Telugu ఆరు రకాల స్కూళ్లు ఎవరి కోసం ఎందుకోసం - anilvaranasi/indianlanguages GitHub Wiki

ణ్‌ / క జ! న గ జా ప క గ 4 ₹ ఖే | (1) నా స జ. 1 స్‌ టీ11 న 6. వకగ? వేరెర ర్‌ 7 య్‌! కకక రీడ్‌, న. కాళ. ||| శ ,. || | | శ ( || +" కకం నన?! తెన్‌ ఫీ న. ( ౪న స! లా కలా మ ( ఆ టన న్‌ | | క్‌ [3 వలీకీ జ! క గ. ర 1 హహ వలే ల. ్న ా | (త. 111 క వే గ 4 గి ||| శ్‌ శ. ౯ | 1 నో ఓ ల ఆ . కా హక చా [ || న. వ ఇట యానా. న ః వ క తంల ళో న్న అ చమన ౯ ర్‌ పష రేవ ష్‌ ఫ్రం లి ఎ క క వ్‌ సన కక కే చ లాల ఫ్యాల్య మ గో శి ఆ గల త్యళ్ళతీ టై న్స్‌ ళాల అటు. తర్‌ ఓ కే త్‌ పా ము గ ల ఉీ జ జి ఆనే కేక అ కం! క ఫషక జక క. న టం ల ల్‌ ఓ క జే శ ఇ లీల, శా అలో తాం ళా “టీ త ఈ గ్‌! తీ ద్‌ నః క్‌ క్ని | క సశ మ | "| . న టం ” | భభ | హ్‌ 1 న. ఇ ,* | ( |

ః “కశ సే స ౯ల ర కం ు చనన న అ తూ ణ్‌ న్‌ నంతా ాణనన, న్‌ శ్‌ " శరభ “రా నానా నిినమయన వసన ల వా నన న. = సర రావన్న కం ల? క నే మేన్‌ 1 క్ష “లక మ్‌ కసత! = శనీ ఫా | ల లాన్‌ నా. ప న అమ ఖా యనా మ అ బగ డా కాల న్‌ లే సళ అ శా న. యై న " ఒసే = చాడా వరే జా ; ॥ - క 1 తా న (" ల ఇ * | లం శ్‌ క న్‌. క్‌ ర | 4 5 ల! | కర ని క త || క్‌. నా | ల ఇ [| శ ఈ, 1 ఇ. వసి స్‌" జా మళ స్‌ గ్‌ ఇ. | ॥ ॥ సం క్ష త ఛి ” | శ

ఇ [| || ల కా క ప్‌ గ ళీ | సా 1: క్త మ. | స ఎనీ ష్‌ న న్‌ు ల్‌ . నా గ నా . ట్‌ మం £్‌ే ల అ క కా శా 9 న్‌ శ వ. గ్‌ | 1 ఆ వ. తథ ననన ఇ. క వో ము ఇకా, (స ప. జ శ్‌ ఇని గ్‌. య 4. | (| బో కా ళ్‌? యన. ఇ చా 11 . | మ్య స స త్త నే న ట్ట + వ నో గ క [| జ్‌ | అ శ్‌ ౯ న్‌ 1 క . నన్‌. ॥ మ్‌ జ [| | + ట్రీ

మ గ్‌ జీ (| ఖ్‌ అః ల హ్‌. న ఖ్‌ న్‌ క. (| ఖ్‌ ర శ్రే [ | అ ॥ సే , 4 ళా " శ న క. ' ల? న న్‌ కాల శ ల్‌ ణ్‌ చ్‌ న కో నా / ఖై జ కూ _

వుం. ఊం టా క్కి

'/ ఓ511బీ 016౧646 ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ? |

నే గీ త శ ఎ ( / ౨

ఈ సంవత్సరం పాఠశాలలు తెరిచీ తెరవకముందే “అమ్మఒడి సొమ్ము జమైంది. గత ఏడాదే స్మూళ్ళు 'నాడు -నేడుతో చూడముచ్చటగా ముస్తాబయ్యాయి. విద్యాకానుక సంచి పిల్లలకోసం ఎదురుచూస్తోంది. ఇవన్నీ ఉన్నాక పిల్లలు బదిగంట విన్సించగానే పరుగెత్తుకొని వచ్చి ఉందాలి. చిన్నారి పిల్లల స్వప్నలోకం మన బడి విరబూసిన తోటలా మారి ఉండాలి.

కానీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు పదెళ్ళు కూడా రాని పసి పిల్లలు ధర్నాలకు దిగుతున్నారు. వాళ్ళ అమ్మానాన్నలు బడికి తాళాలు వేస్తున్నారు. చాలామంది ప్రైవేట్‌ బాట పడుతున్నారు. టీచర్లు ఏమీ చెయ్యలేక కన్నీళ్ళు గుక్కుకొంటున్నారు.

చరిత్రలో ఎప్పుడూ జరగనట్టు ఈ సంవత్సరమే ఎందుకిలా జరుగుతోంది? బడుల విలీనం, తరగతుల మ్యాపింగు, పిల్లల తరలింపు, బలవంతపు టిసిలు లాంటి ఎప్పుడూ వినని మాటలు మన పాఠశాల విద్యారంగాన్ని చుట్టు ముట్టడంతో ఇలా జరిగింది.

ఒక్క మాట నిజం. దీన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా ఒప్పుకోడం లేదు. అసలిలా ఎందుకు జరుగుతోందో ఒక్కరికీ అర్ధం కావడంలేదు. అందరూ ఇంత అన్యాయమా? అంటున్నారు. ఊరిబడిని ఉరికంబం ఎక్కిస్తారా? అని

విస్తుపోతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టు విడవడం లేదు. “ఇప్పుడే ఏమైంది? ముందున్నది ముసళ్ళ పండగ” అంటోంది. బడి పైకి బుల్‌డ్రోజరుని తోలుతోంది. ఎందుకిలా జరుగుతున్నట్టు?

“ఇదంతా నూతన విద్యా విధానంలో భాగిమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలను రెండు ముక్కలుచేసి ఒక ముక్కని అంగన్‌వాడిల్లో, ఒక ముక్కను హైస్కూల్లో కలపడం మా విధానమని తేల్చి చెబుతోంది. ఫలితం ఈ గందరగోళం! ఈ విధ్వంసం! చిన్న పిల్లల చదువులతో చెలగాటం! ఫా అడు రకాల స్మూళ్ళు వవంకోసం ? ఎందుకోసం ?

తవాదవాడలా పాఠశాలలు మన రాష్ట్రంలో దాదావు 100% జనావాసాల్లో ప్రాథమిక వొఠశాలలున్నాయి. లక్ష జనాభాకు అన్నీ కలిపి 92 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. పైవెట్‌ స్కూళ్ళతోనూ కలిస్తే ఇవి 129 అవుతాయి. భారతదేశపు సగటు (83)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. దేశమంతా 2001-14 మధ్య పాఠశాలలు పెరిగితే మన రాష్ట్రంలో 1980 నుంచే ఈ పెరుగుదల ప్రారంభమైంది. వాడవాడకూ బడి వుందటంతో బడికొచ్చే పిల్లల సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా బీసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల పిల్లలు ఎప్పుడూ లేనంతగా బడికి రావడం మొదలైంది. పిల్లలు 1-5 తరగతుల మధ్య బడి మానెయ్యడం కూడా దాదాపు లేకుండా పోయింది. ఇదంతా ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో, చిన్న చిన్న జనావాసాల్లో బడి వుండటం వల్లనే సాధ్యమైంది. వాసి పెరిగినా రాసి తగ్గింది కానీ మారుతున్న కాలంలో ఈ చిన్న చిన్న వ్రాథమిక పాఠశాలలు పోటికి నిలబడలేక పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇవన్నీ ఒకరిద్దరు టీచర్లతో నడవడమే. రెండో కారణం (్రైవేట్‌ హవా. తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆకాంక్షలు మూడో కారణం. అథధ్వాన్నపు వసతులు నాలుగో కారణం. ఫలితంగా ఇవి మూతబడ్డం మొదలైంది. ఒక్క మన రాష్ట్రంలోనే గాదు దేశమంతా ఇదే పరిస్థితి. దింతో “చిన్న పాఠశాలల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. 'విద్యాహక్కు ఫోరం” లెక్క ప్రకారం 2015 నాటికి దేశంలో 81,647 ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి లేదా విలీనమయ్యాయి. మిగిలినవి మరీ చిన్న స్మూళ్ళుగా మారాయి. మన రాష్ట్రంలో 2022 నాటికి 8,343 స్కూళ్ళు ఏకోపాధ్యాయ వొాఠశాలలుగా మారి బిక్కు బీక్కుమంటూ మిగిలాయి. ఇవన్ని దండగమారినవనీ, మొయ్యలేని భారంగా మారాయని, వీటిలో విద్యార్థికి 40వెల రూపాయలు ఖర్చువుతోందనీ ప్రపంచబ్యాంకు నుంచి నీతిఆయోగ్‌ దాకా రాఫ్రైలను “హెచ్చరించి సాగాయి. వీటిలో చదువు రాదని అధ్యయనాలూ, సర్వలూ “ఘోషించిడం మామూలైపోయింది. అసలు నిరుపేద పిల్లలు ఇంత ఆధ్వానపు స్కూళ్ళలో ఎందుకు చదవాలి? అనే నామాజికన్యాయ కోణమూ ఆరు రకాల స్ఫూళ్ళు ఎవరికోసం ? వందుకోసం

ముందుకు రాసాగింది. గత 10 ఎళ్ళుగా ఇవి మూత బడ్డమో, విలీనం కావడమో, టీచర్లు లేకుండా వాలంటీర్లతో నడవడమో, టీచర్లకు రేషనలైజేషన్‌ జరగడమో మామూలు విషయంగా మారిపోయింది. ఇలా ఇబ్బడిముబ్బడిగా వాడవాడలా బడులు పెట్టడం వల్ల బడులన్నీ ముక్కలు ముక్కలై బలమైన బడి ఒక్కటి కూదా లేకుండా పోయిందనీ; ప్రమాణాలు పడిపోవదానికీ, పిల్లలు ప్రైవేట్‌ బాటపట్టడానికీ ఇదో ప్రధాన కారణమనీ విశ్లేషణలు బలంగా తోసుకురాసాగాయి. అయితే ఇది ఒక్క కేరళ మినహా దేశమంతా వున్నదే. నూతన విద్యా విధానం పేరుతో...

ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్ర (ప్రభుత్వం ఆరు రకాల స్కూళ్ళను తెరమీదికి తెచ్చింది. నిజానికి ఎనఇపికి దీనికీ ఏ సంబంధమూ లేదు. ప్రాథమిక పాఠశాలల్ని విడగొట్టమనో, తరగతుల్ని విలీనం చెయ్యమనో ఎన్‌ఇపి ఎక్కడా చెప్పలేదు. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యల్లోని 1-2 తరగతులు కలిపి 5 ఏళ్ళు ఒక అభ్యసన దశ అని మాత్రమే అది పేర్కొంది. పైగా “అంతమాత్రాన పాఠశాల భౌతిక వసతుల్లో, స్వరూపంలో దీనికోసం మార్పులు తీసుకొని రావల్సిన అవసరంలేదు” అని కూడా (ఎన్‌ఇపి-4. 3) స్పష్టంగా పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ కూడా ఇటీవల ఈ మేరకు వివరణనిచ్చింది. భారత దేశంలో ఎన్‌ఇపి పేరుతో ఇలా తరగతుల్ని విలీనం చెసిన ఒక్క రాష్ట్రమూలేదు. బిజెపి పాలిత రామ్రైలు కూడదా దీనికేమీ పూనుకోలేదు. కానీ ముఖ్యమంత్రి నుంచి మేధావులనబడే వారి దాకా “ఇదంతా నూతన విద్యా విధానంలో భాగం” అనడం విచిత్రంగా వుంది. నవ్వులాటలా వుంది.

ఆరు రకాల స్మూళ్ళు ఎందుకు 7

ఆరు రకాల సర్మ్మూళ్ళకోసం (ప్రభుత్వం జిఓ ఎంఎన్‌ నం. 684; తేది. 24. 12.2021ని విడుదల చేస్తూ, 2019లో ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలలు మరీ ముక్కలు ముక్కలుగా (100 [2౩గల66)గా వున్నాయని, ద్రాపౌట్స్‌ తగ్గించడానికి విటిని తగిన విధంగా మార్చాల్సి వుందని సిఖార్సు చేసినట్టు పేర్కొంది. అలాగే ఎన్‌ఇపి కూడా (ప్రస్తుత అభ్యసన ప్రమాణాల్లోని తీవ్రమైన హెచ్చు తగ్గుల్ని సరిచేసేందుకు; అత్యున్నత వ్‌ ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ?

ప్రమాణాలు, సమానత్వం సాధించేందుకు పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యదాకా తీవ్రమైన మార్పులు తేవలసి వుందని పేర్కొన్నట్టు చెప్పుకొచ్చింది. దీనికనుగుణంగా ర5+8+8+4 దశల్చి వాటికి తగ్గ పాఠ్యాంశాల్ని రూపొందిం చాలని ఎన్‌ఇపి నిర్ధాశించిందనీ పేర్కొంది. అయితే పాఠశాలలు ఆరు రకాలు వుండాలని బాలకృష్ణన్‌ కమిటీ సిఫార్సు చేసిందా? చేస్తే ప్రభుత్వం ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టదు? అలాగే ఎన్‌ఇపి ఆరు రకాల స్కూళ్ళను ఎక్కడ ప్రతిపాదించింది? పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటీ సంస్కరణలు ఎందుకు తీసుకొసోందో ఒక అధ్యయన, విధాన పత్రమైనా విడుదల చేసి చర్చకు పెట్టిందా? లేదు. ఇంతపెద్ద సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు ఈ కనీస ప్రజాన్వామిక సూత్రాల్ని ఎందుకు ప్రభుత్వం పాటించలేదో మనకు తెలియదు. “ఇదో ఏకపక్ష నిరంకుశ నిర్ణయం. స్వీయ విధానం, బ్యూరోక్రాట్ల మానసిక పుత్రిక లేదా ప్రపంచబ్యాంకు వెనకనుంచి నడిపిస్తున్న నాటకం” అని మనమెవరమైనా వ్యాఖ్యానించవచ్చు. వారదర్శకత లేనప్పుడు, అంతా గుట్టుచప్పుడుగా జరుగుతున్నప్పుడు ఇలా నిర్వచించుకోడంలో తప్పేముంది? దీని ప్రకారం రూవొందుతున్న ఆరు రకాల స్కూళ్ళలో మొదటివి శాటిలైట్‌ ఫౌందేషన్‌ స్మూళ్ళు (2-1 & 29-2), వాస్తవానికివి ప్రస్తుత అంగన్‌వాడీలే, కాకుంటే ఇవిక నర్సరీ స్కూళ్ళుగా మారతాయి. రెండోవి ఫౌందేషన్‌ స్కూళ్ళు. ఇవి అంగన్‌వాడిలతో (99.1 & 9-2) కలిసిన 1,2 తరగతుల స్మూళ్ళు. ప్రస్తుత ప్రాథమిక స్మూళ్ళు ఈ రూపాన్ని సంతరించుకొంటాయి. మూడోవి ఫౌందేషనల్‌ ప్లస్‌ స్ఫూళు = ఒకటీ రెండూ తరగతుల్ని విడదీయలేని, అంగన్‌వాడీలతో కలిసిన ప్రస్తుత (వబ్రొాథమిక పాఠశాలలవి. వీటిలో 1-56 తరగతులతోపాటు 1-1] & 99.2 కూడా వుంటాయి. నాలుగోవి ప్రీ హైస్కూళ్ళు. ఇవి (ప్రస్తుత అప్పర్‌ (పైమరీ స్కూళ్ళు, కాకుంటే వీటిలో 1-9 తరగతులుందడవు. వీటిలో 3-8 తరగతులుంటాయి. అయిదోవి హైస్కూళ్ళు. ౩-10 తరగతులవి. ప్రస్తుత హైస్మూళ్ళలో ౩-5 తరగతులు అదనంగా చేరగా ఎర్బడ్డవి. ఆరోవి మూడు నుంచి 12వ తరగతి దాకా గల “పస్‌ టు” హైస్మూళ్ళు. ప్రస్తుత హైస్మూళ్ళకు ముందు 3-5 తరగతులు, వెనక ఇంటర్భీడియేట్‌ కలపగా ఏర్పడ్డవి. వీటికి మంచి తెలుగు పేర్లు కూడా దొరక్కపోవడం మన భాషా దౌర్భగ్యమని సరిపెట్టుకొందాం! ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ? 6

అతి పెద్ద ప్రమాదం ప్రాథమిక పాఠశాల ముక్కలు కావడం !

