Telugu ఐసరబుజ్జీ పుల్లయ్య - anilvaranasi/indianlanguages GitHub Wiki
11111/// 7 ల స్వ. 4/4 ర భం వై ఆపి డా న , అసి తవనో (ఫాం శోష, గ్ క | గో శ్ర క | నం. కీ ల జే. న్ధ్యాడ్యాణీ తో ౪13 టో ష్ ౯ శ్? క క [ ల శ ఖాలా. ; ళ్ ౯ | = కీ నింంబ౪ం అల్లరి! ట్ శ మ! కఖ్యో కే దె | శి 1! గ " ర్ క్ష అ 9 గ 9 ఉ ళ్ళి ణా 4 . తిం కే జతే $ | శత హ్! . ఖీ ళీ ౯ ణ్ల / అ ఫీ + మ స ల స * | భశ శి 4 క , 4 "ఈ జీ [ / ఠి" ళీ న "4 ళ్ ం. న మ! జో 4 " | తీ న ౮ 2 పట్టీ కి త శ “ళల ౧ స స ట్ శ శల శ! శీ బ్ ౩ ౫నవిజ్ఞాన వదిక ప్రచురణ ఖీ. . 0కి? లీ న 1! 1 టి ళీ], గ య క్ష న ల కం. - క స టం! ఉళ . . ॥ ం కీ థా | ల్ గ్ క్ న. స్ , క భ్ జై తీ గిట్ట? ఖ్ మ ళీ తిం ] క న బు ఎన: ౧ 4(౧క్కా (.. 1 న 1 ళీ? ల్ 20 తో టర ౯. క్షీ; . క
ర్త | |
౪/ 9511€0 [€12 ఐసరబఖ్ల పుల్లయ్య సా రాగ!” జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ అనుబంధం ,
లెవెల్ ;:5 ఐసరబజ్డీ పుల్లయ్య (కథలు) సీరీస్ ఎడిటర్ రి వి. బాలసుబ్రమణ్యం మొదటి ముద్రణ :; జూలై 2004 రెండవ ముద్రణ : జూన్ 2006 ప్రచురణ జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ (మ్రతులకు ; వి. బాలసుబ్రమణ్యం 27-1-1304, బాలాజీ నగర్, నెల్లూరు-524 002 ఫోన్ ; ౦861-2320610 సెల్ ; 94406 29031 సూచనలకు, సలహాలకు సి. వి.కృష్ణయ్య సి మోహన్ "సెల్ : 94405 39351 సెల్ : 98853 51067 2
ఆ ఆట ఐసరబజ్జీ పుల్లయ్య ఆకా ఎన న్ని స 0 . న మ్. ్ నమా వసూ ఆ అనగనగా ఒక వూరు. ఆ వూళ్ళో పుల్లయ్య, లక్ష్మమ్మ అనే = భార్యాభర్తలుందేవారు. “పుల్లయ్యకు తెలివితక్కువ, ఆకలెక్కువి అసి చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి పట్టించేవారు, అయినా లక్ష్మమ్మ సర్పుకొనిపోయేది. మొగుణ్ణి తన దారిలో పెట్టుకొని కాలం గడుపుతుండేది. ఇలా వురిటే ఒక రోజు పుల్లయ్య అత్తగారింటికి పొయ్యాడు. ఆ కాలంలో బస్సులు, రైళ్ళు లేవు. కాలినడకనే పోవల్సి వచ్చేది. పుల్లయ్య సద్దిమూట గట్టుకొని నడిచి అత్తగారింటికి చేరాడు. తె
న్ అల్లుడు వచ్చాడుగదా అని అత్తగారు మర్యాదలు చేసింది.
కుడుములు చేసి పెట్టింది. పుల్లయ్యకు కుడుములు బలే రుచిగా అన్పించాయి. కుడుముల్లో బెల్లం, నెయ్యి కలిపి తింటూ వుంటే మరింత తినాలనిపించింది. అయితే అత్తగారు ఏమనుకొంటుందో ఏమో! అల్లుడి బెట్టు పోదూ? అందుకని ఎలాగో ఒకలాగున కోరికను బిగపట్టాడు.
అయినా పుల్లయ్యకు కుడుముల మీద నుంచి మనసు వెనక్కు రావడం లేదు. ఇంటికెళ్ళాక భార్య చేత కుడుములు చేయించుకొని తిందాంలే అని సరిపెట్టుకొన్నాడు. ఇంటికి బయలుదేరాడు.
బయలుదేరేటపుడు అత్తగార్ని తనకు వండిపెట్టిన వంటకం ఏమిటో 'పేరు చెప్పమని అడిగాడు. ఆవిడ “కుడుములు అని చెప్పింది. 'వీటిని వండటం నా భార్యకు వచ్చా” అని అదిగాడు. “అదెంత భాగ్యం నాయనా! నా కూతురు కుడుములు నాకంటే బాగా చేస్తుంది” అని చెప్పింది అత్తగారు.
