Telugu ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2008 - anilvaranasi/indianlanguages GitHub Wiki

గి . లు. _ ఉచిత నిర్పంధ విద్యా హక్కు . బిల్తుజం౦ం౦8 తల నినరణలకో ? న్వాఖ్యానంతో వ. =... జనవిజానవేదిక '__

5 విజపి హాస

ఈ బిల్లు బాలలకు ఉచిత నిర్భంద విద్యను ఒక హక్కుగా మారుస్తుంది. కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్ని దీనికి బాధ్యుల్నిగా చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే అనియత విద్య కాదని, ఎనిమిదేళ్ళు బడిలో చదివి, పూర్తి చేసి సర్టిఫికేటు పొందే విద్య అని నిర్వచిస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చాక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడానికి మనకు 62 ఏళ్ళు పట్టింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక (1993) దానికి తగ్గట్లు రాజ్యాంగ సవరణ చెయ్యడానికి తొమిదెళ్ళు (2002) పడితే ఇక బిల్లును పార్లమెంటు ముందుకు తేవడానికి మరో ఏడేళ్ళు పట్టింది. పిల్లల పట్ల, వారి విద్యపట్ల మన ప్రభుత్వాలకు, పార్టీలకే కాదు, మన మేధావి వర్గానికి, నామాజిక శక్తులకు కూడా వున్న తపన ఎంతో ఇది నిరూపిసోంది.

ఇష్టం లేక ఇష్టం లేక కనాకష్టంతో డిసెంబరు 15న రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. చర్చకు పెట్టమని, చట్టం చేద్దామని అడిగే నాధుడే కరువై స్తాండింగ్‌ కమిటీ ముందు మూలుగుతోంది. ఎన్నికల ముందు ఇలా చెయ్యడంలోని గడసరితనంపై ఇంక వ్యాఖ్యానం దేనికి?

ఈ స్థితిలో ఎన్ని లోపాలున్నా ఈ బిల్లు చట్టరూపం పొందాలని 'జన విజ్ఞాన వేదిక) కోరుతోంది. లోపాలపై చర్చ పేర మరింత ఆలస్యం చేసే ఎత్తుగడను ఎండగట్టాలని హెచ్చరిస్తోంది. మరింత సమ(గ్రత కోసం, పదును కోసం పోరాడుతూనే సత్వరం ఈ బిల్లు చట్టంగా మారాలని డిమాండు చేస్తోంది.

దీనిపై విస్సృత చర్చకు, సామాజిక ఒత్తిడికి అందరూ గొంతూ, చేయీ కలవాలని ఆహ్వానిస్తోంది.

  • జన విజ్లాన వెదిక జ సం(ప్రదించడంకోసం :- వి. బాలసుబ్రమణ్యం, ఎం.ఎల్‌.సి. జనవిజ్ఞాన వేదిక, (విద్యా విభాగం) డోర్‌ నెం. 27-1-1804, _ _బాలజీనగర్‌, నెల్లూరు - 524002. మొబైల్‌ : 94900 98912 వెల : రు. 10-00 ఆగ౧౫౬|| : | ౧/05 (్రగ/6ర1గ౧౧8|1.00గ.

పూర్వ రంగం

1993 సుప్రీంకోర్టు తీర్పు (ఉన్నికృష్ణన్‌) ఆర్టికల్‌ 21లోని 'జీవించెే హక్కును ఆర్టికల్‌ 45 లోని “విద్యా హక్కు తో కలిపి చూడాలన్నది. '14 సం॥। లోపు పిల్లలు ఆర్ధిక సామాజిక కారణాల వల్ల విద్యకు దూరం కారాదు. ఇదీ ఈతీర్పు సారాంశం. దీనివల్ల ౨1వ అధికరణానికి 21 (ఎ) సవరణ చేసి విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా మార్చాల్సి వచ్చింది. ఈ సవరణ 2002కు కానీ రాలేదు.

9 ఏళ్ళకు రాజ్యాంగ సవరణ (కోర్టు తీర్పు తర్వాత) జరిగితే 2 ఏళ్ళ

తర్వాత విద్యాహక్కు బిల్లు (2004) తయారైంది. ఎన్‌.డి. ఏ. దీన్ని పార్లమెంటులో

పెట్టకుండానే దిగిపోయింది. యు.పి.ఏ. 2005లో ఈ బిల్లును సవరించింది. 2006 కిది ప్రధాన మంత్రికి చేరింది. ఆయన దిన్ని హైలెవల్‌ గ్రూపుకు పంపారు. ఈ బిల్లు తేవడం కేంద్రానికి సాధ్యం కాదని ఈ (గ్రూపు తేల్చింది.

ఫలితంగా 2006 మోడల్‌ విద్వాబిల్లు రాస్ర్రాలపై భారం పెడుతూ వచ్చింది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు విద్యాహక్కు వీల్లు - 2008 డిసెంబరు 15న రాజ్యసభలో ప్రవేశ పెట్టబడింది.

;|

ఉచిత నిర్భంధ విద్యాహక్కుబిల్లు2౦008 .- బిల్లు నెం. 65/2008 చాష్టరు - 1: ఉవోద్దాతం

1, 2. కొన్ని నిర్వచనాలు - పరిధి :

-- దిన్ని “పిల్లల కోసం ఉచిత నిర్బంధ విద్యా హక్కు బల్ల” అని పిలవొచ్చు.

-- విద్యాహక్కు బిల్లు పరిధి జమ్మూ-కాళ్ళీర్‌ తప్ప మొత్తం దేశం

-- కేంద్రం గెజిట్‌లో ప్రచురించాక (ఉభయసభల ఆమోదం తర్వాత) ఇది అమల్లోకి వస్తుంది.

-- పిల్లలు అంటే 6-14 సం॥। పిల్లలు.

-- ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8 తరగతులు.

-- షెడ్యూల్‌ అంటే చట్టానికి చివరి అనుబంధం “షెడ్యూల్‌.

చాప్టరు - 2 ; ఉచిత నిర్బంధ విద్యా హక్కు

వి, ఉచిత నిర్బంధ విద్య ఓ హక్కు:

-- 6-14 సం॥ పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఈ బిల్లు హక్కుగా చేస్తుంది.

-- _ పరిసరంలోని బడిలో పిల్లలందరినీ 8వ తరగతి దాకా చదివించాలి.

-- ఏ బవీడ్దా ఫీజులు, ఇతర ఖర్చులు భరించాల్సిన అవసరం లేదు. ;

-- అంగ వైకల్యం గల పిల్లలకు కూడా ఈ హక్కు వర్తిస్తుంది.

త్తే ఆరెళ్ళు నిండితే :

-- 6 సం॥ పైబడ్డ పిల్లల్ని మధ్యలో బడిమానేసిన పిల్లల్ని వీరి స్థాయిని బట్టి ఆయా తరగతుల్లో చేర్చాలి. ఇలాంటి వారికి బోధన నిర్దిష్ట కాల పరిధిలో కల్పించాలి.

-- విరికి అవసరమైతే ప్రాధమిక విద్య పూర్తి చేయడానికి 14 సం॥ దాటినా అవకాశ మివాాలి. ం..

06116064! 5, ఉచిత విద్య: -- విద్య 14సం! వరకు ఉచితంగా అందాలి. -- మధ్యలో మరో బడికి మారాల్సి వస్తె ఆ సౌకర్యమూ పొందే హక్కు బాలలకుంటుంది. -- దీనికి తగ్గట్టు టి.సి. యివ్వాలి. _ _- టి.సి. ఆలస్యమైతే టి.సి. లేకున్నా స్కూల్లో చేర్చుకోవాలి. _- అలా టి.సి. ఇవ్వకున్నా బడిలో చేర్చుకోకున్నా హెడ్‌మాస్టరే బాధ్యుడు, చాష్టరు -3: ప్రభుత్వాల, స్థానిక సంస్థల, తల్లిదండ్రుల బాధ్యతలు 6. బడి అందుబాటు : _- బడి ఇందుకోసం పిల్లందరికీ నిర్దిష్ట దూరంలో వుండాలి. ఆలా ఇప్పటికీ లేకుంటే 3 సం॥॥ల లోగా ఎర్పరచాలి. -- ఇది సంబంధిత ప్రభుత్వం, స్టానిక సంస్థల బాధ్యత. గ ఆర్ధికం ; -- దీని కవసరమయ్యె నిధుల్ని సమకూర్చడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. ' _--=. కేంద్రం దీనికవసరమయ్యే మొత్తం ఖర్చుకు, ప్రతి సం।। అయ్యే ఖర్చుకు అంచనాలు రూపొందిస్తుంది. -- తన వాటా రాష్ట్రాలకు (గ్రాంటుగా కేంద్రం ఇస్తుంది. -- అదనంగా రాష్ట్రాల కివ్వాల్సిన అవసరం వుంటే ఆర్ధిక సంఘాన్ని సం(ప్రదిస్తుంది.

_- కేంద్రమిచ్చే పై అదనపు సాయంతో నిమిత్తం లేకుండా, తాను నిధుల్ని సమకూర్చుకొని కేంద్రపు రెగ్యులర్‌ వాటాను వాడుకొని రాష్ట్రం విద్యా హక్కును అమలు చెయ్యాల్సి వుంటుంది.

తే

అకడమిక్‌ సాయం :

-- కేంద్ర ప్రభుత్వం జాతీయ పాఠ్య ప్రణాళికను అకడమిక్‌ అధారిటీ ద్వారా రూపొందించాలి.

-- ఉపాధ్యాయుల శిక్షణా స్థాయి, నైపుణ్యం పెంపుదలకు ఏర్పాట్లు చేయాలి.

-- నృజనాత్మకత, పరిశోధన, (ప్రణాళికా రచన తదితర నైపుణ్యాలు పెంపొందించుకొనేందుకు రాష్ట్రాలకవసరమైన సాంకేతిక నైపుణ్యం అందించాలి.

8 సంబంధిత ప్రభుత్వ బాధ్యత :

-- ప్రభుత్వం ఉచిత నిర్భంధ విద్యావకాశం కల్గించడం సంబంధిత ప్రభుత్వాల బాధ్యత.

-- తల్లిదండ్రులు ప్రభుత్వేతర అన్‌ఎయిడెడ్‌ బడిలో పిల్లల్ని చేర్చుకొంటే ఆ ఫీజుల్ని ప్రభుత్వం నుంచి కోరే హక్కు వుండదు.

నిర్బంధ విద్య అంటే :

-- 6-14 సం॥। పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్య నందించడం.

-- నిర్బంధ ప్రవేశం, హాజరు, చదువు పూర్తి ఈ వయస్సు పిల్లలకుందేలా చూడ్డం.