ఈ ఆరు రకాల స్ఫూళ్ళ విధానంలో అతి ముఖ్యమైంది, అతి ప్రమాదకరమైంది ప్రాథమిక పాఠశాలల్ని నిట్టనిలువునా చిల్చ్బడం. ఇది దేశంలోనే గాదు ప్రపంచంలోనూ ఎక్కడా జరగని వింత. (ఎక్కడో మహానగరాల్లో కొందరిలాంటి ప్రైవేట్‌ స్కూళ్ళు నడుపుతుండొచ్చు!) నూతన విద్యా విధానం ప్రస్తుత 10+2 వ్యవస్థ స్థానే 5+3+3+4 విధానాన్ని తేవడంలో సైతం శాస్త్రీయత ఏమీ లేదు. దీనివల్ల 8వ తరగతే టెర్మినల్‌ కోర్సుగా మారి 9వ తరగతి నుంచి ఐచ్చికాలు మొదలయ్యే ప్రమాదం రావచ్చు. ఇక 9,10 తరగతులు మాత్రమే హైస్కూళ్ళలో మిగలనూవచ్చు. 9-12 తరగతుల వ్యవస్థ కొత్తది రావచ్చు. ఇవన్నీ అభ్యసన దశలనడమూ సరైందికాదు. ఏ ప్రాతిపదికన మూడవ ఎటనుంచి ఇంకో దశ మొదలవుతుంది? పూర్వ ప్రాథమిక “విద్య”కూ, 1,2 తరగతులకూ ఏ పోలిక వుంది? ఎలా ఇవి రెండూ ఒక దశ అవుతాయి? అందువల్ల ప్రస్తుతం ఆచరణలో వున్న 1-5, 6-10 తరగతుల వ్యవస్థలే సరైనవి. 6-8 తరగతుల్ని ఒక దశగా చూడ్డానికి కూడా కాలం చెల్లింది. ఇక 11-12 తరగతులు ఐచ్చికాలు మొదలయ్యే తరగతులు. వాటి సిలబసూ, పరీక్షలూ అన్ని బోర్డుల్లోనూ వేరుగానే వున్నాయి. కాకుంటే 9 నుంచి 12 దాకా సెకండరీ విద్యగానే పరిగణిం చడం, వోస్టు గ్రాడ్యుయెట్‌ స్ధాయి ఉపాధ్యాయులు (పిజిటీలు, బోధించడం అన్ని రాష్ట్రాల్లో ఆనవాయితీగా వుంది. (ఒక్క మన రాష్ట్రంలో తప్ప!)

[ప్రముఖ విద్యావేత్త దిగంతర్‌ వ్యవస్థాపకుడు, జాతీయ పాఠ్య (ప్రణాళికా చట్రం -2005 రూపకల్పనలో ప్రధానపాత్ర వోషిం చిన రోహిత్‌ దినకర్‌ మాటల్లో చెప్పాలంటే “1-5 తరగతుల పిల్లలది ఒకె మానసిక స్థితి. ఒకే విధమైన పెరుగుదల. వాళ్ళ అభ్యసన పద్ధతులూ, వేగం ఒకే విధంగా వుంటాయి. పరిసరాలతో వ్యవహరించడం ఒకటిగా వుంటుంది. ప్రవర్తనా రీతులు కూడా ఒకే రకంగా వుంటాయి. అందుకే ప్రపంచమంతా అదొక దశ”. అలాగే నేర్చుకోడంలో 2-8 తరగతుల మధ్య ఒక కొనసాగింపు (0741 1200199) కూడా వుంటుంది. ఆసలీ దశలో పిల్లల్ని ఖచ్చితంగా తరగతులవారీ విడదీసి చూడలేం. నా థడు రకాల స్మూళ్ళు ఎవంకోసం ? ఎందుకోసం ?

అలాగే బడికీ ఇంటికీ దూరం కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ప్రాథమిక, ఉన్నత తరగతుల పిల్లలకు బడి ఒకే దూరంలో వుందొచ్చునన్న విధానం లేదు. మనం కూడా ప్రాథమిక పాఠశాల ఒక కిమీ దూరంలో, ఉన్నత వాఠశాల మూడు కి.మీ.ల దూరంలో వుండాలని నిర్వచించుకొన్నాం. విద్యా హక్కు చట్టం కూడా దీనికనుగుణంగానే వుంది. నురికొత్త వాదాలూ, వ్యాఖ్యలూ |! హైస్కూళ్ళలో ౩-5 తరగతుల పిల్లలుంటే వారికి సబ్బెక్టు టీచర్లు బోధిస్తారని, వారికి నాణ్యమైన విద్య లభిస్తుందనీ ప్రభుత్వం ఓ వాదనను మాటిమాటికీ తెస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక దశలో సబ్బెక్సు టీచర్లు బోధించడం ఎక్కడా లేదు. ఆ దశ హైస్కూలు నుంచి ప్రారంభమవుతుంది. ఐచ్చికాలు తొమ్మిదో తరగతి నుంచి మొదలవుతాయి. ప్రాథమికస్థాయి పిల్లల అవసరాల్ని, నామర్దాల్ని దృష్టిలో వుంచుకొనే ఉపాధ్యాయ శిక్షణలోనూ, అర్జతల్లోనూ రెండు రకాల కోర్సులున్నాయి. ఉపా ధ్యాయులు రెండు స్థాయిల వారున్నారు. సైకాలజీలోనూ, మెథడాలజీలోనూ తేడాలున్నాయి. అంతేగాదు చిన్న పిల్లలతో టీచర్లు ఒక సన్నిహితత్వం, అనుబంధం పెంచుకోవల్సి వుంటుంది. వారి తల్లిదండ్రులతోనూ సంబంధం నెరపాల్సి వుంటుంది. విద్యార్ధి మొత్తం విద్యకు ప్రాథమిక దశలో ఉవా ధ్యాయుడు ఒకే విధమైన ప్రణాళిక రూపొందించుకొంటాడు మొత్తం ఏద్యార్ధి వికాసానికి బాధ్యత వహిస్తాడు కూడా. బోధించడమే గాదు విల్లలతో వ్యవహరించడమూ, ఆటలు పాటలు నొాంస్కృతికాంశాలు కూడా వేరుగా వుంటాయి. భోజనం చెయ్యడంలో, విశ్రాంతిలో, శాదీరక అవసరాల్లో కూడా చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలతో సమానం చెయ్యలేము. అందుకే ప్రాథమిక పాఠశాల అంత ప్రత్వేకమైంది. దీన్నంతా వదిలేసి కేవలం సాంకేతిక దృష్టితో, ఏ అధ్యయానికీ అనుభవానికీ పొసగని రీతిలో ప్రాథమిక విద్యార్థుల్ని విడదీయడం మాటలకందని వివాదం, విధ్వంసం. హైస్కూల్లో అయితే విశాలమైన స్థలం, వసతులు, హెడ్నాష్టర్‌, ఒక వ్యవస్థ, విధానం, వాలన వుంటాయన్నది మరో వాదం. ('వ్రాధమిక వాఠశాలల్లో అంతా “అస్తవ్యస్తం” అని దీనర్ధం! ప్రాథమిక పాఠశాలలు చిన్న చిన్నవిగా మారడం, అరు రకాల స్ఫూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం?

వసతుళ్లేకపోవడం, ఆలనా పాలనా కరువు గావడం, అన్నిటికంటే మించి తరగతికొక టీచరు లేకపోవడం అనేవి పెద్ద సమస్యలని ముందే మనం చర్చించుకున్నాం. దీనికి పరిష్కారం అసలు ప్రాథమిక పాఠశాలలే లేకుండా చెయ్యడమా? మంచి ప్రాథమిక విద్యా వ్యవస్థను ఎలా నిర్మించడం? అని గదా చర్చించాల్సింది.

మన దేశంలో దాదాపు 72వేల పాఠశాలల్లో 1-10 తరగతులున్నట్టు యు-దైస్‌+ చెబుతోంది. కేంద్రీయ విద్యాల యాలు అలానే వున్నాయి. చాలా ప్రైవేట్‌ పాఠశాలలు కూడా ఇట్లానే వున్నాయి. ఢిల్లీ సర్వోదయ పాఠశాలల నమూనా కూడా మన ముందు వుంది. కానీ వీటన్నిటిలో 1-2 తరగతులు కూడా కలిసే వున్నాయని మనం మరిచిపోగూడదు. మొత్తం 1-5 తరగతులు కలిగిన ప్రాథమిక వాఠశాల వీటిలో వుంది. అది కూడా హైస్కూల్లో ఒక ప్రత్యేక భాగంగా వుంది. వాటికి బోధించే ఉపాధ్యాయులు వేరు. వాటి తరగతి గదులు రూపురేఖల వేరు. వాళ్ళ పని వేళలు కూడా వేరు. కాకుంటే ప్రాంగణం, పాలన 1-10 తరగతులకు మొత్తం ఒకటిగానే వుంటుంది.

మనం కూడా హైస్మూళ్ళను పై నమూనాలో మార్చవచ్చు. ఇందులో ఏ అభ్యంతరం వుండనక్కరలేదు. కానీ అవి ప్రాథమిక విద్యార్థులకు దగ్గరగా వుండాలి. వారికి బోధించే టీచర్లు వేరుగా వుండాలి. హైస్కూళ్ళ ప్రాంగణంలోనే చాలా చోట్ల ప్రాథమిక పాఠశాలలున్నాయి. మరి దగ్గరలో మరికొన్ని వున్నాయి. వీటిని హైస్కూల్లో విలీనం చెయ్యవచ్చు. కానీ విచిత్రంగా అదే ప్రాంగణంలో వున్న ప్రాథమిక పాఠశాలల 1-2 తరగతుల్ని కూడా ఎందుకు విదదీసి దూరం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. క్షేత్రస్థాయికి ఏమీ పొసగని మొరటు విధానమిది.

క్రేత్రస్థాయి సమస్యలు

ఈ ఏడాది 5000పైగా ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేసారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటి? ఒకవైపు “వసతులున్న ఉన్నత పాఠశాలల్లో మాత్రమే విలీనం చెయ్యండి” అని మౌఖికాదేశాలు ఇచ్చారు. కాని, ఎన్ని పాఠశాలల్ని విలీనం చేస్తే అంత సమర్ధ డిఇఓగా కితాబు లిస్తున్నారు. చెయ్యని వారిపై కన్నెర్ర చేస్తున్నారు. పై అధికారులే రికార్డులు తెప్పించుకొని తమక్కావల్సిన సంఖ్య వచ్చేదాకా టిక్కులు పెడుతున్నారు. విలీన పాఠశాలల తీరుతెన్నుల్లో ఒక విధానం, సారూప్యం ఏమీ వుండటం లేదు. అంతా అధికార్ల దయా దాక్షిణ్యం. 9 ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ?

హైస్కూల్లో కొత్తగా వచ్చె 3-5 తరగతుల పిల్లలకు కావల్సిన తరగతి గదులున్నాయా? మా పరిశీలనలో 90% ఉన్నత పాఠశాలల్లో ఏ అదనపు తరగతి గదీ అదనంగా అందుబాటులో లేదు. మరీ విచిత్రమేమంటే నాడు-నేడు రెండో దశలో సైతం వాటికి అదనపు తరగతి గదులు మంజూరు కాలేదు. మరి ఎల్లకాలం ఆ పిల్లలు వరండాల్తొ, చెట్లకిందా '“విలీనం” కావల్సిందేనా?

నాడు-నేడు మొదటి దశలో ప్రాథమిక పాఠశాలల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఏీటినుంచి 8-5 తరగతుల పిల్లల్ని కనీసం కూచోడానికి కూడా చోటులేని హైస్కూళ్ళకు తరలిస్తున్నారు. అధికార్లకిదంతా అర్ధం కాకపోయినా సామాన్యుడికి మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. ఫలితంగా పిల్లలు హైన్మూలుకు మారడంకన్నా _పైవేట్‌ బడికి మారడం మంచిదన్న నిర్ణయానికొస్తున్నారు. వాళ్ళకెలా సమాధానం చెప్పాలో తెలియక టీచర్లు సతమతమవుతున్నారు.

నిలుపుకోవడం చేతగాక...

తమ పథకాల కారణంగా రాష్ట్రంలో ఏడు లక్షలమంది పిల్లలు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి కరోనా వల్ల పిల్లలు ప్రభుత్వ వాఠశాలల బాటపట్టారని అన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. పెద్ద పెద్ద (పైవేట్‌ స్కూళ్ళ నుంచి చిన్న (బడ్జెట్‌ (పైవేట్‌ పాఠశాలలకు కూడా కరోనా కాలంలో పిల్లలు తరలివెళ్ళారు. మొత్తంగా ఇలా 50-60 లక్షలమంది బడులు మారి వుంటారని ఒక అంచనా. మన రాష్ట్రంలో అమ్మఒడి తదితరాల వల్ల కొంచెం ఎక్కువమంది ప్రభుత్వ వాఠశాలలకు వచ్చివుండవచ్చు. మొత్తం మీద ప్రభుత్వ విద్యార్థులు 43 లక్షలకు పెరిగి 60 శాతమయ్యారని యు-డైస్‌ చెబుతోంది. వీరిలో దాదాపు రెండు లక్షలమంది బడిబయట పిల్లలుంటారని విద్యాశాఖ అంచనా. ఇది పూర్తిగా అమ్మజఒడి ఫలితం. రాష్ట్ర విద్యాశాఖ విజయాల్లొకెల్లా ఇదే గొప్పది. (దీన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది).