'ముందే మందమతి, పైగా మతిమరుపు” ఇది గదా పుల్లయ్య వ్యవహారం. అందువల్ల ఎక్కడ మరిచిపోతానో అని 'కుడుములు” కుడుములు అని మాటిమాటికి నోట్లో అనుకొంటూ నడవసాగాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా, పెళ్ళాం చెవిలో ఈ 'కుడుములు” అనే మాట వేద్దామా అని పుల్లయ్యకు బలే తొందరగా వుంది. ఇలా నడుస్తుంటే దారిలో ఒక కాలువ ఎదురైంది, మంచి వయస్సులో వున్నాడుగా పుల్లయ్య దాన్ని ఎగిరి దూకాలనుకొన్నాడు. పంచె ఎగగట్టి, మూతి బిగపట్టి ఒక్కసారి గట్టిగా గాలి పిల్చి 'ఐసరబజ్జీ' అని ఎగిరి దూకాడు.
లే
మా మ్
అంతే పుల్లయ్య ' కుడుములు మాట మరుచుపోయి 'ఐసరబబ్టీని” పట్టుకున్నాడు 'ఐసరబబ్దీ 'ఐసరబబజ్జీ అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు.
వాళ్ళాయన వచ్చాడని లక్ష్మమ్మ సంబరపడింది. అమ్మగారింటి సంగతులు చెపుతాడని ఉబలాటపడింది. కాళ్ళకు నీళ్ళిచ్చి మంచం మీద దుప్పటి పరిచింది.
తీరిగ్గా మంచం మీద కూచుని పుల్లయ్య అత్తగారింటి సంగతులన్నీ చెప్పాడు. అత్తగారు ఎంత మంచిదో చెప్పాడు. తనకు ఎన్నెన్ని మర్వాదలు చేసిందో చెప్పాడు. ఇప్పటిదాకా వల్లెవేసిన 'ఐసరబబ్టీ సంగతీ చెప్పాడు. “అవి బలే రుచిగా వున్నాయి. మీ అమ్మ దగ్గర నువ్వు నెర్చుకొని వుంటావుగదా! నాకుఎలాగైనా ఐసరబబ్జీలు చేసిపెట్టు' అని తొందర పెట్టాడు.
'ఐసరబజ్జీ లేమిటయ్యా! ఈ మాట నేను వినలేదే. వీటిని వండటం నా చేత గాదే అంటూ లక్ష్మమ్మ ముక్కు మీద వేలేసుకొనింది.
5
పుల్లయ్య వొప్పుకొంటాడా? లి అమ్మ కంటే నువ్వే బాగా చేస్తావటగా” అని దబాయించాడు. “ఎవరు చెప్పారయ్యా నీకు?” అంటే 'మి అమ్మే చెప్పింది” అని ఎగిరిపడ్డాడు.
లక్ష్మమ్మకు ఏమీ పాలుపోలేదు. 'ఈ ఐసరబజ్జీలు నాకు తెలీదు మొగ అని వేడుకొంది.
పుల్లయ్యకు ఎక్కడాలేని కోపం వచ్చెసింది. 'అమ్మచేసిన వంటకం కూతురికి తెలీదా? దీనికి కళ్ళు నెత్తిమీది కెక్ళాయి' అని చిర్రుబుర్రులాడాడు. ఎంత చి(ర్రుబు(రులాడినా “లక్ష్మమ్మ” నాకు తెలియదంటే తెలీదని నెత్తీ నోరూ బాదుకొంది.
పుల్లయ్య మూర్చుడు కదా! తిక్కరగింది. పెళ్ళాం అబద్దాలు చెపుతోందని, తనను తిక్కలవాణ్సి చేస్తోందని ఒళ్ళు మండిపోయింది.
కర్ర తీసుకొన్నాడు, భార్యను చితకబాదాడు. పాపం లక్ష్మమ్మకు ఉత్త పుణ్యానికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. వీపూ, కాళ్ళూ, చేతులూ
చుట్టు పక్కల వారంతా చెరారు. పుల్లయ్యను చెడామడా తిట్టారు. = కర్రతీసి దూరంగా పారేశారు. 'నీకేమొచ్చిందిరా రోగం. పెళ్ళాన్ని గొడ్డును బాదినట్లు బాదుతున్నావు? చూడు లక్ష్మమ్మకు ఒళ్ళంతా కుడుముల్లాగా ఎలా కందిపోయ్యిందో” అని మందలించారు.