--. ప్రతి బిడ్డకు పరిసరాల్లో బడిని అందుబాటులో వుంచడం. =

-- బలహీన వరాలకు (ప్రతికూల పరిస్థితు లెదుర్కొంటున్న వారికి ఏ రూపంలోనూ విద్యలో వివక్ష లేకుండా చర్యలు తీసుకోవడం. ;

-- బడికి గదులు, వసతులు, టీచర్లు, అభ్యసన సామగ్రి ఏర్పరచడం.

ఆజా ప్రత్యేక శిక్షణ (ప్రత్యేక పిల్లల కోసం) కల్పించడం.

-- పిల్లలు హాజరయ్యేలా చదువు పూర్తి చేసేలా పర్యవేక్షణ కల్పించడం.

-- నాణ్యమైన, స్థాయిగల ప్రాథమిక విద్య నందించడం.

-- కాలానుగుణమైన వాఠ్య ప్రణాళిక రూపొందించడం.

-- ఉవాధ్యాయులకు శిక్షణ నివ్వడం.

రే

  1. స్థానిక సంస్థల బాధ్యత : .

-- ఉచిత నిర్బంధ విద్య నందించడం.

ఆఆ స్థానికంగా పాఠశాల ఏర్పాటు.

-=- బలహీన వర్ణాల పిల్లలు తప్పనిసరిగా బడిలో చేరేలా, ఆటంకాలు లేకుండా చదువు పూర్తి చేసేలా చూడ్డం.

-- 14 సం! వరకు పిల్లల వివరాల సేకరణ, రిజిష్టర్ల నిర్వహణ -

-- పిల్లల్ని బడిలో చేర్చడం, చదువు పూర్తి చేసెలా చూడ్డం.

_- పాఠశాల గదుల ఏర్పాటు, టీచర్ల శిక్షణ, అభ్యసన సామగ్రి కల్పన.

జా ప్రత్యేక శిక్షణ లభించేలా చూడ్డం.

-- నాణ్యమైన విద్య అందేలా చూడ్డం.

-- టీచర్లకు శిక్షణ లభించేలా చూడ్డం,

-ం- వలస వెళ్ళేవారి పిల్లల్ని బడిలో చేర్చడం.

-- పాఠశాలల పర్యవక్షణ.

-- అకడమిక్‌ క్యాలెందడర్‌ని నిర్ణయించడం.

  1. తల్లిదండ్రుల బాధ్యత :

-_- తల్లిదండ్రులు, సంరక్షకులు తమ బిడ్డలను పరిసర (ప్రాథమిక పాఠశాలలో చేర్చాలి. క్ష

  1. పూర్వ ప్రాథమిక విద్య: .

-- 8-6 సం॥1ల మధ్య పిల్లలకు శైశవ దశలో సంరక్షణ, విద్య అందించే బాధ్యత కూడా సంబంధిత ప్రభుత్వానిదే. ఇది కూడా ఉచితంగా అందించాలి.

చాప్టరు - 4 : స్కూళ్ళ, టీచర్ల బాధ్యతలు

  1. పాఠశాల బాధ్యత :

--. ప్రభుత్వ పాఠశాలల్లో చెరిన పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యనందించాలి.

__ ఎయిడెడ్‌ పాఠశాల తనకు ప్రభుత్వం నుంచి ఎంత గ్రాంటు లభిస్తుందో

5్‌

ఆ మేరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. ఇది 25 శాతానికి తగ్గరాదు.

--. ప్రత్యేక స్కూళ్ళు (కేంద్రియ పాఠశాలలు వగైరా) ఒకటవ తరగతిలో 25 శాతం పిల్లల్ని బలహీనవర్దాల నుంచి తీసుకొని ప్రాథమిక విద్య ముగిసే వరకు ఉచిత నిర్భంద విద్య నందించాలి,.

-- ఈ ప్రత్యేక స్కూళ్ళలో పూర్వప్రాధమిక విద్య వుంటే 25% పిల్లలు బలహీన వర్గాల వారై వుండాలన్న సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది.

--. అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈవిధంగా చేర్చుకొన్నట్లయితే ఆ పిల్లలకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించాలి. ఈ ఖర్చు ప్రభుత్వం తన పాఠశాలల్లో చదివించేందుకు కయ్యె ఖర్చుతో సమానంగా వుంటుంది. ఒకవేళ ఈ పాఠశాలలు ఇంతకంటే తక్కువ మొత్తం ఫిజులు వసూలు చేస్తున్నట్టయితే అంతే ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. ప్రభుత్వం నుంచి భూమి, భవనాలు, పరికరాలు తదితరాలు ఉచితంగా లేదా రాయితీతో పొందివుంటే ఈ స్కూళ్ళకు ప్రభుత్వం నుంచి చదువు ఖర్చు పొందే అవకాశం వుండదు.

-- పతి పాఠశాల ఈ బాధ్యతనెలా నిర్వర్తిస్తున్నదీ వివరాలు (ప్రకటించాలి.

  1. ఫీజులు :

-- కాపిటేషన్‌ ఫీజు వసూలు చెయ్యరాదు. చేస్తే వసూలు చేసినదానికి 10రెట్లు . = అపరాధ శుల్కం చెల్లించాల్సి వుంటుంది. "

-- పిల్లలకెలాంటి ప్రవెశ పరీక్ష పెట్టరాదు. పెడితే మొదటిసారి రూ. 25వేలు, తర్వాతసారికి రూ. 50వేలు అపరాధం.

14 వయో నిర్ధారణ :

-- వయస్సు నిర్ధారణ లేదని ఎవరికీ ప్రవేశం లేకుండా చెయ్యరాదు

" --. వయస్సును జనన ధృవికరణ పత్రం ద్వారా నిర్ణయిస్తారు. 6౮

  1. అద్నిషన్లు : ॥

-- _అడ్మిషన్త సమయంలో ఎవ్వరిని నిరాకరించరాదు.

-- విద్యా సం॥ మధ్యలో చేరితే పిల్లలు ఆ సంవత్సరంలోనే తరగతి పూర్తి

  1. తొలగింపు

-- ఏ బిడ్డనూ అదే తరగతికి మళ్ళీ పంపరాదు. ప్రాధమిక విద్య పూర్తి అయ్యేలోపునే బహిష్మరించరాదు.

  1. వేధింపులు :

_- శారీరకంగా, మానసికంగా విల్లల్ని బాధించరాదు. అలాచేస్తే శిక్షార్చలవుతారు.

  1. పాఠశాల రికగ్నిషన్‌ :

_- ఈ బిల్లు అమల్లోకి వచ్చాక ఏ ప్రభుత్వేతర పాఠశాల రికగ్నిషన్‌ సర్టిఫికటు లేకుండా ప్రారంభించరాదు, నిర్వహించరాదు.

_- సంబంధిత అధారిటీ నిబంధనల మేరకు రికగ్నిషన్‌ ఇస్తుంది.

_-- నిబంధనల్ని ఉల్లంఘిస్తే రికగ్నెషన్‌ ఉపసంహరించుకోవచ్చు. -- రికగ్నిషన్‌ రద్దు చేయబడితే మరో దగ్గరి స్కూల్లో పిల్లల్ని చెర్చాల్సి వుంటుంది. ఏ స్కూల్లో చేర్చాలో రికగ్నిషన్‌ రద్దు చేసిన ఉత్తర్వులో తెలపాలి.

-- రికగ్నిషన్‌ ఉపసంహరించే ముందు నోబీసిచ్చి జవాబు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి.

-- రికగ్నిషన్‌ రద్దయ్యాక బడి నడపరాదు. నడిపితే రూ. 1,00,000/- అపరాధం చెల్లించాల్సి వుంటుంది. అయినా నడుపుతుంటే రోజుకు రూ.10,000/ -లు అపరాధం.

-- రికగ్నిషన్‌ నిబంధనలు, స్థాయి లేకుంటే రికగ్నిషన్‌ ఇవ్వరాదు.

7

  1. _రికగ్నిషన్‌ నిబంధనలు :

--. ఈ బిల్లుకు ముందే ప్రారంభించిన స్కూళ్ళు నిబంధనలమేరకు స్థాయిని, వసతుల్ని మూడు సం॥ల లోగా సమకూర్చుకోవాలి. అలాచెయ్యకుంటే రికగ్నిషన్‌ రద్దవుతుంది.

  1. కేంద్రం షెడ్యూలు : -- కేంద్రం పాఠశాల నియమనిబంధనలు, ప్రమాణాలు నిర్వచించాలి. ఈ షెడ్యూలును (నియమాలు, ప్రమాణాలు) కేంద్రం మార్చవచ్చు.

  2. పాఠశాల నిర్వహణా కమిటీ (5%%6) : -- అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలకు నిర్వహణా కమిటీ వుండాలి. -- ఈ కమిటీలో స్టానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, టీచర్లు వుంటారు. -- బలహీన వర్గాల పిల్లల తల్లితండ్రులకు వారి నిష్పత్తికి తగ్గ (ప్రాతినిధ్యం వుండాలి. -- ఈ కమిటి పాఠశాల పనిని పర్వవేక్షిస్తుంది. . ' 22, (ప్రణాళిక గ్రాంటు : క -- ఏగి! ౮ పాఠశాల అభివృద్ధి (ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ ప్లాను ఆధారంగానే గ్రాంటు/నిధులు వసాయి. క్ష -- పాఠశాల కొచ్చి నిధుల వ్యయాన్ని పర్వవక్షిస్తుంది. ... =. ప్రభత్వం ఆదేశించిన ఇతర విధుల్ని కూడా ఈ కమిటీ చేపట్టాల్సి వుంటుంది.

  3. ఉపాధ్యాయుల అర్హతలు, సర్వీసు రూల్సు :

-- ఉపాధ్యాయుడు తగిన అర్హతలతోనే నియమించబడాలి.

-- ఈ అర్బతల్ని కెంద్ర ప్రభుత్వ అకడమిక్‌ అధారిటీ నిర్ణయిస్తుంది.

ఆయా రామ్షైల్లో ఈ అర్హతగల వారు దొరక్కపోతే కేంద్రం ఈ అర్హతల్ని

ద్‌

కొంత కాలం సడలించవచ్చు. కాని ఇది 5 సం[[లు దాటరాదు.

-- ఈ బిల్లుకు ముందే నియమించబడ్డ ఉపాధ్యాయులు 5 సం॥లులోగా అర్హత సంపాదించుకోవాలి.

బా టీచర్ల జీతాలు, సర్విసు రూల్సు, ఇతర నిబంధనలు (ప్రభుత్వం

_ రూపొందించిన విధంగా వుంటాయి.

