Telugu అమూల్యం_నండూరి సుందరీ నాగమణి_2014_181 P_SVKA102B102 - anilvaranasi/indianlanguages GitHub Wiki
వ్ - | 1 | (1 ల్లో - జ్ | | | కా క గొ గ ౯5 ళ్ లో మెం క న ష్ .! ; భ్ వ ౯ న అ ప్ర పమ 0. శ్వ హ్ ॥ | తాతే టు. _ స్ వ స న వ / ॥ తొ ం / స తేమ సన స్తా ట్య! అనోస్స్య్యళ, శో, ఆలు అం ఆట గుర కుం పం / న్న ఇ రర ల నజ ఆగ్ ల వ గ్ ప. య ౧, ా / .. అటీ టా య ల్ (. / (4 4 , , లగ ళ్ ల్ తన ఇ . గ ్గే వ జే 1 బే " | క్ క న న్ క్త. _ ఈ-- త్ నే క లే =. ఫ్ లో + (| గ ల “త ౯ నే వ్వ న. ॥ ఈ క్ న | + - మే నై ణ్ | ॥ న చ నాం + ఖ్ అజ" ఇ లో ం టం స్‌ు న ఇ క్ ౯ తా. “పా ర్ట ల క | లా మ న. న. గ ॥ ళా మ, ౧ మ! ॥ = న్ త _ వో. శ ఠః వాననననననననా” “( వ. శో స పపా యను 4. ॥ టే ని త్ శ సము ల ఒ. శ జస జ సనన. . ర క స్. ' క వెప ం టె లం ద ప. [ కథ ల ఎత గ. "
తోం2ల ఈాట్నా టం ళ్ళ అంకితం అక్షరమనే భిక్షపెట్టి, అందరాని లోకాలకు తరలిపోయిన అమ్మానాన్న యాళ్ళ కమలమ్మ యాళ్ళ సూరన్నలకు భక్తిగౌరవాలతో అంకితం. నండూరి సుందరీ నాగమణి (ల వ్ ల మ. అఖ్మ గ మ. / గ్ న్న [ తీ ఖై . € మం క మమ మో
(౮ (4 శ్రీమతీ “త ఎ .ట్బ గిగా 63 టగ ౮.౨. దబుత త్తు రి చ ప. త ౨ అవమూల్యం (కథలు) నండూరి సుందరీ నాగమణి
అవబూాల్యం (కథలు) నండూరి సుందరి నాగమణి జెవి. పబ్లిషర్స్ హైదరాబాద్
ల్ , 2. ర్. కం. న్ తిల! 2గ) [. (510౧165) 8/ గీ2గర00గ| 54౧62311 282౧౧3౧! [1/56 ౧౪౮౦115066: గీయకంం€ 2014 అ గలయ0/ ''2౧64౦00/౧| 94౧63౧] [|282గ8౧| న; 98499 89201/98497 42503 ౧2౧6౦౦౧1౧౩౬[20౧౧౩౧| అక్రగా౭||.00గ ౧0౪6! 06518౧: 821 ౦౧165; ౨00 క ననా. భయమ్యుళంాలువ్నా. [5 150/- ప్రదయ్యో వి ల్‌ో ని/0/5/౧66 00/: బ్ 0 ఆ కింి!15[అ “ఏమై ఘా [1/606/౧3036. ల ప్రాదరాజ 6611: 80963 10140 “వక్ జ్ నిగ/౧౭6 06 [1102122 6౯20115 6౧14260211 గ*ర6/౧3036. |: 66100227, 65552357 “(0/600/69. నీ! [420 80016 6%00
ముందుమాట
శ్రీమతి నండూరి సుందరీ నాగమణిని నేను మొదటిసారి కలుసుకున్నది “లేఖిని” సంస్థ ఏర్పాటుచేసిన టూర్‌లో... అప్పుడు నాకు ఆవిడ రచనల గురించి ఏమీ తెలీదు. బస్సు ప్రయాణంలో ఆమె చాలా బాగా పాటలు పాడారు. మధ్యలో మేమిద్దరమూ కబుర్లలో పడ్డాము. అప్పుడు కూడా ఆవిడ తన రచనల గురించి నాకు ఏమీ చెప్పలేదు. అందుకే, “కథలు పంపుతున్నాను, మీరు ముందుమాట రాయాలి” అని ఆవిడ కోరినప్పుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి కారణాలు రెండు - ఒకటి, కొత్త కథలు రాశానని చెప్పకుండా, పదిహేను కథలు నాకు పంపినందుకు, రెండు, నన్ను ముందుమాట రాయమని అన్నందుకు.
నాగమణి వృత్తిరీత్యా బ్యాంక్ ఆఫీసర్. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. నేటి కథా రచయిటక్రుల్లో ఆమె ఒక విశిష్ట వొత్ర నిర్వహిస్తున్నారనటంలో సందేహం లేదు. కథాభిమానులను ఆకర్షించే లక్షణాలన్నీ ఈ సంపుటిలో పుష్కలంగా వున్నాయి. కథలకు ఆమె పెట్టిన పేర్లనే తీసుకోండి. “కణ్వ శాకుంతలం” అన్న శీర్షికను చూడగానే చదవటం మొదలుపెట్టాలని అనిపిస్తుంది. కథలన్నీ జీవితానికి సన్నిహితమైనవి. పాత్రలలో వైవిధ్యం వుంది. సన్నివేశాలలో వాస్తవికత వుంది. కథనంలో ఏకబిగిన చదివించే గుణం వుంది.
నాగమణి రచనల్లో నాకు నచ్చిన అంశం ఆమె తన కథల్లో ఇతివృత్తాలుగా స్త్రీ జీవితాలని ప్రముఖంగా తీసుకున్నప్పటికీ, ఆమె ఏదో ఇక “ఇజం” ఒక 'వాదం'కి కట్టుబడిపోయి, గిరి గీసుకొని ఆ హద్దుల్లో తన రచనలు చెయ్యకపోవడం.
ఎక్కడా ఉపన్యాస ధోరణి కనబరచకపోవడం, ఆదర్శాలు వల్లె వేయకపోవడం. మన జీవితాలు, సమస్యలు ఎంతో విస్తృతమైనవి, మామూలు నీతిసూత్రాలతో వాటికి హద్దులు ఏర్పరచటం అసాధ్యం అని ఆమె గుర్తించడమె దానికి కారణం.
మనసా ఎటులోర్హునే...” కథలో మంజీర (ప్రేమలో పడుతుంది. తను (ప్రేమించిన వ్యక్తి తనని నిర్లక్ష్యం చెయ్యడంతో నిస్ప హలో కూరుకుపోతుంది. అయితే అలాంటి అనుభవాన్నే చవిచూసిన కరుణ ఆమెకి మగవారి స్వభావాన్ని వివరించి, వాళ్ళ మత్తులోంచి బయటకు వచ్చి, జీవితంలో సాధించవలసినవి మరెన్నో వున్నాయని, వాటిపై దృష్టి పెట్టమన్నప్పుడు, మంజీరలో మార్పు చోటు చేసుకుంటుంది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. '“అపరాజితి కథలోని విరజ కూడా వంచింపబడుతుంది. ఆమె అందాన్ని. డబ్బునీ ఆశించి, తనకి పెళ్ళెందన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెని రహస్యంగా పెళ్ళి చేసుకుంటాడు రాకేష్ విరజ తల్లి కాబోతున్నదని తెలిసి అతడు మొహం చాటువేస్తాడు. లాయరు మధుర ఇచ్చిన ధైర్యంతో అతనికి రెండో భార్యగా మిగలక, అతని పడగనీడ నుండి బయటపడి, ఒక సేవాసదన్‌లో చేరుతుంది విరజ. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది. తన జీవితానికో లక్ష్యం ఏర్పరచుకుంటుంది. (ఆశాదీపం'లోని వల్లి కూడా తన భర్తనుండి ఎయిడ్స్ సంక్రమించినా గుండె ధైర్యంతో కోలుకొని, స్వచ్చంద సేవాసంస్థల కార్యక్రమాలలో పాల్గొంటూ, నలుగురికి ఉపయోగపడేలా జీవించటం కొనసాగిస్తుంది. ) మగవాళ్ళు మాత్రమే దుర్మార్గులా? స్రీలే ఎప్పుడూ వంచింపబడుతుంటారా? కాదు, కొందరు స్రీలలో కూడా స్వార్థం గూడు కట్టుకొని ఉంటుంది. “అమూల్యం” కథలో ఉత్పల అతని ఉద్యోగాన్ని డబ్బునీ చూసి ప్రణయ్‌ని ఇష్టపడుతుంది. వాటిని అతను కోల్పోగానే అతన్ని వదిలేస్తుంది. ప్రణయ్ కూడా మనసు మార్చుకుంటాడు. ఆస్తులూ, అంతస్తులూ, కులం పట్టించు కోకుండా సహనం, సేవాగుణం చూపించిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసు కుంటాడు. 'మంచిముత్యం” కథలోని మల్లిక కూడా ఉత్పలలానే (గ్రవర్తిస్తుంది. తనను గాఢంగా (ప్రేమించిన శరత్‌తో “నా ప్రాజెక్ట్ వర్క్ కోసం నీతో చనువుగా ఉన్నాను అంతే” అని అంటుంది. వేరొకరిని పెళ్ళి చేసుకొని స్టెట్స్‌కి వెళ్ళిపోతుంది. శరత్ కూడా ప్రణయలా తన గాయంనుంచి కోలుకుంటాడు. తమ ఆశయాలను,
ఆదర్శాలను ఉగ్గుపాలతో రంగరించి నేర్పించామని అనుకున్న తల్లిదండ్రులనే మోసం చేయడానికి ప్రయత్నించిన స్వార్ధపరురాలైన ఒక కూతురిని 'దుహిత'లో చూసాం.
తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య ఉన్న సంబంధాలు ఇతివృత్తంగా కొన్ని కథలు వున్నాయి. 'అమ్మా, నా వేలు పట్టుకో'లో కొడుకు తల్లిలోని సంగీత, ప్రతిభను ప్రోత్సహిస్తూ, తల్లిపై తండ్రికున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి, అతనిలో పరివర్తనని తీసుకొస్తాడు. “జీవితమే సఫలములో తండ్రి తన కొడుక్కి ఆసరాగా నిలుస్తాడు. వేరొక కథ 'కణ్వ శాకుంతలం'”లో తండ్రి కూతురికి, కూతురు తండ్రికి ఆసరాగా నిలుస్తారు.
(ప్రేమలూ, పెళ్ళిళ్ళూ మాత్రమే కాకుండా, మారుతున్న నేటి జీవన విధానాలూ, విలువలూ కూడా ఈమె కథల్లో చోటుచేసుకుంటాయి. “ఏనాడు విడిపోని ముడి వేసెనో' కథలో స్నిగ్ధ తన తండ్రి ప్రవర్తనని చూసి, వివాహవ్యవస్థ మీద ఏహ్యభావం ఏర్పరచుకొని, తన ప్రియుడితో “సహజీవనం” చేస్తుంది. కాగా, ఆమె ప్రియుడే ఆమెని తనతో పెళ్ళికి ఒప్పిన్తాడు. నేటి యువతరంలో 'సహజీవనం' అనే ధోరణి వేళ్ళునటం చూస్తున్నాం. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు కాని రచయిత్రి దానిని సమర్థించదు. వివాహబంధంలోని బెన్నత్యాన్ని తన కథలో ప్రదర్శిస్తుంది. “అమ్మ చెప్పింది” కథలో కూడా నేటి యువతకి ఎదురయ్యే ప్రమాదాల గురించి హెచ్చరిక ఉంది. ఫేస్‌బుక్‌లూ, సెల్‌ఫోన్‌లూ, స్మెస్‌లూ, క్లబ్‌లూ, నైట్ పార్టీలూ, సైబర్ కైమ్‌లూ... తన తప్పు తెలుసుకున్న స్రవంతి తల్లి సాయంతో ప్రమాదం నుండి ఎలా బయటపడుతుందో ఈ కథ చెబుతుంది. నేటి యువతులకి చెప్పాల్సిన ఎన్నో విషయాలను చెప్పిన మంచి కథ ఇది.
నాగమణి కథల్లో నాకు నచ్చిన మరో అంశం తను స్తీ పక్షపాతిగానే ఉండిపోకుండా, ఉదాత్తమైన పురుష పాత్రలను చిశ్రీకరించటంతో పాటు, స్తీలలోని లోపాలను కూడా ఎండగట్టటం. అలాగే తమ తప్పులు తెలుసుకున్న పాత్రలు పరివర్తనం చెందటాన్ని ఆమె ప్రదర్శించిన తీరు. 'ఉషస్సు'లో స్పందన
ముందు తన భర్తను అపార్ధం చేసుకొని, చివరకి అతని గొప్పతనాన్ని గుర్తించి, పశ్వాత్తాపం చెందుతుంది. తన కథలకు 'ముందుమాటి రాసే అవకాశం నాకు కల్పించిన నాగమణికి ఎంతో కృతజ్ఞురాలిని. ఈమె కథలు ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. చదవటం మొదలుపెట్టాక మధ్యలో ఆపాలని అనిపించదు. మంచి భాషా శైలి ఉన్న రచయిత్రి. భవిష్యత్తులో ఈమె కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుతున్నాను. = ఆర్. శాంతసుందరి, హైదరాబాద్
ఒక్కక్షణం...
నమస్తే... నా దృష్టిలో 'ముందుమాటి అంటే కథల్ని సమీక్షించడం కాదు... విమర్శించడం కాదు... కేవలం పరిచయం చెయ్యడమే! ప్రతి రచయితకీ ఓ విషయం మాత్రం అనుభవంలో వుండి తీరుతుంది... అది, తను రాసిన కథో / కవితో / నవలో - నిర్దాక్షిణ్యంగా వెనక్కి తిరిగి తిరుగుటపాలో రావటం. “ఎందుకిలా?” అనే ప్రశ్న ఖచ్చితంగా సదరు రచయిత/రచయిత్రి మనసుల్లో ఉదయిస్తుంది. ఇగోతో ఆలోచిస్తే ఏనాటికీ ఆ ప్రశ్నకి జవాబు స్ఫురించదు. ౬€ం౦ని - "04 60' అని పంపించేసి ఆలోచిస్తే, మరుక్షణంలోనే జవాబు దొరుకుతుంది.
బహుశా యీ అనుభవం నండూరి సుందరీ నాగమణిగారికి వుండివుందదు. ఎందుకంటే, ఆవిడ రచనలు ఏవీ తిరిగి వచ్చి వుండవు...! కారణం, ఎన్నుకునే ఇతివృత్తాలూ, కథలు నడిపించిన తీరూ, ఆమె సంస్కారం.
రచన రచయిత / లేక / రచయిత్రి సంస్కారాన్ని ప్రతిబింబిస్తుందనడానికి యీ కథాసంకలనం ఓ ఉదాహరణ. “ఇంతింతై వటుడింతై” అన్నట్బగా తప్పటడుగుల నించి దృఢమైన వ్యక్తిత్వానికి ఎదిగిన రచనలు నాగమణిగారివి.
ఆమెలోని “సున్నితత్వం” వెన్నెల పరుచుకున్నట్టు ప్రతి కథలోనూ మనకు కనబడుతుంది.
నేను ఆమెను పాగదడదలుచుకోలేదు. ఎందుకు పొగదడాలీ? ఈ కథల్ని నేను
సామాన్య పాఠకుడిగానూ, కథల్ని ప్రేమించే మామూలు మనిషిగానూ చదివాను. ఓ బిడ్డ ఎదుగుతుంటే ఓ తండ్రి ఎంత సంతోషపడతాడో “అంత'
సంతోషపడుతూ, యీ కథల్ని మీకు పరిచయం చేస్తున్నాను... తప్పులుంటే నావి...!
మన్నించండి! ఒప్పులన్నీ నాగమణివి... మెచ్చుకుని మరింతగా - చేయూత నివ్వండి... (చేయూత అంటే పుస్తకాన్ని “కొని” చదవడం అన్నమాట!) ఇక ఒక్కో కథనీ పలకరిద్దాం... తీరిగ్గా... సరేనా!
-
మనసా ఎటులోర్లునే; సుందరీ నాగమణిగారికి సంగీతం వొచ్చు... అందుకే కథ కూడా 'మ్యూజికల్‌ొ టచ్‌తో సాగుతుంది. మనిషి జీవితంలో ఏ ఆస్తీ మిగలదు... ఒక్క “అనుభవం అనే ఆస్తి తప్ప. పెద్దలనుండి పిల్లలు పొందే పెన్నిధి ఆ అనుభవమే. *ప్రేమ' అనే సబ్దెక్టుని ఎన్నుకుని, సున్నితంగా చర్చించిన కథ ఇది. *నది'లో ప్రచురించబడింది గనక నదీప్రవాహంలాగే సొగుతుంది.. (నది)
-
ఏనాడు విడిపోని ముడివేసెనో: ఇదీ మ్యూజికల్ నేమ్‌తో మొదలైన కథే. ఇప్పటి 'యువతీ యువకులి జీవనవిధానాన్ని సాంప్రదాయిక జీవనంతో కంపేర్ చేస్తూ “ఏది మంచిదో), “ఎందుకు మంచిదో వివరించిన కథ. తీసుకున్న ఇతివృత్తం “'లేటెస్ట్‌దైనా ఎక్కడా ఆవేశానికి పోకుండా, ఆలోచింపజేసేలా కథ నడిపించిన తీరుని మెచ్చుకోవాలి (నవ్య):
-
ఉషస్సు: మానవీయ కోణంలో రచించబడ్డ కథ ఇది. నిజానికి ఇందులో స్పందనని ఇంకా '“రఫ్'గా చూపవొచ్చు. ఆమె నోట్లోంచి తుఫానులే సృష్టించవొచ్చు. కానీ రచయిత్రి అలా చెయ్యలేదు. ఎంత మటుకూ '“ఉంటే'
సరిపోతుందో అంతవరకే ఆ పాత్ర యొక్క “నమ్మకాన్ని ఉంచి, ఆ తరవాత ఆ పాత్రనే “ఆర్ధికపరమైన కోణంనించి మానవీయ కోణానికి మరల్చ్బడం
- కథ సుఖాంతం కావడం చాలా సున్నితంగా జరిగిపోతాయి (స్వప్పు. డ్తే అమ్మా నా వేలు పట్టుకో: నాగమణిగారి జీవితంలో సంగీతం ఒక భాగం. ఈ కథలో “ప్రజ్ఞుకి వయసుతో పని లేదనే సత్యాన్ని ఆవిష్కరించారు. ఓ మధ్య తరగతి కుటుంబంలో, “సంగీతం” అనేది భగవంతుడు మనిషికిచ్చిన
వరమైనా కొన్ని తరాలపాటు మనుషులు ఆ వరాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. ఆ వరం పొందినవాళ్ళని చిన్నచూపు చూస్తూనే వచ్చారు. కానీ “కళ అనేది అణగదొక్కబడదేది కాదనీ, తన 'ఉనికి'ని తాను నిరూపించుకుంటుందనీ ఈ కథ సారాంశం. సున్నితంగా మలచబడ్డ కథ ఇది. (జాగృతి)
-
అపరాజిత; మోసపోయే వాళ్ళు వున్నంతకాలం మోసం చే సేవాళ్ళు వుంటారు. మోసం చేసేవాళ్ళు వున్నంతకాలం మోసపోయేవాళ్ళూ వుంటారు. ఎటొచ్చీ మోసపోయేదీ, సర్వాన్నీ పోగొట్టుకునేదీ ఎక్కువగా ఆడవాళ్ళే. (ప్రేమ! అనే పిచ్చిలో పడ్డవాళ్ళు ఎలా తమని తాము పోగొట్టుకుంటారో, అయితే, ఆ సమస్యనించి కొందరు తమ 'మనోశక్తితో ఎలా బయటపడగలరో యీ కథ చెబుతుంది. (ఆంధ్రభూమి దినప(తైిక)
-
జీవితమే సఫలము: ఇదీ ఓ 'సఫలమైన' ప్రేమకథే. 'ప్రేమ (ప్రేమని ప్రేమించి ప్రేమిసూనే వుండాలంటే లాంటి భారీ డైలాగులు లేకుండా 'సాఫ్) సీదాగా నడిపించారు నాగమణిగారు. తండ్రీకొడుకులు ఫ్రెండ్లీగా ఒకరి కష్టసుఖాలు మరొకరికి 'యీ' కథలో లాగా చెప్పుకోగలిగితే చాలా సమస్యలకి సులువైన పరిష్కారం దొరుకుతుంది. (స్వాతి)
-
కణ్వశాకుంతలం: ఆరుద్రవారు ఓనారి చమత్కారంగా... ళ్ట్టంం చేస్తాం సార్, పువ్వుల్నీ పళ్ళనీ, అప్పుడప్పుడూ ఆకాశాన్నీ అమ్మితేగానీ మాకు జరగదుగా” అన్నారట ఓ ప్రాడ్యూసర్‌తో. నిజం అంతేగా...! ఆఖరికి నేనూ రాశాను, “చామంతి పువ్వా... పువ్వా... పువ్వా... నీకు బంతిపూల చీర కట్టనా!” అని. అట్లాగ ఇప్పుడు కవులకీ, రచయితలకీ నయాగరాలాంటి (ప్రేమ జలపాతం దొరికింది. ఎన్ని లక్షల కోట్ల కథలూ, కవితలూ, నవలలూ, కావ్యాలూ రాసినా ఇంకా రాయడానికి 'మటర్' వుంటూనే వుంటుంది. 'దుష్యంతులకు కొదవలేని దేశంలో శకుంతలలు ఏమి చేస్తారూ? ఓ శకుంతల లాంటి 'సుధీరి కథ ఇది. నెరేషన్ యథాప్రకారం సున్నితంగానే సాగింది. (మాలిక వెబ్ పత్రిక)
-
అమూల్యం: “అమూల్యం)ి కథలో అన్ని ఎమోషన్సూ సరైన పాళ్ళలో ఉండటంతో కళ్ళు అక్షరాల మీద పరుగులు పెడతాయి (చూపులు అనొచ్చు గానీ...) కథ సుఖాంతం గావటంతో పాఠకుడు కూడా కథని చదివేశాక “తృప్తిగా నిట్టూరుస్తాడు. సామాన్యంగా కథలు ప్రేమతో మొదలై పెళ్ళి దగ్గర ఆగుతై. (అంటే పెళ్ళితో (ప్రేమకి ఫుల్‌స్టాప్ అన్నమాట...) కానీ యీ కథ '"సేవితో మొదలై పెళ్ళిదాకా పయనిస్తుంది. కొంతమంది బ్రహ్మ చారులు 'సాంత్వని లాంటి పిల్లకోసం వెదికినా ఆశ్చర్యపడక్కర్ణా. (స్వాతి)
ఫ్ర, ఉడుకునీళ్ళు: “ఉడుకునీళ్ళ' ఉపమానంతో సంసారం చక్కదిద్దుకున్న మల్లేశు కథ ఇది. పల్లె 'యాసిని రచయి(త్రి బాగా పండించారు. అనుమానాలు- అభాండాలు అపోహల నేపథ్యంలో చాలా కథలు వచ్చినా, నాగమణిగారు యీ కథని చాలా రసవత్తరంగానే నడిపించారు. (స్వాతి)
-
గ్రహణం: ఇది ఆడపిల్లల తల్లిదండ్రులందరూ తప్పక చదవవలసిన కథ. ఇతివృత్తం చైల్డ్ అబ్యూజ్ 'పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలు”. నూటికి, బయటపదేవి కేవలం ఒకటో రెండో శాతం మాత్రమే. మిగతావన్నీ “పరువు” పేరుతో కొన్నీ భయం” మాటున కొన్నీ దాగిపోతాయి. నాగమణిగారు కథలో భాగంగా చక్కని సూచనలు చేశారు. అవి అందరూ చదివి ఆచరించాల్సినవి. సమాజానికి మేలు చేసే కథని చాలా సున్నితంగా, చాలా సమర్ధవంతంగా రాసినందుకు నాగమణిగారిని అభినందించి తీరాలి. (ఆంధ్రప్రభ వెబ్ పత్రిక)
-
ఆశాదీపం: ఇది కూడా చాలా చక్కని సమాజానికి పనికొచ్చే కథ. ఎయిద్స్, హెచ్‌ఐవీ గురించి చర్చిస్తూ ఎన్నో అపోహలను తొలగించే కథ. పాంప్లెట్స్ పంచిపెట్టినంత మాత్రాన పాఠకుల మనసులో 'పాయింటోొ ముద్రితం కాదు. చెప్పదలుచుకున్నదానికి ఓ కథారూపం ఇస్తే అది హృదయంలోకి చొచ్చుకుపోతుంది. ప్రజలకు మేలు చేసే ఇతివృత్తాన్ని ఎన్నుకున్నందుకూ, తద్వారా చక్కని సమాచారాన్ని అందించినందుకూ నాగమణిగారు అభినందనీయురాలు. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంఘం
వారిచ్చే పోటీలో ఎన్నుకొనబడిన కథ ఇది) దీన్ని ఓ చక్కని "స్టేజ్ ప్లేగా కూడా మలచవొచ్చు.
-
జీవితసహచరి; ప్రస్తుత పరుగుపందెంలో స్తీ పురుషుల సంబంధాల గురించీ, దాంపత్యం గురించీ చర్చించిన కథ ఇది. కథ కంటే ఇదో సుదిర్హ ఉత్తరం అనుకోవచ్చు. ఇది చదివాక ప్రతి భర్తా తనలోని 'అమరొని గుర్తిస్తే చాలు యీ కథ 'పరమార్ధం' నెరవేరినట్టే. ఎందరో “భవానీల ఆత్మకథ ఇది. అంతులేని వ్యధ ఇది. చదివాక తప్పక మారే ప్రయత్నం ప్రతి భర్తా చెయ్యాలని ఆశిస్తూ... (నవ్య)
-
అమ్మ చెప్పింది: ఇదీ సరికొత్త కథే... అంటే సైబర్ నేరాల మీద. పెద్దవాళ్ళ భావాలని చిన్నవాళ్ళు “వాత చింతకాయ పచ్చడి” భావాలు అంటూ కొట్టి పారేస్తారు. కానీ “విలువలు” ఎప్పటికీ విలువలే...! అవి పాటించినప్పుడు జీవితం వెలుగుతో నిండిపోతుంది. యీ విషయాన్ని చక్కని కథగా మలిచారు నాగమణి. ఎందరినో యీ కథ ఆకట్టుకుంది. (స్వాతి)
-
మంచిముత్యం: విరక్తి - తోడు - మళ్ళీ ఉత్సాహం - ఉద్వేగం - ప్రేమ
- పెళ్ళి... పిచ్చిపిచ్చిగా ఉందా? కాదు... సరదాకి నేనిలా రాశాను కానీ కథ “గబగబా సాగిపోతుంది. ఇందులో 'అవసరార్ధ (ప్రేమ వుంది... అలాగే, స్వచ్చమైన (ప్రేమా వుంది. “ఒక్క పాత్ర తప్ప అన్నీ మానవత్వం వున్నపాత్రలే. 'డ్రామా' వున్నా... అది శృతిమించక, పప్పులో ఉప్పులా సరిపాళ్ళలో వుంది. అందుకే - 06 51659 ౪/04 ౮66... నాగమణీ ౮66 ... (ఆంధ్రభూమి)
- దుహిత; ఈ కథ చదివాక నాకు “చిత్తూరు వి. నాగయ్యగారు” గుర్తుకొచ్చారు. ఆయన '“'జీవనకథిలో ముందుగా ఒకేమాట చెప్పారు... “ఎవ్వరినీ నమ్మకు = మొదట నువ్వు సేఫ్‌గా ఉన్నాకే ఇతరులకు సహాయం చెయ్యి... అదీ,
వారికి తగినంతవరకే” అన్నారు. ఓ పాట వుంది... నిప్పు రగిలితే నీటితో ఆర్పుతాం... నిరే నిప్పుని రగిలిస్తే? ఈ కథా సారాంశం ఇదే... చక్కగా నాగమణిగారు మలిచారు. (ఇది ఆంధ్రభూమి దినపత్రిక).
అదండీ సంగతి. అందరికీ ఓ విన్నపం. “ఇమాజినేషన్ యీజ్ గ్రేటర్ దేన్ నాలెడ్జ్ అన్నారు ఐన్‌స్టీన్‌గానీ, టీవీలుగానీ, సినిమాలుగానీ..., ఊహాశక్తిని పెంచవు. వారు ఏది వూహించి చూపిస్తే అదే మనం చూడాలి. పుస్తకాలు అలా కాదు. ప్రతి పాత్రా మనకిష్టం వచ్చినట్టు మన 'వూహిలోనే రూపుదిద్దుకుంటుంది. అందుకే పుస్తకాలు చదవండి... చదివించండి. నమస్సులతో భువనచంద్ర
ఒక్కమాట...
అనునిత్యమూ సాహితీలోకంలో పయనిస్తూ అలుపెరుగక... అదే లోకంలో యథేచ్చగా సంచరిస్తూ, అణువణువునా సాహితీ చైతన్యాన్ని నింపుకొని, నేను సాగిస్తున్న ఈ సాహితీ ప్రయాణంలో... అక్షరాయుధాన్ని చేబూని సాహిత్యపు లోతులను అవగాహన చేసుకుంటున్నకొద్దీ, సమాజంలో నెలకొని ఉన్న సంక్షిష్ట మానవ సంబంధాలూ, మానవ జీవన వైకల్యాలూ, సమాజ స్థితిగతులూ,, అనేక రకల అసమానతలూ, అమానవీయాలూ... అక్షరాన్నే మార్గనిర్దెశకంగా, ఒక ఆయుధంలా ఎంచుకున్న నాకు నిరంతరం సమాజం' పట్ల- నా బాధ్యతనూ, కర్తవ్యాన్నీ గుర్తుచేస్తూనే ఉన్నాయి.
అయితే, ఆధునిక, ప్రాచీన తెలుగు సాహిత్యంలో కొత్త దృక్పథాన్ని అలవరచుకొని వినూత్నమైన రచనా సంవిధానంతో, కాంతికిరణాల వంటి చరిత్రలో నిలిచిపోయే రచనలు చేసిన గురజాడవారి నాహిత్యం...
సాంసారిక జీవనంలో అనుభవమయ్యే మాధుర్యాన్నీ ఆనందాన్నీ సాహిత్యంగా మలచి, నిత్యమూ కష్టాల కడగండ్లతో సహవాసం చేసేవారి హృదయాల్లో పన్నీటిని చిలకరించేలా ఆహ్లాదంగా తమ రచనా వ్యాసంగాన్ని సాగించిన ముని మాణిక్యంవారి సాహితీ పోకడలు...
రాశిలోనే కాక, గుణంలోను, దృక్పథంలోనూ తెలుగు కథానాహిత్య ప్రపంచంలో దిగజంలాంటి కథకులు శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలు...
“రచయిత చదువరులకు కలిగించదలచిన దృష్టి ఐ కావ్యానికైనా ముఖ్యలక్షణం... సంఘానికి అపకారం చేసే రచనలు, వాటి రచనా విశేషం ఎంత గొప్పదైనా, అవి ఎప్పటికీ గొప్ప రచనలు కానేరవు...” అని ఖరాఖండీగా చెప్పిన శ్రీ, గోపీచంద్‌గారి రచనలలోని స్ఫూర్తి...
“కథానికా రచన అనేది మళ్ళీ మళ్ళీ చదివించే ఖండకావ్యంలా ఉండాలని” నొక్కి వక్కాణించిన బుచ్చిబాబుగార్ల వంటి ప్రపంచ ప్రసిద్ధ రచయితల రచనల ప్రభావం లేశమాత్రంగానైనా నా రచనలమీద ఉన్నదని గర్వంగా చెప్పగలను.
అయితే ఇటువంటి సాహితీ'్రష్టలకు ఏకలవ్య శిష్యురాలినై, నిరంతరం
వారి రచనలను అధ్యయనం చేస్తూ, వాటిని నేటి సమాజ స్థితిగతులకు అన్వయం చేసుకుంటూ, నేను సాగిస్తున్న ఈ సాహితీ ప్రయాణం సాహితీ చరిత్రలో సూది మోపినంత స్థలం నాకు దక్కించినా నేను నా గమ్యం చేరుకున్నట్లై అని భావిస్తాను.
నా ఈ సాహితీ ప్రయాణంలో నన్ను వెన్నంటే ఉంటూ, సాహిత్యం పట్ల నాకున్న అభిరుచిని గుర్తించి, గౌరవించి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా శ్రీవారు శ్రీ నండూరి నాగేశ్వరరావుగారికి, ప్రచురించబడిన నా ప్రతి రచనా చదువుతూ “అయామ్ వెరీ ఫ్రాడ్ ఆఫ్ యూ మామ్...” అంటూ మనస్ఫూర్తిగా నన్ను అభినందించే నా ప్రియపుత్రుడు చిరంజీవి నండూరి శ్రీకాంత్‌కి నా (ప్రేమపూర్వక ధన్యవాదములు.
అంతకంటే ముందు, ఉగ్గపాలతోనే అక్షరాలను రంగరించి, నాతో త్రాపించి, నాలోని సాహితేచ్చకు బీజం వేసిన మా అమ్మగారు స్వర్గీయ శ్రీమతి యాళ్ళ కమలమ్మగారికి, నాన్నగారు శ్రీ యాళ్ళ సూరన్నగారికి నా తొలి వందనం. అదేవిధంగా నా తోబుట్టువులు నాకు అందిస్తున్న సహకారానికి వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. నేను వ్రాసిన కథలను ఎంతో ఆసక్తిగా చదివి అభినందించే నా మిత్రబ్బందానికి పేరుపేరునా నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. నాలోని సృజనాత్మక శక్తిని మేల్కొలిపి, రచనలు చేయటమనే దిశగా నన్ను ప్రేరేపించిన నా ప్రియనేస్తం, ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాలి హిరణ్మయీదేవిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
రచనా వ్యాసంగంలో ఎంత తలమునకలుగా ఉన్నప్పటికీ, వారి అమూల్య మైన సమయాన్ని నాకు కొంత కేటాయించి, అడిగిన వెంటనే సకాలములో వారి 'ముందుమాటితో నా పుస్తకానికి తరగని వన్నెలద్దిన ప్రఖ్యాత రచయిత్రి, అనువాదాలలో అవార్హుల గ్రహీత శ్రీమతి ఆర్. శాంతసుందరిగారికి నా హృదయ పూర్వకమైన కైమోడ్వులు.
సినీ గీతరచయితగా, కథా రచయితగా తనకు క్షణం తీరిక లేకపోయినా నా విజ్ఞప్తి మేరకు ఎంతో అభిమానంతో “ఒక్క క్షణం” అంటూ నా పుస్తకాన్ని గురించి ముచ్చటించిన ప్రముఖ సాహితీవేత్త మిత్రులు, నా సోదరతుల్యులు 3! “భువనచంద్రగారికి మరీ మరీ ధన్యవాదములు.
నా కథలను గుదిగుచ్చి ఒక మాలగా పుస్తకరూపంలో చూడాలని
పరితపించి, ప్రోత్సహించిన రచయిత్రి శ్రీమతి కన్నెగంటి అనసూయనగారికి నా కృతజ్ఞతలు.
నా కథలను ఆసాంతం చదివి, వాటిలోని భావానికి అనుగుణంగా చక్కని ముఖచిత్రాన్ని తయారుచెసి ఇచ్చి, నా పుస్తకానికి కొత్త సొబగులద్దిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ 'బాలి'గారికి నా కృతజ్ఞతలు.
అదే విధముగా నా కథలను ప్రచురించి, నాలో ఆత్మవిశ్వాసాన్ని వ్రాదుగొల్పిన ఆయా పత్రికల సంపాదకులకు నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు.
సంతృప్తికరమైన రీతిలో, నాకు నచ్చే విధముగా, పదిమందీ మెచ్చే విధముగా సకాలంలో పుస్తకాన్ని అచ్చువేసి ఇచ్చిన నా మిత్రురాలు, ప్రముఖ రచయిత్రి, జె.వి. పబ్లిషర్స్ అధినేత శ్రీమతి జ్యోతివలబోజుగారికి నా కృతజ్ఞతాంజలులు.
= నండూరి సుందరీ నాగమణి
| మనసా ఎటులోర్తునే --- సగ్గ -తృం| 2- 19 “7_ ఏనాడు విడిపోని ముడివేసెనో ఒన ష్! న్య 26 గ ఉషస్సు త్న ల శ] (౧. అమ్మా నా వేలు పట్టుకో 7 లీ యి! 48 “5 అహరౌాజిత ---- 172ఎ౧1- 'షస్యాగాలి -షరిపా 8 (జీవితమే సఫలము-ా?సీ లీ” ఇర 67 'స్ర-కజ్వ శాకుంతలం --- యక. [౧౬౯6 బూ 1 77 ౯అమూల్యం గీ న్ 85
- ఉడుకునీళ్ళు సో టట ఆలో 100 ౮ గ్రహణం 4) 9 నే - ౧ యాల) 111 |] ఆశాదీపం --ాగి రత ఉలఆణి _ఎ0| 120
; ౩ జీవిత సహచరి ౮ న, న..5 130 | ౨. అమ్మ చెప్పింది _--- ర శ్ 4011 142 | మంచిముత్యం ఆ సత్ర గాం 20) 153 ౧ దహిత టా || వ్. 1. య్ 169
మమా
మననా, ఎటులోర్లునే...
“కరుణా, ఇక నేను బయలుదేరుతానమ్మా... నా మనవరాల్ని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. తల్లిదండ్రులు లేని పిల్ల... కాస్త కడుపులో పెట్టుకోమ్మా...” చెమర్చిన కళ్ళు వత్తుకుంటూ లేచారు కృష్ణమూర్తిగారు...
“అయ్యో, మీరింతగా చెప్పాలా మాస్టారూ! మంజీరను నా కన్నకూతురిలా చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి...” అంటూ ఆయనకి పాదాభివందనం చేసింది కరుణ.
“తాతయ్యా...” అంటూ బెంగగా, దీనంగా తన భుజమ్మీద తలవాల్చిన మంజీర కన్నీటిని తుడుస్తూ, “కరుణాంటీ చాలా మంచిదమ్మా... తను చెప్పినట్టు విను... బెంగ పెట్టుకోవద్దు... ఊరికే సెలవులవీ పెట్టి వచ్చెయకు... రెండు నెలలకోసారి నేనో, తమ్ముడో వస్తాము, సరేనా? మరి నేను వెళ్ళిరానా తల్లీ?” అంటూ ఆమెను వదిలి చేయి ఊపి బయటకు నడిచారు కృష్ణమూర్తిగారు. ఆయన వెళ్ళినవైపే దిగులుగా చూస్తూ ఉండిపోయింది మంజీర.
కృష్ణమూర్తిగారి ఎకైక సంతానం సుధీర్, అతని భార్య అయిదు సంవత్సరాల క్రితం విమాన ప్రమాదంలో మరణించగా, వారి సంతానమైన మంజీర, శ్రీనాథ్‌ల బాధ్యత ఆయనమీద, ఆయన భార్య రాజ్యలక్షిగారి మీద పడింది. తనకి వచ్చే పింఛను, ఇంటి అద్దెలు, వ్యవసాయమ్మీద వచ్చే ఆదాయం... వీటితో మనవరాలిని బి.టెక్ వరకూ చదివించారు. శ్రీనాథ్ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నాడు. మంజీరకు హైదరాబాదులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంతో హైదరాబాద్‌కి తీసుకువచ్చి, తన శిష్యురాలు, స్నేహితుడి కూతురు అయిన కరుణకు
అప్పజెప్పి వెళుతున్నారు కృష్ణమూర్తిగారు. "కరుణ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్షన్ ఆఫీసరుగా పనిచేస్తోంది. సుమారుగా యాభై సంవత్సరాలుంటాయి... ఎప్పుడూ ఎంతో సంతోషంగా, నండూరి సుందరీ నాగమణి లా
చలాకీగా ఉండే కరుణ కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్ళి చేసుకోకుండా, అవివాహితగా ఉండిపోయింది.
మంజీరకు మొదట్లో కొత్తగా ఉండి, కాస్త బెరుకు ఉన్నా కరుణ స్వతహాగా స్నేహశీలి కాబట్టీ... ఆమె సరదా మాటలతో, కలుపుగోలుతనంతో త్వరగానే కలిసిపోయారిద్దరూ... ఇద్దరూ కలిసి ఇంటిపని, వంటపని చేసుకొనేవారు.
శ శ ఒ
కరుణకు రోజూ ఉదయమే అయిదున్నరకే లేవటం అలవాటు. లేవగానే కాలకృత్యాలు, స్నానాదులు పూర్తి చేసుకొని, ఓ అరగంటసేపు సంగీత సాధన చేసుకుంటుంది.
ఆ రోజు...
తన కనులు మూసుకొని, మైమరచిపోయి మనసారా పాడుకొంటోంది కరుణ...
“మనసా, ఎటులోర్హునే... నా మనవిని చేకొనవే..
దినకర కులభూషబణునీ... దీనుడవై భజన చేసీ...
దినము గడుపుమనిన నీవు, వినవదేల గుణవిహీన!
మనసా, ఎటులోర్లునే... నా మనవిని చేకొనవే...
కలిలో... రాజస, తామస గుణములు కలవారి చెలిమి...
కలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకనే...
సులభముగా కడతేరను... సూచనలను తెలియజేసి...
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన!
మనసా, ఎటులోర్లునే... నా మనవిని చేకొనవే...”
పాట పూర్తయి, కనులు తెరచేసరికి ఎదురుగా కూర్చుని ఆ పాటను అరమోడ్పు కనులతో వింటోంది మంజీర. ఆమె కనులు చెమర్చి ఉన్నాయి.
“అబ్బ! ఎంత బాగా పాడారు ఆంటీ! ఈ పాట వింటోంటే నాలో ఏదో తెలియని భావన కలుగుతోంది... ఈ పాటకు అర్ధం చెప్పరూ?” అని అడిగింది.
“ఇది వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన కీర్తన మంజీరా... ఆయన తన సంసారాన్ని ఈదలేక, ఇహలోకంలో చాలా కష్టాలు పడ్డాడు... తాను నమ్ముకున్నది ఆ శ్రీరాముడినే కాబట్టి, ఎన్నో కవ్వాలు, భవనాగరాలు ఎదురైనా ఆయనే వాటిని కడతేర్చుతాడని మనసుకు చెప్పుకుంటూ, ఓదార్పును పొందే వతతతతతతతతతతతతతతతతతతవవవావాలాటంంజ అమూల్యం (కథలు)
కీర్తన ఇది... చలించే మనసును మందలిస్తూ, రాముడి అండ ఉండగా మనకేదీ లోపించదనీ, అన్నీ ఆయనే చూసుకుంటాదనీ, చపలత్వానికి లోను కావద్దనీ గట్టిగా చెబుతాడు మనసుకు త్యాగరాజస్వామి. మనస్సును చల్లగా స్పృశించే 'మలయమారుతరాగం'లో స్వరపరచాడు ఈ కీర్తనను ఆయన. ఆరాగచ్చాయ, కీర్తన యొక్క భావము నీలో కలిగించిన ఆ భావననే “ఆర్తి అంటారమ్మా...” చెప్పటం పూర్తయ్యేసరికి కరుణ కళ్ళు సజలాలయ్యాయి. తనను తాను సంబాళించుకుంటూ, అక్కడే గ్లాసులో ఉన్న నీటిని కొంచెం తాగింది కరుణ. “ఆంటీ, కీర్తన వింటున్నంతసేపూ... మా అమ్మానాన్నలు గుర్తొచ్చారు... నా ధ్వ్యేయమంతా ఇప్పుడు ఒక్కటే ఆంటీ... మా తమ్ముడిని బాగా చదివించి, మంచి స్థాయిలో నిలబెడతాను. మా తాతయ్య, నానమ్మల కలలు నెరవేరుస్తాను.... ఆంటీ... ఒక విన్నపం. నాకీ కీర్తన నేర్పుతారా?” వేడికోలుగా చూసింది మంజీర. “తప్పకుండానమ్మా, ఈ కీర్తన మాత్రమే కాదు నాకు వచ్చిన సంగీతమంతా నీకు నేర్పుతానురా... రేపే నీ సరళీస్వరాలు ప్రారంభం...” ఆప్యాయంగా చెప్పింది కరుణ, శ సశ ఈ సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. కరుణ, మంజీరల సాన్నిహిత్యం బాగా బలపడింది. మంజీర కరుణ దగ్గర చాలా (శ్రద్ధగా సంగీతం నేర్చుకుంది. ఉదయమే ఇద్దరూ కలసి సంగీతాభ్యాసం చేసేవారు. కరుణ దగ్గర మంచి గ్రంథాలయం ఉంది. ఎందరో కవుల, రచయితల పుస్తకాలున్నాయి. వాటిని తను చదువుతూ, మంజీరతో కూడా చదివించేది కరుణ. తనకు అలవాటు లేకపోయినా చదవటం అలవాటయ్యాక, కరుణతో పోటీపడి మరీ చదివేది మంజీర. చదివిన పుస్తకాల గురించి గంటలు గంటలు చర్చించుకునవారు. ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్ళేవారు. పాత సినిమాల డీవీడీలు ప్లే చేసి, వాటిల్లో ఉండే మంచి మంచి పాటలను, ఘంటసాల వంటి విద్వాంసుల మధుర సంగీతాన్ని, సావిత్రి వంటి అభినేత్రుల అద్భుత అభీనయాన్ని ఆన్వాదించటం నేర్పింది మంజీరకు కరుణ. వారి స్నేహానికి వయసు తారతమ్యమన్నది ఎటువంటి అడ్డంకి కాలేదు. ఇంతలో... మంజీర తనతో కలిసి పనిచేసే పవన్‌తో *“ఢ్రేమిలో పడింది. ఆ భావన మంజీరలో బలపడిన తరువాత, పదిరోజులు ఎంతో వేగంగా గడిచాయి.... మంజీర దినచర్యలో కూడా మార్పు వచ్చింది. ప్రతిరోజూ, నండూరి సుందరీ నాగమణి లం
సాయంకాలాలు ఆఫీసయ్యాక పవన్‌తో పార్టీలు, సినిమాలు, బైక్‌మీద షికార్లు తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా రాబటం మొదలుపెట్టింది మంజీర. ఆఫీసులో మీటింగులని, ప్రాజెక్ట్ పనులనీ కరుణకు అబద్దాలు చెప్పేది. ఉదయమే త్వరగా నిద్ర లేవలేక, “అలసటగా ఉంది అంటూ నంగీత సాధనకు నామం పెట్టేయసాగింది.
మొదట్లో ఆమె మాటలు నమ్మ, 'పిల్ల అలిసిపోతోంది...” అని జాలిపడి వదిలేసింది కరుణ. కానీ మంజీర ముఖంలోని మైమరపు, తడబాటు, సెల్‌ఫోన్ చాటింగ్స్ కరుణను సందేహానికి గురిచేశాయి.
ఓ రోజు భోజనం చేస్తుండగా... మంజీర ముఖంలోనికే నిశితంగా చూస్తూ, “మంజీరా, పవన్ ఎవరమ్మా?” అనడిగింది కరుణ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది మంజీర. పెద్ద దగ్గుతెర అడ్డం పడి, తింటున్న అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుపోయి, పొలమారింది. ఆమె తలమీద చిన్నగా తట్టుతూ, మంచినీళ్ళు తాగించింది కరుణ.
భయంగా తలెత్తి చూసింది మంజీర. కరుణ కనులనిండా కరుణే... ఎంతో దయగా చూస్తూ, తన ప్రశ్నకు జవాబు కోసం ఎదురుచూసోంది... “అతను... అతను... నా ఫ్రెండు ఆంటీ...” అంది ఎలాగో...
“ఎలాంటి స్నేహమమ్మా మీది?” లాలనగా అడిగింది కరుణ.
“ఆంటీ, మీరు నాకు అమ్మలాంటివారు... పవన్ నన్ను ప్రేమిస్తున్నాడు ఆంటీ... వి ఆర్ ఇన్ లవ్...” అమాయకంగా చెప్పింది మంజీర.
“మంజీరా...” ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకొని నుదుట ముద్దు పెట్టుకుంది కరుణ.
“నిజంగానా ఆంటీ? మీరేమంటారో అని నేను చాలా భయపడ్డాను తెలుసా?” రెప్పలల్లార్చింది మంజీర. ఆమె కళ్ళలో ఏదో నిశ్చింత.
“పిచ్చిపిల్లా, నేనేమంటానురా? నీకొక మంచి తోడు దొరికితే నాకన్నా ఎవరురా సంతోషించేది?” మంజీర తల నిమిరింది. కరుణ.
జ శ ౫
కొన్ని రోజులు గడచిపోయాయి. వసంతం వెళ్ళిపోయి, వర్షబుతువు
ప్రవేశించింది. లలత అమూల్యం (కథలు)
కరుణకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏదో తెలిసీ తెలియనట్టు మనసంతా గుబులుగా ఉంది. రెండురోజులై మంజీర చాలా దిగులుగా ఉంటోంది. ఆమె ముఖంలో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆఫీసుకు రొటీనుగా వెళ్ళి వచ్చి, గంటలు గంటలు తన గదిలోనే గడిపేస్తోంది.
కరుణకు తన కర్తవ్యం బోధపడింది. మంజీర ఏదో బాధలో ఉంది. అది తనకు తెలుసోంది. లీలగా ఏదో అనుమానం కూడా కలుగుతోంది.... వెంటనే మంజీరను ఆ బాధలోంచి వెలికి లాగాలి...
వెంటనే చాప పరచి దానిపై కూర్చుని శృతిబాక్సు తెరచి, దాన్ని ఆన్ చేసి పాదనాగింది...
'మనసా... ఎటులోర్లునే...?”
పాటలోని పల్లవి పూర్తికాకుండానే గది తలుపులు తెరుచుకున్నాయి. జుట్టు రేగిపోయి, కనులు వాచిపోయి, దుఃఖంతో అదిరే పెదవులతో ఉన్న మంజీర పరుగు పరుగున వచ్చి, కరుణ ఒడిలో తల పెట్టుకొని విలపించసాగింది. కరుణ ఆమెను వారించకుండా, మెల్లగా ఆమె వీపు రాస్తూ... ముంగురులు సవరించసాగింది. అయిదు నిమిషాలు ఏకధాటిగా బద్బిన తరువాత ఆ దుఃఖపు ఉధృతి తగ్గింది.
“ఏమైందిరా, పవన్‌కీ, నీకూ ఏమైనా గొడవా?” ప్రేమగాఅడిగింది కరుణ.
“పవన్ చాలా మారిపోయాడు ఆంటీ... ఇప్పుడు శశి అనే అమ్మాయితో ఫ్రెండ్విప్... నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు...” మళ్ళీ మంజీరకు దుఃఖం ముంచుకొచ్చింది.
“కూల్ బేబీ, కూల్... ఇంద, ఈ మంచినీళ్ళు తాగు ముందు...” ఎదురుగా ఉన్న సీసాలోంచి గ్లాసులోకి మంచినీళ్ళు వంచి ఇచ్చింది కరుణ. అవి తాగేసి కాస్త స్థిమితపడింది మంజీర.
“ఆంటీ... నేను మీకు చాలా చెప్పుకోవాలి... పవన్ నాతో స్నేహం కోసం ఎంతగా ఆరాటపడ్డాడో తెలుసా? ఆపకుండా ఫోన్లు, మెసేజ్‌లూ... నేను ఒక్కపూట మాట్లాడకపోయినా, అల్లాడిపోయేవాడు. అలాంటిది అతని (ప్రమను నేనుఅంగీకరించగానే అతని (ప్రవర్తనే మారిపోయింది. మీరు రమ్మన్నారని ఎన్నిసార్లు చెప్పినా వస్తానంటూ మాట దాటవేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు ఫోన్
నండూరి సుందరీ నాగమణి లాలా
చేసినా కట్ చేసేస్తున్నాడు. చాలా బాధగా ఉంది ఆంటీ...” విషాదంగా అంది మంజీర.
“ప్రతీ మగవాడూ అంతేనమ్మా.. ఆశించింది దొరికే వరకూ విలవిల లాడిపోయి, వెంపర్లాడిపోయిన మనిషే మనం సరెండర్ కాగానే విచిత్రంగా మారిపోతాడు.... మనమంటే ఉన్న శ్రద్ధ, ప్రేమ అన్నీ మాయమైపోతాయి. ఆ న్థానే అధికారం, ఆ తర్వాత చిన్నచూపు, నిర్లక్ష్యం మొదలౌతాయి. ప్రయారిటీస్ మారిపోతాయి... అందరూ ఇలాగే ఉంటారని కాదనుకో, ఎక్కడో నూటికీ, కోటికీ పదిమంది నిజాయితీగా (ప్రేమించేవారు కూడా ఉంటారు కానీ మనకి ఆ అదృష్టం రాసిపెట్టి ఉండాలి కదా...” శూన్యంలోకి చూస్తూ అంది కరుణ,
మరి, మరి... ఎందుకంతగా ఆరాటపడతారు? నిజానికి నన్ను సిన్సియర్‌గా (మైమించనప్పుడు అంత తపనెందుకు మొదట్లో?” అర్ధం కానట్టు అడిగింది మంజీర.
“ఏముంది, ఆకర్షణను జయించలేక. స్వంతం చేసుకున్నాక (థ్రిల్ ఏముంటుందమ్మా? సరే కాని అతన్ని గురించి అంతా అర్ధమైంది కదా! ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?”
“ఏం చెప్పను ఆంటీ? వాళ్ళిద్దరినీ చంపేసి, నేనూ చచ్చిపోవాలన్న భావన బలంగా కలుగుతోంది... అతన్ని మనస్ఫూర్తిగా (పేమించి, నా భర్తగా ఎంతో ఊహించుకున్నాను. కానీ, కాని... రోజుకో డ్రస్సు మార్చినట్టుగా, గర్ల్‌ఫెంద్స్‌ని మారుస్తుంటే... అలాంటివాడిని ఇష్టపడినందుకు నా మీద నాకే ఎంతో... ఎంతో... అసహ్యంగా ఉంది ఆంటీ...”
“క్షణానికో పువ్వుమీద వాలే సీతాకోకచిలుక మనకిందుకమ్మా? ఈ స్నేహం ఇంతటితో ముగిసినందుకు రిలాక్స్‌గా అయిపోవాలి... అంతే...” స్థిరంగా చెప్పింది కరుణ.
“కానీ ఆంటీ... ప్రతి క్షణమూ అతని నవ్వులు, మాటలు గురొసాయి... ఆ (మేమ, ఆప్యాయత నిజమని నమ్మాను. ఆకలి, దాహం ఉండటం లేదు. దేనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. ఈ పరిస్థితి నుండి నేనెలా బయటపడాలి చెప్పండి?”
“మంజీరా... పవన్‌కి నీ జీవితంలోనికి అడుగు పెట్టే అర్దత్రా, అదృష్టమూ రెండూ లేవురా... అతను నీకు సరియైన జోడీ కాదు. అతన్ని మర్చిపోవటానికి ప్రయత్నించి, నీ లక్ష్యం వైపు దృష్టిపెట్టు... అసలు మీ అమ్మానాన్నల కన్నా
జా అమూల్యం (కథలు)
నీకు 'పవన్” ఎక్కువా? సంగీత సాధనతో, పుస్తక పఠనంతో నీ ఆలోచనలు అటువైపునుండి మళ్ళించుకోవటానికి ప్రయత్నించు... నీ మనసుకు చెప్పు, ఆ చపలచిత్తుడి ఆలోచనలు మానుకొమ్మని... అసలు ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటివి సహజమే... ఆ అగాధంలోంచి బయటకు రావటం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు... నిన్ను నువ్వు కోల్పోకు... ఆ మత్తులోంచి బయటకు వచ్చెయ్... అసలు నీకేం తక్కువరా, బంగారుతల్లివి! నిన్ను నిజంగా (్రేమించే గొప్ప రాకుమారుడు నీ జీవితంలోనికి త్వరలోనే వస్తాడు.... ఈ లోగా నీవు సాధించాల్సినవి చాలా ఉన్నాయి కదా...”
కరుణ సాంత్వన వచనాలకు మంజీర బాధ చాలా వరకూ తగ్గినట్టయింది.
“ఆంటీ, ఇవన్నీ మీకెలా తెలుసు?” అంది ఆశ్చర్యంగా...
“నెను కూడా నీ వయసునూ, ఆ ఫేజ్‌నూ దాటి వచ్చినదాననే కదా! తొలిప్రేమ, ఆ బలమైన ఆకర్షణ, ఆ మధురిమ, చివరికి... చివరికి... ఆ తిరస్కృతి, ఆ నైరాశ్యం... ఇవన్నీ నేనూ చవిచూశాను... కాకుంటే ఇప్పుడు పవన్... అప్పుడు కిరణ్... అంతే తేడా...” మంజీర చేయి పట్టి లేవనెత్తింది కరుణ.
కొత్తజీవితంలోనికి అడుగు పెడుతున్నట్టుగా కరుణ చేయి పట్టుకొని అడుగులు వేస్తూంటే, మంజీర వ్యాకులమైన మనసులో మెల్లగా ప్రశాంతత చోటు చేసుకోసాగింది.
(నది మాసపత్రిక, జూలై, 2012) ప నండూరి సుందరీ నాగమణి తతత
ఏనాడు విడిపోని ముడివేసెనో...
“అదేమిటి ప్రశూ... ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయమేమిటి?” ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ.
“అకస్మాత్తుగా ఐముంది స్నిగ్భా? ఇది ఏనాడైనా జరగవచ్చని ముందే అనుకున్నాం కదా!” షూ విప్పుకుంటూ సమాధానమిచ్చాడు ప్రశాంత్. అతని గొంతు అతి మామూలుగా, ఏ భావమూ లేకుండా ధ్వనించింది.
“క్రాన్సీ,.. కానీ... ఇంత హఠాత్తుగా నువ్వు నన్ను వదిలేసి పోతే...” భయంతో స్పిద్ద గొంతు వణికింది.
“కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ, అలవాటైపోతే అదే బావుంటుందిలే... అయినా ఎంతకాలంలే స్నిగ్గా, ఇంకో కొత్త పార్టనర్ని వెదుక్కొనేవరకే కదా?” బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు ప్రశాంత్.
“ప్రశాంత్... తనవాడనుకున్న ప్రశాంత్... తనను విడిచిపెట్టి వెళ్ళివోతాడా? అదేమిటీ...” ఆ ఆలోచనకే తట్టుకోలేకపోతోంది స్నిగ్ధ అలజడిని అణచుకోవటానికి ప్రయత్నిస్తూ, ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి ఎత్తిపట్టి గడగడా తాగేసింది...
“ఎందుకే అమ్మా నన్నిలా హైరానా పెడతావు? నా మాట వినవా సిగ్గా? అసలు ఈ లివిన్ టుగెదర్లోమిటే అసహ్యంగాను? పోనీ ఆ కుర్రాడు నీకు నచ్చినవాడే కదా, నిన్ను పెళ్ళి చేసుకుంటాననే అంటున్నాడు కదే...” అమ్మ మాటలు మనసులో ప్రతిధ్వనించాయి... పెళ్ళి అనగానే ఉలిక్కిపడిందామె మనసు. ఉహు, ఈ జీవితానికి పెళ్ళి అన్న మాటే తలపెట్టదు తను... తనతో సహజీవనం మానేసి వెళ్ళిపోతాడా ప్రశాంత్? అతన్ని పెళ్ళి చేసుకుంటే మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాడట! హు... ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్! ఇలా అయినా తాను పెళ్ళికి ఒప్పుకుంటుందనేమో... పెళ్ళి... ఛీఛీ... వెళ్ళిపోతాడా, వెళ్ళిపోనీ... ఒంటరిగా ఉండటానికి కొన్నాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది కాని, అలవాటైపోతే అదే 26, పత అమూల్యం (కథలు)
బావుంటుందిలే...” తన మనసును ఓదార్భుకుంది స్నిగ్ధ.
స్నానం చేసి, నైట్‌డైస్‌లో వచ్చాడు ప్రశాంత్. ఆమె ఎదురుగా కూర్చుంటూ, “స్నిగ్గా నాకు బాగా లేటైందిరా ఈవేళ... దారిలో మనం ఎప్పుడూ కూరలు తెచ్చుకొనే షాపులో అన్నీ అయిపోయాయి... ఇప్పుడు తినటానికి ఏమైనా ఉన్నాయా? బాగా ఆకలేస్తోంది...” అన్నాడు.
“కొద్దిగా అన్నం ఉంది ప్రశూ... కూర చేసే ఓపిక లేక నేను పెరుగన్నం తిన్నాను...” చెప్పింది ముభావంగా.
“అయితే ఆవకాయ ఉన్నట్టుందిగా, అది వేసుకొని తింటాలే...” లేచి కంచంలో అన్నం వడ్డించుకొని వచ్చి, సోఫాలో ఆమె పక్కనే కూర్చుని టీవీ చూడనాగాడు.
ప్రస్తుతం తమ షిఫ్ట్‌లు వేరవటంతో ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా అతని కంటే ముందుగానే ఇంటికి వచ్చేస్తుంది స్నిగ్ధ. అతను కొంచెం ఆలస్యంగా వస్తాడు. అప్పటివరకూ ఆమె ఏవో ఛానల్స్ చూసినా, అతను మాత్రం ఆమె అనుమతితో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానెల్స్ చూస్తాడు... చెతిలోని రిమోట్‌ని అతనికి అందించింది మౌనంగా...
“వద్వలే, ఫరవాలేదు... ఈ రోజు నువ్వేం చూస్తే నేనూ అదే చూస్తాను...” అంటూ చిన్నపిల్లల సంగీత విభావరి చూస్తూ అన్నం తినసాగాడు. తినటం ముగించి, చేయి కడుక్కొని వచ్చి వార్తాపత్రిక చేతిలోనికి తీసుకొని పతాక శీర్షికలు చూస్తూంటే, అప్పటివరకూ ఎలాగో తన భావావేశాన్ని అదుపులో పెట్టుకన్న స్నిగ్ధ, “ప్రశాంత్ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావో నేను తెలుసుకోవచ్చా?” అని అడిగేసింది ఇక ఆగలేక.
“ఏం చేయమంటావు స్పిగ్భా, మా అమ్మానాన్నలు నన్ను పెళ్ళి చేసుకొని స్థిరపడమని బాగా పోరుపెడుతున్నారు. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు... కాని నువ్వా పెళ్ళికి ఒప్పుకోవు... నాక్కూడా ఈ జీవితంపై వెగటు కలుగుతోంది... నాకు ఒక కుటుంబం కావాలి...”
“ఏం, ఒక స్నేహితురాలిగా, నీతో సహజీవనం చేస్తున్న భాగస్వామినిగా నేను నీకు నచ్చటం లేదా?” స్నిగ్ధ గొంతులో ఆరాటం.
“సారీ టు సే, అసలు ఈ “సహజీవనం” అన్న కాన్సెప్టే నాకు నచ్చలేదు స్నిగ్ధా... ఓకే, నాకు బాగా నిద్రొస్తోంది... రేపు మాట్లాడుకుందాంలే... గుడ్‌నైట్...” నండూరి సుందరీ నాగమణి తతత
అని లేచి, తన గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు ప్రశాంత్.
స్పిగ్ర మనసంతా వేపాకు తిన్నంత చేదుగా అయిపోయింది. అప్రయత్నంగా ఆమె కనుల ముందు తన బాల్యం కదలాడింది...
శ శ ఈ
సహోద్యోగులై ప్రేమించి పెళ్ళిచేసుకున్న చక్రధర్, పావని దంపతులకు స్నిగ్ధ ఏకైక సంతానం... తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే కావటంతో తోబుట్టువులెవ్వరూ లేని స్నిగ్ధ దాదాపుగా ఒంటరిగా పెరిగింది.
చక్రధర్‌కి పురుషాహంకారంతో పాటుగా వ్యసనాలు మెండు. అతన్ని పెళ్ళి చేసుకున్న పావని తాను తప్పటడుగు వేశానని గ్రహించటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆమెకు ఇంటా బయటా చాకిరీ తప్పేది కాదు. పగలంతా ఉద్యోగం చేసి వచ్చి, రాత్రి చక్రధర్‌కి సేవ చేయాల్సి వచ్చెది పావనికి. బైట స్నేహితులతో పేకాటాడి, ఇంటికి ఆలస్యంగా వచ్చే చక్రధర్‌కి అతను తాగుతుంటే కంపెనీగా పావని పక్కనే కూర్చుని మరీ అన్నీ సర్వ్ చేయాలి. మందులోకి ఆమ్లెట్ వేయాలి... షోడాలు, ఐస్ క్యూబులూ సిద్ధం చేయాలి. వీటిలో ఏది తక్కువైనా చేయి చేసుకోవటానికి సైతం వెనుకాదేవాడు కాదు అతను. పావని ఎంతో సహనంతో అన్నీ చేసేది... అతనికి ఎలా కావాలంటే అలా నడుచుకొనేది. ముందూ వెనకా ఎవ్వరూ లేని తనను పిల్లతో సహా చక్రధర్ వదిలేస్తే తాను ఒంటరిగా బ్రతకలేనన్న అభద్రతా భావం, అతనంటే ఉన్న వెర్రి ఆరాధన ఆమెనలా లొంగుబాటుకు గురిచేశాయి. అతని శారీరక సుఖం కోసం చిన్నపిల్లైన స్నిగ్ధను ఒంటరిగా వదిలిపెట్టి అతనితో గడపవలసి వచ్చేది. ఒంటరితనం వలన కలిగిన భయంతో, బెంగతో అస్థిమితంగా గడిపే స్నిగ్ధ తండ్రిని చూస్తెైనే భయానికి, అసహ్యానికి గురి అయ్యా స్థితికి వచ్చెసింది తన పసితనంలోనే... చిన్నారి స్నిగతో సాయంత్రాలు గడపాలనుకొనే పావనికి తొమ్మిది దాటాక భర్త సేవ తప్పేది కాదు.
చక్రధర్ కూడా పగలు ఎప్పుడైనా మూడ్ ఉంటే మాత్రం స్నిగ్ధను ఎత్తుకొని తిప్పేవాడు. సాధారణంగా అతను ఇంటిపట్టున ఉండెది చాలా తక్కువ. స్నిగ్ధ ఎదిగే కొద్దీ తండ్రికీ, కూతురుకీ దూరం బాగా పెరిగిపోయింది. అతనంటే ఏవగింపు కూడా ఆమెకు ఎక్కువయింది,
తను తొమ్మిదో తరగతికి వచ్చిన తరువాత ఓ రోజు తల్లిని అడిగింది స్నిగ్ధ... “అమ్మా, నువ్వు ఎందుకింతగా ఆయన కోసం శ్రమపడుతున్నావో నాకైతే లా అమూల్యం (కథలు)
అర్ధమె కావటం లేదు. అంత తాగేసి, నీ భుజం మీద వాంతి చేసుకుంటే, ఆ వ్యక్తిని నువ్వు అసహ్వించుకోకపోగా, ముందు నువ్వు వాష్ చేసుకోవటం మానేసి, ఆయన బట్టలు మార్చి, శుభ్రపరచి, పడుకోబెట్టి ఆ తర్వాతే నువ్వు బాత్‌రూమ్‌కి వెళ్ళి శుభపరచుకుంటావు. ఇంత అవసరమా నీకు ఆయన్ని భరించటం? మనిద్దరం (బ్రతకటానికి నీ జీతం సరిపోదా?”
“క్స్, నీకు అర్ధం కాదు చిన్నీ... ఆయనెవరు? నేనెంతగానో (ప్రేమిస్తున్న మీ నాన్నగారు... నాకెంతో ప్రియమైన భర్త. స్నేహితులను సైతం వాళ్ళ వాళ్ళ బలహీనతలతో సహా [్రేమించాలని చెబుతారు. అలాంటిది, నా జీవిత భాగస్వామిని, కోరి కోరి ఆయన్ని పెళ్ళిచేసుకున్నందుకు ఆయన ఎలాంటివారైనా నాకు పూజనీయుదేనమ్మా...”
“అంటే... ఆయనను వారించటానికి కానీ, మార్చటానికి కానీ ప్రయత్నించవా అమ్మా?” సిద్ధ స్వరంలో ఆవేశం.
“ఎవరన్నారమ్మా ప్రయత్నించడం లేదని? చాలా ప్రయత్నించాను. ఆయన బలహీనత త్రాగటం... అలవాట్లు అయినంత త్వరగా మానవురా... బయట తాగనని నాకు మాటివ్వటం వల్ల ఇప్పుడు ఇంట్లోనే తీసుకుంటున్నారు. తాగి నన్ను కొట్టటం లేదు కదా... వేరే ప్రీలవైపు చూడటం లేదు కదా... ఆడపిల్ల తల్లిని తండ్రి అండ లేకుండా నిన్ను పెంచే శక్తి నాకు లేదు. నిన్నూ నన్నూ బాగా చూసుకున్నంతవరకూ ఆయన నాకు మంచివారే... ఈ మధ్యన లిమిట్స్‌లోనే తాగుతున్నారులే...” సర్దిచెప్పింది పావని.