పుల్లయ్యకు అప్పుడు చటుక్కున “కుడుములు గుర్తుకొచ్చాయి, “కుడుములు వండిపెట్టమంటే వండలేదిని దబాయించాడు. భార్య లబోదిబో
్న
మంటూ 'ఐసరబజ్జీలు వండమంటే చేతగాదంటిని కుడుములని చెప్పి చావకపోతివి” అని ఎదురు తిరిగింది. పొరుగువారు గట్టిగా అడిగేప్పటికి కథంతా తెలిసొచ్చింది. పుల్లయ్య తానెంత తెలివితక్కువవాడో తెలుసుకొని సిగ్గుతో తలవంచుకొన్నాడు. పక్కరోజు లక్ష్మమ్మ కావల్సినన్ని ఐసరబజ్జీలు కాదు కాదు కుడుములు చేసి పెట్టింది. ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుకొంటూ తిన్నారు, అప్పటి నుంచి పుల్లయ్యకు 'ఐసరబజ్జీ పుల్లయ్య అని పెరు పడిపోయింది. క్ /
గ దెబ్బకు ఏడు జీవులు మ ' క్ష -అ జో నో జీ
ల! కస న్న) ది 1
ర మిల్ ౧ అనగనగా ఒక ఊరు. అందులో గోపి అనె పిల్లవాడు. లడ్డూలంటే వాడికి చెప్పలేనంత ఇష్టం. ఒక రోజు వాడు లడ్డు తింటూ ఉండగా వాటి మీద ఈగలు వాలాయి. గోపీకి భలే కోపం వచ్చింది. రెండు చేతులతో
8
ఠపీమని ఈగల్ని కొట్టాడు. చేతులు తెరిచి చూస్తే ఒకటి గాదు రెండు గాదు ఏడు ఈగలు చచ్చి పడ్డాయి. గోపి ఎగిరి గంఠేశాడు. తన బలం మీద తనకే ఆశ్చర్యం వేసి పొంగిపొయ్యాడు
“ఇంత బలం ఉన్న నేనేమిటి? ఈ పల్లెటూళ్ళో ఉండటమమిటి? అని టైలర్ దగ్గరికి వెళ్ళాడు. “దెబ్బకు ఏడు జీవులు” అని ఒక పట్టీ
కుట్టించుకొన్నాడు. నడుముకు దాన్ని కట్టుకొని జేబులో లడ్డు కుక్కుకొని
అడివికి బయలుదేరాడు.
దారిలో కుంటుకుంటూ ఒక పిట్ట కన్పించింది గోపీకి. దాన్ని తీసుకొని మరో జేబులో పెట్టుకొన్నాడు. ఇంతలో ఓ రాక్షసుడు ఎదురయ్యాడు. గోపికి గుండదెలవిసిపొయ్యాయి. అయినా తన “దెబ్బకు ఏడు జీవులు కదా” అని గుర్తుకొచ్చి “చూచావా నేనెవర్నో! దెబ్బకు ఏడుగురు. జాగ్రత్త” అని ఎదురు నిలబడ్డాడు. రాక్షసుడికి అనుమానం వేసింది. 'వేలెడు లేదు వీడి బడాయి భలే జోరుగా ఉందే” అనుకొని “ఇదిగో ఈ రాయిని నేను నలిపి నలిపి పిండి చేస్తా. నీ బలం ఏమిటో చూపించు అని సవాలు చేశాడు. గోపి వెంటనే జేబులోంచి లద్దు తీశాడు. నలిపాడు. “పొడి పొడి గావడమే గాదు నూనె గూడా కారింది. చూచావా నా తడాఖా” అని బడాయి
రాక్షసుడు ఒక రాయి దూరంగా విసిరేసి “నువ్వు విసురు చూద్దాం” అన్నాడు. గోపి జేబులోంచి పిట్టను తీసి విసిరాడు. అది తుర్రున ఎగిరిపోయింది.
౮
రాక్షసుడికి చెమటలు పట్టాయి. విడు బతికుంటే ప్రమాదం "అనుకొన్నాడు. రాత్రి ఇంటికి భోజనానికి పిలిచాడు. మంచి విందు చేసి పడుకోబెట్టాడు. గోపికి కొత్త చోట గదా నిద్రపట్టలేదు. రాక్షసుడు వాళ్ళ తమ్ముడితో మాట్లాడ్డం విన్పించింది. తనని చంపడానికి కుట పన్నుతున్నారని అర్ధమైంది. దిండు నిలువుగా పెట్టి దుప్పటి కప్పి తాను (వెళ్ళీ పెద్ద పెద్ద బానల వెనుక పడుకొని నిద్రపొయ్యాడు. అర్దరాత్రి రాక్షసులు ఇనప కడ్డీలు తీసుకొని దుప్పటి కింద ఉన్నది గోపీయే అనుకొని చేతులు నొప్పిపుట్టెలా కొట్టారు. “కిక్కురు మనకుండా చచ్చాడు వెధవి అని .వెళ్ళిపొయ్యారు. చచ్చాడనుకొన్న గోపి తెల్లవారి మళ్ళీ ప్రత్యక్షమయ్యే సరికి _రాక్షసులు భయపడిపోయి పరుగు లంకించుకొన్నారు.