విళ్ళను మన బడుల్లో నిలుపుకోడం ఎలా? వీళ్ళకి మన బడిపై నమ్మకం కల్గించడమెలా? పైవేట్‌ బడికంటే ప్రభుత్వ బడి మంచిదని ఒప్పించడమెలా? నిజానికివి మన ముందున్న సమస్యలు. ఆరు రకాల స్యూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం? 0

నిజం చెప్పాలంటే గత సంవత్సరమంతా వీళ్ళని గాలికి వదిలేశాం. వేల పోస్టులు ఒకవైపు ఖాళీ. ప్రాథమిక పాఠశాలలైతే సగానికి సగం ఏకోపాధ్యాయ పాఠశాలలు. స్థానిక విద్యాశాఖాధి కార్లు సర్టుబాట్లతో సతమతమయ్యారు. బడులు నడిచాయంటే నడిచాయి. దీనికి తోడు కరోనా తెచ్చిన అభ్యసన విపత్తు. రెందేళ్ళ చదువు పోగొట్టుకొని పేద పిల్లలు బిక్కు బిక్కుమంటూ బడికొస్తే వాళ్ళందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి కాలక్షేపం చేసి సరి పెట్టాం. నాడు-నేడు పనులతో, సవాలక్ష గణాంక సేకరణలతో, టాయి లెట్ల ఫోటోలతో చదువు తప్ప ప్రతిదీ మన బడిలో జరిగింది. ఏడు లక్షల మంది పిల్లలు అదనంగా చేరితే, రెండేళ్ళ చదువు పిల్లలంతా పోగొట్టుకొని వస్తే, అన్నీ పక్కనబెట్టి వీళ్ళని చదివే తరగతికి తగ్గట్టు మార్చడమెలా అనే ఒక్కదాని పైనే కేంద్రీ కరించాలన్న కసీసజ్ఞానం మన విద్యాశాఖకు కరువైంది. అసలు టీచర్లే లేకుండా బడులు నడిపి సర్కారు బడంటే మొహం మొత్తేలా చేసారు. నిజం చెప్పాలంటే పిల్లల పేదరికమే మన ప్రభుత్వ బడులకు శ్రీరామరక్ష ఇప్పుడు కరోనా నుంచి తేరుకొన్నాక, అమ్మఒడి కూడా సరిగ్గా స్కూళ్ళు తెరిచేప్పటికి జమవడంతో పిల్లలు మళ్ళీ ప్రైవేట్‌ వలనలు (ప్రారంభించారు.

బడుల విలీనం, పిల్లల తరలింపూ, వసతుల్లేని హైస్మూళ్ళలో పాఠాలు, టీచర్లు లేకుండా తరగతుల ప్రారంభం లాంటి దిక్కుతోచని స్థితిలో మరింతమంది జారుకొంటున్నారు.

మారిన కాలం, సామాజిక పరిస్థితులూ, పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రుల తపనా కలిసి మన దేశంలో ఒక “గొప్పు సంస్కృతిని” ఈ మధ్య తెచ్చి పెట్టాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బడిని తూకం వేస్తున్నారు. ఏ మాత్రం

నమ్మకం సడలినా నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. పిల్లల్ని బడి మార్చిస్తున్నారు.

ఇదే సమయంలో బడి మాన్పిచడం కూడా తక్కువైంది. దీన్ని మనం సానుకులాంశంగా కూడా చూడాలి. అయితే, ఇదంతా మన గొప్పదనమేమీ గాదు కాలం మహిమ. ఇక ఏమీలేని నిర్భాగ్య జనానికి సర్మ్కారుబడే శరణ్యమవు తోంది. ఇలాంటి వాళ్లు మాత్రమే మిగలడం వల్ల మన స్కూళ్ళలో ప్రమాణాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా పడిపోయా యని బ్రిటిష్‌ కౌన్సిల్‌ చెసిన అధ్యయనం చెబుతోంది. లాలా తడు రకాల సూ వవంకోసం ? వందుకోసం?

అతిపెద్ద విషాదం 1-2 తరగతులది !

మన (ప్రాథమిక వాఠశాలలు చిన్న చిన్నవని చెప్పుకొన్నాం. ఇంత చిన్న స్కూళ్ళలో చదువెలా వస్తుందని, ఇవన్నీ దండగ మారినవని, అసలివి కాల గర్భంలో కలిసిపోక తప్పునివని ఒకవైపు సకల శాపనార్జాలూ పెడుతున్నాం.

ఇప్పుడు ఇంత చిన్న స్కూళ్ళనుంచి 3-5 తరగతుల్ని తరలించి 1-2 తరగతుల్ని మాత్రమే మిగిల్చితే వాటి రూపం ఎలా వుంటుంది? ఒక లెక్క ప్రకారం (2021 నాటికి 10లోపు పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలు 1010 అయితే వీటినుంచి మూడు తరగతుల పిల్లలు తరలి వెళితే ఇంకెందరు మిగులుతారు? ఇద్దరు ముగ్గురు కూడా వుండరు. ఇక 10-20లోపు పిల్లలవి 4708 వుంటే వీటిలో 1-2 తరగతుల్లో 10మంది వుండడమూ గగనమే. అలానే 21-80 పిల్లలు 6156 స్కూళ్ళలో మిగిలే 1-2 తరగతుల పిల్లలెందరు? పట్టుమని 15కు ఎట్టీ స్థితిలోనూ మించరు. అసలు మన ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సగటు 40 అని గణాంకాలు చెబుతున్నాయి. రేపు ఈ సగటు 16కు మించదు.

మరి వీటిలో ఎందరు టీచర్లుండబోతారు? కొత్తగా ప్రభుత్వం ఉదారంగా చెప్పినట్టు 1:20 వున్నా ఒకరే వుంటారు. అంటే ఇక మన ప్రభుత్వ (దాథధమిక పాఠశాలల్లో మూడొంతులు అంటే కనీసం పాతికవేలు ఏకోపాధ్యాయ పాఠశాలలవుతాయి!

ఈ 10-15లోపు పిల్లలు కూడా అంగన్‌వాడీ పిల్లలతో కలిసి ఉంటారు. అది సగం బడి, సగం అంగన్‌వాడీ. ఇదొక శాఖదిగాదు రెండు శాఖలది. అందులో భవిష్యత్తులో రెగ్యులర్‌ టీచర్లుంటారని నమ్మలేము. ఇప్పటికే వాటిలో డిఎస్‌సి 1998 వాళ్ళని నియమిస్తామని సంకేతాలిస్తున్నారు. విద్యాశాఖ నుంచి సర్వశిక్షాభియాన్‌కి బదలాయిస్తారన్న వార్తలొస్తున్నాయి. ఇన్ని అనుమానాల మధ్య ఈ 'బడి'లో పిల్లల్ని చేర్చేంత అమాయక స్థితిలో మన తల్లిదండ్రుల్లేరు. ఇవి మూతబడ్డం గోడమీద రాసినంత నిజం. అందుకే విలీన ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు మిగలడం లేదు. వీటి ఆలనాపాలనా ఎలా వుంటుందో, వీటిలో ఏం చదువు వస్తుందో ఇక చెప్పనక్కరలేదు. ఆరు రకాల స్మూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం? 2

విచిత్రమేమంటే చిన్న పాఠశాలల్లో చదువురాదని, అందుకే ఈ సంస్కరణలు తెచ్చామని ఒకవైపు చెబుతూ, అతి చిన్న పాఠశాలల్ని వేలాదిగా సృష్టించడం! నిన్నటిదాకా పిల్లల చదువుల్లో 1-2 తరగతులే కీలకమని శిక్షణలపై శిక్షణలిచ్చి, చివరకు ఆ తరగతుల్ని వాటి చదువుల్ని అనియత విద్య స్థాయికి కుదించడం. అసలు నియత విద్య నేర్వాల్సిన 1-2 తరగతుల పిల్లలకూ, ఆట వాటలకు పరిమితం కావల్సిన శిశువులకూ ఒకే “బడి ఏమిటి? ఈ సంస్కరణలతో 8-55 తరగతుల పిల్లలేమవుతారో గానీ, 1-2 తరగతుల పిల్లలు మాత్రం అన్యాయమైపోతారు. ఇక ఈ వాఠశాలకు మంగళం పాడినట్టే. ఇది తెలిసి పిల్లలు ప్రైవేటు బాటపట్టాక తర్వాత మూడవ తరగతిలో హైస్కూళ్ళకు పిల్లలెక్కడి నుంచి వసారు? అంతా కుప్పకూలడం ఖాయం. బాధకరమేమంటే అధికార్లు సైతం అందరూ దీన్ని ఒప్పకొంటారు. కాని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రాలేరు. శిశు సంరక్షణ - విద్య నూతన విద్యా విధానం దీనికి పెద్దపీట వేసింది. “ఈ దశలోనే 85% మెదడు అభివృద్ధి చెందుతుండగా కోట్లాదిమందికి ఈ అవకాశం లేదు” అంటూ 8-6 సంవత్సరాల పిల్లలందరికీ నాణ్యమైన సమానమైన సంరక్షణ, విద్య అందించాలని; ఇది 2080 మన లక్ష్యంగా వుండాలని నిర్దెశించింది. అయితే దీన్నెలా, ఎక్కడ, ఎవరు అమలు చెయ్యాలనే దానిపై ఎన్‌ఇపిలో కూడా స్పష్టత లేదు. ప్రస్తుత అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలల్లోని అంగన్‌వాడీలు, 5-6 సంవత్సరాల పిల్లల్ని కూడా చేర్చుకొనే ప్రాథమిక పాఠశాలలు, కేవలం పూర్వ (వ్రాథమీక స్కూళ్ళు (016 5010019) ఈ బాధ్యత రతీసుకోవాలంటుంది. వీటిని శిక్షణ పొందిన వర్శర్లు / టీచర్లు నడపాలంటుంది. అంగన్‌వాడీల్ని అభివృద్ది చెయ్యడం, ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చెయ్యడం గురించి ప్రసాావిస్తుంది. ఒకటవ తరగతికి ముందరి క్లాసుగా 5వ ఏట సన్నద్ధతా తరగతి వుండాలంటుంది. దీనర్ధం 3-5 సంవత్సరాల్లో 3-4 ఒక దశగా, 5 ఒక దశగా పరిగణించదమన్న మాట. 13 ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ?

ఇక ఎన్‌సిఇఆర్‌టి రెండు భాగాలుగా 0-3 వయస్సు పిల్లల కోసం ఒక పాఠ్య ప్రణాళికను, ౩-౩8 పిల్లల కోసం మరో పొఠ్య ప్రణాళికను రూపొందించాలని ఎన్‌ఇపి నిద్దశం. ఆధునిక పరిశోధనల్ని అంతర్జాతీయ అనుభవాల్ని దీనికి ప్రాతిపదికగా తీసుకోవాలని కూడా అది స్పష్టం చేస్తుంది. (ఎన్‌ఇపి 1:1 నుంచి

  1. 9వరకు) నూతన విద్యా విధానం దీన్ని “శిశు సంరక్షణ - విద్య” (ఇసిసిఇఖ)అని మరీ స్పష్టంగా పేర్కొంటుంది. ఇప్పటికే ఎన్‌సిఇఆర్‌టీి దీనికి తగ్గ వాఠ్య ప్రణాళికను ఎంతో శాప్రీయంగా రూపొందించి అందిసోంది కూడా.

మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న శాటిలైట్‌ స్మూళ్ళకూ, ఫౌండేషన్‌ సూళ్ళకూ ఇదే ప్రాతిపదిక. ఇందులో రెండంశాలు కీలకమైనవి. ఇప్పటిదాకా ఒకటో తరగతినుంచె మాత్రమె విద్య నేర్పే వ్యవస్థ మనకుంది. దీన్ని అంతకు ముందరి మూదేళ్ళకు కూడా విస్తరింపచెయ్యడం మొదటిది. రెండోది దీనికోసం అంగన్‌వాడిల్ని ఒకటీ రెండూ తరగతుల్ని ఒకటి చెయ్యడం. మూడో తరగతి నుంచి హైస్మూళ్ళకు తరలించడం వెనకవున్న తర్మమూ, లక్ష్యమూ కూడా ఇందులో భాగమే. ఈ దశ చాలా కీలకమైందిగా గుర్తించడం మరో ముఖ్యాంశం. ఇక శిశువుకు సంరక్షణ కోసం అంగన్‌వాడీ, విద్య కోసం బడీ ఒకటవుతు న్నాయన్న

విద్యా +? వికాసమా ?

[మ్రముఖ విద్యావేత్త, ఎన్‌సిఇఆర్‌టి పూర్వ డైరెక్టరు డా॥ కృష్ణకుమార్‌ ఇలా అంటాడు “అక్షరాలూ, గణితమూ వల్లించడం మనకు ఏ శిశు విద్యా సంస్థలోనైనా కన్పించే దృశ్యం. ఈ “వల్లింపు జ్ఞానమే చదువుకు వ్రారంభదశ అని మనం భావిస్తాం. చదవడం రాయడం విద్యలోని ప్రాథమిక వైపుణ్యాలుగాట్టి అవి వీలున్నంత పసిప్రాయంలోనే ఒంటబట్టాలనుకొంటాం. అర్ధంతో, విషయంతో ప్రమేయం లేకుండా, పిల్లల స్వీయ అవసరాలతో నిమిత్తం లేకుండా చేసే కసరత్తుపై పిల్లలకేమీ ఆసక్తి వుండదు. నిత్యజీవితంలో వీళ్ళు దీన్నేమీ వుపయోగించుకోలేరు. డ్రిల్లింగులతో జ్ఞాపకం పెట్టుకొంటారు. దీన్నే మనం నేర్చుకోడం అనుకుంటాం”. దీన్నిబట్టి శిశు “విద్య” అనేది ఎంత సంకుచితార్ధంతో అమలవుతున్న అంశమో మనం గమనించ వచ్చు. ఆరు రకాల స్మూళ్ళు ఎవరికోసం ? వందుకోసం?

ప్రైవేట్‌ సంస్థలు శిశు విద్యను ప్రాథమిక విద్యకు తప్పనిసరి అవసరంగా (016 1601119166 1622001089) మార్వాయి. ఇంగ్లీషు మీడియంలాగానే దీని చుట్టూ సైతం మధ్య తరగతి ఒక “గొప్ప సంస్కృతిని” అల్లుకొంది. కార్పొరేట్‌ సంస్థలు ఒకవైపు దీన్ని సొమ్ము చేసుకొంటూ, మరోవైపు దీన్ని పోషిస్తున్నాయి. అత్యంత సహజంగా దిగువ మధ్య తరగతి వరం, కింది వర్షాలు కూదా దీన్ని నమ్ముతున్నాయి. శాస్త్రం కన్నా సంస్కృతి చాలా బలమైంది మరి. ఇలా “శిశు వికాసం” కంటే “శిశు విద్య'కే ఇప్పుడు సామాజికాంగీకారం ఉంది!

శిశు దశలోని పిల్లలు ఇంటివద్ద వుండటం కన్నా ఏదో ఒక వ్యవస్థలో ఇంటి బయట వుండక తప్పదన్న ప్రస్తుత భౌతిక వాస్తవాన్ని అంగీకరించాక ఆ వ్యవస్థలు ఎలా వుండాలి? వాటిలో పిల్లల్ని ఎలా చూడాలి? వారికేమి అందించాలి? అనే ప్రశ్నలు న్యాయంగా ముందుకు రావల్సినవి. దినికి పిల్లల పట్లా, వాళ్ళ ఎదుగుదల పట్లా అత్యంత ఆసక్తిని కనబరిచే దేశాల అనుభవాలు మన దగ్గర వున్నాయి.

వీటన్నింటిలో శిశు వికాసమె తప్ప విద్య వుండదు. అంటే ఈ దశలో నియత విద్య వుండదు. చాలా దేశాల్లో ఏడవ సంవత్సరం దాకా పిల్లల్ని ప్రాథమిక పాఠశాలల్లో చేర్చుకోరు. వీరందరూ శిశు దశను చాలా కీలకమైందిగా గుర్తిస్తారు. “ఈ దశలో ఆరోగ్యం, ఆహారం ప్రధానం. స్వేచ్చగా ప్రకృతితో, పరిసరాలతో, తల్లిదండ్రులతో కలిసి జీవించడం కీలకం. వికాసం నాలుగు గోడల మధ్యగాదు, విశాల ప్రపంచంలోనే జరుగుతుంది” అన్న ఏకాభిప్రాయం వీరిలో వుంది. అందువల్ల శిశు వికాస, శిశు విహార కేంద్రాలే తప్ప శిశు విద్యా కేంద్రాల్ని వీళ్ళు అంగీకరించరు. ఈ శిశు కేంద్రాల్లో చేరకుండా నేరుగా ఒకటో తరగతిలో

క చేరడంపై ఏ దేశంలోనూ అంక్షలు లేవు. దీన్నే తమిళనాడు ప్రభుత్వం కూడా

హైకోర్టులో నూతన విద్యా విధానాన్ని సవాలు చేస్తూ పెర్కొంది.