“పెళ్ళంటే ఇంతేనా? ఏ ఆడదైనా పెళ్ళంటూ చేసుకుంటే ఇలా సర్దుకొని ఉండాల్సిందేనా అమ్మా? ఇంకే దారీ లేదా? భయంగా అడిగింది స్నిగ్ద.
“తప్పదు తల్లీ... రక్షణ అనేది లేని ఈ సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటూ, ఏ సమస్యాలేని ప్రశాంత జీవితాన్ని కొనసాగించలేని దుర్భరమైన పరిస్థితి. భర్త ఎలాంటివాడైనా సరే ఆడది భూదేవిలా భరించవలసిందే.... విడిపోయి బ్రతకటం అనుకున్నంత సులభమేమీ కాదు. ఆదపిల్లవైన నిన్ను సింగిల్ పేరెంట్‌ని అయి పెంచేంత సామర్ధ్యం నాకసలు లేదు. ఇక ఈ జీవితం ఇంతే...” నిర్లిప్లంగా చెప్పింది పావని,
తన బాల్యంలో “పెళ్ళి అనే వేడుకను ఎంతగానో ఇష్టపదేది స్నిగ్ధ. తల్లితో కలసి బంధువులిళ్ళలోని పెళ్ళిళ్ళకు వెళ్ళటమంటే ఎంతో ఇష్టం.
నండూరి సుందరీ నాగమణి
పెళ్ళికూతురి అలంకరణ, ఆ కళ్యాణతిలకం, నుదుటి పైగా బాసికం, దానికి కొంచెం పైగా పాపిడిబిళ్ళ, బుగ్గన చుక్క పూలజడ, ఆవాదమస్తకమూ అలంకరించుకున్న బంగారు ఆభరణాలు, రంగురంగుల పట్టుచీరలు, ఎర్రగా పండిన గోరింట వేళ్ళతో పెళ్ళికూతురు ఎంతో (శ్రద్ధగా నిర్వర్తించే గౌరీపూజ, మేనమామలు పెళ్ళికూతుర్ని వెదురుబుట్టలో పెట్టుకొని ఎత్తుకొని రావటం, ఆ అగ్నిహోత్రం, జీలకథ్టి బెల్లం పెట్టటం, మాంగల్యధారణం, తలంబ్రాలు... ఆ తదుపరి విందుభోజనాలు, తాంబూలం... వీటన్నింటినీ ఎంతగానో ఇష్టపడేది.
ఏమీ తోచకపోతే ఒక కాగితం, కలం తీసుకొని ఒక బొమ్మ గీసేది. కాటుక దిద్దిన కలువల వంటి రెండు కళ్ళు, ఆ కనుబొమల మధ్యన తీర్చిదిద్దిన పెళ్ళిబొట్టు, నుదుట బాసికం, బుగ్గన చుక్క ముఖంలో ఎంతో సంతోషం... ఓ అందమైన నవవధువుయొక్క వదనాన్ని ఎంతో కళాత్మకంగా గీసేది...
అసలే తండ్రి యొక్క ప్రవర్తన, అలవాటు ఆమెకు మగవాడి పట్ల విముఖతను పెంచగా... మరో సంఘటన దానికిబలాన్ని చేకూర్చింది. తనతో పదవ తరగతి వరకూ చదివిన త్రిపుర అనే అమ్మాయికి పదహారేళ్ళ వయస్సులోనే పెళ్ళెపోయి, ఆమె భర్త ఎవరో వేరే అమ్మాయితో తిరగటం వల్ల దాన్ని భరించలేని త్రిపుర తల్లిదండ్రులు ఆమెకు విడాకులిప్పించారు. దాంతో ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. తాను చదివిన చదువుకు ఏ పనీ దొరకలేదు. ఇంట్లో సరదాగా సరాగాలతో గడిపే అన్నా వదినలను చూస్తే ఎంతో అసూయ... ఆమె భారాన్ని భరించలేని తల్లిదండ్రుల ఈటెల్లాంటి మాటలు... జీవితంమీద విసుగెత్తిపోయి ఆ పిల్ల ఓ రోజు ఉరి వేసుకొని చనిపోయింది. సంఘటన తెలిసిన వెంటనే త్రిపుర ఇంటికి వెళ్ళింది. త్రిపుర చనిపోయినా ఆమె ముఖంలో కోపం, నిరాశ, విషాదం కనిపించాయి. చాలాకాలం వరకూ ఆ సన్నివేశం మరపుకు రాలేదు స్నిగ్ధకు. అప్పట్నుండీ పెళ్ళంటే ఉన్న విముఖత మరింత ఎక్కువైంది. జీవితంలో పెళ్ళనేది చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది స్నిగ్ధ.
చదువు పూర్తవుతూ ఉండగానే బెంగుళూరులోని ఒక మంచి కంపెనీలో, మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావటంతో వెంటనే వెళ్ళి దానిలో చేరిపోయింది స్నిగ్ధ. అక్కడ పరిచయమయ్యాడు ప్రశాంత్. ఇద్దరి అభిరుచులూ కలవటంతో అనుకోకుండా స్నేహం ఏర్పడింది వారిద్దరి మధ్యన... ఆ స్నేహాన్ని మొగ్గలోనే త్రుంచివేయాలని స్పిస్ధ ఎంతగా ప్రయత్నించినా, అదామె వశం కాలేదు. ఒక బలమైన తరంగంలాగా ఆమె జీవితంలోకి చొచ్చుకొని వచ్చేశాడు ప్రశాంత్. తం. లాట అమూల్యం (కథలు)
ఇద్దరమూ పెళ్ళి చేసుకుందామని ప్రతిపాదించిన ప్రశాంత్ మాటలకు అంగీకరించకుండా, ఇద్దరి మధ్యా 'సహజీవనంి అనే ప్రక్రియను ప్రతిపాదించింది
“భీ అదేమిటీ అసహ్యంగా?” ముఖం చిట్లించాడు ప్రశాంత్.
“మంచి స్నేహితులం మనం. ఇలా అయితే ఎలాంటి సమస్యలూ రాకుండా కలిసి బ్రతకవచ్చు. పెళ్ళంటే బానిసత్వమే కదా!”
“అయ్యో స్పిగ్లా, అదేమి సంప్రదాయం? ఇటీవల మనదేశంలో కూడా పెచ్చు పెరిగిన విదేశీ విషసంస్కృతి అది. దాన్ని మనం అనుసరించటం ఏమిటసలు? మీ అమ్మానాన్నలను చూసి, అన్ని కాపురాలూ అంతేనని ఒక నిర్ణయానికి రావటం సరియైనది కానే కాదు... నామాట విను. పెళ్ళి చేసుకుని హాయిగా ఉందాము... జీవితాన్ని కలకాలమూ కలిసి పంచుకుందాము... నావైపు కాని, నీవైపు కాని పెద్దలనుంచి ఎలాంటి అభ్యంతరాలూ లేవు... దయచేసి ఒప్పుకో...” అభ్యర్థించాడు ప్రశాంత్.
కల్పిద్రెశ్చీ సంస్కృతి అన్నావు కదా... విద్య, ఉద్యోగాలు అన్నింటి లోనూ ప్రస్తుతం మనం వాళ్ళనే అనుసరిస్తున్నాము. అలాగే ఇదీనూ... పెళ్ళికాకముందు (పేమ కబుర్లు అందరూ చెబుతారు. వివాహమయ్యాకే లొసుగులు, రంగులు బయటపడేది. నీకు ఇష్టమైతే కొన్నాళ్ళపాటు మనం కలిసి ఉందాము. తర్వాత ఎవరికి విసుగు పుడితే వాళ్ళు విడిపోయి, ఆపై ఎవరి (బతుకు వారు బ్రతకవచ్చు...” నిష్కర్షగా చెప్పిన స్నిగ్ధను వదులుకోవటం ఇష్టం లేక, 'సరే... ఎప్పటికైనా మారకపోతుందా?” అన్న ఆశతో అయిష్టంగానే 'సహజీవనానికి' అంగీకరించాడు ప్రశాంత్.
ఆమె ఉంటున్న వ్లాటుకి షిఫ్ట్ అయ్యాడు. నెలనెలా అన్ని ఖర్చులూ అంటే ఇంటి అద్దె, పనిమనిషి జీతం, రేషన్ ఖర్చు ఇద్దరూ పంచుకోవాలి. ఒకరినొకరు తిట్టుకోవటం నిషిద్ధం. ఇంటిపనులన్నీ ఇద్దరూ తప్పనిసరిగా చేయాలి. ఇద్దరిలో ఎవరికి మూడ్ లేకపోయినా శృంగారం విషయంలో ఎదుటివారిని బలవంతం చేయటం పనికిరాదు. ఒకరిమీద ఒకరు అజమాయిషీ చేయరాదు. ఈ షరతులతో వారిద్దరూ “సహజీవనం” మొదలుపెట్టారు.
శశ 4
“అవును... తానీ మధ్యనే గమనిస్తోంది... ప్రశాంత్ అతని టీమ్‌లో పనిచేసే
నండూరి సుందరీ నాగమణి
శ్రీకన్య అనే అమ్మాయితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు... ఆ అమ్మాయి కోసమే కాబోలు తనను వదులుకోవటానికి సిద్ధపడివోయాడు...? ఆ రాత్రి ఒంటరిగా పడుకున్న స్పిగ్ధకు గుందె చెరువయ్యింది. తలగదలో తలదూర్చి, వెక్కి వెక్కి ఏడవసాగింది.
'తాను ప్రశాంత్‌ను ఎంతో గాధంగా (ప్రేమించింది. అతనితో సాహచర్యం ఈ ఆరునెలల కాలంలో ఎంతగానో అలవాటైపోయింది. ఉదయం నిద్ర లేవటంతోనే కాఫీ దగ్గరనుంచీ అన్నీ అతనితో పంచుకోవటం, అతని (ప్రేమ, లాలిత్యంతో కూడిన స్పర్శ, సాంత్వన... తన భావనలను, భయాలను పోగొట్టి, మానసిక స్టెర్యాన్ని కలిగించే అతని మాటలు, ఆఫీసులో ఏదైనా సమస్య ఎదురైనా దానికి ఎంతో చక్కని పరిష్కారాలు చెప్పటం, బాధ్యతగా వ్యవహరించటం... తనకు ఎప్పుడైనా వంట్లో బాగుండకపోతే దాక్టరుగారి దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయించటం, మందులు టైమ్ ప్రకారం తనతో మింగించటం... తాను బొమ్మలు గీసుకుంటూంటే పక్కనే నిలబడి అతను సూచనలు ఇవ్వటం... ఇవన్నీ... ఇవన్నీ... ఎంత బాగున్నాయి? అతనితో కలిసి జీవించటం వల్ల ఎంతో శాంతిని, సంతోషాన్ని ఎలాంటి ఒడిదుడుకులూ లేని ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తోంది తను. అయితే రేపటినుండీ ఇవన్నీ ఉండవా?
'మరొకరితో కంపానియన్ షిప్? ఆలోచిస్తేనే వాంతి వచ్చినట్టెంది స్నిగ్ధకు. చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గరకు పరుగుతీసింది. ఆ శబ్దానికి నిద్ర లేచిన ప్రశాంత్, “అరె ఎమైంది సిగ్గా?” అంటూ ఆదుర్గాగా వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమె నోటిని కడిగి, టవల్‌తో పెదవులను సున్నితంగా తుడిచి, మంచంమీద కూర్చోబెట్టాడు. రిఫ్రిజిరేటర్లోంచి నిమ్మకాయ తీసి కోసి, రసం కలిపి తీసుకొచ్చి ఆమెచేత తాగించాడు. ఆమె పక్కనే కూర్చుని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.
“ఏమైందిరా, పీరియడ్ ఏమైనా మిస్సయ్యావా?” అనుమానంగా అడిగాడు.
“ఉహు, అదేం లేదు 'ప్రశూ... ఆ జా(గ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను...”
“మరి?”
“నువ్వు... నువ్వు... నిజంగా నన్ను విడిచి వెళ్ళిపోతావా?”
“మరి ఎంతకాలం ఇలా కలిసి ఉండగలం? మన మధ్య ఏ బంధముందని?” ఆమె ముంగురులు సవరిస్తూ చెవ్పాడు.
“అయితే నీకు ఆ శ్రీకన్యతో...” వనజ అమూల్యం (కథలు,
“ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిన మాట నిజమే... కాని నాకు ఆ ఉద్దేశ్యం ఉండాలి కదరా? నువ్వు... నీకు నచ్చినవారినెవరినైనా...” అతని గొంతు వణికింది.
“ప్లీజ్ స్టాపిట్... ప్రశాంత్... ప్లీజ్... మనసు, శరీరం అన్నీ నీతోనే పంచుకున్నదాన్ని. నన్ను నేను ఊహల్లో కూడా ఎవరితోనూ... అబ్బ! తలచుకుంటేనే అసహ్యం వేస్తోంది.... నేను నిన్ను నిజంగా (మేమించాను ప్రశూ...కాని ఈ వివాహబంధమంటేనే నాకు భరించలేనంత కంపరం...”
“కాని స్నిగ్గా, నాకు భార్య కావాలి. ఒక గర్లఫెండు కాదు... పిల్లలు కావాలి... వాళ్ళతో ఆడుకోవాలి. ఒక తండ్రిగా ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి. నాకు అలాంటి జీవితమే కావాలి స్నిగ్దా... తప్పదు... నేను రాజీపడలేను....” తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా అస్పష్టంగా అన్నాడు (ప్రశాంత్.
“అయితే... మరి... నేను... సీకు... వద్దా?” స్నిగ్ధ గొంతు బొంగురు పోయింది.
“ఎందుకు వద్దు? ఆ జీవితం... నీతోనే కావాలి... నువ్వే కావాలి నాకు... కాని ఇలా కాదు. నాలో సగభాగమై... నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా కావాలి...”
“భార్య! లైసెన్స్‌డ్ సర్వెంట్‌మెయిడ్... లీగలైజ్డ్ ప్రాస్టిట్యూట్... చట్టబద్ధమైన బానిస...” పళ్ళబీగువున ఆవేశంగా ధ్వనించిందామె స్వరం.
“పారపాటు పడుతున్నావు... స్నిగ్దా...”
“లేద... నిజం మాట్లాడుతున్నాను ప్రశూ! తాళి కట్టి తనదాన్ని చేసుకొనేంత వరకే మగవాడి ప్రేమలోని మాధుర్యమంతా... ఆ తర్వాత నిద్రలేస్తాడు వాడిలోని రాక్షసుడు... ఆపై ఆడదాని బ్రతుకుంతా బానిసత్వమే... నేను చూశాను ప్రశూ... మా అమ్మ బాధలు, ఆమె కన్నీరు... ఆ నరకం...”
“అవన్నీ ఆమె ఇష్టంగానే చేస్తోందని ఎందుకనుకోవు?”
“ప్లీజ్ డోంట్ టాక్ రబ్బిష్.. తప్పనిసరియై, సంఘంలో ఒక మర్యాద పూర్వకమైన స్థానం కోసం, నా కోసం... చేసింది, చేస్తోంది... అది ఆ తరం... ఇంత చదువు చదువుకొని, నీ అంత సంపాదిస్తూ కూడ, నువ్వంటే ఎంత ఇష్టమైనా ఉండనీ గాక... నీతో తాళి అనే పలుపుతాడు కట్టించుకొని, నీకో కట్టుబానిసలా మారటం... నాకు మనస్కరించటం లేదు. సరేలే... నా భావాలు నావి! వాటిని నండూరి సుందరీ నాగమణి తతా
అలాగే ఉందనీ... సరే ప్రశూ... నీకు చాలా థాంక్స్... నాకిన్నాళ్ళూ ఎంతో సపోర్ట్ నిచ్చావు... నేనిక నిన్ను ఇబ్బంది పెట్టలేను. నువ్వు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు...” బాధగా కళ్ళుమూసుకుంది స్పిద్ద.
“నేనొక 'మంచి భర్తను అవుతానని ఎలా నిన్ను నమ్మించగలనో నాకు తెలియటం లేదు స్నిగ్గా... నువ్వంటే నాకెంత ఇష్టమున్నా ఇలా జీవించటం మాత్రం నాకు నచ్చటం లేదసలు... మన కొలీగ్స్ దృష్టిలో మనం చాలా చవకబారుగా తయారయ్యాము. మొన్న ఆ సారథిగాడు ఏం కూసాదో నీకు తెలుసా? 'స్నిగ్ధతో నీ కంపానియన్‌షిప్ పూర్తయ్యాక చెప్పు. ఆమెతో నేను మాట్లాడతాను.... నీ తర్వాతి పార్ట్‌నర్‌గా నన్ను ఒప్పుకోమని...” అని... మధూగాడైతే ఎన్నోసార్లు.... 'స్నిగ్ధది స్టన్నింగ్ బ్యూటీ... ఆ బాడీ స్ట్రక్చర్ వాహ్... నీతో పడకమీద చాలా యాక్టివ్‌గా ఉంటుందేమో కదూ...” అంటూ అతిగా వాగుతాడు. వెంటనే కట్ చేసేసి అక్కడినుంచి వెళ్ళివోతాను తప్పు, ఏ రకంగానూ ప్రతిస్పందించలేను. నా నరనరం ఉద్రేకంతో తెగిపోతుందా... అన్న బాధ కలుగుతుంది. ఒక్కొక్కణ్ణి పచ్చడి చేయాలన్నంత ఆవేశం వస్తుంది... కాని... కాని... ఏ అధికారంతో? అదే నేను నీకు చట్టబద్ధమైన జీవితభాగస్వామిని అయి ఉంటే ఆ వెధవలు నోరు విప్పే సాహసం చేస్తారా?
అసలు నా బాధంతా నీకోసమే స్పిగ్ధా... నేను నిన్ను విడచి వెళ్ళిపోతే ఈ పులులు, సింహాల బారినుండి నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవు? ఆలోచించు... సరేలే... చాలా రాత్రయింది కదా... ఇక ప్రశాంతంగా పడుకో...” మృదువుగా చెప్పి, స్నిగ్ధను పడుకోబెట్టి తాను తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రశాంత్.
ఆలోచిస్తూనే నిద్రకు ఉపక్రమించింది స్నిగ్ధ.
శ శ ఈ
రెండురోజుల తరువాత...
రాత్రి ఆఫీసునుంచి వస్తూనే, *నా చిన్నప్పటి మిత్రుడు జీవన్ అమెరికానుండి ఇక్కడ ఏదో పనిమీద వస్తున్నాడు స్నిగ్గా... ఒక్కరోజే కాబట్టి బయట హోటల్లో కాకుండా, ఇక్కడే మనతోనే ఉంటానని అన్నాడు... అతను సోమవారం వస్తాడు. ఈ ఆదివారం నేను మన బాస్‌తో కాన్ఫరెన్స్‌లో ఉంటానని నీకు తెలుసుగా? నీకు వీలైతే నా గదిలో పుస్తకాలు, బట్టలు సర్దిపెట్టలలవా?” వేడికోలుగా అడుగుతున్న ప్రశాంత్ మాటను కాదని అనలేకపోయింది స్నిగ్ధ, పతా అమూల్యం (కథలు)
క్రితం నెలలో తన స్నేహితురాలు మిత్రవింద కోల్‌కతా నుండి వచ్చినప్పుడు అతనిచ్చిన సహకారాన్ని ఇంకా మర్ప్చిపోలేదామె. జీవన్‌కు మంచి ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది.
గ శ స
ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకల్లా ేక్‌ఫాస్ట్ కాగానే బయటకు వెళ్ళిపోయాడు ప్రశాంత్.
పనిచేసే అమ్మాయి గంగ రాగానే పనిలోకి దిగిపోయింది స్నిగ్ధ. ముందుగా ఇద్దరూ కలిసి అతని బట్టలన్నీ సర్దేశారు. నేలంతా అద్దంలా తుడిచి, నీట్‌గా దులిపిన కార్పెట్‌ను పరచింది గంగ. పక్కబట్టలు మార్చి, సన్నని పూలూ, లతలూ ఉన్న లేత గులాబీరంగు బెడ్‌షీట్స్‌ను పరచి, అదే డిజైన్ దిండు గలీబులతో మంచాలను అలంకరించింది సిద్ద. రూమ్ [్రెషనర్‌ను (స్పే చేసింది. ఏసీ ఆన్ చేయగానే కమ్మని పూలపరిమళం గదంతా వ్యాపించింది మనసులో ఆహ్లాదాన్ని నింపివేస్తూ...
అప్పటికే టైమ్ పన్నెండు దాటిపోవటంతో పసిపిల్లాడిని వదిలి వచ్చిన గంగను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పింది స్పిద్ద. “అయ్యో, ఈ పుస్తకాలూ, సీడీలు చాలా ఉన్నాయి... వీటిని సర్గాలి కదమ్మా?” అని గంగ వెనకాడుతూ ఉంటే, “అదేం ఫర్వాలేదులే, నేను సర్దేస్తాను గంగా... నీ బాబు పాలకి ఏదుసాడు, నువ్వు వెళ్ళివో... ముందు వంట చేసేసి ఇవన్నీ నెమ్మదిగా నేను సర్దేసు కుంటానులే....” అని నచ్చచెప్పి ఆమెను పంపించేసింది.
ఆమె వెళ్ళిన తరువాత తేలికగా వంట ముగించి, పుస్తకాలు సర్దె పని పెట్టుకుంది. సబ్జ్లెక్ట్‌కి సంబంధించిన పుస్తకాలతో పాటుగా సాహిత్యానికి, కవిత్వానికీ సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి నవలలు “అందమైన జీవితం, 'స్రవంతి”, 'మందాకిని” తీసి మళ్ళీ చదవాలనుకుంటూ పక్కన పెట్టుకుంది. దేవులపల్లివారి “కృష్ణపక్షం”, తిలక్‌గారి 'అమృతం కురిసిన రాత్రి), శ్రీశ్రీ గారి 'మహాప్రస్థానం' కూడా తీసుకుంది. ప్రశాంత్‌కీ తనకూ పరిచయం అయిన కొత్తలో వీటి గురించే చాలావరకూ చర్చించుకొనేవారు
పుస్తకాలన్నీ అందంగా రేక్స్‌లో అమర్చి, పేపర్లు అన్నీ ఫైల్స్‌లో సర్దెసి, షెల్ఫ్ మూయబోతూంటే బ్రౌన్ కలర్ అట్ట ఉన్న బౌండు పుస్తకమొకటి కిందపడి నండూరి సుందరీ నాగమఃభి లాలా
తెరచుకుంది. డైరీలా ఉందే... అనుకుంటూ చేతిలోకి తీసుకుంది స్నిగ్ధ. లేత సువాసనలీనుతూ, మొదటి పేజీలోని అందమైన ఆర్ట్ పేపర్‌పై, అంతకన్నా అందంగా స్కెచ్ పెన్‌తో, తన పేరు “స్నిగ్ధ అని వ్రాయబడి ఉండటంతో ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకుంది. దానిలో తేదీలు, నెలలతో సంబంధం లేకుండా పుస్తకంలో సగం వరకూ ఆమె గురించే వ్రాసుకున్నాడు. తామిద్దరికీ పరిచయమైంది మొదలు, స్నేహమనేది ప్రారంభమవటం... తామిద్దరూ సహజీవనం సాగించటం... అతని అనుభూతులు, అనుభవాలు, భావనలు, బాధలు అన్నీ వ్రాసుకున్నాడు. స్నిగ్ధ తనకు తెలియకుండానే అది చదువుతూ దానిలో లీనమైపోయింది.
నిన్న మొన్నటి తమ ఇద్దరి సంభాషణా సారాంశంతో సహా అన్నీ వ్రాసుకున్నాడు. చివరికి తన తల్లిదండ్రుల కోరిక మేరకు తానొక పెళ్ళి అనేది చేసుకోక తప్పదనీ, అందువలన మనసు లేని మనువును చేసుకొని తనకూ, అటు వచ్చే అమ్మాయికీ కూడా నరకప్రాయమైన జీవితాన్ని ఆహ్వానించక తప్పదనీ, మనసుతో కాక, కేవలం యాంత్రికమైన సంసారిక జీవితాన్ని గడపబోవటం చాలా బాధాకరమైన విషయమనీ, స్నిగ్ద తనకు సహకరించి పెళ్ళికి ఒప్పుకొంటే మాత్రం, అందరి జీవితాలూ అద్భుతంగా ఉంటాయనీ ఎంతో ఆర్తిగా వ్రాసుకున్నాడు. అసలు స్నిదగ్ధను వదలి వెళ్ళిపోవటమనేది తానొక ప్రాణం లేని కట్టెగా మారి వెళ్ళిపోవటమే అని అతను వ్రాసుకున్న వాక్యాన్ని చదివిన స్నిగ్ధ నిజాయితీతో కూడిన అతని స్వచ్చమైన (ప్రేమకు చలించిపోయినదై, ఒక్కసారిగా పగిలిన నీటికుందే అయింది. కనుల వెంట అవిరామంగా కన్నీరు జారుతూ ఉంటే, అలా కలత పడుతూనే నిదురలోనికి జారిపోయింది.
ఆ సాయంత్రమే జీవన్‌ను ఇంటికి తీసుకువచ్చాడు ప్రశాంత్. ఎంతో ఆసక్తితో వంట చేసింది స్నిగ్ధ. బీరకాయ పచ్చడి, బంగాళాదుంప వేపుడు, దోసకాయ పప్పు, బెల్లం వేసిన చారు, సేమ్యా పాయసం, అప్పడాలు, ఆవకాయ, గడ్డపెరుగుతో కొసరి కొసరి వడ్డించింది. దక్షిణాది భోజనమంటే చెవి కోసుకునే ఉత్తర భారతదేశానికి చెందిన జీవన్‌కు ఆ భోజనం ఎంతో నచ్చింది. “థాంక్ యూ వెరీ మచ్ బెహన్...” అని ఎంతో ఇష్టంగా తిన్నాడు. “మావాడు చాలా అదృష్టవంతుడు... ఒరేయ్, నీ భార్య ఇలాగే రోజూ వండి పెడుతూ ఉంటే, అడ్డంగా పెరిగివోతావ్...” అంటూ ప్రశాంత్‌ని ఆట పట్టించాడు. అతని మాటలకు నవ్వుకుంటూనే క్రీగంట స్నిగ్ధవైపు చూశాడు ప్రశాంత్. కొంచెం అపరాధభావనతో అతతతతతపఆఆాలడా అమూల్యం (కథలు)
చూపులు మరల్చుకొంది స్నిగ్ధ. తాము ఉన్న జీవనవిధానం గురించి ప్రశాంత్ జీవన్‌కు చెప్పలేదు... తమది వివాహబంధమనీ, తామిద్దరూ దంపతులనే జీవన్ అనుకుంటున్నాడని అర్ధమైంది స్నిగ్ధకు. చిత్రంగా ఆ ఆలోచన ఆమెకు తెలియని సంతృప్తిని కలిగించింది.
మర్నాడు సెలవు తీసుకుంటూ స్నిగ్ధ తలను ఆవ్యాయంగా నిమిరాడు జీవన్. “ప్రశాంత్ చాలా మంచివాడు. అలాగే నువ్వూనూ... వాడికి ఎలాంటి భార్య వస్తుందో అని చిన్నప్పట్నుండీ అనుకొనేవాడిని... మహాలక్ష్మిలా అనుకూలమైన నీవు వాడికి వరంగా లభించావు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు వాడు... త్వరలో నీకు బిడ్డ పుడితే వాడిని ఎత్తుకొని ఆడించటానికి మళ్ళీ వస్తానమ్మా... ఈ అన్నయ్యను మరచిపోకు...” అప్రయత్నంగా స్నిగ్ధ కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. తనకు తెలియకుండానే జీవన్‌కు పాదాభివందనం చేసింది.
శ 1 ఈ
ఆ మరునాడు జ్వరం తగిలినట్టుంటే ఆఫీసుకు సెలవు పెట్టింది స్నిద్ద.
స్నానం చేసి వచ్చి, టీవీ చూస్తూంటే డోర్ బెల్లు మైగటంతో తలుపు తీసి చూస్తే ఎదురింటి అంకుల్. ఆయనకి తన తండ్రి వయసే ఉంటుంది.
“ఏమమ్మాయ్, అతనింట్లో లేడా?”
“ఏం కావాలి అంకుల్?” నమతగా అదిగింది స్పిగ్ధ.
“ఏం లేదు, బిజినెస్ లైన్‌చూసి వెళదామని...” సోఫాలో సెటిలైపోయి, న్యూస్ పేపర్ చేతిలోనికి తీసుకున్నాడు...
ఏమనాలో తెలియక తానూ కూర్చుంది స్పిగ్ధ.
“అవునమ్మాయ్, నాకో నిజం తెలిసిందీ మధ్య... మిరిద్దరూ మొగుడూ పెళ్ళాలు కారట కదా... కొన్నాళ్ళు కలిసి ఉందామన్న ఆలోచనలో ఉన్నారట కదా...” అతని పెదవులపై వంకర నవ్వు,
అతని చూపులు తన శరీరాన్ని శోధిస్తున్నట్టనిపిస్తూ ఉంటే ఇబ్బందిగా కదులుతూ, “అంకుల్, ప్లీజ్ మీరు వెళ్ళండి, నాకు పనుంది...” అంది.
“అతను లేనప్పుడు లోన్లీగా ఫీలైతే చెప్పు, కంపెనీ ఇస్తాను...” అన్నాడు ఓరగా చూస్తూ...
ఇంతలో... “స్నిగ్ధా... నా పెన్ డైవ్ నీ దగ్గరే ఉండిపోయింది కదా, కొంచెం నండూరి సుందరీ నాగమణి లాలా
ఇస్తావా? నా ప్రాజెక్ట్ ఎస్టిమేట్ అందులో ఉండిపోయింది...” అంటూ ప్రశాంత్ బయటినుండి లోపలికి వచ్చాడు.
“మళ్ళీ వస్తానమ్మాయ్...” అంటూ కంగారుగా లేచి వెళ్ళిపోయాడాయన.
ఉవ్వెత్తున దుఃఖమొచ్చి, వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రశాంత్‌ని అల్లుకుపోయింది
“ఏం జరిగింది?” తెల్లబోయాడు ప్రశాంత్.
గద్దదస్వరంతో ఆయనన్న మాటలన్నీ చెప్పింది. వింటున్న ప్రశాంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. “ఏమనుకుంటున్నాడా ముసలిపీనుగ? నువ్వు ఎవరను కుంటున్నాడు... నా ప్రాణానివి నువ్వు... నీ గురించి అంత వెకిలిగా, చౌకబారుగా మాట్లాడతాడా... వాడి అంతు చూస్తానేమనుకుంటున్నాదో...” ఆవేశంగా కదలబోతున్న అతన్ని వద్దని తలూపుతూ ఆపేసింది.
“చూశావురా, సిగ్గా! ఆ వయసాయనే అలా మాట్లాడాడంటే, మన వయసువాళ్ళు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఎలా ఉండగలరు? మన బాస్‌తో సహా అందరికీ చులకనైపోతావు... నేను వెళ్ళిన మరుక్షణం అందరూ గద్దల్లా నీమీద పడిపోతారు. ఆలోచించు బంగారం...ప్లీజ్... నువ్వు 'ఊ' అంటే వచ్చే నెలలోనే బోలెడు ముహూర్తాలున్నాయట... పెళ్ళి చేసేసుకొని చక్కని జీవితాన్ని పొందుదాము. ఇదిగో, ఇదేనా (ప్రామిస్.... నీకు అందమైన, తీయని దాంపత్య జీవితాన్ని కానుకగా ఇస్తాను. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ అప్పుడు కూడా చేస్తాను. మన పిల్లలను చక్కగా పెంచుతాను. నిజానికి నీకు దూరమై నేనసలు బ్రతకలేను స్నిగ్దా... నా వేదనను అర్ధం చేసుకొని సరేనని చెప్పరా... ప్లీజ్...”
స్నిగ్ధ మౌనంగా వింటూ అతని గుండెల్లో తల దాచుకొని ఉండిపోయింది.
“చూడు పెళ్ళనేది చక్కని భారత సంప్రదాయం. దాన్ని మనం గౌరవించి తీరాలి. పెళ్ళంటే నువ్వనుకుంటున్నట్టు ఓ బానిసత్వం కాదురా, ఒక బాధ్యత... ఆధిపత్యం కాదు, అనురాగవేదిక. నువ్వు చూసిన జీవితాలు కొన్ని అలా ఉన్నంత మాత్రాన అన్ని దాంపత్యాలు ఒకేలా ఉంటాయని అనుకోవటం అవివేకమే కాదు మూర్ధత్వం అనిపించుకుంటుంది. ఈ “సహజీవనం” అనేది ఇటీవలి కాలంలో మన యువతరంలో వెట్టితలలు వేస్తున్న ఓ జాద్యం... వ్యభిచారానికి వేసిన అందమైన ముసుగు... విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి, రోజుకో అమ్మాయిని మార్చే అబ్బాయిలకు, రోజుకో అబ్బాయితో గడపాలనుకొనే
వా అమూల్యం (కథలు)
అమ్మాయిలకు ఇదో పెరటిదారి. మనలాగ ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చ జంటలకు మాత్రం కాదు. మరొకరితో నిన్ను నీవు ఎలా ఊహించుకోలేవో, నేనూ అంతే... వివాహబంధంతో మనమిద్దరం ఒక్కటైపోతే మనల్ని ఎవ్వరికైనా విడదీయటం సాధ్యమౌతుందా చెప్పు? ఐ లవ్ యూ స్నిగ్యా! ఐ లవ్ అవర్ కిడ్స్ విత్ యూ... ఓసీ విత్ యూ...”
మౌనంగా వింటున్న స్నిగ్ధ మనసులో ఏవేవో భావనలు కలిగాయి. అమ్మ మాటలు కూడా గుర్తుకొచ్చాయి. మొన్ననే అమ్మకి సుస్తీ చేస్తే నాన్న దగ్గరుండి వైద్యం చేయించటమే కాదు, బోలెడన్ని సేవలు సైతం చెశాడట. నమ్మలేకపోయింది తను. కానీ నాన్నే తనతో చెప్పాడు... “అమ్మలూ, ఇంతకాలానికి భార్య అనే పదానికి అర్ధం ఏమిటో తెలుసుకున్నానురా... నేనొక మంచి భర్తగా మారటానికి ప్రయత్నిస్తున్నాను" అని... వారి బంధం 'పెళ్ళి అవటం వల్లనే ఆయన అలా ఆలోచించగలిగాడేమో...
“సరే... ప్రశాంత్... మనం పెళ్ళి చేసుకుందాము... మరి... మరి... నన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా...” అమాయకంగా పలికిన స్నిగ్ధ మాటలకు ఫక్కున నవ్వాడు ప్రశాంత్. “ఇంకెక్కడికి వెళ్ళిపోతాన్రా బాబూ, నీ కొంగున నన్ను గట్టిగా కట్టేసుకోవూ?” అంటూనే తన మొబైల్ ఫోన్ తీసి పావనికి రింగ్ చేశాడు.
“అత్తయ్యా, నేనే... మీరు వెంటనే మామయ్యగారితో వచ్చేయండి... స్నిగ్ధ పెళ్ళికి ఒప్పుకుంది...” అతని స్వరంలో సంతోషతరంగాలు.
సిగ్గు ముంచుకొచ్చింది స్పిద్ధకు... అతని ముఖంలోనికి సూటిగా చూడలేక, గులాబీలా కెంపు కాంతులీనుతున్న తన ముఖాన్ని గబుక్కున రెండు చేతులతో కప్పుకుంది.
“అబ్బా... స్పిగ్దా... ఇంత సౌందర్యాన్ని ఎప్పుడూ నీలో చూడలేదు... మబ్బు మాటునుండి ఓరగా తొంగి చూసే చందమామలా... ఈ సిగ్గతెరల మధ్యన నీ ముఖబింబం ఎంత బావుందో చెప్పలేను మరి... మన బాస్‌కి ఈ రోజుకిక రాలేనని చెప్పేస్తాను... మన పెళ్ళికి షానేసుకుందాం రా...” అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తేసుకున్నాడు. ప్రపంచాన్నంతటినీ గెలిచిన అధినేతలా ఉన్నాడు ప్రశాంత్ ఆ క్షణాన!
శ ఎన 24 నండూరి సుందరీ నాగమణి లాలా
మర్నాడు రాత్రి తన షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రశాంత్‌కి తన
అమ్మానాన్నలతో కలిసి ఏకధాటిగా కబుర్లు చెప్పేస్తున్న స్నిగ్ధతో పాటుగా టేబుల్
మీద ప్యాడ్‌లో బిగించి ఉన్న పేపర్‌పై చి(త్రీకరించబడి ఉన్న ఒక
'సంప్రదాయాలంకృత వధువు చిత్రం కనబడింది. చిత్రంగా, ఆ చిత్రంలో అన్నీ స్నిగ్ధ పోలికలే...
(నవ్య వారపత్రిక, 28 జనవరి, 2018)
ఈఈఈ 40, లాం అమూల్యం (కథలు)
అషస్సు
ఆ రోజు తమ పెళ్ళిరోజు కావటంతో భర్తను త్వరగా ఇంటికి వచ్చేయమనీ, తాను కూడా ఆఫీస్‌నుంచి త్వరగా వచ్చేస్తానని గట్టిగా చెప్పింది స్పందన. స్పందనకు సృజన్‌తో పెళ్ళె సరిగ్గా సంవత్సరమైంది. మొదటి వార్షికోత్సవం కావటంతో చాలా ఆనందంగా భర్తతో కలిసి బిర్లామందిర్‌కి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకొని, బయట డిన్నర్ చేసి వచ్చి, తర్వాత ఎంతో ఆనందంగా గడపాలని ప్రణాళిక వేసుకుంది స్పందన. ఆ రోజు సెలవు పెట్టేయమని కోరింది సృజన్‌ను. కాని ఆమెకే ఆ రోజు కంపెనీలో బోర్డ్ మీటింగ్ ఉండటం వలన లీవ్ దొరకలేదు. భర్తను కూడా డ్యూటీకి వెళ్ళిపొమ్మని, సాయంత్రం మాత్రం త్వరగా వచ్చేయమనీ ఒకటికి నాలుగుసార్లు నొక్కి చెప్పి తను బయలుదేరింది స్పందన.
అనుకున్నట్టె తాను త్వరగా వచ్చేసింది స్పందన. అత్తగారిచ్చిన కాఫీ తాగేసి, స్నానం చేసి తయారై, కొత్త చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని తయారై కూర్చుంది. క్షణాలు నిమిషాలుగా మారిపోతుంటే అసహనంగా అతనికి ఫోన్ చేసింది. బెడ్‌రూమ్‌లోంచి వినవచ్చిన రింగ్ శబ్దం ఆమెను వెక్కిరించినట్టెంది. మొబైల్ మరచి వెళ్ళిపోయాడు సృజన్. రెండు గంటల తరువాత జడలోని పూలు విసిరికొట్టి, చీర మార్చేసుకొని ఆశాభంగంతో కన్నీరు కరుస్తూ పడుకుంది స్పందన. ఆమెనే గమనిస్తున్న సుబ్బలక్ష్మి బాధగా నిట్టూర్చింది. ఈ రోజు వీళ్ళ పెళ్ళిరోజు... ఇలా ఎన్నోసార్లు జరిగింది... కాని ఈ రోజు కూడా జరగాలా? సృజన్ త్వరగా వచ్చేసి ఉంటే బాగుండేది... స్పందన చేయబోయే గొడవను తలచుకొంటే ఆమెకు భయం వేసింది.
చివరికి ఎనిమిదిన్నర అవుతూ ఉండగా అలసి సొలసి, నీరసంగా ఇల్లు చేరాడు సృజన్. రాగానే తల్లి దగ్గరకు వెళ్ళి, “అమ్మా, ప్లీజ్... త్వరగా ఏదైనా టిఫిన్ చేయి... ఉప్మాలాంటిది...” అని చెప్పాడు. పరిస్థితి అర్ధమైన ఆ తల్లి నండూరి సుందరీ నాగమణి ----౮౮౮౮౮౮ా లా!
వెంటనే ఆ పనికి ఉపక్రమించింది.
“స్పందూ... సారిరా లేటైంది... లే... ఒక్క అరగంటలో బయటకు తీసుకువెళతాను...” కళ్ళమీద వెలుతురు పదకుండా అడ్డంగా కప్పుకున్న ఆమె చేతిని తొలగిస్తూ అనునయంగా చెప్పాడు సృజన్. అతని చేతిని బలంగా విసిరి కొట్టంది స్పందన.
ఆగ్రహావెశాలతో ఊగిపోతున్న భార్యను సముదాయించటానికి ప్రయత్నిస్తూ, “అసలు నేను ఐదు గంటలకే హాస్పిటల్ నుండి బయటపడ్డాను స్పందూ... కాసీ బయటకు వచ్చేసరికి హఠాత్తుగా హాస్పిటల్ గేట్ ముందే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. పన్నెండేళ్ళ బాబు రోడ్డు దాటుతూ కారు కింద పడటంతో తలకు పెద్ద గాయమై, అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతనితో ఉన్న అతని తల్లి గోడు గోడున ఏడుస్తోంది. ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఆ పరిస్థితులలో ఒక దాక్టరుగా కాదు, ఒక మనిషిగా నేనేం చేయాలి? వెంటనే మా హాస్పిటల్‌కి తీసుకుపోయి, ఆ అబ్బాయిని జాయిన్ చేశాను. చాలా రక్తం పోవటంతో వెంటనే రక్తం ఎక్కించవలసి వచ్చింది. అతనిది రేర్ గ్రూప్... ఆ రక్తం ఎక్కడా దొరలేదు. తలకు సర్జరీ చేయాల్సి వచ్చింది. కొంచెం ఆలస్యం చేసినా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మా సీనియర్ సర్జన్ ఆపరేషన్ చేయటానికి సిద్దమయ్యారు. అదృష్టవశాత్తూ నాదీ అదే (గ్రూపు కావటంతో నేనే రక్తం ఇచ్చాను. అందుకే ఇంత లేట్ అయింది. మన పెళ్ళిరోజున ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగానన్న తృప్తి నాకెంతో శక్తిని ఇచ్చింది. నిన్ను బాధపెట్టినందుకు క్షమించు. మొబైల్ ఇంట్లోనే మరచిపోవటంతో నీకు మెసేజ్ అందించలేకపోయాను... గుడికి ఆదివారం నాడు వెళదాములే...” బుజ్జగిస్తూ చెప్పాడు సృజన్.
తోక తొక్కిన త్రాచల్లే లేచింది స్పందన. “లోకంలో నువ్వొక్కడివే దాక్టరువా? మన పెళ్ళెనప్పటినుండీ చూస్తున్నాను... ఎన్ని సాయంత్రాలు నన్ను వదలి... అర్జెంట్ కేసులు... ఆపరేషన్లు అంటూ వెళ్ళిపోలేదు? అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు... ఫోన్ వస్తే చాలు, నీ డ్యూటీ కాకపోయినా, అసలు నీకేమీ సంబంధం లేకున్నా హస్పిటల్‌కి వెళ్ళిపోతావు. తాళి కట్టింది నాకు కాని నీ అసలు భార్యనీ హాస్పిటలే కదా... ఈ రోజు కూడా ఇంతే... అసలు నీ డ్యూటీ అయిపోయాక కూడా నీకెందుకీ సంఘసేవ? ఎవరెలా పోతే నీకెందుకో?”
“స్పందనా, నువ్వు ఇంకా చాలా ఎదగాలి... ఇది నా వృత్తి ధర్మమని నీకు తెలియదా? డాక్టరు పట్టా తీసుకున్నప్పుడే వృత్తిపరమైన ప్రమాణాన్ని... అంటే పతా అమూల్యం (కథలు)
ఓత్‌ని తీసుకున్నాను... ప్రాణరక్షణ చేస్తానని... దాన్ని నిలబెట్టుకోవటం నా ప్రథమ కర్తవ్యం...”
“ఓహో... డాక్టర్లంతా నీలాగే ఉన్నారా? ఇంటి దగ్గర క్లినిక్కులు పెట్టి, వేలకి వేలు సంపాదిస్తూ ఉంటే నువ్వేమో ఆ హాస్పిటల్లో మామూలు జీతానికి పనిచేస్తున్నావు. సంఘసేవంటూ నువ్వు శ్రమపడటమే కాకుండా, నన్ను కూడా సీ ప్రవర్తనతో బాధ పెడుతున్నావు... ఇదంతా ట్రాష్.. అసలు నువ్వెప్పటికీ మారవా?”
“నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు స్పందనా... ఆవేశం విచక్షణను చంపేస్తుంది... అది తగ్గాక, స్థిమితంగా ఆలోచించు. నేను అత్యవసరంగా ఎమైనా తినాలి... అమ్మ పిలుస్తున్నట్టుంది...” అని గదిలోంచి వెళ్ళిపోయాడు సృజన్.
'అసలు నిన్ను కాదులే, నిన్ను ఇలా తయారుచేసిన మీ అమ్మని అనాలి...” కోపంగా పళ్ళు నూరుకుంది స్పందన.
శ స *ఒఓ
ఆ రోజు సాయంకాలం...
ఆఫీసునుంచి వస్తూ వస్తూ కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి రెండు మూడు రకాల కూరలు కొనుక్కొని స్కూటీ స్టార్ట్ చేయబోతూ ఉండగా భరించలేని నిస్సత్తువగా అనిపించింది స్పందనకి. సంబాళించుకొనే లోపలే విపరీతమైన మైకం కమ్మేసింది.
అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు కాని, బాగా మెలకువ వచ్చి చూసేసరికి తను ఒక మంచంమీద పడుకుని ఉన్నట్టు గ్రహించింది స్పందన. తన ముఖంలోకే ఆత్రంగా చూస్తున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ స్రీ కనిపించింది.
“అమ్మయ్య, మెలకువ వచ్చిందిగా... ఇక భయం లేదమ్మా... మా ఇంటి పక్కగానే నీ బండి పార్క్ చేశావు. నువ్వు బండి పట్టుకొని స్టార్ట్ చేస్తూండగానే తూలి పడిపోయావు. మా అబ్బాయి వస్తున్నాడేమో అని గేటు దగ్గరకు వచ్చి చూసిన నేను వెంటనే వచ్చి, నిన్ను పట్టుకొని నడిపిస్తూ ఇంట్లోకి తీసుకువచ్చాను. పావుగంట సేపు నీకసలు స్పృహ లేదు. ఎంతో గాథఢాతిగాఢంగా నిద్రపోయావు. ఎంత సీరసంగా ఉన్నావు? ఇదిగో, ఈ జ్యూస్ తాగు...” అంటూ అందించింది.
బత్తాయి పళ్ళరసంలో గ్లూకోజ్ కలిపారని గ్రహించింది స్పందన. మారు నండూరి సుందరీ నాగమణి లాలా
మాటాడకుండా అందుకొని తాగేసి, ఆమె అందించిన టిష్యూ పేపరుతో పెదవులు తుడుచుకుంది.
“నా పేరు సౌజన్య. స్కూలు టీచర్ని... నీ పేరు?”
“నా పేరు స్పందనండీ... నేను 'వికాస్ మినరల్స్'లో జాబ్ చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ చేయలేదు. వర్క్ ప్రెజర్ వల్ల కంటిన్యువస్‌గా ఇంట్లో కూడా లేట్ అవర్స్ సిస్టమ్ మీద పనిచేయల్సి వచ్చింది. రెండు మూడు రోజులుగా సరైన నిద్ర లేక బాగా నీరసం వచ్చింది. ఎనీ వే, థాంక్ యూ వెరి మచ్ ఫర్ యువర్ కన్సర్న్ మేడమ్...”
“ఛా మేడమ్ ఏమిటీ, అక్కాఅని పిలు స్పందనా... నీ స్కూటీ కీ ఇస్తే, మీ బావగారు దాన్ని మీ ఇంటికి తీసుకువస్తారు రేపు. ఇప్పుడు మాత్రం మీ ఇంటి దగ్గర కారులో దింపుతారు... ఓకేనా? మరీ ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసేసి ఉద్యోగం కోసం అంత శమ పదడకమ్మా...” చెప్పింది సౌజన్య, ఆదరంగా స్పందన ముంగురులను సవరిస్తూ...
“అలాగే అన్నట్టు తలూపి, ఆమె దగ్గర సెలవు తీసుకొని, సౌజన్య భర్త వెంట కారులో ఇంటికి వచ్చేసింది స్పందన. జరిగిన విషయం విన్న సుబ్బలక్ష్మి కంగారు పడింది. ప్రక్క ఊరిలో క్యాంపులో ఉన్న సృజన్‌కు ఫోన్ చేయబోతే వారించి తను పడుకుని విశ్రాంతి తీసుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్ళిపోయింది స్పందన.
పది నిమిషాలు గడిచాయో లేదో చిన్నగా తలుపు తట్టి లోపలికి తట్టి లోపలికి వచ్చింది సుబ్బలక్ష్మి. ఆమె చేతిలో పొగలు కక్కుతున్న ఉప్మా ప్లేటు... “అయ్యో వద్దు అత్తయ్యా, నేనిప్పుడు ఏమీ తినలేను... బాగా నిద్రవస్తోంది నాకు...” అంది స్పందన. “సరైన తిండి, నిద్రా రెండూ లేవమ్మా నీకు... డాక్టరే కాని పెళ్ళాం ఆరోగ్యం గురించిన స్పృహ మాత్రం లేదు వాడికి... కొంచెం తిని పడుకోమ్మా...” అని బుజ్జగించిన అత్తగారి మాట కాదనలేక, చెంచాతో ఆ ఉప్మా మెలమెల్లగా తినేసింది స్పందన.
“ఊఊ... ఇక పడుకోమ్మా...” అని చెప్పి, లైట్ ఆర్పేసి, ఖ్యాన్ స్పీడు సెంచిి, ఖాళీ పళ్ళెం, మంచినీటి గ్లాసు తీసుకొని వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి.
ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, ఆలోచనలో పడింది స్పందన. ఆమెలో ఏదో కదలిక... తాను పడిపోతే ఆ సౌజన్యగారు ఎందుకలా స్పందించింది? అంత పతతతతతతవావాలాలంలాలా అమూల్యం (కథలు)
కన్సర్న్ ఎందుకు? అసలు ఆవిడకీ తనకూ ఏం సంబంధమని? అసలు ముఖ పరిచయం కూడా లేని తనను తన ఇంట్లోకి తీసుకుపోయి, పడుకోబెట్టి, సేవలు చేసి, ప్రేమతో పళ్ళరసాలు తాగించి... ఎందుకు ఇదంతా? అసలు ఎలా చేయగలరలా? 'మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే...” అన్న తన నమ్మకాన్ని వమ్ము చేసింది ఆ సౌజన్య,
ఇక్కడ ఇంట్లో? అత్తగారు వచ్చి పదిహేను రోజులైనా పని వత్తిడివల్లనో, పెద్దగా చదువుకోని ఆమె అంటే ఉండే ఓ రకమైన నిర్లక్ష్యం వల్లనో ఆమెను అంతగా పట్టించుకోలేదు తాను. ఇంటిపని, వంటపని ఆమే చేస్తున్నా ఏనాడూ సహాయం చేయలేదు. ఆమె లేనప్పుడు తనే వంట చేసుకుంది కదా మరి? “అమ్మయ్య, సుఖపడుతున్నాను అని అనుకుందే కాని కొంచెం కూరలు తరిగి ఇవ్వటం లాంటి పని కూడా చేయటం లేదు తను. పని వత్తిడి ఉన్నమాట నిజమే కాని ఇంటిపనిలో సహాయం చేయటానికి అది ఆటంకం కానే కాదు. ఆ రోజు పెళ్ళిరోజున తనకు కలిగిన ఆశాభంగానికి, సృజన్ చేసే సమాజసేవ వంటి పనులను అత్తగారు (ప్రోత్సహిస్తుందని, పరోక్షంగా అతను అలా తయారవటానికి కారణం ఆమే అని అపోహ తనకు.
అలాంటిది, తాను ఆవిడను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఇలా జరిగిందనగానే ఆవె ముఖంలో తారాడిన కంగారు, గాబరా తనను కలవరపెట్టాయి. ఎంత త్వరగా టిఫిన్ తయారుచేసి పెట్టింది తనకు? ఆవిడకి మాట్లాడే అలవాటు తక్కున. కాని ప్రేమకి ఏం లోటు?
అసలు సృజన్‌ని తాను అపార్థం చేసుకుంది. పనిని ఎంతో ఆనందించే తాను, అతను అతని సేవని దైవసమానంగా భావించి చేస్తుంటే ఎందుకు ఆటంకపరచాలి?
వారం క్రితం పెళ్ళిరోజునాటి సంఘటనలు కనుల ముందు కదలగా... అపరాధ భావనతో స్పందన మనసు కృంగిపోయింది. ఆమె మనసులో జ్ఞానం ఉషస్సులా ఉదయిస్తుండగా, నిద్రాభారంతో ఆమె కనులు మూతబడసాగాయి.
క శ ₹
మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టేసింది స్పందన. అత్తగారిని టీవీ చూడమని కూర్చోబెట్టి, తాను వంట చేయసాగింది.
ఇంతలో తలుపు చప్పుడైంది, సుబ్బలక్ష్మి వాష్ రూమ్‌లో ఉండటంతో నండూరి సుందరీ నొగమణి లాలా
తాను వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ఒక నదడివయస్స్కురాలు. నుదుట కాసంత కుంకుమతో... మనిషి బాగా పేదగా కనిపిస్తున్నా శుభ్రంగా ఉంది. ఆమె పక్కన ఓ కుర్రాడు.
“అమ్మా, డాట్టరుబాబుగారి బారియ గారు తవరేనా? ఉరే బాబుగా, ఈయమ్మ కాళ్ళ మీన పడిపోరా తండిర్... నికు పేణాలు పోసి కాపాడిన దేవుడదాయన...” ఉద్వేగంగా కొడుకును ముందుకు తోసింది ఆమె.
తూలి పదబోయిన ఆ బాబును పట్టుకొని, దగ్గరగా తీసుకుంది. విషయం అర్ధమైన స్పందన. ఆమెను కూర్చోమని సోఫాలో చోటు చూపెట్టింది. కాని ఆమె వినకుండా నేలమీద కూర్చుంది. సుబ్బలక్ష్మి వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. “అమ్మగోరూ, మీరు డాట్టరయ్యగారి అమ్మగోరా... దండాలమ్మా... మీ యబ్బాయి నా కొడుక్కి రత్తమియ్యకపోతే ఈపాటికి ఈడు సచ్చిపోయి పదోరోజై ఉందేది నా తల్లీ... మా ఆయుష్ను కూడా పోసుకుని పదికాలాలు మీరంతా పచ్చగా ఉండాలి అమ్మా...” ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు... సుబ్బలక్ష్మి, స్పందనల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.
“అదేముందమ్మా, వాడు డాక్టరు కాబట్టి వెంటనే సాయం చేశాడు. ఆ భగవంతుని దయ మీ బాబు మీద ఉంది కాబట్టే అంతా మంచే జరిగింది... ఇంతకూ నీ పేరు ఏమిటమ్మా? ఎక్కడుంటారు మీరు?” ఆదరంగా అడిగింది సుబ్బలక్ష్మి.
తన పేరు మల్లమ్మనీ, తన కొడుకు పేరు సూరిగాడనీ చెప్పి, హైదరాబాదు శివార్లలో రాజేంద్రనగర్ వైపున ఉంటామని చెప్పి, తను తెచ్చిన సంచీలోంచి ఒక్కో వస్తువూ బయట పెట్టసాగింది. ఒక లేత ఆనపకాయ, కొన్ని వంకాయలు, బెందకాయలు... ఒక కవరు నిండా అరవిరిసిన బొండుమల్లెపూలు, ఎర్రని గులాబీలు, మరో కవరులో ఒక అరడజను బంగినపల్లి మామిడిపంద్లు. “అమ్మా, మీ బుణం నేను తీర్ప్సుకోలేనిదే,... ఇయన్నీ నా ఇంట్లో పండినయ్యి... తీసుకోండమ్మా...” అంది అభిమానంగా.
స్పందన వైపు తిరిగి, “అమ్మా, నువ్వు శానా అదృష్టవంతురాలివి తల్లే... ఇదిగో ఉప్పుడు నీ పెనిమిటి రత్తం నా కొడుకు ఒంట్లో ఉన్నాది... ఈడు బతికి బట్ట కట్టినాడంటే అంతా ఆ బాబు దయే తప్ప మరోటి కదు. మీరిద్దరూ కలకాలం పిల్లాపాపలతో సల్లగా ఉండాలమ్మా...” అని లేచి సూరిగాడితో స్పందన, పతకాల అమూల్యం (కథలు)
సుబ్బలక్ష్మిల కాళ్ళు మొక్కించి సెలవు తీసుకొంది మల్లమ్మ.
అప్పుడర్ధమైంది స్పందనకు... ఇహానికీ పరానికీ ఉన్న తేడా... సృజన్ యొక్క సేవాభావము, గొప్పతనమూ... కొంతమంది తాము సుఖాలనుభవిస్తూ సంతోషంగా ఉంటారు. మరికొంతమంది ఎదుటివారికి సేవ చేయటంలో అవతలివారిని సంతోషపెడుతూనే తాము సంతోషంగా ఉంటారు. సృజన్ అలాంటివాడు... ఆ గొప్ప వ్యక్తి తన జీవిత భాగస్వామిగా లభించటం తానే జన్మలోనో చేసుకున్న పుణ్యం...
ఆ సాయంత్రం తాను ఇంట్లో అడుగు పెడుతూనే, “సృజీ... అయామ్ సారీ... నన్ను క్షమించవూ...” అంటూ ఎదురేగి వచ్చిన భార్య కళ్ళలోని పశ్చాత్తాపాన్ని గమనిస్తూ... (ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు డాక్టర్ సృజన్.
(స్వప్న మాసపత్రిక, జూలై, 2011) అ ఈఈఈ నండూరి సుందరీ నాగమణి ----ాలాలాలా లా
అమ్మా, నా వేలు పట్టుకో!
“న్స జీవితం... శాపమా, పాపమా... ఆ... మనసా... కవ్వించకే, నన్నిలా...”
రాధమ్మ వాట ముగించగానే 'రవీంద్రభారతి” మెయిన్ ఆడిటోరియమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. సభకు నమస్కరించి, నీళ్ళు నిండిన కనులతో సైడ్ వింగ్ లోనికి నడిచింది రాధమ్మ.
అక్కడ ఉన్న సహ గాయనీగాయకులంతా... “కంగ్రాట్స్ అమ్మా, చాలా బాగా పాదారు...” అని అభినందిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా తల పంకించింది. స్టేజ్ వెనుకభాగం నుంచి సభాప్రాంగణంలో కొలువైన ఎందరో కళాభిమానులను చూస్తూంటే మనసంతా పులకరించిపోయింది రాధమ్మకు. 'తనేనా? తనేనా... ఈ రోజు ఇంతమంది సమక్షంలో పాడగలిగింది? 'రవీంద్ర భారతి!” ప్రతి కళాకారుడూ తన కళను ఒక్కసారైనా అక్కడ ప్రదర్శించాలనుకునే ఒక కమనీయమైన వేదిక... వయస్సు అర్ధశతాబ్ది దాటిపోయాక ఆ వరం ఇప్పటికి దొరికింది తనకు...
ఈమె తరువాతి పాట వేదికమీద ఓ అరవై సంవత్సరాల వయసున్నాయన పాడుతున్నారు... “నా జన్మ భూమి ఎంత అందమైన దేశము....” అంటూ ఎంతో ఉత్సాహంగా...
“అత్తయ్యా, ఇంద... కొంచెం కాఫీ తాగండి... ప్రోగ్రామ్‌లో ఇంకా రెందు పాటలే ఉన్నాయి... అవి కాగానే సభ ప్రారంభమైపోతుంది. మనం వెళ్ళి కింద ఆడియన్స్‌లో కూర్చుందాము...” వ్హాస్క్‌లోని కాఫీని కప్పులోకి వంచి ఇచ్చింది కోడలు మృదుల. “మైక్‌లో మీ గొంతు చాలా బావుంది... ఎంత బాగా పొడారో... అయామ్ వెరీ ప్రాడాఫ్ యు అత్తయ్యా...” మనస్ఫూర్తిగా అభినందించింది మృదుల,
పాం అమూల్యం (కథలు)
“బట్ అయామ్ వెరీ ఫ్రొడాఫ్ మై టీచర్...” గర్వం తొణికిసలాడింది రాధమ్మ గొంతులో.
సభా కార్యక్రమం మొదలైంది. 'స్వరసుధి అనే ఒక సాంస్కృతిక సంస్థ వారు యాఖై సంవత్సరాల వయసు పైబడిన గాయనీ గాయకులకు నిర్వహించిన పాటల పోటీ ఇది. ముఖ్య అతిథి మాట్లాడుతూ, “ఇలాంటి పోటీల వల్ల ఎంతో మంది గాయకుల కళాాభినివేశం పరిపూర్ణమౌతుందనీ, దానికి ఈ సంస్థ నిర్వాహకులు అత్యంత అభినందనీయులనీ' ప్రశంసించారు.
తరువాత విజేతల పేర్లు ప్రకటించారు. “తృతీయ బహుమతి విజేత శ్రీమతి రాధమ్మ...” అని ప్రకటించగానే రాధమ్మ నిశ్చేష్పురాలైంది. “నేనేనా? నాకేనా...?” ఆమె కనుల వెంట నీటి ముత్యాలు జలజలరాలాయి. ఆనందం, ఉద్వేగం ముప్పిరిగొనగా, దాన్ని ఆపుకోలేక మృదుల చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె మనోభావాలు అర్ధమైనట్టుగా, అత్తగారి భుజమ్మీద మృదువుగా తట్టింది మృదుల.
ఒక్కొక్కరికీ బహుమతుల నందజేస్తూ, వారి పాటల గురించి ప్రశంసించ సాగింది న్యాయనిర్దితగా వ్యవహరించిన సంగీత విద్వాంసురాలు. తన పేరు పిలవగానే, తడబడుతున్న అడుగులతో వేదిక మెట్లు ఎక్కింది రాధమ్మ.
“ఆర్తి వేదన కలగలసిన ఈ సాహిత్యాన్ని ఆ రోజుల్లో పి. సుశీలగారు ఎంత కరుణరసంతో ఆలపించారో, ఈనాడు మన రాధమ్మగారు కూడా తన మధురమైన గళంతో అంతే చక్కగా ఆ పాటను పాడారు. ఒకటి, రెండు చోట్ల శృతి దోషాలు ఉండటం వల్ల తప్పితే, ఈనాటి పోటీలో “ప్రథమ బహుమతి” రావలసిన అర్హత ఉన్నది ఈమె పాటకి...” వ్యాఖ్యానం వింటూ, ముఖ్య అతిథి నుండి మెమెంటో అందుకుంది రాధమ్మ. కెమెరా ఫ్లాష్‌లు తళుక్కునున్నాయి ఒక్కసారిగా... అంతులేని సంతోషంతో గాలిలో తేలిపోతున్న భావన కలిగింది రాధమ్మకు. మామిడిపండు రంగుకు రాణీ కలర్ అంచున్న కంచి పట్టుచీరలో, నుదుట మెరిసే కుంకుమతో, ముక్కుకు మెరిసే రవ్వల ముక్కుపుడకతో సమానంగా సంతోష కాంతులతో మెరిసిపోతున్న అత్తగారి ముఖబింబాన్ని చూస్తూంటే సంతృప్తితో కడుపు నిండిపోయినట్లైెంది మృదులకు...
శ + *
రవీంద్రభారతి నుండి వస్తూ, 'తెలుగుతల్లి ప్లై ఓవర్” ఎక్కకుండా, కారును కిందనుంచి పోనిచ్చి, లుంబినీ పార్కురోడ్ లోనికి పోనిచ్చింది మృదుల. చేతిలోని నండూరి సుందరీ నాగమణి లాలా
మెమెంటోను అపురూపంగా పట్టుకున్న రాధమ్మ, “ఇదేమిటి మృదూ, ఇటు తీసుకొచ్చావు?” అనడిగింది.
“మన ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవద్గూ మరి?” అంటూ రోడ్డు ప్రక్కగా కారాపి, రెండు కోన్ ఐస్‌క్రీమ్స్ తీసుకుంది.
“వాడు కూడా ఉండి ఉంటే ఎంత బావుందేదో...” కొడుకును తలచుకుంది రాధమ్మ.
“అవునత్తయ్యా, కాన్ఫరెన్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. నిజానికి ఆయన మనసంతా ఈ రోజు ఇక్కడే ఉంటుంది. రేపు తెల్లారకుండానే వచ్చేస్తారుగా?”
ఐస్‌క్రీమ్ తింటూ, “థాంక్ యూ మృదూ... థాంక్ యూ వెరీ మచ్...” అస్పష్టంగా చెప్పింది రాధమ్మ.
“బావుంది అత్తయ్యా, పాడింది మీరు, ప్రైజ్ గెలుచుకున్నది మీరు... మధ్యలో నాకు థాంక్స్ ఏమిటో?” నవ్వింది మృదుల.
“కాని నా విజయానికి బాట వేసింది మీరే... ఆ బాటలో నా చేత అడుగులు వేయించిందీ మీరే...” మనస్ఫూర్తిగా చెప్పింది రాధమ్మ... నవ్వుకుంటూ కారు నార్ చేసింది మృదుల.
వెనక్కి తలవాల్ళి, తనకు తెలియకుండానే గతంలోనికి జారిపోయింది రాధమ్మ.
శ 1 *
“రాధా, నువ్వు రేడియోతో పాటు పాటలు పాడకు... మా అమ్మ నీకు చెప్పమన్నది...” ముఖం అంతా గంటు పెట్టుకొని అన్నాడు నరసింహం. ఏమనాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ తలూపింది రాధ.
“అసలలా పాటలవీ పాడటం మా ఇంట్లో ఎవరికీ నచ్చదు... ఇంకెప్పుడూ పాడకు...” మళ్ళీ హెచ్చరించాడు నరసింహం.
“సరే అలాగేనండీ...” ఏడుపు వచ్చేసింది రాధ గొంతులోనికి... తనకు అర్జెంటుగా పెళ్ళి చేసి ఈ నరకానికి పంపేసిన అమ్మానాన్నలను తిట్టుకుంది.
రాధ పదవ తరగతి చదువుతూందడగానే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు. పబ్లిక్ పరీక్షలు రాసీ రాయగానే నరసింహం పతలలలలాముంాఆఆజూ అమూల్యం (కథలు)
వాళ్ళ సంబంధం వచ్చింది. వాళ్ళు మంచి ఆస్తిపరులు కావటంతో కట్నం కాస్త ఎక్కువే అయినా పెళ్ళి చేయటానికి సిద్ధపడిపోయారు రాధ తల్లిదండ్రులు. పల్లటూరికి కోడలిగా వెళ్ళటానికి రాధ చాలా భయపడింది. ఉమ్మడి కుటుంబంలో చాకిరీ చేయవలసి వస్తుందని కాదు... తన చదువు అటకెక్కుతుందని...
తన భయాన్ని మెల్లగా తల్లి దగ్గర వెల్లడిస్తే ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూసిందావిడ. ఎన్ని చదువులు చదివినా ఆడది అత్తగారింట మెట్టాల్సిందే కదా... అందుకని భయాలన్నిటినీ కట్టిపెట్టమని గట్టిగా చెప్పింది. చదువు సంగతి మర్చిపోయి, కాపురానికి సిద్ధం కమ్మని చాలా కఠినంగా ఆదేశించింది. పెద్ద చదువులు చదువుకొని, సంగీతం బాగా నేర్చుకొని మంచి గాయని కావాలని అనుకున్న రాధ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.
రాధ భర్తకు అతని ఊరి పోస్టాఫీసులోనే అసిస్టెంట్ ఉద్యోగం... ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కావటం వల్ల అతను తన తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను విడచిపెట్టి వేరే ఊరికి వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే తన ప్రమోషన్లన్నీ వదిలేసుకున్నాడు.
అత్తగారింటికి కాపురమొచ్చిన రాధకు ఆ ఇంటి పరిస్థితి అంతా ఎంతో విచిత్రంగా తోచింది. ఎవ్వరూ ఎవ్వరితోనూ సరదాగా మనను వివ్పి మాట్లాడుకోరు. తన భర్త కూడా రాత్రి పదకింటిలో తప్ప తనతో మాట్లాడడు... అదీ ఆచితూచినట్టు... అసలు తనంటే ఎలాంటి (ప్రమా వ్యక్తపరచకుండా ఏదో యాంత్రికంగా మాత్రం దగ్గరకు తీసుకొనేవాడు. తన మామగారు, పెదమామగారు ఇంకా వేరుపడలేదు.