గోపికి తన వంటి బలవంతుడెవరూ ఉండరనిపించింది. కొండలు “దాటాడు. నదులు దాటాడు. ఒక రాజ్యంలోకి వచ్చి రాజదర్పారుకు చేరాడు. రాజుతో గోపి “రాజా నేనెవరినైనా చంపేస్తా” అని పట్టీ చూపించాడు. “.... “ఓహో! అలాగా మా రాజ్యం సరిహద్దుల్లో ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళని చంపు. నా కూతురినిచ్చి పెళ్ళి చెస్తాను” అన్నాడు రాజు. “అలాగే “అంటూ బయళల్టెరాడు గోపి.
సరిహద్దుల్లో ఓ చెరువుంది. దాని ప్రక్కన ఒక కొండ ఉంది. అక్కడొక
_చెట్టుంది. చెట్టు కింద ఇద్దరు రాక్షసులు గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. గోపి రాళ్ళు ఏరుకొని మూటగట్టుకొని చెట్టెక్కాడు. ఒక రాక్షసుడి మీదికి ఒక
రాయి విసిరాడు. రాయి రాక్షసుడి మూతికి తగిలింది. వాడు చటుక్కున
10
లేచాడు. అటూ ఇటూ చూస్తే ఎవ్వరూ లేరు. పక్క రాక్షసుడే కొట్టి ఉంటాడని వాణ్ణి లేపి అడిగాడు. “నేను కొట్టలేదు మొర్రో అన్నాడు వాడు. మళ్ళీ నిద్రకు లంకించుకొన్నారిద్దరూ. ఈ సారి గోపి రాక్షసులిద్దరి మీదా రాళ్ళ వర్షం కురిపించాడు. ళ్శీ ఇద్దరూ లేచి ఒకరి మీద ఒకరు అనుమానపడి, మొదట తిట్టుకొని తర్వాత క్ష యుద్దానికి దిగారు. రక్తం పారింది. చివరికి ఇద్దరూ చచ్చారు. రాజుకీ సంగతి తెలిసింది. గోపికి పిల్లనిచ్చి పెళ్ళి చేశాడు. గోపి పట్టుపరుపెక్కి కూచున్నాడు రాకుమారి లడ్డూలు తెచ్చింది. ఒక్కొక్కటీ అందిస్తుంటే గోపీ తినసాగాడు. ఇంతలో ఒక లడ్డూ జారి కిందపడింది. దాన్ని అందుకోవడానికి పక్కకు వంగాడు. మంచం మిద నుంచి బోర్లా పడ్డాడు. జే 1 మంచం మీద నుంచి పడ్డ చప్పుడు విన్పించి వంట చేస్తున్న శాంతమ్మ అదరాబాదరాగా గోపి దగ్గరికొచ్చింది. “ఏంటిరా గోపీ! ఎందుకు / పడ్డావ్” అని సముదాయించబోయింది. మన గోపి మాత్రం “నా లడ్డూలు, . నా రాకుమారి అంటూ అరుస్తూనే ఉన్నాడు. “పగటి నిద్రచాలక మళ్ళీ పలవరింతలా' అని శాంతమ్మ కొడుకుని ఎత్తి పడక మీద వేసింది. కళ్ళు నలుపుకుంటూ లేచాడు గోపి. చూస్తే ఏముంది? లడ్డు లేవు. రాకుమారీ లేదు. అంతా కల. [11
జిత్తులమారి నక్క జాలి య్ /' ఈ (| గ జై ళ్ ర్ట జ్ (గ్ా. త (6 ల ఆం ౨ జం తుడు ర *..... ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది అందరినీ మోసం చేస్తూ ఉందేది. అది మోసగించని జంతువులేదు. అందుకే అదంటే అందరికీ అసహ్యం. కాని దాసి ఆటకట్టించే ఉపాయం ఎవరూ ఆలోచించలేదు. 12
నక్క ఆట కట్టించాలని ఒక కోతికి కోర్కె కలిగింది. అది ఒక చెట్టెక్కి కూర్చుని బాగా ఆలోచించింది. ఒక పథకం తయారు చేసుకొంది. నక్క దగ్గరికి వెళ్ళి “నక్కబావా! నక్క బావా!! ఈ ప్రపంచంలో మిక్షిలి రుచికరమైనది ఏమిటో తెలుసా?” అంది. కోతి ఏదో తిండి విషయం
మాట్లాడుతోందని చెవులు నిక్కబొడుచుకుంది నక్క “ఏమిటది?” అని ఉత్సాహంగా అదిగింది.
“గృ(ర్రం ఉంది చూశావా? దాని తొడ మాంసం, అంతకంటే రుచిగా ఉందేది ప్రపంచంలో మరింకొకటి లేదు. అది నీకు కావాలంటే నువ్వో పని చేయాలి. గుర్రం తోకకు నీ తోక గట్టిగా చుట్టి కట్టెయాలి. అప్పుడు నీ పని సులభమౌతుంది” అంటూ తల ఎగరెస్తూ చెప్పింది కోతి. దాంతో నక్కకు ఆశ కలిగింది. “నా తోకను దాని తోకతో ఎందుకు ముడెయ్యాలి?” అని లోలోన సంతోషపడుతూ అమాయకంగా అదిగింది.