శిశుప్రాయం చాలా విలువైందని, దాని వికాసానికో వ్యవస్థ ఆధునిక యుగ అవసరమని అందరం ఒప్పుకోవచ్చు. అయితే అందులో వికాసానికి, విద్యకు మాత్రం ఖచ్చితమైన గీత వుండాలి. ఒకటో తరగతికి ముందరి సంవత్సరాన్ని సన్నద్ధతకోసం మనం ప్రత్యేకంగా చూడొచ్చు. వ లకు కాల స్యూళ్ళు వవంకోసం ? ఎందుకోసం ?

రాష్ట్ర ప్రభుత్వానికి శాటిలైట్‌, ఫౌండేషన్‌ స్కూళ్ళ విషయంలో ఈ స్పష్టత వుందా అనేది ప్రస్తుతాంశం. సూటిగా చెప్పాలంటే మన అంగన్‌వాడీలు యల్‌. కెబి, యు.కె.జి. సెంటర్లుగా మారి వల్లింపుల చదువుల్ని నెత్తికెత్తుకోవాలనేదా ప్రభుత్వ లక్ష్యం? అన్ని వర్గాల పిల్లలకూ పసి వయస్సు నుంచే ఇప్పటిదాకా మనం చెప్పుకొన్న శిశు వికాస కేంద్రాలుండాలన్న దాంట్లో ఎవ్వరికీ అభ్యంతరం వుండనకృరలేదు. దిన్ని ఆహ్వానించాలి కూడా. అయితే వీటినెలా నిర్వహించ దల్పుకొంటోంది ప్రభుత్వం అన్నదే సమస్య,

అంగన్‌వాడీలనేం చేస్తారు ?

రాష్ట్రంలోని అంగన్‌వాడీలు మారుమూల జనావాసాల దాకా విస్తరించి మాతా శిశు సేవల్ని అందిస్తున్నాయి. వీటిలోని వర్మర్లు ఒకవైపు అంగన్‌వాడీ కేంద్రాలను నడుపుతూనే తల్లులకు పౌష్టికాహారం తదితరాలన్నిటినీ అందిస్తున్నారు. వీటిలో ఒక హెల్పర్‌, ఒక కార్యకర్త మాత్రమే వుంటున్నారు. వీరి విద్యార్హతలు చాలామందికి వాఠశాల విద్వా స్థాయిని మించినవేమీ లేవు. ఈ మధ్య బాలింతలకు భోజనాలు పెట్టే పని కూడా అంగన్‌వాడీలకు తోడయింది.

ఇప్పుడు వీటిని శాటిలైట్‌ స్మూళ్ళుగానో, ఫౌందేషన్‌ స్మూళ్ళుగానో మారిస్తే మిగిలిన సేవల్ని ఎవరు అందిస్తారు? అసలీ శిశు సంరక్షణ విద్య విద్యాశాఖదా? మాతా శిశు సంక్షేమ శాఖదా? ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన పాఠ్యాంశాల్ని మన అంగన్‌వాడీలు బోధించగలరా? దీనికి ప్రత్యేక శిక్షణ, అర్హత వుండాలిగదా! దీనికోసం ఆరు నెలలు శిక్షణ ఇస్తే సరి అంటుంది నూతన విద్యా విధానం. శిశు విద్యను గురించి కొందంత రాగం తీసి చివరికొచ్చెప్పటికి సవాలక్ష పథకాలతో సతమతమవుతున్న అంగన్‌వాడీలకు పసిబిడ్డల చదువులు కూడా అప్పగించి సరిపెడతారా? అదీ ఇంగ్లీషు మీడియంలో నేర్పాలంటే అయ్యే పనేనా దీనిమీద ఎవరికి నమ్మకం వుంటుంది? చివరికిది సంరక్షణాలేక, విద్యారాక రెంటికీ చెడ్డ రేవడై పోదా?

మన అంగన్‌వాడీల్లో దాదాపు 7000 ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లోనూ, 4700 ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనూ వున్నాయి. మరో 580 పాఠశాలల్ని ఆనుకొని ఉన్నాయి. ఇంకో 4వేలు ఒక కి.మీ. దూరంలో వున్నాయి. వీటన్నింటినీ ఆరు రకాల స్మూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం? 7

కలిపినా 16230కి మించవు. ఇక మిగిలిన 30వేలకు పైగా అంగన్‌వాడీలు యధాతథంగా ఇప్పటిలానే వుండి పోతాయి. ఇపన్నీ శాటిలైట్‌ స్కూళ్ళుగా మారాల్సి వుంటుంది. మిగతావి ప్రాథమిక పాఠశాలలతో కలిసి ఫాందేషన్‌ స్మూళ్ళు కావల్సి వుంటుంది. శిశు సంరక్షణ-విద్య పటిష్టంగా జరగాలంటే అంగన్‌వాడీల ను వేటికవిగా కొనసాగించాలి. శిశు విద్యకోసం వాటిలోగానీ, ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలలకనుబంధంగా గానీ, అర్హతగల టీచర్లుండే వ్యవస్థ వుండాలి. ఆవైపున (ప్రభుత్వం ఏమీ ఆలోచించడం లేదు. కనీసం అన్ని వసతులూ వున్న చోట పెద్ద పెద్ద ప్రాథమిక పాఠశాలల్లోనయినా మొదట మంచి ఇసిసిఇ కేంద్రాల్ని ప్రారంభించవచ్చు. క్రమంగా వీటిని పెంచుకొంటూ పోవచ్చు. అట్లని ప్రతి బిడ్డ్దమీదా దీన్ని రుద్దాల్సిన అవసరమూ లేదు. ఒకటో తరగతికి ముందు ఒక సంవత్సరం మంచి సన్నద్ధతా విధానాన్ని తీసుకొచ్చినా ఎంతో ఫలితం వుంటుంది. పాపం ప్రాథమికోన్నత పాఠశాలలు మన పాఠశాల విద్యా వ్యవస్థలో ఒకప్పుడు ఎంతో గొప్ప పాత్ర పోషించినవీ, ఇప్పుడేమో ఎప్పుకెప్పుడు వదిలించు కొందామా అనుకొంటున్నవీ ప్రాథమికోన్నత పాఠశాలలు. రాష్ట్రంలో ప్రస్తుతం 4158 అప్పర్‌ ప్రైమరీ స్మూళ్ళున్నాయి. విద్యాపరంగా బాగా వెనకబడ్డ రాష్ట్రంగా మన రాష్ట్రం వుండటాన్ని గమనంలోకి తీసుకొని, కనీసం 7-8 తరగతుల వరకైనా మన గ్రామీణ పేద పిల్లలు - ముఖ్యంగా బాలికలు చదువుకోవాలన్న మంచి ఆశయంతో 1990-- 2000ల దశకాల్లో చాలా ప్రాథమిక పాఠశాలల్ని ఇలా అప్‌గ్రేడ్‌ చేసారు. ప్రాథమిక స్థాయిలోనే డ్రాపొట్‌ కాకుండా ఈ వర్గాల్ని ఇవి ఎంతో గొప్పగా కాపాడాయి. ఏ వ్యవస్థనైనా మనం ఇలా చూడాలి. అట్టడుగు వర్గానికి ఎంతమేరకు ఉపయోగపడ్డా అదెంతో విలువైనదన్న దృష్టితో చూడాలి. కానీ క్రమంగా మారిన కాలానికి తగ్గట్టు ఇవి మారలేక ఎటూ గానివిగా మిగిలి పొయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో 6668 హైస్కూళ్ళున్నాయి. ఇవిగాక 435 ఎయిడెడ్‌, 5681 (ప్రైవేట్‌ హైస్క్మూళ్ళున్నాయి. స్థానికుల డిమాండు మేరకు చాలా అప్పర్‌(పైమరీలు హైన్మూళ్లుగా మారాయి. ఇప్పుడు (ప్రతి 7 తరు రకాల స్మూళ్ళు వవంకోసం ? వందుకోసం?

3 కి.మీ.లకు ఒక హైస్కూలు రాష్ట్రంలో వుంది. (ఏవో కొన్ని గిరిజన ప్రాంతాల్లో తప్ప), సహజంగానే వీటిలో అన్ని సబ్టెక్టులకూ టీచర్లుంటారు. వసతులుంటాయి. ఆలనా పాలనా వుంటుంది. అప్పర్‌ (పైమరీల్లో 6-7/8 తరగతులకు ఇందరు టీచర్లు, ఇంత వ్యవస్థా వుండే అవకాశం లేదు. దీంతో పిల్లలు హైస్కూళ్ళ బాటపట్టారు.

ఇక మన అప్పర్‌ (పైమరీలంతా 100లోపు పిల్లలుంటే (6-8 తరగతుల్లో) మహా గొప్ప అన్నట్టు మారిపొయ్యాయి. వీటిలో ముగ్గురు నలుగురు సబ్జెక్టు టీచర్లు కూడా వుండని పరిస్థితి. ఇక వీటిలో చదివే పిల్లల ప్రమాణాలు ఎలా వుంటాయి? ఇంతటితో చదువు ముగించుకొందామన్న పిల్లలకు సరిపోయేలా ఇవి తయారయ్యాయి. ఫలితంగా వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడు వీటినుంచి 1-2 తరగతులు విడదీసి ప్రీ హైస్కూళ్ళనే పేరుతో 3-7/8 తరగతులతో నడపాలని నిర్ణయించారు. అంటే మరీ చిన్నవిగా మారతాయన్నమాట. వీటి నుంచి సెకండరీ గ్రేడ్గను తొలగించి అన్ని తరగతులకూ స్కూల్‌ అసిస్టెంట్లతో (సబ్జెక్టు టీచర్లతో) బోధించాలని నిర్ణయించారు. ఇదొక భాగం. అక్కడితో ఆగక 137 మించిన పిల్లలుంటే వీటిని హైస్మూళ్ళుగా మార్చెయ్యాలనీ, 97కంటే పిల్లలు తక్కువైతే సబ్జెక్టు టీచర్లను తొలగించి 3-7/8 తరగతులకు సైతం సెకండరీ గ్రేడ్‌ టీచర్లతోనే బోధింపజెయ్యాలని కూడా ఉత్తర్వు లిచ్చారు. ఇక్కడితో ముగించక ఆగక 8 కి.మీ.లోపులో వుంటే హైస్కూళ్ళలో విలీనం చెయ్యాలని కూడా ఆదేశాలిచ్చారు. ఈ మూడు కష్టాలూ తగలనివి మాత్రమే ప్రీహైస్మూళ్ళుగా మిగులు తాయి. ఇలా చూస్తే వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.

ఇక ఒకవైపు హైస్కూళ్ళలోనయితే సబ్బెక్టు టీచర్లుంటారని 8-5 తరగతుల్ని వాటిలోకి తరలిస్తూ, మరోవైపు అప్పర్‌ స్కూళ్ళలో మాత్రం 8వ తరగతిదాకా సెకండరి (గ్రేజ్లే సరిపోతారనడంలో ఏమి సమంజసం వుంది?

ఇంత చిన్న విషయం ప్రభుత్వానికి తలియదనుకోలేము. అంతస్స్పారం స్పష్టం. ప్రాథమికోన్నత పాఠశాలలకు భరతవాక్యం పలకడం! అరు రకాల స్మూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం? [1

హైస్కూళ్ళలో 11,12 తరగతులు

రాష్ట్రంలో (పైవేట్‌ కార్పొరేట్‌ విద్యకు ముఖద్వారం ఇంటర్మీడియేట్‌లోనే వుంది. 1968లో మనం ప్రత్యేకంగా ఇంటర్మీడియేట్‌ బోర్డు ఏర్పర్చుకుని, 11,12 తరగతుల్ని ఇంటర్మీడియేట్‌గా పేరు మార్చుకొని జూనియర్‌ కళాశాల వ్యవస్థ తీసుకొచ్చాం. ఉన్నత సాంకేతిక వైద్య విద్యలకు ఈ దశ విద్య కీలకమని, దీనికి ప్రత్యేక వ్యవస్థ, విధానం వుండాలన్న మంచి ఆలోచనతోనే దీన్ని చేసాం. మిగతా రాష్ట్రాల్లో మాత్రం దీనికి ఖీన్నంగా ఇది 11,12 తరగతుల పేరుతోనే పాఠశాల విద్యలో భాగంగానే వుండిపోయింది. మన విధానం మంచి ఫలితాలిచ్చిం దని, ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులు పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందుండటానికి, సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని మనం శాసిస్తుండటానికి ఇదే కారణమని మనం గొప్పగా చెప్పుకొంటున్నాం కూదా.

కానీ క్రమంగా ఇంటర్మీడియేట్‌ విద్యలో “విద్య” కను మరుగైంది. పోటీ పరీక్షల సన్నద్ధతకు కోచింగు తీసుకోడమే మిగిలింది. ఈ కోచింగు కాస్తా ముదిరి కార్పొరేట్‌ కళాశాలల అవతారమెత్తి గచ్చపొదలాగా అల్లుకు పోయింది. (ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఈ పోటీకి, పద్ధతులకు సరిపోక కాలం చెల్లినవిగా మారాయి. ఫలితం పట్టుమని ఇరవై శాతం కూడా ఇప్పుడు వీటిలో పిల్లలు లేరు.

రాష్ట్రం ప్రపంచబ్యాంకు విధానాలకు ప్రయోగశాలగా మారిన తర్వాత విద్యారంగంలో జరిగిన విధ్వంసాన్ని ఇంటర్‌ విద్యలో చూచినంతగా మనం ఎందులోనూ చూడలేము. పాఠశాల విద్యకు దూరంగా ప్రత్యేకంగా 11,12 తరగతులుం డడం వల్లనే ఇలా జరిగిందనే విమర్శలో కూడా న్యాయం లేకపోలేదు.

ఇప్పుడు తీరిగ్గా చేతులు గాలాక తటపటాయిస్తూనే ప్రభుత్వం హైస్కూళ్ళలో ఫస్‌ టు ప్రారంభించడానికి పూనుకొంది. మోడల్‌ హైస్మూళ్ళలో, కస్తూర్వా విద్యాలయాల్లో, ఒక మేరకు గురుకులాల్లో ఈ విధానం కాళ్ళూనుకోడం కూదా దీనికి తోద్బడింది. తర్దనభర్ధనల అనంతరం జూనియర్‌ కళాశాలలు లేని మండలాల్లో కో-ఎడ్యుకేషన్‌ వుండేలా, బాలికల కళాశాలలు లేని మండలాల్లో కెవలం బాలికలు చదువుకునేలా హైస్కూళ్ళలో ఈ ఏదాదినుంచి 11వ తరగతి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. భా అరు రకాల స్యూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం?