పెదమామగారి కూతురు తల చెడి, పుట్టింట్లోనే ఉంటోంది... రోజంతా ఇంటిపనితోనే సరిపోయేది రాధకు. ఎప్పుడైనా తీరికగా కూర్చుని ఏదైనా పుస్తకం తిరగెయ్యాలన్నా వీలయ్యేది కాదు. భర్తతో తానింకా చదువుకుంటానని చెబితే కొట్టినంత పని చేశాడు. తన బాధను వివరిస్తూ, తల్లికి ఉత్తరం వ్రాసింది రాధ. జవాబుకు బదులుగా తల్లే వచ్చేసింది కూతురికి బుద్ధులు నేర్చటానికి. ఇక పైచదువుల సంగతి పూర్తిగా మరచిపొమ్మని హితబోధ చేసింది. చేసేది లేక కన్నీళ్ళతో తలూపింది రాధ. అత్తగారి పోరు కన్నా, పెద్దత్తగారి పోరు, ఆవిడ కూతురి సాధింపులు ఎక్కువయ్యాయి రాధకు. కాస్త మంచి బట్టలు కట్టుకొని, తల్లో పూలు పెట్టుకుంటే చాలు, “ఏవిటీ సాని వేషాలూ?” అంటూ ప్రాణం పోయే మాటలనేది పెద్దత్తగారు. ఇక అత్తగార్హూ మామగారూ ఆమె మాటలకి వంత నండూరి సుందరీ నాగమణి -౪ పిరమలే 6 జరం
న ౧4.3
పాడేవారు. అందులోని ఓ భాగమే ఇలా పాటలు పాడవద్దని ఆంక్షలు విధించటం. ఈలోగానే రాధకు నెల తప్పింది. పుట్టింటికి పురుటికని వచ్చిన రాధ దగ్గరకు ఆమె స్నేహితురాళ్ళు వస్తూ ఉండేవారు. తమ కాలేజీ కబుర్లు, విశేషాలు చెప్పి నవ్విస్తూ ఉండేవారు. వారున్నంత సేపూ సరదా కబుర్లతోను, పాటలతోను గడిచిపోయేది. తండ్రి కొత్తగా కొన్న టేప్ రికార్టరులో పాత పాటల కేసెట్లు వేసుకొని విని ఆనందించేది రాధ. శావ్యమైన గొంతుగల రాధ ఆ పాటలు వింటూ తాను కూడా పాడాలని ప్రయత్నించేది... కాని ఎప్పుడు పాడబోయినా, 'మీ అత్తారికి ఇష్టముండదు కదే... పాడకు” అంటూ తల్లి వారించటం వలన వలన గొంతు నులిమేసిన కోయిలే అయిపోయింది రాధ. స్వాతి పుట్టిన ఏదాదికే సాత్విక్ పుట్టాడు. ఇంటిపనితో పాటు, పిల్లల పెంపకంలో బాగా బిజీ అయిపోయింది రాధ. ఈలోగా నరసింహానికి విశాఖపట్నం బదిలీ అయింది. బదిలీని తప్పించుకోవటం కుదరక, గవర్నమెంటు ఉద్యోగాన్ని వదులుకోవటం ఇష్టం లేక, భార్యాపిల్లలతో విశాఖలో కాపురం పెట్టాడు. ఉమ్మడి కుటుంబంలోనే ఉండిపోతే తన పిల్లలకు విద్యాబుద్ధులు రావటం కష్టమని గ్రహించటంవల్ల కూడా ఆ నిర్ణయానికి కట్టుబడ్దాడు. అది నిజంగా రాధ అదృష్టమే... ఇప్పుడు తనదంటూ ఓ ఇల్లు ఏర్పడ్డట్టెంది రాధకు. ఉదయమే పిల్లలను లేపి బడికి తయారుచేయటం, టిఫిన్లు, వంటా చేసి బాక్సులు సర్ది పిల్లల్ని భర్తను పంపించటం... తర్వాత ఇంటి పని, బట్టలు ఉతికే కార్యక్రమం తర్వాత కాస్త ఖాళీ సమయం దొరికేది రాధకు. రేడియో కార్యక్రమాల ద్వారా, వాటలు వినటం ద్వారా ఆమెకు ఎంతో కాలక్షేపమయ్యేది. ఇంటింటికీ పుస్తకాలు తెచ్చిచ్చే మొబైల్ లెండింగ్ పుణ్యమాని మంచి. పత్రికలు, పుస్తకాలు చదివే అదృష్టం కలిగిందామెకు. భర్తకు ఇవన్నీ అయిష్టాలే కనుక అతను వచ్చేలోగానే పుస్తక పఠనాలు, సంగీత శ్రవణాలు పూర్తిచేసుకొనేది. పిల్లలిద్దరినీ ఆడిస్తూ, పాడిస్తూ చదువు చెప్పేది. తల్లికున్న అపారజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు పిల్లలిద్దరూ... భర్త మాత్రం ఒక్కసారి కూడా ఒక్క మంచి మాట మాట్లాడేవాడు కాదు. అతని దృష్టిలో ఇల్లాలంటే భర్తకు, పిల్లలకూ అన్నీ అమర్చి పెట్ట ఓ దాసీలాంటిది... అంతే... లజ అమూల్యం (కథలు)
నరసింహానికి సహోద్యోగులలో కొంతమంది స్నేహతులు ఏర్పడ్డారు. పిల్లల పుట్టినరోజులకి పిలుచుకోవటాలు, ఒకరి ఇళ్ళకు మరొకరు వెళ్ళటాలు, ఆఫీసు వనభోజనాల సందళ్ళు... అలా ఎన్నోసార్లు కుటుంబంతో పాటుగా బయటికి వెళ్ళటం, అతని కొలీగ్స్ తమ ఇంటికి రావటం కూడా జరిగేది. అసలు అలాంటి అపురూపమైన సందర్భాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసేది రాధ. ఎంతో శ్రద్ధగా వంట చేసి, వచ్చిన అతిథులకు కొసరి కొసరి వడ్డించేది రాధ. ఆమె ఇంటిని అలంకరించిన తీరు, ఆమె వండి, వడ్డించిన రీతి అందరి ప్రశంసలకు నోచుకునేవి, నరసింహం మామూలే, నోరెత్తేవాడే కాదు. భర్తంటే ఓ రకమైన ఉదాసీనతకు అలవాటు పడిపోయిన రాధ ప్రపంచమంతా ఆమె పిల్లలే...
స్వాతి ఆరో తరగతి, సాత్విక్ ఐదో తరగతీ చదువుతూ ఉండగా ఇద్దరికీ స్కూలు వార్షికోత్సవంలో బహుమతులు వచ్చాయి. స్వాతికి క్విజ్ పోటీల్లోనూ, సాత్విక్‌కి పాటల పోటీల్లోనూ బహుమతి వచ్చింది. రాధ ఆనందానికి అవధులు లేవు. పిల్లలిద్దరూ తన కలలకు ప్రతిరూపాల్లా కనిపించారు.
సాయంత్రం తండ్రి ఆఫీసు నుండి రాగానే పోటీలు పడి మరీ తమ బహుమతులను అతనికి చూపించారు పిల్లలిద్దరూ. న్వాతిని మెచ్చుకున్నాడు కాని, సాత్విక్‌ని మాత్రం “ఈ పాటలేంట్రా, చదువుకోకుండా? అక్కను చూసి నేర్చుకో, ఏం నీ పిచ్చి వాడికి కూడా అంటించావా రాధా?” అంటూ తిట్టి బయటకు వెళ్ళివోయాడు పనుందంటూ...
ముఖం చిన్నబుచ్చుకొని కూర్చున్న సాత్విక్‌ని (ప్రేమగా దగ్గరకు తీసుకుంది రాధ. “అమ్మా, పాటలు పాడటం తవ్వా?” దీనంగా అడిగాడు సాత్విక్. “ఛ... లేదు నాన్నా పాటలు పాడటం అనేది ఒక వరం. అది అందరికీ రాదు.మంచి గొంతు ఉండటంతో పటు, పాటలు పాడాలన్న ఆసక్తి, అభినివేశం ఉండటం కూడా ఒక అదృష్టమేరా...”
“అవునా? మా టీచరుగారు నా గొంతు చాలా బావుందనీ, నేను బాగా పాడుతున్నాననీ చెప్పి, నన్ను శాస్ర్తీయ సంగీతం నేర్చుకొమ్మని చెప్పారమ్మా...” ఉత్సాహం ఉరకలు వేసింది సాత్విక్ గొంతులో.
“నిజమా? నీకు నిజంగా నేర్చుకోవాలని ఉంటే తప్పక నేర్పిస్తాను నాన్నా...” మురిసవోతూ చెప్పింది రాధ.
“మా అమ్మ ఎంత మంచిదో...” ఆమెను హత్తుకుపోయాడు సాత్విక్. నండూరి సుందరీ నాగమణి లా
“చిన్నీ నువ్వూ నేర్చుకుంటావా?” అడిగింది కూతుర్ని.
“నాకస్సలు ఇంట్రెస్ట్ లేదమ్మా... తమ్ముడికి నేర్చిద్దాంలే...” చెప్పేసింది
ఆ మర్నాడే సాత్విక్‌ని సంగీతం క్లాసులో చేర్పించింది రాధ. స్కూలునుంచి డైరెక్ట్‌గా వెళ్ళి వచ్చేలా ఏర్పాటు జరిగిపోయింది. పేకాట క్లబ్‌లో జాయిన్ అయిన నరసింహం ప్రతి రోజూ రాత్రి ఎనిమిది దాటాక కాని ఇంటికి రాకపోవటం వారికి బాగా లాభించింది. అతను వచ్చేలోగా సాత్విక్ మ్యూజిక్ క్లాసు నుంచి
. రావటం, ఇంటి దగ్గర సాధన చేసుకోవటం కూడా జరిగిపోయేది. సరళీస్వరాలు, జంటస్వరాలూ అలవోకగా మూడు కాలాల్లో పాడుతున్న కొడుకును చూసి మురిసిపోయేది రాధ. స్వాతి మాత్రం తమ్ముడు సాధన చేసుకుంటున్నంత సేపూ అది వింటూనే పుస్తకాలు చదువుకొనేది. శ శ ఈ
స్వాతి యంబీవీయస్ పూర్తి అయ్యేసరికి సాత్విక్ ఇంజనీరింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఈలోగానే స్వాతికి మంచి ఫారిన్ సంబంధం రావటం, వరుడు కూడా దాక్టరే కావటంతో ఆ సంబంధం ఖాయం చేసేశాడు నరసింహం. చదువులో ఎంతో శ్రద్ధ చూపించే స్వాతి తానింకా పెద్ద చదువులూ, స్పెషలైజేషన్ చేయటానికి అమెరికా వెళ్ళటం ఓ సువర్జావకాశంగా భావించి, పెళ్ళికొడుకుతో ముందే అన్నీ ఫోన్‌లో మాట్లాడేసుకొని మరీ పెళ్ళికి అంగీకరించింది. ఈలోగా నరసింహానికి హైదరాబాద్‌కి బదిలి అయింది.
న్వాతికి పెళ్ళా వెళ్ళాక, సాత్విక్‌కి మంచి ఉద్యోగం వచ్చింది హైదరాబాద్‌లోనే... జాబ్ చేస్తూనే సంగీత కళాశాలలో చేరి, గాత్ర సంగీతంలో డిప్లామా పూర్తిచేశాడు సాత్విక్. అప్పటికి తండ్రికి తెలిసిపోయినా, ఏమీ అనలేకపోయాడాయన. అతను ప్రాక్టీసు చేసుకుంటున్నప్పుడు 'ఏమిటో, ఈ పిచ్చిరాగాలు? అని సణిగినా, తల్లీకొడుకులు పట్టించుకొనేవారు కాదు. రేడియో 'యువవాణిలో అతని కీర్తనలు మొదటిసారి ప్రసారమైనప్పుడు ప్రపంచాన్ని జయించినంత సంబరపడింది రాధ. అడపా దడపా రేడియోలోను, టీవీ ఛానెల్స్‌లోనూ పాడుతూ, స్టేజీ ప్రోగ్రాములూ చేస్తూ, ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న సాత్విక్ జీవితంలోనికి వసంతకోకిలల్లే అడుగు పెట్టింది మృదుల. ఇద్దరూ మ్యూజిక్ కాలేజీలో సహాధ్యాయులు. వారిరువురి పెళ్ళికీ మొదట పతా అమూల్యం (కథలు,
“ససేమిరా” అన్న నరసింహానికి అమ్మాయి తండ్రికి ఉన్న పలుకుబడి, సిరిసంపదలూ చూసి వెనక్కి తగ్గక తప్పలేదు.
మృదుల మహాలక్ష్మిలా ఇంట్లో అడుగుపెట్టింది. ఆమెను ఎంతో సాదరంగా తమ కుటుంబంలోనికే కాదు, తన జీవితంలోకి మరో కూతురిగా ఆహ్వానించింది రాధమ్మ. కోడలిగా తన అత్తగారింటి అనుభవాలు మరచిపోలేదు ఆమె. పరాయి ఇంటినుంచి వచ్చి, మన కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిన కోడలితో స్నేహంగా, సామరస్యంగా, (పమగా ఉంటే రాబోయే వార్ధక్యంలో తమకు ఆమెనుంచి రెట్టింపు ప్రేమ దొరుకుతుందని ఆమె ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమెను ఒక్కపని కూడా చేయనీకుండా, చాలా గారాబంగా చూసుకొనేది రాధమ్మ. మృదుల కూడా ఆ (ప్రేమను ఎక్స్‌ష్లాయిట్ చేయకుండా రాధమ్మను తన స్వంత తల్లిలా ఢేమించసాగింది.
“మీరిద్దరూ ఒక్కసారి కూడా మాటా మాటా అనుకోరా? అత్తాకోడళ్ళు అంతా ఇలాగే ఉంటే ఎంత బావుంటుందమ్మా?” అనేవాడు నవ్వుతూ సాత్విక్.
ఓనాడు ఐపాడ్ తీసుకొచ్చి తల్లికిచ్చాడు సాత్విక్. “అమ్మా, దీన్ని ఇలా పెట్టుకొని ఈ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకో... ఈ రోజునుంచీ చక్కగా సంగీతం నేర్చుకుంటున్నావు నువ్వు...” అన్నాడు.
రాధమ్మ సిగ్గుపడివోయి, “ధృ సంగీతం... ఈ వయస్సులో ఏమిట్రా?” అంది మొహమాటంగా...
“లేదమ్మా, నిజం... రేపట్నుంచీ మృదుల నీకు సంగీతం పాఠాలు చెబుతుంది. ఇన్నాళ్ళూ నేర్చుకోలేకపోయావు కదా, ఇప్పుడు నేర్చుకోమ్మా..”
“వద్దురా, ఈ వయసులో నేర్చుకుంటే అందరూ నవ్వుతారు...”
“అత్తయ్యా, నేర్చుకోవటానికి వయసేమిటీ చెప్పండి! మీరు రేపుదయం పదకొండు కల్లా ప్రీ అయిపోవాలి... నేను మీ టీచర్ని మరి...” నవ్వుతూ చెప్పింది మృదుల. ఆ మరునాటి నుండే మృదులకు సిన్సియర్ విద్యార్థిని అయిపోయింది రాధమ్మ.
సి శ శ
“రవీంద్ర భారతిలో వచ్చేవారం వెటరన్స్‌కి పాటల పోటీలున్నాయిట...”
ఆఫీసునుంచి వస్తూనే మోసుకొచ్చాడు వార్తను సాత్విక్. నండూరి సుందరీ నాగమణి తా
“అయితే ఇంకేం, అత్తయ్యగారి పేరు ఇచ్చేద్దాం...” వెంటనే చెప్పింది మృదుల. “చాల్లెండ్రా, మీరూ... మీ జోకులూ...” కొడుక్కీ కోడలికీ టీ అందిస్తూ అన్నది రాధమ్మ. “అమ్మా, జోక్ కాదు, నిజం... నువ్వు అందులో పాల్గొంటున్నావు...” గట్టిగా చెప్పాడు సాత్విక్. “అబ్బి, అదికాదురా... నాకేం వచ్చు? అసలంత మంది ముందు ఎలా _ వాడగలను?” బెరుగ్గా అంది రాధమ్మ. “ఎందుకు పాడలేవమ్మా? చిన్నప్పుడు... నాకు వర్ణం పాడటం రాక ఏడుస్తూంటే వమని చెప్పావు? “అనగననగ రాగ మతిశయిల్లుచునుండు... తినగతినగ వేము తీయనుండు.... సాధనమున పనులు సమకూరు ధరలోన... విశ్వదాభిరామ వినురవేమ...” అని చెప్పావా, లేదా? నీకిష్టమైన మంచి పాటను సెలెక్ట్ చేసుకో... మృదుల బాగా ప్రాక్టీస్ చేయిస్తుంది. రవీంద్రభారతిలో పాడుతూ ఉంటే ఎంత బావుంటుందో తెలుసామ్మా? నా మొట్టమొదటి కచేరీ అక్కడే కదా అయింది! ఆ రోజున నువ్వెంత సంబరపడిపోయావో... మరి నాకూ ఆ ఆనందాన్ని ఇవ్వవూ?” అంటూ తల్లిని కన్విన్స్ చేసేశాడు సాత్విక్. తీరా పోటీ రోజుకి ఆఫీసు పనిమీద ముంబయి వెళ్ళాల్సి వచ్చింది సాత్విక్‌కి. “అత్తయ్యా, దిగండి... మనింటికి వచ్చేశాం...” అన్న మృదుల మాటలకు ఈ లోకంలోనికివచ్చింది రాధమ్మ. శ శ ఈ ఉదయమే ప్లయిట్‌లో వచ్చేశాడు సాత్విక్. ఇంటికి రాగానే అతనుచేసిన మొట్టమొదటి పని 'కంగ్రాట్స్ అమ్మా... అంటూ తల్లిని రెండు చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పటం. “అబ్బా దింపరా కన్నా కళ్ళు తిరుగుతున్నాయి...” గాబరాగా అంది రాధమ్మ... మెల్లగా కిందికి దించాడు సాత్విక్. అతని పెదవులపైన, మృదుల పెదవుల లలా అమూల్యం (కథలు)
“అయితే ఇంకేం, అత్తయ్యగారి పేరు ఇచ్చేద్దాం...” వెంటనే చెప్పింది మృదుల. “చాల్లెండ్రా, మీరూ... మీ జోకులూ...” కొడుక్కీ కోడలికీ టీ అందిస్తూ అన్నది రాధమ్మ. “అమ్మా, జోక్ కాదు, నిజం... నువ్వు అందులో పాల్గొంటున్నావు...” గట్టిగా చెప్పాడు సాత్విక్. “అబ్బి, అదికాదురా... నాకేం వచ్చు? అసలంత మంది ముందు ఎలా వొాడగలను?” బెరుగ్గా అంది రాధమ్మ. “ఎందుకు పాడలేవమ్మా? చిన్నప్పుడు... నాకు వర్ణం పాడటం రాక ఏడుస్తూంటే వమని చెప్పావు? “అనగననగ రాగ మతిశయిల్లుచునుండు... తినగతినగ వేము తీయనుండు.... సాధనమున పనులు సమకూరు ధరలోన... విశ్వదాభిరామ వినురవేమ...” అని చెప్పావా, లేదా? నీకిష్టమైన మంచి పాటను సెలెక్ట్ చేసుకో... మృదుల బాగా ప్రాక్టీస్ చేయిస్తుంది. రవీంద్రభారతిలో పాడుతూ ఉంటే ఎంత బావుంటుందో తెలుసామ్మా? నా మొట్టమొదటి కచేరీ అక్కడే కదా అయింది! ఆ రోజున నువ్వెంత సంబరపడిపోయావో... మరి నాకూ ఆ ఆనందాన్ని ఇవ్వవూ?” అంటూ తల్లిని కన్విన్స్ చేసేశాడు సాత్విక్. తీరా పోటీ రోజుకి ఆఫీసు పనిమీద ముంబయి వెళ్ళాల్సి వచ్చింది సాత్విక్‌కి. “అత్తయ్యా, దిగండి... మనింటికి వచ్చేశాం...” అన్న మృదుల మాటలకు ఈ లోకంలోనికివచ్చింది రాధమ్మ. శ శ ఈ ఉదయమే ప్లయిట్‌లో వచ్చేశాడు సాత్విక్. ఇంటికి రాగానే అతనుచేసిన మొట్టమొదటి పని 'కంగ్రాట్స్ అమ్మా... అంటూ తల్లిని రెండు చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పటం. “అబ్బా దింపరా కన్నా కళ్ళు తిరుగుతున్నాయి...” గాబరాగా అంది రాధమ్మ... మెల్లగా కిందికి దించాడు సాత్విక్. అతని పెదవులపైన, మృదుల పెదవుల లలా అమూల్యం (కథలు)
పైనా నవ్వుల పువ్వులు పూస్తూనే ఉన్నాయి.
“ఏంట్రా ఇది? చిన్నపిల్లల్లా?” హేళనగా అన్నాడు నరసింహం.
ఆయన ముఖంలోకి నిశితంగా చూశాడు సాత్విక్. అక్కడే బల్లమీదున్న మెమెంటోని చూపిస్తూ, “నిన్న అమ్మకి ఈ బహుమతి వచ్చింది వాట పాడినందుకు... తనను నువ్వు అభినందించావా నాన్నా?” అని అడిగాడు సాత్విక్,
“ఎందుకూ, అదో ఘనకార్యమేమిటీ?” నరసింహం గొంతులో వెక్కిరింత...
“అవును నాన్నా ఘనకార్యమే.. ఎంతో శ్రద్ధతో పాట నేర్చుకొని, వెయ్యిమంది ముందు పాడి, బహుమతిని గెల్బుకు రావటం ఘనకార్యమె... ఏం మీరు చేయగలరా ఆ పని? అసలు ఏనాడైనా అమ్మను మెచ్చుకున్నారా నాన్నా? ఆమె సేవలను పొందుతున్నారే కానీ, ఒక్కసారైనా ఆమె ప్రతిభను గుర్తించారా మీరు?”
“అందరు ఆడవాళ్ళూ చేసేదే తనూ చేసోంది కాని ప్రత్యేకంగా ఏం కాదు కదా?” తేల్చేశాడు నరసింహం.
“ఈ ప్రపంచం నిండా నీలాంటి నాన్నలే నాన్నా... అమ్మలాంటి అమ్మలు మాత్రం చాలా చాలా అరుదు నాన్నా... ఆమె మన కోసం తన జీవితాన్ని ధారపోసింది. బాగా చదువుకోవాలన్న తన కోరికను చంపేసుకొని, నీకు ఇల్లాలై, " మనందరికీ సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడిపేసింది. తన అభిరుచులనీ నీ కోసం చంపేసుకుంది. నా అభిరుచి దీపాన్ని వెలిగించి, దానికి ప్రోత్సాహమనే చమురును పోస్తూ, అది ఆరిపోకుండా దేదీష్యమైన కాంతులు వెదజల్లేలా చేసింది. అసలు తన పిల్లలతో పాటుగా నిన్నూ ఓ పిల్లవాడిలా సాకే అమ్మ దొరకటం నిజంగా నీ అదృష్టమే నాన్నా... దయచేసి ఇప్పుడైనా గ్రహించు!” తేల్చి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు సాత్విక్.
ఐదునిమిషాల తర్వాత తలవంచుకు కూర్చున్న భార్య దగ్గరకు వచ్చి, ఆమె చేతికి తన చేయిని కలుపుతూ, “కంగ్రాట్స్ రాధా...” అన్నాడు నరసింహం
(జాగృతి వారపత్రిక, 24 ఫిబ్రవరి, 2014) ౨౦4 ఈ నండూరి సుందరీ నాగమణి ఎలా
అపరాజుత
అప్పటికి అరగంటనుంచి దిండులో తల దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది విరజ. అనుకోకుండా తెలిసిన చేదైన కార్చిచ్చులాంటి నిజం ఆమెను అతలాకుతలం చేసేస్తోంది. అకస్మాత్తుగా తెలిసిన ఆ నిజం విద్యుదాఘాతమై పక్షికూనలాంటి ఆమె హృదయాన్ని దహించివేస్తోంది.
అసలేం జరిగిందంటే...
నాలుగు రోజుల క్రితం అనుకోకుండా అమీర్‌పేటలో షాపింగ్ చేస్తూంటే కలిసింది కౌసల్య... తన మేనత్తకూతురు. శ్రావణ శుక్రవారం రోజున తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం ఉందనీ సాయంత్రం పేరంటానికొచ్చి ప్రసాదం, వాయినం తీసుకు వెళ్ళమనీ ఆప్వాయంగా ఆమె ఆహ్వానించటంతో ఈ సాయంత్రం మారేడ్‌పల్లి వెళ్ళింది తను. పేరంటానికి చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. ఇంచుమించుగా హాలంతా నిండిపోయారు. వారిలో 'రజని' అనే అమ్మాయి విరజను ఎంతో ఆకట్టుకుంది. చక్కని శ్రావ్యమైన కంఠస్వరంతో అమ్మవారి పాటలు పాడి ఆహూతులందరినీ ఎంతగానో అలరించిన రజనితో, తానుకూడా సంగీత ప్రియురాలు కావటం వలన స్నేహంగా మాట్లాడుతూ కూర్చుండిపోయింది విరజ.
కౌసల్య ఇచ్చిన ప్రసాదం తిని, కాఫీ తాగి పసుపు, కుంకుమ, తాంబూలం తీసుకొని, బయలుదేరతానని లేచింది విరజ. “కొంచెం ఆగవే విరజా, భోజనం చేసి వెళ్ళు...” అని కౌసల్య చెబుతున్నా “మళ్ళీ వస్తాలే వదినా, చాలా ఆలస్యం అయిపోయింది...” అంటూ బయటపడింది. ఆమె వెనకాలే వచ్చిన రజని, “విరజగారూ! ఈ పక్కనే మా ఇల్లు... మా ఇంటికి కూడా వచ్చి, ఓ నిమిషం కూర్చుని తాంబూలం తీసుకువెళ్ళండి...” అని కోరింది. శుక్రవారం పూట ముత్తెదువు కోరికను కాదనలేక ఆమె వెనుకే నడిచింది విరజ.
“రండి... రండి! ఇదే మా ఇల్లు... స్వాగతం మీకు...” ఫ్లాట్ తలుపు పతతతతతతతవాడావాలాలాలాలాా అమూల్యం (కథలు,
తాళం తెరుస్తూ చిరునవ్వుతో ఆహ్వానించింది రజని. విరజను సోఫాలో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది.
ఇల్లంతా చక్కగా సర్దుకుంది రజని. అల్మారాలో పుస్తకాలు, సీడీలు ఎంతో పొందికగా సర్దబడి ఉన్నాయి. షోకేస్ పక్షనే బల్లమీద వాజ్‌లో అరవిరిసిన తాజా పూలు. హాలంతా చక్కని అగరువత్తుల పరిమళం... వీధి గుమ్మానికి అందంగా అలంకరించిన వపూలతోరణాలు, మామిడాకుల తోరణాలు. ఇంటిముందు పెయింట్ చేసిన రంగుల ముగ్గు... ముగ్దురాలైన విరజ హాలంతా కలయజూస్తూ... షోకేస్‌లోంచి కనబడుతున్న ఆ ఫోటో (క్రేమ్‌ను చూస్తూనే సర్పద్రష్టలా ఆగిపోయింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. గుండె ఓ క్షణం ఆగిపోయి మళ్ళీ కొట్టుకోసాగింది. పైన ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరుగుతున్నా వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ ఫోటోలో... రజని ప్రక్కనే చిరునవ్వులు చిందిస్తూ... రాకేష్.
“మంచినీళ్ళు తీసుకోండి విరజా...” రజని అందించిన నీళ్ళ గ్లాసెత్తి గటగటా తాగేసింది. ఎంతో నిస్తాణగా అనిపిస్తున్నా, గొంతును పెగుల్చుకుంటూ, “మీవారా?” అంది ఫోటోను చూపిసూ,
“జెనండీ... పేరు రాకేష్... మా పెళ్ళి రెండేళ్ళయింది. ఒక బాబు మాకు. మొన్ననే ఏడాది నిండింది. అమ్మానాన్నలకి నేను ఒక్కదాన్నే సంతానాన్ని కావటంతో ఎంతో గారాబం. బాబును సరిగ్గా పెంచలేనేమో అని మా అమ్మ వాణ్ణి తనతో తీసుకుపోయింది. ఊరిలో ఉంటారు. ఇక్కడ మేమిద్దరమే...”
“అవునా, మీవారు ఏం చేసారు?”
“ఏదో టూర్ల ఉద్యోగం అండీ... వారానికి మూడురోజులు టూర్లే ఉంటాయి ఆయనకి. అది ఒక్కటే సమస్య... కాని చాలా మంచివారు. నేనంటే ప్రాణం ఆయనకి. ఇంట్లో ఉన్నంతసేపూ నన్నసలు వదలరు సుమండీ... “రజీ... రజీ...” అంటూ నా కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఈ అపార్ట్‌మెంట్ ఈ మధ్యనే తీసుకున్నాము. మా అమ్మావాళ్ళు ఇచ్చిన డబ్బుకి రెండు లక్షలు తక్కువ పడితే ఎవరో స్నేహితుడి దగ్గర డబ్బు తెచ్చి కట్టేసి, నా పేరునే రిజిష్టర్ చేయించారు...” మురిపెంగా రజని చెబుతూంటే విరజ మనసు అవమాన భారంతో, ఉక్రోషంతో కుంగిపోయింది. 'రజీ... రజీ...” రాకేష్ స్వరం తన చెవులలో గుసగుసలాడినట్లెంది విరజకు... మానసికంగా ఎంతో బలహీనంగా అనిపించ సాగింది. క్ నండూరి సుందరీ నాగమణి తతత
ఎలాగో శక్తిని కూడదీసుకుంటూ, “సరే చాలా సమయం అయింది, మరిక నేను బయలుదేరుతానిక...” అంటూ లేచింది విరజ. బొట్టుపెట్టి, వాయనమిచ్చి, “ఎప్పుడైనా తీరికగా మళ్ళీ రావాలి...” అని గుమ్మం వరకూవచ్చి సాగనంపింది రజని.
ఆటోలో ఎలా ఎక్కి కూర్చుందో, ఎలా ఇంటికి వచ్చిపడిందో విరజకు తెలియనే లేదు. ఇంటికి రాగానే చీరైనా మార్చుకోకుండా, మంచం మీద పడి గుండెలవిసేలా ఏడవసాగింది విరజ.
శ శస శ
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నీరజను, విరజను వారి బాబాయి గోపాలరావుగారు, ఆయన భార్య రాధమ్మగారు తమ పిల్లలతో సమంగా పెంచి పెద్ద చేశారు. డిగ్రీ వరకూ చదివించటమే కాకుండా, పెద్దమ్మాయి నీరజకు మంచి డాక్టరు సంబంధం రావటంతో పెళ్ళి కూడా చేసేశారు. అప్పటికి విరజకు చదువింకా పూర్తికాలేదు. ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోకుండా అక్కయ్యను పెళ్ళి చేసుకున్న బావ మాధవ్, బాబాయి భారాన్ని తగ్గించినందుకు దేవుడిలా కనిపించాడు విరజకు. తాను కూడ కట్నం తీసుకోనివాడినే పెళ్ళి చేసుకోవాలని అప్పుడే గట్టి నిర్ణయం తీసుకుంది. విరజ చదువు పూర్తి అయేసరికి మాధవ్‌కి అమెరికాలో మంచి ఉద్యోగావకాశం రావటంతో నీరజను తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు.
విరజ చదువయేసరికి తమ్ముళ్ళిద్దరూ కాలేజీ చదువులకొచ్చారు. మంచి ఉద్యోగం సంపాదించి, ఎలా అయినా వాళ్ళను పెద్ద చదువులు చదివించాలని నిర్ణయించుకొన్న విరజ ఉద్యోగాన్వేషణలో పడింది. పినతండ్రి భారాన్ని బాధ్యతలను పంచుకోవాలన్న ఆమె తపనను అర్ధం చేసుకున్నట్టుగానే ఆ భగవంతుడు కూడా సిటీలో ఆమెకు మంచి జాబ్ వచ్చేలాగా అనుగ్రహించాడు. పెరిగిన ఊరిని, తల్లిదండ్రులవంటి పిన్నీ బాబాయిలని వదిలి వెళ్ళటానికి బాధగానే ఉన్నా తప్పనిసరిగా నగరానికి ప్రయణమై వచ్చి, ఉద్యోగంలో చేరిపోయింది విరజ. ఆమె జీవితం అక్కడే హఠాత్తుగా ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది.
రాకేష్ దగ్గర అసిస్టెంట్‌గా వేశారు విరజను. ఎప్పుడూ ఎంతో సీరియస్‌గా ఉండే రాకేష్ అంటే భయంగా, బెరుకుగా ఉండేది విరజకు. స్వతహాగా సౌమ్యురాలు, తెలివిగల పిల్ల కావటంతో పనిభారం ఎక్కువగానే ఉన్నా, ప్రతి పనీ (శ్రద్ధగా నేర్చుకొని చక్కగా చేసేది. చాలా అమూల్యం (కథలు,
విరజది చూపు తిప్పుకోలేనంత అసామాన్యమైన సౌందర్యం. అందమైన అవయవ సౌష్టవంతో పాటు, పాలమీగడలో గులాబీ రేకులను కలిపి నూరినట్లుందే మేని ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, వత్తెన తలకట్టు, అందరినీ ఆకట్టుకొనే చిరునవ్వు ముఖం అమె యొక్క అదనపు ఆకర్షణలు.
కొన్ని రోజులు గడిచాక, సిస్టమ్ మీద పనిచేసుకుంటున్న విరజకు అప్పుడప్పుడూ తననెవరో గమనిస్తున్నారన్న భావన కలిగి తల తిప్పి చూస్తే... అప్పటివరకూ ఆమెనే కన్నార్పకుండా చూస్తున్న రాకేష్ గబుక్కున తల తిప్పుకునేవాదు. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినా, తర్వాత తర్వాత విరజకు ఆ చూపులు మెత్తగా గిలిగింతలు పెడుతున్నట్టు తోచి, మదిలో చిత్రమైన పులకింతలు రేగసాగాయి.
ఒకరోజు ఆమె మొబైల్‌కి ఒక మెసేజ్ వచ్చింది.
గ క్ర శ్వేతవర్దపు వస్త్రాల్లో మల్లెపూవులా ఎంత బావున్నావ్? అచ్చు వెన్నెల తునక భువిపైన జారిపడినట్టుగా... రాకేష్” చురుగ్గా రాకేష్‌వైపు చూస్తే అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్టు తోచి, సిగ్గుతో చూపులు మరల్చేసుకుంది విరజ,
అది మొదలు ఆమె ఫోనుకు ప్రతిరోజూ సందేశాల వర్షమే...
“ఆరె నీ జడలో ఎజ్జగులాబీ... నువ్వే ఓ పూరాణివి, నీకెందుకమ్మా గులాబీలు... ?”
“మంచిగంధం సిగ్గుపడుతోంది తెలుసా? నీ దేహచ్చాయ ముందు తాను వెలవెలబోతున్నందుకు...”
“నిన్ను పూలవనమని పిలువనా? నీ మని పరిమళం అలాంటిది మరి!”
“సృష్టిలోని సౌందర్యమంతా ఒక్కచోటే రాశి పోశాడా ఆ దేవుడు? ఆహా, ఏమి అందం నీది, మాటలకందనిది!”
“సీలో ఎన్ని హరివిల్లులు? నీ కంటి మెరుపుల్లో, నీ చెంప ఎరుపుల్లో, నీ పలువరుస తెలుపుల్లో, నీ మెడ నునుపుల్లో, నీ మేని వంపుల్లో, నీ హస్త కమలాల్తో, నీ పాదపద్మాల్లో... ఓహ్! జలపాతమైన నీ సౌందర్యం అలా అలా జాలు వారుతూంటే, మతిభ్రమించి నిలుచున్నా వెళ్టివాడనై నీ ముందు నేనిలా...”
రాకేష్ తనను (ప్రేమిస్తున్న విషయం అర్ధమైన విరజ మనస్సు సంతోషంతో పరవళ్ళు త్రొక్కింది. అంతరాంతరాలలో తనకూ అలాంటి భావమే కలగటం వల్ల త్వరలోనే తనతో పెళ్ళి ప్రస్తావన తేవటంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి నండూరి సుందరీ నాగమణి లాలా లూ
అయిపోయింది విరజ. తన ఆర్థిక పరిస్థితులతో పాటు, బాబాయ్ స్థితిగతులు, తన ఆదర్శం విషయం కూడా చెప్పి, వరకట్నం ఆశించవద్దని రాకేష్‌ను కోరింది. తనకూ “కట్నం” అంటే పడదనీ, కాని తన తల్లిదండ్రులు డబ్బు మనుషులు కాబట్టి, లక్షలలో కట్నాన్ని ఆశిస్తున్నారు కనుక ముందుగా రహస్య వివాహం చేసుకొని, కొన్నాళ్ళయ్యాక పెళ్ళి విషయం వెల్లడి చేస్తే వాళ్ళు ఇక ఏమీ చేయలేరని ఆమెను కన్విన్స్ చేయటానికి ప్రయత్నించాడు రాకేష్ పిన్నీ బాబాయిలకు, అక్కాబావలకు చెప్పకుండా వివాహం చేసుకోవటానికి మనస్కరించకపోయినా, అప్పటికి రాకేష్ చెప్పినది సహేతుకంగానే అనిపించటం వలన అతను చెప్పిన దానికి అంగీకరించింది విరజ.
దైవసన్నిధిలో వారి వివాహం సింపుల్‌గా జరిగిపోయింది. ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకొని కొత్తకాపురం ప్రారంభించారిద్దరూ. విరజపై ఎంతో (ప్రేమ కురిపించేవాడు రాకేష్ హృదయంలోని మమతనంతా రంగరించి, “రజీ!” అని పిలిచేవాడు. అతని సాహచర్యంలో రోజులు క్షణాల్లా మధురాతిమధురంగా గడచిపోతున్నా లోలోపల తనవారికి తెలియకుండా పెళ్ళిచేసుకున్నందుకు విరజకు చాలా దిగులుగా, అపరాధ భావన కలుగుతూ ఉందేది.
పెళ్ళయిన పదిరోజులకే మరొక మంచి కంపెనీలో రెట్టింపు జీతంతో ఉద్యోగం దొరికింది రాకేష్‌కి. తాను కూడా తమ కంపెనీలో రిజైన్ చేసి, అతని కంపెనీలోనే ఉద్యోగానికి ప్రయత్నిస్తానని విరజ అంటే, తాను కొంత నిలదొక్కుకునేంత వరకూ కొంతకాలం ఓపిక పట్టమని చెప్పాడు రాకేష్ అయితే క్రొత్త ఉద్యోగం మార్కెటింగుకి సంబంధించినది కావటం వల్ల టూర్లు ఎక్కువగా ఉంటాయంటూ వారానికి రెండుసార్లు మాత్రమే ఇంటికి రావటం మొదలు పెట్టాడు.
ఒకరోజు ఇంటికి రాగానే 'సదెన్‌గా అవసరమైందనీ, రెండు లక్షల రూపాయలు అత్యవసరంగా కావాలని” విరజను అడిగాడు రాకేష్ “తన బ్యాంక్ ఖాతాలో డబ్బున్నమాట నిజమే అయినా దానిమీద తనకెలాంటి హక్కులూ లేవని, తన తమ్ముళ్ళ చదువుకోసం దాచి ఉంచానని, పెద్ద తమ్ముడి ఇంజనీరింగ్ సీట్ కోసం ఏ క్షణమైనా దాన్ని డ్రా చేయవల్సి రావచ్చని చెప్పింది విరజ. అయితే, తనకు బాగా కావలసిన స్నేహితుదొకడు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉన్నాడని, అర్జెంటుగా ఆపరేషన్ చేయటం కోసం ఆ దబ్బు కావాలనీ, మళ్ళీ నెల రోజులలోగానే తిరిగి ఇచ్చేస్తానని" మరీ మరీ అడుగుతూ ఉంటే కాదనలేక, అతా అమూల్యం (కథలు)
అయిష్టంగానే ఆ దబ్బుకు చెక్ వ్రాసిచ్చింది విరజ. మరుసటి రోజే దాన్ని ఎన్‌కొష్ చేసుకున్నాడు రాకేష్,
తాను తల్లిని కాబోతున్నానన్న విషయం గ్రహించగానే ఆనందసాగరంలో మునిగిపోయింది విరజ. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా, సంబరంగా భర్తకు చెప్పి, తన బాబాయ్ వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళమని కోరింది. విరజ ఈ సంగతి చెప్పగానే రాకేష్ ముఖం వివర్ణమైంది. “ఇప్పట్లో పిల్లలు కలగటం తనకస్సలు ఇష్టమే లేదని, గర్భస్రావం చేయించుకొమ్మనీ' ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. విరజ అందుకు అంగీకరించకపోవటంతో కోపంగా అరిచి, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయటం లేదు.
వారం రోజులైనా గడిచాయో లేదో, ఇదిగో... ఈ సంఘటన... తన భర్త రాకేష్ కొత్తగా పరిచయమయ్యాడు, మరో ఇంతి రజనికి భర్తగా... అంటే... అంటే...? అంటే... కేవలం తన అందం మీద మోజుతో, తన డబ్బుమీద ఆశతో... వివాహితుదై ఉండీ, తనను వివాహం చేసుకున్నాడు రాకేష్ ఈ విషయం బయటపడుతుందనే రహస్యంగా, సాక్షులెవ్వరూ లేకుండా చూసి గుడిలో పెళ్ళి చేసుకున్నాడు. అతడిని తానెంత గుడ్డిగా నమ్మింది? వ్రాణప్రదంగా (ప్రేమిస్తే నమ్మించి గొంతు కోశాడు తనను. అసలు అతన్ని అనటమెందుకులే... తన వివేకం, విచక్షణ ఏమైపోయాయి? నాలుగు మెసేజ్‌లు సెల్‌ఫోన్ ద్వారా పంపించగానే మైమరచిపోయి తన జీవితాన్ని అతని చేతుల్లో పెట్టేసింది. (పేమ గుడ్దిదన్న విషయాన్ని చక్కగా బుజువు చేసింది.
-
- ఈ
రాళకేష్‌కి పెళ్ళి రెందేళ్ళింది. చక్కని చుక్కలాంటి భార్య, సంవత్సరం వయసున్న పిల్లాడు ఉన్నారు. అయినా అతనికిదేమి బుద్ధి? ఆవిడని ఎంతో (ప్రేమగా చూసుకుంటాడట! “రజీ... రజీ... అంటూ క్షణమైనా వదలడట... ఆ పిలుపుతోనే తన మతీ పోగొట్టాడుగా... తన డబ్బు తీసుకుపోయి ఆమెకి వ్లాట్ కొనిచ్చాడు... తనను ముంచివేయటానికి అతనికి మనసెలా వచ్చింది?
అతని మాటలు గుడ్డిగా నమ్మి, పెళ్ళికి ముందు కనీసం ఆఫీసులోని లేడీ కొలీగ్సుతో కూడా తానొక్క మాటైనా చెప్పలేదు తమ పెళ్ళి గురించి... అసలు అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకింత మూర్ధంగా ప్రవర్తించిందో తాను, తనకే అర్ధం కావటం లేదు. తరతరాలుగా జరుగుతున్న దోపిడీ ఈనాడు తనకీ జరిగింది. నండూరి సుందరీ నాగమణి లా
ఇప్పుడు తన పరిస్థితి ఏమిటసలు? రాకేష్‌కి రెండో భార్యగా సమాజంలో తాను వేలెత్తి చూపబడటం అనే విషయాన్ని తన మనసు సుతరమూ అంగీకరించటం లేదు. అలా అని అతడు చేసిన మోసాన్ని అన్యాయాన్ని కూడా సహించి ఊరుకోలేదు తాను... ఇంకా నయమే, అతని మాటలు విని, కడుపులో పెరుగుతున్న అంకురాన్ని మొగ్గలోనే త్రుంచివేయలేదు. తనకు తన బిడ్డ కావాలి... ఆప్యాయంగా పొట్ట నిమురుకుంది.
ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి, మొబైల్ ఫోన్ చేతిలోకి రీసుకుంది విరజ.
మర శస ట్ల
వారం రోజుల విరామం తదుపరి....
లోపలికి అడుగుపెడుతున్న విరజను చిరునవ్వుతో ఆహ్వానించింది లాయర్ మధుర. కళావిహీనమైన ముఖంతో ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంది విరజ.
“నేను రాకేష్‌ను కలిసి మాట్లడాను విరజా... మొదట అసలు నువ్వెవరో తెలియదని, నీతో తనకసలు పరిచయమే లేదని బుకాయించాడు. మీ పెళ్ళికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవటం, ఫోటోలు, వీడియోలు లేకపోవటం వల్లనే అంత ధైర్యంగా తప్పించుకోవాలని చూశాడు...” మధుర చెబుతూ ఉంటే బాధగా తల పంకించింది విరజ.
“క్రాన్సీ నేను అతని భార్య సమక్షంలోనే అతన్ని గట్టిగా బెదిరించాను. నువ్వు అతనిపై కేసు పెడుతున్నావని గట్టిగా హెచ్చరించాను. బ్యాంక్ చెక్ మీద అతని సంతకం ఉందనీ, ఆ బుజువు చాలనీ, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నందుకు తగిన శిక్ష పడేలా చేస్తానన్, ఇంకా బుజువులు కావాలంటే డి.ఎన్.ఎ పరీక్ష ద్వారా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతనే తండ్రి అని బుజువు చేయిస్తానని అన్నాను. అదిగో, అప్పుడు దారిలోకి వచ్చాడతను. ఇదిగో, నీ రెండు లక్షల క్యాష్ నువ్వు అడిగినట్టుగా ఈ ఉత్తరం - ఇక ముందెప్పుడూ నీ జీవితంలోనికి అడుగుపెట్టి, నిన్ను డిస్టర్చ్ చేయనని వ్రాసిచ్చాడు. కంగ్రాట్స్ విరజా, అతన్నుంచి నీకు పూర్తి విముక్తి లభించింది.”
విరజ కళ్ళనుండి జలజల కన్నీళ్ళు జాలువారాయి.
“బాధపడకు విరజా... నీ వంటి అమాయకమైన ఆడపిల్లలున్నంతవరకూ, మిమ్మల్ని ఇలా వశపరచుకొనే మగవాళ్ళూ ఉంటూనే ఉంటారు. నిస్సహాయ పతా అమూల్యం (కథలు)
పరిస్థితులలో, ఒంటరులై భర్తను విడచి ఉండలేక, బిడ్డలను పెంచలేక, ఏ హక్స్కూ చట్టపరంగా లేని రెండవ భార్యలుగా ఎంతోమంది అసహాయులైన ఆడువాళ్లు అలమటించిపోతున్నారు. అలా కాకుండా నీమనసు చెప్పిన ప్రకారం ఆ పడగనీడ నుంది బయటకు వచ్చెసి, నీదైన కొత్తజీవితంలోనికి అడుగుపెడుతున్నావు. అందుకు నీకునా హృదయపూర్వక అభినందనలు! ఇప్పుడిక ఏమి చేయదలచు కున్నావో నిర్ణయించు కున్నావా విరజా?” ఆదరంగా అడిగింది మధుర.
“నేను ఇక్కడినుండి ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను. చేగో పుట్టేవరకూ... ఆ తర్వాత ఆ బిడ్డను అమ్మనైనా, నాన్ననైనా నేనే అయి పెంచుకుంటాను...” చెప్పింది విరజ.
“వెరీ గుడ్ విరజా... నీలాగ అందరూ సమస్యలను థైర్యంగా ఎదుర్శొని, ఆత్మస్టెర్యంతో నిలబడితే లోకంలో అనాథ బాలలూ ఉండరు, దేశంలో ఇన్ని అనాధాశ్రమాలూ ఉండవు. ఐతే... ఉండు ఒక్క నిమిషం...” అంటూ తన సెల్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడి, “రాజమండ్రిలో ఒక ఉద్యోగం ఉంది చేస్తావా?” అని అడిగింది మధుర.
“మా అక్కయ్య క్లాస్‌మేట్ మీరు... అక్కయ్యతో సమానమైనా, పెద్ద ఆపద నుంచి, అంతులేని సుడిగుండం నుంచి నన్ను రక్షించి, ఈనాడు నాకు మాతృ సమానురాలయ్యారు. చక్కని జీవితాన్ని నాకు కానుకగా ఇసొనంటే వద్దనేంత మూర్చురాలిని కాధు. ఒక విషపునాగు బారినుండి విముక్తినిచ్చిన మీరు నాకివ్వ బోయేది ఏదైనా అది అమృతంతో సమానం. తప్పకుండా రాజమండ్రి వెళ్తాను...” రెండు చేతులూ జోడించి చెప్పింది విరజ.
“ఇదిగో, ఇది నా స్నేహితురాలు డాక్టర్ అనూరాధ చిరునామా. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వెళ్ళే దారిలో గోదావరి ఒద్దున షిరిడి సాయి సేవాసదనం అనే ఒక సేవాసంస్థను నడిపిసోందామె. ఎంతోమంది దాతలు ఇచ్చే విరాళాల వల్ల ఆ సంస్థ ఎంతో విజయవంతంగా నడుసోంది. పదిహేను ఎకరాల సువిశాల స్థలంలో ఒక అనాధాశ్రమం, వృద్ధాశ్రమం, ప్రశాంతతను ఇచ్చే బాబాగారి మందిరంతో పాటు, ఒక గురుకుల పాఠశాల కూడా ఉంది. ఎంతో అంకిత భావంతో స్వచ్చందసేవ చేసే సిబ్బంది, ఉవాధ్యాయులు, సేవికలు అక్కద పసి చేస్తున్నారు. డాక్టర్ అనూరాధ అన్నీ తానై, అంతా తానై ఆ సంస్థకు తన జీవితాన్ని అంకితం చేసింది. ఈ ఏడాది చివరికి అక్కడే ఒక చిన్న ఆస్పత్రిని కూడా
నండూరి సుందరీ నాగమణభి ఎూతతతతతయానాాలాలా
కట్టించాలన్నది తన ఆకాంక్ష. ఆర్భనేజికి ఇన్‌ఛార్ట్‌గా ఒక నమ్మకమైన, సేవాభావం గల ఉద్యోగిని కావాలని నాకు చెబితే నీ పేరు సూచించాను. వెంటనే వెళ్ళి అక్కడ చేరిపోమ్మా... ప్రశాంతమైన వాతావరణం, చిన్నారి బాలల ఆలనా పాలనా, సాయినాథుని చల్లని కరుణారస దృక్కులు నీకు ఎంతో సాంత్వనను చేకూర్చుతాయి అని నా నమ్మకం. నీవు వట్టి మనిషివి కూడా కాదు కాబట్టి అక్కడ నీకు వారి అండదండలు కూడా దొరికి చక్కని బిద్దకు తల్లివౌతావు... విధి నిన్ను వంచించినా, ఓటమి లేనిదానవై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో విరజా...” ఆప్యాయంగా చెప్పింది మధుర. చటుక్కున వంగి, మధుర పాదాలకు కృతజ్ఞతతో నమస్కరించింది విరజ. ఆమె కంటినుండి జారే బాష్పధారలు మధుర పాదాలను అభిషేకించాయి. విరజను లేవనెత్తి, గాధంగా తన హృదయానికి హత్తుకుని, ఆమె నుదుట చుంబించింది మధుర (ప్రేమగా... (ఆదివారం ఆంధ్రభూమి, జనవరి, 2012) అ 4౨+ ఈ 66, పతతతతతతతతతతతతతతతతజజా-- అమూల్యం (కథలు)
జీవితమే సఫలము...
“ఏమిట్రా ఆ తినడం? చూడండి వీడు?” భర్త వైపు ఫిర్యాదుగా చూసింది లక్షి.
సాలోచనగా కొడుకు వైపు చూశాడు రామకృష్ణ రాహుల్ అసలీ లోకంలోనే లేదు. ఏదో మధనపడుతున్నట్టుగా అన్నం తినకుండా కంచంలో వేలితో గీతలు
“బాబీ...” పిలిచింది లక్ష్మి. ఆలోచనల్లోంచి తేరుకుంటూ, “అమ్మా, పెరుగు...” అన్నాడు.
“అదేమిట్రా? చామదుంపల వేపుడు చేశాను... పప్పు పులుసు చేశాను... అవేవీ సరిగ్గా తిననే లేదు...” నొచ్చుకుంటూ పులుసు గరిటతో తీసి కంచంలో వేయబోయింది లక్షి.
“ప్లీజ్ వద్దమ్మా... నన్ను బలవంతం చేయకు... పెరుగు వేసెయ్...” అంటూనే తనే స్పూన్‌తో పెరుగు వడ్డించుకొని, దానితో రెండు ముద్దలు తిన్నా ననిపించి, “నాకు వర్క్ ఉంది...” అంటూ లేచి తన గదిలోకి వెళ్ళివోయాడు రాహుల్
“ఏమైందండీ వీడికి?” బాధగా అంది లక్ష్మి.
“లక్ష్మీ, నువ్వు భోజనం చెయ్యి... నేను కనుక్కుంటాగా, ఏదో ఆఫీసులో టెన్షన్ అయి ఉంటుందిలే...” అనునయించాడు రామకృష్ణ.
“అంతేనంటారా? లేకపోతే వంట్లో ఏమైనా బావుండలేదా?” దిగులు పడింది లక్ష్మి.
రోజంతా ఉపవాసమున్న లద్ష్‌కి భోజనం చేయగానే ఆవలింతలు ముంచుకు
నండూరి సుందరీ నాగమణి తతత
రాసాగాయి. ఆమెను పడుకోమని చెప్పి తాను కొడుకు గదిలోకి నడిచాడు శం జస శ
గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. టేబుల్ లాంప్ వెలుగులో డైరీలో ఏదో రాసుకుంటున్నాడు రాహుల్. సున్నితంగా గది తలుపులు తట్టి, లోపలికి వెళ్ళాడు రామకృష్ణ. “డాడీ...” అంటూ తడబాటుగా డైరీని మూశాడు రాహుల్. కుర్చీ లాక్కుని రాహుల్ పక్కనే కూర్చున్నాడు రామకృష్ణ.
“ఏమిటి నాన్నా ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా?” బుజ్జగింపుగా అడిగాడు రాహుల్ భుజంమీద చేయి వేసి నిమురుతూ... ఒకేసారిగా సప్తసాగరాలు పొంగాయి రాహుల్ కళ్ళలో...
“పోగొట్టుకుంటున్నాను డాడీ... వదిలేస్తే, ఎప్పటికీ ఇక దొరకని దాన్ని వదిలేసుకుంటున్నాను నా చేజేతులా...” అస్పష్టంగా అన్నాడు రాహుల్. అవిరామంగా వర్షిస్తున్న అతని నయనాలు ఆరని దుఃఖానికి నెలవులుగా అనిపించాయి.
“బాబీ...'ఎదిగిన కొడుకు స్నేహితుడితో సమానం) అని అంటారు. నేను నీతో ఒక స్నేహితుడిలాగే ఉంటాను కదా, మరి నా దగ్గర దాపరికాలు ఎందుకూ? నీ మనసులో ఏముందో నాతో పంచుకో... నీ బాధ ఏమిటో వివరంగా చెప్పు...”
“డాడీ... అదీ...” సంశయంగా ఆగాడు రాహుల్
“ఎవరురా ఆ అమ్మాయి?”
“డాడీ... మీకు... మీకెలా?”
“ఇంత బాధ నువ్వు పడుతున్నావు అంటే, నిస్సందేహంగా నువ్వు యఘేమలో పడటమే కారణమని అర్ధమైపోయిందిరా బాబీ... చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి?”
“తెలజ దాడీ...”
“కోడలి పేరు చాలా బావుంది. శైలజ నీ (ప్రేమను తిరస్కరించిందా? లేక వాళ్ళ అమ్మానాన్నలతో ప్రాబ్లమా?”
“కాదు డాడీ... నేను... నేనే... శైలూకి “సారీ” చెప్పేశాను... కానీ, కాని... ఆమెను మర్చిపోలేకపోతున్నాను...” తల వంచుకున్నాడు రాహుల్.
“ఎందుకు? ఎందుకని సారీ చెప్పాల్సి వచ్చింది? అసలు ఆ అమ్మాయిని
పత అమూల్యం (కథలు)
మరచిపోవలసిన అవసరమేమిటీ?” రామకృష్ణ మాటలకు విచిత్రంగా చూశాడు రాహుల్,
“శైలూకి అమ్మానాన్న లేరు డాడీ... వాళ్ళ పిన్నీ బాబాయిల దగ్గరుంటోంది... సమస్య ఏమిటంటే... వాళ్ళు మనవాళ్ళు కాదు...” క్లుప్తంగా చెప్పాడు రాహుల్.
“అయితేనేం బాబీ?”
“అదేమిటి డాడీ”? మనం ఏమిటి, మన కుటుంబం ఏమిటి? మన ఆచార వ్యవహారాలేమిటీ? మన ఫ్యామిలీలోకి అలాంటి అమ్మాయి వస్తే అమ్మ ఎలా తట్టుకుంటుంది? అందుకే... అందుకే తనకి “బై చెప్పేశాను...”
“మరింకేం, సమస్య కాసా తీరిపోయిందిగా? ఈ దుఃఖమెందుకు?”
“సర్లెండి, మీకేం తెలుసని నా బాధ? నా శరీరంలోను, మనస్సులోను అర్ధ్థభాగమైంది శైలజ...”
“అబద్ధం బాబీ... నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఆ పిల్ల నీలో అర్ధ్థభాగమైందని నీవు నిజంగా భావిస్తే ఇలా ఆ అమ్మాయిని వదిలేసుకుంటావా?”
“ఏమిటి డాడీ, మరేం చేయమంటారు? మిమ్మల్ని వదిలేసుకో మంటారా? శైలూ కోడలిగా వస్తే మీరు అంగీకరిస్తారా? నిష్టాగరిష్టరాలైన అమ్మ ఒప్పుకుంటుందా?”
“అమ్మ ఒప్పుకోదు....”
“అందుకే డాడీ... మరి గుండెను రాయిగా చేసుకొని పరిస్థితి శైలూకి విడమరచి చెప్పి ఈ రోజు వీడ్కోలు చెప్పేశాను... కాని... కానీ... నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ...” తండ్రి ఒడిలో తలదాచుకున్నాడు, రాహుల్.
“అవును మై సన్... ఆ బాధను తట్టుకోవటం చాలా కష్టం... అంతేకాదు... నీ చర్య వల్ల నీ శైలూ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ బాధ... ఈ బాధకు పదిరెట్లు ఉంటుంది తెలుసుకోరా...” భారంగా అన్నాడు రామకృష్ణ.
ఉలిక్కిపడి తలెత్తాడు రాహుల్... “న్నో... అలా జరగకూడదు...”
“అవునురా... అలా ఎప్పటికీ జరగకూడదు... కానీ జరిగింది... బాబీ... నీకో ప్రేమకథ చెబుతాను... వింటావా? ఇది నా కథే...”
“డాడీ... మీరు ప్రేమించారా? మీకూ ఓ ప్రేమకథ ఉందా?” విస్మయంగా అడిగాడు రాహుల్. నండూరి సుందరీ నాగమణి లాలా
“అవునురా ఉంది... ఓ ఓడిపోయిన (ప్రమకథ...” కళ్ళజోడు తీసి ఓసారి
కళ్ళు తుడుచుకొని గొంతు సవరించుకున్నాడు రామకృష్ణ. జ + ఈ
“మీ అమ్మగారు నిప్పులను సైతం నీళ్ళతో కడిగి శుద్ది చేస్తారు... మీ నాన్నగారు వేదపండితులు... అందుచేత మనమిలా విడిపోవలసిందే... కదూ!” దుఃఖంగా అన్నది సుధ.
“ఏరా, ఇవన్నీ నీకు ఇప్పుడే గుర్తు వచ్చాయా? మా చెల్లెల్ని ప్రేమించినప్పుడు మరచిపోయావా?” నిప్పులు కక్కుతూ చూశాడు సత్యం.
“లేదు సత్తీ... ఎప్పడూ గుర్తుంది... అందుకే, సుధతో అసలు చనువు 'పెంచుకోకూడదని అనుకుంటూనే, నా బలహీనతను జయించలేకపోయాను... ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాను...” నెర్వస్‌గా ఫీలవుతూ గోళ్ళు చూసుకుంటూ అన్నాను.
“సుధ కూడా అంతే కదరా? నీ మీదనే ఇన్ని ఆశలు పెట్టుకొని, భర్తగా నిన్ను తప్ప మరొకరిని ఊహించుకోని నా చెల్లెలు ఇప్పుడేమైపోవాలి? బావా, ఒక్కసారి ఆలోచించురా... ప్లీజ్...” వేడికోలుగా అన్నాడు సత్యం.
“సత్తీ నేను ఏం చేయగలను? అవతల మ అమ్మ తన మేనకోడలితో నా పెళ్ళి నిశ్చయం చేస్తోంది...” నిస్సహాయంగా అన్నాను.
“ఆవిడ చేస్తే.. నువ్వ చేసేసుకుంటావా?” ఆవేశంగా అరిచాడు సత్యం...
“మరేం చేయగలను? సుధతో పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోరు...”
“ఒప్పుకోవటమెందుకురా? మీరిద్దరూ మేజల్లీ కదా, రిజిష్టర్ మేరేజి చేసుకోండి....” సత్యం మాటలకు జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను.
“అసలు సుధ విషయం మీ ఇంట్లో చెప్పావా?” సూటిగా అడిగాడు సత్యం.
అమ్మ మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి... “ఇలాంటి శుద్ధ (శోత్రియ వంశంలో పుట్టి, నువ్వు చేస్తున్న పని ఇదట్రా? నా మాటను కాదని ఆ పిల్లను చేసుకుంటే మాత్రం ఈ ఇంట్లో రెండు శవాలను కళ్ళజూస్తావు...”
“భ్రష్టుడా... బుద్ధి లేదుట్రా? పెద్ద వెధవలిద్దరూ చక్కగా మేము చూసిన సంబంధాలు చేసుకొని హాయిగా ఉన్నారు. నువ్వేంట్రా ఇలాంటి వెధవ పనులకు ఒడిగట్టావు? అసలు ఆ వగలాడిని అనాలి... చక్కగా ఎర్రగా, బుర్రగా ఉన్నాడు లాలా అమూల్యం (కథలు,
కదాని వల వేసింది... ఒరేయ్... అందినంతా లాక్కుని ఆనక తట్టా, బుట్టా సర్దుకొని ఇంకొకడితో చక్కా లేచిపోతుందిరోయ్... నమ్మకు అలాంటి అలగాజాతి వాళ్ళని...” ఛిత్మారంగా అన్నాడు నాన్న...
నన్ను మనసా, వాచా (మేమించటం తప్ప ఐ పొవవాురుగని అమాయకురాలైన నా సుధను మా నాన్న అన్ని మాటలంటుంటే, మా అమ్మ అంతంత ఒట్లు పెట్టుకుంటుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేని అశక్తుదనైపోయాను.
“రామూ... నిన్నే అడిగేది! మీ అమ్మానాన్నలకి మీ ఇద్దరి యేమ విషయం తెలుసా, తెలియదా?” రెట్టించాడు సత్యం. తెలుసన్నట్టు తలూపాను. ఏదో తెలియని రిలీఫ్‌తో నిశ్వసించాడు సత్యం.
“మరింకేం, నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాదనా?”
“వద్దు సత్తీ... ఒప్పుకోరురా...”
“ఓకే, పోనీ మీ ఇద్దరి పెళ్ళీ నేను చేస్తాను... అందుకు అంగీకారమే కదా?”
“ఉహు, నేను సుధను చేసుకుంటే మా అమ్మా నాన్నా చచ్చిపోతార్రా...”
తల పట్టుకున్నాడు సత్యం. “ఐతే... నువ్వు మీ వాళ్ళు చూసినమ్మాయినే చేసుకుంటావన్న మాట!” ఒక్కో పదాన్ని వత్తి వత్తి పలికాడు.
“తప్పేలా లేదు సత్తీ...”
అంతే... నా చెంప ఛెళ్ళుమంది. మరో దెబ్బ నా మీద పదడబోయేంతలో గబుక్కున తన అన్నకు అడ్డం వచ్చింది సుధ. దాంతో ఆ దెబ్బ ఆమె మీద పడింది... “అబ్బా అంది కమిలిపోయిన చెంప పట్టుకొని, బాధకు తట్టుకోలేనట్టేగా...
“అయ్యో... సుధా...” అప్రయత్నంగా పలికాయి నా పెదవులు... గబుక్కున ఆమె బుగ్గను తాకింది నా చేయి అహ్రయత్నంగానే... చటుక్కున వెనక్కి జరిగింది సుధ.
“ఏంట్రా రామూ! ఆడపిల్ల మనసుతో ఆటలా? అసలు నువ్వు మనిషివేనా?” ఉరిమాడు సత్యం.
నేను కిమ్మనలేదు... వాడు మరో డజను దెబ్బలు కొట్టినా పడటానికి సిద్ధంగానే ఉన్నాను. అవును... మరి నాకు ఇదే సరియైన శిక్ష
నండూరి సుందరీ నాగమణి లాాాాాాాాాా లొ
“అన్నయ్యా, రామూని ఏమీ అనకు ఫీజ్...” బడుస్తూ అంది సుధ.
“అవునమ్మా, ఏమీ అనను... నీ రామూని ఏమీ అనను... అసలు... అసలు... నిన్ను చంపి పారేస్తే పీడా పోతుందిలే...” విసుగ్గా అసహాయంగా అన్నాడు సత్యం.
“సారీరా, సత్యం... పరిస్థితులకు ఎదురీదే శక్తి నాకు లేదు...నా వాళ్ళను బాధపెట్టే చర్యను నేను తీసుకోలేను...” దిగులుగా అన్నాను.
“పేమను నటించి, నా చెల్లెల్ని మాత్రం మాయ చేయగలవేం?” కోపంగా అన్నాడు సత్యం.
“నేను నటించలేదు...కానీ... పెళ్ళి విషయంలో నా అసహాయతను మొదటినుంచీ సుధకు చెబుతూనే ఉన్నాను...”
“యేమించటమంటే, నిన్ను నమ్ముకున్నవారిని ఇలా నడిసముద్రంలో వదిలిపెట్టి పారిపోవటమా మిత్రమా?” బాధతో ప్రశ్నించాడు సత్యం. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.
వీడ్కోలు చెబుతున్నట్టు చేయి ఊపి, అక్కడినుండి వెళ్ళిపోయాను.
ఆ తర్వాత అన్ని పనులూ యాం్రికంగానే జరిగిపోయాయి... నేను లక్ష్మి మెడలో తాళి కట్టటం, పసుపు బట్టలతో మేమిద్దరం తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావటం...
నేను తిరుపతి నుంచి తిరిగి వచ్చిన వెంటనే తెలిసింది... ముందు రోజే... ఆ ముందురోబే....” వెల్లువలా దుఃఖం ముంచుకు వచ్చింది రామకృష్ణకి. ఆ ఏడుపు ఎంతో హృదయవిదారకంగా, గుందెలు అవిసిపోయేలా లోపలినుంచి తన్నుకు వస్తోంది. తండ్రినలా చూసేసరికి తట్టుకోలేకపోయాడు రాహుల్. ఎప్పుడూ ఉల్లాసంగా, సరదాగా ఉండే తంద్రే తెలుసు తనకు... కాని బడబాగ్ని లాంటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న సముద్రుడిలాంటి ఈ నాన్న కొత్త...
“డాడీ... ప్లీజ్... ప్లీజ్... కంట్రోల్ యువర్ సెల్ఫ్...” భుజమ్మీద చేయి వేసి ఓదార్చాడు. పక్కనే ఉన్న నీళ్ళ బాటిల్ లోంచి నీళ్ళు గ్లాసులోకి వంచి తాగించాడు. అయిదు నిమిషాల తరువాత రామకృష్ణలో దుఃఖపు ఉధృతి తగ్గింది. కొడుకు అందించిన టవల్‌తో ముఖాన్ని తుడుచుకుంటూ, “అయామ్ సారీరా...” అన్నాడు తగ్గుస్వరంతో.
కొంచెంసేపాగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. “ఆ ముందురోజే సుధ నీద్ర మాత్రలు మింగి చనిపోయిందని తెలిసింది. షాక్ అయిపోయాను. ఆ
లాల అమూల్యం (కథలు)
మతిలేని స్థితిలోనే వాళ్ళింటికి వెళితే, సత్యం నన్ను చూసిన చూపు నిలువెల్లా నన్ను కాల్చివేసింది... సుధ మరణ వార్త నన్ను దహించివేస్తూంటే, ఇప్పుడు... ఇప్పుడు ఓ మంచి స్నేహితుడిని కూడా చేతులారా పోగొట్టుకున్నానన్న భావన నన్ను వరదల్లే చుట్టుముట్టింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూస్తుండగా ఏమనిపించిందో ఏమో కాని, అకస్మాత్తుగా నన్ను కౌగలించుకొని గుండెలు పగిలేలా రోదించసాగాడు సత్యం. “రామూ... చూశావురా, నా చెల్లి వెళ్ళిపోయిందిరా... అది నాకు చెల్లి మాత్రమే కాదురా... నా తల్లి కూడారా... కష్టసుఖాలను పంచుకుంటూ పెరిగామురా ఇద్దరమూ... మొన్ననే నీ విషయం చర్చించుకున్నామురా... మీ ఇద్దరి (ప్రేమ ఎంత ముఖ్యమో, నిన్ను కన్నవారి ఆశలు కూడా అంతే ముఖ్యమనీ, నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా మంచిదేనని అనుకున్నామురా మేమిద్దరమూ.. తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాననీ, వైజాగ్ పంపించి చదివించమనీ అడిగింది, పిచ్చితల్లి... సరేనన్నానురా... నన్ను వమార్చి సడన్‌గా ఇలా చేసిందిరా... నిజంగా నేను చాలా చాలా దురదృష్టవంతుణ్ణిరా రామూ...”