“అవును మరి అలా చేయకపోతే నువ్వు గుర్రం వెంట ఎలా వెళ్ళగలవూ? నువ్వు తొడను కరచుకోగానే అది మహావేగంగా పరుగు త్రీస్తుందనుకో అప్పుడు నువ్వు దానివెంట పరుగెత్తలేవు. దాని తోకతో ని తోక గట్టిగా ముడేసుకొన్నావనుకో. అప్పుడు అది పరుగెడుతున్నానువ్వు దాని వీపుమీద కూర్చొని...దాని తొద చీలి... మాంసం కొంచెం కొంచెం
13
పీక్కు తినొచ్చు”. వెంటనే గొంతు తగ్గించి ఏదో రహస్యం చెబుతున్నట్టు మరికొంత దగ్గరికి జరిగి “ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నెను వచ్చేటప్పుడు గుర్రాన్ని దారిలో చూశాను. మంచి నిద్రలో ఉంది. ఇక నీదే ఆలస్యం” అని పురమాయించింది.
నక్కఎంతో శ్రద్ధగా విన్నది. లోలోన అమితానందం పొందింది. కాని బయటికి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడింది. “సరె! తర్వాత ఆలోచిద్దాం. అన్నిటికంటే రుచికరమైన పదార్ధమని చెబుతున్నావు కనుక. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుని చర్చించుకొందాం. ఆ తరువాత ఓ నిర్ణయానికొద్దాం. ఇటువంటి విషయాల్లో తొందరపడగూడదు. కానీ ఒక విషయం. ప్రస్తుతానికి ఈ విషయం మనమధ్యనే ఉందనీయ్. అప్పుడే అందరికి చెబితే ఏం బావుంటుంది" అంటూ తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. కోతి కూడా తన దారిన తాను పోయింది. నక్క ఎంతో దూరం వెళ్ళలేదు. కోతి కనుమరుగయ్యేదాకా వెళుతున్నట్టు నటించి తర్వాత వెంటనె వెనుతిరిగింది. కోతి చెప్పిన గుర్రం ఎక్కడుందోనని . ఆశగా వెదికింది. ఎక్కువ శ్రమ పదకుండానె గాఢనిద్రలో ఉన్న గుర్రం కనిపించింది. చడీ చప్పుడు లేకుండా గుర్రం వీపుపైకి పాకి తన తోకను _ గుర్రం తోకకు గట్టిగా ముడేసుకుంది. ఆ తర్వాత నింపాదిగా గుర్రం తొడను బలమంతా ఉపయోగించి గట్టగా కరిచింది.
[14
గుర్రం పెద్దగా సకిలిస్తూ మేల్కొంది. ఏం జరుగుతుందో కూడా దానికి సరిగా తెలియలేదు. భయంతో ఎగిరి గంతేసి తనను తాను రక్షించుకొందామని నాలుగుకాళ్ళతో దౌడు తీసింది. ఇక నక్కపరిస్థితి చెప్పనక్కరలేదు. తొడను పళ్ళతో కరిచి పట్టుకొన్నా పట్టు సడలి గభీలుమని క్రింద పడింది. తోకా, తోకా బాగా ముడేసి ఉన్నాయి. తన తోకను ఏదో పట్టుకుని లాగుతోందని భయంతో గుర్రం మరింత వేగంగా పరుగెత్తింది. నకృను రాళ్ళ మీద నుంచి, రప్పుల మీద నుండి, ముళ్ళలోంచి, నీళ్ళ లోంచి తాను లాక్కుపోతున్నానని గుర్రానికి తెలియదు. నక్క శరిరం గీరుకుపోయి రక్తం ముద్దయ్యింది. శరీరంలోని ఏ అవయవమూ స్వాధీనంలో లెదు. నక్క గుణం బాగా తెలిసిన కోతి ఎటూ పోలేదు. అది దగ్గర్లోని చెట్టెక్కి ఈ వింత చూస్తోంది. నక్కకు జరిగిన శాస్తికి కోతి పొట్ట చెక్కలయ్యెట్టు నవ్వుకొంది. రే ర ఆ 15
ఆ నాలుగో స్వర్గం టగా ఒక రోజు తెనాలి రామలింగడు ఒక అరుగుమీద కూచుని చాలా మంది కవులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. కవులు ఏవేవో అడుగుతున్నారు. రామలింగడు వాళ్ళకి జవాబులు చెపుతున్నాడు. నవ్విస్తున్నాడు. 16
ఇంతలో అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. అందరూ లేచి అతనికి నమస్కారం పెట్టారు. అరుగు మీద కూచోమని ఆహ్వానించారు. సన్యాసి వచ్చి వాళ్ళ మధ్య కూర్చున్నాడు.
ఇక సన్యాసి ఒక్క నిమిషం వూరుకోకుండా మాట్లాడసాగాడు. తన గొప్పలు చెప్పుకోసాగాడు.
