Telugu అన్వేషణ - anilvaranasi/indianlanguages GitHub Wiki
(డ్య తళతతకూటు బకింలఖుఅకమురూపు ళ్ | . ౪ లో ఇ /'రీం క వప ్ర్ | లో /డ అ + సె ం టన |) | టం సాకార ణా ర | పదద ఫలా? ఆం! క్ర ఖ్ అయోత | గ్ జ | శ ౮ ల లుం (1. . నలో ఎలనేషస న ం " వా |
అనేషణ (నవల) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా (తెలుగు భావాసమితి ప్రధమ బహుమతి పొందిన నవల) రచన : ౪|| పోతుకూచి ాంబశివరాను)
జ సీ ఖగ ౮ తో ఆరవ ముద్రణ ల ల్ ౧ |ల్రో 1000 ప్రతులు యు డిసెంబర్ 2006 శ్రీ గ గ్య ముఖ చిత్రం : పి. ఆర్. రాజు వ్ లో | ॥ సక్ష | 1 ( ఖో శ | జం -% అన్ని హక్కులు రచయితవే ౯ టం ణ్ ళో య లు క; వల :;: వంద రూపాయలు క క (ప్రతులకు : పొట్టి శ్రీరాములు విశ్వసాహితి. తెలుగు విశ్వవిద్యాలయం వారి 1-3-1-18, కవాడిగూడ, అదన ఆర్ధిక సహకారంతో సికింద్రాబాదు-80, ఫోన్ ; 27533177 డి.టి. పి.: జి.వి. గ్రాఫిక్స్, గాంధీనగర్, హైద్రాబాద్. ఫోన్ ; 65591076 ముద్రణ:
111 నా దృక్పథం ఈ నవలకు ఇతివృత్తం ఆధునిక ఆంధ్రుల సాంఘిక జీవిత చరిత్ర. ఒక నిర్దుష్టమైన యితివృత్త పరిధిలో సృజనాత్మకమైన పని, కదిలే ఆలోచనల వెనకాల ఒక సిద్దాంతం లేనపుడు, అంతం లేకుండా కధ పెరిగిపోతుంది. ఆ అనంతమైన కధ నవలగా చెలామణి అవుతోంది చాలా మంది దృష్టిలో. కాని సమగ్రగాశ్యక జీవిత దృక్పధాన్ని ప్రతిబింబింప చేయ్యడం నవల లక్షణాల్లో ఒకటని విమర్శకులు*చెజుతారు రచయిత మానసిక భావనలు బలంగా ఉన్నపుడే ఒక నిర్భుష్టమైన దృక్పధం ్రీజలు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాంధించ గలిగే శక్తి ఏర్పడుతుంది. సమాజానికి సాహిత్యం ప్రయోజనకరమని గుర్తొంచినరత కాలం రచయితకు మనో బలం గల్గిన దృక్పధం కూడా అలవడడం ముఖ్యావశ్యకం, నేటి తెలుగు జాతిలోని సమస్యలు ప్ప్సస్థితులు పూర్తిగా ఆకళించుకొని, మారుతున్న కాలం విలువలో, సమాజగమనం ఓవిధంగా ఉండాలన్నది నేటి ముఖ్య చర్చనీయాంశం జీవితచిత్రణ వాస్తవికంగా ఉందడం పాఠకుడిని ఆకర్షిస్తుంది వాస్తవికమైన చిత్రణతోపాటు ఉద్బవించే సమస్యలకు సమంజసమైన పరిష్కారాం చూపించడం పారకుడిని ఆదర్భవంతుడిగా నడిపింస్తుంది. సమస్య పరిష్కారాలలోని సిద్ధాంతాలు సహజంగా సూత్నదైతన్నానికి అలవాలమైనప్పుడు పారకుడు సృజనాత్మక రచననుంచి సంపూర్ణమైన అనందం పొందుతాడు. అటువంటి రచన సమాజ బౌన్నత్యానికి సన్నిహిత హేతువు కాగలదు. సాంఘిక ప్రయోజన మొక్కటే సాహిత్య ముఖ్యపరమావధి కాదు దేశ కాల, వొత్రావధులు, దాటి విశ్వజనీనత యిముడ్చుకుని, మానవతా సూత్రాలు అల్లుకుని పరుగులిడే రచన కాలాతీతమై సాహిత్యంలో కాంతిపుంజమై విలసిల్లుతుంది. ఏ ప్రాంతీయ, చరిత్ర, సంస్కృతి, సృజనాత్మక రచనల్లో ప్రతిబింబింపచేసినా, ప్రాధమికమైన మానవతా లక్షణ శుభసంపత్తి పొదిగినప్పుడు, రచనకు మార్దవం, మాంగళ్యం, మహత్తు ఏర్పడుతుంది, ఆ రచన సర్వజానావళికి సాంకేతికమైన మహత్తర సాహిత్య చిహ్న మౌతుంది. సాహిత్యంలో ఈ నవల అన్వేషణ. అధునిక ఆం(ధ్రుల జీవిత స్థితిగతులు చిత్రించి, ప్రస్తుత సమాన ్రాతిపదికమైన కుటుంబం, తత్త్వం, ఆకృతి, సారాంశం, అన్వేషించింది. బారతీయ సంప్రదాయాలు తత్త్వవిచారం మూలాధారంగా వ్యక్తి కుంటుంబాన్ని నిర్ణయించుకునే విలువలు విసృతపరిధిలో అర్ధం చేసుకొవాలి, సమాజం పటిష్టత వ్యక్తి బాహ్యా ప్రవర్తన నిర్ణయిస్తుంది, మానవత్వంతో కూడిన నైతిక విలువలు బాహ్య ప్రవర్తనేకాక,
1౪ మానసిక ప్రవృత్తి కూడా ప్రక్షాళితం చెయ్యాలి. అప్పుడే సాంఘీక వాతావరణంలో సుహృద్భావం ఎర్పడుతుంది.
(ప్రాంతీయ భాషా వరిధులు ఆదారంగా విడివడిన ఆంధ్రజాతి వివిధ మతాభిమానులకు కూడా నిలయమైంది ఆంధ్ర రాజధాని హైద్రాబాదుకు తరలిన తర్వాత తెలుగు, ఉర్జూలకు సాన్నిహిత్యం ఏర్పడింది ముస్తింలు, కైస్తవులు కూడ మత సంప్రదాయాలటుంచి, ఆంధ్రులుగా పరగణింపబడుతున్నారు ఆంధ్రుల నాంఘిక వాతావరణంలో ముస్తిం, కైస్తవ, సంప్రదాయాలు కూడా కొల్లలై కలిసిపోతున్నాయి భాషలో, భావనలో, ప్రవర్తనలో హిందూ ముస్లిం కైస్తవ మిళితమైన సంస్కృతి కనిపిస్తుంది.
రాజధాని నగరం ఆంధ్రదేశంలో కనిపించే అన్నిరకాల ఆం(ధధ్రుల సంస్కృతులకు అలవాలమైనదగుటచే అన్వేషణకు మూలన్యానమైంది. ఆంధ్రదేశంలోని సర్కారు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతనివాసులకు కూడాలిగా రాజధాని (ప్రయోజనం సాధించబడింది. తరతరాలనుంఛచి ఆంధ్రులలో పాతుకుపోతున్న కూపస్టమండూక స్వభావాన్ని యువతరం కాలదన్ని సాహసదృష్టితో నూత్న (ప్రాంతాల అన్వేషణ ప్రారంభించినపుడే క్రాత్తఅదృష్టాన్ని అందుకోవచ్చు. పరిస్థితుల ప్రాబల్యంవల్ల స్వస్థానాల నుంచి దూరమై రాజధానికొచ్చిన యిద్దరు యువతీయువకులు జీవితం సరిదీద్దుకునె ప్రయత్నాలలో పద్మవ్యూహాలను చేధించుకొని , వ్యక్తిత్వాలను పెంపొందించుకొని, మానసిక వేదనలకు తట్టుకుని, విధిద్వారా కాకుండా మానవ ప్రయత్నం ద్వారానే ఒక నిర్భుష్ట జీవన సమన్వయానికి మూలకాకులౌతారు. సాధారణ నామాన్య మానవుని జీవితంలో కంటె వురోభివృద్ధికి తపనపడి, తరగతుల స్థాయిని 'పెంచాలనుకునే సామాన్యమానవుని జీవితంలో నిమ్మోన్నతాలు విచిత్రంగా ఉంటాయి, మూఢనమ్మకాలతో, ధనం ప్రాతిపదికగా, కులమత విభేదాలతో, కరడుకట్టి కరుడు కట్టుకున్న సమాజ తరగతులు కరిగి కలసిపోవడం చాలా కష్టం. అద్దుగోడలు పడగొట్టి అనంత దూరమైన ఆశయ గమ్యస్థానం జేరడం సామాన్యునికి ఒక సాహస క్రియ. పురుషుని సాహస కృషిలోని ప్రతిబంధకాలు, ప్రీ కృషిచుట్టూ అల్లుకునే పరిస్థితుల విషమ దృశ్యాలు లెంగిక సాంఘీక పరిస్టితులవల్ల యీ సంఘర్షణ, పరిస్థితులు, సృజనాత్మక రచనలకు అపారమైన వస్తువు అందించగలవు.
రచనలో కల్పనకు, వాస్తవికతకు సముచితమైన పోషణ ఉండడం అవసరం. ముఖ్యంగా ఆధునిక యుగంలో దినదినం వివిధ సంస్కృతుల ప్రభావలతో సంక్షిషమౌతున్న సాంఘీక నాగరిక వాతావరణంలో, పూర్తిగా కల్పన రాణించదు. అర్ధం చేసుకోవలసిన వాస్తవికత ఎంతో ఉంటుంది గత చరిత్రలోని సంఘటనలగూర్చి, చారిత్రకాధారాలను పొటించి, కల్పన చేయ్యడఐ సులువు. కాని వాస్తవిక ప్రస్తుత జీవితచిత్రణ చేసేటప్పుడు,
ఛో
సహంజగా సన్నివేశాన్ని ప్రదర్శించెటప్పుడు, కంటితో చూచి కల్పన పెంపొందించడం, సృజనాత్మకశోభకు వన్నె తెస్తుంది అనంతమైన ప్రపంచాన్ని అర్ధం చేసుకొవడం అగాధమైన మానవతత్వాన్ని అవగాహన చేసుకోవడం, మానవుని మానసిక భౌతిక శక్తులకు ఒక పరిక్ష ఇది మానవుని పరిణతి మీద ఆధారపడి ఉంటుంది రోజూ కనిపించే దృశ్యం కవి కలంకుంచెలో క్రొంగొత్తగా ఆకర్షిస్తుంది. అందంలేని వస్తువు కళాకారుని దృక్పధంలో లేదు ప్రత్యేకత ఎన్ను కొన్న ప్రదేశములోని దృశ్యాలను అవసరమైతే నగ్నంగా దొలిచి, లేనప్పుడు నాణ్యంగా వర్ణించి, కధాగమనంలో ఒక సాధనచూపడం ఆ సాధనలో కాలం (క్రాతనడకగానేగాక, చారిత్రక ప్రయోజనసిద్దిని వాందడం, రచనకు ఒక విధమైన శ్లేషాలంకారం.
మానవుడు ఒక్కడే భూమిమీద (బ్రతుకుతూ, మరే ప్రాణికోటి లేకపోతే, బహుశ మానవుని జివితం అతనికే రోత కలిగిస్తుంది విభిన్నభావాలు పరాకాష్టలు పొందిన విచిత్ర వ్యక్తులమధ్య జీవితం అంతా సుఖవంతం కాదు మాటరాని ప్రాణికోటి భావం చెప్పలేపి మూగభాషతోచేసే పలకరింపులు మానవుని హృదయానికి ఆహ్హాదం కల్లిస్తాయి విశ్వాసంమైత్రి, ఆదరణ, అనుసరణ మానవునికంటే జంతుకోటిలోనే ఎక్కువ వున్నవంటే అతిశయోక్తికాదు మానవుని వాతావరణం మధ్య తిరుగుతున్న జంతుజాలం, పక్షి సముదాయం, వాస్తవికత సంఘటనలు ఎన్నోవిన్నాము, చూస్తున్నాము. క్రమేణా నాగరికత మానవుని బుద్ధి అంతస్తుల అభివృద్ధి పరిణామంవలెనే. జంతుజాలం బుద్ది అంతస్తుల వాతొవరణం కూడా నూత్న ప్రయోగాల కనుగుణ్యమే మానవునికే ఆశ్చర్యం కల్గజేస్తున్న పరిస్థితులు బర్పడుతున్నయి. క్రొత్త శాస్తవిజ్ఞానాదయానికి అనేకరకాల జంతుజాలం ప్రయోగాలలో బలిబెతోంది. జంతువుని ఒక మానసికత్వం, ఒక ప్రత్యేక జీవనం వున్నాయి. మానవుని స్నేహంతో చాలావరకు మానవుని ప్రవర్తన , బుద్ది కూడా తనలో ప్రతిబింబింపజేస్తుంది జంతువు. ఇదేతత్వం ఇందులోని నల్లపిల్లి పుణికి పుచ్చుకుంది.
మానవుడు యీ దశకు రాకముందు అనేకరకాల పరిణామాలు చెందిన విషయం శాస్తం ఘోషిస్తుంది. మానవుడుగా జన్మించినపిదప శారీరక పరిణామాల ద్వారా సమాజంలో ఉద్భవించే సంఘటనల ఒంపులు, సొంపులు, ఒద్దు, పొడుగు, ఫలితకేశాలు, బట్టతలలు, కాలక్రమం లో ఆకారం అనవాలుకు దుస్పాధ్యమయ్యేటంత విచిత్ర వాతావరణం ఏర్పడుతుంది. ఒకే పోలికలున్న వ్యక్తు కూడా ప్రపంచములో తరచుగా కాకపోయినా, అరుదుగానైనా సంభవవిస్తున్నారు, ఆకారాది పరిణామాలకు, వయస్సు నాగరికత, వాతావరణం కూడా ఒకసారి దోహదం చేస్తుంది. ఒక సమాజ తరగతినుంచి, మరో విచిత్ర సమాజ తరగతికి వ్యక్తి మారినప్పుడు, అటువంటిమార్పు అసంభవమని
(౮/1
ఊహ కల్లినప్పుడు మనుష్యులను గుర్తుపట్టడం కష్టం, నాంఘిక మర్యాదలు, సంక్షిష్ట హృదయాలు, యుక్తులల్లే శక్తిమంతులు, వ్యక్తులను విభిన్న వాతావరణాలలో మరి విభిన్నంగా కనిపించడానికి ఆన్మారమౌతాయి. ప్రీ జీవితంలో తారసిల్లే అన్ని రకాల రంగాలలో ఒడుపుగా నటించిన రాణి, కొద్ధి ఆకారం మార్పుతో వినరీతమైన వాతావరణ చిత్రణలో గుర్తుపట్టబడని పరిస్థితులు కల్పించుకుంటుంది ఇది అసాధారణం, ఈ పా(త్ర చిత్రణవలెనే. వ్యక్తులు జీవితాలు అనుకున్నంత సులువుగా అర్ధం చేసుకోలేము. అనుభవం, వయస్సు, విజ్ఞానం పెరిగినకొలదీ మనిషి మనస్సులోని ఆలోచనలు చాలా లోతుగా దాక్కొంటాయి వ్యక్తి ప్రవర్తన నుంచి వ్యక్తి మనస్సుకు గాలంవసి పట్టుకోవటం ఆశలు, ఆదర్శాలు, భగ్నమయిన (బ్రతుకులు, పెనుతుఫానులోని ఊపులతో కనుల పండుగైన దృశ్యాన్ని అందిస్తుంది. కాని ఆ ఊపులోని సంఘర్షణ ఒక్కపదడవ యొక్క అనుభూతి మాత్రమే, ఆ అనుభూతి తనదిగా గుర్తించి, తట్టి,తరిచి అర్ధంచేసుకోగల శక్తి కళాకారునికే ఉంది. రాజారావు చక్రవర్తుల పాత్రల మందహాసాల వెనుక భగ్న హృదయాల్లో రగిలే అగ్ని జ్వాలలు, బాటలేని ఆపాంధుల అనంతయా(త్రలో వెడిసెగలు, పొగలు విరజిమ్ముతాయ. ఒకత్రుటిలో ఎప్పుడో మనస్సుగాడి తప్పి సుడిగుండంలో రాలిపోతుంది. బ్రతుకంతా ఒక సంఘర్షణ, ఆ వ్యక్తులకు కాని వారి బ్రతుకంతా ఒక రసవత్తరమయిన చిత్రణ, కళాకారులకు, నిమ్నోన్నతాలు లేని సామాన్య మానవునికంటే ఊపి కుదిపే, నిమ్నోన్నతాలు కలిగిన అసాధారణ సామాన్య మానవుదే ఉత్తమ సాహిత్య సృష్టికి జీవగజ్ఞి
మానవుని సాంఘీక పరిణామాలీ కుటుంబం యొక్క ఉన్నతదశ. మానవ సముదాయం పెరిగినకొలదీ ఏర్పడే జీవనపోటీ, మానవుడు పరస్పర సహాయం లేనిదే సుఖంగా మనలేని పరిస్థితి ఏర్పడడం వల్ల ఒకకుటుంబాన్ని ఎర్పరచు కోవలసివచ్చింది. శారీరక ఆవసరాల తృప్తితో పాటు, నియమితమయిన సాంఘీక జీవనం కోసం, రక్తసంబంధాల వ్యక్తులు ఒక గుంపుగా ఏర్పడి కుటుంబంగా పరణమించి, నాగరికతా (ప్రభంజనం పెరిగినకొలదీ మానవదృక్పధం మారుతుంది, రక్తసం బంధాల (ప్రాధాన్యం మీద ఏర్పడిన కుటుంబంలో సమిష్టి ఐక్యత, ఆదరణ, అభిమానం లోపించి, ఆరాచకమైన కుంటుబాలు పరిణమిస్తున్నాయి. మానవుని స్వార్ధం పెరిగినకొలదీ, మమతలు మరుగుపడిపోతున్నాయి సాంఘీక నియమాలు బాహ్యప్రదర్శనకే గాని, అంతర్గత విలువలు పెంచటంలేదు. ఆధునాతన నాగరిక ప్రభావములో వ్యక్తి జీవనస్థితిగతుల ఒత్తిడి పెరిగి, విరామంలేని జీవితంలో నియమబద్దంకాని సంబంధాలు పెంచుకొని, విచిత్ర కుటుంబాలు కూడా ఉద్భవిస్తున్నాయి. సంమంధాలు సాంఘీక నియమాల కనుగుణమైనా కాకపోయినా ఆత్మీయత ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులలోను దానిని కుటుంబంగా నిర్ణయించవచ్చు.
ళ1]
నాగరికత, విజ్ఞానం, మానవుని మేధ యొక్క పరిశోధన, పరాకష్ట పొందినకొలది, అనంతదూరంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడి, 9కుటుంబాలు ఉద్భవిస్తున్నాయి, మానవుని అవసరాల దృవ్ద్యా ఎర్పడిన సాంఘీక నియమాలే ఈ మారిన కాలంలో మరొక నిర్వచనం - అద్ధం పొందవలసి వస్తుంది వ్యక్తులు, బంధనాలు, సంబంధాలు, సాంఘీక నియమాలతో పాటు ఉద్రేకాలు, యుక్తులు, స్వార్ధం, బౌతికవాంఛలు, మొదలయినవి సృష్టిస్తున్నాయి వాటి ప్రయోజనాలు సిద్దించగానె జీవయాత్ర మధ్యలో ఆ సంబంధాలు తెగిపోతున్నాయి. కాకపోయినా కలతలతో జీవయాత్ర సాగుతోంది. మనోపరిపక్వతలేని పరిస్థితుల్లో ఎర్పడిన బంధనాలు, భౌతిక వాతావరణం సుడిగాలుల్లో తిరగడం తప్ప, నిశ్చలమైన ఆధ్యాత్మిక చింతనకు ఆన్మారమివ్వడం లేదు ప్రవర్తన, కలయిక మానసిక పరిణామాలు ఏవిధంగా ఉన్నా వ్యక్తుల సముదాయాన్ని కుటుంబంగా పరిగణించవచ్చు. అటువంటి కుటుంబాలే సమాజ సుస్థిర పటిష్టతకు మూలకందాలుగా ఉంటాయి
ఇంతవరకు వెలిబుచ్చిన నా దృక్పధం నా నవలకు ప్రాతిపదిక. నేను ఎంతవరకు సఫలీకృతుడినైనది సహృదయులైన వికర్శకులు పారకులు నిర్ణయించాలి.
కృతజ్ఞతలు
ఈ నవలకు తెలుగు భాషాసమితి (మద్రాసు) వారు ప్రథమ బహుమతి యిచ్చారు. ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో సిరియల్‌గా దీనిని ప్రచురించారు. ఈ నవల వ్రాసే నమయంలో మరొక (వ్రాత్యవతి (వ్రానిన మిత్రులు గరివెళ్ళ రామమూర్తి పి.యస్ యస్.రామమూర్తి, డి. లింకన్ చేసిన సహాయం మరువలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న నాకు ఆ సమయంలో, నిర్దిత కాలంలో యీ నవల పూర్తిచేయగలిగే జవసత్వాల నిచ్చి. ఆరోగ్యం కాపాడిన మిత్రులు డా॥ యు. రామవర్శగారి ఆదరణ _ చిరస్మరణీయం.
ఈ అన్వేషణ నవల హైదరాబాదు వాస్తవ్యులకు, ముఖ్యంగా తెలంగాణా తీరు తెన్నులు కల్గిన పెద్దలకు అంకితం చేయాలనుకున్నా అందుకు కారణం యీ నవలలో ఉన్నది. జంటనగరాల వాతావరణం. నా మాట వారించక శ్రీ మదుగంటి రామగోపాల రెడ్డిగారు ప్రధమ ముద్రణ అంకితం స్వీకరించటానికి అంగీకరించారు. ఉత్తమ [గ్రంధానికి స్వీకర్తగా శ్రీ రెడ్డిగారిలోని ఉదార స్వభావం, ఉదాత్త హృదయం నన్నాకర్షించాయి. తెలంగాణాలోని వివిధ సాంస్క లతిక సాహిత్యసంస్థల పురోభివృద్ధికి యధాశక్తి
౪111 దోహదంచేసిన శ్రీ రెడ్డిగారికి ఈ కృతి యివ్వడం నాకు చాలా హర్షద్రాయకం. శ్రీ రెడ్డిగారి ఆదరణకు నా నమోవాకాలు.
ఈ నవల ముద్రణ యిప్పటికే ఆలస్యమయింది. అయినా ఇంకా ఆలస్యం కాకుండా దీని స్వరూపం యీ విధంగా వ్యక్తపరచడానికి, ధైర్యం, సహాయం అందిచ్చిన మిత్రులు (కీ1శే) శ్రీ యం రఘు రామరావుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నవల ముద్రణలో ఎక్కువ బాధ్యత వహించి సహకరించిన శ్రీనివాస సోదరులకు కూడా నా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నా.
ఈ నవల రెండప ముద్రణ ఇన్నాళ్ళకి వెలుగులోకి వచ్చింది. ప్రధమ ముద్రణలో ఈ నవల మద్రాసు విశ్వవిద్యాలయం పార్యగ్రంధంగా ఎన్నిక చేయడంలో దీని విలువ గ్రహించి సహకరించిన పూజ్యులు శ్రీ నిడదవోలు వెంకటరావుగారికి కృతజ్ఞతలు తదుపరి అనేక మంది సద్విమర్శకుల మన్ననలు పొందినది యీ నవల, దీనిని ఆదరించిన, పాఠకులకు, సాహితీ లోకానికి నా ధన్యవాదాలు.
-=డాః! వోతుకూచి నాంబళివరావు.
1% గీ ౧0౫౬ 480౮] ౧౦1౧1౮౧౮౮౧!
|! ౧9406 50/ గ౧ం౪౧64గ640[౧1'5 శఉగి/౬35104ీగి గ 100 ౧69841 1౧16/851. 1! ౧2౪6 &2%4/8)/5 6౧౦66 1946100 ౧15 510౧65 ౧౭ 19 1౧ [౧6 10/9 - 1౧0౧1 425 4 ౪/౧6! ౦0+ 510గ65 1౧ 16140964, 42౧౦6 ౪౧41 15 ౧౧౦/6, ౧6 01౧008 10 126 &గ 01 5810౧/- 1611100 06౧41౧ 6౮6/౦110గ 38056 01 664౪/ 2౧6 1061810069 1౧౮౮540 ౧1060 ౧4౧౬ ౧1౧% 061 0౧) ౧6 (651. [19 15 41౧౦514౧ 4౧1౧0౧౫ 1/0100 1౧4౪2౫ 50౧6 0౧15 510/65 &/6 6%0615116. 4౧౪ ౧౦౪6| 0 ౧15 0౪18 10 06 [940 ౪/1౧ 161150, 06046456 ౧159 0౧414018౧5 &(6 [894 &౧౦ (౧96౧1౧16౧4. 2౧06 ౧6 12%695 0౧4105 10 ౧౦6[0౧/ 1౧6/౧ ౪00 4|| 161 12415 2౧౮ [౧౦౧౪౩౩. 116 6065 ౧౦ 504/6 ౧19 ౦0౧44016౧5, [౦| 6065 1౧8 504/6 [౧15 [64661/5, [0౧ 126 (6409౧5 0౦1 &!| 6 06614119, 4౧ 21౧౦51 ౧౦౧100 13 161 106 261 1౧4౮1౧410౧ 10 ౮/420016 ౪/౪
[106061 ౪/16 6౪/6౧ [౧ 1౧6 1616964 120౧0౪౬4౮6, ౧4/6 &|1౪/2/5 50120009 2 19౪4/ 0౧41201619 +0గ౧ 116 95116240) 01 1116, 2౧01 1౧ ౦౦౧౦౪౧41౧0 ౪౧౦౧ 061 ౧420౪69 4౧06 4011009 ౪౧౧10 & |॥౧|1601 (20069 015 [656415 1౧ ౧౧౦౧౦9౦౦౧6 95110౫/ 01 106 ౧6౮౧౧౭4౧ ౧౧1౧౦౮ &ఇ0౧6 ౧6౬గ. 1 61/65 & ౧101416 01 1168 1౧0611/106642| 4 ఉ065 ౧౦ ౧1014౧10 500180/ 5661/ 158 10640066 0౧|౫/ 10 1౧06 ఆగ6౧1 041 11 ౧౭5 [606[0645510[౧9 01126 [1౧06110641 [015 ౪/4౫/0౦01 161|1009 4 5100/ 1069 ౧౦1 0౧/6 & 0201001గ10 *౪16౪/ 01 116 0 01 1౧061/1664415 15 ౧౦౪1౧౦౮ 1౧ 116 2౧6 61100 105966. 50గ ౧౦౪౧6466౦౧ ౮౦065 ౧౦1 ౧౪|౦౧౮ 10 115 01458 0+౪/11196౧ 116 11463 & 0/0౪/6, 116 06118౪69 1౧ & 12/96 040౧౪45, [౧6 [౧6౪615 1౧ ౧౫4౧౪ ౦0౦010/5. ౧15 ౧61000] ౧౬౩ 115 ౮616065 061 1 ౧౬5 15 ౧౦౧౧౪౧౩౬౧౦ ౪1గ౧6465-1౧ 1200 గ౧డ౧౫ తీ౧౦1౧9 ౪/16 ౧1౦౧1 ౧౭౪6 142460౧ 50/1 ౧౦౧౮౪1౦౧19 541262 1౧6 1౧16651౧00 0౧440160 4గ[/౬804గ4ీ, 2౧0 ౧౦గ౧౧4)/66 0౧ ౧౪౧ 2౧౮6 0౧1/ ౧౧069౧ ౧6౧౦1౧6 615400019౧15, 9౧69, 3760099169 2౧6 200౧1/6గ౧9౧19 1౧918406 01 గ౧4|61౧00 ౧6౧ 4౧ 1౧౮1౪16644! &గ౫౦౧౮ గొడగ౧౪/ ౧౧0౪1౧౮ 420059 80 ౧4౧౫ 016! ౪/68 36౮6౬1) ౪౬110 666441/ 1060066 0౫ 06154000101%601 &౧6 0౧౪1, 2౧6 604411/ 11606 0౪ &20[౧167/6గ6గ౧1 2౧౮6 10౫. ౧0౧6 (614110/6 ౧656౧౦6 01 1౧6 ౧6/90[4&| 1౧1/056506011౪/6 9160౧6౧1 1౧ గీ|౪/౬55014%4%& 50061165 ౧౧౬|(6 1౧6 510౧/ 869౧) ౧౧6౦౧౬౧104!
ణీ
2౧౮6 14016100 [౧ 900౧0120610/. 86410౧ 1౧6 ౦006 ౧4౧0 116 ౧48 50 ౧౧౬౦౧ ౮[0595 4౧0 1//6౪4౧06/ 2౧౮6] ౧18 510౧/ 0 ఉీగి/౬5[గేగీగి!గి , 1౧ 50/1 ౧౦౪౧౪౮౧౦౧5 00601౧0 ౧4౧౮, 1265 ౪6౧ 0010%/ 1౧ 2౧౮6 ౪16 6[0౧/ ౧45 ౪1౧6౧) 09046456 1169 ౧౬౩ 1౧6౧. ల[౧6౪/56,11 15 ౧౬/6 10 €౧౮6౧9140౧6 ౪౧౫ 10% 15812౧06, 119 26100 0" గీ౪/655[గ4ఉగీకీి గడజగ65 9౪44౧ 4206 544064 4|గ౦౩1 661106[4161%/ గ660 డ24/2/ ₹0గ 940౧ ౦0106! &0/058 ౧9౭4గ౫/ 1176 /694/5 1౧౦౮౮౧ ౧45810౧ 5[00616 ౧42/6 6౧౪6౧ 1౧10 54506౧56 5/0 ౧౦106గ60౧| 158 0౫/ ౧౦ ౧6౬౧9౩ ౩/61 42౧౦16! 6౧1౪45 01 ౧15 0౪/౧ ౪/4/ 01510గ/ - 1611100 2౧6 ౧6 153 ౧459 |౧4161/ ౦6౪01661 10 ౧6 2 0 5100/ 1611100 ౧0౧౪ 1020౧ గొడగి/ ౦0106/5, 15 11౧6 - &౧ 41౧౧౦/96514016 104100 [118 ౧౦౪65 4౧౮౦ 500/1 510గ95 ౧4౪6 ౪/0౧ ౪/1606 [౧6000౧1100 2౧6 ౧/౧4156 | ౦౪9౧ ౪126 0006000 | ౪1980 ౧1౧
ఇ! 5000655 4౧0 6/1112౧09 1౧ ౧19 ౧6౧౧౫౬&౧5|౧౫|౧. | (6410 1౧0౧) ౧415100 0 0/11012100 1౧6 20144! 5100/ 4౧౮ (౧9 ౧౬౧౫ ౪1106 0౧౧4౧40165 1౧ 1 06046456 1౧19 ౧|౪1210౧/ ౧౦16 15 ౧౧0/6 0 4 9౧6/4] ౧44/6, 2౧౮ 11 15 10/ ౧8 [౧6940665 10 గ౧డగ8 1౧91 ౧౬గ|౦౮౪|4౧ 656%4195, 861 1౧4 61698 001 ౧6౪76౧1 ౧8
[90694100 ౧41! 6౧|౦/66 [16940100 1౧15 ౧౦౪౯|.
850౧౧4 ౪. 5౮8౧414 రికి! 6906110% 1౧౮1౧1, [/069[420401 "0/౧6 4౦౮౪004169 (6౧9౧౬.
క్షే
ఉదయ కిరణాల బంగారు కాంతులు (ప్రజలమయి, ఉషన్సులో తడిసి అద్దు తగిలే ఆకులను దూసుకుంటూ, ప్రపంచాన్ని అన్వషించాలన్నట్లు, సర్వవ్యాప్త మౌతున్నాయి. ఆ కిరణాల కాంతుల్లో నల్లత్రాచుల్లా పరుచుకు సమానంతరంగా పరుగిడుతున్నరైలుపట్టాలు నిగ నిగలాడుతున్నాయి. కనుచూపు మేర చివరలో తాత్కాలికంగా కలుసుకున్నట్లు ఆ రైలు పట్టాలు జీవితానికి గమ్యం తెలియక సతమత మవుతున్న యువకుడి గమనంలా భూమి మీద చుట్టుకున్నాయి. చుట్టుకున్న పట్టాలపై యౌవనపు ఉద్రేకాలా చక్రాల శబ్దాల గడబిడలతో, ఉత్సాహంగా కూత కూస్తూ, భవిష్యత్తులో బరువుగా వేలాడుతున్న సంవత్సరాల్లా పెట్టెలతో, జీవితాన్వేషణతో, ఎత్తుపల్లాల కొండలతో , మేకుల్లా నిలుచున్న తాటిచెట్లతో చుట్టూ ఆవరించుకొన్న ఆ ప్రకృతి పరుగెత్తే రైలుబండికి దారియిస్తూ సగౌరవంగా తప్పుకుంటోంది.
శివరాం రైలుపెట్టె కిటికిలోంచి తోంగిచూస్తూ ఆలోచించాడు అతని జీవితానికి. రైలు గమనానికి ఎన్నో పోలికలు కనిపించాయి. హరాత్తుగా బయలు దేరిన ఆ ప్రయాణం జీవితంలోని ఏ అంతరార్జాలు బుజువు చేస్తుందో! దూరంగాఉన్న క్రొత్త నగరంలో గెరుగని మనష్యుల సాంగత్యములో కక్రాత్తజీవితం దిద్దుకోవాలనుకున్న (ప్రయత్నం ఏమౌతుందో ! పురాతన సంప్రదాయాల భావా బంధాల్లో పాతుకుపోయి తుప్పుపట్టిన మనస్సుకు ఒరివిడి పెట్తాలనే వాంఛ, ఆశించిన ప్రేమ దూరమవగా అలమటించి కరుడు గట్టిన హృదయానికి ఉపశమనం కలిగించి గతం మరవాలనే బాధలకోరిక ఒకరూపం పాందుతాయా? సముద్రంలో పడిన మనిషి బలవంతంగా యీత తానుకూడ బలవంతంగా మేధాశక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బ్రతుకు కల్పన చేసుకోవలసి వస్తుంది.
లి అన్వేషణ
ఎండిన (మోడైన చెట్టు కొత్తగా వేసిన చిగురుటాకులు ప్రొద్దుటెండలో తళతళ మెరుస్తున్నాయి మామిడిచెట్టు నాకదాన్ని మాధవీలత అల్లుకొనటానికి ఎగబ్రాకుతొంది, అప్పుడే రెక్కలువస్తున్న ఒక పిచ్చిక పిల్ల ఎగరడానికి తల్లిదగ్గర పారాలు నేర్చుకుంటోంది. ఒక ఈతచెట్టుపై నున్న గూడులో, రైలుకట్ట క్రింద తుప్పల్లో మొలిచినచిన్న గడ్డిపూలు చిలిపిగా అనందంగా నృత్యం చేస్తున్నాయి. భవిష్యత్తు కలలతో. కాయలు కాసిన సితాఫలం చెట్టు పక్వదశకు వస్తున్నాయన్నట్లు, గర్భవతియైన స్రిలా గర్వంగా, గంభీరంగా నిండుగా కనిపిసోంది టెలిఫోను తీగలమీద పాలపిట్టలు సీలం తోకలు చూపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాయి పాలమ్మి (బ్రతికే గ్రామీణులు ఆవులమందను పచ్చికకోసం తోలుకు వెడుతున్నారు రైలుగమనంలో తిరిగిపోతున్న ఆ దృశ్యాలు, వేడెక్కిన మెదడు కలవరిస్తున్న ఆలోచనలా కదిలి అదృశ్యమై పోతున్నాయి.
అన్వేషించిన కొలది జీవితంలో కలిగే అనుభూతులతో, తారసిల్లే విచిత్ర వ్యక్తులతో జగతి ఎంతో రకమయం అవుతుంది. అందుకే ఒక్కసారి అనిపిస్తుంది-కలకాలం జగతిలోనే బ్రతుకు హాయిగాగడపాలని, జగతిలో విచిత్రమైన యాత్ర జరుపుతున్న యాత్రిక వీరుడిలా శివరాం ఆలోచనలతో ఒక మందస్మితంచెశాడు.
ఆ మూడవ తరగతి రైలుపెట్టె దేశంలోని బీద ప్రజల మ్యూజియమ్లా అగుపడు తోంది నిద్రలేచి మూఖాలు కడుక్కొన్న ప్రయాజీకుల శరీరాల్లోంచి గతరాత్రి మెతక వాసనలు వెలువడుతున్నాయి. రైలు బొగ్గు మెరికలు రాలిపడిన బెంచీల సంపర్కంతో నలుపే మాసిన ప్రయాణికుల దుస్తులు బద్దకస్తుల గతి జ్ఞప్తికి తెస్తున్నాయి. ఒక విద్యార్ధిహోల్దాలు పరుచుకొని ఏదోనవల పరిస్తున్నాడు. నిద్రలో ఏమి దొంగలింపబడ లేదుగదా అని. తెలంగాణా గ్రామీణ రైతు ఒక చుట్ట ముట్టించాడు. బెజవాడకు ముందు పలికే తెలుగు భాష మారిపోయి, ఉర్దు మిశ్రమంలో, మాటచివర “హై” లతో పెట్టె సందడిగా, రైలు గమనానికి ఊతపదాల్లా తయారయ్యింది. భార్యాభర్తలు వొకమూల కూర్చుని సరసంగా గృహవిషయాలు ముచ్చటించు కుంటున్నారు. క్రొత్తగా హైద్రాబాదుకు వస్తున్నఒక చౌదరికి సూటు వేసుకున్న పెద్దమనిషాకడు వింతలు, విశేషాలు వివరిస్తున్నాడు విడ్డూరంగా. కాషాయవస్తాలు ధరించిన ఒక విరాగి ఉదయం సూర్యుణ్ణి ధ్యానిస్తున్నట్లు నిమీలితనెత్రు డయ్యాడు. ఒక బిడ్డల తల్లి రైలు కిటికీలకు తన కోక ఉయ్యాలకట్టి, తన పిల్లవాణ్ణి అందులో పడుకోబెట్టి ఊపుతోంది. (గ్రుడ్డి బిచ్చగాడు రైలు పెట్టెలో దొంగతనంగా జొరబడి బతకమ్మపాట పాడటం మొదలెట్టాడు. అరటిపళ్ళు, బటానీలు, తేలుమందు, పుస్తకాలు, గులివి తెద్దులు, బొత్తాములు రిబ్బన్లు, అమ్ముతున్న వాళ్ళు ఒక పెట్టైెలోంచి
అన్వెషణ త్రి మరొక పెట్టెలోకి, రైలు నడుస్తూన్నప్పుడే, ప్రమాదాన్ని శంకించకుండా, రైలు పెట్టెల ఊచల సహాయంతో కదిలిపోతున్నారు పరిశీలించే వానికి కావలిసినంత పరిశోధన వస్తువు రైలు సెటైలోని ప్రి మనిషిలోనుకనిపిస్తుంది. ఏజీవి వెనకాల ఎంత చరిత్రుందో, ఆ చరిత్రఅర్ధం చేసుకోవాలంటే ఏం చేయాలో, అనే ఆలోచన శివరాంకు కలిగింది అయినా జీవతాలు ౨ర్దం చేసుకోవాలంటే లిష్తమాత్రపు చూపులో జరిగేపనా 7 రైలు పెట్టెమూల ఒంటరిగా కూర్చున్నఒక జవ్వనిముఖ్రక్షాళనానంతరం అద్దంలో తిలకం దిద్దుకుంటోంది. బక్కపలచగా వోట్టిగా నాజూకుగా, లేతమందార ప(త్రంలాంటి ముఖంలో చురుకుగా అంగంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి శివరాం హృదయంలో అణగారినఎన్నో గతస్మ్ఫృతులు వెలికిదెచ్చింది. సరిగ్గా ఆ అమ్మాయిలా ఉన్నా బేకపోయినా, చాలవరకు ఆ పోలికలే శివరాం మనస్సులోదాగొన్న మగువలోకూడ ఉన్నాయి అసలు జీవతంలో యింత ధైర్యం,మొండితనం, సాహసంగా దూరప్రయాణాలుచేసి క్రొత్త జీవితం రూపొందించుకోవాలనే కోరిక ఆ అమ్మ్నాయివల్లనే కలిగింది. మనస్సు అపహరించి, మమతలు అందివ్వని మగువలు మానవ జీవితొన్న మార్చిస్తారు. బాధగా ఒక నిట్టూర్పు విడిచాడు శివారం రైలు ప్రయాణంలో రాత్రి సరిగా నిద్రలేక రగా ఉబ్బిన కన్నుల్లో వేడి భాష్పాలు తారట్లాడాయి. గుండే ఆవేదనతో వేగంగా కొట్టుకుంది జీవితానికి సరిపడ్డా మనస్తాపం కలిగించిన శారదను ఎలా మర్చిపోగలడతను” ఉప్పోంగి వచ్చే శోకాన్ని, రైలు పెట్టిలోని జనం పరికించగలరనే భయంతో లోలోపలనే అణుచుకొన్నాడు శివరాం క్రితంసారి మొట్ట మొదటగా శారదను చూశాడు శివరాం. గుమ్మంలో అగిన జట్కాలోంచి దిగింది ఆమె బక్కపలుచని తెల్లని శరీరంలో, వంకీలు తిరిగిన శిరోజూలు ముడివడి దీర్హంగా (వేలాడే జడ చేత్తో ఆదెస్తూ సన్నని దోండపండులాంటి సెదాలతో, రీవిగా నవ్వుతూ గుమ్మంలో అడుగు పెట్టంది. ఆమె అమ్మమ్మ, చిట్టెమ్మ కూడ చేతంతమూట పుచ్చుకొని ఒంగిపోయిన నడుంతో తెల్లబడిన శిదోజూలతో తేరుకునే (బ్రతుకులోని బాధల బరువుతో ముడతలుపడిన శోకమూర్తిలా ఉన్న విచారవదనంతో శారద వెనకాలే దిగి వీధి అరుగుమీద కూలబడింది. శివరాం తాతయ్య (బ్రమ్మయ్యగారు పొలంవెళ్ళి (శ్రమతో బదలిక దీర్చుకుందామని కుర్చీలో ఒరిగి , అన్న గారి భార్యను, శారదను చూచి చటుక్కున లేవి సాదరంగా, సానుభూతితో లోపలికి ఆహ్వానించారు. అరుగుమీద కూర్చుని "ఒవకాశంగా, చదువుతున్న నవల మూసేశాడు శివరాం ఇంట్లోకి రాగానే శివరాం సుభద్రమ్మ, చెల్లెలు లక్ష్మీ, శారదను అమె అమ్మమ్మను చుట్టుముట్టారు సుభద్రమ్మ 'డ్రిబెట్టుకుని చిట్టెమ్మను, శారదను ఓదార్చింది పదేళ్ళ లక్ష్మీ పరిస్థితి అర్ధం కాక,
శ అన్వెషణ విచిత్రంగా మూగగా చూసింది చిట్టెమ్మవైపు. బ్రహ్మయ్యగారు ఒక్కపట్టు పొడుం సీల్చి రాత్రి అతిధుల భోజనాలకు ఎర్వాట్లు చెయ్యమని సుభద్రమ్మకు చెప్పి, ఆలోచిన్లూ అరుగుమిదికిపోయి కూర్చున్నారు
వయస్సు, ప్రపంచజ్ఞానము బాగా అలవడి పదిహేడేళ్ళు నిండి యువకుడౌతున్న శివరాం పరిస్థితి యిట్టి గ్రహించుకున్నాడు. శారద తల్లిదండ్రులు తీర్ణయాత్రలకు వెళ్ళి కృష్ణానదిలో పడవ (ప్రమాదంలో మునిగి చనిపోయారు. ఈ ఘోర వార్త విని తలబాదుకుంటూ చిట్టెమ్మ అనపర్తి వెళ్ళి మిగిలిన ఒక్క మనమరాలిని తనదగ్గరె ఇంక ఉంచుకొని పోషిద్ధామని తీసుకుని వచ్చింది. బ్రహ్మయ్యగారి సలహాప్రకారం రైలుదిగి. తిన్నగా ఆయన యింటిక శారదతో వచ్చింది చిట్టెమ్మ.
బ్రహ్మయ్యగారి ఆదేశంతో సుభద్రమ్మ వంటింట్లొకి ప్రవేశించింది. కాశ్ళు ముఖం కడుక్కొని చిట్టేమ్మకూడా పీటవేసుకొని వంటయింట్లోకి చేరింది.
ఏదో క్రొత్త స్నేహితురాలు దొరికినట్టు లక్ష్మీ మూగగా మెల్లిగా శారద దగ్గరకు
వెళ్ళి చెయ్యిపట్టుకొంది సన్నటి పెదవుల మధ్య దానిమ్మ గింజల్లా కనింపించే తెల్లటి పళ్ళవరుస చూపిస్తూ మెల్లిగా మందస్మితం చేసింది శారద స్నేహపూర్వకంగా :
పెద్దల బాధ్యత, బాధల వాతావరణం నుంచి యిద్దరూ ఒక్కక్షణంలో తప్పుకున్నారు, దొడ్గొ పాలేరు పక్కలు పరిచి ఉంచాడు. క్రింద నీళ్ళుచల్లి దొడ్డొని బొగడచెట్టు విచ్చిన పువ్వులతో కిలకిలనవ్వింది పిల్లగాలికి : ఆ బొగడచెట్టు క్రింద తెల్లదుప్పట్లమిదకు చెరారు లక్ష్మ, శారద,
దొడ్డొ కొళాయిలోంచి ఏకధారగా నీళ్ళు బిందెలో పడుతున్నాయి.
వాపేరు లక్ష్మీ! లక్ష్మి నవ్వుతూ అంది 'నా పేరు శారద ! లక్ష్మీ బుజంమీద చెయ్యివేసి దగ్గరగా తీసుకుంది శారద. మాటలు దొర్లాయి కులాసాగా, మరుక్షణంలో వారి మనస్సులు కలిసిపోయాయి.
శివరాం దొడ్డివైవునున్న వరండాలో నిలుచుని శారదవైపు చూశాడు, సంధ్యారుణరాగంలో కొద్ది ఎదుపుపూతల లాలిత్యంతో తొణికిసలాడుతున్న శారద, చిన్న పువ్వుల తెల్లవాయిలు చీరలో అందాలరాశిలా దర్శనీయంగా అగుపడింది.
సుఖ(ద్రమ్మ దొగ్గొ రుబ్బురోలులో వేసి రుబ్బుతున్న కందిపచ్చడి వద్దకు.
అన్వేషణ గ్
నోరూరతున్న భంగిమలో పెదవులు తడుపుకుంటూ నిలుచున్న ఆ పిల్లలను చూచి సరదాగా సుభద్రమ్మ కొంచెము పచ్చడి వాళ్ళ చేతుల్లో రాల్చింది. 'అమ్మా! అన్నయ్యకు కూడా పెట్టవే... వరండాలో యిందా కటినుంచి నిలుచున్నాడు.! లక్ష్మి చిలిపిగా అన్నను హేళన చేసింది. శివరాం తల్లి దగ్గరగావచ్చి నిలుచున్నాడు
“మీ అన్నయ్య ?” శారద మెరుస్తున్న కళ్ళతో శివరాం వైపు తిరిగి మందస్మితం చేసింది. శివరాంకూడా గవ్వాడు.
“చదువు కుంటున్నావా?” అదిగాడు శివరాం.
“పోర్తుఫారం పరీక్షకు వళ్ళాను!”
మాష్టరుగారు ప్రశ్నకు సమాధానమిచ్చినట్లు చెప్పింది శారద! 'నేను స్కూల్ఫైనలు పరీక్షకు వెళ్ళాను” రీవిగా బుజాలెగరేశాడు శివరాం.
'మా అన్నయ్య ఆస్తమానం నాతో తగువులాడుతాడు నువ్వు నాజట్టా? అన్నయ్యజట్టాగ్ లక్ష్మి శారదను చెయ్యి పుచ్చుకుని ప్రక్కకిలాగింది.
'ఇద్దరిజట్టూను” నవ్వింది శాదర. 'ఇంక నీతో దెబ్బలాడను చెల్లాయీ!” శివరాం మాటలకు అభిమానంతో గట్టిగా నవ్వింది లక్ష్మీ శారద, కిలకిల నవ్వింది కజ్ఞాకు కాలుదువ్వి, చిలిపిగాసవాలు చేసినట్టు చూసింది శారద. శారదతో కజ్ఞా పెట్టుకుంటే సరదాగా ఉండేలా ఉంధి అనుకున్నాడు శివరాం,
“నీకు మంచికధలు వచ్చా?” శారద ఏదో ఆలోచిసూ అడిగింది.
'చెప్పనా 7? శివరాం ఆత్రుతగా మంచంమీద ప్రక్కగా కూర్చున్నాడు.
చంద్రవంక వెన్నెల్లో బొగడచెట్టు కొమ్మల నీదల్లో, పిల్లగాలుల అలల్లో, ఆనందంగా కధలు చెప్పుకుంటూ కులసాగా గడుపుతున్న ఆ ముగ్గురినిచూసిస్నానము చేద్దామని దాడొకి వచ్చిన (బ్రహ్మయ్యగారు జాలిగా, భాధగా, భాధలోంచి ఉద్భవించే అప్యాయ్యతతో, ఒకకన్నీటిచుక్క వదాలారు. తాను (బ్రతికుండగా చెట్టంతకొడుకు చనిపోవడం, అన్నగారి మ్రరణానంతరము ఒంటరిగా (బ్రతుకుతున్న ఒదినెగారు జీవితంలో ఒక్కకూతుర్ని
"గాట్టుకోవడం కళ్ళముందు తిరిగి (బ్రహ్మయ్యగారు నిట్బర్బారు. పెద్దతనంలో
౮ అన్వేషణ బాధ్యతలలతో బ్రతకవలసివచ్చిందనే బాధకంటే, తల్లిదండ్రుల (ైమతో బ్రహ్మయ్య గౌరు లోలోపల కుమిలిపోయారు. తువ్వాలు చ్చుకొని కుళాయిక్రింద కూలబడ్డారు మహ్మయ్యగారు. 'తాతయ్యా! నడ్డి రుద్దనా* * శివరాం దగ్గరికి చేరాడు. “తాతయ్య! నీవంటికి సబ్బు పట్టించనా?” లక్ష్మీ గెంతుతూనేమెలిలా బ్రహ్మయ్యగారి రగ్గరకు వచ్చి నిలబడింది. కుళాయిధారలో స్నానంచేస్తున్న బ్రహ్మయ్యగారు తల నీళ్ళనితుడుచుకుంటూ, పిల్లల్నిచూసి సరదాగా నవ్వాడు ఎరమరికలేక పిల్లలతో కలిసిపోయిన శారదనుచూసి చిట్టెమ్మ లోలోపల ఆనందంతో కొంత మనశ్వాంతి వొందింది. హరికేనులైటు వెలుగులో, అమాయకమైన కబుర్లతో, ఏదో అల్లరిచేస్తూ, మామిడిపండ్లరసం జుర్రుతూ,భోజనాలు చేశారు పిల్లలు బ్రహ్మయ్యగారితో. పుల్లదనంలోంచి తీయదనం పొందిన మామిడిపండులా, బాధల్లోంచి ఆనందం పొందారు వయస్సుతో కుంగిన (బబ్రహ్మయ్యగారు. దొడ్గొ తెలదుప్పట్లతో మెరుస్తున్న పక్కలమీద ఒరిగారు అంతా. శివరాం బ్రహ్మయ్యగారి మంచముమీదకు చేరాడు. లక్ష్మీ సుభద్రమ్మఒడిలో దూరింది. చిట్టెమ్మ శారద కురులునిమురుతూ హళ్లుకుని మంచము మీద పడుకుంది. బ్రహ్మయ్యగారు అలసి ఉండటంచేత గుర్రు పెట్టి నిద్రలో ముని గారు. తక్కిన మంచాలమీది జనం కూడా సుపిప్తిలో సొమ్మసిల్లి పాయారు. శివరాం ఆకాశం వైపు చూశాడు. నిర్మలమైన ఆకాశంలో తెల్ల దూదిలాంటి మబ్బులు తేలుతున్నాయి మబ్బుల మాటుల్లోంచి తారలు మిణుకు మంటున్నాయి. కాంతివంతమైన వెలుగుతో చంద్రుడు కిల కిల లాడుతున్నాడు. అలా చూస్తూఉంటే జీవితం అంతా హాయి అనిపించింది. శారదను చూడగానే ఏదో అభిమానం ఏర్పడి శివరాం హృదయంలో ఏదో సన్ని హితత్వం ఏర్పడింది పలచగా, గుడ్రంగా చంద్రబింబంబా మెరుస్తున్న శారద ముఖము మీద బొగడపూలురాలి కురులలో దూరి సొగసుగా నిలుచున్నాయి.
అన్వేషణ 7
'శారద చాలా మంచి పిల్ల !" అనుకొని లోలోపల నవ్వుకొని బ్రహ్మయ్యగారి పక్షంలోకి ముఖం దూర్చి కళ్ళు మూసుకున్నాడు శివరాం,
వారం రోజులు గడిచాయి. శివరాం, శారద పేకాట, గవ్వలు, కేరమ్బు, ఆదుకుంటూ, లక్ష్మితో దాగుడుమూతలు పరుగుపందాలు జరుపుతూ కాలం గడిపారు వారం గడిచాక చిట్టెమ్మ, శారదను తీసుకొని ప్రక్కవీధిలోని స్వంతయింటికి వెళ్ళిపోయింది.
ప్రతిరోజు వీలుచేసుకొని శివరాం, లక్ష్మి, శారదను చూడటానికి చిట్టెమ్మ యింటికి వెళ్ళి వచ్చేవారు. తర్వాత స్మూళ్ళు తెరిచారు శారద ఐదవ ఫారంలో చేరింది శివరాం ఇంటర్లో ప్రవేశించాడు. లక్ష్మీ రెండవ ఫారంలోకి వచ్చింది. చదువుల గడబిడలో రెండు సంవత్సరాలు గడిచియాయి.
ఆ రెండు సంవత్సరాలలో శారద రూపంలో మారింది ఒళ్ళుచెసింది బుగ్గలు నున్ననై, నవ్వులో, సిగ్గులో సొట్టలు పడుతున్నాయి. మెరిసే కళ్లలొ చిలిపితనం తొంగిచూస్తున్నది. వోయిగా కిలకిల మునుపు నవ్వే శారద అదోలా మృదువుగా, బీగువుగా, లజ్జగా మందస్మితం చెయసాగింది
ఒకరోజు శివరాం చిట్టమ్మయింటికి వెళ్ళాడు. వసారాలో బల్ల ఉయ్యాలమీద కూర్చుని జేబు రుమాలుపై అల్లిక ఏదో కుడుతోంది శారద, తలంటుతో స్వేచ్చగా విదివిడిన వంకీలజుట్ట్లు శారదకు క్రొత్త అందం యిచ్చింది గులాఖీరంగు చీరకట్టుకుని రేకులు విచ్చుకున్న గులాబీలా ఉయ్యాలలో ఊగింది శారద.
“ఎమిటి కుడుతున్నావు?” శివరాం, శారద చెయ్యి పట్టుకున్నాడు.
నిన్నె కుడుతున్నా !”
శివరాం జేబురుమాలు చూశాడు. తనపేరు ఎర్రగులాబీ రేకుల్లా ఆ రుమాలుమీద అల్లుకుంది.
“నన్ను నిజంగానే కుట్టెవు ? నవ్వాడు శివరాం, జేబురుమమాలు లాక్కుంది శారద.
'రుమాలుమీద కాదు !? అన్న శివరాం మాటలకు శారద పకపక నవ్వింది.
పేరుకుట్టిన రుమాలు మెల్లిగా శివరాం జేబులో కుక్కింది శారద.
శివరాం శారద బుగ్గ నిమిరాడు. శారద సిగ్గుపడి లోపలికి పరుగెత్తి వెళ్లిపోయింది. అమ్మమ్మా? శివరాంబావ వచ్చాడే !? గట్టిగా పిలిచింది శారద.
ప్ర అన్వేషణ
లక్ష్మిని తోడు తీసుకుని, శివరాం శారద కలిసి సినిమాలకు వెళ్ళడం, పార్కులో సాయంకాలం గడపడం పరిపాటైవోయింది.
శారద కాలేజిలో చేరింది. చేరిన నాల్లునెలల్లో ఎంతో మార్పు, కట్టులో, నడకలో, మాటలో, భావంలో, పూర్తిగా మార్పు కనిపించింది శివరాంకు, ఆమె యింట్లో ఆద స్నేహీతులు పెరిగిపోయారు తరచు ఎవరో విద్యార్థులుకూదా వస్తూ ఏదో సంభాషణలతో చాలా కాలం గడిపేవారు. శివరాం వచ్చినప్పుడు కాస్సేపు మాట్లాడి స్నేహితులతో పనివుందని వెళ్ళిపోయేది శారద. కాలేజి ఎన్నికలలో వ్యక్షృత్వపు పోటీలలో, నాటకాలలో వొల్లొని బహుమతులు సంపాదించేది ఆ బహుమతులు చూసి మురిసిపోయేది. చిట్టెమ్మ.
శారద ఇంటర్ రెండవ సంవత్సరములోకి వచ్చింది శివరాం బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. శారద సరదాగా శివరాంతో మాట్లాడుతున్నా మునుపు కనబరచినంత ఆత్రుత, ఆదరణ చూపించటం లేదని శివరాం అనుమానపడి బాధపడేవాడు కాలేజీ కార్యక్రమాలలో చదువులతో స్నేహితుల సాంగత్యముతో తీరుబడి లేకపోవడం నిజమైనా, శారదలో ఏదో మార్పు వున్నట్లుమాత్రం స్పురించింది శివరాంకు.
శివరాం ఒకరోజు సినిమాకు వెళ్ళాడు సోఫాలలో వెనుకగా శారద, మాధవరావు కనిపించారు, శారద శివరాంను చూచి నవ్వింది. మాధవరావు శివరాం తోటివిద్యాగర్ది. ఆ ఏడు కాలేజి విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడు బాగా డబ్బున్నవాడు. అంధమైనవాడు. శివరాంకన్న పదింట్లు హోదా కనపరిచే మనిషి మాటల చాకచక్యంతో మనుష్యుల స్నేహము సంపాదించే నేర్పుగల మాధవరావుకు శారద స్నేహం అంత కష్టం లీకుండానే లభించింది కాలేజి కార్యక్రమాలలో కొంత ఘనత వహించిన మాధవరావుకు మక్కువగా చూచిన శారదకు అతని ధనం, అందం, హోదా, ఆమెను యింకా ఎక్కువ ఆకర్షించి అతనికి దగ్గరగా తీసు కువెళ్ళాయి శారదప్రక్శనే మాధవరావును సినిమాలో చూడనానే మాత్సర్యంతో మనస్సులోనే బాధపడ్డాడు శివరాం.
కొంతకాలం శివరాం శారదతో మాట్లాడలేదు కోపంతో, అతని కోపం లెక్కచేసినట్టు కనబడలేదు శారద, ఆమె నిర్లక్ష్యం శివరాం గుండెల్లో బల్లెం పుచ్చుకొని పొడిచినట్టు బాధపడ్డాడు.
బి.ఎ. పరీక్షలైపోయాయి. ఇంక దినచర్యలో ముఖ్యమైన చదువు ముగియడంతో, తీరిక పెరిగి, శివరాం మనస్సు శారదగురించి పరిపరివిధాల ఆలోచించింది. కాలేజీలో శారదతో వ-టాడదడం మానినందుకు నొచ్చుకున్నాడు.
అన్వేషణ ట్ర
ఒకరోజు శారదను చూడాలని చిట్టెమ్మ యింటికి వెళ్ళాడు శివరాం.
శారద తన స్నేహితులతో పేకాడుతూ కూర్చింది. శివరాం వచ్చిన సంగతి గమనించీ గమనించనట్లు ఊరుకుంది శివరాం, ఆలమారులోని నవల తీసుకొని చదువుతూ కాస్సేపు కూర్చున్నాడు. మరి కొంతసేపు చిట్టెమ్మతో ఏవో కబుర్లు చెప్పాడు.
స్నేహితులు వెళ్ళిపోయాక, శారద తన గదిలోకి వెళ్ళింది. శివరాం ఆమెను అనుసరించాడు.
“శారదా!”
మౌనం వపొంచింది శారద.
“నీతో మాట్లాడాలి!”
“ఏమిటి '....... ఎందుకు ?” కసిరింది శారద.
“నీతో యింతకాలం మాట్లాడనందుకు, క్షమాపణ చెప్పు కుంటున్నా!
“అనవసరం! కటువుగా మాట (త్రెంచింది ఆమె.
శారదా 1...........అప్యాయంగా జాలిగా, దినంగా శివరాం శారదకు దగ్గరగా వెళ్ళాడు.
“ఇక నుంచి నా గదిలోకి రావద్దు” ముఖం త్రిప్పుకుని కిటికి లోంచి వీధిలోకి చూసింది శారద.
“శారదా ? .... .. క్షమాపణ చెప్పుకుంటున్నా... ...” శివరాం మాటలు నమిలాడు. మౌనంగా తన పెట్టెలో చీరలు వెతుకుతూ ఏదో ఏరుతోంది ఆమె.
“శారద ! నువ్వ ఒప్పుకుంటే - మన పెళ్ళి......తాతయ్యతో చెబుతాను
“ఏమిటీ ?” గట్టిగా అరిచింది శారద.
ఆమె కంద్లు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి.
'శివరాం!... ..నన్ను అనవసరంగా విసింగించకు, నువ్వు వెళ్ళు 7 శారద దిజఒలున పెట్టెమూసి, ఒక సిల్ముబిర తీసుకొని మరో గదిలోకి వెళ్ళిపోయింది.
కావా” అని పిలిచే శారద పేరుపెట్టి సంభోదించినందుకు చకితుడయ్యాడు శివరాం,
కేటి అన్వేషణ
మాధవరావు స్నేహం వల్ల, శివరాంకు అసూయ కలిగి మాట్లాడం మానేశాదని గుర్తించిన శారద ఏమీ విచారించలేదు, ఆమె కళ్ళకు శివరాంకన్న మూధవరావే ఎన్నో విధాల తగిన స్నేహితుడిలా కనిపించాడు అవసరమైతే మాధవరావుతో స్నేహం పెంచుకుని, పెండ్లి చేసుకోవాలనే కోరికకూడ కలిగింది శారదకు.
కాలం మార్పుతోపాటు మనస్సులోని కోర్కెలుకూడా మార్చుకున్న శారద శివరాంతో ఘర్షణ పెట్టుకోదలిచింది కనిపించిన శివరాంను నిరసనతో చూసి కదిలిపోయింది.
మళ్ళీ శారదవచ్చి మాట్లాడుతుందనుకుని మౌనంగా ఏదో పుస్తకంలోకి వరధ్యాన్నంగా చూస్తూ పేజీలు త్రిప్పుతూ నిలబడ్డాడు శివరాం కాస్సేపు గులాబీ సిల్కు చీర, నల్లని రవిక తొడుక్కుని ఎత్తు మడమల స్లిఫ్పర్సుతో, చేతిలో వేనిటీబేగ్ పట్టుకుని, బర్మా కొప్పలో తురుముకున్న మల్లెదండలు సరిచూసుకుంటు “అమ్మమ్మా? నేను సినిమాకు వెడుతున్నా! నంటు శివరాం కళ్ళ ఎదుటే గర్వంగా వెళ్ళివోయింది శారద.
శివరాం భాధతో కుమిలిపోయేడు హృదయంలో ఎంతో అనురాగం పెంచుకుని శారద గురించి తన భావజీవితంలో ఎన్నో కలలుకన్న శివరాం ఒంటరిగా పొర్ముకుపోయి ఒక మూల కూరోఏని వెక్కి వెక్కి ఏద్పాడు శరీరమంతా సూదులు (గుచ్చుకున్నట్లు మూల్లేడు. జీవితంలో పూర్తి ఆనందం కోలుపోయినట్లు దురపిల్లాడు మాధవరావును హత్యచేయాలన్న ఉద్వేగంతో, రోషంతో, ఉద్రేకంతో కంపించిపోయాడు.
మరొకసారి శారదకు మనసార పలకరించి మాట్లాడాలని మర్నాడు శివరాం ఆమె యింటికి మళ్ళి వెళ్ళాడు.
'₹్రంరదా !..... నేను సినిమాకు వెడుతున్నా వస్తావా!
'రాను !.
శివరాం గుండెల్లో దెబ్బతిన్న పక్షిలా లోలోపల బాధతో గిలగిల కొట్టుకున్నాడు.
'శారదా..... .ఇంక ......యింతేనా?'
'ఆ......ఇంతే? ముభావంగా కటువుగా సమాధాన మిచ్చింది ఆమె.
స్త్రీ హృదయాన్ని ఆర్ధం చేసుకోవడం కష్టం అనే సంగతి శివరాంకు దృఢపడింది మనిషి నడత వెనకాల దాగొన్న మనస్సు లోని భావాలు పరిశోధించడం, అర్ధం చేసుకోవడం వాటికి అనుగుణ్యముగా నడుచుకోవడం ఒక పెద్ద కళ, స్రీ హృదయానికి దగ్గరగా
అన్వేషణ [1 చేరాలంటే కళలో నేర్పు చాలా అవసరం (బ్రతుకులోని ప్రధమ పాదంలో తారసిల్లిన ఆడదానితో ఏర్పడిన సంఘర్షణను ఏ విధంగా తట్టుకోవాలో అర్ధం కాలేదు శివరాంకు.
'శారధా.. ... వెళ్ళివామ్మన్నావా!'
'మంచిది.!
మళ్ళీ రావచ్చా?
'ఎవరికోసం.....ఎందుకు ? వ్యంగ్యంగా హేళనగా నవ్వింది శారద.
(ప్రేమను తిరస్కరించి అవమానం చేస్తున్న ఆ ఆడదాన్ని ఏ విధంగా హింసించాలా అనే క్రోధంతో సతమతమయ్యాడు శివరాం సక్రమంగా (ప్రేమను మార్చుకుని జీవితగతిని దిద్ధుకుంటానన్న యువతిని అర్ధం చేసుకొని చేరదీయ వేయవచ్చు గాని, అహంకారంతో, గర్వంతో (పేమికుని అవమానపరచ నుంకించిన స్త్రీపై ఏఫ్రతీకారం చేస్తే బాగుంటుంది అనే తీవ్రాలోచనలో పద్దాడు శివరాం.
'లక్ష్మీ..... శారద మన యింటికి రావటంలేదే!” మర్నాడు చెల్లెలుతో ప్రసంగము కదిపాడు శివరాం. చెల్లెలు ద్వారానైనా శారదను మచ్చికచేసుకుని మునుపటి స్నేహము పెంచుకోవాలనే కోరిక శివరాంకు కలిగింది
'ఏమో!.... నేను రమ్మన్నాను.....కానీ రావడంలేదు! అన్నయ్య మనస్తత్వం కొద్దినా అర్ధం చేసుకున్న లక్ష్మి తనవల్ల ఏమీకాదని ముభావంగా ఊరుకుంది.
బ్రహ్మయ్యగారికి ఒక రోజు ప్రొద్దున్న ఒక విచిత్రమైన ఆలోచన తట్టింది. తక్షణం సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళాడు.
“అమ్మాయి !.....మనశివరాంకు పెళ్ళిచేయాలని ఉంది!” అన్నాడు ముక్కుపొడుము పీలుసూ,.
'మీ యిష్టం ! మర్యాదగా మామగారికి సమాధాన మిచ్చింది సుభద్రమ్మ.
'మనవాడి బి.ఏ. యీఏడు పూర్తయిపోతుంది. శారదకు ఇంటర్ పరీక్ష అయిపోయింది. ఆడదానికి ఇంకా చదువులెందుకూ.... పైగా వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉన్నట్లు కనిపించారు...... నీకిష్టమైతే చిట్టెమ్మతో మాట్లాడుతా?........”
సుభద్రమ్మ తన కొడుకు మనస్సు కొంతవరకు అర్ధంచేసుకుంది. శారద యీ మధ్య తమ యింటికి రాకపోవడంతో, శివరాం దీనంగా పరధ్యానంగా ఆలోచనలతో రోజులు
12 అన్వేషణ గడుపుతూండడం పరికించిన సుభద్రమ్మ మామగారితో మాత్రం తన మనుస్సులోని అనుమానం చెప్పదలచుకోలేదు. బ్రహ్మయ్యగారు పెళ్ళి సంగతి కదిపితే పిల్లలు కోపాలుతగ్జి, తిరిగి ఆనందంగా కలుసుకుంటారని ఆశించింది సుభద్రమ్మ.
స్నానంచేసి తెల్లని ధోవతి, చొక్కా తొడుక్కుని కర్ర చెత్తో ఊపుకుంటూ చిట్టెమ్మ ఇంటికి వెళ్ళారు బ్రహ్మయ్యగారు.
'రా.....తాతయ్యా'? శారద బ్రహ్మయ్యగారిని ఆహ్వానించి ఉయ్యాలమీద కూర్చోపెట్టింది.
“మాఇంటికి యామధ్య రావడం మానేశావేమే ?' బ్రహ్మయ్యగారు శారదను దగ్గరగా సిమిరారు.
'పరీక్షలు కదూ,...... చదుకోవలసివచ్చి తీరికలేక.......”
సమానధాం (బ్రహ్మయ్యగారికి సంతృప్తి ఇచ్చింది. అయినా ఎదిగినపిల్ల అస్తమానం వీధుల్లో తిరగడం భావ్యం కాదనుకున్న బ్రహ్మయ్యగారు శారద యీ సంగతిగూడ గుర్తించిన తెలివైనపిల్ల అనుకున్నాడు.
“వదినా.......ఒక ముఖ్యవిషయం మాడ్డాడాలని వచ్చాను... యీ వేసంగిలో శివరాం పెళ్ళి చేసెయ్యా లనుకుంటున్నా...... నేను నువ్వు ఎంతకాలం బ్రతుకుతాం....... శారద 'ఉ' అంటే మర్నాడే లగ్నం నిశ్చయిస్తాను!”
శారద టత్రుళ్ళిపడింది. చికాకుగా ముఖం ప్రక్కకు (త్రిప్పుకుంది. శివరాం మీద ఎక్కువ ఏహ్యభావం లేకపోయినా, మాధవ రావు మీద మక్కువ పెంచుకున్న శారదకు యీ మాటలు ములుకుల్లా చెవుల్లో గుచ్చుకున్నాయి.
“శారద యిస్టం........నొూ సలహా ఏముంది?” చిట్టెమ్మ ముభావంగా ఒక నవ్వు నవ్వింది. శివరాం అంటే చిట్టెమ్మకు చాలా అభిమానం, తెలివైనవాడూ, బుద్దిమంతుడూ అని.
తండ్రి చనిపోయి నప్పటినుంచి తాతగారి యింట్లో వుంటూ (శద్ధాశుక్తులతో, వినయ వధేయతలతో మెలిగే శివరాం, శారదకు ఈడుజోడైన భర్త అని చిట్టెమ్మ ఏనాడో తీర్మానించుకుంది.
“'వఏమంటావు.......శారదా!” బోసినవ్వు నవ్వుతూ (బబహయ్యగారు ఒక్కపట్టు ముక్కుపొడుం నాసి కారంధ్రాల్లోకి దట్టించి అనందంగా ఆ(ఘ్రాణించారు.
అన్వేషణ 18
“ఇప్పడు... .. పెళ్ళికి .... తొందరేమొచ్చింది.......'నసిగింది శారద, ఈడువచ్చినపిల్ల యింతకన్న ఏమంటుంది......సరెలే నీ పెళ్ళికి లగ్నం పెదతాగా!”
అంటూ హాయిగా నవ్వుతూ శారదకు యీ పెళ్ళి యిష్టమే అన్న భావనతో బ్రహ్మయ్యగారు కార్యక్రమం గురించి ఆలోచిస్తూ గబగబ వెళ్ళిపోయారు.
'అమ్మమ్మా.....' శారద నీల్లింది బ్రహ్మయ్యగారు వెళ్ళిపోయాక.
ఏం
“....నాకు ..... యీ పెళ్ళి........వద్దు'
శివరాం బుద్ధిమంతుడు......మంచివాడు!
“అది నాకు తెల్సు........కాని నే పెళ్ళి చేసుకోను.”
చిట్టెమ్మ ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. (బ్రతికిఉన్న ఒక్క మనుమరాలిని గారాబంగా పెంచి ఆమె కోర్కెలు తీర్చి అమెకు ఆనందం చేకూర్చాలనే అభిలాషతో వున్న ఆ ముసలావిడకు శారద మనస్సు నాప్ఫించటం యిష్టం లేకపోయింది.
“నువ్వు కాదంటే.... ఎవరేం చెయ్యగలరు!”...... అయినా ఒక సారి ఆలోచించమ్మా!
చిట్టెమ్మ నచ్చచెప్పి వంటింట్లోకి వెళ్ళివోయింది.
శారద తీవ్రంగా ఆలోచించసాగింది. మాధవరావును కలుసుకుని తన భావిజీవితం గురించి నిర్ణయించాలని నిశ్చయించుకుంది.
బ్రహ్మయ్యగారు మర్నాడు పెళ్ళికి ముహూర్తం నిశ్చయించుకుని చిట్టెమ్మదగ్గరికి వచ్చారు. చిట్టెమ్మ మనుమరాలిని మరోసారి యీ సంగతి అడిగిచూడమని బ్రహ్మయ్యగారికి సలహా యిచ్చింది.
“ల్లీ యిష్టం” అని ఊరుకుంది శారద మనస్సులోని విషయం పైకి చెప్పడం యిష్టం లేక.
“నాకు తెలుసు.......మనకు తెలియకుండా ఏనాడో వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకొన్నారే!” పకపక నవ్వారు బ్రహ్మయ్యగారు.
ఈ పరిస్థితి పరికించిన శివరాం అశతో ఒక్కసారి ఆనందించాడు బహుశా శారద తన మనస్సు మార్చుకొని మునుపటి స్నేహం అందించగలదని మురిసిపోయాడు.
న! అన్వేషణ
వారం రోజులు యింకా పెండ్లిముహూర్తముందనగా, శారద పారిపోయింది. చిట్టెమ్మ లబోదిబోమని తల మొత్తుకుంది. బ్రహ్మయ్యగారు కొయ్యబొమ్మలా ఆశ్చర్యపోయారు. శారద ప్రవర్తన ఎరుగున్న సుభద్రమ్మకు యీ వార్త అశ్చర్యం కలిగించలేదుగాని వంశ ప్రతిష్ట గంగలో కలుపుతూ లేచిపోయిందేమని బాధపడింది శివరాం గుండెలు బ్రద్దలైనంత విలపించాడు పిచ్చివాడిలా ఒంటరిగా బాధపడ్డాడు “అడదాని హృదయం అర్ధంకాని వస్తువు” అని నిర్ణయించుకున్నాడు. భగ్నమైన (పేమబ్రతుకులో వేసిన బడబానలం తన్ను పూర్తిగా భిన్నం చెసి (క్రొత్తరూపు యిచ్చేలా అగుపించింది బ్రతుకులో విరక్తి స్రీమీద ఏహ్యభావం, శివరాం మనస్సులో ఉదయించి వళ్ళు నాటుకున్నాయి. నాల్గుగోడల మధ్యలో, రెండు కళ్ళకు ఎదురుగా కనిపించే వ్యక్తులపై పెంచుకున్న మమకారపు మంచుతెరలు ఒక్కసారిగా విడిపోయాయి అనంతమైన ప్రకృతి, విశాలమైన ప్రపంచం ఎదురుగా శివరాం కళ్ళకు కనిపించాయి. ఒక (స్రీవల్ల కట్టిన అవమానం. పరాభవం, తిరస్కృతి (ప్రేమయిచ్చే దుర్భరమైన బాధనుంచి తప్పుకునిజీవితం సక్రమంగా గడపాలంటే, విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి, జీవితవిధానమే మార్చుకోవాలనిపించింది. శివరాంకు.
“ఆ నిశ్చయం పరిణామమే నేటి పర్యటన!” రైలు వేగంలో వేగంగా కంటిముందు తిరిగింది గత చరిత్ర. రైలు పెట్టెలోని ఆ అమ్మాయి స్వరూపం గత స్మృతులను కెలికింది. శివరాం బాధగా నిట్టూర్చాడు.
తల నెరిసిన తాతగారొకరు రైలుపెట్టెలో మూలగ ఆలోచనలతో పెట్టె ఉపరిభాగం తదేక ధ్యానంతో చూస్తున్నారు. ఆ తాతను చూస్తుంటే బ్రహ్మయ్యగారు కళ్ళముందు కనిపించారు. శివరాంకు వడిలిపోయి ముడతలుపడిన శరీరం అజానుబాహుడు, నెరసిన వెంట్రుకలలో జ్ఞాన వృద్ధులా గంభీరంగా కనిపించే మనిషి.... బ్రహ్మయ్యగారికి కూడా కోపం తెప్పించాడు శివరాం. ఆయన కోరిక కాదని యిల్లు విడిచి వచ్చేయడమే బ్రహృ్మయ్యగ్గారి కోపానికి కారణం.
బి.ఏ. పూర్తయ్యాక రెండు సంవత్సరాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, సంతృప్తి లేక, తొాడూ బొంగరం లేని యీ జీవితాన్ని ఒక ప్రణాళికపై నడిపించాలని ఆశించి, అనంతమైన జగతిలోకి దూసుకుపోయి క్రొత్త విలువల బ్రతును బ్రతకాలని ఉబలాటపడ్డాడు శివరాం. (ప్రేమించిన స్రీ లేచిపోవడం, మనస్సులో రేగిన విషాదం, విరక్తి, ఆ పరిసరాలు పూర్తిగా మరిచి పోయేలా మరో చోటికి ఎక్కడికో వెళ్ళిపొమ్మని (ప్రేరేపించాయి, పరిమిత ప్రదేశంలో ఉండే పరిమిత అభ్యున్నతి అవకాశాలలో, ప్రతి నిమిషం స్ధానిక బలిమితో పోటీపడే
అన్వేషణ 185 జనం మధ్యలో నిజహైన అభ్యున్నతి పొందే పరిన్టితులు చాలా తక్కువ అని [గ్రహించుకున్నాదు శివరాం, తల్లి చెల్లెలు తాతగారి ప్రాపకంలో ఉండడం, సంసార బాధ్యతలు దిద్దుకునే అన్నగారొకరు తనకన్న పెద్దగా మసలుతూందదడం, శివరాంకు ఎక్కువ అస్మారం చూపించాయి, తన కోర్కె వెరవేర్చుకోడానికి.
ఒకరోజు ఉదయం స్నానంచేసి. బట్టలు తొడుక్కొని, నిర్మలమైన మనస్సుతో, తీవ్రమైన నిశ్చయంతో కుర్చీలో కూర్చున్నాడు శివరాం, స్నానం చేస్తున్న తాతగారికై నిరీక్షిస్తూ, బ్రహ్మయ్యగారు కాలకృత్యాలు నిర్వర్తించుకొని ఒక పట్టు ముక్కుపొడుం పీలుస్తూ మనమడి ప్రకృనే కుర్చీలో ఒరిగారు. సుభద్రమ్మ కాఫీ తెచ్చియిచ్చింది యిద్దరికి.
'తాతయ్యా!. ..పొగాకు కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా యిచ్చాను..... ఈవేళ సాయంత్రం మెయిలులో హైద్రాబాదు వెళ్ళే పోవాలని నిర్ణయించుకున్నాను!
తొను చెప్పదలచుకున్నది క్లుప్తంగా తేల్చి మౌనంగా కూర్చున్నాడు శివరాం.
నెరసిన కనుబొమల చిట్లించారు (బబ్రహ్మయ్యగారు: ఆశ్చర్యం కోపం జాలి ఒక్కుమ్మడి ఆయనలో నృత్యం చేశాయి.
*ప్రమిట్రీ అంటున్నావు?
శివరాం మాట్లాడలేదు. తన ప్రశ్నకు సమాధానం తనే వెతుక్కుని, తెలుసుకుని సుభద్రమ్మ వైపు ఒక్కనారి చూశారు బ్రహ్మయ్యగారు చురుకుగా “ఉద్యోగం ఎందుకు వదిలేశావరా! సుభద్రమ్మ దీర్ధం తీసింది.
“ఈ ప్రాంతాల్లోనేను యింక వుండలేను ఒక్కన్నీ ఎక్కడికో పోవాలని వుంది!.
ఆ కోరికలు మాకు లేకనే యింతకాలం పట్టుకు వెళ్ళాదేముకదూ!' (బ్రహ్మయ్యగారు గర్జించారు.
కొడుకు మనస్తతత్వం అర్ధం చేసుకున్న సుభద్రమ్మ నీరసంగా నిలబడిపోయింది. మొదటికొడుకు వెంకటేశ్వర్లు భార్య చెప్పు చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు. రెండవ కొడుకు దూరదేశాలకు పోతానంటున్నాడు. (బ్రతుకులో పుత్ర సందర్శనం, పుత్ర ప్రేమ యింక తనకు లేవేమో అని నిరాశతో మనస్సులో క్షోభపడింది సుభద్రమ్మ.
“ఉన్న ఊళ్ళో వందరూపాయలు ఉద్యోగం దొరికింది. మనకున్న పొలాలు వ్యవసాయం చూసుకుంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది, ఇది తెలిసికూడా దూరదేశాలకు పోయి
16 అన్వేషణ ఏం బావుకుందామని నీ ఉద్దేశ్యం!" అనునయంగా తగ్గించి మాట్లాడారు బ్రహ్మయ్య గారు.
ఎంతదూరం వెళ్ళినా, ఏం సంవాదించినా ఉన్న ఊళ్లో, సాటి మనుష్యులలో బ్రతుకుతున్న రీతిగా ఉండదని బ్రహ్మయ్యగారి నమ్మిక, అత్యంత అభిమానంతో చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసిన శివరాం ఒక్కసారి యీ ముసలితనంలో తన్ను వదిలి వెళ్ళిపోతున్నాడనగానే బ్రహ్మయ్యగారికి హృదయం బాధతో కలగిపోయింది.
తాను అభిమానంగా చూసుకునే వాళ్ళంతా యీ ఆఖరి ఘడియల్లో తన కళ్ళముందు కనిపిస్తూ ఉండాలని బ్రహ్మయ్యగారి కోరిక, ప్రాణం వదిలేముందు తన మనుమలని, ఆస్తల్ని అందర్నీ పిలిచి, వారిమధ్య నిశ్చింతంగా నిర్మలమైన అనురాగ ఆనందాలతో, కళ్ళు మూయాలనే కల ఎన్నాళ్ళ నుంచో (బ్రహ్మయ్యగారిలో మెదలుతూ వుంది. శివరాం వెళ్ళిపోతా ననడంతో బ్రహ్మాయ్యగారు దెబ్బతిన్న ఆవేదనతో లోలోపల కుమిలిపోయారు.
'నేను వెళ్ళిపోవాలి ......వెళ్ళక తప్పదు!” శివరాం గంభీరంగా బాధగా నిట్టూర్చాడు. మనుమడి మనస్సు శారదవల్ల బాగా భిద్రమైపోయిందని బ్రహ్మయ్యగారికి తెలిసినా, శివరాం ప్రయాణానికి అదే ముఖ్యకారణమని మాత్రం ఆయన గ్రహించలేకపోయాడు.
'వెడతా.. ...వెడతానంటున్నావు. ఎక్కడికి వెడతావు! ఏం చేస్తావు? పళ్ళుకొరికి రుద్రుడిలా మండిపడ్డాడు (బ్రహ్మాయ్యగారు.
“కొత్త ప్రదేశంలోకి... వివిధ మనస్తత్వాలు కల విచిత్ర దేశాల్లోకి..... అభ్యున్నతికి అవకాశాలు కనిపించే విశాల (ప్రదేశంలోకి నాకుఒక క్రొత్త జీవితం కావాలి..... ఇక్కడ ఉండలేను!” నిశ్చలమైన కళ్ళతో తన నిర్ణయం నిక్కచ్చిగా చెప్పాడు శివరాం. తాతగారంటే మునుపుచూపే భయం అతనిలో ఎక్కడా పొడచూపలేదు. బ్రహ్మయ్యగారు మనుమడి దృష్టి చూసే అశ్చర్యపోయారు. మనుమడు మారిపోయాడని బాధపడ్డారు.
'వామాట వినరా!....యిక్కడ నీకు ఏం లోటు చేశాను..... మనకున్న పొలాలు, ధనం చాలదా” బ్రహ్మయ్యగారు శివరాం బుజం మీద ఆప్యాయతతో తట్టారు.
'కాదు తాతయ్య!......కూవస్థ మండూకంలా బ్రతుకగల రోజులు అంతరించాయి. బ్రతికిన కొద్ది దినాలు చైతన్యంతో (బ్రతకాలి. చైతన్యం జీవితంలో కలగాలంటే ప్రపంచ లోతుపాతులు పరిశోధించాలి. ఉద్యోగాన్వేషణ నాకు ప్రధానంకాదు యిష్పడు నా జీవితం
అన్వేషణ కే? మారాలి.... క్రొత్త జీవితం కావాలి... .. ఆ క్రొత్త జీవితం అన్వేషణకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా! బాధగా చేతుల్లో తల యిముడ్చుకుని కుర్చీలో క్రుంగాడు శివరాం
'అయితే .......ఈ ముసలితనంలో .....నన్ను విడిచి వెళ్ళిపోతావా శివరాం!
రెండు వేడి కన్నీటి చుక్కలు గంభీరంగా నిలుచున్నాయి '(బ్రహ్మయ్యగారి ముడుతల కన్నుల్లో 'తాతయ్య!” లేచి బ్రహ్మాయ్యగారి దగ్గరికి వచ్చాడు శివరాం. “'తాతయ్య....... నీ అభిమానం వాత్సల్యం నా జీవితంలో మర్చిపోలేను........ కొని మీరు నాకు నిజంగా ఆనందం యివ్వాలంటే నన్ను యిక్కడ నుండి దూరంగా పంపెయ్యాల్సి...... ప్రతినిమిషం గతం జ్ఞప్తికి తెచ్చీ యీ పాత వాతావరణంలో బ్రతుక లేను?
బ్రహ్మాయ్యగారు, మౌనంగా ఆవేదనతో తలదించుకున్నారు. సుభద్రమ్మ మాటరాక కొయ్యలా నిలుచుండిపోయింది. 'నేను సాయంత్రం వెళ్ళిపోతా తాతయ్యా హైద్రాబాదుకు! శివరాం ఉబికివచ్చే దుఃఖంతో, కిటికీలోంచి వీధిలోకి చూశాడు, 'నీ యిష్టం! బ్రహ్మాయ్యగారు మెల్లిగాలేచి మరో గదిలోకి వెళ్ళివోయారు. కాఫీ చల్లారిపోయి, కప్పులనిండా అలాగే వుంది శివరాం ఊళ్ళోకి నడిచి పోయాడు చల్లారిపోయిన కాఫీ కప్పలు లోపలికి చేరవేసింది సుభద్రమ్మ కాళ్ళీడ్చుకుంటూ.
సాయంత్రం బ్రహ్మయ్యగారి యింటిముందు జద్బా నిలుచుంది పాత ట్రంకు పెట్టె ఒకటబెడ్డింగు అందులో పెట్టాడు జట్కా వాడు (బ్రహ్మయ్యగారు జట్కా ఎక్కారు. (పేమ పోంగిపొరలగా, కన్నీరు తుడుచుకుంటూ ఖేలగా నిలుచుండిపోయింది సుభ(ద్రమ్మ గుమ్మంలో, లక్ష్మి శివరాంవైపు దిగాలుగా చూసింది.
“'వెల్ళివన్తానమ్మా!. శివరాం తలవంచుకునే అంటూ జట్కా ఎక్కాడు జట్కా టకటకమంటూ రైలుస్టేషనుకు నడిచింది. బ్రహ్మయ్యగారు జట్కాలో ఏమీ మాట్లాడలేదు.
రైలువచ్చింది. శివదాం రైలు ఎక్కాడు సందడిగా తొందరగా షాటఫారముమీద పరుగెడుతున్న జనం మధ్యలో ఊపుకు, రాపిడికి తట్టుకుంటూ” నిశ్చలంగా, తదేకదృష్టితో కదిలిపోతున్న రైలులో కంటిచూపుకు దూరమైపోతున్న శివరాం వైపు చూస్తూ చేతికర్ర నేలమీద మోపి, నిలుచుని, అలాగే బ్రహ్మయ్యగారు ఉండి పోయారు. రైలు వెళ్ళిపోయాక కూడా కాసేపు అక్కడే నిలుచుండి పోయారు.
185 అన్వేషణ
“ఈ వందరూపాయిలు దగ్గర ఉంచు శివరాం! డబ్బు కావలిస్తే నాకు రాస్తూందడు తరుచు నీ క్షేమం తెలియజేస్తూండు.. నే బ్రతికి ఉండగా నువ్వెక్కడున్నా లోటు కలుగకుండా చూస్తా! ముసలి బ్రహ్మయ్యగారు కన్నీరు గ్రుక్కుకుంటు ఆవేదనతో సతమతమౌతూ డబ్బు అందించారు. శివరాంకు, శివరాం డబ్బు తీసుకోలేదు.
“ఇతరుల దబ్బు ఖర్చుచెయ్యడానికి కాదు నేను దూర(ప్రాంతాలకు పోయేది. స్వతంత్ర జీవనంతో యితరులకు ఆధారంగా నిలబడాలని నా ఉద్ధేస్యం నాదగ్గరున్న డబ్బు నాకుచాలు.. ...”
శివరాం మనస్తత్వం ఎరుగున్న బ్రహ్మయ్యగారు మనుమడు డబ్బుకూదా తీసుకోలేదని బాధపడినా ఏమనలేకపోయారు.
కనుచూపులో దురంగా మాయమైపోతున్న తాతగారిని అభిమానంగా చూసి జేబులో చెయ్యిపెట్టాడు శివరాం. ఏభయ్ రూపాయలున్నాయి. జీవితం స్టిరపదేదాకా యీసొమ్మే ఆదుకోవాలి. ప్రయాణంలో ఒక రోజు జరిగింది క్రాత్వబతుకులో ప్రధమంగా క్రొత్త ఉదయం కనిపించింది రైలు వేగంలో వీచే నిర్మల ఉదయపవనంలో హాయిగా స్వేచ్చగా, బరువుతగ్గి తేలికై మనస్సులో మౌనంగా నవ్వుకున్నాడు శివరాం తనలో.
రైలు స్టేషన్లు కదిలిపోతున్నాయి గిరగిరా రైలు వరంగల్లుదాటి ఖాజీ పేటకు వచ్చింది. ఒక కప్పు టీ త్రాగాలని రైలుదిగి ప్లాటుఫారంమీద అడుగు పెట్టాడు శివరాం వచ్చి వెళ్ళి ప్రయాణీకులతో ష్లాటుఫారం క్రిక్కిరిసి ఉంది అరటిపళ్ళు, ద్రాక్షపళ్ళు, బిస్కట్లు, చుట్టాభీడి సిగలెట్లు, కిళ్ళి అమ్మేవాళ్ళు హదావిడిగా రైలుపెట్టెలోని జనాన్ని చూస్తూ కేకలేస్తున్నారు తమ వస్తువుల ప్రచారం చేస్తూ ఎదురుగా ఉన్న ప్రదేశమంతా రైలుపట్టాలతో నిండి పరుచుకుంది. రెలుఇంజన్లు కాళిడబ్బాలు ఒకచోటినుంచి మరొకచోటికి రవాణా చేస్తున్నాయి. రైలు బొగ్గుతో మాసిపోయిన నల్లటి అసహ్యమైన దుస్తులలో రైలులో పనిచేసేవారు తమ పనుల సందడిలో ఆలోచనలతో కదిలిపోతున్నారు. టిక్కెట్టుకలెక్టరు తన బాధ్యత నిర్వహించడానికి రీవిగా రైలుపెట్టెలు ఎక్కి దిగుతున్నాడు. ప్రయా ఫలహారాలు తినడం త్రాగి పొట్టలు నింపుకొని రైలుపెట్టెలోని తమ స్థలాలు చేరుకుంటున్నారు. వఖ్రూటుఖారానికి ఒక వారగా పేకేజిపెట్టెలు, గోనెమూటలు పదిఉన్నాయి. ఒక రైల్వేఉద్యోగి అవి తనిఖీ చేస్తున్నాడు. ఏదో రైలు ప్రక్క పట్టాలమీదకు వచ్చింది. రెండు రైళ్ళలోని ప్రయాణీకులు పరస్పరం ముఖాలు అవలోకించు కుంటున్నారు. చూట్టూరా మారుతున్న జీవితం......మారుతున్న (ప్రదేశాలు.....మారుతున్న మనుష్యులు
అన్వేషణ 19 .... _.మనస్సులోని భావాలుకూడా కొద్దిగా మార్పు చెంద నారంభించాయి.