“నేను కూడారా సత్తీ... నేను కూడా... సుధతో నేను విషయం చెప్పినప్పుడు సానుకూల దృక్పథంతోనే స్పందించింది. పై చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించుకొని ఎంతో చక్కగా తన భావిజీవితాన్ని తీర్చిదిద్దుకుంటానని, మా ఇద్దరి స్నేహాన్ని ఓ పవిత్రబంధంగా తన మనసులో కొలువుంచుకుంటానని నాకు మాటిచ్చిందిరా... ఇలా చేస్తుందని, మాట తప్పి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతుందని నేనస్సలు ఊహించలేదురా....” నా కన్నీరు వరదై సత్యం భుజాలను తడిపివేసింది.
ఏదో గుర్తొచ్చినట్టు “ఒక్క క్షణంరా...” అంటూ లోపలి గదిలోనికి వెళ్ళి వచ్చాడు సత్యం. అతని చేతిలో ఓ పర్సు, చిన్న కవరు ఉన్నాయి. “రామూ... ఇవిగో... ఇవి సుధ నీకు అందజేయమని నాకు లెటర్ రాసి పెట్టిందిరా... తీసుకో...”
అనాలోచితంగానే అందుకొని జేబులో పెట్టుకున్నాను. జేబులోంచి మరొక కాగితాన్ని తీసిస్తూ, “ఇది సుధ నాకు రాసిన ఉత్తరం. ఇది కూడా ఓసారి చదివి చింపివెయ్యి... రామూ... నేను బెంగుళూరికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నానురా... పదిహేను రోజులలోనే నాకు ఆర్టర్స్ రావచ్చు... బహుశః మరి ఇప్పట్లో నేను నిన్ను కలవలేనురా...” అంటూ చేతులు సాచాడు సత్యం. ఆర్తిగా వాడి
నండూరి సుందరీ నాగమణి లా
పరిష్వంగంలో ఒదిగిపోయాను నేను. “సత్తీ... ప్లీజ్ రా... నన్ను క్షమించు...” అన్నాను ఎలాగో గొంతు పెగల్చుకొని.
“హు! నువ్వేం చేశావనిరా? చేసేది, చేయించేది అన్నీ పైవాడే...” విరక్తిగా నవ్వాడు వాడు. ఇక అక్కడుండలేక ఇంటికి వచ్చేశాను.
సుధ తన అన్నయ్యకు రాసిన చిన్న లెటర్ మొదట చదివాను. “అన్నయ్యా, మాటిచ్చి తప్పుతున్నందుకు నన్ను క్షమించు. రామూ లేని జీవితంలో నేను ఉండలేకపోతున్నాను... అందుకే వెళ్ళిపోతున్నాను...”
భారంగా నిట్టూరుస్తూ పర్సు తెరిచాను. గోల్స్ షాపుల్లో ఇచ్చె ఆర్నమెంట్ పర్స్ అది. లోపల గులాబీరంగు కాగితంలో చుట్టబడి ఉన్నాయి కొత్తవైన వెండిపట్టీలు. *నా మిత్రుడైన రామూ శ్రీమతికి నా చిరుకానుకి అని ఉంది అందులో.
కవర్లో సుధ నాకు రాసిన ఆఖరి లేఖ...
“నాకు ప్రాణాధికమైన రామూ!
చిన్నప్పటినుంచీ మన మధ్య అల్లుకున్న స్నేహం ఎప్పుడురాగబంధమైందో నాకు గుర్తు లేదు. కాని పెళ్ళంటే.. నా ఊహలలో నీతోనే... నా భర్తవు నీవే... నీకు కూడా నేనంటే అంతే అనురాగమని నాకు తెలుసు... కాని సంప్రదాయాన్ని పెద్దలను ఎదిరించి నన్ను అందుకోలేని నీచెయి, కేవలం ఓ స్నెహహస్తంగా మాత్రమే మిగిలిపోయింది చివరికి. దురదృష్ట దేవత నాకు పహరా కాస్తుంటే, నిన్ను నేను ఎలా పొందగలను నేస్తం? లేకుంటే ఇంత ప్రాణప్రదంగా నిన్ను (ప్రేమించే నన్ను ఇలా వేరే కులంలో పుట్టిస్తాడా ఆ భగవంతుడు?
రామూ, నువ్వు చేసింది నూటికి నూరుపాళ్ళూ సరియైనదే... కని, పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల (ప్రేమ ముందు మనది అసలు (ప్రేమె కాదు. వాళ్ళను బాధపెట్టే పని మనం చేయనే కూడదు, అందుకనే నీకు లభించిన నీ భార్య నీకు అనుకూలవతియై, మీ దాంపత్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా పదికాలాలూ పచ్చగా సాగాలని మనసా, వాచా కోరుకుంటున్నానురా...
కాకపోతే నేను నీకిచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాను. నువ్వు లేని ఈ జీవితం నా కసలు వద్దు. నేనీ లోకంలో నీవు లేకుండా (బతకలేను... అందుకే వెళ్ళిపోతున్నాను... నన్ను క్షమించు... పాపమని తెలిసీ, ఆత్మహత్యకు పాల్పడుతున్నాను... అన్నయ్య ఎంత కుమిలిపోతాడో నాకు తెలుసు... కానీ ఈ (ళా పతతతతతతతతతతతతతతతతతతతవజజాజంలాలంంా అమూల్యం (కథలు)
ఎడారి వంటి బ్రతుకును జీవచ్చవమై నేనిక కొనసాగించలేను. మన్నించు నేస్తం... సెలవ్... విత్ లవ్... నీ సుధ.”
ఆ తరువాత సత్యం బెంగుళూరు వెళ్ళిపోయాడు... నేను ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళిపోయాను...” చెప్పటం పూర్తి చేసి, కళ్ళుమూసుకున్నాడు రామకృష్ణ.
“అయామ్ సారీ డాడ్... ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉందే మీ వెనకాల ఇంత విషాదగాథ ఉంటుందని నేనసలు అనుకోలేదు...”తడి కళ్ళతో అన్నాడు రాహుల్.
“జీవితమనేది భగవంతుడిచ్చిన వరం. ఎన్ని ఓటములెదురైనా, చక్కగా ఉన్నతపథంలో పయనిస్తూ జీవించటం ఆయనిచ్చిన ఓ అద్భుత అవకాశం. దాన్ని చేతులారా జారవిడుచుకున్న అవివేకిరా సుధ. కాలమనే వైద్యుడు మాన్పలేని గాయం లేదు. కొన్నాళ్ళెనా వేచి ఉండి, తన మనసును చదువుపై లగ్నం చేసి, చక్కని జీవితాన్ని పొందాల్సిన సుధ అందుకు ప్రయత్నమే చేయకపోగా, కన్నబిడ్డల్లే తనను పెంచిన తన అన్నని నిర్దాక్షిణ్యంగా వదలి వెళ్ళివోయింది... తన చర్య ద్వారా నన్ను కూడా ఎంతో అపరాధ భావనకు గురిచేసింది... ఆమెను (ప్రేమించటం నాలో ఒక తీపిగుర్తుగా కాక, భరించలేని చెదుజ్ఞాపకంగా మిగిల్చి వెళ్ళింది.
అది అలా ఉంచితే, నేను నీకు చెప్పదలచుకున్నది ఒక్కటేరా రాహుల్... (పేమించటం కన్నా “ఒక వ్యక్తితో నిష్కల్మష హృదయంతో నిన్వార్ధంగా (ప్రేమించ బడటం) అనే అవకాశం దొరకటం చాలా అరుదు. అలాంటి అవకాశాన్ని ఏ మనిషీ ఎన్నటికీ వదులుకోకూడదు. నువ్వు కూడా...
అసలు ఈ కులాలు, మతాలు అనేవి మనిషి నిర్మించుకున్నవి. వృత్తిపరంగానో, దైవపరంగానో ఏర్పడ్డవి. కాని అవే ప్రేమలకు, పెళ్ళిళ్ళకు అవరోధాలుగా, అద్దుగోడలుగా మారిపోయాయి.
అమ్మ గురించి... నువ్వు ఆలోచించకురా... ఆ అమ్మాయి గురించి ఆలోచించు.... వెంటనే రిజిష్టర్ మేరేజికి అప్లయ్ చేయండి. నీకు బాసటగా నేనుంటాను. నీకు ఇల్లు, కొత్త కాపురం నేను ఏర్పాటు చేస్తాను. అమ్మ బాధపడుతుంది. నిజమె... అది తాత్కాలికం... ఆమె కోపం పోయెలాగ నేను నచ్చచెబుతాను. తన కోపం తగ్గాక, మేమిద్దరం తప్పకుండా నీ దగ్గరకు వస్తాము...
శైలజతో నీ జీవితం బంగారుబాట అవుతుందిరా... మీ ప్రేమవనాన్ని నండూరి సుందరీ నాగమణి తతత
నిత్యవసంతంతో నింపుకోండి ఇద్దరూ... ఏదీ, ఆ అమ్మాయికి ఫోన్ చేసి, వెంటనే విషయం చెప్పు... లేకపోతే అనవసరంగా ఏదైనా తొందరపాటు చర్యకు పాల్పడే అవకాశం ఉంది కదా... రేపు ఉదయమే అమ్మాయి దగ్గరకు మనమిద్దరం వెళదాం... సరేనా?” కొడుకు నుదుటిపై చుంబించాడు రామకృష్ణ.
“డాడీ, మీరెంత మంచివారు!” అప్రయత్నంగా రాహుల్ చేయి తండ్రి పాదాలను తాకింది.
“అవునురా... మరి (ప్రేమన్నది ఓడిపోకూడదు... ఆల్ ది బెస్ట్ కన్నా... కలతలన్నీ మరచి, రేపటి కోసం బంగారు కలలను కంటూ, హాయిగా నిదురపో... గుడ్ నైట్... ఆ, ముందు శైలూకి ఫోన్ చేసి మాట్లాడు... ఆమె దుఃఖాశ్రువులను ఆనందబాష్పాలుగా మార్చు...” లేచాడు రామకృష్ణ.
అతని చేతిని ముద్దాడి, తన మొబైల్ ఫోన్‌ని చేతిలోకి తీసుకున్నడు రాహుల్.
“హలో శైలూ... గుడ్ న్యూస్... ఇక మన పెళ్ళికి ఏ ఆటంకమూ లేదురా... అసలు ఏం జరిగిందంటే...” గలగలా నవ్వుతూ మాట్లాడుతున్న కొడుకు స్వరంలో గంతులు వేస్తున్న ఆనందాన్ని తృప్తిగా పరికిస్తూ, ఆ గదిలోంచి నిష్క్రమించాడు
(స్వాతి సపరివారపత్రిక, 06.12.2013) వ | ళం. పతతతతతతావవవవాయయయయావావాా అమూల్యం (కథలు)
కణ్వ శాకుంతలం
బెరుకు బెరుకుగా గేటు తెరుచుకుని తన చేయి పట్టుకున్న నాలుగేళ్ళ పాపతో, భుజాన ఎయిర్ బ్యాగ్‌తో ఆ ఆవరణ లోపలికి అడుగు పెట్టింది సుధీర. ఎయిర్ బ్యాగ్‌ను కింద పెట్టి చుట్టూ కలయజూచింది. ఎంత అందమైన పూలతోట ఇది! ఈనాడు ఇలా జీవకళ లేనట్టుగా ఎండిపోయిందేమిటీ? ఎదురుగా ఉన్న రెందంతస్తుల భవనం వైపు ఆర్తిగా చూసింది. తాను పెరిగిన నేల ఇది... ఈశాన్యం మూల ఉన్న గిలకల బావి వైపు చూసింది సుధీర. అది కానా పాదుబడి పోయినట్టుగా అయి, వాడుకలో లేనట్టుగా... చుట్టూరా ఇసుక మేట వేసి ఉన్నది. వైభవమంతా కోల్పోయిన వనకాంత అచ్చు తనలాగానే ఉందని తోచింది సుధీరకి. దుష్యంతుడి చేత పరిత్యజించబడి, తిరిగి కణ్వమహర్న్షి ఆశ్రమానికి వచ్చేసిన శకుంతలలా ఉంది సుధీర.
గేటునుండి ఉన్న కాలిబాట మీదుగా ఇంటివైపు నడిచింది సుధీర. అంతే... ముందు గదిలో కట్టేసి ఉన్న కుక్క ఒకటి భయంకరంగా మొరుగుతూ కటకటాల్లోంచి కోపంగా చూడసాగింది. కటకటాల తలుపులకు పెద్ద తాళం వేళ్ళాడుతోంది. ఆ కుక్క అరుపులు వినగానే పాప ఒక్కసారిగా తల్లి చీర కుచ్చిళ్ళలో తల దాచుకొని గుక్కపెట్టి ఏిదవసాగింది.
“లేదురా, లేదు...” అని దాన్ని ఎత్తుకుని సముదాయిస్తూండగా ఇంటి పక్కనే ఉన్న చిన్న అవుట్ హౌస్‌లోంచి ఎవరో దగ్గుతున్న సవ్వడి వినిపించింది. ఎవ్వరూ కనిపించకపోవటంతో అటువైపు నడిచింది సుధీర. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరచింది. మందుల వాసన మధ్య మంచం మీద పడుకుని ఉన్న వృద్ధుడు... ఎవరు? ఎవరదీ... నాన్న! నాన్నేనా? తండ్రిని గుర్తించిన సుధీర ఒక్కసారిగా ఉప్పెనంత దుఃఖానికి గురైంది. ఇదేమిటీ... నాన్న ఇలా నండూరి సుందరీ నాగమణి లాలా
అయిపోయారు? ఐదేళ్ళలో ఇంత మార్చా?
కళ్ళ మీద వెలుగు పడటంతో కళ్ళు తెరచి కంటికి అడ్డంగా అరచేయి పెట్టుకొని చికిలించి చూశారు రఘుదేవయ్యగారు. “ఎవరు? ఎవరమ్మా?” దగ్గు తెర అద్దుపడటంతో ఆగిపోయి, దగ్గుతూ ఉండిపోయారు. ఆగలేని సుధీర గబుక్కున ఆయనను పొదివి పట్టుకుని బల్లమీద ఉన్న నీళ్ళ చెంబులోంచి నీళ్ళు గ్లాసులోనికి వంచి తాగించింది.
ఆ స్పర్శ తెలియజిప్పింది ఆయనకి ఆమె ఎవ్వరో... నమ్మలేనట్టు ఆమెవైపు చూశాడాయన. ఆ కళ్ళలో చిగురిస్తున్న వెలుగురేఖలు. “అమ్మా! చిట్టీ నువ్వా! నువ్వేనా?” వణుకుతున్న వేళ్ళతో ఆమె ముఖాన్ని తడమసాగాడు రఘుదేవయ్య.
“అవును నాన్నాా నేనే... ఇదేంటి నాన్నా ఇక్కడ! ఈ అవుట్ హౌస్‌లో ఉన్నావు? నీకు ఆరోగ్యం బాగా లేదా?” ఆయన చేయి పట్టుకుని ఊపుతూ ఆత్రంగా అడిగింది సుధీర. అప్పటికే ఆమెకళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి.
“లేదురా చిట్టీ , ఊరు పొమ్మంటోంది, పైనుంచి అమ్మేమో రమ్మని అంటోంది. ఇక నా టైమ్ అయిపోయిందిరా...”
“అయ్యో! అంత మాటనకు నాన్నా...” ఏడుస్తూ అంది సుధీర.
“నా మాటకేం కాని, నువ్వు ఎలా ఉన్నావురా? నీ కూతురా?”
“అవును. ఇది సుశీల. షీలా అంటాము. అమ్మ పేరే పెట్టుకున్నాను నాన్నా...
“అలాగా...౯ ఆయన కళ్ళు మెరిశాయి. “చాలా సంతోషంరా... కూర్చోరా అలా... ఎప్పుడనగా బయలుదేరావో, ఏమైనా తిన్నావా?” లేవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు రఘుదేవయ్య.
“అయ్యో! మీరు పడుకోండి నాన్నాా.. అసలు ఇక్కడెందుకున్నావు నువ్వు? ఆ ఇల్లు తాళమేసి ఉందేమిటి? అన్నయ్యా, వదినా ఊరిలో లేరా?” ప్రశ్నల వర్వం కురిపించింది సుధిర.
“౭వ్రలదీ?” అంటూ లోపలికి అడుగుపెట్టింది ఓ మధ్యవయస్మురాలు. ఆమెను సింహాచలంగా పోల్చుకుంది సుధీర.
“సింహాచలం బాగున్నావా?” అంది ఆవ్యాయంగా.
“చిట్టమ్ములూ నువ్వా? ఎంతకాలమైపోనాదమ్మా నిన్ను సూచి! ఎంత పతతతతతతజలాలాజజ అమూల్యం (కథలు,
సేపైనాది వచ్చి? అదిగో తానాల గది, తానం సేసుకుంతారా? నాను వొజ్బం వండేత్తాను” అంది సింహాచలం.
నాన్నగానీ, సింహాచలం గానీ తానంటే ఎలాంటి కోపమూ లేకుండా మాట్లాడటంతో వారి ఆప్యాయతకు సుధీర మనసు ద్రవించిపోయింది. నాన్న నాన్న... తనే ఆయనకి తగిన కూతురు కాదు.
పాపాయికి సింహాచలం సహాయంతో స్నానం చేయించి, బిస్కట్లు తినిపించి, పాలు తాగించి పడుకోబెట్టి తాను స్నానం చేసి వచ్చింది సుధీర. అప్పటికి రఘుదేవయ్యగారికి వెచ్చని నీళ్ళలో తడిపి పిండిన బట్టతో ఒళ్ళు తుడిచి, ఆయన బట్టలు మార్చుకున్నాక, వాలు, రొట్టె తినిపించి, ఆయన విడిచిన బట్టలను ఉతికి ఆరేసి గబగబా గ్యాసుపొయ్యి మీద వంట చేయసాగింది సింహాచలం. కూర తరుగుతున్న సుధీర మనసంతా కల్లోల కడలియైపోయింది. అంత పెద్ద ఇంటికి అధిపతియైన సింహంవంటి నాన్న ఇక్కడ ఇలా అవుట్ హౌస్‌లో ఎందుకున్నారు?
“అది సరే కాని నాన్నా నువ్వేంటిలా ఇక్కడ? ఆ ఇంట్లో ఎందుకుండటం లేదు? అసలు అన్నయ్యా, వదినా లేరా? తలుపులు తాళం వేసి ఉన్నాయేంటి గా ఇక ఆపుకోలేక మళ్ళీ అడిగింది ఆయన్ని. ఆయన ముఖం వివర్ణమయింది. బాధగా నుదురు రాసుకున్నారు. సింహాచలం ఆ విషయాలు ఏవీ అడగవద్దన్నట్టుగా సుధీరకు పైగ చేసి, ఆయన వేసుకునే మాత్రలు తెచ్చి మింగించింది. ఆయన అలసటగా వెనక్కి వాలి నిద్రలోనికి జారారు.
ఏం చేయాలో తోచక కూర వేయిస్తున్న సింహాచలం వైపు చూసింది సుధీర.
జు శి +
కంచంలో అన్నం వడ్డించి తెచ్చింది సింహాచలం. “తిను చిట్టిపాపమ్మా” అంటూ,
సుధీర భోజనం చేస్తుండగా అడిగింది “ఏమ్మా, అల్లుడుగారు బాగున్నారా? తీసుకురావలసింది కదా!”
పెద్ద పెద్ద ఇండుప గింజలంతంత కన్నీటి బిందువులు తింటున్న అన్నంలో పడ్డాయి. కలవరంగా... “అయ్యో, చిట్టెమ్మా, ఏమ్మా, ఎందుకు... ఏమైనాది?” అనడిగింది సింహాచలం. నండూరి సుందరీ నాగమణి లా
ఏం లేదన్నట్టుగా తలూపి నోట్లోని ముద్దని బలవంతంగా మింగి పెరుగు పోసేసుకుంది సుధీర. నొచ్చుకుంది సింహాచలం, తాను మాట్లాడకూదడనిది మాట్లాడినట్టు అనిపిస్తూందడగా.
“కాసేపు పడుకుంటాను సింహాచలం. నువ్వుంటావా?” అనడిగింది.
“నాన్నగోరు లెగిస్తే వాణ్ణం పెట్టి ఎల్తాను చిట్టెమ్మా..” అంది సింహాచలం. “నాన్నకి నేను అన్నం పెడతానులే, నువ్వెళ్ళు...” అని సుధీర చెప్పటంతో సింహాచలం వెళ్ళిపోయింది.
ప్రయాణ బడలిక వల్ల అలా చాపమీద పాపాయి పక్కగా బఒరిగిందే కాని సుధీరకు నిద్ర రాలేదు. మనసు అనే కవ్వం గతమనే సముద్రాన్ని తరచటం మొదలుపెట్టింది.
సుళీల, రఘుదేవయ్య దంపతులకు ఇద్దరే సంతానం. సుందర్ పుట్టిన అయిదేళ్ళ తరువాత పుట్టిన సుధీర పుట్టినప్పటినుండీ రఘుదేవయ్యకు ప్రాణమై పోయింది. అపురూపంగా పెంచుకున్నాడు వావాయిని. సుశీల ఉన్నా సరే తానే పాపకు అన్నం తినిపించేవాడు. సాయంత్రం ఆఫీసునుండి రాగానె పాపను సైకిల్‌పై షికారుకు తీసుకుపోయేవాడు. స్కూల్లో వేస్తే టీచర్లు కొడతారని ఒకటో తరగతి సిలబస్ మొత్తం తానే ఇంట్లో నేర్పించాడు కూతురుకి. సుశీల తరచుగా కోప్పడుతూ ఉండేది రఘుదేవయ్యను. రేపు అత్తారింటికి తరలి వెళ్ళిపోయే పిల్లమీద అంత మమకారం పెంచుకోవటం తగదంటూ... అయినా వినేవాడు కాదు ఆయన.
చెల్లెల్ని (శ్రేమగానే చూసినా, తండ్రి ఎంతో ముద్దు చేసే సుధీర అంటే ఒకింత ఈర్ష్యగా ఉండేది సుందర్‌కి. సుధీర పదవ పుట్టినరోజుకు రఘుదేవయ్యకు పిల్లలు లేని పెదనాన్నగారు చనిపోవటంతో వేరే వారసులు లేని కారణంగా కొంత ఆస్తి కలిసి వచ్చింది. అప్పుడే ఈ స్థలం కొని రెండంతస్టుల మేడ కట్టించాడు ఆయన. సింహాచలం అప్పట్నుందే వారింట్లో పనికి చేరింది.
సుధీర పదవ తరగతి పూర్తిచేసి ఇంటర్‌లో చేరేసరికి సుశీలకు నిండు నూరేళ్ళూ నిండిపోయాయి. తల్లిని వోగొట్టుకున్న సుధీర తండ్రికి మరింత దగ్గరైంది. జీవిత భాగస్వామినిని పోగొట్టుకున్న తన తండ్రికి ఆ బాధ తెలియకూడదని కంటికి రెప్పల్లే చూసుకునేది సుధీర. సుందర్‌కి అప్పటికే పతతతతతతతతతవావావాలఆఆఆాంా అమూల్యం (కథలు,
ఉద్యోగం రావటం వలన అతను ఢిల్లి వెళ్ళిపోయాడు. సుధీర ఉదయమే లేచి, సింహాచలం సాయంతో వంట, టిఫిన్ తయారుచేసి, తండ్రికి పెట్టి, ఇద్దరికీ కారేజీలు సర్ది కాలేజీకి వెళ్ళిపోయిన తరువాత ఆయన ఆఫీసుకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి కబుర్లే కబుర్లు... కలిసి చెస్ ఆడేవారు. కలిసి బాడ్మింటన్ కూడా ఆదేవారు. కాలేజీ కబుర్లు చెప్తూ ఆమె నవ్విస్తే, ఆఫీసు కబుర్లు చెబుతూ ఆమెను ఉత్సాహంగా ఉంచేవాడు ఆయన. రాత్రి భోజనం అయిన తరువాత ఆమె చదువుకుంటూ ఉంటే తాను తోడుగా పక్కనే కూర్చుని న్యూస్ పేపర్ చదువుకునేవాడు రఘుదేవయ్య.
కాలం ఎప్పటికీ ఒకేలా ఎలా సాగుతుంది? సుందర్‌కి మళ్ళీ తమ ఊరికే బదిలీ అయింది. కొడుక్కి మంచి సంబంధమే చూసి పెళ్ళి చేశాడు రఘుదేవయ్య, సుధీర బీ.కామ్. పూర్తిచేసి ఉద్యోగంలో జాయినైంది. మామగారు తన ఆడపడుచుకి అంత ప్రాధాన్యత ఇవ్వటం, ఇంటి వ్యవహారాలన్నీ సుధీర చేతుల మీదుగా నడవటం సుందర్ భార్య ఇందిరకు ఏమాత్రం నచ్చలేదు. కాని కొత్తకోడలు కనుక ఓర్పుగా ఉండేది. వదిన మనసు [గ్రహించిన సుధీర మాత్రం ఇంటిపెత్తనం, బీరువా తాళాలతో సహా వదిన చేతికి ఇచ్చేసింది.
సుధిరకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టిన రఘుదేవయ్యగారు సుధీర చెప్పిన విషయం విని మొట్టమొదటిసారిగా ఆమెపై ఆగ్రహానికి గురయ్యారు. తన సహోద్యోగిని ఇష్టపడుతున్నానని ఆమె చెప్పిన మాటలు ఆయనకి ఎంత మాత్రం నచ్చలేదు. ఆచార. వ్యవహారాలు వేరు కాబట్టీ, కులాంతరానికి తాను ఆమోదించనని చెప్పారాయన. అదీగాక ఆమె చేపట్టాలనుకున్న ప్రతాప్‌కి ఇద్దరు తమ్ముళ్ళూ, ఇద్దరు చెల్లెళ్ళూ ఉన్నారు. ఆ బాధ్యతలతో తన చిట్టితల్లి ఏమైపోతుందో అన్న పితృప్రేమ కూదా ఆయన్ని ఆ పెళ్ళికి అభ్యంతరం చెప్పటానికి పురికొల్పింది.
కాని అదేదో సామెత చెప్పినట్టు నిందా (ప్రేమలో మునిగిపోయిన వారికి ఎవరి మాటా పట్టదు కదా... తననెంతగానో (ప్రేమించే తండ్రి తన అభీష్టానికి అడ్డం చెబుతాడని అనుకోలేదు సుధీర. చిన్నతనం నుంచీ (ప్రేమగా, ప్రాణంగా పెంచిన తండ్రికన్నా ప్రతాప్ మనసుకు మక్కువయ్యాడు. అంతే, ఓ సుముహూర్తాన ఇంట్లోంచి వెళ్ళిపోయి ్రతాప్‌ను పెళ్ళిచేసేసుకుంది సుధీర.
మననా వాచా నమ్మిన స్నేహితుడు వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో అర్ధమైంది రఘుదేవయ్యకి. భార్య చనిపోయినప్పుడు దుఃఖించాడో లేదో తెలియదు నండూరి సుందరీ నాగమణి తా
కాని కూతురి పెళ్ళి వార్త విని అంత పెద్దమనిషీ ఆడపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పటికే బదిలీ చేయించుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోయింది సుధీర. శు శ ఓ
రంగుల వలయం కరిగిపోయి, కటిక చేదు వాస్తవాలు కళ్ళ ముందు కనబడసాగాయి. వేరే రాష్ట్రంలో విడి కాపురం పెట్టి ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఆ దంపతుల మధ్య అపార్ధాలు, కలతలు మొదలయ్యాయి. అప్పటికే పాపాయికి తల్లి అయింది సుధీర. ప్రతాప్ తమ ఇద్దరి జీతం కూడా విలాసంగా ఖర్చు పెట్టేసేవాడు. ఒక్క పైసా కూడా జమ చేసేవాడు కాదు. పోనీ అతని తల్లిదండ్రులకు కాని, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు కాని ఏ విధమైన ఆర్థిక సహాయమూ చేసేవాడు కాదు.
అతని స్నేహితుల ప్రభావం కూడా అతని మీద పడి, మెల్లమెల్లగా మద్యపానం, పేకాట అలవాటయ్యాయి. అతన్ని మార్చటానికి ప్రయత్నించి ప్రయత్నించి, విసిగి వేసారిపోయింది సుధీర. ఓ వైపునుంచి తమ కొడుకును తమనుంచి వేరు చేశావని ఆమెను శాపనార్థాలు పెడుతూ అత్తగారింటినుంచి ఫోన్ కాల్స్, తనొక శత్రువులా కనబడుతూ నిత్యమూ తనను ద్వేషించే తన భర్త... ఇతన్నేనా తాను దేవుడని భావించి, తన పితృదేవుణ్సి సైతం కాదని వచ్చేసింది! అసలు ఇతని గురించి ఏం తెలుసని పుట్టి, పెరిగిన పాదును తెంచుకొని వచ్చేసింది? ఏ భరోసాతో? తనమీద తనకే అసహ్యం కలగటంతో అతన్నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది సుధీర. అందుకే తన ఊరికే బదిలీ చేయించుకొని, పాపను తీసుకుని వచ్చేసింది.
శ స *
సింహాచలం ద్వారా అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటీ తెలుసుకొని నివ్వెరపోయి, ఆపై కుమిలిపోయింది సుధీర. రఘుదేవయ్యగారు ఆస్తి మొత్తాన్ని రెండు భాగాలు చేసి, సుందర్‌కీ, సుధీరకీ రాస్తే సుందర్, అతని భార్యా ఆయనమీద విరుచుకుపడ్డారు. తండ్రిని కాదని లేచిపోయిన కూతురికి ఆస్తి ఇచ్చినందుకు ఆయన్ని దుయ్యబట్టారు. “సుధీర ఎక్కడున్నా అది తన కూతురే అని, తన ఆస్తికి వారసురాలే...” అని నాక్కి చెప్పారాయన. దాని ఫలితమే వ్యాధిగ్రస్తుడైన ఆయనకి వైద్యం సైతం చేయించకుండా అవుట్ హౌస్‌లో పదేసి తాను భార్యాపిల్లలతో టూరుకి వెళ్ళిపోయాడు సుందర్. లతా అమూల్యం (కథలు)
“అన్నయ్య సంగతి సరే, నీ మాటేమిటి? నువ్వు మీ నాన్నకి చేసిన ద్రోహం విషయమేమిటి?” ఆమె అంతరాత్మ ఆమెను నిలదీసింది.
“విపులంగా మాట్లాడి ఆయనను ఒప్పించటానికి బదులుగా, వివాహ విషయంలో నీ అభీష్టాన్ని కాదన్నాడని ఆయనకి ఎంతో దూరంగా పారిపోయావు. ఎంతో అనుభవంతో, ముందుచూపుతో నీ సుఖం, శాంతి కోరుకునే నీ తండ్రి మాటలని పెడచెవిని పెట్టి ఆ త్రాప్పుడిని పెళ్ళి చేసేసుకున్నావు. కాపురానికి వెళ్ళిన తర్వాత “తండ్రి ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు? అన్న ఇంగితం నీకు లేకపోయింది. ఇప్పుడు కూడా నువ్వు ఆయన మీద (పేమతో మాత్రం తిరిగి రాలేదు. ప్రతాప్‌ను వద్దనుకున్నావు కాబట్టి, అతనితో జీవితం నరకమైంది కాబట్టి నాన్న గుర్తుకు వచ్చి ఇక్కడికి బదిలీ చేయించుకున్నావు. నీ అన్నను నిందించే హక్కు నీకు లేదు. చేతనైతే ఆయన పోగొట్టుకున్న (ప్రెమానురాగాలను తిరిగివ్వటానికి ప్రయత్నించు. ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించే మార్గాలు అవలంబించు. తండ్రి బుణం తీర్చుకొనే సువర్ధావకాశాన్ని ఏ మాత్రమూ వదులుకోకు...? గట్టిగా చెబుతున్న మనస్సాక్షి మాటలకు సిగ్గుతో తలవంచుకుంది సుధీర.
కూతురి కాపురం ముక్కలైందన్న విషయం తెలుసుకున్న రఘుదేవయ్యగారి వేదనకు అంతు లేకుండా పోయింది. శారీరక బాధకు తోడు మానసిక వేదన తోడైంది. కాని అంతలోనే తేరుకున్నారు. తెలియక ఒక బురదలో అడుగేసింది. తన కూతురు. అది బురదని తెలిశాక అందులోంచి బయటపడింది. ఇప్పుడు తాను అక్కున చేర్చుకొని, ఆమెకు నైతికబలాన్నివ్వాలి. 'సుధీరి అని. పేరు పెట్టినందుకు ఆమె సార్థక నామధేయ అవ్వాలి. అలా కావాలంటే తాను ముందు ఈ రుగ్మతనుంది బయటపడి, కూతురుకి, మనవరాలికి అండగా నిలవాలి.
“నాన్నా నన్ను క్షమించు...” అన్న సుధీర తలమీద చేయి వేసి నిమిరాడు . రఘుదేవయ్య. ఆ స్పర్శ ఆమెకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. కర్తవ్యం స్ఫురించింది. వెంటనే సింహాచలం సహాయంతో రెండు వీధుల అవతల ఒక ఇల్లు చూసి, అక్కడికి తండ్రితో సహా మారిపోయింది. ముందూ వెనుకా ఎవ్వరూ లేని సింహాచలాన్ని తమతో ఉండిపొమ్మని కోరింది. తను ఉద్యోగంలో తిరిగి చేరింది. రఘుదేవయ్యగారిని డాక్టరుగారి దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయించటం మొదలుపెట్టింది. నండూరి సుందరి నాగమణి ---౮ాాాలాాలంంంంం భా
తనకు తండ్రి ఆస్తి ఒక్కరూపాయి కూడా అవసరం లేదు. కాని ఆయనకి? తన స్వార్టితమైన ఆస్తిని మొత్తం కైవసం చేసుకోవటమే కాకుండా, వయసుడిగిన తండ్రిని అనాధకుమళ్లే అలా అవుట్ హౌస్‌లో పడేయటం అనే అమానుష చర్యను గర్జించలేకుండా ఉండలేకపోయింది. ఆయనకి న్యాయం జరగాలి. అందుకే లాయర్ని సంప్రదించాలని నిర్ణయించుకుంది సుధీర.
“నాకు నువ్వు చాలురా, వేరే ఆస్తులేమీ అక్కరలేదు. నా చిట్టితల్లి నా దగ్గరకు వచ్చెసింది. అంతకన్నా ఐం కావాలి?” అన్నాడు రఘుదేవయ్య, “నాక్కూడా నువ్వు చాలునాన్నా... నాకిప్పుడు ఇద్దరు పిల్లలు... ఇద్దరూ పసివాళ్ళ... మీ ఆలనా పాలనా కన్నా నాకు కావలసిందేమీ లేదు. కాని నీకు న్యాయం జరగాలి... అంతే...” దృధనిశ్చయంతో చెప్పింది సుధీర.
తన కూతురికి పలకమీద అక్షరాలు దిద్దిస్తున్న తన తండ్రిని చూస్తుంటే, “తాము అనాధలం కాము అన్న భావనతో సుధీర హృదయం, కన్నీటితో ఆమె నయనద్వయం నిండిపోయాయి.
(మాలిక వెబ్ పత్రిక, జూలై 2014) అ ఈ అ వత అమూల్యం (కథలు)
అమూల్యం
భగవంతుడు కొన్ని పరిచయాలను పరిచయాలుగానే ఉంచేస్తాడు.
కొన్నింటిని బలమైన బంధాలుగా మార్చేస్తాడు. అదే ఆయన లీల... శ శస శ
“అరేయ్, ఊరొచ్చేస్తోందిరోయ్...” హుషారుగా ఈలేశాడు డ్రైవర్ పక్కనే కూర్చున్న సుధాకర్. ప్రక్కనే నిద్రపోతున్న నీలేష్ రూపేష్ ఉలిక్కిపడి లేచారు. మొబైల్‌లో పాటలు వింటున్న మిగతావాళ్ళు కూడా అలెర్ట్ అయిపోయారు. పచ్చని పంటపొలాల మధ్య బద్ధకంగా పడుకొని ఉన్న నల్లని నాగుపాములాంటి రోడ్ మీద వేగంగా దూసుకుపోతోంది మా వాహనం. సాయంత్రం నాలుగవుతున్నా నడి వేసవి కావటంతో చండప్రచండంగా చెలరేగిపోతున్న సూర్యప్రతాపం ఏ మాత్రం తగ్గలేదు.
నా పేరు ప్రణయ్. హైదరాబాద్‌లో ఒక చిన్న సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాను నేను. వీళ్ళంతా నా (ఫెంద్ మధు సహోద్యోగులు. వాడు కూడా హైదరాబాద్‌లోనే వర్క్ చేస్తున్నాడు. మొత్తం పదిమందిమీ కృష్ణాజిల్లాలోని ఈ పల్లెలో రేపు అర్ధరాత్రి దాటాక జరగబోతున్న మధు పెళ్ళికి బయలుదేరి వస్తున్నాము. లీవ్ ఇవ్వనన్న బాస్‌ను బ్రతిమాలి ఒప్పించి, ఆఖరి క్షణంలో వీళ్ళతో పాటు నేనూ బయలుదేరాను. వీళ్ళతో పరిచయమే తప్ప నాకు పెద్దగా (ఫెండద్నిప్ లేదు.
ఊరిలోకి ప్రవేశించి, రెందు వీధులు దాటగానే కనబడింది రంగులతో మెరిసిపోతున్న ఓ మూడంతస్తుల భవనం. దాని ముందు వేసి ఉన్న పచ్చగా మెరుస్తున్న పెద్ద తాటాకుల పందిరి... మామిడాకుల తోరణాలు, కొబ్బరిమట్టలతో చుట్టిన స్తంభాలతో అలంకరించబడి ఉంది. మా టాటా సుమో వచ్చి సరాసరి అక్కడే ఆగింది. మధు పెళ్ళి పెద్దలతో అక్కడే నిలబడి ఉండటం చూసి, అదే విడిదిల్లు అనీ, మావాడు మా కోసమే ఎదురుచూస్తున్నాడనీ అర్ధమైంది. నండూరి సుందరీ నాగమణి ----౮ాాాంాం భు
మా వాళ్ళంతా గబగబా మధూ చుట్టూ చేర, కరచాలన ఆలింగనాలతో వాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే, ప్రక్కగా నిలబడి చిరునవ్వుతో పరికిస్తూ ఉండిపోయాను నేను.
“అరె, రారా కవికుమారా, రా... లీవ్ దొరకలేదన్నావు కదా, రావటం ఎక్కడ మానేస్తావో అని భయం వేసింది. పోన్లే, వచ్చేశావు. ఇక్కడ నీకు రాసుకోవటానికి బోలెడన్ని కవితా వస్తువులూ, ప్రకృతి దృశ్యాలూ...” అని ప్రేమగా నన్ను కౌగలించుకొన్నాడు మధు. తర్వాత మా అందరినీ తన మామగారు ఆదిశేషయ్యగారికి, బావమరది కుమార్‌కు పరిచయం చేశాడు.
విడిదింట్లో మాకిచ్చిన రూముల్లో దిగి, స్నానాలవీ కానిచ్చి అందరమూ రెడీ కాగానే, కాఫీలూ, టిఫిన్లు తరలి వచ్చాయి మా కోసం. దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. మా వాళ్ళు అడిగిన బ్రాండ్ సిగరిట్లు, కార్ట్ సెట్లు, కూల్‌డ్రింకులు క్షణాల్లో రప్పించబడ్డాయి. అందరూ సిగరెట్లు ఊదేస్తూ, పేకాట మొదలుపెట్టెశారు. నేను వాళ్ళకు ఓ ప్రక్కగా పుస్తకం చదువుకొంటూ కూర్చొన్నాను. పది నిమిషాల తర్వాత మధు వచ్చి మాతో కూర్చొన్నాడు.
“అరే, మధూ, నువ్వేం చేస్తావో మాకు తెలియదు కానీ, రాత్రికి మాత్రం డ్రింక్స్ అరేంజ్ చేయాల్సిందే...” డిమాండ్ చేస్తున్న మిత్రుల వైపు చూసి నవ్వుతూ, “అరె, ఆ మాత్రం నాకు తెలియదూ? ఆ ఏర్పాట్లు అన్నీ ఎప్పుడో పూర్తయాయి లేరా...” అని చెప్పి, “మరి మన బుద్ధిమంతుడికసలు ఆ వాసనే పదదు కదురా,
' ఎలా మరి?” అని నావైపు నవ్వుతూ చూశాడు మధు. అంతలో అటువైపు కుమార్ రావటంతో, అతన్ని పిలిచి, నా కోసం సెపరేట్‌గా ఒక రూం అరేంజ్ చేయమని కోరాడు వాడు. వాడి వైపు కృతజ్ఞతగా చూశాను.
“నేను వెడదతానురా, అవతల అమ్మా, నాన్నా ఎదురుచూస్తున్నారు...” అంటూ లేచాడు మధు. “మరి నీ కాబోయే శ్రీమతిని ఎప్పుడు చూపిస్తావురా?”
ముక్తకంఠంతో అడిగారందరూ.
“రేపు ఉదయమే చూపిస్తాను సరేనా? ఈ రోజంతా ఎంజాయ్ చేయండి. ఏరా, బుషిపుంగవా, మరి నీ కాలక్షేపం సంగతి ఏమిటి? ఇక్కడికి దగ్గరలోనే వేణుగోపాలస్వామి గుడి ఉంది. చాలా బావుంటుందక్కడ, వెళ్తావా?” మధు అదిగాడు నన్ను.
“అలాగేరా మధూ, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత నా నేస్తా
అతనూ అమూల్యం (కథలు)
లున్నాయిలే...” అంటూ నా వెంట తెచ్చుకొన్న పుస్తకాలు చూపించాను. మధు నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు.
“మీకు ఆ కార్నర్ రూము అరేంజ్ చేశాను. మీ లగేజ్ అక్కడ పెట్టిన్తాను” అంటూ వచ్చాడు కుమార్. అతనికి థాంక్స్ చెప్పి, గుడి ఎటువైపో అడిగి తెలుసుకొని, (ఫెంద్స్‌తో చెప్పి బయలుదేరాను.
జ శు ఈ
మే నెల కావటంతో సాయంకాలం ఆరున్నరవుతున్నా ఇంకా సంజ వెలుగులు తగ్గలేదు. చల్లని పైరగాలులు వీస్తుంటే, స్నానం చేసిన మేనికి హాయిగా అనిపించసాగింది. ఆలయం పదినిముషాల నడక దూరంలోనే ఉంది. మెల్లగా నడుచుకుంటూ, ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టాను.
చుట్టూ జేగురు రంగు వేసిన ప్రాకారం నడుమ విశాలప్రాంగణంలో, విరబూసిన పూలవృక్షాల మధ్య ఎంతో అందంగా కనిపించింది దేవాలయం. అప్పుడే నేలంతా చల్లని నీటితో తడిపారేమో, కమ్మని మట్టి పరిమళం ఆహ్లాదంగా నా మనసును పరవశింపజేసింది.
ఎత్తెన గాలిగోపురం మీద పావురాలు గుంపులు గుంపులుగా కువకువలాడు తున్నాయి. గర్భగుడిలో కొలువైన నల్లని వేణుగోపాలస్వామి విగ్రహం,చేతిలో వేణువుతో, పెదవులపై దరహాసంతో, తలపై నెమలిపింఛంతో మెడలో మల్లెల మాలలతో అద్భుతంగా అనిపించి, క్షణకాలం మా ఊరిలోని రామాలయంలో కొలువైన నీలమేఘశ్యాముదైన శ్రీరామచంద్రుడిని జ్ఞప్తికి తెచ్చింది.
ప్రశాంతమైన మనసుతో స్వామికి నమన్మ్కరించి, అర్బ్చకులిచ్చిన తీర్ధప్రసాదాలు స్వీకరించి, విశాలమైన ఆ మంటపంలో ఒక ప్రక్కగా కూర్చున్నాను. సన్నగా అలముకొంటున్న చికట్లపై తన కిరణాల్ని చల్లగా కురిపిస్తున్న నెలరాజును చూస్తూ బ్యాగ్‌లోంచి డైరీని తీసి ఆ ఆలయాన్ని ఆ వాతావరణాన్ని మనసు పొందిన సాంత్వనాన్ని కవితారూపంలో అక్షరికరించసాగాను.
వ్రాసుకోవటం పూర్తయ్యాక ఇష్టంగా ఉత్పలను తలచుకున్నాను. వచ్చే సంవత్సరం ఈ సమయానికి మా వివాహం కూడా జరిగిపోతుంది. మా ఊరిలో తాతయ్య, అమ్మమ్మల చేతుల మీదుగా పెళ్ళి చేసుకోవాలని నా ఆలోచన. మా నాన్న ఉద్యోగరీత్యా ఢిల్లిలో ఉన్నారు. నా చిన్నప్పుడే అమ్మ పోతే, నాన్న మరో పెళ్ళి చేసుకోవటంతో తాతయ్య దగ్గరే చిన్నప్పట్నుండీ పెరిగాను. ఆయనది
నండూరి సుందరీ నాగమణి
గోదావరి జిల్లా. వ్యవసాయం చేసుకొంటూ ఊరిలోనే ఉన్నారు. మా ఊరు, గోదావరి, అక్కడి ప్రకృతి అందాలు అంటే ప్రాణం నాకు. మొదట్నుండీ నాలో భావుకత కూడా ఎక్కువే కావటంతో కథలు, కవితలూ వ్రాయటం అలవాటైంది. ఇప్పుడిప్పుడే నా రచనలూ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం హైదరబాద్‌లో ఉద్యోగంలో చేరేవరకూ నేను తాతయ్య దగ్గరే ఉండేవాడిని. ఏడాది నుంచీ ఉత్పలతో పరిచయం... ఈ మధ్యే అది (ప్రేమగా మారింది. ఉత్పల వాళ్ళ అక్కయ్య పెళ్ళి కాగానే మేము పెళ్ళి చేసుకోవాలని అనుకొన్నాము. ఉత్పలను తలచుకొంటే చాలు, నా మనసంతా హాయిగా అయిపోతుంది. ఆలోచనలలో పడిన నేను టైం చూసుకోలేదు. చిన్న పూజారి వచ్చి గుడి మూసివేస్తున్నామని చెప్పటంతో లేచాను. నేను రూంకి చేరేసరికి నా స్నేహితులందరూ అమృతసేవనంలో మునిగి ఉన్నారు. నన్ను కూడా జాయినవమని పిలిచారు.కానీ చిరునవ్వే సమాధానంగా సరిపెట్టి, మధు వాళ్ళ రూంకి వెళ్ళాను. అప్పుడే వాళ్ళంతా భోజనాలకి కూర్చుంటున్నారు. మధూ వాళ్ళ నాన్నగారు నన్ను సాదరంగా పిలిచి, తన ప్రకృనే కూర్చోబెట్టుకొని, “నీ స్నేహితులందరిలో నాకు నచ్చింది, ఈ అబ్బాయేరా...” అన్నారు మధూతో. భోజనం అయాక, కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పి, ప్రయాణ బడలిక వల్ల నిద్ర వస్తూండటంతో నాకిచ్చిన రూంకి వచ్చి, బట్టలు మార్చుకొని కాసేపు ఫోన్‌లో ఉత్పలతో కబుర్లాడి, నిద్రకుపక్రమించాను. ఒళ్ళు తెలియనంత గాఢనిద్ర పట్టిందా రాత్రి. శు 1 * తెలతెలవారుతూ ఉండగా సన్నాయి మేళం (శ్రావ్యంగా మైోగుతూ మేలుకొలుపు పాడింది. బయటకు వచ్చి చూశాను. మధూ వాళ్ళ రూములో అందరూ చాలా హడావుడిగా ఉన్నారు. అప్పుడే నిద్ర లేచిన మధూ నన్ను చూసి నవ్వి, “గుడ్మార్నింగ్” చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు... ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకల్ల మధుని పెళ్ళికొడుకుని చేస్తారని. నేను కూడా గబగబా కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం ముగించి, మంచి బట్టలు వేసుకున్నాను. మిగిలిన మిత్రులెవరూ ఇంకా నిద్ర లేవలేదు. నేను వెళ్ళి మధూ వాళ్ళ జా అమూల్యం (కథలు)
రూము బయట పందిట్లో వేసిన కుర్చీల్లో కూర్చున్నాను.
ఒకమ్మాయి వచ్చి “కాఫీ తాగారా సార్?” అని అడిగింది మర్యాదగా.
ఇంకా లేదన్నట్టు తలూపి, ఇవ్వమన్నట్టు ముఖం పెట్టాను.
ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ “మీరు?” అన్నాను.
“మ్సీరని మన్నించనక్కర లేదు. నేను పనిమనిషిని...” అంది ఆమె నవ్వుతూనే.
ఆమె ప్రసన్నవదనం, చిరునవ్వుతో పలుకరించే కళ్ళు, మాటల్లో సంన్మారం, భాష ఆమె పనిమనిషని అనిపించనివ్వలేదు.
“చాలా థాంక్స్, కాఫీ చాలా బావుందండీ” అన్నాను, ఖాళీ కప్పు అందిస్తూ.
“మీ కాంప్లిమెంట్స్ వంటమనిషికి అందజేస్తాను. మీరు టిఫిన్ తినాలంటే చెప్పుండి, పట్టుకొన్తాను, రెడీ అవుతోంది...” అని చెబుతూ ఉంటే, “బుజ్జమ్మా, ఇటు త్వరగా రా...” అంటూ ఎవరో పిలవటంతో వెళ్ళిపోయింది.
రంగు తక్కువైనా కళగల ముఖం, చక్కని తెలుగు సంప్రదాయాన్ని స్ఫురింపజేసే లంగా, ఓణీల్లో ఎంతో కుదురుగా ఉంది. చదువుకున్నట్టుంది, బుజ్జమ్మట పేరు, తమాషాగా ఉంది. ఉత్పలను లంగా ఓణీల్లో ఊహించసాగాను. ఆమె నాకు పరిచయం అయింది మొదలు షర్ట్ ప్యాంట్లలోనో, స్కర్ట్ బ్లౌజ్‌లలోనో, జీన్స్ కుర్తాలలోనో, అరుదుగా చుడీదార్ (దైస్‌లోనో తప్ప ఎప్పుడూ చీరలో కాని, లంగా ఓణీలలో కానీచూడలేదు. అంత అందమైన అమ్మాయి, ముద్దొచ్చే ఈ దైస్‌లో మరింత ముచ్చటగా ఉండదూ? ఈసారి తప్పకుండా వేసుకొమ్మని అడగాలి తనను... ఇంతలో మళ్ళీ వచ్చిన బుజ్జమ్మ నా చేతిలో న్యూస్ పేపరు పెట్టింది. మరో అయిదు నిమిషాల్లో టిఫిన్లు సిద్ధం అవుతాయని, డైనింగ్ హాల్‌కి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది.
టిఫిన్ సెక్షన్ అయ్యక, మెల్లగా నిద్ర లేచిన మా బ్యాచ్ అంతా జాయినయ్యారు ఫంక్షన్ కోసం. మధును పెళ్ళికొడుకును చేసిన తర్వాత వాడు మా అందరికీ అమ్మాయిని చూపించటం కోసం నాలుగిళ్ళవతలే ఉన్న పెళ్ళివారింటికి తానే స్వయంగా మమ్మల్ని తీసుకువెళ్ళాడు.
దీప్తిని కూడా పెళ్ళికూతుర్ని చేసినట్టున్నారు, కొత్త జరీ పట్టుచీరలో, బుగ్గన చుక్కతో, కళ్యాణతిలకంతో అందంగా మెరిసిపోతోంది. నండూరి సుందరీ నాగమణి లతా
మధు కూడా అంతే. సరికొత్త కాంతులీనుతున్నాడు. ఇద్దర్నీ పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీశాను ఎంతో ఉత్సాహంగా. జంట ఎంతో చూడముచ్చటగా, (మేడ్ ఫర్ ఈచ్ అదర్'లా ఉంది. మా అందరినీ దీప్తికి పరిచయం చేశాడు మధు. తను కూడా కొత్త లేకుండా ఎంతో పరిచయమున్నట్టు స్నేహంగా పలకరించిందందరినీ,
అక్కడ కూడా బుజ్జమ్మ పెళ్ళి నామానులు సర్దుతూ కనబడింది. పలకరింపుగా చిరునవ్వు నవ్వాను. తర్వాత మా వాళ్ళంతా మార్నింగ్ షో సినిమాకి వెళితే, నేను పొలాలవైపు వెళ్ళాను. నాకు తాటిముంజెలు తినాలని ఉంది మరి.
ఆదిశేషయ్యగారు నాకు తమ చిన్న పాలేరు సూరిని తోడు ఇచ్చి పొలంవైపు పంపించారు. వెళ్ళగానే అక్కడి కూలీలు కొబ్బరి బొండాంలు కొట్టిచ్చారు. ఒక్కో బొండాం చిన్నసైజ్ బిందె అంత ఉంది. ఒకటి తాగేనరికే కడువు నిండిపోయినట్టనిపించింది. అతికష్టం మీద మరొకటి తాగి, లేత కొబ్బరి తిన్నాను ఇష్టంగా. తరువాత వాళ్ళ పొలం అంతా తిప్పి చూపించాక, తోట కూడా చూపించారు. కూరగాయలు, పూలు, పళ్ళు సాగుచేస్తున్నారు.
మామిడి, సపోటా, నిమ్మ, నారింజ చెట్లున్నాయి. మామిడికాయలు విరగకాసి ఉన్నాయి.
మల్లె అంటుల్ని మడులలో పెంచుతున్నారు. విరగబూసి ఉన్న మల్లెపొదలు చెప్పలేనంత మత్తైన సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. అక్కడ కొంతమంది కూలీలు మళల్లిమొగ్గల్ని కోసి బుట్టల్లోకి వేస్తున్నారు. మరోవైపు జాజిపందిళ్ళు, కనకాంబరం మడులు కూడా ఉన్నాయి.
మరో పక్క రకరకాల రంగు రంగుల గులాబీలు కనువిందు చేశాయి. అప్పటికే తెంపిన జాజుల్సీ కనకాంబరాల్ని రంగురంగుల గులాబీలను, మరువాన్ని బుట్టల్లో సర్ది పెట్టారు.
“ఇవన్నీ మార్కెట్‌కి పంపిస్తారా?” సూరినడిగాను ఆసక్తిగా.
“రోజూ ఐతే మార్కెట్‌కి, వేణుగోపాలస్వామి గుడికీ పంపిస్తారు గానండి, ఈ రోజు పాపగారి పెళ్ళి కదండీ, అందుకని ఇవన్నీ గుడికి, పెళ్ళి పందిట్లోకే...” హుషారుగా చెప్పాడు వాడు.
ఆదిశేషయ్యగారి టేస్ట్‌ను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాను. తతా అమూల్యం (కథలు,
పూల దగ్గరనుండి ఇవతలికి వచ్చి మామిడిచెట్టు నీడలో ఉన్న అరుగుమీద కూర్చున్నాను. సూరి అక్కడికి ముంజికాయ గెలలు పట్టి ౦చుకొచ్చేశాడు.
“తినండి అబ్బాయ్‌గారూ, మీకు కావలసినన్ని ముంజెలు” అంటూ కొడవలితో కొట్టిస్తూంటే బొటనవేలితో పొడుచుకుంటూ అరడజను పైనే లాగించేశాను.
లేత ముంజెను వేలితో పొడవగానే, ఆ లేతరసం ఫౌంటెన్‌లా ఫోర్స్‌గా పైకి ఎగజిమ్మటం, అప్పుడప్పుడూ కంట్లో పడటం చాలా బావుంటుందెప్పుడూ.
చిన్నప్పుడు ముంజెలు తిన్నాక, ఆ ఖాళీ బుర్రలతో బండి చేసుకుని తోసుకుంటూ తిరుగుతూ ఆడుకోవటం గురొచ్చి నవ్వుకున్నాను. ఇంతలో నా సెల్ మ్రోగింది.
అవతలినుంచి మధు... “ఎండలో ఎక్కడ తిరుగుతున్నావ్‌రా? త్వరగా వచ్చెయ్, భోజనం టైం అయింది కదా...” అని కేకలెయ్యటంతో సూరిగాడితో సహా ఇంటిముఖం పట్టాను. కొబ్బరినీళ్ళు, ముంజెలు బాగా పట్టించటంతో అసలు ఆకలి లేకపోయినా, వాడికోసమని కొంచెం తిన్నాననిపించి, రూంకి వచ్చి నిద్రలోకి జారిపోయాను.
పక శర శ
సాయంత్రం ఐదింటికి నిద్ర లేచి బయటకొచ్చేసరికి ఒక అపురూపమైన దృశ్యం కనిపించింది. బుజ్జమ్మ, మరికొందరు అదే ఈడు అమ్మాయిలు మల్లిపూలు రాశిగా పోసుకొని దండలు కడుతున్నారు. అప్పుడే విచ్చీ విచ్చకుండా విచ్చుకుంటున్న మల్లెలు గుప్పున తమ పరిమళాలు గాలిలో వ్యాపింపజేస్తున్నాయి. అనుకోకుండా “గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా...” అనే దాసం గోపాలకృష్ణగారి పాట నా మదిలో మెదిలింది.
అప్పుడు గమనించాను నాలో ఏదో అనీజీనెస్ మొదలైందని. బాగా జలుబు చేసి, సన్నగా తలనొప్పి మొదలైంది. వెలుతురు చూడలేకపోతున్నాను. బయట కూర్చోవాలనుకున్నా కూర్చోలేక రూములోకి వెళ్ళి పడుకున్నాను. కాసేపటికే బాగా జ్వరం వచ్చింది.
మధుకు కాని, మిగతా (ఫెంద్స్‌కి కాని చెప్పాలనుకున్నాను కాని, 'అదే తగ్గిపోతుందిలే, పాపం వాళ్ళ మూడ్ పాడుచేయటం ఎందుకని” ఊరుకున్నాను. నండూరి సుందరీ నాగమణి లాలా
మరో పదినిమిషాల్లోనే చలి కూడా మొదలైంది.
ఇంతలో నన్ను పిలవటానికని వచ్చిన కుమార్ కంగారుగా తట్టి లేపాడు కానీ నేను బరువెక్కిన కనురెప్పలను తెరవటానికి కూడ చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ నిద్రలోకి జారిపోయాను. తర్వాత మగత నిద్రలో డాక్టర్ రావటం, ఇంజక్షన్ ఇవ్వటం లీలగా తెలిసింది.
సడన్‌గా మెలకువ వచ్చేసింది. క్షణకాలం వాటు ఎక్కడున్నానో అర్ధం కాలేదు నాకు. ఒళ్ళంతా చెమటలు పట్టెశాయి. ఎంతో నీరసంగా ఉంది. నుదుటిమీద తడిగా తగలటంతో తడుముకుని చూస్తే, చల్లని నీటితో తడిపి, నాలుగు మడతలు వేసిన జేబురుమాలు బహుశా జ్వరం తగ్గటానికనుకుంటాను పట్టీలా వేసివుంది.
ట్రైమెంతయిందో... అనుకుంటూ, అతి కష్టంమీద పక్కకు తిరిగి దిండు కింద ఉన్న సెల్ అందుకొని చూస్తే రాత్రి పది అవుతోంది.
“అమ్మో, ఎంతసేపు నిద్రపోయాను, పన్నెండున్నరకే కదా మధూగాడి పెళ్ళి...” అనుకుంటూ మంచం మీదనుంచి లేవబోయి, తూలి పదబోయాను. ఎక్కడినుంచి వచ్చిందో గాన్ బుజ్జమ్మ గబుక్కున వచ్చి పదకుండా పట్టుకుంది నన్ను “థాంక్స్” అస్పష్టంగా అన్నాను.
“ఎందుకు లేచారు? మీకసలు ఒంట్లో బాగాలేదు కదా!” అంది నన్ను మంచం మీద కూర్చోబెడుతూ. “అదే... మధూ పెళ్ళికి వెళ్ళాలి కదా” అన్నాను తదబాటుగా. ఏమిటో నోరంతా చేదుగా ఉండి, నాలుక మొద్దుబారిపోయినట్టయి మాట కూడా సరిగ్గా రావటం లేదు.
“మీకు 102 టెంపరేచర్ ఉంది. పైగా చాలా నీరసంగా ఉన్నారు. దాక్టరుగారేమో 'ఫ్లూ అని, మిమ్మల్ని మంచం దిగనీయవద్దని చెప్పారు. మీరు ఇప్పుడు పెళ్ళి చూడటం ముఖ్యం కాదు. కోలుకోవటం ముఖ్యం. పాలు తాగేసి పడుకోండి” అని వ్లాస్క్‌లోంచి గాజుగ్రసులోకి పాలు వంచింది. మరో గ్లాసులో సగానికి గోరువెచ్చని నీళ్ళు నింపి టాబ్లెట్స్ నోట్లో వేసి నీళ్ళు తాగించింది. పాలు తాగించబోతుంటే, “నేను బాత్‌రూంకి వెళ్ళాలి అన్నాను మొహమాటంగా.
“అయ్యో” అంటూ మెల్లగా లేపి, పట్టుకొని నడిపిస్తూ బాత్‌రూం తలుపు తెరిచి, “జాగ్రత్తగా గోడలు పట్టుకుని వెళ్ళండి లోపలికి. తలుపు దగ్గరగా వేసి ఉంచండి... జాగ్రత్తొ అని హెచ్చరించి లోపలికి పంపించింది. తిరిగొచ్చాక ఆమె పతతతతతతతతతతతతతతతతతజ అమూల్యం (కథలు,
అందించిన పాలు అతికష్టం మీద తాగగలిగాను.
“పడుకోండి...” మృదువుగా చెప్పింది.
“చాలా థాంక్స్. నువ్వు పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాను.
చిన్నగా నవ్వింది. “మీకు బాగా లేదు కదా, మీ పరిచర్యను నాకప్పగించారు. అందరూ బిజీగా ఉన్నారు కదా మరి!”
“నీకు ఏం సంబంధం? అందులోనూ ఆడపిల్లవి మొహమాటంగా అన్నాను.
“నేను కొన్నాళ్ళు డాక్టర్‌గారి హాస్పిటల్‌లో పనిచేశాను. ఇంజక్షన్ ఇవ్వటం అదీ వచ్చు. అందుకని నన్నుందమన్నారు. ఏంఫరవాలేదు లెండి, మీకు తగ్గీవరకూ మీ బాధ్యత నాదే... ఆదపిల్లనని ఫీలవకండి.”
“ఐం చదువుకున్నావు బుజ్జ్వమ్మా?”
“నా పేరు సాంత్వన. ఇక్కడందరూ బుజ్జమ్మనే పిలుస్తారనుకోండి. మా నాన్న సుబ్బయ్య ఆదిశేషయ్యగారి దగ్గర పాలేరు పని చేస్తాడు. మా అమ్మాయిగారు అదే దీప్తి, నేను చిన్నప్పట్నుంచీ టెంత్ వరకూ కలిసే చదువుకున్నాం. అమ్మ వోయాక, తనలా పట్నం వెళ్ళి పెద్దచదువులు చదివే అవకాశం నాకు లేకపోయింది. అందుకే వాళ్ళింట్లోనే పనిచేస్తూ అమ్మగారికి సాయం చేస్తూంటాను.”
“నీ పేరు చాలా బావుంది. నీ నైజానికి తగిన పేరు. ఎవరు పెట్టారు?”
“నేన్స పుట్టినప్పుడు మా ఊరికి ఒక స్వామీజీ వచ్చారుట. ఆయన దగ్గరికి ఆశీర్వదించమని మా అమ్మ నన్ను ఎత్తుకుని వెడితే ఈ పేరు పెట్టారు. అన్నట్టు మీ కథలు నేను చదివాను. చాలా బాగా రాసారు మీరు...”
“నిజంగానా? థాంక్‌యూ”
“కానీ కొంతమంది మీ రచయితలంటే నాకు కొంచెం కోపం తెలుసా?”
“ఎందుకుట పాపం?” '
“నా పేరును 'స్వాంతన” అని తప్పుగా రాస్తారు. మరి ప్రింటింగ్ తవ్వో, రచయితల తప్పో తెలియదు కానీ చాలా కథల్లో చదివానలా.”
చిన్నగా నవ్వి, అవునన్నట్టు తల ఊపాను. “ఆ పొరపాటును ఫ్లోలో నేనూ చేసే ఉంటాను. ఉపశమనం, ఓదార్చు” అనే అర్ధాన్నిచ్చే ఈ పదాన్ని తప్పుగా రాయటం నిజంగా తప్పే...” అన్నాను కళ్ళు మూసుకుంటూ. నండూరి సుందరీ నాగమణి
“నిద్ర వస్తే పడుకోండి” అంటూ పల్చని బెద్‌షీట్ కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది. మందుల ప్రభావం వల్ల కావచ్చు, మళ్ళీ నిద్ర పట్టసింది నాకు. ఎప్పుడో కలలోలాగ మంగళవాయిద్యాల శబ్దం విని 'మధుగాడి పెళ్ళెపోయింది' అనుకున్నాను. ఆ తర్వాత మధ్యలో రెండుసార్లు సాంత్వన నా నోట్లో థర్మామీటర్ పెట్టటం, మందులు మింగించటం లీలగా గుర్తు.
శ శ
తెల్లవారింది. లేచి కూర్చున్నాను. చాలా నీరసంగా ఉంది. కాని టెంపరేచర్ మాత్రం లేదిప్పుడు. రూంలో బుజ్జమ్మ, అదే సాంత్వన లేదు. బాత్రూంలోకి వెళ్ళి, బ్రష్ చేసుకునొచ్చి, మంచమ్మీద కూర్చున్నాను. ఇంతలో దీప్తితో కలిసి మధు వచ్చాడు. ఇద్దరిలోనూ ఏదో వింత సొగసు, ఎంతో కళ, సంతోషపు పరిమళాలు... వాళ్ళిద్దరినీ అలా చూస్తూంటే నా మనసంతా ఆనందంతో నిండిపోయింది.
“ఏరా, ఎలా ఉన్నావ్? ప్ప్... ఎంత నీరసపడిపోయావో...” ఆవ్వ్యాయంగా అంటున్న మధు చేతిని నా చేతిలోకి తీసుకొని, మృదువుగా నొక్కుతూ...
“బావుందిరా, పెళ్ళి బాగా జరిగిందిగా?” అన్నాను.
“అన్నయ్యా, టెంపరేచర్ తగ్గిందా? ఈ సాంత్వన ఏమైందీ?” అంటూ ఆమె కోసం దీప్తి అటూ ఇటూ చూస్తూంటే బయటనుండి వచ్చిన సాంత్వన తన చేతిలో మూతపెట్టి ఉన్న డిష్‌ను టేబుల్ మీద ఉంచుతూ, “ప్రణయ్‌గారికి టిఫిన్ తేవటం కోసం వెళ్ళాను” అని దీప్తికి చెప్పి, “ఇప్పుడే లేచారా? ముఖం కడుక్కుంటారా?” అంటూ నన్నడిగింది.
నిద్రలేమితో అలసటగా ఉన్న ఆమె ముఖాన్నిఎర్రకలువల్లా ఉన్న కళ్ళను చూన్తూ అయిపోయిందన్నట్స సైగ చేశాను. “సారీరా! నీ పెళ్ళి చూడలేకపోయాను...” నొచ్చుకుంటూ అన్నాను మధుతో.
“అయ్యో, అదేమిట్రా, అలా అంటావ్? నా పెళ్ళికి వచ్చి హ్యాపీగా
- తిరగకుండా సిక్ అయ్యావని నేను బాధపడుతుంటే? సరే కానీ, కాసేపట్లో మేము తిరుపతి వెడుతున్నామురా. మన వాళ్ళంతా మధ్యాహ్నం బయలుదేరి పోతామని అంటున్నారు. డాక్టరుగారికి కబురుపెట్టాము. ఓ అరగంటలో వచ్చి నిన్ను చూస్తారు. నువ్వు ఓ రెండ్రోజులుండి రెస్ట్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మా మామయ్యగారు, బావా ఉంటారు. నీకేం భయం లేదు, సరేనా?” వాడి ఆప్యాయతకు నా కళ్ళలో సీళ్ళు చిప్పిల్లాయి. అతత అమూల్యం (కథలు,
“వస్తామన్నయ్యా, మీరు మా పెళ్ళికి వచ్చినందుకు చాలా థాంక్స్. సాంత్వనా, అన్నయ్యను బాగా చూసుకోవే...” అంది దీప్తి.
వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చి, ప్లేట్‌లో పొగలు కక్కే ఇల్లీలు, కారప్పాడి వేసి, స్పూన్ పెట్టిచ్చింది సాంత్వన.
ఆకలి బాగా వేస్తూండడంతో గబగబా తినటం మొదలుపెట్టాను. కానీ, ఒకటి కన్నా తినలేకపోయాను. తిన్న రెండు నిమిషాలలోనే వాంతి అయిపోయింది.
నేలమీద, నా షర్ట్‌మీద, పక్కబట్టల మీద పడింది. తడిబట్టతో నా ముఖం, మూతి, బట్టలు తుడిచి, పక్కబట్టలు మార్చి, నేల తుడవసాగింది సాంత్వన.
“సాంత్వనా, నీతో అడ్డమైన పనులూ చేయించుకుంటున్నాను. శ్రమ ఇచ్చినందుకు నిజంగా సారీ... నీ బుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను” అన్నాను అపరాధభావనతో.
“ప్లీజ్ అలా ఫీలవ్వకండి, ఇది నా ధర్మం” చిరునవ్వుతో సమాధానం చెప్పి, తన పనిలో నిమగ్నమయిపోయింది సాంత్వన.
దాక్టర్ సూచన మేరకు నేను మర్నాటి వరకూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది.
శ శ
హైదరాబాద్ తిరిగొచ్చి ఉద్యోగంలో జూయినయ్యాను. జ్వరం వల్ల వచ్చిన నీరసం నన్ను చాలాకాలం వెంటాడింది. ఉత్పల అప్పుడప్పుడూ కలుసోంది.
ఊరిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెబితే, “ఎండలో తిరుగుతూ అడ్డమైన చెత్తా తిన్నావ్... అందుకే సిక్ అయ్యావు...” అని కోప్పడింది. కొబ్బరిబోండాల్నీ, తాటి ముంజెల్నీ “చెత్తు అన్నందుకు కించిత్ కోపం వచ్చింది నాకు.
నేను తనకోసం లంగా, ఓణీ సెట్ కానుకగా ఇస్తే, “బాబోయ్, ఇదెవరు వేసుకుంటారు, బోర్... నాకొద్దు...” అంటూ తిరస్కరించింది.
నాకు మనసు చివుక్కుమంది. ఈమెదంతా మోడరన్ ట్రెండ్. నావన్నీ వాత అభిరుచులు. నాకు ఘంటసాల పాటలు ఇష్టమైతే, ఈమెకు రాక్ మ్యూజిక్ ఇష్టం. నాకు కూచిపూడి ఇష్టమైతే, ఈమెకు సల్సా ఇష్టం. ఆమె మీద రాసిన కవితలను చదివి వినిపిస్తే అర్ధం కూడా నన్నే విప్పి చెప్పమంటుంది. ఇలా అయితే ఎలా? కాని ఉత్పల అంటే నాకు చాలా ఇష్టం. ఎదుటివారి అభిరుచులను నండూరి సుందరీ నాగమణి లా
గౌరవిస్తూ, మన అభిప్రాయాలను వాళ్ళమీద రుద్దకుండా ఉంటే ఆ జంట అన్యోన్యంగానే ఉండవచ్చు కదా? ఇరుహృదయాలను కలిపే శేమ చాలదూ!
మధూ, దీప్తీ హైదరాబాద్‌లోనే ఫ్లాట్ తీసుకొని కాపురం పెట్టారు. అప్పుడప్పుడూ నా ఫ్లాట్‌కి వస్తూంటారు.
ఇంతలో ఒక ఉపద్రవం జరిగిపోయింది. రెసిషన్ పుణ్యమా అని నష్టాల పాలు కావటంతో నేను పనిచేస్తున్న కంపెనీని అర్ధాంతరంగా మూసివేశారు. నా ఉద్యోగం పోవటంతో భవిష్యత్తంతా చాలా శూన్యంగా తోచింది. మధు చాలా ధైర్యం చెప్పి తన కంపెనీలో తప్పకుండా రికమెండ్ చేస్తానని అన్నాడు. కానీ, అదేమిటో, నా ఉద్యోగం పోయినప్పట్నుండీ ఉత్పలలో మార్చు వచ్చేసింది. నన్ను కలవటం చాలా తగ్గించేసింది.
ఈలోగా ఊరినుంచి కబురు, తాతయ్యకు ఆరోగ్యం దెబ్బతిందనీ, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమనీ... నాకు చాలా గాబరాగా అనిపించి, వెంటనే ఊరికి ప్రయాణమయ్యాను. లైట్‌గా పెరాలసిస్ సోకిన తాతయ్యను చూడగానే చాలా దిగులనిపించింది. బాగా చిక్కిపోయాడాయన. ఎడమవైపు చేయి, కాలు సరిగ్గా పనిచేయటం లేదు. అదంతా వ్యాధి (ప్రభావం, వయస్సు ప్రభావమే కాకనా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ.
చేస్తున్న ఉద్యోగం ఎలాగూ పోయింది. మళ్ళీ మరో ఉద్యోగం చూసుకుని నేను సిటీకి వెళ్ళిపోతే ఇక తాతయ్యను శాశ్వతంగా పోగొట్టుకున్నట్టె అనిపించింది నాకు. కాని ఉత్పల? ఉత్పల ఇక్కడికి వచ్చేసి ఉండగలదా? ఏదో తెలియని ఆందోళనతో నా మనసు ఊగిసలాడింది. ఆ రాత్రి భయపడుతూనే ఉత్స్పలకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను.
“ఉండిపో ప్రణయ్, నీకు మీ తాతయ్య, అమ్మమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా, మరో ఉద్యోగం కూడా వెంటనే దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదీ రోజుల్లో...” చెప్పింది ఉత్పల.
“మరి... మరి... నువ్వు ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేస్తావా?”
“సారీ ప్రణయ్, నేను ఇంత మంచి జాబ్ వదిలి రాలేను. నాకు విలేజెస్ సరిపడవు. మన పెళ్ళి మాట మర్చిపో. అసలు నేను నిన్ను ఇష్టపడిందే నీ జాబ్ పతతతతతతతతతతతనతతతతతతంయాపఆఆజఆఆఆా అమూల్యం (కథలు)
గౌరవిస్తూ, మన అభిప్రాయాలను వాళ్ళమీద రుద్దకుండా ఉంటే ఆ జంట అన్యోన్యంగానే ఉండవచ్చు కదా? ఇరుహృదయాలను కలిపే శేమ చాలదూ!
మధూ, దీప్తీ హైదరాబాద్‌లోనే ఫ్లాట్ తీసుకొని కాపురం పెట్టారు. అప్పుడప్పుడూ నా ఫ్లాట్‌కి వస్తూంటారు.
ఇంతలో ఒక ఉపద్రవం జరిగిపోయింది. రెసిషన్ పుణ్యమా అని నష్టాల పాలు కావటంతో నేను పనిచేస్తున్న కంపెనీని అర్ధాంతరంగా మూసివేశారు. నా ఉద్యోగం పోవటంతో భవిష్యత్తంతా చాలా శూన్యంగా తోచింది. మధు చాలా ధైర్యం చెప్పి తన కంపెనీలో తప్పకుండా రికమెండ్ చేస్తానని అన్నాడు. కానీ, అదేమిటో, నా ఉద్యోగం పోయినప్పట్నుండీ ఉత్పలలో మార్చు వచ్చేసింది. నన్ను కలవటం చాలా తగ్గించేసింది.
ఈలోగా ఊరినుంచి కబురు, తాతయ్యకు ఆరోగ్యం దెబ్బతిందనీ, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమనీ... నాకు చాలా గాబరాగా అనిపించి, వెంటనే ఊరికి ప్రయాణమయ్యాను. లైట్‌గా పెరాలసిస్ సోకిన తాతయ్యను చూడగానే చాలా దిగులనిపించింది. బాగా చిక్కిపోయాడాయన. ఎడమవైపు చేయి, కాలు సరిగ్గా పనిచేయటం లేదు. అదంతా వ్యాధి (ప్రభావం, వయస్సు ప్రభావమే కాకనా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ.
చేస్తున్న ఉద్యోగం ఎలాగూ పోయింది. మళ్ళీ మరో ఉద్యోగం చూసుకుని నేను సిటీకి వెళ్ళిపోతే ఇక తాతయ్యను శాశ్వతంగా పోగొట్టుకున్నట్టె అనిపించింది నాకు. కాని ఉత్పల? ఉత్పల ఇక్కడికి వచ్చేసి ఉండగలదా? ఏదో తెలియని ఆందోళనతో నా మనసు ఊగిసలాడింది. ఆ రాత్రి భయపడుతూనే ఉత్స్పలకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను.
“ఉండిపో ప్రణయ్, నీకు మీ తాతయ్య, అమ్మమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా, మరో ఉద్యోగం కూడా వెంటనే దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదీ రోజుల్లో...” చెప్పింది ఉత్పల.
“మరి... మరి... నువ్వు ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేస్తావా?”
“సారీ ప్రణయ్, నేను ఇంత మంచి జాబ్ వదిలి రాలేను. నాకు విలేజెస్ సరిపడవు. మన పెళ్ళి మాట మర్చిపో. అసలు నేను నిన్ను ఇష్టపడిందే నీ జాబ్ పతతతతతతతతతతతనతతతతతతంయాపఆఆజఆఆఆా అమూల్యం (కథలు)
చూసి... మన అలవాట్లు వేరు, మన అభిరుచులు వేరు... ప్లీజ్ ఫెండ్‌లా విడిపోదాము. నీకు అనుగుణంగా ఉందే, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో... ఆల్ ద బెస్ట్.”
“అదేమిటి ఉత్పలా, డబ్బు ముఖ్యమా? మనసులూ, మమతలూ లెక్కలోకి రావా?” అయోమయంగా ప్రశ్నించాను.
“వట్టీ అమాయకుడివి ప్రణయ... ఈ లోకంలో దబ్బు తర్వాతే కదా ఏదైనా... అయాం సారీ...” అని ఫోన్ కట్ చేసింది ఉత్పల.
నా మనసంతా నిర్వేదం అలముకుంది. కానీ ఆ దుఃఖాన్ని ఇంట్లో నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు అధిగమించాయి. ప్రతిరోజూ ఆచారిగారిచ్చే తైలంతో తాతయ్య కాలు, చేయి తోమి మర్దన చేయటం, పాలేర్ల సహాయంతో పొలం పనులు చూడటం, అమ్మమ్మ దగ్గర కూర్చొని ఆమెకు ధైర్యంచెబుతూ ఉండటంతో నాకసలు టైమే తెలిసేది కాదు.
నేనింక హైదరాబాద్ వెళ్ళనన్న నమ్మకం కుదిరాక అనూహ్యంగా తాతయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం మొదలయింది. కాలు, చెయ్యి కాస్త స్వాధీనంలోకి వచ్చాయి. కర్ర సహాయంతో నడవటం మొదలుపెట్టాడు. ఒకరోజు నా పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు తాతయ్య, తానిక ఎక్కువ కాలం (బ్రతకననీ, పోయేలోగా నా పెళ్ళి చూడాలని ఉందనీ, నేనెవరినైనా ఇష్టపడితే సిగ్గుపడకుండా చెప్పమనీ అడిగాడు. ఉత్పల గుర్తుకువచ్చి నా మనసు బాధగా మూలిగింది. కాని అది ఒక్క క్షణమే. నిజానికి మేమిద్దరమూ ఒకరికొకరం సరిపదము.
“ఆస్తులూ, అంతస్తులూ చూడకురా బాబూ, ఎవరైనా సరే, ఈ ఇంట్లో ఇమిడిపోగలిగే అమ్మాయి అయితే చాలు...” అంది అమ్మమ్మ.
నాకెందుకో మనసులో నొంత్వన మెదిలింది. ఆ అమ్మాయిలో ఎంత సహనం, మరెంత సేవాగుణం? వినయం, అణకువ, పొందిక కలగలసిన సద్దుణరాశి... ఆమె నా ఇల్లాలైతే... సరికొత్త ఊహ... బెను, ప్రేమించటం మాత్రమే తెలిసిన ఆమె ఈ ఇంట కోడలిగా అడుగుపెడితే మా తాతయ్యను, అమ్మమ్మను ఎంతో బాగా చూసుకుంటుంది. అలాగే, నాకూ తోడుగా, నీడగా ఉంటూ అనురాగాన్నీ పంచి ఇస్తుంది.
వెంటనే మధుకి ఫోన్ చేసి మాట్లాడాను - నెల రోజుల క్రితం సాంత్వన నండూరి సుందరీ నాగమణి లాలా
తండ్రి వాము కాటుకు గురై మరణించాదనీ, ఆమె అనాధగా మిగిలిపోయిందనీ తెలిసి షాకయ్యాను. వెంటనే అమ్మమ్మతో, తాతయ్యతో ఆ అమ్మాయిగురించి, అప్పుడు నేను పెళ్ళికి వెళ్ళటం, నేను మంచాన పడితే ఆమె నాకు సేవ చేయటం... అవన్నీ చెబుతూ, చివరి విషయం చాలా సంశయంగా చెప్పాను - “ఆ అమ్మాయిది మన కులం కాదు, అసలు ఏ కులమో కూడా నాకు తెలియదు అని.
“మంచితనాన్ని మించిన కులం, మానవత్వాన్ని మించిన మతం ఏమున్నాయిరా? నీకు ఇష్టమైతే, నాకూ ఇష్టమే...చిన్న కారు మాట్లాడు, మన కుటుంబరావు మామయ్యతో కలిసి నలుగురం వెళ్ళి, ఆ ఆదిశేషయ్యగారితో మాట్లాడి వద్దాము...” తాతయ్య మంచి మనసుకు, బెన్నత్యానికీ నా నోట మాట రాలేదు.
విషయం విన్న ఆదిశేషయ్యగారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఫోన్లో మధు కూడా మామగారితో మాట్లాడాడు. ఆదిశేషయ్యగారు సాంత్వనను పిలిచారు. నన్ను చూడగానే వెలిగిపోయిన ఆమె ముఖం నాపై గల అభిమానాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. తాతయ్యను, అమ్మమ్మను పరిచయం చేసి, వారి ప్రతిపాదనను ఆమె ముందుంచారు ఆదిశేషయ్యగారు.
అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం. రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరున ఏద్చింది.
“తప్పమ్మా, సంతోషకరమైన సమయంలో అలా కంట తడి పెట్టవచ్చా?” సాంత్వనను అక్కున చేర్చుకున్న అమ్మమ్మ ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడిచింది చీరచెంగుతో.
“అమ్మా, సీకు నా ఇంట ఏ లోటూ కలగనీయను. నీవు బాధపడే సందర్భం ఇదే చివరిది కావాలి. మా తర్వాత నా మనవడిని జాగ్రత్తగా చూసుకోగలిగే శక్తి నీకే ఉంది. కాదనకమ్మా, మా ఇంట కుడికాలు పెట్టు...” అన్నాడు తాతయ్య ఆమె తల నిమురుతూ.
“బంకేమీ ఆలోచించకు బుజ్జమ్మా, మేము నీకు పెళ్ళి చేయాలన్నా ఇంత మంచి సంబంధం తేగలమా? అబ్బాయే కాదు, అతని పెద్దవాళ్ళు కూడా చాలా మంచివారు. కాదనకు...” చెప్పింది ఆదిశేషయ్యగారి భార్య,
శ శ శ పాలలా అమూల్యం (కథలు,
నెల రోజుల తర్వాత మా ఇంటి ఆవరణలోనే తాతయ్య, అమ్మమ్మల చేతులమీదుగా మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళికి మధు, దీప్తి హాజరయ్యారు. దీప్తి అమ్మానాన్నలే సాంత్వనకు కన్యాదానం చేశారు.
ఆ రాత్రి నా కౌగిలిలో ఒదిగిపోతూ అంది సాంత్వన, “ఇంతటి అదృష్టానికి నేను నిజంగా అర్వరాలినా? ఎందుకింత పెద్ద వరం అనుగ్రహించారు?”
“ఏందుకంటే, భగవంతుడు నాలాంటివారందరికీ న్వాంతన... ఉహు... కాదు, సాంత్వననివ్వటానికే సృష్టించిన అమూల్యమైన వజంగా నిన్ను అనుగ్రహించాడు కాబట్టి...” సమాధానం ఇచ్చి, ఆమె నుదుట (శేమగా ముద్దు పెట్టుకున్నాను.
(స్వాతి మాసపత్రిక, మార్చి 2012) అ 4 + + ఈ
నండూరి సుందరీ నాగమణి లాలా
“గ్రా బ్రావా, పిల్లలా ఉందేటి?” పున్నమి చంద్రుడల్లే వెలిగిపోతున్న మల్లేశు ముఖాన్ని చూసి, అతని భుజమ్మీద కొంటెగా గిచ్చింది గంగ.
“అబ్బ గంగా! ఏటే... నీ సరసాలూ?” చిరుకోపంగా గంగవైపు చూసి భుజం రుద్దుకున్నాడు మల్లేశు.
మళ్ళీ అంతలోనే నవ్వేస్తూ, “నా సంగతి సరేలేయే... నల్లగా ఉన్నాను కదేటి, ఆ పిల్లకు నచ్చానో లేదో మరి నువ్వే అడుగు...” అన్నాడు.
“నల్లగా ఉంటేనేటి బావా, కృష్ణుడు నలుపు కాదేటీ? ఏయ్ పిల్లా మా బావ సెప్పట్లేదు కానీ, నీ సంగజ్జెప్పు... మా బావ నచ్చినట్టేనా?” దుర్గ చెవిలో గుసగుసలాడింది గంగ.
సిగ్గుతో కందిపోతున్న ముఖాన్ని భూమిలోకి దించేసుకుంటూ, “నెను మాత్రం అంత రంగేమీ లేనుగా...” అంటూనే అంగీకారంగా తల ఊపింది దుర్గ
“మరింకేం? బావోయ్, మా సైడు నుంచి మేమోకే... నాన్నా బావకీ ఇష్టమే... మరీ సుట్టరికం ఖాయం సేసేయండి...” హుషారుగా అంది గంగ.
“ఆడి పెళ్ళంటే నీకేటే అంతోటి సంబరం?” గంగ నెత్తిన మొట్టుతూ నవ్వాడు ఆమె భర్త సాంబయ్య,
“అదే మరి... నాకు నిన్నిచ్చి పెళ్ళి సేసేదాకా మా నాన్న తలకాయ్ తిన్నాడు... ఇప్పుడు ఆడూ ఒకింటోడైతే నాక్కాదేటి సంబరం?” అని జవాబిచ్చి, తందడ్రివైపు చూసింది గంగ.
“అమ్మా, శాంతమ్మా... మల్లేశుకి అమ్మయినా, నాన్నయినా మేమిద్దరమే... మీ అమ్మికి నచ్చితే, ఈ మాసంలోనే ఒక మంచిరోజు సూసి, లగ్గం సేసేద్దాం...” 100 పతా అమూల్యం (కథలు)
దుర్గ తల్లితో అన్నాడు కేశవులు.
“మీరెలాగంటే అలాగేనండి. తండ్రిలేని పిల్ల...చానా గారంగా పెరిగింది... పేదోళ్ళం... ఒక్క అరెకరం చెలక తప్ప ఇంకేం ఎట్టలేం మాపిల్లకి!”
“మీ పిల్లకి మీరేదిచ్చినా మీ ఇస్టమమ్మా... బలవంతం ఏమీ లేదు... ఆడు మా కామందుగారికి పెంపుడు కొడుకు లాటోడు. పెళ్ళి కూడా మా ఊళ్ళోనే ఆరే సేస్తామని అన్నారు. సరే... మంచి రోజు చూపించి, కబురెడతాం... పదమ్మా... గంగా... లేరా మల్లేసూ... ఎళ్ళొస్తమమ్మ దుర్గా...” నవ్వుతూ లేచాడు కేశవులు.
“ఎళ్ళొస్తం సెల్లీ...” తనూ శాంతమ్మ దగ్గర శలవు తీసుకుంది, కేశవులు భార్య లచ్చుమమ్మ.
తల్లిదండ్రులనిద్దరినీ చిన్నప్పుడే పోగొట్టుకున్న మల్లేశుడు మేనమామ కేశవులూ, అతని భార్య పెద్ద దిక్కె పెంచారు. చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టని మళల్లేశు, ఆరో తరగతితోనే చదువుకు ఎగనామం పెట్టెసి, కేశవులుతో పాటే, పెద్దరైతు లింగయ్యగారింట్లో పాలేరుతనానికి కుదిరిపోయాడు.
పాడి పశువులను మేపటం, పశువులకొట్టం శుభ్రం చేసి, పాలు పితికివ్వటం దగ్గరనుంచీ, ఇంటిపని, పొలం పన్లు అన్నింట్లోనూ ఆరితెరిపోయాడు. ఇప్పుడు వయసు పైబడటం వల్ల కేశవులు అంతగా కష్టపడలేకపోతున్నా, అతని ఆధ్వర్యంలో చక్కగా నమ్మకంగా పనిచేస్తూ, లింగయ్యగారి దగ్గర మంచి పేరును సంపాదించు కున్నాడు మల్లేశు. ఇక లింగయ్యగారి చిన్న కొడుకు అశోక్‌కైతే చిన్నప్పట్నుండీ మల్లేశంటే చాలా ఇష్టం. పట్నంలో పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నా, ఆ గర్వం లేకుండా, మళల్లేశంటే ఎంతో (ప్రేమగా ఉంటాడు. సెలవులకి వచ్చినప్పుడు ఇప్పటికీ మల్లేశుతో కలిసి గోదాట్లో ఈత కొడతాడు.
కేశవులుకు గంగ, సోమూ ఇద్దరే పిల్లలు. గంగ, మళల్లేశు కన్నా ఒక ఆర్నెల్లు పెద్దది. ఆమెను ఉన్న ఊళ్ళోనే పోలీసు కానిస్టైబుల్‌గా పనిచేస్తున్న సాంబయ్యకిచ్చి పెళ్ళి చేశారు. కొడుకు సోము పట్నంలో పదో తరగతి చదువుకుంటున్నాడు హాస్టల్లో ఉండి. సోము మల్లేశును బావ అని పిలవటంతో గంగకు కూడా ఆ పిలుపే అలవాటైంది.
పదిహేను రోజుల్లోనే మంచి లగ్నం కుదిరిపోవటంతో మల్లేశు, దుర్గల పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. మల్లేశు పెళ్ళికి మూడు జతల ఖరీదైన కొత్త
నండూరి సుందరీ నాగమణి బాలా
బట్టలు కొని బహుమతిగా ఇచ్చాడు అశోక్. లింగయ్యగారు మల్లేశు పెళ్ళి ఖర్చంతా తనే పెట్టుకోవటమే కాకుండా అతనికి కొత్త సైకిల్ కూడా కొనిచ్చారు. శ శ శ
ఆ రోజు వాళ్ళ తొలిరాత్రి.
ఇంటి పెరట్లో పెడగా ఉన్న చిన్న పూరింటి గదిలో వాళ్ళ పడక ఏర్పాటు చేశారు గంగా, లచ్చుమమ్మా... సాయంత్రం నుంచీ ఆ గదిని అలంకరిసూనే ఉంది గంగ. ద్వారానికి రంగురంగుల కాగితం తోరణాలు, మెరుపు తోరణాలు టౌను నుంచి సాంబయ్యతో తెప్పించి కట్టించింది. వాతకాలం పట్టెమంచమ్మీద పరుపు వేసి, తెల్లని దుప్పటి పరచి, దాన్నిండా తోటలోంచి తెచ్చిన మల్లిపూలు ఒత్తుగా చల్లి, మధ్యలో ఎర్రని గులాబీలు అలంకరించింది. చిన్న బల్లమీద గుబాళించే అగరొత్తులు వెలిగించి పెట్టింది. సన్నని జరీ అంచుతో ఉన్న కోరా రంగు చీరను దుర్గకు కట్టి, ఆమె ఒత్తయిన జుట్టును దువ్వి, అందమైన వాలుజడ వేసి, జడ పొడవునా నిండుగా జాజిమాలలు చుట్టి, పైన సన్నజజుల దండలు, మల్లెచెండ్లతో అలంకరించింది గంగ. దుర్గ చేతికి పాలగ్గాసును అందించి, గదిలోకి పంపిస్తూ, “మా బావను చేసుకోవటం నిజంగా నీ అదృష్టమేనే దుర్గా... ఆడు సానా అమాయకుడే... ఎలాటి సెడ్డ అలవాట్లు లేని మణిపూస... ఆణి బాగ సూసుకో మరి!” అని అప్పగింతలు పెడుతుంటే, గంగ కళ్ళలో ఊరిన గంగను విచిత్రంగా చూస్తూ గదిలోపలికి అడుగు పెట్టింది దుర్గ.
మొబైల్ ఫోన్‌లో అశోక్‌తో మాట్లాడుతున్న మల్లేశు దుర్గను చూడగానే కాల్ కట్ చేసి ఆమెకు దగ్గరగా వచ్చాడు. భర్త తన చెంతకు రాగానే వదో తెలియని ఒక సిగ్గు ముంచుకు వచ్చింది దుర్గకు. గబుక్కున రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది. మళల్లేశు తలుపు మూసి వచ్చి, దుర్గ చేయి అందుకొని, మంచం మీద కూర్చోబెట్టి తానూ కూర్చున్నాడు. క్షణాలు గడుస్తున్నాయి.
పెళ్ళి చూపులప్పుడు అలా ఒకసారి చూశాడు కాని తనివితీరా ఆమెను చూద్దామంటే. పక్కనే గంగ, ఆమె తల్లిదండ్రులూ ఉండటం వల్ల బిడియపడి సరిగ్గా దుర్గను చూడలేకపోయాడు మల్లేశు. పెళ్ళీ ముహూర్తం తెల్లవారుజామున కావటంతో ఇద్దరూ ఇంచుమించు నిద్రావస్థలోనే ఉండటం... ఇక పెళ్ళి తంతుతోనే సరిపోయింది...
ఇప్పటికి ఇక ఏ అడ్డూ లేకుందా, ఏకాంతం దొరకటంతో దుర్గవైపు ప తతతతతతతతతతయియయాయాయాంలాంలఆఆ అమూల్యం (కథలు)
పరిశీలనగా చూడసాగాడు మళల్లేశు. అంత లావూ, సన్నమూ కాకుండా మధ్యస్థమైన శరీరం... గుండ్రని చందమామవంటి ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, నల్లని చేపల్లాంటి కళ్ళు, గులాబీ మొగ్గల్లాంటి పెదవులు, బూరెల్లాంటి బుగ్గలు... పచ్చని మేని చాయ లేకున్నా నాణ్యమైన చామనచాయలో చక్కనిచుక్కలా ఉంది దుర్గ. మనసులోని (ప్రేమంతా ముప్పిరిగొనగా, రెండు చేతులూ చాచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మల్లేశు. అతనంటే కలిగిన (పేమ పరవశాన్ని కలిగించగా తన మనసును, తనువును సంతోషంగా అతనికి అర్పించుకుంది దుర్గ. నిన్నటివరకూ ఒకరికొకరు తెలియకపోయినా ఇప్పుడు ఒకరికొకరే అయ్యారు ఆ జంట... పూవూ, తావీ... మెరుపూ, మేఘం కలిసినట్టై ఉందా సమాగమం.
చెమరించిన అతని నుదుటిని తన చీరచెంగుతో వత్తింది దుర్గ. అనురక్తితో ఆమె ముంగురులను సవరిస్తూ, *“దుర్ధా, నేనంటే నీకు ఎంత (పేమే?” అని అడిగాడు మల్లేశు. “ఆకాశమంత! మావా, ఈ ప్రెస్న ఇప్పుడడిగితే అడిగేవు కానీ, ఇంకెప్పుడూ అడగమాక!” అంది దుర్గ,
“ప్ ఎందుకే?”
“ఎందుకని అడిగితే నేను ఇడమరసి సెప్పలేను మావా... నువ్వంటే నాకు సానా ఇష్టం. అంతే..”
శ శ
కొత్తగా తీసుకున్న ఇంట్లో మల్లేశు కొత్త కాపురం మొదలైంది.
మళల్లేశు అంటే దుర్గకి ప్రాణం. తొలిరాత్రి తర్వాత ఒకర్ని విడచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారిద్దరూ... పొద్దున్నే ఐదు గంటలకల్లా లేచి, ముఖం కడుక్కుని, కామందుగారింటి పనిలోకి వెళ్ళిపోతాడు మల్లేశు. మళ్ళీ రావడంరాత్రి ఏడు దాటాకే... అతడు వచ్చేవరకూ ఒంటరిగా బిక్కు బిక్కుమని కాలం గడుపుతుంది దుర్గ.
అతడొచ్చేసరికి తన స్నానం ముగించి మంచి చీర కట్టుకొని, పూలు పెట్టకొని తయారై, వాకిట్లో పొయ్యి మీద వేడినీళ్ళు మసలబెట్టి సిద్ధంగా ఉంచుతుంది. అలసిపోయిన మల్లేశు ఇంటికి రాగానే నీళ్ళు తోడి, తడకలతో కట్టిన బాత్‌రూములోకి స్నానానికి పిలుస్తుంది. తన స్వహస్తాలతో అతని ఒళ్ళు రుద్ది, వీపు తోమి స్నానం చేయిస్తుంది.
“ఎందుకే దుర్గా, ఇంత కస్టం నీకు? సల్లటి నీళ్ళు నాకలవాటేగా...” అని నండూరి సుందరీ నాగమణి
మల్లేశంటే, “కాదు మావా, రోజంతా కస్టపడతావు... ఉడుకునీళ్ళోసుకుంటే నెప్పులన్నీ పోయి, హాయిగా నిద్దరపడతాదని...” అని చెప్పి, వేడి వేడి అన్నం, అతనికిష్టమైన కూరలతో వడ్డిస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ, కబురాడుకుంటూ గంటసేపు అన్నం తిన్నాక, పక్కమీదకు చేరతారు. ఆమె జడలో గుబాళించే మల్లెలు ఇద్దరినీ ఉత్తేజపరుస్తూంటే, సరససల్లాపాలతో, చిలిపి చిలిపి తగవులతో, ఇద్దరికీ ఇష్టమైన శృంగార వనవిహారం చేస్తూ, అందులో ఎంతో అమరానందాన్ని పొందుతారిద్దరూ... పగలంతా ఒక్కతే ఉండటానికి ఇష్టపడుతుంది కాని, తన ఇంటికి నాలుగిళ్ళవతలే ఉన్న గంగ ఇంటికి ఆమె రమ్మన్నా వెళ్ళటానికి ఇష్టపడదు దుర్గ. ఒక్కోసారి గంగే చంటాడ్ని అడ్డాల్లో వేసుకొని దుర్గ ఇంటికి వచ్చి కాస్సేపు కూర్చుని వెడుతూ ఉంటుంది. వచ్చెటప్పుడు బావకి ఇష్టమంటూ తను వండిన చింతచిగురు పప్పో, నూరిన గోంగూర పచ్చడో తెచ్చిస్తుంది. ఆ ఉన్న కాస్ప్సేపూ మల్లేశు గురించే చెబుతూ ఉంటుంది గంగ. చిన్నప్పట్నుండీ తామిద్దరూ, తన తమ్ముడూ కలిసి ఆడుకున్న ఆటలూ, పాటలు, పక్కూరికి జాతరకి వెళ్ళటాలు, సినిమాలకి వెళ్ళటాలు గురించి మురుసుకుంటూ చెబుతూంటే దుర్గకి వళ్ళు _మండిపోతూ ఉంటుంది. ఒకరోజు మల్లేశుతో గొడవపడింది దుర్గ. “ఏటి మావా, ఆ గంగెప్పుడూ నీ గురించే మాట్లాడతా ఉంటాది! అంత ఇస్టమైతే ఇద్దరూ పెళ్ళి సేసేసుకోవాల్సింది కదా...” ళల్ట్స్ తప్పే... అలా అనకూడదు... గంగ సానా మంచిది... సిన్నప్పట్నుండీ కలిసే పెరిగాం కదే... ఆ సనువు కొద్దీ అలా అంటుంది కాని వేరే ఏ ఉద్దేశమూ ఉండదే దానికి!” చెప్పాడు మల్లేశు. “ఏమోలే, ఊళ్ళో సానా మంది సెప్పారు నాకు... దానికి నీ మీద మోజంటగా!” “ఏమ్మాటలే అయ్యి! ఎవరు సెప్పారు? ఓహో... ఆ రత్తాలు, అలిమేలూ వాళ్ళా?” “అవును మావా, సెరువుకి నీళ్ళు తేదానికి ఎళ్ళినపుడు...” “ఆళ్ళిద్దరూ నన్ను సేసుకోవాలని తెగ టై సేసార్లే... నేను రెండూళ్ళవతలున్న నిన్ను కోరి కోరి సేసుకున్నానని సుప్పనాతితనం. అందుకే నీ మనసు లలా అమూల్యం (కథలు)
ఇరిసెయ్యాలని లేనిపోని సంగతులన్నీ సెప్పి పాడుసేత్తన్నారు. గంగకీ నాకూ ఏటే! అలా ఆలోసించకూడదు. తప్పు...”
“అంతేనంటావా మావా?”
“అంతే మరి! దానికి నా మీద అంత మోజుంటే పట్టు పట్టీ, నీతో నాకు పెళ్ళెందుకు జరిపిస్తది సెప్పు! నాంబయ్యన్న కూడా సానా మంచోడు. నిన్నూ నన్నూ ఎంత అబిమానిన్తాడో తెలుసు కదే... ఇలా నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోసిస్తన్నావని తెలిస్తే, గంగ మనసు సానా బాద పడతదే.. వద్దు... నీ మనసులోంచి ఈ తప్పుడు ఆలోసనల్ని తీసెయ్యి. అసలు ... నీకో ఇసయం 'సెవ్వ్పాలని అనుకున్నాను... నా మనసంతా పాడుసేసేసావు...” నిష్టూరంగా అన్నాడు మల్లేశు.
“ఏటి మావా, సెప్పు సెప్పు...
“మా అశోక్‌బాబుకి హైదరాబాదులో ఉజ్జోగమొచ్చింది కదా, వొచ్చేనెల్లో పెళ్ళి సేసేసుకుంటాడంట. నన్నుతన దగ్గిర దైవరుగా ఉంటానికి వాచ్చేయమని, ఆరితో పాటుగానే ఉంచేసుకుంటామని అన్నాడే... మనం సిటీకి ఎళ్ళిపోతే, మనకి పుట్టబోయే పిల్లలని మంచి బడిలో యేసి సదివిసానని కూడా సెప్పాడు. నేనే ఇంకా ఏమీ సెప్పలేదు... మనమిద్దరమూ పల్లె ఇడిసి పెట్టి ఎళిపోతే మా మామ బాధపడతాడని ఆలోసిస్తున్నా...”
“కానీ అశోక్‌బాబు నీకు సిన్నప్పట్నుండీ స్నేయితుదేగా మావా, ఆ బాబు మాట కాదంటే బాగోదేమో...”
“అదేనే... ఆలోసించుకొని వోరం తర్వాత సెప్పమని అన్నాడు... సరేలే సానా పొద్దుపోయింది, ఇంక పడుకో...” అంటూ నిద్రకి ఉపక్రమించాడు మళల్లేశు.
- ఈ ఈ
బుల్లి బుల్లి కాళ్ళను ఊపుతూ, చిరునవ్వులు చిందిస్తూ “నానీ పాలు తగుతూ ఉంటే, ఆ పారవశ్యాన్ని అరమూసిన కనులతో ఆస్వాదిస్తున్న గంగ “గంగా, సాంబయ్యన్నను ఓసారి బయటకు రమ్మనవే, పనుంది...” అన్న మల్లేశు పిలుపుతో ఉలిక్కిపడి, పాలు తాగుతున్న నానీని వదిలించుకోబోయింది. కాని ఆకలితో ఉన్న నానీ తన పట్టును వదలకపోవటంతో, వాణ్ణి తన ఒడిలోనే ఉంచుకొని, పైటకొంగును నిండుగా కప్పుకుంటూ, “రా బావా, సాంబయ్య మావ తానం సేస్తున్నాడు కాని పనేంటో సెప్పు...” అంది. నండూరి సుందరీ నాగమణి లలత
ఒక్క క్షణం తటపటాయించి, లోపలికి అడుగుపెడుతూ, “ఏటీ లేదే... ఈ నెల్లో ఓ మూడేలుంటే సర్దమన్నాడు... అందుకే వచ్చానె...” అన్నాడు.
“మావ తనకు కుదిరినా, కుదరకవోయినా అత్తమ్మకూ, ఒదినమ్మకూ పంపకుండా ఉండలేడు బావా... ఈ నెల నానీకి జొరం రాడం వల్ల మందులకి సానా డబ్బులైపోయాయి. అందుకే ఇబ్బందిగా ఉండి, నిన్నడిగి ఉంటడు...” అంటూనే ఒక్కసారిగా “అమ్మా!” అంటూ నానీని బలంగా రొమ్ము నుండి లాగి, మల్లేశు చేతికిచ్చి, ఒక్కంగలో పైటకొంగును విదిలిస్తూ, గాబరాగా బయట కురికింది.
“ఏటే గంగా, ఏటయిందే?” కంగారుగా అడిగాడు మల్లేశు వెనుకే వస్తూ...
“జెర్రి బావా... జెర్రి... పైనుండి పడింది... కొంచెముంటే నాన్‌ీనీ కుట్టేసును...” అంటూనే మళ్ళీ చీరనంతా దులిపింది. ఇంత పొడవున్న జెర్రి చీరలోంచి బయటపడి, వడివడిగా పాకుతూ పారిపోయింది.
ఏదో పనిమీద అప్పుడే బయటకు వచ్చిన దుర్గకు అస్తవ్యస్తంగా ఉన్న పయ్యెదతో, రవిక ముడి వీడి, సగభాగానికి పైగా కనిపిస్తున్న చనుదోయితో, రేగి ఉన్న జుత్తుతో, చిరుచెమటలతో ఉన్న గంగ, ఆమె వెనకే తలుపు చాటునుండి తొంగి చూస్తున్న మళల్లేశూ కనిపించారు.
“ఈ మధ్యే తన పోరు పడలేక, తనకిచ్చిన మాట (ప్రకారం గంగ ఇంటికి రాకపోకలు మానేసాడని తాననుకుంటోంది... కాని, కాని తన కళ్ళు కప్పి దానింటికి వెడుతూనే ఉన్నాడన్న మాట...” దుర్గకు వివేకం నశించిపోవటంతో, మనసంతా చెదిరిపోయింది. మల్లేశు చూపు తనపై పడదేలోగానే చరచరా నాగినిలా ఇంట్లోకి వెళ్ళి ధడేల్న తలుపేసుకుంది.
“అమ్మో, కొంప మునిగింది...” అనుకుంటూ, నానీని గంగ చేతికిచ్చి, తనింటివైపు గబగబా నడిచాడు మళల్లేశు. తలుపు తడుతూ, “ఏయ్ దుర్గా, తలుపు తెరవ్వే...” అని పిలిచాడు.
తలుపు తెరవకుండానే కిటికీలోంచి చూస్తూ, “అయ్యాయా, దొరగారికి మరదలు మాణిక్యంతో సరసాలూ?” కళ్ళలోంచి అగ్గిని కురిపిస్తూ అడిగింది తీవ్రంగా...
“పిచ్చిదానిలా వాగక, నే సెప్పేదిను...”
“ఏటినేది? నువ్వింటన్నావా యేటి, నేనేదైనా సెబితే?”
106 పతా అమూల్యం (కథలు)
“ఏయ్స్, ఇనవే... అసలు గంగింటికి నేనెందుకెళ్ళానంటే, సాంబయ్యన్నను కలవడానికే...” అంటూ విషయం వివరించబోతున్న భర్త మాటల్ని క్రుంచేస్తూ, “ఎనకటికి నీలాటోడే, తాడి సెట్టెందుకెక్ళావంటే, దూడ గడ్డికోసమన్నాడట... హు... ఎ(రగా బుర్రగా ఉంటాది కదా, దాని దగ్గరకిందుకు ఎల్లావో నాకు తెలుసులే, అనవసరంగా సాంబయ్య మాటెత్తకు మావా...” అంది ఉక్రోషంగా...
ఏదో చెప్పబోతున్న మళల్లేశు జేబులోని సెల్ ఫోన్ మైోగటంతో, అది యజమాని దగ్గరనుండని అర్ధమై, “ఈ తిక్కదానికి కనీసం ఓ గంటైనా నచ్చజెబితే కాని ఇనదు... సాయంత్రం సెబితే సరి...” అనుకుంటూ వెళ్ళిపోయాడు.
శ శై (&
సాయంత్రం మొగుడొస్తె, ఇంటికి రాగానే అతణ్ణి ఎలా వేధించాలో, ఎన్ని మాటలనాలో, ఎన్ని ఒట్లు పెట్టించాలో అన్న ఆలోచనలతో అతలాకుతలమౌతున్న దుర్గ ఎంత రాత్రవుతున్నా అతడు రాకపోయేసరికి, కంగారుపడుతూ బయటకు వచ్చి, ఎదురుగా వాన్ డబ్బా దగ్గరకెళ్ళి అక్కడున్న కాయిన్ బాక్సునుండి మల్లేశు సెల్ నంబరుకి రింగ్ చేసింది. ఎన్నిసార్లు చేసినా 'స్విచ్ ఆఫ్' అని వస్తూండటంతో, నిస్సహాయంగా ఇంటికి తిరిగి వస్తూ యధాలాపంగా గంగ ఇంటివైపుకు చూసింది... గంగ ఇల్ల తాళంపెట్టి ఉండటంతో, దుర్గ మనసులో క్రోధాగ్ని కాలనాగులా పడగ విప్పింది. “ఇంట్లో ఉంటే తన కంట పడతామని భయపడి, సుఖపదడటానికి ఎక్కడికో జంటగా ఎగిరివోయినట్టున్నారిద్దరూ... అందుకే ఫోన్ స్విచాఫ్ చేసేసాడు...” ఇవే ఆలోచనలతో రాత్రంతా కన్నీరు కారుస్తూ, తెల్లవారినా ' భర్త రాకపోయే సరికి తననో గడ్డిపోచల్లే తీసిపారేసాడన్న బాధతో, అతని నిర్లక్ష్యానికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది దుర్గ. “మరదల్ని వదలలేకే కాబోలు, అశోక్ బాబు సిటీకి రమ్మనంటే, ఏ సంగతీ తేల్చకుండా ఎనకా ముందాడుతున్నాడు... గంగ గురించి కేశవులు బాబాయికి ఫిర్యాదు చేసి, ఇద్దరికీ గడ్డి పెట్టించాలంటే, ఆయన పిన్నితో కలిసి బంధువులింట్లో పెళ్ళికి వెళ్ళాడు... మరో మూడురోజల వరకూ రానే రాడు... అసహాయంగా మూల్షింది దుర్గ మనసు.
౭ ఉదయం ఎనిమిది దాటుతూంటే, ఉసూరుమంటూ వచ్చి, మంచమ్మీద కూలబడ్డాడు మళ్లేశు ఎర్రగా జ్యోతుల్లా ఉన్న కళ్ళతో, బాగా అలిసిపోయినట్టున్న అతని ముఖాన్ని చూడగానే, మరోలా అర్ధం చేసుకున్న దుర్గ మండిపడింది. నండూరి సుందరీ నాగమణి లాలా
“పాపం, రాత్రంతా నిద్దర లేనట్టుంది...” అంది కచ్చగా...
“నిజమేనే... కనురెప్ప ఇలా మూసింది లేదంటే నమ్ము...”
“భీ... సిగ్గు లేకపోతే సరి... ఏడాదైనా కాలేదు... కట్టుకున్న పెళ్ళాం అప్పుడే అంత వెగటైెందా మావా? అంతగా దానిమీద (ప్రమ పొంగిపోతున్నప్పుడు నా గొంతెందుకు కోసావు?ొ గద్దద స్వరంతో అడిగింది.
“నువ్వేం మాటాడుతున్నావే, అసలేం జరిగిందో తెలుసా నీకు?”
“నాకేం సెప్పకు మావా...” తిరస్మ్కారంగా తల తిప్పుకుంది.
“అరె, మొగుదేదో సెబుతున్నాడు, ఇనాలన్న ఇంగితముందంటే నీకూ?”
“ఆ, అంత ఇంగితముండీ నువ్వేం సేస్తన్నావో, పగలూ రాత్రీ తేడా అయినా లేకండా మరదలితో కులకట్లేదూ?”
“భీ ఛీ... నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేయడమేనా? మా గంగ ఆ గంగమ్మ తల్లంత పవిత్రమైంది... దానిమీద తప్పుడు కూతలు కూసావంటే కళ్ళువోతాయి జాగర్త!”
“అబ్బో, అంత గొప్పదేమీ కాదులే నీ మరదలు... హు... నిన్న నెను చూళ్ళేదా, ఒంటిమీద సరైన బట్ట లేకుండా అది, ఎనకాలే నువ్వూ... తలుపు సాటున ఏ రాసకార్యాలెలగబెడతన్నారంటా? నా కంట పడ్డందుకేగా రాత్రికి రాత్రే ఎక్కడికో పోయారు? రాత్రంతా జాగారం సేసావా, దాంతో కలిసి!”
“ఇంకొక్క మాట మాట్లాడినా, నేనేం సేస్తానో నాకే తెలీదే దుర్గా... నిన్న దానెనకాలే నన్ను సూసావేమో కాని, నానిగాడు నా సేతుల్లోనే ఉన్నాడు, మరి ఆడు నీకు కనబడలేదా? పిల్లోడికి పాలిస్తుంటే, దానొంటిమీద జెర్రి పడింది. అది గబుక్కున లేచి, చీర దులుపుకుంటుంటే నీకు అలా కనబడింది... అంతే కాని నువ్వనుకుంటన్న తప్పుడు పన్లు మేము సెయ్యలేదు... అయినా సాంబయ్యన్న కూడా అప్పుడింట్లోనే ఉన్నాడు... మన పెళ్ళి కాకముందు ఆళ్ళింటికి అతడు లేనప్పుడు బోలెడు సార్లు ఎల్లాను... అయినా అతనెప్పుడూ మామీద అనుమానంతో నీలాగ సచ్చిపోలేదే...
నిన్న పొలంలో ఉండగా సాయంత్రం నాకు ఫోనొచ్చింది. సాంబయ్యన్న కొత్త సినీమా రిలీజైన హాల్లో టికెట్ల దగ్గర డ్యూటీ సేస్తుంటే గొడవలై ఆయనకి దెబ్బలు తగిలాయని, టౌన్లోని ఆస్పత్రిలో సేర్పారని... ఎంటనే మా అయ్యగారి 108, అలలా అమూల్యం (కథలు)
మోటరుబండి అడిగి తీసుకెళ్ళాను. అప్పటికే కబురు తెలిసిన గంగ కూడా చంటాడితో అక్కడికి ఒచ్చింది. నేను రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్నానే...
నాతో పాటుగా గంగా, నానీలే కాదే... సాంబయ్యన్న స్నేయితులు, ఆళ్ళ బార్యలు కూడా ఉన్నారు. తెల్లారితే కానీ ఏ సంగతీ సెప్పలేమని డాక్టర్లు అనడంతో బెంగటిల్లిపోయింది గంగ. రక్తం కూడా బాగా పోడంతో, నా రక్తం కలిసి, నేనే ఇచ్చాను. నా ఫోన్‌లో సార్టి లేక ఆఫయింది... జగ్గూ గాడితో కబురంపాను నీకు కంగారదతావని... మరాడెందుకు సెప్పలేదో తెలీదు... సమయానికి మా మావా, అత్తా కూడా లేరుగా ఊళ్ళో?
ఇప్పుడే అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని సెప్పటంతో ఆస్పత్రి పక్కనే ఉన్న సాంబయ్యన్న స్నేయితుల ఇంట్లో గంగనూ, నానీని ఉంచి, నీ దగ్గరకు పరుగు పరుగున వాస్తే, నువ్విలా రంపపు కోతెడతన్నావు... అయినా గంగెవరే? అదేమైనా పరాయిదా? నా మామ కూతురు. ఆయన నన్ను తండ్రిలా సాకాడు కనుక, ఇది నా కన్నా పెద్దది కనుక నాకు అక్కతో సమానం... అలాటిదాంతో నాకు లేనిపోని సంబందాలంటగదడతన్నావ్...” నిస్తాణగా కళ్ళు
దుర్గ కోపమంతా పాలపొంగు మీద నీళ్ళు చల్లినట్టుగా చప్పున చల్తారిపోయి, పరుగుపరుగున వచ్చి, అతని కాళ్ళ దగ్గర అలా కూర్చుండిపోయింది.
“దుర్ధా, నువు నాకు తానానికి నీళ్ళు తోడినప్పుడల్లా నాకెంతో ఇసిత్రంగ అనిపిస్తది... ఏదేడిగా కాసిని నీళ్ళల్లో సరిగ్గా నా ఒంటికి సరిపోయేలా, సల్లటి సీళ్ళు కలిపి నీళ్ళు తోడతావు... నా ఒంటికేం కావాలో, ఎంత యేడి ఉండాలో తెలిసిన నీకు నా మనసేమిటో ఇంకా తెలీకపోడమేటే, నా కర్మ కాకుంటే?” వేదనగా అన్నాడు మల్లేశు.
ఇక ఆగలేక, ఒక్క ఉదుటున లేచి అతని చేతులు పట్టుకొని వద్చింది దుర్గ. “పిచ్చిదాన్ని మావా, నువ్వెలాటోడివో, నీ (ప్రేమెంత సత్తెమైందో నాకు తెలిసి కూడా ఇలా మాటాడినందుకు నన్ను మన్నించవా? మరో మొగాదైతే నేనింత పిచ్చిగా వాగినందుకు వాతలు తేలేలా కొట్టుండేవాడు... నువ్వు కూడ కొట్టు మరి...” అంటూ అతని చేతులతో చెంపలు గట్టిగా వాయించుకుంది పశ్చాత్తాపంతో.
“ఛా, ఊరుకోయే పిచ్చిదానా... ఒక్క ఇషయం తెలుసుకో... పొరబాటున నండూరి సుందరీ నాగమణి లాలా భ్రూ
ఉడుకునీళ్ళు దిమ్మరించుకుంటే ఒళ్ళు కాలి బొబ్బలెక్కిపోయినటై, అనుమానాలు, అపార్తాలూ మనసుల్ని కాల్చేస్తాయే... ఆ ఉడుకునీళ్ళకు “నమ్మకం” అనే సన్నీళ్ళు కలుపుకుంటెనేనే ఏ కాపురమైనా సజావుగా సాగేది...” అని మళ్లేశు చెప్పగానే, నిజమే కదా...” అన్నట్టు ఆమె కళ్ళు తెరచుకున్నట్టయింది.
“మావా, నేనూ నీతో వొస్తాను... పాపం గంగక్క ఎంత బాదలో ఉందో... నేనే అక్క దగ్గర సాయముంటా మావా... వదా...” అంది అతన్ని కంగారు పెడుతూ...
భార్యలో వచ్చిన ఆ మంచి మార్పుకు ఎంతో సంతోషపడుతూ, “స్యర్రేన్సే, నేను తానం సేసి వొన్తాను... నువ్వు తయారవ్వు...” అంటూ పెరట్లోకి నడిచాడు మల్లేశు ఎంతో తేలికపడిన మనసుతో...
(స్వాతి సపరివారపత్రిక, 14.12.2011) ి ల ల + ఈ పతన అమూల్యం (కథలు)
గ(గ్రవహాణం
ఆరోజు ఉదయం నుంచీ నా మనసు ఆనందసాగరమై ఉప్పొంగిపోతోంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణకు ఫలితం... గుంటూరులో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా నాకు ఉద్యోగం వచ్చింది. ఇంకొక రెండు రోజుల్లో నేను వెళ్ళి చేరిపోవాలి.
ముందుగా ఈ విషయం కిరీటికి చెప్పాలి... పాపం...కిరీటి! ఇంకా ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతున్నాడు. మా ఇద్దరిలో ఎవరికి ముందుగా జాబ్ దొరికినా సరే, ఆలస్యం చేయకుండా పెళ్ళి చేసేసుకోవాలని నిర్ణయించుకున్నాము ఇద్దరమూ... అప్పాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నప్పటినుండీ కిరీటి మొబైల్‌కి రింగ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎంచేతనో మరి... 'స్విచ్స్ ఆఫ్... అని వస్తోంది. కారణం అయితే తెలియటం లేదు. ఈ విజయాన్ని ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి... ఇక నేనే అతని రూమ్‌కి వెళ్ళి చెప్పి రావాలని నిశ్చయించుకున్నాక, మా వదినకి చెప్పి బయలుదేరాను.
కిరీటి రూమ్‌కి చేరుకునేసరికి పదకొండున్నర అవుతోంది సమయం... గదికి తాళం వేసి ఉండటంతో బయట కనబడిన చిన్నారిని అడిగాను “మామయ్య ఏడి చిన్నారీ...” అంటూ... ఆ పిల్ల బెదురుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
“ఎవరూ?”” అంటూ వాళ్ళమ్మ సత్యవతి వచ్చింది బయటికి...
“ఓ నువ్వా... ?” అంది నన్ను అదోలా చూస్తూ... ఆ చూపులో ఏదో జాలి, చిరాకు, అసహనం కలగలుపుగా కనబడ్డాయి.
నేను నవ్వుతూనే, “బాగున్నారా? ఏమిటీ మీ చిన్నారి నన్ను కొత్తదాన్ని చూసినట్టు చూస్తోంది? కిరీటి ఎక్కడికి వెళ్ళాడు?” అని అడిగాను.
“ల్సీ_ ఛీ... వాడి గురించి మాట్లాదకమ్మాయ నా దగ్గర... అసలు నువ్వు నండూరి సుందరీ నాగమణి లాాాాాతతతతతతతతతతనాా
కూడా ఆ త్రాష్పుడితో సహవాసం మానెయ్యి... లేకుంటే నిన్ను కూడా నట్టెట్లో ముంచేసి పోగల సమర్థుడు వాడు...” ఆమె ముఖం కోపంతో జేవురించింది.
ఆవిడ మాటల్లోని ఏహ్యతను గమనిస్తూనే, “కిరీటి నాకు కాబోయే భర్త... అతను అంత నీచమైన పని ఏం చేశాడండీ?” అన్నాను కొంచెం అసహనంగా...
ఆమె కుర్చీలో కూర్చోమని నాకు సైగ చేస్తూ... “చూడమ్మా సంధ్యా కిరీటి మా ఇంట్లోకి వచ్చి ఏడాదిన్నరయింది. నా స్వంత తమ్ముడిలా చూసుకున్నాను వాడిని... చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు... చుట్టుపక్కల వాళ్ళ పిల్లలందరినీ చేరదీసి ఆడించేవాడు. బోలెడన్ని కథలుచెప్పేవాడు... కాని వెధవ...” దుఃఖంతో, కోపంతో ఆమె ఆగిపోయింది.
“ఏం... ఏం చేశాడు?” వణుకుతున్న గొంతుతో అడిగాను.
“మా చిన్నారి వయసు ఎంత చెప్పు? ఎనిమిదెళ్ళి, తొమ్మిది నడుస్తోంది... నాలుగు రోజుల క్రితం... వాడి గదిలోకి వెళ్ళి ఇది ఆడుకుంటూ ఉంటే దాన్ని దగ్గరకు పిలిచి, పదే పదే తాకరాని చోట తాకాడట... గట్టి గట్టిగా ముద్దులు పెట్టుకున్నాడట... వాడిని చూస్తే చాలు బెదిరిపోతోంది పిల్ల... ముందు ఎంచేతో మాకు అర్ధం కాలేదు... ఇది బెంగెట్టుకుని తిండీ తిప్పలూ మానేసింది. మొన్న ఓ రోజు ఎంతో బుజ్జగించి అడిగితే విషయం చెప్పింది ఏడుస్తూ... వెంటనే మా వారు వాణ్ణి ఇల్లు ఖాళీ చేయించేశారు...”
నా నాలుక తడారిపోయింది... గుండె పట్టేసినట్టయితే, ఎలాగో గొంతు పెగల్పుకుంటూ అన్నాను, “మీరు ... మీరు... చెప్పేది నిజమా...?”
“నిజమే సంధ్యా... ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెబుతానమ్మా? జాగ్రత్తమ్మా... వాడిని నమ్మకు...” ఆమె ఇంకా ఏదేదో చెబుతూనే ఉంది, గబగబా వెనుతిరిగి వచ్చేశాను.
షం శ
ఒక్క ఉదుటున ఇంటికి వచ్చి పడ్డాను. నా బుర్ర పనిచేయటం పూర్తిగా మానేసింది... కిరీటి... నా వాదైన కిరీటి... మంచితనానికీ, ఉత్తమ సంస్కారానికీ దర్పణమని నేను భావించిన కిరీటి ఇంత హేయమైన నైజం కలవాడా? “ప్రపంచమంతా ఒకవైపు... కిరీటి ఒక్కడూ ఒకవైపు...” అనుకున్నాను... నా నమ్మకం కూకటివేళ్ళతో పెకలింపబడిన వటవృక్షంలా కుప్పకూలివోయింది. తతత అమూల్యం (కథలు,
విజయ నా మేనత్త కూతురు. ఇక్కడ నర్స్‌గా పనిచేస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నాకు నా అత్తయ్యే తల్లె పెంచింది, నాకన్నా మూడు సంవత్సరాలు మాత్రమే పెద్దదైన తన కూతురితో పాటు. అత్తయ్య, మామయ్య మా ఊరిలోనే ఉంటారు. వదినకు పెళ్ళెన తర్వాత ఇక్కడ స్థిరపడ్డారు. ఆమె భర్త రాఘవ కూడా మా ఊరివాదే... ముద్దులు మూటకట్టై మూడేళ్ళ వాళ్ళ పాపాయి బేవీ... బొద్దుగా, నల్లని ఉంగరాల జుత్తుతో, బూరెల వంటి బుగ్గలతో ఎంతో ముద్దు వస్తూంటుంది. నా దగ్గర చాలా చేరిక దానికి.
ఒకే దగ్గర పెరగటంతో వదిన దగ్గర నాకు చనువెక్కువ. అంచేత నాకు బి.యిడిలో సీటు వచ్చిన తరువాత తన ఇంటికి వచ్చి ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలూ మొదలుపెట్టాను... అలా ఒక ఇంటర్వ్యూలో పరిచయమయ్యాడు కిరీటి నాకు...
అతని అభిరుచులు, నా అభిరుచులు ఒక్కటే... మా పరిచయం స్నేహంగా మారింది.... రేపో మాపో అతన్నే పెళ్ళిచేసుకోవాలని నేనుకలలు కంటూ ఉంటే అతనిపై ఈ అభియోగం... కిరీటి ఇంత ఛండాలుడా? పసిపిల్లలను కామదృష్టిలో చూసేంత నీచుడా? నాకు తెలిసినంతవరకూ అతనలాంటి మనిషి కాడు... ఎంతో సంస్కారం, సౌశీల్యం కల వ్యక్తి... ఎన్నిసార్లు మేమిద్దరమూ ఏకాంతంగా గడిపినా పెళ్ళి తరువాత గడుపబోయే మధురమైన జీవితం గురించి చెబుతూ అందమైన కవితలు అల్లేవాడే కాని, ఏనాడూ హద్దులు మీరేవాడు కాదు... అలాంటిది, ఇదేమిటీ... ఇంత అసహ్యంగా? ఆలోచిస్తూంటేనే ఏడుపు తన్నుకొచ్చేస్తోంది నాకు...
“ఏమిటే అప్పుడే వచ్చేశావేమిటీ? సాయంత్రం వరకూ రాననీ, కిరీటితో కలిసి సినిమాకి వెళతాననీ అన్నావుగా?” వరండాలో బేబీకి అన్నం తినిపిస్తున్న వదిన లోపలికి వస్తూ అడిగింది నన్ను.
“ప్రిమ్సీ లేదు వదినా...” అంటూనే తన భుజమ్మీద తలవాల్చి బావురు మన్నాను.
“అయ్యో, ఇదేమిటే?” అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది వదిన. చాలా ప్రయత్నం తరువాత మాటలు కూడబలుక్కుంటూ, జరిగిందంతా చెప్పాను.
“ఛ! నమ్మబుద్ధి కావటం లేదు సంధ్యా... కిరీటి మనింటికి కూడా చాలాసార్లు వచ్చాడుగా, అతని ప్రవర్తన చాలా పద్ధతిగా ఉంటుంది... ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండాలి...” నండూరి సుందరీ నాగమణి లాలా
“ఏమో వదినా... నాకు మాత్రం మనసులో చాలా దుఃఖంగా ఉంది. తెల్లారితే ఎన్ని వినటం లేదు మనం! చిన్నపిల్లలమీద... అదే... చైల్డ్ అబ్యూజ్... స్మూళ్ళలో, ఇళ్ళలో... ఎక్కడపడితే అక్కడ... కన్నతండ్రి, మేనమామ, మాస్టర్హు, పక్కింటి అంకుల్స్... ఎవడు పడితే వాడు... అలాంటి నీచులలో ఈ కిరీటి కూడా చేరాడని అనుకుంటే భరించరానంత అసహ్యమేస్తోంది...”
“తొందర పడకే సంధ్యా... కొంచెం నిదానించు...” అనునయంగా చెప్పింది వదిన.
నా వాక్ర్రవాహం ఆగటం లేదు... “వదినా... దినపత్రిక తెరవగానే... ఎన్ని మానభంగ వార్తలు... ఎంత మంది నిర్భయలు? నేటి యువత ఎటు పోతోంది? అమ్మాయిలకు... ఫాషన్ పేరుతో వంటిమీద అరకొర వస్త్రాలు...
. కాలేజీలో చేరగానే ధూమపానాలు, మద్యపానాలు, మాదకద్రవ్యాలు... దేటింగ్ పేరుతో వెధవ వేషాలు...చదువుకునే వయసులో ఇవేం పన్లు చెప్పు! ఇంకా...
' పెళ్ళి చేసుకోకుండా సహజీవనాలు! ఇక మనిషికి నైతికవర్తన వద్దా? నాగరికత అనే ముసుగేసుకుని, ఈ విశ్చంఖలత...” నా గొంతు వణికింది బాధతో.
“అందుకు కారణం ఓ రకంగా మీడియా కూడా కదా సంధ్యా! అర్ధం
- పర్థం లేని వ్యాపారప్రకటనలు... ప్రతి ప్రకటనలోనూ అవసరమున్నా లేకున్నా స్త్రీని అర్ధనగ్నంగానో, ముప్పావు నగ్నంగానో చూపించటం... అదేదో కంపెనీ సెంటు పూసుకుంటే ఆడాళ్ళంతా ఆ మగాడి వెంట ఓ గొ(రైలమందల్లే వెళ్ళిపోవటం... ఏమైనా అర్ధముందా చెప్పు..!”
“ఊ...” కళ్ళు మూసుకున్నాను... కనుల వెంబడి కస్నీరు ఆగకుండా జారుతుంటే...
“ఈ మధ్య ఈ చైల్స్ అబ్యూజ్ అనేది మరింత ఎక్కువైపోయింది సంధ్యా...
మొన్న ఉదయం మన బేబీ హాల్లో పడుకుని ఉండగా మన పాలతను వచ్చాడు. నేను లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చేలోగా వాడు పాపాయి బుగ్గలను గట్టిగా ముద్ద పెట్టుకున్నాడు. అది లేచి కెవ్వున అరుస్తూ అరిచి గీ పెట్టటం మొదలుపెట్టింది. దాని బుగ్గలు కందిపోయి ఉన్నాయి. వాడి పెద్ద పెద్ద మీసాలూ వాడూనూ... మొరటుగా ముద్దు పెట్టుకున్నాడు వద్దని... గట్టీగా కోప్పడితే అంటాదు, 'చిన్నవాప కదమ్మా, ముద్దు వచ్చి...” అంటూ నసిగాడు. పువ్వుల్లాంటి పసివాళ్ళను అలా డీల్ చేయకూడదని చెప్పాను... ్నంా అమూల్యం (కథలు)
మొన్న ఇలాంటి పాపాయి కేసు ఒకటి వస్తే మా డాక్టరుగారు చెప్పారు వాళ్ళ పేరెంట్స్‌తో... అసలు ప్రతి తల్లీ ఆడపిల్లలకు స్కూలుకి వెళ్ళే వయసు వచ్చిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలట. మన ఇంటివాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మన పాపాయితో ఎలా ప్రవర్తిస్తున్నారు, పాపాయి అకస్మాత్తుగా డల్ అయిందా... ఎవర్ని చూసైనా భయపడుతోందా... ఇవన్నీ గమనించాలి. మన ఇంటి దీపాన్ని కంటిరెప్పలా కాపాడుకోవటం మన బాధ్యత... అందుకే అనుక్షణమూ వాళ్ళను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఏదేనా చెప్పబోతే తేలికగా తీసెయ్యకుండా ఓపికగా వినాలి. ఎవరిపైన ఫిర్యాదు చేసినా వాళ్ళను కసిరికొట్టకుండా విని, వాళ్ళను నమ్మాలి. నౌకర్ల దగ్గర కానీ, డైవర్ల దగ్గర కానీ ఒంటరిగా వదిలిపెట్టకూడదు. పది పదకొందేళ్ళు దాటాక వారి శరీరంలో రాబోతున్న మార్పుల గురించి వివరంగా చెప్పాలి. అలాగే తీసుకోవలసిన జాగ్రత్తలు... ఎవరైనా మిస్ బిహేవ్ చేస్తే... వెంటనే తల్లిదండ్రులకు చెప్పగలిగేలా వారిని ట్రెయిన్ చేయాలి... ఆడపిల్లంటే సన్నజాజిమొగ్గ... దాన్ని చిదిమివేయాలనే పశు(ప్రవృత్తి నుండి జాగ్రత్తగా మనమే మన పిల్లల్ని కాపాడుకోవాలి...”
“అవును వదినా... నువు చెప్పింది నిజమే... కానీ చూడు...కిరీటి... నేను ఎంతగానో నమ్మిన కిరీటి ఏం చేశాడో...” నా స్వరం దుఃఖంతో మూగవోయింది.
“ద, బాధపడకు సంధ్యా... మనం కిరీటిని కలుసుకుని మాట్లాడదాం... ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం... లే భోజనం చేద్దాము... నాకు డ్యూటీ ఉంది కదా...”
“వదినా... నేను గుంటూరుకు రేపే బయలుదేరాలి...”
“ఇంకోసారి కిరిటికి ఫోన్ (ట్రై చేయి సంధ్యా...”
“చేస్తూనే ఉన్నాను వదినా... ఫోన్ పలకటం లేదు ఎందుకో...”
“వోనీ నీ నంబరు తెలుసు కదా అతనికి... అతనైనా చేయవచ్చుగా నీకు?” వదిన మాట పూర్తికాక ముందే నా మొబైల్ (మోగింది.
“హలో సంధ్యా... నేను కిరీటిని...” అవతలినుంచి ఎంతో నీరసంగా వినిపించింది అతని కంఠం.
“అసలేమిటి నువ్వు చేసిన పని?” ఆవేశంగా అరిచాను.
“ఒక్క నిమిషం నేను చెప్పేది నిదానంగా విను సంధ్యా... నా సెల్ ఫోన్ . నండూరి సుందరీ నాగమణి ఆ
పోయింది... అందుకే నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను... సడెన్‌గా మా ఊరికి వచ్చాను...
“నాకేం చెప్పకు... నువ్వింత నీచానికి పాల్చ్పదతావని నేనసలు కలలో కూడా అనుకోలేదు... ఐ హేట్ యూ...”
“సంధ్యా...” వారించింది వదిన.
“అయ్యో సంధ్య, నా మాట విను... ప్లీజ్...”
“లేదు కిరీటి... నువ్వు క్షమించరాని పాపం చేశావు... నీ మొహం కూడా నేను చూడదలచుకోలేదు నేను... నిన్ను పెళ్ళిచేసుకుంటే... రేపు పుట్టబోయే మన పాపకు సైతం నీ నుండి రక్షణ ఉండదు...”
“సంధ్యా... ఎంత మాటన్నావు?”” కిరీటి గొంతులో ఆక్రందన నన్నే మాత్రం కదిలించలేకపోయింది...
“కిరీటీ... నాకు. జాబ్ వచ్చింది... నేను రేపే వెళుతున్నాను జాయిన్ అవటానికి... ఇక మనం కలిసే ప్రసక్తే లేదు... నాకు ఫోన్ చేయకు...”
“అది కాదు సంధ్యా...ప్లీజ్... నా మాట విను...”
“సారీ కిరీటీ... మానవత్వం లోపించిన మృగాలతో నేను మాట్లాడను...”
“ఉరిశిక్ష వేయబడ్డవాడికి కూడా చివరిమాటలు చెప్పుకునే అవకాశ ముంటుంది కదా... నేను వచ్చి మాట్లాడతాను... నువ్వు తొందరపడి ఏ నిర్ణయమూ
“నీకూ నాకూ సరిపడదు కిరీటీ... ఇంక వదిలెయ్...” నిష్కర్షగా చెప్పేసి ఫోన్ కట్ చేసేశాను ఆవేశంగా...