“ఈ మధ్య భూలోకం పాపాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మోసాలే. ఎక్కడ చూసిన దొంగతనాలె. పెద్దల మాట చిన్న వాళ్ళు వినడంలేదు. స్వాముల్ని ఎవ్వరూ గౌరవించడం లేదు. అబద్దాలు తప్ప నిజం ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. దేవుడి మీద భక్తి లేదు. పాపం అంటే భయం లేదు” అని చెప్పసాగాడు.
రామలింగడికి ఈ సన్వాసి ధోరణి అర్ధమైంది. “మరి మీలాంటి మహానుభావులు ఈ లోకంలో ఎలా వుండగలుగుతున్నారండీ” అన్నాడు.
| “నాకీ భూలోకం మీద అసహ్యం వస్తోంది. ఇక్కడి మనుషుల్ని చూస్తే భరించలేకుండా వున్నాను. అందుకే నెను ప్రతిరాత్రి స్వర్గానికి పోతాను. అక్కడి వుండి తెల్లవారిన తర్వాత వస్తుంటాను. ఈ శరీరం ఎప్పుడెప్పుడు నశిస్తుందా అని ఎదురుచూస్తున్నాను. శరీరంతో పగటిపూట స్వర్గంలో వుండే వీలులేదు మరి” అని బడాయి కొట్టాడు సన్వాసి. [1/7
కవులందరికీ ఆ సన్యాసి మాటలు వట్టి దొంగకూతలని అర్ధమై పోయింది. అయినా అతనికి ఎలా బుద్ధి చెప్పాలో అర్ధంగాక వూరుకొన్నారు. రామలింగడు అలా వూరుకొంటాడా? ఊరుకోడుగా! “స్వామీ మీరు “నాలుగో స్వర్దం'” చూశారా” అని అడిగాడు.
“'చూడలేదంటే పరువు పోతుంది. ఒక వేళ నాలుగో స్వర్ణం కూడా వుందెమో. ఎందుకు వెనక్కి తగ్గాలి అనుకొని సన్యాసి “ఆహా చూడళకేం రాత్రి కూడా అక్కడికి వెళ్ళ వచ్చాను. ఎంత అందంగా, హాయిగా వుంటుందో” అని మరింత బడాయికొట్టాడు.
“స్వామీ మీరెంత అదృష్టవంతులు. నాలుగో స్వర్గం కూడా చూశారు. మరి ఆ స్వర్గంలో ఆకాశ గంగ వుందే అందులో మునిగారా”? అని అడిగాడు రామలింగడు.
“నాలుగో స్వర్గం వెళ్ళినవాళ్ళు ఆకాశగంగలో మునగకుండా వస్తారా? ఏం ప్రశ్న అడిగారండీ! లక్షణంగా మునిగాను. తనివితీరా మునిగాను. అన్నాడు సన్వాసి.
“స్వామీ! మీ గొప్పతనం అంతా ఇంతా కాదు. మీ అంత పుణ్యాత్ములు మాకు కన్పించడం మా అదృష్టం” అని రామలింగడు ఆ సన్యాసిని ఆకాశానికెత్తాడు. “మరి స్వామీ! ఆ ఆకాశగంగా తీరంలో ఇసుక మీద మీరు తిరిగారా?” అని అడిగాడు
18
“రామలింగా! ఇసుకలో నేనెందుకు తిరగలెదయా! ఆ ఇసుక బంగారపు పొడిలా వుంటుంది. అందులో అడుగులేస్తుంటే శరిరం పైకి తేలిపోయినట్టుంటుంది. ఆ ఇసుక మీద దేవతలు, అప్సరసలు రాత్రులు విహరిస్తుంటారు” అని కోతలు కోశాడు సన్వాసి.
రామలింగదికి వొళ్ళు మందడివాయ్యింది. చివరి ప్రశ్న ఇలా వేశాడు.
“స్వామీ ఆ ఇసుక మీద మెత్తగా మీకేమయినా తగిలిందా?” అన్నాడు.
“తగలకేం. నూరిన గంధం అక్కడ ఎక్కడబట్టినా కన్పిస్తుంది. అది ఎంత మంచివాసన?” అన్నాడు. సన్వాసి.
“అది నా గుర్రం వేసిన పేడలెండి. రాత్రి నేను కూడా నాలుగో స్వర్గం వచ్చాను కదా అన్నాడు రామలింగడు.
దీంతో కవులందరూ ఫక్కుమని నవ్వారు. సన్వాసికి ముఖం చిన్నబోయింది. వంచిన తల ఎత్తకుండా అక్కడి నుంచి జారుకొన్నాడు.
రామలింగడి తెలివిని అందరూ మెచ్చుకొన్నారు.
