Telugu ఆధునికాంధ్ర గేయకవిత్వం - anilvaranasi/indianlanguages GitHub Wiki

న్‌ "| జీ | | | . | | క | 1 / ం/ "| | లో రం క ఇ కా?! త్‌. నయా హం జ సే నం బె నో | మ క క క్‌. ; || ఖై కే | /. 4 | ఠి గగ (క గ ము” | జ్‌ ళో శా ఎం ॥. ల్‌ ప (2 య న ట్‌ ' కాజీ " ళ్ళ ', శ్‌ / ఇ (0౪ థీ ఓ జం జై న. త సమ. గే క. ఖై న. వీ పా |, - ఇ ఇ లం టం | “వాక్‌ మాం కి 1] ఖా నకు = "కీ | " ్‌ై || ॥ న మీ . న్‌ వాహ. న్‌ . శ ఇ గా రే ల కీ లో కై సాక (1 జ్‌ అ ఖీ .. 09 ఆ | అని జ్‌ వి [| గ. జు కళ్‌ . | | క్‌ .. (| న! | గి ( న్‌ా 1 చ చ టి |;

హ్ర యు ర ర౭-వంయి 28 సస్నైంయంగా ఉద్రిష్రవే కటా కి ర్‌ [ ర్రలం1- 2017 (ళో! సియా (1 ఇత్‌ 0౮ మన ర్రళర్మిథ స సనం యి (గ్ర య్‌ న్‌ లా న్‌

లం! ఆధునికాంధ్ర యకీవిత్వం ఉస్మానియా విశ్వ విద్యాలయం వారి పిహెచ్‌.డి. పట్టం పొందిన సిద్దాంత శ్థాంత గ్రంధం ఆచార్య జ. చెన్నకేశవరెడ్డి (ఈ జయమిత్ర నాకి త్ర నాహిత్య నాంస ఇమా స్కృతిక వేదిక 2015

ఆధునికాంధ్ర గదేయకవిత్వం, పిహెచ్‌.డి. థీసిస్‌... (ప్రధమ ముద్రణ - 1988 గ పరిషృత ద్వితీయ ముద్రణ -2015 క ల్శి/ వెల . మెలు ప్రతి రూ.400/-_ లే / నాదాప్రతి రూ. 850/- గ్‌ థి ప్రతులు : 1000 క పతర త (అరి రచయిత ళ్‌ ఉష ౦ోం[.౨ట2ైం. / అతులకు .: కా గ్రహ విల్లా నెం.5 సైబర్‌ మీదోస్‌, జైన్‌ హెరిటేజ్‌ స్కూల్‌ ఎదురురోడ్డు, కొండాపూర్‌, హైద్రాబాదు-500 084 ఫోన్‌ : 040-23014405, సెల్‌ : 9492047027 గ్రంక/96ర;/ అంగ౧౫౬|| ౦౦0౧) నవోదయ బుక్‌ హౌస్‌, హైదరాబాద్‌ నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌ ఇతర పుస్తక విక్రయ కేంద్రాలు ముఖిచ్యతం : ఆర్టిస్ట్‌ ఆనంద్‌ కంవోజింగ్‌ : టి. చంద్రావతి, క. శాంతకుమారి ముద్రణ . ఓం సాయి (గ్రాఫిక్స్‌ 3-4-709, నారాయణగూడ, హైదరాబాద్‌ -27 ఫోన్‌ ; 04ఉ0-275605438

కా ౧ న అంకితం శ నె న ఇ న. క 'క' [జే న స? గో భా సక గ్‌ శో స / “నే శ్రే. న్‌ గ్‌ క్ట కట్ట ఇ వో (జీ నజ షు. గ్‌ న (| మేఖ జ క్‌ నో వ్‌! కష్‌ పసి * టీ మ్‌ ఓ లప క బతి మా అమ్మ కీ॥శే॥ రంగనాయకమ్మకూ మా నాన్న క1శే। తిమ్మారెడ్డికి

న శ్వ ాాాస్రైనో న | జ. జ్ఞానపీర పురస్మారగ్రహీత వృత్తం, గేయం, వచనగేయం- ఇదీ మన ఆధునిక కవితలో ఛందస్సుల పరిణామ క్రమం. కానీ వభాషలోనైనా అక్షర గణ వృత్తాలకంటే ముందుగా మాత్రాచ్చందస్సులు పుడతాయి. ఏ కవిత్వమైనా పురుడు పోసుకునేది పాటతోనే. ఇంతకూ పాటా గేయం ఒకటే. గానయోగ్యం గేయం కదా! చిరంజీవి చెన్నకేశవరెడ్డి ఎం.వ.లోమా విద్యార్ధిగా ఉన్నప్పుడే మంచి కవిత్వమూ పసవున్న వ్యాసాలూ రాసేవాడు. అప్పటినుంచీ గమనిస్తున్నాను, చెన్న కెశవరెడ్డి అధ్యయన ప్రవృత్తిన్‌, సృృజనశీలాన్నీ. నా పర్యవేక్షణలో తెలుగులో గేయకవిత్వం గురించి విస్తృత పరిశోధన చేశాడు చెన్నకేశవరెడ్డి. గేయ లక్షణాలను లోతుగా పరిశీలించడం, సామెతల్లో పొడుపుకధల్లో ఉన్న గేయగుణాన్ని విశ్లేషించి చూపడం, భావకవిత్వయుగం నుంచి విప్లవకవితా శకం వరకు వెలువడిన గేయాల స్వరూప స్వభావాలను వివరించడం ఈ పరిశోధకుని పరిశోధన ప్రతిభకు తార్మాణం. విషయ సమీకరణంలో చెన్నకేశవరెడ్డి ఎంత పరిశ్రమ చేశాడో, అభివ్యక్తిలో అంత సమదర్శనం కనబరిచాడు. ఆధునికాంధ్ర గేయకవిత్వ సమగ్రాకృతిని నిర్దిష్ట విధానంలో వెలువరించిన చెన్న కేశవరెడ్డికి నా అభినందన. అజా పా స్తమ్మోమ్లి-ఉసక్షప్తట--యా--==-

| చిత్తశుద్ధిన్న పరిశోధకుడు |

ఆచార్య చేకూరి రామారావు

ఆదిమ మానవుడు వేసిన తొలికేక కవిత్వమయిందనీ, తొక్కిన చిందులు

నాట్యమయిందనీ, మాటకన్నా పాటముందు పుట్టిందనీ ఇప్పటికీ రాస్తూన్నారు, పుస్తకాల్లో

అచ్చువేస్తున్నారు. ఆదిమ మానవుడెట్లా ఉంటాడో మనకు తెలిదర్రా, తప్పో ఒప్పో

ఎప్పటికీ రుజువు చెయ్యలేని ఊహలు చెయ్యటం వల్ల ప్రయోజనం లేదర్రా అని ఎంత

చెప్పినా పరిశోధకుల చెవికక్కటం లేదు. అటువంటి స్థితిలో చెన్నకేశవరెడ్డి ఏమంటున్నాడో చూడంది.

“పైవన్నీ ఊహలే. ఏ భాషాశాస్రవేత్తా ఏ మానవ శాస్త్రవేత్తా మాట ముందు పుట్టిందో పాట ముందు పుట్టిందో శాస్త్రీయమైన ఆధారాలతో నిరూపించనంతవరకూ ఊహలను నిజాలుగా భావించనవసరంలేదు.”

తెలుగు థీసిస్సుల్లో నా బోటివాళ్లు కోరుకుంటున్నది సరిగ్గా ఈ దృక్చధమే. ప్రతి ధీసిస్సూ బ్రహ్మాండం పొడిచెయ్యదు. ప్రపంచాన్ని కుదిపివేసే ప్రతిపాదనలను ప్రతిధిసిస్సూ చెయ్యదు. ఎప్పటికప్పుడు మారిన ఆలోచనలను జీర్ణించుకుంటూ అప్పటికలవడిన ప్రాపంచిక దృష్టిని గుర్తిస్తే చాలు. పరిశోధనల పరమార్ధమెట్లాఉన్నా పరిశోధకుడికి ఉండాల్సిన సమ్యక్‌, సంయమన దృష్పుల్ని చెన్నకేశవరెడ్డి అలవర్చుకున్నాడు.

థీసిస్సుల్లో ఆలంకారిక (0౫౭16) వాక్యాలూ, ఉద్వేగభరిత (6౧౦410౧21౫ 0౧౬1066) పద ప్రయోగమూ ఉండకూడదు. అంటే కవిత్వపు శైలి థీసిస్సులలో వద్దని మాబోటి వాళ్లం కొన్నాళ్లనుంది గొడవ చేస్తున్నాం. కొంతమంది మా సలహా పాటిస్తున్నారు. “వీళ్ళిట్లాగే అంటుంటారు, వీళ్లతో మన కెందుకు? మనం చేసేది మనం చేసుకుందాం. మనం రాసేది మనం రాసుకుందాం) అనే వాళ్ళూ ఉన్నారు. ఇదిట్లా ఉండగా కొందరు ఈ రకమైన రచనకు కొత్త డిఫెన్సు తయారు చేస్తున్నారు. సాహిత్యాన్ని గురించి రాసే టప్పుడు సాహిత్యభాష వాడాలని. ఈ వాదాన్ని కొంచెం సాగదీసి చూడండి. ప్రాబిన కావ్యాలను గురించి రాస్తే ప్రాచీన భాషలో రాయాలి. నన్నయ గురించి నన్నయ భాషలోనూ, తికృనను గురించి తిక్కన భాషలోనూ, సూరన గురించి సూరన భాషలలోనూ రాయాలనటం లాంటిది. తెలుగు పుస్తకాలను గురించి తెలుగులోనే రాయాలి. ఇంగ్లీషు

౪/11 పుస్తకాల గురించి ఇంగ్లీషులోనే రాయాలి అనే బుద్ధిమంతులు కూడా మనకున్నారు. తెలుగును గురించి ఇంగ్లీషులో రాసిన జయంతి రామయ్య, గురజాడ అప్పారావు, గిదుగు రామమూర్తి, జి.వి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి వాళ్ళు బుద్ధి తక్కువపని చేశారని ఈ బుద్దిమంతుల అభిప్రాయం.

తమ పరిశోధనల ఫలితాలను నలుగురికీ అందించటంకోసం ధీసిస్సులు రాసారు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టీ అచ్చువెస్తారు. ధీసిస్సుల (ప్రయోజనం విషయ ప్రతిపాదన, విశదీకరణ. ఇది సాదా సీదా వచనంలో జరిగితే నలుగురికీ అందుతుంది. పైగా వస్తువును బట్టి రచనలో కొంత టెక్సికాలిటీ ఎట్లాగూ తప్పదు. దానికి తోడు అలంకారాలూ, అఆవేశాలూ, ఉత్సాహాలూ, ఉద్వేగాలూ కలిస్తే వస్తుప్రతిపాదనలో స్పష్టత (01/00, పదును (9౧2గ౧౧6౩౩) తగ్గిపోవచ్చు. చదివే వారి దృష్టిని పక్కదారులు పట్టించే ప్రమాదం (61520100) ఉంది. ధీసిస్సులు వినోదం కోసం చదువరు. విజ్ఞానం కోసం చదువుతారు. చాలా కాలం నుంచి ఇట్లా రాతలోనూ, మాటలోనూ గొడవ చేస్తూనే ఉన్నాను. ఇది చెన్నకేశవరెడ్డి మీద కొంత పనిచేసింది. కవిత్వపు శైలిని చాలా తగ్గించాడు. మామూలు సంభాషణలోనే ప్రాసలు వేస్తూ మాట్లాడే చెన్నకేశవరెడ్డి పాపం! ఇది చాలా కష్టమే, అయినా తంటాలు పడ్డాడు. చాలా వరకు సాధించాడు. కాని అలవాటు అలవాటే కదా! ఉండి ఉండీ “పసిదితున్మల వంటీ ఆ పదబంధాలలో కవితాత్మ పరిమళిస్తుంది అంటాడు. ఇంకాస్త ఆవేశం వస్తే కవిత్వమే చెప్పేస్తాడు. ప్రబంధాలతో పోటీపడే ఈ వర్ణన చూడండి.

“నన్నయకు వూర్చమే దేళికవితా గ్రవంతి తొలుగు పొలాలలో గేయ నొపొత్వాన్ని నవ్చు ధగా వందించగా నన్నయ దానిని చూరకవితా వధం భైవు మలువు తివ్రీనాడు. ఆఅవ్చుటి నుంచి మార్గ దేళి కవితా (వంతులు నమాంతరంగా వ్రవపొన్తూ ఒక్తొక్టునారి (ట్రభావితం వేసుకొంటూ ఒకస్హుడు ఒకటీ ఉరవళ్ళు వరవళ్ళతో వ్రవపొంచగా మరొకటి కొంత కాలం అజ్ఞాతంగా ఏకొందో కోశలలోనో శడునుళ్ళు వడి తిరుగుతూ మళ్చీ జక్టు వదిలించుకొని కొంద కొచ్కుల నుంచి జలవాతంలా దూక్తి తోటి విద్యత్హాంతులు ఎెలయింబి తెలుగు నేలను నన్వుళశ్వాదములంగాను ద్రకాశవంతంగాను బోనినాయి,. ”

కవిత్వానికి ప్రవంతి అనే పోలిక స్ఫురించిందేమో ఇక కవితావేశం కట్టలు తెంచుకుంది. అసలే కవితా హృదయుడాయె. ఆపుకోలేకపోయాడు. తెలుగు పొలాలు, పంటలు గుర్హు వచ్చాయి. రైతు కుటుంబపు వాతావరణం కూదా గుర్తుకు వచ్చి ఉంటుంది. ఇంకేం విజ్బంభఖీంచాడు. రూపకాన్ని పొడిగించాడు, కవిత్వం చెప్పాడు. ఇట్లాంటివి అరుదుగా ఉండటానికి సరదాగానే ఉంది (అంతమాత్రాన వీటిని నేను సమద్ధిస్తున్నానని కాదు,.

సా[11 తాను పరామర్శిస్తున్న విషయం మీద పూర్వులు ఎవరెవరు ఎప్పుడు ఏం చెప్పారో విస్మరించకుండా వివరంగా పరిశీలించాడు చెన్నకేశవరెడ్డి, మాత్రాభందస్సు మీద, ముఖ్యంగా ముత్యాలసరాల మీద చే.రా. వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను బ ఒక్కదాన్నీ వదలలేదు. తాను చెప్పిన విషయం మీద పూర్వకృషిని సంభావించటం పరిశోధక నీతి. ఈ నీతి చెన్నకేశవరెడ్డికి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కాలపు పరిశోధకుల్లో ఈ నీతి తప్పుతున్న వాళ్లు చాలామంది కనిపిస్తున్నారు. ఈ అవినీతి ఒక తెలుగు పరిశోధనలోనే కాదు, భాషాశాస్త్ర పరిశోధనల్లో కూడా కనిపిస్తున్నది. నేను పరీక్షకుడిగా ఉన్న ధీసిస్సుల్లో కూడా ఇట్లాంటివి గమనించాను. ఇందుకు పరిశోధకుడికెంత బాధ్యత ఉందో, పర్యవేక్షకుడికి అంతే బాధ్యత ఉంది. ఇరుపక్కలా ఈ బాధ్యతారాహిత్యం పెరిగిపోతున్న తరుణంలో ఈ నీతిని పాటించినందుకు చెన్నకేశవరెడ్డిని మరీమరీ మెచ్చుకుంటున్నాను.

తెలుగు పరిశోధకుల్లో (లింగ్విస్టిక్సులో కూడా) ఒక జబ్బుంది. తమ పర్యవెక్షకుడు రాసిన రాతలన్నీ పరమ ప్రమాణాలుగా స్వీకరించటం, అయినదానికీ, కానిదానికీ వాటిని ఉటంకించటం, సంబంధమున్నా లేకపోయినా శ్రీవారి సర్వరచనలనూ రిఫరెన్సులో చేర్చటం ఈ జబ్బు లక్షణాలు.

ఈ జబ్బు మన పరిశోధకుల్లో చాలా మందికి ఉంది. నిడుదవోలు సుందరెశ్వర రావు భద్రిరాజు కృష్ణమూర్తిగారి శిష్యులు-గుంటూరులో పచ్చిమిరపకాయలు దొరుకును- చూ. తెలుగూ వెర్చల్‌ బేసెస్‌-అని పుట్‌నోట్‌ ఇస్తారు” అని ఒకసారి చమత్మరించారు. ఇది మొదట ఒట్టి చమత్మారమేననుకున్నాను. కాని నా అనుభవం దీన్ని పూర్తిగా రుజువు చేసింది. ఆ అనుభవం సుందరేశ్వరరావు నిరుద్దేశంగా పేర్కొన్న ఉదాహరణకు సన్నిహితం కావటం ఇంకో విశేషం. కాని చెన్నకేశవరెడ్డి తన గురువులూ, పర్యవేక్షకులూ అయిన నారాయణరెడ్డిగారి అభిప్రాయాల్ని కూలంకషంగా, పరిశీలించాడు నిర్భయంగా విఖేదించాడు. ఇందుకు పరిశోధకుడి నిజాయితీ ఒక్కటే చాలదు. పర్యవెక్షకుడి బెదార్యం కూడా అవసరమే. ఈ బెదార్యం మన పర్యవేక్షకులలో చాలా మందిలో లోపించటం విచారకరం. తమ అభిప్రాయాలతో భేదించటంవరకూ పోనకృర్లేదు. తొలిపలుకులో ఫలానివాడి పేరు ఎందుకు పెట్టావ్‌? వాడి పేరు తీసిందాకా నీ ధీసిసుమీద సంతకం పెట్టనన్న శాఖాధిపతులున్నారు. ఫలానివాడికి కృతజ్ఞతలు ఎందుకు చెవ్వావ్‌? అని కసురుకునే పర్యవేక్షకులున్నారు. ఇది మన పర్యవక్షకుల దివాళాకోరుతనాన్స్నీ, వెకిలితనాన్నీ బయటపెడుతున్నది. అట్లా కానందుకు నారాయణరెడ్డి గారిని అభీనందించక తప్పదు.

ఇంతకీ ఈ పుస్తకంలో చెన్నకేశవరెడ్డి సాధించిందేమిటి? నేను మొదటే చెప్పినట్టు (ప్రతి ధీసిస్సూ బ్రహ్మాండం బద్దలుకొట్టకృర్లేదు. సదుద్దెశాలతో, మంచి సంప్రదాయాలతో,

౫ విషయ పరామర్శ పుష్టిగాచేస్తే చాలు నేను సంతోషిస్తాను. ఆ పని చెన్నకేశవరెడ్డి పుష్కలంగా చేశాడు. గేయ ఛందస్సుల మూలాలను వేదాల దగ్గర్నుంచి చూపించాడు. పరిణామాన్ని ఇప్పటి వరకూ ప్రదర్శించాడు. తాను పరిశోధిస్తున్న విషయాన్ని గురించి ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఏమన్నదీ సవిమర్శకంగా పరిశీలించాడు. తన నిష్కర్ష ఏమిటో చెప్పాడు. తను విశ్లేషించే పద్ధతి చూపించాడు. తానే మొదటిసారి చేశాననలేదు; అన్నీ తానే చెప్పాననలేదు. తోటి పరిశోధకుల్ని సమాదరించాడు, పొగడనూలేదు, తెగడనూ లేదు. సీనియర్‌ పరిశోధకుల పట్ల, గురువుల పట్ల (పర్యవేక్షకుడితో సహా) తగిన వినయం, అణకువ ప్రదర్శించాడు. అట్లని వాళ్ళని ఆరాధించనూలేదు. విభదించటానికి వెనకాడనూ లేదు.

మంచి పరిశోధకుడు ఇంతకంటే ఇంకేం చెయ్యాలి. ఇంత మంచి పరిశోధకుడిలో కూడా సంప్రదాయ బలం వల్ల చుట్టూ ప్రబలంగా ఉన్న వాతావరణ (ప్రభావం వల్ల కొన్ని అల్పమ్రైన (ప్రలోభాలు అక్కడక్కడా మిగిలిపోయాయని ఇంతకు ముందు చూపించాను, ఆయనలో లోపాలు చూపించాలనే సరదాకోసం ఈ పని చెయ్యలేదు. చిత్తశుద్ధి ఉన్న పరిశోధకుడు చెన్నకేశవరెడ్డి అపార్ధం చేసుకోడన్న నమ్మకం ఉంది. ఇంకా మంచి పరిశోధకుడిగా చెన్నకేశవరెడ్డి ఎదగాలనే నా ఆకాంక్ష -చెరా 1988 జులై 24 ఆలా సమైో-గగ్రప్రమంయూా---

పీఠిక లాంటిది

  • ఆచార్య కోవెల సంపత్కునూరాచార్య మిత్రుడు చెన్నకేశవరెడ్డి రచించిన “ఆధునికాంధ్ర గేయకవిత్వం' అన్న ఈ పరిశోధన గ్రంధం పది మందికీ అందుబాటులోకి వచ్చే విధంగా అచ్చయి వెలువడటం నా మట్టుకు నాకు ఎంతో ఆనందంగానూ, ఉత్స్పాహంగానూ ఉంది. ఇందుకు రెండు కారణాలనయితే స్పష్టంగా చెప్పగలను ఒకటి: ఈనాడు ఛందస్సును గూర్చిన శాప్రీయ పరిశ్రమా, పరిశోధనా తక్కువ అనటానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు ఈ [గ్రంధం వెలువడటం ఛందో విషయంగా అంతో ఇంతో పరిశ్రమించే నాకు ఆనందం కాదూ! ఇక, రెండు: చెన్న కేశవరెడ్డి తన పరిశోధన సాగిస్తున్న కాలంలో మేమిద్దరం తరచు కలుసుకొంటూందే వాళ్ళం, ఛందో విషయాలనేకం రకరకాలుగా చర్చించుకొంటూందే వాళ్ళం. ఆయన పరిశ్రమకు నేనూ ఒక సాక్ష్యం. ఆయనకు ౧౧.౦. డిగ్రీ వచ్చింతరవాత కలుసుకొన్నప్పుడల్లా గ్రంధం ఇంకెప్పుడచ్చువేస్తారంటూ సతాయిస్తూ చికాకు పెట్టేవాడిని. ఈ విధంగా ఆయన కృషితో ఒక రకమయిన ఆత్మీయత నాకు తెలియకుండానే నాలో పెరిగింది. ఆయనకు డిగ్రీ వచ్చి అప్పుడే దాదాపు తొమ్మిదేళ్ళ యింది, ఇంకా కాలం గడిచినాకొద్దీ ఆయన పరిశోధన ఫలితాలు ఎక్కడ వపొతబడిపోతా యేమోనని నా భయం. ప్రస్తుతానికి ఛందో రంగం పరిస్టితి గమనిస్తే అంతగా భయపడి పోవాల్సిన అవసరం ఏమీ లేకున్నా ఆ భయం భయమే. ఇప్పుడా భయం తీరింది. మరి, నాకు ఉత్సాహంగాదూ! మరొకటి. ఈనాడు ఛందోశ్ళతృత్వం కవితారంగంలో పెంచబడుతున్న, లేదా పెరుగుతున్న తరుణంలో ఛందస్సును, దాని అందచందాలను, ప్రయోజనాలను, సులువులను విచారించి విశ్లేషించే (గ్రంథం వెలువడటం నా వంటివారికెవరినైనా ఆనందం కలిగించే విషయమే. ఆ యీ కారణాలవల్లనే కావచ్చు, ఆత్మీయంగా ఇప్పుడాయన ఈ (గ్రంధానికి పీరిక లాంటిదేమయినా రాయమని వత్తిడిగా అనటం, ఇక అన్నాడు గదా అని, ఈ [గ్రంధం చదువుతున్నప్పుడు నా కనిపించిన కొన్ని అంశాలు ప్రధానంగా ఛందస్సుకు సంబంధించి ప్రస్తుతంగానూ, ప్రాసావికంగానూ

కొన్ని రాయటానికి నేను ఉత్సాహపడటం, ఇది ఒక విధంగా పూర్వరంగం. ఇంతకూ, ఈ (గ్రంధం ఛందస్సుకు సంబంధించిందా? ఇది గేయ “కవిత్వ సంబంధి గదా! నిజమే కాని, నిజానికి కవిత్వమనేది గేయరూపంలోనూ ఉండవచ్చు, పద్య

క. రూపంలోనూ ఉండవచ్చు. గేయం గానీ, పద్యంగానీ మౌలికంగా కవితారూపం,. ఒకే కవి ఇటు గేయంలోనూ, పద్యం లోనూ కవితాసృష్టి చేయవచ్చు. ఇట్లాంటి చాలా మంది కవుల గూర్చి, వారి కావ్యాల గూర్చి, కేవల గేయకవుల, వారి కావ్యాలతోబాటు ఈ గ్రంధంలో చర్చలూ, విశ్లేషణలూ విస్త లతంగా ఉన్నయి. ఆయా కవుల కవిత్వం గేయ రూపంలో ఉన్నా పద్యరూపంలో ఉన్నా వారి కవిత్వ మౌలికతత్వం మాత్రం ఒకటిగానే ఉంటుంది. మారేది ప్రధానంగా రూపం మాత్రమే. ఆ రూపం ద్వారా అభివ్యక్తి తీరులో అవసరాన్నిబట్టి కొన్నికొన్ని తేడాలు వస్తే రావచ్చు, అంతే. కాగా, గేయ 'కవిత్వమన్నాా పద్య *కవిత్వ'మన్నా వచ్చే ప్రాధాన్యం మాత్రం రూపానికే. అందుకే, ఈ (గ్రంధం “గేయ లక్షణరంి నిరూపించటంతో మొదలయితుంది. మరి, ఆ గేయం ఛందోరూపం అవసరమయినంతమేర ఆధునికాంధ్ర కవిత్వాన్ని గూర్చి దాని పరిణామాన్నీ స్వభావాన్నీ గూర్చి చాలా చాలా అంశాలు ఈ గ్రంధంలో ఉండనే ఉన్నయి. అయితే, (ర్రతి సందర్భంలోనూ ఆయా కవుల కావ్యాలూ, వివిధ కవితలకూ సంబంధించి రూపమయిన గేయ విధానం, సంవిధానం గూర్చి ప్రత్యేకంగా, విశేషంగా చర్చించటం, విశ్లేషించటం ప్రధానంగా ఈ (గ్రంధంలో గమనించదగింది. ఈ యీ కారణాలవల్ల ఈ [గ్రంధం ఛందస్సును ్రధానీకరించు కొందనుకొంటున్నాను.

ఛందోవ్యవస్థను దాదాపు రెండు సగభాగాలుగా విభజిస్తే ఒక భాగం పద్యం, మరొక భాగం గేయం. మొదటి భాగానికి అక్షరచ్చందస్పనీ, మరొక భాగానికి మాత్రాచ్చందస్సనీ వ్యవహారం. నిజానికి గేయం నుంచి ఒకానొక (?) విధమయిన పరిణామాన్స్న్సీ రూపవిశ్లేషణకు సంబంధించి కొత్త కొత్త ఆలోచనలనూ, ప్రయోగాలనూ, అనుభవాలనూ, తద్వారా కొన్ని రకాల లక్షణాలనూ, నియమాలనూ సంవొదించుకొని పద్యం రూపొందింది. పద్యం వృత్తాలూ, జాతులూ అని రెండు వర్గాలు. “జాతులు వృత్త చృందస్సులకూ, గేయ చృందస్సులకూ మధ్య నిలిచినవి. అంటే, గేయచ్చందస్సులను వృత్త చృందస్సులుగా మలచుకొనే ప్రయత్నమే జాతులు” (పు. 14) అని చెన్న కేశవరెడ్డి అన్నది సరయిన పరిశీలన ఫలితం. గేయం అంటే మాత్రాచ్చందస్సని తాత్పర్యం. గేయం నుంచి పద్యం/వృత్తం రూపొందే క్రమపరిణామంలో పద్యాలకు సన్నిహిత పూర్వదశలోని రూపాలు జాతులు. ఈ సాన్నిహిత్యం వల్ల ఇవి జాతి 'పద్యాలు”-తెలుగులో ద్విపద, సీస గీతాదులు వీటిలో గేయ-వృత్త లక్షణాల కలగలుపుదనం సులభంగానే గుర్తుపట్టవచ్చు. గేయంలోని వెసులుబాటూ, వృత్తంలోని బిగింపూ- రెండూ వీటిలో పొదువుకున్నయి. జాతులూ మాత్రాచ్చందస్సులే. కాని, జాతుల పద్య నాన్నిహిత్య కారణంగా మాత్రాచ్చందస్సు రెండు విధాలయింది. ఒకటి మాత్రాగణ పద్ధతి. ఈ పద్ధతికి జుతులు చెందుతాయి. రెండు మాత్రా సంఖ్యాగణ పద్ధతి. వీటికి రగదాదులు, ఇంకా ఇతర రూపాలూ చెందుతయి. వీటిని గేయంగా వ్యవహరించటం సిద్ధమయింది.

వరకే కాగా- ఈ విధమయిన పరిశీలనతో మూలం వైపు వెళ్ళినా కొద్దీ గేయం మౌలికత స్పష్టపడుతుంది. ఒక మహా విస్తృతి, వైవిధ్యం విపులంగాగల ఛందోవ్యవస్టగా గేయం వివర్తమానం కావటంలోని వివిధ దశలకు సంబంధించిన క్రమానుస్యూతి విధానం పరిశీలించటం ఒక ప్రత్యేక పరిశోధన విషయం. ఆ పరిశోధనలో వృత్త-జాతుల పరిణామంలో గూడా ఎన్నో అంశాలు స్పష్టపదే అవకాశముంది. ఈ [గ్రంధంలో పద్య విషయం లక్ష్య విషయం కాదు కాబట్టీ ఇది గేయానికే పరిమితమయింది. ఇంతకూ ఛందస్సును-అంటే పద్య-గేయ చృ్చందోరూప వైవిధ్యాన్ని గూర్చి ఈనాడు విచారించవలసిన అవసరమేమిటి? ఛందస్సు లేకపోతే కవిత్వం కవిత్వం కాకుండా పోతుందా? కవిత్వానికి ఛందస్సు తప్పనిసరా? - ఈ విధమయిన ప్రశ్నలూ, సందేహాలూ పూర్వులకు కలిగినట్లు లేదు. ప్రధానంగా ఇవి ఆధునికమయినవే ననిపిస్తుంది. వీటి వెనుక - కవిత్వానికి ఛందస్సు తప్పనిసరికాదు. కవిత్వానికి ఛందస్సు యొక్క అవసరం లేదు అనే అభిప్రాయం తీవ్రంగా పనిచేస్తున్నట్లు భావించవచ్చు. కాగా, 'కవిత్వం- ఛందస్సు, అంటూ క్లుప్తంగా కొంత వివరించింతరువాత, చివరకు, ఈ ఆధునిక ధోరణిలోనే అనుకుంటాను-- “ధందస్సు కవిత్వానికి తప్పనిసరి నియమం కాకవోయినా, కవితా సౌందర్యాన్ని (అది) ఇనుమడింపజేస్తుందనేది నిజం” (పు. 8) అని చెన్నకేశవరెడ్డి నొక్కిచెప్పినారు. కాని, కవిత్వానికి ఛందస్సు అక్కరలేదనే అభిప్రాయం మాత్రం పునః పునరాలోచించవలసిందిగానే అనిపిస్తుంది. తార్మికంగా అనాది - అంటే ఇంకా మనకు పూర్తిగా తెలిసిరాని అతి ప్రాచీనకాలం వైపు మన ఆలోచన సాగితే, అలనాటి కాలాన ఛందస్సు లేకుండా కవిత్వం కానీ, కవిత్వం లేకుండా ఛందస్సుగానీ ఉందేదని చెప్పటానికి సరయిన దాఖలాలు దొరకవు. అసలు కవిత్వమనేది ఛందస్సహితంగానే అవినాభావంగా అవతరించింది. ఆ రెండింటికీ శరీర-శరీరి భావం; అంగాంగి భావం. అయితే చాలా చాలా కాలం తరువాత మరేవేవో (ప్రయోజనాలకోసం కొందరు ఛందస్సును కవిత్వేతరంగా ఉపయోగించి దానితో వెట్టిచాకిరీ చేయించుకోక పోలేదు. కాని, ఆ సందర్భాల్లో అది చేసేది చాకిరీ మాత్రమే; తనది కాని బరువును మోసే దిక్కులేని కూలిపని మాత్రమే. ఛందస్సును వదిలించి కవిత్వాన్ని ఇతరత్రా ప్రవర్తింపజేయటమూ జరకృపోలేదు. అప్పుడది పరకాయ ప్రవేశం చేసి ఇరుకుళ్ళుపడ్డట్టు; పరకాయంలో దానికి మెసమళ్లనట్టు. స్వకాయంలో ఉన్న వెసులుబాటూ, సుఖం, ఆనందం, ఉద్దీప్తి, క్రియాశీలం పరకాయంలో ఉండవు, ఈ అంశాన్ని 'గవేషణ” అనే ఒక రేడియో నాటికలో శ్రీశ్రీ అద్భుతంగా చిత్రించారు. ఒకానొక కారణంగా (ఆ కారణం ఆ నాటకం చదివితే తెలుస్తుంది.) తన మానవ శరీరాన్ని కోల్పోయిన మానవుడు-జీవి ఒక గబ్బిలం శరీరంలో, ఒక కప్ప శరీరంలో ప్రవేశించి

గ[11 నానా ఇబ్బందులు పడి, యాతనలు పొంది- “ఈ ప్రాణానికేమీ సుఖంలేదు, నా శరీరం నాకు దొరికితే బాగుండును” అంటాడు. చివరి కెట్లాగయితేనేం, మళ్ళీ మానవ శరీరం దొరికి, అందులో ్రవేశించి- “నేను చచ్చిపోలేదు. నమ్మండి. నేను బతికే ఉన్నాను”- అంటూ కేక వేస్తాడు. (శ్రీశ్రీ సాహిత్యం; వచన విభాగం-2., పు. 177 19870) ఏదేమయినా, తనది తనదే, పరాయిది పరాయిదే. ఇది కవిత్వానికి (ప్రస్తుతం సరిగ్గా అన్వయిస్తుంది. ఈనాడు కవిత్వం చాలావరకు తన శరీరంకోసం చేస్తున్న 'గవేషణ” ఇదే. ఇంత 'వచన కవిత్వం'లోనూ “లయ” వంటిదేదో ఉండాలనే తాత్పర్వం వెనుక సుష్తచైతన్యంలో ఈనాడు పనిచేస్తున్నదిదే.

ఇక్కడ మరొక విషయం “ఛందస్సు ప్రతిభా దారిద్ర్యాన్ని కప్పుతుందనే సంగతి గురజాదకు తెలుసు” నంటూ గురజాడ వాక్యాలు కొన్ని ఈ [గ్రంధంలో (పు. 87) ఉదాహరించబడినయి. నిజానికి గురజాడ ఇట్లా అనుకొని ఉంటే, అది కేవలం భ్రమ మాత్రమే. కవిత్వంలో మిగతా దారిద్రాలేమయినా ఉంటే, వీలయినంతవరకు ప్రతిభ వాటిని కప్పివేయగలదని చెప్పవచ్చుగాని, ప్రతిభా దారిద్ర్యాన్ని మాత్రం కప్పిపుచ్చ గలిగేదేదీ ఇప్పటి దాకా కవితారంగంలో లేదు. ముందుంటుందని గూడా ఊహించే అవకాశం లేదు. ఇంతకూ, ఉదాహరింపబడిన గురజాడ వాక్యాల్లో ఛందస్సుకోసం, “యతి ప్రాసలకోసం నిరర్గక పదములను ఫర్లాంగు రాళ్ళవలె నిలవెయ్యాలి. కౌపీన సంరక్షణార్ధమయం పటాటోపళొ అన్నది కీలకాంశం. అయితే, ఒక్క నిరర్ధక పదం కూడా లేకుండా, అన్ని ఇన్ని కాదు, ఎన్నో పద్యాలను చూడవచ్చు. అదట్లా ఉంచి, ఛందస్సు, యతి ప్రాసలు మొదలయిన వాటికోసం ఇబ్బంది పడటమనేదేదయినా ఉంటే, అది పద్యానికే కాదు, గేయానికి కూడా వర్తిస్తుంది. యతి-ప్రాసల్ని ఐచ్చికంచేసి వదిలిపెట్టినా, ఈ ఇబ్బంది మరో విధంగా కూడా కలుగవచ్చు. “(ముడి) వేస్త్రీ, (క్రై) చేస్తే, దీవించి” వంటి క్రియారూపాలనూ, “చుట్టములుూ అని హాయిగా ఉపయోగించటానికి బదులు (ఒకచోట అట్లా ప్రయోగించి కూడా) చుట్టలు అని అతి పాతబడ్డ మాటనూ, అల్లుండ, అతండు, తొడంగు, వంటి పూర్ణబిందుసహిత రూపాలనూ, 'ఫక్కునను' అంటూ వ్యద్ధమయిన ను” ప్రత్యయాన్నీ “'ఉండొకి (ఉండును+ఒకు) వంటి అర్ధ సౌలభ్యంలేని సంధిరూపాన్నీ - ఇట్లా అనేకం తన కవితల్లో గురజూడ ఉపయోగించటం ఛందస్సు కోసమేనన్నది గుర్తించదగిన అంశం. “పసుపు రాసిరి బంగరు మేనికి (పూర్ణమ్మ) అన్న పద్యం (?)లో 'రాసిరి' అని ప్రయోగించిన గురజాడ అదే పద్యంలో *“చేప్రీ' (చేసిరి అనటానికి బదులు) ప్రయోగించటం ఛందస్సుకోసం కాక మరేమయితుంది? అందువల్ల వ్యర్ధ పదాదుల ప్రయోగ యోగ్యత, అననురూపపదాదుల ప్రయోగ యోగ్యత వంటీవి పద్యం నెత్తిమీద రుద్దవలసి వచ్చిన దురదృష్టం, నిజానికి పద్యానిది కాదు.

రా “వ్యావహారిక భాషా పదాలను సులువుగ, యధేచ్చగ ఇముడ్డుకొనే ఛందస్సులను మనం సృష్టించుకోవాలి.” (చూ.పు. 89) అని గురజాడ భావించారు. ఆనాడు వ్యావహారిక భాష అనేది గిడుగు వారు ఆరంభించి సాఫల్యం సాధించిన భాషోద్యమం. గురజాడ ఆ సాఫల్యానికి శక్తిమంతంగా తోడునిలిచాడు. అందుకనుగుణంగా భావించి మాత్రా ఛందస్సులను స్వీకరించారు. కాని, చిత్రమేమిటంటే, త ఛందస్సుల్లో తాము రచించిన పలుకవితల్లో “'గ్రాంధికభాషు నే. ఆ భాషలోని పలురకాల తిరుగుళ్ళు, గిరికీలతో సహా ఉపయోగించారు. పలుచోట్ల ఛందస్సుకోసంగాను సరిగా ఇముడని “వ్యావహారిక (ప్రధానంగా సాగిన రెండు మూడు కవితల్లో “గ్రాంధికి పదరూపాలనూ ఇరికించారు. కాగా, గురజాడ కవితల్లో ఇట్లాంటి రకరకాల ఇరకటాలవల్ల భాషా సౌష్టవం, మాధుర్యం కొరవడిందన్న శ్రీశ్రీ మొదలయిన పలువురు విమర్శకులకు జవాబుగా-అట్లా లేకపోవటమే గురజాడ ్రత్యేకతగానూ, అంతకు పూర్వకవిత్వంలో ఉండదే నిరర్దక సౌకుమార్యం, అసహజ లాలిత్యం వంటి వాటికి ప్రతిగా-+ఈ శబ్ద్బమాధుర్యం మీదనే తిరుగుబాటు చేస్తున్నాడు గురుజాడ” (తెలుగులో కవితా విప్లవాల స్వరూపం పు 82-, 1978) అని వెల్చిరు నారాయణరావు గారంటున్నారు. మరి, నిజంగా గురజాడ “తిరుగుబాటు” లక్షణాలు ఈ కవితల్లోని “గ్రాంధిక భాషా ప్రయోగంలో, వ్యావహారిక భాషా ప్రయోగంలో గాని ఉన్నాయా ?- ఇది ప్రత్యేకంగా పరిశీలించవలసిన అంశం, ఈ సందర్భంలోనే 'ముత్యాలసరాల లక్షణము” అన్న గురజాడ వ్వాసం (వ్యాస చంద్రిక - విశాలాంధ్ర (ప్రచురణ, 1955) గూడా చదువవలసి ఉంటుంది. గేయలక్షణాన్న్సీ ఈ శతాబ్బారంభందాకా సాగిన గేయ వికాసాన్నీ మొదటి రెండధ్యాయాల్లో చెన్నకేశవరెడ్డి అనేక వివరాలతో ప్రదర్శించారు. రెండో అధ్యాయంలో ప్రాస్తావికంగా-*కేవలం గతి ననుసరించి లయబద్ధంగా పాదుకోవటం గేయమవుతుంది. దానికే రాగతాళాదులను జోడించి పాడుకోవటం పాట అవుతుంది (పు. 35) అంటూ గేయం- పాటల మధ్య స్పష్టమయిన తేడాను ప్రతిపాదించారు. దీనినిబట్టి, ఒకే రచన మనం పాడుకొనే పరిమితులనుబట్టి, -అంటే, గతిననుసరించి లయబద్ధంగానీ, లేక రాగతాళాదులను జోడించా అనే అంశాలనుబట్టి గేయమూ కావచ్చు పాటా కావచ్చు. మన మెట్లా పాడుతున్నామనే విషయం అట్లా ఉంచి, ఒక రచనను రచనగా-వస్తు పరదృష్టితో-గేయ మనాలా? పాట అనాలా?-అనే సందేహం వస్తే, స్పష్టపరచటం కష్టమే. మరికొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒక రచనలో రాగం తీయటానికి అనుకూలంగా కొన్ని జాగాలు వదిలిపెట్టబడి ఉంటే అది పాట అనీ, లేకుంటే గేయమనే అనవచ్చు ననిపిస్తుంది. అంటే, ఒక రచన దాని తయారీలోనే అది గేయమో, పాటో తేలిపోతుంది. కాగా, గేయాలు వేరు, పాటలు వేరు. ఇక్కడ మరొక విషయం. 'గేయం” అనేది సంస్కృత పదం, 'పాటి అనేది తెలుగుపదం మరి. సంస్కృతంలో 'పాటిను ఏమనేవారు?

ప అట్లాగే తెలుగులో 'ేయా'న్ని ఏమనేవారు ?- స్పష్టంగా లేదు. రెండురకాల భేదాలనూ గుర్తించటానికి రెండు వేరువేరు పదాలు ఆ భాషల్లో ఉన్నట్లు నాకు తెలియదు. సందర్భాన్ని బట్టి ఆ ఉన్న ఒకే పదానికే వేరువేరు అభిప్రాయాలను గ్రహించేవారనిపిస్తుంది. ఇదీ ఒక ఆలోచించవలసిన అంశం. రెండు భాషల పదాలను ఎదురుబదురుగా నిలబెట్టి తేడాలను ప్రకటించే పద్ధతి గూడా ఆలోచించవలసిందే. గురజాడ, రాయప్రోలు మొదలయినవారు మరులు/వలపు-(డేమ అనేవి ఎదురుబదురుగా నిలిపి మరులు/ వలపు అనేవి ప్రేమ అని అనుకోవద్దని, అవి అశాశ్వతమనీ, (ప్రేమ శాశ్వతమనీ అంటారు.

ఈ [గ్రంధంలో మొదటి రెండధ్యాయాలు భూమికగా తరువాతి మూడు అధ్యాయాలూ విస్తరించబడినయి. మూడవ అధ్యాయం 'ఆధునిక యుగారంభం- గేయావతరణం'. ఈ అధ్యాయం మొత్తం గురజాడ వారి 'ముత్యాలసరం” 'గూర్చి' అనంతర కవుల పై దాని ప్రభావం, ముత్యాలసరం ఛందస్సుపైన సాగిన రకరకాల “ప్రయోగాలిను గూర్సీ చాలా విపులంగా చర్చలు సాగించి అనేక విషయాలను సొగసులను ప్రదర్శించింది. కాగా, ఆధునిక యుగారంభంలో '“అవతరించిని గేయంగా 'ముత్యాలసరం' ఛందస్సు ఈ అధ్యాయాని కంతటికీ కేంద్ర బిందువు. “ప్తీలు పాడే పాటలలోను, మేలు కొలుపు పాటలలోను ఒదిగి ఉన్న ఛందస్సు ముత్యాలసరమనే సరికొత్త పేరును సంతరించుకొని ఆధునిక వస్తువునూ, ఆధునిక సందేశాన్నీ అందించటానికి గురజాడ వాల్మీకి నోటివెంట వెడలి ఆధునిక కవితకు పాదులు వేసింది.” (పు. 85) అన్నారు చెన్నకేశవరెడ్డి. వేదాల్లో ప్రసిద్దమయిన ఛందస్సు వాల్మీకి ముఖతః లౌకిక వాబ్బయంలోకి అవతరించినట్లు (చిత్రం, అమ్నాయా దన్యత్ర నూతనశ్చందనా మవతారః- భవభూతి; ఉత్తర రామచరిత, అంకం 2.), ప్రీల పాటలలో.. ఒదిగి ఉన్న ఛందస్సు గురజాడ నోటివెంట రావటం “గురజాడ వాల్మీకి” అనటంలోని తాత్సర్యమనుకుంటాను. (ఇంద్రగంటి హనుమచ్చాస్రి గారు 'గురజాడ-వాల్మీకి అని ఒక వ్యాసం ఎప్పుడో రాసినట్లు గుర్తు.) అదట్లా ఉంచి, వాల్మీకి గానీ, ఆ తరువాతి వారు గానీ ఆ ఛందస్సు, తనదనీ, వాల్మీకిదని చెప్పినట్లు కన్పించదు. అయితే కొన్ని పద్యాలను కొందరు కవులకు అంటగట్టడం లేకపోలేదు కందం తిక్కన గారిదనీ, సీసం శ్రీనాధుడిదనీ, ఆటవెలది వేమనదనీ అనటం ఇట్లాంటిదే. “మందాక్రాంత కాళిదాసుదీ, శార్దూలం శ్రీనాధుడిదీ కాదని మనమెలా అనగలం?” అంటారు శ్రీశ్రీ 'ముత్వాలసరం-ఒక కృషి (శ్రీశ్రీ సాహిత్యం, వచన విభాగం-2., 19770 అన్న వ్యాసంలో. ఈ అన్ని సందర్భాల్లోనూ ఆయా కవులు ఆయా పద్వాలను అద్భుతంగా నిర్వహించారన్న మెప్పుదలే తాత్పర్యం తప్ప). ఆయా పద్యాలను ఆయా కవులు “సృష్టిం చారని కాదు. ఇదిట్లా ఉంచి, ముత్యాలసరం ఛందస్సును గూర్చి గురజాడ” ముత్యాలసరంలోనే చేసికొన్న నియమమిది. మొదటి మూడు చరణములలో సామాన్యముగా పధ్నాలుగేసి మాత్రలుందడును. నాలుగో చరణమున ఏడు మొదలు

వగ]

పధ్నాలుగు వరకూ ఉండును. విరామమును అర్జానుసారముగా, చెవికింపగునట్లు మార్చ యత్నించితిని....ఒక జాతి ఫార్సీ గజలు యొక్క నడక ముత్యాలసరములో తెచ్చుటకు నేను యత్నించియుంటిని” (వ్యాచం.పు. 24 25) అన్నారు. దీన్నిబట్టి ఈ ఛందస్సు తాను సృష్టించిందే నన్న తాత్పర్యం ఆయనకు ఉండిందనిపిస్తుంది. అయితే, గురజాడ ముత్యాలసరం సంబంధ బాంధవ్యాలను గూర్చి ఇప్పటికే చాలా చర్చలు జరిగినయి, జరుగుతున్నయి గూడా. 'ముత్వాలసరం' అన్న పేరే తప్ప, ఆపేరు పెట్టబడిన ఛందోరూపం మాత్రం గురజాడ సృష్టీకాదనేది అనేక మంది విమర్శకులు గుర్తించటం ప్రసిద్ధమే. నాకు తెలిసినంతవరకు మొదటినారిగా ఈ ఛందస్సును గూర్చి విపులంగా చర్చించిన శ్రీశ్రీ తన 'ముత్యాలసరం-ఒక కృషి అన్న వ్యాసంలో (1985)- “ముత్యాలసరం అనే ఛందస్సు అప్పారావు గారి స్వతంత్ర సృష్టి కాకపోవచ్చును.” అంటూ, యక్షగానాల్లోని ఈ విధమయిన ఛందో రచనలను, వృషభగతి రగడను, కళికోత్మళికలను, “అక్షరాలా ముత్యాల సరమే అయిన” గుమ్మడేడే గోపితల్లీ “అనే గేయాన్ని ప్రస్తావించి, చివరకు- “ఎమయినా, ముత్వాలసరం అంటే మనకు గురజాడ అప్పారావు గారి పేరే జ్ఞాపకం వస్తుంది...... గురజాడ అప్పారావుదే ఈ ఛందస్సు” అన్నారు. కాని, గురజాడ ఆ ఛందోరూపాన్ని ప్రయోగించటానికి ముందే “ఆధునికంగా ఆ రూపం ప్రయోగించ బడిందని సి. నారాయణరెడ్డిగారు తమ పరిశోధనలో గుర్తించిన అంశం. చెన్నకేశవరెడ్డి కూడా (పు. 80) పరిగణనలోకి తీసుకొని వివరించారు. అప్పటిదాకా ఛందోరూపినికి పేరు ప్రత్యేకంగా ఏదీ లేదు. నిజానికి, ఉత్పలమాల, ఆటవెలది ఇత్వాదిగా పద్యరూపాలకు పెర్లున్నట్టు వివిధ గేయచ్చందో రూపాలకు పేర్లు లేవు. కొన్ని గేయ మౌలిక రూపాలయిన రగడ భీదాలను పూర్వలాక్షణికులు మధురగతి, ద్విరదగతి ఇత్యాదిగా పేర్కొని, అవి “గతి” ప్రధానాలనే అంశాన్ని సూచించారు. వారు చూపిన మాత్రాచ్చందో గేయ భేదాలకు మించిన రూపాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకదానికి గురజాడ 'ముత్యాలసరంి అని పేరు పెట్టారని మాత్రం అనవచ్చు (ఈ ఛందస్సును గురజాడ “అద్భుతంగా నిర్వహించారని శ్రీశ్రీ అంగీకరించారు.) అసలీ పేరు ఈ ఛందో రూపానికి పెట్టటానికి (మేరణ కల్పించిందా అనిపించే రచన కంకంటి పాపరాజు 'విష్ణమాయా విలాసంిలో ఉంది.

పైట తొలగ బటాక బయలగు

బటువు గుబ్బల మీద చుక్కల

సాటియై ముత్వ్యాలసరములు

నీటు గులుకన్‌

1! ఇది చాలా మంది చదివి ఉండవచ్చు. మూడోపదంలోని 'ముత్యాలసరములు' కూడా గుర్తించి ఉండవచ్చు. ఈ ఛందస్సు 'ముత్యాలసరా”నికి చాలా పూర్వపు రచన అనీ తెలిసి ఉండవచ్చు. కాని, నాకు తెలిసినంతవరకు 'ముత్యాలసరం' ఛందశ్చర్చా సందర్భంగా మొదటిసారి వెలుగులోకి తెచ్చింది చేకూరి రామారావుగారు. (చేరాతలు” ఆం(ధ్రజ్యోతి-దిన., 1-2-1987) అయితే, “వీటిల్లో “'ముత్యాలసరం' అనే మాట యాదృచ్చికం కావచ్చు. గురజాడ ఇక్కడి నుంచే 'ముత్యాలసరము'” అనే మాటను తీసుకున్నారని నిర్ధారణగా చెప్పలేము.” అని కూడా అక్కడే ఆయన అన్నారు. నిర్ధారణగా చెప్పలేకపోవటానికి కారణాలు రెండు కావచ్చు. ఒకటి : ఈ రచన గురజాడ చూసి ఉందడనే ఊహా. వ్యావహారిక భాష దేశి చృందస్సులు వంటి వాటిని గూర్చి విస్సృతమయిన అధ్యయన శీలం గల గురజాడ దృష్టికి ఈ రచన వచ్చి ఉండటానికే ఎక్కువ అవకాశం. కాని తప్పకుండా వచ్చి ఉంటుందనటానికి దాఖలాలు లేకపోవటం ఒక కారణం కావచ్చు. మరొకటి: చేకూరి రామారావుగారంటున్నట్లు ఉదాహృత రచనలోని-నాలుగో పాదంలో 7 మాత్రలే ఉన్నాయి. నేటి ముత్యాలసరాల్లో ఎక్కువ భాగం 9 మాత్రలతో ఉండటం రెండవ కారణం కావచ్చు. కానీ, నాలుగోపాదంలో 7 నుంచి 14 దాకా మాత్రలుందడవచ్చునని గురజాడే నియమించుకొన్నారు గదా! నిజానికి ఏ ఛందో రూపానికీ చెప్పే లక్షణం ఇంత అవ్యవస్థితంగా ఉండదు (నాలుగో పాదం ఎనిమిది రకాలుగా ఉండవచ్చునంటున్నారు గదా మరి పైగా, ముత్యాలసరంలోని మొదటి మూడు పాదాల్లోనూ పధ్నాలుగేసి మాత్రలే ఉండి, నాల్లవ పాదంలోనూ పధ్నాలుగే ఉంటే అప్పుడది 'ముత్యాలసరం'గానే కాగూడదు. పూర్వ లాక్షణికులు చెప్పిన హరిణగతి రగడ అయితుంది. శ్రీశ్రీ గానీ, గురజాడ వారి ముత్యాలసరాలకు పీరిక రాసిన వాసిరెడ్డి భాస్మరరావు గారు గానీ (చూ. చేరాతలు), మరెవరయినా గానీ, ముత్యాలసరం నడక పోలికలకోసం “'వృషభగతి” దగ్గరికి గాక, 'హరిణగతి, దగ్గరికి పోవలసి ఉంటుంది. హరిణగతికి రెట్టింపు 'వృషభగతి, హరిణగతిలో పాదానికి పధ్నాలుగు మాత్రలు వృషభగతికి ఇరవయ్యెనిమిది. అందువల్ల ముత్యాలసరాన్ని హరిణగతితో పోల్సిచూసు కోవలసి ఉంటుంది. కాని వృషభగతితో కాదు. మొట్టమొదట (0) శ్రీత్రీ వృషభగతిసి ప్రస్తావించటంతో అందరి దృష్టి అటే పడిందనిపిస్తుంది. “బాల బాలరసాల...'ఉదాహరణ

తీరూ ఇంతే. అప్పకవి హరిణగతికి చెప్పిన లక్షణమిది :

నరహరి పదియు నాలుగు లములు

కదియతి హరిణగతికి నెలవులు

“అలములు అంటే లఘువులని అర్ధం. మాత్రలను 'లఘువులతో చెప్పటం లాక్షణిక ప్రసిద్ధమే. సరిగ్గా అప్పకవి చెప్పినట్టే అప్పారావు గారు కూడా పగ్నాలుగు మాత్రలు, అది “సామాన్యంగా” అని మాత్రమే తప్ప గతి నిద్దేశమేమీ చేయలేదు. పైగా

వమ 1[11 అర్జ్భానుసారంగా విరామం మారుస్తున్నట్టూ చెప్పినారు. ఈ విధమయిన మార్పులు గతి నిర్దేశానికి సహకరించవు. అదట్లా ఉంచి, అప్పకవి లక్ష్యం ప్రకారం ఐడు మాత్రల మీద (ఎనిమిదవ మాత్ర) యతి కాబట్టి పాదంలోని మాత్రాసంఖ్య 7+7 అని విరుగుతుంది. ఈ ఏడు మాత్రలు గూడా 4+3 లేదా, 3+4ీ మాత్రాసంఖ్య గణాల పంపిణీ మీద ప్రయుక్తం కావచ్చు. రెండు వాదాలకు మొత్తం 7 మాత్రాసంఖ్యా గణాలు నాలుగయితే, మొదటి మూడు 4+8 పంపిణీ మీదా, చివరిది 3+4 పంపిణీ మీదా ఉన్నయి. కాగా, రెండు విధాలూ అప్పకవికి సమ్మతమే అని స్పష్టపడుతుంది. మరి, అప్పారావు గారి లక్ష్యాన్ని బట్టి చూస్తే ౩+4 పంపిణీనే ఉద్దేశించినా గూడా, అప్పకవి మాత్రం రెందు విధాలకూ వెసులుబాటు కలిగించాడు. అంటే, కవికొండల వెంటరావు గారి “శివరాత్రి ప్రభిలోని“నాసట-కొసరిన-మూడ్షో-కన్ను' వంటి ప్రయోగాలకు అప్పుకవి అవకాశం కలిగించాడన్న మాట. ఈ పంపిణీ విషయం అట్లా ఉంచి, హరిణగతి నాలుగు పాదాల్లో నాలుగోపాదం నుంచి చివరి గణం (హరిణగతిలో (ప్రతి పాదానికి ఏదు మాత్రల గణాలు దరెండుంటాయి. ఏదు మాత్రల గణం మిశగణం మూడు, నాలుగు లేదా నాలుగు, మూడు మాత్రల గణాల కలగలుపు) తగ్గిస్తే, ఆ పాదంలో ఏడు మాత్రలే మిగులుతాయి. '“విష్ణమాయా విలాసం” రచనలో కన్పించేవి ఇదే పద్దతి. ఈ పద్ధతిని బట్టై గురజాద నాలుగో చరణంలోని మాత్రాసంఖ్య ఎడు నుంచి అని మొదలు పెట్టినారు. మేలుకొలుపు, స్త్రీల పాటలలోని ఈ ఛందస్సు రచనల్లో ఈ ఏడింటి మీద మరో రెండు మాత్రలు అదనంగా కల్పించటంతో ఆయన తొమ్మిది మాత్రల పద్ధతినీ స్వీకరించవలసి వచ్చింది. ఇంతవరకు ప్రామాణికంగానే ఉంది. ఇక చివరి ఏడు మాత్రల గణం రెండు గణాల కలగలుపు గదా! వీటిల్లోంచి ఒకటి తగ్గిస్తే (3+4 అనుకొంటే 4& 4+3 అనుకొంటే 8) పది, లేదా పదకొండు మాత్రలు మిగులుతాయి. ఈ విధంగా చూస్తే ఏడు, తొమ్మిది, పది, పదకొండు మాత్రలతో నాలుగోపాదం ఉండే వీలు కన్పిస్తుంది. ఇక ఎనిమిది, పన్నెండు, పదమూడు, పధ్నాలుగు మాత్రలు కూడా ఉండవచ్చుననటానికి-మరేదో విధమయిన భూమికను వెదుకవలసే ఉంది. గురజాడ ఏడు నుంచి పధ్నాలుగు దాకా అని చెప్పటంలో ఆయన ఎ విధానాన్ని మనసులో ఉంచుకొన్నారో తెలిపే ఆధారాలు ఎక్కడా నమోదయినట్లు కన్పించదు. ఇదిట్లా ఉంచి, ఈ సందర్భంలో చెన్నకేశవరెడ్డి చెప్పిన ఈ అంశం గమనించదగింది- “గురజాడ నాలుగోపాదంలో 7 మాత్రలు, 11 మాత్రలు ఉపయోగించిన ముత్యాలసరం ఉదాహరణలు నా పరిశీలనలో కన్పించలేదు.” అనీ, “ఎక్కువగా 9 మాత్రలు..... ఆ తరువాత 12 మాత్రలు, కొంతవరకు 8 మాత్రలు” గురజాడ వాడినారనీ, 10, 18 మాత్రలు వాడిన పాదాలు ఒకటి రెండు కంటే ఎక్కువగా లేవసీ చెన్నకేశవరెడ్డి అంటున్నారు. మరొకటి, నాలుగో పాదం మూడు, అయిదు మాత్రలతో గూడా ఉండటం, ఈ అంశం లక్షణ కథనంలో లేకపోవటం గూడా గమనించదగిన అంశం. ఇదిట్లా కాగా--

క 4

“అప్పారావు గారు ముత్యాలసరాన్ని మెలకువతో నిర్వహించలేదనీ% “అలక్ష్యపతి తములూ, ప్రమాద పతితములూ అయిన అనేక వ్యాకరణదోషాలూ (ఇవి కావు ప్రాఢత్వద్యోతకం) నిర్వహణ వైవిధ్యం లేకపోవడమేగాక, ఎటూ కాని చోట విరువబడి పాదయిన పాదాలూ (ఉదా : 'కాసులు) అప్పారావు గారి ఛందోవ్యవస్థకు బలహీనత ఆపాదిస్తున్నవి* అని శ్రీశ్రీ అన్నారు. ఇంకా పలువురు ఈ అంశాలను గుర్తించి ఉండవచ్చు. కాని వెల్చేరు నారాయణరావుగారు లిఖిత సాహిత్య సంప్రదాయ ప్రమాణా లతో అందరూ గురజాడను చూట్టంవల్ల ఈ లోపాలు వస్తున్నాయనీ, కాని గురజాడ ఆశు సంప్రదాయాన్ని తెచ్చినాడు కాబట్టి ఆయన రచనలను ఆశు సంప్రదాయ (ర్రమాణా లతో చూస్తే ఇవి లోపాలు కావనీ ఒక ప్రతిపాదన చేసారు. చెన్నకేశవరెడ్డి ఈ అంశాన్ని

  • ఈ ప్రతిపాదన చాలా నూతనమయినది అని ప్రస్తావించారు (పు. 144) గాని, దాన్ని ఉపయోగించి చూసినట్టు కన్పించదు. గురజాడ ఛందస్సుల్లో ఛందస్సు తప్పినట్టు కన్పించే జాగాలు పాటగాడు చమత్కారాలు చేయటానికి వీలుకలిగించే జాగాలంటారు నారాయణరావుగారు. (తె.క.వి.స్ప, పు. 75-78-80,. ఇక్కడ స్పష్టంగా ఒక అంశం గుర్తించవలసి ఉంది. గురజాడ “నీలగిరి పాటలు” ఆశు సంప్రదాయానికి చెందితే, ముత్యాలసరాలు లిఖిత సంప్రదాయానికి చెందినవి. వీటికి లక్షణం చెప్పిన పద్ధతీ, విరామాదులను ప్రస్తావించిన విధానం మొదలయినవన్నీ ఈ విషయాన్ని స్పష్టపరుస్తయి. వీటిలో '“జాగాలు” అనబదేవి, లక్షణ కధనంలో గురజాడ “సామాన్యంగా అన్నదాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. మరొకటి నారాయణరావు గారనేట్టుగా ఆశుసంప్రదాయానికి సంబంధించిన ధ్వని సంపుటులు మొదలయిన వ్యవస్థ ముత్యాలసరానికి నప్పదు. ముత్యాలసరం నిర్మాణం 'సాంప్రదాయికి పద్యనిర్మాణ వ్యవస్థకు సంబంధించింది. ధ్వని సంపుటీ విధానంలో పద-పదాంశాలు విరుగకపోవటం, ఒక పాదంలోంచి మరో పాదంలోకి ఒకే పదం వ్యాపించి ఉండటం మొదలయిన (వాటికి ఉదాహరణలు గురజాడ రచనల్లో సులభంగానే దొరుకుతయి) అంశాలు ఈ విషయాన్ని స్పష్టపరుస్తయి. ఈ సందర్భంలోనే చెన్నకేశవరెడ్డి పరిశీలన ఒకటి విశేషంగా గమనించదగింది- “గురజాడ నాలుగో పాదంలో వాడిన చివరి గురువులు ఎక్కువగా ద్రుతాంతమో (నకారపు వాల్లు), వేరే పొల్లులతో గూడినవో ఉన్నవి. పొల్లు అక్షరాలతో ఉన్న గురువులున్నప్పుడు రాగం ఏదో గుడుసుళ్ళు పడిపోయినట్లుంటుంది, రాగం తీగ సాగదు, పొల్లు అక్షరాన్ని అయిదు మాత్రల కాలం సాగదీయడం కష్టం. అంతేకాదు, పొల్లక్షరాలున్న గురువులు కూడా ఎక్కువగా క్రియాంతాలు. (ఉదా : పల్ఫితిన్‌, విలసిల్లున్‌ ప్రబలెన్‌ మొ॥నవి). ఈ రెండు కారణాలను బట్టి గురజాడ అప్పారావు ముత్యాలసరం గేయాలను పాడుకోవటానికిగాక, వచనానికి దగ్గరగా నడిపినారు” (పు. 145) అంటారాయన. ఈ మొదలయిన అంశాలను గమనిస్తూంటే ముత్వాలసరం స్వరూప స్వభావాలనూ, గురజాడ సంబంధ బాంధవ్వాలనూ

బస విశేషంగా, నిశితంగా పరిశీలించ వలసి ఉన్నదనేది నిజం. ఈ సందర్భంలో గుర్తుచేసుకోవలసినవి చేకూరి రామారావు గారి ఈ వాక్యాలు : (చేరాతలు” 1-2-87) “'ఇఫ్పుటిక్రీ నా కం గాని మిస్టరీ ఒకటుంది. అజ్రూరావుగారికి ఇవేవీ (6 -వ్ధుషటభగతి రగచ్చ్హా యృక్షగానంలోని రచనలూ మేలుకొలువు- జ్రీల పొదలూ మొ, -నం..) కంటదబిద లేదా 7 ఒకరకం ఫార్సీ గజలు, నుంచి మత్వాలనరాన్ని లాగాల్సి వబ్చిందా 7” ఇందులో నిజం విలెంత” జుకాయిం వెంత? కాన్సేవు ఉగవోరాధనల్తూ వీరవూజలూ మానని, నిజాన్లు నిగ్గుదేల్టి నిర్ణయంగా వకటించవలనీందిగా ఎమర్హుకులను కోరుతున్నాను. లొ ముత్వాలసరం ఛందస్సును తరువాతి కవులు ఎంత పరిపుష్టంగా, రకరకాల ప్రయోగాలతో (ఈ ప్రయోగాలన్నీ 'ముత్యాలసరం' కిందికి వస్తాయా? మి(శ్రగతి ఉంటే చాలు, ముత్యాలసరమనే అనుకోవాలా?- మొదలయిన అంశాలట్లా ఉంచి, ఎంతో వైవిధ్యం సాధించి శక్తిమంతంగా ప్రయోగించిన తీరును అనేకోదాహరణలతో, పొసగింపులతో చెన్నకేశవరెడ్డి ఈ మూడో అధ్యాయంలో చేసిన వివరణ ఆయన పరిశీలనలోని నైశిత్యాన్ని వ్యక్తం చెస్తాయి. నాలుగవ, అయిదవ అధ్యాయాలు క్రమంగా భావకవితాయుగంలోనూ, అభ్యుదయ కవితాయుగంలోనూ గేయం ప్రవర్తించిన తీరుతెన్నులను, బహుముఖీనతను వివరించారు. కిన్నెరసానిపాటలు, ఎంకి పాటలు, మహాప్రస్తానం వాక్యాల్లోని గేయచ్చందో వైవిధ్యాన్ని పరిశీలించిన విధానం అనేకాంశాలను స్పష్టీకరిస్తుంది. మహాప్రస్థానంలోని సిందూరం రక్త్షచందనం' (6+8 లేదా 6+8+5) వంటి వాటిని పరిశీలిస్తున్నప్తుడు వైతాళలీయ ఛందస్సులను గూడా పరిగణనంలోకి తీసుకొంటే మరి కొన్ని విశేషాలు వెలుగులోకి వచ్చేవనిపిస్తుంది. అభ్యుదయ కవిత్వంలో మూడు దశలను చెన్నకేశవరెడ్డి గుర్తించారు (పు. 274. 'మహాప్రస్తానం నుంచి విశాలాంధ్రోద్యమంవరకు మొదటి దశ అనీ, అక్కడి నుంచి విరసం ఆవిర్భావం వరకు రెండోదశ అనీ, విరసం తరవాతిది మూడోదశ అని ఆయన విభజన. విశాలాంధ్రోద్యమానికి బదులు కవితాపరంగా ప్రాధాన్యం వహించేది గుర్తిస్పె సమత్వం వచ్చేదనిపిస్తుంది. మరి, ఈ మూడోదశలో -“అభ్యుదయోద్యమానికి మూలభూత మయిన తత్త్వం దేశీయమయినది కాదని, ఈ దేశాన్ని ఆధారభూమిగా జాతీయతా శక్తిని ఉన్నత దివ్య జీవనానికి నిశ్రేణికగా భావించి.... సంప్రదాయాన్ని పునర్దర్శించి (ప్రయత్నం చేస్తున్న కవులు ఉన్నారని గుర్తించటం ఆయన వాస్తవిక పరిశీలనకు, నిష్పాక్షికతకు నిదర్శనం. “అయితే, ఈ ధోరణికి చెందిన కవులు ఎక్కువగా గేయ రచనలు చేయటం లేదు. పద్యంలోనో వచన గేయంలోనో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ఈ రకమయిన కవిత్వాన్ని ప్రత్యేక ఉద్యమంగా పేర్కొనలేదు (పు. 274) అన్న చెన్నకేశవరెడ్డి మాటల్లో నిజాయితీ స్పష్టమవుతుంది. ప్రస్తుత (గ్రంధ

న! లక్ష్యం గేయకవిత్వం కాబట్టి ఆ దృష్టా ఆ ధోరణి కవుల రచనలు (గేయాలు కావు కాబట్టి) ఈ గ్రంధ పరిధిలోకి రాకపోవచ్చుగాని, వీరి ప్రయత్నాన్ని (ప్రత్యక ఉద్యమం'గా గుర్తించక తప్పదు (ప్రస్తుతం ఈ అంశాన్ని వివరించేందుకు అవకాశం చాలదు). మరొకటి; ఈ (గ్రంధ పరిధికి చెందదు కాని, ఈ ఉద్యమం కవులు గేయాన్ని ఎందుకు 'ఎక్కువిగా స్వీకరించలేదో, అందుకు కారణాలేమయి ఉంటాయో పరిశీలకులు ఆలోచించవలసిన అంశం. 'అనుభూతివాది కవులూ గేయాన్నే గాక, పద్యాన్ని గూడా వదిలి (-పద్యాన్ని గేయాన్ని కూడా వదిలి అనటం ఇంకా బావుంటుంది) కేవలం వచన గేయాన్నే (వచన పద్యమనటం నా కిష్టం) ఉపయోగించుకోవటానికి కారణాలు గూడా పరిశీలించవలసినవే. విరసం కవులు, ప్రధానంగా గద్దర్‌ మొదలయినవారు 'పాటిను ప్రధానీకరించుకొనటంలోని కారణం, తమ అభిప్రాయాలను 'జనా'నికి అందుబాటులోకి తేవాలనుకోవడమని ్రసిద్ధమె. గద్దర్‌, వంగపండు మొదలయినవారి వాటలను గూడా గేయాత్మకత దృష్ట్వా పరిశీలించి చెన్నకేశవరెడ్డి (గ్రంధాన్ని “సమగ్ర పరచటం గుర్తించదగిన అంశం, చివరిదయిన అయిదో అధ్యాయం చివర-'ఈ దశాబ్దిలోనే గేయం సంప్రదాయ, సమన్వయ, అభ్యుదయ, విప్లవవాదాలను ఇముడ్చు కొన్నది. ఇన్ని దృక్పథాలను, ఇన్ని ప్రక్రియలను ఇముడ్చుకొన్న కవితారూపం ఇదొక్కటే” (పు. 549) అన్నారు చెన్నకేశవరెడ్డి. ఇది నిజమయిన పరిశీలన. ఇన్నిన్ని వాదాల ప్రక్రియల పరిశీలన విచారణలలో చెన్నకేశవరెడ్డి వస్తుపరైక దృష్టితో, అసిధారావ్రతంగా పరిశోధన - పరిశీలనలు సాగించటం నిజంగా అభినందనీయం. గ్రంధసమాప్తి చేస్తూ ఆయన ఇలా అన్నారు -

'కోస్పు ఆధునిక సమాజం ఇంకా ఎంతగా మారినా గేయం మోగుతూనే ఉంటుంది. మానవ జీవితంలో లయ మిగిలి ఉన్నంతవరకూ...”

జీవితంలో 'లయిను సాధించి నిలువరించటానికి అన్ని విధాలా సహకరించ టమే కవిత్వం, సాహిత్యం ధ్నేయం.

రాయమన్నారు గదా అని చెన్న కేశవరెడ్డి ఇచ్చిన చనువును నేను కొంత ఎక్కువగా ఉపయోగించుకొన్నానా? ఏదేమయినా, ఆలోచనలను రేకెత్తిస్తూ ఉత్సాహపరిచె ఈ గ్రంధాన్ని రచించిన చెన్నకేశవరెడ్డిని అభినందిస్తూ-ఆయన పరిశోధన కృషి నిరర్గళంగా ముందుకు సాగాలని ఆశిస్తూ....

-కోవెల సంపత్కుమారాచార్య ాపొబా-ప్తవమమై-ఉవసయా----

| కృతజ్ఞతా నివేదనం |

1978లో పిహెచ్‌. డి. పట్టంకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసమిది. 1979 జూన్‌లో పిహెచ్‌.డి. ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆ అవకాశం కల్పించి, ఇప్పుడు ముద్రించుకోడానికి అనుమతించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వారికీ...

“ఆధునికాంధ్ర గేయకవిత్వం”' అనే విషయం సూచించడం దగ్గరి నుంచి, నా పరిశోధన కృషిని ప్రతి దశలోనూ పర్యవేక్షించిన గురువర్యులు ఆచార్య సి. నారాయణ రెద్దిగారు. వారు ప్రముఖ గేయకవులు కావడం, “ఆధునికాంధ్ర మహాంభోరాశిని మధించి, 'సంప్రదాయములు-'ప్రయోగములు” అనే అమృతకలశాన్ని సాహితీ పిపాసువులకు అందించిన ధన్వంతరి (డాక్టరు) కావడం-ఈ రెండూ నా పరిశోధన విషయానికి ఎంతగానో ఉపకరించాయి. ఎన్నుకొన్న విషయానికి తగిన మార్గదర్శకుడు లభించడం చాలా అరుదు. ఆ అరుదైన అవకాశం కలిగించిన ఆచార్య సి. నారాయణరెడ్డి గారికీ...

పరిశోధనకాలంలో గురువర్యులు క్రీ[శే॥ పాటిబందడ మాధవశర్మ గారినీ, గౌరవ మిత్రులు డా॥ చేకూరి రామారావగారినీ, డా॥ కోవెల సంపత్ముమారాచారి గారినీ ఎన్నిసార్లో కలుసుకొని, ఎంతగానో ఇబ్బంది కలిగించి, ఛందస్సుకు సంబంధించిన విషయాలను చర్చించి నా అవగాహనను పెంచుకొన్నాను. ఆ గౌరవంతోనే, ఇప్పుడు ఈ పుస్తకం మీద తమ అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా అడిగినంతనే నా మీద ఆదరంతో నిష్పాక్షికంగా నా కృషిని సమీక్షించిన చేరా, సంపత్ముమారాచారి గారలకూ...

ఈ [గ్రంథ రచనా కాలంలో గడువు దాటిపోతున్నదనే గమనింపుతో పరుగులు తీస్తూ రాస్తూపోతే, ఎప్పటికప్పుడు చదివి, మెరుగులు సూచిస్తూ వచ్చిన ఆప్తమిత్రులు డా. పోరంకి దక్షిణామూర్తి, కన్ననామి గారలకూ....

ముద్రణకిచ్చేముందు ఓపికగా చదివి ఓ కే.” అని వెన్నుతట్టిన హరి ఆదిశేషువు, దా, ఏటూకూరి ప్రసాద్‌ గారలకూ.....

ఈ [గ్రంధంలో మొదటి రెండు అధ్యాయాలనూ కొంతవరకు కుదించి, తర్వాతి మూడు అధ్యాయాలలో కొద్దిగా సవరణలు చేయడం జరిగింది. ఆ విషయంలో ఎంతో విజ్ఞతతో చక్కని సూచన లందించిన ఆత్మీయుడు డా అమ్మంగి వేణుగోపాల్‌కూ...

నేల!!

అచ్చుపని విషయంలో ఎంతో ఆప్యాయంగా పర్యవేక్షించిన వి. నరసింహారావుకు,

అన్ని వేళలా అన్ని విషయాలలోను నాకన్నివిధాలా సహకరించిన సన్నిహిత సహచరుడు అప్పం పాండయ్యకూ....

తమ సొంత [గ్రంధాలయాలను నాకోసం స్వేచ్చగా వదిలిపెట్టిన ఎటుకూరి (ప్రసాద్‌, ఎల్‌. చంద్రమోహన్‌గారలకూ....

ఈ పుస్తకం వెలుగు చూడాలని ఎంతో ఆసక్తిని వ్యక్తంచేసి, ప్రోత్సహించిన నా సన్నిహిత సాహితీ మిత్రులు డా! నోముల సత్యనారాయణ, దా! వి. లక్షీ నారాయణ, డా॥ కాళిదాసు పురుషోత్తం, డా॥ ఎన్‌. గోపి, ఎ. సూర్యప్రకాళ్‌, జి. వెంకటేశ్వర్హు, వేణుసంకోజ్‌, చిత్రకారులు చంద్ర, సుదర్శన్‌ గారలకూ....

ముఖపత్రాన్ని మిన్నగా తీర్చిదిద్దిన పి.సి. నరసింహారెడ్డి అన్నకూ....

ఈ గ్రంధ ప్రచురణకు 7,500 రూ॥ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిన తెలుగు విశ్వవిద్యాలయంవారికీ....

ఆ మొత్తం సరిపోకపోయినా మొండిథైర్యం చేసి, అచ్చు ఖర్చు ఉచ్చులో బిగుసుకుపోయిన నా పరిస్థితిని, అంత దూరం (అమెరికాలో ఉన్నా అర్ధం చేసుకొని, ప్రచురణ సమాచారం తెలిసీ తెలియగానే అడగక ముందే అవ్యాజమైన అనురాగంతో ఆర్థికంగా ఆదుకొన్న నా బాల్యమిత్రుడు డాక్టరు ఎ. శ్రీనివాసరెడ్డికి నేనేమివ్వగలను, అప్పుపడిన అంతరంగం తప్ప.

నా ఆరోగ్యాన్నే కాదు, నా అభ్యుదయాన్నీ అన్ని వేళలా ఆకాంక్షించే ఆప్తమిత్రుడు డాక్టరు జె. శ్రీరాంరెడ్డికీ...

నేను పెట్టిన ఇబ్బందులకు ఇసుమంతైనా విసుక్కోకుండా ఎంతో ఓపికతో పుస్తకాన్ని చక్కగా ముద్రించిన కంపోజిటర్లకూ, చంద్రశేఖర ప్రింటింగ్‌ వర్న్‌ యజమానులకూ...

పరిశోధన కాలంలోను, ప్రచురణ కాలంలోను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడిన పెద్దలు, మిత్రులు మరెందరో ఉన్నారు, పేరు పేరునా కాకపోయినా వారందరికీ కృతజ్ఞతలు.

చివర చెప్పుకొంటున్నది నా అర్థాంగి సుమిత్ర అందించిన సహకారానికీ..... ఇంత మంది ఇన్ని విధాలుగా సహకరిస్తే ఈ పుస్తకం ఇప్పటికిలా వెలువడింది.

సమీక్షించుకొంటే ఇప్పుడనిపిస్తున్నది ఇంతకీ నేను చేసింది ఎంత అని...

చెన్నకేశవరెడ్డి 1088 జులై 28

| పరిశోధక ప్రవరుడు | (ద్వితీయ ముద్రణ పీఠిక) -డా॥ తిరుమల శ్రీనివాసాచార్య

పరిశోధనం అంటే విశేషంగా శుద్దిచేయడం; పరిష్కరించడం, అన్వేషించడం అని అర్ధం. సాహిత్యంలోని ఏదైన ఒక పక్రియను గూర్చి కానీ, ఒక (గ్రంధాన్ని గూర్చి కానీ ఒక విషయాన్ని గూర్చికానీ, ఒక సాహితీమూర్తిని గూర్చి కానీ, అతడు సాధించిన సిద్ధులను గూర్చి కానీ వివేచించి, సమగ్రంగా నిష్పాక్షికంగా సమీక్షించడం సాహిత్య పరిశోధనం.

తెలుగులో సాహిత్య పరిశోధన 1980లో మద్రాను విశ్వవిద్యాలయంలో (ప్రారంభమైంది. ఆనాటి నుండి 1998 వరకు 2960 విషయాలను గూర్చి పరిశోధనలు జరిగినవి. 1980 నుండి 2015 వరకు గల ఈ 85 సంవత్సరాలలో దాదాపు నాలుగైదు చేల అంశాలను గూర్చి పరిశోధనలు జరిగినట్లు భావింపవచ్చు.

విశ్వవిద్యాలయ స్థాయిలో ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి డిగ్ర పొందడానికి సాహిత్య పరిశోధకుడు, మొదట తానొక విషయాన్ని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకొన్న అంశం మీద పర్యవేక్షణ చేసే పరిపుష్ట పాండితీమూర్తి అంగీకృతిని పొందాలి. తాను గ్రహించిన విషయానికి సంబంధించిన సామగ్రిని సంపూర్ణంగా సంపాదించాలి. ఆ విషయం గూర్చి అంతకు పూర్వం జరిగిన పరిశోధన [గ్రంధాలను పరిశీలించాలి. తాను నిరూపింప బోయే సత్యానికి అనుగుణంగా సంపాదిత సామగ్రిని తార్మికబుద్ధితో విశ్లేషించాలి. గమ్యానికి చేర్చే సోపానాల వంటి విభాగాలను ఏర్పరచుకోవాలి. చిత్తశుద్దితో శాప్రియ దృక్పధంతో విషయానికి సంబంధించిన బాహ్యంతర పరిస్టితులనూ సామాజిక చారిత్రక నేపథ్యాలను విశదీకరించాలి. ప్రయోగాలను ఎత్తి చూపాలి. సమన్వయాలను సాధించాలి. విశిష్ట దృక్పథాలను వివదించాలి. అలా, దీక్షతో కొన్నళ్ళు తపస్సు చేసి తపఃఫలంగా సిద్ధాంత వ్యాసం రచించి, పర్యవేక్షకుణ్ని సంతృప్తిపరచి, పరీక్షకుల పరితోషాన్ని ఆమోదాన్నీ అందుకొని, పరిశోధక పట్టాభీషిక్తుడు కావాలి. అందుకే పరిశోధన అంటే సామాన్య కార్యం కాదు. తెలుగులో మనకున్న అనేక సాహిత్య ప్రక్రియలలో పరిశోధన కూడా ఒకటి. పరిశోధన సుదిర్హకాల శమైక సాధ్యమైన కార్యం.

టే

డా. జి. చెన్నకేశవరెడ్డిగారు 'ఆధునికాంధ్రగేయకవిత్వం' అనే అంశాన్ని గూర్చి

పరిశోధన ప్రారంభించి, విజయాన్ని సాధించిన తపస్వి. పద్యం కన్న ముందే గేయం

పుట్టిందని ప్రముఖ పరిశోధకుల అభిప్రాయం. కవిత్వ సంగీత నృత్య త్రయాన్ని తనలో సంగమింపజేసికొన్న కమనీయ కళాత్రివేణి-గేయం.

డా. జి. చెన్నకేశవరెడ్డిగారు ఆధునికాంధ్ర గేయకవిత్వం గూర్చి శోధించి 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిద్ధాంత వ్యాసం సమర్చించినారు. 1979లో పి హెచ్‌డి. పట్టాను పొందినారు. ఈ సిద్దాంత వ్యాసాన్ని 1988లో గ్రంథంగా ముద్రించినారు.

శ్రీ చెన్నకేశవరెడ్డిగారి ఈ పరిశోధన గేయ చక్రవర్తి, మహాకవి, ఆధునికాంధ్ర కవిత్వ పరిశోధకులు ఆదర్శాచార్యులు డా.సి. నారాయణరెడ్డిగారి పర్యవేక్షణలో జరిగినందువల్ల ఈ సిద్దాంత గ్రంధానికి ఒక సమగ్రత సిద్ధించింది. “ఆధునికాంధ్ర గేయ కవిత్వ సమగ్రాకృతిని” వెలువరించినారని తమ అభిప్రాయం తెలిపి, శ్రీ చెన్నకేశవరెడ్డిగారిని ఆశీర్వదించినారు. ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఈ గ్రంధ ప్రధమ ముద్రణలో ప్రముఖ విమర్శక పరిశోధకులు కీ॥శే॥ ఆచార్య చేకూరి రామారావు, డా॥కోవెల సంపత్కుమారాచార్యుల ప్రశంసలనందుకున్నది ఈ సిద్దాంత గ్రంథం.

దా. చెన్నకేశవరెడ్డి గారు నాకు సన్నిహిత హితులు. శబ్ద్బసౌరభ మాధురులను ఆస్వాదించిన కవులు. సమదర్శనం, సంయమనం గల విమర్శకులు. సత్వాన్వెషణ తత్పరత, శాప్రీయ దృక్పధం, అభివ్యక్తి సారళ్యం-ఈ అన్నింటికీ మూలమైన పరిశోధన ప్రవృత్తి చిత్తశుద్ధి-ఇలా పరిశోధక సులక్షణ సాకల్యాన్ని ఈ “ఆధునికాంధ్ర గేయ కవిత్వం” గ్రంధం ప్రతిఫలింప జేస్తున్నది.

ఈ (గ్రంధమూర్తిలో పంచ ప్రాణాల వంటి ఐదు అధ్యాయాలున్నాయి. అవి-గేయ లక్షణం, గేయ వికాసం, ఆధునికయుగారంభం -గేయావతరణం, భావకవిత్వయుగం-- గేయరచనలు, అభ్యుదయ కవిత్వయుగం-గేయ రచనలు,

గేయ నిర్వచనం, గేయ (ప్రాచీనత కవితాచ్చందస్సుల సంబంధం, అక్షర మాత్రా చృందస్సుల భేదసాదృశ్యాలు, గేయగంధసంవాసితాలైన వృత్త-జాతి పద్యాలు, ద్విపదలు, గేయరూపాలైన రగడలు, షట్పదులు, గేయ స్వరూపస్వభావాలు -ఇవన్నీ ప్రధమా ధ్యాయంలో వివరింపబడినవి.

(గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి గేయవాసనలున్న శాసన పద్యాలు, పాల్కురికి, నన్నెచోడుడు, శ్రీనాధుడు పేర్కొన్న పదరచనలు, శాసనకావ్యాలలో రగడలు, పల్నాటి వీరచరిత్ర, సుభద్ర కల్యాణం-వంటి ద్విపద రచనలు, ఉదాహరణ యక్షగాన వాజ్బయం లోని గేయచ్చందస్సులు, తాళ్లపాకకవుల పదకవితలు, క్షేత్రయ్య పదాలు, రామదాసు

టి క! కీర్తనలు, నాయక రాజుల కాలపు పదకవితలు, త్యాగయ్యకృతులు-ఇంకా గురజాడ వరకున్న సంధీయుగంలో కన్పించే హరికధలలో నాటకాలలో వచనాలలో అగుపించే గేయసాహిత్యం, ఇలా-నిండుగా పరిశీలింపబడినవి. రెండవ అధ్యాయంలో భారతీయ భాషలలో సమాంతరంగా సాగిన గేయ నాహిత్యాన్ని పరిశీలించడం డా. చెన్నకేశవరెడ్డిగారి పరిశోధనప్రవృత్తికి నిదర్శనం.

ఇక తృతీయాధ్యాయం -ఆధునికయుగారంభం -గేయావతరణం -అనేది ఆంగ్ల విద్యావ్వాప్తితో భారతీయభాషాసాహిత్యాలలో ప్రారంభమైన ఆధునిక యుగంలో ఉదయించిన కందుకూరి గిడుగు గురజాదల సంఘసంస్కరణ జాతీయ వ్యావహారిక ఖాషోద్యమాలను, పత్రికా వ్యాప్తి, యాంత్రిక నాగరకతా పరిస్థితులను పేర్కొన్నారు. శ్రీ రెడ్డిగారు. ఆధునికసాహిత్యాన్ని నిర్వచించి, గురజాడ మొట్టమొదటి ముత్యాలసరం గేయమనీ మొదట నిరూపించినారు. ఆ తర్వాత గురజాడ గేయకావ్యాలను సమీక్షించి, ముత్యాలసరాలలోని వర్ణనలు, రసపోషణ, అలంకార -భాషావిశేషాలను సమీక్షించి, ముత్యాలసరాలలో గురజాడ ప్రదర్శించిన ఛందఃప్రయోగవైవిధ్యాన్ని వివరించినారు. ఆధునిక కవిత్వం మీద గురజాడ ప్రభావాన్నీ ముత్యాలసరంలో ఇతర కవులు ప్రదర్శించిన ప్రయోగ వైవిధ్యాన్నీ సోదాహరణంగా పరిశీలించినారు. రాయప్రోలు, విశ్వనాథ, వేటూరి, జంధ్యాల, తల్లావజ్ఞల, అబ్బూరి, దేవులపల్లి, దువ్వూరి, బసవరాజు, వేదుల, కవికొండల, మల్లవరపు, శ్రీశ్రీ, సినారె, ముకురాల, గజ్జెల మల్లారెడ్డి, దేవీప్రియ మొదలగువారి రచనలను ఉదాహరించినారు. 'తోకముత్యాలసరం” వివరణతో మూడవ అధ్యాయాన్ని ముగించినారు శ్రీ చెన్నకేశవరెడ్డిగారు.

ఇక నాల్లవ అధ్యాయం భావ కవిత్వయుగంలోని గేయరచనల పరిశీలనం. భావకవిత్వంలోని ప్రధానశాఖల స్వరూపస్వభావాలు, వస్తు ప్రక్రియలను బట్టి, కధాత్మక (రక్రణయ, ప్రకృతి, దేశభక్తి నొాంఘిక, భక్తి (మార్చ్మికు, స్మ తిగేయాల వింగడింపు సోదాహరణంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా కిన్నెరనాని పాటలు, కోకిలమ్మ పెండ్లి ఎంకివాటలు, శశికళ, ఊర్వశి, వకుళమాలిక, హృదయేశ్వరి, ఉపగూహనము, శివతాండవము, ముసలమ్మ, 'పెనుగొందపాట, కవి-కన్య, గోపగేయాలు, తొలకరి, గోధూళి, నాగుల చవితి, కప్పతల్లి పెళ్ల, బంగారుమామ పాటలు, దేశభక్తి గేయాలు, జన్మభూమి గేయాలు, మాతృదేశ సంకీర్తనలు, రాంభజన కీర్తనలు, గాంధీ సంకీర్తనలు, ఆం(ధ్రోద్యమగేయాలు-ఇలా అనేక గేయరచనలూ అందలి భాషాచ్చందః ప్రయోగాలు అన్నీ ఈ చతుర్ధాధ్యాయంలో దర్శనమిస్తాయి. గేయగంధం గుబాళించే వచన గేయాల ప్రస్తావనతో ఈ అధ్యాయం సమాప్తమవుతుంది.

00౪11

చివరి అధ్యాయం-అభ్యుదయ కవిత్వయుగంలోని గేయరచనల అనుశీలనం,. అభ్యుదయ కవిత్వ ప్రధాన దశలు, శిషట్లా, పరాఖీ, శ్రీతీ, శ్రీరంగం నారాయణబాబు గారల అభ్యుదయ కవితారచనలలోని వస్తుభావచ్చందోవిశేషాలు, విశేషించి శ్రీశ్రీ రచనల వివరణాత్మక పరిశీలనం, అభ్యుదయం, కవిత్వకాలంలోని గేయరచనల ధోరణులు, తెలంగాణ రైతాంగ వోరాటం, తెలంగాణ రాజకీయ స్వాతంత్యపోరాటం, విశాలాం(ధ్రో ద్యమం సందర్భంగా వెలువడిన గేయరచనలు క్రమంగా సమీక్షింపబడినవి.

ఇంకా-అభ్యుదయ కవిత్యోద్యమకాలంలోని జానపదకళారూపాలూ, అనిసెట్టి, నార్ల, విశ్వం, అబ్బూరి, ఆవంత్స, కె.వి. రమణారెడ్డి, కాళోజి, దాశరధి, సినారె ప్రభృతి అభ్యుదయ కవుల రచనలూ, విశేషించి సినారెగారి గేయకథధా కావ్యాలు, నారపరెడ్డి వజ్ఞ్వల వేంకటేశ్వరుల గేయకావ్యాలు, సమన్వయవాదకాల రచనలలోని నవ్యకవితా ధోరణులు, పేరడీగేయాలు, ప్రచారగేయాలు, సినిమాపాటలు-ఇలా అభ్యుదయ గేయకవిత్వ సర్వస్వం ఈ అధ్యాయంలో అనుశీలింపబడినది.

ఇక ఈ అధ్యాయంలో మరో ప్రధానభాగం-విప్లవ కవిత్వంలో వెలువడిన గేయ సాహితీ పరిశీలనం. ఈ సందర్భంగా శ్రీశ్రీ, సుబ్బారావు పాణిగ్రాహి, కె.వి. రమణారెడ్డి, శివుడు, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌, రెంజిమ్‌, వి.వి. గద్దర్‌, తిరునగరి రామాంజనేయులు, కాసూరి వెంకటేశ్వరరావు, వంగపండు ప్రసాదరావు, అంజయ్య, వరవరరావు, పరిటాల శ్రీరాములు, నర్సింగరావు, శివసాగర్‌, జ్వాలాముఖీ, భూపాల్‌ మొదలగు విప్రవకవుల రచనలు చక్కగా సమీక్షింబడినవి. విష్లవకవుల రచనలేగాక సనాతనవాద కవులైన ముదిగొండ శివప్రసాద్‌, యొల్దండ రఘుమారెడ్డి, ముకురాల రామారెడ్డి గారల రచనలు, కూడా ఈ అధ్యాయం చివరలో అనుశీలిపబడినవి. అంతేకాదు-శ్రీశ్రీ, సినారె, గద్దర్‌, వంగపండు ప్రసాదరావు కవుల కేసెట్లు కూడా పేర్కొనబడినవి.

ఇది ద్వితీయ ముద్రణ కాబట్టి శ్రీ వరదరాజేశ్వరరావుగారు ఛందస్సులో చేసిన కొన్ని ముఖ్యప్రయోగాలను చూపి, ఐదవ అధ్యాయంలో సముచిత స్థానంలో చేర్చినారు. సమ(గ్రత కోసం -శ్రీ కేశవరెడ్డిగారు.

ఇక ఈ [గ్రంధంలోని “అనుబంధంలో 1980 నుండి ఇప్పటి వరకు వెలువడిన ముఖ్యమైన గేయ రూప రచనలను పేర్శొని పరిశీలించినారు డా. చెన్నకేశవరెడ్డిగారు. ఉదాహరణకు-- శ్రీ సూరం పూడి రాధాకృష్ణమూర్తి గారి శ్రీమద్రామాయణ మకరందం (గేయానువాదం,), డా. మసన చెన్నప్పగారి ముత్యాలసరాలు, తెలుగులో మొదటిసారిగా డా. దాశరథి ప్రవేశపెట్టిన తెలుగు గజళ్లు, రుబాయీలు, డా. సినారెగారి తెలుగు గజళ్లు, రుబాయీలు, డా. తిరుమల శ్రీనివాసాచార్య గారి రుబాయీలు, ఇంకా కొందరు ఇటీవలి కవుల గజళ్లూ రుజాయీలూ, శ్రీ బత్తిని శ్రీకైలంగారి కాళన్నకధ వంటి కావ్యాలు

కీ. ఇంకా, ప్రత్యేక తెలంగాణ రాహ్ర్రోాద్యమ సంబంధి గేయ రచనలను కూడా సమీక్షించి నారు. గేయ ప్రక్రియలో వచ్చిన సిద్ధాంత [గ్రంధాల పేర్లను, తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కృతులను అందుకొన్న గేయరచనల పేర్లను పేర్కొన్నారు డా. చెన్నకేశవరెడ్డి గారు - సహృదయ పరిశోధకుల పారకుల సమ(గ్రదర్శనం కోసం. ఇలా శ్రీ రెడ్డిగారు అపూర్వమైన సాహిత్యాంశాలను వెలుగులోకి తెచ్చినారు. అనిర్భారిత విషయాలను స్పష్టం చేసినారు. నూతన సమన్వయాలను ్రతివాదించి, పరిశోధనా ప్రయోజనాన్ని సహృదపాఠకుల కందించినారు. అందుకు వారు అభినంద నియులు, శ్రీ చెన్నకేశవరెడ్డిగారి పరిశోధనకు ముందు-గేయసాహిత్యంలో, 1970 వరకు, మూడు నాలుగు పరిశోధనగ్రంధాలు మాత్రమే వెలువడ్డాయి. వీరి-ఈ పరిశోధన [గ్రంధం తర్వాత గేయసాహిత్యంలో పదికి మించిన పరిశోధనలు జరిగినవి. ఆ పరిశోధన లకు శ్రీ రెడ్డిగారి ఈ (గ్రంధం ఆదర్శంగా నిలిచియుండవచ్చునని భావింపవచ్చు. 'ఆధునికాంధ్రగేయకవిత్వం” గూర్చి ఇంత గొప్ప పరిశోధన [గ్రంధాన్ని నిర్మించి నందుకు డా. చెన్నకేశవరెడ్డి గారిని ప్రశంసిస్తున్నాను ఇలా- పరిశోధన ఒక సంద్రం; ఈదినావులే పరిశోధన ఒక సమరం; గెలిచినావులే పరిశోధన సోమయాజి! కేశవరెడ్డి! పరిశోధన గహనాటవి దాటినావులే నీ పరిశోధనాసక్తి నీ సురుచిర శబ్దశక్తి స్తుత్యం కేశవరెడ్డి! సుఖదం నీ అభివ్యక్తి తెలుగుగేయ సరస్వతిని దర్శించిన ధన్యుడవు తెలుగు గేయం రమాశోభ నందించిన గణ్యుడవు చెన్నును గను కన్నులున్న చెన్నకేశవరెడ్డీ! నీ శేముషి అభినంద్యం; నీవు అనామాన్యుడవు, శా--శుణా-వవ్తమి-యగ్రమ్రమయా----

| కృతజ్ఞతా నివేదనం-2 |

ఈ పుస్తకం 1988లో ప్రధమ ముద్రణ కాగా, ఎందరో యువపరిశోధకులు, సాహితీప్రియులు, పుస్తకవిక్రేతలు పుస్తకం లభ్యంకావడం లేదని, మరోసారి ముద్రించమని అడుగుతున్నా ఆర్ధిక భారంతో ఎప్పటికప్పుడు వాయిదావేస్తూ వచ్చినాను. ఈ మధ్యనే యు.జి.సి వేతన సవరణకు సంబంధించిన ఎరియర్స్‌ను పట్టుదలతో సాధించి పెట్టిన అప్పటి మా యూనియన్‌ అధ్యక్షుడు (మాజీ) ఆచార్య ఎమ్‌. శంకర్‌రెడ్డి గారికి, నిధులను తీసుకొనిరావడంలో కృషి చేసిన పొ.శ్రీ.తె.వి. ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి ...

ద్వితీయ ముద్రణలో అక్కడక్కడా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ప్రధమ ముద్రణ పీరికలో ఆచార్య చేకూరి రామారావు గారు ఒకటి రెండు లోపాలను ఎత్తి చూపినారు. వారు చూపిన లోపాలననుసరించి, సవరించిన దృష్ట్వా పీరికలో ఆ వాక్యాలను తొలగించడం జరిగింది. 'తెలుగు పరిశోధన కైమాసిక ప్రచురణలో ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ డా. వెల్దండ నిత్యానందరావు కూడా ఒకటి రెండు సవరణలు సూచించినారు. వాటిని కూడా సవరించుకొన్నాను. సవరణలు సూచించిన వీరిద్దరికీ.

ద్వితీయ ముద్రణకు సహపరిశోధకులు (గేయ నాటికల మీద పరిశోధన చేసినవారు) ఎంతో ప్రేమతో శ్రమకోర్చి పీరిక రాసిన డా॥తిరుమల శ్రీనివాసాచార్య గారికి...

పుస్తకం అట్టవెనుక ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య తెలుగు పరిశోధనల తీరు తెన్నులమాద రాసిన సెమినార్‌ వ్యాసం నుంచి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి '“ఉదయంి పత్రికలో రాసిన సమీక్షనుంచి, వెల్టండ నిత్యానందరావు 'పరిశోధన' శైమాసిక పత్రికలో సమీక్షించిన దాని నుంచి, డా! అమ్మంగి వేణుగోపాల్‌ రాసిన వ్యాసం నుంచి గ్రహించిన కొన్ని వాక్యాలను వొందుపరిచినాను. వారికి ...

1980 నుంచి ఇప్పటి వరకు వచ్చిన గేయరచనలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి సహకరించిన డా॥ వరవరరావు గారికి, దాః పెన్నా శివరామకృష్ణగారికి, ఎస్‌ వి సత్యనారాయణగారికి, డప్పు రమేష్‌ గారికి, రాసిన విషయాన్ని చదివి సరిచూసి ఆమోదించిన ఆప్తమిత్రులు డా! అమ్మంగి వేణుగోపాల్స్‌ వేణు సంకోజ్‌లకు ....

నా హృదయపూర్వక కృతజ్ఞతలు

వ! ద్వితీయ ముద్రణ సందర్భంగా ఎప్పటిలా అప్పటి అప్పం పాండయ్యే మెత్తని చిరునవ్వుతో ఆపన్నహస్తం అందించి ఈ వయసులో నా శ్రమను తగ్గించినందుకు కృతజ్ఞతలు చెప్పనా! చెప్పను. ఉండనీ గుండెలోనే. సర్వవేళలా నా ఆరోగ్యాన్ని నన్ను కాపాడుకొంటున్న సామేను సన్మిత్ర సుమిత్రకు, ఈ వయస్సులో నాకే సమస్యలు లేకుండా, సంతోషంగా ఉంచుతున్న కూతురు మృణాళినికి, అల్లుడు రఘురామిరెడ్డికి మనుమరాలు కీర్తన, కుమారుడు శ్వ్యామాచరణ్‌, కోడలు హరిణి, మనుమడు అంశుమంతుకు ఆశీస్సులు. సంతృప్తికరంగా కంపోజ్‌ చేసిన శ్రీమతి టి. చంద్రావతి, శ్రీమతి కె. శాంతకుమారి అందంగా ముద్రించిన ఓంసాయి గ్రాఫిక్స్‌ మద్ది రాంరెడ్డిగారికి నా కృతజ్ఞతలు, -చెన్నకేశవరెడ్డి 2 డిసెంబరు 2015 నా వుప్తియపముటూ---

సంకేత పద వివరణలు 1 పు. =. పుట వ్యా, = వ్యాసం వ్యాస. - వ్యాస సంకలనం/వ్వాస సంపుటి కస. - కవితా సంకలనం/కవితా సంపుటి సం - సంపాదకుదు/సంపాదకులు త, - అశ్వాసం ప్రఆ. - ప్రథమాశ్వాసం అలాగే ద్వి తృ. చ. మొదలైనవి. ప. -. పద్యం శ్లో - శ్ళకం పం. - పంక్తి చూ. = చూడుము అను -- అనువాదం ప్రము. - ప్రథమ ముద్రణ అలాగే ద్వి తృ. మొదలైనవి. (ప్ర. -. ప్రచురణ 2. _ తరచుగా వచ్చే రచయితల పేర్లూ, పుస్తకాల పేర్లూ మొదటిసారి మాత్రమే పూర్తిగా పేరని, తర్వాత బ్రాకెట్లో ఇచ్చిన ప్రకారం పేర్కొనడం జరిగింది. 8. _ పుస్తకాల ప్రచురణ సంవత్సరం మొ॥ వివరాలను చాలా వాటికి ఉపయుక్త (గ్రంధసూచికలో పేర్మాని, కొన్నిటి వివరాలను మాత్రం ఇక్కడే ఇవ్వడం జరిగింది.

విషయ సూచిక ఆశీస్సు న. చిత్తశుద్ది ఉన్న పరిశోధకుడు ..........40440600000000 0 బజ6 టం ౪10 పీఠికలాంటిది ............44040200200200బవవల లవ పపం వవళలలం వలలటలంటంలంం 04] కృతజ్ఞతా నివేదనం.............200020000204020 0022 0టంంం0 లం ౧0006 పరిశోధన (్రవరుడు.............40000000టటంటలలలంలల లం టట టం ఎ0006/1॥ కృతజ్ఞతా నివేదనం-2.............4000400000టం 00000. 000000 సంకేతపద వివరణ .........4444౦424040220020వ0ంలలలమంట ల 004 అద్వాయం-1 గేయలక్షణం ..440400000066060 00406 022200 2226466644 64. 1ేెకోలై అద్యాయం-2 గేయ వికాసం........00242044426666606244422404440 వైతి-60 అద్యాయం-8 ఆధునిక యుగారంభం-గేయావతరణము ....... 61-144 అద్యాయం-4 భావకవిత్వయుగం-గేయ రచనలు ............. 145-268 అద్యాయం-=5 అభ్యుదయ కవిత్వంయుగం-= గేయ రచనలు .. 269-481 విహంగ వీక్షణం......040402 0200200062 0202 06022 026200040020220422 త్తీరితి-శ్నరె్తీ ఉపయుక్త గ్రంధసనూచిక ........౨౨౨౨౨౦౨౦౦౦౦౦4 టట ంవలలల కేం2-శ77 అనుబంధం ,......4..22426002202వటైబ టం కటల వటి టవ లలల వం ఇం 4404044444 ఉ€౧/9-49ర్‌ వివిధ విశ్వవిద్యాలయాలలో ఆధునిక గేయం మీద జరిగిన పరిశోధనలు...............000ట0ట00ంవంలవలటంంంలలంంలల క9ి6-499 ఉపయుక్త గ్రంథసూచిక ............20000000 0000000002 502-505 నా గురించి

సే శేయ లక్షణం గేయ నిర్వచనం ననా ననన

గేయం గీతం సమానార్ధకాలు, పాదేది గీతం లేదా శ్రవ్యత కవిత్వం గేయం! గాన యోగ్యమైన రచన గేయం. సంగీత నాహిత్యాల ల

ప్రధాన ధర్మం

సమ్యక్‌ మేళనమైన గేయ కవిత్వం ఆపాతమధురమే కాదు క ఆలోచనామృతం కూడా*. కవిత్వానికి ఆపాతమాధుర్యం గానంవల్ల సిద్ధిస్తుంది. “కవిత్వానికి గానగుణం స్వాభావిక శ్రవ్యత మైనది. పాట ఆవేశానుభూతుల సమాహారాన్ని వ్యక్తీకరించ ఛందన్నాధ్యం గల సామర్ద్యం కలది. అది ఒకే (శ్రుతిలో పాదేది” అని శ 13 క్రిస్తాఫర్‌ కాద్వెల్‌ (0510006! 0466౪461) భావించి నాడూ. అక్షర ఛందస్సులు కవిత్వం (శశ్రవ్యకళ. శ్రవ్యత ఛందస్సు వల్ల చేకూరు తుంది. పరనయోగ్యం, ఛందస్సుకు నిత్యంగా ఉండవలసిన ధర్మం (శ్రవ్యత అని, మాత్రాఛందస్సు అన్ని ధర్మాలకంటె అదే గొప్పుదని క్షేమేంద్రుడు వక్కాణించి గాన యోగ్యం, నాడు. ఛందస్సుకు ఆంగ్లంలో /౧8౦6)/ అని వాడుక. మాత్రాఛందస్సులో న౧/0506౪/ అంటే (౧|౦-1౦, ౦686-50[0, 51౧౮ 'గేయాత్మకత, వెల్వడిన కవిత గానయోగ్యత” అని అర్ధం. ఛందస్సును మన ప్రాచీనులు గేయకవిత గాయతత్రిగా సంభావించినారు. గానము, త్రాణము గాయత్రి లక్షణాలు". ఛందస్సును గాయత్రిగా చెప్పడం వల్ల ఛందస్సు నాననా

2 గేయ లక్షణం తత్వం గేయత్వమని చెప్పవచ్చును. ఛందస్సులో అక్షర ఛందస్సు లని, మాత్రా ఛందస్సులని రెండు ప్రధాన భేదాలు గోచరిస్తాయి. అక్షర ఛందస్సులు పరనయోగ్యాలైతే మాత్రా ఛందస్సులు గానయోగ్యాలు. భరతుడు ఈ వషయాన్న నాట్యశాస్త్రంలో “దోదక్రాది (మాత్రా) ఛందస్సులకు గానంవల్లా, (్రగ్ధరాది (అక్షర) ఛందస్సులకు పఠనంవల్లా శోభాతిశయం కలుగుతుంది” అని చెప్పినాడు. కనుక మాత్రాఛందస్సు రూపంలోనున్న కవిత్వాన్ని గేయకవిత్వమని భావించవచ్చు.

సుప్రసిద్ధ విమర్శకులు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు నారాయణరెడ్డగారి “నాగార్జున సాగరం” గేయకావ్వానికి రాసిన పీరికలో గేయ స్వరూపాన్ని గురించి చక్కగా వివరించి నారు. *“లయమయమైన గణములను పంక్తి కిన్నియని లెక్కించి నడుపునది తాళము, దీనిని ఈ గేయకవితలో నిర్వహించుట సాధ్యముకాదు... సరిపెణవలె అఖండముగా సాగిన ఈ నడకలో భావము ముగిసినప్పుడు కూడ విశ్రాంతికి చోటులేదు. విశ్రాంతి తీసికొంటిమా తాళము పటాపంచలగును. దానికై ఆ విశ్రాంతి కాలమును చక్కగా నలువది మాత్రల కాలమునకు పెంచితిమా, పూర్వోత్తర భావములు పరస్పరము అసంబద్ధములుగా సాగును కనుక ఈ రచనలో ప్రధానమైన మూలద్రవ్యము లయ మాత్రమే. అది చదువరులను తనవెంట నీడ్చుకొనిపోవుచు అలౌకికముగా కావ్యరసము ననుభవించుట కెంతో సహాయపడును. మటి అందందు రసభావానుగుణముగా ఆ లయను గూడ సడలించుకొనవలసియుండును. కావ్య కళలకు పరమార్ధ మదే కనుక” అని అభిప్రాయపడినారు.