వాతావరణంలోని మార్పు తప్పనిసరిగా మనస్సులోని పాత ఆలోచనలు మాపి (క్రొత్తఆలోచనలకు తావిన్తుంది విచిత్రంగా కనివిన్తున్న (వ్రన్తుతం, కలగా ఊహించుకుంటున్న భవిష్యత్తు తన జీవితంలో ఏం మార్పులు తేగలవో అనుకుంటూ రైలు ఎక్కాడు శివరాం కాఫీ త్రాగి, రైలు మళ్ళి ప్రయాణానికి సన్నద్దమయ్యింది.
సికింద్రాబాదు, హైద్రాబాదు నగరాలు శివరాం ఎప్పుడూ చూడలేదు గోదావరి ప్రాంతంలోని చిన్న పట్టణాల జీవితానికి అలవాటుపడిన శివరాం మహానగరం వాతావరణం గూర్చి ఏదో విచిత్రంగా ఆలోచించసాగాడు. పెద్దనగరం, విశాలమైన వీధులు ....గబగబ నడిచే జనం....... అందమైన భవనాలు అంతులేని కార్ల ప్రవాహం ..... జాడ తెలియని సందుగొందులు ..పూర్తిగా క్రొత్తయెన ఒక మహానగరంలో జీవితం క్రొత్తగా ప్రారంభించాలి ...ఎన్నో అనుభూతులు, అపాయాలు...... “అవస్థలు.......... ఎదుర్నోవాలి.
ఆకాశంలో పిట్టలు ఎగురుతూ పిల్లి మొగ్గలు వేస్తున్నాయి ఒక వంతెన క్రింద సెలయేరు వంకరటింకరలుగా వయ్యారంగా ప్రవహిస్తోంది సందడిగా చివరిగమ్యం తెలియకపోయినా, లేత చిగురుటాకులతో చిటారుకొమ్మలు ఆనందంగా ఊగిస్తూ వివిధ వృక్షాలూ విరామంగా గాలి పీల్చుకుంటున్నాయి. సేద్యంకాని ఎర్రభూములు ఎదురుగా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. తన నాహసప్రయాణం విఫలంకాదని తీర్మానించుకున్నాడు శివరాం.
తలుపులు మూయబడివున్న రైలు పెట్టెకు రైలు కిటికీలోంచి కనిపిస్తున్న అనంతమైన ప్రపంచానికి వున్న వ్యత్యాసమే సంకుచిత జీవితానికి, విశాల దృక్పధాల జీవితానికి, మధ్య కూడా వుంటుంది మానవజీవితము సంకుచిత మనస్తత్వంలోంచి విశాల దృక్పధంలో మారాలంటే నాల్గుగోడల గృహ వాతావరణంలోంచి బయటపడి ప్రపంచ పరిస్థితులు అవలోకన చెయ్యాలి. అటువంటి అవలోకనకు ప్రయాణం నాంది. సాహసమైన ప్రయాణాలు, (బ్రతుకుల గతులు విలువల్ని పూర్తిగా మార్చగలవు. ఏదో మసకతెరలోంచి గొప్ప భవిష్యత్తు కలలాగా కనిపిస్తున్న శివరాంకు తన ప్రయాణమే ఒక సాహసకార్యమైంది బ్రతుకులో క్రొత్తదనం, గొప్పదనం చవిచూడగలవనే ఆకాంక్ష ఆశ అతనిలో స్పందించాయి. శారదవల్ల ఎదురుదెబ్బే తగలకపోతే యీ సాహసప్రయాణం రూపొందేది కాదేమో! శివరాం ఒక విధంగా సంతృప్తిపొందాడు ఏమైనా జీవితంలో స్థిరపడడానికి
20 అన్వేషణ ముందు యువకుడు కొంత ప్రపంచాటనం చెయ్యవలసిన అగత్యం ఎంతో వుందనే నమ్మకం గట్టిగా ఏర్పడింది శివరాంకు, ముందుముందు తను చేయబోయ మహా సాహసకార్యాల గురించి ఏదో కమ్మని పగటికలలను కంటూ కొంతసేపు తన్మయుడయ్యాడు శివరాం.
అలేరు భువనగిరి........ఘటికేశ్వర్ మౌలాలి. ... స్టెషన్లునల్లటి అక్షరాలబోర్డు కదిలాయి గబగబా.
'వచ్చేది సికింద్రాబాదు!” ఒక తల నెరసిన పెద్దమనిషి ఒక (గ్రామీణ రైతుకు చెబుతున్నాడు.
ఏమీ తెలియకపోయినా, అంతా తెలుసుకున్నట్లు క్రొత్త వాతావరణంలో ఒకవిధంగా నటించవలసిన ఆగత్యం ఒక్కొక్కసారిప్రతి మనిషికి ఏర్పడుతుంది. ఇతరుల దృష్టికి తన అవివేకం, తెలియని తనం, కనిపించకుండా, హుందాగా వుండాలనే స్వభావం కలిగిన శివరాం, తోడి ప్రయాణీకులను ఏమీ ప్రశ్నించకుండా, ఏన్నో సారులు ఆ వైపు ప్రయాణాలు చేసిన యాత్రికుడులా, ఆ వాతావరణం తనకు పాతదే అని ఇతరులకు స్పురించేటట్లు గంభీరంగా మొహంపెట్టి ప్రయాణీకులవైపు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు ముభావంగా వున్న శివరాంకు ప్రక్క ప్రయాణీకులు ఎక్కువగా పలకరించ సాహసించలేకపోయారు.,
జేబు తడుముకున్నాదు శివరాం. నలభై ఎనిమిది రూపాయలున్నాయి భోజనానికి, ఇతర అవసరాలకు పై రెండు రూపాయలు ఖర్చయిపోయాయి. ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకొని జీవితం ఒకదరిచేరేదాకా అదుకోవలసిన ఆ డబ్బును పదిలంగా పట్టుకున్నాడు. రైలులో రాత్రి నిద్రపోయినప్పుడు తన చిన్న నిధికి వివత్తు రానందుకు సంతోషించాడు.
గప్టైల మోతల చప్పుడులతో, ఏనుగు ఘీంకారంలా కూతలతో పడిపడిగా రైలుబండి పరుగిడుతోంది. రైలు పట్టాకిరువైరుల ఇళ్ళు, తోపులు, రోడ్డు కనిపించసాగాయి. టెలిగ్రాపుతీగలు, ఇనుపస్తంభాలు ఒంటరిగా నిలు చున్న గూద్సుబండి పెట్టెలు, పట్టాలమధ్య రాక్షసి బొగ్గుతో నల్లబారిన వెదురుచెక్కలు, నడుస్తూన్న రైలు ఇంజన్లు. రాబోయే పెద్ద రైల్వేస్టేషను సందడిని ఒక విధంగా చూపిస్తున్నాయి. నిప్పులగుత్తుల్లా ఎండలో మెరుస్తున్న ఎర్రపూలతో నగరం పొలిమేర లోని తంగేడు వృక్షాలు క్రాత్తబ్రతుకుకోసం వెదుకుతున్న శివరాంను ఆహ్వానిస్తూ స్వాగతం చెబుతున్నట్లు వూలబొమ్మలతో ఆడి నృత్యంచెశాయి.
అన్వేషణ !
ఉత్సాహంతో రైలుపెట్టెలో లేచి నిలుచూన్నాడు శివరాం. రైలుపెట్టెలో బెంచిక్రింద పదిలపరచిన తనపెట్టె, బెడ్డింగు వెతికాడు. కనిపించిన బెడ్డింగు గట్టిగా బిగించుకుని సర్దుకున్నాడు. ప్రక్కన ట్రంకు పెట్టెలేదు. యేమైంది?......ముచ్చెమటలు పోశాయి. ఏదో భయం కలిగి, చుట్టు ప్రక్కల ప్రయాణీకుల సామాన్లు పరిశోధించాడు అందర్నీ అడిగాడు. గాని ట్రంకుపెట్టె జాడకనిపించలేదు.
నల్లటి చిన్న ట్రంకుపెట్టె-బ్రహ్మయ్యగారు, తన చిన్నతనం నుంచి వాదుకుంటున్న ట్రంకు పెట్టె శివరాంకు అభిమానంగా యిచ్చారు. తరతరాల చిహ్నంగా, ఈనాడు ఎవరో ఆ పెట్టెను దొంగిలించారు. తానుయీ మధ్య చేసిన పొగాకు కంపెనీ ఉద్యోగంతో కుట్టించుకున్న రెండుకోట్లు, చొక్కాలు, పుస్తకాలు, పంక్తులు పదిలంగా దాచుకున్న శారదఫోటో, బి.ఏ ప్యాసయినప్పుడు బ్రహ్మయ్యగారు ఆనందంగా బహుమతిగా యిచ్చిన బంగారు ఉంగరం...... అన్నీ పోయాయి. శివరాం హృదయ ఏదో కలతలతో చికాకు పడింది.
ఇంతవరకు క్రాత్తనగరం వాతావరణం, నూత్న జీవితం గురించి చేస్తున్న ఆలోచనలు చెల్లాచెదురై పోయాయి. ఇది తన భవిష్యత్తుకు అవశకునమేమో అనుకుని భేదపడ్డాడు శివరాం.
ట్రంకుపెట్టె పోగొట్టుకున్నాడని విన్న ప్రయాణికులు శివరాంపై అపారమైన సానుభూతి చూపించారు! కొందరు ప్రయాణాల్లో జరిగే దొంగతనాలు గూర్చి సణిగారు కోపంగా - రైలు పెట్టెలోని జనమంతా కంగారుగా తమసామానులు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోసాగారు.
'కొంచెం సామాన్లు చూస్తూండండి. ఇప్పుడే కాఫీ త్రాగివసా!” అంటూ కాజీపేటలో తను రైలు దిగినసంగతి జ్ఞప్తికివచ్చింది. సూటువేసుకొని సిగరెట్టు కాలుస్తూ ప్రక్శనేకూర్చున్న మనిషి ఎక్కడ దిగిపోయాడో తన ఆలోచనల్లో గమనించకుండా ఉండిపోయాడు. శివరాం “ఊహాగానాల ఫలితం ఉన్నది. పోగొట్టుకుని మళ్ళి శూన్యంలోకి నడవడం, తరతరాల వొతచిహ్నాలు తననుంచి దూరమౌతూన్నాయ్'” అనుకున్నాడు శివరాం.
రైలు దిగిపోవాలనే కంగారులో ఉన్న ప్రయాణికులకు శివరాం స్థితి ఆలోచించే సావకాశం లేకపోయింది. గుండె నిబ్బరం చేసుకుని తలలేని మొందెంలా పాదాలవద్ద్ల పడిఉన్న పొత బెడ్డింగు దుమ్ము దులుపుకుని ప్రయాణం బడలికతో, మాసిపోయిన జుట్టుతలతో, జనం త్రోపుదులో దగ్గరున్న ధనం పోకుండా జేబు గట్టిగాపట్టుకుని,
లలు అన్వేషణ లోపలికి సామాన్లు అందుకోవడానికి కేకలతో ఎగబడుతున్న రైల్వే కూలీలను త్రోసుకుని, కోలుపోతున్న థైర్యం బలవంతంగా తెచ్చుకుంటూ, నీరసబడిన శరీరంలోకి క్రాత్తశక్తి కృత్రిమంగా యిముడ్చుకుని, క్రొత్తదేశంలో అడుగుపెట్టిన యాత్రికుడిలా రైలు పెట్టెదిగి షాటుఫారంమీద ఒకనిమిషం నిలుచున్నాడు శివరాం పెద్ద రాతిపలకల పెట్టెలా అందంగా నగిషీగా, బ్రహ్మాండంగా కట్టబడిన సికింద్రాబాదు స్టేషను, ప్లాటుఫారాలు, వంతెనలు ఎదురుగా చేతులు చాచుకుని ఆప్యాయతతో పలకరీచే గడియారం, సెలయేరుగా కదులుతున్న జన ప్రవాహాలు, చూసి, చైతన్యం రొందినవాడిలా, హృదయంలోని భయం, గగుర్పాటు, అయోమయంగా భావాలు తగ్గించుకుని మామూలు స్టితికి వచ్చాడు శివరాం, జేబులోని టిక్కెట్టు తీసుకుని, ఒక చేత్తో బెడ్డింగు పట్టుకుని, జనప్రవహాంలో దూరి, వంతెన పూర్తిగా నడిచి స్టేషను బయటికి వచ్చాడు. టాక్సీలు, టాంగాలు, బస్సులు ఎదురుగా నిలుచున్నాయి. రైలుస్టేషను అవరణ నవతల పోస్టర్లు, కంపెనీల ఆద్వర్టయిజుమెంట్లు పెద్ద పెద్ద బోర్డులతో నిలబడ్డాయి. వాటికి పదింతల ఎత్తుగా హోటళ్ళ మేడలు పరుసగా ఎదురుగా కనిపించాయి. హిందీ, తెనుగు, తురకం ఇంగ్లీషు మాట్లాడే ప్రజల భాషల శబ్దాలు గాలిలోతేలి ఆపట్టణ సాంఘిక వాతావరణం, సంస్కృతి కొంత తెలియజేస్తున్నాయి. మేడలాకనిపిస్తున్న ఒక పెద్దబస్సు ఉషద్రవమైైన రొద చేసుకుంటూ తిక్క ఎక్కిన అంబోతులా దూసుకువచ్చి ఎదురుగా ఆగింది. శివరాం ఆబస్సుచూసి కాస్త చకితుడై సరదాపడి ఒక మందస్మితం చేశాడు. తన భవిష్యత్తులోని వాహనం కాబోతుంది గదా అనుకుని. రైలుదిగి ప్రయాణీకులను అప్ప్తులువచ్చి ఆహ్వానించి కార్తలో టాంగాలో తోడ్కొనీ పోతున్నారు. “నా” అనే నరుడు కనిపించని వాతావరణంలో అడుగుపెట్టిన శివరాం బంధువులకు దూరమైపోయిన ఏకాకితనం జ్ఞప్తికిరాగాః కాస్త బాధపడ్డాడు.
“బాబూ! బెడ్డింగు తీసుకురావాలా!”” ఒక కూలివాడు ప్రాధేయపడ్డాడు.
అప్రయత్నంగా ఆ కూలివాని చేతుల్లో ఆ బెడ్డింగు వదిలేశాడు శివరాం సీరసంగా.
తనతో రైలు పెట్టెలో ప్రయాణంచేసీ, శారదను జ్ఞప్తికితెచ్చిన ఓ అమ్మాయి ఒక టాంగాలో వెళ్ళిపోతోంది. శివరాం వైపు ఆమె జాలిగా చూసింది. ట్రంకుపెట్టె పోగొట్టుకున్న తన తెలివితక్కువకు ఒక స్త్రీ జాలిచూసి అవమానపరిచిందని బాధపడ్డాడు శివరాం, ఇంక ఆమెవైపు చూడటేదు.
అన్వేషణ 23
ఏంచెయ్యాలి? ఎక్కడకు వెళ్ళాలి? ఈ ప్రశ్నలు ఎదురుగా నిలుచున్నాయి శివరాం కళ్ళముందు.
“ఎదురుగా ఉన్న హోటల్లోకి' ఠీవిగా కూలివాడి వైపు చూశాడు శివరాం.
రైలుస్టెషను ఉపరిభాగాన్ని చిన్న విద్యుచ్చక్తి బల్భులతో ఆలంకరిస్తున్నారు. రాత్ర వెల్దులలో నింపడానికి.
శివరాంకు జ్ఞప్తికి వచ్చింది. ఆ రోజు జనవరి ఇరవై ఆరోతేదీ రిపబ్లిక్ దినం తన జీవితంలో కూడ అది ఒక స్వతంత్ర్రదినం అనుకున్నాడు శివరాం.
ఎండ మిటమట లాడింది ప్రయాణం బడలికతో అలసిపోయిన శివరాంకు శరీరాన్ని ఎండవేడి అర్చివేసినట్లు చేసింది.
ముఖ్యావసరాలైన స్నానం, భోజనం కోసం ఎదురుగాఉన్న హోటల్లో తాత్కాలికంగా ప్రవేశించడానికి వెడుతున్న శివరాం మనస్సులో మాత్రం, ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? అనే ప్రశ్నలు రోకలిపోటుల్లా ధ్వనిచేస్తున్నాయి.
కూలివాడు దారిచూవాదు. శివరాం అనుసరించాడు. క్రొత్త నగరంలోని నడివీధిలో ప్రధమంగా అడుగుపెట్టాడు శివరాం నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు. తనకు ఏర్పడిన స్వతంత్ర జీవితం తలుచుకుని,
ప్రయాణీకులను నింపుకుని, నిండుగా ఠీవిగా, వేగంగా మలుపులో వయ్యారంగా జరుగుతూ, హుందాగా నడివీధిలో ఒక బస్సు దూసుకుని పరుగెత్తింది తన భావిజీవితపు ఆలోచనలు నిముష మాత్రపుకలగా మళ్ళి తిరిగాయి శివరాం కళ్ళముందు. ఆలోచన తగ్గించుకుని వడివడిగా నడిచాడు శివరాం ఆ నడివీధిలో.
2న అన్వేషణ మై
సాయంత్రం ఆరుగంటలు, ప్రయాణంతో అలసిపోయి ఎదురుగా కనిపించే స్టేషనునుచూసి 'రయుంయ్ రుంయ్' మనే విశ్వాసాలు వదులుతూ మెల్లిగా రైలు నాంపల్లి స్టేషనులో అడుగుపెట్టింది రైల్వే ష్లాట్ఫారమ్ మామూలుగా హడావిడిగాసందడిగా తయారయింది. (ప్రయాజీకులు, వారిని ఆహ్వానించడానికి వచ్చిన బందువులు, రైలు లోని జనసమ్మర్ధం చూసి, ముఖారవిందాల సౌందర్యంతో సంతృప్తిపడి తిరగడానికి వచ్చిన యువకులు ప్లాట్ఫారంమీద చిమలగుంపుల్లా కదలుతున్నారు. కమలాఫలాలు, అరటిపండ్లు అమ్మే అంగడిబండి, రంగురంగుల సిగనిగల బొమ్మలతో ఆకర్షిస్తూన్న పుస్తకాలు అమ్మేషాపు పనిలేని యువక సమూహాలద్భష్టి ఆకర్షిస్తున్నాయి “హాల్లో రాజా!” పెంకులెగిరిపోయేటట్టు గట్టిగా అరిచి అరుడుగుల పొడుగైన చక్రవర్తి పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ, రాజారావు బుజం తట్టాడు చక్రవర్తి అరుపుకు ప్లాటుఫారంమిద జనం ఆశ్చర్యంగా వింతగా అతనివైపు చూశారు, క్రొత్తనవలలు పరికిస్తున్న పొట్టి రాజారావు తన స్నేహితుడు చక్రవర్తి అప్పుడే స్టెషనుకు వచ్చాడని గ్రహించుకున్నాడు ప్రతి సాయంత్రం కొద్దోగొప్పో విరామంచేసుకుని ఆ స్టేషను చూడకుండా ఉండలేని ఆయువకులు ఒకరిని వెతుక్కుంటూ మరొకరు ఆ స్టేషనులో తారసిలడం పరిపాటి.
“క్కవేళ రైలు ఎంతసుందరంగా ఉందోయి రాజా” తన పొడుగాటి చేతులతో రైలుపెట్టెలోని జనాన్ని చూపుతూ, రాజారావు బలవంతంగా వప్లాటుఫారంమీద నడిపిస్తూ ముందుకు సాగాడు చక్రవర్తి,
తెల్లటి షరాయి, మోకాళ్ళదాకా వేళ్ళాడే తెల్లటి పొడుగు చొక్కా చెంపలమీదకు పరుచుకువచ్చే ఒత్తుజుట్లు చూడగానే చక్రవర్తిలో ఏదో వొకవైచిత్యము మాత్రం ఉందని స్పష్టమౌతుంది. రాజారావు ఎదురుగాఉన్న కూల్డ్రింక్సుషాపు వైపు నడిచాడు.
అన్వేషణ 2క్
“ఈ వేడి శరీరానీకి చల్లనిపానియమా మిత్రమా!” నవ్వుకక్సేడు చక్రవర్తి.
'యువకుల హృదయాలు సమశీతోష్టంగా ఉండాలంటే చల్లని పానీయాలు అవసరము స్వామీ!” మామూలుగా అలవాటైన సంభాషణ పద్దతిలో రాజారావు సమాధాన మిచ్చాడు. డబ్బు రాజారావే చెల్లించాడు.
'నువ్వు నాకుమాత్రం రాజా నాఖర్చు అంతా నువ్వే భరిస్తున్నావు ! నేను చక్రవర్తినైనా చేతిలో చిల్లిగవ్వలేదు! ఇదీ మన జీవితం 1) జాలిగా నవ్వాడు చక్రవర్తి.
'నాతో ఉన్నంతకాలం డబ్బుగురించి విచారింపకు. జీవితం క్షణికం, కనుక అప్పు చేసైనాసరే హాయిగా బ్రతకమన్నారు మన పెద్దలు!) రాజారావు హూషారుగా నవ్వాడు!
“చెప్పితివి గురూ! నిజం చెప్పితివిఃి నటకుని భంగిమలో మాటలు వదిలాడు చక్రవర్తి,
తక్షణం గట్టిగా నవ్వేశాడు సహజ పద్దతిలో అతను “ఎల్లా ఉంది ప్రపంచం? ఏమిటి వార్తలు?” అలవాటైన ప్రశ్న వేశాడు మళ్ళీ చక్రవర్తి.
“ప్రపంచం గుండ్రంగా ఉంది, ఇంకా, చతురస్రం కావటం లేదు!” అలవాటైన సమాధాన మిచ్చాడు రాజారావు.
వారిద్దరు ఆ స్టేషను పాలించే చక్రవర్తుల్లా విశ్చంఖలంగా తిరగసాగారు.
“మిత్రమా ఒక్కసారి ఆగు? చక్రవర్తి రాజారావును ఆవాదు.
ఎవరో ఆ ఒంటరి యువతి! పాలపిట్టలా ఎంత నాజూకుగా ఉందోయి!? చక్రవర్తి హుషారుగా ఈల వేశాడు.
పువ్వుల వాయిలుచీర కట్టుకుని, ఒక చేత్తో చిన్న ట్రంక్ పెట్టె. మరొక చేత్తో చిన్న సంచి పట్టుకొని, అందమైన గుండ్రని వదనంతో సన్నని ఎర్రని పెదవులతో విచార రేఖలతో, బిత్తరి చూపులతో మెల్లిగా నడుస్తున్న ఆ యువతి చక్రవర్తి మాటలు విని తల వంచుకొని గబ గబా అడుగు వేసింది భయంతో
ఈ యువతి చరిత్ర పరిశోదిద్దామా మిత్రమా! చక్రవర్తి రాజారావును కనుసైగ చేశాడు.
'నీ బుర్రకు ఆలోచన కల్పించకు ఈ రోజు! ఈ వేళ నీ కార్యక్రమం నేను నిర్ణయించాను. పద "” బలవంతంగా లాక్కుపోయాడు. చక్రవర్తిని రాజారావు. వెళ్ళిపోతున్న ఆ యువతి వైపు ఆశగా, కోరికతో చూసి చక్రవర్తి స్టేషనులో నుంచి నిషమించాడు.
వ6 అన్వేషణ
ఆ యువతి స్టేషను అవరణ దాటి బయటికి వచ్చి నిలుచుంది కనుచీకటి పడుతున్న ఆ మహానగరంలో విద్యుచ్చక్తి దీపాలు అప్పడే వెలిగాయి. ముందు తన జీవితాన్ని ఏ విధంగా నడపాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే అలోచనలతో ఒక నిమిషం కొయ్యలాగా అలాగే నిలుచునిపోయింది ఆమె రిక్షావాళ్ళు చుట్టుముట్టారు అందరినీ విధి లించుకుంది ఆమె. ఒక్క పావుగంటలో రైలు స్పెషను ముందు జనం మాయమయ్యారు.
ఆలోచనకు ఒక స్థిరత్వం ఆపాదించుకోవాలని స్టేషనుముందు గా గుండ్రంగా ఉన్న చిన్న పార్ములాంటి ప్రదేశంలోకి పోయి ఒక తిన్నెమీద కుర్చుంది, (ప్రక్క తిన్నెలమీద కూర్చున్న గిరిజాల సాహెబు మరో ప్రక్కవేరుసెనగలు నములుతూ కూర్చున్న టాంగావాడు వింతగాచూశారు ఆ యువతివైపు ఎవరినీ చూడకుండా తల వంచుకుని ఒక నిమిషం కూర్చుంది. సంచిలోని కధల పత్రిక ఒకటివిప్పి చదువుతున్నట్లు నటించింది ఆ మసక చీకటిలో వీధి వెలుగు నీడల్లో పత్రికలోని అక్షరాలు కనిపించవనె సంగతి యితరులకు తెలిసినా ఆ పరిస్థితి తప్పనిసరి అయింది. ఆ యువతికి, ట్రంకు పెట్టెలో ఉన్న నాల్లు రూపాయలతో యీ మహానగరంలో గడపడం అసాధ్యమైన విషయం. అయినా సాహసించి వచ్చాక ఏదో ఉపాయము ఆలోచించుకుని క్రొత్త జీవితం రూపొందించుకోవాలి. ఎక్కడైనా ఏదో చిన్న పనే దొరక్కపోతుందా! ధైర్యంగా నిట్టుర్చింది ఆమె.
నిర్మలమైన ఆకాశంలో తారలుమిణుక్కుమన్నాయి ప్రపంచం ఎదురుగా ఆకాశంలా అనంతంగా గోచరించింది ఆనాడు ఉగాది. జీవితంలో క్రొత్త యుగాది (ప్రారంభం చేయవచ్చు. ఆశతో చటుక్కున లేచి నిలుచుని పెట్టె, సంచి చేత్తోపుచ్చుకుని పార్కు బయటికి వచ్చింది. ఆమె. ఒక కోరమీసాల రిక్షావాడు వచ్చి నిలుచున్నాడు. ఎదురుగా, నిశిత దృష్టిలో విషపు నవ్వుతో ఆమెను పలకరించాడు.
'రిక్షా కావాలా అమ్మా!”
“కావాలి. ఇక్కడి దగ్గరిలో ఏడైనా సత్రపు వుందా?”
రిక్షావాడు ఒక మందస్కితం చేశాడు.
'ఒక మైలు దూరంలో ఒక సత్రపు వుంది. తీసుక వెళ్ళమన్నారా?”
“ఊ' అంది యువతి, అనిశ్చతమైన నిర్ణయాలలో అల్లాడుతూ,
రిక్షావాడు పరుగున ప్రక్కకు పోయి రివ్వున లాక్కు వచ్చాడు రిక్షా ఆ యువతి కూర్చుంది. రిక్షా మువ్వలుగల్లున (మోగుతున్నాయి నడకలో, విద్యుద్దీపాల వెలుగులో
అన్వెషణ 27 జనసమ్మర్ధంలో, ఇరువైపుల దుకాణాలతో, హోటళ్ళలోంచి వచ్చే రేడియో పాటలతో, పరుగెత్తే కార్ల మోతలతో ఆ మహానగర వీధులన్నీ సందడిగా ఉన్నాయి. మనుష్య ప్రవాహాలను దూసుకుంటూ రిక్షా రివ్వున పరిగిడుతోంది ఈనాటి రాత్రికి, సత్రవులో పడుకుని సత్రవు గుమాసా సలహా తీసుకుని భోజన కార్యక్రమం, ఉద్యోగాన్వేషణ చేయాలి ఈ రాత్రికి భోజనం లేకుండానే పడుకోవాలి!” ఒక నిట్టుర్పు విడిచింది ఆ యువతి. గత జీవితంలోని సుఖం తలుచుకుని తన బంధువులందర్నీ విడిచి, దేశాలపాలై, వికలమైన మనస్సుతో (బ్రతుకు చేతులారా దుఃఖభాజనం చేసుకున్నానని ఆవేదనతో ఆమె కన్నీరు కార్చింది. గతానికి పశ్చాత్తావపడక, ధైర్యంతో క్రొత్తజీవితం దిద్దుకోవాలి అనే విచిత్ర సాహసం ఆమెను ప్రేరేపించింది లేత హృదయానికి రాతిరూపం యిచ్చి మోటుమనిషిగా మారిపోవాలి అనుకుంటూ మొండిగా కూర్చుంది రిక్షాలో, ఒక వంతెనమీదుగా రిక్షా పరిగెత్తింది. వంతెనక్రింది నదిలోనీరు కనిపించలేదు. గుబురుగా లేచిన చెట్లు, బండబారిన గుంద్రాళ్ళు, ఎత్తుపల్లాల వలయాకృతిలో మూలమూలగా రాత్రి వెలుగుల్లో ప్రతిపలిస్తున్న నీటిగుంటలు, కనిపించాయి. మరుక్షణంలో ఎత్తెన భవనాలు, గోపురాల ఆకారంలో విచిత్రంగా ఉన్న కట్టడాలు, రాతికట్టడాలతో కోటద్వారాల్లా నిలబడిన పెద్దగేట్లు ఆమెకు ఆశ్చర్యం కలిగించా. ఓ వింతగా, విచిత్రంగా నగరంవైపు చూసింది. “ఈ పేటపేరు ఏమిటీ?” రిక్షావాడిని ప్రశ్నించింది యువతి. “చార్ మినార్ అంటారమ్మాగ రిక్షావాడు మరోమాట ఆనకుండా గబగబ రిక్షా తొక్కుతున్నాదు. రిక్షా పరుగులో ఒక మైలు దాటిపోయినట్లు స్పరించింది ఆమెకు, మద్రాసునగర జీవతం తెలిసిన ఆమెకు. రిక్షావాళ్ళు, జట్కావాళ్లు ప్రయాణీకులను చేసేమోసం ఆమెకు కొంత అనుభవమే. 'ఏది ఏమైనా, జీవితంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు ధైర్యంతో ఎదుర్కోవాలి అనుకుంది ఆ యువతి. మరో పదిహేను నిమిషాలు గడిచాక ఒక సందులోకి పోయిరిక్షాఆగింది. ఆ సన్నటి సందులో విద్యుద్దీపాలు లేక చీకటిగావుంది వీధిలోని రొచ్చుకంపు, శిధిలమైన మట్టిగోడలపై నుంచి వచ్చే మలిన మైన గాలులు, ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
28 అన్వేషణ
'గుమాస్తాగారున్నారేమా చూస్తానమ్మా!' రిక్షావాడు లోపలికి వెళ్ళాడు గబగబా ఒక యింట్లోకి.
రిక్షాదిగి నిలుచుంది ఆమె నిరీక్షిస్తూ,
మరుక్షణంలో రిక్షావాడు ఒక యేఖభైఏళ్ళ యువతితో ప్రత్యక్షమయ్యాడు నల్లటి చీర తాంబూలముతో గారకట్లిన పళ్ళు, నెరసిన వెంట్రుకలు, వెళ్ళాడుచున్న జబ్బలు ..... ఎ(ర్రజీరతో నిశితంగా చూస్తున్న కళ్ళు...... చిన్న మందస్మితం..........వీటితో కనిపించిన ఆ ముసలిది యువతిని ఆహ్వానిస్తూ ప్రశ్నించింది 'నీ పేరు!
'కషల 1 మెల్లిగా సమాధాన మిచ్చింది ఆ యువతి.
“లోపలికీ రా అమ్మా సత్రపు గుమాస్తాగారు లేరు. నేను చూస్తావే నీ అవసరాలు" అంటూ ఆ ముసలిది కమల పెట్టె, సంచీ చేత్తొ పుచ్చుకుంది.
“ఏ మిమ్మన్నావు!' రిక్షావాడివైపు చూసింది కమల.
“తమ దయ'!' చేతులు జోడించుకుని వినయంతో నిలుచున్నాడు రిక్షావాడు. కమల రిక్షావానిచోతిలో పావలారాల్చింది. నవ్వుతూ కమలకు దణ్శంపెట్టి రిక్షావాడు కదిలిపోయాదు.
రెందు గోడలమధ్య కటిక చీకటిలోంచి చిన్న సందు దారి ముందుకు సాగింది కమల నడిచింది ఏదో ఆలోచనతో, ఒక క్షణం నడిచాక ఒక చిన్న వరండా, రెండుగదులు కనిపించాయి. ఒకగది వంటిల్లుగా ఉంది రెండవగదిలో వరుసగా పేర్చి గుట్టల్లావున్న కట్టెలు: చూరుకు అడ్డంగా నిలబెట్టి ఉంచిన గెడకర్రకు వేళ్ళాదే రకరకాల చీరలు, ఒకమూల కుప్పలా పడవున్న మాసిన బట్టలు, ఒక కాలు విరిగిన పాత టేబిలుమీద ప్రీ ముఖాన్ని అందం చేయడానికి ఉపయేగించే కృత్రిమ సామాగ్రి న్న పౌడరు, పెదిమలరంగు మొదలైనవి, నిలువుగా బ్రద్దలయిన నిలువుటద్దం, రెండు నులకమంచాలు కనిపించాయి వరండాకు దక్షిణవైపున తడికలు కట్టారు. తడికల్లోంచి విద్యుద్దిపాల కాంతి. ఆ కాంతిలో మసిలే స్ర్తీల నీడలు, ఎకసక్కా లాడుకుంటున్న ప్రీ కంరాలు, దేడియో పాటలు ఆమెకు గోచరించాయి. అది సత్రమా కాదా అనే అనుమానం కమలకు తట్టకపోలేదు. అయినా ధైర్యం వహించి కాలం గడవాలని ఏమీ అర్ధం కానట్లు క్రాత్తప్రదేశంలో అడుగుపెట్టిన క్రొతప్తీలా మసలుకోవాలనుకుంది కమల,
అన్వేషణ లగ
“స్నానం చెయ్యి, ఛాలా దూరం నుంచి వచ్చేవు” ముసలిది కమల తల నిరిమింది అవ్వాయంగా.
ఒక కుండలో నీళ్ళు తెచ్చి ముందు పెట్టింది.
“రాత్రిళ్ళు కుళాయిలు వుండవుగా” కుండలో నీళ్ళు చాలా కొద్దిగా ఉన్న సంగతిని విపులీకరించి సమాధాన మిచ్చింది ముసలిది.
మౌనంగానే కమల స్నానానికి ఉపక్రమించింది.
కమల స్నానం పూర్తిచేశాక, ముసలిది భోజనానికి ఆహ్వానించింది.
“చాలా చిన్నసత్రవులాుందే!” ముసలిదానివైపు చూచింది కమల,
'పట్నాల్లొ సత్రవులు యిట్లాగే ఉంటాయి,!"
ముసలిది మెరుపు చూపుతో నవ్వింది. ఆ మెరుపు చూపులో తనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉండిఉండాలని అనుమానపడింది కమల.
పచ్చడి మెతుకులతో (ప్రత్యక్షమయింది కంచం, ఆకలితో దహించుకపోతున్న కమల ఎదురుగా కనిపించే ఆహారము అసహ్యంగా ఉన్నా తినక తప్పలేదు చల్లగాఉన్న ఆ అన్నం ఆమె హృదయంలోని ఆశలన్నిటిని చల్లబరిచింది. ముసలిది చివర అందిచ్చిన (గుక్కెడు మజ్జిగనీళ్ళతో తృప్తిపడి వరంఢాలో కూర్చుంది. కమల.
కమల అన్నంతిన్న కంచం కదిగి ముసలిది కమలదగ్గర వచ్చి కూర్చుంది. “ఆ తడికల అవతల ఎముంది? కమల ముసలిదాన్ని ప్రశ్నించింది అమాయకమైన చూపుతో.
“ఏముంది ! మన సత్రపులోని మనుష్యలే?” పక్కున నవ్వింది ముసలిది. ఆమె నోట్లోనీ తాంబూలం, పెదవులను ఎ(ర్రబరిచి కొసల గుండా లాలాజలాన్ని ్రవింపజేస్తోంది, చెమటతో నిండిన ఆ ముసలిదాని ముఖం అప్పుడే జల ఊరుతున్న క్రొత్తనుయ్యిలా తడితడిగా వికృతంగా ఆగుపించింది,
ముసలిదాన్ని ముఖంలో ఆలోచనలు ముడుతలుగా మారి పాముమెలికల్లా చుట్టుకున్నాయి.
“కాస్త తల దువ్వనా!?
తి0 అన్వేషణ
'రాత్రి కలా ఉంటేనేం ? కమల చికాకుపడింది.
'అలా అంటే ఎలా! యీ సత్రపులో ఉన్నవాళ్ళు ఎప్పుడూ అందంగా ఉండేలా చూసేబాధ్యత నాది!"
వికటంగా నవ్వింది ముసలిది
కోపంగా, రోషంగా చూసింది కమల.
తడికల ప్రకృసందులోంచి గళ్ళలుంగీ, ఎర్రటోపీ పెట్టుకున్న సాహెబు, ఇంకో కుర్రాడు వచ్చారు. కమలచూని ఒకక్షణం ఆగి, నవ్వుతో ముసలిదాన్ని సమీపించారు. ముసలిది కంగారుగా గబగబ లేచి వాళ్ళకి ఎదురువెళ్ళింది. ఏవో గుసగుసలు నడిచాయి. సాహెబు కిలకిలా ఖంగున నవ్వాడు. ఓరచూపుతో కుర్రాడు కమల వైపు ఆశగా చూశాడు.
'కమలమ్మా! నేను మళ్ళా యిప్పుదే వస్తా” ముసలిద్ సాహెబుతో తడికల సందులోంచి నిష్క్రమించింది.
ఇరవైఏండ్ల ఆ కుర్రాడు మెల్లిగా అడుగులు వేస్తూ కమల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు లోలోపల ఆ పరిస్థితి అంతా భయం గొల్పుతున్నాా ధైర్యంగా మొండిగా కూర్చుంది కమల.
“ఏవరు? కుర్రాడు అడిగాడు,
“మద్రాసు
“కొత్తగా వచ్చావన్నమాట!”
మొనంగా తలపూపింది కమల.
ఎంత అందంగా ఉన్నావు!
నిట్టుర్పు విడిచాడు ఆ కుర్రాడు (ప్రేయసిని చూసినట్లు,
ఆ మాటకు కమల కొద్దిగా కత్రుళ్ళిపడింది.
“న్సవ్వుకూడా వ్యాపారం చేస్తావా?” కమల మాట్లాడలేదు.
ప్రక్కనే ఉన్న చీపురువుల్ల తీసి నోట్లో పెట్టకు నలుముతు ఆలోచనలో పద్దాడు 'కుర్రాడు-గచ్చునేల (కింద పారుతున్న చిన్న మురికిగుంట కుళ్ళువాసనలు చిమ్ముతోంది.
అన్వేషణ ప దోమలు రొదచేస్తూ వీరవిహారం చేస్తున్నాయి. తడికల ప్రక్క గోడఅవతల పాకీదొడ్డి దుగ్గంధం వ్యాపింపజేస్తాంది ఆ వాతావరణ మంతా అసహ్యంగా బీభత్సంగా కనిపించింది కమలకు కుర్రాడు కొంటెగా చీపురుపులతో కమల చేతిమీద కొట్టాడు. “ఏమిటి నువ్వనేది? ఎవరు నువ్వు?” చికాకుగా అరిచింది కమల. “ఈ యిల్లు ఎవరిదో తెలునా” హేళనగా నవ్వాడు కుర్రాడు కుర్రాడు పకపక గట్టిగా నవ్యాడు. 'ఇప్పుడు తెలిసింది నీ స్థితి ?” హరాత్తుగా నవ్వు ఆపి ఆలోచనలో పడ్డాడు కుర్రాడు. మనస్సులోని అనుమానాలు స్థిరపరిచే ఆ కుర్రవాడి నవ్వుచూసి కమల కంగారు పడింది. వయసులో కొంచెం తనకన్న తక్కువగా కనిపించే ఆ కుర్రాడిని మచ్చిక చెసుకుని వాతావరణం అర్ధం చేసుకొని జీవితాన్ని భద్రంగా నడిపించుకోవాలనుకుంది కమల. 'నీ పేరు! అనునయంగా అడిగింది. “రాముడు + “ఏం చేస్తుంటావు ? “నీలాంటి వ్యాపార ప్రీలకు సహాయం చేస్తుంటాను?” 'వ్యభిచారం!? కమల భయంతో మౌనం వహించింది. శరీరంనిండా తెళ్ళుకుట్టినట్లయింది. ప్రయాణం బడలికతో ఆమెకు నీరసం అవహించింది ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగి తొట్రుపాటు సర్గుకుంది. ఛి 'ఈ చీకట్లో నీఅందమైన కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్!' ఆ కుర్రాడి మాటలు కమలకు ధైర్యం చేకూర్చాయి. “అయితే ఇది బోగంకొంప అన్నమాట!" “'ఊ” నవ్వాడు కుర్రాడు.
తజ అన్వేషణ
'ఆ ముసలిది ఎవరు ?
కుర్రాడు సమాధాన మిచ్చేలోగా తడికల వెనుకనుంచి అయిదుగురు యౌవనవతులు, ముసలిది కిలకిల లాడుకుంటూ వచ్చారు. సీల్కుబిరల్లో శరిరాంతర్చాగాలు వెలికి వయ్యారంగా చూపిస్తూ, స్నో పౌదరు అద్దిన తెల్లముఖాలు, రంగు పూసుకున్న పెదవులు, చెదిరిన జడలతో, ఘల్గుమనే గాజుల మోతతో ఏవో కబుర్లు చెప్పు కుంటుకమలదగ్గరకు చేరారు.
“ఈ అమ్మాయి కమల, క్రొత్తగా వచ్చింది ! ముసలిది తాంబూల బుగ్గను బిగించి, వక్రంగా దవడలు త్రిప్పి రీవిగా పరిచయం చేసింది. తక్కిన అమ్మాయిలకు.
ఆ అయిదుగురు యువతులు కమలచుట్టుమూగారు. ముసలిదాని సైగతో కుర్రాడు చీకటి సందులోంచి వెళ్ళిపోయాడు. కమలను అపాదమస్తకం ఆ ప్రీలు పరిశీలించారు.
“ఎంత అందమైన ముఖం?
“అరకు (ముక్కలాంటి గుండ్రని ముఖం!”
'మెరుస్తున్న కళ్ళు?”
(వెండి చేపల్లా!
అబ్బ! నాజూకైన కాళ్ళు, చేతులు!”
“తామర తూడుల్లా!
'ఎంత పెద్దజడ[
“నల్ల త్రాచులా వేలాడుతోంది!”
ప్రశ్నలు, సమధానాలు ఒకరికొకరు చెప్పుకుపోతూ కమలను వర్ణిస్తూ కిలకిల నవ్వారు. ఆ స్రీలు ముదిరిపోయిన ముఖాలతో, లావెక్కుతున్న శరీరాలతో, తాంబూలంతో గారకట్టన పళ్ళతో, అనారోగ్యంతో చెడిన శరీరాలు వెలిగ్రక్కే వాసనలతో చుట్టూ రాక్షసస్త్రీల్లా కూర్చున్నవాళ్ళని చూసి లోలోపల అసహ్యించుకుంది కమల.
“రేపటి నుంచి మన బేరాలన్నీ దీనివైపు మొగ్గుతాయి. కాబోలు!” ఒకతె పెదిమ విరుచుకుంది.
“నేపటినుంచి మన బస మార్చుకోవడం మంచిడి!' ఒకతె వెళ్ళు విరుచుకుంది.
అన్వేషణ 88
“ఫోవె! ఎవళ్ళ అదృష్టం వాళ్ళది!” ముసలిది మధ్యన అడ్డుకుంది
ఆ ప్రీలు గదిలోకిపోయి, మాసినబట్టలు ధరించారు బయటికి వచ్చి వరండాలో ప్రక్కలు వేసుకున్నారు ఇద్దరు తడికెల గదిలోకి పోయి పడుకున్నారు.
పదకొండుగంటలు దాటింది. ముసలిది కమలను తడికల గదుల్లోకి తీసుకువచ్చింది.
“ఇదంతా మనదే !' ముసలిది సరదాగా నవ్వింది “ఇక్కడ పడుకో! ముసలిది కమలకు ఒక పట్టెమంచం చూపించింది.
మరకలతో మలినంగా వున్న తెల్ల దుప్పటి, మాసిపోయి చమురుతో నల్లబడిన పాత తలగడ దానిమీద పడిఉన్నాయి.
“ఈ వేళకు పడుకో ! రేపు నీకు తెలుస్తుంది అంటూ" అంటు ముసలిది తడికలు దాటి మునుపటి వరండాలోకి వెళ్ళింది.
కమల పట్టెమంచంమిద ఒరిగింది ముసలిది విద్యుద్దిపాలు అర్పెసి, నూనె ప్రమిదలు వెలిగించింది. దోమలు గుంపుల్లా దండయాత్రకు వచ్చి, కమల శరీరమంతా కుడుతున్నాయి, మాసిపోయిన దుప్పటి ముఖం మీదకు కప్పుకుంది కమల.
పట్టెమంచం అంటిపెట్టుకొని సంసారాలు గడుపుతున్న నల్లులు తమ కొంప ఆక్రమించిందనే కోపంతో అడుగునుంచి ఆమె శరీరాన్ని బాధిస్తున్నాయి.
వీధిలోంచి ఎవడోత్రాగి మైకంగా ఏదో పాడుతూపోతున్నాడు రిక్షా మువ్వల కదలిక శబ్ధాలు ఘల్లుఘల్లున వినిపిస్తున్నాయి. గస్తీ కాసే పోలీసువాళ్ళ ఈలలు అప్పుడుప్పుడు గాలిని దలాసుకుని కమలకు వినవస్తున్నాయి.
దుప్పటి ముసుగులో కమల వెక్కివెక్కి ఏడ్చింది. దురదృష్టవశంవల్ల వ్యభిచారుల కొంవలో (ప్రధమంగా అ్య(శయం తీనుకోవలని వచ్చినందుకు దుఃఖము అపుకోలేకపోయింది. గతించిన జీవితంలో పురుషుడు తన్ను మోసం చెయ్యడమేకాకుండా తన అందాన్ని అన్ని విధాల అన్వాయంగా అన్వాదించి తన్ను కులటగా చెయ్యాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. ఎన్నో కష్టాలు దాటి క్రొత్తజీవితం గడపాలని మరో మహా నగరానికి పయనమైవస్తే దైవంకూడా తనకు వ్యభిచారుల కొంపనే ఆశ్రయానికి చూపించాడు తన జీవితం ఇక ముందు కులటగా గడుస్తుందా! మోసం చేసిన పురుషుడుపై వ్యభిచారిణిగా జీవితం (ప్రతీకారం తీర్చుకుంటుందా? కాముకులైన పురుషుల
తశ అన్వేషణ విషయవాంఛలకు బలియై, శరీరారోగ్యం చెడగొట్టుకొన్నాక యు ప్ర మాత్రం జీవితంలో ఏ ఘనకార్యం సాధించగలదు? బ్రతుకుతెరువుకు కులటవృత్తికన్న మరో ఉత్తమమార్షం ప్రీకి దొరకదా? సమాధానాలు దొరకక సంఘర్షణపడి సతమతమైంది కమల.
ఉన్న నాల్గురూపాయలలో ఒక పావలా రిక్షావాడికి యిచ్చింది కమల మిగిలిన సొమ్ముతో ఏలా జీవితం గడపడం! ఒకసారి చెడిన శీలం: జీవితంలోని ఒక లక్ష్యంకోసం మరొకసారి చెడితే నష్టమే ముంటుంది? ఇక్కడే ఉండి ధనం సంపాదించుకుంటే?.. .. అనాకారులుగా, అసహ్యంగా ఉన్న ఆ కొంపలోని స్రీలు కమల కంటి ముందు కదిలారు. కోరమీసాల రౌడీ ......... బట్టతల ముసలాడు...... ఇరవయ్యేళ్ళ క్రొత్తకుర్రాడు .......వళ్ళూడిన తాత... ....... కుంటికాలు యువకుడు.........తాగితూలే నీచులు..........పురుషులను తెచ్చే బ్రోకర్షు. . ఎ(రటోపీల అధికారులు........ ..ఇల్లు కాపలాకాసే వస్తాదులు..... .... తమకరాశకలాలు సంకెళ్ళల్లా పేని ఆమె శరీరాన్ని మలిచి మలిచి ముద్ద చేసినట్లు అనుభూతి గల్లింది కమలకు, 'ఆ జీవితం దుర్భరం !...... ఇక్కడ నుంచి వారిపోవాలి రేపు......... పట్టపగలు..... ముసలిదానితో నిష్కర్షగా చెప్పెయ్యాలి, ఇక్కడ ఉందదల్ఫుకోలేదని........ " ఒక నిశ్చయానికి వచ్చిన కమల బాధగా, బెంగగా ఎడుస్తూ కళ్ళు మూసుకుంది.
మగత నిద్రలో వడుతున్న కవులకు తన శరీరం వీద ఎవరో చెయ్యివేసినట్లునిపించింది. బయటకి చూచింది. రాత్రి తన ప్రక్కన కూర్చున్న కుర్రాడు! తన శరీరం మీద దుప్పటి తొలగిస్తున్నాడు. “భయంతో కెవ్వున ఆరిచింది, కమల 'భయపడకు......నేను..,.....* మెల్లిగా ఊదాడు కుర్రాడు.
ఆమె కేకకు ముసలిదానికి మెళుకువవచ్చి లేచింది. మరెమి మళ్ళి గడబిడ వినపడనందువల్ల, వీధిలోంచి ఎవరో అరచి ఉంటారనుకొని ప్రక్కమిద ఒరిగింది ముసలిది.
“ఎందుకు వచ్చావు?”
'నీ సంగతి ......తెలుసుకుందామని............రాముడు నసిగాడు,
“తెలుసుకుసి.........?”
“సాయం చెయ్యాలని.........నువ్వు యీ యింట్లోకి పొరపాటున వచ్చావనుకుంటా?”
“ఊ! సదత్రవు యిదేనని రిక్షావాడు!”
అన్వేషణ కక్
'దొంగపీనుగ!' రాముడు నవ్వాడు
“ఇక్కడనుంచి రేపు వెళ్ళిపోతా!"
“ఎక్కడికీ?.......అలా వెళ్ళనివ్వదు ముసలిది ..... .. పోలీసులు, రౌడీలు దానికి అందకూడా!).
'మరి ఎలాగా ?”
“నే సహాయంచేస్తా. ...... ..నేను చెప్పినట్లు చెయ్యి.......రాముడు కమల చెవిలో గుసగుసలాడాడు. చెవుల పద్ద చేరిన రాముడి పెదవులు కమలముఖాన్ని స్పృళించి. చుంబించకుండా వెనుతిరగలేకపోయాయి రాముడు తనకు ముందు ముందు సహాయకారి కాగలడనే ఆశతో కమల అతడి చుంబనాన్ని మౌనంగా ఆమోదించింది.
“మృసలిది చూస్తే ఏమన్నా అంటుంది.”
'రేపువస్తా!” రాముడు మెల్లిగా శబ్ధం చెయ్యకుండా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.
రాముడు చెప్పిన సలహావల్ల కొంచెం ధైర్యం కలిగి కమల నిద్రవోయింది.
పీడకలలతో మనస్సు చెదిరి, అనుకోని పరిస్టితులవల్ల భయం పెరిగి, వికలచిత్తంతో తెల్లవారగానే లేచింది కమల రాత్రి ఆ గృహానికి వచ్చిన విటులు విడిచిన సిగరెట్టుముక్కలు చెదిరి క్రిందపడి ఉన్నాయి గత స్మ బ్రతులన్నీ మనస్సులో కదిలాయి కమలకు, సిగరెట్టు పీకెల మసిలా ఆమె మనస్సునిండా ఆందోళన వ్యాపించింది.
తడికేల గదిదాటి వరండాలోకి ప్రవేశించింది. ఆ యింట్లోని యువతులు యింకా నిద్రమత్తులో సొమ్మసిల్లి పడి ఉన్నారు. పొడరు ముఖాలు చమురుతో నలుపెక్కి అసహ్యంగా, వికారంగా కనిపించాయి నలిగిపోయిన దుస్తులతో, నిద్రబద్దకంతో సొచుకొని పడుకున్న ఆ ప్రీలు రసంతీసినపిదప విసిరిన చెరుకుపిప్పి కుప్పల్లా కనిపించారు.
ఏ జీవితం తరచిచూసినా ఏదోవైచిత్రి కనిపించక మానరు. కాని ప్రతిజీవి తనజీవితం యొక్కవైచిత్ర్యం విలువ తక్కినవాటికన్న ఎక్కువ ప్రత్యేకత మాత్రం కలిగిఉందనే భావంతో గడుపుతూటుంది అనేక అనుభూతులతో గడచిన మూడు సంవత్సరాలలో కమలజీవితంలో కలిగిన మార్పులు ఆమెకే ఆశ్చర్యం కలిగించాయి తన ఎదుట నిద్రమైకంలో నిశ్చింతంగా ఉన్న ప్రీల జీవితాల్లో ఎటు వంటి విచిత్ర అనుభూతులు ఉంటాయో అనుకుంది కమల
ఏ6 అన్వేషణ
ముసలిది లేచికూర్చుంది కమలనుచూచి గదిలోకి వెళ్ళి పళ్ళపొడి అందిచ్చింది వీధిలోని ఒక ఊరకుక్క యింట్లోకిచారబడి ముసలిదాన్ని చూచి తోక ఆడిస్తూ నిలుచుంది క్రితందినం గిన్నెల్లోమిగిలిన మెతుకులు ఏరి కుక్కముందు రాల్చింది ముసలిది,
మౌనంగా దంతధావన మొదలెట్టింది కమల, ముసలిది పళ్ళు తోముకుంటూ ఆమెప్రక్కనే వచ్చి కూర్చుంది
“నేను యీవేళ మధ్యాహ్నాం ఊళ్ళోకి వెళ్ళితా, అక్కడ మా బందువులున్నారు! కమల అ(త్రుతతో ముసలిదానివైపు చూసింది.
“మాసటత్రంలో అడుగుపెట్టిన అతిదుల్ని అనవసరంగా బయటికి పంపే అలవాటులేదు నాకు నీకు ఏమిలోటు కలిగింది ?* నవ్వుతూనే ముసలిది కమల బుజం నిమిరింది.
రాముడు చెప్పిన మాటలవల్ల ముసలిదానిముందు చర్య గ్రహించుకున్న కమల మౌనంగానే ఉండిపోయింది.
కొంతసేపు గడిచాక, కుళాయిధారలో స్నానం చేసి, పెట్టెలోని వాయిలుచీరె ధరించి కుంకం తీలకం దిద్దుకుని, నగరంలోకి పోవాలనే ప్రయాణసన్నాహంతో ఏదో ఆలోచనతో వరండాలో కూర్చుంది కమల.
ముసలిది వేడికాఫీ తయారుచేసి తెచ్చింది,
రాత్రి చేయవలసిన అలంకారం పొద్దున్న మొదలుపెట్టావు 7” కాఫీకప్పు అందిచ్చింది కమలకు.
“నాకు కాఫీ అక్మర్లేదు!
“ఏం ?”
ఇక్కడ ఏమీ తీసుకోదల్బుకోలేదు.
'అలాగా!' వయ్యారంగా, చోద్యంగా నిలుచుంది ముసలిది.
“ఇద్ర భోగంకొంపి) అరిచింది కమల.
ముసలిది పకపక నవ్వింది.
నేను తక్షణం వెళ్ళివోతా!”
“కాఫీ తీసుకొని వెళ్ళు” వెకిలిగానవ్వి కాఫీకప్పు చేతికి అందిచ్చింది కమలకు.
అన్వేషణ 87
అందిచ్చి కాఫీకప్పును త్రోసివేసింది కమల, కప్పు క్రిందపడి పగిలి ముక్కలైంది, కాఫీ వరండాలో కాల్వకట్టింది
'కోపంవల్ల ప్రయోజనంలేదు!' హేళనగా మూతిత్రిప్పుకుంటూ ముసలిది వంటిల్లోకి వెళ్ళిపోయింది.
కాఫీకప్పు పగిలిన చప్పుడును పందుల్లా దొర్లుతున్న ఆ యువతులు కళ్ళును లుము కుంటూ, ఒకరిమీద ఒకళు పడుతూ చిలిపి శృంగార చేష్టలు చేసుకుంటూ గారాబంగా దిర్దాలుతీస్తూ లేచికూర్చున్నారు కమల తన పెట్టె, సంచి సర్దుకుని, వరండాలోకి వాటితో వచ్చింది ప్రయాణానికి సిద్దమయి.
'క్రొత్తపిల్ల పోతోంది అమ్మా” అరిచింది ఒక యువతి
“పోయేదాన్ని ఎవరాపగలరు?” నవ్వింది ముసలిది పెట్టె, సంచి, చేత్తోపుచ్చుకుని గబగబ వీధి గుమ్మంవైపు చిన్నసందులోకి నడిచింది కమల
నిన్న రాత్రి కనిపించిన సాహెబు గుమ్మానికి అడ్డంగా కూర్చున్నాడు అతని ప్రక్మనే అరడుదుల అజానుబాహుడు తిరగలి దిమ్మలాంటి వక్షస్టలంతో, కోరమీసాల వసాదు కమలను పషట్టుకుందామని కండలు తిరిగిన బాహువులు చాచి భయంకరంగా నవ్వాడు
“ఎం పిల్లా? ఏదకు పోదామని!
ఒక క్షణం నిశ్చేష్టురాలై నిలుచుండిపోయింది కమల కబంధుడిలా కదిలి ముందుకు వచ్చాడు వస్తాదు. చేతులుచాచుకుంటూ ఆబలమైన చేతులతో ఆటబొమ్మను ఎత్తినట్టు కమలను ఎత్తి పట్టుకున్నాడు భయంతో బిగ్రరగా అరిచింది కమల, సాహేబు తన గెద్దాన్ని కంపింపజేస్తూ పకపక నవ్వాడు. ఆమె చేతుల్లోంచి జారినపెట్లె, సంచి గబుక్కున అందుకున్నాడు వస్తాదు కమలను చేతులతో ఎత్తి గబగబనడిచి వరండాలో కూలవేశాడు కమల గిజగిజతన్నుకుని కోపంతో వస్తాదుచెయ్యి కొరికేసింది "పెంకి పీనుగ!” కొరీకినచెయ్యి నిమురుకున్నాడు. వస్తాదు. గళ్ళలుంగీ సాహెబు ఆనందంగా గంతులువేశాడు. ముసలిది విరగబడినవ్వింది యువతులు కొందరు మౌనంగా తిలకించారు పరిస్థితి కమల వెక్కి వెక్కిఎద్వసాగింది.
'పిచ్చిపిల్లా ఏడుస్తే ఏం లాభం?” ఒకతె పాచిముఖంకంపుతో కమల ముఖంలో ముఖం పెట్టింది.
తక అన్వేషణ కమల అసహ్యంగా ఆమెను గెంటెసింది. “ఈ రాత్రికి రంగంలోపడితే, అదే ఉంటుంది. ఈ పిల్లను జా(గ్రత్తగా చూసేబాధ్యత నీది!” ముసలిది వస్తాదువైపు సైగచేసింది. పాచిముఖాలతోనే కాఫీలు త్రాగడానికి వంటింట్లోకి నడిచారు స్రీలు. రాముడు వచ్చాడు పరిస్టితిచూసి, తాను నిన్న రాత్రి కమలకు చెప్పిన విషయం తారుమారైందని [గ్రహించాడు నగరంలో బంధువులున్నారనే నెపంతో కమలను అయింటి నుంచి బయటకు పంపే పన్నాగంలో ఉన్న రాముడు ఆపరిస్టితి చూసి నిరుత్సాహబడ్డాడు బోగంకొంపలో పడిపోయానన్న బాధతో ఉక్రోషంగా పరిస్థితిని జాగ్రత్తగా పరిష్కరించడానికి బదులు పారిపోతున్నసంగతి ముసలిదాని దృష్టికి తగిలేలా ప్రవర్తించింది కమల. చిరకాలంనుంచి వ్యభిచార వ్యాపారంలో అనేక గుణపారాలు నేర్చుకున్న ముసలిదానికి కమలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలో తెలియని విషయం కాదు నాన్నరాత్రే సాహేబుతో చెప్పి వస్తాదును యింటికి కాపలా పెట్టింది, ఏమీ తెలియనట్లు రాముడు ప్రశ్నించాడు . సంగతి ఎమిటని గళ్ళలుంగీ సాహెబు వచ్చిరానీ తెలుగు భాషలో వివిధ స్వరాలకూతల విచిత్రంగా మాట్లాడాడు. పరిస్థితి దసాభాసు అయింది [గ్రహించిన కమల ముందుసంగతి ఐమిటన్నట్లు జాలిగా రాముడివైపు చూసింది. ఎక్కడికిపోతుందో చూద్దాం. ప్రక్కగదిలో పెట్టి తాళం వెయ్యండి" రాముడు కోపంగా ఉరిమాదడు. తన వృత్తిలో నమ్మిన బంటులా పనిచెస్తున్న రాముడు మీద ముసలిదానికి చాలా అభిమానం. అతని సలహా ఆమెకు నచ్చింది వస్తాదువైపు చూసింది. గునపంతో గడ్డ పెల్లగించినట్లు వరండాలోని కమలను బలవంతాన చేతులతో ఎత్తి ప్రక్కనున్న గదిలో కూలేశాడు వసాదు. . రాముడు గదిలో చొరబడి “తాళం తేవోయ్” అని వస్తాదు వైపు చూశాడు. వస్తాదు బయటకు నిష్షమించాడు. బొగ్గులు పిడకలు, పుల్లలు పాతసామానులతో, బూడిదనిండిన, బూజుపట్టిన ఆ గదిలో విషకీటకాలవల్ల ఏ ప్రమాదమైనా రావచ్చు సాలిగూడులు గదిలో
అన్వేషణ ఫ్ర వ్రైళ్ళాడుతున్నాయి : కమల భయంతో రాముడి వైపు చూసింది రాముడు తన ప్రవర్తన అంతా నటన అని కనుసైగ చేశాడు.
'వ్యాపారం చెయ్యడానికి ఒప్పుకో! రాత్రి నా స్నేహితులను తీసుకువసా వాళ్ళు నిన్ను నగరంలోకి తీసుకు వెడతారు. అక్కడ నుంచి.... అంతే!” రాముడు నవ్వాడు కమలకూడా బలవంతాన లేనినవ్వు తెచ్చుకుని నవ్వింది
రాత్రి వెలుగు చికట్లలో కమల ముఖం అందాలు సరిగా రాముడికి తెలియలేదు. పగటిపూట స్పష్టంగా చూస్తుంటే పసుపు పచ్చని, పలుచని ఆమె ముఖసౌందర్యం, నాజూకు పెదవుల నవ్వు శిరోజాలు కొంటెగా ఎగరడం, ఆశగా దూసుకువస్తున్న ఆమె చూపులు, రాముణ్ని మైమరపించాయి, ఆ మైకంలో తన్మయుదై ఒక నిట్టుర్పు నిడిచాడు.
వన్తాదు తాళం తెచ్చాడు. రాముడు అందుకున్నాడు. ముసలిది గర్వంగా నవ్వుతూ వస్తాదు వెనకాలే వచ్చింది
'మేము చెప్పినట్లు వినేదాకా నీకీ గదిలోని ఖైదు తప్పదు రాముడు భళ్ళున తలుపువేసి తాళం బిగించాడు. 'ముసలవ్వ చెప్పినట్లు వింటావా?” రాముడు తాళం తీయకుండానే ప్రశ్నించాడు. “వింటాను ! కమల గదిలోపలినుంచి అరిచింది “ఈ యింట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించవుగదా?” “వెళ్ళను” కమల గట్టిగా తలుపు గుద్దింది. 'వ్యావారానికి ఒప్పుకుంటావా?” కమల మెల్లిగా “ఊ” అంది ముసలిది మందస్మితం చేసింది. “తలుపుతియ్యి. లోపల ఏ తేలైనా కుట్టగలదు!” ముసలిది జూలిగా నవ్వంది.
రాముడు తాళం తీసి, గదితలుపులు తెరిచాడు. కమల తల ఒంచుకుని మెల్లగా బయటికి నడిచివచ్చింది. యువతులు ఆమెను చుట్టుముట్టారు.
“మొదటే ఒప్పుకుంటే యింత గొడవ కాకుండా ఉండేదికదూ!” ఒకతె కమల చుబుకంపట్టుకుని అనునయించింది.
“అమ్మకు గొప్పలాభంలే యీ వేళ !” మరొకతె ముసలిడాని భుజం తట్టింది.
నాహెబు వెకిలిగా పకపకనవ్వాడు కులుకుతూ వస్తాదు తన కండలు నిమురు కున్నాడు, యింతవరకు జరిగిన ఘనకార్యం తలచుకుని, రాముడు తాను వేసిన పన్నుగడ పారిందని కమల వైపు ఓరగా కొంటెగా చూసూ వెళ్ళిపోబోయాడు.
“సాయంత్రం కనిపిస్తావా!' అరిచింది ముసలిది.
'అది నా ఉద్యోగం!” రాముడు నవ్వాడు.
40 అన్వేషణ గళ్ళలుంగీ సాహెబు అతని వెనకాలే నిష్మమించాడు. వస్తాదు మామూలుగా గుమ్మంముందు కూర్చున్నాడు తన కాపలా ఉద్యోగం నిర్వహించడానికి.
సూర్యుడు ఇకాశంమీదకు ఉవ్వెత్తున లేచి జరిగిన సంగతి అంతా పరికిస్తున్నట్లు కనిపించాడు. వరండాలోకి పొంచుకు వచ్చిన ఎండ వెలుగు చూసి, యువతులు కాలకృత్యాలు తీర్చుకోడానికి ఉపక్రమించారు కమల నిశ్చబ్దంగా వరండాలో ఒకమూల కూర్చుని తన భవిష్యత్తుగురించి ఆలోచించసాగింది.
వీధిలో ఏవో బాజాలు వినిపించాయి. మెల్లగా నడిచి వీధి గుమ్మంలో నిలుచుంది కమల. వస్తాదు బుజాలు నిమురుకుంటూ లేచి కమలకు అద్దుగా నిలుచున్నాడు.
ఎవరో చచ్చిపోయారు. శవాన్ని ఊరేగిస్తూ జనం పోతున్నారు.
“ఎవరు?” కమల అడిగింది, పోయే శవంవైపు చూసూ.
“పొరుగింటి అమ్మాయి ! చాలా అందంగా ఉందేది. వ్యాపారంలో దిగాక క్షయ వచ్చింది ..... తీసుకు తీసుకుని చచ్చిపోయింది. బ్రతికిన ఆఖరి రోజుల్లో రక్తవాంతులతో యమయాతన పడింది.... ఆమె అంటే ఆభిమానమున్న పాత స్నేహితులు శ్శశానికి తీసుకువెడుతున్నారు!"
ధనాశతో, గతిలేక పొట్టగడుపుకోవడానికి శరీరాలు అమ్ముకుని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న ఆ పల్లెలోని ప్రీలు ఆఖరిదశలో ఆ విధంగా మరణిస్తారనే భావం కమలకుకలిగింది. ఈకుళ్ళు పద్మ వ్యూహంనుంచి ఎప్పుడు తప్పించుకు పోదామా అని తహతహలాడింది లోలోపల.
కమల తల ఒంచుకుని ఆలోచనతో లోపలికెళ్ళింది యువతులు స్నానాలు పూర్తిచేసి సింగారంలో పడ్డారు. ఒకతె దగ్గరకువచ్చి కమలను తల దువ్వమని అడిగింది కమల జడ వెయ్యడం ప్రారంభించింది.
“నువ్వేమైనా చదువుకున్నావా?' కమల అడిగింది.
“చదువుకుంటే ఈ వ్యాపారం ఎందుకూ!..... చక్కగా ఉద్యోగమే చేసుకునే దాన్ని
తేలికగా వెక్కిరించినట్లయింది కమలకు.
“ఇంతకుముందు యీ వ్యాపారంలో అనుభవం ఉందా?” అయువతి కమలను అడిగింది.
అన్వేషణ త్తే
'అయితే యిప్పుడు అంతా క్రొత్త అన్నమాట?
'ఏంచేసాను. జీవనోపాధి ఏదో చూచుకోవాలి, చేతిలో వాలుగు రూపాయతే ఉన్నాయి అందుకే ఒప్పుకున్నాను! మనసులోని మరోబాధ అణచుకొని సహజంగా తన కృత్రిమభావం వెలడించింది కమల వీధిలో . జనం కేకలేసుకుంటున్నారు. పెద్దగల్లంతు జరుగుతున్నట్లు శబ్దాలు వినిపించాయి.
యువతులూ, కమలా, విధి గుమ్మంవైపు నడిచారు.
ఇద్దరు యువకులు అరుస్తూ కొట్టుకుంటున్నారు. జనంపోగయి వాళ్ళని విడదీయ ప్రయతిస్తున్నారు. పోలిసు పరుగెత్తుకు వచ్చాడు ఈపోట్లాట చూచి, అతడిరాకతో భయపడి ఆ యువకులు ఒకరి నొకరు తిట్పకుంటూ విడిపోయారు.
వస్తాదు ఆ గుంపులో దూరి సంగతి కనుక్కుని వచ్చాడు ఒక అమ్మాయిని ఒక యువకుడు అతిగా (ప్రేమించి ప్రతిదినం ఆమె సాంగత్యంలో ఆనందించేవాడు, ఆ అమ్మాయి సౌందర్యం సంగతి విన్న ఆ యువకుని స్నేహితుడొకడు ఒకరాత్రి ఆమెనె అనుభవించాడు అది యువకుడికి తెలిసింది. ఉదయం ఆ ఆమ్మాయి యింటికి యిద్దరూ ఒకరికి తెలియక ఒకరువస్తూ దారిలో ఒకరినాకరు చూచుకుని ఉద్రేకాలు ఆపునులేక, కొట్లాట మొదలు పెట్టారు.
ఆ యువకులు అనుభవించిన ఆ అమ్మాయి దూరంగా మేడమీదనుంచి నవ్వుతూ కొట్లాట చూస్తాంది.
వ్యభీచారవృత్తి స్వీకరించిన స్రీలు ధనాశతో నిజాయితీని మంచితనాన్ని చంపుకుంటారని తనువిన్న సంగతి కమలకు బుజువయినట్లనిపించింది. రాణి ఈగచుట్సు తిరిగే తేనేటీగల్లా మసిలేవిటులను చూసి యౌవనము. అందమూ ఉన్న యువతులు గర్వంగా కొంత కాలం వి(ర్రవీగుతారు, వారి ప్రవర్తనకు ప్రతిఫలంగా జీవితం చివరికి కఫోేదమయమవుతుంది.
“సరేలే! యిటువంటి కొట్లాటలు మామూలే” అనుకుంటూ యువతులు ఇంట్లోకి నడిచారు.
కొంతసేపు ఆప్రీలు కొట్లాడుకుంటున్న యువకుల అందం, బలం, పౌరుషం గురించి సరదాగా వాదోపవాదాలు చేసుకున్నారు.
శై అన్వేషణ
ముసలిదానికి వంట ప్రయత్నంలో సాయం చేయడానికి ఇద్దరు స్రీలు వంటింట్లోకి చేరారు.
ఒకతె పేక తెచ్చింది. ముక్మలు కలిపింది. పేకాటలో చేరింది కమల. ఇట్టేకాలం గడిచిపోయింది
ముసలిది భోజనానికి పిల్ళ్సింది.
కమల, మిగతా ప్రీలు భోజనాలు చేసి ఒక కునుకు కూడా తీశారు.
మధ్యాహ్నం మూడుగంటల తర్వాత రాముడు వచ్చాడు చేతిలో ఏది-కర్ర ఊతంగా ఊపుకుంటూ,
“విన్నారా యీ సంగతి!” నటుడి భంగిమలో నిలుచున్నాడు రాముడు.
ముసలిది యువతులు, వస్తాదు కమల అందరూ అతనిచుట్టు నాటకంలోని పాత్రల్లా మూగారు.
“ఆ ప్రక్క వీధిలో వబొజ్జమ్మను హత్యచేశారు!”
“ఎవరు” అందరి కంరాలు ఆశ్చర్యంగా (ప్రశ్నించాయి,
“పూర్వాశ్రమంలోని భర్తకళ్ళు పెద్దవిచేసి, నోరు మెలికలు త్రిప్పి, గుటకలు (మింగుతూ మెల్లగా చెవ్పాడు రాముడు,
“అలాగా'” ప్రాణాలు ఎగిరిపోయినట్లుఅందరూ (గ్రడ్డు తేలేసి ఇశ్యర్యంగా నిలుచుండిపోయారు.
బొజ్బమ్మలేచి పోయిందట ఎవరితోనో. భర్తతో కాపురంచేసేరోజుల్లో ఆమెకోసం భర్త తెగవెదికాడట....కాని కనిపించలేదు లేవతీసునివచ్చినవాడు మోసం చేసిపోగా బొజ్జ్బమ్మయిక్కడకు వచ్చి వ్యాపారంతో పొట్టగడుపుకుంటోంది బోజ్జమ్మను యిక్కడ చూచిన వాళ్ళు ఎవరో భర్తకు చెప్పారట హేళనగా - ఈవేళ ప్రోద్దున హరాత్తుగా కొపంగా గుమ్మంలో ప్రత్యక్షమయిన భర్రనుచూసి కొయ్యలా నిలునుండిపోయింది. బొజ్జమ్మ .. కళ్ళల్లో నిప్పులు [గ్రక్కుతూ మౌనంగా కసిగా వెల్లిగా బొజ్జమ్మ దగ్గరగా వచ్చి నిలుచున్నాడు భర్త... అతని ప్రవర్తనచూసిబొజ్జ్బమ్మ ఆశ్చర్యపోయి, అతన్ని ప్రసన్నం చేసుకోవాలని నవ్వింది..., ఏనుగుమీద సింహం ఉరికినట్టు ఒక్కసారిగా పెద్ద అరుపు అరిచి ఆమె పీక పట్టాడు. మరుక్షణంలో పీక మొండానికి వేలొజెంది. రాక్షసిలా మారిపోయింది
అన్వేషణ శ్ర బొజ్జమ్మముఖం నిలుపుగ్రుడ్గుపడి, రక్తం కాల్వకట్టింది ఆమెభర్త చెతులు, బట్టలు రక్తంతో ఎ(ర్రబడిపోయాయి ఆ రక్తం తీసుకుని ముఖాన బొట్టుపెట్టు కున్నాడు భర్త... రక్తంతో తడిసినచాకు విసిరేశాడు ఖులాసాగా, ఒళ్ళంతా రక్తం రకతం పూసుకుని విరగబడి నవ్వాడు ఆ యింట్లోని స్రీలు భయంతో తమ గదుల్లోకి పారిపోయి తలుపులు మూసు కున్నారు ఇంతలో పోలీసులు వచ్చారు అతనికి సంకెళ్ళు తగిలించి తీసుకుపోయారు!!!
నటుని ధోరణిలో ఉపన్వాసమిచ్చి, అలసిపోయి విచిత్ర హావబావ ప్రకటనచేసీ, ఆగాడు రాముడు.
రాముడి నటన అంతా చూసి “ఆ , యిటువంటి హత్యలు యీ పేటలో క్రొత్త ఏముంది?” యువతులు నీల్లారు.
కమలకు లోలోపల భయం పుట్టింది బొజ్జ్బమ్మ చరిత్రవోలికలు కొన్ని తనలోనూ ఉన్నాయి, ఎవరోజ్ఞప్తికి వచ్చారు అతను కనిపిస్తే.....ఈ పరిస్థితుల్లో యిక్కడచూసి. అది జరిగేటంత పనికాదని మెల్లిగా తనలో తాను సర్దుకుంది కమల,
“ఇందులో పెళ్ళయినవాళ్ళు ఎవరైనా ఉంటే తమ భర్తల్ని గురించి ఒక్కసారి జవం చేసుకోండి !” రాముడు వ్యంగంగా నవ్విరీవిగా బయటకు వెళ్ళిపోయాడు.
కవుల అతనివైపు అ(తంగా చూనింది. మరణంగురించి యువతులు ముచ్చటించారు.
“చచ్చిపోయి బొజ్జమ్మ ఎంత అదృష్టవంతురాలు ! కటాకట్ ఒక్క దెబ్బతో ఎక్కడికో తెలియిని ప్రపంచంలోకి వెళ్ళివోయిందికి పకపక నవ్వింది ఒక యువతి.
“ఏదో కసి తీర్చుకున్నా ననుకున్నాడు కాని, బ్రతికిఉండి బొజ్జమ్మభర్త ఏంబావుకుంటాడో! కొన్నాళ్ళు జైలు... తర్వాత పిచ్చి తర్వాత చీడ బట్టినట్లు మంచం చావు! “మరొక యువతి చేతులు విరుచుకుంటు సాగుతీసుకుంది.
“బాధల (బ్రతుకుకంటే చావు ఎంతనయం! హత్య చేసినవాడు దురదృష్టవంతుడు, హత్య చేయబడిన వాళ్ళే చాలా అదృష్టవంతులు.... నన్ను తక్షణం ఎవరైనా చంపేస్తే ఎంత దాగుంటుంది!” మరొకఐ లీలగా చావుల ప్రపంచాన్ని కూర్చి ఊహాగానం చేసింది.
ఒకతె చేంతాడు తెచ్చి ఆమె పీకకుచుట్టి బిగించింది. తక్కిన వాళ్ళు నవ్వారు. కళ్ళు తెలేసినట్లు నటించి కూలబడింది ఆమె. ముసలిది కాఫీ తేవడం చూచి కూర్చుంది ఆమె,
క! అన్వేషణ
“అమృతం లాంటి కాఫీ ప్రపంచంలో దొరకుతుంటే నీకునాకూ చావు ఎలావస్తుంది!” ఒక స్తీ వేళకోళం చేసింది.
(బ్రతుకు బాధల బడబాగ్ని గుందెల్లో దాచుకుంటూ, నీచకులట వృత్తిలో వొట్టవోషించు కుంటూ, కృత్రిమ ఆనందంతో, నిర్లక్ష్యంగా జీవితాలు గడుపుతున్న ఆ ప్రీలు కమలకు చాలా విచిత్రముగా కనిపించారు. నీచమైన వృత్తి చేపట్టినంతమాత్రాన వాళ్ళలో పూర్తిగా దుర్మార్గుల లక్షణాలు మూర్తీభవించాయని నిర్ణయించడము కష్టంగా కనిపించింది కమలకు.
“కమల |! ముఖం కడుక్సూని. తలదువ్వుకో!” మునలిది ఆజ్జచేసింది.
“కొత్త! గట్టిగా రుడిపించకు!?” ఒకతె ముసలిదాని బుజంతము జాలిగా చూసింది కమలవైపు. “జడవఎయ్యనా!” అంటు ముందుకు కచ్చింది. కమల మౌనంగా అంగీకరించింది. ఆమె నూనెరాసి ముడివేసింది.
“డాబామీదకు వెదధామా!” కమల నడిగింది ఆ యువతి “నీ పేరు?”
“బాలమ్మ”
కుళాయి చప్పామీద కుండ పెంకులో మట్టితో ఉన్న నల్లబడిన లక్సు సబ్బుతో ముఖం రుద్దుకుంది కమల
మల్లెపూలు నాల్గుదండలు తెచ్చి మామూలుగా యింట్లొ పడేశాడు ఒక దుకాణాదారు.
ముసలిది తెచ్చి మల్లెపూవులు, అందరితలలో గుచ్చింది.
బాలమ్మ కమల డాబామీదకు వెళ్ళారు. దుమ్ముపట్టి, ఎగుడుదిగుడుల సిమెంటు గతుకులతో, మట్టిలోంచి ఫపొడుచుకువచ్చే గడ్డి మెలకలతో సగం సగం పడిపోయిన, క(ర కమ్మీలతో , అడదాబా ఆ శిధిలమైన కొంపకు, అందులో బ్రతుకుతున్న చితికిన జీవితాలకు అను గుణంగానే ఉంది. డాబా మీదినుంచి క్రిందికి చూచింది కమల కిళ్ళిదుకాణాలవద్ద జనం గుంపులుగా నీలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. సిగరెట్టు వొగలు వదులుతూ ్రక్కనున్న యిళ్ళవైపు, యిళ్ళగుమ్మంలో నిలుచున్న స్రీలవైపు ఓరచూపులు చూన్తూ తమలోతాము నవ్వుకుంటు పోగరుబోతుగా యువకులు నోోచిపోతున్నారు, అక్కడక్కడ చెదిరి నిలుచున్న (బ్రోకర్లు కూలాసాగా, నీటుగా, ఓరగా నడుస్తున్న యువకులను పసికట్టిచూచి “బాబూ!కావాలా” అంటు నడిచి, ఆగి, నిర్వయంగా ప్రశ్నిస్తున్నారు తెరలు కట్టిన రిక్షాలు మువ్వల శబ్ధంతో ఎరుగుతూ కదులుతున్నాయి.
అన్వేషణ జేస్
వీధిలోని విద్యుగ్దిపాలు మసకగా వెలిగాయి కులటల కులుకుల్లా, మల్లులాల్సీ తొడుక్కున్న ఒక నల్లయివకుడు, దుబ్బురోలుగా లావెక్కిజన్న మరొకడు, ఒక (బబ్రోకరుని పిలిచి డాబాక్రింద గుసగుస లాడుతున్నారు, ఎదురుగావున్న మేడమీద వాయిద్యాల, (శుతులు గాలిలో తేలి కదలి వీనుల్లో ఊగాయి మువ్వల శబ్లాలతో కదిలి వెలువడుతున్న రాగాలు నృత్య ప్రదృనలు జరుగుతున్నట్లు స్పష్టము ,ఎస్తున్నాయి.
ఒక బట్టతల తాతగారు వెంటబడిన (బోకరును కసిరికొట్టారు ఒక యువకుడు రెండు రూసాయల కాగితాలు ఒక బ్రోకరునకు అందిస్తున్నాడు ఎదురుగావున్న యింట్లో ఇద్దరు యువకులు చొరబడ్డారు వీధి గుమ్మంలో నిలుచున్న స్రీలు పురుషుల విషయ వాంఛల (క్రూరంగా మార్చేసిన వికృత స్వరూపాలకు కృత్రిమపు టందాలు పూసుకొని బలవంతంగా తెచ్చుకున్న నవ్వులతో ఒయ్యారంగా నిలుచుని పసికట్టన విటులను పిలుస్తున్నారు. కాకీదుస్తుల ఎర్రటోపి మనిషి లాఠీ పట్టుకుని శృంగాటకంలో గస్తీ కాస్తున్నాడు, గలాటాలు జరుగకుండా, మోటారు సైకిలుమీద పరుగెత్తిన ఒక కాకీదుస్తుల అధికారి ఒక గుమ్మంముందు నిలుచున్న స్త్రీని చూచి నవ్వుతూ గాలిలో తేలిగా ఒకముద్దు విసిరాడు.
“*నాక్తు భయంవేసొంది బాలమ్మ!” కమల బాలమ్మ భుజముమీద ఒరిగింది. కమల ముఖం చూడకుండా, తర్వాత కమల వదనంలోని భయంచూచి జాలిపడింది బాలమ్మ.
“నీక్సు యీ జీవితం యిష్టంలేకపోళతే వెళ్ళిపో యిక్కడినుండి దొంగతనంగా 1! - మా జీవితాలు నాశనమైపోయాయి....నాశనం చేశారనే కోపంతో, మగపురుగులపై కసితీర్చుకోవడానికి యీ బ్రతుకు (బతుకుతున్నా -నా ఆనారోగ్యం, అందమైన భార్యలను మోసంచేని ధనమదంతో యొక్కడ అడుగు పెట్టిన (ప్రతి మగవాడికి ఒక గుణపారంచెబుతూంది. యిక్కడ అడుగు పెట్టిన ప్రతి మగవాడికి ఒక గుణపాఠం చెబుతుంది. పగబట్టిన త్రాచులా విషకలుషితం చేస్తేనే నా మనస్సుకు శాంతి. చితికిపోయిన జీవితాన్ని బాగుచేయ్యడం కష్టం - ఎప్పుడో చితిఎక్కి మసియైపోతుంది. ఆ కాలం ఎంత త్వరగా వస్తే అంత మంచిది! 1!”
బాలమ్మ చూపులు భయంకరంగా మారి కనుగ్రుడ్డు ఎ(ర్రబాడ్డాయి!
“ఎల్లాగ పారిపోవడం?”
ఇచ్చేను సనాయంచెయ్యనా?”
డట అన్వేషణ
జ్య |
“మరి ఈరాత్రి ఎలాగ గడుపుతావు-ముసలిది ఊరుకోదు విటులను తోలుతుంది నీ మీదకి....”
“ బం చెయ్యమంటావు?
“అల్లరి చెయ్యి - దగ్గరికి రానీయకు ! ... ఏం జరిగినా విచారించకు - శీలం చెడగొట్టుకోకు .... తెల్లవారురూమున నిన్ను యింట్లోంచి పంపే ఏర్పాటు నేచేస్తా!”
బాలమ్మ మాటలతో కమల ఆనందం పట్టలేకపోయింది. వృత్తి వల్ల నీచగుణంవున్న హృదయంలో జెదార్యంవున్న బాలమ్మ కమలకు దేవతలా కనిపించాంది. మనిషీ శీలాన్ని బట్టీ మనస్సును ఆపార్ధం చేసుకోకుడరనుకుంది కమల. ఒక్క తెంతు తెంతు సంతోషంతో బాలమ్మను గాఢంగా చేతులతో బంధించింది.
ముడు కూడా సాయంచేస్తానన్నాడు !”
వాడిమాటలు నమ్మకు - ఎంతైనా మగపురుగు!”” క్రూరంగా నవ్వింది బాలమ్మ.
రాముడికోనం వీధిలోకెళ్ళి కళ్ళు పెద్దవీచేసి పరిశీలించింది కమల ఎక్కడా కనిపించలేదు అతను బాలమ్మ మాటల్లోని అంతరార్ధం కొంత నిజంకావచ్చునని అనుమానపడింది కమల.
శృంగొటకంలోని ఇరానీ హోటల్లోని రేడియో హిందీపాటలు విసురుతోంది, విషయవాంఛాతృప్తితరువాతవీరసదేహాలతో తూలుతున్న యువకులు హోటల్లోదూరి టీ సేవిస్తున్నారు. బూందీ, పకోడీలు, మిరకాయబజ్జిలు అమ్మెబండి గాసులైటుతో శృంగాటకములో నిలుచుంది. బేరాల ఊపుకు తట్టుకోలేని ఆ బండివాడు ఆయాసంగా గబగబ పొట్లాలు కడుతున్నాడు.
చీకటి బాగాఅల్లుకుంది. ఆ చీకటిని చేదించే విద్యుదీప స్తంభాల నీడల్లో వారకాంతలు వరసగా నిలబడ్డారు.
ముసలిదిగట్టిగా పిలిచింది బామలమ్మను.
కమల బాలమ్మను అనుసరించింది క్రిందకు ఆ బొద్దుమనిషి గదిలో మంచంమీద కూర్చున్నారు. గళ్ళలుంగీ సాహేబు గడ్డాన్ని వేలాడిస్తూ అతివినయంగా నిలుచున్నాడు వాళ్ళట్రక్కనే యువతులు పెళ్ళిపందిరిలో స్తంభాల్లా నిశ్చలంగా విలుచున్నారు.
అన్వేషణ డ్తే్ల
భయంతో బాలమ్మవెనక దాగొన్న కమలవైపు కులుకుకూచూశాడు బొద్దుమనిషి,
- ఏం పిల్లా ” రుబ్బురోలులావున్న కోమటాయన నవ్వాడు ముఖం ఛిట్లించి, నల్ల యువకుడు అలవాటైన రీతిలో బాలమ్మను చెయ్యిపట్టుకు లాగాడు,
తక్కిన స్రీలు గదిలోంచి తరలిపోయారు సాహెబు చేతిలో పదిరూపాయలనోట్లు వద్దాయి కమల భయంగా బయటికి నడిచింది.
“వెళ్ళిపోతుందేముటి ?”కోమటి తమాషాగా బిక్కముఖంతో అరిచాడు.
“ఎక్కడికి పోతుందీ 1!” బాలమ్మ కోమటి స్వరంలోనే రాగం తీసింది హేళనగా.
మల్లులాల్చి నల్ల యువకుడు పకపక నవ్వారు. బాలమ్మ చెయ్యి పుచ్చుకొని నల్ల యువకుణ్ని తడికల గదిలోకి లాక్కుపోయింది. దారిలో నిలుచున్న కమల చెవిలో ఏదోగొణిగి నవ్వింది బాలమ్మ గళ్ళలుంగీ సాహేబు కొంటె చూపులో అంతా
' పరిశీలించాడు, ముసలిదాన్ని పిలిచాడు. ముసలిది తాంబూలం నములుతూ కమల
భుజం మీద చెయ్యివేసింది.
“పిచ్చిపిల్లా! లక్షాధికారి కోరుతున్నాడే యీ వేళ నిన్ను! సంతోష పెడితే, స్వర్ణం కనిపిస్తుంది యీ భూలోకంలో!” కమల వెక్కి వెక్కి ఏద్పింది.
ముసలిది కమల చెయ్యిపట్పకొని కోమటి కూర్చున్న గదిలోకి బలవంతంగా త్రోసి తలుపు బిగించింది.
భయంగా లేడి పిల్లాలా గదిలో ఒకమూల ఒరిగి నిలుచుంది కమల.
“నన్ను చూస్తే భయమెందుకే పిల్లా!” కదులుతున్న మర్రి చెట్టులా కనిపించాడు కోమటి.
“నా దగ్గరికి రాకు 1” ఆరచింది కమల.
“అబ్బ! ఏంతమాషా!” కోమటి కులికాడు.
“నేను మంచిదాన్ని కాను”
“అందుకేకదూ నేవచ్చింది!”
“నాలో నానా రోగాలు ఉన్నాయి!”
“భయంలేదు. నువ్వు భలే అందంగా ఉన్నావు!”
శి అన్వేషణ కుంభలాంటి బొజ్జతో కురిడీలా, గుండ్రంగా. నున్నగావున్న కోమటి కమలను ఆభింగనం చేసుకోబోయాడు కమల కోషంతో కోమటిని తన్నింది.
“ఏంటే? పొగరుగొ మొద్దుతుట్ట పెదవుల మధ్య నుంచి నాలిక పైకిలాగి కూర్చున్నాడు కోమటి కోపంగా.
“తన్నులు తినడానికి యిచ్చినా పదిరూపాయలు!” కోమటి రైలు ఇంజనులా గువ్వుమనే పౌరుషంతో కమల మీదకు విసురుగా వచ్చీ బలవంతగా చేతుల్లోకి బంధించాడు కమలకు ఏంచేయాలో అద్ధంకాక, కోమటి చెయ్యిగట్టిగా కరిచింది.