అయితే దీని అమల్లో ఎదురయ్యే సవాళ్ళపట్ల విద్యాశాఖకు ఒక స్పష్టత లేకపోయింది. ముందస్తు ప్రణాళికతో గత విద్యా సంవత్సరం చివరికే ఇలాంటి హైస్మూళ్ళను ఎంపికచేసి వుండాల్సింది. వాటిలో గదుల్సి, సిబ్బందిని సిద్దం చెయ్యాల్సింది. ఒక నమ్మకం కలిగించాల్సింది. ఇప్పటికే పాఠశాల ప్రాంగణం లోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వున్నా ఆ స్కూలు పిల్లలు కూడా పదో తరగతి తర్వాత వాటిలో ఎందుకు చేరడం లేదో విద్యాశాఖకు ఒక అంచనా వుండాల్సింది. దీనికితోడు వీటిలో ఎవరు పాఠాలు చెబుతారు? దీని నిర్వహణ బాధ్యత ఎవరిది? ఇది ఇప్పటికీ తేలలేదు. అదే హైస్కూల్లో వున్న టీచర్లతో బోధిస్తామని, అదే హెడ్నాష్టరు ఫ్లస్‌ టు బాధ్యత కూడా చూస్తారని చెప్పడంతో ఈ వ్యవస్థ బాలారిప్టాల నుంచి బయట పడ్డం కష్టమనే అభివ్రాయం ఎర్పడిపోయింది. ఇక మండల కేంద్రాల్లో కో-ఎడ్యుకేషన్‌ వుండగా, వాటి నుంచి మగపిల్లల్ని తరలించి బాలికల కళాశాలగా మార్చాలన్న నిర్ణయం బెడిసికొట్టింది. (పిల్లల్ని ఎక్కడినుంచి ఎక్కడికైనా తరలించడం విద్యాశాఖకు చిటికెలోపని!$) ఈ గందరగోళానికి తోడు (ప్రైవేట్‌ కళాశాలల దాడి విపరీతంగా వుండే రంగం కావడంలో కొత్తప్షస్‌ టు హైస్మూళ్ళలో చేరుతున్న పిల్లల సంఖ్యను వేళ్ళమీద లెక్కపెట్టాల్సి వస్తోంది.

మొదట పిజిటిలను, గ్రేడ్‌-1 హెడ్మాష్టరును నియమించి, వసతి చూపిస్తేనే ఒక నమ్మకం కుదురుతుంది. అలాగే ప్రస్తుత జూనియర్‌ కళాశాలల్ని ఏంచెయ్యాలో కూడా ప్రభుత్వానికి ఒక స్పష్టత వుండాలి. వాటిని యధాతథంగా వుంచెయ్యడం, మరింత బలోపేతం చెయ్యడం మంచిది. వాటిని బలహీనపరిస్తే మొదటికే మోసం వస్తుంది. కొత్త వ్యవస్థను తీసుకురావడం గాబట్టి మనం వేచిచూద్దాం ఇది ఏ మలుపులు తిరుగుతుందో! ఇంతలో టీచర్లకు 8000మందికి పిజిటిలుగా ప్రమోషన్లు వసాయనీ, హెడ్నాష్టర్లు (గ్రేద్‌-1 'హెడ్మాష్టర్లుగా మారివోనున్నారని (ప్రభుత్వం ఊరించడం మాత్రం జోరుగా సాగుతోంది. అరు రకాల స్మూళ్ళు ఎవరికోసం ? వందుకోనం?

టీచర్ల రేషనలైబేషన్‌

ఇలా పాఠశాలల్ని కలగాపులగం చేశాక పిల్లల్ని హైస్కూళ్ళ కు తరలించాక, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు చదువు చెప్పాలనుకొన్నాక, అప్పర్‌ (ప్రైమరీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లకు ఉద్వాసన పలకాలనుకొన్నాక మొత్తం టీచర్లను కూడా రేషనలైజేషన్‌ చెయ్యకతప్పదు. స్ఫ్మూళ్ళ కుదింపు పూర్తయ్యాక టీచర్ల తగ్గింపు తప్పనిసరి. దీనికోసం 117 జిఓ వచ్చింది.

దీని ప్రత్యేకత ఏమంటే టీచర్ల సంఖ్యను భారీగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకొని దానికనుగుణంగా సూత్రీకరణలు చెయ్యడం. ఇందులో పిల్లల కోణం ఏదీ లేదు. అంతా ఉపా ధ్వాయుల సంఖ్యవైపు నుంచి చూడ్డం తప్పు.

దీని ప్రకారం ఫౌండేషన్‌ స్కూళ్ళలో (1-2 తరగతుల్లో) 45మంది దాటితేనే రెండవ పోస్టు వుంటుంది. టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చాక మొదట 31 దాటితే రెండవ పోస్టు ఇస్తామని, ఆ తర్వాత 20దాటితే రెండో పోస్టు వుంటుందని ప్రభుత్వం దిగొచ్చింది. అన్ని స్కూళ్ళు 2౦లోపే వుంటాయి గదా అనేది ప్రభుత్వ ధీమాగావచ్చు. ఒకవేళ రెండో వోస్టు ఇచ్చినా అది ఖాళీగానే వుంటుంది. కొత్తగా 2008, 1998 డిఎస్‌సి అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో వచ్చిన వాళ్ళు వుందనే వున్నారు. వీటన్నిటినీ మనసులో పెట్టుకొనే ప్రభుత్వం దిగొచ్చినట్లు నటిస్తున్నది.

ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3-8 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లె బోధించబోతున్నారు. అందువల్ల సెకండరీ (గ్రేడ్గతో అవసరం లేదు. అయితే పిల్లలు 97కంటే తక్కువ వుంటే స్కూల్‌ అసిస్టెంట్లే వుండరు. వారంతా మిగులే. కాదని 8 కి.మీ.లోపు వుందని హైస్కూల్లో కలిపితే అప్పుడు 1-2 తరగతులకు కావల్సిన ఒకరో ఇద్దరో తప్ప మొత్తం మిగులె.

హైస్కూళ్ళలో సమాంతర మీడియంలను రద్దుచేసి 6-8 తరగతుల్ని ఒకే మీడియంగా పరిగణిస్తున్నారు. దీని ప్రకారం ప్రతి హైస్కూల్లోనూ కనీసం నలుగురు టీచర్లు మిగులుతారు. వీరి చేత ౩-5 తరగతులకు బోధింపజేస్తే (ప్రాథమిక పాఠశాలల విలీనం జరిగినా అదనపు టీచర్ల అవసరం వుండదు. ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం పిల్లలు వెళ్ళాక ఎస్‌జిటిలు అదనమవుతారు. 1 యారు రకూల స్యూళ్ళ ఎవరికోసం ? ఎందుకోసం?

ఇవన్నీ చాలక పనిగంటలు 82 నుంచి 40కి పెంచారు. టీచర్ల సంఖ్యను భారీగా తగ్గించడానికి అంతిమంగా ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం సెక్షన్ల విభజనలో కొత్త మార్గదర్శకాలు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 80,35,40కి ఒక సెక్షను ఉండాల్సిందల్లా దీన్ని అమాంతం 45,53, 60లకు పెంచారు. విద్యాహక్కు చట్టానికీ ఇది విరుద్ధం. ఒక్కో తరగతిలో 60మందిని కూచోబెడితే తరగతి గది ఎలా వుంటుందో మన విద్యాశాఖకు తెలియ దనుకొందామా? దీనివల్ల హైస్కూళ్ళు ఎంత పెద్దవయితే ప్రస్తుత సెక్షన్లు అంత తగ్గిపోతాయి. ఇప్పటిదాకా సెకండరీ గ్రేడ్లకూ, స్కూలు అసిస్టెంట్లకూ మాత్రమే రేషనలైజేషన్‌, డిఇఓ పూల్‌ లాంటివి వర్తించేవి. జిఓ 117 దీన్ని హెడ్మాష్టర్లకూ, పిఇటిలకు కూడా విస్తరింపజేసి చరిత్ర సృష్టించింది. హైస్కూల్లో 97కంటే విద్యార్థులు తక్కువైతే ఆ ఇద్దరికీ ఉద్వాసన పలికింది.

ఎన్ని సెక్షన్లకు ఎందరు పిల్లలు, ఎందరు టీచరు, వారికి ఎన్ని పీరియడ్లు వుండాలనేవి సుదిర్హ చర్చల అనంతరం నిర్ణయింపబడినవి. వాటికి కొన్ని స్పష్టమైన నిబంధనలు, చట్టాలు కూడా వున్నాయి. ప్రభుత్వాలు మారితేనో, అధికార్లు మారితేనో ఇవన్నీ మారడమంటే అది ఏ దేశంలోనూ లేని విచిత్రమే అవుతుంది. పేద పిల్లల పట్ల ఏ మాత్రం బాధ్యత వున్నవారైనా ఇలాంటి ఆలోచనలు చెయ్యరు. ఖర్చు తగ్గించుకోడానికే గాదు టీచర్లపై దాడికోసం కూడా తీసుకొచ్చిన విధానాలవి. దీనివల్ల ఎన్ని పోస్తులు అదనంగా మారతాయి? వీటిలో సెకండరీ గ్రేడ్లు ఎందరు? స్కూలు అసిస్టెంట్లు ఎందరు? ప్రభుత్వం దీన్ని స్పష్టంగా చెప్పడం లేదుగానీ దీనివల్ల ప్రస్తుతం ఖాళీగా వున్న పాతిక వేల పోస్టులు భర్తీ చెయ్యాల్సి వుందదు. మరో 15-20 వేల పోస్టులు కూడా అదనంకావచ్చు.

ఖాళీ పోస్టుల్ని ఎప్పటికప్పుడు మాయం చెయ్యడానికి కూడా ప్రభుత్వం సకల మంత్ర తంత్రాలు ప్రయోగిస్తూనె వుంది. సెకండరీ (గ్రేడ్‌ పోస్టుల్ని పలు రూపాల్లో అంతరింపజేస్తోంది. మోడల్‌ హైస్కూళ్ళ కోసం ఒక్కో జిల్లా నుంచి 897 ౫ 12 వంతున (కర్నూలు మినహా) 4764 పోస్టుల్ని రద్వచేసింది. కొత్తగా మండల విద్యాశాఖాధికార్లూ, డిప్యూటీ డిఇఓలూ అవసర మవుతారని వారికోసం ఎస్‌జిటి పోస్టుల్ని రద్దు చెస్తామని ప్రతిపాదిస్తోంది. హెడ్నాష్టర్ల పోస్టులు 998 ఆరు రకాల స్ఫూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం? 22

కావల్సి వుంది. వీటికోసం సెకండరీ (గ్రేడ్లు బలిపీఠం ఎక్కనున్నారు. చివరికి ఆఫీసర్ల పోస్టులు కావాలన్నా ఎస్‌జిటిలే బలి కావాలి. ఇది చాలక 2008 డిఎస్‌సి వారిని 2198మందిని ఎస్‌జిటి పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. త్వరలో 4వేలకుపైగా డిఎస్‌సి 1998 వాళ్ళూ రానున్నారు. ఎయిదెడ్‌ టీచర్లతో కొన్ని పోస్టుల్ని ఇప్పటికే భర్తీ చేసారు! ఇక కొత్తగా డిఎస్‌సి అవసరమేముంది? టీచర్లకు “భారీ ప్రమోషన్లు” ఎక్కడ? సమాంతర మీడియం రద్దు!

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇంగ్రీషు మీడియాన్ని గొప్ప విద్యా సామాజిక విఫ్లవంగా ప్రచారం చేస్తోంది. కనీసం సమాంతరంగా ఇతర మీడియంలు కొనసాగించాలని కోరినా వారిపై పేదల వ్యతిరేకులని దాడి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనట్టు మాతృభాష మీడియంను రద్దుచేసింది. హైకోర్టు ్‌ ఇవ్వడంతో దీనికి (బ్రేకు పడింది. అయినా విద్యాశాఖాధికార్లు టీచర్లపై దండోపాయం ప్రదర్శించి క్షేత్రస్థాయిలో తెలుగు మీడియం లేకుండా చేసేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. ఇంతచేసినా క్షేతస్థాయి పరిస్థితులు వేరుగా వున్నాయి. తెలుగు మీడియం కోరుకొనే వారు అంతర్జానం కావడం లేదు. ఇప్పటికీ దాదాపు 80-90% హైస్కూళ్ళల్లో 6-10 తరగతులన్నిటిలో తెలుగు మీడియం ఉంది. తమిళ, కన్నడ, ఒరియా, ఉర్దూ మీడియాలూ సరిహద్దు స్కూళ్ళలో వున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టును కూడా ధిక్కరించి 6-8 తరగతుల్లో సమాంతరం మీడియంలు రద్దుచేసింది. వాటిని బోధించే టీచర్లను అదనమని తేల్చింది. ఇందులో ఆంగ్ల మీడియం పట్ల ప్రజారంజకోత్సాహం ఎంతవుందో, టీచర్ల పోస్టుల్ని మిగిలించుకోడమూ అంతే వుంది. ఏడేళ్ళ పాటు (1-8 తరగతులు) తెలుగు, తదితర మీడియంలలో చదివిన వారు 9వ తరగతిలో ఒక్కసారి ఇంగ్రీషు మీడియంలోకి మారాలంటే ఎలా వుంటుందో విద్యాశాఖకు తిలియదను కుందామా? ఉర్లూ లాంటి మైనర్‌ మీడియంని ఎలా రద్దు చేస్తారు? తమిళ, కన్నడ, ఒరియాలకూ ఇదే గతా? మొదట వీటితో చిక్కులొ స్తాయని జంకిన ప్రభుత్వం ఒక్క తెలుగు మీడియం మాత్రమే రద్దు చేస్తామని చెప్పుకొచ్చింది (తెలుగంటే అంత నోరులేనిది గన్క. కానీ ఇప్పుడు దాన్నుంచి కూడా 117 జిఓలో తప్పుకొంది. 2 ాాాాోాఖడు రకాల స్యూళ్ళువవరకోసం ? ఎందుకోసం?

“పిల్లలు వాళ్ళకిష్టం వచ్చిన మీడియంలో వాళ్ళు చదువు కోవడం ఒక హక్కు గాదా? ఇంగ్లీషు మీడియం ఎంత శాస్త్రీయ మన్నది అలా వుంచండి. మీరు ఆకాశానికెత్తుకొంటున్న నూతన విద్యా విధానం మీడియంపై చెబుతున్నదేమిటి? దీన్నయినా పట్టించుకోరా?” అంటె సమాధానం లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికీ, విద్యాశాఖకూ నూతన విద్యా విధానం ఒక ముసుగు. అవసరమైనప్పుడు అందులో దాక్కుంటాయి. లేనప్పుడు నిస్సిగ్గుగా తీసి అవతలపారేస్తాయి. ఇది మళ్ళీ కోర్టులపాలు కావడం ఖాయం. ఇంతలో పేద పిల్లలు సతమతం కావడం మరింత ఖాయం.

అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది ?

ప్రభుత్వం పాఠశాలల విలీనంపై ఒక బ్లూప్రింటు తయారుచేసింది. దీనికోసం పెద్ద కసరత్తే చెసింది. సమర్ధనకోసం ఎక్కడెక్కడి గణాంకాలూ సేకరించింది. వాదాల్ని సిద్ధం చెసుకొంది. ఎదురు దాడికి కూడా ఆయుధాల్ని పదును పెట్టుకొంది. తర్వాత రంగంలోకి దిగింది.