“లయబద్ధమైన ఒక భావం పూర్తి అయి, వేరొక భావం మొదలయినప్పటికీ విరుపులు సరిపెణలాగా నడుసూవుండే ఛందం గేయమనబడుతుంది” అని రాజగోపాల నాయుడుగారు గేయాన్ని నిర్వచించినారు."

సంగీత విద్వాంసులు మాటల మాతువునుంచి వేరుచేసిన సంగీతపు కూర్చు (ధాతువు)గా గేయాన్ని నిర్వచించినారు.* అభినయానికి గానానికి అనుకూలమైన శృంగార గేయరచనలను (నాట్యానుకూలములై అడుగు వేయించేవి) పదాలని సంగీత విద్వాంసులు పరిమితార్థంలో వ్యవహరించినారు. క్షేత్రయ్య, సారంగపాణి మొదలైనవారి గేయరచనలను పదాలని, త్యాగరాజు గేయరచనలను కృతులని, అన్నమాచార్యులు మొదలైనవారి గేయ రచనలను సంకీర్తనలని, సంగీత విద్వాంసులు వ్యవహరించడం పరిపాటి. ఇట్లా పరిమితార్ధంలో కొందరు విమర్శకులు వాడుతున్నప్పటికీ వారే ఆ పదాలన్నిటినీ సమానార్ధకాలుగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. కాబట్టి గేయం-గితం-పదం-పాట అనే మాటలను సామాన్యార్ధంలో సమానార్ధకాలుగా వాడుతున్నారు.

ఆధుభికాంధ్ర గేయ కవిత్వం వె

సాహిత్యం ఛందస్సహితం (౪6/59) గాను, ఛందోరహితం (0౧096) గాను ఉంటుంది. ఛందస్సహిత సాహిత్యాన్ని పద (గేయ), పద్య సాహిత్యాలని స్థూలంగా విభజించవచ్చును. గేయం, పదం, గీతం, పాట అన్న పదాలు సామాన్య వ్యవహారంలో సమానార్ధకాలుగానే చెలామణి అవుతున్నాయి. కొందరు విమర్శకులు ఒక్కొక్కదానిని పరిమిత పరిధిలో పారిభాషికార్థంలో వాడుతున్నారు. గేయం” అంటే మాత్రాఛందస్సులో రాసిన కవిత్వమని, *పాట' అంటే రాగతాళాలతో పాడే సంగీతరచన అని, సామాన్య లోకంలో రూఢమైంది. గేయం ప్రాచీనత

మానవశాస్త్రవేత్తలు (&౧౪౧|౦౧౦|౦౫1919) ప్రపంచ ప్రజలను స్టూలంగా రెండు వర్గాలుగా విభజిన్తారు. “లిఖిత వాజ్ఞ్మయం (౪19౧ 11621409) ఉన్నవాళ్ళూ, లిఖీత వాజ్బయం లేనివాళ్ళూ' అని. అలిఖీత వాజ్బ్యయమే మౌఖిక వాజ్మయం (01 11164476) లిఖత వాజయమున్న మానవజాతికి మౌఖీక వాజ్ఞ్మయం కూడా ఉంటుంది. మనిషికి భాష అలవడటం అతని సాంస్కృతిక వికాస చరిత్రలో అతి ప్రధానమైన మలుపైతే, లిపి అలవడటం మరో ప్రధానమైన మలుపు. ఈ రెండు మలుపుల మధ్య కొన్ని వందల, వేల సంవత్సరాల కాలం గడిచిపోయి ఉంటుంది. ఇప్పటికీ లిపిలేని భాషలు మాట్లాడే మానవజాతులు ఉన్నాయి. కాని భాషే లేని జాతి లేదు. కనుక లిఖిత వాజయం కంటె మౌభికవాజ్బయమే ప్రాచినమైనది. మౌభికవాబయంలో ఎక్కువ భాగం గేయ వాబ్బయమే.

ఆదిమ మానవుడు వచనంలోకంటె ముందు లయాత్మకమైన కవితా భాషలో తన ఆలోచనలను వ్యక్తికరించి ఉంటాడని ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఓటో యెస్పర్సన్‌ (010 ౮౭9౧9౭150౧) భావించినాడు. ** ఆటవికులు ఏది మాట్లాడినా పాట తీరులోనే ఉంటుందని, వాళ్ళ కంరస్వరం సంగీత స్వరానికి దగ్గరగా ఉంటుందని, వాళ్ళ భాష సంగీతమయంగాను ఉంటుందని-విటిని బట్టి చూస్తే ఒకప్పుడు భాష అంతా పాటమయంగా ఉందేదని యెస్పర్సన్‌ ఊహించినాడు.

జార్జి ధామ్సన్‌ (360/6 1౧0౧800) నృత్యం, సంగీతం, కవిత్వం ఈ మూడు కళలూ ఒకే పాదునుంచి జనించి ఉంటాయని అభిప్రాయపడినాడు. “ సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్నే మన ప్రాచీన సంగీత విద్వాంసులు వ్యక్తీకరించి ఉన్నారు. శార్‌బ్బదేవుడు సంగీత రత్నాకరంలో “గీతం నాదాత్మకం. వాద్యం నాదం యొక్క వివరణవల్ల ప్రకాశమా నమవుతుంది. నృత్యం గీత వాద్యాల ననుసరించి ఉన్నది. కనుక ఈ మూడూ నాదాథీనం.

శ గేయ లక్షణం నాదం వల్ల అక్షరం, అక్షరం వల్ల పదం, పదం వల్ల వాక్యం, వాక్యంవల్ల సమస్త లోక వ్యవహారమూ జరగడం వల్ల వీటితో కూడిన యావజ్జ్ఞగళ్తూ నాదాధీనం. పే

క్రిన్లుఫర్‌ కాద్వెల్‌ (0౧510006! 0406౪61) కూదా “ఆటవిక మానవుడు ఆంగిక చేష్టలద్వారా, గంతులు, చిందులద్వారా ఒంటి కదలికలను (లయను) వ్యక్తీకరిస్తూ నృత్యానికీ, పొలికేకలద్వారా, అర్ధరహితమైన అరుపులద్వారా కవిత్వానికీ, కర్రలతోనూ, రప్పలతోనూ అరచేతులు తాటించి కొడుతూ అకృత్రిమమైన ధ్వనులు కలిగించి సంగీతానికి బీజం వేసినాడు అని అభిప్రాయపడినాడు. పే

పైవన్నీ ఊహలే. ఏ భాషాశాస్త్రవేత్తా ఏ మానవ శాస్తవేత్తా (4౧౧0౧౦1015 మాట ముందు పుట్టిందో, పాట ముందు పుట్టిందో, శాప్రీయమైన ఆధారాలతో నిరూపించనంతవరకు ఊహలను నిజాలుగా భావించనవసరంలేదు. గేయం మొదటిది అని నిరూపించనంతమాత్రాన గేయం ప్రాచినతకు భంగమేమీ లేదు. గేయం ఆతి ప్రాచీనమైన కవితారూప మనడంలో విప్రతిపత్తి లేదు. మానవ సమాజంలో మాట, మాటతోపాటు పాట కుడిఎదమలుగా, వెనుకముందులుగా పరిణమించి ఉంటాయనే విషయం సామాన్యమైన బుద్ధికి అందేదే. దీనికి శాప్రీయమైన ఉపపత్తులూ, రుజువులూ అక్కరలేని వివాదాతీతమైన విస్పష్టమైన విషయం.

భాష ఎంత ్రాచీనమైనదో, గేయంకూడా అంత ప్రాచీనమైనదనే చెప్పవచ్చు. భాష పుట్టి ఎన్ని వేల సంవత్సరాలైనదో (బహుశః లక్షల సంవత్సరాలైనా అయి ఉండవచ్చు) కాని ఐదువేల సంవత్సరాల క్రితమే భాష ఉన్నదని చెప్పడానికి ఆధారా లున్నాయి. *

మన వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి అనుశుతంగా అంది వచ్చిన మౌఖిక వాబ్బయం. వాటినే మనం ప్రధమ వాజ్బయంగా పరిగణించవలసి ఉంటుంది. వేదాలు ఉదాత్తానుదాత్త స్వరిత స్వరయుతాలు. గేయానికి స్వరం, గతి ప్రధానం. కనుక వేదాలు గేయ లక్షణమున్నవి. వేదాల బుక్కులు గేయాలే అని చెప్పవలసి ఉంటుందని గిడుగు సీతాపతిగారు *'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంధంలో అభిప్రాయపడినారు. బుగ్వేదంలో అక్కడక్కడా కొన్ని పదాలు పల్లవివలె మళ్ళీమళ్ళీ వస్తుంటాయని, దినిని బట్టి అవి గానం చేయడాని కుద్దశింపబడినవేనని గిడుగు సీతాపతిగారు అన్నారు.*ీ సామవేదం గేయమని, మిగిలిన మూడు వేదాలు పార్యాలని అంటారు. గానం సామవేదం నుంచే పుట్టిందని సంగీతజ్ఞుల అభిప్రాయం. వేదాలు అక్షర ఛందస్సులైనా వృత్తాలలోవలె గురు లఘువుల క్రమం ఉండదు. ఒక్కొకృప్పుడు

ఆధునికాంధ్ర గేయ కవిత్వం వ్‌ అక్షర సంఖ్యా నియమం కూడా లేని బుక్కులు ఎన్నో ఉన్నాయి. అక్షర నియమానికి సరిపోయేటట్లు చదవడానికి పాదాలలో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ఎన్ని మార్పులు చేసుకొన్నా సరిపోని బుక్కులు కూడా ఉన్నాయి. అక్షర నియమాన్ని సరిపెట్టుకోవడానికి ఏ ఏవిధంగా ఉచ్చారణలో ఎన్నెన్ని మార్పులు చేసుకోవాలో చిలుకూరి నారాయణరావుగారు “మాత్రాచ్చందస్సులు' అనే వ్యాసంలో వివరించినారు. ఎన్ని మార్పులు చేసుకొన్నా ఇంకా లక్షణం కుదరని బుక్కులు ఉన్నాయని, అన్ని వైదిక ఛందస్సులనూ అక్షర ఛందస్సులని అనుకొనడం వల్ల ఇన్ని మార్పులు చేసుకొనడం, చేసుకొన్నా ఇంకా చాలా మట్టుకు కుదరక నిలిచిపోవడము సంభవిస్తున్నదేమో. వాటిలో కొన్ని మాత్రాచ్చందస్సు లనుకొంటే చాలా చిక్కులు విడిపోతవేమో అని తోస్తుంది. వేదములలో ఆర్యా, వైతాలీయ చృందస్సులు రెండే మాత్రాబద్ధములైనవి కనబడుతున్నవని విద్వాంసులు చెప్పుచున్నారు. ఈ మాట యెంత వరకు నిజమయినా, మాత్రాచ్చందస్సులు వేదములలో ఉండవచ్చుననే మాట స్థిరపడుతుంది గదా” అని చిలుకూరి నారాయణరావు గారు ఆ వ్యాసంలో అభిప్రాయపడినారు.*”

మన ఆదికావ్యమైన రామాయణాన్ని కుశలవులు (శ్రుతి వేసుకొనిపాడేవారని, రామాయణాన్ని గానం చేసే వారిని కుశీలవులని అనడం సంప్రదాయమని తెలుస్తున్నది. వాల్మీకి రామాయణం పూర్తి చేసిన తర్వాత కుశలవులకు ఉపదేశించే సందర్భంలో “పార్ష్యేగేయ చ మధురం ప్రమాణ స్రిఖిరన్వితమ్‌; జాతిఖీస్సప్తభీర్ప్చద్ధం తంత్రీలయ సమన్వితమ్‌,.... కావ్యమేతద గాయతామ్‌” అని రామాయణంలోనే ఉన్నది. శ్రీరాముడు గానం చేస్తున్న కుశలవులను పిలిపించుకొని రామాయణాన్ని పాడించుకొన్నాడట. ప్‌

వాల్మీకి రామాయణంలో తంత్రీలయ సమన్వితమ్‌” అనే మాటను అనేక సందర్భాలలో వాడినాడు. 'తంత్రీలయ సమన్వితమ్‌” అనే మాట 'ఓ/102 అనే మాటకు చక్కగా సరిపోతున్నది. గేయకవిత్వానికి ఆంగ్రంలో 'ఓ/104| నంం[౧/ అనే పదాన్ని పర్వాయపదంగా స్వీకరించవచ్చు. (౫౪ అనే జంత్రవాద్య సహాయంతో పాడే రచనను 10//1024| ౧౦౭1౫)” అని అంటారు. ఈ విధంగా పార్యే గేయే చ మధురం, “ప్రమాణ స్రిఖిరన్వితమ్‌” 'జాతిభిస్సప్తభీర్చద్ధమ'” 'తంత్రీలయ సమన్వితమ్‌”, 'సమతాల సమన్వితమ్‌” మొదలైన ప్రయోగాలు రామాయణంలో కనిపిస్తాయి. దీనిని బట్టి రామాయణ కావ్యం గానానుకూలంగా రచితమైనదని అనిపిస్తుంది. కాని వాల్మీకి నిర్దెశించిన గాన సంప్రదాయం నేడు కానరాదు. అది పాఠ్యంగానే ప్రసిద్ధమైంది. కాని ఉత్తర భారతంలో తులసీదాసు రచించిన రామచరిత మానసాన్ని గానం చేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.

గ్‌ గేయ లక్షణల

మన రామాయణ కావ్యంతో పోల్చదగిన ఇలియద్‌ (40), ఒడిస్సీ (00699) అనే రెండు మహాకావ్యాలను రచించిన గ్రీకు కవి హోమర్‌ (40౧6౧ కూడా ప్రభువుల ఆస్థానాలలో '“లైరు” అనె జంత్ర వాద్య సహాయంతో ఆ రెండు కావ్యాలను పాడి వినిపించేవాదని ప్రతీతి. సుప్రసిద్ద విమర్శకుడు సి.ఎమ్‌. బౌరా (0.14 80౪412) ప్రిమిటివ్‌ సాంగ్‌ '?౧౧|1౪6 80౧8 అనే గ్రంథంలో ప్రాచీన శిలాయుగం నాటి ఆదిమ మానవులు, ఆటవిక తెగలు పాడుకొన్న పాటలెలా ఉండేవో, ఏఏ విషయాలమీద వాళ్ళు పాటలు పాడుకొని ఉండేవారో, వాటి స్వరూప స్వభావాలను గురించి శాస్త్రీయమైన సమ్యక్‌ దృష్టితో చక్కని ప్రతిపాదనలు చేసినాడు. పాటలు క్రీ. పూ.2500 ప్రాంతంనాటికే ఉన్నట్లుగా సుమేర్‌, ఈజిప్ట్‌ లిఖిత [గ్రంధాలలో ఆధారాలు కనిపిస్తున్నాయని, ఇంతవరకు తెలిసినంతవరకు మొదటి సుమేరియన్‌పాట సుదీర్ధమైన కధనాత్మకమైన కవిత అని, అందులో వెదాంత విషయాలు, విశ్వసృష్టి విషయాలు వర్ణితమైనాయని, ఆ తరువాత కొంతకాలానికి ఆ కవితలు దేవుళ్ళ, దేవతల కీర్తనలతో పూర్తిగా నిండిపోయినాయని, క్రీపూ. 2850 ప్రాంతంలో పెపి-1 (౧01-1) ప్రభువు సైనికులు ఈజిప్ట్‌ దేశ భాషాగీతాన్ని పాడుకొన్నారని, అదే అతి ప్రాచీన ఈజిప్టు దేశ భాషాగీతమని జె.బి. ప్రిఛార్డ్‌ (౮9. ౬౧10౧౭10) “ఏన్షియంట్‌ నియర్‌ ఈస్టర్న్‌ టెక్స్‌ (4౧౦16౧1 ౧62! ౯2816 అ9)” అనే [గ్రంథంలో రాసినట్లుగా సి.ఎమ్‌. బౌరా తెలిపినాడు.” ఛందస్సు - కవిత్వం

ఛందస్సు వేదాంగాలైన షట్‌శాస్రాలలో ఒకటి. వేదాల సువ్యవస్టను కాపాడటానికి ఛందస్సు ఆవశ్యకమైనది. ఛందస్సు వేదాలకు పాదాల వంటిది.” పాదాలు గమన సాధనాలు. ఛందస్సు గతిని నిర్దెశిస్తుంది. ఛందశ్శబ్దానికి రెండు విధాలుగా అర్ధాన్ని సాధించవచ్చు. ఛంద్యతే అనే నేతి ఛందః, ఛది సంవరణేో అనే సూత్రంవల్ల ఏర్పడిన ఛందశ్శబ్దానికి ఆచ్భాదనమని అర్ధం. ఇది (=ఆహ్లాదే) ధాతువులోని “చి కారానికి “చచ్చేరాదేశ్చఛ:” అనే ఉణాదిసూత్రంవల్ల “ఛి కారాన్ని సాధించుకొనగా ఛందశ్శబ్ద మేర్పడింది. 23 దానికి ఆహ్లాదం అని అర్ధం. “ఛందస్సు” శబ్దానికి భిన్న ధాతువుల నుంచి, భిన్నార్ధాలు ఏర్పడినా ఛందస్సు ఈ రెండు ధర్మాలనూ (ఆచ్చాదనం, ఆహ్లాదనం,)) నిర్వర్తిస్తుంది.

కవిత్వం మౌఖీక సంప్రదాయం (024 ౪261400౧) నుంచి ఆవిర్భవించిన (ఛవ్యకళ. దృశ్యకళలైన వాస్తువు, శిల్పం, చిత్రలేఖనం మొదలైన వాటిలో కూడా లయకు ప్రొాభాన్యమున్నది. సౌష్టవం (9౧౧౧౧౭౪౧) లోపించిన వస్తువు, శిల్పం లయవిరహితంగా కన్సడి కంటిని బాధిసాయి. (ఛవ్యకళలైన సంగీతానికి, కవిత్వానికి (చుతిలయాత్మకత

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 7 జీవం. కవిత్వంలో హృదయ వేద్యాలైన శ్రుతిలయలు ఛందన్సాధ్యాలు. ఛందస్సు భాషనూ, ఖావాన్నీ లయబద్ధంచేసి కొంత ఎత్తుకు తీసుకొని పోతుందనేది యథార్థ విషయమే. ఛందస్సు పరమ ధర్మం (శ్రవ్యత. సంగీతగుణం ఛందస్సు సహజలక్షణం. నిత్యజీవితంలో చెవులు చిల్లులు పెట్టే నగరంలోని రణగొణ ధ్వనులకూ, స్వరపరిచిన సంగీత ధ్వనులకూ (శవ్యతలో ఎంతటి తేడా ఉందో అట్లాగే మాట్లాడే భాషకూ, కవిత్వ భాషకూ అంతటి తేడా ఉంటుంది. ఈ తేడా ఛందస్సువల్ల కలుగుతుంది. గో కనుక ఛందస్సు కవిత్వానికి తప్పనిసరి నియమం కాకపోయినా కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుందనేది నిజం. ప్రభాన ఛందో భేదాలు

ఛందస్సులలో మూడు ప్రధాన ఖీదాలు గోచరిస్తాయి. 1. మాత్రాఛందస్సులు (౧౧౭౧౦౩) 2. అక్షర ఛందస్సులు (9/00) 8. స్వర ఛందస్సులు (10౧10).

  1. మాత్రా ఛందస్సులు : కాలపరిమాణం (664౧10) మీద ఆధారపడినవి. వీటికి ప్రమాణం (౪౧౪ మాత్ర (౧౦౧1). మాత్రా సంఖ్య నియతంగా ఉందేవి మాత్రా ఛందస్సులు. ప్రాకృత ఛందస్సులు, ద్రావిడ భాషల ఛందస్సులు మాత్రా ఛందస్సులే. గ్రీకు, రోమన్‌ భాషల ఛందస్సులు కూడా ప్రధానంగా మాత్రాఛందస్సులని తెలుస్తున్నది. *
  2. అక్షర ఛందస్సులు : అక్షరం గుణం (16441) మీద ఆధారపడినవి. అంటే ఇందులో అక్షరాల స్థానం ముఖ్యం. అంటే గురు లఘువుల క్రమం ముఖ్యం. అక్షరాల సంఖ్య కూడా నియతంగా ఉంటుంది. సంస్కృతంలోని వృత్తఛందస్సులు అక్షర ఛందస్సులు. త్ర స్వర ఛందస్సులు : స్వరం యొక్క ఉదాత్త, అనుదాత్త స్వరితాల మీద ఆధారపడినవి స్వరఛభందస్సులు. ఊనిక (5189966) ఉన్న అక్షరం (9/11016), ఊనిక లేని అక్షరం (4౧89566 8/114016) వీటి సమూహం వల్ల ఏర్పడేవి స్వరఛందస్సులు. ఆంగ్ల భాషా ఛందస్సు, ప్రధానంగా స్వరఛందస్సు. వైదికఛందస్సు కొంత వరకు స్వర ఛందస్సు, మరి కొంత వరకు అక్షర ఛందస్సు. వైదిక ఛందస్సులలో గురు, లఘువుల [క్రమం నియతంగా ఉండదు. కొన్ని బుక్కులలో అక్షరాల సంఖ్య కూడా నియతంగా ఉండదు. అక్షరాల సంఖ్యను సరిపెట్పకోవడానికి పదోచ్చారణలో కొంత మార్చు చేసుకోవలసి ఉంటుంది.

ఛందస్సుకూ, కవిత్వానికీ గల సంబంధాన్ని గురించి, ప్రధాన ఛందోభేదాలను గురించి చర్చించుకోవడం జరిగింది. గేయకవిత్వం మాత్రాభఛందోబ్దమైనది. కనుక మాత్రా ఛందస్సుకు సంబంధించిన పరిభాషను కూడా అవసరమైనంత మేరకు వివరిస్తాను.

8 దేయ లక్షణం యాత్ర

(మాత్రా శబ్దం మా (మాజ్‌ మానే) ధాతువు నుంచి నిష్పన్నమైనది. “మాత్ర మానసాధనం. కాలమానసాధనం. మాత్ర అంటే రెప్పపాటు కాలమని అద్దం, 'నిమేషోన్నే షాభ్యాం అన్యతరేణ తులితః కాలః మాత్రా” అని ఛందశ్చాస్తాలలో చెప్పిన నియమం. చిటిక వేయడానికి పట్టే కాలాన్ని కూడా మాత్ర అంటారు. రెప్పపాటు కాలంలో ఉచ్చ రించే ధ్వనిని మాత్ర అని అంటారు. లేదా ఒక హ్రస్వస్వరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని ఒక మాత్రాకాలం అని అంటారు. కాల పరిమాణానికి మాత్రను ప్రమాణంగా (౧౧||) తీసుకొంటారు. మాత్ర అంటే కాల నియమాన్ని పదోచ్చారణతో కొలిస్తే వచ్చే ఒక యూనిట్‌. -" హ్రస్వాక్షరాలన్నీ ఏక మాత్ర కాలోచ్చారణ కలవి. దీర్జాక్షరాలన్నీ ద్విమాత్రికాలు. ఫ్లుతాక్షరాలు త్రిమాత్రికాలు. వ్యంజనం అర్ధమాత్ర కాలికోచ్చారణం కలది.” మయమాత్రాగణాలు

అక్షరాల (గురులఘువుల) సంఖ్యకు ప్రాధాన్యం లేకుండా రూపొందిన గణాలు మాత్రాగణాలు. ఈ గణాలలో మాత్రాసంఖ్య కూడా నియతంగా ఉండదు. అంటే పద్యపాదాలలో మాత్రాగణాలు వరుసగా సరిపోయినా, ఆ పాదాల మాత్రా సంఖ్య ఒక్కటిగా ఉండదు. ఇటువంటి గణ వ్యవస్థ తెలుగు, కన్నడ భాషలకు ప్రత్యేకమైనది. ఈ గణాలలో రెండు నుంచి అయిదు అక్షరాల వరకు, మూడు నుంచి ఏడు మాత్రల వరకు ఉంటాయి. ఈ మాత్రా గణాలను మళ్ళీ రెండు వరాలుగా విభజించడం జరిగింది. 1, మాత్రా గణాలు 2. మాత్రా సంఖ్యా గణాలు,

  1. మాత్రా గణాలలో ఉండవలసిన గురులఘువుల క్రమాన్ని బట్టి నిద్దశించినవి మాత్రా గణాలు. మాత్రా గణాలను సూర్య, ఇంద్ర, చంద్ర గణాలని మళ్ళీ మూడు వర్గాలుగా విభజించినారు. సూర్య, ఇంద్ర, చంద్ర, గణాలు దేశి ఛందస్సుకు ప్రత్యేకమైనవి. సూర్య, ఇంద్ర, చంద్ర గణాలతో జాత్యుపజాతి పద్యాలు ఏర్పడతాయి. తెలుగులో చంద్రగణాల ప్రయోగం చాలా విరళం. అక్కర జాతిపద్యాలలో చంద్రగణాల ప్రయోగం ఉన్నది. కాని తెలుగులో ఒక్క ద్విపద తప్ప అక్కర జాతిపద్యాలు కూడా చాలా తక్కువ. ద్విపదలో చంద్ర గణాల ప్రయోగం లేదు. మూత్రా నుంఖ్వా గణాలు

మాత్రాగణాలకు, మాత్రాసంఖ్యా గణాలకు కొంత భేదమున్నది. మాత్రా గణాలలో మాత్రాసంఖ్య సమానంగా ఉండదు. అవి కూడా గురు, లఘువుల వల్ల ఏర్పడినవే, కాని మాత్రా సంఖ్యను బట్టి ఏర్పడలేదు. ఇంద్ర, చంద్ర గణాలలో అన్నిటా మాత్రా

ఆధునికాంధ్ర గేయ కవిత్యం ర్త సంఖ్య సమానంగా ఉండదు. నాలుగు, ఐదు, ఆరు మాత్రల గణాలు ఇంద్ర గణాలలో ఉన్నాయి. ఐదు, ఆరు, ఏడు మాత్రల గణాలు చంద్రగణాలలో ఉన్నాయి. ఒక్క సూర్యగణాలు మాత్రమే త్రిమాత్రా గణాలు. కాని 'లగం” (10) త్రిమాత్రా గణమైనా సూర్యగణంగా స్వీకరించలేదు. అట్లాగే ఇంద్ర, చంద్ర గణాలలో పంచమాత్రా గణాలు, షణ్మాత్రాగణాలు, సప్తమాత్రా గణాలు అన్నీ లేవు. కొన్నిటిని మాత్రమే స్వీకరించినారు. ఇట్లా కొన్నిటిని మాత్రమే స్వీకరించినందువల్ల దేశివాబయమైన గేయాలు చాలా వరకు లక్షణవంతం కాలేదు. అట్లాగే ఒకే విధమైన మాత్రా సంఖ్య గల గణాలన్నిటినీ ఒక వర్గంగా రూపొందించి ఉంటే సమంజసంగా ఉందేది. అంటే త్రిమాత్రా గణాలను సూర్యగణాలన్‌ీ, చతుర్మాత్రా గణాలను ఇం గణాలనీ, పంచమాత్రా గణాలను చంద గణాలనీ, షణ్మాత్రాగణాలను రుద్రగణాలనీ-ఈ రకంగా ఆయా మాశ్రాసంఖ్యగల గణాలను వేర్వేరు పేర్లతో వర్గికరించి ఉంటే సమంజసంగా ఉందేది. కాని మన లక్షణికులు ఆ విధంగా చేయలేదు. దేశి పద్యాలకు, గేయాలకు మగణాది అక్షరగణాలచేతను, సూర్వాది మాత్రా గణాల చేతను లక్షణం చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, మాత్రా సంఖ్యా గణాలతో లక్షణం చెప్పడం సమంజసమని డా. గిడుగు కీత్రాపతిగారు”*, కోవెల సంపత్కుమూరాచార్య గారు” మొదలైన ఛందశ్వాస్త్ర విమర్శకులు అభిప్రాయ పడినారు.

మాత్రా సంఖ్యాగణాలు కాల ప్రమాణాన్ని బట్టి ఏర్పడినవి. వీటిని మాత్రా సంఖ్యతో సూచిస్తారు. ఉదా: కత్రిమాత్రాగణాలు, చతుర్మాత్రాగణాలు, మూడు మాత్రలకాలం వాటు ఉచ్చరించబడిన వాటిని త్ర్యస్ర (త్రిశ, తిశ్రు గతులని, అట్లాగే చతురస్ర (నాలుగు మాత్రలు), ఖండ (ఐదు మాత్రలు), మిశ (ఎదు మాత్రలు), సంకీర్ణ (తొమ్మిది మాత్రలు) గతులని అంటారు. మాశత్రాగణాలను ఆవృతాలని (ఆవృతులు, కూడా అంటారు. గురు, లఘువుల గుర్తులతో (౮, |) సూచించినట్లే ఆవృతులలోని మాత్రలను త, క,కిిట అనే అక్షరాల (జతుల)తో సూచిస్తారు. ఈ నాలుగక్షరాలు ఒక మాత్రాకాలాన్నే సూచిస్తాయి. త్రస్రగతిలో నడిచేవాటిని 'తకిట' అని, చతురస్రాలను 'తకకిట, కిటతకి అని ఖండాలను 'తకతకిటి అని ఈ విధంగా కూడా సూచినారు, గేయఛందస్సులు మాత్రాసంఖ్య గణ ఛందస్సులు కాబట్టి మాత్రాసంఖ్యా గణ ్రస్తారాన్ని కూడా తెలుసుకోవడం అవసరం, ప్రాకృత పైంగళంలో చూపిన గణ ్రస్తారాన్ని* ఇక్కడ ఇస్తున్నాను.

ప్రాకృతపైంగళంలో ఆరునుంచి రెండు మాత్రల గణాలను వరసగా ట, ఠ, ద, ధ, ణ అని వర్గాలుగా చేయడం జరిగింది. జయకీర్తి ఛందో£౬. నుశాసనం వీటిని (రండు నుంచి ఆరు మాత్రల గణాలను వరుసగా దత చప ష గణాలుగా వర్గీకరించినాడు.”

10 గేయ లక్షణం మాత్రా ప్రన్తారం గ అల ద్రవాూత్రాగణాలు ౨ ఓ, || లగ గల న (అమాశత్రాగణాలు ఎ 1, అఆ |! గగ స, జ, భభ నల బతుర్వాతాగణాలు . ౮౮, 10, 10% ౪||, 11! య్మ రృ నగ త, సల, జల, భల, నలల వంచవూాశగత్రా గణాలు / 1౮౮, ౪౮, 110౮, ఆ౪|, 10౮. 10||, ఆ|| 11111 మ, సగ జగ, భగురువు, నలగ, యల, రల వత్యాతా గణాలు 2 అలో, 1అఆ౮ఆ, '|౮, ఆ||, 11110, 1౮||, అఆ|౮|, నగల, తల, సలల, జలల, భలల, నన 11101, ఆఆ, 11 1౮1, 11111 11111! ప్రాకృత పైంగళంలో ఆరు మాత్రల గణాల వరకు మాత్రమే ప్రస్తారం చేసి చూపడం జరిగింది. ఏడు, ఎనిమిది, తొమ్మిది మాత్రాగణాల ప్రస్తారాన్ని కూడా ఈ విధంగానే చేయవచ్చు. గిడుగు సీతాపతిగారు ఎనిమిది మాత్రల వరకు చేసినారు. తెలుగు, కన్నడ భాషలలో గేయాలు ఎక్కువగా త్ర్రస్ర చతురస్ర, ఖండగతిలో నడుస్తాయి. ఈ మూడిటిలో ఖండగతికే ప్రాచుర్య మెక్కువ. దీనికి కారణం ఈ రెండు భాషలలోనూ అయిదు మాత్రలకు మించిన పదాలు దాదాపు చాలా తక్కువేనని చెప్పాలి.” అయ గేయాలు తాళలయానుగుణంగా నడుస్తాయి. లయ గేయాలకు జీవం. లయ, తాళాలను గురించి సంగీతశాస్త (గ్రంధాలలో సూక్ష్మవివేచనం చేసినారు. గేయానికి సంబంధించినంతమట్టుకు, లయ, తాళాలను గురించి కొంతవరకైనా తెలుసుకోవడం అవసరం. లయ సామ్యాన్ని తెలుపుతుంది. సంగీతశాస్త్రంలో గానంతో చేరి హెచ్చుతగ్గలేక నడిచేది లయ. దీనినే సంగీత కాలం లేదా నామరస్యం అని కూడా అంటారు. రేర్‌ తాళం నడుమ నడిచే కాలం లయ అని మరొక నిర్వచనం. అది ద్రుత, మధ్య, విలంబితం అని మూడు విధాలుగా ఉంటుంది. వీటిలో శీఘ్రమయినది ద్రుతం, దానికి

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 11 రెట్టింపు మధ్య, మరి దానికి రెట్టింపు విలంబితం. “సంగీతంలో నృత్య, గీత, వాద్యాదుల సమత్వమే లయ. లయ సామ్యాన్ని తెలియజేస్తుంది. క్రియానంతర విశ్రాంతి లయ. ” విశ్రాంతి కాల ప్రమాణంలోని భేదంవల్ల లయలో భేదాలు ఏర్పడతాయి.

“ఒక నిర్దీతకాలంలో గాని, కొన్ని విరామ కాలాలలో గాని కొన్ని ధ్వనులు, ఆంగిక చలనాలు మొదలైన వాటి పునఃపునః ఆవృతి శ్రేణి లయ అని ఆంగ్లేయ విమర్శకుడు బోస్టన్‌ (80510౧) లయ (గ11గ) కు విలక్షణమైన ఆధునికమైన నిర్వచనమిచ్చినాడని చాట్‌మన్‌ (0841౧2౧0) (4 7060౧/ 61 1461/6' అనే (గ్రంధంలో ఉదాహరించినాడు. లయనే ఆంగ్లంలో [౧౫1౧౧ అని అంటారు. ఆంగ్లంలో గిగ1గ, సంస్కృతంలో బుతం ఒక్కటే. తాళం

సంగీతరత్నాకరకారుడు తాళాధ్యాయంలో తాళ శబ్ద వ్యుత్పత్తిని, అర్జాన్నీ ఈ విధంగా వివరించినాడు. తలప్రతిష్టాం అనే ధాతువు ప్రయోగం వల్ల తాళశబ్దం పుట్టింది. ఈ తల ధాతువు ప్రతివ్వర్ధకం కావడం వల్ల నృత్య గీతవాద్యాలు తాళంలో ప్రతిప్టితమై ఉన్నవి. హస్తద్వయ సంయోగ వియోగాలు (సశబ్ద, నిశ్శబ్ద క్రియలు) కలిగి దశ ప్రాణాత్మకమైన కాలమే తాళం. 8. కాలం, క్రియ, మానం ఈ మూడూ చేరి వకకాలంలో కలుగుతున్నప్పుడు తాళం ఉత్పత్తి అవుతుంది. క్షణాదికము కాలం, కొట్టబడిన రెండు వస్తువుల చేరిక క్రియ. క్రియలమధ్య ఉందే విశ్రాంతి కాలం మానం.” లయ సహజసిద్ధమైనది. తాళం శాప్రీయంగా లయనుంచి అభీవృద్ధిపరచినది. తాళం సంగీత కాలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రమాణం (0౧1) అని చెప్పుకోవచ్చు, వృత్తం - జాత్యుపజాతులు - గేయం

పాదబద్ధమైనది పద్యం. పద్యాలు రెండురకాలు 1. వృత్తాలు 2. జాతులు. వృత్తం నిసర్షగణాలైన భగణాది అక్షరగణాలచేత ఏర్పడుతుంది. ఉక్తనుంచి ఉత్కృతి వరకు గల26 అక్షరాలతో ఏర్పడే అనేక పద్యాలను వృత్తాలనడం ఛందశ్శాస్త్ర సంప్రదాయం. వృత్తాలు అక్షరగణ ఛందస్సులు. వృత్తాన్ని పద్య సామాన్యవాచిగా కూడా పేర్కొంటారు.

ఉపగణాలైన సూర్యాది మాత్రాగణాలతో ఏర్పడే పద్యాలను జాతులు అంటారు. జాతులు, ఉపజాతులు అని రెండు రకాలు. జాతులకున్న వ్రాసనియమం ఉపజాతులకు లేదు. ఉపజాతులలో యతికి బదులు ప్రాసయతి కూడా చెల్లించవచ్చు. యతి, ప్రాసల విషయంలో ఉన్న భేదమే తప్ప జాతులకు ఉపజాతులకు భేదమేమీ లేదు. జాతులలో మొదటిపాదం మొదటి అక్షరం (గురు, లఘువులలో) ఏది ఉంటుందో, తక్కిన పాదాలలో

12 డేయ లక్షణం కూడా మొదటి అక్షరం ఉండాలని జాతులకున్న విశేష నియమం. ఉపజాతులకీ నియమం లేదు.

ప్రాస, పాదాద్యక్షర నియమం పాటించి ఉపజాతులను జాతులుగా మార్చుకో వచ్చును. ఆ విధంగానే పాదాలలోను అన్నీ ఒకే గురులఘుక్రమాన్ని వాటించి జుతులను వృత్తాలుగా మార్చుకోవచ్చును. ఉపజాతుల, జాతుల, వృత్తాల అంతర నిర్మాణంలో గల ప్రధాన భేదమిది.

జాత్యుపజాతులు దేశిపద్య ఛందస్సులు. దేశీయ పద్వాలన్నీ ఒకప్పుడు గేయాలే, సంస్కృత లాక్షణికులు దేశభాషా గేయాలకు లక్షణం అక్షరగణ పద్ధతిలో చెప్పదడంవల్ల మాత్రాగణ పద్ధతి అనే ఒక ఆభాస పద్దతిని కల్పించుకొని, ఆ పద్ధతికి లొంగిన లక్ష్యాలకే లక్షణం చెప్పి, వాటిని “జాతులు” అని పెర్కొన్నారు. జాతులు వృత్త ఛందస్సులకూ, గేయ ఛందస్సులకూ మధ్య నిలిచినవి,. అంటే గేయ ఛందస్సులను వృత్త ఛందస్సులుగా మలచుకొనే ప్రయత్నమే జాతులు. వృత్త ఛందస్సులలో గురులఘువుల క్రమమూ, అక్షర సంఖ్యా నియతమైనవి. మాత్రా సంఖ్య కూడా నియతం. కాని వృత్తాలలో లయ నిర్దిష్టం (1౫66) గా ఉండదు. ఒకే వృత్తాన్ని వివిధ గతులలో నదుపవచ్చును. గేయ (మాత్రా) ఛందస్సులలో అక్షరకాల పరిమాణం (9/1010 ౧౦౧౫10) ప్రధానం. మాత్రా సంఖ్య నియతంగా ఉండటం వల్ల లయ నిర్దిష్టం (౫66) గా ఉంటుంది. మాత్రాగణ ఛందస్సులైన జాతి పద్యాలలో వృత్తాలలో వలె గురులఘువుల క్రమంగాని, అక్షరసంఖ్య గాని, గేయాలలోవలె మాత్రా సంఖ్యగాని నియతంగా ఉండవు. మాత్రాగణాలు మాత్రం నియతం. శ్రీ శ్రీ అక్షర ఛందస్సులను గ౮1 ౧618 అనీ మాత్రాగణ ఛందస్సులను 6125110 ౧616౧5 అనీ, మాత్రాసంఖ్యా గణ ఛందస్సులను 56001-612910 ౧౧616౧ అనీ మూడు ఛందస్సులలోగల భేదాన్ని చక్కగా వ్యక్తీ కరించినారు. అంతేకాదు గణబద్దాలు కృత్రిమ ఛందస్సులనీ, మాత్రా ఛందస్సులు స్వాభావికములని అభిప్రాయపడినారు. * గేయ గంధి వృత్తాలు

సంస్కృత లౌకిక కావ్యాలన్నీ ప్రధానంగా అక్షరగణ ఛందస్సులతో నిర్మితమైనవి. అక్షరగణ ఛందస్సులైన వృత్తాలకు మగణాదిగణాలైన త్రికాలతో లక్షణం చెప్పడం జరిగింది, భాషల మధ్య ఆదాన ప్రదానాలు కుడి ఎడమలుగా ఉంటాయి. పూర్తిగా ఆదానమూ, పూర్తిగా ప్రదానమూ ఐ భాషా లక్షణమూ కాదు. సంస్కృత ఛందస్సుల ప్రభావం దేశభాషల మీద ఉన్నట్లే దేశభాషల ఛందఃప్రభావము సంస్కృతం మీద కూడా తప్పనిసరిగా ఉందని చెప్పవచ్చు. దేశిచ్చందస్సులనేకం (మాత్రాభందస్సులు)

ఆధునికౌంధ్ర గేయ కఖిర్యం కే3 సంస్కృతంలో గ్రహింపబడిన తర్వాత అక్షరగణ విభజనకు లోనైనవని గిడుగు సీతాపతి వంటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మన లాక్షణికులు మాత్రాఛందస్సులైన దేశిపద్యాలకు, గేయాలకు సహితం మార్గచ్చందఃపద్ధతి (అక్షర గణపద్ధతి)లో లక్షణం చెప్పినారు. దానివల్ల ఉపగణ వ్యవస్థ, ఒకానాక ఆభాస సంప్రదాయం తెలుగులో నెలకొన్నది. పద్యాల, గేయాల ఉద్దిషల్టయ అభివ్యక్తమయ్యేటట్లుగా మనలాక్షణికులు లక్షణం చెప్పలేదు. తెలుగు జాతి పద్యాలకు, గేయాలకు, చివరికి సంస్కృత వృత్తాలకు సహితం అక్షరగణాలతోను, సూర్వేంద్ర చంద్ర మాత్రాగణాలతోను లక్షణం చెప్పడం వల్ల ఆ పద్యాల నడక తెలుసుకోలేమని, వాటికి త్ర్ర్వస్రాది గతులలో లక్షణం చెప్పడం వల్ల ఆ పద్యాల నడక పట్టుబడుతుందని గిడుగు సీతాపతిగారు ప్రతిపాదించినారు. * సంస్కృతవృత్తాలకు అక్షరగణాలతో లక్షణం చెప్పడం వాటిలోని నడక స్పష్టంకాక, కవులు ఏ కొన్ని వృత్తాలను మాత్రమే అధికంగా ఆదరించినారు. చాలా వృత్తాలు పేరుకు మాత్రమే లక్షణ [గ్రంధాలలో పేరుకొనిపోయినవి, వృత్తాలలో అక్షరసంఖ్య, మాత్రాసంఖ్య (గురు, లఘువుల) అక్షరక్రమం నియతం. లయ మాత్రం నిర్దిష్టంగా ఉండదు. అందుకే కవులు ఒకే వృత్తాన్ని విభిన్న గతులలో నడిపినారు. లయ నిర్దిష్టంగా ఉందని వృత్తాలలో సహితం స్పష్టంగా త్ర్యన్రాది గతులలో నడిచే వృత్తాలనేకం, వాటిని గేయగంధి వృత్తాలని చెప్పవచ్చు.

ఉదాహరణకు పంచచామరం, తరలి, దమనకం, కనకలత, సుకాంత అనే వృత్త పద్యాలు; ఉత్సాహం, సుగంధి, విచికిలిత మొదలైన జాతి పద్యాలు త్రస్రగతిలో నడుసాయి. అట్లాగే దోధకం, మానిని, కవిరాజ విరాజితం, బంధురం, దుర్మిలా, కిరీటం, సుందరి, ప్రమితాక్షర, జలోద్ధతగతి, పద్మిని మొదలైన పద్యాలు చతురస్రగతిలోను; భుజంగప్రయాతం, లయవిభాతి, లయగ్రాహి, స్రగ్విణి, వనమయూరం, మంగళ మహాతశ్రీ, మాలిని, మణిమాల, సారంగం, స్పైరిణీక్రీడనం మొదలైనవి ఖండగతిలోను; మత్తకోకిల, తరలం మిశ్రగతిలోను నడిచే పద్యాలు.

ఈ విధంగా త్యస్రాదిగతులలో నడిచే వృత్తాల నెన్నిటినైనా రచించుకోవచ్చు. పద్యరచన బాగా పట్టుబడినవారికి గణాలు జ్ఞాపకం ఉండవు. పద్యాల నడకనుబట్లై రచిస్తారు. కనుక గణాలను త్రికాలుగా చెప్పినప్పుడు వృత్తాల నడక ఉద్దిష్టం కాదు లయ అభివ్యక్తమయ్యేట్లుగా లక్షణాన్ని చెప్పుకొంటే అనెక కొత్త వృత్తాలకు ప్రాచుర్యం కల్పించవచ్చు. కవులు చక్కగా నడిపించడానికి వీలున్న వృత్తాలనే కావ్యాలలో వాడినారు,

| గేయ లక్షణం తెలుగులో జాతి పద్యాలు

  1. కందం 2. ఎత్తుగీతి 3. ప్రగీతి 4. మేలనగీతి 5. ద్విపద 6. తరువోజ
  2. త్రిపద 8. చౌపద 9. పంచపద 10. షట్పదులు 11. సప్తపద 12. ఉత్సాహం
  3. అక్కరలు. 14. రగడలు. వీటిలో తెలుగు కవులు ఎక్కువగా వాడిన జాతి పద్యాలకూ, మాత్రాఛందస్సుల దృష్ట్వా ప్రాధాన్యమున్న జాతి పద్యాలకూ మాత్రమే లక్షణం గమనిస్తే చాలు. మిగతా వాటిని అప్పకవీయాది లక్షణ(గగ్రంథాలలో చూడవచ్చు. కందం కందం మాత్రాఛందస్సు. చతుర్మాత్రాగణాలతో నిర్మితమైనది. తెలుగు కంద పద్యానికి మూలం సంస్కృతంలోని 'ఆర్వాగీతి అని గాని, ప్రాకృతంలోని, 'స్కంధక' అని గాని పేర్కొంటారు. తెలుగులో కందపద్యాని కెంత ప్రాచుర్యం ఉందో, ప్రాకృతంలో 'గాథాకు కూడా అంత (ప్రాచుర్యమున్నది. ఈ రెండింటి లక్షణాలకు కూడా చాలా దగ్గరి సంబంధమున్నది. కందం చతురస్రగతిలో నడుస్తుంది. కందపద్యాన్ని కవులు అనేక గతులలో నడిపించినా చతురస్రగతిలో నడిచే కందపద్యాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. హరిగతిరగడ పాదాలను (చతుర్మాత్రాగణాలలో జగణాన్ని చేరిస్తే) నాలుగు పాదాలుగా ఒక పద్యం పాదపద్ధతిలో రాస్తే కందపద్యమవుతుంది. మొదటి పాదంలోని చతుర్నాత్రాగణాన్ని రెండో పాదంలో రాయాలి. కాని కందపద్యంలో బేసిగణం జగణం నిషిద్ధం. ఆరో గణం జగణమో, నలమో అయిఉండాలనడం, రెండోపాదం, నాలుగో పొదం చివర గుర్వంతంగా ఉందాలనడం కందపద్యానికున్న విశేష నియమాలు. హరిగతి రగడలో చతుర్మాశత్రాగణమైన జగణాన్ని పూర్తిగా నిషేధించి ఉండటం రగడ విశేషం. మాత్రాసంఖ్య దృష్టా కందం, హరిగతిరగడ ఒక్కటే. గేయవాజ్బయంలో కందార్థాలున్నవి. ముందు కందపద్యాన్ని రాగయుక్తంగా చదువుతూ చివరి పాదం యతిస్థానం దగ్గరి నుంచి తాళబద్ధంగా (త్రిపుట తాళం) అందుకొంటారు. తాళబద్ధంగా అందుకొన్న పాదభాగాన్ని పల్లవిగా భాసింపజేస్తారు. పద్యంలో మధ్యమధ్య మాటలను చరణాలుగా తాళబద్ధం చేసి పాడుతుంటారు, శోణీభర కుచయుగభర వేణీభరములను డస్సి వివిధాభరణ క్వాణయయి యువిదవచ్చెను పాణి సరోజమున నమృత భాందడము గొంచున్‌

ఆధునికాంధ్ర గేయ కనిత్వం 15 యతిన్యనం దగ్గరి నుంచి 'భాండము గొంచున్‌'-అని వాదఖందాన్ని

తే ల్తే త్ర ల్తీ

భాం డ్రామూ గొం చున్‌- అని మిశ్రగతిలోకి సాగదీసి, పల్లవిగా పాడుతూ “ఉవిద వచ్చెనూ వంటి పాదఖండాలను (త్రిపుట తాళానికి సరిపోయేవి) చరణాలుగా తిరిగి తిరిగి పాడుతుంటారు, శుద్ధ నిర్గుణ తత్త్వ కందార్థాలు మొదలైనవి గేయ వాజ్బయంలో ప్రసిద్ధమైనవి. ఇట్లాగే సీసార్థాలు, ద్విపదార్థాలు కూడా ఉన్నాయి. ద్విపద

ద్విపదకు రెండు పాదాలుంటాయి. (ప్రతి పాదానికి 38 ఇం. +1 సూ. ఉంటాయి. చతుర్మాత్రాగణాలు గాని, పంచమాత్రాగణాలు గాని, లేదా వీటి కలగలుపు గాని ఉన్న మూడు గణాలు, ఆ తర్వాత ఒక టత్రిమాత్రా గణం ఉండాలి. వ్రాసనియమం ఉంటుంది. ఏ పాదాని కాపాదం తెగజెప్పాలని, ప్రాసయతి చెల్లించకూడదని లాక్షణికులు విధించినా, కవులా నియమాన్ని పాటించలేదు. ద్విపద లక్షణం, మంజరీ ద్విపద లక్షణం ఒక్కటే. మంజరీ ద్విపదకు ప్రాస, ప్రాసయతి ఉండవు. ద్విపద కంటె మంజరీ ద్విపద ప్రాచీనమైనది. గేయఛందస్సు నుంచి మంజరీ ద్విపద, ఆ తరవాత ద్విపద జనించినాయని చెప్పవచ్చు.

తరువోజ, సీసం, అక్కరలు మొదలైన అనేక దేశిపద్వ ఛందస్సులకు ద్విపద మూలమనవచ్చు. ద్విపద రెండు పాదాలు తరువోజ పాదం కాగా, తరువోజలో నడుమనున్న సూర్యగణం చివరికి చేరిస్తే సీసపద్య పాదమవుతుంది. ద్విపద పద (గేయ) ఛందస్సులు పద్య ఛందస్సులుగా మారే ప్రధమ దశను సూచిస్తుంది ద్విపద గేయఛందస్సు. వర్లమూడి గోపాలకృష్ణయ్యగారు ద్విపద మార్గభందస్సులోనిదేనని అభిప్రాయపడగాో, తెలుగు ద్విపదకు సంస్క బత ; ప్రాకృత, కన్నడ, తమిళ ఛందస్సులలో ద్విపదగా అనుమానించదగిన వాటితో జన్యజనక సంబంధంలేదని, అది పూర్తిగా తెలుగు ప్రాచీన దేశిఛందస్సు అని డా. జి. నాగయ్యగారు తమ సిద్ధాంత వ్యాసంలో" నిరూపించినారు., ద్విపదలో రెండే పాదాలుందటం, అవి నాలుగు గణాలు మాత్రమే గల చిన్నపాదాలు కావడం, వరుసగా ఎన్ని ద్విపదలైనా రాయడానికి వీలుండటం గానయోగ్యత ఉండటం ద్విపద (ప్రాచీనతకు నిదర్శనం. *' ద్విపద ఏ పాదాని కా పాదం తెగజెప్పాలని లాక్షణికులు చెప్పడం ద్విపద గేయత్వాన్ని తెలుపుతున్నది. సామాన్యంగా గేయాలలో పాదం, ద్విపద గేయత్వాన్ని తెలుపుతున్నది. సామాన్యంగా గేయాలలోని పాదం పదాంతంతో ముగుస్తుంది. పదంలో కొంతభాగం మరొక పాదంలోకి చొరబడదు.

ర గేయ లక్షణం ద్విపద కంటె ప్రాచీనమైనది మంజరీద్విపద. మంజరీద్విపదకు ప్రాసనియతి లేదు. గేయాలలో ప్రాస ఐచ్చికమె కాని, నియతం కాదు. వాల్కురికి సోమనాధుడు ప్రాసనియతిని పాటించి, ఏ పాదాని కాపాదం తెగజెప్పక ద్విపదకు కొంత వరకు పద్యత్వం కల్పించినాడు. కాని లాక్షణికులు నిషేధించిన ప్రాసయతిని అక్కడక్కడా పాటించి ద్విపదకున్న గేయత్వాన్ని కొంతవరకు నిలిపినాడు. ప్రాసయతి గేయలక్షణం అని నిడుదవోలు వెంకటరావు 'సోమన సృష్టించిన ఛందస్సు” అనే వ్యాసంలో తెలిపినారు. ద్విపదను పోలిన కొన్ని జానపద గేయాలలో ప్రాసయతి ఉందటం గమనించవలసిన మిషయం.

ద్విపదలో ఇంటద్రగణాలన్నీ చతుర్మాత్రాగణాలై, చివరి త్రిమాత్రాగణమైన సూర్యగణంలోని అక్షరాన్ని ఒక మాత్రాకాలం సాగదీసి పాడితే చతురస్రగతిలో నడిచే హరిగతిరగడ అవుతుంది. నాలుగు మాత్రల గగం, నగణాన్నీ సూర్యగణంగా కవిజనా (శయకర్త, కావ్యాలంకార చూడామణి కర్త పేర్కొన్నారు. అట్లాగే ఇంద్రగణాలన్నీ పంచ మాత్రా గణాలై సూర్యగణంలోని చివరి అక్షరాన్ని రెండు మాత్రల కాలం సాగద్‌స్తే ఖందగతిలో నడిచే ద్విరదగతి రగడ అవుతుంది. పాటలలో పాదాంత లఘువును ఒకటి, రెందు మాత్రల కాలం సాగదీసి పాడటం ఉన్నది. ద్విపదలో చతుర్నాత్రాగణాలు, పంచమాత్రా గణాలతోపాటు త్రిమాత్రాగణాలు ఉంటాయి. కనుక “ద్విపద యొక్క లక్షణము ద్విరదగతి రగడ లక్షణం కంటె విస్తృతము. విస్తృత లక్షణము గల ఛందోరీతుల నుండి సంకుచిత లక్షణములు గల ఛందోరీతు లేర్పడుట భందః పరిణామమున సహజము. కావున ద్విరదగతి రగడ నుండి ద్విపద సంభవించినదనుట కన్న ద్విపద నుండియే ద్విరదగతి రగడ రూపొందినదనుట సమంజసమును, శాప్త్రీయము అని డా.జి. నాగయ్యగారు అభీివ్రాయపడినారు. కాని ద్విపద ద్విరదగతి రగడ, హరిగతి రగడ వంటి గేయ ఛందస్సుల నుంచి రూపొంది ఉండవచ్చుననిపిస్తుంది. ద్విరదగతి రగడ, హరిగతి రగడ నియమాలు సరళమైనవి. ద్విపద ఛందస్సు వీటి కంటె క్లిష్టమైనది. మొదట నియమాలు సరళంగా ఉండి, రానురాను క్లిష్టం కావడం ఛందః పరిణామానికి సహజం. ద్విపదలో చతుర్నాత్రాగణాలు, పంచమాత్రా గణాల కలగలుపు ఉండటానికి కూడా కారణాలున్నాయి. లాక్షణికులు జానపద గేయాల గాన సంప్రదాయాన్ని సరిగా గుర్తించకపోవడం (లఘువును గురువుగాను సాగదీసి, గురువును లఘువుగాను చేసి పాడటం) వారి భాషను సంస్కరించడం, తప్పుగా గణవిభజన చేయడం -ఇవీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు “అంతట రాముల వారూ-అంగన సీతను గూడీ”-ఇది చతురస్రగతిలో నడుస్తుంది. “అంతట రాముల వారు-అంగన సీతను గూడి”-అని ఈ

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 17 విధంగా భాషను సంస్కరించినందువల్ల త్రిమాత్రాగణాలైన సూర్యగణాలు మధ్యలోను, చివరలోను చేరి మధ్యాక్కర పద్యమైంది. కనుక ద్విపద గేయఛందస్సు నుంచి జనించిందని నిర్ధారణగా చెప్పవచ్చు. ద్విపద అనేక దేశిపద్య ఛందస్సులకు మూలమైనది. కనుక దేశి పద్యఛందస్సులన్నీ గేయ ఛందస్సులనుంచి పరిణమించినవేనని చెప్పవచ్చు. గేయ ఛందస్సులకూ, పార్య ఛందస్సులకూ నడిమి దశ ద్విపద అని చెప్పవచ్చు. అంటే ద్విపద గేయమూ, పార్యమూ.

అట్లాగే చౌపద (జగణం తప్ప మూడు చతుర్మాత్రాగణాలు, ఒక సూర్యగణం లేదా నాలుగు చతుర్మాత్రాగణాలు), ఉత్సాహం ఏడు సూర్యగణాల (త్రిమాత్రాగణాల, మీద ఒక గురువు) అక్కరలు మొదలైన జాతి పద్యాలు ఒకప్పుడు గేయ ఛందస్సులే. రగడలు

అనేక గేయ ఛందస్సులకు రగడలే మూలమని చెప్పవచ్చు. తెలుగులో వీటిని వైతాళీయ భేదాలుగా లాక్షణికులు పేర్కొన్నారు. వైతాళలీయాలంటే వివిధ తాళగతులలో పాడదగినవని అర్ధం. రగడలను గురించి కవిజనాశ్రయ కర్త రేచనగాని, విన్న కోట పెద్దనగాని తమ లక్షణ [గ్రంధాలలో చెప్పలేదు. అనంతుని నుంచి అనంతర లాక్షణికులు నవవిధ రగడలకు లక్షణం చెబుతూ వచ్చినారు. కాని ప్రధానమైన రగడలు నాలుగే. ఈ రగడలను రెట్టించడం వల్ల మిగతా రగడలు ఏర్పడతాయి. రగడలకు ఆద్యంత్యప్రాసలు నియతం. అంత్యప్రాస రగడల విశిష్ట లక్షణం.

రగడలు తస, చతురస్ర, ఖండ, మిశ్ర గతులను బట్టీ ఎర్చడినవి. కాని లాక్షణికులు రగడలకు గణాలను పేర్కొన్నారు. విలోమగతి గణాలను నిషేధించడమే వారి ఉద్దశమై నందువల్ల రగడలకు మాత్రా సంఖ్యను బట్టి కాక, గణాలను బట్టి లక్షణం చెప్పినారు. లాక్షణికులు రగడలకు టత్రిమాత్రా గణాలలో లగం, చతుర్మాత్రా గణాలలో జగణాన్సిి పంచ మాత్రాగణాలలో జల, యగణాలనూ నిషేధించినారు. కాని కవులు లాక్షణికులు విధించిన ఈ నియమాలను సరిగా పాటించలేదు. విలోమగతి గణాలను కూడా వాడి, రగడలకు గమన వైవిధ్యం కలిగించినారు. ఆద్యంత్య (ప్రాసలను కూడా అక్కడక్కదా పాటించలేదు. ఆధునిక గేయకవులు కూడా ఆద్యంత్య ప్రాసలను ఐచ్చికంగానే పాటించినారు. ఆధునిక గేయ రచనలలో ఎక్కువగా రగడలు, రగడ భఖేదాలే కనిపిస్తున్నాయి. కనక రగడ లక్షణాలను వివరంగా పరిశీలించడం అవసరం. లాక్షణికులు నిర్దేశించిన గణాలను బ్రాకెట్లలో ఇవ్వడం జరిగింది.

18 గేయ లక్షణం

నవవిధ రగడలు

పే హయ ప్రచార రగడ : త్రస్రగతి, 3+8+8+8; (నాలుగు సూర్యగణాలు), తృతీయ గణాద్యక్షరం యతి

  1. మధురగతి రగడ ; చతురస్రగతి, ఉ+4ఉ+4+4 (గు భ స, నల గణాలలో నాలుగు గణాలు) తృతీయ గణాద్యక్షరం యతి

త. ద్విరదగతి రగడ ఖందగతి, 5+5+5+5; (గ, నలల, భల, సల, త్మ ర గణాలలో ఖవైనా నాలుగు గణాలు), తృతీయ గణాద్యక్షరం యతి

కే హరిణగతి రగడ ఏ మిశ్రగతి, 3+4+3+4 (సప్త్రమాత్రా గణాలు రెండు,)=(త్రిమాత్రా, చతుర్మాత్రా గణాల కలగలుపు అంటే సూర్యగణం తర్వాత గగ, భ స, నల గణాలలో ఏదైనా ఒకటి, మళ్ళీ ఒక సూర్యగణం తర్వాత ఈ గణాలలో ఏదైనా ఒకటి రావాలి) ద్వితీయ గణాద్యక్షరం యతి.

ర్‌, తురగవల్గన రగడ ; హయటప్రచార రగడకు రెట్టంపు. ఎనిమిది త్రిమాత్రా గణాలు, పంచమగణాద్యక్షరం యతి,

ఉ విజయమంగళ రగడ : తురగవలనరగడకు రెట్టంపు; 16 త్రిమాత్రా గణాలు; ల్‌ 9, 18వ గణాద్యక్షరాలు యతి

7 హరిగతి రగడ ౩ మధురగతి రగదడకు రెట్టింపు, ఎనిమిది చతుర్మాత్రాగణాలు; పంచమగణాద్యక్షరం యతి.

  1. విజయభద్రరగడ : ద్విరదగతి రగదడకు రెట్టింపు, ఎనిమిది పంచమాత్రా గణాలు, 3, 5, 7 గణాద్యక్షరాలు యతి

  2. వృషభగతి రగడ ౩: _హరిణగతి రగడకు రెట్టింపు, నాలుగు మిశ్రగతి గణాలు, (సప్త్రమాత్రాగణాలు), తృతీయ గణాద్యక్షరం యతి

ఆధునికాంధ్ర గేయ కవిత్వం [9

రగడలు కూడా ద్విపదవలె రెండు వాదాలు కలిసి ఒక రగడ అవుతాయి. కాని ద్విపదలలోవలెనే వరసగా ఎన్ని పాదాలనైనా చెప్పవచ్చు. సరిసంఖ్యలో పాదాలుండటం రగడల సంప్రదాయం. ఒకే పదం ఉభయ పాదాలలో ఉండగూడదని నిషేధం. కవులీ నిషేధాన్ని పాటించలేదు. పై రగడల లక్షణాన్ని పరిశీలిస్తే గమనించవలసిన విశేషాంశాలు ఒకటి, రెండు గోచరిస్తాయి. సమానమాత్రా సంఖ్య గల గణాలు నాలుగుండటం రగడల సామాన్య లక్షణం. కాని హరిణగతి రగడలో మాత్రం సప్తమాత్రా గణాలు రెండే ఉంటాయి. వృషభగతి రగడలో సప్తమాత్రాగణాలు నాలుగుంటాయి. ఈ దృష్టితో చూస్తే వృషభగతి రగడే పూర్ణరగడ అని, హరిణగతిరగడ వృషభగతిరగడకు అర్ధరగడ అని అనిపిస్తుంది. కాని హరిణగతిరగడలో కూడా సప్తమాత్రాగణాలు రెండే అయినప్పటికీ, త్రి చతుర్నాత్రా గణాలు కలిసి (కలగలుపుగా నాలుగు ఉంటాయి. కాని అవి సమాన మాత్రా సంఖ్య గణాలు కావు, మిశ్రగణాలు రగడల యతి విషయంలో కూడా గమనించవలసిన విషయ మొకటున్నది. నాలుగు గణాలుగల ప్రధాన రగడలలో (విటిని మూలరగడలు అనవచ్చు) యతి సరిగ్గా పాదమధ్యంలో ఉంటుంది. అంటే తృతీయ గణాద్యక్షరం యతి హరిణగతిరగడ రెట్టింపు అయిన వృషభగతి రగడకు కూడా (నాలుగు సప్తమాత్రా గణాలు) పాదమధ్యంలోనే యతి ఉంటుంది. సామాన్యంగా_పాదమధ్యంలో యతి ఉండటం గేయానికున్న సహజ లక్షణం. పాదమధ్యంలోని యతి గేయగతిని పెంపొందిస్తుంది. కాని రగడలకు ఆద్యంత్య(ప్రాసలు చెప్పడం వల్ల ఆ నియమం రగడల గేయగతిని మందీకరిస్తుంది. ఆదిప్రాస పద్యలక్షణం. పార్యానుకూలమైనది. ఈ రహస్యాన్ని గుర్తించిన కవులు రగదలలో ఆద్యంత్య (వ్రాసలను ఐచ్చికంగానే వాదినారు. కొందరు కవులు రగడల గతులను బట్టి కాక, పాదమాత్రా సంఖ్యను బట్టే రగడలను రచించినారు. నవవిధరగడలకు మాత్రమే అనంతాదులు లక్షణం చెప్పినారు. కోవెల సంపత్కుమారాచార్య గారు ఛందఃపదకోశంలో ప్రాచీన లాక్షణికు లెవరూ చెప్పని మరికొన్ని రగడలకు (ఉదాహరణకావ్యాలలో ఉన్నవాటికి) లక్షణం చెప్పినారు. వారు చెప్పిన రగడ లివి. హాంసగతిరగడ

5+5+38+83, తృతీయ గణాద్యక్షరం యతి. ద్విరదగతి రగడ సగపాదం, హయప్రచార రగడ సగపాదం కలిసి ఏర్పడిన రగడ కాబట్టి దీనిని మిశ్రరగడ అని అనవచ్చు. మాత్రా సంఖ్యను బట్టి చూస్తై ఇది మధురగతిరగడ అవుతుంది. చతురప్రగతిలో నడుపుకోవచ్చు. అర్ధ హంసగతి రగడ

హంసగతి రగడ భేదం ఇది. ఒక పంచమాత్రా గణం, ఒక టత్రిమాత్రా గణం ఉంటాయి. ఉదాహరణకావ్యాలలో దీనికి ఉత్మళికారూపంలో ప్రయోగం కనిపిస్తుంది.

20 గేయ లక్షణం మంజుల రగడ

ఆద్యంత్య ప్రాసలు లేని 'మధురగతి రగడను అయ్యలరాజు నారాయణామాత్యుడు హకాంసవిశంతి'లో మంజుల రగడ అనే పేరుతో ఉపయోగించినాడు. ప్రాసనియమం లేదు కాబట్టి మంజుల రగడ ఉపజాతి వర్గానికి చెందుతుంది. ఆధునిక గేయకవులు రగడలలో యతి, ప్రాస, అంత్యప్రాసలను ఐచ్చికంగానే వాడినారు. కనుక వారు ప్రయోగించిన రగడలను మంజుల హయప్రచార రగడ, మంజుల ద్విరదగతి రగడ అనే విధంగా పేర్కొనవలసి ఉంటుంది. కొని ఆ విధంగా ఎవరూ పేర్కొనలేదు. కళికోత్కళికలు

ఉదాహరణ కావ్యాలలో ఉపయోగించిన రగడలనే కళికోతృళిక లంటారు. కాని కళికకు ఎనిమిది పాదాలుంటాయి. రగడకు రెండు పాదాలుంటాయి. రగడలలో కూడా వరసగా ఎన్ని పాదాలైనా రాయవచ్చు. కనుక ఎనిమిది పొదాల రగదడకూ, కళికకూ ఏమీ ఖేదం లేదు (ప్రాసభేదం తప్పితే). కళికలో ఉపయోగించిన రగడల పాదార్థాలతో (సగం పాదాలు) రూపొందిన దానిని 'ఉత్మళికు లంటారు. పూర్ణరగడ కళలిక అని, అద్ధరగడ ఉత్మళిక అని చెప్పవచ్చు. నుట్పదులు

ప్రాచీన తెలుగు సాహిత్యంలో షట్పదులకు ప్రయోగం దాదాపు లేదనే చెప్పాలి. కన్నడ లాక్షణికులు పదిరకాల షట్పదులకు లక్షణం చెప్పగా, తెలుగులాక్షణికులు చెప్పిన షట్పదికి కూడా లక్ష్యాలనదగిన రచనలు చాలా విరళం. జూనపదవాజ్బ్యయంలో ఒకటి, రెండు రకాల షట్పదులకు లక్ష్యాలు కనబడుతున్నాయి. షట్పదులు రగడవలెనే త్ర్యస్రాది గతులలో నడిచే రచనలే. పాదనిర్మాణంలో తప్ప రగడలకు, షట్పదులకు పెద్ద తేదాబేదు. ఈ కారణంవల్లనే నవవిధరగడలకు లక్షణం చెప్పిన మన లాక్షణికులు షట్పదులకు లక్షణం చెప్పవలసిన అవసరమేర్చడలేదు. పైగా షట్పదులకు లక్ష్యాలనదగిన రచనలు లేకపోవడం కూడా మరొక కారణం కావచ్చు. లక్ష్యాలున్నప్పుడు కదా లాక్షణికులకు లక్షణం చెప్పవలసిన అవసరం ఏర్పడడం. కాని ఆధునిక గేయకవులు కొందరు షట్పదు లలో రచనలు చేసినారు. కనుక షట్పదుల లక్షణాలను పరిశీలించడం అవసరం. పేరును బట్టే షట్పదికి ఆరు పాదాలుంటాయని చెప్పవచ్చు. మొదటి మూడు పాదాలు ఒక భాగంగాను (పూర్వార్ధం), తర్వాతి మూడు వాదాలు ఒక భాగంగాను (ఉత్తరార్థం, ఉంటాయి. లాక్షణికులు మొదటి భాగానికే లక్షణం నిర్దెశిస్తారు. తరవాతి అర్దభాగం కూడా పూర్వభాగం వలెనే ఉంటుంది. షట్పదులకు యతి నియమం ఉండదు. 'ప్రాసనియమం ఉంటుంది. ఇవి షట్పదుల సామాన్య లక్షణాలు.

ఆధుభకాంధ్ర గేయ కవిత్వం 21

కన్నడంలో నాగవర్శ చెప్పిన షట్పది లక్షణాన్ననుసరించి తెలుగులో రేచన చెప్పగా, రేచననుసరించి తరువాతి లాక్షణికులు షట్పదికి లక్షణం చెప్పినారు. నాగవర్మ తర్వాత కన్నడలాక్షణికులు చెప్పిన పదిరకాల షట్పదులను గురించి మన తెలుగు లాక్షణికులు షట్పదులకు ఇంద్ర-చంద్రగణాలతో లక్షణం చెప్పినా (షట్పదిభేదాలన్నీ మాత్రాసంఖ్యా గణాలతో రూపొందినవి) కన్నడంలో షట్పదులకు ప్రాచీన సారస్వతంలోనూ, ఆధునిక సారస్వతంలోనూ అధిక (ప్రాచుర్యమున్నది. కన్నడ కవులు షట్పదులలో కావ్యాలే రచించినారు.

కన్నడ లాక్షణికులు చెప్పిన పది షట్పదులలో ఆరు షట్పదులు ముఖ్యమైనవి. మిగతా షట్పదులకు మూలమనదగినవి.

క్ష శరషట్స్పది వ. జ్మీఫడ్తీ (చతుర్నాత్రాగణాలు, జ్హేల్మీ శ+4+4+2 (చివర షణ్మాత్రాగణం నాలుగు+రెండు మాత్రలుగా (గు) విరగాలి;)

  1. కుసుమషట్పది ఇ (౧౧575; (0) 5+5; (9) 5+5+5+2 (గు-ఇట్లా 1,2,8 పాదాలు ఉంటాయి. మూడో పాదం చివరి సప్త్రమాత్రాగణం ఐదు, రెండు మాత్రలుగా విరగ్గాలి. అంటే ఖండగతిలో ఉన్న మూడోపాదం చివర మరి రెండుమాత్రలు (గు) చేర్చాలి.

క. భోగషట్పద్‌ వ (ఏ) 3+8+38+8) (2) 3+8+8+8;

(9 3+8+8+3+38+8+2 (గు)

క ఖామినీషట్పది రు 8+4+8+4 (0) 3+4+8+4; (3) 3+4+3+4ఉ+3+4+2 (గు)

గ్‌, పరివర్ధినిషట్పది వ 6 ఉ+4+ంకంకు 0) ఉ4ండ+క+ం4 క్తేశిత్త యత్తే ఛతీ 444442 (గు)

౦ వార్థకషట్పది ౩ ఈ) 5+5+5+5; 5+5+5+5; ర+శర+5+5+5 +5+2(గు)

శరషట్పది రెట్టింపు పరివర్చినిషట్పది. కుసుమషట్స్పది రెట్టింపు వార్థకషట్సది, అట్లాగే భోగషట్పదిలో సగభాగమే 'తలషట్సది. భామినీషట్పదిలో సగభాగమె జలషట్సది.

20 గేయ లక్షణం ఇట్లే పరివర్ధిని, వార్థక షట్పదుల మిశ్రమం వల్ల 'విషమషట్సది”, విషమషట్పది భేదమే 'ప్రౌాఢధషట్పది. ఈ షట్పదులకు ప్రయోగ ప్రాచుర్యం తక్కువ. ఈ షట్పదుల పాద నిర్మాణం ఇట్లా ఉంటుంది. ఓ తలషట్పది : 3+3 3+% 3+8 8+2 (గు) 2, జలషట్పది తి+ఉ తాట 3+4ఉ్క 3+2 (గు తె విషమషట్సది : శీ+ర5్‌ శ+ర్‌; ఉ+ర5+4+5+2 (గు శ టప్రాధషట్పది : శర +4+5, ఉ+5+4+ర్వ ఉ+ర్‌+ఉ+ర్‌+4ఉ+5+2 (గు)

తెలుగులో చెప్పిన షట్పది లక్షణం కొంతవరకు శర, కుసుమ షట్పదులతో సరిపోతుంది. షట్పదులు రగడల నుంచి రూపొందినవే. రగడలనుంచే కొద్ది మార్పులతో షట్పదు లయినాయి. భోగషట్పది హయ్రచార రగడకు, భామినీషట్పది వృషభగతి రగడకు, శర, కుసుమ షట్పదులు మధుర, ద్విరద గతి రగడలకు కొద్ది మార్పులతో సరిపోతాయి. పాద నిర్మాణంలో తప్పితే గణనిర్మాణంలో రగడలకూ, షట్పదులకూ భేదమేమీ లేదు. మూడోపాదం, ఆరోపాదం చివర రెండుమాతశ్రలు అధికంగా ఉండటం రగడలకంటె షట్పదులకున్న విశేషనియమం.

అనాం మెమో యమప- యు ---

సు గేయ వికాసం లా ప్రాచీనాంధ్ర గప నన్నయకు పూర్వమే శౌతవాహనరాజు హాలుడు సంకలనం చేసిన లేదా శాసనాలలో గేయం హాలుసి ఆధ్వర్యంలో సంకలనం కావించబడిన గాథాసప్తశతి ఉనికి ప్రాకృతభాషలో ఉన్నప్పటికీ తెలుగు మాటలు (అత్తా, పాడి, జ పాట మొ॥[నవి) కొన్ని చోటు చేసుకొన్నాయి. 'గాసట బీసటే ల న్ని గాం పాల్కురికి పదకవితల చదివి గాధలు (త్రవ్వు తెనుంగు వారికిన్‌ గాధ ప్రాకృత క ఖత్‌ థ్‌ ప్రస్తావన, అన్నమయ్య మాత్రాఛందస్సు*.. ఇవి తెలుగు వారికి ప్రతివాత్రమైనవి. క్‌ ణే షె వాటికి లక్ష్య లక్షణ (క్రీస్తు శకారంభం నాటి హాలుని గాథా సప్తశతి (ఫ్రాకృత ప్రస్థాపన, తెలుగు గతికి కావ్యంలోనే)లో తెలుగు మాటలే కాదు తెలుగు జనజీవితం ఖండాంతర ఖ్యాతి కూడా (ప్రతిబింబించింది. గాధాసప్తశతిలో ఆనాటి ప్రజలు తెచ్చిన త్యాగయ్య, పాడుకొనే పాటల ప్రశంస కూడా ఉన్నది. వివాహానికి పదానికి పదవిన్యాసం ముందు వధువును "పెంగ్షికుమార్తిను చేసి తెలుగు స్త్రీలు నేర్పిన క్షేత్రయ్య, మంగళ గీతాలు పాదేవారట. అవి తెలుగు పాటలై పాటలో తన గుండె ఉంటాయి. అనాటి స్రీలు చేసుకొన్న వ్రతాల, నోముల గోసను వెళ్ళబోసుకొన్న సందర్భాలలో పొడుకొన్న తెలుగు పాటలేవో? రామదాసు ప్రభృతుల నన్నయకంటె పూర్వం తెలుగులో గేయకవిత్వం వల్ల గేయవికాసం. విసృతంగా ఉండి ఉంటుందని సాహిత్య విమర్శకులు కనాన

24 రేయ వికాసం ఊహిస్తున్నారు. ఈ ఊహలకు పాల్కురికి సోమనాథుడు పేర్కొన్న పదకవితలూీ ఊతమిస్తున్నాయి. నన్నయకు పూర్వమే తెలుగులో కవితారచన సాగిందనడానికి నన్నయ కంటె పూర్వం వేయించిన శాసనాలు ఆధారాలుగా ఉన్నాయి. క్రీ.శ. 848 ప్రాంతంలోని దని భావిస్తున్న పండరంగని అద్దంకి శాసనంలోని తరువోజ పద్యం, గుణగ విజయా దిత్యుని కందుకూరి శాసనం (క్రీ. శ. 848-892)లోని సీసపద్యం, చాళుక్య భీమరాజు ధర్మవర శాసనం (క్రీ.శ 892-929)లోని సీసపద్యం, యుద్ధమల్లుని బెజవాడ శాసనం (క్రీశ 927-93థలోని ఐదు మధ్యాక్కర పద్యాలు, విరియాల కామసాని గూడూరు శాసనం (క్రీ.శ. 1000) లోని మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాల పద్యాలు నన్నయకు పూర్వమే తెలుగులో కవితా రచన జరిగిందనడానికి ప్రత్యక్ష నీదర్శనాలుగా ఇంతవరకు దొరికిన శాసనాలలో మొట్టమొదటిదైన అద్దంకి శాసనం * తరువోజ ఛందస్సులో ఉండటం గమనించదగినది. తరువోజ పాటల పాదులో నుంచి పుట్టుకొని వచ్చిన పద్య ఛందస్సు. తరువోజను రోకటి పాటలుగా పాడుకొనేవారని విన్నకోట పెద్దన తెలిపినాడు. మధ్యాక్కరలు కూడా పాటలను సంస్కరించగా ఏర్పడిన పద్య ఛందస్సులే. మధ్యాక్కరల పాటల ఫణితి పూర్వకాలంలో ఈ విధంగా ఉండి ఉంటుంది. అంతట రాములవారూ అంగన సీతను గూడీ సంతస మందుచు వేగా స్వపురమునకు చనుదెంచీ తమ్ముల తోడా గలస్తీ నెమ్మది రాజ్యము లేలే ధర్మముతో (బ్రజ లెల్లా తామర తంపర లైరీ చతురస్రగతిలో స్త్రీలు పాడుకొనే ఈ పాటలో దీర్చాలను (స్వీకరిస్తే సరిగా మధ్యాక్కర పద్యమవుతుంది. సీసపద్యం కూడా గేయఛందస్సునుంచి పరిణమించినటువంటిదే. స్రీలు పాడుకొనే పాటలలో ఎక్కువగా సీసపద్య ఛాయలలో నడుస్తాయి. శావణ మంగళవారపు పాటలు, వేదాంత కీర్తనలు, కుచ్చల కథ మొదలైనవి. యక్షగానాలలో సీస పద్యార్ధాలు కూడా ఉన్నాయి. భరతుడు నాట్యశాస్త్రంలో శీర్షకమనే గేయరచనను పేర్కొన్నాడు. ” అదే తెలుగులో సీసపద్యమైనదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మొదట సీసపద్యం చతురస్ర గతిలోనో, ఖండగతిలోనే నడిచే గేయమై ఉంటుంది. చతురస్ర, ఖండగతుల కలగలపు

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 25 అంటే ఒకే పాదంలో నాలుగు మాత్రల గణాలు, ఐదు మాత్రల గణాలు-వాడటం తర్వాత ప్రవేశించి ఉంటుంది. ఉదాహరణకు శ్రీశంభు తనయునకు సిద్ధగణ నాధునకు వాసిగల దేవతా-వందితున-కూ ఓబొజ్జ కనకయ్య నీ బంటు నేనయ్య ఉంద్రాళ్ళ మీదికీ-దండు బంపూ అనే ఖండగతిలో (కుసుమషట్పది) సాగే మంగళహారతి పాటను కొద్ది మార్పులు చేసి రాస్తే సీసపద్య పాదాలవుతాయి. శ్రీ శంభు తనయునకు సిద్ధగణనాధునకు వాసిగల దేవతా వందితునకు ఓ బొజ్జ కనకయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికీ దండు బంపు ఇది ఖండగతిలో సాగే సీసపద్యం. చివరి చరణంలోని “మీది” అనే అనిష్ట గురువును లఘువుగా రాసినప్పుడు భగణం. (ఇంద్రగణాలలో ఒకటి). ఈ విధంగా పాటకోసం సాగదీసిన గురువులను లఘువులుగా రాసి గణవిభజన చేయడం వల్ల ర్సీస పద్యపాదంలో నాలుగు మాత్రల గణాలను, ఐదుమాత్రల గణాలను నిర్దేశించవలసి వచ్చింది. పాదాంతంలో టత్రిమాత్రా గణాలైన సూర్యగణాలను వాడటం కూడా రెండు నుంచి నాలుగు మాత్రల కాలం సాగదీసి పాడటానికో, విశ్రాంతి తీసుకోవడానికో అయి ఉంటుంది. ఈ విధంగా గేయఛందస్సులెన్నో లాక్షణికుల సంసారానికి గురి అయి పద్య ఛందస్సులుగా పరిణమించి ఉంటాయి. మార్గ - దేశి భారతదేశంలో ఆర్యుల ఆక్రమణ అనంతరం దేశభాషలు సంస్క త్‌ భాషా ప్రాబల్యానికి లోనయినాయి. ఆర్యేతరుల సంపర్మంవల్ల, సాంకర్యం వల్ల ఒక్క భాషలోనే కాక సంగీత, నృత్యాది కళలన్నిటీిలోనూ మార్ద-దేళి భేదాలు బర్పడినాయి. మొదట మార్గ-దేశి భేదాల ప్రస్తావన సంగీతశాస్త్రంలో కనబడుతున్నది.” తెలుగులో మార్గ-దేశి భేదాలను గురించి మొట్టమొదటిసారిగా (ప్రస్తావించింది నన్నెచోడుడే.

26 రేయ విరౌఫపం నన్నెచోడుడు కుమారసంభవ కావ్యావతారికలో పూర్వం మార్గకవిత లోకంలో వెలయగా చాళుక్యరాజు మొదలైనవారు దేశికవిత పుట్టించి తెలుగులో నిలిపినారని చెప్పుకొన్నాడు. 1 ఈ పద్వానికి విమర్శకులు రకరకాలుగా అర్ధం చెప్పినారు. సంస్కృతకవిత 'మార్గమని, దేశభాషలలో వెలసిన కవిత 'దేశి' అని ఈ పద్యాన్ని బట్టి కొందరభిప్రాయపడినారు. నన్నెచోడుని అభిప్రాయం కూడా ఇదే అయి ఉంటుంది. ఆ రోజులలో సంస్కృతభాషలో వెలసిన కవిత మార్గకవిత, ఆయా దేశభాషలలో వెలసిన కవిత దేశికవిత. అప్పుడు భాషాదృష్టి తోదనే మార్గ-దేశి భేదాలు ఏర్పడి ఉంటాయి. నన్నయ, నన్నెచోడుల కాలం నాటికి సంస్కృత మార్గానుసారి అయిన నన్నయ, నన్నెచోడులు కవిత మార్గకవిత, ద్విపదాది దేశిఛందస్సులో వెలసిన కవిత దేశికవిత అయింది.

మార్గ-దేశి భేదాలను నిర్ణయంచేటప్పుడు భాష ఛందస్సు, అలంకారం, రితి, వస్తువు, రసం పాత్రాదులనన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలని విమర్శకుల అభిప్రాయం. * కాని తెలుగులో మార్ట-దేశి భేదాలు భాష ఛందస్సు, వస్తువు-ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఛందస్సు దృష్ట్వానే తెలుగులో మార్గ-దేశి భేదాలు ఏర్పడినాయని చెప్పవచ్చు. బండారు తమ్మయ్య గారు ఛందస్సును బట్టే మార్గ -దేశి భేదాలను నిర్ణయించినారు. “కేవలం గీర్వాణములయిన ్రగ్ధరాదులు (అక్షర గణములు) కూర్ప్చబడినది 'మార్గ' మని, దేశీయములగు కందము, గీతము మొదలగు మాత్రాగణబద్ధమయినది దేశికవిత” అని వారు అభిప్రాయపడినారు. * రావూరి దొరసామి శర్మగారు కూడా “దేశీయములగు మాత్రాఛందస్సు నుంచి పుట్టిన జాతి పద్యముల రచన దేశి కవిత” అని భావించినారు. పే

నన్నయ్యకు పూర్వమే దేశికవితా స్రవంతి తెలుగు పొలాలలో గేయసాహిత్యాన్ని సమృద్ధిగా పండించగా, నన్నయ దానిని మార్ద కవితా పధం వైపు మలుపు తిప్పినాడు. అప్పటి నుంచి మార్గ-దేశి కవితా స్రవంతులు సమాంతరంగా ప్రవహిస్తూ, ఒక్కొక్కసారి పరస్పరం ప్రభావితం చేసుకొంటూ, ఒకప్పుడు ఒకటి ఉరవళ్ళు పరవళ్ళతో ('ప్రవహించగా, మరొకటి కొంతకాలం అజ్ఞాతంగా ఏ కొండ కోనలలోనో గుడుసుళ్ళువడి తిరుగుతూ, మళ్ళీ ఒళ్ళు విదిలించుకొని కొండకొమ్ముల నుంచి జలపాతంలా దూకి కోటి విద్యు త్యాంతులు వెలయించి తెలుగు నేలను సస్యశ్యామలంగాను, ప్రకాశవంతంగాను చేసినాయి. ఈ అధ్యాయంలో తెలుగు కవిత ఆరంభదశనుంచి ఆధునిక యుగం వరకు దేశి (గేయ) కవితా వికాసాన్ని రేఖామాత్రంగా వివరిస్తాను.

ఆధుథికాంధ్ర గేయ కలిశ్వం 27 జానపద గేయ సాహిత్యం

ఏ దేశభాషలో (నాగరక భాషలు) నైనా లిఖితసాహిత్యం. మౌభిక సాహిత్యం ఉండటం సహజం. జానపద సాహిత్యం మౌఖిక సాహిత్యం, లిఖిత నాహిత్యంకంటె మౌఖిక సాహిత్యం పరిమాణంలో ఎన్నో రెట్లు గొప్పది. ఎంతో ప్రాచీనమైనది కూడా. మౌఖిక సాహిత్యం చాలా వరకు గేయరూపంలోనే ఉంటుంది. లిఖిత సాహిత్యం మౌఖిక సాహిత్యం నుంచి స్ఫూర్తినీ, మూర్తినీ పొందుతుంది. అంటే జానపద నాహిత్య ఛందస్సుల నుంచి లిఖిత సాహిత్యానికి ఛందస్సు ఏర్పడుతుంది. ఇది దాదాపు అన్ని భాషలకూ సమానమే. ఉదాహరణకు జర్మన్‌ భాషలో ఛందస్సులన్నీ గేయాలనుంచి పరిణమించినవే నని సరన్‌ (౯౯ 54/20) అభిప్రాయపడినారు. * తెలుగులో కూడా జాతులు, ఉపజాతులు, అనే పద్య ఛందస్సులకు మూలం గేయఛందస్సే. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పడం జరిగింది.

నన్నయకు పూర్వమే తెలుగు భాషలో పదకవిత వర్టిల్లిందనడానికి పాల్కురికి సోమనాథుడు పేర్కొన్న వివిధ పదరచనలే తార్భాణం.

పదములు తుమ్మెద పదముల్‌ ప్రభాత పదములు పర్వత పదము లానంద పదములు వెన్నెల పదములు సంజ వర్ణన మరిగణవర్జన పదము

లర్జవ ఘోష ఘూర్జిల్లుచునుండ బాడుచు నాడుచు బరమ హర్షమున గూడి సద్భక్త సంకులమేగుదేర”

ఈ విధంగా పాల్కురికి సమకాలికమైన పదరచన లెన్నిటినో పేర్కొన్నాడు. ఆనాటి జొనపద గేయాలు మనకు లభించకపోయినా కనీసం అవి ఉన్నవని ఊహించడానికైనా పాల్కురికి లిఖితాధారాన్ని సమకూర్చినందుకైనా మన అదృష్టాన్ని అభినందించుకోవాలి. తన బసవపురాణానికి ఆనాటి భక్తులు పాడుకొన్న పాటలే మాతృక*” అని పేర్కొని తన చిత్తశుద్ధిని ప్రకటించుకొన్నాడు. భక్తకూటాలలో పాటలుగా గట్టి పాడేవారని, రోకటి పాటలుగా కూదా పాడదేవారని*, మల్లికార్జున పండితారాధ్యుడు “పంచెగద్దెలు” 'శంకరగీత భాస్వత్పదావళి, 'ఆనందగీతంబులు”' మొదలైన పదాలతో అనేక (్రాక్తన నూతన భవ్యగీతాలతో భక్తాత్ముని పొగడినాడని సోమనాథుడు తెలిపినాడు. "

నన్నయకు పూర్వమే తెలుగులో జూునపద గేయ సాహిత్యం ఉండి ఉంటుంది. కాని జానపద గేయ నాహిత్యం లిఖితం కాకపోవడం వల్ల చాలా వరకు లభించలేదు.

28 గేయ వికౌఫ్రం ఈ శతాబ్దారంభం నుంచే ఎందరో సాహిత్య పరిశోధకులు జానపద గేయాలను విరివిగా సేకరించి సంపుటాలుగా ప్రకటించినారు. ఇంకా సేకరించవలసింది ఎంతో ఉన్నది. నాగరకత అభివృద్ధి చెందడంతో పాటు జానపద గేయసాహిత్యం మరుగున పడిపోతున్నది. ఈ రోజులలో పల్లెటూళ్ళలో కూడా దంచడం, విసరడం వంటివి లేవు కదా. ఇక దంపుడు వాటలు, విసురురాతి పాటలు ఎట్లా ఉంటాయి. పెళ్లిళ్లలో మంగళారతుల పాటలు, తలుపు దగ్గర పాటలు మోటయినాయి. వెనుకటి ఆచారాలన్నీ మోటుకావడంతో అప్పటి పాటలన్నీ విస్మృతమై పోతున్నాయి.

అయితే జానపదులలో గేయం నిర్వహించిన పాత్ర గణనీయమైనది. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి కావ్యెతివృత్తాలను జానపదులకు దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి గేయం వాహికగా తోద్చడి, అక్షరజ్ఞాన శూన్యులైన వారికి అక్షయమైన ప్రాచీన సంస్కృతిని వారసత్వంగా అందించింది. పల్నాటివీరులు, సర్వాయి పాపడు, బొబ్బిలివీరులు, సదాశివరెడ్డి మొదలైన తెలుగు వీరుల కధలు చెప్పి జానపదుల జబ్బచరిచింది; తెలుగు ప్రీలకు జోలపాట నేర్పింది. తెలుగు పిల్లలకు చక్కని ఆటలు నేర్పింది. పడుచువాళ్ల ప్రణయాలలో పాలుపంచుకొని పరాచికాలాడింది. మూలనున్న ముదుసళ్ళకు తెలిసీ తెలియని తత్త్వాన్ని విడమరిచి చెప్పింది. భిక్షకులకు బుక్కెడన్నం పెట్టించింది. జానపదుడు రోకళ్లతో దంచుతున్నాా రోడ్డు రోలరు లాగుతున్నా పడవ నడుపుతున్నా పాట పిలిచినట్లుగానే వచ్చి అతని శ్రమలో పాలుపంచుకొన్నది. జానపదుడు పనిచేస్తూ పాడుకొంటాడు. పాట పాడుతూ పనిచేసాడు. జానపదుడు జీవితంలో 'పనివాటలిను ద్వంద్వ సమాసంగా సంభావించి అనుభవిసాడు. మార్గకావ్యాలలో గేయ ప్రస్తావన

మొట్టమొదట మార్గ-దేశి భేదాల ప్రసక్తి తెచ్చిన నన్నెచోడుడు తన కాలంలో (ప్రచారంలో ఉన్న గేయరచనలను పేర్కొన్నాడు. నన్నెచోడుడు కుమారసంభవ కావ్యంలో అంకమాలికలు , ఊయలపాటలు, ఆలతులు", గౌడుగితాలు* మొదలైన గేయ రచనలను ఆయా సందర్భాలలో పేర్కొన్నాడు. శబరకామిని రోకటితో దంచుతూ రాగయుక్తంగా పాటలేవో పాడినదని*ో ఎరుకవెలదులుల్‌ వీనులకింపుగా పాడినారని కుమారసంభవంలో వర్ణించినాడు.

నాచనసోముని వసంత విలాసంలోనిదని లక్షణ (గగ్రంథకర్తలు జాజర పాట నొకదానిని ఉదాహరించినారు.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 29 వీణాగానం వెన్నెల తేటా రాణమీరగా రమణుల పాటా పేరు చెప్పిన పినబ్రాహ్మణు వీటా జాణలు మెత్తురు జాజరవాటా దీనిని నాచనసోముడు రాసి ఉంటే, ఇదే లభ్యమైన మొట్టమొదటి గేయమని చెప్పవచ్చు. చతురస్రగతిలో సాగే మధురగతి రగడ ఇది. కాని మాత్రాగణ విభజన చేసిచూస్తే స్థూలంగా చతురస్రగతిలో (మధురగతి రగడ) చెరినట్లే అనిపిస్తుంది. కాని మూడో పంక్తిలో ఒక మాత్ర అధికంగా ఉంది. ఇది త్రిశ్రగతిలో సాగేపాట. తెలంగాణలో బహుళ ప్రచారంలో ఉన్న జాజిరి పాట వంటిది. జాజిరి జాజిరి జక్కల పొవా అది గుండిది గుందిత్తడి గుండు అనే పాట కూడా గణవిభజన చేస్తే చతురస్రగతిలోకే వస్తుంది. కాని పాడేటప్పుడు 'జూను లఘువుగా ఉచ్చరించవలసి ఉంటుంది. ఇలాగే మిగతావి అన్వయించుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న నోటి పాటల తీరు. కనుక నాచనసోముడు వసంతవిలాస కావ్యం మొత్తం ఇలాగే జానపద గేయాల బాజణీలలో రగడలతోనే రచించినాడేమో, వసంతవిలాస కావ్యం లభించనందువల్ల ఏ నిర్ణయానికీ రావడం కష్టం. పాట ప్రసక్తి వచ్చింది. కాబట్టి ఇక్కడే మరొక్క ఉదాహరణ ద్వారా గేయానికి, పాటకూ ఉన్న తేడాను విశదీకరిస్తాను. కేవలం గతి ననుసరించి లయబద్ధంగా పాడుకోవడం గేయమవుతుంది. దానికే రాగతాళాదులను జోడించి పాడుకోవడం పాట అవుతుంది. భాను వంశమూన బుట్టీ దానవ కామీని గొట్టి పూని మఖము నిర్వహింపవా, ఓ రామచంద్ర మౌనివరులు సమ్మతింపగా పే ఏలపాట సుగ్రీవ విజయంలోనిది. పై ఏలపాటలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, వలపాట మాత్రాఛందస్సు దృష్త్రా త్య్రస్రగతిలో నడిచే హయ (ప్రచార రగడే అయినా, పాటగా పాడుకొన్నప్పుడు చతురస్రగతిలో సాగిపోతుంది. పై ఏలను ఇట్లా పాడతారు.

30 గేయ వికాసం మొదటివొదం ; భాను వంశా మూనా బుట్టీ ఖభ అను జీ బీ వ! 3 మాత్రలు మొట్టమొదటి యూనిట్‌లో మాత్రం ఒక మాత్ర తక్కువగా ఉంటుంది. తాళంలో ఒక మాత్ర జాగా (విరామం) ఇచ్చి వాట ప్రారంభమవుతుంది. ఇది ఒక అందం. తక్కింది స్పష్టంగా & మాత్రల చొప్పున చతురస్రగతిలో విరుగుతుంది. అట్లాగే రెండోపాదం: దాన వాకా మీనీ గొట్టీ త డ్తీ జీ జ్తీ మూడోపాదం ; పూని మఖమూ నిర్వా హింపా తర్వాత “వా మిగిలింది. “వాతో కలిసి ఓ రామచంద్ర అనేది మరోపాదం అవుతుంది. అప్పుడు నాలుగో పాదం ఇట్లా ఉంటుంది. నాలుగోపాదం : వా ఓ... రామా చంద్రా తె 2+2 జ్శీ ! ఐదోపాదం:; మౌని వరులూ సమ్మా తింపా వ్‌ న్స ల్త జ్త “గా మిగిలిపోతుంది. దీనితో కూడా 'వా తర్వాతలాగే ఓ రామచంద్రా అని పూర్తి చేస్తారు. లేదా తాళం పూర్తి అయ్యేవరకు దీర్హం తీస్తారు. ఈ విధంగా టత్రిశగతిలో నాలుగు పాదాలుగా ఉన్న ఏల, పాటగా పాడుకొన్నప్పుడు చతురస్రగతిలో విరిగి ఆరు పాదాలవుతుంది. శృంగారనైషధం వంటి ప్రొాఢ కావ్యాలు సంతరించిన శ్రీనాథుడు విద్వత్మవేకాక దేశి ఛందస్సులో ఉత్తమ కావ్యాన్ని సృష్టించిన కవి. శ్రీనాధుడు తన కాలంలో ఉన్న గేయరచనల నెన్నిటినో తన కావ్యాలలో పేర్కొన్నాడు. భీమేశ్వర పురాణంలో యక్షగానా లను గురించి ప్రస్తావించినాడు.*” అంతేకాదు భీమనాధుని ఎదుట అచ్చరలు బంగారు వీణలు మీటుతూ జాజర పాటలు పాడినట్లు పేర్కొన్నాడు. * క్రీడాఖిరామంలో శ్రీనాధుడు అనేక గేయరీతులను 'ప్రస్తావించినాడు. ఓరుగల్లు పట్టణంలో ప్రజలు పల్నాటి వీరచరిత్రను పాటలుగా పాడినట్లు తెలిపిఉన్నాడు” అంతేకాదు ఏకవీర మహాదేవి ఎదుట బవనీల చక్రవర్తి పరశురాముని కధలెల్ల పొడినట్లుగా శ్రీనాధుడు తెలిపినాడు జక్కులపురంధ్రిని “కామవల్లీ మహాలక్ష్మి కైటభారివలపు పాడుచు” వచ్చినదని వర్ణించినాడు. ఈ వలపుపాట

అధుధికాంధ్ర గేయ కవిత్వం ఫ్ర కామేశ్వరీపాట అయిన 'అక్కలపాట” అయి ఉంటుందని డా.బి. రామరాజుగారు అభిప్రాయపడినారు.** కాకతీయుల కాలంలో స్త్రీలు రామాయణం ఆరుకాండలనూ పాటలుగా కట్టుకొని పాదేవారని క్రీడా భిరామంవల్ల తెలుస్తున్నది. తేలి

ఈ విధంగా ప్రబంధకవులు కూడా తమ కావ్యాలలో అక్కడక్కడా సందర్భవశాత్తు పాటలను గురించి ప్రసావించినారు. సామెతలు, జాతీయాలలో గేయ ప్రస్తావన

ఏ జాతికైనా, ఏ భాషకైనా సామెతలు, జాతీయాలు జీవనాడివంటివి. ఒక చిన్న జాతీయంలో, సామెతలో మిన్నులముట్లే అర్ధం దాగి ఉంటుంది. కొన్ని జీవితాల అనుభవసారం ఇమిడి ఉంటుంది. పసిడితున్మలవంటి ఆ పదబంధాలలో కవితాత్మ పరిమళిస్తుంది. అటువంటి సామెతలు, జాతీయాలలో గేయ రచనల ప్రస్తావన ఉండటం గేయ రచనా ప్రక్రియ ఎంతగా జనజీవితంలోకి చొచ్చుకొని పోయిందో తెలిసివస్తుంది.

పట్టలేని కోపంలో భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నప్పుడు “అబ్బో ఆయన చిందులు తొక్కుతున్నాడు.” అని అనడం తెలుగువాడికి సహజం. చిందు అనేది యక్షగానాలలో వచ్చే గేయ రచనా ప్రక్రియే.

వేడుకతో చిందుపాడంగ నుబ్బి కోణంగి యాటల గునిసెడివారుో

అని చిండు పాటను పాల్కురికి సోమనాధుడు పేర్శొన్నాడు.

అట్లాగే ఒక గొప్ప అధికారి దగ్గరికి ప్రాపకంకోసం వెళ్లినప్పుడు ఆ అధికారి ఏమన్నా 'జోహుకుం', “చిత్తం” అనే కాకారాయుళ్ళను చూసి “వాడు తానే అంటే తందానా అంటున్నాడు.” “తాళం వేస్తున్నాడు” లేదా “తాళం కొడుతున్నాడు” అని తెలుగువాడు అనకుండా ఉండలేదు. “తందాని అనేది గేయము. 'తందానా' అనే మాట బు(రకథలో వచ్చే ఊతపదం. "తాగి తందనాలాడుతున్నాడు అనే నానుడి కూడా ఉన్నదే. “తాళం వేస్తున్నాడు” అనే దానిలో గమనించవలసిన విశేషాంశం ఒకటి ఉన్నది. తాళవాద్యం స్వతంత్రత లేనిది. ఒకరు పాడితేనో, వాయిద్యం వాయిస్తేనో కదా తాళవాద్యగాడికి పని. తాళవాద్యగాడికి స్వతంత్రత లేనట్లుగానే, “తాళం కొట్టెవాడికి స్వతంత్ర వ్యక్తిత్వం ఉండదు. ఎదుటివాడి ఇచ్చకాలకోసం, ఏది చెప్పినా అనాలోచితంగా మద్దతు ఇవ్వడమే వాడిపని,

క్రర్లే గేయ వికాఫ్రం

'తాళాధ్యాయం పట్టించాడు, లేదా '“తాళాధ్యాయం ప్రారంభమైంది.” అనేది మరో నానుడి. సంగీతంలో రాగాలూ, స్వరాలూ మొదలైనవి మృదువైనవి, సరళమైనవి. నోటికి, గొంతుకు పనిచెప్పే అధ్యాయాలు. తాళాధ్యాయం అనగానే చేతికి పని. చేతితో 'దరువులు” పడతాయి. ఏదైనా గొడవ వాగ్వాదాన్నిమించి చెయ్యి చేసుకోవడం దాకా పోతే 'తాళాధ్యాయంి ప్రారంభమైనట్లే కదా.

'ఓ పెద్ద దండకం వల్లిస్తాడు' అనే నానుడి కూడా తెలుగువాడికి పరిచితమైనదే. దండకం ఇన్ని పాదాలనో, ఇంత (గ్రంధ సంఖ్య అనో పరిమితి లేనిది. దండకం మాత్రా ఛందస్సుకు సంబంధించినది.

ఈ విధంగా తెలుగువారి నిత్యజీవిత వ్యవహారంలో గేయ రచనల ప్రస్తావన దొర్లుతూ ఉంటుంది గేయగంధి సామెతలు - పొడుపు కథలు

నలుగురు కూచొని కాలక్షేపానికి కబుర్లు చెప్పుకొంటుంటే సంభాషణలో ఏవో కొన్ని సామెతలు, పొడుపు కథలు దొర్లుతుంటాయి. అవి సహజంగా కుదురుకొన్న యతిప్రాసలతో కూడుకొని ఏదో ఒక లయలో వెలువడుతుండటం సహజం. పదిశీలించాలే కాని అవి ఏదో ఒక ఛందంలో అందంగా ఒదిగి ఉంటాయి. తెలుగు భాషలో గేయగతిగల సామెతలు, పొడుపు కధలు కోకొల్లలుగా కనిపిస్తాయి. కొన్ని పూర్తిగా గేయాలైతే, మరి కొన్ని ఒకటి రెండు మాత్రలు తక్కువగానో, ఎక్కువగానో గురికి బెత్తెడు దూరంగా త్రస్రాది గతులలో నడుస్తాయి. ఉదాహరణకు త్రస్రగతిలో నడిచే ఒక సామెతను తీసుకొని పరిశీలిద్దాం.

తె త్రి తె త్ర 1 బెండ కాయ ముదిరి నా.(39) తె తె ద్ర వి 2, బ్రహ్మ చారి ముదిరి నా.(3) ప్రి ప్ర 8 7(4. 3) తె 6 3. 'పనికి రాదు లేదా 'పనికి రాదంటారు లేదా 'పనికి వస్తుందా పై సామెతలో 1,2, పాదాల డిజైన్‌, లయా సమానమే. త్ర్రస్రగతిలో ఉంది. చతురస్ర గతి ; 1. ఎరువుల సొమ్ములు బరువుకు చేటూ తియ్యా పెట్టా తీపుల చేటూ వాటిలో ఒక్కటి పోతే అప్పుల చేటూ

  1. ముందుకు పోతే నుయ్యి వెనుకకు పోతే గొయ్యి ర్‌ ర్‌ ర్‌ ర్‌ ఖండ గతి: 1. ముంజేతి కంకబణానికి అద్ద మెందుకు (కూ) ర్‌ ర్‌ ర్‌ ర్‌ వ!
  2. సన్నికలు కడగరా సయిదల్లి అంటే. కడిగినట్టే త్‌ ర్‌ ర్‌ నాకినా ఖుదాతో దన్నట్లు
  3. రాయగా రాయగా కరణం దగ్గగా దగ్గగా మరణం మిశ్రగతి : 1. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట
  4. కోటి విద్యలు కూటి కొరకే (కోసం)
  5. పోరు నష్టం పొందు లాభం ఎనిమిది మాత్రలు ; 1. ఇల్లు ఇరకటం-ఆలి మరకటం
  6. నీ చేతి మాత్ర-వైకుంఠ యాత్ర
  7. జిహ్వకో రుచీ-పురైకో బుద్ధి 4, గతిలే నమ్మకు-మతిలేని మొగుడు కొన్ని సామెతల పాదాలన్నిటా సమానంగా మాత్రలుండటం వల్ల సమభారత (414౧౦6) కూడా సమానంగా ఉంటుంది. జదావారణకు 6 త్తే టీ అంగడిలో అన్నీ ఉన్నవి = 1% క్త 6 ణ్శ అల్లుడి నోట్లో శని ఉన్నది = 14 ఈ రెండు పాదాల స్వరూపంలో సామ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంగడి-అల్లుడి చతురస్రగతిలో మొదలై, ఉన్నవి-ఉన్నది చతురస్రగతిలో అంతమవుతాయి. నడుమ ఆరు మాత్రల గణాలు ఉన్నవి

34 దేయ థికాసం మండుపు కథలు క్ర త్ర త్రి టీ తే త్యృ్యస్రగతి: 1. గోడ మీది బొమ్మ- గొలుసుల బొమ్మ = 16 క్‌ త్రై తె ౮ త్ర వచ్చి పోయ వారికి వడ్డించు -బొమ్మ = 8(తేలు) 2, తోకలేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది, (దీపంవత్తి) చతుర(స్రగతి ; 1. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు (కండ్లు) 2, గుప్పెడు పిట్టకు బారెడు తోక (తామరపువ్వు) ఖందగతి ; 1. అదవిలో పుట్టింది అడవిలో పెరిగింది. మా ఇంటి కొచ్చింది మా అమ్మ మెచ్చింది. తాదోసి కట్టింది తైతక్క లాడింది కడవలో దూరింది గజ్టుమన్నాది పెరుగులో మునిగింది వెన్నింత తెచ్చింది నాకింత పెట్టింది (కవ్వం) ఇది ఖండగతిలో సాగిన గేయ రచనే. కొన్ని సామెతలు, పొడుపు కధలు వచనపు తుంటలలాగా ఉన్నా వాటిలో మాత్రాసంఖ్య కనీసం రెండు పాదాలకైనా దాదాపు సమానంగా ఉండటం వల్ల ఒక విధమైన లయ, తూగు ఉంటాయి. సామెతలు, పొడుపు కధలు చిరకాలం జ్ఞాపకం పెట్టుకొని, ఎప్పుడు పడితే అప్పుడు సందర్పోచితంగా ఉదాహరిస్తున్నామంటే, వాటిలో సహజమైన, అంతర్గతమైన ఒకానొక లయ దాగిఉండటమె ప్రధాన కారణమని చెప్పవచ్చును. శాసనాలలోను, కావ్యాలలోను రగడల వికాసం జానపద గేయాలు, ఆధునిక గేయాలు చాలా వరకు రగడలలోనో, రగడ భేదాలలోనో అంతర్భవిస్తాయి. కనక రగడల వికాసాన్ని విశదంగా పరిశీలించడం అవసరం! మాత్రాఛందస్సులలో ఒక్క రగడలను మాత్రమే శ్రీనాధుడి దగ్గరి నుంచి 'ప్రబంధకవులు తమ కావ్యాలలో అక్కడక్కడా వాడినారు. మార్గ కావ్యాలలో రచితమైన గేయాలు రగడలు మాత్రమే. క్రీ.శ. 6వ శతాబ్దం నాటిదైన పొట్లదుర్తి మాలెపాడు శాసనం పైకి వచనంలో ఉన్నా దీనిలో

అధునికాంధ్ర గేయ కవిత్వం ప్‌ అణపోతులు రేవణ కాణ పుద్దణకాలు శ6 ఇచ్చిన పన్నన సపెన్సాటజె ఇళె రేణికిన్‌ =-అనే రెండు పంక్తులలో 'ద్విరదగతి రగడి లక్షణం గర్భితమై ఉన్నదని దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డిగారు తెలిపినారు.” ఈ శాసనమంతా గేయపడద్ధతిలో రచితమైందని, ఇదే మొట్టమొదటి గేయశాసనమని టేకుమళ్ళ కామేశ్వరరావుగారు నిరూపించినారు. ” రగడల రచన నన్నయ కంటె పూర్వం నుంచీ జరుగుతున్నట్లు ప్రాచీన శాసనాలవల్ల తెలుస్తున్నది. క్రీ.శ. 9వ శతాబ్ది వాడైన సోమదేవసూరి రచించిన 'యశ స్తిలకి చంపూ కావ్యంలో కొన్ని రగడలున్నాయి. వికచ కర్ణోత్పల స్పర్ధి తరళేక్షణాః కేళి తాళ క్వణత్మనకమయ కంకణాకో అనే పాదాలతో రగడ మొదలవుతుంది. మాత్రాసంఖ్యను బట్టి ఇది ద్విరద గతి రగడకు సరిపోతుంది. ఈ రగడ ఆ కావ్యంలో పాదవిరహితంగా వచనంలాగా వరసగా రాసి ఉండటంవల్ల ఆ కావ్య వ్యాఖ్యాత దీనిని గద్యగానే భావించిఉంటాడు. సంస్కృతం లో రగడలు లేవు. సోమదేవసూరి దాక్షిణాత్యుడు కాబట్టి దక్షిణదేశ ఛందస్సంప్ర దాయ పరిచయాధిక్యంవల్ల అతడు తెలుగు రగడను సంస్కృత కావ్యంలో ప్రవేశపెట్టి ఉంటాడు. తొమ్మిదో శతాబ్దంలోనే తెలుగుభావా ఛందస్సు అయిన రగడ సంస్కృత కావ్యంలో ప్రవేశించి ఉన్నందువల్ల అంతకు పూర్వమే తెలుగులో రగడలకు అధిక (ప్రాచుర్యం ఉండి ఉండాలని ఊహించవచ్చు. క్రీశ 1022 ప్రాంతంలో రాజరాజు పట్లాభిషేకానంతరం వేయించిన కోరుమిల్లి శాసనంలో సంస్కృత శ్లోకాలు, కొంత గద్య భాగం తర్వాత 28 పంక్తులు ద్విరదగతి రగడ ఉన్నది, తస్మై సమస్త జనతా విశేషగుణాయ రైసుతర్పిత మహాదేవ దేవగణాయ దతోమయా చంద్రతారం హి తిస్టేత తస్యావధి వ్యక్తి రేషోచ్యతేరాధ్య*"

ఏర గేయ్‌ వికౌసం

ఈ రగడలో మొదటి నాలుగు పాదాలలో ఆదిప్రాస, చివరి నాలుగు పాదాలలో ఆదిప్రాస, అంత్యప్రాస పాటించడం జరగలేదు. మిగతా పాదాలన్నీ లక్షణవంతంగా ఉన్నవి. యతి, ప్రాసలు ఎక్కడో తప్పిన వాటికి డా॥ దివాకర్ల వేంకటావధాని గారు 'ప్రాబన్నయ యుగము” అనే గ్రంధంలో చక్కని సవరణలు సూచించి ఉన్నారు. శాసనం సంస్కృత భాషలో ఉన్నప్పటికీ విచ్చేద రూపయతిని పాటించక తెలుగు ఛందస్సునను సరించి యతి (సరూపయతి)ని చాలావరకు పాటించడం జరిగింది. కనుక ఈ రగడ సంస్కృత భాషలో ఉన్నప్పటికీ పూర్తిగా తెలుగు ఛందస్సంప్రదాయాన్ని అనుసరించి రచింపబడిన రగడ అని చెప్పవచ్చును. ఈ శాసన రచయిత బేతనభట్టు. శాసన లేఖకుడు గండాచార్యుడు. నన్నయ్య రచించిన నందంపూడి శాసనాన్ని రాసిందీ గండాచార్యుడే. దీనిని బట్టి నన్నయ్య రగడలను ఎరిగి ఉంటాడని చెప్పడానికి అవకాశ మున్నది. కాని ప్రథమ కావ్యమైన భారతంలో రగడలు లేవు. నన్నయ్య రగడలు రచించకపోయినా, రగడల నడకలకు దగ్గరగా ఉన్న వృత్తాలనే ఎన్నుకొన్నారని సంపత్ముమారాచార్యగారు 'తెలుగు ఛందో వికాసం”లో విశదంగా తెలిపి ఉన్నారు.