“అయ్యాయి!” కోమటి చచ్చిపోతున్న రాక్షసుడిలా ఘొరంగా కక పెట్టాడు. ముసలిది, గళ్ళలుంగీ సాహేబు. గదితలుపులు తెరిచాడు కమల విసురుగా ఏడుస్తూ బయటికి వచ్చేసింది.
“ఏం జరిగిందేకొ ముసలిది అడిగింది,
“క్రక్స్త్రీరేలా కరిచాను! - నేను ఇక్కడ ఉండను. పోతాను ?” కమల వెక్కి వెక్కి బద్భింది.
గళ్ళలుంగి సొహేబు, గదిలోని విద్యుద్ధీపాలకాంతిలో కోమటిచేతిమీద పళ్ళకాటు పరీక్షించాడు.
“లడ్మీ హేమీ లడ్కిస్ గెడ్డం దువ్వుకున్నాడు, ఆశ్చర్యంగా సాహేబు! “ఏవోయ్!” కోమటి రోషంగా అరిచాడు.
సిగరెట్టుకు దమ్ము పీల్చుకుంటు మలులాక్చి నల్ల యువకుడు బహిరంగంగా బాలమ్మను ముద్దు పెట్టుకుంటూ కొమటి గదిముందుకు వచ్చాడు.
“అయిందా!” నల్ల యువకుడు (ప్రశ్నించాడు.
“ఆ [! అయింది ఏదీగో రుసరుస లాడుతూ కోమటి నాలూగంగల్లో వీధిలో నిలబద్దాడు.
మల్లులాన్చి నల్ల యువకుడు జరిగిన సంగతి విని, నవ్వుకుని ఖులాసాగా బయటికి నడిచాడు.
ముసలిది నివ్వెరపోయి నిలుచుంది కోపంగా. ఒక్కక్షణం నిశ్శబ్దం తాండవించింది ఆ యింట్లో,
అన్వేషణ శ్రి
ముసలిది ఏదో అలోచనతో వాక నిశ్చయానికి రాబోయింది ఇంతలో రాముడు ప్రత్యక్షమయ్యాడు, అతని వెనుకనే ముగ్గురు యువకులు లోపల అడుగు పెట్టారు. సిల్కు బుష్కోటులోంచి బనీను కన్పించేలా ఎకైయిన వక్షంలో రీవిగా ముందు రాజారావు కనిపించాడుపొడుగాటి చక్రవర్తి, శివరాం బుజం అదిమి పట్టుకొని “భయపడకు విత్రమా 1” అంటు పకపక నవ్వాడు, శివరాం విచిత్రంగా సరదాగా ఆ యింటినంతా పరిశోధించడం మొదలు పెట్టాడు అడుగు పెడుతూనే,
వరండాలో నిలుచున్న ప్రీలవైపు చూసి అరిచాడు రాముడు “తప్పుకోండి”
రాజారావు, చక్రవర్తి శివరాం వోక్క గదిలోకి ప్రవేశించారు రాముడితో “మిత్రమా! నవగ్రహాలు అనేమాట విన్నావుకదా! మిగిలిన గొప్ప గ్రహాలన్నీ ఈ యిళ్ళలో ఉంటాయి వొక్కొక్క గ్రహం వద్ద అనందమైన ప్రభావం! - నీజీవితమే మార్చేస్తుంది. తన ప్రభావంతో తన జీవితమే మార్చుకున్న ప్రబలమైన (గ్రహాలు!...వొకటి రెండు!” చక్రవర్తి మాటలలో వొక్కొక్క స్త్రీ లోపల అడుగుపెట్టింది ముసలిది కమలనుకూడా నెట్టింది క్రూరంగా ఆ ప్రీల వరుసలో భయంగావెళ్ళి నిలుచుంది కమల. రాముడురాజా రావువైపు కనుసైగ చేశాడు రాజారావు కమలవైపు వేలు చూపాడు.
“మన నాయకుడి రాణిదోరికింది! మిత్రమా! - నువ్వు కోరుకో ! ఏరుకో - వరమిస్తున్నా?” చక్రవర్తి శివరాం బుజం మీద తట్టాడు.
తెల్ల పంట్లాం, ఎర్ర బుష్‌కోటు, ఆకు చెప్పులు తొడుక్కున్న శివరాంను చూసి కమల బిత్తరపోయింది. గుండె దడదడలాడింది నీరసంతో బాలమ్మ బుజంమీద ఒరిగిపోయింది.
“ఏం ?” బాలమ్మ కమల చెవిలో ప్రశ్నించింది.
“ఏం లేదు ! కమల నసిగింది.
ఎదురుగావున్న కమలను చూడగానే శివరాంఅపాదమస్తకం కంపించాడు.
కొయ్యబొమ్మలా (గ్రుడ్లు నిలిపివేసి ఆమెవైపు దీర్ధంగా వాకనిముషం తేరిపారి చూశాడు.
“ఏం మిత్రమా - తన్మయత్వమా!
చక్రవర్తి పకపక నవ్వేశాడు. అంతనవ్వు నవ్వినా ఎదురుగా నిలుచున్న స్త్రీల ముఖాలు భంగిమలు మారక నిశ్చలంగా ఉన్నాయి. ఆ మౌనముద్రకు చక్రవర్తికి కోపం వచ్చింది.
50 అన్వేషణ
“ఏ అమ్మాయిలు! - వొక్కసారి నవ్వకూడదు! నవ్వితే మీపెదాల వెనక్కాలపళ్ళు ముత్యాల్లా రాలిపోతే, నేను ఏరుకుంటానని భయమా!”
స్తంభాల్లా నిలుచున్న ఈ అమ్మాయిలలో కదలిక కలిగి మెల్లిగా నవ్వారు.
“మా పళ్ళు మూత్వాల్లా ఉండవ్లు - కెంపుల్లా ఉంటాయి [హాయిగా మందస్మితం చేసింది బాలమ్మ!
తాంబూలం నమిలిన తన పళ్ళగురించి ఛలోక్తి విసిరిన బాలమ్మమీద మోజు కలిగింది చక్రవర్తికి !
“అయితే ! చూడుఅమ్మాయి ! - న్ కెంపులు నాకు అమ్మేయి యీ వెళ !” చక్రవర్తి నిలబడ్డారు తన వఐవోడుగాటి చేతులు ముందుకు చాచి. బాలమ్మ అతని చేతుల్లోకి దూసుకు నడిచింది.
“మిత్రమా ! నువ్వు దీపస్సెమ్మాలా వరండాలో కూర్చోవడమేనా?” చక్రవర్తి శివరాంతో పరాయాచక మాడాడు.
చక్రవర్తి మాటలకు శివరాం బాధపడినా, స్నేహంలోని హేళనకు అంతకన్న మరో ఎదురుమాట చెప్ప సాహసించలేదు.
బాలమ్మ చక్రవర్తిని మరో గదిలోకి నడిపించింది.
రాముడి చేతిలో రెండు పది రూపాయల నోట్లు రాలాయి.
కమల మౌనంగా నిలుచుంది రాజారావు తలుపులు బంధించాడు.
వరండాలో ఒంటరిడా భయంగా నిలుచున్న శికరాంను చూసి, ఒక ప్రీ అతని భుజంమీద చెయ్యివేసింది.
“పోనీ కుర్పిమీద కూర్యో ! - అలా రాతివిగ్రహంలా నుంచుంటావెందుకు.”
శివరాం మొల్లిగావెళ్ళి కుర్చిలో కూర్చున్నాడు, రాముడు వరండాలో ఒక మూలగా కూర్చుని చార్మినార్ సిగరెట్టు వెల్ళించాడు.
ఇద్దరు స్త్రీలు శివరాం ఇరుప్రక్కలకు వెళ్ళి నిలుచున్నారు.
“పెళ్ళయందా ! - దొరాగ్ అడిగింది వొకతె !
అన్వేషణ స్ట్
'ఏకపత్నీ వ్రతుడేమోనే! - పరప్షీని కన్నెత్తి చూడడు !'మరొకతె శివరాం జుట్లు చేతివేళ్ళతో నిమిరింది శివరాం కోపంగా ఆమె చెయ్యి పట్టుకొని దూరంగా తోసేశాడు.
“దొరా! - ఒకటీ తెప్పించు !” వొకతె శివరాంగడ్డం పట్టుకుని బ్రతిమాలింది.
“అబ్బ! ఎంతనున్నగా వుంది దొర శరీరం, మరొకతె శివరాం ఒళ్ళు తడిమింది
“ఉద్యోగమా!” శివరాం జేబులోంచి జేబురుమాలు పైకిలాగి తలకు అర్ధచంద్రా కారంగా చుట్టుకుంది ఒక స్త్రీ, మరొకతె జేబుతడిమి ఒక బేడ పైకి లాగింది.
శివరాం కోపంగా, మౌనంగా చీదరించుకున్నాడు ఆ ప్రీలను చూసి అంతకన్న పరిహాసం చేస్తే పరిస్థితి విషమించగలదని భయపడి ఆ స్త్రీలు శివరాంను ఒంటరిగా వదిలి ముసలిదాని దగ్గరకు నడిచి పోయారు. ముసలిది ఆ స్రీలతో గవ్వలాట మొదలెట్తింది.
మ౬
మరో అయిదు నిమిషాల తర్వాత రాజారావు తలుపు తెరిచాడు. రాముడు ముసలిదాన్ని పిలిచాడు ముసలిదాని వెనకాలే గళ్ళలుంగిసాహెబు కుందేలులా చెవులునిక్కిరచుకువచ్చి నిలబడ్డాడు.
“బయటికి తీసుకువెడతా యీ అమ్మాయిని” రాజురావు కమలవైపు చూశాడు నవ్వుతూ!
“పాతిక గ” రాముడు సవినయంగా రేటు చెప్పాడు. గళ్ళలుంగీసాహేబు ముసలిదాని చెవలో ఏదో ఊదేడు.
“ కృవేళ బయటికి పంపడానికి వీల్లేదు.!” ముసలిది తీవ్రంగా చెప్పింది - 'కావాలంటే యిక్కడే - ఈ రాత్రి నవ్వింది ముసలిది
'మరో పది తీసుకో !” రాముడివైపు చూవాదు రాజారావు రాముడు ముసలిదాన్ని ప్రక్కకుపిల్సి ఏదో చెప్పాడు. ముసలిది అతనిమాటలు లెక్క చెయ్యలేదు.
శివరాం మనస్సు పరిపరివిధాల పోయింది. రాజారావుతో ఉన్న అమ్మాయి ముఖం తనకు పరిచయమున్న శారద వదనంలావుంది శారద భోగంకొంపల్లో ఉంటుందా! అది అసంభ మనుకున్నాడు శివరాం!... కొద్దిగా శరీరంలో పోల్లికలతోబాటు శివరాంకు, తర్వాత మొల్లిగా రాజారావును ప్రశ్నిద్ధామునుకున్నాడు.' ఒకసార్ కిషివైపు నిశితంగా
న స 1 స్మా ॥ గ్
గె అన్వేషణ చూసి దగ్గరగా వెళ్ళాడు. శివరాం దగ్గరగా రావడం - గమనించాక కమల రాజాదావు చాటుకువోయి నిలుచుంది.
నేను ఒప్పుకోను ! ఖచ్చితంగా చెప్పింది ముసలిది.
చక్రవర్తి పొడుగాటికాళ్ళు ,అంగలు వేసుకుంటూ బాలమ్మతో బయటికి వచ్చాడు.
మిత్రమా 1! ఏమిటి గోదవ' స్వర్గ్ణంలోంచి నరకంలోకి వచ్చి నట్లుందే? పకపక నవ్వాడు చక్రవర్తి, ఆ సన్నివేశం కాస్సేపటిలో అర్ధంచేసుకుని రానంటుంటే బలవంత మెందుకు గురూ ! ఆ ఫాతిక పెడితె మరోచోట అప్పరస దొరకదూ!
చక్రవర్తి మాటలతో రాజారావు ప్రవర్తనకు బలంపోయింది రాజారావు రాముదివైపు చూశాడు తర్వాత కర్తవ్యం అలోచిస్తూ “నేను బయటికి వెడతాను (కమల అరిచింది,
“అది అంతా నీ పన్నాగం?.... నాకు తెలుసుగా ” ముసలిది కోపంతో అరిచింది, గళ్ళలుంగీ సాహేబు చెవిలో గుసగుసలాడింది మరుక్షణంలో గళ్ళలుంగీ సాహెబు వస్తాదుతో ప్రత్యక్షమయ్యాడు. పరిస్టితి ప్రమాదకరంగా ఉందని రాజారావు తలవంచుకుని బయటికి నదిచాడు.
“గమ్యుంలేని మన జీవితంలో ఇది ఒక అయోమయమైన యాత్ర మిత్రమా! - ఎలావుంది - ఈ యిల్లు... పేట.....వాతావరణం?” చక్రవర్తి శివరాం భుజంపై చెయ్యివేశాడు సరదాగా. “మిత్రమా ! - నువ్వు యింకామారాలి - చాలా మారాలి జీవితం లోతుపాతులు +” యింకా చక్రవర్తి ఏవో అనబోతుంటే రాజారావు కసిరాడు ధోరణి ఇపమని.
“నాయకుడి ఆజ్ఞ! నోరుమూసుకో మిత్రమా 1” చక్రవర్తి శివరాం నోరుమూసి తననోరుకూడా మూసుకున్నాడు.
ముగ్గురు శృంగాటకంలోని ఇరానీ హోటల్లోకి ప్రవేశించారు మూడు కప్పులు టీ తెమ్మని రాజారావు చెప్పాడు.
వేడి టీ ఒకగుక్క (మింగి చక్రవర్తి మళ్ళీ సంభాషణ ప్రారంభించాడు.
“నర్రూ! ఎలా ఉంది నీ ప్రేయసి?
“అ్రనుభవించలేదుగా !” పేలవంగా నవ్వాడు.
అన్వేషణ ర్పి రాజారావు రాముడిద్వారా ఆ అమ్మాయిని ఆ భోగం కొంప నుంచి తప్పించడానికి తాను చేసిన ప్రయత్నం విఫలమైందని రాజురావు తన పన్నుగద వవరించి చెప్పాడు.
“రాముడిని నేను మునువు ఎరుగుదును.... . వచ్చి బ్రతిమాలిచెబితే కాదనలేక పోయాను - ఈవేళ ఖర్చు పెట్టింది రాముడిసొమ్ము పాపం 1! ఆ అమ్మాయిగతి ఏమౌతుందో!” రాజారావు జాలిగా నిట్టుర్పాడు
ఇంతవరకు రాజుల౮ావు మాటలు చాలా ఆసక్తితో విన్న శివరాం “ఆ అమ్మాయి పేరు?” ప్రశ్నించాడు.
“కమల$[”
శివరాం ఏదో నిరాశగా తల ఒంచుకున్నాడు. మనిషిని పోలిన మనుష్యులు ఎందరో ఉంటారని సమాధానం చెప్పుకున్నాడు శివరాం,
టీ త్రాగేక రిక్షాలు పిలిచి రాజారావు, చక్రవర్తి ఆ శృంగాటకంనుంచి నిష్క్రమించారు చీకటి వెలుగు నీడల్లో.
కమల ఏదో విధంగా పారిపోవాలనే ప్రయత్నంలో ఉందనే ధృఢనమ్మకం ముసలిదానికి కలిగింది. ఈ రాత్రి కూడా వస్తాదును గుమ్మంలో కాపుండదానికి నియమించింది.
“క్క వేళ బేరాలన్నీ చెడగొట్టింది ” ముసలిది విసురుగా వెళ్ళి కమల చెంపమీద కొట్టింది. కమల ఏడ్చింది. బాధగా ఒకమాల ఒరిగి కూర్చుని, ఆమె కళ్ళముందే ఇంకా ఎందరో విటులు అక్కడికి వచ్చారు. ఆ ప్రీల మందలోంచి ఎవరినో ఒకరిని ఏరుకుని అనుభవించి ధనం వ్యయంచేసి సంతృప్తితో వెళ్ళిపోయారు. తన చుట్టువున్న వాతావరణం పరమ అసహ్యంగా కనిపించింది ఆమెకు,
బాలమ్మ వచ్చి కమలప్రక్కన కూర్చుంది. 'ఉందుకు యిక్కడ? పోయి పడుకో ! ముసలిది వినేలా గట్టిగా అరిచింది బాలమ్మ ! కమల వైపు చాటుగా కనుసైగ చేసింది.
పిల్లిలా అడుగులు వేసుకుంటూ కమల తడికెల గదులువాటి వరండాలో వోకమూలవున్న చాపమీద ఒరిగింది.
రాత్రి పన్నెండు గంటలు ధాటింది. వీధిలో జనం తగ్గారు. ఆకాశం మబ్బులతో నిండి చీకటి ఉధృతమయింది మరుక్షణంలో గాలి, వాన (ప్రారంభమైనాయి. రాముడు
గక అన్వేషణ వచ్చి ముసలిదానీ దగ్గర ఏదో డబ్బు తీసుకొని కమల పడుకున్నట్లు గమనించి, ఐం చేయ్యాలో తోచక వెళ్ళిపోయాడు.
యువతులు తడికెలగదుల్లో సర్దుకున్నారు. నిద్రకోసం.
'కమల ప్రక్కనే పడుకో ఈ రాత్రికి! ముసలిదాని చెవిలో మెల్లిగా ఊదింది బాలమ్మ ముసలిది కమల (ప్రక్కనే చాప పరుచుకొని పడుకుంది.
రాత్రి మూడుగంటలయింది. వస్తాదు విధిగుమ్మం సందుదగ్గర అరుగుమీద చాపవేసుకొని జోగుతున్నాడు. వరండాలో పడుతున్న చిన్న చిన్న చినుకుతుంపరలు అతని శరీరాన్ని కప్పుకున్న దుప్పటిని సగం తడుపుతున్నాయి.
బాలమ్మ మెల్లగా కమల చాపవద్దకు వెళ్ళింది. ముసలిది నిద్రలో మునిగిపోయింది. బాలమ్మ రాకచూసి కమల లేచి కూర్చుంది. రాత్రి సంపాదనలోని నాల్లు రూవాయలు కమల చేతిలో పెట్టింది బాలమ్మ ఆమె చెవిలో గుసగుసలాడింది. కమల నిద్రవోతున్నట్లు మళ్ళీ చాపమీద జరిగింది.
బాలమ్మ వస్తాదు దగ్గరకి నడిచింది. వస్తాదు ఉలిక్కిపడ్డాడు. వస్తాదు నోటిమీద చెయ్యివేసిమాట్లాడవద్దంది. అతని చెయ్యి పట్టుకులాగి, వసాదును ఆలింగనం చేసుకుంది, వసాదడు పరవశమైపోయాడు వానరాత్రి.... కొద్దిగా చలి .... వనితయిచ్చిన కౌగిలి..... ఆహ్వానం వదులుకో బుద్దిపుట్టలేదు.
తన గదివైపు రమ్మని బాలమ్మ సెగచేసింది. పిల్లిలా వస్తాదు ఆమె వెంట నిశ్శబ్దంగా నడిచాడు.
గదిలో చొరబడిన వస్తాదు వెనుకగా తలుపులు బంధించింది బాలమ్మ.
కమల మెల్లిగా లేచింది. నిశ్శబ్దంగా సందుదాటి వీధిగుమ్మంతెరీచి విధిలో అడుగు పెట్టింది. వాన చినుకులతో తపతప లాడుతూనల్ల రాతివీధి విద్యుద్దీపాల కాంతిలో మెరుస్తోంది. ఇళ్ళకిటికిల్లో తొంగిమాసే ప్రమిద దీపకాంతుల మినుకు మినుకుమని పిస్తున్నాయి అక్కడక్కడ దీపకాంతులు మినుకు మినుకుమని కనిపిస్తున్నాయి. గబగబ అడుగులు వేసుకుంటూ శృంగాటకందాటి నడిచింది కమల పెద్దవీధిలో చెట్లు చీకటిలో భయంకరంగా ఊగుతున్నాయి. వంతెన వచ్చింది.....తెల్లటి బుడ్గులాంటి విద్యుద్దపాలు స్వచ్చమైన కాంతిని వంతెననిండా వ్యాపింపచెశాయి. నిర్దనమైన ఆవంతెనమీద నడక
అన్వేషణ స్ర్ వేగం చేసింది ఆమె నది కిరువైపుల చెట్టగుంపులు దూరంగా గోపురాలు, ప్రాకారాలు మాత్రము ఆమెను పరిశీలిస్తున్నట్లు కనిపించాయి ఆ రాత్రి.
ఆకాశంలో నల్లటి మబ్బులు చెదిరి, వేగుజుక్క ప్రకాశవంతమయింది. వీధిలో కుక్కల అరుపులు ్రతిధ్వనిస్తున్నాయి రిక్షాల్లో ఒరిగి నిద్రిస్తున్న రిక్షావాళ్ళు మెల్లిగాలేచి రిక్షా త్రోక్కుతున్నారు. బేరాలు వెదుక్కుంటూ, సిటీ బస్సులు, ప్రయాణీకులు లేకుండానే పరుగిదుతున్నాయి. చీకటిని ఛేదిస్తూ తొలివెలుగులు మసక మసకగా వ్యాపిస్తున్నాయి. ఎదురుగా కనిపించినదారి పట్టుకుని, ముసుగుకప్పుకుని గబగబ నడిచివోతున్న కమలను శృంగాటకంలో నిలబడి వీధివైవు తేరిపారి చూసింది. ఎదురుగా హోటల్లో పనివాడు తుడిచి శుభము చేస్తున్నాడు మేజూబల్లల్ని ఆ ప్రక్కనే తెల్లవెలుగుల్లో, పిల్లగాలుల్లో శిరీషపుష్టాలు విచ్చుకుని కుంకుమరంగులు స్వాగతం చెప్పినట్లయింది గడియారం ఆరుగంటలు కొట్టింది. గడియారగోపురం భవనాన్ని తేరిపారి చూసింది కమల. . రైల్వేస్టేషను ...ఎక్కడ దిగిందో మళ్ళి ఆ ప్రదేశానికి వచ్చింది.....మెల్లిగా ముందుగతి ఆలోచిస్తూ అడుగులు వేసింది కమల స్టేషనువైపు.
ర్6ి అన్వేషణ తె
తాజమహల్ హోటల్లో భోజనంచేసి, కడుపు నిండిన ఆనందంతో దినమంతా పడిచిన శ్రమ మరచి, వీధిలోకి వచ్చాడు, శివరాం. కిళ్ళీదుకాణంవైవు నడిచి మద్రాసు సాదాకిళ్ళి ఒకటి బుగ్గకు బిగించాడు స్వతంత్ర జీవనం సాగిస్తున్న శివరాం సిగరెట్టు ముట్టించాడు. నిస్సంకోచంగా, నిర్భయంగా, ఒంటరి (బ్రతుకులో, ప్టిరత్వము ఏర్పడికొంత స్వేచ్చ కలిగినపుడు, మనస్సులో ఉన్న కోరికలు అణచుకోవడం హాస్యాస్పద మనిపించింది స్వేచ్చాజీవితంలో కోరికలను తీర్చుకోవటం ద్వారా కలిగే మానసిక చైతన్యం, సంతృప్తి నియమితసూటత్రాలు వాటిస్తూ జీవితంచుట్టూ నాల్గుగోడలు సృష్టించుకుని, (బ్రతికే వారికి ఎన్నడూ లభ్యంకాదని యీ మధ్య తన జీవితంలో కలుగుతున్న మార్పులు నిర్ధారణ చేస్తున్నాయనే విశ్వాసం శివరాంకు కలిగింది.
జీవితంలోని విషాదానికి సుఖాలకు వ్యక్తి మానసికంగా కల్పించుకునే దృక్పధమే కారణం. ఆర్థికబాధలు తన జీవితంలో యింకా ఉన్నా పూటైనా సంతృప్పిగా భోంచెసీ, సరదాగా గడపాలని తాజ్‌మహల్ లోకి వచ్చాడు శివరాం.
తాజ్విధి ద్వారంపైన కట్టిన ఇంగ్లీషు అక్షరాల పెద్దబొర్జు, విద్యుద్ధీపాల కాంతిలో ప్రకాశవంతంగా బాటసారులను ఆకర్షిప్తాంది. నడిచే బీదజనం హోటల్లోని క్రొత్తరకం రుచికర భోజనాన్ని ఒక్కసారి ఊహించుకుంటూ, పైసలులేని జేబును ఒకసారి తడుముకుని నడిచి పోతున్నారు. రోద్దుమీద యిరువైపుల సరుసగా నిలుచున్న విద్యుద్ధిపాలు దూరంపోగా చిన్నచిన్న చుక్కల్లా కనిపిస్తూ ఆకాశంలోతారలతో పందెంకట్టి నిలబడినట్లున్నాయి. హోటలు ఎదురుగా శాఖలు శ్యాపించి నిలుచుని పొాయగంగా ఊగుతున్న రావిచెట్టుగాలి ప్రసారం చేస్తూ, హొటల్లో భోజనంచేసి వచ్చిన వారికి వింజామరలు పట్టినట్లు కనిపించింది.
అన్వెషణ గ్7
'రుచికరమైన మంచి ఆహారమిచ్చే హోటళ్ళు ఉంటే సంసారలంపటాలు మాని ఒంటరి బ్రతుకులుహాయిగా గడుపుకోవచ్చు. అనుకుంటూ తాంబూల సుగంధద్రవ్య పరిమళంలో మత్తెక్కిన సంతృప్తితో శివరాం నవ్వుకున్నాడు. నగరానికి వచ్చిన తనజీవితంలో కలిగిన అనుభూతులు, అనుభవాలు అతనికే ఆలోచిసొంటే ఆశ్చర్యం కలిగించాయి. క్రొత్తప్రదేశ్లో క్రొత్త జీవితం దిద్వకోవాలంటే, పొట్ట సుఖంగా నింపుకోగలిగితే జీవనోపాధి చూసుకుని స్థిరపడటం, అది ప్రాతిపదికగా చేసుకుని జీవిత లక్ష్యాలకు అనుగుణ, మైన ప్రశాంతవరణ సృష్టించుకుని సాహసంగా, ధైర్యంగా మసలడం ముఖ్యం. మొదటిదానిలో ఒకవిధంగా కృతార్చుడై, జీవితగమనంలో ఒక ప్రాతిపదిక ఏర్పడినందుకు కొంత సంతృప్తి శివరాంకు కలిగింది. ప్రతీ మానవుడు జీవనోపాధి ఏదోవిధంగా కొంత (ఛశమపడి సంవాదించుకుంటాదడు. లక్ష్యనిర్ణయం చేసుకుని జీవితాన్ని తీర్చి దిద్దుకుంటూ, సాహసిక జీవితం గడపడమే వింతవిద్య. ఈ వింతవిద్య సాధించాలనే పట్టుదల శివరాంలె [(క్రబలమయింది.
అనేక జీవిత చరిత్రలు పరిశీలిస్తేవ్యక్తులు సామాన్య జీవితంనుంచి ఎన్నో దశలు ధైర్యంగా దాటి ప్రపంచాన్ని ఆకర్షించే బెన్నత్యంపొందగలిగిన ఉదాహరణలు శివరాం దృష్టిలో మెలిగాయి. మనిషి మానసికశక్తికి ఏదీ అద్దురాలేదనే విషయం, చేయాలనే ఆకాంక్షను అతనిలో (ప్రేరేపించింది. అందుకు సాధనాలు అన్వేషించాలనుకున్నాడు వివరాం.
శారద శివరాం ఆలోచనల్లో కదిలింది..... ఆమె ఎక్కడుందో?... ఒక నెల(క్రితం రాజారావుతో చార్మినార్ వెనుక ప్రాంతాలకు వెళ్ళినపుడు కనిపించిన అమ్మాయి సరిగాశారదలాగే ఉంది... కాని పేరు వేరు... అయినా పరపురుషుణ్చి (ప్రేమించి లేచిపోయిన శారదకు తనమీద మక్కువ ఉందనిగాని, ఇక ముందు కనిపిస్తుందనిగాని కనిపించనా ఇద్దరూ ఆనందంగా పలకరించుకుని, కలిసి (బ్రతికే అవకాశం ఉంటుందనిగాని, శివరాం ఆశించలేకపోయాడు. ఒక్కజ్ఞాపకం ..... ఆమెమీదిప్రబలమైన (పేమ ..... జీవితంలో మదురంగా గడిచిన ఒక సంవత్సరం.... మరుపురానివైపోయాయి. అది ఒక దశ.... శివరాం ఒక నిట్టూర్పు విడిచాడు.
రాత్రి తొమ్మదిగంటలయింది జేమ్సుట్రీటు దాటి నల్లగుట్టలోని సందుకి మళ్ళాడు శివరాం. ఆఖరయిపోయిన సిగరెట్టు ముక్కను ఆలోచనల వేగంలో రివ్వున విసిరాడు. పైకి చూశాడు చంద్రుడులేని ఆకాశం తారల తళకులతో ఒయ్యారంగా ఒంగి చూస్తోంది శివరాం వైపు.
ర్రి అన్వేషణ
తలుపుకొట్టాడు శికరాం, పొట్టిగా, బొద్దుగా చామనుచాయగా తెల్లటిచిర కట్టుకుని జడలో మల్లెపూలు తురుముకుని చేతిలో పాపనెత్తుకొని యింటివారి కోడలు, రత్నం తలుపు తీసింది నవ్వుతూ. శివరాం తలవంచుకుని ముభావంగా వరండాలోకి నడిచి, ప్రకృనే తన గది తాళం తీయడానికి ఉప(క్రమించాడు. రత్నం వీధితలుపు మళ్ళి గడియవేసింది.
“తాళం కనిపిస్తాందా, లైటు వెయ్యమన్నారా?” నవ్వుతూ రత్నం వరండాలోని విద్యుద్దిపాన్ని వెలిగించింది
'అబ్బే.... లైటు అక్కల్లేదులెండి!? మొహమాటంగా సహజమైన బిడియ ధోరణిలో నసిగాడు శివరాం 'మీరు హోటల్లో తింటుంటారు. ఒంటరిగా ఉన్నారు. రోజూ యిలా ఆలస్యంగా యింటికి వస్తూంటే ఆరోగ్యం పాడవదండి ! సాగదీసుకుంది రత్నం. ఆమె మాటలకు శివరాం నవ్వేశాడు.
శివరాం మూడునెలల క్రితం ఆ యింట్లో ఒక గది పదిరూపాయలకు అద్దెకు తీసుకున్నాడు వరండా వెనుకభాగంలో మరోకుటుంబం కాపురముంటున్నారు. కాని యీ మధ్యనే రాయలసీమలోని స్వగ్రామానికి వెళ్ళారు కొన్నాళ్ళు అక్కడ ఉండివద్దామని ఆయింటి మేడమీద రత్నం, భర్త, ఆమె అత్తకాపుముంటున్నారు. ఇంటి యజమాని, ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు రాత్రి యింటికి వచ్చాక ఏవో కబుర్లు చెప్పుకునే అలవాటు ఉండేది శివరాంకు. అతనికి, వారిద్ధరిమధ్య మాటల్లో ఏదో కలుగబేసుకుని రత్నం తన తెలివికూడా, చూపిస్తూ భర్తచేత హేళన పొందుతూ శివరాంవద్ధ కొంతచనువు సంపాదించుకుంది. ఈ రోజు ఇంటియజమాని కనిపించకుండా రత్నం ఒకరైతే సింగారించుకుని కనిపించడం శివరాం తలపులను కొంచెం చెదరగొట్టినమాట వాస్తవం, “మీవారు యింట్లో లేరా! యధాలాపంగా వేసిన ప్రశ్నకు రత్నం చురుకుగా మెరుపు చూపుచూసింది.
“ఏదో పనిమీద బెంగుళూరు వెళ్ళారు. రెండు రోజుల్లో వస్తారు. అత్తయ్య నిద్రపోతోంది!” అంటు రత్నం వరండాలో సోఫాలో మేనువాల్సింది చంటిపిల్లతోను శివరాం ఇంక మాట్లాడకుండా గదిలోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని, బెడ్డింగు వరండాలో వేసుకున్నాడు పడుకుందామని. అయింటి కోడలు చంటిపిల్ల నెత్తుకోని మేడమీదకు వెళ్ళివోయింది.
అన్వేషణ ద్9
కాళ్ళుచుతులు చన్నిళ్ళతో కడుగుకుని పక్క పరుచుకొని విరామంగా శయనిద్దామని మేనువాల్హాడు శివరాం గదిలో ఉన్నఒక కధల పుస్తకం తెచ్చుకుని పేజీలు తిరగవేస్తున్నాడు.
“సాయంత్రమీరు బయటికి వెళ్ళిపోయాక మీ కేవోఉత్తరాలు తెచ్చెడు పోస్టుమేన్!” ఆ యింటి కోడలు ఉత్తరాలు అందించింది.
మధ్యాహ్నం వచ్చి ఉత్తరాలు యిచ్చివెళ్ళే పోస్టుమేన్ సాయంత్రం ఆలస్యంగా వచ్చాడుకాబోలు అనుకుని సమాధాన పరచుకున్నాడు శివరాం. ఉత్తరాలు విప్పాడు ఒకటి తాతయ్య మరొకటి అన్నగారు వ్రాసేరు.
“ఎవరిదగ్గరినుంచి ఉత్తరాలు!” సన్నని స్వరంలో కులుకుతూ సాగదీసుకు నవ్వింది రత్నం.
శికరాం ఉత్తరాలను చదవడంలో నిమగ్నుడై సమాధాన మివ్వలేదు. బ్రహ్మయ్యగారు మనుమడి క్షేమసమాచారాలు ప్రశ్నిస్తూ ఒకసారి వీలుచేసుకొని యింటికి రమ్మని, తల్లి అతన్ని చూదాలంటోందని వ్రాశారు. సూటమాఖై రూపాయలు ఉద్యోగం లభించినందుకు శివరాంను అభినందిస్తూ పిల్లల చదువులవల్ల భార్యకు అనారోగ్యం వల్ల యీమధ్య యింటిఖర్చులుబాగా పెరిగిపోయాయని, వీలైతే అప్పుడప్పుడు ధన సహాయం చేయవలసిందని కోరుతూ అన్నగారు వెంకటైశ్వర్లు కోరాడు భార్య కాపురానికి వచ్చిన తన జీవితంలో స్వేచ్చగా బ్రతకాలని తాతయ్యను వదలి మరోవూరు బదిలి చేయించుకుని, స్వార్ధంగా బతుకుతున్న అన్న గారు తన జీతంచూసి కళ్ళుకుట్టి మెల్లగా మచ్చికతో అనుభవించాలని చేస్తున్న ప్రయత్నమే ఈ ఉత్తరమని నవ్వుకున్నాడు శివరాం. మనుష్యుల మనస్తత్వాలు జాగ్రత్తగా అవగతం చేసుకున్నాా వారి ప్రవర్తన తనకు హానికలిగించనంత వరకు వారిజోలికి పోకూడదనే ప్వభావం అతనిది. ఉత్తరాలు మడిచి తలగడక్రింద పెట్టుకున్నాడు శివరాం,
“కాస్తఫలహారం చేస్తారూ!” ఆ యింటి కోడలు వయ్యారంగా నడిచి ఆపిలుముక్కల ప్లేటు శివరాం ఎదురుగా ఉంచింది.
“అమ్మో!.... ఇప్పుడేమీ వద్దండీ!” శివరాం మొహమాట పడ్డాడు.
- సరవాలేదు !... తినండి!” అనునయంగా చెప్పింది కోడలు రత్నం
“ఆయన లేకపోతే ఏమీ తోచదండి - యింట్లో వుంటే ఏవో కబుర్లుచెబెతూ అల్లరిచేసేవారు - మీకు అప్పుడే నిద్ర వస్తుందా. పోని కేరమ్స ఈడుకుందామా!”
60 అన్వేషణ రత్నం ఒళ్ళు విరుచుకొని శివరాం వైపు జాలిగా చూసింది.
“అప్పడే పదిగంటలవుతోంది - నిద్రపోవాలి - అయినా ఇప్పుడు ఆటాలొడ్డం ఏమిటి!”చిరాకుగా అన్నాడు శివరాం,
ఒక నిమిషం నిశ్శబ్దం. ప్లేటులోని యాపిలుముక్కలు కాళీ చేశాడు శివరాం
“వ్పికని |! - ఆ కథలపుస్తకం చదవండి - కాస్సేపు వింటానుగొ కోడలు రత్నం శివరాం దగ్గరగావెళ్ళి కూర్చుంది. జీవితంలో యితర స్తీ సాంగత్య మెరుగని శివరాం దత్నం కోడలి ప్రవర్తనకు భయంతో చికాకుపడ్డాడు.
“అమృతాంజనము తెచ్చి తలకు వ్రాయమన్నారా?” రత్నం ఒక్క గెంతులో మేదమీదకు రివ్వున వెళ్ళిపోయింది.
శివరాం గుండె దడదడలాడింది. ఈ యింట్లోకి వచ్చాక ఇంటి యజమాని తన్నుచాలా ఆదరణతో చూస్తూన్నాడు తరుచు మలేరియా జ్వరాలతో ఆరోగ్యము బాగుండనపుడు ఆయన స్వయంగా తన్ను డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళి మందు ఇప్పించేవాడు.ఇంట్లో పధ్యంగా భోజనం ఏర్పాటు చేశాడు ఏమి అవసరం వచ్చినా యిట్టే సహాయంచేసే జెదార్యం చూసించిన ఇంటి యజమానికి ద్రోహం చేయ్యడం నీచమనిపించింది శివరాంకు. వరండాలో లైటు ఆర్పేసి దుప్పటి ముసు గు పెట్టిపడుకన్నాడు,
రత్నం ఆమృతాంజనంతో వచ్చింది. వరండాలో చికటి ఆరవరించి ఉన్నందుకు కొంచెం జంకి శివరాంను పిలిచింది.శివరాం మాటాడలేదు.
'కాపమా!” సొగసుగా అంటూ ఆమె ఆమృతాంజనం శివరాం (ప్రక్కదగ్గర ఉంచి కధలపుస్తకం తీసుకుని వరండాలో లైటువేసుకుని సోఫాలో కూర్చుని కేజీలు తిరగవెయ్యనాగింది. తన (ప్రవర్తన అర్ధంచేసుకుని శివరాం ప్రక్మమీద నుంచి లేస్తాడని ఆశించింది యువతి.
“ఆదంతా నిద్రే కాబోలు! - వమండీ !” పకపక పవ్వింది కోడలు రత్నం. శివరాం మౌనంవహించాడు. సన్నివేశం (ప్రోత్సాహకరంగా కనిపించినా రత్నం కోడలు మరో
అన్వేషణ 6] ముందడుగు తక్షణం వెయ్యడం భావ్యంకాదనుకుని పుస్తకం పేజీలు తిరగవెయ్యసాగింది. ఒక్క ఆరగంటలో శివరాం గుర్రు వినిపించింది. రత్నంకోడలికి ఉపద్రవమైన కోపం వచ్చింది. కధల పుస్తకం రివ్వున నేలమీదకొట్టి వరండాలో లైటు ఆర్పి మేదమీదకు వోయింది
దుప్పటి ముసుగు చీకటిలో ఆలోచనలు బంధించి నిద్రపోయిన శివరాంకు రాత్రి రెండుగంటలకు మెలకువ వచ్చింది. రత్నంకోడలు సన్నివేశం జ్ఞాపకం వచ్చింది నవ్వుకున్నాడు శివరాం మంచినీళ్ళు త్రాగాలని లేచి కూర్చున్నాడు
వరండాలో హరాత్తుగా లైటు వెలిగింది. రత్నం కోడలు ప్రత్యక్షమయింది, నలిగిపోయిన చీరతో చెదిరిన శిరోజూలతో నిద్రలేని కళ్ళతో జడలు నలిగిపోయినా గుప్పుమనే సువాసనలు విదల్లుతున్న మల్లెపూల గుత్తులతో రత్మం వీధితలుపు తీసింది. వీధిలోని శూన్యం పరికించింది శివరాంవైపు చూసింది.
గదిలో కూజాలోని నీళ్ళు త్రాగి మౌనంగా, బద్దకంగా పడుకున్నాడు. శివరాం.
ఒక అయిదారు నిమిషాలు రత్నం కోడలు వీధిలోని చికట్లోకి నిశితంగా చూసింది. చంద్రవంక కొంటెగా ఆకాశలోంచి ఆమెను చూసి నవ్వినట్లనిపించింది. రత్నం కోపం అపుకోలేక వీధి తలుపు భళ్ళుమని మూసి. రుసరుసలాడుతూ, పాదాలు నేలమీద బరువుగా బాదుకుంటూ మేడమీదకు పోయింది.
శివరాంకు యింకా నిద్రపట్టలేదు. రత్నం కోడలకి నైరాశ్యం కలిగించటంలో
తానేమీ అన్యాయం చెయ్యనట్లు భావించాడు. జీవితంలో కనిపించే ప్రతి స్రని ప్రతి పురుషుడు (ప్రేమించడం కష్టం. ఒకసారి ఒకస్త్రీని ప్రేమించాక పరప్రీలపై దృష్టినిలవడం, (ప్రేమను అర్ధంచేసుకున్న ఎవరికైనా దుస్సాధ్యం. అయినా తన జీవితంలో శారదతో జరిగిన సంఘటనలు స్తీపైనే ఏహ్యభావం కలిగించాయి శివరాంలో, లక్ష్యాలు వర్పచుకొని, జీవితాన్ని ఓ లక్ష్యసాధనకు అంకితం చేయ్యాలంటే (బ్రతుకుదారిలో ఆధఃపతనానికి ఈడ్చే యీ సామాన్య ఆకర్షణలకు అందకుందా ని(గ్రహశక్తి కావాలనిపించింది. యీ గదిమార్చిమరోచోట నివసించటం ఉచితమనిపించింది శివరాంకు.
ఆరునెలల నగరజీవితం శివరాం (బ్రతుకులో, భావాల్లో విపరీతమైన మార్పు తెచ్చినమాట వాస్తవం. నిద్రరాక పొడికన్నులు పడిన శివరాంముందు. జరిగిన చరిత్రసినిమాలా కదిలింది. ఆ రోజు స్టేషనువిడిచి హోటల్లో ప్రవేశించాడు. మధ్యాహ్నం
62 అన్వేషణ స్నాన భోజనాదులు పూర్తిచేసి ఒక కునుకుతీసి లేచాడు చేతిలో ఉంటే డబ్బుతో చాలా కాలం హోటల్లో ఉండే స్తోమత తనకులేదు. ఏదో ఒక ఉద్యోగం ముందు సంపాదించు కోవాలనుకున్నాడు శివరాం.
మాసిపోయిన రైలు ప్రయాణపు దుస్తులు మూలపడేశాడు జేబులోని కాగితంలోని ఒక బంధువు చిరునామా ఉంది... తన తల్లి యిచ్చింది. ఈ నగరానికి వచ్చేముందు ..తన పెత్తండ్రి మనుమడు రెజిమెంటల్ బజారులో ఒక ఇంట్లో ఉంటున్నాడు . బంధువుల మన స్తత్వాలు బాగా ఎరిగిన శివరాం, €యనవల్ల తనకు ఉపకారం జరుగుతుందనే ఆశ లేకపోయినా, ఒకసారి యిల్లుపట్టుకుని అతన్ని చూడడంలో నష్టం లేదనుకున్నాడు. పరుపుచుట్టలో నలిగిపోయిన ఒకలాగు, చొక్కా తొడుక్కుని బయలుదేరాడు.
నగరంలో క్రొత్తస్టలం కనుక్కోవడంలో తారసిల్లే వ్యక్తులు, తిరిగే సందుగొందులు, ప్రతి యింటివైపు క్రొత్తగా చూస్తూ నదవవలసిన ఆవసగం శివరాంకు కొంత తమాషాగానే ఉంది. చివరకు తల్లి చెప్పిన బంధువు యిల్లు పట్టుకున్నాడు శివరాం,
విధి గుమ్మము తెలియక దోడ్డిదారిన అడుగు పెట్టాడు శివరాం. కుళాయిదగ్గర దాసీది గిన్నాలు తోముతోంది. పద్దెనిమిదేళ్ళ జవ్వని ఒకతె దొడ్గొ తిన్నెమాద ముస్తాబై కూర్చుని అల్లికలు కుడుతోంది ఒక బట్టతల తాతగారు ఇంట్లోంచి ఏదో అరుస్తున్నారు. దొడ్డిగుమ్మంలో నిలుచున్న శివరాంను చూసి కోపంగా ఇంట్లోంచి పరుగెత్తుకువచ్చారు బట్టతల తాతాగారు, “ఏంకావాలి” అంటూ , ఆయన ప్రశ్నలో “యీనగరంలో వివిధ రూపాల్లోవచ్చే దుండగీడులో నువ్వుకూడా ఒకడవా నాయనా” అన్నట్లు తీవ్రమైన చికాకు కనిపించింది.
“నారాయణగారి యిల్లు యిదేనాండీ?”
“ఐ నారాయణగారు? ... ఈ వూళ్ళో లక్షతొంభై నారాయణలు ఉన్నారు. నల్లగాపొడుగ్లా ఉంటారు .. ఆయనేనా? ముసిముసినవ్వులు నవ్వారు. బట్టతలతాతగారు తన కోపం ఈకస్మికంగా మార్చుకుని.
“అవునండి!” అన్నాడు శివరాం. తనకు కనిపించబోయే బంధువు రూపము పూర్తిగా ఎరుగకవోయినా.
“మేడ మీదకు వెళ్ళండి!” బట్టతల తాతగారు ఏదో ఖులాసాగా ఒక్కసారి శివరాంవచైపు చూశాడు.
అన్వేషణ 63
“సత్తెమ్మా! మీయింటికి ఎకరో వచ్చారు” గట్టిగా ఆరిచారు. తాతగారు.
శివరాం మెల్లగా మేడ ఎక్కాడు. ముందు బాటచుట్టు గదులు ఉన్నాయి. ఒక మూలగా ఉన్న కుళాయిదగ్గర, బిందెలోకి నీళ్ళుపడుతున్న సత్తెమ్మ చెంగున గెంతుతూ ముందుకు వచ్చింది.
శివరాంనిచూసి కాస్త నిర్దాంతపోయింది. శివరాం తన్ను పరిచయం చేసుకున్నాడు. సత్తెమ్మకు అప్పటికి అతని బంధుత్వం అర్ధం కాలేదు
“కూర్చోండి! ఆయన బజారుకు వెళ్ళారు యిప్పుడే వస్తారు?” ఆ దాబాలో ఒక వారగా కూర్పోబటోయాడు శివరాం.
'అబ్బేబ్బే !...గదిలో కూర్చోండి!... .సత్తెమ్మ శివరాంను మందలించి, గదిని పట్టెమంచం చూపించింది. మాసిపోయిన దుప్పటి చెల్లాచెధరైనా దూదితో ఉన్న పరుపు.... దానిమీద నూనెతో అట్టకల్లిన తలగడ..... ఆ మంచం స్వరూపంచూసి కొంచెం శంకించాడు శివరాం కూరోడానికి,
“ఇంటినిండా పిల్లలుకదండి... ఇట్లావేధించుకు తింటారు . ఎక్కడవస్తువు అక్కడ ఉండనీయరు” చలాకీగా నవ్వింది సత్తెమ్మ.... “నీకు పెళ్ళయిందా నాయనా?” ఓరగాచూసి సత్తెమ్మ ప్రశ్నించింది. సరదాగా.
“ తేదండి” సిగ్గుపడ్డాడు శివరాం.
సత్త్షెమ్మ వంటయింట్లోకి వెళ్ళిపోయింది.
శివరాం ఏమితోచక గది పరిీక్షచేయ్యడం మొదలుపెట్టాడు. గదిగోడ మేకుకు సగం చిరిగిన ఒక సినితార కేలండరు వేలాడుతోంది. గదిగూట్లొ పలకపుల్లలు సుద్దలు చిన్న పెన్సిలు ముక్కలు, పాలబ్లేడు.... దొంతరలుగా పడిఉన్నాయి. ఎదురుగా పేలమీర రెండు టంకు పెట్టెలు .. ఆ ప్రక్కనే బవీయ్యపుసంచి. ఎండుమిరపకాయలు, కూరలు, పప్పులు వరసగా చెల్లాచెదురుగా పళ్ళాల్లో కనబడ్డాయి. గది గుమ్మానికి కిటికీకి కట్టిన తాదుమీద మాసిన బట్టలు. చీరలు తోరణాల్లా వేలాడుతున్నాయి. ఒక ముక్సాలి పీటమీద 'సేక, గవ్వలబుట్ట కనిపించాయి. చాలీచాలని ఆదాయంతో, వీదరికాన్ని కప్పుకుంటూ, పైకి హుందాగా (బతకడం నేర్చిన మధ్యతరగతి కుటుంబమని నిశ్చయించుకొన్నాడు శివరాం.
త్రశ అన్వేషణ ముగ్గురు పిల్లలు అల్లరి చేసుకుంటూ గదిలో చొరబడ్డారు. శివరాంను చూసి ఒక్కనిమిషం భయంతో ఆగారు అపరిశుభ్రంగా మాసిపోయిన బట్టల్లో మలినంగా వున్నారు. ఏదో పెట్టడానికి, ఆ పిల్లల్ని అనునయంగా పిలిచాడు శివరాం తన దగ్గరకు పిలవడమే తదవుగా మట్టి కాళ్ళతో ఒక్క గెంతు మంచంమీదకు గెంతి శివరాం మెడ చుట్టబెట్టారు! “ మామా” అంటూ ఈరున్లూ.
సత్తెమ్మ లోపలికివచ్చి, యింకా సరిగా పరిచయమెనా కాని ఒక అగంతకుని గొంతు పిసికేస్తున్నారేమో అని భయపడి పిల్లల్ని కేక లేసింది.
ఒక అప్పడం తీసుకొచ్చి *ఇది తింటూ వుండండి ఈలోపుగా ఈయన వన్తారు!” నవ్వుతూ అందిచ్చింది సత్తెమ్మ
ఆ విచిత్ర ఫలహారాన్ని అందుకున్నాడు ఆనందంగా శివరాం అందుకున్న అప్పడాన్ని పట్టుకుని లాగి ముక్కలు చేశారు పిల్లలు.
“ఇదిగో మీ వళ్ళు హూనం చేసేస్తాను ఇలా అల్లరిచేస్తే!” పిల్లలను కొట్టటోయినంత పనిచెసి, మడికట్టుకున్న సంగతి జ్ఞప్తికి వచ్చి వెనక్కి తగ్గింది సత్తెమ్మ. పిల్లలంతా భయంతో బయటికి వెళ్ళగా గదిలో గచ్చుమీద కూర్చుంది సత్తెమ్మ తాపీగా !
ఎప్పుడొచ్చావు బాబూ యీవూరు?”
“కవేళేనండి”
“ఎక్కడుంటున్నావు?”
“హోటల్లో”
“ ఆరెరె!... మా యింట్లోనే వుండవచ్చు. కాని - యిప్పుడు అందరూ మాయింట్లోనే వుంటున్నారు. - బావగార్లు - వేలువిడిచిన మేనత్త... తమ్ముడు, చెల్లెలు - ఆత్తమామలు, ఉం -ఆయనలాంటి దుబారామనిషి మరొకడు రండి... ఏమిటో ఎవరెవర్నో ..... తీసుకువస్తారు - అయితే నువ్వు సుభద్రమ్మగారి అబ్బాయివా - పేరు ఎక్కడో విన్నానుగాని _ పరిచయం +” అంటు నసిగింది. సత్తెమ్మ ఆలోచిస్తూ. శివరాం మౌనంగా నవ్వాడు.
“నీక్తు పెళ్ళి కొాలేదన్నావుకదూ - యివూళ్ళో ఎవరో ఒకర్ని చూసి ముడి పెట్టెస్తాలే
- మావారి దగ్గరికి లక్షతోంభై మంది వస్తూంటారు. పెళ్ళికొడుకులు కావాలంటూ - అన్నట్టు మన డాబా క్రిందవాటాలోనే ఉందోయి ఒక పెళ్ళి కూతురు....” పకపక నవ్వింది సత్తెమ్మ. *“ పెళ్ళికి తోందరేముంది లెండి 1” శివరాం సిగ్గుగా మందస్మితం చేశాడు.
అన్వేషణ 65
“అదేమటోయ్ అలా అంటావు ! - నీకు యిరవై మూదో నాల్లో ఉంటాయగా - ఇదే సమయం పెళ్ళికి - పెళ్ళికూతుర్ని పిలవనా ఎమిటి ?”కులికింది సత్తెమ్మ
సత్తెమ్మ మాటల ఉత్పాహం చూస్తే తక్షణం పెళ్ళిచేసేలా ఉందని భయపడ్డాడు శివరాం,
నారాయణ వచ్చాడు . సన్నగా .... నల్లగా పొడుగా - ఒకపంచె, చొక్కా ధరించి
- సంచిలో ఒక పెద్ద అనపకాయ పట్టుకొని గదిగుమ్మంలో అడుగు పెట్టాడు. భార్య చనువుగా నవ్వుతూ మాట్లాడుతున్న శివరాంవైపు ఒక్కసారి తేరిపారి చూశాడు.
“ఈ అబ్బాయి మీ సుభద్రమ్మగారి కొడుకటండి !” సత్తెమ్మ భర్తరాగానే సగౌరవంగా పరిచయం చేసింది శివరాంను.
“ సుభద్రమ్మగారు?” తీవ్రంగా ఆలోచిస్తూ ఒక్కక్షణం నిస్తబ్బుడుయి వోయాడు నారాయణ.
“ మా తాతగారు బ్రహ్మయ్యగారు. - రాజమండ్రిలో ఉంటున్నాము - ” శివరాం మాటలు నమిలాడు - మెల్లిగా.
“ఓహో - మీ తాతయ్యగారిని, మీ తల్లిగారిని బాగా ఎరుగుదును- ఒక్కసారిగా ఉత్సాహంగా, అనందంగా నవ్వాడు నారాయణ.
“అయితే ఎప్పుడొచ్చావు - ఏమిటి సంగతి? ఏం చేస్తున్నావు?” గబగబ ప్రశ్నించాడు నారాయణ ,
“ఇతను పెళ్ళి కొడుకండి - మన డాబాక్రీింద బట్టతలాయన కూతుర్నిన్చి పెళ్ళిచేస్తే చాలా బాగుంటుంది. - యీడు జోడుచక్కగా -”
సత్తెమ్మను భర్త కసిరాడు ఎప్పుడూ పెళ్ళిగొాడవలేనా అని,
క్రొత్తవారి పద్దతులు మనస్తత్వాలు, పరిస్థితులు పూర్తిగా అర్ధం చేసుకోకుండా నారాయణ ఏ సలహాలు ఇవ్వడు. మనిషి ఆవసరాల ననుసరించి, వారికి తగినపని చేసిపెట్టి మంచి చేసుకుని, తరువాత నొప్పించకుండా వారిదగ్గరనుంచి స్వప్రయోజనాలు సాధించువోవడంలో నారాయణ నేర్పరి.
భర్త కసరడంతో సత్తెమ్మ బయటికి వెళ్ళిపొయింది.
66 అన్వేషణ
శివరాం తన పరిస్థితులు వివరించాడు. తక్షణం ఉద్యోగం కావాలన్నాడు. తప్పక తనకు చేతనయినంతవరకు సహాయం చేస్తానన్నాడు నారాయణ. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండమని సలహాయిచ్చాడు.
శివరాం మళ్ళి కలుస్తానంటూ సెలవు తీసుకుని బయటకు నడిచాడు.
“ఈ సాయంత్రం యిక్కడ భోజనం చేయ్యకూడదటోయ్ .. నీకు మాయింట్లో ఎప్పుడూ భోంచేయాలంటే ఆప్పుడు చేయవచ్చు. నారాయణ లౌక్యం చూపించాడు.
“ఆబ్బే ! యీసారివచ్చి భోంచెస్తా !”” అంటూ శివరాం వెళ్ళి పోయాడు,
రైల్వేలో గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ జా(గ్రత్తగా కాపురం నడిపించుకొస్తున్న ఆబీదబంధువు నారాయణ తన కేమిప్రత్వేక సహాయం ఉద్యోగాన్వేషణ విషయంలో చెయ్యగలడనే నమ్మిక శివరాంకు కలగలేదు అయినా అతని మాటల్లో ఈ నగరంలోని పెద్దల నందరనీ ఎరుగుదునన్నట్లు స్ఫురించడంవల్ల, ఆ మాటలు నిజాలో బూటకాలో బుజువులు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు శివరాం.
తిన్నగా నడిచాడు రోడ్డుమీద. పనిలేనప్పుడు ఆలోచిస్తూ మౌనంగా షికారుచెయ్యడం చాలా సరదాగా ఉంటుంది. ముస్తాబైనయువ దంపతులు సినిమాకిలాగుంది. హడావిడిగా నడిచిపోతున్నారు. ఉద్యోగంనుంచి విరమించిన ఒక ముసలాయన చేతికర్ర ఊపుకుంటూ మెల్లగా వీధిలో నడుస్తూ షికారు కు బయలుదేరినట్లున్నాడు. మనోహరుటాకీసువద్ద జనం గమిగూడి టిక్కట్లకోసం క్యూలో నుంచాని రభస చేస్తున్నారు. కైస్తవులచర్చి, గంటస్తంభంతో కాపురం చేస్తున్న పార్కు నలువీధుల మొగలో కనిపించాయి చుట్టుప్రక్కల భవనాలు గంటస్తంభం. హోటళ్ళు విద్యుద్దీపాలతో తోరణాలు ప్రదర్శిస్తూ రిపబ్లిక్‌దినోత్సవం జరుపుతున్నాయి. వొర్ము పకృనే నిలుచుని ఒకడు పిడతకిందపప్తు, వేరుశేనగకాయలు అమ్ముతున్నాడు. పార్కులో కూర్చున్న జనం రేడియోనుంచి వచ్చే గీతావళి విరామంగా వింటూ ఆనందిస్తున్నారు తొందరపని ఉన్నట్లు కార్లు అతివేగంగా దోద్దుమీద నడుస్తున్నాయి. ఇరానీ హోటలు యజమాని మేజాదగ్గర కూర్చుని గలగల రాలే రూపాయలు పోగుచేసుకుంటున్నాడు. లెక్కలేనంత జనం, అనేకమైన వ్యాపారాలు ఉన్న ఆ నగరంలో ఏదో ఉద్యోగం తనలాంటి చదువుకున్నవానికి దొరకకపోదనే ధైర్యం, కలిగింది. శివరాంకు వేరుశనగకాయలు అమ్ముకుంటూ, పాటలు పాడుతూ వీధిలో తిరుగుతే .. హోటల్లో సెర్వరుగా పనిచేస్తే... రిక్షాలాగితే?.. తన్నెవరూ ఎరగని యీ నగరంలో ఎటువంటి పనిచేసినా ధనసంపాదన సుటభమే అనిపించింది శివరాంకు. సంకుచిత మనస్తత్వాలుగల
అన్వెషణ 67 పెద్దల దృష్టిలో యీ పనులు నీచంగా భావింపబడినా, నిజంపరిశీలిస్తే మనుష్యుని వ్యక్తిగతమైన పరపతికీ, చేసేవృత్తికి సహ(్రవ్యత్యాసం కనిపించింది. ఏ వృత్తిలోనూ నీచత్వం లేదనిపించింది శివరాంకు
పార్ములోకి అడుగుపెట్టాడు శివరాం విశాలమైన ఆ సిమెంటు తివాసీలపై ఎంతోమంది జనం చిన్న చిన్న గుంపులుగా చెల్లాచెదురుగా కూర్చున్నారు. ఒకవైపుకుర్రాళ్ళు క్రికెటు, మరోవైపు పట్బాల్ ఆడుతున్నారు ఒక తల్లి తనబిడ్డను తోట్టెకుర్చీలో కూర్చోపెట్టి త్రిప్పుతోంటే తండ్రి పాపకు ఏవో సంబ్దలుచేస్తూ ఆనందిస్తున్నాడు. విశాలమైన హృదయం, విస్తృతమైన భావాలు, వ్యక్తికకూడా అవసరమని ఆ పెద్ద మైదానాలు ఉద్భోధిస్తున్నట్లు న్నాయి. సంధ్యారుణరాగం వెదజిమ్ముతున్న విశాలగగనం విప్లవభావాలు వెలి[గ్రక్కుతోంది. మైదానాలను చుట్టుతున్న రోడ్లపై నేరేడు, రావి, చింత, మొదలైన గంభఖీరమై, సుందరమై, విప్లవాత్మకమైన ఆ ఆకాశం మైదానంలా ఒక క్రొత్త జీవితాన్ని ఆ నగరంలో సృష్టించు కోవాలనే నిశ్చయంతో ఉద్రేకపడ్డాడు శివరాం.
మర్నాడు పొద్దున కాఫీత్రాగి హోటల్లో కూర్చుని స్థానిక వార్తాపత్రిక తిరగవేశాడు శివరాం. “టైవిన్సు కావాలి!” వార్తా వ[తికలో ఒకమూల కనివించింది. 'ముషిరాబాదు . 420 నెంబరు. .'సాలోచనగా మూలబడిఉన్న బెడ్డింగువైపు చూశాడు
- మరోరెండు పంట్లాములు, చొక్కాలు నలిగి మాసివున్నాయి హోటల్లో పనిమనిషిని తక్షణం పిల్చి ఒక పావలా చేతిలో పెట్టి ఉతికిపెట్టమన్నాడు. ఒక జతదుస్తులు బయటికితీసి ఆ గదిలోనే ఇంకాకొందరు నివసిస్తున్నారు హొటలు యజమానికి నెలవారి అద్దె యిచ్చుకుంటూ, ఆస్పత్రిలో వరుసగా పెర్పిన రోగుల మంచాల్లా ఆ హోటలుగదిలో కూడా ఇనుపమంచాలు పేర్చిఉన్నాయి, తమిళులు యిద్దరు ఒక మంచంమీద కూర్చొని ఏవో ఆఫీసువిషయాలు తర్మించుకుంటున్నారు. వొకాయన తెలుగు డిటెక్టివ్ నిశ్శబ్ధంగా చలనం లేకుండా అవస్వరాల కూనిరాగం అందుకున్నాడు. ఇంకొకరు ఆఫిసుకాగితాల ఫైల్సులో ఏదో (వ్రాస్తున్నారు కాఫీ వాక్కొక్కగుక్క మింగుతూ,
శివరాం మనస్సు వార్తపత్రికలోని యితర వార్తలు పట్టించుకోలేదు. ట్రెపిస్సు ఉద్యోగం
- నెల జీతం ... కొత్తజీవితం -బస్సుల్లో ప్రొద్దున్న ఉద్యోగులగుంపులతో ప్రయాణాలు... ఆలోచనలు అలల్లా కదిలాయి ఈ పగటికలలకు నవ్వుకున్నాడు శివరాం. మళ్ళివార్తా పత్రికమీద లగ్నం చేవాడు మనస్సు.
. మధ్యాహ్నం భోజనంచేసి, ఉతికించిన బట్టలు ఇప్తీ చేయించుకుని, ధరించి,
608 అన్వేషణ వార్తపత్రిక, తన డిగ్రీపత్రం కొన్ని -యోగ్యతా పత్రాలు తీసుకుని స్టెషనులో బస్సుఎక్కాడు శివరాం ముషీరాబాదు పోలీసు స్టేషను ఎదురుగా దిగాడు.
420 నెంబరు !...... ఇరువైపు తెరిపార చూస్తూ, జాగ్రత్తగా నెంబర్లు పరిశీలిస్తూ నడవసాగాడు శివరాం. ఇంటి గుమ్మాల్లోనిలుచున్న గృహిణులు దిక్షగా చూస్తున్న శివారాంవైపు వింతగా చూదనాగారు ట్రైపీస్లు కావాలని వార్త ప్రకటించిన ఇంజనీరింగ్ కంపెనీ ఎక్కడ అని దారినిపోయేవారిని ప్రశ్నించాడు. కొందరు తెలియదన్నారు. మరికొందరు విననట్లు గబగబ తలవంచుకు వెళ్ళిపోయారు. మరికొందరు ఏదో అర్ధమయినట్లు తలఊపి మరొకవీధి చూపించారు. తిరిగి ఏ వీధిలోనూ ఆ నెంబరు గృహం కనిపించక విసుగెత్తి చికాకుగా నడిరోద్దు ఎదురుగా ఓ హోటల్లో చతికిలబడ్డాడు
హోటలు చాలా అపరిశుభ్రంగా ఉంది. గుమ్మం ప్రక్క అద్దాల బీరువాల్లో బిస్కట్లు. పేస్తీలు, బన్నులు, రొట్టెలు పేర్చి కూర్చుని వీధిలోపోయే జనాన్ని ఆహ్వానిస్తున్నాయి. కప్పులు, సాసర్లు ఖంగుఖంగుమని ధ్వనిస్తున్నాయి. సెర్వర్ల ఉర్దూ, తెలుగు కేకలు, మాటలు చెవులను గజిబిజిచేస్తున్నాయ. ఈగలు ముసురుతున్న టేబిలుమీద త్రాగివిడిచిన టీ కప్పులు మరకల్లో మూగగా చూస్తూన్నాయి. చార్ మినార్ సిగరెట్లు త్రాగతూ నల్లటి మాసిపోయిన కళ్ళతో కూలీలు టీ త్రాగుతూ తమ అర్ధనగ్న జీవితాల సమస్యలగూర్చి ఖిన్నులై ఆలోచనలో సతమత మౌతున్నారు.
ఒకగ్గాసు మంచినీళ్ళు, వొకకప్పు కాఫీత్రాగి లేచాడు శివరాం. హోటలు యజమానిని ఆఖరిసారిగా 420 నెంబరు యిల్లుగురించి ప్రశ్నించాడు అక్కడి చౌరస్తాకు ఉత్తరంగా వొక ఫర్లాంగు నడిచి తూర్పుగా మొదటి వీధిలోకి తిరగమని సలహాయిచ్చాడు హోటలు యజమాని. ఆఖరుసారిగా ఆశగా ఆత్రుతతో వెయ్యికళ్ళు చేసుకుని (ప్రతీ గృహాన్ని పరిశీలిస్తూ నడిచాడు శివారాం.
హోటలు యజమాని చెప్పిన వీధిలో ఆ నెంబరు యిల్లు చివరకు కనిపించింది. ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా గుమ్మం ఎక్కాడు. తలుపులు మూసిఉన్నాయి. గట్టిగా తలుపుకొట్టాడు శివరాం వొక నిమిసం సమాధానం రాలేదు. "కోన్ హై” అంటు ఆరుపు వినిపించింది. రెండవసారి తలుపు బాదగానే ఏదో ప్రీకంఠంలా వినిపించ గానే శివరాం కొంచెం జంకాడు. అయినా ఆఫీసుల్లో స్రీలు పనిచేసే యీ మహానగరంలో అంత భయపడవలసినపని లేదనుకుని సమాధానపరుచుకున్నాడు శివరాం. గాజులు ఘల్సుమనే శబ్ధంతో (శ్రుతికలిపింది తలుపు కిర్రుకిర్రుధ్వని. పరదాలో పటుత్వంగా నిలుచుంది ఒక
అన్వేషణ ౮09 దీర్హమైన నల్లని ఆకారం చిన్న గళ్ళసందులోంచి మొదిలాయి కనుపాపలు “క్వాహై,కోన్ హై క్యాబాత్ హై” రాళ్ళవానలా మాటలు దూసుకు వచ్చాయి ఆమె నోటినుంచి. కాస్త హింది అర్దం ఎరిషెన శివరాం ఆమె మాటలకు భయపడ్డాడు, ఉద్యోగంకోసం వచ్వానని సవినయంగా మనవిచేసుకున్నాడు “నువ్వు యీవేళ పన్నెండో మనిషివి అంటూ భళ్ళున తలుపు వేసేసుంది కుపితయైన ఆ వనిత ఆ ఇంటినెంబరు తనవైపు వెకిలిగా హేళన చేసినట్లు నవ్వింది. భళ్ళుమని మూసినతలుపులమీదకు విసిరినదుమ్ము కొంచెం దులుపుకుని ఆనాటి ఘనకార్యానికీ, జరిగిన పరాజయానికి తనలో తనే ధైర్యం చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా హోటలుగది చేరుకున్నాడు శివరాం. వార్తాపత్రిక ప్రకటనలోని మోసం యొక్క అంతరార్థమేమిటో అతనికి బోధపడలేదు.
రాత్రి భోంచేసి తన మంచంమీద కూర్చుని పరుపుచుట్టలో రాచుకు తెచ్చుకున్న షేక్సిపియరు నాటకం ఒకటి తీశాడు చదువుకుందామని పుస్తకాలు చెప్పే సిద్ధాంతాలకి, మానవుడు జీవితంలో విజయం పొందడానికి చాలాఖేదం ఉందనిపించింది. రచయితలు తమ అనుభవ జ్ఞానాన్ని వ్రాతపూర్వకంగా అందిచ్చినపుడు చదివి ఆనందించటమే కాని, దాన్ని మానవుడు జీవితంలో ఏ విధంగానూ ఆచరణలో పెట్టుకోలేక పోతున్నాడనేది మాత్రం సత్యం. సిద్ధాంతాలు,నితులు మననం చేసుకుంటూ కుర్చునేకంటె, ఆచరణలో వాటిని ఆధారంచేపసుకునే అనుభవం సంపాదించుకోవాలి. పుస్తకం మూసేసి,ఇంత వరకు గదిలోని మిత్రులను పరిచయం చెసుకోకుండా ఉన్నందుకు కించపడి, ఫైల్సు (వ్రాసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళికూర్చున్నాడు శివరాం? సవినయంగా తన పేరు చెప్పుకున్నాడు.
'ఆ ! చూస్తున్నా మిమ్మల్ని! కళ్ళజోడు తీసి కింద పెట్టాడు ఆ ముసలాయన. శివరాం తన పరిస్థితులు క్షుప్తంగా మనవిచేసుకుని, ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చేప్పమని (ప్రాధేయపడ్డాడు
మౌనంగా కూర్చుని, చుట్టూ ఉన్న వాతావరణంలోని విలువలను అర్ధం చేసుకోకుండా, ఆందనివాటికి విచారిస్తూ నిరాశగా (బ్రతికే నిర్వీర్యుని జీవితమంతా ఫోదమయంగానే ఉంటుంది. తన కవసరమైనవన్ని విధి ననుసరించి తనముందుకే వస్తాయనే సంగతి మనిషి విస్మరిస్తాడు. శివరాం తన పరిస్థితిలోంచి ఒకసిదాంతాన్ని (ప్రతివాదించుకున్నాడు.
౯/0 అన్వేషణ
మర్నాడు మామూలు పద్దతిలో నిరుద్యోగిగా వినాయకరెడ్డి ఆఫీసులో ప్రత్యక్ష మయ్యాడు శివరాం. లావుగా బొద్దుగా, నల్లగా గుండ్రంగా పెద్ద బొజ్జతో తన ఆఫీసుగదిలో ఎగాదిగా చూశాడు
“బవూరు?”
“టెపు చేయ్యడం తెలుసా” అన్నాడు బొజ్జాయన
“ పరీక్ష కూడా ప్యాసయ్యాను.”
రెడ్డి శివరాంను కూర్చోమని ఎదురుగాఉన్న కుర్చీ చూపించాడు పాలపిట్ట రంగులో గదిగోడలనీ అందంగా, పరిశుభ్రంగా ఉన్నాయి. పెద్దమేజూబల్ల, అందమైన కలం, సిరాబుడ్లు, ఆల్విన్ బీరువాలు గాంధీ నెహ్రూల పెద్ద ఫోటోలు, నెత్తిమీద గిర్రున తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఫాన్, కాకీరంగు బట్టల్లో నిలబడి నమ్రతగా పనిచేస్తున్న నౌకర్లు...ఆ ఆఫీసు పరపతిని హెచ్చిస్తున్నాయి.
నాల్గుపేజీల వ్రాతప్రతి టైపుచెయ్యమని శీవరాంను ఆజ్ఞుపించాడు రెడ్డి నౌకరు బైపురైటరు దగ్గరకు తీసుకువెళ్ళాడు. కాగితాలు బైపుచేసి రెడ్డిముందు నిలుచున్నాడు శివరాం.
టైపుచెసిన కాగాతాలు ఒక నిమిషం చదీవాడు రెడ్డి.
“ఐం చదుకున్నావు?”
“వి. వొ నిశ్చలంగా సమాథాన మిచ్చాడు శివరాం.
“వి. ఏ?” ఒక్కసారి ఆశ్చర్యంగా నోరు ఆవలించాడు రెడ్డి అంత చదుకున్నవాడు టైపిస్సుగా పనిచేస్తాడా అనుకుని.
“ఎంత జీతం కావాలి ?”
మీ యిష్టం.”
“ఒక వందరూపాయలు యిన్తా నివసించడానికి గది ఉచితం!” వినాయక రెడ్డి రీవిగా కుర్చీలో నిండుగా ఒరిగి గిర్రున తిరిగాడు బొజ్జనిమురుకుంటూ.
ఏదో ఉద్యోగం దోరికితే చాలనుకుంటున్న శివరాంకు అది చాలా మంచి ఆవకాశ మనిపించింది. బసకూడా ఉచితంగా సమకూర్చబడడం తన అదృష్టమే అనుకుని ఉద్యోగం చేయ్యడానికి ఒప్పుకున్నాడు.
అన్వేషణ ౮0! మర్నాడు వినాయకరెడ్డి ఇంట్లోకి తన బెడ్డింగుతో వచ్చేశాడు బంగాళా వెనుక కాంపౌండుటో ఆరు గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి ఆ గదిల్లో రెడ్డి ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు మరికొందరు కాపురమున్నారు. తనకు కేటాయించిన గది చూపించారు. గదిలో ఒక నులకమమంచం, దానిమీద చిన్న పరుపు... గూటిలో పుస్తకాల దొంతరులు, ఒక ట్రంకు పెట్టె ..సబ్బు పెట్టె అద్దం .దివ్వెన కనిపించాయి ఆ గదిలో యింకొకరు5కూడా ఉంటున్నారనే సంగతి బుజువయింది కాలకృత్యాలు తీర్చుకొవడానికి బయటకు వెళ్లిన నానా స్వామి, గదిలోకి వచ్చి శివరాంవైపు చోద్యంగా చూసి నవ్వాడు.
“మీరేనా క్రొత్తగావచ్చిన టైపిస్టు ... రండి . రెడ్డిగారు చెప్పారు.... మనిద్ధరం ఇందులో ఉండాలి .. ఎలా ఉంది మన గది!”
నటకుడులా చేతులు చాచి గది చూసిస్తూ హోయలుగా నడిచాడు. కనుబొమ్మలు, ఎగరేస్తూ, ఒంటరిగా (బ్రతికేమనిషి మరొకడు తనకు తోడుగాఉన్నాదని సంతోషించాడు శివరాం.
ఆ రోజు ఆఫీసుపని మొదలు పెట్టాడు శివరాం. పని చాలా ఎక్కువగా ఉంది. తన దగ్గరవున్న కొద్దిపొమ్ము నెలాఖరులోగానే సరిపుచ్చుకుంటే జీతంవచ్చిక అవసరమేన బట్టలు, పెట్టె మొదలైనవి కొనుక్కోవచ్చునని ఒక ప్రణాళిక వేసుకున్నాడు శివరాం.
వినాయకరెడ్డి శివరాం పనిచూసి సంతృప్తిపడ్డాడు. అయిదు గంటలు కాగానే శివరాం దగ్గవకు వచ్చాడు.
- ఆభఖీసు మూసేసేవేళ అయింది ... మీరువెళ్ళండి.... నగరం అంతా చూశారా 1 _....... మీవసతి సౌకర్యంగా వుందా? ఏం కావాలన్నా అడిగి తీసుకోండి!” ఖులాసాగా నవ్వుతూ రెడ్డి వెళ్ళిపోయాడు.
రెడ్డి మంచితనం శివరాంకు ఆనందం కలిగింది. సహ్యదయడైన యజమాని మొదట తనకు తారసిల్లడం తనభావికి శుభసూచకమనుకున్నాడు.
నానాస్వామితో కలిసి శివరాం సాయంత్రం వాహ్యాళి వెళ్ళాడు. నారాయణగూడా చౌరస్తాలోని హోటల్లో భోంచేసి రెడ్డిగారి బంగాళా చేరుకున్నాడు శివరాం. దారిలో నానాస్వామి అనేక సంగతులు చెప్పాడు. ఢిల్లీనుంచి వచ్చియిక్కడ గుమాస్తాగా చేరడం.,... చూసిన సినిమాలు...... రెడ్డి కూతుళ్ళు కొడుకులు అఫీసు ఉద్యోగులపై చేసే ఆధికాగ
ల్లు అన్వేషణ తమ గదుల ్రక్కనే కాపురముంటున్న ఇతర ఉద్యోగుల కుటుంబవిషయాలు. .. రసవత్తరమైన కధల్లా వినిపించాడు. శివరాంకు, తరచి చూచినకొద్దీ మనుషుల జీవితాల్లో ఎన్నో నిగూఢరహస్యాలు ఉంటాయి కాబోలు అనుకున్నాడు శివరాం
గదిలోని విద్యుద్దీపం ఆర్పి దుప్పటి ముసుగు పెట్టుకుని నిశ్చింతగా మంచంమాద ఒరిగాడు నానాన్వామి. శివరాం తన పరుపుచుట్టకూడా పరుచుకున్నాడు. దోమలు కూనిరాగాలు పాడుతూ గదిలో ఎగురుతున్నాయి గది బయటికి కిటికీలోంచి చూసేడు. రెడ్డి బంగాళా వెనుకభాగం కనిపించింది అక్కడ రెండు గుడిసెలు. ఖాళీస్టలం కనిపించాయి. ఆ బంగాళాను వేరుచేసే గోడపై ఆ గుడిసెలలోని బాటసారులు విడిచే అపరిశుద్దం గాలులు గోడకు ప్రక్కగా వీలు ముక్క దొలుచుతున్నాయి. నిద్రపట్టక శివరాం బంగాళా లోపలి ఆవరణలోకి వచ్చాదు
(ప్రక్కగదుల్లో కుటుంబాల అడంగులు కాళ్ళుచాపుకు కుర్పొని కబుర్లు చెప్పుకుంటున్నారు రెడ్డి నివసించే మేడకు తమగదులకు మధ్య నున్న అరఫర్జాంగు దూరం పూలకుండీలతో మొక్కలతో, ఫలవృక్షాలతో, కూరపాదులతో, సుందరంగా నిర్ణత పద్దతిలో ఆ తోట పెరిగి ఉంది. చేరుకు దూసుకుని వెన్నెల వరండాలోకి వస్తున్నది, పండువెన్నెలహాయిలో బంగళా కాంపొండులోని చూతవృక్షం పరవశం చెందుతూ నృత్యం చెస్తోంది. రెడ్డిగారి బంగాళా దీపాలు మెరుస్తున్నాయి. మేడమీద మసలుతున్న జనం నీడలు ద్వారబంధాలకు కట్టిన అందమైన తెల్లరంగు తెరలపై అగుపించి. చెదిరి పోతున్నాయ్. మేడమీద కిటికీలొంచి రెడ్డిగారి బొచ్చుకుక్క నాలుకచాపి ఆయాసంగా ఒగురుస్తూ తమాషాగా చుట్టూవున్న దృశ్యాలు తిలకిస్తోంది, జీవితాల్లోని అంతస్థుల విభేదాలు శివరాం కళ్ళముందు కట్టాయి. ఎప్పటికైనా అటువంటి బంగాళాలో రెడ్డి గారిలా తను జీవించగలడా ? జన్మించిన న్ధాయిని దాటి బ్రతుకులో అంతస్థుల సోవానాలు ఎక్కడం. నిరంతరం సోపానాలకు జారుడు రంగుపూసి దిగజార్చే సంఘం కట్టుబాట్లు నెదుర్శొని నెగ్గడం... సాధారణవిషయం కాదనిపించింది. నిద్ర రాకపోయినా ప్రక్కనున్న కుటుంబాలకు ఒంటరిగా రాత్రి వరండాలో నిలుచుని, దురభిప్రాయం కలిగించ కూడరనుకుని శివరాం తన గదిలోకి పోయాడు.
క్రొత్తస్టలం... దోమల రొద.... దుర్వాసనలు... పరిమితమైన చిన్నగది ... శివరాం నిద్రను చెడగొట్టాయి. ఉదయం కాగానే లేచి రాత్రి దోమలు శరీరాన్ని కాట్లు వేయగా గాలి పీల్చికుందామని వరండాలోకి వచ్చాడు. వినాయకరెడ్డి పంచెనడుంకు గూడకట్టుకుని
అన్వేషణ శ్ర బుజంమీద తువ్వాలు సరిచేసుకుంటూ నోట్లో పెద్దచుట్టతో రైలు ఇంజనులా పొగలు వదులుతూ, చెతిలో ఏవో కాగితాలు పుచ్చకుని శివరాం దగ్గరకు వచ్చాడు.
'లేచావోటోయి... నీకోసమే వచ్చా. . ఈ కాగితం చాలా జరూరుగా కావాలి.... ఒక్క చిటికెలోటైవు చెయ్యాలి.. .* కాగితం రెడ్డి అందిచ్చాడు.
“ఇంకా ముఖం....” నూనెకారే జిడ్డు ముఖాన్ని తువ్వాలుతో తుడుచుకుంటూ నసిగాడు శివరాం.
'ఆ. .... అయితే నేను ఆఫీసుగదిలో ఉంటా... ఒక్క అయిదు నిమిషాల్లో వచ్చేయి ! నవ్వుతూ వెళ్ళిపోయాడు రెడ్డి.
నిద్రనుంచి లేచీ లేవలేకుండా, రెడ్డి ఇచ్చే ఆఫీసుపని తల్చుకుని చికాకువడ్డాడు శివరాం అయినా ఒక్కరోజు యిటువంటి పనివస్తే తప్పులేదనుకుని సమాధాన పరుచుకున్నాదు.
కాఫీకూడా త్రాగకుండా మేడ ఆఫీసులోకి వెళ్ళి ట్రైపురైటరు వద్ద కూర్చున్నాడు శివరాం. రెడ్డి కాగితాలు నౌకరుద్వారా పంపించాడు అవి పూర్తిచేయ్యకుండా విరామం లేకుండా యింకా కాగితాలు రెడ్డిపంవించసాగాడు. యజమాని (ప్రవర్తన విడ్డూరమనిపించింది. శివరాంకు. ఒక గంట గడిచాక యజమానితో చెప్పి భోజనానికి వెళ్ళి పోయాడు శివరాం. శివరాం టైపు చెయ్యవలసిన కాగితాలు అలాగే వుంచి వెళ్ళిపోవడం రెడ్డికి అసంతృప్తి కలిగింది. అయినా ఏమనలేక వూరుకున్నాడు.
ఆఫీసుకు వచ్చాక సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా పని వచ్చింది శివరాంకు. మధ్యహ్నం నానాస్వామి యిప్పించిన ఒకకప్పుకాఫీ త్రాగి పనిలో నిమగ్నుయ్యాడు. తోటి గుమాస్తాలు శివరాం వైపు చిత్రంగా చూడసాగారు మనుషుల్ని అర్హంచేసుకోవడానికి అవకాశం కావాలనుకుని మౌనంగా ఊరుకున్నాడు శివరాం.
ఆరుగంటలు దాటేక రెడ్డి శివరాందగ్గరకు కచ్చాడు.
“సాయంత్రం బయటికి అవసరంగా వెళ్ళకు... ఏమన్నాజరూరగా టైపు చేసే కాగితాలు రావచ్చు .... మన యింట్లో పేక, కేరమ్సు...... వార్తపత్రికలు, అన్నీ ఉన్నాయి. ఆడుకోడానికి మా అమ్మాయిలున్నారు....నేను అందరం..... హిహిహి.. కలిసి ఇక్కడ ఆడుకోవచ్చు, రెడ్డి ఆనందంగా నవ్వుతూ చుట్ట పొగలు గుప్పు మనినించుకుంటూ వెళ్ళవోయాడు,
ట్! అన్వేషణ
బంగాళా వెనుకనే బస సమకూర్చిన రెడ్డిగారి మనస్తత్వం శివరాంకు అర్హమయింది. ఒక్క ఉద్యోగమే తన జీవితలక్ష్యం కాకుండా యింకా ఎన్నో పనులు చేసుకోవాలనుకున్న శివరాంకు ,యీ వాతావరణం నచ్చలేదు. నిర్భయంగా నియమితమైన గంటల్లోనే ఆఫీసుపని చేయ్యడం తప్ప యితర సమయాలు జ్ఞానాభివృద్ధిని, స్నేహితులను పెంచుకోడానికి , వినియోగించుకోవాలనుకున్నాడు శివరాం.
రెడ్డి మాటలు లెక్కచెయ్యకుండా శివరాం నగరంలోకి వెళ్ళివోయాడు సాయంత్రము షికారుకు తిరిగి రాత్రి పదిగంటలకు ఇంటికి వచ్చాడు. బంగళా వీధిగేటు తాళం వేయబడింది గట్టిగా నౌకర్లును పిలిచాడు శివరాం, మేడగదిలో మనుష్యుల సంచలనం నడకల కదలికల్లో కనిపిస్తున్నా ఎవరూ బంగళాగేటు తియ్యలేదు. గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. రెడ్డిగారి బొచ్చుకుక్క మేడమీద నుంచి ఆరుస్తోంది. కాంపొండులోని గేదె బలంగా మేసి త్రేన్సింది. కాంపొందులోని ఉసిరిచెట్టు ఒళ్ళు విరుచుకుని గాలికి ఊగుతోంది గబగబ అడుగులు వేసుకుంటూ బంగాళా మధ్య తోట ముందరికి వచ్చాడు శివరాం. కారుషెద్దు ప్రక్కగది రేకు తలుపు విచ్చుక్కుని ఎలుకపిల్ల లోపలికి వెనుదిరిగింది. కంగారులో మూసిన రేకుల తలుపుల్లోంచి ఖరీదైన గులాబి సిల్కుబిర బయటికి వేలాడింది. మధ్యాహ్నం స్నేహితురాలికి ఒక ఉత్తరము టైపు చెయ్యమని వచ్చిన రెడ్డిగారి పెద్దకూతురు ప్రమీల ఆ ఎ(ర్రగులాబి చిరకట్టుకుంది. కారు షెడ్ ప్రక్కన గదిలో (డ్రైవరు ఒంటరిగా కొపుర ముంటున్నాడు పరిస్టితి పరిశోధించాలనుకున్నాడు శివరాం. గబగబ నడిచి చూతవృక్షం చాటున ఒదిగి నిలుచున్నాడు. ప్రమీల కంగారుగా తల వంచుకుని తోటదాటి వెళ్ళి వోయింది. హుషారుగా ఈలవేసుకుంటూ శివరాం మెల్లగా అడుగులు వేసుకుని తన గది చేరాడు నానాస్వామి చదువుతున్నాడు ఏదో పుస్తకం.
ఎవరికి చెప్పకుండా ఎగిరిపోయావేమిటోయి?” నానాస్వామి సాయంత్రం శివరాం కనిపించలేదని అడిగాడు.
ఎన్నో విషయాలు నిన్నరాత్రి చెప్పాపు..... ఈ సంగతిచెప్పలేదే శివరాం హుషారుగా దుస్తులు విప్పుకున్నాడు.
' ఏ విషయం?”
“ రెడ్డిగారి కూతురు ప్రణయగాధ +
“* ప్రణజయమనేది నువ్వూ నేను చెయ్యలేం. కామించి మోసంచేయగల కఠిన హృదయం..." సంఘ నియమాలు చేదించగల సాహసం, కాలం తెలివి వృధాచెయ్యగలిగే
అన్వేషణ 75 పట్టుదల ..... అలవర్చ్భుకో గలిగితేనే ఈ నాగరిక ప్రపంచంలో ఇటువంటి గాధల్లో నాయకులు కావచ్చు ఆ లక్షణాలు నీలోలేవు....నాలో లేవని ఏనాడో నిర్ణయించుకున్నా.. అందుకే యీ విషయం తెలిసినాపూర్తిగా మర్చిపోయాను?” నానాన్వామి శివరాం భుజంమీద గట్టిగా తట్టి అసలు సంగతేమిటి అని ఆత్రుతగా అడిగాడు. నానాస్వామి విషయం తెలుసుకుని పకపకనవ్వాడు. శివరాం అతని నవ్వులో శ్రుతికల్పాడు. ఆ నవ్వుల శ్రుతిలో గధిలోని విద్యుద్ధిపం ఆరిపోయింది. రెడ్డిగారి బంగాళాలో అంతా నిశ్శబ్దం తాదవించింది.
మర్నాడుఫ్రొద్దున ప్రక్క్మమీద బద్దకంగా ధొర్లుతున్నాడు శివరాం. గది తలుపు చప్పుడయింది లేచివెళ్ళి తీశాడు తలుపు ఎదురుగా డ్రైవరు కనిపించాడు రెడ్డిగారు రమ్మంటున్నారని,
= అదృష్టవంతుడివి! ప్రొద్దున్నే లేవగలిగేవు” శివరాందైవరు వైపు భావగర్శితంగా నవ్వి “వస్తున్నాననీ చెప్పు?” అన్నాడు.
రెడ్డి బంగాళాలోని తోట ప్రక్కగా ఫేముకుర్సీలో కూర్చుని, క్రితంరోజు వార్తాపత్రిక తిరగవేస్తున్నాడు శివరాంను చూడగానే అప్యాయంగా పిలిచాడు.
కద్చాళ్సీ తెప్పించనా*
మౌనంగానవ్వి ఊరుకున్నాడు శివరాం. మరుక్షణంలో టేబిలు మీదకు కాఫీ వచ్చింది. నిర్మాహమాటంగా త్రాగేశాడు శివరాం.
“ఒక ముఖ్యమైన ఉత్తరం ట్రెపుచెయ్యాలోయి.... వ్రాసుకో!”
చేతిలో కాగితం కలం లేకపోయినా వ్రాసుకోమని మామూలు హోదాలో యజమాని మాట్లాడడం విచిత్రమనిపించింది. ఇంతలోకే రెడ్డి తన కూతురును పిలిచాడు. కాగితం కలంతో ప్రమీల వచ్చింది. తండ్రి ప్రక్కగా మరో కుర్చీలో, తర్వంగా కూర్చుని కాగితం కలం లేబీలు మీద పెట్టింది. శివరాంవైపు హుందాగా చూస్తూ, నలిగినెర్ర సిల్కుబిర...... ముఖం మీద మొలచిన మొటిమలు, .. రెండుజదలు.... జీరలు కడుతున్న నల్లటి కళ్ళు.... సన్నటి ఆకారం..... పలుచని ముఖం...... రేగిన శిరోజాలు.... నాగరికమైన ప్రౌదత్వం ఆమెలో ప్రతిఫలించాయి.
ఉత్తరం సారాంశం చెవ్వాడు రెడ్డి.. అది ప్రమీల పెళ్ళి గురించిన విషయం... కాబోయే ఆమె మామగారితో సంప్రదింపులు.... మధ్య మధ్య ప్రమాల అద్దుకుని మాటలు
[42 అన్వేషణ మార్చించింది ఐ.ఎయస్. పరీక్షకు వెళ్ళిన పెళ్ళికొడుకుని పిల్లని చూడ్డానికి యింకా పంపలేదేమని.... ప్రశ్న ! .. . గృహవిషయాలు ఉత్తరాలుకూడా ఆఫీసుట్రెపిస్టు చేత టైపు చేయించుకోవడం యజమానుల ఆధికార గర్వమే ననుకున్నాడు శివరాం “* ఈ ఉత్తరాల సంగతి ఎవరికి చెప్పకూడదు.... తెలుసా! *“ యజమానిగా అధికారంతో ఆజ్ఞాపించాడు రెడ్ది.
