Telugu ఇల్లలకగానే - anilvaranasi/indianlanguages GitHub Wiki

. శ ఈ ” జ. , 4 " | స న | “ఇళ * ప జ ౯ ఠా ఆ న [ జ ఉనే. | వ. అటి . న ల "ద

  • ల. . న నా క్ట - ఒ - ళా ం న శ _ | ళం 1 అ ట్‌ - " జ “వ కలీ | “ఛీ ళ్‌ అ శం ఇ తమ , టా " [| ళీ న న లా 1 " ఎ క్‌ మ ॥ " ట్‌ ” జ 1 ళో చ. శ యం శ ల్‌ చ్‌ శ నా _ , ఇ | నో. ణి [= మ్‌ జ్‌ టం న్‌ సా ఖ్‌. శ్‌. గ్ర ( | న జే ఆ న. ఓ ॥ య శ్‌ ఎత 4 జ | (| ॥ | ల్ని ( ' ల క _ భే అ గ్‌ ఆ న! " . | " శే ॥ ॥ | ॥ | , “ ల ః | శ _ గ ! ఇ “ గ , ॥ త ఆ శ జ | _ ల యు మ... / శు ల్‌ | |. యె య శ | |. య . ల ॥ ఎ స | _ ॥ " ఇ -ు త . స - ” జ [ /| వ. క. చై . శ శి ్టం ॥ ॥ ఎ” ” ॥ = శ ష్‌ ॥ , , జీ | " (' లి క అ _ 7 పా న లా | వ్‌ సహ. ల . _ . ఆ 'క “ + 4. _ లో న్‌. ॥ _ గా " |; ఒం గ " ఆ / న. _ న. . | ఈ కి " ల న్‌ న క ॥ ఆ శా జా / ఇ _ వ క నతి శ జా = " క! ఎ న నా లై [క | 1 లీ ్‌ మ ద్ని! క | ॥ జ థొ జ్య . పూ జ ౧ గ 1 గ్‌ _ థి క ః [్‌ ల ఆ (| య / ॥ మ హా! ర ఎ ఆ ఈ శ , క ం " " (| ర బారా 4 లీ వో | _ క్ష 6 ఇ | 1 జ ఠ న. సా | ॥ సా - ఇ అ అ ॥ మ! చ | ళ్‌ ఇం - ళీ . . -. _ ణీ ల ఖ్‌ .. " | _ | | | _ శీ |. ॥ ॥ ॥ ? [= 4 | గ్‌ ల 2 ం _ ళీ చ ॥ గా ళి ్‌ | ॥ కా లా లం 4లో... 2 వ . “ట్‌. ంక్టీ- రాల అఆ ఇ ర జ. చే లో గ ల ళ్‌ [ సక యి / ([ ॥* లీల || - | ళ్‌ క్ర ళీ ల లీ ॥ * జ్‌ లం టీ. ః జీ 7 " న క ల ద - "॥ క్ని ల ' ల 7 ళల స క (ఇ ౯ శ. గ్‌ న. | | (| ఇ చ యే? రా జా ణ్‌. 2 జ న. లి క (౨. ర్‌ త్‌ షె “టీ ౯. ల , | " జే శా ల లి త ఇ ఈ శ. క లు" న్‌ ॥ _ తీ ట్‌ గ వ. ఓ ట్‌ ళీ న / (| టీనో |. త . థి _ ఇ చె " ల్‌ 7 ॥ మ | కై ల | | " ఇ ళీ న్నా న శ [ ఉ - ఇ "వ్వా కః ఉత ॥ అ | 4. ఈ: | 1 | _ ఇ శ . న . _ ట్‌ జ క =. ఖు. ఇ స్‌ న్‌. ఇతో త జ ౧. + ఆ /. గ్‌. =, వ క. = + థి "=. న ॥ _ , జ క్ష / ఈ ౨ ఇక్టనా. కో టె శ్‌ న్న , యం లం... రాతశ 5; త్‌ త క్ట _ జి ు ప్రి, రా _ జా నా వా క్‌ ఇ కేల? _ ఖ్‌ పా! గ | ం క. క ః గ్‌ మ | థి జ్‌ కే. “నక స. ఇ సరా యాం ఇ ఇ - గ ఎ ఛి క ఇ యు ఫ్‌ భ్‌ | ప | ౭౨౧4 న్‌ శ 4 అ మ క ఇ గ య ;. ఖా యం ॥ లం = వ _ న జ స ం జ కా శ ఇ. సె చీ % న్న ఇక?! శ్ష్‌ా కక కో కత: న్‌ శ ౨ [అాతాక 11 | ళా 1 న న యు న్‌ కక్ష 4 శ్‌ న్‌ అ ఇ ళ్న్తా నీ ల్‌ ౪ వ్‌ సలా 4 క ॥ ” షల . ఉట , క్లీివ్య లే _ మ గడ 1 తం నల న శః లం ల ఇ! టక జ ట్‌ చిరా శై ను ల జ. . బలా ౧. టా ే క అ. _. యల్‌! నక పం | నీ? హ్‌ “జ ఖ్‌ బ్‌ స “40 "బా న్‌ ఖా గ్‌ న. క ॥ శ జా. బీ రో ర. షన్‌ ర్‌ తా" న ళా కలే జ్‌ ల షు నో ..ాాక న! వ య గర్తిఛి గె న ళో కీ య! శశ ఆ పె త శ 1. ఇ . ల్న్హా వై హక, టో శే ఇ ల జ వాళ - 4 1 జ్‌ ॥| వా ఆ. ళ్ళ జ్‌! ణ్‌ న. టు ల ఎ ళా £ అ-తె __ ళు 1“ “ వ! గబా - న జం అనన్య? = పా బాం ళ్‌ వా్పుల్‌ 3 డి క ఇ జ క లో , పంచలు తల నా పిక స. గిన “స్‌ స్‌ జ గ లే జ క్‌ ను. న బ్‌. తం నా న్‌ టా వ క. | నాం క్‌. శస క ల న్‌ (2 గ _ ॥ న్న ళో జ ౮ అ ఇ ల న | లే ాా గ్‌ ల గ్‌ క యజ ల్‌ | [౯ , యు క నక ల గో 4 మాచే వ నీ లో తేట మ్‌ 7 న కలలా ఠి అన్య శ క; ట్‌ ఆట్‌ ట్‌ హ్‌ నకు ్‌ీనే ల్ని వ . న. రు. స హా ళు శా గీ న్న న ఓ టి కా ల్‌ మ లో హ్‌ న్ను కు 1. సు ; ఏ అ ళ్య య స. ఖ వంశి ౫ - లో, చి గ * శ జ నా! ఇచ న ల నే న్న ని ఛ్‌కే ఇ గ్య ర్‌ జ్‌ అ / ఇ
  • ( వీ (6 అ ల తై నం న్న. + క శ | క్వ ళ ల్లా క జ 4 శ్‌ కశ అజ య న లె, =. శా నక్ష ల్ని ఖీ వా శ న |. క్ష కా వళి =. శ , న . బో [ఇ నూ రీ ట్‌! గ నో శి శ క క వ్‌ లం ఆ ట్లో . ఇవా ళ్‌ జా ఓ [ ల? - - డ్‌ ట్స సేత శబ ల్‌. . వ. క న | క స ! “శశ భ లక కీ - | గ్‌ వ్‌ ర్‌ లో చల? ఆ క , _” ఖగ ఉక. ఇ పనర్సిా ్రి - టాకా “ఎవ్వేీము అ ఇని? న శ న్య ్ట్‌ టో. జే. స వ = వుం! న ర న్నే ఇ శన ధ్న్న శ్‌ =. + | ళో ॥ ణి ్ట్‌ ్మ త = ఇ

ఇల్లలకగానే. ....... కథలు ఈ, నత్తర8ి

ఖం క్‌ జ! ర్న న | గ ౮ ₹/04[4ీ54రంగలీ , 4. ల ల్‌ 51051 360168 ర్త గ ర్ట? // ధ్ర పే 520137272011 గ 1136 కడేటం సలా 1995 థి ఉం! ౧౦76? 001062 = 68101072 12967 7065610100 = ల74టసిణ 1012372౪ 4జ6ఉ44 + 520 002 రాంకు జ. గ ” కొ! 2210 రా2 0/05 ) జ 1)80/2472644 = 520 003 భభ లిం ల అంం1ఆ 2721120]16 41 టి ని న్ని గ 27064044 40/35 గ్బొ జు ల్‌ జర పటల 02144 క. 1123722464 - 520 002 త470644౮4/4 40/15/6753 50 పగిలి, శకి డేం1ర61 ఉగ? = 522 002 ₹754/4142%174 కొంంగ్‌ గ్రోంటుం4ి కస?యం9202 206 19 07200163 తిఉళ0డీ46ై/4 కొం0గ్‌ 0454 0 50966 [0 గడ 520022) సెశడగడ హా 4001226482 ౧౫౦౪౧154 1074012046 = 500 027 కం: 2006204101 8. 40-00 1274 502%64 8. 50-00

6

ఆకాశంబున నుండి ... గోవు 10 న. 19 ఇరలకగానే _. 25 | ఇందిర న క్‌ 38 న త్త భత కక

గబితం క జీవుడు 73 గాంధారిరాగం రిప అరుణసంధ్య “ వెంకటేశ్వర్లు వెళ్ళిపోయేడు న పెళ్ళప్రయాణం 106 బదిలీ న

ఘుందుమాట్లో

ఇరవై సంవత్సరాల నుంచీ కథలు వ్రాస్తున్న నేను “మాఘ సూర్య కాంతి కథ వ్రాసిన తరువాత నా ంర్తవ్యాన్ని గుర్తించానని భావిస్తున్నాను. అంత క్రితం వ్రాసిన కథలలో కూడా స్త్రీ జీవితమే వస్తువు అయినప్పటికీ ఈ కధ వ్రాసిన తరువాతనే నా కధలకి ఒక ప్రయోజనం అంటూ వుంటే అదేమిటో నాకర్ణం అయింది. ఈ అసమ సమాజంలో స్త్రీగా జీవించడం ఎంత క్లిష్టంగా వుంటుందో, ఆ క్లిషఒతలో నుంచి ఒక సంపూర్ణ మానవిగా స్త్రీ ఎదగడానికి ఎంత శ్రమపడాలో, త్యాగం చెయ్యాలో ఆలోచించిన కొద్ద, ఆమె జీవితం అంత సంక్లిష్టం కావడానికి కారణాలు తెలిసిన కొద్దీ పడిన ఆవేదనే బహుశా నన్ను 'స్త్రీీ తప్ప మరో విషయం మీద వ్రాయనీయడం లేదేమో.

“సంసారం నిలబడడానికి తన స్వేచ్చ సమర్పించుకున్న స్త్రీ తన యుగాల నిద్ర నుంచీ మేల్కొన్నది.” అని చలం చెప్పినట్లు, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరచి తన చుట్టూ పరికించి చూసుకుని, “ఈ సమాజంలో నా స్థానం ఎక్కడ?” అని అయోమయంగా ప్రన్నించుకుని, ఉక్కిరి బిక్కిరై ఆవేదనపడి, తన స్టానం ఎక్కడ వుండాలో కనుక్కుని, దాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నంలో వుంది నేటి స్త్రీ చలం చెప్పినట్లు సుఖాలు తక్కువై, వికాసము స్వేచ్చా అడుగంటి, ఉత్త ఆచారమూ విచారమూ మిగిలితే ఎంత అలవాటైనా ఎప్పటికో అప్పటికి యోచన కలిగి తీరుతుంది ఎంత మూఢులకైనా “అజ్ఞానిగా మూఢురాలిగా తయారుచేసి వుంచడానికి ఎంత ప్రయత్నించినా. అని అ వాక్యాన్ని సరిదిద్దితే బావుండుననిపిస్తుంది.

ప్రీత్వ లక్షణాలంటూ వైభవీకరించి వేసిన బంగారు గొలునుల్ని చశేదించుకుని మానవ లక్షణాలు కల స్వతంత్ర వ్యక్తిగా తనను తను తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో వున్న వేటి స్త్రీ ఆ లక్ష్య సాధనలో ఎదుర్కొంటున్న విమర్శలనూ, “బ్యాక్‌లాష్‌ లనూ తట్టుకుని నిలబడాలంటే ఆత్మస్టయిర్యం కావాలి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న రాజకీయార్టిక

పరిస్థితుల వలన, స్రీ విద్యా ఉద్యోగావకాశాలు పెరిగినా, ఇంకా వంటిల్లు స్రీదే. వంట పూర్తవనిదే అఫీసుకి వెళ్ళకూడదు ఆఫీసుకి లేటయినా స్త్రీ పురుషు లిద్దరూ ఒకేలాంటి ఉద్యోగం చేస్తున్నా పురుషుని ఉద్యోగానికీ, అతని ప్రమోషన్లకే ప్రాధాన్యం.-

కని పెంచేది ఆమే అయినా, ఎంత మందిని కనాలి ఎప్పుడు కనాలి, అసలు కనాలా వద్దా అని నిర్ణయించేది పురుషుడు, కుటుంబం, ఇప్పుడు రాజ్యం కూడా. పిలలమధ్య ఎడం వుండాలనుకుంటే ఆ తంటాలేవో పడవలసిన బాధ్యత స్రీదేనని ప్రభుత్వం కూడా అంటోంది అన్యాపదేశంగా.

భద్రత కుటుంబంలోనే - కుటుంబ చట్రం దాటితే స్త్రీకి భద్రత లేదు. కుటుంబాన్ని రక్షించుకోవాలంటే పురుషాధిక్యతని అంగీకరించాలి. కుటుంబంలో వున్న హింసని అక్కడ జరిగే అత్యాచారాలనీ, మానభంగాలనీ కప్పిపెట్టుకుని ప్రభాత స్నానంతోపాటు చిరునవ్వు నగలు ధరించి కనిపించాలి

వెనకటి తరం పురుషులకన్న ఈ తరం వారు లౌక్యులు వారు భార్యలకి స్వతంత్రం యిస్తారు. ఇంటిపనిలో సాయం చేస్తారు. భార్యని స్కూటర్లమీద ఆఫీసుల్లో దింపుతారు బయట భోజనాలకీ సినిమాలకీ తీసుకు వెడతారు. కానీ ఎదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళదే తుది తీర్పు, భార్య సంపాదన మీద అదుప్పు వాళ్ళదే. భార్య ఆలోచనలమీద ప్రభావం వాళ్ళదే ఈ వర్గ సమాజంలో పురుషుడికే స్వతంత్రం లేదు స్రీలకు మాత్రం సంపూర్ణ స్వతంత్రం ఎలా వస్తుంది? అంటారు పురుషుడు వ్యవస్థకి బానిస అయితే, స్త్రీ అటు వ్యవస్థకీ ఇటు పురుషుడికీ కూడా బానిన స్త్రీ తొనేమిటో మర్చిపోయి, తన పేరుకోసం తన ఉనికి కోసం తడుముకోవలసిన ఆవశ్యకత ఎర్బడడానికి వ్యవస్థతోపాటు పురుషాధిక్య భావజాలం కూడొ కారణమే ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని ఊరికే స్త్రీని బులిపిస్తారేకానీ, ప్రతి స్త్రీ పరాయీకరణ వెనక, పరాజయం వెనక పురుషుడే కాదు వ్యవస్థ మొత్తం ఉంటుంది ఇదంతా ఎమిటని ప్రశ్నిస్తే స్తీవాదుల్ని వేర్పాటు వాదులంటూ వేలెత్తి చూపించి వారిపై లేని పోని అపవాదులు (స్తీవాదులంతా లైంగిక స్వేచ్చ కోరతారనీ, స్వలింగ సంపర్కాన్ని సమర్దిస్తారనీ, సిగరెట్‌లు త్రాగుతారనీ వగైరా) వేసే స్థాయికి దిగజారారు కొందరు. సమాజంలో సగభాగం అయిన స్తీకి పురుషునితో సమానత్వం లేనిదే, సమసమాజం రావడానికీ ఒక మెట్టుకూడా వెయ్యలేం రులాలు, మతాలు, వర్గాలు, స్త్రీలు, పురుషులు అంటూ ఇంత అసమానత్వం ఉండగా సమసమాజం కోసం, అన్నింటా అగ్రస్థానంలో ఉన్న వారితో కలిసి కృషి చెయ్యడం ఎలా సాధ్యం? సమాజంలో పితృస్వామ్యుభావాలు, పురుషాధిక్యత పోనిదే, స్త్రీల సమస్యలు తీరవు.

$1

ఆడపిల్లను భూమి మీదకు తేవడం దగ్గర్నుంచీ వివాహం, చదువు, ఉద్యోగం మొదలయినవన్నీ సమన్యలే అత్యధిక నర్క్యులేషన్‌, ప్రకటనలూగల, (ఆరిస్టోక్రాటిక్‌ పాఠకులకోసం ప్రచురింపబడే) పత్రికలు కొన్ని స్రీ పైలెట్లను, జడ్డీలను, కార్పొరేట్‌ డైరెక్టర్లనూ ఉదహరిస్తూ నేటి స్త్రీకి “ఆకాశమె సరిహద్దు అని అతిశయోక్తులు ప్రచురిస్తాయి. ఈ పైలెట్లు, ఇంజనీర్డు, డాక్టర్లు, కార్పొరేట్‌ సెక్టర్‌లోని స్త్రీలు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిలో నుంచీ వచ్చినవారే మాత్రం కారనే విషయం మాత్రం చెప్పరు. ప్రీలకయినా పురుషులకయినా డబ్బులోనుంచీ పుట్టే అవకాశాలు హెచ్చుగానే ఉంటాయన్న కనీస జ్ఞానం లేని స్త్రీ పాఠకులు అవి చదివి మురిసి పోతారు. ఎంతోమంది మేధావంతులైన స్త్రీల తెలివితేటలు, పిల్లల్ని పెంచడానికి, వేళకి వండుకు తినడానికి మాత్రమే పరిమితమై పోతున్నాయి చిన్న గీతను పెద్దగీతగా కనుపింపజేయడానికి పెద్ద గీత తనను కుదించి వేసుకున్నట్లు, కుటుంబంలో సుఖశాంతుల్ని కాపాడడానికీ కళ్ళూ నోరూ మూసుకుని తెలివీ చురుకూ దాచుకుని సుఖంగా నూరేళ్ళు కాపరం చేసుకునే గృహిణులు కోఠొల్లలు.

ఇప్పుడున్న వివాహవ్యవస్థ ఎంతగా వ్యాపారంగా మారిపోయిందో చెప్పడానికి పత్రికలలో వచ్చే వివాహా ప్రకటనలు, వీధివీధినా వలిసిన మ్యారేజ్‌ బ్యూరోలు, కంప్యూటర్‌లు నిదర్శనాలు, ఇప్పుడు పెళ్ళికి పునాది "స్నేహం, డ్రేమ, అభిప్రాయాల కలయికా కాదు. “నీ జీతం ప్లస్‌ నా జీతం, వెరసీ మనం కొనబోయే ఇల్లు నువ్వు తెచ్చే కట్నం నేను చేసే వ్యాపారం కలసి మనం అనుభవించే సుఖాలు. మన పిల్లలకి అతి ఖరీదైన స్కూళ్ళల్లో చదువులు.” ఇప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలోనూ జరగవు. హృదయాల కలయిక ద్వారానూ జరగవు కంప్యూటర్లే కుదురుస్తాయి. ఇంత డబ్బు పోసి జరిపించుకున్న పెళ్ళి విడాకుల దొకా వెళ్ళకుండా పెద్దలూ, సమాజమూ ఎప్పటి కప్పుడు అతుకులు పెట్టి కాపాడి వెండి, బంగారు పండగలు జరిపిస్తాయి. ఏ పిల్లల కోసం, ఎ కుటుంబ భద్రత కోసం తన సుఖాన్ని తన స్వంతాన్ని తన తెలివిని, తన చురుకుదనాన్ని స్తీ నైవేద్యం పెట్టిందో, ఆఖరికి ఆ పిల్లలే అవిణ్గ్శీ “నీ కర్తవ్యం వృద్ధాప్యంలో కూడా నీ పతి సేవ!” అని ప్రబోధిస్తారు.

పెట్టబడిదారీ సమాజపు ముఖ్యలక్షణమైన వస్తువ్యామోహ సంస్కృతి స్త్రీలో ఆలోచననీ, స్పందననీ కబళించి వేసి, తనవైపు బలంగా లాక్కోడానికి చూస్తున్నది, వేరొకవైపు సకల అవినీతులకి స్త్రీలే కారణం అంటూ ప్రచారం అవినీతిపరుడు, లంచగొండి అయిన భర్త పతనానికి కారణం భార్య ధనదాహమేననీ, తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు స్వార్ధానికి కోడలు ప్రభావమేననీ చెప్పడానికి ప్రయత్నించి, ఆ

క11

అధారాలళో “స్త్రీకి స్రీయే శత్రువు అని బుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తారు. వరకట్న మరణాల వెనక యువకుల అసమర్థత, స్వార్ధం కాక్క, అత్తల దాహాన్ని భూతద్దంలో నుంచీ చూపిస్తారు. స్త్రీలలో ప్రపంచ జ్ఞాన శూన్యతకూ, అవగాహనా లేమికీ, కారణం వారి నాలుగు గోడల బ్రతుకేనన్న సాధారణ విషయం తట్టదు కొందరికి. శతాబ్దాలుగా జీర్ణించి పోయిన అభద్రతా భావమే స్త్రీలని గయ్యాళులుగా తయారు చేస్తుంది. గయ్యాళి స్త్రీ భర్త బయటికి మెత్తగా ఉన్నట్లు కనిపిస్తాడే గానీ అవసరం వచ్చినప్పుడు ఆధిక్యత చూపిస్తాడు. స్తీలలోని అభద్రతా భావాన్ని పోగొట్టడానికి, ఆలోచనలు కలుగ జేయడానికి ఇప్పుడొస్తున్న స్రీ వాదరచనలు దోహదం చేస్తున్నాయే తప్ప ఇంత వరకు ఎవరూ ప్రయత్నించలేదు. స్త్రీల సమస్యల్ని స్త్రీల దృష్టి నుంచే ఎవరూ విశ్లేషించలేదు. ఇదంతా మధ్యతరగతి స్త్రీలను గురించి.

ఆర్థికంగా అట్టడుగున ఉండి, చదువులేని స్త్రీలలో ఇంకా వదిలిపోని మూఢనమ్మకాలు, కుటుంబహింస, దారిద్య్రం, బహుసంతానం, తాగే భర్తలు- చిన్న పిల్లల చాకిరీ మీద ఆధారపడే కుటుంబాలు- అన్ని వర్గాలలోనూ అతి భద్రంగా కాపాడబడుతున్న జండర్‌ వివక్రృ పురుషాధిక్య భావజాలం,

ఈ నేపధ్యాన్ని చిత్రించడానికి ప్రయత్సించినవే ఈ సంపుటిలోని కథలు కొన్ని-

ఇల్లు ఎంత బాగా అలికితే అంతమంచి గృహిణిగా, తల్లిగా పేరు తెచ్చుకో వచ్చునని సంబరపడీ పడీ ఆ సంబరంలో తన పేరు కూడా మర్చిపోయి, ఇల్లలకగానే పండగ కాదనీ, తనకీ ఓ పేరూ, ఓ మెదడూ ఉన్నాయని స్త్రీలంతా గుర్తించిన ఈ సందర్భంలో, ఈ కధా సంపుటికి అదే పేరు పెట్టడం ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. నిజానికి ఈ ఆలోచన మిత్రులు డాక్టర్‌ వి. చంద్రశేఖరరావుగారిది. అలాగే ఈ కధా సంపుటిని ఇలా తేగలగడానికి తమ సలహా సహకారాలందించిన సహృదయులు శ్రీ ఎ. రామమోహనరావుగారికి నేనెంతో బుణపడి ఉన్నాను.

ఈ కధలన్నింటినీ ప్రచురించిన ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఆదివారం ప్రత్యేక సంచిక, “ఉదయం' వారపత్రిక, ఆహ్వానం, రచన, విపుల, జ్యోతి, ఇంటియాటుడే సంపాదకులకు నా కృతజ్ఞతలు. మరి స్నేహితులు సుజాత, నిర్మల, ఆర్టిస్ట్‌ చైతన్య, జానకి, శ్రీదేవిలకు కృతజ్ఞతలు చెప్పడం చివరగానే అయినా, వారందరి సహకారంలేనిదే నేనేం చేయగలను?

= పి, సత్యవతి 7 మే11 1995

టి రకాశం1లునీ నుం. ... మేనిమావు వేళ ముసిరిన చికట్టను తరుముతూ ఒక్కసారిగా దీపాలన్నీ వెలిగాయి అఆ వెలుగు వీధి చివర నిలబడ్డ ఆ అమ్మాయి మొహం మీదొచ్చి పడింది. అంత వెలుగు భరించలేనట్టు ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకుంది. ఆమె ప్రక్కన నిలబడ్డతను “రిక్షా తెస్తానుండు" అన్నాడు అల్లంత దూరంలో నిలబడ్డ ఇంకొకతను ఖరీదైన బట్టల్లో వున్నాడు ఖరీదైన సిగరిట్టు (తాగుతూ, ఖరీదైన సెంటు వాసనతో ఖరీదు ఖరీదుగా వున్నాడు అతను ఆ అమ్మాయి మొహంలోకి సంతృప్తిగా చూసి నవ్వాడు యవ్వనం ప్రసాదించిన శరీర సౌష్టవం - సన్నని చీరెలో దాగని వొంపు సొంపులు ఆమె అందగత్తె అని చెబుతున్నాయి కొంచెం ఎక్కువగా అద్దిన పౌడరు, పెన్సిల్‌ గీతలా వున్న కనుబొమ్మలు, ముదురు రంగు లిప్‌స్టిక్‌, ముదురు రంగు వేసిన పొడవాటి గోళ్ళు, కత్తిరించి వదిలేసిన జుత్తు - ఆమె కొంచెం ఎక్కువగానే అలంకరించుకున్నట్టు చెబుత:న్నాయి మెడలో నల్లపూసలు, సన్నని చీరెలోంచి కనపడే మంగళ సూత్రాలు ఆమె గృహిణీత్వాన్ని చాటుతున్నాయి ఆమే ముఖ కవళికలు మాత్రం ఎం చెప్పడం లేదు క ల ర చ రా ర్‌ శ ల న ్ధ్గ న ననే నబ న సల త తో.

2 ఇల్గలకగొనే, ...

“ఏయ్‌ రిక్షా” అని పిలిచాడు మొదటి అతను అక్కడకు కొంచెం దూరంలో సిగరెట్ట అప్పుడే ముట్టించుకుంటున్న రిక్షా అతను - దాన్ని ఆబగా రెండు దమ్ములు ఏల్చి, విసిరిపడేసి వడివడిగా అక్కడికొచ్చేడు

“అమ్మగారు - అయ్యగారు హోటల్‌ దగ్గర దిగుతారు. జాళ్రత్తగా తీసుకెళ్ళు, అయ్య గారు పది రూపాయిలిస్తారు తీసుకో కొంచెం దూరం కదా” అన్నాడు

రిక్షావాళ్ళని జనం సాధారణంగా “ఎయ్‌ రిక్షా' అని పిలుస్తారు గనుక అతన్ని కూడా 'రిక్షా' అనొచ్చు రిక్షాకి ఈ అయ్యగారు అమ్మగార్హ వ్యవహారం కొత్తేం కాదు ఎ అయ్యగారు అమ్మగారు అంత దూరం రిక్షా ఎక్కరు పది రూపాయిలివ్వరు. “ఎక్కండి” అన్నాడు ముఖం వికారంగా పెట్టి. అయ్యగారు ముందు రిక్షా ఎక్కాడు ఆనక అమ్మగారు ఎక్కింది రిక్షా ఎక్కుతూ “రిక్షా మొహం వైపు చూసింది ఆ అమ్మాయి - రిక్షా కదిలింది కదిలి ముందుకు సాగింది రిక్షాలో కూర్చున్న జంటకి మధ్య మాటలేం లేవు. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ పాములా పాకింది. పాములతో పొత్తు భయం లేనట్బ ఆ అమ్మాయి అలాగే కూర్చుంది.

అప్పుడా అమ్మాయి కాలక్షేపం కోసం తనకి తానే ఓ కథ చెప్పుకుంది ఆ కథలో నాయిక పేరు సూరీడు

సూరీడుకి పదిహేనేళ్ళొచ్చేసరికి అది సూర్యుళ్ళా మెరిసి పోయింది పోత పోసిన్న బంగారు విగ్రహంలా మిడిసి పడింది రాజ ప్రాసాదం నుంచి దాసి వేషంలో తప్పించుకుని సామాన్యుల ఇళ్ళల్లోకి వచ్చిపడిన రాజకుమారిలా రీవిగా వుంది అంతఃపురంలో అసూర్యం సళ్యగా వుండడం వలన మిసమిస లాడే పసిమి ఛాయ, పట్టు దారాల్హాంటి నల్లటి నిడుపాటి వెంట్రుకలతో అల్లిన బారెడు జడ, నిర్మలంగా వున్నతెల్లటి అంతంత లేసి కళ్ళు - జలపాతంలా ఉరుకులు పరుగుల మీద వచ్చి పడుతూన్న వయస్సు - సూరీణ్ది అపురూపంగా పెంచుకున్న తల్లి చనిపోతూ ఆ పిల్లని తమ్ముడికి అప్పగించింది 'దీన్నేం బేస్తావో నీ యిష్టం' అంది

తమ్ముడి పేరు నారాయణ. అతను సూరీడుకన్నా పదేళ్ళు పెద్ద సూరీడు చిన్నప్పుడు ఉఊయ్యాల్లో గుక్కపట్టి ఏడుస్తూంటే అక్కని అనుకరిస్తూ జోలపాడిన వాడు - తను ఎత్తుకున్నప్పుడు ఆ చంటిది దోసిళ్ళతో జుత్తు పీకినప్పుడు బాధ కలిగి ఏడుద్దామనుకుని కూడా దాని బాల్య చేష్టలకి నవ్వేసినవాడు సూరీడు తల్లి చనిపోయే నాటికి నారాయణ కొక చెల్తెలు పెళ్ళికుంది. ఆ పిల్లకి కొంచెం మెల్లకన్ను కావడంతో సంబంధం కుదరడం కష్టమైంది చీటీ పాట పాడి నాలుగు వేలు తెచ్చి ఎలాగో ఆ యమ్మని అత్తవారింటికి పంపాడు నారాయణ. అంత క్రితమే అతను రిక్షా స్వంతానికి కొనుక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ సూరీడుకి పెళ్ళి చెయ్యాలంటే అప్పు చేయ్యాలి సూరీడుకేం సినిమా స్టార్షంతా దాని ముందు బలాదూరే! అయినా కాస్తో కూస్తో కట్నమివ్వాలి కద!

ఆఅకొశంబున నుండి .. తే ఓరి నారాయణ! నేనా మంచంలో పడ్డానికి సిద్ధమైతిని! ముసలితనంలో అమ్మమ్మకి ఇంత కాచి పోస్తది నువ్వంటే దానికి తగని ప్రేమ దాన్ని నువ్వే ముడేసుకోరా! ఖర్చు కలిసాస్తథ లచ్చిలా ఇంట్లో వున్నా చాలు అని సలహా ఇచ్చింది నారాయణ తల్లి నారాయణ ముందు సందేహించేడు గానీ సూరీడు అంగీకారంతోనే ఆమెని తన భార్యగా చేసుకున్నాడు తల్లి చెప్పనట్లు అది ఇంట్లో వున్నా చాలు - లచ్చిందేవే! దాని ముక్కుకొక ఎగర్రరాయి ముక్కు పుడక బెట్టి చెవులకి జూకాలెడితే పెద్దింటి అమ్మాయిగార్లెవరూ పక్కన నిలబడలేరు కంచి పట్టు చీరె కట్టి జూనెడు మల్లె చెండెడితే ఈ పట్నంలో అందరూ దానికి దిష్టి బెట్టాల - నారాయణ సూరీణ్లి (పేమించాడు ఆ వాడకట్టులో వున్న పది ఇళ్ళల్లో ఎ మగవాడూ తన భార్యని చూడనంత అపురూపంగా సూరీణ్జి తన గుండెలో నింపుకున్నాడు అది తన పాలిటి దేవత అనుకునేవాడు శివరాత్రి నాడు ఇద్దరూ కృష్ణ స్నానానికి వెళ్ళేరు ముఖం నిండా పసుపు పూసుకున కృష్ణలో మునిగి లేచి ఇవతలకీ రాగానే వేలితో పట్టెడు కుంకుమ ముఖానికి పూసుకుంది “బావున్నావులే కనకదుర్గ అమ్మవార్థా - నాకు నిన్ను చూస్తే భయమేస్తా వుంది ఇంటి కెళ్ళి సబ్బెట్టి మొహం కడిగి తిలకం ఎట్టవో'” అన్నాడు అవును -పూబ్దేసి గుళ్ళో నించీ బయటికొస్తే అమ్మవార్లాగే వుంటుంది నూరీడు. “ఇంట్లో కూచుని తింటే లావయి పోతావుగానీ రెండిళ్ళు పాచిపని సెయ్‌- సీటీలు తొందరగా తెమిలిపోవాల” అని సూరీణ్జీ తనే ఒకింట్లో పాచి పనికి కుదిర్పాడు నారాయణ. వాళ్ళ పిల్లల్ని అతను రిక్షాలో స్కూలుకి తీసుకుపోతాడు అ అమ్మగారు దేవతలాంటిది, అయ్యగారు దేవుడి లాంటి వారు బేరాలాడరు ఎప్పుడైనా కాఫీ యిస్తారు పండగలైతే టిఫిగ్లు రూడా పెడతారు నారాయణ పిల్లల్ని స్కూల్లో దింపితే, సూరీడు ఇంటెడు పనీ చేసేది సూరీడు కిచ్చే జీతం తెచ్చి చీటీ కట్టేవాడు నారాయణ నారాయణ కి త్రాగుడు లేదుసిగరెట్ట లేదు. ఎప్పుడైనా లాటరీ టిక్కెట్లు కొనడం - సూరీడుకి తినడానికేదైనా కావడం, పూలు కొనడం - ఇద్దరూ కలిసి సినిమాలకెళ్లడమే గానీ - ఇంకే ఖర్చూ లేదు సూరీడు సంసారం ఆరు బయట నులక మంచం పైన వెన్నెల్లో సరసంలా, రోజూ మూరెడు మల్లెపూల దండగా - ఏరోజూ త్వరగా తెల్లారిపోయే రాత్రిగా - ఎప్పుడూ సంతోషమేగాని మూతివిరుపులు - తిట్లు సాధింపులూ లేని స్వర్గసీమగా గడిచిపోయింది రెండేళ్ళు నారాయణ చీటీలు తీరిపోయాయి సూరీడుకి ముక్కుపుడక చేయించడమే మిగిలింది అప్పుడతని చెల్లి పురిటికి వచ్చిందె పురిటికి వచ్చిన చెల్లికి చాలా జబ్బు చేసింది బిడ్డ దక్కలేదు మూడువేల రూపాయిల్తో కల్లి బయట పడింది నారాయణ మళ్ళీ క్రొత్తగా చీటీ పాడాడు మళ్ళీ అప్పు చేసేడు ఆ సందడిలోనే అతని తల్లి కూడా వెళ్ళి పోయింది ఆమె దినవారాలకి మళ్ళీ అప్పు భేశాడు. ఆ అప్పులు తీరడానికి సూరీడు పని చెయ్యాలి తప్పదు కష్టపడ్డం కష్టం ఎం కాదు సూరీడుకి,

శీ ఇల్లలకగానే.. .. అతనికి సాయం చేయగలుగుతున్నందుకు ఆమె సంతోషించింది కూడా. అయితే అప్పుడే ఒకనాడు -

సూరీడు ఆ ఇంటికిక పనికెళ్ళనని మొండికేసింది. కారణం చెప్పదు కన్నీళ్ళెట్టు కుంటుంది ముందు బ్రతిమిలాడేడు నారాయణ తర్వాత చిరాకుపడ్డాడు “చీటీలయ్యేదాకా చెయ్యి, తరువాతొద్దు- బంగారు తల్లిగా - నీ కాళ్ళట్టుకుంటా 'నన్నాడు “ నేను ముక్కు పుడక చేయిస్తా 'అన్నాడు పట్టిలు కొంటానన్నాడు

సంక్రాంతి పండక్కి సిల్కు చీరె తీస్తానన్నాడు,

ససేమిరా వెళ్ళనన్నది సూరీడు

“మకురుతనం, రెండ్రోజులు పోనియ్‌" అనుకున్నాడు నారాయణ.

మూడోరోజుదయం పిల్లల కోసం రిక్షా తీసుకెళ్ళినప్పుడు ఓ ముసలమ్మ ఆ వాకిట్లో ముగ్ణయ్యడం చూళాడు నారాయణ

“అమ్మగారూ- సూరీణ్జి పనిలోంచి తీసేసినారా?” అని వినయంగా అడిగేడు

“ఎం? అది నీకు చెప్పలేదా? రావలసిన జీతం కూడా యిచ్చేశాను ఏం? నువ్వు రిక్షా వేయ్యవా మీ ఆవిణ్ణి తీసేస్తే - చెప్పు- ఇంకో రిక్షా మాట్లాడుకుంటాం” అంది ఆ అమ్మగారు

నారాయణ బిత్తర పోయేడు “అదేంటమ్మా - అదేవైనా తప్పు చేస్తే నాకు చెప్పొచ్చు గంచా!' అన్నాడు మళ్ళీ వినయంగానే

“నీకు చెప్పే తప్పు కాదులే నారాయణా! అదంతా ఇప్పుడెండుకు! ఎదో మమ్మల్నిలో బ్రతకనియ్‌ నీకిష్టమైతే పిల్లల్ని తీసుకెళ్లు లేకపోతే మానెయ్‌” అందావిడ కరినంగా

ఆ రాత్రి నారాయణ సూరీణ్జి గుచ్చి గుచ్చి అడిగేడు ఏం జరిగిందని. సూరీడు కంటికి కడివెడుగా ఎడ్చి “దేవుడిలాంటి అయ్యగారు” నిజంగా దేవుడు కాడనీ దేవుడి ముఖం తగిలించుకున్న జంతవు అనీ - ఆ జంతువు బారి నించీ తప్పించుకోడానికే తను మానేశాననీ చెప్పింది

“మరి అమ్మగారలా అందేం?” అన్నాడు నారాయణ.

“అలా అందా! అయితే ఆవిడ దేవశ కాదన్న మాట. దేవత మొహం తగిలించుకున్న చెయ్యం అంది సూరీడు

“మరి ఆ జంతువు అక్కడుంటే రెండేళ్లు నవ్వుతూ తుళ్ళుతూ ఎలా పని చేశావు?” అన్నాడు నారాయణ

అతను రెండేళ్ళ నించీ దేవుడి ముఖం తగిలించుకునే వున్నాడనీ, ఆ ముఖం ఇప్పుడిప్పుడే తీసేసి అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాడనీ, అది నిజం, నమ్మమనీ మొర పెట్టుకుంది సూరీడు

ఆకాశంబున నుండి... ర్‌

నారాయణకీ దేవత లాంటి సూరీణ్జీ నమ్మాలో దేవత లాంటి అమ్మగార్ని నమ్మాలో అర్థం కాలేదు.

ఒక్కరోజు పనికెళ్ళకపోతే అమ్మగారు చేసుకోలేదని అల్లల్లాడి పోయిన సూరీడు ఆవిడని దయ్యం అనడం ఏమిటో అతనికి బోధపళ్ళేదు దేవుడు ముఖం తగిలించుకుని

తిరుగుతున్న అయ్యగార్నే - “ఎం బాబూ ఏంచేళాన్‌? మా ఆవిణ్ణి కాబేయడానికి ఎందుకు చూశావ్‌? ' అని నిలదీద్దామా అనుకున్నాడు ఎంతైనా ఆళ్ళజోలికి పోడం మంచిది కాదని తీర్మానించుకున్నాడు అతను సూరీడు కళ్ళు తుడీచేడు - “ఎడవమాక! ఆడు నీ ఎనకెనకే తిరిగాడు గానీ నిన్నేం చెయ్యలేదు గదా. ఇంకో ఇంట్లో పని బేద్చవులే” అని సముదాయించేడు

దేవుడిలాంటి ఆ అయ్యగారు అమ్మగారు సూడకుండా తన భుజం మీద చేతులు వేసి తనను ముద్దు పెట్టుకున్నాడనీ తనతన్ని వెనక్కి తోసేసి గబగబా వచ్చేసిందనీ సూరీడు చెప్పలేదు.

మళ్ళీ అదే సాయంత్రం తన వెనకే వచ్చి అలాంటి పనే చెయ్యబోయేటప్పుడు అమ్మగారు అటుగా వచ్చిందనీ, వెంటనే తనని ఇంటికి వెళ్ళి పామ్మందనీ కూడా చెప్పలేదు అతను తనని వెంటాడుతున్నాడని, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడనీ, కాళ్ళల్లో కాళ్ళు వేసి నడుస్తున్నాడనీ మాత్రం చెప్పింది అయ్యగారి చేసిన తప్పుకి అమ్మగారు తనని తిట్టడం ఎందుకో సూరీడుకి అర్ధం కాలేదు తనేదో ఆయన్ని చెడగొట్టేస్తున్నట్లు బాధపడిపోయింది ఆవిడ దృష్టిలో అయ్యగారు మంచి వాడే తనే చెడిపోయిన ఆడది!! ఆవిడ భర్తని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న ఆడది తను! ఒక మాటలో అమ్మగారిలో విపరీతమైన మార్పొచ్చింది ఆమె అనే మాటల్లో - చూసే చూపుల్లో కత్తులు కనిపిస్తున్నాయి శాపాలు వినిపిస్తున్నాయి

నారాయణ సూరీడ్ని సముదాయిస్తూనే వులిక్కిపడ్డాడు ఈ సూరీడు అందం కళ్ళు చెదిరే అందం అనీ, దీని శరీరానికి ఎందర్నో ఆకర్షించే శక్తి వుందనీ, అందుకని సూరీడు బయటకి వెడితే ఇలాంటివి ఎదురౌతాయని తొనెన్నడూ అనుకోలేదు దాని అందం తన ఒక్కడి సామ్మేనని, దాని శరీరం, మనస్సూ తన కొక్కడికే స్వంతం అనీ అనుకుంటున్నాడు, వాటిని ఇతరులు ఆశిస్తారని ఎన్నడూ అనుకోలేదు

దుష్ట శక్తుల నుండి దాన్ని ఎలా కాపాడుకోవాలి? బయటికి పంపకపోతే గడనని ఆర్థిక పరిస్థితి వచ్చింది పంపితే పచ్చకామెర్లవెధవలందరి కళ్ళూ దాని మీదే! అలా ఆలోచిస్తున్న నారాయణ మనస్సులోకి ఇంకో వూహ జొరబడింది రెండేళ్ళ నాడు ఇంకా వుషారుగా, ఇంకా షోగ్గా, యింకా పొగరుగా వుండేది సూరీడు మరలాంటిది ఆ అయ్యగారు ఇన్నాళ్ళు ఎందుకు నిగ్రహం చూపించేడు? ఇప్పుడే ఇలా ఎందుకు ప్రవర్తించేడు? అమ్మగారలా ఎందుకన్నది?

6 ఇల్లలకగానే .. సూరీడు నిజమే చెబుతోందా! ఎరగా బుర్రగా వుండీ సెంటు కొట్బకుని నున్నంగా గడ్డంగీసుకున్న ఆ మనిషి మీద మోజు పడిందా? అ ఊహ మహాభయంకరంగా అనిపించింది ఛీ ఛీ అనుకున్నాడు ఆ రాత్రి అతను సూరీణ్జి దగ్గరగా తీసుకుని కళ్ళ మీద ముద్దెట్టుకోలేదు. వీపు మీద చెయ్యివేసి నిమరలేదు గాజులు సవరించలేదు ఆకాశం కేసి చూస్తూ వుండిపోయేడు. తన పెళ్ళయినాక ఎన్నడూ లేనిది ఆ రాత్రి ఎంతకీ తెల్లవారలేదు ఇన్నాళ్లూ అతని గుండెల నిండా కాపురం వున్న సూరీడు బదులు అశాంతి వచ్చి చేరుతోంది ఆ వాడలో వున్న పది పదిహేనిళ్ళల్లో తను భార్యని చూసుకున్నట్టు ఎవరూ చూసుకోరు అందులో చాలామంది __ భార్యల్ని బూతులు తిడతారు తాగేసాచ్చి తంతారు అక్కడ కొత్తగా కట్టిన ప్లాట్స్‌లో ఆ

వాడలోని ఆడవాళ్ళు పనిచేస్తున్నారు మొగవాళ్ళు రిక్షాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి చేరవేస్తున్నారు ప్లాట్స్‌ ప్రక్క గుడిసెలుండడం వాళ్ళ అదృష్టం కాగా, గుడిసెల ప్రక్కనే గొప్పోళ్ళ ఇళ్ళుండడం తమ అదృష్టం అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ దూరం నడిచి పోకుండా పని దొరికినందుకు - అంతేకాదు - ఈ గుడెసెలూ, ఆ కట్టిన వ్లాట్టూ కూడా మార్కెట్‌కి దూరంలోనే వున్నాయి కనుక - బేరాలు బాగానే దొరుకుతున్నాయి ఆ ప్తాట్స్‌లో వుండే ఆడవాళ్ళల్లో కొంత మంది ఉద్యోగాలకి వెళ్ళగా, కొంతమంది ఇళ్ళల్లోనే వుంటారు అలా ఇళ్ళల్లో వుండిపోయిన ఆడవాళ్ళు ఒకరింటికి ఒకరు వెడుతూ వస్తూ వార్తలు సేకరించి, జేరవేస్తుంటారు. రెండేళ్ళ నించీ ఫలానా కామేశ్వరి గారింట్లో ఎంతో వినయ విధేయతలతో పనిచేసిన నూరీణ్జి ఆవిడ మానిపించడానికి కారణం అక్కడ చర్చనీయాంశం అయింది,

“పని వాళ్ళని తీసెయ్యడానికి రెండు కారణాలుంటాయి ఒకటి దొంగతనం, రెండవది. అని & వ్యంగ్యమైన నవ్వు విసిరింది ఒక ఇల్లాలు

సూరీడు అందం మీద, అలంకారం మీద వ్యాఖ్యానించింది ఇంకొక ఇల్లాలు. ఎమైనా సూరీడులా వుండే ఆడవాళ్ళని పనిలోకి రానివ్వడం చాలా ప్రమాదకరం అని మెజారిటీ సభ్యులు తేల్చేరు “ఇవ్వాళ కామేశ్వరికైంది - రేపు మనకీ అని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫన్మ వరకు పిల్లల్ని రిక్షాలో పంపిన కామేశ్వరి ఫస్టు నించీ పిల్లల్ని భర్తతో స్కూటర్‌ మీద పంపడం మొదలెట్టింది.

“పెళ్ళాన్ని పనిలోంచి తీసేశానని కచ్ళపెట్టకుని పెల్లల్నేవైనా చేస్తాడేమోనండీ” అని ఆవిడ భర్త దగ్గర బాధ పడింది

ఇదంతా తనకి జరిగిన అవమానంగా భావించేడు నారాయణ నారాయణ ఇప్పుడు సూరీడుకి మల్తెపూలు తేవడం తరచు మర్చిపోతున్నాడు. అది అద్దం దగ్గర నిలబడి తల దువ్వుకుంటున్నా బొట్బపెట్టకుంటున్నా “చాల్లే సోకులు” అని విసుక్కుంటున్నాడు.

ఆకొాశంబున నుండి... ల ఇలాంటి అందమైన ఆడదాన్ని పెళ్ళి చేసుకుంటే దాన్ని కంచుకోటలో పెట్టి కాపాడుకునే స్తోమత వుండాలి బయటికి పంపి నలుగురూ ఏదో అన్నారని వాపోవడం ఎంత మూర్కత్వం? అసలు సూరీణ్జి తను పెళ్లి చేసుకోవడమే తప్పు. ఓ నాలుగయిదు వేలు అప్పు తెచ్చి ఎవరికైనా ముడీపెట్టి పంపేస్తే బావుండేది. ముసలిదాని మాట విని ఈ నిప్పుని తెచ్చి తన యింట్లో పెట్టుకోవడం ఎంత పారపాటైంది! సూరీడు ఖాళీగా లేదు మళ్ళీ పనిలో చేరింది ఫ్లాట్స్‌లో కాదు - ఇంకొంచెం దూరం ఒక డాక్టర్‌ గారింట్లో జీతం ఎక్కువే! పనీ ఎక్కువే, పని గంటలూ ఎక్కువే! సూరీడుకి కష్టం ఎక్కువైంది దానితో నారాయణ వినుగూ ఎక్కువైంది. వారూ వీరూ అనే మాటలు పట్టించుకోడమూ ఎక్కువైంది నారాయణ సిగరెట్లు కొలుస్తున్నాడు ఓ నాడు ఆ వాడలో వుండే వెంకయ్యతో కలిసి తాగి కూడా వచ్చాడు

ఇదేమిటని సూరీడు ఏడిస్తే దాన్ని కొట్టేడు భయంకరంగా తిట్టేడు లేనిపోని రంకులు అంటగట్టాడు అది తెచ్చే డబ్బు లేనిదే చీటీలు తీరవు అది ఎం చేస్తోందోనని భయం అడపా దడపా ఇంట్లో పండగలూ, పార్టీలూ వచ్చి ఆలస్యం అయినా, అయిదూ పదీ ఎక్కువిచ్చినా “ఇది ఎక్కడిది - ఇంతాలన్యం ఏమిటి?' అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు నారాయణ.

సూరీడుకి చెప్పుకుని ఏడవడానికి ఎవరూ లేరు ముసలిది కూడా చచ్చిపోయిందాయె! తను చేసిన తప్పేమిటో, తాను చేయని తప్పు కీ శిక్షేమిటో, నారాయణ మనస్సులో ' మాబేమిటో అంతుచిక్కడం లేదు క్ష్‌

సూరీడు దిగులుపడింది తెల్లగా చెరువులో చిన్న చేపపిల్లల్లా తళుకు తళుకుమనే ఆమె కళ్ళల్లో దిగులు తెరలు. పచ్చగా మిసమిసలాడిపోయే శరీరం మీద దెబ్బలు, మనస్సుకి తేైలియని ఆవేదన సూరీడుకి నారాయణంటే వుండే భక్తి, గౌరవం,(ప్రేమా సడలిపోతున్నాయి సున్నితంగా దగ్గరకు తీసుకుని లాలించే అతనిలో తనకి అదివరకు అమ్మ కనిపించేది - ఇప్పుడు అతనిలో లాలిత్యం లేదు అతని (పేమలో మొరటుతనం వచ్చింది సాయంత్రం కోసం ఆరాటం లేదు. తెల్లవారకూడదనే కోరిక లేదు “ఎప్పుడూ పగలే అయితే పని చేసుకుంటూ బతకొచ్చు రాత్రి నరకం' అనుకుంది సూరీడు

అప్పుడు'సూరీడుకి పరిచయం అయ్యాడు అప్పలకొండ అప్పలకొండ పళ్ళమ్ముకునే సింహాచలం కొడుకు. సింహాచలం మొగుడు రిక్షా తోలతాడు సింహాచలం పళ్ళు అమ్ముతుంది కొడుకు ఏమీ చెయ్యడు వాడు ప్యాంటూ షర్టూ వేసుకుని విలాసంగా సిగరెట్బ కాలుస్తూ వుంటాడు వాడు సూరీడు కష్టం, సుఖం కనుక్కున్నాడు ఆదరించాడు ఆవేదన ప్రకటించాడు “పాపం” అన్నాడు “మనిద్దరం యిశాపట్నం ఎల్లి పాదాంపద- నిన్ను పువ్వుల్ల పెట్టి సూసుకుంటా' "నన్నాడు ఆమెని రోజూ పనిదాకా దిగబెట్టడం- ఇంటికి తీసుకు రావడం చేస్తున్నాడు ఓ రోజు

రి ఇల్లలకగానే ,.. వాళ్ళిద్దరూ కలిసి నడవడం చూసిన నారాయణ ఆ రాత్రి సూరీణ్ణి కొట్టిన దెబ్బలకి ఆ పిల్ల చచ్చివుండవలసింది - కానీ బతికింది చచ్చి బతికిన సూరీడు వారం తిరక్కుండా వ్రూరు నుంచీ మాయమైంది అది లేచిపోయే రకమేనని ఆ వాడకంతా ముందే తెలుసుననీ, అందుకని వాళ్ళకీం ఆశ్చర్యం లేదనీ అనుకున్నారు “నీ పీడ విరగడయ్యిందిరా నారాయణూ

  • పెళ్ళయి మూడేళ్ళయినా ఓ కాయా, కసరా? మళ్ళీ నిచ్చేపంగా మనువాడు ఈ సారైనా మామూలు ఆదిదాన్ని పెళ్ళాడి సుకంగుండూ నీ దరిద్రం తీరిపోయింది” అని కొందరు నారాయబణకీ హితవు చెప్పారు ఆ చెప్పిన వారిలో దేవుడిలాంటి అయ్యగారు, దేవత లాంటి అమ్మగారు కూడా వున్నారు అ అమ్మగారు తన పిల్లల్ని మళ్లీ నారాయణ రిక్షాలోనే స్కూలుకు పంపడం మొదలు పెట్టింది సూరీడు వెళ్లిపోవడం చాలా మందికి బావుంది నెలరోజులకి నారాయణ మూడు వేలు కట్నం తీసుకుని మహలక్ష్మిని మనువాడాడు. ఈ సారి భార్యని అతను అందరు భార్యల్లాగే చూస్తున్నాడు... ఏడాది తిరిగేసరికి ఆ భార్య అతనికి మగపిల్లవాణ్ణి కని యిచ్చి - అతనిలోని సూరీడు జ్ఞాపకాలని పూర్తిగా తరిమేసింది.

అప్పలకొండతో యిశాపట్నం వెళ్ళిన సూరీడు గతి ఎమైంది? అని అడగద్ద- ఓ ఆరు నెలలకి అప్పలకొండ మళ్ళీ ఈ వూరే తిరిగొచ్చి “నానేం దాన్ని లేపుకపోలేదు- దాని పనిమీద అది పోయిందేమో ' అని కాలరు ఎగరేసుకుని తిరుగుతున్నాడు సూరీణ్లేం చేశావో చెప్పమని నారాయణ అడగలేదు సూరీడు అతనికిక అక్కర్లేదు లోకంలోని మనుష్యులంతా ఏమైపోతే తనకేం అనుకున్నాడు అతని గుండెలోకి మళ్ళీ శాంతి ప్రవేశించింది. అప్పలకొండ చెప్పకుండా వెళ్ళిపోయేనాటికి సూరీడు లోకాన్ని చదివేసింది ఆమె మనన్సు భగ్గున మండింది శరీర కష్టం చేసుకుని రాళ్ళు మోసీ, సున్నపు పని చేసీ బ్రతకబోయినా, అక్కడా పాములుంటాయి జంతువులుంటాయి జంతువులు తనని వేటాడతాయి ఎక్కడా భద్రత లేదు “వేటాడే కళ్ల నించీ - వెంటపడే మృగాల నుంచీ తన కేది రక్షణ? ఎక్కడ రక్షణ? అని ఆక్రోళించింది సూరీడు అప్పుడు ఆమెని రక్షించాడు భగవాన్‌దాసు “నీకు బ్రతుకు ఎలా తెల్లవారాలో నేను చెబుతాను పద ' అని ఆమెని తీసుకువెళ్ళాడు వారం రోజులు మంచి భోజనం పెచ్టేడు బ్యూటీ పార్లర్‌కి తీసుకువెళ్లి కనుబొమ్మలు కత్తిరింపించేడు జుత్తు కత్తిరింపించేడు

“సూరీడూ! నువ్వు ఎవరనుకుంటున్నావు? నువ్వు మోహినివి! భూలోక వాసులకు అమృతం పంచి పెట్టడానికి వచ్చిన దానివి! నీ యోగ్యతలు, నీ అర్హతలు నీకు తెలీవు నీ పాదాల దగ్గర ఎంత మంది భక్తులు వాలిపోతారో నువ్వు ఎరగవు నా మాట విని దీపం వుండగానే నీ ఇల్లు చక్కదిద్దుకుని నా ఇల్లు చక్కదిద్దు! రాజకీయనాయకుల్లో కొంతమందితో, ఆఫీసర్లలో కొంతమందితో, వ్యాపారస్తులలో కొంత మందితో పని చేయించుకోడానికి నువ్వు అమోఘంగా పనికొస్తావు! అందం నీకు భగవంతుడిచ్చిన వరం దాన్ని ఎలా వుపయోగించుకోవాలో

ఆఅకాశంబున నుండి... ర వక్‌ పకకన కనక నేర్చుకో” అని బోధించాడు. కాదంటే కొంత బాధించాడు చివరికి అవుననిపించేడు భగవాన్‌ దాస్‌ సూరీడుకి గిల్దు మంగళసూత్రాలు, నల్ల పూసలు కొనిచ్చాడు ఆ రెండింటి వల్ల ఎన్నో లాభాలు వున్నాయని చెప్పాడు, నువ్వు గృహిణిలా కనపడతావ'న్నాడు. వాళ్ళిద్దరూ ఈ వూరే వచ్చి మేడల పక్కన ఓ వాటా తీసుకుని కాపురం పెట్టేరు

కుటుంబంలోని సుఖంతో సంతృప్తిపడని దేవుడి లాంటి అయ్యగార్లెంత మంది సూరీఖ్జి తీసుకుని క్యాంపుల కెళ్ళినా దేవతలాంటి అమ్మగార్ల కిప్పుడు తెలీదు అలా ప్రస్తుతానికి స్థిరపడింది సూరీడు దేదీష్యమానంగా వెలిగిపోతున్న హోటలు ముందు రిక్షా ఆగింది అయ్యగారు రిక్షా కి డబ్బులిన్తున్నాడు అమ్మగారు అతని పక్కన నిలబడింది రిక్షా నారాయణకి జుత్తూ, కనుబొమ్మలు కత్తిరించుకున్న ఆడవాళ్ళంటే అసహ్యం వత్తుగా పెరిగిన కనుబొమ్మలు, బారెడు జడ ఎంత అందం ఆడపిల్లలకి! ముఖం నిండా అసహ్యం నింపుకుని ఆమె వైపు చూశాడు నారాయణు

ఆమె వెనక్కి తిరిగింది అలా తిరుగుతుండగా ఆమె ఎడమ చెంప మీద వున్న వుట్బమచ్చ అతని కంటపడింది ఆ పుట్బ్టమచ్చ అతని గుండెలో చురకత్తి దించింది “తొనా ఈమెని రిక్షాలో తెచ్చి ఇక్కడ దించింది! తానేనా?”

(జం(్రజ్యోతి దీపావళి వత్వ్యళనంచిక - 1989) వో

గోరి న్లీంసంగా కళ్లువిప్పి చుట్టూచూసిన గోమతికి తను హాస్పిటల్‌లో ఉన్నట్లు అర్ధం అయిందేకాని, తను అక్కడికి ఎస్తుడు ఎందుకు ఎలా వచ్చిందో అర్ధం కాలేదు.

ఈ హాస్పిటల్‌ తమకి దగ్గర బంధువైన డాక్టర్‌ తారది "-- సరిగ్గా రెండురోజుల (క్రితం చెకప్‌కి రావడం, ఆవిడ చెప్పిన వార్త విని సంతోషించి, చెప్పిన మందులు కొనుక్కువెళ్ళడం గోమతికి తెలుసు--ఇలా మంచంమీద పడుకోవలసి రావడం ఎందుకు సంభవించిందో మాత్రం తెలీడంలేదు

మంచంమీద కూర్చుని చుట్టూ చూసింది గోమతి. ఎదురుమంచంమీద ఓ పూచిక పుల్ల పడుకొని వుంది ఆ పూచికకి పొత్తికడుపుమీద ఇంతదూది వేసి కుట్టినట్టు కడుపు వుంది--ఆ కడుపు చేత్తో పట్టుకుని మూలుగుతూ ఏడుస్తోంది పూచిక పూచిక దగ్గర కూడా ఎవరూ లేరు అవును, తనదగ్గర కూడా ఎవరూ లేరు వృద్ధ మహారాణి గానీ ప్లీడరు సుందర రావుగారు కానీ ఎవరూ లేరు తనని ఒంటరిగా ఇక్కడెందుకు వదిలివేశారో మరి

పూచికని చూస్తే జాలేసింది గోమతికి.

“పురిటి నొప్పులా' అనడిగింది.

గోవు 11

పూచిక తలాడించింది

“దగ్గరెవరూ లేరేం” అంది గోమతి.

“అమ్మని ఇందాకే ఇంటికి పంపించాను ఇంటిదగ్గర ముగ్గురు పిల్లలు వాళ్లకి తిండీ అదీ చూడాలిగా. సాయంత్రం దాకా పురుడు రాదంది డాక్టర్‌.

“మీకు ముగ్గురుపిల్లలా. మళ్లీ ఇదొకటా! ఎలా కంటారో ఎమో” జాలిపడింది గోమతి

పూచికకి దుఃఖం వచ్చింది లేచికూర్చుని 'ఎం చెయ్యను ముగ్గురూ ఆడపిల్లలే! మా ఆయనకి మగ పిల్లవాడు కావాలట. క్రీందటికాన్పులో బాగా సుస్తీ చేసింది. చచ్చి బ్రతికాను మూడు వేలు ఖర్చయ్యింది గాజాలమ్మేళాను " ఇవ్వన్నీ తనతో చెబుతోందంటే ఎంళ దుఃఖాన్ని దాచుకుందో పాపం.

“మళ్లీ ఎమవుతుందో? బ్రతుకుతానో చచ్చిపోతానో! ముగ్గురు పిల్లల్ని ఏంచేస్తానో”

ఇంతలో ఒకతను వచ్చేడు! మనిషి చూడ్డానికి బాగానే వున్నాడు. ఓ చేతిలో ప్లాస్టిక్‌ బుట్టలో కొన్ని బట్టలు, రెండవ చేతిలో ప్లాన్కు తెచ్చాడు.

“మీ అమ్మ వస్తోందిలే ఎలా వుంది! నెప్పులెక్కవయ్యాయా!” ఆనడిగాడు పూచికని అవిడ మొగుడు, అవిడ చేత మగపిల్లవాబ్ని కనిపించే హక్కు గలవాడు.

పూచిక ఏడుస్తూ “ ఏమండీ! ఈసారి నేను బ్రతకనండి చచ్చిపోతాను" అంది.

“ల! అలా అశుభం పలకకు--ఈసారి నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి మొగపిల్లవాణ్నీ కంటావు అందుకోసం ఈసారి నేను జపాలు చేయించాను అభిషేకాలు చేయించాను - నీకు తెలునుగా'

“ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మల్లీ, . ”

“అదే వద్దన్నాను ఇలా ఎడ్చి ఏడ్చి ముగ్గుర్ని కన్నావు' అంతా బాగానే జరుగుతుంది. ఈసారికి ఓర్చుకో"

అతగాడు కొంచెం చిరాకుపడి, బయటికి వెళ్లేడు. ఓర్చుకోడానికి పిసరు ఓపిక లేదు పూచిక దగ్గర, కన్నీళ్లు కారుతూనే వున్నాయి

గోమతి జాలిగా చూస్తూ కూర్చుంది

అంతలో ఆవిడొచ్చింది వృద్ధ మహారాణి.

“లేచి కూర్చున్నా నే --ఇంకేం --తారనడీగి ఇంటికి పోదాం -- ముందు కాఫీ తాగు

ఆంది, “నేనెందుకు వచ్చానిక్కడికి? నాకేమైంది?” అంది గోమతి

16 ఇల్లలకగానే. 69

“అయ్యో పిచ్చితల్లీ | నీకు అబార్షన్‌ అయిందమ్మా పొద్దున కళ్లు తిరిగి పడిపోయినవావు _-వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం అప్పటికే అంతా అయిపోయింది. ఆవిడ ముఖం జాలిగా పెట్టి అన్నది.” నేను పడిపోయానా! ఎప్పుడూ . నాకు తెలీదే! నాకు అబార్షన్‌ కావడం ఏమిటి? అనంభవం"” గోమతి అలా బయటికి అనలేదు కడుపుమీద చేతో తడిమి చూసుకుంటే దుఃఖం వచ్చింది.

“ఏం చేస్తాం ళల్లీ, నీకు ఈ బిడ్డ దక్కే యోగం లేదు. పద వెడదాం” అంది వృద్ధ మహారాణి ఆవిడమాటలు నమ్మబుద్ధి కావడం లేదు గోమతికి నిన్ననే తను ప్లీడరు గారిని బ్రతిమిలాడీంది. ఆయన ఎంత వద్దన్నా ఈ బిడ్డ తనక్‌ కావాలని మొరపెట్పకుంది. ఇవాళ ఇలా జరిగింది. తను కళ్లుతిరిగి పడిపోవడం నిజంకాదు ఈవిడమాటలు నమ్మి ...ఈవిడ వృద్ధ మహారాణి కాదు వృద్ధ జంబుకం--తార కూడా నిజం చెప్పదు ఎవరూ నిజం చెప్పరు.

“కారొచ్చింది వెడదాంపద'” అన్నది ఆవిడ. ఆ క్షణంలో ఆవిడ బ్రహ్మరాక్షసిలా కనపడింది. తనని తినెయ్యడానికి ఎత్తుకుపోతున్న బ్రహ్మరాక్షసి, పూచికపుల్లకి నెప్పులెక్కువవు తున్నాయిలా వుంది మెలికలు తిరిగిపోతోంది. ఆవిడ తల్లి వచ్చింది కూతురికి మంచినీల్లిచ్చి, కళ్లు తుడుచుకుంది.

“ఈ గండం ఎలా గడుస్తుందో ఏమో! ఏడుకొండలవాడా! తండ్రీ నా కూతుర్ని దయచూడు నాయన్తా" అని దండం పెట్టుకుంటోంది.

గోమతి ఇంటికి వచ్చింది

“పడుకుని విశ్రాంతి తీసుకో! పదిరోజులు వంట మనిషిని కుదిర్పానులే నీ అరోగ్యం కన్నానా ' అంది ముసలి మహారాణి.

అ మాటల్లో లోతు లేదు ఆవిడ తనతో మాటాడే మాటల్లో ఎప్పుడూ లోతు వుండదు. పెదవుల పైనుంచే మాట్లాడుతుంటుంది.

మంచంమీద పడుకున్న గోమతికి దుఃఖం కట్టలు తెగి వచ్చింది.

అమ్మ చెప్పేది --భగవంతుడు మానవులని సృష్టించి భూమ్మీద పడేసేటప్పుడు వాళ్ల ముఖాలమీద వాళ్లు అదృష్టవంతులు అని కొందరికీ, వాళ్లు దురదృష్టవంతులు అని కొందరికీ రాస్తాడట ఆ రాత ఇక మారదట కొందరు పుడుతూనే అదృష్టవంతులుగా పుట్టి జీవితాంతం అలాగే వుంటారట కొందరేమో దానికి విరుద్ధమట. తన జీవితంలో అది నిజం అని తేలిపోయింది అమ్మ చాలా అనుభవంమీద చెప్పినమాట ఎప్పుడూ జీవితంతో రాజీపడుతూ ఇంతే ప్రాప్తం అని నరిపెట్టకుంటూ బ్రతకడమే అలవాటు చేసుకున్న గోమతి, ఇవ్వాళ అలా సరిపెట్టకోలేక దుఃఖపడుతోంది. ఇంతవరకూ తనకేదీ లభించలేదు తను దేన్నీ కోల్పోలేదు. తన దగ్గర ఏమీ లేదు కానీ ఇవ్వాళ తన దౌర్భాగ్యపు జీవితంలోకి వెలుగురేఖ వచ్చిందని

గోవు 13 ఒక్కక్షణం సంతోషించేసరికి, ఆ రేఖ మాయమైపోయింది. అందుకే గోమతికి దుఃఖం ఉపశమించడం టేదు ఆ దుఃఖపు వెల్లువకే శక్తి వుంటే అది ఈ కపట ప్రపంచాన్నంతా ముంచి తనలో ఇముడ్చుకుని వుండేది కాని ఆ దుఃఖానికి శక్తిలేదు. అది తనలో తానే కమిడీపోనల్సిన దుఃఖం, ప్రపంచాన్ని ముంచివేసే శక్తి దానికి లేదు.