శి స ₹
భోజనం చేశాననిపించి, అన్యమనస్కంగానే పాపాయిని ఆడిన్తూ, సాయంత్రం దాకా ఎలాగో గడిపాను. సాయంత్రం రాఘవ అన్నయ్య రాగానే గుంటూరుకి నెట్‌లో బస్ టికెట్స్ బుక్ చేయాలని, అతని లాప్‌టాప్ అడిగి తీసుకున్నాను. ఆ పని అయ్యాక కాజువల్‌గా మెయిల్ ఓపెన్ చేసిన నాకు కిరీటి పంపించిన మెయిల్ కనిపించింది. అప్రయత్నంగా నా కళ్ళు ఆ మెయిల్ వెంట పరుగులు తీశాయి.
చాలా అమూల్యం (కథలు)
“ప్రియమైన సంధ్యకు...
అయామ్ సారీ సంధ్యా... నేను చేసిన సీచమైన పనివల్ల దేవతలాంటి సత్యవతి అక్కయ్య వాళ్ళింటినుండి బహిష్కరింపబడ్డాను. తప్పుచెసిన నాకు అలాంటి శాస్తి జరిగి తీరాల్సిందే...
నువ్వు గుంటూరుకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు, ఇక్కడ నాక్కూడా ఓ మంచి కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. అన్ని అర్హతలూ ఉన్నా నన్ను సెలెక్ట్ చేయలేదు. ఆ ఉద్యోగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు చాలా ఆశాభంగంగా అనిపించింది. విపరీతమైన ్రస్టేషన్‌తో నా క్లాస్‌మేట్ మదనగోపాల్ రూముకి వెళ్ళాను. ఆ రోజు వాళ్ళంతా అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. నేను వెనక్కి వచ్చేయాలని అనుకున్నాను కానీ మదన్ వాళ్ళ (ఫైంద్ ఒకతను తన పుట్టి నరోజన్ నన్ను భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేయటంతో నేను మొహమాటంగానే ఉండిపోవలసి వచ్చింది.
“కంపెనీ సేక్ అంటూ బలవంతంగా నాతో డ్రింక్ తాగించారు. లాప్‌టాప్‌లో ఒక బ్లూ ఫిలిమ్ చూపించారు. 'పసిపిల్లలతో లైంగికక్రియ - దాంట్లో ఉండే కిక్కు..* అది చూస్తూంటే నాకు చాలా బాధగా అనిపించింది. కానీ క్రమంగా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూంటే నేనూ నాకు తెలియకుండా దానిలో లీనమైపోయాను. మత్తు ఎక్కువైపోవటం వల్ల ఆ రాత్రి అక్కడే నిద్రపోయాను. తెల్లారే లేచి నా రూమ్‌కి వచ్చేశాను.
విపరీతమైన హాంగోవర్... ఇంకా మత్తు దిగలేదు... అలా పడుకునే ఉన్నాను. ఆ మధ్యాహ్నం నా దగ్గరకు ఆడుకోవటానికి వచ్చింది అమాయకపు చిన్నారి. నాకు తెలియకుండానే ఆ పాపతో నేను మిస్ బిహేవ్ చేశాను. ఆ పిల్ల బెదిరిపోయి ఇంట్లోకి పారిపోయినపుడు కానీ నా తప్పు తెలియలేదు. చాలా గిల్టీగా అనిపించింది... నా మీద నాకే ఎంతో అసహ్యం వేసింది. చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని, కథ చెబుతూ అన్నం తినిపించేవాడిని... భావిలో మన కూతుర్ని ఊహించుకుంటూ... అలాంటిది... ఆ పాపతో అలా ఎలా ప్రవర్తించగలిగాను? నువ్వు రాగానే నీతో ఇవన్నీ చెప్పాలని అనుకొన్నాను.
ఈలోగానే చిన్నారి బెంగ పెట్టుకోవటం, అన్నం తినకపోవటం, ఊరికే ఉలిక్కిపడటం, నన్ను చూసి భయపడటం ఇవన్నీ జరిగిన విషయాన్ని దాచలేక పోయాయి. అందుకే చిన్నారి నాన్న నన్ను ఇల్లు ఖాళీ చేయమని అనగానే మారు
నండూరి సుందరీ నాగమణి లాాాాాాలాాాాా భి
మాట్లాడకుండా, సత్యవతి అక్కయ్యకు క్షమాపణ చెప్పి బయటకువచ్చేశాను. ఈ హడావుడిలో బస్సులో నా మొబైల్ ఎవరో కాజేశారు. అంచేతనే నేను నీకు వెంటనే ఫోన్ చేయలేకపోయాను. ఇదీ జరిగిన విషయం సంధ్యా... నేను చేసింది తప్పే... కానీ కావాలని చేసింది మాత్రం కాదు. అలా అని ఇది క్షమార్హమూ కాదు. నిన్ను క్షమించమని వేడుకోగలనే కానీ, నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోనికి ప్రవేశించలేను కదా... అంతిమ నిర్ణయం నీదే... కానీ ఒక ప్రమాణం... నువ్వు అడగకపోయిన సరే... ఇక కలలో కూడా అలాంటి పనులు, యోచనలు చేయను. మా అమ్మ మీద ఒట్టెసి చెబుతున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ తాగను... ఆ మైకంలో ఇలాంటి దరిద్రపు పనులు చేయను. నువ్వు నన్ను నమ్మవచ్చు... ఒకవేళ ఇది ఒక మానసిక చాపల్యమో, బలహీనతో అయి ఉంటే ఆ రుగ్మతను నయం చేసుకోవటానికి నేను నీతో పాటు డాక్టరుగారి దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను... మరి... నాకు ఒక్కటంటే ఒక్కటి... ఒక్క అవకాశం ఇస్తావా? ఆశతో... నీ కిరీటి” నాకు తెలియకుండానే నాలుగైదు సార్లు ఆ లేఖను చదివాను... ఎంతో నిజాయితీగా, దీనంగా కిరీటి చెబుతున్న మాటలు నా మనసులో ్రతిధ్వనించ సాగాయి. చెడు అలవాట్లు దట్టంగా ముసురుకునే చీకట్లలాంటివి. అవి సంస్కారమనే వెలుతురుని నిలువునా మింగేస్తాయి. చెడు స్నేహితులు రాహుకేతువుల్లా ఈ చీకట్లలో మనను ముంచేయటానికే కంకణం కట్టుకుంటారు. వపావాలకు, అకృత్యాలకు చీకటి సంపూర్ణ సహకారి! నిజానికి కిరీటి చాలా సంస్కారవంతుడు. చాలాసార్లు, చాలా గంటలు అతనితో కలిసి నేను రూమ్‌లో చదువుకున్నాను. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయేవాళ్ళం ఇద్దరమూ కలిసి. అవకాశం వచ్చినా అతను ఎప్పుడూ నన్ను మోహావేశంతో తాకలేదు. కనీసం నన్ను ముద్దు పెట్టుకోలేదు. నాకు ఆశ్చర్యంగా ఉందేది... అప్పుడప్పుడూ నేనే ప్రలోభపడి... మనసులోనే గింజుకునేదాన్ని. 'నేను అందంగా లేనా, లేక అతనిలో వదైనా లోపమున్నదా అనే ఆలోచనలు, అనుమానాలు కూడా వచ్చివి. ఓసారి నా సందేహాన్ని నిస్సంకోచంగా కిరీటి దగ్గర వ్యక్తపరచాను. వతం అమూల్యం (కథలు)
మాట్లాడకుండా, సత్యవతి అక్కయ్యకు క్షమాపణ చెప్పి బయటకువచ్చేశాను. ఈ హడావుడిలో బస్సులో నా మొబైల్ ఎవరో కాజేశారు. అంచేతనే నేను నీకు వెంటనే ఫోన్ చేయలేకపోయాను. ఇదీ జరిగిన విషయం సంధ్యా... నేను చేసింది తప్పే... కానీ కావాలని చేసింది మాత్రం కాదు. అలా అని ఇది క్షమార్హమూ కాదు. నిన్ను క్షమించమని వేడుకోగలనే కానీ, నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోనికి ప్రవేశించలేను కదా... అంతిమ నిర్ణయం నీదే... కానీ ఒక ప్రమాణం... నువ్వు అడగకపోయిన సరే... ఇక కలలో కూడా అలాంటి పనులు, యోచనలు చేయను. మా అమ్మ మీద ఒట్టెసి చెబుతున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ తాగను... ఆ మైకంలో ఇలాంటి దరిద్రపు పనులు చేయను. నువ్వు నన్ను నమ్మవచ్చు... ఒకవేళ ఇది ఒక మానసిక చాపల్యమో, బలహీనతో అయి ఉంటే ఆ రుగ్మతను నయం చేసుకోవటానికి నేను నీతో పాటు డాక్టరుగారి దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను... మరి... నాకు ఒక్కటంటే ఒక్కటి... ఒక్క అవకాశం ఇస్తావా? ఆశతో... నీ కిరీటి” నాకు తెలియకుండానే నాలుగైదు సార్లు ఆ లేఖను చదివాను... ఎంతో నిజాయితీగా, దీనంగా కిరీటి చెబుతున్న మాటలు నా మనసులో ్రతిధ్వనించ సాగాయి. చెడు అలవాట్లు దట్టంగా ముసురుకునే చీకట్లలాంటివి. అవి సంస్కారమనే వెలుతురుని నిలువునా మింగేస్తాయి. చెడు స్నేహితులు రాహుకేతువుల్లా ఈ చీకట్లలో మనను ముంచేయటానికే కంకణం కట్టుకుంటారు. వపావాలకు, అకృత్యాలకు చీకటి సంపూర్ణ సహకారి! నిజానికి కిరీటి చాలా సంస్కారవంతుడు. చాలాసార్లు, చాలా గంటలు అతనితో కలిసి నేను రూమ్‌లో చదువుకున్నాను. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయేవాళ్ళం ఇద్దరమూ కలిసి. అవకాశం వచ్చినా అతను ఎప్పుడూ నన్ను మోహావేశంతో తాకలేదు. కనీసం నన్ను ముద్దు పెట్టుకోలేదు. నాకు ఆశ్చర్యంగా ఉందేది... అప్పుడప్పుడూ నేనే ప్రలోభపడి... మనసులోనే గింజుకునేదాన్ని. 'నేను అందంగా లేనా, లేక అతనిలో వదైనా లోపమున్నదా అనే ఆలోచనలు, అనుమానాలు కూడా వచ్చివి. ఓసారి నా సందేహాన్ని నిస్సంకోచంగా కిరీటి దగ్గర వ్యక్తపరచాను. వతం అమూల్యం (కథలు)
నా మాటలు విని ఆపకుండా నవ్వాడు కిరీటి. “వివాహబంధం చాలా పవిత్రమైనది సంధ్యా... ఎంతో ఇష్టపడి ఒకటయ్యే ఇద్దరు వ్యక్తులు, తమ ప్రతి అనుభూతినీ తొలిరేయినాడు పంచుకుంటేనే కదా, ఆ రాత్రికి సార్ధకత! అదీ గాక, ఇలాంటి ప్రలోభాలకు మనం లోనైతే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యాలను చేరుకోవటం అసాధ్యం... ఇప్పుడు మనం పెళ్ళి చేసుకోవాలంటే వెంటనే ఉద్యోగాలు రావాలి... అవి రావాలంటే ఇలాంటి కోరికలకు చెక్ పెట్టాలి...” అంటూ బుద్దుడిలా జ్ఞానబోధ చేశాడు. ఆ పాఠం వినలేక దణ్ణం పెట్టిశాను... అది గుర్తుకు వచ్చి తెరలు తెరలుగా నవ్వొచ్చింది నాకు.. అనుకోకుండా మనసు కూడా తేలికైపోయింది. (ప్రమ యొక్క ప్రథమ లక్షణం 'క్షమ!” నెలవంక వంటి చిరునవ్వు లీలగా నా పెదవులపై కదలాడుతుంటే, మళ్ళీ లాగిన్ అయ్యాను, కిరీటి మెయిల్‌కి జవాబు వ్రాసేందుకు... (ఆంధ్రప్రభ వెబ్ పత్రిక, 18.03.2014) అ ఈ ఈఈ నండూరి సుందరీ నాగమణి లా
ఆశాదీపం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే స్థాణువులా కూర్చుండి పోయింది వల్లి. భోజనం చేసి, మందులు వేసుకోవాలి తాను... కాని... కాని... ఆ ధ్యాసే లేనట్టు వల్లి అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఊహ తెలియని వయసులోనే లోకం విడిచిపెట్టి వెళ్ళిన తండ్రినీ, తనకు పెళ్ళి చేసేసి తనువు చాలించిన తల్లినీ తలచుకుంటూ వెక్కి వెక్కి ఎద్బింది. తన గర్భంలోని శిశువును పొట్టపైనుండి తాకుతూ, పొగిలి పొగిలి ఏడ్వసాగింది వల్లి.
నిజానికి తాము చాలా నిరుపేదలు. కటికదరిద్రం అంటే తమదే అని చెప్పాలి. యౌవనంలోనే భర్తను పోగొట్టుకున్న తన తల్లి నూకాలు ఒక తాపీ మేస్త్రీ దగ్గర రోజు కూలీకి చేస్తూనే తనను పదవ తరగతి వరకూ చదివించింది. పది పాసయ్యాక, ఆపైన ఇంకా చదువుకుంటానని అంటే తనకిక సోమతు లేదని చెప్పింది. ఈలోగానే ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. తనిక చేసేదేమీ లేక, ఇల్లు గడవటానికి నాలుగిళ్ళల్లో పనిచేయటం మొదలుపెట్టింది వల్లి. సాయంత్రాలు ట్యుటోరియల్స్‌లో చేరి చదువుకోవాలని, (ప్రైవేటుగా ఇంటర్ పరీక్షకు కట్టాలని అనుకుంది. కానీ... తన వయసే తనకు శాపమైంది. తాను పనిచేసే ఇళ్ళలోని కుర్రాళ్ళు మాత్రమే కాదు, వారి తండ్రులు, తాతలు... అసలు అన్ని వయసుల్లోని పురుషులూ కూడా తనను చెరపట్టాలని, తన యవ్వన మకరందాన్ని (గగోలుకోవాలని కోరుకుంటున్నవారే అయ్యేసరికి, వారి నుంచి తప్పించుకోవటం
బ్రహ్మ ప్రళయమే అవసాగింది వల్లికి, తాను అనుభవించే బాధలను తల్లితో పంచుకుంటుంటే, ఆ నిస్సహాయురాలైన తల్లి మనసు ద్రవించిపోయింది. ఆ తోడేళ్ళ బారినుండి, ఈ లేడిపిల్లను ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. తను పనిచేసే మేస్త్రీ దగ్గర చెప్పుకొని బాధపడితే, అతను తనకు తెలిసిన ఒక ఆఫీసులో హెల్పర్‌గా పని ఇప్పించాడు. ఒక మూడు 120 లతా అమూల్యం (కథలు)
నెలలు బాగానే గడిచింది. మళ్ళీ కథ మాత్రం మామూలే అయిపోయింది. పెద్ద ఆఫీసర్లు మొదలుకొని, చిన్న ప్యూన్ల వరకూ అందరికీ వనల్లీయే కావాలి. అందరి పనులూ వల్లీయే చేయాలి. బయటినుండి కాఫీలు, టీలు, సిగరెట్లతో సహితం వల్లీయే తీసుకురావాలి. ఏదొక వంకతో సాయంత్రం ఆఫీసు అయ్యాక కూడా వల్లిని ఇంటికి పోనిచ్చేవారు కాదు. సాయంత్రం పూట తనకు క్లాసులు పోతాయని, చదువులో చాలా వెనుకబడిపోతానని దిగులు పడుతూనే పనిచేస్తూ ఉండిపోయేది వల్లి.
ఓ రోజు సాయంతం అందరూ వెళ్ళిపోయాక, తాను కూడ బయలుదేరబోతూ ఉంటే ఆఫీసరు పుల్లారావు బయటినుంచి టీ తెచ్చిపెట్టమని డబ్బులిచ్చాడు. టీ తెచ్చిన తరువాత ఫ్లాస్క్‌లోంచి కప్పులోనికి వంచి అందిస్తుంటే, కప్పుతో పాటుగా ఆమె చేయి కూడా పట్టుకుని లాగి, భుజమ్మీద చెయ్యేసి గట్టిగా నొక్కాడు. అంతే! విదిలించుకొని మరుక్షణం పరుగు పరుగున ఆఫీసునుంచి బయటకు వచ్చేసి, రోద్దుమీద పడింది వల్లి. ఇంకోసారి ఆ ఆఫీసు గుమ్మం ఎక్కలేదామె. అటువంటి పరిస్థితులలో కూతురికి పెళ్ళి చే సెయ్యటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది నూకాలు. ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో లారీ దైవర్‌గా పనిచేస్తున్న దూరపు బంధువు పైడిరాజు వల్లిని చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. నూకాలుకి తమ్ముడి వరస అయ్యే అతను, వల్లికన్నా ఇంచుమించు పదేళ్ళు పెద్దవాడు. వయసు తారతమ్యం మాట ఎలా ఉన్నా అతని అలవాట్లు కాని, వృత్తిగాని వల్లికి నచ్చలేదు. ఆ మాట తల్లితో చెప్పగానే, ఆమె “అమ్ములూ, పైద్రాజు మనోడు కనక, మనమంటే అభిమానముంది కనక, పైసా కట్నం డబ్బులు కూడా అడక్కుండా కర్సులన్నీ ఆడే బరాయించుకుని, నీ మెళ్ళో పుస్తె కడతానికి ఒప్పుకున్నాడే... నీకు కటమియ్యటానికి ఈ గుడిసె అమ్మెద్దారని అనుకున్నాను కాని అలా సేత్తే ఇంక నాకు నిలవనీడ ఉండదని ఆడే ఒద్దన్నాడు. నువ్వుప్పుడు ఈణ్సి సేసుకోనని మొండికేత్తే, నిన్నెవులు సేసుకుంటారు సెప్పు? నాను సూత్తే కాట్లో ఓ కాలు, ఇంట్లో ఓ కాలు ఏసుకుని ఉన్నానా? నానుండగానే నీకు లగ్గమైపోతే ఇంక నాను సచ్చిపోయినా పర్నదు...” కూతురుకి నచ్చజెప్పింది నూకాలు.
ఇక చేసేదేమీ లేక, చదువుకోవాలన్న తన ఆశను కాస్తా చిదిమేసుకొని, తన ఆడపుట్టుకను తిట్టుకుంటూ పెళ్ళికి తలవంచింది వల్లి. =
పైడిరాజంటే ఇష్టమే కాని అతను కాల్చే బీడీ వాసన, తాగే బ్రాందీ వాసన నండూరి సుందరీ నాగమణి తతా
గిట్టేవి కావు వల్లికి. వాటిని మానేయమని బ్రతిమలాడేది. భార్యమీద ఉన్న (పేమకొద్దీ మానేస్తానని మాటిచ్చాడు పైడిరాజు. వారానికి రెండు రోజులు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. మిగిలిన రోజుల్లో లోడ్ తీసుకుని లారీమీద వెళ్ళేవాడు. తల్లిని తన దగ్గరే పెట్టుకుంది వల్లి. తన మనసును చదువుమీద కేంద్రీకరిస్తూ, భర్త తెచ్చిచ్చే డబ్బును ఎంతో పొదుపుగా వాడుతూ, ఇల్లు నడపసాగింది వల్లి. వల్లి దురదృష్టం... పెళ్ళ నెలైనా గడిచిందో లేదో... కడుతున్న గోడ కూలి పడిపోయి, అక్కడే ఉన్న నూకాలు మీద పడటంతో ఆమె చనిపోయింది. హఠాత్తుగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిన తల్లిని తలచుకొని వల్లి ఏడవని రోజు లేదు. నూకాలు పూరిల్లే బాగు చేయించి, పెంకు కప్పించాడు పైడిరాజు. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసిందో లేదో వల్లికి నెల తప్పింది.
తల్లిని కాబోతున్నానన్న సంతోషం కన్నా, “కొన్నాళ్ళు దీన్ని వాయిదా వేసి ఉంటే బావుందేదేమో...' అన్న భావన దానిని అధిగమించినట్టు అనిపించింది వల్లికి. బాగా చదువుకొని, ఉద్యోగం సంపాదించుకొని భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి సంసారం దిద్దుకొన్నాక అప్పుడు సంతానం కలిగి ఉంటే బావుండేదని అనిపించిందామెకు. ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో పొరపాటైంది.
తండ్రిని కాబోతున్నానని తెలిసిన క్షణం నుండీ పైడిరాజు ఆనందానికి అంతులేదు. తన బిడ్డకు తల్లి కాబోతున్న వల్లి అతనికి ఎంతో అపురూపంగా అనిపించింది. తనకెంతో ఇష్టమైన నూకాలప్పే తన కూతురిగా రాబోతుం దనిపించిందతనికి. అందుకనే సేట్ నడిగి అడ్వాన్సుగా అయిదువేలు తెచ్చి వల్లికిచ్చాడు. డాక్టరుకు చూపించుకాని, ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని మందులు వాడమని చెప్పాడు. అంతే కాదు, ఒక పెద్ద హార్లిక్స్ సీసా, సంచినిండా పళ్ళు తీసుకువచ్చి ఇచ్చాడామెకు. వల్లికి సహాయంగా ఉంటుందని, తన పినతల్లి కూతురు పద్దాలును తీసుకొచ్చాడు. పద్దాలు వల్లి కన్నా ఏడాది చిన్నది. ఇంకా పెళ్ళి కాలేదు. నెల తప్పిన తరువాత వల్లికి బాగా నీరసం పట్టుకుంది. తిన్నా, తినకున్నా నిరసమే. దానికి తోడు విపరీతమైన వేవిళ్ళు. ఏం తిన్నా ఇమిడేది కదు. దగ్గూ, ఆయాసాలతో బాధపడసాగింది. ఇంటి దగ్గరే ఉన్న క్లినిక్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకొమ్మని వ్రాసిచ్చింది. మామూలుగా చేసే పరీక్షలన్నింటితో వాటుగా డాక్టరమ్మ వ్రాసిన హెచ్.ఐ.వీ టెస్ట్ కూడా చేశారు లాబ్‌వాళ్ళు. అది కాస్తా పాజిటివ్‌గా వచ్చింది. రిపోర్టులు తీసుకుంటుంటే వాటినందిస్తూ వంకరగా నవ్వాడు ఆ ల్యాబ్‌లోని ఉద్యోగి. అప్పుడు పతత22/తతతాలాజజజఆఆఆఆఆలలాడా అమూల్యం (కథలు,
అర్ధం కాలేదు కాని, ఇప్పుడింటికొచ్చి చూసుకున్నాక... తను... తను... హెచ్.ఐ.వీ పాజిటివ్!!! జ శ ఈ
అసలెలా నాధ్యమిది? ఎందుకిలా జరిగింది?? ఈ వైరస్ రక్తమార్పిడి ద్వారా కాని, స్వలింగ సంపర్కం ద్వరా కాని, లైంగిక సంపర్కం ద్వారా కాని ఒక మనిషి నుంచి మరొక మనిషి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అంతవరకూ తనకు తెలుసు. అంటే... అంటే... ఇది... ఇది... తన భర్త ద్వారా జరిగిందన్నమాట. ఇప్పుడు తనకొచ్చింది, ఇక ఏ పాపమూ తెలియని తన అమాయకపు శిశువుకీ వస్తుంది. వల్లికి ఆవేశం హద్దులు దాటింది.
కోపంగా, ఆవేశంగా పద్దాలును దగ్గరకు పిలిచింది. “చూడు పద్దూ, మీ అన్న ఏం చేశాడో...” అంది దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ. “ఏమైంది ఒదినీ?” అమాయకంగా అడిగింది పద్దాలు. పద్దాలుకి అర్ధం కాదని కొంతా, దాంపత్య సమస్యను మూడో వ్యక్తి వద్ద తీసుకురావటం ఇష్టం లేక కొంతా... తనను తాను సంబాళించుకొని, “ఏమీ లేదులే, కొంచెం మంచినిళ్ళు తీసుకురా...” అనేసింది.
“ఒదినీ, నువ్వు అన్నం తినలేదు...”
ఆమె వైపు నిర్వికారంగా చూసి, “సరే, తిందాం... పళ్ళాలు పెట్టు...” అని లేచింది వల్లి. వదిన ఎందుకు దుఃఖిస్తున్నదో అర్ధం కాలేదు పద్దాలుకు. కాని అదగటానికి భయపడింది.
శ + ఈ
ఆ రాత్రి... ఎనిమిది దాటుతూండగా వచ్చాడు పైడిరాజు. వచ్చీ రాగానే స్నానం చేసి, పద్దాలు వడ్డిస్తోంటే అన్నం తిన్నాడు. అప్పటికే తేలికగా తినేసి, మందులు వేసుకొని, విశ్రాంతిగా పడుకొని ఉంది వల్లి.
గదిలోనికి రాగానే, “వల్లీ, నీ ఒంట్లో ఎలాగుందే?” అని అడిగాడు పైడిరాజు (యేమగా.
బదులుగా, “పద్దూ... ఎం చేస్తోంది?” మెల్లని స్వరంతో అడిగింది వల్లి.
“టీవీ చూసోంది... ఎందుకూ?”
“మావా, నీతో మాట్లాడాలి...” అని గది తలుపులు దగ్గరగా వేసి, “ఎందుకుమావా, నా మీద నీకింత (పమ? రోగాలు అంటించేంత!”” అంది నండూరి సుందరీ నాగమణి లా
కచ్చగా. నిర్దాంతపోయాడు పైడిరాజు,
“అదేంటి వల్లీ, నేనేం చేశానే?” అన్నాడు అయోమయంగా.
“ఏం చేశావా? ఇదిగో, ఇదిగో... చూడు... నువ్వు నాకిచ్చిన బహుమతి ఏమిటో...” రిపోర్ట్ ఫైల్‌ని అతని ముందు పెట్టింది విపరీతమైన కోపంతో...
“ఏంటి వల్లీ, నీ పరీక్షలు అన్నీ చేయించుకున్నావుగా? ఏమైనా తేడా వచ్చిందా? నీ వంట్లో రక్తం తక్కువుందన్నారా?” అడిగాడు ఆదుర్దాగా పైడిరాజు.
“కాదు మావా, నావంట్లో క్రిమి ఉందన్నారు... హెచ్‌ఐవీ వైరస్ పాజిటివ్ వచ్చింది.నీ నుంచే నాకంటుకుందది. నిజం చెప్పు మావా, నీకసలు ఎప్పుడు వచ్చిందది?”” నిలదీసింది వల్లి.
“అది... అది... ఎప్పుడో ఐదేళ్ళ క్రితం... డ్యూటీ మీదున్నప్పుడు, దోస్తులతో మందు కొట్టి మజా చేశాను... ఏదో తెలియక... అప్పుడే తెలిసింది నాకు రోగమంటుకుందని. మరి నేను మందులు వాడి తగ్గించేసుకున్నాను కదా...” అన్నాడు పైడిరాజు అమాయకంగా.
“అదేంటి మావా, నీలో ఇంకా ఆ వైరస్ ఉందనీ, నువ్వు పెళ్ళి చేసుకుంటే ఆ వైరస్ నీ భార్యకి కూడా వస్తుందని నీకు తెలియదా?”
“అయ్యో... ఒట్టు వల్లీ... సత్తెప్రమాణికంగా నాకు తెలీదు, నేను మందులు వాడాను కదా, ఇంక తగ్గిపోయిందని నేననుకుంటున్నానే... అసలు నాలో ఇంకా ఆ రోగముందని తెలిస్తే, అది నా వల్ల నీక్కూడా వస్తుందని తెలిస్తే నేను పెళ్ళి మానుకునే ఉండేవాళ్లో... నా వల్ల సానా తప్పెపోయింది... నన్ను క్షమించవే...” అన్నాడు దీనాతిదీనంగా.
అతని అమాయకత్వం చూస్తూంటే అది నటన అనిపించలేదు వల్లికి. అసలు తానెలాంటి పరిస్థితిలో ఉన్నాడో కూడా అతనికి ఏ మాత్రం తెలియటం లేదు. ఏమని చెప్పాలో, ఎలా వివరించాలో కూడా తెలియలేదు వల్లికి. మెల్లగా అతని చేయి పట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని తనకి తెలిసినంతవరకూ వివరించింది.
“మావా, ఏనాడో నువ్వు పడిన సరదా... నీలోను, నాలోను కూడా వైరస్ క్రిమిగా కొలువై కూర్చుంది. మనం చాల దురదృష్టవంతులం. ఎక్కువకాలం బ్రతకం... కాని... మన బిడ్డ? మనం చేసిన తప్పు ఏ వాపం తెలియని ఆ ఓడ్డను బలి తీసుకుంటోంది...” అంది ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంటూ...
ట్య లాలా అమూల్యం (కథలు)
జరిగినదాన్ని మనసుకు జీర్ణించుకోలేనట్టుగా తలొంచుకున్నాడు పైడిరాజు.
“వల్లి... నేను పాపిష్టివాడినే... నా వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగి పోయింది...” అన్నాడు అపరాధభావనతో.
దీర్హంగా నిట్టూర్చింది వల్లి. “అవును మావా, జరగకూదనిదే జరిగి పోయింది... ఇంక జరగవలసిన దాన్ని గురించి ఆలోచించాలి. రేపు మనిద్దరం దాక్టరుగారి దగ్గరికి వెళదాం. పద్దూ, ఆ టీవీ ఆపేసి, ఇంక పడుకోమ్మా...” నిద్రకుపక్రమించింది వల్లి. నిసృహగా తనూ పక్కమీద వాలాడు పైడిరాజు.
1 శ శ
మర్నాడు తాను పరీక్షలు చేయించుకున్న లాబ్ దగ్గరకే పైడిరాజును కూడా తీసుకుపోయి, హెచ్‌ఐవీ టెస్ట్ చేయించింది వల్లి. తాము అనుకున్నట్టై అది పాజిటివ్‌గా వచ్చింది. భర్తను తీసుకుని తమ కాలనీ పార్కుకి రెండో వీధిలోని డాక్టరుగారి దగ్గరకు వెళ్ళి, తమ ఇద్దరి రిపోర్టలూ చూపించింది వల్లి,
“ఓ... అయామ్ వెరీ సారీ అమ్మా... చాలా దురదృష్టం... మీకు ఇద్దరికీ హెచ్‌ఐవీ వైరస్ సోకింది” రిపోర్టులు పరిశీలించి జాలిగా చెప్పాడు డాక్టర్ జగన్నాథ్.
మౌనంగా తల పంకించింది వల్లి. కొన్ని లిప్తల తరువాత, “డాక్టరుగారూ, నేను తల్లిని కాబోతున్నాను. ఈ పరిస్థితుల్లో ఈ హెచ్‌ఐవీ వైరస్ గురించి, ఇది శరీరంలోనికి ప్రవేశించిన తరువాత జరిగే మార్పుల తరువాత జరిగే మార్పుల గురించీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే...”
“మీరు తెలుసుకోవాలని అనుకోవటం చాలా ఆనందకరం అమ్మా... తప్పకుండా చెబుతాను. మన శరీరంలో సి.డి. 4 అనబడే కొన్ని కణాలు ఉంటాయి. అవి అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడే సహజ వ్యాధినిరోధక శక్తిని మన శరీరానికి ఇస్తాయి. ఎప్పుడైతే ఈ హెచ్‌ఐవీ మన శరీరంలోనికి ప్రవేశిస్తుందో, అప్పుడది ఈ సి.డి.4 కణాలను చంపుతుంది. తద్వారా మనం ఆ వ్యాధుల బారిన పడే అవకాశం వర్పడుతుందన్నమాట.
హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తుల్లో విడువకుండా దగ్గూ, జలుబూ ఉంటాయి. ఒక్కోసారి ఆయాసం కూడా... హఠాత్తుగా బరువు తగ్గిపోవటం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, లింఫ్ గ్రంధులు వాచటం, ఫ్లూ జ్వరంతో బాధపడటం... ఇవన్నీ ఈ వ్యాధిని తెలిపే ప్రథమ లక్షణాలు, ఈ లక్షణాలు కనబడిన దశను “ప్రారంభదశి నండూరి సుందరీ నాగమణి --ాలాలాలాలాాజంంా భాం
అని అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అంద్ టెస్టింగ్ సెంటర్‌కు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి.
హెచ్‌ఐవీ సంక్రమించిన తరువాత, హెచ్‌ఐవీ పరీక్షలో పాజిటివ్ అవునా, కాదా అని తెలియటానికి ఆరువారాల నుండీ, ఆరు నెలల సమయం పడుతుంది. ఈ యాంటీ బాడీస్ పరీక్షలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ, ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేయగలదు. కాబట్టి, మూడు నెలల తరువాత ఆ వ్యక్తి పాజిటివ్ అవునా కాదా అనేది తెలుసుకోవటం కోసం మరల రక్తపరీక్ష చేయవలసి ఉంటుంది. ఈ దశను “విండో పీరియడ్ అని అంటారమ్మా...
ఆ తరువాతది ఎటువంటి లక్షణాలూ లేని దశ. లోతైన కణజాలాల్లోకి ఈ హెచ్‌ఐవీ వైరస్ వేగంగా వ్యాపించి, అక్కడ చాలా నెలలు లేదా చాలా సంవత్సరాలు నిద్రావస్థలో ఉంటుంది. ఈ దశ ఆ వ్యక్తి యొక్క వ్యాధినిరోధక శక్తిమీద ఆధారపడి మూడు నెలల నుండీ, పదిహేడు సంవత్సరాల కాలం వరకూ ఉండవచ్చును. ఈ సమయంలో వ్యక్తి ఆరోగ్యకరంగానే కనిపించినప్పటికీ, హెచ్‌ఐవీ సంక్రమణ కలిగే ఉంటాడు.
ఆ తరువాత మరల లక్షణాల దశ... ఈ దశలో మన శరీరం కాసా వైరస్‌తో పోరాడే శక్తిని కోల్పోతుంది. సి.డి. 4 లింఫోసైట్‌లను వైరస్ చంపటం వల్ల మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ క్రమేపీ క్షీణించిపోతుంది. క్షయ, కాండిడియాసిస్, హెర్పిస్ న్యూమోసిస్టిస్ లంటి అనేక వ్యాధుల లక్షణాలతో హెచ్‌ఐవీ పీడితుడు అనారోగ్యానికి గురియై బలహీనపడిపోతాడు. తరువాత దీర్హకాలిక జ్వరాలు, బరువు కోల్పోవటం, తరచుగా నీళ్ళ విరోచనాలు, తీవ్రమైన అలసట మరియు ఆకలి మందగింపు, పొడిదగ్య, వేగంగా శ్వాస తీసుకోవటం, లింఫ్ గ్రంధుల వాపు, నాలుకపైనా, నోటిలోనూ వచ్చే తెల్లని మచ్చలు మొదలైన లక్షణాలు ముదిరి పరిస్థితి ఇంకా కష్టతరంగా మారిపోతుంది...” చెప్పటం ఆపి టేబుల్ మీద నున్న మంచినీళ్ళ గ్లాసును అందుకొన్నాడు డాక్టర్ జగన్నాథ్.
“డాక్టరుగారూ, అసలు ఈ వ్యాధి ఏ రకంగా వ్యాప్తి చెందుతుందండీ?”
“అసలు ఏ రకంగా వ్యాప్తి చెందదో చెప్తానమ్మా ముందు... ముద్దు పెట్టుకోవటం, మరియు తాకటం వలన, కరచాలనం వలన, ఒకే మరుగుదొడ్లను ఉపయోగించటం వలన, కలిసి భుజించటం వలన, దోమకాటు వలన, దగ్గు, మరియు తుమ్ముట వలన, ప్రజా స్నానశాలలను ఉపయోగించటం వలన, లేదా
పా అమూల్యం (కథలు,
లాలాజలము, జలుబు ద్రవాలు, చెవిలో చీము, కన్నీరు, చెమట మరియు మల మూత్రాదుల వలన ఇది వ్యాపించదు తల్లీ...
అరక్షిత లైంగిక సంపర్శ్మము వలన కాని, హెచ్‌ఐవీ వైరస్ సంక్రమించిన రక్తమును ఎక్కించుకోవటం వలన కాని, కలుషిత సూదులు, సిరంజీలు వాడటం వలన కాని ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇక నీ మాట... తల్లి కాబోతున్నావు కదా... నీవు హెచ్‌ఐవీ పాజిటివ్ అయినప్పటికిన్సీ నీ ద్వారా నీ బిడ్డకు వైరస్ సోకకుండా ఉండేందుకు దాక్టర్ సలహా ప్రకారం నెవరపిన్ అనే బెషధం వాడితే లోపలి శిశువు సురక్షితమౌతుంది. నీబిడ్డకూడా అంతే... నీవు నిశ్చింతగా ఉండు...”
వల్లి ముఖంలో వెయ్యి పున్నమలు ఒకేసారిగా వెలిగిన కాంతి! “నిజమా? మీరు చెప్పింది నిజమా డాక్టర్?” అంది సంభ్రమంగా.
“అవునమ్మా, నీకు ప్రభుత్వం వారి ఎ.ఆర్.టి కేంద్రం చిరునామా ఇనాను. అక్కడ వైద్యం చేయించుకొని, ఉచితంగా ఇచ్చే మందులు మీరిద్దరూ వాడండి. మీలోని వ్యాధి పూర్తిగ నిర్మూలించబడకపోయినా, జీవితకాలమంతా ఆ మందులు వాడటం వలన మీ జీవితకాలం పొడిగించబడుతుంది...” అని కాగితం మీద చిరునామాను వ్రాసిచ్చాడు దాక్టర్.
వల్లి ముఖం ప్రఫుల్లమైంది. మనసులో విషాద వీచికలు తొలగిపోయయి. మబ్బులు చెదిరిన నిర్మలాకాశంలా అయిపోయిందామె. “డాక్టరుగారూ, మేమేమైపోయినా ఫర్వాలేదండీ... నా బిడ్డకి మాత్రం ఈ వ్యాధి సోకకూడదు. రేపే మేము అక్కడికి వెళ్ళి, మందులు తెచ్చుకొని వాడతాము...” అంది సంతోషంగా.
“డాక్టరు బాబూ, ఎన్ని మంచి విషయాలు చెప్పారండీ... మాకెంతో ధైర్యాన్నిచ్చారండి...” కృతజ్ఞతగా చేతులు రెండూ జోడించాడు పైడిరాజు.
శ శ ఈ
మర్నాదే ఎఆర్‌టీ ఆరోగ్యకేంద్రానికి వెళ్ళారిద్దరూ. అక్కడ ఉచితంగ మందులు ఇచ్చి, ఎలా వాడుకోవాలో వివరంగా చెప్పి, గర్భస్థ శిశువుకు ఏమీ కాదని, నార్మల్ బిడ్డగానే పుడుతుందనీ భరోసా ఇచ్చారు అక్కడి సిబ్బంది.
“మావా, నువ్వు ఇంక లారీ మీద వెళ్ళడం మానేయాలి!” ఖచ్చితంగా చెప్పింది వల్లి.
“అదేంటే, మానేసి ఇంట్లోనే కూర్చుంటే నోట్లోకి నాలుగేళ్ళూ ఎలా ఎలాయి?” నండూరి సుందరీ నాగమణి లాలా
“నీకు మన పరిస్థితి అర్ధమైంది కదా, మనమిద్దరం ఇక ఎక్కువ కాలం బ్రతకము. బ్రతికే కొద్దికాలమూ కూడా కేవలం మందుల సహయంతో మాత్రమే. బ్రతకటానికి ఏదో ఒక దారి దొరక్కృపోతుందా మావా?”
వల్లి “చైతన్య భారతి” అనే ఒక స్వచ్చంద సేవా సంస్థను ఆశ్రయించింది. అక్కడ సభ్యులుగా తమవంటి అభాగ్యులు ఎందరో... బ్రతకటానికి మరో దారి లేక, విధివంచితలై, సెక్స్ వర్మర్లుగా మారి, హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులై, ఇప్పుడు ఆ వృత్తి మానేసి, ఏదో ఒక చిన్న వ్యాపారమో, ఉద్యోగమో చేసుకుంటూ జీవితాన్ని గడపాలనుకుంటున్నవారు, ప్రకృతి పరంగా హిజ్రా లక్షణాలతో పెరిగి, స్వలింగ సంపర్కం వల్ల హెచ్‌ఐవీ పాజిటివ్స్‌గా మారినవారు...
అటువంటి వ్యక్తులకు వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసి, అపరాధ భావనల తొలగించి, వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటమే కాకుండా, బ్రతకటానికి దారి చూపించటం కూడ సేవా సంస్థ యొక్క ప్రధాన ఆశయాలు. వివిధ ప్రభుత్వ, (ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులెందరో “'చైతన్యభారతిలో స్వచ్చంద సేవకులుగా మారి సహాయం చేస్తుంటారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వోద్యోగులతో పాటుగా బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు.
అటువంటి ఒక బ్యాంక్ అధికారి “కరుణాకర్” ఒక జాతీయ బ్యాంక్‌లో శాఖాధికారిగా ఉన్నారు. వల్లి, పైడిరాజులు ఆయన్ని కలవగానే, వారి సమస్యను ఎంతో మంచి మనసుతో అర్ధం చేసుకొని, వెంటనే అతనికి కిరాణా దుకాణం పెట్టుకోవటానికి బలహీన వర్గాల బుణసహాయ పథకం క్రింద అప్పు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఇంటిలోనే ఓ ప్రక్కగా షాపు ప్రారంభించారు. మరో పక్కన అరుగుమీద కూరగాయల దుకాణం పెట్టుకుంది వల్లి, పద్దాలు సహాయంతో...
వల్లికిప్పుడు తను, తన భర్త హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులమన్న బాధగాని, ఆదుర్హాకాని లేవు. తనకి పుట్టబోయే బిడ్డను మాత్రం ఆ మహమ్మారి నుండి రక్షించాలన్నదే ఆమె ఆశయం,
వల్లికి నెలలు నిండసాగాయి. ఎ.ఆర్.టి కేంద్రంవారిస్తున్న మందులను క్రమం తప్పక ఇద్దరూ వాడసాగారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ద్వారానే ఆసుపత్రిలో పురుడు పోసుకోవటం కోసం అడ్మిట్ అయింది వల్లి. కాన్పు సులభంగానే అయి, మగపిల్లవాడు పుట్టాడు. నొప్పులు వస్తున్నప్పుడు ఆమెకి ఒక డోసు 'నెవిరపైన్” అనే మందును ఇచ్చారు. బాబు పుట్టిన వెంటనే వాడికి కూడా ఒక మోతాదు పా అమూల్యం (కథలు)
అదే మందును ఇచ్చారు. ఇప్పుడు వాడు హెచ్‌ఐవీ వైరస్ నుంచి పూర్తిగా సురక్షితం. = వల్లి యొక్క ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, ప్రభుత్వంవారి చేయూత, “'చైతన్యభారతి' వంటి స్వచ్చంద సేవా సంస్థల ఆదరణ ఆమెకు చక్కని జీవితాన్నీ పండంటి పూర్తి ఆరోగ్యకరమైన బిడ్డనూ అనుగ్రహించాయి. అది మొదలు... వల్లి 'చైతన్యభారతి' సంస్థవారి ఏ సభ జరిగినా, సమావేశం జరిగినా తను కూడా వాటిల్లో పాల్గొంటూ, తన యదార్థగాథను అందరికీ వివరంగా చెబుతూ, గర్భవతిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న జాగ్రత్తలను, ఆరోగ్య పరిరక్షణా సూత్రాలను వివరిస్తూ, ఆరోగ్యకరంగా పుట్టిన తన బిడ్డను అందరికీ చూపిస్తూ... పలువురికి స్ఫూర్తిదాయకంగా మారింది వల్లీ, పైడిరాజు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు...కాని బ్రతికినంత కాలం తమ కొడుకుతో ఆనందంగా జీవిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. జీవించటం ఒక చక్కని కళ. నలుగురికీ ఉపయోగపడేలా జీవించటం మాత్రం పూర్వజన్మ సుకృతమే! (ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంఘంవారి కథల పోటీలో ఎన్నికైన కథ) 4 ఈఈ 6 నండూరి సుందరీ నాగమణి
జీవిత సహచరి
విశాఖపట్నంలోని వీచ్‌రోడ్‌లోంచి, భీమిలీ వైపు దూసుకుపోతోంది శ్రీహరి ఎక్కిన టాక్సీ...
పది రోజుల క్రితమే సింగపూర్ నుండి వచ్చిన శ్రీహరి ముంబయిలో బిజినెస్ పన్లు చూసుకొని, తన మిదత్రుడు అమర్‌ను కలవటం కోసం వైజాగ్ వచ్చాడు. అమర్‌ది విశాఖపట్నం పకృనే ఉన్న భీమిలి. చెన్నెలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన ఊరిలోనే స్థిరపడిపోయాడు. ఏదాది క్రితం అతని భార్య పోయిందన్న సంగతి ఇటీవలే తెలిసిన శ్రీహరి చాలా బాధపడ్డాడు. అందుకే, రెండు రోజుల క్రితమే సింగపూర్‌కి వెళ్ళిపోదామని అనుకున్నవాడు కాస్తా, అమర్‌ను కలవటానికని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు.
అకస్మాత్తుగా కారు వేగం తగ్గటంతో “ఏమైంది?” డ్రైవర్‌ను ఉద్దెశించి అడిగాడు శ్రీహరి,
“వటైనాదోనండి మరి, చూడాలి...” అంటూనే రోడ్ పక్కగా కారాపి, దిగి చూసి, “సారీ సార్, టైర్ పంచర్ అయిపోనాది... స్టెప్నీ ఉన్నాదిలెండి.. మీరు కారు దిగమాకండి బాబూ, పావుగంటలో పనైపోతాది...” అంటూనే కావలసిన సామాన్లు డిక్కీలోనుంచి తీసుకొని పనిలోకి దిగాడతను. ఏమీ తోచక తాను కూడా కారు దిగి నిలబడ్డాడు శ్రీహరి.
సాయం సంధ్య తన నీరెండ చీర కొంగును నీలిసముద్రం మీద అలవోకగా కప్పేసిందేమో, నారింజ రంగులు సంతరించుకుంటున్న సాగరం వింత
' సొగసులతో మెరిసిపోతోంది. రెండు నిమిషాలకోసారి ఏదో ఒక వాహనం రివ్వున దూసుకుపోతోందా దారిలో...
సాగర సౌందర్యాలు గమనిస్తూ, టీ తాగాలనిపించి, అక్కడికి దగ్గర్లోనే ఉన్న బడ్డీ కొట్టు వైపుగా నడిచాడు శ్రీహరి.
పతా అమూల్యం (కథలు)
అతను కొంచెం ఇటుగా రావటంతో, అప్పటికి ఏకాంతం దొరికిన డైవర్ సింహాచలం తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి, భార్యకు ఫోన్ చేశాడు. గాలివాటుకు అతని మాటలు శ్రీహరికి అస్పష్టంగా వినిపించసాగాయి.
“ఏటే బంగారమా, ఫోను సెయ్యలేదని కోపమొచ్చీసినాదెటి? మజ్ఞానం నుంచీ, టయిం దొరకనేదే...బండి నడుపుతానే ఉండిపోనాను... ఇదిగో, ఈ అయ్‌గార్ని బీమిలిలో ఒగ్గేసి, రేతిరి తొమ్మిదయ్యేతలికి ఇంటికొచ్చేత్తానుగా... దూరమేలేయే... దూరం దూరమని బేరాలొదిలీసుకుంతే డబ్బులెలాగొత్తాయి? నువ్వు నా కోసం తెలివేసి కూచోకుండా మాయమ్మ ఇంత ముద్దెడితే తినేసి నిద్దరపో... అసలే ఉట్టి మడిసివి కూడా కాదు...” మాట్లాడుతూనే చకచకా టైర్‌మార్చి, శ్రీహరి వైపు అయిపోయిందన్నట్టు సైగ చేశాడు. చేయి ఊపి టీ తాగటానికి రమ్మని పిలిచాడు శ్రీహరి. అతను టీ తాగుతుంటే, “ఎవరితోనోయ్ మాట్లాడుతున్నావ్, మీ ఆవిడా?” అనడిగాడు నవ్వుతూ...
“అవునండి, దానికి ఊళ్ళో బేరాలు కాకండా, ఇలా దూరం ఎల్తే నచ్చదండి... సాయంత్రమయ్యేతలికి ఇంటికి ఎల్లకపోతే ఊరుకోదు. జట్టీ యొట్టెస్తది. నేనంటే పేణం దానికి...” ముసి ముసిగా నవ్వుతూ చెప్పాడు సింహాచలం.
“పెళ్ళాలంతా అంతేలే, వట్టి సెంటిమెంటల్ ఫూల్స్...” తనూ నవ్వాడు శ్రీహరి.
భీమిలి ఊరి చివరనున్న అమర్ బంగ్లా దగ్గరకు చేరేసరికే బాగా చికటి పడిపోయింది. గేటు దగ్గర ఉన్న గూర్చాకు తానెవ్వరో చెబితే, అతను ఇంటర్‌కమ్‌లో అమర్‌తో మాట్లాడి గేటు తెరిచాడు. ఇంటి ముందు కారు ఆగగానే ఇద్దరు నౌకర్లు పరుగుపరుగున వచ్చి, శ్రీహరి చేతిలోని సూట్‌కేసును అందుకున్నారు. వరండాలో నిలబడి, ఆత్రంగా ఎదురుచూస్తున్న అమర్, శ్రీహరి క్యాబ్‌లోంచి దిగగానే ఒక్క ఉదుటున ముందుకు వచ్చి, సజల నేత్రాలతో అతన్ని కౌగలించుకున్నాడు. ఆ పరిష్వంగంలోని ఆత్మీయానురాగాలను ఆన్వాదిస్తూ, “అమర్... అమర్...” అన్నాడు ఆర్తిగా శ్రీహరి. ఏదో తెలియని ఉద్వేగంతో భారమైపోయింది అతని గొంతు.
క్యాబ్‌ను పంపించేసి, మిత్రుడి భుజాల చుట్టూరా చేయివేసి, ఆప్యాయంగా నడిపిస్తూ, ఇంటిలోపలికి తీసుకువెళ్ళాడు అమర్. ఇద్దరూ హాల్లో సోఫా మీద పక్కపక్కనే కూర్చున్నారు. అమర్, శ్రీహరి చేయిని వదలకుండానే... పనిమనిషిని పిలిచి మంచినీళ్ళు తెప్పించాడు. హాలంతా కలయజూస్తున్న శ్రీహరి చూపులు
నండూరి సుందరీ నాగమణి లాలా
ఎదురుగా కనిపిస్తున్న ఫోటో మీద ఆగిపోయాయి. లైఫ్‌సైజులో ఎదురుగా సజీవంగా నిలబడినట్టె ఉంది భవానీ రూపం. నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన ఉదయభానుడి లాంటి కుంకుమబొట్టుతో, కళకళలాడే పూర్ణచంద్రబింబం వంటి ప్రసన్న వదనంతో, లక్ష్మీదేవిలా చిరునవ్వుతో చూస్తోందామె. ఆ ఫోటోకి వేసి ఉన్న గుబాళించే గులాబీల దండ, నిశ్చలంగా స్లాండ్‌లో వెలుగుతున్న దీపకళిక, సుగంధ ధూవాలు వెదజల్లుతున్న అగరువత్తులు మాత్రం ఆమె స్వర్గస్థరాలైందని అన్యాపదేశంగా చెబుతున్నట్టున్నాయి.
“చూడరా...చూడు... హరీ... నా భవానీ నన్ను అన్యాయం చేసి వెళ్ళివోయింది...” శ్రీహరి భుజమ్మీద తల పెట్టుకొని ఒక్కసారిగా భోరుమన్నాడు అమర్. చెట్టంత మనిషీ అలా కుదేలైపోయి కుమిలిపోతుంటే శ్రీహరి గుండె చెరువైవోయింది...
“ఛ! ఊరుకోరా... ఇదేమిటీ చిన్నపిల్లాడివా? పుణ్యాత్మురాలురా... పిలుపు వచ్చింది, వెళ్ళిపోయింది... ఇవ్వాళ తను, రేపు మనమైనా అంతే కదరా!” మెత్తని మాటలతో మిత్రుణ్సి ఓదార్చసాగాడు శ్రీహరి.
“ఒరేయ్ పరీ, రాక రాకనా దగ్గరకు వచ్చావు... ఒక్కరెండు రోజులు నాతోనే ఉండి వెళ్ళవూ, నేను నీతో చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి...” దిగులుగా అడుగుతున్న మిత్రుడిని చూస్తూంటే మనసు మూగవోయింది శ్రీహరికి. అప్రయత్నంగా తలూపాడు అంగీకారసూచకంగా.
బ్యాగ్రా భోజనం చేద్దాం... ఎప్పుడనగా తిన్నావో, ఏమిటో... ఆ ... పైదమ్మా, వంటంతా పూర్తయిందా? త్వరగా ఏదైనా స్వీట్ చెయ్యి...” అంటూ హడావుడి పడుతున్న అమర్‌ను పరిశీలనగా చూశాడు శ్రీహరి. అధికారిక హోదా తెచ్చిన రీవితో, నిండుగా, ఆరోగ్యంగా ఉందే ఆజానుబాహుదైన అమర్, ఈనాడు ఒరుగులా ఎండిపోయినట్టెపోయాడు. ప్రతిరోజూ మద్యం సేవిస్తున్న సూచనగా కంటికింద నల్లని వలయాలు, “ఉబ్బుసంచులు” ఏర్పడ్డాయి. ముఖంలో జీవకళ అసలే లేదు. “భవానీ మరణం వీడిలో ఇంత శూన్యాన్ని సృష్టించిందా?” బాధగా అనుకున్నాడు శ్రీహరి.
భోజనాలు పూర్తయ్యాక, బాల్భనీలో కూర్చున్నారు మిత్రులిద్దరూ... ఎదురుగా అనంత జలరాశి... అమావాస్య దగ్గర పడుతున్నదేమో, సాయంత్రం అంతగా మనసును అలరించిన సింధువే, ఇప్పుడు చిమ్మచీకట్లో నల్లని భూతంలాగా కనిపిస్తూ, భయోత్సాతాన్ని కలిగించేలా ఉంది. ఆ కెరటాల హోరు ఓ ఉన్నాదపు
ప అమూల్యం (కథలు)
స్రీ దుఃఖంతో చేస్తున్న హాహాకారాల్లా వినిపిస్తోంది.
“ఏగర్రా అమర్ ఏమిటిలా అయిపోయావు? భవానీ మీద బాగా బెంగ పెట్టుకున్నావు కదూ!” లాలనగా అడిగాడు శ్రీహరి.
“అవునురా హరీ... భవానీ విలువ తను ఉన్నప్పటికన్నా, వెళ్ళిపోయాకే నాకు బాగా తెలిసింది. 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు” అన్నారు ఆశ్రేయగారు. కానీ బ్రతికున్నప్పుడుకూడా భవానీ మంచిదే. ఆ మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాజ్సయ్యాను నేను. నిజానికి భవానీ అనారోగ్యంతో మరణించిందని అనేకన్నా, నిర్లక్ష్యంతో హత్య చేయబడిందని అనటమే మేలు... ఆ హంతకుడిని నేనే...” అపరాధిలా తలదించుకున్నాడు అమర్.
“ఏమిట్రా, నీ పిచ్చి కాని... కాలం తీరిపోయింది, చెల్లాయి వెళ్ళిపోయింది... అంతే! ప్రతిదీ నీకు ఆపాదించుకొని, మానసికంగా కుంగిపోతే ఎలారా? గుందె దిటవుచేసుకొని, ఆ విషాదంలోంచి బయటపడకపోతే చాలా కష్టం కదరా?” అనునయించాడు శ్రీహరి.
“హరీ... నా మనసును చాలాకాలంగా కొండంత బరువు అదిమివేసోంది. అది ఎవ్వరి దగ్గరా విప్పి చెప్పేది కాదు. నీకు మాత్రం చెప్పాలని అనిపిస్తోందిరా... వింటావా?”
“అమర్, నిన్ను ఈ దుఃఖభారంలోంచి లాగేందుకు ఏమైనా చేసానురా, చెప్పు... వింటాను...”
శ శి ఈ
“హరీ, భవానీకి కాన్సర్ అని, త్వరలో ఆమె నాకు దూరమైపోబోతుందన్న విషయం తెలిసిన క్షణాన నేను మంచులా ఘనీభవించిన సముద్రాన్న అయిపోయానురా... నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. తనకు చికిత్స చేస్తున్నా అది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమేనని, చివరి రోజుల్లో తను - ఎంతో ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అది విన్నాక న మనసులో భరించలేని 'అసహనంి... ఏమీ చేయలేని 'అసహాయతి... అసలే నాకు కోపం చాలా ఎక్కువ అని నీకు తెలుసుగా? పిల్లలు ఇద్దరూ మనదేశంలో లేరు... ఇక్కడ మేము ఇద్దరమే... ఇంకొన్నాళ్ళు పోతే... నేను ఒక్కడినే... ఇలా చేయటం ఆ దేవుడికి న్యాయమేనా? ఏదో తెలియని ఉక్రోషంతో దేవుడి గదిలోకి వెళ్ళి, ఆయనపై గట్టిగా అరిచాను... నిలదీసాను.... ఏడ్చాను... భవానీ తన ఆరోగ్య
నండూరి సుందరీ నాగమణి లా
పరిస్థితి తనకు తెలిసి కూడా ధైర్యంగానే ఉంది కాని, నేను మాత్రం అలా ఉండలేకపోయాను.
ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు... భవానీ గదిలో తన దగ్గరే పెద్ద విషాద పర్వతాన్ని మోస్తూ కూర్చునేవాడిని. భవానీయే ఏవో కబుర్లు చెబుతూ ఉందేది కానీ అవి నా మనసుకు ఏ మాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు... ఒక రోజు రాత్రి భవానీకి 'గుదడ్‌నైట్ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి, నా గదిలోకి రాబోతుంటే, నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు ఓ కేసెట్ ఇన్‌సర్ట్ చేసిన తన పాకెట్ టేప్ రికార్టర్ నా చేతికిచ్చి, వినమని కోరింది.
భవానీ దగ్గర ఎప్పటెప్పటివో “ఆడియో కేసెట్స్' ఉండేవి. వాటిని ఎప్పుడూ తన మినీ టేప్ రికార్టర్‌లో పెట్టుకొని వింటూ ఉండేది. ఎంపీత్రీలు, డీవీడీ ప్లేయర్లు వచ్చిన తర్వాత కూడా వెనుకటి కాలంలోలాగ ఈ కేసెట్లేమిటని ఆమె మీద విసుక్కునేవాడిని.
“ఇప్పుడు ఈ కేసెట్‌లో ఏముందో?” అనుకుంటూ, 'ప్లే బటన్ నొక్కాను.
నిశ్శబ్దంగా తిరుగుతోంది టేప్... రెండు నిమిషాలు గడిచాయి... ఏం రావటం లేదు... అసహనంగా ఆఫ్ బటన్ నాక్కబోతుండగా భవాని గొంతు వినిపించింది.
“అమ్మూ!' మృదుమధురంగా వినిపించిన ఆ పిలుపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను.
“అమ్మూ... అబ్బ, ఎంత కాలమైంది అమ్మూ, నిన్నిలా పిలిచి! నన్ను మనసారా (ప్రేమించి, నన్ను స్వంతం చేసుకోవటం కోసం తన అమ్మానాన్నల్ని సైతం ఎదిరించిన నా (ప్రేమికుడిని నేను ముద్దుగా పిలుచుకొనే పేరిది. చాలా కాలంగా నా మనసులో పేరుకుపోయి, నోరు తెరిచి ఇప్పటివరకూ నీకు చెప్పలేక పోయిన విషయాలను ఇప్పుడు చెప్పుకోవాలని అనిపిస్తోంది. దయచేసి, ఈ టేప్ చివరి వరకూ వింటావు కదూ!
ఎంత బాగుందేవి అమ్మూ, ఆ రోజులు! ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ, ఒకరి కోసం మరొకరమై (బతికిన ఆ బంగారు రోజులు... పిల్లలు పుట్టే వరకూ మన అనురాగం అలా అపురూపంగానే ఉన్నది. నా కోసం నువ్వు అల్లాడిపోయిన ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ అదే ఇష్టంతో నా ంా అమూల్యం (కథలు)
మనసు పులకరిసోంది. ఆ రోజులలో అలా రెప్ప వేయకుండా నీవు నా వైపే చూస్తూంటే, నీ కళ్ళలోంచి (ప్రేమ సుధాధార ఉవ్వెత్తున పొంగి, పొరలి నన్ను తడిపివేసేది.
తర్వాత నీ ఉద్యోగంలో నువ్వు మెల్లగా ఎదగటం మొదలైంది. పదోన్నతుల కోసమని ఎప్పుడూ పరీక్షలకు చదువుకోవటం, ఇంటర్‌వ్యూలకు తయారవటం... వీటితో చాలా ఛథశమపడుతూ ఉండేవాడివి. నువ్వు చదువుకొనేటప్పుడు నీతో కలిసి నేనూ మేలుకొని ఉండటం, నీకు నిద్ర రాకుండా ఉండేందుకు 'టీ* కాచి ఇవ్వటంలాంటి పనుల్లో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేదాన్ని నీ నిరంతర కృషి ఫలితంగా వరుసపెట్టి నీకు ప్రమోషన్లు రావటం మొదలైంది.
నీ హోదా, అధికారం పెరిగేకొద్దీ, నువ్వు నాకు మెల్లమెల్లగా దూరమవట మనేది ఆరంభమైంది. అసలు నీ ప్రమేయమంటూ ఏమీ లేకుండానే అలా జరిగి పోయింది. నువ్వు నీ సిబ్బందిపై చూపించే “అధికారం” ఇంట్లో కూడా ఆరంభమై, 'మమకారం” మరుగున పడిపోవటం మొదలైంది. ఇంట్లో నువ్వున్నంతసేపూ నేను నీ చుట్టూనే తిరుగుతూ, నీకు కావలసినవన్నీ అమర్చుతూ, నీకు ఇష్టమైన వంటకాలు వండి, కొసరి కొసరి తినిపిస్తూ ఉందేదాన్ని. నీ పనుల వత్తిడికి, ఆఫీసులోని సమస్యలకూ నీలో కోపం, అసహనం బాగా పెరిగిపోయేవి. ఏ విషయంలోనైనా సరే, అడిగినది వెంటనే చేయకపోయినా, కావలసినది తక్షణమే అందించకపోయినా కోపంగా గట్టి గట్టిగా అరిచేయటం, చేతిలోని వస్తువులను విసిరికొట్టటం మొదలుపెట్టావు... ఒళ్ళు తెలియని కోపంలో ఒక్కోసారి నా మీద చేయి చేసుకోవటం కూదా...
సారీ అమ్మూ! నేను నిన్ను నిందించటం లేదు... నా ఆవేదన చెబుతున్నానంతే... అప్పట్నుండీ నాకు నీమీద ఉన్న (ప్రేమ, ఆరాధనలతో పాటుగా వాటిని అధిగమించేంత అధికమైన భయం, బెంగ కూడా మొదలయ్యాయి.
మన పిల్లలను నువ్వు క్రమశిక్షణ పేరుతో ఏనాడూ నీ దగ్గరకు రానీయలేదు. అందుకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ విదేశాల్లో స్థిరపడివోయి, మనలను తలవటం కూడా మానేశారు... అయితే, నీ కాఠిన్యం వల్ల మాలో చనువు తగ్గిపోయి, భయం మొదలైంది. నీ చుట్టూ నువ్వొక 'వలయం గీసుకొని అది దాటి బయటకు నువ్వు రాకుండా, మమ్మల్ని లోపలికి రానీయకుండా ఉంచటం... 'కూదడనిది' అని చెప్పాలని నేను ఎంత ప్రయత్నించినా నువ్వా అవకాశంసైతం ఇచ్చెవాడివి కాదు.
నండూరి సుందరీ నాగమణి లాలా
అసలు మన అలవాట్లెమో పరస్పర విరుద్దాలు... నాకేమో రాత్రి పది గంటలకల్లా పడుకొని, తెల్లవారురూమునే లేవటమంటే చాలా ఇష్టం, అలాటు. సీకేమో రాత్రంతా కంప్యూటర్‌లో పని చేసుకొని, ఉదయం ఆలస్యంగా లేచి హడావుడిగా ఆఫీసుకు పరుగు తీయటం అలవాటు. ఇంటి పనులయ్యాక, కాస్త సమయమంటూ దొరికితే, ఏదైనా పుస్తకం చదవటమో, లేక పాటలు వినటమో నాకు అలవాటు... నీకైతే సమయం దొరకటమే అపురూపం, దొరికినా టీవీకి అతుక్కుపోవటమంటే చాలా ఇష్టం.
. నీకు విపరీతమైన కోపం... కోపమంటే కేవలం అరవటమే కాదు... ఆ పనైపోయాక, రోజుల తరబడి మాటలు మానేస్తావు. అసలు నువ్వు ఎందుకు ముభావంగా ఉన్నావో, నా అపరాధమేమిటో తెలియదు, తెలియనీయవు. ఆ ముభావత ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. మాట కలపబోతే కసిరి కొడతావు. జన్మజన్మల తరబడి మన మధ్య ఏదో బద్ధ శత్రుత్వం ఉన్నట్టై ప్రవర్తిన్తావు. ప్రసన్నంగా పలకరించబోతే, 'ఒంటరిగా ఉండనీ" అంటూ కస్సుమంటావు... నా మనసు ముడుచుకుపోతుంది. దుఃఖం ముంచుకొస్తుంది. అసలు నీ మూడ్ ఎందుకు పాడైందో, ఆఫీసులో ఏదైనా సమస్య వచ్చిందో ఏమీ చెప్పవు, నాకు తెలియనీయవు. మళ్ళీ నీ అంతట నీవు అందులోంచి బయటకు వచ్చి, మామూలుగా మారవలసిందే తప్ప, అందులోంచి నిన్ను లాగటం మాత్రం నా తరం కానే కదు.
ఆలుమగల మధ్యన ఉండవలసింది 'పరస్పర స్నేహం) అమ్మా... ప్రేమించి, పెళ్ళాడిన నీకు అది తెలియదా? ఉహు, తెలియక కాదు కానీ, “ఆగ్రహం” అనే నీ పెద్ద బలహీనతను నీవు జయించలేకపోతున్నావు... అంతే...
అలాగే, నేనెప్పుడూ నవ్వుతూ ఉంటాననీ, ఇంట్లో ఉండి రిలాక్స్ అయిపోతున్నాననీ, నువ్వేమో ఆఫీసులో ఉండి చాలా భారం మోసేస్తున్నావని సీకో పెద్ద ఫీలింగ్. నీకున్న వత్తిడి నాకు లేదని నామీద “అసూయ. నువ్వు ఆఫీసులో కష్టపడి జీతం సంపాదించి తెస్తున్నావు. నేను పిల్లల్ని పెంచుతూ,
. ఇల్లు చూసుకుంటూ, మీకు కావలసినవి అమరుస్తూ... నేను... నేను కూడా కష్టపడుతున్నాను అమ్మూ... 'మనమిద్దరమూ ఒక్కటే...” అన్న భావన నీకెందుకు కలగదు?
నేను జడలో పూలు పెట్టుకుంటే పల్లెటూరి బైతునని ఎగతాళి చేస్తావు... ఆజ అమూల్యం (కథలు)
చేనేత చీర కట్టుకుంటే పనిమనిషిలా ఉన్నావని వెక్కిరిస్తావు... కారణం అవి నీకు నచ్చవు కాబట్టి... పెళ్ళికి ముందు, నేను ఓ “అక్షరం” వ్రాసినా అదో గొప్ప కావ్యమని నన్ను ఆకాశానికి ఎత్తేసిన నువ్వే... ఈ మధ్య నా కవిత ఒకటి పత్రికలో పడిందని చూపించబోతే చదవలేదు సరికదా, 'తెలుగు పత్రికలకు ఎంత [గ్రహచారం పట్టింది? అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి, అక్కడినుంచి వెళ్ళిపోయావు... నీకు తెలుసా, ఆ క్షణం నేనెంత నరకయాతనతో విలవిలలాడి పోయానో... కాలం నీలో ఎంతటి రాక్షసుడిని పెంచింది?
అసలు అకారణంగా నువ్వు నన్ను తిట్టినా నీ దగ్గర సాధ్యమైనంత మౌనంగానే ఉంటాను... కోపం చల్లబడితే నువ్వే మామూలుగా అయిపోతావని... కానీ శాంతం కూడ నీకు నా బలహీనతలాగానే కనబడి, అదో “నిర్లక్ష్య ధోరణి” అనుకునే స్థితికి వచ్చి, మాటల ఈటెలతో మరింతగా నన్ను బాధిస్తున్నావు. నిజానికి అపర దూర్వాసుడిలాంటీ వాడి పెళ్ళాం కన్ను పచ్చి తాగుబోతువాడి పెళ్ళామే ఒకింత అదృష్టవంతురాలు... ఎందుకంటే, తాగుడు వల్ల వచ్చే విపరీత ప్రవర్తన ఆ “మత్తు దిగేదాకానే.. కోపిష్టివాడి వాచాలతో! అది నిత్యాగ్నిహోత్రం... మమ్మల్ని దహించేందుకు.