కాగితాలు తీసుకుని ఆఫీసు గదిలోకి వెళ్ళాడు. రెడ్డి యిచ్చిన ఉత్తరం టైపు చేయ్యడానికి మనస్సు అంగీకరించలేద). స్వతంత్రబుద్ది పెరుగుతున్న శివరాంలో విప్లవాత్మకమైన సంచలనం కలిగింది ఈ అధికారులకు ఒక్క ఆఫీసుపని తప్ప తదితర స్వంతపనులు చేయకూడదన్న సిద్దాంతాన్ని పాటించాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాగాతాలు ట్రైపు రైటరు దగ్గర విడిచేసి తన గదిలోకి వెళ్ళిపోయేడు.
భోజనంచేసి అందరి ఉద్యోగులతో పాటు ఆఫీనుకు వచ్చాడు శివరాం. రాగానె రెడ్డి పిలిపించాడు ఉత్తరం టైపు అయిందా అని అడిగాడు. అటువంటి ఉత్తరాలు టైపు చెయ్యనని నిష్కర్షగా చెప్పేశాడు శివరాం. రెడ్డి ఆశ్చర్యపోయాడు. వ్రాద్దున్న అతని కిచ్చిన కాఫీ వృధా అయిపోయి, ఎదురు తిరిగి అతనిలో చైతన్యం కలిగిందని వాపోయాడు.
టేబిలు మీద మరో రెండు పెళ్లి ఉత్తరాలు కనిపించాయి. ఆపీసులో పెద్ద గుమాస్తా వచ్చి శివరాంను గదిమాడు ఈ ఉత్తరాలు టైపు చెయ్యమని, అతనివూపు చూసి వ్యంగ్యంగా నవ్వాడు శివరాం. రెడ్డిగారి పెద్దకొడుకు భుజంగరెడ్డి గబగబ వచ్చాడు కోపంగా తండ్రి ద్వారా సంగతి తెల్సుకుని, అతనికీ అదే సమాధానం దొరికింది. శివరాం మాటల్లొ సత్యం ఉన్నా సంగతి గమనించినా, తండ్రికి నామర్ద్జా కలగకూడదని భుజంగరెడ్డి శివరాంపై గట్టిగా అరిచాడు, తక్షణం ఆ ఉత్తరాలు టైపు చేయ్యమని,
“వ్సీరు అలా గట్లిగా ఆరిస్తే ఏపనీ కాదు!” శివరాం నిశ్చయంతో సమాధాన మిచ్చాడు. భుజంగ రెడ్డి కాస్త టైపు చెయ్యమని బ్రతిమిలాడాడు.
“కసారి చేసాను... మరోసారి యింక యివ్వకండి ఇటువంటి ఉత్తరాలు!” శివరాం ట్రైపుచేసి భుజంగరెడ్డికి యిచ్చేశాడు ఉత్తరాలు,
తోటి గుమాస్తాలు కొందరు శివరాం పట్టుదలకు “సెభాష్” అన్నారు. మరకొందరు “ యిలా అయితే ఎంతోకాలం ఉండేలా లేవు!” పెదివి విరిచారు. ఈ విశాల ప్రపంచంలో ఉద్యోగాలు కొరతా? అనుకున్నాడు శివరాం.
అన్వేషణ 7ాగ్లా మధ్యాహ్నం రెండు గంటలకు బం(టోతు వచ్చాడు శివరాం దగ్గరకు
“అమ్మగారు పిలుస్తున్నారు?”
- ఐ అమ్మగారు?”
ఎందుకు?””
“ఏమో?” సాగదీశాడు బంట్రోతు వ్యంగ్యంగా.
“రాను!” శివరాం మౌనంగా టకటక టైపు చెయ్యసాగాడు.
నానాస్వామి అతని దగ్గరకువచ్చి చెవిలో ఏదో ఊదాడు. శివరాం కాగితం పెన్సిలు పుచ్చుకుని మేడదిగి క్రిందిగదిలో ఉన్న ప్రమీల దగ్గరికి వెళ్ళాడు.
“కాగితాలు పెన్సిళ్ళు ...రబ్బర్లు .....టైపు రిబ్బన్లు ... సరఫరా అంతా నేనే చేసాను... .. ఏమన్నా కావలిస్తే నాకు కబురంపాలి!” శివరాంవైపు చూడకుండా అద్దంలో ముఖం చూసుకుంటూ జడలు సర్దుకుంది ప్రమీల,
ఒక ప్రత్యేక హోదా మరికొంత జీతం యిస్తే నాకు అభ్యంతరము లేదు ఇటువంటి పనులు చేయ్యడానికి?” నిర్ణక్ష్యంగా నవ్వాడు, శివరాం.
“ఏమిటో మాట్లాడుతున్నావు!” కసిరింది ప్రమీల,
ఉత్తమాటలు.... కొత్తధోరణిలో” పకపక నవ్వాడు శివరాం నువ్వనే మాటలు నీకర్టమవుతున్నాయి” చికాకుగా అరిచింది ప్రమీల.
నా కర్టం కాకపోతే ఫర్వాలేదు... మీకూ అర్ధృమవుతున్నాయిగా.......యింతలోనే యింతకోపం. నమస్తే ..వస్తా” రివ్వున వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు శివరాం, ప్రమిల శివరాం ప్రవర్తన చూసి దిగ్ర్భాంతి చెందింది.
శివరాం సరైన ఉద్యోగి కాజాలడనే నిశ్చయం చేసుకున్నాడు వినాయకరెడ్డి, ఆభఖిప్రాయాలను లెక్కచేయకుండా నియమిత మైన గంటల్లో ఈఫీసుపని చేసి నిర్మాహమాటంగా శివరాం బయటకి పోయేవాడు.
ఒకరోజు సాయంత్రం నానాస్వామి ఎవరో స్నేహితుని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు ఒంటరిగా శివరాం షికారుకు బయలుదేరాడు. ఆరుగంటలయింది. హుస్సేనుసాగర్ కట్టవైపు రోడ్డుమీద మెల్లిగా నడుస్తున్నాడు.
శా అన్వేషణ
'మిస్టర్! శివరాం!” కారు హారన్. స్తీగొంతు ఒక్కసారి వెనుకనుంచి వినిపించాయి.
శివరాం ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు. ప్రమీల ఒక్కడే కారు నడుపుకుంటూ వచ్చి ఆగింది
“ఎక్కడికి? నవ్వుతూ అడిగింది,
“షికారుకు!”
నేను సినిమాకి వెడుతున్నా ..... నువ్వుకూడా రా! ఆహ్వానిస్తూ తన ప్రక్కన వున్న మెత్తటి సీటు చూసించింది. శివరాం కొంచెం జంకాడు, ఆ పరిస్టితిలోని వింత చూసి ధైర్యంగా వెళ్ళి కూర్చున్నాడు.
కారు నదుస్తోంది.
“నువ్వేం చదువుకున్నావు శివరాం?
'వి.ఏ.2
అందుకేనా అలా గర్వంగా మాట్లాడుతావు? పకపక నవ్వింది ప్రమీల. 'నేను ఎం.ఏ. చదువుతున్నా! గర్వభంగమయిందా అన్నట్లుచూసింది ప్రమీల, శివరాం కొంచెం కించపడ్డాడు.
'నీ కున్నంత ధనం, హోదాగల తండ్రి ఉంటే!” నేనీపాటికి అమెరికాలో ఉండేవాణ్ని శివరాం హాస్య ధోరణిలో అంతర్గత భావాలను కప్పుకున్నాడు.
“నువ్వు బలేగా మాట్లాడుతావు... అందుకే నువ్వంటే ఇష్టం.... ఎప్పుడూ 'సేకాడుకుందుకైనా రాలేదే మా బంగాళాలోకి. . భోజనం ఎక్కడ చేస్తున్నావు .. ఈవేళ నాతో గడపాలి.... భోజనం, షికారు, సినిమా అన్నీ నాతో పాటే ! పకపక నవ్వింది (ప్రమీల.
సినిమా హాలులోక్వివెళ్ళి కూర్చున్నారు ఇద్దరు.
ఇంగ్లీషు సంగీతం కమ్మగా నెమ్మదిగా వినిపిస్తోంది హాలులో అందరు నిశ్శబ్దంగా ఉన్నారు నాగరికతతో కూడిన ఒక నవీనత ఆ (పేక్షకుల్లో ప్రతిబింబించింది.
థి
“నాకు ఇంగ్లీషు సినిమాలంటే చాలా యిష్షం!.... నీకో!.....
“తెలుగు సినిమాలు!”
అన్వేషణ 79
అందుకే అలాగున్నావు!” వెకిలిగా నవ్వింది ప్రమీల, ఆమె నవ్వుకు చకితులైనారు హాలులోని ్రెక్షకులు.
సినిమా మొదలైంది పూర్వకాలపు ఆమెరికా జీవితంగురించి సినిమా... గుర్రాల పరుగులు, పిస్టల్ కాల్పులు ..ప్రీపురుషుల చుంబనాల ఇంగ్లీషు నృత్యాలు -సన్నివేశాలు ఉద్రిక్తంగా ఉన్నాయి నాయకుడు పిస్టలు కాల్చినపుడు. గుర్రంమీద పరుగెత్తినప్పుడు. నాయకురాలిని రక్షించినపుడు శివరాం బుజం పై తట్టెది ప్రమీల గట్టిగా.
సినిమా పూర్తయ్యాక ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు.
“ఎలావుంది?” ప్రమీల కారునడపడం ప్రారంభించింది.” వీపు దెబ్బలకు మౌాగి సలుపు పెడుతుంది” శివరాం సమాధానానికి ప్రమీల పకపక నవ్వింది.
అబిడ్లోని పెద్దహొటలుకు తీసుకుపోయింది ప్రమీల ఎత్తెన కొండమీద పూలతోటల మధ్యనుంచి లోపలి సోఫాల వరండాలు దాటి ఒక ఫర్హాంగున్న చిన్న చెక్కలగదిలోకి తీసుకువెళ్ళింది ప్రమీల.
“ఏం తింటావు?”
ల న్చుం! 2
ఒళ్ళు విరుచుకుని నవ్వింది ప్రమీల.
వష్హూంసం తింటావా?”
“అలావాటు లేదు?"
అందుకే అలాగ ఉన్నావు సన్నగా బక్కగా!” చేతిమీది ఎముకలు తడిమింది జాలిగా ప్రమీల. బిర్యానీ, ఆమ్లెట్,బన్ను, రొట్టెలు, పళ్ళు, ఐస్ ఏమేమో తెప్పించింది ప్రమీల, ఇద్దరూ సుష్టుగా తిన్నారు.
“మాంసం తిననంటూ తిన్నావేం?”
“* అలవాటు లేదన్నాకాని తిననని చెప్పలేదుగా.”
భలే వాడివి!” మళ్ళీ శివరాం బుజం అదిరిపోయింది. దెబ్బతో.
“నిన్నాక కోరిక కోరాలని ఉంది!” శివరాం నవ్వేడు.
80 అన్వేషణ
- ఈ రాత్రి వం కోరినా యిచ్చెస్తాను!” ప్రమీల మత్తుగా జూలిగా అర్థనిమీలిత నెత్రాలతో మందస్మితంగా శివరాం వైపు చూసింది
“= ఏమిలేదు. దయయుంచి మాటిమాటికి నాబుజం మీద బాదకు అసలే సన్నగా ఉన్నాను”
శివరాం మాటలకు ప్రమీలకు ఉత్తేజం ఆనందం కలిగగాయి. మత్తుగా శివరాం దగ్గరగా జరిగి ఆతనిమీద ఒరగబోయింది.
“ఆ ,.....ఆ.......దూరం..... (డ్రైవరు ఏమనుకుంటాడు?” శివరాం ద్వంద్వార్ధ ప్రయోగం చేశాడు ప్రమిల ఒక్క నిమిషం కొయ్యభారినట్లు శివరాంవైపు చూసింది.
“వున కారు(డైవరు ఏమన్నా అనుకోగలడు!” శివరాం తన వాక్యాన్ని సమర్ధించుకున్నాడు. ప్రమీల ముఖభంగిమలు సర్దుకుంది.
కారు హుస్సేన్‌సాగర్ కట్టమీదకు నడిచింది. ఆ సుందరమైన వంతెనక్రింద సాగర్‌లోని న్ళ్ళు అలలతో పొంగుతున్నాయి. దూరనావలిగట్టున ఎత్తుకొండల మెట్టుపల్లాల రోడ్లపై నిలుచున్న భవనాలు విద్యుద్దిపాలు చిన్నగా కనిపిస్తూ ఆకాశంలయం చివరభాగంలోని నక్షత్రాల్లా మెరుస్తున్నాయి పదిగంటల సమయం... జనం చాలా తక్కువగా ఉన్నారు. వంతెనమిద. వంతెన రెండవగట్టు అంచులమీద పెరిగి నిలుచున్న పెద్ద పెద్ద వృక్షాలు సొగుసుగా గాలిలో ఊగుతోఆలింగనాలు చేసుకుంటున్నాయ్. ఆవృక్షాల (క్రింది లోయభాగమంతా పొలాలు, చెట్టు, పిల్ల కాల్వలతో అల్లుకుని అగాధంలా కనిపించింది.
ప్రమీల, శివరాం బెంచీమీద కూర్చున్నారు. ఒక ఆరగంట మౌనంగా ఏవో ఆలోచనల్లో కొట్టుకున్నారు యిద్దరూ.
“శివరాం!” మత్తుగా చూసింది ప్రమిల.
ప్రమీలప్రవర్తన గతరాత్రి చూసిన శివరాంను ఆమెమీద ఏ మక్కువ కలగలేదు అయినా మనిషితత్వం అర్ధం చేసుకోవాలనే ఆమెతో ఆ సాయంత్రం గడిపాడు.
“ మనం యింటికి పోదామా!” లేచాడు శివరాం,
“ఆప్పుదేనా?”
“మి నాన్న ఏమి ఆనడూ?”
అన్వేషణ త్1
“స్నేహితురాలి యింటికి వెళ్ళానంటా!”
“పూర్తి స్వెచ్చ గడించిన నాగరిక నారీమణివి!”” నవ్వాడు వివరాం.
ఇద్దురూ గృహోన్మఖులయ్యారు. కారులో.
పండువెన్నెల బాగుందికదూ!” ప్రమీల శివరాంవైపు చూసింది.
“ ఆ. నాజీవితంలాగే తెల్లగా పాలిపోయింది ౯”
(ప్రమీల నిశ్శబ్దంగా ఊరుకుంది.
తమ బంగాళాకు అర్ధఫర్లాంగు దూరంలో కారు ఆపేసింది.
- దిగు!....౯ొ శివరాంవైపు చూసింది ప్రమీల జాలిగా.
“ఏం?”
“ మనిద్దరం యింట్లోకి వెడితే బాగుండదు,”
“ ఆ బుద్ది మొదటనే కలుగుతే బాగుందేదికదూ!” ప్రమిల నివ్వెరపోయింది.
శివరాం.. ఏ మనకోకు”” ప్రాధేయపడింది. ప్రమీల.
శివరాం కొరు దిగాడు.
“ఆక్కర్లేదు గోడదూకి రాగలను!”
ప్రమీల కిలకిల నవ్వింది,
“నీ గదిలో దోమలున్నాయేమో......... బయట వరండాలో పడుకోకూడదూ!”
“* నీ సలహాలకు ఒక నమన్మారం!” శివరాం ఆమె మాటలు యింక వినకుండా నడిచాడు ముందుకు,
ప్రమీల కారులో వెళ్ళి యింట్లోకి నడిచింది. మేడమీద వినాయకరెడ్డి చుట్టపొగలు వదులుతూ కోపంగా కూతురువైపుచూశాడు. భార్య కుతురుకు యిచ్చే చనువువల్ల తానేమి అసలేక కోపం దిగమింగుకున్నాడు.
మేడమీద తండ్రిని చూడకుండా వీధిగేటు ఓరగా వదిలేసింది ప్రమీల పై నుంచి రెడ్డి అరిచాడు తలుపు తాళం వెయ్యమని. ఒక్క నిమిషం ఆలోచించి గేటు తాళం వేసింది.
జై అన్వేషణ
మరో అయిదు నిమిషాల్లో శివరాం వచ్చాడు. వీధిగేటు మూసి ఉంది, గేటు తీయవలసి వస్తుందని రెడ్డి తన గదిలోకిపోయాడు మేడమిద, శివరాం గోడదూకి లోపలికి వచ్చేశాడు. మేడమీద కిటికిలోంచి చూస్తున్న రెడ్డి నిర్జాంతపోయాడు, రెడ్డిగారి ఆఫీసులో ఒక నెలరోజులు గడిపాడు శివరాం. ప్రమీల ప్రణయం, రెడ్డి అధికారం....... తోటి గుమస్తాల బానిసత్వం ..... శివరాంకు అసహ్యం కలిగించాయి ఈ ఉద్యోగం మానుకుంటే బాగుంటుందని నిశ్చయించాడు
ఒకరోజు ప్రొద్దున్న మామూలుగా ఆఫీసులో అడుగుపెట్టాడు శివరాం. గుమస్తాల షెద్ద తిన్నగా అతని వద్దకు వచ్చాడు తన సీటుమీద మరొక టైపిస్టు పని చేయడం గమనించాడు శివరాం.
“కొత్త ట్రైపిస్స పనిలో చేరాడు?” గుమస్తా కళ్ళు పెద్దవి చెసి నోరు తెరచి పొట్ట' దవడల ముఖం చిట్లించాడు.
“నన్ను ఉద్యోగం లోంచి తీసేశారని చెప్పలేవూ?” శివరాం ప్రశ్నలకు గుమస్తాల పెద్ద కోపంతో ఉరిమాడు,
= నా జీతం యిమ్మను !” కోపంతో శివరాం ఉద్రిక్తుదయాడు.
“* ఒక వారం పోయాక రెడ్డిగారు రమ్మన్నారు..... బ్యాంకులోంచి డబ్బు తియ్యాలి”.
'ఆ సంగతి నే తేల్చుకుంటా ! శివరాం రుసరుసలాడుతూ అద్దువచ్చె గుమాస్తాల పెద్దను ప్రక్కకు నెట్టి లోపలికిపోయాడు.
రెడ్డి నిశ్చలంగా చుట్టుత్రాగుతూ కాగితాలు చదువుకుంటున్నాడు. శివరాం గదిలోకి వచ్చిన సంగతి గుర్తించి తల ఎత్తకుండానే 'ప్యూన్* అరిచోడు రెడ్డి.
నా జీతం యిప్పించండి - చాలా అవసరం!”
రెడ్డి మాట్లాడలేదు.
బంట్రోతు వచ్చి శివరాంను గెంటెయ్యబోయాడు.
“ ఒంటిమీద చెయ్యివేస్తే మాటదక్కడు!” అరిచాడు శివరాం. బంట్రోతు వణికాడు రెడ్డి కుర్చీలోంచి లేచాడు.
“ఒక వారం తర్వాత కనిపించు !* నిర్లక్ష్యంగా చూశాడు రెడ్ది.
అన్వేషణ 88
“ నాకు తక్షణం కావాలి జీతం!' శివరాం ఆరిచాడు.
' ఇవ్వను!” రెడ్డి బల్లగుద్దాడు,
'ఇవ్వను?” ఒళ్ళుమరచిన ఆవేశంతో శివరాం తిన్నగా రెడ్డి బల్లదగ్గరకు వెళ్ళి పటపట పళ్ళు కోరుకుతూ కాగితాలుకోసే చాకు తీశాడు.
ఏరి చెస్తావు ?
“జీతం తీసుకుంటాను! రెడ్డి కూర్చున్న కుర్చీమీదకు జరిగి అతనికోటు పట్టుకొని గుంజాడు శివరాం.
ఆఫీసులోని గుమాస్తాలు రెడ్డి గదిలోకి త్రోసుకువచ్చారు. శివరాం ఉద్రిక్త భంగిమ చూసి సొట్టదవడల గుమాస్తా అడ్డువచ్చాడు. రెడ్డికోటు సర్దుకున్నాడు. అంతమంది గుమాస్తాలు ఆ సన్నివేశం చూసి నందుకు సిగ్గుపడ్డాడు రెడ్డి.
- ఇతని జీతం యిచ్చి పంపెయ్యండి!” కోపంగా గుమాస్తాల పెద్దవైప అరిచాడు రెడ్డీ.
మరుక్షణంలో వందరూపాయలు శివరాం చేతిలో రాలాయి. నెలాఖరు కాగానే చేతిలోని డబ్బంతా ఖర్చుయిపోగా ఉద్యోగం పోయిందని విన్న శివరాం హతాశుడయ్యాడు తక్షణం జీతం దొరకకపోతే యీ నగరంలో బ్రతుకు గడపటం ఎలా, అని చికాకుపద్దాడు ఉ(దైెకం ఆపుకోలేక రెడ్డిమిద యౌవన రక్తపు పొంగుతో ఉరికాడు ఫలితం సానుకూలంగా పరిణమించినందుకు సంతోషించాడు.
బెడ్డింగు చేత్తోపట్టుకొని వీధి గేటుదగ్గరకు వచ్చాడు శివాం. మేడమీద నుంచి ప్రమీల జాలిగా చూస్తూ చెయ్యి ఆదించింది బొచ్చుకుక్క మొరిగింది నానాస్వామ్ వచ్చి 'నమస్తే ........అప్పుడప్పుడు కన్పిస్తూండు....... యీ చెరసాలలో కాదు...... :. బయట!” అంటూ వీడ్కోలు యిచ్చాడు,
ఇంతలో మేదమీదనుంచి బంట్రోతు పరుగెత్తుకుంటూ క్రిందికి వచ్చాడు.
“అమ్మగారు మీ బెడ్డింగును బస్సున్తాండుదాక తీసుకవెళ్ళమన్నారు, ” రెడ్డిగారు ఆజ్ఞతో తన్ను గెంటెయ్యబోయినబంట్రోతు ఎదురుగా వినయంగా నిలుచున్నాడు. మేడమీద ప్రమీల నవ్వింది.
శివరాం బస్సుఎక్స్కి తిరిగి మునుపటి హోటలుకు వచ్చేశాడు.
ప్రశ అన్వేషణ మునుపు తానున్నగదిలో జనం మారిపోయారు ఫైల్పువ్రాసుకునే ముసలాయన సంసారం తెచ్చుకుని నగరంలో నివసిస్తున్నాడని విన్నాడు శివరాం
(క్రితం నెల దొరికిన జీతముతో రెండుజతల కక్రొత్తబట్టలు కుట్టించాడు ఒక ట్రంకుపెట్టె కొన్నాడు. మర్నాడు ఉద్యోగాలిప్పించే ప్రభుత్వాకార్యాలయానికి వెళ్ళాడు
వంకీలు తిరిగిన జుట్టు, పెద్దతల, లావుపాటి శరీరంతో ఏదో నములుతూ ఒక ఆఫీసరు క్యూలో నిలుచున్న జనంవైపు చికాకుగా చూస్తూఅరుస్తున్నాడు.
శివరాం చెప్పిన వివరాలు వ్రాసుకుని, ఒక కార్డు అతనిచేతి కందించాడు ఆఫీసరు. శివరాంలో ఏ ఆకర్షణ కనిపించిందో ఆ ఆఫీసరు ఆతనివైపు తేరిపార చూశాడు.
“ఏవూరు మీది?” అని ప్రశ్న - శివరాం మౌనం.
చిదానందంగా నవ్వాడు ఆఫీసరు.
“రేపు కనిపించు ఒకసారి ....... ఏదైనా ఖాళీ ఉంటే చూస్తా!” భుజంమీద తట్టాడు ఆఫీసరు. ఆ అయాచితమైన ఆదరణచూసి, బహుశా ఆయనకూడా తన ప్రాంతంనుంచే వచ్చిఉంటాదని ఊహించాడు శివరాం.
వాగ్దానం చేసినట్లుగానే ఆఫీసరు శివరాంకు ఒక కంపెనీలో గుమాస్తా ఉద్యోగానికి పంపించాడు. మర్నాడు కంపెనీ డైరెక్టరు అతన్ని ఉద్యోగంలో చేరమని ఉత్తరవు జారీ చేశాడు.
తాను పనిచెయ్యవలసిన టేబిలు చూపించాడు. బంట్రోతు. టెబిలుమీద పెద్ద పెద్ద రిజిష్టర్లు దొంతరులుగా పడివున్నాయి. మరొక తోటి గుమాస్తా దగ్గరకు వచ్చి ఆఫీసుపని నేర్పాడు. గుమస్తాల జీతాలను పంచడం, ఆఫీసర్లు ప్రయాణ భత్యాలు నిర్ణయించడం, మొదలైన బాధ్యతలతిె, ఆఫీసు డబ్బు దాచవలసిన భారంకూడా అతనిమిద నెట్టబడింది.
ఒకటవతారీకు వచ్చింది. ఈఫీసులో జీతాలు పంచవలసిన దినం. బ్యాంకుకు వెళ్ళి డబ్బు తెచ్చి ఇన పెట్టెలో పెట్టాడు శివరాం. డైరెక్టరు పిలిచాడని వార్త బంట్రోతు అందివ్వగానే కంగారుగా ఆయనగదిలోకి నడిచాడు. క్రిందటినెల తన (ప్రయాణభత్యపు బిల్లు త్వరగా తయారు చెయ్యమని ఆజ్ఞ యిచ్చాడు డైరెక్టరు. ఆలోచిస్తూ తన టేబిలు చేరుకున్నాడు శివరాం.
అన్వెషణ కెర్
మధ్యాహ్నము కాఫీఫలహారాలు సేవించటానికి గుమాసాలు యధాప్రకారం ఆఫీసు విడిచి వెళ్ళిపోయారు. ఆఫీసు అంతా చాలా వరకు ఖాళీగా ఉంది. ఏదో ఒకమూల గుమాన్తాలిద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు.
గుమాస్తాలకు జీతాలిచ్చే రిజిష్టరు తెరిచాడు. శివరాం ఇనపెట్టెలో పెట్టిన సోమ్ముకట్టలు సవరించాడు ఒక వెయ్యిరూపాయల కట్ట కనిపించలేదు డైరెర్టరు దగ్గరకు వెళ్ళేముందు తొందరలో ఇనపెట్టె తాళం వెయ్యడం మర్పిపోయేడు శివరాం. తన అజా[గ్రత్తకు కంగారుపడి ఆత్రుతతో అంతా వెదికాడు మళ్ళీ. కాని కనిపించలేదు వెయ్యిరూపాయిల నోట్లకట్ట.
మూలగా కూర్చున్న గుమాస్తాలను పిలిచాడు. శివరాం జరిగిన సంగతిచెప్పాడు. గుమాస్తాలు ఆశ్చర్యపోయారు తక్షణం డైరెక్టరుకు చెప్పమన్నారు ఈ సంగతి శివరాం వెళ్ళి డైరెక్టరుకు చెప్పాడు సొమ్ముపోయిన సంగతి. డైరెక్టరు ఆవేశంతో శివరాం టెబిలుదగ్గరకి వచ్చాడు. గుమస్తాలంతా ఫలహారాలకు వెళ్ళిపోవడంవల్ల ఎవరినీ ఏమనలేక, కోపంగా చీకాకుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు డైరెక్టరు.
సొమ్ముపోయిన సంగతి అడవిలోని కార్చిచ్చులా ఆఫీసంతా వ్యాపించింది. గుమా స్తాలు అంతా ఏవో గుసగుస లాడుకున్నారు. డైరెక్టరు అందరినీ పిలిచి సంజాయిషీ అడి గాడు. తక్షణం పోలిసురిపోర్టు యిచ్చాడు. పోలిసువాళ్ళు తీరికగా కేసు సోదా చేస్తామని వెళ్ళివోయారు.
“క్రాత్త గుమాస్తా ఉద్యోగం ఊడిపోతుంది!” గుసగునలాడుకున్నారు తక్కిన గుమాస్తాలు
“ఉద్యోగం ఊడడమే కాకుండా జైలుకు వెదతాడేమో!” మరొక ముసలి గుమాసా భయంతో కళ్ళజోడులోంచి శివరాం భవిష్యత్తు జాగ్రత్తగా ఊహించాడు.
డైరెక్టరు ఉత్తరువు జారీ చేశాడు శివరాంకు జీతం ఇవ్వకూడదని , శివరాంకు మరొక పని అప్పగించాడు. పోలిసు కేసు విచారణ జరిగి, దొంగ దొరికే ధాకా శివరాంకు జీతం ముట్టదని డైరెక్సరు తెలియజేశాడు.
పోయిన సొమ్ము తెలివిగా శివరాం జీతంలోంచి తీసుకోవాలని డైరెక్షరు పన్నుగడ వేశాడు. చేసేది ఏమీలేక శివరాం ఉద్యోగం నుంచి విరమించలేదు.
86 అన్వేషణ
రెండు నెలల గడిచాయి రెడ్డి ఇచ్చిన జీతం ఏనాడో ఖర్చుయి పోయింది. నారాయణ సహాయంవల్ల ఆ యింట్లో ఒక గది దొరికింది ,తన సరిస్టితి తెలుసుకున్న ఆ యింటి యజమాని జాలిగా అద్దెకుతొందర పెట్టకుండా, ధనసహాయంకూడా చెస్తున్నాడు కష్టదశలో సహాయం చేస్తున్న ఆ యింటి యజమానికి మానవుడుగా కృతజ్ఞత చూపవలసిన విద్యుక్తధర్శం తనమీద ఉందని విశ్వసించాడు శివరాం.
వరందా కిటికి తరచి బయటికి చూశాడు శివరాం. వెగుచుక్క ప్రకాశవంతంగా మెరుస్తోంది కోడికూతలు ఎక్కడినుంచో వినిపిస్తున్నాయి ఆ దినం ప్రయాణం ఆరంభించిన బస్సుల నడక శబ్దం వినిపించింది. మరొక్కకునుకు తీసుకోవాలని బద్దకంగా బలవంతంగా కన్నుమూసేడు శివరాం.
మర్నాడు ప్రొద్దున్న ఆలస్యంగా లేచాడు ఎనిమిది గంటలకు ఆదివారం సెలవుదినం, ఎ కార్యక్రమం చేద్దామా అని ఆలోచించాడు. అన్ని కార్యక్రమాలకు అవసరమైన డబ్బు. తనకు లేదని, మౌనంగా పుస్తకపఠనం కాని, వీధిలో కాలు అరిగేలాతిరగడం కాని, చెయ్యడమే తాను చెయ్యగల కార్యక్రమమననుకుని ఒక నవ్వునవ్వుకున్నాడు.
ముఖ ్రక్షాళనానంతరం శివరాం దుస్తులు వేసుకున్నాడు. నగరం లోకి పోదామని. రత్నం కోడలు కాఫీ తెచ్చి ఎదురుగా నిలుచుంది.
- త్రీసుకోండి !” బాధగా నవ్వింది అమె కొంగుతో కన్నీరుళుడుచుకుంటూ.
అక్కర్లేదు!” కసిరాడు శివరాం.
నిలువునా నీరైపోయినట్లు దీనంగా నిలుచుంది రత్నం కోడలు శివరాంకు మరుక్షణంలో జాలివేసింది, అసభ్యమైన నడతకు దారితీయనంతవరకు, ఈభిమానం చూపించే హృదయానికి ప్రత్యభిమానం చూపడం మానవధర్శ్మ మనపించింది శివరాంకు.
ఒక్క నవ్వునవ్వేశాడు కోపం మానుకుని.రత్నం కోదలుకూదా నవ్వింది.
శివరాం వేడి కాఫీ శత్రాగేశాడు మౌనంగా,
“ఎక్కడికి?” ప్రశ్నించింది రత్నం కోడలు జాలిగా.
“ హల్లో మిస్టర్ ! శివరాం !.... హల్లో మిత్రమా !” అంటూ రాజారావు, చక్రవర్తి ఇంట్లో (ప్రవేశించారు. కాఫీ కప్పు తీసుకుని రత్నం కోడలు సిగ్గుతో గబగబ మేడ మాదకు వోయింది
అన్వేషణ 87
“ఎం మిత్రమా! రసమయ ఘట్టాన్ని పాడుచేశామా? - క్షమాపణ వేడుకుంటున్నాం!” చక్రవర్తి పకపక నవ్వాడు.
“మనవాడు ఇంకా మునీశ్వరుడే కదూ!” రాజారావు శివరాం బుజం తట్టాడు.
“ఎమిటి కార్యక్రమం?” అడిగాడు శివరాం.
'మామూలుగా మనం నడిపేనగర సంచారం.... వీధులన్నీ చిన్నపోతున్నాయి మనం లేకపోవటం వల్ల ... పద మిత్రమా పయన మౌదాం!” చక్రవర్తి త్రోశాడు శివరాంను.
గది తాళం వేశాడు శివరాం. ముగ్గురు ఏవో కబుర్లు ధోరణిలో నవ్వుకుంటూ వీధిలోకి నడిచారు మేడమాద రత్నం కోడలు నిరాశగా మోచేతికి చుబుకాన్ని ఆన్సి పాలిపోయిన ముఖంతో కన్నీరు కార్చింది వెళ్ళిపోయే శివరాంను చూచి కింగ్సువేలో హోటల్లో ప్రవేశించారు ముగ్గురూ. ఒక టేబిలు చూట్టూ కూర్చున్నారు.
“మిత్రమా! జ్ఞపకముందా!.... నీ ప్రధమ సందర్శనం మాకు యిక్కడే లభించింది! చక్రవర్తి శివరాం తల ఆప్వాయంగా నిమిరాడు.
దొంగతనం కారణంగా జీతం ఆపుచేయబడినరోజు నిరుత్రాహంగా బేబులో పావలాతో హోటల్లో ప్రవేశించాడు. శివరాం ఏదో ఈలోచనగా, బాధాగా కాఫీ త్రాగేదు. ఆ పావలా ఖర్చుయిపోతే చేతిలో యింక డబ్బు లేదు. ఎలా బ్రతకడం ? ఒక భీకర సమస్య ఎదురుగా తాండవం చేసోంది.
ఇంతలో రాజారావు. చక్రవర్తి ఈ టేబిలు వద్ద కూర్చున్నారు. వసపోసిన పిట్టల్లా యిద్దరూ ఏవో గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. “మిత్రమా కొంచెం మెల్లగా మాట్లాడు . మన మాటలు వీరి ఆలోచనలకు అంతరాయం కలిగించవచ్చు!” చక్రవర్తి రాజరావు నుద్దేశిస్తూ శివరాంవైపు చూశాడు.
“ఫరావాలేదు... మాట్లాడుకోండి!” శివరాం బలవంతంగా నవ్వాడు.
“ హోటల్లో ఆలోచన లేమిటి ఇంత గడబిడ జరుగుతూంటే, దెన్ని గురించి ఆలోచన బొస్తన్నారు స్వామి!” రాజారావు చనువు తీసుకుని ప్రశ్నించాడు శివరాంను.
“అబ్బే ఏమీలేదండి!” శివరాం ముభావంగా ఊరుకున్నాడు.
“ మనదేవూరు!” రాజారావు ప్రశ్నించాడు శివరాంను బాహ్యంగా పరిశీలించి.
ఏడి అన్వేషణ వేను యిక్కడకు వచ్చి చాలా రోజులయింది!" స్వవిషయాన్ని కప్పి పుచ్చాడు
శివరాం.
" ౨ సంగతి నాకు తేలుసు .. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు!” రాజారావ్లు శజివరాంది ముఖభంగిమలు చూసి ప్రశ్నించాడు
తన పరిస్థితికి టోపలినుండి వచ్చే దుఃఖాన్ని దిగమ్రింగుకున్నాడు శివరాం.
“* వసాాను... * అంటూ లేచాడు శివరాం.
“ ఉందండి... మేము వస్తాము .” రాజారావు శివరాంను బలవంతంగా కూర్చోబెట్టాడు.
అతి చనువుగా దగ్గర స్నేహితుడిలా వలకరిస్తున్న రాజూారావును చూడగానే ఎంతో అభిమానం ఏర్పడింది శివరాంకు. రాజారావు చక్రవర్తి ఫలహారం పూర్తిచేసి లేచాడు సెర్వరు బిల్లుఇచ్చాడు.
శివరాం బీల్లుకూడా యిమ్మన్నాడు రాజారావు. శివరాం జేబులో పావలాతీసి తనబిల్లు చెల్లించబోయేడు.
“ఈ పావలా ఆరిగిపోయింది... మారదుకో హోటలు యజమాని బిల్లు తీసుకోలేదు.
- ఇప్పుడేనా సను యివ్వవచ్చా డబ్బు !” రాజారావు బిల్లులన్నీ చెల్లించాడు.
కిట్ల దుకాణంవద్ద ఆగి మషాళ కిళ్లిలు బుగ్గకు బిగించారు, రాజారావు, చక్రవర్తి మొహమాటపడినా శివరాం చివరకు కిళ్ళీ తీసుకుని. అందిచ్చిన గోల్డొప్లేక్ సిగరేట్టు ముట్టించాడు.
“ ఒక సిగరెట్టు అందిస్తే ఎంత తెలియని వాడైనా స్పేహితుడై పోవాలికొ రాజూరావు శివరాం బుజంపై చెయ్యి వేశాడు.
“ఒక సగరెట్టే కాదు. . కిల్లీ ..... కాపీకూడా యిచ్చావు యీయనకు..... అందువల్ల ఆయన స్నెహితుడైపోయి మూడు తరాలు గడిచింది” చక్రవర్తి పకపక నవ్వాడు.
బేగంపేట చూశారా!” రాజారావు శివరాంను ప్రశ్నించాడు.
ఈద్ దు
అన్వేషణ ఏకి
“అయితే. రండి మాతో... విమానాలు చూద్దురు గాని !” రాజారావు చెయ్యిపట్టుకొని శివరాంను లాగాడు, ఆతని జవాబు వినకుండా ముగ్గురూ వెళ్ళిబోయారు బేగంపేట విమానాశ్రయానికి.
శివరాం తలలో తిరిగింది తనకు స్నేహబంధం ఎర్పరచిన అరోజు రాజారావు స్నేహం లభించాక ఎన్నో క్రొత్త విషయాలు చూశాడు. తన కష్టంలో ఆదుకుని నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు పెడుతూ నీరస జీవితంలో ప్రతి నిమిషం చైతన్యం కలిగిస్తూన్న రాజారావు బుణం ముందు ముందు ఏవిధంగా తాను తీర్చుకోగలనని ఆలోచనలో పడ్డాడు శివరాం,
'మనవాడు మళ్ళీ పాతరికార్డుముఖం పెట్టాడు!
రాజారావు మొదటి పరిచయంనాటి శివరాం ముఖం జ్ఞప్తికి తెచ్చాడు. చక్రవర్తి పకపక నవ్వాడు.
హైద్రాబాదుకుపోయి రోడ్లన్ని నడిచారు. పబ్లిక్ గార్డెన్స్‌లో మూలనున్న వచ్చగడ్డి మైదానాల్లో పడుకున్నారు నాంపల్లి దైల్వేప్తాట్ ఫారంమీద కాస్సేపు తిరిగారు. సాయంత్రం సినిమా చూశారు. హోటల్లో భోంచేశారు రాత్రి పదిగంటలయింది.
'స్వామి సెలవా” శివరాంను ఉద్దేశించాడు రాజారావు.
'మనవాడికి సంభావన ముట్టచెప్పు!' చక్రవర్తి పకపక నవ్వాడు.
రాజారావు శివరాం చేతిలో ఒక రూపాయి పెట్టాడు.
'జాగ్రత్త.. పారేశావు కనుక.... బస్సు కండక్టరు చొక్కాఊోడదీసుకోగలడు!' నవ్వాడు చక్రవర్తి,
“ఈ పాత చొక్కా బస్సుటికెట్టు ఖరీదుకూడా చెయ్యదు శివరాం జాలిగా నవ్వాడు.
'కండక్టరు చొక్కాలు నువ్వేలాక్కునే కాలం వస్తుందిలే స్వామీ..... బస్సుఎక్కు!'
రాజారావు ఎదురుగా వచ్చిన బస్సు చూపించి శివరాంను ఎక్కించాడు.
శివరాం నల్లగుట్ట చేరాడు. వరండాలో రత్నం కోడలు ఒంటరిగా కూర్చుని చదువుకుంటోంది శివరాంను చూసి ఆశగా, నోరు ఆవలించి, కళ్ళు పెద్దవిచేసి నవ్వింది. ఆమెను చూడగానే శివరాంకు భయంవేసింది. ఈ రాత్రి గండం ఏ విధంగా గడుస్తుందా అనుకుంటూ ఉక్కిరి బిక్కిరిగా బిత్తరపోయి తన గదితాళం తీయసాగాడు.
90 అన్వేషణ
వీధిగుమ్మంలో టాంగా నిలుచుంది, ఆ యింటి యజమాని టాంగాలోంచి దిగాడు. శివరాం మనస్సు కుదుటబడింది “ఏవండీ ఖులా గా ఉన్నారా” ఆ యింటి యజమాని శివరాంను ప్రశ్నిస్తూ ఎదురేగి నిలుచున్న భార్యవైవు ముసిముసిగా నవ్వుతూ లోపలికి పోయాడు
మరో మూడు నెలలు చైతన్యం లేకుండా గడిచిపోయాయి. శివరాంకు జీతాలు అందలేదు. పోలీసుకేసు విచారణ పూర్తికాలేదు. ఆ యింటి యజమాని కియ్యవలసిన అప్పు అద్దె పెరిగి నూటయాభైరూపాయ లయింది చేతిలో చిల్లిగవ్వలేదు ఆఫీసులో గుమాస్తాలు శివరాం స్నేహం మాని ఎవరి జా(గత్తలో వారుంటున్నారు ఆ వెయ్యిరూపాయలు తనే దొంగతనం చేసివుండవచ్చు అని గుమాస్తాలు చెవులు కొరుక్కోవడం శివరాం విన్నాడు ఈ క్షిష్టపరిస్టితుల పరిష్మారం ఎప్పుడు లభిస్తుంచా అని శివరాం దినదినం శుష్క ఆలోచనతో కాలంగడపసాగాడు.
ఒకరోజు హోటల్లో కొనుక్కున్న టిక్కట్ల పుస్తకం అయిపోయింది. చేతిలో డబ్బులేదు రాజారావు ఆ రోజుకనిపించడం దుస్నాధ్యమనిపించింది. మధ్యాహ్నం భోజనంమాని నాల్గు జామిపళ్ళు తిని నీళ్ళుత్రాగాడు. పార్కులోకిపోయి ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు శివరాం తన పరిస్థితుల దుష్టవిధిని దూరుకుంటూ రాత్రికూదా ఆకలితో గడపటం చాలా కష్టమైపోయింది ఇంటికిపోయి రత్నం కోడలును ఒక రూపాయి అప్పుయిమ్మని అడిగాడు 'మాయింట్లో భోంచెయ్యండి!' ఆహ్వానించింది ఆమె. శివరాం ఒప్పుకోలేదు. తనపెట్టెలో దాచుకున్న స్వంతపొమ్ములోని రెండు రూపాయలు శివరాం చేతిలో పెట్టింది రత్నం కోడలు వీటితో ఎన్నాళ్ళు గడపాలో! భాధతో హోటలువైపు నడిచాడు పెద్దబజారులోని సన్నని సందుల్లో ఒక చిన్న హోటలు కనిపించింది అందులోకి నడిచాడు శివరాం. భోజనంలరీదు అర్ధరూవాయి సొమ్ము తక్కువని సంతోషించాడు. విస్తరి ముందు కూర్చున్నాడు. ఉప్పుడుబియ్యం కుళ్ళువాసనలు వెదజల్లింది నాంబారు చప్పగా ఉంది. దబ్బకాయ నీచువాసనతో గుప్పుమంది. నీళ్ళ మజ్జిగ విస్తరాకులలో కారిపోయింది.
అర్జాకలితో బయటబద్డాడు. ఒక అణా అరటిపళ్ళు కొనుక్కుని కడుపునింపుకున్నాడు.
మర్నాడు మలేరియా జ్వరం, శరీరాన్ని వణికించివేసింది. చలితో గజగజలాడి పోయాడు శరీరంలోని నరాలు లాగేస్తున్నాయ్. దుప్పటి ముసుగుతో పడుకున్నాడు కదలలేక ఆ ఇంటి యజమాని వచ్చి పలకరించాడు డాక్టరు దగ్గరకి వెళ్ళి మండు తెచి పెట్టాడు. నాల్గురోజులు జ్వరతీవ్రత వీరవహారంచేసి, శరీరం. పీల్ఫి పిప్పిచేసింది.
అన్వేషణ ర రత్నంకోడలు అభిమానంగా వెబ్నీళ్ళు, పళ్ళరసం అందిచ్చేది. దెబ్బతిన్న పాములా (క్రుంగిపోతున్న జీవితం తల్చుకుని కుమిలి లోలోపల ఏడ్చాడు శివరాం.
(బబ్రహ్మయ్యగారు మనుమడివద్దనుంచి ఉత్తరాలు లేవని అలమటిస్తూ ఉత్తరం వ్రాశారు. ఒక పాతిక రూపాయలు మనియార్దరు పంపారు శివరాం స్వాభిమానం పెరిగి ఆ మణియార్దరు వాపసు చేసేశాడు పుష్కలంగా సంపాదించుకుంటున్న తనకు మనియార్దరు అవసరం లేదని త్వరలోనే వచ్చి అందర్నీ చూస్తానని తల్లి చెల్లెలు క్షేమం వ్రాస్తుందమని జవాబు వ్రాశాడు.
జ్వరతీవ్రతవల్ల మూడు రోజులు సెలవు పెట్టాడు ఆఫీసుకు శివరాం జ్వరం తగ్గేక పధ్యం రత్నంకోడలు అమర్చింది! “కొన్నాళ్ళు మాయింట్లో భోజనం చేయ్యండి అరోగ్యం బాగుపడుతుంది!” బ్రతిమాలింది. భర్తచేతకూడా చెప్పించింది. ఇంకా మరోగతిలేక శివరాం కొన్నాళ్ళు వారియింట్లో భోజనం చెయ్యనాగాడు.
నారాయణ తరుచు కనిపిస్తూ ఎన్నో సంబంధాలు శివరాం కోసం వేచిఉన్నాయని. పిలలను చూడమని వేధించ మొదలుపెట్టాడు. ఒంట్లో బాగులేదనే నెపంతో శివరాం నారాయణను సర్దిపంపించేశాడు.
ఒకరోజు ఒక పోలీసు యినస్పెక్టరు యింటికి వచ్చాడు. ఆఫిసులోని దొంగతనం గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. 'కొంచెం జాగ్రత్తగా మసలుకోండి!' అంటూ మందులింపు స్వరంలో వెళ్ళిపోయాడు, పోలీసు యినస్పెక్టరు.
రాజరావు తనభార్య పుట్టింటికి వెళ్ళాడు. (రమ్రసవసమయం దగ్గరకు రావడంవల్ల. రాజారావు లేనిదే ఒక్కడుగు ముందుకు వెయ్యని చక్రవర్తి శివరాంను కలుసుకోలేక పోయాడు.
చుట్లూ వాతావరణం నిరాశ, నిస్పృహలు శివరాంలో కలిగించి, అతన్ని వేధించాయి. ఈ నగరంలో యింక తన బ్రతుకుబాగుపడే మరోమార్గం లేదనిపించింది. పెరిగిపోయిన అప్పులు తీర్చేఆవకాశం కాని, ఉద్యోగం నిలబడే సూచనలుకాని, దొంగతనం నేరంపరిష్కారమయ్యే పద్దతికాని, కనిపించకపోగా తనకు జైలు సిద్దిస్తుందేమో అనే భయంలో పడ్డాడు శివరాం.
ఒంటరిగా సాయంత్రం మమబూబ్ కాలేజిదాటి పార్కులో కూర్చున్నాడు శివరాం ఖిన్నుడై. గడియారం ఏడుగంటలు కొట్టింది. ప్రక్కనున్న క్రైస్తవులచర్చిలో ఏక స్వరంలో
రై అన్వేషణ ఎన్నోగొంతులు ప్రార్ధనలు చేస్తున్నాయి. డబుల్ డెక్ బస్సులు పెద్ద రోదనచేస్తూ విసురుగా పోతున్నాయి. శీతలవాతావరణంలో తడిబారిన విద్యుద్దీపాలు మనకగా (గ్రుడ్డిగా వెలుగుతున్నాయ్ రెడియోలోంచి వార్తల్లో పరిచితమైన ఓ కంఠము, దేశములోని మరణాలు, బీదరికం నిరుద్యోగ సమస్యలగూర్చి వివరిస్తోంది.
శివరాం శరీరమంతా క్రుంగి, ముడుచుకుని ముద్దయిపోయింది. మనస్సు బండబారింది నరాలు వైతన్యం పోగొట్టుకున్నట్లయ్యాయి. ఇల్లు విడిచి సాహసంగా బ్రతుకుదామని వచ్చిన ఆశలన్నీ చల్లబడి పోయాయి శివరాం ఉసిరిక చెట్టుక్రింద కూర్చుని వెక్కివెక్కి ఏడ్చాడు. జీవితంలో జ్ఞానం వచ్చాక, బాధగా ఉపద్రవమైన ఈవేదనతో, అసంతృప్తితో (బతుకు ధ్వంసమైపోయిందని శివరాం విలపించడం అదే ప్రధమం. ఉబికివచ్చిన కన్నీరు బుగ్గలమీద జారి చొక్కాను తడిపి ముద్దచెసింది. ఒక్క నిట్టూర్పు విడిచాడు.
ఆకాశం నల్లటి మబ్బులతో శోకదేవతలా ఉంది. తారలతళుకులు కూడా ఆ నల్లమబ్బుల మాటున మణిగిపోయాయి. కదలనిమబ్బులు గాఢంగా అల్లుకుని ఆకాశాన్ని బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి,
వేరుశెనగ లమ్మెవాని నిప్పుపిడత క్రింద జారి బ్రద్దలయి నిప్పులు వెదజీమ్మింది. దారనిపోయే ఒక సైకిలు కిరసనాయిలు దీపం అంటుకుని భగభగ మందనాగింది కారువేగంతో రోడ్డుమీద కాలు నలిగిన కుక్క కుయ్యోమని ఆరుస్తూ పార్కులోకి పరుగెత్తుకు వచ్చింది. చెట్లమీది పక్షిగుంపులు అపస్వరాలకూతలతో అలజడిగా ఎగురుతున్వాయ్.
బాధలు ఆవేదనలు, చితికిన ఆశలు భగ్నమైన (బ్రతుకులు, తనచుట్టూ ఉన్న వాతావరణమంతా నిండినట్టనిపించింది. ఈ వాతావరణాన్ని బలవంతంగా మార్చేసుకుంటే గొని, మారేలా కనిపించలేదు. బలవంతంగా మార్చడం మానవుడికి నాధ్యం కాని పనిగా తోచింది. మరో మార్గం .... వాతావరణంనుంచి దూరమైపోవాలి. ఈ నగరాన్ని విడిచి పోవాలి... ఎక్కడికి? ఇంటివైపు మళ్ళడం (బ్రతుకు హీనపరుచుకున్నట్లే .... తెలియని మరో ప్రదేశంలోకిపోవాలి,
ఆలోచనల్లో రైలు కూత కూసింది. బెడింగుతో, ట్రంకుతో ... రైలు ఎక్కాడు... అక్కడికి.. బొంబాయి... వెళ్ళిపోవాలి...........దీర్జంగా నిట్టూర్చి శివరాం పార్కులోంచి లేచాడు. ఒక నిశ్చయానికి వచ్చి.
అన్వేషణ 03
మబ్బులుకమ్మిన (ప్రాతఃకాలం పాలిపోయినరంగులో పేలవంగుంది. గతదినం రహదారిలో పయనించిన ప్రజలు. టాక్సీలు, టాంగాలుజంతువులు చేర్చిన చెత్త,చింత, మామిడి,సీమతంగేడు వృక్షాలు రాల్చిన ఆకులు, రోడ్లమీద చెదరిపడి ఉన్నాయి, ఈదురుగాలి జోరుగావిసురుతోంది. ఆ గాలి విసురులో చెత్త కమల ముఖంమీదకు ఎగిరింది.
నిద్రలేని రాత్రి గడిప్ ప్రొద్దున్నే భయంతో బాధగాపరుగెత్తుకు వచ్చిన కమలకు నీరసం హెచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని సేదదీర్చుకోడానికి ఎరుడుగా రైల్వేస్టేషనును అమాయక ఆగంతుకులకు రక్షణస్థలంగా కనిపించింది. స్టేషనులోనికి పోయి మొదట నీరు త్రాగి సిమెంటు కుర్చిలో మేనువాల్సింది.
అలసిపోయిన శరీరం ఆమెకు అతి సులువుగా, సషుప్తి కలిగింది. నిద్రనుంచి మెలుకువ వచ్చేటప్పుటికి పదిగంటయింది ఎదురుగా కుర్చీలో ఎవరో ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కళ్ళజోడుతో గర్వంగా కూర్చున్న ఒక అమ్మాయి ఏదో ఇంగ్లీషు పత్రిక తిరగవేస్తోంది. ఒక తల్లి తన పిల్లలకు తలదువ్వి కొత్త యిస్రీబట్టలు తోడుగుతోంది. ఒక గుజరాతి వనిత మేలిముసుగుళ్ వేతిగాజులు ఘల్లున శబ్దం చేసుకుంటూ బట్టలపెట్టి సర్దుతోంది. జఒకముస్తిం గులబీ సిల్కు పూర్తిపరదాలో అవిష్కరణ ముందుంచే రాతిబొమ్మల ఒకమూల కుర్చీలో కూర్చుండి.
ఎదురుగా పాటుఫారం సందడిగా జనంతో నిండిపోయింది. !; బయటకు వచ్చింది కమల. తెల్లపంట్లాం తెల్లకోటులో గేటుదగ్గిర టిక్కట్టు కలెక్టరు నిలబడ్డాడు. బయటికి వెడితే టికృట్టు అడుగుతాడేమో ఆని భయపడింది కమల. స్టేషనులో ఆగిన రైలులోంచి దిగిన ప్రయాణీకులు పూర్తిగా వెళ్ళిపోయాక. ప్లాట్ఫారం కాళీఅయితే టిక్కట్టుకలెక్టర్ను
ర్ర్డే అన్వెషణ తప్పుకోవచ్చు అనుకుంది . తిన్నగా ష్లాట్ఫారం మీద నడిచింది కమల, రకరకాల జనం కన్నులపండువుగా కనిపించారు. భర్తలను వెంటబెట్టుకు నడిచె గృహణిలు, సోదరుల సహాయంతో ప్రయాణంచేసే జవ్వనులు, తన జీవనములో అందలేని లోపాన్ని వేలెత్తి చూపించినట్లయింది కమలకు తన గడిచిపోయిన చరిత్ర తలుచుకుని కన్నీరు కార్చింది
స్టేషను ప్లాట్ఫారం చివరకు రాగానే ప్రక్కనే దూరంగా పూలవృక్షాలతోట కనిపించింది జనం రైలుకట్టలు దాటి ఆ తోటద్వారా నడిచిపోతున్నారు, టిక్కట్టు కలెక్టరు బాధ తప్పించుకోవాలంటే ఆ పూల తోటలో6ఛి పోవడమే శ్రేయస్మరం అనుకుందికమల.
జనంతోపాటు తనూ నడిచింది. పచ్చిగడ్డిమైదానాలు, పువ్వుల వృక్షాలు , లేత ఆకులచూతాలు, తామర ఆకులు తేలుతూ పువ్వులతో, ఆకుమీద వాలే కొంగలతో సుందరంగా, ఉన్నకొలను .. కొలను ప్రక్కనే సిమంటులో చెక్కిన మూతి విప్పుకున్న పెద్ద కొంగ, వనదేవతల్లా నిలుచున్న శ్వేత మందిరాలు, మసీదు . .. పిల్లల గ్రంధాలయం కోళ్ళు ...కుందేళ్ళు....... లేళ్ళు, ఎనుగులు, ఎలుగుబంటులు (ప్రదర్శిస్తున్న జంతుశాల... పిల్లలకు ఆటలకు అమర్చబడి తూగుటుయ్యాలలు పనిలేక తిరిగే కమలకు కన్నుల పండువయింది
సూర్యుని ఎండవేడి తీవ్రమయింది. చెట్లనీడలలోంచి వీచే పిల్లగాలిలో మెల్లిగా హాయిగా నడిచి కొలను ఎదురుగా ఉన్న కర్రకుర్చిలో ఒక చెట్టుక్రింద విశ్రాంతితో భావికార్యక్రమం ఆలోచించుకోవాలని కూర్చుంది. కమల.
ఆకలి దహించుకుపోతోంది. చేతిలో బాలమ్మ యిచ్చిన నాల్గురూపాయలే ఉన్నాయి. వేరుశెనగలమ్మే వాణ్ణి పిలిచింది. ఒక బేడపొట్లంకొని తినడం మొదలుపెట్టింది.
ఆడది ఒంటరిగా (బ్రతకాలంటే సిగ్గు, భయం, విడిచి, కాలప్రవాహంలో కాలికి తగిలే అవకాశాలన్నీ ఉపయోగించుకుంటే కాని, జీవితంలో అంతస్టులు ఎక్కలేదు. ఆధునిక యుగంలో స్వేచ్చగా బ్రతకడానికి ప్రయత్నించే ఆడదాన్ని కూడ పురుషుడు తన స్వలాభదృష్టితో చూడడం మానలేదు. (ప్రకృతి కలిగించిన జాతి విభేదాలలోనే స్త్రీకి పురుషుడిపై ఆధారపడే లక్షణము సహజంగా ఏర్పడిండేమో అనుకుంది కమల.
చదువు సంధ్యలు నేర్చుకుని, నాగరికత ఆధారంగా, నాజూకైన స్వేచ్చా గృహజీవితం గడిపే ఉన్నత తరగతి ్రీలకు, చదువు సంధ్యలు లేక, అనాగరిక మోటుస్వంతంత్ర జీవితం గడిపే నీచజాతి బీదరికపు స్రీలకు, ఉన్న లక్షణాలన్నీ తనలో సమన్వేయమయి ఒక క్రాత్త వ్యక్తిగా తాను సృష్టింపబడినట్లనిపించింది కమలకు, స్త్రీ బెన్న త్వ్యపధం జేరడానికి
అన్వేషణ ఫిగ్ నిమిష నిమిషానికి ప్రతిబంధకమయ్యో పురుషుని లాలనగా చలింపజేసి, పాలించి, లక్ష్యసాధన అయినాక త్యజిస్తేనే తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది కమల ఆలోచనము తొనే నవ్వుకుంది
బూట్లు పొలిష్చేసే కుర్రవాడు ఆమె దగ్గరకువచ్చి కాలికి చెప్పుల్లేక పోవదిం చూసి నిరాశగా వెళ్ళిపోయాడు. మాలిష్ చేసే వాడు నాల్గుసీసాల తీగ కొక్కెం నాజూక.గా ఆడిస్తూవచ్చి. ఆడ మనిషిని ఆడగాలా లేదా అనే అనుమానంతో వెనక్కి తిరిగిపోయేడు ఆ తోటలు చూడటానికి వచ్చిన యువకులు కొందరు ఆమెవైపు ఖులాసోగా వింతగా చూశారు చెట్లనీడల క్రింద పనిలేని బికారులు పచ్చగడ్డి మైదానాలమీద స్వేచ్చగా హాయిగా పడుకుని నిద్రపోతున్నారు. ఒక ఆమే టిఫిస్ కేరియర్లు గంపలో పెట్టుకుని వయ్యారంగా నడిబి పోతోంది. ఆ తోటలోని శాసననభమైపు.
చీర కొంగులో నలిమివేసిన వేరుశనగల పెచ్చులన్నీ రాలి పోగుగా ఏర్పడ్డాయి. ఎదురుగా కొలనులో జపంచేసిన కొంగ హరాత్తుగా చేపను ముక్కుకు దక్కించుకుంది,
కమలకు తన జీవితం గురించి ఒక ఆలోచన తట్టింది. గబుక్కున క(రబెంచీమీద నుంచి లేచింది. వేరు శెనగతుక్కు క్రింద రాలిబోయింది.
తోటవిడీచి వడివడిగా నడిచింది రోడ్డుమీద మొజంజాహీ మార్కెట్టు చేరింది. ఆరణాలు ఇచ్చి ఒక గంపకొనుక్కుంది వేలాదే చీర కొంచెం ఎగకట్టి మేలిముసుగు వేసుకుంది. నెత్తిమీద గంప పెట్టుకుని, పళ్ళదుకాణాలవద్ద పచార్లు మొదలుపెటింది.
ఒక ఆఫీసరుభార్య ఆజ్ఞతో ఆమెతో నడిచి, వివిధ దుకాణాల వద్ధ సరుకుటు సేకరించుకుని, ఆమె కారులో వొంచింది ఒక బొజ్జ అయ్యగారు అర్దరూపాయి చేతిలో పెట్టి ఒక మైలుదూరం నడిపించి అతనిహోటల్లో కూరలు గుమ్మరించమని, 'అప్పుడప్పుడు కనిపిస్తూండు' అంటూ కులికాడు ఒక యువకుడు నాట్టుమామిడిపళ్ళు కొని ఆమెను గంప ఎత్తమని రెండుమైళ్ళు నడిపించి, ఆమె జీవితం గురించి ఏవో ప్రశ్నలువేసి వేధించి ఒక రూపాయిస్తూ, ఆమె చేతులు తాకి పరవశమయి, ఒక నిమిషం తన్మయత్వంలో మైమరచి, తేరుకుని ఇంతలో ఆమె అదృశ్యమవగా తెల్లముఖం వేసుకున్నాడు. మార్కెట్టులోని పళ్ళదుకాణాల ఆసామీలు వోరచూపులతో ఆమెవైపు వెకిలిగా నవ్వుతూ పిలవసాగారు. బహిరంగంగా ఆకారం మార్చుకుని మసలినా సహజమైన అందం కప్పిపుచ్చు కోవడం కష్టమనిపించింది సాయంత్రానికి గంపకూలివల్ల అయిదు రూపాయలు చేతిలో కనిపించినా, కమలకు ఆ దినం జ్లసంతృప్షిగా, ఆసహ్యంగా కనిపించింది.
ఏ6 అన్వేషణ
సాయంత్రం అయిదుగంటలకు ఒక వయసుడిగన ముత్తెదువు మార్కెట్టకుపచ్చి కమలను పిలిచింది చేతిలో గొడుగు, కళ్ళజోడు, ఆకుపచ్చ సిల్కు చీర, నెరసిన వెంట్రుకలు, అందాలు వాడిపోయిన ముడుతల ముఖం.... వంకరనవ్వు ... ఆ వనిత కమలను ఎందుకో ఆకర్షించింది బత్తాయిలు, అరటినళ్ళు, కూరలుకొని గంపలో వేయించింది. కమల ఆమె వెనుక నడవసాగింది టట్రూప్జజారు దాటి కోటికివెళ్ళే పెద్దవీధిలోంచి దక్షిణంగా వెళ్ళే ఒక సందులోకి నడిచింది ఆ ముసలిస్తీ, ఒక ఎత్తెయిన గుమ్మాల ఇంట్లో అడుగుపెట్టింది. నడుం వాంగిపోయిపూర్తిగా శరీరకాంతి, శక్తిహరించిపోయిన మరొకముసలి ఆమె ఇంట్లోంచి వచ్చి గుమ్మరించిన కూరలు సజ్జల్లో అమర్శి లోపలికి తీసుకుపోయింది. కమల చేతిలోకి పావలా రాలింది. గంప ఎత్తుకుంది బయటకి పోదామని.
గోతులు పడిన మట్టి అరుగుమీద నుంచి ఎత్తుపల్లాల ఎగుడుదిగుడుల మెట్లమీద కంగారుగా దాటుకున్న కమల జారి అడుగు తడబడి గభేలున క్రిందికి దొర్లిపోయింది. వీధితలుపులు వేసుకుంటున్న ముసలి ప్రీ ఈ సంఘటన చూచి వీధిలోకి వచ్చింది. ఆరుగు నిమ్నోన్నతాలతో కొనలుకేలిన రాళ్ళు కమలముఖాన్ని ఒంటిని రాసుకుని గాయాలు కలిగించాయి. కాలుబెణికి నడ్డిమీద గట్టిదెబ్బతగిలి మెట్లక్రింద చతికిల బడిపోయింది. గంపదొర్రి దూరంగా పడిపోయింది. వీధిలో నడిచేజనం ఆమెవైపు విడ్డూరంగా చూశారు. ముసలిస్తీ కనికరంతో మెట్లుదిగి కమలను లేవనెత్తింది మెల్లిగా చేయిపట్టుకుని మెట్లు ఎక్కించి గదిలోకి తీసుకువెళ్ళింది శరీరంమీడి గాయాలు రక్తం స్రవిస్తున్నాయి కమలకు కళ్ళు తిరిగాయి. పగలంతా సరిగా భోజనంలేక నీరసిల్లి మళ్ళీ నేలమీద వాలిపోయింది ముసలిస్తీ నీళ్ళుతెచ్చి గాయాలు కడిగి నూనెరాసి ఒక మంచంమీద కమలను పరుండబెట్టింది కమల బాధగా నీరసంగా మూల్లి నిద్రలో మునిగిపోయింది.
రాత్రి పదిగంటలకు ఒకసారి మెలకువ వచ్చింది కమలకు, ముసలిప్రీ మరొక యవ్వనప్తీ ఎదురుగా కుర్చీల్లో కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు.
“ఎలా ఉంది అమ్మాయి! . కాన్తలేచి కొంచెం భోంచేస్తావా?” ముసలిస్రీ కమల దగ్గరకు వచ్చి బుజం మీద నిమిరింది.
నులకమంచం మీద పరుపు నల్లగా మాసిపోయివున్నా దాని మీది తెల్లదుప్పటి ఆ పరుపు పాతదనాన్ని కప్పిపుచ్చుతోంది. ఎదురుగా చిన్న గుండ్రని టేబిలుమీద ఏసుక్రీస్తుబొమ్మ, చిన్న బైబిలు పుస్తకము, టేబిలుమీద పూలు అల్లిన నల్లని సిల్కుగుడ్డ,
అన్వేషణ ఫ్ర పెన్ను, రెందు కాగితాలు కనిపించాయి. బహుశ అది కైస్తవ కుటుంబమనుకుంది కమల లోలోపల
కమల లేచికూర్చుని నీరసంగా నవ్వింది.
యవ్వనప్తీ కమల దగ్గరకు వచ్చి జాలిగా చూస్తోంది.
“నీ పేరు?” ముసలిది ప్రశ్నించింది యధాలాపంగా
కమల ఒక్కసారి ఆలోచించి పంచెప్పాలా అని మరుక్షణంలో వాళ్ళకి అనుమానం తగలకుండా చెప్పేసింది.
“మరియమ్మ!”
“ఊ&” ముభావంగా ఆ ్రీలవైపు చూసింది, వారి ముఖ భంగిమలు పరిశీలిస్తూ.
ముసలి ప్రీ ఒకక్షణం ఆలోచించి ఏదో తళుకు మెరిసినట్లు నవ్వింది.
“అదంతా ఒక కథ!” నిట్టూర్చింది కమల. “ముందు భోంచేయి!” ముసలిస్త్రీ బలవంతంగా లేవదీసి క్రిందకు దింపింది కమలను.
మొదట మొహమాటపడినా, చివరకు ఒప్పుకుంది, కమల భోంచెయ్యడానికి, ఆమె చరిత్ర ఏమిటని ముసలిస్తీ పరిశోధన చేసింది. నిజం కప్పి సగం కల్పనచేసి, మదరాసులో పెత్తల్లి పెట్టె బాధలు భరించలేక స్వతంత్ర జీవనం గడుపుటకు ఈ నగరం వచ్చేశానని నమ్మకం కలిగించేలా దీనంగా చెప్పింది కమల.
ముసలిప్తీ జాలి ప్రకటించింది.
“అమ్మా!.... మరియమ్మనుకూడా మనయింట్లోనే వుండనీయ్! ఏదో ఉద్యోగం చూచుకొని మనతోటే బతుకుంది!” యవ్వన స్రీ ముసలిస్తీవైపు తిరిగి కమలవైపు నవ్వుతూ చూసింది.
కమల కృతాజ్ఞతాభావంతో తలదించుకుంది.
“మరియమ్మా!.. నీ కిష్టమైతే నాకు అభ్యతరంలేదుగ ముసలిప్రీ నవ్వింది.
రక్షణలేని ఈ మహానగరంలో ఏదోగ్భృహంలో కాస్త ఆదరణలఖిస్తే భావిగురించి (క్రమంగా ఆలోచించుకోవచ్చని తాతృలికంగా సంతోషించింది కమల.
రగ అన్వేషణ
“నా పేరు విజయ... మా అమ్మపేరు నీ పేరు ఒకటే"యవ్వస్తి సరదాగా నవ్వింది.
“మీ మేలు మరచిపోలేను!" కమల నమ్రతగా చేతులుజోడించి వారిద్దరికి సమస్మారం చేసింది.
ఆ యింట్లో ఆ ఇద్దరు స్రీలుతప్ప మరెవ్వరూ కనిపించలేదు. బహుశా ఆ కుటుంబంతో తాను కలిసిపోవడం కొంతలాభం కలిగించ వచ్చు అని ఆశించింది కమల.
మరొక పట్టెమంచం వాల్చుకుని, తల్లీకూతుళ్ళు ఇద్దరూ ఏవో గుసగుసలాడుకుంటూ రాత్రి నిద్రపోయారు
తెల్లవారగానే కమలకు మరొక క్రాత్త జీవితం (ప్రారభమైనట్లు తోచింది.
“నాగంప ఏదీ?” కమల విజయనడిగింది.
“సీ గంపకూడా మా సంసారంలో కలిసిపోయింది. అందులో బొగ్గులు పోశాను.” నవ్వింది విజయ.
కమలకు తన పెట్టె చూపించింది విజయ. అందులో ఒక అరడజను సిల్కు చీరలు, జాకెట్లు, మాత్రం ఉన్నాయి.
ఓ త్ర బట్టలన్నీ ఎవరివి?” (ప్రశ్నించింది విజయ.
“నీవి?”
'కాదు .. మనిద్దరివీ! .. నీకు కావలిసినప్పుడు ఈ దుస్తులు తీసి తొడుక్కోవాలి అంతే!”
పసుపుపచ్చని ఒక సిల్కు చీర తీసి కమలకు చుట్టబెట్టింది విజయ ఆ సిల్కు చీరలో కమల అందం ఇనుమడించింది.
“ఇంత అందమైన మనిషివి... నీకీపేరు బాగులేదు.... మార్చేసుకో!” విజయ సాలోచనగా తన సన్నటి శరీరం ఏటవాలు గెడ కర్రలా నిగిడ్చి చటుక్కున ఏదో ఊహతట్టి చప్పట్లు కొట్టింది.
తన పెట్టెలో మూలగా మడిచిన కవరుతీసి అందులోంచి ఒక కాగితం తీసింది విజయ.
అన్వేషణ 99 “రాణి . హెచ్ యం సి. సర్దిఫికేటు” కమల ఆసక్తితో చూసింది ఆ కాగితంవైపు. విజయ కమలను ఒయ్యారంగా నడిపించి కుర్చీలో కూర్చోపెట్టింది. “"దెంహాసనంలో కూర్చున్న రాణీలా ఉన్నావు ఈవేళ నుంచి నీపేరు మార్చసే
పత్రం నీకందిస్తున్నా” రాజులా రీవిగా కుర్చీ దగ్గరకు వచ్చి చేతిలో సర్టిఫికేటు పెట్టి
కమల చుబుకం ఎత్తింది విజయ.
“నా రాజి” విజయ (ప్రేమగా చూసింది కమలవైపు.
ఆ హాస్యరస సన్ని వేశంలో ఇద్దరూ పకపక నవ్వుకున్నారు.
“అమ్మా... మనయింట్లో రెండవ మరియమ్మ రాణిగా మారిపోయిందిగొ పెద్దకేక పెట్తింది విజయ.
యి
మరియమ్మ నవ్వుతూ వంట ఇంట్లోంచి వచ్చి జాలిగాచూసి కన్నీరు తుడుచుకుంది కొంగుతో కమల కొంచెం ఆశ్చర్యపోయింది. “నాకొక చెల్లెలు ఉండేది. . . దానిపేరు రాణి. ఇంటరు చదువుతూ హరాత్తుగా చనిపోయింది ఒక ఏడాది క్రితం” విజయ బాధగా తలవంచుకుని కుర్చీలో కూర్చుంది. వారిద్దరిన్ పరామర్శచేసి, ఉపశమన వాక్యాలుపలికే బాధ్యత తనమీద ఉందని కమల (గ్రహించింది. కమల విజయ (ప్రకృనే వెళ్ళి భుజం మీద ఆప్వాయంగా చేయి వేసి నిమిరింది.
“నువ్వు ఇంట్లో మసులుతూంటే మారాణి ఉన్నట్లే ఉంది “మరియమ్మ గద్దదస్వరం ప్రకంపించింది.
“నేను మీ రాణిలాగే వీలైనంతవరకు మీకు ఆనందం కలిగించటానికి ప్రయత్నిస్తాను! రాణి నిశ్చయంగా దైవప్రార్ధన చేస్తున్నట్లు పలికింది.
మరియమ్మ ముఖం చేటంతయి, సంతోషంతో వెల్లివిరిసింది
విజయ హుషారుగా ఎగిరిగంతేసింది.
విజయ రాణికి సాన్నిహిత్యం పెరిగింది రెండురోజులు ఇద్దరూ విచ్చలివిడిగా హూషారుగా నగరంలో తిరిగారు. విజయ(ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది తన స్నేహితు లందరినీ విజయ షరిచయం చేసింది రాణికి తెల్లగౌను త్లెసాక్సు తొడుక్కుని తెల్లని వల్లెవాటు చీరలో ఆస్పత్రి రోగాల మంచాలవద్ద పచార్లు చేస్తూ మందులు అందిస్తున్నారు వాళ్ళంతా రాణితన దూరపు బంధువని, నగరానికి క్రొత్తగా వచ్చిందని,
100 అన్వేషణ ఏదైనా ఉద్యోగం అంతా కలిసి ఇప్పించే బాధ్యత మనదే అంటూ విజయ స్నేహితులందరికి నచ్చుచచెప్పింది రాణి సౌందర్యం చూచి తమకు మరొక మంచి స్నేహితురాలు దొరికిందని నర్ఫ్సులంతా అనుకున్నారు
వెంకటరావు, రెడ్డ, చౌదరి, మూర్తి శర్మ వచ్చి కాస్సేపు విజయతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు విజయ మాటలు సందర్భంలో రాణీని పరిచయం చేస్తోంది ఉద్యోగము చేస్తున్న విజయకు వివిధ రకాల స్నేహితులుండదడం ఆసమంజస మనిసించటేదు రాణికి
ఒక రోజు సాయంత్రం విజయ ఏదో ముఖ్యమైన పని ఉందని ఒంటరిగా వెళ్ళిపోయింది నగరంలోకి రాణికి ఏమీ తోచలేదు వీధి అరుగుమీద నుంచుని వచ్చిచ వెళ్ళే జనాన్ని పరికిస్తూ మరియమ్మతో కబుర్లు చెబుతూ కూర్చుంది. పరిసరాలలో గృహాలు పాతబడి శిధిలావస్థలో ఉన్నాయి. పెంకులు ఎగిరిపోయి కప్పులు, పెళ్ళలు ఊడిపోయిన వెల్లలేక పల్లబడిపోయిన గోడలు, సన్ననిదారులు, చిన్న కోమటి దుకాణం, మసలుకున్న బీదరికపు ప్రజలు, ఆ వాతావరణమంతా మధ్యతరగతి జీవితానికి ప్రాకులాడుతున్న మనుష్యుల పేటలా కనిపించింది.
మరియమ్మ క్రీస్తు గొప్పతనం, మళ్ళీ ఆయన జన్మించి పాపుల హృదయాలు ప్రక్షాళన చేసి షవిత్రులను చెయ్యగలడనే విశ్వాసం గురించి, గంభీరంగా నొక్కి వక్కాణిన్తోంది.
వీధిలో ఒక రిక్షా ఆగింది నల్లని పంట్లాంలోకి చారల చొక్కా బిగించి, చెదిరిపోయిన (క్రాపుతో ముష్పయేళ్ళ మనిషి ఇంట్లోకి వచ్చాడు. చేత్తో లెదర్ బేగ్ పట్టుకుని.
“రండి! ... ఇదేనా రావడం గుంటూరునుంచి!” మరియమ్మ లేచి మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది ఆ ఆగంతకుని. రాణి విచిత్రంగా చూస్తూ వీధిలోనే నిలబడివోయింది.
మరియమ్మ పిలిచింది రాణిని.
రాణికూడ ఇంట్లోకి వెళ్ళింది
“ఈ అమ్మాయిని చూశారా?” మరియన్ము రాణిని దగ్గరకు పిలిచి కౌగిట హత్తుకుంది.
“ ఎవరీ అమ్మాయి?” కోపంగా చూశాడు ఆయన 'ళాణీ ముసిముసిగా నవ్వింది
“ఆయన విజయ భర్త నరసింగంగారు” రాణికి ఎతిచయం చేసింది ఆక్రొత్త మనిషిని.
అన్వేషణ కీ01
“ఈ అమ్మాయి సంగతికేం.. . విజయ ఏదీ?”
విసువుగాకుర్చీలో మేనువాల్సి లెదర్బేగ్ క్రిందగిరవాటేశాడు నరసింగం.
“స్నేహితురాలితో బయటికి వెళ్ళింది. ఇప్పుడే వస్తుంది! . మీరు ఇంకా ఒక వారం దాకా రారేమో అనుకున్నాం!” మరియమ్మ సాగదీసుకుంది.
“నువ్వు నీ కూతురు వేసే వేషాలు ఎవరికి అర్ధంకావు?” అరిచాడు నరసింగం బూట్లు విప్పుకుంటూ, కోటుతీసి మంచం మీదకు గిరవాటేశాడు.
రాణికి ఈ దృశ్యం వింతగొలిఫింది. ఇంతవరకు తనకొక భర్తవున్నాడని విజయ చెప్పలేదు మరియమ్మ కూడా మౌనం వహించడంలో ఈ కుటుంబంలో ఏవో రహస్యాలు ఉన్నాయని అనుమాన పడింది ౮ాణీి.
వరండాగది తలుపు తెరుచుకుని, వెనుకనే మెట్లు ఎక్కీ మేదమీదకు పోయాడు. సరసింగం వచ్చిన రెండురోజులనుంచి క్రిందవున్న వరండాగది, ప్రక్కనున్న వంటిల్లు కవతల కుళాయివున్న దొడ్డి మాత్రమే రాణి చూసింది
వెనకాల మేదగదికూడ ఒకటుందని తెలుసుకుని, ఇంతవరకు తనకు తెలియకుండా ఆ విషయము దాచడము గ్రహించి రాణి దిగ్భ్రాంతి చెందింది ఆయినా తన ఆశ్చర్యం మరియమ్మకు తెలియ నియకుండా మౌనంగా అమాయకంగా నిశ్చలంగా మసల మొదలిడింది రాణి
నరసింగం మేడమీదకు వెళ్ళి దుస్తులు విడిచి ఒక లుంగీ బనీను తొడుక్కుని క్రిందకు వచ్చాడు మరియమ్మ హస్తప్రక్షాళనకు నీళ్ళు ఇచ్చింది. వొనంగా వంటయింటిలో ప్రవేశించి భోంచేసి మళ్ళీ మేడమీదకు వెళ్ళిపోయాడు నరసింగం.
“ఉత్తకోపిష్టి” నరసింగం వెళ్ళిపోయాక మరియమ్మ వేళ్ళు విరుచుకుంది అతనివైపు.
మేడమీదగది కూడా మనదేనా?” అడిగింది రాణి అమాయకంగా,
“జ్ర గదిలో ఆయన ఒక్కరే వుంటారు. మే మెవ్వరం పోము. ఉత్తకోపిష్టి” నవ్వేసింది మరియమ్మ.
భోజనం పూర్తిచేసి రాణి యధాప్రకారం నులకమంచంమీద ఒరిగి కధల పత్రిక ఒకటి చదవడం మొదలు పెట్టింది. రసవత్తరమైన కధలపఠనంతో గంటలు గబగబ నడిచాయి. వాశ్చాత్య నాగరిక ప్రభావంతో, కృత్రిమ భావాలతో, యుక్తాయుక్త
102 అన్వెషణ ఎచక్షణాజ్ఞానం నశింపజేసుకుని, అహంభావ గర్వాలతో, ప్రవర్తిస్తున్న ఆధునిక యువతీ యువకుల జీవిత చిత్రణలు కధల్లో ప్రతిబింబించాయి కథలు చదివి ఆవలించి గడియారం చూసింది రాజి పన్నెండు గంటలయింది. ఎజయ ఇంకా రాలేదేమని విస్తుపోయింది ఇంతలో తలుపు ఒజ్బ-దయింది. మరియమ్మ కూతురు గురించి ఏం భయం, టెడద, బెంగ లేనట్లు గుర్రుపట్టి నిద్రపోతోంది. విజయ గొంతు వినిపించింది తేలిపోయన సారంలో, రాణి తలుపుతీసింది మేలిముసుగు వేసుకుని చేతిలోని వేనిటీ జేగ ఊపుకుంటూ, తూలుతూ గుమ్మంలో అడుగుపెట్లింది విజయ. ఇంట్లోకి రాగానే మేలిముసుగు గొలిగిపోయింది. శిరోజాలు చెదిద ఉన్నాయి. చీర నలిగిపోయింది నిమీలిత నేత్రాలతో తూలుతూవచ్చి కుర్చీలో కూర్చుంది. “ఎవరు” . . . రాణి” పకపక నవ్వింది విజయ ఆ మాటతీరు చూసి ఆమె (త్రాగి వచ్చిందని నిర్మయించుకుంది రాణి. “అమ్మ . ఏదీ? . . . నిద్రపోతోంది. . . అమ్మ బొమ్మ! నిజంగానాకు దొరికిన ఒక బొమ్మ. . కన్నకడుపైతే ఇలా దిమ్మచెక్కలా నిద్రపోతుందీ. . రాణీ.. , భోజనం పెట్టు. . .మజ్జిగ ఉందా! ... *” విజయ తూలుతూ రెండుసార్లు ఎక్సిళ్ళతో వెకిలిగా నచ్వింది. రాణి విజయను పట్టుకుని వంటింట్లోకి నడిపించింది. “బ్రతుకు ... ఏంచేస్తా . . ,సంవొదించాలి. ఈ ముసలిపీన్లు కోసం! . , నల్లమందుకే చాలదు నా డబ్బు!” నీల్లింది విజయ నడుస్తూ, మరియమ్మ ముసుగులోంచి గురక వినిపిస్తోంది. విజయ పషిలిచిందిమెల్లిగా . . “అమ్మా” అని ప్రశాంతంగా. .. మరియమ్మ లేవటేదు విజయ బీగ్గరగా అరిచింది పెంకులు ఎగిరిపోయేటట్టు కోపంగా, మరియమ్మలో చలనం కలగలేదు. “లేస్తావా! . . . లేవవా?” మంచాన్ని తన్నింది విజయ బిగ్గరగా స్పృహతప్పి అరుస్తూ.
అన్వేషణ 103 మరియమ్మ లేచికూర్చుంది కంగారుగా ఆ తాపుతో
మేడమెట్లు దిగి గదిగమ్మంలో నిలుచున్నాడు నరసింగం. కళ్ళు చింతనిప్పుల్లా ఎ(ర్రబద్గాయి కోపంతో ముఖం చిట్లించాడు. “ఏయ్ . . .!” అతని అరుపు ప్రతిధ్వనించింది.
లేడిలా విజయమీదకు ఉరికాడు. జడపుచ్చుకుని లాగి దవడ మిద విరామం లేకుండా నిర్దయగా శక్తికొలది కొట్టాడు. త్రాగి శక్తిలెక తూలుతున్న విజయ ఆ దెబ్బతో శోషవచ్చి నేలమీద కూలిపోయింది
మరియమ్మ తల లబలబ బాదుకుంది.
“ఎందుకురా నా కూతుర్ని ఇలా చంపేస్తావు! నీ పీడవిరగదై పోయినా బాగుండేది!” కూనిరాగాలు తీసి ఏడ్చింది మరియమ్మ.
“నీ కూతురు! . .” హేళనగా పకపక నవ్వాడు నరసింగం. మరుక్షణంలో పళ్ళు పటపట కొరికాడు.
“మీ ఇద్దరికీ త్వరలో తగినశాస్తి చేస్తా! ఇల్లంతా కొల్లగొట్టేక . . . విశ్వాసం కూడా బేకుండా విచ్చలవిడిగా సంచరించేదాన్ని ఏంచేస్తే బాగుంటుంది?. , . కసాయివాడిలా కత్తితో పనసపొట్టులా ముక్కలు ముక్కలు చేస్తే!” నరసింగం గర్జించాడు.
“వంపు చూద్దాం!” మరియమ్మ దెయ్యంలా జుట్టుపీక్కుని నరసింగం మీదకు వెళ్ళి చేతులు త్రిప్పుకుంటూ గయ్యాళిగా అరిచింది.
“ఓహో! . . . ముసలిపీన్లు రక్షిస్తుంది కాబోలు!”
వ్యంగ్యంగా క్రూరంగా రౌడీలా నవ్వాడు నరసింగం.
అతని మాటలు వినిపించుకోకుండా మరియమ్మ విజయను నేలమీదనుంచి బలవంతంగా లేవదీసి పట్టెమంచంమీద పడుకోబెట్టింది. చన్నీళ్ళు తెచ్చి ముఖంమీద చల్లింది. విజయ మూట్లింది.
రాణి ఈ దృశ్యమంతా చూస్తూ చకితురాలై మౌనంగా, భయంతో, మరియమ్మ దగ్గరకుపోయి కూర్చుంది.
“ఏమిటీగొాడవ?” మెల్లిగా నసిగింది రాణి మరియమ్మ చెవిలో.
104 అన్వేషణ
“రాక్షసుడమ్మా. . పెళ్ళి చేసుకున్నప్పటినుంచి ఇంతే! .. అందుకే మనిషిలా పొడయిపోయింది'”” మరియమ్మ తెల్ల కనుబొమలు గిలక గూతి చేంతాదులా అల్లుకున్నాయి. ఆమె కళ్ళలో ఏవో ఆగాధాలు ఉన్నట్లు స్ఫురించాయి రాణికి
కాస్పేపు మూట్చి, నీరసంగా లేచి, కాస్త మజ్జిగ అన్నం తిని, తూలుతూ, విలాసంగా నవ్వుతూ, నిర్లక్ష్యంగా నిశ్చింతగా మంచమీద ఒరిగింది విజయ
వంటింట్లో పిల్లులు కుమ్ముకుని గిన్నెలు పడగొట్టాయి. గోడ మీది బల్లి విద్యుద్దిపము చుట్టూ ఎగిరే పురుగులను పట్టుకుని భక్షిస్తోంది. కిటికీలోంచి కనిపంచే రాత్రి చీకటితో దట్టమై భయకంరంగా ఉంది.
తన జీవితంలో ప్రతిదినం ఒక పరిక్ష అయిపోయిందనుకుని నిట్టూర్చెంధి రాణి. మరియమ్మ విద్యుద్దిపం ఆర్పింది.
ఆ చీకటిలో మనుష్యులు నిశ్వాసాల రొదలు కాస్సేపు వినిపించాయి. ఆవేశించిన సుషుప్తిలో, అలుముకున్న చీకటిలో ప్రపంచమే మరిచిపోయింది రాణి.
మర్నాడు నరసింగం మధ్యాహ్నం తన లెదర్బేగ్ తీసుకుని విజయవాడ వెడుతున్నానని రెండు రోజులదాకా రానని మరియమ్మతో చెప్పి వెళ్ళిపోయేడు. వెళ్ళముందు విజయవైపు చూశాడు. గత రాత్రిసన్నివేశానికి కుపితయై విజయ నరసింగంతో మాట్లాడలేదు “వెర్రిదానా! ఇటువంటి పోట్లాటలు మనకు మామూలేకదూ!” నవ్వుతూ వెళ్ళిపోయాడు నరసింగం.
అతను ఇల్తువిడిచి వెళ్ళిపోయాక, మరియమ్మ విజయ వంటింట్లో కూర్చుని ఏవో గుసగుస లాడుకున్నారు అరగంటసేపు. మౌనాన్ని భేదించి, భేదాన్ని త్యజించి, విజయ యధాప్రకారం రాణితో కబుర్లు చెప్పింది. సాయంత్రం ఆరుగంటలు కాగానే తనకేదో పని ఉందని విజయ అందంగా అలకంరించుకుని వీధిలోకి వెళ్ళిపోయింది.
రాణి తన కార్యక్రమం నిర్ణయించుకోవలసిన అవశక్యత ఏర్పడినట్లు గుర్తించింది. ఇంట్లో ఎవరిమట్టుకు వారు తమ కార్యాలలో నిమగ్నులైనప్పుడు తానుకూడ ఒక నిర్జిత పద్ధతిని జీవితయా(త్ర గడపడం ముఖ్యమనిపించింది. మరియమ్మ కుటుంబంలో ఏవో ధాగని రహస్యాలున్నాయని అవి ఎప్పటికో బట్టబయలైతే మళ్ళీ తన జీవితం ఏ విధంగా నడిసముద్రంలోని నావలా ఊగులాడుతుఎదో అని భయం పొందింది. అటువంటి
అన్వేషణ 105 పరిస్థితులు ఏర్పదకముందే ఇంట్లో దొరికిన స్మూలు పైనలు సర్టిఫికేటుతో త్వరలో ఉద్యోగం సంపాదించుకోవాలని సిర్ణయించుకుంది రాణి.
సాయంత్రం విజయ వెళ్ళిపోయాక, రెడ్డి, రావు వచ్చారు. విజయ లేకపోవడం వల్ల రాణీ వాళ్ళతో మాట్లాడక తప్పలేదు సంభాషణల మధ్యలో తానొక ఉద్యోగం చూసుకుందామనే ప్రయత్నంలో ఉన్నానాని తెలియజేసింది రాణి రెడ్డి రావు “మేముందడగా సీకు ఉద్యోగానికేమి లోటు .. రేపే కనుక్కొని చెబుతా!” అన్నారు కాలరు ఠీవిగా ఆడిస్తూ, ఇటువంటి మనుష్యుల పరిచయాలు చాకచక్యంగా ఉపయోగించుకోవాలనుకుంది రాణీ, కనిపించినంతవరకు రెడ్డి, రావు రాణీవైపు ఖులాసాగా చూస్తూ వెళ్ళిపోయారు.
మరియమ్మ వంట ప్రయత్నంలో వంటింట్లో ఉండిపోయింది.
ఇంట్లో తుడుపులు, కడుగులు పూర్తిచేసుకుని నడుం ఒరిగిన నరసవ్వ తనయింటికి పోదామని బయలుదేరింది. వీధి అరుగుపై ఒంటరిగా ఏమీతోచక నిలుమన్న రాణి నరసవ్వను ఆపి కబుర్లు పెంచింది. ఊరుకోని నరసవ్వ తన జీవితచరిత్ర, చుట్టుప్రక్కలవారి భోగట్టా, చూసిన సినిమాలు తాను జీవితంలో నేర్చిన నీతులు, చివరకు జీవితం ఎప్పటికైనా కాటితో భస్మమైపోయెదే కనుక అది కలలా కనిపిస్తుందనే తన భావం, తన అమ్మమ్మదగ్గర నేర్చుకున్న వేదాంత జావళీలు వరుసగా ఏకరుపెట్టింది. సామాన్య సంసారస్తీలు చిన్నతనంలో తల్లి తండ్రుల అదుపులోను తర్వాత భర్త రక్షణలోను, గౌరవంగా నాల్లు గోడలమధ్య బ్రతికే జీవితానికి, వారికి దూరంగా ఉండే బాహ్యవాతావరణంలో ఏ రక్షణలేక సంఘం యొక్క కర్మశ కృత్రిమ ప్రవర్తనలకు బలియెై వొట్ట పోషించుకునే ఆబలల జీవితానికి ఉన్న వ్యత్యాసం, ఆధునిక యుగంలో సంశ్లిష్టమౌతున్న నాగరికతతో నిమిషం మారిపోతున్న కుటుంబ సంప్రదాయాలలో వ్యక్తిగత భావాలలో పదిరెట్లు ఇనుమడించినట్లు స్ఫురించింది రాణికి
నరసింగం లెదర్బేగ్ ఊపుకుంటూ రిక్షాలో దిగాడు. ఇంటి ముందు. రాణీ ఆశ్చర్యవోయింది. విజయ ఈ సాయంత్రం కూడా బైటికి వెళ్ళివోయినందుకు మళ్ళీ ఈరాత్రి ఎటువంటి రభస జరుగుతుందో అని భయంతో అలజడి చెందింది.