అదివరకు ఎంతటి బాధనైనా, ఎంతటి దుఃఖాన్నయినా అవలీలగా దిగమింగుకుని నిర్లిప్తంగా బ్రతకడానికి అలవాటుపడిన గోమతికి, ఎంత తుడుచుకున్నా కంటితడీ ఆరడం లేదు ఆ కన్నీళ్ల తడికి ఆమె గుండెమంట చల్తారడం లేదు.

“మన గోవు మంచిగా చదువుకుంటుందండీ ..దానికీ డాక్టర్‌ చెప్పించాలి” అనేది అమ్మ, తన చిన్నప్పుడు. ఆవిడ తనని ముద్దుగా గోవు అని పిలుచుకుంటూ, గోవులా ఎలా వుండాలో నేర్పుతూ పెంచింది. తను కనీనం మెట్రిక్‌ అయినా చదవకముందే నాన్నపోవడం, కుటుంబ పరిస్థితి తల్లక్రిందులై పోవడం, అన్నయ్య ఉద్యోగం మీద వదినే కాకుండా ఆమ్మా తనూ కూడా ఆధారపడ్డం, వదినె ఉద్యోగంలో చేరడం, అమ్మ ఆ ఇంటి పనిమనిషిగా, మారడం అన్నీ జరిగిపోయాయి, చాలా వేగంగా అప్పుడే అమ్మ తనకి చెప్పింది కొందరు దురదృష్టవంతులుగా పుడతారనీ తను ఆ జాతికి చెందిందనీను.

అమ్మకి జీవితానుభవంవలన ఎన్నో నిజాలు అర్ధం అయ్యాయని, ఆవిడ చెప్పేవన్నీ సత్యాలనీ గోమతి నమ్మింది. దానీకి తగ్గ రుజువులు కూడా దొరికాయి ఆమెకి. ఆవిడ అనారోగ్యానికి గురవడం--దానికి తగ్గ ఖరీదైన మందులూ, ఖరీదైన ఆహారం యిప్పించలేక పోవడం వలన ఖాళీ అయిన పనిమనిషి స్టానాన్ని తను భర్తీ చేయడం కూడా వెంటవెంటనే జరిగిపోయాయి

తల్లిదండ్రులు యిచ్చిన అస్తులేం లేకుండా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న అన్నావదినెలు గోమతి పెళ్ళిగురించి ఆలోచించారు గానీ, అధి వాళ్లకీ అందుబాట్లో లేదని అర్ధమై మౌనం వహించారు గోమతి ఇంటిలో ఏదో ఒక చీర కట్టుకుని బుద్ధిగా పనిచేస్తూ పడిఉండటం వలన వాళ్లకి ఆమె గుండెలమీద కుంపటిగా కొక, ఉద్యోగాలు చేసుకుని ఇంటికొచ్చే వేళకి అన్నీ అమర్చిపెట్టే మనిషిగా తెలిసి వచ్చి, ఆమెని పోగొట్టుకోడం ఇష్టంలేక కూడా కొంత మౌనం వహించారు. అలా అలా గోమతికి వయస్సు "పెరుగుతూనే వచ్చింది సూదికి దారం ఎక్కకపోవడం, బియ్యంలో పురుగులు కనపడకపోవడం, అక్షరాలు కనపడకపోవడం మొదలెట్టాయి

“అక్షరాలు కనపడకపోతే పీడాపోయె! బియ్యంలో పురుగులు కనపడకపోతే ఎలా, వెళ్ళి కళ్ళజోడు వేయించుకో-- చత్వారం వచ్చింది కాబోలు నలలై వచ్చినాయి. నాకన్నా మూడేళ్లు పెద్దటగా నువ్వు-- మీ అమ్మ అంటుండేది” అని డబ్బులు కూడా ఇచ్చి కళ్లజోడు. వేయించుకురమ్మని పంపింది వదినె గ రల రర ర రా ర లా రయ ర లా రయ్‌ ర్‌ ర య్‌ య్‌ య్‌ రయ ర య్‌ యల్‌ ల్‌ అ య్‌ య గయ

(క ఇల్లలకగొనే ... సరిగ్గా అప్పుడే గోమతి జీవితం మలుపు తిరిగింది

క్రిమినల్‌ లాయరుగా పేరుప్రఖ్యాతులు బాగావున్న ప్లీడరు సుందరరావు గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్త సెల్లిళ్ల పేరయ్య పరమేశ్వరం చెవిన పడింది. ముందు ఆయన కొంచెం ఆశ్చర్యపడి, ఆ వెంటనే సంచీ పుచ్చుకుని బస్పెక్కి సుందరరావు గారింటికి వెళ్ళి ఆయన అక్కగారైన స్వరాజ్యలక్ష్మిగార్ని కలిసి షెళ్లి విషయం ప్రస్తావించేడు. ఆవిడ పరమేశ్వరాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడే ప్రత్యక్రమైనంత ఆనందంగా ఆహ్వానించింది

“అవును పరమేశ్వరం సుందరం పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నేనే నీకు కబురు పెడదామనుకుంటున్నాను ఎక్కడైనా సంబంధం చూడు ' అంది

“మరి భార్య పోయి పన్నెండేళ్ళాయె! ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నట్టు అహ. అతనికి ఈడుమించిందని కాదు మగవాడికి ఈడేమిటిలే” అన్నాడు పరమేశ్వరం

“అప్పుడేమో పిల్లలు చిన్నవాళ్ళు సవతి తల్లి వాళ్లనెలా చూస్తుందోనని వాడు పెల్లిచేసుకోలేదు పైగా నా వంట్లో ఓపిక వుండేది ఇప్పుడు నేనూ పెద్దదాన్నయినాను. పిల్లలూ ఎదిగారు. అడపిల్ల పెళ్ళిచేసుకుని వెడుతుంది మగపిల్లవాడు చదువుకు వెడతాడు ఈ వయస్సులో నన్నూ వాలణ్నీ కనిపెట్టకుండే బొమ్మ కావాలిప్పుడు మాకు అందావిడ

“ఆంధ్రదేశంలో ఆడపిల్లలకేం కొదవమ్మా కట్నం ఎంతలో ఉన్నట్లు ”

“కట్నంలేదు ఎం లేదు పరమేశ్వరం. మంచి బుద్ద్ధిమంతురాలైన అమ్మాయిని చూడు"

“మా వూల్లో లాయర్‌ సుశీలగారున్నారు అవిడకీ నలభై రెండేళ్ళు. ఇప్పుడిప్పుడే ఆవిడకీ పేలి మీద ఆలోచనపోయింది లాయరు సుశీల గారైతే సుందరంగారితో పాటు కోర్టుపనీ అదీ చూస్తారు పైగా ప్రాక్టీసులో సాయంచేస్తారు ఎమంటారమ్మా

“మనకీ లాయర్లు డాక్టర్లు వద్దు పరమేశ్వరం! వాళ్లకి కూడా చేసిపెట్టే వాళ్ళెవరిక్కడ. మంచి పనిమంతురాలైన అమ్మాయిని - నలభై అయినా ఫరవాలేదు - కాస్త పొంకంగా వున్న అమ్మాయిని చూడు కావాలంటే పెళ్లి ఖర్చుకు బట్టలకీ మనమే కాస్త డబ్బిద్దాం ' అన్నది స్వరాజ్యలక్ష్మి

“మరి సుందర్రావుగారిని కూడా అడగడం మంచిది కదా! ఆయనేమంటారో '

“వాడీ మొహం! అస్తమానూ కేసులూ వాడూను వాడీకేం కావాలో వాడిగేం తెలుసు పరమేశ్వరం నేను చెప్పినట్లు అన్నివిధాలా సరిపోయే సంబంధం. చూసుకురా'” అన్నది అవిడ సుందర్రావుగారి అక్కగారు స్వరాజ్యలక్ష్మిగారు

స్వరాజ్యలక్ష్మిగారు తన యిరవయ్యో ఎటనే వితంతువై, కొంత అస్తి మనోవర్తిగా తీసుకుని తమ్ముడింటికి వచ్చారు ఆవిడ ఆస్తి, ప్రస్తుతం సుందర్రావుగారు నివసిస్తున్న భవంతి కొన్ని కాసుల బంగారం కొంత వెండీ చాలా సామానువగైరాలు తమ్ముణ్ని తను

గోవు 15 కనిఫెట్బకుని వుండడం తమ్ముడు తనను వృద్ధాప్యంలో చూసుకోవడం వారి ఒప్పందం ఆ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ జరుగుతూ వచ్చింది సుందర్రావు గారి మొదటిభార్య వరలక్ష్మికూడా రాజ్యలక్ష్మిగారి కనుసన్నలలో మెలుగుతూ వుండేది ఆమె పోయినాక పిల్లల్ని సవతితల్లి సరిగ్గా చూడదేమోననే భయంతో తనూ, అతనూ కూడా పెళ్ళిమాట తలపెట్టలేదు అయితే ఎంతటి దుఃఖాన్నిైనా కాలపరిమితి వుంటుందనీ అది సహజమైన కోర్కెలకి అడ్డుకట్ట వేయజాలదనీ ఆ సహజ వాంఛా పరిపూర్తి కోసం మనుష్యులు వేరే మార్గాలు వెతుక్కోపలసి వస్తుందనీ ఆమెకి త్వరలో అర్ధమైంది పోనీ ఎవరిబాధలు వాళ్లవి ..అని సరిపెట్టలోలేని పరిస్తితి ఏర్పడింది

ఆ ఇంట్లో పనిచేసే పనిమనుష్యులు కొందరు వంటమనుష్యులు కొందరు ఆయన్ని ఆకర్షించడం ఆ విధంగా వారు ఆ ఇంట్లో ఒక ప్రత్యేకస్థానం సంపాదించడానికి ప్రయత్నించడం వార్ని తను పనులలోనించి తొలగించి, ఇంటిని శుభం చేస్తువుండటం ఈ కార్యక్రమంలో అలసిపోయిన స్వరాజ్యలక్ష్మిగారు సుందరరావుని చూసుకోడానికి, అతని సహజమైన కోర్కెలు తీర్చడానికి చట్టసమ్మతమైన మనిషి అవసరమేననే నిర్ణయానికి వచ్చారు ఆ ప్రయత్నంలో లాయర్‌ సుశీల కూడా కబుర్లుపంపింది గానీ లాయర్‌ సుశీల తనకిష్టంలేదు తమ్ముడికి భార్య అవసరం కానీ ఇంట్లో లాయర్ల అవసరం లేదని స్పష్టంగా గ్రహించింది ఆవిడ

ఆ విధంగా అజ్ఞ అందుకుని ఇంటికి వచ్చిన పరమేశ్వరం, తన భార్య తొయారమ్మతో సుందర్రావుగారికి ఎలాంటి అమ్మాయిని చూడాలో వివరించేడు. ఆవిడ ఆ సంగత్తి వినంగానే, “అదేమిటండీ! ఎవరో ఎందుకు! మన వెంకట్రావు చెల్తెలు గోవుందికదా! పాపం దాన్ని ఓ ఇంటిదాన్ని చేసి పుణ్యంకట్టుకోండి, వాళ్ల వదినె కట్నం ఇచ్చి దానికీ జన్మలో పెళ్లిచెయ్యదు దానిక్కుడా మొన్నమొన్ననే నలభైదాటాయి. తల్లిలేని పిల్ల పదేళ్లుకేడా ఫరవాలేదులెండి మీ పుణ్యాన అది సుఖపడుళుంది ' అని కర్తవ్యం బోధచేసింది పరమేశ్వరానికి భార్య సలహా బాగా నచ్చింది. రెండో పెళ్ళివాడి సంబంధమా అని వెంకట్రావు భార్య పరమేశ్వరాన్ని తిట్టి సంబంధం కుదరకుండా వీలైనంత అడ్డుపడింది గానీ, పాపంవెంశట్రావు ఈ విషయంలో తన చెల్లెలి పక్షాన నిలబడి పెళ్ళి జరిపించాడు

ఆవిధంగా గోవు ఆ ఇంట్లో అడుగుపెట్టింది.

“అమ్మాయ్‌ గోమతీ! ఇలారా తల్లీ! అని ఎంతో అప్యాయంగా పిలిచే స్వరాజ్యలక్ష్మిగారు “పిన్నీ” అని గౌరవించే పిల్లలు--పెద్ద ఇల్లు, నగలు చీరలు--మంచి భోజనం, అంట్లు తోమడానికి పనిమనిసి బట్టలుతకడానికి చాకలి--గోమతికి బాగానే వుంది ఆ జీవితం

తన దురదృష్టపు జాతకంలో మార్పువచ్చి అదృష్టం ప్రవేశించిందేమోనని ఆమె అనుకోబోయింది కానీ--

16 ఇల్లలకగానే. ...

స్వరాజ్యలక్ష్మిగారు తనని అమ్మాయ్‌ తల్లీ అని సంబోదించడం పని చేయించుకోడానికే ననీ, పిల్లలు పిన్నీ అని గౌరవించడం పైపైకేననీ తనతో వారికెలాంటి స్నేహభావం లేదనీ సుందగర్రావుకి తను కేవలం భోజనం పెట్టి తదితర అవసరాలు తీర్చే మనిషేనని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు గోమతికి మల్లీ తను గోవులా వుండాల్సిందేనని తెలుసుకుని అలాగే వుంటూ వచ్చింది వాళ్లు తన పేదరికాన్ని, అప్పుడప్పుడు ఎత్తిచూపి, తనకి ఎలాంటి సొకర్యాలు కలుగజేసి మేలు చేస్తున్నారో గుర్తుచేసి, తన ద్వారా మరింతసేవను మరింత కృతజ్ఞతా భావాన్ని పిండుకోడానికి ప్రయత్నిస్తున్నారనీ, తనని ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా వారి మనిషిగా చూడ్డంలేదనీ గోమతి గ్రహించింది తనని ఎవరు మాత్రం తమ మనిషిగా చూశారు? అమ్మపోయినాక వదినె, అన్న ఎవరూ చూడలేదు తనే తన మనిషి, తనే తన మిత్రురాలు, తన దురదృష్టమే తన స్నేహితురాలు, అనుకుంది గోమతి

సరిగ్గా అప్పుడే గోమతి శరీరంలో మరో (ప్రాణానికి అంకురార్పణ జరిగింది, ఆవిషయం ఎంతో అనందంతో సుందర్రావుకు చెప్పింది

అక్కడ ప్రారంభమైంది ఇంకో కథ--

“ఇదెంత మాత్రం వీల్లేదు గోమతీ ఎంత మాత్రం వీల్లేదు మా కిరణ్మయికి పెళ్ళయి దానికి బిడ్డపుడితే నేను తాతయ్యనవుతాను ఇప్పుడు నువ్వు మళ్లీ తండ్రిని చెయ్యడానికి వీల్లేదు నా పరువేం కావాలి ఈ వయస్సులో నాకు పిల్లలేమిటి? నీకు నలభై ఏళ్ళొచ్చాయి. కిరణ్మయి బాబూ వాళ్లే మన పిల్లలు వాళ్ళు నిన్ను స్వంత అమ్మకన్నా ఎక్కువ (ఫేమిస్తారు” అన్నాడు ఆయన

*థ ఒక్క నలునునీ నాకు దక్కనీయండీ మిమ్మల్నేం అడగను' అని ప్రాథేయపడింది గోమతి

“విను గోమతీ నీకింకేం కావాలన్నా అడుగు మేం నిన్ను సరిగ్గా చూడం అనుకుంటే నీపేర కొంత డబ్బు బ్యాంక్‌లో వేస్తాను. వరలక్ష్మి నగలలో సగం యిప్పుడే నీకిస్తాను నెలనెలా నీపేర రికరింగ్‌ డిపాజిట్‌ కడతాను, నేను పోయాక నీకొచ్చేలా ఇంకో ఇన్సూరెన్సు సాలసీ తీసుకుంటాను '

“అవన్నీ నాకవసరంలేదండీ నేను డబ్బులో వుట్టి పెరగలేదు వున్నదాంతోనే నాకు సంతృప్తి కానీ నా బిడ్డ అనేది ఈ ఒక్కటే'

“నా మాట విను గోమతీ. ఈ బిడ్డ పుట్టడంవలన ఎన్నో సమన్యలొస్తాయి. తొర దగ్గర ఎబార్షన్‌ చేయించుకో ఈ వయస్సులో పిల్లల్ని కనడం బాగోదు '

ఈ వయస్సులో పెల్లిచేసుకోవడం బాగుందా?

ఈ వయస్సులోవయసాచ్చిన ఆడపిల్ల పడకగది ప్రక్కన భార్యతో పడుకోడం బావుందా? ఈ వయస్సులో జుత్తుకి రంగువేసుకోవడం బావుందా--వంటికి ప్రే సెంట్లు కొట్టకోడం బావుందా? అని గోమతి అడగలేదతన్ని

గోవు 17

“అవునమ్మా వాడు చెప్పిందే సబబు. నువ్వు కూడా ఆలోచించు, మనవడుపుట్టే ఈడులో కొడుకులేమిటమ్మా నీవుమాత్రం వయస్సులో తక్కువా నీ ఈడు! నిజంగా కిరణబ్మ్యయంత కూతురుండవలసిన మాట..'అని సన్నాయి నొక్కులు నొక్కింది ఆవిడ వృద్ధ మహారాణి--జంబుకం

ఇలా రెండురోజుల అనంతరం తనకితెలియకుండా తను ఇక్కడ ఈ హాస్పిటల్లో తననర్వస్వం పోగొట్టుకుని వొట్టి చేతుల్తో మళ్లీ సుందరరావుగారింట్లో తేలింది గోమతి ఆఅవతలగదిలో అందరూ టీవీ చూస్తున్నారు

“దా అమ్మాగోమతీ నువ్వుకూడా వచ్చి కూర్చో ఒక్కతివే ఏం పడుకుంటావు? పోయిన దానికి బాధపడకూడదు నువ్వులా వుంటే మాకేం బావుండదు” అని చెయ్యిపట్టుకుని లేవదీసింది అవిడ, వృద్ధమహారాణి

గోమతిలేచి వెళ్ళి హాలులో కూర్చుంది అందులో ముగ్గురాడవాళ్లు. స్త్రీలు చాలా పురోగమించారని, ఇందిరాగాంధీ దానికి ఉదాహరణ అనీ, స్త్రీలు విమానాలు నడిపేస్తున్నారనీ బిజినెస్‌ చేస్తున్నారనీ, స్త్రీలుగవర్నర్‌లు అయ్యారనీ, పదిపేర్లని పదేపదే చెబ్ప, ఈ పదిమంది స్త్రీల ప్రగతే భారతదేశ స్రీల గతి అని, నొక్కి వక్కాణించింది ఇంకొకావిడ నీతో పూర్తిగా ఏక్షీభవిస్తాననీ- నేనుకూడా అళావాది ననీ చెప్పింది మొత్తానికి అందరూ కలిసి ప్రపంచం అంతా సుఖంగా వుంది అని అంతా ప్రగతే తప్ప ఇంకేంలేదనీ అందరూ కూడా వెండీ అంచుల్నే చూడాలిగానీ నల్ల మబ్బుల్ని చచ్చినా చూడకూడదనే తీర్మానించి, చిరునవ్వులు నవ్వి నమస్కారాలు పెట్టేశారు.

గోమతికి వాంతీ, దానితో పాటు దుఃఖమూ కలిగింది నలఖై కోట్ల ప్రీ లోకంలో ఇరవైమంది అత్యున్నత స్థానంలో వున్నారని మురిసిన స్త్రీలని చూసి వెంటనే అమెకి తారాదేవి హాస్పిటల్లో నాలుగోకాన్పులో తన బ్రతుకో చావో తేల్చుకోడానికి సిద్ధమవుతున్న పూచిక గుర్తొచ్చింది మాయచేసి మత్తుపెట్టి ఎబార్షన్‌ చేయించిన తను గుర్తొచ్చింది స్వంతకొడుకు ఇంట్లో పనిమనిషి కన్నాహీనంగా బ్రతికిన అమ్మగుర్తుకొచ్చింది నూతిలో పడి చనిపోయిన స్నేహితురాలు కాత్యాయిని గుర్తుకొచ్చింది పూచిక బ్రతికిందా! ఆమెకి ఈసారి మగపిల్లవాడు పుట్టాడా? అయ్యో! అనుకుంది గోమతి మరునాడు ఇంజెక్షన్‌ చేయించుకోడానకి హాస్పిటల్‌కి వెళ్లిన గోమతికి పూచిక తల్లి ప్లాస్కు తో ఎదురైంది

'మీఅమ్మాయి ప్రసవించిందా? ఎలావుంది? అనడిగింది గోమతి

'ప్రసవించిందమ్మా--మళ్లీ ఆడపిల్లే అల్లుడు నిన్నటినించీ పిస్పిటల్‌ గుమ్మం తొక్కలేదు'. అని కళ్లు తుడుచుకుంది

16 ఇల్లలకగొనే. ... ఇంబెక్షన్‌ చేయించుకుని ఇంటికి వచ్చిన గోమతికి గుమ్మరలో ఎదురైన స్వరాజ్యలక్ష్మి మనిషి వేషంలో వున్న తోడేలుగా కనిపించింది తను ఇంటికి వచ్చి రెండురోజులయినా ఇంతవరకు కన్పించని ప్లీడరుగారు పెద్దమనిషి మొహం తగిలించుకున్న దొంగలా అనిపించేడు అవునూ ఎమయినట్టు ఆయన హైకోర్టులో అర్జెంటుకేసుండి హైద్రాబాద్‌ వెల్తినట్టు చెప్పారు కానీ, నిజం అది కాదనీ, వేసక్టమీ చేయించుకోడానికి అక్కడున్న డాక్టర్‌మిత్రుడి దగ్గరకువెళ్లాడనీ. వున్నవూళ్లో ఆ పని చేయడానికి ఇష్టం లేకపోయిందనీ తరువాత తెలిసింది గోమతికి. అప్పుడు ఆమె కళ్లల్లో నలభై ఏళ్ళుగా కాపురం వుండిపోయిన బెరుకు, బెదురు, దైన్యం నిస్సహాయత మాడి మసి అయిపోయేలా ఒక్క చూపు చూసింది గోమతి తనపాలు పితుక్కుని, పితుక్కుని రక్తం పిండుకోడానికైనా వెనుదీయని మనుష్యుల్ని , వారి హింసాప్రవృత్తినీ అర్ధం చేసుకున్న గోవు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలాగా రంకెవేసి- తన కొమ్ముల్లో కనబడ్డ వారినల్లా పాడిచిపాడిచి కుమ్మికుమ్మి వదిలినట్లు గోమతి విశ్వరూపర దాల్చింది అప్పుడామెకి తోడేలుమొహం తగిలించుకున్న స్వరాజ్యలక్ష్మి అసలు ముసలిస్వరూపం కనిపించింది దొంగమొహం తగిలించుకున్న ప్లీడరుగారి పిరికిమొహం కనిపించింది వాళ్ల మేడ, వాళ్లసంపద, వాళ్ల నగలు పనికిరాని 'పేకముక్కల్లా కనిపించాయి తోడేలుమొహాన్ని ఊడదీసి కసువులో పారేసింది దొంగమొహాన్ని ఉతికి పెరట్లో ఆరేసి, నిజంమొహంతో తిరగరా పిచ్చి నాయనా అని గాండ్రించింది పూనకం వచ్చిన దానిలా గర్జించింది. ఆమె ఆజ్జ లేనిదే ఇంట్లో ఎవరూ ఎఏమీచేయడానికి వీల్దేదని శాసించింది. అయినా ఆమె ఆవేదన అణిగిపోలేదు ఆమె పగ చల్తారలేదు ఆమె శోకం క్రోధాగ్ని అయి ఆ ఇంట్లోవారి ఆహంకారాలను, నిలువెల్లా దహించింది ఆమె వంటింట్లో నుంచీ వీధిలోకి వచ్చింది పూచికపుల్లల్నీ గోవుల్నీ పోగేసి ఇదీ మీ బ్రతుకు అని చెప్పింది తమ్ముడికి పెళ్చిచేసి అప్పనంగా పని మనిషిని తెచ్చుకున్న సంతోషం హరించిపోగా ఆ 'పోట్టగొడ్డు'ని చూసి హడలిపోయి మంచం పట్టింది స్వరాజ్యలక్ష్మి గోమతి తన పడకగదిలోకి ప్రవేశాన్ని నిషేధించాక, ఆ తలుపులు తనకోసం ఇక తెరుచుకోవని తెలిసినాక, ఇండియన్‌ పీనల్‌కోడ్‌లోని ఏ సెక్షన్‌ ప్రకారం తనకిలాంటి శిక్ష పడిందో అర్ధంకాలేదు సుందరరావుకి (ఉదయం వారవ(్రిక ఉగాది (వత్వేక నంచిక 1990. టే

రాయసం బంబోణి వీణ మీద చాలా బావుంటుంది. ఇన్ని కృతులు నేర్చుకున్నా “విరిబోణి వర్ణం అంటే శారదకి చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో ఆమెకీ తెలీదుగానీ అదంటే చాలా ఇష్టం ఆరోజు ఇల్లు దులుపుకుంటూ వీణ శుభంగా తుడుస్తుంటే ఒకసారి “విరిబోణి వాయించుకోవాలనిపించింది వీణ మాస్టారు గుర్తొచ్చారు- “సాధన చేస్తే నువ్వు ధనమ్మాళ్‌ అంతవుతావమ్మా! అనేవారు--సాధన చెయ్యడానికీ టైం ఎక్కడ తీగెలు సరిగ్గా బిగించి, శృతిచేసి నర్దం మొదలెడుతుండగా కాలింగ్‌బెల్‌ 'మోగింది-వీఐ ప్రక్కన పెట్టి తలుపు తీసింది శారద. “ఇదేమీటి ఇల్లు ఇలావుంది! నేను నాలుగింటికల్లా వస్తానని చెప్పలేదూ -అయిదింటికి నా కొలీగ్‌ శివరావుని పిలిచేను అతని భార్యతో సహా వస్తాడు _ ఈ వీణ బయటికెందుకు తీశావిప్పుడు-మైగాడ్‌ - వాళ్ళకేవైగా తినడానికి చేశావా లేదా - అన్నాడు శారద వీణ పెట్టెలో పెట్టింది- విరిబోణీ వర్ణం ఆమె మనసులో మెదలుతుంది శివరావుకీ భార్యకీ స్వాగతం పలకాలి- ఈలోగా ఇల్లు సర్జాలి--ఇల్లు నీటగా ఉండకపోతే రావ్‌

20 ఇల్లలకగానే.... గౌరికి కోపంవస్తుంది ఫారిన్‌ కంపెనీలో పనిచేసే వారంతా ఒకరకంగా ఉండాలట- వాళ్ల కల్చరే వేరట వీణ పెబ్టైమీద కవరు కప్పి దానిమీద పూలకుండీ అమర్చింది శారద.

శివరావుగారు వారి సతీమణీ వేంచేశారు

వారు రాత్రి పన్నెండు వరకూ ఉన్నారు-తెల్లవారాక పిల్లలు స్కూలుకి - రావుగారు ఆఫీసుకి-సినిమాలోలాగ బ్రేక్‌ఫాస్ట్‌ టేబిల్‌ అలంకరించాలి- అన్నీ యాంత్రకంగా జరిగి పోతుంటాయి

రావ్‌గారు అప్పుడప్పుడు ఆఫీస్‌ పనిమీద ఊరువెడుతుంటారు. ఆయన వెళ్ళినప్పుడు శారదకి కొంచెం ఊపీరాడినా - అప్పుడు పిల్లలకి యూనిట్‌ టెస్టులో ఎవో వస్తుంటాయి- అప్పుటినించి వీణ బయటికి తీసి విరిబోణి వాయించుకునే అవకాశం శారదకి రాలేదు-

అ రోజు మధ్యాహ్నం రావుగారు క్యాంప్‌కి వెళ్లేరు- చిన్నపాప నోట్‌బుక్స్‌ కొవాలనీ, పెద్ద పాప సాక్సు కావాలనీ తొందరపెట్టేరు- ఇంట్లో సరుకులు కూడా కొన్ని కావాలని బజారుకి బయల్లేరింది శారద వ్లాట్‌కి పదిగజాల దూరంలో మోదుగ చెట్టుంది ఆ చెట్టుక్రింద ఓటీ కొట్ట (బడ్డీ) ఉంది అక్కడ నాలుగైదు రిక్షాలు ఎప్పుడూ ఉంటాయి. రావ్‌గారు ఊళ్లో ఉంటే కారుంటుంది ఆయన లేకపోతే కారుండదు

టీ కొట్ట నారాయణకి పాపలంటే ఇష్టం. అందుకని అతను పనిగట్టుకుని శారదని పలకరిస్తుంటాడు

రావ్‌గారు రాత్రివేళ ఆలస్యంగా ఇంటికి వచ్చే రోజుల్లో, కిటికీ దగ్గర కూర్చుని శారద టీ కొట్బకేసి చూస్తూ ఉంటుంది రెండవ ఆట సినిమా వదిలే వరకూ చెట్టుక్రింద సందడిగా ఉంటుంది,

“బావున్నారా అమ్మా ఏం ఇలా వచ్చేరు?” అన్నాడు నారాయణ

“బజారెడదామని అవును నువ్వు బాగున్నావా? నీ బిజినెస్‌ బాగా నడుస్తుందిలా ఉంది. ఎప్పుడూ హడవుడిగా ఉంటుంది ఇక్కడ” అంది శారద.

“అవునండీ హడావుడే ఇది మంచి సెంటర్‌ కదా”.

“ఇంకేం నీకు బాగా సంపాదన” శారద అతన్ని అభినందించింది

“డబ్బు నాదెలా అవుతుందమ్మా! నేనొట్టి కూలోణ్ని నెల జీతపు గాడిని అసలు ఈ కొట్టు యజమాని మా రాములు బాబాయి"నారాయణ నిట్టూర్చేడు

“ఐమిటీ! ఈ కొట్టు నీది కాదన్నమాట మరి నువ్వెలా ఉంటున్నావిక్కడ?”

“ఎక్కడుండనమ్మా - ఎక్కడ చేసినా ఒకటే కాకపోతే ఇక్కడ కొంచెం వసతులు బావున్నాయి.

తొయిలం 2] లతలు

“టీ”లు అందించే కుర్రవాడు వెంకటేశు యంత్రంలా పని చేసుకుపోతున్నాడు తొట్టి నీళ్ళలో కప్పులు ముంచి కడిగేసి, మళ్ళీ టీ నింపి ట్రేలో పెట్టుకొని వెడుతున్నాడు శారద వాణ్ణి అలా రాత్రి పన్నెండు వరకూ చూస్తూనే ఉంటుంది

“ఈ కొట్టు నువ్వు కొనేసుకుంటే ఈ డబ్బంతా నీకే ఉండేదిగా నారాయణా!” అంది నారాయణశారద వంక అజ్ఞానివంక బ్రహ్మజ్ఞాని చూసినట్లు దయగా చూసి నవ్వి, “నేనేం కొంటానమ్మా - నాకోచ్చే జీతం ఎంతని? నెల నెలా ఈ కొట్టు మీదొచ్చే సంపాదనలో పదో వంతు కూడా లేదు - అది నా కుటుంబానికే చాలదు ఇంత సెంటర్‌లోకొట్టు కొనాలంటే గుడ్‌విల్‌ ఇవ్వోలి కదా- పైగా రాములు బాబాయికేం ఖర్మ అమ్ముకోడానికి - బంగారు బాతుని అమ్ముకుంటారేమిటమ్మా.

పిల్లలు రిక్షా పిలిచి బేరం ఆడారు

నారాయణని చూసి జాలిపడుతూ రిక్షాఎక్కింది శ్చారద

బజారు నుండీ వచ్చేసరికి ఎనిమిదిన్నరైంది అప్పటికే రావ్‌ గారొచ్చారు

ఆయన కొంచెం చిరాకుగా కన్పిస్తున్నారు

వెళ్ళినచోట పని అయి ఉండదని శారదకి అర్ధం అయింది పైగా ఇంటికి వచ్చేసరికి తొళంవేసి ఉంటే ఆయనకి కోపం వస్తుంది

“అమ్మో అమ్మో అని మమ్మల్ని సతాయిస్తుంటారు కొనేవాడికి ప్రోడక్ట్‌లో లోపాలు తెలీవా? అవి సరిచెయ్యమంటే నీ ఉద్యోగం దేనికని అడుగుతారు"

అటుపై అధికార్లనీ ఇటు డీలర్లనీ ఓ పావుగంట ఏకధాటిగా తిట్టేసి స్నానానికి వెళ్ళాడాయన.

రొవుగారు భార్యాబిడ్డలతో ఎక్కువ మాట్టాడరు మాట్లాడినా తన అఫీను విషయాలే ఎక్కువ మాట్లాడతారు ఆయనకి తన ఉద్యోగం తప్ప వ్యక్తిగతమైన విషయాలేం ఉండవు చెప్పడానికి తన సహ ఉద్యోగస్థులు, తన ఆఫీసు, తన రీజినల్‌ మానేజర్‌ - వైస్‌ ప్రెసిడెంటూ

  • ఆ ఊల్లో డీలరు - ఈ ఊల్లో డీలర్‌, వాళ్ల ప్రశ్నలు - తన తెలివిగల సమాధానాలు - తన అనుభవం - తన తెలివితేటలు - తన టార్గెట్స్‌ సాధించకపోతే వారి తిట్లు, అప్పుడు తనువారిని తిట్టడం - ఆకంపెనీ, దాని గొప్పతనం, ఎన్నికోట్ల టర్నోవర్‌ -ఉద్యోగస్టుల కెన్షి సదుపాయాలు ఇదంతా శారదకీ కంరస్థం అయిపోయింది - ఉదాహరణకి ప్రొద్దున్న ఎప్పుడైనా టిఫిన్‌లోకి చపాతీలు చేసిందనుకోండి, వెంటనే అతనందుకుంటాడు

“మా కొలీగ్స్‌ ఎవరూ ప్రొద్దున్నే చపాతీలు తినరు తింటే ఇడ్తీ , లేక బ్రైడ్‌ బట్టర్‌ జామ్‌. పల్లెటూరి పెంపకం సరేసరి - వెళ్లి ఒక్క సారి మా కొలీగ్స్‌ భార్యల్ని చూసిరా ఎలాంటెలాంటి వంటలు చేస్తారో” అంటాడు.

22 ఇల్లలకగానే .,.

అదొక స్వర్గసీమ అందులో పని చేసే వారంతా దేవతలు - అయినా అ న్వర్గసీమకి అధిపతులైన మార్కెటింగ్‌ మానేజర్‌ వైస్‌ (పెసిడెంట్‌ జనరల్‌ మ్యానేజర్‌కి వీరంతా దానులు. “దాస్యంలోనే ఆనందం అదంతేలే మరి' క్రొత్తలో అనుకునేది శారద

కానీ రావ్‌ గారు అమె ఆలోచన మార్చేసేరు

“కంపెనీ మనకెన్నో సౌకర్యాలిస్తోంది కనుక అది దొన్యంకాదు. మాదంతా ఒక కుటుంబం - మేం శ్రద్ధగా పనిచేస్తాం అంటే కంపెనీ శ్రేయస్సు కోరతాం' అంటాడు అతని స్వామి భక్తి ఇప్పుడు శారదకి ఆరాధనీయం అయింది తన భర్త చాలా గొప్పవాడు సిన్సియర్‌ వర్కర్‌ అందుకే ప్రమోషన్‌ వచ్చింది, కారొచ్చింది. బోలెడు అదనపు సౌకర్యాలొచ్చేయి

"అతను అంత కష్టపడబట్టే ఇంటికి ఇన్ని అమిరాయి పిల్లలకి మంచి స్కూళ్లు అమిరాయి తినడానికి పారియ్యడానికి మంచి ఆహారం దొరుకుతోంది జై కంపెనీకి జై మా అయనకీ” అనేసుకుంది శారద

ఫలానా కంపెగీ ఉద్యోగుల భార్యలలో ఒక భార్యగా మారిపోయింది అతన్ని కనిపెట్టి మంచి చెడ్డలు చూ. సు. నికి అన్నీ అందిస్తే అతను బాగా పనిచెయ్యగలుగుతాడు అప్పుడు ప్రమోషన్గువస్తాయి హొడ ఎరుగుతుంది జీతం పెరుగుతుంది పిల్లలకి మంచి చదువులొస్తాయి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది కనుక రావుగారు కంపెనీకి ఎంత శ్రద్ధగా 'పనిచేస్తారో - ఎంత స్వామిభక్తితో ఉంటారో - మిసెస్‌ రావు కూడా రావ్‌గారి పట్ట అంత భక్తిశ్రద్ధలు చూపిస్తూ ఆయన అడుగులకి మడుగులొత్తుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటోంది

అలాంటి మిసెస్‌ రావుకి విరిబోణ్‌ వాయించుకోవాలనిపించింది ఒకరోజు. ఇంకొక రోజు పిల్లల్ని తీసుకుని ఎటైనా వెళ్లి రావాలనిపించింది మరోసారి తన స్నేహితురాలు శకుంతల ఇంటికి వెళల్తాలనిపించింది కానీ కుదరలేదు ఓసారి రావుగారి స్నేహితులొచ్చేరు మరోసారి అతని ఇమ్మీడియట్‌ బాస్‌ భోజనానికి వచ్చేడు

ఇంకోసారి ఆయన రీజినల్‌ మానేజరొచ్చి ఊళ్ళో తిష్టవేసి సేల్స్‌కాంపేన్‌ మొదలేశాడు

సంవత్సరం మొదట్లో జరిగే సేల్స్‌ కాన్ఫరెన్స్‌కి వెళ్లొచ్చిన రావ్‌గారు భోజనంచేస్తూ చెబుతుంటారు

“ఈ కాన్ఫరెన్స్‌లో అంతా టెన్షన్‌ ఎవరికీ మాట్లాడ్డానికి గుండెలులేవు మా వైస్‌ [పెసిడెంట్‌ మమ్మల్ని బాగా తిట్టేశాడు నువ్వు పని పిల్లని తిడతావే అలాగ - నీకు పాత చీరె ఇచ్చాను ఐస్‌క్రీం పెట్టాను సినిమాకి డబ్బులిచ్చాను- అని దెప్పుతావు చూడు అలాగన్న మాట మీకు బోనస్‌లిచ్చాం రెంట్‌ ఫ్రీ క్వార్టర్స్‌ ఇచ్చాం కారిచ్చాం మెడికల్‌ బెనిఫిట్సిచ్చాం యాక్చుయల్సిచ్చాం అయినా టార్గెట్స్‌ సాధించలేదు బహుశా సుఖాలెక్కువై ఉండొచ్చు. ఎలాగో సరే నేను లేచి ధైర్యం తెచ్చుకుని ఇలా చెప్పాను ప్రాడక్ట్‌ బాగుచెయ్యండి ఇన్సెంటివ్‌

తాయిలం 23 లివ్వండి టీవీలో ఎడ్వర్న్‌దైజ్‌ చెయ్యండి అందరిలాగ అని దానికి ఆయన నిప్పుతొక్కిన కోతి అయ్యేడు

అవ్వన్నీ చేసుకుంటూ పోతే నీ మీద ఎడాదికి ఇంత ఖర్చుపెట్టడమెందుకోయ్‌. మాకింతమంది మార్కెటింగ్‌ స్టాఫ్‌ ఎందుకూ? ఇదేమన్నా సబ్బా - సాంబారుపాడా? ఒక్కసారి ఫార్ములా మారిస్తే కొన్ని కోట్ల నష్టం - టీవీలో చెప్పేకాడికి మీకెందుకు టీ ఏ లివ్వడం అని విరుచుకు పడిపోయాడు అలా ఉంటాయి వాళ్ల ఆలోచనలు " ఇలా చెప్పుకుపోతుంటాడాయన ఎవరికీ అందులో వినాలని ఉండదు. అయినా వినాలి అతనింటి యజమాని. యజమాని చెప్పే దెప్పుడూ శ్రద్ధగా వినాలి, శారద వింటుంది ఆమెకిప్పుడు కంపెనీ గురించి పూర్తిగా తెలుసు అలాగ నిర్విఘ్నంగా పదిహేను సంవత్సరాలు గడిపిన శారదకిప్పుడు కొంచెం చిరాకనిపిస్తోంది తన ఆలోచనల్లో తన ప్రవర్తనలో ఐదో లోటు ఆమెకి అనుభవమౌతుంది. తనని తాను పారేసుకున్నట్లు అనిపిస్తోంది ఆ పారేసుకున్న తనని వెతికి తెచ్చుకోవాలని కూడా అనిపిస్తోంది అదెప్పట్నించీ అంటే ప్రక్క ఎపార్ట్‌మెంట్‌లోకి రాగిణీవాళ్ళు దిగేక ఇద్దరు పిల్లలు రాగిణి వాళ్లాయన కంపెనీ కల్చర్‌లో ఇమిడిపోలేదు. ఆ అమ్మాయికి స్వంత కల్చర్‌ ఉంది ఓ రోజు తను వాళ్లింటికి వెళ్లినప్పుడు వాళ్ళు ఎదో సినిమా గురించి మాట్టాడుకుంటున్నారు మరోసారి రాజకీయాల్సి గురించి ఇంకో సారి సాహిత్యం గురించి సంగీతం గురించి అప్పటి నుంచి శారదలో అసహనం మొదలైంది. మొదలైన రోజున ఆమె పెట్టెలో నుంచి వీణ పైకి తీసి సరిగమలు వాయించి పెద్దపాపకి నేర్పింది. అదే రోజున ఆమెకీ రావుగారికీ తగాదా అయింది

రావ్‌గారు మళ్లీ ఎన్యువల్‌ కాన్ఫరెన్స్‌కి వెళ్లేరు వెళ్లేటప్పుడు భార్య చేత సూట్‌కేస్‌ సర్దించుకున్నారు షర్చులకి గుండీలు కుట్టించుకున్నారు కర్చీఫ్‌ల మడతల్లో పౌడరు వేయించి మడతలు పెట్టించారు టైలు, బూట్లు చెప్పులు అన్నీ విడివిడిగా సర్దించారు అది ఆయనకి పదిహేనేళ్ల అలవాటు హోటల్‌ రూంలో దిగి పెట్టె తీసినప్పుడు ఈ పూట వేసుకోవలసిన బట్టలు ఆ పూట పైకి రావాలి తన కొలీగ్స్‌ అంతా అన సూట్‌కేస్‌ చూసి అసూయపడతారు

శారద పనిచేసుకుని కిటికీ దగ్గర కూర్చుంది పిల్లలు చదువుకొని నిద్రపోయేరు చెట్టుక్రింద బడ్డీ కొట్టు చురుగ్గా సాగుతోంది నారాయణ డబ్బులెక్క బెడుతున్నాడు వెంకటేశు తిరుగుతున్నాడు గల్తా పెట్టె నిండుతోంది. అలా చూస్తున్న శారదకి ఆలోచనొచ్చింది.

నారాయణ కదలకుండా కూర్చొని పైస నష్టం రానీయకుండా కాపలా కాస్‌ గల్తా పెట్టెనింపుతున్నాడు వెంకటేశు కాళ్లకి బలపాలు కట్టినట్టు తిరిగీ తిరిగీ అర్ధరూపాయి, రూపాయి పోగేసుకొచ్చి ఇస్తున్నాడు సాయంత్రం కాగానే రాములు బాబాయొచ్చి అ రోజు కలెక్షన్‌ మూట కట్టుకుని పోతున్నాడు “ట్ల బో ్జ్గ్‌ ఎ ్స్త్‌ తో శ ్య్ట్ళ ్చ్శ్‌ ్ట్‌ త్య ్ల శ ్ఞ్శ్‌ చ్చ త్‌

24 ఇల్లలకగానే. ...

వెంకటేసుది అందరికన్నా పెద్ద కష్టం. కాని వాడికిచ్చేది రోజు కలెక్షన్లో ఇరవైయ్యోవంతు కూడా లేదు నారాయణదీకష్టమే మీదు మిక్కిలి అతని నిజాయితీకి ఖరీదేలేదు అయినా అతని కష్టంలో పదోవంతుకూడా అతనికీ దక్కడంలేదు ఇదేంన్యాయం ప్రనిపించింది -

శారద చిరాకుపడిపోయింది వెంకటేశు పన్నెండేళ్ల వాడు, ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వాడు ప్రాద్దుటినుంచీ రాత్రిదాకా కాళ్లరిగేలా తిరిగి తిరిగి రాములు బాబాయి సంపద పెంచుళన్నాడు తన నిజాయితీతో శ్రద్ధతో తెలివితేటల్లో రాములు బాబాయి. సంపదని పెంచుతున్నాడు నారాయణ శారద అసంతృప్తిగా కిటికీ దగ్గర నుంచీ లేవబోయింది. పన్నెండవుతోంది నారాయణ కొట్టు మూసేశాడు. మూస్తూ అ రోజు శ్రమకి మెచ్చి వెంకటేశు చేతిలో ఓ చాళ్లిట్‌ పెట్టాడు వాడు దాన్ని భక్తిగా అందుకుని ప్రసాదంలా నోట్లో వేసుకున్నాడు ప్రతీరోజు అది ఆఖరి కార్యక్రమం, ఈ రోజు అ చాక్లెట్‌ దాన కార్యక్రమం చూసిన శారదకి అసహ్యం వేసింది. ఆమె కిటికీ తెరదించి లైటు ఆర్పిపడుకోడానికి వెల్లింది

రావుగారు కాన్ఫరెన్స్‌ నుంచి ఇనుమడించిన ఉత్సాహంతో వచ్చారు పిల్లలకి ఏవో కొనుక్కొచ్చారు వాళ్లని హుషారుగా పలకరించారు. బహుశా అధికారుల ప్రశంసకిపాత్రులై ఉంటారు ఆయన హుషారే ఇంట్లో అందరి హుషారుంఆయన చిరాకుగా ఉంటే ఇంట్లో అందరూ నిళ్ళబ్దంగా ఉండాలి,

“ఈసారి మా రీజినల్‌ సేల్స్‌ అందరికంటే ఎక్కువ, టాగ్గెట్‌ దాటిపోయింది. మొన్నతిట్టిన మా వైస్‌ పెసిడంట్‌ ఈసారి ప్రత్యేకం నన్ను మెచ్చుకున్నాడు నేను ఈ ఆగస్ట్‌లో మార్కెటింగ్‌ మానేజర్‌ అయిపోతాను తెలుసా ఈసారి మా కంపెనీ వారు భార్యలకి కూడా కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు మిడిల్‌ మ్యానేజ్‌మెంట్స్‌ స్థాయిలోని వారి భార్యలందరికీ కూడా రిస్ట్‌ వాచీలిచ్చారు. తమ భర్తల్ని సమర్శలుగా పనిచేయడానికి తోడ్పడీనందుకు” రావ్‌ గారి హుషారు శారదకి తెలీందేంకాదు ఆమె అక్కడ నిలబడీ చూస్తోంది

రిస్ట్‌ వాచీ తీసి భార్యకిస్తూ “మాకంపెనీ కల్చరే వేరు ప్రతి మగవాడీ విజయం వెనక స్త్రీ ఉంటుందని వాళ్లకి తెలును”.

అ వాచి చూన్తుంటే చప్పున శారదకి నారాయణ వెంకటేశు చేతిలో పడేసే చాక్లెట్‌ గుర్తొచ్చిది వెంకటేశులా నారాయణ తిరగి టీలు అందించలేడు. వెంకటేశు లేనిదే వ్యాపారంలేదు అందుకే వాడీకా తాయిలం అవును అలాగే ప్రతిమగవాడి వెనకా ఓ స్రీ ఉంటుంది ప్రతి స్తీ తనని తాను మర్చిఫోడం వెనక తనని తాను పారేసుకోడం వెనక ఓ పురుషుడే కాదు వ్యవస్థ మొత్తం ఉంటుందేమో అనిపించింది శారదకి - ఆమె వైవాహిక జీవితంలో మొదటిసారి

(జ్యొతి మూనవత్రిక, అక్టోబరు, నవంబరు 19889) టి

'షంంగానే రంపగానా డా రేల్లాలు కాకపూర్వం ఓ యువతి. చదువూ సంధ్య తెలివీ చాకచక్యం,

సమయస్ఫూర్తీ, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి.

అమ్మాయి అందం తెలిలీ, వాళ్ల నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసి, ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది" అని చెప్పేడు. ఆ ఇల్లాలు వెంటనే పయిట నడుముకి బిగించి, ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకుని, “నువ్వు ఇల్లు అలకడంలో నేర్చరివి - ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్చరివి - సెభాష్‌ కీప్‌ ఇట్‌ అస్‌” అని ఇంగ్లీషులో మెచ్చుకుని భుజం తట్టాడు

దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి, ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలూ - ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కానీ ఒక నాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ “నాపేరేమిటి చెప్మా!” ' అనుకుంది అలా అనుకుని ఉలిక్కిపడింది చేతిలో అలుకు గుడ్డా, ముగ్గు బుట్టా అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ, “నాపేరేమిటి--నాపేరేమిటీ!” అని తెగ

26 ఇల్లలకగానే, .., ఆలోచించింది ఎదురుగా ఇంటికి నేమ్‌బోర్డ్‌ వేలాడుతోంది మిసెస్‌ ఎం సుహాసిని ఎం ఏ పిహెచ్‌డి - ప్రిన్స్‌పాల్‌ “ఎక్స్‌' కాలేజి అని - అవును అలాగే తనకీ ఓ పేరుండాలి కదా- ఇలా మర్చిపోయానేమిటి?ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను- ఇప్పుడెలాగ అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో ఆపూటకి ఇల్లలకడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది--పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని, “అమ్మాయ్‌ నాపేరునీకు తెలుసా!” అని అడిగింది.

“అదేమిటమ్మా అమ్మగార్లపేర్లతో మాకేమిటి పని! మీరంటే మాకు అమ్మగారే!

ఫలానా తెల్లమేడ క్రింద భాగంలో అమ్మగారంటే మీరు” అన్నది అ అమ్మాయి

“అవున్లే పాపం నీకేం తెలుసు" అనుకుంది ఇల్లాలు.

స్కూల్‌నించి మధ్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నాపేరు

అనుకుంది ఇల్లాలు

“ఓరే పిల్లలూ, నాపేరు మీకు తెలుసా?” అని అడిగింది వాళ్ళు తెగ అశ్చర్యపడిపోయి

“నువ్వు అమ్మవి --నీ పేరు అమ్మే --మేం పుట్టినప్పటినించీ మాకు తెలిసింది అదే

  • నాన్నగారి పేరుతో ఉత్తరాలోస్తాయి. అయన్నంతా పేరుతో పిలుస్తారు గనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదుగదా--పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు" ' అనేశారు వాళ్ళు--అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మానాన్న ఉన్నారుగానీ నెలకో రెండు నెలలకో ఓసారి ఫోన్‌ చేస్తారు --చెల్లెళ్ళు అక్కలూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళు అలుక్కోడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు అంటే ఏ పెల్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్తముగ్గుల్ని గురించో --వంటల్ని గురించో మాట్టాడుకోడమేగానీ ఉత్తరాలు లేవు ఇల్లాలు నిరాశపడింది గానీ ఆమెకి అశాంతి ఎక్కువైంది తన పేరెలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది అంతలో పక్కిటాంవిడ పేరంటం పిలవడానికొచ్చింది పోనీ ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి,

“మరే! మీ పేరు నేనడగాలేదు--మీరుచెప్పాలేదు కుడిచేతి వైపు తెల్లమేడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజరుగారి భార్య అనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అనో చెప్పుకుంటాం -- అంతే ' అనేసింది ఆ ఇల్తాలు

ఇంక లాభంలేదు--పిల్లల స్నేహితులు మాత్రం ఎం చెప్తారు--వాళ్ళకి కమలావాళ్ళ

అమ్మ అనో, ఆంటీ అనో తెలుసు --ఇక భర్తగారొక్కరే శరణ్యం --ఆయనకే గుర్తుంటే ఉండాలి

రాత్రి భోజనాల దగ్గర అడిగింది “ఏవండీ నాపేరు మర్చిపోయానండి--మీకు

గుర్తుంటే చెప్పరా!'

ఇల్లలకగానే, .., 2/7

భర్తగారు పెద్దగా నవ్వేసి “అదేమిటోయ్‌ ఎన్నడూ లేనిదివ్వాళ్ల పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. నిన్ను పెళ్ళయిన్నాటి నుంచీ 'ఎమోయ్‌' అని పిలవడం అలవాటైపోయింది. నువ్వుకూడా అలా పిలవకండి నాపేరు నాకుంది కదా అని చెప్పలేదు-- అందుకని నేనూ మర్చిపోయాను--ఇప్పుడేం? నిన్నందరూ మిసెస్‌ మూర్తి అంటారుగదా'” అన్నాడు “మిసెస్‌ మూర్తి కాదండీ నా అసలు పేరు నాక్కావాలి-ఎలాగిప్పుడు? అన్నది అవేదనగా

“దానికేం పోనీ ఎదో ఒక పేరు పెట్టేసుకోకొత్తది” అని సలహా ఇచ్చాడు ఆయన.

“బావుందండీ--మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అనో సుందరరావు అనో సపెట్టుకోమంటే ఊరుకుంటారా? నాపేరే నాక్కావాలిఅన్నది--

“బాగానే ఉంది చదువుకున్నావుగదా-సర్టిఫికెట్టమీద పేరుంటుంది గదా-- ఆ మాత్రం కామన్‌సెన్స్‌ లేకపోతే ఎలా --చూనుకో వెళ్ళి” అని సలహా ఇచ్చాడాయన మళ్ళీ--

ఇల్లాలు సర్టిఫికెట్లకోసం హోరాహోరీ వెతికింది--బీరువాలో పట్టుచీరెలు, షిఫాన్‌ చీరెలు --నేత చీరెలు --వాయిల్‌ చీరెలు వాటి మాచింగ్‌ జాకెట్లు, లంగాలు, గాజులు పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరిణెలు, గంథంగిన్నెలు, వెండీకంచాలు, బంగారంనగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయేగానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడబేదు, అవును--తను పెళ్ళయిన తరువాత ఇక్కడికొచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు

“అవునండీ --నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు--నేను మా ఊరు వెళ్లి ఆ సర్టిఫికెట్లు వెళుక్కుని నాపేరు అడిగి తెలుసుకుని రెండు రోజుల్లో వచ్చేస్తాను" అని అడిగింది భర్తని

“బాగానే ఉంది పేరుకోసం ఊరెళ్ళాలా ఏం? నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులూ * ఇల్లెవరలుకుతారు?" అన్నాడు నాధుడు. అవును నిజమే మరి-- తనందరికన్న బాగా అలుకుతుందని గదా-- ఆ పని ఎవర్నీ చెయ్యనివ్వలేదు ఇన్నాళ్ళూ--ఎవరి పన్లు వాళ్ళకున్నాయి ఆయనకి ఉద్యోగం --పిల్లలకి చదువులు-- వాళ్ళకెందుకులే శ్రమపాపం--అనుకుని తనే ఆపని చేస్తూ వచ్చింది--వాళ్ళకి అసలు చేతకాదుమరి--

అయినా పేరు తెలీకుండా ఎలా బ్రతకడం

ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తురాలేదు గనుక సరిపోయిందిగానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది--

“రెండురోజులెలాగైనా కష్టపడండి--నే వెళ్ళి నా పేరు కనుక్కుని రాకపోకే బ్రతకలేకుండా ఉన్నాను ' అని బతిమిలాడి బయటపడింది ఇల్తాలు.

“ఎమ్మా ఇంతర్జంటుగా వచ్చావు? ఆయనా పిల్లలూ బావున్నారా! ఒక్కదానివే వచ్చావేం?”' అని అమ్మా నాన్నా ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చినపని వెంటనే గుర్తుకొచ్చి--

28 ఇల్లలకగానే. ... "అమ్మా నాపేరేమిటో చెప్పమ్మా” అనడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు-- “అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయివి నీకు బి ఏ దాకా చదువు చెప్పించి

యాఖైవేలు కట్నం ఇచ్చి పెల్లి చేశాం-- రెండు పురుళ్ళుపోశాం-- ప్రతి పురిటికీ ఆస్పత్రి

ఖర్చులు మేమే భరించాం -నీకిద్దరు పిల్లలు మీ ఆయనకి మంచి ఉద్యోగం --చాలా మంచివాడు కూడానూ --నీ పిల్లలు బుద్దిమంతులు"

“నా చరిత్రకాదమ్మా--నాపేరు కావాలమ్మానాకు--పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు”

“ఏమోనమ్మా ఈమధ్యన ఆలమారల్లో పాత కాగితాలు ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజుసామాన్లు నర్దించాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటకమీద వడేశాం--రేపు వెతికిద్దాంలే--ఇప్పుడు వాటికేం తొందర --హాయిగా స్నానం చేసి భోజనం కానియ్యమ్మా” అన్నది ఆ ఇల్తాలి తల్లి ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్రరాలేదు--ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గువేస్తూ పేరుమర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు

తెల్లవారింది గొనీ అటకమీద పైళ్ళలో సర్టిఫికెట్టు వెతకడం పూర్తికాలేదు ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది--చెట్టునడిగీ--పుట్టనడిగీ--చెరువునడిగీ--తనుచదివిన స్కూలు నడిగీ--కాలేజీనడిగీ--అరచీ అగ్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తనపేరు సంపాదించింది -- ఆస్నేహితురాలు తనలాగే, తనతోనే చదువుకుని తనలాగే పెళ్ళి చేసుకుని, తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా, ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరునూ--తన స్నేహితురాళ్ళ పేర్లనూ కూడా గుర్తుంచుకున్న వ్యక్తి-ఆ స్నేహితురాలు ఈవిణ్గి చూడగానే గుర్తు పెట్టి, “ఓ, హాయ్‌ శారదా! నా ప్రియమైన శారదా!” అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది అప్పుడా ఇల్తాలిని దాహంతో ఆర్బుకుపోయి, ఎండిపోయి (ప్రాణం పోవడానికి సిద్దపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లోపోసి బ్రతికించిన చందంగా--బ్రతికించింది ఆ స్నేహితురాలు-

“నువ్వు శారదవి నువ్వు మనస్కూల్లో బెన్స్‌క్లాసులో ఫస్ట్‌ వచ్చావు, కాలేజీలో జరిగిన మ్యూజిక్‌పోటీల్లో ఫస్టాచ్చావు అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి మనందరం పదిమంది "స్నేహితులం--వాళ్లందర్నీ నేను అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉన్నాను--మేం౦ ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం-- నువ్వొక్కదానివే మాకు అందకుండా పోయావు చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు” అని నిలదీసింది ఆవిడ

“అవును ప్రమీలా --నువ్వు చెప్పింది నిజం నేను శారదనే--నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకంరాలేదు'-- నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలీ అనే విషయం

ఇల్లలకగానే ... 29 మీదే కేంద్రీకృతం అయిపోయాయి ఇంకేం గుర్తులేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది'' అంది శారద అనే పేరుగల ఆ ఇల్లాలు--*+రద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు--పాత ఆలాంలు ౨ ఒ సాధించింది తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న (పైజులు కూడా వెతికి పట్టకుంది

కొండంత సంతోషంతో ఇంటికి తిరిగివచ్చింది. “నువ్వులేవు--ఇల్లుచూడేలా ఊందో--సత్రంలా ఉంది అమ్మయ్య నువ్వొచ్చావు ఇంక మాకు పండగేనోయ్‌ ' అన్నాడు శారద భర్త “ఇల్లలకగానే పండగకాదండీ--అవును గానీ ఇకనుంచీ నన్ను ఏమోయ్‌గీమోయ్‌ అనకండి నాపేరు శారద-- శారదా అని పిలవండి తెలిసిందా. అని కూని రాగాలు తీస్తూ హంషారుగా లోపలికి వెళ్లింది- ఐ మూల దుమ్ము ఉందో ఎక్కడ సామాన్లు ఆర్డర్‌లో లేవోనని చాలా సీరియస్‌గా వెతుకుతూ, డిసిప్టిన్‌కోసం తపనపడే శారద రెండు రోజులుగా దులపని

సోఫాలో హాయిగా చేరబడి, తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తూంది (ఉదయం వారవత్రిక 4 - 5 - 90)

ల్డ్‌

గందీరీ

మేనిమావు చీకట్లు చూస్తుండగానే ముదిరి పోయినా బిడ్డ ఇంటికి

రాలేదు. అప్పుడే ఇంటికొచ్చిన ఆదిలక్ష్మికి వళ్ళు విరిగి పోయినట్లుగా

వుంది. వుండదా మరి ! |! నాలుగొద్దల నుండీ ఒకటే పిండికొట్పడు.

డబ్బు గలోల్లకు పండుగలు పబ్బాలు ఎప్పటి సందీ బాగానే జర్గుతున్నాయ్‌, ఇళ్ళు కడుక్కోడాలు - ముగ్గులేసుకుంటాలు - అరిసెలొండుకుంటాలు - అల్లుళ్ళకు కూతుళ్ళకు బట్టలు కొనడోలు - గట్లనే తన బోటాలకు పిండి కొట్టడాలు - ఇల్లు కడిగి పెట్టడాలు- బూజు దులపడాలు - ఒళ్ళిరిగిపోవడాలు - ఇంటికి రాంగనే జరింత చాయ్‌ కాచిచ్చి - విన్నీళ్ళతో చేతులకు కాపడం సపెడతది బిడ్డ - ఇంత అన్నం కూడా వండి వారుస్తుంది ఈ ఏల ఎక్కడ పనక్కడ్నే వుండె రాత్రి సంటిది తడిపేసిన బట్టలు కూడ కంపు కొట్ట్బకుంట అమైన్సె పడున్నాయి

అమ్మగారిల్లకాడ టీ వి.గాని నూడబోయిందా ఏం? అట్టబోతే సెల్డెల్ని సంక వేసుకుని జోయేది గదా! వెంకులు గాడ్నీ కూడ ఇడిసి బెట్టిపాయె - ప్రక్కింటి అవ్వకాడ చంటిది ఎక్కులు బెట్టి ఏడుస్తోంది.

“ఇంద్ర గెక్కడ కెల్లిందవ్వా!” అనడిగింది ఆదిలక్ష్మి ప్రక్కింటి అవ్వని. తతత వాతలు ంకులంనిదింనచింనన నినన

ఇందీర క

“నాకే మెరుకమ్మా పొద్దుననంగ సంటిదాన్ని నాకాడ బెట్టి పాయింది. కసిన్ని పాలైనా లేవు - చిడ్డ ఒకటే ఎడుపు”

వొళ్ళంతా ఒకటే సలుపు ఆదిలక్ష్మికి. ముందు ఇందిర లేనందుకు కోపం - ఆపైన చీకటిపడ్డారానందుకు భయం - యాదగిరి రెండో ఆట సిన్మా వదిలితేనే గాని ఇంటికి రాడు

  • వచ్చినా తిన్నగా రాడు - వచ్చి సరిగ్గాయింత తిని పడుకోడు - ప్రతి రాత్రీ తిరణాలే - జాగారమే = ఇవ్వాళ తనూ మజ్జిగన్నం తిని చంటిదాన్ని ప్రక్కనేసుకుని కంటి నిండా నిద్రపోవాలని ఆశ పడుతూ వచ్చింది పొద్దుట్నించీ కడగని గిన్నెలు, చంటి దాని బట్టలు, ఖాళీ బక్కెట్లు - కుండలు - పాయ్యిలో నిప్పే లేదు - బొటన వేలు చీకి చీకి ఎంకులు శోష కొచ్చి పాత చీరమీద పడి నిద్రపోయేడు బిడ్డ ఏమైపాయె? అంత నీరసంలోనూ ఆదిలక్ష్మికి ఏడుపు వచ్చింది ఆ కాలువ వొడ్డు గుడిసెల్లోని ఇందిరలంతా ఇళ్ళల్లోనే వున్నారు తన ఇందిర మాత్రం లేదు - ధాన్ని చూశామని గానీ ఎక్కడి కెళ్ళిందో తెలుసని గానీ ఎవరూ చెప్పలేదు, భూలక్ష్మి కూతురు ఇందిర, సెంద్రమ్మ కూతురు ఇందిర, దుర్గమ్మ కూతురు ఇందిర, చింతయ్య కూతురు ఇందిర - అందరింట్లోనే వుండె - మరి దీనికేమాయె 1! ఎవరైనా ఎత్తుకు పోయిన్రో ఎమో! పన్నెండేళ్ళ బిడ్డ - తండ్రిలాగా నలుపు కాదు - తనలాగా ఎరుపు - అందుకే యాదగిరికి అదంటే కోపం - ఎంకులు గాడిమీద గేమ -

“ఇంద్ర కనపళ్ళేదు - యాడబోయిందో ఏమో - నీకేమన్న ఎరికెనా ? * అనడిగింది పన్నెండు గంటల వేళ ఇంటికొచ్చిన యాదగిరిని =

“నాకేమెరిక, పొద్దుననంగ బోతి - ఇప్పుడొస్తుంటి అన్నాడు చాలా సరనంగా

“యాడ బోయుంటదంటావు? ఎవరైనా ఎత్తుకెల్లినంటావా?'' ఎడుపు దిగమింగు కుంటూ అడీగింది

“రాగానే ఏడ్పు మొదలెట్టినావేంటి - పద పద అన్నం పెట్టు - కడుపు మండుతున్నది

  • యాడికెళ్తందేం ! రెపొద్దున్నొస్తదిలే - ఏ అమ్మగారింటన్న పడుకుందేమో - టీవి జూసుకుంట
  • మొగానికి అన్నం పెట్టకుండ నిలదీస్తవ్‌ - ఎం ఆడదానివంట

పది హేనేళ్ళనాడు నల్గొండ నించీ వలస వచ్చి ఈ కాలువ వడ్డు పాకల్గో కాపురం పెట్టిన నాటి నుంచీ యాదగిరి స్వభావంలో మార్పు లేదు. అప్పుడొచ్చిన పదికుంటుంబాల్లో ఏడెనిమిది మంది రిక్షాలు తొక్కేవాళ్ళే - ఇద్దరు ముగ్గురు యాదగిరి లాంటి వాళ్ళున్నా తక్కిన వాళ్ళు పెళ్ళాన్నీ పిల్లల్నీ మంచిగానే జూసుకుంటారు - చెవులకి రెండేసి తులాల గంటీలుతో నల్లపూసల్తో పదీ పదిహేను బంగారు గుళ్ళతో కాళ్ళకి వెండి కడియాల్తో వచ్చింది ఆదిలక్ష్మి ఇప్పుడు చెవుల గంటీలు బేవు - కడియాలు లేవు - బంగారు గుళ్ళూ లేవు భూలచ్చిమికున్నాయి చంద్రమ్మకీ వున్నాయి - సింతయ్య పెళ్ళానికీ వున్నాయి - భూలక్ష్మి తనలాగా పాచిపనికి పోదు

32 ఇల్లలకగానే. ... ఎదో ఇస్కూల్లో ఆయా పని యిప్పించ్చిండు మొగుడు - అప్పుడిక్కడ కొచ్చినప్పుడు తమందరికీ కొత్తగా పెండ్తాయె - పిల్లలు కూడా ఆరేడు నెల్ల ఎడంల పుట్టిను

ఆఅడబిడ్డలందర్కీ ఇందిరలని పెట్టుకోవాలని మనపైంది - ఎందుకైందో అందరికీ ఎరెకనె. తమ తల్లులంతా తమకి ఆ లక్ష్మి అనీ ఈ లక్ష్మి అనీ పేర్లు పెట్టుకుని “లక్ష్మీ అని పిలిస్తే

నిజం ఆ “లచ్చి పలుకుతుందని ఆశపడ్డారు మరి తమ కళ్ళ నిండా కలలాయె - కలల మధ్య

“ఇందిర' అని పెట్టుకున్నారు ఇందిర్లందరికీ ఇప్పుడు పన్నెండేళ్ళాచ్చినాయి - భూలక్ష్మి కూతురు ఇందిర మాత్రం ఇస్కూలుకి పోతది - సెంద్రమ్మ కూతురు తల్లితో పనికి పోతది సింతయ్య కూతుర్ని అదేదో సినిమా అమ్మగారింట పనికి పెట్టిండు - తన కూతుర్కి ఇంట్లో పనే సరిపాయె - పలక బలపం పట్టంగానే ఎంకులు కడుపున పడె - ఆడు పుట్టేటేలకు తనకు జబ్బు సేసె ఈ పిల్లే దిక్కెంది సంటోన్నీ సూసుకుంట - ఇంట్లో పనీ బయట పనీ సేసుకుంట

  • ఆరేళ్ళ ఇంద్ర సాయంతోనే - ఎంకులు తరువాత సంటిది పుట్టంగానే ఇంద్రకి ఇంటి పనంత పైబడె - అయ్య రిక్షా తొక్కుతున్నా అమ్మకి కష్టపడక తప్పలేదు అమ్మ బయటి౭ెడితే ఇల్లు దిద్దుతోందా బిడ్డనే గద మరి - పన్నెండేళ్ళకే నాపసాని అయింది బిడ్డ - ఇల్లూడ్చుడు = నీళ్ళు తెచ్చుడు - బట్టలుతుకుడు - అన్నం వండుడు - పనంతా చేసుకొస్తది - బిడ్డ - ఎక్కడికి పోయినా సంటిదాన్ని సంకనేసుకుని, ఎంకులు గాడి చెయ్యి పట్టుకుని పోతది వాళ్ళకదే తల్లి

కాళ్ళు, జబ్బలు, తల మంటలు - పోట్లుదయ్యంలా. పదిశేర్ల పిండి కొట్టింది. నాలుగు రోకళ్ళపోటు - జల్లెడ పట్టుడు -

ప్రతీ ఏటా అరిసెలు తింటూనే = కొట్టిన కూలి పెరిగిందని ఎడుస్తావుంటారు అమ్మగార్లు - పట్టుచిరెల ధరలు పెరిగాయని కాదు - అర్ధ రూపాయికి శేరుబియ్యం కొట్టి సెడీతే అరిసెలు ఇంకా రుచిగా వుంటాయేమో మరి - ఐదు రూపాయిలంటే ఏడుపు - మరి తినకుండా వుండొచ్చుగా - తినాలి, చవగ్గా తినాలి - జబ్బలు సలుపులు పుట్టాలి - కానీ అర్ధరూపాయి రోజుల్లో అరిసెలు వండడం గురించి చెప్పే చెప్పే వాపోతారు అమ్మగార్లు

సంక్రాంతి పండగొస్తే ఓ యాభై రూపాయిలు దొరుకుతాయి - ఇంద్రకి రెండు పక్క ఫిన్సీసులు- తనకి గాజులు- ఎంకులుకి సెడ్డీలు- చంటిదానికి ఒక టోపీ- ఇవ్వన్నీ కొనుక్కోవచ్చని-

రే ప్రొద్దున్న వెళ్ళాలంట - నీళ్ళు కాచాలట - అమ్మగార్ల అమ్మాయిగార్లు - అబ్బాయిగార్లు తలంట్లు పోసుకుంటారు - భోగిమంటలేస్తారు -

వాళ్ళకన్ని అందించుకుంట - అక్కడుండాలి.