ఏడ ఉవాధ్యాయుల విధులు :

-ఎ- పని వేళల్ని ఖచ్చితంగా వాటించాలి. రెగ్యులర్‌గా బడికి హాజరు కావాలి.

-- పాఠశాల ప్రణాళికను నియమిత సమయంలో పూర్తిచెయ్యాలి.

-- ప్రతిబిడ్డ యొక్క అభ్యసన సామర్వాన్ని గుర్తించాలి. వెనుకబడితే తగిన అదనపు బోధన అందించాలి.

-- తల్లిదండ్రులతో రెగ్యులర్‌గా సమావేశాలు జరపాలి.

-- పిల్లల హాజరు, అభ్యసన స్థాయి, పురోగతి తదితరాలు వారికి వివరించాలి.

--. ప్రభుత్వం నిర్దేశించిన విధులు చేపట్టాలి.

-- వీటిని ఉల్లంఘిస్తే సర్వీసు రూల్స్‌ మేర శిక్షార్డులవుతారు.

-- శిక్షకు ముందు ఉవాధ్యాయుడికి వివరణ ఇచ్చుకొనే అవకాశం ఇవ్వాలి.

  1. ఉవాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి :

-- ఈ బిల్లు చట్టమైన 6 నెలల్లోగా ఉవాధ్యాయ విద్యార్ధి నివృత్తి నిబంధనలమేరకు సరిచెయ్యాలి.

= ఇది రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల బాధ్యత.

-- ఒక పాఠశాలలోని ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు టిప్యూటేషన్‌పై పంపి పై నిష్పత్తిని సరిచెయ్యరాదు.

౨౮. వోస్టుల ఖాలీలు :

-- ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్ల పోస్టుల్లో 10 శాతం మించి ఖాళీగా వుండరాదు.

ం

  1. బోధనేతర విధులు : | -- 10సం॥లకు ఒకసారి వచ్చి జనాభా లెక్కలు, అనుకోకుండా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల సహాయ ఏధులు, చట్ట సభల, స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ఇతర విధులకు టీచర్లను కేటాయించ రాదు.
  2. ట్యూషన్లు : --. ఏ ఉవాధ్యాయుడూ ప్రైవేట్‌ ట్యూషన్లు చెప్పరాదు. చాప్టరు - త్‌
  3. వాఠ్య ప్రణాళిక - ప్రాథమిక విద్యా పూర్తి : -- పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని రాష్ట్రప్రభుత్వ అధారిటీ నిర్ణయిస్తుంది. -- ఈ నిర్ణయం చేసేపుడు రాజ్యాంగం పేర్కొన్న విలువలకు లోబడి ఉండాలి. -- ఈ విషయంలో బిడ్డ సమగ్ర అభివృద్దిని దృష్టిలో వుంచుకోవాలి. -- ఇది బిడ్డ జ్ఞానాన్ని సామర్ధ్యాన్ని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా వుండాలి. -- అభ్యసనం కృత్యాధారంగా, అన్వషణాత్మకంగా, ప్రతిభను, శారీరక, మానసిక సామర్ధ్యాన్ని వెలికితీసేదిగా సాగాలి. -- ఆచరణకు వీలైన మెరకు మాతృభాష మీడియంగా ఉండాలి. + -- భయం, ఒత్తిడి, ఆందోళన లేకుండా బిడ్డ తన అభిప్రాయాలు స్వేచ్చగా చెప్పగల్లాలి. + -- బిడ్డ జ్ఞానాన్ని అవగాహనను, వీటిని వినియోగించుకొనే సామర్యాన్ని మూల్యాంకనం చెయ్యాలి. .
  4. సర్దిఫికేటు ? -- ప్రాథమిక విద్య పూర్తయ్యు వరకు ఎలాంటి బోర్టు పరీక్షలకు పిల్లలు హాజరు -- ప్రాధమిక విద్య పూర్తిచేసిన విద్యార్ధికి సర్టిఫికేటు ఇవ్వాలి. 10

_ చాప్లరు-6. లు

  1. పిల్లల హక్కుల పరిరక్షణ :

. -- జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణా కమిషన్‌ (1063260021 ౮౦౧ఘు38101 101 20160401 0% 016 1826 రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణా కమిషన్‌లు ఈ చట్టం మేరకు పిల్లలకు అందాల్సిన హక్కుల్ని పరిరక్షిస్తాయి

-- పిల్లల విద్వా హక్కురక్షణకు ఎర్పాట్లను సమీక్షించి, పరీక్షించి దిని అమలుకు ఏ చర్యలు తీసుకోవాలో ఇవి సిఫార్సు చెస్తాయి.

-- ఉచిత నిర్భంద విద్యపై వచ్చి ఫిర్యాదుల్ని విచారిస్తాయి.

-- పిల్లల హక్కుల చట్టాన్ని (0౧16 ౧1౩౧9 గంఏ అమలు చెయ్యడంలో ప్రస్తుతం ఈ కమిషన్లకున్న అధికారాలు ఈ బిల్లు ద్వారా పిల్లలకు సంక్రమించే హక్కుల రక్షణకు కూడా వుంటాయి.

-- ఇలాంటి కమిషన్‌ రాష్ట్రస్థాయిలో లేకుంటే ఈ అధికారాలు గల ఒక కమిషన్‌ను ఏర్పాటుచెయ్యాలి.

  1. ఫిర్యాదుల పరిశీలన ;

-- ఈ చట్టం కల్పించే హక్కులపై స్టానిక అధారిటీకి ఎవరైనా లిఖితపూర్వక ఫిర్యాదు చెయ్యవచ్చు.

ఆలా నిర్ధిష్ట సమయంలో ఇది ఈ ఫిర్యాదుల్ని పరిష్కరించాలి. సంబంధిత పార్టీలకు వివరణ నిచ్చుకొనె అవకాశం ఇవ్వాలి.

-- దీనిపై రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణా కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు.

-- _ అప్పీళ్ళను సదరు కమీషన్‌ పరిష్కరించాలి.

  1. కేంద్ర సలహాసంఘం :

-- కేంద వభుత్వం ఇందుకోనం ఒక జాతీయ నలహా సంవుం ఏర్పాటుచేయాలి.

క్షే

-- ఇందులో 15కు మించకుండా సభ్యులుండాలి. ఈ సభ్యులకు (వాధమిక

విద్యకు, పిల్లల అభివృద్ధికి చెందిన అనుభవపూర్వక పరిజ్ఞానం వుండాలి. “-- ఈ చట్టాన్ని సమర్దవంతంగా అమలు చేసేందుకు తగిన సూచనలివ్వడం ఈ సంఘం విధి.

-- విరి నియామకపు విధివిధానాలు, జీతభత్యాలు ప్రభుత్వం నిర్ణయించిన

మేరకు వుంటాయి. చాప్టరు -

  1. ప్రభుత్వాల బాధ్యత :

-- కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టం అమలుపై మార్గదర్శకాలు ఆదేశాలు ఇవ్వాలి. =

  • రాష్ట్రప్రభుత్వం స్టానికసంస్థలకు ఇదే మార్గదర్శకాలు, సూచనలు ఇవ్వాలి.

=. స్థానిక సంస్థలు పాఠశాల నిర్వహణ కమిటీలకు ఇలానే సహకరించాలి.

  1. శిక్షణాధికారాలు :
  • పాఠశాలల యాజమాన్వాలను (రికగ్నిషన్‌ తదితరాల పై) శిక్షించే ముందు సంబంధిత అధికారి నుండి అనుమతి పొందాలి.
  1. వ్యాజ్యాలనుంచి రక్షణ :
  • ఈ చట్టాన్ని అమలు చెయ్యడం కోసం సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర, సానిక ప్రభుత్వాలు, పాఠశాల నిర్వహణా కమిటీలు, పిల్లల హక్కుల పరిరక్షణా కమిషన్లు తీసుకొనే చర్యలపై కోర్టుల్లో ఎలాంటి కేసులు వెయ్యరాదు
  1. ప్రభుత్వాల అధికారాలు :
  • ఈ చట్టం అమలుకు ఆయా ప్రభుత్వాలు ఈ క్రింది అంశాలపై నియమ నిబంధనలు రూపొందించాలి.

  • _ 6సం। దాటినా బడిలో చేరని, చెరి మధ్యలో మానేసిన వారు వయస్సుకు తగ్గ క్లాసులో చేరినపుడు వారికివ్వాల్సిన ప్రత్యేక శిక్షణ

12

  • _ పరిసరపాఠశాల (62[00౪6గ1006 501001 పరిధి

  • _ 14ఉసం॥[వరకు వయస్సు గల పిల్లల వివరాల రికార్డుల నిర్వహణ

  • _ అన్‌ఎయిడెద్‌ స్కూల్స్‌కు ఫీజుల చెల్లింపు.

  • పిల్లల వయస్సు నిర్ధారణ కోసం ఇతర డాక్యుమెంట్స్‌

  • విద్యాసంవత్సరం మధ్యలో చెరిన పిల్లల చదువు పూర్తి

  • _ పాఠశాలల రికగ్నిషన్ల విధానం, అధారిటీ

-... రికగ్నిషన్‌ ఉల్లంఘనలపై విచారణలు, అప్పీళ్ళు

  • పాఠశాల నిర్వహణా కమిటీల ఇతర కార్యకలాపాలు

  • పాఠశాల అభివృద్ధి (ప్రణాళికా రచన.

  • ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, వేతనాలు.

  • ఉపాధ్యాయుల విధి నిర్వహణ

-.. టీచర్ల ఫిర్యాదులు.

_ =. ప్రాథమిక విద్యానంతరం ఇవ్వాల్సిన సర్టిఫికెట్‌

-.. పిల్లల హక్కుల పరిరక్షణా కమీషన్ల ఎర్పాటు, వాటి విధి విధానాలు

_ జాతీయ సలహామందలి సభ్యుల అలవెన్సులు ఇతర విధి విధానాలు.

చట్ట సభలకు జవాబుదారీ :

  • ఈ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం చేసే నియమాలు, ప్రకటనలు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ౩0 రోజులు వుంచాలి. ఈ కాల వ్యవధిని అవసరమైతే వెంట వెంట జరిగే సమావేశాల్లో తీసుకోవచ్చు. ఉభయ సభలు ఆమోదించాక మాత్రమే ఇవి అమల్లోకి వస్తాయి.

  • _ ఇదే సూత్రం రాష్ట్ర ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ప్రతి నియమాన్ని శాసన సభ, శాసన మండలి వంటి రాష్ట్ర స్ధాయి ఉభయ చట్ట సభల్లో ఆమోదం పొందాల్సి వుంటుంది.