ప్రాచినులలో నన్నయ్య తర్వాత నన్నెచోడుడు రగడలు రాయకపోయినా రగడను పోలిన క్రౌాంచపదవృత్తాన్ని రచించినాడు.” క్రౌంచపదవృత్తంలో 'భ, మ,స,భ, స, న, న, యి అనే గణజాలుంటాయి. ఈ వృత్తం చతురస్రగతిలో నడుస్తుంది. క్రౌంచపదం అక్షరగణబద్ధమైన సంస్కృత వృత్తమనడం కంటె నడకనుబట్టి, విరుపును బట్టి మాత్రా బద్ధమైన రగడ అనడం సమంజసం. ఈ వృత్తం హరిగతి రగడకు సరిపోతుంది. మాత్రాగణబద్ధమైన రగడ ఛందోఖేదం అక్షరగణ బద్ధంగా సంస్కారానికి గురికావడం వల్ల వృత్తంగా మారి ఉంటుందనడానికి క్రాంచపదం ఒక ఉదాహరణ. క్రౌాంచపద వృత్తాన్ని కావ్యంలో ఉపయోగించింది నన్నెచోడుడే.

రగడలకు పాటలలో ప్రచారమున్నది. కాని శిష్ణవాబయంలో ప్రాచుర్యం లభించలేదు. అనేక దేశికావ్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన సోమనాధుడే రగడకు మొదట కావ్యగౌరవం కల్పించినాడు. మొదట రగడను కేవలం భగవత్‌ స్తోత్ర సందర్భాల లోనే ఉపయోగించినట్లు తెలుస్తున్నది. సోమనాధుడు ఉదాహరణ కావ్యాది స్తోత్ర కావ్య విషయంలోనే రగడలను, రగడ భేదాలైన కళికోత్మళికలను ఉపయోగించినాడు. సోమనాధుడు బసవరగడ, బసవాధ్య రగడ, సద్దురు రగడ, గంగోత్పత్తి రగడ అనే రగడ కావ్యాలు రచించినట్లు తెలుస్తున్నది. సోమనాధుని రగడ కావ్యాలు లభించలేదు. సోమనాధుని రగడ కావ్యాల తర్వాత రగడలలో రచితాలైన స్వతంత్ర రచనలు చక్రపాణి రంగన రచించిన నయనరగడద, నమశ్శివాయ రగద, కృష్ణమాచారి రచించిన నృసింహ

ఆధునికాంధ్ర గేయ కథిత్వం స నామాలు, రామనామాలు, తాళ్ళవాక పేదతిరుమలాచార్యుడు రచించిన “సుదర్శన రగదః” మొదలైనవి చెప్పుకోదగినవి. మొత్తం మీద రగడలలో స్వతంత్ర కావ్యాలు చాలా తక్కువ. పైన పేర్కొన్న రగడ రచనలన్నీ స్తోత్రపరమైనవి. అల్బ్పపరిమాణమున్నవి. వీటిలో కధా స్పర్భలేదు.

లాక్షణికులు వసంత విలాసంలోనిదని (నన్నెచోడుడు) ఉదాహరించిన రగడ మధురగతి రగడ. ఆ తర్వాత శ్రీనాధుని వరకు రగడలను ఉపయోగించినట్లు లేదు. మార్గ కావ్యాల్లో రగడలకు మొదట చోటు కల్పించినది శ్రీనాధుడే అని చెప్పాలి శ్రీనాధుని అనేక విషయాలలో అనుసరించిన ప్రబంధ కవులు ఈ విషయంలో కూడా అనుసరించి, తమ కావ్యాలలో పుష్పాపచయ సందర్భాలలో రగడలు రచించినారు. శ్రీనాధుడు కాశీ ఖండంలో మణికర్ణికా ఘట్టాన్ని వర్ణిస్తూ రాసిన రగడ మణికర్ణిక రగడగా ప్రసిద్ధమైంది. ఉం ఇది హరిగతి రగడ. శివరాత్రి మాహాత్మ్యంలో హరిగత రగడకు రెట్టింపుగా ఒక పెద్ద రగడను మూడు సందర్భాలలో రచించినాడు. దానికి శ్రీనాధుడు తాళవృత్తం, విషమ వృత్తం అని పేర్లు పెట్టినాడు.* లాక్షణికులు చెప్పిన నవవిధ రగడలలో తాళవృత్తం లేదు. హరిగతి రగడే మధురగతి రగడకు రెట్టింపు. హరిగతి రగడకు రెట్టింపు రగడను లాక్షణికులు చెప్పలేదు. ఒక్కత్ర్రస్రగతిలో నడిచే రగడ (హయప్రచార రగడ)ను రెండుసార్లు రెట్టించగా ఏర్పడిన రగడ (విజయ మంగళ రగదును పేర్కొన్నారు. కాని మిగతా గతులలో నడిచే రగడల రెట్టింపు (రెండుసార్లు) రగడలను లాక్షణికులు పేర్కొనలేదు. శ్రీనాధుడు రగడలలో చేసిన నవ్య ప్రయోగంగా దీనిని పరిగణించవచ్చు.

ప్రబంధాలలో పుష్పాపచయ సందర్భంలో రగడలు రాయడం ప్రబంధ కవుల సంప్రదాయమైపోయింది. ప్రబంధకవులు భగవంతుని స్తుతించే సందర్భాలలో కూడా రగడలు వాడి ఉన్నారు. ఏమైనా గానయోగ్యాలైన సందర్భాలలో ప్రబంధకవులు రగడలు రాసి ఉన్నారు. అల్లసాని పెద్దన మనుచరిత్రలో ద్విరదగతి రగడను, ముక్కు తిమ్మన్న పారిజాతాపహరణంలో వృషభగతి రగదడన్తు* ధూర్జటి కాళహస్తి మాహాత్యంలో? ఒక హరిగతి రగడను, పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నంలో ీ ద్విరదగతి రగడను, కళాపూర్ణోదయంలో 49 తురగవల్దన రగదను, రామరాజకవి కవికర్ణ రసాయనంలో వృషభగతి రగడను,” సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనంలో హరిగతి రగదను పొన్నకంటి తెలగన్న యయాతి చరిత్ర చతుర్ధాశ్వాసంలో మధురగతి రగడను, పంచమాశ్వాసంలో ద్విరదగతి రగడను, రఘునాధ భూపాలుడు. వాల్మీకి చరిత్రలో” వృషభగతి రగడను రచించినారు.

వి గేయ వికాసం శృట్పదులు తెలుగులో షట్పదులకు ప్రచారం తక్షువే. కన్నడంలో కుమారవ్యాసుడు మొదలైన

కవులు షట్పది ఛందస్సులలో మహాభారతాది కావ్యాలు రాయగా, మన తెలుగు కవులు ఒక కావ్యం కాదు గదా, కనీసం ఒక్క షట్పదినైనా తమ కావ్వాలలో రచించలేదు. ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో కన్నడ కవులు షట్పదిని విరివిగా వాడి ఉత్తమ కావ్యాలు వెలయిస్తే, మన తెలుగు కవులు ఈ పాటల ఛందస్సుపట్ల నిరాదరణ చూపినారు. కృష్ణదేవరాయల కాలంలో కన్నడభాషలో షట్పదులలో కావ్యరచన ఎక్కువగా జరిగినట్లు తెలుస్తున్నది. కన్నడదేశంలో స్థిరపడిన ప్రబంధ కవులకు, కన్నడంలో మహాకావ్యాలు వెలసిన షట్పది ఛందస్సును గురించి తెలుగు కవులకు తెలియకుందా ఉందకపోదు. షట్పది ఛందస్సును గురించి తెనాలి రామకృష్ణుడు 'మల్లియల పెల్లు కన్నడ కవితా విలాసంబును బోలె షట్పద వృత్త విలాస భాసురంబై'-అని పాండురంగ మాహాత్యంలో పేర్కొని ఉన్నందువల్ల షట్పదీ వృత్తము ప్రబంధ కవులకు బాగా పరిచయమున్న ఛందస్సే నని చెప్పవచ్చు. కాని ప్రబంధ కవులెవ్వరూ షట్పదిని ముట్టుకోలేదు. తెలుగులో షట్పదులకు ప్రాచుర్యం తక్కువగా ఉండటానికి కారణం ఇవి దాదాపు రగడ భేదాలు కావడమే. తెలుగు లాక్షణికులు నవవిధరగడలను పేర్కొన్నారు. షట్పదులన్నీ నవవిధ రగడలలో అంతర్భవిన్తాయి. కన్నడంలో రగడలకు తెలుగులో ఉన్నంత ప్రాచుర్యం లేదు. కన్నడంలో మూడు రగడలనే లాక్షణికులు పేర్కొన్నారు. ఈ మూడింటిలో షట్పదులన్నీ అంతర్భవించవు. అందుకే వారు పది రకాల షట్ప్పదులను చెప్పుకోవలసి వచ్చింది. తెలుగులో రగడ భేదాలు అధికంగా ఉన్నందువల్ల షట్పదులకు అధిక ప్రాచుర్యం లేకపోయింది. తెలుగులో షట్పదులకు జానపద గేయాలలోనే ఉదాహరణలు లభిసాయి.

  1. భోగషట్పది : తులసి-యింట-నుంచు-వార్ని

తులసి-పూజ చేయు-వార్ని

తులసి-యందు-భక్తి-యుంచి-మెలగు-వారినీ

తులసి-జూచి-మొక్కు-వార్ని

తులసి -చుట్టు-తిరుగు-వార్ని

తెలిసి-సీవు-వారి -దిక్కు-తొంగి-చూడ-కూ 2. శరషట్పది : శ్రీతరు-ణిరొనే

శ్రీరఘు-రాముడ

చేరిక-వాటము-తీ(కఈ)-వే

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 39 ౩. కుసుమషట్పది : ఈశ్వరా-పుత్రునకు గాజావ-తారునకు పార్వతీ-తనయునకు -భక్తితో-నూ చెంగావి-చీరెలా కొంగూలు-జీరాడ రంగైన-(నవ) మోహ-నాంగి ఎ-క్కడీకే చంద్రూని -శిరమూన ధరియించు -కొన్నట్టీ జగములే -లెదుజగా-ధీశుస -న్నిధికే ఇది రెండు మాత్రలు ఎక్కువగా ఉన్న కుసుమ షట్పది అవుతుంది. కాని పాటపాడేటప్పుడు ఈ రెండు అధిక మాత్రలను కుదించుకోవచ్చును. భామినీ షట్పది :; గుమ్మ-దేదే-గోపి-దేవీ గుమ్మ-దేడే-కన్న-తల్లీ గుమ్మ-డినిపొడ -సూప -గదవే-అమ్మ-గోపె-మ్మా (ముచ్చు-తనమున-వేద-ములు గొని తెచ్చి-వెరచచు-జలధి-లోపల జొచ్చి-యున్నను -వాని-వెంబడి -జొచ్చి-జలనిధి-లో తెలుగులో ఈ నాలుగు షట్పదులే కనిపిస్తాయి. మిగతా వాటికి జానపదగేయ వాబజ్బయంలో కూడా ఉదాహరణలు అంతగా లభించడం లేదు. ఆధునిక కవులు కొందరు షట్పదులలో రచనలు చేసిన వారున్నారు. మొట్టమొదటి గేయకావ్యం పలనాటి వీరచరిత్రను మొట్టమొదటి గేయకావ్యంగా పరిగణించవచ్చు. వస్తువు, భాష్క ఛందస్సు ప్రజల నుంచి తీసుకొన్నవేకాక, ఆశుకవితా సంప్రదాయాన్ని (0 140140౧) అనుసరించి వెలువడిన గేయకావ్యమిది. ఇది మంజరీ ద్విపద ఛందస్సులో ఉన్నది. ఈనాటి పలనాటి వీరచరిత్ర ముద్రిత కావ్యాన్ని పరిశీలిస్తే ఆశుకవితాధార అంతగా అగుపించకపోవచ్చు. కాని ఈ కావ్యం ఆశుకవితా సంప్రదాయానికి చెందినదే నని అనడానికి కావలసినన్ని అంతస్సాక్ష్యాలున్నాయి. డా. వెల్చేరు నారాయణరావుగారు. తమ సిద్ధాంతవ్యాసంలో ఆశుసాహిత్యం లక్షణాలను పేర్కొంటూ ఆశుసాహిత్యంలో నిర్మాణంలోను, కధాకధనంలోను పడికట్టు పద్ధతి ఉంటుందని పలనాటి వీరచరిత్రలోని ఉదాహరణలు ఉటంకిస్తూ ఆశుసాహిత్యం ముఖ్యలక్షణాన్ని ప్రస్తావించినారుో

తే గేయ ఐకాస్రం మంజరీ ద్విపదలో వెలసిన మరో గేయకావ్యం తాళ్ళపాక తిమ్మక్క రచించిన 'సుభద్రాకల్యాణము' పల్నాటి వీరచరిత్ర ఆశుకవితా సంప్రదాయానికి చెందిన గేయ కావ్యమైతే, సుభద్రాకల్యాణము లిఖిత సంప్రదాయానికి చెందిన గేయకావ్యం. తాళ్ళపాక తిమ్మక్క ఈ కావ్యాన్ని వాట పాడటానికి కొన్నిచోట్ల దిర్జాక్షరాలలో (హసన్వాక్షరా లుండ వలసినచోట) రాసినది. విమర్శకులు సుభద్రాకల్యాణ కావ్యాన్ని మంజరీ ద్విపద వికార గేయరచనగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ కావ్యంలో ద్విపదకు వాడవలసిన గణాలను చాలా చోట్ల వాడలేదు. జదావారణకు ఎగుభుజ మ్ములవాడు మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు గరగరని వాడు చక్కని వాడు నతడు వెన్నున మచ్చగల విభవంబు వాడు... పై పాదాలలో రెండుసార్లు 'నలలిను (న్నడుముగల, గరగరని) వాడటం జరిగింది. ఒక “భలిను (మచ్చగలు) కూడా వాడటం జరిగింది. పంచమాత్రాగణమైన 'నలలిను, “భలి ను కూడా ఇంద్రగణంగా అంగీకరిస్తే అప్పుడవి ద్విపదపాదాలే అవుతాయి. మొత్తం మీద ద్విపదను పూర్వాంధ్ర కవులు గేయఛందస్సుగా కూడా వాడినారని చెప్పడానికి పల్నాటి వీరచరిత్ర, సుభద్రాకల్యాణం దృష్తాంతాలుగా కనిపిస్తున్నాయి. గోనబుద్దారెడ్డి రచించిన రంగనాధరామాయణం, కట్టా వరదరాజు రాసిన రామాయణం -- ఈరెండు ద్విపద కావ్యాలలో కొన్నిచోట్ల గేయత్వం అధికంగా (శ్రుతమైనా, అవి గేయమే కాక పార్యం కూడా అవుతాయి. లాక్షణికులు ద్విపదను పద్యఛందస్సుగా పేర్కొన్నా కవులు ద్విపదను అటు గేయంగాను, ఇటు పద్యంగాను రచించినారు. ఉదాహరణ వాజబజయం ఉదాహరణ వాబ్బయంలో అక్షర, మాత్రా ఛందస్సులను నియతంగా సమావేశ పరచడం ఉన్నది. మార్గ, దేశి స్రవంతుల కూడలి స్థానం (మొత్తం ఎనిమిది విభక్తులు) ఒక్కొక్క విభక్తికి ఒక పద్యం, తర్వాత ఒక రగడ, ఆ తర్వాత అర్ధరగడ చెవ్వాలి. ఆ తర్వాత నార్వవిభక్తికంగా ఒక పద్యమూ, అంకితాంక పద్యమూ చెప్పాలి. పద్వాలు, రగడలు, అర్ధ రగడలు కలిపి మొత్తం 26 ఉంటాయి. స్థూలంగా ఉదాహరణ లక్షణమిది,. ఉదాహరణ కావ్యంలో రగడలు, అర్ధరగడలను కళికోత్మళికలు అంటారు. కళిక పూర్తి రగడ. ఉతృళిక అర్ధరగడ, కళికోత్మళికలు తాళలలయా్థ్రితాలైన గేయభేదాలు. ఉదాహరణ

ఆధునికాంధ్ర గేయ కదిశ్వం 4] కావ్యంలో కళికోత్మళికలను తాళ ప్రధానంగా రచిస్తారు. పద్యాలనూ, తాళ ప్రధానాలైన కళికోత్క్మళలికలను ఒకదాని తర్వాత ఒకటి రచించడంవల్ల ఉదాహరణ కావ్యంలో సంగీత సాహిత్యాల సమ్మేళనం గోచరమవుతుంది. మొత్తం 26 పద్యాలలో 16 రగడ భేదాలైన కళికోత్మళికలు 10 పద్యాలు ఉంటాయి.

ఉదాహరణం భగవత్‌స్తోత్ర ప్రధానమైన కావ్యప్రక్రియ. ఉదాహరణ కావ్య ప్రక్రియ విశిష్టమైనదైనా ఎక్కువగా విసృతిని పొందలేదు. ప్రాచీనాంధ్ర సారస్వతంలో ఇంతవరకు ఆరు ఉదాహరణ కావ్యాలే పూర్తిగా లభించినాయి. తెలుగులోను, సంస్కృతంలోను లభ్యమైన మొదటి ఉదాహరణ (గ్రంధం పాల్కురికి సోమనాధుడు రచించిన బసవోదా హరణం, రావిపాటి త్రిపురాంతకుడు రచించిన *త్రిపురాంతకోదాహరణం) ఉదాహరణ వాజ్బ్యయంలో తలమానికమైనది. తాళ్ళవాక పెదతిరుమలయ్య రచించిన 'వెంకటేశ్వరోదా హరణం), చిత్రకవి పెద్దన రచించిన 'హనుమోదాహరణం”, అప్పకవి రచించిన 'కృబ్ణుదా హరణంి, బాలకవి అనంతము రచించిన '“శేషార్వోదాహరణం) పూర్తిగా లభించినాయి. ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ (గోపాలోదాహరణం) ప్రభృతులు కొందరు ఉదాహరణ కావ్యాలు రచించినారు. యక్షగానాలు

పేరును బట్టే 'యక్షగానాలు గాన ప్రధానమైన రచనా ప్రక్రియ అని తెలుస్తున్నది. యక్షగానం గేయ, నృత్య విశిష్టమైన కావ్యప్రక్రియ. యక్షగానం అనేక గేయఛందస్సులను ఇముడ్భుకాన్న ప్రక్రియ. యక్షగానం 'దేశి నాటకమని విమర్శకులు అంటారు. మొదట తోలుబొమ్మల ఆటలు, కొయ్యబొమ్మల ఆటలే క్రమంగా యక్షగానాలుగా పరిణమించి ఉంటాయి.

తెలుగుకవులలో పురాణకవులూ, ప్రబంధకవులూ గేయఛందస్సును నిరాదరించి, పద్య ఛందస్సులలోనే కావ్యాలు రచించినారు. కొందరు పార్యమూ, గేయమూ అయిన ద్విపదకవితను వెలయించినారు. అటు అక్షర ఛందస్సులను, ఇటు మాత్రాఛందస్సులను సమ్మేళనం చేసిన ఉదాహరణ కావ్యాలు రచించినారు. ఈ ఛందః ప్రక్రియలన్నిటీినీ తనలో ఇముడ్చుకొన్న నూతన కావ్య ప్రక్రియ యక్షగానం. యక్షగాన కవులు ద్విపద, సీసం, కందం మొదలైన దేశీయ ఛందస్సులలోనే కాకుండా అక్షర ఛందస్సులలో కూడా తమ ధోరణికి అనుగుణమైన తూగును, నడకను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాత్రా ఛందస్సు ప్రయోగం చేసినారు. ఉదాహరణకు తంత్రముజేసి... తరుణుల జేసుట ధర్మమందురాో ఇది ఉత్పలమాల పద్యపాదం, లక్షణం ప్రకారం భగణం

శి దేయ థికాసం ఉండాలి. కాని భగణం చతుర్మాత్రాగణం కాబట్టి, చతుర్మాత్రాగణమైన “నలిను (తరుణులు ప్రయోగించినాడు. ఇటువంటివి యక్షగానాలనిందా కోకొల్లలు. యక్షగాన కవులకు గణ దృష్టి కంటె గతి దృష్టి ఎక్కువ. కనుక యక్షగానాలు పూర్తిగా గీతి ప్రాధాన్యమున్నవి.

యక్షగానం పూర్తిగా దేశి సాహిత్య ప్రక్రియ. యక్షగ్రానంలో రేకులు దరువులు ప్రధానమైనవి. ఇవి గేయరచనలే. యక్షగానంలోని గేయరచనలు, దేశి రచనలు రగడలలో కొంత మార్పు జరిపి త్రిపుట, జంపె, ఏక, ఆట అనే తాళాలకనుగుణంగా ఉంటాయి. అప్పకవి నవవిధ రగడలను పేర్కొని, వాటిని ఏ మార్పులు చేస్తే ఏ తాళాలకు అను గుణంగా ఉంటాయో తెలిపి వాటిని యక్షగ్రానాలలో ప్రయోగించవచ్చునన్నాడు.*" అప్పకవి పేర్కొన్న ఈ గేయ రచనలే కాక ఇంకా అనేకరకాలైన గేయరచనలు యక్ష గానాలలో చోటు చేసుకొన్నాయి. అవి; ఏలలు, జోలలు, సువ్వాలలు, ఆరతులు, ధవళాలు, చందమామ సుద్దులు, వెన్నెల పదాలు, విరాళి పదాలు, అల్లోనేరేళ్ళు, క్సీస్వ, కందార్థాలు, త్రిభంగులు, ద్విపదలు, టశ్రిపదలు మొదలైనవి.

డా॥ యస్వీ జోగారావు గారు తమ సిద్దాంతవ్యాసమైన “ఆంధ్ర యక్షగాన వాబ్బ్మయ చరిత్రలో యక్షగానాలలోని అనేక గేయఛందస్సులను గురించి గేయరచనలను గురించి సోదాహరణంగా, వివరంగా పేర్కొన్నారు. 58 యక్షగానాలలో దృశ్య, (ఛవ్య కావ్యాల సమ్మేళనం, గాన నాట్యకళల సమ్మేళనం కనిపిస్తాయి. యక్షగానాలను ప్రదర్శన కోసం రచించినవైనా గానానుకూలంగా శ్రవ్యయోగ్యంగా రచించినారు. నాయకరాజుల యుగం గీతికాయుగమని చెప్పవచ్చును. ఆ యుగంలో యక్షగానాలు అసంఖ్యాకంగా వెలువడి గేయవికాసానికి దోహదం చేసినాయి. దండకము

దండకాన్ని ఉద్దురమాలా వృత్తాలలో ఒకటిగా లాక్షణికులు పేర్కొన్నారు. తెలుగులో లయగ్రాహి మొదలైన మాలావృత్తాలకు మాత్రాగణనం చేయడం జరిగింది. కనుక మాలికావృత్తాలు మాత్రాఛందస్సుకు చెందినవని చెప్పవచ్చు. వృత్తానికి నాలుగు పాదా లుండటం నియతం. దండకాన్ని కూడా వృత్తంగానే చెప్పడం వల్ల, దండకానికి కూడా నాలుగు పాదాలుండాలి. అయితే దండకం ఒక పాదంతోగాని, నాలుగు పాదాలతో గాని రచించవచ్చునని సంస్కృతాంధ్ర లాక్షణికులు చెప్పినారు. కాని తెలుగులో ఏకపాద దండకాలే ఎక్కువగా ఉన్నాయి. నగణద్వయం మీద ఇష్టం వచ్చినన్ని రగణాలు చెప్పడం సంస్కృత దండక లక్షణం. తెలుగులో వచ్చిన దందకాలను పరిశీలిస్తే తగణమో, రగణమో, యగణమో, నగణమో, సగణమో ఉన్న దండకాలు కనబడుతున్నాయి.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 4 తెలుగులో తగణ దండకాలే ఎక్కువ. భ, జ, మ-ఈ మూడు గణాలతో దందకాలు తెలుగులో కనబడటం లేదు. మొత్తం మీద ఏదో ఒక్క గణమే ఆవృత్తి అవుతూ ఉంటుంది. కొన్ని దండకాలలో మొదటి ఒకటి, రెండు, మూడు గణాలు భఖిన్నగణాలు ఉంటాయి. ఆ తర్వాత ఏదో ఒక గణం మాత్రమే ఆవృత్తి అవుతూ ఉంటుంది. ఏకగణావృత్తి దండకానికి ప్రధాన లక్షణం,

దండకానికి పాదబద్ధత లేదు. కాబట్టి దండకం పద్యం కాదు. ఇది గేయమో, వచనమో అవుతుంది. దండకానికి గణబద్ధత ఉంది. కాబట్టీ వచనం కూడా కాదు. గేయాలకు పాదబద్ధత ఉండదు. దండకంలో ఏకగణావృత్తి ఉంటుంది. కనుక అక్షర సంఖ్యతో పాటు మాత్రా సంఖ్య కూడా సమానంగా ఉండి గేయగతి శుతమవుతుంది. కనుక దందకాన్ని గేయంగానే పరిగణించవచ్చు.

దండకాన్ని తెలుగు కవులు కావ్యాంతర్గతంగాను, ప్రత్యేక కావ్యాలు గాను రచిస్తూ వచ్చినారు. కావ్వాంతర్గతంగా రాసిన దందకాలలో నన్నయ భారతంలో రాసిన దండకం మొదటిది. ప్రత్యేక కావ్యంగా రాసిన దందడకాలలో పోతన భోగినీ దండకం ప్రధమ దందకమేకాక (ప్రశస్తమైనది. తెలుగులో దండక రచన విరివిగానే సాగింది. పదకవిత

పదం విషయంలో సంగీత విద్వాంసులు నిర్వచనమేమైనప్పటికీ, కవిత్వానికి సంబంధించినంత మట్టుకు శుదం' అనే మాటను విస్ఫతార్థంలోనే గ్రహించాలి. తాళ్ళవాక అన్నమాచార్యుని కాలం నాటి నుంచి గేయం సంగీతంతో సంబంధం కలుపుకొని పద కవితగా పరిణమించింది. సంగీత, సాహిత్యాల బాంధవ్యం బలపడుతున్నకొద్దీ సాహిత్యం సన్నగిల్లి, సంగీతానికే సర్వాధిపత్యం లభించింది. ఆ దశలో సాహిత్యం సంగీతానికి ఒక వాహికగా మాత్రమే తోడ్పడింది. తాళ్ళవాక అన్నమాచార్యుల గేయ రచనలలో సంగీతం కంటె సాహిత్యం ప్రాధాన్యం వహించగా క్షేత్రయ్య గేయరచనలలో సంగీత సాహిత్యాల సమ్యక్‌ మేళనం కనిపిస్తుంది. త్యాగరాజ కృతుల నుంచి పదకవితలో సంగీతం పాలు అధికమవుతూ వచ్చింది. తాళ్ళవాక కవులు

తాళ్లవాక అన్నమాచార్యులకు (1442-1503) పూర్వం పదకవిత లేకపోలేదు. కాని అదంతా జానపద పదకవిత. ఆశుకవితా సంప్రదాయానికి చెందినది. అన్నమయ్య లిఖిత సంప్రదాయానికి, సంగీత సంప్రదాయానికి చెందిన పదకవితకు పాదులువేసినాడు. జానపద పదకవితా స్వరూపాన్ని ఆకళించుకొని పదకవితకు సురూపం కల్పించినాడు.

తలే గేయ వికౌస్రం అన్నమయ్య జాజరలు, చందమామ పదాలు, తుమ్మెద పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, దంపుళ్ళు, తందానలు మొదలైన అనేక జానపద గేయరీతులను ఉద్ధరించడమేకాక వాటి లక్షణాలు తెలిపే సంకీర్తన లక్షణ గ్రంథాన్ని సంస్క తంలో సంతరించినాడు. అన్నమయ్య రచించిన సంకీర్తన లక్షణ గ్రంధం లభించకపోయినా అతని మనుమడు తాళ్ళపాక చినతిరుమలాచార్యులు తెలుగులోకి అనువదించిన సంకీర్తన లక్షణ [గ్రంధం లభించి ఉండక పోతే పాల్కురికి పేర్కొన్న పదకవితల పేర్లతోనే తృప్తిపడ వలసివచ్చేది. ఆనాటి పదకవితల తీరులూ, తియ్యందనాలూ ఎట్లా ఉందేవో ఊహించ ధానికి కూడా అవకాశం ఉందేది కాదు.

తాళ్ళపాక వంశంలో అన్నమయ్య ఒక్కడే కాదు. అతని తర్వాత మూడు నాలుగు తరాలవారు కూడా శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పదకవితల పుష్పహారాలు అల్లుతూ వచ్చినారు. సంగీత సాహిత్యాలకు సమహ్రాధాన్యమిచ్చే పదకవితా పద్ధతిని పుట్టించి పోషించి నిలిపిన కీర్తి తాళ్ళపాక పదకవిత్రయానికే దక్కుతుంది. తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తండ్రివలెనే కొన్ని వేల సంకీర్తనలు వెలయించినాడు. ఇతడు శృంగార సంక్తీర్తనలు, అధ్యాత్మ సంకీర్తనలు, సుదర్శనరగడ మొదలైన రచనలు చేసినాడు. తాళ్ళపాక చిన తిరుమలాచార్యులు తాతగారైన అన్నమయ్య సంకీర్తన లక్షణ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించడమేకాకుండా అన్నమయ్యనే దైవసమానునిగా భావించి, అతని మీద సంకీర్తనలు రచించినాడు. తాళ్ళపాక వంశంలోని వారందరూ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కొన్ని వేల సంకీర్తనలతో కీర్తించి నోరార పాడుకున్నారు. క్షేత్రయ్య పదాలు 1600-1680)

పద సాహిత్యంలో క్షేత్రయ్య ముద్ర ప్రగాధమైనది. అతని మువ్వ గోపాలుని పదాలే పదాలుగా ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. పదకవిత ఏనాడో అన్నమయ్యతో ఆరంభమైనప్పటికీ, క్షేత్రయ్య పదాలవల్లనే పదానికి సంగీత విద్వాంసులు సరికొత్త నిర్వ్చచనమిచ్చుకోవలసివచ్చింది. అన్నమయ్యవి సంకీర్తనలని, క్షేత్రయ్యవి పదాలని, త్యాగయ్యవి కృతులని, రామయ్యవి (రామదాసు) కీర్తనలని వ్యవహరించటం సంగీత ప్రపంచంలో రూఢమైపోయింది. పదమంటే క్షేతయ్యగా, క్షేతయ్యేపదంగా ్రసిద్ధికెక్కినాడు.

ఆదిమ కాలంలో నాట్యానికి, సంగీతానికి, కవిత్వానికీ ఉత్పత్తి ఒక్కచోటే, ఒక్కసారే జరిగినప్పటికీ, రానురాను అవి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, సమాంతరంగా ప్రవహిస్తూ వచ్చినా, క్షేత్రయ్య పదాలలో అవి మళ్లీ త్రివేణి సంగమాన్ని పొందినాయి. గేయచ్చందోనిబద్ధమైన పదాలలోని సాహిత్యాన్ని రాగతాళాలకు అనుగుణంగా పాడటమే

ఆధునికాంధ్ర గేయ కఖిర్వం తేన కాకుండా, ఆంగిక విన్యాసం ద్వారా అభినయించడానికి అనువుగా పదరచన చేయడం క్షేత్రయ్యతోనే ఆరంభమైంది.

నారాయణతీర్చులు సంస్క తంలో రాసిన కృష్ణలీలాతరంగిణి, సిద్ధేంద్రయోగి భామాకలాపం క్షేత్రయ్య పదాలకు ఒరవడి పెట్టినాయి. జయదేవుని అష్టపదులలోని పదమాధుర్యమూ, భావసౌందర్యమూ, నాదసాఖ్యమూ క్షేత్రయ్య పదాలను తీర్చిది ద్దైనాయి. క్షేతయ్య వివిధ క్షేత్రస్థలాలను దర్శించి, ఆ వేలుపుల పేర్లమీద పదాలు రచించినాడు. వేలుపుల మీద కాక మధుర తిరుమలేంద్రుడు, తంజావూరి విజయరాఘవుడు, గోల కొండ పాదుషా మొదలైన ప్రభువుల మీద కూడా పదాలు రచించినాడు. క్షేత్రయ్య నాలుగువేలకు పైగా పదాలు రచించినాడట. వాటిలో నాలుగు నూర్ల పదాలు మాత్రమే లభించినాయి. ప్రధానంగా సంగీత విద్వాంసులు క్షేత్రయ్య పదాలను మూడు విధాలుగా విభజించినారు. 1. మువ్వగోపాల పదాలు 2. విజయరాఘవుని మీది పదాలు 3, మధుర తిరుమలేంద్రుని మీది పదాలు.

క్షేత్రయ్య పదాలు అతని సమకాలికులైన విజయరాఘ వునికి, పసుపులేటి రంగాజమ్మకేకాక, అతని తర్వాతి పదకర్తలైన మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, సారంగపాణి, సభాపతయ్య, పరిమళరంగ పదకర్త, యువరంగడు, ఘనం శీనయ్య మొదలైన వారెందరికో ఒజ్జబంతులైనాయి. భక్త రామదాసు కీర్తనలు 1620-1680)

తెలుగు దేశంలో ఏ మారుమూల పల్లెకు వెళ్ళినా, ఏ రామమందిరంలో భజనగోష్టి జరుగుతున్నా రామదాసు (కంచెర్ల గోపన్న కీర్తనలు వినబడకుండా ఉండవు. పామరులు సెతం రామదాసు కీర్తనలు భక్తిపారవశ్యంతో పాడుకొంటున్నారంటే ఆ గేయాల నాదమాధుర్యమూ, భావగాంభీర్యమూ, భక్తితత్పరతా కారణం.

రామదాసు కీర్తనలు పామరులలో సైతం వ్యాపించగా, తెలుగునాట భజనకీర్తన సంప్రదాయం ఏర్పడింది. తెలుగుదేశంలో భజనగోష్టులు బర్పడటానికి రామదాసు క్రీర్తనలే ముఖ్యకారణమని చెప్పాలి. రామదాసు నెలకొల్పిన ఈ భజనకీర్తన సంప్రదాయాన్ని యాదవదాసు, సింగరిదాసు, తూము నరసింహదాసు, ఎడ్ల రామదాసు మొదలైనవారు కొనసాగించినారు. రామదాసు కాలంలో ఏర్పడిన భజనపద్ధతి సంప్రదాయం ఆధునిక కాలం వరకూ కొనసాగి, ఆధునిక గేయకవితా వికాసానికి దోహదమిచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కంచర్ల గోపన్న రామనామాన్ని కీర్తించి తరించి భక్త రామదాసు అయితే, ఆ రామదాసు చరిత్రను తదనంతర కవులు హరికథలుగాను, యక్షగానాలుగాను రచించి ఆబాలగోపాలాన్ని తరింపజేసినారు.

జ్‌ రేయి వికాధం

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి వేదాంత తత్త్వ ప్రతిపాదకమైన అధ్యాత్మ రామాయణ కథ ఆరు కాండలను 104 కీర్తనలలో రచించినాడు. సంకీర్తనాత్మకంగా అన్నమాచార్యులు ప్రారంభించిన గేయం అధ్యాత్మ రామాయణంలో కధనాత్మకంగా పరిణమించింది. గేయకవితా పరిణామంలో ఇదొక ముఖ్యమైన ఘట్టమని చెప్పవచ్చు. మొట్టమొదటి రామాయణ గేయకావ్యం అధ్యాత్మరామాయణమే అని చెప్పవచ్చు. సంకీర్తన రూపంలో రచింపబడిన ఈ గేయకావ్యం రామదాసు కీర్తనల తర్వాత పామరజనులలో సైతం (ప్రశస్తికక్కింది. సుబ్రహ్మణ్యకవి కీర్తనలే కాక, కొన్ని పదాలు కూడా రచించినట్లు తెలుస్తున్నది. *దామెర్లవారి పదాలు” అనే పదాలు సుబ్రహ్మణ్యకవి రచించినవేనని దా! తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు తెలియజేసినారు.

నాయకరాజుల కాలం, ఆ తర్వాత మహారాష్ట్ర రాజుల కాలం పదకవితకు పట్టుగొమ్మ. ఆంధ్రసాహిత్య చరిత్రలో అదొక గీతికాయుగం. ఆ యుగంలో వెలసిన కవులందరూ పదకవితను, యక్షగాన ప్రక్రియను చేపట్టక తప్పలేదు. ఆ యుగప్రభావ మటువంటిది. తంజావూరు నాయకరాజులలో విజయరాఘవనాయకుడు పదకవితకు పచ్చని పందిళ్ళు వేయించినాడు. విజయరాఘవుని పదకవితకు క్షేత్రయ్యే గురువు. క్షేతయ్య విజయరాఘవుని మీద 12 పదాలు చెప్పినట్లు తెలుస్తున్నది. విజయరాఘవుడు గోపికాగీతలు, భ్రమరగీతలు, రగడ, చౌపదులు, సాంగత్యపదాలు, ఎలలు, దరువులు, సంకీర్తనము, అధ్యాత్మలు మొదలైన గేయ ప్రబంధాలు రచించినట్లు తెలుస్తున్నది. పసుపులేటి రంగాజమ్మ రచించిన మన్నారుదాస ఏలాసంలో విజయ రాఘవుని మీద కొన్ని పదాలు చెప్పింది. ఈమె ఒక్క తెలుగులోనేకాక అష్టభాషలలోను విజయరాఘవుని మీద పదాలు చెప్పింది. విజయరాఘవుని పదాలుగాని, రంగాజమ్మ పదాలుగాని చాలా వరకు క్షేత్రయ్య పదాలలోని నుడికారంతో, అనుప్రాసలతో, భావాలతో పోటీపడి చాలా మధురంగా ఉంటాయి.

నాయకరాజుల అనంతరం తంజావూరునేలిన మహారాష్ట్ర రాజులు కూడా తెలుగుభాషను ఇతోధికంగా ప్రోత్సహించడానికి కారణం తెలుగు పదకవితా మాధుర్యమే. మహారాష్ట్ర రాజులు తమ మాతృభాష మరాఠీ అయినా, పాలించేది తమిళ ప్రాంతమైనా తెలుగు పదకర్తలను, కవులను ప్రోత్సహించడమేకాకుండా తామే స్వయంగా పదాలు, యక్షగ్రానాలనెన్నిటినో రచించడం ఒక విశేషం. మహారాష్ట్ర రాజులలో శాహజీ మహారాజు అనేక యక్షగానాలు రచించడమే కాకుండా “శంకరపల్లకి సేవా ప్రబంధము, “విష్ణుపల్లకి సేవా ప్రబంధము అనే రెండు కావ్యాలు దరువులతో కూడిన పదకవితల కావ్యాలను రచించినాడు. శాహజీ ఆస్థానంలో ఉన్న గిరిరాజు ప్రసిద్ధ వాగ్గేయకారుడు. గిరిరాజు మనుమడే త్యాగరాజు.

ఆధునికాంధ్ర గేయ కవివ్యం తా త్యాగరాజు కృతులు

“తన గీతి యరవజాతిని పాటకులనుగా, దిద్ది వర్టిల్లిన తెనుగువాణి”” అని రాయప్రోలు సుబ్బారావుగారు స్వభాషాభిమానంతో సగర్వంగా అనగలిగినాడంటే, “సుందరాం(ధ్రపదమ్ము పాడుతూ, సింధునదిని పడవ నడుపుదాంగ”* అని తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించినాడంటే దానికి కారణం తెలుగు పదకవితా సరస్వతికి అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య మొదలైన పదకర్తలు చేసిన సేవే. త్యాగరాజు తనకృతుల ద్వారా తెలుగు భాషను భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాఫింప జేసినాడు. కర్దాటక సంగీతంలో తెలుగుభాష ప్రాముఖ్యానికి రావడానికి త్యాగయ్యే (ప్రధాన కారకుడు. త్వాగరాజు కృతులలో సగానికిపైగా రామునికి సంబంధించినవే. వాల్మీకి రామాయణాన్ని 24000 శ్లోకాలు రాయగా, త్యాగరాజు కూడా 24,000 కృతులు రాసినాదని ప్రతీతి. త్యాగరాజు కృతులనేకాక (ప్రహ్లాద భక్తివిజయం, నౌకాచరిత్రం అనే గద్య, పద్య, గేయాత్మకాలైన ఉత్తమ సంగీత నాటకాలను రచించినాడు. వాటిని గేయనాటకాలుగానే పరిగణిస్తున్నారు.

త్యాగరాజు సమకాలికులైన శ్యామాశాస్త్ర, ముత్తుస్వామి దీక్షితులు తెలుగులో కూడా కొన్ని పదకృతులు రచించినారు. కర్ణాటక సంగీతంలో త్యాగరాజు, శ్యామాశాస్త్రి ముత్తున్వామి దీక్షితులు-ఈ ముగ్గురినీ సంగీత త్రిమూర్తులని, రత్నత్రయమని పిలున్తారు. త్యాగరాజుగాని, త్యాగరాజు తర్వాతగాని వచ్చిన వాగ్గేయకారులు ధాతుకల్పనలో శ్రద్ధ చూపినారు. సాహిత్యాన్ని అంతగా పట్టించుకోలేదు. కనుక వాటిని పదకవితలనడంకంటేె కేవల సంగీత రచనలుగానే భావించి వారి రచనలను గురించి ప్రస్తావించడం లేదు.

అన్నమాచార్యుల నుంచి త్యాగరాజు వరకు పదకవితా పరిణామాన్ని పరిశీలిస్తే అవగాహనకు వచ్చే విషయాలివి. పదరచన రసభావయుతమైన రాగవిసృతికీ, నాట్యాభిన యానికీ చాలా దోహదం చేసింది. అన్నమాచార్యుల సంకీర్తన పదాలలో సాహిత్యానికే ప్రాధాన్యం. సాహిత్యంలోని భావకల్చ్పనకు అనుగుణమైన సరళ సంగీత రచన ఉండేది. క్షేత్రయ్య పదాలలో పదస్వరూపం పరిపూర్ణమై, సంగీతమూ, సాహిత్యమూ సమానమైన ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. భక్తరామదాసు కీర్తనల ప్రాచుర్యంవల్ల తెలుగు దేశంలో భజన కవితా పద్ధతి నెలకొన్నది. త్యాగరాజు పదకృతులలో ధాతువు జీవాతువు, మాతువు అప్రధానం. త్యాగరాజు కృతులవల్ల తెలుగుదేశంలో సభా సంప్రదాయం (కచ్చేరి) విస్తృతమైనది,

గి గేయ వికాసం సంధియుగం - గేయ వికాసం తాత్విక గదేయాలు-కాలజ్ఞాన తత్వాలు

త్యాగరాజు నుంచి గురజాడ అప్పారావు (ఆధునిక యుగారంభం) వరకు సంధియుగంగా పరిగణించి, సంధియుగంలో జరిగిన గేయ వికాసాన్ని రేఖామాత్రంగా సమీక్షిస్తాను. అన్నమాచార్యాదులు తీర్చిదిద్దిన పదకవితాపధం శిష్పులను మాత్రమే అటు భక్తివైపునకో, ఇటు రక్తివైపునకో తీసుకొని వెళ్ళింది. కాని వామరుల జ్ఞాన పిసాసను, ముక్తివాంఛను తీర్చలేకపోయింది. ఒక్క భక్త రామదాసు కీర్తనలు మాత్రమే అటు శిష్టులకూ, ఇటు పామరులకూ భక్తిదాయకాలైనాయి. పామరులను ఆధ్యాత్మికపధంవైపు నడిపించడంలో కాలజ్ఞాన తత్వాలు వంటి తాత్విక గేయాలు కాలిబాటల వంటివైనాయి. పామరులలో కొందరు ఆ కాలిబాటల వెంట కొంత దూరం పయనించి, ఆధ్యాత్మిక గహనాంతర సీమలలో గమ్యం తెలియక, తెలిసీతెలియని అయోమయంలో పడిపోతే, మరొకొందరు ఆ తత్తాల పరమార్ధాన్ని ఒంటపట్టించుకొని యోగులైనవారు లేకపోలేదు. ఏమైనా సంసారసాగరంలో సాగిపోతున్న పామరుల జీవితాలలో ఆటుపోటులెదురైనప్పుడు ఈ పాటలే రవంత ఊరడించినాయి. నిరాశా నిస్బృహలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, జీవితం నిస్సారంగా తోచినప్పుడు ఈ పాటలే భక్తినీ, వైరాగ్యాన్నీ ప్రబోధించి, వారిని ఉన్నత పధాలవైపు నడిపించినాయి.

ఈ తత్త్పకర్తలకు భాషపట్ల, ఛందస్సుపట్ల పెద్ద పట్టింపు ఉందేది కాదు. ఏవో కొన్ని ప్రసిద్ధమైన జానపద గేయాల వరుసలను దృష్టిలో పెట్టుకొని తత్వాలను అల్లేవారు. ఈ తత్త్వగీతాలలో భాషకూడా చాలా వరకు జానపదులభాషే. ఆనాటి వ్యావహారిక భాషా పరిశీలనకు కూడా ఈ తత్తాలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ రకమైన తత్తాలలో యోగి వేమన వని చెప్పే తత్వాలు, పోతులూరి పీరబ్రహ్మంగారి కాలజ్ఞానతత్తాలు ఆత్మబోధామృత తత్వాలు ప్రసిద్ధమైనవి. వేమన, బ్రహ్మంగారల కాలనిర్ణయం వివాద (గ్రస్తమైనది. వారి తత్తగీతాలకూ, ఆ ఒరవడిలో రాసిన తత్త్వగీతాలకూ గత శతాబ్దిలో విశేషమైన ప్రాచుర్యం ఉండేది. యోగి వేమనదనే చెప్పే ఒక తత్వాన్ని కింద ఉదాహరిస్తున్నాను.

జాతర జాతర జాతర సుమ్మీ జాతర తీతుడు వేమన సుమ్మీ వేదాతీతుడు వేమన సుమ్మీ వేమన చెప్పిన వేదము సుమ్మీ వేద శాస్త్రములు వాదులు సుమ్మీ వాదుల నోళ్ళకు బూదిడు సుమ్మీ

అధునికాంధ్ర డేయ కవిత్వం వ ఈ రకంగా సాగిపోతాయి ఈయన తత్పగ్గీతాలు. వాటిలో నిజంగా ఆయన రాసినవేవో, ఇతరులు రాసినవేవో నిర్ణయించడానికి ఆధారాలు లేవు. ప్రాచీనకాలంలో కూడా ఏగంటీ వారు, బాపసనయ్య, నందమయ్య మొదలైన వారు ఈ రకమైన తత్వగీతాలను చెప్పిఉన్నారు. ముఖ్యంగా పోతులూరి వీరబ్రహ్మంగారే ఈ రకమైన తత్పాలకు ఒరవడి పెట్టినారు. పోతులూరి వీరబ్రహ్మంగారు, ఆయన ప్రియశిష్యుడైన దూదేకుల సిద్ధప్ప, ఆయన మనుమరాలైన ఈశ్వరమ్మ, ఇంకా ఆయన శిష్యపరంపరలోని వారు కొందరు చెప్పిన తత్వాలను కలిపి కాలజ్ఞాన తత్త్వాలు అని అంటారు. బ్రహ్మంగారి తత్వాలను ఈనాటికీ బైరాగులు, బిచ్చగాళ్ళు రైలు కంపార్చుమెంట్‌లలోను, బస్‌స్తాండ్‌లలోను పాడుతూ జీవయాత్ర సాగిస్తున్నారంటే వాటికెంత విశేష ప్రాచుర్యం ఉందో తెలుస్తుంది. బ్రహ్మంగారి తత్వాలలో వెప్పలేదంటనక పొయ్యారు నరులారి, “తియ్యని మామిడిపండు, పండు తినబోతే దొరకాదు తీపులు మెండు...” “చిల్లర రాళ్ళకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర వారే వొరే” మొదలైనవి ప్రశస్తమైనవి. దూదేకుల సిద్ధప్ప తత్తాలలో “ఏకులమని నను వివరమడిగితే యేమని తెలుపుదు లోకులకూ” అనే తత్త్వం చాలా ప్రసిద్ధమైనది. బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్పాల తర్వాత గుజ్జల నారాయణదాసు “తారాకామృత సారమూ, “ఆత్మబోధామృతమూ), బేతపూడి పరబ్రహ్మదాసు “బ్రహ్మానంద సంకీర్తనలు, యల్లమదాసు “గురుజ్ఞానామృతమూ”, గోపం జగన్నాధం 'అద్వెత కీర్తనలూ", బీబీపేట హనుమయ్య “జ్ఞాన బోధాధ్యాత్మలూ”, గొల్లపూడి రామలింగశా'స్తులు 'శివైకాంతసేవ), భోజదాసు 'అచల సద్దురు సంకీర్తనలూ, బ్రహ్మానంద సరస్వతీ స్వామి 'ముక్తికాంత ఎరుకు మొదలైన తాత్విక గేయరచనలు ప్రసిద్ధమైనవి. 19వ శతాబ్దం తొలిభాగంలో ఉండిన తత్వకర్తలలో చెప్పుకోదగినవాడు నిట్టల ('ప్రకాశదాసు. ఇతడు గత శతాబ్దిలో నివసించిన గొప్పయోగి. వీరితత్వాలు ఇతర తత్ప్వకర్తల తత్వాలంత క్లిష్టంగా, దుర్చోధకంగా ఉండవు.” వీరు సరళమైన సంకేతాలతో, తేటతెలుగు మాటలతో తత్ప్వార్ధాన్ని తేటపరుస్తారు. ఉదాహరణకు గాలిపటమురా జీవా, గాలి నిలిచినంతలోనె కూలిపోవు ధరణిలో జాలమేల చేసేవుర.... ఈ రకంగా సాగిపోతాయి. “గూటి చిలకేదిరా అన్నా....” అనే తత్త్వం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఈయన అటువంటి తత్పాలేకాక, భజన కీర్తనలు కూడా రచించి

యో 'లరాలయ న; భల యే ౮0 . గీ ౧౫! వదదమణ ం. గేయ వికాస్రల ఊరూరా తిరిగి నం కస్పస్తూ పామరులలో వీటికి విశేష ప్రాచుర్యం కల్పించినారు" = ఆయా గత శతాబ్దిలో నివసించిన మవాభక్తులలో ఎడ్ల రామదాసు ఒకడు. అన్నిటా భక్తరామదాసుకు దీటైనవాడు. బ్రహ్మంగారి తత్వాల తర్వాత ఈయన తత్పాలకే ఆంధ్రదేశంలో అధిక ప్రాచుర్యమున్నది. 110 కీర్తనలతో “సుజ్ఞాన చంద్రిక అనే తత్వగీతాలను రచించినాడు. ఎడ్ల రామదాసు రచించిన తత్తాలను, ఆయన తత్తాలను అనుసరిస్తూ రచించిన తత్పాలను '“ఆత్మబోధామృత తత్వాలు అంటారు. ఎడ్ల రామదాసు రచించిన తత్పాలలో “జీవమా మెలుకొనవే”, “అనుమాన మెందుకే మనస, ఈ తనువు నిత్యముగాదు హంస”, “దిని భావము తెలియవలెనన్నాా నీలోను బ్రహ్మము పూని కనుగొనవలెను వినుమన్న “ఏమి జన్మం బేమి జీవనమూ-యీ మాయకాయము" మొదలైన తత్త్వాలు ప్రశస్తమైనవి. ఈ ధోరణిలో చెర్విరాల బాగయ్య వంటి తత్ప్వకర్తలు తత్వగీతాలను రచించి గేయరీతులను అవిచ్చిన్నంగా నిలుపుతూ వచ్చినారు, హారికథలు యక్షగానాలే హరికథలుగా పరిణమించినాయి. యక్షగానాలు బహువ్యక్తికాలైతే, ఎకవ్యక్తికమై బహుప్రాతాఖినయంతో చేసే సంగీతోపన్యాసము హరికథ. దృశ్య, (శ్రవ్య, కావ్య సంప్రదాయాలను ఏకత్రా జోడించి, ఏకపాత్రోన్నుఖంగా వెలువడినవే హరికధలు. యక్షగానం నాటకీయ గతిలో సాగుతూ నటనానుకూలమై ఉంటుంది. హరికథలో ప్రత్యేకించి కధాకధనం ఉంటుంది. ఈ కధాకధనంలో యక్షగానాలలో ఉపయోగించే కందార్థాలు, దరువులు, సంవాదాలు మొదలైన గద్య, గేయఛందస్సులేకాక, తోహరాలనే ఆఖ్యానగేయాలు ప్రాధాన్యం వహించినాయి. హరికధలకు ఆంధ్రప్రదెశంలోనేకాక దక్షిణ భారతదేశంలోను, మహారాష్ట్రంలోను ప్రాచుర్యం ఎక్కువ. తమిళులు హరికథలను 'కాలక్షేపోలంటారు. మహారాష్షులు వీటిని “అభంగ్‌' లంటారు. కుశలవులు పాడిన రామాయణం మొట్టమొదటి హరికథగా పరిగణిస్తారు. ఆధునిక హరికధలు వెలువడిన పూర్వం గోగులపాటి కూర్మనాధకవి రచించిన 'మృత్యుంజయ విలాసం” ఓబయ్య రచించిన “గరుడాచల మాహాత్యం” మొదలైన యక్షగానాలను, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రచించిన “అధ్యాత్మ రామయణ సంకీర్తనిలను హరికధలుగా చెప్పుకొనేవారు. హరికధలలో మొట్టమొదట చెప్పుకోవలసింది తాళ్లూరి నారాయణకవి రచించిన “మోక్షగుండ రామాయణం.” మోక్షగుండ రామాయణం శైలి సులభంగా ద్రాక్షాపాకంలో ఉంటుంది. “'తోహరాలు” రగడలు, పంచచామరాది వతాలతో

ఆధునికాంధ్ర దేయ కనిత్వల 5] 8, 4 చరణాలకంటె ఎక్కువగా ఉండక, అంత్యానుప్రాస యమకాది నియమాలతో పండిత పామర రంజకంగా ఉంటాయి. మోక్షగుండ రామాయణంలోని కీర్తనలను ఈనాటికీ స్త్రీలు పాటలుగా పాడుకొంటున్నారంటే, ఆంధ్రదేశంలో దినికి గల ప్రశస్తి వేరే చెప్పనక్కరలేదు. తాళ్లూరి నారాయణకవి తర్వాత హరికధ ఆంధ్రదేశంలో అతిశీఘంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. అన్ని ప్రాంతాలలోను హరిదాసులు బయలుదేరినారు. సింగరిదాసు, నరసింహదాసు, సంగడిదాసు మొదలైనవారు అనేక హారికధలు రాసినారు. వీరి తర్వాత ఆంధ్రదేశమంతటినీ హరికధా గానంతో ఉ(రూతలూగించిన మహాప్రతిభాశాలియైన వాగ్గేయకారుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. బహుముఖ (ప్రతిభాశాలి ఆదిభట్ల నారాయణదాసులో గానం, నృత్యం, కవిత్వం ఈ మూడూ మూర్తీభవించినాయి. వీరు నెలకొల్పిన హరికధా సంప్రదాయంలో కధా గానంలో నృత్యం విశిష్టస్టానం సంతరించుకొన్నది. ఆదిభట్ల నారాయణదాసు జానకీ శపథం, రుక్కిజణీకల్యాణం, ప్రహ్లాదచరిత్ర, యధార్థ రామాయణం మొదలైన హరికథలు రచించడమే కాక ఎందరో హరికధకులను తీర్చిదిద్దినారు. ఆదిభట్ల నారాయణదాసు శిష్యులమని చెప్పుకోవడమే గొప్పగా ఉండేది ఆనాటి కధకులకు. హరికధలలో ఆదిభట్ల నారాయణదాసు నెలకొల్పిన సంప్రదాయమే నేటికీ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తున్నది. నారాయణదాసు అనేక హరికధలు రచించడమేకాక బుగ్వేదాన్ని అచ్చతెలుగులోకి అనువదించి స్వరపరచినాడు. ఈ గ్రంధం పేరు 'మొక్కుబడి'. ఇది ద్విపద ఛందస్సులో ఉన్న దరువులతో కూర్చిన గేయరచన డదావారణకు

చలువ తెమ్మెర పాటు-జగము మేల్మొల్సి

బ్రతుకులకున్వింత -విన్నియం బెట్టి

వెల్ల గుజ్జము ప్రొద్దు-వేల్పు నెక్కించి

వేంచేసే ఐంగారు-వెకువరాణి”

ఉమరుఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగుభాషలలోకి అనువదించినాడు. తెలుగులో వీటిని గేయాలుగా సంతరించడం, నేరుగా పర్షియన్‌భాష నుంచి ఈ రుబాయీలను అనువదించడం చెప్పుకోదగినది. అంతేకాదు రుబాయీలను తెలుగులో అనువదించినవారిలో వీరే ప్రథములు. నారాయణదాసు తర్వాత బాలాజీదాసు, బాగేపల్లి అనంతరామాచార్యులు,

తిరునగరి శేషదాసు మొదలైన వారెందరో అసంఖ్యాకంగా హరికధలు రబించినారు. హరికథలు తెలుగుదేశం మారుమూలలా సామాన్య ప్రజానీకానికి భారతీయసంస్కృతినీ,

52 గేయ వికాసం రామాయణ, మహాభారత, భాగవత కావ్యాల విజ్ఞానసారాన్నీ పంచిపెట్టినాయి. తెలుగు దేశంలో హరికధలు జరుగని పల్లే లేదు, వినని పల్లియుడూ లేడు. గత శతాబ్దిలో హరికధలకున్న ప్రాచుర్యమూ, ప్రాబల్యమూ గమనించిన కధకులు ఈ శతాబ్దిలో కూడా విరివిగానే రచించినారు. అటువంటి వాటిలో స్వాతంత్రోద్యమ సందర్భంలో రచితమైన 'క్రిప్సు రాయబారం), *'వందేమాతరం” మొదలైన హరికధలు పేర్క్శొనదగినవి. నాటకాలలో పాటలు

గత శతాబ్దిలో తెలుగులో నాటక రచన విరివిగా జరిగింది. అంతకు పూర్వం తెలుగులో నాటకాలు లేవు. తెలుగులో రూపక రచన గత శతాబ్ది ఉత్తర భాగం వరకు యక్షగానాల స్థాయికి మించి పెరగలేదు. యక్షగానాలు గీతి ప్రాధాన్యమున్నవి. యక్షగానాలను చూడటానికి అలవాటుపడిన ప్రజలకు, కేవల వచన నాటకాలు రుచించవేమోనని నాటకర్తలు తమ నాటకాలలో పద్యాలూ, పాటలూ చేరుస్తూ వచ్చినారు. ఈ విధంగా షందొమ్మిదో శతాబ్దిలో తెలుగులో గసయరచన మరొక ముఖ్యమైన పరిణామాన్ని పొందింది. నాటకాలలో పాటలు ప్రవేశపెట్టడానికి మరొక కారణం కూడా ఉన్నది. ధార్వాడ కంపెనీ వారు తమ నాటకాలలో పార్చీ, మరారి మట్టలలో పాటలు సమకూర్చేవారు. ధార్వాడ కంపెనీవారు ప్రదర్శించే నాటకాలలో భాష అర్ధం కాకపోయినా, పాటలకోసం ప్రజలు విరగబడి చూసేవారు. నాటి ప్రజాభిరుచి ననుసరించి తెలుగు నాటకకర్తలు తాము రాసే నాటకాలలో పాటలు చేర్చక తప్పింది కాదు.

సంస్కృత నాటకాలలో పాటలు ఉందవు. త్రస్రగతిలోనో, చతురస్ర గతిలోనో తాళాన్ని అనుసరించి విధించిన నాందిని కూడా సంస్కృతనాటక కర్తలు ఒక వృత్తంగా మార్చుకొన్నారు. (ప్రస్తావనలో నటి చేయవలసిన బుతుగానం కూడా వృత్తాలలోనే ఉంటుంది. రత్నావళి నాటకంలో మాత్రం 'ద్విపదీ ఖండము”, *చర్చరి” అనే రెండు గీతాలున్నాా అవి కూడా నృత్తగాన సన్నివేశం వల్ల వచ్చినవే కాని పాత్రల అభినయానికి సహజంగా తోద్చడేవి కావు. ఆంగ్రంలో ఆద్యంతం పాటలతో నిండి ఉన్న ఓపెరా (0౧౭/2) లనే సంగీత నాటకాలు కూడా ఎక్కువగానే వెలువడినాయి.

సంస్కృతాంగ్ల నాటకరీతులను అవలోడనం చేసిన ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆనాటి ప్రజాభిరుచిననుసరించి తాను రాసిన నాటకాలన్నింటిలోను, ఒక్క అజామిళంలో తప్ప, పాటలు, పద్యాలు ప్రవేశపెట్టక తప్పలేదు. ధర్మవరం వారితోనే తెలుగులో స్వతంత్ర నాటక రచన ఆరంభమైంది. నాటకాలలో భావతీవ్రత ఉన్న సన్నివేశాలలో రసపోషణ నిర్వహణకు పాటలూ, పద్వాలూ కొంతవరకు తోద్చడవచ్చు. ప్రఖ్యాత నాటక కళా విమర్శకులు రాళ్ళపల్లి అనంత కృష్ణ

ఆధునికాంధ్ర గేయ కఠిత్వం న్‌ శర్మగారు నాటకాలలో పాటలకు, పద్యాలకు గల ఆవశ్యకతను గురించి ఇట్లా అభిప్రాయ పడినారు. “సూక్ష్ష్యములైన, తీవ్రములైన ప్రాణి భావభేదములను గానము చూపగలిగినట్లు ఏ యితర కళయు చూపలేదు...ఇట్టి వానిని స్పష్టపణుపవలెనన్న కవిత్వమునూ, అభినయమునూ గానమునకు తోడుగావలయును. ఇట్లై భావ ప్రదర్భ్శనమందు అభినయమునకు కవిత్వమును దానికి సంగీతమును సహాయము గాకున్నచో సంపూర్ణభావ లయము మనకు సిద్ధింపదు.” ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ నాటకాలలో శోకతీవ్రత, భక్త్యావేశం మొదలైన ఉత్కృష్ట భావ సంపద ఉన్న సన్నివేశాలలో పాటలో, పద్యాలో రాసినారు. చాలా సన్నివేశాలకు ఆ పాటలు, పద్యాలు శోభాతిశయం చేకూర్చినాయనడం వాస్తవమే. అయినా ఎన్నో స్థలాలలో వాటి ఆవశ్యకత లేకున్నా; వాటిని కూర్చడం జరిగింది. ఉదాహరణకు సారంగధర నాటకంలో సారంగధరుని మీద వలపు తప్పని తెలిసి ఉన్నా దుర్చలమైన మనస్సును ఆపుకోలేని చిత్రాంగి ఒంటరిగా కూర్చుని “కోరకుమా కోరకుమా కూడని వాని” అని హృదయావేదనను పాటలో వెల్లడించడం సన్నివేశానికి తగినట్లుగానే గంభీరంగానే ఉన్నది. కాని వేటకు పోయివస్తానని రాజరాజనరేంద్రుడు, పోవద్దని చిత్రాంగి మామూలుగా వచనంలో మాట్లాడుకోవలసిన సన్నివేశంలో కూడా పాట ఉన్నది. రాజరాజు వరధరోద్యదురోజ సరోజ విలోచనా కడుబిరాన నేవత్తునే.... చిత్రాంగి : వరధరావరరాజ పరాజిత మన్మధా కనికరింపగ భారమాయొనే....

ఇటువంటి సంవాద సన్నివేశాలలో సహితం పాటలుండటం ఇప్పటి మనదృష్టికి హాస్వాస్పదంగా కనిపించడమే కాకుండా, నాటక రచనా నిర్మాణం దృవ్వా కూడా పేలవంగా ఉంటాయి,

ధర్మవరం రామకృష్ణమాచార్యుల సమకాలికుడయిన కోలాచలం శ్రీనివాసరావు గారు నాటకాలలో పాటలు ఉండటానికి ఇష్టంలేకపోయినా తాను రాసిన నాటకాలన్నిటిలో చాలా వరకు చివర అనుబంధంగా పాటలను చేర్చినారు. వేదం వేంకటరాయశాస్త్రి గారు కూడా ప్రతాపరుద్రీయ నాటకంలో సన్నివేశాలను బట్టి పాటలను కూడా రచించడం గమనించవలసిన విషయం.

నాటకాలకు పాటల రచయితగా పాపట్ల కాంతయ్యగారిని ప్రత్యేకించి పెర్కొన వలసి ఉన్నది. ఆనాటి నాటక సమాజాల వారి నాటకాలకు ఆయా సన్నివేశాలకు

వ్‌డీ గేయ నికౌప్రర తగిన పాటలు రచించి ఆబాలగోపాలానికి సన్నిహితుదైనాడు. సావిత్రి, ద్రౌపదీ వ(స్ర్త్రాప హరణం, కృష్ణతులాభారం వంటి నాటకాలలో ఈనాటికీ మన కర్ణకుహరాలను వదలని పాటలను రచించింది పాపట్ల కాంతయ్యగారే. సావిత్రి నాటకంలో 'పోవుచున్నాడే? రాగమాలిక ”, 'ఆవాకాంతా' అనే పాటలు, కృష్ణతులాభారంలోని “భలే మంచి చౌకబేరము, 'మునివరా” మొదలైన సంవాద గేయాలు, రాగమాలికలూ ఆయాసన్నివేశాలకు సరిగా సరిపోయి, చాలా సంవత్సరాల వరకు (ఈనాటికి కూదా) ఆంధ్రదేశపు నాటక (ప్రేక్షకులకు 'ప్రతివారినోటా వినిపిస్తూ ఉండేవి.

ఆనాడు నాటకం రక్తికట్టాలంటే పాటలు, పద్యాలు తప్పనిసరిగా ఉండేవి. పద్యాలను కూడా రాగతాళాదులు జోడించిపాదేవారు. రాగాలాపనతో పద్యాన్ని పాటలాగా సాగదీసి పాడితే, వన్స్‌మోర్‌ (0౧౦6 గ౧0|9) లతో రంగస్థలమంతా మార్చోగిపోయేది. “'పద్వాన్ని పాడరాదు అని భమిడిపాటి కామేశ్వరరావుగారు ఒక ఉద్యమాన్నే లేవదీసి 'ఆంధ్రనాటక పద్యపరనం' అనే గ్రంధాన్నే రాయవలసి వచ్చిందంటే పాటల పట్లా, పద్యాల పట్లా అనాటి తెలుగు (ప్రేక్షకుల అభిరుచి వెల్లడవుతుంది. ఆనాడే కాదు, నాటకాల స్థానంలో సినిమాలు వచ్చిన ఈనాడు కూడా పాటలు లేకుండా ఒక్క తెలుగు సినిమా (ఒకటి, రెండు ఉంటే ఉండవచ్చు) కూడా రావడం లేదు.

కనుక ప్రజాభిరుచి ననుసరించి గత శతాబ్ది నాటకకర్తలందరూ-ఒక్క పానుగంటి లక్ష్మీనరసింహారావు తప్ప-నాటకాలలో పద్యాలు, పాటలు రాసినారు. పానుగంటి నాటకాలలో పద్యాలు రాసినా, వాటీని లయహీనంగా, వచనానికి దగ్గరగా రచించినారు. ఇక పాటలులేని నాటకాలలో జనరంజనార్థం పాటలు రాయడానికి ప్రత్యేకించి మరికొందరు పాటల రచయితలు బయలుదేరినారు. మొదట నాటకాలు వచనంలో రాసిన వారు కూడా, ముద్రణ సమయంలో తమ పద్ధతిని, అభిరుచిని మార్చుకొని, విరివిగా పద్యాలు, గేయాలు చేర్చడం మొదలుపెట్టినారు. ఇట్లా తయారైనవే చిలకమర్తి వారి గయోపాఖ్యానం మొదలైన నాటకాలు. బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి 'హరిశ్చంద్ర' నాటకానికి అంత ప్రశస్తి రావడానికి ప్రధాన కారణం పద్వాలూ, పాటలే. కొందరు నాటకకర్తలు తమ నాటకాలలో పాటలు, పద్యాలు ఉన్నాయని సూచించడానికి గాను నాటకాల పేర్లకు ముందు 'సంగీతి పదాన్ని చేర్చడం మొదలుపెట్టినారు. సంగీత హరిశ్చంద్ర, సంగీత సావిత్రి మొదలైన నాటకాలు ఇందుకు ఉదాహరణలు. వచనం

పూర్వాంధ్ర కవులు వచనాన్ని చక్కని లయాత్మకమైన శైలిలోనే రాసినారు. చంపూ కావ్యాలలోని గద్యలైనా, ప్రత్యేక వచన కావ్వాలైనా, యక్షగ్రానాలలోని వచనాలైనా చాలా

ఆధునికౌంధ్ర గేయ కఖిర్వం న్‌్‌ వరకు వృత్తగంధి రచనలో, తాళగంధి రచనలో అయి ఉంటాయి. ఇప్పటిలాగా లయ విరహితమైన వచనాన్ని వారు రాయలేదు. ఏదో ఒక తూగులో, లయాత్మకంగా పాడుకోవ దానికి వీలుగా, గేయాంశ ఉన్న వచనాలనే వారు రచించినారు. దేశీయాలైన కళికోతృలిక లతో గద్యలను రచించినారు. కళికోత్మలికలు రగడ భేదాలు, గేయ ఛందస్సులు.

కన్నడంలో వచనకవితాశాఖ విశిష్టమైనది, విస్ఫృతమైనది. కన్నడిగులు వచనాలను పాటలుగా పాడుకొంటారు. అంతటి విశిష్టతా, విసృృతీ తెలుగు వచన కవితాశాఖకు లేకపోయినా కొంతవరకు 'ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఈ వచన కావ్యశాఖలో కృష్ణమా చార్యుడు రచించిన 'సింహగిరి నరహరి వచనాలు మొదటివి. ఇవి తెలుగువేదంగా ప్రశస్తికెక్కినాయి. కృష్ణమాచార్యుడు వీటిని వచనాలనీ, విన్నపాలనీ, సంకీర్తనలనీ, నామ సంకీర్తనలనీ, వేదాంత సంకీర్తనలనీ, ధ్యాన సంకీర్తనలనీ అనేక విధాలుగా పేర్కొన్నాడు. సంక్షీర్తనాచార్యుడని, పదకవితా పితామహుడని అన్నమాచార్యులకు ప్రశస్తి వచ్చింది కాని, నిజానికి కృష్ణమాచార్యుడే ప్రధమ సంకీర్తనాచార్యుడు. తాళ్ళపాక పెదతిరుమలా చార్యులు వైరాగ్యవచన మాలికా గీతాలనే పేరుతో శ్రీ వేంకటేశ్వర వచనాలను తాళగంధి చూర్చికలుగా రచించినాడు. కృష్ణమాచార్యులు వచనాలలో కంటె పెద తిరుమలాచార్యుల వచనాలలో గేయగంధం నిస్తులంగా ఉంటుంది. వాటికి తాళ్ళపాకవారే రాగ, తాళ నిర్దేశనంచేసి రాగిరేకులలో భద్రపరచినారు.

ఇట్లాగే గంగాధరయ్య వచనాలు, శంకర వచనాలు, కాలజ్ఞాన వచనాలు, కాళికాధీశ్వర వచనాలు, భవానీ మనోహర వచనాలు మొదలైన శైవుల వచనాలు ఉన్నాయి. శైవ వచన వాజ్మయంలో పిడపర్తివారి వచనాలు చాలా ప్రసిద్ధమైనవి. వచన వాజ్బయంలో ఏగంటివారి వచనాలు, చిలుకపాటీి వారి వచనాలు, చిట్టన్నగారి వచనాలు చాలా ప్రసిద్ధమైనవి. ఈ రకమైన వచన సాహిత్యమంతా గానయోగ్యమైనదే. ఇతర భారతీయ భాషలలో గేయం - తులనాత్మక పరిశీలన

ఇతర భారతీయ భాషల గేయసాహిత్యంతో ప్రాచీన తెలుగు గేయసాహిత్యాన్ని పోల్చి చూస్తే తెలుగులో గేయసాహిత్యం పరిమాణంలోను, గుణంలోను చాలా తక్కువేనని చెప్పాలి. ఇదే అభిప్రాయాన్ని తల్లావజ్ఞల శివశంకరశాస్త్రి గారు పదకర్తలు అనే వ్యాసంలో తెలియజేసినారు. “ఆంధ్రభాషలో జరిగిన అన్యాయము తక్కిన భాషలలో పదాలకు ప్రాప్తించలేదు. సంస్కృతములో భజగోవిందానికీ, అష్టపదులకూ, కృష్ణలీలాతరంగిణికి అఖండవైభవమున్నది. హిందీలో సూరదాసు పదావళికీ, కబీరు కీర్తనలకు కావలసినంత మర్యాద. వంగభాషలో పదకర్తలను మహాకవులుగా ఎంచుతారు. విద్యాపతి, చండీదాసు

5్‌గ్ర గేయ వికాసం గోవిందదాసు, రామప్రసాదు మొదలైనవారి పదాలు ఆదరానురాగాలతో పాడుతారు. మహారాష్ట్రలో తుకారాం ప్రభృతుల అభంగాదులను అత్యంత గౌరవంతో ప్రజలు పాడుతూ ఉంటారు. ప్రపంచ విఖ్యాతి పొందిన రవీంద్రుని రచనలలో ముప్పాతిక పదాలే.”

తెలుగు నాహిత్యం ప్రధానంగా నన్నయ్య తీర్చిదిద్దిన మార్గకవితాభిముఖంగానే సాగింది. పద్యఛందస్సులలో భారత, భాగవత, రామాయణం వంటి కావ్యాలూ, మను చరిత్ర, వసుచరిత్ర వంటి ప్రాధఢకావ్యాలు వెలసినాయి. పూర్వాంధ్ర కవులకు, పండితులకు పదకవితలపట్లా అసలు దేశిసాహిత్యంపట్లా ఏనాడూ గౌరవం లేదు.

ఎంతో ప్రతిభావంతుడైన పాల్కురికి రచించిన ద్విపద కావ్యాలకే ప్రశస్తి రాలేదు. కనుక మిగతా దేశిరచనల గురించి చెప్పవలసిన పనేలేదు. ఆ కారణం వల్లనే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మాత్రాఛభందస్సులో మహాకావ్యం మాటకేమిగాని, లఘుకావ్యం వంటిది ఒక్కటి కూడా రాలేదు. పదానికీ, పద్యానికీ నడుమ ఉన్న ద్విపద కొంతవరకు ఆ లోపాన్ని పూరించిందని చెప్పవచ్చు. క్షేత్రయ్య పదాలను నట్టువరాండ్రు నాట్యం చేస్తూ పాడే బూతుపదాలుగాను, భక్త రామదాసు కీర్తనలను పామరజనులు పాడుకొనే పాటలుగా చిన్నచూపు చూశారుగాని, ఉత్తమ కవిత్వంగా భావించలేదు. ఆ కాలంలో పిల్ల వసుచరిత్రలనే, చిత్రబంధ కవితారీతులనే ఉత్తమ కావ్యరచనలుగా పరిగణించినారు. కాని గేయకవిత్వాన్ని ఉత్తమ కవిత్వంగా వారెన్నడూ పరిగణించలేదనేది సత్యం. ఇతర భాషలలో గేయానికి ఇంత దుర్గతి పట్టలేదు. గేయ ఛందస్సులో రామాయణం, మహాభారతం వంటి ఉత్తమ కావ్యాలు వెలసినాయి. గేయకవులను మహాకవులుగా పరిగణించినారు. కనుక ఉత్తర భారతీయ భాషలలో గేయ సాహిత్యానికి గల స్థానమెటు వంటిదో సంగ్రహంగా సమీక్షించి, సోదర ద్రావిడ భాషలలో గేయ సాహిత్యాన్ని రేఖామాత్రంగా వివరిస్తాను. ఉత్తర భారతీయ భాషలలో గేయ సాహిత్యం

ఉత్తర భారతదేశ భాషలలో ప్రాకృత కవిత్వమంతా చాలా వరకు మాత్రాఛందస్సులో ఉన్నదే. సేతుబంధము, గౌడవహు, యశోధర చరిత్ర (జనహర చరివు), వజ్జ్ఞలగ్గ, కరికండ చరివు మొదలైన ప్రాకృత కావ్యాలు మాత్రాభందస్సులో ఉన్నవి. హాలుని 'గాధాసప్తశతి” కూడా 'గాధా అనే మాత్రాఛందస్సులో ఉన్నదే. ఉత్తర భారతీయ భాషలలో అన్నిటికన్నా బెంగాలీలో ఎక్కువగా గేయసాహిత్యం వెల్లివిరిసింది. బెంగాలీ సాహిత్యం చాలా వరకు గీతికామయమే. బెంగాలీలో గేయకవులను మవాకవులుగా ఎంచుతారు. కవిత్వం విషయంలోనే ఉత్తమాధమ ఖేదం కాని, కవితారూపం బదైనా వారికి

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 57 ఉపాదేయమే. బెంగాలీలో ఉత్తమ కవిత్వమంతా చాలావరకు గేయరూపంలోనే వచ్చింది. వైష్ణవపదగీతావళి మొదలుకొని రవీంద్రుని గీతాంజలి వరకు వెలసిన సాహిత్యమంతా గేయమయమే. మధురభక్తి ప్రపూరితాలైన వైష్ణవ పదగీతావళి బెంగాలీ సాహిత్యంలో ప్రశస్తమైనవి. విద్యాపతి, చండీదాసు, గోవిందదాసు, రామహప్రసాదు మొదలైన కవులు వైష్ణవ పదగీతాలను వెలయించినారు. చరియాపదాలు కూడా ప్రశస్తమైనవి. చంద్రావతి అనే కవయిత్రి రాసిన రామాయణ గీత), 'దస్యుకెనా రామ” అనే గీతికా కావ్యాలు పామరజనుల నోళ్ళలో నిలిచిపోయినాయి. బెంగాల్‌లో వివిధ సందర్భాలలో ఆబాల గోపాలం పాడుకొనేది చంద్రావతి రాసిన రామాయణ గీతాలే. కృతివాస ఓరూ రచించిన రామాయణం చాలా ప్రసిద్ధమైన గేయకావ్యం.

ఒరియా భాషా సాహిత్యం మీద బెంగాలీ సాహిత్యం ప్రభావం ఎక్కువ కాబట్టి, ఆ భాషలో కూడా గేయసాహిత్యమే అధికంగా వచ్చింది. ఒరియాలో 'బౌద్ధగాన్‌ బెదోహా' (బౌద్ధ గీతాలు, దోహాలు), జగన్నాధదాసు రచించిన గీతాలు ఉత్తమోత్తమమైనవి. ఒరియా భాషలో బలరామదాసు రామాయణ గేయకావ్వానికి చాలా ప్రశస్తి ఉన్నది.

ఉత్తర భారతీయ భాషలలో భక్తితో వెల్లివిరిసిన సాహిత్యమంతా గేయరూపంలోనే వచ్చింది. తెలుగులో భక్తి కవితకు పరాకాష్ట అనదగిన పోతన పద్య రూపంలో రావడం గమనించదగినది. హిందీలో రామాయణం ఇతివృత్తంగా అనేక గేయకావ్యాలు వెలసి నాయి. వాటిలో తులసీదాసు రచించిన “రామచరిత మానసము, కేశవదేవ్‌ రచించిన 'రామచంద్రికి అనే కావ్యాలు ఎన్నదగినవి. రామచరిత మానసి కావ్యాన్ని గానం చేయడం ఉత్తర భారతంలో ఒక సంప్రదాయమైపోయింది. అట్లాగే సూరదాసు, నందా దాసు, కబీర్‌, నానక్‌ మొదలైన వారి పదావళి చాలా ్రశస్తమైనవి. మహారాష్ట్రంలో నామదేవ్‌, జ్ఞానేశ్వర్‌, తుకారామ్‌, రామదాసు, మెరోపంతు మొదలైన భక్తకవులు రచించిన అభంగాదులకు అపారమైన గౌరవమున్నది. గుజరాతీలో మీరాబాయి కీర్తనలు చాలా మధురమైనవి,

ఇక దాక్షిణాత్య భాషలైన తమిళం, కన్నడం, మలయాళం భాషలలోని గేయ సాహిత్యాన్ని పోల్చి చూసినా ప్రాచీన కాలంలో తెలుగులో గేయసాహిత్యం తక్కువే ననిపిస్తుంది. తమిళం

తమిళంలో సంగం కాలంలోనే గీతి కావ్యాలు వెలసినాయి. 'పత్తుప్పాట్టు, 'పదినెణ్‌కిళ్‌ కణుక్కు' అనే సంకలన [గ్రంథాలలో పదరచనలు ఉన్నాయి. దేశి సాహిత్య

వ్‌8ి జయ్‌ వికెుం సంప్రదాయాలను గ్రహించడానికి ఈ కావ్య సంకలనాలు బాగా తోడ్పడతాయి. 'అగనా నూరు", 'పురనానూరు” అనేవి గీతికా సంకలన [గ్రంధాలే. అగనానూరులో నన్నూరు (పేమ గీతాలున్నాయి. వీరగీతాల సంకలనమైన పురనానూరులో కూడా నాలుగు వందల గీతాలున్నాయి. తమిళ వేదమైన “తిరుక్కురలొ దేశిఛందస్సు అయిన 'కురలొ ఛందస్సులో రచింపబడిన కావ్యం. ఆళ్వారులు, నాయన్మ్నారులు సంస్కృత భాషాభిజ్జులైన భక్తిపారవశ్యం తో వారు ప్రజల భాషలోనే గీతాలు పాడినారు. నాయన్నారులు పాడిన శైవగీతాల సంకలనాన్ని “'తిరుమణై” అని అంటారు. తిరుజ్ఞాన సంబంధర్‌ (తేవారం), తిరునావు క్కరశర్‌, సుందర్‌, మాణికృ్కవాచకర్‌ మొదలైన నాయన్నారులు శ్రైవవాజ్మయాన్ని గీతాలలో నింపివేసినారు. ఈ గీతాలు శైవులకు పరమ ప్రీతిపాత్రాలు. మాణిక్యవాచకర్‌ 'తిరువాచ కమ్‌” అనే కావ్యాన్ని దేశికవితా శాఖకు చెందిన అమ్మానై (అచ్చనగాయలాడుతూ స్త్రీలు పాడుకొనే ఒకానొక పాట), తెళ్లెణం (గొబ్బిపాట), పాళల్‌ (జోలపాట) మొదలైన పాటల ఛందస్సులలో రచించినాడు. ఆళ్వారులు విష్ణువును స్తుతిస్తూ పాడిన గీతాలు నాలుగువేల వరకు ఉన్నాయి. ఈ సంకలన [గ్రంథాన్ని *“నాలాయిర దివ్య ప్రబంధం” అని అంటారు. నమ్మాళ్వారు పెరియాళ్వారు, శ్రీ అండాల్‌ (తిరుప్పావై) మొదలైన ఆళ్వారులు భక్తిగీతాలు వెలయించినారు. భక్తకవి అరుణగిరి నాధుడు “తిరుప్పుగలొ అనే గీతికావ్యం వెలయించినాడు. ఇందులో వేయికి పైగా మధురగీతాలున్నాయి. 'రామనాటకంి' వంటి గేయరూపకాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలువడినవి.

దేశి సాహిత్యప్రక్రియలు తమిళసాహిత్యంలో ఉన్నంతగా మరి ఏ దాక్షిణాత్య భాషలలోను లేవు. 'పిళ్లెత్తమిల్‌' అనేది ఒక దేశి కావ్యప్రక్రియ. పసిపిల్లల వివిధ చేష్టాదికాలను ప్రశంసించే కావ్యప్రక్రియ ఇది (పెరియాళ్వారు బాలకృష్ణుని బాల్య క్రీడలు వర్ణిస్తూ పాడిన పాటలు). దేశీయాలైన పాటల ప్రసక్తి తొల్యాప్పియం కాలం నాటికే ఉందని విమర్శకులు ఊహిస్తున్నారు. తర్వాత కుమారకురువరార్‌ రచించిన బాలగేయాలు ఈ కావ్య ప్రక్రియలో ప్రశస్తమైనవి 'కలంబగం” అనేది దేశికావ్య ప్రక్రియే. శిష్ట సాహిత్యాన్ని జానపద గేయ కవితను ఒకచోట చేర్చికూర్చడం 'కలంబగం'లోని ప్రత్యేకత. పూర్తిగా జానపదగేయాల ప్రత్యేక సంపుటిని 'పాటుతురై” అని అంటారు. కన్నడం

కన్నడంలో గేయసాహిత్యం విస్తృతంగా వర్ధిల్లినది. షట్పదుల వంటి గేయ ఛందస్సులలో రామాయణం, మహాభారతం వంటి మహాకావ్యాలు వెలసినాయి. కుమార వ్యాసుడు షట్పదులలో మహాభారతాన్ని రచించినాడు. కన్నడ వాజ్బ్యయంలో కుమార వ్యాసుని భారతం అగ్రగణ్యమైనది. కుమారవ్యాసుని యుగాన్ని కన్నడ విమర్శకులు

ఆధుధికొంధ్ర గేయ కవిత్వం క్‌ దేశియుగంగా పరిగణిస్తారు. ఈ యుగంలో షట్పది, సాంగత్యము, త్రిపది అనే గేయ ఛందస్సులు ప్రాముఖ్యం వహించినాయి. కుమార వాల్నీకి 'తొరవై రామాయణాన్ని. ఐదువేలకు పైగా భామినీ షట్పదులలో రాసినాడు. భాస్కరుడు 'జీవంధర చరిత్రను భామినీషట్పదులలో రచించినాడు. 'నాదలోల లక్ష్మీశి అని ప్రశస్తి వహించిన లక్ష్మీశకవి వార్థకషట్పదిలో రచించిన జైమిని భారతం” కుమారవ్యాసుడు షట్పదికావ్యాలలో హిమోన్నతశ్చంగం వంటిది. కుమార వ్వాసుడు షట్పదులలో భారతం పదిపర్వాలు రాయగా, మిగతా భాగాన్ని తిమ్మణ్ణకవి షట్పదులలోనే పూర్తిచేసినాడు. భీమకవి బసవ పురాణాన్ని షట్పదులలోనే రాసినాడు. ఈ విధంగా కన్నడంలో 500కు పైగా షట్పది కావ్యాలు వెలసినాయట.

కన్నడంలో దాసవాబ్మయానికి ప్రత్యేక స్థానమున్నది. దాసకవులు వీరశళైవుల వలె జననసామాన్నానికి అందుబాటులో ఉండేటట్లు సంగీతబద్ధమైన కీర్తనలు వెలయించినారు. శ్రీపాదరాయలు 'దేవరనామాలు' అనే కీర్తనలు రచించినాడు. పురందరదాసులు సంకీర్తన సాహిత్యాన్ని పరూంకోటికి తీసుకొని వెళ్లినాడు. ఇతడు లక్షకుపైగా కీర్తనలు వెలయించినట్లు ప్రతీతి. అట్లాగే వ్యాసరాయలు, వాదిరాజు తీర్భులు నూర్లకొద్దీ క్తీర్తనలు రచించినారు. కనకదాసు 'హరిభక్తసారి అనే షట్పదికావ్యాన్ని అనేక కీర్తనలను వెలయించినాడు. కన్నడంలో వచనసాహిత్యం కూడా ఎక్కువే. ఈ వచనాలను వాళ్లు పాటలుగా పాడు కొంటారు. వచనసాహిత్యంలో బసవ వచనాలు, అల్లమప్రభువచనాలు ప్రసిద్ధమైనవి. మలయాళం

మలయాళంలోని ఛందస్సులన్నీ గాన ప్రధానమైనవి. మలయాళంలో కూడా ఎక్కువగా గేయ సాహిత్యమే వర్టిల్లినది. “భద్రాకాళి పాట్టు, 'తీయాట్టుపాట్టు,' 'పుళ్ళువన్‌పొట్టు, “శాస్త్రకళిపాట్టు, '“తోట్టంపాట్టు, మొదలైనవి పెర్కొనదగిన జానపద గేయ ఛందస్సులు. వీటిని ఉత్సవాదులలో పొాదతారు. “ఉలకు తయ పెరుమాళ్‌వాట్టు' (రోకటిపాటలు), “అచ్చుతం పురాన్‌ పాట్టు, 'రామకధపాట్టు, “ఇరవుకుట్టీ పిళ్ళవోర్‌పాట్టు' మొదలైన గేయాలు కూడా ముఖ్యమైనవే. కృష్ణగాధ మంజరీ ఛందస్సులలో వెలసింది. ఈ ఛందస్సులో వెలసిన కావ్యానికి “ధ్ర అని వ్యవహారం.

మహాకవ ఎళుత్తచ్చన్‌ “కిళివ్పాట్టు' (చిలకవాట) ఛందస్సులలో రామాయణ, మహాభారత కావ్యాలను రచించినాడు. ఎళుత్తచ్చన్‌ జానపద గేయఛందస్సులకు కావ్య గౌరవం కల్పించినాడు. మలయాళంలో '“ఆట్టక్కధ' ప్రత్యేక కవితా సంప్రదాయానికి చెందినది. గీతగోవిందంలోవలె ఆట్టక్కథలో శకాలుంటాయి. నటీనటుల మాటలు

60౮ గేయ వికాసం కూడా పాటల రూపంలో ఉంటాయి. ఇవి మన యక్షగానాల వంటివి. మలయాళంలో ఆట్టక్కధలు చాలా విదివిగానే వెలసినాయి. 'రామనాట్టం'” ప్రసిద్ధమైన ఆట్టక్కధ, 'తుళ్ళల్‌ అనేది కూడా ప్రసిద్ధమైన నృత్యవిశేషం, కుంజన్‌నంబియార్‌ 'తుళ్ళలొ రచనలో ఉత్తమ కవిత్వాన్ని వెలయించినాడు. అతని తర్వాత ఈ 'తుళ్ళల్‌ రచనను విశేషవ్వాప్తిలోకి తెచ్చిన వారిలో పూన్‌తోట్టత్తు, వలియ దామోదరన్‌ నంబూరి, రామపురత్తువాయార్‌ అనేవారు ముఖ్యులు.

తెలుగు అజంతభాష కాబట్టి గేయానికి సహజంగా ఒదిగే భాష అని, తెలుగుపాటలు మధురమైనవని తెలుగువారు, ఇతర భాషలవారూ ప్రశంసించినా, ఇతర భారతీయ భాషలతో పోల్చిచూస్తే ప్రాచీనకాలంలో తెలుగులో గేయసాహిత్యం రాశిలోను, వాసిలోను చాలా తక్షువెనని చెప్పకతప్పదు. తెలుగులో మాత్రాఛందస్సులలో పదకవితలు విస్తారంగా వర్ధిల్లినా, ఉత్తమ కావ్యం ఒక్కటైనా రాకపోవడం పరిశీలించదగిన విషయం.

జాణ మమా. యకమ-జయయా---

  1. ఆరునక యుగూరంభం - కయావతరణం

గురజాడ కంటె పూర్వం గేయకవిత్వం జానపద శ్‌ గేయాలలోను, పదకర్తల పదకృతులలోను అతివేలంగా అధునికత ఉన్నమాట వాస్తవమే అయినా, ఆనాడు అటువంటి కవితలకు కాలవాచికాదు, (ప్రజాదరణ, పండితాదరణ ఉండేదికాదు. ఏకాక్షర, ద్వక్షర, స్వభావవాచి నిరోష్టాది ప్రబంధ కవిత్వపు కబంద హస్తాలలో బంధితులైన ష* * పండితులు స్వేచ్చగా, స్వచ్చంగా పారే సెలయేళ్ళవంటి అధునికత అనేది జానపద గీతాల వైపుగాని, రాగాలు జాలువారే త్యాగ యుగధర్మం రాజాదుల కమ్మని పదకృతుల వైపుగాని తేరిపార చూడలేదు. జల

ఆనాటి నాహిత్య క్షేతం పండితుల పాండిత్య ప్రదర్శన అధునికత అంటే కొక కురుక్షేత్రంగానో, పదకర్తల సంగీతపాటవాని కొక. బ్యర్వ్యావ్రీన్తత కాదు సభాస్థలిగానో తోడ్పడింది. ఒకవైపు యమకాలు, మరొకవైపు క! గమకాలు; ఒకవైపు పాండిత్యం, మరొక వైపు సంగీతం. ఈ రెండింటి బెద్ధత్యం సాహిత్యంలో అధికమయ్యేకొద్ద ఆధునికత అంటే అచ్చమైన కవిత్వం అంతకంతకూ పేదవడుతూ వచ్చింది. వర్తమానకాలికత అటుపద్య ఛందస్సులలో పిల్లవసుచరిత్రలు పుట్టగొడుగుల్లా గతానికి పుట్టుకొస్తున్న రోజులవి. ఇటు గేయ ఛందస్సులలో క్షేత్రయ్య, భిన్నమైనది త్యాగరాజాదుల అభినయానికి, సంగీతానికి ప్రాధాన్యమున్న నాణాలని

62 అధునిక యుగారంభం - ేయానకర్‌ణం పదకవితలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న రోజులవి. అంతటా అంధానుకరణమే అగ్రాసనాధిపత్యం వహించగా మౌలికత అన్నది మూలపడిపోయిన రోజులవి.

నాయకరాజుల కాలం నుంచి గురజాడ వరకు గేయరచనలు విరివిగానే వెలువడినా, వాటిలో సాహిత్య విలువలు మృగ్యం. క్షేతయ్య త్యాగయ్య పదకృతుల కవితాపధాన్ని అనుసరించడం తప్ప, గేయం మరొక కొత్త దారి తొక్కలేదు. రక్తియో, భక్తియో తప్ప వేరొక వస్తువును స్వీకరించలేదు. ధర్మపురి సుబ్బారావు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, వీణఐశేషన్న దాసు శ్రీరాములు మొదలైన సుప్రసిద్ధ వాగ్గేయకారులెందరో గత శతాబ్ది పూర్వార్ధభాగం నుంచి ఈ శతాబ్ది ఆరంభం వరకు ఉత్తమ పదకృతులు వెలయించక పోలేదు. కాని అవన్నీ శాస్త్రీయ సంగీతాన్ని నిబంధించడానికి అనుగుణంగా విరచితమైన గేయరీతులు. అప్పటికింకా గేయం సమకాలిక సమస్యలను చిత్రించేటంతగా పదనుదేరలేదు. గురజాడ వంటి ప్రతిభావంతునికోసం ఎదురు చూస్తున్నది. గురజాడ పుట్టింది 1862లో; ఆధునిక కవితకు శ్రీకారం చుట్టింది 1910లో. గత శతాబ్ద నాంఘిక స్థితిగతులు

ఆధునికాంధ్ర గేయ సాహిత్యం గురించి చెప్పుకోబోయే ముందు సాహిత్యంలో “ఆధునికతకు దారితీసిన సాంఘిక, చారిత్రక, రాజకీయ స్టితిగతులు మొదలైన వాటిని స్టూలంగానైనా సమీక్షించడం అవసరమని భావిస్తున్నాను. భారతీయ భాషా సాహిత్యాలన్నిటిలోనూ ఆధునికయుగారంభం, ఇంచుమించు ప్రథమ స్వాతంత్ర్య యుద్ధానంతరం (1857) నుంచి లేదా ఇరవయ్యో శతాబ్ది ఆరంభం నుంచే వచ్చింది. అట్లాగే సాహిత్యంలో ఆధునికతకు దారితీసిన స్థితిగతులు కూడా అన్ని భారతీయ భాషా సాహిత్యాలలోనూ ఒక్కటేనని చెప్పవచ్చును. యూరప్‌లో పారిశ్రామీక విప్రవానంతరం ఆర్ధిక, రాజకీయ, సాంఘిక రంగాలలో కలిగిన పరిణామాలను, మార్పు లను ప్రతిబింబించే సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యంగా ఆ దేశాలవారు పరిగణిస్తున్నారు.

ఆధునిక కవిత్వం పెట్టుబడిదారీ కవిత్వమని క్రిస్తోఫర్‌ కాడ్వెల్‌ అంటారు. “మూడు శతాబ్దాలపాటు ఇంగ్లండ్‌ ప్రపంచాన్ని పెట్టుబడిదారీ వికాసంవైపు నడిపింది. అదే కాలంలో కవిత్వ వికాసంలో కూడా ప్రపంచానికి నాయకత్వం వహించింది. ఈ రెండూ సంబంధంలేని యాద్భచ్చిక ఘటనలు కావు; ఒకే చారిత్రక పరిణామంలో అంతర్భాగం” అని కాద్వెల్‌ అభిప్రాయపడినాడు. భారతదేశంలో కూడా ఆంగ్ల విద్యావ్యాప్తి అనంతరం అన్ని రంగాలలోను అనేకమైన మార్పులు సంభవించినాయి. సమకాలిక సామాజిక జీవనానికి దర్పణం వంటిదైన సాహిత్యం కూడా ఈ మార్పుల ప్రభావానికి లోనుకావడం

ఆధునికాంధ్ర గేయ కవిత్వం ఢవె సహజం. కనుక ఆంగ్ల విద్యావ్యాప్తి అనంతరమే భారతీయ భాషా సాహిత్యాలలో ఆధునిక యుగారంభమైనదని చెప్పవచ్చును.

తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు సంస్కృత భాషా వ్రాబల్యమున్న సాహిత్యాన్ని పూర్వాంధ్ర సాహిత్యంగాను, ఆంగ్ల భాషా సంపర్కం ప్రబలిన తర్వాత వెలసిన సాహిత్యాన్ని ఆధునికాంధ్ర సాహిత్యంగాను సూలంగా వింగడించవచ్చును. నన్నయనుంచి ఇంచుమించు ఇరవయ్యో శతాబ్ది వరకు తెలుగు సాహిత్యం ప్రధానంగా సంస్కృత మార్గానుసారే. అంతేకాదు ప్రధానంగా పద్యకవిత్వమేనని చెప్పాలి, నన్నయకు పూర్వం నుంచి అవిచ్చిన్నంగా మార్గసాహిత్యంతో బాటే దేశిసాహిత్యం కూడా వెలసినా దానికేనాడూ ఆదరణ లభించలేదు. ఆధునికయుగంలో దేశిసాహిత్యం మీద విస్తృతమైన పరిశోధనలు జరిగి, దేశిసాహిత్యం పట్లా ముఖ్యంగా జానపదగేయాలపట్లా ఆధునికులలో అభిమానాతిరేకం పెల్లుబికింది,

భారతదేశంలో ఆంగ్ల విద్యావ్యాప్తికి పాటుపడిన వారిలో ప్రధములు రాజారామ మోహనరాయలు. ఆంగ్ల విద్యావ్యాప్తికి కాక, బ్రహ్మసమాజ న్ధాపన, సహగమన నిర్మూలన, సాంఘిక దురాచార నిరసన, ఆధునిక విజ్ఞాన వ్యాప్తి మొదలైన సంస్మరణోద్యమాలకన్నిటికో మూలపురుషులు. భారతదేశంలో ఆధునిక యుగనిర్మాతలుగా మొట్టమొదట చెప్పుకోవలసింది రాజారామమోహనరాయలనే. అతడు తలపెట్టిన సంస్కరణోద్యమాలను భారతదేశం నలుమూలల నుంచీ ఎందరో మహాపురుషులు అందుకొన్నారు. అటువంటి వారిలో వీరేశలింగం పంతులుగారొకరు. దక్షిణ భారతదేశానికి ఆయన మరొక రామమోహనరాయలు అనిపించుకొన్నారు. ఆంధ్రదేశంలో ఆధునికతకు వాకిళ్ళు తీసినవారు వీరేశలింగంగారు. సంఘ సంస్కరణోద్యమాలతోపాటు ఇంచుమించు అన్ని సాహిత్య శాఖలలోనూ మొదటివో, దాదాపు మొదటివో అనదగిన [గ్రంధాలు రచించినారు. అయితే కవిత్వం విషయంలో వీరేశలింగంగారు తీసుకొని వచ్చిన నవ్యత ఏమీలేదనే చెప్పాలి. ఆయన ప్రధానంగా సంఘసంస్కర్త. మహాసంస్కర్తగా కీర్తి పొందినవాడు, బహుకార్యవ్యగ్రుడు, మహాకవిగా అయిఉండవలసిన అవసరంలేదు. అయినా ఆయన ప్రతిష్ట కది లోటు కాదు. కాని కవితా రంగానికి నూతన చైతన్యం గురజాడ అప్పారావుగారి వల్లనే కలిగిందనే విషయం వాస్తవం. వీరేశలింగం పంతులుగారు సంఘ సంస్కరణోద్యమా అతో తెలుగుదేశంలో ఆధునికతకు బాట వేయగా, వ్యావహారిక భాషావాదంతో గిడుగు రామమూర్తి గారు బాసటగా నిలువగా, గురజాడ ఆధునికాంధ్ర కవితావేదిక మీద గేయం బావుటా ఎగురవేసినాడు. డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారన్నట్లు, 'నవ్య కవిత్వమన్నది ఒక్కచోట ఒక్కనాడు ఒక్కన్యక్తి సృజించిన దాన్ని అనుసరించి వర్తిల్లలేదు.

రతీ ఆధునిక యుగారంభం - గేయావతరణం వర్షము పడినప్పుడు సెలయేళ్ళు కలిసి నదియైనట్లు, వ్యక్తులూ, ఉద్యమాలూ, పరిస్థితులూ కలిసిరావడంవల్ల నవ్యకవిత్వము నాలుగుచోట్లా పుట్టి పెరిగింది.”” వ్యక్తులు వీరేశలింగం, గిడుగు, గురజాడ మొదలైన వారు; ఉద్యమాలు సంఘసంస్మరణోద్యమం, జాతీయోద్యమం, వ్యావహారిక భాషోద్యమం మొదలైనవి; పరిస్థితులు ఆంగ్రవిద్యావ్యాప్తి, పత్రికల వ్యాప్తి, యాంత్రిక నాగరకత మొదలైనవి. *... అయితే బలరాముని హలముతో యమున వలె అప్పారావుగారి మేధాశక్తితో నవ్యకవితా ధోరణి చైతన్య సరస్వతియై మళ్ళీ ప్రవహించింది.” అని శ్రీపాద గోపాలకృష్ణ మూర్తిగారనడం అక్షరాలా సత్యం. గురజాడ హస్తస్పర్భతో ఆంధ్రసాహిత్యము అదివర కెన్నడూ లేని జవమూ, జీవమూ పుణికిపుచ్చుకొని ఆధునికతను నిలుపుకొన్నది. ముఖ్యంగా కవితారంగంలో గురజాడ గేయం యొక్క సర్వాంగీణతను, సమగ్రతను ప్రదర్శించినాడు. గురజాడ ముందు గదేయరచనలు

గురజాడ అప్పారావుగారి సర్వతోముఖమైన సాహిత్యసృజనను సందర్శించబోయే ముందు ఈ శతాబ్ది ప్రధమ దశకంలో వెలసిన ఒకటి, రెండుగేయరచనలను గురించి ప్రస్తావించవలసి ఉంటుంది. దా.సి. నారాయణరెడ్డిగారు తమ సిద్ధాంత వ్యాసంలో గురజాడ ముందు గేయరచనలుగా కె. వెంకటరత్నం పంతులుగారి “విక్టోరియా మహారాజ్ఞి గీతం” ఉత్సాహవృత్తంలో రచింపబడినదైనా గేయరీతిలో రచింపబడినదని సోదాహరణ పూర్వకంగా వివరించారు.* మళ్ళీ ఆ విషయాన్ని వివరించడం చర్వితచర్వణమే అవుతుంది. అయితే వస్తువులోని ఆధునికతదృష్పాను, రచనారీతి దృష్పాను మేలుకొలుపు పాటను, 'మాలవాండ్ర పాటిను మళ్ళీ పేర్కానవలసివస్తున్నది. మొదటి ముత్యాలరసం

డా॥సి. నారాయణరెడ్డి గారు తమ పరిశోధన (గ్రంధంలో 'మేలుకొలుపు' అనే గేయాన్ని మొట్టమొదటి ముత్యాలసరంగా గుర్తించినారు.” ఈ గేయం గురజాడ “ముత్యాల సరములు' (తోకచుక్క కంటె సుమారు ఒక సంవత్సరం ముందుది. (ఆంధ్రభారతి) పత్రిక మొట్టమొదటి సంచిక (శా.శ1831 మాఘ సంచిక)లో అచ్చయింది. ఈ సంచికలోనే గురజాడ వారి నిలగిరి పాటలోని *వూటి చోద్యమేమి చెపుదు” అనే పాట అచ్చయింది. కనుక గురజాడ వారీ గేయాన్ని తప్పక చూసే ఉంటారు. ఈ గేయం నదకకూ, గురజాడ రాసిన ముత్యాలసరం (తోకచుక్క నడకకూ ఖిదమేమీ లేదు. రెండూ మిశ్రగతిలో నడిచేవె ఉన్న భేదమంతా పాదవిభజనలోనే. “మేలుకొలుపు గేయాన్ని రెండు పాదాలుగా రచించడం జరిగింది. ప్రాసకూడా రెండు పాదాలకీ పాటించడం జరిగింది. 'మలుకాలుపు” గేయాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాను.

ఆధున్రికొంధ్ర గేయ కనిత్వం ర్‌

మేలుకొనుమీ భరత పుత్రుడ, మేలుకొనుమీ సుజన పుత్రుడ

మెలుకొనుమీ సచ్చరిత్రుడ, మేలుకొనవయ్యా! వత్సా! మేలుకో

వేడుకను జాతీయతయను వేగుచుక్క పొడిచెనదుగో

కూడి వందేమాతరమ్మను కుక్కుటములరచెన్‌ వత్సా!

అల్లనను విజ్ఞానమనియెడునట్టీ యరుణోదయము నాయెను

చెల్లై నంతఃంకలహములనెడు చీకటుల వెల్లన్‌ 11వత్సా॥

తరలి మూర్థాచారములనెడు తారకంబులు నస్తమించెను

సొరిది తూరుపు దిశను జ్ఞానసూర్యుడుదయించెన్‌ 11వత్నా!!

