంలో జ్ఞాపకం వచ్చింది! ఆమె గుల్మోహర్ నీడకేసి, బాటకేసి రెప్పవాల్బకుండా చూస్తున్నది! క్రమక్రమంగా నితాయీకి ఆ గ్రామం అంతా జ్ఞాపకం వచ్చింది. ఆ పల్లెపక్కన చిన్న బరు, విశాలమైన సస్యక్షేత్రాలు, వైశాఖమాసంలో గాలివాన, నల్లనల్లని మేఘాలు, కారుచీకటి, మెరుపులు, ఉరుములు, ఎడతెగని వానలు, ఆ వర్షధ్రారల సవ్వ డులు- అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆ (గ్రామ పరిసరాలన్నింటిని గురించి ఆలోచిస్తుంటే పున్నమినాటి ధర్మరాజ పూజా మహోత్సవం స్మృతివీధిలో మెది సింది. ఆ పూజలో డోలు, కొమ్ముబూరాలు మొదలైన వాద్యధ్వనుల కోలా హలంలో మెడలలో పూలమాలికలు ధరించిన భక్తులనేకులు నృత్యం చేసారు. ఆపైన అర్ధరాత్రివెళ ఆయా తోటలలో నుండి పళ్లుకోసి జాగ్రత్త చేస్తారు. గొప్పగొప్ప సంపన్నుల తోటలలో చెట్లతొర్రలలో కొండచిలవలవంటి సర్పాలు నివసిస్తూంటాయి. అవి కొమ్మపైకెక్కి వాకుతూంటాయి. కాని భక్తులందరు ఏకగ్రీవంగా “జయ ధర్మరాజూ” అని గొంతులెత్తి కేకలు పెట్టి పళ్ల కోసం చెట్లెక్షగానే ఆ పాములన్ని జాగ్రత్తగా అతిరహస్యంగా అక్కడక్కడ దాక్కుంటాయి. ఆ తోటలలో కొన్ని పురాతన వటవృక్షాలున్నాయి. అరణ్య షష్టిపూజనాడు గ్రామంలోని ప్రీలందరు రంగురంగుల చీరలు ధరించి ఆ మర్రిచెట్ల దగ్గిరికి చేరుకుంటారు. ఆ మనోహర దృశ్యాలన్ని జ్ఞప్తికి తెచ్చుకోగానే అవి అతని సమక్షంలో జరుగుతున్నట్లె సాక్షాత్మరించాయి! ఆ తోటల కిరువైపుల పచ్చపచ్చని పంటపొలాలు, వాటిమధ్య వంకరటింకర కాలిబాటలు! అప్పుడే ఆషాఢమాసం సమీపించబోతున్నది! ఆకాశంలో ఆ పంటపొలాలమీద నల్లనల్లని మబ్బులన్నో గుమిగూడి దట్టంగా కమ్ముకుంటాయి. నీటితో నిండిన నల్లనల్లని కారు మబ్బులు! అలాగ ఆలోచిస్తూంటే నితాయీకి ఆయా బుతువుల గేయాలన్ని జ్ఞప్తికి వచ్చాయి. ఆ గేయాల ననుసరించి నితాయాీ వేరొక గేయం రచించాడు. ప్రత్యేకించి వర్షాకాల సౌందర్యం అంతా ఆ గేయంలో పొందుపరిచాడు. తిరిగి ఆ మనోహరదృశ్యా లొకమారు సందర్శించాలని అతని అంతర్యంలో పట్టరాని తహతహ చెలరెగింది.
182 € కవి నవల
మరునాడు తెల్లవారుజాము కోసం నిమిషమొక యుగంగా నిరిక్షించాడు. ఇక్కడ కొత్త అమ్మ నుద్దేశించి ఇనుమడించిన భక్తి ప్రపత్తులలో నమస్కరించి తన కృతజ్ఞత వెల్లడించుకున్నాడు. “అమ్మా! నీవు వాస్తవానికి మా ఊరి అమ్మవే గాని వేరొకతెవుగావు! నన్ను తిరిగి మా ప్రాంతానికి తీసుకుపోవడానికే అక్కడినించి ఇక్కడికి వచ్చావు! సందేహం లేదు! కాని వెరొకవ్యక్తివైనట్లు నటించావు! అంతే! నీ ఆజ్ఞ నేనింక శిరసావహిస్తున్నాను! ఆక్షరాలా అనుస దిస్తున్నాను!'