కే -

షెడ్యూలు (నియమాలు - ప్రమాణాలు)

  1. 5వ తరగతి వరకు గల స్కూల్‌ అయితే
  • 60 మంది పిల్లల వరకు ఇద్దరు టీచర్లు
  • 61 నుండి 90 వరకు ముగ్గురు టీచర్లు
  • _ 91నుండి 120 వరకు నల్టురు టీచర్లు
  • 121 నుండి 200 వరకు ఐదుగురు టీచర్లు
  • 150 మందికి దాటితే ఒక హెడ్‌మాస్టర్‌ + ఐదుమంది టీచర్లు
  • 200 దాటితే హెడ్‌మాస్టర్‌ గాక ఉవాధ్యాయ విద్యార్ధి నిష్ఫత్తి 1:40 దాటరాదు. 2, 6 నుండి 8వ తరగతి వరకు ఉంటే...
  • సైన్సు, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలకు ఒక్కొక్క టీచరుండేలా కనీసం తరగతికొక టీచరు.
  • ప్రతి 35 మందికి కనీసం ఒక టీచర్‌
  • 100 మంది పిల్లలు దాటితే ఒక హెడ్‌మాస్టర్‌
  • చిత్రలేఖనం, వ్యాయామం, వృత్తి (పని) విద్యలకు పార్ట్‌టైం ఇన్‌(స్టక్టర్లు +
  1. భవనాలు =... ఒక టీచరుకు ఒకగది, హెడ్‌ మాస్టరు ఆఫీసు, స్లోరులకు కలిపి ఒకగది. -- వికలాంగుల ప్రవేశానికి అనుగుణంగా ఇవి వుండాలి.
  • బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు
  • మంచినీటి వసతి.
  • మధ్యాహ్న భోజనం కోసం వంటగది. ఆ ఆటస్థలం.
  • కంచె లేదా కాంపౌండ్‌ కర్మ
  1. పని దినాలు, పని గంటలు
  • 1నుండి 5 తరగతులకు 200 పనిదినాలు

  • 6-8 తరగతులకు 220 పనిదినాలు

  • కర్‌ తరగతులకు 800 గంటల పని గంటలు

  • 6-68 తరగతులకు 1000 పనిగంటలు

-- టీచర్లకు వారానికి టీచింగ్‌, సన్నద్ధతకు 45 పనిగంటలు

ర్‌ ఇతరవసతులు

  • _ ్రతి తరగతికి అవసరమైన బోధన, అభ్యసన సామగ్రి
  • వార్తాపత్రికలు, మ్యాగజైన్లతో పాటు పుస్తకాలు (కథా పుసకాలతో సహా) గల [గ్రంథాలయం -_ ప్రతి క్లాసుకూ అవసరమైన క్రీడాసామాగ్రి. ఈ బిల్లు లక్ష్యం

ప్రజాస్వామ్య మనుగడకు, పురోగతికి సమాన హక్కులు కల్పించడమే కీలకం. ప్రాధమిక విద్య ఈ హక్షుల్లో కీలకమైంది. దీన్ని గణణతంత్రంగా మనం అవతరించిన్సటి నుంచీ అందరం అంగీకరిస్తున్నాం. మన ఆదేశిక సూత్రాలు 14 సం॥ల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య నందించాలని స్వాతంత్రానంతరం (బ్రొాథమిక విద్యా వ్యాప్తిలో మనం ఎంతో పురోగతి సాధించాం. అయినా ఈ లక్ష్య సాధన పూర్తి కాలేదు. ప్రాథమిక విద్య పూర్తయ్యే లోపు బడి మానేసే పిల్లలు గణనీయంగా వున్నారు. వీరంతా బలహీన వర్గాల వారు. ప్రతికూల పరిస్థితుల్లో జీవనయానం సాగిస్తున్నవారు. ఇక ప్రాథమిక విద్య పూర్తి చేసినా, నాణ్యత ఎంత అనేది ప్రశ్నగానే వుంది.

-- రాజ్యాంగపు 865వ సవరణ (2002) ద్వారా ఆర్టికల్‌ 21-ఏ ప్రవేశ పెట్టబడింది. దీని ప్రకారం 6-14 సం॥ల లోపు పిల్లందరికీ ఉచిత నిర్బంధ విద్య నందించడం ప్రభుత్వ బాధ్యత.

-- దీని కనుగుణంగా ఈ “ఉచిత నిర్పంధ విద్యా హక్కు 2008 విల్లును చట్టం చెయ్యడానికి ప్రతివాదిస్తున్నాము.

కే5్‌

-- దీని ప్రకారం స్పష్టమైన నియమాలతో, ప్రమాణాలతో నడిచే పాఠశాలల్లో సంతృప్తికరమైన, సమానమైన, నాణ్యత గల పూర్తికాలపు ప్రాథమిక విద్య పొందె హక్కు ప్రతి బిడ్డకూ వుంటుంది.

-- ఆ మెరకు పాఠశాలల్లో ప్రవేశం, హాజరు, కొనసాగింపు, పూర్తి చెయ్యడం అనే బాధ్యతల్ని ప్రభుత్వానికి “నిర్బంధ విద్య” దఖలు చేస్తోంది.

-- ఉచిత విద్య అంటే ప్రాథమిక విద్యకోసం ఏ ఫీజులు, చార్జీలు చెల్లించాల్సిన అవసరం వుండకూడదు.

-- దీని అమలుకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్టానిక సంస్థలకు, తల్లిదండ్రులకు, పాఠశాలలకు, టీచర్లకు కొన్ని విధులు వుంటాయి.

-- బాలల హక్కుల పరిరక్షణ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగం వుంటుంది. వికేంద్రీకరింపబడ్డ విధానంలో ఫిర్యాదులు పరిష్కరింపబడతాయి.

-- ఒక న్యాయమైన, మానవీయ ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించాలంటే మనం సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం అనే విలువలకు కట్టుబడి పనిచేయాల్సి వుంటుంది. ఇది నాణ్యమైన, సమానమైన (ప్రాథమిక విద్య

'_ నందించడం ద్వారానే సాధ్యం. ఇదే ఈ బిల్లు సారం.

-- ఇందుకోసం బలహీన వర్షాల, ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటున్న వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సి వుంటుంది. ఇది కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ళ బాధ్యత మాత్రమే కాదు. ప్రభుత్వ నిధులు పొందని (పైవెటు) పాఠశాలల క్కూడా ఈ బాధ్యత వుంటుంది.

-- _ రాజ్యాంగపు 21-ఏ ఆర్టికల్‌కు అనుగుణంగా ఈ బిల్లు చట్టమవుతోంది.

-- పై లక్ష్యాన్ని సాధించడం కోసమే ఈ బిల్లు.

ఈ బిల్లుపై సూచనలు ఈ కింది చిరునామాకు పంపండి :

[౧మంండుం,

౨2్రజంంల0ట407” 50068 ౦౦[ిుళ66 09 మ 101

వయటంజ6ం0 911,

ణంగజటుం06 904జాజటు (టఊరుులం, ౫న” 0౧91.

16

అనుబంధం -1

2005 విద్యాహక్కు బిల్లుకు 2008 బిల్లుకూ తేడా ఏమిటి?

మొదట 2004లో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం విద్యాహక్కు బిల్లు రూపొందించింది.

ఈ బిల్లుపై తీవ్రదుమారం రేగింది. కనీస బాధ్యత నెత్తికెత్తుకోకుండా బాధ్యత

లేని బిల్లును జనంమీదికి వదిలిపెడుతోందని తీవ్ర విమర్శ ఎదుర్కొన్న నేపధ్యంలో

పార్లమెంటు ఎన్నికలొచ్చాయి. అంతటితో దానికథ ముగిసింది.

యు.పి.ఏ. ప్రభుత్వం వచ్చాక కేబ్‌కి (08౬) అప్పగించి బిల్లు 2005లో తయారు చేయించింది. దీనిపై విసృత చర్చ జరిగింది. అసలు విద్యను ఒక హక్షుగా గుర్తించి చర్చ జరపడం ఇదే మొదటిసారి. ఈ బిల్లు చాలా “పదునుగా వుందని కొందరు, చాలా పేలవంగా వుందని ఇంకొందరు, మాకు వ్యతిరేకమని ప్రైవేటు స్కూళ్ళ యజమానులు, మాకు శత్రువని టిచర్ల సంఘాలు, మాకు భారమని ఆర్ధిక ప్రణాళకాశాఖలు యుద్ధం ప్రకటించాయి. దీంతో దీనికి కాలం చెల్లింది.

ఆ తర్వాత మోడల్‌ విద్యాహక్కు బిల్లు 2006 గుట్టు చప్పుడుకాకుండా వచ్చింది. రామ్ర్రాలకు దీన్ని పంపి, ఇలాంటి బిల్లులు తయారుచేసుకొమ్మని కేంద్రం ఉచిత సలహా ఇచ్చి సరిపెట్టుకొంది. ఎంత రహస్యంగా ఇది వచ్చిందో అంతే గోప్యంగా దీని కథ కంచికి చేరుకొంది.

ఇపుడు 2008 విద్యా బిల్లు మనముందుంది.

ఈ క్రమంలో 2005 బిల్లును నమూనాగా తీసుకొంటే 2008 బిల్లు నాటికి వచ్చిన మార్పు లేమిటి? దీన్నిబట్టి (ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పును పసిగట్టవచ్చు.

  • 2005 బల్లు చాప్టరు ౮ శీర్షిక “ఉచిత, నిర్బంధ, సమానమైన నాణ్యతగల విద్య పిల్లల హక్కు” అని పేర్కొంది. 2008 కొచ్చెసరికి “సమానమైన నాణ్యతగల” అనేది మాయమైంది. కొఠారీ పెర్కొన్న *'కామన్‌ స్కూళ్ళు సమానమైన విద్యకోసం వుద్దేశించినవి. “నాణ్యత అనేది నేటి విద్యకు తప్పనిసరి అవసరం. ఈ రెండూ ఉద్దేశపూర్వకంగానె ఈ బిల్లునుంచి కనుమరుగయ్యాయి.

_ 2005 బిల్లు కాజు ౩ ఈ బిల్లు వచ్చెప్పటికి 6 సం॥ దాటిన 7-9 సం॥|

క్షే

మధ్య పిల్లలను 1 సం॥ లోపల, 9-14 సం॥। పిల్లలను 3 సం॥ల లోపల బడిలో చెర్పాలని స్పష్టంగా పెర్కొంది. క్లాజు 6 లోనూ ఈ స్పష్టత వుంది. 2008 బిల్లులో ఇంత నిర్దిష్టంగా ఎక్కడా కన్పించదు.