అంతటను నవశక్తి యనియెడు కాంతిపుంజము తేజరిల్లెను

మంతనంబున నూతనోద్యమ మారుతము వీచెన్‌ 11వత్సాః

అందరును నీకంటె ముందర నడుగువేయుచు మెలగుచుండగ

పందవలెనిటు నిద్రపవోవగ బాడియగునయ్యా 1వత్సా॥।

'మేలుకొలుపు గేయకర్త ఎవరో తెలియదు కాని నవయుగ వైతాళికుడైన గురజాడ అవ్వారావుగారి కంటె ఒక సంవత్సరం ముందుగా మేలుకొలుపు పాడినాడు. ఈ గేయంలో “వత్సా మేలుకో” అనే పల్లవిని తీసివేసి నాలుగు పాదాలుగా రాస్తే ఇది అచ్చంగా ముత్యాలసరమే అవుతుంది. చివర హ్రస్వపాదాలన్నిటా 9 మాత్రలే ఉంటాయి. గురజాడ అప్పారావుగారి ముత్యాలసరాలలో చివరి పాదాలు 9 మాత్రలవే ఎక్కువ. మేలుకొలుపు గేయం రెండు పాదాలుగా అచ్చువెసినంత మాత్రాన ముత్యాలసరం కాకుండా పోదు. ప్రీలు పాడుకొనే 'మేలుకొలుపోో పాటల ఒరవడిలో సాగిన గేయమిది. ఈ గేయం నడకలోనేకాక వస్తువరణంలోను, శైలిలోను గురజాడ గేయాలకు చాలా దగ్గరగా ఉన్నది. ప్రతి పంక్తిలోనూ ఆధునికత ఉట్టిపడే గేయమిది. డా॥1సి. నారాయణరెడ్డి గారి పరిశోధనలో వెల్లడైన మరోగేయం 'మాలవాండ్రపాట””

అనేది. ఈ గేయం కూడా ఆంధ్రభారతి (శా.శ 1882) భాద్రపద మాససంచికలో అచ్చయింది. ఈ సంచికలోనే గురజాడవారి 'డామన్‌పితియస్‌' అనే గేయం అచ్చయినందు వల్ల ఈ గేయాన్ని కూడా గురజాడ చూసే ఉంటారు. ఈ గేయం గురజాడ మొదటి ముత్యాల సరమైన “తోకచుక్క గేయం తర్వాతిదైనా అస్పృశ్యత సమస్యను చిత్రీకరించిన మొట్టమొదటి గేయమిది. గురజాద *“లవణరాజుకల” ఈ గేయం (మాలవాండ్రపాట) తర్వాతిది. లవణరాజు కలలోని

66 ఆధునిక యురారంభం - దేయానతరణం మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ, రెందె కులములు మంచి యన్నది మాలయెతే మాలనే అగుదున్‌ అనే పంక్తులు రాయడానికి 'మాలవాండ్రపాటి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. గాంధీజీ లేవనెత్తిన 'హరిజనోద్యమము' కంటె ఎన్నో ఏళ్ళు ముందుగా అస్పృశ్యతా సమస్యను చిత్రీకరించిన 'మాలవాండ్ర పాటి లోని కొన్ని పాదాలను ఉదాహరిస్తాను. అందారు పుట్ట్దీరి హిందమ్మ తల్లికి ఇందారు ఒక్కటై ఉందారి సక్కంగ కష్టమ్ములొచ్చీన నిష్టూర మొచ్చీన ఇష్టమ్ముగానుండి కట్టూగ నుందాము 1(అందారు॥। వర్దాలు యెక్కువ పుట్టంగ లేదయ్య మమ్మేల (క్రిందికి క్రుమ్మేరు మానోరు 1 అందారు॥। తమ్మూలమని మీరు మమ్మూలజాడండి అమ్మోరు దీవించి అయిశ్వర్యమిచ్చును 11 అందారు!। ఖండగతిలో సాగిపోయే గేయరచన ఇది. ఇందులోని వస్తువు 'హరిజన సమస్య ఎంతో ఆధునికమైనది. భాష కూడా హరిజనులు మాట్లాడుకొనే భాషకు దగ్గరగా ఉన్నది. గురజాడ గేయాలలో శిష్ట్వ్యావహారిక భాషను వాడినారు, కాని గ్రామ్యభాషను వాడలేదు. కనుక భాష విషయంలో కూడా గురజాడ కంటే ఒక అడుగు ముందున్నది. ఇంతటి నవ్యత్వమున్న గేయాన్ని ఎవరు రచించినారో తెలియకపోవడం దురదృష్టకరం. కాని ఈ మధ్యనే హరి ఆదిశేషువుగారు 'మొదటీి ముత్యాలసరం రచయిత ఎవరు?” అనే వ్యాసంలో ఈ రెండు గేయాలు కూడా మంగిపూడి వెంకట కృష్ణశర్మ రచించినట్లు నిర్ధారించినారు. “ హరిజనుల ఐక్సాన్నే కాక, జాతి ఐక్యాన్ని కూడా ప్రబోధించే గేయమిది. ఈ విధంగా గురజాడ కంటె ముందుగా ఆధునిక వస్తువును స్వీకరించిన గేయ రచనలు కనిపించినా, గురజాడను మొట్టమొదటి ఆధునిక గేయకవిగా పేర్కొనాలి. నన్నయకంటె పూర్వమే శాసనాలలో పద్యరచనలున్నా నన్న్మయను ప్రధమాంధ్ర కావ్యకర్తగా, పద్యవిద్యకు ఆద్యుడుగా పరిగణించినట్లుగానే గురజాడను కూడా మొట్ట మొదటి ఆధునిక గేయకవిగా పరిగణించవలసి ఉంటుంది.

అధున్రికౌంధ్ర గేయ కవిత్వం గ్‌? ప్రథమాధునిక మహాకవి గురజాడ

“మహాకవి గురజాడ అవ్వారావు మొట్టమొదటిసారి ముత్యాలసరాలు గుచ్చిన ఏడు. అప్పుడే తెలుగు కవిత్వంలో విప్ల్రవశకం ఆరంభమైనది.” అని అభిప్రాయపడిన శ్రీశ్రీతో ఏకీభవిస్తూ గురజాడ మీద రాస్తున్న ఈ అధ్యాయాన్ని ఆ వాక్యంతోనే ఆరంభిస్తున్నాను. తెలుగులో మొట్టమొదటి ఆధునిక కవి గురజాడ అప్పారావు,” ఆ మాటకువస్తే గురజాడకు పూర్వమున్న కవులెవ్వరు కూడా ఆధునిక కవులు కారు. అంటే వారు తమ కాలానికి తగిన రచనలు చేయలేదు. పూర్వాంధ్ర సాహిత్యమంతా ఆనాటి సమాజ జీవితానికి దూరంగానే ఉంటూ వచ్చింది. కల్పిత పాత్రలతోను, కట్టుకధల తోను నిండిపోయింది. సమాజంలో మనుషుల మధ్యనున్న సంబంధాలను, సంఘర్షణ లను, వాటితోబాటు సామాజిక జీవిత పరమార్దాన్ని కొంతమేరకు చిత్రీకరించిన రామాయణ, మహాభారతాలు తెలుగులో అనువాద కావ్యాలు మాత్రమే కనుక ఆ కావ్యాలలో ఆ కావ్యకర్తల రచనా కాలంనాటి సమాజ జీవితమేమీ ప్రతిబింబించటం లేదు. తెలుగులో స్వతంత్రకావ్యాలైన ప్రబంధాలలో కొంతవరకు సంపన్నుల భోగజీవితమే ప్రతిబింబించింది. కాని సామాన్య ప్రజాజీవితంకాని, ప్రజాసమస్యలు కాని ప్రతిబింబించ లేదు. పాల్కురికి సోమనాథుని కృతులలో కొందరు శివభక్తుల చరిత్రలు ఇతివృత్తాలుగా ఉన్నా అవి కేవలం ఒక వర్గానికే (శైవులకే) సంబంధించినవి కాని, సమస్త మానవాళికీ సంబంధించినవి కావు ఒక్క “పలనాటి వీరచరిత్ర కావ్యం అపవాదుగా కనిపిస్తున్నది. అయితే అది మౌఖిక కవితారీతికి చెందినది. అంటే మౌఖికంగా చెప్పబడి, తర్వాత లిఖీతరూపం పొందిన కావ్యం. '“ఆధునిక' అనే విశేషణాన్ని యావదాం(ధ్ర కవులలోను గురజాడ కవితోనే ఆరంభించాలి. గురజాడకు మనిషి కొలబద్ద, మానవజీవితాన్ని కళాత్మకంగా మలచడమే ఆయన రచనల ఉద్దేశం. 'తెలుగులో నవ్యరీతులకు నూతన (ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్యకళ నవీనం, కావ్య యితి వృత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను; జీవితాన్ని నూతన దృక్పధంతో దర్శించి కథా, కవితారూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి (ప్రయత్నించాను. ”** అని తనను గురించి, తన సృజనను గురించి తాను చక్కగా అంచనా వేసుకోగలిగిన మెలకువ గల కళాకారుడు (00౧9801008 ఇగ150 గురజాడ. ప్రథమాంధ్ర ఆధునిక మహాకవి గురజాడను గురించి చెప్పుకోబోయేముందు ఆధునికత అంటే ఏమిటో వివరించవలసి ఉన్నది. ఆధునికత అంటే

ఆధునిక కవిత్వానికి 20వ శతాబ్ది ఆరంభాన్ని ఒక హద్దుగా నిర్ణయించుకొన్నా ఈ శతాబ్దిలో వెలసిన కవిత్వాన్నంతా ఆధునికకవితగా పరిగణించనక్కరలేదు. అంతెం

68 అధునిక యుగౌారంభం - గేయావతరణం దుకు ఈ దశాబ్దిలో పురాణ కవితా రీతులు, ప్రబంధ కవితారితులు, భావ కవితారీతులు ప్రతిబింబించే కవితా రచనలు అనేకం వెలువడుతున్నాయి. వాటినన్నిటినీ ఆధునిక కవితగా పద్దువెయ్యడం ఇబ్బందిగానే ఉంటుంది. ఆధునికత కాలవాచి కాదు, స్వభావ వాచి. ఆధునికత అనేది యుగధర్మం, ఆధునికత అంటే అర్వాచీనత కాదు. ఆధునికత అంటే వర్తమాన కాలికత అనే అర్ధంతోబాటు గతానికి భిన్నమైనది-అనే అర్జాన్ని కూడా (గ్రహించాలి. "14066001%/ 158 & ౧౮6810౧ ౧౦౪ 0 6416 0641 0 0౪+100[ -అని సర్‌ రిచర్స్‌ లివింగ్‌స్టన్‌ (951౧100416 ౬1/1౧0910౧6) అంటాడు. ఆధునికత అనేది దృక్పథానికి సంబంధించినదే. సమకాలిక సమాజాన్ని సమకాలిక సమస్యలను చిత్రీకరించేది. సమకాలిక జీవితం పట్ల సమకాలిక దృక్చధాన్ని కలిగించేదే ఆధునిక సాహిత్యం. ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు రూపం, వస్తువు, భావం, రచన-ఈ నాలుగింటిలో కనీసం ఏ ఒక్కటైనా తత్పూర్వ సాహిత్యం కంటె ఏరకంగా భిన్నమైనది ఏ మేరకు ఆధునికత ఉన్నది? అనే అవగాహన ఉండాలి.

ఆధునిక కవిత్వానికి యుగకర్త ఎవరు? అనే విషయంలో డా1సి. నారాయణరెడ్డి గారు తమ పరిశోధన [గ్రంధంలో పలువురికి గల భిన్నాభిప్రాయాలను సుదీర్హంగా చర్చించి, సమన్వయ ధోరణిలో గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు ఇద్దరూ యుగకర్తలే అని తేల్చినారు. * అయితే ఒక్కొక్క యుగానికి ఒక యుగకర్త ఉంటాడని, ఆ యుగాన్ని ఆ యుగకర్త పేరు మీదుగా వ్యవహరించాలనే దృక్పధమున్న విమర్శకులు చేసే యుగవిభజన ఇది. ఇదివరలో నవ్య కవిత్వం విషయంలో “నవ్య కవిత్వమన్నది ఒక్కచోట ఒక్కనాడు ఒక్క వ్యక్తి సృజించినదాన్ని అనుసరించి వర్తిల్లలేదు..” అన్న డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారి అభిప్రాయాన్ని మళ్ళీ ఉదాహరించవలసివస్తుంది. ఇది నవ్య కవిత్వానికే కాదు, ఏ యుగం కవిత్వానికైనా వర్తిస్తుంది. ఒక కవికి యుగకర్ఫత్వం అంటగట్టడం సమంజసంకాకపోయినా, పద్యం ప్రాచీనతకు, గేయం ఆధునికతకు సంకేతాలుగా గగ్రహించినట్లయితే, ఆధునిక కవితా వస్తువును అందించడానికి పాతదై పోయిన పద్యరూవాన్ని కాదని, ఒక ఉద్దిష్ట ప్రయోజనంకోసం, ఉద్దేశపూర్వకంగా గేయ రూపాన్ని స్వీకరించిన గురజాడను 'ప్రథమాధునిక మహాకవి" అని అనడంలో ఎలాంటి విప్రతిపత్తిలేదు. రాయప్రోలు సుబ్బారావు ప్రధానంగా పద్యకవి. ముత్యాలసరాల ఛందస్సు విషయంలో గురజాడ ప్రభావం తనపై ఉందని రాయప్రోలు వారే అంగీకరించి ఉన్నారు. * నూతన ఛందో. వతరణం

నూతన ఛందస్సు ఒక అవతారమని భవభూతి కొనియాడినాడు. * వాల్మీకి నోటి వెంట వెలువడిన అనుష్టుప్‌ శ్లోకము ఒక అవతారంగా భవభూతి భావించినాడు.

ఆధునికొంధ్ర గేయ కవిత్వం 69 వాల్నీకి నాటికి అనుష్టుప్‌ ఛందస్సు కొత్తదేమీ కాదు. ఆదివేదమైన బుగ్వేదంలో ఉన్నదే. బుక్కులు పొదుగుకొన్న అనుష్టుప్‌ ఛందస్సు వాల్ళీకి నోటివెంట వెడలి ఆదికావ్యానికి పాదులు వేసింది. అట్లాగే స్రీలు పాడుకొనే పాటలలోను, మేలుకొలుపు పాటలోను ఒదిగి ఉన్న ఈ ఛందస్సు ముత్యాల సరమనే సరికొత్త పేరును సంతరించుకొని ఆధునిక వస్తువునూ, ఆధునిక సందేశాన్నీ అందించడానికి (గురజాడ వాల్మీకి నోటి వెంట వెడలి ఆధునిక కవితకు పాదులు వేసింది.

టి.యస్‌.ఇలియట్‌ గ 500 కూడా నూతన ఛందస్సును గురించి సరిగా ఇటువంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చినాడు. “564 101009 02౧ ౧40౧6౧ 10 & ౧౭౦౧ 2/6 గాం౧9 ॥1౧౧౦గ౬౧1 41 06 1౧౪౭౧౪0౧ 6 & ౧6౪ 10౧౧ 01 ౪6/56.“

20వ శతాబ్ది ఆరంభంలో తెలుగు కవితా రూపంలో ప్రధానమైన విప్లవం వచ్చింది. అది పద్యం నుంచి గేయానికి పరిణమించడమే. నన్నయ్య నుంచి 20వ శతాబ్ది వరకు తెలుగు సాహిత్యం ప్రధానంగా పద్య సాహిత్యమే. గేయసాహిత్యం కొద్దిగా ఉన్నా అది పద్యసాహిత్యం ప్రాభవం ముందు వెలవెలపోయింది. అది ఏనాడూ పద్యం స్థానం పొందలేదు. అయినా 20వ శతాప్దీకి పూర్వమున్న గేయం స్వరూపం వేరు, 20వ శతాబ్దిలో గేయం స్వరూపం వేరు. ఈ శతాబ్ది ఆరంభంలో గేయానికి ప్రాముఖ్యం రావడంతో క్రమంగా పద్యం తగ్గుముఖం పట్టింది. “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాఛందస్సుల ప్రజాన్వామ్యయుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ”” అని శ్రీశ్రీ అభిప్రాయపడితే, “గురజాడ తెచ్చింది కమ్యూనిస్టు విప్లవం కాదు. బూర్దూవా విప్రవమని అర్ధం చేసుకున్న నాడు గురజాడ విప్లవాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతాం. తెలుగు సాహిత్యాన్ని ఫ్యూడల్‌ బంధాల్నుంచి విముక్తం చేసి బూర్జువా సమాజం వేపు నడిపించాడు” అని శ్రీశ్రీ అభిప్రాయానికి వివరణగా డా! చేకూరి రామారావు గారు అభిప్రాయపడినారు. “ సాహిత్యరంగంలో గురజాడ ప్రారంభించిన కవితా విప్లవం అసంపూర్ణంగానే నిలిచిపోయిందని డా॥ వెళ్చెరు నారాయణరావుగారు తమ సిద్ధాంత వ్యాసంలో సిద్ధాంతీకరించినారు. ” గురజాడ గేయ స్వీకరణకు ప్రధాన కారణాలు

వస్తువులో మార్పు వచ్చినప్పుడు ఛందస్సులో మార్పు రాక తప్పదు.” ప్రాచీనాంధ్ర కవిత్వంలో కూడా పాల్కురికి సోమనాధుడు పద్యాన్ని కాదని, ద్విపదను చేపట్టడానికి [ప్రధాన కారణం ఇదే. గురజాడ తన రచనలలో చిత్రీకరించదలచుకొన్నది ఆధునికతను, ఆధునిక జీవితాన్ని ఆధునిక సమస్యలను, అందుకే కన్యాశుల్మ నాటకాన్ని పూర్తిగా

70 ఆధుఖక యురారంభం - దేయాదతరణం వాడుకభాషలో రచించినాడు. అట్లాగే కవిత్వంలో కూడా తాను ఇవ్వదలచుకొన్న నూతన సందేశానికీ, తాను చిత్రీకరించదలచుకొన్న నూతన వస్తువుకూ, అక్షర ఛందస్సు అక్కరకు రాదనుకొన్నాడు. గురజాడ పద్యరచనలలో దేనిలోనూ ఆధునిక భావాలు కాని, ఆధునిక వస్తువుకాని అగుపించకవోవడం పై ఊహకు ప్రోదలకంగా ఉన్నది. గురజాడ పద్యఛందస్సులతో “మాటల మబ్బులు “మెరుపులు, 'బుత శతకం” మొదలైన ఖండ కావ్యాలు రచించినాడు. ప్రబంధకవుల పుష్పలావికలకు సాటిరాగల 'పుష్పలావికలు'” అనే ఖండ కావ్యం, చేమకూర వెంకన్న “విజయ విలాసం'తో చెలిమి చేయగల “సుభద్ర కావ్యం రచించినాడు. 'సుభద్రి కావ్యం (1913) తప్ప మిగతా పద్య రచనలు రచనా కాలాలు తెలియటం లేదు. కాబట్టీ వీటిని ముత్యాలసరాల కంటె ముందు రచనలుగానే భావించాలి. ఈ పద్య రచనలు గురజాడ కవితా ప్రస్థానంలో ప్రయోగదశను మాత్రమే తెలుపుతాయి. గురజాడ పద్యాలు రాయలేక గేయాన్ని స్వీకరించలేదనే నిజాన్ని 'సుభద్రి కావ్యం నిరూపిస్తున్నది. ఏమైనా గురజాడ పద్య రచనలు ఆయన ప్రతిభను కాని, దృక్పధాన్ని కాని వెల్లడించేవి కావు. పద్యరచనే కొనసాగించి ఉంటే ఆయన వైతాళికుడు అయి ఉండేవాడు కాదు. ఛందస్సు ప్రతిభా దారిద్ర్యాన్ని కప్పుతుందనే సంగతి గురజాడకు తెలుసు. పద్యాన్ని గురించి గురజాడ మాటలలోనే చెప్పాలంటే...“ఛందస్సు వొకటి. గణాలు సరిపెడితే ఒక మోస్తరు లయ కుదురుతుంది. కడంవి నిఘంటువుల్లో మాటలూ, వ్యాకరణాల్లో ప్రత్యయాలూను. ఇవి వాడుకభాషలో లేకపోవడం చేత ఒక విలక్షణ ధ్వనిని కొలుపుతాయి. అంతటితో ఆనందించేవారు అనేకులు. గంగిరెద్దు మీది పాతగుడ్డల వలె యివి లోపల పసను కమ్ముతవి...రసం చాలనిచోట పద్యరచన విరసం. అందుకు తోడు తలపులు తక్షువైతే వృత్తాలు నిండడం కోసం గంగిరెద్దు గుడ్డలు మెట్లుగా పదవలె... పెద్ద కవులకే పొల్లుమాటలు లేకుండా వాదగని చంపకమాలలకూ, ఉత్పలమాలలకూ తలపెడితే అంత్యగురువు లభించుటకుగాను, ఏకాక్షర శబ్దాలు అతకవలసివస్తుంది. యతి ప్రాసలకోసం నిరర్ధక పదములను పర్గాంగు రాళ్ళవలె నిలవెయ్యాలి. కౌపీన సంరక్షణార్ధ మయం పటాటోపలఖ” పద్యం అన్న తర్వాత కొన్ని పొల్గ్లుమాటలూ, కొన్ని రెల్లుగడ్డి భావాలూ చోటు చేసుకోక తప్పదని గురజాడకు తెలుసు. పద్యంలో అర్ధం, భావం, రసం వీటి పరిరక్షణ కౌపీన రక్షణార్ధమైన పడిన పటాటోపమంతా పడవలసివస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నవాడు కాబట్టై గురజాడ తన సునిశితమైన ప్రతిభను పద్యం చట్రంలో బిగించలేక, గేయ ఛందస్సును చేపట్టినాడు.

గురజాడ గేయ ఛందస్సును చేపట్టడానికి (ప్రధాన కారకుడు శంభుచం(ద్ర ముఖర్జీ అయిఉంటాడని భావించవచ్చు. గురజాడ విద్యార్ధి దశలోనే, 21వ ఏటనే “సారంగధర అనే కావ్యాన్ని ఇంగ్లీషులో రాసి జి. వెంకట రమణయ్య గారు నడుపుతున్న “ఇండియన్‌

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 71 లీజర్‌ అవరొ (1౧6140 ఓ6150!6 [౦౮౪౧ అనే పత్రికకు పంపినాడు. వెంకటరమణయ్యగారు “సారంగధర కావ్యాన్ని తమ పత్రికలో ప్రచురించడమే కాకుండా, కలకతాలో శంభుచంద్ర ముఖర్జీ గారు నడుపుతున్న 'రస్‌ అండ్‌ రయత్‌ (౧618 2౧౮6 ౧౧/60 అనే పత్రికకు కూడా ప్రచురణార్ధం పంపినాడు. శంభు చంద్ర ముఖర్దీ వర్ధిష్ణువైన గురజాడ ప్రతిభా పాటవాన్ని సరిగా అంచనావేసి గురజాడకు రాసిన ఉత్తరంలో ఇట్లా రాసినాడు. . జలపాతాలను ప్రవహించే సెలయేళ్ళను వీక్షించండి. మానవ రూపంలో అరుదుగా అందంగా గోచరించే దైవాంశమును చూడడం మరవకండి. మీ హృదయాన్ని ఇతరుల హృదయాలను పరిశీలించండి. వాటి బలాన్ని దౌర్చల్వాన్ని పరీక్షించండి. ఇతరులు సాధించిన గొప్పతనాన్ని తెలుసుకోండి. కాని ఇతరుల మీద ఎన్నడూ ఆధారపడవద్దు. మీ ఆత్మశక్తి మీద మీరు విశ్వాసం వుంచి అన్ని విధాల దాని వికాసానికి కృషి చేయండి.” శంభుచంద ముఖర్జీ గురజాడకు రాసిన మరో ఉత్తరంలో... “జానపద గేయాలు వివిధ ఛందస్సులలో పద్యాలు వ్రాయడాని కుపక్రమించండి.”” అని సలహా ఇచ్చినాడు. గురజాడ గేయ ఛందస్సును స్వీకరించడానికి అన్నిటికంటె ముఖ్యకారణం వాడుక భాష, వ్యావహారిక భాషకు, పద్య ఛందస్సుకు పొత్తు కుదరదనే విషయం గురజాడకు బాగా తెలుసు. ముత్యాలసరాల గేయాల రచనా కాలం (1910-18) తర్వాత రచించిన సుభద్ర పద్యకావ్యం (1913) కూడా వాడుక భాషా రూపాలు లేకుండా గ్రాంధిక భాషలో రచించడం పైఊహను బలపరుస్తున్నది. వాడుక మాటలకూ, రసస్స్ఫూర్తికీ చాలా దగ్గరి సంబంధమున్నదని గుర్తించిన గురజాడ ఆ మాటలకు విలుకలిగించే మాత్రా ఛందస్సులపై దృష్టి మళ్లించవలసి వచ్చింది. “నాది ప్రజల వుద్యమము. దానిని యెొవరిని సంతోష పెట్టడానికైనా వదులుకోలేను.” అని వ్యావహారిక భాషను ఒక ఉద్యమంగా భావించిన గురజాడ, వాడుక భామా సామర్దాన్ని నిరూపించదానికే నన్నట్లు “కన్యాశుల్కం” నాటకాన్ని వాడుకభాషలో చాలా విజయవంతంగా రాసి చూపించినాడు అనేక రంగాలలో వ్యావహారిక భాషా వ్యాప్తిని అరికట్టలేక అంగీకరించవలసీన పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి గణబద్ధ ఛందస్సులతో, గ్రాంధికభాషలో కవిత్వాన్ని ప్రజలకు దూరంగా ఉంచిన ఆనాటి పండితులకు కావ్యరచనకు వాడుక భాష తగదనే అభిప్రాయం మాత్రం బలంగా ఉండిపోయింది. వాడుక భాష కావ్య రచనకు తగినదనే అభిప్రాయ మున్న ” గురజాడ అప్పారావు “వ్యావహారిక భాషాపదాలను సులువుగ, యభథెేచ్చగ ఇముడ్చుకునే ఛందస్సులను మనం సృష్టించుకోవాలి.” అని భావించినాడు. ఆంగ్లభాషా పారంగతుడైన గురజాడ ఆ భాషలో వర్డ్స్‌వర్తు, (//0/6940గ1), స్విన్‌బర్న్‌ (94/1000/౧9) మొదలైన కవులు వాడుకభాషలో రసవత్మావ్వ్యాలు రచించిన సంగతి గుర్తించినాడు.

72 అధునిక యురారంభం - గేయానతరణం శతకాలు, ద్విపద కావ్యాలు, జానపద గేయాలు, వీరగాథలు ప్రజల మెప్పుపాొంది ఉన్నాయంటే, శబ్లాడంబరాన్నీ చాలా మట్టుకు విసర్దించినందువల్లనేనని గ్రహించినాడు. జానపద గేయాలలో శబ్బసౌష్టవం లేకపోయినా, కవితా శిల్పం లేకపోలేదని, సర్వజన సంవర్ధితమైన జానపద గేయాలు విదేశీయుల నాకర్షిస్తున్నాయనే విషయం గురజాడ గుర్తించినాడు. గుర్తించడమేకాదు, జానపద గేయాలంటే ఆయన కమితాసక్తి ఉండేదని ఆయన డైరీలను బట్టి తెలుస్తుంది. ద్రవిడియన్‌ ఫోక్‌సాంగ్స్‌, ఇంగ్రీషు రూరల్‌ పాయట్రీ, ది ఫోక్‌ సాంగ్స్‌ మొ॥ గ్రంథాలను చదివి ఉన్నాడు. అంతెందుకు కన్యాశుల్మ నాటకంలో సన్నివేశానికనుగుణంగా జానపద గేయాలకు స్థానం కల్పించినాడు. వాడుకభాషలో రసవంతంగా కావ్యరచన చేయవచ్చునని నిరూపించడానికే గురజాడ గేయాన్ని స్వీకరించి నాడనే విషయం విశదమవుతుంది. జానపద గేయాల సరళమైన ఛందస్సు, భావవ్యక్తీకరణ సొారళ్య్ళ్యం గురజాడను ఆకర్షించి ఉంటుంది. అందుకే జానపద గేయాల ఛందస్సునుంచే ముత్యాలసరమనే కొత్త మొలకను తీసుకొనివచ్చి ఆధునికాంధ్ర కవితాక్షేత్రంలో అంటుగట్టీనాడు.

గురజాడ నిరాడంబరమైన, నిరలంకారమైన శైలిలో, సరళమైన గేయ ఛందస్సులో కవిత్వాన్ని రచించడంవల్లనే “పుట్టు కవులయి”, కరిన గ్రాంధిక భాష, ప్రాఢమైన పద్య ఛందస్సులో పలుకలేక “మూగలైయున్న”” ఎందరో యువకవుల గళాల నిగళాలు విడివిడి, కవిత్వం సమాజపరమై, సామాజిక సమస్యలను చిత్రీకరించగలిగింది.

గురజాడ పద్యాన్ని కాదని గేయాన్ని స్వీకరించడానికి మరొక ముఖ్యకారణం-కవికి మానవ సమాజం పట్ల మహత్తరమైన బాధ్యత ఉన్నదనే విషయం ఆయన గుర్తించడం. ” తనకున్న మహత్తర బాధ్యత సంఘసంస్కరణ, మానవతా ప్రబోధం అని భావించినాడు, తాను మానవ సమాజానికి అందించవలసిన నూతన సందేశాన్ని పద్యం కంటె గేయమే ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళుతుందనే విషయం గురజాడ గుర్తించినాడు. పిల్ల వసు చరిత్రల కావ్యాలలోని శ్లేషలూ, యమకాలూ మొదలైన అనవసర పదభారాన్ని పద్యరూపం మోయలేక మోసి పాతదైపోయింది. పల్ఫ్పబడిపోయింది. కనుక గురజాడ తెలుగువారికి ఆధునిక భావాలను, నూతన సందేశాన్ని అందించడానికి గేయరూపాన్ని స్వీకరించినాడు. వాడుకభాష్క సంఘ సంస్మరణ-ఈ రెండు చక్రాలు తొడిగి గేయ కవితా రథాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చినాడు,

పద్యరచనలోని సాధకబాధకాలు, శంభుచంద్ర ముఖర్ధి సలహా, వాడుకభాష్క సమాజంపట్ల కవి బాధ్యత ఈ నాలుగు కారణాలు గురజాడ గేయరూపాన్ని చేపట్టడానికి దోహదం చేసినాయి.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 73

దా॥సి. నారాయణరెడ్డి గారన్నట్లుగా గురజాడ చెసిన చాలా సాహసోపేతమైన ప్రయోగాలలో ముత్యాలసరం ఒకటి. పద్యం నుంచి గేయానికి తిరిగిపోవడమే గొప్ప ప్రయోగం. అందులో ఒక్కమాత్రా నియమం తప్ప, యతిప్రాస నియమం లేని గేయాన్ని చేపట్టడం, పైగా వాడుకమాటలు ప్రయోగించడం, ఆ గేయాన్ని ఉదాత్త విషయాలను వ్యక్తీకరించడానికి వాహికగా చేయడం ఒక దానికన్న ఒకటి మిన్న అయిన ప్రయోగాలే. చే

కవిత్వరంగంలో గురజాడవలె సాహసోపేతమైన ప్రయోగాలు చేసినవారిలో పూర్వాంధ్ర కవులలో పాల్కురికి సోమనాధుడొక్కడే. “ఇరువురూ దేశిసాహిత్య ప్రవర్తకులే, ఇరువురూ వ్యవహార భాషను చేపట్టినవారే-ఒకరు జాను తెనుగనగ్గా, మరొకరు సజీవమైన భాష అన్నారు. ఇరువురూ వర్ణభేదాలు లేని సమాజాన్ని లక్షించినవారే. కాని ఇరువురికీ కల భేదమంతా ఒక్క విషయంలో-ఒకరిది శివభక్తి మజొకరిది మానవాభ్యుదయాసక్తి.

గురజాడ అవ్వారావుగారు వాల్సురికి సోమనాథుని వలెనే వస్తువు, భాష్క ఛందస్సు -ఈ మూడు కవిత్వాంగాలలోను పూర్తిగా దేశికవి. పాల్కురికి తరవాతి కవులు ద్విపదను నిరాదరించి తిరిగి పద్యాన్ని చేపట్టినట్లుగానే, ద్విపదలో రాసిన గోనబుద్ధారెడ్డి మొదలైన వారు పాల్ఫురికిని వస్తువులో (వం) గాని, భాష (జాను తెనుగు) లో గాని అనుసరించ నట్లే, గురజాడ తర్వాత వచ్చిన భావకవులు కొందరు ఆయన ఛందస్సును మాత్రమే అనుసరిస్తే, కొందరు వస్తువును, మరికొందరు భాషను మాత్రమే అనుసరించినారు. వస్తువు, భాష ఛందస్సు ఈ మూడింటిలోను పూర్తిగా గురజాడను అనుసరించిన భావకవులు లేరనే చెప్పాలి. మయముత్యాలసరాల లక్షణం

గురజాడ అప్పారావు ముత్వాలసరాలలో చేసుకొన్న నియమమిది. “మొదటి మూడు చరణములలోను సామాన్యముగా పధ్నాలుగేసి మాత్రలుండును. నాలుగో చరణమున యేడు మొదలు పధ్నాలుగు వరకూ వుండును. విరామమును అర్భానుసారముగా చెవికింపగునట్లు మార్చ యత్నించితిని. ఎంతవరకు నా యుద్యమము కొనసాగెనో, మార్పుల యెడ నసహనములేని చదువరులు చెప్పవలె.” గురజాడ అప్పారావు ముత్యాల సరం ఛందస్సు సృష్టితో కవితా రంగంలో ఒక కొత్త బాట తొక్కినవారే కాక, ముత్యాల సరం ఛందస్సును చిత్తశుద్ధితో ఒక ఉద్యమంగా కొనసాగించినందువల్లనే, ఆధునిక కవితాలోకంలో ఆనాటి నుంచి ఈనాటి వరకూ కొనసాగుతూ వస్తున్నది.

గురజాడ ముత్యాలసరం స్టూలస్వరూపాన్ని గురించి మాత్రమె చెప్పినాడు కాని, ముత్యాలసరం ఎట్లా నడుస్తుందో వివరించలేదు. ముత్యాలసరం మాత్రా ఛందస్సుకు

గీ అధునిక యురారంభం - దేయానతరణం సంబంధించినది. మాత్రాఛందస్సు గతి ప్రధానమైనది. కనుక మాత్రాఛందస్సు పద్యాలకు లక్షణం చెప్పేటప్పుడు నడకను నిర్దేశించడం ముఖ్యం. గురజాడా, తర్వాతి కవులూ ముత్యాలసరాన్ని నామాన్యంగా నడిపిన తీరును బట్టీ, ఆ ముత్యాలసరం నడక ఏమిటో ఆధునిక కవితారంగంలో స్థిరపడిపోయింది. చక్కగా నడిచే ముత్యాలసరాలను పరిశీలిస్తే ముత్యాలసరాల సామాన్య లక్షణం ఈ విధంగా ఉంటుంది.

ముత్వాలసరం ఛందస్సుకు నాలుగు పాదాలు ఉంటాయి, మొదటి మూడు పాదాలు సమానమైనవి. చివరిపాదం హ్రస్వపాదం, సమపాదాలలో పాదానికి రెండు సప్త మాత్రాగణాలు (3+4౫2=14 మాత్రలు) ఉంటాయి. చివరి హ్రస్వపాదం సాధారణంగా 9 మాత్రలు ఉంటుంది. ఈ పాదంలో కూడా ఒక సప్త్రమాత్రాగణం (3+4) మీద ఒక గురువు ఉంటుంది. ముత్వాలసరం ఛందస్సు లయ మూడు మాత్రలు, నాలుగు మాత్రలు. త్రిపుటతాళంలో నడుస్తుంది. ఈ తాళం తప్పితే మాత్రల సంఖ్య సరిపోయినా పాదం నడువదు.*ే

ముత్యాలసరం మి(శగతి (3+4) లో నడుస్తుంది. గురజాడ అప్పారావూ, తర్వాతి కవులు కూడా మిశ్రగతిలోనే ముత్యాలసరం ఛందస్సును నడిపినారు. కాని కొందరు కొన్నిచోట్ల కేవలం మాత్రాసంఖ్యను (పాదానికి 14 మాత్రలు) మాత్రమే నియమంగా పెట్టుకొని మిశ్రగతికి భిన్నంగాకూడా నడిపినారు. అయితే వాటిని ముత్యాలసరాలుగా పరిగణించకూడదు. ముత్యాలసరం చివరి హ్రస్వపాదంలో గురజాదా, తర్వాతి కవులూ చాలా వరకు సాధారణంగా 9 మాత్రలనే వాడినారు. చివరిపాదంలో 7 నుంచి 14 మాత్రలు వాడినవారు తక్కువే. చివరి వాదం 7 మాత్రలది ఉన్నప్పుడు చివరిపాదం సమపాదంలో సగపాదమవుతుంది. చివరిపాదం 14 మాత్రలది ఉన్నప్పుడు, అన్ని పాదాలూ సమాన పాదాలవుతాయి. ఈ నియమాలన్నిటినీ ముత్యాలసరం విశేష నియమాలుగా [గ్రహించాలేతప్ప సామాన్య లక్షణంగా ([గ్రహించరాదు.

ఇక యతి, ప్రాసలు, ముత్యాలసరాలలో యతి, ప్రాసలు నియతం కావు. ముత్యాలసరంలో యతిని నియతంగా పాటించనప్పుడు యతిస్టానాన్ని నిర్ణశించనవసరం లేదు. గురజాడ ముత్యాలసరాలలో యతిని పాటించిన సందర్భాలలో కూడా అన్నిచోట్లా నియతస్థానంలో పాటించలేదు. ఇష్టం వచ్చిన చోట పాటించడం జరిగింది. తరవాతి కవులు ముత్యాలసరంలో యతిని పాటించినవారు ఎక్కువగా ప్రతిపాదం మొదటి అక్షరాన్ని వొటించినారు. తర్వాత రెండవ సప్తమాత్రాగణాద్యక్షరాన్ని యతిన్థానంగా పాటించినారు.

కక ముత్యాలసరాలలో ఉపయోగించవలసిన గణాలలో మూడు, నాలుగు మాత్రలలో వేటినైనా ఉపయోగించవచ్చు. ముత్వాలసరం మాత్రాఛందస్సుకు సంబంధించి

ఆధునికాంధ్ర గేయ కఠిత్వం 75 నదీ కాబట్టీ గణనిర్దెశం చేయనక్కరలేదు. కాని అబ్బూరి రామకృవ్లారావుగారు ముత్యాల సరానికి గణనిర్దేశం చేసినట్లుగా శ్రీశ్రీ ముత్యాలసరం వ్యాసంలో తెలిపినారు. " అబ్బూరి రామకృష్ణారావు గారి అభిప్రాయం ప్రకారం ముత్యాలసరం పాదం ఇట్లా ఉంటుంది. సూర్యగణం+ఇంద్రగణం+సూర్యగణం+ఇంద్రగణం 'ఇంద్రగణాలలో భగణము, నలమూ అనే చతుర్మాత్రాగణాలు వాడినప్పుదే ముత్యాలసరం అవుతుంది. అబ్బూరి రామకృష్ణారావుగారి లక్షణం ప్రకారం ముత్యాలసరం చాలా సంకుచిత పరిధిలో నడుస్తుంది. శ్రీశ్రీ ముత్యాలసరంలో ఉపయోగించే చతుర్మాత్రాగణాలలో 'భగణం, నలం'తో పాటు 'సగణం, గగిను కూడా అంగీకరించి నారు. కాని చతుర్మాత్రాగణమైన జగణాన్ని పేర్కొనలేదు. జగణం విలోమగణం. కాబట్టి ముత్యాలసరంలో అది ఇమడదని శ్రీశ్రీ అభిప్రాయమై ఉంటుంది. కాని ముత్యాలసరంలో ఉపయోగించవలసిన త్రిమాత్రా గణాలలో సూర్యగణాల (నగణం, హగణం)తో బాటు విలోమగణమైన లగాన్ని కూడా అంగీకరించినాడు. లగ ప్రయోగంవల్ల ముత్యాలసరంలో ప్రౌఢగమనం సిద్ధిస్తుందని శ్రీశ్రీ ఆ వ్యాసంలో అభిప్రాయపడినారు. కాని డా॥ చేకూరి రామారావుగారు 'ముత్వాలసరం జగణంతోపాటు, లగాన్ని కూడా ఇముడ్చుకోలేదు.” అని అభిప్రాయపడినారు.* ముత్వాలసరంలో గురజాడా, తర్వాతి కవులూ చేసిన ప్రయోగ వైవిధ్యాన్ని ముందుముందు వివరించినప్పుడు ముత్యాలసరం లక్షణం మరింత విశదం కాగలదు. ఇప్పుడు ముత్యాలసరానికి మూలమేదనే విషయం ముచ్చటిస్తాను. ముత్యాలసరాల మూలం గురించి గురజాడ అప్పారావు ఏమీ చెప్పలేదు. “ఒక జాతి ఫార్ఫీ గజలు యొక్కనడక ముత్యాలసరములో తెచ్చుటకు నే యత్నించి యుంటిని ముత్వాలసరాల లక్షణం వ్యాసంలో గురజాడ తెలిపినాడు. ముత్యాలసరం సృష్టికి దోహదం చేసిన ఆ పార్శీ గజలేదో గురజాడ ఉదాహరించలేదు. అయితే ముత్యాలసరం నడక మన ప్రాచీన జానపద గేయాలలోను, రగడలలోను కనబడుతుంది. నడకను బట్టీ ముత్వాలసరం వసుచరిత్రలోని ప్రసిద్ధమైన వృషభగతి రగడను పోలిఉంటుంది. బాల బాలరసాల మిది శుక-పాలిపాలిటి యమరసాలము గేలి గేలిడి గ్రుచ్చగడురా-గిల్లు గిల్లుము తత్ర్రవాళము పై వృషభగతి రగడలోని రెండు పాదాలను నాలుగు పాదాలుగా రాస్తే 'ముత్యాలసరంి అవుతుంది. హరిణగతి రగదకు రెట్టింపే వృషభగతి రగడ, ముత్యాల సరంలో నాలుగోపాదం కూడా పధ్నాలుగు మాత్రలదే అయినప్పుడు ముత్యాలసరానిక్తీ,

76 ఆధునిక యుగారంభం - డేయావరతరణం హరణగతి రగడకూ తేడా ఏమీలేదు. ఒక్క యతి ప్రాసలు, అంత్య ప్రాసలలో తప్ప, ఆద్యంత్య ప్రాసలు, యతి నియమాలులేని 'హరిణగతి రగడే' ముత్వాలసరం అని తేలుతుంది. ముత్యాలసరం చివరి పాదంలో సాధారణంగా 9 మాత్రలే ఉంటాయి. $ మాత్రలున్న చివరిపాదాన్ని మూడో పాదంలోకి తీసుకొనివస్తే అంటే ముత్వాలసరం నాలుగు పాదాలను మూడు పాదాలుగా రాస్తే భామినీషట్పది సగభాగానికి సమ్మ సరిపోతుంది. భామ్‌నీ షట్పదిలో ఉన్న ప్రసిద్ధమైన జానపద గేయం. గుమ్మదేడే గోపి తల్లీ గుమ్మడేడే ముద్దుగుమ్మా గుమ్మదేడే కన్న తల్లీ గుమ్మడేడమ్మా ఇది భామినీషట్పదిలోని సగభాగం. మూడోపాదంలోని “గుమ్మడేడమ్మా' అనే ఖాగాన్ని నాలుగో పాదంగా రాస్తే అప్పుడది ముత్యాలసరమే అవుతుంది. 'మేలుకొలువు” పాటలలో కూడా ముత్యాలసరం ఛందస్సు కనిపిస్తుంది. కంరీరవరాజు యక్షగ్రానంలోని మేలుకొలుపు పాట ముత్యాలసరమే. మేలుకొనవే చంద్రశేఖర మేలుకొనవే ఇంద్రవందిత మేలుకొనవే ఫాలలోచన నీలకంరా హరా పార్సీగజల్‌ నడక ముత్యాలసరం ఛందస్సుకు (ప్రేరణ ఇచ్చినమాట యధార్ధమె కావచ్చు. ఏమైనా ముత్యాలసరం గురజాడ నూతన సృష్టి మానవాళికి నూతన సందేశాన్ని అందించదానికి ఆ ఛందస్సును సొంతం చేసుకొన్నాడు. ముత్యాలసరం నడక తీరు జానపద గేయాలలో కనిపించినప్పటికీ, పేరులోనే కొత్తదైనప్పటికీ గురజాడ అప్పారావు పేరుతో ముడిపడి ఉన్నది. కాళిదాసనగానే మందాక్రాంత, వేమన్న అనగానే ఆటవెలది, శ్రీనాధుడనగానే సీసం, పాల్కురికి అనగానే ద్విపద జ్ఞాపకం వచ్చినట్లు గురజాడ అనగానే ముత్యాలసరం గుర్తుకు వస్తుందని విజ్ఞుల అభిప్రాయం. ముత్యాలసరం నడకకు దగ్గరగా ఉన్న పార్సీ గజలు నడక ఏమైఉంటుందో డా!1సి. నారాయణరెడ్డిగారు తమ సిద్ధాంతవ్యాసంలో రాసినారు. డా1సి. నారాయణరెడ్డి గారు చూపిన పార్శీ గజలు ఇది.

ఆధురికౌంధ్ర గేయ కనత్యం 77 వాఇ జాకీం జల్వ బర్‌మహ్రాబొ మెంబర్‌ మీకు నంద్‌ చూంబ ఖిల్వత్‌ మీర వంద్‌ అంకారె దీగర్‌ మీకు నంద్‌ *-వాఫిజ్‌ బండి నాగరాజు గారు 'బహర్‌ రమలొ అనే పార గజల్‌ ఛందస్సు ముత్యాలసరానికి సరిపోతుందని తనకు రాసినఉత్తరంలో పేర్కొన్నట్లుగా రమణారెడ్డిగారు 'మహూదయం'లో పేర్కొన్నారు. * ముత్యాలసరానికి సరివచ్చే రమల్‌ ఛందస్సు నడక ఇది. సబ్‌క హాకుచ్‌ లాల వోగుల్‌ కొత్త పాతల మేలు కలయిక మేను మాయా హోగ యీ క్రామ్మె రుంగులు జిమ్మ గా పైన పేర్ళొన్న పార్శ గజళ్ళు రెండూ కూడా ముత్యాలసరం నడకకు దగ్గరగా ఉన్నాయి. నీలగిరి పాటలు గురజాడ అప్పారావు ముత్యాలసరాల కంటె ముందుగా 'సీలగిరి పాటలు” రచించినాడు. ఇవి మొత్తం ఆరు పొటలు, విటిని స్వరసహితంగా ఆంగ్లానువాదంతో ప్రత్యేక పుస్తకంగా 1907లో ప్రకటించగా, గురజాడ అనంతరం 'ముత్యాలసరాలు” [గ్రంధంలోనే చేర్చడం జరిగింది. “నీలగిరి పాటలలో సంగీత సాహిత్యాలు చక్కగా సంగమించినాయి. ఆనంద గజపతి అప్పల కొండయాంబ (రీవారాణి)కు సచివుడుగా మెలగిన గురజాడ ఆమె తరచు బేసే “నీలగిరి యాత్ర లలో సారధ్యం వహించేవాడు. పైగా గురజాడ ఆరోగ్యం దృష్టా ఆ యాత్ర ఎంతో అవసరమర్వ్య్యోది. రీవారాణి “నీలగిరి యాత్ర పరివారంలో గురజాడ వంటి కవుబే కాక, సంగీత విశారదులు గూడా ఉండి ఉంటారు. వారి ప్రోత్సాహం, కోరికా కూడా గురజూడను ఈ పాటల రచనకు పురికొల్పి ఉందాలి. అంతేకాదు తనకు ఆరోగ్యాన్ని (ప్రసాదించి, నూతనోత్తేజాన్ని, నూతనోల్లాసాన్ని కలిగించిన చల్లని కొండల మీడ కృతజ్ఞతా సూచకంగా ఆ పేరుతో పాటల సంపుటిని రచించినాడు. అందుకే ఆ పాటలలో ప్రకృతి సొందర్యారాధన వ్యక్తమైంది. సంగీత ప్రపంచంలో సాహిత్యం అంతా భక్తి శృంగారాలకే అంకితం అయింది. పదకవిత్వంలో ప్రకృతి వర్ణనలు ఒక్క సీలగిరిపాటలలోనే ఉన్నాయి. ఆ దృష్ట్వా నీలగిరి పాటలు ఆధునికతా ముద్ర ఉన్నవని చెప్పవచ్చు.

౯ అధునిక యుగారంభం - దేయాదఠరణం

కాని ముత్యాలసరాల గేయాలలోని భావాలకూ, భాషకూ నీలగిరి పాటలలోని ఖావాలకూ, భాషకూ ఎంతో తేడా ఉన్నది. ముత్యాలసరాలలోని భావాలు ఆధునిక కాలానికి సంబంధించినవి. భాష వ్యావహారికం. నీలగిరి పాటలలోని భావాలు సాంప్రదాయిక మైనవి. భాష కూడా గ్రాంథికం. వాడుక భాషాపదం మచ్చుకైనా కనిపించదు. నీలగిరి కొండ '“బృందారకముని బృందసేవితమగు నందనవన” మట. అక్కడి కొండ చరియల నంటి సాగే వెందిమబ్బులు వెన్నుని సిగనమరియున్న వేల్పుతరువు విరుల మాడ్కి ఉన్నాయట. ఆశ్రిత వరదు డంబికారమణుడు' తన కృతిని స్వీకరించిన 'అప్పల కొండయాంబిను బ్రోచవలెనట. “మాట మూట గల్టగొని, వాటి దప్పితనుట నా పొరపాటుగాక మాటన నేపాటిర నీసాటిదొరకు*, 'మేటిపైన నీ యెద మొగమూట మెటుల బాసె నొక్క్మమాటురా, నీ యోటుమాటె కోటి ధనములిచ్చి కొందు-వంటి పాటలు జావళీల రచనా సరళిని తెలుపుతాయి. అంతేకాదు గురజాడ అప్పారావుకు గల అనుప్రాసరక్తినీ, శబ్దసౌందర్య ప్రీతినీ తెలుపుతాయి. తొలిదశలో ఇంతగా పరమ సాంప్రదాయికమైన భావాలను, ఇటువంటి భాషలో వెల్లడించిన గురజాడ అప్పారావు ముత్యాలసరాలలో వాడుకభాషలో, అందునా నిరలంకారమైన శైలిలో ఉదాత్తమైన భావాలు వెల్లడించడం కవితా ప్రస్థానంలో ఆయన సాగించిన సాధన ఉన్నతమైనది.

అయితే “నీలగిరి పాటలను పాటల దృష్టితోనే చూడాలి. అట్లా చూసినప్పుడే ఆ పొటల రచనా సౌందర్యం బోధపడుతుంది. నీలగిరి పాటల శైలి ప్రధానంగా సంగీతానికి అనుగుణంగా ఉన్నది. పాటలలోని ఆ అనుప్రాసల విన్వాసమూ, ఆ విరుపులూ సంగీతరచన కుద్దేశించినవేనని తెలుపక తెలుపుతున్నాయి. ముత్యాలసరం గేయాలలో ఛందోనిర్వహణలో గురజాడ తగిన మెలకువ చూపలేదని విమర్శకులు అభిప్రాయ పడతారు. పై విమర్శలో బలమెంతో పరిశీలించేముందు గురజాడకు గేయరచనలో గల సంప్రదాయబలం సంగీత, సంస్కార పరిమళం ఎంతగా ఉందో తెలుసుకోవాలి. అందుకు 'నీలగిరి పాటల” నిర్మాణ శిల్పాన్ని రేభామాత్రంగానైనా పరిశీలించడం అవసరం.

నీలగిరి పాటలలో 'ఊటిచోద్యమేమి చెపుదు* 'నాటిమాట,” “చిత్తరువనిజూడ' వంటి ఛందోబద్ధమైన శీర్చికలే తెలుపుతాయి; ఇవి సంగీత సంబంధమైన రచనలని, నీలగిరిపాటలలో ఒక్క 'లేవాకొా మంత్రములు” అనే పాటలో తప్ప మిగతా ఐదు పాటలలోని పల్లవి, అనుపల్లవి, చరణ విభాగం కనిపిస్తున్నాయి. 'లేవాకొ మంత్రములు” అనే పాటలో కేవలం చరణాలు మాత్రమే ఉన్నాయి. ్రక్రియాస్వరూపంలో ఇది కీర్తనల వద్ధతికి చెందిన రచన అయినా స్వభావంలో “పాటల గంధి రచనే. ఈ పాటలన్నిటిలోను కొన్ని నామాన్య లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి, ఏ పాదానికాపాదం విరగడం, పాద

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 79 మధ్యంలో విచ్చెదరూపయతితో బాటు సరూపాక్షరయతి కూడా నియతంగా ఉండటం, ప్రాస, వృత్యనుప్రాస, అంత్యానుప్రాస మొదలైన శబ్దాలంకారాలు కూడా నియతంగా ఉండటం మొదలైనవి. వీటన్నిటివల్ల పాటల రచనా సౌందర్యం ఇనుమ డించింది. ఉదాహరణకు ఎచ్చట జూచిన-బచ్చిక పట్టులు పొదవాద రొదలిడు-పాలుపగు పిట్టలు వింత వాసనలు-వీచెడు చెట్టులు కుదురు రధ్యగల-కొలకుల గట్టులు (నుందరతర మీ నీలనగము. గురజాడ గేయనిర్మాణంలోనేకాక, సంగీతానికి అనుగుణంగా రచన చేయడంలో మరెన్నో సొగసులు చూపించినాడు. ఒక్కొక్క పాటలో సంగీతానికి సంబంధించిన సొగసులు ఒకటి రెండు వివరిసాాను. 'నీలగిరి పాటలిలో 'సుందరతర మీ నీలనగము అనే మొదటి పాట నాలుగేసి మాత్రలకు పదం తెగుతూ బిగుతుగా నడుస్తుంది. ఆదితాళంలో పడుతుంది. పల్లవిని పట్టి చూస్తేనే చాలు, పదమాధుర్యంతోబాటు నాద మాధుర్యం చెవికి చవులూరిస్తుంది. సుందరతర మీ నీలనగము దీని యందము హృదయానందకరము దీని చందము హృదయానందకరము

పై పల్లవిలో నాదాక్షరాలైన నకార, మకారాలు, అనుస్వారం వీటి ఆవృత్తివల్ల మరింత శ్రుతిసుభగత్వం చేకూరింది. 'దీని అందము” అన్నప్పుడు 'దీ' దీర్హంగానే పలికినా పాడేటప్పుడు ఏకమాత్రకాలంలోకి లెక్కకు వచ్చేటట్లు పాడతారు. 'దీని అందము” అని పాడేటప్పుడు దీనికి ముందుగల అక్షరాల ఉచ్చారణ కాలం కొద్దిగా తగ్గించి “ది” అక్షరాన్ని దీర్హంగా పలికినా లయ సరిపెట్టడంలో ఒక అందం, ఊపు వస్తాయి ఇది పాటకెంతో అందాన్నిస్తుంది.

“ఊటి చోద్యమేమి చెపుదు” అనే పాట ఎత్తుగడలోనే ఎంతో నవ్యత ఉంది. పాటగాడు పల్లవికే ఎంతో పరవశించిపోతాడు. పరభాషాపదమైన 'ఊటి' తెలుగు మాటలకు ముందు చక్కగా చోటుచేసుకొన్నది. “ఉదకమండలి మని సంస్క ఎతీకరణరూపం వాడకుండా “ఊటి” అనే పదాన్ని ప్రయోగించడంలో నవ్యత కనిపిస్తుంది. మూదేసి మాత్రలకు చక్కగా పదాలు తెగుతూ నడకలో అందాలు నింపుకొన్నదీ గేయం. త్రిశగతిలో సాగే

80 ఆధునిక యుగారంభం - దేయాదతరణం గేయమైనా, పాటలో రూపకతాళానికి (2+4) వస్తుంది. అన్ని చరణాలలోను 4,8 పాదాల చివర నియతంగాను, మిగతా పాదాలలో అక్కడక్కడ సాహిత్యాక్షరాలు తగ్గించి రాయడం గానయోగ్యత కోసమే, లోపించిన నాహిత్యాక్షరాల మాత్రాకాలంలో రాగం సాగి పాటలో విశ్రాంతినిస్తుంది. ఉదాహరణకు రెండో చరణంలో

నిండు కొలువు హేమంత

ముండి యిచట వెలసెను

అన్నప్పుడు 'హేమంతింలో “హే” అక్షరాన్ని ఫ్లతంగా సాగదీసినప్పుడు లయ సరిపోవదమేకాక గేయగమనంలో ్రాథిమ పెరుగుతుంది. 'హేమంతి అని ఫ్లతథశ్రుతి వల్ల భావస్స్ఫూర్తి కూడా కలుగుతుంది. మూడో చరణంలో

సన సన్న వెండి మబ్బు చజీయలంటగా

అని అన్నప్పుడు పాదారంభంలో ఒక మాత్రను, రెండోపాదం చివర నాలుగు మాత్రలను తగ్గించి రచించడం జరిగింది. 'సనసన్నః అనే ద్విరుక్తపదంలో పూర్వరూపాన్ని ద్విత్వరహితంగా ప్రయోగించడం జరిగింది. పాడేటప్పుడు పాదారంభాన్ని 'సన్‌ సన్‌ న్‌ని అని ద్రుతం మీద నొక్కులు నొక్కుతూ రాగం తీస్తే పాటకు సొగసువస్తుంది. (శ్రవణసుభగత్వం కలుగుతుంది. ఈ విధంగా పొటగాడు ఫీట్లు చేయడానికి వీలుగా ఎక్కడ చోట్లు వదిలితే బాగుంటుందో సంగీతపు మట్లపట్లు తెలిసినవాడికే తెలుస్తుంది.

“ఉమాపతి యర్చని పాట ముఖ్యంగా సంగీతజ్ఞులను తృప్తిపరిచే విధంగా- తాళానుగుణంగా అక్షరాలను సాగదీసుకొని పాడే విధంగా రచన సాగింది. పల్లవిలో ఒక్కొక్క పంక్తికి 18 మాత్రలు; అనుపల్లవిలో, చరణాలలో కొన్ని పంక్తులు 19 మాత్రలు, మరికొన్ని 17 మాత్రల కాలంలో సాగినందువల్ల సంగీత సంప్రదాయంలో దీని స్వరరచన ప్రతి పంక్తికి 21 మాత్రల కాలానికి సాగదీయడం సాధ్యమయింది. కనుకనే దీనికి స్వరరచన సమకూర్చిన వారు మిశ్రచాపు (3+4) అని పేర్కొన్నారు. మాత్రాఛందస్సులో ఇది మి(శగతికి వస్తుంది. ఇది భక్తపరమయిన రచన.

'నాటి మాటి పాట ఛందస్సు దృవ్వా తిశ్రగతి అయినా, సంగీత రచనగా 2+4 పద్ధతిలో రూపకతాళంలోకి అన్వయిస్తారు. సాహిత్యాక్షరాలు నిండుగా ఉన్న పాట ఇది. ఎక్కడా జాగా లేకపోగా అక్కడక్కడ దీర్దాక్షరాలను లయకోసం కుదించుకోవలసి ఉంటుంది కూడా. 1వ చరణంలో “పాటి దప్పితనుట నా పొరి అనే పంక్తిలో ఒక మాత్ర ఎక్కువవుతుంది. కాని పాడేటప్పుడు “నా దీర్జాక్షరంగా పలుకుతూనే 'నా పొర"

ఆధునికాంధ్ర గేయ కఠిత్వం 81 మూదు మాత్రల కాలమే తీసుకొనేటట్లు పాడటం గానసంప్రదాయంలో ఉన్నదే. అట్లాగే 4వ చరణంలో 'మాటురా నీ యోటు మాటిలో “నీ” దీర్ధాక్షరమే అయినా, లయ దృష్టా ఏకమాత్రా కాలంలో ఉచ్చరించక తప్పదు. అనుపల్లవిలో (ము)మ్మాటికి నిను విడనంటి' అనే పాదంలో 'విడనంటి' ఒక మాత్ర తక్కువగా ఉన్నది. 'విడనన్‌న్‌టి' అని నొక్కిపాడితే మాత్రాకాలం సరిపోతుంది. ఈ పాటలో '*టి కారం మాటిమాటికి రావడం చెవికింపు గొలుపుతుంది. మట్టుకు తగినట్లుగా మంచి తేట మాటలను మట్టసంగా పొదిగిన పాట ఇది. ఇది పూర్తిగా జావళీల బాణీని పుణికిపుచ్చుకొన్న పాటే అయినా ఈ పాటలో కూడా గురజాడ

బ్రతుకునందు లేని స్టిరత

వెతక నేల భాషయందు అని వ్యావహారిక భాషావాదాన్ని చొప్పించినాడు.

“'లేవాకో మంత్రములు ఖండగతిలో సాగుతుంది. సంగీత సంప్రదాయంలో 10 మాత్రల అవృ్ఫతం గల జంపె తాళానికి అనుగుణమైనది. ఈ పాటలో పల్లవి, అనుపల్లవి లేవు. చరణాలు మాత్రమే ఉన్నాయి. చరణాలలో బేసిపాదాలు నిండుగా ఉంటాయి. పూర్తిగా 20 మాత్రల కాలంలోను సాహిత్యాక్షరాలుంటాయి. సరిపాదాలు నిండుగా ఉండవు. ఏడు మాత్రల కాలం చోటు వదిలిపెట్టడం జరిగింది. ఇట్లా చరణంలో పాదం విడిచి పాదానికి సప్తమాత్రా కాలం జాగా వదిలిపెట్టడంతో స్వర సంచారానికి ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. పాటగాడు రాగ ప్రసారంలో మెలకువలు చూపడానికి కావలసినంత స్వేచ్చ ఇవ్వడం జరిగింది. చరణాలలో ఇంత జాగా వదిలి పెల్టనందువల్ల, పల్లవి, అనుపల్లవి లేకపోయినా విశ్రాంతి అధికంగా ఉన్నందువల్ల పాటగా బాగా రాణిస్తుంది. ఇది కూడా శృంగారపరమైన గేయరచనే.

“బిత్తరువని చూడ*' పాట కూడా “ఉమాపతి అర్బ్చని కృతి రచనాపద్ధతిని అనుసరించింది. ఈ పాటలో ఒక్కో పాదంలో 17 మాత్రలు, మరికొన్నిటిలో 18, 19, 16, 15 మాత్రలు కూడా ఉన్నాయి. ఇట్లా మాత్రలు ఎగుడుదిగుడుగా ఉన్నా అన్ని పాదాలనూ ఒకే లయలోకి ఇముడ్భుకొనే విధంగా మిశ్రచాపులో (7) ఒక్కొక్క పాదాన్ని 21 అక్షరాల కాలంలో పాడుకోవాలి, ఈ పాటలో కూడా జావళి రచనారితి ననుసరించడం జరిగింది.

కన్యాశుల్మం నాటకం ద్వారా తెలుగువారికి ఉత్తమ హాస్యమెటువంటిదో తెలియజెప్పిన గురజాడ అప్పారావు కవిత్వంలో హాస్యాన్ని పోషించలేదు. ఒకే హాస్యపు

ఓ ఆధునిక యుగౌరంభం - దేయానఠరణం పాట ఉన్నది. ఇది నీలగిరి పాటలలోనిది కాకపోయినా, నీలగిరియాత్ర చేసే సందర్భంలో ఒకసారి యాత్రాబ్బందంలో ఒకరైన తాతాచార్యుల కోరికమీద అతనిపై ఆశువుగా అల్లిన గేయంలో వాస్యం తొంగి చూస్తున్నది.

నూగు మీసపు కట్టు

కానరాని బొట్టు

నోటాన సిగరెట్టు

కోటు వింత కుట్టు

చేకళ్ఞ జిలుగు వెండి కట్టు

నీలగిరి కొలను గట్టు

పై విహరించు వైష్ణవబొట్టు ఇది కార్టూను కవిత. ఈ రకంగా ఇది ఆధునికతను సంతరించుకొన్నది.

ఈ విధంగా గురజాడ రాసింది ఆరు పాటలైనా (నీలగిరి పాటలు) అన్ని తీరుల గతులలో నడిపినాడు. ఈ పాటలు నాహిత్యమర్శజ్ఞుదైన గురజాడ సంగీత రచనలో కూడా అందెవేసిన చేయి అని నిరూపిస్తాయి. పాటలన్నీ కూడా రచనా సౌందర్వాన్ని భావ సౌకుమార్యాన్ని గమన సారళ్యాన్ని సంతరించుకున్నాయి. గురజాడ కవిత్వాన్ని పద్యం నుంచి గేయం వైపు మలుపుతిప్పిన ప్రధమాధునిక గేయకవి కాబట్టి, గేయరచనా ప్రయోగ దక్షతను పరిశీలించే ముందు ఆయనకున్న సంప్రదాయబలాన్ని సమీక్షించడం జరిగింది. ముత్యాల సరాలు - ఆధునిక వస్తువు

గురజాద తనకు సమాజంపట్ల మహత్తరమైన బాధ్యత ఉందని భావించినాడు. కనుకనే ఉత్తమ సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి కన్యాశుల్కం నాటకం రచించినట్లుగానే కవిత్వం కూడా సమాజ శ్రేయస్సుకే అంకితం చేసినాడు. శ్రీశ్రీ గురజాడ ఆధిక్యానికి నాలుగు కారణాలను పేర్కొన్నాడు. ౨7 ఎ సామాజిక పరిణామానికి విష్రవపంధాలో వేగం సాధించడం (2) భవిష్యత్తు మీద విశ్వాసం (3) సజీవమైన వాడుకభాష ప్రయోగం (4) సార్వజనీనత, సార్వకాలికత. ముత్యాలసరాలలో ్రతిఖండికలో కూడా వస్తువులో నవ్యత, సంఘసంస్కరణాభిలాష వెల్లడవుతున్నాయి. గురజాడ కవిత్వంలో ఆధునికతను పదిశీలించే ముందు గురజాడ నాటి సాహిత్య స్థితిగతులను (ప్రాబంధిక ధోరణి), సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలి. గురజాడ గతానికి భఖీన్నంగాను, తన సమకాలిక సాహిత్వరీతుల కంటె, సమాజ వ్యవస్థకంటె ఎంతవరకు ఆధునికంగా

ఆఇధుధికాంధ్ర గేయ కవిత్వం న ఆలోచించగలిగినాడు అనే దృష్టితోనే పరిశీలించడం అవసరం. ఏ కవినైనా ఈ దృష్టితోనే పరిశీలించడం సద్విమర్శ అనిపించుకొంటుంది. అంతేకాని గురజాడ భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యాన్ని కోరలేదనో, ఆంగ్ల ప్రభుత్వంపట్ల విధేయుడనో, ్రభుభక్తి పరాయణుడనో, ఆయన తన రచనలలో పూర్తిగా సామ్యవాదాన్ని (90614115) కోరలేదనో భావించడం పొరపాటు. ఒకవైపు నిష్టుర ప్రభుభక్తి, మరొకవైపు నిద్దపు ప్రజాసేవానురక్తి-ఈ రెండిటినీ ఆయన చిత్తశుద్ధితో నిర్వహించిన మాట వాస్తవమే. కాని రాచరిక వ్యవస్థలో ఉంటూ కూడా “నాది ప్రజల ఉద్యమము, దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోలేను అని, “నాకే ఆశలూ లేవు... సాహిత్యకృషిని, కొనసాగించడ మొకటే నా ఆశయం. అయితే సాహిత్య రచనను నేను సర్వస్వతంత్రుడుగా వుంటూ కొననాగించ వలెనని నా అభిమతం” అని రాసుకొన్నాడంటే గురజాడ ఎంత ఆధునికంగా, స్వతంత్రం గాను ఆలోచించగలిగినాడన్నది వ్యక్తమవుతుంది. గురజాడ తాను నమ్మిన సిద్ధాంతాలను, విశ్వాసాలను తన రచనల ద్వారా వెల్లడించడానికి చిత్తశుద్ధితో కృషి చేసినాడు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడలేదు. ఆయన జీవికకోసం కొనసాగించిన వృత్తిని ఏ పరిస్థితులలోనూ ఆయన ప్రవృత్తికి అద్దుగా రానివ్వలేదు. ఆయన ఏ వ్యవస్థలో ఉన్నా ఆయన హృదయం, మేధ ఉన్నత లక్ష్వాలవైపే వికసించినాయి.

గురజాడ ఆధునికాంధ్ర దేశానికి ఒక నూతన భావావేశాన్నీ నూతన సందేశాస్నీ అందించడానికి పాతదైపోయిన పద్యరూపంలో కాక, గేయాన్ని వాహికగా గ్రహించినాడు. గురజాడ ఏ ఆశయ సాధనకు, ఏ భావ వ్యక్తీకరణకు గేయానికి శ్రీకారం చుట్టినాడో, గేయం ఈనాటికీ వాటిని శక్తిమంతంగా నిర్వహిస్తూ వస్తున్నది. ముత్యాలసరాల సంపుటిలో ఒక్సాక్కగేయంలో ఆయన తీసుకొన్న వస్తువేదో వివరిస్తే ఆయన గేయరూపాన్ని దెనికోసం గ్రహించినాడనే విషయం తేటతెల్లమవుతుంది. తోకచుక్క

గురజాడ మొట్టమొదటి ముత్యాలసరమైన “తోకచుక్క గేయం ద్వారా ఆధునిక కవితారంగంలో గేయాన్ని 'సంఘ సంస్కరణ ప్రయాణ” పతాకగా ఎగురవేసినాడు. తోకచుక్కపొడిస్తే భూమిమీద ఏవో అనర్థాలు జరుగుతాయనే మూఢవిశ్వాసాన్ని పోగొట్టడా నికే ఈ గేయాన్ని రచించినా, అనేక ప్రగతిశీల భావాలను ఇందులో వెల్లడించినాడు. “తోకచుక్క అనర్దాలు కలిగిస్తుందని భావించే రోజులలో దానిని సంఘ సంస్కరణోద్యమా నికి 'వేగుచుక్కగా భావించడం ఆధునికత, ముందుముందు 'జాతిబంధాలనే గొలుసులు జారిపోతాయని, ఎల్లలోకము ఒక్క ఇల్లై, వర్ణభేదాలన్నీ కలె, వేల నెరుగని ఢగేమబంధం వేడుకలు కురుస్తుందని, మతాలు మాసిపోతాయని, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగుతుందని,

గడీ ఆధునిక యుగారీంభం - గదేయాదతరణం అవనిమిద స్వర్ణసుఖాలు విలసిల్లుతాయని గురజాడ భవిష్యత్తుపట్ల ప్రగాఢ విశ్వాసాన్ని, విశ్వమానవ (ప్రేమను ప్రకటించినాడు. 'తూర్పు బలబల తెల్లవారెను*, '“యెక్కడనో వాక చెట్టు మాటున నొక్క కోకిల పలుకసాగెను*, “మేలుకొలుపులు కోడి కూసెను” వంటి పంక్తులు ఆధునిక కవితాప్రపంచంలో గురజాడకున్న వైతాళిక స్థానాన్ని సూచించి, సుస్టిరం చేస్తున్నాయి. రాసులు గురజాడ అప్పారావుగారు “కాసులు” అనే గేయంలో పవిత్ర దంపతీ ప్రణయానికి వాదులు వేసినారు. గురజాడ తరువాతి భావకవులు స్త్రీని హృదయేశ్వరిగాను, ప్రేయసిగాను సంభావించి అమలిన శృంగారతత్త్షమనే నూతన సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే, గురజాడ ఇంద్రియ సుఖాలను నిరసించకుండానే గార్టస్హ్య ధర్నానికి లోబడిన (ప్రేమను (క్రతివాదించి, స్త్రీని జీవితేశ్చరిగాను, 'స్నేహితురాలిగాను సంభావించినాదు. స్తీ పురుషుల మధ్య ప్రేమలేకపోతే “బ్రతుకు చీకటి” అని, 'ప్రేమనిచ్చిన (పేమవచ్చును, (పేమ నిలిపిన (పేమ నిలుచును అని ప్రేమతత్త్వాన్ని సూత్రప్రాయంగా ఆవిష్మరించినాడు. మరులు (ప్రేమని మదిదలంచకు మరులు మరలును వయసుతోదనె మాయమర్శము లేని నెస్తము మగువలకు మగవారి కృృృెటె బ్రతుకు సుకమునకు రాజమార్గము అనే పంక్తులలో (ప్రేమ కామానికంటె భిన్నమైనదని, కామం వయసుతోనే ఉడిగిపోతుందని, డమ కాయికంకాదని, అది మనస్సుకు సంబంధించినదని, (ప్రమ ఒక్కటే దంపతుల బ్రతుకుబాటను సుఖకరం చేస్తుందని, దాంపత్య (ప్రేమకు నివాళు లెత్తినాడు గురజాడ. భావకవితాయుగంలో రాయప్రోలు సుబ్బారావు ప్రతిపాదించి, విస్తరింపజేసిన అమలిన శృంగార తత్త్వానికి (౧110౧16 10౪6) బీజం ఈ పంక్తులలో కనిపిస్తున్నది. ప్రీలు బానిసత్వంతో మగవాళ్ళ అధికారంకింద, పెత్తనంకింద మగ్గిపోతున్న రోజులలో 'మగడు వేల్చ్పన పాతమాటది, ప్రాణ మిత్రుడ నీకు అని గురజాడ రాయడం అపూర్వమైన ఆధునికత, ప్రీ సమస్యను స్వీకరించి “కన్యాశుల్కం” నాటకాన్ని రచించిన గురజాడ ఈ గేయంలో ఈ రెండు పంక్తులలో పురుషుడు స్త్రీకి ఇవ్వవలసిన స్థానాన్ని చక్కగా సూచించినాడు.

ఆధునికొంద్ర గేయ కవిత్వం 85 లవణరాజు కల 'లవణరాజు కలి ఇతివృత్తం యోగవాశిష్టం, జ్ఞానవాశిష్టం [గ్రంధాలలోనిదే అయినా మూలకర్తలు ఆ ఇతివృత్తంలో ఉద్దేశించింది వేరు, గురజాడ ఉద్దేశించింది వేరు. పురాణాంతర్గతమైన వస్తువును స్వీకరించి, ఆధునిక భావాల కనుగుణంగా మలచు కోవడం గురజాడకు ఆధునికత పట్ల ఉన్న దృక్పథం 'లవణరాజు కలి ద్వారా వ్యక్త మవుతుంది. మూలకధ పూర్తిగా వేదాంతపరమైనది. మూలంలో వశిష్ణుడు రామునికి మనస్సు లక్షణాన్ని వివరించి, స్వప్న స్వరూపం తెలుపుతాడు. స్వప్నంలో మనస్సంక ల్పంవల్ల గోష్పాదం మేర అనేక యోజనాల దూరమవుతుందని, అనేక యోజనాల ప్రదేశం గోష్పాద మాత్రమవుతుందని, క్షణం కల్పంగాను, కల్పం క్షణంగాను అవుతుందని, కనుక దేశకాలాలు మనస్సుకు లోబడి ఉన్నవేనని వివరిస్తాడు. ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిపాదించే కధను తీసుకొని గురజాడ ఆధ్యాత్మిక వాసనలేవీ అంటకుందా, కేవల లౌకిక విషయాలను, లౌకికాదర్హాలను వెల్లడించడానికే కధలో అనేక మార్పులు చేసినారు. డా॥1సి. నారాయణరెడ్డిగారు తమ పరిశోధన గ్రంధంలోను', కె.వి. రమణారెడ్డి గారు 'మహోదయంిలోను “లవణరాజు కల* ఇతివృత్తాన్ని మూలకథతో పోల్చి, గురజాడ చేసిన మార్పులను, వాటి బెచిత్యాన్ని సవివరంగా చర్చించినారు. కనుక మళ్ళీ అటువంటి చర్చను చేయడం చర్విత చర్వణంగా భావిస్తూ గురజాడ ఈ గేయంలో (ప్రతివాదించిన విషయమేదో వివరిస్తాను. గురజాడ పౌరాణికమైన కథ ద్వారా ఆధునికమైన, ప్రగతిశీలమైన భావాలను వెల్లడించినాడు. జగత్తు మిధ్య అని, పరమే తిరమైనదని భావించే భారతీయుల ఊర్హ్వదృష్టిని, అనుభవమే సత్యమైనదని చెప్పి వాస్తవికత వైపు మళ్లించినాడు. పుస్తకాలలోని మాటలను చిలుకపలుకుల లాగా వల్లిస్తూ అనుభవాల తత్త్వాన్ని గుర్తించకపోవడం గుడ్డితనమేనని గురజాడ యొప్పటికి అనుభూత మెద్దియొ అప్పటికి యది నిక్కువంబే యెప్పుడో లోకంబు కల్లగు ననుట యిపుదెట్లో అని 'అనుభూతివాదాన్ని (6గ౧1గ105గ)) (్రతిపాదించినాడు. గురజాడ ఈ గేయంలో ప్రతిపాదించిన అనుభూతివాదానికి ౮౦౧౧ ౬00% ప్రతిపాదించిన ఇంద్రియాను భఖభూతివాదానికి (66౧5410౧2119౧)) దగ్గరి పోలికలున్నాయని రమణారెడ్డిగారు మహో దయంిలో అభిప్రాయపడినారు.*

తీర ఆధునిక యుగారంభం - దేయావతరణం గురజాడ అప్పారావు ఈ గేయంలో ప్రధానంగా అనుభూతివాదాన్నే ప్రతి పాదించినా, నిశ్చలమైన (ప్రేమముందు కులాల అద్దుగోడలు నిలవవనే నిజాన్ని కూడా కవితామయంగా (్రవచించినాడు. మలిన దేహులను మాలలని, మలినచిత్తులకు అధికకులాన్ని ఆపాదించిన ఈ వర్ణధర్శ్మం అధర్మమైన ధర్మమని మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ, రెందె కులములు మంచియన్నది, మాలయైతే మాలనే అగుదున్‌ అని గురజాడ వర్ణ వ్యవస్థ పట్ల తన వజసదృశ సంకల్పాన్ని వెల్లడించి విశ్వమానవ (మేమను చాటినాడు. కన్యక ఈ గేయంలోని వస్తువు ప్రసిద్ధమైనదె, వైశ్యుల కులదేవత అయిన “కన్యకా పరమేశ్చరి” వృత్తాంతమే ఇది. వస్తువులో నవ్యత లేకపోయినా, ఈ వస్తువును స్వీకరించి ఏ ఆధునిక భావాలను వెల్లడించకపోయినా, ప్రీ పట్ల గురజాడకున్న కరుణాగర్ధ దృష్టే ఈ కధను ఎన్నుకొనేటట్లు చేసి ఉంటుంది. రాచరిక వ్యవస్థలో బతుకుతున్న గురజాడ అప్పారావుగారు రాజులు 'రాసిక్యం' పేరుతో ఎందరి స్రీల మానాభిమానాలు మంటగలుపుతున్నారో అన్యాపదేశంగా తెలుపడానికి ఈ ఇతివృత్తాన్ని గ్రహించి ఉంటారు. పరప్రీల మానాభిమానాలు దోచే రాజులు జార, చోరులకంటె నికృష్ణులని కన్యక చేత నిందింపజేసాడు. ఆూజు తలచిందేను ధర్మం, రాజు చెప్పిందెల్ల శాస్త్రం" అనే దురహంకారపూరితులైన రాజుల కళ్ళు తెరిపిస్తాడు. కన్యక ఆత్మాహుతి చేసుకొంటూ పౌరుల నుద్దేశిస్తూ, ఆలుబీడ్డలను కాచుకోవాలనే ఆశ మీకు లేదా? పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవమముందడడా? పరువు నిలపను పౌరుషము మీ కేల కలుగదొకో? అని పౌరులలో పౌరుషాగ్నిని రగుల్కొల్పడానికి రేఖామాత్రమైన తిరుగుబాటు తత్వాన్ని ప్రబోధిస్తుంది.

ఆధునికౌంధ్ర గేయ కవిత్వం 87 ఊామన్‌ పితియస్‌ గురజాడ రచనలన్నిటిలోను వస్తువు భారతీయమైనదే. కాని ఇదొక్కటే విదేశీయమై నది. అయినా ఈ కధలో ప్రతిపాదించిన విషయం ఉపనిషత్తులలో ఉన్నదే. ఈ గేయంలో ఆదర్శమైత్రిని చిత్రీకరించినారు. స్నేహితులిద్దరూ ఒకరికి బదులు మరొకరు రాజాజ్ఞ ననుసరించి ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధపడిన త్యాగమూర్తులకధ ఇది. ఈ కధలో ప్రాజ్ఞుని గురించి చెప్పిన వాక్యాలు మన ఉపనిషత్తులలోనివే, "పెక్కులొకటిగ జూచువాడె (వ్రాజ్జుడు, అని ('మ్రందుటన్నది బొంది మార్చుట ముందు భవమున కల్లు విభవము నంద, ప్రాజ్ఞుడు వగవ జెల్లునె అనే వాక్యాలు భగవద్గీతలోని “జాతస్య హి ధ్రువో మృత్యుర్హవం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యే... బ్ధెనత్వం శోచితు మర్షసి”ో గీతా వాక్యాల అంతస్సారాన్ని అంతరంగంలో నింపుకొన్నది. బ్రతికి, చచ్చియు, ప్రజల కెవ్వడు బ్రతి గూర్చునొ, వాడె ధన్యుడు అని గురజాడ ఈ గేయం ద్వారా సందేశమిచ్చినాడు. పూర్ణమ్మ గురజాడ రచించిన గేయ కథలలోకెల్లా “పూర్ణమ్మ తలమానికమైనది. పూర్ణమ్మ రసవత్కాన్యం. “కన్యాశుల్కం” నాటకంలోని వస్తువూ, పూర్ణమ్మ గేయ కావ్యంలోని వస్తువూ ఒక్కటే. “జీవితమే ఒక నాటకం” అనే సూక్తికి లక్ష్యప్రాయంగా సజీవమైన పాత్రలతో జీవితాన్నె యధాతధంగా నాటకంగా మలిచి తెలుగులో ఉత్తమోత్తమ నాటకాన్ని సంతరించిన గురజాడ అప్పారావు, ఎన్నో వళ్ళ తర్వాత కూడా మళ్ళీ అదే సమస్యను తీసుకొని ఉత్తమోత్తమ గేయకావ్యంగా తీర్చిదిద్దడం ఆ సమస్యపట్ల ఆయనకున్న అభిమానాతిరేకం వెల్లడవుతున్నది. గురజాడ అప్పారావు “కన్వాశుల్మం”* నాటకాన్ని అపూర్వంగా రచించినా ఆ నాటకంలో ఇంకా ఏదో చెప్పలేదనే అసంతృప్తి వారిలో మిగిలిపోయి ఉంటుంది. నాటకం చివర “డామిట్‌ కధ అడ్డం తిరిగింది” అనే వాక్యంలో ఆయన సుప్తచేతనలో ఉన్న అసంతృప్తి ధ్వనిపూరితంగా ఆవిష్టృతమైంది. ఆ అసంతృప్తి ఎన్నో ఏళ్లుగా ఆయన మనస్సు మారుమూలలో ఒదిగి ఉండి, పూర్ణమ్మ కధను గేయకావ్యంగా తీర్చిదిద్దదంతో ఆ అసంతృప్తి నెరవేరి పూర్ణ తృప్తినిచ్చి ఉంటుంది.

8కి అధుధిక యుగారంభం - చేయావతరణంల కాబట్టే “కన్యాశుల్కం వంటి బృహన్నాటకాన్ని చదివినా, చూసినా కలిగిన అనుభూతి ఈ చిన్న గేయకధ ద్వారా కలుగుతుంది. కన్యాశుల్మంలోని నిగ్గే (6598౧06) పూర్ణమ్మ కధ, కన్యాశుల్మం మహానాటకమైతే, పూర్ణమ్మ విషాదాంతమైన 'ఏకాంకికి, మనిషి

గురజాడ “మనిషి అనే చిన్న గేయంలో మానవతావాదాన్ని మిన్నుల కెత్తినాడు. గురజాడ నిరీశ్వరవాది కాకపోయినా విగ్రహారాధనను నిరసించినాడు. మనిషిలోని మంచితనాన్ని మానవత్వాన్ని దైవసమానంగా భావించిన మహామనీషి గురజాడ “బ్రహ్మ సమాజంిలో సభ్యుడు. ఈ గేయం మీద బ్రహ్మసమాజం ప్రభావం ఉన్నది. (బ్రహ్మ సమాజం ఆంధ్రదేశంలో మానవోద్యమ వ్యాప్తికి కృషి చేసింది. అయితే గతానికి కట్టుబడని గురజాడ మతానికీ కట్టుబడలేదు. గురజాడ రచనలన్నిటికీ 'మనిషి కొలబద్ద. జాతీ, మతాలకు అతీతమైన విశ్వమానవ (ప్రేమను తన రచనల ద్వారా చాటినాడు. 'మనిషి చేసిన రాయి రప్పకి మహిమకలదని నాగి మొక్కుతు, మనుషులంటే రాయి రప్పలకన్న కనిష్టంగా” చూసే వారిని గురజాడ కనిష్టంగా చూసినాడు. గురజాడ ఈ గేయంలో దేవుడనేవాడు కొండ కోనలలో దాగలేదని, ప్రతి మనిషిలోనూ దాగి ఉన్నాడని, మానవుడే దేవుడని, మానవునిలోని దైవాంశకు పట్టంకట్టినాడు. దేశభక్తి

గురజాడ అప్పారావుగారి గేయాలన్నిటిలోకి అత్వధిక ప్రాచుర్యం పొందిన గేయ మిది. ఎన్నివేల సభావేదికలమీద నుంచి ఈ గీతం సాగర చేతనంలా వెల్లివిరిసి జన సందోహం గుండెలలో ఘూర్ణిల్లి, ఎన్ని లక్షల యువహృదయాలలో “దేశాభిమానం” మొలకెత్తి విజ్బంభింపచేసినదో కాని గురజాడ ప్రతిపంక్తీ సూక్తిముక్తావళిగానూ, ప్రబోధాత్మకంగానూ, సందేశాత్మకంగానూ రచించినాడు. గురజాడ 'మనిషి అనే గేయంలో సూత్ర ప్రాయంగా ప్రతిపాదించిన మానవతావాదాన్ని ఈ గేయంలో భాష్యప్రాయంగా భాషించినాడు. గురజాడ రాచదిక వ్యవస్థలో ఉంటూ కూడా ఎల్లలు ఎరుగని “దేశభక్తి గీతాన్ని పాదగలిగినాడంటే ఆశ్చర్యం వేస్తుంది. గురజాడ అప్పారావుగారొకసారి గిడుగు సీతాపతిగారితో “చూశావా ఈ దేశభక్తి, ఈ స్వదేశాఖిమానం మన హృదయాన్ని ఎంత సంకుచితమైన దానినిగా చేస్తుందో, నలుగురితోపాటు నేనున్ను మన భారతదేశం- అందులో మన తెనుగు దేశం-అందులో మన బ్రాహ్మణజాతి... ఈ విధంగా మన అభిమానాన్ని అంతకంతకు సంకుచితం అయ్యేట్టు చేస్తుంది ఈ దేశాభిమానం. ఎంతో విశాలహృదయంతో చూస్తేనే కాని ఈ విశ్వమంతా మనదే అనే సార్వజనీనమయిన అనురాగాన్ని పొందలేము” అని అన్నారట. గురజాడ అప్పారావుగారికి విశాల హృదయం ఉండటం వల్లనే విశ్వగీతాన్ని రచించగలిగినాడు.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 89

గురజాడ 'దేశభక్తి గీతం సకల దేశాల జాతీయగీతాలతో సాటి రాగలిగేదేకాక, కొన్ని విషయాలలో మిన్న అయినది కూడా. ఏ దేశ జాతీయ గేయమైనా ఆ దేశౌన్నత్యాన్ని సంకీర్తనం చేసేదిగా ఉండటమేకాక, అన్ని దేశాలకన్న ఆ దేశమే మిన్న అన్నట్లుగా ఉంటుంది. కాని గురజాడ “దేశభక్తి” గీతం ఏ దేశభాషలోకి అనువదించినా ఆ దేశం జాతీయగీతం స్ధానాన్ని పొందుతుంది. ఎల్లలులేని జాతీయ గీతం ఇది. మానవతా పరిమళాలు వెదజల్లే గేయమిది. బంకించంద్రుని “వందేమాతరం, రవీంద్రుని “జనగణ మని ఇక్సాల్‌ 'తరానా-ఇ-హింద్‌ (4/12౧౭-1-1౧061) వంటి భారత జాతీయ గీతాలతో తులతూగేదే కాక, వాటికంటే విశిష్టమైనది.

“ఒక్క “దేశభక్తి” గీతం చాలు, గురజాడను ప్రపంచకవులలో ఒకడిగా నిలుపుతుందని, రామాయణ మహాభారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికే ఉందని, ఒక తెలుగుకవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక అని, మానవుని ఆధ్యాత్మికయాత్రలో “'భగవద్దీతకు గల స్థానం ఈ గీతానికున్నదని, ఈ గీతం పావురంలాగా ప్రశాంతంగా రవళిస్తూనే సింహంచేసే క్ష్వేళాధ్వనిని స్ఫురింపజేస్తుందని, ఏకకాలంలో ప్రభుసమ్మితంగాను, కాంతాసమ్మితంగానుకూడా మానవత్వాన్ని ఉపదేశిస్తుందని”ో శ్రీశ్రీ 'ముత్యాలసరాలు” అనే వ్యాసంలో అభిప్రాయపడినాడు.

“సర్వకాలాలకూ, సర్వస్థలాలకూ ఇది జాతీయగీతం కాగలదో లేదో తెలియదుగాని, అవ్వారావు రాసిన కాలానికీ, దేశానికీ ఇంతకంటె నిండుగా సమాజపధాన్ని గురించి ఆదేశించిన జాతీయగీతం మరొకటి లేకపోవచ్చు. రవీంద్రునిదీ, ఇక్పాల్‌ దీ కవిత్వానికి వాస్తవదర్శనాన్ని లోబరచిన రచనలైతే, అప్పారావుది వాస్తవ దర్శనానికి కవిత్వాన్ని లోబరచిన రచన” అని కె.వి. రమణారెడ్డిగారు 'మహోదయం' గ్రంధంలో అభిప్రాయ పడినారు*ో

“దేశభక్తి గీతం మానవాళికి అందించే సందేశం ఇది. వ్యవసాయం, కళలు, విద్య, వాణిజ్యం మొదలైన రంగాలలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి మానవుడు క్రియాళీలుడు, కంకణబద్దుడు కావాలని, మానవుడు గతానికి కట్టుబడకూడ దని ముందుచూపుతో ముందడుగు వేయాలని వాణిజ్యం మొదలైన రంగాలలో పరస్పరం సహకరించుకొంటూ సుస్టిరశాంతిని నెలకొల్పుకోవాలని, ఫరుల కలిమికి ఈర్ష్య చెందరాదన్సి స్వలాభం కొంత మానుకొని ఇతరులకు తోద్పడాలని, అన్ని మతాలూ, జాతులూ పరస్పర స్నేహభావంతో కలసి మెలగాలని, విశ్వమానవ (మేమ వెల్లివిరియాలని 'దేశభక్తి గీతం ప్రబోధిస్తుంది. ఆకాంక్షిస్తుంది.

ఖ0 ఆధునిక యుగారీంభం - దేయావతరణం

“దేశభక్తి గీతంలో ఉన్నత సందేశం, ఉత్తమ (్రబోధంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవలసింది భావసారళ్యం. తేటతెలుగు మాటలతో గూర్చిన ఈ ముత్యాలసరం. గేయం తానివ్వదలచుకొన్న సందేశాన్ని సూటిగా, వాడిగా అందిస్తుంది. “మంచి గతమున కొంచెమేనోయి, మందగించక ముందు అడుగేయి “స్వంతలాభం కొంతమానుకు, పొరుగువాడికి తోదుపడవోయ్‌ దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌, “మతం వేరైతేను యేమోయ్‌? మనుసు వొకటై మనసులుంటేి”, “దేశమనియెడి దొడ్డవృుక్షం, (ప్రేమలను పూలెత్తవలెనోయ్‌”, “ఆకులందున అణగిమణగీ, కవిత కోకిల పలకవలెనోయ్‌”

  • ఈ విధంగా మొదటి నుంచి చివరివరకు భావాలను ఇంత సరళంగా, సాఫీగా వ్యక్తీకరించడం పద్యరూపంలో అయితే అసాధ్యం. అందుకు గేయమే సమర్ధమైనది. పద్యమన్న తర్వాత కొంత అనవసర పదజాలము, అన్వయక్షిష్టత తప్పనిసరి అవుతాయి. ఆద్యంతమూ ఇంత సరళంగా పద్యంలో చెప్పడం కష్టం. గురజాడ “దేశభక్తి గీతం ద్వారా తర్వాత భావకవిత్వంలో ప్రధానశాఖ అయిన 'దేశభక్తి కవిత్వానికి, తద్వారా ప్రబోధకవిత్వానికి దారివేసినాడు. “దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌” అని సామాజిక స్పృహను తొలిసారిగా ఈ గేయం ద్వారా కలిగించినాడు. భఖంచులంగరు

గురజాడ ఈ గేయాన్ని మొదటి ప్రపంచ యుద్ధం రోజులలో రచించినాడు. ఈ గేయంలో యుద్ధవిముఖతను, శాంతిప్రియతను వెల్లడించినాడు. కవులు సహజంగా శాంతి ప్రియులు, మారణహోమాన్ని సృష్టించి, మానవత్వాన్ని మంటగలిపే యుద్దాన్ని వారెన్నడూ కోరరు. ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా అభ్యుదయ కవులు విశ్వశాంతికి నీవాళులెత్తినారు. శాంతిగీతాలను రచించడం అభ్యుదయ కవితాతత్సంలో ప్రధాన భాగం, గురజాడ 'దించులంగరు” అనే గేయం ద్వారా విశ్వశాంతిని కోరి, ఈ రకమ్షైన కవిత్వం రచించడంలో వారే ఆద్యులయినారు, లంగరచ్తుము

గురజాడ మరణానికి నెల రోజులు ముందుగా రచించిన గేయమిది. గురజాడ మరణం ఆసన్నమైనదని గుర్తించినారేమో, మరణశయ్య పై నుంచి తన జీవిత కాలంలో సాధించినదేమిటని వ్రశ్నించుకొని, ఒక్కసారి తన జీవితాన్ని కవితామయంగా

  • శరజాదో దోతభ్త్లో గీతాన్ని వాలాబోట్లు చివర యకారం వబ్చిన బోట్‌ అజంతంగానో రానీనాడు దీదా . క్టోపెట్లోష,. అదుగేయ్మి వెనకేలోడు అయితో వొడోటన్లుడు వాలంతంగా పొడుకొంటేనే వూత్రాసంఖజ్రా నరివోడు లయ కుడుడుతుంధి కాదిల్టో వాలంతంగానేో రాయడం ఉరిగింద.

ఆధునికాంధ్ర గేయ కవిత్యం 9| సమీక్షించుకొన్నట్లు ఉన్నది ఈ గేయం. 'ముత్యాలసరాల' సంపుటిలో అన్ని గేయాలూ వస్వాణ్రయాలైతే, ఇదొక్కటే ఆత్మాశయమైనది. భావకవిత్వంలోని (క్రధానశాఖ అయిన ఆత్మాశయ రీతికి ఈ గేయం బీజం వేసినట్లుగా భావించవచ్చు. విరిగి పెరిగితి; పెరిగి విరిగితి కష్ట సుఖముల పార మెరిగితి పండు నన్నవి ఆశ లెన్నో యెండి రాలగ బొగిలితిన్‌ తరువాత భావకవిత్వంలోని ఆత్మాశయరీతికి ప్రాధాన్యం వహించిన కృష్ణశాస్త్రి “చుక్కలు అనే గేయంలోని చేతికందెడు పూలకొాలకై చేయిచాపక చేరికోరక దూరముగ లేవంచు వానిని దూజీ వదలితిని పక్షివలె నాకాశ నిర్మల పథవిహార స్వేచ్చ గోరితి పక్షములు లేవంచెటుంగక ప్రాకులాడుచు బొగిలితిన్‌ వంటి పంక్తులు '“లంగరెత్తుమూను తలపింపజేస్తాయి. మిణుగురులు గురజాడ అప్పారావు “మిణుగురులు” అనే శీర్షిక కింద రెండు బాలగేయాలను రచించినారు. పూర్ణమ్మకథను బాలగేయంగా కూడా స్వీకరిస్తే గురజాడ మొత్తం మూడు బాలగేయాలను రచించినట్లవుతుంది. మూడు గేయాలు కూడా 'ముత్యాలసరం'” ఛందస్సులో లేవు. గేయంలో అనేక నవ్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన గురజాడ బాల సాహిత్యానికి కూడా శ్రీకారం చుట్టినారు. ఎంతటి ఉదాత్తమైన భావాన్నెనా తేటమాటలతో సరళంగా తేటపరిచే కవితాశక్తి గల గురజాడ అప్పారావు బాలసాహిత్యానికి శ్రీకారం చుట్టడం బాలసాహిత్యం అదృష్టంగా భావించాలి. గురజాడ రాసింది రెండు మూడు బాలగేయాలే అయినప్పటికీ బాలసాహిత్యానికి చక్కని మార్గం వేసినాడు. భావం భాష పిల్లల స్థాయికి మించి ఉంటాయి. పిల్లల మనస్సుకు ఎక్కేటట్లు పాటలు రచించడం చాలా కష్టం. గురజాడ రచించిన 'మిణుగురులులో

92 ఆధునిక యురారంభం - డేయావఠరణం మన్మథ బాణం మోగే వేళ మగువల మనసులు క్రాగే వేళ అనే రెండు సంక్తులు తప్ప మిగతా పంక్తులన్నీ పిల్లల మానసిక స్టాయికి దగ్గరగా ఉన్నాయి. కలవల్లారా కలవల్లారా రాజువచ్చెను కన్నులు విప్పండి కలవల్లారా కలవల్లారా రాజు గ్రుంజెను కన్నులు మూయంది ప్రకృతి వర్ణనను ఎంత సరళంగా పిల్లల మనస్సుకు హత్తుకొనేటట్లు చెప్పినారో గమనించవచ్చు, ఏనుగు ఎక్కి మనము ఏివూరెళదాము ఏనుగు ఎక్కి మనము ఏలూ రెళదాము ఈ విధంగా సాగిపోతుంది ఈ గేయం. సై గేయం చదువుతుంటే జూనపద గేయాలలో బాలగేయం ఒకటి గుర్తుకువస్తుంది. ఏనుగమ్మా ఏనుగు ఏవూరెళల్లిందేనుగు ఉప్పాడెల్లిందేనుగు ఉప్పునీళ్ళు తాగిందేనుగు మిణుగురులులో మొదటి 8 పంక్తులు ద్విపదకు దగ్గరగా ఉన్నాయి. మూడు చతుర్మాక్రా గణాల తర్వాత ఒక (త్రిమాత్రా గణం ఉన్నది. అయితే చతుర్మాత్రా గణాలలో ఇం(ద్రగణాలు కాని సగణాన్ని గగను వాడటం జరిగింది. మాత్రా ఛందస్సులలో పొదొంతహ్రస్వాన్ని గురువుగా కూడా [గ్రహించవచ్చు కాబట్టి ఈ 8 పంక్తులు చతురస్రగతిలోనే నడుస్తాయని చెప్పవచ్చు.

ఆధునికాంధ్ర దేయ కవిత్వం ౧3 గగ మల్లెలు మొల్లలు ప్తూచే వేళ సగణం మేనుల గంధం బలదే వేళ గేయంలోని మిగతా పంక్తులు కూడా చతురస్రగతిలోనే నడుస్తున్నాయని చెప్పాలి, అయితే కొన్ని చోట్ల మాత్రలు తగ్గించి, మాత్రలు పెంచి పాడుకోవడానికి వీలుగా రచించినారు. బూరుగు చెట్టు చిలకల తోను ఏమని పలికింది? పై రెండు పంక్తులలోను ఒక మాత్ర తక్కువ, మూడో పంక్తిలో ఒక మాత్ర ఎక్కువ ఉన్నా చతురస్రగతిలోనే పాడుకోవాలి. గురజాడ రచించిన “కోరుకొండ అనే గేయం త్ర్రస్రగతిలో ఉన్నది. విజయరామ గజపతి 1911లో కోరుకొండలో నూతన గృహప్రవేశం చేసిన సందర్భంలో రాసిన గేయమిది. 1912లో పంచమ జార్జి చక్రవర్తి ఢిల్లీలో దర్బారు చేసినప్పుడు 'ముత్యాల సరంిలోనే ఒక గేయం రాసినారు. ఈ రెండు గేయాలలో గురజాడ ప్రభుభక్తి పరాయణత వ్యక్తమవుతున్నది తప్ప ఎ నవ్యతా లేదు. ఈ రెండు గేయాలను గురజాడ రాచ కుటుంబా నికి సన్నిహితుదైనందువల్ల రచించవలసి వచ్చింది. వాటిని ఆ దృష్టితోనే చూడాలి. అయితే ఏదో ఒక సంఘటనను పురస్కరించుకొని, దానికి తగినట్లుగా గేయాలు రచించడంలో కొంత నవ్యత లేకపోలేదు. ఈ రెండు గేయాలు తప్ప గురజాడ రాసిన మిగతా గేయాలు ఆధునిక స్పర్భలేనిది లేనే లేదు. గురజాడ అప్పారావు ముత్యాలసరాలలో పది పదకొందు కంటె మించి గేయాలు రచించకపోయినా, (ప్రతి ఒక్క గేయము, ఒక నవ్య కవితా రీతికి బీజం వేసింది. గురజాడ ఆధునిక కవితా క్షేత్రంలో వెదజల్లిన బీజాలే మొలకెత్తి అనేక శాఖోపశాఖలుగా విస్తరించినాయి. 'ముత్యాలసరాలి సంపుటిలోని గేయాల వస్తువును పరిశీలించి సమీక్షించుకొంటే, ఆధునిక కవితా రంగానికి గురజాడ అందించిన నవ్వ కవితా ప్రక్రియలివి అని తేలుతుంది. గురజాడ నెలకొల్పిన నూతన ప్రక్రియలు 1 గేయంలో ఖండికా రచన (లంగరెత్తుము, దేశభక్తి, మనిషి ౨. గేయ కథా రచన (పూర్ణమ్మ, కన్యక, లవణరాజుకల, డామన్‌ పితియస్‌)

ర్త ఆధునిక యుగౌరంభం - రేయానథతరణం 3. ఆత్మాశయ కవితా రీతి (లంగ రెత్తుము) శ _ ప్రబోధ కవిత్వం లేదా దేశభక్తి కవిత్వం (దేశభక్తి, మనిషి 5 సంఘసంస్కరణ కవిత్వం (తోకచుక్క 6, ప్రణయ కవిత్వం (కాసులు, లవణరాజుకల,) 7. _ ప్రకృతి కవిత్వం (య కధలలో ప్రకృతి వర్ణనలు) 8. బాలగేయం (మిణుగురులు

డా! శ్రీ పాద గోపాల కృష్ణమూర్తిగారు గురజాడ నూతన కవితా రితులను ఒక వ్యాసంలో చక్కగా సమీక్షించినారు.”* ఆ సమీక్షా సారాంశం ఇది; (1) ఆధునిక కవులలో “లసబైన తిరుగుబాటుదారు” అవ్వ్పారావు ఒక్కడే (2) తెలుగు భాషలోని అందచందాలు మాత్రాభఛభందస్సులలోనే బయల్పడగలవని గ్రహించి మొదట ఆచరణలో పెట్టింది అప్పారావే. (2) పాటలకు గూడా కావ్యత్వసిద్ధిని చకూర్చినాడు. (4) భాషా భేషజాలు చూపకుండా తేలికమాటలతో కావ్యరచన చేసినాడు. (5) పుస్తకాలలో విన్న సౌందర్యంగాక సొంతంగా గుర్తించిన సౌందర్వాన్ని రచనలలో పొదిగినాడు. (4) ప్రయోజనాత్మకమూ, సందేశకాత్మకమూ అయిన రచనలు చేసినాడు.

ముత్యాలసరాలు - రటన

వర్దనలు - ఆధునికత

ప్రబంధాల చరమదశలో పుట్టిన గురజాడ వర్ణనలకు, (ప్రబంధాలలోని వర్ణనలకు హస్తిమశకాంతర ఖేదం కనిపిస్తుంది. ప్రబంధ కవులు తమ వర్ణనా వైదగ్యాన్ని ప్రదర్శించడా నికి ఏదో ఒక చిన్న కధను తీసుకొని, కవి సమయాల మూసలో దీర్హ సమాసాలతో పద్యాలకు పద్యాలు, అశ్వాసాలకు ఆశ్వాసాలు వర్ణనలతో నింపివెస్తే ఆ ప్రబంధాలను పుక్కిటబట్టిన గురజాడ అప్పారావు కధలో సన్నివేశకల్పనకు నేపధ్యంగానో, మూర్తిచిత్రణకో మూడున్నర పాదాలు గల ఒకటి, రెండు ముత్యాలసరాలలో చాలా తక్కువ మాటలతో వర్ణనలు మూర్తిగట్టించినాడు. చాలా తక్కువ రేఖలతో సమ(గ్రమూర్తి చిత్రణం చేసే చిత్రకారుని చిత్రాలవలె ఉంటాయి. గురజాడ వారి వర్ణనలు గురజాడ వలె మాటలలోను, ఊహలలోను అంతటి పొదుపు, అంతటి అదుపు ఉన్న కవి తెలుగుకవులలో చాలా అరుదు. కన్వాశుల్మంలో సజీవపాత్రలను సృష్టించినట్లుగానే గురజాడ గేయరచనలలో సజీవ ప్రకృతిని సృష్టించినారు.

అధున్రికౌంధ్ర గేయ కఖత్వం ర్త గురజాడ కంరదఘ్నంగా చదువుకొన్న ప్రబంధాల ఒరవడిలో దీర్హసమాసాలతో ఊహలను పేనుతూ పేజీలకొద్దీ వర్దనలు చేసి ఉండేవాడే. కాని గురజాడ స్వీకరించింది మూడున్నర పాదాల ముత్యాలసరం ఛందస్సు. సమాసాల బరువుగాని, ఊహల ఇంద్ర జాలాన్ని గాని అంతటి చిన్న ఛందస్సు మోయలేదు. ఆయన తీసుకొన్న గేయరూపమే కొంతవరకు తక్కువ మాటలతో, సరళమైన వర్ణనలు చేయడానికి తోద్పడిందని చెప్పవచ్చు. డా11శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగా రన్నట్లుగా గురజాడ పుస్తకాలలో విన్న సౌందర్యంగాక, సొంతంగా గుర్తించిన సౌందర్యాన్ని రచనలలో పొదిగినాడు.” తాను కనులారా దర్శించిన, మనసారా అనుభూతిపొందిన ప్రకృతి దృశ్యాన్న వర్ణించి, భావకవులకు ప్రకృతి వర్ణ్షనల విషయంలో ఒరవడిపెట్టినాడు. ఉదాహరణకు కొన్ని వర్జనలు పరిశీలిస్తే గురజూడ వర్దనా నైపుణ్యమెటువంటిదో తేటతెల్లం కాగలదు. 'లవణరాజుకల” నాయిక పాటపాడుతుంటే సమస్త ప్రకృతీ క్షణకాలంపాటు పరవశించిందని చెప్పడానికి గురజాడ పాట వాదెను చెట్లు చామలు కోటి చెవులను (గ్రోలి యలరగ తాటి వనమున నాగి చంద్రుడు తాను చెవియొగ్గన్‌ అని గురజాడ ప్రకృతికి ప్రాణం పోన్తాడు. ఆ ప్రాణవంతమైన ప్రకృతిని మాటల చట్రంలో బిగించిన నిశ్చల చిత్రం (5 119 ఇది. 'లవణరాజుకల'” లోనే తాడి వనములు తూర్పు కొందను గొడుగు లెత్తెను, చామరంబులు నడిపె జీలుగు లుడు గణంబులు దవ్వులను నిలిచెన్‌ చల్ల గాలులు సాగి యలలుగ జల్లు జల్లున రాల్చి పూవుల ఉల్లమలరెను.........444204 అని సజీవ ప్రకృతికి అద్దంపడతాడు గురజాడ, గురజాడ వర్ణనల ద్వారా జడ ప్రకృతిని సజీవంగా సాక్షాత్మారింపజేస్తాడు. గురజాడ ప్రకృతి వర్దనలు ఇంద్రియాలను స్పృశిస్తాయి. “తోకచుక్క అనే గేయంలో ప్రభాత వర్ణన ఒకటి ఉదాహరిన్తాను.