ఇంద్ర ఏమాయె! యాడికి బోయింది బిడ్డ !

ఇందిర 33

యారగిరి అప్పుడే గుర్క బెడుతుండు - పగలంత రాత్రంత రిక్షా తొక్కుడు - అ పైన సారా తాగుడు - పెళ్ళాన్ని తిట్టుడు - మరీ కోపం వస్తే తన్నుడు - ఇదిగో ఇలాగ గుర్క పెట్టి నిద్ర - ఇన్టాళ్ళనుండీ ఇదే దినచర్య -

“బిడ్డ గురించి కదిలించి అతనిచేత దెబ్బలు తినే ఓపిక యివ్వాళ లేదు ' అనుకుని నోర్మూసుకుని పడుకుంది ఆదిలక్ష్మి-

తెల్లవారి పనికి పోతూ “బిడ్డ సంగతి కనుక్కుంటావా లేదా ?" అని యాదగిరిని ఓసారి హెచ్చరించింది

దినమాయె - రెండు దివనాలాయె - మూడాయె - ఇంద్ర జాడలేదు - పోలీసు రోపోర్టి వ్వమంటే యాదగిరి వినడంలేదు - ఇంద్ర లేకుంటే పోయ్యిలో నిప్పులేదు - సంటిదాని కంటికి కునుకులేదు ఎంకులుకీ స్నానం లేదు - ముక్కు, జుత్తూ అంటలు కట్టాయి వాడికి -

కనుము పండగనాడు అమ్మగారిళ్ళల్లో కోళ్ళు కోసుకుంటున్న వేళ - కంటికి కడీవెడుగా ఎడ్చీ

“నువ్వు పోలీసులకి చెబుతవా ! నన్నెలమంటావా ? "

అని నిలదీసింది ఆదిలక్ష్మి - మొగుణ్ణి -

యాదగిరి ఆదిలక్ష్మి మొహంలోకి నిదానంగా చూసి బీడీ వెలిగించేడు -

“రెండు నెల్లనాడు ఎంకులు గాడికి వారం రోజులు జరం వచ్చింది - డాక్టరుదగ్గర మందులు నేనిప్పించిన్నా? నువ్విప్పించినవా ? ఎంతైందనుకున్నవ్‌!” అన్నాడు -

ఆదిలక్ష్మీకి అర్ధం కాలేదు -

“వందైంది - అప్పు జేసిన్ను - మొన్న సంటిదాని బంక ఇరోసనాలకెంకైందను కుంటున్నావు? నూట యాఖై రూపాయిలు - రెండు నెల్ల కిందట నీ సెల్లీ బావా వచ్చిన్రు యాదున్నదా ? కోడి కోసినవా లేదా? రెండొద్దులుండీ ఎల్లిన్రా - రెవికెట్టినవా లేదా ? వంద రూపాయిలు - ఈ కర్చంతా ఎవడిచ్చిన సామ్మనుకున్నవ్‌!” యాదగిరి గప్పు గప్పు బిడీ పాగ వదులుతూ చాలా నాటకీయంగా చెబుతున్నాడు-

“సంటిదాన్ని ఇరోసనాలని అమ్మగార్నడీగినా జీతంల వంద తెచ్చిన - ఎంకులు గాడీ జరానికి పంతులమ్మ గార్నడిగి నూటేఖై తెచ్చి నీచేతికిచ్చిన - మా సెల్లి వచ్చినప్పుడు నాకాడ చిల్లరంతా పోగేసి రయిక తెమ్మని నీకే వంద యిచ్చిన - ఇంతకస్సెందుకయ్యింది అంతా అబద్ధమే! ఇంతకీ ఇంద్ర మాటంటే అప్పుల్సంగ తెందుకంట-”

“అదే సెబుతుంటే అడ్డు తగుల్తావు - నువ్వు యిచ్చిన పైనలెడబోయినయ్యేే - నేనైతే సింతయ్య కాడ అప్పు జేసిన - రోజు రోజు సతాయిస్తుండు +

“అందుకని-”

పతీ ఇల్లలకగానే. ,..

“అందుకని ఏలూరు రోడ్డు అమ్మగారి పిల్లలకి రిక్షా ఏస్తాజూడు - ఆ అమ్మగారి అక్కగారి దగ్గర అయిదొందలు ఎడ్వాన్సు తీసుకుని ఇంద్రని అయిదారాబాద్‌ పనికి పంపేశాను

  • అప్పు తీర్చినా - అయిదు నెలలకి నీ బిడ్డ మళ్ళీ నీ దగ్గరికొస్తది - ఏసం కాలం సెలవులకి
  • ఇంక లొల్లిపెట్టక నోర్మూసుకో-”

ఆదిలక్ష్మి కుప్ప కూలిపోయింది -

“మూడు రోజుల నుండీ నెత్తి పగలకొట్టుకుంటూ వుంటే ఎందుకు చెప్పలా ?” అని అరిచింది +

“నాయిష్టం - చెప్పలేదు - ఏం చేస్తావిప్తుడు?” అవును - ఏం చేస్తుందిప్పుడు ? ఏం చేయగలదిప్పుడు? ఆదిలక్ష్మి కళ్ళు కట్టలు తెంచుకున్నాయి -

“బిడ్డని తాకట్ట సపెట్టినవయ్యా! ఎంత మంచి నాయనవు - రేపొద్దున నన్ను కూడా అమ్ముకుంటవు - నాకు సెప్పకుండా ఎంత పన్దేసినవయ్య -”

“తాకట్టు పెట్టిన్నా- మరి సింతయ్య మాటో? తన బిడ్డని సినిమా అమ్మగారింట్లో వుంచ లేదా? అది తాకట్టా - నెలకి రెండొందలు తెచ్చుకుంటున్నాడు '

యాదగిరితో వాదన పెట్టుకోడం ఎంత భయంకరమో ఆదిలక్ష్మికి తెలుసు -

పయిట సెంగు నోట్లో కుక్కుకుని ఎడుస్తోంది ఆదిలక్ష్మీ - “ఎందుకట్ణ ఎడుస్తవు? పాణాలు బోయినట్టు- బిడ్డ వాళ్ళకాడనే సుఖం గుంటది - పొద్దున్న నావా - మధ్యాహ్నం అన్నం- రెండు పూట్లా చాయ్‌ - వాళ్ళ పిల్లల్తో పాటు సిరుతిండీ - సాయంతరం టివి. - కావల్సినన్ని పాత చొక్కాలిస్తారు - తీపరమాయెనాగెట్ల? ఇక్కడ కంటే అక్కడే మంచి గుంటది దానికి - ఊర్కె ఎడ్వమాక - ” అన్నాడు యాదగిరి గుష్పు గుప్పున పొగ వదులుతూ- “ఆ మాయంతా నాకు తెల్సులేవయ్యా - ప్రొద్దున్న నాష్టా ఏమిస్తరో - పిల్లల్తో పాటు సిరుతిళ్ళు ఏం బెడుతరో - నిన్నటి వన్నీ ఫ్రిజ్‌లో పెట్టి తినగా తినగా మిగిలినయ్యన్నీ ఇస్తరు - సిరు తిళ్ళు పళ్ళాళ్ళో వదిలేసిన యన్నీ పోగుసేసిస్తరు - టి వి లు సూడనిస్తరా ? కసురుకుంటరు - పదేళ్ళ పోరి తోనే యాభై ఏళ్ళ దానిపని చేయిస్తరు - ఆళ్ళిచ్చే వంద రూపాయిలకు నాలుగు రెట్లు పని చేయిస్తరు - నేను పెట్టలేకనా ఊర్కుంటిని? అమ్మగార్హంతా ఎప్పటి సందో అడుగుతుంటే-'

“అబ్బో నువ్వు కూసోబెట్టి పోషిస్తున్నవు? ఉచ్చ గుడ్డలుతికిస్తున్నవ్‌ - అన్నం వండిస్తున్నవ్‌ - బిడ్డల పాలనంత దానికే మళ్ళా - నువ్వేమన్నా గూకోబెడుతున్నావా అంట

అక్కడైతే వంద రూపాయలొస్థయ్‌ నువ్వేం యిస్తున్నవ్‌ - ఇంటెడు పని చేయించి - ఈ

సవాలుకి ఆదిలక్ష్మి దగ్గర జవాబు లేదు - అవును - సంటిది రాత్రి ఖరాబు చేసిన బట్టలన్నీ ఇంద్రే కాలవ కాడ ఉతుక్కొస్తది - పాయ్యిలో నిప్పు రాబేసి అన్నం వండుతది - ఇల్లు జిమ్మి

ఇందిర ఏక్‌

  • నల్లకాణ్డుంచి నీళ్ళు అెచ్చి గాబుల్ల పోస్తది - తనకిన్ని ఎబ్లీళ్ళు పోస్తది - ఎంకుల్ని సంటిదాన్ని కనిపెట్టకునుంటది - అది తన బిడ్డకాదు - తనకి తల్లి - తానేమిస్తది - రాత్రి ఇంటికొచ్చి నాక సంటి దాన్ని ప్రక్కలో ఏసుకొని పడుకుంటే అటు ప్రక్క ఇంద్ర తన నడుం మీద సెయ్యేసి పడుకుంటది - కాళ్ల మీద ఎంకులు నిద్రపోతాడు -

ఆదిలక్ష్మికి ఏడుపొచ్చింది బిడ్డని పనికి బెట్టి అప్పుతీర్చిన దరిద్రం మీద కోపం వచ్చింది - ఆ అప్పు చేసిన యాదగిరి మీద కోపం వచ్చింది యాదగిరి అలవాట్ల మీద కోపం వచ్చింది అన్నింటికన్నా ఎంత కష్టపడినా కడుపునిండని దారిద్యం మీద కోపం వచ్చింది - “ఇందిర' పేరు పెట్టుకుని మురిసిపోయిందే గాని ఒక్కనాడన్నా దానికి బలపం పుల్ల యిచ్చి రాసుకోపొమ్మందా, లేదు - తన వల్ల కాలేదు - ఇందిర లేని బండీ తను లాగ లేదు తను పనికి పోక పోతే కడుపునిండదు - ఆ మాట కొస్తే యాదగిరి తాగకపోయినా అతని సంపాదనతో కడుపులు నిండవు - రిక్షా కిరాయిలు పెంచినకొద్దీ ధరలు పెరుగుతాయి - *.శనరల పెరగుదల ఆపడం ఎవరి చేతొకాదు - రిక్షాలు బేరం చేస్తారు సిటీ బస్సులు ఎక్కుతారు - మరీ తక్కువ బేరానికి లాగలేక - అనుకున్న ఆదాయం రాదు - ఈ బతుకులింతే అనుకుని ఓ వారం రోజులు ఏడ్చి, ఏడ్బీ ఆ ఇద్దరు బిడ్డల పని తనే చేసుకుని పనికి పోవడం అలవాటు చేసుకుంది అదిలక్ష్మి రోజులు గడిచిన కొద్దీ పన్నెండేళ్ళ తన బిడ్డ పెద్ద నాపసొనిలా తననెంత ఆ మకున్నదీ అర్థం అయింది ఆదిలక్ష్మికి - ఈ చిన్న గుడి సెలోనే ఇంత పనుంటే పట్టణంలో పిల్ల వేత ఎంత చేయిస్తున్నారో నని ప్రతి రోజూ తలచుకుని తలచుకుని ఎడ్చేది ఆదిలక్ష్మి -

ఆ వేళ సాయంత్రం పని నుంచీ వచ్చి దిగులుగా సంటి దానికి తిండి తినిపిస్తున్న వేళ సింతయ్య ఇంట్లోంచి అరుపులు వినబడ్డాయి - ఆ గుడెసెల్లో కాస్త వున్నవాడు సంతయ్యే

  • అతని పెళ్ళాం వంటి మీద రెండు తులాల బంగారం - అతనింట్లో ఇత్తడి - స్టీలు గిన్నెలు వున్నాయి - ఎప్పుడైనా పదీ పరకా అప్పులు ఇస్తారు వాళ్ళు - అరుపులేమిటోనని చంటిదాన్ని ఆమైనే గుండెలకి అద్దుకుని అటు పరిగెత్తింది ఆదిలక్ష్మి - సింతయ్య కూతురు ఇంటికొచ్చింది
  • బిడ్డ బాగా నలిగిపోయింది - సినిమా అమ్మగారింట్లో ఐదువందల రూపాయలు సోయాయి
  • ఎలా పోయాయో ఎవరికీ తెలీదు - ఇందిర బుట్ట తీస్తే అందులో యాభై రూపాయలు దొరికాయట - రెండు అంటించి తిట్టి వదిలిపెట్టేరు - అంతేకాదు పిల్లల ఆట వస్తువులు కూడా దొరకాయట “దొంగ పిల్లతో ఎం పని చేయించుకుంటాం చెప్పు చింతయ్య, !$” అని అమ్మగారు బాధపడ్డారు

ఇంటికొచ్చి చింతయ్య ఇందిర్ని తెగ బాదేడు - భార్య అడ్డం పోయినా ఆగలేదు - అతని భార్య అరుస్తోంది - ఇందిర ఏడుస్తోంది. చింతయ్య చిందులు తొక్కుతున్నాడు.

36 ఇల్లలకగొనే. ...

ఆదిలక్ష్మికి చప్పున తన బిడ్డ గుర్తుకొచ్చింది ఎక్కడ అయిదరాబాదు ? ఎక్కడి బెజవాడ ? బిడ్డను ఓసారి చూడ వీలుకాని పరిస్థితి - “ఎంత పని చేసినావయ్యా” అని మళ్ళీ యాదగిర్ని తిట్టింది ఆదిలక్ష్మి- ఈ మధ్య నంటిదానికి బంక విరేచనాలు చుట్బకున్నాయి - సరిగా చూసే వాళ్లు లేక మట్టితినీ - మురికినీళ్లు త్రాగీనూ - ఎంకులు గాడి జుత్తు నిండా పేలు లుక లుకలాడుతున్నాయి - అంటలు గట్టిపాయింది జుత్తు -

ఎసంకాలం ఎప్పుడొస్తుంది - సెలవులు ఎప్పుడొస్తాయి ఇందిర ఎప్పుడొస్తుంది అని కంట్లో నత్తులు వేసుకుని కూర్చుంది ఆదిలక్ష్మి

ఆరోజు సాయంత్రం -

రుతువు కాని రుతువులో ఆకాశం నిండా నల్ల మబ్బులు ముసురుకుని, కుంభ వృష్టి కురవడానికి సిద్ధంగా ఉంది చంటిది చంక దిగక ఆదిలక్ష్మి కి కాళ్ళూ చేతులూ ఆడడంలేదు

  • పాయ్యిలో కట్టెలు మండక మొరాయిస్తున్నయ్‌ - వర్వం వస్తే పొయ్యి తడుస్తుందని తొందరపడుతోంది ఆదిలక్ష్మి - అన్నం కుండ దించేస్తే చాలు - వర్ష ౦వచ్చినా ఫర్వాలేదు - పిల్ల గుక్కపట్టి ఎడుస్తూనే వుంది - అప్పుడు వాకిట్లో నిలబడింది ఓ ఆకారం-

చిరిగిపోయి, మాసిపోయి, బొగ్గు గనిలో పనిచేసి వచ్చిన దాని గౌనులాగా ఉన్న చాలీ చాలని గౌనుతో - మొన్న మొన్న గుండు చేయించుకుని ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డిపరక లాంటి జుత్తుతో పీక్కు పోయిన కళ్ళతో - లోతుకు పోయిన బుగ్గల్లో చేతిలో చిన్న సంచితో నిలబడీపోయింది ఓ పిల్ల - ఎడెనిమిదేళ్ళ పిల్ల -

“అమ్మా -' అని పిలిచింది -

“వెళ్ళమ్మా - ఎళ్ళు మాకే తినడానికి తిండి లేదు నీకేం పెడతాం - మధ్యాహ్నం అన్నం కూడా లేదు - అమ్మగార్జు అన్నాలు ఫ్రిజ్ఞుల్లో దాచుకొని తింటం నేర్పారు” అని అరిచింది అదిలక్ష్మీ -

“అమ్మా” అంది ఆ పిల్ల ఈ సారి ఏడుపు గొంతుతో “ఎళ్లమంటే నీక్కాదే-” అని అక్కడకొచ్చింది ఆదిలక్ష్మి సంచి క్రిందపడేసి ఆదిలక్ష్మిని చుట్టకుని బావురుమంది ఆ పిల్ల -

బారెడు వెడల్పు జడ - అంతంత లేసి కళ్ళు, వస్తున్న వయస్సును సూచించే బుగ్గలు

  • కళ్ళనిండా (పేమ అలా అయిదు నెలల నాడు వెళ్ళిపోయిన ఇందిరేమో యిది? ?

అవును - ఇది ఇందిరే |]

“బిడ్డా!” అని ఒక్క అరుపు అరిచింది జదిలక్ష్మి

ఇందిర పగ “ఆళ్ళకి సిప్పకుండా పారిపోయొచ్చిన - అక్కడ్నుంచి ఎతుక్కుంట రాటానికి పది రోజులు పట్టింది - దిమ్మ దిరిగిన నమ్మా - ' వెక్కులు పెడుతూ చెప్పింది ఇందిర “ఎలా వచ్చావు బిడ్డా? డబ్బులు దొంగిలించావా ? వాళ్లెట్ల చూసిన్రమ్మా నిన్ను - ఈ గుండేమిటి తల్లీ - ఈ గౌనేమిట్రా నాన్నా - అయ్యోనా బిడ్డా - ” ఇవేవీ అవలేదు ఆదిలక్ష్మి 'అమ్మా ఇంకెప్పుడూ నన్నెక్కడికీ పంపకమ్మా -' అని తల్లిని బ్రతిమలాడలేదు ఇందిర ఆ కాలవా, ఆ గుడిసే - తమ్ముడు, తల్లీ, చెల్లీ ఇవ్వన్నీ మళ్ళీ తనకి దక్కినందుకు బిడ్డా, పోయినా ప్రాణం తిరిగొచినందుకు తల్లీ, ఒకర్పి చుట్టుకొని ఒకరు తనవి తీరా ఎడ్చి ఏడ్బీ తృప్తి పొందారు - (ఆంధ్రజ్యోతి దీపావళి వ్రత్వేక నంచిక 1990)

రసుగు

'నేలుపు తెలుపు పోగులతో నేసిన జరీ అంచు పట్టు చీరెలా ధగ ధగ

మెరిసి పోయే వ్యాపారం చేసే శర్మ అతని స్నేహితుడు ప్రొఫెసర్‌

సుందరం రాకని పురస్కరించుకుని ఇస్తూన్న విందులో రచయిత

సూర్యనారాయణ, లాయర్‌ సుబ్రహ్మణ్యం కూడా పాల్గాంటున్నారు

నగరంలో ఎప్పుడూ ఏదో ఒక "కర్యక్రమం: జరిపించి, ప్రముఖుల్ని ఆహ్వానించి పరిచయాలు పెంచుకునే ఒక సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా ఎర్పాటు చేసిన సదస్సులో పాల్లానడానికి సుందరం వచ్చేడు సూర్యనారాయణ కూడా అందుకే వచ్చాడు. సాంస్కృతిక సంస్థకి ఉపాధ్యక్లుడై నందునే కాకుండా, సుందరం చిన్ననాటి మిత్రుడిగా కూడా శర్మ అతన్ని డిన్నర్‌కి పిలిచేడు సుందరం పరిచయం కోసం సుబ్రహ్మణ్యాన్ని పిలిచేడు భార్య పెద్దమ్మకొడుకు గదాని 'సూర్నాయణనీ' పిలిచేడు సూర్య నారాయణ కూడా పాపం ఈ మధ్య మంచి కీర్తి సంపాదించేడు, కాసిని డబ్బులు కూడాను,

అప్పుడు అ చల్లని సాయంత్రం - పోనీ రాత్రి వేళు శుభ్రంగా తోమి తళతళలాడీ పోతున్న గాజు గ్లాసుని నుందరం ముందుకు పెట్టి, “చాలా రోజులకీ కలిశాం - క్రబ్‌ వారి ధర్మమా అని కామేశ్వరినికూడా తీసుకువస్తే మూ ఇంట్లో రెండు రోజులుండేది గదా!” అన్నాడు శర్మ

ముసుగు 39

“కామేశ్వరికి పిల్లలుకదా! వాళ్ళని వదలి ఎలా వస్తుందీ! ఆమె పిల్లల్ని చూసుకుంటూంటే ఇదిగో నేనిలా తిరుగుతున్నాను అన్నాడు సుందరం చిరునవ్వుతో.

సుందరం ఇంకా రెండేళ్ళకి యాఖైలో, ప్రవేశిస్తాడంటే ఎవరూ నమ్మరు అతని మనస్సు ఎప్పుడూ యవ్వనంలోనే వుంటుంది గనుక, శరీరం కూడా యవ్వనం ఇంకా విడీచి పెట్టడానికి ఇష్టపడడం లేదని, అతనంటే ఇష్టపడే వాళ్ళంటారు పచ్చని ఛాయతో, కొంచెం బట్టతల ఆయినా తెలీని క్రాపుతో, బాగా ట్రిమ్‌ చేసిన చిన్న గడ్డంతో, కళ్ళద్దా లతో ఇంటలెక్చు వల్‌ లుక్‌ కలిగించే వేషధారణలో వుండే సుందరం, మాటలో, నడకలో నవ్వులో, భుజాలు ఎగురవెయ్యడంలో, ఆఖరికి సిగరెట్‌ కాల్చ్బడంలో కూడా తను మేధావినని తెలియజెయ్యడానికి ప్రయత్సిస్తాడు

“ఇవాళ మీ ప్రసంగం చాలా గొప్పగా వుంది ” అన్నాడు లాయర్‌ సుబ్రహ్మణ్యం, సీపా మూత తీస్తూ

“ధ్యాంక్యూ ' అన్నాడు సుందరం

“నాకు సునంద ప్రసంగం నచ్చింది ' అన్నాడు శర్మ

“ఎంకైనా నుందరంగారి స్పీచ్‌ తరువాతే అన్నాడు లాయర్‌ సుబహ్మణ్యం, సుందరం విదార్థిని వనజ తండ్రి -

“రియల్లి షి స్పోక్‌ వెల్‌ - హు ఈజ్‌ షీ” అన్నాడు సుందరం-“"ఇదేమిటోయ్‌ - ఎంత ప్రాఫెసర్‌ వి అయితే మాత్రం అంత మతిమరుపా | మధ్యాహ్నం అవిడ ప్రక్కన కూర్చుని భోంచేశావు గదా- అంతసేపు కబుర్లు చెప్పావు” అన్నాడు శర్మ

“అవునవును కాని జనరల్‌టాక్‌ - వివరాలు అడగలేదు” అని నసీరుద్దీన్‌ షా లా ఒక చిరునవ్వు చిందించేడు సుందరం

“ది సో కొల్డ్‌ ఫెమినిస్ట్‌" అని వ్యంగ్య వైభవం అందించేడు సూర్యనారాయణ!

“ఐ లైక్‌ ఫెమినిజం అన్నాడు సుందరం.

“ఫెమినిజం సంగతి వదిబేవోయ్‌ చెప్పు- ఎలా వున్నావు ? ఇల్లు సాంతం కట్టేవా? పిల్లలేం చదువుతున్నారు ? ఏమైనా డబ్బు దాచావా? అన్నాడు శర్మరెండవ వరస గ్లానులు నింపుతూ.

“చూడు శర్మా - అవ్వన్నీ కామేశ్వర చూసుకుంటుంది మనకేం తెలీవ్‌. అందరం బాగానే వున్నాం డబ్బులేం వున్నాయో ఏం లేవో అవిడ్నడగాల్సిందే ఆవిడలా సవ్యసాచిలా వుండబట్టే ఈ రోజు సుందరం ఇలా సెమినార్లలో మాట్టాడగలుగుతున్నాడనుకో - ఐ వో హర్‌ ఎ లాట్‌ శర్మా- షి ఈజ్‌ ఎన్‌ ఏంజిల్‌ అన్నాడు నుందరం గద్గదంగా.

శీ0 ఇల్లలకగానే....

“అవున్నార్‌ - నిజానికి ఆడవాళ్ళంతా అలా వుండబట్టే మనం ఇలా వుండ గలుగుతున్నాం ప్రతి మగవాడి వెనుక ఒక స్రీ వుంటుందంటారుగదా 1” అన్నాడు వనజ తండ్రి, లాయర్‌ సుబ్రహ్మణ్యం -

“అవును - నేనూ నా బిజినెస్సు తప్ప ఇల్లు పెద్ద పట్టించుకోను - మా రాజ్యం చూసుకుంటుంది" అన్నాడు శర్మ

“మా సుశీల కూడా అంతే బావగారూ - నా కోనం ఎంత మంది అభిమానులు వచ్చినా చిరునవ్వుతో రిసీవ్‌ చేసుకుంటుంది” అన్నాడు సూర్యనారాయటు

“మరే - మీ అంత గొప్ప రచయిత భార్య కావడం ఆవిడ అదృష్టం కాదా!

ఆ మాటకొస్తే శర్మ లాంటి వ్యాపారస్తుడి భార్య కావడం, సుందరం లాంటి మేథావి భార్య కావడం వారి వారి అదృష్టాలు కావుటండీ ఆ సంగతి వాళ్ళకి తెలుసు, అందుకే మిమ్మల్ని అంతగా అభిమానిస్తారు” అని విశ్లేషించేడు లాయర్‌ సుబ్రహ్మణ్యం

“ఆడవాళ్ళపై అత్యాచారాలు” అనే అంశం మీద ఆ రోజు జరిగిన సెమినార్లో కీ నోట్‌ ప్రసంగం సుందరంది అసలే ప్రాఫెసర్‌- ఆ పైన మంచి కంరం - ఇంకా ప్రసంగాన్ని చదివే తీరు తెలుసు - ఇంకేం - దాదాపు ముపషప్పావుగంట హాలులో ఎవర్నీ మాట్లడనీకుండా మంత్రముగ్యల్ని చేసేశాడు ప్రాఫెనర్‌ సుందరం.

“కామేశ్వరి చాలా మంచిదోయ్‌ - నిజంగా - దేవత- దేవత అనుకో = నేనేం చేసినా అవిడ రుణం తీరదు అన్నపూర్ణమ్మ తల్లి - నిజం - ఒక్కోసారి ఆవిడ కాళ్ళు పట్టుకొని దండం పెట్టాలని అనిపిస్తుందనుకో” సుందరానికి కన్నీళ్ళు వచ్చాయి కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు

“ఇంక భోజనాలకి లేద్దాం - రాజ్యం మనకోసం చాలా తయారు చేసింది తినకపోతే బాధపడుళుంది - పైగా మన కోసం వెయిట్‌ చేస్తోంది” అని అయిపోయిన సీసాలో అగ్గిపుల్ల గీసి పడేశాడు శర్మ తన గ్లాసు బోర్లించి

“నువ్వు అతిథి మర్యాదలు పాటించడం లేదోయ్‌ శర్మా- సుందరంగార్ని అడక్కుండా అలా గ్లాసు బోర్లించడం ఏమి మర్యాద" అన్నాడు లాయర్‌ సుబ్రహ్మణ్యం, “వాడీ కెలా మర్యాద చేయ్యడమో నాకు తెలుసు - పదండి ' అని లేచాడు శర్మ

“నువ్వు వ్యాపారస్తుడివి కదొ |! నీకు జీవితంలో ప్రతిదీ వ్యాపారమే! కమర్షియల్‌ అవుట్‌ లుక్‌! నువ్విలా గ్లాసు బోర్లించి మమ్మల్ని అవమానపరచకపోతే మా ఇంట్లో షివాజ్‌ రీగల్‌ వుంది - తెచ్చేవాబణ్గి అన్నాడు సుబ్రహ్మణ్యం

“షి ఈజ్‌ వెరీ బ్యూటిపుల్‌ - దట్‌ సెమినిస్ట్‌ అన్నాడు సుందరం నొక్కి నొక్కి పలుకుతూ

“పద భోంచేద్దాం" అని మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి భోజనాల గదిలోకి నడిపించేడు శర్మ

మునుగు త.

వ్యాపారంట - వ్యాపారం | తెల్లవార్తూ త్రాగేసి అవాకులూ చెవాకులూ పేలడానికొ పిలిచింది నుందరాన్ని పరిచయం చేసింది వాడిలో దెయ్యాన్ని బయటికి తేవడానికా? ఎం మనిషి వయ్యా సుబ్రహ్మణ్యం - వాడెంత త్రాగినా ఎవరికీ ఊర్కే మార్కులు వెయ్యడు అందుకే డీపార్యమెంటులో పేరు నంపాదించుకుని వెలిగి పోతున్నాడు వాడికి డ్రింక్‌ యిష్టం కదాని త్రాగుతాడు కానీ, లంచం క్రింద తొగడోయ్‌ వెర్రి లాయరూ! అనుకున్నాడు శర్మ

భోజనాల దగ్గర రాజ్యం వుంది “బావున్నారా అన్నయ్యగారూ"” అని పలకరించింది.

సుందరానికి వృద్ధనారి శాంత కుమారి గుర్తుకొచ్చింది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరక్కుండా వుండాలంటే ప్రతీ పురుషుల్లో స్త్రీలు “అన్నయ్యా! ' అని పిలవాలని చెప్పింది కౌంత మంది అక్కడక్కడే పెద్దగా నవ్వేసి సంతోషం వ్యక్తం చేశారనుకో!

పాపం రాజ్యం చాలా మంచిది “అన్నయ్యా అనకపోయినా ఫరవాలేదు - భుజం నిండుగా ఫమిట కప్పుకొని పెద్ద బొట్బ పెట్టుకుని వుంది

“కామేశ్వరి బావుందా?” అని అడగాలని పించింది రాజ్యానికి కామేశ్వరి అంటే ఆమెకీ యిష్టమూ, సానుభూతి కూడాను కామేశ్వరి ఉద్యోగం చేస్తుంది. పిల్లల్ని చూసుకుంటుంది అందుకే ఆమెంటే తగని అభిమానం రాజ్యానికి మాట వరసకి అడిగితే ఇక్కడే ఎడ్చేలా వున్నాడు మహానుభావుడు డ్రంకెన్‌ ఏడుపులంటే మహా చిరాకు రాజ్యానికి

ఇందాకటి నించీ డ్రాయింగ్‌ రూంలో జరిగిన సంభాషణంతా రాజ్యం విననే విన్నది

అక్కడ ఆమె ప్రసంగం బావుందని మెచ్చుకుని వచ్చి ఇక్కడ ఆమె అందాన్ని వర్ణిస్తూ ఫసంగం ఎవడిక్కావాలి ! ఆమె అందం వెన్నాడు తోందనే ఈ సుందరం సంస్కారం గురించి తను శర్మతో అంటే - అతను ఇలా అంటాడు

“ఎంత మంచి మగవాళ్ళయినా బయటికి వచ్చి తమతో సమానంగా వుండే జడవాళ్ళని గురించి ఇలాగే వాగుతారు రాజ్యం - నిజానికి సునంద చాలా డీగ్నిఫైడ్‌గా వుంటుంది మగ వాళ్ళకి ఈ సరదా వాగుడు ఒక జబ్బు అందుకే నిన్ను బయటికి వెళ్ళద్దంటాను అంటాడు అంతే కాదు అలా వాగినా సుందరం చాలా గొప్ప వాడంటాడు.

ఈ సూరిగాడు మాత్రం |! తన నవలల్లో "రేప్‌ దృశ్యాలు మహా ఆసక్తికరంగా

వర్ణిస్తాడు

వీడి వర్ణనల ప్రకారం తీసిన సినిమా చూసిన ప్రతి మగాడికీ కనపడ్డ ఆడదాన్నల్త్లా చెరచాలనిపించేలా రాస్తాడు పైగా “నాకు ఇలాంటి అకృత్యాలంటే చిరాకక్కయ్యా ! అందుకే నా నవలల్లో పాపులందర్నీ ఆఖరికి చంపేస్తాను అంటాడు. వెధవ హిపోగ్రసీ వీఢూను ” “అక్కయ్య లేదు - చక్కయ్యలేదు - నోర్ముయ్‌రా సన్యాస అనాలని వుంటుంది కానీ ఇలాంటి విషయాలు తమ్ముడితో కూడా మాట్లాడరాదు నల రల రల రాయ ర రాయ ర ల ర రత రయ ర ల ర ర

శ2 ఇల్లలకగానే. ...

ఆడవాళ్ళు చీరెల్ని గురించీ, నగల్ని గురించీ పిల్లల చదువులని గురించీ, బంధువుల గుణగణాలని గురించీ సంగీతం గురించి జబ్బుల్ని గురించీ, మాటాడాలి - అత్యాచారాల్ని గురించీ, రచనల్ని గురించీ, మనుషుల్ని గురించీ, రాజకీయాలని గురించీ మాట్లాడరాదు

ఒకవేళ “ఇదేమిటి!' అని ఎ రాజకీయ పరిస్థితి గురించో, సాంఘిక పరిస్థితి గురించో మాట్లాడబోతే శర్మ వెక్కిరింపుగా “అబ్బో చాలా విషయాలు తెలుసే నీకూ! అలాగా! అని నవ్వి వెళ్ళిపోతాడు :

మొదట్లో అవమాన పడేది రాజ్యం తరువాత అర్ధం అయింది తను ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వ్యాఖ్యానించడం అతనికిష్టం లేదని - అందుకనే అతని ఎదుట మాట్లాడదు అందుకే శర్మకి రాజ్యం నచ్చుతుంది అంతస్టెరిగి మసలుకునే వాళ్ళంటే శర్మకి ముచ్చటగా వుంటుంది రాజ్యం అంటే అందుకే అతనికి ఇంకా ముచ్చటగానే వుంటోంది

అందుకే చిరునవ్వొకటి తగిలించుకుని అదీ ఇదీ వడ్డిస్తున్నట్లు కనిపిస్తూ ఓ పదిహేను నిమిషాలు ఆదర్శ గృహిణి పాత్ర నిర్వహించింది

సుందరం నిద్ర లేచేసరికి ఉదయం పదకొండు గంటలయింది - అప్పటికి అతని కోసం క్షబ్‌ వాళ్ళొచ్చేరు సాయంత్రం రైలుకి అతని టికెట్టు పక్కా అయిందని చెప్పారు మధ్యాహ్మం ఒక డాక్టర్‌ గారు అందర్నీ తమ ఇంటికి భోజనానికి పిలిచారనీ, సునంద శాంతకుమారి(వృద్ధనారి) కూడా వస్తారనీ - త్వరగా స్నానం చేసి తయారైతే కారు పంపుతామని చెప్పారు-

సుందరానికి ఇంకా మత్తుగానే వుంది షవర్‌ క్రింద హాయిగా స్నానం చేసేడు-

టీషర్టు వేసుకుంటే బాగుంటుంది గానీ ఇలాంటి వూళ్ళల్లో జనం ఊర్కే ఎడ్చేస్తారు -వాళ్ళ దృష్టిలో నలభై ఎనిమిదేళ్ళవాడు అరవైఎనిమిదేళ్ళవాడిలాగానూ - అరవై ఎనిమిదివాడు శవంలాగానూ ఉండాలి వీళ్ళ వాఖ్యానాలు మన కేల ?పుల్‌ షర్టు వేసుకుని అందర్నీ సంతోషపెడితే పోతుంది - ఎంతైనా గౌరవం దుస్తుల్లో నుంచీ కూడా వస్తుందటగా -సునంద ఏమనుకుంటుందో? ఈ సునంద ఎవరబ్బా వూరికే ప్రతి దాంట్లో కల్పించుకుంటుందీ!

కారు వచ్చింది - డాక్టర్‌ గారిల్లు వచ్చింది - అక్కడ మద్యాహ్న భోజనానికి డాక్టర్లు, పురప్రముఖులు చాలా మంది వున్నారు -

డాక్టర్‌ గారు బొత్తిగా ఎండు మనిషిలా వున్నాడు - డైలంచ్‌ అట - ఎంటైనా డాక్టర్‌ గదా! ఇన్నూరియస్‌ టు హెల్త్‌ అనుకుని వుంటాడు సిగరెట్టయినా కాల్చుకోనిస్తాడో లేదో -

“హలో ప్రాఫెసర్‌ హొ డు యూడూ ' అంటూ వచ్చింది శాంతకుమారి -

“అన్నయ్యా” అంటుందేమోనని భయపడ్డాడు అనలేదు పాపం -

ముసుగు శీత

హొడూ ఐడూ ? ఇప్పటిదాకా బావున్నాను వృద్ధనారీ, నిన్ను చూడగానే సిక్‌ అయిపోయాను అనుకుని, “మీరెలా వున్నారు?" అన్నాడు- మళ్లీ నసీరుద్దీన్‌ షాలా ఓ

ఇంటలెక్సుయల్‌ 'నవ్వు నవ్వి -

“చాలా బావున్నాను - అదుగో సునంద వచ్చింది - ఆంది

బ్రతికాం - వచ్చింది కదొ సునంద! అబ్బో! వచ్చింది - ఇన్ని మల్లె పువ్వులు ముత్యాలు దారి పొడవునా రాల్చుకుంటూ,

“హొడుయూడూ |! " అన్నాడు హుషారుగా చెయ్యి జాపి.

“హలో” అని నవ్వింది -- చెయ్యి జాపలేదు -

భోజనాలకి ఒకే టేబిల్‌ దగ్గర -

“నిన్న చాలా బాగా మాట్లాడారు - చాలా ఇంప్రెసివ్‌గా - వుంది ' అన్నాడు.

“థాంక్స్‌-”

“ఎం చేస్తూ ఉంటారు? పెళ్ళయిందా - పిల్ల లెందరు -? మీ రచనలు బావుంటాయి

  • మా ఆవిడకీ కూడా ఇష్టం -- మిమ్మల్ని కోట్‌ చేస్తుంటుంది అన్నాడు.

మళ్ళీ కాసిని మల్లెపూలు కుమ్మరించింది

పెళ్ళయింది - ఫలానా ఆఫీనులో ఉద్యోగం - అతను తన కలీగే - ఒక పాప.

“ఫెమినిస్టులు పురుష ద్వేషులన్నాడు ఒక స్నేహితుడు - మీరు నన్ను ద్వేషించడం లేదుగదా! ” అని పెద్దగా నవ్వేడు

“నో-నో - అదేం లేదు - ఐ లైక్యూ వెరీమబ్‌ - నిన్న మీరు మాట్టాడింది విన్నాక మిమ్మల్ని ద్వేషిండమా!' అంటుందనుకుని, మురిసిపోతూ--

“ ఐ స్నేహితుడు? ఆయనెవరో తెలుసుకోవచ్చా?' అంది - ద్వేషిస్తున్నాననీ అనలేదు! ద్వేషించనూ అనలేదు - తెలివిగలదే సుమా!

“ఉన్నాడు లెండీ -- రాలేదిక్కడికి - అవునూ - నిజంగా మీరు పురుషద్వేషులా?”

అన్నాడు అమాయకంగా మొహం పెట్టి

“మేం పురుషాధిక్యతని సహించం అందరూ సమానమే అని చెబుతాం - మిమ్మల్ని- అంటే ప్రొఫెసర్‌ సుందరంని నేనెందుకు ద్వేషిస్తాను - మీతో భోజనం చెయ్యడం, మాట్లాడ్డం మంచి కాలక్షేపం- 'అంది

“ మా యూనివర్సిటిలో స్త్రీల సమస్యల మీద సెమినార్‌ ఏర్పాటుచేస్తాం - మీరు రావాళి - మా స్టూడెంట్స్‌ చాలా మంది మీ అభిమానులు” అన్నాడు

“నేను వెళ్ళి మీకు ఉత్తరం రాస్తాను - తప్పకుండా రావాలి మీరు మా ఇంట్లోనే వుండొచ్చు - మా కామేశ్వరి సంతోషిన్తుంది- కామేశ్వరి చాలా మంచిది - " అన్నాడు

న! ఇల్లలకగానే ... న పకన

“అలాగే థాంక్స్‌” అంది

ఆ విధంగా ప్రాఫెసర్‌ సుందరం “ఆడవాళ్ళ మీద అత్యాచారాలు” అనే అంశం మీడ రెండు నాళ్ళు జరిగిన తిరునాళలో అతి విజయవంతంగా పాల్గొని ఇంటికి తిరిగి వచ్చేడు - వచ్చేసరికి అతని చిన్ననాటి మిత్రుడు శివరావనే అతను బొంబాయి నించీ వచ్చి అతని కోసం వేచి వున్నాడు -

అన్నట్టు, అప్పుడు జరిగిన ఆ సమావేశాలను గురించి తెలుగు పత్రికలన్నీ బాగా వ్రాసేయి- ఫోటోలు కూడా ప్రచురించేయి సుందరం ఫోటో చక్కగా వేశాయి, సునంద ఫోటో కూడా వేశాయి సుందరం ప్రసంగాన్ని దాదాపు సగం వరకూ య దాతథంగా ప్రచురించేయి

“సునంద బాగా మాట్టాడిందండీ” అంది కామేశ్వరి పత్రిక చదివి -

“నాలుగు పుస్తకాలు చదివితే ఎవరైనా మాట్లాడుతారులేవోయ్‌- నువ్వూ అలవాటు చేసుకో - నిన్ను కూడా మాట్లాడిస్తారు - ఒక సభలో - “అన్నాడు, ఏ మాత్రం ఆసక్తిలేనట్టు- ఇంకొకరి గొప్ప తనాన్ని అంగీకరించరు ఇలాంటి వాళ్ళు అనుకుంది కామేశ్వరి -

“మీరూ అలానే పుస్తకాలు చదివి మాట్టాడేరా?” అని కూడా అనాలనిపించింది - కానీ కామేశ్వరి అలా అనదు - అతనితో వాదవివాదాలు ఆమె కిష్టం వుండవు - నిజానికి కామేశ్వరికి ప్రశాంతత అంటే చాలా యిష్టం - ఇల్లు ప్రశాంతంగా వుంటే పిల్లలు బాగా చదువుతారు - బాగా చదివితే ప్రయోజకులౌతారు - లేకపోతే వాళ్ళ లేత మనసులు విరిగిపోతాయి - అందుకని ప్రశాంతమైన గృహ వాతావరణం కల్పించడం కామేశ్వరి తన ధ్యేయంగా భావిస్తుంది - అందుకోసం నోరు మూకేసుకుంటుంది - అక్కడ నుండి వేరే పని మీద హడావుడిగా వెళ్ళిపోతుంది

సుందరం ఉద్యోగానికి, శివరావు ఊళ్ళో పనుల మీద వెళ్ళి రాత్రికి కూర్చుని కబుర్లు మొదలెట్టేరు -

చిర కాలానికి కలిసేరు కనుక చాలా కబుర్లున్నాయి వాళ్ళిద్దరికీ - వాళ్ళ క్లాస్‌ మేట్‌ విజయమేరీ దగ్గర్నుంచీ ప్రక్కింటి పిల్లల తల్లి కుముదమ్మగారి దాకానూ ఇంకా ఆఫీసుల కబుర్దు, స్నేహితుల కబుర్లు నాలుగయిదు రౌండ్ల దాకా చెప్పుకుని చెప్పుకుని రాత్రి రెండు గంటల వేళ భోజనం చేశారు “ మన కెప్పుడూ అట్లతద్దె భోజనమే” అని గొల్లున నవ్వేడు శివరావు

వాళ్ళు మళ్ళీ కంచాల్లో చేతులు పెట్టుకుని మళ్ళీ పాత విషయాలు తలుచుకుని కొంత ఎడి, కొంత నవ్వి - ఎలాగో మూడు గంటలు కొట్టే వేల్టికి టేబుల్‌ ముందు నుంచి లేచేరు- ముందు గదిలో సోఫా పరిచి శివరావుని దాని మీదకి చేర్చి - ఓ దుప్పటి కప్పి, లైటు నీసి, సింక్‌ దగ్గర చన్నీళ్ళతో మొహం కడిగేడు సుందరం

ముసుగు కర్‌

“ఏమి హాయిలే హలా -” అని కూనిరాగం తీస్తూ సింక్‌ దగ్గర్నుంచీ వస్తూంటే తలుపులు తీసిన పిల్లల గదిలో నిద్రపోతున్న కామేశ్వరి కనిపించింది.

“సౌండ్‌స్లీప్‌ లో వున్నదేమో కొంచెం గురక కూడా పెడుతోంది - పిల్లాడొకడు ఆమె నడుం మీద చెయ్యివేసేడు -

మాతృ పరిష్యంగ సుఖం అన్నమాట ప-రి-ష-వ-౦గ - సుఖం! గబిక్కిన వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని లేపాడు

ఉలిక్కిపడీ కళ్ళు తెరిచింది -

“నా గదిలో పక్క దులిపి వెయ్యి” అన్నాడు.

“సాయంత్రం వేశాను” అంది కళ్ళు మూసుకుని -

“మళ్ళీ వెయ్యాలి - లేచిరా” అని గుంజేడు

కామేశ్వరి చటుక్కున లేచి నిలబడింది

రేడియం ముల్తాక్కటె మూడు దాటి వుంది - రెండో ముల్లు దాని క్రింద వుందన్న మూట - మూడుంపావు -

“నాకు ఇలా లేస్తే దడ వస్తుందండీ - ఆయాసంగా వుంటుంది - వెళ్ళి పడుకోండి ప్లీజ్‌ - “నాలుగింటికి కృష్ణుడు లేస్తాడు - వాడికి పరీక్షలొస్తున్నాయి - ' అంది చాలా నెమ్మదిగా

'రమ్మంటే ఏమిటా వెధవ సబఖుగుడు” అన్నాడు కొంచెం పెద్ద గొంతుతో-

అతని మాటలో స్పష్టత లేదు - కళ్ళల్లో ఓ వింత మెరుపు వుంది - ఆ మెరుషంటే కామేశ్వరికి భయం-

కామేశ్వరికి పిల్లలు లేచి తండ్రీని చూస్తారని కూడా భయం -

ఈలోగా సుందరం ఆమెని తన గదిలోకి ఈడ్చుకుపోయేడు -

“ నామాట వినండీ - నాకు వంట్లో బాగా లేదు - ప్లీజ్‌ అంది కామేశ్వరి

సుందరం ఆమెని మంచం మీదకి బలంగా తోసేడు - ఆమె లేవడానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ వీల్లేకుండా చేసేడు

“ఎప్పుడూ బావుండదు వంట్లో - మళ్ళీ ఎవరి దగ్గరకైనా వెళ్ళానంటే ఎడుపు - దిట్టంగా వున్నావు - వంట్లో బాగాలేదంటా/”

కామేశ్ళ్శరికి సమాధానం చెప్పాలని వున్నా ఆమె నోరు మూసుకుంది

“ఇలా మొరాయించావంటే ఎవర్తైనా తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను”

మగవాడీ బలం, మగవాడి కోరిక, అవతల నించీ ఆహ్వానం ప్రోత్సాహం లేదన్న అవమానంతో కూడిన కసీ - నరాబ రాగాలు కావవి - నరాల తీపులు -

46 ఇల్లలకగ్గానే. ...

“ఎవర్న్శో తెచ్చిపెడతావా ! నువ్వు తేలేవు -నేను మాత్రం |! నిన్ను విడిచిపెట్టి, ఈ అవమానాన్నీ హింసనీ ఎదుర్కొని ఇల్లువిడిచి పోగలనా! పోలేను మనిద్దరం పరువు ప్రతిష్టల కోసం పడి చస్తాం గదా! అందుకే మనం కట్టుకున్న ఈ గది గోడల మధ్య కర్కశంగా, అమానుషంగా హేయంగా, దీనంగా, హీనంగా, ఇలా ఎవరూ చూడని బ్రతకు మనం బ్రతకాల్సిందే-'

సుందరం (ప్రేమ హింసని కన్నీళ్ళతో కలిపి భరిస్తూ అనుకుంది కామేళ్వరి-

పక్కగదిలో అలారం (మైోగింది-

ఉలిక్కిపడి నిద్రలేచిన కామేశ్వరి పదిహేనేళ్ళ కొడుకు కృష్ణుడు తల్లికోనం చూసేడు.

ఆవిడ అప్పటికే బాత్‌రూంలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది -

తల్లి అలా ప్రభాత స్నానాలు చెయ్యడం వాడీకెరుకే - పది నిమిషాలు ఆలస్యంగా అయిన్నా శుభ్రంగా కళకళలాడుతూ పాల గ్లాసుతో ప్రత్యక్షం అయి అన్నీ సమకూర్చే ఆ కన్నతల్లి ఎందుకు ఆ వేళప్పుడు స్నానం చేస్తుందో వాడి కెందుకు ?

ఆ సంగతి ఆమెకే తెలుసు. ఈ ప్రభాత స్నానం, ఏ దైవానికీ సుప్రభాత సేవ చెయ్యడం కోసం కాదు - కన్నీళ్ళతో, స్వేదంతో లాలాజలంతో మలినమైన తన మొహాన్ని, చిరిగిన తన జాకెట్టునీ, మొక్కజొన్న పీచులా రేగిపోయిన తన జుత్తునీ చూసి తన కొడుకు జడుసుకోకుండానే కదా!

ఈ విషయం బారెడు ్రాదెక్కి నిద్రలేచి భార్య చిరునవ్వుతో ఇచ్చే బెడ్‌ కాఫీ. అందుకునే సుందరానికి మాత్రం ఏం తెలుసు! కామేశ్వరి మంచిది పాపం - “ఆమె స్నానం ఆమె ఇష్టం - ఆ సంగతి కూడా మనకెందుకు అనుకుంటాడు విశాల హృదయంతో

(ఆంధ్రజ్యోతి వార వ్యతిక (౯-6౯-917)

నీరు

పే0వన। తనమీద తనకి ఎక్కడలేని సానుభూతి ముంచుకొస్తూంది.

ఏమిటీ వెధవ బ్రతుకు? దీనికసలు అర్థం వుందా! హోమ్‌ ఈజ్‌ టూ

మచ్‌ విత్‌ వందన! ఎస్‌, హోమ్‌ ఈజ్‌ టూ మచ్‌ విత్‌ వందన! షి హాజ్‌

నోటైం టు స్టాండ్‌ అండ్‌ స్టేర్‌! ఎస్‌, హోమ్‌ ఈబ్‌ టూ మచ్‌ విత్‌

వందన!

ఫిర్‌ నుబహ్‌ హోగయీ! లేస్తూనే జుత్తుకి రబ్బర్‌ బ్యాండ్‌ కట్టి, కొంగు నడుముకి బిగించి కాఫీ డికాక్షన్‌ తీసి, పాలు మరిగించి టిఫిన్‌ తయారించి, భోజనం ఏర్పాట్లు పూర్తి గోవించి - ఒకటేమిటి- శతావధానం -అవునూ- ఏడు గంటలైనా వరాలు రాలేదు

అయ్యో! వరాలు రాలేదు - అయ్యయ్యో వరాలు రాలేదు- వరాలు రాభేదండీ బాబూ వరాలు రాలేదు- ఎలాగిప్పుడు? ముంచుకొచ్చిన సానుభూతి మున్నేటి వరదైంది ఎమిటో ఈ బతుకు! గానుగెద్దు నయం, ఈ వందన ఎద్దుకంటే! హడావుడికి పట్టకారు పట్బకోకుండా గిన్నె దించితే చెయ్యి కాలిందీ, పాలూ వొలికాయి- క్రయ్‌ ఓవర్‌ స్పిల్స్‌ మిల్క్‌కి తీరిక లేదు - “ఎనిమిదైనా నన్ను లేపవేం - నేను ఆఫీసుకి వెళ్ళక్కర్లేదా ?”పతి దేవుని సుప్రభాత సణుగుడు సారీ సార్‌- మర్చిపోయాను - మీ అంతట మీరు లేస్తారనుకున్నాను. అవును మీరు

త్రి ఇల్లలకగానే. ,.. నిజంగా మంచివారే - మా అక్క మొగుళ్ళా కాకుండా మీ బ్రష్న మీద మీరే పేస్ట్‌ వేసుకుని, మీ పళ్ళు మీరే తోముకుంటారు = వెధవ పళ్ళు ఈ మధ్య సరిగా తోముకోక- టైం చాలక- నెప్పులెడుతున్నాయి- నా వండీ బాబూ మీవి కావు మీ పళ్ళకేం - తాంబూలంతో సిగరెట్‌ పాగతో చక్కగా గారబట్టి బావున్నాయి. ఇదుగో తెస్తున్నా - పాగలు కక్కే వేడి వేడి ఫిల్టర్‌ కాఫీ-

నా మొహంలా వుందా - నా మొహం అంత బాగుందన్నమాట- పెళ్ళి కాక ముందు మాట మరే! ఇప్పుడు కాస్త పంచదార తగలెయ్యనా? తగలేసేటంత పంచదారే వుంటే ఇకనేం

  • కాస్త కాఫీలో వేస్తానులే వరాలు రాలేదు స్వామీ- చస్తున్నాను నా మొహం కడుక్కుని బొట్బ పెట్టుకోక పోయినా ఫరవాలేదుగానీ వాకిలి కడిగి ముగ్గెయ్యుకపోతే ఇంటి రాక్షసి వూరుకోదు
  • చంపేస్తుంది వరాలుకి బుద్దిలేదు - జీతం పెంచినా - సాయంత్రం రానీ చెబుతాను

ఏమిటీ సాక్స్‌ ఉతికించాలా? వరాలు రాలేదని చెబుతుంటే వినపడలేదా? మీకేకాదు నాకూ వుంది ఆఫీసు- ఈ వుతుకుళ్ళు పెట్టకుంటే ఆఫిసులో మెమోలు అందుకోవాలి - ఆడవాళ్ళు లేటుగా వెడితే అందరికీ ఎగతాళే |

సరేలెండీ! ఓ వారం రోజులు సెలవు పడేసి మీ సొక్సులన్నీ ఉతికేసి, మీ షర్టులన్నింటిఃీ గుండీలు కుట్టి మీ బూట్ల జతలన్నింటికీ పాలిష్‌ చేసేసి- ఇంకా ఏమేం వున్నాయో అవన్నీ చేసేస్తాను- దానికేంగానీ - ఓ పది నిమిషాలు ఆగితే నన్ను బస్‌ స్టాప్‌లో దించవచ్చుగా ! అసలే వరాలు రాలేదు నేను పది నిమషాల్లో కమలడం మీరింత వరకూ చూడలేదా! అవును మరి మీరలా చూస్తూ నిలబడండి - ఇంటికి తాళాలు పెట్టడం - సాయంత్రానికి పెరుగు తోడెయ్యడం - ప్రక్క వాళ్ళకి తాళం చెవులు ఇవ్వడం - ఈ పన్లు అన్నీ నావే కదా! వెళ్ళండి సార్‌ వెళ్ళండి- ఆటోలో వెళ్ళమంటారా? మరే - నా దగ్గరంత సామ్ము లేదు గానీ- పక్కింట్లో నుంచి ఫోన్‌ చేసి ఓ అరగంట పర్మిషన్‌ అడిగి బస్సులో వెడతాను - మీరు మీ స్కూటర్‌ ఎక్కి ఎంచక్కా టైంకి వెళ్ళి - ప్రశంసలు పొందండి - అవును- వరాలు రాకపోతే మీకేం - మీ పన్లన్నీ జరిగిపోతాయి - నాకే కదా ఇబ్బంది-

ఈ వరాలు దయ్యం సాయంత్రం అయినా తగలడుతుందో లేదో! ఇది రాలేదని

పిల్లకి హోం వర్కులు యివ్వకుండా వుంటారా! ఏ పనులు ఆగుతాయిగనుక-

“ఇవ్వాళ పనమ్మాయి రాలేదా? అని అడగనే అడిగింది చందన మహారాణి

పులు కడిగిన ముత్యంలా, మంచుకి తడిసిన మల్లెపువ్వులా - ప్రశాంతంగా, నిబ్బరంగా, అందంగా, చందంగా- చక్కగా కూర్చున్న చందన-

అవునమ్మా మహారాణీ - మా పనమ్మాయి రాలేదు- “తెలుస్తూనే వుందిలే - ఆ వంకర టింకర చీరె కుచ్చెళ్ళు-పాపిట్లో వంకర్షు-లేటు పర్మిషన్లు-టిఫిన్‌ డబ్బా తేకపోవడం- ఇదేగా పదిరోజుల కోసారి నీ వాలకం

చీమ 4 “అవును-అనలు ఈ జన్మలో ఎప్పుడైనా లేటుగా వస్తావా నువ్వు? ఏమిటి నీ విజయ

రహన్యం? ఏ చీకూ చింతా గలేకుండొ' ఎంత హాయిగా వుంటావు? ఆ చిట్కాఏదో నాకు

చెప్పకూడదూ? అడగాలనుకుంటుంది గానీ అడగలేదు- ఇవ్వాళ అడగాలి

“పద-పద-ఇవ్వాళ నా డబ్బాలో గుత్తి వంకాయ కూర తెచ్చాను" అని లంచ్‌ బ్రేక్‌లో ఆహ్వానించింది చందన-

'నీకూ నీ మొగుడూ-ఇద్దరు పిల్లలూ- వాళ్ళకి న్కూళ్ళూ- ఓ పని మనిషి వున్నారు గదా- నువ్వెప్పుడూ ఇంత హాయిగా ఎలా వుంటావే చందనా- మీ ఇంట్లో అస్తమానూ వుండే మంచి పనిమనిషి వుండి వుంటుంది-అవునా?” ' అంది వందన

చందన పకపకా నవ్వింది-

“ఎందుకలా అనుకున్నావు? ' అంది-

“నువ్వు చెరగని ముస్తాబుతో,చక్కగా రోజూ టైం తప్పకుండా ఆఫీసుకి రావడం వెనుక రహస్యం ఆ పనిమనిషి అని నాఉద్దేశ్యం '

చందన మనోహరంగా నవ్వి- “నీకో రహస్యం చెప్పనా?”

“అసలు మాకు పనిమనిషే బేదు- ' అంది

“మరి? పనంతా నువ్వే చేస్తావా? గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం

“అందరం చేసుకుంటాం- ఈ పనిమనిషుల కోసం ఎదురు చూడ్డం- వాళ్ళు రాకపోతే విసుక్కోడం ఇంట్లో అందరూ బద్ధకస్థుల్లా తయారవడం- పనంతా ఒక్క ఆడదాని మీదే పడడం ఇదంతా మాకు నచ్చదు. వందన తల తిరిగి పోయింది

“ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పిల్లల టిఫిన్‌ బాక్సులు కడగడం వాళ్ళ హోంపర్కు ఇదంతా' అంది.

“హోంవర్క్‌ మా రఘు చేయిస్తాడు- టిఫిన్‌ బాక్స్‌ ఎవరిది వాళ్ళే కడిగేస్తారు- ఈ పూట వంట కూడా ప్రొద్దున్నే అయిపోతుంది నాకు-పిల్లల యూని ఫామ్స్‌ వారానికోసారి ఉతుట్కుంటాం'

“ఉతుక్కుంటాం అంటే మీ ఆయన కూడానా?”

“ఎం ఆయన బట్టలు వేసుకోడా? మా రఘుకి అదంతా ఏం లేదు-అవునూ- అమెరికాలో వున్న మీ తమ్ముడు తన వంట తను చేసుకుని తన బట్టలు తను ఉతుక్కుని, తన గిన్నెలు తను కడుక్కుంటాడని చెప్పావు కదా? మరి ఇక్కడ చేసుకుంటే తస్పేం?”

వందనకి మళ్ళీ సానుభూతి పాంగింది- ప్రపంచంలో అందరి మొగుళ్ళూ, అందరి పిల్లలూ మంచి వాళ్ళే-వందన బ్రతుకే ఇలా తగలడింది

“అమెరికాలో అన్నింటికీ మిషన్గున్నాయి-మనకేవీ?” అంది వందన తనని తనే ఓదార్చుకుంటూ ఉత తలా తతత తతత తాతల తట తతత తాతకు

ీ "| ఇల్లలకగానే ... వత తతత

“లేశేం? మనకీ వచ్చాయిగా రకరకాల మిషన్లు-ఇద్దరం సంపాదించుకుంటున్నప్తుడు ఒక్కొక్కటి కొనుక్కుని జీవితాన్ని కాస్త సుఖంగా దిద్దు కోవచ్చు” వందన మనస్సు “అదోలా”

అయిపోయింది (వందనకి పల్ప్‌ సాహిత్యం చాలా యిష్టం)

అదన్నమాట సంగతి! మొగుడు ఇంట్లో పన్లన్నీ చేస్తుంటే ఈ మహారాణి దర్జాగా ఆఫీసుకి వస్తుంది ముక్కు పచ్చలారని పిల్లల చేత టిఫిన్‌ బాక్సులు కడిగిస్తుంది ఇలాంటి వాళ్ళకే మంచి రోజులు-ప్రశంసలు రూడా తనలాంటి మంచి వాళ్ళకి ఇంటా బయటా కూడా చివాట్లే! వందన మనస్సు భారం అయిపోయింది చందనకి ఓ మంచి పనిమనిషి వుందని తెలిసినా ఇంత బాధ కలిగేది కాదు- ఆమెకి పనిలో పిల్లలు భర్తా సాయం చేస్తారంటే- ఆమాట తనకి ఎమాత్రం సంతోషం కలిగించడం లేదు. పైగా చాలా కష్టంగా వుంది-ఇలా కష్టంగా బాధగా వుండడాన్ని అసూయ అంటారేమో మరి-ఆసంగతి వందనకి తట్టలేదు

సాయంత్రం మళ్ళీ వరాలు రాలేదు-పిల్లలు టిఫిన్‌ బాక్సులు, మంచినీళ్ళు సీపాలు తెచ్చి సింక్‌లో పడేశారు బూట్లు విప్పి ఇంటినిండా ఇసుక పోళశారు-స్కూల్‌సంచీలు కుర్చీలో గిరాటేసి, అలసిపోయి తీనడానికి పెట్టమని మారాం చేశారు-పిల్ల నూడిల్స్‌ కావాలంటే పిల్లవాడు ఇంకేదో కావాలన్నాడు-వాణ్ణి బతిమిలాడి బజారుకి పంపి బిస్కెట్లు తెప్పించి పబ్బం గడిపఏసరికీ కళ్ళంట నీళ్ళాచ్చాయి-

ఆడవాళ్ళయితే ఆఫీసు నించీ సరాసరి ఇంటికి వస్తారు- మగవాళ్ళు మాత్రం ఎంత 'సేపటికోగాని ఇల్లు చేరరు-అమ్మ పనే హాయిగా వుండేది- ఆవిడకి చదువూ లేదు ఉద్యోగమూలేదు-బజారు పనులన్నీ నాన్నే చేసేవారు ఆవిడ ఒక్క చీటీవ్రాసి నాన్న దగ్గరికి పంపితే చాలు, సామాన్లన్నీ దిగిపోయేవి అఖరికి ఆవిడ కట్టే చీరెలు కూడా ఆయనే తెచ్చేవారు-వెధవ ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే ఎంత? లేకపోతే ఎంత! డబ్బు సంపాదించి తను మాత్రం ఏం సుఖపడుతోందంటా!

“ఎమిటీ! ఇంటి నిండా ఇసక-కుర్చీలో పుస్తకాలూనూ! కాన్త ఇల్లు చిమ్మితే పోదా!” పతిదేవుని సంధ్యా వందనం

వందన చీపురు తెచ్చి ఇల్లు వూడ్చింది బాక్సులు కడిగింది పిల్ల హోంవర్క్‌ చూసింది- రాత్రికి వంట చేసింది-మర్నాటికి పెరుగు తోడు 'పెట్టింది-ఇంకా చాలా చాలా చిల్లర పనులు చేసేంది-ఆపైన బెల్లుబికిన సానుభూతి వెల్లువలో కొట్టుకు పోయింది

“ఎప్పుడూ ఏడుపే-మంచి పనమ్మాయిని పెట్టుకుని సుఖపడ్డం రాదు-ఎదురింటి సుశీల చూడు చక్కగా ఎలా వుంటుందో-ఆవిడ చెయ్యడం లేద్దా ఉద్యోగం-మానెయ్‌ లేకపోతే-నీ ఉద్యోగం డబ్బు నీ చీరెలకీ, పర్సులకీ చెప్పులకీ-బస్సు ఖర్చులకీ సరిపోతుంది- ఉద్యోగం మానేస్తే అవన్నీ వుండవుగా”- పతి దేవుని పవళింపు సేవ! పగలంతా కార్యేషుదాసి,

వ. వచే ధ్‌ స్త (( ర్వ. బక్‌ మి / చీమ ల. యగ. ర51 ను ఎ ఇ గ్గ కా

ఇప్పుడేమో శయనేషు రంభ కాబోలు! రంభట రంభ! నడుమూ కాళ్ళూ ఒకటే పీకుతున్నాయి-కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వన్తుందా అనీ-భీ-ఛీ అవును సార్‌- నాకెప్పుడూ ఎడుపే-ఈ బ్రతుక్కి సుఖం లేదు-నా బోటి స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్రం ఎమాత్రం సుఖం ప్రసాదించలేదు- మాది బానిస బ్రతుకైపోయింది-కెల్లవారవచ్చే తెలియక నాళల్లీ మళ్ళీపరుండేవు లేవమ్మా-వరాలు కూడా రాలేదమ్మా-ఇవ్వాళ-ఆఫీసుకి సెలవ్‌-సిక్‌ లీవ్‌- వాంతులు-విరేచనాలవలన ఆఫీసుకి రాలేక పోతున్నందుకు దయచేసి ఈ రోజు సెలవు మంజూరు చేయ వలసిందిగా (ప్రార్ధిస్తున్నాను- యువర్స్‌ సిన్సియర్లీ, వందన-వున్నాయిలే ఈ సంవత్సరానికింకా రెండు మూడు క్యాజువల్‌ లీవులు-ఓ పిక్‌నిక్‌లా? వినోద యాత్రలా? విందు?వినోదాలా? అన్నీ ఇలాంటి సెలవులే-చుట్టాలొచ్చారనీ-పిల్లలకి జ్వరాలనీ-షని మనిషీ రాలేదనీ-

“ఇవ్వాళ సెలవు పెట్టినట్ట్లున్నావుగా -మొన్న కుట్టించుకున్న క్రొత్త షర్టులు కొంచెం వుతికి పెడుదూ'" బ్రేక్‌ ఫాస్టు చేస్తూ గొంతుకలో కొస్త మార్దవం నింపుకుని పతిదేవుడు-

“రేపు మా స్కూల్‌లో ఎలక్యూషన్‌కి నాకు కొంచెం పాయింట్లు తయారు చేద్దూ[” కూతురు

“మమ్మీ! సాయంత్రం టిఫిన్‌ దోశెలు” కొడుకు అజ్ఞ-అవును బాబూ! నేగెందుకు సెలవు పెట్టాను! వరాలు రాలేదని-ఇవ్వన్నీ చెయ్యడానికా!