నే రే రోగ 19
ఆ వొపం గుర్రం! గ థి మ గటి. ఈ మరీ తోస్తే ' చాలా పాతకాలం నాటి సంగతి. ఆ రోజుల్లో జంతువులన్నీ అడవుల్లోనే వుందేవి. స్వేచ్చగా వుండేవి. వాటి మీద మనుషుల పెత్తనం వుందేది కాదు. ఒక రోజు ఒక గుర్రం అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక పచ్చిక బీడులోకి వచ్చింది. పచ్చిక మెత్తగా పచ్చగా నిగనిగలాడుతోంది. అయితే అక్కడక్కడా ఎవరో పచ్చికను కొరికినట్లు అనిపించింది. గుర్రం 20
అటూ ఇటూ చూసింది. దూరంగా పచ్చిక మెస్తూ దానికొక జింకపిల్ల కన్పించింది.
గుర్రానికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాన్ని తరిమెయ్యాలను కొనింది. జింక దగ్గరకెళ్ళి దబాయించింది.
'ఏయ్ జింకపిల్లా! నీకెంత పొగరే. నా పచ్చికంతా ఎంగిలి చేస్తావా? ఎవరిచ్చారు నీకీ అధికారం?” అనింది.
జింకపిల్ల బెదిరిపోలేదు “ఏం ఈ పచ్చికంతా నీ అబ్బ సొమ్మా? ఈ అడివి అందరిదీ. అందరం తింటాం. నెనూ తిన్నా. కావలిస్తే నువ్వూ తిను అని ఎదురు తిరిగింది.
గుర్రానికి చిరైత్తుకొచ్చింది. “బెత్తెడు లేదు. ఈ జింకపిల్ల కింత పొగరా? దీని భరతం పట్టాలి” అనుకొనింది. ముందరి కాళ్ళెత్తి జింకపిల్లను తన్నబోయింది. జింకపిల్ల తుర్రుమని ఎగిరివోయింది. గుర్రం దాని వెనుకబడి తరుముకొనింది. జింకపిల్ల చిక్కితేగా అది ఒక్కక్షణం ఒక చోట నిలవకుండా పరుగెత్తసాగింది. పరిగెత్తుతూనే పచ్చిక కొరకసాగింది.
“ఎండ నెత్తి మీది కొసోంది. గుర్రానికి ఒక వైపు రోషం ఒక వైపు ॥ అలసట ముంచుకొస్తున్నై. జింకపిళల్లేమో చెంగుచెంగున ఎగురుతోంది.
గడ్డి పరకలు కొరికి గుర్రాన్ని వెక్కిరిస్తోంది.
గుర్రం లాభం లేదనుకొంది. తీరిగ్గా రేపు వచ్చి దీని అంతు చూద్దామనుకొంది. వెనుతిరిగి పోతుంటే దానికొక కట్టెలు కొట్టె మనిషి
బి]
కన్పించాడు. గుర్రాన్ని చూసి అతడికి ముచ్చటేసింది. “బాగా బలిసి వుంది. కొంచెం మచ్చిక చేసుకొంటే ఈ కట్టెలైనా మోస్తుంది” అన్పించింది. పైగా గుర్రం ఏదో దిగులుతో వుంది. 'మాట్లాడిస్తే బాగుందు” అనుకొన్నాడు. మాటల్లోకి దించాడు.
గు(ర్రం జింకపిల్ల సంగతంతా చెప్పింది. దాన్ని ఎట్లయినా పట్టుకొని బుద్ది చెప్పాలనింది. “కొంచెం నాకు నాయపడతావా”? అని అదిగింది.
మనిషి బలే ఛాన్సు దొరికిందనుకొన్నాడు. “ఓస్! వలెడు జింకపిల్లను పట్టుకోవడం ఓ పెద్దపనా? రేపు నేను కూడా తోడుంటా.. ఈ రోజు మాయింటికి రా. రాత్రికి మంచి మేత పెడతా. తిను. రెపు ఇద్దరం వద్దాం”? అన్నాడు. గుర్రానికి చెప్పలేని ఆనందమైంది. మనిషి తోడంటే మాటలా? ఇక జింకపిల్ల తనకు లెక్కా? అనుకొంది. మనిషి వెంట అతడి ఇంటికి బయలుదెరింది. మనిషి కట్టెలమోపు గుర్రం మీద పెట్టాడు. గుర్రం ఊళ్ళోకి వచ్చి మనిషి యింటికి చేరుకొంది.
మనిషి దానికి మంచి గుగ్గిళ్ళు పెట్టాడు. దాణా కూడా పెట్టాడు. ( గుర్రానికి గుగ్గిళ్ళు తినడం కొత్త. అవి బలే రుచిగా వున్నట్టన్పించాయి. పరిగెత్తడానికి కావల్సినంత శక్తి వస్తుందని గొంతుదాగా మెక్కింది.
తెల్లవారింది. రైతు, గుర్రం అడవిలోకి బయలుదేరారు. ఈసారి రైతు గుర్రం మీద ఎక్కాడు. ఇద్దరూ కలిసి పచ్చిక బీడులోకి వచ్చారు.