ఫగ్ర ఆధుధిక యుగారంభం - గడేయానఠరణం వెలుగు నీటను (గ్రుంకె చుక్కలు చదల చీకటి కదలబారెను యొక్కడనొ వొక చెట్టు మాటున నొక్క కోకిల పలుకసాగెను మేలు కొలుపులు కోడి కూసెను విరులు కన్నులు విచ్చి చూసెను ఉండి, ఉడిగియు, ఆకులాడగ కొసరెనోయన గాలివీచెను ఇంత తక్కువ మాటలతో ప్రకృతిని కనులకు కట్టించడం గురజాదకే సాధ్యమైంది. గురజాద ప్రకృతి వర్దనలోనే కాక, మూర్తిచిత్రణంలో కూడా ఈ పద్ధతిన అనుసరించి నాడు. ప్రబంధ కవులవలె అతి వేలంగా అంగాంగ వర్ణనలకు పూనుకోకుండా కొద్ది మాటలతో మూర్తిని పొడగట్టేటట్లు చిత్రించడమే కాకుండా, అంతరంగస్థితిని కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. 'పూర్ణ్వమ్మకధిలో గురజాడ వర్ణనా వైదగ్ధ్యం పరాకాష్ట నందుకొన్నది. “పుత్తడిబొమ్మ పూర్ణమ్మ” ను చిత్రించిన తీరు చిత్తగించండి. పళ్ళను మీరిన తీపుల నడలును పువ్వులమీరిన పోదుములున్‌ అంగములందున అమరెను పూర్ణకు సౌరులు మించెను నానాటన్‌ నదడకలను హంసగమనంతోను, గజగమనంతోను పోల్చడం కవి సమయం. కాని ఆమె నడకలు పళ్ళనుమీరి తీపి గలవట. నడకలకు మాధుర్య గుణం ఉన్నదని చెప్పడం సరికొత్త ప్రయోగం.” ఆమె నడకలోని మాధుర్య గుణం మనస్సులో కూడా ఉన్నదని ఈ వర్ణన ద్వారా స్ఫురింపజేసినాడు. పూర్ణమ్మ దుర్గలో ఐక్యమైన సన్నివేశ వర్దనం సమస్త భాషా సాహిత్వాలలోనూ తలమాసికమైనది. కన్నులకాంతులు కలవల చేరెను మేలిమి జేరెను మేనిపసల్‌ హంసల జేరెను నదకల బెడుగులు దుర్గను జేరెను పూర్ణమ్మ

ఆధునికాంధ్ర గేయ కవిత్వం త కన్నులను కలువలతోను, శరీరచ్చాయను బంగారంతోను, నదకలను హంసల తోను పోల్చే కవిసమయాల మాటకేంగాని, ఈ వర్జనలోని భావ సౌందర్యాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రాచీనాలంకారిక [గ్రంధ పరిజ్ఞానం చాలదు. ఈ వర్ణనా శిల్పాన్ని అర్ధం చేసుకోవడానికి శ్రీశ్రీ తెలుగు సాహిత్య విమర్శలో ప్రవేశపెట్టిన “రసన అనే కొత్త భావన (60౧౦6౧0 తో చూడవలసి ఉంటుంది. *ఏక కాలంలో అనేక రసాలను ఉప్పాంగింపబేసే దానిని శ్రీశ్రీ “రసన అని పేర్కొన్నాడు. *” వకకాలంలోనే వస్తుధ్వని అలంకారధ్వని, రసధ్వనిని సూచించగల గేయమిది.”ో గురజాడ '“లవణరాజుకలిలో నాయిక తండ్రిని వర్ణిస్తూ పండు గెడ్డము, నిండు కన్నుల నిందశాంతరసంబు, పలుకుల కడలి గొంభీర్యంబు, యొడలినీ దివ్యతేజంబున్‌ అని అంగవర్దనతోబాటు అంతరంగచిత్రణ కూడా చేస్తాడు. రసవోషణ ముత్యాలసరాల సంపుటిలో డామన్‌ పితియస్‌, లవణరాజుకల, కన్యక, పూర్ణ్వమ్మ- ఈ నాలుగింటిలో మాత్రమే కధావస్తువు ఉన్నది. అంటే ఈ నాలుగు గేయాలు మాత్రమే రసపోషణకు వబిలున్నవి. ఈ నాలుగు గేయకధలలో ప్రతి ఒకటీ సమగ్ర కావ్యనిర్మాణ సమర్ధమైనదైనా గురజాడ అప్పారావు ఈ కధలను రమ్యంగా కధ చెప్పడానికో, రసపోషణకో ఎన్నుకోలేదు. కధను సూటిగా, వేగంగా నడిపినాడు. తానందించదలచుకొన్న సందేశాల కనుగుణంగా వీటిని మలచుకొన్నాడు. అందుకే శాంతరస (ప్రధానంగా ఉ న్న మూలకధను (లవణరాజు కల) మార్చి, శృంగారరస (ప్రధానంగా మలచుకొన్నాడు గురజాడ అప్పారావు 'లవణరాజు కలి” ఇతివృత్తాన్ని శాంతరసపోషణకో, శృంగార రసపోషణకో గ్రహించలేదు. ఈ కథ ద్వారా గురజాడ అందించదలచుకొన్న సందేశమే వేరు. గురజాడ గేయకధలు చాలా అల్ప పరిమాణమున్నవి. వాటిలో సమగ్ర రసపోషణకు తావు లేదు. అయితే విభావానువాదుల వౌష్మల్యం లేకున్నా రసస్సూర్తి కలుగుతుంది. “లవణరాజుకలిలో శృంగారం అంగిరసం; అద్భుత, శాంత, కరుణ విప్రలంభాలు అంగరనాలు. ప్రబంధాల ప్రభావం బలంగా ఉన్న రోజులలో గురజాడ శృంగార రసాన్ని ఎంతో సభ్యంగాను, ఉదాత్తంగాను చిత్రీకరించినాడు. రేఖామాత్రమైన వర్ణనల ద్వారా

ర ఆధుర్రిక యుగారీంభం - దేయావతరణం శృంగారరసానికి కావలసిన సన్నివేశాన్ని ఉద్దీపన విభావాదులను సృష్టిస్తాడు. చల్లగాలులు పూలురాల్చ్బగా ఉల్లమలరడం, వింతగానం చెవులకు సోకగా పూర్వవాసనలు పిలిచినట్లు కావడం, లవణుడు ఆకలి మరచి పరవశుడు కావడం, నాయిక అరమొగిద్సిన కన్నుగవతో చెదరియాడెడి ముంగురులతో, బెడగునడకలతో సాగుతూ పాట పాడటం, ఆ పాటలో నాయకస్మరణం ఉండటం, నాయికా నాయకుల సంభాషణను చంద్రుడు తాటివనం చాటుగా చెవియొగ్గి వినడం- ఈ విధంగా శృంగార రసానికి తగిన సన్నివేశాన్ని చక్కగా కల్పించి కొద్ది మాటలతోనే ఉద్దీపన విభావాదులను, వ్యభిచారి భావాలను చక్కగా పోషించి, శృంగార రసస్సూర్తిని కలిగించినాడు. అట్లాగే డామన్‌-పితియస్‌ కధలో ధర్మవీరాన్ని పోషించినాడు. స్నేహధర్నాన్ని పురస్కరించుకొని మిత్రులిద్దరూ ఒకరికి బదులు మరొకరు అహమహమికతో ఆత్మార్పణ చేసుకోవడానికి చూపే ఉత్సుకత స్థాయి భావం కాగా ధర్మవీరం ప్రధానరసమైంది. గురజాద అప్పారావు 'కన్యక'లోను, ముఖ్యంగా “పూర్ణమ్మ కథలోను కరుణరసాన్ని చక్కగా పోషించినాడు. పూర్ణమ్మ కధలో ఎత్తుగడ నుంచి ముగింపు వరకు ఆద్యంతమూ కరుణరస నిర్భరమె. మేలిమి బంగరు మెలతల్లారా కలువల కన్నుల కన్నెల్లారా అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా-మీరీ కధను అని గురజాడ కరుణరసం ఎవరిలో సుష్టుగా నిష్టమై ఉంటుందో వారిని ఉద్దేశిస్తూ ఈ కధను ఎత్తుకొంటాడు. ఒకానొక సాంఘిక దురాచారానికి బలియైపోతున్న బాలికల కరుణామయ గాధను విన్నారా? అని సమస్త నారీ లోకాన్నే కాదు మొత్తం సమాజాన్నే ప్రశ్చిస్తున్నట్లుగా ఉంది. ఆమని రాగా దుర్గ కొలనులో తామరలు కలకల నవ్వినాయి. దుర్గ వనంలో చిలుకలు కిలకిల పలికినాయి. ప్రకృతికి ప్రతిరూపమైన పూర్ణమ్మ ముఖకమలంలో ఆ ముద్దు నగవులూ, ఆ మురిపాలూ పెనిమిటి జూచిన మరునిమిషంలో మాయమైనా యట. కరుణరస పోషణకు వసంత కాలవర్ణనను కూడా చక్కగా ఉపయోగించుకొన్నాడు గురజాడ,

ఆధునికాంధ్ర గేయ కథిత్వం 99 అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు, ఇంటిలోని వారందరూ కంటతడిబెట్టడం సరేసరి, కాని “నలుగురు కూచుని” నవ్వేవేళల నాపేరొక తరి తలవండి; మీమీ కన్నబిడ్డల నొకతెకు (ప్రేమను నా పేరివ్వండి” అని పూర్ణమ్మ అనడంలో కరుణం పరాకాష్ట నందు కొంటుంది. తాను మరణించినా తన స్మృతి మిగిలిఉండాలనే మానవ ప్రవృత్తి ఉదాత్తంగా వ్యక్తమైంది ఈ పంక్తులలో. ఆ నాయంత్రం ఆవులు, పెయ్యలు, పిట్టలు గూళ్ళకు చేరుకొన్నా దుర్గను కొలవడానికి పోయిన పూర్ణిమ ఇంటికి రాదు. కన్నుల కాంతులు కలవల చేరెను మేలిమి జేరెను మేని పసల్‌ హంసల జేరెను నడకల బెడగులు దుర్గను జేరెను పూర్ణమ్మ అని చెప్పడంలో కరుణరసాన్ని కనులకు కట్టిన్తాడు. “ఏకోరసః కరుణ ఏవి” వాక్యానికి “పూర్ణమ్మ కధి ఉదాహరణ'(ప్రాయంగా నిలిచివోతుంది. ఈ విధంగా ఇంత చిన్న కధలలో ఇన్ని రసాలను ఇంత చక్కగా పోషించడం అసాధారణమైనది. రాసింది కొన్ని గేయకధలైనా, గేయం సర్వరస పోషక సమర్థమైనదని గురజాడ రచనల ద్వారా నిరూపితమైనది. ఆఅలంకారాలు గురజాడ అప్పారావు గేయకవిత్వం నిరలంకారమైనది. ముత్యాలసరాల సంపుటి లోని గేయాలన్నీ పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట ఛాయామాత్రంగా ఉపమాలంకారమో, రూపకాలంకారమో తళుక్కున మెరుస్తుంది. ఊహలకు పదును పెట్టె ఉత్రేక్షలు, అతిశయోక్తులు మొదలైన ప్రాధమైన అలంకారాలు మచ్చుకైనా కనిపించవు. గురజాడ వాడింది కొన్ని అలంకారాలైనా అవి సరళమైనవి. సహజరమ్యమైనవి. “(ధూమకేతువు వేల్పులలనల కేలి వెలితొాగూయట, 'దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనట.! ఖాష గురజాడ వాదుక భాషను ఒక ఉద్యమంగా నిర్వహించినాడు. వాడుక భాష కావ్యరచనోపయోగి అని నిరూపించడానికే వాదుకభాషకు కావ్యగౌరవం కల్పించినాడు. సజీవమైన భాషలో దేశభక్తి వంటి ప్రబోధ కవిత్వాన్ని వాడిగా, సూటిగా గుండెకు గురిపెట్టినాడు. పదునైన భాషలో జాతినాడిని పట్టి చూపినాడు. “సంకెళ్ళను (్రేమించే వాళ్ళు ఆ (గ్రాంథిక భాషను ఆరాధిస్తారు గాక, నాకు మాత్రం నా మాతృభాష జీవద్భాష.

100 ఆధునిక యుగారంభం - చదేయాపతరణం ఈ జీవద్భాషలో మన సుఖాల్నీ దుఃఖాల్నీ వెల్లడించుకోవడానికి మనం ఎవరమూ సిగ్గుపడడం లేదు. కాని, దీన్ని (వాయదానికి మాత్రం మనలో కొంతమంది బిడియపడుతున్నారు.”ో అని గురజాడ అప్పారావు అభిప్రాయపడినాడు. గురజాడ “సుభద్ర మొదలైన పద్య రచనలలోను, నీలగిరి పాటలలోను గ్రాంథిక భాషనే వాడినాడు. వాటిలో ఎక్కడా వాడుక భాషా రూపం కనబదనే కనబడదు. ఒక్క ముత్యాలసరాలలోనే వాడుక భాషను ఉపయోగించినాడు. దీనిని బట్టి గురజాడ ఉద్దేశ పూర్వకంగానే ముత్యాలనరాలలో తాను చెప్పదలుచుకొన్న ప్రయోజనాత్మకమైన, సందేశాత్మకమైన భావాలకు వాడుక భాషనే ఉపయోగించినాదని తెలుస్తున్నది. తెలుగు కవిత్వంలో నేను కొత్త 'ఎక్సెరిమెంటు” ఆరంభించాను; నా ముత్యాలసరాల రతిని గమనించినట్లయితే మీకీ విషయం బోధపడుతుంది; నేను తలపెట్టిన మార్పు స్పష్టపడుతుంది. ముత్యాలసరాల గేయాలను క్రమానుగతంగా మీరు పరిశీలించినట్లయితే, వాటి శబ్దవిన్యాసంలో భేదం కనపడకపోదు. నేను నా మొదటి గేయాలలో సాధ్యమైనన్ని వాదుకమాటలన్తు, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్లాలను ప్రయోగించాను. “పూర్ణమ్మ'లో వాడుక పదాల కంటె, *గ్రాంథధిక వ్యాకరణ సూత్రాలకు సరిపడని శబ్దాలు ఎక్కువ; ఇవి “కన్యకిలో మరీ హెచ్చు,” అని గురజాడ వారే ఒక లేఖలో రాసుకొన్నారు. అయితే గురజాడ అప్పారావుది గొప్ప కవిత్వం అని అంగీకరించే సద్విమర్శకులు కూడా గురజాడ వారి కావ్య భాష పరిణతి చెందినది కాదనీ, వ్యావహారిక శబ్ద ప్రయోగ దీక్షవల్లనే ఆయన కవిత్వ భాష ప్రౌాఢధతను సంతరించుకోలేకపోయిందని, ఆయన భాష కరుకుగాను, మొరుకుగాను ఉంటుందని అభీిప్రాయపడినవారున్నారు. గురజాడకు శబ్ద సౌందర్యం మీద దృష్టి లకపోయినా, ఆయన భాష కరుకుగా, మొరటుగా ఉన్నా పదునైనది, పసగలిగినది. ఉత్తమ కవిత్వంలో భావం, భాషా విడదీయరానివి. భావం భాష నాశ్రయించి ఉంటుంది. భాష బాగుందీ భావం బాగులేకపోవడం ఉంటుందేమో కాని భావం బాగుండీ భాష బాగులేకపోవడమంటూ ఉండదు. విశ్వనాధ సత్యనారాయణ గురజాడ భాషను గురించి ఇట్లా అన్నాడు. “అసలు రసానికి దేశభాష మూలకందం.... హృదయావధికమైన రసము పుట్టవలెనంటే దేశభాషలో అచ్చమైన నుడికారంలో కాని పుట్టదు... కవుల ప్రయోగాలకును సాహిత్య మీమాంసకులైన వైయాకరణుల సూత్రాలకును భేదం కనిపించటం. ఈ భేద జ్ఞానం ఆంధ్రంలో శ్రీ గురజాడ అప్పారాయోపజ్ఞకం ...వాడుక భాషలో వ్రాసిన పాటలు రమ్యమైన కథాసృష్టి కలవి. పండితులు విని భావం బాగానే ఉంది. భాష బాగులేదంటారు. భాష బాగులేకపోతే భావం యెల్లా స్ఫురిస్తుంది?”ో అని ప్రశ్నిస్తాడు.

అధునికౌంధ్ర గేయ కవిత్వం 101

పిల్ల వసుచరిత్ర కావ్యాలలో శబ్దాల గారడీ ఎక్కువై, కవిత్వంలో శబ్దం నిరర్ధకంగా తయారయి, మూసకట్టు భావాలకు ప్రకటించేదిగా తయారయిన కాలంలో గురజాడ “ఆనాటి కవిత్వాన్ని అతి మార్దవంలోంచి, అసహజ లాలిత్యంలోంచి, నిరర్ధక సౌకుమార్యం లోంచి, నిర్జీవ ప్రాఢిలోంచి తప్పించడానికి అవసరమైన సంజీవని వాడుకభాష గురజాడ ఈ భాషని కవితా సౌందర్యం కోసమే వాడినాడు. ఆయన రాసింది గొప్ప కవిత్వం అనడానికి ఆయన కవిత్వంలో భాష్క భావమూ, ఛందస్సూ సంగీతమూ కలిసిన పరిపూర్ణ రూపం కారణం. సౌందర్య వివేచనకోసం, ఇందులో ఒక్కొక్క దానిని విడదీసి చూడటం సాధ్యమేకాని, ఆయన కవిత్వం వీటన్నిటి కలయిక” అని దా॥ వెల్చేరు నారాయణరావు గారు తమ సిద్ధాంత వ్యాసంలో అభిప్రాయపడినారు.*”

అయితే గురజాడ అప్పారావుగారు ముత్యాలసరాలలో పూర్తిగా వాడుక భాషను ఉపయోగించలేదు. గ్రాంధిక, వ్యావహారిక భాష సమ్మిశ్రణం (016౧0) కనిపిస్తుంది. ముత్యాలసరాలలోనేకాధు, గురజాడ మిగతా రచనలన్నిటిలో కూడా ఒక్క కన్యాశుల్కం తప్ప ఈ సమ్మిశణం కనిపిస్తుంది. ఒక్క గురజాడలోనే కాదు ఈనాడు రాస్తున్న అత్వాధునిక కవులైన దిగంబరకవులు, విప్లవకవుల రచనలలో కూడా గ్రాంధిక, వ్యావహారిక భాషల సమ్మిశ్రణం కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణాలు : (1) చిన్నప్పుడు చదువుకొన్న చదువంతా గాంధ్రికభాషలోనే ఉండటంవల్ల; ఎంత జాగరూకతతో వ్యావహారికంలో రాసినా గ్రాంధిక భాషా రూపాలు అచేతనంగా దొర్లడం (2) భాషపట్ల సరిఅయిన, కచ్చితమైన, శాస్త్రీయమైన అవగాహన లేకపోవడం (8) కవిత్వానికి సంబంధించినంత వరకు గ్రాంధిక, వ్యావహారిక భాషల సమ్మిశ్రణం కొంతవరకు అనివార్యం కావడం అందుకు కారణం లయిేే, కవిత్వం ప్రధాన గుణాలలో లయ ఒకటి. కవిత్వం రాసేటప్పుడు కవి తన హృదయలయతో సంవదించే భాషనే ఎన్నుకొంటాడు. కాని ఇది గ్రాంధికమా? వ్యావవారికమా? అనే స్ప్రహ ఆ సమయంలో ఉండదు. ఒక్కొక్కసారి వాడుక భాషా రూపం హృదయలయతో సంవదించకపోతే గ్రాంథిక భాషా రూపాన్ని వాడటానికి వెనుదియడు.

గురజాడ ముత్యాలసరాలలో (గ్రాంథిక భాషా రూపాలు ఎక్కువగానే కనిపిస్తాయి. [గ్రాంధిక భాషా రూపాలే కాదు. 'పూర్ణ (బ్రహ్మాండాది రాజ్యమూ, “పటు వివాద సమాకులేక్షణుడు వంటి సంస్కృత సమాసాలు ఒకటి, రెండు ఆయన శైలిలో అసహజంగాను, అతకనట్టుగాను కనిపించేవి అక్కడక్కడా లేకపోలేదు. 'కోవిలి, “'దుక్కించె), 'డబ్బది” 'వుమ్మిరి, (ఇస్తిని) వంటి వ్యావహారిక భాషా రూపాలకు కావ్యగౌరవం కలిగించడమే కాకుండా *'వాదయి (ాడి+అయి), “ఉండొకి (ఉందు +ఒక), 'లేదనుంటిని

102 ఆధుధిక యురారంభం - దేయానతరణం (లేదని+ఉంటిని, *“యిల్లునందు” మొదలైన లిఖిత వ్యాకరణ సూత్ర విరుద్ధమైన ప్రయోగాలకు కూడా చోటు కల్పించినాడు. ముత్యాలసరాలలో [గ్రాంధిక భాషా రూపాల కంటె వ్యావహారిక భాషా రూపాలే ఎక్కువగా ఉండవచ్చు. కాని పదాల నిష్పత్తి కంటె ముఖ్యమైనది గురజాడ ఆలోచనా సరళి, భావ వ్యక్తీకరణ పద్ధతి. ఈ రెండూ వ్యావహారిక భాషకు దగ్గరగా ఉంటాయి, 'మెచ్చనంటా వీవు, నీవిక మెచ్చకుంటే మించిపాయును'; “యిల్లు జేరితి నాటి వేకువ; జేరి, ప్రేయసి నిదురలేపితి; కంటివే నేనంటి, “'రాజుతల చిందేను ధర్మం, రాజు చెప్పిందెల్ల శాస్త్రం, “మంచిదే, మరినడువు, మేమును తోడవత్తుము, దేవళంలో అగ్నిసాక్షిగ కన్యకను మేమందుకొనగలమూ మొదలైన ఉదాహరణల ద్వారా గురజాడ కావ్యభాషను వ్యావహారిక భాషకు, వ్యావహారిక వచన రచనకు చాలా దగ్గరగా నడిపినట్లు తెలుస్తుంది. కనుక ముత్యాల సరాలలోని భాష పూర్తిగా వ్యావహారిక భాష కాకపోయినా, చాలా వరకు వ్యావహారిక భాషకు దగ్గరగా ఉన్నదనే చెప్పాలి. ఆ రోజులలో కవిత్వాన్ని వాడుకభాషలో అందునా వచనరచనకు దగ్గరగా రాయడం చాలా ఆధునికమని భావించాలి. నిరాడంబరమైన భాషలో నిరలంకారమైన శైలిలో, సరళమైన ఛందస్సులో, సరళమైన రీతిలో భావాలను వ్యక్తీకరించి ఉత్తమ కవిత్వాన్ని వెలయించిన గురజాడ కవికి యావదాంధ్ర కవులలో సాటి రాగలవారు లేరనే చెవ్ఫాలి. “ఆకు లందున అణగి మణగి పలికిన కవిత కోకిల) గురజాడ. ముత్యాలసరాలు : గురజాడ ప్రయోగ వైవిధ్యం

ముత్యాలసరం ఛందస్సు గురజాడ అప్పారావు నూతన సృష్టి. ముత్యాలసరం లక్షణాన్ని ఇదివరకే వివరించినాను. ఇప్పుడు ముత్యాలసరం ఛందస్సులో గురజాడ అప్పారావు చూపిన ప్రయోగ వైవిధ్యాన్ని పరిశీలిస్తాను. ముత్యాలసరం ఛందస్సుమీద శ్రీశ్రీ, డా.సి నారాయణరెడ్డిగారు, చేకూరి రామారావుగారు విపుల పరిశోధన చేసినారు. వారు వేసిన మార్దంలోనే సాగి మరికొంత ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాను.

గురజాడ రచించిన ముత్యాలసరాల సంపుటిలో “పూర్ణమ్మ”, కోరుకొండ, 'మిణుగురులు' తప్ప మిగతా ఖండికలన్నీ ముత్యాలసరాల ఛందస్సులోనే ఉన్నవి. కనుక గురజాడ రాసిన గేయాలన్స్నీ ఒకే ఛందస్సులో రచించినాదని చెప్పుకోవాలి. వాల్చురికి సోమనాధుడు ఒకే ఛందస్సు (ద్విపదును వాడినా, ఒకే ఛందస్సువల్ల కలిగే విసుగును తొలగించడానికి అనేక విధాలుగా నడిపించినట్లు, గురజాడ కూడా ముత్యాలసరం ఛందస్సులో గణనీయమైన వైవిధ్యాన్ని ప్రదర్శించినాడు. ముత్యాలసరాల ఛందస్సులో గురజాడ చూపిన వైవిధ్యాన్ని డా! సి. నారాయణరెడ్డిగారు తమ పరిశోధన [గ్రంథంలో 16 విధాలుగా వింగడించినారు. *ీ అవి వమంటిే; (1) నాలుగు పాదాలూ సమానంగా

అధుధికాంధ్ర గేయ కఠిర్వం 103 కూర్చినవి (2) చివరి పాదంలో 12 మాత్రలు, చివర గురువు (3) చివరి పాదంలో 12 మాత్రలు; చివర రెండు లఘవులు (4) చివరి పాదంలో 9 మాత్రలు (5) చివరి పాదంలో 8 మాత్రలు (6) చివరి పాదంలో 8 మాత్రలు (7) మొదటి మూడుపాదాలలో 18 మాత్రలు (8) మూడవ పాదంలో 12 మాత్రలు (9) 5 చరణాల గేయం (10) రెండు చరణాలది (11) పాదనియతిలేక స్వేచ్చగా సాగిపోయే గేయం (12) పాద మధ్యంలో అధికమాత్ర (13) పాదాదిలోనే అధిక మాత్ర (14) అధిక పాదం (ఎందులోనూ ఇముదనిది) (15) వాదపూర్తికాక రెండు ఖండాల (512229) వరకు అల్గుకొనిపవోయిన భాగాలు (16) మాత్రలు ఒకటి, రెండు లోపించినవి. నారాయణరెడ్డి గారు వీటికి ఉదాహరణలు కూడా చూపించి ఉన్నారు. దొ॥చేకూరి రామారావుగారు 'ముత్వాలసరంి అనే వ్యాసంలో ఇన్ని (16) విధాలుగా విభజించనక్కరలేదని, పాదాంతంలోను, పద్యాంతంలోను (అరుదుగా గణాంతంలోనూ) చివరి లఘవును గురువుగా ఉచ్చరించే సంప్రదాయాన్ని గ్రహిస్తే ఇన్ని భేదాలుండవని, ఈ భేదాలను నాలుగు రకాలుగా విభజించినాడు. (1) సంపూర్ణంగా సమపాదాలున్నవి (2) నాలుగో పాదంలో 38 కాని, 3+4+గురువు కానీ, 3+4+3+ గురువు కానీ ఉన్నవి. (8) నాలుగో పాదం అయిన తర్వాత కొంత అధికభాగం ఉన్నవి. (4) పాదాదిన ఒక గురువు అధికంగా ఉన్నది. * చేకూరి రామారావు గారు చెప్పినట్లుగా పాదాంత హ్రస్వాన్ని గురువుగా స్వీకరిస్తే కొన్ని భేదాలు తగ్గించవచ్చు. ముఖ్యంగా చివరిపాదంలో 8 మాత్రలు వాడిన గురజాడ ఎనిమిదో మాత్రను లఘువుగానే ఉపయోగించినాడు. ఊనీక చివరిమాత్రమీద పడటంతో లఘువును గురువుగా ఉచ్చరించడమో, ఒక మాత్రాకాలం విశ్రాంతో తీసుకోవాలి. ఉదాహరణకు. వేల నెరుగని డ్రైమ బంధము వేడుకలు కురియ

అన్నప్పుడు ఊనిక “యి” ను దీర్ధంగా ఉచ్చరించడమో, “య” తర్వాత మరొక మాత్రాకాలం విశ్రాంతి తీసుకోవడమో చేయాలి; అట్లాగే 18 మాత్రల పాదాన్ని 14 మాత్రల పాదంగాను, 12 మాత్రల పాదంలోని చివరి గురువును-రెండుమాత్రల కాలం సాగదీసి 14 మాత్రల పాదంగాను గ్రహించవచ్చు. అట్లాగే 10 మాత్రలున్న పాదంలో చివర గురువున్నప్పుడు మరి రెండు మాత్రల కాలం సాగదీసి పాడితే 12 మాత్రల పాదం అవుతుంది. అప్పుడు ప్రధాన భేదాలు మూడే కనిపిస్తాయి. గురజాడ రాసిన ముత్యాలసరాలలో వరుసగా ఈ మూడు ఖేదాలే (ప్రాధాన్య క్రమంలో 9, 12,8 మాత్రల పొదాలు) ఉన్నాయి. తక్కినవి చాలా అరుదు. గురజాడ ముత్యాలసరాలలో ప్రదర్శించిన ఛందోవైవిధ్యాన్ని నా పరిశీలనకు తోచిన విధంగా ఉదాహరణలతో వివరిస్తాను

104 ఆధుభిక యుగారంభం - గదేయానతదణం నాలుగు పొదాలూ సమానంగా ఉన్నవి:

దేశ మనియెడి దొడ్డ వృక్షం = కశ మాత్రలు

ప్రేమలను పూలెత్త వలెనోయ్‌ ఆ

నరుల చమటను తదిసి మూలం జ

ధనం పంటలు పందవలెనోయ్‌ జ్‌ నాలుగో పాదం హ్రస్వపాదం :

గురజాడ అప్పారావు నాలుగో చరణంలో 7 నుంచి 14 మాత్రల వరకు

ఉంటాయని చెప్పినాడు. నాలుగో పాదంలో 14 మాత్రలు ఉన్నప్పుడు నాలుగోపాదం కూడా సమపాదమై నాలుగు పాదాలూ సమానంగా ఉంటాయి. దీనికి ఉదాహరణ పైననే చూపించడం జరిగింది. ఇక చూడవలసింది 7 నుంచి 18 మాత్రల వరకు ఉన్న చరణాన్ని గురజాడ నాలుగో పాదంలో 7 మాత్రలు 11 మాత్రలు ఉపయోగించిన ముత్వాలసరం ఉదాహరణలు నా పరిశీలనలో కనిపించలేదు. మిగతా వాటికి మాత్రమే (ప్రాచుర్యక్రమాన్ని (అంటే ఎన్ని మాత్రల పాదాన్ని ఎక్కువగా ఉపయోగించినాడో దానిని) బట్టి ఉదాహరణ చూపిస్తాను. గురజాడ అప్పారావు చివరిపాదంలో ఎక్కువగా 9 మాత్రలు వాడినాదడు. ఆ తర్వాత 12 మాత్రలు, కొంతవరకు 8 మాత్రలు వాడినాదు. 10 మాత్రలు, 18 మాత్రలు వాడిన పొదాలు ఒకటి రెండు కంటె ఎక్కువగా ఉపయోగించలేదు. అ. 9 మాశ్రలు :; 9 మాత్రలు ఉపయోగించిన చివరిపాదంలో చివర తప్పనిసరిగా గురువు ఉపయోగించినాడు. అంటే 3+4+గురువు క్రమంలో విరుగుతుంది.

పొత్తు లన్నవి సంపదలకే

ఆఅపదలకగునే = 3+4+గురువు=9 మాత్రలు ఆ. 12 మాత్రలు : గురజాడ 12 మాత్రలు వాడిన పాదంలో కూడా చివరి గురువే వేసినాడు. పాదం 3+4+3+గురువుగా విరుగుతుంది. గురువుకు బదులు రెండు లఘువులు వాదిన ఉదాహరణ ఒకటి మాత్రం లభిస్తుంది. చివర గురువు

కురుల సరులును కుదురు జేయుచు

ఓర మోమిడ బల్మితిన్‌ చివర ర0డు లఘువులు

పట్ట దలచితి వింక నీవొక

పట్ట మేలే రాజువట 3+4+8+రెండు లఘున్సలు

ఆధునికాంధ్ర దేయ కఖత్వం 105 ఇ ఈ మాత్రలు : 8 మాత్రలున్న పాదం చివర లఘువే ఉపయోగించినాడు. కాని గురువు వాడలేదు. అంటే ఏడోమాత్ర, ఎనిమిదో మాత్ర కలిసి గురువు రాదు. పాదం 3+4+అధిక మాత్ర (లఘువు)గా విరుగుతుంది. కాని గురువుగా విరగదు, వాదం చివర హ్రస్వం వాడటం వల్ల ఒక మాత్రాకాలం విశ్రాంతికి గాని, మరొక మాత్రాకాలం సాగదీయడానికి గాని వీలుంటుంది. అంటే 8 మాత్రలున్న పాదం 9 మాత్రలుగా చదువుకోవచ్చు లేదా పాడుకోవచ్చు.

జంతు హింసను చేయ నొల్లము

భూత దయ మతము త+4+1=8 ఈ. 10 మాత్రలు : వైశ్యజాతికి వన్నె ఉ. 18 మాత్రలు ; మందగించక ముందు అడుగేయ్‌

వెనక పడితే వెనకే నోయ్‌-13 మాత్రలు

పె ఉదాహరణలో చివరిపాదం కూడా 3+4+4+2 (గురువు) గా విరిగి ముత్యాలసరం నడకకు భంగం కలిగిస్తుంది. రాతలో ఉన్న ప్రకారం (వెనక పడితే వెనకెనోయి) చదివితే 3+4+4+3గా విరుగుతుంది. 'వెనకె' చివరి దీర్జాన్ని హ్రస్వంగా (వెనకెనోయ్‌) చదివితే అప్పుడు 3+4+3+2 గా విరిగి 12 మాత్రల పాదమే అయి ఉండవచ్చు. 18 మాత్రలు వేసిన మరో ఉదాహరణ కనిపించలేదు. 8. నాలుగోపాదం 8 మాత్రలు ఉన్నది దీనిని కూడా రెండో విభజనలో చేర్చవచ్చు. కాని గురజాడ నాలుగో పాదం 7

నుంచి 14 మాత్రల వరకు ఉండవచ్చునని పేర్కొన్నాడు. మూడు మాత్రలది కూడా ఉండవచ్చుననలేదు. కనుక దీనిని ప్రత్యేకవిభజనగా ఫరిగణించవలసి వస్తుంది

424442 కోట పేటలు

కూలి, నక్కల కాటపటైె

అమర శ్తీ దీర్షపాదాలలో మాత్రలు తక్కువగా ఉన్నవి

అ, తగటు బంగరు చీరె కట్టీ కురుల పువ్వుల సరులు జుట్టీ నుదుట కుంకుమ బొట్టు పెట్టి

106 ఆధునిక యుగారంభం - దేయానతరణం పై మూడుపాదాలలోను చివర ఒక మాత్ర తక్కువగా ఉన్నది. అయితే పాదం చివర ఒక మాత్రాకాలం విశ్రాంతి తీసుకొంటేనే గాని లయ కుదరదు, మూడుమాత్రలు ఉన్నా నాలుగు మాత్రలుగానే పరిగణించాలి. ప్రతిపాదం చివరా ద్విత్వాక్షరం ఉన్నందువల్ల ఊనిక ద్విత్వాక్షరం మీద పడి, మరొక మాత్రాకాలం విశ్రాంతి తీసుకోవడమో, ద్విత్వాక్షరాన్ని దిర్హంగా ఉచ్చరించడమో చేయాలి. ర్‌, దీర్హ పాదాలలో ఒకటి రెండు మాత్రలు ఎక్కువగా ఉన్నవి పాదారంభంలో గురువు అధికంగా ఉండటం దేశాఖిమానము నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ మురో జీదావారణ వింటి మీపోకిళ్లు వింటిని కంటి నిద్దుర కాన కుంటీని యీ చిన్న మనసును చిన్నబుచ్చుట పై రెండు ఉదాహరణలలో మొదటి దానిలో చరణారంభంలోనే (ప్రధమ పాదారంభంలోనే) అధిక గురువు. రెండవదానిలో చరణమధ్యంలో (మూడవపాదంలో అయినప్పటికీ, మొదటి అక్షరమే) అధిక గురువు ఉన్నది. అధికంగా ఉన్న గురువును ముందు ఎత్తుకొంటే, ఈ రకంగా తాళంపదడటం 'అతీతం' అంటారు. తరువాత అక్షర మీద తాళం పదుతుంది. ఉదాహరణకు 'దే' ముందు ఎత్తుకోవాలి. “శా మీద తాళం పడుతుంది. అప్పుడు ముత్వాలసరం నడక కుదురుతుంది. సంగీతంలో ఈ పద్ధతిని అనాహతం (0610/6 0640 అంటారు. 6. గణానికి గణం విరగడం గురజాడ ముత్వాలసరం గేయాలు మూడుమాత్రలకు, నాలుగుమాత్రలకూ పదమో, పదాంశమో కచ్చితంగా విరిగి తీరుతాయి. అంటే మూడోమాత్ర, నాలుగోమాత్ర కలిసి గురువు రాదు. అట్లాగే ఏదోమాత్ర, ఎనిమిదో మాత్ర కలిసి, పదోమాత్ర, పదకొండో మాత్ర కలిసి గురువు రాదు. ఏ గణానికి ఆ గణం విరిగి తీరుతుంది. ఖ్‌ విరిగి పెరిగితి పెరిగి విరిగిత్‌ తి+శ+8+4 కష్ట సుఖముల పార మెరిగితి 8+శ+3+క్త

ఆధుధికాంధ్ర చేయ కవిత్వం 107 ఈ. మరొక విధంగా నడిచిన ముత్యాలసరం చూతునా! అని చూసితిని; మరి 5 +2+ద+9 చేతునా అని చేసితిని; ఇక ర+2+ర్‌+2 గుత్తునా ముత్యాలసరములు ర్‌+5+4 కూర్చుకొని తేటైన మాటల 5+5+కీ పెన చూపిన రెండు ఉదాహరణలలో మొదటిది 5+2+5+2 గా విరిచి చదివితే సొగసు వస్తుంది. రెండవది 5+5+4గా విరిచి చదివితే కొత్త గమనం స్ఫురిస్తుంది. అయితే ఈ రెండు ఉదాహరణలలో పైన వివరించినట్లు మూడోమాత్ర, నాలుగోమాత్ర కలిసి (అట్లాగే మిగతావి) గురువు రాలేదు. కాబట్టి ముత్యాలసరం నడకకు భంగం కలగలేదు. చూతు నాఅని చూసి తినిమరి ఈ విధంగా మూడు, నాలుగు మాత్రలకు సరిగా విరుగుతూ నడుస్తుంది. అట్లాగే రెండో ఉదాహరణ కూడా గురజాడ మూత్యాలసరాల గేయాలు ఈ విధంగా 8, 4 మాత్రలకు చక్కగా విరగడానికి ప్రధాన కారణం. ఆయన అధికంగా తెలుగు మాటలను (ముఖ్యంగా వాదుకభాషను) వాదటమే. తెలుగు పదాలు సాధారణంగా 2,4 మాత్రలవి, 5 మాత్రలవి ఉంటాయి. 5 మాత్రల కంటె మించి ఉన్న పదాలు చాలా తక్కువ, గురజాడ సంస్కృత పదభూయిష్టమైన గ్రాంధికభాషను వాడిఉంటే ముత్వాలసరంలో గణమధ్యంలో (3,4 మాత్రల) మధ్య గురువులు తప్పక వచ్చి ఉండేవి. సంస్కృతభాషలో సంయుకాక్షరాలు, దీర్దాక్షరాలు ఎక్కువ. అందుకే గురజాడ సంస్కృత సమాసాలు వాడినచోట కూడా ముత్యాలసరం గేయం 3,4 మాత్రలకు విరుగుతుంది. ఉదా, పలికె నిటుల పటువిషాదస మాకు లేక్షణు డగుచు లవణుడు పై ఉదాహరణలో “పటు విషాద సమాకులేక్షణుడు” అనే దీర్హసమాసం వేసినా పదాంశాలు 8, 4 మాత్రల దగ్గర విరగకపోయినా (పటు-విషాద-సమా-కులేక్షణుడు ఈ విధంగా విరగకపోయినా) గణమధ్యంలో (3,4 మాత్రల) గురువు రానందువల్ల 3+4 మాత్రలుగా విరిచి చదువుకోవచ్చు.

108 ఆధుభిక యుగారంభం - దేయాదతరణం ఇ. ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి. వగణానికి ఆ గణం విరుగు తుంది. పాదాంతంలోని చివరి గణం కూడా విరుగుతుందని అంటే పాదాంతంలోని చివరిమాత్ర, తర్వాతి పాదంలో మొదటి మాత్రతో కలిసి గురువు కాదు. అంటే పాదాంతంలోను ఛివరిమాత్ర హ్రస్వంగాను, తర్వాతి పాదంలోని మొదటిమాత్ర సంయుక్తాక్షరంగాను ఉండవు. గురజాడ అప్పారావు ముత్యాల సరాలన్నీ ఈ విధంగానే ఉన్నాయి. దీనికి భిన్నంగా వారు ఒక్క ముత్యాలసరమైనా రచించలేదు. గురజాడ తరువాతి కవులు దీనికి భిన్నంగా రచించిన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు నారాయణరెడ్డిగారి సమదర్శనం నుంచి ముత్యాలసరం నడక ఉన్న ఒక ఖండం. గతధరా గర్భమును జీల్చుచు రతనముల్‌ జతగూర్చుచుండగ వర్తమానము నాకు విద్యు ద్వల్లి వలె మిరుమిట్లు గొల్పెను* మూడోపాదంలోని చివరి అక్షరం నాలుగోపాదంలోని మొదటి అక్షరమైన సంయుక్తాక్షరంతో కలిసి గురువవుతుంది,. ఇది పద్యశిల్పా న్ననుసరించి చేసిన గేయ రచన. గ పాదానికి పాదం విరగడం గురజాడ అప్పారావు ముత్యాలసరం గేయాలు ఎక్కువగా ఏ పాదానికాపాదం విరుగుతాయి. అంటే పాదాంతంతోబాటు పదాంతం కూడా ఉంటుంది. వెలుగు నీటను గ్రుంకె చుక్కలు చదల చీకటి కదల బారెను 8. ఒక పాదం మరొకపాదంలోకి చొచ్చుకొనిపోవడం ఒక పాదాంతంలోని పదాంశం కొంత మరొక పాదాదిలో ఉండటం. ఈ రకమైన పద్ధతిని గురజాడ ఎక్కువగా గేయకథలలోనే ఉపయోగించినాడు. కధాకధనానికి ఈపరద్ధతి కొంతవరకు దోహదం చేస్తుంది. మరో విషయమేమంటే గురజాడ గేయకధాకావ్యాలలో ఏ వాదాని కాపాదం విరగక పోవడానికి ప్రధానకారణం పద్యాలలో వలె *ప్రాసిను చాలావరకు పాటించడమే. పద్వాలలో కూడా చాలా వరకు ఏ పాదాని కా పాదం విరగకపోవడానికి *ప్రాసే' కారణం.

ఆధునికాంధ్ర గేయ కవిశ్వల 109 నమ్ము నేనను మాట తెరవ!భ యమ్ము వాయుము; కూటి నిడిచే కొమ్ము నా ప్పాదయంపు రాజ్యము నిస్సపత్చ్యముగాన్‌ 9, ముత్యాలసరం ఖండం ($12౧22) మరొక ఖండంలోకి చొచ్చుకొనిపోవడం ముత్యాలనరంలో నాలుగుపాదాలు (ఒక ఖందము-512౧24) ఉంటాయి. సాధారణంగా భావపూర్తి పాదపూర్తి ఒకే ఖండంలో జరిగిపోతాయి. మరో ఖండంలోకి విస్తరించదు. గురజాడ అవ్పారావు గేయకధలలో రెండు, మూడు సందర్భాలలో దీనికీ భిన్నంగా రచించినాడు. కధాకావ్యాలలో ఏ ఖండికలో చెప్పవలసిన భావాన్ని ఆ ఖండికలోనే చెప్పడం కష్టం. మరో ఖండికలో అల్లుకొని పోతుంటుంది. అయినా గురజాడ చాలా వరకు గేయ కధాకావ్యాలలో ఏ ఖండికలో చెప్పవలసిన భావాన్ని ఆ ఖందడికలోనే చెప్పినారు. ఒకే ఖండికలో, వాదపూర్తి గాక మరో ఖండికలోకి విస్తరించిన దానికి ఉదాహరణ. పంపె నీకీ యశ్వరాజం బెందు లేదిద్దానికీ దనె చెవిని మాటలు సోకి సోకక లవణు దకృన్నం జూచే స్మయ హర్షాతి రేకము లాత్మ పెనగొన, డాసి, చేకొని “'వచ్చితవ, నా వ్రాణసఖి యని గద్దియను జేర్చెన్‌ 'కన్యక'లో “విద్య నేర్చినవాడు.... రాజులై మనుడయ్య (పుట 108-104) వరకు నాలుగు ఖండాలవరకు భావం విస్తరించింది. కన్యకలోనే “డేగ పిట్టకు...కదల” (పుట102) వరకు (రండు ఖండాల వరకు) భావం వ్యాపించింది. 10. వాదాంత విరామం ఏ పాదాని కా పాదంలో భావపూర్తి జరిగితే ఏ పాదాని కాపాదం ఒక్కొక్క వాక్యమవుతుంది. అప్పుడు పాదాంత విరామం కలుగుతుంది. పూను స్పర్ధను విద్వలందే వైరములు వాణిజ్య మందే వ్యర్ధ కలహం పెంచబోకోయ్‌ కత్తి వైరం కాల్చవోయ్‌

110 ఆధునిక యుగారంభం - చేయావఠరణం పే ఉదాహరణలో ఒక్కొక్క పాదం ఒక్కొక్క వాక్యం. దేనికది స్వతంత్రంగా భావాన్ని వ్యక్తీకరిస్తుంది. ఒక్కొక్క పాదంలో భావపూర్తి పాదపూర్తి జరిగి పాదాంత విరామం కలుగుతుంది. 11. పాద మధ్యంలో విరామం పట్ట వలెరా దీని బలిమిని కొట్ట వలెరా మరుని రాజ్యం కట్ట వలెరా గండ పెండం రసిక మండలి లో ఇక్కడ పాదారంభంలోనే క్రియలు (పట్టవలెరా, కొట్టవలెరా, కట్టవలెరా) వాడటం వల్ల క్రియావాచకం పూర్తిఅయిన తర్వాత కొద్దిగా విరామం కలుగుతుంది. 12, పొదాంత విరామం లేకపోవడం పట్టమేలే రాజ; బలిమిని పట్ట వలెనా? నీదు సొమ్మే కాద కన్నియ? నీవు కోరుట కన్న మరికలదా వైశ్య జాతికి వన్నె? పట్టమేలేరాజ్య బలిమిని పట్టవలెనా నీదు సొమ్మే కాద కన్నియ; నీవు కోరుటకన్న మరికలదా వైశ్యజాతికి వన్నె-ఈ విధంగా వాక్యాలు విభజన కావడం వల్ల పాదాంత విరామానికి స్థానం లేకుండా ఉన్నది. 18. పాదనియతి లేకపోవడం ముత్వాలసరానికి నాలుగు వాదాలుంటాయి. నాలుగు పాదాలకు మించిగాని, తక్కువగాని ఉన్నవాటిని పాదనియతి లేనివిగా చెప్పవచ్చు. అ, ఐదు పాదాల ముత్యాలసరం వచ్చెనిదె బంగారు కాలము వాంఛ లెల్లను తీరు సుజనుల కాంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంత్ర్య మిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుత పై ఉదాహరణలో ఐదు పాదాలు సమానంగా ఉన్నాయి.

ఆధునికాంధ్రి గేయ కవిత్వడ 111 అ. రెండు వాదాల ముత్యాలసరం

అనుచు చింతలు వాసికై కై = 14

జేర్చి జొచ్చితిమపుడు చితి = 12

పై ఉదాహరణలో మొదటిపాదంలో 14 మాత్రలు, రెందోపాదంలో 12 మాత్రలు ఉన్నాయి. అంటే ముత్యాలసరంలోని మొదటి రెండుపాదాలు లేకుండా 3, 4 పాదాలు మాత్రమే ఉన్నాయని భావించాలి.

పై రెండు ఉదాహరణలలో పాదనియతి లేకపోయినా ముత్యాలసరం ఛందోనియతి ఉన్నది. కాని పాదనియతి, ఛందోనియతి లేని ముత్యాలసరాలు గురజాడ రచనలోనే ఉన్నాయి. ఇవి మూడు రకాలుగా ఉన్నాయి.

ఇ. ముత్యాలసరాలు నాలుగుపాదాల తర్వాత (9 మాత్రల నాలుగో పాదం) మరికొన్ని మాత్రలలో ఐదోపాదం అధికంగా ఉండటం (కన్యక), ర్ల. మూడు వాదాల తర్వాత మరికొన్ని మాత్రలు ఉండటం (మనిషి, ఆ. ఏ పాదనియతీ లేక, ముత్యాలసరం లయమాత్రం భాసిస్తూ స్వేచ్చగా ౧౧ ౦౧ ౪6/56 లాగా సాగిపోయే గేయం (కాసులు)-ఈ మూడు పద్ధతులను గురించి విశదంగా వివరిస్తాను.

ఈ. 'కన్యక'లో గురజాడ అప్పారావు నాలుగో వొదాన్ని తొమ్మిది మాత్రలతో ముగించి మూడునుంచి పదిమాత్రల వరకు గల పాదాలను అధిక పాదం (ఐదోపాదం)గా రచించినారు. ఈ అధికపాదాన్ని నాలుగో పాదంలోకి తీసుకొనిపోతే ముత్యాలసరం నడక దెబ్బతింటుంది. ఉదాహరణ ద్వారా దీనిని వివరిస్తాను,

పసిడి కడవల వాలు పెరుగులు

పళ్లె రమ్ముల పళ్ళు పువ్వులు

మోము లందును మొలక నవ్వులు

చెలగ చెలిక త్తెట్‌

వెంట నడిచిరి

ఈ ఉదాహరణలో “చెలగి చెలికత్తెలొ అన్న వెంటనే 'వెంట నడిచిరి” అని చదివితే

నడక కుంటుతుంది. దీనిని నారాయణరెడ్డిగారొక విధంగా సాధించినారు.” *“చెలగి చెలికత్తెలో చదివిన తర్వాత సరిగా 5 మాత్రల కాలమాగి 'వెంట నడిచిరి అంటే లయభంగం జరగదు సరికదా మళ్ళీ 'ెలగ చెలికత్తెలో అనవలెననిషించి, పాట కిందికి దిగుతుంది.

112 ఆధునిక యురగారంభం - దేయానతరణం

చెలగ చెలికత్తెల్‌ (తకిట కిట)

వెంట నదచిరి (చెలగ చెలికత్తెల్‌)

ఇక్కడ వివరించవలసిన విషయం ఒకటుంది. ముత్యాలసరం మూడు, నాలుగు

మాత్రలకు విరుగుతూ టత్రిపుటతాళంలో నడుస్తుంది. నాలుగోపాదం తొమ్మిదిమాత్ర లుంటుంది. అంటే 7(3+4) మాత్రల మీద ఒక గురువుంటుంది. అంటే త్రిపుటతాళానికి మించి (7 మాత్రలకు మించి) అదనంగా రెండుమాత్ర లుంటాయి. నారాయణరెడ్డి గారు చెప్పిన ప్రకారం “చెలగ చెలికత్తెలొ తర్వాత ఐదు మాత్రల కాలమాగి (తకతకిట) విశ్రాంతి తీసుకొంటే 7+(2+5) అయి, మరో త్రిపుట ఆవృత్తి సిద్ధిస్తుంది. తర్వాత ఐదోపాదం “వెంట నడిచిరి” మళ్ళీ 7 మాత్రలు మిగులుతాయి. మిగతా మాత్రాకాల పరిపూర్తికోసం మళ్ళీ 'చెలగ చెలికత్తెల్‌ అంటే మరో ఆవృత్తి పూర్తి అయి, అదనపు 2 మాత్రలు చివర మిగులుతాయి. మళ్ళీ ఐదుమాత్రల కాలం విశ్రాంతి తీసుకోవాలి. ఈవిధంగా ఐదు పాదాలూ త్రిపుట తాళంలో నడుస్తాయి. ఈ విధంగా 5 మాత్రల కాలం ఆగి, చదువుకొనే చరణాలు 'కన్యకిలోనే మరి మూడున్నాయి.

తొగల కాంతులు కనులు పరపగ

మించు తళుకులు నగలు నెరపగ

నదక లంచకు నడలు కరపగ

కన్నె పరతెంచెన్‌

రాజవీధీని

పట్టమేలేరాజ! బలిమిని

పట్ట వలెనా? నీదు సొమ్మే

కాద కన్నియ? నీవు కోరుట

కన్న మరికలదా

వైశ్య జాతికి వన్నె? (3+4+8)

తడవు చెయ్యక తల్ల డిల్లక

నేడు రేపని గడువు పెట్టక,

నెమ్మి గోరితివేని, కన్నియ

నిమ్ము! లేకుంటే

వొమ్ము! (3)

అధున్రికాంధ్ర చేయ కవిత్వం 113

ఈ నాలుగు ఉదాహరణలోని అధిక పాదాలను పరిశీలిస్తే అధికపాదాలు కూడా ముత్యాలసరాల నడక ననుసరించి 3+4 మాత్రలుగా విరగడం గమనించదగిన విశేషం. అంటే ఈ అధికపాదం ఒకచోట ఒక గణంగాకాని (8 మాత్రలు), ఇంకొక చోట రెందు గణాలుగా కాని (39+4), మరొక చోట మూడు గణాలుగాకాని (3+4+3) కనిపిస్తుంది.

ఈ. పై ఉదాహరణలలో అధికపాదాలుకూడా ముత్యాలసరం నడకకు దగ్గరగా ఉంటే మరొక గేయం (మనిషిలో మూడుపాదాల తర్వాత కొన్ని మాత్రలు అధికంగా ఉంటాయి. గురజాడ దీనిని మూడు పాదాల గేయంగానే పరిగణించినాడు. ”*

మనిషి చేసిన రాయి రప్పుకి మహిమ కలదని నాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్టం

గాను చూస్తావేల, బేలా

వేలా?

యెరిగి కోరిన కరిగి యీదో

మూడుపాదాల తర్వాత (3+5) మాత్రలు (కన్న కనిష్టం), 4 మాత్రలు (వేలా), ౩ మాత్రలు (ముక్తి) ఉన్న పాదాలు అధికంగా ఉన్నాయి. ముత్యాలసరంలో 8 మాత్రలున్న నాలుగో పాదం హ్రస్వాంతంగా ఉంటుంది. కాని దీర్చాంతంగా ఉండదు. వీటిని అధికపాదాలుగానే పరిగణించాలి.

ఉ. "కాసులు అనే గేయంలో పాదనియతి లేకుండా ఎటూ కానిచోట విరిచిన పాదాలున్నాయి. 'మనిషి, "కాసులు అనే గేయాలను పరిశీలిస్తే గురజాడ అప్పారావు కవిత్వం అగాధమైనదైనా, ఛందస్సు మాత్రం అపరిపక్వమనీ, ముత్వాలసరం గనిలోనుంచి తీసిన లోహం వంటిదని, ఆయన దానిని మెలకువతో నిర్వహించలేదని విమర్శకులు అభిప్రాయపడినదానిలో కొంత నిజం లేకపోలేదనిపిస్తుంది.*ో అయితే డా! సి. నారాయణరెడ్డిగారు తమ పరిశోధన గ్రంధంలో గురజాడ ఛందోవ్యవస్థకు బలహీనత

114 అధునిక యురారంభీం - దేయానరర్‌ణం నాపాదించే ముత్యాలసరాలు మాత్రం రచించలేదని నిరూపించినారు. 'కాసులు అనే గేయం ముద్రణప్రతులలో ఉన్న ప్రకారం చదివితే ఛందోవ్యతిక్రమం కనబడుతుందని, అది అచ్చువేసిన పద్ధతిని మార్చి చరణాలను ఇంకొక విధంగా కూర్చి, విరుపులు మరొక విధంగా జరిపితే, ఏ మాత్రం ఛందస్సు, లయ నడక బెణకని గేయమని, నారాయణరెడ్డిగారు అభిప్రాయపడినారు. మొత్తం గేయాన్ని ఆ విధంగా తిరుగరాసి అనుబంధంలో ముద్రించినారు. కనుక మొత్తం గేయాన్ని నారాయణరెడ్డిగారి 'ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు ప్రయోగములు' అనే గ్రంథంలోని అనుబంధాన్ని (పు. 692) చూడగోరుతున్నాను. మచ్చుకు కొంతభాగాన్ని తీసుకొని ముత్వాలసరం సంపుటంలోని భాగంతో పోల్చి చూపుతున్నాను.

మనసులో నీకుండు 3+4+3

ధనమన నొండు గలదే పసిడి 3+3+4+8

గాకని, ప్రాజ్ఞలకె కనికట్టు శ+3+త్త+8

కనకము; చపల చిత్తల కన్ను శ+3+8+8

చెదరుట చిత్రమా....... ఖర్‌ నారాయణరెడ్డిగారు తిరిగి రాసిన కూర్చు

మనసులో నీకుండు ధనమన రాశీ షాఢీ సడ

నొండు కలదే పసిడి గాకని తై+శ4ఉ+3+క్ష

ప్రాజ్జులకె కనికట్టు కనకము 3+4+3+4

చపల చిత్తల కన్ను చెదరుట క+4 34+

చిత్రమా న్‌

ముత్యాలసరం సంపుటంలోని గేయానికి, నారాయణరెడ్డిగారు కొద్ది మార్పులతో

పాదవిభజన చేసి రాసిన భాగాన్ని పోల్చిచూస్తే తెలుస్తుంది. మొదట ఉదాహరించినది ముత్యాలసరం నడకకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. నారాయణరెడ్డిగారు చేసిన మార్పులవల్ల నాలుగువాదాలు ముత్వాలసరాల వాదాలై, చివరివాదం మాత్రం ఐదుమాత్రల అధికభాగమైంది. నారాయణరెడ్డి గారు చేసిన మార్పును బట్టీ “కాసులు” గేయం పాదనియతి లేని రచన మాత్రమె. దానిలో ఛందోభంగం ఏ మాత్రం లేదని స్పష్టమవు తున్నది. “కాసులు” గేయాన్ని అచ్చువేసిన తీరుదృష్టా కాక, దాని లయననుసరించి పదవిభజన చేసి చూపినారు నారాయణరెడ్డిగారు. అట్లాగే 'కన్యక' గేయాన్ని కూడా అధిక భాగాలకు ముందు చరణాలను ఐదు మాత్రల కాలం ఆగి, ఆ తర్వాత అధిక భాగాన్ని పాడుకొంటే లయ కుదురుతుందని కూడా నారాయణరెడ్డిగారు చక్కగా

ఆధునికాంధ్ర దేయ కవిత్వం కే కేన్‌ ప్రతిపాదించినారు. గురజాడ 'కన్యకి గేయాన్ని పార్యదృష్టితో కాకుండా పొట దృష్టితో చూదవలసి ఉంటుందని నారాయణరెడ్డిగారు గుర్తింపజేసినారు. ఇటువంటి అధికపాదాలకు డా॥వెల్చిరు నారాయణరావుగారు “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అనే సిద్ధాంత గ్రంథంలో ఒక నూతన వివరణను ఇచ్చినారు. గురజుడ గేయకవిత్నాన్ని పరిశీలించడానికి నూతన దృక్నోణాన్ని కల్పించినారు. గురజాడ గేయాలలో లయ తప్పడం జరగదనీ, అచ్చువేసిన తీరులో చూస్తే ఛందస్సు తప్పినట్లు కనిపించే జాగాటున్నాయి, కాని అవి పాటగాడు చమత్నారాలు చెయ్యడానికి వీలు కలిగించే జూగాలనీ, ఈ పద్ధతి ఆశు సాహిత్యంలోని పాటలలోను, ఆశుసంప్రదాయం ప్రకారం రాసిన పాటలలోను సర్వసామాన్యమేనని గుర్తించాలని అభిప్రాయపడినారు. అంతేకాదు గురజాడ కవిత్వంలో రూపం ఆశు సంప్రదాయానిదని, భావం నవ్యకవిత్వా నిదని, ఈ రెండింటినీ విడదీయడం అసహజమని ఆధునిక ప్రపంచానికి చెప్పవలసీన ఖావాలను, ఆశు సంప్రదాయం నుంచి తెచ్చిన రీతులలో చెప్పడం ఆయన గొప్పతనమని అన్నారు. ఇంతవరకు గురజాడ విమర్శకులందరూ గురజాడ కవిత్వాన్ని లిఖీత సంప్రదాయం దృష్టితో చూస్తూ వచ్చినారని, లిభితకవిత్నానికి వర్తించే విమర్శ ప్రమాణాలనే వర్తింపజేస్తున్నారని, అందువల్లనే విమర్శకులు గురజాడ ఛందోవ్యవస్టకు బలహీనత నాొపాదించే రచనలు చేసినట్లుగా భావించినారని, గురజాడ కవిత్వాన్ని లిఖిత సంప్రదాయం దృవ్వ కాకుండా ఆధునిక సంప్రదాయం దృవ్వా చూడవలసి ఉంటుందని వవరించినారు. గురజాడ కవిత్వం విమర్శనాత్మక వాస్తవికతతో కూడిన, సామాజిక, చైతన్య లక్షితమైన పురోగామితత్వమని, వారి కవితారీతి ఆశుసంప్రదాయానికి చెందినదని సిద్ధాంతీకరించారు. గురజాడ కవిత్వం మీద వెల్సేరు నారాయణరావుగారు చేసిన ఈ (ప్రతిపాదన చాలా నూతనమైనది.ో ముత్యాలసరంలో వచ్చిన అధికపాదాన్ని వచనంలాగా చదవాలని, దానిని ఎట్లా చదువుతారో డా॥ చేకూరి రామారావుగారు తన అనుభవంలో ఒక జానపదుడు ఆశు వుగా చెప్పిన గేయాన్ని 'ముత్యాలసరం” వ్యాసంలో ఉదాహరించినారు.*ో ఇరిసినా పొగాకు తీపి కొత్తకుండలొ కల్లుతీపి కోరినా తిరపమ్మ తీపి ఇంటిదొరసానేమి తీషండో మల్లయ్య దొరలు

116 ఆధునిక యుగారంభం - గేయానతరణం

ఈ ఉదాహరణలో మొదటి మూడు పాదాలలో తీపి” అనే మాటలో చివరి అక్షరం హ్రస్వం. అయినా ఉచ్చారణలో దీర్దమవుతుంది. హ్రస్వాన్ని గురువుగా (మాత్రాకాల పరిపూర్తికోసం) పరిగణించవచ్చు. ఈ గేయంలో 'తీపండో' అనే మాటలో రెండు మాత్రలు అధికంగా ఉన్నాయి. “మల్లయ్య దొరలు” అనేది మిగతాపాదాల నడకతో భిన్నమైనదని చేకూరి రామారావుగారు ఆ వ్యాసంలో అన్నారు. అయితే నారాయణ రెడ్డిగారితో ఈ విషయాన్ని ప్రస్తావించగా ముత్యాలసరం ఛందస్సులో ఉన్న ఈ జానపద గేయం మీద ఏల పాటల ప్రభావమున్నదని ఏమి తీపండో తర్వాత 3 మాత్రలకాలం దిర్జం తీసి 'మల్లయ్యదొరలు” అని అందుకొంటే లయభంగం జరగదని ముత్యాలసరం నడకలోనె పాడి వినిపించినారు.

కనుక “కన్యకిలోని అధికపాదాలు ముత్యాలసరం నడక కంటె ఖిన్నమైనవేమీ కావని పరిశిలనవల్ల తెలుస్తున్నది. “కాసులు” గేయం 'గ6౧ 0౧ ౪656' పద్ధతిలో పాద నియతి లేకుండా రాసిన గేయం, నారాయణరెడ్డి గారు అనుబంధంలో ఇచ్చిన దానిని బట్టి 'కాసులు' గేయం కూడా ముత్యాలసరం నడకలో ఉన్నది.

గురజాడ అప్పారావు ముత్యాలసరాల గేయంలో గమనించవలసిన ముఖ్య విషయం మరొకటి ఉన్నది. ముత్యాలసరం నాలుగోపాదంలో గురజాడ ఎక్కువగా 9 మాత్రలే వాదినాడు. ఆ 9 మాత్రలు కూడా 3+4+గురువుగా విరుగుతాయి. నిజానికి మిగతా ఐదుమాత్రల కాలపరిపూర్తి (14 మాత్రల ఆవృత్తిపూర్తి) కోసం చివరిగురువును ఐదు మాత్రల కాలం సాగదియడానికి వీలున్నది. అయితే చివరి గురువు సహజంగా దీర్జాక్షరం ఉన్నప్పుడు మిగతా ఐదు మాత్రల కాలం సాగదీసి పాడుకోవదానికి చక్కగా కుదురుతుంది. కాని గురజాడ నాలుగోపాదంలో వాడిన చివరి గురువులు ఎక్కువగా [ద్రుతాంతమో (నకారపుపొల్లు), వేరే పొల్లుతో కూడినవో ఉన్నవి. పొల్లు అక్షరాలతో ఉన్న గురువు లున్నప్పుడు రాగం ఏదో గుడుసుళ్ళు పడినట్లుంటుంది. రాగం తీగసాగదు. పొల్లక్షరాలున్న గురువులుకూడా ఎక్కువగా క్రియాంతాలు, (ఉదా : పల్మితిన్‌, విలసిల్లున్‌, ప్రబలెన్‌ మొ1నవి) ఈ రెండు కారణాలను బట్టీ గురజాడ అవ్వారావు ముత్వాలసరం గేయాలను పాడుకోవదానికికాక, వచనానికి దగ్గరగా నడిపినారు. పాడుకోవడానికి ఉద్దేశించిన 'దేశభక్తి' గీతాన్ని కాని, పూర్ణమ్మ (ముత్యాలసరంలో లేకపోయినా) గేయాన్ని కాని పరిశీలిస్తే ఈ భేదం స్పష్టమవుతుంది. 'దేశభక్తి గీతంలో “నాలుగో పాదం నిర్మాణంలో ఈ లేదా స్పష్టంగా కనబడుతుంది. ఈ గీతంలో చాలా వరకు '*నాలుగో పాదంలో మాత్రలు నిండుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకటి, రెండు మాత్రలు (అవైనా ఊపిరి

అధుభికౌంధ్ర గేయ కవిత్వం 117 తీసుకోవడానికి) మాత్రమే తక్కువగా ఉన్నాయి. కాని 9 మాత్రల చరణం ఎక్కడా వాడలేదు. నాలుగోపాదంలోనే కాక, మిగతా పాదాలలో కూడా చివరి అక్షరాలన్నీ గురువులు ఉండటం వల్ల చక్కగా పాడుకోవచ్చు. పాదాంతాలన్నిటా (చాలా వరకు) గురువులు ఉండటం వల్ల ఈ ప్రబోధగీతం చక్కగా పాడుకోవటానికి వీలై చాలా ప్రాచుర్యం పొందగలిగింది. దేశమును (ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ ఈ విధంగానే 'పూర్ణ్వమ్మ' గేయంలో కూడా చాలా వరకు పాదాలు గురువుతోనే అంతమవుతాయి. ఇంతవరకు 'ముత్యాలసరరి ఛందః ప్రయోగ వైవిధ్యాన్ని వివరించడం జరిగింది. గురజాడ గేయాలలో “పూర్ణమ్మ చాలా ప్రసిద్ధిచెందిన గేయం. కధా నిర్వహణలోనేమి, (కరుణ) రసపోషణలోనేమి, ఉదాత్త కవితాగుణంలోనేమి 'పూర్ణమ్మ' గేయం ఉత్తమ కళాఖండం. “పూర్ణమ్మ” గేయకథ బాలికలు పాడుకోవటానికి ఉద్దేశించి చేసిన రచన కాబట్టీ దానికనుగణంగానే ఈ గేయం లయాత్మకంగా నడిచింది. 'పూర్ణమ్మ' గేయం పదహారుమాత్రల ఛందస్సు. చతురస్రగతిలో నడుస్తుంది. వాదానికి నాలుగు చతుర్మాత్రాగణాలు ఉంటాయి. నదకను బల్ట ఇది మధురగతి రగడ అని చెప్పవచ్చు. అయితే పాడుకోవడానికి ఉద్దేశించి రచించిన గేయం కాబట్టి సాహిత్యాక్ష రాలు అక్కడక్కడా నిండుగా ఉండవు. కొన్ని లోపించి ఉంటాయి. మాత్రాకాల పరిపూర్తి కోసం అన్ని మాత్రల కాలం సాగదీసి పాడుకోవలసిండదే. పూర్ణమ్మకధలో వాదాంతాలు కూడా చాలా వరకు గురువలే (దీర్జాక్షరాలు) ఉండటం గమనించవలసిన విషయం. గురజాడ అప్పారావు చరణం (నాలుగుపాదాల) లో చాలా వరకు రెండుపాదాల కొకసారి విరామాన్ని పాటించడానికి వీలుగా రెండు, మూడు మాత్రలు తగ్గించి రాసినారు. థఉదావారడణుకు - ఏయే వేళల పూసే పువ్వుల ఈ 16 (4ఉ+శ4+4+త్త) ఆయా వేళల అందించి క్‌ శ్వీఫక్న+ర్‌= 18 బంగరు దుర్గను భక్తితా కొలిచెను = 4+4+4+డ=16 పుత్తడి బొమ్మా పూర్ణమ్మ = శ్తీ+క్తీర్‌=1ే8ి

118 ఆధునిక యురారంభర - గేయావకడణం యతి వ్రాసలు గురజాడ ముత్యాలసరాల గేయాలను యతిప్రాసలను నియతంగా పాటించలేదని ఇది వరకే చెప్పడం జరిగింది. యతిప్రాసలను ఐచ్చికంగానే పాటించినారు. యతి ప్రాసలను పాటించిన సందర్భాలలో వారు చూపిన వైవిధ్యాన్ని వివరిస్తాను. యతి యతి విషయంలో సంస్కృతభాషకు, తెలుగుభాషకు ప్రధానమైన భేదం ఉన్నది. సంస్కృతంలో యతి విరామం మాత్రమే. సంస్కృతంలో యతి స్వరూపం విచ్చేదరూపయతి పాదంలో నియతస్థానంలో పదవిచ్చేదం జరిగి మరోపదంతో ఆరంభం కావాలి. నియతస్థానంలో పదవిచ్చేదం జరగడం వల్ల కొద్దిగా విరామానికి వీలుకలుగుతుంది. అయితే తెలుగులో యతి విరామం కాదు. సరూపాక్షరయతియే తెలుగులో యతి. పాదాద్యక్షరంలో ఉన్న స్వరాన్ని గాని, తన్మిత్రస్వరాన్ని గాని అదే పాదంలో నియతస్థానంలో పాటించడం అన్నమాట. ముత్యాలసరం 3+4+8+4& మాత్రలుగా విరుగుతూ నడిచే ఛందస్సు. గురజాడ ముత్యాలసరాలు చాలా వరకు మూడు మాత్రలకు, నాలుగుమాత్రలకు పదమో, పదాంశమో విరుగుతుంది. కనుక సంస్కృతలక్షణం ప్రకారం గురజాడ ముత్యాలసరాలలో చాలా వరకు (విచ్చెదరూప) యతిని పాటించినట్లే. ఇక చూడవలసింది తెలుగు (సరూ పాక్షర) యతి మాత్రమే. ముత్యాలసరం పాదాలు చాలా చిన్నవి (14 మాత్రలు). అంత చిన్న పాదాలలో నియతంగా సరూవాక్షరయతిని వొటించడం వల్ల ముత్యాలసరం గమన వైవిధ్యాన్ని కుదించినట్లే అవుతుంది. యతిప్రాసల విషయంలో గురజాడ అప్పారావు అభిప్రాయ మిట్లా ఉన్నది. “నేను యెరిగియె యతి ప్రాసములను, అలంకారములను ముత్యాలసరములలో ప్రయోగించితిని, నియమముగా నుంచినయడల యతిప్రాసములకు గాను తెచ్చిపెట్టుకున్న శబ్దములు అర్ధపటుత్వమును చెరచి, సందర్భమును తప్పించి, యీడ్చుకుపోవును”ో గురజాడ యతిని ఐచ్చికంగా పాటించిన సందర్భాలలో వైవిధ్యాన్ని పరిశీలిసాను. అ. అన్ని పాదాల ప్రధమాక్షరాలకు యతి పాటించడం కన్ను కానని వస్తు తత్వము కాంచ నేర్పరు లింగి రీజులు కల్ల నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నరసితిన్‌

ఇధునికాంధ్ర గేయ కవిత్వం 119 పై ఉదాహరణలో అన్ని పాదాల ప్రధమాక్షరాలకు యతిని వాటించడం జరిగింది. అంతేకాదు పాదంలోనే సంస్కృత విచ్చేదరూపయతితో బాటు తెలుగుయతి కూదా, రెండోపాదంలో తప్ప మిగతాపాదాలలో యతి (స్వరమైత్రి) ఉన్నది. పాద ప్రధమాక్షరానికి, మూడోగణంలోని (మూడు మాత్రల) మొదటి అక్షరానికి యతి చెల్లింది. ముత్యాలసరం పాదంలో 14 మాత్రలు ఉంటాయి. కనుక యతిని పాటిస్తే ఎనిమిదో మాత్రను (పాదమధ్యంలో) యతి స్థానంగా పాటించాలి. గేయాలలో పాదమధ్యంలో యతి ఉంటే గతి మరింత లయాత్మకంగా ఉంటుంది. కనుక ముత్యాలసరంలో కూడా యతిసి పాటించినప్పుడు పాదమధ్యంలో (ఎనిమిదోమాత్ర) పాటించడం మంచిది. అయితే గురజాడ తదనంతరకవులు ఎక్కువగా పాద ప్రధమాక్షరాలకే యతిని పాటించినారు. ముత్యాలసరం పాదప్రమాణం చిన్నది కాబట్టి వాదప్రధమాక్షరాలకు పాటించినా బాగుంటుంది. అ. మొదటి రెండు పాదాల మొదటి అక్షరాలకు, చివరి రెండు వాదాల మొదటి అక్షరాలకు యతి వాటించడం మెచ్చ నంటా వీవు; నీవిక మెచ్చకుంటే మించి పాయెను కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా? ఇ అన్ని పాదాలలోను పాదమధ్యంలో యతి ముత్యాలసరాలలో నాలుగోపాదం హ్రస్వపాదం (నాలుగుపాదాలు సమానంగా ఉన్నవి చాలా తక్కువ) కాబట్టీ నాలుగోపాదం యతి పాటించిన ఉదాహరణలు తక్కువ. పూర్ణమ్మ కధలో నుంచి ఉదాహరణ చూపిస్తాను. వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు తల్లియు కంటను తడదిబెట్టన్‌ కాసుకు లోనై అల్లుని తలుచుకు ఆఅనందించెను అయ్యొకదె రెండోపాదంలోను, నాలుగోపాదంలోను, మాత్రలు తక్కువగా ఉన్నప్పటికీ పాడే టప్పుడు అన్ని మాత్రల (తక్కువగా ఉన్నవి) కాలం పాడితీరాలి. కనుక ఇక్కడ యతి పాదమధ్యంలోనే పాటించినట్ల. ఈ విధంగా మూడు పాదాలలోను, రెండుపాదాల లోను, ఒకపాదంలోను యతిని పాటించిన ఉదాహరణలు పూర్ణమ్మలోను, ముత్యాల సరాలలోను కనిపిస్తాయి.

120 ఆధునిక యుగారంభం - గేయానతరణం ఈ. వ్రాసయతి తెలిసి దిగ్గునలేచి, (ప్రేయసి నన్ను గానక మిన్ను గానక పై ఉదాహరణలో ప్రాసయతితోబాటు ద్వితీయ గణాద్యక్షరానికి, చతుర్ధ గణాద్యక్షరానికి మైత్రి కుదిరింది. ఉ. మరొక ఉదాహరణద్వారా యతి ప్రయోగ వైవిధ్యాన్ని వివరిస్తాను. మేలు కొలుపులు కోడి కూసెను విరులు కన్నులు విచ్చి చూసెను ఉండి ఉదిగియు ఆకు లాడగ కొసరె నోయని గాలి వీచెను పై ఉదాహరణలో రెండోపాదంలో పాదమధ్యంలో యతి కుదిరింది (విరులు, విచ్చి) అంటే ప్రధమగణం, మూడోగణం మొదటి అక్షరానికి మూడోపాదంలో మొదటి రండు గణాద్యక్షరాలకు, చివరి రెండుగణాద్యక్షరాలకు యతి కుదిరింది. నాలుగోపాదంలో మొదటి రెండుగణాద్యక్షరాలకు యతి కుదిరింది. చివరి రెండు గణాద్యక్షరాలకు యతి కుదరలేదు. బ్రాసు గురజాడ అప్పారావు గేయకథాకావ్యాలలో (డామన్‌పితియస్‌, లవణ రాజుకల, కన్యక) చాలా వరకు నియతంగా పాటించినాడు. ముత్యాలసరం చిన్నవాదాలు కల గేయం కాబట్టి ప్రాస వాడినప్పుడు అది వృత్యనువ్రాసగా భాసిస్తూ గేయానికి కాంత వేగాన్ని అందాన్ని ఇస్తుంది. గేయకధలలో ప్రాసవాడటం వల్ల గేయగమనంలో వేగం ఎక్కువై కధాకధనానికి కొంతవరకు దోహదం చేస్తుంది. గురజాడ (ప్రాసను ఎన్ని రకాలుగా వాడినాడో వివరిస్తాను. 1 వాలుగు పొదాలకు ప్రాస చెక్కు చెదరక నిలిచి డదమనుడు నికమే కద చావు నరునకు యొక్క దెప్పుడు యెటుల గూడిన నొక్కటే కాదా

ఆధునికౌంధ్ర గేయ కఠిత్వం 12] £2 మూడువాదాలకు ప్రాస తదియ చందురు వే సోకెను చదల విడబడి, యిరులు బ్రాకను అదును కాంచిన దిక్క మూకలు అంతటను (ప్రబలెన్‌ 8, రండు పాదాలకు (ప్రాస మొదటి రెందు పాదాలకు గాని, చివరి రెండుపాదాలకు గాని, మధ్య రెండు పాదాలకు గాని ప్రాస ఘటించడం జరిగింది. ఒక్కదానికి మాత్రం ఉదాహరణ అరమొగిద్చిన కన్నుగవతో చెదరదియాడెడి ముంగురులతో బెదరు యెరుగని బింక మొప్పిన వెడగు నదకలతో త్న పాదం విడిచి వాదానికి ప్రాసన చిన్నల నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరూ అన్నల తమ్ముల నప్పుడు పలికెను పుత్తడి బొమ్మా పూర్ణమ్మ 5, అంత్యప్రాస అంత పట్టవు రాజు యొదురై కన్నె సొగసుకు కన్ను చెదురై మరుని వాడికి గుండె బెదురె మరొక డదావొారగణు మేలు కొలుపులు కోడి కూసెను విరులు కన్నులు విచ్చి చూసెను ఉండి ఉడిగియు ఆకు లాడగ కొసరె నోయన గాలి వీచెను 1,2,4 పాదాలకు ప్రాస పాటించినాడు. ఇట్లా ప్రాస పాటించడం రుబాయీ పద్ధతి.

122 ఆధునిక యుగౌరంభం - గేయానతరణం 6ఓ _ ప్రాస్య-అంత్వప్రాస

వింటి, మీపో కిళ్ళు వింటిని

కంట నిద్దుర కాన క్తుంటిని

గురజాడ యతివ్రాసలను నియతంగా పాటించక ఐచ్చికంగా వాటించినందువల్ల యాదృచ్చికంగాను, సహజంగాను దొర్లినవే ఎక్కువ.

ఈ విధంగా గురజాడ ముత్యాలసరం ప్రయోగ వైవిధ్యాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తే మరెన్నో సూక్ష్మభేదాలు వెల్లడవుతాయి. అయితే ఇప్పటికే విస్తరించిన ఈ విపుల పరిశీలనను ఇంతటితో విరమించి, గురజాడ ప్రభావం తదనంతర కవులమీద ఎంతవరకు ఉన్నదో, ముఖ్యంగా తదనంతరకవులు ముత్యాలసరం ఛందస్సును ప్రయోగించిన తీరును వివరిసాను. ఆధునిక కవిత్వం మీద గురజాడ ప్రభావం

“ఆధునిక కవిత్వం” మీద అని అనడం కంటె ఆధునిక సాహిత్యం మీద గురజాడ ప్రభావం అని అంటే గురజాడపట్ల మరింత విసృతావగాహనకు అవకాశమిచ్చి నట్లవుతుంది. ఇదివరలో చెప్పినట్లుగా గురజాడ ఒక్క ఆధునిక కవిత్వానికే కాక, ఆధునిక నాటకం, కధానిక, వ్యాసం మొదలైన సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టినారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు “అప్పారావుగారు మహాకవి మాత్రమే కాదు, తరువాత రచయిత లందరికీ మార్గదర్శిన్నీ అయితే ఒక్క సత్యం చెప్పక తప్పదు. అదేమిటంటే? వచన రచయితలు మాత్రమె అప్పారావుగారి మార్గదర్శిత్వం స్వీకరించారు. పద్య రచయితలు ఆ దారి పట్టకోలేకపోయారు”” అని అభిప్రాయపడటంలో నిజం లేకపోలేదు.

కవితారంగానికి సంబంధించినంత మట్టుకు గురజాడ రాసింది తక్కువైనా, చేసింది తక్కువేమీ కాదు. ఆధునిక కవితారంగంలో గురజాడ నెలకొల్పిన నవ్యప్రక్రియలను ఇదివరలోనే పేర్ళొానడం జరిగింది. నేడు శాఖోపశాఖలుగా విస్తరించిన అనేక నవ్యకవితా ప్రక్రియలకు బీజాలు చాలావరకు గురజాడ కవిత్వంలో కన్పిస్తాయి. ఈనాడు సామాజికస్ఫృహ ఉన్న రచయితనే ఆధునిక రచయితగా గుర్తిస్తున్నారు. గురజాడ సామాజిక సమస్యలను చిత్రీకరించడానికే గేయకవిత్వం రాసి ఆధునిక కవితా ప్రస్థానంలో అఆద్యులయినారు.

ఆయన వాడుకభాషలో, సరళమైన ఛందస్సులో, నిరాడంబరమైన, నిరలం కారమైన, నిసర్గసుందరమైన శైలిలో సామాజిక సమస్యలకు ప్రాధాన్యమిస్తూ కవిత్వం రచించినారు. అప్పటి నుంచే తెలుగు కవితారంగంలో నూతన చైతన్యం వెల్లివిరిసింది.

ఆధునికాంధ్ర దేయ కఠిశ్వం 123 అయితే గురజాడ అనంతరం వచ్చిన భావకవులు అన్నిటా ఆయనను అనుసరించలేదు. కారణం ఆత్మీయానుభూతులకు, ఆవేశాలకు ఆలంకారికమైన పద్ధతిలో సలక్షణమైన భాషలో, జిలుగుపని చూపెడుతూ కవితారూపమిచ్చిన భావకవులకు గురజాడ నిరాడంబరశైలి, వాడుకభాష మొదలైనవి రుచించలేదు. చాలామంది భావకవులు అలంకారప్రాయంగా గురజాడ నూతనసృష్టి అయిన ముత్యాలసరాలను కొద్దిసేపు ముచ్చటగా మెడలో వేసుకొని మళ్ళీ తీసిపెట్టినారే కాని, గురజాడ ఆధునికతను అవగాహన చేసుకోలేకపోయినారు. బసవరాజు అప్పారావు, చింతాదీిక్షితులు మొదలైన ఒకరిద్దరు కవులు మాత్రం గురజాడను ఛందస్సులోనే కాక వాడుకభాష విషయంలో కూడా అనుసరించినారు. గురజాడ అప్పారావుకు తర్వాతి కవులలో అనుచరవర్షం ఏర్పడకవోవదానికి కారణం ఆయన వాడుకభాష, నిరలంకారమైన శైలే కాక, ఆయన కవిగా (ముత్యలసరాలు) 5,6 సంవత్సరాలకంటె ఎక్కువకాలం జీవించలేదు. రచనా విస్సృతి లేకపోవడం కొంత విస్కృతికి కారణమైంది. ఆయన తెలుగు కవితారంగంలో తీసుకొని రాదలచిన మార్చు సుస్థిరం కాకముందే ఆయన మరణించడం జరిగింది. అందుకే గురజాడ ప్రారంభించిన కవితా విప్లవం అసంపూర్ణ విప్రవమని, ఆయన మార్గమే ఆనాడు కొనసాగి ఉంటే, ఆశుసాహిత్యరీతిలో విద్యావంతులకూ, పామరులకూ ఉమ్మడిగా ఒక కవితామార్గం రూపొందిఉండేదని, భావకవిత్వపు ఊహలకు చోటులేని ఒక వాస్తవిక ప్రాధాన్యమైన కవిత్వం వచ్చి ఉండేదని వెళ్చిరు నారాయణరావుగారు అభిప్రాయపడినారు. *ీ

భఖావకవితాయుగంలో గురజాడకు రావలసిన కీర్తి రాకపోయినా, అభ్యుదయ కవిత్వపు రోజులలో గురజాడకు గురుపీరం లభించింది. గురజాడ మార్గానికి నిజమైన ప్రచారం 1940 నుంచి ఉద్యమంగా కమ్యూనిస్టు పార్టీ ఆయన దేశభక్తి గీతాన్ని ప్రతి సభలోనూ పాడటంవల్ల కలిగిందనే విషయం యధార్ధమే. శ్రీ శ్రీ భావకవుల ప్రభావం నుంచి బయటపడి, గురజాడ మీద గురి కుదిరిన తర్వాతనే ఆయన అభ్యుదయ కవితాయుగాన్ని నడిపించగలిగినాడు. గురజాడ ఆధునికతను సరిగా అవగాహన చేసుకొన్నది శ్రీశ్రీయే అని చెప్పాలి. అయితే శ్రీశ్రీ కూడా గురజాడ నిరలంకారశైలిని, వాడుకభాషను అనుసరించలేదు. మొత్తంమీద గురజాడను పూర్తిగా అనుసరించిన తెలుగుకవి ఒక్కడూ లేదనే చెప్పాలి. “సాహిత్యరంగంలో ఇప్పుడు నేను కావిస్తున్న కృషికి సమతుల్యమైన కృషి భారతదేశంలో మరెక్కడా కనిపించలేదు.”” అని రాసుకొన్న గురజాడను అందుకొన్న తెలుగు కవి లేడు. అయితే ఆయన తర్వాత కలం పట్టిన ప్రతి తెలుగుకవి మీద ఆయన ప్రభావం అప్రత్యక్షంగానో, అంతర్లినంగానో అంతోఇంతో ఉందనేది వాస్తవం.

124 ఆధునిక యుగారంభం - చేయావతరణంల గురజాడ ముత్యాలసరం నూతన ఛందస్సును సృష్టించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా, పద్య ఛందస్సులలో రాసిన పూర్వాంధ్రకవులు ఒక్క కంద పద్యమైనా రాసినట్లే'” గేయఛందస్సులలో రాసిన ఆధునిక కవులందరూ దాదాపు ఒక్క ముత్యాల సరమైనా రాసినారు. కనక ముత్వాలసరం రాసిన ముఖ్యులైన కవులు కొందరిని, ముత్వాల సరంలో చేసిన ప్రయోగ వైవిధ్యాన్ని ఈ అధ్యాయంలోనే వివరిన్తాను. యుత్యాలసరం - ఇతర కవుల ప్రయోగ వైవిధ్యం భావకవితాయుగానికి ఆరంభకుడైన రాయవ్రోలు సుబ్బారావు కూడా ముత్యాలసరం ఛందస్సు విషయంలో గురజాడను అనుసరించినారని ఇదివరకే తెలియజేయడం జరిగింది. రాయఫ్రోలు సుబ్బారావు “తమ్ముడా”, 'యాత్రి, '“ప్రభాతము, “తిలకము, “'చిల్మ, మొదలైన గేయాలు ముత్యాలసరాలలో రాసినారు. వీరు రాసిన ముత్వాలసరాలలో చివరిపాదంలో సాధారణంగా 12 మాత్రలు వాడినారు. యతి, ప్రాసలను కూడా చాలా వరకు వపాటించినారు. శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పొణటిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా! విశ్వనాథ నత్యనారాయణ ముత్యాలసరం ఛందస్సును కథన కవిత్వానికి ఉపయోగించుకొన్నారు. పూర్తిగా ముత్యాలసరం ఛందస్సులోనే 'కోకిలమ్మపెండ్లి' అనే గేయకావ్వాన్ని రచించినారు., విశ్వనాథ సత్యనారాయణ ముత్వాలసరం ఛందస్సులో ప్రాధప్రయోగాలెన్నో చేసి గమన వైవిధ్యం కలిగించినాడు. చివురులూ కొమ్మలా చివరా... 5+5+4=14 చివురు-లూకొ-మ్మలా-చివరా... గుబురులై గుబురులా చివరా... 5+5+4=14 గుబురు-లైగుబు-రులా-చివరా... పూవులూ నాలుగూ వైపులా ... 5+5+4=14 పూవు-లూనా-లుగూ-వైపులా ... బుగులు కొన్నాయి ... 54+2=9 బుగులు-కొన్నా-యీ .., (కోక్‌లవ్మువెండ్లీ వులి-67 పై ముత్యాలసరం గేయఖండం 3+4+8+4 మాత్రలుగా కాక, 5+5+4 మాత్రలుగా విరుగుతుంది. అట్లాగే మూడు మాత్రల స్థానంలో లగాన్ని మూడు పాదాలలోనూ (కొొమ్మలా, (గుబురులా, (నాలుగూ వాదటం వల్ల ముత్యాలసరం నడకకు గతి వైవిధ్యం వచ్చింది. అయితే ఇది 3+4మాత్రలుగా విరగటం లేదు. అందుకే

ఆధుథికౌంద్ర దేయ కఐిత్యం 125 దా॥ చేకూరి రామారావుగారు పై గేయఖండాన్ని ముత్యాలసరంగా అంగీకరించలేదు. అయితే దీనిని ముత్యాలసరంగానే అంగీకరించాలి. మొత్తం కావ్యమంతా ముత్యాలసరం ఛందస్సులో ఉన్నది. ఇక్కడ కొద్దిగా భిన్నమైన నడక స్ఫురిస్తుంది. అంతమాత్రాన ఇది ముత్వాలసరం కాకపోదు. ఇదివరలో గురజాడ ముత్యాలసరాల విషయంలో చెప్పినట్లు ఈ గేయఖండంలో కూడా మూడోమాత్ర, నాలుగోమాత్ర, అట్లాగే ఏడోమాత్ర, ఎనిమిదో మాత్ర కలిసి గురువు రావడం లేదు. కాబట్ట కొంత ప్రయత్న పూర్వకంగా 3+4+3+4 మాత్రలుగా (ప్రక్కన చూపిన విధంగా, విరిచి చదువుకోవచ్చు. అయితే “కోకిలమ్మ పెండ్లి లోని ముత్యాలసరాలలో మూడోమాత్ర, నాలుగో మాత్ర కలిసి గురువు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా గురువు వేయడం వల్ల ముత్యాలసరం 3+4 మాత్రలుగా విరగదు. కే పిడాదికొక సారివసా .. 5+5+4

డేడాదికొక సారితెస్తాడు... 5+5+4 (పు.78) అట్లాగే ల్సి రావయ్య ఓపూల రాజా

రావయ్య ఓ అందగాదా (తక) 5+2+3+4 (పు. 78) అట్లాగే

4+3+8+4 మాత్రలుగా కూడదా విరుగుతుంది. తె, తల్లిబిద్దల ప్రేమ అంటే

యిల్లాగు వుందాలటంటూ... ఉ+8+8+4 (ఫు74) ల్తే వచ్చా వటయ్యా పూల టేదా

తెచ్చా వటయ్యా పూల రాజా (పు 78)

అయితే ఈ నాలుగింటినీ గురజాడ '“దేశాఖిమానము నాకు కద్దని అనే గేయ ఖండంలో చెప్పినట్లుగా పాదాది గురువును అతీతకాలంలో వచ్చిన అక్షరంగా (౧6108 5620 (గ్రహించి, ముత్యాలసరం నడకకు కుదుర్చుకోవచ్చు. ఉదాహరణకు. “రావయ్యా ఓ పూల రాజ్యా రావయ్య ఓ అందగాడా” అనే పాదాలలో

మొదటిపాదంలో మొదటి గురువు “రాను అతీతకాలంలో వచ్చిన అక్షరంగా (గ్రహించి 'వయ్య ఓ పూల రాజా అని ఎత్తుకోవాలి. అప్పుడు ముత్వాలసరం నడక ఈ విధంగా ఉంటుంది.

రా-వయ్య-ఓ పూ-లరా-జారా

వయ్య-ఓఅం-దగా-దా(తక)

126 ఆధునిక యుగారంభం - రేయానఠరణల దీన్ని మరోరకంగా పాడుకోవచ్చు

రా వయ్య ఓ (తక) పూలరాజా

రావయ్య ఓ (తకు అంద గాదా

రెండు పాదాలలోనూ మొదటి గురువును అతీతకాలంలో వచ్చిన అక్షరంగా గ్రహించి “ఓ దీర్జాన్ని మరిరెండు మాత్రల కాలం సాగదీస్తే నడక కొత్తసాబగును సంతరించుకొంటుంది. ఇట్లాగే మిగతావాటిని కూడా పాడుకోవాలి,

“కోకిలమ్మ పెండ్లిలో విశ్వనాథ మూడుమాత్రల స్థానంలో విలోమగణమైన లగాన్ని అధికంగా వాడి, ప్రాధగమనాన్ని కలిగించినారు. విశ్వనాధ "కోకిలమ్మ పెండ్లిలో దీర్హపాదాల సంఖ్య 'పెంచికూడా ముత్యాలసరాన్ని (ప్రయోగించినారు.

కోకిలమ్మా అదుగొ మళ్ళీ కూసెనంటె కూసెనానీ వచ్చెనంటే వచ్చెనానీ బ్రతికెనంటే బ్రతికెనానీ ఒళ్ళు తెలియక అడవిపూటా పొర్లిపోయిందీ (పు.77)

ఒక పాదం దీర్హపాదం (14 మాత్రలు), మరొాకపాదం నాలుగోపాదమైన (హ్రస్వపాదం (9 మాత్రలు) ఒకదాని తరువాత ఒకటి వెంటవెంటనే ప్రయోగించినారు.

చెన్ను తరగని మావి మోకా = 14

చివురు తొడిగిందీ జ క్ర

అంత లోపల నడివికందం = 14

అతిశ యించిందీ = 9 (పుట.77)

విశ్వనాధ నాలుగోపాదంలో దాదాపు అన్నిచోట్లా తొమ్మిదిమాత్రలే వాడినాడు. అట్లాగే అన్ని చోట్లా (చాలా వరకు) నాలుగో పాదాంతం క్రియతోను, దీర్జాక్షరంతోను అంతమవుతుంది. చివరి దిర్జాక్షరం. ఉందటం వల్ల మిగతా 5 మాత్రలకాలం సాగదీసి పాడుకోవటానికి లేదా విశ్రాంతి తీసుకోవటానికి కుదురుతుంది.

పాదాదిలో గురువుకూడా అధికంగా ఉపయోగించిన ముత్యాలసరం కనిపిస్తుంది. కోకిలమ్మ పెండ్లిలో 3, 4 క్రమంలో కాక, 4,3 [క్రమంలో విరుపులున్న ముత్వాలసరం పాదాలు ఒకటి, రెండు ఉన్నాయి.

ఆధునికాంధ్ర గేయ కనిర్యం 127 కోకిలమ్మా యింటికైనా రాక అడవుల్లోన తిరుగుతు పోకిళ్ళమారైంది.... చివరిపాదం 4+3 క్రమంలో విరుగుతున్నది. ఈ విధంగా విశ్వనాధ “కోకిలమ్మ పెండ్షి'లో ముత్యాలసరం ఛందస్సుకు గమనవైవిధ్యం, ప్రాడిని కలిగించినా, లయ కందని సందర్భాలు కూడా ఉన్నాయి, ముత్యాలసరం ఛందస్సును కధనకవితకు ఉపయోగించుకున్న వారిలో గీతానందుడు ముఖ్యుడు. ఆయన కాపుపెళ్లి కావ్యాన్ని ముత్యాలసరం ఛందస్సులో రచించినారు. అదవి బాపిరాజు 'శశికళి గేయకావ్యంలో అక్కడక్కడా ముత్వాలసరాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నిచోట్ల మాత్రలు పెంచి రచించినారు. “ఎండిమియాన్‌” అనే కావ్యభాగమంతా ముత్యాలసరంలోనే ఉంది. గండ శిలపై మేను వాల్చితి కొండ వాగూ పాట పాడెను వెంది వెలుగులు నన్ను ముంచెను ఓ నిండు వెన్నెల నీటులాడీ పండుకొనుచూ నిదుర కూరితినే ” పై గేయాన్ని కూడా ఏలపాట పాడినట్లుగా పాడుకోవాలి. పండిత ప్రవరులు వేటూరి ప్రభాకరశాస్రి కూడా గురజాడ ప్రభావంవల్ల కొన్ని ముత్యాలసరాలు రచించినారు. బందరులో తుఫాను బీభత్సం కలిగినపుడు “గీతాంజలి” శీర్షికతో కొన్ని ముత్యాలసరాలు రచించినారు. వారు ఐదు పాదాల నొక ఖందంగా రచించినారు. మచ్చుకొక ఖండం నీటి మీదను నేల మీదను నింగి మీదను వెలయ గంటిమి చేటు నెలుగక పోతిమిక ర క్షింపుమో తంద్రీ-దయ వీ క్షింపుమో తండ్రీ * చివరి పాదాలన్నిటా నియతంగా 9 మాత్రలే ఉపయోగించినారు. నాలుగో పాదాలన్నిటా 13 మాత్రలే ఉపయోగించినారు. 'ర-క్షింపుమో తండ్రీ' అని ఒక మాత్రాకాలం విశ్రాంతి తీసుకోవాలి. 'గీతాంజలి' గేయమంతటా 4, 5 పాదాల నిర్మాణం ఒక్క తీరుగా ఉంటుంది. “తండ్రీ అని రెండుసార్లు సంబోధన వస్తుంది,

121 అధుభ్రిక యుగౌరంభం - గదేయావతర్‌ణం జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ రచించిన 'విజయత్రీ' కావ్యంలో అర్జునుని విషాదం, కృష్ణుని ఉపదేశం (కొంతవరకు) ముత్వాలసరాలలోనే ఉన్నది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రాసనియమాన్ని చాలా వరకు (నాలుగు పాదాలకూ) వాటించి ముత్వాలసరానికి పద్యగమనం కలిగించినారు. తాతలను తండ్రులను గురువుల భ్రాతలను పరిమార్చుటకు నా చేతు లాడుట లేదు, నేనెటు సేతు సంగరము” అందరికంటె ఎక్కువగా ముత్యాలసరాలు రాసినవారు తల్లావజ్ఞల శివశంకరశాస్తి, వీరు రచించిన నాటకాలలోను, కావ్యాలలోను పద్యాలతో బాటు ముత్యాలసరాలు కూడా రచించినారు. వీరి ముత్యాలసరాలు కొన్నిచోట్ల వృత్తాలవలె నడుస్తాయి. వీరు ముత్యాలసరాలలో చాలావరకు నియతంగా మొదటి రెండుపాదాల మొదటి 3 అక్షరాలకు, చివరి రెండు వాదాల మొదటి అక్షరాలకు యతిని వాటించినారు. ఆ టత్రిలోచన మూర్తినీ నయ నామృతోర్ముల దేలియాడుచు చెలియ, నీపద పట్టభంగ శ్రేణి జేరునులే” పై ఖండికలో 3,4 మాత్రలకు పదంకాని, పదాంశంకాని విరగక పోవడంవల్ల వృత్తరచనను తలపిస్తుంది. శివశంకరశాస్త్రి 'పలిత కేశము' 'హృదయేశ్వరిలో ప్రణయ సందేశ భాగాన్ని ముత్యాలసరాలలోనే రచించినారు. పూడిపెద్ది వెంకటరమణయ్య “వెన్నెల అనే కావ్యంలో ప్రబంధాలలో ఆశ్వాసాంత పద్యాలలాగా ప్రతి సన్నివేశం చివర ఒక ముత్యాలసరం నియమంగా రచించినారు. అబ్బూరి రామకృష్ణారావు “వర్షాగమము” అనే ఖండకావ్యం ముత్యాలసరాలలోనే రచించినారు. 'నదీసుందరి” అనే నాటకంలో కూడా అక్కడక్కడా కొన్ని ముత్యాల సరాలు న్నాయి. అబ్బూరి రామకృష్ణారావు ఒక ముత్వాలసరంలో పాదాదిలో గురువువెసి యొదటి పాదం, మూడోపాదంలోను) రచించినారు. ఆలింపు పాదెద నాంధ్రకోమలి = 16 యాధర్ధ హైందవ గీతులన్‌ = 1డీ పాలింతు నెల్లడ భావపుప్పిత = 16 నవ్యశయ్యా రితులన్‌' జ.

అధునికౌంధ్రి చేయ కథిత్వం 120 మొదటిపాదంలోను, మూడోపాదంలోను మొదటే గురువు అధికంగా వేసినారు. అధిక గురువు (ఆ,పా) విడిచి (లేదా లోలోపల గబాలున చదువుకొని) లింపు పాదెద- లింతు నెల్లడ.. అని ఈ విధంగా చదువుకుంటేనే కాని నదకకుదరదు, అయితే రెండోపాదం చివర రెండు మాత్రలు తగ్గించి, మూడోపాదం మొదటి రెండుమాత్రలు పెంచినారు. మొదటి రెండు వాదాలకు, తర్వాతి రెండు వాదాలకు యతి, వాదం విడిచి పాదానికి ప్రాస (ఆలిం, పాలిం), అట్లాగే రెండోపాదానికి, నాలుగో పాదానికి అంత్య ప్రాస (గీతులన్‌, రీతులన్‌) పాటించినారు. వేదుల సత్యనారాయణశాస్తి రచించిన 'రాణాప్రతాపసింహు నాటకంలో “జయము భారత భాగ్యలక్ష్మి అనే గేయం ముత్యాలసరంలో ఉన్నది. బోయిభోమన్న 'పైరుపాట' అనే గేయరూపకంలో కొన్ని రంగాలు ముత్వాలసరాలలో రచించినారు. బాపురెడ్డి గేయనాటకాలలో ఒకచోట ముత్యాలసరం దీర్హపాదం ఒకటి, ఆ తర్వాత హ్రస్వపాదం (8 మాత్రలు), మళ్ళీ దీర్హపాదం, హ్రస్వపాదం (8 మాత్రలు) ఈ విధంగా పల్లవిని కూర్చి గేయాన్ని ముత్యాలసరంలో రచించినారు. ఏమిటమ్మా! ఏమిటమ్మా ఇంత సంబరము గెలిచినట్లున్నావు, ఈభూ తలము అంబరము... వెదికికొన్నది దొరికినట్టుల కలలుగన్నది కాంచినట్టుల వెలుగుచున్నవి నీదుకన్నులు ” విడిగా ముత్యాలసరాలలో గేయఖండికలు ఎందరో రాసినారు. వాటిలో ప్రయోగం దృష్ట్వా విశిష్టమైనవీ, చాలా బాగున్నవీ కొన్ని వివరిస్తాను. భావకవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, బసవరాజు అవ్వారావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, కవికొండల వెంకటరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, పెనుమర్హి వెంకటరత్నం, కొడవటిగంటి వెంకటసుబ్బయ్య, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మొదలైనవారు చక్కని ముత్యాలసరాలు రాసినారు. దువ్వూరి రామిరెడ్డి ముత్యాలసరంలో చూపిన ప్రయోగాలు చెప్పుకోదగినవి, గాలి యదుగుల నెవరి కోసరము ఓ మోహ శీలా కదలి వచ్చితివీ నిశీథమున కాలి యందెలు ఘల్లుమను ననియొ ”*

130 ఆధునిక యుగార్‌ంభం - గేయానఠర్‌ణం పై గేయంలో మొదటిపాదం తర్వాత ఐదు మాత్రల కాలం విశ్రాంతి తీసుకొని రెండోపాదం 'ఓ మోహ శీలా” అని ఎత్తుకొంటేనే ముత్వాలసరం నడక కుదురుతుంది. ఇది ఏలపాట ప్రభావంతో రాసినది. దువ్వూరిదే మరో ముత్యాలసరం. సందె వేళల బూల టేకులు (క్రింది కురలగ గాంచి కాంచిమ రంద బిందువు కన్ను దమ్ముల జింద బొగిలెదు ప్రకృతి చేష్టకు సుందర గామినీో పై గేయంలో నాలుగుపాదాల తర్వాత ఐదోపాదాన్ని (14 మాత్రల) "కామినీ (5 మాత్రలు), సుందరగామినీ' (4+5మాత్రలు) అని విరిచి రెండు పాదాలుగా ముత్యాల సరంలో గణమధ్యంలో విరచి మరొక పాదంగా రాసి కొత్త నడకను తీసుకొనివచ్చిన (ప్రయోగం కూడా కనిపిస్తుంది. చిన్ని పూవే వాడె నా తన కన్నె వలపుల వాదెనా తన చిన్నె లన్నియు వన్నె లన్నియు మన్ను లో గోల్పోయె నా బసవరాజు అవ్వారావు దువ్వూరి మొదటి గేయంలోలాగానే రెండు పాదాల నడుమ ఒక హ్రస్వపాదముంచి, దానిని పల్లవిగా కీర్తన మాదిరిగా ముత్యాలసరాన్ని రచించినారు. ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా జంటగా నను బిల్వదగదోయీ కంటికంతా జలమయంబై మింటివరకును నేక రాతై జంట దొరుకని మహా ప్రళయవు టింటిలో వటప్రత డోలిక ఒంటిగా.. ”*

ఆధునికౌంధ్ర దేయ కదిత్శం 13] హ్రస్వపాదంలో తప్ప పల్లవిలోను, చరణంలోను అన్నిపాదాలలోను ఒకే ప్రాస కూర్చడం గమనించదగిన విశేషం. బసవరాజు అప్పారావు 'దగాయితి, “విహారము, 'రామకధాసుధి అనే ఖండికలను ముత్యాలసరంలోనే రచించినారు. 'విహారము'లో ఉన్న నాలుగుముత్వాలసరాలలోను దీర్హపాదాలన్నిటికీ ఒకే ప్రాస (2,8 గీతాలలో (హ్రస్వవాదాలకు కూడా) కూర్చడం జరిగింది. కొండ కోనల నదుల వనముల నెండ చొరని నికుంజ గృహముల తాండ వింపగ పొంగి నాయెద తప్పటలు జరచున్‌ో కొడవటిగంటి వెంకటసుబ్బయ్య “ఆతిథ్యము” అనే చక్కని గేయాన్ని ముత్యాల సరంలోనే రాసినాడు. అగు మాగుము తెరువరీ, ఆ యాస ఖేదము నపనయింపుము, మా గృహాంగణ కుసుమ సముదయ మధువు లియ్యవిగో!ో పై గేయంలో ఏ పాదానికిపాదం విరగటం లేదు. మొదటిపాదం రెండో పాదంలోకి చొచ్చుకొని పోయింది. మల్లవరపు విశ్వేశ్వరరావు 'గడ్డిపువ్వును ముత్యాలసరంలో కూర్చినాడు, “గడ్డిపువ్వులో చక్కని భావచిత్రాలను (0069) కనులకు కట్టించినారు. తెప్ప వోలిక చంద్ర బింబం తేలి పోతో వుంది నింగిని అందులోనా ముద్దు ప్రేయసి వుంది కాబోలు” 'గడ్డిపువ్వు' గేయంలో చాలా వరకు రెండు పాదాలకు (పాదాద్యక్షరాలకు) యతిని పాటించడం జరిగింది. ఈ గేయంలోనే నీకు నేనే కావలిస్తే నింగి వొదులకు నీవె, సీతా కోక చిలుకవొ, దేనివో అయి రాగలవు!

132 ఆధునిక యుగారంభం - గేయావతరణం నేనొద్దు కనకే ముత్తెములొ రత్నాలొ యేరుతొ చిత్రమవు నామబ్బు కడలినె అద్ధ చంద్రుడి దోనెలోనే ఆఅదుకొంటావు!”

ఈ గేయంలో మొదటిఖండంలో చివరి పాదాన్ని 5 మాత్రలతో ముగించి రెండవ ఖండం మొదట్లో 9 మాత్రల అధికపాదాన్ని రచించినారు. ముత్యాలసరంలో కవులు కొన్నిమాత్రలతో అధికపాదాన్ని సాధారణంగా చివర రచఛించినారు. కాని ఈ గేయంలో ఖందానికి మొదటే అధికపాదం ఉన్నది. అయితే 14 మాత్రల నాలుగో పాదాన్ని రెండుపాదాలుగా విరిచి, రాయడం జరిగింది. 'రాగలవు, నే నొద్దుకనకే' అనే పదం ముత్యాలసరం పాదంలాగే 3, 4 మాత్రలకు విరుగుతుంది. అయితే ఐదు మాత్ర లొకపాదంగా, 9 మాత్రలు మరో ఖందానికి ఆదిలోనే అధికపాదంగా రచించడం జరిగింది. దీనిని అచ్చుదృష్టితోకాక వొట దృష్టితో చూస్తే మొదటి గేయఖండంలో నాలుగూ సమాన పాదాలవుతాయి.

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ “*కుపిత విధి “అంధకారము మొదలైన గేయాలు ముత్యాలసరాలలో రచించింది. “కుపితవిధి గేయంలో కొన్ని ఖండాలలో 4 మాత్రలకు 8 మాత్రలే వాడీంది. 3౩ మాత్రలే వాడినచోట ఒక మాత్రాకాలం విశాంతి తీసుకోవదమో, 'హ్రస్వాన్ని గురువుగా సాగదీయడమో చేస్తేనే కాని నడక కుదరదు.

పూల మాలిక లల్లినందుకు = త+4+3+4 కరకు కత్తులు కాను కాయెను = 3+4+3+4 తేనె సుధలను చల్లి నందుకు = 3+4+3+4 తేటి పోటుల కాటు లాయెను = 3+4+3+4 విరహవ్యధలు: విరహవ్యధలు = 3+3+3+8 ఓర్వ లేని విరహ వ్యధలు = 3+8+3+3 అగ్ని మండి గుందె లోన జి 8+3+3+8 ఈసు లేనీ లోక మేదో =... క+4+ర+ాశ ఎరిగి తెలియుము మాలతీ" = 3+4ా8+38

పై గేయంలో మొదటి ఖండం చక్కగా 3, 4 మాత్రలతో నడిస్తే, మిగతా ఖండాలలో

అక్కడక్కడా నాలుగు మాత్రల స్థానంలో మూడు మా(త్రలు వాడటం జరిగింది.

ఆధునికాంధ్ర దేయ కఖిర్వం 133 నోరి నరసింహశాస్త్రి రచించిన 'మైనారిటీ వెళ్ళిన రోజుని అనే గేయంలో అన్ని గేయఖండాలలోను నాలుగు వాదాలకు ప్రాసను నియతంగా పాటించడం జరిగింది. యతి కూడా చాలా వరకు పాదాదిని పాదమధ్యంలో కూడా (ఎనిమిదోమాత్ర) స్వరయతిని పాటించడం జరిగింది. తల్లి కడుపును వెడలుటాదిగ చల్లనౌ తలపులు తలంచుచు వెళ్ళ బుచ్చితి నిన్ని దినములు పిల్ల వాడనుగా” పై ముత్యాలసరంలో నాలుగో పాదాలన్నిటా నియతంగా 9 మాత్రలే వాడటం జరిగింది. నోరి నరసింహశాస్త్రి ముత్యాలసరాలను ప్రయోగదృష్టితో కాక, నియమాలను ఉల్లంఘించకుందా, మరిన్ని నియమాలు (యతిప్రాసలు మొ॥నవి) వొటిస్తూ చాలా చక్కగా నడిపినారు. ముత్యాలసరం నడకను తీర్చిదిద్దినారు. నాలుగు కంటె హెచ్చుపాదాలతో కవికొండల వెంకటరావు "శివరాత్రి ప్రభ శ్రీశ్రీ “బాటసారి” అనే గేయాలను [౮౧-౦౧-౪6౧6 పద్ధతిలో రచించినారు. కవికొందల 'శివరాత్రిప్రభిలోను, శ్రీశ్రీ 'భాటసారి' లోను ముత్వ్యాలసరం ఛందస్సులో సరికొత్త విరుపులు చూపి, గమనవైవిధ్యం నాధించినారు. ఉదాహరణకు కవికొండల “శివరాత్రిప్రభిలో కొన్ని పంక్తులు కాల కంఠుని నాగ సర్పము =. 3+4+38+4 కుబుస మూడ్చీ పడగ బుస్సంది = 8+4+3+5 రెందు నాల్క్మలు ఇ. ప్రతీ గండు మీసాలట్లు దూసిందిో* = 3+4+8+5 పాదాంతంలో క్రియాపదాలలో ఒక అధికమాత్ర వేయడం వల్ల ఒక నిండుదనం, కొత్తదనం కనబడుతున్నాయి. కొన్నిచోట్ల సగం పాదాలు (3+4 మాత్రలు) కూడా వాడటం జరిగింది. ఈ గేయంలోనే 3+4 మాత్రలుకాక 4ఉ+8 మాత్రలుగా కూడా విరుపులు కనబడుతున్నాయి. నొసట గొసరిన మూడో కన్ను = 5+4+4+8 నివురు లూదిన కొలిమి దెగడి* = 3+4+8+5 అక్కడక్కడ పాదాంతంలో ఒకటి, రెండు మాత్రలు తక్కువగా వాడి, ఒక్కొక్కచోట ఒకటి, రెండు మాత్రలు ఎక్కువగా వాడి చిత్రగతులు కల్పించినారు.