22
ఒక నెలరోజులపాటు ఎలాగో అలాగ కాశీలో గడిపి వెసిన పిమ్మట నితాయీ ఒకనాడు రైలులో కూర్చున్నాడు. ఏ విధంగానైనా సరే, అతడు మరి కాళీలో ఉండలేకపోయాడు!
ఆ నెలరోజులపాటు నితాయీ ఎన్నడు హాయిగా నిద్రపోలేదు! ఆపైన ఎడతెగని ఆత్రుత, ఉద్వేగం అతని గాఢనిద్రకంతరాయం కలిగించాయి. ఇప్పుడతనికి నిద్ర ముంచుకువచ్చింది! మొగలు సరాయిస్టేషన్లో అతికష్టం మీద బండిదిగి, కొత్తబండి ఎక్కి “అమ్మయ్యా! అనుకున్నాడు! తాను కూర్చున్న బల్లపైన ఖాళీగా ఉన్న బల్లమీదకెక్కి పడుకున్నాడు. అమ్మయ్యా! తప్పకుండా అతడికి తన బంగారు దేశంలో తల్లి చందీమాత బడిలోనికి తరలిపోతున్నాడు! ముమ్మాటికి ఇది యధార్ధం.
మరునాడు తెల్లవారేసరికి నితాయీ నిద్రకు అకస్మాత్తుగా అంతరాయం కలిగింది! మిక్కిలి పరిచితు లెవ్వరో పిలుస్తున్నట్లు తోచింది, అతడెంతో తియ్యని కంరస్వరంతో పిలుస్తున్నట్లు స్ఫురించింది!
“లేవండి! లేవండి! లేవండి!”
“ఎవరు? ఎవరు వారు?”
నితాయీ కంగారు పడుతూ లేచి కూర్చున్నాడు.
అంత పరిచితులెవ్వరు అతనిని పిలవలేదు! ఒకవ్యక్తి పూర్తిగా కిందిబల్ల అంతా ఆక్రమించుకుని పడుకున్నాడు. కొత్తగా బండిలో ప్రవేశించిన ప్రయా ణికుడొకడు ఆ వ్యక్తినే పిలుస్తున్నాడు. అంతే! మసుమతి చలనుంని + 183
నితాయీ హాయిగా నిట్టూర్చాడు. బండి బండంతా తెలిసిన మనుషులతో నిండినట్టున్నది! అందరు పరిచితులే! అందరు తన ప్రాంతంవారే! వెనువెంటనే నితాయీ పైబల్ల మీదినించి కిందిక దిగి కొత్తవ్యక్తితో సవినయంగా అన్నాడు.
“సామాను పైన సర్తిపెట్టమన్నారా!”
“అవును, నాయనా! కాస్త సామాను పైన సర్దిపెట్టు బాబూ!”
నితాయీ అలాగే చెశాడు. ఆ కొత్తవ్యక్తి వృద్ధుడు. అతడు మనసారా ఆశీర్వదించాడు.
“దిరకాలం జీవించు బాబూ! చాలా మంచివాదవు నాయనా నీవు!”
కింద బల్లమీద కూర్చుని నితాయీ కిటికిలో నించి చూశాడు. బండి ఏదో స్టేషన్లో అగింది. నలువైపుల పరిశీలించి చూడగానే అతనికపరిమితా నందం కలిగింది! అందరు, అందరూ పరిచితులే! అప్పుడే దేశంలోనికి వచ్చి వేశాడు! కిటికివెలుపల అంతట బాంగ్లాదేశమే! అందరు సుపరిచితులే! అప్పుడే రాణీగంజ్ దాటిపోయింది! ఇంక వర్ధమాన్! వెలుపల ఆకాశంలో అంతట నల్లనిమబ్బులలుముకున్నాయి.