“ఏం రాణీ! వీధిలో కూర్చున్నావు!” నవ్వుతూ నరసింగం లోనికి వెళ్ళిపోయాడు మేడమీది తన గదిలోకి. అతని పదాలశబ్దం సర్వం విన్న మరియమ్మ కంగారుగా వంటింట్లోంచి వచ్చి తొట్రుపాటు సర్దుకుని, ముసిముసి నవ్వులు నవ్వింది.
1046 అన్వేషణ మేడమీదనుంచి “విజయా అని కేకపెట్టాదు నరసింగం.
“రాణి! ఏం కావాలో నువ్వుచూడమ్మ ఉత్తకోపిష్టి!”
రాణిని మేడమీదకు నెట్టింది మరియమ్మ ఆ పరిస్థితితో మరోమార్గంలేక, నరసింగం ప్రవర్తన భయంతో మెల్లగా మేడమెట్లు ఎక్కినిలుచుంది;
“ఏం కావాలి?” లేనిధైర్యం తెచ్చుకుని పలకరించింది రాణి.
“కావలసినవన్నీ నువ్వు ఇవ్వగలవా?” ఒక్కసారి రాణివైపు తీక్షణంగా చూసి పకపక నవ్వేశాడు, నరసింగం. “కాఫీ” అంటూ వంచుకున్నాడు నరసింగం.
రాణి మంచినీళ్ళుతెచ్చి మేడ మీద పెట్టి మేడమెట్లు దిగబోయింది.
నరసింగం పిలిచాడు ఆమెను.
“ఇలా కూర్చో!” కుర్చీ చూపించాడు నరసింగం.
మౌనంగా, భయంతో, బెదురుతున్న కళ్ళతో కూర్చుంది రాణి.
*నేను దెయ్యాన్ని కాదు....మనిషినేగ నరసింగం నవ్వాడు, రాణికికూడా నవ్వు వచ్చింది.
“న్సీక్రాక్ర ముఖ్యవిషయం చెప్పాలని పిలిచా, ఏీళ్ళిద్దరు తల్లికూతుళ్ళుకారని నా అనుమానం. గుంటూరులో విజయతో పరిచయం కలిగింది. ఒకరింట్లో పెళ్ళిలో . .. భోగంమేళంలో కలుసుకున్నాం . . . పదివేల ఆస్తిదీనిపరం చెశాను. విశ్వాసఘాతకురాలు . . . నువ్వు ఎల్లా ఈ ఇంట్లోకి వచ్చేవో తెలియదు. .. కానీ జా(గ్రత్త నిన్ను చూస్తే అమాయకత్వం ఉట్టిపడుతున్నట్లుంది . . . మంచితనంగా ఈ సంగతి నీకు చెప్పాను. , = తర్వాత నీఇష్టం!” నరసింగం లేచి లుంగీ కట్టుకుని, తెల్లచొక్కా తొడుక్కుని మెడకు మసఫ్లర్ చుట్టుకుని, అందంగా తలదువ్వుకుని లేచి నిలబడ్డాడు.
“క రోజుతో ఈ ఇంటి సంబంధాలు త్రెంచుకోదలుకున్నాను ... విజయమీద చూపిన (శ్రద్ధాశక్తులు నా భార్య పిల్లలమీద చూపించి ఉంటే హాయిగా ఉండేవాణ్లి . ., భార్యకు కళ్ళు గప్పి, వ్యాపారం పేరుతో ఈ నగరంలో ఉంటూ నాశనమైవోయాను నిట్టూర్చాడు నరసింగం. తలవంచుకుని గబగబ మెట్లుదిగి వెళ్ళిపోయాడు. నరసింగం,
మనుష్యులను పూర్తిగా అర్ధం చేసుకోవడం చాలా కష్టమనిపించింది క్రూరత్వం బాహ్యంగా ఆకారంలో ఉట్టిపడే నరసింగంలో మంచితనం కూడా ఉందని [గ్రహించుకుంది రాణి
అన్వేషణ 107
“రైలు అందలేదా?” వెళ్ళిపోతున్న నరసింగాన్ని ప్రశ్నించింది మరియమ్మ. అతను సమాధాన మియ్యలేదు. పెదిమలు విరుచుకుని, బుజాలెగరేసి, వక్రంగా నవ్వింది మరియమ్మ
చెదిరిన జుట్టుతో, చికాకుగా కోపంగా ఒంటిమీద మషఫ్లర్లే కుందా రివ్వున ఇంట్లో అడుగుపెట్టాడు నరసింగం రాత్రి పన్నెండు గంటలకు, బయట ఈదురుగాలి జోరుగా రివ్వున విసురుతోంది కీచు రాళ్ళు అరుస్తున్నాయి. చీకటిలో, విద్యుద్దీపాల వెలుగునీడల్లో నిలుచున్న పాత కొంపలు, శృశానంలోని పాతబడిన సిమెంటు సమాధుల్లా గోచరించాయి.
మరియమ్మ ఆ రాత్రి నిద్రపోలేదు. నరసింగం మళ్ళీ విజయరాగానే రభస చేస్తాదనుకుంటోంది. అతను రాగానే లేచి తలుపుతీసింది.
“విజయ ఏదీ?” ఇంట్లో అడుగుపెడుతూనే నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు నరసింగం.
“ముందు భోజనం చెయ్యండీ!” నమతగా అల్లుడిని ఆహ్వానించినట్లు మర్యాదగా చేతులు నలుపుకుంటూ నిలుచుంది మరియమ్మ
భోజనం! . . . కడుపునిండా భోజనం అయిపోయింది. ఈ వేళ మాత్రం ప్రత్యేకంగా మనశ్శాంతి కలిగించే నిండుభోజనం దొరికింది వ్యంగ్యంగా హేళనగా పకపక నవ్వుతూ, ఒక్కసారి భయంకరంగా గర్జించి మేడమెట్లు ఎక్కిపోయాడు నరసింగం.
రాత్రి విజయ ఇంటికి రాలేదు,
' గదిలో సామాన్లన్నీ మూటగట్టి బయట పెట్టాడు నరసింగం. మర్నాడు ప్రొద్దున, వీధిలోకిపోయి టాంగా తీసుకున్నాడు. ఒక పెట్టె, బెడ్డింగు, రెండు గోనెసంచులు, సామాను, టాంగా ఎక్కాయి.
మరియమ్మ ఆశ్చర్యంగా కళ్ళు తేలేసి నిలుచుంది నరసింగం వైపుచూస్తూ. “ఇదే ఆఖరి నమస్కారం మళ్ళీ మీ ముఖాలు చూడను!” నరసింగం వదనం కోపంతో ఎ(రబడి పోయింది
'బహూశా ....” ఏదో అనబోయి మళ్ళీ ఆలోచనతో ఊరుకున్నాడు. నరసింగం, ఆ ఎగుడు దిగుడు గతుకుల రోడ్డు నరసింగం జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చి టాంగాలో తీవ్రంగా కుదిపేసింది అతన్ని.
మరియమ్మ నరసింగాన్ని ఆపదల్ప్చుచకోలేదు ధనంలేని నరసింగం ఇంక తమకు పనికిరాడని, నిర్ణయించుకుంది మరియమ్మ ఈ విషయం విజయ అంగీకరించి, మరో
105 అన్వేషణ ఆండకోసం ప్రయత్నంలో ఉంది. అందుకే గతరాత్రి ఇంటికి రాకపోయి ఉండవచ్చునని నిర్దారణ చేసుకుంది మరియమ్మ!
భార్యాభర్తల తగవులు . ఎవ్వుడూ ఇంతే .. మళ్ళీవస్తాడు. . ఎక్కడికి పోతాడు!” సరదాగా రాణివైపు నవ్వింది మరియమ్మ.
చక్కటి అందమైన సీలం వులెన్ సూట్ తొడుక్కుని సిగరెట్టు కాలుస్తూ, ఒంటికి రాసుకున్న సెంటు ఘుమఘుమలు పగిసరాలంతా నింపుతూ కులుకుతూ, హేట్ ఊపుకుంటూ రావు (ప్రవేశించాడు
ఆ ఇంటి పెద్దకు తగు మర్యాద ఇవ్వాలని మరియమ్మకు అతి వినయంగా నమస్మరించాడు రావు రాణి నవ్వుతూ న్వాగతమిచ్చింది.
రాణీ! ఈ వేళ ఘా ఆఫీసుకు సెలవు పెట్టాను!'
రావు మాటళ్తోని అంతరార్ధం పూర్తిగా అవగాహన కాకపోయినా, కొంత చూచాయగా మాత్రం (గ్రహించుకుంది రాణి
“బహుశ! నా ఉద్యోగం గురించి ఏమన్నా ప్రయత్నం... ఆమె మాటలను ఆర్షోక్తిలోనే ఆపేశాడు రావు.
సరిగ్గా నామనస్సులోని ఊహ ఇట్లే తెలుసుకున్నాను .. అందుకే నాకు నీలాంటి వాళ్ళంటే సరదా!” రావు చలాకిగా నవ్వేడు.
“మరి ముందు కార్యక్రమం గురించి మీ సలహా?”
“ఖముంది, , .. నువ్వు శుభ్రంగా ముసాబయి నీ చదువు పత్రాలు సేకదించుకుని నా వెనక రా... సాయంత్రానికి నీకు ఉద్యోగం!
ావుగారిని నేను చాలా రోజుల నుంచి ఎరుగుదును. ఆయన హృదయం వెన్న ఏసుప్రభువులా ఎంతదయ!*” మరియమ్మ అతిమృదువుగా మాట్లాడింది.
ఆమె మాటలకు ప్రతివాదముగా నవ్వడం తన బాధ్యతగా ఎంచాడు రావు.
రాణి గదిలోకి వెళ్ళి ముస్తాభై వచ్చింది. గులాబి రంగు జార్డెటు సిల్కు చీర,.. మోచేతుల వరకూ పసుపురంగు సిల్కుజాకెట్టు మధ్య పాపిడితో బర్మాకొప్పు,... ఎత్తుస్తిప్పర్లు
అన్వేషణ 109 నవనాగరిక నాజూకు వనితలా ప్రత్యక్షమైంది “నిన్ను చూస్తే ఎవరికి ఉద్యోగం ఇవ్వబుద్ది పుట్టదు.. నెనే ఒక కంపెని పెడితే నీలాటి ఆడవాళ్ళకే నా ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చెవాడిని” నీ అందానికి నా అభినందన అన్నట్లు శిరస్సు వంచి, హేట్తీసి, అతి గౌరవంగా ఒక సలాముచేశాడు రావు.
రాణి నవ్వింది. సమ్మోన పరిచచేలా నవ్వింది. రావు ఒక్క నిమిషం ఉద్రేకంతో స్తంభించి వీధివైపు నడిచాడు దారిచూపిస్తూ ఒక చిన్న బేబీకారు వీధిలో నిలుచుంది,
“మనదేనా ఈ కారు?”
“వృనవశంలో ఉన్నంతసేపు ఈ కారు మనదే
ఇద్దరూ నవ్వుకున్నారు.
కారు ఆబిడ్ రోడ్డులో ఒక పెద్ద బంగళా దగ్గర ఆగింది. ఇద్దరూ మేడ ఎక్కారు.
రావు తన పేరు వ్రాసి ఒక చీట్ బంట్రోతుకు అందిచ్చాడు. గది పైన ఉన్న బోర్డులో “రామనరసు పేరు కనిపించింది ఉద్యోగం లభ్యమౌతుందో లేదో అనే అనుమానం పీడిస్తున్నా క్రొత్త వాతావరణం కలుసుకొనబోయే వింత వ్యక్తుల గురించి ఊహలు భయం గొలుపుతున్నా తన అందంలోని శక్తిమీద ఆధారపడి, మనస్సు నిబ్బరపరచుకుని, వేనిటీబేగ్ చేతితో ఆడిస్తూ నిలుచుంది రాణీ.
లోపలికి వెళ్ళ మని బంట్రోతు సంజ్ఞ చేశాడు.
అట్టహాసంగా “హల్లో?” అంటూ అరుస్తూ అతిచనువుగా వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు రావు.
ఒక పెద్ద టేబిలు ఎదురుగా కుర్చీలో నిటాగ్గాకూర్చుని తీవ్రంగా ఆఫీసు కాగితాలు సంతకంచచేస్తూ, రావు ప్రవేశించగానే మందస్మితంగా తలఎత్తి, ఎలక్ట్రిక్ ఫేన్ విసిరేగాలిలో ఎగురుతున్న జుట్టు, ఎర్రచారల టై సరిచేసుకుంటూ, కళ్ళజోడు లోంచి కళ్ళు చికిలించాడు. రాణివైపు ఒక్కనిమిషం తదేకధ్యానంగా చూసి, తన్మయత పరధ్యాన్నంలోనే చూపవలసిన మర్యాద చూపిస్తూ కూర్పోమన్నాడు ఆమెను రామనరసు.
హోయలుగా సోయగంగా కూర్చుని, సునిశితంగా నవ్వింది రాణి.
“మీ గురించి రావు చెప్పాడు!” రామనరసు మొట్టమొదట ప్రారభించాడు సంభాషణ.
110 అన్వేషణ
“ఏం చదువుకున్నారు?”
స్కూలు ఫైనలు!” చేతిలోని సర్టిఫికేటు అందించింది రాణీ రామనరసుకు.
కళ్ళజోడులోంచి పరీక్షగా చూశాడు రామనరసు అ పత్రాలు సంతృప్తిగా నవ్వాడు.
ఆఫీసుపనికి, ఈ సర్టిఫికెట్లకు సహస్ర వ్యత్యాసం ఉంది. అయినా ఇది ఒక మామూలు అయిపోయింది!”
రావు పక పక నవ్వాడు రామనరసుతో. రాణి శ్రుతికల్పింది ఆ నవ్వులో.
ధరామనరసు ఆజ్ఞతో బంట్రోతు మూడు టీ కప్పులు తెచ్చి టేబిలు మీద పెట్టాడు.
“కయన చాలా మంచివాడు. అణుకువగా చెప్పినపని చేస్తే వీిరిలాంటి సహాయకులు జీవితంలో మరొకరు దొరకరు!”
రావు ఒక ప్రత్యేక రీవితో మాటలు విసిరాడు.
“నన్ను గురించి అనవసరంగా ఏదో చెప్పి ఇప్పుడే భయపెట్టకు అమ్మాయిని!” నవ్వేడు రామనరసు.
“మరి .ఎప్పుడు ఉద్యోగంలో చేరడం? రాణికి ప్రతినిధిగా తన విద్యుక్తధర్మం నిర్వహించాడు రావు.
“న్సోమవారం నుంచి ...ఒక గుమస్తా ఉద్యోగం .... ఏమీ కష్టంగా ఉండదు... నెలకు వందరూపాయలు..” ఖులాసాగా సకిలించాడు రామనరసు
సెలవు తీసుకుని రామనరసుకు నమస్కరిస్తూ, రాణి, రావు బేబీ కారులో గృహొన్ముఖులైనారు రాణిని ఇంటి దగ్గర విడిచి రావు నగరంలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ కలుసుకుంటానంటూ.
మధ్యాహ్నాం భోంచేసి విరామంగా కూర్చుంది రాణి విజయ ఇంకా ఇంటికి రాలేదు. మరియమ్మ మనసు పరిపరివిధాల మనస్సులో ఏదో ఆత్రుత పడుతున్నా బాహ్యంగా రాణిముందు ఏమీచెప్పలక పోతోంది. రాణీమాత్రం విజయ ప్రవర్తనలో కొంత రహస్య జీవితం స్ఫుటమౌతున్నట్లు పసికట్టింది. నరసింగం మాటలు మరియమ్మ బాహ్యా జీవితం వెనకాల ఇంకా ఏదో నిగూఢమయిన భూతకాలం దాగున్నదనే సూచనలు వెలి[గ్రక్కాయి. పైకి అమాయకత్వం నటిస్తున్నా జాగ్రత్తగా చుట్టుప్రక్కల వాతావరణంలోని ప్రతి వ్యక్తి మీద ఒక కన్ను ఉంచి, ప్రతి మనిషిని తన ఆశల ఆశయాల సాథల్యానికే
అన్వేషణ కే11 వినియోగించుకోవాలని రాణీ ఆంతర్గతంగా తన కార్యక్రమాలు నిర్జేశించుకొన నిశ్చయించింది
రెడ్డి నమస్కరిస్తూ ఇంట్లో అడుగు పెట్టాదు ఆలోచనల్లొ అతనిరాక గమనించని రాణీని చూసి, మరియమ్మ “పెద్దవాళ్ళు వస్తే మర్యాదగా ఆహ్వానించవద్దూ!” అంటూ కృత్రిమంగా కసిరింది ఖర్చులేని నవ్వులు పెదాలమీద జిమ్మీ ప్రతి నమన్మారం చేసింది రాణీ రెడ్డికి.
గ్
షేర్వాణి సరిచేసుకుంటూ కూర్చున్నాడు రెడ్డి.
“నీ క్రద్య్వోగం గురించి ఆలోచించాను రాణి!!”
రాణీ ముసిముసిగా నవ్వింది.
“దండు రోజులు తర్వాత కనిపించమని ఒక ఆఫీసరు చెవ్వొాడు. ఆయనా నా 'స్నేహితుదేలే! గర్వంగా నవ్వాడు రెడ్డి
“బహుశ తప్పకుండా నీకు ఉద్యోగం దొరుకుతుంది.... ఆ బాధ్యత నాకు వదిలేయి?”
సాలోచనగా ముఖం చిట్లించారు రెడ్డి.
“మీకు ఎక్కువ శ్రమ ఇవ్వదల్పుకోలేదు!” నవ్వింది రాణి.
వినయంగా,
“లుం,... ఎంతమాట. . . . ఇదేం శ్రమ
“ప్రొద్దున్నే రావుగారు వచ్చి ఆబిడ్స్‌లో ఇన్సూరెన్సు కంపెనీలో గుమాస్తా ఉద్యోగం ఇప్పించారు.... ఎల్లుండి నుంచి ఉద్యోగంలో చేరుతున్నాను. . .” రెడ్డి మనస్సు నావ్వకుండా అమాయకంగా ముఖం పెట్టింది రాణి.
“అలాగా... ఆ సంగతి నాకు తెలియదే. . . పోనీ ఏదోవిధంగా నీకు ఉద్యోగం దొరకాలి... బాగుంది . . .౯”” కంగారుగా ముఖాన్ని ఆశాభంగంవల్ల పోసిన చెమటలు తుడుచుకున్నాడు రెడ్డి, తొట్రువాటు సర్దుకుంటూ.
“మంచినీళ్ళు ఇమ్మన్నారా[!” అమాయకంగా అంతర్గత హేళనతో ప్రశ్నించింది రాణీ.
ఆ. . . అక్కర్లదు!”
112 అన్వేషణ
“ఒక ఆరంజిడ్రింకు తెప్పించవే రెడ్డిగారికి.... నరసవ్వా!” మరియమ్మ రీవిగా కేకపెట్టింది వంగిపోయిన నడుంతో ఏదో సణుగుకొంటూ నరసవ్వ ప్రత్యక్షమైంది దొడ్సొంచి వచ్చి మరియమ్మ దగ్గర రెండణాలు తీసికొని వీధిలోకి నడిచింది. అయిదు నిమిషాలలో ఒక ఎర్రరంగు ఫానీయం సీసాతో ప్రవేశించింది.
రెడ్డి కులుకుతూ సరదాగా త్రాగేడదు ఆ పానీయం
“చాలా రుచిగా ఉంది... రాణి చేతులతో ఇవ్వడం వల్ల కాబోలు!” ఓరగా నవ్వాడు
“ఏమండీ!... అంత అందంగా ఆడవాళ్ళకు పోటీగా ముఖం సింగారించుకుంటే ఎలాగండీ!” రాణీ హేళన చేసింది
“ఏం . . . ముఖానికి పొడరైనా ఎప్పుడూ రాసుకోను” జేబు రుమాలుతో పెదాలు తుడుచుకున్నాడు రెడ్డి.
“ష్సైూద్రరు కాదు ... పెదాలకు ఎర్రరంగు వేసుకున్నారు.... పకపక నవ్వింది రాణి.
జేబురుమాలుతో పెదాలు తుడుచుకున్నాడు రెడ్డి సిగ్గుపడుతూ పెదాలకు అంటుకున్న ఆ ఎర్రంగు జేబు రుమాలుమీద రక్తపు చారల్లా వ్యాపించింది. ఎంత తుడుచుకున్నా పెదాల ఎర్రరంగు పోలేదు.
“ఆ ముసలిదానితో ఏ పని చెప్పినా ఇంతే! చౌకరకం తెస్తుంది.” మరియమ్మ దానిపైన కోపం చూపించింది. రెడ్డి ఈ సంఘటన అవమానంగా భావించకుండా ప్రస్తావన మార్చాడు, విజయ ఏదీ?
“ఎవరో స్నేహితుల ఇంటికి వెళ్ళింది!” మరియమ్మ తక్షణం సమాధానం ఇచ్చింది. రాణీ ఏమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా.
_ ఆ రోజుతనకు శుభంగా లేదని నిర్ణయించుకున్నాడు రెడ్డి. మళ్ళీ కలుపుకుంటా నంటూ లేచి వీధిలోకి నిష్క్రమించాడు.
మరియమ్మ బైబిలుగ్రంధం తీసి కళ్ళజోడు నవరించుకుంటూ ఉచ్చ్వాస నిశ్వాసాలలో ఆ (గ్రంధం సారాంశం మనస్సుకు పడుతున్నట్లు కనిపిస్తూ తీవ్రంగా చదవసాగింది, అలమరులో ఉన్న డిట్టెకివ్ నవల “పార్కులో హత్య” తీసి చదవడం మొదలెట్టింది రాణి.
అన్వేషణ శేశే8ి
కథా సంవిధానంలో పాత్రల నడకలో నవల బిగువుగా నడిచింది. చదివేటప్పటికి సాయంత్రమైంది ఆ పుస్తకం చదివేక ఒంటరిగా షికారుకు పార్కుకు వెడితే అందులోని భయంకర సంఘటనలే జ్ఞప్తికి వస్తుంటాయి. నవ్వుకుంది రాణి. పచ్చటిమైదానాలలో సుందరమైన విరామస్థలాలను హత్యలగ్భహంగా మార్చిన రచయిత పోకడగురించి.
మరియమ్మ వంటప్రయత్నం చేయాలని లేచింది బైబిలు చదువుతూ గుమ్మంలో ఏదైనా అలికిదైతే విజయ వచ్చిందేమో అని ఆసక్తిగా ఒక నిమిషం చూసేది. నాయంకాలమైనా విజయ జాడతెలియక పోవడం మరియమ్మ గుండెలో వదో భయం కలిగించింది నెత్తురులిని కమిలిన వదనంతో దిగులుగా తలపంచుకుని వంటింట్లోకి నడిచింది ముభావంగా ఉన్న మరియమ్మ, రాణులనుచూసి, నరనవ్వ తన వృత్తి నిర్వర్తించి నిష్మమించింది.
రాణి మేడమీదకు వెళ్ళింది నరసింగం ఉండే గది గోళ్ళెం ఊడదీసింది. ఒక పాతకుర్చీ, సులకమంచం, చెదిరిన చిత్తుకాగితాలు చూరుల్లో బూజులు, నేలమీద దుమ్ము ఆ గది అసహ్యంగా ఉంది ఆ గదికి ఆనుకుని ఉన్న మరొక చికటిగది గోడలమసితో వికృతంగా భయంకరంగా హత్యల గృహంలా గోచరించింది. డిటెక్సివ్ నవల మనస్సులో తిరిగి కదిలింది ఎవరో పిస్టలు పుచ్చుకుని వెనుక నుంచునిచేతు లెత్తమని అరచినట్లు బయపడింది. వెనక్కి తిరిగి తల భ్రాంతికి తనే నవ్వుకుంది రాణి. గది గొళ్ళేంవేసి క్రిందవరందడాలోకి వచ్చింది.
వంటింటోంచి కూర మసాలవేపుడు గుమ్మున నాసికారంధ్రాల్లోకి వాసనలు చొనిపింది. నోరూర్చుకుంటూ చంటిపిల్లలా వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది రాణి మరియమ్మ మౌనంగా నవ్వింది ఆ నవ్వు వెనకాల విచారరిఖలు దాగొన్నట్లు కొంతవరకు స్పష్టంగా తెలునోంది.
“విజయ ఇంకా రాలేదే!”
“ఏ స్నేహితురాలింట్లోనో ఇష్టమొచ్చినట్లు ఇలాగే గడుపు తూంటుంది. ఇంటి దగ్గర తల్లిఒకర్తె ఉందని జ్ఞానమైనా పట్టించుకోదు. ఏంచేసేది. .. వస్తుంది... ఈ రాత్రో? రేపో” చికాకుపడింది మరియమ్మ,
“ఫైన గదిలో గలీజుగా ఉంది!”
“ర్రేపు నరసవ్వచేత, శుభ్రం చేయించు. .. ఆయన రాజాలా వసాడు. . . పోతాడు అద్దె మనం ఇచ్చుకోవాలి!” నరసింగం పైన దాడి చేసింది మరియమ్మ.
క్షైషేశ అన్వెషణ
బైబిలు మధ్యాహ్నం తాను చదివిన నీతివాక్యాలు రాణిముందు పునరుద్దాటీంచింది మరియమ్మ ప్రతి మనిషికి తల్లి (ప్రేమ, మంచి హృదయం చాలా అవసరమసి వక్కాణించింది, ఆమెగంభీరంగా ఎక్కువ మరేమీ సంభాషణలు లేకుండా మరియమ్మ, రాణి, మంచాల మీద ఒరిగారు భోజనం పూర్తిచేసి, రాణికి త్వరలో నిద్రపట్టింది మరియమ్మ అర్ధరాత్రి వరకు విజయ వస్తుందనే ఆశతో, మేల్కొని, మంచంమీద దొర్లుతూ చివరకు చికాకుగా అలసటతో కన్నుమూసింది.
మరియమ్మ ప్రాతఃకాలంకాగానే లెచి బద్దకంగా ఇంకా నిద్రలో కమ్మని కలలు కంటూన్న రాణిని లేపింది రక్షణచూపిన మరియమ్మ ఆజ్ఞలు కొంతకాలం అణుకువతో పాలించవలసిన అగత్యం ఎంతో వుంది అని నమ్మింది రాణి.
“ చర్చికి వెళ్ళాలి , = = త్వరగా తయారవ్వు!”
రాణి కొంచెం ఆశ్చర్యపోయినా పరిసరాల కనుగుణ్యంగా ప్రవర్తన మార్చుకోవడం ముఖ్యమనుకుంది. కాలకృత్యాలు తీర్చుకుని! ఒక చిన్న నల్లపూసల హారం మెళ్ళో వేసుకుని, తెల్లబీర, తెల్ల జూకట్టు తొడుక్కుని నిరాడంబరంగా తయారైంది. బైబీలు గ్రంధం హస్తంలో పదిలపరచుకొని, ఆకుపచ్చ సిల్కు చిర ధరించి, కళ్ళజోడు పెట్టుకుని, గాంభీర్యం అభినయిసూ వక్రంగా నవ్వింది మరియమ్మ తన్ను అనుసరించమని ఇద్దరూ రిక్షా ఎక్కారు అబిడ్స్ రోడ్డులోని క్రైస్తవ ఆలయంముందు ఆగింది రిక్షా. చర్చి ప్రాకారంలోని మొక్కలతోపు మధ్య బాట మానవుడి పరిసరాలలోని పాపభూయిష్ట వాతాశరణాన్ని ఛేదిస్తూ దైవ సన్నిధికి ఆహ్వానించే మార్గంలా అగుపించింది. చర్చిపై కోణాకార గోపురాలు ఆకాశం నుంచి దైవశక్తిని అందుకుంటున్నట్టున్నాయి.
దైవాన్ని నమ్మి ఆయన రక్షణ పొందమనే సూక్తులు చర్చి గోడల మీద వ్రాయబడియున్నాయి. ఏసుక్రీస్తు వధ్యశిల చిహ్నం నిగనిగలాడుతూ దక్షిణాన గోడకు వేలాడుతోంది. హాలు ఎదురుగా ఉన్న వేదిక మీద ఎర్ర రంగు కర్టెను గాలికి కొద్దిగా ఊగుతూ అందమైన బేక్ గ్రౌండ్ ఏర్పడింది.
ప్రార్దనలు ప్రారంభమయ్యాయి. ఒక తెల్లటి అజానుబాహునైన వ్యక్తి పోడుగాటి గెడ్డంతో, కళ్ళజోడుతో తెల్లటి పొడుగు గౌనుతో బైబిలు [గ్రంధం పుచ్చుకొని వేదిక ఎక్కాడు, అతన్ని మరోయిద్దరు అనుసరించారు బైబిలు తీసి వ్యక్తిశీలాన్ని పటుత్వంగా నిర్మించుకోవలసిన అగత్యం గురించి ఇంగ్లీషులో ఉపన్యపించాడు. మరొకతను తెలుగులో అనువాదం చేశాడు. ఇంకొకరు హర్మోనియం వాయిస్తూ ఏసుప్రభువు మీద గీతాలు
అన్వేషణ శే వేడ్ ఆలపించారు. ప్రారామందిరంలోని (ప్రేక్షకులలో అంతా మోకాళ్ళు మీద ఒరిగి ఏసుప్రభువుకు జీవితాలు అంకితం చేస్తున్నట్లు వినమ్ర శిరస్ములయ్యారు.
ప్రార్ధనల అనంతరం మరియమ్మను కొందరు నవనాగరిక స్త్రీలు పలకరించారు. తమ దూరపు బంధువని రాజిని పరిచయము చేసింది వారందరికీ.
వ్రార్దనల పద్ధతి అంతా విచిత్రంగా ఉంది రాణికి అలవాటు లేని ఆ పద్ధతులను ఇతరుల తన్ను అనుమానించకుండా జాగ్రత్తగా అవలంబించి మరియమ్మతో కలిసి చర్చిబైటకు వచ్చేసింది రాణి
మధ్యాహ్నం మరియమ్మ ఒంటరిగా నగరంలోకి వెళ్ళి సాయంత్రం నాల్గు గంటలకు తిరిగి వచ్చేసింది. మనస్సులో ఏదో నిగూఢంగా దాచుకుని బాధపడుతున్నట్లు ఆమె వదనంలో స్పష్టంగా అగుపించింది రాణికి. వజయ ఆనాడు కూడ ఇంటికి రాకపోవడం రాణికి కూడా చాలా ఆచ్చర్యం కలిగించింది.
నాయంత్రం రావు ఒక్కడే కులసాగా వచ్చాడు. వియజను గురించి ముందు ప్రస్తావించి, తర్వాత రాణితో కులాసాగా కబుర్లు చెప్పి, చివరకు మరియమ్మను ఒప్పించి రాణీతో సినిమాకు బయలు దేరాడు రావు ఉద్యోగం ఇప్పించిన రావుతో కొంత స్నేహం చేసి, కృతజ్ఞత చూపడం తన విధ్యుక్తధర్మం అనుకుంది రాణి.
నాలుగు ఫర్లాంగులు నడిచి సినిమాలో ప్రవేశించారు వదిలి వేసిన భర్తను అన్వేషించుకుంటూ గగ్రామంనడిచి పట్టణంలో అడుగు పెట్టి బాధలు అనుభవించి, సంఘం దు(ప్పవర్తనలు ఎదుర్శొని చివరకు సుఖాంతమైన ఒక యవ్వనిగాధ మధురమైన పాటలతో, అందమైన దృశ్యాలతో, అలరించే హాస్యంతో సినిమా రక్తిమయం గానే ఉంది. సినిమా మధ్యలో యధోచితమైన మర్యాదలు జరిపొడు రాణికి కొఫీ అందిస్తూ రావు. పట్టలేని నవ్వు వచ్చే పరిస్థితులు నెపంగా రాణి శరీదానికి పన్నిహితంగా జరిగాడు రావును ప్రవర్తన ద్వారానే రాణి మందలించింది. సినిమా పూర్తయ్యాక విడిపోయి మౌనంగానే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు రాణి, రావు.
మర్షారు ఆఫీసులోని గుమాస్తా ఉద్యోగంలో ప్రవేశించింది రాణి, ఆఫీసులోని గుమస్తాలందరు ఒక నిమిషం కలం, కాగితాలు మేజూ మీద ఒదిలేసి ఆమెను చూస్తూ తన్మయతలో పని మాసేసి సమ్మె చేసినట్టు కనిపించారు. తిరిగి తేరుకొని, పనులు (ప్రారంభించారు. అలసిపోయినపుడు ఏదో నెపం పెట్టుకుని రాణిని పలకరించడం మొదలు పెట్టారు గమాస్తాలంతా.
116 అన్వెషణ
ఆఫీసులోని హెడ్ గుమాస్తా రాఘవరావు అతి మర్యాదగా రాణిని పిలిచి చెయ్యవలసిన పనులు విపులీకరించి చెవ్సాడు పురుష వాతావరణం మధ్య ఒక అందమైన స్రీ పనిచేసేటప్పుడు వచ్చే ఆకస్మి సాధక బాధకాలు ఒక సినిమాలా చిత్రించి, మ కష్టంలోనైనా సరే తన్ను అన్నగారిలా నమ్ముకుని తగిన సహాయం ఫొంది బాగుపదమనీ హితబోధచేశాడు రాఘవరావు ఎత్తుపళ్ళతో, నల్లని ముఖంతో మాసిన బట్టలతో, పీల్చే సిగరెట్లు వాసనతో అసహ్యకరంగా కనిపించినా రాఘవరావు హృదయంలో స్రిలపట్ల సానుభూతి, దయనిండిఉన్నట్లు తెలుసుకొని రాణి సంతోషించింది.
మధ్యాహ్నం ఫలహార సమయానికి ఆఫిసులోని ఉద్యోగులందరి దగ్గర నుంచి తనతో కలసి భోజనం చెయ్యవచ్చని ఒకేసారి ఆహ్వానాలు వచ్చాయి అందరి ఆహ్వానాలు ఒకేసారి స్వీకరించడం అసంభవం కనుక ఒంటరిగానే తాను ఫలహారం చెయ్యడం సముచితమని నిర్ణయించుకుంది రాణి, మధ్యలో రామనరుసు ఏదో పని ఇస్తూ కులుకుతూ నవ్వినా, అమాయకంగా, పని తెలుసుకునే ఆసక్తి ముఖంతో ముభావంగా మాటాడి, తన పనిలో నిమగ్నమైపోయేది రాణి సాయంత్రం గుమాస్తాలందరూ ఆఫీసు బయటకి వచ్చేస్తూ ఆమె ఎక్కడ నివసిస్తున్నది, ఏవిధంగా ఆఫీసుకు రాగలుగుతున్నది మొదలైన విషయాలు సమంగా తెలుసుకొని ఆప్తల్లా అభినయించారు. రాఘవ రావు ఆమెను అనుసరించి బస్సు ఎక్కించి, సంతృప్తితో తలవంచుకుని గృహొన్ముకుడయాడు.
రాణి సాయంత్రం ఇంటికి రాగానే మరియమ్మ శోకంతో ఏకాంతంగా మంచం మీద పడుకొని ఉంది. రాణిని చూసి మరి వెక్కి వెక్కి ఎద్బింది. ఆఫీసులోని తన అనుభవాలు సరదాగా మరియమ్మకు చెబుదామని తహతహలాడుతూ వచ్చిన రాణికి అ పరిస్థితి నిరాశ కలిగించినా, నిజం తెలుసుకోవాలనే ఆసిక్తితో మరియమ్మను పలకరించింది.
“విజయ నన్ను విడిచివెళ్ళిపోయింది!” వాలిపోయిన ముఖాన్ని తలగడలో దాచుకుంది మరియమ్మ ఐడుస్తూ,.
రాణి ఆశ్చర్యంతో నిస్తబ్బరాలైందినాక నిముషం, కారణమడిగింది.
- ఏమో. . . ఎందుకు వెళ్ళిపోయిందో . . . ఎవరితోనో విజయ నిన్న బొంబాయిరైలు ఎక్కడం ఆమె స్నేహితులు చూసి నాతో చెప్పారు. ఎంతో కాలం నుంచి ఆప్యాయంగా "పెంచి పెద్ద జెసినందుకు చివరకు ఈ విధంగా కృతజ్ఞత చూపింది . . . నాకున్న మమకారం దానికెలా ఉంటుంది?” మరియమ్మ మరీ చంటిపిల్లలా ఏడ్పుహెచ్చింది.
అన్వేషణ 117
మరియమ్మ మాటల్లో విజయ కన్నకూతురు కాదేమోనని అనుమానం స్పురించింది రాణికి. అయినా తానంతటతానే ఆ విషయంలోని రహస్యం అడగడం అనుచితమని ఊరుకుంది రాణి
“ఇంతకాలం ఈ ముసలిదాని జీవితం ఎలాగో గడిచి పోయింది. . . ఇంక నాకు దిక్కెవ్వరు ...?” జుట్టు విరబోసుకొని తల మీద చెయ్యివేసుకొని శోకం దీర్హాలుగా మార్చింది మరియమ్మ.
మరియమ్మ పరిస్థితీ ఒక విధంగా సానుభూతి కలిగిస్తున్నా మరొవిధంగా హాన్యాస్పందం కూడ ఉంది. వచ్చె నవ్వు ఆపుకుంటూ వదనం తీవ్రంగా మార్చింది రాణి.
“నేను ఉన్నా కదమ్మా, . . ఏదో ఉద్యోగం దొరికింది ఇద్దరం బ్రతకలేకపోతామా...!” రాణి ఊరదించింది.
“అవుననుకో . . .నువ్వు మంచిదానవు కనుక అలా అన్నావు...లేకపోతే ఈ ముసలితనంలో నాగతి ఏమయ్యేది?...” ముక్కు కళ్ళు కొంగుతో తుడుచుకుని మరియమ్మ శోకాన్ని బలవంతంగా స్తంభింపచచేసుకొని రాణిని దగ్గరకు తీసుకుని అప్యాయంగా ఒళ్ళు నిమిరి “ఇక నుంచి నిన్న నా కూతురుగా నమ్ముకుంటున్నాను!” అంటూ అనుమానంతో, బాధతో, కృత్రిమ నవ్వుతో విచిత్రంగా రాణి వైపు చూసింది మరియమ్మ,
ఆ సన్నివేశాన్నికి మించి మరే విషయం విజయగురించి రాణికి చెప్పలేదు మరియమ్మ. కాని ఏదో నిజం తన దగ్గర నుంచి దాస్తోందని మాత్రం రాణి (గ్రహించకలిగింది.
కుర్చీలో వార్తాపత్రిక పడిఉంది. ఆఫీసు దుస్తులు మార్చుకొని విరామంగా కుర్చీలో కూర్చొని వార్తాపత్రిక చదివింది రాణి. . . “పార్కులో హత్య” వార్త రాణిని ఆశ్చర్యంలో ముంచింది. ,. చదివింది. . . ఏదో శవం మూసీనది పార్కుఒడ్డు చెట్లతోపులో కనిపించిందనీ. ఆ శవం ఎవరిదో నిర్ణయించలేక పోలీసులు విచారణ జరుపుతున్నారని వార్తాపత్రిక చదువుతున్న రాణి వైపు భయంగా మరియమ్మ ఒక నిమిషం చూసి, వార్తాపత్రిక చేతుల్లోంచి లాక్కొని ఆఫీసు విషయాల ప్రసక్తి కదిపింది మరియమ్మ.
భోజనానంతరం మౌనంగా మరియమ్మ, రాణి విడివిడిగా మంచాల మీధ పడుకున్నారు.
118 అన్వేషణ
విజయ లేకపోయినా, తమ భుక్తికి లోటురాకుండా రాణికి ఉద్యోగం దొరకడం, ఆమె తనతోనే ఉంటానని వాగ్ధానం చెయ్యడం మరియమ్మకు మనస్సులో కొంత సంతృప్తి కలిగించింది. రాణికి తన జీవితం పూర్తిగా తెలియజెపితే ఆమె మనస్సు మార్చుకుని తనకు దూరమైపోగలదేమోననే భయం మరియమ్మను పీడించసాగింది అయినా రాణి మనస్తత్వం పూర్తిగా గ్రహించకుండా జీవిత పద్దతిగూర్చి తాను సలహాలుగూడ ఇవ్వడం శ్రేయస్కరంగా కనిపింలేదు ఆమెకు పరిస్థితి జాగ్రత్తగా పరిశీలించి. రాణి మనస్సును వశవర్చుకుని, తన ప్రణాళికలు క్రమంగా అమలు పరుచచుకోవాలనే సహజబుడ్ది పోగొట్టుకోలేక పోయింది మరియమ్మ.
విజయ ఎవరితోనో లేచిపోవడంతో ఆ గృహంలో సంపాదన పరురాలిగా, ఒక హోదాతో తనే పెద్ద అయినట్లు స్టిరమైంది రాణికి. తనమీద భుక్తికీ ఆధారపడి మరియమ్మకు తల్లిగానే ఒక స్థానం ఇచ్చి. ఒక కుటుంబస్తాయి కలిగించుకుని, కుటుంబ సంప్రదాయాల విలువలపై మక్కువచూపే సంఘంతో మంచి చేసుకుని ఒక నిర్ణీత ప్రణాళికతో జీవితాన్ని ఒక ఉన్నత పదవిలోకి తీసుకుపోవాలనే కోరిక రాణికి ప్రబలంగా ఆవేశించింది జీవితంలోని ప్రధమ పాదంలోనే ఉద్రేకాల తెలివితక్కువలో జరిగిన సంఘటనలు జీవితాన్ని (ప్రమాదకరంగా మార్చేసినా, ప్రమాదాలు ఎదుర్కోవలసిన ధైర్యసాహనాలుకూడ ప్రతి నిమిషం హృదయంలో ప్రజ్వలింప చెయ్యడం భావిజీవితంతో ఏ లక్ష్య సాధనకైనా ప్రాతిపదికగా ఉపయోగించగలదని రాణీ సంతోషించింది.
మరియమ్మ ఆలోచనలు, రాణి ఆశలూ విభిన్న దృక్పధాలతో వారి మనస్సులో మెలిగాయి, ఎసుప్రభువు బొమ్మ కెదురుగా నిలుచున్న గుండ్రని టేబిలుమీద వెలుగుతున్న క్రావ్వాత్తి, గాలిలో ఊగుతూ, చీకటిలో వెలుగుతూ. శ్రమకు క్రుంగుతూ, పరిమితమైన వాతావరణంలో తన్ను నమ్ముకుని, ఇల్లు అవ్పగించి, నిదురించే వ్యక్తులకు రక్షణగానిలుచుని, తన విద్యుక్త ధర్మం నిర్వహించసాగింది.
అన్వేషణ 119
మనోవ్యాకులతో శుష్కించి నిస్పృహ నిరాశలు ప్రతిబింబిస్తూ చిట్లించిన ముఖంతో, తనయింటి మేడ ఎక్కాడు శివరాం, ప్రొద్దున్నె నాధారణంగా ఇంటి యజమాని ఉదయం తన గదిముందు వరండాలోకి వచ్చి కూర్చునే అలవాటున్నా, ఆ రోజు రాకపోవడంవల్ల, తానే స్వయంగా మేడమీదకు ధైర్యం చేసుకుని అడుగుపెట్టాడు శివరాం. ముఖ ప్రక్షాళణనానంతరం బద్దకంగా చుట్టముట్టించి మేడవరండాలో పచారు చేస్తున్న ఇంటి యజమాని తనంత తానుగా పైకివచ్చిన శివరాంనుచూసి కొంచెం ఆశ్చర్యపోయాడు అతనిరాక గమనించి రత్నం కోడలు సంతోషంగా ముఖం వికసింప చేసుకుంది.
మర్యాదగా ఆహ్వానించి ఇంటి యాజమాని శివరాంకు కుర్చీచూపించాడు.
శివరాం బాధగా మౌనంగా నిలుచున్నాడు. “నాతో ఏమన్నా జరూరు పనుంధా?” ఇంటి యజమాని అభిమానంగా అడిగాడు.
“పనేమీలేదు” ఇంక ఏపనీ మీకు ఇవ్వదల్భుచకోలేదు. . . మీరు ఇంతవరకు చూపిన ఆదరణ మరచిపోలేను. . . ఆఖరుసారిగా మీ దగ్గర సెలవుతీసుకోవాలని వచ్చాను” శివరాం హృదయంలో ఉబకి వస్తున్న భగ్న జీవితపు ఆవేదన అణచుకుంటూ ముఖం దించుకున్నాడు.
ఆ ఇంటి యజమాని తృటిలో అతని పరిస్టితి కొంత అవగాహన చేసుకొని, బలవంతంగా అతని భుజాలు వంచి కుర్చీలో తాపీగా కూర్చోపెట్టాడు.
“మీకు ఇప్పటికే ఎంతో సొమ్ము ఇవ్వాలి . . . అది ఈ ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల్లో ఇవ్వగలనో లేనో అనే భయం నాకే కల్గుతోంది... ఈ వాతావరణం మార్చుకుని మరో
1ఏ౮ అన్వేషణ ఉద్యోగం చూసుకోగలిగితే మీ బుణం లీర్చుకునే శక్తి కల్గుతుంది. ” ఇంకా ఏదో చెప్పబోయే శివరాంను మధ్యలో ఆపేశాను ఆ ఇంటి యజమాని నవ్వుతూ “ఈ చిన్న విషయం గురించి ఇంత బాధ ఎందుకండి! . , . ఎవరికైనా వస్తాయి కఖైలు” సానుభూతిగా భుజం తట్టాడు ఆ ఇంటి యజమాని,
“టొంబాయి పోవాలని నిశ్చయించుకున్నా”? అన్నాడు శివరాం.
ఆ ఇంటి యజమాని శివరాంలోని అమాయకత్వం గమనించి గట్టిగా నవ్వేవాడు, రత్నం (ప్రకృనేవుండి పొంచి వింటోంది
ఇంటి యాజమాని నవ్వు శివరాంను హేళన చేసినట్ట్లనిపించింది బొంబాయి నగరంకు తనలాంటి మనిషి జీవితం క్రొత్తగా ప్రారంభించటం మరింత దుస్పాధ్యమనే అభిప్రాయంతో ఆ ఇంటి యజమాని నవ్వదనిమాత్రం శివరాం అర్దం చేసుకోలేకపోయాడు. హృదయంలో అవమానాల మధ్య ఉబుకుతున్న కరుడుగట్టిన ధైర్యం, ఆశ, ఆధారంగా అనుకున్న ప్రకారం జరిగి తీరాలనే పట్టుదల పట్టాడు శివరాం.
ఈవేళ సాయంత్రం బొంబాయివెడుతున్నా. . . మీకు అభ్యంతరం లేకపోతే .... మీ నామ్ము ఎక్కడున్నా తీర్చుకుంటాననే ప్రతిజ్ఞ చేస్తున్నా. . . నా నిజాయితీ మీద నమ్మకం మాత్రం ఉంచమని బిందువులు కోరుతున్నా” ఆవేదనవల్ల కన్నీటి ఉబికి నిలుచున్నాయి.
“వోనీ. . . ఈ ఊళ్ళోనే , . . మరేదైనా ఉద్యోగం. .
=క్పదరదు . ,. అనుమానాలతో పరిహసిస్తున్న జనం దొంగతనం కేసు పోలిసుల గస్తీలు . . బీదరికం. . . త్రాడు బొంగరం లేని జీవితం . .. ఇక్కడ ఎన్నాళ్ళు అవ్యక్తమైన బాధతో ఒక నిట్టూర్పు విడిచాడు శివరాం.
“వ్పీర్రు మరో చోటికిపోయి జీవితం బాగుచేసుకుంటానంటే ఎవరు ఆద్డు పెట్టగలరు? మీ బుణంగురించి ఏమీ విచారించకండి!”” నవ్వాడు ఆ ఇంటి యజమాని
మౌనంగా లేచి, గిరుక్కున తిరిగి, గబగబ మేడమెట్లు దిగాడు శివరాం. అతని ప్రవర్తన చూసి ఆ ఇంటి యజమాని ఆతని భార్య కూడ చాల బాధపడ్డారు.
“పాపం! . . . చేతిలో ఏమన్నా డబ్బుందోలేదో . . . బొంబాయి పోతానంటాడమిటి. . . పోనీ మనం ఒక పాతికరూపాయలు చేతికిస్తే మంచితనం ఎప్పటికైనా ప్రతిఫలం పొందుతుంది!” రత్నం కోడలు భర్తళొ సంప్రదించింది. భార్యసలహా ఉదారుడైన ఇంటి
అన్వేషణ [121 యజమానికి నచ్చింది డబ్బు ఇద్దామని క్రిందకు వెళ్ళినా శివరాం కనిపిచలేదు. గదితాళం వేసి ఉంది మళ్ళీ అతను తిరిగి రాగలడనే ఆశతో తాను ఇంట్లో లేకపోయినా అనుకున్న ప్రకారం డబ్బు ఇమ్మని భార్యకు సలహా ఇచ్చాడు అ ఇంటి యజమాని.
శివరాం ఆప్పదైన రాజురావును ఒకసారి కలుసుకోవాలని హైద్రాబాదు నగరంలోకి వెళ్ళాడు ఇల్లు తెలియక పోయినా తెలిసిన చిరునామా ప్రకారం రాజారావు ఇల్లు పరిశోధించి పట్టుకున్నాడు. ఊరినుంచి వచ్చిన రాజారావు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయాడని ఇంట్లోంచి వచ్చింది వార్త. నిరాశతో ఒక చీటీవ్రాసి ఇంట్లో వదలి వెనుతిరిగాడు శివరాం.
మధ్యాహ్నాం పన్నెండు గంటలైంది. కడుపులో ఆకలి దహిస్తోంది సూర్యుని ఎండవేడి తీవ్రతలా. జేబులోని కొద్ది సొమ్ము బస్సు రవాణాకు మాత్రమే ఉపయోగించేలా వుంది. రాజారావు కనిపిస్తే నోరుతెరచి ఏమన్నాడబ్బు అడగాలని ఆశించాడు శివరాం. కష్టాలు పరంపరలుగా తన జీవితంలో చుట్టముట్టడం మామూలు సంప్రదాయంలాగే కనిపించింది. వీధుల్లో తిరగడం ఇష్టం లేకపోయింది తన చీకటి గదిలో ఒంటరిగా ఏడుస్తూ పడుకోవటమే హృదయబాధకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని గృహోన్ముఖు దయ్యాడు శివరాం.
తిన్నగా గదిలోకిపోయి తలుపులు మూసుకుని ప్రక్క్మమీద వరున్నాడు. ఒక్కొక్క ఆబాగ్యుడి భగ్న జీవితం పద్మ వ్యూహంలా ఆవరిస్తుంది. ఆ వ్యూహాన్ని భేదించలేక సాలిగూడులో చిక్కుకున్న పురుగులా హతమైపోతాడు అతను. సాహసయా(త్రలో నూతన చైతన్యంతో క్రొత్త జీవితాలు దిద్దుకోవలసిన ఆధునిక యువకుల కర్తవ్యము (ప్రస్పుటంగా చాటుదామని ధైర్యంగా బయలు దేరిన తనకే యాత్ర ప్రధమ పాదంలోనే ముప్పువాటిన్లింది. బ్రహ్మయ్యతాత ఉన్న ఊళ్ళోనే బ్రతకమని ఇచ్చిన సలహాలో కొంత సత్యం, దూరదృష్టి ఉన్నాయేమో అనే భ్రాంతిలో పడ్డాడు శివరాం. లక్ష్యసాధన కరతలా మలకమయి విజయులైనవారు అభినందనీయులే. లక్ష్య సాధనలో ప్రబలమైన నిరోధశక్తుల నెదుర్కొని నశించిన వారు కూడ ఒక విధంగా తమ ధైర్యసాహసాలకు అభినందనీయులొతారు ఈ రెండవ తెగకైనా తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాడు శివరాం.
ఆవేదనలో బాధలో నిరాశలో నిస్పృహలో శోకం ఉబికింది అతనికి. వడ్చ్డాడు. మనసార ఏద్బాడు. తలగడ తడసింది. తడిపిన తలగడలో చెమ్మగిల్లిన కళ్ళు దాచుకున్నాడు శివరాం. కిటికీలు మూసిన గది. మసక వెలుతురులో మందకొడిగా కనిపించింది.
క్షే2ై2ై అన్వెషణ తలుపు చప్తుడయింది.
శివరాం ని(ద్రపోతున్నట్లు నటించాడు.
మళ్ళీ చప్పుడయింది.
తలుపు బయటనుంచి మాటలేదు.
బహుశా ఆ ఇంటి కోడలు కాదనుకొని తలుపు తీశాడు శివరాం.
రత్నం కోడలు నిలుచుంది దీనంగా ముఖంపెట్టి.
'వెళ్ళిపోతున్నారా!” ముఖం వెనుకకు త్రిప్పేసుకుంది.
తన బాధలు గుర్తించకుండా మనస్తత్వాన్ని అర్ధం చేసుకోకుండా తనకు మానసిక ఆనందానికి అవకాశం లేనపుడు ఆమె తన విచిత్ర ప్రవర్తనతో ఇస్తున్న దర్శనం శివరాంకు కోపంకూడ తెప్పించింది. తన గొడవలోనే మునిగి, ఇతరుల మనస్తత్వాలు అర్ధం చేసుకోని కరినులచే ఆకర్షింపబడటం దుర్విధి అని దురపిల్లింది రత్నం కోడలు.
“ఈ నొమ్ము మీ కిమ్మన్నారు!? పాతిక రూపాయలతో ఉన్న కవరు శివరాం గదిలో విసిరేసి గబగబ మేడమీదికి పోయింది ఇ ఇంటి కోడలు.
ఆమె ప్రవర్తనకు అంత బాధలోనూ జాలికలిగింది శివరాంకు ఏదో నెరంచెసి పశ్వాత్తాపడిన వానిలా బాధతో క్రుంగిపోయాడు శివరాం,
వీధిలో కారు ఆగింది. రాజారావు సిగరెట్టు పీలుసూ తుఫానులా రివ్వున నడుస్తూ ఆనందంగా ఇంట్లో ఆడుగు పెట్టాడు.
“వమీ స్వామీ! సంతోషవార్త! . . . నువ్వే నేరం చెయ్యలేదు! గబగబ వచ్చి శివరాంను కౌగలించుకున్నాడు రాజారావు!
'మరో సంతోషవార్త మిత్రమా! . . . రాజారావు తనవంశాన్ని ఉద్దరించాడు. భావిభారతవీరులలో ఒకణ్సిసృష్టించాడు...” చక్రవర్తి పకపక నవ్వుతూ, చప్పట్లు కొడుతూ “భారతదేశం జిందాబాద్” అంటూ అరిచాడు.
ఆఫీసులో శివరాంను కలుసుకోవాలని రాజారావు వెళ్ళాడు. వెయ్యిరూపాయలు దొంగతనం డైరెక్టరు దగ్గిర పనిచేస్తున్న బంట్రోతు చేశాడనీ పోలీసులు నిర్ధారణచేసి, అతడిని జైలులో పెట్టారు. గుమాస్తాలంతా శివరాంపై అపారమైన ఆదరణ చూపిస్తూ
అన్వేషణ 123 మాట్లాడుకుంటూ శివరాం ఎదురుగా లేకపోవడంవల్ల పొంగిపొర్లుతున్న తమ అభిమానం వృధాఅయిపోతూందే అని విచారిస్తున్నారు. రాజారావును చూచి గుమాస్తాలు అతన్ని చుట్టుముట్టి తమ సానుభూతి వాక్యాలతో అతన్ని ముంచేశారు వాళ్ళను విదిలించుకుని, చక్రవర్తిని తీసుకొని ఒక టాక్సీమాట్లాడి ఎగిరిపడ్డాడా ఇంట్లో రాజారావు.
“ఈవేళ బొంబాయి పోవాలనుకొని నిశ్చయించుకొన్నా. నువ్వు మీ ఇంటిదగ్గర లేవు . . . నిరాశతో వచ్చేశా!. ..
“నిన్ననే అత్తవారింటినుంచి వచ్చా. ..ప్రొద్దున్నే నేను ఎరుగున్న ఒక ఆఫీసరు ఢిల్లీనుంచి వస్తుంటే కలుసుకుందామని విమానాశ్రయానికి వెళ్ళా. . .” రాజారావు విషయాన్ని పూరించాడు.
“అయితే బొంబాయి వెళ్ళివచ్చేశావన్నమాట రాజారావు కనిపించలేదని!” నవ్వాడు చక్రవర్తి రాజారావు వినని మాట జ్ఞప్తికి తెస్తూ!
“బొంబాయి ఎందుకు?” ప్రశ్నించాడు రాజారావు.
శివరాం పేలవంగా నవ్వాడు.
'ఎప్పుడూ అంత నిరాశగా ఉంటే ఎలా.. . రేపు నీ జీతం పూర్తిగా దొరుకుంది. .
ఇకనుంచి డబ్బుల జీవితం లభిస్తుందన్న మాట . . . అది ఎలా ఉంటుందో ఈవేళ చూపిస్తారా . . . కారు ఎక్కు రాజారావు శివరాంను బలవంతంగా తోశాడు.
ఎక్కు మిత్రమా . . . కారెక్కు మిత్రమా! స్వరంలో ఆలపించాడు చక్రవర్తి.
రాజారావు గది తాళం వేశాడు చీకటిలో, ముగ్గురు కారు ఎక్కి కూర్చున్నారు.
కారు ఉప్పొంగే చైతన్యంతో ఆ సందు గతుకులపై ఊగుతూ రహదారిదాకొ వెళ్ళింది రాజకీయనాయకుడు నగరానికి వస్తే రహదారి బంధించి బారులుతీర్చి నిలుచున్న జనంగుంపులు కదిలి విచ్చలవిడిగా నడిచిపోతున్నారు. ఫలహారాలు సుష్పుగా భుజించి కారు గండిపేట నడిపించారు.
బారులు తీర్చిన చెట్లు రివ్వున వీచే గాలిలో మైమరచి నృత్యం చేస్తున్నాయి. ఆకాశంలోని తెల్లమేఘాలు హొయలుగానడు స్తున్నాయి. పిట్టలు బారులుగా ఆకాశంలో ఎగురుతూ స్వేచ్చానందాన్ని వ్యక్తపరుస్తున్నాయి.
ఆ కారులో ముగ్గురి హృదయాలు సంతోషంతో నిండి పోయాయి.
కేఖైడ అన్వేషణ
సహజంగా ముభావసంభాషియైన శివరాం, సరదాగా ఒక్కనిమిషం మౌనం వహించక ఏదో కులాసాగా కబుర్లు చెబుతూందే రాజారావు, చక్రవర్తులు కూడ ప్రకృతి పరిసరాలు పరిశీలిస్తూ తన్మయత్వంలో మునిగారు.
కారు ఎత్తెనరోద్దు ఎక్కింది.
ఎక్కగానే కనిపించింది ఉస్మ్నాన్సాగర్ సరస్సు
“కారు మెల్లిగా పోనీయ్!' రాజారావు ఆజ్జ చెశాడు డైవరును.
కెరటాలమీదనుంచి వచ్చేగాలి విజ్బంభీంచి చెట్లతో కలిసిగాత్ర సమ్మేళనం గానకచచేరి జరుగుతున్నట్లు కనిపించింది సరస్సు తరంగాలు శబ్దాలు చేస్తూ తీరాన నిలుచున్న తెల్లకొండరాళ్ళను తాకుతూ తాళం వేస్తున్నట్లుంది. కోకిల “కూ” స్వరాలుగాలిలో మధురంగా వింత వాయిద్య స్వరాల్త్లా వినిపించాయి. ఎంతోకాలం నుంచి ఆ మధురగానాలు వింటూ నిద్రలేక కళ్ళు ఎర్రబడినట్లు, సీమతంగేడు వృక్షాలు ఎర్ర పుష్పాలతో నిండి ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్లున్నాయి.
ఎత్తయి గుండ్రంగా తిరుగుతున్న సిమెంటుబాట. .. ఆ బాట కిరువైపుల విహారుల ఆనందం కోసం పెంచిన తోటలు...తోగల కానుకుని దాగుడుమూత లాడుతున్న సరస్సుతీరం... తీరంమీద కొండ రాళ్ళపై తరంగాల హస్తాలు మోసి కలకల శబ్ధాలతో ఆహ్వానిస్తున్న సరస్సు... అనంత ఆనంద ్రదాయినిలా కనుచూపు మరల్లో ఆవలికట్ట కనిపించనీయక విశాలంగా వ్యాపించుకున్న..ఆ ఉస్నాన్ సాగర్ శివరాంను చాలా ఆకర్షించింది. ప్రప్రధమంగా చూడటంవల్ల ఆసక్తీ మరింత పెరిగింది.
కారు ఆగింది. చిన్న హోటలు వద్ద. మరికొన్ని కారులు వరుసగా నిలిచి ఉన్నాయి. రాజారావు నిశ్శబ్దాన్ని ఛేదించాడు కారు దిగి. జేబులోని సిగరెట్టు తీసి ముగ్గురికి ఇచ్చాడు.
“ఆ సరస్సు తీరంలో తిన్నె గోపురంలో తపస్సు చేసుకోవాలని ఉంది” రాజారావు మాట బరువుగా వచ్చింది.
“ఆ కెరటాల గుంటలమధ్య వాలిపోయి దొర్గుతూ హాయిగా ఈతాడాలని ఉంది మిత్రమా! చక్రవర్తి పకపక నవ్వాడు.
శివరాం మందస్మితం చేసి మౌనంగా కదిలాడు హోటలువైపు.
అన్వేషణ 125
దూరాన ప్రీ పురుషుల జంటలు సొగసుగా కదులుతున్నాయి.
సరస్సువైపు ఉన్న హోటలు (ప్రాకారంలో కూర్చున్నారు. ఆకుపచ్చరంగు చెరిగిబోయి మాసిపోయిన నాలుగు చిన్న మేజాబల్లలు, కుర్చీలు, రెండు మూడుచోట్ల పరచిఉన్నాయి. బల్లల మీద విడిచిన తేనీరు చక్కెర వాసనల ఈగలు ముసురుతున్నాయి. సరస్సు నానుకొని వృక్షాలతో చుట్టుకొని గుండ్రంగా ఉన్న ఆ హోటలు పరిసరం సౌందర్యంగా ఉంది. ఆస్తమిస్తున్న సూర్యుని సంధ్వ్యారుణ కాంతులు కెరటాల ముడతలలో బంగారు రేకులు దాచుకుంటున్నాయి.
సోడాలుత్రాగి మౌనంగానే ఆ పరిసరాలు తిరిగారు సరస్సుకు ఆనకట్టగా కట్టిన వంతెన కావలి వైపు అందంగా పచ్చిగడ్డి మైదానాలతో కన్నులపందువుగా అమర్చబడిన పార్కులో ఆడ మగ జంటలు ఏకాంతంగా తమ ప్పాదయాలు విప్పుకుంటున్నారు
“ఎలా ఉంది స్వామీ. . .ఈ ప్రదేశం . . . నీకోసం ఈవేళ ఇక్కడికి వచ్చాం .. తెలియని ప్రదేశాలు చూస్తూ యాత్రలు చెస్తే సంకుచిత జీవితాల్లో సతమతమౌతూ మనం పడే బాధలు విశాలదృష్టి ఏర్పరుచుకొని విస్మరించగలం!” రాజారావు శివరాం వైపుచూశాదు.
“నాయకుడి మనస్సు పూర్తిగా చెప్పాలంటే ప్రక్కను ఎవరైనా వనితారత్నం అవసరం!” చక్రవర్తి వ్యంగ్యంగా అన్నాడు. బాహ్యంగా రాజారావు అన్న మాటలు నిజం కాదన్నట్లు,
“ఆవసరం లేదు. నేనే చెప్తా... కొడుకు పుట్టాడని సరదాలో ఇక్కడికి వచ్చాను. ఆనందంగా ఈ ్రకృతి పరిసరాల్లో కాస్సేపు గడపాలని. . . తండ్రికి సహజంగా ఆనందం ఉంటుంది. ముఖ్యంగా రెండు పెళ్ళిళ్ళు జీవితంలో చెడిపోయాక!” రాజారావు ముఖం చిట్టించాడు.
చక్రవర్తి నొచ్చుకున్నాడు తన సంభాషణకు. శివరాం బాధపడ్డాడు రాజారావు విషాదవదనం చూసి, ఎంతో ఖులొసాగా తిరిగే రాజారావు జీవితంలో కూదా ఏదో విషాదం “వ్రేళ్ళు పాతుకుందని మాత్రం గ్రహించుకున్నాడు శివరాం.
అంతా తిరిగి కారు ఎక్బారు”
“నా వివాహజీవితానికి కూదు నేను సంతోషించేది నాకు వంశోద్ధరణకు ఒకడు లభించేడుకదా అని సంతృప్తి... ఇప్పుడు నేనేం చేసినా, ఏమైపోయినా ఫరవాలేదు!” పాలిపోయిన నవ్వు రాజురావు పెదాలమీద ప్రతిఫలించింది
126 అన్వేషణ
ఆ నిమిషంలో రాజూరావు ఆకస్మికంగా విషాదం వదిలేసి. ఖులానాగా పురుషుడుగా మారిపోయాడు కునిరాగాలు తీశాడు పాటలు పాడాడు. పద్యాలు చదివాడు. ప్రక్కనున్న ఇద్దరినీ హెచ్చరించాడు తనతో పాడమని చప్పట్లు చరుస్తూ, కేకలు వేస్తూ అల్లరిచేస్తూ ఆ కారులో నగరపరిసరాలలోకి వచ్చేశారు ముగ్గురూ.
“స్వామీ తినడానికి నీకేం కావాలి?” శివరాంవైపు చూశాడు రాజారావు.
“్రాత్రి ఏదుగంటలు దాటింది. భోజనంచేస్తే బాగుటుంది” అన్నాదు శివరాం,
“ఎల్లకాలం ఆవరి మెతుకులే! . . ., ఇంకేమైనా తినకూడదూ . . నాతోరాగో
టాక్సీవాడికి దబ్బులు చెల్లించి రాజారావు రెష్టారెంటులోకి నడిచాడు. గదులుగా విభజింపబడి తెరలు వేలాడు తున్నాయి వరండాలో, ఒక గదిలోకి వెళ్ళారు ముగ్గురూ.
“బాయ్!” రాజారావు కేకతో తెల్లకోటు పంట్లాం తొడుక్కున్న ఒక నౌకరు వచ్చాడు.
ఒక కాగితం చూసి “బ్రాంది!” మాట తేలుస్తూ నవ్వాడు రాజారావు.
“క్ష వేళ మనమి్రుడికి విందు చెయ్యాలి!”శివరాంవైపు చూసి రాజారావుకేసి కనుసైగ చేశాడు చక్రవర్తి
రెండుగ్లాసుల్లో ఎర్రని పానీయం కొంచెం, రెండు సోడాలు టేబిల్ మీద నిలుచున్నాయి. సిగరెట్టు మామూలుగా వాళ్ళ పెధాల మధ్యదూరి పొగలు వదులుతున్నాయి, శివరాం ఆ పానీయం తీసుకోనన్నాడు. అలవాటు లేదంటూ. రాజారావు బలవంతంచేసినా పుచ్చుకోలేదు. రెండు గ్రుక్కలు త్రాగిన రాజారావు, చక్రవర్తి ఏదోసుఖంలో శివరాంను అప్పుడప్పుడు పలకరించినా ఎన్నో తెలియని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు,
“ఈ కాళ్ళు సరిగ్గా ఉంటే ప్రపంచాన్సే జయించేవాణ్ని” చక్ర వర్తికి కళ్ళు చెమ్మగిల్లాయి.
“సత్యాన్ని ప్రేమను గౌరవిస్తాను . . . . నామీద ఇష్టంలేని అమ్మాయిని నేను (ప్రేమించినా ఎంతకాలం నాతో గడపగలదు? , . . అందుకే వదిలేశాను ప్రియుణ్లి కలుసుకోమని . . . అదొక మరచిపోలేని కధ! పెదాలు ముడిచి ఉవ్పీంగు గ్లాసు టేబిలుమీద గిరగిరాత్రిప్పాడు రాజారావు.
సంభాషణల సారాంశం శివరాంకు క్రొత్తగా తోచింది. ఇంత కాలం తన కష్టాలకు
అన్వేషణ 127 సానుభూతి చూపిస్తూ సరదాగా (బ్రతుకుతున్న రాజూురావు చక్రవర్తులలో బాధలే లేవనుకున్నాడు శివరాం తన కష్టాలు ఒకవిధంగా గట్టెక్కుతున్నాయనుకున్న ఆ రోజున వారి నిజ స్వరూపం ఒక విధంగా అర్దమైంది.
మత్తు పానీయాలు త్రాగడం పూర్తిచేసి తూలుతూ వీధిలోకి వచ్చారు ,..
“వసావా” రాజురావుమాట తేలికైపోయింది.
“ఎక్కడికి?' శివరాం అడిగాడు.
'రాత్రి సుఖంయిచ్చిది రమణి-! నవ్వేశాడు రాజారావు. చక్రవర్తి శ్రుతి హెచ్చించాడు నవ్వుల్లో.
“ఈ వేళకు నన్ను ఒదిలెయ్యండి!' శివరాంతల దించుకున్నాడు.
“గుడ్‌బై!” రాజారావు శివరాం చేతిలో ఐదురూపాయల నోటు పెట్టాడు తూలుతూ చక్రవర్తి భుజంమీద చెయ్యివేసి బస్సు న్థాపువైపు వెళ్ళిపోయేడు.
చేతిలో రూపాయలనోటుపెట్లి వెళ్ళిపోతున్న ఆ స్నేహితుల నిద్దర్నీ ఒకసారి పరీక్షగా చూసి హోటల్లోకి వెళ్ళి సంతృప్తింగా భోంచేసి గృహోన్మ్నుఖుడయ్యాడు శివరాం.
రత్నం కోడలు, ఆ ఇంటి యజమాని శివరాం ద్వారా దొంగ తనం కేసు పరిషారనమైన సంగతి విని సంతోషించచారు.
మర్నాడు ఆఫీసులోకి వెళ్ళగానే గుమాస్తాలంతా ఎదురువచ్చి అభివందనలిచ్చి గతంనాటి కష్టాలకు సానుభూతి చేప్పారు శివరాంకు. డైరెక్టరు పిలిచి జీతం ఆపడంలో తన విద్యుక్తధర్మ్శ్మం నిర్వహించడమే కాని, ఆతనిపై దొంగతనం ఆరోపణ చెయ్యడం కాదని స్పష్టపరిచాడు. ఇంతకాలం ఆగిపోయిన ఐదువందల రూపాయలు శివరాం జేబులో నిండాయి. జీవితంలో మొట్టమొదటగా స్వార్టితం కళ్ళారా చూసుకుని కులికాడు శివరాం.
అప్పులివ్వదడం ఆలవాటు లేదంటూ రాజూరావు శివరాంనుంచి దబ్బేమి తీసుకోలేదు. ఆ ఇంటి యజమాని అప్పుతీర్చడంతో పూర్తిగా శివరాం బుణబాధ ఆఖరయిపోయినది. పుష్కలంగా ఉన్నధనం ఏదో ఖర్చును పురమాయిస్తుంది. అందమైన దుస్తులు అత్యవసర నామానులు కొనుక్కొని ఒక వందరూపాయలు టబ్రహ్మయ్యగారికి మని యార్దరు చేశాడు శివరాం.
128 అన్వేషణ
శివరాం ముఖంలో నవ్వు, ఆకారంలో కొత్తకాంతి దుస్తుల్లో క్రొతదనము నారాయణ గమనించాడు ఇంతవరకు మనో వ్యాకులతతో మధనపడుతున్న శివరాం పెళ్ళి సంబంధాలు తిరగగొట్టదములో సబబు కనిపించినా, ఇకముందు అలా అతను చేయడనే విశ్వాసం కలిగింది.
తీరుబడిగా ఒక రోజు భోజనముచేసి నారాయణ శివరాం ఇంటికి వచ్చాడు ఆ ఇంటి యజమాని, రత్నం కోడలు శివరాంతో ఏదో ఇష్పాగోష్టి జరుపుతున్నారు ఆ దంపతుల సహాయం పెళ్ళీ విషయంలో తప్పక లభిస్తుదంనే నమ్మకంతో, నారాయణ సంబంధాల ప్రసక్తి కదిపాడు ఆ ఇంటి యజమాని పెళ్ళి చేసెయ్యాలని చప్పట్లు కొట్టాడు రత్నం కోడలు రాబోయే భార్య సంసారంలో భర్తకు ప్రతినిమిషం ఆందిచచ్చే సుఖాలు లేత తమలపాకుల్లో నోరూర్చెలా ఉంటాయంటూ వర్టించింది నచ్చినా నచ్చకపోయినా అసలు సంబంధాలు చూస్తే క్రొత్త అనుభూతులు సంపాదించుకొన్నట్లవుతుందని ఒప్పుకున్నాడు శివరాం.
ఒక అమ్మాయిని చూడడానికి ఒక రోజు నిర్ణయించారు. తెల్ల షరాయి, తెల్లచొక్కా ఒక కోటు, బూటు తొడుక్కుని శివరాం పెళ్ళికొడుకు వేషంతో ముస్తాబయ్యాడు. -
రత్నం కోడలు అతన్ని చూసి వెకిలిగా నవ్వింది. ఆ యింటి యజమాని శివరాంకు అందగా అతని వెంట వెళ్ళాడు.
వరండాలో కూర్చున్న పెళ్ళికూతురు శిరస్సు మోకాళ్ళలోకి ముడిచేసుకుంది. ఎవరో ముత్తయిదువులు, జవ్వనులు, వరండాలోని ప్రక్కగదుల్లోంచి తొంగిచూస్తూన్నారు. నారాయణ, ఇంటి యజమాని పెండ్లికూతురు తండ్రితో వివాహాలు, అందులోని కష్టాలు, ఆధునిక యువతీ యువకుల మనస్తత్వాలు, అవి నమన్వయం చేసుకో లేని తమ (బ్రతుకులు గురించి భాహాటంగా చర్చిస్తున్నారు. పెద్ద మనిషి తరహాలో శివరాం మందస్మితం చేస్తూ కూర్చున్నాడు.
ఫలహారాలు ప్లేట్లలో ఎదురుగా నిలిచాయి. వేడికాఫీ ఆవిరి పొగలు జిమ్ముతూ కప్పులో తొణికింది. నారాయణ నిర్మొహ మాటంగా కడుపార భుజించాడు. కాఫీ త్రాగి ఇచ్చిన క్రిల్లీ బిగించికమ్మని చుట్ట ముట్టించాడు. శివరాం మందస్మిత మౌనంలో ఎంతో శుభసూచకమైన ఆశ కనిపించింది నారాయణకు ఆ నగరంలో శివరాంకు తనొక్కడే ఆప్పుదైనట్లు మాట్లాడాడు నారాయణ అక్కడి ప్రేక్షకులముందు.
అన్వేషణ 120
ఊపిది బంధించి, ఉక్కిరి బిక్చిరిగా ముడుచుకు కూర్చున్న అమ్మాయికి విరామం ఇన్వడం తన ప్రస్తుత విధ్యుక్త ధర్మంగా భావించాడు శివరాం పెళ్ళి చేసుకున్నా, లేకపోయినా, ఆమెను లోపలికి పంపించెయ్యండని నారాయణవైపు చూశాడు శివరాం ఆ అమ్మాయి తం(ి ఇంకా కాస్సేపు ఆమెను అబ్బాయి ఎదురుగా వుంచితే ఏ నక్షత్ర శక్తి 'ప్రభావంలోని ఆకర్షణవల్లనైనా పెండ్లి నిశ్చయం కాగలదనే భ్రాంతిలో కూతురును కూర్చోమనినా, తర్వాత బాగుండదని ఇంట్లోకి పంపేశాడు. పెళ్ళికూతురు తండ్రిదగ్గర శెలవు తీసుకొని నారాయణ, శివరాం ఆ ఇంటి యజమాని వీధిలోకి నడిచారు.
“ఎలావుంది అమ్మాయి?” నారాయణ (ప్రశ్నించాడు శివరాంను.
జగాన వంది!”
“స్టరపరచచమన్నావా?”
“తొందరేమొచ్చింది?”
“నీకు తొందర లేకపోతే వాళ్ళకు తొందరేగా?”
“వాళ్ళకు తొందరైతే మరొకరిని స్టిరపరచుకోమను,” నారాయణ ఉత్సాహం తగ్గించుకుని కుంచించుకు పోయాడు.
వింతవాదన వదిలి సాఫీగా మాట్లాడాలనుకున్నాడు.
“అసలు పిల్లనచ్చిందా లేదా?”
ళ్న్ద చలే దు
“అలా చెప్పు!... నిన్ను బలవంతం ఎవ్వరూ చేయరు. ... రేపు వాళ్ళకు కబురంపేసాను!”
సారాయణ మౌనం వహించాడు తర్వాత. ఇంటిదాకా శివరాంను దిగబెట్టి వెనుదిరిగి వోయాడు నారాయణ
ఇంటికి రాగానే రత్నం కోడలు గుచ్చిగుచ్చి అడిగింది పెళ్ళి కూతురును గురించి శివరాంను, ఆ ఇంటి యజమాని దృశ్యమంతా వర్ణించి కేరింతలు కొట్టాడు. శివరాం ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోలేదని తెలిసి “మాకు బూరెముక్క దొరకదు కాబోలు” అని పకపక నవ్వింది రత్నం కోడలు.
130 అన్వేషణ
ఇంకా ఎన్నో సంబంధాలు గురించి వివరాల పట్టిక శివరాం ముందు పెట్టాడు నారాయణ బ్రతుకుతెరువుకై పాటుబడే బడిపంతులు కూతురు తండ్రిలేని కుటుంబంలోని అమ్మాయి, చిన్న తనంలో తల్లిని పోగొట్టుకుని తండ్రికి సేవచేస్తూ ఇంటిపనులలో ఆరితేరిన అమ్మాయి, ధనవంతుని కుంటికాలు కూతురు, ఒక మెల్ల కన్ను మినహాయించి, సర్వాంగలక్షణ సంశోభితయైైన కన్య ఆ పట్టికలో దొర్లారు. ఆధునిక అభ్యుదయ దృక్పధంతో కట్నాలు ఎక్కువ పట్టించుకోకూడదంటూ, అయినా ముఖ్యమైన ఆదరణాభిమానాలకు ఏ కొరత గలగకూడదంటూ, నారాయణ ఉద్దాటించాడు.
ప్రతి పురుషునికి స్తీ అవసరం కనుక, ఏదో అమ్మాయిని పెండ్లిచెసుకొని బ్రతకడం శీవరాం దృష్టికి మృగలక్షణం మనిపించింది సంబంధభాంధవ్వాలలోని మమతలు అటుంచి, జీవితంలోని అభివృద్దికి దోహద మొనర్చగలిగే బాంధవ్యం ఆ నగరంలో ఒంటరిగా నివసిస్తున్న తనకు ముఖ్యమని భావించాడు శివరాం. నారాయణ ఏకరువు పెట్టే సంబంధాలన్నీ బాధ్యతలు పెండ్లిద్వారా అతనిమీద నెట్టడానికి (ప్రయత్నించేవిలా కనిపించదడంవల్ల వాటిగురించి ఉదాసీనత్వం వహించడం మంచిదనుకున్నాడు,. అయినా చిన్నతనం నుంచి పెద్దజేసిన కుటుంబ పెద్ద (బ్రహ్మయ్యగారిని సంప్రదించకుండా 'ప్రయాత్నాలు చెయ్యడం భావ్యం కాదని నిశ్చయించున్నాడు.
ఉన్న సంబంధాలు ప్రస్తుతం చూడనన్నాడు. శివరాం నారాయణకు అతని మనస్తత్వం అర్ధంకాలేదు
నారాయణ మొట్టమొదట చూపించినపిల్ల తాలూకు ముసలి తండ్రి ఒక రోజు దీనంగా ఇంటికివచ్చి కలుసుకున్నాడు. అతన్ని తప్ప మరెవ్వరినీ పెండ్లి చేసుకోనంటోంది. కూతురు అని వాపోయేదు. ఎదిగిన పిల్లల మనస్సులు మార్చటం కష్టం గనుక ఏవిధంగానైనా ఒప్పుకుని తన కూతురును పెండ్లి చేసుకోమని 'ప్రాధయపడ్డాడు. ఎదిగి వయస్సు వచ్చినవారి మనస్సు మార్చబడడం కష్టం గనుకనే తనే విదముగానూ పెండ్లికి అంగీకరించజాలనన్నట్లు మర్యాదగా తిరస్కరించాడు శివరాం.
శివరాంను పెళ్ళికొడుకుల జాబితాతో చేర్చేశాడు నారాయణ. అతనికి వీలైనంత ఎక్కువ ప్రచారంకూడా ఇంతకుముందు చేసి వుంచాడు. శివరాం సంబంధాలు చూడననటంతో నారాయణకు పచ్చి వెలక్కాయ గొంతుకపడినట్లయి, అమ్మాయిల తండ్రులకు సమాధానం చెప్పలేక సతమతమౌతున్నాడు. ఒక్కొక్కసారి శివరాం తప్పక వచ్చి పిల్లను చూస్తాడని చెప్పి, ఆ సమయానికి తనాక్కడే వెళ్ళి, ఫలహారాలు సుష్టుగా
అన్వేషణ 131 భుజించి, అనివార్యమైన కారణాలవల్ల ఆ రోజు శివరాం రాలేకపోయాడని, మరొక రోజు తీసుకువస్తానని వాగ్గానం చేసి తిరిగి వచ్చేవాడు నారాయణ
ఒక రోజు ఒక మునలి ఐడివంతులు ఉరకలు వేసుకుంటూ శివరాం ఇల్లువెతుక్కుంటూ వచ్చాడు తనకోసమే వచ్చిన ఆయన్ను శివరాం ఆహ్వానించాడు. నారాయణ ఆయన విషయంలో అనేక విధాల త్రిప్పడంవల్ల సమస్య ఎదురుగా నిర్భయంగా పెండ్లికొడుకుతోనే పరిష్మరించుకోవలెనని వచ్చానని స్పష్టంగా చెప్పాడు బడిపంతులు. తనకు ముగ్గురు ఎదిగిన కూతుళ్ళున్నారని, ఏ విధంగానూ కాలయాపన జరుగకుండా విషయాలు త్వరలో పరిష్కరెంచుకోవడం తనకు ముఖ్యమని తన పరిస్థితి గుర్తించి మరోమాట చెప్పకుండా, తన కూతుర్ని చూసి, ఇచ్చిన కట్నానికి ఒప్పుకొని, వివాహ నిశ్చయానికి అంగీకారం తెలియజెయ్యమని ప్రాధేయపడాడు ఆ బడిపంతులు ధోరణి శివరాంకు సానుభూతి కలిగించింది నారాయణ ప్రవర్తనకు తాను నొచ్చుకొంటున్నట్లూ కాస్త బాధపడి, తనపై ఏ ఆశ ప్రస్తుతం పెట్టుకోవద్దని నచ్చచెప్పి బడిపంతులును సాగనంపాడు శివరాం. పెరిగిపోతున్న జనభాతో కుటుంబాల బీదరికంతో మారిపోతున్న నాగరికతతో, చంచలమౌతున్న ఆధునిక మనస్తత్వాలతో, పురాతనుల అభ్యుదయ నిరోధక సంకుచిత భావాలతో వివాహ సమస్యలుకూడ వికృతరూపం దాల్సినట్లున్నాయి వివాహానికి ఒక అక్ష్యం ఏర్పరచుకొని, కుటుంబాన్ని ఒక నిర్ణితపద్ధతిలో నిర్ధెశించుకోవడం ఆధునిక యుగంలో అవలంబించవలసిన ముఖ్య సూత్రంగా గోచరించింది శివరాంకు.
బ్రహ్మయ్య తాతగారికి ఒంట్లో బాగుండటం లేదని తక్షణం ఒకసారి బయలుదేరి రమ్మని తంతి వచ్చింది శివరాంకు. ఆఫీసుకు ఒక వారం రోజులు శెలవు పెట్టాడు. శివరాం సాయంత్రం పరుపుచుట్ట సర్దుకొని రత్నం కోడలును కలిసి తన ప్రయాణం సంగతి చెప్పాడు.
“క్కరోజు (ప్రొద్దున్నే ఆయన బెంగుళూరు వెళ్ళారు . .. మీరు కూడా వెళ్ళిపోతున్నారన్నమాట ... ఇంట్లో ఒంటరిగా .. . భయంవేస్తుదండి!”” రత్నం కోడలు నిట్టూర్పు విడిచింది, పరిస్థితి అర్ధమైంది శివరాంకు. తంతి చూపించాడు ఆమెకు. రత్నం కోడలు మౌనంగా గుమ్మంలో నిలుచుంది వెళ్ళివోతున్న శివరాంను చూసి.
రైలెక్కగానే స్వగృ్మహంగురించి ఆలోచనలు కదిలేయి. కషాలలో అందరిని మరచిపోయి గడిపిన ఆరు నెలల కాలంలో అణిగిపోయిన మమతలు ఒక్కసారి
132 అన్వేషణ పెల్లుబీకాయి. వారం రోజులలో ఇంటిదగ్గర గడపవలసిన కార్యక్రమాలు ఊహించు కున్నాడు శివరాం. ఖులానాగా ప్రయాణీకులతో కబుర్లుచెప్పి ఆనందించాడు
జట్మాదిగి స్వగృహంమందు నిలుచున్న శివరాంకు ఆశ్చర్యం కలిగించింది. బ్రహ్మయ్యగారు కుర్చిలో రీవిగా కూర్చొని పసందుగాచుట్ట కాలుస్తున్నారు శివరాంను చూసి ఆనందం ఒలకబోసే బోసి ముఖంతో ముందుకు వచ్చి భుజంమీద తువ్వాలు సర్పుకొని, పంచెకట్టు బిగించుకొని 'ఏమే కోడలా! .. నీ కొడుకు వచ్చాడే' అంటూ హాస్యంగా పిలిచాడు సుభద్రమ్మను. అంగలు వేసుకుంటూ సుభద్రమ్మ గుమ్మంలోకి వచ్చింది లక్ష్మ ఒక్కగెంతుతో అన్నగారిని తొంగిచూస్తూ ముసి ముసి నవ్వులతో తల్లిని వెన్నంటింది
“తంతి ఇచ్చారేం?” (ప్రశ్నాకారం ముఖం పెట్టాడు శివరాం.
“అంతా తమాషా!” 'బ్రహ్మయ్యగారితో పాటు అందరూ గొల్లున నవ్వారు శివరాంమ చూసి,
“ఆరు నెలలయినా” హైద్రాబాదునుంచి రాకపోతే మమ్మల్ని ఏపంచెయ్యమన్నావు?” లక్ష్మీ అన్నను నిలబెల్టీ సాగదీసుకుంటూ అడిగింది.
“ఇంట్లో అందరికీ చూడాలని ఉంటే . . .” బ్రహ్మయ్యగారు ఉబికివచచ్చే నవ్వును ఆపుకోలేక పకపక నవ్వాడు పొట్ట చేత్తోపుచ్చుకుని.
అ తమాషా పరిపూర్ణంగా అనుభూతిపొందాడు శివరాం ఆస్తులను మరచి చూడాలనే ధ్యాస స్వయంగా తనకు కలగకపోయినందుకు కించపడ్డాడు శివరాం. ఆధునిక నాగరిక (ప్రపంచచంలో ఎడతెగని ఊపిరి సలపని స్వలాభపరమైన కార్యక్రమాలలో మునిగి తేలే నిర్లక్షమైన మనుష్యులకు సనాతన పద్ధతుల్లో అంటిపెట్టుకుని అభిమానం మరచి పోలేని పురాతన మనుష్యులకు మధ్య ఉన్న వ్యత్యాసం తన ద్వారా అర్ధం చేసుకున్నాడు శివరాం. అన్నగారిలా స్వలాభపరుడు కాకుందా, తన బాధల్లో అందరినీ మరిచిపోయనని మాత్రం సంతృప్తిపడ్డాడు శివరాం.
చిట్టెమ్మ, పార్వతమ్మ, పార్వతమ్మ పిల్లలు వరుసగా బయటికి వచ్చారు. ఒక పిల్లవాడి నెత్తుకొని ఆడిస్తూ ఆడుగిడిన వెంకటేశ్వర్లు తమ్ముడిని పలకరించాడు. అనురాగం, అభిమానం, ఆదరణలో కాకుందా, గౌరవప్రదంగా కూడ అందరూ తన్ను పలకరించడంతో శివరాం ఒళ్ళు గగుర్పొడిచింది. బహుశా సంపాదనాపరుడై, తమకు తెలియని దూర
అన్వేషణ 133 ప్రాంతాలలో మసలుతూ అనుభవజ్ఞుడొతున్న తనకు తగిన గౌరవం ఇవ్వడం ధర్మమని అందరూ భావించి ఉంటారని అనుకున్నాడు శివరాం
శివరాం హైదరాబాదునుంచి వచ్చాడన్నవార్త పొరుగింటి గృహాల్లో పొక్కిపోయింది, వొరుగు గృహయజమానులు సాయంత్రం ఏదో షికారుకు బయలుదేరినట్లు బ్రహ్మయ్యగారి ఇంటికి వచ్చి శివరాంను పలకరించి, నగర భోగట్టాలు, సంపాదన వివరాలు, విచిత్ర అనుభవాలు, అడిగి తెలుసుకొని, ఆనందించి “పెద్దవాడవయ్యావు!” అంటూ పెదవి చప్పరించి తిరోగమనం చేసేవారు. ఇల్లు విడిచి షికారుకు వెళ్ళిన శివరాంవైపు ఎరిగిన పొరిగింటి కన్యలు తీక్షణ దృక్కులతో, అనిర్వచనీయమైన ఆశలతో చూశారు. పట్టణంలో కనిపించిన మిత్రులు దూరదేశ మహానగరంలో స్వశక్తితో అభివృద్ధికి వచ్చి బెన్నత్యంపొందిన శివరాంకు అభినందనలు తెలిపారు ఎరిగిన పాలవాడు, కొట్టువాడు చాకలి మంగలి, పాలేరు, దాసి “బాబయ్యా” అని నోరునిందా పలకరించి, దణ్ఞం పెట్టి బహుమతి కోసం చేతులు చాపారు శివరాం హృదయం ఆ అభిమానాల చిలకరింపుల్లో పులకరించి పరవశత్వం చెందింది ఆ ఆనందంలో తోచక రూపాయల నోట్లు వాళ్ళచేతుల్లో చల్లాడు.
శారద అదృశ్యమైపోవడంతో ఆ కుటుంబ పెద్దగా మిగిలి పోయిన చిట్టెమ్మ స్వంతయిల్లు అద్దెకు ఇచ్చుకుని ఒంటరిగా బ్రతకలేక బ్రహ్మయ్యగారి ఇంట్లోకి వచ్చేసింది. ఆమెను చూడగానే పురాతన స్మృతులు శివరాం భగ్న హృదయంలో ఉ(దేకాలు రెచ్చగొట్టాయి తాపీగా అణచుకున్నాడు.