  • 2005 బిల్లు కాజు 4 లో ఇతర రాష్ట్రాలకు మారాల్సి వచ్చినా ఓడ్డకలా మారే హక్కువుంది. కొంత రక్షణావుంది. న్ధానిక ప్రభుత్వం పరిసర . పాఠశాలను ప్రతి బిడ్డకూ చూపితీరాలన్న నిబంధన వుంది. 2008 బిల్లులో ఈ ప్రసావన లేదు.

  • 2005 బిల్లు చాఫష్టరు 3లో విద్యాహక్కు ఆయా (ప్రభుత్వాల బాధ్యత (రెస్పాన్సిబిలిటి అని వుంటే 2008 బిల్లులో విధి (డ్యూటీ) అని వుంది. బాధ్యతకీ, విధికి తేడా ఏమిటో న్యాయపండితులే చెప్పాలి.

  • _ 2005 క్షాజు 7లో 3-6 సం॥ల పిల్లలకు ఐసిడియస్‌ ద్వారా సంరక్షణ, విద్య అందించేందుకు రాష్ట్రం కృషి చెయ్యాలని వుంది. 2008 బిల్లులో ఈ కాజు కనుమరుగైంది.

  • 2005 బిల్లు క్లాజు 8లో ఇప్పటికి బడికిపోని, మానేసిన యువతకు 18 ఎళ్ళదాకా ప్రాథమిక విద్య పూర్తిచేసే హక్కు వుంది. ఈ వయోపరిమితి అవకాశం 2005 బిల్లులో లేదు.

  • 2005 బిల్లు క్షాజు 9లో విద్య ఉమ్మడి బాధ్యత అంటూనే కేంద్రానికి నిర్దిష్ట బాధ్యతల్ని పెర్కొంది. ఓ ఫార్ములా (మకారం కేంద్రం ఇవ్వాల్సిన నిధులివ్వాలని, సాంకేతిక సాయం అందించాలని, వనరుల సపోర్టు, దేశంలోని మంచి అనుభవాల నందించాలనీ పర్యవేక్షించాలని వివరంగా స్పష్టంగా వుంది. 2008 బిల్లులో అస్పష్టంగా కేంద్ర బాధ్యతను పేర్కొని ఇవన్నీ వదిలేశారు.

2005 బిల్లు కాజు 10లో స్థానిక సంస్థలకు రాష్ట్రం సహకారం అందించాలని

వుంది. ఎన్ని స్మూళ్ళు, ఏట వసతులు అదనంగా అవసరమో లెక్కించి అవి

చెకూర్చాలని వుంది. 2008 బిల్లులో దీనిపై స్పష్టత లేదు.

  • _ 2005 బిల్లు క్లాజు 11లో 6 నెలల్లోగా టీచర్ల శిక్షణకు, సామర్ధ్యంపెంపుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని వుంది. దీన్ని 5 సం లోగా అమలు చెయ్యాలని వుంది. 2008 బిల్లు ఈ టీచర్ల నాణ్యతపట్ల, శిక్షణపట్ల పెద్దగా (శ్రద్ధ చూపినట్లు కన్పించదు.

18

  • 2005 బిల్లు కాజు 12లో స్థానిక సంస్థలకు అధికారాలవ్వాలసి పేర్కొంటే 2008 బిల్లు దీనిపై మౌనం పాటించింది.

  • _ 2005 బిల్లు క్లాజు 18లో పాఠశాల నిర్వహణా కమిటీలు (యస్‌. ఎం.సి.లు) పాఠశాల ప్రణాళికలు రూపొందించాలనీ వీటి ఆధారంగా రాష్ట్రం; దాని ఆధారంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధంచేయాలని అట్టడుగునుంచి వికేంద్రీకృత ప్రణాళికా రచనను ప్రోత్సహించింది. 2008 బిల్లులో ఈ ప్రసావన లేదు.

  • 2005 బిల్లు కాజు 14లో అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు తమ పరిసరాల్లోని బలహీన వర్గాల పిల్లల్ని రాండమ్‌గా గుర్తించి 25 శాతం చెర్చుకోవాలని వుంది. ఈ ఎంపిక వారదర్శకంగా వుండాలని, దీన్ని ముందుగా ప్రకటించి ప్రచారం చెయ్యాలని, ఇలా చేర్చుకొన్న వారినందరినీ ప్రాథమిక విద్య పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈ స్మూళ్ళదేనని చాలా పదునుగా పేర్కొంది. 2008 బిల్లులో “25 శాతం పిల్లల్ని చేర్చుకోవాలి” అనేసి ఊర్భాంది.

  • 2005 బిల్లు క్షాజు 16లో ఏడాది పొడవునా అడ్మిషన్లు చేసుకోవాలనీ, _ ఎప్పుడూ నిరాకరించరాదని, బడి తెరిచిన 4 నెలల లోపు చేర్చుకోవాల్సి వస్తే అదే ఏడు అదనపు బోధన అందించి ఆ తరగతి పూర్తిచేియించాలని వుంది. 2008 బిల్లు దీన్ని దాటవేసింది. ఏడాది మధ్యలో చేర్చుకోవాలని చెప్పి సరిపెట్టుకొంది.

  • 2005 బిల్లు క్లాజు 17 ప్రైవేటు స్కూళ్ళ రికగ్నిషన్‌పై కఠినంగా వ్యవహరించింది. ఇప్పటికే రికగ్నిషన్‌ పొందిన స్కూళ్ళ రికగ్నిషన్‌

కొనసాగుతుందని పేర్కొని, విల్లు తర్వాత ప్రారంభించే స్కూళ్ళు రికగ్నిషన్‌

లేకుండా నడవరాదని, ఈ చట్టం మేరకు రాష్ట్రాలు ప్రస్తుత చట్టాల్ని

సవరించాలని, ౩ ఏళ్ళలోగా ఇప్పుటి స్మూళ్ళన్నీ కొత్త నిబంధనల కనుగుణంగా

వసతులు సమకూర్చుకోవాలని లేకుంటే రికగ్నిషన్‌ రద్దవుతుందని పేర్కొంది. 2008 బిల్లులో ఈ క్లాబే లేదు.

  • _ 2005 బిల్లు క్షాజు 22 పాఠశాల నిర్వహణ కమిటి (ఎస్‌.యం.సి.) స్వరూపం, విధి విధానాలపై విసృతంగా పేర్కొంది. ఎస్‌.యం.సి.లో 3/4 వంతులు తల్లిదండ్రులుండాలని, వాటిలో 56, 57, 86, మైనారిటీలకు (వ్రాతినిధ్యం

గం

వుండాలని పేర్కొంది. మిగతా వారు స్థానిక సంస్థత్నించి, టీచర్ల నుంచి, విద్యాఖమానుల్నించి వుండాలని చెప్పింది. 2008 బిల్లు ఇంత ఖచ్చితంగా పేర్కొనలేదు. ఇదే క్షాజు పాఠశాల ఆస్తులన్నీ ఆ కమిటీకి అప్పజెవాలని, వాటిని ఈ కమిటియే నిర్వహించాలని పేర్కొంది. అక్కడితో ఆగక టీచర్ల పనితీరు పర్యవేక్షణ, [గ్రాంట్లు పొంది జీతాల చెల్లింపు, తప్పుచేస్తే జీతాల్లో కోత, లీవు మంజూరు, మైనర్‌ శిక్షలు, గ్రాంట్ల వాడకం, దానికి అకౌంట్స్‌, వాట్‌ ఆడిటింగ్‌ ఇదంతా 5446 బాధ్యతలుగా పెర్కొంది.

2008 బిల్లు ఈ అధికారాల్ని దాదాపు అన్నిటినీ తొలగించింది.

  • 2005 బిల్లు క్లాజు 23 టీచర్లు ఈ బిల్లు తర్వాత ఏదో ఒక స్ఫూలు ఎన్నుకోవాలని, ఇక వారికి బదిలీలు వుండవని, వీరి నియామకాలు సైతం 5/46లే చేస్తాయని పేర్కొంది. దీనిపై ఉవాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. 2008 బిల్లు ఈ క్షాజును పూర్తిగా తొలగించేసింది.

  • _ 2005 బిల్లు క్షాజు 24లో ప్రభుత్వం మొత్తం టీచర్ల పోస్టుల్లో 10 శాతం మించి ఖాళీగా వుంచరాదని, అర్బన్‌లో ఎక్కువ, గ్రామాల్లో తక్కువ టీచర్లుండే పద్ధతి పనికిరాదని, డొనేషన్లు కుదరవని పెర్కొంది. 2008 బిల్లు ఈ క్షాజునూ తొలగించింది.

= 2005 బిల్లు క్లాజు 25లో టీచర్లు ౫0౫౬ పేర్కొన్న అర్హతలతోనే సియమింపబడాలని వుంది. అలాంటి వారు దొరకాలంటే కేంద్రం నుంచి అనుమతి పొందాలని వుంది. అన్‌ఎయిడెడ్‌ స్కూళ్ళకీ ఇదే సూత్రం వర్తిస్తుందని, ఇప్పటికే పనిచేసే టీచర్లు 5 ఏళ్ళలో ఈ అర్హతలు పొందాలని, టీచర్లు ఇలా అర్హతలు పొందేదాకా అయ్యేఖర్చు యాజమానాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ చివరి మాట 2008 బిల్లులో లేదు. మిగతావికూడా అస్పుష్టంగా మాత్రమే వున్నాయి.

  • _ 2005 బిల్లు క్లాజు 26లో టీచర్లు తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధి వివరాలు రెగ్యులర్‌గా తెలియపరచాలని, డ్యూటీలో విఫలమైతే శిక్షార్హులని వుంది. 2008 బిల్లులో ఇంత గట్టిగా ఈ అంశం లేదు.

  • 2005 బిల్లు క్లాజు 27లో ప్రభుత్వ స్కూళ్ళ టీచర్ల పనితీరుపై రిపోర్టుల తయారీ అధికారం 5/46 లకు, స్థానిక సంస్థలకు వుంది. విచారించేపుడు ఫిర్యాదు వచ్చిన టిచరు 540కి హాజరుకారాదని, ఒకవేళ 11/4 మీదనే

  • 20

ఫిర్యాదువస్తే ఆయనా హాజరు కారాదనీ వుంది. 2008 బిల్లులో ఇదంతా తీసేశారు.