వర్ధమాన్‌లో బండిమారి, రెండు మూడు గంటలసేపు కూర్చుంటే, ఆపైన తన గ్రామం చేరుకుంటాడు. చండీమాత! ముదుసలి శంకరుడు!
ఆ ఆదిదంపతుల దేవాలయ (ప్రాంగణంలో నిలిచి తానిక పాటలెన్నో వినిపించగలడు! ప్రతి పుణ్యక్షత్రంలోను, (ప్రతి ఉత్స్పవంలోను, తారకేశ్వరం లోను, కాశీఘాట్ను అన్నిచోట్ల తానిక పాట లెన్నో వినిపించగలడు! దేశంలో ప్రతి ప్రాంతంలోను పర్యటించి ప్రజలనందరిని తన గానంతో ఆనందింపజేయ గలడు! తన పాటలతో వారికందరికి సంపూర్ణంగా సంతృప్తి కలిగించగలనని నితాయీకి గట్టగా నమ్మకం కలిగింది. ఇక తానిక స్వయంగానే కవితాగానాల పోటీ పాటకచేరీలు వర్పాటుచెయ్యగలడు. అందువల్ల ఒకరి వర్పాట్లమీద ఒప్పందాల మీద ఆధారపడవలసిన అగత్యమేమి ఉండదు!
అయితే ఆ ఒప్పందాల లోటేమి ఉండదు అవి బాగానే వస్తాయి. కవి గాయకుడుగా తనపేరు దేశంలో నలుమూలల వ్యాపించింది అందువల్ల ఆ ఒప్పందాల కోసమని ఆత్రపడనకృరలేదు. కాని ఆయా ఉత్సవాలలో దూష 1844 కవి నవల
ణలు, వ్యంగ్వాలు, జావళీలు మొదలైనవి లేకపోతే రక్తి కట్టదు. అసలు పస అంతా అటువంటి పాటలలోనే ఉంది! అయితే తాను (ప్రేమగీతికలి ఎక్కువ అలాపించగలడు. వసంతపోయిన తరువాత నితాయీకి ఈ పృధివి అంతా దుఃఖంతో నిండి ఉన్నట్టనించింది. అయ్యో! బ్రతుకంతా ఇంతగా చిన్నదై అల్పమైపోయినదేమి? (ప్రేమలో ఆశా పరిపూర్ణత లభించదెందుచేత? ఇంతటి చిన్న జీవితంలోనే (ప్రేమవల్ల సంతృప్తి కలగదెందుచేత? అచ్చమైన (ప్రేమ గీతికలు! శోకంతో నిండిన పాటలు! వసంతపేరుతోనే ఇక పాటల రచన! కోకిల వసంతమాట మరిచిపోగలదా!
ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ నెమ్మదిగా నిలిచింది. ఏదో పెద్దస్టేషన్లో నిలబడింది. వర్దమాన్! వర్దమాన్!
వర్ధమాన్ నించే లూప్లైను ప్రారంభమవుతుంది. నితాయీ ఆపైన ఆ చిన్నలైను బండిలో ఎక్కి కూర్చున్నాడు. అతని మనసులో ఆదే క్షణంలో గాన రచన ప్రారంభమైంది! గ్రామం చేరుకోగానే అతడు నమస్కరించడం కోసం మున్ముందుగా చండీమాత దేవళానికి వెడతాడు. ఆ సమస్కృతి కోసమే నితాయీ నూతన గానరచన కుపక్రమించాడు. ఆపాట పాడుతూనే ఆ చల్లని తల్లికి నమస్కరిస్తాడు.
“జయంతీ, మంగళా, కాళొ అన్న సాంప్రదాయక సంస్కృతశ్లుకాలతో నమస్కరించడు. తాను స్వయంగా రచించిన పాట పాడుతూనే ఆ జనానికి నమస్కరిస్తాడు.
“పలుకవేల నా జననీ! ఒకింత
పలుకుము! నా తల్లీ!
దట్టమైన కారుమబ్బులు ఆకాశంలో నలువైపుల అలముకున్నాయి. రమ్మని చల్లని తడిగాలి వీస్తున్నది, ఆహాహా! శరీరం నఖశిఖ పర్యంతం పులకిస్తున్నది! పసిరిపచ్చనిగడ్డి ఒత్తుగా పెరిగి అంతట అల్లుకున్నందువల్ల భూమాత హృదయం మరి కానరాలేదు!