భార్యకు నలతగా ఉంటోందని, వెంకటేశ్వర్లు ఒక వారం రోజులు శెలవుపెట్టీ ఇంటికి వచ్చాడు తన తల్లిచేత సంరక్షణ చేయించు కోవాలని. ఇంటిదగ్గర అన్న ఉంటాడనే ఊహలేక చేసిన పనికి సర్హుకోడానికి ఏంచేయాలో తోచక, సందేహంతోనే భన బెడ్డింగు విప్పాడు. శివరాం భోజనాలు చేసి తాపీగా కబుర్లు చెబుతున్న బంధుజనం శివరాంవైపు ఆసక్తితో చూశారు ఏక్రొత్త వస్తువులు తెచ్చాడో అని.
ఒక జార్దెట్టు సిల్కు చీర లక్ష్మికి ఒక మల్గుపంచె బ్రహ్మయ్యగారికి. ఒక సైనుపంచె తల్లికి అందిచ్చాడు శివరాం. లక్ష్మి సిల్కు చీర ఒంటికి రాసుకుంటూ నున్నగా అనుభూతిపొంది, అందంగా ఉంటాననుకుంటూ ఆలోచనలో హాయిగా నవ్వింది. బ్రహ్మయ్యగారు మనవడి సరదాను బోసినవ్వు లొలుకుతూ “ఎందుకురా ఇది! అంటూ మామూలుగా అని పంచనేత పరీక్షించసాగారు. తనకిచ్చిన వస్త్రం ఉపయోగానికే గాని మరెందుకూ కాదని, పుత్రుడు చూపిన మాతృ([్రేమలో మునిగి తన్మయురాలై, సుభద్రమ్మ మదతపెట్టింది సైనుపంచె.
న! అన్వేషణ భోజరాననంతరం బొజ్జ నిమురుకుంటున్న వెంకటేశ్వర్లు దృష్టి కొద్దిగా వక్రమయినా తనకు తమ్ముడు బహుమతి ఇవ్వలేదనే అసంతృప్తిదాచుకుంటూ కృత్రిమంగా నవ్వాడు ఆ వస్త్రాలు చూచి, పార్వతమ్మ మూతి ముడుచుకుని మౌనంగా తదేకధ్యానంగా లక్ష్మీకిచ్చినబీరవైపు చూస్తూకూర్చుంది. చిట్టెమ్మ నిష్కామంగా మామూలు ధోరణిలో ఆ వస్త్రాల వెల ప్రశ్నించింది అన్న వదినెలకు ఆ పరిస్థితి ఏర్పడుతుందని తెలిసినా, శివరాంకు మరో గత్యంతరము లేకపోయింది. తెచ్చుకున్న ధనం తిరుగు రైలు చార్జిలకు ముఖ్య అవసరాలకు సరిపోతుందిగాని, వారికి కూడా బహుమతి లివ్వగలిగేలా లేదు. అయినా తాతయ్య వారికి తగు సత్కారం వెళ్ళేముందు ఎలాగా చేస్తాదుగదా అని మనస్సును సమాధానపరచుకున్నాడు శివరాం వెంకటేశ్వర్లు బొజ్జచుట్టూ నిల్పొని అల్లరిచేస్తున్న ముగ్గురి పిల్లలచేతుల్లో మూడు రూపాయలు ఉంచబోయాదు శివరాం. ఆ దంపతులకు కొంత సంతృప్తి కలిగించాలని. వెంకటేశ్వర్లు అర్జాంగీ కారంగా ఊరుకున్నా పార్వతమ్మ అద్దువచ్చి పిల్లలను డబ్బు తీసుకోనివ్వలేదు. “మీ అన్నయ్య సంపాదన నీ అంత లేకపోయినా మాకేం లోటులేదు!” షార్వతమ్మ మాటలు కర్ణకరారంగా ఉన్నాయి శివరాంకు. లక్ష్మి బాధతో తన చీర క్రింద జార్చేసింది. బ్రహ్మయ్యగారు మర్యాదగా మందలి ౦చాడు పార్వతమ్మను తాతయ్యకు సమాధానం చెప్పదేమని భర్తవైపు రౌద్రంగా ఒకసారిచూసి, మళ్ళీ నలుగురిలో కలిసిపోయి నవ్వింది పార్వతమ్మ గతంలో ఏమీ జరగనట్లు బ్రహ్మయ్యగారు శివరాం ఇంతవరకు గడిపిన జీవితం గురించి నిజం చెప్పమని గ్రుచ్చిగ్రుచ్చి అడిగారు శివరాం తన నగర చరిత్ర అంతా నిజస్వరూపంలో తెలియజేశాడు, మనుమడు ఒక విధంగా ఉద్యోగంలో స్టిరపడి కష్టాలు దాటినందుకు బ్రహ్మయ్యగారు, సుభద్రమ్మ లోలపల సంతోషించారు. మరిదిని చూసైనా నేర్చుకోండి అన్నట్లు భర్తవైపు చురచురచచూసింది పార్వతమ్మ భార్య చూపులకు తాళలేక, తమ్ముడి సాహసకార్వాలు వినలేక, వెంకటేశ్వర్లు ఏదో పని వుందని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు.
అన్వేషణ 135 ఒకరోజు (బ్రహ్మయ్యగారు ఫలహారాలవద్ద సంభాషణ కదివారు.
“ఈవేళ ఇదృష్టంకొద్దీ అంతా ఒక చోట చేరాము. ఈఏడు ఏవో సంబంధాలు వెదకి లక్ష్మికి, శివరాంకు వివాహాలు స్టిరపరచాలి . . . నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళివోయినా కాస్త ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి?” బ్రహ్మయ్యగారు సగం ఆజ్ఞగా సగం ఆనునయంతో చూశాడు, వెంకటేశ్వర్లువైపు.
“ముందు లక్ష్మై పెంట్ల కానివ్వండి .. నా పెళ్ళికి తొందర లేదు.” శివరాం ముభావంగా నవ్వుతూ తల వంచుకున్నాడు.
అతని మనస్తత్వం అర్ధం చేసుకున్న ఆ కుటుంబంలో ఎవరూ సమాధానమిచ్చి అతని హృదయం బాధ పెట్టదలచుకోలేదు.
“ఈ కాలపు పెళ్ళిళ్ళకు (ప్రేమలు , . . అదీనీ. . .మా కాలంలో అవేమి తెలియవు!” శివరాంను దెప్పుతూ నాధారణంగా అన్నట్లు వ్యంగ్యంగా నవ్వింది పార్వతమ్మ
“ఆ సంగతి అందరికీ తెలుసు?” బ్రహ్మయ్యగారు కొంచెం కోపం చూశారు.
వెంకటేశ్వర్లు తాతగారి మాటకు “ఊ” అన్నాడు. భర్తతల ఊపుచూసి చిందులు శ్రొక్కింది, పార్వతమ్మ మనస్సులో ఉండబట్టలేక ఉన్నమాట భళ్ళున విసిరింది.
“ఆయన పనులతో ఆయనకే తీరిక ఉండదు . . . ఇంక పెళ్ళి సంబంధాలు ఏం చూడగలరు చెల్లెలికి!” సాగదిసుకుంది పార్వతమ్మ.
“నీ సలహా నేను అడగలేదు!” కసిరారు బ్రహ్మయ్యగారు.
ముఖం జేగురుమ్సులా మార్చి మూతిముడుచుకుని పార్వతమ్మ మూలగాపోయి కూర్చుంది మౌనంగా తక్షణం,
“అన్నయ్యకు తీరుబడి లేకపోతే ఫరవాలేడు.....నాకు పూర్తిగా తీరుబడే....ఆ సంబంధాల ప్రయత్నం నేనే చేస్తాను. . . ” వ్యంగ్యంగా నవ్వాడు శివరాం.
తన వివాహం గురించి ఎర్పడిన వివాదాలు చూసి ఏవగించుకుని అక్కడినుంచి లేచిపోయింది లక్ష్మి.
ఆ సంభాషణలో ప్రసక్తి తీసుకోక చిట్టెమ్మ మామూలుగా మందకొడితనం ప్రదర్శించింది. సుభద్రమ్మ ఆలకిస్తూ ఆశ్చర్యంగా చూసింది కోడలు ప్రవర్తనకు.
136 అన్వేషణ
నాల్దురోజులు గడవగానే ఆ వాతవరణం శిరాంకు విసుగు కలిగించింది. సరదాగా కాస్సేపు మాట్లాడి గడపడానికి లక్ష్మి తప్ప మరెవ్వరూ లేరు. పట్టణంలోని స్నెహితులు ఎవరి వ్యాపకాలలో వారు నిమగ్నులైపోయారు. ఇంక ఆ పట్టణంనుంచి నిష్క మించ దలనుకున్నాడు శివరాం
సెలవు పూర్తయివోయింది కనుక వెళ్ళివోవాలనుకున్నాడు శివరాం బ్రహ్మయ్యగారు, సుభద్రమ్మ ఇంకా ఒక వారం ఉండమని బలవంతపెట్టారు విలులేదన్నాడు శివరాం. ఉద్యోగాల్లో చేరాక ఆస్తులను అభిమానంగా దగ్గిర ఉంచుకోవడం కష్టమని గుర్తించి ఊరుకున్నారు బ్రహ్మయ్యగారు.
లక్ష్మి అన్నగారితో హైదరాబాదు వెడతానని పట్టపట్టింది. నిజంగా వెడుతుందెమోననే అసూయతో పార్వతమ్మ తన బుద్ది దాచుకోలేకపోయింది. “పెళ్ళియీడదు పిల్లలు ప్రయాణాలు చేసే కాలం కాదిది!...” అంటూ సజణిగింది ఒంటరిగా ఉంటున్న అన్నయ్యకు తాను కొంతకాలం వంటచేసి పెడతానని తన కోరికకు బలం కల్పించుకుంది లక్ష్మి ఇదీ సమంజసమే అన్నారు బ్రహ్మయ్యగారు రత్నం దంపతులను దృష్టిలో పెట్టుకుని లక్ష్మిని తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదన్నాడు శివరాం రాజారావు అత్తిల్లు పిఠాపురం కనుక, అతని బంధువులు ఈవై పెవరైనా వస్తే తిరిగి చెల్లెలును పంపించగలనని చెవ్వొాడు శివరాం. ఈ పరిస్థితుల్లో లక్ష్మి ప్రయాణానికి ఆటంకాలు లేకుందా పోయాయి.
లక్ష్మి శివరాం సికింద్రాబాదు స్టేషనులో దిగారు. దారిపొడుగునా చిలిపి అల్లరిచేస్తూ కనిపించిన వానిని కొంటెగా అభినయిస్తూ వింత ప్రశ్నలు వేయసాగింది లక్ష్మి సరదాగా ఠీవిగా అన్నింటికీ సమాధానాలు ఇచ్చేవాడు శివరాం. స్టేషన్లో దిగి నల్లగుట్టకు టాంగా కుదిర్సాడు అతను. రత్నం కోడలు తన చెల్లెలును చూసి మురిసిపోతుందని ఇద్దరికి అపురూపమైన స్నేహం పెరుగుతుందని నారాయణ స్నేహాన్ని లక్ష్మికి సంబంధాలు. వెతకడంలోనైనా ఉపయోగించుకోవాలనీ, ఇంకా ఏదో ఆలోచిస్తూ ఇంటిముందు దిగాడు శివరాం,
వీధి ద్వారం బంధించివుంది. కిటికీ తలుపులు మూసివున్నాయి టాంగా ధ్వనివల్లనైనా మేదమీద అలికిడి అవుతుందేమోనని మేడ మీదకు ఆశగా చూశాడు శివరాం. అతనికి అండగా గుర్రం సకిలించింది. అయినా మేడమీద ఎవరూ మసలుతున్నట్లు కనిపించలేదు. తలుపు కొట్టాడు శివరాం. సమాధానంలేదు. గట్టిగా బాదాడు మళ్ళీ.
అన్వేషణ 1ప7
వీధితలుపు తెరుచుకుంది ఆ ఇంటి యజమాని తల్లి వంగిన నడుముతో మౌనంగా నిలుచుంది శివరాం నమస్మరించాడు ఆమె ముభావంగా వెనక్కి తిరిగి మెదమీదకు వెళ్ళివోయింది.
సామాను టాంగావాడిచేత లోపల పెట్టించి తన గది తెరిచాడు శివరాం ఒక్కటే గది . ఇందులో అన్నా చెల్లెళ్ళు ఎంతకాలం గడపడం... ఏదో ఇరుకు సమస్య ఉద్భవించినట్లు కనిపించింది శివరాంకు. ఇల్లంతా నిశ్చబ్దంగా ఉంది తలుపుమూసి లోపల మసక కాంతులలో చికటి శీతలవాతావరణం వ్యాపించింది చెల్లెలును గదిలో కూర్చోబెట్టి సహజమైన నవ్వుతో సరదాగా మేడమీదకు వెళ్ళాడు శివరాం ఆ ఇంటి యజమాని తల్లి నేలమీద కొంగుపరుచుకుని పడుకుంది దిగులుగా. ఇంటి యజమానికై ప్రశ్నించాడు శివరాం. రత్నం కోడలా గడిలోంచి బయటకు వస్తుందని ఆశించాడు. కాని ఆవా కనువించలేదు కొడుకు వడుకున్న గది చూవించింది తల్లి ఆ వైపునడవబోయాడు శివరాం.
“మీకు పెళ్ళయిందా?” ఆ ఇంటియజమాని తల్లి హఠాత్తుగా ప్రశ్నించింది.
శివరాం నిలువునా ఒక్క నిమిషం ఆశ్యర్యంలో పడి స్తంభించిపోయాడు, తిరిగి
“మా చెల్లెలు... ఈ నగరం చూస్తానంటే తీసుకువచ్చాను"
ఇంక ఏ చిక్కుప్రశ్న ఆమె వేస్తుందో అన్న భయంతో ఆగకకోమటి యజమాని గదిలోకి వెళ్ళిపోయాడు శివరాం
కోమటి యజమాని పంచెకట్టుకుని అర్ధనగ్న శరీరంతో, చెదిరిన క్రాపుతో ఓరగిలపడుకున్నాడు పందిరి మంచంమీద, “ఎవరు?” ముఖం పెట్టుకుని గదిలో అలకిడి విని వెనక్కి చూడకుండా “ఎవరు? అని ప్రశ్నించాడు.
శివరాం తన కంఠం వివ్వ్పాడు.
'మీరా!' లేచి కూర్చున్నాడు ఆ ఇంటి యజమాని, దిగులుగా దీనంగా ఉబ్బిపోయిన ఎ(రటి కళ్ళతో అతని ముఖం ఏదో బాధతో నల్లబడి, కాంతి తగ్గిపోయింది.
'అలా ఉన్నారేం. . .? “శివరాం ప్రశ్నించాడు.
ఆప్రశ్న విని ఆ ఇంటి యజమాని తనతల్లి ఇతనికేమి చెప్పలేదనుకున్నాడు.
188 అన్వేషణ “ఆమె చనిపోయింది!” ఇంటి యజమాని కన్నీరు బుగ్గలమీద దొరలుగా కారింది “ఎప్పుడు ఎమయింది?” శివరాం నాలిక తడబడింది” గుండె వేగంగా కొట్టుకుంది. “నాల్రగు రోజుల క్రితం!” శివరాం బాధగా నిట్టూర్పు విడిచాడు.
“నేను ఆరోజే బెంగుళూరునుంచి తిరిగి వచ్చెను ఆమెకు జ్వరం తీవ్రంగా ఉంది. డాక్టరును పిలిపించుకుని ఏదో మందు పుచ్చుకుంటోంది. పడుకుని ఒళ్ళుకదుములు కట్టినట్లు బాధపడింది. మేడమీది వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది. ... . ఎదురింటి వారింట్లో పిల్లవాడి బారసాల జరిగింది బంధువులు వస్తూపోతున్నారు వెళ్ళే ముత్తయిదువులను, పిల్లలను సంతోషంగా మేడమీద నిలుచుని చూడసాగింది జర్వతీవ్రత నీరసంలో కళ్ళు తిరిగాయి, కాళ్ళు తేలి పోయాయి ఆమెకు మేడమీది చిన్న సిమెంటు గోడమీదికి తూలి పోయింది. నేను గదిలోంచి ఆమె దగ్గరకు వచ్చేలోగా, ఆమె పట్టు విడిన శరీరం ఆ చిన్న సిమెంటు గోడదాటి వీధిలోకి తూలిపోయింది. రక్తం బీటలు . .. కాలులో ఎముక విరిగింది నా గుండె బ్రద్ధలయింది. . క్రిందకు వీధిలోకి పరుగెతాను. .. నాముందు భయంకర కనాయి .. మృత్యువు , = ” వెక్కివెక్కి ఏడ్చాడు కోమటి యజమాని కాస్సేపు హోరున ఏడ్చి చేతుల్లో ముఖం కప్పుకున్నాడు.
“ఆమె శ్వాస కాస్సేపు నిలిచింది . . ఆఖరిసారిగా బాధగా చూచి పెలవంగా నవ్వింది కళ్ళు మూసింది! ... డాక్టరు వచ్చేలోగా నాగృహలక్ష్మి ప్రాణాలు నేను కాపాదలేక పోయాను!” చంటిపిల్ల వాడిలా మంచంమీద వాలిపోయి రోదించాడు ఇంటి యజమాని.
శివరాం నరాలు దొలిచేని నట్టయింది (ప్రతిరక్త కణంలో మంటలు ఆవేశించినట్టయింది.
మౌనంగా స్తంభించిపోయి కూర్చున్నాడు. ఒక వావుగంట. ఇంటి యజమాని తేరుకున్నాడు. శివరాం చెల్లెలు వచ్చిన సంగతి విని సంతోషించాడు. తనేమైనా అవసరాలు చూడగలిగితే చెప్పమన్నాడు. అతని దగ్గర "సెలవు పుచ్చుకుని మేడక్రిందకు వచ్చేశాడు శివరాం.
తప్పనిసరిగా లక్ష్మినిహోటలుకు తీసుకువెళ్ళాడు శివరాం భోజనానికి. ఆ నగర వాతావరణమంతా లక్ష్మికి మిరుమిట్లు గొలిపింది నగర వీధుల్లో వింతగా అన్నను అనుసరించింది
అన్వేషణ 139 తన బాధలు తనకున్నా, శివరాంకు అతని చెల్లెలుకు తాత్మాలికంగావంట చేసుకునే వసతులు, అవకాశాలు ఇవ్వమని తల్లికి పురమాయించేడు ఇంటి యజమాని తీరుబడి ఉన్నప్పుడు ఉభయనగరాలు చూపించాడు శివరాం చెల్లెలుకు నగర్ కట్టదాలు - వింత సంస్కృతి - పబ్లిక్ గార్డెన్ - సాలార్ జంగ్ మ్యూజియం - మక్కామసీదు
- చార్మినార్ - నగరవైభవానికి మూలకందాలుగా ఉన్నాయి. ఆ వింత ప్రదేశమంతా చూదగలిగినందుకు తన్న భఖినందించుకుంది లక్షి. పగలు ఆఫీసుకు శివరాం వెళ్ళినప్పుడు, లక్ష్మి ఇంటి యజమాని తల్లితో కబుర్లుచెప్పి, కధలు పత్రికలు చదివి కాలం వెళ్ళబుచ్చెది. సాయంత్రం అన్నతో కలిసి ఏదో ప్రాంతానికి షికారుకు వెళ్లేది. ఒక రోజు నారాయణ పార్కులో కనిపించాడు శివరాంకు. ప్రక్కనున్న లక్ష్మిని చూసి “పెళ్ళయిపోయిందేమిటోయ్!” ప్రశ్నించాడు కొంప మునిగిపోయినంత నిరాశా భావంతో. “మా చెల్లెలు లక్ష్మి!” శివరాం పరిచయం చేశాడు. నారాయణకు లక్ష్మిని. “ఎప్పుడొచ్చావమ్మా! .. .. . .అదేమిటోయ్ ... మన ఇంటికి తీసుకు రాలేదే!.
- , అంతా సంతోషించేవాళ్ళం రేపు తప్పకుండారామ్మా! భోజనానికి కూడాను. . . అత్తా రేవూరు?” మాటలు శరపరంపరల్లా విసిరాడు నారాయణ. “ఈమెకు కూడ పెళ్ళి మీరేచెయ్యాలండి!” నవ్వాడు శివరాం ఆ భారం నామీద వదలవోయ్. .. ఒక్కరోజులో సంబంధం తెచ్చి ముడివెయ్యనూ?” పకపక నవ్వాడు నారాయణ. పురాతన తరాల ద్వారా తన తల్లిదండ్రులకు (బ్రహ్మయ్యగారి వంశానికి ఉన్న సంబంధబాంధవ్యాలు ఏకరువు పెట్టాడు నారాయణ అతను చెప్పే బాంధవ్యాల మెలికలు అర్ధం కాగపోగా వింటున్నట్టు నటిస్తూ రేడియో గీతావళి పై చెవులు ఒగ్గించారు, అన్నా చెల్లెళ్ళు రేడియో అగిపోయినట్టే నారాయణకూడా తన ఉపన్యాసం ఆపేసి అన్నా చెల్లెళ్ళను మళ్ళీమళ్ళీ తన గృహానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళి పోయాడు. మర్నాడు చెల్లెలు బలవంతంమీద నారాయణ ఇంటికి వెళ్ళక తప్పలేదు శివరాంకు, ఈసారి వీధి గుమ్మంలోంచి వెళ్ళాడు చెల్లెలుతో మేడ ఎక్కి ఎవరూ కనిపించకపోగా తిన్నగా గదిలోకి చవునుగా నడిచాడు శివరాం. ఆక్రొత్త ప్రదేశం జంకుతూ వెనక
140 అన్వెషణ నిలిచిపోయింది" లక్ష్మి ముందు కడుగిడిన శివరాం గది ద్వారంవద్ద ఆశ్చర్యంతో ఆగిపోయాడు. సత్తెమ్మ ఎవరో కళ్ళజోడు పెద్దమనిషితో సరసాలాడుతోంది. శివరాంను చూసి ముఖం మార్చుకుని, గబుక్కున నవ్వి, చేతిలో కాఫీకప్పు పుచ్చుకుని. “రావోయ్!... ఏన్నాళ్ళకు వచ్చావు మా ఇంటికి” అంటూ ఆనందం వెలిబుచ్చి శివరాం చెల్లెలును చూసి గబగబ వెళ్ళి ఆలింగనం చేసినంతపని చేసింది సత్తెమ్మ. ఆమె తత్వం శివరాంకు అసహ్యం కలిగించినా వచ్చిన తర్వాత మర్యాదగా మాట్లాడిపోవాలని గదిలో కూర్చున్నాడు కళ్ళజోడు పెద్దమనిషి శివరాంను చూసి లేచాడు తన పని పూర్తయినట్లు “నారాయణ వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు!” అంటూ సత్తెమ్మవైపు తిరిగి సిష్కమించాడు ఆయన.
'మాకు బావగారవుతారు వరుసకు . . . ఆయనకు ఆప్తమిత్రులు!కులికింది సత్తెమ్మ ఆకళ్ళజోడు పెద్దమనిషిని పరిచయం చేస్తూ. లక్ష్మి తన ఇంటికి రావడంవల్ల ఆ రోజు పండుగదినంలా భావిస్తున్నానని, తన భర్త తాము వస్తారన్న సంగతి చెప్పారు ఇంట్లొనని, అనివార్యమైన అర్జంటు పనివల్ల బయటకు వెళ్ళారని, ఏ క్షణంలోనైనా వచ్చేయడం తధ్యమని ఇంకా యేదో ఉపన్వాసం విసిరింది సత్తెమ్మ శివరాం ముభావంగా మాట్లాడాడు. లక్ష్మి చలాకీగా మాట్లాడింది దూరపుబంధువు ఒకతె దొరికిందని తన ఇంట్లో కొన్నాళ్ళు వుండి పొమ్మని బలవంతం చేసింది సత్తెమ్మ లక్ష్మిని. అలాగేనని మార్వాదకు ఒప్పుకుని అన్నా చెల్లాళ్ళు ఆమెదగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశారు. తాను చూసిన దృశ్యం గురించి చెల్లెలుకు చెప్పలేదు శివరాం.
చెల్లెలును గండిపేటతీసుకువెళ్ళాలని శివరాం రాజారావుతో చెప్పాడు. ఒక స్సేహితుడి కారు తీసుకువచ్చాడు రాజారావు. ప్రొద్దున్న పదిగంటలకు బయలుదేరుతున్నారు అన్నా చెల్లెళ్ళు రాజారావుతో. ఎదురుగా నారాయణ, వారిఇంట్లో చూసీన కళ్ళజోడు పెద్దమనిషి వీధిగుమ్మం ముందు ఎదరుయ్యారు. తరువాత మళ్ళీ కలుసుకుంటామని చెప్పి నారాయణను సాగనంపి కారులో కూర్చున్నాడు శివరాం. నారాయణకు కళ్ళుకుట్టాయి. మొన్న నగరంలోకి వచ్చి తనకంటె పలుకుబడిగల స్నేహితులను సంపాదించుకున్నాడని. పరాయిమగవాడితో తన చెల్లెలును షికార్లకు తీసుకువెడుతున్నాడనే విషయం వేలెత్తిచూపించాడు కళ్ళజోడు పెద్దమనిషి నారాయణకు నారాయణ సన్నటితలలో ఏదో పురుగు దొలిచినట్లయింది.
మర్నాడు ప్రొద్దున్నే ఆ ఇద్దరు శివరాం ఇంటిముందు వాలారు. శివరాం ముభావంగా మర్యాదగా ఆహ్వానించాడు వారిద రినీ, లక్ష్మి ఇంట్లోంచి రెండు కప్పుల కాఫీ తెచ్చింది. కాఫీకప్తు అందుకుంటూ కళ్ళజోడు పెద్దమనిషి లక్ష్మిని తేరిపార చూశాడు.
అన్వేషణ క. “ఏం చదువుకుంటున్నావమ్మా!”” నాజూకుగా ప్రశ్నించాడు. “స్కూలు పైనలు చదివాను!” ఆమె జవాబుకు కళ్ళజోడు పెద్దమనిషి కనుబొమ్మలు ఎగిరాయి. ఇద్దరు కాఫీలు చప్పరించి, కప్పులు కాలీ చేశారు “విరి అబ్బాయి బి.ఏ. చదువుతున్నాడు * కదిపాడు నారాయణ సంభాషణ శివరాం అర్ధం చేసుకున్నాడు “చెల్లెలు పెండ్లసంగతి మా తాతయ్య చూసుకుంటారు .. మన ప్రయత్నం ఆయనకు నచ్చదు!” తెలివిగా ఆ సమస్య పరిష్మారం తేల్చాడు శివరాం. కళ్ళజోడు లోంచి పెద్దమనిషి కళ్ళు ఎర్రబడినట్లు కనిపించాయి శివరాంకు. “ఆ. . దానికేంగాని నాది ఒక సలహా..... చిన్నవాడవు, కనుక చెబుతున్నా. పెళ్ళియీడు పిల్లని ఇలా పరాయి వాళ్ళతో తిప్పగూడదు” ఆ పెద్దమనిషి సలహాకు శివరాంలో కంపరమెత్తింది కోపం బలవంతాన దిగమింగుతున్నాడు. “పరాయవాళ్ళతో తిరిగితే అలాగ అనడం సహజం. .. మీ రిద్దరు ఒంటరిగా ఇక్కడ ఉండడం .. లోకం .. . హర్షించదు!”” నారాయణ మాటలు నమిలాడు. శివరాంకు కోపో(ద్రేకం ఆగలేదు. ఒళ్ళు ఉడికిపోయింది. గబుక్కున లేచి నుంచున్నాడు. “తక్షణం మీరిద్దరూ బయటికి వెళ్ళండి . . . వెళ్ళండి!” ఇల్లు ప్రతిధ్వనించేలా అరిచాడు శివరాం. అతని భయంకర స్వరూపం చూసి ఇద్దరూ నిశ్చేష్పులై ఒక క్షణం సర్దుకుని మూతి ముడుచుకుని, వికృతంగా నిష్రమించారు ఇంట్లోంచి. శివరాం కేకతో లక్ష్మి, ఇంటి యజమాని కంగారుగా మేడ క్రిందకు వచ్చారు. “ఏమీలేదు . . . వాళ్ళు ఆవాకులు పేలేరు నేను అరిచాను... అంతే!” శివరాం కోపం సర్దుకుని నవ్వేశాడు. ఈ కుత్సిత సమాజ పరిసరాల్లో చెల్లెలును తనదగ్గర ఉంచు కోవడం భావ్యంకాదని నిశ్చయించాడు శివరాం రాజారావు తల్లి మనుమడిని చూడటానికి పిరాపురం వెడుతుంటే ఆమెకు చెల్లెలును అప్పగించి రాజమండ్రిలో దింపేయమని కోరాడు శివరాం. అన్న
కేశ్త2 అన్వేషణ విచిత్ర ప్రవర్తన అర్ధం కాకపోయినా, నగరంలో చాలా రోజులున్నానని, తిరిగి వెళ్ళడంగూర్చి ఎక్కువ పట్టించుకోలేదు. లక్ష్మి,
ప్రపంచం గురించి ఎక్కువ తెలియకుండా పరిమిత ప్రదేశంలో (బ్రతికే ఇంటిదగ్గర మధ్యతరగతి సమాజానికి, (ప్రాంతాలు మారి వివిధ సంస్కృతులతో విలసిల్లే నగరంలో బ్రతికే మధ్యతరగతి సమాజానికి నైజగుణం ఒకటే ననిపించింది ప్రీ పురుష స్నేహం అవినీతి చిహ్నంగా మాత్రమే భావించే కుత్సితులకు మరే అభిమానం, (పేమ అర్ధంకాదు. ఈ మధ్యతరగతి సంకుచిత బంధుజన వ'తావరణాన్ని అధిగమించి నూత్న స్నేహాలతో. విశాల దృక్పధంతో బ్రతకడానికి మార్గమన్వషించడం అత్యవసర మనిపించింది శివరాంకు.
రత్నం కోడలు చనిపోవడం మానసికంగా ఏమిటో శివరాంకు చాలా అసంతృప్తి కలిగించింది ఆమె కనిపించినప్పుడు ఈసడించుకున్న రోజులున్నా ఆమె మరణాంతరం ఆమెలో కనిపించిన అప్యాయత శివరాంను వెన్నఎటింది. ఒంటరిగా తన గదిలో ఉన్నప్పుడు ఆమెగురించి భావాలు పరిపరి విధాల పోయేవి. మనశ్శాంతికి మనస్తత్వం మార్పుకు బసమార్చటం ముఖ్మమని నిర్ణయించేడు శివరాం.
చెల్లెలును రైలులో సాగనంపి, ఆలోచనలతో స్టేషన్‌ను విడిచి వీధిలో నడవసాగాడు శీవరాం. వీధిలో పరుగెత్తే కార్లు ఇంజన్లు ముందు గాజుదీపాలతో గుడ్లురిమి చూస్తున్న క్రూరమైన సమాజంలా అగుపడ్డాయి., పరిసరాలలో నడుస్తున్న మనుష్యుల చూపుల్లో, నడకలో మాటల్లో వక్రతలు కనుపించాయి కృత్రిమ విద్యుద్దీపాల కాంతిలో నగర సహజ సౌందర్యం మించినట్లు విరుమిట్లు గొలుపుతోంది. హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చి తనగదిలోదీపం వెలిగించాడు శివరాం.
దోమలు తమ రోదన ప్రారంభించి పీకడం మొదలెట్లాయి. దీపంచుట్టూ ఎగిరే పురుగులకోసం నోరు మెదుపుకుంటూ పొంచి కూర్చుని ఒక్కొక్కటే భక్షిస్తోంది గోడమీద పొతకలా ఎదిగి అంటి (ప్రాకుతున్న బల్లి.
అన్వేషణ శేత్షపి
అప్టల్గంజ్ బస్సు స్టాండు వెనకాల పార్కులో జనం గుంపులుగా చెదిర కూర్చున్నారు ఆకుపచ్చ మైదానాలు - ఆకాశాన్నంటే పొడుగయిన చెట్లు మైదానల మధ్య రాతిహంస, ఆకాశంలో కనిపించే సూర్యుని బాటలా మైదానాలను చేదిస్తూ యిరుకొనలు కలుపుతున్న గచ్చుదారి - చింతచెట్టు మొదలుతో రాళ్ళగుట్టమీద విచిత్రంగా అల్లుకున్న లతల సమూహం - ఆ వెనకాల గోరదీల దిమ్మల కానుకుని చుట్టుకున్న వివిధ వృక్ష సముదాయం
- చుట్టూ ఆవరించుకుని ఆ పార్కును రక్షిస్తున్న కోట బురుజుల్లాంటి గోడలు - అక్కడే దృశ్యాలు చూడడానికి ఏర్పరచబడిన రాతితిన్నై గోపురం - విపరీతమైన అందాలు వెదజల్లుతూ వాహ్యాళికి వచ్చె జనులు మనస్సులను అలరిస్తోంది. 'ప్రకృనే మూసీనదిపై అతికిన వంతెనపైన పాలబుడ్డు పార్కు ఎదురుగా ఉన్న లైట్లు - ఆకుపచ్చ వారును వెలుగు నీడల్లో ముంచి తేల్చుతున్నాయి. చింతచెట్టు వెనుక వృక్షాలలోంచి రాణి, రావు వెలికి వచ్చారు. ఫెల్టు హేట్ సినీతారల బుష్ కోటు ఊపుకుంటూ సిగరెట్టు ముట్టించాడు రావు ఖులాసాగా.
“మనమిద్దరం నడుస్తూంటే ఇది నందన ఉద్యానవనంలా లేదూ?” రావు నవ్వేడు
“ఆ! సుగంధ పరిమళాలు కూడా వస్తున్నాయి”
“ఎక్కడనుంచి?...నీరులేని మూసీనదిలోంచా?” పకపక నవ్వేడు రావు తన తెలివికి తానే మెచ్చుకుంటూ.
“అబ్బే...మీరిచ్చిన చీరమీది సెంటు పువ్వుల్లోంచి!”
“ఆ! అలాగా... అందుకే చీరమీది ప్రతీ పువ్వుకు సెంటు రాశాను పరిమళించాలని... రాణీ... నువ్వు యీ రూపంలో...” రావు నడుస్తూ ఆగిపోయి ఒక్కసారి తన్మయతగా ఆమెవైపు చూశాడు.
న! అన్వేషణ రాణి నవ్వింది.
“రాణి నువ్వు వెధించకూడదు. త్వరలో”
“తప్పకుందా... అమ్మనడిగి పెళ్ళి చేసుకుందాం !"
“సరే నీ యిష్టం... విజయతత్వమే వేరు!” నీరసిల్లాడు రావు.
“అలాగా? పకపక నవ్వింది రాణి
వీధిలోని దుకాణాలపై విద్యుద్దీపాలు వివిధ రంగుల్లో హరాత్తుగా వెలిగి ఆరి బాటసారులను ఆకర్షిస్తున్నాయి. రాణి తెల్ల చీర మీది పసుపుపచ్చ పూలు మిల మిల మెరుస్తున్నాయి ఆ వెలుగుల్లో
రావు, రాణి రిక్షా ఎక్సారు. కోరీ ప్రక్కని సందులోకి మళ్లింది రిక్షా, రాణి ఇంటిముందు ద్గాడు రావు.
“ణీ! యీసారి నా సంగతి తేల్చకపోతే వీ ముఖం చూడను” విసవిస నడిచి రిక్షావాదికి డబ్బు చెల్లించి వెళ్లిపోయాడు రావు.
“అంతకోపమా!” రాణి నవ్వు, తనవైపు రావు చూడకపోవడం గమనించి ముఖం తీవ్రం చేసుకుని తల వంచుకుని రెండు అడుగులు వేసింది.
“కమలా!” గట్టి అరుపు వినిపించింది. ఎవరో మగమనిషి గొంతులా ఉంది తన పూర్వ నామం జ్ఞాపకం వచ్చి, ఒక క్షణం ఆగి, కంగారుగా అడుగులు వేసుకుంటూ ఇంట్లో చొరబడింది రాణి వీధి తలుపులు మూసి కిటికీలోంచి బయిటికి తొంగిచూసింది. ఏ మనిషీ తన్ను వెన్నంటినజాడ కనిపించలేదు. కంగారు అణచుకుని యధాస్టితికి వచ్చింది రాణి.
రావు యిచ్చిన పువ్వులచిర ధరించి ఆఫీసుకు వెళ్లింది రాణి. అనునయంగా నెమ్మదిగా మాట్లాడే రాఘవరావు తప్ప తక్కిన వారంతా రాణివైపు ఎగాదిగా చూసి ఏదో మాట్లాడ పురస్మరించుకునేవారు, రామ నరుసు బావమరిది మూర్తి రాణితో ఎక్కువ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించాడు. తన బావ యీ కంపెనీ యజమాని అన్న సంగతి, తన పలుకుబడి ఆమెకు తెలిసేలా సర్వవిదితం చేశాడు అయినా అమాయకంగా నిర్లక్ష్యంగా కనిపించిన రాణిని చూస్తున్న కొలది మూర్తికి ఉద్రేకా లతో మతి చెడుతోంది. ఎలాగైనా రాణి స్నేహం పొందాలని వివిధ ప్రయత్నాలు చెయ్యసాగాడు.
అన్వేషణ పతర్
“నమస్కారమండి!” రాగానే రాణి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మూర్తి,
[ప్రతి వందనం చేసింది ముభావంగా,
“మీ పువ్వుల చీర చాలా అందంగా వుంది.. ఎవరిచ్చారో!” నవ్వాడు వెటకారంగా మూర్షి
“స్వంత విషయాలు మీకనవసరం!” కరకుగా జవాబిచ్చింది.
“నిన్న సాయంత్రం తమరని పార్కులో చూశాను...ఎవరో ఆ వ్రక్మనున్న అదృష్టవంతుడు”
“మీరు నాజోలికి రావద్దని ఎన్నోసార్లు చెప్పాను!” రాణి గట్టిగా అరచింది.
రాఘవరావు వారి ప్రసంగం రాణి కేక విని ఇద్దరిమధ్య వచ్చి సముదాయించ జోయాడు కంపెనీ యజమాని బావమరిది నన్నట్లు గర్వంగా రాఘవరావువైపు చూచి మూర్తి అప్పటికి ఆమె దగ్గరనుంచి నిష్క్రమించాడు
మధ్యాహ్నం రాణి రాఘవరావుతో ఫలహారం చేసింది తన బేగ్లో నుంచి మామిడాకు కట్టిన పసుపుత్రాడు బయటికి తీసి రాఘవరావు చెతికి కట్టింది.
“ఇదేమిటి... ఈ రోజు రాఖీపౌర్ణమి కాదే!”
జాకపోవచ్చు...యీ ఆఫీసు చూస్తోంటే నాకు భయం వేస్తోంది... ఇక్కడ అన్నలా మీరే నన్ను కాపాడాలి! బిక్క్మముఖం పెట్టింది రాణి.
“నేనుండగా నీకేం ఫరవాలేదమ్మా!... నీకే కష్టమొచ్చినా నాతో చెప్పు... నీకు తప్పకుండా సాయం చేస్తా!” రాఘవరావు సహజ ధోరణిలో కళ్ళు చికిలించి, నీరసంగా అన్నాడు,
గమనించాడు మూర్తి. అవమానమే తనకు జరిగినట్లు భావించాడు ఆఫీసులో అందరికీ మధ్యాహ్నం రాణి చేసినపని చెప్పాడు రాఘవరావు రాణిని మచ్చిక చేస్తున్నాడనే నదంతి లేవదీశాడు. అటువంటి అనాకారి కన్న తీసిపోయారా మీరు అని ఆఫీసు గుమాసాలను ఉద్రేక పరిచాడు మూర్తి. తాత్కాలికంగా గుమాస్తాలంతా విడ్డూరంగా రాణి గురించి ప్రసంగించినా, కంపెనీ యజమానికి కూడ ఆస్తరాలు అనే ధోరణిలో ముభావం వహించారు. మూర్తి మనస్సు వ(క్రగతిలోనే పయనించింది. రెండుసార్లు ఆమె వ్రక్క కుర్చీ నుంచి వెడుతూ కాలితో ఆమెను తన్నాడు మరోసారి ఆమె చీర కొంగు లాగాడు.
146 అన్వేషణ
రాణి కోపోద్రేకం అణచుకోలేక పోయింది బుసకొట్టిన పాములా రివ్వనలెచి విసుగా నడిచి చెప్పుతీసి మూర్తి దవడమీద గట్టిగా బాదింది మౌనంగా పోయి యధాస్థానంలో కూర్చుంది.
మూర్తి నిలువునా ఆ సంఘటనకు మూర్చపోయినంతగా బాధపడ్డాడు. తోటి గుమాస్తాలకు తన ముఖం చూపలేకపోయాడు. వెళ్ళి రామనరుసుకు ఫిర్యాదు చేశాడు. అంతకన్నా ఎక్కువ ప్రతీకారం అక్కయ్య ద్వారా తీర్చుకోవాలని గృహోన్ముఖుడైయాడు మూర్తి తక్షణం
రాఘవరావు మందలించాడు రాణిని. జరిగిన సంఘటన ఏ విపరీత పర్యవసానం కలిగిస్తుందో అని భయపడ్డాడు రామ నరుసు రాణిని పిలిచి మొదట కూకలేసినా, బావమరిది అసభ్య ప్రవర్తనకు తనే నొచ్చుకున్నాడు. ఆ రోజు గుమాస్తాలంతా రాణిని పులిలా చూసి భయపడి పిల్లుల్లా అడుగులు వేసుకుంటూ నిష్క్రమించారు.
మర్నాడు రాజి యధాప్రకారం చిరునవ్వుతో అడుగుపెట్టింది ఆఫీసులో. రామనరుసు పిలిచాడు ఆమెను గదిలోకి. చిన్న కొండలా లావుగా సన్నగా ఉత్సవ విగ్రహంలా కుర్చీలో కూర్చుంది రామనరుసు భార్య కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతూ ఆ ప్రకృనే పళ్ళు కొరుకుతూ రీవిగా నిలుచున్నాడు మూర్తి మౌనంగా ముభావంగా కాగితం అందించాడు రామనరుసు రాణికి. ఉద్యోగం ఆఖరయిందని కాగితం చెప్పింది. రాణి అందరివైపు ఒకసారి చూసి అమాయకంగా పేలవంగా నవ్వి, విధికృతము తప్పింపలేమనే వేదాంతంలో బయటికి వచ్చేసింది. తన వ్యాపారానికి పెట్టుబడి పెట్టిన భార్య ఆజ్ఞలను పాలించక తప్పలేదు రామనరుసుకు.
రాఘవరావు ఆమెకు నానుభూతి చూవాదు. తిరిగి ఆమెను ఉద్యోగంలో చేర్చలా తాను సర్వశక్తులా ప్రయత్నిస్తానని వాగ్భానమిచ్చాడు. ఉద్యోగం దొరికేలోగా ధనసహాయం కూడా చేస్తానని మాట యిచ్చాడు రాఘవరావు.
ఆనాటి సంఘటనకు, తన విచిత్ర ప్రవర్తనకు పశ్చాత్తాపంతో దిగులుగా యింటికి వచ్చేసింది రాణి.
రాత్రి ఎనిమిది గంటలయింది. అయినా మరియమ్మతో జరిగిన సంగతి చెప్పలేదు రాణి. తీవ్రంగా ముందు కార్యక్రమం గురించి తనలోనే ఆలోచించుకోసాగింది.
రామనరుసు తిన్నగా ఇంట్లోకి వచ్చేశాడు. ఇదివరకు రామనరసును ఎరుగని మరియమ్మ అతని పెద్ద కారు చూసి ఏ గొప్ప వ్యాపారస్తుడో, ఉద్యోగో రాణి స్నేహం
అన్వేషణ కేత్న7 వాంభించి వచ్చాడని, అతి వినయంతో, తన చీర సర్దుకుంటూ నాజూకు నవ్వులు చిలుకరిస్తూ ఆహానించింది. మర్యాదగా బేచి కూర్చుంది రాణి మౌనంగా నమస్మరించి, మధ్య తన ఆకారం ఎందుకని వంటింట్లొనికి నిష్షమించింది మరియమ్మ.
“రాణి ! నువ్వు ఎంత బాధపడి ఉంటానో నాకు తెల్పు. . కాని తప్పునీసరి అయింది. నువ్వు ఉద్యోగం చేసినా చెయ్యక ఫోయినా వంద రూపాయలు యిచ్చేస్తా “త్వరలోనే మళ్ళీ నిన్ను ఆఫీసులోకి తీసుకుంటా... నువ్వేమీ అనుకోకూడదు!” రామనరుసు ఒగరుస్తూ బ్రతిమిలాడాడు. రాణి సూక్ష్మంగా పసిగట్టింది రామనరుసు మనస్సులోని అంతరార్ధం. ఆయినా పరిస్థితులు చూపించిన అగత్యానికి బలి అయి “అలాగే” అని ఊరుకుంది.
బీ మీది అభిమానం...” రామనరుసు "“హిహిహి” అంటూ మాటలు మింగేశాడు.
“అప్పుడప్పుడు కనిపిస్తూండు; నాకు చాలా అర్జంటు మీటింగు వుంది” రామనరుసు లేచాడు. నమస్మారంచేసి వీడ్కోలు ఇచ్చింది రాణి.
మరియమ్మ ఆ వచ్చిన మనీషి గురించి వివరాలు అడిగింది అందము మనిషిని అంటిపెట్టుకుని చాలా కాలం ఉండదని వయస్సులో ఉన్నప్పుడె అదది బాగా ధనం సంపాదించుకుని ముసలితనంలో జీవితాన్ని కొపాడుకోవాలని, అన్ని కష్టాలు తప్పించి ఆ ఏసుప్రభువు చల్లగా చూస్తారని మరియమ్మపది నిమిషాలు తియ్యగా ఉపన్యాసం యిచ్చింది.
“నా ఉద్యోగం ఊడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నా! రాణి చల్లగా వదిలింది మాట. దీనివల్ల ఆమెలో వచ్చే పరిణామాలు ఆసక్తిగా పరిశీలించదలిచింది రాణి. తన మీద ఆధారపడి (బతుకుతున్నా తన జీవితంలోని నిజం యింతవరకు మరుగుపరిచి నంగనాచిలా బ్రతకడంలోని అంతరార్థమేమిటో రాణి ఆ రోజు తేల్చదలిచింది. రాణి మాటలకు మరియమ్మ ఒక నిమిషం నోరు ఆవలించి ప్రతిమలా కూర్చునివోయింది.
“ద్వుర్రి ఆ కంపెనీ యజమాని ఎందుకు వచ్చినట్లు”
“ఇవ్వవలసిన జీతం రేపు అందజేస్తానని మర్యాదగా చెప్పాడు. వచ్చి!”
“అనవసరంగా ఎందుకు కొట్టావే ఆ అబ్బాయిని... మచ్చిక చేసుకుంటే..!” సాగదీసుకుంది మరియమ్మ.
148 అన్వేషణ
“చాల్లే నోర్ముయ్యి .. ఈ రోజు నుంచి నీదారి నువ్వు చూసుకోవచ్చు!” రాణి కోసం నటించి వదనం తీవ్రం చేసింది.
మరియమ్మ మనసు పరిపరివిధాల బాధపడింది రాణి తన్ను ఒంటరిగా వదిలేస్తే పొట్టగడిచే విధంలేదు మర్యాదగా మారురూపంతో ఒక తరగతి మనుష్యుల స్నేహంతో బ్రతుకుతున్న తనను మరోపని చేసే స్తోమత కాని, చాకచక్యంగాని లేదని గుర్తించుకుంది మరియమ్మ.
“రాణి! నన్ను యిలా ఒంటరిగా గంగపాలుచేస్తే ఎలా?”...యీ ముసలిదానికి ఎవరో ఒకరు అందగా ఉండకపోతే బ్రతక లేదు... నల్లమందు ఖర్చుకే...” మరిమయ్య్మ ఏడ్పు మొదలెట్తింది
ల
“ఎందుకు దొంగ ఏడ్పులు...అంతా దొంగ జీవితం. విజయ ఏమయింది?...నరసింగం ఎక్కడికి పోయాడు! నువ్వు విజయ తల్లివేనా?...నన్ను కూదా చివరకు వాళ్లలా నాశనం చేస్తావు!” రాణి ముఖం ముడుచుకుంది
“రాణీ! నువ్వు ఎలా చెబితే అలా వింటా!” మరియమ్మ రాణి చేతులు పట్టుకుంది .. “అయితే విజయ సంగతి చెప్పేస్తా! .. విజయను ఎవరో చంపేశారు!” రాణి ఆశ్చర్యంతో ఒక అరుపు అరిచింది.
“ఆ రోజు నువ్వు ఆఫీసుకు వెళ్లావు... మధ్యాహ్నం పోలీసులు వచ్చారు యింటికి... నన్ను విజయ శవం దగ్గరకు తీసుకు వెళ్లారు... ఆఫ్టల్గంజ్ పార్కు గోడక్రింద మూసీనది చెట్ల తుప్పల్లో పడి ఉంది. ఆస్పత్రి నర్సులు ఎవరో చెప్పారట చిరునామా. . నన్నడిగారు శవాన్ని గుర్తుపట్టగలవా... అని... ఆ హత్యలో నన్ను ఇరికిస్తారనె భయం పుట్టింది. తెలియదని బొంకాను. విజయ స్నేహితులతో కలిసి పెళ్లికి బెజవాడ వెళ్లిందను కున్నాను”... మరియమ్మ గద్దద స్వరంతో, ఎక్కిళ్ళతో, కొంగు నలుపుకుంటూ బడింది.
విజయను ఎవరు చంపారో అనే విషయం మరియమ్మకు గాని రాణికిగాని అర్ధం కాలేదు కోపిప్టియైన నరసింగం అంత పని చేస్తాడనుకోడానికి ఏ బుజువులేదు. పైగా అతను నగరమే విడిచి వెళ్లిపోవడంతో ఎవరికి అతనిపై అనుమానమే కలగలేదు.
“ఎవరైనా పొడిచేశారా?” చావురీతి గురించి ప్రశ్నించింది రాణి.
“లేదు. ఎవరో పీకనులిమి చంపేశారుట!” మరియమ్మ శోకం దీర్హాలుగా మారింది.
అన్వేషణ 143
అయితే ఎప్పుడో నన్ను కూడ యిటువంటి పరిస్థితుల్లో యిరికిస్తావన్నమాట . ఈ రోజు చెబుతున్నా. న్ స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరినీ నాకు పరిచయం చెయ్యకు... నేను నీతో ఎక్కడికి రాను. నా మీద ఆధారపడదల్సుకుంటేనే పెట్టింది తిని ఊరుకో!” రాణి తన నియమాలు ఖంజాయింపుగా ముందు పెట్టింది.
“అలాగే” తల దించుకుంది మరియమ్మ.
“ఈ నరసింగం ఎవరు?” రాణి పరిశోధన మొదలెట్టింది.
“అసలు నిజం చెప్పేస్తా... మేము కైస్తవులం కాము... ఒక కలపవ్యాపారి నన్ను నంద్యాల నుంచి లేవదీసుకుని వచ్చి గంటూరులో ఉంచాడు. మా యింటి ్రక్షనే రెండు చిన్న గదులుండేవి. నేము అక్కడికి రాకముందే విజయ కాపురముంటూ ఊళ్ళో టీచరుపని చేస్తుండేది. ఒక చిన్న స్కూల్లో రెండేళ్ళ తర్వాత ఆ కలప వ్యాపారి చచ్చిపోయాడు అంతకుముందే విజయతో నాకు స్నేహం ఏర్పడింది. ఒక రోజున విజయ అడిగింది నన్ను యీ నగరం వచ్చెయ్యమని తనతో.. తనకు తల్లిగా ఉండమంది నన్ను ..ఒప్పుకున్నా ..కొంచెం పెద్దరికం హోదాలో తిరగాలని క్రైస్తవులుగా మారిపోయాం యిక్కడ!” తన కృత్రియ (బతుకుకు పేల వంగా నవ్వింది మరియమ్మ.
చెరువులోకి జారిపోయిన మనిషి ఎటువైపు వెళ్ళినా నాచు చుట్టుకున్నట్టు, జీవితంలో తప్పుదారి త్రాక్కిన తన చుట్టూ పతితశీలురే చేరుతూండడం రాణికి విసుగు కలిగించింది గౌరవ ప్రపత్తులతో మసిలే ఉన్నత వంశీకుల సాంగత్యం కోసం తహతహ లాడింది రాణి ఏదైనా కళా జీవితంలో అడుగు పెడితే అటువంటి అవకాశాలు వసాయేమో అనే ఆలోచన ఆమెకు తట్టింది, పది మంది పెద్దలువచ్చే ప్రదేశాలు, సభలు, గ్రంధాలయాలు, ఉత్సవాలు సందర్శిస్తోంటే ఎవరితోనైనా స్నేహం కలగవచ్చనే అభిప్రాయం కలిగింది. ఉద్యోగం లేకుండానే జీతం వస్తున్న ఈ దినాలు ఎలా గడపాలా అనే యోచన చేయసాగింది.
మొకరంజాహి రోద్దులోని గ్రంధాలయంవైపు నడిచింది, సాయంత్రం. అతి శుభ్రంగా, రకరకాల పుస్తకాలతో అందంగా ఎంత మంది వచ్చి వెడుతున్నా అతి నిశ్శబ్దంగా నాజూకైన పద్ధతిలో ఆకర్షణీయంగా ఉంది గ్రంధాలయం. మేగజైనులు, పుస్తకాలు కొంతసేపు చదివి సభ్యురాలిగాచేరి కొన్ని మేగజైనుల్లో చేతో పుచ్చుకుని వయ్యారంగా వీధిలోకి నడిచింది రాణి. వీధిలో ఒక గజం నడవగానే ఎదురుగా “కమలా” అంటూ పిలుసూ ఇరవైయేళ్ళ యువకుడు నిలుచున్నాడు. విననట్లు రెండడుగులు ముందుకు వేసింది
150 అన్వెషణ రాణి. నిన్నే అంత తమాషాగా ఎరగనట్లు పోతున్నావె! వెంటబడ్డాదు.
“ఎవరు నువ్వు.. జాగ్రత్తగా మసలుకో” అరిచింది రాణి.
“అబ్బ! ఇంట్లోంచి పారిపోయి తమాషా చేస్తున్నావే .నిన్ను బలవంతంగా యీవేళ...!” ఆ యువకుడు ఆమె చెయ్యి పట్టుకోబోయాడు.
“వోలీసులని పిలవనా.. ఏమిటా పొగరు .? రాణి చౌరస్తాలో నిలుచున్న పోలీసులను గట్టిగా పిలిచింది రహదారి కాపాడు తున్న పోలీసు కదలలేక ఒక నిమిషం తటపటాయించాడు ఇంతలో జనం మూగారు మూగిన గుంపులోంచి దూసుకువచ్చాడు రాజారావు.
“రాముడూ!... ఏమిటీ యీ అల్లరి నడిబజారులో!” మందలించాడు రాముడిని రాజారావు.
“చూడండి. _.ఈమె కమల కాదట!” తన్ను మోసం చేస్తున్న రాణిని చూపించాడు రాముడు.
“నా పేరు ..రాణి ..కోరీ దగ్గర ఉంటాను... ఉద్యోగం చేసుకుంటున్నా .. మనిషిని బోలిన మనుష్యులు ఉండవచ్చు... అందుకు నన్ను నిలదీస్తాడేమిటి మర్యాద లేకుందా!” చీదరించుకుంది రాణి
రాజారావు కూడా ఆ అమ్మాయిని ఎక్కడో బాగా చూసినట్లు అనుమానపడ్డాడు.
“నన్నెప్పుడదైనా చూశావా?” ప్రశ్నించాడు రాజారావు,
“లేదు...” నవ్వింది రాజి.
రాముడిని కూకలేసి పంపించేశాడు రాజారావు. చేసిన సహాయానికి కృతజ్ఞత చూపుతున్నట్లు నమస్కరించింది రాణి. తన చిరునామా యిచ్చి ఎప్పుడైనా అవసరమైతే కబురంపండి అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు రాజారావు.
తన్ను వేశ్యల కొంపలోంచి తప్పించడానికి ఉద్యుక్తుదైన రాజారావులో మంచి తనమున్నాా వేళ్ళకొంపల మధ్య తిరిగే అతనిలో ఏ నీచగుణాలున్నాయో అనే శంక రాణిని వేధించింది అయినా రాజారావు ద్వారా తనకు తెలిసిన నాటకకళతో రంగంలోకి ప్రవేశిస్తే ప్రేక్షక జనంలోని పెద్దల సాంగత్యంలో అభివృద్ధిచెందే అవకాశాలు బాగా లభిసాయనే ఆశపడింది రాణి.
అన్వేషణ కేస్ 1 గ్రంధాలయానీకి విలైనన్నిసార్లు వెళ్లింది రాణి ఒక రోజు రాజారావు అక్కడే కనిపించాడు ఆకస్మికంగా కోరుకున్నట్లు, రాణి నమస్కరించింది చదువుతున్న నాటకం పుస్తకం చూశాడు రాజారావు “నాటకాలంటే సరదా అనుకుంటాను!” రాజారావు ఆమె ప్రక్కనే కూర్చుని మరొక పుస్తకం తీశాడు “మరేనండి. మీరు నాటకాలు వేసారా!” “వెయ్యను... కాని వెసేవాళ్ళు నా స్నేహితులున్నారు!” “ఏమండీ...నాకు నాటకాల్లో వేషాలు వెయ్యాలని ఉంది” కనుబొమలు ఎగరేస్తూ భంగిమలు మారుస్తున్న నర్తకిలా కులి కింది రాణి “ఇంతకుముందు వేషాలు వేశారా?” “చదువుకునేటప్పుడు బడిలో వేసేదాన్ని...అయినా బాగా వేషం వెయ్యగలననే ధైర్యముంది!” రీవిగా నవ్వింది రాణి. “ఆడవాళ్ళు వెషాలకు దొరక్మ అవస్థపడుతూంటే, మీ కోరిక చెల్లకపోవడమేమిటి?” నిశ్శబ్దాన్ని చెదరగొంట్టకుండా మెల్లిగా నవ్వాడు రాజురావు రాజారావు రాణిని కృష్ణమూర్తికి పరిచయం చేశాడు కృష్ణమూర్తి ఆ నగరంలో నటకుడిగా, నాటక సమాజ నిర్వాహకుడుగా పేరుపొందాడు. ఎక్కడ నాటకం జరిగినా, నృత్యం ఏర్పాటయినా, గానకచేరి పెట్టినా, అక్కడ ప్రత్యక్షమౌతాదతను ఇతర ప్రాంతాల నుంచి ఎ కళాకారుడు, ఏ సినిమా నటులు నగరానికి వచ్చినా ఏదోవిధంగా వాళ్ళని పట్టుకుని ఒక సభ ఏర్పాటుచేసి అభినందనలు ఇవ్వనిదే అతనికి సంతృప్తిలేదు; అతని జీవితములో నాటకాలు ప్రతినిముషం ప్రతిధ్వనిస్తూ ఉండడంవల్ల అందరూ అతనికి నాటకాల కృష్ణమూర్తి అని పేరు కూదా పెట్టేశారు. “నవయువక మండలి” స్థాపించి దానిని అభివృద్ధికి తెచ్చాడు. రాణి పరిచయంతో తనకు పెన్నిధి లభ్యమయినంతగా పొంగిపోయాడు కృష్ణమూర్తి, ఇంతవరకు పేడి మూతుల ముసలమ్మలు, తెలుగుమాట సరిగారాని ఆరవ వనితలు తన నాటకాలలో పాత్రలు ధరించి వీలైనంత చిత్రవధ చెయ్యడం కళ్ళారాచూసి భరించి, (పేక్షకులకు తన బాధ తెలియకుండా చిరునవ్వుతో సాగిపోయేవాడు. పైగా (ఢ్రుక్షకులు ఆ
కేప్ అన్వేషణ పాత్రధారుల రీతులు, ప్రశ్నిస్తే, ఆడదే దొరకని ఈ నగరంలో ఆ మాత్రం ధైర్యంగా ఆడవాళ్ళని నాటక రంగంలోకి తెచ్చిన తమ నాహస థ్రైర్యాలకు అభినందనలు ఇవ్వతగునని ఉపన్యాసమిచ్చేవాడు. అది కూడ ఒక నిజమని తెలుసుకుని (పేక్షకులు ఆ పాత్రలు చూపిన హాస్యం ఆనందించిఫోయేవారు ఇటువంటి యిరుకు సంఘటనలు రాణి ప్రవేశంతో తన నాటక రంగంలో అదృశ్యమై పోగలవని సంతోషించాడు కృష్ణమూర్తి.
మర్నాడు రమ్మని, క్రొత్త నాటకంలో ఒక పాత్ర వెయ్యాలని ఆదేశించాడు కృష్ణమూర్తి రాణిని స్వీయ విషయాల గురించి ప్రశ్నించినా ముభావంగా సమాధానం యిచ్చి ఊరుకుంది రాణి. ఎక్కువగా స్వంత విషయాలు ప్రధమ స్నేహంలోనే ఆడదాన్ని ప్రశ్నించడం అపాయకరమని అనుభవం కలిగిన కృష్ణమూర్తి నవ్వుతూ రాణిని నాగనంవాడు ఆనాటికి.
ఒక స్కూలు బడిలో రిహార్సలు జరుగుతున్నాయి. (బతికిన దినాల్లో భార్యను హింసించి ఆమె మరణానంతరం ఆమె విలువ అర్ధం చేసుకుని పిల్లల కుటుంబాన్ని సముదాయించలేక వ్యధపడిన భర్త కధ ఆ నాటకం రాణికి ఇచ్చిన వొత్ర చాలా చిన్నది. కష్టాలు భరిస్తూ విషాదంగా నటించడం ఆ పాత్ర మరణించడంతో నాటకంలో ఆమె న్ధానం ఆఖరయి వోతుంది.
కృష్ణమూర్తి తక్కిన నటకులను రాణికి పరిచయం చేశాడు. భూమారావు... కృష్ణమూర్తి కుడభుజం... నల్లబుగ్గలతో, ముందు బట్టతల ఎర్బడిన చిన్న క్రాపుతో, మడతలు నలగని వులన్ పాంటుతో కొంచెం సిగ్గుగా నవ్వుతూ - కులుకుతూ నమస్కరించాడు... ఆచారి... ఆజానుబాహుడయి, చిన్న సన్నని నామంపెట్టి, చక్కగా వెనక్కి గిరిజాలు దువ్వుకుని, పంచెకట్టు లాల్ఫీలో నాటకాల గురువులా నవ్వుకుంటూ చెయ్యి ఆడించాడు .. హుస్సేన్ ఆలీ... వెడల్పైన తెల్లని వదనం - స్ఫుటమైన ముక్కు వంకీల మధ్య పాపడి -బుష్‌కోటు పాంటుతో, సిగరెట్టు పీలుస్తూ చిదానందంలాగా నవ్వాడు. జగదీశ్వర్... వారా పత్రికలా కనిపిస్తున్న బుష్‌కోటు - గాలిలో ఊగూతూ సన్నగా రివటగా ఉన్న శరీరం - ముద్దమాటలు... నిమిష నిమిషానికి వెకిలి నవ్వు...వంగి ధనస్సులా నమస్మ రించాడు... శ్రీనివాసు...ఎర్రటి కళ్ళతో, తెల్ల్పషరాయి పాంటుతో నాజూకుగా నవ్వుతూ “మా నాటకాల్లో మీరు చేరడంవల్ల ఈ రోజు నిజంగా శుభదినం!” అన్నాడు. ఈ శుభదినం నాకు టీలాంటి పానీయం సేవించడం ధర్మం కనుక తక్షణం అటువంటి ఏర్పాటు చేయించడం న్యాయమని వక్కాణించాడు శ్రీనివాసు. శ్రీనివాసు అన్నాడని
అన్వేషణ 153 కాకపోయినా, క్రొత్త నటీమణి ముందు కొంచెం హోదాగా ఖర్చుపెట్టడం కూడా నాటక నిర్వాహకుల గొప్పతనం సూచిస్తుందని కృష్ణమూర్తి అనుకున్నాడు.
ఎక్కడ ఎవిధంగా ఎడ్యొూలి ఐరకమైన విచారభంగిమలు ముఖంలో ప్రదర్శించాలీ. ప్రక్కనే ఉన్న పాత్రలలో ఏ స్థాయిలో సంభాషణ నడపాలి అనే ముఖ్య విషయాలు కృష్ణమూర్తి తన ధర్శకత్వ నిపుణత రాణి అర్ధం చేసుకునేలా అనుభవజ్ఞుడైన కళాకారుడిలా తనే నటిస్తూ చెప్పాడు లావుగా పొడుగ్గా గరుత్మంతుడి ముక్కుతో, ఒత్తు జుట్టు కిరీటంతో, గంధర్వుడి ఆకారంతో ఉన్న కృష్ణమూర్తి స్త్రీ పాత్ర విషాద భంగిమలను చూసిస్తుంటే తక్కిన నటకులు నవ్వుకున్నారు
“నేను యీ ఏద్చే పాత్రలు వెయ్యలేనండి!” సాగదీస్తూ అన్నది రాణి విశాలంగా
“అబ్బ! ముత్యాలు ఒలకబోసింది పిల్ల!” అన్నాడు శ్రీనివాసు. రాణి నవ్వుచూసి.
“ఈ మొదటిసారికి ఏడుస్తేగాని నాటకం మరి ఎలా?” కృష్ణమూర్తి తన యజమాని తనము తగ్గించుకోదలచుకోలేదు
“క్కసారికి ఏదోవిధంగా ఎదడమ్మా ..వచ్చేసారి నుంచి నవ్వేలా నాటకం వేద్దాం!” అంటూ జగదీశ్వర్. ఏడ్పులోని రకాలు వరుసగా చూపించాడు. అతడి ఏడ్పులు చూసి, శ్రీనివాసు పిల్లికూతలు, భూమారావు కుక్క అరుపులు, ఆచారి ఆంబోతు రంకె, హుస్సేన్ ఆలీ ఒక భావగీతం వకరుసగా విసిరారు. ఆ గల్లంతుమాని “అందరూ ఆట సమయంలో నిశ్శబ్దం!” అంటూ నవ్వుతూ శాసించాడు కృష్ణమూర్తి,
నవ్వులు ఆపుకుంటూ రాణి నటించింది.
“భేష్! ఇలా చేస్తే చాలు!” అన్నాడు కృష్ణమూర్తి.
“ఇలా చేస్తే సినిమాలోకి తీసుకుంటారు” అన్నాడు శ్రీనివాసు.
“ఆమె సినీతార అయితే మనల్ని పలకరిస్తుందాగొ జగదీశ్వర్ ఆశ్చర్యంతో ఒగర్చేడు మాటల్లో,
“ఆమె సినీతార అయితే ఆమె ప్రక్క చిన్న చిన్న వేషాలయినా దొరుకుతాయిలే” ఆడవాళ్ళ స్నేహంలా ఆశావాదిగా పదిణ మించిన భూమారావు నవ్వాడు.
1ర్4 అన్వేషణ
“ఆ! ఇంట్లో బంట్రోతులుగానైనా చేరవచ్చు మనం!” తన తెలివికి అంతా నవ్వుతారనుకున్నాడు ఆచారి.
“వీ! నీ నీచబుద్ధి పోగొట్టుకోలేదురా తమ్ముడూ!” నవ్వింది రాణి.
అందరూ మళ్లీ నవ్వుకున్నారు
ఒక వారంరోజులు రిహార్సలు సాగాయి రాణి నటకులందరితోను పరిచయం ఏర్పరచుకొని చనువు పెంచుకుంది. ఎవరితో మాట్లాడుతున్నా నవ్వుతో కులకడం నేర్చింది రాణి సరదాగా సంఘంలో మసిలితే మనుష్యులు ఇట్టే సన్నిహితులౌతారన్న విషయం ఆమె అనుభవంలో తెలుసుకున్నది. పైగా తాను (స్తీ అవడంలో, పురుషులు మరీ ఆకర్షింపబడ్డారు. ఆ నాటక మండలిలో నటకులంతా రాణికి అతిసన్నిహితులైపోయారు. ఆ వారంరోజుల్లో.
కృష్ణమూర్తి నాటకం రిహార్సలు దర్శకత్వం వహించడమే కాకుండా నాటకానికి డబ్బు సేకరించే బాధ్యత నాటకమండలి కార్యదర్శిగా నిర్వహించవలసి వచ్చెది. ఒక్కొక్కసారి నాటక రిహార్స్చలు శ్రీనివాసుకు, భూమారావుకు అప్పగించి ధనంకోసం ఎదురుగా నున్న వారిపై దండయాత్రకు బయలుదేరేవాడు. ఈ అవకాశాలు భూమారావు, శ్రీనివాసు కూడ రాణితో పరిచయం చేసుకోవడంలో ఉపయోగించుకోసాగారు.
ఒక కాలేజీ భవంనలో నాటకం ఏర్పాటు చేశారు. ఒక మంత్రీగారు అధ్యక్షత వహించడానికి ఒప్పుకున్నారు నటీనటుల పేర్లు ముఖ్యంగా ఆకర్షణకు రాణి ఫోటో, అచ్చయిన కరపత్రాలు, నగరంలో ప్రతీచోట కనిపించాయి. కిళ్ళీ దుకాణాదారులు, హోటలు మనుష్యులు, విద్యార్థులు, అందరూ రాణిబొమ్మ చూసి ముసిరిపోయేరు. నాటకం చూడాలనే ఉత్సాహం వారందరిలోనూ రగిలింది. వీధిలో పోయే కొంటె కుర్రవాళ్ళు బస్సున్తాండులకు, గోడలకు అంటించిన రాణి ఫోటోలు చింపుకుపోయారు. తన ఫోటోలు చూసుకుని జరుగుతున్న సులభ ప్రచారానికి సంతోషించింది. ప్రచారానికి తగిన న్యాయం చేకూర్చేలా చక్కగా నటించాలని నిశ్చయించుకుంది రాణి.
అనుకున్న కాలానికి అరగంట ఆలస్యంగా నాటకం తెరవిడింది. మధ్యతరగతి కుటుంబీకుని యిల్లు తెరమీద కనిపించింది రాణి ప్రవేశించింది. రంగురంగుల కోటాల్లో ఆమె ముఖం విద్యుద్దిపాలు ఉజ్జ్వల కాంతిలో పదిరెట్లు అందంతో మెరిసింది. అందానికి తగ్గ సముచితమైన శరీరం?” కదలిక, కదలికకు లయతాళములు కలిసే పద్ధతిలో నాజూకు
అన్వేషణ 15 త్ స్వరకంపన, (ప్రెక్షకులను ముగ్భులను చేసింది నాటకంలోని ఆమె పాత్ర చిన్నది కావడంచే జనం ఆమె నటనను ఎక్కువ ప్రశంసించకపోయినా అభ్యుదయ నటీమణి కావచ్చుననే ఆశ కలిగి ఆమెను చూడాలనే తహతహలు మాత్రం పొందారు
హాలు ప్రేక్షకులతో కిక్కిరిసి ఉంది అనుకున్నట్లు కాకుండా ఎక్కువగా టిక్కెట్లు అమ్ముడుపోయినందుకు కృష్ణమూర్తి సంతోషంగా తన శ్రమకు ఫలం దక్కిందని బాధ్యతల బరువు తల దిగినట్లు విశ్రాంతిగా నిట్టూర్వాడు ఒక్కసారి.
అధ్యక్షులు యధాధోరణిలో నాటకం గురించి ప్రశంసా వాక్యాలు పలికారు నాటక సమాజం యింకా పురోగమనం సాగించి ఉత్తమ రీతుల్లో నాటకాలు ప్రదర్శించి ఉన్నతి స్థితికి రాగలదని తమ ఆశ వ్యక్త పరిచారు. కరతాళ ధ్వనుల మధ్య నాటకం ముగిసింది.
నాటకమయ్వ్యాక కోటా ముఖం కడుక్కుని, తెచ్చుకున్న చిరలు (గీన్ రూములో రాణి సర్దుకుంటోంది నటకులంతా రంగస్థలం వదలి గ్రీన్‌రూం ప్రవేశించారు ఆనందంగా తారాజువ్వలా ఒక విసురు పర్యటన చేసి నటకులందరికీ గుత్త అభినందల పత్రం విసిరి చటుక్కున ప్రేక్షకుల హాలులోకి వెళ్లిపోయాడు కృష్ణమూర్తి. నటకులంతా రాణిని ఉత్సాహంగా వాొగిడారు.
“ఎలా వుందండి నా నటన? అమాయకంగా చిరునవ్వుతో, సిగ్గుతో ప్రశ్నించింది రాణ్.
“అమోఘం
“అద్భుతం!”
“అత్యద్భుతం!”
“అధ్యక్షులు నిన్ను చూసి చివరదాకా కుర్చీకి అంటి పెట్టుకుపోయాడుగా!”
“అసలు నాటకానికి కళ అంతా రాణిదే!”
భూమారావు, ఆచారి, శ్రీనివాసు, హుస్సేన్ ఆలీలు ముఖం రుద్దుకుంటూ పొగడ్తలు విసిరారు.
జగదీశ్వర్ కొంచెం సాహసించి, రాణి ముందుకు వచ్చి, ఆమెతో కరచాలనంచేసి తన్మయత చెంది, ఆ తన్మయతలో కళ్ళు మూసుకుని, రాణి నటన అపూర్వమని పొగిడి, చేత్తి వేళ్ళలో ప్రాకిన విద్యుచ్చక్తి ప్రభావానికి కరగి, ఒకింత ఒక చిరునవ్వు నవ్వి,
156 అన్వేషణ ఓరచూపు చూసి మళ్ళీ కలుసుకుందామంటూ కొబ్బరినూనె సీసా తీసి ముఖం నూనెతో నింపుకున్నాడు.
మరియమ్మ జీవితానుభవంలో తారసిల్లిన స్వీయవ్యక్తులు నాటకాలలో నటించే శక్తి కలిగి ఉండడం తటస్థించలేదు. పురాతన పద్ధతిలోని గొల్లకలాపం, దేవాలయ నృత్యం, తోలుబొమ్మల వెనకాల గానం, పద్య నాటకంలో రెండు వచనాలు వల్లించి వచ్చే భాగకత కధలలోని పాత్రలు నటించిన స్నెహితులను నంద్యాలలో తాను వేశ్యగా ఉన్నప్పుడు చూసింది సాంఘిక వచన నాటకాల్లో క్రొత్త రాతిని సహజత్వం ఉట్టిపడుతూ గృహిణిగా నటించిన రాణి శక్తి మరియమ్మకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. (ప్రక్కన కూర్చున్న వనితలకు తన కూతురని రాణిని పరిచయం చెసి, వారి అభిమానానికి సంతోషించింది. మరియమ్మ తిన్నగా కూతురిని కలుసుకోవాలని గ్రీన్ రూములోకి వచ్చేసింది ఆమెకు అభ్యంతరపెట్టే శక్తి ఆ నాటక సమాజంలో ఏ వీరుడికీ ఉన్నట్లు కనిపించలేదు. పైగా రాణి ఆదరణ పొందాలని మరియమ్మకు అందరూ నమస్కరించి ఆ సౌందర్యానికి కన్నతల్లి కాగల్టినందుకు మా అభినందన అని వినమ్ర శిరస్సులతో నటకులంతా గౌరవం చూపారు.
కృష్ణమూర్తి (పేక్షకుల పొగడ్రలతో మునిగి తేలుతున్నాడు అమెరికాలో సినిమాలకు దర్శకుడై పర్యటనలో ప్రజలను చూస్తున్నట్టు రీవిగా అందరికి నమస్మరిస్తున్నాడు కొందరు పెద్దలకు రాణిని పిబ్చి పరిచయం చేశాడు తన నాటక సమాజానికి మూలమైన ఆదాయానికి ఆధారస్థంభాలైన ప్రేక్షకులకు చిరునవ్వులతో ప్రీతి కలిగించడంతో కలిగే మంత్ర ప్రభావం ఎన్నటికి వృధా కాదని కృష్ణమూర్తి విశ్వాసం. రాణితో మాట్లాడె అవకాశం గురించి ఎక్కువ లెక్క చేయకుండా (ప్రేక్షకులను కార్లో ఎక్కించే సందడిలో ఉన్నాడు కృష్ణమూర్తి.
అప్పటికే చాలా రాత్రి గడిచిందని రాణి, మరియమ్మ కృష్ణమూర్తి దగ్గర సెలవు తీసుకోబోయారు. ఆ సందడిలో వారిని సాగనంపే బాధ్యత భూమారావుపై వదిలాడు కృష్ణమూర్తి. రిక్షా పిలిచి, రిక్షావానికి ఖర్చు యిచ్చేసి, తల్లి కూతుళ్ళను సాగనంపాడు భూమారావు రాణి వెడుతూ వెనక్కి చూసి నవ్వుతే. భూమారావు వదనంలో సిగ్గవేడిలో చిరునవ్వు పొంగి అదని నున్నటి బుగ్గ్లలలో నిగ్గులు తేలింది.
రామనరసు, రాజారావు కూడ నాటకానికి రావడం రాణి చూసింది తెరసందుల్లోంచి రామనరసు పెద్ద కంపెనీ యజమాని కనుక పిలిచి పలకరించక పోవచ్చునని సర్పుకుంది. '
అన్వేషణ 157 కాని రాజారావు నాటకంలో తన్ను కలుసుకుని అభినందనలు కూడా తెలుప లేదేమనే సంశయం రాణికి కలిగింది ఎదురుగా కనిపించినప్పుడు ఎంతో సన్నిహిత్వంతో మాట్లాడే రాజారావు యిట్లే మనుష్యులను మరచి అదో ధోరణిలో విచిత్రంగా కాలం గుపుతాడేమో అనిపించింది. ఎంతోమంది మగవాళ్ళు తన అందానికి ముగ్దులై తన్ను పకలరించడానికి తాపత్రయ పడుతూంటే తనే ముందు పలకరించినా, స్నేహం కోసం ఎక్కువ పాటుపదని రాజూరావులో ఏదో విచిత్ర మనస్తత్వం. ఉండి వుండాలనుకుంది రాణి,
కృష్ణమూర్తి నాటకమయిన మర్నాడు రాణ్ ఇంటికి వచ్చాడు విజయ ఉన్నప్పుడు మునుపు మరియమ్మ యింటికి వచ్చే స్నేహితులకు ప్రస్తుతం వచ్చె స్నేహితులకు, సంస్కృతి సభ్యతల్లో ఎంతో భేదం గమనించింది రాణి కృష్ణమూర్తి స్వయంగా తన యింటికి రావడం అదృష్టమని పొంగివోయింది రాణి.
చేతిలోని పొట్లం విప్పాడు కృష్ణమూర్తి నీలం సిల్ముచీర చిన్న చిన్న నల్లపువ్వులతో నల్ల తాచులా కాగితం చుట్టచుట్టుకుని పడుకుంది, ప్రకృనే ఎర్రని రంగులో సిల్కు జాకెట్టు ముంగి పోట్లాటలో పాటు కక్కిన రక్తంలా సిల్కు చిరనంటి పెట్టుకుంది.
“మా నాటకమండలికి సహాయంచేసే నటీమణుల సహకారానికి కృతజ్ఞత చూపడం నాధర్మం. ఇది మేమివ్వగలిగే చిన్న బహుమతి అని కృష్ణమూర్తి దర్జాగా నవ్వుతూ ఆ చీర జాకెట్టు రాణి చేతిలో పెట్టాడు.
“కృష్ణమూర్తిగారి మనస్సు వెన్నలాంటిది!” తన సహజమైన వందిమాగధన్తోత్రము వదలలేకపోయింది మరియమ్మ ఇంట్లో ఉన్న నిన్నటి చేగోడిలు తెచ్చి ప్లేటులో ముందు పెట్టింది. మర్యాదగా చల్లబడి సాగుతున్న చేగోడీలతో కొంచెం రభసపబడి, కొన్ని తిని మర్యాదగా తక్కినవి యింక తినలేనని ఊరుకున్నాడు కృష్ణమూర్తి.
“రాజీ! ...నువ్వు చూశావుగా మన సమాజంలోని మిత్రులను .. ఏ విభేదాలు లేకుండా అంతా సరదాగా ఉంటాము... నువ్వు కూడ అలాగే వుండాలని ఎప్పుడైన ఇంటికి వస్తూవుండు...కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు!” కృష్ణమూర్తి వదనం గంభీరమయి ఏదో బెదార్యము చూపిస్తున్నట్లు పొడ చూసింది.
ఏ నీచ తరగతి వంశంనుంచో రాణి అభివృద్ధికి వస్తున్నదని అర్ధం చేసుకున్న కృష్ణమూర్తి తన ఆహ్వానంలో ఆమెను మరి కొంచెం ఉన్నత వాతావరణంలోకి వచ్చేలా తను అవకాశమిస్తున్నట్లు భావించాడు.
158 అన్వషణ
రాణీ వీలైనప్పుడు కృష్ణమూర్తి యింటికి వెళ్ళేది నాటకాల పేరుమీద అనేక వ్యక్తుల్లో ఎందరో ప్రీలు కూడా సహజంగా చూస్తుండడంవల్ల భర్త ప్రవర్తన తప్పుపట్టక, వారితో కలిసిమెలిసి తిరగలేక దూరంగా వుండేది కృష్ణమూర్తి భార్య అయినా ఇంటికి వచ్చేవారిని ఆహ్వానించవలసిన బాధ్యత మాత్రం గృహిణిలా నిర్వహించేది ఆమె రాణికి కృష్ణమూర్తి స్నేహం ముఖ్యమవడంచే తక్కిన విషయాలు ఎక్కువ పట్టించుకోలేదు.
కృష్ణమూర్తి యింటికి తరచు ఇతర నటకులు కూడ వచ్చేవారు నగరంలోని తదితర నాటక సమాజాలు, వారి కార్యక్రమాలు, క్రొత్త నటీమణులు వార్తలు, నాటకాల పోటీలు, క్రొత్తగా ఉద్భవించిన నాటక రచనలు, రేడియో నాటక రీతులు మొదలగు వాటి గురించి విడ్డూరంగా గంటలతరబడి ప్రసంగించే వారంతా ఆ ప్రసంగంలో తనకు తెలిసీ తెలియని సంగతులు హాస్యంగా మాట్లాడి, చిలిపిగా నవ్వుతూ, అందాలు ఒలికిస్తూ కులుకుతూ కాలక్షేపం చేసేది రాణి ప్రసంగాలు పూర్తయ్యాక ఎవరో ఒకరు వీలు చూసు కుని రాణిని ఇంటిదాకా సాగనంపి, రిక్షా ఖర్చులు చెల్లించి, వీలుంటే దారిలో దోసె, కాఫీ యిప్పించి, ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళల్లా తిరోగమనం చేసే వారు ఆమె యింట్లోకి వెళ్ళాకా, అంత చనువు యిచ్చిన రాణిని అవకాశం దొరికినపుడల్లా ఇంటి దగ్గర కలుసుకోసాగారు నటకులు. భూమారావు వచ్చినప్పుడు పెసరట్టు, జగదీశ్వర్‌కు, అరటిపళ్ళు, హుస్సేన్ ఆలీకి మిరాయి, ఆచారికి పులిహోర, వివిధ రీతుల్లో ఫలహారాలు పెట్టించి సరదాగా కబుర్లు చెప్పి వారిని పంపించేది. ఎవరైనా సినిమాకుగాని, హోటలుకు గాన్, పార్ముకుగాని రమ్మంటే అభ్యంతరం చెప్పకుండా తన విరామ కాలాన్ని కూడా. సద్వినియోగం చేసుకుంటూన్నట్లు భావించి, వారికి సంతృప్తి కలిగించేది రాణి.
క్రమంగా రాణి కృష్ణమూర్తి సన్నిహితులైనారు. నాటకాల వల్ల తనకు వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టలు లభిస్తున్నాయని రాణి కృష్ణమూర్తి నాశ్రయించింది. తన నాటకాలు రక్తికట్టడమే కాకుండా ధనాదాయం రాణి ప్రవేశంతో అధికమండంచే కొంత మంది ధనంతో ఆమెను ఉత్సాహం, సంతృప్తి కలిగిస్తూ, ఎక్కువ చనువు పెంచుకుంటూ, ఆమెమీద ఆధారపడ్డాడు కృష్ణమూర్తి. పరస్పరంగా ప్రయోజనాలు సాధించుకోవలసి రావడంతో వారి స్నేహం బాగా పెరిగింది.
ఆధునిక యువకులు నవనాగరికత నాజూకుల్లో సంఘంలో చేసే మోసాలు, స్త్రీల కాలు, కూలీల హక్కుల సంరక్షణ, [గ్రామీణుల అభివృద్ది మొదలైన విషయాలు ప్రతిబింబించే నాటకాలు కృష్ణమూర్తి వేయించాడు నాజూకైన విద్యార్ధిగా. గడ్డిమోసే కూలి యెంకిగా సంఘసేవ పేరుతో తిరిగే విలాసాల గృహిణిగా పల్లెపడుచుగా వివిధ
అన్వేషణ 159 పాత్రలు ధరించి ప్రజల మన్ననలు పొందింది రాణి. క్రమక్రమంగా తనపై పెరుగుతున్న ప్రజల గౌరవం కొంచెం గర్వం కలిగించింది కూడా.
రాణి వేసిన నాటకాలు చూసిన కిళ్ళీ దుకాణదారులు, హోటలు యజమానులు, దర్దీవాళ్ళూ బట్టల వర్తకులు, బస్సు కండక్టర్లు దారిలో కనిపిస్తే నమస్కారం పెట్ట తమ ద్వారా ఏ పనులు కావలసినా ఉచితంగా చేస్తూ ఆమె అనుగ్రహం సంపాదించ దానికి తహతహలాడ జొచ్చారు.
కృష్ణమూర్తిలోని సహజమయిన మగ ప్రవృత్తి రాణీ స్నేహాన్ని అవార్దం చేసుకుంది ఒక రోజు కృష్ణమూర్తి రాణిని గండిపేట రమ్మని పిలిచాడు. రాణి స్నేహమర్యాదగా ఒప్పుకుంది ఒక టాక్సీ కుదిర్చేడు కృష్ణమూర్తి విహార సమయంలో తనతో ఒంటరిగా ఉన్న స్రీపై కృష్ణమూర్తి సహజమయిన కామిత ప్రకోపం కలిగింది ఆమె సుఖాన్ని అర్ధించేలా (ప్రవర్తించాడు. రాణి అమాయకంగా కోపంగా దూరమయింది. ఆమెను అర్ధం చేసుకోవడంలో తన ప్రవర్తనలో పొరపాటు జరిగిందని గుర్తించాడు కృష్ణమూర్తి. తిరుగు ప్రయాణంలో క్షమించమన్నాడు. ఏ సంగతి జరగనట్లే ప్రవర్తించింది రాణి. కృష్ణమూర్తి తన "ప్రవర్తన వల్ల ఆమె దూరమయిన తన నాటకాలకు ఆటంకం కలిగించదని సంతోషించాడు.
తదితర నటకులతో రాణి ప్రతిచోట కనిపిస్తోందనే వార్తలు కృష్ణమూర్తికి అసూయ కలిగించాయి. రాణిని మందలించాడు. విచ్చలవిడిగా నగరంలో ఆడది పరపురుషునితో తిరగకూడదని తోటి స్నేహితులైన నటకులకు, నాయకుడయిన తనకు (ద్రోహం తలపెట్టకూడదని హితబోధ చెశాడు కృష్ణమూర్తి ఉద్దేశించిన ద్రోహంలోని అంతరార్ధం గుర్తించుకున్న నటకులంతా తమలో తాము నవ్వుకున్నారు. పెన్నిధి వస్తుంటే కాలదన్నే తెలివితక్కువవాడు. ఆధునిక యుగంలో అరుదన్నట్లు వాళ్ళ నవ్వులు కృష్ణమూర్తిని ఎకసక్సాలు చేశాయి.
కృష్ణమూర్తి తన యుక్తులు ఉపయోగించేడు. విభజించు పాలించు సిద్ధాంతాన్ని వినియోగించాలనుకున్నాడు. తన సంఘం లోని ప్రతివానితో రాణి స్నేహం చేస్తోందని తెలిసి వార్త చిలవలు పలవలుగా ఊహించి, విషయాలు కల్పించి, ఒకరు లేనప్పుడు మరొకరిపై రాణి గురించి అసూయద్వేషాలు రగల్ఫ ప్రయత్నించేడు. ఒక రోజు హరాత్తుగా మరొక ప్రీని నాటక సంఘంలోకి తీసుకువచ్చి, మన క్రొత్త సభ్యురాలని అందరికి పరిచయం చేశాడు.
160 అన్వేషణ ఎక్కువ అందం లేకపోయినా తీర్చిదిద్దన కన్ను ముక్కు పలుచని శరీరం పొట్టి నతంలో వనజ ఆకర్షణీయంగానే ఉంది వనజతో రాణి స్నేహం పెంచుకుంది. అందరితో అయినా నటకులందరు రాణితో కులుకుతూ మాట్లాడినట్లు వనజతో మాట్లాడ యిష్టపడేవారు గాదు. స్నేహాలు పెరిగిపోయి, కనిపించడమే మానేసిన రాణీపై చెప్పలేనంత కోపం వచ్చింది రాఘవరావుకు అన్నగా తన్ను స్వీక రించి ప్రమాణం చేసిన రాణి తన ప్రమేయమే లేకుందా నాటకరంగంలో ప్రవేశించి, ప్రచారం చేయించుకోవడం రాఘవరావుకు కన్నెర కలిగించింది. రామనరసుతో తనకున్న చనువు పలుకుబడి ఉపయోగించి వీలయినప్పుడు ఉద్యోగి వినయంతో రాణి తప్పు మన్నించి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవలసిందని, డబ్బు యిబ్బంది వల్ల నాటకాల సమాజాల్లో తిరిగి బాధపదుతోందని నచ్చచెప్పి వాడు రాఘవరావు. తాను ఎవరికీ తెలియకుండా నెల జీతం ఆమెకు ముట్టజెప్పుతున్న సంగతి గూఢంగా అట్టెపెట్టి, రాఘవరావు మాటల్లో నిజం ఉందన్నట్లు పైకి నటించేవాడు. రామనరసు త్వరలో ఆమెను తిరిగి ఉద్యోగంలో చేర్చే ఏర్పాటు చేస్తానని వాగ్దాన మిచ్చాడు. అయినా ఆ వాగ్గానం తీర్చుకునే పరిస్థితులు ఏవిధంగా సృష్టించాలని సతమతమయ్యాడు స్వప్రయోజన దృష్టితో, రామనరసు దగ్గర తన శక్తినంతా వినియోగించి రాణికి తిరిగి ఉద్యోగం యిప్పించే ప్రయత్నం చేస్తూ కష్టపడుతున్న సంగతి గుర్తించకుండా నిర్లక్ష్యంగా సంచరిస్తున్న రాణిని మందలించాలని యింటికి వెళ్లాడు. అడుగు పెట్టగానే సహజమైన నవ్వుతో, అమాయకంగా ఆప్యాయత కనబరుస్తూ ఆహ్వానించింది రాణి రాఘవరావును. చేతుల్లో ఉన్న మల్లెదండ అందించాడు రాణికి. “మల్లెపూవులాంటి పవిత్రమైన హృదయం రాఘవరావు గారిది!” నవ్వంది మరియమ్మ తన పెదవులు వంకరగా త్రిప్పి కొంచెం సాగసుతో. మరియమ్మ వైపు తీవ్రంగా ముఖం పెట్టాడు రాఘవరావు. అమైనా రాణికి బుద్ధి చెప్పి తన ఆశ్రయం కోరమని సలహా యివ్వలేదని మరియమ్మ అని చూపుకు భయపడి తన వంటింటి గదిలోకిపోయింది. టీ న్ళ్ళు తయారుచేసి అతని కోసం తగ్గించాలని. రాణీ యింతవరకు తాను వేసిన నాటకాల వేషాల ఫోటోలు తెచ్చి రాఘవరావుకు చూపించింది. “చూడమ్మా...నీవు ఇంకా అనుభవం నేర్చుకోవలసిన పిల్లవు... నాటక సమాజాలలో చేరితే నీ పరువు ప్రతిష్టలు పోతాయి. అన్ననెందుకు విద్యుక్త ధర్మం నిర్వర్తించాలని ఈ
అన్వేషణ శే61 సలహా యిస్తున్నా!” సన్నని కోలముఖం చిట్లించి ఎత్తుపళ్ళు యికిలించి, జాలిగా రాణి వైపు చూశాడు రాఘవరావు అతని ముఖం బాగా కమిలిపోయినట్లు కనిపించింది రాణికి అంత అందవికారి తన్ను గూర్చి ఏమీ అసూయపడటంలేదు కదా అని ఒక నిమిషం సందేహించి, అయినా అతను తన్ను చెల్లెలని సంభోధిస్తున్నప్పుడు అటువంటి శంకలకు దారి యివ్వకూడదని, అతని సలహా సహజ ధోరణిలో యిచ్చినదేనని నమ్మింది.