మొదట దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన “రాజకీయ విధానంగా” ప్రకటించింది. అధికార్లూ ఉవాధ్యా యులూ అమలు చెయ్యడం తప్పు దీనిపై పల్లిత్తుమూటా అనరాదని గీత గీసింది. శాసన మండలి సభ్యులకు కూడా తెగేసి ఇదే చెప్పింది విలీనం, మీడియం మా ఇష్టం. వీటిపై ట చర్చలూ వుండవు అని ప్రకటించింది. ఇప్పుడు మనల్ని కూడా ఇదేమీ అకడమిక్‌ అంశంగాదనీ, రాజకీయ విధానమనీ అంగీకరించి మాట్లాడా ల్సిన స్థితికి తెచ్చింది.

మనకు 38813 ప్రాథమిక, 4158 ప్రాథమికోన్నత, 6668 ఉన్నత వొాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో హైస్కూలుకు 1 కి.మీ.దూరంలో 17600 (62%); 2 కి.మీ. దూరంలో 7000 (20%); 8 లేదా ఆపై కిలోమీటర్ల దూరంలో 7000 (20%) వున్నాయి. అలాగే మనకు 55,607 అంగన్‌వాడీలుంటే వాటిలో 7000 దాకా ప్రాథమిక పాఠశాల ల్లోనే నడుస్తున్నాయి. అదే ప్రాంగణంలో మరో 4700, ఇంకో 580 పాఠశాలలకు ఆనుకొనివుండగా 1 కి.మీ.లోపులో ఇవిగాక ఇంకా 4000 వున్నాయి. వీటిలో కొన్ని మినీ అంగన్‌వాడీలు వుండొచ్చు. అరు రకాల స్యూళ్ళు ఎవరికోసం ? వందుకోసం? 7

వీటి విసృతినీ, మన సామాజికార్ధిక పరిస్థితుల్నీ క్షైత్రన్ధాయి నిర్వహణా సమస్యల్నీ (వసతులు ఇత్యాది, దృష్టిలో వుంచుకొంటే వీటన్నిటినీ ఒకేసారి విలీనం చెయ్యడం అసంభవం. (ప్రభుత్వా నికైతే చెయ్యాలనేవుంది) దింతో తప్పనిసరై ప్రభుత్వం అంచెలం చెల విధానానికి తెరలేపింది. మొదట 1 కిమీ.లోపు ప్రాథమిక పాఠశాలలన్నీ విలీనం చేస్తామని చెప్పి తర్వాత 250 మీటర్లలోపు స్కూళ్ళకు పరిమితమైంది. వాటిలోనూ ప్రకృతి అడ్డంకులున్నవి కలపడం కష్టమైంది. ఎంతకుస్తే పట్టినా ఇవి 2000లకు మించలేదు. వాటిలో కూడా ఎక్కడి పిల్లల్ని అక్కడే పెట్టి టీచర్లను వెళ్ళిరమ్మన్నారు. నికరంగా విలీనమైనవి 500-600 కూడా వుండకపోవచ్చు. ఈ విలీన పాఠశాలలు ఎంత అందంగా నడిచాయో క్షేత్రస్థాయిలో చూచినవారికి తెలుస్తుంది. నిజం చెప్పాలంటే 3-5 తరగతుల్ని పట్టించుకొన్న నాధుడు లేడు హైస్కూళ్ళలో! వాళ్ళకి తగ్గ టీచర్లూ లేరు, రూములూ లేవు!

ఇక ఈ సంవత్సరం ఒకేసారి 3 కి.మీ. దూరానివన్నీ విలీనం చేసేస్తామని మార్గదర్శకాలు కూడా ఇచ్చి, "4(లకు నిర్ధాక్షణ్య వివరణలిచ్చి తర్వాత వసతులుంటేనే విలీనం అనే దగ్గరికొచ్చి, ఒక కి.మీ.లోపు స్మ్కూళ్ళకే పరిమితిమయ్యారు. విచిత్రమేమంటే మొదటి దశలో విలీనమైనవి రెండో దశలో కన్పించడం లేదు. మళ్ళీ ప్రకృతి అడ్డంకులు రానే వచ్చాయి. అంతా కలిసి 5000 దాటేప్పటికి ఆపసోవాలు పడాల్సి వచ్చింది. జనాగ్రహంతో జవాబు చెప్పుకోలేక వీటిని రోజూ తగ్గిస్తున్నారు. చివరికి ఎన్ని నికరంగా విలినమవుతాయో చెప్పలేము.

వసతులు (అదనపు గదులు) సమకూరాక మిగతా వాటి భరతం పడతాం అంటున్నారు. అప్పుడైనా ఒక కి.మీ.కు పరిమితమవుతారా? అన్నీ విలీనం చేస్తారా అనేది తేలలేదు. పైకి మాత్రం దినికి పరిమితం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనివల్ల గొడవలు తప్ప వ్రతం చెడ్డా ఫలితం దక్కడం లేదు. కొద్దిమంది 3-5 తరగతుల పిల్లలే హైస్కూళ్ళకు రావడంతో, టీచర్లు ఎవ్వరూ రాకపోడంతో ఈ దుస్థితి దాపురించింది. ఎక్కువ స్కూళ్ళు విలీనమైలేనే విద్యాశాఖ ప్రణాళిక ఫలిస్తుంది. నం లకు రకాల స్యూళ్ళు వవంకోసం ? ఎందుకోసం?

అంగన్‌వాడీలదీ అంతే. వీటిని ఒక్కదాన్నీ ఉన్నచోట నుంచి కదిలిచే స్థితి లెదు. దీనికి నిబంధనలు ఒప్పుకోవు. ఇది జాతీయ ్రాజెక్స. ఏమిచేసినా అదే స్క్మూలులోనో, ప్రాంగణంలోనో వున్నవే ఫౌండేషన్‌ స్మూళ్ళు అవుతాయి. మిగతావి ఏ పేరుతో పిలిచినా అవి అంగన్‌వాడీలగానే మిగులుతాయి.

ఇప్పుడు తరగతి గదులు అదనంగా కడుతున్నారు. వాటి ఎంపికకూడా అస్తవ్యస్తంగా వుంది. విలీన హైస్కూళ్ళకు గదులురాలేదు. మూస్తున్న స్కూళ్ళకు గదులొచ్చాయి. స్థలం లేకున్నా కొన్నిటికి ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు. పైగా రానున్నది ఎన్నికల సంవత్సరం! ఎలా గట్టెక్కతారో తెరమీద చూడాలి. కోర్టు వివాదాలు ఎలాగూ సరేసరి.

అన్నీ విలీనం చెయ్యలేకపోతే ఏమవుతుంది? కొన్నిటిలో 1-2 ఇప్పటిలా ప్రాథమిక పాఠశాలల్లో వుంటాయి. కొన్ని మాత్రం బలవుతాయి. కొన్నింటి ౩-5 తరగతులకు సబ్జెక్టు టీచర్ల “మహాబోధన” వుంటుంది. చాలా చోట్ల ఆ 'మహాభాగ్యం' లభించదు. కొన్ని హైస్మూళ్ళు 3-10 తరగతులతో వుంటాయి. కొన్ని మళ్ళీ 6-10 తరగతులతోనే మిగులుతాయి (6 రకాల స్మూళ్ళలో 6-10 హైస్మూళ్ళు లేవు) ఇక 1-2 తరగతులు హైస్కూళ్ళలోవీ, అప్పర్‌ (పైమరీల్లోవీ కూడా విడిపోయి, అక్కడ అంగన్‌వాడీలు కూడా లేక ఏం చెయ్యాలో అర్ధంగాని స్థితి ఎర్ప్చడుతుంది.

అయితే ప్రభుత్వ వాదం, దీమా ఏమంటే “ఇంత మహా సంస్కరణల్లో ఈ మాత్రం కష్టాలుందవా? అన్నీ సర్దుకొంటాయి కొంచెం ఓపిక పట్టండి” అనేది ఒకటైతే “విద్యారంగ సంస్కరణల ఫలితాలు ౩-4 ఏళ్ళ తర్వాత గానీ కన్పించవు. అప్పుడు చూడండి” అనేది మరొకటి.

మొత్తం మీద ఒకటి మాత్రం ఖాయం. ఎప్పటికీ అన్ని స్కూళ విలీనమూ జరగడం అసాధ్యం. మెజార్టీ ప్రాథమిక పాఠశాలతో, అంగన్‌వాడీలూ ఇప్పటిలాగే వుండటం గొడమీద రాసినంత నిజం. విలీనమైనవి ఇటూ అటూగాక పేలవంగా మారతాయి. పిల్లలు (్రైవెట్‌ బాట పడతారు. ఈ ప్రయోగశాలల్లో పిల్లల్ని బలిచెయ్యడానికి ఏ తల్లిదండ్రులూ ఒప్పుకోరు! ఊహాతీత విధ్వంసం మిగులుతుంది. ఆరు రకాల స్మూళ్ళు ఎవంకోనం ? ఎందుకోసం? ర

ఏకపక్షం, ఎదురు దాడులూ |!

విలీన విధానం తమ రాజకీయ నిర్ణయమనీ దీన్ని ప్రశ్నిం చడానికి లేదనీ ప్రభుత్వం చాలా పట్టుదలతో వుంది. ఈ విధానం పై ఏ చర్చకూ అవకాశం ఇవ్వడం లేదు. ఎలాంటి సమాచారము అందుబాటులో వుండనివ్వడం లెదు. అడగడానికి ఎవ్వరూ అందుబాటులో వుండటమూ లేదు. ఎంతో హుందాగా, ప్రజా స్వామికంగా, వీలున్నంతమందిని కలుపుకుని ఒక ఉద్యమం గా నడపాల్సిన సంస్కరణల్ని బుల్‌డ్రోజరుతో నడపాలను కోడంలో ప్రభుత్వ దుర్మార్గం ఎంత దాగివుందో, దాని విధానాల డొల్లతనం కూడా అంతే దాగివుంది! ఇప్పుడు ప్రతిదాన్నీ అధికార్లు పట్టించుకొంటున్నారు. జరిగి తీరాలని పట్టుబడు తున్నారు. జనం నుంచి వ్యతిరేకత వస్తే పాలకపక్ష నాయకులైనా సహనం ప్రదర్శిస్తున్నారుగాసీ అధికార్లు మాత్రం భరించలేకుండా వున్నారు. ఇదంతా సంస్కరణలకు వ్యతిరేక కుట్రగా లెక్కిస్తున్నారు. బలవంతంగా టిసిలిప్పిస్తున్నారు. పోలీసు పద్ధతులన్నీ పాటిస్తు న్నారు. పేద గిరిజన బాలబాలికల పట్ల కూడా అత్యంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. పత్రికల్లో వార్తలు రాకూడదు. ఏ కష్టాలు సామాజిక మాధ్యమాల్లో కన్పించ గూడదు. విద్యాశాఖ స్వభావమే మారిపోయింది.

టీచర్లపై యుద్ధం

టీచర్లను నమ్మడం, వాళ్ళను ప్రోత్సహించి క్రియాశీల భాగస్వాముల్ని చెయ్యడం, వారికి 'స్వేచ్చనివ్వడం ఏ ప్రజాన్వామిక విద్వా విషప్లవానికైనా అత్యంత కీలకమైనవి. అసలు టీచర్లను విశ్వసించకుండా విద్యాశాఖను నదపడమంత అర్దరహితమైనది ప్రపంచంలో ఎక్కడా వుండదు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ నిజంగా అద్భుతాలనే తెచ్చింది. దాన్ని టీచర్లు చేతులెత్తి న్వాగతించారు. అద్భుతంగా అమలు చేస్తున్నారు. దీనికి కారణం టిచర్లను నమ్మడం. వారికే బాధ్యతలప్ప జెప్పడం. కేరళ కరోనాతో చిగురుటాకులా వణికిపోయింది. “అయినా మా రాష్ట్రంలో ఒక్కరోజూ చదువులాగలేదు” అని ధీమాగా చెబుతోందా ప్రభుత్వం. “దీనికంతా మా టీచర్లే కారణం” ఆంటోంది అక్కడి విద్యాశాఖ. పైనుంచి ఎవరు ఎన్ని, విన్యాసాలు చేసినా, ఎన్ని ఉత్తర్వులు కుమ్మరించినా అవన్నీ అమలు కావల్సింది తరగతి గదిలో! అమలు చెయ్యాల్సింది ఉత్తేజితులైన ఉపాధ్యాయులు. దిన్ని అంగీకరించడానికి ఏ మాత్రం ప్రస్తుత విద్యాశాఖ సిద్ధంగా లేదు. 7 తరు రకాం స్మూళ్ళవవంకోసం ? ఎందుకోసం?

అసలు టీచర్లంటే మన విద్యాశాఖకు మహా చిరాకు. “వాళ్ళ వల్తా, వాళ్ళ సంఘాల వల్లే విద్యారంగమిలా నిస్సారంగా మారింది. వాళ్ళు పిల్లల్ని గురించి ఒక్క నిముషమూ ఆలోచిం చరు” అనేది దాని నిశ్చితాభిప్రాయం. ఇక టీచర్ల ప్రజాస్వామిక హక్కుల్ని గురించి చెప్పనవసరం లేదు. “పీళ్ళ సంఖ్యని తగ్గించాలి. వీళ్ళ ప్రయోజనాల్ని తెగోయాలి. విళ్ళని గొర్రైల మందలా మార్చి, వధ్యశిలమీదికెళ్ళినా తలాడిస్తుండేలా మార్చాలి. అప్పుడే పేద పిల్లలకు న్యాయం జరిగేది” అన్న పట్టుదలతో సర్కారు వున్నప్పుడు, సంస్కరణలు మొత్తం ఉపాధ్యాయులను కట్టడి చెయ్యడంవైపు నుంచే సాగుతున్నప్పుడు దిని పర్యవసానం కూడా అలాగే వుంటుంది.

ఒక్కబడీ ముయ్యం ! ఒక్క పోస్పు రద్దుకాదు !

దీన్ని మాటిమాటికీ మంత్రులూ అధికాల్లేగాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నారు. నిజంగా అలా జరిగితే అంతకంటే ఆనందించాల్సింది లేదు. కానీ జరుగుతున్న దేమిటి? ఎయిడెడ్‌ పాఠశాలలు విలీనంతో ఎన్ని మూతపడ్డాయి? జన్మలో అవి కోలుకోనేనా? ఊరిబడి నుంచి 3-5 తరగతులు మాయ మయ్యాక ఆ పిల్లలకు ఆ బడి మూతబడ్డట్టా తెరిచి వున్నట్టా? ఒకటింండు తరగతులే మిగిలిన ఫొౌందేషన్‌ స్కూళ్ళలో ఎంతమంది పిల్లలు మిగులు తారు? అవి బతికేవేనా? అప్పర్‌ (పైమరీ సెక్షన్లను హైస్మూళ్ళలో కలిపేస్తే అదింకా వున్నట్లే లెక్కా? గతంలో కూడా కొన్ని స్మూళ్ళు పిల్లల్లక వెలవెలపొయ్యెవి. ప్రభుత్వం అక్కడి నుంచి డిప్యుటేషన్‌ పై టీచర్లను తరలించేసేది. బడిని మాత్రం మూసి వేసేది కాదు. మూతబద్డానికీ, మూత వెయ్యడానికీ తేడా ఏమిటో మనబోటోండ్లకు అర్ధమయ్యేదిగాదు. ప్రభుత్వ వాదన ప్రకారం సంఖ్యాపరంగా, భౌతికంగా బడుల్లో ఏ మార్పురాదు. కాకుంటే ఇప్పుడున్న పిల్లలు మాత్రం వాటిలో వుండరు ఎంత చమత్సారం!