ఆహా! ఇంతలోనే ఇటువైపున వర్షం ముంచుకు వస్తున్నది! చక్కగా దున్నిన పొలాలలో నల్లనిమన్ను నీటితోతడిపి గౌరవనీయురాలైన మహిళవలె వసుమతి చలనాని + 185
అటుఇటు ఒదుగుతున్నది. టెలిగ్రాఫ్ స్తృభంమీద బాగా తడిసిన కాకి ఒకటి రెక్కలు రెండు ఒకించుక విస్తరింపజేసి ముక్కు మున్ముందుకు చాచుతున్నది. పట్టరాని ఆనందంతో మనసు పరవశిస్తున్నది! రాగి, మర్రి, దిరిసెనల చివురు టాకులు తేమగాలిలో అటు ఇటు కదులుతున్నాయి. రైల్వలైను కిరువైపుల దొరువులలో పూలు వికసిస్తున్నాయి. ఆహాహా! దూరంలో చెరువు గట్టున మొగలిపొద గాలిలో కదలాడుతున్నది. అదే సమయంలో వసంతను గురించిన గీతిక ఒకటి నితాయీకి జ్ఞప్తికి వచ్చింది.
“పరిమళముతోనింపి మనసు మత్తిలజేసె!
కరకురంపముళ్ల ముసుగులో మొగలి!
పొరబడితివిదినేను ఆరయలే కక్కటా!”
పెనుసవ్వడితో బండి కదిలిపోతున్నది! మళ్లీ అంతలోనే వర్షం కురవడం ప్రారంభించింది. నలనల్లని కొలని నీటిమీద సంధ్యాకాంతి ప్రసరించినప్పటి ఛాయతో కారుమబ్బుల మీద ఎర్ర ఎర్రని వెలుగు వ్యాపిస్తున్నది! వాన బాగా ఎక్కువైంది. నాలుగువైపులు మసకమసకగా మారిపోయాయి! ఆహా! ఈ వైపున వర్షం మరింతగా ఎక్కువైంది! పొలాలన్నీ నీటిలో మునిగి తేలుతూ తపపతలాడుతున్నాయి. కప్పలు పెద్దగా బెకబెకమని అరుస్తూ రైలుబండి రొద పూర్తిగా కప్పివేస్తున్నాయి. దూరంలో వరినాట్లు జరుగుతున్నాయి. ఘమ్ ఘమ్ఘమ్మని రైలు ధ్రువదధోరణిలో సంగీతం పాడుతున్నది! కాషాయవర్దంతో నిండిన నీటిలో నురుగు లెగురుతున్నాయి! ఆ వైపునించి ఈవైెపుదాకా అంతా నీటి ముంపుతో నిండింది. నీరంతా మధ్యమధ్య మళ్లుతిరుగుతూ తిరిగి తిన్నగా ప్రవహిస్తున్నది. రైల్వలైను కిరువైపుల ఒత్తుగా పచ్చగా పెరిగిన రెల్లుగడ్జి అటు, ఇటు కదులుతున్నది. అభయ నది! అప్పుడే అభయ నది ఎదురైంది! అప్పుడే తన ప్రదెశానికి వచ్చివేసింది రైలు! అక్కడే తన గ్రామం! తన జనని!
'నీవే పలుకక పోయినచో నా నెమ్మది శూన్యము తల్లి!
కంటికొక్క కునుకైనా రాధిక కన్నీరే జలధార!”
ఈసారి జోల్పూర్, ఆపైన కోపాయీ, ఆపైన, ఆపైన జంక్షన్, చిన్నలైను. రైలు విపరీతంగా చప్పుడు చేస్తున్నది! ఒళ్లంతా కుదిపివేసి నృత్యం చేయిస్తున్నది! 18064 కవి నవల
ఈ చిన్నలైను రైళ్ళలో ప్రయాణం అంటే ఇంతే! అయ్యయ్యో! ఏమి కుదుపు! వెనువెంటనే గుండెలో మనసు ఎగిరిఎగిరి గంతులు వేస్తున్నది! పసిపాపలా గంతులు వేస్తున్నది! అభయ నదికి వరదవచ్చినట్టు కళ్ళమ్మట కన్నీళ్లు ధారకట్టి ప్రవహిస్తున్నాయి! అమ్మా! ఓ అమ్మా! నా తల్లీ!