సాయంత్రం చందన ఆఫీసు నుంచి ఇంటికి వెడుతూ చూసి పోదామని వచ్చింది- వొకిట్లో మోపెడ్‌ ఆగడం చూసి పిండిచేతులు కడుక్కుని బయటికి వచ్చింది వండన-

“నీళిలా వుందో చూసి పోదామనీ- నిజంగా వాంతులేనా?” అంది-

“అవునూ-వంట్లో బాగాలేకపోతే-హాయిగా మీ అందరూ ఈ పూటకి బయటికి వెళ్ళి భోజనం చెయ్యొచ్చుగదా-సెలవు పెట్టి మరీపని చెయ్యాలంటా! నేనయితే చెయ్యను బాబూ'

చందనకీ తనకీ ఒకే జీతం-వాళ్ళాయనకి తనమొగుడికన్న ఓ వంద తక్కువేగాని ఎక్కువ రాదు- చందన ఇంత దర్జాగా ఎలా వుందబ్బా! మొగుడికీ పిల్లలకీ సరిగ్గా తిండీ పెట్టదేమో-దీనికి వంట చెయ్యడానికి కూడా బద్ధకమే-చందన బ్యాగ్‌లో నుంచి రెండు యాపిల్‌ పళ్ళు తీసి వందనకిచ్చి “దారికదా అని మార్కెట్‌కి వెళ్ళి కూరలు తెస్తున్నాను అంది-

“ఏమో తల్లీ-నీ మహత్యాలు నీకే అర్ధం అవుతాయి" అనుకుంది వందన-చందన మోపెడ్‌ ఎక్కి వేగంగా వెళ్ళిపోయింది

వచ్చింది వరాలు-మూడు రోజుల తరువాత-వందనకి జ్వరం వచ్చిన తరువాత-ఆమె వొళ్ళు పచ్చి పుండులా అయిపోయిన తరువాత తను పిల్లల్ని తిట్టి అతనితో తగూలాడ్‌ గట్టిగా ఎడ్చేసిన తరువాత! మూడు రోజులుగా ఎందుకు రాలేదు? జ్వరంగానీ జబ్బుగానీ చేసిన

52 ఇల్లలకగానే.. ., దొనాలేదు- చక్కగా వుంది-వస్తూనే చీపురు తీసుకుని నంగనాచిలా వాకిలి ఊడఛడానికి వెళ్ళింది

“ఫలానా కారణూన రాలేదమ్మగారూ” అని చెప్పకుండా -“అయో్యో పాపం ఎలా వున్నారో ఏమో!” అనైనా అనకుండా దర్జాగా వెళ్ళింది వాకిట్లోకి-

ఈరోజుల్లో పనివాళ్ళ బ్రతుకులే బావున్నాయి-వాళ్ళకి ఎం పన్గుంటాయి ఇంట్లో-వందన కాఫీ త్రాగుతూ వరాల్ని క్రీగంటితో చూసింది-పిడుగులు పడ్డా చలించని దానిలా ఇల్లు చిమ్ముకుంటోంది వరాలు-ఎంత ధైర్యం! నిక్షేపంలాంటి అమెరికన్‌ సిల్కు చీరె తీసుకుని నెల రోజులు కాలేదు- పొట్టయిపోయాయని అరడజను నిక్కర్లు వాళ్లబ్బాయికిచ్చి పది హేనురోజులు కాలేదు-విశ్వాస ఘాతకురాలు-దాన్ని తీసెయ్యాలి పనిలోంచి-

“ఏమండీ వరాలు గారూ-మూడురోజులాయె ఏ వూరు వెళ్ళారు-” అంది కసిగా వందన

“ఇక్కడే వున్నానమ్మా-ఏడికీ పోలేదు ' అంది-

“అయ్యో అమ్మగారూ-నన్ను మీరంటారేంటండి- తప్పు కదూ-ఏదో పారపాటయిందని నన్ను అలా బాధపెట్టకండి- అంటుందనుకుంది వందన

“మరి ఇక్కడే వుండి రాలేదేం ' అంది గొంతు మార్చి-

“ఈలు కాలేదమ్మాఈలయితే రాకపోదునా?” అంది ఎందుకు వీలు కాలేదో చెప్పకుండా.

“ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే మాకు ఉద్యోగాలు పీకేస్తారు-మీకేం దర్జాగా ఎన్నిరోజులైనా మానేస్తారు-ఓమాటంటే పెనుక్కుని పెనుక్కుని బాధపడతాం- మీకేం-వేషమా రోషమా ఎన్నన్నా ఒక్కటే-మీరు లేనిదే మాకు జరగదని మీకు గర్వం-నీమూలంగా నేను సెలవు పెట్టాల్బోచ్చింది

వరాలు మాట్టాడలేదు-చీపురు గోడకి తగిల్చి-అంట్లు ముందు కూర్చుంది

వందన వాక్సృవాహం వరాలుని కదల్బలేదు-యంత్రంలా అంట్లు తోమి పెట్టింది-బట్టలు పుతికి ఆరేసింది

వరాలొచ్చి నందుకు వందనకి చాలా హాయిగా వుంది-చెమట పట్టిన శరీరం మీద పన్నీరు కలిపిన గోరు వెచ్చని నీళ్ళు స్నానం చేసినట్లుంది ఆరుబయట వెన్నెల్లో కూర్చున్నట్టుంది-దాహం వేస్తూండగా ద్రాక్షరసం తాగినట్ట్లుంది-అమ్మ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినట్టుంది-కానీ వరాల్ని బాధపెట్టాలని వుంది ఇన్నాళ్ళురానందుకు ఏమీ అనకపోతే తను అలుసయి పోతాననిపించింది-సంజాయిషీ యివ్వని ఆ మనిషి వలన తనకెంత ఉపయోగం వున్నాసంజాయిషీ ఇచ్చే సంతృప్తి ఎక్కడిది? ఇంగ్లీషులో దాన్ని ఇగో సాటిస్‌ఫాక్షన్‌ అంటారేమో!

చీమ 53

“అలా వున్నారేం అమ్మగారూ ' అంది వరాలు వెడుతూ- అమ్మగార్ని చూసి చాలా జాలి పడుతున్నట్టు వందనకి వళ్ళు మండిపోయింది ఇందాకటి నించీ తను అన్నమాటలన్ని వినీ వినీ, ఇప్పుడు నంగనాచిలా“అలా వున్నారేం” అంటోంది

“ఎలా వున్నానేం? నువ్వెన్నాళ్ళు రాకపోయినా నీకు నాగాలు కట్టకుండా జీతం యిచ్చి, చీరెలిచ్చి, మీ పిల్లలకి బట్టలిచ్చి-నేను ఆఫీసుకి సెలవు పెట్టి నడుం విరుచుకున్నందుకు సంతోషంగా వున్నాను-సరేనా? నామనసంతా ఆనందంతో నిండిపోయింది అంది తనకు చేతనైనంత వ్యంగ్యంగా

ఈసారి వరాలు ఓ చిన్న నవ్వు నవ్వి గడపదాటబోయింది-

“అవునే వరాలూ -నీకు నవ్వుగానే వుంటుంది- నీకు రోషం లేదు-వేషంలేదు-ఎన్నన్నా పట్టించుకోవు- మాలాగ ఓ చిన్నమాటంటే రోషపడి ఎడవవు-అదృష్టవంతురాలివి ' అంది వందన-వరాలు అప్పటికీ మాట్లాడలేదు

“చదువుకున్న వాళ్ళకే అన్ని బాధలు-నీకేం మీ ఆయన కొట్టినా రెండు రోజుల్లో దెబ్బలు మానిపోతాయి-మళ్ళీ ఇద్దరూ నవ్వుకుంటూ సినిమాకి పోతారు-మాకలా కాదు-నీ కర్థం కాదులే- ఎమిటో ఈ మూడు రోజుల నుంచీ మనస్సంతా చికాకైపోతుంది-నీమూలంగా అబద్ధం ఆడీ సెలవు కూడా పెట్టాను ఆఫీసుకి-నీకేం నువ్వు పని మానేసినా ఎందుకు మానేశావో చెప్పనక్కరలేకుండానే దర్జాగా చీపురు తీసుకుని దొడ్లోకి వెళ్ళిపోయావు-మాకు పది మందికి సంజాయిషీ ఇవ్వాలి-”

ఈసారి వరాలు వెనక్కితిరిగి వందన వైపు చూసి మళ్ళీ నవ్వింది-ఆ నవ్వుని చిత్రించడం లియొనార్లో డావిన్సీకి కూడ చేతకాదు-అలాంటి అద్భుతమైన నవ్వు

“అవునండమ్మగారూ-మీకన్న నేను సాలా అదురుష్టవంతురాలిని-వేలకి వేలు జీతం తెచ్చుకొని పిల్లల్ని మంచి మంచి బళ్ళల్లో చదివించుకుంటూ-కంటికి వచ్చిన చీర కట్టుకొని యిష్టమైన తిండితిని, వాన కాలంలో ఎచ్చగా, ఎండాకాలంలో సల్లగా వుండే ఇంట్లో కాపురం వుండి-మూడు నిమిషాల్లో గాస్‌ మీన వంట జేసుకోనే మీరు-దురదుష్టవంతులు-కట్టెలుంటె బియ్యం వుండవ్‌! బియ్యం వుంటే కట్టైలుండవ్‌-చీరుంటే రయికుండదు- రయికుంటే చీరుండదు- పిల్ల గాండ్లకు బడీకి వంపాలంటే వది రూపాయిలు లేవు-నేను అదురుష్టవంతురాలిని-.మా ఆయన కొట్టిన దెబ్బలు రెండు రోజులకి మానిపోతాయా? ఎవరు సెస్పారమ్మాగారూ ఆ మాట మీకు మనసులున్నా యేమో! మాకు అవేటో తెలీదండమ్మా-.మా కుందల్తా శరీరాలేకదమ్మా! ఆటితోనే పనిసేస్తాం-మీ అంట్లు తోమేవి-మీ బట్టలుతికేవి కూడా ఆ శరీరాలే కదమ్మా ఆటితోనే నాలుగు రూపాయిలు సంపాయించుకోవాలా-ఆటికీ దెబ్బలు పడతాయి- అందుకే నాగాలెడతాం-మీలాంటి సదూకున్న వారంతా సారా దుకాణాలు

ర్‌4 ఇల్లలకగొనే. .. మూసీయించలేక పోనారా! ఊరూరా గవుర్మెంటే దుకాఖాలెబ్టేసి “తాగండొరే ఎదవల్లారా?” అని అమ్మిస్తావుండారు-మా మగాళ్ళు సంపాదించిందంతా తాగేస్తే-మేం పదిళ్ళు పాచిపని చేసి ఇల్లు గడుపుకోన్తున్నాం- మీలాగ మాకు సమత్సరానికిన్ని సెలవలున్నాయా? జీతాలు పెంచుతున్నారా? బోనాసులిస్తున్నారా? అయి పెంచకపోతే మేం సమ్మెలు సేస్తున్నామా? అవునమ్మా-మాకు మనసుల్లేవు-శరీరాలే వుండాయి-అయి శుభ్రంగా తోముకోడానికి ఓ సబ్బు ముక్క లేదు-కప్పుకోడానికి బట్టలేదు-ఎండకీ వానకీ ఆగీ కొంప లేదు-అలాంటోళ్ళకి రోషాలేంటమ్మామనసులమాట వున్న వాళ్ళకి కానీ మాక్కాదు తల్లీ-మూడ్రోజుల సంది ఎందుకు రాలీదని అక్కసు పడుతున్నావు-చెబుతా విను-ఇదిగో ఈవీష్మీద దెబ్బలున్నాయి చూశావా? అవి మా ఆయనా, ఆయన అక్కా కలిసి కొట్టినవి- నువ్వు చెప్పినట్స రెండ్రోజుల్లో మానవమ్మా-ససలపరింతలు పెడతాయి-జొరం వస్తది-ఎముకలు యిరిగి పోతాయి-అణ్లి వాదిలిపోతే ఇంకోడు ఎంటపడతాడు-ఆడూ ఇంతే-పిల్లల తండ్రి కదా-పిల్లసన్నాసుల గురించి ఇదంతా- ఈసోదికేం లేగానమ్మా -నేనెల్తున్నా- ఈదెబ్బలు తప్పనంత కాలం ఈ నాగాలు ఇంతేనమ్మూ-వద్దంటే ఇంకో ఇల్లెతుక్కుంటా |”

తన శరీరం కుంచించుకుని కుంచించుకుని తను మరుగుజ్ఞులా- చివరికి చీమలా అయిపోయిన ట్లనిపించింది వందనకి- ప్రవాహంలో కొట్బకుపోతున్న చీమ మిత్రుడికి ఓ ఆకు విసిరి వొడ్డుకి తెచ్చిన కాకి నేస్తం కథ ఎప్పుడో చదివిన గుర్తొచ్చింది,

(1997 ఆంధజ్వ్యోత దీపావళి వ్రజ్వేక నంచికు నో

1ఫద్రుతీ

మహాబలిపురం బీచ్‌ హోటల్లో రెండు రోజులు జరగబోయే అఖిల

భారత సేల్స్‌ సమావేశానికి ఎగ్జిక్యూటివ్‌లందర్హీ వారి వారి భార్యలతో

సహా రమ్మని అధికారులు ఆహ్వానించారన్న విషయం 'మోహన్‌కి

చాలా ఆనందం కలగబేసింది,

ఆ విషయం అతను చెప్పినప్పుడు అందరు “ఎగ్జిక్యూటివ్‌ భార్యల్లా ఎగిరి గంతు శియ్యనందుకు అతను నన్ను కొంచెం విసుక్కున్నాడు అలవాటుగా నాకు 'ఎగ్జిక్యూటివ్‌' భార్య ుక్షణాలు బొత్తిగా లేవనీ, అందుకు కారణం-నేను పుట్టిన ఇల్తు, మా తాత, మా ముత్తాత, మా వంశం, నా పెంపకం, నేను పీల్చే గాలీ అని. అతనిచ్చిన సుదీర్జోపన్యాసం నాకు అలవాటే

నిజానికి, ఈ కాన్ఫరెన్స్‌ జాతరంటే నాకు మహా కంపరం వెళ్ళకపోతే తరువాత నే 3దుర్కోవలసీన పరిణామాలు తలుచుకుంటేనూ నాకు కంపరమే- అంచేత అప్పుడప్పుడు - (అదేం మాటలెద్దూ) ఎప్పుడూ కూడా అతన్ని సంతోష పెట్టడంలో నష్టపోయేదేమీ లేదని (ఏమైనా వుంటే కదా నష్టపోవడానికి) సర్దిచెప్పుకుని ప్రయాణానికి సిద్ధమైపోయాను- సరేననడంతోనే ప్రయాణు"నికి ఏర్పాట్లు “ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో జరిగిపోయాయి-

“మరీ కస్తూరిబాయి గాంధీ చీరెలు సర్దకు- తెలుసుగా- మా కంపెనీ డైరెక్టర్ల భార్యలు, జనరల్‌ మేనేజర్‌ భార్య - మా దక్షిణాది డిపోల మేనేజర్ల భార్యలు అంతా

ర్‌6 ఇల్లలకగొనే. . .. వలల యకకనయమేస 4 బ్రహ్మాండంగా వస్తారు- నీ సింప్లిసిటీ మీ వూళ్లో చూపించుకో -” అని అలవాటుగా నా కొక హెచ్చరిక కూడా ఇచ్చేడతను-ఆ హెచ్చరిక అందుకోక ముందే నేను 'ఎగ్జిక్యూటివ్‌' భార్య చీరెలు సూట్‌కేసులో సర్హాను- మద్రాను వరకూ ఫస్టు క్లాసులో ప్రయాణం- అక్కడ నించీ కంపెనీ ఎర్పాటుచేసిన కారుల్లో మహాబలిపురం ప్రయాణం- సముద్రం వొడ్డున కట్టిన హోటల్లో కుటీరాల్లాంటి “కాటేజీ” లు చాలా అందంగానూ, కృత్రిమంగా కూడా వున్నాయి “హాయ్‌ "లూ. 'హలో'లు - 'థ్యాంక్యూ'లు, 'వెల్‌కం'లు అయ్యాక మా 'గుడిసె'ల్లో” కి మేం చేరాం “అప్పటికే సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి-

“ఈ ఇంట్రూడర్‌ని క్షమించాలి” అని ఓ బుర్ర మీసాలాయన లోపలికి వచ్చాడు-

"హెలో మీనన్‌ - అని మోహన్‌ అతన్ని కౌగిలించుకున్నాడు.

“ఇతను మీనన్‌-ఎర్నాకులం బ్రాంచ్‌-”

“మిసెస్‌ మోహన్‌ -”

మీనన్‌ నన్ను పాదాల దగ్గర్నుంచీ తల వరకూ పరిశీలించి (ఏ మాత్రం సిగ్గు లేకుండా) “హలో 'అన్నాడు స్టయిల్‌ గా-

నేనూ అలాగే అనేసి మొహం తప్పేసుకున్నాను-

సాయంత్రం పార్టీకి కాక్‌టెయిల్స్‌ సమకూర్చే పనిని అతనికి అప్పగించారట - మోహన్‌ సాయం కావాలట -

“తీసు కెళ్ళు బాబూ - హాయిగా సముద్రం చూస్తూ కూర్చుంటాను” అనుకున్నాను నేను -

ఆ చిన్న కుటీరం సిగరెట్‌ పొగతో నిండిపోయింది

-నేను బయట కుర్చీ వేసుకుని కూర్చున్నాను- అక్కడ ప్రకృతి ఎంత అందంగా వున్నా- ఎంత హాయిగా వున్నా- ఎదో లోటు కృత్రిమత్వం కనపడుతూనే వున్నాయి. చాలా అందంగా వున్న అమ్మాయి, ఎర్రటి రంగుతో పెదాలు పాడుచేసుకున్నట్లు- చక్కటి కనుబామల్ని పెన్సిల్‌ గీతల్లా గొరిగేసినట్లు- నిడుపాటి వెంట్రుకల్ని పిచ్చి పిచ్చిగా కత్తిరించి పిన్నులు పెట్టినట్టు, ప్రకృతి ని కూడా ఫ్యాషన్‌బుల్‌గా తయారుచేసినట్లు అనిపిస్తోంది-

సముద్రం ముందు కుటీరం - కుటీరం ముందు కుర్చీల్లో నిక్కర్లు తొడుక్కున్న మగవాళ్లు, వాళ్ళ నోళ్ళల్లో సిగిరెట్లు, వాళ్ళ ముందు సీీసాలు- ఆడవాళ్ళ వేషధారణలో వెగటుదనం - మోహన్‌ని బుర్ర మీసాల స్నేహితుడు తీసుకువెళ్ళగానే నేను స్విమ్మింగ్‌ పూల్‌ కేసి నడిచి వెళ్ళాను - చల్లగా బావుంది - ఈత కోసం వచ్చిన వాళ్ళు- ఈళ వేసే అమ్మాయిల్ని చూడ్డానికొచ్చిన వాళ్ళు - ఈతలు కొడుతున్న వాళ్ళు - ఈతలు కొట్టేసి బయటికొచ్చిన వాళ్లు - సన్నటి నాజూకు శరీరాల వాళ్ళు - బాన పొట్టల వాళ్ళు, బట్టతలల వాళ్ళు - చిన్న ముసలి

భద్రత ర్‌” వలన వాళ్ళు, ముసలి చిన్నవాళ్ళు, వార్‌ భార్యలు, వారి భర్తలు - మోహన్‌ భాషలో “ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో వున్నారు- కొందరు మా మళ్చ్ళీ నేషనల్‌ వాళ్ళు - ఇంకొందరు అలాంటి మరో మల్టీ నేషనల్‌ వాళ్ళు - వ్యాపారులు - సినీమా వారు - పెర్కులతో, రోజువారీ పెగ్గులతో పొట్టలు పెరిగినవారు, ఖరీదైన అట్టహాసపు జీవితానికి అలవాటుపడ్డవారు - అప్పుడు చూళాను, ఆ అమ్మాయిని - ఎక్కడో చూసినట్టున్న ఆ అమ్మాయిని - మిసిమి రంగు మేనితో, తళుకులీనే కళ్ళతో, వంకీల జుత్తుతో తటిల్లతలా, తళుక్కున నెరిసి మాయమైన ఆ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి గుర్తురావడం లేదు ..

ఆ అమ్మాయి ప్రక్కన నడిచి వెళ్ళినతను ఆమె తండ్రీ వయస్సు వాడీలా వున్నా తండ్రి కాడని నాకనిపించింది అతని నల్లని శరీర ఛాయ, పెరిగిన పొట్ట, పలచని జుత్తు - ఆమె అన్న కూడా కాడని తెలుసుకున్నాను - అతను స్విమ్మింగ్‌ పూల్‌ లో నుంచీ బయటికి రాగానే ఆమె అతనికి ఘుమఘుమ లాడే ఇస్త్రీ తువ్వాల అందించింది - వీపు మీగ టాల్కం పౌడర్‌ చల్లింది

  • షర్టూ, ట్రౌజర్బూ అందించింది - అతని తడి బట్టల్ని బ్యాగ్‌లో సర్దింది

“ఎమి చేస్తున్నావిక్కడ - పద - పద స్నానం కానిచ్చి తయారవ్వు - తతిమ్మా వాళ్ళంతా రెడీ అయిపోతున్నారు - ' అని మోహన్‌ తొందరపెట్టక పోతే - ఇంకొంచెం అలోచించి మెదడులోని జ్ఞాపకాల అరలన్నీ తెరిచి, వెతికి పట్టుకుని వుండేదాన్ని ఆమె పేరు !

సంబరం మొదలైంది - మగవాళ్ళు కాక్‌ టెయిల్స్‌ లోకి వెడితే ఆడవాళ్తంతా ఒక వైపు చేరారు - కొంచెం ధైర్యం వున్న వాళ్ళు వైన్‌,జిన్‌ లాంటివి తీసుకుంటే, మరీ బయటపడ్డం ఎందుకులే అనుకున్న వాళ్ళు డ్రీంక్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు - స్టేట్స్‌లో వున్న సంతానాన్ని గురించిన గొప్పలతో కొందరు, నౌకర్ల సమస్యని గురించి కొందరు, పెరుగుతున్న ధరలళ్ని గురించి కొందరు, పిల్లల చదువు గురించి, వాళ్ళ న్కూళ్ళ గొప్పల్సి గురించి, మగవాళ్ళ అలవాట్ల గురించి, వాళ్ళ లేట్‌ నైట్స్‌ గురించి, వాళ్ళ హాంగోవర్ల గురించి, వాళ్ళ కిష్టమైన

దుస్తులను గురించి ,వాళ్ళకి తామెలా వుంటే ఇష్టమో గురించి సాగిపోతున్నాయ్‌ సంభాషణలు-ఒక ప్రక్క పేకాట మొదలైంది-

“ఈ పేకాట సెక్షన్‌ మొదలైందంటే నాకు మరీ వినుగుబాబూ - శనివారం రాత్రి కూర్చుని సోమవారం ప్రొద్దున్న లేస్తూ వుంటారు మా ఇంట్లా ఒక్కొక్కసారి - వాళ్ళకి మంచింగ్‌లు, భోజనాలు ఏర్పాట్లతో సరిపోతుంది - ఇక పిల్లల్ని చూసుకోడానికి కూడా తీరదు -'. అని ముద్దుముద్దుగా చెప్పింది మిసెస్‌ నందా.

ఆవిడ చెప్పిన తీరులో ఆ పేకాటని ఖండీంచినట్లు కాక, ఇష్టపడుతున్నట్టు అర్థం అయింది -

“'డార్సింగ్‌ ఓ నాలుగొందలుంటే ఇటు పడెయ్‌” అని వచ్చాడు ఒకాయన

58 ఇల్లలకగానే.. ..

'నా వల్ల కాదు డియర్‌ - నువ్వున్నావు క ఆని నేను పర్సులో డబ్బు వేసుకురాలేదు " అని సిగ్గు సిగ్గుగా చెప్పింది డార్లింగ్‌, మిసెస్‌ వెంట్రామన్‌ -

“అలాగీ అంటావులెద్దూ -' అని అవిడ చేతిలో పర్సు లాగేసుకుని వెళ్ళిపోయాడు డీయర్‌ వెంకట్రామన్‌,

డార్లింగ్‌ వెంకట్రామన్‌ భర్తపైన చాలా ముద్దు ముద్దుగా ఫిర్యాదులు చేసింది. - అతనలా పర్సు లాక్కువెళ్ళడం తనకి చాలా నచ్చినట్లు -

అటు ప్రక్కనెవరో కాప్సికమ్‌ ఫై ఎలా చెయ్యాలో వివరిస్తున్నారు - వాళ్ళాయన కాప్సీకమ్‌ ప్రియుడట - “అంటే అది నీ సవితి అన్న మాట- అని ఒకావిడ చాలా గొప్ప జోకు వేసింది -మిసెస్‌ల బృందంగొల్లుమని ఆ జోకుని చాలా సేపు ఆనందించింది -

“మీ ఆయనలంతా కష్టపడి అమ్మకాలు పెంచి కంపెనీకి లాభాలు తెచ్చినందుకు మీ కందరికీ ఇలా మంచి హాలీడే ఏర్పాటు చేశాం - మీరంతా బాగా ఆనందిస్తున్నారనీ - మీ మీఇంటి పనిని మర్చిపోయి హాయిగా గడుపుతున్నారనీ ఆశిస్తున్నాను" అన్నాడు పండిపోయిన ఎర్ర టమేటా మొహం మేనేజింగ్‌ డైర్టైర్‌- మిసెస్‌ లంతా ఆయనకి ధన్యవాదాలర్పించేరు - “ఎలాగయినా అమెరికన్‌ కంపెనీ అమెరికన్‌ కంపెనీయే- ' అని తీర్ప్చిచ్చింది ఒకావిడ-

“అమెరికా అంటే గుర్తొచ్చింది - ఎప్పుడు మీ ప్రయాణం -' అని ఇంకొకావిడ గుర్తుచేసింది -

ఆవిడ తన అమెరికా యాత్ర గురించి యాఖైరెండు వారాల సీరియల్‌ ప్రారంభించింది = తన కూతురికి అమెరికాలో సంబంధంక్రుదరడం దగ్గర్నుంచి -ఆ పిల్లకి వీసా రాకపోవడం, అటుపైన ఆ పిల్ల విరహ వేదన - అటు నుంచి రోజూ కాల్స్‌ - ఇటు నుంచీ రోజూ కాల్స్‌ - నాలుగంకెల్లో టెలిఫోన్‌ బిల్లులు - వాళ్ళాయన విసుక్కోవడం - తను సముదాయించడం - పిల్ల బెంగెట్టుకుని, జా౭ిట్లన్నీ వదులైపోవడం

ఇంతలో ఇంకొకావిడ తన కూతురికి వెంటనే వీసా రావడం, ఆ పిల్ల ప్రయాణానికి తను చేసిన ఏర్పాట్టు, హడావిడి, తను పంపే పచ్చళ్ళు ఎకరవు పెట్టింది -

ఈ సందడిలో నేను చల్లగా జారుకున్నాను - మా జనం కాకుండా అందరూ కూర్చున్న చోటికి వెళ్ళాను - అక్కడ మళ్ళీ కనిపించింది నాకు తటిల్లత - వంకీలు జుత్తు - మెరిసే శరీరభ్భ్చాయ - అమ్మాయి- ఆ అమ్మాయి, వాళ్ళాయనా నడిచి వస్తున్నారు

నేను కావాలని దగ్గరగా వెళ్ళి మొహంలోకి చూశాను - అవును - ఆ అమ్మాయి మా అక్క క్తాస్‌మెట్‌ నీరజ సందేహం లేదు-

“నువ్వు నీరజవి కదూ?”

భద్రత ర్‌ం

అ అమ్మాయి నన్ను క్షమిస్తున్నట్లు చాలా దయగా నవ్వి ఇంగ్లీషులో కాదని చెప్పింది

నమ్మలేకపోతూనే, క్షమాపణ చెప్పి వచ్చేశాను

మరునాడు ఉదయం నేను నిద్ర లేచేసరికి, మోహన్‌ జాగింగ్‌ చేసి వస్తున్నాడు అతనితోపాటు, ఇందాక నీరజ చేత వీపు తుడిపించుకుని పౌడర్‌ చల్లించుకున్నాయన - (ఇలా అంటే బాగుండదేమో - నీరజ భర్త) కూడా వున్నాడు ఇద్దరూ చిరపరిచితుల్లాగ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు కాటేజీ దగ్గర విడిపోయారు - “ఇతను 'మనవాడే' గుంటూర్లో కళ్యాణీ టొబాకో కంపెనీ ఇతనిదే - సుందర్రావనీ - గుంటూర్లో బాగా డబ్బున్న వాళ్ళల్లో ఒకడు-"

అతను 'మనవాడే' కావడమేకొక డబ్బు రూడా వుండడం అదనపు అర్హత మోహన్‌ దృష్టిలో మోహన్‌కి “మనవాళ్ళు "' అంటే చాలా అభిమానం 'మనవాళ్ళు' కనపడితే చుట్టరికాలు కూడా తిరగేస్తూ వుంటాడు నీరజ,నీరజ కాదని చెప్పాక నేను సుంద(ర్రావు భార్యని గురించి ఆలోచించలేదు - ఆమె ఎవరిలా వుందో - వుండడమేకాక, నీరజేనని నేను అనుకున్నాననీ మోహన్‌ కి నేను చెప్పలేదు -తరువాత వాళ్ళిద్దరూ కనిఫించలేదు - నీరజ మా అక్క పద్మ స్నేహితురాలు - రోగిష్టి తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు - తండ్రీ లేకపోవడం, ఇది ఆ అమ్మాయి చరిత్ర

  • క్లాసులో ఫస్టు మార్కే డాక్టర్‌ కావాలని ఆశ - డాక్టర్‌ కాకపోయినా నష్టం లేదనీ - అది కాక ఇంకా ఎన్నో చెయ్యవచ్చనీ ఆ అమ్మాయికి ఎవరూ చెప్పలేదులా వుంది - అస్తమానూ డాక్టర్‌ కావడం గురించి మాట్టాడేది - మా అక్కకి కూడా డాక్టర్‌ కావాలని వుంది - అందుకోసం నాలుగు సబ్టెక్టులకీ నాలుగు ట్యూషన్లు పెట్టించింది - శ్రాష్‌కోర్సుల్లో చేరింది - ట్యూషన్లకి వెళ్ళడానికి మోపెడ్‌ కొనుక్కుంది అర్ధరాత్రి దాకా చదువుకుని అలసిపోయి పాలూ, కొబ్బరి నీళ్ళూ త్రాగేది - ఆ సంవత్సరం మా నాన్న మా అక్క కోసం ఎసి కూడా కొన్నారు - పద్మ నీరజకితన ట్యూషన్‌ నోట్సులన్నీ ఇచ్చేది - తనతోపాటు ఎసి లో కూర్చోబెట్టుకుని చదివించేది
  • ఇద్దర్లో ఒక్కరికీ మెడికల్‌ ఎంట్రన్స్‌ లో సరయిన ర్యాంక్‌ రాలేదు - ఒక్క మార్కులో అక్కకి పోయింది - అయిదు మార్కులు తగ్గాయి నీరజకి-

అక్క ఎడ్చీ గోలపెడిజే నాన్న లక్షరూపాయలు విరాళం కట్టి, మణిపాల్‌ పంపారు - నీరజ ఎడిస్తే వాళ్ళమ్మ సముదాయించింది - బియస్సీ లో చేర్చింది - నీరజ సంతోషంగా వుండడం, ఇదుగో ! మహాబలిపురంలోనే మళ్ళీ చూడడం -

నా పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి నీరజ ఇంటికి వెళ్ళినప్పటికి - ఆమె, బి యస్పీ, పూర్తి చేసుకుని, చిన్న కాన్వెంట్‌ స్కూల్లో నెలకీ నాలుగు వందల రూపాయిలకి ఉద్యోగంలో చేరింది

  • లెక్క లేనన్ని బ్యాంక్‌ టెస్ట్‌లు రాసింది సర్వీస్‌ కమీషన్లూ - రైల్వే పరీక్షలూ రాసింది - దేంట్లోనూ సెలెక్ట్‌ కాలేదు - వరండా నిండా ట్యూషన్‌ పిల్లలు వున్నారు

60 ఇల్లలకగొనే ...

మా స్నేహితురాలు సుజానమ్మకి బ్యాంక్‌లో వుద్యోగం వచ్చింది - ఆ అమ్మాయి బిఎ నాలుగు సార్లు తప్పింది - అమ్మాజీకి ఎదో గవర్నమెంట్‌ ఆఫీసులో వుద్యోగం వచ్చింది. అరవై వేల లంచం ఇచ్చిందని పుకారు వచ్చింది- నిజం ఎవరికీ తెలీదు - సుజానమ్మకి మరో బ్యాంక్‌ మేనేజర్‌తో పెళ్ళయింది - అమ్మాజీ నాలుగు లక్షల కట్నంతో ఓ ఉద్యోగస్తుణ్ణి పెళ్ళాడింది - సిగ్గుపడ్డం దేనికి కానీ - నేనూ కొంత కట్నంతోనే మోహన్‌ని పెళ్ళి చేసుకోబోతున్నాను

  • రాజీ తప్పదు - ఇంకోస్నేహితురాలు గాయత్రి కూడా పెళ్ళి చేసుకుంది - గాయత్రికి లెకరర్‌ ఉద్యోగం వచ్చింది - వెంటనే సంబంధం కుదిరింది -

నేనిచ్చిన శుభలేఖ అందుకున్న నీరజ కనీసం చిరునవ్వయినా నవ్వలేదు - వాళ్ళమ్మ ఇచ్చిన కాఫీతాగి బయటపడ్డాను - నేననుకున్నట్లే నీరజ నాపెళ్ళికి రాలేదు- అక్క ఆమెని చూడ్డానికి వెడితే ఇల్లు తాళం పెట్టి అందరూ వూరు వెళ్ళారని తెలిసింది - నా శుభలేఖ అందుకున్న నీరజ కళ్ళల్లో తళుకులు లేవు - శరీరం మినమిస లాడ్డంలేదు - నిర్లిప్తత మూర్తిమంతం అయినట్లు అనిపించింది - ఇవ్వాల్సి నీరజ రూపం వేరు -

తిరిగి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూటివ్‌ భార్య అవతాం౦లో మునిగితేలుతూ వుండగా, హైదరాబాద్‌ ఎదో పని మీద వెళ్ళవలసి వచ్చింది -

తరువాత చాలా రోజులకీ మళ్ళీ నాకు హండ్‌లూం హౌస్‌లో కనిపించింది నీరజ - నేను తలెత్తి పలకరించబోయేసరికి వెళ్ళి పోయింది - ఎందుకిలా చేస్తుందో, నిజంగా నీరజకాదేమో అనుకుని, ఆమె గురించి మర్చిపోడానికి ప్రయత్నించాను - దాదాపు మర్చిపోయాననే చెప్పాలి సరిగ్గా అప్పుడే జరిగింది ఈ సంగతి - మామయ్య కూతురు జయ పెళ్ళికి గుంటూరు వెళ్ళాం నేనూ, మోహన్‌

ఆ పెళ్ళిలో కలిసిన సుందర్రావు మమ్మల్ని తన ఇంటిక్‌ ఆహ్వానించేడు - నేను ఎగిరి గంతువేసి బయలుదేరాను - ఈ సారి ఎలా తప్పించుకుంటుందో చూద్దాం అని నీరజక్‌ విస్మయానందం కలిగించాలని !

సుందరరావుగారిల్లు రాజభవనంలా వుంది డబ్బుతో సమకూరే సొకర్యాలన్నీ పున్నాయి బయట ఎండలో నుంచి వచ్చిన మాకు - ఎసి గదిలో ప్రాణం సేదతీరినట్లు వుంది - నేను కూర్చున్న సోఫాకి ఎదురుగా గోడకి చక్కని పెయింటింగ్‌ వుంది - గది కళాత్మకంగా అలంకరించారు. ఎంతైనా నీరజది మంచి అభిరుచి పోనీలే పాపం - అటు డాక్టర్‌ కాలేకపోయింది - ఇటు మంచి ఉద్యోగమూ రాలేదు - మనిష్‌ కాస్త పెద్దవాడూ, చూడ్డానికీ బావుండనివాడూ అయినా సుందర్రావు మంచివాడు లాగే వున్నాడు కావలసినంత డబ్బు, డబ్బుతోనైనా సుఖపడుతోంది - అదెంత కాదు? ఈ డబ్బు లేకనే కదా అక్కలా మెడిసిన్‌

భద్రత 61 చదవలేకపోయింది ? ఆ డబ్బు లేకనే కదా అమ్మాజీలా వుద్యోగం కొనుక్కోలేక పోయింది ? ఆ డబ్బు లేకనే కదా నాలా భర్తని కొనుక్కోలేకపోయింది ! భద్రమైన జీవితం ॥ నీరజని గురించి ఇలాంటి ఆలోచనలతో నేను సంతోషపడడానికి ప్రయత్నిస్తుండగా, ట్రేలో కాఫ్‌ కప్పులతో ఆవిడ లోపలికి వచ్చింది నీలమేఘచ్చాయ, కొంచెం ఎత్తుగా కనిపించే పళ్ళు - మెడ నిండా గొలుసులు - చేతులకు చాలా బంగారు గాజులు, ముక్కుకి రవ్వల పుడక, సుందరరావు అక్కగారేమోననుకుని, పలకరింపుగా చిరునవ్వు చిందించడానికి ప్రయత్నించేను

“కళ్యాణి - మా ఆవిడ - మా మేనత్త కూతురు కూడా చిన్నప్పుడు నవలలు రాసింది

  • ఇప్పుడు మహిళామండలి (ప్రెసిడెంటు - బిజీవుమన్‌ - మా ఇంటి మహారాణి- అతిశయోక్తులతో పరిచయం - మోహన్‌ నావైపు చూసి “మిస్టర్‌ నో ఆల్‌' లాగానవ్వి నా చెయ్యి గిల్లేడు - అయినా నేను సర్దుకోలేకపోయాను

పెద్ద బండరాయొకటి నా నెత్తిన పడ్డట్టయింది - తలలో నరాలన్నీ చితికిపోయాయి నెత్తురు కళ్ళల్లోకి చిమ్ముకొచ్చింది - గోడలన్నీ దగ్గరకి వచ్చి నన్ను నొక్కేస్తున్నాయి సుందరరావు బాన కడుపు పెద్దదై, మరీ పెద్దదై నన్ను బయటికి తరుముతోంది రవ్వల ముక్కు పుడక కొలిమిలా మండి కాల్చడానికి వస్తోంది.

“అయో్యో-” అన్నది ఒక గొంతు

పెళ్ళి ఇంట్లో పరామర్శలు, పరిచర్యల మధ్య తేలాను - “ఇదంతా మామూలేనోయ్‌

  • అంతా పెళ్ళాలతోనే హాలీడేకి రారు - టేకిట్‌ ఈజీ-' అన్నాడు మోహన్‌

ఆమె గురించి మర్చిపోవాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు - నేను దాన్ని ఈజీగా తీసుకోలేకపోయినాను- తరువాత మాకు హైదరాబాద్‌ ప్రాంతానికి బదిలీ అయిపోయింది - మంచి స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించడానికి వేటతో పాటు అక్కడ కుదురుకోవడానికి ఆరు నెలలు పట్టింది - స్థలం మార్పు, ఊపిరాడని దినచర్యతో దాదాపు నేను నీరజని గురించి తలచుకోడం మానేసినట్టే లెక్క - అయితే ఓ రోజు సాయంత్రం అయిదు గంటలప్పుడు నేను అబిడ్స్‌ నుంచి వస్తూంటే, ఒక ఆఫీసు దగ్గర ఆటో ఎక్కుతూ కనిపించింది నీరజ నాకు మళ్ళీ.

  • ఈసారి నేనామెని విడిచిపెట్టదలచలేదు - ఆఫీసు పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని టెలిఫోన్‌ డైరక్టరీ సాయంతో ఆ ఆఫీసుకి ఫోన్‌ చేసి నీరజ అనే అమ్మాయి అక్కడ పవి చేస్తున్నట్లు తెలుసుకున్నాను - నీరజ ఆరోజు ఆఫీసుకు రాలేదు ఎందుకురాలేదో మేనేజర్‌ని అడిగి చెప్తానని టెలిఫోన్‌ ఆపరేటర్‌ చెప్పింది - అడిగి చెప్పింది - నీరజకి వంట్లో బాగాలేదట జ్వరం వచ్చిందని మూడు రోజులు - అనగా ఆదివారం దాకా సెలవు పెట్టిందట నీరజ అక్కడ స్టెనోగ్రాఫర్‌ గా చేస్తోందట - “ఇంటి ఎ డ్రస్‌ చెప్పగలరా! ' అంటే మళ్ళీ ఆమె కొలీగ్స్‌ని అడిగి

62 ఇల్లలకగొచే. . ,. చెప్పింది - ఆ ఆఫీసుకి ఆటోలో వెడితే కనీసం ముప్పావు గంట దూరంలో వుండే ప్రాంతం

  • మోహన్‌ ని అడిగి కారు తీనుకుని వెళ్ళాను ఇంటికి వెళ్ళి కనపడీతే తను నీరజ కాదని తిప్పి పంపదనే ధైర్యంతో ఇల్లు సొకర్యంగా వుంది - తల్లి సంతోషంగానూ, ఆరోగ్యంగానూ కనిఫించింది చెల్లెళ్ళు యూనివర్సిటీ చదువులకి వచ్చేరు - ఇంట్లో ఆధునిక గృహసౌకర్యాలన్నీ వున్నాయి - నీరప ఇంట్లో లేదు - హాస్పిటల్‌కి వెళ్ళిందేమో- “నీరజ ఎప్పుడొస్తుందమ్మా!”' అంటే అవిడ చెప్పింది -

నీరజ వాళ్ళ మేనేజర్‌ తో కలసి క్యాంప్‌ కి వెళ్ళిందట - ఇంకా మూడు రోజుల దాకా రాదట అప్పుడప్పుడూ ఆమెకిలాంటి ప్రయాణాలు తప్పవట - మగపిల్హాడిలా ఇల్లు గడుపుతోందిట - కళ్ళనిండా ప్రేమ నింపుకుని చెప్పింది ఆ కన్న తల్లి -

“ఆదివారం తప్పకుండా రా అమ్మా! నిన్ను చూస్తే సంతోషిస్తుంది అమ్మాయి'' అన్నది

  • నేనింటికొచ్చేసరికి మా ఇంట్లో నుంచి కొత్త గొంతు వినిపిస్తోంది చూస్తే డ్రాయింగ్‌ రూంలో సుందరరావుగారున్నారు - 'మనవాళ్ళు తో స్నేహాన్ని మోహన్‌ ఎంత బాగా కాపాడుకుంటాడో తెలుసు - “వండుకునే వారికి ఒకటే కూర - అడుక్కునేవారికి అరవైయ్యారు కూరలనీ మా అమ్మమ్మ సామెత చెప్పేది - అంటున్న ది కొత్త గొంతు - సుందర్రావుది -

ఆ హాస్యోక్తికి అమితంగా ఆనందించిన చిహ్నంగా రెండవ గొంతు పడీపడీ నవ్వుతోంది. = హాస్యం చిందించిన గొంతు అందులో శృతి కలిపింది -

“అడుక్కోడం ఆరవైయ్యారు కూరల కోసం మొదలెట్టరు సార్‌ -మొదలెట్టడంతోనే అరవైయ్యారు కూరలు ఆటోమేటిక్‌గా పడిపోతాయి- ' అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు

నేను మోహన్‌ ని కారడిగినప్పుడు ఎంతో నిజాయితీగా నీరజ గురించి చెప్పి వుంఢథకపోతే, ఈ అవహేళన వినవలసి వచ్చేది కాదు - అనుకోకుండా దిగిన “మనవాడు”, మోహన్‌ నీరజ గురించి మాట్తాడుకునే వుంటారు ఆమె నాకు పరిచితురాలని తెలిసి కూడా మాట్లాడుకునే వుంటారు అలా మాట్టాడుకోగలగడం వాళ్ళ హక్కు

నాకు సుందరగ్రావూ్హూ మోహన్‌ ఒకేలా కనిపించారు - ఇద్దరిలో ఎవరెవరో నేను గుర్తుపట్టలేక పోయాను - వాళ్ళిద్దరి కళ్ళల్లో దాగని అవహేళన నాకు ప్రస్పుటంగా కనపడింది వాళ్ళిద్దరి కళ్ళూ నాకు నాలుగు చెత్తకుండీల్లా కనిపించాయి - ఆ గదంతా కుళ్ళు వాసన వేసింది- ఇంటికి తిరిగి వసూనే నేను ఆలోచించాను

నే నెందుకిలా నీరజ వెంటపడుతున్నాను ఆమె నన్వు ఎందుకు తప్పించుకుంటోందో తెలిసిన తరువాత కూడా నేనింత బాగా జీవితంలో స్థిరపడ్డానని చూపించుకోడానికా? “నీ వెలావున్నావు? అని అడిగి బాధ పెట్టడానికా? ఆమెని సానుభూతి హింసకు గురిచెయ్యడానికా?

భద్రత 63 ఆమెకి నేనేం చెయ్యగలను? ఆమె తల్లికీ, చెల్లెళ్ళకీ నుఖప్రదమైన జీవితం సమకూర్చే జీవిక సంపాదించిపెట్టగలనా? ఆమెని అర్ధం చేసుకుని ఆహ్వానించే మనిషిని వెతికి తెచ్చి పెళ్ళి చెయ్యగలనా? మరెందుకు నాకీ ఉత్సుకత! ఆమె ఎదుట నిలబడే అర్హత నాకు లేదని తెలిశాక నేను వాళ్ళింటికి ఎలా వెళ్ళగలను? నేనింక నీరజ వెంట పడలేను -

“బావుందా నీ స్నేహేతురాలు!' మోహన్‌ ప్రశ్న-

“వీపులు తుడీపించుకునే వాళ్ళంతా ఎంతో బావున్నప్పుడు, తుడిచే వాళ్ళు కొంచెం బావున్నట్టు కనిపించడం చూసి కూడా ఎఏడవాలా?” అని అడగలేని నా చేతగానితనాన్ని తిట్టకుంటూ,గొంతులోకి ఎగదన్నుకు వస్తున్న గుండెని లోపలికి వెడుతూ, వంట ఇంట్లోకి వెళ్ళాను - అంతకన్నా భద్రమైన చోటు ఇంక్కడుంటుంది కనుక |!

(ఆజంట్రట్యోతి వారవత్రక 7-8-92) నయా యయయయయయయాయయాయయాం

గణీరం బి హోల్‌ స్క్వేర్‌ ఈజ్‌ ఈక్వల్‌ టూ ఎస్క్వేర5+ బిస్క్వేర్‌+టు ఎ బి అనేది గొప్ప సిద్ధాంతమే కానీ సిద్ధాంతాలకి అందని నిజాలు కూడా తప్పకుండా వుంటాయని బుజువు చెయ్యడం లాగా, అతని స్కూటర్‌ మీదనించి దిగింది రాధ - సందేహం లేదు రాధే! రాధని అతనితో ఎప్పుడూ ఊహించలేదు తను - నమ్మలేకపోతున్నా అమె రాధే-! ఈ హాస్పిటల్‌కి ఆమె రావడానికి కారణం ఆమెని చూడగానే తెలిసిపోతోంది. తులసి మళ్ళీ వాళ్ళిద్దర్నీ చూసింది - అతను మధు - ఆమె రాధ - అది నిజం - మధు తన భార్య రాధని చెకప్‌కి డాక్టర్‌ సరోజిని మెటర్నిటీ లో చేర్చి వచ్చేడు -సందేహం లేదు - రాధ నిండుగా వుంది - కళ్ళల్లా సంతృప్తి కాంతి కొట్టాచ్చినట్బ కనపడుతోంది - తన కర్థంకానిది వీళ్ళిద్దరికీ ఎలా సంబంధం కుదిరింది అనేదే! “హలో తులసీ-” అంది రాధ- భుజం మీద చెయ్యివేసి. “హలో! రాధా- బాగున్నావా? కంగ్రాట్స్‌ - తల్లికాబోతున్నందుకు - నిన్ను స్కూటర్‌ మీద తెచ్చింది మధూ కదూ!” అంది. “అవును! మధూ నేనూ పెళ్ళి చేసుకున్నాం - ఏడాదయింది - నువ్వీ వూళ్ళో వున్నావని తెలీదు- అంది రాధ

గణీతం 65్‌

“మా ఆయనకి ఇక్కడ ఉద్యోగం- నేనూ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాను-”

“నీకు పెళ్ళయినట్లు తెలీదు-”' అంది రాధ.

ఇంకా కాలేదనుకుంటోంది కాబోలు - అలా అనుకోడంలో తప్పేం లేదు - నిజంగా అలా అనుకుంటూందో - వెక్కిరించడానికి అన్నదో తెలీలేదు -

“నిరుడు అయింది + నీ ఎడ్రెస్‌ తెలీక కార్డు పంపలేదు - నీ పెళ్ళయినట్టు నాకు తెలీదుగా!' అంది తులసి!

“నా పెళ్ళికి కార్టు వేయించలేదు- ఓ పదిమంది (ఫెండ్స్‌తో రిజిస్ట్రార్‌ ఆఫీసుకి వెళ్ళి పెళ్ళి అయిందనిపించాం- ఎందుకంత ఖర్చని-'

“దట్స్‌ వెరీ ఇంటరెస్టింగ్‌ - ఇక్కడేం చేస్తున్నావ్‌ నువు -”

“ప్రస్తుతం కడుపులో పిల్లని మోన్తున్నాను - మధు ఫోటో స్టూడియో ఒకటి (ప్రారంభించాడిక్కడ - అతనికి సాయం చేస్తుంటాను - రాకూడదూ మా యింటికి పోదాం- అంది రాధ

పీలవగానే ఎక్కడికీ వెళ్ళకూడదు - కొంచెం బెట్టు చెయ్యాలనేది చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న జ్ఞానం - మధూ, రాధా ఎలా వుంటున్నారో చూడాలన్నది ఇప్పటి కుతూహలం - రాధలోపలికి వెళ్ళి చెకప్‌ చేయించుకుని వచ్చింది

“నీక్కూడా ఇలాంటి జబ్బేనా?' అంది

“కాదులే చిన్న సుస్తీ- ' అని నవ్వి లోపలికి వెళ్ళింది - తిరిగి వచ్చేవరకూ అక్కడే వుంది రాధ.

'మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర నడిచిపోవచ్చు'” అంది “కారు తెచ్చాను పద -” ఆంది తులసి

“ నీకు కారు వుండే వుండాలి - మర్చిపోయాను పద” అంది రాధ

ఇది కూడా వెక్కిరింపేననిపించింది ఫొటో స్టూడియో ముందు కారు ఆపింది

ఇల్లూ, ఫోటో స్టూడియో కలిసే వున్నాయి మూడు గదులు స్టూడియో - రెండు గదులు ఇల్లు, ఇల్లు నిరాడంబరంగా - చాలా సాొదాగా వుంది ఒక గదిలో మంచాలు, పుస్తకాలు ఒక గదిలో వంట సామాను, మళ్ళీ పుస్తకాలు స్టూడియోలో కూడా మళ్ళీ మళ్ళీ పుస్తకాలు - మంచాల గదిలోనే టివి టేప్‌ రికార్డర్‌

రాధ చల్లని నిమ్మరసం యిచ్చింది

“మీ ఆయన పేరేమిటి? ఏం చేస్తాడు అన్నీ చెప్పు -” అంది

మధు వచ్చేడు- “ఓ! తులసీ - ఏమి విస్మయానందం!” అన్నాడు

“నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు-” అంది రాధ

656 ఇల్లలకగానే. ..,

“ఏం ్రశ్చ వేశావు?” మధు అడిగేడు.

“వాళ్ళాయన ఎం చేస్తాడు అని?”

“ఓ! అదా! తులసి కన్న అన్ని విధాల ఎక్కువైనవాడు! ఆమె కన్న పొడుగు - ఆమె కన్న అందగాడు - ఆమెకన్న ఓ మెట్ప పై ఉద్యోగంలో వున్నవాడు - ఆస్తికలవాడు - ఆమెకన్న ఎక్కువ చదివినవాడు అయివుంటాడు - బహుశా ఏ కంపెనీకో మేనేజింగ్‌ డైరెక్టరో - ఏ గవర్పమెంటు సంన్థకో డైరెక్టరో -”

మధుని చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది తులసికి

“అవును - నువ్వు చెప్పిందంతా నిజం - అతని పేరు ప్రభాకర్‌ -” అంది తమాయించుకుని

-.... “నేనెప్పుడూ నిజమే చెబుతాను తులసీ - నీ సిద్ధాంతం ప్రకారం అది అంతే అయివుండాలి-"

సరన్సులో రాయి విసిరేడు బహుశా అతనికి చాలా ఆనందం కలిగి వుండొచ్చు - తనని పుల్లతో పొడిచినందుకు -గురిచూసి బాణం వేసినందుకు

తులసి లేచింది - ఇంటికి వచ్చింది - దాహంగా అనిపించి మంచినీళ్ళు తాగింది - వంట్లో బాగాలేని తనం ఎక్కువైనట్టు అనిపించింది చాలా కష్టపడి ఎంతో డబ్బు వెచ్చించి, ఎంళో కాలంగా నిర్మించుకున్న సొధం, అందం లేక వెల వెలపోయినట్లు అనిపించింది

-ఖరీదైనదేగాని సుందరమైనది కాని హర్మ్యం శూన్యంగాఅనిపించింది రెండు రెళ్ళు నాలుగు-అయిదు మూళ్ళు పదిహేను లాగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న జీవితంలో, ఈ రోజు ఎదో “అపద్ధతి' ప్రవేశించిం దేమోనని పిస్తోంది.

తననుకున్నది నిజంగా పద్దతి కాదేమో ననే సందేహం కూడా కలుగుతోంది- ఆంకెలన్నీ కాళ్ళూ చేతులూ విరగగొట్టుకుని గాలిలో తేలిపోతున్నాయి సిద్దాంతాలు విరిగిపోతున్నాయి- 'టూఎబ్లి ఒక చోటికి, 'బిస్కేర్‌ ఇంకొకచోటికీ ఎగిరిపోతున్నాయి - ఎస్క్వేర్‌ మంచం కిందికీ - బి స్క్వేర్‌ ఇంకెక్కడికో పారిపోతున్నాయి.

ఎయిర్‌ కండిషనర్‌ వేసి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది తులసి.

ఫోన్‌ మోగింది - అవళల ప్రభాకర్‌- తనీవేళ సెలవు పెట్టి ఇంట్లో వుంటున్నట్లు అతనికి తెలుసు.

“సాయంత్రం మా జిడ్డుగాబ్సిభోజనానికి పిలుస్తున్నాను - ఏమైనా కావాలంటే తిప్పించుకో -ప్యూన్‌ ని పంపుతాను - * అన్నాడు

“జిడ్డుగాడు' అంటే అతని కన్నా ఓమెట్టుపైనున్న కృష్ణమూర్తి - హెడ్‌ ఆఫీసు నించి వచ్చాడు - అతనితో ఏమైనా అవసరం రావచ్చునని అతన్ని భోజనానికి పిలుస్తాడు ప్రభాకర్‌

గణితం 6/7

  • తనకి వంట్లో బాగాలేదని తెలుసు - 'పిలవనా?' అని అడగడు పిలుస్తున్నానని చెబుతాడు. రెండవ మాటకు అవకాశం ఇవ్వడు. రాబోయే ప్రమోషన్‌కు ఇలాంటి భోజనాలు కొన్ని తనకి ఎందుకో అసలు నచ్చవు - ఈ వ్యాపార స్తేహాలు, వ్యాపార భోజనాలు.

రాధ తనని ఇంటికి ఎందుకు తిసుకెళ్ళినట్లు?]

“ఇదిగో చూడు! నువ్వు చెయ్యలేని పని నేను చేశాను - సమస్థ సంపదలు, సౌఖ్యాలు కాలిగోటితో తన్నేసి బతుకులో నిజమైన సుఖం అంటే ఏమిటో అర్ధం చేసుకున్నాను-” అని చెప్పడానికా? “నువ్వు అక్కర్లేదని విసిరి వేసిన రాయిని సానపెట్టి అందులో వున్న నిజమైన వజ్రాన్ని వెలికి తీశాను చూడవే మూర్మ్చులారా' అని వెక్కిరించడానికా?

“మాది (ప్రేమ వివాహం - మేం చూడు ఎంత హాయిగా వున్నామో!' అని చూపించడానికా?

అవును, రాధకి అన్నీ తెలుసు - అస్తమానూ చెట్ట్లకీ పుట్లకీ భాయా చిత్రాలు తీసేవాడు పెళ్లానికి అన్నం పెడతాడా? నీ సంపొదన చూసి నీ వెంట పడ్డాడేగానీ నీకన్న చదువు తక్కువ, నీకన్న అందం తక్కువ, నీకన్న పొడుగు కూడా లేడు - ఆస్తిలేదు - ప్రభుత్వోద్యోగం లేదు - ఇవి నిజం ప్రమలా ? ఇదుత్త ఇన్‌ఫాచ్యుఎషన్‌ - నిజం - ఇవి పేమలు కావు - వయసులో పుట్టే సహజమైన ఆకర్షణలకి రోమాంటిక్‌ రూపాలు - స్త్రీ పురుషుల మధ్య వుండేధి లైంగిక ఆకర్షణే గానీ (పేమకాదు - పెళ్ళయిన రెండోనాటికే తెలిసిపోతుంది - కావాలంటే చూడు ఎన్ని ఉదాహరణలో - మొన్న మొన్న విడాకులు తీసుకున్న వైదేహి - భర్త ఇన్ఫీరియారిటీ కాం ప్లెక్స్‌కి బలైపోయి కొసప్రాబాలతో పుట్టింటికి వచ్చింది - (ప్రేమ, (పేమ అంటూ తనకన్నా అన్నింట్లో తక్కువైన వాణ్ణి పెళ్ళి చేసుకున్న సరస్వతి ఆత్మహత్య చేసుకుంది - ఇంకో సరోజిని హిస్టీరియా వచ్చింది -మరో దమయంతి రోగిష్టిమారిదైంది - కోకోల్లలు - ఉదాహరణలు - జీవితానికి రోమాంటిక్‌ టచ్‌ మంచిదే - కానీ దాన్ని మించింది వాస్తవికత - స్వభావాలు - అవి ఒకదానితో ఒకటి సర్దుకు పోవడం - ఎంత కాదన్నా పురుషుడు - స్రీ ఆధిక్యతని వరంగంలోనూ సహించడు, అందులోనూ భార్య తనకన్నా అధికురాలంటే అసలే భరించలేడు- భార్యని భార్యలాగా నే చూస్తాడు - హింసిస్తాడు - ఈ (ప్రేమలు అర్ధం లేనివి - వుత్తుత్తి అకర్షణలు - వయస్సుపోయే వెర్రి పోకడలు - " లోకం చేసిన జ్ఞానబోధ ముందు తలవొగ్గింది తులసి, అని రాధకి తెలుసు - అందుకే రాధ ఇప్పుడు తనని ఇంటికి తీసుకు వెళ్ళింది.

ప్రభాకర్‌ పంపిన ప్యూన్‌ వచ్చి అమ్మగారు చెప్పిన జాబితా పుచ్చుకుని వెళ్ళేడు అడంబరాలు, అట్టహాసాలు ప్రభాకర్‌ కి చాలా యిష్టం కృష్ణమూర్తిలాంటి ఒక మనిషిని పిలిచినా, యధావిధిగా అన్నీ అమర్చాలి. “ఎ మనిషీతో ఎప్పుడు అవసరం వస్తుందో - ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్‌, తులసీ!” అంటాడు

68 ఇల్లలకగొనే, ... అతనికి ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే చాలా ఇష్టం ఆమాట అంటే కూడా చాలా యిష్టం “ఆఫీసులు ఇంత దగ్గర్లో పెట్టుకుని మనకి కారెందుకు” అంది తులసి- అతను కారు

కొన్నప్పుడు “ఇదొక ఇన్వెస్ట్‌మెంట్‌ - కారు వుంటే కారు ఎలవెన్సు వస్తుంది - కారు ఇంట్లో

పెట్టుకుని స్కూటర్‌ మీద వెళ్ళొచ్చు - పైగా మన అప్పు తీరేనాటికి కార్ల ధర పెరుగుతుంది

  • మన డబ్బు మనకొస్తుంది ఇదంతా సేవింగే [-' అంటాడు అతని అంచనాలు - లెక్కలు తులసికి చాలా వింతగా వుంటాయి కృష్ణమూర్తి భోజనానికి వచ్చాడు తులసి లాంటి భార్యని పొందిన ప్రభాకర్‌ అదృష్టాన్ని వేనోళ్ళ పొగిడాడు అందం, మంచి ఉద్యోగం, - చెప్పిన మాటవినే గుణం అన్నీ వున్న అమ్మాయి దొరకడం - నిజంగా చాలా అరుదు - ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోకంండా ఆగినందుకు తగ్గ ఫలితం లభించిందన్నాడు,

అవును! తనకీ సంబంధం కుదిరినప్పుడు చాలా మంది ఆ మాటే అన్నారు మగవాడు అందంగా వుండడం చాలా గొప్ప అన్నారు ఇంత మంచి ఉద్యోగం వుండడం - అంతకన్నా అన్నివిధాల ఎక్కువ అయిన వాడు దొరకడం నిజంగా చాలా గొప్పు అన్నారు - ఇంతకాలం ముప్పై ఒక్క సంవత్సరాలు పెళ్ళి చేసుకోకుండా వున్నా - నిరీక్షణకి ఫలితం దక్కిందన్నారు. తులసికి నవ్వొచ్చింది - ఇంతకాలం తను ప్రభాకర్‌ కోనం నిరీక్రించిందా ? లేదు -

ఆమాటకొస్తే - తన జీవితంలో తీసుకోబడిన నిర్ణయాలలో తన ప్రమేయం ఏం వుందనీ ? బిఎ చదువుతున్నప్పటి నుంచీ సంబంధాల వేట సాగింది అక్క పెళ్ళికి అయిన అప్పు దృష్టిలో పెట్టుకుని నాన్న తన పెళ్ళికి కొంచెం తాత్సారం చేసేడు బిఏ కాగానే తనకి ఎం ఎలో సీటొచ్చింది - “ఊర్కే ఇంట్లో వుండి ఎ చేస్తుందీ వెళ్ళమను యూనివర్సిటీకి - " అన్నారు పెద్దలు . అదీ యూనివర్సిటీ వూళ్ళోనే వుంది కనుక ఎంఏ చదువుతున్నప్పుడు

'పెళ్ళికొడుకుల వేట సాగింది ఎంఏ అమ్మాయికీ గ్రాడ్యుయేట్‌ని చెయ్యం కదా ? అందుకని

ఆమెకన్నా విద్యాధికుడి కోసం వేట ఎంఏ అయిపోయింది. విద్యాధికులు దొరక్కకాదు -

వాళ్ళు అడిగిన కట్నం చూసి జడుసుకుని

అదేం అదృష్టమో, తులసికి ఉద్యోగం కూడా వచ్చింది తులసి అందానికి, తులసి ఉద్యోగానికి తగ్గవాడు, ఎక్కువ కట్నం ఆడక్కుండా వుండేవాడు దొరకడానికి యింత కాలం పట్టింది ఇప్పుడేం మరి, తులసి కట్నం యివ్వలేదా ? అంటే - యిచ్చింది - ఆమె ఏడెనిమిదేళ్ళుగా తన జీతం అంతా దాచి,ప్రభాకర్‌ ఇందానికి, ప్రభాకర్‌ ఉద్యోగానికీ = తగ్గట్టుగానే కట్టం యిచ్చింది - అయినప్పుటికీ, తులసి అర్హతలు చూసి కట్నంలో కొంత రాయితీ యిచ్చినట్లు అంటూ వుంటారు అతని తల్లి తండ్రులు - అతను కూడా

గణితం 69

తులసి జీవితంలో హాయిగా స్థిరపడిం దని, ఆమెకిక పిళ్ళ కాదేమోనని బాధపడిపోయిన

లోకం ఆనందించింది నిదానమే ప్రదానం అనే సిద్దాంతం తులసి పట్ల ఎలా బుజువైందో పదిమందికీ తెలియజెప్పి ఆనందించింది.

“నేనే చాలా పొరపాటు చేశానోయ్‌ - నాలుగు లక్షలు కట్నం వచ్చిందని ఆశపడి మేనమామ కూతుర్ని చేసేసుకున్నాను - అందులో రెండు లక్షలు మా అమ్మానాన్న కొట్టేశారు. ఒక లక్ష మా ఆవిడ బంగారం క్రింద అయింది. తీరా చేస్తే నాకొచ్చింది లక్త - నీలా ఉద్యోగం చేసే భార్య వుంటే రిటైరయ్యేనాటికి ఎన్ని లక్షలవుతాయో చూడు ! నీది నిజమైన ప్లాను పైగా మీ ఆవిడది సురక్షితమైన, టెన్షన్లు లేని ఉద్యోగం యు ఆర్‌ రియల్లీ (ప్రాగ్మటిక్‌ నీ తెలివికి అభినందిస్తున్నానోయ్‌ -'

జిడ్డు స్టేటుమెంటుని ఏ మాత్రం ఖండీంచకుండా నవ్వి ఊరుకున్నాడు ప్రభాకర్‌ తులసికి బాధగా అనిపించింది

పెళ్ళి చూపులతోనూ, పేరయ్యల తోనూ విసిగి పోయాక తులసి తండ్రి ఆదివారం వివాహ సంబంధాల ప్రకటల్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెట్టేడు అలా చూడగా - “ముప్ఫెలోపుఉద్యోగస్తురాలైన అమ్మాయి కావలెను - యువకుని ఉద్యోగం ఫలానా - జీతం ఫలానా - అనే సలక్షఐమైన సంబంధం ఒకటి కంటపడింది - ఈ మధ్యన వస్తున్న సంబంధాలలో తులసికన్న ఒకటి రెండేళ్ళు తక్కువ వయస్సున్న పెళ్ళికొడుకులు వస్తున్నారు, వెంటనే ఓ దరఖాస్తు వ్రాసిపడేశాడాయన పదిరోజుల్లో ఫలానా ఊళ్ళో ఫలానా హోటల్లో ఫలానా టైంకి అమ్మాయితో సహా తల్లి తండ్రులను హాజరుకమ్మని పిలుపొచ్చింది పుట్టిన తేదీ. సర్టిఫికెట్టు, పతకాలు, ప్రయిజుల తాలూకు ఫోటోలతో సహా హాజరైపోయారు - అబ్బాయి అల్లి తండ్రుల ఎదుట

థాంక్‌ గాడ్‌ అమ్మాయి బాగుంది ! పర్మనెంటు అండ్‌ డీసెంట్‌ జాట్‌ - ట్రాన్సఫర్‌ బల్‌

  • అమ్మాయి మర్యాదస్తురాలే!