  • 2005 బిల్లు క్లాజు 29లో అకడమిక్‌ అంశాలపై చాలా స్పష్టతవుంది. బోధన విద్యార్ధి కేంద్రంగా, పిల్లలకు స్నేహంగా, వుండాలనీ, పిల్లల అభిప్రాయాల్ని గౌరవించాలనీ, వారి న్వంత జ్ఞానం, పరిసరాలు, సంస్క బతి, భాష్క (ప్రతిభ, వ్యక్తిత్వం ఇవన్నీ విద్యలో పరిగణలోకి తీసుకొని గౌరవించాలని పేర్కొనడం విశేషం, మూల్యాంకనం సమ(గ్రమైందిగా, . నిరంతరమైందిగా వుండాలనీ చెప్పడం ప్రత్యేకత. 2008 బిల్లులో ఇంత వివరంగా చెప్పకుండా ఒక మేరచెప్పి సరిపెట్టుకొన్నారు.

  • 2005 బిల్లు కాజు 32లో 1౫6౮౬ శిక్షణకోసం నియమాలు, ప్రమాణాలు

రూపొందించాలని, దీనికతగ్గ ఏజెన్సీలు నెలకొల్పాలని, ఇన్‌ సర్వీసు శిక్షణలు అవసరమని, అకడమిక్‌ సపోర్టు [1౧౬ బాధ్యత అనీ, ఉపాధ్యాయులు తమమధ్య అనుభవాలు పంచుకోడంద్వారా, వినూత్న సృజనాత్మక కృత్యాలు

_ చెయ్యడం ద్వారా అభివృద్ధి చెందడాన్ని ప్రోత్సహించాలని వుంది. 2008

__బిల్లుదీన్ని తొలగించింది. .

  • 2005 బిల్లు కాజు 38 చాలా విలువైంది. ఈ బిల్లు చట్టమయ్యాక అమలుపరచడానికి, అమలును పర్యవేక్షించడానికి ఓ చట్టబద్ధ సంస్థ అవసరమని ఈ క్లాజు చెపుతుంది. ఇందుకోసం జాతీయ ప్రాథమిక విద్యా కమీషన్‌ను ఇది ప్రతిపాదించింది. దీనికి విద్యారంగంలో విశేషానుభవంగల ప్రముఖ వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని, (ప్రాథమిక విద్య, వెనకబడ్డ వర్ణాల

అభివృద్ధి, పిల్లల హక్కుల సంరక్షణ, ఆర్ధిక రంగం, న్యాయ రంగంలలో అనుభవమున్న వారిని ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించాలని, మెంబర్‌ సెక్రటరీగా పాఠశాల విద్యలో అనుభవంగల వ్యక్తి వుండాలని చెప్పింది. ఈ కమిటీని ప్రధాని, స్పీకర్‌, 44480 మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సూచిస్తే రాష్ట్రపతి నియమిస్తారని పేర్కొని దినికి మొత్తం అధికారాల్ని అప్పగించింది. పార్లమెంటుకు దీన్ని జవాబుదారి చేసింది. ప్రతి సంవత్సరం నివేదికలు పార్లమెంటుకు ఇవ్వాలని పేర్కొని దీని చర్యలు వ్యాజ్యాలకు అతీతమని = రక్షణకల్పించింది. రాష్ట్రాలు కూడా ఇలాంటి కమీషన్‌ను నియమించాలనింది. ఈ బీల్లుకిది గుందెకాదు. అ

2008 బిల్లు దీన్ని పూర్తిగా తొలగించింది. జాతీయ ప్రాథమిక విద్యా కమీషన్‌ స్థానంలో జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణా కమిషన్‌కు బాద్యత లపవ్పగించింది. అదనవు అదికారాలు ఈ బిల్లుకోనం ఈ కమీషన్‌కుంటాయని, రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి ఇదేకమీషన్‌ ఈ చట్టాన్ని పర్యవేక్షిస్తుందని పేర్కొంది. నామమాత్రపు సలహా మండలితో సరిపెట్టింది.

  • 2005 బిల్లు 46 క్లాజులో ఈ చట్టం అమలుపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని, చేసిన 90 రోజుల్లో సమాధానం స్థానిక ప్రభుత్వం, 5446 ఇవ్వాలని, వీరి చర్యపై అప్పీలు చెయ్యవచ్చునని, ఆపై రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు సమాధానం ఇవ్వాల్సి వుంటుందని పేర్కొంది. 2008 బిల్లు దీన్ని తొలగించింది.

  • _ 2005 బిల్లు 47వ క్లాజు రాష్ట్రస్తాయి రగ్యులేటరీ ఆధారిటీ వుండాలని పేర్కొంది. 2008 బిల్లులో ఈ ప్రస్తావన లేదు.

  • 2005 బిల్లు 4&ఉ8ివ క్లాజు పిల్లల్ని ప్రాధమిక విద్యకు దూరంచేసే వారిపై చర్వకు, రు. 10 వేలు మొదట అపరాధం ఆ తర్వాత ప్రతి రోజూరు. 10 వేలు అపరాధం వేసేందుకు అవకాశం కల్పించింది. 2008 బిల్లులో ఇదిలేదు.

  • 20005 బిల్లు 49 క్షాజు 5 సం॥ 10 నెలలు నిండగానే బడ్డను బడికి పంపడం తల్లిదండ్రుల బాధ్యతగా పెర్కొనింది. ఇది నిర్భంధం. అలాచెయ్యని తల్లిదండ్రులకు “సామాజిక సేవ”ను శిక్షగా విధించింది. 2008 బిల్లులో ఇదిలెదు.

నారాంశం 2005 బిల్లు 6485 కమిటీ చాలా కూలంకషంగా చర్చించి విద్యావేత్తలు, క్షేత నిపుణులు రూపొందించింది. ఇది చర్చకు వచ్చెప్పటికి బహుముఖదాడి జరిగింది. విద్యారంగ మేధావులు, సంస్థలు మరింత పదునుగా వుండాలని కోరాయి. కానీ ప్రణాళికా సంఘం, (ప్రైవేటు యాజమానులు, రాజకీయ శక్తులు దీన్ని నీరుగార్చ ప్రయత్నం చెశాయి. టీచర్లు 5446 పై పోరాటం చేశారు. అందర్నీ సంతృప్తి పరచడానికి జరిగిన ప్రయత్నం 2008 బిల్లు. ఫలితం సారంలేని చట్టం! ప్రధానంగా అదనపు నిధులు కేంద్రం ఇవ్వాలి. దీనికోనిధి వుండాలి. 22

దీన్ని దాటవెయ్యడం ఈ బిల్లు ప్రధానలోపం.

రెండోది అమలు, పర్యవేక్షణ బాలల హక్కుల పరిరక్షణాకమిషన్లకు అప్పచెప్పడం, ఆ కమీషన్లకు అధికారాలివ్వకపోవడం అన్యాయం. చాలా రాష్ట్రాల్లో ఈ కమీషన్లే లేవు. కేంద్ర రాష్ట్రస్తాయిల్లో చట్టబద్ధ విద్యా కమీషన్‌లు లేకుండా దీనికి న్యాయం జరుగదు. ఫిర్యాదులపరిష్కారం, అమలుపై నిఘా, బాలకార్మికుల విముక్తి, యజమానులపై చర్య, ప్రైవేటు స్కూళ్ళ నియంత్రణ వీటన్నిటికి చట్టబద్ధ అధికార వ్యవస్థ కేంద్ర రాష్ట్ర మండల, గ్రామ స్థాయిల్లో అవసరం. మెజిస్టీరియల్‌ అధికారాలుసైతం వీటికుండాలి.

మూడోది అకడమిక్‌ అంశం. విద్య అక్షరాలు నేర్పడంకాదు. సమాచార సం[గ్రహణమూ కాదు. కొన్ని విలువలు దానికి కీలకం బోధన ఒక ప్రజాస్వామిక సృజనాత్మక ప్రక్రియ. ఇదొక సాంస్కృతికాంశం. పిల్లలు సజీవ మూర్తులు. గత బిల్లులో ఈ అంశాలకు పెద్దపీట వుంది. క్రమంగా ఇది కనుమరుగ్గావడం, 16౫౬ లాంటి సంస్థల్ని నిరాకరించడం చదువు సారాన్ని తొలిచెయ్యడమ.

.... నాలుగోది స్థానిక పర్యవేక్షణా యంత్రాంగం, పాఠశాల స్థాయిలో ఎవరు పట్టించుకొంటారన్నదే కీలకం. ప్రపంచవ్యాప్త అనుభవమిదే. 5/46 లను పెట్టి వీటికి నిధులు లేక, అధికారాల్లేక పెద్దమనుషులుగాను, రాజకీయాథ్రితుల్లాను వుండమనడంవల్ల పైనుంచి ఏం చేసినా ఫలితం వుండదు.

ఏమైనా ఎవరితోను ఘర్షణకు పోకుండా, లౌక్యంగా బిల్లును ముందుకు నెట్టాలని కొందరు విద్వాభిమానులు, పిల్లల హక్కుల ప్రేమికులు చేసిన ప్రయత్నం ఇందులో స్పష్టం. ఏమేరకు వస్తే అమేరకు మేలు అనె తత్వం అనుభవం వీరికి నేర్పింది!

దానికైనా మన రాజకీయ వ్యవస్థ అంగీకరిస్తుందా? వేచిచూడాలి. ర.