134 ఆధునిక యుగారంభం - దేయావరరణం శ్రీశ్రీ “బాటసారి” అనే కథాగేయాన్ని ముత్యాలసరంలో రచించి ఆ ఛందస్సుకు ప్రచండ వేగం నేర్పినారు. మచ్చుకు “బాటసారిలోని పంక్తులివి. కూటి కోసం, కూలి కోసం పట్టణంలో బదుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి చండ చండం తీవ్ర తీవం జ్వరం కాస్తే భయం వస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టీ, గాలికొట్టీ వాన వస్తే వరద వస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం శ్రీతీ ఈ గేయంలో “లగ” ప్రయోగాలు ఎక్కువగా చేసినారు. *చండ చందడం..........వరద వస్తే వరకు చూస్తే 'గల, గగ) ప్రయోగాలు, ఆ వెంటనే *లగ, గగి గణాలు కొన్ని ఆ వెంటనే మళ్ళీ 'గల, గగి గణాలు వేసి ముత్యాలసరాలను తీరుతీరుగా నడిపించినారు. *చండ చండం'” దగ్గరినుంచి “ఎంత కష్టం) వరకు ఎక్కడా విశ్రాంతికి చోటు లేదు. '“ఎంతకష్టంి తర్వాత ఒక్కసారి ఊపిరి తీసుకొంటే గేయం నడకలో చిత్రమైన తూగు వస్తుంది. శ్రీశ్రీ మిశ్రగతిలో మంచి వేగాన్ని తీసుకొని వచ్చినారు. శ్రీశ్రీ కూడా కవికొండలలాగానే పాదాంత క్రియలలో ఒక అధిక మాత్ర వాడి, మంచి తూగును తెచ్చినారు. బాటసారి కళేబరముతో శీత వాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది" ఆధునికులలో శ్రీశ్రీ ఎక్కువగా ముత్యాలసరాలు రాయడమేకాక ప్రయోగాలుకూడా ఎక్కువ చేసినారు. శ్రీశ్రీ ముత్యాలసరాలలో రచించిన గేయాలు 1. ఆంధ్రకవితా పితామహుడు 2. హారతి 3. జయభేరి 4 బుక్కులు 5. అవతారం 6. బాటనాది

ఆధునికాంధ్ర చేయ కవిత్వం 135 7. స్విన్‌బర్న్‌ కవికి 8. ఉన్నాది 9. ఏవి తల్ల అనేవి ఈ గేయాలలో శ్రీశ్రీ ఛందళ్ళిల్పంలో అనల్పవైవిధ్యాన్నీ వైభవాన్నీ ప్రదర్శించినారు. 'స్విన్‌బర్న్‌ కవికి గేయంలో

విషం క్రక్కే భుజం గాలో

కదం త్రాక్కే తురం గాలో

మదం పట్టిన మాతం గాలో (1 మాత్ర అధికం)

కవీ నీ పాటల్‌ *

“ఎగం) వెంట గగం' వేసి చిత్రమైన ఉద్ధతిని నాధించినారు. 8+4+8+4 మాత్రలు ముత్యాలసరం లగ+గగ+లగ+గగ ఈ విధంగా నడుస్తుంది. అంటే ఈ గేయఖండికలో మూడుమాత్రల స్థానంలో అన్నీ 'లగి లే (మాతం-గాలో ఒక మాత్ర అధికంగా పడటం జరిగింది.) నాలుగు మాత్రల స్థానంలో అన్నీ 'గగలే' (ఒక భగణం-పట్టిన) వాడటం జరిగింది. శ్రీశ్రీకి విలోమగణాలంటే ఇష్టం. ఆయన రచించిన గేయాలలో లగం, జగణాన్ని అధికంగా వాడినారు. ముత్యాలసరంలో జగణం వాడలేదు కాని, చతురస్రగతిలో నడిచే గేయాలలో జగణాన్ని అధికంగా వాడినారు. ముత్యాలసరాలలో వీలోమగణాలు వాడి నదక కుంటుపడకుండా, పైగా నడకకు ఉద్ధతి కలిగేటట్లు రచించడం చాలా కష్టం. విశ్వనాధ సత్యనారాయణ "కోకిలమ్మ పెండ్లిలో “లగ ప్రయోగం చేయడం వల్ల కొన్ని చోట్ల నడక కుదరలేదు. శ్రీశ్రీ ముత్యాలసరంలో 'లగ' ప్రయోగాన్ని చాలా ప్రొధంగా వాడినారు. శ్రీశ్రీ పాదాల విరుపులోను, పాదసంఖ్య లోను, పాద ప్రమాణంలోను వినూత్న మార్గం తొక్కి ముత్యాలసరం నడకకు వింతగతులు కలిగించినారు. 'జయఫేరి, “అవతారం” గేయాలలో దాదాపు ఒకేశిల్సాన్ని ప్రదర్శించడం జరిగింది. 'జయఖీిరి' గేయంలో ముత్యాలసరంలోని రెందేసిపాదాలను మూడుపాదాలుగా (మొదటి పాదాన్ని రెండుపాదాలుగా) విభజించి రాయడం చివర క్రియాంతంలో ఒక మాత్ర అధికంగా వాడటం శ్రీశ్రీ చేసిన నవ్యప్రయోగం.

నేను సైతం వ ప్రె+త్తవ=? ప్రపంచాగ్నికి = 4డీ =7 సమిధ నొక్కటి ఆహుతిచ్చానుో* = త+క్ష+9ి+ర్ర= 15

“ఆహు తిచ్చాను-చివరి హ్రస్వంమీద ఒక మాత్రాకాలం ఊపిరి తీసుకొంటే లేదా గురువుగా ఉచ్చరిస్తే 9 మాత్ర లవుతుంది. 'ఆహుతిచ్చాను నాలుగో పాదంగా రాస్తే, అప్పుడు ముత్యాలసరం నాలుగోపాదం అవుతుంది. మిగతా పై మూడు పాదాలు ముత్యాలసరం సగవాదా లవుతాయి.

136 ఆధుదిక యుగారంభం - గేయాదతరణం దీనిని వ్యతిరిక్తంగా

ఎండకాలం మండినప్పుడు ౬ 8+క్త+8+శీ =14

గబ్బిలం వలె = బ్ర+శీ=7

కాగి పోలేదా”* = వ్రైఛిశ్త+2=9 (రెండు మాత్రలు అధికం) రెండు దీర్హపాదాల నడుమ హహ్రస్వపాదం

శీతకాలం కోత వెట్టగ ఇ త్రిఛత్తటారి+డ = 14

కరడు కట్టీ = లైెశడ్తీ=?

అకలేసీ కేక లేశానే * = ప్ర+శ+3+శీ+2=16 రెండు హ్రస్వవాదాలు, ఆ తర్వాత 1% పాదం, మళ్ళీ రెండు హ్రస్వవాదాలు

నేనొకళ్లే

నిల్చిపోతే

చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు

ఖభూమిమీవా

భుగ్న మౌతాయి'

'అవతారం”* గేయంలో కూడా దాదాపు ఇదే సంవిధానాన్ని అనుసరించడం జరిగింది, రెండోపద్ధతిలో చూపినట్లు మొదట్‌ ముత్యాలసరం దిర్హపాదం, తర్వాత రెందు అర్ధపాదాలు (చివరి పాదంలో అధికమాత్ర)-ఇట్లా మూడుఖండాలు, తర్వాత ముత్యాల సరం నాలుగు సమపాదాలను రెండు దిర్హ పాదాలుగా రాసి (ప్రతిపాదం చివర- క్రియాంతంలో-ఒక అధికమాత్ర” ఆ తర్వాత మొదటి పద్ధతిలో చూపినట్లు రెండు అర్ధపాదాలు (ముత్యాలసరం) తర్వాత దీర్హపాదం (+అధికమాత్ర)--ఈ విధంగా మళ్ళీ మూడుఖందాలు. ఈ రకంగా పాదవిభజనలో రకరకాల విరుపులు చూపి ముత్యాల సరానికి కొత్త సొగసు తీసుకొనివచ్చినారు. శ్రీశ్రీయే 'ముత్యాలసరం” వ్యాసంలో రాసినట్లు ఈ రెండు గేయాలలోను పాదనిర్మాణంలో అభిరుచితప్ప విటి దైర్హ్యం నిర్ణయించే మరొక [ప్రమాణం కనిపించటం లేదు. అయితే ఈ పాదాల విరుపులు భావావేశానీకి అనుగుణంగా, బెచితీమంతంగా, లయాత్మకంగా ఉన్నాయి.

'హారతి అనే గేయంలో ఒకచోట శ్రీశ్రీ అబ్బూరి రామకృష్ణారావు “పూజా శిరీషము బేరుకొంటిని...” అనే గదేయఖందంలోని ఛందస్సంవిధానాన్ని అనుసరించినారు.

అధునికౌంధ్ర గేయ కవిత్వం 137 ఈ తామసీ నిశ్ళ్శబ్దహృది మన కిర్వురకు న్వాగతముగా శ్వేత స్మితామృత శిశిర వీచీ శీకరము లొలయించగా* మొదటిపాదం, మూడోపాదం మొదట్లో గురువు అధికంగా ఉన్నది. బేసిపాదాలలో 16 మాత్రలు సరిపాదాలలో 12 మాత్రలు ఉన్నాయి. సరిపాదాలలో 2 మాత్రలు తగ్గి, బేసిపాదాలలో 2 మాత్రలు పెరిగినాయి. బేసిపాదాలలో గురువు 8+4+3+4 మాత్రలునూ, సరిపాదాలలో 3+4+8+ గురువు క్రమంలో నడుస్తుంది. అబ్బూరి రామకృష్ణారావు గేయఖండం, శ్రీశ్రీ గేయఖండం రెండింటిలోను ఉన్న పాదాదిగురువు (ఇదివరలో చెప్పుకొన్నట్లుగా) అతీతకాలంలో వచ్చిన అక్షరంగా భావించి పాడుకోవాలి. రెండో పాదానికి, నాలుగో పాదానికి అంత్యప్రాస ఘటించడం, మొదటి రెండు వాదాద్యక్షరాలకు తర్వాతి రెండు వాదాద్యక్షరాలకు యతి పాటించడం గమనించదగినది. ఈ గేయంలో శ్రీశ్రీ గురువులను అధికంగా వాడి లయకు ఉరవడి కలిగించినారు. అట్లే పాదాద్యక్షరం. పాదాంత్యాక్షరం చాలా వరకు గురువులే వాడినారు. శ్రీశ్రీ బుక్కులు అనే గేయంలో 1% పాదాల ముత్యాలసరాన్ని మూడుపాదాలు (సగపాదాలు)గా రాసి, ఆ తర్వాత రెండు పాదాలను చతురస్రగతిలోను నడిపినారు. ఆ విధంగా మూడుఖండాలవరకు నడిపినారు. ఆ తర్వాత మిగతా గేయమంతా చతురస్రగతిలోనే నడిపినారు. మిశ్ర, చతురస్రగతులు సాహచర్యం నెరిపినాయి. ఈ గేయంలో మిశ్రగతిలో ఉన్న మూడుపాడాలలో నాలుగుమాత్రల గణం అంతటా “గగ నే వాడినారు. కుక్క పిల్లా అగ్గి పుల్లా సబ్బు బిళ్లా హీనంగా చూడకు దేన్నీ కవితా మయమే నోయ్‌ అన్నీ" నిత్యం మనం చూసే మామూలువాటిని ఒక గతిలోను, తాను ప్రతిపాదించదలచు కొన్న విషయాన్ని మరొక గతిలోను రచించడం ఇందులోని విశేషం. మామూలుగా కంటికి కనిపించే వాటిని మామూలుగా చూడవద్దు. భిన్నంగా చూస్తే వాటి లోతు లేమిటో తెలుస్తాయని చెప్పడానికి గతిని మార్చి చెప్పడం జరిగింది. ఇట్లా గతిని మార్చి చెప్పదంవల్ల (ప్రతిపాదిత విషయానికి ఎంతో బలం చేకూరింది. శ్రీశ్రీ ేయరచనా సంవిధానానికి ఇదొక మచ్చుతునక. శ్రీశ్రీ ఇంత శక్తిమంతంగా చెప్పినందువల్లనే ప్రఖ్యాత

138 ఆధునిక యుగారంభం - గదేయానతరణం రచయిత రావిశాస్త్రి తదనంతర కాలంలో 'కుకృపిల్లి, 'అగ్గిపుల్లి, 'సబ్బుబిళ్ళ' మొదలైన వాటిని శీర్షికలుగా చేసుకొని “బుక్కులు అనే పేరుతోనే కధల సంపుటిని ప్రచురించడం జరిగింది. అభ్యుదయ కవులు కూడా సామాన్య విషయాలను కవితా వస్తువులుగా చేసుకోవడానికి ఈ కవిత (ప్రేరణ ఇచ్చి, “బుక్కులు” అనే పేరును సార్ధకం చేసుకొన్నది. శ్రీశ్రీ మాత్రాసంఖ్యా నియమాన్ని (14 మాత్రలు) పాటిస్తూ "పేదలు అనే గేయాన్ని రచించినారు. అయితే అది ముత్యాలసరం కాదు. ముత్వాలసరం నడక వాసనకైనా కనిపించటం లేదు. మూడు, నాలుగు మాత్రలుగా ఆ గేయం ఎక్కడా విరగటం లేదు. అంతేలే పేదల గుండెలు జ 6+4+4= 14 ఆ(శువులే నిండిన కుండలు = 6+4+4ీ=1ే4ీ శృశానమున శశికాంతులలో = 6+4+4=1ే4ీ చలిబారిన వెలిరాబండలు.* = 6డీ 44వ 14 ఇది పై విధంగా విరుగుతుంది. కాని ముత్వాలసరం నడకలా మాత్రం విరగదు. శ్రీత్రీ ముత్యాలసరం ఛందస్సులో అనేక ప్రయోగాలు చేసిన వారిలో ముఖ్యులు. వారి ఛందఃప్రయోగ వైవిధ్యాన్ని కొంత విపులంగా పరిశీలించడం జరిగింది. శ్రీశ్రీ వలెనే అబ్బూరి వరదరాజేశ్వరరావు ముత్యాలసరంలో ప్రయోగవైవిధ్యాన్ని వైచిత్రిని సాధించినారు. * కొన్ని ముఖ్యమైన వాటిని పేర్కొంటాను. స్థిరం లేని మనవెతల చెంత చరిస్తుంది ముందాశ కొంత హరిస్తుంది ప్రస్తుతం కనక పరం మాట ద్వాపరం వెనకే పై గేయంలో పాదానికి 14 మాత్రలున్నా 3+4ఉ క్రమంలో విరగటం లేదు. 6+5+3 [క్రమంలో విరుగుతున్నాయి. నాలుగు పాదాలలోను పాదాదిలోని షణ్మాత్రాపదబంధాలలో “లగ, గల) అక్షరాల కూర్చును, ప్రతి రెండు పాదాలకు అంత్యప్రాసను పాటించడం ఈ ఖండిక ప్రత్యేకత. దీన్ని ఒక ప్రయోగంగానే గుర్తించాలి తప్ప, ముత్వాలసరంగా కాదు. *“అభ్బూరి కవితానంచికు సామిధేని” రచనాకాలం చాలా వళ్ల కీందబో జరిగినా వ్లన్తకాలు వడునగా 299% 9895లలో టబ్రచురితమయ్యాయి. కనుక ఈ నీద్దాంతవ్వానం ద్వుతీయ ముద్రణలో వాటిని వరిళీలించవలనీ వబ్చింది ఈ వరిళీలనకు సామిథేని' వ్లన్తకంలో చేరా వీరక ఉవయోగపదింద.

అధున్రికాంధ్రీ గేయ కవిత్వం 139 మురొక దదావొరణ

దాచుకోని దాచుకోని

ఉన్నదంతా అమ్ముకోని

నల్లఐబజారు పంపకాలు

పెద్దమ్మ సిగ చంపకాలుే

మొదటిపాదం 12 మాత్రలే కాని దాచుకోనీ, దాచుకోనీ అని చదవాలి. అట్లాగే

రెండో పాదం మూడోపాదం, నాలుగోపాదం చివరి అక్షరాన్ని దీరంగానే ఉచ్చరించాలి. మూడోపాదంలో మొదటి అర్ధభాగంలో నాలుగు మాత్రల గణం స్థానంలో జగణం (బజారు) పడినది. ఇది విలోమగణం. (ముత్యాలసరం నడకకు అనుకూలించినది) అట్లాగే నాలుగో పాదారంభంలో 5+2 మాత్రల కూర్పు ఉన్నది. దిన్ని కూడా ఒక (ప్రయోగంగానే భావించాలి. చురొక దయాగం

శీత కాలం తైఛశీ

భయం దేనికి లగ+4ీ

జీవచ్చవం నిళీధానికి -శ+లగు లగ+క

ఊరి వెలుపల

ఆరు బయళ్ల

హోరుమంటూ చీకటి గొంతు

ఈ ఖండికలలో ముత్యాలసరాన్ని త్రిపాదిగా రాయడం జరిగింది. మొదటి రెండు

వొదాలు అర్ధవాదాలు (7 మాత్రలు) మొదటి ఖండం రెండో పాదంలో విలోమగణం “లగి (భయం) పడింది. మూడోపాదారంభంలో సప్తమాత్రాపదబంధం 4+3గా విరుగుతున్నది. రెండోఖండంలో రెండోపాదంలో జగణాన్ని (బయళ్లు మూడోపాదం స్థానంలో నాలుగు మాత్రల పదాన్ని (చీకటి) కూర్చడం జరిగింది. దీనిని కూడా ముత్యాల సరం మీద ప్రయోగంగానే గుర్తించాలి.

గతి తప్పిన జనం సంగతి ఒ... 2+4ఉ+8+4ీ

తల మాసిన తత్త్వ వేత్తల _.. 2+4+3+4

కల రేగిన వెరి కేకల ఒఅ... 2+4+8+4ీ

పద నేస్తం వెనక ఆపదేో =... 2+౬4+3+4

140 ఆధునిక యుగారంభం - దేయానతరణం సాధారణంగా మాత్రల తగ్గింపు చివరి పదంలో ఉంటుంది. కాని పై ఖండంలో అన్ని పాదాలలోనే మొదటనే నియతంగా ఒక మాత్ర తగ్గింపు ఉన్నది. అంతేకాదు పాదం మొదటి రెండు అక్షరాలను పాదం చివరి పదంతో కూర్చడం ఒక వైచిత్రి. (గతి-సంగతి; తల-(వేత్తల; కల-కేకల; పద-ఆపద). ఈగేయ ఖండంలోనే కాదు, తర్వాతి ఐదు ఖండాలలోను ఇదే వైచిత్రిని పాటించడం జరిగింది. ఇవి వరద ప్రయోగ కౌశలానికి మెచ్చుతునకలుగా, మెరుపుకళికలుగా ఉదాహరణ(ప్రాయంగా నిలుస్తాయి. మరొక ట(దయాగం

  1. అజ్ఞాతాన్నీ లీ అనంతాన్నీ
  2. అదినుంచీ అవిరళంగా
  3. _ ధ్యానిస్తున్న పూజిస్తున్న
  4. దరిద్ర దీన హృదయులంతా
  5. భ్రష్ట మతితో దురదృవ్వాన
  6. భావించారు జగతి దుర్గతి
  7. శాసించారు జనతప్రగతిో ఈ గేయ ఖండంలో మొదటి రెండు పాదాలు 4+4, 3+4 క్రమంలో విరుగు తున్నాయి. నాలుగోపాదం 4+8; 4+3 మాత్రల క్రమంలో పదాలు విరుగుతున్నాయి. ఐదోపాదం మొదటి అరద్దభాగంలోను, ఆరోపాదం చివరి అర్ధభాగంలోను ఎలా విరిచీనా జగణం తప్పటం లేదు. దరిద్ర-దీన, దరి-ద్రదీన లగ, జగణం విలోమగణాలు, ముత్యాలసరం నడకలో ఇమడనివి. ఇలాగే ఇమడని గణాలను ఇమిడ్చి గతి వైచిత్రిని సాధించడం వరద ప్రత్యేకత. మరోజడదావొరణ
  8. _ కృతుల్‌ ద్రవించి ఛతీ ల. (స్రవించి సుతుల్‌ శీగార 35, లయం రహించి 8 +4్కీ 4, వహించి భయం ఢ+3
  9. శాపం విరచించిన మాపటీికి శీ+6+5
  10. పాపం విరజిమ్మిన రేపటికి శీ+6+5 ఈ గేయఖండం పక్కన చూపిన మాత్రాక్రమంలో రచితమైంది. గణాల వ్యతృ్యయం తోబాటు మరొక విశేషం ఉన్నది. ప్రాసను కూడా వ్యత్యయరితిలో (ప్రయోగించడం జరిగింది. (కృతుల్‌-సుతుల్‌; ద్రవించి-స్రవించి, లయం-భయం; రహించి-వహించి)

ఆధునికాంధ్ర గేయ కథిత్వం 141 5, 6 పాదాలలో గురులఘువుల క్రమం ఒక్కటే. అంతేకాదు ఆద్యంత్య ప్రాసలను కూడా పాటించడం జరిగింది. (శాపం-పాపం; మాపటికి-రేపటికి) ఉద్దిష్ట ప్రయోగోద్ధ తుడైన వరద ప్రయోగాల వరదకు దీనితో అద్దుకట్ట వేయక తప్పటం లెదు.

చేకూరీ రామారావుగారు రాసిన 'ముత్యాలసరం” వ్యాసంలో ముత్యాలసరం ఛందస్సులో విలోమగణాలైన లగం (మూడుమాత్ర), జగణం నాలుగు మాత్రలు ఇమడవని అన్నారు. అంతేకాదు ముత్యాలసరం వాడిన ప్రసిద్ధ కవులెవ్వరూ (గురజాడ కూడా) నాలుగుమాత్రల స్థానంలో జగణం వాడలేదని అభిప్రాయపడినారు. “' అయితే “లగ ప్రయోగాన్ని రామారావుగారే అంగీకరించినారు. జగణం విషయంలో రామారావుగారి పరిశీలన సరి అయినదే. ముత్వాలసరం 3+4 మాత్రల క్రమంలో విరిగే ఛందస్సు. నాలుగు మాత్రల స్థానంలో జగణం వేస్తే 4, 8గా విభక్తమవుతుంది. జగణంలో మధ్యగురువు ఉంటుంది. కనక ఊనిక ఆ గురువుమీదనే ఉండి గురువుకు పూర్వం ఉన్న లఘువు పూర్వగణంతో చేరి ౩+4కు బదులుగా 4&+3 క్రమం కన్పించి మిశ్రగతికి భంగం వస్తుంది. ఇందుకు ఉదాహరణగా శ్రీశ్రీ రాసిన ముత్యాలసరం వ్యాసంలో ఉదాహరించిన 'మునిమాపు గేయం

ఈక నుసన్న లెవరి-కోసము ఈమ ధుగీతు-లెందు-కొరకో -మనిమావు

మునిమాపు గేయంలో ముత్యాలసరం నడక అవ్యవస్థంగా ఉన్నదని శ్రీశ్రీయే అభిప్రాయపడినారు. దీనికి కారణం శ్రీశ్రీ స్పష్టంగా చెప్పలేదు కాని, నాలుగు మాత్రల స్థానంలో జగణాన్ని వాడటం వల్లనేనని పరిశీలించి చూస్తే తెలుస్తుంది.

డా॥ముకురాల రామారెడ్డి ముత్యాలసరం ఛందస్సును ఆవరిస్తున్న నందనం అనే గేయంలో చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. “ఆవరిస్తున్న నందనం” అనే గేయంలో మొత్తం 60 పాదాలున్నవి. అన్ని పాదాలూ సమపాదాలే. అంటే అన్ని పాదాలలో 14 మాత్రలే వాడటం జరిగింది. పాదవిభజనలో కొంత కొత్తపద్ధతి చూపినారు. నాలుగు పాదాల తర్వాత మరిరెండు పాదాలు వేరుగా రచించడం జరిగింది. ఈ రెండుపాదాలు పల్లవిలాగా కనిపిసాయి. అంటే పల్లవిలాగా మళ్ళీ పాడవలసిన అవసరం లేదు. అయితే ఒకేరకమైన వాక్యనిర్మాణం (పదాలు) అన్నిటా కనిపిస్తుంది. 'ఏతరం నందనమొ ఇది, 'ఎన్నడెండిన నందనమొ ఇది”- ఈవిధంగా ఉంటాయి. ఒకచోట 6 పాదాల తర్వాత రెండు అధికపాదాలు, మరొకటి 8 పాదాల మీద రెండు అధికపాదాలు ఉన్నాయి. మిగతా గేయమంతా నాలుగు పాదాలమీదే రెండు అధికపాదాలు కనిపిసాయి. ఈ గేయంలో కొన్ని చోట్ల ముత్యాలసరం నడకలో భిన్నగతి స్ఫురిస్తుంది. దానికి కారణం

142 అధునిక యుగారంభం - దేయానతరణం 8+4 మాత్రలుగా విరగక వోవడం మాత్రంకాదు. అన్ని పాదాలూ చక్కగా 3, 4 మాత్రలుగా విరుగుతాయి. అంటే మూడోమాటత్ర, నాలుగోమాత్ర, వడోమాత్ర, ఎనిమిదోమాత్ర, పదోమాత్ర పదకొండోమాత్ర కలిసి ఎక్కడా గురువు రాకపోయినా అక్కడక్కడా నడకలో కొద్దిగా ఖీన్నంగా ఉంటుంది. దానికి కారణం మూడు, నాలుగు మాత్రల దగ్గర పదంకాని, పదాంశంకాని విరగకపోవడమే ఉదాహరణకు

కొమ్మ చాటున గుబాళించే

కొత్త తరగతి గులాబులు ఇవి

కాళ్ళు చేతులు వంచనిదె, అతి

కాయులకు అందకుంటునృవి

నందనం ఆవరిస్తునది

నాపరిసరం మురుస్తున్నది”

కింద గీత ఉన్నవోట నడక సాఫీగా లేదు. ఉదాహరణకు 'అందకుంటున్నవి, 'ఆవరిస్తున్నది" అనే మాటలు, “అంద -కుంటున్నవి), “ఆవ-రిస్తున్నది' అని ఈ విధంగా పదాంశంగా విరగకుండా “అం”, *ఆ” ఒక అక్షరం మాత్రమే పూర్వగణంలోకి వెళ్లి; “దకుం-టున్నవి, 'వరి-స్తున్నది (3+4) లాగ ఛందస్సు ప్రకారం చదువు కొంటున్నందు వల్ల నడక వింతగతిని సంతరించుకొన్నది. ముత్యాలసరం ఛందస్సు ఆధునికకవులలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఛందస్సు.

ఎంతో సౌలభ్యాన్ని సంతరించుకొన్న ఛందస్సు. ఇటీవలి కాలంలో దినపత్రికలలో సమకాలిక వారాసంఘటనలను, తాజా రాజకీయ సంఘటనలను వ్యంగ్య పూర్వకంగా వ్యాఖ్యానించడానికి గజ్జెల మల్లారెడ్డి, దేవీప్రియ వంటి వాళ్లు ముత్యాలసరం ఛందస్సును చక్కగా ఉపయోగించుకొంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రజ్యోతి 'చల్‌ తే చల్‌ తే' శీర్షికలో దేవీప్రియ మంత్రి పదవి నుంచి తొలగించబడిన రాజకీయ సంఘటనను వ్యంగ్యపూర్వకంగా వ్యాఖ్యానిస్తూ...

తెల్ల ద్రాక్షలు పుల్ల నాయెను

మంత్రి పదవే చాకి రాయెను

నాటి దైవం దయ్య మాయెను

సేటు మారెనుగా!

రెక్క లొచ్చెను, గాలి వీచెను

ఒక్కసారిగా గోచి జారెను

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 143 పైస్సు చెవిలో పూలు పూచెను వినక తప్పదుగా

అని ముత్యాలసరంలో ప్రస్తుత రాజకీయ స్థితిని ముచ్చటించినారు.

తోక ముత్యాలసరం

వెలుపలి వీరరాఘవస్వామి నాలుగోపాదంలో విశేషం చూపించి, “ముసలమ్మ గారి కార్తీగస్నానం” అనే హాస్యరచనలో తోకముత్వాలసరం అనే ఒక కొత్తరకం వాడుకను తెచ్చినారని శ్రీశ్రీ ముత్యాలసరం వ్యాసంలో తెలిపినారు. ఈ రకమైన ప్రయోగం గురజాడ “కాసులు” అనే గేయంలోనే చేసి ఉన్నాడు. అయితే తోకముత్యాలసరం అని అనలెదు. కవికొండల “కూలియన్నల కుతుకము” అనే గేయంలో తోకముత్యాలసరం పద్ధతి ననుసరించినారు.

మొగములను ముచ్చెమట లూడ్చుచు

మూపులను పెనుమోకు లీడ్చుచు

మడమలెత్తున మన్ను రేచుచు

గుండ్ల పేరూ కులుకు పాటేమో ఏమో

పాలిందబగడపు గుండ్లపేరేమో**"

ఈ గేయంలో నాలుగోపాదం చివర రెండుమాత్రల (గురువు) అధికంగా వేసి, ఏమో అని మరొక అధిక పాదంరాసి, చివరి పాదంలో మొదటా చివరా ఒక గురువు (మొత్తం రెండు గురువులు) అధికంగా వేసినారు. మొదటి గురువునూ, చివరి గురువునూ విడిచి చదివితే ముత్యాలసరం పాదమవుతుంది. ఈ గేయంలో మొదటి మూడుపాదాలకు, తర్వాతి రెండు పాదాలకు అంత్యవ్రాసను కూడా పాటించడం జరిగింది.

1916 సంవత్సరం 'ఆంధ్రపత్రికు ఉగాది సంచికలో రంగాచార్యులు 'అప్పరాయ స్మృతిని గురించి

అప్పరాయ కవీంద్ర చంద్రుం డవని విడినాడా కట్టా అవని విడినాడా** అని తోకముత్వాలసరంలోనే రచించినారు.

న! అధునిక యుగారంభం = గేయడానతరణం గురజాడ అప్పారావు కీరికి నివాళులెత్తుతూ కవులు ఎక్కువగా ముత్యాల సరాలలోనే రచించినారు. అటువంటివాటిలో కృష్ణశాస్త్రి 'గుత్తునా ముత్యాలసరం), సి. నారాయణ రెడ్డి “గురజాడ” గేయం పేర్కొనదగినవి. ఓ కవీ గురజాడా! కవితా శ్రీకి వెల్లులమేద! జాతీ యతకు విచ్చిన పూలదారీ అలత నెరుగని బాటసారీ ఎట్టి మాత్రాచ్చందమున్‌ గొని ఏమిరవ్వలు రాల్సినావో ఎందుకయ్యా బంద్లకొద్దిగ ఎద కదల్బని కావ్యరాసులు? జాతినాడులలోన పారెడు గీతి యొక్కటి చాలదా మరి! ఏనాడు గురజాడ అప్పారావు కలం నుంచి ఈ ముత్యాలసరం జాలువారి, జాతి నాడులలో పారిందో, ఆనాటినుంచి ఈనాటి వరకూ కవులెందరో ఈ ఛందస్సులో అనేక ప్రయోగాలు చేయడమే కాకుండా ఆధునిక కవితా వస్తువుకు వాహికగా వాడుకున్నారు. ముత్యాలసరమంటే మూడు నాలుగు మాత్రలకు విరుగుతూ, 14 మాత్రలవి మూడుపాదాలూ, 9 మాత్రల (3+4+గురువు) హ్రస్వపాదంతో నడిచే గేయంగా ఆధునిక కవితాప్రపంచంలో స్థిరపడింది. ముత్యాలసరం గేయంతో ఆధునిక గేయకవిత ఆరంభమైంది కాబట్టి ఈ ఛందస్సులో గురజాడ అప్పారావు మొదలుకొని ఈనాటి వరకు కవులు చూపిన ప్రయోగవైచిత్రిని ఈ అధ్యాయంలో విపులంగా పరిశీలించి చూపడం జరిగింది. తరవాతి అధ్యాయంలో భావకవితాయుగంలో గేయరచనల గురించి వివరిస్తాను. వాల మ్త్తుము. యేస;

(4. భావకవిత్వయుగం - శేయరవినలు భావకవిత్వ యుగం ననన ననననననననని ఆధునికాంధ్ర కవిత్వంలో (ప్రధానంగా రెండే రెండు భాం ఉద్యమాలు కనిపిస్తాయి. (1) భావకవిత్వం (2) అభ్యుదయ ప్రాణభూతం కవిత్వం. మిగతా అప్రధాన ఉద్యమాలన్నీ భావకవిత్వంలోనో, వంటిది అభ్యుదయ కవిత్వంలోనో అంతర్భవిస్తాయి. అభ్యుదయ న కవిత్వం తర్వాత వచ్చిన ఉద్యమాలలో వచన కవిత్వం, విప్లవ కవిత్వం ్రధానమైనవే. అయితే 'వచన కవిత్వం” భావకవిత్వం అనే పేరు రూపభేదాన్ని తిలుపుతుంది. కాని, తత్పతః ఈ కధాసన్నివేశ అభ్యుదయ కవిత్వానికి భిన్నమైనదేమీ కాదు. అట్లాగే విప్లవ రహితం కవిత్వం కూడా అభ్యుదయాన్ని ఆకాంక్షించే కవితే కాని * 3 ఓ తద్భిన్నమైనదేమీ కాదు. భావకవిత్వం సుమారు మూడు వెవరు? దశాబ్దాల పాటు (1910 నుంచి 1940 వరకు) తెలుగు ఏీం జరిగింది? కవితా సీమలో తిరుగులేని అధికారం చెలాయించింది. అనేక ఎందుకు? నూతన కవితారీతులకు గవాక్షాలు తీసింది. ఇత్వాది ప్రశ్నలకు తెలుగు కవిత్వంలో గురజాడ అప్పారావుగారు సమాధానాలు తీసుకొని వచ్చిన ఆధునికత, రాయ్రోలు సుబ్బారావుగారు దొరకవు. ననా

146 భావకవిర్వయురం - గదేయరచన్రలు ఆరంభించిన భావకవితారీతి ఇంచుమించు రెండూ ఒక్కసారే వచ్చాయని చెవ్వాలి. భావకవిత్వం ఆధునిక కవిత్వంలో ఒక నవ్యకవితా రీతికి ఒరవడి పెట్టింది. ఖావకవితా స్వభావం

భావ కవిత్వమనే పేరు భావ కవితా రీతి స్టిరపడిన తరువాత ఎర్చడినది. భావకవితా యుగారంభకుడైన రాయప్రోలువారి కావ్యాలలోనే మొదటిసారిగా 'భావపదము*”'అనే మాట కనిపిస్తుంది. తర్వాత కవులెందరో “భావగీతం” అనే పదాన్ని ఉపయోగించడం మొదలుపెట్టినారు. ఆ రోజుల్లో “భావకవిత్వం” అనే కొత్త పేరుపట్లా, కొత్త కవితారీతిపట్లా అనేక విమర్శలు చెలరేగినాయి. “భావం లేకుండా కవిత్వం ఉంటుందా! మరి భావ కవిత్వమనే కొత్త పేరేమిటి?” అని ప్రశ్నించిన వాళ్ళు అనేకులు. దానికి సమాధానంగా భావకవులు “భావకవిత్వం” అనే పదాన్ని అదే పనిగా వాడటం మొదలుపెట్టడమె కాకుండా, ఉధృతంగా రచనలు చేసినారు. దానితో ఆధునిక కవిత్వంలో భావకవితారీతి స్టిరపడి పోయింది. భావకవిత్వాన్ని అనేకులు అనేక విధాలుగా నిర్వచించినారు. వాటిలో ముఖ్యమైన వాటీని పరిశీలిస్తే భావకవితా స్వరూపం కొంత వరకు బోధపడుతుంది. భావకవిత్వానికి ప్రతినిధి అయిన కృష్ణశాస్త్రి భావకవితా స్వరూవాన్ని “ఎదియొ అపూర్వ మధురరక్తి స్ఫురియించుగాని అర్ధమ్ముకాని భావగీతమ్ములవి”* అని కవితామయంగానే వివరించినారు. విశ్వనాధ సత్యనారాయణ భావకవితా స్వరూపం వివరించడానికి రచించిన 'ఆతిధ్యము” అనే నాటకంలో 'భావకవిత్వ మనేది అర్ధమయ్యే విషయం కాదు. హృదయానికి అవగతమయ్యె విషయం. నీ హృదయంలో ఏదో తారాడుతుంది. అది బాధగా ఉంటుంది. ఆ బాధలో ఒక సుఖం ఉంటుంది. జీవుణ్ణి అలా కదిలిస్తుంది. ఇదమిత్సమని మనం చెప్పలేంది. అదే భావకవిత్వమంటే”* అని ఒక పాత్రచేత పలికించి నారు. ఇది భావకవిత్వానికి నిర్వచనం కాకపోయినా కొంతవరకు భావకవితా స్వరూపాన్ని అవగతం చేసుకోవడానికి తోడ్పడుతుంది. సరిగా ఇటువంటి భావాన్నె విశ్వనాధ మరో సందర్భంలో నిర్వచనంగా ప్రవచించినారు. “కవియొక్క అవిన్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపం, ఒక చిన్న కావ్యంలో ఊదబడునుగే బాధ భావకవిత్వానికి పర్యాయపదమైంది. భావకవిత్వానికి కొందరు ప్రముఖులిచ్చిన నిర్వచనాలను పరిశీలిస్తే భావకవితా స్వరూపం కొంత వరకు అవగతమవుతుంది. మొదట భావకవిత్వ యుగారంభ కుదైన రాయప్రోలు అభిప్రాయాన్ని ఉటంకిస్తాను. ఆనందోపాసన కావించువాడే భావకవి. ఆ కవి యొక్క స్వీయభావమే ప్రధానంగా గలది భావకవిత. భావమనగా కవి అభిప్రాయము. 'భావయతి, బోధయతి, కవేరభిప్రాయ మితిభావఃణి అని గురుబాల ప్రబోధిక...వస్తు సంవరణమునందు భావకవికి తన స్వానుభవమే యధికరణము”"

ఆధుభ్రికాంధ్ర గేయ కవిత్వం 147 భావకవిత్వానికి లక్షణబద్ధమైన నిర్వచనాలివ్వడానికి ప్రయత్నించిన వారిలో పంచాగ్నుల ఆదినారాయణశాస్తి, విశ్వనాధ సత్యనారాయణ గణనీయులు. పూర్వాంధ్ర కావ్యాలలో కధ ఉన్నది కాబట్టి వాటిలో సమ(గ్ర రసపోషణకు వీలున్నదని, ఖందడావ్యాలలో కథ లేకపోవడం వల్లు లేదా అల్పంగా ఉండటంవల్ల '5సాంగములగు విభావానుభావాదులు సమగ్రంగా గ్రహించడానికి “వీలులేదని ఏదో ఒక భావాన్ని ఆధారము చేసికొని అల్పావ కాశంలో పూర్ణంగా రససిద్ధిని చేకూర్చేయత్నం" నవ్వులు చేస్తారని పంచాగ్నులవారు అభి[పప్రాయపడినారు.

“కావ్యములు రస(ప్రధానములు, ఖండకావ్యములు భావప్రధానములు. కావ్యములందు ప్రతి పద్యమునందు భావముండవచ్చును, కాని కావ్యము సమష్టి మీద రనాభిముఖముగా వోవును. ఖండ కావ్యములందును భావములు రసవ్యంజకములు కావచ్చును. కాని ఖండ కావ్యములు ప్రధానంగా ఒక భావమును ఆశ్రయించియే యుండును, అందుచేత దీనిని భావకవిత్వము అనవచ్చును.” అని విశ్వనాధ నిర్వచించి నాడు. పంచాగ్నుల, విశ్వనాధల నిర్వచనాలు రెండూ ఇంచుమించు ఒకదానితో ఒకటి సంవదిసాయి.

పూర్వాంధ్ర కావ్యాలస్నీ కధాసహితాలే. ముక్తక రచనలవంటి చాటువులు, శతకాలు మాత్రమే కధారహితాలు. అందుకే వాటిలో-ముఖ్యంగా శతకాలలో కొంతవరకు భావకవితాచ్చాయలు కనిపిస్తాయి. కాళిదాసు రచించిన మేఘసందేశంలో కూదా భావకవిత్వం ఛాయామాత్రంగా కనిపిస్తుంది. మేఘసందేశంలో కధావస్తువు అల్పంగా ఉన్నప్పటికీ యక్షునిలో కాళిదాసు కవితావాణి వినిపిస్తుంది. మబ్బుతున్మను మాటలను మోసుకొని పోయే చైతన్యమూర్తిగా భావించి మనసు విప్పుకోవడంలో కాల్చనిక దృష్టి (గంగ౧౧౬౧|16 164) ఉన్నది. కాల్చ్బనికత భావకవిత్వానికి ప్రాణభూతం వంటిది. కధ అల్బంగా ఉన్న మేఘసందేశంలోను, కధ అసలే లేని శతకాలలోను భావకవిత్వం కొంతవరకు ఉందని చెప్పడం వల్ల ప్రాచీన కవిత్వమంతా భావరహితమైనదని మాత్రం కాదు. ప్రాచీన కావ్యాలలో ఏదో కొంత కథ ఉంది, ఏదో ఒక రసం అంగిగా ఉంటుంది. భావానికి స్వతంత్ర అస్తిత్వం ఉండదు. అది రసపోషణలో భాగంగా ఉంటుంది. భావకవిత్వం రసవ్యంజకం కావచ్చునేమో కాని, రససిద్ధిని మాత్రం కలిగించదు. వెల్చేరు నారాయణరావుగారన్నట్లు “భావకవిత్వం కధా సన్నివేశ రహిత మైందసీ, ఇందులో “ఎవరు?” “ఏం జరిగింది” “ఎందుకు”? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు దొరకవనీ, భావం [గ్రహించాలనీ చెప్పడానికి ఏర్పడిన పేరిదిో* భావకవిత్వంలో స్వీయ సుఖదుఃఖానుభూతులు చోటుచేసుకొన్నాయి. అందువల్ల భావకవికి కధ అక్కర లేక

1జేర్రీ భానకవిర్వయురం - దేయరచద్రలు పోయింది. తన వ్యధలే కవితలుగా పాడుకొన్నాడు. భావకవిత్వంలో అనుభూతి వస్తువు కావడంతో కథ కంచికి వెళ్లింది. కథ కంచికి వెళ్ళడం కొంత మంచికే అయింది. అచ్చమైన కవిత్వాన్ని వడకట్టడం జరిగింది. కృష్ణశా(్రిగారన్నట్లుగా “ఉత్తమమైన ఆత్మపరమైన కావ్యంలో ఉన్నంత కవిత్వలావణ్యము మరొక కావ్యంలో ఉండదు. ఊపినచోట అది ఊపినంత మరొకటి ఊపదు.” కధాస్టానాన్ని వచన (ప్రక్రియలైన నవల, కధానిక గ్రహించడంతో ఆధునిక కవిత్వం కథారహితమైనది.

ఖావకవిత్వం ప్రబంధ కవిత్వంపై తిరుగుబాటుగా వచ్చింది. ప్రబంధ కవి అల్పమైన కథను తీసుకొని వర్ణనా బాహుళ్య్ళంతో, అలంకార భావంతో కావ్యనిర్మాణం చేస్తే భావకవి కథను పరిత్యజించి, తన అనుభూతినే కవితగా అల్లినాడు. అనుభూతి కావ్యవస్తువు కావడం వల్ల కావ్య స్వరూపంలో ముఖ్యమైన మార్పు వచ్చింది. అదే ఖండకావ్యం. భావకవికి “తన అనుభూతిని మించిన సత్యమూ, తన అంతరంగానికి మించిన ప్రపంచమూ లేకపోవడం వల్లా, భావకవిత్వంలో కవి ఆత్మవ్యక్తికి అపారమైన ప్రాధాన్యం వస్తుందని”” వెల్చేరు నారాయణరావు తమ సిద్ధాంత వ్యాసంలో అభిప్రాయ పడినారు. అయితే అనుభూతికి అంతరంగం ప్రమాణంగాని, సమాజం కాదు. 'ఆత్మాశయత ప్రధానమైన భావకవితా వస్తువుకైనా (శోత సమాజమే! ఏ కావ్యంలోనైనా రసానికి బీజస్థితి నుంచి స్థాయివరకు ఒక పాత్రే ఆలంబం అవుతుంది. శ్రోతలు లేదా పాఠకులు రససిద్ధిని పొందుతున్నారు. భావకవిత్వంలో పాత్ర 'కవి, (శశోత సమాజం. సమాజరహితమైన ఆత్మ వ్యక్తి “నేను” భావకవిత్వానికంతటికీ ఆలంబనం.కనక భావకవిత్వం ప్రధానంగా ఆత్నాశయకవిత్వం. భావకవి దేనినైనా తన దృష్టితో తానుగా అనుభూతి చెందుతాడు. తన అభి'ప్రాయాలనే ఆరోపిస్తాడు. విద్వాన్‌ విశ్వం భావకవిత్వాన్ని గురించి రాస్తూ రవీంద్రుని అభిప్రాయాన్ని ఉదాహరించిే దాని మీద వ్యాఖ్యానిస్తూ “కవిత తనకు జనానికి మధ్య భావవాహికగా కాక, అది తన హృదయాన్ని తనకే వినిపించే జిహ్వికగా చేసుకొన్న ఈ రకం కవి, తనలో తాను కూరుకొనిపోయి, జన భావాలకు దూరమైనాడు.”” అని అభిప్రాయపదినాడు.

వర్ణన ప్రాధాన్యమున్న ప్రబంధాలలో పదబంధాలు కొన్ని భావాలను వెలువరించే పడికట్టు మాటలయినాయి. అవే వర్ణనలు, అవే అలంకారాలు, అవే కవి సమయాలలో ప్రబంధాలలో పరిమితమైన భావసంపదను మాత్రమే చూస్తాము. భావకవిత్వంలో అనుభూతి ప్రాధాన్యం వహించడంవల్ల కోకొల్లలుగా కొత్తకొత్త పదబంధాలు క్రాొమ్మెరుంగులు చిమ్మినాయి. మాటలకు అర్జాలేకాక రంగూ రుచీ వాసన కూడా పట్టించి నారు భావకవులు. పదాలకు కొత్త అర్ధచ్భాయలు కలగడంతో భావకవిత్వంలో కొంత

ఆధునికాంధ్ర ేయ కవిత్వం 149 అస్పష్టత అనివార్యమైంది. అందుకే భావకవిత్వంలో 'పులుముడు' ఎక్కువ అని అక్కిరాజు ఉమాకాంతంవంటి పండితులు అధిక్షపించవలసివచ్చింది. ప్రబంధకవులు దీర్షసమాస చాలనంతో ఒకరిని మించి మరొకరు ప్రౌాధంగా సుదీర్హ వర్ణనలు చేస్తే భావకఠకవులు ఒకరిని మించి మరొకరు సుతిమెత్తని, మృదుమధురమైన పదబంధాలతో సుకుమారమైన, రమణీయమైన భావాలకు చిత్రికలు పెట్టినారు.

భావకవిత్వం ప్రధానలక్షణం అంతర్ముఖత్వం. సుకుమారత, రమ్యత, కూర్చు భావకవిత్వం ప్రధాన గుణాలు. కవిత్వం మారినప్పుడు రచనా సూత్రాలు మారతాయి. ఐ కవిత్వాన్నయినా వస్తువు, కవి, కావ్యం, పారకులు ఈ నాలుగు అంశాల దృష్ట్వా చూడవలసి ఉంటుంది. అధునిక కవిత్వంలో భావకవిత్వం పొందిన అపప్రచారం మరే కవితాశాఖా పొందలేదు. అక్కిరాజు ఉమాకాంతంగారు నేటి కాలపు కవిత్వం అనే (గ్రంధంలో భావకవిత్వాన్ని తూర్వ్పారపట్టనారు. అనంతపంతుల రామలింగన్వామిగారు భావకవిత్వాన్ని అధిక్షేపిస్తూ 'శుక్షపక్షము” అనే హేళన కావ్యాన్ని రచించినారు. వీరందరూ భావకవిత్వాన్ని సంప్రదాయకవిత్వాన్ని చూసిన దృష్టితోనే, ప్రాబినాలంకారిక (విమర్శ) ప్రమాణాలతోనే చూడటం వల్ల భావకవిత్వం అర్ధం కాకుండా పోయింది. ఆధునిక కవిత్వాన్ని విమర్శించడానికి ఆధునిక మార్తాలను అనుసరించినప్పుదే ఆధునిక కవిత్వం అవగాహన అవుతుంది. ఆనాటి విమర్శకులలో చాలా మందికి ఈ దృష్టి కొరవడినందు వల్లనే భావకవిత్వం “బావ కవిత్వం” అని అభాసుపాలయింది. కాల్పనిక కవిత్వం (గింగా2౧౪6 ౧౦౭€)౧

భావకవిత్వం మీద ఇంగ్లీషు కాల్సనిక కవి త్వం ప్రభావమున్నది. ఇంగ్లీషు కవిత్వంలో కాల్చనిక కవిత్వం పందొమ్మిదో శతాబ్ది ఆరంభంలో వచ్చింది. ఇరవయ్యో శతాబ్లి ఆరంభంలో భారతీయ భాషలన్నిటిమీదా ఇంగ్లీషు కాల్పనిక కవిత్వం ప్రభావం పడింది. స్థూలంగా తెలుగులో కాల్చనిక కవిత్వం ప్రభావంవల్ల వెలసిన కవిత్వాన్ని భావకవిత్వం” అని చెప్పవచ్చు. ఇంగ్రీషు కాల్పనిక కవిత్వంలోను, తెలుగు భావకవిత్వం లోను ఇంచుమించు ఒకే రకమైన కవితాశాఖలున్నాయి. అయితే దేశకాల పరిస్థితుల నను సరించి ఒకటి, రెండు శాఖలు ఎక్కువగానో, తక్కువగానో ఉంటే ఉండవచ్చు. కాల్పనిక కవిత్వంలో ప్రధాన గుణాలు

  1. ప్రకృతి ప్రీతి 2) గతవైభవ పునరుద్ధరణ 3) ప్రణయతత్త్వం 4) ఆత్మాశయత్వం
  2. అద్భుతత్వం 6) సాహస ప్రియత్వం” ఈ గుణాలన్నీ ఖావకవిత్వంలో కూడా కనిపిసాయి.

150 భాడకవిత్వయుడ్‌ం - దేయరదనలు ఖావకవిత్వంలో ప్రధాన శాఖలు

  1. ప్రకృతి కవిత్వం 2) ప్రణయ కవిత్వం 3) భక్తి కవిత్వం 4) దేశభక్తి కవిత్వం ర) సంఘ సంస్మరణ కవిత్వం 6) స్మ బ్రతి కావ్యాలు*

ఈ ప్రక్రియలన్నీ కాల్పనిక కవిత్వ ప్రభావమున్నవి కావు. వీటిలో ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, స్మృతి కావ్యాలు కాల్పనిక కవిత్వ ప్రభావమున్నవే. దేశభక్తి కవిత్వం ఆనాటి జాతీయోద్యమంవల్ల వెల్లివిరిసిన కవిత్వమే. అయితే కాల్పనిక కవిత్వంలో ప్రధాన గుణాలలో ఒకటైన గత వైభవ పునరుద్ధరణ (౧6/41 016 ౧౭90 దేశభక్తి కవిత్వంలో అంతర్గతంగా కనిపిస్తుంది. ప్రాచీన భారతీయ వైభవాన్సీ ప్రస్తుత దుస్టితినీ భావకవులు కళ్ళకు కట్టించి స్వాతంత్రేచ్చను రగుల్మొల్పినారు. సంఘ సంస్కరణ కవిత్వం కూడా సాంఘిక స్థితిగతులను బట్టి ఉద్భవించినదే. భక్తికవిత్వం పూర్తిగా భారతీయమైనదే. భక్తికవిత్వం మీద సాంప్రదాయిక ముద్ర కొంత, రవీంద్రుని ప్రభావం కొంత, బ్రహ్మ సమాజం ప్రభావం కొంత ఉన్నదని చెవ్వాలి. మొత్తం మీద భావకవిత్వం, కాల్పనిక కవిత్వం-ఈ రెండింటి గుణాలు బింబప్రతిబింబ భావమున్నవే. ఆత్మాశయత్వం ఈ రెండింటికీ ప్రధానమైన గుణం. ఆత్నాశయ కవిత్వాన్ని ఇంగ్లీషులో 560)601/6 ౧౦6౪౧/ అని అంటారు. 50060176 గం6[0/ /1౦2| ౧౦6౭(౧/కి పర్యాయపదం. ఎన్‌ సైక్లో పీడియా బ్రటానికా ఓగగ౦౫| గ౦ఈళా/ ని ఈ విధంగా నిర్వచిస్తున్నది.

౧6 6/౧౦ ౧౭౩ 06 10౧౦1100 ౪ 18౪68410, 1౧ 16/౧౧ ౦0 ౧౮/6 2గ 16 51665 01 1౧౧6 [116 19 ౧౦౧౪౩, 15 12015110 10/5, 15 807గ0౪/5, 1 6616౧. *

కవి తన మనస్సులో సుఖదుఃఖాలను, విభిన్న కాంక్షలను 'లిరికొ ద్వారా వ్యక్తం చేస్తాడని పై నిర్వచన సారాంశం. లిరిక్‌ (4/౧౦) అంటే లైర్‌ (6/8) అనే జంత్రవాద్యం వాయిస్తూ పాడేగీతం కనుక ఓ/104[౯౦౪[౧/ లో ఆల్మీయాంశతోపాటు గానాంశం కూదా ఉన్నది. కవి తన అనుభూతులను పాట రూపంలో ప్రకటించడమే '/౧౦4| ౧౦౭1౧/ అని పిండితార్ధం. భావకవిత్వాన్ని 1/10 ౧౦6[౧/ కి సమానార్దకంగా విమర్శకులు వాడుతున్నారు. భావకవులు తమ అనుభూతులను ఎక్కువగా మాత్రాఛందస్సులలోనే వ్యక్తీకరించినారు. పద్య ఛందస్సులలో ఎక్కువగా గీతపద్యాల్లో, ద్విపదలో రచించినారు. అవి కూడా పాటలాగా రెక్కలు విప్పుకొని భావకవితా విహాయసంలో విహరిస్తాయి. కనక భావకవిత్వానికి పర్యాయపదంగా “భావగీతం” అనే పదాన్ని తరచుగా వాడినారు. 16 గురజాడ అవ్వ్పారావు గేయరూపంలో ఆధునికతను, వాస్తవికతను ప్రవేశపెట్టి కవిత్వాన్ని సమాజానికి దగ్గరగా తీసుకొని వస్తే, భావకవిత్వంలో సమాజరహితమైన 'నేను, ప్రాధాన్యం వహించడంవల్ల, భావకవులు గేయంలోను, పద్యంలోను తమ వైయక్తికానుభూతులను,

ఆధునికాంధ్ర గేయ కవిత్వం [151 వైయక్తిక వైఫల్యాలను పాడుకొన్నారు. గురజాడ కవిత్వాన్ని పద్యం నుంచి గేయానికి మలుపు తిప్పితే, భావకవులు పద్యాన్ని కాదనకపోయినా, గేయాన్నే ఎక్కువగా తమ అనుభూతికి వాహికగా చేసుకొన్నారు. భావకవితాయుగంలో గేయరూపంలో అదివరకె న్నడూ లేనంతగా ఉత్తమ కవితా విలువలను పోషించడం జరిగింది. భావకవిత్వయుగా రంభకుడైన రాయప్రోలు సుబ్బారావును గురించి కొంత చెప్పుకొని, భావకవిత్వ యుగంలో వెలువడిన గేయరచనలు గురించి విశదీకరించడం జరుగుతుంది. రాయప్రోలు సుబ్బారావు భావకవిత్వయుగానికి రాయప్రోలు సుబ్బారావు (ప్రధమాచార్యులు. భావకవులు ఛందస్సులో గురజాడను, కవితారీతిలో రాయప్రోలును అనుసరించినారు. కాని రాయ(్రోలు సుబ్బారావు ప్రధానంగా పద్యకవులే. వారి ప్రసిద్ధ కావ్యాలైన స్నేహలత, స్వప్పకుమారము, తృణకంకణము మొదలైనవన్నీ పద్యాలలోనే ఉన్నాయి. “జదకుచ్చులు,, “ఆం(ధ్రావళి “వనమాల” మొదలైన కవితా సంపుటులలో కొన్ని గేయ ఖండదికలున్నాయి. రాయప్రోలు 1910 లోనే 'చిల్మ, ఈ గీతము అనే గేయాలు రచించినారు. ఈ విధంగా రాయ(్రోలు కవిత్వంలోనేకాక, గేయరచనలో కూడ గురజాదతో పాటు ఆరంభకులైనారు. రాయప్రోలు భావకవిత్వయుగానికి ఆరంభకుడు-కాబట్టి ఆయన గేయరచనలు తక్కువైనా-ఆయన కవితా తత్వాన్ని గురించి రేఖామాత్రంగానైనా చెప్పుకోవలసి ఉంటుంది. గురజాడ వాడుక భాషను, గేయరూపాన్ని ఆధునిక కవిత్వంలో వినియోగించు కుంటే, రాయప్రోలు పద్య ఛందస్సుపట్ల, గ్రాంధిక భాషపట్ల మొగ్గు చూపినారు. గురజాడ అప్పారావు కంటె రాయప్రోలు సుబ్బారావుకే కవిత్వంలో అనుయాయులు ఎక్కువ. దానికి కారణం రాయప్రోలు సుబ్బారావు తమ కావ్యాలలో (వ్రాబంధికభాషను కొనసాగించడమేనని విమర్శకులు అభిప్రాయపడినారు. దేశికవితా సంప్రదాయాన్ని వదిలి మార్దకవితా పధాన్ని పట్టన పూర్వాంధ్ర కవులవలెనే, ఆధునిక కవులు కూడదా గురజాడ నెలకొల్పిన దెశిమార్గాన్ని వదిలి, రాయహ్రోలు మార్గకవితామారాన్ని అనుసరించి నారు. రాయటవ్రోలు కవిత్వానికి “ఆంధ్రత్వము, భారతీయత అనే భావతాదాత్యం, భావావేశం ఊపిరిలూదింది. అత్మీయానుభూతులకు ఆవేశాలకు ప్రాధాన్యమిచ్చిన భావ కవులకు రాయనవ్రోలు ఆరాధ్యుడయినాడు. రాయహ్రోలు సంభోగశ్చ్ళంగారానికంటె, వియోగశ్చంగారానికే అత్యధిక ప్రాధాన్య మిచ్చి తెలుగు కవిత్వంలో వినూత్నమైన, ఆరోగ్యకరమైన మార్చును తీసుకొని వచ్చినాడు. ప్రబంధకవులు స్త్రీని సంభోగవస్తువుగా పరిగణిస్తే, రాయప్రోలు భావకవులకు స్రీని

152 భావకవిర్వయుర్‌ం - గదేయరచన్రలు ఆరాధ్యగా చేసినారు. “అమలిన శృంగారి మనే నూతన సిద్దాంతాన్ని ప్రతిస్టించినారు. “అమలిన శృంగారతత్తం'* మీద గి|ఇ10౧10 10౪6 ప్రభావమున్నది. స్తీని తల్లిగానో, దేవతగానో ఆరాధించడం రాయహప్రోలుతోనే మొదలైంది. రాయప్రోలు సుబ్బారావు ఇంగ్లీషు కాల్పనిక కవిత్వాన్ని వంగదేశపు వైష్ణవ గీతాలను, రవీంద్రుని కవితా తత్త్వాన్ని ఆకళించుకొని తెలుగులో నూతన కవిత్వానికి బాటవేసినాడు. లఘు కావ్యరచనకు, ఖండికారచనకు, అమలిన శృంగారతత్స్వానికి పాదులువసి, భావకవిత్వాన్ని మూడుపూవు లారు కాయలుగా పండించిన మాలి. రాయప్రోలు సుబ్బారావు వలెనే ప్రధానంగా పద్యకవిత్వాన్నే రచించిన భావకవులు కొందరున్నారు. అటువంటి వారిలో నాయని సుబ్బారావు, జాషువా, వేదుల సత్యనారాయణ శాస్త్రి, (దీపావళిలో కొన్ని గేయఖండికలున్నాయి), తుమ్మల సీతారామ మూర్తి చౌదరి మొదలైనవారు ముఖ్యులు. అట్లాగే పూర్తిగా గేయరచనలే చేసిన కవులలో నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు (కొన్ని గీతపద్యాలు రాసినారు) అడవి బాపిరాజు మొదలైనవారు ముఖ్యులు. మిగతావారు గేయాన్ని పద్యాన్ని సమానంగా ఆదరించినారు. గేయ రూపంలో వచ్చిన భావకవిత్వమే ప్రస్తుత సిద్దాంత వ్యాసపరిధిలోకి వస్తుంది కాబట్టీ పద్యరచనలు చేసిన భావకవులుగాని, పద్యంలో ఉన్న భావకవిత్వాన్ని గాని పరిశీలనలోకి తీసుకోలేదు. ఖావకవిత్వయుగం - గేయరచనల విభజన భావకవిత్వయుగంలో వచ్చిన గేయరచనలను కొంతవరకు వస్తువును బట్టి, మరి కొంతవరకు ప్రక్రియను బట్టీ ఈ కింది విధంగా విభజించడం జరిగింది.

  1. _గేయకావ్యాలు లేదా కథాత్మక గేయాలు 2, ప్రణయ గేయాలు తె, ప్రకృతి గేయాలు లేదా గోపగేయాలు (౧231012! 1౪/౧౦5) క దేశభక్తి గేయాలు 5, సాంఘిక గేయాలు
  2. _భక్తిగేయాలు లేదా మార్చిక గేయాలు (14/50 [/109) ౧ స్మ ్రతిగేయాలు (౬160185) 8, గేయనాటికలు
  3. బాలగేయాలు

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 153 గేయకావ్యాలు-కథాత్మక గేయాలు

భావకవిత్వయుగంలో గేయం కావ్యరచనకు ఉపయోగపడింది. దీనికి మార్గ దర్శకులు గురజాడ అప్పారావుగారే. గురజాడ మొట్టమొదటిసారిగా గేయాన్ని కధాకధనం కోసం వాడినారు. 'లవణరాజు కలి, “పూర్ణమ్మ కధి, *డామన్‌ పితియస్‌, 'కన్యకః వంటి కధలను మాత్రాఛందస్సులో రచించడం అపూర్వప్రయోగం. అంతకు పూర్వం మాత్రా ఛందస్సు పదకవిత్వానికి ఉపయోగపడింది. కధాకధనం కోసం కాదు. కాని గురజాడ స్వీకరించిన కధల పరిమాణం చాలా చిన్నది. సమగ్రమైన రసపోషణకోసం ఆ కధలు చాలవు. గురజాడ రచించిన 'లవణరాజు కలి, 'కన్యకి మొదలైన వాటిని గేయ కావ్యాలనడం కంటె గేయ కథలనడం మంచిది.

భావకవిత్వ యుగంలోనే గేయకావ్య నిర్మాణం జరిగింది. ఎంకిపాటలు, శశికళ, కిన్నెరసాని పాటలు వంటి ఉత్తమ గేయ కావ్యాలు వచ్చినాయి. ఎంకి పాటలలోను, శశికళలోను కథ లేకపోయినా పాత్ర సృష్టి ఉన్నది. ఎంకి పాటలలో నాయికా నాయకు లున్నారు. శశికళలో అజ్ఞాత నాయకుడు (కవి) ఉన్నాడు. నాయిక శశికళ పాటలన్నీ వేటికవి విడివిడిగా ఉన్నా సమష్టిగా అవి ఏకవస్తువు నాశ్రయించినాయి. ప్రాచీన అలంకార శాస్త్రాలు కావ్యానికిచ్చిన నిర్వచనం వీటికి పట్టకపోయినా వస్తుస్పర్భ ఉన్నది కాబట్టి వీటిని కావ్యాలుగానే పరిగణించాలి. ఎంకి, శశికళ, కిన్నెరసాని ముగ్గురూ ఆయా భావకవుల ఊహా(ప్రయసులే, ఊహా ప్రయసులను సృష్టించుకోవడం భావకవుల ప్రథమ కర్తవ్యమైంది. కొందరి ఊహాప్రేయసులకు నిజజీవితంలో ఉనికి ఉండవచ్చు. మరి కొందరు కలలన్నీ కలబోసి, సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒకచోట మూర్తిగట్టంచి సృష్టించు కొన్న వారై ఉండవచ్చు. భావకవితాయుగంలో ప్రేయసిని సృష్టించుకోని, ఆ (ప్రేయసి మీద కనీసం ఒక్క గీతమైనా రాయని భావకవి లేదని చెప్పాలి. కొందరు భావకవులు తమ (ప్రేయసిని ఒకటి, రెండు గేయసుమాలతో అర్చిస్తే, మరి కొందరు కావ్వాలే అల్లి సమర్పించినారు. తాము సృష్టించుకొన్న ఊహా(ప్రయసులకు “ఎంకి, “శశికళ ఇత్యాది పేర్లు పెట్టి తమ గుండెనే గుడిగా చేసి జీవితమంతా ఆరాధించినారు, అన్వేషించినారు.

భావకవితాయుగంలో వచ్చిన గేయకావ్యాలలో ప్రధానంగా ప్రణయమే ఇతి వృత్తంగా ఉన్నది. వస్తువు దృష్ప్వా ఈ గేయకావ్యాలను ప్రణయగేయాలలోనే చేర్చవచ్చు. కాని ప్రక్రియ దృమ్వా వీటిని ప్రత్యేకించి పేర్కొనడం జరిగింది. భావకవిత్వయుగంలో కధాకావ్యాలు చాలా తక్కువ. ఖండికా రచనే ఎక్కువ కనక ఉన్న కొద్ది గేయకావ్యాలను ప్రత్యేకంగా పరిశీలించవలసి వస్తున్నది. ఒక కావ్యాన్ని (కిన్నెరసాని పాటలు) తీసికొని, దాని కావ్యత్వాన్ని విశదంగా వివరించి, మిగతావాటిని గురించి సంగ్రహంగా పరిశీలిం చడం జరుగుతుంది.

కేవడ భావకవితర్వయురం - దేయరచద్రలు కిన్నెరనాని పాటలు

కిన్నెరసాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ అపూర్వ సృష్టి పద్య ఛందస్సులో ప్రౌఢ కవిత్వానికి పరాకాష్ట అనదగిన “రామాయణ కల్పవృక్షం) వంటి మహాకావ్యం వెలయించిన విశ్వనాథ గేయ ఛందస్సులో 'కిన్నెరనాని వొటల” వంటి మధుర కావ్యం వెలయించినాడు. విశ్వనాథ కావ్యాలలో జ్ఞానపీరం అవార్డు పొందిన “రామాయణ కల్పవృక్షం” మీద సహితం విమర్శకులు విరుచుకుపడినా 'కిన్నెరసాని' మీద మాత్రం ఎవరూ కన్నార్ర చేయలేదు. విశ్వనాధ విమర్శకులు సహితం 'కిన్నెరసానిపాటల'* కవితా సౌందర్యానికి, నాదమాధుర్యానికి 'ఓహో కిన్నెరసాని” అని తలలూపి తబ్బిబ్బులయిన వారే. విశ్వనాథ రచనలలో ఏది నిలిచినా, ఏది నిలవక పోయినా, "కిన్నెరసాని పాటలు” మాత్రం తెలుగుభాష, తెలుగు జాతి ఉన్నంత కాలం నిలిచి ఉంటుందని విమర్శకులందరూ ఒక్క గొంతుకతో ఓటు వేసిన వారే.

“కిన్నెరసాని పాటలు" భావకవితాయుగంలో వెలసిన ఉత్తమగేయకావ్యం. వస్తుబలంలో నేమి, వర్ణనా గుణంలోనేమి, “కిన్నెరసాని పాటల” వంటి గేయ కావ్యం భావకవితాయుగంలోనే రాలేదని చెప్పాలి. భావకవితాయుగంలో వెలువడిన గేయకావ్వా లన్నీ ఆత్మాశ్రయ రీతి కావ్యాలైతే విశ్వనాధ రాసిన 'కిన్నెరసాని పాటలు” “కోకిలమ్మ పెండ్లి మాత్రం వస్త్వాశయ రీతికి చెందినవి. 'కిన్నెర పుట్టుకలో కొంత ఆత్నాశయ రీతి అగుపించినా, మిగతా కావ్యమంతా వస్త్వాశ్రయ రీతిలోనే సాగింది. 'ఎంకిపాటలిలో నాయుడు బావ ఉన్నా , నాయుడు బావ నండూరి సుబ్బారావే. కనక ఆత్మాశ్రయ రీతి ప్రాధాన్యం వహించిన భావకవితా యుగంలో వస్త్వాశయరీతిలో వెలసిన "కిన్నెరసాని పాటలు విలక్షణమైనదే కాక, విశిష్టమైనది కూడా.

“కిన్నెరసాని పాటల'లో నాయిక కిన్నెరసాని. నాయకుని పేరేమిటో తెలియదు. ఈ కావ్యంలో నాయకునికి ప్రాధాన్యం లేదు. మొత్తం కావ్యమంతా నాయికపరంగానే సాగింది. కిన్నెర మహాఇల్లాలు. కాని ఉద్విగ్నహృదయ. తెలుగు కుటుంబాలలో సామాన్యమైన అత్తాకోడళ్ల పోట్లాట ఆ ఇంట్లోనూ ఉన్నది. కొడుకు సుఖమెరుగని తల్లి ఒకసారి నిష్టురమైన నింద నారోపించింది. ఆ నింద భరించడం కిన్నెరకు కష్టమైంది. కిన్నెర భర్త తల్లినీ కాదనలేక, భార్యనూ ఓదార్చుకోలేకపోతే ఆవెశహృదయంతో కిన్నెర భర్త మీద అలిగి, అలుగులైపారి, అడవుల వెంట పరుగెత్తుతుంది. భర్తపోయి ఆమెను వద్దని కౌగలించుకొంటాడు. ఆమె అతని కౌగిట్లోనే కరిగి నీరై, వాగై ప్రవహిస్తుంది. అతడు శోకించి శిల అవుతాడు. కిన్నెర వాగై వనాలు దాటి, తోగులు దాటి, దుర్గమాద్రులు దాటి, పధాంతరాలు దాటి పోగా, సముద్రుడు కనుసైగ చేయగా, శీలరక్షణార్ధమై గోదావరి

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 153 గర్భంలోకి వెళ్లి తలదాచుకొంటుంది. తెలుగు దైవమైన భద్రాద్రిరాముని సన్నిధిలో నిత్యంపారుతూ తన జీవితం చరితార్థం చేసుకొంటుంది. స్థూలంగా కథ ఇంత మాత్రమే. విశ్వనాధ ఈ కథనంతా గేయంగా రాయలేదు. కిన్నెర వాగుగా పుట్టినప్పటి నుంచే గేయంలో కథ ఆరంభమవుతుంది. మిగతా కధనంతా విశ్వనాధ కావ్యారంభంలో 'కల్చ్పనిగా వచన రూపంలో చెప్పుకొన్నాడు.

తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ, కాచిన పూతాత్మ కిన్నెర, తన పుణ్యనామం చేత, తన సంగీత మాధుర్యం చేత విశ్వనాధ ఆత్మలో నర్తించీ నర్తించీ, అతని గుండెను మధించీ మధించి కిన్నెరసాని పాటగా అవతరించింది. "కిన్నెరసాని పాటల'లోని కధ జనబాహుళ్యంలో ప్రచారంలో లేదు. విశ్వనాధ స్వంతంత్ర కల్పనే. ఈ కథాకల్పన మీద ఏ ఇతర ప్రభావం లేదని విశ్వనాధ వారే అన్నా విమర్శకులు కొందరు 'కిన్నెరసాని'లో పోలికలు పూర్వసాహిత్యంలోనుంచి ఎత్తిచూపినారు.

పెనుగొండలోని బృందావనాన్ని చూసి శుక్తిమతి, 'కోలాహలుి, గిరిక పాత్రలు సృష్టించిన భట్టుమూర్తి లాగా విశ్వనాధ దృష్టికి నది నాయికగా, కొండ నాయకుడుగా భాసించి ఉంటారని పుట్టపర్తి నారాయణాచార్యులు అభిప్రాయపడినారు. “” స్త్రీ నదిగా మారడం వాల్మీకి రామాయణంలో ఉన్నదని డా॥సి. నారాయణరెడ్డి గారు విశ్వామిత్రుని చెల్లెలు కౌశికి కధను ఎత్తిచూపినారు. * అంతేకాదు ఇంగ్లీషులో రాసిన “ఎరితూజా” (౧61౧694) గేయంలోని కథకు, కిన్నెరసానికి వోలికలున్నాయని నారాయణరెడ్డిగారు 'ఎరితూజా' గేయంతో పోల్చిచూపినారు. * వాల్మీకి రామాయణంలోనే “గంగావతరణం” కధ ఉన్నది. “మున్ను భగీరథ భూపతి, వెన్ను వెంట పరుగెత్తిన అన్నాకధునీ వైఖరినున్నది. నీచన్న క్రోవి), అని విశ్వనాధ సత్య్వనారాయణగారే ధ్వనింపజేసినారు. నదిని నాయికగా, సముద్రుడు నాయకుడుగా భావించడం భారతీయ సాహిత్య సంప్రదాయమే. అయితే ఈ కావ్యంలో సముద్రుడు ప్రతినాయకుడు. అబ్బూరి రామకృష్ణారావు రచించిన 'నది సుందరి రూపకానికి, కిన్నెరసాని వాటలకు పోలికలు చూపించినారు డా.సి. నారాయణ రెడ్డిగారు. *) అబ్బూరి రామకృష్ణారావు “నదీ సుందరి” "కిన్నెరసాని పాటల' కంటె ముందు రచన. కావేరి నది స్త్రీ రూపంలో ఉన్నప్పుడు వర్షంలో మెదలక కూర్చోవడాన్ని వర్ణించడం లోని ధ్వని, క్రిన్నెరనాని పాటలలోని 'మునుపే నీ కన్నులు గని అనుకొంటిని నీవు నదీ వనితవు' అని అనడంలోని ధ్వని రెండూ పోలి ఉన్నాయి. "కావేరి సస్యలక్ష్మికి సాయముగా పాపులకు క్షాళనముగా దేవేరి అయి వచ్చిందీ.” అని వనకన్యలు మంగళ గీతాలు వాడటం, కిన్నెరనానిని జలదేవతలు బలవంత పెట్ట నడిపించడం, వనదేవతలు పూలు కురిపించడం మొదలైన వోలికలు ఉన్నాయి.

156 ఖాదకదిశ్వయుగం - దేయరచనలు

పూర్వ సాహిత్యంలో “'కిన్నెరనానికి పోలికలు కస్‌పించినా, ఇది విశ్వనాధ స్వతంత్ర సృష్టి. వాటి ప్రభావం లేదనే చెప్పాలి. విశ్వనాధకు ఆర్షధర్మాలపై అభిమానం మెండు. ఆయన ప్రతి రచనలోనూ ఈ అభిమానం కనిపిస్తుంది. సాంఘికమైన కట్టుబాట్లు ఎవరూ దాటరాదని ఇందులో ధ్వని. 'లోకాలు తప్పుత్రోవల పోతే సర్దిచెప్పగల సామంతుడీ రాజే (కడలి). *కడలి లోకములు నేటే రాజూ “కడలి ధర్మములు” నిలిపే 'దొరి అటువంటి కడలి తన స్వధర్మాన్ని మరచి చెలియలి కట్ట (హద్దులు) దాటితే ఇంకేమైనా ఉందా? అందుకే కడలి ఎంత పొంగినా చెలియలి కట్ట దాటలేదని అన్నాడు. కడలి చెలియలికట్ట దాటకపోవడంవల్ల కిన్నెర పొందిన వైభవాన్ని వర్ణించినాడీ కావ్యంలో. సరిగ్గా “చెలియలికట్ట! అనే నవలలో కూడా విశ్వనాధ ఇటువంటి భావాన్నే వ్యక్తం చేసినాడు. మనిషి “చెలియలికట్ట” దాటితే కలిగే పతనాన్ని చిత్రీకరించినారు ఆ నవలలో. కిన్నెర పరిత్యక్త అయినా పతనం పొందకుండా చివరికి వైభవాన్ని వొందుతుంది. కిన్నెర సౌశీల్యాన్ని అడుగడుగునా రసాభిముఖంగా చిత్రీకరించినాడు. కిన్నెర '“ఉద్విగ్నహ్బదయ, 'రసాకృతి' కాబట్టే ఇంత కధ జరిగింది. భర్త కౌగిట కరిగి వాగై ప్రవహించిన కిన్నెరసాని త్వరలోనే తన ఆవేశంవల్ల కలిగిన అనర్ధాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడుతుంది. “తనకింక పతితోడి తగులు లేదనుకొంటుంది. కిన్నెరసానిలో ప్రత్యాశ నశించటం, భార్యాభర్తలిద్దరూ తిరిగి కలుసుకోలేకపోవదడం ఒక రకంగా విషాదాంతమే. అయితే “మనిషిగానే ఉండి ఉంటే ఎప్పుడో ఒకసారి చచ్చిపోక తప్పదు. ఇప్పుడు తను నదిగా మారడం వల్ల, తన భర్త శిలగా మారడం వల్ల ఇద్దరికీ మరణంలేదు అని కిన్నెర చేత భావింపజేస్తాడు. అంతేకాదు 'తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా” అని కిన్నెర జీవితాన్ని చరితార్థం చేయడం వల్ల కధ మోదాంతమే అయింది. 'విషాదాంతరంిగా పర్యవసించిన కథను 'మోదాంతంిగా పరిణమింప జేయడంలో విశ్వనాధ సంప్రదాయబలం వెల్లడవుతుంది. ఈ విధంగా ఈ కావ్యంలో (బొచ్య వాశ్చాత్య కావ్య సిద్ధాంతాలను సంగమింపజేసినాడు. రచనా శిల్పం

విశ్వనాధ 'కిన్నెరసాని పాటల'లో ఉదాత్త విషయప్రతిపాదనకు ఉదాత్తమైన రచనా శిల్పాన్ని జోడించినాడు. విశ్వనాధ ఈ కావ్యంలో చూపినంత శిల్పం మరే గేయరచనలో కనిపించదు. కనుక ఈ కావ్యంలో రచనా శిల్పాన్ని సంగ్రహంగా సమీక్షిస్తాను.

“'డిన్నెరసాని పాటలిలో విప్రలంభ శృంగారాన్ని పోషించినారు. భావకవిత్వంలో విప్రలంభశృ్ళంగారమే ఆధిపత్యం వహించింది. “కిన్నెర పుట్టుకలో విప్రలంభాన్ని నాయక పరంగాను, “కిన్నెర నడకలిలో నాయిక పరంగాను చెప్పడం జరిగింది. “కిన్నెర సంగీతం),

ఆధునికాంధ్ర గేయ కవిర్వం 157 “కిన్నెర నృత్యము" అనే వాటిలో అక్కడక్కడా నాయికా నాయకుల పూర్వ (సంయోగ) శృంగారాన్ని ధ్వనింపజేసినారు. “కిన్నెర దుఃఖరిలో ప్రత్యాశారహితమైన స్థితిని వర్ణించి, కరుణను పోషించినారు.

ఈ కావ్యమంతా వర్ణన ప్రాధాన్యమున్నదే. ముఖ్యంగా 'కిన్నెర నృత్యము, “క్రిన్నైర సంగీతము” పూర్తిగా వర్దనలే. కిన్నెర నదీ ప్రవాహాన్ని వర్ణించడమే ఇందులోని వస్తువు. ఇందులోని వర్ణనలు పద్యకావ్యాలలోని ప్రాధవర్జనలను తలపింపజేస్తాయి.'కిన్నెర నృత్యంలో పువుకన్నెలా-జగారవ నవ్వులా-వేల్పు కవచిన్నెలా', 'ఘల్గుఘల్లునా-వెల్లువల వెల్లునా-కొల్లవలి జల్లునా, మొదలైన విరుపులు వసుచరిత్రలోని 'లలానా-జనాపాంగ వలనా-వసదనంగ తులనా' మొదలైన ప్రాధపద్యాలలోని విరుపులను మెరిపింపబేసాయి.

“కిన్నెర పుట్టుకలో కిన్నెర భర్తను విడిచి నదిగా మారుతున్నప్పుడు వర్జించిన తీరు ఉదాత్తంగా ఉన్నది. తనను విడిచిపెట్టి పోతున్న కిన్నైరను వారించడానికి కిన్నెర భర్త ఆమె వేణీబంధాన్స్నీ కొంగునూ పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తాడు. పాదాలపై ప్రణమిల్లుతాడు. కిన్నెర కొప్పూ, కొంగూ, కాళ్ళూ ఒక దాని తర్వాత ఒకటి కాల్వగట్టు తాయి.

పరుగెత్తెడు నీ వేణీ

బంధము పూనితి చేతను కరమున వేణికి బదులుగ కాల్వగట్టె నీటి పొరలు ఓహో ఈ పగిదిని వాగువైన

నీపై పేమము చూపెడి-ఓహో

ఈ వర్ణన కిన్నెర పై నుంచి కింది వరకు క్రమంగా నిలువెల్లా సీళ్ళుగా మారిన దృశ్యచిత్రానికి పట్టిన నిద్దపు నిలువుటద్దం వంటిది.

“నవ్వులు నురగలుగొ, “వళులు తరగలుగొ, "కన్నులు మీనులుగా”) 'జఘనము ఇసుకతిన్నెగా' ఉపమించడంలో పాత కవిసమయాలే కనిపించినా, '“పదుపు కట్టినలేళ్ళ కదుపులా 'తెల్లని పూలనదిలా “వదలు తెల్లని త్రాచుపడగ'లా, “ఆవు పొదుగున పాలు ధారగట్టినయట్లు, 'వనదేవతలు నీళ్ళు వాలకబోసినయట్లు, “తల్లి చల్లని ప్రేమ వెల్లి వారినయట్లు), “పరికిణీ తొక్కాడు పదియేండ్ల కన్నులా, “చిన్న గంతులు వేయు తెల్లనా బెయ్య'లా "కొబ్బరిపాలు వాకలు కట్టినట్లు, 'వెయ్యావు లొకసారి పిదికినట్లు మొదలైన

158 ఖావకథితృ్వయురీం - గేయరచనలు కొత్త కొత్త ఉపమానాలదొంతరలు, పదచిత్రాలు కొల్లలుగా కనిపీస్తాయి ఈ కావ్యంలో. ఈ కావ్యంలో అక్షరగత శిల్పం కూదా అక్కడక్కడా కనిపిస్తుంది. ఉదాహరణకు

ఈవు రసాకృతి వగుటను

ఈ వైఖరి ప్రవహించితి

నేను శిలా హృదయుండను

పూనుదునె ధునీ వైఖరి-ఓహో

కిన్నెరకు ఈవు (నీవు) అని స్వరరూపం వాడటం, కిన్నెర భర్తకు “నేను” అని వ్యంజనరూపాన్ని వాడటంలో అక్షరశిల్పమున్నది. స్వరం ప్రాణవంతమైనది, కదలిక ఉన్నది. వ్యంజనం ప్రాణం లేనిది, కదలిక లేనిది. కిన్నెర నది, ఆమె భర్త శిల.

ఈ కావ్యంలో అక్కడక్కడా నాటకశిల్పాన్ని అనుసరించి ముందు జరగబోయే కథను ముందుగానే సూచించినాదు. “కిన్నెర సంగీతం” చివర 'కష్టాలకడలియే గాంచెనొో అని చెప్పి “కడలి పొంగును వర్ణించినాడు. తర్వాతి అంకంలో జరగబోయే కధను అంతకుముందు అంకంలో సూచించడం నాటకలక్షణం. “కిన్నెర పుట్టుకలో 'మునుపే న్పీ కన్నులు గని అనుకొంటిని, నీవు నదీవనితవు మానుష జన్మము, కనినావసి అసి భర్త అనుకోవడంలో కావ్యార్ధ సూచన కనిపిస్తుంది.

“కిన్నెరసాని పాటల'లో మొట్టమొదట కొట్టవచ్చేటట్లు కనబడే గుణం శబ్దినాద రమ్యత. ముఖ్యంగా ఈ ఒక్క గుణమే ఈ కావ్యం ప్రశస్తికి కారణమైంది. యతులూ, ప్రాసలూ, అనుప్రాసలూ, అంత్య ప్రాసలూ మొదలైన శబ్దాల ౦కారాలన్నీ శబ్బనాదరమ్యతకు తోద్పడినాయి. ఈ శబ్దాలంకారాలను ప్రత్యేకించి ఉదాహరించవలసిన అవసరం లేదు. అవి (ప్రతి పంక్తిలోను పలుకరిస్తుంటాయి. శబ్బనాదరమ్యతకు తోడ్పడిన మరొక ముఖ్యగుణం పునరుక్తి. పునరుక్తిని దోషంగా పరిగణిస్తారు ఆలంకారికులు. కాసి ఆ దోషమే అలంకారంగా భాసించింది ఈ కావ్యంలో. కనక ఈ కావ్యంలో పునరుక్తివల్ల సాధించిన శిల్పరామణీయకతను వివరించవలసిన అవసరమున్నది.

“కిన్నెరసాని పాటలు పాటల ఒరవడిలో సాగిన రచన. గొంతెత్తి పాడుకుంటేనే కాని కవితా మాధుర్యం, శబ్బనాదరమ్యత అనుభూతం కావు. పాటలన్నిటిలోను పునరుక్తి తప్పనిసరి. కృతులవంటి పాటలలో ఒకేపాదాన్ని అనేకసార్లు ఆలాపించడం ఉన్నదే. కనక “కిన్నెరసాని పాటలలోని పునరుక్తిని పాటల దృష్టితో చూడవలసి ఉంటుంది. ఈ కావ్యంలో ముఖ్యంగా ఐదు రకాల పునరుక్తులు కనిపిస్తాయి. (1) భావపునరుక్తి

(2) పాదపునరుక్తి (8) పదపునరుక్తి (4) అక్షరావృత్తి (5) స్వరావృత్తి. పునరుక్తి అన్నా

ఆధునికౌంధ్ర గేయ కనిర్వ్యం 15% అవృత్తి అన్నా ఒక్కటే. అక్షరావృత్తి స్వరావృత్తి అని శబ్ఞాలంకార పరిభాషనే ఇక్కడ వాడటం జరిగింది. ఒక్కొక్క రకం పునరుక్తినీ ఒకటి, రెండు ఉదాహరణలతో వివరించి చూపుతాను.

ఒకేరకమైన భావం కావ్యంలో అక్కడక్కడా రావడం, 'ెలుగు పాటలవెంట తీపిలా తోచింది 'తెనుగు పిట్టలు వాళ్ళు తెలియక పాడినై, 'తెనుగువాగై పారెనే, 'నెత్తావ్‌ తెనుగు పాటలుపాడెనే, తెనుగు వెలుగులు క్రమ్మెనో, 'తెలుగు సతృవిరాజు, 'తెలుగు యాత్రికులు, 'తెలుగు దైవమ్ము'-ఈ రకమైన భావపునరుక్తి (తెలుగుదనం) వల్ల కవికి తెలుగు భాషమీద, తెలుగు (ప్రాంతం మీద, తెలుగుదనం మీద గల అభిమానాతిరేకం వెల్లడవుతుంది. “తెలుగు పాటల తీపి మాటకేమిగాని, ప్రకృతిలోని వెలుగూ, పులుగూ అస్స్స్‌ తెలుగు మయంగానే కనిపిస్తాయి కవికి. చివరికి దైవం కూడా "తెలుగు దైవిమై నాడు. భావకవితాయుగంలో స్వభాషవల్లా, స్వదేశంవల్లా ప్రేమాభిమానాలు వెల్లువలై పారినవి. ఆ భావపరిణామమే ఈ కావ్యంలో కనిపిస్తుంది. 'తెలుగుదనం' మీద విశ్వనాథ కున్న అభిమానమే ఆయనచేత "కోకిలమ్మ పెండ్లి అనే మరో గేయకావ్యం రాయించింది,

ఒకే రకమైన పాదం మళ్ళీ మళ్ళీ రావడం. ఉదాహరణకు 'గోదావరి సంగమం'లో గేయఖండాలన్నీ ఇంచుమించు ఒకే రకమైన పాదాలతో ఆరంభమవుతాయి. 'గోదావరీ దేవి గుండె జలజలలాడి, “గోదావరి జాలి గుండె గూడులు కదలి, “గోదావరీ యెదద కోసలను కోతపడి* అనే పంక్తులు అట్లాగే కిన్నెర దుఃఖంలో కొన్ని గేయఖండాలలో మొదట "కిన్నెర యేడుపుసన్నని యెలుగులు (రెండుసార్లు), 'చిన్ని కిన్నెరా సన్నని యొలుగులు (రెండుసార్లు), 'పడతికిన్నెరా ప్రన్నని యెలుగులు” అనే పంక్తులు పునరుక్తిగా వస్తాయి. ఈ రకమైన పునరుక్తి కొంతవరకు పాటలోని పల్లవి ప్రయోజనాన్ని నెరవేర్చి, భావావేశాన్ని ఆస్వాదయోగ్యం చేస్తుంది.

ఒకే పదం మాటిమాటికి రావడం పునరుక్తి. కిన్నెరసాని పాటలలో అన్ని రకాల పునరుక్తులను చాలా సార్ధకంగానే ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా పదాల పునరుక్తి కొన్నిచోట్ల ఇది స్టితిచిత్రణకు ఉపయోగపడింది. మరి కొన్ని చోట్ల భావాన్ని స్ఫుటంగా మనస్సుకు నాటుకొనేటట్లు చెప్పడానికి ఉపయోగపడింది.** ఉదాహరణకు “కిన్నెర నడకిలలో

160 భావకఐిశ్వయుగం - గదేయరచన్రలు జలదేవతలు వచ్చి నెలత కిన్నెరనాని పదమంచు పదమంచు బలవంత పెట్టంగ మరిమరీ పతిచుట్టు తిరిగి కిన్నెరసాని వలవలా యేద్చింది పలపలా కుందింది జలదేవతలు వచ్చి చలపెట్ట పతిగుట్ట విడలేక విడలేక పడతి కిన్నెరసాని చనలేక చనలేక చాన కిన్నెరసాని ప్రోలేక పోలేక బాల కిన్నెరసాని (పుట-17)

ఈ గేయఖండాలలోని పునరుక్తులు భర్తను విడలేని “'కిన్నెరనాని" స్టితిచిత్రణను వ్యక్తం చేస్తాయి. ముఖ్యంగా విడలేక విడలేక, చనలేక చనలేక, పోలేక పోలేక అనే పునరుక్తులు ఇవన్నీ పర్యాయపదాలే కావడం వల్ల శబ్ద పునరుక్తితో పాటు అర్ధ పునరుక్తి కూడా ఉన్నది. ఇక్కడ ఒక విశేషాంశాన్ని వివరించవలసి ఉన్నది. రండవ గేయ ఖండంలో చివరిపాదంలో అన్వయం ముగియలేదు. 'పోలేక పోలేక బాల కిన్నెరసాని” అని అసంపూర్ణంగా ఉన్నది. ఈ పాదం పాడిన తర్వాత మొదటి ఖండంలోని “వలవలా యేడ్చింది, పలపలా కుందింది" అని చివరి పాదాన్ని అనుసంధించుకొన్నప్పుడు కలిగే రసస్సూర్తి అంతా ఇంతా కాదు. కింది చరణాలలోని భావమంతా ఒక్కసారి పైదానికి ఎగురుతుంది. మీమాంసకుల పరమాపూర్వంవలె ఇక్కడ రసం చర్వణమవుతుందని పుట్టపర్తి వారు అభిప్రాయపడినారు.”

అదేవిధంగా 'తళతళా మెరిసింది”, “బిరబిరా నడిచింది, 'బుసబుసా పొంగింది”- వంటి ధ్వన్యనుకరణ ఆ(మేడితాల ద్వారా భావం స్వయంవ్యక్తమై మనస్సులో స్ఫుటంగా నాటుకొంటుంది,

త. తుక్షరావ్పత్తి

ఒకే అక్షరమో, కొన్ని అక్షరాలో మాటిమాటికి రావడం. దీనినే వృత్యనుప్రాస అంటారు. ఈ రకమైన ఆవ్ఫత్తి సాధారణంగా ఈ కావ్యమంతటా ఉన్నది. 'గోద్రావది సంగమము'లో “ది ప్రాసను అన్ని పాదాలలోనూ నియతంగా పాటించడం జరిగింది, “ది ప్రాసగానే కాక, అక్కడక్కడా వృత్య్యనుప్రాసగా కూడా వాడటం జరిగింది. 'కిన్నెరసాని పాటల' లో కొన్ని అక్షరాలనే వృత్త్యనుప్రాసగా వాడటం జరిగింది. అవన్నీ లలితాక్షరాల కావడం వల్ల మధురమైన ధ్వని సంయోజనాన్ని కలిగిసాయి. ఇందుకు ఈ కావ్యమంతటా

ఆధుధికాంధ్ర దేయ కఖిత్వం 161 ఉదాహరణే. అక్షరావృత్తివల్ల ఈ కావ్యంలో విశ్వనాథ మరికొన్ని విశేష ప్రయోజనాలను సాధించినాడు. ఉదాహరణకు "కిన్నెర నృత్యం” లో (కిన్నై రటు కదలి యిటు కదలి

చిటి తరంగాలతో-పొటి తరంగాలతో

నటనాలు మొదలెట్టెనే -క్రొన్నీటి

తుటుములా కదలాదెనే

“ఇటు కదలి-అటు కదలి” అట్లా 'టి అక్షరం రెండుసార్లు రావడం 'మొదలెట్టెనే - కదలాడనే' ఇట్లా 'నే అనే అక్షరం రెండుసార్లు రావడం-ఈవిధంగా “కిన్నెర నృత్యం” ఖందమంతా ఇవే అక్షరాలు ఇదేస్ట్థానంలో రావదంవల్ల ఒక దృశ్యం గుర్తుకు వస్తుంది. 'టి అక్షర పునరుక్తివల్ల మృదంగం దరువులు వినిపిస్తుంటే, “నే అక్షరావృత్తివల్ల 'భామనే- సత్యభామనే" అని పాడుతూ నృత్యం (కూచిపూడి) చేస్తున్న దృశ్యం గుర్తుకు వస్తుంది. నియత స్థానంలో 'నే' అక్షరావృత్తి వల్ల నృత్యలయ వ్యక్తమైంది. 5. స్వరావృత్తి ఒకే స్వరం ఆవృత్తి కావదం, ఇది అక్షరావృత్తి వంటిదే. కాని ఇందులో స్వరానికే

ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లండ్‌లో జలశాస్త్రం (1/6/0109) చదివి తిరిగి వచ్చిన విశ్వనాథ మిత్రుడు ఈ కావ్యం విన్న తర్వాత విశ్వనాధతో “మీరు జలశాస్త్రము పఠించినారా యేమి? ఈ ధ్వనులన్నియు శాస్త్రము చెప్పునట్లు ఉన్నవి.” అని అన్నారట. శబ్బగ్రహణ యంత్రాన్ని నది ఒడ్డున పెడితే ఏ ధ్వనులు రికార్డు చేస్తుందో ఆ ధ్వనులే ఈ కావ్యంలో ఉన్నాయని వేమూరి వేంకట రామనాధంగారు ఆ వ్యాసంలో అభిప్రాయపడినారు. ఇది కొంత అత్యుక్తిగాను, అశాస్రీయంగాను కనిపించినా, ఆ రకమైన ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పడానికి ఈ కావ్యంలో అంతస్సాక్షాలున్నాయి. ముఖ్యంగా ఒకే రకమైన 'స్వరంి అదే పనిగా శుతం కావడం వల్ల ఆ రకమైన ప్రయోజనం నెరవేరింది. అందుకే దీనిని ప్రత్యేకించి 'స్వరావృత్తి అని అనవలసి వచ్చింది. ఉదాహరణకు “కిన్నర నృత్యంలో

కెరటాలలో నుర్వు

తెరాచాటులో నీటి

పొర జాలులో ...

సొన జారుతూ నీటి

పనవాలు తూ అంద

మున సోలుతూ,...

162 ఖావకవిర్వయుగం - దేయరచనలు చిజలు తేనెలా అచ్చ రల గొంతు లా గజ్జి యల (మోతలా

మొదటి దానిలో 'ఓ), రెండవదానిలో “ఊ, మూడవదానిలో 'ఆ”* అనే స్వరాలు మాటి మాటికి శుతమవుతున్నాయి. ఊనిక ఆ స్వరాల మీద ఉంటుంది. ఈ గేయ భాగమంతా (కిన్నెర నృత్యం, అవే స్వరాలు అదే పనిగా వినిపిస్తూ ఉందటం వల్ల, నది నిండుగా ప్రవహిస్తున్నప్పుడు దూరంగా ఉన్నవాడికి నదీ తరంగ నాదం వంటిదేదో లీలగా వినిపించినట్లు ఉంటుంది. ఈ రకమైన శిల్పాన్నే “కిన్నెర సంగీతం'”లోను, “కడలి పొంగు” లోను పాటించడం జరిగింది. కడలిపొంగులో 'ఊ'” అనే స్వరం చివరి పాదాల చివర (చాలా వరకు అన్ని గేయ ఖండాలలోను) వినిపిస్తూ ఉంటుంది. దజీదావారణకు

ఉట్టుట్ట లూచెన్లూ మిట్టిక్కి చూచెన్తూ సళ పెళా కాగెన్తూ గల గలా వూగెినూ తన కేమి పరువ్తూ కదలిరాజు నక్తూ

ఇట్లా ఈ గేయ భాగమంతా “ఊ) అనే స్వరం అదేపనిగా (శుతం కావడం వల్ల 'సముద్ర ఘోష వినిపించినట్లుంటుంది. చివర 'ఊ” అనే దీర్జాచ్చును కొన్ని మాత్రలకాలం సాగదీస్తే ఆ రకమైన అనుభూతి అవగతమవుతుంది.

ఈ రకంగా ఈ కావ్యంలో పునరుక్తివల్ల ఎంతో విశిష్టమైన ప్రయోజనాన్ని సాధించడం జరిగింది. ఈ కావ్యంలో పునరుక్సిని గురించి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఈ విధంగా అభిప్రాయపడినారు. “సాంకేతికమగు కావ్యదృష్టితో చూచినప్పుడు “కిన్నెరసాని'లో పులుముడు లెక్కువ. అందుకే దానిని చదువరాదు-మజథి పాడవలెను. కంరమెత్తి పాడినపుడా యా(మేడితమే సౌందర్యముగ మారి భావసృష్టికి తోడుపడును. 'జృనాధ! ఓ నాధి యని నాలుగు సారులన్నప్పుడు ఆ నాల్వు సారులును వివిధ స్వరములలో మేళవించినప్పుడు పదమొక్కటియైనను అనెక భావములు రాగమున కన్నను

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 163 స్పష్టములై కానుపించును. దీనీతో 'లీనత* యను ధర్మమెక్కువయగును. ఇతర కావ్యము లకును, గేయకావ్యములకు నున్న భేదములలో నిదియెకటి.” ఛందళశ్ళ్శిల్పం కిన్నెరసాని పాటలలో ఛందః ప్రయోగం ప్రత్యేక పరిశీలనార్ష్హమైనది. ఈ కావ్యం ప్రధానంగా ఖండగతిలో సాగింది. అయినా ఒక్కొక్క శీర్షికలో ఒక్కొక్క ఛందస్సంవిధానాన్ని పాటించినారు. ఇది సంస్కృత కావ్యఛందస్సు మర్యాద ననుసరించి చేసినట్లున్నది. ప్రతి సర్దనొక ఛందస్సులో రాయడం సంస్కృత కావ్యాలలో కనబదే సంప్రదాయం. “కిన్నెర పుట్టుక), "కిన్నెర దుఃఖము” - ఈ రెండు మాత్రమే చతుర(స్రగతిలో ఉన్నాయి. మిగతావన్నీ ఖందగతిలోనే ఉన్నాయి. “కిన్నెర పుట్టుక ను, “కిన్నెర దుఃఖమును ఒకే గతిలో నడపడంలో కిన్నెర పుట్టుకే దుఃఖమయమైనదని ఛందస్సు ద్వారా నాధించిన ధ్వనిగా కనిపిస్తుంది. ఈ కావ్యంలో విషయస్థితిని బట్ట గతిని ఎన్నుకోవడం జరిగింది అయితే కిన్నెర పుట్టుకను పదహారు మాత్రల ఛందస్సులోను (నాలుగు చతుర్మాత్రాగణాలు) రచించినారు. చతురస్రగతిలో కూడా విశ్వనాథ విభిన్న గతులను ప్రదర్శించినాడు. దీదావొరగుకు ఇంత కోప మేమిటీికే = 3+8+8+3 యింత పంత మేమిటికే = త+8+8+8 ఇంతులు జగమున పతులకు డ్‌ త్తీ+ిడ్తీసాడీ నింతలు సేయుదు రటవే జు డ్తీభడ్తీ+త్త మొదటి రెండు పాదాలలో పదాలు త్రస్రగతిలోను, తరువాతి రెందు పాదాలలో చతుర(స్రగతిలోను విరుగుతున్నాయి. మరోవిధమైన నదక నీ నవ్వులు నురుగులుగా = 6+6 నీ వళులవి తరగలుగా = 6+6 నీ కన్నులు మీనులుగా = 6+6 నీ కరణిని ప్రవహించెదు = డి+6 పై ఉదాహరణలో పాదాలలో ప్రతి 6 మాత్రలకు విరుపులు తెగుతూ నడక సాగుతుంది. అయితే పాదంలో మొదటి 6 మాత్రలు 2+4గాను, తర్వాతి 6 మాత్రలు 4+2గాను విరుగుతూ రూపకతాళంలో నడవడం, మొదటి మూడు పాదాలలోను మొదటి అక్షరం, చివరి అక్షరం గురువులే ఉండటం, అందులోనూ ఒకే అక్షరాలు ఆవృత్తి (నీ,గా) కావడం, పాదాద్యక్షరాలన్నీ యుష్మదర్ధకాలతో ఉందటం ర,ల (అక్షరాలు)

[ గ్ర4 ఖావకథిరృ్వయురం - దేయరచదనలు పునరావృత్తి కావడం వీటి వల్ల గేయం నడకకు చక్కని అందం వచ్చింది. మరో విధమైన నడక

ఇదిగొ చేతులను చాచితి = 3+5+4

నేడ్చు చుంటి కంర మెత్తి = 3+3+3+3

మొదటి పాదంలో విరుపులు 38+5+4 గా తెగుతాయి. మొదటి పాదాన్ని క్రియతో అంతం చేసి, వెంటనే రెండోపాదం క్రియతో ఆరంభం చేయడం. ఈ విధంగా థీన్నమైన నిర్మాణళిల్పం (ప్రదర్శితమైంది.

“కిన్నెర పుట్టుకలో పాదాద్యక్షర మైత్రిని, ప్రాసను చాలావరకు నాలుగు పాదాలలోను నియతంగా పాటించడం జరిగింది. ఎక్కడో ఒకచోట తప్పినా కనీసం రెండు పదాలకైనా ప్రాసనియతి తప్పనిసరిగా కనిపిస్తుంది. 12 మాత్రల ప్రమాణమున్న చిన్న పాదాలలో ద్వితీయాక్షరప్రాస వృత్యనుప్రాసగా భాసించి గేయగమనాన్ని గుణిస్తుంది. “కిన్నెర దుఃఖము" లో ద్వితీయాక్షర ప్రాసనేకాక అంత్యప్రాసను కూడా చాలావరకు కనీసం రెండు పాదాల కైనా పాటించడం జరిగింది కనుక “కిన్నెర దుఃఖములో ఛందస్సు మధురగతి రగడ అని చెప్పవచ్చును. పాదాద్యక్షరయతిని కూడా పాటించడం జరిగింది. చతురస్రగతిలో సాగిన "కిన్నెర దుఃఖము”లో విరుపులు వివిధరకాలుగా ఉన్నాయి. దబీదావారణకు

కడలి లోకములు నేలే రాజట = తే+ర్‌+4+శీ

కడలి ధర్మములు నిలిపే దొారయట = 3+5+4+4

కడు పతివ్రతల కవయ నెంచుటలు = 2+6 (లేదా 5+8ఏ8+5

కడలికి తగునా తగునా యిట్లని = 4+4+4+4 మూడదోపాదంలో మొదటి సగం 2+6గా గాని, 5+38గా గాని విరుగుతుంది.

బొట్టు బొట్టుకొక వేయి యెదలుగా = 3+3+5+5 లేదా 8+8+2+8+5

తరగ తరగ కొకవేయి నోళ్ళుగా = ఏ+3+5+5

ఒడలి నీరమే యేడుపు మయమై = 4+4+4+4

కడలి మోత లెక్కుడదు భయమిడగా = 3+3+4+5

చూడ వచ్చినా లేడి కిన్నెరా = 3+5+8+65

గాడి వారినా యెడద లోపలా = 3+5+8+5

వాడి వాడి లేజివురు వత్తలై ఇ వ+3+5+5 లేదా 8౪+5+8+5

దేడిస కన్నుల నీరము వెట్టగ జ.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 165 మొదటి రెండు పాదాలలో మొదటీ సగభాగాలలో వాక్య నిర్మాణంలో నామ్యము న్నందువల్లను అక్షర సమత్వం (గురు లఘువుల క్రమం కూడా ఒకటి) ఉన్నందువల్లను ఒకేతూగు, ఒకే తూకం కనిపిస్తాయి. మొదటి మూడు పాదాలు 38+5 మాత్రలకు కచ్చితంగా పదం కూడా విరుగుతూ నడవడం వల్లను, 'డ* కారం ప్రాసగానే కాక వ్రాసయతి గాను వృత్యనువ్రాసగాను రావడం వల్ల గేయగమనానికి కొత్త అందం వచ్చింది. ఇక ఖండగతిలో విశ్వనాధ (ప్రదర్శించిన ప్రయోగవైవిధ్యాన్ని పరిశీలిస్తాను. 'కిన్నెర నడకలిలో కదిలింది కదిలింది = త+ర్‌ కదిలింది కదిలింది = ర్‌ళర్‌ కదిలి కిన్నెరసాని వొదుగుల్లు వోయింది = 5+5+5+5 సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది మొదటి రెండు పాదాలు హ్రస్వ పాదాలు, తర్వాతి మూడుపాదాలు దీర్హపాదాలు, మొదటి రెండు పాదాలను ఒకేపాదంగా రాస్తే నాలుగూ సమాన పాదాలు అవు తాయి. “కిన్నెర నడకలో ప్రాసను, అంత్యప్రాసను చాలా వరకు నియతంగా పాటించి నందువల్ల ఇది ద్విరదగతి రగడలో సాగిందని చెప్పవచ్చు. "కిన్నెర నడకలు*లో వాక్య నిర్మాణం గురించి ఒక విశేషం చెప్పవలసి ఉన్నది. “కిన్నెర నదక'ల లో వాక్యాలు చాలావరకు వచనక్రమాన్ని అనుసరిన్తాయి. ఉదాహరణకు "కిన్నెరసాని వాదు గుళ్ళువోయింది' ఈ విధంగా వచన (క్రమంలోలాగా నదపదడంవల్ల లయవిరహితంగా కనిపిసాయి. అయితే ఈ వాక్యాలకు ముందు ప్రీ పర్యాయపదాలు-'తరుణి కిన్నెరసాని” “పడతి కిన్నరసాని', “సుదతి కిన్నెరసాని” 'ముదిత కిన్నెరసాని'-ఈ విధంగా మార్చి మార్చి రాయడం వల్ల ఆ పర్వ్యాయపదాలే వాక్యాన్ని వచనం నుంచి తప్పించి లయను పోషిస్తాయి. పూర్తిగా వచనక్రమంలో ఉన్న వాక్వాలు "కిన్నెరసాని పాటలలో లేకపోలేదు. జీదావారణకు గోదావరి యీ వార్త విన్నదీ గోదావరి నది గుండె కరిగినది గోదావరి నది జాలి పొందినది గోదావరి కన్నీరు కార్చినది

166 ఖావకవిర్వయురం - దేయరచభనైలు

మొదటి వాక్యంలో క్రియ దీర్హాంతంగా ఉన్నందువల్ల ఒక తూగు వచ్చి కొద్దిగా లయాత్మకంగా ఉన్నా మిగతా మూడు వాక్యాలు వచనక్రమంలో ఉండి లయ విరహితంగా నడుస్తాయి. అయితే నాలుగు పాదాలలోను ఒకేపదం (గోదావరి) ఆవృత్తి కావడం వల్ల, తిరిగి తిరిగి అదేమాటను అంటూ ఉండడం వల్ల రెండు, నాలుగు పాదాలలో 'నది' అనే మాట నామవాచకంగాను (గోదావరి), క్రియాపదంతోను (కరిగినది, పొందినది) పునరుక్తి కావడం వల్లను ఏదో కొద్దిగా లయ కదిలినట్లు ఉంటుంది. “కిన్నెర నృత్యం” కూడా ఖండగతిలోనే ఉన్నా మరో తీరుగా ఉన్నది. ఉదాహరణకు ) చితు గాలిలో నూగు ఇ ?+8 లేదా 5+ర్‌ ౨. _ కొజలవంపులో నీటు ఇ... ౯748 3. తరి తీపులో కిన్నె =... |షరై ట్స రట్రు లేచి యిట్లు లేచి = 2+83+92+8 లేదా 5+5 5, _ జల్లు తుంపురులతో-కొల్ల తుంపురులతో = 5+5+5+6 6, మెల్ల మెల్లన నాదెనే-కెరటాల 7. జల్లులో ముంచెత్తెనే

కిన్నెర నృత్యంలో ప్రతిగేయ ఖండానికి వడుపాదాలు ఉంటాయి. మొదటి నాలుగు పాదాలు అర్ధవాదాలు. రెండు ఐదు మాత్రల గణాలు ఉంటాయి. మొదటి మూడు పాదాలలో ఐదు మాత్రల తర్వాత గురువు నియతంగా ఉండి, ఆ గురువు పూర్వపదంతో అనుబంధమై ఉండటం వల్ల 7+8 మాత్రలుగా విరుగుతుంది. ఐదు మాత్రల తర్వాత ఉన్న గురువు మూడు పాదాలలోను ఒకే అక్షరం ఆవృత్తిగా రావడం విశేషం. అట్లాగే మొదటి మూడు పాదాలకు ద్వితీయాక్షర ప్రాస ఉంటుంది. నాలుగో పాదంలో ఖండగతి 2+3 మాత్రలుగా విరుగుతుంది. ప్రాసయతి ఉంటుంది. *ఇటు, అటు” అనే పదాల మధ్య ఒకే పదం ఆవృత్తి అవుతుంది. ఐదోపాదం దీర్హపాదం నాలుగు పంచమాత్రాగణాలు ఉంటాయి. ప్రాసయతి ఉంటుంది. పదపునరుక్తి ఉంటుంది. ఐదు, ఆరు ఏడు పాదాలకు ద్వితీయాక్షర వాస ఉంటుంది. ఆరు, ఏదు పాదాల నిర్మాణం మరో విధంగా ఉంటుంది. ఆరోపాదంటో 17 మాత్రలు, వడో పాదంలో 12 మాత్రలు ఉంటాయి. ఆరోపాదంలోను, ఏడోపాదంలోను పది మాత్రల తర్వాత గురువు ఉంటుంది. ఆ గురువు తర్వాత మూడు మాత్రల కాలం విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది.