అలాగే వోస్టుల సంగతి. విలీనాలతో, రేషనలైజేషన్‌తో వేలాది పోస్టులు అనవసరంగా మారుతాయి. వాటిని రద్దు చెయ్యరు. ఇతర అవసరాలకు మారుస్తారు (మోడల్‌ స్కూళ్ళకు ఎస్‌జిటి పోస్టులను వాడుకొన్నట్లు). వాటిని భర్తీ చెయ్యరు. ఎంతకాలమైనా మన క్రాఫ్ట్‌ డ్రాయింగు పోస్టుల్లా ఖాళీగా వుంటాయి! ఖజనాకు కావల్సినంత మిగులుతుంది. పనిచేస్తున్న టీచర్లపై మొయ్యలేని భారం మోపుతారు. మరి ఒక్క పోస్తూ రద్దుగాక పోతే మూడేళ్ళనుంచి ఖాళీగా ఉన్న ఒక్క టీచరు పోస్టునూ ఎందుకు భర్తీ చెయ్యడం లేదు? ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ? ఏర్‌

ఇంకొన్ని ప్రయోగాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఏ రాష్ట్రమూ చెయ్యని మరికొన్ని ప్రయోగాలూ చేస్తోంది. వీటిలో దశలవారీగా అన్ని హైస్కూళ్ళను సిబిఎస్‌ఇ స్మూళ్ళుగా మార్చడం ఒకటి. నిజానికి రాష్ట్ర సిలబస్‌ పోటీ పరీక్షలకు కూడా భేషుగ్గా వుందని కార్పొరేట్‌ స్మూళ్ళు కితాబులిస్తుంటాయి. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు సిబీఎస్‌ఇ 10వ తరగతి తర్వాత మళ్ళీ మన ఇంటర్మీడియేట్‌లోకే వస్తారు. గణితం, సైన్సు వాఠ్యగ్రంథాలు దాదాపు సిబిఎస్‌ఇ నమూనాతో మనమూ అందిస్తున్నాం. సిబిఎస్‌ఇ పాఠ్యాంశాల్లో ప్రామాణికత, సృజనాత్మకత, శాస్త్రీయత వుంటే ఆ తరహాలోనే మనం న్ధానికాంశాలతో వాఠర్యగ్రంథాలు తయారు చెయ్యవచ్చు. పరీక్షలు కూడా అలానే నిర్వహించవచ్చు. కానీ రాష్ట అవసరాలు, సంస్కృతి, చరిత్ర అన్నీ ఎందుకు మన చదువుల నుంచి కనుమరుగు కావాలి? ఇంగ్రీషు మీడియంలానే ఇదీ ఒక పాపులర్‌ ప్రయోగం! ఇంగ్లీషు మీడియంను దొడ్డిదారిన తీసుకురావడానికి కూడా ఇది భేషుగ్గా వుపయోగ పడవచ్చు. ఏ రాష్ట్రం తన స్మూళ్ళన్నిటినీ సిబిఎస్‌ఇకి అప్పజెప్పడం లెదు. పై పెచ్చు కేరళ ప్రస్తుత ఎన్‌సిఇఆర్‌టి పోకడల దృ్టా తాము సిబిఎస్‌ఇని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది కూడా. బైజూస్‌ ఒప్పందమూ ఇలాంటిదే. బైజూస్‌ కేవలం ట్యూషన్లు చెప్పుకొనే

సంస్థ. కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌ చదువులతో అది అందలమెక్కింది. పాఠశాల

చదువులకు అదనంగా స్తోమతవున్నవారు బైజూస్‌ పాఠాల్ని ట్యూషన్‌ రూపంలో

వింటుంటారు. అంతమాత్రాన అది తరగతి గదికి ఏ మాత్రం ప్రత్యామ్నాయం

కాబోదు. రాష్ట్ర ప్రభుత్వమే ఒక కార్పొరేట్‌ వ్యావార విద్యా సంస్థను తరగతి

గదుల్లోకి ఆహ్వానించడం దేశంలోనే ఇది మొదటిసారి. పాఠాలకు మార్భులేగాదు విలువలూ వుంటాయి. దీన్ని మరిచిపోతే మన పిల్లలు మర మనుషులుగా మాత్రమే మిగులుతారు. అసలీ పాఠాలు మన గ్రామీణ పిల్లలకి ఏ మేరకు ఉపకరిన్తాయనే దానిపై ఏ అధ్యయనం చేసారు? అంతా హడావుడి నిర్ణయం, మరో పాపులర్‌ పథకం! నం తరు కాం స్యూత్యవవంకోసం? వందకోనం?

నేల విడిచిన సాము

ప్రభుత్వం క్షేత్రస్థాయి సామాజికార్ధిక పరిస్థితుల్ని సాంస్కృతికాంశాల్ని, అవి పిల్లల చదువులపై నెరిపే ప్రభావాన్ని ఏ మాత్రం చూడ నిరాకరిస్తోంది. ఒక అధికార కేంద్రం ప్రతిదాన్నీ శాసిస్తోంది. “బడి అందుబాటు అనేది మనలాంటి సమాజాల్లో చాలా కీలకమైంది. ఎక్కువ స్కూళ్ళు వీలున్నంత దగ్గరగా వుండబట్టె అందరు పిల్లలూ బడికొస్తున్నారు. ఇప్పటికీ వారు బడికీ తమకూ మధ్యగల సామాజిక దూరాన్ని అధిగమించలేకపోతున్నారు. కూలినాలి చేసుకొనె వాళ్ళు తమ పిల్లల్ని బడిలో దించి, మళ్ళీ బడినుంచి తీసుకుపోలేరు. తమ వాడలోనే బడి వుండటం వారికి పెద్ద ఊరట. ఆరో తరగతికి రావడమే మన గిరిజన పిల్లలకి గగనంగా వుంటోంది. వాళ్ళ హాజరు కూడా అంతంతమాత్రంగానే వుంటోంది. (ప్రైవేట్‌ విద్యార్దులు బస్సులెక్కి వెళతారు. వీళ్ళలా గాదు నడిచేపోవాలి.

విద్యాహక్కు చట్టం (రకారం ఒక కి మీ.లోపున బడి వుండదా లనడం, అప్పర్‌ (పైమరీ స్మూళ్ళు వీలున్నంత అందుబాటులో వుండటం తెలివి తక్కువగా తీసుకొన్న నిర్ణయాలు గావు. ఇవి చిన్న చిన్న బడులు గదా అనొచ్చు. అయినా నడపాల్సిందే. అది ప్రభుత్వ బాధ్యత. వాటిలో వసతులూ, ప్రమాణాలు లేవనే సాకు అర్ధరహితం. వాటిని ఏర్పర్చాల్సింది కూడా ప్రభుత్వమే. ఏదో కొందరు పిల్లలు మంచి బడికోసం ఎంతదూరమైనా వెళుతున్నారని ఓ 'అధ్యయనంిచేసి అందరు పిల్లల్ని ఎక్కడినుంచి ఎక్కడికైనా తరలించాలనుకోడం నేల విడిచిన సాముగా మారుతుంది.

అలాగే (ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు, ఆదర్భాలూ చెబుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల గురించీ, పోటీల గురించీ ప్రవచిస్తోంది. రాష్ట్రంలో ఎందరు పిల్లలు పదో తరగతి దాటుతున్నారు? దాటిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారు? ఈ మధ్య ప్రతిష్టాత్మక ఏకలవ్య పాఠశాలల్లో చదివిన పిల్లలు, 12వ తరగతి తర్వాత (తమ బడి వదిలాక) ఏమవుతున్నారో ఒక అధ్యయనం చేసారు. పది శాతం కూడా ఇంజనీరింగు లాంటి కోర్సులకెళ్ళడం లేదు. సాక్షాత్తు ౮౫2 చేసిన సర్వేలో 1 నుంచి 10దాకా ఇంగ్లీషు మీడియంలో చదివిన ప్రస్తుత ఇంజనీరింగు తెలుగు విద్యార్థులు 40% తమకు సాంకేతిక విద్య కూడా తెలుగు ఆడు రకాల స్యూళ్ళు ఎవరికోసం ? వందకోసం?

మీడియంలోనే వుండాలన్నారు. మన గురుకుల పాఠశాలల్లో చదివిన అమ్మాయిలు జీవితంలో ఎలా స్థిరపడుతున్నారో పరిశీలన చేస్తే తెలుస్తుంది మన సమాజపు వికృతరూపం. ఏ మీడియంలో చదివినా, ఏ స్మూళ్ళలో చదివినా నమ్మకంగా నాలుగు లైన్లు చదవడం వచ్చినవాళ్ళు ఎందుకు కన్పించడం లేదో అజీమ్‌ (ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ను అడిగితే చెబుతుంది. ఇంగ్రషు మీడియం ఎంత కొంపముంచిందో ప్రపంచబ్యాంకునూ, బ్రిటీష్‌ కౌన్సిల్‌ను సంప్రదించి మన విద్యాశాఖ వాఠాలు నేర్చుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో ఇలావుంటే మనం నేల విడిచి సాము చేస్తే ఏమవు తుంది? పిల్లలకూ హక్కులుండవా ? విలీన ప్రక్రియ మొత్తం పూర్తయితే ౩-5 తరగతుల పిల్లలందరూ హైస్ఫ్మూళ్ళకు తరలి వెళ్ళాల్సి వుంటుంది. వీరి సంఖ్య దాదాపు 18 లక్షలు! అప్పర్‌ (పైమరీలనుంచి వెళ్ళి పోవల్సిన వాళ్ళు దీనికిది అదనం! వాళ్ళ ఇమ్రాఇవ్టాలతో, కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా, తల్లిదండ్రులకు ఏ మాత్రం చెప్పకుండా వీళ్ళనందరినీ ఊరిబడి నుంచి ఎక్కడెక్కడికో తరలించడానికి ఎవరికైనా ఏమి హక్కు ఉంది? పిల్లలకేమీ వాక్కులుండవా? ఎంత పసిబిడ్డ్దలయితే అంత సున్నితంగా వారిని గురించి ఆలోచించాలి గదా? ఇంగ్లీషు మీడియం పెట్టాలనుకొన్నప్పుడు ఆఘమేఘాలమీద వాలెంటీర్లను పంపించి తల్లిదండ్రులచేత సంతకాలు “సేకరించారు” (ఆ '“సేకరణి ఎంత ఆద్భుతంగా జరిగిందో అందరికీ తెలుసు) అంతా జనాఖీష్టం ప్రకారమే చేస్తున్నామని బుకాయించారు. మరిప్పుడు ఊరిబడి విలీనంపై కూడా ఎందుకు సంతకాలు సేకరించరు? తల్లిదండ్రుల కమిటీలతో ఎందుకు తీర్మానాలు చేయించరు? అసలు తమ వాఠశాలపై గ్రామ పంచాయితీకి, పిల్లలకూ, వాళ్ళ తల్లిదండ్రులకూ ఏ హక్కులూ వుందవా? విద్యారంగంలో సైతం ఇంత నియంతృత్వం ఎం న్యాయం? “ప్రజాస్వామిక విద్య, “విద్యా ప్రజాస్వామికీరణ”, 'తరగతి గదిలో ప్రజాస్వామ్యం), శిశు కేంద్రక విద్య” లాంటి ఆదర్శాలన్నీ నీతి వాక్యాలేనా? 31... ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ?

బూడిదలో పోసిన పన్నీరు

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని రాజకీయ అజెండాగా ముందుకు తెచ్చింది. ముఖ్యమంత్రి స్థాయిలో మాటిమాటికీ సమీక్షలు జరుగుతున్నాయి. దీంతో విద్య ప్రభుత్వానికి ప్రథమ (ప్రాధాన్యం అనే సంకేతం అందరిలోకి వెళ్ళింది. కేరళ, ఢిల్లిలు పలట్టనబాట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ చేపడుతుందన్న ఆశలు కలిగాయి. బాలకృష్ణన్‌ కమిటీని కూడా అందరం ఆహ్వానించాం.

ఈ మూడేళ్ళలో ఒక్క అమ్మజఒడికే ప్రభుత్వం 19,617 కోట్లు వెచ్చించింది. ఇక విద్యాకానుకకు 2,368 కోట్లూ, గోరుముద్దకు 3,087 కోట్లూ ఖర్చు చెసింది. నాడు-నేడు మొదటి దశ పూర్తయింది. రెండో దశ చేపట్టారు. దీనికి కేటాయింపు 11,669 కోట్లు! ఇంత అదనపు భారీ బడ్జెట్‌ విద్యారంగాని కెప్పుడూ లెదు. నాడు-నేడు ప్రతివ్వాత్మక పథకం. దీంతో మన స్మూళ్ళు చూడముచ్చటగా మారాయి. మారనున్నాయి.

ప్రభుత్వానికి వీటివల్ల వచ్చిన మంచి పేరు మొత్తం విలీనం విధానంతో గల్లంతైంది. అసలు ప్రాథమిక పాఠశాలల్ని విడగొట్ట బూనుకోడమె ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. దీంతో లక్షల మంది పిల్లల్ని సాంత బడినుంచి ఎక్కడెక్కడికో తరలించాల్సి వచ్చింది. అందంగా తీర్చిదిద్దిన నాడు-నేడు స్మూళ్ళు పిల్లల్లేక వెలవెలబోతున్నాయి. అన్నీ వెనక్కి వెళ్ళి, స్కూళ్ళ మూతే ముందుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేనట్టు బడి చుట్టూ పోరాటాలు మొదలయ్యాయి. ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం టీచర్లపైనా, వాళ్ళ సంఘాలపైనా దాడి చేస్తోంది. ప(త్రికల్ని తప్పు పడుతోంది. ప్రతిపక్షాల్ని నిందిస్తోంది. కానీ సొంత ఎమ్మెల్యేలనుంచే విజ్ఞప్తులు వెల్లు వెత్తడంతో దిక్కుదోచని స్థితిలో పడింది. పిల్లలు టిసిలబాట పట్టడం మరీ బెడిసి కొడుతోంది. అయినా విద్వాశాఖ పోలీసు శాఖావతారమెత్తి దందడనలతో తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. ఇంత అస్తవ్యస్తం ఎప్పుడూ చూదనిది. ఆరు రకాల స్యూళ్ళు వవరికోసం ? వండుకోసం [32