రాఘవరావుతో, తన ప్రవర్తన అసభ్యంగా లేదనినీతికరంగానే ఉందని వాదించింది రాణి.
“అయినా చూడు చెల్లి! సంఘానికి భయపడాలి... నువ్వు పెళ్ళి చేసుకోవాలి...!” రాఘవరావు మాటలను తేలికైన నవ్వులతో ఆపేసింది రాణి,
“ఎందుకు నవ్వు?” వడలిన నల్లవంకాయలా ముఖం ముడుచుకున్నాడు రాఘవరావు.
“ఆ పెళ్లి అంటే. . నవ్వు వచ్చింది!” ఒక్కసారి నవ్వులోంచి ఏదో ఆలోచన, విషాదం, బాధ ఆమె ముఖంలో పెనవేసు కున్నాయి. మరొక నిమిషంలో ముఖకవళికలు మార్చుకొస్ కనుబొమ్మలు ఎగరవెస్తూ పలికింది రాణి.
“ఏమండీ!... నాటకాలతోపాటు నృత్యం నేర్చుకోవాలని ఉంది...!” నవ్వింది రాణి.
“ఇంకా నృత్యం నేర్చుకుంటాను... బాగుంది.. కావాలంటే నేను ధనసహాయం చేస్తా చెల్లీ... రేపే నృత్యం చెప్పే పాఠశాలలో చేరు...”
అంటూ పాతిక రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. రాఘవరావు రెందుసార్లు యింటికి వచ్చినా కనిపించడంలేదని నిష్టూ రంవేశాడు రాఘవరావు. జరిగిన అసంతృప్తులకు పరివ్మారంగా ఖులాసాగా చిదానందంగా రాఘవరావు వైపు నవ్వి, మరియమ్మ తెచ్చిన టీ స్వయంగా చెమిచాతో కలిసి రాఘవరావు చేతి కందించింది రాణ్.
“నాకు తెలుసు చెల్లీ...నేనంటే నీకు అవాజ్యమైన అభఖిమానమనికో రాఘవరావు విశాలంగా నవ్వాడు,
“అస్తమాను మీ పేరే స్మరిస్తూ ఉంటుందంది!గ” మరియమ్మ తన విద్యుక్త ధర్మమైన ఊతపదం వదిలింది.
162 అన్వేషణ
“రామ నరసుతో చెప్పాను... త్వరలో నీకు ఉద్యోగం మళ్ళీ యిస్తానన్నాడు"”' శన పలుకుబడి ప్రభావం స్ఫుటంగా స్ఫురించెట్లు గొంతు సవరించాడు రాఘవరావు
రాణికి కృతజ్ఞత తెలిసింది.
రాఘవరావు సినిమాకి వెడదాం రమ్మన్నాడు.
కురూపియైన రాఘవరావుతో వీధిలో తిరగడ యిష్టంలేకపోయింది ఆరోగ్యం సరిగాలేదని దిగాలుముఖం పెట్టింది. బహుశా ఉద్యోగంలేక సరైన కుటుంబ రక్షణ లేక బెంగతో ఆరోగ్యం చెడగొట్టుకుంటూందేమోనని భయపడి, ఆరోగ్యం మహాభాగ్యమనే సూక్తి బోధించి, త్వరలో మరొక పాతిక రూపాయలు పంపుతానని వాగానం చేసి రాఘవరావు వెళ్లిపోయాడు.
ఉద్యోగంలోకి తిరిగి చేర్చుకునేదాక మొఖం చెల్లక రాణి స్నేహం పోగొట్టుకోవడం యిష్టంలేక నెల జీతం పంపిస్తూ, ఆమెతో మాట్లాడడానికి పదే పదే యింటికి వెళ్లడం తన హోదాకు లోపమని రామనరసు ఒంటరిగానే బాధపడసాగాడు.
నృత్యం కూడా తెలిసి ఉంటే, నటన అనుభవంతో నాటకాలలో జేరి సినీతార కావచ్చనే ఆశ రాణిలో కలిగింది. ఉద్యోగం లేని తీరిక సమయం సరిగా సద్వినియోగం చేసుకున్నట్లుంటుందని రాజీ నృత్య కళాశాలలో చేరింది.
తన నాటకమండలిలో నటకులకు, మండలి పోషకులక, హితులకు కృష్ణమూర్తి ఒకరోజు తేనీటి విందు చేశాడు అబిడ్స్ లోని ఒక హోటల్లో సుందరమైన వనంలో మధ్య వరుసగా టెబిల్స్ అమర్చబడి, పైన, పూలగుత్తులు వేలాడుతున్నాయి. నాల్లు వైపుల కుర్చీలు వరుసగా అమర్చబడి ఉన్నాయి. మేజూ మీదకు కాంతి వచ్చెలా సొగసుగా ప్రక్కనున్న చెట్టుకొమ్మమీంచి జారుతోంది ఒక విద్యుద్దీపం.
అతిధులంతా వచ్చాక కృష్ణమూర్తి నిలుచుని ముఖ్య అతిధి పరమహంసను పరిచయం చేశాడు. తన నాటకమండలి కార్యక్రమాలు, నిర్మాణాత్మక కృషి విపులంగా ముందు వివరించి, పరమహంస దేశంలో ప్రఖ్యాతికెక్కిన నటుడనీ, ఏపాత్రనైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరుక్షణంలో అభినయించగల శక్తి ఆయనలో ఉందని, విదేశ గమనంలో పొందిన విజ్ఞానం, వయస్సు ప్రయోగాలలోని అనుభవం జతచేర్చి అద్భుత నటకుడిగా కీర్తి గణించుకున్నారని, ఆయన సన్నానం కోసమే తన నాటకమండలి తరఫున యీ అల్పాహార విందు చేస్తున్నానని కృష్ణమూర్తి చిన్న ఉపన్యాసం యిచ్చాడు.
అన్వెషణ 168
వచ్చిన అతిధుల నందరీని పరమహంసకు పరిచయం చెశాడు అతి చనువుగా అందరినీ పలకరించాడు పరమహంస నాటకంలోని ఆధునిక రీతులు గూర్చి తన అభిప్రాయాలు చన్చించాడు. అనుభవమున్న నటీమణుల ఆవశ్యకత నాటకరంగానికి చాలా అవసరమని ఎదురుగా ఉన్న రాణి, వనజల వంటి సంస్కృతిగల ప్తీలు నాటక రంగంలో (ప్రవేశించడం ప్రీ జాతికి పురోగతి చూపడమేనని ఉద్దాటించాడు,
ఫలహారాల సమయంలో యిష్టాగోష్టి జరిగింది. వయసుడిగిన పరమహంస కూడ రాణివంక తదేక్కధానంగా చూదడకమాన లేదు. తాత్కాలికంగా నగరానికి వచ్చారని చెబుతున్న పరమహంస ఎంత సత్యం వచిస్తున్నాడో అనే అనుమానం కూడా ఇతర నటకులకు కాకపోయినా రాజీకి ముఖ్యంగా కలిగింది పరమహంస రాణిపై విసిరే తీవ్ర దృష్పులలో ఒకవిధంగా ఆ న/:రం విడిచి పోయే మనిషిలా కనిపించలేదు ఆలోచనలు ఎక్కువ ఉన్న తన తల అర్ధాలు అనేకం పుట్టిస్తుందని తన్ను తానే చూసుకుని, రాణి సహజమైన చలాకి నవ్వులతో తేనేటి విందులో గడిపింది.
పరమహంస మర్నాడు రాణి యింటికి ప్రత్యేకంగా రానే వచ్చాడు ఒక క్షణం పరమహంసను చూసి ఆశ్చర్యపోయినాా, తొట్రుపాటు సర్దుకుని, అమిత గౌరవంతో ఆహ్వానించింది రాణి.
“ఆడవాళ్ళను దర్శించడానికి వచ్చినప్పుడు తృణమో ఫణమో బహుమతి ఇవ్వాలనే సిద్ధాంతం నాది... ఈ గులాబీపూల గుత్తి!. ” అందిచ్చాడు పరమహంస చిరునవ్వుతో.
తల నెరిసి, ముఖం ముడతలు పడి ఐభై సంవత్సరాలకు పైబడిన నటకుడు అపూర్వ గౌరవంతో అందిస్తున్న పూలగుత్తి తీసుకోకపోవడంలో అసభ్యత స్ఫురించింది రాణికి. పూలగుత్తి అందుకుని ఆఘ్రాణించి, ఒళ్ళు గగుర్పొడిచి ఆనందంతో నవ్వింది రాణి
ఆ నవ్వుతో పరమహంస చైతన్యం తప్పినట్లు తీవ్ర వదనం పెట్టాడు.
అతని వదనం చూసి ఆశ్చర్యవోయి అమాయకంగా నిలుచుంది రాణి.
“క్తూర్పో రాణీ!... మనకున్న తక్కువ పరిచయంతో నీ దగ్గరికి రావడం అన్యధా భావించకు... నాటక రంగంలో పాశ్చాత్య రీతుల్లో క్రొత్త పంధాలు ఊరూర ప్రయోగాలు చేసి సఫలీకృతుడనయి యీ నగరానికి వచ్చాను ఆ ప్రతిభ యిక్కడ చాటాలి అను కుంటున్నా. నా ప్రయోగాలు చైనా, జపాన్, బోర్నియో, మలేషియాల్లో కూడా (ప్రశంసలు
164 అన్వేషణ పొందాయి నేను ఒక్కళ్లో నాటక బృందంలోని మనిషిని... కాని నీ సహాయం కావాలి... ప్రదర్శనకు ఐభయ తక్కువ కాకుండా నీకు బహుమతిగా యిచ్చుకోగలను!”” గబగబా గుక్క సర్పుకోకుండా చెప్పాడు పరమహంస.
“మీ పేరు విన్నాం ..ఎప్పుడూ చూసే భాగ్యం కలుగలేదుగో మరియమ్మ చేతులు ముడుచుకుని నమతగా నవ్వింది.
పరమహంస చిదానందంగా నవ్వాడు
పరమహంస కోరికలో అన్యాయం కాని, వస్తున్న ధనం తన్నుకోవంలో సమంజసం కాని కనిపించలేదు రాణికి కృష్ణమూర్తి నాటకాలలో నటించినట్టె పరమహంసతో కూడా నటిస్తే వచ్చిన కష్టమేమీ లేదనుకుంది అయినా కృష్ణమూర్తి ప్రదర్శనలతో సంఘర్షణ పడకుండా తన కార్యక్రమాలు నిర్ణయించుకోమని కోరింది రాణి.
తల ఊవాదడు పరమహంస జిజ్ఞాసతో, రాణి తన సహకారం యివ్వడానికి అంగీకరించింది పరమహంస నిష్క్రమించాడు రాణి యింటి నుంచి.
పరమహంస నాంపల్లిలోని పెద్ద హోటల్లో బసచేశాడు. తన రాక గురించి, నటనా ప్రతిభ గురించి పత్రికలో “చూచాయ వార్తలు" యిప్పించాడు. నగరంలో పెద్దలైన కళాకారులను కళాపోషకులను కలుసుకున్నాడు. తన ప్రదర్శనకు అనువైన అవకాశం యివ్వవలసిందనీ, ధనార్జన కాక కళా ప్రదర్శన తన ముఖ్య ధ్యేయమని విపులికరించాడు ప్రముఖులు పరమహంస పేరు విని ఉండడం వల్ల తప్పక సహాయం చేస్తామని వాగ్దానాలు చేశారు.
రెండు రోజుల కొక్కక్క ప్రదర్శన పరమహంస ఏర్పాటు చేసుకోగలిగాడు ఏ ఆఫీసులోనో, ఏ పాఠశాలలోనో, ఏ వర్తక సంఘ ఆధ్వర్యాన్నో తన ప్రదర్శనలను జరిపించసాగాడు. వాగ్దానం చేసిన ప్రకారం రాణికి ధన సహాయం చేస్తుండడం వల్ల పుష్కలమయిన ధనం చూచిన ఆశతో శ్రమ ఆనక పరమహంస బసకు వెళ్లి రిహార్చల్సు వేసుకుంటూ గడుపుకొసోంది రాణి.
రాణి యిచ్చిన ప్రదర్శనలకు నవయువక మండలి అంతా మొదటి దినాలలో హాజరయేది. కాలక్రమంలో పరమహంసతో రాణికి పరిచయం పెరుగుతున్నదన్న విషయం కనిపెట్టి అతని (ప్రదర్శనలకు హాజరు కావడం మానేశారు. రెండేసి రోజులకు ప్రద రృనలు యిస్తున్న పరమహంస రాణిని నవయువక మండలికి ఏవిధంగానూ
అన్వేషణ 165 ఉపకరించకుండా ఆటంకంగా కనిషించాడు కృష్ణమూర్తికి నాటక రంగంలో ప్రవెశమిచ్చి, అభివృద్ధికి తెచ్చిన తన్ను తృణీకరించి, మరచి ఎవరో ఒక ముదుసలి నటుడితో కాలం అంతా గడుపుతున్న రాణి మీద విపరీతమైన కోపం వచ్చింది కృష్ణమూర్తికి.
పరమహంస ప్రదర్శనల వార్తలు, రాణి నటనా చాతుర్యము పత్రికలో పెద్ద స్థాయిలో ప్రచురించబడ్డాయి. పరమహంస యిచ్చె ప్రచార పత్రాలు క్రొత్త రీతిలో క్రొత్త భంగిమల్లో ఉన్న రాణి ఫోటోలుతో నిండి ప్రజలకు నూత్న ఆకర్షణ కలిగించాయి. పరమహంస ప్రదర్శనలపై ప్రజలకు మోజు పెరిగింది.
ఒక రోజు కృష్ణమూర్తి తిన్నగా రాణి యింటికి వచ్చాడు పరమహంస బహుమతిగా యిచ్చిన నిలువుటద్దంలో తల దువ్వు కుంటోంది రాణి. అద్దంలో ప్రతిబింబంగా ప్రవేశించిన కృష్ణమూర్తిని చటుక్కున తిరిగి పలకరించి క్షేమం ప్రశ్నించింది రాణి.
కృష్ణమూర్తి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. చికాకుతో ముడుకుపోయింది. “రాణి. . నువ్వింత విశ్వాసము లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు!”
రాణి కృష్ణమూర్తి మాటలకు ఆశ్చర్యపోయి అమాయకంగా చూసింది.
“అయితే... నువ్వు మా నాటక సమాజాన్ని వదులుకున్నట్లైనా?...!” తల వంచుకుని ప్రశ్నించాడు కృష్ణమూర్తి,
“మీరు కావాలంటే ఎందుకు వెయ్యను మీ నాటకాల్లో?”
“అయితే పరమహంస నాటకాల్లో పాల్గొనడం నాకిష్టం లేదు..యీ వేళ ఉండి రేపు పోయేవాడు అతను... చిరకాలం నగరంలో ఉండేది మన సంస్థ... ఆలోచించుకో!”
“ఏమిటి మీరనేది?” రాణి కోపం చూపించింది. చికాకుగా. రాణిలో ఆ స్వరూపం ప్రధమంగా చూశాడు కృష్ణమూర్తి గదిలో టేబిలుమీద చైనా బేగ్, నల్లకళ్ళజోడు, నేలకు వారగా బంగారు రంగు క్రొత్త ఎత్తు జోళ్ళు, చిలక్కొయ్యకు వేళ్లాడుతున్న పూర్తి చేతుల వులెన్ జుబ్బా, రంగుల సిల్కు చీరలు, రకరకాల భంగిమల్లో రాణి ఫోటోలు... ప్రక్కనే పరమహంస జిజ్ఞాసలో ఉంటున్న ఫోటో... చూసి కృష్ణమూర్తి అర్ధం చేసుకున్నాడు రాణిలోని మార్పు.
“నేననేది నీకు తర్వాత అర్ధమౌతుంది” గబుక్కున లేచి రివ్వున వెళ్లిపోయాడు
166 అన్వేషణ
మరియమ్మ వేళ్ళు చిట్లించుకుని మూతి వంకరగా టత్రిప్ని నవ్వింది
రాణి సంఘర్షణలో పడింది
వెళ్లిపోయే కృష్ణమూర్తి వైపు వీధిలోకి విచిత్రంగా నవ్వుతూ చూసింది.
వీధిలో కోడిపుంజులు దెబ్బలాడుతున్నాయి గోళ్ళతో దోజుకుంటూ ఎగురుతూ, శరీరాలు గీరుకుంటూ రక్తం చిమ్ముతూ, నెత్తిమీద అందమైన జూలు కొరుక్కుంటూ సౌందర్యవంతమైన ఈకలు విదుల్చ్బుకుంటూ, భయంకరంగా కోడిపుంజులు కొట్లాడు కుంటున్నాయి జనం చుట్టూ చోద్యంగా నిలబడి ప్రతీ ఎగురుకు ప్రతీ దెబ్బకు హుషారుగా నవ్వుతూ, విడ్డూరంగా చూస్తున్నారు.
అన్వేషణ 167 ౯
సీకింద్రాబాదు, హైదరాబాదు నగరాలను జంటగా బంధిస్తూ మంగళసూత్రంలా ఉంది, హదయంగమమైన హుస్సేన్ సాగర్ వంతెన ఆ వంతెన కమ్మీల కానుకుని సరస్సు తరంగాలకు నీలాకాశానికి మధ్యనున్న శూన్యంలోకి వింతగా చూస్తూ సిగరెట్టు కాలుస్తూ నిలుచున్నాడు శివరాం. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడిన సంధ్యారుణిమలు నల్ల మెఘాంచారలు మధ్య నుంచి ద్విగుణీకృతంగా మెరుసూ ఆవలీతీరంలోని కొండల మీద విప్లవ ధ్వజులు ఎగురుతున్నట్లు కనిపించాయి. సిగరెట్టు ఫొగలు రింగులరూపం దాల్చి ఆ సౌందర్య దృశ్యాన్ని సరిగ్గా చూడమంటూ శివరాంకు కళ్ళజోడుగా ఏర్పడ్డాయి. కెరటాల తరగల ధ్వనులు ఏకాంతంగా నిలుచున్న శివరాంను పలకరించాయి కెరటాల మీద నుంచి వచ్చే పిల్లగాలులు శివరాం ప్రశాంత ఫాలభాగం మీదికి క్రాపును దువ్వుతూ మెదడులోకి ఆలోచనల గిలిగింతలు జొనువుతున్నాయి.
వంతెన మీద నడ్డి ఆన్బి రహదారివైపు చూచేడు. మేడల భవనాల్లాగా డబుల్ డెక్ బిస్సులు జనంతో పరుగెత్తుతున్నాయి. ఒగరుస్తూ నడుస్తున్న సైకిళ్ళతో అన్వాయంగా కార్లు పందెం వేస్తున్నాయి. వంతెన కావలివైపు ఏపుగా ఎదిగిన మతంగేడు చెట్టు ఎర్రని పుష్చులు విచ్చుకుని నీలాకాశపు రంగులో నీలమేఘశ్యాముని దొండపండు పెదాల నవ్వుల కాంతుల్లా గోచరించాయి. ప్రకృతి సౌందర్యములో మానవాతీతమైన శక్తి ప్రస్ఫుటమౌతూ దైవత్వం పొడసూపుతున్నట్లు అనిపించింది శివరాంకు.
నల్లగుంటలోన్ ఇల్లు మార్చి, హైదర్ బస్తీలో (క్రొత్త యిల్‌ను చూచుకుని పదిరోజులయింది. ఇరుగుపొరుగు స్నేహాలు మారాయి కాని, జీవితంలో నూత్నశక్తి
168 అన్వేషణ ఇచ్చే కొత్త వాతావరణం ఏర్పడలేదు. ఆఫీసు గొడవలు సినిమా చర్చలు, దారి నడిచే అమ్మా యిల గురించి కబుర్లు ఉబుసుపోక పేకాటలు తప్పించి శివరాంకు ఆ క్రొత్త బస్పీలో ఏమీ కనిపించలేదు
జీవితం కొంతవరకు మానవ నిర్మితమనే సూక్తిలో సత్యమున్నట్ల స్ఫురించింది శివరామ్‌కు మనిషి ప్రణాళికలు వేసుకొని, ఒక నిర్ణీత పద్ధతిలో జీవిత గమనాన్ని కళ్ళెంవసి నడిపించినట్లయితే నిశ్చయించుకున్న లక్ష్యాన్ని కొంత ఆలస్యమయినా చెరగలుగు తాడు, లక్ష్యమేలేని జీవితాలు గాలిలో ఎగిరే తేలిక గమనానికి తన ఆలోచనలతో ఒక రూపు యివ్వాలనుకున్నాదు శివరాం,
స్నేహాలు పెంచుకోడం కూడా ఒక కళ. తాత్కాలికంగా తమంతట తాము కలుసుకునే మనుష్యులు కాలక్రమంలో స్నేహితులైనా, ఆ స్నేహబంధంలో ప్రత్యేకత లేదు ఏదైనా సాధించి సంపాదించుకున్న దానిలోని ఆనందం తాత్కాలికంగా లభించిన వానిలో కనిపించదు దూరాన కొండలమైన ఎత్తైన భవనాలు, పెద్ద పెద్ద కారుల్లో హోదాతో బతికిన మనుష్యులు, విచిత్రమైన వివిధ సంస్కృతులు ఏక భాష ప్రాతిపదికపైనే వివిధ మతాలతో కలిసి, వెలని (బతికే జాతులు...ఆలోచించగా తమంత తామే సన్నిహితమయ్యేట్టు కనిపించలేదు శివరాంకు వాటి సన్నిధి చేరాలంటే తాను స్వప్రయత్నంతో సాధన చెయ్యాలని అనుకున్నాడు శివరాం.
చిన్నప్పుడు, కాలేజీ దినాల్లో నాటకాలు కొద్దిగా వేసేవాడు. సాహిత్య రచనల్లో చైతన్యవంతమైన అద్భుత ప్రక్రియ “నాటకం” జీవితంలో కూడా నాటకం అనేది అందరూ చెయ్యలేని అద్భుత ప్రక్రియే అనిపించింది శివరాంకు నాటక రంగంలో ప్రవేశిస్తే అటు జీవితానుభవమూ, యిటు వివిధ తరగతుల వ్యక్తుల పరిచయము లభిస్తుందని ఆశించాడు శివరాం,
ఆలోచనల్లో మనస్సులోని కెరటాలు గాలి ఊపుకు ఎగిరి గెంతుతున్నాయి. జీవిత గమనంలా సరస్సులో దూరాన పడవ నడుస్తోంది. వాహ్యాళికి వచ్చి గుంపులుగా చెదిరి నడుస్తూ కర్ర బెంచీలమీద కూర్చున్న జనం రంగు రంగుల దుస్తులతో ఆ వంతెన శోభను తమ కుంచెతో దిద్దుతున్నట్లు కనిపించారు. తన జీవితంలో కూడ క్రొత్త రంగులు తెచ్చుకోవాలనే ఆశతో శివరాం వంతెన విడిచి గృహోన్ముఖుడయ్యాడు. దారిలో గోడలమీద, పరిగెత్తే బస్సులమీద, బస్సుస్తాండు ఇనపరేకులకు పెద్ద అక్షరాలతో కాగితాలు అంటించబడి ఉన్నాయి “కురుక్షేత్రం నాటకం... ప్రసిద్ధ నటకులచే” 14వ తేదీన నాటకానికి హాజరవ్వాలని
అన్వేషణ 169 తీర్మానించుకున్నాడు శివరాం.
సరోజినీదేవి రోడ్డులోని సినిమా ధియేటరులో రాత్రి తొమ్మిది గంటలకు జనం కిటకిటలాడుతున్నారు. కాంపౌండులో కిటికీలవద్ద టిక్కెట్లు దొరకని జనం 'క్యూలో నిలచుని ఒకరినొకరు తోసుకుంటూ అరుస్తున్నారు. బలవంతుడైన ఆసామీ ఒకడు 'క్యూ' తప్పించుకుని కిటికీ మీదపడి, పోలీసువానిచేత తోయబడి, చొక్కా చింపుకుని చివరకు దొరికిన టిక్కెట్టు చేతబట్లి సంతోషిస్తూ విజయగర్వంతో నాటకం హాల్లోకి చేరాడు భార్యతో వచ్చిన భర్త, తనవల్ల టిక్కెట్టు దొరకడం కష్టమని (గగ్రహించుకుని భార్యను క్యూమీదికి దాడిపంపగా పోలీసు వాడు అద్దుకుని ఆమెకు టిక్కెట్టు ముందుకు యిప్పించేడు. నగరంలోని షోకీలా యువకుడు కోర్టు వ్యవహారాల మీద నగరానికి వచ్చిన వివిధ ఆంధ్రప్రాంత గ్రామీణులు, తలనెరసిన వితంతువులు.. ముడుతలు పడ్డ ముసతి మనుష్యులు నాటకం హాలులో చేరిన గుంపులో కనిపించేరు ధనంతో నాటక విలానాన్ని అనుభవిద్దామని వచ్చిన జమీందార్లు అలసిపోకుండా ముందు సోఫాట్లో కూర్చున్నారు. ప్రముఖ నగర రాజకీయవేత్త అధ్యక్షుడిగా ఆనాటి నాటకానికి ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చేడు.
ఆనాటి నాటంలో ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు పాత్రలు ఒక్కొక్కటి ముగ్గురు మనుష్యులు చొప్పున ధరించారు. ఒక రిని మించిన రాగాలాపనతో మరొకడు పద్వాలు చదివి మాటలు విరిచి, ముఖ భంగిమలు తొణికించి, శరీర సౌష్టవము ప్రదర్శించి, ఆ పాత్ర అమోఘంగా చేశామనుకుంటూ తెరల్లోకి నిష్కమించేరు. ఒక పద్యంపాడి అలసిపోయిన అర్జునుడు, దుర్యోధనుడు సమాధానంలో పద్యం చదివేలోపుగా తెరలోకిపోయి కాస్త కాఫీ సేవించి, పాత్ర తెరమీద ఉండవలసిన బెచిత్యానికి భంగం కలగ నట్టు, తిరిగి ప్రత్యక్షమయ్యేవాడు. రాగాల పాతదనం, హార్మోనీల మోతతో నాటక (ప్రదర్శనం నిండివోయింది ద్రౌపది మానభంగం సమయాన ప్రేక్షకులు వేసిన అరుపులు, ఈలలు, వివిధ జంతుజాలం కూతలు, నాటకానికి కాకపోయినా నాటకంలోని ప్రేక్షకులకు కొంత విరామం కలిగించేయి. రంగంలోకి ప్రవేశించిన దుశ్ళాశనుడు ప్రజలకద్ధంకాని పటిష్ట సమాస భూయిష్ట పదజాలంతో (పేక్షకుల నదరగొట్టెశాడు. వాత కధ, వాతబడిన నాటకరీతి, పాతబడి వయసుడిగిన నటకులే నాటకమంతా నిండినా, అంత ఎక్కువగా కిటకిటలాడే జనం రావడంతో పురాతనత్వం మీద ఉండే సహజ అభిమానం ఆధునికులలో పోలేదనిపించింది.
1/0 అన్వేషణ
సన్నగా, రిపటలా నల్లగా చైనా బొమ్మలా శివరాం పక్కనే కూర్చున్న ఈశ్వరయ్య ఒక్కడూ నవ్వుకుంటున్నాడు. నాటక రంగంలో రసాత్మకమైన హాస్యాన్ని చూచి శివరాం సంభాషణ కలివాడు.
“అవునండీ! పూర్వతరంవారి నాటకాలు - అఖరి దానిలు'' నవ్వాడు ఈశ్వరయ్య ప్రస్తుత తరంలో తానొక గొప్ప నటకుడిలా.
“మీరెప్పుడైనా నాటకాల్లో వేశారా?” శివరాం ప్రశ్నించాడు, అతని చరిత్ర గురించి తెలుసుకుందామని.
“మీరెప్పుడూ చూడలేదనుకుంటా - 'తుఫాను' నాటకంలో రైతుగా, 'ద్వేషం'లో కూలీగా, 'వరట్నం'లో వరుడుగా యీ నగ రంలో నటించి కప్పులు బహుమతులు పొందాను... మీరెప్పుడైనా మా యింటికి రండి చూపిస్తాను... నన్ను ఎరుగని వాళ్ళేవరూ యీ నగరంలో లేరు.... నేను రేడియో నాటకాల్లో కూడా వేస్తాను! చొక్కా కాలరు సర్దుకుని స్వోత్మర్షతో నవ్వులు చిలకరించాడు ఈశ్వరయ్య. మళ్ళీ ఇలా అన్నాడు. “ఆడబోయిన తీర్ధం యెదరయింది అన్నట్టు ..సరిగ్గా సమయానికి కనిపించారు... ప్రస్తుతం ఒక నాటక సంస్థలో ఉన్నారనుకోండి...గాని అక్కడ మనుష్యుల ప్రవర్తన చాలా విచిత్రం... బాగుపడేవాడంటే .. ఏమిటో అనూయ...ఏ నాటకం ఏరుకున్నాా పెద్ద పొత్రలు స్వలాభపరంగా పంచుకుందాం అనే కోరిక తప్ప, ఎవరు ఆ పాత్రకు ఆకారంలో, నటనా ప్రతిభలో, బెచిత్యం కలిగి, ఉన్నాడనే విషయం ఆలోచించరు ..అందుకేలెండి మన నాటక రంగం యింకా అధోగతిలో ఉంది... నేను ఒక నాటక సమాజం స్టాషించి యీ దురలవాట్లను రూపుమాపి ఉత్తేజకరంగా హృదయాహ్ల్హాదకరంగా ఉన్నత స్థాయిలో నాటక ప్రదర్శనాలు చేయించాలన ప్రయత్నిస్తున్నాడు. దానికి మీ సహకారం ఎంతయినా కావాలి!” గుక్క తిప్పుకోకుండా చెప్పి వాన తుంపరలా నవ్వాడు ఈశ్వరయ్య. తక్షణం శివరాం చిరునామా తెలుసుకున్నాడు. మర్నాడు వచ్చి కలుసుకుని, ఒక వారం రోజుల్లో కొత్త నాటక సమితి న్యాపన కార్యక్రమం నడిపిస్తానన్నాడు ఈశ్వరయ్య.
కళ్ళులేని దృతరా(ష్తుడు రంగస్టలంమీద ఉపన్యసిస్తున్నాడు. కృష్ణుడు సమాధానంగా రాయబారం జరుపుతూ పద్యాలు విసిరేస్తున్నాడు. అంగ భంగిమలు, స్వరకంపనలు, ఊగే ఆదే చేతులు వంకరటింకరలుగా టత్రిప్పేస్తూ. “ఈ నాటకం అయ్యేటప్పటికి తెల్లవారుతుంది. తిన్నగా హోటలుకు పోయి ..కాఫీ సేవించి, కాలకృత్యాలు తీర్చుకుని ఆఫీసుకు పోవచ్చు!” తన చమత్సారానికి తనే ఫక్కున నవ్వుకున్నాడు ఈశ్వరయ్య.
అన్వేషణ కే₹1
ఈశ్వరయ్య అన్నట్టె నాటకాంతం అయ్యేటప్పటికి మసక వెలుగులు కనిపించాయి. నాటకం చూసిన జనమంతా నూనె కారుతూ పాలిపోయి, నిద్రలేక ఎర్రబడిన కళ్ళతో బయటికి వచ్చేరు మునిసిపల్ పాకీవాళ్ళు నల్ల సిమ్మెంటు రోడ్లు ఊడుస్తున్నారు. ఎదురుగా ఉన్న జమీందారుగారి ఎత్తుగోడల కాంపొండులోంచి కోళ్ళు కూస్తున్నాయి. రావిచెట్లు ఉదయ వాయువుల్లో ఊగుతూ ఒళ్ళు విరుచుకుంటున్నాయి బద్ధకంగా
ఒక రోజు సాయంత్రం అలసిపోయి ఆఫీసు నుంచి యింటికి వచ్చాడు శివరాం. తలుపు తీయగానే కార్డు ఒకటి నేలమీద దొర్లుతూ ఎత్తుకోమని ఏడ్చింది. చంటిపిల్లలా కార్డు ఎత్తి చదివాడు శివరాం ధర్మశాలలో పదవ నెంబరు గదిలో ఆదివారం సమావేశానికి హాజరు కమ్మని ఈశ్వరయ్య వ్రాశాడు బహుశా నాటక సమితి స్థానం గురించి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నా యనుకున్నాడు శివరాం.
కూరలబజారు ఎదురుగా ధర్మశాల గుమ్మందగ్గర నిలుచున్నాడు ఈశ్వరయ్య, శివరాం వచ్చేటప్పటికి మీ కోసమే చూస్తున్నా... అంతా వచ్చారు!” అంటూ శివరాంను లోపలికి తీసుకువెళ్తాడు ఈశ్వరయ్య,
గదిలో చాపమీద ముగ్గురు యువకులు కూర్చున్నారు. ఈశ్వరయ్య పరిచయం చేశాడు .. వెంకట్రావు ..మందుల కంపె నీలో ఏజెంటుగా పనిచేస్తున్నాడు... నల్లగా సముచితమైన శరీర సౌష్టవంతో, ఉబ్బెత్తు ఫాలంతో, పొట్టి ఆకారంతో పటుత్వమైన వదనంతో, నిశితమైన కళ్ళతో సమీక్షిస్తూ నవ్వాడు.... నారయ్య, లావుగా తెల్లగా, బలమైన శరీరంతో మిరాయి వుండలా మిసమిస లాడుతూ అతి వినయంతో ఆహ్వానించాడు... సన్నగా బక్కగా ఎదురు క్రాపులో నిదానంగా చూస్తూ నమస్మరించేడు ప్రభాకరం.
పరస్పర పరిచయమైనాక నాటక సమితి న్యపన ప్రసక్తి కదిలింది. ముఖ్యంగా నగరంలో ఆధునిక రీతుల్లో ఐక్యతతో అద్భుత నటనా శక్తి కలిగిన పాత్రధారులతో నాటకాలు ప్రదర్శించబడటం లేదని ఏవైనా కొన్ని సంస్థలున్నాా అవి స్వభావ పేరితాలై కళకు ద్రోహం చేస్తున్నాయని అందువల్ల ఉత్సాహంగల యువకులు కొందరు జేరి ఉత్తమమైన నాటక సంస్థ ఒకటి న్థాపించవలసిన అగత్యం ఎంతో ఉందని ఉద్దాటించాడు ఈశ్వరయ్య. ఆ అభిప్రాయాన్ని బలపరిచాడు ప్రభాకరం. క్రొత్త నాటక సంస్థ న్థాపించి, పూర్వం ఇతర సంస్థలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచుకుని, సర్వశక్తి యీ క్రొత్త సంస్టకే ధారపోసే కంకణం కట్టుకోవాలని తన అభిప్రాయం ఈశ్వరయ్య గతచరిత్ర దృష్టిలో పెట్టుకుని లౌక్యంగా మాట్లాడాడు వెంకట్రావు. ఏది ఏమైనా సంస్థ
172 అన్వేషణ అభివృద్ద్ధికరంగా నాలుగు కాలాలు బ్రతికి బట్టకట్టి ఉన్నత స్టితికి రావాలంటే ధనం ముఖ్యం అనీ, దాని సంపాదనకి రాత్రిం పగళ్ళు పాటుపడాలని నారయ్య సూచించెడు నమ్రతగా. క్రొత్త సంస్థలు స్థాపించడం సులభఖేనని, స్థాపించిన తర్వాత దానిని జీవంతో నిలబెట్టడానికి సర్వశక్తులా పాటు పడగలిగి, అవసరం అయితే జీవితాలను త్వాగం చెయ్యగల శక్తి ప్రదర్శించడం కష్టమనీ, ఆ రెండవ పద్ధతికి అందరూ ప్రతిజ్ఞ బూనిననాడె క్రొత్త సంస్థ స్థాపన ప్రకటించడం ఉత్తమమన్నాడు శివరాం ధన సంపాదనతోపాటు రసవత్తరమైన ప్రదర్శనల నివ్వడం, ముఖ్యంగా కార్యకర్తలలో నిజాయితీ, నిష్పక్షపాతబుద్ధి ఉండదం చాలా ముఖ్యం అని ఉద్రేకంగా మాట్లాడాడు శివరాం. క్రిందటి దినం మందకొడిగా కనిపించిన శివరాం ఉద్రేకంగా మాట్లాడడం చూసి ఈశ్వరయ్య కొంచెం జంకాదు సంస్ధ స్టాపించాక ఇతను తనకు మించినవాడు కాబోతాదనే భయంతో, ('ప్రభాకరంవైపు ఏదో సమన్వయమైన భావంతో కన్నుగిటాడు హ్ పరిస్థితి నిశితంగా అద్ధం చేసుకున్నాడు వెంకట్రావు అసలు ధన ప్రధాన విషయం ప్రసక్తిలేదని మౌనంగా నవ్వేడు నారయ్య
సంస్థాపన గూర్చి అందరం ఏకగ్రీవంగా ఒప్పుకున్నాం కనుక ఒక సేరు పెట్టే సూచన గురించి తేల్చాలన్నాడు ప్రభాకరం. సమిష్టి చర్చ జరిగేక గంధర్వ నాటక సమితి అని నామకరణం చేశారు. తమ నాటక సంస్థను సూచనల తర్జన భర్జన జరిగేక ఒకరి మీద ఒకరు పూర్తి నమ్మకంలేకుండానే, మొట్టమొదటగా ఒక ఉమ్మడి అంగీకారం వుండాలని, వెంకట్రావును కార్యదర్శిగాను, నారయ్యను కోశాధికారిగాను, ఈశ్వరయ్యను దర్శకుడిగాను ఎన్నుకున్నారు అందరూ మునుపు ఎరుగున్న మనుష్యులు పదవులు పంచుకున్నారనే నెపం లేకుండా శివరాంను సహాయ కార్యదర్శిగా చేశారు. ప్రభాకరం కావాలని తాదాత్యం వహించి ఏ పదవీ తీసుకోలేదు. ఈశ్వరయ్య ముఖంలో సంతృప్తి వెలసింది.
ఒక జమీందారుని తక్షణం సమితికి అధ్యక్షుణ్తి చేసి, ఒక మంత్రి పుంగడిడిచే సమితికి ఎక్కువ ప్రచారం జరిగేలా ప్రారం భోత్సవం జరపాలని నిశ్చయించారు.
అనుకున్న ప్రణాళికలు అమలు జరుగుతూ కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి. ప్రారంభోత్సవంనాడు సమితిలో చేరిన అయిదుగురు కలిసి ఆడదిలేని నాటకం ఒకటి ఆదారు. నిపుణతతో, సహజ గాంభీర్యంలో మంత్రి పుంగవుడు సమితిని ప్రశంసించి ఉన్నత స్థితికి రావలసిందని శుభాకాంక్షలు తెలిపారు. ఈశ్వరయ్య విడిచిన నాటక
అన్వేషణ [1/3 సమాజంలోని నటకుల, తదితర నాటక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉచితంగా యిచ్చె నాటకంచూసి, ఆనందిద్దామని తండోపతంగాలుగా ప్రారంభోత్సవానికి వచ్చారు, నటకుల నటన బాగుందని పొగిడారు ప్రారంభోత్సవం విజయవంతమైనదని వెంకట్రావు చెతులు ఆడిస్తూ ఉత్సాహంగా నవ్వేడు. ఈశ్వరయ్య గర్వం హెచ్చి నడి వీధిలో ఒక నాయకుడి హోదాలో నిటారుగా, గర్వంగా నడవ మొదలుపెట్టాడు ప్రతిపక్ష నాటక బృందాన్ని చూసి.
కబుర్లు చెప్పే ఈశ్చరయ్య కానీ సంపాదించలేక పోయాడు సమితి కోసం, జమీందార్ల స్నేహితుడై వర్తక సంఘాలమధ్య వ్యాపారుడుగా బతుకుతున్న నారయ్య, మందుల కంపెనీ ఏజంటుగా తీయని మాటలతో మసిబూసి మారేడుకాయ చెయ్యగలిగిన ప్రతిభగల వెంకట్రావు ఉద్రేకంతో ఉత్తమమైన నిజాయితీ కృషి జరపాలనుకునే శివరాం, సమితి ధనాదాయవృద్ధికి కృషి సలివారు. ప్రభాకరం ప్రక్కనుంచి ఉత్సాహకరంగా సలహాలిస్తూ వీలైనంతవరకు ఈశ్వరయ్య పద్ధతిలోనే నడవడం మొదలెట్టాడు.
కార్యదర్శి కోశాధికారులు ధన సంపాదన చేయగా సమితి ప్రాబల్యం వారికి చిక్కకూడదని ఈశ్వరయ్య సమితిలో క్రొత్త సభ్యులను చేర్చుకోవాలని ప్రతిపాదన పెట్టాడు. పదిమంది సభ్యులను చేర్చుకుని సమితిలో తన బలం వ్యక్తుల ద్వారా పంపాదించు కున్నాడు ఈశ్వరయ్య. అది ఒక ఘనకార్యం కాదని అవసరమైనప్పుడు పదవులు పోయే ప్రమాదం సంభవించినప్పుడు అతడు రెట్టింపు సభ్యులను ఒక్క రోజులో చేర్చించగల శక్తి తమకుందని నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు వెంకట్రావు. నారయ్య వీరి మనస్సుల్లో రగులుతున్న విఖేదాలు కనిపెడుతున్నాడు శివరాం.
ధనాదాయం కొంత స్వయంకృషివల్ల పెంచిన శివరాం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరిపించాలని, ఆ కార్యక్రమాలు ఒక నాటకకళకే సంబంధించి ఉండనక్కరలేదని సూచించేడు. తదితరులు ఈ విషయంపై వకగ్రీవ అంగీకారం తెలిపారు వివిధ తరగతుల మనుష్యుల పరిచయం కావలనుకున్న శివరాంకు యా అంగీకారం ఆనందం కలిగించింది. ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చెయ్యాలని తన నాంధి కార్యక్రమం సమితి న్థాపకుల ముందు పెట్టాడు శివారం. ఏ కవులను ఆహ్వానించాలనే విషయం ప్రస్తావించి ఉభయ నగరాల్లోని కవుల జాబితా తయారు చేశారు, ఎవరు ఎరిగిన వారిని వారు ఆహ్వానించి, సభ ఒక ఆది వారం జరవాలని నిశ్చయించారు.
రాష్ట్రపతి రోడ్డు ప్రక్కనున్న ఒక దేవాలయంలో గంధర్వ నాటక సమితి తరఫున
1774 అన్వేషణ కవి సమ్మెళనం ఎర్వాటైంది. సభకు కవి తిలక, కవి శిరోమణి, కవి కంరీరవ బిరుదాంకితులైన శాస్త్రిగారు అధ్యక్షతల వహించేరు. అధ్యక్షుని వేదికపైకి ఆహ్వానిస్తూ, గంధర్వ సమితి ఆశయాలు, జరుపబోయే కార్యక్రమాలు, నాటక సంస్థలోని (ప్రస్తుత... లోపాలు అవి రూపుమాపడానికి విస్తృత మవుతున్న తమ సంస్థ కృషి గురించి అనర్దళంగా ఉద్రేకంగా అయిదు నిమిషాలు ఉపన్యసించాడు శివరాం ఉపన్వ్యాసమంటే సభాకంపన గల ఈశ్వరయ్య వెంకట్రావు, నారయ్య శివరాం వాగ్గారణిని అభినందించి సమితికి చక్కని ప్రచారకర్త కాగలడని అభి (వ్రాయపడ్డారు. కార్యదర్శిగా వెంకట్రావు వచ్చే అతిధులను ఆహ్వానించాడు. పంచెలు కట్టుకుని లాల్ఫీలు వేలాడించుకుంటూ, కండువాలు వల్లెవాటుగా వేసుకుని గిరజాలు, క్రాపులు, పిలకలు గల పెద్దలంతగా వచ్చేశారు. మాస్ చిరిగిన చొక్కాలతో, ఒత్తు జుట్టుతో, సిగరెట్టు కాల్పులతో నల్లబడిన పెదాలతో అభ్యుదయ కవులు కూడ అతిధులలో కనిపించారు శివరాంకు శెలియని వారిని ఈశ్వరయ్య శివరాంకు పరిచయం చేశాడు.
ఆధునిక నగనాగరిక పద్ధతిలో సభ నడిపించాలని ప్రతి కవికి ఫలం, పుష్పం, పత్రం అందజేయాలనే ప్రణాళిక అమలు జరిపాడు శివరాం. చేతులు నిండేలా బత్తాయిపండ్లు, ఊహాగానానికి వీలైన మత్తువాసనల గులాబీ గుత్తులు, ఉద్రేక తీవ్రరచనల పరనానికి అనువుగా వేడి కాఫీ ఆహ్వానించబడిన ప్రతి కవికి అందజేయబడ్డాయి. ఆ ఫల పుష్పు పానీయ సందర్శనంతో కవుల ఊహాబలం విజ్బంభీంచింది ఛందస్సు నడకలతో, పిలక ఊపులతో, ప్రబంధ రీతిలోని పంచరత్నాలు; తేలిక మాటలతో, తెల్లని నవ్వులతో తరంగాలూగా గెంతే గేయాలు; గిరజాల ఒంపులలోంచి జారిన మధురమైన గొంతుతో జానపద గేయాలు, చింతనిప్పు కళ్ళతో నల్ల పెదిమల మధ్య నాట్యమాడిన భయంకర, యుద్ధభీభత్స దృశ్యపూరిత రగడల పరుగిడులు,; నూనె కారే దిగాలు ముఖంతో, ఒంగిపోయి కృంగిపోతున్న శరీరంలోంచి బీదరిక రోదనలు, రకరకాల తలపులు, కులుకులు, పలుకులు, నవ్వులు ఆ సభలో వెల్లివిరిశాయి.
పరమహంస చిన్ననాటి పద్యాలు సరదాకు వినిపించాడు హుస్సేన్ ఆలి ప్రేమగానం ఆలపించాడు. కృష్ణమూర్తి నాటకాలకై మధ్య మధ్య వ్రాసిన తన గేయాలు వినిపించేడు తమకు ప్రత్యేక అవకాశమిచ్చినందుకు శివరాంను అభినందించారు ముగ్గురూ. వారి పరిచయమైనందుకు సంతోషం వ్యక్తపరిచాడు శివరాం,
సభ దిగ్విజయమన్నాడు ఈశ్వరయ్య,
అన్వేషణ క్షే/5 మర్నాడు వార్తాపత్రికలలో ఐదు పేరాలు అవిరళంగా వ్రాయబడింది. కవి సమ్మేళన సభను గూర్చి, కార్యకర్తల కృషిన ప్రశంసిస్తూ
వార్తాపత్రికలో ఉపన్వాసమిచ్చిన శివరాం పేరు పడినందుకు అసూయపడినా, చివరకు ఘనకార్యమంతా తమ ఆధ్వర్యంలో జరిగినదే కదా అని సంతోషించారు సమితిలోని ఇతర కార్యకర్తలు
నెలకొక కార్యక్రమమయినా జరిపించి సమితిలో జీవకళ ఉట్టిపడెలా చెయ్యాలన్నారు వెంకట్రావు. నారయ్య సమితిలో ప్రతీరోజు వీలైనంతవరకు నటకులంతా కలుసుకుంటూ నిర్మాణ కార్యక్రమాలు జరపాలని లేనిచో నగరంలోని, నాటకరంగ వాతావరణం చర్చించుకుని “మన సమితి” పురోగతికి మన (ప్రయత్నాలు మనం చెయ్యడంలో నిమగ్నులం కావాలని, సమితి కార్యాలయానికి ప్రతిరోజు నటకులు వచ్చి కాలంగడపడానికి చదరంగం, పేక, కేరమ్సు మొదలయిన చిన్న ఆటవస్తువులు ఏర్పరిస్తే ఆకర్షణగా ఉపకరిస్తుందని ఈశ్వరయ్య (ప్రతిపాదించేదు. కార్యవర్గం ఈ సూచనలు అంగీకరించింది.
“దోపిడి అనే నాటకం పెద్ద ఎత్తులో ప్రదర్శించాలని గంధర్వ నాటక సమితి తీర్మానించి పత్రికా ప్రకటన చేసింది అయ్యే ఖర్చు, సంపాదించవలసిన సొమ్ము అంచనాలు వేశారు నాటకంలోని పాత్రలు పంపకంలో కాస్త మొదట ఘర్షణ జరిగినా చివరకు ఆమోదం కుదిరింది. నాటకాల రిహార్సల్సు నడిపించే బాధ్యత ఈశ్వరయ్య, థన సంపాదన బాధ్యత నారయ్య, వెంకట్రావు, రంగస్థల నిర్మాణం, ప్రచారం మొదలైన బాధ్యతలు శివారంకు అప్పగించబడ్డాయి. తీరిక సమయంలో తమ బాధ్యతలు పరస్పర సహాయంతో నడిపించుకుంటూ రిహార్సల్సు నడిపించనాగారు.
ధర్మశాల రిహార్సల్సుకు ఏదో కొద్ది మామూలు గుమాస్తాకు యివ్వడంతో ఏర్పాటు చెయ్యబడింది తన దర్శకత్వ నిపుణత అంతా ప్రత్యేకంగా ప్రదర్శించాలని ప్రయత్నించేవాడు ఈశ్వరయ్య. నటనలో ఏవిధంగానూ తీసిపోనని ప్రత్యేకమైన సలహాలు తన నటనతో యిచ్చే అవసరంలేదనే అహంభావంతో ఈశ్వరయ్య సూచనలు నిర్లక్ష్యపరిచేవాడు వెంకట్రావు, వ్యాపార సందడిలో తీరికలేక ఆలస్యంగా వచ్చి ఒక అరగంట రిహార్సలు జరిపి ఎలా చెబితే అలా ఏ ఆలోచనా లేక వినిపోయేవాడు నారయ్య, స్వీయ అనుభవంతో, యితరుల సలహాలు కూదా అర్ధంచేసుకుని, ఒక సమన్వయ దృష్టితో నటిస్తే పాత్ర రాణిస్తుందని శివరాం దర్శకుడి సలహాలన్నీ చాలా సమంజసమనీ, నటకులు తమ అహంభావం తగ్గించుకుని ఎక్కువ సహకారం చూవాలని వాదించేవాడు.
176 అన్వేషణ
వ్యక్తిగత విలువలకు ఏ అవమానం కలగకుండా రిహార్సల్సు జరిగిపోయేవి, విసిగెత్తినప్పుడు విరామకాలంలోనూ విలాసంగా అల్లరి చేసేవారు నటకులు, ప్రభాకరం లేచి ఆంగ్లపద్దతిలో నృత్యం చేసేవాడు విరహవెదన నటిస్తూ ఇంగ్లిషు పాటలు పాడుతూ, ప్రతికక్ష్య నటకుల నటన, నడక అవహేళనగా అభినయించేవాడు వెంకట్రావు గారడివాని ఘనకార్యాలు, సాముద్రికుడి ఉపన్యానాలు, కోయదొర మాటలు, పెళ్ళాడే బొమ్మపాటలు, విచిత్రమైన నడకలు ప్రదర్శించేవాడు ఈశ్వరయ్య అమ్మాయిల అంగవిన్వానాలు, పూర్వ అనుభవంతో తారసిల్లిన నటీమణుల హాస్యాస్పద నటభంగిమలు ఒయ్యారంగా త్రిప్పుకుంటూ నిండు బుగ్గల్లో సిగ్గుచూసేవాడు నారయ్య, ఎదురుగా చేయబడె హెళ నటనలను హాస్యంగా వ్యాఖ్యానించేవాడు శివరాం మద్దెల మోతలు, హార్మనీ కూనిరాగాలు, కుంయ్ కుంయ్లు, నటకుల విరామకాల హాన్యాన్ని వృద్ధిపరిచేవి
నాటక ప్రదర్శనానికి రెండు రోజులముందు స్త్రీ పాత్రలు ధరించివలసిన నటీమణులు బెజవాడ నుంచి వచ్చెరు. నారయ్య, వెంకట్రావు స్టేషనుకు వెళ్ళీ ఆహ్వానించి ధర్మశాలలో ఒక గది ఏర్పాటు చేశారు. నటీమణులిద్దరికి అండగా రక్షగా ఒక ముసలి వనిత, ఒక పిల్లవాడు, ఒక పాతికేళ్ళ యువకుడు అనుసరించి వచ్చేరు. వృద్ది విలువలు, మనిషి నడతలు బాహాటంగా అందరికీ అర్ధమవుతున్నా అబలయైన వనితలకు ఏ యుగంలోనైన బలవంతుడైన మగవాడు అండగానే ఉండవలసి వస్తోందనుకున్నాడు శివరాం. వారి అవసరాలకు సహజంగా అయేదానికంటే రెండింతలు ఖర్చు ఎక్కువౌతోందని వయసుడిగి ప్రీ వాంఛ తగ్గిన ఈశ్వ రయ్య ముఖం చిట్లించాడు. నటీమణుల పరివారాన్ని చూసి, తప్పనిసరి ఖర్చులంటూ ఏకగ్రీవంగా పెదవి విరిచారు నారయ్య, వెంకట్రావు.
క్రొత్తగా స్థాపించిన నాటకసంస్థ అని ప్రజలకు గంధర్వ నాటక సమితి మీద మోజు కుదిరింది. సభ్యుల ప్రచారంవల్ల నయితేనేమి పలుకుబడివల్లనయితే నేమి “దోపిడీ” నాటకానికి ధనం పుష్కలంగా చేరింది. వర్తకులను పట్టి నారయ్య, జమీందారు లను, ధనికులను మచ్చిక చేసుకుని వెంకట్రావు, ఆఫీసర్లముందు నాజూకుగా తియ్యగా మాట్లాడి శివరాం ధనసేకరణలో ప్రత్యేక నటనా నైపుణ్యం చూపారు. రాష్ట్రపతి రోడ్డు ప్రక్కన ఉన్న ధియేటరులో ఆ రాబోయే ఆదివారం పది గంటలకు 'దోపిడి నాటక ప్రదర్శనకు విరివిగా సన్నాహాలు జరుగుతున్నాయి.
తన పాత్రకు అవసరమైన టోపీలు, దుస్తులు సమకూర్చుకుని టాంగా ఎక్కాడు శివరాం. దారి కిరువైపులా బలాధ్యులయిన బిచ్చగాళ్ళు పేవుమెంట్లుమీద గుడ్డలు,
అన్వెషణ క్షేగ్ల సత్తుగిన్నెలు పరుచుకు కూర్చున్నారు బాటసారులు దయతో విసిరే పైసల కోసం ఒకడు పేవుమెంటు మీద పడుకుని కాళ్ళు తన్నుకుంటూ పొట్ట బాదుకుంటూ ఆకలి అంటూ అరుస్తున్నాడు ఒక కళ్ళున్న మనిషి గ్రుడ్డి వాడుగా మరొక స్త్రీ అండ తీసుకుని వీధిలో ఘుపష్టికి బయలుదేరాడు విభూతి పిండికట్టు బిగించి పంచాంగం చేతబట్షిన బ్రాహ్మ ణుడు ఎరుగున్న పెద్దలయింటికి యాయవారానికి బయలుదేరి మూటలు మోసుకుంటూ నడుస్తున్నారు మరొక శక్తిభక్తుఢు పెద్ద తోలుకర్రతో తళుక్కున శరిరాన్ని పలుమారులు బాదుకుంటూ గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తున్నాడు. శరీరానికి ఏ బాధ కలుగనట్లు సహజ రూపాలకు కాకీరంగు దుస్తులు తొడిగి కాకిటోపీలతో తయారై శృంగాటకాల్లో తమ వృత్తి వాటిస్తున్నారు పోలీసులు జీవితంలో పొట్టగడుపుకోవటానికి కూదా ప్రతిమనిషి మాససికంగా కాని శారీరకంగా కాని మార్పు తెచ్చుకుని ప్రపంచరంగంలో నాటకం వేస్తు న్నట్లు కనిపించాడు.
తొమ్మిది గంటలయినా రంగస్టలంమీది తెర ఏర్పాట్లు, విద్యుద్దిపాల అమరు 'మైక్' న్ధ్థాపన జరగలేదు. కూలీలు హాలులో కుర్చీలు సోఫాలు స్థలాలు మారుస్తున్నారు. రంగస్టలంమీద నిచ్చెన వేసుకొని వెంకట్రావు అజమాయిషీలో కూలీలు తెరలు కడుతున్నారు గ్రీన్ రూమ్‌లో నారయ్య నటీమణుల కోటారంగుముఖాలు యింకా సుందరవంతంగా వుండేటట్లు నాజూకుగా కనుబొమ్మలు బుగ్గలు సరిదిద్దుతున్నాడు నవ్వుతూ. ఈశ్వరయ్య పా(తరూపాన్ని అప్పుడే ఆవ్వానించుకొని నటనకు సన్నద్ధుడౌతున్నాడు. ఉద్రేకంతో జీవితంలో ఎంతో అపూర్వమైన నటనానుభవం ఉండి ఎప్పుడైనా రంగస్థలం మీదికి వచ్చి నటించిపోవచ్చుననే ధోరణిలో పాత్ర సంభాషణలే సరిగా తెలియని నటకులు అహంభావంతో నాటక ప్రారంభానికి అయిదు నిమాషాలు ముందుకువచ్చి గ్రీన్‌రూమ్‌లో ్రవేశించాకే, ఈశ్వకయ్య ఒక్క అంగలో గ్రీన్ రూమ్‌లోకి దుమకి, మరుక్షణంలో స్వయం(ప్రతిభతో తన పాత్ర రంగులకోటోలో సృష్టించుకొని సిద్దమయ్యాడు వెంకట్రావు. హాలులోని (ప్రేక్షకుల ఆతురత కేకలతో ఈలలతో గ్రీన్ రూమ్‌లోకి వినిపిస్తోంది.
నాటకం ప్రారంభం అయింది. ప్రకృతి సౌందర్యం అలరారే బీదరైతు పొలం దృశ్యం రంగస్థలంమీద కనిపించింది. ఈశ్వరయ్య సన్నగా, బక్కగా ఒక పంచె, బనీనుతో, తలపాగా చుట్టుకొని చేతికర్ర బుజానికి తగిల్చి, దీనమైన ముఖంతో పొగాకుచుట్టతో నిలబడ్డాడు. నీళ్ళకుండతో పల్లెపిల్లగా వయ్యారంగా సొగసుగా ప్రవేశించింది నటీమణి. నాటకం నడిచింది పట్టుగా, పిచ్చి జమీందారు సినీ డైరెక్టరు శివరాం, అతని అనుచరుడుగా
కే/8 అన్వేషణ నారయ్య జంటగా (ప్రశంసనీయంగా నటించారు వెంకట్రావు అహంభావంతో ఏ హాలీవుడ్ నటకులనో అభినయించాలనే ఆకాంక్షతో సంభాషణలు రాక పాత్రే చెడగొట్లాడు చిన్న పాత్రలు తమ్ముతాము బెచిత్యంతో పోషించుకున్నారు రంగస్థలంమీద అధ్యక్షుడిగా ఆహ్వానించబడిన ఒక ప్రభుత్వోద్యోగి ఇంత ఉత్తమనటనతో యువకులు ప్రదర్శించిన నాటకం యిదివరకు చూడలేదన్నాడు. అధ్యక్షుని ప్రశంసలు తన దర్శకత్వానికే అభినందన అని మురిసిపోయి, రంగస్థ్టలంమీద పరిచయసమయంలో ప్రవేశించి, వంగి వంగి నమతగా (ప్రేక్షకులకు నమస్కరించి, వారి కరతాళధ్వనులకు చిరునవ్వులు విసిరి అవి ఆఖరవోయినా మరొకసారి చప్పట్లు కొట్టమన్నట్టు ఒక క్షణం వారివైపు దీనంగా చూసి తెరలోకి నిష్క్రమించాడు ఈశ్వరయ్య.
పిచ్చిజమింందారుగా శివరాం నటన అద్భుతమైన సహజత్వం ఉట్టిపడుతూ (మేక్షకులకు ఆనందంకలిగించిందన్నారు తన నటనపాడయిపోయినదనే బాధతో అవమానం పొందినట్లు భిన్నుడయి ఒక క్షణం రంగస్థలంమీద తప్పనిసరిగా నిలుచుని గబుక్కున వినమశిరస్సుతో (ప్రేక్షకులకు ముఖం చూపకుండా నిష్ర్రమించెడు వెంకట్రావు. నాటకం సమాప్తి అంటూ ప్రేక్షకులు హాలు కాళీచేశారు.
ఈశ్వరయ్యకు విజయగర్వం పెరిగింది. నాటకరంగంలో ధృవతారగా తాను వెల్లి విరిసినట్లు కనిపించిన ప్రతీవారిముందు ఒక అరగంట చిన్న ఉపన్యాసమిచ్చి, చణుకులు విసిరేవాడు వెంకట్రావు తనపాత్ర పాదయిందనే అవమానంతో ప్రజలలో పదిహేను రోజులు తిరగడం మానేశాడు. నటీమణులను మరో రెండు రోజులు అట్టేపెట్టి తనింట్లో స్వయంగా భోజనాలు ఏర్పాటు చేసి కులుకుతూ నారయ్య వారిని సాగనంపాడు.
హాలులోని (పేక్షక సమూహాన్ని బట్టి నాటకం రాబడి రెండు వేలరూపాయలు మీంచిందని అంచనా వేయబడింది టిక్కెట్లు అమ్మిన నటకులు, యింకా దబ్బు సేకరించలేదని అందినతర్వాత యిస్తామని వాయిదా వేశారు. చేసిన ఖర్భులు వచ్చినసగం ధనానికి మించివోయాయన్నారు నారయ్య, వెంకట్రావు.
ప్రజల మన్ననలువొంది బహుజన ప్రదర్శితమైన నాటకం సమితి ఆదాయం చివరకు శూన్యం చేసింది. నెలలు గడచినా టికృట్లపూర్తి సొమ్ము రాకవోగా జమాఖర్చులు పట్టిక కార్యవర్షం ఆమోదం పొందడానికి కార్యదర్శి పూనుకొనక పోవడంవల్ల ఈశ్వరయ్యకు ఆ(గ్రహం కలిగించింది. అతని ఆగ్రహం సమంజస మన్నాడు శివరాం ప్రభాకరం నమర్ధించాడు. కార్యవర్గంలో నాటకం రాబడినిగురించి వుర్న్షణ చెలరేగింది.
అన్వేషణ 1776 వాదోపవాదాలు తీవ్రమై వ్యక్తిగత దూషణం దాకా పరిణమించి నారయ్య, ఈశ్వరయ్యను కొట్టటోయాడు శివరాం అడ్డుకున్నాడు బలమైన నారయ్యచెయ్యి ఈశ్వరయ్య చెంప దూసుకుని ఊరుకుంది. బక్క ఈశ్వరయ్య బలమైన నారయ్య ఉధృతం చూని బెదిరిపోయాడు కార్యవర్దసభ వాయిదా పడింది
ప్రభాకరం నటకుల నందరినీ కూడగట్టి ఒక సమనయ సిద్దాంతం ప్రతిపాదించేడు. కార్యవర్గ పదవుల్లో సమితి అభివృద్ధి దృవ మార్చు తేవడం అవసరమని శివరాంను కార్యదర్శి చేయ ప్రతిపాదించాడు. నారయ్య కొంచెం ఆలోభించి వెంకట్రావుతో సంప్రదించి ప్రతిపాదనకు చివరకు అంగీకారం సూచించాడు. శివరాం కార్యదర్శిగా ఎన్నికైనాడు
నిర్మాణాత్మక కృషి జరపాలని ఉత్సాహంగా నాటక సంస్థలో చేరిన శివరాంకు సమితిలోని రాజకీయాలు చికాకు కలిగించాయి. తన కార్యదర్శికత్వంతో ఘర్షణలకు అవకాశం తగ్గించి పురోగతికి తోద్చడాలనే ఆశయం పెట్టుకున్నాడు శివరాం.
[గగ్రంధాలయాల్లో సంఘసేవా సమితుల్లో సభ్యుడిగా చేరేడు శివరాం. వీలైనంతవరకు నగర సభల్లో ఉత్సవాల్లో సముచితమైన కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని వివిధ తరగతుల మనుష్యులతో మసులుతూ పరిచయాలు వ్పుద్ధి చేసుకున్నాడు. శివరాం ప్రవర్తన పరిసర వర్గాల్లో విశ్వాసం వృద్దిచేసింది. టి నిర్మాణాత్మక కృషి జరుపదలచినా నగర ప్రముఖులు అతని పేరు. లెక్కలో వేసుకోసాగారు.
ఈశ్వరయ్య వర్గబలంతో శివరాం నాటక సమితి కార్యక్రమాలు జయప్రదమైనాయి. నారయ్య, వెంకట్రావు తమ సహకారం తగ్గించినా కార్యనిర్వాహణలో కార్యానికి దూరంగా వుండడానికి యిష్టం లేక, తమ వ్యక్తిగత పదవి, ప్రభావాలు పోకుండా చెయ్యి వేసేవారు. మరికొన్ని నాటకాలు ప్రదర్శిత మయినాయి కవులసభలు జరిగాయి. బీదవిధ్యార్ధి నటకులకు బహుమతులు యివ్వబడ్డాయి. నగర సంస్థల మధ్య గంధర్వ నాటకసమితి తరపున నాటకాలపోటీ ఉత్సవాలు జయప్రదంగా జరిగాయి. సమితి ఆదాయం పెరిగింది. శివరాం పరపతి యినుమడించింది.
ఆఫీసులేని తీరిక సమయాల్లో , సెలవుదినాల్లో సాంస్కృతిక నాటకరంగం కార్యక్రమాలలో ఊపిరాడక శివరాం తిరగజొచ్చాడు. రాత్రి యింటికి వచ్చేటప్పటికి పది గంటలు దాటేది. రోజూ రాత్రి ఆలస్యంగా రావడం ఇంటి యజమానులు ఆంగొఇండియనులకు చికాకు కలిగించింది శివరాంకోసం కాంపొండుగేటు తెరచి రాత్రి 10 గంటల దాకా వుంచడం భద్రతకు అపాయం కలిగిస్తుందని బాధపడేవారు. ఒకటి, రెండుసార్లు శివరాంకు చెవ్పారు రాత్రిత్వరగా యింటికి రావాలని, వ్యక్తి విషయాలలో
180 అన్వేషణ సంబంధం కల్పించుకుని తమ కనుగుణ్యంగా నదడవమనే గృహయజమానుల సలహాలు శివరాంకు ఆగ్రహం కలిగించాయి. తన కార్యక్రమాలు యింటికి త్వరగా రానీయమన్నాడు శివరాం సౌలభ్యం గుర్తించకుండా గహ యజమానులు గేటుకు తాళం వెసెవారు రాత్రి విసుక్కుంటూ వచ్చి తలుపు తీసేవారు. ఒక్కొక్కసారి వినీవిననట్లు నిద్రపోతుంటే, శివరాం కేకలు వేయలేక గేటుదూకి లోపల (్రవేశించెవాడు
ఒంటరిమనిషి జీవితం గృహస్థుల ధర్మాలకు విరుద్దమని ఆధునికులు కూడా పాటించడం శివరాంకు కంటకంగా కనిపించింది సనాతనుల సంకుచితదృష్టితో ఒంటరియువకులు గృహస్ఫుల యిండ్లలో కాపురముండడం.... ప్రమాదమని హెచ్చరించినా, సమానత్వం స్తీ పురుషులలో అన్ని విధాల కావాలంటే ఆధునికులుకూడా బాధ్యతలు అర్ధమయి బ్రతికి ఒంటరి యువకులనుంచి తమ గృహాలు కాపాడుకోవాలనీ అద్దెల కివ్వకపోవడం శివరాం నివాసస్టిరత్వానికి వీలు కలిగించటంలెదు పాశ్తాత్వ్య పద్ధతుల మనస్తత్వంగల ఆంగో ఇండియనులు తనకు ఇల్లు అద్దెకు యివ్వడంలో వారి మానసిక విశాలదృక్పధాన్ని ప్రశంసించినా, ప్రతినిమిషం తన ప్రవర్తనను కట్టుదిట్టం చేసి ఇంట్లోనే ఉండి పోమ్మనేవారి మనస్తత్వంలో ఏదో వింత స్ఫురించింది శివరాంకు, అద్దె ఎక్కువయినా ఎకాంతంగా, విశాలంగా ప్రత్యేకంగా ఉందే మిద్దె పైభాగం ఎదైనా దొరుకుతే బాగుంటుదనుకున్నాడు శివరాం.
ఒకరోజు బ్రహ్మయ్యగారు ఉత్తరం వ్రాశారు లక్ష్మి పెళ్ళి ఆలస్యం చెయ్యడం గృహ సార్నపదాయాల ప్రకారం మంచిదికాదని, ఎంత త్వరలో సంబంధం నిర్ణయంచేస్తే అంత మంచిదని, వార్ధక్యం వస్తూన్న తాను కళ్ళారా చూస్తూ, చేతులతో స్వయంగా యీ వివాహము జరిపించాలని కోరుతున్నానన్నారు. వరంగల్‌లో ఏదో సంబంధం ఉందని వాకబువల్ల తెలిసిందని, ఒకనారి ఇంటికి వెళ్ళి పెళ్ళికొడుకును పిల్లను చూసుకోవలసిందని కోరి దగ్గరవుండి అతనిని వీలయితే రాజమండ్రి, తీసుకురావలసిందని (వ్రాశారు బ్రహ్మయ్యగారు. సాంఘిక కార్యక్రమాలలో తీరుబడిలేక తిరుగుతున్న శివరాంకు ఒకసారి దృష్టి గృహంవైపు మరలింది యీ ఉత్తరంతో కుటుంబానికి పెద్దగా బ్రహ్మయయగారు సర్వవిషయాలు సర్దుకుంటున్నారు చెల్లెలి పెండ్లి చేసే బాధ్యతలో తన చెయ్యికూడా వేసి సహకారం చూపడం విధ్యుక్తధర్మ మనుకున్నాడు శివరాం.
వరంగల్ ప్రయాణమయ్యాడు. ఊళ్ళో ఒక హోటల్లో మకాం వేసేడు. తాతగా రిచ్చిన చిరునామా తీసుకుని ఉదయమె యిల్లు వెతుక్కుంటూ బయలుదేరేదు శివరాం, చివరకు పట్టుకున్నాడు.
అన్వేషణ 181
వీధివైపు ముందు వరండాపై ఒరుగుతున్న పెంకు కప్పు, ఆ వెనకాల దాబా, వీధి వరండాలకు ఇనుప కటకటాలు, కటకటాల్లోంచి రెండు వాలుకుర్సీలు కనిపించాయి.
కటకటాలు శబ్దం చేశాడు శివరాం, ఒక ముసలాయన తలుపు తెరిచాడు ఒక పంచ, బనీను, బుజంమీద తువ్వాలు వేసుకుని నిశితంగా శివరాంవైపు చూసేడు 'మాది హైదరాబాదు .. మీతో కలసి మాట్లాడాలని వచ్చేను....* శివరాం వినయంగా మాట్లాడాడు
తన తాతగారి ఉన్వరంగురించి ప్రస్తావించాడు శివరాం.
ముసలాయన కులాసాగా నవ్వాడు కోటు తొడుక్కుని ఆఫీసుకు ప్రయాణమౌతున్న తనకొడుకును పిలిచాడు. మెట్లు దిగుతున్న అతను ఆగి వరండాలోకి వచ్చి నిలుచున్నాడు ఒక క్షణం.
సగం బట్టతలతో, ముదిరిన ముఖంతో, లావుగా కమిలిన మామిడిపండులా కనిపిస్తున్న ఆ యువకుడికి వయస్సు సుమారు ముప్పైఅయిదు సంవత్సరాలు తక్కువ వుండదని నిర్ణయించాడు శివరాం. పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న తన చెల్లెలికి యితను తగిన సంబంధమా అనే సంశయం శివరాంకు కలిగింది.
ముసలాయన శివరాంతో మాట్లాడారు, (బ్రహ్మయ్యగారి సంగతి విన్నానని, ఆయనలాంటి యింకొకరు లేరని, ఉత్కృష్టనుటుంబంలో పుట్టి మంచి పరపతి సంపాదించుకున్నారని పొగిడారు. తెల్లని వస్త్రం ధరించి, కేశాలు ముడివేసుకుని తిలకంలెని నలభై ఏండ్ల వనిత శివరాంవైపు తొంగిచూస్తూ గుమ్మంలో నిలుచుంది. పాతికేళ్ళ జవ్వని అావుగా బొద్దుగా గుండ్రనిముఖంతో ఆశగా చూస్తూ శివరాంకు కాఫీ అందించింది మర్యాదగా....,
“నీ కెంతమంది పిల్లలు బాబు?” ముసలాయన చిరునవ్వుతో ప్రశ్నించాడు.
“నాకు ఇంకా పెండ్లి కాలేదండి!” శివరాం జవాబుకు ముసలాయన ముఖంలో అసంతృప్తి గోచరించింది పెళ్ళీకాని (బ్రహ్మచారి కుర్రాడు చెల్లెలుకొరకు సంబంధాలు వెతుకుతూ పెద్దమనిషిలా ప్రవర్తించబూనడం తనలాంటి వయసు పెరిగిన పెద్దలను ధిక్కరించి అవమానం చెయ్యడమేనన్నట్లు తీవ్రంగా చూశాడు ముసలాయన.
“మీ తాతగారు స్వయంగా వస్తే బాగుండేది .. నువ్వు యింకా పిల్లకాడవు యీ విషయాలు ్రస్తావించడానికి .. మా అమ్మాయి సుగంధికికూడా పెళ్ళి చెయ్యాలను
184 అన్వేషణ కుంటున్నాం.... మీ తాతగారే ఎదురుగావుంటే పరస్పరం... ముసలాయన ఆసంతృప్తి ముఖం మార్చి సరదాగా నవ్వేడు,
శివరాంకు భయంవేసింది చెల్లెలి పెండ్తిగురించి వస్తే తనపెండ్షి ప్రస్తావన జరుగుతూందేమని, సుగంధి కిటికిలోంచి తొంగిచూసోంది ఓరగా.
“మంచిరోజు వీలుచేసుకుని మీరు తెలపండి... నెను మీ కుర్రవాణ్ని రాజమండ్రి తీసుకువెడతాను.. తాతయ్య ముసలివారైపోయారుగో .. అందువల్ల యింతదూరం రావడం కష్టం...! అసంతృప్తిగా నిట్టూర్చాడు. . ముసలాయన కొడుకు గంటస్తంభంలా వరండాలో ధ్వనియైనా చెయ్యకుండా నిల్చున్నాడు
“సరే... నువ్వు ఆఫీసుకువెళ్ళు! ” తండ్రి ఆజ్ఞతో తల వంచుకుని వెళ్ళిపోయాడు ముసలాయన కొడుకు.
భోజనానికి ఉండమంటే సంబంధాలు అతకదనే భయంతో ముసలాయన ఆ ప్రస్తావన ఎత్తలేదు శివరాంతో. ఆయనవద్ద శెలవు తీసుకుని బయటికి వచ్చిశాడు శివరాం.
స్వయంగా తనకు సంబంధం నచ్చకపోయినా తుదినిర్ణయం చెయ్యవలసిన బాధ్యత తాతయ్యదని జరిగిన సంగతిగురించి విపులంగా తాతయ్యకు ఉత్తరం వ్రాయాలనుకున్నాడు శివరాం. వరంగల్ వచ్చనపని పూర్తయినది కనుక చుట్టుప్రక్కల ఉన్న చారిత్రక స్థలాలు చూసిపోవాలనుకుని కిళ్ళీ దుకాణంపై నడిచాడు శివరాం కిళ్ళీ ఒకటి నోట్లో వేసుకుని సిగరెట్టు ముట్టించాడు విరామకాలం గడిపే మార్టం ఆలోచిస్తూ,
పొట్టిగా గుమ్మటంలా ఆకారం, పెద్ద ముక్కు బట్టతల, చేతిలో కర్ర, బిళ్ళపంచెకట్టు, చలాకీనవ్వు - ఒకాయన కిళ్ళీ దుకాణం వద్ద పలకరించేడు శివరాంను.
“మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి!”
క్రాత్త మనుష్యులను పలకరించి పరిచయం చేసుకోవడంలో ఆమోఘమైన నేర్పుగల ఆయన ఆమాట అప్రయత్నంగా శివరాంను చూడగానే వదిలాడు.
శివరాం ఆశ్చర్యంగా ఆయనవైపు చూసేడు, ఆయన్ని చూచినట్లు వ విధమైన జ్ఞాపకం అతనికి కలుగలేదు.
“అలాగాగొ నవ్వాడు శివరాం.
“మీ దేవూరు?”
అన్వేషణ 183
“సికిం(డ్రాబాదు”
“అల్లా చెప్పండీ.... ఇప్పుడు తెలిసింది... సికింద్రాబాదులో నాటకాల్లో, సభల్లో ఎక్కడో చూశాను!” అన్నాడాయన
శివరాం తనకు తెలియకుండా అందరూ తన్ను తెలుసుకుంటున్నారనే కులాసాతో నవ్వాడు. ఆ నవ్వులో తన సంభాషణ విజయవంతమైందనుకున్నాడు ఆయన
“నా పెరు... పేరిశాస్త్రి... జైనగరులో ఉంటూంటాను!”
సికింద్రాబాదు విషయాలు కాస్సేపు ముచ్చటించారు ఇద్దరూ. వరంగల్ వచ్చిన పనులు యిద్దరూ పరస్పరంగా చెప్పుకున్నారు
“అయితే యిద్దరం ఇంచుమించు ఒకే పని మీద వచఛచ్చామన్న మాట?” పేరిశాస్తి అన్నాడు.
“నువ్వు బాగా కుర్రాడివోయ్... ఇటువంటి పెళ్ళివిషయాల్లో నువ్వుమాత్రం సులువుగా నిర్ణయించకుసుమీ... కావాలంటే నాసలహా తీసుకో... నువ్వు చూసిన సంబంధం గురించి నాకు బాగా తెలుసు... నువ్వు కటకటాలింట్లోకి వెడుతూంటే ఏదో అనుమానించి అప్పటి నుంచీ నీ కోసం ఎదురుచూస్తూ వీధిలో నుంచున్నాను... ఆ సంబంధం పెద్ద చెప్పుకోదగ్గది కాదు!” కర్ర ఊపుకుంటూ నడుస్తూ పెదవి విరిచాడు పేరిశాస్తి.
శివరాం విచిత్రంగా పేరిశాస్తి వైపు చూశాడు.
“నేను ఉద్యోగం పూర్తిచేసుకుని పింఛనీ పుచ్చుకుంటూ దృఢంగా ఉన్నానని స్నేహితులందరూ యీ వివాహాల బాధ్యత నా నెత్తిమీద వేస్తారు... ఈ ఊళ్ళో తహశీల్దారుగారి కొడుకును చూసి రమ్మని స్నేహితుడొకడు పదిసార్లు అడుగుతూంటే పోనీ అని బయలుదేరేను... నువ్వు చూసిన సంబంధం గురించి వాకబు చేశాను... కుర్రాడికి రెండో పెళ్ళి... మొదటి పెళ్ళాన్ని నిప్పుల్లో త్రోసి కాల్చిచంపేశాడని పెద్ద పుకారు... మహా కోపిష్టిట.... అందుకే... వాళ్ళమ్మాయి సుగంధికి ఏ సంబంధం కుదరటంలేదు!” సాలోచనగా శివరాం భుజం తట్టాడు.
పేరిశాస్తి ఇచ్చిన సమాచారంతో శివరాంకు ఆ చూసిన సంబంధంపై పూర్తిగా యిష్టం తగ్గింది. ఈ సంబంధం గురించి ఆలోచించడం కూడా తన వంశ ప్రతిష్టకు భంగమనుకున్నాడు శివరాం. అయినా ఆ ముసలాయన కొడుకు ప్రధమ భార్యను ఏ ఘర్షణ వివాదాల్లో కోపం ఆపుకోలేక నిప్పులోకి త్రోసి చంపేశాడో, నిప్పుల్లోకి త్రోసినంత
184 అన్వెషణ మాత్రాన అతని భార్య ఎలా చచ్చిపోయిందో తమాషా సన్నివేశంలా కనిపించింది శివరాంకు.
తన సందేహం ప్రశ్నగా చేశాడు శివరాం
“ప్రొద్దున్న నీళ్ళపాయ్య ముందు కూర్చుందిట భార్య, రాత్రల్లా ఏదో ఘర్షణ పడ్డారట, స్నానానికి నీళ్ళకాగు దింపి నీళ్ళు తొరుపుతోందట భార్య కోపం ఆగక ఆమె శిరస్సు వంచి కణకణ మందేపొయ్యిలో కుక్కేశాడట ముఖం మాడిపోయి, బొబ్బలుదెరి అయిదుగంటలు తిరగకుండా ఆ యిల్లాలు పరమవదించిందట!” ఒళ్ళు భయంతో జలదరించినట్లు పేరిశాస్తి కళ్ళుమూసుకుని క్రుళ్ళిపడ్డాడు.
“ఇది నిజమయితే చాలా ఘఫోరసంఘటనే!” నిట్టూర్పు విడిచాడు శివరాం
హోటలుచేరి శివరాం ఉత్తరం వ్రాశాడు తాతయ్యకు తాను విన్న సంగతులు గురించి. ఈ సంబంధం తనకే విధంగా నచ్చలేదని సలహాఇచ్చెడు. పేరిశాస్తిగారిని తన చెల్లెలుకు ఏమన్నా సంబంధాలు చూడమన్నాడు శివరాం. ఓ! అంటూ కళ్ళు పెద్దవిచేసి “తప్పకుండా” మా యింటికి రావోయి ఒకసారి!” అన్నాడు పేరిశాస్త్రి. శాస్తిని వదిలి శివరాం చారిత్రకస్థలాలు చూడటానికి వెళ్ళాడు,
పురాతనమైన ఓరుగల్లుకోట శిధిలావస్థలో పడివుంది రూపురేఖలు పూర్తిగా మారి నామమాత్రస్టలంగా గడ్డదుబ్బులు పెంచుకుని పురాతన వైభవానికి చిహ్నంగా మాత్రం కనిపించింది కోట. కాలం మార్పులో యుగయుగాల నాగరికత రూపుమార్చుకుని శిధిలంగా మాత్రమే భావి పౌరులకు పొడచూపుతూ ఉంటుంది. నేటి యుగంలో పురాతనత్వంగానూ, పురాతన బిన్నత్యం శిధిలచిహ్నంగానూ. భావియుగాలలో నేటి ఆధునిక నాగరికయుగం, బహుశా పురాతన సనాతనత్వంగానూ, శిథిల పురోగతిగానూ పరిణమించేలా అగుపించింది శివరాంకు.
వేయి స్తంభాలగుడి బాగా శిధిలమైన కట్టడపు సౌందర్యం ఇంకా ప్రతిఫలిస్తోంది. నల్లరాతి స్థంభాల పై చెక్కిన బొమ్మలు, లతలు, శిల్పము, వాటికాలపు నాగరికత, మానసిక ప్రభావం, వైజ్ఞానిక సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయి. ఉపరిభాగాలు ఎగిరిపోయిన స్థంభాలు, ఛత్రంలేని ఒంటరి సింహాసనాల్లూ ఈశ్వరుని రక్షక్షభటవర్గంలా గుడికెదురుగా నిల్చున్నాయి. ఒయ్యారంగా సొగసుగా కూర్చున్న నంది సౌందర్య ముగ్ధగా రాతితో చెక్కబడి జీవం ఉట్టిపడుతోంది. గోటితో మీటికే సప్తస్వరాలు పలుకుతున్న ఆ రాతి
అన్వేషణ 185 స్థంభాలు ఈశ్వరుని పూజకు రాత్రిళ్ళు అద్భశ్యంగా వచ్చే గంధర్వ కిన్నెర కింపురుష వాయిద్యాల్లా కనిపించేయి శివరాంకు.'
శిధిలమైపోయిన' ఆంధ్రుల శిల్పబెన్నత్య చిహ్నాలు స్మరించుకుంటూ రైలు ఎక్కాడు శివరాం. పరిగెడుతున్న రైలు చుట్టూ భూమి గుండ్రంగా తిరుగుతోందనిపించింది. భూమి గుండ్రంలాగే కాలయుగం కూడా బెన్నత్యపతన బిందువులు కలయిక రేఖతో వృతాకారంగా కనిపించింది శివరాం దృష్టిలో.
చారిత్రక స్థలాలు, పురాతన శిల్పవైభవాలు చూసేటప్పుడు తప్పక ఒక కెమేరా ఉండడం ముఖ్యమనిపించింది శివరాంకు అది కొనుక్కోనందుకు విచారించాడు, అయినా ఒక యంథత్రంతో వన్తు రూపాలను (వతిబింబాలుగా తయారుచేనుకుని ఆనందించడంలోకంటే స్వయంగా చిత్రలేఖనలో నైపుణ్యం పెంపొందించుకుంటే ఒక కళారాధన చెయ్యడం, పరపతి గణించటం, తీరిక సమయాన్ని సద్వినియోగం చెయ్యడం కూడా జరుగుతుందని ఆశించాడు శివరాం. చిన్నతనంలో అప్పుడప్పుడు సరదాగా గీసిన బొమ్మలు, దృశ్యాలు తలచుకున్నాడు. నలుగురూ ప్రశంసించేవారు. తిరిగి ఆ కళను వృద్ధిచేసుకోవాలనేసరదా శివరాంలో ఉద్భవించింది. పట్టుదల, నిరంతరకృషి ఉంటే మనిషికి సాధ్యంకానిది లేదనే సిద్ధాంతం నమ్మిన శివరాం ఆలస్యం అయినా చిత్రలేఖనా కళను ఆరాధించాలనే సంకల్పం చేసుకున్నాడు.
రైలులోకి వివిధ తరగతుల జనం ఆకార రేఖలు బొమ్మల్లా కదిలాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బొమ్మలా కనిపించాడు. హావభావ భంగిమలు, రూపు రేఖలు, గీతల్లో యిమిద్బి ఊహించాడు శివరాం. ప్రతీది అద్భుతమైన రేఖాచిత్రంలా తయారయినట్లు పొంగి పోయాడు శివరాం. రైల్వే స్టేషనులో కదిలేజనం, బొగ్గుమసి చొక్కాలతో నడిచే రైల్వే కూలీలు, ఇంజను (డైవరు, పళ్ళు అమ్మేకూలి, “చుట్టా, బీడి, సిగరెట్టు” అంటూ అరిచే పిల్లవాడు, టీస్టాలు, గీతల్లో దృశ్యాలుగా కళ్ళముందు కట్టాయి శివరాంకు. పేరిశాస్తి ఆ రైల్లో ప్రయాణం చేస్తూ ఏదో స్టేషనులో దిగిపచారుచేస్తూ ఏమోయి అంటూ నవ్వుతూ పలకరించాడు శివరాంను. జగతి అంతా విచిత్ర వ్యక్తులలో కూడిన వివిధ దృశ్యాలు సౌందర్యమయం అనుకున్నాడు శివరాం.
బ్రహ్మయ్యగారు మనవడి లేఖ చదివి, ఏ నిప్పూ లేనిదే పొగరాదని నమ్మి ఆ సంబంధం గురించి ఇంక ప్రయత్నం చెయ్యడం అనవసరమని నిర్ణయించుకున్నారు. అదే జవాబు శివరాంకు అందింది. అయినా తన ప్రయత్నం లోపం ఉండకూడదని పేరిశాస్త్రి గారింటికి బయలుదేరాడు శివరాం. దారిలో పేరిశాస్త్రి ఎదురయ్యాడు.
186 అన్వేషణ
“సరిగ్గా నిన్ను గురించె ఆలోచిస్తున్నానోయ్!” అన్నాడు పేరిశాస్త్రి ఠీవిగా కర్ర ఊపుకుంటూ నడుసూ
శివరాం నవ్వాడు హోటల్లోకి నడిచారు యిద్దరూ వద్దు వద్దు అంటూనే పేరిశాస్తి నాల్గు వడలు, అయిదు ఆవడలు చక్కటి వేడి కాఫీ సేవించి సంతృప్తిగా ్రేన్చేడు ఒక డిప్యూటి కలెక్టరు కొడుకు బిఏ చదువుతున్నాదని, ఒక హెడ్మాస్టరు కొడుకు ఇంజనీరింగులో యీ ఏడే చేరేదని, ఒక బీ యస్సి యువకుడు ప్రస్తుతం కాలేజీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడని, వీలైనంతవరకు కన్యలకు పెళ్ళికొడుకులను నిర్ణయించడంలో, ఉద్యోగంలో స్టిరపడిన వ్యక్తులను ఏఠుకోవడం మంచిదని చెప్పాడు పేరిశాస్త్రి, గంభీరంగా ఫలహారబలాన్నంతా జాగ్రత్తగా ప్రయోగిస్తూ కాని చాలా కట్నాలు హెచ్చు సుమి!” అంటూ పెదిమ విరిచి కళ్ళు పెద్దవిచేసి ముఖం చిట్లించాడు శాస్తి.
“సమంజసమైన కట్నం మేమూ యిచ్చుకుటాంకదూ!” వినయంగా చెప్పాడు శివరాం.
“ఆ!... ఇంచుమించు వఏడెనిమిదివేల రూపాయలకు తగ్గమనుకుంటా. అంతా పరువు ప్రతిష్ట గల కుటుంబాలు .. రత్నాల్లాంటి అబ్బాయిలు! అయినా మన ప్రయత్నం మనం చేద్దాం! వీలైనంతవరకు కట్నం తగ్గించేలా తంటాలు పడదాం .. అదేనా నిన్ను చూసి.... నిన్ను చూస్తోంటే ఏమిటో ఆప్యాయత ఉట్టిపడుతోందోయ్!” ఆనందంతో కళ్ళు మెరిశాయి శాస్త్రికి
శివరాం తాను నివసిస్తున్న అద్దెకొంపకు తీసుకెళ్ళాడు శాస్త్రిని. గృహ యజమానులు ఆంగొయిండియనులని తెలిసి శాస్తి చిదరించుకున్నాడు.
“ఎల్లాగుండ గలుగుతున్నావోయి ఈ యింట్లో... నీచువాసన ... వెకవెకలు... పకపకలు గౌనులతో తిరిగే ఎదిగిన ఆడాళ్ళు, మన సాంప్రదాయాలకు తగదోయ్ ఈ వాతావరణం... నీకు మా యింటి ప్రక్క ఏదైనా ఇల్లు చూపిన్తా!” శాస్తి యింక అక్కడ ఉండనంటూ సెలవు పుచ్చుకుని వెళ్ళివోయాడు.:ః
మతాలు వేరైనా, జాతుల నడతలలో భిన్నత్వమున్నా సర్వం ఏక మానవుల కుటుంబం అనే దృక్పధం ప్రబలిన ఆధునిక యుంలో కూడా శాస్తివంటి కొంచెం పురాతన మనుష్యులు లేకపోలేదని అర్ధమయింది శివరాంకు. ఒక్కొక్కసారి సనాతనత్వ సంకుచిత ప్రవర్తన, ఆధునిక విశాల దృక్పధం అన్నది కాలానుగుణ్యమైన గుణాల కాకపోగా, మానవ నైజాగుణాలేమో అన్న భ్రమ కలిగింది శివరాంకు.