ధాంక్‌ గాడ్‌ - అబ్బాయి బానే పున్నాడు ఎత్తుగా వున్నాడు - ఎంత మంచి ఉద్యోగం - మర్యాదగానే కన్పించాడు - జాతకాలు కలవక చస్తాయా ? కలవబట్టే కదా - నీ ప్రకటన చూసి దరఖాస్తు వెయ్యడం జరిగింది - మేం మీ నంబంధం ఎరడం జరిగింది - మేం నమ్మం సార్‌ జాతకాలు - పిల్ల నచ్చకపోతే మాత్రం జాతకం కుదరలేదంటాం - అంతే ! మేమూ అంతేనండీ - అడిగిన కట్టం యివ్వలేకపోతే అబ్బాయి జాతకం సరిపోలేదంటాం

అబ్బాయినీ అమ్మాయినీ మాట్లాడు కోమనండి

ఎం వున్నాయి మాట్లాడుకోవడానికి ! ఊహలు కల బోసుకోవడాలూ - అభిప్రాయాలు తెలుసుకోవడాలూ - అభిరుచులు కనుక్కోవడాలూ కావు - అందులోనూ అంకిలూ -

706 ఇల్లలకగొనే.... అంచనాలే - "కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారు - ” నాన్న “ఇచ్చెయ్యండీి - దాని డబ్బేవున్నది గదా - మనం కాస్త వేద్దాం - బంగారంలాంటి సంబంధం-” అమ్మ బ్యాంక్‌ ప్యాస్‌ బుక్‌ లన్నీ పోగేశారు సరిపోయింది . అమ్మయ్య! మేళాలు మోగాయి ఫలానా వారింట్లో,

“తక్కిన ఆడపిల్లలకిలాగో పెళ్ళి చేశాడు గానీ ' ఈ పిల్ల కే కష్టం అయింది పాపం - అయినా అంతలేసి చదువులూ - ఉద్యోగాలూ వుంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావండీ - ”

“పోన్లే పాపం - తులసి అందరిలాంటిదీ కాదు - చాలా మంచి పిల్ల! ఎదో ఆ ఫోటోలు తీసే అబ్బాయితో స్నేహం చేసింది గానీ - మళ్ళీ పెద్ద వాళ్ళ మాట వినిమానేసింది - చెబితే వినే పిల్లే - చాలా మంచిది -” అని లోకం ఆమెకి శాలువ కప్పి సన్మానించింది

“మధు తీసిన ఫోటోకి ఫస్ట్‌ ఫ్రయిజ్‌ వచ్చిందటమ్మా - ఏదో దిన పత్రికలో ఉద్యోగం తూడా వచ్చిందట-” అన్నాడు తులసి తమ్ముడు,

“ఏం పత్రికలో లేరా - ఆ ఉద్యోగాలు శాశ్వతం కావు-” అని చప్పరించేసింధి తులసి తల్లి

“ఇప్పుడు మనకేం అమ్మా - మన తులసికి పెళ్ళయింది కదా! అతనికి ఉద్యోగం పచ్చిందని నేను సంతోషంతో చెప్పానంతే - ' అన్నాడతను

తులసి కూడా సంతోషించింది.

తులసి తన పెళ్ళికి కూడా సంతోషించింది అవును మగ వాళ్ళకి ఇన్ఫీరియారిటి కాంప్లెక్సు వుంటే కష్టం - భార్యల్ని అనేక రకాలుగా బాధ పెట్టి పైశాచికానందం పొందుతారు పురుషాధిక్యత ఈ సమాజంలో ఇంకా కొన్ని శతాబ్దాలు పరిరక్షింపబడుతుంది దానికి ఎవరూ ఏం చెయ్యలేరు సర్దుకు పోవలసిందే ప్రభాకర్‌ మంచివాడే ! మొదటి రాత్రే అతడు తన పథకాలన్నీ భార్యకి చెప్పేడు ఇప్పుడే ఇల్లు కొనుక్కుంటే మంచిది - లోన్‌ త్వరగా తీర్చవచ్చు

  • ఒక జీతం యిద్దరికీ హాయిగా చాలు అందుకని తులసి పేరున అతను లోన్‌ తీసుకుంటాడు ఆమె జీతం లోన్‌కి కడుతుంది ఇల్లు ఆమె పేరునే వుంటుంది. తను కారు లోన్‌ తీసుకుంటాడు దాన్ని ఎలవెన్సుల్లో సర్పుతాడు. ఇద్దరు మనుషులకి ఒక జీతం కూడా ఎక్కువే

“మా అల్లుడికి ముందు చూపు జాస్తి - అని అమ్మ మురిసిపోతుంది, ఇదంతా చెబితే అనుకుంది తులసి

కట్నం డబ్బులో కొంత కట్టి ప్తాట్‌ కొనేశాడు ప్రభాకర్‌, లోన్‌ తీసుకుని ఇప్పుడు తులసి జీతం అంతా అప్పులకే పోతుంది. అది వరకులా ఓ చౌరాసియా క్యాసెట్‌ కొనుక్కోవాలన్నా, తమ్ముడికీ చెల్లెలికీ ఏదైనా కొనాలన్నా చేతిలో అనలు డబ్బుండడం లేదు. ప్రభాకర్‌ జీవన స్థాయి మాత్రం ఏమీ తగ్గలేదు “ఇల్లునీదే గదోయ్‌- "అని మురిపిస్తాడు తులసికి సంగీతం ప్రాణం తమ్ముడికీ - చెల్లికీ కూడా అంతే ! అందులోనూ ఇన్‌స్టుమెంటల్‌ అంటే మరీ యిష్టం,

గణితం క్‌ ము పృెయ్యో పడిలో ప్రవేశించడం అంటే వొళ్ళు రాకుండా కాపాడుకోడం జుత్తురాలకుండా జాగ్రత్త పడ్డం - కళ్ళ క్రింద నల్లపడకుండా చూసుకోవడం -ముప్పైె అయినా యిరవై నాలుగులా కనపడడానికి ప్రయత్నించకపోతే పెళ్ళి కుదరదేమోననే బాధ, ఇన్ని కష్టాలున్నా - సాయంత్రం ఇంటి కొచ్చేసరికి కాఫ్‌ తో ఎదురయ్యే అమ్మ ఎనిమిదిన్నరకి ఇంటిల్లిపాదీ డైనింగ్‌ టేబిల్‌ ముందరపోగవడం నాన్నగార్ని ఆటపట్టించడానికి తమ్ముడు “వుయ్‌ డిన్ట్‌ స్టార్ట్‌ దఫైర్‌' అనే బిల్లీ జోయెల్‌ పాటని పెద్ద వాల్యూంలో పెట్టడం - ఆయన పాశ్చాత్య సంగీతాన్ని తిట్టడం - వాడు ఆ పాటకి ఆర్ధం చెప్పి మెచ్చేసుకోవడం - ఆయన మళ్ళీ తిట్టడం - తరువాత వాడు ఆయనకి సంగీతం మెచ్చుకునే చెవి లేదని అనడం - అమ్మ హరి ప్రసాద్‌ చౌరాసియా క్యాసెట్‌ వెయ్యడంతో - ఆ గొడవ సద్దుమణగడం - తమ్ముడి చతురు - చెల్తెలి కబుర్లు - నవ్వులు - నవ్వులు - “పెళ్ళికాలేదు పాపం - ” అనే లోకం బాధని తన బాధగా చేసుకుందే గానీ - నిజంగా పెళ్ళి కాలేదనే బాధ తనకి లేదేమో - అమ్మతో అంజద్‌ ఆలీఖాన్‌ నీ తమ్ముడితో రాడ్‌స్టీవర్ట్‌నీ చెల్లిలితో జానకినీ విని ఆనందించేది - సాయంత్రం మొదలు రాత్రి పదకొండు వరకూ ఇల్లంతా సంగీత మాధుర్యమే కదా! (ప్రభాకర్‌ కి 'చెవి అసలు లేదు అతను టేప్‌ రికార్డర్‌ ని వెంటనే కట్టేసి వచ్చి టీవీ ముందు కూర్చుంటాడు జిడ్డుని పంపించి, పడక గదిలోకి వచ్చాడతను “వెధవ - మహా ఆనందించేడు మన భోజనానికి - నిన్ను చూసి ఒకటే ఏడుపు - అసూయాపరుడు - పోన్లే పాపం - వీడు మా బాస్‌ కి కుడి భుజం - మన ప్రమోషన్‌ కి సాయం చేస్తాడు -' అన్నాడు పడుకుంటూ. తులసి మాట్లాడలేదు - ఇలాంటి వక్కాణింపులకి బదులు చెప్పడానికి ఎం వుంటుంది గనుక ! ప్రభాకర్‌ చాలా ఆనందంగా వున్నాడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసేడు “నాకు వంట్లో బాగాలేదు - " అంది తులసి “ఎమైందంటా” అన్నాడు. పొద్దున చెప్పింది - తనే కారిచ్చి హస్పిటల్‌కి వెళ్ళమన్నాడు మళ్ళీ “ఎమైందిటా-" అంటున్నాడు మళ్ళీ చెప్పింది, 'ముఫై ఒకటన్నావుగానీ, యాఖై ఒకటేమోనని నా అనుమానం -' అన్నాడు అటు తిరుగుతూ

72 ఇల్లలకగానే...;

అతని హాపష్యం - అసహ్యంగా వుంది - వాంతి వచ్చేలా వుండీ, రాకుండా వుంటే ఎలా వుంటుందో అలా వుంది

తనకీ మధుకీ మధ్య సంబంధాన్ని “ఇన్‌ ఫ్యాచ్యుఏషన్‌” అని సిద్ధాంతీకరించిన లోకాన్ని తనకీ ప్రభాకర్‌ కీ వున్న సంబంధాన్ని గురించి ఎమంటుందో అడగాలి ? బహుశా భార్యా భర్తల మధ్య సహజంగా వుండే సంబంధం అంటుందేమో! ఈ సంబంధానికి రోమాంటిక్‌ ట£ అనవసరం అంటుంది- జీవితంలోనేభావుకత అవసరం లేదు వాస్తవికత కావాలంటుంది

“ఇదంతా రాధ చేసిందే - ఈ పరికారాలన్నీ కొనడం స్పడియో ప్రారంభించడం - నాదేం లేదు - 'అన్నాడు మధు.

“ నాదేం వుందోయ్‌! నాదగ్గర డఉబ్బుంది - అతని దగ్గర కళ వుంది - ఈ రెండింటికీ సరస్పరావసరం వుందని తెలియ జెప్పానంతే -' అంది రాధ

రాధ డబ్బుతో పైకొచ్చిన మధుకి ఇన్‌ఫీరియారిటీ కాంపెక్స్‌ రాకుండా వుంటుందా | ఆమెని హింసిప్తాడా ? ఆమె అతనికి విడొకులిచ్చి వెళ్ళిపోతుందా? ఆత్మహత్య చేసుకుంటుందా? రోగిస్టిమారిదౌతుందా?

అది లోకం సిద్దాంతం - అదేమో తనకి తెలీదుగానీ తనూ ప్రభాకర్‌ మాత్రం విడిపోరు. ఎందుకంటే తమ జీవితాలు పద్ధతి ప్రకారం నడుస్తాయి అంచనాల ప్రకారం సాగుతాయి అంకెల మీద - నల్లేరు మీద బండీలా నడిచి పోతాయి

ప్రభాకర్‌ హాయిగా గురక పెట్టి నిదపోతున్నాడు అనుకున్న దాన్ని అంచనాల ప్రకారం అందుకోవడమే తెలుసు అసంతృప్తి ఎరగడు అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళడు. రూడికలతో తీసివేతలతో హడావుడిగా వుంటాడు తనకి నిద్ర రావడంలేదు కళ్ళు మూసుకుంటే ఆంకెలు దయ్యం వేషాలతో మీద మీదకు వచ్చి భయపెడుతున్నాయి కళ్ళు తెరిస్తే సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కల మీద - గోడ మీద కూడా కూడా ప్లస్‌ లూ ఇంటూలు కనిపిస్తున్నాయి.

(రచన మాన వత్రిక నవంబరు 1992) భ్‌

న. దేర్రడు షూ ఆయన సద్గుణ సంపన్నుడనీ, నన్ను భార్యలా కాక స్నేహితురాల్లా చూసుకుంటాడనీ నాకు అన్ని విధాలా సహకరిస్తాడనీ నిజంగా అతను నా పొలిట దేవుడేననీ మా కొలీగ్స్‌ చాలామందే కాకుండా మా చుట్టాలు కూడా అంటూ వుంటారు వాళ్ళలా అన్నప్పుడు నిజంగానే నాకు కాస్త గర్వంగా వుంటుంది, ఎందుకంటే నిజంగానే కృష్ణమూర్తి నుంచివాడు. చాలామందిలా త్రవ్లకి తాగుడు లేదు సిగరెట్లు కాల్బడు ఆపీసునుంచి వస్తూ కూరలూ సరుకులవీ తెస్తాడు పాపతో హోంవర్క్‌ చేయిస్తాడు నేను వంట చెయ్యడానికీ బద్దకించిన రోజున ఆవకాయ, పెరుగుతో సరిపుచ్చుకుంటాడు నన్ను 'ఎమే!వొసే అనడు. నేనతన్ని పేరుపెట్టి పిలిచినా వూరుకుంటాడు అతని ఆలోచనలు, అతని పధకాలు నాకు అమితంగా నచ్చుతాయి ఆఖరికి నేను ఉద్యోగం ఎలా చేయాలో కూడా అతనే చెబుతాడు ఎవరితో ఎలా మాటాడాలో, ఎలా ప్రవర్తించాలో అతనే నాకు నేర్పాడు. అతను అవన్నీ నేర్చకపోతే అమాయకంగా ఏ ప్రమాదం కొనితెచ్చుకుంటానోనని అతని బెంగ. “నువ్వొట్టి అమాయకురాలివి” అని అతను అంటూ వుంటే, నిజంగా నా భారం అతని మీదవేసి నేను

లీ ఇల్లలకగానే.... సుఖంగా, ఆలోచించ నవసరం లేకుండా బతక గలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నిజానికి నాకు ఆలోచించే అవసరం వుండదు నా బదులు అతనే అలోచిస్తాడు ఇలా మా జీవితం సుఖంగా సాగిపోతున్న తరుణంలో ఓ సాయంత్రం అకస్మాత్తుగా “ రిక్షా దిగి, పెద్ద సూట్‌కేసుతో లోపలికి వచ్చింది వసంత వసంతని గుర్తుపట్టడం కొంచెం కష్ట మైంది, పచ్చని ముద్దబంతిపువ్వులా వుండే వసంత ఎండు వేపుపుల్లలా వుండడాన చాలా కాలం తరువాత కలుసుకున్నందుకు సంతోషించి ఆమెని కృష్ణమూర్తికి పరిచయం చేసేను. ఇద్దరం చిన్నప్పుడు మావూరి జిల్లా పరిషత్‌ హైస్కూల్లోను, తరువాత గుంటూరువుమెన్స్‌ కాలేజిలో కలిసి చదువుకున్న సంగతి చెప్పాను బహుశా పుట్టింటి నుంచి తన ఇంటికో, తన ఇంటి నుంచి పుట్టింటికో వెడుతూ దారిలో ఆగినట్ట్లుంది ఏమైనా ఆమె ఇలా రావడం నాకెంతో సంతోషం కలిగించింది నేనీవూరు వచ్చి ఓ ఇల్లు ఎర్పాటు చేసుకున్నాక నా స్నేహితురాలంటూ ఎవరూ వచ్చి రెండు రోజులుండలేదు, అందుకని

ఇద్దరం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూండగా అడిగేను, “ఎక్కడనించి ఎక్కడికి

వెడుతూ ఇక్కడ దిగావ్‌!' అని “మా నాన్న ఇంటినుంచి వస్తున్నాను ఇక్కడికే వచ్చాను. ఏం? ఇంత సూట్‌కేస్‌తో

వచ్చాననా? ' అంది

సాధారణంగా అందరూ పుట్టింటినించి అనో, అమ్మగారింటినించి అనో అంటారు,

ఇలా నాన్న ఇంటినించి అనరు “నువ్వు పదిరోజులుంటే సంతోషంకాదా? అలా మాట్టాడకు" అన్నాను, తను వచ్చిందని నాలుగు రోజులు సెలవుపెట్టేను వసంత వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగావుంది గడిచిన రోజులు, అప్పటి ఊహలు, అప్పటి మాటలు, అప్పటి అల్లరి అన్నీ గుర్తు వచ్చి మళ్లీ పదేళ్లు చిన్నదాన్ని అయినట్లు అనుభూతి పాందేను. ఇలా అప్పుడప్పుడూ స్నేహితులని కలుసుకోకపోతే సంసారంతో పడి యంత్రాల్లా బతికి, త్వరగా వృద్దులం అయిపోతాం అనిపించింది కానీ వసంత సంతోషంగా కనిపించలేదు చాలా ముభావంగా

వుంది నవ్వడం లేదు నవ్వకుండా అసలు మాట్టాడేదేకాదు పూర్వం

ఆ రాత్రి కృష్ణమూర్తి అడిగేడు “ఎమిటి నీ ఫెండ్‌ ఎన్నాళ్లుంటుందీ! అంత సూట్‌కేస్‌తో వచ్చింది? అని అతనలా అడగడం నాకు బాధగా అనిపించింది మాట్టాడకుండా వూరుకున్నాను అదే రోజు సాయంత్రం మా అమ్మ కూడా వచ్చింది అమ్మకి వంట్లో బాగున్నట్టులేదు జ్వరం కూడా వుంది అమ్మ మావూళ్లో ఒక్కతే వుంటుంది ఇల్లు రెండు భాగాలు అద్దెకిచ్చింది ఆ అద్దెలు వసూలు చేసుకుని తన ఖర్చు గడుపుకుంటూ వుంటుంది. నాన్నగారి ప్రావిడెంటుఫండ్‌

దేవుడు 75 తతత వగైరా డబ్బు బ్యాంక్‌లోవుంది దానిమీద వడ్డీ వస్తూ వుంటుంది ఆవిడకి ఆర్ధికంగా ఎ లోటూ లేదు అయినా వంటరిగా వుంటుంది.

“మీ అమ్మమీ అన్నయ్య దగ్గర వుండక అలా ఒక్కతే వుండడం ఎందుకూ?” అంటూ వుంటాడు కృష్ణమూర్తి నేనూ అది నిజవే అనుకుంటాను అమ్మమా ఇంటికి తరుచూ వస్తూ వుంటుంది వచ్చేటప్పుడు నాకోసం పచ్చళ్లు, పాడులూ పిండివంటలు తెన్తూ వుంటుంది. పాపని చూడకుండా ఆవిడ వుండలేదు మా పాపకి ఆవిడ దగ్గర చాలా మాలిమి అమ్మ కూడా పది రోజులుంటే కృష్ణమూర్తికి ఇష్టం వుండదు అంచేత ఆవిడ వెల్లిపోతానంటే నేను మాట్లడను అతనితో అభిప్రాయభేదాలు తెచ్చుకోవడం, ఘర్షణ పడడం నాకిష్టం వుండదు

ఎ తల్లి తన ఆడపిల్లల దగ్గర వుంటుంది. గనుక! తల్లి తండ్రులు వుండవలసింది మగపిల్లల దగ్గరే! ఆని నేనూ నమ్మాను

“నువ్వు ఆఫీసుకి వెళ్లిపో సుమతీ! అమ్మ నాకు తోడువుంటుందిగా అవిడకి నేను తోడుగా వుంటాను ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాం ' అంది వసంత

నాకూ ఆమె సలహా నచ్చింది

సాయంత్రం నేను అఫీసునుంచి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా సర్దింది పాపకి స్నానం చేయించింది నాకు టిఫిన్‌ కూడా పెట్టింది రాత్రికి వంట సిద్దం చేసింది “ఇదంతా ఎందుకు చేసేవు వసంతా! నేను వచ్చి చూసుకుంటానుగదా! అన్నాను నొచ్చుకుంటూ

“ఈపనంతా అక్కడ నాకు అలవాటే! ఇంతకన్నా ఎక్కువ పని చేస్తాను" అంది

'అక్కడ అంటే తన ఇంట్లో, వపంత పొరపాటున కూడా నా ఇల్లు అనదు అక్కడ అంటుంది.

భోజనాలయ్యాయి. అందరూ పడుకున్నాక నేనూ వసంత వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నాం ఆమె నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకుని, అందుకు సిద్దంగా "కూర్చున్నాను

వసంత చెప్పడం ప్రారంభించింది చాలా గంభీరంగా, ఒక్క కన్నీటి బొట్వ కార్చకుండా ఎంతో నిబ్బరంగా చెప్పింది నేను విన్నాను విన్నంత సేపూ పమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూనే వున్నాను చెప్పడమే కాదు. వీపు మీద దెబ్బలతాలూకు కమిలిపోయిన గుర్తులు చూపించింది నిద్రలేని రాత్రులు కళ్లకింద వేసిన నల్లని చారలు చూపించింది కన్నీరు కార్చి కార్చి వట్టిపోయిన పాడీ కళ్లే అందుకు సాక్ష్యం ఈ హింసంతా కట్నం కోసం కాదు.

కొంత భార్యని హింస పెట్టకపోతే ఎలా? అనే స్వభావ సిద్ధమైన హింస, కొంత ఆమె మీద అనుమానంతో జరిగే హింస ఆమెంటే రవంత (ప్రేమలేదు కరుణ లేదు స్నేహం అసలులేదు అలాంటప్పుడు ఆమె శరీరం మాత్రం ఏం అవసరం? కానీ ఆమె మీద తన ఉవనాలాానాలంనతాలానిాలానంంనిినాలనలలలంలాానరలన

76 ఇల్లలకగానే. .. ఆధిక్యత చాటుకోడానికి ఆమె శరీరం కూడా అతనిది అతనిష్టం అలాంటి అవమానాల్త్లోంచి, అసహ్యంలో నుంచీ హింసలో నుంచీ ఇద్దరు పిల్లలు లోకంలోకి వచ్చారు కానీ ఆ పిల్లల్ని ఆమె ఎంళో (ప్రేమించినా ఆ పిల్లల్ని కూడా ఆమె దగ్గరికి రానివ్వడు ఆమె మీద పిల్లలికి కూడా అసహ్యం కలుగబేస్తాడు బతుకు దిన దిన గండంగా మారింది అక్కడ వుండలేనని అమ్మతో చెప్పింది. అమ్మ నాన్నతో చెప్పింది నాన్న రమ్మనలేదు అమ్మా, నాన్నా అన్నయ్యా అంతా వసంత అసమర్ధతని వేలెత్తి చూపారు. మంచి భోజనం పెట్టి, వినయవిధేయతలు ప్రదర్శించి, అందచందాలు చూపించి భర్తని లొంగదీసుకోలేని చవట అన్నారు అమ్మ చెప్పింది, వినయంగా విదేయంగా వుండి తను నాన్నగారితో ఇన్నేళ్లు బతకబట్టే తన పిల్లలు సుఖంగా వున్నారని విడాకులూ, విడిపోవడాలూ మన వంశంలో లేవని తేల్చారు భగవంతుడిని నమ్ముకుని అతన్ని మంచి చేసుకోవడానికి ప్రయత్సించమన్నారు ఓపిగ్గా బతకమన్నారు, షిరి డీసాయిబాబా విభూతి ఇచ్చి రోజూ రాత్రివేళ మొహానికి పెట్టకోమన్నారు

కనకదుర్గ అమ్మవారి పూజకుంకం ఇచ్చారు ఆచారి గారి దగ్గర రక్షరేకు తెచ్చిచ్చారు ప్రతి శనివారం తన కోసం అమ్మ ఉపవాసం చేస్తానంది, తన సంసారం బాగుపడీతే ఆ స్వామికి కల్యాణం చేయిస్తానంది. ధైర్యంగా వుండమంది నాన్న ఆరు వందలు పెట్టి సిల్కు చీర తెచ్చేరు, అన్నయ్య సినిమాకి తీసుకువెళ్లేడు అమ్మ లడ్డు, అరిసెలూ చేసిచ్చింది అన్నయ్య తీసుకువెల్లి దింపి వచ్చాడు అమ్మ చెప్పిన వినయం, విధేయత, అందం, భోజనం అన్నీ తనని మరింత లోకువ చేశాయి హింస మరింత పెరిగింది అనుమానం పెనుభూతం అయింది మళ్లీ వెల్లింది పుట్టింటికి కాదు నాన్న ఇంటికి మల్లీ అవేబోధలు, మళ్లీ అవే మాటలు ఈసారి నాన్న వచ్చి దింపుతానన్నారు అక్కర్లేదు నేనే వెడతానని బయలుదేరి ఇక్కడ దిగింది ఇదీ ఈమె కథ “గాడిదకి చాలా ఓర్పంటారు ) నే గాడిదకన్నా ఎక్కువ ఓర్పు వహించాను దాని కన్నా హీనంగా బతికాను కానీ ఇంక నావల్ల కాదు నేనేం తప్పు చేశానని అలా శిక్ష అనుభవించాలి? నాకు చావొక్కటే మార్గం ఇందులో నుంచీ తప్పించుకోడానికి! కానీ నాకు చావాలని లేదు. నా పిల్లల్ని తెచ్చుకుని ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని వుంది అందుకు నువ్వు సాయం చేస్తావని వచ్చాను” అంది.

“అయ్యో! నీకు సాయం చేయడం నా విధి వసంతా! వినడానికే కష్టంగోవుంది. నువ్వెలా భరించావో ఏమో!” అని ఆమెని ఓదార్చేను

“మన స్పేహితురాళ్లందర్లోకీ నువ్వు మంచి స్థితిలో వున్నావు. మీ ఆయనతో సమానంగా సంపాదిస్తున్నావు ఆతను నిన్ను బాగా చూస్తాడు నువ్వే నన్ను ఒక దారికి చేరుస్తావనే నమ్మకంతో వచ్చాను నాకేదైనా చిన్న ఉద్యోగం చూసిపెట్టు పిల్లల్ని తెచ్చుకుని ఎలాగో బళతుకుతాను' అంది

దేవుడు 77

“తప్పకుండ చూద్దాం రేపు కృష్ణమూర్తికి అంతా చెబుతాను. అతను ఒక మార్గం చూస్తాడు. నువ్వు హాయిగా వుండు, పని దొరికే దాకా ఇది నీ ఇల్లే అనుకో” అన్నాను

మరునాడు ఉదయం ఆమె మొహం తేటగా కనిపించింది కావాలని ఇంటి పనంతా భుజం పైన వేసుకుంది నేను వారిస్తే

“అక్కడ ఇంతకన్నా పదిరెట్లు పని చేసేదాన్ని, కానీ రవంత ఆదరణ లేదు నువ్వు నాకు పునర్జన్మ నిస్తున్నావు నీ బుణం ఎలా తీర్చుకోను? ఈ పని నాకేం కష్టంలేదు నీకు తెలీదు సుమతీ అక్కడ నేనెలా చాకిరీ చేసేదాన్నో ఎ చిన్నలోటు వస్తే ఉద్యోగంలోంచి తీసేస్తారో, నోటి దగ్గర కూడుపోతుందని దిక్కులేని వాళ్లు భయపడుతూ వణికిపోతూ ఉద్యోగం చేసినట్టు నేనక్కడ పని చేసేను. ఇక్కడ నా ప్రియస్నేహితురాలికి కొంచెం సాయపడుతున్నానంతే కాదనకు” అంది

అ సాయంత్రం వసంత కథంతా కృష్ణమూర్తికి చెప్పాను ఆమె నాకెలాచెప్పిందో నేనూ అలాగే చెప్పాను అయితే నాలా అతను కళ్లు తుడుచుకోనూలేదు, కదిలిపోనూలేదు

“అదన్నమాట అవిడ రాకకి కారణం బాగానేవుంది దారినపోయే తద్దినాన్ని నెత్తికి చుట్టుకోకు ఇలాంటివి జరుగుతూనే వుంటాయి, కొత్తేం వుందీ అయినా తల్లికీ తండ్రికీ లేని దుగ్ధ నీకేమిటీ! అందుకే నువ్వొట్టి అమాయకు రాళివన్నాను చెప్పిందంతా నమ్మేశావు రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు ఈవిడేం చేసిందో అతనంత క్రూరంగా ప్రవర్తించడానికి నామాట విని నాలుగు మంచి మాటలు చెప్పి, మీఅమ్మతో పాటు మీ నూరు పంపించు వాళ్ల అమ్మానాన్న చూసుకుంటారు" అన్నాడు.

నేను తెల్లబోయాను ముంచుకొచ్చిన నల్లటి మబ్బుని ఒక్క గాలి తెర తేలిపోయేలా చేసినట్లు అతని మాటలకీ మొదటిసారిగా నేను తెల్లబోయాను మొదటిసారిగా ఆ మాటలు నాకు చేదుగా అనిపించాయి అసలింత వరకూ నేనతనికి ఎదురు సమాధానం చెప్పివుండలేదు వాదించలేదు ఊ అనడం మాత్రమే నాకు తెలుసు అతనికి ఎలా చెప్పాలో నాకు అర్ధం కాలేదు వసంత చెప్పిందంతా నిజం అబద్ధంకాదని అతనిక్కూడా తెలుసునని నాకనిపించింది అతనిలా మాట్టాడ్డం నాకు చాలా అవమానకరంగా తోచింది అమ్మ పుట్టెడు జ్వరంతో వచ్చింది ఆమెనికూడా పంపించమంటున్నాడు. నా మసస్సు చివుక్కుమంది

నా ప్లీడర్‌ స్నేహితురాలు రాజేశ్వరితో వసంత విషయం చెప్పాను ఆమె వసంతకెక్కడైనా చిన్న పని చూస్తానని వాగ్దానం చేసింది నేను ఆఫీసుకి వెళుతున్నాను వసంత అమ్మతో కాలక్షేపం చేస్తోంది నేను వద్దన్న కొద్దీ ఇంటి చాకిరీ అంతా నెత్తిన వేసుకుంది

ఆమె వచ్చి పది రోజులైంది కృష్ణమూర్తి ప్రవర్తనలో నూర్పు నేను స్పష్టంగా గమనించాను. ఆతను చీటికీ మాటికీ పాపనీ నన్నూ విసుక్కోడం గమనించాను. వసంతని పంపలేదని అలా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్నాను నేను వసంతని పంపలేను

78 ఇల్లలకగాొనే. ... క పతకత న 1 ఆ రాత్రి అందరం భోజనంచేస్తుండగా “నేను చేసిన కూర ఎలా వుంది కృష్ణమూర్తిగారూ! గుత్తి వంకాయంటే మీకు చాలా ఇష్టంట కదా!” అంది వసంత, “బావుంది” అన్నాడు చాలా ముభావంగా, ఏ భావమూ లేని వెక్కముక్కలాంటి మహం పెట్టి మి ఇంట్లో వంటకి పెట్టకోండి నన్ను జీతం ఇవ్వకపోయినా ఫరవాలేదు తిండిపెట్టి వుండనిస్తే చాలు” అంది కొంచెం హాస్యంగానే “అదేం మాటమ్మా!” అని అమ్మ అంటూండగానే “మాకు వంట మనుష్యుల్సి పెట్బకునే స్థోమత లేదండీ! ఇద్దరం సంపాదిస్తున్నాం అన్నమాటేగానీ అన్నీ అప్పులే” అనేశాడు గబుక్కున నేను వసంత మొహం చూడలేకపోయేను అవును మాకన్నీ అప్ములే చిట్‌ఫండ్స్‌, షేర్లు, రికరింగ్‌ డీపాజిట్టు, ఇన్నూరెన్స్‌లు, ఇవన్నీ అతనికి అప్పులకింద లెక్క ఒక స్నేహితురాలు [ప్రాణసంకటంలో వుండి నా దగ్గరకొచ్చి పదిరోజులుంటే అతనికి అప్పులైపోతాయి ఇతనేనా నా పతిదేవుడు? నా కొలీగ్స్‌కి, చుట్టాలకి అందరికీ నా పట్ల అసూయ కలిగించినవాడు, ఇన్నాళ్లూ నా హృదయంలో అత్యున్నత స్థానం ఇచ్చి హీరో వర్షిప్‌ చేయించుకున్నవాడు, ఇలా మాట్లాడుతున్నాడేం ఇతను! మేం ఇద్దరం ఒకటేనన్నవాడూ, ఇద్దరి డబ్బూ ఒకటేనన్నవాడు నా ఆనందం, నా అభివృద్ధి, నా శ్రేయస్సూ కోరే మొదటి వ్యక్తి అయినవాడు, నాకు చిలుక పలుకులు నేర్పినవాడు, నడకలు నేర్పినవాడు, ఇతనే! సందేహం లేదు, నా మనస్సునిండా వర్షాకాలపు నల్లమబ్బులు కమ్ముకున్నాయి అవి ,వర్షించకపోతే! ఆ బరువు నేను మోయలేననిపించింది నాకు ఏడవాలనిపించింది భోజనొలయిన తరువాత అతను మళ్లీ నాకు చెప్పాడు “వసంతని పంపించెయ్‌! ఆమె ఇక్కడుండడం మంచిది కాదు దేపు సెలవుపెట్టి సినిమా చూషించి, ఒక చీరెపెట్టి మీ అమ్మకిచ్చి పంపు” “అమ్మకి జ్వరంగావుంది ఆమె ఇక్కడ నాలుగు రోజులు వుండడానికి వచ్చింది” అన్నాను ధైర్యం కూడదీసుకుని “ఆవిడ మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి వుండ వచ్చుగా! ఒక్కతే ఎందుకక్కడ” అన్నాడు విసుక్కుంటూ నేనేం మాట్లాడలేదు తెల్లవారి పళ్లు తోముకుంటూ ఆలోచిస్తున్నాను వసంతని పషపంపలేను అమ్మని పంపలేను. కృష్ణమూర్తి కోపాన్ని భరించలేను ఇంతవరకూ అతని కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు కోపం రావడానికేం వుంది ఆతనిష్టపవ్రకారమే నడున్తూ వచ్చాను నేనలా ఆలోచిస్తూ వుండగా వరండాలోనుంచి దిన పత్రిక విసురుగా వచ్చి నా మొహాన పడీంది అంత

దేవుడు 79 విసురుగా అది వచ్చి నా మొహాన పడిందంటే అందులో ఐదో సంచనలం వుందన్నమాట! అవును వుంది.

“వసంత అనబడే ముప్ఫై సంవత్సరాల వివాహిత మనస్థిమితం బేక ఇల్లు విడిచి వెల్లిపోయింది సన్నగా పొడుగ్గా వుంటుంది కోలమొహం పెద్ద కళ్ళు, తెలుగూ, ఇంగ్రీషూ మాట్లాడుతుంది ఆచూకీ తెలిసిన వారు ఫలానా అడ్రసుకు తెలియజేయాలి బహుమతులేంలేవు'" ' వసంత ఫాటో. పెళ్లినాటి దండల ఫొటోలో సగం

“నీకు మనస్థిమితం లేదటగా!” అని అ పత్రిక వసంతకిచ్చాను.

“అవును పెళ్లయిన నాటినించీ లేదు. ఈ ఒక్క మాటా నిజమే చెప్పాడు" అంది. ఒక నిమిషం అగి

“నేనిక్కడున్నట్లు మీ ఆయన్ని ఉత్తరం రాయొద్దని చెప్పు. అతనొచ్చి జాతర చేస్తాడు అతని మాటలు, ప్రవర్తన మీరు భరించలేరు” అంది,

నా మనస్సు మళ్లీ చివుక్కుమంది వసంతని ఇక్కడ వుంచుకున్నందు వలన గొడవలౌతాయని అనుకుంటున్నాడేగానీ, వసంతని భర్త దగ్గరకి పంపించమన్నంత(ర్రూరుడేం కొదు కృష్ణమూర్తి అనిపించింది అతను అంత అమానుషంగా ఆలోచించడు ప్రవర్తించడు నాలుగురోజులు పోయాక రాజేశ్వరి వసంతకి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే ఈ చిరాకులన్నీ తొలగిపోతాయి కృష్ణమూర్తి గురించి వసంత అపార్ధం చేసుకుందనిపించింది అతనలా రొయడు అనిపించింది అయితే వార్తాపత్రికలోప్రకటన పడ్డాక కృష్ణమూర్తి అసలు నాతో మాట్ట్లాడ్డంలేదు ఇప్పుడతనికి ఇంట్లో ఎదీ నచ్చడం లేదు, వంటనచ్చడం లేదు, పాప అల్లరి నచ్చడంలేదు ఇంట్లో ప్రయివెసీ అనేది కరువైపోవడం అసలు నచ్చడంలేదు ఇంట్లో ఎవరికివారు గొప్ప వాళ్లిపోయారనీ, అతని మాట ఎవరూ లక్ష్య పెట్టడం లేదనీ తెలుస్తోంది. ఇంతకాలం నేనొట్టి అమాయకురాలిననే అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు నేనొట్టిమొండిదాన్ననీ మూర్చురాలిననీ తెలిసింది. ఇదీ సంగతి

నాకు పెళ్లయిన నాటినుంచీ నా జీతం తెచ్చి అతనికిస్తున్నాను. అతని అనుమతితోనే చీరెలు,నగలు కొనుక్కుంటున్నాను ఇంట్లోకి ఎం కావాలన్నా అళనే తెస్తాడు నాకేంలోటు లేదనుకున్నాను పోనీ వసంతని ఎదైనా స్రీల హాస్టల్‌లో ఒక నెలవుంచుదామన్నా నా దగ్గర డబ్బులేదు మాకిద్దరికీ జీతాలు వస్తాయేగానీ ఒక జీతం చిట్‌ఫండ్స్‌కి తదితర సేవింగ్స్‌కి పోతుంది వున్నదాంట్టో ఇల్లు గడవాలి అందుకోసం నా బస్సు ఖర్చులకి, చిన్నచిన్న ఇతర ఖర్చులకి మాత్రమే నాదగ్గర డబ్బుంటుంది ఈ మధ్యన మేం స్థలం కొనుక్కున్నప్పుడు డబ్బు తక్కువైతే నా నగలు బ్యాంక్‌లో తాకట్టుపెట్టి డబ్బు తెచ్చా ఇప్పుడవి కూడా నా దగ్గరబేవు మేం ఇద్దరం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్క రాయాలంటాడతను అలా ఒక్క వంద రూపాయలతో ఉమ వంతల నంననిననిాలా శల త తనననననా

రి0 ఇల్లలకగొనే. . .. వున్నాను నేను. మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి. తెల్లవారుతూనే వాకిట్లో ఆగిన ఆటోలో నుంచి దిగిన వాడు సాక్షాత్తూ వసంత మొగుడే! నేను వసంత మొహంలోకి చూడలేశ తలదించుకున్నాను

“పిచ్చిదానా! నీవైవాహిక జీవితం నీకేం నేర్పలేదు. నా వైవాహిక జీవితం నాకు మనుషుల్ని అర్ధం చేసుకోడం నేర్చింది, సంశయించడం నేర్చింది ' అన్నట్లు ఓదార్చుగా నా వైపు చూసింది వసంత

రమ్మని అతను, రానని వసంత.

పంపెయ్‌మని కృష్ణమూర్తి, నావల్ల కాదని నేను, తగవు, తిట్టు అరుపులు, తిట్టు, బూతులు,

“నేను చెప్పాను అతనొట్టి గొడవ మనిషని” అంది వసంత

వసంతని తీసుకు వెళ్లడం తనవల్ల కాదని తెలిసి, “ఎం? నీ స్నేహితురాలి మొగుడు నిన్ను కూడా వుంచుకుంటానన్నాడా!' అన్నాడు, అక్కసుగా, అసహ్యంగా అతను

“ముందిక్కడ్నించి కదులు, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను రాస్కెల్‌ ' అని అతన్ని బయటిక్‌గెంటేడు కృష్ణమూర్తి అందుకు ఏంతోషించబోతూండగా, అతను నన్ను దుయ్యబట్టేడు, నా మొండీతనంతో తన పరువు తీశానన్నాడు నా మూర్థత్వంతో అతనికి అవమానం జరిగిందన్నాడు ఇకనైనా బుద్ధిగా వుండకపోతే నన్ను కూడా వెల్లిపొామ్మన్నాడు. అలా అరిచీ అరిచీ అలసిపోయి కుర్చీలోకూర్చున్నాడు

ఈలోగా వసంత బట్టలు సన్దడం మొదలు పెట్టింది

“నువ్వేమో ఉద్యోగం చేసి స్వతంత్రంగా నున్నావనీ, హాయిగావున్నావనీ, నాకు సాయం చేస్తావనీ అనుకున్నాను. ఇదేమిటిలా జరిగింది. నా మూలంగా మీరిద్దరూ పోట్లాడుకోకండీ ' అంది

వసంత నా ఉద్యోగాన్నీ నా సంపాదననేకాక నన్నూ, నా అహాన్ని కూడా దెబ్బ కొట్టింది

ఇప్పుడు నాకు కృష్ణమూర్తి మీద కోపం రాలేదు నా అసమర్థత తలుచుకుని ఏడుపురాలేదు ఇంతకాలం నాకేం కావాలో కెలుసుకో లేకపోయినందుకు, కళ్లు తెరచి లోకాన్ని చూడలేకపోయినందుకు, విచారం కలగలేదు నాకు నా కర్తవ్యం ఒక్కటే గుర్తొచ్చింది

వసంత చెయ్యి పట్టుకుని, “సంతోషించాంకానీ నువ్వెక్కడికీ వెళ్లవు నేనూ ఎక్కడికీ వెళ్ళను పద పొద్దెక్కుతోంది త్వరగా స్నానం చేసి రాజేశ్వరి దగ్గరకు వెడదాం తను నిన్ను రమ్మని కబురు చేసింది” అన్నాను,

(ఐఫుల జనవరి 1994) ణ్గ్‌

గాంధారి రొగం లీశను తనపట్ల ఎంతో ప్రేమతో కొని యిచ్చిన ఆధునిక గృహ పరికరాలన్నీ శుభ్రంగా తుడిచి, వాటి వాటి స్థానాల్లో అందంగా ఠీవిగా కనపడేలా వుంచి, చీమలతో, దోమలతో, బల్లులతో, బొద్దింకలతో హోరా హోరీ పోరాడి జయించి, మచ్చలేని మహా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణిలా వెలిగిపోయే సరస్వతి, ఒకింత ప్రకృతి సిద్ధమైన చల్లనిగాలి కోసం వీధి వరండాలోకి వచ్చింది. పల్చబడుతున్నా పచ్చ పచ్చగా వున్న ఎండ అప్పుడే నీళ్ళుపోసిన మొక్కలకు మెరుగుపెడుతున్నది. సాయంత్రపు గాలి, ప్రాణూన్ని సేద దీర్బేలా వుంది గేటుకీ వరండాకీ మధ్య గచ్చు చేసిన నడవలో స్నేహితురాలు రషీదాతో షెటిల్‌ ఆడుతోంది నరస్వతి కూతురు గీత రషీదా ఆరిందాలా ఆడుతుంటే గీత బ్యాట్‌ పట్బకోడం రాక తికమక పదిపోతోంది రషీదా గేలి చేస్తోంది గీత ఉడుక్కుంటోంది. సరస్వతి మొహంలోకి వెచ్చని ఆవిర్లు వచ్చాయి ఆవేశంగా రెండడుగులు నడవ వైపు వేసి ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తిరిగింది - బాబీ వచ్చే వేళైంది - వాడు బాగా అకలిమీద వస్తాడు.

రం ఇల్లలకగానే. ,.. వాడికి ముందే చేసి వుంచిన చల్తారిపోయిన టిఫిన్లు నచ్చవు - వాడు వచ్చి టేబుల్‌ ముందు కూర్చోగానే పల్చటి దోసెలు వేడీ వడిగా వేసి పెట్టాలి గీత ఆటకాగానే దానికీ పెట్టాలి గీత దోసెలు తినదు చపాతీలు కావాలంటుంది అందులోకి తెల్ల సెనగల కూర కావాలి - సుబ్బారావు రాత్రిపూట భోజనం చెయ్యడు చపాతీలుతింటాడు ఇప్పుడే కాలిస్తే అతను విసిరేస్తాడు చల్తారిపోయిన చపాతీలు గేదెలు కూడా తినవంటాడు. అంచేత ఇప్పుడు తను ముందుగా కొన్ని చపాతీలు గీతకి చేసిపెట్టి, తరువాత బాబీకి దోసెలు వెయ్యాలి ఇంతపని పెట్టుకుని వీధి వరండాలో నిలబడి ఆవేశపడిపోవడం తగదు కదా! పిల్లలకి వేళ్ళికి తిండి పెట్టకపోతే వాళ్ళు బాగా చదవలేరు. వాళ్ళ భవిష్యత్తంతా తను వాళ్ళకి సరిగ్గా వండి పెట్టడం మీదే వుంటుందంటాడు సుబ్బారావు నిజమే కాబోలు అనుకుంటుంది సరస్వతి

“వాహ్‌! క్యా ఖుష్పూ ఆంటీ” అంటూ వంట ఇంట్లోకి వచ్చింది రషీదా

“అమ్మ ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తుంది - అందుకే మా నాన్నగారికి ఎవరింటికి

వెళ్ళినా ఎం నచ్చదు” అంది గీత

సరన్వతి ఏం మాట్లాడలేదు ఇద్దరికీ చపాతీలు పెట్టింది ఇంతలో బాబీ వచ్చేడు. వాడికి దోసెలు వేసింది అమ్మని ఎమీ అడగక్కర్లేదు - “అడగందే అమ్మయినా పెట్టదు' అంటారుగానీ ఆ మాట అబద్దం అమ్మని ఏం అడగక్కర్లేదు మనస్సులో అనుకుంటే చాలు, నోటి ముందు ప్రత్యక్షం

ఒక్క బాబీకేమిటి! సరస్వతి అందరికీ అన్నీ అలాగే అమరుస్తుంది

మాస్టర్‌ ఆఫ్‌ ది హవుస్‌ మిస్టర్‌ సుబ్బారావు ఏడు గంటలకి వస్తాడా! అతను రాగానే తళతళలాడే స్టీలు గ్లాసులో, కాచి చల్తార్చి వడపోసి ఫ్రిజ్‌లో వుంచిన మంచి నీళ్ళు యిస్తుంది. అతనొచ్చేసరికి ఇల్లు అద్దంలా వుంచుతుంది అలా లేకపోతే అతను సరస్వతిని వెక్కిరిస్తాడు ఎద్దేవా చేస్తాడు ఆ మాటలంటే సరస్వతికి మొదట్లో చికాకు, ఇప్పుడు అసహ్యం అందుచేత అతను నోరు విప్పే అవసరం రానీయదు అతనొచ్చి సోఫాలో కూర్చోగానే ఫ్యాన్‌ వేస్తుంది - అప్పుడప్పుడే ఫిల్టర్‌లో దిగిన డికాక్షన్‌లో మరిగే పాలు కలిపి, నురగలు కక్కే కాఫీని బోన్‌ చైనా కప్పులో పోసి తెన్తుంది తెచ్చి ఒక నిముషం నిలబడుతుంది, ఆ కాఫీలో ఏ లోపం లేదని తేల్చుకున్నాక లోపలికి వెడుతుంది

సుబ్బారావు ఇంటికి వచ్చే వేళకి, సరస్వతి మురికిచీచెలో పనిచేస్తూ వుండకూడదు తనకి చపాతీలు కాల్చడం తప్పించి ఇంకే పనీ చేయకూడదు అంతా పూర్తిచేసుకుని, మంచి చీరె కట్టుకుని వుండాలి ఎనిమిదిన్నరకి అతను టెలివిజన్‌ పెడతాడు అప్పటికి పిల్లల చదువులు పూర్తి కావాలి సుబ్బారావు టెలివిజన్‌ వేసే సమయంలో సరస్వతి అక్కడే కూర్చుని,

ననన ననన

గొంధారి రాగం రితి ప్నులు అతను చేసే వ్యాఖ్యానాలు తనకి నచ్చినట్బ మొహం పెట్టాలి. పిల్లలకి హోమ్‌ వర్క్‌ చేయించడానికి, అర్ధం కానివి చెప్పడానికి ఓ ట్యూషన్‌ మాస్టర్‌ వున్నాడు

వాళ్ళ ర్యాంకులు దిగకుండా కాపాడడం అతని బాధ్యత

సుబ్బారావు కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు అన్నీ తనమీదే వుంచుకోకుండా, పిల్లల చదువుల బాధ్యత ట్యూషన్‌ మాస్టర్‌ దయితే, ఇల్లు శుభ్రంగా వుంచడం, రుచిగా శుచిగా వండీ పెట్టడం, పాదుపుచెయ్యడం సరస్వతి బాధ్యత ఎక్కువ మాట్లాడకుండా, స్నేహతుల్ని ఇంటి మీదకి తేకుండా, గంతులు పెట్టకుండా, చెప్పిన మాటవిని చదువుకుని ర్యాంకులు తెచ్చుకోవడం పిల్లల బాధ్యత మరి సుబ్బారావు కే బాధ్యతలూ లేవా? అంటే వున్నాయి పిల్లల్నీ సరస్వతినీ అదుపులో వుంచుకోవడం, తనకిష్టంలేని పనులు ఇంట్లో జరగకుండా చూసుకోడం, తన ఆఅధిక్యతని కాపాడుకోడం లాంటి గురుతరమైన బాధ్యతలు అతనికి కేటాయించుకున్నాడు,

గీత హోమ్‌వర్క్‌ పూర్తి చేసుకుని వచ్చి సోఫాలో తల్లి పక్కనకూర్చుంది బాబీకి ఇంకా పూర్తి కాలేదు వాడి లెక్క ఒకటి రాకుండా తిప్పలు పెడుతోంది మాస్టారు నాలుగు రోజులుగా రావడం లేదు బాబీ పుస్తకం తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు.

“ఎం కావాలోయ్‌!”' అన్నాడు సుబ్బారావు దయగా

"ఈ లెక్క రావడం లేదు” అన్నాడు బాబీ

“ఓహ్‌ ఈ భాగ్యానికే!”” అన్నట్టు వాడీ చేతులో పుస్తకం తీసుకుని ఒక నిముషం చూసి “అబ్బో గట్టిదేనే!?' అని తేల్చుకుని మొహం గంభీరం చేసేసుకుని “అవునూ మీ మాష్టారు రాలేదా!” అన్నాడు గట్టిగా.

“మాస్టారి భార్య కన్నది పాప పుట్టిందిట - నాలుగు రోజుల నుంచి రావడం లేదు”

అంది సరస్వతి

“బాగానే వుంది - కన్నది ఆవిడైతే ఈయనెందుకు రాకపోవడం - ఎవర్నీ అదుపులో పేట్టలేవు - ఊరికే డబ్బు లిప్పించేస్తావు - అవున్లే -నీకేం - సంపాదించేవాడికి తెలుస్తుంది” అని సరస్వతి మీద విసుక్కున్నాడు, లెక్క సంగతి తేల్చకుండా

అది చేయడం అతనికి రాదని సరస్వతికి తెలుసు బాబీకి కూడా తెలుసల్తే వుంది అక్కడ్నుంచి జారుకున్నాడు సుబ్బారావుకి వేడి వేడిగా చపాతీలు కాల్చడానికి సరస్వతి వంట ఇంట్లోకి ,వెళ్ళిందేక్‌ స్థామ్మిదిన్నర కల్లా అంతా భోజనాలకి రావాలని సుబ్బారావు నియమం పెట్టాడు

బాబీ గొణుక్కుంటున్నాడు

“నాన్నకి రాదే గీతా - అందుకే అలా విసుక్కుంటారు - ఏం చెప్పటు - అమ్మేమో చదువు మర్చిపోయానంటుంది - ఎప్పుడూ పనే ఆవిడకి!” అంటున్నాడు

ర్రిలే ఇల్లలకగానే ...

పిల్లలు బాగా చిన్నవాళ్ళుగా వున్నప్పుడు వాళ్ళ చదువులకి సరస్వతే సాయం చేసేది. కానీ సుబ్బారావుకి అది నచ్చలేదు “ఇన్ని పన్లు నువ్వు చెయ్యలేవు సరసూ- మాస్టార్ని పెడతాను-ఆయనే చూసుకుంటాడు నీ పన్లు నువ్వు చేసుకుంటే చాల్లే ' అన్నాడు “నీ పన్లు అంటే వంట చెయ్యడం వగైరాలు పని మనుషులు వేధించినప్పుడల్లా సుబ్బారావు ఆమె కొక పనిముట్టు కొని ఇచ్చేవాడు

“నువ్వు కష్టపడలేవు సరస్వతీ-హాయిగా ఈ మిషన్‌తో బట్టలు ఉతుక్కో-దీంతో ఇల్లు చిమ్ముకో-దీనితో పప్పు రుబ్బుకో! పని మనుషుల మీద ఆధారపడకు' అనేవాడు

చాకలి సరస్వతంత బాగా బట్టలు వుతుకదు-పనిమనిషి సరస్వతి అంత శుభ్రంగా ఇల్లు చిమ్మదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ఇల్లు బావుంటుంది అని సుబ్బారావు సరస్వతిని ఎప్పుడు మెచ్చుకునేవాడు. రాను రాను సరస్వతికి తన పని తప్ప ఎవరు చేసినా నచ్చడం మానేసింది

ఆ విధంగా సరస్వతి పిల్లల చదువులతో, తన చదువుతో బయట్‌ ప్రపంచంతో సంబంధం పోగొట్టుకుని సంసార సరస్వతి అయిపోయింది

“అమ్మా! నాన్నగారు అంత చదివారు గదా! బాబీ లెక్క అడిగితే చెప్పకపోవడం ఏమిటి? నువ్వేమో ఆయన కన్న తక్కువ చదివి నాకోసారి ఇంగ్లీష్‌ గ్రామర్‌ చెప్పావు కదా!” అంది గీత పడుకునేటప్పుడు.

“తప్పమ్మా! అలా అన కూడదు-నాన్నగారు పగల9తా కష్టపడీ ఆఫీసులో పనిచేసి వస్తారుగదా! మళ్ళీ ఆలోచించాలంటే ఆయనకి ఎంత శ్రమో చెప్పు! ఆయనకి రాకపోవడం ఏమిటి? అంత ఉద్యోగం చేస్తుంటేనూ[!"అని అప్పుడు సరస్వతి గీతకి చెప్పాలి-కానీ ఈ రోజు అలా చెప్పకపోయింది

నాన్నగారు చాలా గొప్పవారు.ఆయన మనందరినీ ఇంత సుఖపెడుతున్నారు-అన్నీ కొనిస్తున్నారు-ఆయన్ని గౌరవించాలి-ఎదురు చెప్పకూడదు-ఆయన చెప్పిన పని కిమ్మనకుండా చెయ్యాలి. అని ఎప్పుడూ సరస్వతి వాళ్ళకి చెబుతూ వుంటుంది-అలా చెప్పమని ఒకసారి సుబ్బారావు సరస్వతికి చెప్పాడు

ఈ రోజు చెప్పలేక సోతోంది-ఈ రోజే కాదు-గత కొద్ది కాలంనించి సరస్వతిలో అశాంత్‌ చెలరేగుతోంది-అంతొా వడుకున్నాక బాబీ లెక్కల వుస్తకం తీసింది వపదిెహిడు సంవత్సరాలయింది తనకీ దేవత సరస్వతికీ సంబంధం తెగిపోయి-

వెనక్కి, వెనక్కి, పదిహేడు సంవత్సరాల వెనక్కి . ఒక అరగంట, చీకట్లో తడుముకున్నట్టు తడుముకున్నాక సరస్వతికి ఆ లెక్క వచ్చేసింది. అంటే అంటే తను చదువు జ త్‌ ఊత తం తంల తం తు త్ల తర శి తో తత్త త్తి వం త్ల త త త్త ఉరు తల,

గొంధారి రొగం 85 మర్చిపోలేదు. అవును తనది బోలు చదువు కాదు 'ఫండా' చదువు మాధమాటిక్స్‌ మెయిన్‌లో డిగ్రీ- కాలేజీ ఫస్ట్‌! యూనివర్సిటీలో ఫోర్త్‌ ర్యాంక్‌

“తెలివిగల దానిని, ఇంకా చదువు- పైకొస్తావు. పనికొస్తావు కాలేజీ ప్రిన్సిపాల్‌ బహుమతి యిస్తూ దీవించింది

కానీ ఆ దీవెన ఫలించలేదు

“బాగానే వుంది సంబడం! ఈ చదువు చాల్లే- ఇంకా చదివితే నీకన్నా పై చదువుల వాడ్సీ తేవాలి దాంతో ఇంకా వయస్సు పెరుగుతుంది కట్నం పెరుగుతుంది- నా వల్ల కాదమ్మా సరస్వతీ ' అనేశాడు నాన్న

  • సుబ్బారావు సంబంధం లక్షణమైన సంబంధం కొన్త నల్లగా వుంటాడు అయితే ఎమీ! బుద్ధిమంతుడు ఒక్క వ్యసనం కూడా లేదు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు కొంచెం డల్‌గా కనిపిస్తాడు ఎం ఫరవాలేదు- అతనికి నగరంలో ఎంత ఇల్తుందో తెలుసా? ఇప్పుడు కడితే పది లక్తలౌతుంది వాళ్ళ వంశం పరుప్రఖ్యాతులున్న వంళశం-కనుకే అతనికి ఈ ఉద్యోగం యిప్పించ గలిగేడు వాళ్ళ నాన్న కాస్తో కూస్తో ఖర్చుపెట్టి- ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇప్పించుకోడం నూటలా! ఉద్యోగమూ మంచిది, ఇల్లూ వుంది, వ్యసనాలా లేవు తండ్రికి పరపతి వుంది ఇంకేమిటి కావాలి? కాస్త కట్నం కూడా తగ్గించారు దీని అందం చూసి, (చురుకుదనం చూసి ఎం కాదు-) అవన్నీ చిన్ననాటి సరదాలు పోనిద్దూ! అడదానికీ అందం, వినయం ముఖ్యం జాతకాలు కూడా కలిశాయి ఒడ్డున పడిపోయాం అమ్మయ్య

“సరస్వతీ! నువ్వూ మీ ఆయనా కలిసి అలా తిరిగి రండి- మహాబలిపురం- మద్రాసు, కంచీ- తిరుపతి, బెంగుళూరు, అవన్నీను- ఎలాగు కట్నం కాస్త మిగిలింది కదా ఇంక ఈ డబ్బు తీసుకో” అని కూతుర్ని మెచ్చుకుని వాళ్ళిద్దర్నీ హనీమూన్‌ పంపించాడు సరస్వతి తండ్రి.

టే తేనె జుత్తు, నీలి కళ్ళమ్మాయి, వయొలెట్‌ ఫ్రం యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా,

సరస్వతి జడ చూసి మహా ముచ్చట పడింది ఆమె కళ్ళ కాటుక, చేతుల గోరింటాకు, కాళ్ళ పారాణి, వెండి పట్టాలు అన్నీ పట్టి పట్టి చూసింది సరస్వతీ, వయొలెట్‌ రాతి రధాల దగ్గర ఫోటోలు తీసుకున్నారు- చాలాసేపు మాట్టాడేసుకున్నారు

“నాతో లంచ్‌కి రండి మీ ఇద్దరూ అని పిలిచింది వయొలెట్‌

“నేను రాను కావలిస్తే నువ్వు వెళ్ళు అన్నాడు సుబ్బారావు మూతి ముడిచేసుకుని.

తను రాలేక పోయినందుకు ఏదో కుంటి సాకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది సరస్వతి

“నీక్కూడా ఈ ఫారిన్‌ వాళ్ళ పిచ్చి వుందన్న మాట- పల్లెటూరి వాళ్ళలాగ- లేకపోతే నీ6 గొప్ప ఇంగ్లీషు వచ్చని ప్రదర్శనా? లేకపోతే ఎమిటి? ఆ పిల్ల వెంట పడ్డం నువ్వు? అన్నాడు సుబ్బారావు

86 ఇల్లలకగొనే. . ..

ఆఅప్పుడర్థం అయింది సరన్వతికి. సుబ్బారావు వయొలెట్‌తో “నో 'ఎస్‌' తప్ప ఏం మాట్లాడలేడనీ, అతనికి ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడ్డం రాదనీ- తను మాట్లాడ్డం యిష్టం లేదనీ-

మద్రాసులో సాయంత్రం బీచికి బయలుదేరతూ, చుడీదార్‌ వేసుకుని జుత్తు లూజుగా వదిలేసింది. “ఈ డ్రెస్‌లు వేసుకోడం యిక మానెయ్యాలి నువ్వు. పెళ్ళయినాక మా చెల్లెళ్ళు మానేశారు. మా అమ్మా నాన్నా ఒప్పుకోరు- నాక్కూడా నచ్చవు" అన్నాడు బెంగుళూరులో లాల్‌బాగ్‌ చూడ్డానికి వెడుతుండగా అనుకోకుండా గిరీష్‌ కర్నాడ్‌ కనిపించేడు. ఆయనంటే సరస్వతికి మహా గౌరవం గబగబ వెళ్ళి పలకరించింది. తనని పరిచయం చేసుకుంది

“ఈయన్ని మీరు గుర్తుపట్టలేదా! గిరీష్‌ కర్హాడ్‌- ఈయన - “తుగ్లక్‌ అని మంచి వాటకం రాశారు- మంచి నటుడు- ఇంక..." అని ఆయాసపడి పోయింది సరస్వతి. సంతోషంతో తబ్బిబ్బు అయిపోయి.

“ఈ పిల్ల చేష్టలు మానెయ్యాలి- నీకు పెళ్ళయిందని జ్ఞాపకం వుందా, లేదా! ఇంకనుంచి నువ్వు ఎవరితోబడితే వాళ్ళతో మాట్లాడకూడదు- నేనెవరితో మాట్లాడితే నువ్వు వాళ్ళతోనే మాట్లాడాలి అన్నాడు నుబ్బారావు పబ్లిక్‌ ఫిగర్స్‌ గురించి కూడా అతనికి తెలీదన్నమాట! హోటల్‌కి వెళ్ళడానికి చేయివూపి టాక్సీ పిలిచింది సరన్వతి.

“అదే వద్దన్నాను- ఏం తొందర- వెనక మగవాణ్ణి నేనుండగా!”

హనీమూన్‌ అయిపోయింది సుబ్బారావు అర్ధం అయ్యాడు సరస్వితికి. సుబ్బారావు తనకన్న ఓ డిగ్రీ ఎక్కువే చదివాడుగానీ, అతని చదువు ఉద్యోగం తెచ్చుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు అతనికున్నది డిగ్రీ మాత్రమే. ఇంకే చదువూ లేదు సరస్వతి కన్నా తనే తెలివైన వాడిలాగాను, తెలిసిన వాడిలాగానూ, పెద్దవాడిలాగానూ, రక్ష్తకుడిలాగానూ కనిపించాలని సుబ్బారావు అభిలాష

పోన్లే సరస్వతీ-ఇప్పుడు నువ్వు ఒక బాధ్యతగల గృహిణివి' ఇల్లు చూసుకో-పిల్లల్ని చూసుకో అదీ ముఖ్యం-ఎ ఆడదానికైనా ఏం కావాలి చెప్పు! వున్న డబ్బుతో సుఖంగా బ్రతకడం-అన్నీ అమర్చుకోడం, కాస్త వెనకేసుకోడం, ఇదీ ముఖ్యం గుర్తుపెట్టకో సరస్వతీ! పైథాగరస్‌ ధీరం గుర్తు పెట్టుకుని ఏం చేస్తావ్‌! ఆల్టీబ్రా లెక్కలు నీ సంసారంలో తగాదాలు తీరుస్తాయా? ఎదో గవర్నమెంటు వారు పద్దెనిమిదేళ్ళు నిండితేగానీ పెళ్ళి చెయ్యొద్దన్నారు గదా అని చదువుకుంటూ కాలక్షేపం చేశావు- చదువు చెప్పించినందుకు వాళ్ళ పేరు నిలబెట్టి మంచి మార్కులు కెచ్చుకున్నావు-బహువమతులు సంపాదించావు- అవ్వన్నీ ఇప్పుడు అక్కర్లేదు-ఇప్పుడు సంనారం చూసుకో సరస్వతీ! అదీ ముఖ్యం! అతని కనుసన్నలలో మెసలి-అతన్ని మెప్పించుకో-అదమ్మా కావాల్సింది

గౌంధారి రాగం 8/ తలలను ననన కతలు

సుబ్బారావు మంచివాడు.

అవును. సుబ్బారావు మంచివాడే!

అతని ఇంట్లో, పది లక్షలు విలువచేసే పెద్ద ఇంట్లో తన మెడల్సుకీ, కప్పూలకీ, షీల్ణులకీ చోటులేదన్నవాడు అవ్వి పుట్టింట్లోనే వుండనిమ్మన్నవాడు

సుబ్బారావు మంచివాడే

తన లెక్కల్ని చాకలి పద్దులకీ పాల లెక్కలకీ పరిమితం చేసినవాడు.

సుబ్బారావు మంచివాడు కాడని ఎవరన్నారు?

ఇంటెడు పనిముట్లు కొనిపెట్టాడు ఆ పనిముట్ల మద్య, షడ్రుచుల శాక పాకాల మధ్య, గుడుగుడు గుంచం గుండేరాగం అడిస్తున్నవాడు.

గుండెలో రాగం వినలేనివాడు. గుండె రగిలించే రాగం పాడుతున్నవాడు. తనచేత గాంధారి రాగం పాడిన్తున్నవాడు

“ఎమ్మా! ఈవిడింత తెలివి తక్కువ దేమిటీ? గుడ్డి మొగుడికి దారి చూపించాల్సింది పోయి- తమా గుడ్డితనం తెచ్చి పెట్టకుంది-ఇద్దరూ తడుముకుంటూ పడి తల పగలగొట్బ కోరా? అంది సరస్వతి కాలేజిలో చదువుకునేటప్పుడు ఒకసారి అమ్మతో “తప్పమ్మా, అలా అనకూడదు-ఆమె మహా పతివ్రత తన భర్తకి లేని కంటి చూపు తన కెందుకని త్యాగం చేసింది వాళ్ళకి తడుముకునే ఖర్మమేముంది మహారాజులు-దాసీలే తెచ్చి చేతికిస్తారన్నీ- వాళ్ళే నడిపిస్తారు- అని తన తరపున చెంపలు వేసుకుందావిడ త్యాగమో, కసో, ఆశక్తతో, ఏదైనా మహా పతివ్రతల్నించీ దేశాన్ని రక్తిం చాల్సిందే

ఇలా కళ్ళని చిదిమేసి, జన్మ జన్మల అంధత్వాన్ని వారసత్వం చేస్తున్న గాంధారి గంతలు యిమడడంలేదు తన మొహం మీద కొంత కాలంగా! విప్పెయ్యాలనే బలమైన కోరిక గుండెలో నుంచి తన్నుకు వస్తోంది

“'సక్కుబాయికి ఏ దేవుడో పిండి విసిరి పెట్టినట్టు నాకు లెక్క చేసి షెట్టాడేవ్‌ గీతా! ' అని గంతులు పెడుతున్నాడు బాబీ

మళ్ళీ సాయంత్రం రషీదా ఆడడానికి వచ్చింది-

గీతా ఇలారా ' అని పిలిచింది సరస్వతి వరండాలో నిలబడి,

  • అబ్బ ఉండమ్మా!" అంది గీత రాకుండా.

అవును అమ్మ పిలిచిందంటే ఏదైనా తినడానికి రమ్మని, లేకపోతే 'ఆట చాలు ఇక లోపలికి పోయి చదువుకో అని, లేకపోతే “నాన్నగ్గారొచ్చే వేళైంది గంతులు పెట్టకు” అని చెప్పడానికి అనుకుంటుంది గీత.

88 ఇట్లలకగానే,. .

అందుకే సరస్వతి గీత దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో బ్యాట్‌ అందుకుని “ఇలా ఆడాలి చూడు! బ్యాట్‌ ఇలా పట్బకోవాలి షెటిల్‌ని ఇలా కొట్టాలి-ఇదుగో- ఇలా సర్వీస్‌ చెయ్యాలి' 'అని చూపించింది.

గీత అపనమ్మకంగా చూసింది తల్లివైపు.

“నాతో ఆడు ఆంటే!” అంది రపషీదా

పదిహెడు సంవత్సరాలుగా ఇంటి చాకిరీ తప్ప మరో న్యాయామం ఎరుగక ఇష్టం వచ్చినట్టు ఫెరిగి పోయిన వళ్ళు, ఆమెని అడుగు ముందుకు వెయ్య నివ్వలేదు ఆయాసపడుతూ కూలబడిన ఒకప్పటి గర్‌ స్టేట్‌ షెటిల్‌ ఛాంపియన్‌ సరస్వతి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

సరన్వతి వేచి నిటారుగా నిలబడింది

“రేపటినుంచీ నేనూ ఆడతాను” అని గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్ళింది.

( అంధజ్వోతి - ఆదివారం సంచిక 6-3-1994

లిరుభ సంధ్య

కేన దూదిపింజ మబ్బులు అరుణిమలో కరిగిపోవడం, పడమటి

ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం, ఆపైన

చీకటి ముసురుకు రావడం, చూస్తూ కూర్చుంది అరుంధతి -

అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి అశ్చర్యపడింది

అక్కడ జరుగుతున్న చర్చ ఆమె చెవిన పడుతూనే వుంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనుకాడడం లేదు. అరుంధతిని ఎవరూ ఆమె అభిప్రాయం అడగలేదు

అడిగితే ఏం వుంది చెప్పడానికి?