నీ ఆఫీసు టూర్లు, మీటింగులు, సుపీరియర్లు, సబార్జినేట్లు... క్రమంగా నువ్వు ఎక్కే మెట్లు... ఈ 'విజయపరంపరిలో పయనిస్తూనే ఉన్నావు... నన్నూ నీతో ఉండనిచ్చావు... అయితే అది నీ సంతోషాన్ని నాతో పంచుకోవటం కోసం మాత్రం కాదు. నీ అవసరం కోసం...నువ్వు క్యాంప్‌కి వెళ్ళాలంటే, నేనే నీ సూట్‌కేసును సర్గాలి... నీ ఆఫీసు ఫంక్షన్స్‌లో నీ బార్యగా పక్కనే ఉండాలి... నీ స్టాఫ్‌తో పిక్నిక్కులకు నేను కూడ రావాలి... అందరికోసం పెదవులపై ప్లాస్టిక్ చిరునవ్వులు అతికించుకొని నటించాలి... ఇవన్నీ నీ కోసం నేను చేయాలి...
కానీ, నాతో గుడికి రమ్మంటే నీకు తీరిక దొరకదు. ఏదైన ఊరు ఇద్దరం కలిసి వెళదామంటే నీకది బోర్ అంటావు. నా ఇష్టాలను మన్నించటమనేది నీకెప్పుడూ అయిష్టమే...
ఎన్నెన్ని ఉదయాలు? చెన్నెలోని మన ఇంటి బాల్మసీలో కూర్చుని, పొగలు కక్కే కాఫీ రుచిని ఆస్వాదిస్తూ, సముద్రగర్భంలోంచి ఉదయించే బాలభానుడి సౌందర్యాన్ని ఇద్దరం కలిసి చూడాలని, ఆ మధుర క్షణాలను హృదయంలో పదిలపరచుకోవాలని ఎంతగా తపించిపోయేదాన్నో తెలుసా నీకు? కానీ, ఆ ఆస్వాదన ఎప్పుడూ నే ఒంటరిగానే... నండూరి సుందరీ నాగమణి లాలా
ఇష్టమైన పాటను వినాలన్నా నేనొక్కదాన్న.. మంచి పుస్తకం చదవాలన్నా నేనొక్కదాన్నే... పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోతే... హాస్పిటల్‌కి వాళ్ళతో నేనొక్కదాన్నే... స్కూల్లో పేరెంట్స్ మీటింగ్‌కీ నేనొక్కదాన్నే... చివరికి మన పుట్టిన రోజులకూ, పెళ్ళిరోజులకూ ఇద్దరం కలిసి ఏ అనాధశరణాలయానికో, వృద్దాశమానికో వెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వాలని నాకు అనిపిస్తే, అలాంటి ప్రదేశాలకి రావటం నీకు చికాకు కాబట్టి, ని బెదార్యం కొద్ద నన్ను మాత్రం అభ్యంతరపరచవు కనుక అక్కడికీ, నేనొక్కదాన్నే...
అసలు నేనంటే నీకు (ప్రేమ లేదు... అదిగో వచ్చేసింది నీకు...కోపం... ఎదురుగా ఉంటే అనేవాడివి... “అదేమిటి భవానీ, నువ్వంటే (పేమ లేదా నాకు? నేనసలు నిన్ను ప్రేమించనే లేదా? ఎన్నిసార్లు నిన్ను డిన్నర్లకు బయటకు తీసుకుపోలేదు! ఎంతెంత విలువైన దైమండ్ నగలను కొనివ్వలేదు!” అని. నిజమే నీకు నేనంటే చాలా ప్రేమ... చాలా చాలా ప్రేమ! నాకు బ్యాంక్‌లో ఓ పదిలక్షల రూపాయల డిపాజిట్ ఉండి ఎం లాభం చెప్పు, నాచేతిలో పదిరూపాయలు లేకపోయాక! నీ మనసులో నా మీద ఎంత '*'పేమి ఉండీ ఉపయోగమేమిటీ, దాన్ని నీవు 'వ్యక్తపరచలేకపోయాక!' పదిమందితో పాటుగా నీ హోదాలో నన్ను స్టార్ హోటల్స్‌కి తీసుకుపోయి తిండి తినిపిస్తే నాకు కలిగే ఆనందం కన్నాా ఇదిగో, ఈ బాల్మనీలో కూర్చుని పెరుగన్నంలో పచ్చడి నంజుకుంటూ ఇద్దరం 'కలిసి” తినటమే నాకు ఎనలేని తృప్తిని ఇస్తుంది.
అసలు నిజానికి నువ్వో అద్భుత ్రేమికుడివి. కాని, నువ్వు (ప్రేమించేది నన్ను కాదు... “నిన్ను! అవును నిన్ను నీవు ప్రేమించుకోవటమనేది నీకు చాలా ఇష్టమైన వ్యాపకం... నన్ను నీతో బయటకు తీసుకువెళ్ళాలని నీకు బలంగా అనిపిస్తే ఆ సమయంలో నాకు ఇష్టం లేకున్నాా తీరిక లేకున్నా అలసటగా అనిపించినా సరే... అది నీ కిష్టమైన పని కనుక తీసుకెళ్ళి తీరతావు. అలా... 'నన్ను నీవు ్రేమిస్తున్నావు...” అనే భావనను నువ్వు మరింతగా మనసారా (ప్రేమిస్తున్నావు... నీ అంతరంగాన్ని సంతుష్టిపరచేందుకు మాత్రమే కాని నీ ఎదుటనున్న నాకోసం మాత్రం కాదు.
ఇప్పుడు నీకు కోపం, బాధ కలుగుతున్నాయి... నాకు తెలుసు... కాని... కాని... ఒక్కసారి నీ మనిషిని అయిన నా గురించి మనసుతో ఆలోచించు... అప్పుడు నీకు నా మీద అంతులేని (ప్రమ, ఆవ్యాయత, కరుణలు కల్పతాయి... చత అమూల్యం (కథలు)
ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో అర్ధమౌతుంది... నీ పదవీ విరమణ కోసం వేయి కళ్ళతో ఎదురుచూశాను. ఇన్నాళ్ళు నీ పని వత్తిళ్ళ వల్ల, ఊపిరాడని నీ దినచర్య వల్ల నాతో కలసి గడపలేకపోయావు... ఇక ఫరవాలేదు... మనమిద్దరం ఈ జీవనసంధ్యలో హాయిగా మళ్ళీ పాత రోజులను పొందవచ్చనీ, హాయిగా గడప వచ్చనీ ఎన్నెన్నో కలలు కన్నాను... ఆ 'అదృష్టం' ఎక్కడిదీ నాకు? నేను శాపగ్రస్తను అమ్మూ... అల్పాయుష్కురాలిని... ఏ జన్మలో ఏ పాతకానికి ఒడిగట్టానో మరి, ఆ మహాపాపం ఈ జన్మలో ఇలా కాన్సర్ రూపంలో నా ప్రాణాలు లాక్కెళ్ళిపోతోంది... నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను నాకు దూరం చేసేస్తోంది... భగవంతుడు ఒక్క అవకాశమిచ్చి, ఒక్క రెండేళ్ళెనా నన్ను నీతో ఉండనీయకూడదూ! ఉహు, అది జరగదని సుస్పష్టంగా తెలిసినా ఏదో ఒక పిచ్చి ఆశ.
ఒక ప్రార్ధన అమ్మూ... ఒక రకంగా చివరి కోరికని అనుకో... చంద్రుడిలోని మచ్చల్లా నీలో ఆ 'ఆగ్రహంి, 'అసహనం'... వీటిని సాధ్యమైనంత వరకూ నీలో నుంచి తొలగించుకోవటానికి ప్రయత్నించు... 'ధ్యానాభ్యాసం), నిరంతర సాధన చేయటం ద్వారా అది సాధ్యమే... ఇప్పటివరకూ నా మాట వినకపోయినా, ఇప్పుదైనా దయచేసి మొదలుపెట్టు... ఎందుకంటే, రేపు నేను వెళ్ళిపోయాక, నిన్ను చూసుకోవటానికి మన బంధువులు కాని, నౌకర్లు కాని నిన్ను తిట్టుకుంటూ కాకుండా, నీ మంచితనం గుర్తించి, మనస్పూర్తిగా ముందుకు రావాలి... 'నోరు' మంచిదైతేనే కదా ఊరు మనదయేది? నీ కోపాన్ని భరించే శక్తి నీ ఇల్లాల్నెనందుకు నాకు మాత్రమే ఉంటుంది. కాని అందరికీ ఎందుకుంటుంది? అదొక్కటి గమనించుకో...
చివరగా ఒక విన్నపం... ఈ అస్తమయ సమయంలో... నన్ను నొప్పించే విధంగా కాకుండా, కొంచెం సౌమ్యంగా, శాంతంగా ఉంటూ, సాధ్యమైనంత ఎక్కువ సమయం నాతో గదపవూ? అది నాకు ఎంతో సాంత్వన కలిగిస్తుంది అమ్మూ... నీ మెడ చుట్టూ నా చేతుల్ని హారంలాగా వేసి, నీ భుజమ్మీద తలవాల్చి, నీ చెవిలో గుసగుసగ చెప్పాలని ఉంది... ఐ లవ్ యూ! యస్... ఐ లవ్... యూ...” టేప్‌లో మాటలు ఆగిపోయి, సన్నగా వెక్కిళ్ళు వినబదసాగాయి... భవానీ ఏడుస్తోంది... నా భవానీ దుఃఖిస్తోంది. ఆ తర్వాత టేప్ ఆగిపోయింది.
అప్పుడు మొదలైందిరా హరీ, నాలో పశ్చాత్తాపం... నాలోని బలహీనతలను జయించి తీరాలన్న పట్టుదల కూడా... కాలాన్ని ఒక్కసారి 'రీవైంద్' చేయగలిగే నండూరి సుందరీ నాగమణి లాలా
వరాన్ని భగవంతుడు నాకు అనుగ్రహిస్తే, భవానీకి నాతో కలిసి నడిచిన దారంతా పూలబాటను చేయగలను... నాతో గదపిన జీవితమంతా ఆనందలహరది చేయగలను... కాని... కానీ... ఇటీజ్ లేట్... టూ లేట్!
ఆ తర్వత నేను ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదురా పరీ... ప్రతి క్షణం ఆమెతో ఆనందంగా గడిపాను... భవానీకి ఆనందం కలిగించే పనులన్నింటిలోను భాగాన్ని పంచుకున్నాను... ఆమె ఎప్పటినుండో వెళ్ళాలని అనుకుంటున్న “కన్యాకుమారికి తీసుకువెళ్ళాను... అక్కడినుంచి వచ్చిన వారం రోజుల తరువాత నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయిందిరా నా భవానీ...” సజల నేశక్రాలతో చెప్పటం ముగించాడు అమర్.
వింటున్న శ్రీహరి హృదయం ఎంతో ఆవేదనకు లోనయింది. ఆ విషాదగాథ వింటూ ఉంటే, అప్రయత్నంగా తన భార్య రమణీ మనసులో మెదిలింది... తను మాత్రం, అమర్ కన్నా ఏవిధంగా మెరుగని? రమణి అభిరుచులన్నీ తనకు
- క్సెల్లుగానే అనిపిస్తాయి... ఆమె ఇంటర్నెట్‌లో పాత 'చందమామ'లు చదువుకొంటూ ఉంటే అది తనకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది... చిన్నప్పటి జ్ఞాపకాలు ' నెమరు వేసుకుంటుంటే మూర్ధత్వమనిపిస్తుంది... ఓహ్... “భార్యలు కూడా తమలాంటి వారేనన్న సత్యం భర్తలకు ఎందుకు తోచదు? తనలోనికి తాను , తరచి చూసుకుంటూ తల విదిలించాడు శ్రీహరి.
“ఏమిట్రా హరీ, నీ స్నేహితుడి మీద నీకుచాలా అసహ్యంగా ఉంది కదూ!” పేలవంగా నవ్వుతూ అడిగాడు అమర్. “ఛ! అదేంటి అమర్... ఆ మాటకొస్తే నూటికి దెబ్బయ్ శాతం భర్తలం అలాగే ఉంటాము... మన నాన్నల కాలం నుండీ అంతే... ఏది ఏమైనా, చివరికి నీ తప్పు తెలుసుకున్నాను... చివరి రోజుల్లో భవానీ మనసును ఆహ్హాదపరచావు... కానీ, జరిగినదానికి నీవు బాధపడుతూ, తాగుడుకు బానిస కావటమే నాకేమీ నచ్చటం లేదు... నువ్వు వ్యసనానికి లోనవటం భవానీకి నచ్చే విషయమా!” కించిత్‌ుమందలింపుగా అన్నాడు శ్రీహరి.
“కాదులేరా, నా భవానీని మర్చిపోలేక, ఆమె లేదన్న బాధను తట్టుకోలేక తాగుతున్నానంతే... మానెయ్యటానికి ప్రయత్నిస్తానురా... అయినా ఇప్పటివరకూ నాలో ఉండి, నన్ను తొలిచివేస్తున్న నా “అపరాధ భావని అంతా నీతో చెప్పేశాక మనసు చాలా తేలికైపోయినట్టుందిరా... నేను ఇక్కడే మా వొాలాలున్న స్థలంలో ఒక వార్ధక్య ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను. అది పూర్తి అయ్యాక, అక్కడికే తరలి పావాంలాలాంా అమూల్యం (కథలు)
వెళ్ళిపోయి, నాలాంటి వారి మధ్యే, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నానురా...” చెప్పాడు అమర్. మిత్రుడి నిర్ణయానికి ఎంతో సంతోషించాడు శ్రీహరి. శ శ ఈ శ్రీహరి ప్రయాణిస్తున్న విమానం సింగపూర్‌లోని 'ఛాంగీ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అవబోతోంది. త్వరగా ఇంటికి చేరుకోవాలనీ, తాను భారతదేశం నుండి తెచ్చిన 'కానుకిను భార్యకు అందించి, దాన్ని చూడగానే ఆమె కళ్ళల్లో దేదీప్యమానంగా వెలిగే దీపావళి కాంతుల్ని తనివితీరా చూసి, మురిసిపోవాలని రాటంగా ఉందతనికి... తన ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగేజ్‌లోని 'శరత్ సమగ్ర సాహిత్యం” పుస్తకాల బంగీని ఆప్యాయంగా తడుముకున్నాడు శ్రీహరి, తన రమణిని ప్రేమగా తలచుకొంటూ... (నవ్య వారపత్రిక, 27.03.2018) చ ౨6+ ఈ నండూరి సుందరీ నాగమణి లా
అమ్మ చెప్పింది
“మామ్... ప్లీజ్ సెండ్ కాఫీ...” సెల్‌ఫోన్ ప్కీన్ మీద మిల మిల మెరుస్తున్న మెసేజ్‌లోని అక్షరాలు చదివి తలకొట్టుకుంది మమత.
“ఏమిటీ పిల్ల? పక్కగదిలోనే కదా ఉన్నది, పిలవొచ్చు కదా... అనుకుంటూనే
' కాఫీ పట్టుకెళ్ళి, “ఇదిగోనే కాఫీ...” అని టేబుల్ మీద ఉంచింది కాఫీ కప్పును.
డెస్కటాప్‌లో పనిచేసుకుంటున్న స్రవంతి తల్లి గొంతు వినగానే ఉలిక్కిపడి,
కంప్యూటర్ ్రీనుని మినిమైజ్ చేసేస్తూ, “వై డిడ్ యూ ట్రింగ్? వెరీజ్ దట్ లేడీ?” ఉరిమింది.
“వరాలా, ఈ రోజు రాలేదులే...”క్రీగంట కూతురిని గమనిస్తూ చెప్పింది మమత.
“సరే సరే... నువ్వెళ్ళు... నాకు పనుంది...” కాఫీని గబగబ తాగేసి, ఖాళీ కప్పును తల్లి చేతిలో పెట్టింది స్రవంతి. కూతురివైపు అదోరకమైన భావనతో చూస్తూ వంటింట్లోకి వచ్చేసింది మమత.
వైబ్రేషన్ మోడ్‌లో ఉన్న తన మొబైల్ ఫోను అప్పటికే చలిజ్వరం వచ్చినట్టు వణికిపోతుంటే గబుక్కున చేతిలోనికి తీసుకొని ఆన్సర్ బటన్ నొక్కింది. “ఆ... ఏమోయ్ మమతా... టిఫిన్ అయితే పట్టుకురా... తిని పెడతా...” భర్త గొంతు వింటూనే మమత అరికాలి మంట నెత్తికెక్కినట్టెంది.
“మీరెక్కడ?”
“ఎక్కదేమిటి? ఎప్పట్లా పేపర్లన్నీ చదువుకుంటూ హాల్లోనే ఉన్నానుగా! ఏం?”
“మరి నోటితోనే పిలవచ్చు కదండీ, ఈ ఫోన్ కాల్స్ ఏమిటీ? అయినా హాలున్నది సరదాగా అందరం కూర్చుని టీవీ చూడటానికి, అతిథులు వచ్చినప్పుడు
వారిని కూర్చోబెట్టి మాట్లాడటానికీను... అందరం కలిసి టిఫినూ, తిండీ తినే ప్రదేశాన్ని దైనింగ్ హాలని అంటారు...” చెప్పింది కోపంగా మమత.
“దైనింగ్ హాలా? బోర్! ఇక్కడైతే టీవీ చూస్తూ తినొచ్చు... పట్టుకొచ్చేయ్...” కాల్ కట్ అయింది.
చేసేది లేక వేడి వేడి పెసరట్లున్న ప్లేటును పట్టుకొని హాల్లోనికి వెళ్ళింది మమత.
“అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకొనేదేమైనా ఉందా?” అంది అతని చేతుల్లోంచి పేపర్‌ని లాగి పడేస్తూ...
ఆమె చేతిలోని ప్లేటును అందుకుంటూ, “ఏం జరుగుతోంది? అయినా గృహరాణీవి... నువ్వున్నావుగా, ఏం జరుగుతుందో చూసుకోవటానికి?” అన్నాడు ముకుందరావు.
“అవతల మీ కూతురు ఫేస్ బుక్కులో ఎవరితోనో ఛాటింగ్ చేసోంది... చెబితే వినదు... నా మాటలు 'బోర్ బోర్ అని తీసిపడేస్తూ ఉంటుంది. మనందరం ఒక దగ్గర కూర్చుని మనసారా ఒకరితో ఒకరం మాట్లాడుకొని ఎన్నాళ్ళయింది? ఇంట్లో ఉన్నంతసేపూ మీకు టీవీ, పేపర్లతోనే సరిపోతోంది... దానికి నైట్ డ్యూటీలు... మీకు సాయంత్రాలు క్లబ్‌లో కాలక్షేపాలు... వాడేమో అమెరికాలో కూర్చున్నాడు. ఇక నేనే ఒంటరిదాన్నెపోయాను...” ఫిర్యాదుగా అన్నది మమత.
“అబ్బా, లైట్ మామ్... అన్నింటికీ ఇష్యూ చేస్తావు... నాక్కూడా టిఫిన్ ఇక్కడికే పట్టుకురా...” అంది స్రవంతి తన గదిలోంచి వస్తూ.
“స్రవంతీ, తెల్లవారు రూమున ఇంటికొచ్చావు... కాసేపైనా పడుకోకుండ సిస్టమ్ మీదనే ఉన్నావు... టిఫిన్ తినేసి నిద్రపోరా...” ఆప్యాయంగా చెప్పింది మమత.
“హా, నాకు తెలుసులేమ్మా... నువ్వేం చెప్పక్కరలేదు... డాడీ,. నాకు అర్జెట్‌గా టెన్ థౌజంద్ రుపీస్ కావాలి... నా అకెౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయవూ?”
“ఆయన్నెందుకు డబ్బులడుగుతున్నావు? అసలు నీకు వచ్చే జీతం అంతా ఏమైపోతోంది?” కోపంగా అడిగింది మమత.
“నీకన్నీ లెక్కలు చెప్పాలా? అయినా నేనడిగింది నిన్ను కాదులే, మా డాదీని... ఆయనకి లేని అబ్జెక్షన్ నీకెందుకు?” దురుసుగా అంది స్రవంతి. నండూరి సుందరీ నాగమణి లా
“స్రవంతీ... పెద్దా చిన్నా లేదా?” కోపంగా చూసింది మమత.
“క్రాల్ మీ (శ్రావ్స్... ఏంటిది డాడీ, ఇంత పాతచింతకాయ పచ్చడిని ఎలా భరిస్తున్నావు?” అంటూ గట్టిగా నవ్వింది.
“అదే కదరా బేబీ... నా ఐరనీ?” తనూ నవ్వాడు ముకుందరావు.
ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకుంటూ, వంటి ంట్లోకి వెళ్ళిపోయింది మమత.
షు శ 2
మధ్యాహ్నం ఏదో తిన్నాననిపించి, మంచం మీద ఒరిగింది మమత. ఏమిటో, ఈ పిల్లలు...? తన కొడుకు చైతన్య చూస్తే పెళ్ళి చేసేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. వాడు ఇండియా రావటమే తక్షువైపోయింది. వాడి తర్వాత ఏడేళ్ళకు పుట్టిన కూతురు స్రవంతి తీరు చూస్తే ఇలా ఉంది. దీనికి పెళ్ళి చేయాలి... భర్త చూస్తే అలా, తన సరదాలు, సంతోషాలు తప్ప మరేమీ పట్టదు ఆయనకి... వీళ్ళందరికీ వండిపెట్టే వంటలక్క బ్రతుకైపోయింది తనది... అసలు తానంటూ ఒక మనిషుందనీ, దానికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయనీ ఎవరికీ పట్టదు.... దిగులు పడుతూనే నిద్రలోనికి జారిపోయింది మమత.
మొబైల్ ఫోను మైోగుతుంటే మెలకువ వచ్చింది మమతకు. “హలో...” అనగానే, అవతలినుంచి చైతన్య... “ఏమిటి మమ్మీ, పడుకున్నావా?”
“చెప్పరా నాన్నా ఎలా ఉన్నావు? చెల్లి ఇంట్లోనే ఉందిరా, మాట్లాడతావా?” అంది ఆరాటంగా...
“దాంతో నిన్ననే స్మెప్‌లో మాట్లాడాలే అమ్మా... ఇంతకీ నువ్వెలా ఉన్నావు?”
“బాగానే ఉన్నాను... కోమలి ఎలా ఉంది? బాబు బాగున్నాడా? ఒక్కసారి ఇంటికి రారా... చూసి ఎంత కాలమైందో...”
“లేదమ్మా ఇప్పట్లో మా ఇద్దరికీ లీవు దొరకదు... ఐనా వారం వారం ప్కీన్‌పై చూసుకుంటూనే ఉన్నాము కదా... నన్ను చూడాలనిపించినప్పుడు కాల్ చేసి, స్మెప్ ఆన్ చేస్తే సరి...”
“నాకవన్నీ రావురా...”
“ఏమిటి మమ్మీ, గ్రాడ్యుయేట్‌వే కదా, అవన్నీ నేర్చుకోకపోతే ఎలా? ఆ... నీ ఆరోగ్యం జాగ్రత్త... నాన్నతో కూడా మాట్లాడానులే... ఓకేనా?” పతతతతతతతతవనాావాాాలాాాా అమూల్యం (కథలు)
“అరి, చైతూ... ఒక్క నిమిషంరా...”
“చెప్పు, చెప్పు... త్వరగా...”
“చెల్లికి చెప్పరా... అది వట్టి అమాయకురాలురా... అస్తమానూ ఎవరెవరితోనో ఛాటింగులు చేస్తూ ఉంటుంది. పిల్ల ఏమైపోతుందో అనినా భయం...” పకపకా నవ్వేశాడు చైతన్య,
“అమ్మా, నువ్వు వట్ట అమాయకురాలివి... మేమింకా చిన్నపిల్లలమని అనుకుంటూ ఉంటావు. దాని జాగ్రత్తలు దానికి తెలుసులే... లైట్ తీసుకో... అన్నట్టు నా (ఫెండు ప్రబాకర్ అక్కడికి వస్తాడు వచ్చేవారం... వాడితో ఏమైనా ఊరగాయలు పంపించు... ఇక్కడినుంచి నీకేమైనా పంపించమంటావా?”
“ఉహు, నాకేం వద్దు నాన్నా... నీ ఆరోగ్యం జాగ్రత్త... కోడలిని...”
“ఓకే, ఓకే ఇక ఉంటా...” తన మాట పూర్తికాకుండానే కాల్ కట్ చేసేసిన కొడుకుని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియలేదా పిచ్చితల్లికి...
శ శ ఈ
“మామ్, మా బాస్ ఇంట్లో ఈ రోజు పార్టీ ఉంది... నైట్ బాగా లేటవుతుంది...” తల్లితో చెప్పింది స్రవంతి బయలుదేరబోతూ. వంటికి అంటుకు పోయిన పలుచని టాప్... దానిలోంచి సుస్పష్టంగా కనిపిస్తున్న లోదుస్తులు ఆమె యవ్వన సంపదలను కొంతవరకూ బహిర్గతం చేస్తున్నాయి. క్రింద వేసుకున్న స్కర్ట్ మోకాళ్ళు దాటినా, పాదాల పైభాగం అడుగున్నర దాకా కనిపిస్తోంది.
“సవంతీ, ఏమిటమ్మా ఈ డ్రెస్సు?” మమత భృకుటి ముడివడింది.
“ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషన్‌లే మామ్, నీకు తెలీదు...” నుదుటి పై పడుతున్న జుత్తును నిర్లక్ష్యంగా వెనక్కి తోసుకుంటూ చెప్పింది స్రవంతి.
“లంగా ఓణీ ఇష్టం లేకపోతే ఓకే... చీర కట్టుకోవటమంటే చిరాకు, సరే... నీకు ఎన్నో పంజాబీ సూట్స్ ఉన్నాయి కదా, లేదూ... మొన్న కొన్న ఘాఘ్రా చోళీ వేసుకో... క్రిందటి నెల కొన్న అనార్భలీ ద్రెస్ వేసుకో...ఎవరు కాదన్నారు? లోపలి బట్టలు కనబడే ఈ (దస్ మాత్రం వేసుకోకమ్మా, చాలా ప్రావోకేటింగ్‌గా ఉంది...” ముఖం తిప్పుకుంది మమత,
“ఏం ఫర్లేదు మమ్మీ... నేను వెళ్ళే పార్టికి చాలా మోడరన్‌గా ఉండేవాళ్ళు వస్తారు. ఇంకా ఇక్ష్వాకుల కాలంలోలా ఉంటే ఏమైనా బావుంటుందా? ఐనా
నండూరి సుందరీ నాగమణి లాలా
ఇది చాలా నయం... మా కొలీగ్స్ అయితే ఇంకా చిన్న చిన్న (డైస్సులు వేసుకొస్తారు...” ఐటబ్రోస్ దిద్దుకుంటూ చెప్పింది స్రవంతి.
“స్రవంతీ, ఇప్పుడీ పార్టీకి నువ్వెళ్ళకపోతే ఏమ్మా?” అనునయంగా అడిగింది మమత.
చిత్రంగా చూసింది స్రవంతి. “వాట్ మమ్మీ, టార్టెట్ రీచ్ అయినందుకు మా బాస్ పార్టీ ఇస్తుంటే నేను వెళ్ళకపోతే ఎలా?”
“సరే... కాని త్వరగా వచ్చేయ్... ప్లీజ్ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తీసుకో...” నిస్సహాయంగా చెప్పింది మమత.
భుజాలు ష్రగ్ చేసి, బయటకు నడిచింది స్రవంతి.
శు శ 4
రాత్రి పన్నెండున్నర దాటాక, కారు శబ్దం విని, టీవీ చూస్తూ కునికిపాట్లు పడుతున్న మమత లేచి తలుపు తీసింది. అప్పటికే కారు పార్క్ చేసి లోపలికి వస్తోంది స్రవంతి. ఆమె కళ్ళు వాలిపోతున్నాయి. ఒళ్ళు స్వల్పంగా తూలుతోంది.
“స్రవంతీ, ఆర్ యూ ఓకే?” దగ్గరగా వచ్చి, ఆమె చేయి పట్టుకుంది మమత.
“యా, అయామ్ ఓకే మమ్...” తల్లి చేయి పట్టుకొని తన గదిలోకి దారితీసింది స్రవంతి.
“నిద్దరొస్తోంది మమ్మీ...” అనంటున్నా వినకుండా బలవంతంగా బట్టలు మార్పించింది మమత,
“బై మామ్, గుడ్ నైట్...” మత్తుగా మంచమ్మీద వాలిపోయింది స్రవంతి.
శ శ ఇ
మర్నాడు ఉదయం...
“స్రవంతీ, లేమ్మా, కాఫీ తీసుకో...” లేపింది మమత.
“బ్రష్ చేసుకొని వస్తా మమ్మీ...” అంటూ లేవబోయింది స్రవంతి.
“ఏం ఫర్వాలేదులే... బెడ్ కాఫీ నీకలవాటే కదా...” అంటూ తనూ కూతురి మంచంమీద కూర్చుని, “నిజం చెప్పవే... రాత్రి నువ్వు డ్రింక్ చేశావు కదూ!” కాఫీ తాగుతున్న కూతురి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మమత. పా అమూల్యం (కథలు)
“తప్పలేదే తల్లీ... వోడ్కా తాగాను... నేనే కాదే, అక్కడున్న అందరూ తాగారులే... ఐనా అదేమంత తప్పుకాదు...” తల్లి చూపులు తప్పించుకుంటూ, బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపేసుకుంది స్రవంతి. వాష్ బేసిన్ దగ్గర ఇలా నిలబడిందో లేదో, ఆమెకు భళ్ళుమని వాంతైపోయింది.
బ్రష్ చేసుకొని ఇవతలికి వచ్చేసరికి తల్లి ఆ గదిలో లేకపోవటంతో ఎంతో రిలీఫ్‌గా నిశ్వసించింది.
ఒక్కనారిగా రాత్రి పార్టీలో జరిగిందంతా ఆమె కళ్ళముందు రీలులా తిరిగింది.
తను వెళ్ళేసరికే తమ బాస్ రాబర్ట్‌ని స్టాఫ్ అంతా అభినందిస్తున్నారు. తాను కూడా వెళ్ళి చేయి కలిపి అభినందించింది.
“ఇంత లేట్ ఏమిటి (శావ్స్, నీ కోసం ఎప్పట్నుండి వెయిటింగో తెలుసా?” అన్నాడు హస్కీగా. అతను తనను ఇష్టపడుతున్నాడన్న భావన ఆమెలో పులకలు రేపింది.
ఆఫీసులో ఉన్నంతసేపూ తన అందాన్ని పొగడుతూనే ఉంటాడు రాబర్ట్. తనకేసి వెర్రిగా చూస్తూ ఉంటాడు... ఇంటికొచ్చిన తర్వాత ఫెస్‌బుక్‌లో ఛాట్ చేస్తుంటాడు. అతన్ని పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోవాలి. అతని (ప్రేమ సామ్రాజ్యానికి అధినేత్రి కావాలి. అందుకే ఈ రోజు ఇంత ప్రత్యేకంగా అలంకరించుకుంది. అతను బహూకరించిన ఈ (దైస్‌ను తనకి అంతగా నచ్చకున్నాా అతనికిష్టం కాబట్టి వేసుకుంది. అందరికీ డ్రింక్స్ సర్వ్ చేశారు.
“సార్రీ నేను సాఫ్ట్ డ్రింక్స్ తప్ప తీసుకోను...” సున్నితంగా నిరాకరించింది (స్రవంతి.
“శావ్స్, ఇది సాఫ్ట్ డ్రింకేనోయ్, యాపిల్ జ్యూస్... ఇదిగో చూడు, నేను కూడా ఇదే తాగుతున్నా...” గ్లాసందుకొని, దాన్ని తన పెదవులకు తాకించాడు రాబర్ట్. బలవంతంగా గుటకేసి మింగింది... నాలిక కొంచెం తిమ్మిరిగా అనిపించినా, చల్లగా, హాయిగా అనిపించింది.
ఓ గ్లాసు పూర్తికాగానే, “డీజే అంటూ డిస్కో మొదలుపెట్టారు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా... అందరూ కలిసి డాన్సులు చేయసాగారు. తన చేయి అందుకొన్నాడు రాబర్ట్. అప్పటికే తన కళ్ళముందు మంచు తెరలు... మత్తుగా, గమ్మత్తుగా... నండూరి సుందరీ నాగమణి లాలా
ఈలోగా మరో గ్లాసు డ్రింక్. అతని కళ్ళలోకి చూస్తూనే అలా తాగేసింది తను. ప్రపంచమంతా ఊగిపోతూ ఉంటే, రాబర్ట్‌తో తాను ఆ ఫాస్ట్ బీట్ సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ... అతని చేయి తన నడుము చుట్టెయగా, అతని పెదాలు అప్పుడప్పుడు తన చెక్కిళ్ళను ముద్దాడుతూ... అతని ముఖం తన ముఖానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇబ్బందితో తను ముఖం తిప్పేస్తున్నా, మనసు తన మాట వినక, వివేకపు హెచ్చరికలను పెడచెవిని పెడుతుండగా... ఒకటి రెండుసార్లు ఆ ముద్దను తాను కూడా ఆస్వాదించింది. మ్యూజిక్ వేగం ఎక్కువై, హఠాత్తుగా తనను దగ్గరగా లాక్కుని, తన టాప్‌ను కిందికి లాగేస్తూ, పైకి బహిర్గతమవుతున్న తన ఎదసీమపై తన ముఖాన్ని రాస్తూంటే, అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి... విదిలించుకుంటూ, దూరం జరగబోయింది. కాని అతని పట్టు ఉడుము పట్టయింది.
“ప్లీజ్ లీవ్ మీ రాబర్ట్... ఇలా నా కిష్టం లేదు వదులు...” తను చెబుతూనే ఉంది తడబడుతూ... కానీ ఫలితం ఉండటం లేదు... ఈలోగా దేవుడు దయ చూపినట్టు షీలా అతన్ని తనవైపుకు తిప్పేసుకుంది. తనను వదిలిపెట్టి రాబర్ట్ షీలావైపు ఒరిగిపోయాడు. “హమ్మయ్య!” అనుకుంటూ దుస్తులు సరిచేసుకొని, అలాగే అక్కడినుండి బయటపడింది తాను.
అమ్మ చెప్పింది నిజమే... తన బట్టలు చాలా భయంకరంగా ఉన్నాయి... దానికి తోడు తాను సేవించింది కూల్‌డ్రింక్ కాదు మద్యమే... రాబర్ట్ ప్రవర్తన చాలా ఇన్ డీసెంట్‌గా ఉంది. అతనికి కావలసింది ఏమిటో ఆ క్షణంలోనే అర్ధమైంది. ఆ నిమిషం అతనికి సుఖాన్నిచ్చేది తానైనా, షీలా అయినా, మరో రోజా అయినా ఎవరైనా ఒక్కటే... ఆ క్షణంలో అతనికి తన మీద ఉన్నది లవ్ కాదని, లస్ట్ మాత్రమె అని అవగతమైంది తనకు.
కాని తను? తనెంతగా (ప్రేమించింది అతన్ని? అతనే తన జీవిత భాగస్వామి అవుతాడని ఎంచి, ఎన్నెన్ని కలలు కన్నది? గత రాత్రి జరిగిన విషయాలను మననం చేసుకొనే కొద్దీ, దిగులుగా, దుఃఖంగా అనిపించింది స్రవంతికి... భారంగా దిందులో ముఖాన్ని దాచుకుంది.
ఈ కంపెనీలో చేరి తొమ్మిది నెలలవుతోంది. తాను జాయిన్ అయిన రోజే రాబర్ట్ తన మనసును ఆకర్షించాడు... కంపెనీ తరఫున ప్రతినిధిగా, తమకు బాస్‌గా యు.యస్. నుంచి వచ్చాడు... గులాబీరంగులో చిదిమితే పాలుగారేలా పతతతతతతతతతతతతయయంంంఆ అమూల్యం (కథలు,
ఉందే రాబర్ట్ అంటే అమ్మాయిలందరికీ కేజ్. అతనే తనకు ఆఫీసులో పనంతా నేర్పించాడు. ఒక అయిదారు నెలల నుంచీ ఇద్దరి మధ్యా బాగా చనువు పెరిగింది. ఫేస్ బుక్‌లో మెసేజెస్, ఛాట్స్ తనకు బాగా అలవాటు అయిపోయాయి. అతన్ని మిస్ అవుతానన్న భయంతో వంట్లో నలతగా ఉన్నా సరే ఏ ఒక్కరోజు కూడా ఆఫీసుకి వెళ్ళకుండా ఉండదు తను.
రాబర్ట్‌ను చూడకుండా, అతనితో మాట్లాడకుండా అసలు ఉండలేకపోతోంది తానీ మధ్య... అమ్మానాన్నలతో మాట్లాడి, ఒప్పించి, అతన్నే వివాహం చేసుకోవాలన్న నిర్ణయం కూడా తీసేసుకుంది. కానీ... కానీ... అతను తనను ప్రేమించటం లేదు... కేవలం కామిస్తున్నాడంతే... అతనికి తానక్కరలేదు... కేవలం తన అందం, యవ్వనం... ఇవే కావాలి... అతని దృష్టిలో తానొక భోగ్యవస్తువు మాత్రమే. (స్రవంతికి తనమీద తనకే కలిగిన జాలితో ఉవ్వెత్తున్న దుఃఖం పొంగుకొచ్చింది.
ఇ * 4
నెల రోజులు గడిచాయి. తిండీతిప్పలూ మానేసి రోజు రోజుకీ కృంగి, కృశిస్తోంది స్రవంతి. ఆఫీసుకి కూడా సరిగ్గా వెళ్ళటం లేదు. ఎప్పుడూ నిరాశగా... శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. కోపం, చిరాకు ఎక్కువయ్యాయి. ఆరోజు ఉదయం భర్త ఆఫీసుకు వెళ్ళగానే కూతురి గదిలోకి వచ్చింది మమత.
చిందరవందరగా ఉన్న పక్కమీద... పాతబడిన నైటీ ఒకటి వేసుకొని, జుత్తయినా దువ్వుకోకుండా అలా దీనంగా కూర్చున్న కూతుర్ని చూడగానే కడుపు తరుక్కుపోయింది మమతకు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన అందుకొని, కూతురి పక్కనే కూర్చుని, మెల్లగా తల దువ్వసాగింది. హఠాత్తుగా పక్కకి తిరిగి తల్లి పొట్టలో తల దాచుకుంది స్రవంతి. దుఃఖావేశంతో ఆమె డొక్క ఎగిరెగిరిపడ సాగింది.
“ఏమైందిరా నాన్నా? నాతో చెప్పవూ?” బుజ్జగింపుగా అడిగింది మమత. వెక్కిళ్ళ మధ్య చెప్పటం (వ్రారంభించింది స్రవంతి... రాబర్డ్‌తో తన పరిచయం, స్నేహం, తను మదిలో అతనిపై పెట్టుకున్న ఆశలు, కన్న కలలు, ఆ తర్వాత పార్టీలో అతని తీరు, అది భరించలేని తన మనసు విరిగిపోవటం అన్నీ వివరంగా చెప్పింది.
“అలా ఫేస్‌బుక్కులో నేను పెట్టిన నా ఫోటోలను మార్చింగ్ చేసి, అసభ్యంగా
నండూరి సుందరీ నాగమణి లూ
మార్చాడమ్మా రాబర్ట్... ఆ రోజు పార్టీలో డాన్స్ చేసినప్పుడు మేము సన్నిహితంగా ఉన్న సీన్లను నాకు తెలియకుండా ఫోటోలు తీశాడు. ఇప్పుడు నేను గనుక వాడికి దక్కకపోతే ఈ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ నా గురించి తెలిసేలా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అమ్మా, నిజం చెబుతున్నాను. ఆ రాత్రి ఎప్పుదైతే వాడు నా శరీరం కోసం ఆశపడ్డాడో, అప్పుడే వాడంటే విరక్తి కలిగింది నాకు. ఇప్పుడీ బెదిరింపులతో నరకం చూస్తున్నాను... అయామ్ వెరీ సారీ అమ్మా నీ మాట ఎప్పుడూ నేను వినలేదు... అందుకే ఇప్పుడిలా అనుభవిస్తున్నాను...” చెప్పటం పూర్తిచేసి కళ్ళుతుడుచుకుంది స్రవంతి.
“దీనికేనా ఇంత బెంగ ్రవంతీ... నేను చూసుకుంటానులే... లే... స్నానం చేసి, మంచి బట్టలు వేసుకొని రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళి వద్దాం” (స్రవంతిని బలవంతంగా లేవదీసింది మమత,
శం శ ఓ
టేబుల్ మీదున్న గ్లాస్ పేపర్ వెయిట్‌ని తిప్పుతూ, మమత చెప్పినదంతా వింటూ, జాగ్రత్తగా పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు వినయ్. ఎదురుగా మమతతో పాటు కూర్చున్న మళ్లెమొగ్గ వంటి స్రవంతి బెదురుచూపులు చూస్తూంటే చాలా జాలేసిందతనికి. “చూడు వినయ్, వాడికి నువ్వే బుద్ధి చెప్పాలి... చిన్నప్పట్నుండీ తెలిసిన పిల్లవాడివి... మంచి స్థాయిలో ఉన్నావు... ఆ వెధవ మిద చర్య తీసుకొని, ఇలా అమాయకంగా బలైపోతున్న ఎందరో ఆడపిల్లలను వాడి బారినుండి రక్షిస్తావని కొండంత ఆశతో వచ్చాను...” వేడికోలుగా అంది మమత.
“అయ్యో ఆంటీ, మీరంతగా చెప్పాలా? ఇలాంటి కేసులు మాకు మామూలే కదా... ఇటువంటివి పరిష్మరించటానికే మా సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ 'లా'లు ఉన్నది... ్రవంతీ... మీరు ఈ పేపరు మీద మీ అభియోగం వ్రాసూ సంతకం చెసివ్వండి...” తెల్లకాగితం బిగించిన ప్యాడ్‌ను ఆమె ముందుకు తోస్తూ చెప్పాడు వినయ్. అయిదు నిమిషాల్లో కంప్లయింట్ (వ్రాసి, సంతకం. చేసిచ్చింది (స్రవంతి.
“ఇక మీ భయాలన్నీ మరచి హాయిగా నిద్రపొండి ఆంటీ... వాడి అంతు నే తేలుస్తాను... సైబర్ నేరంలో ఇరుక్కుంటే బయటపడటం అంత తేలికేమీ కాదు... వాడిని తిరిగి అమెరికా పార్ఫిల్ చేస్తాను... ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఆంటీ... అవసరమైతే ఎంత రాతైనా సరే నాకు ఫోన్ చేయండి...” తన విజిటింగ్ కార్ట్ అందించాడు వినయ్.
అతడా అమూల్యం (కథలు)
మార్చాడమ్మా రాబర్ట్... ఆ రోజు పార్టీలో డాన్స్ చేసినప్పుడు మేము సన్నిహితంగా ఉన్న సీన్లను నాకు తెలియకుండా ఫోటోలు తీశాడు. ఇప్పుడు నేను గనుక వాడికి దక్కకపోతే ఈ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ నా గురించి తెలిసేలా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అమ్మా, నిజం చెబుతున్నాను. ఆ రాత్రి ఎప్పుదైతే వాడు నా శరీరం కోసం ఆశపడ్డాడో, అప్పుడే వాడంటే విరక్తి కలిగింది నాకు. ఇప్పుడీ బెదిరింపులతో నరకం చూస్తున్నాను... అయామ్ వెరీ సారీ అమ్మా నీ మాట ఎప్పుడూ నేను వినలేదు... అందుకే ఇప్పుడిలా అనుభవిస్తున్నాను...” చెప్పటం పూర్తిచేసి కళ్ళుతుడుచుకుంది స్రవంతి.
“దీనికేనా ఇంత బెంగ ్రవంతీ... నేను చూసుకుంటానులే... లే... స్నానం చేసి, మంచి బట్టలు వేసుకొని రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళి వద్దాం” (స్రవంతిని బలవంతంగా లేవదీసింది మమత,
శం శ ఓ
టేబుల్ మీదున్న గ్లాస్ పేపర్ వెయిట్‌ని తిప్పుతూ, మమత చెప్పినదంతా వింటూ, జాగ్రత్తగా పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు వినయ్. ఎదురుగా మమతతో పాటు కూర్చున్న మళ్లెమొగ్గ వంటి స్రవంతి బెదురుచూపులు చూస్తూంటే చాలా జాలేసిందతనికి. “చూడు వినయ్, వాడికి నువ్వే బుద్ధి చెప్పాలి... చిన్నప్పట్నుండీ తెలిసిన పిల్లవాడివి... మంచి స్థాయిలో ఉన్నావు... ఆ వెధవ మిద చర్య తీసుకొని, ఇలా అమాయకంగా బలైపోతున్న ఎందరో ఆడపిల్లలను వాడి బారినుండి రక్షిస్తావని కొండంత ఆశతో వచ్చాను...” వేడికోలుగా అంది మమత.
“అయ్యో ఆంటీ, మీరంతగా చెప్పాలా? ఇలాంటి కేసులు మాకు మామూలే కదా... ఇటువంటివి పరిష్మరించటానికే మా సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ 'లా'లు ఉన్నది... ్రవంతీ... మీరు ఈ పేపరు మీద మీ అభియోగం వ్రాసూ సంతకం చెసివ్వండి...” తెల్లకాగితం బిగించిన ప్యాడ్‌ను ఆమె ముందుకు తోస్తూ చెప్పాడు వినయ్. అయిదు నిమిషాల్లో కంప్లయింట్ (వ్రాసి, సంతకం. చేసిచ్చింది (స్రవంతి.
“ఇక మీ భయాలన్నీ మరచి హాయిగా నిద్రపొండి ఆంటీ... వాడి అంతు నే తేలుస్తాను... సైబర్ నేరంలో ఇరుక్కుంటే బయటపడటం అంత తేలికేమీ కాదు... వాడిని తిరిగి అమెరికా పార్ఫిల్ చేస్తాను... ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఆంటీ... అవసరమైతే ఎంత రాతైనా సరే నాకు ఫోన్ చేయండి...” తన విజిటింగ్ కార్ట్ అందించాడు వినయ్.
అతడా అమూల్యం (కథలు)
“థాంక్స్ వినయ్... నువ్వు నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌వని మీ అత్తయ్య ద్వారా విని, వెంటనే నీ దగ్గరకు వచ్చాము. మా సమస్య చెప్పిన నువ్వు ఎంతో బాగా స్పందించావయ్యా... నా స్నేహితురాలి మేనల్లుడివి... నాకెంతో ఆప్పుడ వయ్యావు... వస్తాము మరి...” అంటూ లేచింది మమత.
“చూడండి స్రవంతిగారూ, మీరేమీ తప్పు చేయలేదు... అలా గిల్టిగా ఫీలవ్వకండి, జరిగింది ఓ పీదకలగా భావించి, అందులోంచి బయటకు వచ్చేయటమే మీ తక్షణ కర్తవ్యం... బీ బ్రేవ్...” లేచి ఆమె భుజాన్ని తట్టాడు ధైర్యాన్నిస్తున్నట్టుగా... కృతజ్ఞతగా చూస్తూ, తల్లిని అనుసరించింది (స్రవంతి.
అనతి కాలంలోనే ఇండియాలో రాబర్ట్ చరిత్ర ముగిసిపోయింది. అతని కంప్యూటర్‌ని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ చేయించి చూడగా అతను చేసిన నేరాలు, ఘోరాలు ఎన్నో ఎన్నెన్నో బయటపడ్డాయి. స్రవంతి మాత్రమె కాక మరెందరో అమ్మాయిల ఫోటోలు భయంకరంగా మార్చివేయబడ్డాయి. అతని స్నేహితుల్లో కూడా అతనిలాంటి వారే ఎందరో ఉన్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, రాబర్ట్ అకౌంట్ ద్వారా అందరి జాతకాలూ బయటకొచ్చాయి. వీళ్ళంతా ముఠాలుగా ఏర్పడి, డబ్బున్న అమ్మాయిల్ని గృహిణులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించి జల్సా చేస్తున్నారు. రాబర్ట్ మీదా, అతని స్నేహితుల మీదా కేసులు ఫైల్ చేయించి, అతన్ని అమెరికా పోలీసులకు అప్పజెప్పటం జరిగిపోయింది.
“అమ్మా, నన్ను క్షమించు... నిన్ను చిన్న చూపు చూస్తూ, నువ్వు చెప్పిన మాట ఏదీ వినకుండా ఎదురు సమాధానాలు చెప్పినందుకు తగిన శాస్తి జరిగింది నాకు... ఈ రోజు నువ్వే ఆదుకోకపోయినట్టెతే ఏమైపోయి ఉందేదాన్నో...”తల్లి గుండెల్లో తల దాచుకుంటూ చెప్పింది స్రవంతి.
“ధ! అదేమిటే... పిల్లలు వచ్చీరాని వయసులో వేసేవి తప్పటడుగులు... వాళ్ళు నదక నేర్చుకుంటున్నందుకు ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో, అదే సమయంలో “అయ్యో, ఎక్కడ పడిపోతారో...” అనే ఆదుర్గా కూడా పడుతుంది... ఒకవేళ వాళ్ళు నడుస్తూ పడిపోబోతుంటే వెన్నంటి ఉండి గబుక్కున పట్టుకుంటుంది... ఇప్పుడు నేను చేసింది కూడా అది... వయసులో ఎంత ఎదిగినా
మీరు మీకు బుజ్జిపాపాయిలే ్రవంతీ...” (ప్రేమగా అంది మమత.
“నేను కూడా సారీ చెబుతున్నా మమతా... చాలాసార్లు స్రవంతితో కలిసి
నండూరి సుందరీ నాగమణి లాలా
నిన్ను చిన్నబుచ్చాను... ఏది ఏమైనా, నీ సమయస్ఫూర్తి మాత్రం మెచ్చుకో వలసినదే... ఇంతకీ ఈ వినయ్ నీకు తెలిసిన వాడవటం మనకి మేలయింది...” అన్నాడు ముకుందరావు,
“అవునండీ... నా (ఫైండ్ సత్యవతి వాళ్ళన్నయ్య కొడుకు ఈ వినయ్. మేము కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు పుట్టాడు. ఎంతో ముద్దుగా ఉందేవాడు. ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసరైపోయాడు... డిపార్ట్‌మెంట్‌లో చాలా మంచి పేరుందతనికి. ఆ మధ్య అతను సాధించిన విజయాలన్నింటినీ అభినందిస్తూ, పేపర్లో 'యువతరంగం' శీర్షికన అతనితో ఇంటర్వ్యూ కూడా వేశారు... మరి... అతన్ని మన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం...” సూటిగా పాయింట్‌లోకి వచ్చేస్తూ చెప్పింది మమత.
“అంటే...” ప్రవంతి వెపు సాభిప్రాయంగా చూశాడు ముకుందరావు. వాళ్ళు అంటున్నది ఏమిటో అర్ధమయేసరికి స్రవంతి బుగ్గల్లో గులాబీలు పూశాయి...
“సత్యవతితో నిన్ననే ఫోన్‌లో మాట్లాడాను. వినయ్ దీనికన్నా నాలుగేళ్ళు పెద్ద... అదిగాక, వినయ్‌కి కూడా మన బంగారం అంటే ఇష్టమే... మరి.. ్రవంతీ... నీకు? తల్లి అడుగుతూ ఉంటే, ఎన్నడూ లేనిది సిగ్గు ముంచుకొచ్చింది స్రవంతికి. దాన్ని దాచుకుంటూ, మమత మెడ చుట్టూ చేతులు వేసి, “నా బాగోగులేమిటో నాకన్నా మీ ఇద్దరికే తెలుసని అర్ధమైవోయింది అమ్మా... నీ ఎన్నిక ఎన్నడూ తప్పు కాదు. మాయమోహంలో బొగ్గును వజంగా భ్రమసి ఆశపడ్డాను... ఇప్పుడు నీ (ప్రేమతో నిజమైన వజ్రాన్నే కానుకగా ఇస్తానంటే వదులుకొనేంత అవివేకిని కను...” తల్లి చెంపమీద ముద్దు పెట్టుకొని, తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది స్రవంతి.
(స్వాతి సపరివారపత్రిక, 07.08.2014) ప లాలా అమూల్యం (కథలు)
మంచిముత్వం
“శరత్, ఈ రోజు మనకి కొత్త బాస్ రిపోర్ట్ చేస్తున్నారు... ముంబయి నుండి వస్తున్నారట...” సుడిగాలిలా వచ్చి చెప్పాడు మధు.
“ఆహా, అలాగా?” నిరాసక్తంగా చూశాడు శరత్.
“ఏమిటో, ఎంతో హుషారుగా ఉండేవాడు... ఇలా అయిపోయాడు...” తనలో తానే అనుకుంటూ, వార్తను చేరవేయటానికి మిగతా కొలీగ్స్ దగ్గరకు వెళ్ళిపోయాడు మధు.
సరిగ్గా పదకొండు గంటలకు బయట కారాగింది. లైట్ బ్లూ కలర్ షర్ట్‌ను, స్నఫ్ కలర్ పాంట్‌లో టక్ చేసి, చిన్న ప్రింట్ ఉన్న మెరూన్ కలర్ టైతో, చిరునవ్వు చెరగని ముఖంతో, స్మార్ట్‌గా ఉన్న బాస్ లోపలికి వచ్చాడు. వస్తూనే, నిలబడి ఉన్న స్టాఫ్ మెంబర్స్‌ని కూర్చోమని, తాను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు.
మైడియర్ (ఫెంద్స్, నేనే మీ కొత్త బ్రాంచ్ మేనేజర్ శ్రీహర్నను. మాధవరావు గారి స్థానంలో వచ్చాను. బై ద వే, ట్రెయిన్ చాలా ఆలస్యంగా రావటం వల్ల, నేను ఆఫీసుకు సమయానికి రాలేకపోయాను, అందుకు మీరందరూ నన్ను క్షమించాలి. మీరందరూ ఎవరిని వారు పరిచయం చేసుకుంటారా?” శ్రీహర్ష కలుపుగోలుతనానికి ఆశ్చర్యపోతూనే, అందరూ తమను తాము పరిచయం చేసుకున్నారు.
ఆఖరుగా శరత్ మిగిలాడు. అంటీ అంటనట్టు శ్రీహర్నతో చేయి కలుపుతూ, “శరత్...” అని మెల్లగా గొణిగడు. హుషారుగా తలెత్తి “ఓ, మీరేనా శరత్ అంటే? మీ గురించి నేను చాలా చాలా విన్నాను మిస్టర్ శరత్... క్రిందటేడు మన బ్రాంచి లాభాల్లో సగానికి సగం మీ కంట్రిబ్యూషన్ అని తెలిసింది. వెరీ గుడ్ అండీ... నండూరి సుందరీ నాగమణి లా
మీవంటివారు మన సంస్థకి మంచి అసెట్స్ అన్నమాట...” ఆప్యాయంగా అతని చేయి నొక్కాడు శ్రీహర్ష
శరత్ కళ్ళలో చిన్న మెరుపు ఓ లిప్తపాటు వెలిగి మయమైపోయింది.
“ఓకే (ఫెండ్స్, చాలా ఆనందంగా ఉంది, మీతో కలిసి పనిచేయబోతు న్నందుకు... అయితే నా గురించి ఒక విషయం మీకు చెప్పాలి... వ్యక్తిగతంగా మీతో ఎంతగా స్నేహంగా ఉంటానో, ఆఫీసు విషయాలలో అంత కఠినంగా ఉంటాను నేను. పని ఎగ్గొట్టినా, పెండింగ్ పెట్టినా నాకు నచ్చదు. మీకు ఏ విషయంలో సందేహాలున్నాా పని తెలియకపోయినా, డాటా లేకపోయినా నన్ను అడగండి, కలిసి పనిని పంచుకుందాము. మన సంస్థనుముందుకు నడిపించు కుందాము...”
“అలాగే సర్... తప్పకుండా...” డిప్యూటీ మేనేజరు రామారావు శ్రీహర్షను అతని కేబిన్‌లోకి తీసుకెళ్ళాడు. అక్కడ అతనితో అయిదు నిమిషాలు మాట్లడిన తరువాత, బయటకి వచ్చి, శరత్ టేబుల్ దగ్గర ఆగి, “ఆ అన్నపూర్ణా ఇండ్టీస్ ఫైల్ ఏమైంది శరత్? నోట్ పుటప్ చేయమని మూడు రోజుల క్రితం చెప్పాను కదా?” అన్నాడు రామారావు.
“ఇంకా కాలేదు...” నిర్లిప్తంగా చెప్పాడు శరత్ అభావంగా చూస్తూ,
“ఇంకా కాకపోవడమేమిటి శరత్? చంపకయ్యా బాబు, లోపలికెళ్ళి ఆయన తన సీట్‌లో కూర్చున్నాడో లేదో ఫోన్ మోగింది. అటునుంచి అన్నపూర్ణా వాళ్ళ ఛైర్మన్ అనుకుంటాను, ఈయన వెంటనే ఆ ప్రపోజల్ స్టేటస్ ఏమిటో చెప్పమని నన్ను అడుగుతున్నాడు. ఒక్క అరగంటలో ఫినిష్ చేయమ్మా, ప్లీజ్...” నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ, తన సీట్‌వైపు వెళ్ళబోయి, మళ్ళీ వెనక్కి వచ్చాడు.
“శరత్ ఎంత హుషారుగా ఉందేవాడివి నువ్వు? ఇదివరలో ఏ వర్క్ ఇచ్చినా సరే దాన్నినిమిషాల్లో ఫినిష్ చేసి, సాయంత్రానికల్లా ఫైల్స్ అన్నీ అప్పడేట్‌గా నా టేబుల్ మీద ఉంచేవాడివి... ఉత్సాహానికి మారుపేరులా ఉండే నీలో ఇంత స్తబ్ధత ఏమిటి? సరే, ఇది విను... ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరట. మొదటిరోజునే ఈయన ఆగ్రహానికి గురవ్వటమెందుకు కానీ, త్వరగా నోట్ పెట్టేయి శరత్...” అని దీర్హంగా నిట్టూరుస్తూ, తన టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు రామారావు.
మౌనంగా ఆ ఫైల్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడు శరత్.
పతా అమూల్యం (కథలు)
నాయంత్రం అయిదవుతుందడగా శ్రీహర్న నుండి పిలుపు వచ్చింది శరత్‌కి. “కమిన్ మిస్టర్ శరత్...ప్లీజ్ టేక్ యువర్ సీట్... నోట్ బాగా పెట్టారు... వెల్ సెడ్... అన్నపూర్ణా వాళ్ళ ప్రపోజల్‌ని యథాతథంగా రికమెండ్ చేయకుండా, దానివల్ల మనకుండే సాధకబాధకాలను చక్కగా సమీక్షించారు. ఈ ఫైల్‌ని నేను ఈ రాత్రికే స్టడీ చేసి, నిర్ణయం తీసుకుంటాను. అవునూ, ఎందుకో ఈ మధ్య మీరు ఆఫీసు పనిమీద సరిగ్గా మనసుపెట్టటం లేదని... సారీ, ఐ మీన్... ఏదైనా సమస్యా? మీరు చాలా బాగా పనిచేస్తారని నాకు తెలుసు.... ఇదిగో, దృష్టాంతం నా చేతిలోనే ఉంది. కానీ మీరెందుకో అకస్మాత్తుగా డల్ అయ్యారని విన్నాను. ఏమైంది? శరత్, నన్ను మీరు మీ క్లోజ్ (ఘెండ్‌గా భావించి చెప్పండి, సీజ్...” ఆప్యాయంగా, ఆదరంగా అడిగిన శ్రీహర్షకు శరత్ నుండి మౌనమే సమాధానంగా వచ్చింది.
“ఇట్స్ ఆల్‌రైట్... మీ కిష్టం లేకుంటే ఆ విషయాలేవీ మాట్లాడుకోవద్దులే మనం... రేపు ఉదయమే మనం అన్నపూర్ణావాళ్ళ యూనిట్‌కి విజిట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది... ఆఫీసుకు ఓ అరగంట ముందుగా రండి, ఓకే?”
“నేనా?” విస్మయంగా చూశాడు శరత్... “మాధవరావుగారు మానేజర్‌గా ఉన్నప్పుడు తనతో రామారావుసార్‌ని తీసుకెళ్ళేవారు...”
“నేను మిమ్మల్ని తీసుకెళదామని అనుకుంటున్నాను. ఓకే? ఆ, నాకింకొక హెల్ప్ చేయాలి మీరు... నేను హోటల్ శ్రీదేవిలో దిగాను. అర్జెంటుగా నాకిల్లు చూసిపెట్టాలి మీరు. మన ఆఫీసుకి దగ్గరలో అయితే మంచిది...”
“సరే సర్...” మెల్లగా అన్నాడు శరత్.
ఇంటికి వచ్చిన చాలాసేపటి వరకూ శరత్ మనసులో ఆ రోజు ఆఫీసులో జరిగిన సంఘటనలు, కొత్త బాస్ శ్రీహర్ష మాటలు తిరిగాయి. శ్రీహర్న వైఖరి చాలా బాగుంది. ఇలాంటి వైఖరి, సిబ్బందితో చక్కగా పనులు చేయించటానికి, మంచి ఫలితాలను సాధించటానికి ఉపయోగపడుతుంది. చాలా సిన్సియర్ వర్శర్ అని తెలుస్తోంది... నిన్నటి వరకూ తానూ అలాగే ఉండేవాడు... ఈ రోజు ఇంత నిరాసక్తత, నిశ్శబ్దం తనలో ఏర్పడటానికి కారణాలు ఏమిటీ? శరత్ మనో విహంగం, గతకాలపు గగనంలోనికి రివ్వున ఎగిరిపోయింది.
శు 4 ఈ
రెండేళ్ళ క్రితం ఆ ఆఫీసులో జాయినైన శరత్ అనతికాలంలోనే అన్ని
నండూరి సుందరీ నాగమణి బూతు
సెక్షన్స్‌లోని వర్క్ బాగా నేర్చుకున్నాడు. ఆంగ్లభాష మీద ఉన్న పట్టుకొద్దీ నోట్ డ్రాఫ్టింగ్ చాలా బాగా చేసేవాడు. రామారావుకి కుడిభుజంగా ఉంటూ, ఎన్నో పనులు సునాయాసంగా చక్కబెట్టేవాడు శరత్. తన పనే కాక, ఆఫీసులో మిగతావాళ్ళ పనులలో కూడా సహాయంగా ఉండేవాడు. అందరితో స్నేహంగా ఉంటూ, అందరినీ నవ్విస్తూ తానెప్పుడూ నవ్వుతూ ఉందే శరత్ అంటే అందరూ ఎంతో ఇష్టపడేవారు.
ఈలోగా అతని జీవితంలో ఎన్నడూ జరగని ఓ పెనుమార్పు సంభవించింది. అవును అతడు (ప్రేమలో పడ్డాడు. ఓ రోజు ఉదయమే ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటుంటే, మేనేజర్ మాధవరావుగారి వెంట వచ్చిన హరివిల్లు వంటి అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు శరత్. లేత గులాబీరంగు పంజాబీ సూట్‌లో, అరవిరిసిన గులాబీ మొగ్గలాంటి ఆ అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తూ, “మీట్ మై నీస్, మల్లిక... యంబీయే హెచ్ ఆర్ చేస్తోంది. మన ఆఫీస్‌లో ప్రాజెక్ట్ వర్క్ కోసం చేరింది...” అని చెప్పాడాయన. ఆ అమ్మాయిని రామారావుకి అప్పజెప్పి, అన్నీ నేర్పమని తన కాబిన్‌లోకి వెళ్ళిపోయాడు మాధవరావు. శరత్‌కి తన సర్వాంగాలు పనిచేయటం మానేసి, కళ్ళు మాత్రం మల్లికకి అంటుకు పోయాయి. సర్వం మరచి, ఆమె ఎటు వెళితే అటు, ఎటు కదిలితే అటు చూడసాగాడు. ఆ రోజు రాసిన మూడు నోట్లూ తప్పుగానే రాశాడు. ఒక్క లెటర్ కూడా రీట్రైపులు లేకుండా చేయలేకపోయాడు. రామారావు ఆరు సార్లు అతన్ని పిలిస్తే ఏడోసారి అతి కష్టమ్మీద వినిపించుకొని పలికాడు. అతని ధ్యాసంతా రామారావుకి ఆ ప్రక్కన కూర్చుని, పీసీలో నోట్స్ టైప్ చేసుకుంటున్న మల్లిక మీదనే ఉంది.
మధ్యాహ్నం రామారావు శరత్‌ను పిలిచి, “ఈ అమ్మాయికి వర్క్ విషయంలో ఏవో సందేహాలున్నాయట... నన్ను బాస్ పిలుస్తున్నారు. కొంచెం గైడ్ చేస్తావా?” అని అడిగేసరికి, “సరే సార్...” అంటూ అదిరే గుండెలతో ఆమె ్రక్మనే కూర్చున్నాడు. ఆమె అడిగిన సందేహాలకు తనకి తెలిసినంత మటుకు సమాధానాలు చెప్పాడు. తెలియనివాటికి కొన్ని మాన్యువల్స్ రిఫర్ చేసి మరీ పాయింట్‌వైజ్ చెప్పాడు.
ఉశ్ర్ర్రగ్ర్ గారూ, చాలా చాలా థాంక్సండీ... మీ దయవల్ల ఇలాగే థియరీ, ప్రాక్టికల్స్ కూడా కంప్లీట్‌గా నేర్చుకుంటే, నా వ్రాజెక్ట్ వర్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది...” ఐదు గంటలకు తన బ్యాగ్ సర్పకుంటూ చెప్పింది మల్లిక. పతన అమూల్యం (కథలు)
మాటల సందర్భంలో ఆమె మాధవరావుగారి చెల్లెలి కూతురని, వాళ్ళది వైజాగ్ అని తెలిసింది. ఆమె తన గురించి అడిగినప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ ఐదేళ్ళ [క్రితం యాక్సిడెంట్‌లో చనిపోగా, అన్నావదినలతో ఉంటున్నట్టు చెప్పాడు శరత్. ఆ రాత్రంతా ఆమె గురించే ఆలోచిస్తూ, కలత నిద్రలో గడిపివేశాడు శరత్.
షు 1 ఈ
నెల రోజులు గడిచేసరికే ఇద్దరి మధ్య చనువు, స్నేహం పెంపొందాయి. నిజానికి శరత్‌కి చారవ చాలా తక్కువ. మల్లిక అతనితో చాలా చనువుగా ఉంటూ, అతని మీద జోకులేస్తూ, ఉడికిస్తూ రకరకాలుగా సతాయించేది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్‌లో (ఫైెంద్‌షిప్ మెసేజిలు, లవ్ మెసేజిలు పెట్టేది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుడ్నాణింగ్ మెసేజ్‌లు, గుడ్‌నైట్ మెసేజ్‌లు పంపించేది. అతని వంటి మంచి స్నేహితుడు మరొక్కడు ఉండదనీ, అతని రాకతో తన జీవితంలో వసంతం వచ్చిందనీ చెప్పేది. తనకి హైదరాబాదు కొత్తని, సైట్ సీయింగ్‌కి తీసుకెళ్ళి అన్నీ చూపించమని గొడవ చేసేది.
ఆమె పోరు భరించలేక, మాధవరావు శరత్‌ను పిలిచి, ప్రతి ఆదివారం ఆమెను బయటకు తీసుకువెళ్ళమని ఆదేశించాడు. ఆమె కంపెనీ తనకు చాలా ఎక్సెటింగ్‌గా ఉండటంతో ఆనందంగా అందుకు అంగీకరించాడు శరత్. బయటకు వెళ్ళినప్పుడు, బైక్ మీద కూర్చున్నప్పుడు ఆమె శరత్‌తో ఒక లవర్ లాగానే బిహేవ్ చేసేది. ఏదో ఒక నెపంతో అతన్ని తాకేది. శరత్‌కి ఇహప్రపంచంతో సంబంధం లేనేలేదు ఇప్పుడు... అనుక్షణమూ ఆమె ధ్యానమే... ఆమె తన కలల్లోకి వస్తుందన్న ఆశతో నిద్రపోయేవాడు, ఆమెని త్వరగా కలవాలన్న ధ్యాసతో నిద్ర లేచేవాడు. ఆఫీసులో తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనన్న స్పృహ సైతం లేకుండా కన్నార్పకుండా ఆమె వైపే చూస్తూ ఉండిపోయేవాడు. చనిపోయిన అమ్మానాన్నల మీద బెంగతో ఉన్న శరత్ మనసుకు మల్లిక తనపై చూపించే (పేమ, కన్సర్న్ ఎంతో సాంత్వనను కలిగించేవి. ఫలితంగా ఆమెతో ఎక్కువసేపు గదపాలని కోరుకునేవాడు. అతనికి చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేకపోవటంతో, చాలా తక్కువ సమయంలోనే ఆమెవైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు.