అనుబంధం - 92 కొన్ని అంశాలు - కొన్ని ప్రశ్చలు విద్యా హక్కు బిల్లు 2005లో వచ్చాక, ఒక అకడమిక్‌ సెక్షన్‌లో దినిపై కావల్సినంత చర్చజరిగింది. ఇది చాలా చిన్న సెక్షన్‌. బుద్దిజీవుల సెక్షన్‌. ఏిరి .._ విమర్శల్లో చాలా వాస్తవాలున్నాయి, కానీ కోడిగుడ్దుకు ఈకలు పికారన్న అపప్రధా వుంది. రెడీమేడ్‌ విమర్శలు కొందరివైతే అమాయక (భ్రమలు ఇంకొందరివి. చర్చ ఢిల్లీ హోటళ్ళకు పరిమితం కావడం, దాన్నలాగే కొందరు వల్లి వేయడం జరిగింది తప్ప కిందికి దిగి రాలేదు. విసృత శ్రేణుల్లోకి వెళ్ళలేదు. ఏ రాజకీయ పార్టీకి ఇది అజెండానే కాలేక పోయింది. కేరళ లాంటి రాహ్రాల అనుభవాల్లోంచి, క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి, ప్రస్తుత రాజకీయాల స్వరూప స్వభావాల్లోంచి, ఆచరణలో ఏం చెయ్యగలమా - తాత్కాలికంగా ఏం సాధ్యమా, దిర్హ కాలికంగా ఏం వాంఛనీయమా అన్న స్పృహతో, బాధ్యతతో జరిగిన చర్చ చాలా తక్కువ. ఎవరి నష్టాన్ని వారు ఎత్తి చూపారు. ప్రణాళికా సంఘం దిని మొదటి విరోధి. నిధుల్లేవని, సాధ్యం కాదని, రాష్ర్టాల బాధ్యత అని అది ఈ బిల్లును నీరు గార్చింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ మీద సర్కారు పెత్తన మెమిటని ఎదురు తిరిగాయి. సి.ఐ.ఐ. రంగంలోకి దిగింది. టీచర్ల సంఘాలు తమ హక్షుల్ని హరిస్తోందని ఎస్‌.యం.సి.లను ఎదుర్కొన్నాయి. మొత్తం మీద దీన్ని కావాలనే నాథుడు కరువయ్యాడు. ప్రణాళికా సంఘాన్ని ప్రైవేట్‌ యాజమాన్వాల్ని వంటరి చేసి సవరణలతోనైనా ఈ బిల్లు చట్టం గావాలని అడిగే ప్రజాస్వామిక శక్తులు కరువయ్యాయి. అరవై ఏళ్ళ భారతంలో మన పిల్లల పట్ల మనకున్న స్పృహ ఇది! సరే, ఈ చర్చలో వచ్చిన కొన్ని ప్రశ్చ్నల్నిపుడు చూద్దాం. యే. 6-14 సం॥। పిల్లలు : పిల్లల్ని 6-14 సం॥గా నిర్వచించడం వల్ల 3-5 సం।॥। పిల్లలు శిశువిద్యను కోల్పోయారని, ౧-3 సం॥। పిల్లలు సంరక్షణను కోల్పోయారని ఒక విమర్శ వుంది. ప్రస్తుతం 10వ తరగతి వరకు విద్య అవసరం కాబట్టీ కనీసం 16 సం॥। దాకా పొడిగించాలన్‌, 18 సం॥ల వరకు పిల్లలేననీ రెండు వాదనలు వున్నాయి. రాజ్యాంగానికి 21-ఏ సవరణ (2002) చేసినపుడే 6-14 సం॥ పిల్లలు అని నిర్వచించారు. అప్పుడు పార్లమెంటులో ప్రశ్నించిన నాధుడు లేడు. ఆ సవరణకు చట్టబద్ధత కల్పించేటట్లు వచ్చినపుడు చర్చ కిందికి 24

దిగేప్పటికి సహజంగానే ఈ ప్రశ్న తలెత్తింది.

ప్రాథమిక విద్యను నియత విద్యగా గుర్తించి, నిర్జ్వంధం చేయడం ఈ బిల్లు లక్ష్యం. మరి శిశు విద్యను కూడా నిర్బంధం చెయ్యవచ్చా? ప్రైవేటు స్కూళ్ళ ఎల్‌.కె.జి., యు.కె.జి.లు శాస్రీయమైనవా? ఏ దేశంలోనైనా మూదేళ్ళ పిల్లల విద్య నియత విద్యగా పేర్కొంటారా? అనేవి మరోవైపు నుంచి వచ్చే ప్రశ్నలు. కొన్ని దేశాల్లో 6 ఏళ్ళు పూర్తయ్యాక విద్య ప్రారంభిస్తారు. అప్పటి దాకా బాల్యాన్ని బాల్యంగా కాపాడుతారు. ఏమైనా తల్లిదండ్రులకు పసి బిడ్డల్ని మహా విద్యావంతుల్ని చెయ్యాలన్న దుగ్ధ, దీన్ని వ్యాపారం చేసుకొనే వ్యాపార విద్యా వ్యవస్థ వెర్రి తలలు వేస్తున్న వేళ ఈ ప్రశ్న రావడం సహజమే! 3-5 సం॥లకు శిశు సంరక్షణా వ్యవస్థ బలీయంగా, అది బడికి అనుబంధంగా వుండగల్లితే బాగుండు నన్పిస్తుంది. దీన్ని శిశు “విద్య”

అనడం న్యాయం కాదేమో!

  1. ఉచిత విద్య: ఉచిత విద్య అంటే ఫీజుల్లేని విద్యేనా? బలహీన వర్ణాల పిల్లలు బడికి రావడమంటే కొంత ఆదాయాన్ని కోల్పోవడం. అదనపు ఖర్చును భరించడం. యూనిఫారం, పుస్తకాలు, ఇతర సామగ్రి, రవాణా ఇవన్నీ కూడా వాళ్ళ పాలిట “ఫీజులే”. వీటి ప్రస్తావన ఈ బిల్లులో లేదు. కనీసం కొన్ని సెక్షన్లకు వీటి నందించాలి. అలాగే మంచి మధ్యాహ్న భోజనమూ అందించాలి.

  2. _ నిర్బంధం ఎవరికి? నిర్బంధ విద్య అంటే నిర్బంధం ఎవరికి? ఇది

తల్లిదండ్రులకు కాదు, ప్రభుత్వాలకు. ఈ స్పష్టత ఈ బిల్లులో లేదు. గత బిల్లులో

(2005) తల్లిదండ్రులు బిడ్డకు 6 సం॥ కాగానే బడిలో చేర్చాలని, లేకుంటే

సామాజిక సేవను శిక్షగా అనుభవించాలని చేర్చి చేతులు కాల్పుకొన్నారు. దీనిపట్ల

తీవమైన నిరసన వ్యక్తమైంది. అదే సందర్భంలో తల్లిదండ్రులకేమీ బాధ్యత లేదనడమూ అర్ధరహితం. ఏదో కొంత ఒత్తిడి వారిపైనా అవసరం. 25

  1. పరిసరాల స్మూళ్ళు (౫648%004100006 5010019) : నిర్దిష్ట జనాభాకు నిర్దిష్టంగా ఒక స్కూలు వుండాలని దీని భావం. అంతవరకు బాగానే వుంది. ఇది కామన్‌ సూలు మాత్రం కాదు. కానంతవరకు “సమానమైన నాణ్యమైన విద్య” అందరికీ లభించదు. ధనికులకు, పేదలకు రెండు రకాల స్కూళ్ళను ఈ బిల్లు అనుమతిస్తోంది. (ప్రోత్సహిస్తోంది కూడా!). కామన్‌ స్కూళ్ళ వ్యవస్థను ఈ బిల్లయినా తెస్తుందన్న ఆశను ఇది దురాశగా మార్చింది. పరిసరాల స్కూలు పేదవాళ్ళ పేదబడే! =

కానీ ఈ చిన్న బిల్లు ఇంత పెద్ద సామాజిక రాజకీయ సమస్యకు పరిష్కారం కనుగొన గలదా అనేదే ప్రశ్నః ఈ బిల్లు పరిమితే అంత అనుకోవాల్సి వస్తుంది.

  1. _ క్రైగ౦లు : “ప్రాథమిక స్కూలు” స్థానిక సాయం, పర్యవేక్షణ, ప్తానింగు లేకుండా ఎంత మేరకు న్యాయంగా నడుస్తుంది? ప్రపంచమంతా స్టానికుల, తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాథమిక స్మూళ్ళున్నాయి. కేరళ, తమిళనాడు విజయాలు సైతం దీన్ని ధృవీకరిస్తున్నాయి. కాని మన గ్రామాల్లో దిని రూపమెలా వుండాలి? పంచాయతీల పాత్ర ఏమిటి? ఇవన్నీ (ప్రశ్నలు. పంచాయతీలు తమ అధికారాల్ని (73-74) ఇది హరిస్తుందని వాదిన్తున్నాయి. ఎన్‌.ఎం.సి.లు పంచాయతీలకు పోటీనా అని ప్రశ్నిస్తున్నాయి. ఎస్‌.ఎం.సిలకు టీచర్ల నియామకాలు, ఆస్తుల నిర్వహణ ఇవ్వడం అసలుకే ఎసరు తెస్తుందని కొందరు, అధికార్లకే అంతా వదిలిపెడితే ఇంతకన్నా ఒక్కడుగు కూడా ముందు కెయ్యలేమని కొందరు వాదించారు. మధ్యస్తంగా శక్తి లేని ఎస్‌.ఎం.సి.లు వచ్చాయి. టీచర్ల కష్టాలు తీరాయి. సాధించింది ఏమిటి అనేది ప్రశ్నగానే మిగిలింది.

  2. మాతృభాష : “ఆచరణలో వీలున్న మేర ప్రాథమిక విద్య మాతృభాషలో

వుండాలి” అనే వాక్యానికి అర్ధమేమిటి? మాతృభాష కావాలంటారు. ఆచరణలో

సాధ్యం కాదంటారు. అంతేనా? ఇంగ్లీషు పిచ్చికి ఈ బిల్లు దాసోహమనింది. ఎదురు నిలబడలేక పోయింది. ఏ సమాజంలోనూ ఇలా జరగదు మరి. కనీసం

“పరిసరాల స్మూళ్ళయినా మాతృభాషలో వుండాలంటే బావుండేది. దానికీ ధైర్యం

చాల్లేదు మరి.

26

  1. ప్రైవేట్‌ కోటా : అన్‌ఎయిడెడ్‌ స్కూళ్ళు 25 శాతం బలహీన వర్గాల పిల్లల్ని చేర్చుకోవాలని ఈ బిల్లు చెపుతుంది. వీరికయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. అయితే ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకయ్యే ఖర్చు మాత్రమే ఇస్తుంది. దీనికి రెండు వార్వాలున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్మూళ్ళు వేలు, లక్షలు వసూలు చేస్తాయి. వాటికి సర్కారు బడి ఖర్చు ఇస్తే ఏ మూలకు? అందువల్ల దీన్ని అవి ఒప్పుకోవు. అసలు సంపన్నుల ప్రక్కన నిర్భాగ్యుల్ని కూర్చోపెట్టడానికే ఆ స్కూళ్ళు మొరాయిస్తాయి. ఇదొక పార్య్వం. చాలా చిన్న చిన్న (ప్రైవేట్‌ స్కూళ్ళకు - ముఖ్యంగా గ్రామాల్లోని స్కూళ్ళకు ఇదె పెద్ద మొత్తం. (ప్రభుత్వ స్కూల్లో ప్రాథమిక విద్యార్థిపై ఖర్చు ఏడాదికి షుమారు 4000 పైగా వుంటుంది). అప్పుడు ప్రభుత్వ స్మూళ్ళకు పిల్లలే పోరు. తల్లిదండ్రులూ పోనీరు. మరి వీటికి రక్షణ ఏది? దివాళా తియ్యవా? ఇక పోటీ పడాలి. దీనికి సర్కారు స్కూళ్ళు సిద్దపడలేవు. ఈ స్కూళ్ళకు బలహీన వర్గాల పిల్లల ఎంపిక ఎలా? ఆ సంపన్నులే చెరి 259% కోటా లెక్కలోకి వచ్చేస్తారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు బడిలో ' చదివే వారు ప్రభుత్వ బడిలో చదివేవారు అని రెండు జాతులా? ఇదో ఘర్షణ.