మెల్ల మెల్లన నాదెనే (తకిట)-కెరటాల = 20 జల్లులో ముంచెత్తెనే (తకిట) = 15

ఆధునికాంధ్ర దేయ కవిత్వం 167 ఈ విధంగా ఖండగతిలో గురువు తర్వాత మూడు మాత్రల కాలం విశంతి తీసుకొనే పద్ధతి తెలంగాణలో ప్రసిద్ధమైన గౌరమ్మ పాటలలో ఉన్నదే. నా నోము నీకిస్తునే (తకిట) గౌరమ్మ నీ నోము నాకియ్య వే (తకిట)

పై గేయ ఖండంలో వాక్య నిర్మాణంలో ఒక (క్రమం, ఒక సామ్యం కనిపినాయి. మొత్తం ఈ గేయఖండంలో రెండు వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యంలో మూడు షష్టీ విభక్ష్యంత నామవచనాలు (చిజుగాలిలో..), తర్వాత కర్భపదం (కిన్నెర), నిర్దేశార్థకం (అటు), తర్వాత క్షార్ధక క్రియాపదం (లేచి), నిర్దేశార్థకం (ఇటు), మళ్ళీ అదే కార్ధక క్రియ, ఆ తర్వాత రెండు తృతీయా విభక్ష్యంత నామవాచకాలు (జల్లు తుంపురులతో...), క్రియా విశేషం (మెల్లమెల్లనన్‌), క్రియ (ఆడెనే) -తర్వాత షష్టీ విభక్ష్యంత నామవాచకం, (క్రియ రెండో వాక్యంలో కర్పపదం లోపించి ఉంటుంది. మొదటి వాక్యంలోని కర్చపదాన్ని (కిన్నెర) అన్వయించుకోవాలి. దాదాపు ఇదేరకమైన వాక్యనిర్మాణం "కిన్నెర నృత్యంలో ఉంటుంది.

“కిన్నెర సంగీతమూ దాదాపు “కిన్నార నృత్యము"లోని ఛందళ్శిల్సాన్న పాటించడం జరిగింది. ఆరుపాదాలు ఒకే గేయఖండంగా రాయడం జరిగింది. మొదటి రెండు పాదాలు దిర్హపాదాలు. పంచమాత్రాగణాలు నాలుగు ఉంటాయి. మూడు, నాలుగు పాదాలు అర్ధపాదాలు. రెండు పంచమాత్రాగణాలు ఉంటాయి. 5, 6 వాదాలను "కిన్నెర నృత్యం'లోని 6, 7 వాదాలలాగా దాయడం జరిగింది. ఉదాహరణకు

తేనెలై కలకండ సోనలై వానలై (0) చాన కిన్నెర వాట నాగులాడుట చూచి - (2) చివరలో, చివురొత్తు -ఊ (3) సవురులో క్రొమ్మావి ఆ (4) వింతగా సిగ్గందెనో (తకిట)-కోకిలా - (5) గొంతులో కదలాదెనో (తకిట) = (6

ప్రతి రెండు పాదాలకు వ్రాసను నియతంగా (చాలావరకు) వాటించడం జరిగింది. మూడు, నాలుగు పాదాలలో మొదటి మూడు మాత్రల తర్వాత నియతంగా గురువును వాడటం, అందునా ఒకే అక్షరాన్ని (లో) ఆవృత్తిగా వాడటం జరిగింది. అట్లాగే 5, 6 పాదాలలో పది మాత్రల తర్వాత *నో” అనే అక్షరాన్ని ఆవృత్తిగా వాడటం జరిగింది.

168 ఖాదకఖిరత్పయురం - దేయరభనలు పై ఉదాహరణలో మొదటి పాదంలో పదాలన్నీ కచ్చితంగా ప్రతి ఐదు మాత్రలకు

తెగడం వల్ల గేయానికి చక్కని గమనం చేకూరుతుంది. కిన్నెరసాని పాటలలో కచ్చితంగా ఐదు మాత్రలకొక పదాన్ని కూరుస్తూ నడిపించిన గేయాలు చాలా ఉన్నాయి. మరో ఉదావారణ

చిజు తేనెలా అచ్చ

రల గొంతులా గజ్జి

యల (మోోతలా

పాదవిభజన ఆ విధంగా చేసి రాసినా మొదటి రెండు అక్షరాలను విడిచి చదివితే ప్రతి పదం ఐదు మాత్రలకు ముగిసి చక్కని గమనం శ్రుతమవుతుంది.

(చిజు) తేనెలా అచ్చరల గొంతులా గజ్జియల (మైోతలా

ఈ రకమైన రచనా విధానం కృష్ణశాస్త్రి గేయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. రెండోపాదంలో మొదటి సగం (చాన కిన్నెరసాని), రెండో సగం (సాగులాడుట చూసి) మాత్రా సమత్వంతో పాటు అక్షర సమత్వం (9/11201051౧4%0) (అంటే గురు లఘువుల క్రమం రెండింటిలో సమానంగా ఉండటం) కూడా ఉందటం వల్ల సమభారత (0212006) సరిగా కుదిరింది. మూడు నాలుగు పాదాలలో కూడా ప్రతి ఐదు మాత్రలకు పదాంతం అవుతుంది.

'కడలి పొంగు”లో ఖండగతి మరో తీరున సాగింది. ఆరు పాదాలనొక ఖండంగా రాయడం జరిగింది. మొదటి రెండు పాదాలలోను పంచమాత్రాగణాలు మూడు, తర్వాతి రెండు పాదాలలో నాలుగు, చివరి రెండు పాదాలలో రెండు ఉంటాయి. మొదటి రెండు పాదాల చివర రెండు పాదాలలో రెండు ఉంటాయి. మొదటి రెండు పాదాల చివర, చివరి రెండు పాదాల చివర దీర్దాక్షరం నియతంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ దీర్జాక్లరాన్ని ఫ్లతంగా సాగదీయవలసి ఉంటుంది. ఉదాహరణకు

అస్నివా గులవంటి దగునా, అన్నితో గులవంటి దగునా. మంచికి న్నెరసాని మగనికె క్కినచాన. కొంచెమే మోపొంది కోపమి ట్లయినంత తన్ను పొందునటే. తనకు దక్కునటే.” వచ్త్యతల బాగా దన బో పల్టీ మాత్రల జాగా ఉందో అల్లి చధ్టలతో నూచించదం జడనతుంద

ఆధునికాంధ్ర చేయ కవిర్వం 169 పై గేయంలో చివరి దీర్చాలను ఫ్లతాలుగా సాగదీయాలి. ప్రతి రెండు పాదాలకు (ప్రాసను చాలా వరకు నియతంగా వాటించడం జరిగింది.

“గోదావరి సంగమము'”లో విశ్వనాథ విశిష్ట లయ విన్యాసాన్ని ప్రదర్శించినాడు ఇందులో కూడా ఆరుపాదాల నొక గేయ ఖందంగా రచించినారు. అయితే ఒకటోపాదం, నాలుగోపాదం మాత్రమే నిండుగా ఉంటాయి. అంటే నాలుగు పంచమాత్రాగణాలు ఉంటాయి. మిగతా పాదాలలో విశ్రాంతికి జాగాలుంటాయి. రెందోపాదంలో 14 మాత్రల తర్వాత మూడు మాత్రల కాలం విశ్రాంతి తీసుకొని, తర్వాతి మూడు మాత్రల పదాన్ని అందుకోవాలి. మూడు, ఐదు పాదాలలో 14 మాత్రల తర్వాత ఒక మాత్రాకాలం విశ్రాంతి తీసుకొని ఐదు మాత్రల పదాన్ని అందుకోవాలి. ఆరోపాదంలో కూడా 14 మాత్రల తర్వాత ఒక మాత్రాకాలం విశ్రాంతి తీసుకోవాలి. రెండు, మూడు పాదాలలోను, ఐదు, ఆరు పాదాలలోను పన్నెండు మాత్రల తర్వాత నియతంగా దీర్దాక్షరం ఉంటుంది. ఆ దీర్జాక్షరం కూడా ఒకే అక్షరం అయి ఉంటుంది. (అంటే 2,3 పాదాలలో ఒక అక్షరం 5, 6 పాదాలలో ఒక అక్షరం) 1, 5 పాదాల చివరి అక్షరాలు సాధారణంగా హ్రన్వాంతాలుగా ఉంటాయి. ఉదాహరణకు

  1. గోదావరీ జాలిగుండె గూడులు కదలి ల. సాదు కిన్నెర కెదురు వోయీ (తకిట) ఆమె
  2. లోదిగులు తరగచేదోయీ . వారించి శ. ఆదరముచే నామె నదిమి కౌగిటబూని 5, వద్లినీ మొగము నా తల్లీ, అన్నది
  3. నీదిగులు నిక మాను చెల్లీ,

గోదావరి సంగమంలో పాదాంత విశ్రాంతి ఎంతో భావస్సూర్తి నిస్తుంది. పై గేయఖందడంలో 2, 3, 5, 6 పాదాంతాలలో విశ్రాంతి (మాత్రల జాగా) భావధార ననుసరించి పాటించడం జరిగింది. 2వ పాదం చివర *ఎదురువోయీ.... (8 మాత్రల కాలం ఆగి), ఆమె లోదిగులు తరగ చేదోయీ (ఒక మాత్రాకాలం ఆగి) వారించాక అవిరామంగా ఆదరమూ కెౌగిలీ ఇచ్చి, ఏది సీ మొగము నాతల్లీ. (1 మాత్రా కాలం ఏవరామం,).. నీ దిగులు నిక మాను చెల్లి, (1 మాత్రా విరామం)-ఈ విధంగా పాదాంత విరామం (౧4656) ఎంతో భావస్ఫోరకంగా ఉంది. 'ది కార ప్రాస ఆరు పాదాలలోను పాటించదమేకాక, “గోదావరి సంగమము'లో మొదటి నుంచి చివరి వరకు నియతంగా పాటించడం గమనించవలసిన విశేషాంశం.

170 ఖాదకదిర్వయురం - దేయరచనలు “కిన్నెర వైభవము'”లో మరొక నిర్మాణశిల్చం కనిపిస్తుంది. సాధారణంగా ఆరు పొదాలనొక ఖందంగా రచించడం జరిగింది. (నాలుగు వాదాలొక ఖండంగా రాసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి.) మొదటి నాలుగు పాదాలలోను మాత్రలు నిండుగా ఉంటాయి. ఐదోపాదంలో పదిమాత్రల తర్వాత ఐదు మాత్రల కాలం విశ్రాంతి తీసుకొని తర్వాతి ఐదుమాత్రల పదం అందుకోవాలి. ఆరోపాదం అద్ధవాదం , రెండైదు మాత్రల గణాలు ఉంటాయి. ఉదాహరణకు

  1. మూరగా బారగా ప్రొద్దువా టారింది 2, పొలము పి చ్చికగుంపు పురుగుమే తేరింది ఏ. అడవిచె ట్టులనీడ లవఘలించిన నీరు శ నలుపుతిరి గినపైరు నాట్యమా డినయట్లు
  2. తరలింది కిన్నెరా (తకతకిట) తరగల్లు
  3. ఉరలింది కిన్నెరా మొదటి రెండు పాదాలలోను అంత్యప్రాస నియతంగా ఉంటుంది. అంతే కాదు అంత్వాక్షరం హస్వంగా ఉంటుంది. “కిన్నెర వైభవము*లో వాక్యనిర్మాణం విషయంలో వివరించవలసీన విశేషాంశం ఉన్నది. మొదటి రెండు పాదాలు వాక్యాలు. అంటే క్రియా సహితాలు. [క్రియలు పాదాంతంలో గాని, పాదమధ్యంలోగాని, పాదాదిలోగాని ఉందవచ్చు. తర్వాతి రెండు పాదాలు క్రియారహితంగా ఉన్న ఉపవాక్యాలు. నాలుగో పాదం చివర ఉపమావాచకం నియతంగా ఉంటుంది. ఐదో పాదారంభంలో క్రియాపదం, ఆ తర్వాత కర్పపదం ఉంటాయి. ఆరోపాదం కూడా క్రియాపదంతోనే ఆరంభమవుతుంది. ఐదోపాదంలోని క్రియాపదంలోను, ఆరోపాదంలోని క్రియాపదంలోను మొదటి అక్షరం మాత్రమే తేడా ఉంటుంది. మిగతా అక్షరాలు సమానంగా ఉంటాయి. ఆరోపాదంలో కూడా క్రియాపదం తర్వాత ఐదోపాదంలోని కర్ఫపదమే (కిన్నెరా) ఆవృత్తి అవుతుంది. అంటే అర్ధపాదమైన ఆరోపాదం మొదటి అక్షరం తప్ప, మిగతా అక్షరాలన్నీ ఐదోపాదం అర్దపాదంలోని అక్షరాలే ఉంటాయి. అంటే సుమారు 5, 6 అక్షరాల ప్రాస ఉంటుందని కూడా చెప్పవచ్చు. నాలుగు పాదాలున్న గేయఖండం, పై గేయఖండం (ఆరుపాదాలున్నద్రి) లోని మొదటి రెండు పాదాలను విడిచి మిగతా పాదాల నిర్మాణాన్ని పోలిఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క నిర్మాణ శిల్పాన్ని నియతంగా మొదటి నుంచి చివరి వరకు పాటించినందువల్ల 'కిన్నెరనాని పాటలిలో గేయం చక్కని గమనాన్ని సంతరించుకొన్నది.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 171 కిన్నెరసాని పాటలలో వాక్య నిర్మాణం వ్యావహారిక వచన రచనకు దగ్గరగా ఉంటుంది. వాడుక భాషా రూపాల కంటె గ్రాంధిక భామారూవాలు ఎక్కువగా ఉన్నా [క్రియాపదాలు మాత్రం చాలా వరకు వ్యావహారిక రూపాలే ఉన్నందువల్లను, వాక్య నిర్మాణం చాలా వరకు వచన క్రమాన్ని అనుసరించినందువల్లను కిన్నెరసాని పాటలలో భాష వ్యావహారికమే అని చెప్పవచ్చు. “శైవాభిషేకరంజన్నారికేళ గర్భాంబువుల్‌, “గోద్రావదీ మహాకూలంకషామృత శ్రీదివ్య మధుతరంగాలు” వంటి ఒకటి, రెండు చోటులలో పద్య రచనా శిల్పం, ప్రౌఢ సమాస నిర్మాణం కనిపిస్తాయి. మిగతా రచన అంతా అల్ప్బసమాసా లతో, లలితాక్షర సంయోజనంతో పరమ మధురంగా సాగిపోతుంది. శబ్బనాద రమ్యత ఈ కావ్యంలో విశేషగుణం. ఆధునిక కవితా యుగంలో ఇది అద్వితీయ కావ్యం. కోకిలమ్మ పెండ్లి విశ్వనాధ సత్యనారాయణగారి మరో అపూర్వ గేయకావ్యం 'కోకిలమ్మ పెండ్లి. ఇది ప్రతీకాత్మక కావ్యం (9౫/౧౦౦|0 ౧౦౪౧) ఆంగ్లంలో ఇటువంటి కావ్యాన్ని 4630౧ అంటారు. ఇటువంటి ప్రతీకాత్మక కావ్యం ఆధునిక సాహిత్యంలో ఇదొక్కటే కనిపిస్తుంది. “కిన్నెరసాని పాటలు” తెలుగు వాగు మీద రచించిన కావ్యం. కోకిలమ్మ పెండ్లి తెలుగు ఖాష మీద రచించిన కావ్యం. అనగా అనగా ఒక రాజు. ఆ రాజు కిద్దరు కూతుళ్ళు. చిలక తల్లి, కోకిలమ్మా చిలకతల్లేమో ముద్దుల మొలక, పుట్టటంతోనే పలకడం నేర్చుకొన్నది. కోకిలమ్మ నల్లనిదే కాదు. పుట్టుమూగ కూడా. తల్లిదండ్రులకూ అందరికీ చిలక తల్లంటేనే ప్రేమ, కోకిలమ్మను ఎవరూ పట్టించుకోరు, చిలకతల్లిని పెళ్ళాడటానికి ముచ్చటపడి వెదపండితుడు వస్తాడు. కోకిలమ్మ మనస్సులో ఎంత బాధపడిందో, కాని, అడవుల వెంటపట్టింది. అంతలో వసంతం వస్తుంది. వసంతుడి రాకతో కోకిలమ్మ గొంతు ముడివిడివడుతుంది. ఇన్నాళ్ల మూగ గొంతులో రాగాలు జాలువారుతాయి. వసంతుడే కోకిలమ్మను పెళ్లాడుతాడు. ఇదీ కధ. ఇందులో చిలక తల్లి సంస్కృత భాషకు, కోకిలమ్మ తెలుగు భాషకు ప్రతీకలు. కావ్యం చివర చిలక తల్లి మహాన్వయంబున నిలిచినవి సాంస్కృతిక వాక్కులు కోకిలమ్మా తెనుగు పలుకూ కూడబెట్టిందీ అని కవి చెప్పేవరకు చిలక తల్లెవరో, కోకిలమ్మెవరో తెలియదు ఈ ప్రతీకల దృష్టా చూస్తే ఈ కావ్యంలోని గాంభీర్యం, సొగసు అర్థమవుతాయి. లేకపోతే “అనగనగా ఒక రాజు” కధే అవుతుంది.

172 భాదకవిశర్వయురం - గేయరచన్రలు విశ్వనాధ సత్యనారాయణ ఈ కావ్యాన్ని వ్యావహారిక భాషలోనే రచించి, తెలుగు భాషలోని సొగసులను చూపించినాడు. తెలుగు నుడికారాన్ని తెలుగు జాతీయాలను ఈ కావ్యంలో చెరిగిపోసినాడు, వాడుకభాష జీవనాడిని పట్టి చూపించినాడు. ఉదాహరణకు చెట్టుతోనో పుట్టతోనో చెప్పుకుందా మన్నగానీ ఎట్టివాడో వాదు నోరూ పెట్ట లేదాయే ఈ కావ్యాన్ని పూర్తిగా ముత్వాలసరం ఛందస్సులోనే రచించినారు. ఈ కావ్యంలో ఛందఃప్రయోగ వైవిధ్యాన్ని గురించి రెండవ అధ్యాయంలోనే పరిశీలించడం జరిగింది. “కిన్నెరసాని పాటల లోనూ, కోకిలమ్మ పెండ్లిలోనూ గేయాన్ని చాలా వేగంగా నడిపినారు. గేయంలో ప్రాణవంతమైన పలుకుబడిలో వేగవంతమైన నడకను సాధించడం ఈ కావ్యం విశిష్టత. కోకిలమ్మా అదుగో మళ్ళీ కూూసె నంటే కూసె నానీ వచ్చెనంటే వచ్చెనానీ బ్రతికె నంటే బ్రతికెనానీ ఒళ్ళు తెలియక అడవి పూటా పొర్లి పోయింది “కోకిలమ్మ పెండ్లిలో కూడా "కిన్నెరసాని పాటలిలో లాగానే పునరుక్తి అధికంగా కనిపిస్తుంది. పై ఉదాహరణలో పునరుక్తి వల్లనే గేయానికి వేగం వచ్చింది (హెచ్చింది). పునరుక్తిని గురించి “కిన్నెరసాని పాటల) విషయం చెప్పెటప్పుడు విపులంగా వివరించడం జరిగింది. కోకిలమ్మ పెండ్లిలో కూడా శబ్ద్బనాదరమ్యత (శ్రవణపేయం చేస్తుంది. ఎంకి పాటలు భావకవుల ఊహా (ప్రేయసులైన ఊర్వశి, హృదయేశ్చరి, కిన్నెరసాని మొదలైన వారికీ, ఎంకికీ ఎక్కడా పోలికలేదు. ఊర్వశి వంటి ఊహా ప్రేయసులు కలలకడలి అలల మీద నడచివచ్చిన కమ్మని కవితా సౌందర్యమూర్తులు. ఎంకి తెలుగు పల్లెపడుచు పిల్ల. “ఎంకివంటి పిల్లలేదు ఆమె నాయుడు బావతో మనసు కలిపింది, మనువాడింది. ముచ్చట్లు 'సెప్పింది, కోటి మురిపాలు సూపింది. కోటి కోర్కెలు రేపింది. “సంకలో

ఆధునికాంధ్ర గేయ కవిత్వల 173 పిల్లాడు సంబ్రాలు పడుతుంటే నాయుడు బావతో తీర్తానికెళ్ళింది. “'సరిగింగ తాణాలు చేసింది. ఎంకి పాటలు దాంపత్య ప్రణయాన్ని నిసర్ణ సుందరంగా చిత్రించిన పాటల సంపుటి.

సెక్కిట సిన్నీ మచ్చ

సెపితే సాలదు లచ్చ

వొక్క నవ్వే యేలు

వొజ్జిర వాయిదూరాలు

కళ్లెత్తితే సాలు

కనకాబిసేకాలు ఇదీ ఎంకి మూర్తిచిత్రణం.

ఎంకీ 'నవ్వు నవ్విస్తాది. యొల్లి మాటాడిస్తే యిసిరి కొడతాది; కన్ను గిలికిస్తాది...

బులిపిస్తాది, దగ్గరస కూసుంటే అగ్గిసూన్తాది; ఎంకి 'రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల “సత్తెకాలపు యెంకి, “ఉత్తమా ఇల్లాలు”

పూలబాసలు తెలుసు ఎంకికి; “పూలమనసులు తెలుసు ఎంకికి

పూలెరుగు నాకోత నీలెరుగు నామోత... అంటుంది ఎంకి ఇదీ ఎంకి స్వభావ చిత్రణం

ఎంకెవ్వర ని లోక

మెపుదైన కదిపితే

వెలుగు నీడల వైపు

వేలు సూపింతు? “ఇదీ ఎంకితనం'

జానపద గేయాల బాణి, ఖండకావ్య నిర్మాణశిల్పం, దాంపత్య (పేమ, గోదావరి

జిల్లా కర్షకుల భాష-ఎంకి పాటల విశిష్టలక్షణాలు. భావకవిత్వంలో మొదటిసారిగా దాంపత్య ప్రేమను చిత్రీకరించిన పాటలివి. అంతకుపూర్వం అధికార్ల సూర్యనారాయణ 'జానకి' అనే కావ్యంలో దాంపత్యజీవనాన్ని చిత్రీకరించినారు. అయితే అది పద్యకృతి. పైగా దాని కంత ప్రశస్తిరాలేదు. నండూరి సుబ్బారావుకు అధికార్ల సూర్యనారాయణ సాహచర్యం, గేయరచనలో అన్నిటా గురజాడ మార్గాన్ని అనుసరిస్తున్న బసవరాజు అప్పారావు సాహచర్యం లభించడంవల్ల, దాంపత్య ప్రణయాన్ని గేయాలలో చిత్రీకరించి ఉండవచ్చు. ఎంకి పాటల రచనకు ముందు నండూరి వల్లూరి జగన్నాధరావు "కోడి పాటలు, “గొల్ల పాటలు 'విస్కీ పాటలు మొదలైన వాటిని “చల్‌ మోహన రంగా

[74 భాదకథిర్వయురీం - దేయరచన్రలు వాటలను, కమ్మగా గొంతెత్తి పాడి వినిపించేవారు. ఆ పాటల రచనా సౌందర్యం అతని మీద ప్రభావం చూపి ఉండవచ్చు. అయితే ఈ ప్రభావం పరోక్షమైనది. అతని మౌలిక ప్రతిభ మీద ఏ మాత్రం ప్రత్యక్ష ప్రభావం లేనివి. ఎంకి పాటలన్నీ నవనవోన్న్మేషణశాలిని అయిన అతని ప్రతిభాలతకు ననలెత్తిన నవకుసుమాలే. జానపద భాషలో ఉత్తమ కవిత్వాన్ని రచించడంలో నండూరిని ఆంగ్ల కవి అయిన బర్స్‌ కవితో పోలుస్తారు. '864౧9 11166664 016 1౧6606౧1 50౧05' * అని ఆంగ్ల విమర్శకుల అభిప్రాయం. 'వుర్దూలోని (పేమగీతాల వలె బరన్స్‌ (864గ౩) స్కాచ్‌ పద్యాలవలె-పూర్వకాలపు పర్షియన్‌ కవుల ధీరమయిన కవిత్వం వలె-వైష్టవ గోపికా గానంవలె ప్రత్యేకమైన విలువగలిగిన ఆంధ్ర ఐశ్వర్యం యీ పాటలు అని సౌందర్యోపాసకుడైన చలం అభిప్రాయపడినాడు. *

ఎంకిపాటలు విడివిడి పాటల సంపుటే అయినా, ఏ పాటకాపాట ఒక ఖండ కావ్యంగా ఉన్నా సమాహారంగా చూసినప్పుడు కావ్యానుభూతి కలుగుతుంది. యొంకి పాటలను ఒక క్రమంలో పరిశీలిస్తే ఒక ఉదాత్త ప్రణయ కావ్యమే అవుతుంది* అయితే కవికి ఈ పాటల రచనలో కావ్యదృష్టి లేదు. అందుకే ఒక క్రమం, ఒక ప్రణాళిక ఉండదు. అప్పుడప్పుడూ రాసిన వాటలివి. ఒక్కొక్క పాట కవి అనుభూతి కడలి కెరటంలా ఎగిసివచ్చింది. ఒక్కొక్క వాట అప్పటి కవి చిత్తవృత్తి (౧౦౦౦) ని తెలుపుతుంది. అందుకే తొలిపాటలో ఎంకి కులపాలికగా, మలిపాటలో అభిసారికగా కనబడవచ్చు. ఒక పాటలో ముగ్గగా, మరొక పాటలో విరహదగ్గగా కనబడవచ్చు. ఒక పాటలో “ఉత్తమా ఇల్లాలు'గా, మరొక పాటలో స్పైరిణిగా కనబడవచ్చు. ఏమైనా అన్నీ, “ఎంకి” మీద ఉన్న పాటలే. నండూరి ఎంకి పాట తప్పితే మరే పాటా రాయలేదు. ఎంకి పాటలను ఒక క్రమంలో పరిశీలిస్తే కావ్య దర్శనం కలుగుతుంది. ఒక ప్రణయ పధం కనిపిస్తుంది. ఈ ప్రణయపధంలోని నాలుగు దశలను నారాయణరెడ్డిగారు (1) పూర్వరాగం (2) దాంపత్యయోగం (3) విప్రయోగం (4) పూర్ణయోగం అని పేర్కొన్నారు. లం కొన్ని వొాటలు ఎంకి, నాయుడు బావలు వివానినికి పూర్వం వాడుకొన్న ప్రణయగీతాలు. కొన్ని పాటలు దాంపత్య జీవితాన్ని చిత్రించేవి. మరికొన్ని కలహాలను, కయ్యాలను విరహాలను తెలిపేవి. ప్రణయ తత్త్వాన్ని వ్యాఖ్యానించేవి మరికొన్ని, ఈ విధంగా సమాహార దృష్టితో చూసినప్పుడే “ఎంకి సమగ్ర స్వరూపం అవగతమవుతుంది.

ఎంకిపాటలు వెలువడిన రోజులలో “ఎంకి స్వీయయా, పరకీయయా మొదలైన విషయాల మీద “గాలి దుమారా' లెన్నో చెలరేగినాయి. ఇటువంటి దుమారాలకు కారణం బహుశః ఏ పాట కాపాట విడివిడిగా పత్రికలలో ప్రచురితమవుతున్నప్పుడు సాకల్య దృష్టితో చూసే వీలులేకు శకల (విడివిడి ఖండికల) దృష్టితో చూడటమే కావచ్చు. ఏమైనా *ఎంకి పాటల లో ఎంకి, నాయుడు బావ ఇద్దరే పాత్రలు. నాయుడు బావ

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 175 మరోస్టీని ప్రేమించినట్లు గాని, ఎంకి మరో పురుషుని ప్రేమించినట్లుగాని ఎక్కడా దాఖాలాలు కనిపించవు. పైగా వారిద్దరూ కలిసి “సంకలో పిల్లాడు సంబ్రాలు పడుతుంటే" తిరుపతి, భద్రాద్రి, కాశి తీర్ధాలు సందర్శిస్తారు. ఒక్కసారో, ఒక్క ఏడో రాసిన పాటలు కాకపోవటం వల్ల, జీవితకాలమంతా రాసిన పాటలు కావటం వల్ల ఎంకి ఎన్ని తీరులు గానో దర్శనమిస్తుంది. ఎంకి పాటలలో జీవితమంత విస్పృతి కనిపిస్తుంది. ఎంకి పాటలలో చిన్న చిన్న మాటలతో కట్టిన బొమ్మలు ప్రతి పాటలోను పలుకరిస్తుంటాయి. “ఏటికడుపున దాగి తోట నిదరోయింది.* 'యెలుతురంతా మేసి యేరు నెమరేసింది'-అట్లా ఇంత తక్కువ మాటలతో ఇంత ఉత్తమ చిత్రాలు గీయడంలో భావకవులలో నండూరి ప్రసిద్దుడు నండూరి చూపుతో మాట్లాడి వూపిరితో తెనిగించిన పాటలు కాబట్టి, ఆ పాటలలోని మాటల బొమ్మలు, 'కనుబొమ్మతో నవ్వి మనసు కరిగిస్తాయి. 'నా సొగసు నన్నైన సూసుకోనీడమ్మా', “ఆవు మెళ్లో మువ్వలట్టె మోగినవేటె, సుక్కెక్కడున్నదో సూడవే చెల్లీ- అనే పంక్తులు 'ఈ రేయి నన్నాల్ల నేరవా? రాజా, ఎన్నెలల సొగసంత యేటి పాలేనటర, ఒక్కతెను నాకేల ఓపజాలని సుకము”- అనే పంక్తులు "కన్నీరు నీకేల సెందురుడా, కనికారమే శాన సెందురుడా” అనే పంక్తులు విరహతీవ్రతను వ్యంజింపజేసే ఉత్తమ కవితాపంక్తులు. ఇంత తక్కువ మాటలలో, ఇంత మామూలు భాషలో, నిరలంకారమైన నిసర్ణ సుందరమైన రీతిలో గుండె కోతవడేటట్లుగా విరహతీవ్రతను వ్యంజింపజేయడం ఎంకి వాటల ప్రత్యేకత. (గోవు మాలచ్చిమి” అనే పాట ఎంకి, నాయుడు బావల దాంపత్యం ఎంత ఉదాత్తమైనదో ధర్మదేవత చెప్పిన మౌనభాష్యం “ఆరిపేయవే దీపం” అనే పాట నాయకుని ఇంద్రియాతీతమైన సౌందర్య దృక్పధాన్ని ఆవిష్కరించింది.

ఎంకి పాటలలో ముఖ్యంగా “'యొట్ళీ నా యెంకి” 'గోవు మా లచ్చిమి'” “ఆరిపేయవే దీపము, 'యెంకి సూపు' నిర్మాణ శిల్చం దృష్టా ఉత్తమోత్తమమైనవి. మాటల ప్రయోగంలో ఎంతో పొదుపరితనం ఉన్నవి. మాట పొదుపరితనంలో ఎంకి పాటల తీరే అంత. “అద్దములో నా రాజు అంత నీ రూపు ఇంతముత్తెములోన యిరికె నేలాగు అని అబ్బురపడినట్లు నండూరి కొండంత భావాన్ని రవంత మాటలో ఇరికిస్తాడు.

ఎంకి పాటలు జొనపద గేయాల బాణీలో రచించిన పాటలు, అయితే వీటిని జానపద గేయాల కోవలోకి చేర్చలేము. భాషలోను, భావంలోను, క్లుప్తంగా సూటిగా చెప్పే తీరులోను జానపద గేయాల ఒరవడి ఉన్నమాట నిజమే. ముఖ్యంగా వాత పాటలు. వాతపాటలను మొదట రచించి, తరువాత వాడుకొన్నవి కావు. 'గుందె గొంతుక "లో ఒక రాగం కదలాడినప్పుడు భావం దాని కనుగుణంగా సాగింది. మొదట షాట గళంలో ఊపిరి పోసుకొని, తర్వాత కలంలోకి జాలువారింది. పాడిన తర్వాతో, పాడుకుంటూనో రచించిన పాటలివి. ఈ దృష్వా పాతపాటలు లిఖిత సంప్రదాయానికి

176 భావకఠిత్సయుదరం - దేయరచదన్రలు (4/గ౧ఈ6౧ (4641110౧) చెందినవి కావనే చెప్పాలి. మౌఖిక సంప్రదాయానికి (0121 1161100) చెందినవే. ఇంతవరకు పాతపాటలను జానపద గేయాలుగా చెప్పవచ్చు. కాని ఆ పాటలకర్త నండూరి జానపదుడు కాదు, నాగరికుడు. ఆంధ్ర, ఆంగ్ర సాహిత్యాలను కంరదఘ్నంగా చదివిన కళామర్శ్మజ్జ్డుడు అయిన ఒక ఉత్తమ సంస్కార హృదయం నుంచి వెలువడిన రసగీతాలివి. అంతేకాదు, ఆ పాటలు జానపదుల కోసం రచించినవి కావు. సాహిత్యాభిమానులకోసం రచించినవి. పాటల కరా, శోతా కూడా జానపదులు కారు. కనకనే ఈ పాటలు జానపద గేయాలు కావు. ఎంకి పాటలలోని కొత్త పాటలు లిఖత సంప్రదాయానికి (4౧16౧ 12641100) చెందినవేనని చెప్పాలి. వాటిలో ఎంతో జిలుగుతనం ఉంది. 'పాతపాటలిలోని నిసర్గ సుందరత తగ్గి, నిర్మాణ మార్మికత పెరిగింది. కొత్త పాటలలో, భాషలోను, భావంలోను, బాణీలోను 'పాత”-'కొత్త (పాట) లకు ఎంతో ఆంతర్యం ఉన్నది. “'వొనలచ్చిమి), 'వనలక్షి, 'వనదేవి' అయింది. 'సిలుకి, “చిలుక! అయింది. అసలు 'యెంకే, “ఎంకి గా మారివోయినప్పుడు పాతపాటలకు, కొత్త పాటలకు ఎంతో తేడా కనిపిస్తుంది. పాత పాటలలో పల్లెల పలుకుబడి, యాస చోటు చేసుకోగా, కొత్త పాటలలో భావకవుల పదమాధుర్యం నిండిపోయింది. భావంలో కూడా ఈ రెండు 'పాటలి మధ్యా భేదం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. పాతపాటలలో “గోదావరి గంగలో కొంగూ కొంగూ గల్టీ, కరువు తీరా బుటకలేదామా; సరిగెంగ తాణాలు సేదామా అనే నిసర్గ సుందరమైన భావం “రవల వెలుగుల గంగ రమ్మందిరా, యొంకి, శివమెత్తి తానాలు చేసిందిరా' అని ప్రౌఢోక్తిని సంతరించుకొంటుంది. 'సుక్కెక్షడున్నదో సూడవే చెల్లి అని అమాయకంగా ముగ్ధమోహనంగా నిరీక్షించిన 'యెంకి, 'ఎన్నెలల సొగసంత యేటి పాలేనటర* ఒక్కెతను నాకేల ఓపజాలని సుకము* అని ప్రాఢధగంభీరంగా అడుగుతుంది “ఎంకి, భావకవులు సుందరమైన భావాలను వెలువరించడానికి [గ్రాంధిక భాషలోనే సుకుమారమైన, మధురమైన పదజాలాన్ని ఏరి ఏరి కూరుస్తున్న రోజులలో నండూరి ఒక్కడే వాడుకభాషలో అందులోనూ మాండలిక భాషలో పల్లీయుల యాసలో కవిత్వం రాయడం గొప్పు సాహసమే. ఎన్ని దుమారాలు రేగినా వెనకకు తగ్గకుండా, ఆ భాషలోనే, ఆ బాణీలోనే పాటలు రాయడమే దానికి సమాధానంగా భావించినాడు. పాటకజనుల భాషలో పాటలు రాయడం గొప్పేమీ లేదు. సారంగపాణివంటి పదకర్తలు మాండలిక భాషలో, యాసలో పదకృతులు రాసిన వారున్నారు. అయితే వాడిన [శఘతిమాటా రసవ్యంజకంగా ప్రయోగించడం నండూరి ప్రత్వేకత. “ఎంకి పాటలు” పూర్తిగా మాండలిక భాషలో ఉన్నవి కావు. 'పాత పాటల'లో కొన్ని మాండలిక పదాలు ఉన్నమాట వాస్తవమే. 'పద్దాక' (పొద్దస్తమానం), వల్లకుండు (ఊరకుండు), ఓలె (ఓసి, వోపాలి (ఓసారి,

ఆధుధికాంధ్ర గేయ కదిత్వం 177 దగ్గరస (దగ్గరగా), కొత్తి (పొయ్యి) ఆపడితే, (అగుపడితే) మొదలైనవి. అయితే ఈ పదాలన్నీ ఒక మండలానికి (గోదావరి జిల్లాకు) సంబంధించినవే కావు. సాగరాంధ్రసీమ మాందలిక భాష అని చెప్పాలి. ఉదాహరణకు “పద్దాక అనే మాట కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా వినిపిస్తుంది. అయితే ఇటువంటి మాండలిక పదాలు తక్షువే. గ్రాంధిక రూపాలకు కొద్ది మార్చులతో చేసిన వ్యావహారిక రూపాలే ఎక్కువ.

జదావారణకు

(1) (గ్రాంధికంలో *చి కార రూపాలు వ్యావహారికంలో 'సి కార రూపాలు అయినవి. చూపు -సూపు, చీకటి-సీకటి మొదలైనవి.

(2) (గ్రాంధికంలో *వి కార రూపాలు, వ్యావహారికంలో 'యి కార రూపాలుగా మారినవి. వింత-యింత మొదలైనవి.

(8 (గ్రాంథికంలో *వి కార రూపాలు, వ్యావహారికంలో “వొ కార రూపాలుగా పొందినవి. వాసన-వోసన, వన్నె చిన్నెలు-వాన్నె సిన్నెలు మొదలైనవి. ఇటువంటి పద ప్రయోగాలే ఎక్కువగా ఉన్నందువల్ల “ఎంకి పాటలు అందరికీ

అర్ధమయినాయి. ఎమైనా జానపదుల భాషకు, పాటకు సాహిత్యగౌరవం కలిగింది

“ఎంకి పాటలి'తోనే. ఎంకి పాటలననుసరించి లచ్చివాటలు, సీర్రిపాటలు, లంబాడీ

పాటలు, కాపుపాటలు, మల్లిపాటలు మొదలైనవి వచ్చినా, భాషలోను, భావంలోను

ఎంకివాటల స్థాయిని అందుకోలేకపోయినవి. ఎంకి పాటలలో ఛందస్సు జానపదగేయాలకు మాతృక అయిన ద్విపదే. చాలా

వరకు పాటలన్నీ ఖండగతిలోనే నడుస్తాయి. *తపస్సు” కోకోకో' అనే పాటలు మి(శగతిలో ఉన్నాయి. ఒకేగతిలో ఉన్నా నడకలో ఎంతో వైవిధ్యం ఉన్నవి. ఇవి పాటలు కాబట్టి పల్లవి ఉంటుంది. కొన్నిటిలో పల్లవి లేకుండా చరణాలు మాత్రమే ఉన్నాయి. చాలావరకు పల్లవి ద్విపద ఛందస్సులో ఉంటుంది. పాట కాబట్టి చివర రెండు మాత్రల జాగా సాగదీయడానికి బాగుంటుంది. పదజాలంలో 10 మాత్రలు ఉంటాయి. పల్లవిలో నాలుగు ఐదేసి మాత్రల గణాలు, (జాగాతోసవా) చరణాలలో రెండు ఐదేసి మాత్రల గణాలు ఉంటాయి. పల్లవి, చరణాలు సమానంగా ఉన్నవి కూదా ఉన్నాయి. నండూరి పల్లవి నిర్మాణంలో చాలా సొగసులు చూపించినాడు. ఉదాహరణకు

మనిసే సాలు..

మనిసి వోసనె సాలు

మనిసి మాటే సాలు

మనసే.సాలు..

178 భావకథిత్వయురం - గేయరచన్రలు పై పల్లవిలో మొదటి పాదంలో మొదటి అర్ధభాగంలో జాగాలున్నాయి. (నాధారణంగా జాగాలు చివర ఉంటాయి రెండోపాదంలో చివరి సగభాగంలో జాగాలు న్నాయి. రెండు పాదాలలోను రెండు విధాలుగా ఉండటంవల్ల పాదాలు తూకంలో కొద్దిగా భేదం ఉంది, మంచి తూగు వచ్చింది. పల్లవిలోని ఎత్తుగడను విన్నప్పుడు ఒక జానపదగేయంలోని “అంతే నాకు చాలు తమ్మలపాకు తొడిమే పదివేలు అనే ఎత్తుగడ గుర్తుకు వస్తుంది. ఎత్తుగడ తప్పితే ఈ రెండు పాటలకు ఎక్కడా పొత్తే లేదు. అట్లాగే యీ యేపు నోయావు ఆ యేపు నోయావు జోదావులకు నడుమ నాయెంకీ- అని అన్నప్పుడు యీకాడ నోకొండ ఆకాడ నోకొండ కొండ కోనల నడుమ నాయెంకీ- అని అన్నప్పుడు జానపదగేయంలోని 'అటుకొండ యిటుకొండ ఆ రెంటి నడుమ” అనే ఎత్తుగడ గుర్తుకు వస్తుంది. ఇట్లా అక్కడక్కడ జానపదగేయాల బాణీలు రేఖా మాత్రంగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో ఎంకికి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉందనే ఉంటుంది. “నా పెరె నా రాజు పాట అను అపవాదు ఈ జన్మకే కాదు ఎప్పటికి పోదు” అని ఎంకి అన్నట్టు “ఎంకి షాటలి కర్తగా నండూరికి వచ్చిన “అపవాదు” ఎప్పటికీ పోదు. శశికళ

శశికళ అడవి బాపిరాజు గారి కల. ఆమె అతని 'ఆశయమూర్తి, 'ఆత్మ పూజాపీరస్థ శిల్చ్పకళాలక్ష్మి, ఆమెకోసం అతడు *“చంద్రలోకం తూర్పుదిసలో), 'సూర్యలోకం పశ్చిమంలో ఒక చిన్న లోకమే సృష్టించుకొన్నాడు. ఆమె బాపిరాజుకు స్వాప్నిక సౌందర్యమూర్తే కాదు ఆరాధ్యదేవత. ఆమె 'సూర్యసుతి, 'చంద్రబాలి, “గాన శిల్పాది చిత్ర కళామూర్తి, అతనిలోన ఆమె “నిత్య యౌవని, ఆ బాలకోసం బతుకే ఒక కలగా, హృదయమే ఒక మాలగా చేసుకొని అంతటా అన్వేషించినాడు అంతులేని ఆరాటంతో, అలసటే లేసి ఆశతో...

“శశికళ కొన్ని గీతాల సంపుటి. ఏ గీతానికాగీతం స్వతంత్రంగా ఉన్నట్లనిపిస్తుంది 'ఎంకి పాటల” లాగే. అయితే ఈ గీతాలన్నీ ఒకే పాత్ర చుట్టూ అల్లుకొన్నవి. ఒకే వస్తువు (ప్రణయలికు సంబంధించినవి. కనక ఈ గీతాల సంపుటిని గేయకావ్యంగా పేర్కొనడం జరిగింది. ఈ గీతాలలో కధలేదు. “ఎండిమియాన్‌' వంటి ఒకటి రెండు గేయాలలో కొంత కధాస్పర్శ ఉన్నది. బాపిరాజు తమ గురువైన కూల్టేదొరతో కలిసి తీర్దయాత్రలు చేస్తూ ఒకసారి అజంతాలోయలో వెన్నెలలో బండరాయి మీద నిదుర

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 179 పోతున్న సమయంలో అతని (బాపిరాజు) మీద ఒక వెలుగు రేక వాలుతుంది. దానిని కూ్రే దొర 'అజంతా లోయలో బాపిరాజు అనే పేరుతో చిత్రంగీసి “ఎండిమియాన్‌” అని నామకరణం చేసినాడు.ఎండిమియాన్‌ గ్రీకు దేశపు గోపబాలుడు. అతడు కూదా ఒకరోజు ఆవులు మేపుకొంటూ గండశిలపై నిదురపోతే ఒక దివ్యాంగన అతని మీద వాలినదట. తరువాత ఇరువురూ కలిసి ప్రణయ రాజ్యాలు ఏలినారు. ఈ కథ మూడు వేల వళ్ళనాటిదట. ఈ కధను కీట్సు మొదలైన రొమాంటిక్‌ కవులు కావ్యాలుగా రచించినారు. బాపిరాజుకు అజంతా లోయలో తారసిల్లిన సంఘటన, 'ఎండిమియాన్‌కు జరిగిన సంఘటన సరిగ్గా పోలి ఉన్నది. మూడు వేల ఏళ్ళనాటి ఆ అప్సరస మళ్ళీ ఈనాడు తనను ఈ రూపంలో అనుగ్రహించిందని భావించి, ఆ రూవాన్ని సాక్షాత్కరింప జేసుకోవడానికి అడవి బాపిరాజు అడవుల వెంబడీ, కోనల వెంబడీ, కొండవాగుల వెంబడీ అన్వేషిస్తాడు. ఆ కవితా రూపమైన అన్వేషణే “శశికళ, తన పితులందరికీ వారి ఇష్టదేవులు (దేవతలు) యెంకి, హృదయేశ్వరి, కిన్నెరనాని, ఊర్వశి కలరు. “తన (బ్రతుకు (శ్రుతి కలిపి వలపించు సతిగా బాపిరాజు ఊహా(పేయసి 'శశికళిను సృష్టించుకొన్నాడు.** బాపిరాజీ విధంగా ఊహా ప్రేయసితో సంయోగవియోగాలనుభవించి, సమస్త కళా ప్రసూనాలతో అర్చించినాడు. బాపిరాజు స్వభావతః చిత్రకారుడు, గాయకుడు, స్వాప్పికుడు, భావుకుడు తన సౌందర్యమూర్తిని మాటల కుంచెలతో, రాగాలరంగులతో “శశికళ కావ్యంగా చిత్రించినాడు. ఈ కావ్యంలోని గీతాలన్నీ ఆత్మాశయరీతిలో సాగినాయి. ప్రతి గీతంలోనూ బాపిరాజు గొంతే వినిపిస్తుంది. బాపిరాజు గుండే పలుకుతుంది. ఒకటి, రెండు గీతాలలో “శశికళ బాపిరాజు గొంతుతో గొంతు కలుపుతుంది. బాపిరాజు అన్ని గతులలోను “శశికళా గీతాలు పలికించినారు. “నిరీక్షణ”, “నగ్న మొదలైన గేయాలు త్రిశగతిలోనూ, 'తెర “ప్రత్యక్షము, 'ఆశయదేవి' మొదలైన గేయాలు చతురస్రగతిలోనూ, '“అమరత్వము*, “అనర్హత, 'నువ్వటే' 'పువ్వటే' మొదలైన గేయాలు మి(శగతి (ముత్యాలసరాలు) లోను నదునాయి. ఇవి పాటల ధోరణిలో రాసినవి కాబట్టి కొన్నిచోట్ల కొన్ని మాత్రలు ఎక్కువగానో, తక్కువగానో ఉంటాయి. 'మన చెలిమి” అనే గేయంలో బాపిరాజు భావకవుల ప్రణయ సిద్దాంతాన్ని (ప్రతిపాదించినాడు. నా సఖీ మన చెలిమి వేసటే నట భువికి కాసంత ఉపకాది కాదంట మనుజునకు

180 భావకనిర్వయుగం - ేయరచనై్రలు కళలైన సాంఘిక రాజకీయార్థికా చరిత భావోద్రిక్త సంకలితమై యుండ వలె నంట మనుజప్రగతికి దారంట అవి అనే లోక విమర్శకు ప్రతిగా భావకవుల ప్రతినిధిగా బాపిరాజు 'జమ్ముమనే మధురటశుతి వినిపించే తుమ్మెదల ఆటలు, కోకిలల పాటలు పుష్పగంధవ్యాప్తి, పూర్ణ చంద్రుని దిప్తి-ఇవన్నీ అర్ధరహితమైనవేనా? అని ఎదురు ప్రశ్న వేస్తాడు. లోక విమర్శకు సమాధానంగా ప్రకృతిలో సౌందర్య ప్రత్యక్ష దృశ్యాలు వికసితోత్తమకృషులు సకల కావ్యములు కళలు నరజాతి ప్రగతి కవి ఆలంబనోద్దీప నాధారములు సౌందర్య సంధాన సందర్భ్శనోదృ్భృవము అనందమో దేవి! ఆనందమే శక్తి ఆనందమే ప్రగతికై నరులకిదు రక్తి ఓ సఖీ మన (పేమ అసాధ్య మీ భువికి అనంద సౌందర్య ప్రాణమే మనుజునకు- అని ప్రణయ కవితా సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తాడు. బాపిరాజు “శశికళ మీద డాంటే (౧౬౧169), రోసెటి (౧౦9౦౭6) మొదలైన కవుల (ప్రభావమున్నదని వావిలాల సోమయాజులు అభిప్రాయపడినారు.* ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి భావసముద్రమథనానంతరం ఒక చేతిలో పద్యకలశాన్నీీ మరొక చెతిలో గేయకలశాన్నీ పట్టుకొని అవతరించిన అమృతమూర్తి ఊర్వశి. కృష్ణశాస్త్రి గారి కలం నుంచి పద్యమైనా పాటలాగా పరుగులు తీస్తుంది. పాటమాట సరేసరి. అది పక్షే అందుకే విమర్శకులు కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధాన గుణం గేయం అని అభిపప్రాయపడినారు*ే

ఆధునికాంధ్ర దేయ కఠిర్వల 181 ఊర్వశి కావ్యంలో ఉత్తమ కవితా వాహికలుగా అటు పద్యమూ, ఇటు గేయమూ రైలు పట్టాలలాగా సమానంగానే, సమర్ధంగానే సహకరించినాయి. పద్యం గేయంలాగా రెక్కలు విప్పుకోవాలని చూస్తుంది. గేయం పద్యాల ప్రాధగమనం కోసం పాకులాడు తుంది. ఉదాహరణకు క్షే నునుమబ్బు లేదున్క కొనలపై సోనలౌ నెలవంక చిలునవ్వు చలువ వాట తొలి ప్రొద్దుపొడుపు రేకుల పైడి దారుల ఏరులౌ మంచు కన్నీరు పాట లై ధూళికై వాలు మౌళిపై దాలిచికొన ఇంత విరిదోటలో నపుదెంత వెదకి పై రెండు ఉదాహరణలు ఛందస్సు దృవ్త్వా మొదటిది సీసపద్యమూ, రెందవది తేటగీతీ కావచ్చు. కాని గేయగంధాన్ని దట్టంగా పట్టించుకొన్న పద్యపాదాలు. ఒకటి, రెండు మాత్రలు ఎక్కువగానో, తక్కువగానో ఉండి, ఖండగతిలో తాళబద్ధంగా నడుస్తాయి. ఈ రెండు పద్యాలు ఎక్కువగాను, తక్కువగాను ఉన్న మాత్రలను కుదించుకొనోో, సాగదీసో పాడవచ్చు. మరో ఉదాహరణ (గేయంలో పద్యగమనం,). మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్ఞి! నీ వెలుగు చూపొక రేయి వికసించి వాసించి పై గేయపాదాలు తేటగీతి పద్యం నడకను పుణికిపుచ్చుకొన్నాయి. మొదటి పాదం 'మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్ఞి వరకు తేటగీతి పాదమే, చివర గురువు (ని) చేరడం వల్ల ఖండగతిలోకి వస్తుంది.

  1. మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్ఞి ల్లి హాలాహలాంధకారానల జ్వల
  2. వైకుంఠ మృదు కంర వైెజయంతీమాల 4, అకాశ సికతాల నదడగి ప్రాకు స్రవంతి & టప్రాభాత గగన పూర్వ ప్రాంగణ మ్నౌనొ! పై గేయ పాదాలలోని సుదీర్హ సమాస రచన పద్యాలలో కనిపించే దృఢశయ్యను తలపింపజేస్తుంది. ఊర్వశి కావ్యంలో 'తొలివియోగిని నేనే! తొలి ప్రేయసిని నేనే 'నవనవ వసంత చరణముల నాట్యమ్ములా!' (ప్రేయసి! చలియింపని నీ చేయి జేయి గీలింపు, 'కలువపూ

1ఏ2 భావకథిత్వయురం - దేయరచదలు బ్రతుకులో గనుమోడ్డు వెన్నెలే, మఘవమస్తక మకుటమాణిక్య రాజ్ఞ మొదలైనవి గేయాలే. ఉదాత్త వస్తువుకూ, ఉత్తమ కవిత్వానికీ పద్యమైనా, గేయమైనా ఒక్కటేనని చెప్పడానికి “ఊర్వశి కావ్యమే ఉత్తమోత్తమ ఉదాహరణ. వకుళ మాలిక వకుళమాలిక గేయకావ్యకర్త తల్లావజ్ఞల శివశంకరశాస్తి. శివశంకరశా స్త్రి భావకవులకు పట్టుగొమ్మ. ఎందరో భావకవుల కవితారీతులను తీర్చి దిద్దిన కవికుల గురువు. నవ్యసాహితీ సమితి సంస్థాపకులు. శివశంకరశాస్త్రి కృతులన్నీ ప్రధానంగా గేయగుణాన్ని సంతరించుకొన్న రచనలు. భావకవితాయుగంలో ఎక్కువగా గేయరచనలు చేసింది వారే. వారి కృతులన్నిటిలోను సాధారణంగా పద్యాలు, గేయాలు కలిసే ఉంటాయి. అయినా శాస్త్రిగారు వాటిని గేయరచనలుగానే వ్యవహరించినారు. శాస్త్రి గారు రచించిన “పద్మావతీ చరణచారణ చక్రవర్తి నాటికలో జయదేవుని 'గీత గోవిందాన్ని (శ్రవ్యకావ్యంలో చేర్చవలెనా? గేయకావ్యంలో చేర్చవలెనా? అనే ప్రశ్నకు సమాధానంగా ఒకపాత్ర చేత ఇట్లా పలికిస్తారు. ఏగుణంబు మిగుల హెచ్చుగా గాన్పించు చుండు దానివలన నొదవు నాఖ్య యెట్టి కృతికైన, ఈ మహాకావ్యంబు నందు గేయగుణము తుందిలంబు (వద్దావతీ చరజబారణు చ్యకవర్తి శ. 289) పై పద్యం గీత గోవిందానికే కాదు శివశంకరశాస్త్రి రచనలకన్నిటికీ వర్తిస్తుంది. వారు తమ కృతులలో పద్యాలు వాడినప్పటికీ దేశిఛందస్సులలో ఎక్కువగా తేటగీతి, ఆటవెలదులే వాడినారు. సంస్కృత వృత్త ఛందస్సులలో వంశస్థము, వసంతతిలక, శిఖరిణి, పృధివి, సుగంధి, ఉత్సాహము, తోటకము, రధోద్ధతము, వనమయూరం వంటి చిన్న చిన్న వృత్తాలే ఎక్కువగా వాడినారు. ఈ వృత్తాలన్నీ చాలా వరకు గేయ గంధివృత్తాలే. తాళబద్ధంగా నడిచేవే. గేయాలలో ఎక్కువగా ముత్యాలసరాలు వాడినారు. శివశంకర శాస్త్రి కావ్యాలలో 'వకుళ మాలిక పూర్తిగా గేయరచన. ఇది 'గీతికా స్వగతము”, వకుళమాలికతో ఆత్నాశయరీతిలో కధ చెప్పించడం ఇందులో నవ్యత. ఇందులో నాయకునికి (మాధవుడు) పొగడపూలంటే ఇష్టం. ఒకరోజు నాయిక (ఇందిర) పొగడపూలను దండగా గుచ్చి ఈ వకుళమాలిక వాడిపోకముందే మీకు అర్ధాంగి

ఆధునికాంధ్ర గేయ కఠిత్వం 183 నవుతాను” అని అంటుంది. కాని కొంతకాలానికి ఏ కారణంవల్లనో ఆమెకు ప్రియుని పట్ల వైముఖ్యం కలిగి వివాహానికి ఒప్పుకోదు. ఒకనాడు నాయికా, నాయకుల బిగికౌగిలిలో పడుచు గుండెలమధ్య, ఉద్విగ్న హృదయాలమధ్య నలిగిపోయిన పొగడ పూలదండ, వారి భగ్న ప్రణయాన్ని కూడా వింటుంది. పొాగడపూలమాల తాను చూసిన, విన్న (ప్రణయగాధను చెప్పడమే ఇందులోని ఇతివృత్తం.

ఈ కావ్యం ఆత్మాశయరీతిలో సాగింది. ఈ కావ్యంలో పొగడపూల దండ తనను తాను నాయికగా భావించుకొని నాయకుని నుంచి విరహాన్ని అనుభవిస్తుంది. “త్రానేగనక పూలమాలగా కాక పూబోణిగా పుట్టి ఉంటే అతనినే వరించి ఉందేదానినని తలపోస్తుంది. '(పేమనగర్‌ కీ రాహ్‌ కరిన్‌ హై-అని ఈ కావ్యమిచ్చే సందేశం,

ఈ గేయకావ్యం ప్రధానంగా ఖండగతిలో నడిచింది. పాదానికి ఇరవై మాత్రలు ఉండి, ఐదు మాత్రలకు విరుగుతుంది. ప్రాస, అంత్యప్రాస నియమాలు నియతంగా పాటించని ద్విరదగతి రగడలో ఉన్నది. ఉదాహరణకు

పుష్పమాలికగానె పుట్టి యుండిన యేని పూబోణిగా నేను పుట్ట గల్గితి నేని అతనినే వరియించి ఆత్మవల్లభునిగా కౌగిలింతు తదీయ కంఠమే నేవేళ (శివళంకరళార్తి కుతులు, వ. 724 ఈ గేయకావ్యంలో జానపదగేయ బాణీల ననుసరించిన ఒకటి, రెండు పాటలు కూడా ఉన్నాయి. చల్లనౌ నాయాహ్న మోనాథా చక్కనౌ మార్గాన ఓనాధా నామోము వీక్తించు చోనాధా ఈ విధంగా చివర ఓనాధా సంబోధన చేర్చి పాటనంతా రచించినారు. ఈ పాట తెలంగాణాలో ప్రసిద్ధమైన “బతుకమ్మ పాటి నడకను పోలి ఉన్నది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో (చల్లనౌ సాయాహ్న మోనాధా) పహ్పృాదయేశ్వరి శివశంకరశాస్త్రి కావ్యాలలో '“హృదయేశ్వరి' ప్రశస్తికెక్కిన కావ్యం. అయితే ఈ కావ్యం పూర్తిగా గేయరచన కాదు. ఆటవెలది, తేటగీతి, ముత్యాలసరాలలో ఈ కావ్వాన్ని

ప్రత భాదకఖిరృ్వయురం - దేయరచదన్రలు రచించినారు. 'వకుళమాలికి గేయకావ్యంలోను 'హృదయేశ్వరి” లోను ఇతివృత్తం భగ్న ప్రణయమే. పైగా 'వకుళమాలికి గేయకావ్యం 'హృదయశ్వరి? కావ్వానికి అనుసంధాన కావ్యమెమో అన్నట్లు ఉన్నది. “హృదయేశ్వరి' కావ్యంలో నాయిక ఇంటి ముందున్న పొగదడపూల చెట్టును మాటిమాటికి వర్ణించడం ఉన్నది. ఆ 'పొగడ పూలమాల” (వకుళమాలిక) పేరుతోనే తర్వాత గేయకావ్యంగా రచించినారు. 'శివశంకరశా స్త్రి కృతులు! అనే గ్రంథంలో కూడా 'హృదయేశ్వరి" తర్వాత “'వకుళమాలికిను ముద్రించడం జరిగింది. దనిని బట్టి 'వకుళమాలికి 'హృదయేశ్వరికి అనుబంధకావ్యమని చెప్పవచ్చును. 'హృదయేశ్వరి పద్య-గేయాలతో రచించిన ఇతివృత్తాన్నే తీసుకొని 'వకుళమాలికి గేయకావ్యంగా రచించినట్లు భావించడానికి వీలున్నది. 'హృదయేశ్వరి'లో 'వైతాళికము” అనే భాగం ముత్యాలసరం ఛందస్సులోనే ఉన్నది. పూర్వకాలంలో రాజులకో, భగవంతు నికో వైతాళికగీతాలు పాడేవారు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ప్రేయసిమీద మేలు కొలుపు పాటలు రాయడం నవ్యత. “హృదయేశ్వరి' కావ్యంలోని 'వైతాళికము” అనే ఉచ్చ్వాసాన్ని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విని, నడకలు బాగున్నాయని సంతోషించి ఆ ఛందస్సుకు 'దండాడింపులు' అని నామకరణం చేసి తాను “గీతా సీతారామము” అనే కావ్యంలో ఈ ఛందస్సును ఉపయోగించినారట. * 'వైతాళికము" అనే ఉచ్చ్వాసంలో వాడిన ఛందస్సు ముత్యాలసరం ఛందస్సు. ఈ ఛందస్సుకు ఈ పేరు తప్ప 'దండాడింపులు అనే పేరుగాని, మరో పేరు గాని వ్యాప్తిలోకి రాలేదు. 'హృదయేశ్వరి' కావ్యంలో 'వైతాళికముూ అనే భాగాన్నే కాక ప్రణయ సందేశాన్ని కూడా ముత్యాలసరంలోనే రచించినాడు,

ఉపగూహనము

శివశంకరశాస్త్రి పూర్తిగా గేయంలో రచించిన మరో గేయరచన 'ఉపగూహనమూు'. దీనిని పదిమాణం దృష్పా గేయకావ్యం అనడం కంటే గేయకధ అని పేర్కోవచ్చు ఈ గేయకధలోని కథ సమకాలికమైనది. పైగా జరిగిన కధ అని శాస్రీ గారే రాసినారు. ఈ కధలోని వస్తువు కూడా ప్రణయమే. అయితే విఫల ప్రణయం కాదు. సఫల (ప్రణయం.

ఈ గేయకధ కొంత తిశ్రగతిలోను, మరికొంత చతురస్రగతిలోను నడుస్తుంది. వొదానీకి 12 మాత్రలు వాడినారు. 12 మాత్రలున్న పాదం నాలుగు త్రిమాత్రా గణాలుగాను, మూడు చతుర్మాత్రాగణాలుగాను విరిచి చదువుకోవచ్చు. కనక ఈ గేయకధలో ట్రిశ, చతురప్రగతులు రెండూ కనబడతాయి.

అధుభ్రికాంధ్ర గేయ కథితం 185 శివతాండవము

“శివతాందవి గేయకావ్యం పుట్టపర్తి నారాయణాచార్యులు రచించినది. వస్తువు శివపార్వతుల తాండవ లాన్యాల వర్ణనమే. ఎమా(త్రం కధా స్పర్శలెనిది. కవి తన అనుభూతి చక్షువుతో శివతాండవాన్ని దర్శించి తన్మయుడై, పట్టరాని పారవశ్యంతో గానం చేసిన కావ్యమిది. కవి తనకు కలిగిన తాదాత్య భావాన్ని ఈ కావ్యంలో ప్రతి పదంలోను పొదగడానికి పడిన తపన కనిపిస్తుంది. భావకవిత్స్వయుగంలో భక్తి కవిత్వం ఒక (ప్రధానశాఖ, కాబట్టీ ఈ కావ్యాన్ని భావకవిత్వయుగంలో చేర్చవలసి వచ్చింది. అంతేకాని భావకవితారీతి, ప్రభావమూ ఈ కావ్యంలో ఏ మాత్రం కనిపించవు. ఇదొక స్వతంత్రమైన, అద్వితీయమైన కావ్యం.

'ఏ మానందము భూమీ తలమున...”* అని ఎలుగెత్తి పాడినప్పుడు శ్రోత శ్రవణేంద్రియంలో నాద ్రోతస్విని జలపాతంలాగా దూకుతుంది. శివతాండవం అనే భాగం ఒద్దు లొరుసుకొని ఉరవళ్ళ పరవళ్ళతో ఉధృతంగా ప్రవహించే వర్షాకాలం నదిలాగా, 'శివాలాస్యం) అనే భాగం శరత్కాల నదిలాగా ప్రవహిస్తుంది. ఇది శివతాండవ గేయకావ్యం పాడగా విన్నప్పుడు ప్రతిశ్ర్రోతలోనూ కలిగే నాదానుభూతి. ఆద్యంతమూ ఆపాతమధురంగా రచితమైంది.'శివతాండవ” గేయకావ్యం వల్లనే పుట్టవర్తి నారాయణాచార్యులు సరస్వతీపుత్రులయినారుోో

“శివతాండవ గేయకావ్యంలో 'శివతాండవంి, 'శివాలాస్యం” అని రెండు భాగాలు ఉన్నాయి. “తాండవం” నృత్తానికి పర్యాయపదం, నృత్తంలో తాండవం, లాస్యం అని రండు భేదాలున్నాయి. ఉద్ధతంగా ఉన్న నృత్తం తాందవం. సుకుమారంగా ఉన్న న్నత్తం లాస్యం. తాండవం ఆరభటీ వృత్తిలోనూ, లాస్యం కైళికీ వృత్తిలోనూ ఉంటుంది. * సాధారణంగా తాండవం పురుష ప్రయోజ్యం, లాస్యం స్త్రీ ప్రయోజ్యం.

శివతాండవం “ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు” అనే ధ్రువపదంతోనూ, శివాలాస్యం 'ఆదినది గిరికన్నై అనే ధ్రువపదంతోనూ నడుస్తుంది. రచనారీతి కూడా శివతాండవం ఆరభటీ వృత్తిలో ఉద్ధతంగానూ, శివాలాస్యం కైశికీవృత్తిలో మసృణశైలి లోనూ సాగింది. తాందవంలో పరుషాక్షరాలు, సంయుకాక్షరాలు, మహాప్రాణులు, ఊష్మాలు వీటి సంయోజనం ఎక్కువ. లాస్యంలో లలితాక్షర సంయోజనం ఎక్కున. అట్లాగే తాండవంలో కనబడినంత సమాసభూయిష్టత లాస్యంలో కనబడదు. తాండవం, లాస్యం రెండూ ఖండగతిలోనే ఉన్నా గమనభేదం ఉన్నది. రెండింటిలోనూ ప్రతిపాదం ఇరవై మాత్రలతో నిండుగా ఉంటుంది. ఎక్కడా విశ్రాంతికి జాగా (చోటు) ఉండదు. పాదాలన్నీ విశ్రాంతి కెడమివ్వకుండా సరిపెణలాగా సాగిపోతాయి. తొండవంలో

186 భావకవిర్వయుిరం - దేయరీచనైలు పదిపాదాల తర్వాత గాని, ఎనిమిది పాదాల తర్వాత గాని ధ్రువపదాన్ని కూర్చితే, లాస్యంలో నాలుగు వాదాల తర్వాత (ధ్రువపదాన్ని కూర్చడం జరిగింది. అంటే తాండవంలో తాళానికి ప్రతి పది పాదాల తర్వాత గాని, ఎనిమిది పాదాల తర్వాతగాని విశ్రాంతి, లాస్యంలో ప్రతి ఐదు మాత్రలకూ పదం విరిగినంతగా తాండవంలో విరగదు, కనక అక్షర సంయోజనం వల్లను, సమాస నిర్మాణం వల్లను, పాదసంఖ్యవల్లను, విరుపుల వల్లను ఈ రెండింటి శైలిలోను, గమనంలోను చాలా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు

నవజటాపటల సంధ్యాకాల వారిదాం

త వికాస చంద్ర మంద్రాతవార్ట శరీర!

నగకన్యకా నేత్రయుగళ నిర్యత్మటా

క్ష గణతాపింఛ ఫించా దీన గురువక్ష |

అదెనమ్మా! శివుడు

వొదెనమ్మా భవుడు (శివతాందవం)

సమవాదయుతమైన న్థానక స్థితి నిలచి

క్రమముగా జూపులను గంజాక్షి విరజిమ్మి

ఘలు ఘల్లు ఘలుమనెడి వలయనాదములతో

జిలిపినవ్వుల సుమాంజలి వల్టీ శివునకై

యాడినది గిరికన్నె ! (శివాలాస్యం) యతి, వబ్రాస - అంత్య ప్రాస

శివతాండవం'ిలో యతిని, ప్రాసను, అంత్యప్రాసను ఎక్కడో తప్ప చాలావరకు

నియతంగా వాటించడం జరిగింది. ప్రాసను, అంత్యప్రాసను నియతంగా పాటించినందు వల్ల శివతాండవంలోని ఛందస్సు ద్విరదగతి రగడ. శివాలాస్యంలో యతిప్రాసలను నియతంగా పాటించడం జరిగింది కాని, అంత్యప్రాస విషయంలో అంత నియతి కనబడదు. శివతాందవంలో అంత్యప్రాసలను నియతంగా పాటించడంలో ఒక ప్రయో జనం కనిపిస్తుంది. శివతాందవంలో పాదానికి ఇరవై మాత్రలు నిండుగా ఉండటం వల్ల, విరామానికి జాగా ఉండదు. పది పాదాల తర్వాతనే ధ్రువపదంతోనే విరామం కలుగుతుంది, పది పాదాల వరకు విశ్రాంతి లేకుందా, సరిపెణలాగా సాగడం వల్ల (శోతకు శ్రవణపేయంగా ఉండదు. రెండు పాదాలకు అంత్వప్రాసను నియతంగా పొటించడంవల్ల అక్షర సాదృశ్యంవల్ల శోతకు శ్రవణ సుఖాపాదమవుతుంది. సరిపెణ లాగా సాగే పదాలలో చివర ఎకాక్షర (శ్రుతి చెవికింపుగా ఉంటుంది. యతి కూడా (శ్రవ్యతకు తోద్పడుతుంది. ఉధాహరణకు

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 187 తలపైని జదలేటీ యలలు దాండవ మాడ నలల త్రోపుడుల గ్రాన్నెల పూవు గదలాడ మొనసి ఫాలముపైన ముంగుజులు చెజలాద గనుబొమ్మలో మధుర గమనములు నడయాడ శీవాలాస్యంలో అంత్యప్రాసను అంత నియతంగా పాటించకపోవడానికి కారణం శివతాందవంలో ఉన్నట్లుగా విశ్రాంతి చాలా పాదాల తర్వాత ఉండదు. నాలుగు పాదాల తర్వాత విశ్రాంతి ఉంటుంది. కనక శివతాండవ కావ్యంలో యతి, ప్రాస, అంత్యప్రాసలకు ఉద్దిష్ట ప్రయోజనం ఉన్నది. లయంకరుడైన శివుని తాండవ వర్ణనకు అక్షరబద్ధమైన పద్యం కంటె, తాళబద్ధమైన గేయమే తగినదని శివతాండవ కావ్యం నిరూపిస్తున్నది. ఈ కావ్యం గురించి పీరిక (శివతాండవ కావ్యగుణములు)లో శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు ఇట్లా అభిప్రాయ పడినారు. “ఆంధ్ర వాబ్మయానికి అభిశాపషరూపమైన చంపూ పద్ధతిని వీడి ఈయన జిగిని వెలయించగల పద ఛందస్సును స్వీకరించుట ఈయన చైతన్యమును ప్రకాశింప జేయు దీపము”. శివతాండవ కావ్యాన్ని పద్యంలో రాస్తే ఎట్లా ఉంటుందో ఊహించడం అసాధ్యం. శ్రీకృష్ణ తాండవము - గోపికాలాన్యము శివతాండవ కావ్యాన్ని అనుసరిస్తూ వచ్చిన గేయకావ్యం ఇది. కర్త మైనంపాటి వెంకటసుబ్బయ్య, ఇందులో వస్తువు శ్రీకృష్ణుని తాండవమూ, గోపికల లాస్యమూ- వర్ణించడమే. కావ్యారంభం ఎత్తుగడలోనే తెలుస్తుంది ఇది “శివతాండవ గేయకావ్యానికి అనుకృతి రచన అని. అదుగో అదుగో ముదమున వచ్చిరి గోపిక లెల్లరు గోపాలురతో తాందవమట! కృష్ణుని తాండవమట లాస్యమ్మట! గోపికాలాస్యమ్మట శివతాండవంలో లాగానే కావ్యారంభం చతురస్రగతిలోనూ, మిగతా కావ్యం ఖండగతిలోనూ నడుస్తుంది. ఖండగతిలో విలోమగణాలైన జగణం మీద లఘువు, యగణం ఇమడవేమోననిపిస్తుంది ఈ కావ్యం చదువుతుంటే. ఉదాహరణకు

188 ఖావకవితృ్వయురీం - దేయరచద్రలు ఎన్నగా చతు(శ్రుతి బుషభమ్ము పున్నాగ శివతాందవ గేయకావ్యంలో విలోమగణాల ప్రయోగం కన్పించదు. ద్విరదగళతి రగడలో ఉపయోగించవలసిన *నగ, నలల, భల, సల, త, ర గణాలనే ఉపయోగించినారు, ప్రసిద్ధమైన శివతాండవ కావ్యానికి అనుకృతీ రచన కాబట్టి దీని కంత ప్రశస్తి రాలేదు. 1970-80 దశకంలో వచ్చిన గేయకావ్యమిది. అయినా 'శివతాండవం' అనుకృతిరచన కాబట్టి, దానిని అనుబంధంగా ఇక్కడే పేర్గొవడం జరిగింది. శివతాండవ కావ్యాన్ని పోలిన మరో గేయకావ్యం సుబ్బరాయశాస్త్రి రచించిన 'నృత్యభారతి. ఈ కావ్యంలో గేయాలను నృత్యానికి అనువుగా రచించినారు. ముసలమ్మ ఈ లఘు కావ్యాన్ని చిలుకూరి నారాయణరావు రచించినారు. అనంతపురం పట్టణం ఆనుకొని 'బుక్కరాయ సముద్రం అనే చెరువు ఉన్నది. ఆ చెరువు కట్ట ఒక సంవత్సరం వర్షాకాలంలో తెగిపోగా సళ్ళు ఊరిని చుట్టుముట్టినాయట. గంగాభవాని ఒక ముదుసలిపై ఆవేశించి నరబలిని కోరినదట. ఆ ఊరిలోని వారందరూ వెనుకాడగా బసివిరెడ్డి కోడలు 'ముసలమ్మ' అనే పడుచు గ్రామ క్షేమం కోసం ఆత్మత్యాగం చేసిందట, చెరువుగండిలో 'ములసమ్మ” శవంమీద రాళ్లు, మట్టివేసి పూద్చినారట, ఇప్పటికీ ఆ కట్టను 'ముసలమ్మ కట్ట" అని అంటారు. “ముసలమ్మ ఆత్మత్యాగమే ఇందులో ఇతివృత్తం. ఈ ఇతివృత్తాన్న తీసుకొని కట్టమంచి రామలింగారెడ్డి 'ముసలమ్మ మరణము అని పద్యకావ్యంగా రచించినారు. చిలుకూరి నారాయణరావు 'ముసలమ్మ' గేయకావ్యం కొన్ని చోట్ల బొబ్బిలి కథ ఫక్మిననుసరించింది. ఈ కావ్యం మీద భావకవిత్వయుగ ప్రభావం అంతగా లేదు. ఆ కాలంలో వచ్చిన కావ్యం కాబట్టి ఇందులో చేర్చడం జరిగింది. అయితే సంఘ సంక్షేమం కోసం త్యాగం చేసిన త్యాగధనుల సంకీర్తనం కూడా భావకవులు చేయకపోలేదు. కనక ఈ కావ్యాన్ని భావకవితాయుగానికి చెందినదేనని చెప్పవచ్చు. తమకోసం తలిదండ్రాదులను తలదరిగే భూతలములోపల పరుల కొరకు తమ (ప్రాణం విడిచే వారున్నారా? కన్నారా? అనే ప్రశ్చకు సమాధానంగా ఈ కావ్యాన్ని రచించడం జరిగింది.

ఆధునికౌంధ్ర గేయ కవిత్వం 189 చెల్లమాంబ రాయలసీమ ఇతివృత్తాన్నే తీసుకొని రచించిన మరో గేయకావ్యం '“చెల్లమాంబి. కర్త పెమ్మరాజు లక్ష్మీపతి. రాయకుదురు (గ్రామ వాస్తవ్యుడైన చెంగల్వల తమ్మయ్య భార్య చెల్లమాంబ 1824లో ఆమె భర్తతోపాటు సహగమనం చేసింది. ఈ సంఘటనే ఈ కావ్యంలో వస్తువు. ఈ కావ్యంలో కొన్నిచోట్ల “కిన్నెరసాని పాటల) నడకల అనుసరణులు కనిపిస్తాయి. ఉదాహరణకు కన్నీరుతో వలపు పన్నీరుతో పాల మున్నీరులో గలియు మిన్నేరు వలె మెరసి మిన్నంటి తన మగని వెన్నంటి కడువడిగ నడిపించినది-చెల్లమాంబా ఆ పూల పడవ నల్లన -చెల్లమాంబా (దెల్లమాంబ) తలిరోర్పుతో నీటి యలలూర్చుతో అంద ముల నూర్చుతో కిన్నె రటు తూగి, యిటు తూగి బిగువుటందాలతో-నగవు టందాలతో నిండుగా ప్రవహించెనే-పువ్వుల్ల చెండులా చెలువొలికెనే (కిన్నెరసాని పాటలు) దెనుగొండ వాట జాతీయోద్యమపు రోజులలో వచ్చిన ప్రశస్తమైన గేయకావ్యం "పెనుగొండపాటి. సుప్రసిద్ధ విమర్శకులు, సంగీతజ్జులు అయిన రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ రచించిన కావ్యమిది. విజయనగర నామాజ్య చరిత్రలో "పెనుగొండ'కు అధిక వ్రాధాన్యమున్నది. “పెనుగొండ*కు సంబంధించిన చారిత్రక ఇతివృత్తాన్ని తీసుకొని రాళ్ళపల్లి వారు విరరస ప్రధానమైన గేయకావ్యాన్ని రచించినారు. అయితే కధాకధన ప్రాధాన్యమున్న కావ్యం కాదు. వర్ణన ప్రాధాన్యమున్న కావ్యం. ఆంధ్రుల సముజ్వుల చరిత్రలో కొన్ని ఘట్టాలను తీసుకొని వర్షించడమే ఈకావ్యంలోని వస్తువు. ఈ కావ్యాన్ని మిశ్రగతిలో రచించడం జరిగింది. దీనిని పాటగా రచించినారు. కాబట్టి పల్లవి, అనుపల్లవి, చరణం ఉన్నాయి.

190 భావకఖిర్వయుడం - గేయరచనలు పెనుగొండ కొంద-ఈ పెనుగొండ కొంద చనిన నాళుల దెనుగు కత్తులు సానబెట్టిన బండ 1ఈ పెను! రంధ్రముల బ్రవహించు తురకల రక్త ధారలు త్రాగి-శ్రేచిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్మల అరితి నీలపుదండ-ఈ పెనుగొండ కొండ... కవి - కన్య చింతా దీక్షితులు ఈ లఘుకావ్వాన్ని రచించినారు. ఇందులో కూడా ప్రణయమే ఇతివృత్తం. ఇందులో కవి, కన్య ఇద్దరు పొత్రలు. ఇద్దరి మధ్య ప్రణయాన్ని చిత్రించే కావ్యం ఇది. కవిత్వం విషయంలో కవికీ-కన్యకూ జరిగిన సంభాషణలో భావకవితాతత్షం ఆవిష్టృతమైంది. కన్య : ఎవరికోసము ఎందుకొరకై ఏమి ఫలముల నందదానికి కాలమైనా లెక్కచేయక కావ్యమల్లెదవు? కవి ఎవరికోసము వాయు దేముడు ఎల్ల దిక్కుల పరువు లెత్తును వివరికోసం నదులు కొండల యంద విహరించున్‌ ఈ పంక్తులు కృష్ణశాస్త్రి గారి “సౌరభము లేల చిమ్ము బుష్పవ్రజంబు? చంద్రికల నేల వెదజల్లు జందమామ? ఏల సలిలంబు పాఖు? గాద్పేల విసరు?* వంటి పంక్తులను తలపింపజేస్తాయి. భావకవిత్వయుగంలో అనేక గేయ కథాకావ్యాలు, కధాస్పర్శ, వస్తుస్పర్శ ఉన్న గేయరచనలు అనేకం వెలువడినా మచ్చుకు కొన్నిటినే పరిశీలించడం జరిగింది. ప్రణయ గేయాలు భావకవిత్వంలో (ప్రణయ కవిత్వం పరాకాష్ట నందింది, భావకవిత్వం ఆరంభానికీ, వికాసానికీ, క్షీణతకూ ప్రణయకవిత్వమే మూలకారణం. సంభోగం విప్రలంభం శృంగార రసంలో భేదాలు. (ప్రబంధ కవులు కధను స్వీకరించి, నాయికా నాయకులను ఆలంబ నంగా చేసి, సంభోగ శృంగారానికే పట్టం కట్టినారు. పూర్తిగా విప్రలంబ ప్రాధాన్య

ఆధుధికాంధ్ర గేయ కవిత్వం 19] మున్న కావ్యం ప్రాచీన సాహిత్యంలో మేఘసందేశం ఒక్కటే కనిపిస్తుంది. ప్రబంధాలలో విప్రలంబ శృంగారం తాత్మాలికమైనదే కాక, యాంత్రికమైనది కూడా. అనుభూతి గాఢతగాని, క్షష్తతకాని ఉండవు. దీనికి కారణం విప్రలంభం వస్తుగతం కావడం, కొన్ని పడికట్టు కవిసమయాలతో చంద్రాదుల ఉపాలంబనతో ఆశ్వాసాలకు ఆశ్వాసాలు విస్తరించడం జరిగింది. భావకవి విరహంతో చంద్రాదులను ఏమైనా అన్నా ప్రాణ వంతంగా ఉంటుంది. “కన్నీరు నీకేల సెందురుడా కనికారమె శాన సెందురుడా”” అని ప్రకృతితో తాదాత్యం పొందుతాడు. సంభోగ, విప్రలంభ శృంగారాలలో విప్రలంభా నికి హృదయావర్దక శక్తి ఎక్కువ. అందునా అది వస్తుగతం కాకుండా, ఆత్మగతమైనప్పుడు మరింత నిశితమవుతుంది. భావకవిత్వంలో విప్రలంభం ప్రబంధాల లోని విప్రలంభం కంటె పూర్తిగా భిన్నమైనది. ఈ విప్రలంభం వస్తుగతమైనది కాదు, ఆత్మగతమైనది. అనుభూతి ఆర్రత, రక్తపుజీర ఉన్నది. భావకవి ఆ విరహాగ్నిలో తానే మండిపోయినాడు కాని, మరొక మట్టిబొమ్మలో పోయలేదు. ప్రణయాగ్నిలో తన హృదయాన్న పుటం పెట్టి మేలిమి కవిత్వాన్ని అందించినాడు.

భావకవుల 'పణయం అమూర్తమైనది. ఒకచోట అది (ప్రేయసీగతంగాను, మరొకచోట దైవగతంగాను ఉండవచ్చు. కొందరు భావకవులకు నిజజీవితంలో (మవేయసులు ఉండవచ్చు. అయితే నిజజీవితంలోనే (ప్రేయసికి ఊహాలోకంలో కొత్త ఊపిరి పోయడంవల్ల రూపం, నామం అన్నీ మార్పుపొంది ఉంటాయి. (మటప్రేయసితో ప్రణయం ఊహాగతమైనదే. మానసికంగానే రమిస్తాడు కాని, కాయికంగా కాదు. మొతానికి తనకు అందని అమూర్తమైన దాని కోసం వేసటే లేని వెర్రి అన్వేషణ జరుపుతాడు. ఆ అన్వేషణలో అవ్యక్తమైన వేదన ఉంది. ఆ అవ్యక్తమైన వేదనలో కవికి తాదాత్యం ఉంది. మాధుర్యం ఉంది. తన ఊహాప్రణయంలోని ఆనందానుభూతులను, తన వైఫల్యా లను కవిత్వంలో చెప్పుకొన్నట్లు ఉంటుంది. కాని, వాటిని సాధారణీకరణం చేసి చెబు తాడు. ఇది క్షణికమైన దానిని శాశ్వతీకరించడం, ఆత్మీయమైన దానిని సాధారణీకరించడం వంటిది.*”, తనను నాయికగాను, భగవంతుని నాయకుడిగాను సంభావించడంలో 'మధుర భక్తి ప్రభావం కనబడవచ్చు. అయితే “మధురభక్తి ఒక్కటే ప్రణయ కవిత్వం కాదు. ప్రణయ కవిత్వం మీద ముఖ్యంగా ఇంగ్లీషు కాల్పనిక కవిత్వం ప్రభావం కనిపిస్తుంది భావకవిత్వంలో ప్రణయ కవిత్వం మొలకను నాటి, ఇక్కడి పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా పెంచి పెద్దజేసినటువంటిది.

ప్రణయకవిత్వంలో వస్త్వాశయ రీతిలో ఆత్నాశయరీతి అని రెండు రీతులున్నా యని నారాయణరెడ్డిగారు తమ సిద్ధాంతవ్యాసంలో పేర్శొన్నారు.* అయితే ప్రణయ కవిత్వంలో వస్త్వాశయ రీతిలో వచ్చిన కావ్యాలు చాలా వరకు పద్యకావ్వాలై

192 ఖాదకవిర్వయుగరం - దేయరచనలు ఉండటం గమనించవలసిన విషయం. తృణకంకణము, సౌభద్రుని ప్రజయయాత్ర, జలజ మాలిక, మల్లికాంబ, కడపటి వీడుకోలు, స్నానఘట్టము ఇవన్నీ పద్యకావ్వాలే. ఈ కావ్యాలలో కూడా చాలా వరకు నాయికకు ప్రాముఖ్యమున్నవే ఎక్కువ. కొన్నిటిలో నాయకుడు ఉండడు. నాయకుడున్న కావ్యాలలో కూడా నాయకుని పాత్రలో కవి ఆత్మీయాంశ గోచరిస్తుంది. గేయరూపంలో వచ్చిన ప్రణయ కవిత్వం మాత్రం చాలా వరకు ఆత్నాశయరితిలోనే ఉన్నది.

వస్తుబలమున్న ఎంకిపాటలో నాయుడుబావ నండూరి సుబ్బారావే. 'యెంకి నా (మమ రసాని కాశ్రయము, నా శృంగారవాక్కునకు విశ్రామస్థానము, వలపులకు నిధానము” అని నండూరే చెప్పుకొన్నారు. ఇది ఒక రకంగా ఆత్మాశయరీతికి చెందినదే. ఒక్క 'కిన్నెరసాని పాటలే వస్వాశ్రయ రీతికి చెందినది. కనక గేయరూపంలో వచ్చిన ప్రణయకవిత్వమంతా చాలా వరకు ఆత్మాశయరీతికి చెందినది. ఆత్మాశయరీతికి చెందిన ప్రణయకవిత్వంలో రెండే రెండు ప్రధానమైన పాత్రలు. సార్వకాలికమైన 'నేను సార్వ కాలికమైన “అతడు” లేదా “ఆమె. తనకూ, తన ప్రణయ స్వరూపిణికీ మధ్య మరొక పాత్రను, మరొక వస్తువును భావకవి అంగీకరించలేదు. భావకవుల ప్రణయ గీతాలలో ముఖ్యంగా ఈ కింది ధోరణులు కనిపిస్తాయి.

  1. డ్రుమతత్వాన్ని నిర్వచించడం
  2. సమాజనిరసనం -నైరాశ్యం 8, ప్రపంచ ప్రసిద్ధిచెందిన (ప్రేమికుల సంకీర్తనం క్రేమతత్వం

భావకవికి మేమించడం కంటె ఉదాత్తమైన విషయం ఇంకొకటి లేదు. (ప్రేమ (ప్రేమకోసమేనని అతని భావం. ఈ సమస్త ప్రకృతీ (ప్రమమయమేనని అతని అభిప్రాయం, పూలు వాసనలను ఎందుకు చిమ్ముతాయో, చంద్రుడు వెన్నాలనెందుకు వెదజల్లుతాడో, కోయిల మామిడిగున్న మీదనుంచి ఎందుకు కూస్తుందో-వీటికి ఏ పరమార్ధం ఉందో 'నా (ప్రేమకు అదేపరమార్ధం ఉందని భావకవి అంటాడు.” 'సౌందర్యోపాసనే సద్రతమనిో *ప్రణయ వేదనల పాడుట కంటె కవికి పరమామోదమైనది ఇంకొకటి లేదనో” అదే కవికి జీవితమని భావకవి భావించినాడు, బసవరాజు అప్పారావు 'పేమతత్తాన్ని ఈ విధంగా వివరిస్తాడు.

వల పెలుంగక (బతికి కులికి మురిసేకన్న

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 193 వలచి విఫలమ్మొంది విలపింప మేలురా! (ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికె (ప్రేమించు ప్రేమకై యేమింక వలయురా భావకవి తాను ప్రేమించిన ప్రేయసి మీద, ప్రియుని మీద (ప్రేమగీతాలు అల్లినాడు తాను ప్రేమించిన (ప్రేయసి కోసం ప్రకృతిలో ప్రతిచోటా ఆమెకోసమే అన్వేషించినాడు. “తెప్పవోలిక చంద్రబింబం నింగిని తేలిపోతోవున్నా అందులో నా ముద్దు ప్రేయసి వుంది కాబోలు”? అని అనుకొన్నాడు. “వేయి కరాలు సాచి వేయికన్నులతో వేయి గుండెలతో”* ఆమె కోసం వేచి యున్నాడు. ఆ నిరీక్షణలో “కంటిరెప్పలు మింటికప్పుల నంటినవి. ఫాలతలమున రక్తనాడులు భగ్గు భగ్గున మండినవి.ో భవమెంతొ భారమై పరుగులెత్తే వేళ జీర్ణమై నా గుండె శిధిలమయ్యే వేళ కన్నుగవలో నొక్క కాంతి పుంజముదాల్సి చిన్ని నవ్వులు మోముపై చిందులాడగా”" వచ్చి లాలించుమని భావకవి అర్ధింపు. ప్రేయసీ విరహంలో న్నెలలు ఊరకే చలియిస్తాయి,”ే ఆ విరహాగ్ని మండి గుండెలోన ఆరదు” “చాలు నిరీక్షణ, చాలిక జింతన చాలు, రహస్య వియోగహతుల్‌ోో అని బాప్పదౌత్యం సలుపుతాడు. “కలలోనైనా కనబడి ఈ దీనుని మది యలజడి అంతా పోవునట్లుగ వలపుదీర్చో రమ్మని వియోగిగా విలపిస్తాడు. ఒక్కొక్కసారి ఆ అన్వేషణ, ఆ వీయోగము (పేయసికోసమే కానక్కరలేదు. అమూర్తమైన దానికోసం అర్రులు చాచవచ్చు. 'ఒక క్రొత్త బరువుతో, ఒక క్రొత్త యాసతో, కనలేని వెలుగు కొజకై ఎన్నడును కనరాని దానికాజణక”ో వెదకి వేసారి పోతాడు. భావకవి 'ఈ వియోగ నిరాశ క్షణక్షణ టప్రతీక్ష చెదరి ఎగసి ఎగసి పగిలిపోదునో! పగలెజుగని ప్రవాసమునకిక వేకువరేకు విరియదోోో అని వాపోతాడు. నుమాజ నిరసనం - నైరాశ్యం భావకవుల ప్రణయ గీతాలలో సమాజ నిరసనం, నైరాశ్యం అధికంగా కనిపిసాయి. భావకవి 'హృదయదళన రోదన ధ్వనులె విన్నాడు. వేయి గుండెలతో వేదనను భరించి నాడు. ఆ వియోగంలో, వేదనలో మాధుర్యాన్నే చవిచూసినాడు. తనకూ, తన ప్రేయసికీ

194 భాదకదిత్వయుగం - ేయరచనలు మధ్య సమాజం అద్దుగోడవంటిదని భావించినాడు. అందుకే ఈ 'లోకముతో మనకేటికి లోలాక్షీ రా పోదముూ” అని సమాజాన్ని ఖాతరు చేయడు. “పాడులోకము జూచి భయమెలేకను వలపు పలుకులాడగ జెల్లునే' అని చెట్టుమీది ప్రేమపక్షి (కోకిల)ని ప్రశ్నించినా పరమ ప్రేమ స్వరూపంబులై పావనంబుల జేయు ప్రణయ కవిోగా భావిస్తాడు. “ఇంకిపోయి నాకందని ఈ లోకపు సానుభూతి నందవనమందె సుధానదమై పొంగుోనని ఆశిస్తాడు. నా హృదయనాళమేలా తునియలుగా నా నిర్జివపు జీవితమ్ము నీట వదలుదురా! ఇపుడా నను బలుకరింతురుూ” అని ప్రశ్నిస్తాడు. 'నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు, నేను హేమంత కృష్ణానంతశర్వరిని, నాకు కాలమ్మొక్కటే కారురూపు, నాశోకమ్మువలెనె, నా బ్రతుకువలె నావలెనో అని బిట్టుగా శోకిన్తాడు. 'కనుజెప్ప కొసలనొక చినుకైన కదలినీో అని శోకాన్నే కోరుకొంటాడు. ఈ సమాజపు ఇరుకు సందులలో ఇమడలేక కవి “ఆకులో నాకునై, పూవులో వూవునై, ఈ యడివి దాగిపోనా” అని సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాడు. భావకవిలో నిరాశాజీవి మనస్తత్వం, పలాయనతత్త్వం కనిపిస్తాయి. మృత్యువరణం దీనికి పరాకాష్ట “మృత్యు వైభవము కీర్తించుట కన్న నిత్యానందము కలదో అని మృత్యువును సంతతం కీరించినాడు. రాధాకృష్ణతత్త్వం

భావకవిత్వయుగంలో రాధాకృష్ణులను ప్రణయానికి ప్రతీకలుగా గ్రహించి గీతాలెన్నో రచించినారు. రాధాకృష్ణతత్తం (౧46౧౬190౧4 000 భారతీయమైనదే, కొత్తదెమీ కాదు. చైతన్యుడు, వల్లభుడు రాధాకృష్ణతత్తాన్ని వ్యాప్తిలోకి తెచ్చినవారు. వంగదేశపు వైష్ణవ గీతాలలో వెల్లవిరిసింది ఈ తత్త్వం. ఆధునికాంధ్ర కవిత్వం, ఆంగ్రభామా కవితా రీతులనేకాక, బెంగాలీ సాహిత్యాన్ని కూడా జీర్ణం చేసుకొన్నది. బెంగాలీ సాహిత్య ప్రభావం వల్ల 'రాధాకృష్ణతత్వం' కూడా తెలుగు సాహిత్యంలో చోటుచేసుకొన్నది. ఎందరో భావకవులు రాధాకృష్ణులను తమ సొంతం చేసుకొన్నారు. తామే “రాధి అయి 'మోయింపకోయ్‌ మురళి... తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు, మురళి పాటకు రగిలి మరుగు నీ వెన్నెలలు, నొగయునా యెదకేల తగని సౌఖ్యజ్వాలో అని వేడుకొన్నా మళ్ళీ “మురళీ మధురగాన రవళి దేలుచు వచ్చి నా హృదయపద్నాన నధివసింపుము పతీ అని ప్రాధేయపడినాడు. *నా జీవితేశుండు, నాదు వలపుల టేడు, నా కృష్ణుడేల రాడో” అని ఎదురు తెన్నులు చూసినాడు. 'ఆనందమయమైన యా (ప్రేమరాజ్యమ్ము రాధ రాణిగ నేలునని, రాధ పున్నెము పండు నని సంతోషించినాడు. “దాసిగా నుంటకైన తగనాో ఒంటిగా నుయ్యాల లూగితివా, నా ముద్దు కృష్ణా, జంటగా నిను బిల్వద గదోయీ'”' అని పరితపించినాడు.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 195 పపంచ ప్రసిద్ధులైన ప్రేమికుల సంకీర్తనం పురాణ ప్రసిద్దులైన రాధాకృష్ణులే కాక ప్రపంచ ప్రసిద్దులైన (ప్రేమికులు భావకవులకు కవితా వస్తువులైనారు. అభ్యుదయ కవిత్వంలో ప్రపంచ కార్మికులూ, శ్రమజీవులూ కవితావస్తువులైనట్లు, భావకవిత్వయుగంలో ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రేమికులు-కవితా వస్తువులైనారు. 'లైలామజ్లు”* కధ చెప్పుకొన్నాడు. 'శాఫో ” “” గీతాలు పాడుకొన్నాడు. తానే 'ఎండిమియాన్‌” అయినాడు. (ేమకు ప్రతీక అయిన 'తాజ్‌మహల్‌ ” 'కవులకు కామితమిచ్చే మామిడిపండు” అయింది. (పేమికులే కాదు, గున్నమావి మీద కూర్చున్న 'ప్రేమపక్షులు” కూడా “పరమ ప్రేమ స్వరూపంబులై లోకాల పావనంబుల జేయు గ్రణయకవులు”గా కనిపించినాయి. 'ఈ మావిపై నుంది ఈవు కూకూ యంచు నామావిపై నుండి ఆమె కూకూ యంచు నేమి బాసలు జేతురే కోకిలా. '" అని ప్రశ్నించినాడు ప్రకృతి గేయాలు సంస్కృత సాహిత్యం ప్రకృతి వర్ణనకే ప్రాధాన్యమిచ్చిన కావ్యం కాళిదాసు రచించిన 'బుతుసంహారం” ఒక్కటే కనిపిస్తుంది. అంతకు పూర్వం వేదాలలో ప్రకృతి వర్ణనలు లేకపోలేదు. కాళిదాసు రచించిన ఇతర కావ్యాలలో ముఖ్యంగా మేఘసందేశంలో - ప్రకృతి వర్ణనలకు సముచిత ప్రాధాన్యమున్నది. అందుకే అనేక విషయాలలో కాళిదాసు భావకవులకు చాలా దగ్గరి వాడు. ప్రాచీనాంధ్ర సారస్వతంలో ప్రకృతి వర్ణనలకంత ప్రాధాన్యం లేదు. అవి కథాకధనంలో ఎక్కడోగాని తగలవు. వర్దన ప్రాధాన్యమున్న ప్రబంధాలలోనే ప్రకృతి వర్ణనలు ఎక్కువగానే ఉన్నా చాలావరకు అవి ప్రబంధనాయికల దోహద క్రియలకోసం పుట్టినవిగానో లేదా ప్రబంధకవికి వృక్షాల పేర్లతో గల పరిచయాన్ని తెలిపేవిగానో ఉన్నాయి. ఒక్క ఆముక్తమాల్యద కావ్యంలోని ప్రకృతి వర్షనలు మాత్రం ప్రశస్తమైనవి. ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు పాత్రల మానసిక స్థితితో సంవదించేవి చాలా అరుదు. భావకవిత్వంలో ప్రకృతి కవిత్వానికి ప్రత్యేకమైన అస్తిత్వమున్నది ఆధునిక కవిత్వంలో ప్రకృతి కవిత్వానికి ఒరవడి పెట్టినవాడు గురజాడే. భావకవులు ప్రకృతిని చర్మచక్షువుతో కాక, మనోనేత్రంతో దర్శించినారు. ఈ విషయంలో కూడా భావకవుల మీద కాల్పనిక కవుల ప్రభావమున్నదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రకృతి కవిత్వం విషయంలో ముఖ్యంగా వర్స్స్‌వర్త్‌ (1%/0/609౪/0గ౧) వీరికి గురువైనాడు. గురువుల దగ్గర నేర్చుకొన్న దానికన్న ప్రకృతి పారశాలలో నేర్చుకొన్నదే ఎక్కువని వర్ట్‌వర్త్‌ అభిప్రాయపడినాడు. 0౧6 1౧౧౮156 *10గా & *౪6గ౧౫4| ౪౦౦౮6 ౪/11! 16400 ౪0౪ ౧౧0౧౪ 0 గొడిగి, 01 ౧౦|| 6|| 2౧6 0 ం౦౦6 ౧4౧ 4|| 06 54063 ౦01౧ ”

196 భానకథిర్మయుగం - దేయరదనలు

వేదనాజీవి అయిన భావకవికి ప్రకృతి తోడునీడగా, కన్నతల్లి ఒడిగా భాసించింది. తన మనస్సును ప్రకృతి ముందుపరచి, కష్టసుఖాలు చెప్పుకొన్నాడు. ప్రకృతిలో తానూ ఒకడయి పలుకరించినాడు, పరవశించినాడు.

భావకవి సమకాలిక సమాజ పరిస్టితులతోను, కృత్రిమ నాగరిక జీవితంలోను విసుగెత్తినప్పుడు “ఆకులో నాకునై, పూవులో పూవునై,-నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులయిన ఇచటనే ఆగిపోనాొ”* అని ప్రకృతి ఒడిలోకి పారిపోవాలని చూస్తాడు. గడ్డిపువ్వు నుంచి గగనగంగ వరకు ప్రకృతిలో ప్రతి అణువూ అతనికి ప్రాణ వంతంగా కనిపిస్తుంది. గడ్డిపూవు గుడ్డిదిగా కనిపించదు. అది “దాక్కుని చూస్తుంది, దారంట గడ్డి నిరుక్కొని కూస్తుంది. ఒక్కడే నడుస్తూ వుంటే, చుక్కలు పొడుస్తూ వుంటే మక్కువగా కూర్చో” మని పిలుస్తుంది. గరికతో జన్మజన్నాల అనుబంధాన్ని తలపోన్తాడు. నిర్మలజ్యోతినే సందర్శిస్తాడు. **'ీమందారమేమో ఒద్డున్న వొంగి నీటిలో తన అందాలు తానే చూసి మాట్లాడుతుంది.” భావకవికి ప్రకృతి మోహినీమూర్తిగా దర్శనమిస్తుంది. సెలయేరులు రాగాలెక్తి గానం చేస్తాయి. తళతళ వెన్నెల సిగ్గులతో అలలు తాందవమాడు తాయి. జగమెల్లా నందన వాటికగాను కనిపిస్తుంది. చల్లగ వెన్నెలలు కన్నతల్లిలా కాస్తాయి కాని, మనసేమో మాటు మణగదు.” 'కన్నెకాటుక కళ్లు, చిన్నినాధుని చూచి, కదలులాడినవేళ, ఆకాశ మధ్యాన, అటనొక్క చెలిమబ్బు మెరుపులా ” మెరుస్తుంది.

ఈ విధంగా భావకవి ప్రకృతిని ప్రణయోద్దిపనకారిగాను, తాపోపశమనకారిగాను భావించినాడు. ఒకప్పుడు ప్రకృతితో తన అంతరంగం విప్పి విరహవ్యధల కధలు వినిపించినాడు. కవిత లల్లినాడు. ప్రకృతి చల్లని ఒడిలో వేదనను మరిచిపోయినాడు. అందుకే భావకవికి ప్రకృతి అన్నా ప్రకృతి ఒడిలో జోలలు కట్టుకున్న పల్లెటూళ్ళన్నా, ప్రకృతి అంత నిర్మలమైన మనస్సుగల పల్లెటూరివారన్నా ఎంతో (ప్రేమ. అడవిమల్లైలవంటి పల్లెలనూ, అకృత్రిమమైన అంతరంగమున్న పల్లీయులనూ వర్ణించడం ప్రకృతి కవిత్వంలో ఒక భాగమయింది. పల్లీయుల జీవనాన్ని చిత్రించే కవిత్వాన్ని ముఖ్యంగా గోపకుల జీవిత విధానాలను చిత్రించే కవిత్వాన్నీ ఆంగ్లంలో 02510/2! ౧౦౪1%/ అంటారు. ౧౩1018! ౧061)/ నే తెలుగులో 'గోపకావ్యాలు”, 'గోగీతికలు' అని వ్యవహరిస్తున్నారు. కేవలం గొల్లవారి జీవితాన్నే కాక, వివిధ వృత్తులవారిని కూడా వర్ణించే గేయకవిత్వాన్ని కూడా 'గోపగేయాలు” లేదా 'గోగీతికలు” అని వవహరించవచ్చు. ఎందుకంటే పల్లెలలో గొల్లవారే కాక, వివిధ వృత్తులవారందరూ వ్యవ సాయవ్ఫత్తితో ఏదోరకంగా అనుబంధమై ఉన్నవారే.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 197 గేపగేయాలు భావకవితా యుగారంభకుదడైన రాయప్రోలు వారి 'తెల్లకుచ్చుల పాగ అల్లల్ల

నసియాడ గొన్న గొట్టెల మేపు చిన్నారి గొల్లాడ” అనే గేయంతోనే 'గోపగేయ కవిత్వం" ఆరంభమైనదని చెప్పవచ్చును. భావకవిత్వయుగంలో గోపకవిత్వాన్ని రచించిన వారిలో దువ్వూరి రామిరెడ్డి, కవికొండల వెంకటరావు ఇద్దరే ప్రముఖులు. ఈ శాఖలో దువ్వూరి రామిరెడ్డి పద్యకవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తే, కవికొండల వెంకటరావు గేయకవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. దువ్వూరి రామిరెడ్డి రచించిన 'వనకుమారి, 'కృషీవలుడు' ఈ శాఖలో వెలసిన ప్రశస్తమైన పద్యకావ్యాలు. కవికొండల ప్రత్యేకించి ప్రకృతికవిగా ప్రసిద్ధిపాందినాడు. వీరిని 'ఆంధ్రా వర్ట్‌వర్త్‌'గా పేర్కొంటారు. ప్రకృతిలోని (ప్రతివస్తువూ, వీరికి కవితావస్తువు అయింది. అన్ని వృత్తులవారినీ మిన్నుల కెత్తినాడు. వీరి గేయాలలో తెలుగుదేశంలోని పల్లెపట్టుల ప్రజాజీవితం ప్రతిబింబిస్తుంది. వీరి 'గోపగేయాలిలో ఉన్నంత వైవిధ్యంగాని, విస్ఫృతిగాని, సహజతగాని ఇతరుల గోపగేయాలలో కనిపించవు. కవికొండల '“జనపదములు,, ప్రకృతి చందనము), 'భావమురళి, “నెలబాలుడు, “విశాల విశ్వము”, ప్రకృతి పాంచజన్యము, 'కలరుతము”, 'కొండకొలను', “వికసితోత్పలాలు” మొదలైన గోపగేయాల సంపుటులు వెలువరించినారు. వీటిలో కొన్ని పద్యఖండికలు కూడా లేకపోలేదు. అయితే వీరిది ప్రధానంగా గేయకవిత్వమే. కవికొండల కొండలకవి (ప్రకృతి కవి). పసులకాపరి అయినా, పడవ మీదున్న పడుచుపిల్ల అయినా, అంట్లుతోమే అప్పలమ్మ అయినా ఇట్లా అన్ని వృత్తులవారినీ కవికొండల తన గేయాలలో తనివితీరా వర్చ్టించినారు. గోపగేయాలెకాక, “రక్తకుల్యగాధ' మొదలైన గేయకథల నెన్నిటినో రచించినారు. *నావపై పిల్లో అనే గేయంలో

నదినిండ నీరున్నదీ నావపై పిల్లున్నదీ

పిల్లాకు వొళ్ళున్నదీ వొళ్లెల్ల వయసున్నదీ

చిన్నాది పూదేనెరా కవటాకులో ఈనెరా

పున్నామి నెల బరణిరా-ముమ్మెదట నా రాణిరా” అని పడవ మీద ఉన్న పడుచుపిల్ల పరువాన్ని వర్ణించినాడు.

కవికొండల గేయాలలో జానపదుల మనస్తత్వాన్ని సహజరమ్యంగా చిత్రించినారు.

కోత కూలీలను గురించి, రోడ్లు బాగుచేసే కూలీలను గురించి గీతాలెన్నో రచించినారు. వీరి 'కూలియన్నల కుతుకమూ చాలా ప్రసిద్ధమైన గేయం.