ఓ నాపల్లీమతల్లీ! ఇదిగో, ఇదే అన్న ఉదాసీపొలం! ఇదిగో ఇదే కాశీ పుష్కరిణి! ఇదిగో ఇదే కాళికాదేవి తోట! ఈ తోటలో చెట్లకే తన పాటలన్నీ మొట్టమొదటగా వినిపించాడు! బంది కొంచెం మలుపు తిరిగి స్టేషన్లో ప్రవేశించింది! ఇదిగో! ఇదిగో అప్పుడే ఆగిపోయింది!
ఆపైన ఆ బండి వెళ్ళివోతున్నది!
నితాయీ బండిదిగి వాట్ఫారమ్మీద నిలుచున్నాడు. అతని కన్నివైపుల ఆశ్చర్యంతో నిశ్చేష్టితులైన ఆత్మీయుల బృందం! నితాయీ ఇంతటి ఆప్యాయత కోసం నిజంగానే ఎదురుచూడలెదు! ఇక్కడ ఇంతటి స్నేహం, ఇంతటి అదరం తనకోసం నిరీక్షిస్తున్నాయా! రాజా నోట కూడా మాట వెలువడడంలేదు! బనీయామామ, దేవేన్, కోష్టదాస్, రామలాల్స్ ఇంకా మరికొంతమంది తగ్గుమనుషులు, వారితోబాటు మరికొంతమంది ఘరానా మనుషులు కూడా అతనిచుట్టూ గుమిగూడారు. ఎదురుగా గుల్మోహర్!
పువ్వులకాలం పూర్తయింది! దట్టమైన లేతలేత చివురుటాకులతో తళతళ లాడుతున్నది! అయినా రెండు మూడు పూలు అతనికోసమే పూసినట్టున్నది! నితాయీ నేత్రాల నుండి నిరంతర బాష్పధార! అతడు అదేపనిగా విలపిస్తు న్నాడు. విప్రపదుని మృత్యువార్త విన్న పిమ్మటే నితాయీ కంతటి దుఃఖం కలిగింది. విప్రపదుడు చనిపోయాడు!
ఆ విప్రపదుని కోసం నితాయీ దుఃఖించడం గమనించి అందరూ ఎంతైనా ఆశ్చర్యపడ్డారు! నిజంగా అది వేళాకోళంచెసి కొట్టిపారవెయ్యవలిసిన సంగతే! కాని నితాయీ నేత్రాల నుండి ఆశుధార అలాగే నిరంతరంగా నీరసంగా ప్రవహిస్తున్నది! అందువల్ల ఆ కన్నీటిజాలులో అపూర్వమైన మహిమ గోచరించింది! ఆ ప్రశాంత మహిమాధోరణి గమనించిన పిమ్మట అక్కడ నిలబడినవారి కెవ్వరికి అతని దుఃఖాన్ని గురించి తేలికగా వేళాకోళం చెయ్య వసుమతి చలనాని + 187
దానికేమాత్రం మనస్కరించలేదు! కవిగాయకుడుగా నితాయీకి వచ్చిన ఖ్యాతి సంగతి దేశంలో అందరు ఆలకించారు! నితాయీ ఇప్పుడందరికళ్లలోను పూర్వంకన్న మరింత గొప్పగా వెలిగిపోయాడు! విప్రపదుని మృతి విని మాత్రమే అతదంతగా దుఃఖించలేదు! అందరు తిరిగి కంటపడ్డారన్న ఆనందంతో మేళ వించిన దుఃఖంతో కూడా ఆ విధంగా విలపించాడు!
మరికొంతసేపటికి నితాయీ ఆ గుల్మోహర్ చెట్టుకింద కూర్చుని రాజాను తన పక్షనే కూర్చుండబెట్టుకున్నాడు.