ఆమె తరచుగా అతనికో మెసేజ్ పంపించేది. “మల్లిక ప్రాణం ఎవరూ? శరత్తే కదా?” పదేపదే ఆ మెసేజ్‌ని చూసుకుంటూ గంటలు గంటలు ట్రాన్స్‌లో గడిపేవాడు శరత్. నండూరి సుందరీ నాగమణి లలా
“మల్లీ... ఐ లవ్ యూ సో మచ్... మల్లిక ప్రాణం శరత్తే కాని, శరత్ ఆత్మ మాత్రం మల్లికే...” పరవశంగా చెప్పాడు శరత్.
“మన పెళ్ళికి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా డియర్?” అని శరత్ అడిగితే, “ఏమో!” అన్నట్టు భుజాలు ష్రగ్ చేసింది మల్లిక.
తర్బనా అప్పుడే పెళ్ళేమిటి శరత్, నా పీజీ అయిపోవాలి కదా!”
“అఫ్ కోర్స్... ఐపోయాకే...” ఆమె ముంగురులు సవరిస్తూ చెప్పాడు శరత్.
“సరే ఇక వెళదాము. నా ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిపోయింది. వచ్చే ఆదివారం వైజాగ్ వెళుతున్నాను. ఇదంతా నీ హెల్ప్ వల్లనే సాధ్యమయింది శరత్. నీకు చాలా చాలా థాంక్స్.”
“ఛ! మనలో మనకి థాంక్సులు ఎందుకు మళ్లీ? అసలు నువ్వు వెళ్ళిపోతావని అనుకుంటేనే చాలా బాధగా ఉంది తెలుసా? నిన్ను నేను మిస్ అయిపోతాను. ఒక్క నాలుగు నెలల్లో నీ పీజీ అయిపోతుంది కదా, రిజల్డ్ రాగానే మీ నాన్నగారితో మన విషయం చెప్పు. నీకు ప్రాబ్లమైతే నేనే మీ ఇంటికొచ్చి మన విషయం మాట్లాడతాను, సరేనా?”
“సర్రే ఐనా మనం టచ్‌లోనే ఉంటాముగా"” ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తరువాత క్రమంగా తన ఫోన్ కాల్స్, మెసేజ్‌లు తగ్గించేసింది. ఎప్పుడు ఫోన్ చేసినా, “బిజీగా ఉన్నాను అని కట్ చేసేది లేదా ఆన్సర్ చేసేది కాదు. సింపుల్‌గా చెప్పాలంటే అతన్ని అవాయిడ్ చేయటం మొదలుపెల్టీ ంది.
ఒకరోజు “ఎందుకిలా చేస్తున్నావంటూ' మె సేజ్ పెట్టాడు. దానికి జవాబుగా ఆమె 'నేను ఎప్పుడూ నిన్ను (ప్రేమించలేదు. నా పని అవటం కోసం నీతో చనువుగా ఉన్నానంతే. నీతో పెళ్ళి అని కూడా నేనెప్పుడూ ఊహించలేదు. అనవసరంగా నువ్వేవో ఆశలు పెట్టుకొని ఉంటే మాత్రం నేనందుకు బాధ్యురాలిని కాదు. నాకు ఆల్రెడీ పెళ్ళి సెటిలైంది. నా వుడ్‌బీ స్టేట్స్‌లో ఉంటారు. నా మాట విని, నన్ను మర్చిపోయి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటే సుఖపదతావు శరత్” అని మెసేజ్ ఇచ్చింది.
శిలగా మారిపోయిన శరత్ కళ్ళనుంచి జలపాతాలు. “ఇదేమిటిది? పీడకలా? మల్లిక ఇంత కఠినంగా ఎందుకు ప్రవహించింది? నిజంగా ఆమె మదిలో ప్రేమ అన్నది కలగలేదా? మరి తనతో అంత సరదాగా, (డేమగా ఎలా గడపగలిగింది? శరత్ మనసులో అన్నీ ప్రశ్నలే, కాని ఒక్కదానికీ సమాధానం పంల అమూల్యం (కథలు)
లేదు. పిచ్చి పిచ్చిగా అనిపించింది. మల్లికకి తనంటే (పేమ లేనప్పుడు, తనామెని (ప్రేమిస్తున్నానని తెలిసీ కూడా ఎందుకని ప్రోత్సహించాలి? ఆనాడే చెప్పేసి ఉంటే తన (ప్రేమను మొగ్గలోనే తుంపేసుకొని ఉండేవాదేమో...తన మనసుతో ఆడుకొనే హక్కు ఆమెకి ఎవరిచ్చారు?
అనుక్షణమూ ఆమెతో గడిపిన మధురక్షణాలు, వెనువెంటనే ఆమె ఇచ్చిన కర్మశమైన మెసెజ్ గుర్తుకొస్తున్నాయి. మనశ్శాంతి పూర్తిగా కరువైంది. ఆకలి లేదు, నిద్ర రాదు... మానసికంగా నరకాన్ని అనుభవించసాగాడు శరత్.
శ శ ఈ
రెండు రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్ళాడు శరత్. కడిగిన ముత్యంలా ఉందే శరత్ సరిగ్గా ద్రెస్ చేసుకోకుండా, రేగిపోయిన క్రాఫ్‌తో పిచ్చివాలకం పడిపోయి ఉన్నాడు. అతన్ని చూస్తుంటే రామారావుకు కడుపు తరుక్కు వోయినట్టెంది. “ఏమ్సిట్రి శరత్, ఇలా అయిపోయావు?” అతని భుజం మీద చేయి వేసి లాలనగా అడిగాడు.
ఆయన చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు శరత్. అతన్ని లంచ్ రూములోకి తీసుకెళ్ళి, సముదాయిస్తూ మంచినీళ్ళు తాగించాడు రామారావు.
“రిలాక్స్ శరత్. ఈ కాలంలో యువత ఇలాగే ఉన్నారు. అవసరానికి (ప్రేమలు నటించటం, అమాయకులను వాడుకొని వదిలివేయటం ఎక్కువై పోయింది. సిన్సియర్ (ప్రేమలకు విలువంటూ లేకుండా అయిపోయింది. ఏదో, అలలాగ నీ జీవితంలోకి వచ్చింది, మళ్ళీ అలలాగే వెళ్ళిపోయింది. మల్లికకి పెళ్ళి కూడా కుదిరిపోయిందట. నిన్న మాధవరావుగారు చెబుతుంటే విన్నాను. ఇక మీదట ఆమెను నీవు పూర్తిగా మరచిపోవాలి, తప్పదు. చూడు శరత్, నిన్న మీ అన్నయ్య ఫోన్ చేసి ఒకటే వాపోయాడు. తిండి తినటం లేదట, ఎవ్వరితోనూ మాట్లాడవట... ఆఖరికి నువ్వెంతో ప్రాణప్రదంగా చూసుకొనే మీ అన్నయ్య కూతురు డదాలీని కూడా దగ్గరకు రానివ్వటం లేదుట... ఇదెంతవరకూ కరెక్ట్ చెప్పు!”
ఆయన మాటలకు ఏ జవాబు ఇవ్వకుండా తల వంచుకున్నాడు శరత్.
కట్చి అమ్మానాన్నలు ట్రెయిన్ ప్రమాదంలో చనిపోయి అయిదేళ్ళయింది కదా... చాలా బెంగగా ఉంటుంది కదూ నీకు... కాని వాళ్ళని తలుచుకుని రోజంతా బాధపడుతూనే ఉన్నావా? లేదు కదా! కొత్తలో చాలా చాలా బాధ నండూరి సుందరీ నాగమణి లాలా
కలుగుతుంది. మనమూ చనిపోవాలన్నంత దుఃఖం కలుగుతుంది. క్రమంగా అదంతా తగ్గుముఖం పట్టి, వాళ్ళు లేకుండా జీవించగలగటం అలవాటు అవుతుంది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా మల్లిక, ఆమె చేసిన గాయం ఎక్కువా? కాదు కదా! మల్లిక కాకపోతే మరొక గులాబీ పువ్వు దొరుకుతుంది. రిలాక్స్ నాన్నా అందులోంచి బయటకు వచ్చేయాలి నువ్వు..” మృదువుగా చెబుతూ, బుజ్జగిస్తున్న రామారావుగారి మాటలను (శ్రద్ధగా వినసాగాడు శరత్,
“ఆఫీసు పనుల్లో ఎంత దల్ ఐపోయావో తెలుసా నువ్వు? నేనున్నాను కనుక నిన్ను కవర్ చేసుకొన్నాను. మన మాధవరావుగారికి కూడా ట్రాన్స్‌ఫర్ వచ్చేస్తుంది. మళ్ళీ మేనేజరుగా ఎవరొస్తారో ఏమో... పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టం? కష్టపడి నీ మెరిట్‌తో సంపాదించుకున్న నీ ఉద్యోగాన్ని నిలుపుకోవటమనేది నీ చేతుల్లోనే ఉంది శరత్. పెద్దవాడిని చెబుతున్నాను, వివేకంతో ఆలోచించు. ఆఫ్టరాల్, మల్లికతో నీ స్నేహం వయసెంతని? కేవలం మూడే నెలలు. టైమ్ పాస్ కోసం, అవసరం కోసం నీ మనసుతో ఆటలాడుకొని వదిలేసిన అమ్మాయి కోసం, నీవాళ్ళను, వారి ్రేమను లక్ష్యపెట్టకుండా, ఇలా కూరుకుపోవటం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. కాలమనే వైద్యుడు ఎంతటి గాయాన్నయినా నయం చేస్తాడు. ఈ ఊబిలోంచి బయటకు రావటానికి నీ వంతుగా నువ్వు కృషి చేయాలి కదా, ఆలోచించు.”
“అవును సర్, ప్రయత్నిస్తాను...” మెల్లగా అన్నాడు శరత్,
ఇది జరిగి ఆరునెలలైనా శరత్ మామూలు మనిషి కాలేకపోయాడు. మల్లిక
. అతని మనసుపై వేసిన వేటు చాలా బలంగా తాకటంతో క్రుంగిపోయిన అతన్ని
సాంత్వనపరచి మామూలుగా చేయటానికి అతని కుటుంబ సభ్యులతో పాటుగా రామారావుగారు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు.
ఉర్చాబ్రాయ్, అమ్మ అన్నం తినటానికి రమ్మంటోంది...” నాలుగేళ్ళ డాలీ ముద్దు మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు శరత్.
శ శ
“చాలా థాంక్స్ అండీ... మీ దయవల్ల మీ పక్కనే మంచి ఇల్లు అమరింది నాకు. ఆఫీసుకు కూడా బాగా దగ్గర...” శాంతి ఇచ్చిన కాఫీ తాగుతూ అన్నాడు శ్రీహర్ష
“మ్వీరేమీ అనుకోకపోతే మా శరత్‌ను కాస్త చూసుకోవాలండీ... జరిగిన పతనం అమూల్యం (కథలు,
కథంతా చెప్పాను కదా, మానసికంగా బాగా దెబ్బ తిని ఉన్నాడు. ఇలా అడక్కూడదని తెలుసు కానీ...” మొహమాటంగా ఆగాడు శరత్ అన్నయ్య ప్రశాంత్.
“శ్రరత్ర్ మంచి పెర్‌ఫార్మర్... అతని సంగతి నేను చూసుకుంటాగా, మీరేం వర్రీ అవద్దు. అతని లాంటి జెమ్‌ని ఏ సంస్థా వదులుకోదు. ఇక అతని బాధనుండి పైకి లాగి మామూలు మనిషిగా మార్చే పూచీ నాది...”
“మరి మీరు మీ కొత్తింట్లో ఎప్పుడు దిగుతారు? మీ ఫ్యామిలీని ఎప్పుడు తీసుకొస్తారు?” అడిగింది శాంతి.
“నాకింకా పెళ్ళి కాలేదు అక్కయ్యగారు... చెల్లీ నేను ఉంటాము. చెల్లిని బాంబేలో మా పిన్నిగారింట్లో ఉంచి, నేనిక్కడ ఆఫీసులో జాయినవటానికి వచ్చాను. అమ్మానాన్నలు మా చిన్నప్పుడే చనిపోతే, మమ్మల్ని మా పిన్నీ బాబాయిలే పెంచారు. చిన్నప్పుడు మా చెల్లెలికి ఓ దీపావళినాడు టపాసులు కాలుస్తుంటే జరిగిన ఓ ప్రమాదంలో ఒక కన్ను పోయింది. అంచేత దానికి పెళ్ళి అయేంతవరకూ నేను ' పెళ్ళి చేసుకోదలచుకోలేదు.”
“అయ్యో... అలాగా?” బాధపడ్డారు (ప్రశాంత్, శాంతిలు.
“ఇట్సాల్ రైట్. చూసేవారికి ఆ లోపం తెలియదు లెండి. తనకే... కుడివైపు దృష్టి లోపం ఉంది కనుక చూసేందుకు బాగా ఇబ్బంది పడుతుంది. కాని ఆ బాధ ఎవ్వరితోనూ చెప్పదు. బాగా చదువుకుంది, సంగీతం కూడా నేర్చుకుంది. చాలా బాగా పాడుతుంది. నా చెల్లెలిని చెప్పటం కాదు కాని సకల సద్దుణ సంపన్నురాలు తను. రేపు ఆదివారం మా పిన్ని చెల్లి కలిసి వస్తారు. ఆ రోజే ఇంట్లో దిగిపోతాను... ఆ, ఇక బయలుదేరతాను... ఏడీ శరత్?”
“లోపలున్నట్టున్నాడు, శాంతీ, వాజి పిలు...” ఇబ్బందిగా కదులుతూ చెప్పాడు ప్రశాంత్.
కర్చే, ఫర్వాలేదు... మీరు చెప్పండి, మరి నే వసాను...” అంటూ లేచాడు శ్రీహర్ష
శు శ ౫
వారం దినాలు ఇట్టే గడిచిపోయాయి. నిత్యను దిగబెట్టి, కొత్త ఇంట్లో సామాన్లు సర్దేసి తిరిగి బాంబే వెళ్ళిపోయింది శ్రీహర్న పిన్ని వర్ధని.
తీర్చిదిద్దిన రూపురేఖలతో, కలువల వంటి కన్నులతో, పచ్చని పసుపుకొమ్ము నండూరి సుందరీ నాగమణి
మేని చాయతో, సన్నజాజి మొగ్గలాంటి నిత్య చూపరుల మనసులను ఇట్టె ఆకట్టుకుంటుంది. గాజుకన్ను ఉండటం వలన అది మామూలు కన్నులాగానే సహజంగా ఉంటుంది. చెబితే తప్పు ఆ కన్నుకు దృష్టిలోపం ఉన్నట్టు తెలియదు.
శరత్ వదిన శాంతి, నిత్య బాగా క్లోజ్ ఫెండ్స్ అయిపోయారు. ఉదయం వంట చేసేసి, శ్రీహర్న భోజనం కానిచ్చి ఆఫీసుకు వెళ్ళిపోగానే, నిత్య శాంతి ఇంటికి వెళ్ళిపోయి, డాలీతో ఆదుకొనేది. ఇద్దరికీ శాస్ర్తీయ లలిత సంగీతాలలో మంచి అభిరుచి ఉండటం వలన గంటలు గంటలు పాటలతో, సంగీత రాగాల గురించిన చర్చలతో సమయం గడచిపోయేది. నిత్యకి మంచి కంపెనీ లభించటం వలన ఎంతో హాయిగా ఉంది. ప్రశాంత్, శాంతి ఎంతో సంన్మారవంతులు కనుక, నిత్యకున్న లోపాన్ని గురించిన ప్రసక్తి తెచ్చేవారు కాదు.
ఇక ఆదివారాలైతే, రెండు కుటుంబాల వారు కూడా ఎంతో హాయిగా కలిసి గడిపేవారు. శ్రీహర్ష కూడా వారితో బాగా కలిసిపోవటం వలన హోదాలు కాని, అంతస్తులు కాని వారి స్నేహానికి ఎంతమాత్రమూ ఆటంకం కాలేదు.
ఆఫీసులో శ్రీహర్ష శరత్‌కు తన పి.ఏ. హోదా కల్పించటమే కాక, ఆఫీసు హాల్లోంచి అతని సీటుని తన కేబిన్‌కి మార్పించేశాడు. ఆఫీసులో ఏ సెక్షన్‌కి సంబంధించిన పనైనా సరే, దానిలో తప్పకుండా శరత్‌ని ఇన్వాల్వ్ చేసేవాడు. ఊపిరి తిరగని పనులు కల్పించేవాడు. అతన్ని తనతో పాటుగా బయట తిప్పేవాడు. క్లయింట్స్‌తో డీల్ చేసేటప్పుడు కూడా శరత్‌ని తనతో తీసుకుపోయేవాడు. ఫలితంగా శరత్ ఒంటరిగా ఉండటమనెది దాదాపుగా తగ్గిపోయింది. ముమ్మరమైన ఆఫీసు పనులతో బిజీ అయిపోవటం వలన, విరామం లేకుండా మస్తిష్కం వాటితో నిండిపోవటం వలన మల్లికపై ధ్యాస చాలా వరకూ తగ్గిపోయింది. అదీగాక, తన కోసం ఎంతగానో ఆరాటపడుతున్న అన్నావదినలను, తోబుట్టువులాంటి రామారావును చూస్తుంటే తాను ఆ బాధలోంచి బయటపడాలన్న కోరిక తీవ్రతరమై, పూర్తిగా మనసును పనిమీద లగ్నం చేయసాగాడు.
ఇంటిదగ్గర కూడా రాత్రి భోజనాలయ్యాక, శ్రీహర్ష శరత్‌ను తనింటికి రమ్మని పిలిచి, ఏదొక ప్రపోజల్ గురించో, ఫైల్ గురించో, రికవరీస్ గురించో చర్చించేవాడు. అందువలన కూడా శరత్‌కు బాధపడే టైమ్ అస్సలు ఉండటమే లేదు. ఇప్పుడు పూర్తిగా ఆఫీస్ వర్క్‌ని ప్రేమించటం నేర్చుకున్నాడు. ఒక్క నెల రోజులలోనే ఎంతగానో మారిన తమ్ముడిని చూసి, ప్రశాంత్ ఎంతో హాయిగా నిట్టూర్చాడు. ఎన్నోసార్లు శ్రీహర్షకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. పతా అమూల్యం (కథలు)
ఆఫీసులో రామారావు ఆనందానికైతే అవధులే లేవు. శ్రీహర్షను ఎన్నోసార్లు ఆకాశానికెత్తేశాడు. ఇక శ్రీహర్ష ఆగమనంతో ఆఫీసులో పనిదొంగల ఆగడాలకు కళ్ళెం పడింది. ఇప్పుడందరూ వారి వారి పని పెండింగ్‌లో ఉంచకుండా చకచకా చేసుకుపోతున్నారు. ఫలితంగా వాళ్ళ బ్రాంచ్ ఆ క్వార్టర్ ఎండింగ్‌కి సదరన్ రీజియన్‌లో 'ది బెస్ట్ బ్రాంచి” అవాద్ది అయింది.
శు శు *
ఆ విషయం మెయిల్‌లో రాగానే ఆఫీసులో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. శ్రీహర్న ఆ సాయంత్రం తన స్టాఫ్ అందరికీ హోటల్‌లో విందు ఏర్పాటు చేశాడు. పార్టీకి తనతో పాటుగా నిత్యను కూడా తీసుకువచ్చాడు.
శరత్ చాలా రోజుల తర్వాత (శ్రద్ధగా తయారయ్యాడు. తనకిష్టమైన ్రెస్ వేసుకుని, ఇష్టమైన పెర్‌ఫ్యూం (స్పే చేసుకొని, ఎంతో ఉత్సాహంతో పార్టీకి రెడీ అయాదు. అతని హుషారు చూసి, ప్రశాంత్, శాంతి ఎంతో సంతోషంగా ఫీలయ్యారు.
శ్రీహర్హు నిత్య అతిథుల కోసమై నిరీక్షిస్తున్నారు. తెల్లని పంజాబీ డ్రెస్‌లో, ముత్యాల ఆభరణాలు ధరించిన నిత్య, నిలువెల్లా విరబూసిన మళ్లెతీగలా ఉంది. నవ్వు ముఖంతో అందరినీ రిసీవ్ చేసుకుంటున్న నిత్య, లోపలికి ప్రవేశిస్తున్న శరత్‌ను చూడగానే అలాగే అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది. శరత్ ఆమెకి కొత్తేం కాదు. శాంతి కోసం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, అతను తమ ఇంటికి వచ్చినప్పుడు రోజూ చూస్తూనే, మాట్లాడుతూనే ఉంది. కాని అప్పట్లో లేని కొత్త కాంతి, ఆత్మవిశ్వాసము, సంతోషంతో కూడిన వదనం ఆమెకి అతనిలో కొత్తగా కనిపించాయి. దానికి తోడు, అతను వేసుకున్న కోరా రంగు షేర్వాణీ అతనికి ఎంతో అందంగా అమరి, రాజసం ఉట్టిపడుతున్న రాకుమారుడిలా అనిపించాడు.
శరత్ నేరుగా శ్రీహర్ష దగ్గరగా వెళ్ళి తన చేతిలోని గులాబీల పుష్పగుచ్చాన్ని అతనికి అందించి, “హార్టీ కంగ్రాట్స్ సర్...” అని నవ్వుతూ... నిత్యవైపు తిరిగి “హలో నిత్యా!” అంటూ పలకరించాడు. రామారావు ఎంతో సంతోషంగా శరత్ వైపే చూస్తూ ఉండిపోయాడు.
శ్రీహర్ష అందరినీ ఉద్దేశించి, “నేను మీ దగ్గరకు వచ్చి కేవలం మూడు నెలలే అయినా, ఒకే కుటుంబ సభ్యులుగా మనం కలిసిపోయాము. సమిష్టిగా కలిసి సాధించనిదంటూ ఏమీ లేదని నా స్టాఫ్ మెంబర్స్ అయిన మీరంతా నండూరి సుందరీ నాగమణి లాలా
బుజువు చేశారు. ఈ విజయం మనందరిదీ... పని విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి, మీ మనసులను నొప్పించి ఉంటే నేను క్షంతవ్వ్యుడిని. కాని, ఏ ఒక్క విషయమూ వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణమూ మనసంస్థ కోసం పాటుపడ్డారు. కనుకనే ఇంత ఆనందంగా ఈ వేళ మనం ఇలా పండుగ చేసుకుంటున్నాము. నా కెరీర్‌లోనే ఎంతో మధురమైన క్షణాలివి. మీరందరూ ఇలాగే అంకితభావంతో పనిచేసి, మన సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను” అన్నాడు.
రామారావు మాట్లాడుతూ, “శ్రీహర్ష్నగారు, వయసులో చిన్నవారే అయినా, కార్యనిర్వహణలో చాలా పెద్దవారు. మనందర్నీ ఒకే తాటిపై నడిపించి, పని చేయించారు. ఆయన మనలో కలిగించిన ఇన్సిరేషన్‌కి నిజంగా హాట్స్ ఆఫ్. ఊపిరి తిప్పుకోనీయకుండా తరిమి వేస్తూంటే నిజం చెప్పద్దూ, అందరితో పాటుగా ఆయన్ను నేనూ తిట్టుకున్నాను. నిజానికి మనకన్నా ఆయనే ఎక్కువ కష్టపడ్డారు. ఏ రోజూ రాత్రి నాలుగైదు గంటలకన్నా నిద్రపోయేవారు కాదు. ఉదయం నేను ఆఫీసుకు వచ్చేసరికి ఆయన తన సీట్‌లో ఉండేవారు. ప్రతీ పని, ఏ రోజుకారోజు అప్‌డేట్ చేసేవరకూ ఊరుకునేవారు కాదు. కరస్వాందెన్స్, హౌస్ కీపింగ్ అన్నీ దగ్గరుండి చేయిస్తారు. ఇలాంటి బాస్ మనకి ఉండాలి...” అలసటగా ఓ నిమిషమాగి మళ్ళీ కొనసాగించాడు.
“శ్రీహర్షగ్లారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అందులో కార్యదీక్ష సమయపాలన, నాయకత్వం, మనకి తెలియనివి బోధించే గురుధర్మం మొదలైనవెన్నో... ఈ విజయం మాత్రం పూర్తిగా ఆయనదే... వారి నేతృత్వంలో పనిచేసే అదృష్టం మనకి దక్కిన ఈ నేపథ్యంలో, ఇలాగే కష్టపడుతూ, విజయపథం వైపు మన సంస్థను ముందుకు నడిపిద్దాము.. అలా అని అందరమూ మన మనసుల్లోనే శపథం చేసుకుందాము...”
శరత్ మాత్రం క్లుప్తంగా రెండే మాటలు మాట్లాడాడు. “శ్రీహర్షగారు మన సంస్థకే కాదు, నాకూ ఊపిరిని పోసిన దేవుడు...” అతని స్వరంలో కృతజ్ఞతతో పాటుగా అంతులేని భక్తి గౌరవాలు... ఇంకో ఇద్దరు ముగ్గురు మాట్లాడాక, వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి. మిమిక్రీ, పొటలు, జోక్స్, నవ్వులతో ఆ మినీ హాలు దద్దరిల్లిపోయింది.
అందరి కోరిక మేరా, నిత్య కూడా దేవులపల్లివారి 'అలికిడైతే చాలు, ఆశతో నా కనులు...” అనే లలితగీతం వీనుల విందుగా పాడింది. తరువాత భోజనాలు
లతా అమూల్యం (కథలు)
బుజువు చేశారు. ఈ విజయం మనందరిదీ... పని విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి, మీ మనసులను నొప్పించి ఉంటే నేను క్షంతవ్వ్యుడిని. కాని, ఏ ఒక్క విషయమూ వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణమూ మనసంస్థ కోసం పాటుపడ్డారు. కనుకనే ఇంత ఆనందంగా ఈ వేళ మనం ఇలా పండుగ చేసుకుంటున్నాము. నా కెరీర్‌లోనే ఎంతో మధురమైన క్షణాలివి. మీరందరూ ఇలాగే అంకితభావంతో పనిచేసి, మన సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను” అన్నాడు.
రామారావు మాట్లాడుతూ, “శ్రీహర్ష్నగారు, వయసులో చిన్నవారే అయినా, కార్యనిర్వహణలో చాలా పెద్దవారు. మనందర్నీ ఒకే తాటిపై నడిపించి, పని చేయించారు. ఆయన మనలో కలిగించిన ఇన్సిరేషన్‌కి నిజంగా హాట్స్ ఆఫ్. ఊపిరి తిప్పుకోనీయకుండా తరిమి వేస్తూంటే నిజం చెప్పద్దూ, అందరితో పాటుగా ఆయన్ను నేనూ తిట్టుకున్నాను. నిజానికి మనకన్నా ఆయనే ఎక్కువ కష్టపడ్డారు. ఏ రోజూ రాత్రి నాలుగైదు గంటలకన్నా నిద్రపోయేవారు కాదు. ఉదయం నేను ఆఫీసుకు వచ్చేసరికి ఆయన తన సీట్‌లో ఉండేవారు. ప్రతీ పని, ఏ రోజుకారోజు అప్‌డేట్ చేసేవరకూ ఊరుకునేవారు కాదు. కరస్వాందెన్స్, హౌస్ కీపింగ్ అన్నీ దగ్గరుండి చేయిస్తారు. ఇలాంటి బాస్ మనకి ఉండాలి...” అలసటగా ఓ నిమిషమాగి మళ్ళీ కొనసాగించాడు.
“శ్రీహర్షగ్లారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అందులో కార్యదీక్ష సమయపాలన, నాయకత్వం, మనకి తెలియనివి బోధించే గురుధర్మం మొదలైనవెన్నో... ఈ విజయం మాత్రం పూర్తిగా ఆయనదే... వారి నేతృత్వంలో పనిచేసే అదృష్టం మనకి దక్కిన ఈ నేపథ్యంలో, ఇలాగే కష్టపడుతూ, విజయపథం వైపు మన సంస్థను ముందుకు నడిపిద్దాము.. అలా అని అందరమూ మన మనసుల్లోనే శపథం చేసుకుందాము...”
శరత్ మాత్రం క్లుప్తంగా రెండే మాటలు మాట్లాడాడు. “శ్రీహర్షగారు మన సంస్థకే కాదు, నాకూ ఊపిరిని పోసిన దేవుడు...” అతని స్వరంలో కృతజ్ఞతతో పాటుగా అంతులేని భక్తి గౌరవాలు... ఇంకో ఇద్దరు ముగ్గురు మాట్లాడాక, వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి. మిమిక్రీ, పొటలు, జోక్స్, నవ్వులతో ఆ మినీ హాలు దద్దరిల్లిపోయింది.
అందరి కోరిక మేరా, నిత్య కూడా దేవులపల్లివారి 'అలికిడైతే చాలు, ఆశతో నా కనులు...” అనే లలితగీతం వీనుల విందుగా పాడింది. తరువాత భోజనాలు
లతా అమూల్యం (కథలు)
మొదలయ్యాయి. బఫే విందు కావటం వలన భోజనం పూర్తయ్యే లోపుగా నిత్యకు రెండు, మూడు సార్లు చేరువగా వచ్చాడు శరత్.
కొద్దిసేపు మొహమాటపడినా, చివరికి “మీ పాట చాలా బాగుంది, ఆ పాటంటే నాకు చిన్నతనం నుండీ చాలా ఇష్టం...” అన్నాడు శరత్.
“ధాంక్‌యు... మీ వదినగారు చాలా బాగా పాడతారు...”
“అఫ్‌కోర్స్... కాని వదినకి లైట్ క్లాసికల్స్, ఫిల్మ్ సాంగ్స్ కన్నా క్లాసికల్స్ ఇష్టం... మొన్న మీరు వదిన దగ్గర పాడిన 'మౌనంగానే ఎదగమనీ...” పాట కూడా చాలా బాగా వాడారు”
“థాంక్స్ ఎ లాట్... ఆ పాటతో ఎందరికో ఇన్సిరేషనిచ్చారు చంద్రబోసు గారు...” చెప్పింది నిత్య.
డిన్నర్ పూర్తికాగానే శ్రీహర్ష శరత్‌ని పిలిచి నిత్యని ఇంటికి తీసుకువెళ్ళమనీ, తనకు ఇంకా కొంచెం పనుందనీ చెప్పాడు. నిత్య ఇంటి దగ్గర దిగి, గేటు తెరచుకొని లోపలికి వెళుతుంటే, “మా ఇంటికొస్తారా పోనీ, మీ అన్నయ్యగారు రావటం లేటౌతుంది కదా!” అన్నాడు శరత్.
“నో థాంక్యూ అండీ... గుడ్‌నైట్...”
ఇంటికెళ్ళి పార్టీ విశేషాలన్నీ అన్నావదినలకు పూసగుచ్చినట్టు చెప్పాడు శరత్. అతనలా సంతోషంగా ఉందటం చూసి ఆ దంపతులు ఎంతో సంతోషపడ్డారు.
శరత్, నిత్యలకు ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు... ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ, ఎప్పటికో కళ్ళు మూసుకున్నారు.
శ 4 ఈ
ఆదివారం నాడు, శరత్ నిద్ర లేచేసరికి, వంటింట్లో దోసెలు వేస్తున్నాడు (ప్రశాంత్.
“అదేమిటన్నయ్యా, వదినేదీ?” అని అడిగాడు శరత్.
“నిత్యను చూసుకోవటానికి పెళ్ళివారొస్తుంటే వాళ్ళ పిన్నిగారు రమ్మన్నారని సాయం వెళ్ళింది. త్వరగా బ్రష్ చేసుకురా... టిఫిన్ తిందు గాని...”
శరత్‌కి నీరసం వచ్చేసింది. అయితే నిత్యను ఎగరేసుకుపోవటానికి రాజకుమారుడు వచ్చేశాడన్నమాట... నీరసంగా బాత్‌రూమ్‌లోకి నడిచాడు.
నండూరి సుందరీ నాగమణి లాాలాలాాలాలాాా లు
తానెవర్షి ఇష్టపడితే వాళ్ళు దూరం అయిపోతారా? నిత్యంటే చాలా ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి తనలో. అది (ప్రేమో కాదో తెలియదు కాని, శ్రీహర్షను అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు. ఇక ఇప్పుడు అడిగినా లాభం లేదు.
“ఆ అబ్బాయి పూనా ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట. చాలా బాగుంటాడట... ఎమైనా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలురా... అన్నీ కుదిరిపోయి, ఇది సెట్ అయితే బాగుండును...” అన్నయ్య మాటలకు తింటున్న దోసె చేదుగా అనిపించింది శరత్‌కి.
మరో రెండు గంటల తర్వాత ధుమధుమలాడుతూ ఇంటికొచ్చింది శాంతి.
5భ్ఫీ ఛీ... కొంచెం కూడా బుద్ధి లేదు, చదువుంటే చాలా?”
“ఓ... అశాంతీ... ప్లీజ్... కొంచెం శాంతి! ఎవరి గురించోయ్ నీ స్వగతాలు? అడిగాడు ప్రశాంత్.
“ఇంకెవరికీ, ఆ పూనా పిల్లాడికి... అతని పెద్దవాళ్ళు నిత్యకున్న లోపం గురించి అతనికి చెప్పలేదల్లే ఉంది. పెళ్ళచూపులకు వచ్చిన తర్వాత ముళ్ళమిద
ః కూర్చున్నట్టై కూర్చుని, శ్రీహర్వను పక్కకి పిలిచి సారీ చెప్పేసి వెళ్ళిపోయాడు... అమ్మాయి నచ్చలేదన్న సంగతి తర్వాతైనా చెప్పవచ్చు కదా, ఉన్నంతసేపూ కొంచెం (ఫెండ్లీగా ఉండొచ్చు కదా... పాపం నిత్య ఎంత హర్ట్ అయి ఉంటుంది? ఐనా, నిత్యను చేసుకోవటానికి పెళ్ళీ పుట్టాల్లెండి... అతనికా అదృష్టం లేదు మరి!” శరత్ మనసు గంతులు వేసింది ఆనందంతో... గబగబా గదిలోంచి బయటకు వచ్చి, “చాలా థాంక్స్ వదినా, మంచి వార్త చెప్పావు...” అన్నాడు ఆమె చేతులు ఊపివేస్తూ...
“అయితే నువ్వు నిత్యను ఇష్టపడుతున్నావా?” షాక్ అయిన భార్యాభర్తలిద్దరూ ఒకేమారు అడిగారు.
“అవునన్నయ్యా, ఆ విషయం ఈ రోజే నాకూ అర్ధమైంది. కానీ శ్రీహర్షగారు ఒప్పుకుంటారంటావా? నిత్య నన్ను యాక్సెప్ట్ చేస్తుందా?”
“నిత్య సంగతి అలా ఉంచు... అసలు నువ్వు మాత్రం ఆమె గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శరత్. తనకు కుడివైపు కనిపించదు. అటువైపు చూడాలంటే అమ్మాయి పూర్తిగా అటు తిరిగితే కాని సాధ్యం కాదు. ఎంతో సామరస్యంతో అర్ధం చేసుకొని సహకరిస్తే తప్ప, ఇద్దరూ ఆనందంగా గడపలేరు. తన మనసు చాలా సున్నితం. అది ఎన్నడూ నొచ్చుకోకుండా
ట్రా అమూల్యం (కథలు)
తానెవర్షి ఇష్టపడితే వాళ్ళు దూరం అయిపోతారా? నిత్యంటే చాలా ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి తనలో. అది (ప్రేమో కాదో తెలియదు కాని, శ్రీహర్షను అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు. ఇక ఇప్పుడు అడిగినా లాభం లేదు.
“ఆ అబ్బాయి పూనా ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట. చాలా బాగుంటాడట... ఎమైనా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలురా... అన్నీ కుదిరిపోయి, ఇది సెట్ అయితే బాగుండును...” అన్నయ్య మాటలకు తింటున్న దోసె చేదుగా అనిపించింది శరత్‌కి.
మరో రెండు గంటల తర్వాత ధుమధుమలాడుతూ ఇంటికొచ్చింది శాంతి.
5భ్ఫీ ఛీ... కొంచెం కూడా బుద్ధి లేదు, చదువుంటే చాలా?”
“ఓ... అశాంతీ... ప్లీజ్... కొంచెం శాంతి! ఎవరి గురించోయ్ నీ స్వగతాలు? అడిగాడు ప్రశాంత్.
“ఇంకెవరికీ, ఆ పూనా పిల్లాడికి... అతని పెద్దవాళ్ళు నిత్యకున్న లోపం గురించి అతనికి చెప్పలేదల్లే ఉంది. పెళ్ళచూపులకు వచ్చిన తర్వాత ముళ్ళమిద కూర్చున్నట్టై కూర్చుని, శ్రీహర్నను పక్కకి పిలిచి సారీ చెప్పేసి వెళ్ళిపోయాడు... అమ్మాయి నచ్చలేదన్న సంగతి తర్వాతైనా చెప్పవచ్చు కదా, ఉన్నంతసేపూ కొంచెం (ఫెండ్లీగా ఉండొచ్చు కదా... పాపం నిత్య ఎంత హర్ట్ అయి ఉంటుంది? ఐనా, నిత్యను చేసుకోవటానికి పెళ్ళీ పుట్టాల్లెండి... అతనికా అదృష్టం లేదు మరి!”
శరత్ మనసు గంతులు వేసింది ఆనందంతో... గబగబా గదిలోంచి బయటకు వచ్చి, “చాలా థాంక్స్ వదినా, మంచి వార్త చెప్పావు...” అన్నాడు ఆమె చేతులు ఊపివేస్తూ...
“అయితే నువ్వు నిత్యను ఇష్టపడుతున్నావా?” షాక్ అయిన భార్యాభర్తలిద్దరూ ఒకేమారు అడిగారు.
“అవునన్నయ్యా, ఆ విషయం ఈ రోజే నాకూ అర్ధమైంది. కానీ శ్రీహర్షగారు ఒప్పుకుంటారంటావా? నిత్య నన్ను యాక్సెప్ట్ చేస్తుందా?”
“నిత్య సంగతి అలా ఉంచు... అసలు నువ్వు మాత్రం ఆమె గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శరత్. తనకు కుడివైపు కనిపించదు. అటువైపు చూడాలంటే అమ్మాయి పూర్తిగా అటు తిరిగితే కాని సాధ్యం కాదు. ఎంతో సామరస్యంతో అర్ధం చేసుకొని సహకరిస్తే తప్ప, ఇద్దరూ ఆనందంగా గడపలేరు. తన మనసు చాలా సున్నితం. అది ఎన్నడూ నొచ్చుకోకుండా
ట్రా అమూల్యం (కథలు)
చూసుకోవాలి. జీవితాంతమూ ఆమెను సంతోషంగా ఉంచగలగాలి. ఆ పాజిటివ్ దృక్పథం కనుక నీకుందని అనిపిస్తే చెప్పు, మీ అన్నయ్యతో కలిసి వెళ్ళి హర్షతో నేను మాట్లాడుతాను” చెప్పింది శాంతి.
“ఆమె ఒప్పుకోవాలే కాని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా వదినా... అసలు తనలోపం నా దృష్టిలో ఓ లోపమే కాదు. నన్ను చేసుకున్నందుకు ఆమె జీవితంలో బాధపడే రోజు రానే రాదు. నన్ను నమ్మండి...”
“ఓహో, అయితే ఇంకేం, పద శాంతీ, వెళ్ళి మాట్లాదేసి వద్దాము. నిత్య ఇక నిన్ను నిత్యమూ “అక్కా అనే పిలుస్తుందిలే....” నవ్వాడు ప్రశాంత్.
శ శ 2&
హోటల్ మధువని... చల్లని ఆ సాయం సంధ్యవేళ... పచ్చని లాన్స్‌లో అప్పుడే వెలిగిన దీపాలు తమ కాంతులను అందరికి కనువిందు చేస్తూ వెలుగు తున్నాయి. సన్నని వేణునాదం అక్కడ మంద్రస్థాయిలో వినిపిస్తూ ఆహూతులను అలరిసోంది.
పూలతో అలంకరించిన వేదిక మీద నవ వధూవరులు ఆసీనులై ఉన్నారు. నిత్య, శరత్‌ల రిసెప్షన్ జరుగుతోంది అక్కడ. మూడు రోజుల క్రితం అన్నవరం కొండమీద ఇద్దరి వివాహం శుభప్రదంగా జరిగిపోయింది.
శ్రీహర్న ముఖం వేయి చంద్రుళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయినంత కాంతితో ధగధగా వెలిగిపోతోంది. అతని పిన్ని మనసులో ఎంతో ఆనందం. ప్రక్కప్రక్మనే కూర్చున్న నిత్య, శరత్‌ల ముఖాలు జంట చంద్రబింబాలైనాయి. నిత్య ముఖంలో నునుసిగ్గుతో కూడిన చిరునవ్వులు... ఆమె చేతిని అపురూపంగా పట్టుకున్న శరత్ మధ్య మధ్యలో మెల్లగా ఆమె చెవిలో ఏదో చెబుతుంటే, గులాబీ రంగులోని ఆమె బుగ్గలు లేత ఎరుపును సంతరించుకొంటూ, వింత సౌందర్యంతో ఆమె ముఖం మెరిసిపోతోంది.
పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అంతా తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చారు. తమకెంతో ఇప్పుడైన శరత్, తమకి ఇంకా ఇష్టుదైన బాస్ శ్రీహర్న యొక్క చెల్లెల్ని చేపట్టటం అందరికీ ఎంతో సంతోష, సంరంభాలను కలిగించింది. ఇక రామారావు ఆనందానికైతే అవధులు లేవు. వధూవరుల మీద సతీసమేతంగా అక్షింతలు చల్లుతూ, శ్రీహర్నతో మంచిముత్యం వంటి బావ దొరికాడు సర్ మీకు...” అన్నాడు.
నండూరి సుందరీ నాగమణి తా
“రామారావుగారు, మా శరత్ మంచిముత్యమని మీరంటున్నారు కాని, మంచు బిందువు నేలపై పడితే వెంటనే ఇంకిపోయి మట్టిలో కలిసిపోతుంది. నదిలో పడితే అందులో ఓ భాగమైపోతుంది. ముత్యపు చిప్పలో పడితేనే అది ముత్యమై, ఒక విలువను, మెరుపును సంతరించుకొని పదికాలాల పాటు అలరారుతుంది. మామూలు నీటిచుక్కను సైతం మంచిముత్యంగా మలచిన ముత్యపుచిప్ప, ఇదిగో... మా శ్రీహర్ష బావగారు... మా తమ్ముడిని మంచిముత్యాన్ని చేసిన ఘనత ఆయనదే...” చెప్పాడు ఉద్విగ్నతతో ప్రశాంత్.
“అబ్బే, నాదేమీ లేదు. అంతా మా నిత్య అదృష్టమే... తన హృదయాన్ని గెలిచిన, తనను ప్రాణప్రదంగా చూసుకొనే మంచి మనసున్న వరుడు, మా శరత్... ఆమెను స్వంత చెల్లెలిగా ఆదరించే శాంతి అక్కయ్య, వాత్సల్యానికి ప్రతిరూపమైన ప్రశాంత్ బావగారు... వారి ఇంట్లో కోడలిగా నిత్య అడుగుపెట్టడ మనేది ఆమె పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. శరత్, నిత్య నా ప్రాణం... నా ప్రాణాన్ని ఈ రోజు పూరిగా నీకు ఇచ్చేశాను... మరి ఎలా చూసుకుంటావో, ఏమో...” శ్రీహర్ష కంఠం జీరబోయింది.
“నిత్య మీకు ప్రాణమైతే ఇప్పుడు నా కనురెప్ప... మీరిచ్చిన ఈ అపురూపమైన కానుకను నా ప్రాణమున్నంతవరకూ ప్రాణప్రదంగా చూసుకుంటాను... ఇది నా ప్రమాణం” ఉద్విగ్నంగా అంటూ శ్రీహర్ష్నను కౌగలించుకున్నాడు శరత్.
అందరూ లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తుండగా నిత్య, శరత్‌లు పూలదండలు మార్చుకున్నారు. అక్షతల జల్లు, ఆశీర్వచనాలతో కూడి, ఆ నవ దంపుతులను తడిపివేసింది.
(ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చి 2011) క లాలా అమూల్యం (కథలు)
దుహిత
“అదేమిటండీ? అమీర్‌పేట ఇల్లు అమ్మేస్తారా?” బాధగా అంది ఉమ.
“తప్పదు ఉమా... అల్లుడు ఈ రోజు మరీ గొడవ చేశాడట. రమ్య చాలా దిగులుగా ఫోన్ చేసింది” జవాబిచ్చాడు మోహనరావు.
“అదేమిటండీ, ప్రేమించి పెళ్ళిచేసుకున్నవాళ్ళు కూడ డబ్బుకోసం ఇలా... నాకేమీ అర్ధం కావటం లేదు... పోనీ ఓసారి మనిద్దరం బెంగుళూరు వెళ్ళి వద్దామా?”
“మనకాలం అనుకున్నావా ఉమా, (ప్రేమించి పెళ్ళిచేసుకున్నా పెద్దలు కుదిర్చిన పెళ్ళయినా ఒకటే - దబ్బు ముఖ్యం అవుతోంది మనిషికన్నా మన అమ్మాయి సుఖం కోసం మనకి తప్పదు కదా... ఆ ప్లాట్‌కి అడ్వాన్స్ ఇవ్వాలి అని సుమన్ ఒకటే గొడవ చేస్తున్నాడట.”
“ఇద్దరినీ మగపిల్లల్లాగా పెంచాము... చక్కని మంచి చదువులు చెప్పించి, ఉద్యోగస్తులము చేశాము... మన కాలంలో మనం పాటించిన ఆదర్శాలు పిల్లల విషయంలో కూడా వాళ్ళు పాటించి తీరతారని అనుకున్నాను... కాని అరేంజ్‌డ్ మారేజ్ అయినందుకు పెద్దదానికీ కట్నం ఇవ్వక తప్పలేదు. లవ్ మేరేజ్ అయినా దీనికీ ఏదొక రూపంలో డబ్బు ఇవ్వక తప్పటం లేదు... ఏమిటండీ ఇది!” ఆవేదనగా అంది ఉమ.
“పిచ్చి ఉమా, కాలం మారిపోవాలి అని అనుకోవటం మన అపోహ, అత్యాశ... అంతే... వరకట్నం అని కాకపోయినా మనకున్నదంతా మన పిల్లలదేగా. ఎప్పటికైనా వాళ్ళకు ఇవ్వాల్సిందే కదా. అందుకే, వాళ్ళ అవసరం నిమిత్తం ఇప్పుడే ఇచ్చేస్తున్నామని అనుకో...”
“అది కాదు, మనం ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నామో నాకింకా నండూరి సుందరీ నాగమణభి లావు
గుర్తుందండీ... అయినా వాళ్ళు సంవాదించుకుంటూ కూడా మామగారి మీద వాలిపోవటానికి ఆ సుమన్‌కి ఎలా సిగ్గులేదో...” కోపంగా అంది ఉమ. “ఆవేశపడకు... నాశనమయ్యేది మన అమ్మాయి జీవితమే... అయినా ఆ ఇంగితం ఆ అబ్బాయికి ఉండాలి ఉమా... రాఘవరావుగారి స్నేహితుడు ఇల్లు చూసుకొని వచ్చారు... మాట్లాడటానికి ఈ ఆదివారం వస్తారట... అన్నీ కుదిరితే... వచ్చేవారమే రిజిగ్రేషన్...”
“అయ్యో...” ఉమ కళ్ళల్లోంచి జలపాతాలు ఉరికాయి... చెమ్మగిల్లిన తన కళ్ళను భార్య చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు మోహన్. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం సహోద్యోగులైన ఉమ, మోహన్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరవటంతో సహజంగానే ఇరువైపుల పెద్దవాళ్ళూ ఒప్పుకోలేదు... స్నేహితుల సహాయంతో రిజిష్టర్ మేరేజ్ చేసుకొని కాపురం పెట్టారు. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయేవరకూ కూడా ఎవరి రాకపోకలూ లేవు... ఆ తర్వాత కూడా అంతంత మాత్రమే... తోబుట్టువుల పిల్లల పెళ్ళిళ్ళకు చుట్టపు చూపుగా వెళ్ళటం, రావటం తప్ప పెద్దగా అనుబంధాలు పెరగలేదు.
మోహన్ సాహచర్యంలో తన వాళ్ళందరినీ మరచిపోయి ఉమ సంతోషంగా ఉన్నా మోహన్‌కి మాత్రం తాను తన తల్లిదండ్రులకు, అన్నయ్య, అక్కయ్యకు దూరం అయినందుకు చాలా బాధగా ఉండేది. తన పిల్లలకు బామ్మ, తాతయ్యల (పేమ, లాలన దొరకలేదని చాలా బాధపడేవాడు. అలాగే అన్నయ్య పిల్లలతో, అక్కయ్య పిల్లలతో తన పిల్లలకు ఏమాత్రం అనుబంధం లేకపోవటం అతనిని కలచివెసేది. ఉమ ఎంత ఊరడించినా అందులోంచి బయటకు రాలేకపోయేవాడు మోహన్. అలాంటి పరిస్థితి రాకూడదని, పెద్దకూతురు సౌమ్యకు ఇరవై నిండగానే పెళ్ళి సంబంధాలు చూడటం రాలేకపోయేవాడు, మోహన్. వీళ్ళ కులాంతర వివాహం సంగతి తెలిసి మంచి సంబంధాలేవీ రాలేదు... మంచి ఫామిలీలో అమ్మాయిని ఇవ్వాలని మోహన్ తాపత్రయం... ఆఖరికి సౌమ్య ఇంగ్లీష్ లెక్చరర్ ఇందిర తమ్ముడు హర్ష సౌమ్యను కాలేజీ ఫంక్షన్‌లో చూసి ఇష్టపడితే వాళ్ళు మాట్లాడటానికి వచ్చారు.
పెళ్ళిచూపులు కాగానే వారు చేసే బేరసారాలకు ఉమకు మతిపోయింది... వెంటనే రంగంలోకి దిగి చెప్పింది. “పాతికేళ్ళ క్రితం మేము ఓ ఆదర్శంతో, లక్ష్యసాధనతో పెళ్ళిచేసుకున్నాము... వరకట్నాన్ని నిర్మూలించాలన్నదే మా ఆదర్శం... అలాగే మా పిల్లల పెళ్ళీళ్ళు కూడా అలాగే చేయాలని మా తీర్మానం...
పటట అమూల్యం (కథలు)
ఏమీ అనుకోకండి వరకట్నం ఇచ్చే ఉద్దేశ్యం మాకు లేదు... ఏమమ్మా ఇందిరా, మీ తమ్ముడికి అమ్మాయి బాగా నచ్చిందని అన్నారు కదా... ఇంకా కట్నం అడిగితే ఎలా?” అంది నవ్వుతూనే... హెచ్చరికగా చేస్తున్న మోహన్ కనుసైగలను పట్టించుకోకుండా....
“అదేంటి ఆంటీ, మీ కాలంలో మీరు ఆదర్శాలు పాటించారు అని అందరూ అవి పాటించాలంటే ఎలా? మీ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఊరికే అవుతాయని అనుకున్నారా, ఏమిటి? ఏదో మా తమ్ముడు ఇష్టపడ్డాడని మీ దగ్గరకు వచ్చి అడిగినందుకు మీకు చులకన అయ్యామల్లే ఉంది. ఈ రోజుల్లో కట్నం తీసుకోని వారెవరున్నారు చెప్పండి! ఇంకా మావాడికి బోలెడన్ని మంచి సంబంధాలు వస్తుంటే సౌమ్యను ఇష్టపడ్డాడు... అక్కడికీ నేను చెబుతూనే ఉన్నాను, ఇది మనకి కలిసివచ్చే సంబంధం కానే కాదురా అని... వినలేదు... అయినా మీరు ఇచ్చే డబ్బుకాన్స, లాంఛనాలు కానీ నా కోసమో, మా అమ్మానాన్నల కోసమో కాదు కదండీ... మీ అమ్మాయికి, మీ అల్లుడికీను... కోరి వచ్చిన సంబంధం కదా అని అలా తేలిక చేయకండి...” ఉక్రోషంగా అంది ఇందిర... ఎమ్మే, పిహెచ్‌డి చేసి అంత మూర్ధంగా మాట్లాడుతున్న ఇందిరను చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు ఉమకి. కూతురివైపు చూసింది. అప్పటికే ఆమె కళ్ళు హర్ష కళ్ళతో దోబూచులాడు తున్నాయి... కట్నం గురించి జరుగుతున్న చర్చలతో తమకేమీ పట్టనట్టే ఉన్నారు ఇద్దరూ. అన్ని విషయాలూ వాళ్ళతో మోహన్ మాట్లాడుతూ ఉంటే చేసేదేమీ లేక నిస్సహాయంగా చూస్తూ అలా ఉండిపోయింది ఉమ.
శ జస ఈ
లక్ష రూవాయల కట్నం ఇచ్చి పెళ్ళి ఘనంగా చేసి సౌమ్యను పంపించారు. తమకి ఎంత అయిష్టంగా ఉన్నా తమ ఆదర్శాలకు వ్యతిరేకంగా ఉన్నా పిల్లల సంతోషం కోసం ఆ దంపతులు రాజీపడక తప్పలేదు. పెళ్ళి కాగానే సౌమ్యకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
మరో రెండేళ్ళకు రమ్య చదువు పూర్తయి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్‌లో జాయినైంది. ఆరు నెలలు గడవకుండానే సుమన్‌తో ప్రేమలో పడిన రమ్య ఆ విషయాన్ని తల్లికి చెప్పలేక తండ్రికి చెప్పుకుంది. కర్ణాటకకు చెందిన సుమన్‌తో వివాహానికి వెంటనే అంగీకరించలేకపోయింది ఉమ. కారణం, ఇరువురి మాతృభాషలు వేరు కావటం, ఆచారవ్యవహారాలు కూడా వేరు కావటం. మళ్ళీ ఉమను మోహనే కన్విన్స్ చేయవలసి వచ్చింది. సుమన్‌కి కట్నం ఇవ్వటానికి నండూరి సుందరీ నాగమణి --ాలంా లా
మాత్రం ఉమ ఒప్పుకోలేదు. అంతేకాక, పెళ్ళిమాత్రం సింపుల్‌గా చేసి, రిసెష్పన్ బెంగుళూరులో (ఫెండ్స్‌కి ఇచ్చుకోమని చెప్పింది ఉమ. ఆ విషయాన్ని అయిష్టంగానే అంగీకరించింది రమ్య, ఓ లక్ష రూవాయలు పెట్టీ బంగారం కొని ఇచ్చింది కూతురికి, పెద్దకూతురికి ఇచ్చినట్టె... ఉమకు తెలియకుండా మరో లక్ష రూపాయలు తండ్రి దగ్గర తీసుకుంది రమ్య.
ఇదంతా జరిగి ఆరునెలలు అయిందో లేదో... ఇప్పుడు ఓ నెల రోజులనుండీ ఒకటే ఫోన్ కాల్స్ చేస్తోంది రమ్య. సుమన్ బెంగుళూరులో అపార్భమెంట్ తీసుకుంటున్నాడనీ, అందుకు అడ్వాన్స్‌గా కట్టటానికి ఓ పది లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నాడనీ, తనను మానసికంగా మాటలతో పహింసిస్తున్నాడనీ చెప్పి ఏడుస్తోంది. దాని ఫలితమే మోహన్ ఇల్లు అమ్మటానికి నిర్ణయించుకోవటం.
ఉమకి ఎంతో దిగులుగా ఉంది. కాలగతిలో ఎళ్ళు గడచినా మనుషుల స్వార్ధం కానీ, ధనాశ కానీ ఏ మాత్రం మారలేదు... సౌమ్య పరిస్థితి ఫరవాలేదు. వరకట్నం తీసుకున్నా అల్లుడు హర్ష ఆమెను బాగానే చూసుకుంటాడు. వారానికో, పదిహేను రోజులకోసారో వస్తూనే ఉంటారు... తన ముద్దుల కూతురు రమ్య...
. తాను ఏం చెబితే అదే చేసే రమ్య... చిన్నతనం నుండి తన ఆశయాలు, ఆదర్శాలు పుణికిపుచ్చుకున్న తన బంగారు తల్లి... ఆ రాక్షసుడి చేతుల్లో ఏం బాధలు పడుతుందో ఏమో... ఏం చేయాలి? అసహాయత నిలువెల్లా కమ్మేసుకుంటుంటే... భారంగా నిద్రకి ఒరిగింది ఉమ. గ సగ శ
ఆదివారం అమ్మానాన్నలను చూడటానికి వచ్చింది సౌమ్య తన ఎదాదిన్నర కొడుకుతో. మధ్యాహ్న భోజనాలుఅయిన తరువాత, తల్లిని అడిగింది... “ఏమిటమ్మా, మన అమీర్‌పేట ఇల్లు అమ్మేస్తారా? నాన్నంటున్నారు...”
ఉమ ముఖం కోపంతో, దుఃఖంతో కందగడ్డలా మారింది.
“సుమన్‌కి కొంచెం డబ్బు కావాలట సౌమ్యా... అందుకని...” చెప్పాడు మోహన్.
“అవునే... ఆ రాక్షసుడి పుణ్యమా అని... ప్రేమించి పెళ్ళిచేసుకుంటే ఏమిటో అనుకున్నా... ఇదీ అతగాడి (ప్రేమ... అతను అపార్ట్‌మెంట్ కొనుక్కోవటానికి మనం పది లక్షలు ఇవ్వాలట... అసలు ఆ సుమన్ మనిషి కాదే...” ఇంకా వతతతతతతతతతతతపతాయఆంయఆఆఆ అమూల్యం (కథలు)
ఏదో అనబోతున్న ఉమను వారిస్తూ, “ఆగమ్మా, అతన్నెందుకంటున్నావు?” అంది సౌమ్య గట్టిగా.
“ఏం మనిషివే సౌమ్యా చెల్లిని బాధపెడుతున్నాడంటే మరిదిని వెనకేసు కొస్తున్నావు. అతడెలాంటివాడో నీకు తెలుసా? అతనికి ధనపిశాచి పట్టింది...”
“అమ్మా ప్లీజ్... నిజానిజాలు తెలియకుండా ఎవ్వరినీ దూషించకూడదని నువ్వే చిన్నప్పటినుండీ చెవ్పావు... ఒక్క నిమిషం...” అంటూ తన లాప్‌టాప్ తెరిచి, మెయిల్ ఓపెన్ చేసి రమ్య తనకు పంపిన మెయిల్‌ని చదవమని తండ్రికి ఇచ్చింది. మోహన్ పైకి చదవసాగాడు.
శ శం *
“డియర్ అక్కా
ఎలా ఉన్నావు? నువ్వు నాకు బుద్దులు చెబుతూ రాసిన మెయిల్ చదువుకున్నాను... థాంక్స్. మొన్ననే కొత్త కారు బుక్ చేసుకున్నాము. సుమన్‌కి జీతం పెరిగింది. అందుకని నేనే అపార్ట్‌మెంట్ తీసుకోమని చెప్పాను. అతను ఒప్పుకోవటం లేదు... కానీ నేను మాత్రం నాన్నకి ఫోన్ చేసి డబ్బు అడిగాను, సుమన్ ఇమ్మన్నాడని... డబ్బు కోసం నన్ను బాగా వేధిస్తున్నాడనీ... నాన్న తప్పకుండా ఇస్తారు నాకు తెలుసు.
నీకే నయం, వరకట్నంగా డబ్బు ఇచ్చి బంగారు నగలు ఇచ్చి, రంగరంగ వైభవంగా పెళ్ళి చేసి పంపించారు. మరి నాకు? తూతూ మంత్రంగా చేసింది అమ్మ నా పెళ్ళి. లక్షరూపాయల బంగారం మాత్రం ఇచ్చి దులిపేసుకుంది. నాన్నే నయం నేను అడగ్గానే నాకు మరో లక్ష రూపాయలిచ్చారు అమ్మకి తెలియకుందా...
చిన్నప్పటినుండీ ఆశయాలు, ఆదర్శాలు... రూల్సు, రెగ్యులేషన్సూ... అబద్ధాలు అఆదకూడదు, దొంగతనం చేయకూడదు, లంచం తీసుకోకూడదు, కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు... సింపుల్‌గా ఉండాలి. అమ్మ... అమ్మ... మన అమ్మ హిట్లర్ పెట్టే రూల్స్‌తో వేసారిపోయాను, నా చదువయ్యేదాకా... ఉద్యోగం వచ్చి ఈ బెంగుళూరు వచ్చేదాకా నాకు విముక్తి కలగలేదు... ఏం చేసుకుంటారే అంత డబ్బు! నాన్నకింకా ఐదేళ్ళు, అమ్మకి మరో ఏదేళ్ళూ సర్వీసుంది... బోలెడంత జీతం వస్తుంది ఇద్దరికీ కలిపి. వాళ్ళుంటున్న ఇల్లు సొంతం. అమీర్‌పేట ఇంటి అద్దెలు వస్తాయి. తర్వాతయినా మనకే కదా ఇచ్చేది! నండూరి సుందరీ నాగమణి లా
అంచేత, నేను ఇలా దబ్బు అడుగుతున్నందుకు ఐఏ మాత్రం బాధపదటం లేదు. అది నా హక్సుగా భావిస్తున్నాను. కాకపోతే సుమన్‌కి ఈ విషయం తెలిస్తే నన్ను బాగా కేకలేసాడు, మొదటికే మోసం వస్తుంది... అందుకే డబ్బు అందేవరకూ తెలియకుండా జాగ్రత్తపడుతున్నాను. ఈ విషయాలేవీ అమ్మకి, నాన్నకి చెప్పకు... బాధపడతారని కాదు... అమ్మ నాన్నకి అద్దుపడిపోతుంది... అవిడ మాట ఆయన కాదని అనలేరుగా మరి! లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నీ దైమండ్ టాప్స్ ఇస్తానని మర్చిపోయావు... ఈసారి నాన్నకిచ్చి పంపించు. బావగారిని అడిగినట్టు చెప్పు. బాబిగాడికి నా ఇట్లు ప్రేమతో నీ చెల్లి చదవటం పూర్తిచేసిన మోహన్ ముఖం కత్తివాటుకి నెత్తురుచుక్క లేనట్టుగా పాలిపోయింది... రెండు రోజుల క్రితం సుమన్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే క్షేమసమాచారాలు అయిన తర్వాత తాను అన్నాడు అతనితో... డబ్బు పంపించటానికి మరో ఇరవై రోజుల వరకూ పడుతుందని... ఏం డబ్బని అతను అడుగుతూ ఉండగానే రమ్య ఫోన్ లాక్కుని తనతో మాట్లాడింది... అంటే, సుమన్‌కి ఈ విషయంలో ప్రమేయం ఏ మాత్రం లేదన్నమాట! నాటకమంతా తన కూతురే ఆడుతోంది... తల్లిదండ్రులుగా తమ బలహీనతను అడ్డం పెట్టుకుని తనను హింసలు పెడుతున్నాడంటూ, వజ్రపు తునకలాంటి సుమన్ మీద అభాండాలు వేస్తోంది... కష్టపడి తాము సంపాదించుకున్న ఆస్తిని, డబ్బును హక్కు పేరుతో లాక్కోవాలని ప్రయత్నిస్తోంది... ఇటు... ఉమ కూడా తల వాల్చుకొని కన్నీరు కార్చనాగింది. ఉగ్గుపాలతో తన ఆశయాలను, ఆదర్శాలను రంగరించి నేర్పించానని . అనుకుంది తను... తన ముద్దుల కూతురు రమ్య ఎంత పెద్దయివోయింది! స్వార్ధానికి పరాకాష్టగా తయారైంది... అమ్మానాన్నల మీద దానికున్నది భక్తి కాదు... కోపం, చులకనభావం... వాళ్ళను వెన్నువోటు పొడవటానికి కూడా వెనుకాడటం లేదు... ఇది తన పెంపకంలోని లోపమా? లేక నేటి యువతలో అణువణువూ నిండిపోయిన స్వార్ధమా? అత్యాశా? ఊరికే వచ్చే ఈజీ మసీ కోసం వెంపర్లాటా? ఆయాచితంగా వచ్చే ధనం కోసం ఆశించే వీళ్ళకి స్వయంగా సంపాదించుకొని వస్తువు కొనుక్కోవటంలోని ఆనందం ఎలా తెలుస్తుంది? ఉహు, ఎప్పటికీ తెలియనే తెలియదు. పతా అమూల్యం (కథలు)
ఇంకా నయం, రిటైర్ కాగానే తానూ మోహన్‌తో బెంగుళూరు వెళ్ళి చిన్న కూతురి దగ్గర ఉందామని అనుకుంది. ఇలాంటివారు వార్ధక్యంలో తల్లిదండ్రులని ఆదరిస్తారా అసలు? కంటిని కాపాడే కనురెప్పే కంటిని కబళించేస్తే, ఆ కన్ను పరిస్థితి ఏమిటి? భగవాన్! “అమ్మా, నన్ను క్షమించు... చెల్లి మీద నీకు నేరాలు చెప్పాలని కాదు... అనవసరంగా ఓ మంచి మనిషి నీ దృష్టిలో దోషి కాకూడదన్న తాపత్రయంతో ఈ మెయిల్ చూపించాను మీకు... అంతే... టేకిట్ ఈజీ... కొంచెం టీ చేసుకు వస్తాను...” అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది సౌమ్య.
ఉమ పక్షనే కూర్చుని ఓదార్పుగా ఆమె భుజం మీద చేయి వేశాడు మోహన్, “సారీ ఉమా, వెరీ వెరీ సారీ... బాధపడకు ప్లీజ్...”
“కాదండీ నేనే మీకు సారీ చెప్పాలి... నా కడుపున అలాంటి విషపు నాగు పుట్టిందని నేను అనుకోలేదు... దాని అమాయకత్వమంతా నటన అని నేను అనుకోలేదు... మీకు చక్కటి రత్నాల్లాంటి పిల్లలను ఇచ్చానని మురిసిపోయేదాన్ని... కానీ కరడు గట్టిన స్వార్ధపరత్వాన్ని అత్యాశను కన్నానని తెలుసుకోలేకపోయాను... ఆణిముత్యంలాంటి అల్లుడిని ఆశపోతని తిట్టుకున్నాను... కానీ ఇదే సూత్రధారియై ఈ నాటకమంతా నడిపిందా? తట్టుకోలేకపోతున్నానండీ... అయామ్ సారీ...” ఆవేదనతో అతని ఎదపై వాలిపోయింది ఉమ.
(భూమిక - ఆంధ్రభూమి దినపత్రిక, 01.03.2014) న స్తై నండూరి సుందరీ నాగమణి తతత
కం కంల అవటు. ఈ శష్ర్రైద్తుర ల రుటకమై ఆ (౨. ఏష థిద గాల వ వై య మ సో స [4 ౬ (ఏతత్ గ్గంర్డి క్రుంత వాలి. ప్రారంంటా తతా మి యాన్టాట్రచ్యడ త! థకదంయరయ్గార్రే ౧0ఈమ్లు[ ర్రిరప్తాట గ త్ గలం యల తంఆము తరమా షణం లోరి- తరంలో గ + యుతి. ఆప్రమి గ ధయబకంం - నై ల్‌ో స | కా సీ 2. రు నే శ్ర) మయ లి టిల్ నా. స్ మోకు (6 య. ళ్లు న సం మం? గా (ద్ టయ టారో ( 7 బాన (1 సం౧నా | = గా
మాదీ ([(న౯ 1. క. అమూల్యం " రచయిత(త్రి కథలో వస్తువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, భాన వ్యక్తీకరణకూ అంతే ప్రాధాన్యత ఇస్తాడు అనేది ఎంత నిజమో 'నందూరి సుందరీ నాగమణి'గారి కథలు ప్రయోజనాన్నీ బాగా ఆకళింపు చేసుకున్న సుందరీనాగమణిగారు తనదైన శైలిలో దాని చెవ్వకనే చెబుతాయి. ఎత్తుగడలో విలక్షణీయత, చక్కని నృజనాత్మకత, బహుముఖీనమైన ప్రతిభావ్యుత్వత్తులు పుష్కలంగా ఉన్న గర్వించదగ్గ రచయిత్రి సుందరీ నాగమణి. సమకాలీన సమాజంలో అత్యంత వేగంగా పరివర్తన చెందుతున్న సామాజిక సమస్యల గ్రహణశక్తి కథా వస్తు స్వీకరణ శక్తి, స్వీకరించిన వస్తువును ప్రకటనాభి వెంటాదే భావ పరంపర, తరుముకొస్తూ వేగిరపరచే అ భావాలకో రూపాన్నిిచ్చే అమరికలో సుందరీ నాగమణిగారు చూపించే లాలిత్యం, బెచిత్యం, చాతుర్యంతో... సాహితీ చరిత్రలో తనకంటూ ఒక ముద్రనే వేసుకోగలిగారంటే... అతిశయోక్తి కానేకాదు. . - శ్రీమతి కన్నెగంటిఅనసూయ