“మన పెద్దవాళ్ళు అమెరికాలో ఇమడలేరు- ఆ జీవితం వేరు- ఆక్కడ మీకేం తోచదు = మీరు ఇక్కడ వుంటేనే సుఖంగా వుంటుంది అన్నాడు రవి,

అమ్మ చాలా అలసి పోయింది- కొన్నాళ్ళు తీసుకు వెళ్ళి నా దగ్గర వుంచుకుందాం అనుకున్నాను -” అన్నది కరుణ.

“పిచ్చిగా మాట్లాడకు, ఈ వయస్సులో వాళ్ళిద్దరూ ఒకచోటే వుండడం ధర్మం- ఇప్పుడాయన ఒక్కడే ఎలా వుంటాడు-వేళకి మందు సరి అయిన భోజనం, ఇదంతా ఎవరు

90 ఇల్లలకగానే ..,. చూస్తారు? తీసుకు వెళితే ఇద్దర్నీ తీసుకు వెళ్ళు- కొంచెం పెద్దిల్లు తీసుకో! ఈ ఇల్లు అద్దెకిచ్చెయ్‌-'' అన్నాడు రవి

“నా కష్టార్జితంలో ఇల్లు కట్టకున్నాను నేనిక్కడే వుంటాను - నేనెవరింట్లోనూ వుండను - వుంటే కొడుకు దగ్గర వుండాలి - లేకపోతే నా ఇంట్లో వుండాలి - నేను కరుణ దగ్గరుండడం ఏమిటీ? అని కోపంగా అరిచినంత పనిచేసేడు సూర్యనారాయణ

“అదేమిటండీ కరుణ మీ కూతురు కాదా” రవి ఎంతో కరుణ అంత కాదా మీకు?” అన్నాడు మోహన్‌

“అవ్వన్నీ తీసిపడెయ్య వోయ్‌ - వున్న ధర్మం చెప్పాను నేను -నా తల్లి తండ్రుల్సి వృద్ధాప్యంలో నా దగ్గరుంచు కున్నాను - మా ఆవిడ వాళ్ళకి సేవ చేసింది అది ధర్భం - ఇప్పుడు నాకొక ఇల్లుంది - కనుక నా ఇంట్లో నేను వుంటాను - కూతురు దగ్గర వుండడం ధర్మం కాదు-'

అన్నాడు సూర్యనారాయణ అరుంధతికి నవ్వాచ్చింది ధర్మపన్నాలు చెబుతున్నాడు

సూర్యనారాయణ-'' అనుకుని - లత అరుంధతి వైపు చూస్తోంది - పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలిని చూసి ఆశ్చర్యపడింది- రవిని పెళ్ళి చేసుకున్నాక వచ్చి ఇక్కడ వుండడం యిదే ప్రధమం - అరుంధతి గురించి గానీ, సూర్యనారాయణ గురించి గానీ రవి అమెతో ఎక్కువ ఏం చెప్పలేదు ఈ పదిరోజులనుంచీ ఆమె అరుంధతిని చాలా నిశితంగా పరిళీలిస్తోంది

“మామగారి కూడా తీసుకుపోదాం కరుణా ' అన్నాడు మోహన్‌,

“నేను రానని ఇందాకే చెప్పాను ఎవరి పంచలో వుండవలసిన అవనరం నాకు లేదు” -” అన్నాడు సూర్యనారాయణ చిరాకు పడిపోయి -

“నువ్వు మాట్లాడవేం అమ్మా! అన్నాడు రవి కొంచెం అసహనంగా.

“నాకు మాట్టాడ్డానికేం లేదు - అంది అరుంధతి, చాలా నిర్లిప్తంగా

“ఆవిడ తరపున కూతుర్ని పెట్పకుందిగా! ఇంక మాట్టాడే అవసరం ఏముందీ! చేసేదంతా చేసి ఎమీ ఎరగనట్ట కూర్చుంటుంది!” అంటున్నాడు సూర్యనారాయణ

“ఇందులో అమ్మ ప్రమేయం-ఏం లేదు నాన్నా నేనే అన్నాను. అన్నది కరుణ. “ఆవిడప్రమేయం ఎందులోనూ ఉండదు తమాషా చూస్తూ కూర్చుంటుంది - ఈ వయస్సులో నేనూ మీ నాన్న ఒకచోటే వుండాలి మేం ఇక్కడే వుంటాం-” అని అనవచ్చు గదా! అనదు. నా కుటుంబం కోసం నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు- ఒక్క రెక్క మీద మీ అందర్నీ ఇంత వాళ్ళని చేశాను ఎవరికీ కృతజ్ఞత లేదు - సూర్యనారాయణ

అరుంధతి లేచి వంట గదిలోకి వచ్చింది అలాగే వాదించుకోని! తనకేం! తను తీసుకునే నిర్ణయమేదో తీసేసుకుంది-జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం బహుశా చివరిది చూడా! భోజనాల వేళ వరకూ వాదోపవాదాలు, ప్రణాళికలు,

అరుణ సంధ్య 91 అంచనాలు జరుగుతూనే వున్నాయి భోజనాల దగ్గర కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద యుద్ధం లేవదీశేడు సూర్యనారాయణ. అ కోపం అంతా అరుంధతి తనని సమర్దిస్తూ మాట్ట్లాడలేదనే విషయం లతకి కూడా అర్ధం ఆయింది

“ఇన్ని ఐటమ్స్‌ వున్నాయి గదా! ఆ కూర వదిలేసే తీనండి -” అంది లత, అనహనంగా,

“జీవితం అంతా ఈవిడతో ఇలానే సరిపెట్బకుంటూ బ్రతికానమ్మా- అన్నాడాయన

అతనంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెదవి విప్పలేదు

“మీ అమ్మ చాలా చిత్రమైన మనిషి -చాలా డిటాచ్‌డ్‌గా వున్నట్టుంటుంది- అసలీ ఇంటికి చెందనట్లు, ఎక్కడినించో వచ్చి పదిరోజులు మీకు సాయం చేసి వెళ్ళడానికి వుంటున్నట్ట్లు వుంటుంది -' అంది లత, వారం రోజుల నాడు రవితో

“ఆవిడంతే - ఎప్పుడూ ఏమీ పట్టించుకోదు - దేని మీదా శ్రద్ధ కూడా లేదు - తన ఆరోగ్యం గురించే లేదు - ఎదైనా వచ్చినప్పుడు ఆయన చేత చివాట్లు తిని డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తుతుంది- ' అన్నాడు రవి

ఆ సమాధానం ఏ మాత్రం నచ్చలేదు లతకి, తను యు ఎస్‌ నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది -పగడాలనీ, ముత్యాలనీ, నాన్‌స్టిక్‌ వంట పాత్రలనీ, డిన్నర్‌ సెట్‌ - అవ్వన్నీ చూసినప్పుడు కూడా ఆవిడ మొహం మీద రవంత సంతోషం కనపడలేదు

ఈ పగడాలూ,ముత్యాలూ వేసుకుని ఈ నాన్‌స్టిక్‌ పెనాల మీద నాజూకు దోసెలు పోసుకుంటూ, అతిథులకి ఆమెరికా డిన్నర్‌సెట్‌ లో అన్నం వడ్డిస్తూ, ఇంకా ఎన్నాళ్ళు? సూర్యనారాయణ భార్యకి!” అనుకుంది అరుంధతి అని లతకి తెలియదు

ఉండడానికో ఇల్లుండి, వున్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి, వాళ్ళకి నచ్చిన జీవన భాగస్వాముల్ని ఎంచుకుని పెళ్ళిచేసుకుంటే, ఈ వయస్సులో ఎంత గర్వంగా, ఎంత దర్జాగా ఎంత అనందంగా వుండాలి ఈ తల్లి!

లతకి అమ్మ గుర్తొచ్చింది - ఆవిడ చేసే ఆర్భాటం గుర్తొచ్చింది -*'మా అమ్మాయి అమెరికా నుంచి యివ్వన్నీ తెచ్చింది” అంటూ యాఖై దాటినా ఇంకా చక్కగా ముస్తాబై పోయి

హుషారుగా కబుర్లు చెబుతూ, ఎంత పని చేస్తూ వుంటుందో అవిడ! వాళ్ళిద్దరికీ అడుగడుగునా

కనిపించే తేడా పదిరోజులుగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది లత

అన్నయ్య ఢిల్లీలో వుంటాడు తనదగ్గరకు రమ్మంటే నాన్న కన్న ముందు అమ్మే చెబుతుంది - “మేం రామురా అబ్బాయ్‌ - ఇది మా ఇల్లు - ఇక్కడ మేం హాయిగా వుంటాం = ఇష్టమొచ్చింది వండుకుంటాం -హాయిగా ఇంటినిండా పుస్తకాలు పేపర్లు విరజిమ్ముకుంటాం = శొవాలంటే శుభ్రం చేసుకుంటాం - లేదంటే లేదు - మా సామ్రాజ్యం యిది - దీనికి నేను రాణీని - మీ ఇంటికి మీ ఆవిడ రాణి- తెలిసిందా!” అంటుంది

$్ర2 ఇల్లలకగానే

ఈవిడ, ఈ అరుంధతి మొహంలో ప్రకాశం లేశం కూడా చూడలేదు తను! రవితో, తనతోకరుణతో కబుర్లు చెబుతూ, తమని గౌరవిస్తూ, టేమిస్తూ వుండే సూర్యనారాయణ అరుంధతిని ఎంత చీదరించుకుంటాడో, ఎంత తిరస్కారంగా సమాధానాలు చెబుతాడో లత పది రోజులుగా గమనించింది.

ఆ యింట్లో ఎ నిర్ణయం తీసుకున్నా అది ఏక పక్ష నిర్ణయమే - అధికారాలన్నీ సూర్యనారాయణవే - అంతిమ నిర్ణయాలన్నీ అతనివే.

ముప్పే సంవత్సరాల దాంపత్య జీవనం ఆ ఇద్దరి మధ్యా వి అనుబంధాన్ని చివురింపచేయ లేదంటే లతకి ఆశ్చర్యంగా వుంది సూర్యనారాయణ కొడుకు రవి, తనకి జలుబు చేసినా మంచం మీద నుంచీ లేవనివ్వడు - కాఫీ తెచ్చి చేతికిస్తాడు - అటువంటి రవి తల్లి దగ్గర కూర్చుని ఆవిడతో ఒక గంటన్నా మాట్లాడినట్లు లేదు తనయితే అలా వుండలేదు రెండేళ్ళ తరువాత ఇంటికి వస్తే అమ్మతో నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో, ఎంత చిక్కిపోయారో, అన్నీ పరిశీలిస్తుంది -ముందు అమ్మకి దగ్గరగా కూర్చుంటుంది భుజం మీద చెయ్యి వేస్తుంది - ఆ స్పర్శ చాలు! కానీ రవి అసలు వాళ్ళమ్మని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. కనీనం అవిడ కూరగాయలు కోసుకు ౦టూంటే దగ్గరకూర్చుని కబుర్ల్ణయినా చెప్పడు.

“ఆవిడెప్పుడూ అంతే -” అంటాడు ప్రతీ దానికీ అతనికీ తండ్రి మీద అభిమానం, ఇద్దరూ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు- ' తనని మంచి స్కూళ్ళల్లో చేర్చి చదువు చెప్పించాడు అమెరికా పంపించాడు - ఆడిగినంత డబ్బు లేదనకుండా యిచ్చాడు లతని పెళ్ళి చేసుకుంటానంటే సమ్మతించాడు కట్నం వద్దన్నాడు పైకి అలా వుంటాడు గానీమా నాన్న చాలా మంచివాడు అంటాడు.

కరుణకి కూడా తండ్రీ మీద ఎలాంటి కంప్లయింట్స్‌బేవు రవితో సమంగా చదువు చెప్పించాడు. ఆడపిల్ల అని తేడా చూపించలేదు మోహన్‌ని పెళ్ళి చేసునుంటానంటే సరేనన్నాడు

“ఇంత మంచివాడు, అవిణ్దెందుకలా వేపుకు తింటాడు?" అంది లత

“ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు - మొదటినించీ అంతే ఈవిడెప్పుడు దిగులుగా ఎదో పారేసుకున్నట్ట వుంటుంది హుషారుగా వుండదు అయినా మాకేం లోపం చెయ్యలేదు - మమ్మల్ని బాగా పెంచింది ' అంటుంది కరుణ.

వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే -

కరుణ తల్లిని కనిపెట్టి వుంటుంది.

అరుణ సంధ్య 03

“వేను వెళ్ళిపోతే అమ్మకి ఏమీ తోచదు -” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమ్మా నాన్న తనతో వుంటే బావుండునంటుంది.

అరుంధతి ఏమీ అనదు.

అంటే ఎక్కఢ వున్నా ఒకటే ననా ?ఎలాగైనా బ్రతకవచ్చుననా?

భోజనాలయినాక అరుంధతి సూర్యనారాయణకి వరండాలో మంచం వేసింది నవ్వారు అల్లిన పట్టెమంచం బరువైనది ఆవిడ మోసుకొస్తుంటే మోహన్‌ అందుకుని వరండాలో వేశేడు

“రోజూ ఇక్కడే పడుకుంటావుగదా! ఈ మంచం ఇక్కడే వుండనివ్వ కూడదూ.! " అన్నాడు రవి -

“నవారు మాసిపోతుంది- పైగా వరండాలో ఎదురుగా మంచం ఏమిటీ!” అన్నాడు సూర్యనారాయణ

మంచం మీద మెత్తటి పరుపూ, ఇస్త్రీ దుప్పటీ వేసింది రెండు తలగడలు పెట్టింది మంచం ప్రక్కన ముక్కాలి పీటమీద మంచినీళ్ళ కూజా పెట్టి, దానిమీద గ్లాసు బోర్లించింది అతను రోజూ వేసుకునే నిద్రమాత్ర సస్టిస్‌లోనుంచితీసి చేతిలో పెట్టి, గ్లాసులోకి నీళ్ళు వొంపి యిచ్చింది-

“దొరుకునా ఇటువంటి సేవా!”

అరుంధతి చిన్నగా నవ్వుకుని లోపలికి వచ్చింది-

“అరుంధతి తనని విడిచిపెట్టి ఎక్కడికి వెడుతుంది!' అనుకుని హాయిగా నిద్రలోక జారేడు సూర్యనారాయణ “అవును అరుంధతి ఎక్కడికి వెడుతుంది!”

నం! అరుంధతి ఎందుకు వెళ్ళదు? వెడుతుంది! ఇప్పుడే - ఇవాళే!

కొంతసేపు కబుర్దు చెప్పుకుని యువజంటలు ఎవరిగదిలోకి వారు వెళ్ళి నిద్రపోతారు

తనూ నిద్రపోతుంది సుఖనిద్ర- జీవితానికంతటికీ ఒకే ఒక సుఖ నిద్ర -అంతా లక్షణంగా జరిగి పోతుంది- ఎవరికీ ఏ కష్టమూ వుండదు- ఎవరూ ఎక్కడనుంచి శ్రమపడి రానక్కర్లేదు-

జీవితంలో అనేక సార్లు తల ఎత్తి, నిర్హాక్షిణ్యంగా అణచి వేయబడ్డ కోర్కె ఇప్పుడు తీరుతుంది - అరుంధతి ఎక్కడ వుండాలి అనే చర్చంక ఉండదు అరుంధతి ఎక్కడ వుండాలో కనీసం యిప్పుడు అరుంధతే నిర్ణయిస్తుంది

అరుంధతి గదిలోకి వచ్చి, కిటికీ తలుపులు తీసింది - చల్లని గాలి శరీరాన్ని తాకీంది

  • శరీరమే కదా యిప్పుడున్నది - ఇదే కదా ఇప్పుడు భారమై పోయింది - లైటు వేసి గోడకి వున్న పెళ్ళి ఫోటో చూసింది ముఫై ఏళ్ళనాటి మాసిపోయిన ఫోటో అయినా అందులో దేదీష్య

క్ర ఇల్లలకగొనే ... మానంగా వెలిగిపోతున్న తన మొహం, బరువైన పూలదండ లోనుంచీ, చందమామలా వుంది- స్వచ్చంగా తళతళలాడే కళ్ళు- ముఫై సంవత్సరాల చరిత్రలో మర్చిపోలేనివీ చిరకాలం గుర్తు పెట్టుకొదగ్గ మధురానుభవాలేం వున్నాయి!

మధురానుభవాలా?

అనుభవాలున్నాయి! ఎందుకిప్పుడు తలుచుకోడం? పెళ్ళి ఫోటో ప్రక్కనున్న దేవుడి పటానిక్తి. నమస్కారం చేసింది

పరుపుక్రిందపెట్టిన బీరువా తాళంచెవుల కోసం చూసింది లేవు కంగారుగా నాలుగు మూలలా వెతికింది లేవు పరుపు ఎత్తి నేలమీద పడేసి దుప్పటి దులిపింది లేవు- ఆఖరికి ఇప్పుడు దేవుడికి కూడా తను సుఖపడ్డం యిష్టంలేదన్న మాట! వీల్లేదు. తాళం చెవులు వెతికి పట్టుకోవాలి- ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్ర్తేదు- తన బీరువాలో తన చీరెలు తప్ప ఎం లేవు- డబ్బూ, డాక్యుమెంట్లు, వెండీ బంగారం అతని బీరువాలోనే వుంటాయి అయోమయం, తెలివితక్కువ, దేబెమొహం, పరాకు మొదలైన గుణాలన్నీ పుణీకి పుచ్చుకున్న అరుంధతి అధీనంలో వుండవు

దొరకలేదు తాళంచెవులు-

అసలు సాయంత్రం వరకూ బొడ్డోనే దోపుకుని తిరిగింది వాటిని - సాయంత్రం స్నానానికి వెడుతూ పరుపు క్రింద పడేసింది-

రేపు సాయత్రం కరుణ ప్రయాణం- రవికింకా పదిహేను రోజులుంది- ఎవరూ యిబ్బంది పడకూడదు- ఇప్పుడు లైట్లు వేసి ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు ఫరవాలేదు- ఎదో ఒకటి చెప్పవచ్చు కొనీ తాళం చెవులు కనిపించి తీరాలి -

ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరో! తియ్యకపోతే ఇంకా ఇంకా కొడతారు-

కళ్ళు తుడుచుకుని,మొహానికి పట్టిన చమట తుడుచుకుని తలుపు తీస్తే, ఎదురుగా తాళం చెవుల గుత్తితో లత! పాలిపోయిన మొహంతో నిలబడింది అరుంధతి-

“తాళం చెవులిస్తానుగానీ నిద్రమాత్రలసీసా యివ్వను- ఒక మాత్ర కావాలంటే యిస్తాను-” అంది పినరైనా సానుభూతి లేని గొంతుతో

అరుంధతి మాట్లాడలేదు-

“అలాంటి పిరికి వాళ్ళంటే నాకిష్టం వుండదు- మీ ఆలోచనలన్నీ నేను కనిపెడుతూనే వున్నాను అసలెందుకు ఇలా హరాత్తుగా వెళ్ళిపో దలచుకున్నారు!” నిలదీసి అడుగుతోంది.

హరాత్తుగానా! ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన?! కాదు. ఇరవై ఎనిమిదేళ్ళ నాడు, ప్రక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళు అడిగితే, యిచ్చినప్పుడు,సూర్యనారాయణ తనకీ

"అరుణ సంధ్య లర్‌ ఆ విద్యార్థికీ మధ్య అశ్రమ సంబంధం వుందని అర్ధంలేకుండా మాట్టాడినప్పుడు, తనని చెంపదెబ్బకొట్టినప్పుడు- అప్పుడు రాలేదూ ఈ ఆలోచన!

వచ్చింది- కానీ అప్పుడు కడుపులో రవి ఇంకో పదిరోజులకో ఏమో భూమి మీదకీ రాబోతున్నరవి - పోనీలే! వీళ్ళందరికీ మంచినీళ్ళివ్వక పోతేనేం! కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది!

అప్పుడేమిటీ, ఇంకా చాలాసార్లు వచ్చింది,

మరిగే కాఫీ నెత్తి మీద పోసినాతినేఅన్నం మొహానికి పులిమినా, పుట్టింటికి వెళ్ళి పదిరోజులుండి వస్తేపగిలినపోయిన గాజులు, ఎండినపూలు, ఖాళీ కండోమ్‌ పాకెట్‌లు ఊడ్చేసుకుని పరుపులు ఎండేసుకుని ఇల్లు డెట్టాల్‌తో కడుక్కుని, మళ్ళీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు- చాలాసార్లు వచ్చింది ఈ ఆలోచన ఎప్పుడు ఈ అలోచన వచ్చినా బిక్కు బిక్కుమంటూ కొంగు పట్బకు తిరిగే పిల్లలు, సవతి తల్లి పెట్టే బాధలు , తల్లిపోయిన దుఃఖంలో పాడైపోయే భవిష్యత్తు - ఆడదానికి ఎన్నున్నాయో చావనీయకుండా బంధించే పరిస్థితులు 1 “వుంటే వుండు, పోతేపో. నాయిష్టం-” అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికి ఇప్పటికీ పాటిస్తూనే వున్నాడు పోతేపోవడానికి కనపడని సంకెళ్ళిన్నూ వుంటే వుండడమే మిగిలింది- ఇప్పుడు పిల్లలు బిక్కుబిక్కు మనరు కళకళ లాడుళున్నారు కాళ్ళమీద నిలబడ్డారు- సంకెళ్ళు తెగిపోయాయి

(పేమ సంబంధాలుంటే బ్రతకాలి - అధికార సంప్రదాయాలు, ధర్మాలతో తనకేం పని! తనకొక్కదానికే ధర్మాలు!

అవమానాలు, ఛిత్కారాలతో సాగిన దాంపత్య జీవితాన్ని తలచుకుని తలచుకుని మురిసి పోవడానికి సాగించాలా ఈ బ్రతుకు! అతనుమంచి తండ్రే కావచ్చు-మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు!

వీళ్ళ తీర్పులు, ఓదార్పులు తనకెందుకు! వచ్చిన పని అయిపోయింది ఎవరికీ + అపకారం చెయ్యలేదు- ఎవరినీ నష్టపరచలేదు కన్నీళ్ళు కార్చినా, దుఃఖంతో అవమానంతో వేగిపోయినా, ఎవరిముందూ ఆ బాధని వెళ్ళగక్కలేదు ఎవరి మనళ్వాంతీ భగ్నపరచలేదు తనలో తనే కాలిపోయింది తన బ్రతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవరికీ వదలదు ఏం చదవాలో, నాన్న నిర్ణయించేడు బ్ర బట్టలు కట్టువోవాలో ఎలా మాట్లాడాలో, ఎవర్సి పెళ్ళాడాలో అన్నీ సమాజము, నాన్న నిర్ణయించేరు ఎం వండాలో ఎం తినాలో, ఎప్పుడు నవ్వాలో, ఎందుకు నవ్వకూడదో, ఎలా బ్రతకాలో సూర్యనారాయణ నిర్ణయించేడు ఎక్కడ వుండాలో, ఎందుకు వుండాలో ఏది ధర్మమో ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు

96 ఇల్లలకగానే ..

“భేష్‌! అరుంధతి కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి అవమాన జ్వలిత ద్వేషాగ్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి

కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖం అస్తమయ సూర్యబింబంలా వుంది

ఎగర్రచిరె ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా వుంది

లతకి తన తల్లి గుర్తొచ్చింది వెన్నెలలు విరజిమ్మే పున్నమి జాబిల్లిలా వుంటుంది ఆవిడకి జీవితం అంటే అపారమైన ప్రేమ అందుకు కారణం అర్ధం అయింది లతకి గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం

ఎవరూ పెదవి విప్పడం లేదు

చాలా సేపటి తరువాత కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది లత! దూరంగా తెల్లవారుతున్న వెలుగు,

నెమ్మదిగా అరుంధతిని సమీపించి, ఆమెని దగ్గరగా పొదువుకుంది. సంవత్సరాలుగా గడ్డకట్టిపోయిన దఃఖం ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నీరు వరద అయింది

(ఆహ్వానం ఆగన్సు 1994) భ్గ

తెంక(నోన్పట్లు 3ళ్చిరోయాదు స కీ

గ్షేరంవతల కాలవలో స్నానంచేన్తూ నూర్యోదయాన్ని చూని

ఆనందించడం ఇవ్వాల్సి మాట కాదు. పసుపుతాడు మెడలో వేసుకుని

ఏరు దాటి ఈ గడ్డ మీద కాలు పెట్టిన మర్శాటి నుంచీ క్రమం

తప్పకుండా జరుగుతున్న విషయమే. ఇత్తడి బిందెని కాలవ వొడ్మన

వున్న వొండ్రు మట్టితో తోముకోడం, తెచ్చుకున్న బట్టలన్నీ బండ

మీద బాది బాది ఉతుక్కోవడం, అ పైన హాయిగా స్నానం, ఈలోగా

సూర్యోదయం,

ఇవ్వాళ సూర్యుడు ఇంకా తేజోవంతంగా వున్నట్లనిపించింది ఆదిలక్ష్మికి, పాతికేళ్ళ ముందర కన్న ఇష్టంగా రానీ, కష్టంతో రానీ - ఈ దిన చర్య తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇది తప్పి పోతున్నందుకు ఒక ప్రక్క ఆనందమే అయినా మరొక ప్రక్క విచారంగానూ వుంది.

“నీకే మమ్మా ఇక నుంచీ హాయిగా ఇంట్లోనే స్నానాల గది వుటుంది వేన్నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తావు ఎ జన్మలో ఏ నోము నోచుకున్నావో - ఎంకటేళుల్ని కన్నావు - నీ కష్టాలు గట్టెళ్కొయి అని ఊరు వాడా ఒకటే అంటూ వున్నా సంతోషంళో పాటు కొంచెం భయంగా కూడా ఉంది ఎన్నడూ ఊహించని క్రొత్త జీవితంలోకి అగుగు పెట్టడం గురించి. ఉననవ నలత తలను ఒరనలాన వాతా

9 ఇల్లలకగొన. , ,.

బహంళా ఇదే ఈ వూరి ఆఖరి సూర్యోదయం చూడ్డం కావచ్చు తనకి రండు చేతులూ ఎత్తి సూర్య భగవానుడికి నమస్కరించింది ఆదిలక్ష్మి కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి

బట్టలన్నీ గట్టిగా పిండి పిడచలు పెట్టి గంపలో పెట్టుకుని తల మీద పెట్టుకుని వొడ్డుకి వచ్చింది ఇప్పుడు మంచి నీళ్ల పంపులొచ్చాయి “వీళ్ళకి కూడా మంచి నీళ్ళా! అన్నట్లు ఐడుస్తూ వస్తాయి షావుకారు సుబ్బయ్యగారింటి మీద గదంత సీళ్ళ ట్యాంకు మంచి నీళ్ళతో నిండాలి

సర్పంచ్‌గారిది, పెద్ద డాక్షర్‌గారిది, ఇంకా ఖామందుగారిది, ఇలా వాళ్ళందరి ట్యాంకులూ మోటార్లు నింపేస్తాయి ఈ లోగా పంపులు కట్టేస్తారు వాళ్లకి బట్టలుతుక్కోడానికి, అంట్లు తోముకోడానికి, స్నానాలకి, ఆఖరికి పాయిఖానా దోడ్లో పంపులకి కూడా మంచి నీళ్ళే ఇక్కడేమో రెండు బిందెలోచ్చే సరికి కాళ్లు పీకేస్తాయి వుండడానికి తనకీ ఓ బావి వుంది ఏం లాభం సముద్రం నీళ్ళలా ఉంటాయవి తోమిన గిన్నెలు నల్లబడి పోతాయి బట్టలకి మురికి పోదు పంపు వచ్చినంత సేపూ అక్కడ నిలబడి నిలబడి నీళ్ళు తెచ్చుకోవాలి “నీకేంలే ఆదిలచ్చమ్మా నీ కట్టాలు తీరిపోయినయ్‌ హాయిగా రేపటినించీ సాకల్ని ఎట్టేసుకుంటావు సుకపడతావు'' - కొంత అసూయ, కొంత అభినందన, అందరి గొంతుల్లో వందో - పిచ్చి నాయనకి దిట్టి పెట్టేస్తున్నారు వెంకటేశ్వర్లు సాయంత్రం వస్తున్నాడు ఇక్కడ గోటీ బిళ్ళలాడిన వెధవ 'అళ్ళ నాయనకి బీడీ కట్టలు మోసిన గుంటడు,

ఆళ్ళమ్మకి పంపు కాణ్నించీ నీళ్లు మోసి పెట్టిన పసి సన్నాసి - ఊరికి, పేటకి - వంశానికి - కుటుంబానికి - తల్లి తండ్రులకి ఖ్యాతి తెచ్చాడు - కష్టాలు తీర్చాడు - ఊబిలో నుంచి లాగి స్వర్గంలోకి తీసుకు వెడుతున్నాడు - పుణ్యం అంటే వాళ్ళదే -

సాంబయ్య తాగితేనేం - ఆదిలక్ష్మిని కొడితేనేం - ఆదిలక్ష్మి నిజంగా దేవత అనుకో

  • అందుకే దానికి దేవుడు మేలు చేశాడు - మంచితనం ఊరికే పోదు -

వేంకటేశ్వర్లుకి వచ్చిన ఉద్యోగం సానా మంచిదంట - నౌకర్లు చాకర్లు - మందీ మార్చలం - పైన కూడా బాగా సంపాదన వుంటదంట-

మన షావుకారు గారి రెండో అల్లుడు సెయ్యడంలా అలాంటి దేనంట-

టైయినింగయి పోయి, పోస్టింగ్‌ వేయించుకొని వస్తున్నాడు - ఏ వూరేశారో ఏమో!

ఆదిలక్ష్మి ఇల్లలికింది - గోడలకి సున్నం వేసింది - మంచానికి వున్న నవార్లన్నీ ఉడకబెట్టి ఉతికి, తెల్లగా చేసి అల్లింది-

దుప్పట్లన్నీ కాలవ దగ్గర బాదీ బాదీ ఉతికింది - ఇంట్లో రవ్వంత బూజు లేకుండా దులిపింది - సాంబయ్య తెనాలి నుంచీ కప్పులు కొనుక్కొచ్చాడు. ఇన్‌స్టెంట్‌ కాఫీ పాడి తెచ్చాడు - సాంబయ్య చెల్లెలు సావిత్రి మేనల్లుడొస్తున్నాడని బియ్యం పిండి స్వయంగా కొట్టి

వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు 99 అరిసెలొండి తెచ్చింది సావిత్రి కూతురు జ్యోతి వెంకటేశ్వర్లుకి ఈడు - దాన్ని కొట్టీ తిట్టే చదివించి టెన్త్‌ ప్యాసు చేయించి తెనాలి కాలేజికి పంపిస్తోంది అదంతా వెంకటేశ్వర్లు కోసమే- జ్యోతిని ఇవ్వాళ కాలేజికి వెళ్ళద్దంది సావిత్రి

సాంబయ్య తెల్లని ఇస్త్రీ పంచె కట్టాడు అతనిప్పుడు 'ఎంరా సాంబయ్య' కాదు వెంకటేశ్వర్దుగారి తండ్రి సాంబయ్యగారు బీడీలు మానేస్తాడు మంచి సిగరెట్ట త్రాగుతాడు

  • అణా కానీ సారాయి మానేసి అబ్బాయిని బ్రతిమాలి రోజుకో క్వార్ట్భరు మంచి మందు కొనుక్కుంటాడు

సాంబయ్య రెండో కొడుకు, వెంకటేశ్వర్లు తమ్ముడు గోపాలకృష్ణుడు చదువుకోలేదు అలాగని చదువుకోకుండానూ వుండలేదు - వాడు అప్పటి నించీ చదువుకుంటూనే వున్నాడు కానీ ఇంకా ఇంటర్‌ ప్యాస్‌ కాలేదు - ఇదుగో వెంకటేశ్వర్లే వాడీనొక దారికి తీసుకురావాలి-

వెంకటేశ్వర్లు చెల్లెలు లక్ష్మి తెనాలి కాలేజిలో బిఎ చదువుతోంది - అన్నలా పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగం చెయ్యాలని కలలు కంటోంది. అందరి కలలూ నిజం అయ్యే సమయం ఆసన్న మయింది-

వెంకటేశ్వర్లు సాయంత్రం వస్తున్నాడు. “ఆడు పెట్టెలయ్యీ మోచుకొని రాలేడు నువ్వెల్లి బస్‌ స్టాండింగు కాడ వుండు = ఏబస్‌లో వత్తాడో ఏమో!” అని గోపాలకృష్ణుబ్సి నాలుగు గంటల నుంచే బస్‌స్టాండ్‌లో నిలబెట్టాడు సాంబయ్య

వీధి వీధంతా వెంకటేశ్వర్లు కోసం ఎదురు చూస్తోంది -

ఊరు ఊరంతా కూడా ఎదురు చూస్తోంది-

సాయంత్రం అయిదు గంటల వేళ లక్ష్మి వీధి వాకిట్లో దుమ్ము అణగడానికీ పేడ నీళ్ళు చల్లి ముగ్గు వేసింది ఆదిలక్ష్మి వసారాలో నవ్వారు మంచం వేసి శుభ్రమైన దుప్పటి వేసింది

  • గోపాల కృష్ణుడు గేదె దగ్గర అప్పటి కప్పుడు గోరు వెచ్చని పాలు తీసుకొచ్చేడు.లక్ష్మి కప్పులన్నీ తళ తళా తోమి పెట్టింది

“ఈడు మన కొడుకు కాదా ఏం! ఏంటిలాగ పరాయి వాడొత్తున్నట్లు మనందరం అడావుడి పడిపోతున్నాం!” అని ఆశ్యర్చ పడింది ఆదిలక్ష్మి పళ్ళెంలో హారతి సిద్ధం చేస్తూ-

“అడికి రాగానే ఆరతి పట్ట వదినా! అని సావిత్రి యిందాకే చెప్పిపోయిఎది-

బస్‌ స్టాండులో బడ్డీ కొట్టు దగ్గర నిలబడి కాళ్లుపీక్కు పోతున్న గోపాలకృట్టుడు!

హారతి పళ్ళెం పక్కనెట్టుకుని నవారు మంచం మీద కూర్చుంటే దుస్పటి మాన్తుందని క్రింద కూర్చున్న ఆదిలక్ష్మి -

వీధి మొదట్లోనే నిలబడ్డ సాంబయ్య -

100 ఇల్లలకగొనే. .. వెంకటేశ్వర్లు రావడం తాము చూడలేమేమోనన్న ఆతురతలో తొంగి తొంగి చూసే ఇరుగు పారుగులు -

వెంకటేశ్వర్లు వచ్చాడు - అతను బస్‌లో రాలేదు - సినిమాల్లో చూపించే ఎర్రటి కారులో వచ్చాడు - ఒక్కడే రాలేదు - వెంట ఇంకొకళాయనతో వచ్చాడు - పెట్టైలూ సంచులూ లేవు - చేతులూపుకుంటూ వచ్చాడు ఆదిలక్ష్మి ఉలిక్కిపడి వెంకటేశ్వర్డుకి హారతిచ్చింది - అతనితో వచ్చినాయినని చూసి, ఆ కారు ఆయనదని గ్రహించింది

డ్రయివరు పళ్ళ బుట్ట తెచ్చి గుమ్మంలో పెట్టాడు -

“ఈయన వెంకట్రామయ్యగారమ్మా - నేను హైదరాబాద్‌లో వుండి పరీక్షలకి ప్రిపేర్‌ అయినప్పుడు నాకు చాలా సాయం చేశారు - వీళ్ళమ్మాయి అనూరాధ కూడా నాతో పరీక్షలు (వ్రాసింది. తనకి సెలక్షన్‌ రాలేదనుదో -”

ఓట్లడగడానికి' వచ్చే రాజకీయ నాయకుడిలా ఆయన అందరికీ నమస్కారం చేసి, మంచం మీద కూర్చున్నాడు

వాళ్లిద్దరి ప్రక్కనా తను కూర్చోవచ్చో, కూర్చో కూడదో అర్దం కాలేదు సొాంబయ్యకి నిలబడి చూస్తున్న సాంబయ్యకి లక్ష్మి ఒక కుర్చీ పీట వేసి కూర్చోమంది -

“ఇక్కడ కూర్చో న్నాన్నా" అని జరిగి కొడుకు తనకి మంచం మీద చోటివ్వ లేదని సాంబయ్య అనుకోలేదుగానీ ఆదిలక్ష్మి అనుకుంది - అంత ఖరీదైన మనిషిని వెంటబెట్టుకుని రావడం ఎవరికీ నచ్చలేదు - వాళ్ల గొంతులు మూగబోయాయి -

లక్ష్మి వాళ్ళకి మంచి నీళ్ళిచ్చింది -

“నాకీ మధ్య చాలా సుస్తీ చేసిందమ్మా - అప్పట్నించీ ఎక్కడికెళ్ళినా కాగబెట్టిన నీళ్లు మోసుకు తిరుగుతున్నాను -” అని ఆయన కారులో నుంచి చల్లని మంచి నీళ్ళు పోసుకునే పెద్ద డబ్బా తెచ్చుకుని అందులో నుంచీ నీళ్ళు పోనుకుని కొన్ని వెంకటేశ్వర్లుకి కూడా యిచ్చాడు .

ఆదిలక్ష్మి రెండు స్టేట్లల్లో అరిసెలూ, కారప్పూస తెచ్చి పెట్టింది

“హార్ట్‌ పెషెంటునమ్మా - ఇవ్వన్నీ “తినకూడదు: -” అన్నాడాయన

“మీ సావిత్రమ్మత్త నీకోసం చేసిందిరా ఎంకటేశులూ-” అన్నది ఆదిలక్ష్మి గొంతు పెగిలించుకుని -

వెంకటేశులు ఓ అరిసెముక్క కొంచెం తిని తల్లిని సంతోష పెట్టేడు

అప్పటి కప్పుడు తీసిన పాలు కాచి ఇన్‌స్టంట్‌ కాఫీ పొడితో జాగ్రత్తగా కలిపిన కాఫీ తీసుకొచ్చి యిచ్చింది ఆదిలక్ష్మి -

పాపం అది మాత్రం వద్దనలేదు ఆయన.

వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు 101

వెంకటేశ్వర్లూ తీసుకున్నాడు.

“ఈ కారు కోసం ఆశపడి ఈయన్ని ఎంటేళుకు రాకపోతే హాయిగా బస్సులో వస్తే ఈ పాటికి అందరం ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం?" అనుకుంది వెంకటేశ్వర్లు చెల్లెలు లక్ష్మీ -

/గోపాలకృష్ణుడు దూరంగా నిలబడ్డాడు

“వీడు నా తమ్ముడు -” అని ఆయనికి వెంకటేశ్వర్లు పరిచయం చేయలేదు-

వెంకటేశర్లుని దిగబెట్టి ఎర్ర కారాయన వెళ్ళిపోతే మాట్లాడుకోవచ్చులే అనుకున్నాడు సాంబయ్య -

కానీ ఎర్రకారాయనతో పాటు వెంకటేశ్వర్లు లేచేడు.

“నేనొస్తానమ్మా - నాకింకా హైదరాబాద్‌లో పన్గున్నాయి - పోస్టింగ్‌ ఎక్కడీస్తారో తెలీలేదు - ఈ లోగా మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను -” అన్నాడు -

“పోట్టింగేదో వచ్చేదాకా ఇక్కడుండరాదూ?” అంది గోదిలక్ష్మి దైర్యం కూడగట్టుకుని-

“చెప్పాను గదా - నాకు కొన్ని పన్గున్నాయని! మళ్లీ వచ్చి వుంటాను -' అన్నాడు-

ఎ(ర్రకారులో వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు - వీధికి ఆశాభంగం -వూరికి ఆశాభంగం = ఇంటికి మరింత ఆశాభంగం -

అప్పుడెళ్లిన వెంకటేశ్వర్లు మళ్ళీ వచ్చాడు - ఈ సారీ ఎర్రకారులోనే వచ్చేడు - కానీ రాజకీయ నాయకుడిలాంటాయనతో రాలేదు - ఆయన కూతురుతొ వచ్చేడు-

ఆ అమ్మాయి ఆదిలక్ష్మికీ, సాంబయ్యకీ నమస్కారం చేసి కొత్త బట్టలు యిచ్చింది -

లక్ష్మికి ఒక ముత్యాల దండ, గోపాలకృష్ణుడు కొక రిస్పవాచీ యిచ్చింది - రెండు బుట్టలతో పళ్ళు, రెండు ప్యాకట్ట్లతో స్వీట్లు యిచ్చింది

అల్లుడి కోసం వెల రోజులు వెన్న పూస దాచి దాచి కరగేసిన నెయ్యితో అరిసెలు వండిన సావిత్రమ్మ కళ్ళంట నీళ్ళు ధారలు కట్టాయి - కూతురి చదువు కోసం పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్టు అయిపోయింది -

ఈ అమ్మాయి తమ లోకం మనిషి కాదు - తమ రంగు కాదు - తమ భాష కాదు

  • తమ తిండి కాదు - మంచం మీద పొందికగా కూర్చున్న ఆ అమ్మాయి “ఇక్కడ కూర్చోండీ నొ ప్రక్కన అని జరిగి ఆదిలక్ష్మికి చోటివ్వలేదు -

వాళ్ళంతా నిలబడి వుండడం బాలా సహజం అన్నట్లు ప్రవర్తించింది -

అదిలక్ష్మి పెట్టిన భోజనాన్ని వేళ్ళతో కెలికి తిన్నట్లు నటించింది -

'ఓ పెద్ద మంత్రిగారు ఓ కూలీల కాలనీని దర్శించడానికి దయదలచివచ్చినట్లు వుంది' అనుకుంది వెంకటేశ్వర్లు చెల్లెలు లక్ష్మి

102 ఇల్లలకగానే. . ,. ప్రొద్దున్న వచ్చిన వెంకటేశ్వర్లు సాయంత్రం చాకా వున్నాడు. సాయంత్రం దాకా వున్న వెంకటేశ్వక్తు చాలా చెప్పాడు -

ఈ పల్లెటూర్లో - ఈ దుమ్ములో - మీరుండ లేరన్నాడు కాపురం తెనాలి తరలించమన్నాడు అక్కడ మంచి నీళ్ల పంపు వున్న మంచి ఇల్లు తీసుకోమన్నాడు. నెల నెలా డబ్బు పంపుతానన్నాడు

“అయితే మమ్మల్ని నీతో తీసుకెళ్లవా?”

“నన్నేసింది ఈ జిల్లాలో కాదు - అక్కడ మీరుండ లేరు - ఇదంతా మీకు అలవాటైన చోటు -” అన్నాడు -

“తెనాలిలో మా నాన్నగారికి ఇల్లుంది - అది ఖాళీ చేయించి యిస్తాం - మంచి ఇల్లు

  • అందులో వుండండి - మేం ఎప్పుడైనా వచ్చినా ఈ పల్తెటూరికీ రావడం కష్టం - ఓ రోజుండాలన్నా - ఆ ఇంట్లో మీరు ఎన్నాళ్ళెనా వుండొచ్చు నాకొచ్చే యిల్లే అది-”అంది వెంకట్రామయ్యగారమ్మాయి అనూరాధ - చాలా దయగా -

“మీకేం లోటు రానివ్వను - నేను డబ్బు పంపుతాగా!”

ఆదిలక్ష్మి కుప్పకూలి పోయింది-

పాతికేళ్లుగా సాంబయ్య చేత తిన్న దెబ్బలన్నీ మళ్లీ తగులు తున్నట్లని పించాయి-

కొడుకు దగ్గర వుంటే సాంబయ్య భయంగా వుంటాడని, తనకి వెంకటేశర్లు తల్లిగా ఓ గౌరవం వుంటుందని ఆశ పడింది రేపటినించీ కొడుకు మీద కోపం చూపించడానికి తను తప్ప ఇంకెవరుంటారు సాంబయ్యకి?

రేపటి నించీ ఊరి జనం అనే మాటలు భరించలేని సాంబయ్య ఎంత తాగుతాడో - ఏం చేస్తాడో ఊహించడం కూడా కష్టం -

వీడి కోసం ఎంత రెక్కల కష్టం చేసింది తను? షావుకారి భార్య చీరెలు ఉతకడం దగ్గర్నుండీ - ఒక పనా? ఎంత కారం కొట్టింది? ఎంత పిండి దంచింది?

వీడు కనీసం దగ్గర కొచ్చి ఒకసారి భుజం మీద చెయ్యివేసి “అమ్మా!” అని పలకరించాడో? డబ్బు పంపుతాడట!

వెంకట్రామయ్యగారి కూతురు ముందు తను ఏడవగలదా” గొంతు పూడుకుపోదా! ఎంత కష్టపడ్డా ఇన్నాళ్లూ అదంతా శారీరకమైన కష్టమే- మనస్సులో ఆశ ఎంత కష్టాన్నైనా మరధిపించింది ఆశే ప్రాణం - ఇప్పుడు ఇంకేం మిగిలింది?

డబ్బులు పంపుతాడట నెంకటేశ్వర్లు!

“అన్నయ్య చెప్పింది బావుందమ్మా మనం తెనాలి వెళ్ళి పోదాం-' అంది లక్ష్మి - పాయ్యి దగ్గర కూర్చుని కళ్లు తుడుచుకుంటున్న ఆదిలక్ష్మితో

వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు 103 కనపకకసుకు హస ను

“అవునమ్మా - మొన్నటి దాకా వూరంతా అన్నయ్యని ఆకాశానికెత్తేశారు రేపటి నించీ తిట్టి పోస్తారు - రక రకాలుగా మాట్టాడతారు - ఇవ్వాల్టిదాకా నువ్వు పుణ్యం చేశావన్నారు రేపట్నుంచీ నువ్వేం పాపం చేశావో నంటారు - ఇప్పటి దాకా ఒక ఆశతో బ్రతీకాం - రేపట్నించీ మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం - ఈ పల్లెటూరి కష్టాలు మనం పడలేం - మనలాంటి వాళ్లకి పట్నాలే నయం - అక్కడ మనని గురించి ఎవరూపట్టించుకోరు - పైగా, ఫలానా వారి ళల్లీ తండ్రీ అని తెలిస్తే పరిచయాలు పెంచుకుని స్నేహాలు చేస్తారు-”

“ఎవరేం అన్నా - ఎం అనుకున్నా ఫరవాలేదు - ఈ ఇల్లు మనది - ఇక్కడ మనకి గేదెలున్నాయ్‌ - మన చేత పని చేయించుకుని సాయం చేసే మనుసులున్నారు - నా రెక్కల్లో ఇంకా సత్తువుంది - పోయి ఎవురింటోనో ఎందుకుండాల నేను, నాకే మవసరం?? ఆడికి పల్లెటూరు రావడం - ఇట్టాంటి గుడిసెలో వుండటం యిట్టం లేక తెనాలి పొామ్మంటాడు - నేను పోను - అంత ఆపేచ్చే వుంటే పంపే డబ్బు ఇక్కడికే పంపమను - ఇక్కడుంటే మా బతుకు మేం బతుకుతాం - అక్కడికి పోతే ఆడు డబ్బు పంపితే గతి, లేకపోతే లేదు - ఆడీకాడ వుండనప్పుడు ఎక్కడుంటే వాడీకేమిటి? నేను డబ్బుకి ఆశ పడ్డానా? ఆడికాడుండటానికి ఆశ పడ్డానా? నీకు అర్హం కాదే! ' అని బావురుమంది ఆదిలక్ష్మి

“చీకటి పడుతోంది వెంకట్‌?'' అంటోంది ఆ అమ్మాయి

“బయలుదేరదాం- "” అని లేచి నిలబడ్డాడు వెంకటేశ్వర్డు.

“ఈ డబ్బు నీ దగ్గరుంచు నాన్నా! తెనాల్లో ఇల్లు బాగు చేయిస్తాం - అక్కడికీ మారిపాండి - నేను రెండు నెలలాగి మళ్లీ వస్తాను - మీరేం బాధపడకండి - నేను కొంచెం సెటిల్‌ అవగానే మీకు డబ్బు పంపుతాను -” అన్నాడు, తండ్రి చేతిలో ఓ పదివేలు పెట్టి-

“ఇప్పుడే ఎందుకింత డబ్బిస్తున్నావు?” అనలేదు సోంబయ్య-

“డబ్బుతో మా బుణం తీర్చేసుకుంటున్నావా?” అనలేదు-

బుద్దిగా నోట్ల కట్ట అందుకుని జేబులో పెట్బకున్నాడు-

ఎదో వండుతున్న నెపంతో పాయ్యిదగ్గరే వుండి కళ్లు తుడుచుకుంటోంది ఆదిలక్ష్మి -

“మీ అమ్మని పిలు! ఆళ్ళిళ్ళి పోతారంట - కాపీ కలుపుకు రమ్మను-” అని కూతురికీ పురమాయించేడు సాంబయ్య.

*వస్తామమ్మా! అని చెప్పడానికి కొడుకు లోపలి కొస్తాడేమో, ఒక్కసారి వాణ్ణి కౌగిలించుకుని గట్టిగా బడవాలనుకుంది ఆదిలక్ష్మి

“వాళ్ళకి కాఫీ తెమ్మంటున్నాడు నాన్న” అని లోపలికి వచ్చింది లక్ష్మి -

“నువ్వు కలుపుకు వెళ్ళు” అంది ఆదిలక్ష్మి.

104 ఇల్లలకగానే. ...

లక్ష్మి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి

అన్నయ్యదగ్గర వుండి పై చదువులు చదవాలన్న కలలన్నీ ఈ కటచ్చెపుల్లల్లాగే ముండిపోయాయి -

మళ్ళీ తనకే నవ్వొచ్చింది -

అన్నయ్యని ఎవరు దగ్గర పెట్వకుని చదివించారు? పాపం ! తన కష్టం తనే పడ్డాడు!

కాఫీ కప్పులతో తల్లీ కూతుళ్లు వసారాలో కొచ్చేరు -

“వస్తాను -' అంది ఆ అమ్మాయి-

ఆ స్థానంలో జ్యోతి ఉంటే “అత్తమ్మా అని పిలిచి తన వొడిలో వాలిపోయేది -

ఈ పిల్లని ఒక్కసారి ముట్టుకోవాలని, చేతిని తన చేతిలోకి తీసుకోవాలని అనిపించినా, నిగ్రహించుకుంది - అలా చేయవచ్చునో కూడదో తెలీని అజ్ఞానురాలు కదా తను!

దుఃఖాన్ని అదిమి పట్పకుని పేలవమైన ఒక నవ్వు నవ్వి, ఆమె నుదుట బొట్టు పెట్టి ఆమె తెచ్చిన పళ్ళే కొన్ని చేతిలో పెట్టింది ఆదిలక్ష్మి -

“ఇవి మీ కోసం తెచ్చాం గదా! అక్కడ చాలా వున్నాయి, మీరుంచుకోండి -” అని మంచం మీద పెట్టింది ఆ అమ్మాయి మళ్ళీ

స్కాలర్‌ షిప్పులతో చదువుకుని పైకొచ్చాడన్న అభిమానంతో, స్నేహంతో, (ప్రేమతో, అతనికి ప్రోత్సాహం యిచ్చి దగ్గరుండి పరీక్ష వ్రాయించి అతని పురోభివృద్ధికి ప్రధాన కారకురాలైన అమ్మాయి - ఇప్పుడు శ్రీమతి అనూరాధా వెంకట్‌ - ఆమె లేకపోతే వెంకటేశ్వర్లు ఈ రోజు ఇలా వుండడు

మీరేం చేశారు వెంకటేశ్వర్డుకి! కూలికి పంపకుండా చదువుకోనిచ్చారు - ప్రభుత్వం స్కాలర్‌ షిప్‌ యిచ్చింది - సీట్టిచ్చింది - కాకపోతే బట్టలు కుట్టించారు - తిండి పెట్టారు - అంతేగా! మీరు చెప్పించిన చదువులతో అతనికీ ఉద్యోగం వచ్చేదా? హైద్రాబాద్‌ వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని కష్టపడి చదువుతూ వుంటే - ఈ దేవత సాక్షాత్కరించింది. జాలిపడి చెయ్యి అందించింది -

పైకి లాగింది -

ఈమే లేకపోతే ఈ రోజు వెంకటేశ్వర్లు ఇలా ఉండడు ఇదంతా మధ్యాహ్నం వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మికి చెప్పేడు వెంకటేశ్వర్లు మంచివాడు పాపం వాడికి కృతజ్ఞత చాలా ఎక్కువ

“మా అమ్మ మా కోసం పడని కష్టం లేదు - మా అయ్య వున్న ఎకరం నేల అమ్మేసి

  • చేసే పని మీదొచ్చే పది రూపాయలు కూడా సజావుగా ఇంటికి యివ్వకపోతే ఈ విడే రెక్కలు ముక్కలు చేసుకుని సంసారం నిలిపింది నాటే వేసిందా, కలుపులే తీసిందా, కోతలే కోసిందా,

వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు 105 కోరమే దంపిందా, అంట్లే తోమిందా, ఆ పన్షన్నీ లెక్కబెట్టడానికి రావు - ఆవిడే లేకపోతే ఈ రోజు వెంకటేశ్వర్లు గొడ్డను మేపుకుంటూ గోటీ బిళ్ళలాడే వాడు-'' అని బహుళా వెంకటేశ్వర్లు అనూరాధకి కూడా చెప్పేవుంటాడనుకుంది ఆదిలక్ష్మి అలా అనుకోడంలో సంతృప్తి కోసం -

ఎర్రకారు బయలు దేరింది వెంకటేశ్వర్లుని ఎక్కించుకుని -

అతను వెళ్ళిపోయేడు

ఆ వెళ్ళడం శాశ్వతం గానే - అనిపించగా ఆదిలక్ష్మి గుండె చెరువయ్యింది.

ఆ రాత్రి ఆదిలక్ష్మికి ఎంతకూ కునుకు పట్టలేదు

“తన వెంకన్నని, పెద్ద పెద్ద చదవులు చదివి ఆఫీసరైన వెంకట్‌ని, ఆ పట్టపోళ్లు ఆడపిల్లనీ, అస్తినీ ఎరచూపి పడేసుకున్నారా? లేక తామే తమ సేరాశతో చేజేతులా కొడుకుని జారవిడుచుకున్నారా?

అలా అమె ఆలోచనలు ఎంతసేపూ కోడలి కుటుంబం తమ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయేగాని యీ పాతికేళ్ళలో వెంకటేశ్వర్డుజీ వితానుభవం అతనిలో ఎ పరిణామాలు తెచ్చుంటుందో - అని ఆ వంకగా ఆమె ఆలోచించటేకపోయింది

అలా మహా మహా వాళ్ళే చూడలేరు. ఆదిలక్ష్మనగా ఎంత?

(రబన నచ్యిత మాసవత్రిక : డీసెంబల్‌ 94) వో

పెళ్ళి ర్రయొణం డడ న పొలాన్ని, ఉంటున్న ఇంటినీ వదిలి చిన్న మామయ్య హైదరాబాద్‌ వెళ్తిపోతున్నాడని తెలిసి అమ్మ బాధపడింది. తను పుట్టీ. పెరిగీ. ఊహలు సంతరించుకుని, అడీ పాడీ, చదివీ జీవితంలో అడుగుపెట్టిన ఆ ఊరినీ, ఆ ఇంటినీ, తన తండ్రినీ ఒకసారి చూడాలనే ఉద్దేశ్యంతోనే ఆవిడ చిన్న మామయ్య కూతురు శ్రీలక్ష్మి పెళ్ళికి ప్రయాణమైంది.

జ పెళ్ళి ఉన్నంతలో బాగా చేస్తున్నాననీ, బంధువులందర్నీ ప్రత్యేకంగా పిలిచాననీ, అమ్మని తప్పకుండా రమ్మనీ చిన్న మామయ్య మరీ మరీ కోరుతూ ఉత్తరం రాశాడు. అలాంటి రంగ రంగ వైభోగంగా జరిగే పెళ్ళిళ్ళన్నా, ఒకచోట సమావేశమయ్యే ఆ అశేష బంధువర్గం అన్నా అమ్మకి ఇష్టం ఉండదు అయినా, ఆవిడెందుకనో వెంటనే ప్రయాణం అయింది. ఇంటికి వచ్చి చాలా రోజులైందని వారం రోజులు సెలవు పెట్టి బెంగుళూరు నుంచి వచ్చిన నన్నూ ప్రయాణం చేసింది

“ మహా నగరంలో పుట్టి పెరిగి ఇంకో మహా నగరంలో ఉంటున్నావు , మీ అమ్ము ఎక్కడ పుట్టిందో, మీ అమ్మమ్మ ఎలా జీవించిందో చూద్దువుగాని రాకూడదూ !” అని నన్నూ ప్రయాణం చేసింది

'షెళ్ళి ప్రయాణం 107

అమ్మ పుట్టిల్లు ఆనందపురం నేనెప్పుడూ వెళ్ళలేదని కాదు పదిహేనేళ్ళకిందట అమ్మమ్మ పోయినప్పుడు అందరం వెళ్ళేం అప్పుడు అక్కడ పదిరోజులు ఉన్నాను కూడా మూసిన తలుపుల మధ్య ఉండీ, ఉండీ ఆ తలుపులు తెరుచుకుని విశాలమైన మైదానంలో అడుగు సపెట్టినట్లుంది ఆ ఊరువెడితే నాన్న కసలు అక్కడికి రావడం౫ఇస్టం ఉండదు. అందుకని అమ్మ పిలవదు. మేం ఇద్దరం తమిళనాడు ఎక్స్‌పెస్‌కు విజయవాడకి టికెట్స్‌ రిజర్వ్‌ చేయించుకున్నాం ఉండడానికి ఆనందపురం కలకత్తా - మద్రాసు రైల్వే లైను మీద ఉన్నా, అక్కడ ప్యాసింజర్జ్లు తప్ప ఆగవు మరీ వేగంగా వెళ్లే ఎక్స్‌(పెస్‌లు తెనాలిలోనూ ఆగవు అంచేత ఢిల్లీ నుంచి విజయవాడలో దిగి, టాక్సీలో వెళ్లడం మంచిదని నిర్ణయించాం అమ్మ కూడా అటువైపు వెళ్ళి పదేళ్లయింది ఆవిడ ఉద్యోగం, మా చదువులు, అవిడ వ్యాపకాలు అవిజ్ఞటు వెళ్ళడానికి ఇన్నాళ్ళు అనుమతించలేదు.

అమ్మ స్నేహితురాలు డార్టర్‌ త్రిపుర సుందరి విజయవాడలో పేరు ప్రఖ్యాతులున్న వైద్యురాలు ఆవిడ అర్ధరాత్రి వేళ స్వయంగా స్టేషనుకు వచ్చి మమ్మల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి, తెల్లవారి తన కారులో ఆనందపురం పంపించింది.

మంగళగిరి దాటిన తరువాత కారు తెనాలి రోడ్డు పట్టిన దగ్గర్నుంచి ఆమ్మ మాట్లాడుతూనే ఉంది ఆవిడ ఎప్పుడూ ఇంత మాట్లాడదు మితభాషి

“ఇది తుమ్మపూడి సంజీవ్‌దేవ్‌ గారి ఊరు”

“ఇది దుగ్గిరాల పసుపు మార్కెట్‌,

“ఇది చూశావా, ఆనందపురం రైల్వేస్టేషన్‌ నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ ఇలాగే ఉంది రైలు దిగాలంటే నిచ్చెన దిగినట్లే ఈ ప్లాట్‌ఫాం మాత్రం ఎత్తు చెయ్యరు.

రెండు బస్సులు ఎదురైతే తప్పుకోడానికి కష్టముయ్యే ఆ రోడ్డుకి రెండు పక్కలా కాలువలు, పెరిగిన పొలాలు, చురుగ్గా పైకి వస్తున్న సూర్యుడు పక్కన కూర్చున్న అమ్మ మొహంలో వెలుగూ పరిమితమైన వేగంలో పోతున్న కారు, ఉల్లాసంగా ఉన్న వాతావరణం అమ్మని చూస్తే నాకు అళ్చర్యంగా అనిపించింది తిరునాళ్ళలో తప్పిపోయి, చాలా కాలానికి దారి కనుక్కుని ఇంటికి వస్తున్న చిన్న పిల్లలా ఉంది ఆవిడ

“ఈ ఊరు నీది కాదు ఇక్కడి పాలాలు నీవి కావు ఆ ఇంట్లో ఒక సూదిమొన స్థలం కూడా నీకు లేదు అయినా, ఆఅ ఊరి మీద, ఆ ఇంటి మీద నీకఠెందుకింత మమకారం?" ఇది నాన్ని ప్రళ్న

దానికి అమ్మ జవాబు చెప్పలేదు

పుట్టినప్పటి నుంచీ గుండెల మీద కుంపటిగానే భావించి తృణమో పణమో ముట్టదెప్పి అల్లుడికి అంటగట్టి పంపించే పుట్టిళ్ళని కూడా ఆడవాళ్ళు (ప్రేమిస్తూనే ఉంటారు.

108 ఇల్లలకగానే. . .. (పేమించే గుణం వాళ్ళ రక్తంలో ఇంకిపోయింది అమ్మ విషయంలో తృణమో పణమో ముట్టదెప్పడం కూడా జరగలేదు అయినా, జవిడకి ఆ ఊరంటే ప్రేమ ఆ ఇల్లంటే ట్రేమ తండ్రంటే (పేమ ఉందో లేదో నాకు తెలియదు ఆవిడేప్పుడూ చెప్పదు

అమ్ముమ్మగారింటికి గేట్లు రెండుంటాయి రెండవ గేటు దగ్గర కారు ఆగింది ఆ గేటు పక్కనుంచే కొబ్బరి చెట్టు, గోడనానుకుని విరబూసిన రాధామనోహరం తీగె-పదిహేనేళ్ళనాడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కారు ఆగుతూనే లోపల నుంచి మామయ్య పరిగెత్తుకుని వచ్చాడు ఆ వెంట మరికొందరు వచ్చారు పదేళ్ళ తరువాత చూసిన అమ్మని వాళ్ళు కౌగిలించునుంటారనుకున్నాను గానీ,అది ఆంధ్రదేశంలో సంప్రదాయం కాదని గుర్తొచ్చింది పదిహేను సంవత్సరాల కిందట నేను వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులతో నాకు సన్నిహిత స్నేహం కుదిరింది. ఒకటి-మా పెద్దమ్మ కూతురు సుధ రెండు - మా పెద్ద మామయ్య భార్య శారద ఆ పది రోజులలో వారిద్దరి సాహచర్యాన్ని నేనెప్పుడూ మర్చిపోను. ఇప్పుడు సుధని గుర్తువీట్టగలనో లేనో- ఉత్తరాల ద్వారా పలకరించుకోవడమేగానీ,

చౌలా రోజుల తరువాత వచ్చిన అమ్మని వాళ్ళంతా ఘనంగా ఆహ్వానించి, మర్యాదలతో ముంచెత్తారు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చారు కూర్చోకముందే కాఫీ కప్పులు అందించారు. కార్లో సామాన్లు గదిలో పెట్టించారు ప్రయాణం సుఖంగా జరిగిందో లేదోనని ఆతురతగా వ్రళ్నించారు జరిగిందని విని సంతోషించారు తాతయ్య కూడా లోపల నుంచి వచ్చి అమ్మని పలకరించి కూర్చున్నాడు నేనే వెళ్ళి తాతయ్యని పలకరించాను బాగా పెద్దవాడయ్యాడు ఆయన అమ్మమ్మ పోయినప్పుడు ధృఢంగానే ఉన్నాడు ఇప్పుడు డెబ్బై దాటిపోయాయి. ఎనభైకి దగ్గర పడ్డట్లున్నాడు విడిది ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళిన కలెక్టర్‌ పెద్దమ్మ, ఆమె కొడుకు రవీ వచ్చేరు

అమ్మని చూడగానే పెద్దమ్మ మొహం వెలిగిపోయింది. రవి రెండు వారాలయిందట ఇండియా వచ్చి తాతయ్యని చూడడానికి వచ్చాడట వాడికి ఈ దుమ్ములో, ఎండలో ఐం జబ్బు చేస్తుందోనని పెద్దమ్మ హడలిపోతోందట మినరల్‌ వాటర్‌ సీసా చేత్తో పట్టుకుని తిరుగుతోంది వాడికిదేం పట్టినట్లు లేదు హ్యాండీక్యామ్‌ తీసుకుని ఇల్లంతా తిరిగి కనపడ్డ వాళ్ళనల్లా ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు ముఖం మీద ఒక్క వెంట్రుక లేకుండా నున్నగా , తెల్లగా, పాలరాతి బొమ్మలా ఉన్న రవి ఆ ఇంట్లో ఒక ప్రత్యేక అకర్షణ అంతలో శ్రీలక్ష్మి వచ్చి అమ్మ కాళ్ళకి దండం పెట్టింది సినిమాలో పెళ్ళికూతురిలా కొంచెం ఎక్కువగానే ముస్తాబైంది. నేను చూసినప్పుడు చిన్న పిలకతో చెడ్డీ వేసుకుని మట్టిలో ఆడుతూ ఉండేది. జుత్తుని చాలా అందంగా దువ్వింది పెదవులకి రంగు కూడా వేసింది తెనాలి కాలేజీలో డిగ్రీ చదివిందట.

“నేను జయని” అని పరిచయం చేసుకుంటే, నాకొక నమస్కారం పెట్టింది

పెళ్ళి ప్రయాణం 109

“నమస్తే జయాజీ” అంటూ వచ్చాడు రాజు రాజు నేను చూసినప్పుడు పదేళ్ళవాడు.

' ఇప్పుడు పాడవుగా, బలంగా తయారయ్యాడు నన్నెలా గుర్తుపట్టాడో!

“అచ్చమైన రైతులా తయారయ్యేవురా రాజూ అని అతడిని అభినందించింది అమ్మ ఇంటికి ఉత్తరం వైపున ఉన్న చాలా ఖాళీ స్థలంలో పెద్ద షామియానా వేశారు. అమ్మమ్మ పోయినప్పుడు అక్కడే షామియానా వేశారు షామియానాలంట్నే అందుకే అయిష్టం నాకు ఈ షామియానాకి రంగు కాగితాలూ, మామిడీ తోరణాలూ కట్టారు. పిల్లలు టేప్‌రికార్డర్‌ నుంచి “శీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వే కట్నం” అనే పాట విని, ఆనందిస్తున్నారు

ఒక పెద్ద హాలు. అందులో తూగుటుయ్యాల అన్నీ కలిసి ఓ ఆరు గదులూ, వంట ఇల్లూ, పచ్చళ్ళ గద్‌, పూజ గద్‌, భోజనాల గదీ, రెండు పెద్ద పెద్ద స్నానాల గదులూ, కావల్సినంత పెరడూ- “ఎంత పెద్ద ఇల్లో!” అనిపించేలా ఉంటుంది ఆ ఇల్లు హాలులో అమ్మమ్మ ఫోటోకి దండ వేసి, చుట్టూ చిన్న చిన్న ఎలక్టిక్‌ బల్బులు అమర్చారు దాని పక్కన వరుసగా తాతయ్య తండ్రి, తల్లి ఫోటోలు వాటన్నింటికీ దండలు వెంకటేశ్వరస్వామి, అలివేలుమంగ ఫోటో, దానికి దండ ఆంజనేయస్వామి ఫోటో దానికి దండ దండలన్నీ కొత్తవి. పెళ్ళి కోసం ఫోటోలని కూడా ముస్తాబు చేశారు హాలులో కూర్చున్న మమ్మల్ని ఒకరొకరే పలకరించిపోతున్నారు సుధ మాత్రం కనిపించలేదు

ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. పక్క పల్లెటూరు నుంచి తాతయ్య చెల్పెలు మహాలక్షమ్మ గారు కూడా ఒంటెద్దు బండీ కట్టించుకుని వచ్చింది ఎముకల మీద చర్మం కప్పుకున్నట్లు ఉన్నా, ఆవిడ ఓపికగా ఒడ్డాణం, కాసులపేరు మోస్తోంది ప్రతీ చిన్న విషయాన్ని ప్రయోజనాల దృష్ట్యా బేరీజులు వేసే ఈ రోజుల్లో ఇంతమంది బంధువులు ఈ పల్లెటూరుకి రావఢం నాకు వింతగానే అనిపించింది బంధుగ్రేమలు ఇంకా ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనమేమో!