కేరళ, ఢిల్లీలు ఏం చేశాయి ? విద్యారంగంలో తెచ్చి మంచి సంస్కరణలు రాజకీయంగా కూడా ఎంతో లాభిస్తాయని ఢిల్లీ ప్రభుత్వం నిరూపించింది. పంజాబ్‌ ఎన్నికల్లో దీన్ని ప్రధానాస్తంగా ఆమ్‌ ఆద్బ్భీ పార్టీ వాదుకొంది. ఇప్పుడు ఢిల్లీ స్కూళ్ళు పెద్ద పర్యాటక కేంద్రాలుగా, అంతర్జాతీయ జాతీయ స్థాయిల్లో చర్చావేదికలుగా మారాయి. ఆమ్‌ ఆద్మి పెద్ద ఎత్తున విద్యావేత్తల్నీ విద్యాభిమానుల్నీ స్మూళ్ళచుట్టూ సమీకరించింది. గొప్పు మేధోమథనం చేసింది. ఒక ఉద్యమంగా సంస్కరణలు చేపట్టింది. ఉవాధ్యాయులకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణలిప్పించింది. వాళ్ళనుంచి మంచి నాయకత్వాన్ని సమకూర్చుకొంది. ఉత్తేజిత ఉపాధ్యాయ వర్షం ఢిల్లీ విద్యకు వెన్నెముక. పాఠశాలల్ని చాలా భారిస్థాయిలో అత్యున్నత వసతులతో తీర్చిదిద్దింది. తల్లిదండ్రుల్ని బడికి తోడుగా నిలబెట్టింది. వీటన్నిటికంటేమించి కేజ్రీవాల్‌తో సహా పాఠశాలల కొచ్చి హెడ్‌ మాస్టరు ఎదురుగ్గా కూచుని మంచీచెడ్డా తెలుసు కొన్నారు. పిల్లలతో ముచ్చటించారు. బడిని సమాజపరం చేసారు. అకడమిక్‌ ప్రమాణాలపై ఎన్నడూలేని శ్రద్ధ పెట్టారు. ఒక విశ్వాసం జనంలో కల్లించారు. సహజంగానే పిల్లలు వీటిలోకి బిలబిలా వచ్చారు. అంతే గానీ ఊరిబడిని మూసేసి బలవంతపు తరలింపులకు పూనుకోలేదు. ఏకపక్ష బ్యూరోక్రటిక్‌ నిర్హయాలు చెయ్యలేదు. టీచర్లను శత్రువులుగా చూడలేదు. ఆత్మరక్షణలో పడలేదు. కేరళ దేశానికే గొప్ప ఆదర్భం. దానిది దిర్హకాలిక ప్రణాళిక. దేశంలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి తీరాలన్న నియమాన్ని తు. చ. తప్పకుండా వొటిస్తున్న రాష్ట్రం కేరళ ఒక్కటే. ప్రతి తరగతిగదీ డిజిటలైజ్‌ అయిందీ ఒక్క కేరళ రాష్ట్ర హైస్మూళ్ళ లోనే. అకడమిక్‌ విషయాల పట్ల, విద్యా ప్రమాణాల పట్లకూడా కేరళ రాష్ర్రానికున్న స్పష్టత ఎవ్వరికీ లేదనడంలో అతిశయోక్తి గాదు. ఉపాధ్యాయుల [క్రియాశీల భాగస్వామ్యం, (ప్రజల, పంచాయతీల ప్రమేయం కూడా కేరళ విద్యారంగానికి గొప్ప వెన్నుదన్ను. కేరళ ఒక క్రమంలో పాఠశాలల్ని ఆధునీకరిసూ వెళ్ళింది. కొన్నిటిని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు గా మార్చింది. ఎయిడెడ్‌ పాఠశాలలకూ నిధులిచ్చింది. అయిదారేళ్ళలో అన్ని స్మ్కూళ్ళనూ ఆధునసీకరించింది. “మేము పాఠశాల విద్యారంగంలో చెయ్యాల్సి ౦ది దాదాపు చేసేసాం. ఇక ఉన్నత విద్యపై 33 ఆరు రకాల స్కూళ్ళు ఎవరికోసం ? ఎందుకోసం ?

కేంద్రీకరించాలి అని ఇటీవల ప్రకటించింది కూడా. 'పోతు విద్యాభ్యాస సంన్మార యజ్ఞమ్‌, 'నవకేరళమ్‌” విధాన పత్రాలు చదివితే కేరళ నమూనా ఎంత గొప్పదో తెలిసొస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు పెరిగారు. ఒక్క ఢిల్లీ, కేరళల్లో మాత్రమే అంతకుముందే పిల్లలు పెరిగారు. ఫలితంగా రెండు రాష్ర్రాలకూ గొప్ప పేరు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ సంస్కరణల్లో పొపులర్‌ దృక్పథం వున్నంతగా సమగ్ర దృక్పథం లేదు. బ్యూరోక్రటిక్‌ పెత్తనం తప్ప ప్రజాస్వామిక ధోరణి లేదు. టీచర్లపై దాష్టీకం తప్ప వాళ్ళని విశ్వసించి, బాధ్యతల ప్పగించడం లేదు! ప్రపంచబ్యాంకు నడిపిస్తోందా ౪? ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా ఇంత అభాసుపలవు తున్నా ఇంతమంది నెత్తీనోరూ మొత్తుకొంటున్నా ప్రభుత్వం ఎందుకింతపట్టుదలగా వుంది? దీనివల్ల రాజకీయంగా సైతం నష్టం జరుగుతున్నా దేనికంత మొండి తనం? ఎలా ఇది ఒక రాజకీయ విధానంగా మారింది? ఒకటి స్పష్టంగా కన్పిస్తున్నది. అది టీచర్‌ పోస్టుల కుదింపు, వాఠశాలల తగ్గింపు. ప్రభుత్వం దీన్ని కాదనవచ్చుగానీ ఇందులో ఏ సందేహం వుండనకృరలేదు. దీనివల్ల భారం బాగా తగ్గుతుంది. మొదట కొంత అదనంగా వెచ్చించాల్సి వచ్చినా తర్వాత తర్వాత బరువు సగానికి సగం తగ్గిపోతుంది. ఈ లెక్కలన్నీ వేసుకొన్నాకనే ప్రభుత్వం ఈ గోదాలోకి దిగింది. నీతిఆయోగ్‌, ప్రపంచబ్యాంకులాంటి సంస్థలు కూడా ఈ సలహాలే ఇస్తున్నాయి. చిన్న చిన్న స్కూళ్ళలో విద్యార్ధి పై 40వేలు ఖర్భవుతోందనీ, వాటిపై “ఏదో ఒక సాహసోపేత” నిర్ణయం తీసుకోవాలనీ నితిఆయోగ్‌ పురమాయిస్తోంది. ఇక “బడ్జెట్‌లో 83% ఉపాధ్యాయుల జీతాలకే సరిపోతోందని' ప్రపంచబ్యాంకు గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు కొత్తగా 541 ఒప్పందం కూడా రాష్ట్రంలో అమలవుతోంది. అడు రకాల స్యూళ్ళు ఎవరికోసం ? వందకోసం? 34

చివరగా

మొదట ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్ని విడగొట్టడం మానుకోవాలి. ఇది ఆత్మహత్యాసదృ్భృశం. ఆచరణలో అసాధ్యం. పిల్లల్ని తరలించడం ఏ మాత్రం సరిగాదు. దీనికి బదులు పంచాయితీని ఒక యూనిట్‌గా తీసుకొని ఒక మంచి ప్రాథమిక పాఠశాలను అయిదు గదులూ, అయిదుగురు టీచర్లూ వుందేలా ఆధునిక వసతులతో ఏర్వాటు చెయ్యాలి. ఇప్పటికే హైస్కూలు, ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో వుంటే వాటిని ఒకే స్కూలుగా 1-10 తరగతులతో నడపొచ్చు.

'తరగతికి ఒక టీచరు” అనేది ప్రాథమిక విద్యలో అన్నిటికంటే కీలకమైంది. ప్రణాళికాబద్ధంగా అలాంటి స్మూళ్ళను పెంచు కొంటూ పోవాలి. అవసరమైతే దినికోసం ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని తగ్గించాలి. క్రమంగా పిల్లలు వీటిలోకి వస్తారు. ఈ ఓపిక మనకుండాలి.

“అందుబాటు తప్పనిసరి అవసరం. రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేనప్పుడు ఇది అత్యంత విలువైంది. టీచర్లనూ బడులనూ తగ్గించుకొంటూ పోవడం గాదు చెయ్యాల్సింది. తక్కువ పిల్లలతో ఎక్కువ తరగతులూ, ఎక్కువమంది టీచర్లూ వుండటం మంచి చదువులకు గ్యారంటీనిస్తుంది.

పాఠశాలల్లో చదువులు ముఖ్యం. మిగతావన్నీ చదువుల కోసమే. దీనికోసం ఇతర పనులు పక్కనబెట్టి స్వేచ్చగా టీచర్లకు పాఠాలకు పరిమితం చెయ్యాలి. వాళ్ళు పిల్లల విద్యా ప్రమాణా లకు బాధ్యత వహించాలి. ఒంటరిబడి నిలబడలేదు. దాని చుట్టూ సమాజాన్ని తోడు తెచ్చుకోవాలి. స్థానికంగా అన్ని విషయాల్లో ప్రజలకే నిర్ణయాధికారం ఉండాలి. ఇప్పుడు కావల్సింది ఇలాంటి రాజకీయ విధానం.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవడం మంచిది. ఇన్ని వైరుధ్యాలున్న సమాజంలో, అత్యంత ప్రధానమైన విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చే టప్పుడు ఆచితూచి వ్యవహరించాలనీ, అందరినీ కలుపుకుపోవాలనీ, ఓ క్రమపద్ధతిలో యాడు రకాల స్యూళ్ళువవంిసం? ఎందుకో?

దీర్హకాలిక దృష్టితో వ్యవహరించాలనీ గుర్తుంచు కోడం మంచిది. మంచిని ఆహ్వానించేవాళ్ళు, మరీ విద్యారంగంలో మంచి మార్పుల్ని స్వాగతించే వాళ్ళు చాలామంది సమాజంలో వున్నారని కూడా ఒప్పుకోడం మంచిది. ప్రపంచ వ్యాప్తంగానే గాదు, దేశంలో సైతం ఆద్భుతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, వాటి అనుభవాల్నుంచి నేర్చు కోవల్సింది ఎంతో వుందనీ వినయంగా అంగీకరించడం మరీ మంచిది. మనం చేసే ప్రతి నిర్ణయం, వేసె ప్రతి అడుగూ అట్టడుగు పేద బాలికకు ఎంతమేలు చేస్తుందో అనుక్షణం తూకం వెసి చూచుకోవడం అన్నిటికంటే మంచిది. ! లో టా సత్య వవ? వదక? 0 “|

లూ ఒక్టీ

గా జ / | _్త _ 11 | ల శ ట్‌ శ . స్వా . వెల ఇ ణి ం 4 శ నః ॥ ల్‌ హం. చ జా నో మీ ఇవ కో ఫస జే ళ్‌ స వలీ చ కు క లో క హి “వః ఖ్‌ న్‌ ప | క! స క డం సం ప్‌ మ స” ల పతా క ఇ, మ. తపం వు నాచాన్ళి మల 4 సో *, ర కరు కోక జ ర శ్‌ అఆ! (| | కేరళ క మం? వ (ఇ నఖ షె ౯ (- న్‌ల | జ ల్‌ షే సన; "వట అలలా లే న గ వం వో? ్మ( చయ? కో ఇన్నా టీల అలాని శీలి. పో స . బ్‌ ఫ్‌ కటు ౧ న్‌ థీ జాతా గనం విను 1 మ. క? ఇన | క క్ట లం ; 1 స ల ఆహ వజ మకు క మ | స్త త్‌ . త 1 . క సేఫ్‌ వి... వయో [ ర సఖ న్‌్‌ సశ = 2 /. వే ల ర. క్‌ ళ్‌ ఖః [ము కో క 1 జ నీ! నె , 1, య నతన ల కో గ" డా ్ట పం ఇక్‌ ల _ . స టీపను = హైమా సళ తే (సు లు ర వి జీ. గ్‌ వ్‌ 1 స “చి అకక కన హు భల చను జా లన ఐం. శ వ్‌ కం మనా ల ల గల సా స చ న లం. కా అ క, న్‌! ఖ్‌ క్ష తే చచ ఇ | | |. | . హ్‌ న. | కన ఫి న క | నన (నా న మ యు 5 అప " ॥ = . క... *సట్య ల, క్‌ వాయన. సం టటో 1 1 , . లం! క? ము ర! శే చ స్త [క కా టట సం. ,! | వ 4 లే ల నన. ఈ భట్‌ ఆ శ 4,1! నవత | పో రట " . + . ఓ న. . షో వంట న వస కీ ల 1 1. శ్‌ క) (అ క ( గ. వ ంముటే ఫై చక టం. గే త నే (వ (౯ తీ త ఈక?! కు . . | ౨. ఘాత న ఏష ర ఓ. మ! హే 4] త మహట్టు ॥ . నే | క సు | 1౯] ళ్ళ ౫ 1 నజ! నని భనీ సన , వ

  • లూ జే! | | ప ప ఫ పమ లే పనే “నటి మయా వ. క్ష వ తథ క ణే [1 ఈ గా లక. వ్‌ లి ౨ నీకా | | శూల + ల్‌ . “ నీకీ స = భవ త ట్ట. వ రతా తు కు స “ న న. ళ్ళ వా నా. శీల | ఆల (ఆ బళ క క జ్‌ తి హు! క క మె క! న్ని లం జా ॥ _ క. | జం స. . శ్‌ లో నలో శ పచ _ [2 తళ ఫు కే , ల _ ు ( యళ నాల న త. చ హాటా. యం. క కరం! శ రయ గ? "శీ “చాచి ౨. ॥ . పన కనే వళ ర క జ్యా కోకో శే న. వ. శ్‌ న వ! క ల! ఇ శో హ్‌ వ = లలి . ఎ" 1 = న న ం నట శ బా ల్ల పనన శ లాం క్‌ ల రి ఖే; త్‌ డన టాం ప న కు... | వమనం ల ని స న. ! చం! పయ. | న న్న - క | | మ్య క తి కే వి వ గం లై లే [౯ వా | | శ కక్‌ /. అ | | ఎ / | . . / శ. లే రాం, న్‌ ర్‌! గే శ క ఇ. అ ౮ | సె గ | | . ల క ళా (న ఇ, స 15 లన | ఏ భతక లను లై న్‌ = . + ॥ ॥ శం ప వం ల. ముక స్‌ “ఖై ఫ్‌ సం | ॥ .. ళ్ళి! రర త న. . | - క గల ట్‌ కీల ఇ జో ట్‌ (| క్క క. 11, , , _ _ టం 1 | ష్టం 1కి 4! శారా 2 భా. శ జ జ్యా ' , - | న. టల! 2 ఆ |. ॥ | . . త. 1 స్తత కలా సం ఓక య య. ఫం 01 (ళో ల! శ + / న. లు. సహ స బ్‌ న... " . _ _ | .. | ఇకా. భ్‌ ' శ్‌ ల త్‌ విట వళ శక శ టు ఆ ం స ' చలీ " స్‌ కల . శే న నర. య ంక్‌ 7 వళ గ్మసా ర కు (పతర గే ॥
  • వం లలు! 0 త్‌ క! లు లా జి ఢి _ ! ॥ క ఇట్ట యు. మ జక. ( ణ్‌ ప, . మ్‌. ష్టక్త్టాం "కూ గీ నో గ శ ఉచ * _ అణు ల! ల ౦. ప న ల. ణు [ | ॥ ్ట , ( శ లే || || నా 4 క్‌ శ ॥ శ ం | శ వ క క్‌ + క 2 క న జే. న _ " ఎ " క గ పట్‌ ఇతతదకార్స వు? ఇవ వహ న. లత " - .' | అ త్తి బా ” | క లలి శ క ఇ యళ వసం పి రో జ భా, -
  • రం ప రట యి క. - క... కా మ! టి! “శ. ॥ , . స | ధట వా! పీ: క హా. - “ 1
  • . జ్‌! లా! న ల చ్‌ ( క స! తనా ల ఇ _ శ లో ం (1 భు! గౌ ర్‌“ యవ ర / నం పియా! క ] ౯ | గ " ం

న మవసు ఫౌండేషన్‌ “వహఖ | స ్రదెన్‌ర్‌ 2 ౧ ౧.6 “ాభందంట్ల్‌ గర్‌ మాన ననననకు నాం న త చాల ౭ చా నా నననానననననా ననా "వవచేపవి (౧00 తయ టొ పకక్షచేవవ 1౧౦౬౦ నాక వాం నా ననన ర వా ల క్రకునతవతన |. లాహవచెయ్యవన పరిస్తితి. ్యోో రాదిగి. లా