మొగములను ముచ్చెమట లూడ్చుచు

మూపులను పెనుమోకు లీడ్చుచు

198 ఖాదకవిత్వయుడ్‌ం - దేయరదదవ్రలు మదమలెత్తున మన్ను రేచుచు గుండ్ల పేరూ కులుకుపాటేమో! ఏమో! పాలిండ్ల బగడపు గుండ్ల పేరేమో” కవికొండల తర్వాత గోపగేయాలు అధికంగా రచించిన కవి అడవి బాప్‌రాజు. పేరి “తొలకరి, “గోధూళి” గోపగేయాల సంపుటులు. అడవి బాపిరాజు చిత్రకారుడు కూడా కావటంతో జానపదుల నిసర్ణ సౌందర్యాన్ని మాటలతో బొమ్మ కట్టిస్తాడు. “గోద్దూల్లిల్రో గౌళ్ల సెళ్ళాయి కూతురు, పాపికొండల అడవుల నీడలలో పరుగులెత్తే కోయపడుచూ, దేముడిచ్చిన పాపతో బయలుదేరిన ముప్టిదీ వీరు గీసిన కవితా చిత్రాలలో చెప్పుకోదగినవి. 'నన్ను సూసీ నవ్వింది దేసోళ్ళ చిన్నది నన్ను సూసీ నవ్వింది “ఆ ఎల్లావుకు గడ్డిలేదు నల్లావు చిక్కినాది, మన్నేనికి పోయివస్తువా% మొదలైన గేయాలెన్నో రచించినారు. 'ఉప్పాంగి పోయింది గోదావరి” అనే గేయంలో 'అడవి చెట్లన్నీని జడలలో తురిమింది. ఊళ్ళు దండలు గుచ్చి మెళ్లోన తాల్చింది.” అనే కవితా పంక్తులు గోదావరి నదిని నైరూప్య చిత్రకళా (4౦౪1101 &గ) రీతిలో చిత్రించినాయి. 'గంగిరెద్దు, 'లేపాక్షి బసవయ్య లేచిరావయ్యి' మొదలైన గేయాలలో తెలుగు పల్లెల సంస్కృతి పరిమళిస్తుంది. తెలుగువారి అందాలు తెలుగు జానపదుల ముగ్గమోహన సౌందర్యమూ వీరి 'గోధూళి' సంపుటిలోని గేయాలలో కానవసాయి.*ీ గోపగేయాలలో కవికొండలకు, బాపిరాజుకు ప్రత్యేకమైన స్దానం ఉన్నది. ఇద్దరి గేయాలు పల్లె ప్రజల పలుకుబడిని పుణికిపుచ్చుకొన్నవే. అయితే భాష మీద బాపిరాజుకున్న దృష్టి కవికొండలకు లేదు. కవికొండల గేయాలలో వాడుక భాషా రూపాలు, గ్రాంధిక భావు రూపాలు సయ్యాటలాడుతుంటాయి. భావం, భాషా గుండెలో నుంచి పరుగులు తీస్తాయి. కాని మెరుగులు సంతరించుకోవు. బాపిరాజు వబాణీలో గేయం రాస్తే దానికి తగినట్లుగా భాష ఉంటుంది. బసవరాజు అప్పారావు గేయాలలో తెలుగుదేశం ఆచారాలు, సంస్కృతి ప్రతి ఫలిస్తాయి. “నాగులచవితి” గేయంలో నీ పుట్టదరికి నా పాప లొచ్చేరు పాపపుణ్యముల వాసనేలేని బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి! కోషించి బుస్సలు కొట్టబోకోయి.”

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 199 వంటి పంక్తులు 'పడగలెత్తకు పాము, పగవారము కామూ అనే జానపద గేయాల పరిమళాన్ని పట్టించుకొన్నవే. “ఎల్లాగెక్కూవా, ఇంకెల్లాగెక్కువా? సదువూకున్నా బ్యామ్మర్గంతా సాకలవోళ్ళా రాముడికంటె ఎల్లాగెక్కువా” “ఎల్లొద్దామాపుల్లీ ఎల్లొద్దామా కల్లుదుకానాని కెల్లొద్దామా” వంటి గేయాలు జానపదుల అమాయక హృదయాన్ని ఆవిష్కరిస్తాయి, గోపగేయాలలో చావలి బంగారమ్మ 'కప్పతల్లి పెళ్లి గేయం తవ్పని సరిగా పేర్కొనవలసిందే, “కప్పతల్లీ పెళ్లి నేడూ, చూడరే, కావెళ్ళ నీళ్లొంపినాడు. వరుణ దేవుడు పంపినాడూ ఓ చెల్లీ వాడలన్నీ నింపినాడు.” వంటి పంక్తులు వానాకాలంలో తెలుగు పల్లెలలో జూనపదులు పాడే గేయాలను తలపుకు తెస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆంధ్రదేశంలో కప్పను వేపమండల మధ్య పెట్టి రోకటికి కట్టుకొని కప్పతల్లి కప్పతల్లి కడవెడే నీళ్ళు దొంతాల్‌ దొంతాల్‌ దొడ్డడే నీళ్ళు చీమతల్లి చీమళల్లి చిట్టెడే నీళ్ళు అని పాడుకొంటూ ఇల్లిల్లూ తిరుగుతూ కప్పతల్లి మీద నీళ్ళు పోయించుకొంటారు. “కప్పతల్లి గేయంలో చావలి బంగారమ్మ తెలుగుసీమ గ్రామీణవాతావరణాన్ని చి(త్రించినారు. కొనకళ్ళ వెంకటరత్నం “బంగారు మామ పాటలిలో జానపద గేయకవితా సౌందర్యం జాలువారుతుంది. 'మొక్కజొన్న తోటలో, ముసిరిన చీకట్లలో, మంచెకాడ కలుసుకో, మరువకు మామయ్య అనే గేయం చాలా ప్రశస్తి పొందింది. బంగారు మామ పాటలలో పడుచు జంట ప్రణయమే ఇతివృత్తం అయినా నేపధ్యంలోనే పల్లి జీవితమే ప్రతిబింబిస్తుంది. ఈ సంపుటిలోనే ఉన్న రోడ్డు రోలరు లాగే శ్రామికుల బాధామయ జీవితాన్ని వ్యక్తీకరించే పాటలో మారువాడి అప్పుకంటె మాయదారి బతుకుకంటె బరువా ఇంతోటి బండరాయి మామయ్య లాగరా హయిలెస్స లాగరా రోడ్డు రోలరు ముందడుగై సాగరా వంటి పంక్తులు గుండెను పట్టివేస్తాయి. ఈ విధంగా భావకవులు తెలుగుదేశం ప్రకృతినీ, తెలుగు పల్లెలనూ, ప్రజాజీవితాన్నీ, పండుగలనూ, ఆచారాలనూ, వర్ణిస్తూ అసంఖ్యాకంగా గేయాలు రచించి ఆధునికాంధ్ర కవిత్వాన్ని సౌందర్యశోభితం చేసినారు.

200 ఖావకవిర్మ్వయురం - గేయరచనలు దేశభక్తి గేయాలు

యావద్భారతం ఏనాడూ ఏకచ్చత్రాధిపత్యం కింద లేకపోయినా ఏకసంస్క్యతి ఉందేద్‌. ప్రకృతి శక్తులు ఆరాధించి ఆహ్వానించే బుక్కులు, పృధ్వీమాతను ఆవాహన చేయడాన్ని కుద్దేశించిన పృధ్వీసూక్తం, వేదకాలంనాటి భారతదేశంలోని దేశభక్తికి పరమోదాహరణలుగా కనిపిస్తున్నాయి. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే ప్రాచీన సూక్తి అనాదినుంచీ జాతినాడులలో ఘూర్చిల్లుతూ వస్తున్నదే... అయితే ఈ దేశభక్తి ఎక్కడికక్కడ ఒక పరిధికి పూర్వులలో లేదనే చెప్పాలి. దేశభక్తి, దేశం, భారతజాతి - ఈ భావాలు (ఫైెంచి విప్లవం వంటివి చదివిన విద్యావంతులు ప్రజలలో కలిగించినారు. కనుక “దేశభక్తి కవిత్వం మీద కూదా పరోక్షంగా ఆంగ్ల విద్యా ప్రభావం ఉన్నది.

సాగర చేతనంలా వెల్లివిరిసిన జాతీయోద్యమంలో సాహిత్య ప్రక్రియలన్నిటిలోకి గేయం గణనీయమైన, గర్వకారణమైన పాత్రను నిర్వహించింది. ఏ ఉద్యమం వచ్చినా ముందుకురికేది గేయమే. మిగతావి దానిని వెన్నంటి వస్తాయి. ఆవేశానుభూతులకు గేయాన్ని మించిన ఉత్తమవాహిక లేదు. జాతీయోద్యమంలో గేయాలు అసంఖ్యాకంగా వెలువడినాయి. ప్రతి సభలోను గేయం గద్దెనెక్కి (ప్రబోధపూరితంగా గానం చేసింది. ఆనాటి జాతీయగీతాలు యువహృదయాలనే కాక, నిరక్షరాస్యులను నిరుపేదలను కూడా ఉత్తేజితం చేసినాయి.

మొట్టమొదటి ముత్యాలసరం గేయమైన 'మేలుకొనుమీ భరతపుత్రుడ” అనే గేయం లోనే జాతీయ భావాలున్నాయని, అట్లాగే గాంధీమహాత్ముడు హరిజన సమస్యను లేవనెత్తక ముందే 'అందారు పుట్టీరి హిందమ్మ తల్లికీ అనే గేయం రచితమైందని గత అధ్యాయంలోనే వివరించడం జరిగింది. గురజాడ 'దేశభక్తి గేయం మొట్టమొదటి “దేశభక్తి గేయమేకాక అంత ఎత్తుకు ఎదిగిన గేయం మరొకటి లెదు. వైయక్తిక స్వేచ్చను ఆరాధించే భావకవులకు స్వేచ్చా స్వాతంత్రాలకోసం జరుగుతున్న జాతీయోద్యమం ఊపిరి నిచ్చింది. దేశభక్తి గేయాలు, దానిలో భాగమైన సంఘ సంస్మరణ గేయాలు-ఇవి రెండే భావకవులు సమాజా నికి సంబంధించి చేసిన రచనలు. భావకవులు రచించిన 'దేశభక్తి కవిత్వంలో గతవైభవ కీరనం ఉన్నది. ఈ గతవైభవ కీర్తనం కూడా కాల్పనిక దృష్టై (0౧౫౭౧౪౦ ౪164) అయితే జాతీయోద్యమంలో వచ్చిన గేయాలన్నిటిలోను గతవైభవ సంకీర్తనం అంతగా కనిపించదు, దేశభక్తి కవిత్వం మాత్రం ఇక్కడి పరిస్థితుల కనుగుణంగా వికసించిన తరుశాఖ.

భావకవిత్వయుగంలో “దేశభక్తి ని మిన్నుల కెత్తినవారు రాయప్రోలు సుబ్బారావు. గురజాడ 'దేశభక్తి గేయం తర్వాత చెప్పుకోదగిన గేయం రాయప్రోలు సుబ్బారావు “జన్మభూమి. “దేశభక్తి గేయం కంటె 'జన్మభూమి' గేయమే ఎక్కువగా జాతీయతను ప్రబోధించే గేయం. ప్రతిపదంలోను జాతీయతను పుణికిపుచ్చుకున్న గేయమిది.

ఆధునికాంధ్ర గేయ కథిత్యం 201 ఏదేశ మేగినా, ఎందుకాలిడిన ఏ పీర మెక్షినా, ఎవ్వరే మనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా న్‌ జాతి నిండు గౌరవము అనే గేయం జాతీయ భావాలకు ఊపిరులూదింది. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అనే ఆర్యోక్తినే కవితామయంగా గానం చేసినారు. 'బుషులు తమ తపస్సులు ధారవోసిని దేశమిది. 'రాజచంద్రులు తమ శౌర్యహారాలి నర్పించినది. 'జగాల నూగించే మగతనం బెగసిని దేశమిది. 'పొలాలలో రత్నాలు పండినవి.* “పృధివి దివ్యోషధుల్‌ పిదికినది. ఈ విధంగా భారతదేశం యొక్క అధిభౌతిక, భౌతిక సంపదను, శౌర్య, ధైర్య గుణాలను, సంగీత, సాహిత్యాది కళలు మొదలైనవాటిలో భారతదేశం ఘనతను ఈ గేయం వేనోళ్ళ కొనియాడింది. “అటువంటి భారతదేశంలో పుట్టడం బి పూర్వపుణ్య ఫలమో అని, ఇటువంటి భూదేవి ఎక్కడా లేదని, భారతీయుల వంటి పౌరులు ఎక్కడా లేరని, సూర్యుని వెలుతురు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక భారతీయుడ నంచు భక్తితో పాడమని” ఈ గేయం ప్రబోధిస్తుంది. రాయప్రోలు “తమ్ముడా” అనే గేయం కూడా “జన్మభూమి” గేయంతో తులతూగుతుంది. శ్రీలు పొంగిన జీవగడ్డయి, వాలు వాతిన భాగ్యసీమయి, (వ్రాలినది ఈ భరత ఖండము భక్తి వాడర తమ్ముడా! దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశ మరసిన ధీరపురుషుల తెలిసి వాడర తమ్ముడా! రాయప్రోలు “జన్మభూమి, “తమ్ముడా” అనే గేయాలు జాతీయోద్యమం రోజులలో జాతి బెన్నత్యాన్ని పురావైభవాన్ని కీర్తించే ఇటువంటి గేయాలే ప్రజలను ఉత్తేజితులను చేసినాయి. దేశం అఖీవృద్ధి చేసుకోవలసిన అవసరాన్ని గుర్తింపజేసినాయి. దువ్వూరి రామిరెడ్డి 'ఎల తెలియక సంశయించెదవు? భారత కుమారా..., చిన్న తనమున గేలు మోద్చెదవు? తెల్లచర్మము నీకు లేదనియో, బలమైననాడుల బెల్లు నెత్తురు పాజలేదనియో!... చాలు చాలిక విఫల యాచనము,.- వీరపూజోత్సవపు సమయమున

202 భావకవిర్వయుగం - ేయరచనలు బూరింపలెమ్ము”” అని 'ప్రబోధశంఖం' పూరిసాడు. భారతమాత మందిరంలో దివ్వెలు గాను, ఆమె పాదాలకడ పువ్వులుగాను, ఆమె వీణకు తంటత్రులుగాను, జన్మ భూమి శౌర్య సౌరభ్యములు చల్లే గీతాలుగాను, కదనవీరుల చేతి ఖద్ద్గధారలలో మెజుపులుగాను ఉందామని “సేవో అనే గేయంలో దేశసేవలో ఉన్న పవిత్రతను కీర్తిస్తాడు. అయితే దువ్వూరి రామిరెడ్డి, దేశభక్తి గేయాలలో కంటె 'న్వాతంత్ర్య రధము” అనే పద్య రచనలో పరాకాష్ట నందినది. కవికొండల “మాతృదేశ సంకీర్తనలు” అనే దేశభక్తి గేయాల నంపుటి చెప్పుకో దగినది. 'మాతృ్ళదేశమున కది ఏనాడో” అనే గేయంలో “స్వరాజ్యం నా జన్మహక్కు”అనే తిలక్‌ నినాదాన్న “ఆజన్నాంతపు హక్కు స్వతంత్రము” అంటూ గళమెత్తి గానం చేసినారు. హోమ్‌రూల్‌ ఉద్యమాన్ని గురించి రాసిన 'స్వరాజ్య స్వాగతము అనే గేయం కూడా పేర్కొనదగినదే. దేశభక్తి గేయాలు రచించిన వారిలో అగ్రేసరులు గరిమెళ్ల సత్యనారాయణ. ఈయన గేయాలలో భావకవిత్వం ప్రభావం ఏ మాత్రం కనబడదు. కేవలం జాతీయ కవిగా ఆంధ్రజాతిలో అజరామరుడిగా నిలిచిపోయినాడు. 1921లో రాసిన “మా కొద్దీ తెలదొరతనమ్ము” అనే పాట స్వాతంత్ర్య సాధనలో తారకమంత్రంగా సమస్త ఆంధ్రుల నోట నిలిచిపోయింది. ఈ గీతం యావదాంధ్ర జాతిని ఉర్రూతలూగించింది. దేశభక్తిని రగుల్ఫొలిపింది. నూట నలుబది నాల్లు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాదవద్దంటాడు, టోపి తీసి వీపున బాదుతాడు ... మాకొద్దీ... అని తెల్లదొరతనం దమనసీతిని, నిరంకుశత్వాన్ని చెరిగి చెండాడినారీ గేయంలో. రాట్నలక్ష్మి నవ్వు-రంజిల్లుమోముతో -పాడుచున్నది నోటి నిందా కఠణవు మాడుచున్నది దాని యెందడా స్వేచ్చ తిరుగుచున్నది దాని గుండా ఆ దొరల తేజంబెల్ల తూల్చే జందాయుందా ... మా కొద్దీ... ప్రచారార్ధమై రాసిన ఇటువంటి గీతాలలో ఇంతటి కవితా పంక్తులు ఉండటం అరుదే. శ్రీశ్రీ అన్నట్లు “వంద ఉపన్యాసాలకన్నా ఎక్కువగా ఈ ఒక్క పాటలోనే ప్రజాహృదయం ప్రతిబింబించిందనడం అతిశయోక్తి కాదు. సాహిత్యాన్ని ప్రచార సాధనం చెయ్యరాదనే ఛాందసులకు తిరుగులేని జవాబు ఇచ్చింది.” ఆ రోజులలో ఈ గేయాన్ని

ఆధుధికాంధ్ర గేయ కవిత్వం 203 ఎవరు పాడినా జైలు తప్పేది కాదు. గరిమెళ్ళ సత్యనారాయణ కూడా ఎన్నోసార్లు కారాగార శిక్ష ననుభవించవలసి వచ్చింది. గరిమెళ్ళ సత్యనారాయణ దేశభక్తి గేయాల నన్నిటినీ “స్వరాజ్య గీతములు” అనే పేరుతో మూడు భాగాలుగా ప్రకటించడం జరిగింది. జాతీయోద్యమం రోజులలో జరిగిన ప్రతి చిన్న సంఘటనకూ ప్రతిస్పందించి రచించిన గేయాలివి. 'సీమగడ్డలు వీడి మీరిక క్షేమమందండి' అని విదేశీ వస్తు బహిష్కా రాన్ని బలపరుస్తాడు. 'పరదేశ వస్త్రములె బ్రహ్మచెముడు వలె వ్యాపించినవని', “దాని నరకెడి ఖద్దధార రాట్నమే** అని భావించినారు. తెల్లదొరతనం వారి పన్ను విధానాన్ని “ఉప్పు పన్ను పప్పు పన్ను ఊరికెళితె పన్ను బాబు, కొప్పు కాస్త దేముడికి మొక్కుకుంటే పన్ను బాబు” ** అని పన్నుల విధానాన్ని తూర్పారపట్టినాడు.

'రామదండు'ను నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య “రాంభజని కీర్తనలు రచించినారు.

ముప్పయి కోట్ల (ప్రజలు రాంభజన-పంజరబంధమైనారు బంధాలు త్రెంపుకొని రాంభజన-అవతలపదాలి గంధి మంత్రమిదేను రాంభజన-స్వరాజమండత్రం ఒక్కటే మంత్రం రాంభజన-మేలైన మంత్రం”

ఈ గేయాలను సత్యాగ్రహోద్యమంలో పాల్గొనే స్వచ్చందసేవకులు మహోత్స హంతో పాడుతూ వీథులలో ఊరేగేవారట.

“స్వేచ్చకారకే మేము బ్రతికాము, స్వేచ్చకొరకే ప్రాణమిచ్చేము... స్వాతంత్ర్యమే తల్లి మనకెల్ల, అరుణోదయమె తండ్రి మనకెల్లో”ో అనే గేయంలో కాటూరి వెంకటేశ్వరరావు స్వేచ్చాస్వాతంత్రాలంటే ఏమిటో సరళమైన భాషలో ఉదాత్తంగా చిత్రీకరించడం జరిగింది. తురగా వెంకటరామయ్య “నాజన్మ భూమేదిరా అనే గేయంలో బాపూజీని సంబోధిస్తూ ఎంతో ఆవేదనను వెల్లడిస్తాడు.

నాజన్మ భూమేదిరా

బాపూజీ

నా ముద్దు తోటేదిరా

నా కోకిలమ్మేది, నా పూలమాటెది నా రాణి వీణేది, నా వలపు పాటేది కలలోని సిరులాయెరా

బాపూజీ

కారడవి పాలైతివా!

204 భావకవిర్వయురం - గేయరచవలు జాతీయోద్యమం రోజులలో జాతులన్నీ భేదభావాలు తాత్మాలికంగానైనా మరిచిపోయి, సుసంఘటితమయినాయి. అదే విషయాన్ని మంగిపూడి పురుషోత్తమ శర్మగారు “పొలి పొలీ! బలి బల” అనే పాటలో హిందూమసల్నానులందజము వచ్చాము బౌద్ధ సీఖులు ఏకభావులై వచ్చాము పారస్‌ క్రైస్తవులు పరుగున వచ్చాము బ్రాహ్మణ పంచముల్‌ బలిసి కలిసొచ్చాము మా భఖేదభావములు మంట కలిపేశాము మమ్ము మన్నింపవమ్మా మా తల్లి మమ్మాదరింపమ్మా'” అని స్వరాజ్య దేవతకు విన్నవించినారు. ప్రజలలో జాతీయోద్యమం శీఘ్రగతిని వ్యాపించాలనే ఉద్దేశంతో జానపద గేయ రీతులను పునరుద్ధరిస్తూ, అనుకరిస్తూ, దేశభక్తి గేయాలు, కీర్తనలు అసంఖ్యాకంగా వెలువడినాయి, చాలా గేయాలకు, కీర్తనలకు కర్తలెవరో కూడా తెలియకపోయినా అవి జనబాహుళ్యంలోకి చొచ్చుకొని పోయినాయి. వాటిలో మచ్చుకు ఒకటి. స్వరాజ్య సౌఖ్యం మన కెన్నటికో సురాజ్య సామ్రాజ్య సుభోజ్యమెన్నటికో* ఆనాటి రాజకీయోద్యమాన్ని పురస్కరించుకొని పాటలు కుప్పలు కుప్పలుగా బయలుదేరినాయి. 'మరువకుడార్యులరా పంజాబు వధలు,, “నిరాకరణమును మిరాయి', 'జైలు-అది వున్నాదీ మనకొకృమేలు” మొదలైన వాటలు అసంఖ్యాకంగా వెలువడినాయి. గాంధీ సంకీర్తనం జాతిని ఒక తాటిమీద నడిపిన నాయకుడు మహాత్నాగాంధి. ఉద్యమం రోజులలో నాయకుని సంకీర్తనం మరింత ఊపిరినీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కలియుగంలో విష్ణువు మళ్ళీ అవతరించినట్లుగా గాంధీని భావించినారు. భారతీయుల హృదయమందిరాలలో ఇంతటి మహోన్నత స్థానాన్ని పొందిన మహాత్ముని మీద అసంఖ్యాకంగా గేయాలు, కీర్తనలు వెలువడటంలో ఆశ్చర్యం లేదు. అన్ని గేయాలలోకి బసవరాజు అప్పారావు రచించిన గేయాలు ప్రశస్తమైనవి. అవి ప్రచారగేయాలైనా ఉత్తమ కవిత్వం ఉట్టిపడుతుంది. వాటిలో *మా గాంధి అనే గేయం మకుటాయమానమైనది. “కొల్లాయి గట్టితే నేమీ, మా గాంధి కోమటై పుట్టితే నేమీ? వెన్నపూసా మనసు, కన్న తల్లీ ప్రేమ, పండంటి

ఆధుఠికాంధ్ర గేయ కవిత్వం 205 మోముపై బ్రహ్మ తేజస్సు”” అని చాలా మామూలు మాటలతో, మామూలు భావాలతో ఆ మహనీయుని మాహాత్యాాన్ని వర్షించినా ఆ కూర్పులో ఎక్కడుందోకాని అపూర్వ భావనా శక్తి యావదాంధ్రులను కదిల్సివేసింది. ప్రతివారి జిహ్వాగ్రాల మీద నాట్య మాడింది. మరో గేయంలో బసవరాజు అప్పారావు బాపూజీని శ్రీరామచంద్రునిగా, కొత్త ఏసుక్రీస్తుగా, పైగంబర్‌గా భావించి, హిందువులకు, ముస్లిములకు, క్రైస్తవులకు గాంధీయే నాయకుడుగా, దేవుడిగా చిత్రించి, అన్ని మతాల సఖ్యతను కోరతాడు. స్వాతంత్రోద్యమం పిలుపును వేణునాదంగా, గాంధీని శ్రీకృష్ణుడిగా భావించి భార్యలవిడిచీ భర్తలు, భర్తల విడిచి భార్యలు, తల్లుల విడిచి పిల్లలు, పిల్లల విడిచీ తల్లులు-ఈవిధంగా సమస్త మానవాళి ఆయన వెన్నెంటి రమ్మని ప్రబోధిస్తాడు. 'వేణునాదము” అనే గేయంలో * 'స్వరాజలక్ష్మి పెండ్లి అనే గేయంలో స్వరాజ్యలక్ష్మిని పెండ్లి కూతురిగా, నము[ద్రమె వివాహన్థలంగా, దేవతలే నదన్యులుగా, ఉప్పే తలంటబ్రాలుగా, గాంధీమహాత్ముని వశిష్టుడిగా, కస్తూరమ్మను పెద్ద ముత్తెదువుగా, పరమాత్ముని సాక్షిగా పరమోదాత్తంగా ఉపమించినాడు.** 'గాంధీప్రభూ అనే గేయం గాంధీకీర్తి ప్రభకెత్తిన కవితా నీరాజనం. “గాంధీమహాత్ళుడు బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది... గాంధీ మహాత్ముడు కన్నువిప్పగా అధర్మము గడగడ వణికింది... గాంధీమహాత్ముడు నవ్వునవ్వగా స్వరాజ్యం కన్నుల గట్టింది...””” అని భారతదేశంలో గాంధీమవాత్సుని ప్రభావాన్ని మహోన్నతంగా చిత్రీకరించినాడు.

భక్తరామదాసు శ్రీరామచంద్రుని కీర్తించిన విధంగా, ఆ కీర్తనల మట్లను అనుకరిస్తూ గాంధీ మీద అనేక కీర్తనలు రచించడం జరిగింది. వాటిలో దామరాజు పుండరీకాక్షుడు రచించిన “శ్రీ గాంధి నామం మరువాం, మరువాం”* అనే కీర్తన చాలా ప్రసిద్ధమైనది. భజనలు, కీర్తనలు, మంగళహారతులు మొదలైన పాటలెన్నో గాంధీ పేరును తారక మంత్రంగా గానం చేసినాయి. “గాంధీ మహాత్ముని స్మరణ మొనర్చుడి జనులారా అని, “సందేహము లేదు గాంధి చక్రియ వినుమీ”ీఅని, “జగద్రక్షకుడు గాంధీమహాత్ముడు -జనులందరు మీరెరుగండీ-జగతిని ధర్మస్థాపన జేయగ జన్మించిన హరియతడండీీ,”ో అని, “మహాత్నాగాంధీ దర్శనము పావనము, కలుషహరము కలుగు ముదము” అని, “మమ్ము బ్రోవ మహిని వెలసితివా మహాత్మాగాంధీ అని, “గాంధీలాలీ; మోహన గాంధీలాలీ! కరుణాసాంద్రా, మోహనదాసాొి అని కవులు రకరకాలుగా గాంధీని సంకీర్తనం చేసినారు. గాంధీని దేవుణ్ణి చేసినారు. ఇది ఒకరకం ఫాసిజమ్‌ అయినా ఆ రోజులలో ప్రజాహృదయాలలో గాంధికున్న స్థానమటువంటిది. గాంథీ స్వాతంత్రోద్యమ సందేశాన్ని “వినుడి వినుడి జనులారా, విని ధన్యత నొందుడి జనులారా, పతితపావనుడు, పురుషోత్తముడగు గాంధీమహాత్ముని ఘన సందేశము” అని ఒకరు జముకుల కథ

206 ఖాధకఠిర్యయుర్‌ం - దేయరచనలు పద్ధతిలో అందిస్త, “గాంధీ విజయము" వంటి హరికథలు, బుర్రకథల ద్వారా అందించినారు మరొకరు.

గాంధీనామ సంకీర్తనమేకాక, గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమానికీ గేయాలు, కీర్తనలు రచించి జాతిని జాగృత మొనరించినారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనేమి, విదేశీ వస్త్ర బహిష్క్మరణోద్యమంలోనేమి, శాంతినీ అహింసను ప్రబోధించడంలోనేమి, అస్పృశ్యతా నివారణోద్యమంలోనేమి, మద్యపాన నిషేధంలోనేమి కవులు గాంధి అడుగు జాడలను అనుసరించడమే తరుణోపాయమని గీతాల ద్వారా ప్రజలకు ఉద్పోధించినారు. “పన్నెండు దేశాలు పండుతున్నా గాని, పట్టెడన్నమె లోపమండీ, ఉప్పు ముట్టుకుంటే దోషమండీ”12] “దండాలండోయ్‌, మేముండలేమందోయ్‌ బాబు, ఉప్పుకును పన్ను బాబు, కొప్పుకాస్తా దేముడికి ఒప్పుకుంటే పన్ను బాబూ” “నవరుచులకు నౌపహాడా” మొదలైన గేయాలు ఉప్పుసత్యాగ్రహం సందర్భంలో రచితమైనవి. “సిగ్గు లేదా నీకు శరము లేదా, అన్నమైనా లేక బీదలల్లాడుతుంటేను సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ” “మోడుమోకులు చిగుర్వోసెడి పోలిక, నీ బట్టగట్టెరు వడివడి వదుకుూ”ో, “ఏకులు కావలెనా? ధాస్యపు- మోకులు కావలెనా” “నేను మీ యిలవేల్పునే చెల్లీ, నా తోడ నాడుకొనవే, నేను గృహలక్ష్మినే, తల్లి మరచిపోతివటే... మీ పాలి పత్తిరాట్నమును నేను” ీ “తిప్పవే రాట్నమా దేశచక్రంబు, విప్పవే రాట్నమా విజయకేతనము*” మొదలైన గేయాలు విదేశీవస్త బహిష్టరణ, ఖద్దరు ఉద్యమవ్వాప్తి సందర్భంలో గచించినవి. జాతీయ పతాకాన్ని గురించి కూడా గేయాలెన్నో రచించినారు. రవీంద్రుని 'జనగణమని జాతీయ గీతం వంటి జాతీయ గీతాలెన్నో రచించినారు. భారతదేశంలోని నదులు, కొండలు, జాతులు మొదలైన వాటిని పెర్కొంటూ సమగ్ర భారతస్స్ఫూర్తిని కలిగించినారు. మొత్తానికి జాతీయోద్యమం గేయానికి వరద రోజులు. అందుకే అసంఖ్యాకంగా గేయాలు, కీర్తనలు వెలువడినా చాలా వరకు ప్రచారస్తాయిని దాటిపోలేదు. కొన్ని గేయాలే కవిత్వపు విలువలను పుణికిపుచ్చుకొనీ, జాతిని మేల్కొలిపినాయి. జాతీయోద్యమం రోజులలో వెలువడిన కొన్ని ముఖ్యమైన గేయసంపుటాలలో, గరిమెళ్ళ సత్యనారాయణ 'స్వరాజ్య గీతములు” ఉన్నవ లక్ష్మీనారాయణ “భావతరంగాలు” (తక్కెళ్ళ జగ్గని పాట ప్రసిద్ధము), దుగ్గిరాల గోపాల కృష్ణయ్య “రాంభజన కీరనలు”, కొండపల్లి జగన్నాధదాసు “స్వరాజ్య నవనీతము, సబ్నవీసు గురునాధరావు గేయాల సంపుటి మొదలైనవి పేర్కొనదగినవి. 'జాతీయ గీతములు” అనే పేరుతో ఇరవై, ముప్పై వరకు వివిధ కవుల గేయసంకలనాలు వెలువడినాయి. (గ్రంధం సీతాపతిశర్మ సంకలనం చేసిన 'మహాత్నాగాంధీ భజన గీతములు, శ్రీనివాసాచార్యులు ప్రకటించిన “గాంధీజీ జైలు పాటలు”, “ఆంధ్ర నాయకుల జైలుపాటలు"' మొదలైనవి పేర్కొనదగినవి. ఇక జాతీయోద్యమంలో అంతర్భాగంగా

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 207 ఉంటూ, జాతీయోద్యమానికి దోహదం చేసిన ఆంధ్ర రాష్రోద్యమ సందర్భంలో వెలువడిన కొన్ని గేయాలను సమీక్షిస్తాను. ఆంధ్రోద్యమ గేయాలు ఆంధ్రదేశానికి సంబంధించినంతమట్టుకు ఆంధ్రోద్యమం జాతీయోద్యమంతో బాటు ఇంచుమించు కొద్ది వెనకా ముందుగా సమాంతరంగానే సాగింది. 1907లో విజ్ఞాన చంద్రికామండలి స్థాపన, 1910లో గుంటూరులో ఆంధ్ర యువజన సాహిత్య సంఘ సమావేశంలో జరిపిన ఆంధ్రరా(్రానికి సంబంధించిన తీర్మానం, 1913లో బాపట్లలో జరిగిన ప్రధమాంధ్ర మహాసభ మొదలైన సంఘటనలవల్ల ఆంధ్రరా(ష్రోద్యమం ఇంచుమించు జాతీయోద్యమంతోబాటే జరిగినట్లు తెలుస్తున్నది. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలకు చెన్నపట్టణం (మద్రాసు) ఉమ్మడి రాజధానిగా ఉండేది. అనేక విషయాలలో తమిళులతో పొసగని ఆంధ్రులకు తమకొక సొంత ఇల్లు ఉంటేగాని తమ సమస్యలు పరిష్కారం కావని భావించినారు. అప్పట్లో జరిగిన చారిత్రక పరిశోధనలలో ఆంధ్ర దేశానికి సంబంధించిన అపూర్వమైన విషయాలెన్నో వెలుగుచూసినాయి. ఖందాంత రాలలో ఆంధ్రులు సాగించిన నౌకా వ్యాపారం, ఆంధ్రుల శౌర్యప్రతాపాగ్ని ఆంధ్రుల నంస్కృతి మొదలైనవన్నీ ఆంధ్రులకొక మహోజ్వల చరిత్ర ఉన్నదనే విషయం ధ్రువపడటంతో ఆంధ్రులలో ఆత్మవిశ్వాసం అభివృద్ది చెందసాగింది. ఆంధ్రుల చరిత్రలోని ఒక్కొక్క సువర్ణ ఘట్టం కవులకు సమధికోత్సావాన్ని సమకూర్చింది. ఆంధ్రుల శౌర్యాన్నీ ఆంధ్రుల ప్రశస్తినీ, ఆంధ్రుల చరిత్రనూ, సంస్కృతినీ కవులు మహోద్వేగంతో మహోత్సా హంతో ముక్తకంఠంతో గానం చేసినారు. ఆం(ధ్రోద్యమ కవిత్వం రాయనవ్రోలు కవిత్వంలో పరాకాష్ట నందినది. “నాదు జాతి,

నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు' మని రాయప్రోలు పదేపదే ప్రబోధించినారు. ఆంధ్రోద్యమ కవిత్వం ఈ మూడువాయలు (జాతి, దేశము, భాషుగా ప్రవహించింది. రాయటవైోలు సుబ్బారావు ఆంధ్రోద్యమ కవిత్వం ప్రధానంగా పద్యాలలోనే నొగింది. రాయ(ఫ్రోలు “తమ్ముడా” అనే జాతీయ గేయంలో కూడా ప్రాంతీయమైన భావాలకు పాదులు లతీసినారు.

లోక మంతకు కాక పెట్టిన

కాకతీసతి కదన పాందితి

చీకి పోవని చేవపదములు

చేర్చిపాడరా తమ్ముడా

తుంగభద్రా భంగములతో

208 ఖభావకథిర్మ్వయుగం - గదేయరచనలు

పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ

భంగపడని తెనుంగు నాధుల

పాటబాడవె చెల్లెలా

ఆంధ్రుల శౌర్యాన్ని ఆంధ్రభాషా మాధుర్యాన్ని ఆంధ్రదేశ సౌందర్యాన్ని అదేపనిగా

అతివేలంగా వర్ణించడం రాయప్రోలు సుబ్బారావుతో మొదలైంది. భావకవులు ఆంధ్రదేశపు మట్టిని మహతృనకంగా, ఆంధ్రదేశపు నీటిని అమృతంగా భావించినారు. మానసిక స్వేచ్చకోసం పరితపించి చైతన్యవంతమైన కవిత్వాన్ని సృజించిన భావకవుల చైతన్యం జాతీయగీతాలలోను, ఆంధ్రోద్యమ గీతాలలోను కొంతవరకు సమాజపరమైంది. తెలుగుదేశానికి ప్రత్యేకత ఉన్నదనీ, తెలుగువారికి చరిత్ర ఉన్నదనీ తెలుసుకొని, ఉ(ద్రేకపడి ఉప్పాంగిపోవడంలో ఈ చైతన్య లక్షణం కనిపిస్తుంది. ** ఈ చైతన్యం తెలుగు తేజాన్ని తెలుగు శౌర్యాన్ని తెలుగు ధర్మాన్ని తెలుగు శిల్పాన్ని తెలుగు సిరిసంపద లను, తెలుగు నదులను, మొదలైన తెలుగువాటిని వర్ణించడంలో ప్రదర్శితమైంది. ఉదాహరణకు తుమ్మల సీతారామమూర్తి చౌదరి “జోహారు** అనే గేయంలో,

తెలుగుతల్లి నీకు జోహారు! దేశమాతా నీకు జేజేలు!

నీ పాలు జుంటితేనియ తేటలో, గోస్త

నీ పక్వరసమో, సుధాపూరమో... అని తెలుగు భాషా మాధుర్నాన్ని చవిచూపినారు.

ఎల్లోరా కొండ నీ యల్లారుగీమటే

కొల్లారి కొహినూరు కొప్పులో బూవటే

కొల్లూరు గనులు నీ కోశంబటే పంద్లు

పుల్లనైపోవు నీ భోగమ్ము కన్నచో

అని తెలుగు శిల్పసంపదను, భాగ్యసంపదను రమ్యంగా, రసవత్‌ ఖండంగా

వర్ణించినారు. అదే గేయంలోనే

గౌతమీ కృష్ణానదీ తుంగభద్రాది

పూత స్రవంతికా పుంజమ్ము నీ ముద్దు

గూతులై నీ చేను నీ తోట పండింప

నీ తనూజులు పైడి పాతర ల్లప్పిరే అని తెలుగు నదీమ తల్లులు ప్రసాదించే ధాన్యసంపదకు పైడి పాతరలు తవ్వినారు.

ఆధునికౌంధ్ర గేయ కవిత్వం 209 మరొక కవి “కత్తీ యొక్కడ? కటారు యెక్కడ? ఢధమధఢమ, ఢమ ధమ-ధమథము, మ్రోగే భేరీ? రణభేరీ! యెక్కడ, ఆంధ్రుందెక్కడ...”* అని 'ఆంధ్రుని వీరగీతిక ఆలపిస్తే మరొక కవి 'నీయశః పారిజూతమ్ముల మాల, ఆంధ్రమాత్ఫగ్రీవ మందు ముత్యాలహారమై వ్రేలగా, తారాళి దూరమై తూలగా, చేరిపాదెదము నీ గౌరవ గీతి** అని ఆంధ్రవీరుని యశోగానాన్ని దశదిశలకు వినిపిస్తాడు. “కృష్ణవేణి తరంగిణినున్న ర్యురియు, తుంగభద్రా సరిత్తున నూగు హేల, ధవళ గోవ్రాతము, నవనవనీతము కలవు తిక్కన పల్కు తెలుగు పల్కులకు”” అని తెలుగుభాషకు తియ్యదనాన్ని తెలుగు సాహిత్యానికి విశ్వఖ్యాతిని కలిగించిన తెలుగు కవులను నోరార స్తుతించినారు. ఆంధ్రోద్యమ కాలంలో కవులు రచించిన గేయాలు ఆంధ్రులకు ఆంధ్రాభిమానాన్ని, ఆత్మవిశ్వానాన్ని కలిగించినాయనే మాట వాస్తవమే. కాని కొందరు కవులలో ఈ ఆంధ్రత్వం వీరావేశం ఆవహించినందువల్ల వికటించింది. ఉదాహరణకు కాటూరి వెంకటేశ్వరరావు రచించిన 'తెలుగు జెండా”, 'మేం ఆంధ్రులం” అనే గేయాలలో ఆం(ధ్రావేశం అంచులు దాటింది. తెలుగు కన్నులు జేవురించాయి తెలుగు మొగములు బెడుగరిచాయి తెలుగు మీసాల్‌ మెలులు దిరిగాయి తెలుగు నెత్తురు పొంగు లెత్తింది తెలుగు నాలుకలు పదునెక్కాయి. అని అన్నప్పుడు ఆంధ్రాభఖిమానంతో ప్రతివాడి నెత్తురు పొంగులెత్తుతుంది. 'ఆెలుగావకాయ ఘాటెక్కింది, తెలుగు గోంగూర పులుపెక్కింది' అని అన్నప్పుడు వ్యంగ్యానికి లోలోపల హర్షిస్తాము. కాని '“తమిళనాడూ దద్దరిల్లింది. తమిళకుండా బద్దలయింది. సాంబారు కాలువలు గట్టింది, ఇడ్జెన్సకు ఆటగట్టింది.”-అని అన్నప్పుడు కాటూరి వంటి కవి అనవలసిన మాటలా? రోడ్డు మీద బడిపిల్లవాడు అనవలసిన మాటలా? అని అనుకోవవలసివస్తుంది. చెన్నపట్నం రెండు చెక్కల్లు సెంటు జార్జీ కోట వక్కల్లు ఇనుపపెట్టె రెండు ముక్కల్లు ఎవరి కాతా వారి లెక్కల్లో

210 భాదకవితృ్మయుడం - చేయరచద్రలు అని వేగవంతమైన గతిలో చెప్పడం వల్ల ప్రతి ఆంధ్రుడి హృదయమూ వేర్పాటు ఉద్యమానికి ఉరకలు వేస్తుంది. 'మేమాం(ధ్రులం'” అనే గేయంలో కాటూరి వారి ఆవేశం మరి శివాలెత్తింది. ఆంధ్రుల రాజ్యం అస్తమించితే స్వరాజ్య మెవదిక్కావాలి కాంగ్రెస్‌ గీంగ్రైెస్‌ జూంతేనై గాంధీ గీంధీ కర్తే జాతీయోద్యమానికి, ఆంధ్రోద్యమం కూడా తోడు కావడంతో దేశభక్తి కవిత్వం ఒక వెల్లువలా తెలుగువారిని ముంచివేసింది. (ప్రతివారూ స్వాతంత్రోద్యమంలోను, ఆంధ్రోద్యమంలోను తలమున్మలయినారు. అన్ని సాహిత్యప్రక్రియలలోకి గేయమే ముందుకు వచ్చి తెలుగువారి దేశాభిమానాన్స జాతీయభావాన్సి, జాత్యభిమానాన్ని ఆంధ్రా వేశాన్ని వాహికగా మోసుకొని ముందు నడిచింది. అసంఖ్యాకంగా వెలువడిన దేశభక్తి గేయాలలో స్టాలీపులాక న్యాయంగా కొన్ని పసిడి తునకలను మాత్రమే పట్టి చూపించటం జరిగింది. సాంఘిక గేయాలు సమాజం పరిణామశీలమైనది. ఆ పరిణామంలో కొన్ని దురాచారాలు, కొన్ని మూఢ విశ్వాసాలు, కొన్ని అనవసరమైన కట్టుబాట్లు ఏర్పడుతుంటాయి. వాటీని నిర్మూలించడానికి ఒక్కొక్కప్పుడు కొన్ని మహోద్యమాలే కావలసివస్తాయి. స్వేచ్చాళీలి మైన, క్రాంతదర్శ్భి అయిన కవి ఇన్ని లోపాలున్న సంఘవ్యవస్థలో ఇమడలేడు. మార్పును వాంఛిస్తాడు. సమాజంలో జరిగిన పరిణామాలన్నీ అతని కవితలో ప్రతిఫలిస్తాయి. భావకవి సమాజాన్ని నిరసించినా సమాజానికి దూరంగా వెళ్ళినా, సంఘసంస్కరణ కవిత్వాన్ని రాయక తప్పలేదు. భావకవి ఎన్ని ఊహాలోకాలలో ఎంతగా విహరించినా జీవించేది ఈ నేలమీదనే కదా! భారతదేశంలో జాతీయోద్యమం కంటె ముందుగా సంఘ సంస్మరణోద్యమమే బయలుదేరింది. ఎన్నో సాంఘిక దురాచారాలు జాతిని రుగ్మతలా పట్టిపీడిస్తున్న రోజులవి. సంఘ సంస్కరణ జరగనిదే స్వాతంత్ర్యం వచ్చినా ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్న రోజులవి. కనక స్వాతంత్ర్యం కంటే ముందుగా సంఘసంస్కరణ ముఖ్యమని అభిలషించి, ఎందరో సంఘసంస్కర్తలు సంఘసేవకోసం నడుం బిగించినారు. భారతదేశంలో రాజారామ మోహన రాయలు సంఘసంస్మరణోద్యమానికి మూలపురుషులు. తెలుగుదేశానికి

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 211 సంబంధించినంతవరకు సంఘసంస్కరణ రంగంలో వీరేశలింగంగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు అగ్రగాములుగా నిలిచినారు. బాల్యవివాహ ఖందడనం, వితంతు వివాహం మొదలైనవాటికి వీరేశలింగం ప్రాధాన్యమిస్తే, ఏకేశ్వరారాధన, విగ్రహారాధననిరసనం వంటి వాటికి రఘుపతి వెంకటరత్నం నాయుడు (ప్రాధాన్యమిచ్చి నారు. వీటన్నిటికీ మూలస్తంభం మానవోద్యమం. గత శతాబ్దిలో రాజారామమోహన రాయలతో పుట్టింది ఈ ఉద్యమం. మానవోద్యమ ప్రభావం బ్రహ్మసమాజ స్థాపనకు కారణమైంది. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారలు బ్రహ్మసమాజ స్థాపకులు. ఆనాటి భావకవు లందరి మీదా బ్రహ్మసమాజం ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంది. భావకవులు బాల్యవివాహాలను, కన్వాశుల్మాన్న్సి వర్ణ వ్యవస్థను, సంఘవ్యవస్థను నిరసించినారు. గాంధీ సర్వోదయ సిద్ధాంతాలకు, మద్యవాన నిషేధానికి బహుళ ప్రాచుర్యం కల్పించినారు. హరిజనునికి నివాళులత్తినారు. సంఘసంస్కరణ కవిత్వం మీద మానవోద్యమ ప్రభావం, గాంధీ ప్రభావం ప్రబలంగా ఉన్నాయి. సంఘసంస్కరణ కవిత్వం దేశభక్తి కవిత్వంలో ఒక భాగం. ఆధునిక గేయకవిత్వం సంఘసంస్కరణ కవిత్వంతోనే ఆరంభమైంది. గురజాడ అవ్వారావు “తోకచుక్క గేయం సంఘంలో పాతుకొనిపోయిన మూఢవిశ్వానాలను పెకిలించడానికి చేసిన ప్రయత్నం. పూర్ణమ్మ గేయం కన్యాశుల్మానికి నిరసనగా రచించినది. 'మనిషి' గేయం మానవోద్యమానికెత్తిన పతాక. గురజాడ అప్పారావు “మనిషి గేయంలో విగ్రహారాధనను నిరసించి, మానవునికి మకుటధారణం చేస్తే, ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా శిధిలాలయమ్ములో శివుడు లేదోయి ప్రాంగణమ్మున గంట పలుక లేదోయి దివ్య శంఖము గొంతు తెరువలేదోయి పూజారి గుడి నుండి పోవలేదోయి చిత్రచిత్రపు పూలు చైత్రమాసపు పూలు ఊరూర ఇంటింట ఊరకే పూచాయి శీథిలాలయమ్ములో శిలకెదురుగా కునుకు పూజారి కొకటేనని పూవు లేదోయి. అనే గేయంలో విగ్రహారాధనను వ్యంగ్యంగా విమర్శించినారు.

212 ఖాదకవిర్వయురం - గేయరటభదలు గాంధీమహాత్కుడు నడిపిన ఉద్యమాలలో అస్పుశ్యతా నివారణ మొకటి. గాంధీ అస్పృశ్యత నివారణ ఉద్యమాన్ని ఆరంభించకముందే హరిజన సమస్యపై “అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి వంటి గేయాలు వచ్చినాయని ఇదివరకే వివరించి ఉన్నాను. గురజాడ రచించిన '“లవణరాజుకల' లో 'మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్‌' వంటి గేయ పంక్తులు కూడా గాంధీజీ అస్పృశ్యతా నివారణోద్యమానికి పూర్వానివే. గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం లేవనెత్తిన తర్వాత ఈ సమస్యమీద ఎన్నో గేయాలు వచ్చినాయి. వాటిలో సబ్నవీసు గురునాధరావు “పశ్చాత్తాపము అనే గేయం ప్రశస్తమైనది. పుట్టినప్పటి నుండి పట్టుబట్ట మనము అంటరానీ తనము వెంటాడి నందులకు వగచి వాదాలపై పదదామా! పాపాలు మన్నించుమందామా!"”” తరతరాలుగా హరిజనునికి జరిగిన అన్యాయానికి అతని పాదాలపై పడినాకాని పాపపరిహారంకాదని ఆక్రోశిస్తారీ గేయంలో. హరిజనులకు దేవాలయ ప్రవేశార్హత లేకపోవడం అనే సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా ఎన్నో గేయాలు రచించినారు. వాటిలో పురిపండా అప్పలనామి గేయం ఇక్కడ ప్రత్యేకించి ఉదాహరించదగినది. గుడిలోని దైవమా ఆలింపవోయి గుడిలోని దయ్యమా పైకి రావోయి నీ పాదపూజకై వెదకి తెచ్చిన పూలు నీ పాదసేవకై నింపి తెచ్చిన నీళ్లు పనికి రావంటారు మైలపడెనంటారు. మాలముట్టిన నేల మాలముట్టిన నీరు మాలపాడిన వాట మాలలాడిన మాట మైలపడెనంటారు పనికి రాదంటారు. *ో అని కవి హరిజనుల ప్రతినిధిగా తీవ్రంగా నివేదించుకొన్నారు. ఆ రోజులలో గాంధీ హరిజనోద్యమంతోబాటు మద్యపాన నిషేధోద్యమాన్ని కూడా చేపట్టినారు. మద్యపానాన్ని నిషేధించనిదే హరిజనుల స్థితిగతులు బాగుపడవని ఆయన భావించినారు. మద్యపాన నిషేధాన్ని సమర్ధిస్తూ ఎన్నో ప్రచారగేయాలు వెల్లువలా

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 213 వెలువడినాయి. యన్‌. వెంకయ్య గారు సంకలనం చేసిన 'మద్యపాన నిషేధ కీర్తనలు" వాటిలో ఒకటి. ఈ విషయం మీద గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన గేయం చాలా ప్రశస్తమైనది. కల్లు త్రాగి సీ యిల్లు నెల్ల-గుల్ల చేయకు నీ వళ్ళు రోగాల కెల్ల-వడ్ది కీయకు* కల్లు త్రాగి

ఈ విధంగా మద్యపాన నిషేధం మీదేకాక, వ్యభిచార నిర్మూలన, భోగం మేళాల నిషేధం మొదలైన అనేక సాంఘిక సమస్యల మీద చాలా గేయాలు వెలువడినాయి. అవన్నీ చాలా వరకు ప్రచారస్థాయిని మించి ఎదగలేదు. జాతీయోద్యమం రోజులలో గేయం దేశభక్తి ప్రబోధానికీ, సాంఘిక దురాచార నిర్మూలన ప్రచారానికీ చాలా సమర్ధంగా ఉపయోగపడిందని పరిశీలనవల్ల తెలుస్తున్నది. ప్రబోధానికీ పప్రచారానికీ గేయాన్ని మించిన సాహిత్య ప్రక్రియ లేదని నిస్సంశయంగా చెప్పవచ్చు. భక్తి గేయాలు

భావకవి విగ్రహారాధనను నిరసించినాడు కాని, నిరీశ్వరవాది కాడు. అయితే బ్రహ్మసమాజం ప్రభావం వల్ల భావకవితాయుగంలో కొన్ని నాస్తిక గీతాలు కూడదా వెలువడినాయి, పూర్వాంధ్రకవిత్వంలో ఆత్మాశయ రీతిలో కవిత్వం ఏదైనా ఉన్నదంటే అది భక్తి కవిత్వంలోనే. శతకాలలోను, భాగవతంలోను, ఆత్నాశయరీతి కనిపిస్తుంది భాగవతంలో రెండే ముఖ్యపాత్రలు. భగవంతుడు, భక్తుడు. ఆత్మాశయరీతే ప్రధాన లక్షణమైన భావకవిత్వంలో భక్తి కవిత్వానికి ప్రాముఖ్యం వచ్చింది. భావకవులకు (ప్రేయసి ఊహా సౌందర్యమూర్తి. భగవంతుడు మానవుడు సృష్టించుకొన్న కల్పనామూర్తె ఊహా సౌందర్యమూర్తిని ఉపాసించిన భావకవి, కల్పనామూర్తిని కూడా ఆరాధించగలిగినాడు. ప్రణయాన్ని ప్రణవంలా జపించిన భావకవి, భగవంతుని సాన్నిధ్యంకోసం తపించిపోయి నాడు. రక్తితో పాటు భక్తినీ ఉపాసించినాడు. భావకవుల భక్తి కవిత్వంలో మధురభక్తి పరాంకోటి నందుకొన్నది.

తెలుగులో గేయం సాహిత్య గౌరవాన్ని అందుకోవడం అన్నమాచార్యుని భక్త్షికవిత్వం తోటే. భగవంతుని గానలోలుడిగా భావించి, అనేక సంకీర్తనలతో భగవన్నామాన్ని అర్చించినాడు. ఆ విధంగా గేయం భక్తుని ఆత్మానుభూతిని భగవంతునికి చేర్చ ప్రధాన వాహిక అయింది. అన్నమయ్య పదకవిత, క్షేత్రయ్య మువ్వగోపాలుని పదాలు, పోతన భాగవతంలోని ముఖ్యంగా గోపికాగీతాలు, గీత గోవిందం, కృష్ణలీలా తరంగిణి, రవీంద్రుని 'గీతాంజలి” ప్రభావం భావకవిత్వయుగంలోని భక్తికవిత్వం మీద ప్రస్ఫుటంగా కన బడుతుంది.

214 ఖావకథిర్వయురం - గదేయరచనలు మధురభక్తి గేయాలు భావకవిత్వంలో వెంకట పార్వతీశ్వరుల “ఏకాంత సేవి మధురభక్తికి ప్రాతినిధ్యం వహించే కావ్యం. “ఏకాంతసేవ కావ్యం “ప్రవిమల భక్తియుక్తుడైన భక్తుడు పరమేశ్వరుని గూర్చి పాడు ప్రణయగీతము...వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి యొట్టిదో, మన యాంధ్రమునా* కట్టిదని కృష్ణశాస్త్రి అభిప్రాయపడినారు. అయితే “ఏకాంత సేవ" కావ్యం 'గీతాంజలికి అనుకరణ కావ్యం మాత్రం కాదు. దేనికది స్వతంత్ర కావ్వాలే. శతకకవుల భక్తికవిత్వం, కృష్ణకర్జ్ణామృతం, కృష్ణలీలాతరంగిణి మొదలైన వాటిలోని రాధామాధవుల శృంగారం వైష్ణవగీతాలలోని (గరేమ మాధుర్యం కలిసి “ఏకాంత సేవిగా రూపొందినది. మంజరిద్విపద ఛందస్సులో వెలసిన మధురమైన కావ్యం “ఏకాంత సేవి చాలా వరకు 'ఏకాంత సేవి కావ్యంలోని పాదాలు 5+5+5+8 మాత్రలుగా ఉంటాయి. చివర రెండు మాత్రలకాలం ఊపిరి తీసుకొంటే ఇది ద్విరదగతి రగడ అయి, చక్కగా ఖండగతిలో నడిచే గేయమవుతుంది. విరిదండ మెడలోన వేయుటే కాని ఇ 5+5+5+8 కన్నార నీమూర్తి గాంచనే లేదు జ. ర+ర5్‌+5+8 ప్రణమిల్లి యడుగుల బడుటయే కాని = 5+4+5+8 చేతులా రగ సేవ జేయనే లేదు = 5+5+5+38 ఈ విధంగా సాగిపోతుంది 'ఏకాంత సేవి, భావకవిత్వంలో మధురభక్తి రెండు విధాలుగా నాగింది. రాధాకృష్ణుల, గోపికాకృష్ణుల ప్రణయాన్ని విరహాన్ని ఆ ప్రాతలద్వారా చిత్రీకరించడం. రెండవ దానిలో భావకవి తనను తాను గోపికగానో, రాధికగానో, (ప్రేయసిగానో భావించుకొని కృష్ణుని నుంచి వియోగ సంయోగాలనుభవించినట్లు భావించడం. రెండవదానికి ఏకాంత సేవ పరమోదాహరణం. భావకవులెందరో మధురభక్తి మార్గంలో కృష్ణుడిని సొంతం చేసు కొన్నారు. వారిలో తురగా వెంకట రామయ్య, బసవరాజు అప్పారావు ముఖ్యులు. మధురభక్తి మార్గంలో వెలసిన గేయాలను గురించి, ప్రణయ గేయాల శీర్షిక కింద ఇదివరకే కొంత పేర్కొనడం జరిగింది. తాత్విక గేయాలు భగవంతుని గురించిన జిజ్ఞాస మానవునికి అనాది నుంచీ ఉన్నదే. అతదు సాకారుదని, నిరాకారుడని, అతడు సగుణుడదని, నిర్దణుడని, భగవంతుడు ఒక్కడే అని, పలువురని, ఈ రకమైన జిజ్ఞాస ప్రతి మతంలోనూ ఉన్నది. జీవనయాత్రలో ప్రతి మానవుడూ ఏదో ఒక దశలో భగద్భావనను గురించిన ఆలోచనలకు లోనుకాక తప్పదు.

ఆధునికౌంధ్ర చేయ కవిత్వం 215 అతడు నిరీశ్వరవాది అయినా కావచ్చు, ఏకేశ్వరోపాసకుదైనా కావచ్చు లేదా కనిపించిన ప్రతి రాయికీ, పుట్టకూ మొక్కవచ్చు. అనేక ఆలోచనా ధోరణులను, అనేక మత తత్తాలను ఇముడ్చుకొన్న భారతదేశంలో తాత్త్విక కవిత్వం విస్సతంగానే విలసిల్లింది. అక్షర ప్రపంచా నికి దూరంగా ఉన్న జానపదులలో కూడా తాత్త్వికచింతన అధికంగానే కనిపిస్తుంది. “మ్పైనలుు మీదుగ, మొనలు కిందుగ మొలచియున్నది వృక్షమూ- మోదమలరగ మింటి మీదను మదగజము విహరించెరా”-మొదలైన గేయాలలోని తత్వం తరాల నుంచీ నరాలకు పట్టినదే. భావకవులలో తాత్విక కవిత్వాన్ని ఎక్కువగా రచించినవారిలో దువ్వూరి రామిరెడ్డి అ(గ్రగ్రణ్యులు. వీరు తాత్విక కవిత్వాన్ని మర్మకవిత్వమని వ్యవహరించినారు మర్మ కవిత్వాన్నే ఆంగ్లంలో //98%6 ౧061౧/ అని అంటారు. భక్తికవిత్వంలో భావకవిత్వంలో భావవ్యక్తీకరణలో మర్శత, గూఢత ఉన్నప్పుడది మర్శకవిత్వమవుతుంది. మర్శకవిత్వం భక్తికవిత్వంలో అంతర్భాగమే. దువ్వూరి రామిరెడ్డి రచించిన 'మర్శకవి, “దీపనిర్వాణము,, 'పెచ్చివీకారి “అతిధి” మొదలైన ఖండికలలో తాత్వికత తలస్పర్శిగా ఉన్నది. పై ఖండికలన్నీ మంజరీ ద్విపదలో వెలసిన కవితలే. దువ్వూరి రామిరెడ్డి జీవితాన్ని మృత్యువును జంటబిడ్డలుగా భావించినారు. మృత్యువును అందాలలోకెల్ల అందమైన దానిగా “ఆనందదాయకంబైన వాసంతకన్యగా, “ఖద్యోతకాంతల గనుబొమల పైన గురిపించు పెండ్లి కూతురు”గా భావించినారు. ప్రతిరాత్రీ గాఢ నిద్రావేళలో ఆమె సుఖతర నిశ్శబ్ద చుంబన స్పర్శను అనుభవిస్తూ ఉంటానని కవి అభిప్రాయపడినాదు. ప్రాణికోటుల బరపారంబు జేర్చు నుడుపంబు నేర్పుతో నడుపంగ బ్రకృతి నియమించె నిన్నునో నిశ్చల కర్ష ధారిణీ" అని మృత్యువును ఎంతో మనోజ్ఞంగా ఊహిస్తారు. మృత్యువును సహితం, ప్రియమైన దానిగా భావించడం భావకవులు సాధించిన నవ్యత. పొరపాటునైనా అమంగళాన్ని ఉచ్చరించడం, మనస్సులో ఊహించడం కూడా తప్పుగా భావించే భారతీయ సంప్రదాయానికిది పూర్తిగా భిన్నంగా గోచరిస్తుంది. మరొక భావకవికి 'మృత్యువైభవము కీర్తించుటకన్న నిత్యానందము* లేదని అంటాడు. దువ్వూరి రామిరెడ్డి రచించిన 'పిచ్చిబికారి' తాలోత్తాలమైన తాత్విక భావసంపద ఉన్న ఖందిక. ఒక విరాగి మాయాకుమారి దగ్గరికి వెళ్ళి నీ చేతి భీక్షై నిఖీలంబు విడిచి కాలవీధిని నొంటి గదలి వచ్చితినిో అని అడుగుతాడు. ఆమె తాను “ఉత్త చేతుల రాణి, నిత్తణి నీకు నేమియ్యగలి నని సమాధానం చెప్పగా అతడు

216 ఖాదకఐర్వయురం - గేయరచదవ్రలు నీజడ కట్టులో నిద్దుర వాడీ నలిగిన చంపక దళముల మాల వీచ్చంబు పెట్టుమీ పిచ్చిబికారి సంతృప్తి నొందును, చాలించు యాత్రగీ అని అంటాడు. ఆమె జదలో వాడిన చంపక దళాలమాలను భిక్షగా అడగడంలో తాను తరించడానికి జ్ఞానమార్గాన్ని ప్రసాదించమనే తత్త్వం గర్భితంగా ఉన్నది. దువ్వూరి వారిదే “దీప నిర్వాణము అనే ఖండికలో 2002066044 045 కోకిలయు నమృత తుల్యంబైన యానంద గీతి బాదదక్కట! నాదు పాపమే మందు! పలుమాటు నాచేతి బంగారు దివ్వె వెలిగింతుంగాని, కంపిలి యానిమేష మందె పయ్యర వీచి యారిపోయెడిని అనే పంక్తులలో నైరాశ్యం తీవ్రతరంగా కనిపిస్తుంది. దువ్వూరి రామిరెడ్డి కాక, మరికొందరు భావకవులు కూడా తాత్విక గేయాలు రచించినారు. మదిరాతత్వం తాత్సిక కవిత్వంలోని అంతర్భాగమే మదిరాతత్తం. పారశీక మహాకవి ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయిలలో ప్రతిపాదించిన సూఫీ తత్వమనే కొత్త అంటును తీసుకొనివచ్చి ఈ పాదులో కట్టినది. ఉమర్‌ ఖయ్యాము రుబాయీలను ఆంగ్లంలోకి ఫిట్ట్‌ గెరాల్స్‌ (112 (62164) అనువదించగా భావకవులు తెలుగులోకి అనువదించినారు. వీటిలో రాయప్రోలు సుబ్బారావు 'మధుకలశము, దువ్వూరి రామిరెడ్డి 'ఎవఎంనశాలి, మాధవ పెద్ది బుచ్చిసుందర రామశాస్త్రి 'ఉమరుఖయ్యాం), రామచంద్ర అప్పారావు 'అమరుకి కావ్యాలు ప్రశస్తమైనవి. కాని ఇవన్నీ పద్యకావ్యాలే. వీరందరి కంటే ముందుగా మొట్టమొదట ఆదిభట్ల నారాయణదాసు పారశీక భాషలో ఉన్న ఉమర్‌ఖయ్యామ్‌ రుబాయీల ననుసరించే అచ్చ తెనుగులో గేయకావ్యంగా సంతరించినాడనే విషయం ఇదివరకే వివరించి ఉన్నాను. ఆదిభట్ల నారాయణదాసే కాక చిలుకూరి నారాయణరావు కూడా ఫిట్ట్‌ గెరాల్డ్‌ ఆంగ్లానువాదాన్న అనుసరంచి, షట్ప్సదులలో అనువదించినారు. ఉదాహరణకు ఈడ మేముందడేటి కాలము దాటివోతున్నాది మఠీ అది దాటిపోతే తిరిగి వచ్చే మాట యేమొ కదా

ఇభునికాంధ్ర గేయ కనిర్వం 217

కొక్కురో అని కోడి కూసెను

కొట్టు “తలుపును తీయవే” మని

కోడి యుందినవారు నాత్రముతోడ నార్వగను*"”

ఆంధ్రానువాదం చాలా పేలవంగా కనిపిస్తుంది. అనువాదాలలో పద్యకావ్వాలైన మధుకలశము (రాయప్రోలు), 'పానశాలి (దువ్వూరి రామిరెడ్డి) ప్రశస్తమైనవి ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలకు ఉత్తమమైన గేయానువాదం ఒక్కటీ రాలేదు.” “పానశాల పద్యకావ్యం రచించిన దువ్వూరి రామిరెడ్డి మదిరాతత్తాన్ని మరికొన్ని గేయాలలో ప్రతిపాదించినారు. వాటిలో 'ఆనందసత్రము*, 'ఆమని నిషా” అనే గేయాలు ప్రసిద్దమైనవి. 'ఆనందసత్రద్వారముల నన్నిటిని దెఐచితి' రమ్మని అతిధులను ఆహ్వానిస్తాడు. దువ్వూరి 'వెరియొక్క పాత్ర యాసవ రసి మానినంతలోనే 'ఆ మత్తులోన గరిగిపోవు నైహిక యాత్రాభమము”* అని అంటారు. 'ఆనంద సత్రము' అనే గేయంలో “జాగ్రత్త! జాగ్రత్త మాయజగత్తని శాస్తములెల్లను విప్పెదవు, భాగ్యము భోగము చంచలమంచు బైరాగి ధర్మము జెప్పెదవు, ఎవ్వారు విందురీ పిచ్చి బోధనము, ఆనంద భాండమునందు హలాహలమయ్యయ్య విరసుడ, కలుపకుము” అని పిచ్చి బోధనలను కొట్టీ పారవేసారు. “ఆమని నిషాలో అంతేకాదు 'సరిచేయుమో సఖి, భగ్నవిపంచిక సంధ్యలు పాటల బుచ్చెదము! సౌఖ్యనదీరసపూరము నందంచ జంట విధంబున నీదుదుము! అని అంటారు. ఆ గేయంలోనే దువ్వూరి వారి 'పానశాలి వెలసిన తర్వాత భావకవులలో మదిరాతత్త్సం బాగానే ముదిరింది. మదిరాక్షి మీద మనసు కుదురుకొన్నది. మల్లవరపు విశ్వేశ్వరరావు, చలం వంటి కవులెందరో మదిర మీద, మదిరాక్షి మీద మధురమైన కవితలు రచించినారు. స్మృతి గేయాలు 'స్కృతిగేయంో అనే మాట ఆంగ్రభాషాపదమైన ఎలిజీ (5160) కి చేసిన అను

వాదం. మరణంవల్ల ఆప్తజన వియోగం కలిగినప్పుడు, ఆ వ్యక్తిని గురించి రచించిన గేయాన్ని స్మృతిగేయం అనవచ్చు. ఇంగ్రీషులో 'ఎలిజీకి ఇంచుమించు ఈ విధమైన నిర్వచనమే ఉన్నది. 706 ౬160౪ 18 & 1/10 6౫%00/6550/6 ౮ ౧6|4౧౦౧౦1/ 0 3౧61, గ 0211006146 ౪106౧ ౦0గ౫౧౪గ౫౦|౧2౪/6 ౦1 6౮646 116౧6 5 ఈ నిర్వచనంలో మిత్ర స్మృతి అని ప్రత్యేకంగా పేర్కొన్నా ఆప్తలైన వారి మరణంపట్ల రాసిన కవిత్వాన్నే 'ఎలిజీ' అనవచ్చు. భారతీయ కావ్యాలన్నీ మంగళంతో ఆరంభమై, మంగళంతో అంతమలయ్యేవి. = వడివదిగ ఐలరామాదార్డు ఉమడయ్యాం అమడోతాల, ౧౩౬9) అనే వేడతో త౭౭లో రవించినాడు.

218 ఖానకవిర్వయురం - గేయరచనలు వాల్మీకి రామాయణంలో సీతకోసం రాముడు విలపించడంలోను, కాళిదాసు రచించిన రఘువంశంలో 'అజవిలాప ఘట్టం'లోను, కుమార సంభవంలో “రతీవిలాప ఘట్టం'లోను స్మృతి కావ్యచ్చాయలు కనిపిన్తాయి. పూర్వాంధ్ర సాహిత్యంలో శ్రీనాధుడు రచించిన “కాశికా విశ్వేశు గలసె వీరారెడ్డి అనే పద్యంలోను, పెద్దన చెప్పిన “ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూత యొసగి యొక్కించుకొనియె” అనే చాటుపద్యంలోను స్మృతికావ్యచ్చాయలున్నాయి. “ఎలిజీ' ఒక ప్రత్యేక కావ్యశాఖగా అభివృద్ధి చెందింది భావకవితాయుగంలోనే.

భావకవితాయుగంలో మొట్టమొదటి స్మృతి కావ్యం (ఖండకావ్యం) రచించింది. రాయప్రోలు సుబ్బారావుగారె. గోపాలకృష్ణ గోఖలే మరణం వల్ల రాసిన ఖండకావ్యమిది. అయితే అది పద్యంలో ఉన్నది. అంతకు పూర్వం కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటివారు విక్టోరియా రాణిపై స్మృతిగేయాలు రాసినారు. జీవితంలో శోకాన్నే దర్శించిన, శోకాన్నే కోరుకున్న భావకవులు శోకగీతాలు (స్మ బ్రతి గేయాలను) ఒక ప్రత్యేకశాఖగా వెలయించడంలో ఆశ్చర్యంలేదు. వడ్పువల్ల ఎదమెత్తనవుతుంది. ఆప్తమరణంవల్ల తప్త హృదయం తాత్విక శిఖరాలకు ఎదుగుతుంది. ఆ తాత్విక శిఖరాల నుంచి వెలువడిన స్మృతిగీతం ఉదాత్తతను సంతరించుకొంటుంది. భావకవితా యుగంలో 'వరలక్ష్మి త్రిశతి, “భగ్నహృదయము, 'మాతృగీతాలు” మొదలైనవన్నీ ఉత్తమ స్మృతికావ్యాలే. కాని అవన్నీ పద్యకావ్వాలు.

స్మృతి గేయాలను రెండురకాలుగా వర్టీకరించవచ్చు. 1. దేశనాయక స్మృతి గేయాలు 2. ఆప్తస్మృతి గేయాలు దేశనాయకస్త్కృతి గేయాలు

రాజకీయ సాంఘిక, సాహిత్యాది రంగాలలో నాయకత్వం వహించి ్రసిద్ధులైనవారు మరణిస్తే, వారిని గురించి పేర్ళోవచ్చు. స్వాతంత్రోద్యమకాలంలో అనేక రంగాలలో, జాతిని జాగృతం చేసిన నాయకులెందరో ఉన్నారు. బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే, మహాత్నాగాంధీ, సరోజినీ నాయుడు వంటి జాతీయ నాయకులు, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులు, రవీంద్రుడు, గురజాడ వంటి మహాకవులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆం(ధ్రరాష్త్రంకోసం పూర్ణాహుతి చేసుకొన్న పొట్టి శ్రీరాములు వంటి మహానుభావులు మరణించినప్పుడు తెలుగు కవులెందరో ఆ పుణ్యశ్లోకుల యశస్సును ముక్తకంరంతో చాటినారు. భావకవితా యుగంలో ఆరంభమైన స్మృృతిగేయాలు ఈనాటికే అసంఖ్యాకంగా వెలువడుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న స్మ ఎతిగేయాలలో భావకవితాయుగంలో వచ్చిన కొన్ని స్మృతి గేయాలను మచ్చుకు పేర్కొంటాను.

ఆధునికాంధ్ర గేయ కవిత్వం 219 'తెలుగు తల్లికి ముత్యాలసరాలు గుదిగ్రుచ్చి ఇచ్చిన మహాకవి గురజాడ అవ్వారావు నిర్యాణానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన స్మృతిగేయం స్మరణీయమైనది. గురజాడ “గీత శీకరములు' యుగయుగంబుల నుండి (మోగెడు విశ్వగాన వియత్రరంగిణి భంగముల నుప్పొంగు *” అని గురజాడ కవితాశక్తిని గొప్పగా ఊహించినారు. బసవరాజు అప్పారావు చిత్తరంజన్‌దాసు మృతిపట్ల రాసిన ఊరేగింపు" గేయం కూడా పేర్కొానవలసినదే. స్మశానానికి తీసుకొనివెళ్లే ఊరేగింపును పెండ్లి ఊరేగింపులా భావించదమేకాక, చిత్తరంజనుడు, మన్మధుడు ఈ రెండు పేర్లలో అర్థ్ధసామ్యాన్ని పురస్కరించుకొని 'ఊరేగు మన్మధా ఊరేగవోయ్‌ పెండ్లి కొడుకూ లాగు పల్లకిలో యెక్కి *ీ అని అనడంలో ఎంతో ఉక్తి చమత్కారం ఉన్నది. స్మృతి గేయంలో కూడా ఇంత ఉక్తి చమత్సారాన్ని పొదగడం అరుదే. బసవరాజు అప్పారావుదే మరో గేయం. 'యమునా సాంత్వనం” అనే స్మ తిగేయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవలసిందే. ఈ గేయం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి మరణ సందర్భంలో రాసినది. వల పాడే నింక యమునా కళ్యాణి, నే లీలా మానవుడు గోపాలుడు లేదాయె ఈనాటి యీనేస్త మే జన్మకో తిరిగి కన్నీళ్ళు గారవకె కదుపు చెరువయ్యెనేో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి 'యమునా కళ్యాణి' రాగమంటే ఇష్టమట, బసవరాజు అప్పారావుచేత మరీ మరీ పాడించుకొని వినేవాడట. ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు మరణం పట్ల కవికొండల వెంకటరావు రచించిన స్మృృతిగీతం కూడా ఇక్కడ స్మరించదగినడదే. ఆ కళారత్న మిస్సీ-కట్టైయగుటెట్టు? నవనీతపుం గుంచె-నాడి సోకమి యెట్లు? చిత్రకారుని సొగసు-క్షితికి బరువాటెట్లు?

220 భాదకదిత్పయుగం - చేయరచనలు ఆప్తస్పృతి గేయాలు జన్మకారకులైన జననీ జనకులు, అర్జాంగి, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు, ఏకోదరులు హృదయం పంచుకొన్న స్నేహితులు మొదలైన ఆప్తులు మరణించినప్పుడు రాసిన గేయాలను ఆప్తస్మృతి గేయాలుగా వర్గీకరించవచ్చు. బాలాంత్రపు వెంకటరావు అర్ధాంగి మరణసందర్భంలో రాసిన “విరహ సంగీతము” అనే స్మృతిగేయంలోని కన్నీటి సరుల దొంతరల మాటున కమ్మని కవిత్వం ఉంది. అర్ధాంగి మరణంతో “విశ్వమును వెలయించు వెన్నెల పాటి, 'కోరికల్‌ చిగురించు కోకిల పాటి కడలేని పాటలో కలిసి పోయినాయని వీరు భావించినారు. ఆమె ఒక పక్షి అని, ఆమె “బంగారు జిక్కల నీదిలో ఆడే గృహస్థుడనని, ఇప్పుడామె జ్ఞాపకంరాగా “కనుల గడగుచుంటి కడవెడు సీళ్ళతోనని డగ్గుత్తిక పడిన గొంతుకతో” స్మ తిగీతాన్ని పాడినారు. స్మృతిగీతాల కర్తగా బసవరాజు అప్పారావుకు ప్రత్యేకమైన స్థానమున్నది. జీవిత సాగరంలో ఎదురైన ప్రతి ఆటుపోటునూ పాటగా ఆలపించినారు. అతని స్మృతిగేయాలలో ప్రతి పంక్తీ గుండెను పెకలించుకొని వస్తుంది. కృష్ణశాస్త్రి అన్నట్లుగా అతని స్మృతిగేయానికి 'నెత్తురు జీర అంటుకొని” ఉంటుంది. * అతని స్మృతిగేయాలు నగ్నంగా, ఉద్విగ్నంగా ఉండి, సూటిగా, వాడిగా, వేడిగా గుండెను తాకుతాయి. బసవరాజు అప్పారావు స్మృతి గేయాలలో ఉన్నంత వైవిధ్యం, వైశిష్టం మరి ఏ కవి సృృతిగేయాలలోనూ లేవు. ఆయన ప్రధానంగా 'ఎలిజీ' కవి. బిడ్డ మరణంపట్ల రాసిన స్మృతిగేయాలు చాలా గొప్పవి. బసవరాజు అప్పారావుకు 'మంగళప్రది అనే కూతురు ఉండేది. ఆమె తన ఇంట ఉదయించినందుకు 'ఎల్లజగమ్ముల నెలెడు తల్లి మా యింట చిటిపిల్లుగా పుట్టిందని స్వాగతం పలికినారు. 'వెనకజన్మలొ యేమి పెట్టి పుట్టితిమొ? బంగారు పండంటి పసిబాలకలిగె' అని మురిసిపోయినారు. కాని "పెట్టి యెవరిని యేమి తిట్టుకొన్నాడొ కాని, ఆ ఇచ్చిన దైవమూ మర్చిపోలేదు.” ఆ దైవం “కత్తిబెట్టీ పొడిసినాడు.” 'నిలువూన యిల్లు దోచేశాడు.” 'వెలలేని మణిని కాజేశాడు. ఆయన 'కడుపుతీపి అటువంటిది. విధి వికటించినప్పుడు మంగళప్రదను రుద్రభూమిలో పెట్టిరాక తప్పలేదు. ఆ రాత్రి- 'మంగళప్రదను రుద్రభూమిలో పెట్టిన రోజు-ఆకసము చిల్లులు పడినట్లు కుండపోతగ వర్షం” అంతలో ప్రకృతి పగబట్టినట్లు గర్జిస్తుంది. బంగారు బొమ్మ నాదు మంగళప్రదమ్మ యొంటి రుద్రభూమి గటిక నేల నిద్రించెదు నొడలు మరచి

ఆఢధుభికాంద్రి దేయ కిత్వం నేం చూపబోకు మచట నీ ప్ర తాప మెల్ల పిదుగా?్‌

అని వేడుకొంటాడు-మనీషి మరణించినా, ఇంకా ఆ జీవికి నిద్రాహారాలున్నాయని, ఆ జీవి ఇంకా బతికే ఉన్నదనే భ్రాంతి, ఆ జీవిపట్ల మమత, ఆ మాయ కొన్నాళ్ళ వరకు మాయదు. ఎంతటి పరిణతమనస్ములైనా ఆత్మీయులు మరణించినప్పుడు అదే రకమైన వేదన కలుగుతుంది. తర్వాత మంగళప్రద మరణించిన వాస్తవాన్ని క్రమంగా గుర్తిస్తారు. అయినా మంగళప్రదను మరిచిపోవడం సాధ్యమా!

సదడమటా సూర్యుండు కుంకేటి వేళా సందెకాంతులు కళ్ళ పండగా వేళా వికసించి నవ్వేటి బీరపువ్వులతో చిరునవ్వు నీ మోమె చూచి మురిసేనుో*

అని ప్రకృతిలో అమె ప్రతిరూపాన్ని దర్శిస్తారు. అంతలో వదాది గడిచి పోతుంది. కాలం ఎవరికోసమూ ఆగదు కదా! ఎవరి దుఃఖాన్నీ పట్టించుకోదు కదా! అయినా 'తనకు కలిగిన దుఃఖాన్ని అప్పుడే కాలం ఎట్లా మరిచిపోయింది. ఈ ఉగాది పండుగనాడు మామిదాకులు తోరణాలుగా దూరిపోవడానికి తొందరపడుతున్నాయి.” అని అనుకొంటారు. “తన చక్సని చుక్క మంగళప్రద ఈ పాటికి చుక్కలలో ఒక చుక్కగా మారిపోయి ఉంటుందని, ఆ చుక్కలలో ఏ చుక్కో మంగళప్రద* అని చుక్కలనే అదుగుతారు.

'స్వాగతము” దగ్గరి నుంచి “సంవత్సరాది' వరకు-అంటే మంగళప్రద పుట్టినప్పటి నుంచి, చనిపోయి సంవత్సరాది వరకు-చూస్తే మొత్తం ఏడు గీతాలలో (స్వాగతము, శాస్తి దోపిడి, కదుపు తీపి, చలిపిడుగు, నిర్వాణ సుఖము, సంవత్సరాది) అంతస్సూత్రంగా కావ్యధర్శ్మం కనిపిస్తుంది, జీవిపుట్టుక, జీవిమరణం, ఆ స్మ లకీ కాలగర్భంలో దలిసి పోవడం-దీనికి సంబంధించిన అనుభూతి స్రవంతి ఈ గీతాలలో కనిపిస్తుంది. విడివిడిగా ఉన్న ఈ ఏడు గీతాలలో ఏక సూత్రత ఉన్నందువల్ల, ఈ ఏడు గీతాలను కలిపి 'స్కృతి కావ్యం'గా పేర్కోవచ్చు. ఈ ఏడు గీతాలలో భాష రచన పేశలంగా ఉన్నా పొడిపొడి మాటలలోనే ఆరని తడి, అనుభూతి, అగాధమైన దుఃఖం ఉన్నందువల్ల పారకుని పేగులను కదిలిస్తాయి.

బసవరాజు అప్పారావు కొడుకు మరణంపట్ల రాసిన స్మృృతిగీతాలు కూడా ఉత్తమ కవితాత్మను పుణికిపుచ్చుకొన్నవే. “వేదాద్రి శిఖారాన వెలిగేటి జోతి నా పూరి గుడిసెలో దీపమైనిదని సంబరపడినాడు. కాని ఆ జోతి ఆ పూరిగుడిసెలో మినుకు మినుకుమని కాసేపు కునికినట్లే కునీకి హుష్‌కాకి అని కొండెక్కింది.

22 ఖావకథిత్మయుగీల - దేయరచవలు కాపుర మొచ్చిన కన్ని పాపాయి యిల్లు కాళీజేసి వెళ్లిపోయాడు” కృష్ణశాస్త్రి పీఠికలో అన్నట్లు పై పంక్తి “ప్రపంచ కావ్యభాండాగారాల్లో ఇదొకటి.” మంగళప్రది, 'వేదాద్రి నరసింహుడు”-ఇద్దరూ ఈ భూమి మీద అల్పాయుష్ములైనా బసవరాజు అప్పారావు స్కృతిగేయాల ద్వారా ఆధునికాంధ్ర సాహిత్యంలో అమరులైనారు. బసవరాజు అప్పారావు భార్య “సౌదామిని” (బసవరాజు రాజ్యలక్ష్యమ్మ) కూడా తమ ఇద్దరు పిల్లల మరణంవల్ల కలిగిన దుఃఖతీవ్రతను “దురదృష్టము” అనే గేయంలో వెల్లడించినారు,. మోటూరి వెంకటరావు తన తండ్రి మృతి సందర్భంలో 'ఆహుతి' అనే పేరుతో ముత్యాలసరంలో స్మ ఎతిగీతాన్ని రచించినారు. గాలి మేడలు హిమనగమ్ముల గట్టుకొని నా బ్రతుకు నేటికి గాజు పెంకులువోలె ముక్కలు గాగ జితికినది.” అనే పంక్తులలో తండ్రి మరణం వల్ల తన ఆశయానికి కలిగిన అశనిపాతాన్ని చిత్రించుకొన్నాడు. ఈ విధంగా భావకవితాయుగంలోని స్మృతిగేయాలలో అనుభూతి గాఢత, దుఃఖతీవ్రత అధికంగా కనిపిసాయి. గేయనాటికలు ఇంతవరకు భావకవిత్వంలోని కవితా ధోరణులను బట్టి వెలసిన గేయకవితా శాఖలను వివరించడం జరిగింది. గేయనాటికలు అనేది రచనా ప్రక్రియను బట్టి చేసిన విభజన. మొదట భావకవిత్వయుగంలోనే గేయం రూపక రచనకు కూడా తోడ్పడింది. అంతకు పూర్వమున్న యక్షగానాలు గీతి ప్రాధాన్యమున్నవైనా పూర్తిగా గేయరూపకాలు కావు. వాటిలో మధ్య మధ్య వచనం, పద్యం రూపంలో సంభాషణలు ఉంటాయి. పూర్తిగా గేయంలోని నాటికలు రచించడం భావకవితాయుగంలోనే జరిగింది. భావకవిత్వ యుగంలో వచ్చిన గేయనాటికలలో ఎక్కువగా వస్తువు ప్రణయానికి సంబంధించినదే, సంస్కృతంలోని ఉపరూపకాలకు గేయకావ్యాలనీ, “నృత్త ప్రకారాలినీ, “రాగ కావ్యాలినీ పేర్లు ఉన్నాయి. ఉపరూపకాలు స్వరూపంలో గేయాత్మకాలైనా, అవి ముఖ్యంగా నృత్త ప్రధానమైనవి. జయదేవుడు రచించిన “గీత గోవిందం” నారాయణతీర్చులు రచించిన 'కృష్ణలీలాతరంగిణి, ఈ రెండూ ప్రదర్శన యోగ్యాలయిన గేయరచనలే కాని రూపకధర్మం

ఆధునికాంధ్ర గేయ కథిర్వం 22వ లేనివి. అవి నృత్య ప్రాధాన్యమున్న గేయకావ్వాలు మాత్రమే. అట్లాగే కూచిపూడివారి భామా కలాపం, యక్షగానాలు, నృత్యప్రాధాన్యమున్న గేయరచనలేకాని, గేయనాటికలు కావు.

భావకవిత్వయుగంలో గేయనాటిక ప్రక్రియ కూడా ఆంగ్ల సాహిత్య (ప్రభావం వల్ల వచ్చిందని చెప్పాలి. ఆంగ్లంలో గేయరూపకాన్ని మెలోడ్రామా (761062౧2) అని, నృత్యరూపకాన్ని బాలే (౧260 అని, సంగీత రూపకాన్ని ఓపెరా (0౧౭/2) అని అంటారు. అయితే ఈ మూడు రకాల రూపకాలలోను సాహిత్య రచన గానానుకూలంగా (గేయమే) ఉంటుంది. కనక ఇవన్నీ గేయనాటికలే. ఆ నాటికలో నృత్యానికో, సంగీతానికో పూర్తి ప్రాధాన్యమున్నప్పుడు వాటిని ఆ పేర్లతో పిలుస్తారు. మెలోడ్రామాను ఓపెరాగా కూడా కొందరు విమర్శకులు పేర్కొంటారు. ఓపెరా పూర్తిగా గీతి ప్రధానమైనది. కొన్ని ఓ పెరాలలో సంభాషణలన్నీ పూర్తిగా గేయరూపంలోనే సాగుతాయి. మరికొన్ని ఓపెరాలలో అక్కడక్కడ గేయాలను అనుసంధిస్తూ వచనపు తుంటలు ఉంటాయి.

తెలుగు సాహిత్యంలో నాటక రచన గత శతాబ్ది చివరి పాదంలోనే ఆరంభమైంది తెలుగు సాహిత్యంలో కేవల పద్యకావ్యాలుకాని, (నిర్వచనోత్తర రామాయణం తప్పు), కేవల పద్య నాటకాలుగాని, గేయనాటకాలు గాని భావకవితాయుగం వరకు లేవని చెప్పాలి. నాటకాలలో గేయాలను, పద్యాలను మొదట ప్రవేశపెట్టినవారు ధర్మవరం రామకృష్ణమాచార్యులు, అయితే వారు రాసిన నాటకాలను గేయ, పద్య నాటకాలుగా పరిగణించలేము. వారి నాటకాలో గేయాలు, పద్యాల కంటె వచనానికే ప్రాధాన్య మెక్కువ. గేయాలను, పద్యాలను నాటక ప్రదర్శన రక్తికట్టించడానికి ఉపయోగించడం జరిగింది. పూర్తిగా పద్యాలతోను, గేయాలతోను రచితమైన నాటికలు భావకవిత్వయుగం నుంచే బయలుదేరినాయి. గేయ, పద్య నాటికలు పరిమాణంలో చిన్నవిగానే ఉంటాయి నాటకాలవలె ఏడు, ఎనిమిది అంకాలవరకు విస్తరించి ఉండవు. కనుకనే వీటిని నాటికలని వ్యవహరించడం జరిగింది,

గేయనాటికాకర్తలుగా మొట్టమొదట పేర్కొనవలసింది తల్లావజ్ఞల శివశంకరశాస్తి గారినే. వీరే ఈ రచనా ప్రక్రియలో ఆద్యులేకాక, అ(గ్రేసరులు కూడా. ఎక్కువగా గేయ నాటికలు రచించింది వీరే. వీరి కావ్యాలలో కూడా ఎక్కువ సంభాషణలు పాత్రల ముఖంగానే జరుగుతాయి. ఉదాహరణ 'హృదయశ్వరి? అనే కావ్యంలో “శుభ స్వప్నము” అనే భాగం సంభాషణల రూపంలోనే నడిచింది. 'వకుళమాలికి అనే గేయకావ్యం 'గీతికా స్వగతం (6/1౦ గ0౧౦|౦౫49) అని శాస్త్రిగారు వ్యవహరించినారు ఏకపాత్రో న్ముఖంగా కధను చెప్పించడం గీతికాస్వగతం. రెండు పాత్రల చేత కధ నడిపించడం గీతికా సంవాదం అంటారు. వీటిలో రంగ విభజన ఉండదు. “'వతభంగమిు,

224 భావకఖిర్తయుడీం - దేయరచనలు “ఉజ్జీవము, “రత్నాకరము మొదలైన గీతికా సంవాదాలు రఛింఛినారు, గేయ సంవాదం పూర్వ, ఉత్తర భాగాలుగా విభక్తమైనది. పూర్వభాగంలో రెండు పాత్రలచేత (భ్రమర, శాంత), ఉత్తర భాగం రెండు పాత్రల చేత (ధూర్జటి, త్రిలోచనుడు) కధ నడిపించినారు, అయితే ఇది రంగ విభజనవంటిది కాదు. “రత్నాకరము'ను గీతికా సల్లాపం అని కూడా శాస్రిగారే వ్యవహరించినారు. సల్లాపం ఉపరూపకాలలో ఒకటి. శివశంకరశాస్రి గేయనాటికలలో పూర్తిగా గేయాలు లేవు. పద్యాలు కూడా ఉన్నాయి. అయితే బాహుళ్యగుణంచేతనే వాటిని గేయనాటికలుగా పెర్కొనాలి. శాస్తి గారు తాము రచించిన నాటికలలో “'వరపర్‌క్షి, 'యక్షరాత్రి, 'సహజయానపంధథి, 'ాజజామాతా), “నోణక భార్య మొదలైన వాటిని గేయనాటికలుగాను, “పద్మావతీ చరణ చారణ చక్రవర్తి, 'దీక్షిత దుహితి, *కవిప్రియి, *'పదాంకము మొదలైన వాటిని పద్యనాటికలుగాను పేర్కొన్నారు. అయితే పద్యనాటికలుగా పేర్కొన్నవాటిలో గేయాలు గాని, గేయ నాటికలుగా పేర్కొన్న వాటిలో పద్యాలుగాని లేకపోలేదు. పద్యంలోగాని, గేయంలోగాని సంభాషణలు నడపడంలో శాస్త్రి గారు సిద్ధహస్తులు. మొదట ఒక వాత్ర ఎ ఛందస్సులో సంభాషణ మొదలుపెడుతుందో, తర్వాతి పాత్ర కూడా అదే ఛందస్సులో సంభాషణను కొనసాగిస్తుంది. సంభాషణలు పద్యాలలో, గేయాలలో ఉన్నాా వాటిని వచనానికి దగ్గరగా నడిపినారు. ఉదాహరణకు “ప్రభు వాక్యము” అనే గేయనాటికలో మహామాత్యుడు : ఇపుడు వచ్చితి వేమి? ఈ తొట్రుపాటేమి? ఆకస్మికముగా అహితముదయించెనా? ప్రతీహారి ; అనుకంప వహించి హఠాదాగమనము క్షమియింపుడు; కాంచి రాజకుమారిక గాఢ శోకతప్పురాలు దర్భనార్ధ మరుగుదెంచి ద్వారము కడ నిలుచున్నది ఆఅనతియగునేని లోని కామెను దోడ్కొనివత్తును. సాధారణంగా గేయనాటికలో ఒక పాత్ర మాట్లాడినదానిని ఒక గేయ ఖండంగా రాస్తారు. శివశంకరశాస్తి కొన్ని చోట్ల రెండు పాత్రల సంభాషణను కూడా ఒకే ఖండంలో రాసారు. ఉదాహరణకు భంగపడినావెలా ఛాయా పటము కొరకై వేడి యాపెను? అడగినాడ ఒసంగు నేమోయన్న విభ్రాంతిన్‌ో

అధున్రికౌంధ్ర గేయ కథిశ్వం 225

శివశంకరశాస్త్రి నాటికలన్నిటిలోను వస్తువు, కాలం, ప్రదేశం ఈ మూడిటికీ చక్కని ఐక్యం గోచరిస్తూ ఉంటుంది.

అబ్బూరి రామకృష్ణారావు “నదీ సుందరి” అనే గేయనాటిక (పద్యాలు కూడా ఉన్నవి)ను రచించినారు. ఈ నాటికలలో ఒకే అంకమున్నది. అబ్బూరి రామకృష్ణారావు రపీంద్రుని నాటకాలు కొన్నిటిని గేయరూపంలో అనువదించినారు. *బ్రహ్మచారి సమితి”, రారాజు, 'ముక్తధరి, 'రక్తకర వీరం” మొదలైనవి రవీంద్రుని నాటకానువాదాలు.

విశ్వనాధ సత్యనారాయణ “పాము పాటి అనే సంగీత రూపకాన్ని రచించినారు. ఇది ప్రసిద్ధమైన ధర్మాంగద కధే. “ధర్మాంగద చరిత్ర-పాము పాటి అనే పేరుతో జానపదులలో బహుళ ప్రచారంలో ఉన్నది. విశ్వనాథ ఆ ఇతివృత్తాన్నే తీసుకొని సంగీత రూపకంగా మలిచినారు. కాళ్ళీరు దేశంలోని కన్యకాపురాన్ని ఏలే ధర్మాంగదునికి చిత్రాంగదుడనే వాడు పాముగా (శాపవశాన) పుట్టడం, సౌరాష్ట్ర దేశాన్ని ఏలే రత్నాంగదుని కూతురు ైలోక్య సుందరిని పాముకిచ్చి పెళ్ళి చేయడం, సుందరి భర్త (పాము)ను తలమీద పెట్టుకొని క్షేత్రాలన్నీ దర్శించి, బ్రహ్మగుండంలో మునిగి పామును మనిషిగా చేసుకోవడం-ఇందులోని ఇతివృత్తం. వస్తువులోను, కధాకధనంలోను, కవితా విషయంలోను ఆధునికత లేకపోవడం వల్లను వీరి ఇతర గేయకావ్యాలైన కిన్నెర సాని పాటలు, కోకిలమ్మ పెండ్లికి వచ్చినంత ప్రశస్తి దీనికి రాలేదు. 'కిన్నెరనాని వాటలు” గేయ కావ్యాన్ని విశ్వనాథ ఆకాశవాణి (రేడియో) కోసం గేయరూపకంగా మలిచినారు. వీరు ఇదేకాక “గౌహతి” అనే గేయరూపకాన్ని రచించినారు. ఇవి రెండూ కూడా రేడియోలో ప్రసారితమైనవే.

గేయనాటిక రచనలలో కొత్తపుంతలు తొక్కినవారు కృష్ణశాస్త్రి గారు. పూర్తిగా గేయాలు కాకపోయినా మధ్య మధ్య వచనంలో సంభాషణలు ఉన్నాా గేయనాటికలలోని వచనం కూడా చెక్కిన శిల్పంలా, తీర్చిదిద్దిన తీగెలాసాగి సెలయేటి గలగలలు వినిపీ స్తుంది. మాటవెంట వాట, పాటవెంట మాట ఉండి, ఏది మాటో, ఏది పాటో తెలియనంత పరుగులు తీసి పరవశింపజేస్తాయి వీరి గేయనాటికలు. వచనమైనా, గేయమైనా ప్రతి పంక్తీ కవితామయంగా ఉండటంవల్ల రసహృదయం పులకిస్తుంది. ఏ మాత్రం సంగీతం రాని సహృదయుడు చదువుకొన్నా హృదయమే అజ్ఞాతంగా మట్టు సమకూరుస్తుంది వీది గేయనాటికలకు. కృష్ణశాప్రి “శర్మిష్టు, “విద్యావతి, ఏదాది పొడుగునా), “'వేణుకుంజం), 'ధనుర్దాసు” 'వసంతోత్సవం), “ఆండాళ్ళు, “దక్షయజ్ఞం, “కృష్ణాష్టమి” మొదలైన గేయ నాటికలు రచించినారు. ఊర్వశి కావ్యాన్ని రేడియోకోసం గేయనాటికగా రచించినారు. ఉమర్‌ ఖయ్యాం జీవితం ఆధారంగా రచించిన '“అతిధిశాల* అనే సంగీత రూపకంలోని పాటలలో ఉర్జూ, అరబ్బీ, పారశీక పదాలు వాడి చక్కని వాతావరణాన్ని కల్పించినారు.

226 భానకథిత్వయురం - దేయరచద్రలు వె సాకీ, సాకీ అనే పాటా, “తళుకు జలతార్‌ బుటాలద్దిన నీలవలయమ్మీ గుదారం, అఖిల సుఖదమ్మీ బిడారం, చేయి చేయి మెయి మెయి తగిలిచి చెంతనే ఉండాలి ప్యారి, చెలియమే మా పాలి హోరీ" అనే పాటా చాలా ప్రశస్తమైనవి. ఇవేకాక దాశరధితో కలిసి రాసిన *'కొత్తకోవెలి అనే నాటికలో కృష్ణశాస్త్రి రాసిన “నారాయణ నారాయణ అల్లా అల్లా” అనే పాట, 'కమ్మగా బతికితే గాంధీయుగంి అనే పాట ప్రతి నాహిత్వాఖీ మానినీ అలరించినాయి. కృష్ణశాస్త్రి రచించిన సంగీత రూపకాలు ఆధునిక యక్షగానాల వంటివి “విప్రనారాయణ, క్షీరసాగరమధనం' అనేవి యక్షగానాలే. కన్నడంలో జ్ఞానపీరం అవార్చు పొందిన శివరామ్‌ కారంత్‌ యక్షగాన ప్రక్రియను ఆధునికంగా మలచి, ఎంతో విస్పృతమైన వ్యాప్తిలోనికి తెచ్చినారు. కన్నడంలో వ్యాప్తిచెందినంతగా ఈ ప్రక్రియ తెలుగులో వ్యాప్తి చెందలేదనే చెప్పాలి. కృష్ణశాస్త్రి గేయనాటికలో భక్తి, రక్తీ రవంత వాస్యోక్తీ ముప్పేటలా అల్లుకొని ఉంటాయి. వీరి “చౌరస్తా సంగీత రూపకం వస్తువైవిధ్యమున్నది. రిక్షావాలా జీవితాన్ని ఎంతో హృద్యంగా వర్ణించినారు. వీరి గేయనాటికలన్నీ రేడియోలో (ప్రసారితమై, (శోతల సంగీత, నాహిత్యాభిరుచిని పెంపాందింపజేసినాయనడంలో సందేహంలేదు,

రేడియోలో ప్రసారితమైన గేయరూపకాలలో మల్లవరపు విశ్వేశ్వరరావు “బిల్ణణీయం' పేర్యొానదగినది. ఇది ఆకాశవాణిలో ప్రసారితమైన మొట్టమొదటి సంగీత రూపకం. షెల్లీ రచించిన “*ప్రొమిధియస్‌ అన్‌బౌండ్‌ (౧/0౧౧౪౪16009 6౧౦౦4౧౮6) ను సంపూర్ణ గేయరూపకంగా ఆంద్రీకరించినారు. పీ రచించిన '“శారదోత్సవం), “బలహీనులు, 'కృష్ణాపుష్మరం) 'మహివాసురమర్ధని చక్కని గేయరూపకాలు. రవీంద్రుని “చిత్రాంగది ఆధారంగా రాసిన గేయరూపకానికి చాలా (ప్రశస్తి వచ్చింది.

భావకవితాయుగం నుంచి ఇప్పటివరకు ఎక్కువగా గేయనాటికలు రాసిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు. కవి మాత్రమే కాక, గాయకుడు కూడా కావడంవల్ల వీరి గేయాలు కమ్మగా సాగపోతాయి. వారు రచించిన ఇతర గేయ నాటికలలో 'మధురా నగర రాధి, 'సుభద్రా విజయము” 'మేనకి, 'నౌకావిహారంి, 'పుష్పలావికుడు, రాసలీలి, “'స్వప్నసీమి, 'సుమజన్మ, *నళిన భ్రమరి, 'శాఖో అమృతవర్షిణి), మేఘసందేశరి, 'చండీదాసు, '“లకుమాదేవి, “విజయ విదాత), 'విశ్నవీణ'” మొదలైనవి చెప్పుకోదగినవి. రజనీకాంతరావు సంఖ్యలోనేకాక, గుణంలో కూడా ఉత్తమ గేయ నాటికలు రచించినారు.

సూరంపూడి భాస్కరరావు రచించిన 'ఆమకవి, “శునశ్చేపుడు, సత్యనారాయణ రావు రచించిన *చంద్రకాంతి, సరిపెల్ల నాంబశివరావు రచించిన “వరపుత్రికా పరిణయము, శ్రీశ్రీ రచించిన 'మోహినీ రుక్నాంగది, కాటూరి వేంకటేశ్వరరావు రచించిన

ఆధునికాంధ్ర గేయ కథిన్వల 227 'మువ్వగోపాలి), “శ్రీనివాస కల్యాణం), పాలగుమ్మి పద్మరాజు రచించిన “వానకారు కధి, కొప్పరపు సుబ్బారావు రచించిన 'అల్లీ మురా” మొదలైనవి పేర్కొనదగినవి. భావ కవిత్వయుగంలో బయలుదేరిన గేయనాటిక (ప్రక్రియ ఈనాటి వరకూ కొనసాగుతూ వస్తున్నది.

గేయనాటికలు దృశ్యనాటికల కంటె (శ్రవ్యనాటికలుగానే ప్రాచుర్యం పొందినాయి. ముఖ్యంగా ఆకాశవాణి గేయనాటికల రచనకు, ప్రాచుర్యానికి దోహదం చేసింది. కొన్ని గేయనాటికలు దృశ్యనాటికలుగా కూడా రక్తి కట్టించడానికి వీలున్నవి. అయినా వాటిని ప్రదర్శించడానికి కావలసిన ఆధునిక రంగస్థలం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం ఒక ముఖ్యలోపం. అందుకే పూర్తిగా గేయాలలో రచించిన దృశ్యనాటికలు ఎక్కువగా విజయవంతం కాలేదు. కొప్పరపు సుబ్బారావు రచించిన 'అల్లీ మురా, శివశంకర శాస్త్రి నాటికలు కొన్ని కృష్ణశాస్త్రి నాటికలు కొన్ని రంగస్థలం మీద కూడా విజయవంత మైనాయి.

తిరుమల శ్రీనివాసాచార్యులుగారు ప్రత్యేకించి గేయనాటికల మీద కృషి చేసి సిద్ధాంత (గ్రంధాన్ని రచించినారు. కేవలం విషయ సమగ్రత కోసం గేయనాటికల గురించి రేఖామాత్రంగా పరిశీలించడం జరిగింది. బాల గేయాలు

గేయవాజ్బ్యయంలో బాలగేయాలది ప్రత్యేకమైనశాఖ. ప్రాచీనకాలం నుంచీ బాలగేయాలు సంస్క తిలో భాగంగా ఉంటూ వచ్చినాయి. పసితనంలో పొాటలకున్న (ప్రాముఖ్యం బలమైనది. బాల్యం లయాత్మకమైనది. చైతన్యవంతమైనది. ఒంటి కదలికలోను, కంటి తళతళలోను లయ తొణికసలాడుతుంటుంది. ఆ వయస్సులో చదువు చెప్పాలన్నా చక్కని బుద్ధులు నేర్పాలన్నా పాటలతోనో, ఆటలతోనో పట్టుబడి నట్లుగా మాటలతోనో, మరి దేనితోనో పట్టబడవు. తరతరాలనాటి తీరు తీరుల బాల గేయాలు చెవిమరుగై పోతుండటంవల్ల తెలుగుబడులలో పాటల ప్రసక్తి లేకుందా పోతున్నది. సుమతి శతకం నుంచో, వేమన శతకం నుంచో ఏవో కొన్ని పద్యాలు చేరుస్తున్నారు. అవయినా పిల్లల మానసిక స్ధాయికి అనుగణంగా ఉండటం అరుదు. 'అంగన నమ్మరాదు...” 'గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్‌..” వంటి ఇతర సందర్భాలలో పనికి వచ్చే సూక్తులను పిల్లలచేత చదివించడం వల్ల తెలుగు చదువులకు పట్టిన దుర్లతికి దుఃఖించవలసివస్తుంది. వార్య విషయాలు పిల్లల వయస్సు, మనస్సు స్థాయులను బట్టి, బుద్ధి లబ్ది (1౧161106౧1 ౧౮౦16౧0 ని బట్టీ ఉండాలనే విషయాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అయినా పాటల ద్వారా విద్యను బోధించే పద్ధతి తెలుగుబడు

5౫414 (0461! 60 (బై మ. “ఆధునికాంధ్ర గేయకవిత్వం' అన్న విషయం మీద శీ ఎన్నో విషయాలను తమ పరిశోధన పరిధిలోకి తీసికొంటూ త .. శ్రీ చెన్నకేశవరెడ్డి గారు చక్కని కృషి చేశారు. ఈ నా సిద్ధాంతగ్రంథం ఆధునిక సాహిత్య పరిశోధన రంగంలోని (| షే ముఖ్యమైన లోటును భర్తీ చేసింది. ఆధునిక కవితల రూపం 1 య న క షే విషయంలో ఇంత బృహద్దంథం రాలేదు. ఎంతో ఉత్తమ 1 ట్‌ జ్‌ య. పరిశోధన వ్యానాలు ఇందులో ఉన్నాయి. దొరనామి శర్మ, 1 అనే! స్‌ జీ సంపత్కుమార, సీతాపతి గారల ఛందఃపరిశోధనల తర్వాత . వచ్చిన చక్కని సిద్ధాంత [గ్రంథం ఇది.. అందునా ఇది ఆధునిక ఆంధ్రగేయకవిత్వం మీద దృష్టి సార్థించిన గ్రంథం. -ఆచార్య ముదిగొండ వీరభదయ్య ఆధునికాంధ్ర గేయకవితా పదనర్తన పాటవాన్ని - విశ్లేషించి, ఛందస్సు తత్వాన్ని సార్ధ్థకతను అనుశీలించిన . గ్రంథం-ఇది వట్ట పరిశోధన (గ్రంథం కాదు. పదికాలాల పాటు కవులకు విమర్శకులకు ఉపయోగపడే కరదీపిక... . మాత్రాగణగతులు ఎంత భావస్ఫోరకంగా ఉంటాయో ఈ = వ్యాసకర్త అనుళీలించిన పద్ధతి ఈనాటి విమర్శకులకు వ... అనుసరణీయం. ఛందోవేత్తలంతా ప్రయాణించిన క్షుణ్ణమైన జ్య మార్గంలో కాకుండా అఖభీమాని అయిన కవిగా, 1. ఛందోమర్శ్మజ్జుడయిన పరిశీలకుడుగా ఈ వ్యాసకర్త చేసిన ఫో నిర్ణయాలు ఛందోవిమర్శకులకు దారిదీపాలు. || జః ఆచార్య ౨లర్లూటి శివారెడ్డి | - ( . భ ౦దోవై ముఖ్యం ప్రబలిపోతున్న నేటి కాలంలో న ల 11. గేయఛందస్సులను, వాటి నిర్మాణ వైచిత్రిని, లోతుగా / . య న్‌ 'సీరియస్‌'గా విషయపుష్టితో పరిశీలించిన చక్కని పరిశోధన వ | (గ్రంథం. ఈ (గ్రంథంలో డా. చెకేరె పాండిత్యాన్ని ప్రదర్శించే శ . . . పట్టులు, కవిత్వపులోతులు ముట్టె అవలోకనా నైపుణ్యం, . | ళ్‌ పరిశ్రమ శీలం అడుగడుగునా కనిపిస్తాయి. ్ష్‌ న

  • ఆచార్య వెల్టంద నిత్వానందరావు . / ల్ల వేదబుక్కుల దగ్గర నుంచీ గద్దర్‌ పాట దాకా గేయం య... [ శ్‌ పరిణామ-వికాసాల చరిత్రను, అటు ఛందఃపరంగాను, గ (. న ఇటు సాహిత్యపరంగాను పరిశోధించి, ప్రాచ్యపాశ్చాత్య లం దృక్కోణాల నుంచి అనుశీలించిన సిద్ధాంత (గ్రంథమిది. నీ స పరిశోధకుని ఆధునిక సంస్కారం ప్రతివుట్టంలోనూ న స్త నో -దా. అమృంగి వేణుగోపాల్‌ అ