అంతలో వాకిట్లో చిన్న కలకలం రేగింది ఏమిటని చూస్తే పతివ్రత పిన్ని, బడాబాబూ వస్తున్నారు పిన్ని వస్తూనే అమ్మని ఒక్క నిమిషం పలకరించి లోపలికి పోయింది హడావిడిగా.

“హలో జయా హౌ ఆర్‌ యూ? ఎలా ఉంది నీ ఉద్యోగం? పెళ్ళి మాటేమైనా తలపెట్టావా' అన్నాడు బడా(యి)బాబు ఈయన నాకు బాబాయి

“నేను బావున్నాను మీరెలా ఉన్నారు? మీకు జనరల్‌ మేనేజర్‌ ప్రమోషన్‌ వచ్చేసిందా?” " అన్నాను

“బావుండకేం బ్రహ్మాండంగా ఉన్నాను ఉండకపోతే మీ పిన్ని ఊరుకోదు కదా! జనరల్‌ మేనేజర్‌దేం ఉంది- అయిపోతాను" అన్నాడు

అంతలో పిన్ని ఓ గాజుగ్జాసులో పండ్ల రసంతో ప్రవేశించింది అది ఆయన కిచ్చి పొద్దున్న ఆయన్ని వాకింగ్‌ తీసుకువెళ్ళడం, అక్కడ ఆయన చిన్నపిల్లాడిలా ఈతలాడుతానని

110 ఇల్లలకగానే. ,.. మారాం చెయ్యడం, ఈవిడ బతిమాలి కొంపబేర్చడం చెప్పింది వాకింగ్‌ అయి ఇంటికి రాగానే రసం తాగకపోతే ఆయనకి నీరసం వస్తుందని కూడా చెప్పింది చెప్పి మల్లీ ఆయన స్నానం ఎర్పాట్ల కోసం వెళ్ళింది

బడా(యి)బాబుతో మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తను మేధావిననీ, పెద్ద ఉద్యోగస్థుడిననీ మర్చిపోలేడు ఎదుటివాళ్ళు వట్టి పనికిమాలిన వాళ్ళనీ, వాళ్ళ మీద దయదలిచి మాట్లాడుతున్నాననీ అనుకుంటాడు ఈ దయదలచడం అంటే ఒళ్ళు మంట నాకు “ఓ ఐ సీ ఆహా” - “కృ్వయట్‌ ఇంటరెస్టింగ్‌” -“హౌ ఫన్నీ" లాంటి పదాలు నిమిషానికొకటి వాడుతుంటాడు పాపం పిన్ని రెండు నిమిషాల్లో ఆయనకి నీళ్ళు ఏర్పాటు చేసి వచ్చి ఆయన్ని లాక్కుపోయింది. '“అమ్మయ్య' అనుకుంటూండగా సుధ వచ్చింది వెనక నుంచి కళ్ళు మూసి ఎవరో కనుక్కోమంది అప్పుడప్పుడే ఓణీలు వేసేది ఇప్పుడు చాలా 'పెద్దదానిలా ఉంది నాకన్నా రెండేళ్ళే పెద్ద నేను అప్పుడు టెన్స్‌ కాసు తను సీనియర్‌ ఇంటర్‌.

ముఖంలో ఆ మెరుపు, కళ్ళలో ఆ చురుకూ లేవు కళ్ళ కింద కొంచెం నలుపు కూడా_ వచ్చింది- “ముప్పై ఏళ్ళకే ముసలమ్మ అయిపోయానేమిటే!” అంది అమ్మ “ఏమిటో పిన్సీ, ఉద్యోగం, ఇంటి పనిలో ఇలా అయిపోయాను. అంది

సుధా నేనూ షామియానా కింద వేసిన కుర్పీల్లోకి పోదాం అనుకుంటూ ఉంటే పిన్ని స్నానం చేయించిన బాబాయిని తీసుకొచ్చి గదిలోకి పంపించి మా కెదురుగా కూర్చుంది

“ఆయనకి స్నానం చెయ్యగానే పది నిమిషాలు ధ్యానం చేసుకునే అలవాటు అప్పుడంతా నిశ్శబ్దంగా ఉండాలి" అంది

“రమ, కృష్ణుడు బావున్నారా పిన్నీ" అన్నాను నేను రమ గురించి చెప్పడం మొదలుపెట్టింది రమ చదువు, క్షాసులో దాని ఆధిక్యం, దానికొచ్చిన ప్రయిజులు వాని తెలివి, కృష్ణుడూ- వాడీ తెలివీ, వాడి మార్కులూ, వాడి మాటలూ, వాడి జోకులు,

“ఇద్దరూ ఇద్దరే! మాణిక్యాలు అంది పెద్దమ్మ

“బాబాయిగారి ధ్యానం అయినట్టుంది రవి ఎక్కడున్నాడో కొంచెం చూద్దూ. వాడితో అయితే ఆయన కబుర్లు చెబుతారు కాలక్షేపం అవుతుంది. అంది పిన్ని

“మేం వెతికి పంపిస్తాంలే పిన్నీ" అని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాం. షామియానా కింద భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు పన్నెండు గంటల కల్లా పెళ్ళి వారొచ్చేస్తారట రాగానే భోజనం చేస్తారు హైదరాబాద్‌ నుంచి రెండుబన్సుల్లో వస్తారట నూట యాఖై మందికి పైనే వస్తారట.

“చాలా శ్రమపడి వస్తున్నారు పాపం!” అన్నాను నేను.

పెళ్ళి ప్రయాణం 111

“ఐం లేదు బస్సు ఖర్చులు మనవే బస్ఫ్బు ఖర్చులివ్వకపోతే అక్కడికి వచ్చి పెళ్ళిచయ్యమని అడిగారు. అక్కడ పెళ్ళి చేస్తే ఇంకెంత మంది జనం వస్తారోనని బస్సు ఖర్చులకి ఒప్పుకున్నాడు మామయ్య

“ఇదంతా బేరం చేశారా!”

“ఊ61 అంతా బేరాలే. వంటవాళ్ళని విజయవాడ నుంచే తేవాలని ఒప్పందం. సాయంత్రం వంటలో ఎం చేయించాలన్నది ఒప్పందం, మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చే పెళ్ళివారికి రాగానే తిండి పెట్టడం కాదట కాఫీలిచ్చి సేద తీర్చి, తరువాత భోజనం పెట్టాలట

“బావుంది ”*

పెళ్ళివివరాలు వింటూ ఉండగానే టాక్సీలో నుంచి గుంటూరు బ్యుటీషియన్‌ దిగింది, శ్రీలక్ష్మికి పెళ్ళికూతురు ముస్తాబు చేయడానికి గోరింటాకు పెట్టడానికి ఆవిణ్ణి టాక్సీలో తీసుకొచ్చారు ఇద్దరు వీడియోగ్రాఫర్లుకూడా వచ్చారు “కట్నకానుకలే కాక, ఇప్పటి పెళ్ళిళ్ళల ఇవి కూడా అత్యవసరాలయిపోయాయి. అంది సుధ

“సరే, నీ సంగతి చెప్పు పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావా! ఎవరితోనైనా స్నేహం చేశావా? ఇలాగే ఉండిపోదామనుకుంటున్నావా' అన్నాను

"మా అమ్మ నాకు పదేళ్ళ నుంచీ సంబంధాలు చూస్తూనే ఉంది. నేనెవరితోనూ స్నేహం చెయ్యలేదు పెళ్ళి చేసుకోకూడదని నేనేం అనుకోలేదు” అంది

“మీ అమ్మ చూడ్డం ఎమిటి!

“సర్లే - మా అమ్మ కూతురిగా నువు ఉంటే నీకు తెలిసేది ఆవిడ సంగతి కలెక్టర్‌ పెద్దమ్మ గురించి నీకు తెలిందేం ఉంది అంది సుధ

వాళ్ళమ్మకి కలెక్టర్‌ బిరుదిచ్చింది తనే ఆవిడ పేరు జానకీ జరీ చీర కట్టి, చేతుల నిండా బంగారు గాజులు వేసి, గోల్త ఫేం కళ్ళజోడు పెట్ట, చిన్న సిగచుట్టి, దాని మీద బంగారపు సంపెంగ పువ్వు పెడుతుంది బార్లో వెండి రాజస్థానీ తాళం చెవుల గుత్తి వేలాడుతూ ఉంటుంది అందరినీ తన మాట వినేలా చేసే నాయకత్వ లక్షణాలున్నాయి ఎవరికీ అవిడ మాట కాదనే శక్తి ఉండదు వాళ్ళింట్లో.

పెళ్ళివారొచ్చేరని కబురు రావడంతో చాలావుంది హడావిడిగా వీధిలోకి పరిగెత్తారు-హారతి షళ్ళాలూ, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళూ, తాగడానికి నీళ్ళూ, కాఫీలు మోసుకుని విడీదిలోకి

“ఏం రోడ్డండీ బాబు! వట్టి మట్టి రోడ్లు- నడుములు విరిగిపోయాయి” అంది పెళ్ళీకొడుకు తల్లి

“రోడ్డిప్తుడు బాగుచేశారండీ సిమెంటు రోడ్డు వేశారు మేము హైదరాబాద్‌ నుంచే వచ్చాం మా కార్లో ' అంది పెద్దమ్మ

112 ఇల్లలకగానే ,., నల అ తనతత

ఆవిడకిక మాట్టాడ్డానికేం లేకుండా పోయింది పెద్దమ్మమాటల్లో రెండు అర్థాలున్నాయి. ఒకటి - 'నువ్వు చెప్పిందంతా అబద్దం' అనేది రెండవది - తనకి కారుందనీ, వాళ్ళకి లేదనీ అందుకే ఇలాంటి వ్యవహారాలకి ఆవిణ్ణి నియోగిస్తూ ఉంటారు అలా హాస్యాల పేరుతో చురకలు అంటించుకుంటూనే మొత్తానికి పెళ్ళి చాలా ఆడంబరంగా చేశారు

సాయంత్రం విందుకు ఊరివారు చాలామంది వచ్చారు. అ విందులో అమ్మకి తెలిసినవాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు యాఖై దాటిన అమ్మ సన్నగా ఉంటుంది జుళ్తు పొట్టిగా కత్తిరించి పిన్ను పెడుతుంది. నూలుచీరలైనా మడత నలగకుండా కడుతుంది తెల్లటి ఆవిడ కుడి చేతికి ఒకే ఒక్క గాజు ఉంటుంది రెండవ చేతికి గడియారం ఉంటుంది కళ్లకి జోడు ఉంటుంది మెడలో సన్నని గొలుసు ఉంటుంది ఆవిడ పరిచయస్ఫులందరూ చాలా ముపలివాళ్ళలా, తలలు నెరిసిపోయి, నడుములు పెరిగిపోయి కనిపించారు ఒక్కొక్కరు అరవై ఎళ్ళ వాళ్ళలా ఉన్నారు వాళ్ళందరికీ అమ్మ నన్ను చూపించి తన కూతురని చెప్పింది. వాళ్ళంతా తన తోట్‌ వాళ్ళనీ, కొందరు స్కూల్లో తనతో చదివారనీ, కొందరు ఆడుకోడానికొచ్చే వారనీ చెప్పింది పల్లెటూర్లో ఉంటే అమ్మ కూడా అలాగే ఉండేదేమో అనిపించింది ఆ సాయంత్రం పెళ్ళి విందులో వడ్డించడానికి సుధని పురమాయించింది పెద్దమ్మ తనే సుధకి చాలా ఖరీదైన చీర కట్టి, మెడలో ఒక నక్లేసు కూడా పెట్టింది

“నీకేం లేవా ఇలాంటివి” అంది నన్ను. లేవని చెబితే, “మీ అమ్మ నీకు నగలు చేయించలేదన్నమాట"' అంది. తను సుధకి చాలా చేయించిందట, పెళ్ళి కుదిరితే నగల షాపుకి వెళ్ళే పనే లేదట - సుధ మంచిది! అమ్మ చెప్పినట్లు వింటుంది దగ్గరుండి ముప్పై వళ్ళ కూతురికి పెద్దమ్మ అలా ముస్తాబు చెయ్యడం ఎందుకో తరువాత అర్ధం అయింది. పెళ్ళికొడుకు పిన్ని కొడుకొకడు వచ్చాడట అతగాడు చాలా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నాట్ట సుధని చూసి మెచ్చితే ఇక్కడే ఖాయం చేసుకోవచ్చట సంబంధం నుధని చూసి అనసూయత్త అక్క కూతురొకతె, మరొక ఇరవై ఎళ్ళ అమ్మాయి కూడా వడ్డనకి బయలుదేరారు.

“సరదా ఉంటే నువ్వూవెళ్ళు” అంది పెద్దమ్మ నాతో

"సరదా అసలు లేదు పెద్దమ్మా” అనేశాను నేను అనసూయత్త హడావిడిగా పెళ్ళి వారు కూర్చున్నవైపు తిరుగుతూ వాళ్ళు వద్దన్న కొద్దీ వడ్డించి వస్తూంది పెళ్ళివారి వైపు ఆడవాళ్ళ దృష్టి అమెరికాలో అకుపచ్చ కార్డున్న రవిపైన పడింది వాళ్ళొచ్చి పెద్దమ్మతో పరిచయం సంపాదించారు అయితే, ఆ అబ్బాయికి పెళ్ళి కావల్సిన అక్క ఉందనీ, అప్పటిదాకా లైను క్లియర్‌ కాదనీ తెళిసి చప్పబడిపోయారు

నాకు సుధ మీద చాలా కోపం వచ్చింది- డాక్టర్‌ సుధ ఎం ఏ,పిహెచ్‌డి మీద! అమ్మ చెప్పగానే పదివేల రూపాయల పట్బచీర కట్టేసుకుని, బంగారం నెక్టేసు పెట్టేసుకుని, నేతి గిన్నె ఒకటి పుచ్చుకుని అందరి దృష్టిలో వడ్డం కోసం అటూ ఇటూ తిరిగే సుధ మీద

పెళ్ళి ప్రయాణం 113

“నీకు మతిపోయింది సుధా” అన్నాను.

“అమ్మ మాట కాదంటే ఎంత గొడవ చేస్తుందో నీకు తెలీదు' అంది సుధ.

“పెద్దమ్మకి అంత చెడ్డతనం ఆపాదించకు అన్నాను. మొత్తానికి అనసూయత్త అనుకున్నట్టు పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయిందిగానీ, తిరిగి వెళ్ళేటప్పుడు పెళ్ళికొడుకు తండ్రీ చిన్న తుపాను సృష్టించాడు వధూవరులిద్దరికీ ప్రత్యేకంగా టాక్సీ మాట్లాడి పంపమంటాడు బస్సులో ఎక్కించడం ఎమిటంటాడు.

“అలా అని ముందు మాట్లాడుకోలేదు గదా” అంటాడు చిన్న మామయ్య

“ ఆమాత్రం ఇంగితం మీకుంటుందనుకున్నాం. మాకేం తెలుసు, అది కూడా అడగాలనీ” అంది అతడి తల్లి.

“నా వల్ల కాదు అన్నాడు మామయ్య,

“వాళ్ళిద్దర్నీ వదిలేసిపోతాం తరువాత మీ ఇష్టం కొత్త కోడల్ని బస్ఫులో తీసుకెళ్ళడం మౌకు నచ్చదు అన్నాడు మావగారు

“ఇప్పుడు టాక్సీలెక్కడ దొరుకుతాయండీ” అన్నారెవరో

“అదంతా నాకు తెలీదు ఈ ఊళ్ళో ఇంత పరపతి ఉంది మీకు టాక్సీ కోసం తెనాలి పంపలేరా ఎవర్తైనా” అని సూచించాడు అప్పటికి రాత్రిరెండుగంటలవుతూంది. అప్పగింతలనీ, ఇంకేదో అనీ అంతసేపయింది

“ఎలాగయినా టాక్సీ తెప్పించండి ఇంత ఖర్చుపెట్టాం, ఒక చెయ్యిరూపాయలకి వెరుస్తే ఎలాగూ 'అంది అనసూయత్త

“మా కార్లో వెళ్ళండి తరువాత మేం ఎలాగోవెడతాం అన్నాడు రవి.

“ఇదుగో చూడు ఈ దుమ్ము రోడ్లమీద బస్సులో నేను రాలేను రైలసలు ఎక్కలేను నువ్వూర్కో మధ్యలో అని పక్కకి పిలిచి చివాట్లు పెట్టింది పెద్దమ్మ డ్రయినిర్ని పిలిచి పెట్రోలుకి డబ్బులిచ్చాడు దారిలో ఎక్కడైనా పోయించుకోమని పెళ్ళివారింట్లో వాళ్ళని దింపి తాళంచెవులు తండ్రీకప్పజెప్పమన్నాడు

“అమ్మా! నిన్ను జాగ్రత్తాగా నేను టాక్సీలో తీసుకువెడతాను సరిగదా! నిన్నెందుకు ఇబ్బంది పెడతాను శ్రీలక్ష్మి కోసం మనం ఈ మాత్రం చెయ్యలేమా అన్నాడు. పెద్దమ్మ మొహం నల్లగా చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయింది-

“అబ్బా! మహా జాలి చూపించాడు పాపం ' అని మెటికలు విరిచింది అనసూయత్త

మొత్తానికి శ్రీలక్ష్మి పెద్దమ్మ కార్లో వెళ్ళిపోయింది తన కూతుర్ని రవికి చేసుకోలేదని అనసూయత్తకి కోపం రవి విషయంలో రవికీ కొన్ని కోరికలుంటాయని ఆవిడ బుర్రకి తట్టదు అలా అడగడంలో తప్పులేదనీ, రవి శ్రీలక్ష్మిని చేసుకోవడం, చేసుకోకపోవడ *)తన ఇష్టం కాదనీ లలా లలల లలలలలలలలలలులంలలలలలలలలలలలలలలలలలరనలనా

114 ఇల్లలకగొనే, ... పెద్దమ్మ చిన్న మాటంటే సరిపోయేది కానీ, ఆవిడలా అనదు అందువల్ల ఆ ఇద్దరి మధ్యా హాస్యాల పేరుతో సాధింపులు జరుగుతూ ఉంటాయి “పెళ్ళి విషయంలో సమాజంలో పాతుకుపోయిన భావజాలం ఇప్పటికీ మారకుండా ఉండిపోయింది ఈ వేళ్ళు పాతుకుపోయిన భావాలలో నగరాలలో కొన్ని మార్చులొచ్చినట్టు కనిపిస్తాయి అవికూడా అవసరం కొద్దీ వచ్చినవేనేమో!

“చూశావా! పెద్దమ్మని చూసి నువ్వంత భయపడతావు. రవి తను చెయ్యదలుచుకున్న వని ఎలా చేసి చూపించాడో!” అన్నాను సుధతో

“ఇంటికి వెళ్ళి వాడికి బాగా తలంటి పోన్తుంది” అంది సుధ

“మీ అమ్మని సమాధానపరిచే నేర్పు రవికుంది, నీకు లేదు నువ్వు అదివరకు నేను చూసీన సుధవి కావు నీలో సెల్ఫ్‌పిటీ బయల్ట్లేరింది నువ్వు చాలామంది కన్నా చాలా మంచి స్థితిలో ఉన్నావని గుర్తు పెట్టకుని ఆత్మవిశ్వాసంతో ఉండాలిగానీ, సానుభూతి ఆశించడం కాదు" అన్నాను కొంచెం ఆవేశంగానే,

“రేపు మాట్టాడుకుందాంలే నిద్రొస్తూంది' అంది సుధ. తెల్లవారి మేము లేచేసరికి చాలామంది బంధువులు వెళ్ళిపోయారు పతివ్రత పిన్నీ, బడాబాబూ వాకింగ్‌కి వెళ్ళారు చిన్న మామయ్య కొడుకు సుందరం వాళ్ళమ్మ దగ్గర కూర్చుని డబ్బులెక్కలేవో చెబుతున్నాడు పెద్ద మామయ్య కొడుకు రాజు షామియానా తీయించేస్తున్నాడు

“నా పెళ్ళికి ఇక్కడ తాటాకు పందిలి వేశారు నాలుగు బళ్ల తాటాకు- అంతా మా పాలంలోదే. ఇప్పుడు తాటాకంకి కూడా కరువొచ్చింది. ఆ పందిరి ఏడాది ఉండిపోయింది. దానికింద ఎంత చల్లగా ఉండేదో అంది పెద్దమ్మ షామియానా వంక చూస్తూ

“ఎన్నాళ్ళయింది! పెద్దమ్మా నీ పెళ్ళయి?

“బావుందే! ఇవ్నాళా నిన్ననా? నలభై ఎళ్ళయింది ఆంధ్రదేశంకోసం పాట్ట శ్రీరాములు గారు నిరళశనవ్రతం చేసినప్పుడే నాకు పెళ్ళి చూపులు జరిగాయి. మీ పెదనాన్నగారి మొదటి ఉద్యోగం కర్నూలులోనే

“నీ పెళ్ళి కూడా ఇంత వైభవంగా-చేశారా?”

“బాగానే చేశారు. నాకు పదహారేళొచ్చినయ్యేగానీ ఏమీ తెలిదనుకో-ఇదుగో ఈ ఊరి హైస్కూల్లోనే ఎస్సెల్సీ చదివాను గొర్రైలాగ తలవంచుకుని స్కూలుకి వెళ్ళడం, ఇంటికి రావడం, లాంతరు పెట్టకుని సాయంత్రం కాసేపు చదవడం , రేడియోలో పాటలు వినడం, ఇంటికి వారపత్రికలాస్తే చదువుకోడం- ఇదీ బతుకు పెళ్ళిచూపులకి ఎవరో వస్తారు, ఫలహారాలు, కాఫీలు తయారుచెయ్యమని మా నాన్న అరగంట ముందు మూ అమ్మకి చెప్పడం, అప్పుడీవిడ తడుముకోవడం, మా శేషమ్మత్త మా అమ్మని కూడా కాస్త తల

పెళ్ళి ప్రయాణం 115 దువ్వుకుని మంచి చీర కట్పకోమని, తను పాయ్యి దగ్గర కూర్చోడం- ఇదీ తంతు ఎన్నో పెళ్ళిచూపులు లేవులే అ రోజుల్లో ఇంత అన్యాయం ఎక్కడిదీ! ఈ బేరాలూ, ఈ ఒప్పందాలూ అప్పుడు లేవు కట్నాల రేట్లూ తక్కువే, మంచి కుటుంబం కావాలని చూసేవారు ఈ పెళ్ళివారొచ్చేరు- మా శేషమ్మత్త నాకు వదులుగా జడేసి జాజిపూలు సెట్టి, మా అమ్మఫట్టచీర ఒకటి కట్టి కూర్చోపెట్టింది వారం రోజుల తరువాత తాంబూలాలన్నారు నేనేమో ఈ పెళ్ళి కుదరకపోతే బావుండునని దేవుడి గుడికి వెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుని వచ్చాను దేవుడు నా మొర ఆలకించలేదు. వాళ్ళకి నేను చాలా నచ్చానుట కట్నం కూడా ఎక్కువ అక్కర్లేదుట వాళ్ళే నాకు చాలా నగలు పెడతారట ఎంత అదృష్టమో అని అంతా పాంగిపోయారు నేను కుంగిపోయాను ఎందుకంటే, నాకు పదహైతే, అతనికి ఇరవై అరు, నేను తెల్లని తెలుపైకే, అతను నలుపు నాకేం నచ్చలేదు. కానీ, ఆ మాట చెబితే ఎవరూ వినరు ఏడుస్తూ పెళ్ళి చేసుకున్నాను బయటికి ఏడవలేదులే శేషమ్మత్త కూడా ననిపించుకోలేదు నామాట మా నాన్న నన్ను జానకమ్మ తల్లీ, నాన్నా అని పిలిచేవాడు కానీ, ఈ పెళ్ళి నీ కిష్టమా లేదా అని అడగలేదు అయితే, నా అదృష్టం బాగుండి మీ పెదనాన్న చాలా మంచివాడని తెలిసింది ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు నేనెక్కడ అలని,పోతానో), మాసి పోతానోనన్నట్టు చూసేవారు అంతే కాదు్కుు ఆయనకి మా నాన్నలాగా ఆడవాళ్ళంటే చిన్నచూపులేదు పెళ్ళయిన కొత్తలోనే సలుపు అనేది అనర్హత' కాదని నాకు టిలిసింది నేనాయన్ని గౌరవించడం మొదలుపెట్టాను ”'

“మరి ఆయన మంచివాడు కాకపోతే, నిన్ను సరిగ్గా చూడకపోతే నువ్వేం చేసే దానివి” అన్నాను వెంటనే.

“ఏమీ చేసేదాన్ని కాను మా అమ్మని మా నాన్న ఎలా చూసేవాడు? ఆవిడేం చేసింది! అలాగే ఎడ్చుకుంటూ ఉండేదాన్ని బహుశా అవిడలా నాకూ ఫిట్టు వచ్చేవేమో!

"అమ్మమ్మకి ఫిట్లు వచ్చేవా!'

“దానికంతా చాలా చెప్పాలిలే పొద్దున్నే ఎందుకు? పదండి అలా ఒకసారి మనం కూడా కాలవగట్ల వెంబడి కాసేపు నడిచి మన పాలాలవీ చూసొద్దాం " అంది పెద్దమ్మ

“మన పాలాలా, మామయ్యగారి పాలాలా? మనళిక్కడివమ్మా పాలాలు"” అంది సుధ.

“పోనీ మామయ్య పాలాలే అనుకో!”

నాకు నవ్యొచ్చింది పోనీ అనుకోవడం ఎమిటి! అవి ఖచ్చితంగా మామయ్య పాలాలే

“నీకెంత కట్నం ఇచ్చారు పెద్దమ్మా అన్నాను

“ఎంతమ్మా!మూడువేల అయిదు వందలు- అందులో వాళ్ళు మళ్ళీ నన్ను చీరలు కొనుక్కోమని వెయ్యి రూపాయలిచ్చారు ఆ వెయ్యిలో మా నాన్న ఆరు వంగలు పెట్టే చీరలు

116 ఇల్లలకగానే. ... తెచ్చాడు నాకు. ఎందుకంటే, వెండి కంచం కొనాల్సి వచ్చిందట. దానికి డబ్బు తక్కువైందట, అందుకని,”

“అప్పుడు మీ నాన్నకెంత పాలం ఉండేదో!”

“ఎంత లేకేం జయా . ఇరవై ఎకరాలుండేది. అయిదెకరాల గరువుండేది శేషమ్మత్త పొలం రెండెకరాలుండేది అయినా, ఈయన నా కట్నం దగ్గర చాలా ఆలోచనలు చేసి పాపం చివరికీ సంబంధం ఖాయం చేసేడు ఆ కట్నం సొమ్ము మూడువేల అయిదు వందలు, పెళ్ళి ఖర్చూ, నా పెద్దకూతురు పుట్టినప్పుడు పురిటి ఖర్చూ తప్ప ఈ ఇంటి సామ్ము ఇంక నేనేం ఎరుగను ”

“మా అమ్మకసలు పెళ్ళి ఖర్చు లేదు గదా?”

“అవును మీ అమ్మ చదువుకుంటానని గోలచేస్తే గుంటూర్లో ఉంచి చదివించాడు అదీ మాపిన్ని ఇంట్లో ఉంచి హాస్టల్‌ ఖర్చు లేదు ఆ రోజుల్లో కాలేజీ ఫీజెంత? చాలా తక్కువ ఇప్పట్లా ట్యూషన్లూ లేవు అది ఇష్టపడ్డవాణ్లి చేసుకోడానికి ఈయన వీల్తేదన్నాడు దానికిష్టం లేకుండా ఈయన దానికో సంబంధం చ్తూశ్తాడు అదేమో మీ నాన్నని పెళ్ళి చేసుకుని వచ్చింది ఈయన ఇంటికి రావద్దన్నాడు ఇంతా చేస్తే అది కులాంతరమూ కాదు మతాంతరమూ కాదు చుట్టులబ్బాయే- అతనికి ఆస్తి లేదని మీ అమ్మ ఈ ఇంటి సామ్ము అసలెరగదు, ఆ చదువు తప్పితే ఆఖరికి పెళ్ళి చేసుకోడానికి వెడుతూ, మెడలో ఉన్న గొలుసు కూడా తీసిచ్చిపోయింది అది మొదలు మీ అమ్మా నాన్నా చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ఇద్దరూ ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడ్డానికి దాదాపు అయిదారేళ్ళుపట్టింది అప్పటివరకూ మా నాన్న వాళ్ళకి రూపాయి సాయం చెయ్యకపోగా, పరాయి వాళ్ళని వెక్కిరించినట్లు వెక్కిరించేవాడు. అందుకే వాళ్ళు అందరికీ దూరంగా ఢిల్లీలో స్థిరపడిపోయి హాయిగా బతికారు వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఉండడానికో ఇల్లు, ఇవ్వన్నీ అమిరాక అప్పుడు అంతా ఢిల్లీ పనులుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగడం సాగించారు అదే మీ నాన్నకి కోపం అందుకే రాడిక్కడికి పెల్లి చేసుకుని వస్తే గుమ్మం తొక్కద్దన్నాడు కదా మావగారు. అదమ్మా ఆడపిల్లలకి జరిగే మర్యాద "

“మరి విజయ పిన్నికో.”

“విజయ పిన్ని పెళ్ళినాటికీ ఇంకాస్త పెరిగాయి కట్నాల రేట్లు వాటితోపాటు పాలాల రేట్టూ, వడ్డ బస్తాల రేట్లూ, మినుముల రేట్లూ పెరగలా మరీ! దానికి పదివేలిచ్చాడు అంతే '

ఒక పక్క నుంచి కట్నాల పీడింపు లెక్కువగా ఉన్నాయనీ, అదంతా ఇవ్వడానికి ఆడపిల్లల తండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారని వింటూంటే, ఆస్తి ఉంచుకుని కూడా ఆడపిల్లల కోసం ఖర్చుపెట్టని తండ్రుల గురించి పెద్దమ్మ చెబుతోంది వీళ్ళ గురించి ఎవరూ మాట్లాడరేం? ఇదే అమ్మతో అన్నాను నేను

పెళ్ళి ప్రయాణం 11/7 “అంటే కట్నాలు ఇవ్వడం మంచిదంటావా నువ్వు అంది అమ్మ “కట్నం గురించి కాదమ్మా మన దగ్గర శక్తి ఉన్నప్పుడు ఎ వస్తువైనా మనకి నచ్చింది కొనుక్కోవాలనుకుంటాం గదా! చవగ్గా వచ్చింది గదా అని నచ్చనిది కొనుక్కోంగదా అలాంటప్పుడు కట్నం తప్పనిసరి అనుకున్నప్పుడు, డబ్బున్న తండ్రులు పిల్లకి నచ్చినవాణ్మి కొంచెం ఎక్కువ ధర పెట్టి కొనిపెట్టవచ్చు గదా! “దానివలన ఆడవాళ్ళ స్థితి బాగుపడుతుందంటావా? ఆ డబ్బు పెళ్ళికొడుకు తీసుకోడు తన భార్యకూ ఇవ్వడు తలిదండ్రులకే పోతుంది. మళ్ళీ ఆ పిల్ల వాళ్ల మీద అధారపడాల్సిందే మగపిల్లవాడి కోసం ఎన్ని కష్టాలైనా పడతారు ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా ఉందో, ఎంత కష్టపడుతోందో గమనించినా పట్టించుకోరు. ఈ పుట్టింటి అండ లేకనే కదా ఇన్ని ఆత్మహత్యలు నిజానికి ఉత్తర హిందూస్థానంలో ఉన్న కట్నాల పిచ్చి దక్షిణంలో లేదు కొన్ని కులాల్లో ఎక్కువ కట్నం అంటారు వాళ్ల దగ్గర బాగా డబ్బుండి ఇస్తారు అస్తి ఉంటే భాగం "పెట్టారా? అలాగన్న మాట కొన్ని కుల్లాల్లొ ఎంత డబ్బున్నా ఆడపిల్లకి పెట్టడానికి వెనకా ముందూ ఆలోచించి ఉన్నదంతా కొడుక్కి కట్టబెట్టి, చివరికి అతని మీద ఆధారపడతారు పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్లు తగ్గి, పిల్లలే పెళ్ళిళ్ళు చేసుకునే స్థితికి వస్తేగానీ కట్నాలు పోవేమో! మేం అలా మాట్లాడుతుంటే గాయత్రి మాకు కాఫీ తెచ్చిచ్చి 'రాజు బావ మిమ్మల్నందర్నీ రమ్మంటున్నాడు పొలం చూపిస్తాట్ట”" అంది- సన్నగా సూదిలా ఉండే గాయత్రి కళ్ళు చాలా చురుగ్గా ఉంటాయి, ఈ పిల్ల ఎవరో తెలీలేదు మేం బయలుదేరే వేళకి శారదత్తయ్య మాకు పెద్ద పఫ్లాస్కుతో కాఫీ ఇచ్చింది ఆవిడ అనసూయత్తలా అతిగామాట్లాడదు చేసే పనిలో ఇష్టం, (ప్రేమా ఉంటాయి ఇలాంటి తల్లి పెంపకం వల్లనేమో రాజుకి మనుష్యుల్ని (ప్రేమించటం, స్నేహంగా ఉండడం అలవాటయింది దిగు మామయ్య కొడుకు సుందరం ఎవరితోనూ కలవడు. మనసు విప్పి మాట్లాడడు మేమంతా చాలా సుఖంగా ఉన్నామనీ-తన తండ్రీ, తల్లీ, తనూ చాలా కష్టపడిపోతున్నారనీ అనుకుంటాడు సుందరానికి హైదరాబాద్‌లో ఉద్యోగం రావడానికి బడాబాబే కారణం అందుకని ఆయన్ని కొంచెం గౌరవిస్తాడు రవికి కుటుంబ రాజకీయాలు తెలీవు వాడికి తన చదువూ, సంపాదనా తప్ప చిన్నప్పటినుంచీ మరో ధ్యాస లేదు కానీ, అందరితో సరదాగా ఉంటాడు అడిగితే తప్ప అమెరికా గురించి చెప్పని ఇంకో మంచి గుణం కూడా ఉంది ఆ ప్రేమ ప్రకటించే శక్తి వాడికి డాలర్లిచ్చాయి. ఎవరి మీదా అసూయపడే అవసరం వాడికి లేదు మొదటినుంచీ వాడికి ఒకే గమ్యం దాన్ని చేరుకోడానికే శ్రమిస్తాడు పక్కనేం జరిగినా పట్టించుకోడు రాజు కూడా జనాన్ని ప్రేమిస్తాడు వాడికీ అసూయ లేదు రవి డాలర్లతో (పేమ

116 ఇల్లలకగానే. . ,. ప్రకటిస్తే, రాజు మాటతో, సహాయంతో ప్రకటిస్తాడు మనసు విప్పి మాట్టాడతాడు రాజు నాకు చాలా నచ్చాడు

రాజు మమ్మల్ని పోస్టాఫీసు బజారులో నుంచి కాలువగట్టుకు తీసుకువెళ్ళాడు ఆ బజారులో దాదాపు అరడజను కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి - పొలాలు అమ్మురుని, ఇళ్ళు పాడు పెట్టకుని

“ఎందుకనిరా రాజూ'' అంది పెద్దమ్మ అమాయకంగా

“ఒకటి చెబుతాను విను అతా! పొలం మీద గౌరవం లేనివాడికి పాలం ఉండకూడదు. పాలం అంటే తల్లితో సమానం. మనకి అన్నం పెడుతుంది గదా అలాంటి తల్లిని ఎవరికో కౌలుకిచ్చి అవసరం వచ్చినప్పుడల్లా ముక్కలు ముక్కలుగా నరికి అమ్మేవాళ్ళకి పాలం ఎందుకు, చెప్పు? పొలంలో వ్యవసాయం ఇష్టంగా చేసుకునే వాడికి ఉండ్జాలి అప్పుడు దాని మీద వాడీకి గేమ ఉంటుంది ”

“ “వ్యవసాయం చెయ్యడం అందరికీ చేతకావద్దు? కొందరికి చేతకాకపోవచ్చు. దానికీ ఊరు విడిచిపోవడానికీ లంకేమిటీ” అంది పతివ్రత పిన్ని

పెద్దమ్మ కన్నా అమ్మకన్నా పిన్ని చిన్నదే అయినా, వాళ్ళకన్నా కొంచెం అమాయకంగా ఉంటుంది - తెలివిగా ఉండవలసింది పోయి

“ఈ ఊరు విడిచిపోయినవాళ్ళందరూ. బీచవాళ్ళేం కాదు సాలాలున్నవాళ్ళే ఒక ఎకరం పొలం మీద ఆధారపడి బతికి, దాన్ని పదెకరాలు చేసినవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు కానీ, వీల్లో! ఉన్న పదెకరాలనీ కొంచెం కొంచెం అమ్ముకుని చివరికి వెళ్ళిపోయారు వీళ్ళకి వీళ్ళ శక్తిమీద గౌరవం లేదు పాలం మీద అంతకన్నాలేదు ఆఖరికి వాళ్ళ భార్యా బిడ్డల మీద కూడా థద్ధ, గౌరవం లేవు ”

“నువ్వు చెప్పేది నాకేం అర్ధం కాదు” అంది పిన్ని

“వాళ్ళ సంగతి వదిలెయ్‌ నీకర్థ్మమయ్యేలా చెప్పాలంటే నీ పుట్టింటినే ఉదాహరణగా తీసుకో! మీ ళలాత మీ నాన్నకి ఎంత పాలం అప్పగించి పోయాడు. పాతిక ఎకరాలిచ్చాడు - అవునా?”

“అవును ”

“అందులో పండని పాలం ఉందా అంటే లేదు ఆడపిల్లలకేమైనా ఇచ్చాడా అంటే లేదు దానం చేశాడా అంటే లేదు స్కూళ్ళు కట్టించాడా అంటే లేదు లైబ్రరీ కట్టించాడా అంటే లేదు మరి ఆయన చేతి మీదుగా పదిహేనెకరాల పాలం అమ్మేశాడు. ఎందుకు?

“ఎందుకు?”

“ఆయనకి తనతో బతికే భార్య మీద, తన పంచన చేరిన అక్క మీద, కడుపున పుట్టిన బిడ్డల మీద గౌరవంగానీ, శ్రద్ధగానీ లేవు అంటే నీకు కోపం వస్తుందిగానీ, అది నిజం బహుళా

పెళ్ళి ప్రయాణం 119 అది ప్యూడల్‌ మగవాడి మనస్తత్వమేమో మరి పాలంలో చేసే వ్యవసాయందగ్గర్నుంచీ ఇంట్లో వంచే కూరల దాకా అతనిదే పెత్తనం భార్య అనారోగ్యవంతురాలు. పదిమంది బిడ్డల్ని కన్నది, మరి ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేదా? ఉంది పదిమంది బిడ్డల్లో ఎంతమంది బతికారు? అయిదుగురు ఎప్పుడు చూసినా ఆవిడ అటు కడుపుతో ఉండో, ఇటు పసిబిడ్డ తల్లిగానో ఉండేదట జబ్బులతో, కాన్పులతో ఉసూరుమంటూ ఉండేదట కనీసం స్నానం చెయ్యడానికి కూడా ఓపిక లేకుండా ఉండేదట ఎప్పుడూ మురికి ఓడుతూ, జుత్తు ముడి వేసుకుని ఉండేదట ఈయన తెల్లవారగానే ఇస్త్రీ బట్టలు వేసుకుని, కర్చీఫ్‌ మడతల్లో పొడరు వేసుకుని బయలుదేరేవాడు ఊరి వ్యవహారాలు కావాలి ఎ వ్యవహారం చేసినా, 'ఐం చెయ్యటోయినా ఇంట్లో చెప్పే పని లేదు పాలం అమ్మినా, నగలు తాకట్టు పెట్టినా, ఎవరి సలహా అక్కర్లేదు అసలు ఆయన ఇంట్లో ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడేవాడా!చాలా ముభావంగా ఉండేవాడు మాట్టాడితే చులకనౌతానని భయం. మీ అమ్మ తలుపుచాటున నిలబడి ఆయనతో రెండు మాటలు మాట్లాడేదట. అంతే అదుగో అలాంటి కుటుంబాలే ఇవి వాళ్ళ మగపిల్లలకి కాస్త చదువులు వచ్చాయి అందుకోసమని పిల్లలకి ఉద్యోగాలొచ్చిన ఊళ్ళకి వెళ్ళిపోయారు ఆ పిల్లలేమో ఆస్తులు అమ్ముకురమ్మని వేధిస్తారు అమ్ముకొచ్చాక, ఇచ్చేదాకా వేపుకు తింటారు ఇచ్చినాక బతికి ఉన్నందుకు విసుక్కుంటారు అవీ వీళ్ళ బతుకులు ” రాజు ఊపిరి పీల్చుకోడానికి ఆగాడు నేను విసయంతో చూస్తున్నాను అతని మొహం వంక

“మా తాతయ్య అదృష్టం బావుండి ఇంకా కొంత పాలం మిగలడమేకాక, మా నాన్నలకి చదువు అబ్బలేదు దాంతో 'విధా! ఖర్మమా! అని ఇక్కడ ఉండిపోయారు. కాకపోతే ఏ గుమాస్తా ఉద్యోగాలో చూసుకుని పోయేవాళ్ళు "'

“గుమాస్తా ఉద్యోగాలేం? ఈ ఊరి వాళ్ళకి అంతకన్నా మంచి ఉద్యోగాలు రాలేదా

  • అన్నాను తెలుసుకుందామని “వచ్చాయిలే ఊర్కే అంటున్నాను మీ అమ్మ (ఫెండు విక్టోరియా ఆంటీ ఉంది ఆవిడ కొడుక్కి పోలీస్‌ సర్వీస్‌ సెలెక్షన్‌ వచ్చింది మొన్ననే స్టేషన్‌ నుంచి వచ్చేదారిలో పెద్ద మేడ కట్టాడు చూడు, ఆయనకొడుకు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఇంకా చాలామందికి మంచి ఉద్యోగాలే వచ్చాయి! అదికాదు నేను చెప్పేది ఇప్పుడీ అరడజను కుటుంబాలు వెళ్ళిపోతే ఊరికేం నష్టం లేదు. ఆ పాలాలు కొనుక్కున్న వాళ్ళు హాయిగా పండించుకుంటున్నారు "

“వ్యవసాయానికి కూడా చాలా పెట్టుబడి పెట్టాలట సరిగ్గా పండవుట కొన్నిసార్లు అదంతా మనం పడలేం దానికి తగ్గవాళ్ళు పడతారు” అంది పిన్ని మళ్ళీ

120 ఇల్లలకగానే...,. నం

“నీ ఉద్దేశం నాకర్థం అయిందిలే అత్తా అదంతా పూర్వం మీరనుకునే మాటలు! అంతే ఈ పనికి వీళ్ళూ, ఆ పనికి వాళ్ళూ అని ఎవరి మొహానా ఉండదు”

“ఇంకేమిటి ఈ ఊరి సంగతులు” అంది అమ్మ “నిజం చెప్పాలంటే ఈ ఊళ్ళల్లో పెద్ద గొడవలుండవు వర్షాలు కురవవనీ, కరువులనీ ఉండవు, ఎప్పుడో తప్ప పాలాలన్నీ బొగా పండుతాయి పంట కాలవలున్నాయి డ్రైెయిన్స్‌ ఉన్నాయి మంచి నీళ్ళున్నాయి గేదెలకి గడ్డి లేక చచ్చిపోవు మురాకక్షలూ, హత్యలూ, కోర్టులూ లేవు, ఎప్పుడో తప్ప నిదానంగా ఉంటుంది బతుకు - చిన్న చిన్న జబ్బులకి ఊళ్ళో డాక్టరున్నాడు ఆయన పనికిరాడనుకుంటే గంటలో గుంటూరు వెళ్ళొచ్చు గుంటూరు నిండా డాక్టర్లే తెనాలిలోనూ డాక్టరే మీ హైదరాబాద్‌లో కోరీనో, నాంపల్లో వెళ్ళినట్లు షాపింగ్‌లకి తెనాలి వెళ్ళొచ్చు ఇక్కడ దేనికీ లోటు లేదు ఎటిలో కూడా మంచి నీళ్ళ ట్యాంక్‌ కట్టారు మిషనరీ వాళ్ళు ఇంగ్లీష్‌ మీడియం స్కూలు కట్టారు ఊళ్ళో పిల్లలు సిటీ బస్సెక్కి తెనాలి కాలేజీకి పోతారు ”

“వెంకట్రామయ్య పెద్దనాన్న బావున్నాడా? మణి ఎలా ఉందో” అంది పెద్దమ్మ

“ఆయనకేం అత్తా! వడ్డీ వ్యాపారం కదా! గుంటూర్లో సినిమాహాలు కట్టాడు. మన ఊళ్ళు వడ్ల మిల్లుంది తన ఇల్లంతా బ్రహ్మాండంగా కట్టించుకున్నాడు.”

“మరి శాస్త్రిగారి పిచ్చి పెళ్ళాం ఏమయిందో!

మా పెద్దమ్మనలభై ఏళ్ళనాడు ఊరు వదిలి వెళ్ళినా, ఇక్కడి కబుర్లు తెలుసుకుంటూనే ఉంటుంది. ఏడాదికొకసారి వచ్చి అందర్నీ చూసి వెడుతూ ఉంటుంది

“అవిడేం కాలేదు ఆయన పోయాడు పోయాక ఈవిడ పిచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు హాయిగా ఉంది.

“అదేంపిచ్చో”'

“మన నాయనమ్మకి - అదే, మీ అమ్మకి ఫిట్ట్లు ఎందుకు వచ్చేవో తెలుసా?”

“చెప్పు - నువ్వు మా అందరికన్నా ముందు పుట్టినట్టున్నావు” అంది అమ్మ అతని నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి

"అదిగో ఆ కాలువ ఒడ్డున పెంకుటిల్లుంది చూశావా? అది వడ్డు దంచే బాలమ్మది. మన ఊళ్ళో వడ్డమర రాక ముందు మన ఇంట్లో వడ్లు దంచడానికి వచ్చేది ఆవిడ వడ్లు దంచడానికి వచ్చినప్పుడల్లా ఈవిడకి ఫిట్టు వచ్చేది ఆ పెంకుటిల్లు బాలమ్మకి తాతయ్య కట్టించి ఇచ్చిందే బాలమ్మ కొడుకు ఎంకటేశులుంటాడు చూడు చిన్న తాతయ్యగారింట్లో కొన్నాళ్ళు కమతానికి ఉన్నాడు వాడి మూతి అచ్చం తాతయ్యదిలాగే ఉంటుందిట *”

“నోర్ముయ్యరా! సన్యాసీ అంది పిన్ని నవ్వు ఆపుకుంటూ ఈ కథలన్నీ వాళ్ళకి తెలియనివి కావేమో!

పెళ్ళి ప్రయాణం 121

నడిచి నడిచి పాలం వచ్చేసింది ప్రస్తుతం అక్కడేం పనులు జరగడం లేదు కోతలకి ఇంకా రెండు నెలల సమయం ఉందట. చిన్న మామయ్య అమ్మిన పాలం చూపించాడు. పక్కనే ఉంది. నాట్ట్లుకాకముందే అమ్మేడట పెద్దమ్మ అందరికీకాఫీ ఇచ్చింది.

“ఈ గాయత్రి ఎవరు రాజూ” అంది సుధ ఉన్నట్టుండి

“ఆదా! అది మంగమ్మగారి మనవరాలు. దానికో పెద్ద కథ ఉందిలే. వింటానంటే చెబుతా.”

“అడిగాక వినకతప్పదు గదా!”

“మీ అమ్మ మేనత్త శేషమ్మగారి పేరు వినే ఉంటావుగా!”

“అయ్యో! ఎందుకు వినలేదూ? శేషమ్మత్తని నేను చూశాను కూడా! హైదరాబాద్‌ వచ్చింది. అమ్మ తీసుకొచ్చింది ఓసారి ”

“ఆవిడ కథ తెలుసా నీకు? చెప్పనా?”

“తెలుసులే. బాల వితంతువు నగలతో, మామగారిచ్చిన డబ్బుతో మీ- ఇంటికీ వచ్చింది ”

“నే బెబుతా విను మా మేనత్త సంగతి'' అని పెద్దమ్మ అందుకుంది “ఆవిడ ఆ డబ్బూ నగలూ తెచ్చి మా తాతయ్యకిచ్చి, వాటితో తనకి పాలం కొనిపెట్టమని అడిగింది కొంటాను కొంటానంటూనే కొనకుండా చచ్చిపోయాడాయన తన తమ్ముడయిన మా నాన్నని సతాయించగా, సతాయించగా, తను అమ్మదలుచుకున్న పాలం ఒక ఎకరం ఆవిడ పేర పెట్టాడు కానీ, ఆవిడ చనిపోయేవరకూ దానిమీద వచ్చే అయివేజు పూర్తిగా ఆవిడకి ఇవ్వలేదు జబ్బు మనిషి అయిన మా అమ్మని కూర్చోపెట్టి మాకందరికీ ఎంతో సేవ చేసింది ఆవిడ మమ్మల్నందర్నీ పెంచింది కూడా ఆవిడ మేం పురుళ్ళు పోసుకుంటే ఆవిడే మాకు దిక్కు మాకు జబ్బులు చేస్తే కూడా అవిడే నూకు చేసేది పిల్లలు లేని ఆవిడ శక్తినంతా మాకే ధార పోసింది ' పెద్దమ్మ కళ్ళు చెమర్చాయి కళ్ళజోడు తీసి తుడిచి పెట్టకుని, “ఈ మంగమ్మగారి కథ కూడా అంతే అది ఇంకా అన్యాయంగా ఉంటుంది. ఈవిడ మాకు దూరపు బంధువు ఆవిడకి ఈ ఊళ్ళో కాస్త పాలం ఉంది దాని మీద అయివేజు ఇవ్వక రైతులు ఎడిపిస్తుంటే దానిని మా తాతయ్యకి అప్పజెప్పింది ఈయన కూడా ఆవిణ్ణి ఏడిపించాడు. చివరికి కూతుర్ని తీసుకొచ్చి మా ఇంట్లోనే ఒక గదిలో ఉండిపోయింది ఆ కూతురికి మా తాతయ్య ఒక దిక్కుమాలిన సంబంధం చూసి పెళ్ళి చేయించాడు. అతగాడొట్టి తెలివి తక్కువవాడు అ తెలివి తక్కువవాడు మా తాతయ్య దగ్గర పనిచేసేవాడు. అప్పట్లో పంచాయితీ వారు ఇంకా మంచి నీళ్ళ పంపులు వెయ్యలేదు ఊరి చివర మంచినీళ్ళ బావిలో నుంచి నీళ్ళ కావిడి తెచ్చేవాడు బండి తోలుకుని పాలం వెళ్ళేవాడు ఈవిడ, మంగమ్మగారు

122 ఇల్లలకగొనే.. .. మా ఇంట్లో వంట చేస్తూ, పచ్చళ్ళు నూరుతూ, కందులూ, మినుములూ విసురుతూ తాతయ్య ఇచ్చే పదీ పరకా తీసుకుని బతికేది ఆవిడ కూతురు విస్తళ్ళు కుట్టీ, ముత్తయిదువగా పెళ్ళిళ్ళకు వెళ్ళీ కాలం గడీపేదిగానీ, వాళ్ళెవరూ తాతయ్య మీద కోర్టుకి వెళ్ళలేదు గట్టిగా పోట్లాడినప్పుడు ఓ వంద రూపాయలిచ్చేవాడు కార్తీకమానంలో కాలవ స్నానానికి వెళ్ళి కాలు జారి కాలువలో పడి చచ్చిపోయింది మంగమ్మగారు ఆవిడ పోయిన ఏడాదికే మా తాతయ్య కూడా పోయాడు పెత్తనం మా నాన్న చేతికొచ్చింది మంగమ్మ అల్లుడికి మానాన్న ఎదుట మాట్లాడే ధైర్యం లేదు కూతురే చాలాసార్లు రొక్కించి అడిగింది దానితో మా నాన్న అవిడ చేతిలో ఓ నాలువేల రూపాయలు పెట్టి పాలం తనకి అమ్మినట్లు రాయించేసుకున్నాడు ఆ నాలుగువేలు ఆవిడ జబ్బుపడ్డప్పుడు ఖర్చయిపోయాయి ఆవిడకి చాలా జబ్బు చేసింది ఆరు నెలలకి పైనే గుంటూర్లో ఉండి వైద్యం చేయించుకుంది తరువాత మా నాన్న ఇచ్చే కూలీయే ఆధారం. అప్పటిదాకా పిల్లలు లేని ఆవిడకి నలభయ్యో పడిలో గర్భం వచ్చింది ఈ గాయత్రిని కని ఆవిడ చనిపోయింది అమె పోయిన ఏడాదికే అతనూ పోయాడు దాన్ని మా అమ్మే పెంచింది ఓ ఏడాది తరువాత శారద పెంచుతోంది ఎలాగైనా శారద దారి వేరు" “ఎండ చురుక్కుమంటోంది ఇంక వెడదాం మీ బాబాయిగారికి భోజనం వేళైంది అంది పతివ్రత పిన్ని కొత్తగా డబ్బు సంపాదించి కొత్త పద్ధతిలో కట్టిన కొత్త ఇళ్ళు, పాతబడి పెచ్చులూడీపోయిన పెంకుటిళ్ళు, రెల్లు కప్పులు వేసిన ఇళ్ళు దాటుకుంటూ దాటుకుంటూ నడుస్తుంటే ఒక పెద్ద మేడ మీద డిష్‌ యాంటెనా కూడా కనిపించింది, “మొత్తానికి ఇది జీవం ఉన్న ఊరు ' అనిపించింది “దిన్న మామయ్య చాలా తెలివితక్కువ పని చేస్తున్నాడు రాజూ. ఈ గాలీ, ఈ వెల్తురూ, ఇంత ఇల్లూ వదిలిపెట్టి కొడుకు పంచన చేరడం బాగాలేదు అంది పెద్దమ్మ “నేనెంతో చెప్పి చూశాను వినలేదు అసలు శ్రీఆక్ష్మికింత కట్నం ఇచ్చి ఈ సంబంధం చేయ్యడం కూడా నాకిష్టం లేడు మన వెనుక బజార్లో ఉండే వెంకటరత్నం మాష్టారబ్బాయి రఘు శ్రీ లక్ష్మిని చేసుకుంటానని బాబాయిని ఎన్నోసార్లు అడిగాడు తనకి కూడా రఘు అంబే చాలా ఇష్టం రఘుకి ఆడంబరాలు గిట్టవసలు సింపుల్‌గా పెళ్ళీ చేసుకుంటానన్నాడు. కట్నం అక్కర్లేదన్నాడు అమ్మిన పాలం శ్రీలక్ష్మి పేర రాసిచ్చి, రఘుకిచ్చి పెళ్ళి చెయ్యనుని ఎంతో చెప్పాను వినలేదు పెళ్ళికి ముందు అది చాలా ఎడ్చింది అనసూయ పిన్ని దాన్ని తిట్టింది. “ఎందుకని రఘుకివ్వనంది? “వాడు పల్తెటూరి వాడట ఉద్యోగం లేదట. నీకు తెలుసా జయా? వాడి పాలం అంతా మెట్టపాలం పసుపు వేస్తాడు మనకన్నా రెట్టింపు వస్తుంది వాడికి వాళ్ళమ్మ చాలా మంచిది ”

పెళ్ళి ప్రయాణం 1ప3

“మీ బాబాయి నచ్చజెప్పలేదా మరి పిన్నికి

“ఆయనకీ ఇష్టమే బస్తీ సంబంధం, గొప్పగా పెళ్ళి చెయ్యడం. ఇప్పుడు ఇంట్లో సగం అమ్ముతానంటాడు కొనడానికి మా నొన్న దగ్గర డబ్బు లేదు ఇల్లు కొనాలంటే పాలం అమ్మాలి అదినా కిష్టం లేదు మమ్మల్ని అలాంటి ఇరుకులో పెట్టాడు ఇదంతా సుందరం చేస్తున్నదే. డబ్బంతా తెచ్చి హైదరాబాద్‌లో ఎపార్ట్‌మెంటు కొనమంటాడు. పెళ్ళీకాగానే ఎపార్ట్‌మెంటులో తల్లీతండ్రీ ఎక్కువైపోతారు అప్పుడుంటాయి వీళ్ళ పాట్లు ”

ఇంటికొచ్చేసరికి అందరికీ గుండెల్లో బరువుగా ఉన్నట్లనిపించింది బడాబాబుకి శారదత్త భోజనం పెట్టిందని తెలిసి ఫిన్ని స్తిమితపడింది అందరికీ హాలులో వరుసగా భోజనాలు వడ్డించారు శారదత్తయ్య, గాయత్రీ అనసూయత్త అలసిపోయానని పడుకుంది.

కొంచెం ఎక్కువగా తిన్నట్టనిపించింది.

“నువ్వొక్కదానివే ఉంటావు కాబోలు! వండుకుంటావా? హోటల్‌లో తింటావా" అంది సుధ

“మేం పగలు క్యాంటీన్‌లో తింటాం సాయంత్రం పనిమనిషి వండేస్తుంది నలుగురం కలిసి ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకున్నాం బావుంటుంది రాకూడదూ ఎప్పుడైనా! నిన్ను బాగా తిప్పుతాను టూరిస్ట్‌ బస్‌లలో "

పెద్దమ్మా, అమ్మా కబుర్లలో పడిపోయారు వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుని లోకాన్నే మర్చిపోతున్నారు ఆ కబుర్లు వింటూ ఉంటే అప్పుడు వాళ్ళు నవ్వుతున్న నవ్వు ఇంకా పదేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి చాలుననిపించింది నేను సుధని చెయ్యిపట్టుకుని తీసుకొచ్చి ఎవరూ లేనిచోట కూర్చోబెట్టి అడిగాను,

  • “చెప్పు సుధా, నీ సంగతి ”

“నీ సంగతి చెప్పు ముందు” అంది ఎదురు తిరిగి

“ఏం ఉందీ! నేనీ ఉద్యోగంలో చేరి ఏడాదైంది చాలామంది స్నేహితులయ్యారు ఆడవాళ్ళూ, మగవాళ్ళూ నేనెవ్వర్నీ నా జీవితంలోకి ఆహ్వానించే దృష్టితో ఇంకా చూడడం లేదు పెళ్ళి మీదకి నా ఊహలు పోవడం లేదు" అన్నాను.

అప్పుడు చెప్పింది సుధ తను ఎంఎ చదివేటప్పుడు ఒకతన్ని పెళ్ళి చేసుకోవాలను కుందట కానీ, పెద్దమ్మ ససేమిరా ఒప్పుకోలేదట పైగా తను చూసిన సంబంధమే చేసుకోవాలని వాగ్జానం కూడా చేయించుకుందట. ఆవిడ సంబంఢథాలు చూస్తూనే ఉందట. ఏదీ కుదరడం లేదట,

“ఎందుకని కుదరడం లేదు?”

“జొతకాలంటారు కట్నాలంటారు క్వాలిఫికేషన్‌ ఎక్కువైందంటారు తక్కువైదంటారు '

124 ఇల్లలకగానే, ... లలత తతత తయ

“అప్పుడతన్ని ఎందుకు వదిలేశావు? కేవలం అమ్మకోసమేనా?”

“అవును నాకు ధైర్యం చాలలేదు అతను తెలుగువాడు కొదు మన కులం కాదు మా అమ్మకి తెలిసి గొడవ చేసింది బెదిరించింది ఇంక అతనికి చెప్పేశాను ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఇప్పుడతనికి పెళ్ళయిపోయింది. మద్రానుకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు, స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం ”

"పెద్దమ్మ అప్పుడలా చేసింది గానీ, నువ్వు ఆవిణ్ణి కన్విన్స్‌ చేస్తే మారి ఉండేది ఆవిడ నువ్వనుకున్నంత చెడ్డదిగాదు చాలామంది అడవాళ్ళు బయటికి అలా పులి బొమ్మ మొహానికి వేసుకుని తిరుగుతారు వాళ్ళ అసలు మొహం వేరే ఉంటుంది కన్నబిడ్డలకు కూడా దాన్ని చూసే ఓర్పు ఉండదు ఎందుకనంటే, మన సమాజంలో నిజాన్ని వెతుక్కునే తీరిక ఎవరికీ లేదు తమకి తెలిసిన కొంచమే సర్వస్వం అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు.”

సుధ ఎటో చూస్తూ కూర్చుంది

“మేము మీ కంటే అన్ని విధాలా అధికులం అని విర్రవీగే మగవాళ్ళల్లోనే చాలామందికి ఆలోచనలేనప్పుడు, వాళ్ళెప్పుడూ అణచి ఉంచడానికి ప్రయత్నించే స్త్రీలలో ఎలా ఉంటుంది? ఆడవాళ్ళకి ఆలోచన లేదనీ, గయ్యాళులనీ అనే వాళ్ళంటే పరమ చిరాకు నాకు వాళ్ళ ఆలోచన వికసించడానికి, వాళ్ళలో ఒక బ్యాలెన్స్‌డ్‌ అవుట్‌లుక్‌ రావడానికి ఎవరు దోహదం చేస్తున్నారు? మీ అమ్మని మీ కంటే మీ నాన్నే బాగా అర్ధం చేసుకున్నారు” అన్నాను.

“ఆయనకి ఆవిడంటే చచ్చే భయం” అంది సుధ రకీమని

“అదంతా వొట్టిదే ఆయన కెందుకు భయం? ఆవిడలా ఉండడమే ఆయనకిష్టం లేకపోతే ఎప్పుడో ఆవిడ నోరు నొక్కేసి ఉండేవాడు పైగా మీ అమ్మ మీ నాన్నని ఎప్పుడూ గౌరవంగా చూస్తుంది ఆయనకి కావల్సినవన్నీ చూడడమేగాదు, పిన్నిలా ఆయన అడుగులకి మడుగులొత్తే దాసిలా ఉండదు. మనిషిలా ఉంటుంది అది కూడా ఆయనకిష్టం నీకు తెలుస? ఎంత సేవ చేసినా పతివ్రత పిన్నంటే బాబాయికెంత లోకువో? చెయ్యకేం చేస్తుందన్నట్లుంటాడు "

“సింపుల్‌గా, నెమ్మదిగా ఎందుకుండవూ"” అన్నాను పెద్దమ్మని ఆవిడొకసారి బెంగుళూరు వచ్చి నా ఎపార్ట్‌మెంటులో పదిహేను రోజులున్నప్పుడు మా స్త్నేహితులందరితో ఎంతో హాయిగా గడిపింది మాకు కావల్సినవన్నీ వండిపెట్టింది మేం ఆవిణ్శి మైసూరు, శ్రావణబెళగొళ కూడా తీసుకువెళ్ళాం. అప్పటినుంచీ పెద్దమ్మ నాకు స్నేహితురాలైపోయింది

“నేను గయ్యాళినీ కాను, ఎమీ కాను మీ అమ్మలాంటిదాన్నే. అయితే, నేనిలా ఉండకపోతే మా అత్తగారూ, ఆడబడుచులూ నన్ను ఉత్త గంగిగోవును చేసి గాటకి కట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళకన్నా నేను చిన్నదాన్ని మనసు బాధపడితే ఓదార్చడానికి మా అమ్మకి చేతకాదు.

పెళ్ళి ప్రయాణం 125 వనవోల్తననతలనతనుతతననతనతననలలతపనతతనానవ. ఇక్కడ నుంచి నాశెలాంటి అండదండలూ లేవు. ఇదంతా ఓ పోటీ ప్రపంచం అనుకో నేను వాళ్ళ మీద పెత్తనం చెయ్యకపోతే వాళ్ళు నా మీద చేస్తారు మనందరం హాయిగా ఉందాం అంటే వాళ్ళకి నచ్చదు. నా పొజిషన్‌ నిలబెట్బకోడానికి నేనిలా చెయ్యవలసి వచ్చింది. ఈ వేషం వెయ్యకపోతే నాకు గౌరవం లేదు ఇది ఒక విధంగా గౌరవం లాక్కోడం అన్నమాట మీ అమ్మకి ఆ అవసరం లేదు. హాయిగా ఉద్యోగం ఉంది. ప్రేమించిన భర్త ఉన్నాడు అర్ధం చేసుకునే పిల్లలున్నారు అది ఏ వేషమూ వెయ్యక్కర్లేదు ”

“ఈ సందర్భంగా నీ పిల్లల గౌరవాన్ని పోగొట్బకున్నావు గదా” అంటే,

“నేనేం పోగొట్టుకోలేదు వాళ్ళు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు” అంది.

“చూశావా సుధా, నువ్వు ఈ క్షణం ఎవర్సి పెళ్ళి చేసుకున్నా, మీ అమ్మ ఎమీ అనదు. అప్పుడు నువ్వు పారపాటుపడ్డావనుకుని ఆ సంబంధం వద్దంది అప్పుడయినా నువ్వు ఆవిణ్ణి సమాధానపరచడానికి ప్రయత్నించలేదు పోన్లీ నీ అంతట నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే తరువాత ఆవిడే సమాధానపడేది నీకు ధైర్యం చాలలేదు. నీ పిరికితన్నాన్ని మరొకరి చెడ్డతనం కి౧ద చిత్రించడం మంచిది కాదు అదివరకు ఆడవాళ్ళు ఆర్థిక స్వాతంత్ర్యం లేక అణిగిపోయారు. ఇప్పుడు చాలామందికి ధైర్యం లేక అణిగిపోతున్నారు ”

“నిన్ను బలవంతంగా ఎవర్తైనా (ప్రేమించి, పెళ్ళిచేసుకుని సొమ్మని నేను చెప్పడం లేదు. నీకా అవసరం వస్తే ఎవరి కోసం దడవద్దన్నాను ”

“నాకిప్పుడు పెళ్ళి మీద అసక్తి పోయింది, నిజంగా!”

“అయితే, ఈ పట్పచీరల వేషాలు వెయ్యననీ, నీకిక సంబంధాలు చూడవద్దనీ మీ అమ్మకి చెప్పెయ్‌ మళ్ళీ ఎవరైనా నీకు సన్నిహితంగా వచ్చినప్పుడు, వాళ్ళు నీకు నచ్చారనుకుంటే, నీకు పెళ్ళి చేసుకోవాలనిపిస్త అప్పుడు చేసుకో ఆ స్టేట్‌మెంట్‌ కోసమే మీ అమ్మ ఎదురు చూస్తోంది ఆవిడ నీకు పెళ్ళి చెయ్యదని నువ్వు అనుకుంటావనే ఇదంతా చేస్తోంది.”

“నిజమేనేమో” అంది సుధ

“పెళ్ళి కాలేదని కుంగిపోవడాలూ, అయిందని పాంగిపోవడాలూ - ఇవ్వన్నీ వొట్టి భ్రమలు ' అని నవ్వింది

తరువాత ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుని బాగా నవ్వుకున్నాం. ఈలోగా పతివ్రత పిన్నీ, బడాబాబు వచ్చి కూర్చున్నారు మా దగ్గర పిన్ని సుధ మీద చాలా సానుభూతి కురిపించింది నామీద కూడా కొంచెం చూపబోయింది గానీ, నేను పడనివ్వలేదు పిన్నీ వాళ్ళు రాత్రికీ విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి బొంబాయి వెళ్ళిపోతారు విజయవాడలో బడాబాబు చెల్లెలు ఉంది అక్కడికి వెళ్ళడం పిన్నికి ఇష్టం లేదు వీలున్నంత వరకూ ఆయన్ని వాళ్ళతో కలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది

126 ఇల్లలకగొవే. . ..