22
దూరంగా జింకపిల్ల చెంగుచెంగున ఎగురుతూ కన్పించింది. గుర్రం
పట్టరాని ఉక్రోషంతో దాని వెంట బడింది. అయితే, ఏం లాభం?
జింకపిల్ల బీడంతా గుర్రాన్ని తిప్పితిప్పి మూడు చెరువుల నీళ్ళు
తాగించింది. గుర్రానికి నిన్నటి కంటే ముందె అలుపొచ్చింది. మనిషిని మొయ్యోలిగా అందుకని!
'మళ్ళీ రేపు వద్దాం. జింకపిల్ల పని పడదాం” అన్నాడు మనిషి గుర్రాన్ని క్కూడా అదే మంచిదన్పించింది. దానికి గుగ్గిళ్ళు గుర్తుకు రాసాగాయి. దాణా తలుచుకొంటే నోట్లో సీళ్ళూరుతున్నాయి. అందుకని అది వొప్పుకొనింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చింది.
రైతు మళ్ళీ దానికి మంచి గుగ్గిళ్ళు పెట్టాడు. కావల్సినంత దాణా వేశాడు. ఉలవపిండి కలిపిననీళ్ళు తాగించాడు. గుర్రం ఈ రాత్రి కూడా పీకలదాకా తినింది. తాగింది. హాయిగా నిద్రపోయింది.
ర 23
తెల్లారగానే రైతు కళ్ళిం పట్టుకొచ్చాడు. కళ్ళెం లేకుంటే తనకు న్వారి చెయ్యడం కష్టంగా వుందన్నాడు. పడిపొయ్యె ప్రమాదం వుందన్నాడు. గుర్రం చచ్చినట్లు వొప్సుకొనింది. రైతు కళ్ళాన్నీ దాని మూతికి బిగించాడు. హాయిగా స్వారి చేశాడు. జింకపిల్ల మాత్రం చిక్కితే వొట్టు మూడవ _ | రోజు కూడా అది గుర్రాన్ని ముప్పుతిప్పులు పెట్టింది. మనిషేమో అది ఎంతకాలం చిక్కకుంటే అంత మంచిదనుకొంటున్నాడు.
మళ్ళీ ఆ రోజు కూడా గుర్రం మనిషితో పాటు అతని ఇంటి దారి పట్టంది. గుగ్గిళ్ళు మెక్కింది. ఇలా రోజులు గడిచిపాయ్యాయి. నెలలు గడిచివొయ్యాయి. జింకపిల్ల చిక్కనేలేదు. అఖరికి ఏం జరిగిందనుకొన్నారు.
గుర్రమెమో గుగ్గిళ్ళు తినడం మరిగింది. మనిషిమో గుర్రపు స్వారి మరిగాడు. ఇంకేముంది. మీరే చెప్పంది. గుర్రానికి మిగిలింది సుగ్గిళ్ళు, బానిసతనమూ. మనిషికి మాత్రం లక్షణంగా గుర్రం దొరికింది. వానిమీద పెత్తనం దక్కింది.
ఇలా గుర్రం అడవిని వదిలేసి, అడవితోపాటు స్వేచ్చనూ వొదిలేసి బానిసగా మారిందట. మనిషి నీడన బతకసాగిందట.
నే రే 3 24 ల
౨65
'/6511నీ0! గయ తు సోమన. " శ్ న టం స క్ |. యం (స స. ఐడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు ా అ, ఖ్ కూడదా పుస్తకాలు 'చదవగలరా”? వాళ్ళకు కూడా పుస్తకాలు సన. . వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాస్తారా?... ॥ . ఇ క నఖ 1. లవ ఇప్పుడివన్నీ అర్ధంలేని ప్రశ్నలు. పిల్లలు చదవడం పలు రూపాల్లో వ్! నట లలి పూరీ వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు 7 = || చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. '"_ 3 బొమ్మల్ని చూసి కథల్నివాళ్ళు చదువుతారు. మ వ. | . మ ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు ఫం కా. _'ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. "అసలు మనం నెత్తి మీద కూచుని భాష నేర్చనక్కరలేదు. వాటుల 1 గల గర్నుకోదానికే ఈ ప్రయత్నం.
- __కరగతుల పిల్లలకోసం. తట న వధ
సీ లయేంయక్ పుస్తకాల పరిశీలనాపట్టిక పూంవఖ్య | ఇ/౧నద్భ౧/[ దగ దర /౨ఫ / పుసకం పేరు 6 వా వు గ్న్మ్యాగగ్ర 0. _ ఉర తీ. ఆ త్ న గ 444 గు న్ని గ్) గీ ల్ని వందు ఐట్ల || ట్ ఎగనుక లట్ట 1. ్ష / గ్ మొత్తం పేజీలు | 24 లేటివజలు (0 న్ పయైారు లమనుది ట్ న్ ్గ (| పేజీలు విదరీసినది త్! పమ పరక్షచసినది | యంగ. 1 క.