రైల్వే లైను వంకరగా తిరిగినచోట, ఆ లైను కమ్మీలు రెండు ఒకటిగా మారినట్టున్నచోట ఏకాగ్రదృష్టి నిలిపి అన్నాడు.
“రాజూ ! అన్నా”
“ఉస్తాద్ ! తమ్ముడూ”
“చిన్నరాణి!”
“ఉసాద్!”
“బిన్నరాణి లేదు!
ల్రేద్రా[”
“లేదు! ఆమె చనిపోయింది!”
రాజావంటి దృథమనస్స్ముని పెదవులు రెందు కూదా కంపించడం (ప్రారంభించాయి.
“చిన్నరాణికి పిచ్చెక్కింది ఉన్తాద్! నీవు వెళ్లిపోయిన తరువాతా”
రాజా కళ్ళమ్మట బాష్పప్రవాహం ప్రారంభమైంది. చిన్నరాణి మరిలేదు! ఆమె చనిపోయింది! పిచ్చిదై చచ్చిపోయింది! ఆ నాలుగు మాటలే ఎన్నెన్నో మాటలు చెప్పినట్టుగా నితాయీ హృదయంలో పెనుగాలి వాన చెలరేగింప జేశాయి! హృదయంలోని బాప్ప్రధారాప్రవాహం గట్లు తెంచుకుని కళ్లమ్మట (ప్రవహించింది. “అయ్యో! బ్రతుకింత చిన్నదై పోయినదేమి?” అన్నభావం మనసులో ప్రొదుర్భవించింది. అతడలాగ దుఃఖిస్తుండడం గమనించి, రాజా నెమ్మదిగా అడిగాడు.
“ఉస్తాద్! ఏడుస్తున్నావా? చిన్నరాణికోసం కంట నీరు పెట్టుకుంటు 188 € కవి నవల
న్నావా?”
కళ్లు తుడుచుకుని విచిత్రంగా ఒక చిరునవ్వు చిందించి నితాయీ అన్నాడు.
“ఇదిగో, ఈ పాట విను రాజా! పాట! చిన్నపాట!”
సంగీతంతో మేళవించి గొంతువిప్పి ఆ పాట అందుకున్నాడు నితాయీ,
“ఇదేనా హృదయాంతరాళ నిరంతరఖేదము!
ఆశ (ప్రమతో పరిపూర్ణత నందలేదుగదా!
(బ్రతుకేమో నా చెతిలో లేదుగదా!
అయ్యో! మనుగడ ఇంతగా అల్పమై
నంకుచిత మయిపోయినదేమి ఈ లోకంలో!”
రాజా అతని చెయ్యి పట్టుకుని గొంతు హెచ్చించి ప్రశ్నించాడు.
“ఉస్తాద్, ఒక్కమాట చెప్పు! బ్రతుకింతగా అల్పమైపోయినదేమి? అయ్యయ్యో”
నితాయీ సమాధానం చెప్పాడు.
అయ్యో! నాకు మాత్రం తెలుసునా రాజా!”
ఆపైన అతని నేత్రాలలో బాష్పాలావిర్భవించాయి. ఆ తరువాత కుమిలి కుమిలి దుఃఖించాడు. అతని కళ్ళలో నుండి ఎడతెగని బాష్పధారాప్రవాహం (ప్రారంభమైంది. ఆ విచారం మధ్యలోనే నితాయీ పెదవులమీద చిరునవ్వు పొటమరించింది, కాదు! చిన్నరాణి మరణించలేదు!
అతడా విషయం విస్పష్టంగా సందర్శించాడు!