  2. విలువలు : అకడమిక్‌గా ప్రభుత్వం కొన్ని అంశాల్లో స్పష్టంగా కఠినంగా వుండాలి. రాజ్యాంగ విలువలైన సెక్యులరిజం, ప్రజాన్వామ్యం, వైవిధ్య రక్షణ, వివక్షారాహిత్యం వంటివి ఒక రకమైన విలువలైతే, పిల్లల పట్ల (పమ, గౌరవం, వారి స్వేచ్చ మరో రకం విలువలు. బోధనలో పిల్లలు కేంద్రం కావడం, వారి స్వయ జ్ఞానానికి, సంస్కతికి, పరిసరాలకు గుర్తింపు, సర్వతోముఖ వికాసం ఇవన్నీ ఇంకో విలువలు. ప్రభుత్వ స్కూళ్ళలో కంటే ప్రైవేట్‌ స్కూళ్ళలో వీటికి భద్రత కరువైంది. దీన్ని చూచి ప్రభుత్వ స్మూళ్ళూ నేడు వొళ్ళు కాల్చుకొంటున్నాయి. విద్యా రంగానికి పట్టిన పెద్ద చీడ ఇది. అసలు చదువంటే ఏమిటి? ఎందుకు? అనే మూల ప్రశ్నలు తలెత్తే రోజు వచ్చింది. ఈ బిల్లు (2005) మొదట విటిని ఎంతో పట్టించుకొని తర్వాత (2008) వదిలెయ్యడం అన్యాయం. చట్టబద్ధమైన పాలనా, శిక్షణా, పర్యవేక్షణా వ్యవస్థలు ఈ విలువల కోసం అవసరం. కో

  3. _ నాణ్యత : ప్రాథమిక విద్యను పూర్తి చెయ్యడమంటే 8 ఏళ్ళ చదువు పూర్తి చెయ్యడం మాత్రమే కాదు. రాను రాను చిన్న చిన్న నాన్‌ఫార్మల్‌ స్కూళ్ళలా మన ప్రాథమిక స్కూళ్ళు మారాయి. అక్షరాస్యుల్ని చెయ్యడం వీటి లక్ష్యంగా మారింది. విద్యావంతుల్ని చెయ్యడం సార్వత్రిక విద్యలో సాధ్యం కాదన్నట్టుంది' వ్యవహారం. బలమైన ప్రాథమిక పాఠశాల వ్యవస్థ, అన్ని వసతులు గల పెద్ద స్మూళ్ళు, రవాణా సౌకర్యం, స్కూల్లో భోజనం తదితర సౌకర్యాలు, ఇంగ్లీషు బోధన వుంటేనే మన స్మూళ్ళు నాణ్యమైన విద్య నందివ్వగలవు. జనానికి నమ్మకం వుంటుంది. దీన్ని ఈ బిల్లు ప్రస్తావించలేదు. ఈ సమస్యలోకి లోతుగా వెళ్ళనె లేదు.

  4. టీచర్లు : టీచర్లకు శిక్షణ వుండాలన్న ప్రస్తావన మాత్రం వుందీ బిల్లులో. వృత్యంతర శిక్షణ లేదు. నిరంతర పరిశోధనకు అవకాశం లేదు. సృజనాత్మక ధోరణులకు ప్రోత్సాహం లేదు. మంచి టీచరు ఒంటరి వాడవుతున్నాడన్న దృష్టీ లేదు. టీచర్లు ఎదగకుండా పిల్లలు ఎదగలేరు. ఈ బిల్లు దీన్ని ' పెద్దగా పట్టించుకోలేదు. పిల్లల కెంత స్వేచ్చ అవసరమో టీచర్లకూ అంతే కావాలి. పిల్లల సృజనాత్మకతకు ఎంత పెద్ద పీట వెయ్యాలో టీచర్ల సృజనశీలతకూ అదే పీట వెయ్యాలి. ఒక సంస్కృతిగా దీన్ని విస్తరింప చెయ్యాలి. ఈ బిల్లుకు ఇంత విస్పృతి వుందని ఆశించలేము గానీ దీన్నాక అంశంగానైనా గుర్తించకపోవడం అన్యాయం.

  5. సమాజం బాధ్యత ॥ చట్టాలతో, అధికార్లతో చివరికి భవనాల టీచర్లతో నిధులతో కూడా “అందరికీ విద్య" లాంటి సామాజిక సాంస్కతికాశం నెరవేరదు. దీనికి సమాజ భాగస్వామ్యం అవసరం. అసలు సమాజం దీన్ని అంగీకరించాలి. ఇందుకోసం సమాజానికీ *“విద్య' కావాలి. సామాజిక నిర్మాణాలు కావాలి. ఇదొక సాంస్కృతిక ఉద్యమం. ఈ బిల్లులో దీని ప్రస్తావన లేదు.

  6. _ అసలు విషయం ఆర్రికం : వాథమిక వద్యను ఒక హక్సుగా గుర్తించాక ఇది అమలు కావాలంటే ఏ వసతులు, యంత్రాంగం, ఏర్పాట్లు కావాలి? దీని కెంత నిధులు అవసరం అనే లెక్కలు గతంలో చేశారు. కనీసం అదనంగా రు. 50

28

వేల కోట్లు ఐదేళ్ళలో అవసరమని చాలా సందర్భాల్లో తేలింది. దీన్ని కేంద్రం భరించాలి. ఆ హామీ, కేటాయింపు కేంద్రం నుంచి రాకుండా అమలు ఎలా ' . సాధ్యం? అలాగే కేంద్రం తన బడ్జెటులో, రాష్ట్రాలు తమ బడ్జ్డెటులో ('వాథమిక విద్య కెంత శాతం కేటాయించాలి? ఇవన్నీ ప్రణాళికా సంఘం తేల్చాల్సినవి. పార్లమెంటు విడుదల చెయ్యాల్సినవి. ఈ ప్రస్తావన బిల్లులో లేదు. ఏదో అలవోకగా

చెప్పి సరిపెట్టారు.

  1. _ పర్యవేక్షణ - అమలు : 2005 బిల్లులోని “జాతీయ ప్రాథమిక విద్యా కమీషన్‌” ఒక మంచి ప్రయత్నం. అలాంటిదే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వుండాలి. అవి విద్యా నిపుణులతో వుండాలి. వాటికి చట్టబద్ధ అధికారాలుండాలి. ఏటిని చట్టసభలకు జవాబుదారీ చెయ్యాలి.

ఈ బిల్లులో వీటికి బదులు “బాలల హక్కుల పరిరక్షణా కమిషన్ల”కు ఈ ప్రతిపత్తి కల్పించారు. ఇవి చాలా బలహీనమైన వ్యవస్థలు. వీటి అధికారాలు స్వల్పం. ప్రతిపత్తి స్వల్పం. యంత్రాంగం బలహీనం.

ఇలా ఎన్ని లోపాలున్నా ఇదొక మహత్తర బిల్లు. మన పిల్లలకు ప్రాథమిక విద్యను ఒక హక్కుగా ఇది మారుస్తుంది. దీన్ని ప్రభుత్వానికి నిర్బంధం చేస్తుంది. పిల్లల హక్కుల కోసం తపించే వారికి, పోరాడే వారికి ఓ ఆయుధంగా పనికొస్తుంది.

ర

/ ౧611౦]! బోగ జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు: స్మూళ్ళకోసం, టీచర్లకోసం

  1. కథలంటే మాకిష్టం రు. 40.00 (151 కథల సంకలనం,
  2. పాటలంటే మాకిష్టం రు. 20.00 (102 పిల్లల పాటల సంకలనం) .
  3. ఆటలంటే మాకిష్టం రు. 30.00 (91 పిల్లల ఆటల సంకలనం,
  4. _నేర్చుకోడం మాకిష్టం రు. 20.00 (59 పిల్లల కృత్యాల సంకలనం,
  5. పాడుకొందాం. రు. 20.00 (58 దేశభక్తి, విద్య, ఆరోగ్యం, పర్యావరణం పాటలు) .
  6. అక్షరాలతో ఆటలు రు. 30.00 ... (భాషాక్రీడలు) 7, తేట తెలుగు - 1 (ఆధునిక తెలుగు వాచకం) రు. 30.00 8 తేట తెలుగు - 2 (ఆధునిక తెలుగు వాచకం) రు. 30.00
  7. ఉపాధ్యాయవృత్తి అనుభవాలు జ్ఞాపకాలు రు. 75.00 10... జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం-2005 రు. 15. 00
  8. నెల్లూరు పిల్లోళ్ళ కథలు రు.50. 00
  9. మమ్ముల్ని అర్ధం చేసుకోండి రు.30. 00 . పిల్లల కోసం
  10. 1-2 తరగతుల పిల్లల నాహిత్యం రు. 100.00 ... (10 పుస్తకాల సెట్‌)
  11. 2-8 తరగతుల పిల్లల సాహిత్యం రు. 120.00 (10 పుస్తకాల సెట్‌)
  12. 3-4 తరగతుల పిల్లల సాహిత్యం రు. 140.00 (10 పుస్తకాల సెట్‌) , డృ ఉర్‌ తరగతుల పిల్లల సాహిత్యం రు. 140.00:.. (10 పుస్తకాల సెట్‌)
  13. 6 న్యుచి పైతరగతుల పిల్లల సాహిత్యం రు. 150.00 (10 పుస్తకాల సెట్‌) ప్రతులకు . వి. కృష్ణారెడ్డి, జె.వి.వి. ప్రచురణల విభాగం దోర్‌.నెం. 15/780, జేమ్స్‌గార్దన్‌, మొదటివీధి, నెల్లూరు-524002, సెల్‌ 9846535145

మవసు ఫౌండేషన్‌ న ప్రస్తూల వరిశీందాపట్ట పుపకంపంఖ్య 1206 ౧+దగో. ఓ), //౪41 ౨, పంపరు డ్రిశ్చాత ఇిర్వంధ విద్యా హక్కు తార్‌ఖు మో స వెమకలట్ట . |11[0 వడు (ఉదా పిద్దపైాపేటలు | |. ; ___పావచేపివవి. ౧ | [1,016 __పరీక్షచేపివపవి _౧యటయ ౧64 ప్రజీలుపరిచూపినవి | [( బైండింగుచేసవి [| ప్కావ్‌చెయ్యనివి. ఈశప్పులు ' (౧ |[).