ఆవిడలా చెయ్యడం ఈయనకీ ఇష్టమే ఎందుకంటే, వాళ్ళతో కలసీ మెలసీ ఉంటే తడవకీ బొంబాయి వచ్చేస్తారు సహాయాలడుగుతారు ఎడంగా ఉండడమే మంచిది ఇలా తను వాళ్ళకి ఎడంగా ఉండడం తన భార్య వల్లనేనని వాళ్ళు అనుకోవడం కూడా ఆయనకిష్టమే, ఎందుకంటే, వాళ్ళ సానుభూతి తన మీడ ఉంటుంది అయితే, ఇప్పుడు ఆనందపురం వరకూ వచ్చి విజయవాడ స్టేషన్లో రైలెక్కుతూ, సొంత చెల్లెలు ఇంటికి వెళ్ళకపోతే బావుండదని ఒక రాత్రి అక్కడ ఉండడానికి కేటాయించింది పిన్ని

'నాదేం లేదు నా దేహం, ప్రాణం అన్నీ ఆవిడవే' అనేస్తాడు బడాబాబు. అందులో రాజకీయం అర్ధంకాని పిన్ని నిజమేనని నమ్మి అతనికి మరింత వినయం ప్రకటిస్తుంది బాబాయిని వాళ్ళ బంధువులంతా భార్యావిధేయుడు అంటారు నిజానికి ఎవరు ఎవరికి చిధేయులో వాళ్ళకి అర్థం కాదు

అప్పటికే రవీ, రాజు కూడా వచ్చి కూర్చున్నారు. రవికి రాజు బాగా నచ్చినట్టున్నాడు. ఇద్దరూ కబుర్లు చాలా సేపట్నించీ చెప్పుకుంటున్నారు.

రాజు ఎవరికి నచ్చడు గనుక!

“మనం కూడా గేపు వెళ్ళిపోదాం. ఉష పిన్నినీ, జయనీ విజయవాడలో దింపేసి, అందరికీ కలిపి తెనాలి నుంచే ఒక టాక్సీ మాట్లాడుకొచ్చెయ్‌” అంది పెద్దమ్మ రవితో. ఆవిడకి రవి మీద కోపం ఎప్పుడో పోయింది

“ఇండియాలో ప్యాసెంజర్‌ రైలు జర్నీ బావుంటుంది ప్రొద్దున్నే ఏడున్నరకి ఉందట మనందరం సరదాగా అ రైలెక్కి పోదాం చిలుమూరులో సపోటా కాయలు కొనుక్కోవచ్చు. వడ్గపూడిలో నారింజకాయలు, దుగ్గిరాలలో పమపు కొమ్ములు అన్నాడు రవి.

“అవి అక్కడ రైలులో అమ్మరు తండ్రీ” అన్నాను నేను

“నీకు మతి ఉందా, పోయిందా! ఆ దుమ్ములో అ జనం మధ్యలో ఎక్కుతావా. నీ ప్రయాణం పది రోజుల్లోకొచ్చింది ఈలోగా మంచం ఎక్కుతావు అంది పెద్దమ్మ

“నీకు నీ చిన్నతనం మళ్ళీ ఒకసారి చూసినట్టుంటుంది రైలెక్కడం మంచి అనుభవం

అని వాదన పెట్టుకున్నాడు చివరికి అందరూ రవినే సమర్ధించారు. ఈ ష్యాసెంజరు రైలు ప్రయాణం గురించి రవికి రాజే చెప్పినట్టున్నాడు

“ఈ పెళ్ళి వంకతో తమ్ముడు మనందర్నీ ఇలా కలిసాడు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంఓామ్రో! సుధ పెళ్ళికేనా? అంది పిన్ని

“నేనిబ్రాంటి పెళ్ళి చేసుకోను పిన్నీ ఇది చూసి నా మొహం మొత్తింది ఎన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాముగానీ, ఇంత దగ్గరగా చూడలేదు ఆ తలంబ్రాలు పోసుకోవడం వెనక, వీడియోల వెనక ఇంత బర్చ్బూ, ఇంత శ్రమా ఉంటుందని ఆలోచించలేదసలు నేను దేన్ని గురించి ఆలోచించాను గనుకా” అంది సుధ వెంటనే

పెళ్ళి ప్రయాణం 12/ కమ ననీపపనన

“అయికే, ఇంక మనందరం కలిసేది జయ పెళ్ళిలోనేనా అంది పిన్ని మళ్ళీ నేను పిన్ని భుజం మీద చెయ్యి వేసి, “నీక్సు మా అమ్మని చూడాలని ఉంటే హాయిగా ఢీల్తీ వచ్చెయ్‌ పెద్దమ్మని చూడాలని ఉంటే హైదరాబాద్‌ వెళ్ళిపో నన్ను చూడాలనిపిస్తే బెంగుళూర్‌ వచ్చియ్‌ మధ్యలో పెళ్ళి గొడవెందుకు! పోనీ నీకు మమ్మల్ని చూడాలని చాలా అనిపించి నువ్వు రాలేకపోతే మాకొక ఉత్తరం రాసి పడెయ్‌. మేమే వస్తాం. అవునసలూ, నువ్వెవరికీ ఉత్తరం రాయవెందుకూ” అన్నాను.

“ఏమిటోనే! రాయడం అలవాటు తప్పిపోయింది. పెన్ను పుచ్చుకుంటే అక్షరాలు పడవు అందుకే ఎప్పుడైనా పెద్దమ్మకి ఫోన్‌ చేస్తుంటాను. నాకు మాత్రం ఎవరున్నారు. నాకెప్పుడూ మా అక్కయ్యలు గుర్తొస్తారు కానీ, ఏం చెయ్యను చెప్పు ఇంట్లోనే సరిపోతుంది నేను లేకపోతే ఒక్క క్షణం గడవదు ' అంటూ కళ్ళు తుడుచుకుంది

పిన్నికి స్నేహితులు లేరు అక్కచెల్లెళ్ళని కలుసుకోడానికి తీరదు పెళ్ళీ పేరంటం వంకనగానీ బయలుదేరడానికి కుదరదు అందుకే ఇలాంటి సందర్భాలని వదులుకునేవాళ్ళు కారేమో పూర్వం, అంతకన్నా అత్మీయుల్ని చూడడానికి అవకాశం లేక

“క్రీందటి సంవత్సరం ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చి పెద్దమ్మ నాదగ్గర చాలా రోజులు ఉంది నీకు ట్రీట్‌మెంట్‌ అక్కర్లేదనుకో అయినా, నీ పతిసేవకి ఓ పది రోజులు సెలవు పెట్టి నా దగ్గరకు రా బావుంటుంది' అన్నాను కొంచెం ధైర్యం చేసి

“అలాగేనమ్మా” అంది పిన్ని కళ్ళు తుడుచుకుని

సేవ, ట్రేమ ఇవ్వడమేగానీ పుచ్చుకోవడం ఎరగని చాలామంది స్త్రీల లాంటి పతివ్రత పిన్ని నా ఆహ్వానానికి కరిగిపోయింది తనని విడిచిపెట్టి బాబాయి హాయిగా ఉండగలడని పిన్నికి కలిసే ఉంటుంది. కానీ, ఈవిడే ఉండదు అతన్ని ఒంటరిగా వదలడం ఈవిడకిష్టం లేదు అందుకోసమని ప్రతి చిన్న విషయానికీ తనపైన ఆధారపడేలా చేసింది ఆఖరికి'టై'కి రూడా ముడి వేసి ఉంచుతుంది. ఇప్పుడు ఈ పెళ్ళికి కూడా తను ఒక్కతే రాకుండా ఆయన్ని బలవంతం చేసి తీసుకోచ్చింది తను బేనిదే ఆయన బతకటేడని తనని తను నమ్మించుకుంటూ, ఆయన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది బాబాయికి తన మీద గల (పేమ పట్ట, ఇంట్లో తన స్థానం పట్ల ఆవిడకింకా నమ్మకం కలగలేదన్నమాట పెళ్ళయినప్పటినుంచీ ఇస్పటి వరకూ ఆ అభద్రతాభావంతోనే బతుకుతూందన్నమాట

అమ్మ నాన్నని వదిలిపెట్టి నెల, రెండు నెలలు కూడా వెడుతూ ఉంటుంది

“నేను వెళ్ళినప్పుడు నువ్వేం చేశావు" అని అడగదు ఆవిడ మీదే మేమంతా ఆధారపడి బతికేలా, అసమర్భుల్లా మమ్మల్సి అవిడ తయారు చెయ్యలేదు. అందుకే మేం అందరం తలా ఒకచోట ఉన్నా హాయిగా బతుకుతున్నాం అనుకుంటాను

128 ఇల్లలకగానే. ..,

జీన్స్‌ ప్యాంట్‌లు, టీ షర్ఫలు, మిడీలు, క్రాపులు, వీకెండ్‌ పార్టీలు, బయట తినడాలు, సినిమాలు, స్నేహిళులు, చర్చలు, వాదనలు, సిద్దాంతరాద్దాంతొల జీవితంలో నుంచి ఆనందపురం రావడం నాకొక ప్రత్యేక అనుభవంలా ఉంది ఇదంతా ఇలా ఉంటుందని అమ్మ నాకు పదిహేను సంవత్సరాలనాడే చెప్పినా, "ఇప్పటికీ ఇలాగే ఉంటుందని నేను అనుకోలేకపోయాను. కుటుంబం గురించి, వివాహ వ్యవస్థ గురించి, అసలు పెళ్ళి చేసుకోవాలా = అక్కర్రీదా అనీ, ప్రిమారిటల్‌ సెక్స్‌ గురించీ ఒకవైపు చర్చలు జరుగుతూ ఉంటే ఇంకొకవైపు ఇంకా అలివిమాలిన పాతివత్యాలు, పతిసేవలు, లక్షలు లక్షలు పోసి మొగుణ్ణి కొనుక్కోడాలు, మర్యాదలు, అలకలు. మహానగరాలలో మహమ్మారిలా వ్యాపించిన పెట్టబడిదారీ వ్యాపార సంన్కృతి, పల్పెటూళ్ళలో ఇంకా మిగిలి ఉన్న భూస్వామ్య భావజాలం - అన్నిచోట్లా ఉన్న పితృస్వామ్య సంస్కృతి ప్రభావం - మనుషులంతా ఆలోచించడం మర్చిపోయారా? చలనం లేని బొమ్మలై పోయారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి

“నువ్వెంతసేపటికీ నీ మధ్య తరగతి వర్గం గురించే ఆలోచిస్తున్నావు జయా. పల్లెటూరిలో అట్టడుగువర్గపు స్రీలకి ఇప్పటికీ ఎన్ని సమస్యలున్నాయో చూడు ఉండడానికో ఇల్లు, తినడానికి మంచి తిండి, చూడడానికి టెలివిజన్‌, కట్టడానికి పట్టుచీరలు - ఇన్ని ఉన్న స్త్రీలకి సమస్యలుంటే - నిద్ర లేచిన దగ్గర్నుంచీ పాయ్యి మీదకి, పాయ్యి కిందకీ వెతుక్కోవడంతో మొదలుపెట్టి, రాత్రి పడుకోడానికి వాన వస్తే పొడీ జాగా కోసం వెతుక్కోవడంతో ఆఖరయ్యే బతుకుల గురించి అలోచించు. వాళ్ళ సమస్యలు తీరేవి కావు వాళ్ళమీద రోజూ జరిగే కుటుంబ హింస, అంటే మొగుడిచేత తన్నులు తినడం - ఇదంతా ఆలోచించు" అన్నాడు రాజు,

“ఇప్పటికీ కూలి కొస్తే మగవాడికి ఎక్కువ, ఆడదానికి తక్కువ కొన్ని పనులకి మగవాళ్ళనే పిలుస్తారు ఆడవాళ్ళని పిలవరు ఇళ్ళదగ్గర పసిపిల్లల్ని చూసే దిక్కు ఉండదు. పని చేసే చోటికి తెచ్చుకుంటారు వాళ్ళు ఏడిస్తే పాలివ్వడానికి వెడితే మేస్త్రీ ఊరుకోడు. ఇప్పుడు ఈ ఊళ్ళో కూలీ కూడా ఎకరానికింత అని కాంట్రాక్టు మొదలైంది మేస్తీలు ఆడవాళ్ళే.

మనిషికింత అనికాక, ఎకరానికింత అని ఇస్తాం! మేస్త్రీ ఆ డబ్బుని ఎంతమంది కూలీలని తెస్తే అంతమందికి పంచుతుంది ఈ ఆడవాళ్ళు పాలంలో పని ఉన్నప్పుడు కూలీ చేస్తారు అంటే నాట్లు వేస్తారు కలుపు తీస్తారు కోత కోస్తారు కుష్పవేయడం మళ్ళీ మగవాళ్ళు చేస్తారు ఈ పన్లు లేని రోజుల్లో ఇళ్ళలో పని చేస్తారు పిండి కొడతారు అంట్లు తోముతారు అటుకులు దంచుతారు ఇప్పుడు అటుకులకి మరలొచ్చాయనుకో ఎంత చేసినా చాలదు, మీ చిన్నప్పుడు మగవాళ్ళు తాగేవారు కాదేమో ఇప్పుడు ్రతివాడీకీ అదే ఎవరోనూటికి పదిమంది తాగనివాళ్ళు. ఇప్పుడు అదొక అదనపు ఖర్చు ఇక కుటుంబ నియంత్రణ

పెళ్ళి ప్రయాణం 129 అంటావా అదంతా ఎంతసేపటికీ ఆడదాని. వ్యవహారమే అని ప్రభుత్వమూ అనుకుంటుంది, మగవాళ్ళూ అనుకుంటారు ఆడవాళ్ళే మాత్రలు మింగాలి ఆడవాళ్ళే ఆపరేషన్లు చేయించుకుని, మందులు మింగీ అలివిమాలిన పనిచేస్తే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడం లేదా? వాళ్ళలో హార్మోన్‌ జబ్బులు రావడం లేదా?”“ప్రభుత్వం టెలివిజన్‌ ఎడ్వర్‌టయిజ్‌మెంట్లు కూడా స్త్రీల కోసమే ఎక్కువ ఇస్తుంది. ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఇంత శ్రమ దోపిడీ ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా ఎక్కువైంది ' రాజు చెప్పుకుపోతున్నాడు

“పద్నాలుగు పదిహేనేళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు ఎంత చెప్పినా వినఠు వాళ్ళకి పదహారేళ్ళొచ్చేసరికి పిల్లలు ఈడేరిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇంకా దానికి భద్రత లేదని వాళ్ళ నమ్మకం ఆ పిల్ల అంత లేతవయసులో ఇంటి పనంతా నెత్తిన వేసుకుని చెయ్యాలి పిల్లల్ని కనాలి తన్నులు తిని మొండికి పడి బతకాలి ఇంంతా ఎప్పుడైనా ఆలోచించావా?”

“అవును రాజూ నాకు తెలుసు” అంది పెద్దమ్మ

“మనం ఆలోచిస్తాం కానీ, మనం ఏం చెయ్యగలం" అంది సుధ

“అల్లాంటివాళ్ళకి సాయం చేసే స్వచ్చంద సంస్థలేవైనా ఉంటే వాటికి, మనకి చేతనైనంత సాయం చేసి ప్రోత్సహించాలి మనం చేసే వెధవ దండగ ఖర్చులు మానేసి, సంవత్సరానికో సారి వాళ్ళకి ఎదైనా ఇవ్వాలి ' అన్నాడు రవి

“మనమేం దండగలు చేస్తున్నాం” ఉన్న డబ్బే చాలడం లేదు” అంది పిన్ని.

“వాటి గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం అంత తేలిక కాదు" అసి నవ్వేడు రాజూ

సాయంత్రం భోజనాల దగ్గర రవీ, రాజు అందర్నీ సమావేశపరచారు

చిన్న మామయ్య ఇల్లు అమ్మడం, సుందరంతో వెళ్ళీ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌ కొనుక్కోవడం గురించి ప్రస్తావన తెచ్చింది శారదత్తయ్య

“కొనబోతే కొరివీ అమ్మబోతే అడవీ అనీ - ఈ ఇల్లు కట్టి దాదాపు యాఖై సంవత్సరాలైంది పల్లెటూళ్ళో ఇందులో సగం ఎవరు కొంటారు చెప్పు? కొన్నా ఎఎతిస్తారు? బస్తీలో - అందులో హైదరాబాద్‌లో ఇల్లు కొనడానికి ఇది సరిపోతుందా?” చాలదు ఉన్న రెండెకరాలూ కూడా అమ్ముకోవాలి హైదరాబాద్‌లో అపార్ట్‌మంటంటే నాలుగు లక్షలుంటుంది రేపు సుందరానికి పెళ్ళాతుంది భార్య వస్తుంది. అపార్ట్‌మెంట్‌లో ఇంతమంది ఎక్కడుంటారు? ఎప్పుడైనా శ్రీలక్ష్మి వచ్చి అమ్మ దగ్గర నాలుగు రోజులుండాలంటే ఎక్కడుంబుంది” అన్నాడు పెద్ద మామయ్య

130 ఇల్లలకగాొనే. ... వ ననన నన

“మా అమ్మకి ఒంట్లో బాగాలేదు ఈ పల్లెటూళ్ళో పనివాళ్ళు దొరకరు. నేనక్కడ పనిమనిషిని పెట్టి చేయిస్తాను” అన్నాడు సుందరం,

“నీ చేయించడం నాకు తెలుసులే వీళ్ళు తెచ్చే డబ్బంతా నీ ఇంటికి సరిపోతుంది ఇక ప్రతి పైసకీ వాళ్ళని నీ మీద ఆధారపడేలా చేసుకుంటావు” అన్నాడు పెద్ద మామయ్యే మళ్ళీ.

“నీ కొడుక్కి ఉద్యోగం రాలేదు కాబట్టి, నువ్విన్ని మాటలు చెబుతున్నావు వస్తే నువ్వు మాత్రం బస్తీ వెళ్ళిపోవా ఏం”అన్నాడు సుందరం

“రాజు తలుచుకుంటే ఐ ఎ ఎస్‌ ప్యాసైపోతాడు వాడికి ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వాడికున్న తెలివీ, పరిశీలన నీకున్నాయా” అంది పెద్దవత్మే కలుగబేసుకుని.

“మీ అబ్బాయిని అమెరికా ఎందుకు పంపావు? ఇండియాలో ఉంచకపోయావా” అన్నాడు నుందరం

నేను పంపలేదు వాడే వెళ్ళాడు, నేనాపలేదు వాడీస్టం అని ఊరుకున్నాను. నిన్ను ఇక్కడే ఉండిపామ్మని నేనడం లేదు మీ నాన్న సంగతి చెప్పాను” అన్నది పెద్దమ్మ

“నువ్వొకసారి బాగా ఆలోచించుకో తమ్ముడూ నువ్వు పుట్టిన దగ్గర్నుంచీ ఈ వాతావరణానికి అలవాటుపడ్డావు పైగా నీ చేతిలోోఉన్న అస్తి అమ్ముకుని వెడితే వృద్దాప్యంలో బాధపడతావు అన్నది అమ్మ

“ఇది మా కుటుంబ వ్యవహారం చిన్నత్తా మేం ముగ్గురం ఆలోచించుకుంటాం” అన్నాడు సుందరం

“కాదని ఎవరంటారు? ఏదో పెద్దవాళ్ళం కదా అని మాకు తోచ్చింది చెప్పాం” అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది పెద్దమ్మ

నేనూ ఆలోచించుకునే వెడతానులే అక్కయ్యా అంత తొందరపడను మన రాజుకి కూడా నేనీ భాగం అమ్మడం ఇష్టం లేదు పరాయివాళ్ళని ఇంట్లో చొర పెట్టవద్దంటాడు అసలు ఇప్పుడు వెళ్ళడం ఎందుకో కూడా ఆలోచించాలి" అన్నాడు మామయ్య మా అమ్మ దగ్గరగా జరిగి కూర్చుని,

సుందరం మొహం మాడ్చుకుని వెళ్ళిపోయేడు.

“వాడికి మంచి ఉద్యోగం వచ్చింది హాయిగా ఇల్లు తీసుకుని ఉంటాడు, మీరిక్కడే ఉండండి. నీకింకా యాఖై ఎళ్ళయినా లేవు నిండా ముసలివాడివేం కావు. హాయిగా ఉన్న సొలం చూసుకుంటూ ఉండు మామయ్యా" అన్నాడు రవి

పెళ్ళి ప్రయాణం 131 “గుద్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుందిరా అబ్బాయ్‌ ' అని నవ్వాడు చిన్న మామయ్య పుట్టి బుద్ధెరిగిన తరువాత ఆనందపురం దాటి ఎక్కడికీ వెళ్ళని గాయత్రిని మాతో

ప్రయాణం చేసింది అమ్మ

తెల్లవారుతూనే విజయవాడ వెళ్ళే ప్యాసెంజర్‌ ట్రెయిన్‌ కోసం అందరం స్టేషన్‌కు బయలుదేరాం రవి రాజుని విడిచిపెట్టడం లేదు రాజు మాతో స్టేషన్‌కి బయలుదేరాడు

“నీ కార్యత్రమం ఏమిటి రాజూ? ఒకసారి రాకూడదూ బెంగుళూరు - సరదాగా!” అన్నాను నేను కిందటిసారి వచ్చినప్పుడు సుధ నాకు స్నేహమైంది ఇప్పుడు రాజు ఎంతో ఆత్మీయుడైనాడు.

“మీదంతా అమ్మాయిల అపార్ట్‌మెంట్‌ కదా! నన్నుండనిస్తారా ' అన్నాడు.

“చూద్దువుగానిగా మేం నిన్ను ఎంత స్నేహంగా (ప్రేమగా చూసుకుంటామో! అఆచ్నాను

“కొంపదీసి రాజుని డ్రుమిస్తున్నావా ఏం? మీ ఇద్దరూ రాత్రి ఒకటే కుర్లు డాబా మీద కూర్చుని" అంది సుధ

“రాజుని నేను చాలా గ్రేమిస్తున్నాను. నా కెంతో నచ్చాడు" అన్నాను

“అతనూ నిన్ను (ట్రేమిస్తున్నాడా? మరి రాజు బెంగుళూరు వచ్చేస్తాడా? నువ్వీ పల్తెటూరు వచ్చి ఉంటావా అని ఎంతో ఆత్రంగా నా మొహంలోకి చూసింది

“ఎవరూ ఎక్కడికీరారు అతను ఎంతో హాయిగా అనందపురంలో వ్యనసాయం చేనుకుంటూ ఉంటాడు నేను బెంగుళూరులో ఉంటాను, నా కంప్యూటర్‌ దగ్గర ”

“మరి (పేమిస్తున్నానన్నావు పెళ్ళి చేసుకోవా?”

“పేమించడం అంటే పెళ్ళి చేసుకోవడం అని నేను చెప్పానా నీకు? (క్రేమ అనే మాటకి ఎంతో గొప్ప అర్భన్ని ఎంత కుంచించివేశావో చూడు? రాజు మాటలంటే నాకు వినడం ఇష్టం. కనుక డాబా మీద కూర్చుని విన్నాను అర్థం అయిందా! నేను చాలా ప్రాక్టికల్‌గా, నేను ఎలా అయికే సుఖంగా, హాయిగా ఉండగలనో అలా ఉండడానికే ప్రయత్నిస్తాను గానీ, నేలవిడిచి సాము చెయ్యను ఐయామ్‌ ది మోస్ట్‌ అన్‌ రొమాంటిక్‌ అన్నాను

“అంటే, నీదంతా స్వప్రయోజన దృష్టి అన్నమాట.”

“అవును, స్వప్రయోజనం ఎందుకుండకూడుదు? స్వప్రయోజనం కోసం ఎవరికైనా ప్రోహం చేస్తే తప్పు నా జీవితం, నా అభిప్రాయాలు, నొ అలవాట్లు, నా కెరీర్‌ నాకు ముఖ్యం వీటిని త్యాగం చేసే ప్రసక్తి లేదు వాటిని కాపాడుకుంటూనే, నన్ను అగిమానించి నాతో అభి(ప్రాయసామ్యం కల వ్యక్తి నాకు సన్నిహితంగా వచ్చినప్పుడు పెళ్ళి గురించి ఆలోచిస్తాను

132 ఇల్లలకగానే అంతేగాని, ప్రథమ వీక్షణంలో డ్రేమలు, అలివిమాలిన త్యాగాలు, ఆత్మార్పణల మీద నాకు నమ్మకం లేదు.”

వెనుక నుంచి రవి చప్పట్లు కొడుతున్నాడు

వైలాచ్చింది.

దుమ్ములో మామూలు మనుష్యుల మధ్య ప్రయాణం చెయ్యనన్న పెద్దమ్మ రైలెక్కగానే తన చిన్నతనంలో వాళ్ళమ్మతో కలిసి విజయవాడ దాకా చేసిన ప్రయాణాల గురించి చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు విజయవాడ దగ్గర కృష్ణా బరాజ్‌ లేదట తరువాత కట్టారట కట్టిన తరువాత మళ్ళీ రైలు ప్రయాణం చెయ్యలేదట తన చిన్నతనంలో ఆనందపురం నుంచి విజయవాడ వెళ్ళడానికి మూడు గంటలైనా పట్టేదట

విజయవాడ నుంచి టాక్సీ తీసుకుని రవీ, పెద్దమ్మా వెళ్ళిపోగా, అమ్మా, నేనూ, గాయత్రీ త్రిపురసుందరి భవంతికి పోయాం అటువంటి భవనాలని బయటి నుంచి చూడడమేగాని, ఇంతవరకూ లోపలికి పోలేదు నేను సర్వశ్రేష్టమైన వస్తువులతో ఇల్లంతా అలంకరించింది జవిడ ఆ మాటంటే ఇప్పుడలాంటి ఇళ్ళు విజయవాడలో చాలా ఉన్నాయండి పది పదిహేనేళ్ళలో ఒక న్యూ రిచ్‌ కాస్‌ విజయవాడలో ప్రాముఖ్యం సంపాదించింది ఇళ్ళు కట్టుకోడం, జీవన శైలీ ఏ మహానగరవాసులకీ తీసిపోని విధంగా ఉంటుందట వాళ్ళకి. విజయవాడలో ప్రబలుతూన్న ఈ సంస్కృతికి నిదర్శనంగా ఎక్స్‌క్తూసివ్‌ బ్యూటీషాప్‌లు, బ్యూటీ క్రినిక్‌లు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లు, ఐస్‌క్రీం పార్లర్దు, కొత్త కొత్త హోటళ్ళు చూశాం విపరీతంగా కట్టే భవనాలు, ఎపార్ట్‌మెంట్స్‌ చూశాం డాక్టర్లని, ఇంజనీర్లని ఉత్పత్తి చెయ్యడం కోసం పోటీలు పడి నడుపుతున్న రెసిడెన్షియల్‌ కాలేజీలు చూశాం జిమ్‌లు, యోగా సెంటర్లు, స్పోకిన్‌ ఇంగ్లీషు ఇన్‌స్టిట్యూట్‌లూ చూశాం బజారుకొకటిగా వెలిసిన కంప్యూటర్‌ సెంటర్లూ చూశాం జీన్స్‌ టీ షర్ట్‌ అమ్మాయిల్నీ చూశాం రోడ్డు పక్క చెట్టుకింద అన్నం వండుతున్న ఎనిమిదేళ్ళ అమ్మాయినీ, ఆ పక్క చీర ఉయ్యాల్లో నిద్రపోతున్న అ పిల్ల తమ్ముణ్లీ, అక్కడ కట్టే భవన సముదాయానికి సిమెంటు మోస్తున్న తల్లినీ చూశాం

అమ్మా, త్రిపురసుందరీ ఆంటీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వింటున్నాను ఈ ఊరు నుంచి లక్షలకి లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్ళి చదివే పిల్లల్ని గురించ్హి ఎల్‌ కెజీ కాసు ఇక్కడ చదివించడం ఇష్టంలేక ఊటీ పంపే పేరెంట్స్‌ గురించి, దావణగిరిలోనూ, మణిపాల్‌లోనూ ఎండిలు చదువుతున్నవాళ్ళ గురించి - వింటూనే కాఫీ టేబుల్‌ మీదున్న స్టానిక వార్తాపత్రిక తీశాను.

కిందటిరోజు జరిగిన ఒక కుల సంఘం ఆతిపెద్ద ఊరేగింపు తాలూకు రంగుల ఫోటో. మరో పేజీలో మరునాడు జరగబోయే ఇంకో కుల సంఘం సభ తాలూకు వివరాలు స్టా పేలి వినాహిత యువతి మరణం కృష్ణ ఒడ్డున గుర్తు తెలిని యువకుడి శవం

పెళ్ళి ప్రయాణం 133 స్త్రీలకి బ్యూటీ టిప్స్‌, ఫ్యాషన్స్‌, వంటలు “ఒక మొగుడు ఇద్దరు పెళ్ళాలు” సినిమా శతదినోత్సవ సభ వివరాలు - విశేషాలు, ఫోటోలు - ఆ సినిమాలో విలైనంత అశ్తీల సంభాషణలూ, రెండర్థాల పాటలూ రాసిన రచయితకి ఘనసన్మానం అంత గొప్ప సినిమా తీసిన దర్శకుడికి పొగడ్తలు, ప్రశంసలు అటువంటి కళాఖండాన్ని ఇంతరవకూ చూడలేదని ఒక మహిళా కళాళాల లెక్చరర్‌ ప్రశంస మళ్ళీ తమిళనాడు ఎక్స్‌(పెస్‌లో ప్రయాణం శేషమ్మ మంగమ్మ, కలెక్టర్‌ పెద్దమ్మ, పతివ్రత పిన్నీ, గాయత్రీ, సుధా గుండెమీద వేసిన ముద్రలతో (ఇండియా టుడే - వార్షిో సాహిత్య నంచిక - 1995)

పలల తతత +దిలీ పతన కొనానానావావను టీదవారం ఆలస్యంగా నిద్రలేచి తల్లి యిచ్చిన కాఫీ త్రాగుతూ 'పేపర్‌చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అపశకునంలా తోచింది. సుందరం రావడాన్ని గుర్తించినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్లో తల దూర్చాడు రాఘవరావు. సుందరం చాలా చొరవగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయి, రాఘవ తల్లిని పలకరించి ఆవిడ యిచ్చిన కాఫీ కప్పు పుచ్చుకుని వరండాలోకి వెళ్ళి, రాఘవ తండ్రిని కూడా పలకరించి, వచ్చి అతని ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు. “అదివారం కదా - రజనీ పిల్లలూ వచ్చారేమో అనుకున్నాను. అయినా వాళ్ళు ముగ్గురు రావడం కంటే నువ్వు ఒక్కడివే వెళ్ళడం సులువేమో! వెళ్ళి వుంటావను కున్నాను అన్నాడు కొంచెం సేపు ఆగ అతని వ్యాఖ్యానాలకీ, ప్రశ్శలకీ ప్రతిస్పందించడం రాఘవరావుకి యిష్టం లేకపోయింది. అతను మళ్ళీ ఒక నవ్వు నవ్వి వూరుకున్నాడు “పిల్లల్ని తీసుకు వెళ్ళక ముందు నెలకి ఒకసారో రెండుసార్లో వచ్చేది ఇప్పుడు వీడు వెళ్ళడమే ” అన్నాడు రాఘవ తండ్రి, లోపలికి వచ్చి కూర్చుని - “ఈ మధ్యన - అంటే క్రిందటి సోమవారం అనుకుంటా - మా తమ్ముడు హైదరాబాద్‌ వెళ్ళాడు. ఆబిడ్స్‌లో ఒక మందుల షాపు దగ్గర రజనీ కనిపించిందట మా వాడీని పలకరించి,

బదిలీ 135 ఎవరో సుబ్బారావట - అతన్ని పరిచయం చేసిందట - అతని స్కూటర్‌ మీదే ఎక్కి వెళ్ళి పోయిందట - అబ్బో - అక్కడికి వెళ్ళిన తరువాత చీరెలు కట్టడం లేదులా వుంది - చుడీదార్‌ వేసిందట -” అన్నాడు సుందరం మళ్ళీ -

“చుడీదార్‌ కాకపోతే షార్స్స్‌ వేసుకుంటుంది - నీ౭ందుకు మధ్యలో -' అన్నాడు రాఘవరావు చిరాకతుపడుతూ -

సుందరం కొంచెం బెదురుతూ “అహ! అలా అని కాదు - మావాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా అన్నాను - ఆవిడ ఏమి వేసుకుంటే మాకేం? ఎవరి స్కూటర్‌ మీద వెడితే నాకేం! ' అన్నాడు కచ్చగా - ఆ సంభాషణ తండ్రి పాడిగించకుండా జాగ్రత్త పడ్డట్లు రాఘవరావు అక్కడి నించీ లేచి, “నేను హెయిర్‌ కట్‌కి వెడుతున్నాను అని వెళ్ళిపోయేడు ఆ పైన సుందరం తన తండ్రికీ తల్లికీ ఎన్ని చిలవలు పలువలు చెబుతాడో అతనికి తెలుసు

ఈ మధ్యన రజనీ చాలా మారి పోయినట్టు రాఘవరావుకి కూడా అనిపిస్తోంది సుబ్బారావుతో స్నేహం గురించీ, వేషభాషల్లో మార్పు గురించి కూడా! ఈ ఆదివారం వెడీతే బావుండేది బద్దకించేడు. పైగా తండ్రీ ఒకటే పోరు - సైన్సు లెక్చరర్‌ వైయుండీ కాలాన్ని వ్యర్థం చేసుకో కుండా ట్యూషన్లు చెప్పుకుని బాగా సంపాదించుకోమనీ - పెళ్ళాన్ని ఉద్యోగం మాన్పించి తెచ్చుకోమనీ - రజనీ ప్రవర్తన మారిపోతుందనీ, ఆమెని ఇప్పుడు కంట్రోల్‌ చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేవనీ - పిల్లలు కూడా నువ్వు చెప్పినట్లు ఇంక మీదట వినరనీ, ఆయన పని గట్టుకుని ప్రతీరోజూ చెబుతున్నాడు సాయంత్రం ఇంటి కొచ్చే సరికి పిల్లలూ రజనీ లేకపోతే తనకేం తోచడం లేదు అందుకని తండ్రి చెప్పినట్లు ఒక ట్యుటోరియల్‌ కాలేజిలో రెండు గంటలు పారం చెప్పడానికి వొప్పుకున్నాడు రజనీ ట్రాన్స్‌ఫర్‌ వలన తనకి ఏ ఇబ్బందీ లేదు తల్లి వండి పెడుతోంది - డబ్బుంది ఎ పిల్లలతో, ఆమెకీ వచ్చే జీతంలో ఎలా సర్దుకుంటోందోనని మొదట్లో అనుకునేవాడు కొంత డబ్బుకూడా పంపేవాడు రెండు నెలలుగా రజని ప్రవర్తన గురించి వింటూన్న కొద్ది అతనికి డబ్బు పంప బుద్ధి కావడం లేదు తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్ళించడంతో - ఇప్పుడతనికి చేతినిండొ డబ్బున్నట్లు అనిపిస్తోంది - పిల్లలపేర బ్యాంక్‌లో రికరింగ్‌ డిపాజిట్‌ తెరిచాడేగానీ రజనీకి పంపబుద్ది కాలేదు - “నువ్వీ ట్యూషన్‌ వ్యామోహంలో పడకుండా పిల్లలకి బాగా పాఠాలు చెబుతావని గర్వపడేదాన్ని - ఎందుకిలా కష్టపడుతున్నావు రాఘవా? 'అంది రజని, క్రిందటిసారి తను హైదరాబాద్‌ వెళ్ళినప్పుడు

“నువ్వు లేవు - పిల్లలూ లేరు - సాయంత్రాలంతా నేనేం చెయ్యాలి - అన్నాడు

“నువ్వు చిన్నప్పుడు ఎంతో బాగా పాటలు పాడేవాడీవి - మంచి పుస్తకాలు చదివేవాడివి - పోనీ నీకేం తోచకపోతే కొంత మంది బీదపిల్లలకి ఊర్కే పారలు చెప్పవచ్చుగా

  • డబ్బు తీసుకొని ఎందుకు?" అంది మళ్ళీ - తలారా లననంతాలతలాాననంతతానినితా

136 ఇల్లలకగానే ...

“నేను నీ అంత విశాల హృదయుణ్ణి కాదు రజనీ - నాకు డబ్బు అవసరం - నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకుంటున్నాను " అన్నాడు రాఘవరావు - కొంచెం రజనీని హర్ట్‌ చేసి సంతృప్తిపడాలని - “నువ్వు పిల్లల కోసం డబ్బు పంపడం లేదు - నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను -'' అని రజనీ అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు కానీ రజని ఆమాట అనలేదు - అసంతృప్తితో అప్రసక్తి వదిలి పెట్టాడు

హెయిళలకట్‌ నుంచీ రాగానే తండ్రి అందుకున్నాడు - “శృతి మించి రాగాన పడక ముందే రజనీని తీసుకొచ్చేయ్‌ - ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించు కుంటున్నావు - రజనీ జీతం అంతా నికు ట్యుటోరియల్స్‌ వాళ్ళిస్తున్నారు - కాపురం చెడగొట్టకోకు - బ్రతిమాలో బెదిరించో వెళ్ళి ఆ పిల్లని తీసుకురా -' అన్నాడు.

“అవున్రా, రాఘవా - ఊళ్ళో వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను - మన ఇంటావంటా ఇలాంటివి లేవు - అంది తల్లి -

'నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని కళ్ళు నెత్తికక్కాయి ఆపిల్లకి - అసలు మొదట్లోనే నువ్వు రజనీని హైదరాబాద్‌ వెళ్ళనిచ్చి వుండకూడదు - చాలా తప్పు చేశావు - నీకు ముందు నుంచే చెబుతున్నాను - నామాట విన్నావు కాదు - రెట్టింపు డబ్బు సంపాదించగల శక్తి నీ దగ్గర పెట్టుకుని అ షిల్ల జీతం మీద అధారపడ్డావు - ఆడవాళ్ళని దార్లో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. అప్పటి నుంచీ ట్యూషన్లు పెట్టుకొనుంటే ఈ పాటికి ఇల్లు కట్టుకుని వుండేవాడివి - నీ భార్యకి నగా నట్రా కొనే వాడివి - నగలకీ చీరెలకీ అలవాటుపడ్డ ఏ ఆడదీ ఇలా మొగుణ్ణి విడిచి పోదు - కీలకం అంతా డబ్బులోనే వుంది - మంచిగా నయంగా చెప్పు

  • నీకేం లోటు రానివ్వనని చెప్పి తీసుకురా - తండ్రి అన్నాడు.

రాఘవరావుకి ఊపిరాడనట్టెంది - తామిద్దరూ పెళ్ళి చేసుకునేముందే రజని = తను ఊద్యోగం మానేసే ప్రసక్తే లేదని చెప్పింది - కనీసం ఆమెని హైదరాబాద్‌ వెళ్ళనివ్వకుండా కూడా తను అడ్డుపడ లేకపోయాడు ఎ చురుకుదనం, ఏ తెలివీ, ఎ సామర్ధ్యం చూసి, ఎ స్నేహం, ఏ మంచి తనం చూసి ఆమెని తను యిష్టపడ్డాడో, ఇప్పుడా గుణాలే రజనికీ తనకీ మధ్య తిరలు గించుతున్నాయి

రెండు సంవత్సరాల క్రితం రజనీ పని చేసే ఆఫీసుకి క్రొత్త మేనేజరు వచ్చాడు అతను కొకా ప్రియుడని, రాగానే స్థాఫంతా కనిపెట్టి అతని అహాన్ని విలున్నంతగా సంతృప్తి పరచడం మొదలు పెట్టారు రజనీ పని చేసే ఆఫీసులో రజనీ కాక ఇంకా ఇద్దరు స్తీలున్నారు అందులో చారుమతి సీనియర్‌ అయినా అఆవిడకింకా ప్రమోషన్‌ రాలేదు - న్యాయంగా అయితే ఈ పాటికిచారుమతి మేనేజరు కావల్సి వుంది - కానీ ఆవిడ పెట్టినన్ని మెడికల్‌ లీవులు, ఎర్న్‌డ్‌ లీవులు ఇంకెవరూ పెట్టరు - జీతం నష్టం మీద సెలవులూ, లేట్‌ పర్మిషన్తూ లెక్కలేదు - ఎంత

బదిలీ 13/ కష్టపడైనా ఈ వూళ్ళో వుండడం ఆవిడలక్ష్యం - భర్తని విడిచి వెళ్ళడం యిష్టం లేదు - ఈ మేనేజర్‌ వచ్చాక అతని భార్యకి ఆవకాయ సెబ్టేపని తప్పించింది చారుమతి - గోంగూర అయితే చారుమతి ఇంట్లో నుంచీ వస్తేనే అందరికీ యిష్టం మేనేజర్‌గారింట్లో - ఇంక వరలక్ష్మి

  • వరలక్ష్మి భర్త తరచూ ఆఫీసుకి వచ్చి మేనేజర్‌ని కలుస్తూ వుంటాడు ఆయనకేదో వ్యాపారం వుంది ఈ వ్యాపార లావాదేవీల వల్లనయితకేనేం, మేనేజర్‌ని పనిగట్టకుని పాగడడం వల్లనయితేనేం వరలక్ష్మి కూడా మేనేజర్‌ దయకి పాత్రురాలే - శివరావు మేనేజర్‌ గారికి షాపింగ్‌ చేసి పెడతాడు - ప్రభాకర్‌ కబుర్లు చేరవేస్తాడు - ఆఫీసు మొత్తంమీద సాంబిరెడ్డీ, రజనీ మాత్రం మేనేజర్‌గారి దయకి పాత్రులు కాని లిస్పలో చేరిపోయారు - అందునా మేనేజర్‌ వచ్చిన ఆరునెలలకే రజనీకి అతనికి పెద్ద తగాదా అయింది - తప్పు తనలో పెట్బకుని రజనీకి మిమో ఇస్తే, దానికి రజనీ చాలా ఘాటయిన జవాబు యిచ్చింది - అప్పటి నించి ప్రచ్చన్నయుద్ధం సాగుతూనే వుంది - రాఘవరావు రజనీకి చాలాసార్లు చెప్పాడు - “కుర్చీలో కూర్చున్న ప్రతివాడూ, తన స్టాఫ్‌కన్న తనే తెలివైన వాడనుకుంటాడు అందరూ తన తెలివిని కొనియాడాలను కుంటాడు - తను చెప్పినట్టు వినాలను కుంటాడు - హీరార్కీలు ప్రతిచోటా వుంటాయి - అందుకని పదికాలాలపాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగవు పడకు -"అని -

“ఆఫీసులో రాజకీయాలను గురించి మాట్లాడకు - నీ చురుకుతనం - తెలివి తేటలు ప్రదర్శించకు - తలవంచుకుని వెళ్ళి నీ పని చేసి వచ్చెయ్‌ - అనవసరమైన వాటిలో కల్పించుకోకు, అని చాలా చెప్పాడు రజని మొండిఘటం అని అతనికి తెలుసు ఆ మొండీతనాన్నే అదివరకు అతను అభిమానించాడు కానీ ఇప్పుడది తలబిరుసుతనంగా కన్పిస్తోంది - ఈ పరిస్థితి ఇలా వుండగా మేనేజర్‌ చుట్టం ఒకడు (హైదరాబాద్‌ ఆఫీసులో వుండే వాడు) ఈ వూరమ్మాయిని పెళ్ళిచేసు కున్నాడు ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు - పైగా ఈ వూళ్ళో బ్యూటీక్షినిక్‌ నడుపుతోంది - క్రినిక్‌ మీద బాగా ఆదాయం వస్తుంది

  • అతనికిక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయితే ఇంటద్దె, తిండి, భార్య సంపాదన అన్ని కలిసి వస్తాయి ఆ పని తను చేసిపెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజరు - ఇక్కడినించీ ఎవర్షి కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజని కనిపించింది - నిజానికి సాంబిరెడ్డిని పంపవచ్చు అతనికింకా పెళ్ళికాలేదు - హైదరాబాద్‌లో వుంటే బావుండునని ఆలోచిస్తున్నాడు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ సాంబిరెడ్డికి ఆనందం, రజనీకి విచారం కలిగిస్తాయి గనుక రజనీనే కదిలిస్తే పోతుందనుకున్నాడతను - రజనీకి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ వచ్చింది - ఆరోజు బ్రతిమిలాడి, కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు - “ఒకనెల మెడికల్‌ లీవ్‌ పడెయ్‌ - నేను హైదరాబాద్‌ వెళ్ళి నీ బదిలీ అపిస్తాను - సాంబిరెడ్డికి అయ్యేలా చూస్తాను - అంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఎదీ లేదు -' అని -

136 ఇల్లలకగానే,

“మొన్న పాపకి జబ్బు చేస్తే నేనే మెడికల్‌ లీవ్‌ పెట్టాను. నిరుడు మీ చెల్లెలు పెళ్ళికి మెడీకల్‌ లీవ్‌ పెట్టాను - ఇలా పోయిన పొడుగునా మెడికల్‌ లీవులు పెట్టకుంటూంటే నేనూ చొారుమతిలా ఈ సీట్లో పడివుండాల్సిందే - నాకు జన్మలో ప్రమోషన్‌ రాదు - పైగా ఈ మేనేజర్‌ ఎదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే వుంటాడు - మొన్న నీ స్నేహితుడు సత్యనారాయజణకి ట్రాన్స్‌ఫర్‌ అయితే ఏం చెప్పావునువ్వు? తిరిగి చూడకుండా వెళ్ళి పామ్మన్నావు- గుర్తుందా మెడికల్‌ లీవులు అంతగా వాడుకోడం మంచిది కాదని నువ్వేకదా చెప్పావు?” అని నిలదీసింది రజని -

“వాడికీ నీకూ పోలికేమిటీ? వాడు మగవాడు - వాడీకి ప్రమోషన్‌ అవసరం - నీకు రాకపోయినా బాధలేదు - మనిద్దరి జీతం మనకి చాలదా?” అన్నాడు రాఘవరావు అందుకు రజని వొప్పుకోలేదు - ప్రమోషన్లు లేకుండా కేవలం 'వేడినీళ్ళకి చన్నీళ్ళు' మాదిరిగా ఉద్యోగం చెయ్యడం తనకిష్టం లేదంది. 'మనిద్దరం ఎనిమి దేళ్ళుగా ఇక్కడున్నాం కలిసి - కొన్నాళ్ళు విడిగా వుందాం - పోయేదేం వుంది? ఎంతమంది భర్తలకి ట్రాన్స్‌ఫర్‌ అయితే వాళ్ళ భార్యలు పిల్లల్ని పెట్టకుని వంటరిగా ఉండడంలేదు? చదువులకోసం! - ఎవరికి ట్రాన్స్‌ఫర్‌ అయినా ఫలితం ఒకటేగదా - సత్యనారాయణ ఒకచోట నునంద ఇంకొకచోటా వుండడంలా? అని తర్కించింది -

ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇలా విడీవిడిగా వుండడం తెలిసిన విషయమే - అయితే పురుషుడికి ట్రాన్స్‌ఫర్‌ అయితే అతను వెళ్ళినట్లుగా స్త్రీకి ట్రాన్స్‌ఫర్‌ అయితే వెళ్ళడం కష్టం అని అనుకుంటారు - “నీది ట్రాన్స్‌ఫర్లు లేని ఉద్యోగం గనుక నీకాకష్టం తేలీదు - అదే నీకూ ట్రాన్స్‌ఫర్‌ అయిందనుకో, నన్నూ పిల్లల్నీ ఇక్కడుంచి నువ్వు వెళ్ళేవాడీవి కావా? అని నిలదీసింది-

రెండుకాపురాలు, రెండు ఇంటి అద్దెలు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు - అవ్వన్నీ నత్యనారాయణకి మాత్రం లేవా? అతన్నెందుకు వెళ్ళమన్నావంది ససేమిరా మెడీకల్‌ లీవు పెట్టను - వెళ్ళి చేరిపోతానంది -

“ని పిల్లల్నెవరు చూస్తారు?” అని ఆఖరి అస్తం ప్రయోగించాడు రాఘవరావు

“వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోకు - ఇంకా రెండు మూడు నెలల్లో వాళ్ళకి పరీక్షలైపోతాయి - వేసవిసెలవుల్లో తీసుకువెళ్ళి అక్కడ చేర్పిస్తాను - అత్తయ్య చూడనంటే చెప్పు - మా అమ్మని తీసుకొస్తా ' అంది -

“పిల్లల్ని చూడ్డం నావల్ల కాదు - అనలేక పోయింది రాఘవ తల్లి - ఆవిడకి మొదటి నించీ వాళ్ళంటే ప్రాణం - వాళ్ళకీ నాయనమ్మంటే యిష్టం - అంతేకాదు రాఘవరావు చెల్లెలు 'పెళ్ళినడుంకట్పకుని జరిపించింది రజనీయే - బ్యాంక్‌లో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా యిచ్చింది

బదిలీ 139

“ఎదో పంతానికి పోతోంది పిచ్చి పిల్ల - ఒకనెల వంటరిగా వుంటే తెలిసొస్తుంది - తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది - ఈ భాగ్యానికి దానితో తగాదా ఎందుకురా రాఘవా

  • వెళ్ళనియ్‌ - పిల్లలు నాకు బరువా ఏం? "అందావిడ

“ఇలాగే వెనకేసుకొస్తావు - అసలు వెళ్ళడం ఎందుకంటా - ఆ డబ్బు ఇక్కడ సంపాదించుకోకూడదా? అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా? ' అన్నాడు మామగారు

“పోనీ, రాఘవే అక్కడికి రావచ్చు గదా - ఇంత జీతం వచ్చే ఉద్యోగం ఆతనికి మాత్రం అక్కడ దొరకదా!” అంది రజని చిరాకుపడిపోతూ -

“బాగానే వుంది సంబరం - వాడిది పర్మనెంటు ఉద్యోగం - పదేళ్ళ సర్వీసు - ఇదంతా పోగొట్టుకోవాలా? రిటైర్‌మెంటు బెనిఫిట్స్‌ పోవా!” అన్నాడు మామగారు కోపం తెచ్చుకుని -

“నాదీ అంతేనండీ - ఎనిమిదేళ్ళ సర్వీస్‌ డ్యూ ఫర్‌ ప్రమోషన్‌ - నాకు మాత్రం రిటైర్‌మెంటు బెనిఫిట్స్‌ పోవా?”

“నీ పెద్దతనంలో నిన్ను మొగుడూ పిల్లలూ చూసుకోరా? నీకేం తక్కువమ్మా!” అంది అత్తగారు

“ఆయన్ని మాత్రం పిల్లలు చూసుకోరా?' అంది రజని -

“మొండి వాడు రాజు కంటే బలవంతుడని సామెత - కానియ్యమ్మ - నీ యిష్టం వచ్చినట్లే కానీ - తప్పేదేముందీ - “అన్నాడు మామగారు అన్నాడే గానీ ఆయనకి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన రాఘవరావు చేతగాని తనానికి కోపం వచ్చింది - ఆ రోజు నుంచీ కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకుని, డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకుని పెళ్ళాన్ని అదుపులో వుంచుకోమని పోరుతూనే వున్నాడు ఉద్యోగంలో చేరిన రజనీ పదిహేను రోజుల తరువాత పిల్లల్ని చూడడానికి వస్తూ వాళ్ళకి బొమ్మలూ పుస్తకాలూ తెచ్చింది - అత్తగారికి కూడా ఏవో తెచ్చింది - ఒక్కతే వుంటున్నందుకు దిగులుపడి వుంటుందనీ, చిక్కిపోయి వుంటుందనీ పిల్లలమీద బెంగ పెట్టుకుని వుంటుందనీ - ఇంక తప్పకుండా ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నం చేస్తుందనీ ఆశపడ్డారు అందరూ - అదేం లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది అక్కడ ఆఫీసులో పనిచెయ్యడం తనకి చాలా నచ్చిందట - పిల్లల సీట్లకి కూడా ప్రయత్నిస్తోందట - ఆపకుండా కబుర్లు చెబుతూంటే కనపడకుండా ఆళాభంగం చెందాడు రాఘవరావు వేసవి సెలవులకి అందర్నీ హైదరాబాద్‌ ప్రయాణం చేసింది అత్తగారు మావగారు మాత్రం ఏమీ యిష్టం చూపలేదు - రాఘవపిల్లల్ని తీసుకుని వెళ్ళాడు - సెలవులు రెండు నెలలూ అతనికి త్వరగా గడీచి పోయాయి - పిల్లల్లా ఊరుచూడ్డం - రజనికి వంటలో సాయం చెయ్యడం - పిల్లల సీట్లకోసం ప్రయత్నం - వాళ్ళని ఎంట్రెన్స్‌కి తయారుచేయడం = పరీక్ష వ్రాయించడం - ఈ హడావుడీలో, ఆనందంలో అతను రజనీ వేషభాషలు మారాయనీ,

140 ఇల్లలకగానే. , .. సుబ్బారావు అనే వ్యక్తీ అతని భార్యా ఆమెకి సన్నిహితులయ్యారనీ గమనించలేదు. ఆ మాటకొస్తే రాఘవరావూ సుబ్బారావు కలిసి చాలాసార్లు బీరు సేవించారు - సినిమా చూశారు

  • ఛెస్‌ ఆడారు - పాటలు పాడారు “రుదాలి సినిమాలో భూపేన్‌ హజారికా పాట సుబ్బారావు పాడినప్పుడు పరవశుడై అతన్ని కౌగిలించుకున్నది రాఘవే - అతను తమ ఇంట్లోనే తమ పాయ్యి మీదే గుత్తి వంకాయకూర వండినప్పుడు, ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడిందీ రాఘవే - అప్పుడెప్పుడూ అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏ మాత్రం అనభ్యత కనిపించలేదు - సుమతినీ సుబ్బారావునీ ఎంతో మెచ్చుకున్నాడు కూడాను -

కానీ ఇప్పటి పరిస్థితి వేరు - ఇప్పుడు సుమతీ సుబ్బారావూ రజనీ కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు - కలిసి వండుకుంటున్నారు - ఇవ్వన్నీసామాన్లు కలిసి వస్తాయని చేశా మంటున్నారు -

ఈవూరు నుంచీ హైదరాబాద్‌ వెళ్ళొచ్చే వాళ్ళు చాలామంది వున్నారు - వాళ్ళల్లో కొంతమంది పనిగట్టుకుని రజని వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి రావడం, ఆమె ఇంటికి వెళ్ళి రావడం చేస్తున్నారు - యిష్టం వచ్చినట్టు స్కాండల్స్‌ ప్రచారం చేేస్తున్నారు-

రాఘవరావు మనస్సంతా చికాకుగా తయారైంది- రజనీ వెళ్ళి సంవత్సరం కావచ్చింది = పిల్లలూ తల్లీ కూడా చాలా అనందంగా కన్పించడం కూడా అతనికి నచ్చడం లేదు - ఇప్పుడతను ప్రాద్దునపూట ఎం సెట్‌ కోచింగ్‌ పెట్టుకున్నాడు ఈ వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు రజనీని వొప్పించి తీసుకురావాలని - వొప్పుకుని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించు కున్నాడు - ఆమె చేత ఎ విధంగానైనా రెండు మూడు నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు,

“ఎమిటో ఈ సపెద్దతనంలో నాకు ఇంటి బాధ్యతలు పడ్డాయి- అంటూ తల్లి సణుగుడు -

“నువ్వొట్టి దద్దమ్మవి' అని తండ్రి ఆక్షేపణ -

“ఆ సుబ్బారావెవరబ్బా! ఇంక మీ ఆవిడ నిన్ను విడిచిపెట్టేసినట్లేనా” అని సుందరం లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు ఎ

రజనీ హుషారు - రజనీ చురుకుదనం - సత్యనారాయణ వెళ్ళి రెండేళ్ళయినా సునంద దిగులుగా లేదు- హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటోంది - తనూ సునందకి సాయం చేస్తున్నాడు గానీ తననీ సునందనీ ఎవరూ ఏమీ అనడం లేదు - “అవును - పాపం సత్యనారాయణ కి ట్రాన్స్‌ఫర్‌ అయింది ! ఉద్యోగం మీద ఆధారపడ్డ వాడు వెళ్ళక తప్పదు - ఏం చేస్తాడు? వెళ్ళ బట్టే ప్రమోషన్‌ వచ్చింది - వాళ్ళావిడ పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని

బదిలీ 141 చదివించుకుంటోంది - చాలా నెమ్మదస్థురాలు వంచిన తల ఎత్తదు-' అని ఆవిడకి అంచా శాలువ కప్పి సన్మానించారు కూడా

“రజనీకి పాపం ట్రాన్స్‌ఫర్‌ వస్తే వెళ్ళింది - పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది కష్టపడి చదివించుకుంటోంది పాపం! సుబ్బారావు ఆమెకీ చాలా సాయం చేస్తున్నాడు చాలా మంచి అమ్మాయి- ఎంతో చురుకైనది - ఆమెకి ప్రమోషన్‌ రావడం ఖాయం!” అని ఎవరూ అనడం లేదు - ఎందుకో అర్ధం కావడం లేదు రాఘవరావుకి నిజంగా రజనీలోనే లోపం వుందనిపిస్తోంది అతనికి - ఎది ఎమైనా ఎం సెట్‌ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకు రావాలనే సంకల్పంతో హైదరాబాద్‌ వెళ్ళాడు పట్టుదల తోనే అతను రజనీకి డబ్బు పంపడం లేదు రజనీ తనని ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు - పిల్లల న్కూల్‌ ఫీజులు అక్కడ ఎక్కువే - ఎలా తంటాలుపడుతుందో చూడాలి అనుకున్నాడు

అతను వెళ్ళేసరికి సుమతి, సుబ్బారావు రజని ఎవరూ ఇంట్లో లేరు - పిల్లలు టీవి చూస్తున్నారు -,టీ.వి కోసం ఫ్రిజ్‌ కోసం వీళ్ళింటికి మారిందా అనిపించింది - ఒక బెడ్‌రూం ఒక బాత్‌ రూం ప్రత్యేకంగా రజనివి - హాలు ఇద్దరూ వాడుకుంటారు - వంట ఇంట్లో సామాన్లన్నీ ఎవరివో తెలీదుగానీ పిల్లలు తనకి కాఫీ పెట్టకునే సామాన్లు చూపించి కాఫీ కలుపుకోమన్నారు - సుమతీ సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు రజనీ మీద ఎంత కోపంగా వున్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా ప్రశాంతంగా వున్నట్లనిపించింది - పిల్లలిద్దరూ ఊపిరాడనీయకుండా కబుర్లు చెప్పారు నాయనమ్మని తాతగారిని తీసుకు రాలేకపోయారా అని అడిగారు.

“సుబ్బారావు, సుమతీ ఎమైనా అనుకుంటారేమోనని రాలేదు వాళ్ళు - మనం వేరేవుంటే తెచ్చేవాళ్ళే -” అన్నాడు కావాలని -

“సుబ్బారావు అంకుల్‌ చాలా మంచివాడు - ఏం అనుకోడు -” అంది పాప-కళ్ళు తిప్పుతూ -

రాఘవ ఏమీ అనలేదు -

“నువ్వీ ఇంట్లోకి మారడం నాకేం నచ్చలేధు రజనీ - ఇక్కడ మనకి ప్రయివెసీ ఎముంది? అయినా ఎప్పుడూ ఇక్కడే వుండబోయే దానిలా ఎందుకు మారావు? నీ చేత రెండు నెలలు సెలవు పెట్టించి మన వూరు తీసుకుపోదామని వచ్చానీసారి - నాకిక్కడ వుండబుద్ధి కావడం లేదు -' అన్నాడు రజనితో రాత్రి

“ఏది మన వూరు?” అంది రజని

“అదేమిటి? మన వూరు - మన వూరే-”

“అది నువ్వు ఉద్యోగం చేసే వూరు - ఇది నేను ఉద్యోగం చేసేవూరు - మనకంటూ ఒక వూరేది రాఘవా? ఏ వూళ్ళోనైనా మనకి పాలమో ఇల్లో వుంటే అది మన వూరౌతుంది -

142 ఇల్లలకగొనే.... లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన వూరు - ప్రస్తుతం ఇక్కడున్నాం గనుక ఇదే మన వూరు = విం - ఈ సారి ఇంత కోపంగా వచ్చావు?” అని భుజం మీద చెయ్యి వేసింది -

“నీ లాజిక్కంతా వినడానికి బాగానే వుంటుంది - కానీ నాకిప్పుడు నచ్చడం లేదు - నేనిప్పుడు బాగా సంపాదిస్తున్నాను - ఏడాది నుంచీ లక్ష రూపాయలు బ్యాంకులో వేశాను - నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధలేదు - నీకు నెలకి వచ్చే జీతం నేనిస్తాను - వచ్చెయ్‌ వెడదాం - వేసవి సెలవులకి పిల్లల్ని తీనుకురమ్మని అమ్మ చెప్పింది -” అన్నాడు రాఘవరావు -

“నేనూ సంపాదిస్తున్నాను రాఘవా - నా జీతం ఇంటద్దెకీ మా తిండి తిప్పలకీ చిన్న చిన్న సరదాలకీ పిల్లల స్కూల్‌ ఫీజులకీ చాలడం లేదని, నేనూ ఒక పత్రికాఫీసులో సార్టైైం ఉద్యోగం చేస్తున్నాను - రాత్రి ఎడింటి నుంచీ ఎనిమిదింటి దాకా ప్రూఫ్‌లు దిద్దడం - మేము బాగానే వున్నాం - ఏ పనీ చెయ్యకుండా నీదగ్గర్నుంచీ జీతం తీసుకోవడం నా కిష్టం లేదు -' అన్నది రజని - రాఘవరావు ఉలిక్కిపడ్డాడు - రజనికి ఎంత ఆత్మాభి మానమో తనకి తెలుసు =

“మీరు లక్ష రూపాయిలు దాచి నందుకు సంతోషం - మీ చెల్లెలు పెళ్ళికి నగలు పెట్టి బ్యాంక్‌లో అప్పు తెచ్చాం - అవ్వి విడిపించి యిస్తే నాకు పనికొస్తాయి -' అంది -

అ నగల సంగతి తనకిన్నాళ్ళు ఎందుకు గుర్తు రాలేదో అర్ధం కాలేదు రాఘవరావుకి శల్లిగానీ తండ్రీగానీ ఆ మాటే గుర్తు చెయ్యలేదు -

“నాతో రానంటావయితే - నుబ్బా రావుని చూడకుండా వుండలేనంటావు?” అన్నాడు

  • ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది - కిటికీ దగ్గర నిలబడి సిగరెట్‌ ముట్టించుకున్నాడు = హాయిగా నిట్టూర్పు వదిలాడు రజనీ చాలాపేపు మౌనంగా వుండిపోయింది - ఆమె ఎడుస్తోందేమెనని వెనక్కి తిరిగాడు - మంచంమీద పడుకుని పుస్తకం చదువుతోంది - ఆ తలబిరుసు తనమే తనకి వొళ్ళు మండించేది.

“నేను రేపు వెళ్ళిపోతాను - నాకిక్కడ వుండడం నచ్చలేదు - నేనింకెప్పుడూ ఈ ఇంటికి రాను - నువ్వు మనస్సు మార్చుకుని ట్రాన్స్‌ఫర్‌కి ప్రయత్నం చేసుకుని అక్కడికి వస్తే మంచిది

  • ఉద్యోగం మానేసినా నాకిష్టమే - నీకేలోటూ లేకుండా చూసే బాధ్యతనాది - నువ్వు కష్టపడి రెండు ఉద్యోగాలు చెయ్యక్కర్లేదు - నేనింకేం చెప్పను - మీ అఫీసులో జనం ఏం అనుకుంటున్నారో, ఊళ్ళో వాళ్ళేం అంటున్నారో, అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి మరీ చూసుకో ఎ అన్నాడు.

రజని మాట్లాడలేదు - ఆమె ముఖం ఎ భావములేని తెల్ల కాగితంలా వుంది -

బదిలీ 143 చెప్పినట్లే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు - పిల్లలు అతని వెంట బయలుదేరితే “ఇక్కడే వుండండి” అన్నాడు - “ఉండండి సార్‌, సెలవులే కదా -” అని సుబ్బారావు అంటే, “పని వుందిసార్‌ ! మళ్ళీ వస్తాను'"- అన్నాడు. వారం రోజులు తరువాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్బుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పజెప్పాడు - దానితో పొటు ఒక్క ఉత్తరం కూడా లేదు - మరో వారం తరువాత పిల్లల పేరిట పదివేల రూపాయిలకి డ్రాఫ్ట్‌ వచ్చింది - వాళ్ళ స్కూల్‌ ఖర్చుల కోసం అని - దాన్ని తిప్పి పంపింది రజని - తిరిగి వచ్చిన డ్రాఫ్ట్‌ మీద ఇంట్లో తర్జ్దన భర్ణనలు జరిగాయి రాఘవరావంత దద్దమ్మని ఇంత వరకూ తన జీవితంలో చూడలేదని తండ్రి అక్షేపించాడు. ఇంటిపనిలో సగం పని మనిషినీ మరొక సగం వంట మనిషినీ పెట్టి చేయిస్తున్నా తల్లి సబుగుతూనే వుంది రజనీ కనీసం ఫోన్‌ కూడా చెయ్యడం మానేసింది - రజనీ , రాఘవరావూ శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా, ఎవరో విని ఇంకెవరితోనో అంటే, వాళ్ళు “అది నిజమా! అయ్యో పాపం!” అని ?రాఘవరావుని) పరామర్శించడాని కొచ్చేరు డాబామీద పడుకుని ఆకాశంకేని చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపాచ్చింది- వీళ్ళంతా కలిసి తన మనస్సుని ఓ పనికిరాని పాతసామాన్ల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు - ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగడానికి ప్రయత్శిస్తున్నాడు తను-ఆమెని ఘోరంగా అవమానించి వచ్చాడు. తననింక క్షమించదు - ఇప్పుడే మొహం పెట్టుకుని వెడతాడు అక్కడికి? రజనీ ఎమిటో తనకి తెలియదా ? ఎంత పిచ్చిగా మాట్లాడి వచ్చాడు | సత్యన్నారా యణ అక్కడేం చేస్తున్నాడో, ఎవరితో తిరుగు తున్నాడో ఒక్కరోజు కూడా సునంద అలోచించదు - సునందే కాదు, ఊరివాళ్ళు కూడా అతన్ని ఏమీ అనరు అతను ఏ అమ్మాయిని స్కూటర్‌ మీద ఎక్కించు కున్నా “ఈ రోజుల్లో అవ్వన్నీ పట్టించు కోకూడదు ఈ 'స్పేడు యుగంలో అదేం తప్పు?” అని సమర్ధిస్తారు. రజని విషయాన్ని తన తండ్రి, ఊరిజనం ఇంత పట్టించు కోడానికి కారణం ఎమిటి? రజనీ లాంటి అమ్మాయిల్ని చూస్తే వాళ్ళకి భయం అటువంటి వాళ్ళి నెత్తిన మొట్టి అఖిచివుంచకపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం రజనీ లాంటి 'పాగరుబోతు'ను చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు అది పాగరుబోతుతనం కాదనీ ఆత్మగౌరవం అనీ వ్యక్తిత్వం అనీ మెచ్చేసుకుని అలాంటి అమ్మాయితో బ్రతకడంలోనే ఆనందం వుందని తీర్మానించుకున్నాడు కానీ పెళ్ళికాగానే తను సగటు భర్తలా మారిపోతున్నాడు రజనీ సహచర్యంలో తనేం నేర్చుకోలేక పోయాడు. రాఘవరావు ఒక్క

144 ఇల్లలకగానే. ... 0

ఉదటున లేచి, సూట్‌కేసులో నాలుగు జతల బట్టలు కుక్కుకుని, “నేను హైదరాబాద్‌

వెడుతున్నాను” అని తల్లికి చెప్పాడు.

“ఈ సారి తాడో పేడో తేల్చుకొచ్చియ్‌' అన్నాడు తండ్రి రాఘవరావు సమాధానం చెప్పకుండా! పరిగిత్తుకువెళ్ళి చివరి బస్సు అందుకున్నాడు ఉషోదయానికి రజని ముందు వాలాలి,

కదిలేబస్సు కీటికీ దగ్గర కూర్చుంటే కమ్మనిగాలి చెంపల్ని తాకింది. రజని తనని తప్పకుండా క్షమిస్తుంది. “నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవా-” అని తనని దగ్గరకు తీసుకొని తన నుదుటిమీద ముద్దు పెట్టినట్లు కలకూడా వచ్చింది

(ఆహ్వానం మాసవత్రిక, ఎవిల్‌ 1995) గ్‌ గ అవిటి ణో గ్‌ ([ | 0) 62 నగ

త్యాళ్లాలకగాన .... అ రకాశం1లనీ నుం గోప తొంసంం ఇల్లంగానే ంం జరు 'షందిరీ | రుసుగు భద్తోత గణీతం దేర్చడు . గొౌంధొరీరొగం లిరుఖినంట్టు తెంకస్వుట్లు తెళ్ళిరోయాదు పెళ్ళిర్రియాఖం దసీలీ టె. సత్యవతి కథలు