రైల్వేలైను కమ్మీలు రెండు ఒకటె వంకరగా తిరిగినచోట, దక్షిణముఖంగా ప్రవహిస్తున్న నది కవ్వలివైపున ఒక రెల్లుపువ్వు శిరస్సుమీది పైడిబిందువుతో తళతళ లాడుతున్నది! అది నితాయీవైపు కదిలివస్తున్నట్లె కనిపిస్తున్నది! ఆమె ఉన్నది! ఉన్నది! ఎక్కడికి పోలేదు! ఆమె అక్కడ ఉన్న ప్రతి చిన్నవస్తువుతోను మేళవించి ఏకీభవించింది! ఇది గుల్మోహర్! ఎంత అందమైనదిది! అక న్మాత్తుగా జ్ఞప్తికి వచ్చింది! మొట్టమొదటినాడు వసంత ఇక్కడే పడుకుని అన్నది “ఏమండీ ఉస్తాద్- కాదు- పోస్తాద్గారూ?” వసుమతి చలనాని + 1869
అదిరిపడి అనుకున్నాడు నితాయీ, 'వసంత కూడా ఇక్కడే పడుకుని ఉన్నట్టున్నది! ఆహా! చిన్నరాణి! వసంత! ఇద్దరు పక్కపక్కనే నిలబడినట్టె కని పిస్తున్నారు! కలిసిపోయి ఒకే ఆకారంతో సాక్షాత్మరిస్తున్నారు! నితాయీ లేచి “లే పోదాం!” అన్నాడు రాజాతో. “ఎక్కడికి ఉన్తాద్!” “వండీమాత దేవాలయానికి! ఒకసారి సమస్మ్కారం చేసివద్దాం రా!” రాజా ముఖం కేసిచూసి మళ్లీ అందుకున్నాడు నితాయీ, “నేలమీద సాగిలపడి సామ్రాంగ నమస్మారం చేద్దాం!” అదే తరుణంలో అతనికి సమస్త శరీరం నేలమీది ధూళిస్పర్శతో ఎరు పెక్కినట్టే అనిపించింది! ఆ చల్లని తల్లి కట్టెదుట నిలిచి “అమ్మా, జీవితం ఇంతగా చిన్నదైపోయినదేమి!” అని అడుగుదామని సంకల్పించుకున్నాడు నితొాయీ, కులం, వంశం, గుణాలకతీతంగా వుండాలని ఆదేశిస్తూ సూర్యభగ వానుడు అస్తమిస్తున్నాడు. నితాయి మాత్రం మేల్మొని ఉదయకిరణాల్లో హృదయగానంతో నీ ఉనికికి నేను చిహ్నంగా వుండిపోతానని నమస్కరించుకున్నాడు ప్పదయపూర్వకంగా. అ + ₹€ షు + వా. 100€ కవి నవల
6 161 డ 1|ళ్ప 2ల ఆతం. శ్రీమతి చలసాని వసుమతి ఎనిమిది పదుల వయసులో సాహితి యాగానికి ఆధ్వర్యం వహిస్తూ.... ...... జీవదీపాలు వెలిగించాలనే తపన తీరక [గ్రంథ రచనానుబంధాలు పెంచుకుంటూ... . _ శీఖరోన్నత ధీర సమాన. లక్ష్యాలను ఎంచుకుంటూ... |. ల ___వాత్సల్యానురాగ రాగాలను పంచుకుంటూ... న 'స్యైళ్ళు- సాహితీ సుమతి చలసాని వసుమతి. . కృష్ణాజిల్లా తోట్లవల్లూరు అన్నేవారిల్లు పుట్టినిల్లు. పెదమద్దాలి చలసాని వారిల్లు ల మెట్టినిల్లు. కృష్ణాతీరంలోని గ్రామీణ జీవితం ఆమె సాహితీ చిత్రణకు నేపధ్యం. భ్రమరగితం, యశోదకృష్ణ, చిత్రలేఖ, కుంతల, అహల్య, సుమిత్ర, గాజుల సవ్వడి. ఇదిగో ఇప్పుడు 'కవినవల ఈమెరచనలు. . నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ _ వారి విశిష్ట మహిళా పురస్కారం పొందారు. . పెద్దబ్బాయి రమేష్-లక్ష్మి, చిన్నబ్బాయి రవి-ధనలక్ష్మి, కుమార్తె మొటపర్తి రమాదేవి-బుచ్చిబాబు. . 0 భర్త కీ.శేచలసాని మాధవరావు. ౨. దక్షిణభారత హిందీ ప్రచార సభ వారి విశారద, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యరత్న జబల్పూర్ విశ్వవిద్యాలయం నుండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏపట్టాలు పొందారు. రు.75/- మాధురి ప్రచురణలు .