అన్వేషణ 187
శాస్త్రిగారి ననుసరించాడు సాయంత్రం వేళల శివరాం, డిప్యూటీ కలెక్టరుగారిని కలుసుకోవడం కష్టమని ఆయన తమ్ముడి గృహానికి తీసుకువెళ్ళాడు శాస్త్రి లుంగీ, చొక్కా తొడుక్కొని చక్కగా క్రాపు దువ్వుకుని శాస్తిని చిరునవ్వుతో ఆహ్వానించాడు ముప్పయి అయిదేళ్ళ మనిషి పెద్ద మనుష్యుల పరిచయం కోసం వెడుతున్న శివరాం తానుకూడ ఒక కోటు బిగించి పెద్దమనిషి తరహా కనపరచాలనుకున్నాడు శాస్తిసంబంధం గురించి కదిపాడు.
'ఎమిటి శాస్త్రిగారు... మీరుకూడ యిటువంటిపని చేస్తారేమిటీ. . ఇతని తాలూకు పెద్దవాళ్ళని రమ్మనక యీ కుర్రాడిని తీసుకువచ్చారెటి?” కుండ బద్దలు కొట్టినట్లు కోపంగా అన్నాడు ఆయన.
శాస్త్రి కొంచెం బాధపడి, బాధ మరుగు పరుచుకుంటూ తమాషాగా నవ్వాడు.
శివరాంకు అవమానోదేకం హృదయంలో రగిలింది. వ్యక్తికి విలువపోయి. వయస్సుకు గౌరవం పెరిగింది అనిపించింది వయస్సు మళ్ళిన తెలివితక్కువను ప్రశంసించి, యువక వ్యక్తుల తెలివిని విస్మరించే వ్యక్తులుకూడా ఆధునిక యుగంలో కనిపించడం శోచనీయమనిపించింది. అయినా ఏ యుగంలోనయినా వయస్సు మళ్ళిన పెద్దలు వయస్సులో తక్కువైన కు(ర్రవాళ్ళ సలహాలు ఎంత ఉత్కృష్టమైనా గమనించరనేది మానవుని సహజ గుణంగానె తోచింది శివరాంకు.
ఇదే అనుభవం శాస్తి ఎక్కడికి తీసుకెళ్ళినా జరిగేది. వివాహం కాకపోవడం, వయసులో బాగా పెరిగి 'పెద్దమనిషిలా కనిపించక పోవడం కుటుంబ పెద్దగా తన్ను అనర్హుణ్నిచేశాయి అని విచారించాడు శివరాం తన ప్రయత్నాలు తాతయ్యకు ఏ విధంగానూ సహకారం యివ్వలేక పోతున్నందున దుఃఖించాడు. స్వార్ధపరుడైన అన్నగారు ఏ విధంగాను తాతయ్యకు సహాయం చెయ్యడని తెలిసిన శివరాం తానుకూడా, స్వార్ధంలేకపోయినా, నిరుపయోగినై పోయాననికుమిలి బాధపడ్డాడు సమితి కార్యాలయానికి రావటంలేదని ఈశ్వరయ్య నేరం మోపాడు శివరాంపైన. సమితిమీద ఎక్కువ (శ్రద్దచూపని కార్యదర్శి. రాజీనామా యిచ్చి తప్పుకుంటే మంచిదన్నాడు ప్రభాకరం పూర్వం తాను సమర్ధించిన మనిషినే యిప్పుడు త్యజిస్తున్న ఈశ్వరయ్య, (ప్రభాకరం పద్ధతిచూసి సంతోషంగా నారయ్య, వెంకట్రావు కార్యదర్శి ప్రవర్తనపై తమ నిరసనకూడ తెలియజేసేరు.
చెల్లెలి ఫెళ్ళి విషయాలలో నిమగ్బుదై, కొద్దిరోజులు నాటక సమితి కార్యక్రమాలు వాయిదా వేసినందున, ఇంతవరకు తాను సమితికి చేసిన కృషి, సేవ విస్మరించిన
188 అన్వేషణ విశ్వాసహీనులు తనను చుట్లుకున్నారని చికాకు పడ్డాడు శివరాం అయినా లౌక్యంగా కోపం తగ్గించుకుని త్వరలోనే మళ్ళీ కొత్తరీతుల్లో కార్యక్రమాలు సాగిస్తాననీ, ప్రస్తుతం తన చెల్లెలి వివాహం స్టిరపడటంతో, చాలా పనులు చేసుకునే భారం మీద పడిందని నటకులకు సముదాయించాడు. బ్రహ్మయ్యగారు ఉత్తరం వ్రాశారు చెల్లెలికి సంబంధం స్టిరపడిందని లగ్ననిర్ణయం పదిహేను రోజులలోనే నిశ్చయింపబడిందని, తక్షణం బయలుదేరి రావలసిందని, శివరాం పదిహేను రోజులు సెలవు పెట్ట రాజమండ్రి వెళ్ళివోయాడు.
మనుమడు అండగా పెళ్ళి ముహూర్తానికి పదిహేను రోజులు ముందు రావడం బ్రహ్మయ్యగారికి ఎంతో ఆనందం కలిగించింది, వెంకటేశ్వర్లు ఆఫీసుపని బాగా పెరిగిపోవటంవల్ల, ఆఫీసరు దుర్మార్డుడుగా సంచరిస్తూండడంవల్ల ఉద్యోగక్షేమం దృష్టిలో పెట్టుకుని తక్షణం రాలేకపోతున్నందుకు చింతిస్తున్నారని, సరిగ్గా పెళ్ళి ముహూర్తానికి కయినా తప్పక వస్తానని జాబు వ్రాసాడు. అన్నగారి పద్ధతితో క్రొత్తదనం ప్రత్యేకముగా ఏమీ లేదని భావించాడు శివరాం.
పెళ్ళి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి తన బంధువుల కందరికీ వివాహ శుభలేఖలు పంపించేరు, బ్రహ్మయ్యగారు పొలాలమీద శిస్తు సేకరణ, ధాన్యం దంపించడం, పసుపు కొట్టించడం, ఊరగాయలు పెట్టించడం, స్వయంగా శివరాం పర్యవేక్షణలో చేయించసాగాడు. పెళ్ళి పనులలో సహాయం చేయడానికి మధ్య వయస్సు వితంతు బంధువులు పది రోజులు ముందుగానే బ్రహ్మయ్యగారింట్లో పదిలంగా బస చేశారు. బ్రహ్మయ్యగారితో ఒక సాయంత్రం బజారువెళ్ళి పెళ్ళికి కావలసిన బట్టులు, ఆభరణాలు సరుకులు పట్టించుకు వచ్చాడు శివరాం.
లక్ష్మి పెళ్ళికళతో అలరారుతోంది. సిగ్గుతో, వినయంతో స్యమ్రతగా, ఎక్కువ కదలకుండా ఇంట్లో మసలుతోంది. పెండ్లికొడుకు దీక్షితులు ఎక్కువ చదువుకున్నవాడు కాకపోయినా, ఇంటరు పరీక్ష చదివి మానేశాడు. చిన్నతనంనుంచీ తండ్రికి సేద్యములో సమాయం చేస్తూందడడంవల్ల వ్యవసాయ అనుభవం బాగా గడించేడు. ఎంత చదివినా పొట్టకూటికి ఏదో ఉద్యోగం చేయకతప్పదు. గనుక, చదువుకు అవసరమయిన ఖర్భులుమాని ఉన్న భూములు వ్యవసాయం చేసుకుంటే, లేని ఉద్యోగంకోసం ప్రత్యేకంగా తాపత్రయపడ నవసరం లేదని అతని అభిప్రాయం. అభివృద్ధికి రావలసిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇంకా వుండగా తనమీద కుటుంబం ఆదాయం ఖర్చు కాకూడదనే త్యాగ భాముతో తన చదువుకు స్వస్తి చెప్పాడు దీక్షితులు.
అన్వేషణ 189
దీక్షితులు గుణగణాలు ఉత్తమమయినవని విన్న బ్రహ్మయ్యగారు గృహస్ఫుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఉందని, లక్ష్మి సుఖపడుతుందని సంతోషించారు ఎక్కువ కట్నం ఇచ్చుకోలేక మధ్య తరగతి జీవనం గడిపే తనబోట్లకు అనవసరం అయిన పరుగులుదీయకుండా, యీ సామాన్య సంబంధంతో ముడిపడితే, కుటుంబాలకు సమాన ప్రతిపత్తులు కలిగి కలిసి మెలిసి బ్రతుకగలవనే ఆశ బ్రహ్మయ్యగారిలో కలిగింది. అందువల్ల సంబంధం నిశ్చయించారు లక్షకి.
స్ఫురద్రూపి, తనకన్న ఎక్కువ చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, అని అర్ధం చేసుకున్న లక్ష్మి, దీక్షితులను వివాహంచేసుకోడానికి బ్రహ్మయ్యగారి నిశ్చయంతో ఏకీభవించింది. వివాహ ఉత్సవం జరపాలని ఆత్రుత చూపుతున్న సుభద్రమ్మ వరుని కుటుంబం మంచితోనే సంతృప్తి పడింది.
పెళ్ళి పందిరి వేయించి, మామిడి తోరణాలు కట్టించి, కాగితాల బుట్టలు మధ్యన వ్రేలాడదీయించి, స్తంబాలకు అరటిచెట్లు కట్టించి, శోభాయమానంగా యేర్పాటు చేశాడు శివరాం వివాహ మంటప ప్రదేశం. ద్వితీయ పుత్రుదైన కుటుంబ పెద్దగా పనులు పురమాయిస్తూ కార్యభారం వహించిన శివరాంను చూసి సుభద్రమ్మ అభిమానంతో పులకరించి ఆనందా(శ్రువులు రాల్ఫింది. అచ్చు తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్న శివరాం, భర్త చనిపోయినా ఎదురుగా చిన్న ప్రతిబింబంగా కనిపించాడు సుభద్రమ్మకు.
వివాహానికి బంధువులంతా చేరారు, వానాకాలంలో కప్పలు చెరువుకు తరలి వచ్చినట్లు. పెట్టెలు, పరుపుచుట్టలు ఇల్లంతా నింపి, చిందరవందరగా వస్తువులు అక్కడక్కడ విడుసూ పిల్లల అల్లరి అరికట్టుకునే కేకలతో సందడిగా బ్రహ్మయ్యగారిల్లు బంధువులతో నిండిపోయింది. వివాహ లగ్నంనాటికి పెళ్ళిపందిరి రకరకాల ముత్తెదువులతో, రంగురంగుల చీరల అందాల్లోమెరిసే కన్నులతో కళకళ లాడింది. పురోహితుల మంత్రాలు ప్రతిధ్వనించాయి బ్యాండువాళ్ళ వాయిద్యాల స్వరకంపనంలతో హృదయ కుహరాలు దద్దరిల్లాయి. అజమాయిషీ చేసే పెద్దల సలహాల కేకలమధ్య దీక్షితులు లక్ష్మికి మూడుముళ్ళు వేశాడు, దంపతుల శరీరాలు పులకరించాయి. నిండు సిగ్గు చూపులతో పరస్పరం ప్రధమంగా భార్యాభర్తలుగా చూసుకున్నారు, వారిద్దరు. పదిహేనురోజుల (శమ ఫలించిందనుకున్నాడు శివరాం. చెల్లెలికి కన్యాదానం ఎవరో దూరపు బంధుదంపతులు చేశారు. శారద తన్ను వివాహమాడివుంటే చెల్లెలి కన్యాదానం తనే చేసివుందేవాణ్ని కదా అని ఒక్కసారి ఆలోచన కలిగి బాధగా బిక్కమొహం పెట్టాడు శివరాం. బాధ అణచుకుని బలవంతంగా ముఖభంగిమలలో ఆనందం తెచ్చుకున్నాడు.
1080 అన్వెషణ కాని శారద ఎక్కడుందో ఏం చేస్తోందో అన్వేషించడం అసాధ్యం అని నిరాశగా నిట్టూర్చాడు శివరాం.
లక్ష్మి వివాహం అయినాక బంధువులంతా పెండ్లిభోజనాలు సంతృప్తిగా ఆరగించి, ఆరగించిన భోజనం అరిగేలా మిగిలిన శివరాం వివాహం గురించి (ప్రస్తావనలు లేవదీశారు పొరుగింటి కన్యలు, బంధువుల 'పెండ్లికాని కూతుళ్ళు దూరదేశాల్లో శివరాం ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నాడని విని ఆశగా అతనివైపు యిష్టంగా నవ్వుతూ తలవంచుకుని నడిచేవారు. శారదమీదే హృదయం అగ్నమయి, ఆశలు భగ్నమయిన శివరాంకు వివాహమంటే ఈసడింపు కలిగేది.
బ్రహ్మయ్యగారు పదిమంది బంధుజనంతో శివరాంకు చెప్పారు, త్వరలో ఏదో కన్యను స్టిరపరచుకుని ఒక యింటివాడవు కావాలని బంధువులంతా ఏకగ్రీవంగా ఆయనమాట సమర్ధించారు. శివరాం ఒక నవ్వనప్వ ఊరుకున్నాడు. ఆ మౌనంతో కూడిన నవ్వులో ఉన్న దిగులు నిరాశ బ్రహ్మయ్యగారు సుభద్రమ్మ గుర్తించక పోలేదు
వెంకటేశ్వర్లు ఒక్కడే పెళ్ళి సమయానికి వచ్చి తన భార్యకు ఒంట్లో బాగుందడలేదని, పిల్లలకు జ్వరాలని యింటికి వెళ్ళకపోతే కుటుంబాన్ని చూసే దిక్కు ఎవరూ లేరని, మర్నాడే తాతగారివద్ద సెలవు తీసుకుని నిష్మమించేడు.
లక్ష్మిని అత్తవారింటికి మనుగడుపులకు సాగసంపారు బ్రహ్మయ్యగారు. వచ్చిన బంధుజనం క్రమంగా వెళ్ళిపోయారు ఒక్కొక్కరు. శివరాంకూడా తాతయ్యకు నమస్కరించాడు వెడతానంటూ బ్రహ్మయ్యగారు కళ్ళనీళ్ళు పర్యంతం తెచ్చుకుని ఒంటరి (బ్రతుకులో సుఖంలేదనీ. గృహస్ట్థధర్మం నిర్వర్షించవలసిన బాధ్యత గుర్తించుకుని తర్వలోనచ్చిన కన్యను స్టిరపరచుకోమని తిరిగి బోధచేశారు. శివరాం నిర్లక్ష్యంగా పేలవంగా నవ్వాడు.
పదిహేను దినాల తర్వాత సికింద్రాబాదు నగరంలో అడుగుపెట్టిన శివరాంకు బాహ్య వాతావరణంలో చాలా మార్పు కనిపించింది. శివరాం గంధర్వ నాటక సమితి పై నిర్లిషత వహించాడనీ, అతని చెల్లెలి వివాహం శుభలేఖ లందుకున్న సమితి నటకులంతా, ఆ వివాహలగ్న రోజునే కార్యవర్గ సమావేశంచేసి అతనిపై విశ్వాసరాహిత్య తీర్మానం చేశారు ఈశ్వరయ్య కార్యదర్శిగా ఎన్నుకోబడ్దాడు తన చిరకాల వాంఛితం యీడదేరిందని మనసులో సంతృప్తిపొందాడు ఈశ్వరయ్య కార్యదర్శి కావడంతో ఇంతవరకు శివరాం నగరంలో పొందిన పలుకుబడి తనకీ సంక్రమిస్తుందని ఆశించాడు ఈశ్వరయ్య.
అన్వేషణ 191
వ్యక్తిగత విలువలకు, సంస్థ పదవులు ఆక్రమించి విలువలు సంపాదించుకునే వ్యక్తులకు వున్న వ్యత్యాసం తన భావిప్రవర్తనలో గంధర్వ నాటకసమితికి చూపించాలని నిశ్యయించుకున్నారు శివరాం కాలం అంతా వినియోగించి కట్టుకున్న మంగళసూత్రంలా సంస్థల నంటి పెట్టుకుని బ్రతుకులేకాని పదవులు చిరకాలం నిలవవని తెలిసింది శివరాంకు. కొందరు వ్యక్తులు స్వీయపరపతి వృద్దిచేసుకుని సంస్టలకన్న ఉన్నతస్తాయిలో బ్రతకగలరనే విషయం జగద్విదితమైనా, గంధర్వ నాటకసమితి నటకుల దృష్టి అంతా విశాల దృక్పధం అలవరచుకునే స్థితిలో లేకపోయింది. అయినా సమితి సభ్యత్వానికి రాజీనామా యివ్వకుండా సభ్యుడిగా చేరి వ్యక్తిగత విలువలు ప్రదర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు శివరాం.
ఎదురుగా అంతా ఏమిటో శూన్యం గోచరించింది, శివరాంకు. మానవకృషికి ప్రపంచంలో అమరమైన చిహ్నాలు ఎప్పుడూ ఉన్నట్లు గోచరించలేదు అతనికి. మానవశక్తి నిర్విరామముగా పనిచేసినంతకాలం పరసరాలనుంచి ప్రశంసలు ఉద్భవిస్తాయి. మానవశక్తి క్షిణించగానే గతమంతా కాలప్రవాహంలో కొట్టుకుపోయి విస్మరింపబడుతుంది. నిత్యం జగతిలో స్మరింపబదేవ్యక్తి లెక్కకు ఒక్కడూ కనిపించలేదు, శివరాం దృష్టిలో. జీవితంలో పరిపూర్ణత లక్ష్య్రసాధనలోనే వుంది.
ఆకాశం శూన్యంలోకి వదలి గాలిపటాలు తోకలు ఆడించుకుంటూ పైకి క్రిందకు ఎగురుతున్నాయి పక్షులు రెక్కలు విచ్చుకొని ఆకాశంలో పైకి స్వేచ్చ కలిగినా నిమ్మోన్నతాల గతులు మార్చలేకుండా ఎగురుతున్నాయి ఇంటి యజమానులు కుక్కల అరుపులు ప్రతిధ్వనించి, ఆరంభశూరత్వ చర్యల్లా సమసిపోతున్నాయి. ఆనంతమైన జగతిలో సర్వవ్యాప్తమైన పగటి వెలుగులో హృదయాకర్షణీయమైన ప్రత్యేక కాంతి ఏమీ కనిపించలేదు శివరాంకు.
టక ళో ఇ
192 అన్వేషణ రి
నాంపల్లిలోని హోటల్లో తనగదిలో కటికి దగ్గర నిలుచుని వీధిలోకి చూడసాగాడు పరమహంస, షరాయి, లాల్సీ. వదులుగా వేలాడుతూ కిటికీమీదనుంచి వచ్చే గాలుల్లో కాపు చెదురుతూ పరమహంస వ్రేలాడే దవదడలముఖం ఆలోచనల మొలికలలో నిండిపోయింది. గదిలో మేజాబల్ల మీద చదరంగంబల్ల గదులలో కదిలి చెదిరిన పాచికలు పరిచిఉన్నాయి.
ఎదురుగా రైల్వేస్టేషను భవనము గోపురంమధ్య అతికిన గడియారంలో ముల్లులు కదులు తున్నాయి. సెకెండులముల్లు పెద్ద ముల్తును, పెద్దముల్లు చిన్నముల్నును కదిలిస్తున్నాయి. వృత్తాకార (ప్రపంచ కార్యక్రమంలో చైతన్యం కలగాలంటే పరస్పరధారత్వం అర్ధం చేసుకుని (బ్రతకాలి! ఒక మనిషికి కదిలిస్తే అతని చుట్టూవున్న సంఘం కదలి, ప్రయోజక సిద్ధికి ఉపకరిస్తుంది. రాణి తనూ కలసి మాత్రమే విచిత్రరీతుల్లో ఏదో నాటక ప్రదర్శనాలిచ్చి, వ్యక్తిగత విలువలు అధారంగా గత రెండు నెలలు నుంచి నగరంలో కాలక్షేపం చేస్తున్నాడు నాటకాలలో పాల్గొని ధనాపేక్ష కలిగయినా సహాయం చేసే నటీమణుల కొరత రాణి దొరకడముతో చాలా తగ్గిపోయింది మరి యిద్దరు మంచి నటుల సేకరించి ప్రదర్శనలు విస్తృతముచేసి ధన సేకరణ చేయాలనే ఊహ కలిగింది పరమహంసకు.
చాలా కాలం తరువాత నగరానికి వచ్చిన తనకు పురజనుల ఆదరణ బహుళంగానే లభించింది. పాత సంసారం జీవితంలోని ప్రతినిత్యం క్రొత్తరీతుల (బ్రతుకు కావాలని వాంఛించే పరమహంసకు నగర రాజధానిలో క్రొత్త సంఘాలలో పాతకళ మళ్లీ ప్రదర్శిస్తే కొంత ఆకర్షణ కలగక మానదని విర్వసించాడు. అది నిజమయింది. ధనం కొంత
అన్వేషణ 193 లభించింది పుష్కలంగా, బందరులో వున్న కుటుంబానికి, రాణికి, తనకు వచ్చిన ఆదాయం ఖర్చులకు సరిపోతోంది. కారణమేదయినా రాణి తనకు మంచి సహాయకారిగా ఉంది. నాటక ప్రదర్శనలో అందాలరాణిని చూడటానికి కూడా (ప్రజలువస్తున్నారని వినికిడి ధన సేకరణకు ప్రతిభతోపాటు ప్రత్యేక ఆకర్షణ ఉంటే ఎక్కువ రాణిస్తుంది. ప్రదర్శనరీతులు పెంచాలంటే వాతావరణం విస్తృత చేయాలనుకున్నాడు పరమహంస
కనుబొమలు బాణాకారాల్లా ఫాలబాగంలోకి నిగిడ్బి రాజి ఫోటో పరమహంసను పరిక్షీస్తోంది. పరమహంస చిదానందంగా నవ్వుకున్నాడు.
పరమహంస ఇంతవరకు నగరంలో చూసిన నటకులంతా దృష్టిలో మెలిగారు. సాత్వికుడు, ప్రతిభావంతుడు తనతో కలసి మెలసి పనిచెయ్యగలిగిన నటకుడు, శివరాం అని తట్టింది పరమహంసకు తక్షణం అతన్ని కలుసుకోవాలని బస్సు ఎక్కాడు.
శివరాం ఆఫీసునుంచి వచ్చి ఇంటిదగ్గర పెన్సిలుతో చిత్రాలు గీస్తున్నాడు తీరుబడిగా ఒకనాటి పరిచయమే చిరకాల స్నేహంగా మార్చి ఆవ్యాయంగా ఆత్రంగా గదిలో అడుగు పెట్టి సంతోషంగా కరచాలనం చేశాడు పరమహంస,
ఇష్టాగోష్టి ప్రధమంలో పూర్తయింది.
పరమహంస చెప్పాడు తన నాటకాలు విస్తృతం చెయ్యదలచుకున్నానని. అతని సహకారం కావాలని... నగర కార్యక్రమాలలో ఎవిధంగా వాల్గొన వలెనా అని యోచనచేస్తున్న శివరాంకు మంచి అవకాశం లభించినట్లయింది. శివరాం తన అంగీకారం తెలియజేశాడు. తన నాటకం రిహార్సల్సు హొటలులో తన గదిలోనే జరుగుతాయని. మర్నాడు సాయంత్రం అక్కడికి రావలసిందని కోరాడు పరమహంస. శివరాం అభ్యంతరం లేదన్నాడు.
పరమహంస, శివరాం సహకారం కోరడంలో కొంత స్వార్ధం లేకపోలేదు. అతని కొక వొత్ర యిచ్చి అతను ఎరుగున్న స్థలాలలో నాటక ప్రదర్శనాలిస్తే ఎక్కువ ధనం సంపాదించవచ్చేనే ఆశ పరమహంసకు కలిగింది. ఆ ఆశ పర్యవసానమే శివరాంను ఒక వాత్రధారుడుగా చెయ్యవలసివచ్చింది.
మర్నాడు అనుకున్న కాలానికి శివరాం పరమహంస హౌొటలు వెతుక్కుంటూ వెళ్ళాడు. పరమహంస అక్కడే మంచంమీద ఒరిగి జుట్టురగిన తీవ్ర ఆలోచనల ముఖంతో ఒక లుంగీ, బనీను తొడుక్సుని ఇంగ్లీషు మేగజైను పేజీలు త్రిప్పుతున్నాడు. గది అంతా
1594 అన్వేషణ చిందర వందరగా వుంది. మాసిపోయిన బట్టలు చెల్లాచెదురుగా మంచం క్రింద పడి వున్నాయి దోమతెర పూర్తిగా ఉపరిభాగం మీద ముడుచుకుపోయింది. కాల్చి విసరిన సిగరెట్టు పీకలు మసి, గది అంతా చెల్లాచెదురుగా పడి ఎగురుతున్నాయి. పాత మేగజైన్లు, పత్రికలు మేజాబల్లక్రింద, మీద దొంతరలుగా పడివున్నాయి కోటాసామానుల పెట్టె ఒకటి రంగుల ముఖంతో కిటికీలో హాస్యగాడిలా నవ్వుతోంది. మంచం మీద మాసిపోయిన దుప్పటి ముడతలుపడి చికాకుగా ఉంది
శివరాం రాగానే మర్యాదగా ఆహ్వానించాడు పరమహంస తక్షణం ఒక వేడి కాఫీ, సిగరెట్టు తెప్పించాడు తన ట్రంకుపెట్టె లోంచి పురాతన కాగితాల గ్రంధం, ఒక కను బొమ్మల ఆల్బం బయటికి తీశాడు. గ్రంధంలో పూర్వకాలంలో తన (ప్రతిభ గురించి వివిధ ప్రముఖులు (వ్రాసిన వ్యాసాలు, వివిధ పత్రికాధిపతులు చేసిన పొగడ్తలు, చిరిగి చెదిరి గుచ్చబడి ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో తాను చూపిన నటనా కౌశలం ప్రతిబింబించే పాత్రల స్వరూపాలు, సహాయం చేసిన నటీనటవర్గం, తాను నిర్మించిన వివిధరకాల రంగస్థలాలు. స్నేహం చేసుకున్న ప్రముఖ సినీనటులు, మొదలయిన ఫోటోలు ఆల్బంలో కనిపించాయి ఆ వురాతన జీవితచిహ్నాల ప్రాతిపదికగా వయసుడిగిన ముసలితనం వర్తమానంలో పరమహంస జీవితానికి ఆధారాలు ఏర్పరచుకుని వక్రీకరించిన తన మెదడుకు తగినవని కల్పిస్తూంటాడు. శివరాం ముందుకూడా పరమహంస తన సహజ ఉపన్వాసం ఒకటి యిచ్చేశాడు.
కాలం మార్పుతో ప్రజాభిరుచిని అనుసరించి, కళారీతులకు విలువలు కూడా మారుతూంటాయి. పరమహంస పాతచరిత్ర విలువలు ప్రస్తుతంలో ప్రజాధరణ పొందవనే దృఢనమ్మకం శివరాంకు కల్లినా అతని కార్యక్రమాలతో మంచితనం పేరుమీద తగిన సహకారం ఇవ్వడంలో అనర్ధకాలున్నట్లు కనిపించలేదు. పరమహంస ఉపన్యాసం విని లోపల ఆనందించినా పైకి మాత్రం మౌనంగా ఆసక్తి కనపరచేడు శివరాం.
“భరణం అనే నాటకంలో దోంగపాత్ర ధరించవలసినదని ఆ పాత్ర సంభాషణల కాగితం శివరాంకు అందించేడు పరమహంస ఈ నాటికలో మూడే పాత్రలుంటాయని, తక్కిన రెండు పాత్రలూ రాణి, తను నిర్వహిస్తామన తెలియజేశాడు పరమహంస. రిహార్సల్సు జరపడానికి రాణిరాకకై నిరీక్షిస్తూన్నట్లు పరమహంస ్రవర్తన ప్రతిబింబిస్తోంది.
పరమహంస సంభాషణ పొడిగించేడు రాజీ వచ్చేలోపుగా కాలక్షేపం చెయ్యాలని తన స్వంతవూరులో కుటుంబాన్ని అట్టేపెట్టి తిరుగుతున్నా, భార్యాపిలలమీద తనకున్న
అన్వేషణ 195 మక్కువ, చాలా కాలానికి యింటికి వచ్చినా అమాయకమైన మందస్మితంలో అనురాగంతో ఆహ్వానించే తనభార్య తన జీవితంలో కలిసిన విచిత్రవ్యక్తులు, తాను ప్రతినిత్యం జీవితంలో కనపరచిన నిజాయితీ ఏకరువుపెట్టేడు పరమహంస ఒక రోజుహోటల్లో స్నానాలగదిలో తనకు వెయ్యి రూపాయిల కవరు దొరికిందని, ఆ కవరు బహుశా తనకు ముందు స్నానం చేసిన మరొక ఆసామిదై యుంటుందని నిశ్చయించి, అతని కోసం వెతకి, తిన్నగా రైలు స్టషనుదాకా వెళ్ళి అతను నోట్లకవరు కనిపించక కంగారుగా వెనక్కు వస్తూంటే పట్టుకుని, ధనం యిస్తే ఎంతోషమైనా వ్యక్తపరచకుండా అభివందనలైనా చెప్పకుండా, కృతజ్ఞతయైనా వెల్లడించకుండా, ఆ ఆసామి మూతి ముడుచుకుని రౌద్రంగా ఎల్లా వెళ్ళిపోయినదీ నటించి చూపాడు పరమహంస. తన నాటకాల్లో సహాయం చేసిన నటీమణుల యవ్వనోద్రేకాలలో చప్పుదారులు త్రొక్కివాడై పోతుంటే సలహాలు, మంచి చెడులు చెప్పి, వారిని సన్నార్దులుగా చేసిన వైనము వివరించాడు పరమహంస తనతో కలిసిమెలిసి తిరిగిన స్నేహితులతో స్రీ పురుషులు ఒండొరులు (ప్రేమించుకుంటే, తాను వారికి కల్పించిన అవకాశాలు, తద్వారా పవిత్రదంపతులుగా వారిని చివరకు మార్చి జరిపించిన వివాహ తతంగాలు సవిస్తరంగా సెలవిచ్చాడు పరమహంస. తన జీవితమంతా వేదాంతపూరితమై, నిష్కామంగా, నిర్విరామంగా గడిచిందని వక్కాణించి ఒక చిరునవ్వు ప్రశాంతంగా నవ్వి హరాత్తుగా అయిదు నిమిషాలు మౌనం వహించాడు పరమహంస.
ఆ సమయంలో గదిలోకి రాణి ప్రవేశించింది. నీలం సిల్కు చిర, ఎర్ర జాకెట్టు, ఎత్తుమడమలు, పెదాలకు రంగు, ముఖానికి పొడరు, వంగిన కనుబొమ్మలమధ్య ఎర్రని తిలకం, వయ్యారపు నడకచేతిలో వేనిటీబేగ్, కాంతివంతమైన కళ్ళతో నిశితంగా చూస్తూ నెమ్మదిగా గదిలో అడుగు పెట్టింది రాణి. ప్రవేశించి పరమహంసకు నమస్కరించింది శిష్యురాలిలా. ప్రక్కనే కూర్చున్న శివరాంను పూర్తిగా చూడడం మానేసింది పురుషులతో మాట్లాడడం తనకు చాలా కొత్త అయినట్లు.
పరమహంస శివరాంను పరిచయం చేశాడు రాణికి. రాణి మందస్మితంగా కంగారుగా గబుక్కున నమస్కరించి ఊరుకుంది. శివరాం మనస్సులో ఏదో భూకంపం విజృంభించి, అతన్ని ఒక్క క్షణం కుదిపివేసింది. రాజారావు చక్రవర్తులతో ఒకరోజు చార్మినార్ వెనకాల ఇండ్లకు వెళ్ళినపుడు యీమెను చూచినట్లు బాగా గుర్తు. ఆకారంలోని మార్పు తప్పిస్తే తక్కిన అవయవభంగిమ లన్నీ తన ఆప్తురాలయిన శారద ఆకృతికి సన్నిహితంగా అగుపిస్తున్నాయి. తనవైపు నిర్లక్ష్యంగా చూసి ఊరుకున్న రాణి తనకు ఎ
196 అన్వేషణ విధంగానూ సన్నిపొతురాలు కాకపోయినట్లు నిర్దారణ అయినా, హృదయంలో పాతుకుపోయిన సహజభావాలతో కూడిన ఆప్వాయత రాణిపై ఉద్భవించింది శివరాంకు.
“'విమండీ నేను ఉద్యోగంలో చేరాను నిన్నటినుంచి!' నవ్వుతూ కనుబొమలు ఎగరవేసింది
పరమహంస ఆశ్చర్యంగా ముఖం చిట్సించాడు.
'రామనరసుగారే మళ్ళీ పిలిచి ఉద్యోగం యిచ్చారు!
“జాగ్రత్త! మళ్ళీ మూర్తిని కొట్టగలవు! పరమహంస చలాకీగా నవ్వాడు.
'మూర్తి మా ఆఫీసు వదిలివేశాడు. మద్రాసులో ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగం యిప్పించారు, రామనరసుగారు[
ఆ సంభాషణలోని అంతరార్ధం రాణి ఎవరినో కొట్టినట్లు స్పురించింది శివరాంకు. ఎందుకు కొట్టిందో, సంగతి ఏమిటో అగమ్యంగా వుంది శివరాంకు ఉద్యోగంచేస్తున్న రాణి, చార్మినార్ వెనకాల కనిపించిన స్రీ బహుశా వేరు అని నిశ్చయించుకున్నాడు శివారం. ఒక మనిషిని పోలిన మనుష్యులు ఉండడంలో విపరీతంలేదని సర్దుకున్నాడు శివరాం.
నాటకం తీశారు చదవడానికి. పరమహంస నాటకం అంతా వివిధ పాత్రల అభినయం చేసి రాణికి, శివరాంకు విశదపరిచాడు స్త్రీగా తాను ధరించవలసిన పాత్రకూడ పరమహంస తనముసలి వాలకంలో నటిస్తూ చూపిస్తూంటే రాణి నవ్వు ఆపుకోలేక పోయినది. అమాయకంగా కిలకిల నవ్వింది. శివరాం కూడా ఆ నవ్వుల్లో శ్రుతి కలిపేడు.
పాత్రల అభినయంలో లినమయి, సహజమయిన మౌనముద్రలు సడలగానే రాణి, శివరాం కూడా సరదాగా మాట్లాడుకోసాగారు.
వేనిటీ బాగ్‌లోంచి వేయించిన శెనగపప్పు తీసింది రాణి. శివరాంకు, పరమహంసకు కొద్దిగా చేతిలో పోసింది.
“దంటిపిల్లలా శెనగపప్పు తినడం ఏమిటి?” నవ్వాడు పరమహంస.
“ఏమండీ! నాకు చంటిపిల్లలా వేషం వెయ్యాలనుందండీ!” కనుబొమలు ఎగరేస్తూ అడిగింది రాణి.
అన్వెషణ 19
'ఆం |! రంగస్టలంమీద కాళ్ళు చేతులతో పిల్లిలా ప్రాకుతే సరి ! అప్పుడప్పుడు గొర్లుతూ ఏద్గాలి!” శివరాం చంటిపిల్ల వేషానికి సూచనలు చేశాడు.
“అప్పుడు నీకు తల్లిగా నేను ఆడవేషం వెయ్యాలి!' నవ్వాడు పరమహంస.
ఏులేగా ఉంటుది కదూ!” కిలకిల నవ్వింది రాణీ. రాణి నాటకంలో తన భార్యగా నటిస్తుందనీ, భార్యాభర్తలు రాత్రి నిద్రపోయిన సమయంలో దొంగలా వచ్చి నటించి భయ పెట్టాలని శివరాంకు విశదీకరించాడు పరమహంస భయపెట్టె భంగిమలు ముఖంలో ప్రదర్శించాడు
“ఏమిటండీ, మీ నటన అంతా ఉత్తిడొక్కులా ఉంది!... నాకసలు భయం వేయటమేలేదు[ నవ్వుతూ అంది రాణ్.
'నువ్వు భయపడినట్లు నటించు' పరమహంస దర్శకుడి ధోరణితో కూకలేశాడు.
'నాకు ఎవరన్నా భయంలేదండీ... ఎలా భయపడదేది' మళ్ళీ నవ్వింది రాణి.
“ఈ పద్ధతిలో మనం నాటకం వెయ్యలేం రాణి పరమహంస మూతి ముడిచాడు.
“ఆం అదికాదండి! మీ ముందు ఎలా భయపడగలను. రంగస్టలం మీద బాగా భయపడిపోతాను!... ఊం మీరు భయషెట్టండి శివరాంగారు! సన్నగా నవ్వింది రాణీ పెదాలు బిగబెట్టుకుంటూ.
శివరాం దొంగవేషంలో వచ్చి చెయ్యవలసిన వివిధ అట్టహవాసనటనలు చేసి చేతులు విసిరాడు ఒక ఫోజులో. బల్లమీద రాణి పెట్టుకున్న వేనిటీబేగ్ శివరాం చేతికి తగిలి క్రింద పడిపోయింది రబ్బరుబేగ్ నేలమీద కత్రుళ్ళిపడింది.
'అయ్యయ్యో! నన్ను కాకపోయినా మా అబ్బాయిని భయపెట్టేశారండి! అంటూ ఓరగా కోపంగా శివరాం వైపు చూసింది రాణి,
దుమ్ము దులువుకుని, బేగ్ తీసి పైకి పట్టుకుంది రాణి.
జట్స్ అబ్బాయి ఎవరండి?” శివరాం (ప్రశ్నించాడు అందులోని హోస్యం తెలుసుకోవాలని.
“మ్రాడలేదు మీరు...?” అంటూ బేగ్ లోంచి చిటికన వ్రేలంత చిన్న రబ్బరుబొమ్మతీసి శివరాం చేతిలో పెట్టింది.
138 అన్వేషణ
శివరాం ఆ రబ్బరుబొమ్మను చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. అతన్ని నవ్వించాలన్న సంతృప్తితో మందస్కితం చేసింది రాణి కులుకుతూ
'మీరంతా గట్టీగా నవ్వుతే మా అబ్బాయికి అవమానంకడండీ...” అంటూ రాణి రబ్బరుబొమ్మను వేనిటీబాగ్లో పెట్టేసింది.
రాణి ఛలోక్తులకు శివరాం ముగృదైపోయాడు
“ణి మాటల్లో ఏదో గారడీ ఉందండి!” పరమహంస మత్తుగా మందస్మితం చేశాడు శివరాం వైపు.
రాత్రి ఎనిమదిగంట లయింది
పరమహంస బలవంతపై రాణి, శివరాం హోటల్లోనే భోంచేశాడు. తాంబూలాలు వారికి అందించి బస్సున్హాందుదాకా నాగనంవాడు పరమహంస,
“మీ రెక్కడికి వెళ్ళాలి!” రాణి ప్రశ్నించింది అతని బస వివరాలు తెలుసుకోవాలని.
“క్పెడిం[ద్రాబాదు.”
“అంతదూరం వెళ్ళాలా ఇప్పుడు!...” ఆశ్చర్యంగా ముఖం చిట్లించి అరచెయ్యి వక్షంమీద వేసుకుని, కళ్ళు పెద్దవిచేసింది రాణి.
అట్హ్సీ ద్ర్ర[౫7
కట్టోర్ద్ట్ &ై|3
“చాలా దగ్గరే ఉందన్న మాట మీ యిల్లు!”
“ఒకసారి మా ఇంటికి రాకూడదండీ!” చిలిపిగా సాగదీసుకుంటూ రాణి అడిగింది.
ఆ*క్షసారి ఎప్పుడైనా వస్తా” నవ్వాడు శివరాం.
“వోనీ, మీరు నన్ను మా ఇంటిదగ్గర దిగబెట్టి వెళ్ళిపోకూడదూ.... మీకు మగమి ఇబ్బంది...” నసిగింది రాణి, -
నగరంలో నాగరిక స్రీలు రాత్రికూడా పురుష సహాయం లేకుండా నిర్భయంగా కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్ళి పోతూండటం మామూలైనా, అడిగిన స్త్రీకి సహాయం: చెయ్యడం మర్యాద అని శివరాం ఒప్పుకున్నాడు ఆమెను ఇంటిదగ్గర దిగబెట్టడానికి.
అన్వేషణ 190 దగ్గరే కనుక, బస్సుమాని నడిచి పోవచ్చునంది రాణి '
తాము కైస్తవులమనీ, కోరీ ప్రక్కనే సందులో ఉంటున్నామనీ, వీలైనప్పుడు తప్పకుండా తమ ఇంటికి వస్తూందమనీ చనువుగా మాట్లాడింది రాణి నగరం వచ్చెక అంత చనువు చూపించిన నాగరిక నాజూకు యవ్వన స్తీ, బాహ్యవాతావరణంలో తటస్థించడం అదే ప్రధమం శివరాంకు. తప్పకుండా ఆమె ఆహ్వానం అంగీకరించాడు లోలోపల.
ఇల్లు చేరగానే రాణి నమస్కరించింది.
“మా అమ్మ నాకోసం ఎదురు చూస్తూంటుందండి!” అంటూ భయంగా గబగబా అదుగులు వేసుకుంటూ మెట్లు ఎక్కి ఇంట్లోకి జొరబడిపోయింది రాణి.
తలుపుల వెనకాల అదృశ్యమయిన రాణివైపు చూస్తూ శివరాం ఒక్క క్షణం ఆగి వెనక్కి మళ్ళివోయాడు.
“భరణం” నాటక ప్రదర్శన ఒక స్కూలుహాస్టల్ హాలులో ఏర్పాటయింది. రాణి నటనగురించే, అందం గురించి, పటుత్వమైన శైలిలో పొగడుతూ, పరమహంసగుదించి ఒక చిన్న జీవిత సంగ్రహం ప్రకటిస్తూ, ఫోటోలతో విద్యార్ధి సమూహాం మధ్య వెదజల్లబడిన కరపత్రాలు బాగా ప్రచారం తీసుకువచ్చాయి. నాటక ప్రదర్శన ద్వారా వినోదం అనుభవించడమె కాకుండా ఒక అందమైన అమ్మాయిని చూడగలమనే భ్రాంతిలో విద్యార్ధులు తండోవతండాలుగా వచ్చారు ఆ 'హాస్టల్‌ను నడిపించే పెద్దలు, దానికి అంటి పెట్టుకుని స్కూలులోని ఉపాధ్యాయులు, ఆ స్కూలును నడిపించే పురప్రముఖులు, వారి స్నేహితులు పరమహంస యివ్వబోతే క్రొత్తనాటకాన్ని చూడాలని ఉబలాటపడుతూ వచ్చారు,
నాటకం తెర వెనకాల గ్రీన్ రూమ్‌లో పరమహంస తన నటనకు అనువైన రూపం దిద్దుకుంటున్నాడు గ్రీన్‌రూమ్‌లోకి ఉన్న పరిచయం పురస్కరించుకొని, సహాయం నెపంతో శ్రీనివాసు, జగదీశ్వర్, భూమారావు, హుస్సేన్ ఆలీ చొరబడి అనవసర సలహాలు యిస్తూ రంగస్థల భాగాన్ని పర్యవేక్షిస్తూ యింకా రాణి రాలేదేమని మనస్సులో అనుకుంటూ, పరమహంస కోటాముఖం భంగిమలు పొగడుతూ, ఇటూ, అటూ తిరగజొచ్చారు. “ఆచాది శివరాంకు కోటాస్టలం వెనక గ్రీన్ రూమ్‌లోకి మరో మార్గంలేక హాలుమధ్యనుంచి తలవంచుకుని గబగబ నడిచింది రాణి. ఆమెను ఎదురు ఆపకుండా, రక్షణ యిస్తూ ఆ హాస్టలును నడిపే నిర్వాహకులలో ఒక యువకుడు, తిన్నగా రంగస్థలం వెనకాలకు
200 అన్వేషణ తీసుకెళ్ళి విడిచి, బయటకువచ్చి, చిదానందంగా చొక్కాకాలరు ఎత్తుకుని, ఒక క్షణం హాలుతోని జనాన్ని చూసి ముందుకు పోయాడు హాలులోని జనంలో రాణినిగురించి చూడబోయే నటీమణి అంటూ గుసగుసలు వ్వ్యాఫంచాయి.
రాణి గ్రీన్‌రూమ్‌లోకి రాగానే పరిచయస్తులైన నటకులందరూ ఎదురుగా ఒక్కసారి కనిపించగానే దిగ్రమచెంది అందరినీ సంతృప్తి పరచాలనే దృష్టితో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నమస్కరించింది .. సమస్మారాలందుకుని నటకులంతా మురిసిపోయేరు. ఆచారి తన తీవ్రధోరణిలో నమస్మారానికి చలించక శివరాం ముఖం కోటాతో గట్టిగా బాదుతున్నాడు నటకు లందరిలోనూ సమానస్థాయిలో నవ్వుతూ మాట్టాడిన రాణీ బహుశా అందరి విషయంలోనూ యిదే ప్రవర్తన చూపుతుందని, తనమీద ప్రత్యేక చనువు ఏమీ మునుపు చూపలేదనే అసంతృప్తి కలిగి మౌనంగా ఊరుకున్నాడు శివరాం రాణి తనంతటతానే ముఖానికి రంగు వేసుకోసాగింది. మధ్య మధ్య నటకులను పిలిచి ముఖం యొక్కరంగు అద్దకం సరిగా ఉందా లేదా అని ప్రశ్చించేది. జగదీశ్వర్ ధైర్యంగా వేళ్ళు ఆమె బుగ్గపైవెసి, కోటా సరిచేశాడు. శ్రీనివాసు రాణి పెదాలకు సన్నగా ఎ(ర్రరంగు పూశాడు. కనుబొమ్మలు దిద్దాడు హుస్సేన్ ఆలీ సరిగా బాణాకృతిలా ఉన్నాయంటూ ఒక చిన్న గేయ చదివి, భూమారావు రాణి హస్తాలకు కొద్దిగా రంగు పూశాడు.
శివరాం తన వేషం పూర్తిచేసుకుని సంభాషణలు వల్లించుకుంటూ తన ధోరణిలో ఉన్నాడు, అతని ముభావం జాగ్రత్తగా గుర్తించింది రాజ్
తన చిన్న ట్రంకులోంచి చమ్మీపూల ఎర్రగులాబీ రంగు చీర బయటికి తీసింది రాణి. అది తనకు బా ఫందా అని అడగదానికి శివరాం వైపు వెళ్ళబోయింది. భూమారావు ఆమకు ఎదురువచ్చి “యీ చీరలో నువ్వు అప్పరసలా వుంటావు. రాజీ!” అంటూ బుగ్గలు బూరించి కులుకుతూ నవ్వాడు. అతని ప్రవర్తనకు కలిగిన చికాకు లోలోపలే అణుచుకొని మౌనంగా ఊరుకుంది రాణి, ఒక కుర్రవాడు మల్లెపూలు తీసుకువచ్చి యిచ్చాడు రాణీకి
“అద్దం ఒకసారి యివ్వండి!” ముద్దుగా అడిగింది రాణి పరమహంసను.
“కాస్సేపు ఉండవే! హాస్యం చేశాడు పరమహంస.
“అప్పుడే భార్యా భర్తల్లా ప్రవర్తిస్తున్నారే!' భూమారావు నవ్వాడు.
“కోటా వేసుకోగానే పాత్రల రూపాలు వచ్చేస్తాయి. అప్పటి నుంచి... నవ్వాడు పరమహంస రాణివైపు చూస్తూ.
అన్వేషణ 2౮1 రాణీ కోపం నటించింది గబగబా శివరాం దగ్గరకు నడిచి వెళ్ళింది.
“ఏమండీ! యీ పూలు నా తల్లో పెట్టండి... ఆయన అద్దం యివ్వటంలేదు!” శివరాంవైపు చూసి మెల్లగా నవ్వింది రాణి ఆమె నవ్వులోని కాంతి, చూపులోని కాంతి శివరాం కళ్ళకు మిరుమిట్లు గొలిపాయి రాణీ ప్రవర్తనలో తనవైపు ప్రత్యేకత చూపిస్తున్నట్లు స్ఫురించింది శివరాంకు. ఆనందంగా నవ్వుతూ మౌనంగా పూలగుత్తి రాణీ కొప్పుకు చుట్టాడు శివరాం.
“ఏమండీ ! నా వేషం బాగుందా? వయ్యారంగా గుండ్రంగా క్రీగంట్తో చూసి కులికింది రాణి.
శివరాం వైపు రాణిమొగ్గు చూపిస్తున్నందుకు నటకులంతా కొంత కోపగించుకున్నారు. అయినా చేసేది ఏమీలేక అసూయ లోపలే అణుచుకున్నారు.
“నాటకంలో ఇంటిపద్దులు చూడాలి,కదండి .. మీ దగ్గర చిల్లర డబ్బులు ఎమన్నా వున్నాయా...” వేళ్ళతో చిటికెలువేస్తూ హరాత్తుగా శివరాంవైపు వచ్చింది రాణి.
శివరాం తాను విప్పిన వంట్లాముజేబు తడిమాదు. ఆరణాల చిల్లర కనిపించింది.
అదే జేబులో విడిగా ఉంచిన పదిరూపాయల కాగితం కనిపించలేదు. అందులోనే ఉన్న జేబురుమాలు తీసి అంతా వెతికాడు ముడుతల్లో, పర్సుల్లో పెట్టుకున్నానేమో అని వెతికినా పదిరూపాయలు నోటు కనిపించలేదు! కాని మరో అయిదు రూపాయల కాగితాలు మాత్రం అందులో కనిపించాయి.
“నా జేబులో పదిరూపాయలు నోటు పోయిందే!
చిల్లర ఠాణికి అందిస్తూ విచారంగా దిగులుగా ముఖం పెట్టాడు శివరాం.
'ఏమయిపోయిందండీ!”' ఆశ్చర్యంగా పెద్దగా కేకవేసింది రాణి.
ఆ కేకలు నటకులంతా మూగేరు.
శివరాం పదిరూపాయల నోటు ఏ విధంగా పోగొట్టుకున్నది, వివరాలన్నీ అడిగి అపరాధ పరిశోధకుడి పాత్ర అభినయించాడు ప్రతినటకుడు.
దారిలో రిక్షాలో పడిపోయి ఉండవచ్చు నన్నాడు జగదీశ్వర్.
“జేబురుమాలు పైకి లాగినప్పుడు వీధిలో ఎక్కడో జేబులోంచి బైటికివచ్చి గాలిలో ఎగిరిపోయి ఉందడవచ్చునోటు” అన్నాడు శ్రీనివాసు.
202 అన్వేషణ
“పొరపాటున ఏ హోటలు వాడికో యిచ్చేసి చిల్లర తీసుకోకుండ వచ్చెయ్యలేదుగద!” ఆచారి తెలివిగా పూర్వసంగతులు జ్ఞప్తికి తేబోయాడు.
“పదిరూపాయలనోటు ఊరికే ఎందుకు పోతుంది?. . ఎవరికో యిచ్చేసి మరచిపోయి వుంటావు!” హుస్సేన్ ఆలీ కవుల సహజ పరధ్యానం జ్ఞప్తికి తెచ్చాడు.
“పర్సులో రూపాయల కాగితాలున్నాయి కదూ... యింకా పదిరూపాయిలనోటు ఎమిటోయ్!” పరమహంస అసలు రహస్యం కనుక్కునట్లు చిదానందంగా నవ్వాడు.
“అదికూడఆ నటనా?” నటకులంతా గొల్లున నవ్వారు. “పది రూపాయిల నోటుపోయి ఆయన బాధపడుతూంటే, మీకి వేళాకోళం ఏమిటి. . ఆ మిగిలిన నోట్లు నాకివ్వండి ట్రంకుతోపెట్టి తాళంవేసి దాస్తాను... మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోండి!” బలవంతంగా పర్సు తీసుకుని ట్రంకులో బిగించింది రాణి,
నాటకం టైమయింది. సిద్ధంగా వుండాలని పరమహంస హెచ్చరించాడు.
రంగస్థలం చుట్టూ మూగారు నటకులు, రాణి, శివరాం. కొందరు నటకులు పరమహంస దయాప్రసారం పొందాలని తెరవెనుక నుంచి పాత్రల సంభాషణ అందిన్తామని సిద్దమయ్యారు.
తెరలేచింది.
పిచ్చివాడుగా ప్రవేశించాడు పరమహంస. మరో నిమిషంలో రూపం మార్చుకుని వితంతువయ్యాడు మరొకక్షణంలో రాజకీయ వేత్తలా మారాడు. ఇంకొకసారి బడిపంతులులా ప్రత్యక్షమయ్యాడు. (పేక్షకులను హాస్యంతో కడుపుబ్బ నవ్వించాడు.
“భరణం” నాటకం పరమహంస రచన. దర్శకత్వంతో నటింప బడి (పేక్షకుల మన్ననల నందింది శివరాం దొంగగా రంగస్థలం మీదకు వచ్చి చేసిన అట్టహాసాలకు రాణికి నిజంగా భయంపుల్టింది. పరమహంస ఆనందంతో కులికాడు. నాటకాంతంలో తనకు నాటకరంగంలో భార్యగా నటించిన రాణి, భార్య కన్న ఎక్కువ సహాయంచెస్తున్న నాగరిక యువతి అని పొగిడాడు. శివరాం గురించి తాను విన్న సంగతులు, నొాంస్కతిక కార్యక్రమాలలో అతనికున్న అభిరుచి ద్విగుణీకృతంగా వొగిడాదు.
నాటకం పూర్తయేక రాణి స్వయంగా వచ్చి దాచిన రూపాయి కాగితాలు తిరిగి శివరాంకు యిచ్చెసింది. మౌనంగా, మందస్మితంగా అందరికీ సమస్మరించి, తన కోసం
అన్వేషణ 203 హాలులో నిరీక్షిస్తున్న మరియమ్మను చేరింది. ఇద్దరూ హాస్టలు హాలుగుమ్మం దిగారు కారు లున్న పెద్దలు రాణివద్దకు వచ్చి యింటి దగ్గర దిగపెడతామని వినయంగా నిలబడ్డారు వినయంగానే వారి ఆహ్వానం తృణీకరించింది రాణి. మరియమ్మకు ఒళ్ళుమండింది కారులో యింటిదగ్గర దిగితే పొరుగింటివారి ముందు ఎంత గౌరవమో రాణి గుర్తించుకోలేక పోతోందని చికాకుపడింది ఆమె మీద ఆధారపడిన తనకు స్వతంత్ర భావాలు అమలు జరిపించే యోగం లేకపోయిందని లోలోపలనే బాధపడింది మౌనంగా.
రాణి రిక్షాయెక్కి మరియమ్మతో వెళ్ళివోయింది నటకులంతా తక్షణం పరమహంసకు సమస్మ్కరించి గ్రీన్ రూమ్ కాళీచేసి వెళ్ళి పోయారు. ఒంటరిగా పరమహంస తన సామానులు రిక్షాలోకి ఎక్కించుకుని హోటలుకు పయనమై పోయాడు.
పదిరూపాయిల నోటు పోయినపుడు నటకులంతా సానుభూతి చూపడం మాని సహజ హాస్యధోరణిలో ప్రసంగించినపుడు రాణి చూపిన ప్రవర్తన శివారం హృదయంలో హత్తుకుపోయింది. రాణి మాటల్లో తియ్యదనం, నవ్వులో చిలిపితనం, కళ్ళల్లో మిణుకు కాంతి, నడకలో హుందాతనం చనువు, నడతలోని చలాకీతనం, సరిగా శారద రూపం కళ్ళముందు కడుతోంది ఆమెలాంటి స్త్రీలను అప్పుడే ఇద్దరిని చూశాడు శివారం. అయినా రాణితో ఏర్పడినంత చనువు ఇతర స్త్రీలతో యిప్పటివరకు ఏర్పడలేదు లేచిపోయిన శారద రూపు చాలవరకు పుటికి పుచ్చుకుని, తన పూర్వ మధురస్మృతులు ప్రతినిమిషం జ్ఞప్తికి తెస్తున్న రాణి సాంగత్యం తప్పకుండా తనకు హాయి కలిగిస్తుందని విశ్వసించాడు మతాలు వేరైనా, ఏకభాష ప్రాతిపదికపై ఒకే తెనుగుజాతిగా వ్యవహరిస్తున్న తనకు, రాణికి ఏ విధంగానైనా బాగా సాన్నిహిత్యం ఏర్పడితే ఒక బాంధవ్యం ఏర్పరచుకోడానికి అభ్యంతరం ఉండకూడదనిపించింది శివరాంకు.
తన భావాలతో ఏకీభవించని సనాతన సాంప్రదాయ బద్దమైన (బ్రహ్మయ్యగారు, సుభద్రమ్మ, శివరాం దృష్టిలో మెదిలారు. ఏమైనా ఆమె సాంగత్యం వృద్ది చేసుకుని జీవితంలో కొంత మానసిక శాంతి పొందుతే బాగుంటుందేమో అనుకున్నాడు శివరాం. సాంగత్య సాన్నిహిత్యంలో మనిషి నిజరూపం తెలియడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆశించాడు శివరాం.
ఒక రోజు ఆఫీసు విడిచి ఇంటికి వెళ్ళాలని బస్సుస్తాండుదాకా వచ్చాడు శివరాం. ఎదురుగా రాణి నడిచివన్తోంది. శివరాంను చూసి నమస్కరించింది.
“ఇలా ఎక్కడికి వెడుతున్నారండీ!' నవ్వుతూ సాగదీసుకుంది రాణి.
204 అన్వేషణ
“ఆఫీసునుంచి ఇంటికి వెడుతున్నా!”
“ఏక్కడ మీ ఆఫీసు!”
“ఆ ఇరానీ హోటలు ప్రకృభవనంలో!”
“యూ ఆఫీసు ఈ ఎదురు వీధిలోనే వుందండి!”
ఏదో ఆశగా సరదాగా నవ్వింది రాణి,
“అయితే మీరు రోజూ కనిపించలేదే మునుపు!”
“తెలియక మీరు గుర్తుపట్టి ఉండకపోవచ్చు. . ఇక ముందు రోజూ కలుసుకో వచు గా నవ్వింది రాణి సరదాగా.
తన ఆఫీసు వీధిలోని ప్రక్కసందులోంచి రోజూ యింటికివెళ్ళ రాణి. శివరాం దూరంగా కనిపించగానే, సందుమళ్ళి నడవీధిలోకి నడిచి ఎదురుగా వచ్చింది. శివరాంతో మాట్లాడి సంతృప్తి పడింది. రోజూ ఈ విధంగానే కలుస్తే బహుశా శివరాం పరిచయం వృద్ధి కావచ్చునని కూడా లోలోపల ఆశపడింది.
“నూ యింటికి ఒకసారి రండీ౯ భయంగా, బెదురుతూ, మెల్లిగా బలహీనంగా నవ్వుతూ ఊరుకుంది రాణి.
“తప్పకుండా... రేపు సాయంత్రం రమ్మన్నారా?”
“రండి.....”
“ఆరు గంటలకు సాయంత్రం వన్తా”
“ఊం గ” రాణికళ్ళు మెరిశాయి. బుగ్గలు నవ్వుల పొంగుల్లో సొట్టలు పడ్డాయి.
శివరాం బస్సు ఎక్కాడు.
బడినుండి తిరిగివస్తున్న విద్యార్ధినులు కమిలిపోయిన సింగారంతో కాంతిహీనంగా కనిపించారు. సినీమాకు బయలుదేరిన యువకులు సొగసుగా ముస్తాబయ్యారు. వ్యావార నిమిత్తం..." గుంటూరు నుంచి వచ్చిన చౌదరులు యిద్దరు గట్టిగా దినుసులు ధరలు చెప్పుకుంటున్నారు. ఒక విజయవాడ నివాసి “ఏం (బ్రదర్! అణా పుచ్చుకుని రెండుఫర్లాంగులైనా (త్రిప్పలేదే బస్సుమిద మమ్మలిని!” అంటూ కందక్షరుతో సరసాలాడి బస్సు దిగుతున్నాడు. కళ్ళజోడు పెట్టుకున్న నల్లని సన్నని విద్యార్ధిని, జాజిమొగ్గల
అన్నేషణ 205 ఆకారంలోని బంగారుహారం కనిపించేలా పమిట సర్భకుంటూ దానిమ్మగింజల దంతాలతో ఏమిటో ముసిముసిగా నవ్వుకుంటోంది శివరాంవైపు చూస్తూ, బస్సులోకి రాగానే చెప్పులు చేతపుచ్చుకున్న ఒక పల్లెటూరి వనిత ప్రక్క స్రీపై చెప్పులతో రాస్తూంటే చిరాకుగా మందలించబడింది ఒక బస్సుస్తాండు దగ్గర ఒక కుర్రాడు తల్లి వెంబడి బస్సులో చొరబడి దిగనంటూ మరాము చేస్తూంటే “నాయనా పైసలు లేవు దిగరా!” అంటూ తల్లి సముదాయించింది. కాలేజీ విద్యార్ధినులు తమ కళాశాలలో లెక్చరర్సు పారాలు చెప్పే రీతుల గురించి హాస్యంగా బిగ్గరగా ముచ్చటించుకుంటున్నారు 'చంపకం ఎం ఏ ' అని పేరుపెట్టుకున్న లెదర్ బేగ్‌తో కూర్చున్న ఒక నల్లని నాజూకు యువతి ఏదో మహాపాపిని చూస్తూన్న చికాకు ముఖంతో శివరాంవైపు కోపంగా చూస్తోంది బస్సులోని మనుష్యుల ఆకృతుల సహజమైనవో, మనస్సు లోని భావాల సంఘర్షణల్లో క్రుత్రిమత్వం పొందినవో తెలుసుకోవడం కష్టం అనుకున్నాడు శివరాం
బస్సుదిగి, చేతిలో టిక్కట్లు ఆలోచనల కదలికలో చిన్న చిన్న ముక్కలుగా వేళ్ళతో తుంపి, మలయ మందమారుతంలో హాయిగా రేపటి రాణి సమావేశం గురించి ఊహాగానం చేస్తూ యింటికి చేరాడు శివరాం,
మర్నాడు కోరిదగ్గర బస్సుదిగి, రాణి యింటివైపు నడిచాడు శివరాం. ఆలస్యంగా ఆఫీసు నవలడంవల్ల బస్సుస్తాండుదగ్గర రాణి కనిపించలేదనుకున్నాడు. రెండు పెద్ద ఇనప స్తంభాలను అంటి ఉన్న భారీ ఎత్తున ఒక సిగరెట్టు పెట్టెలోంచి సిగరెట్లు పైకివచ్చి ప్రజల వైపు తొంగిచూస్తున్నాయి. ఆఫీసు విడిచిన ఉద్యోగులు భార్యలను ముస్తాబు చేయించి సుల్తానుబజారులోని కూరల బజారువైపు నడుస్తూ తీసుకువెడుతున్నారు. రకరకాల సినిమాచిత్రాలు అందాలు పొంగి ప్రసరిస్తున్న యవ్వనరఖల శరీరాలతో (ప్రేక్షకుల నాకర్షిస్తున్నాయి. సరిగా అరుగంటలకు రాణి యింటిముందు ప్రత్యక్షమవగానే రాణీ వీధిలో శివరాం కోసమే ఎదురుచూస్తున్నట్లు నిలుచుంది.
“మీరు యిల్లు సరిగా గుర్తుపట్టగలరో లేదో అని” ఆగిపోయింది రాణి, తక్కిన మాటలు శివరాం అర్ధం చేసుకున్నాడు.
తిన్నగా మేడమీదకు తీసుకెళ్ళింది రాణి. శివరాం అనుసరించాడు.
పాతబడిపోయిన సిమ్మెంటు గచ్చునేలతో నల్లగా ఉన్న మేడ మీద వరండా. వరండాలో రెండు కుర్చీలున్నాయి. క్రింద గాలిపటము పడి ఉంది.
206 అన్వెషణ
“దంటిపిల్లల్లా గాలిపటాలు ఎగురువేస్తున్నారా!” శివరాం" వోస్యమాడాడు.,
=న్సేన్సు ఎగురువేసూంటే బాగానే వుంటుంది. కాని మా అమ్మ నాకంటె చంటిపిల్లా గంతులేస్తుందండి.... ఎవరో గాలిపటం ఎగురు వేస్తూంటే అది వాలి మా మేడమీదకు వచ్చింది, చిలిపిపిల్లలా పుటుక్కున తాడుతెంపి గాలిపటం పట్టుకుంది. మీరు గాలిపటం ఎగుర వెయ్యండి... నేను దారం పట్టుకుంటాను.. ” గాలిపటం చేత పట్టించింది రాణి. నవ్వుతూ దారం శివరాం పట్టుకున్నాడు. గాలి పటం వదిలేసింది రాణి గాలిలో.
“ఇప్పుడు మీరే చంటిపిలలయారు కదండీ” పకపక నవ్వింది రాణీ.
గాలిపటాన్ని విడిచి ఇద్దరూ కుర్చీలమీద కూర్చున్నారు “మీ యింటిముందు దృశ్యం చాలా బాగుంటుందడి ఎత్తు పల్లాలతో . చిత్రం గీస్తే మధ్యతరగతి సామాన్య కుటంబీకుల 'పేటలా చక్న్మగా రావచ్చు. ..” శివరాం వీధిలోని సొగసు కళాత్మక దృష్టితో పరిశీలించాడు.
“మీకు చిత్రలేఖనం వచ్చునా?”
నవ్వాడు శివరాం వచ్చునన్నట్లు.
“ఏమండీ! నా బొమ్మగీసి యివ్వరూ ఒకరోజు!”
“అలాగే!”
మందస్మితాలు లతల్లా అల్లుకుపోయాయి వారియిద్దరి మధ్యా నరసవ్వ వంగిన నడుంతోటీ తీసుకు వచ్చింది మేడమీదకు.
“మా ముసలవ్వ మంచిపాటలు పాడుతుందండీ!” అన్నది రాణీ.
ఆమె మాటకు హుషారు కలిగిన నరసవ్వ ఇద్దరికీ “టీ' అందిచ్చి తక్షణం తాను ఎరిగిన జావళీలు పాడడం అందుకుంది,
“ఇదిగో చూడు... క్రింద వెళ్ళి మిఠాయి, జిలేబికూడా తీసుకురా!... అమ్మనడుగు...!”
నరసవ్వ గబుక్కున పాటమాని క్రిందకుపోయింది. మరియమ్మ మరుక్షణంలో ఒక ప్లేటులో వివిధ రకాల తీపివస్తులు పెట్లి తీసుకు వచ్చింది.
శివరాం మొహమాట పద్డాడు.
“అంత మనిషి ఉన్నారు... ఆ మాత్రం తీపివస్తువులు తినలేరూ?” రాణి హాస్యం చేసింది.
అన్వేషణ లై"
“అబ్బ ! మొన్న మీరు నాటకంలో ఎంత బాగా నటించారండీ! .. నాకే భయమేసింది!” మరియమ్మ గుడ్లు నిగిద్బీ శోషిల్లుతున్నట్లు అభినయించి వక్రంగా నవ్వింది.
“మా అమ్మ ప్రతిరోజూ అడగడమే . మిమ్మల్ని ఇంటికి ఒక సారి పిలవమని!” రాణి మరియమ్మను సంతోషపెట్టాలని ప్రయత్నించింది. మరియమ్మ ఉబ్బిపోయింది.
“మా అమ్మాయి మిమ్మల్ని గురించే ఎంతో చెప్పిందండి... మీ అంత మంచివారు లేరని...” మరియమ్మ నిండుగా హాయిగా మందస్మితం చేసింది.
నరసవ్వ మేడమీదకు వచ్చింది.
రాణి అడగడంలో మళ్ళీ జావళీ అందుకుంది. నరసవ్వ జావళీలు మాధుర్యంలో మైమరచి శివరాం ఫలహారం ముగించాడు.
పంచమి చంద్రుడు ఆకాశంలో ప్రత్యక్షమై వెన్నెల మేడ మీదకు ప్రసరించాడు.
శివరాం రాణి జీవితం గురించి తర్మించే ప్రశ్నలు వేశాడు. స్వస్థానం గుంటూరని, బొంబాయిలోనూ, మద్రాసులోనూ తమ బాబయ్యలు ఉద్యోగాలలో, ఉన్నారని, తరచు వస్తూంటారని, గుంటూరులో ఒక చిన్న యిల్లు రెండెకరాల భూమి కూడా తమ కుందని, ఏదో ఉద్యోగంమీద వచ్చే జీతంతో జాగ్రత్తగా నగరంలో కాలక్షేపం చెస్తున్నామని రాణి సమాధానం యిచ్చింది. శివరాం అన్వేషణ సాగించడానికి ఆధారం ఏమీ కనిపించలేదు.
రాణి పేక తెప్పించింది. ఆటలో నిమగ్నులయారు రాణి, శివరాం. మాటలతో అట్టేకాలం గడషడం అసాధ్యమని ఆటలు ప్రారంభించింది రాణి.
ఆటలమధ్యలో మరియమ్మ రాణిని క్రిందకు రమ్మని పిలిచింది పేక ముక్కలు ముడిచి రాణి క్రిందకు నడిచింది. అయిదు నిముషాలు గడిచినా రాణి మేడమీదకు రాలేదు. శివరాం లేచి నిలుచుని పచారు చెయ్యసాగాడు మేడ చివర నిలుచుని వీధిలోకి చూశాడు ఎవరో నల్లని వ్యక్తి కంగారుగా రాణియింటి గుమ్మంమెట్లు దిగిపోతున్నాడు. రాత్రి ఏడున్నర గంటలకు ఒక వ్యక్తి రాణిని పలకరించి తిరిగి కంగారుగా వెళ్ళిపోవడంలో ఏమైనా జీవితరహస్యాలు దాగి ఉన్నాయేమో అని అనుమానం కలిగింది శివరాంకు. ఆ నల్లని వ్యక్తి రూపంలో ఏ విధంగానూ తనతో తులగతూగకపోవడంతో శివరాంకు మరీ అసూయ కలిగింది. రాణి పైన కోపం వచ్చింది. మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు, పేకముక్కలు కలుపుతూ చేతుల్లో.
208 అన్వేషణ
రాణి మేడమీదకు వచ్చింది వేళ్ళాడే జడ కొప్పుగా చుట్టుకొని, మల్లెపూలదండ తురుముకుంది. శివరాంకు ఏదో అనుమానం కలిగింది
తలవంచుకుని శివరాం (ప్రశ్నించాడు, వెళ్ళివోయిన మని షెవ్వరని?
“ఆయనా?... మా ఆఫీసులో పనిచేసే హెద్దు గుమాస్తా రాఘవరావుగారండీ!.... చాలా మంచి మనిషి! తేలికగా నవ్వేసింది రాణి,
రాణి అంతరంగం అర్దం చేసుకోవడం కష్టమనిపించింది శివరాంకు. మౌనంగా కాస్సేపు మర్యాదగా పేక ఆడి, సెలవు తీసుకుంటాంనంటూ లేచాడు.
ఎగ్జిబిషన్ మైదానాల్లో ఆడుతున్న నర్మసు ఫోకస్లైటు కాంతివంతంగా చుట్టూతిరుగుతూ, ఆకాశంలోకి, బాణంలా చొచ్చుకుంటోంది లేచి నిలుచున్న శివరాంను చూసి రాణి నిట్టూర్చింది.
“మళ్ళీ దర్శనం?” పేలవంగా నవ్వింది.
ఆమె అమాయకమైన వదనంలోని ధైన్యం చూడగానే శివరాం కోపం తగ్గిపోయింది.
“మళ్ళీ ఎప్పుడో వీలైనప్పుడు కలుద్దాం?”
శివరాంకు నమస్మరించి వీడ్కోలిస్తూ రాణి అనుసరించింది. క్రింది వీధి గదిలోంచి నడుస్తూంటే, సినీతారలా ఆకర్షణీయంగా ఏటవాలుగావున్న రాణి ఫోటో గోడమీద చూశాడు శివరాం. ఆ ఫోటోలో కనపడే చాంచల్యం గుర్తించి శివరాం హృదయంలో బాధపడ్డాడు. స్తీ సహజమైన చంచలచిత్తం నాటకాల అనుభవంలో గడించిన నటన, నిత్యము నవ్వుతూ కనిపించే పెదాల వెనకాల అర్ధం కాని అంతరంగం నిండుకున్న రాణికి బహుశః తనవంటివాడు దూరంగా ఉంటేనే బాగుంటుందేమో అనుకున్నాడు శివరాం.
హోటల్లో భోంచేసి రాత్రి యింటికి చేరాడు పది గంటలకు. యధాప్రకారంగా వీధిగే టు తాళం వేయబడివుంది. రోజూ ఆలస్యంగా వస్తే గేటుదాటి లోపలకు పోవడం చాలా అసభ్యమనిపించింది. మరో అద్దెకొంప చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు శివరాం. పేరిశాస్తిగారు ఈ విషయంలో సహాయం చెయ్యగలరని ఆశించాడు.
మర్నాడు పేరిశాస్తిగారింటికి వెళ్ళాడు శివరాం. ఆయన రాజమండ్రి వెళ్ళాడని విని ప్రయోజనంలేక తిరిగి వచ్చెశాడు.
అన్వేషణ 200 సాయంత్రం కాలక్షేపంగా గ్రంధాలయానికి వెళ్ళి వార్తాపత్రిక తిరగేశాడు రాజమండ్రి దగ్గర గోదావరి పొంగిపోతుందని, విపరీతంగా ఒడుదుడుకులుగా నది ప్రవహిస్తూండ డంవల్ల పట్టణానికి ప్రమాదం సంభవిస్తుందేమో అనే అనుమానం కలుగుతోందని, పట్టణ సంరక్షణకు తగిన కట్టుబాట్లు జరుగుతున్నాయని వార్త కనిపించింది గోదావరి తీరం కట్ట[క్రింద పల్లపువీధిలో నివసిస్తున్న బ్రహ్మయ్యగారి పైన తల్లి పైన దృష్టి మళ్ళింది. ఒకవేళ గోదావరివరదలు పొంగుతే! .. క్షేమ సమాచారం తెలియజెయ్యమని తక్షణం బ్రహ్మయంగారికి ఉత్తరం వ్రాశాడు శివరాం. ఉత్తరం బ్రహృయ్యగారికి అందకుండానే గోదావరి ఉవ్వాంగింది. అర్దరాత్రి పన్నెండు గంటలకు పట్టణమంతా మాటుమణిగి నిశ్శబ్దంలో సుషుప్తిలో ఒరిగినపుడు గోదావరి మెల్లిగా అద్దుకునె కంకర్రాళ్ళను అణగద్రొక్కి నిరోధించే చెట్లను ఊడబీకి, అడ్డంగా చాచుకు పళుచుకున్న మట్టికట్టను కెరటాల ప్రవాహంతో చీల్చి దొలిచి కాపలాకాస్తూ నిలుచున్న పోలీసువాడి ఈలలకు బెదరకుండా, వామనావతారంలా వపరీతంగా యినుమడిస్తూ, ఈదురుగొలుల శబ్దాలతో విజ్బంఖస్తూ, కట్టమీంచి పొంగి, పల్లపు నేలమీదకు ప్రాకింది. పట్టణానికి ఉత్తరాన దక్షిణాన బలవంతంగా బెల్లులు పెకలించి కట్ట(త్రెంచి గండ్లు వేసుకుని పట్టణంలోకి చొరబడింది గోదావరి. జలఊరుతున్నట్లు రోడ్లమీద నీరు వ్యాపించింది అరగంటలో కట్టమీద నుంచి గోదావరి జలపాతంఆ మారింది. చీకటిలో కెరటాలపొంగులో ఏదో కోపంతో ఉద్రిక్తమయి పూర్తిగా మట్టము పెరిగి గోదావరి అవలితీరం కనిపించలెదు. గట్టుమీద కట్టి ఉన్న పడవలు త్రాళ్ళు తెంచుకుని వరదలు ప్రవాహంలో తలక్రిందులుగా మొగ్గులువేస్తూ పరుగిడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు వాటి కొమ్మలకు చుట్టుకుని పడగలెత్తి నిలుచున్న వాములు, శవాలు, జంతువులు అనంతమైన వేగంతో నీళ్ళల్లో పరిగిడుతున్నాయి కట్టమీద ఉండే కలపదుకాణాలు కెరటాల వాంగుల్లో ఉయ్యాలల్లా ఊగుతున్నాయి గుడిసెల ఎండు తాటాకుల కెరటాల ఒడితుడుకుల్లో తాబేళ్ళలా కదులుతున్నాయి. గోదావరి వరదప్రమాదాన్ని గుర్తుచేస్తూ రావిచెట్లు రోజుకుంటూ అరుస్తున్నాయి. (వ్రైళ్ళతో పెకిలింపబడిన చెట్లపై గూళ్ళు కట్టుకున్న పక్షులు, రెక్కలు రాని పక్షి పిల్లలను రక్షించలేక భయంగా విలపిస్తూ ప్రాణ రక్షణకు గాలిలోకి ఎగిరిపోతున్నాయి జలపాతంలాంటి గోదావరి వరదల నీరు ఇళ్ళల్లోకి పాకింది. వీధి అరుగుమీద గదిలో ్రకృవేసుకు పడుకున్న యింటి యజమాని మంచం క్రిందనుంచి తడితడిగా
210 అన్వేషణ నడ్డికి తగిలితే ఆకస్మాత్తుగా లేచి మోకాలినీళ్ళలో నడిచి ఇంటిలోని వారినంతాలేపీ విధి తలుపులకు తాళాలు బిగించి మిద్దెమీదకు పరుగెత్తాడు సంసారంతో, వీలైన సామానుతో, వీధి చప్తామీద పడుకున్న ముష్టివాళ్ళు జోలెలు; పోయారు ఒక బట్టల దుకాణం నీళ్ళలో మునిగిపోయి విలువైన తానులు చీకిపోయాయి ప్లీడరుగారిబోర్దు, డాక్టరుగొరిబోర్డు మేకులు ఊడి నీళ్ళ ప్రవాహంలో కలిపి సరదాగా తేలుతూ ప్రయాణం చేస్తున్నాయి. ఒక రిక్షా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి, రక్షించమంటూ టాపుతో నిక్కరిస్తూ ఎలుగెత్తి అరుస్తోంది వారకాంతల ఆభింగనాల్లో ఆనందం అనుభవిస్తున్న విటులు తమ కొంపలు నిజంగా మునుగుతున్నాయని బిళ్ళకచ్చలు సవరించుకుంటూ పరుగెత్తికుని ఇళ్ళకు చేరుకున్నారు ధనికులు, లారీలు, సిద్ధంచెసుకుని విలువైన సామానులతో ప్రక్కఊళ్ళకు తరలిపోతున్నారు అంతస్థుల భవంతులున్న ఆగర్భ శ్రీమంతులు క్రిందిభాగాలు వదలి పారలివచ్చే నీటిని భయంగా చూస్తూ పై అంతస్థులకు పారిపోతున్నారు. ఒక హోటలో మరుదినం కోసం వుంచిన మినపగుజ్జు కూరముక్కలు, పచ్చిమిరతునకలు నీటిలో కరిగితేలి తారట్లాదుతున్నాయి. ఒక నన్వాసి ఆశ్రమం పూర్తిగా నీటిలో కొట్టుకుపోయి సర్వాంతర్యామిని శరణు కోరడంలో అతనికి పరీక్ష పెట్టింది. ఒక వితంతువు ఆపాదమస్తకం మంచంమీద కూర్చుని, వరదలు నీరుచూసి భయంతో, నారాయణ నారాయణి అంటూ జపిస్తూ ఇంటిల్లిపాదిని రణగొణధ్వనితో లేపేసింది. ఒక గయ్యాళి భార్య, భయంతో భర్త రక్షణకోరి ప్రసన్నురాలయిపోయింది. దొడ్లో కట్టివున్న ఆవులు, గేదెలు దూడలు నీటి పారుదలచూసి భయంగా అరుస్తున్నాయి.
కొత్తగా తవ్వించిన నుయ్యినుంచి జల రాక పోగా శివుడికి కొబ్బరికాయలు నాయం త్రమే కొట్టిన కోమటాయన, నూయి నీటితో పొంగి పొరలిందేమోననే సంతోషంతో లేచి, వరదల నీరని గమనించి, కంగారుగా గంతులువేశాడు. యింట్లో సగం మట్టి నేలతో కూడిన కంకరరోడ్డు నీటితో మునిగిపోయి బురదనేలగా మారాయి.
వరదలనీరు ప్రమాదాన్ని తట్టుకోడానికి, పొరుగింటి ధనికుల ఆదరణలో, అంతస్థుల మేడమీద ఒక గదిలో రెండు రోజులు సకుటుంబంగా రక్షణ తీసుకున్నారు బ్రహ్మయ్యగారి కుటుంబం. మనుమరాలు యింటినుంచి అదృశ్యమయ్యాక మందకొడితనంతో బ్రతుకుతున్న చిట్టెమ్మ పదిరోజులనుండి టైఫాయిడ్ జ్వరంతో మూల్గుతోంది. వరదల బాధల్లో డాక్టర్లుకూడా స్వకుటుంబరక్షణలో మునిగి తేలడం వల్ల చిటైమ్మ జ్వరానికి తగ్గ చికిత్స లభ్యం కాకపోయింది. కొన్నాళ్ళయినా వెంకటేశ్వర్లు దగ్గర వేళంగిలోఉంటే, యీ ఒడుదుడుకులు తగ్గవచ్చని ఆశించాడు బ్రహ్మయ్యగారు.
అన్వేషణ 21]
మూడు రోజులుదాకా గోదావరి వరదల నీరు పిల్లకాల్వల్లా వీధుల్లో వ్యాపించింది నదిలో పడవల్తా, వీధుల్లోనే పడవలు తిరగడం మొదలెట్టాయి. జట్మాలు, రిక్షాలు అదృ్భశ్యమైవోయాయి యూరప్‌లోని సముద్రతీరఖండాల నంటి పెట్టుకునే సరస్సుల పట్టణంలా రాజమండ్రి మారిపోయింది చ " మునిగిన యిండ్లు సగం ఒరిగిన గృహాలు, నీటిలో శిధిలమై రాలిపడిపోతున్న మట్టిగోడల పూరిండ్లు, తధిసి మెతక వాసనల విరజిమ్మే కలపద్వారాలు, ద్వారబంధాలు, ఎండుతున్న మేర మురికి ఏర్పడి దుర్దంధం వెదజల్లె మెరక ప్రదేశాలు నీటీపారుదలతో తడిసి తపతపలాడే కొంపల్లో రొదచేసే దోమలు [క్రిమికీటకాల రభస, యధేచ్చగా వాసాలపైకి ప్రాకి బుసలు కొడుతూ భయం కల్సించేపాములు, కూలిపోయిన చెట్లు, క్రుంగిపోయిన పెంకుటిళ్ళు పట్టణాన్నంతా నిర్జన ప్రదేశంగా చేసి ఒక శ్మశానంగా మార్చింది. మధ్యతరగతి కుటుంబీకులు ఆలస్యంగా శిధిలమైపోతున్న గృహాలు పూర్తిగా రక్షణ యివ్వకవోవడంవల్ల పడవల నాశ్రయించి మెరక ప్రాంతాలకు వెళ్ళుతున్నారు, రక్షక భటులు, విద్యార్ధి సంఘాలు ప్రజా సేవకులు సేవానిరతి చూపే అవకాశం వచ్చిందని విరామం లేకుండా వరద బాధితులకు సహాయం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు విమానాలమిద, పడవలమీద, పర్యటించి, పట్టణంలో స్తంభించిపోయిన రైలు కట్టలు పరీక్షించారు. వార్తాపత్రికల్లో వరదల నీరు పొంగుల్లా పెద్ద పెద్ద నల్ల అక్షరాలతో వరద భీభత్స దృశ్యాలు నిండిపోయాయి ప్రకృతి కోపోద్రేకానికి తట్టుకోలేక భగవన్నామస్మరణతో, స్వకుటుంబ రక్షణలో ప్రతి వ్యక్తి విపరీతమైన స్వార్ధం చూప మొదలెట్టాడు.
తన పలుకుబడి నంతా ఉపయోగించి, కొంతమంది స్నేహితులతో ఒక రవాణా మోటారు కుదుర్చుకుని, కుటుంబంలో వీలైన కొంత సామానుతో వేళంగి బయలుదేరారు 'బ్రహ్మయ్యగారు. వరదల నీరు పట్టణంలో తగ్గినా, పట్టణం అంతా యధారీతికి వచ్చి, వరదల వల్ల వ్యాధులు తగ్గవరకు చాలాకాలం పడుతుందని బ్రహ్మయ్యగారు యిష్టం లేకపోయినా దగ్గరవున్న మనుమడి వద్దకుపోక తప్పలేదు. టైఫాయిడ్ జ్వరంతో మళ్ళీ నీళ్ళలో తడిసి, ఈదురు గాలిలో కుమిలి, గజగజ వణుకుతూ ముద్దలా కారులో ఒరిగిపోయింది చిట్టెమ్మ.
వేళంగి చేరగానే వెంకటేశ్వర్లు కొంత సానుభూతి చూపి, ఆఫీసు పని రద్దీవల్ల ఆ ప్రాంతానికి రాలేకపోయానని సాకు చూపాడు. జ్వరంతో దిగిన చిట్టెమ్మను చూచి, తన పిల్లలకు ఏ బాధ కలుగుతుందో అనే శంకలో పార్వతమ్మ మూతి ముడుచుకుని బలవంతంగా న్వాగతమిచ్చింది వరద బాధితులకు.
212 అన్వేషణ రాకపోకలు, ఉత్తరాల రవాణా స్టిరపదేలోపుగానె చిట్టెమ్మ జ్వరం విపరీతంగా విజ్బంభీంచింది వెంకటేశ్వర్లు తీసుకువచ్చిన డాక్టరు తనశక్తినంతా వినియోగించానని వాక్రుచ్చి, ఫలితం విచారకరమేనని పెదాలు విరిచాడు. చిట్టెమ్మ ఒకరాత్రి మౌనంగానే మందకొడిగానే మాటలేక కళ్ళు మూసింది. మరణించిన చిట్టెమ్మ గురించి ఎక్కువగా విచారించినవారెవరూ లేకపోయారు. వయసు పెరిగి ముసలియైన చిట్టెమ్మ మరణానికి సన్నిహితురాలయివుందని అందరూ నమ్మారు కాని జరగవలసిన అంత్యక్రియలు జరిపే బాధ్యత (బ్రహ్మయ్యగారే పూనుకొని చేశారు. శుభమైన తనకొంపలోకి ఒక పీనుగు కొట్టుకువచ్చిందని కుళ్ళి కుళ్ళి కుత్సితంగా మధనపడింది వార్వతమ్మ. శివరాం వ్రాసిన ఉత్తరం వరదలు పూర్తయ్యాక చిట్టెమ్మ చనిపోయాక రాజమండ్రి వచ్చి అక్కడి నుండి తిరుగపంపబడి, మెల్లిగా బ్రహ్మయ్యగారికి చెరింది. జరిగిన సంగతులు వివరిస్తూ కంగారుపడి రానవసరం లేదని శివరాంకు జవాబిచ్చారు బ్రహ్మయ్యగారు. ఉండ్రాజవరంలోని దీక్షితులు, భార్య కుటుంబం ఆపదలో వుందని రాకపోకలు సమకూడేక చూడాలని బయలుదేరి వెళంగి వచ్చాడు. వార్వతమ్మ ప్రవర్తన అర్ధం చేసుకున్న (బ్రహ్మయ్యగారు పొలం వ్యవహారాలు, తదితద సంగతులు వెంకటెశ్వర్లుకు అప్పచెప్పి దీక్షితులు బలవంతం మీద సుభద్రమ్మతో ఉండ్రాజవరం చేరారు కొన్నాళ్ళు గడుపుదామని. (బ్రహ్మయ్యగారి ఉత్తరం శివరాంకు అసంతృప్తి కలిగించింది ఉన్న (ప్రాంతం కదిలివచ్చే స్వభావం లేని బ్రహ్మయ్యగారిని తన దగ్గర వుండమంటే ఒప్పుకోరని ఇంతకాలం ఆ ప్రస్తావన ఎత్తలేదు ఉద్యోగంలో స్థిరపడి పుష్కలంగా సంపాదించుకుంటున్న తనతోనే తాతను తల్లినీ కూడా వుంచుకుని సేవచేస్తే వాళ్ళ చివరి రోజుల్లో తన విద్యుక్తధర్మం నిర్వర్తించినవాడ నౌతానని తలపోశాడు శివరాం. ఆస్తి వ్యవహారాలు అన్నగారికి అప్పచెప్పి తల్లితో తక్షణం బయలుదేరి సికింద్రాబాదు వచ్చెయ్యమని ప్రాధేయపడుతూ శివరాం ఉత్తరం వ్రాసాడు దీక్షితులు ఇంట్లో తనకు అన్ని సౌకర్యాలు సమకూరుతున్నా మనుమరాలి అత్తవారింట్లో చాలాకాలం ఉండడం సబబుగా కనిపించలేదు బ్రహ్మయ్యగారికి జవసత్వాలు కాలక్రమంలో ఉడిగిపోతుండగా, కొంతకాలం క్రొత్త నగరాన్ని చూస్తూ మనుమడి దగ్గరే గడుపుతే మనస్సుకు పూర్తిగా శాంతి కలగవచ్చునని (బబ్రహ్మయ్యగారు మనసు మార్చుకున్నారు. ఎప్పుడురమ్మంటే అప్పుడు బయలుదేరి వస్తానని జవాబిచ్చారు ఆయన, తాతయ్య ఉత్తరం చూసి ఆనందంతో తవబ్బిబ్పైపోయాడు శివరాం పేరిశాస్తిగారింటికి పయనమైపోయాడు. ఆ రోజే రైలు దిగి వచ్చానని గోదావరి వరద బీభత్స దృశ్యాలు
అన్వేషణ 213 చుట్టూ కూర్చున్న కొంత జనంతో పాటు శివరాంకూ ఒక పెద్ద ఉపన్యాసం యిచ్చాడు. వరదనీరు యింట్లోకి ప్రవహించి నిలువెత్తున పొంగిపోతే, శాస్త నామానులు మిద్దెమిదకు చెరవేసి, పేకాడుకుంటూ చీకటి మిద్దెమీద రెండు రోజులు ఎలా గడిపింది ప్రతిభావంతుడైన నటకుడిలా అభినయించి చక్కగా వర్ణించి చెప్పారు గదిలోని (ప్రేక్షకులు చెవులు నిక్కించి ఆశ్చర్యంతో కుతూహలంగా విన్నారు.
శివరాం తన క్రొత్త అద్దె కొంప ప్రస్తావన తెచ్చాడు “నిన్ను గురించి నేను మునుపే ఆలోచించేను అది అద్దెకిస్తాడేమో కనుక్కుని కుదురుస్తా” చాలా సూక్ష్మంగా తేల్చేశారు పెరిశాస్త్రి.
బ్రహ్మయ్యగారు, సుభద్రమ్మకూడ యిక ముందు తనతో నివసిస్తారని శివరాం చెప్పగా ఆనందం వ్యక్తపరచి వరదల బీభత్సంలో వారిని రాజమండ్రిలో చూడలేక పోయానని, ఏ విధంగానూ సాయం చెయ్యలేకపోయానని అసంతృప్తి ప్రకటించాడు పేరిశాస్తి ఆయన మాటలో దృఢవిశ్వాసం పెంఛుకుని మార్నాడే క్రొత్త అద్దెకొంప దొరకగలదనే ఆశతో శివరాం వెళ్ళిపోయాడు
శివరాం ఆశ నిరాశకాలేదు. పేరిశాస్తి ఇంటి అద్దె కుదిర్చి అరవై రూపాయలని మేడ మీద బంగళా చాలా బాగుందని తన స్వంత పలుకుబడివల్ల ఈ విషయం స్టిరపడిందని స్వోత్కర్షతో చిరునవ్వు నవ్వాడు మేడభాగం ప్రత్యేకంగా సర్వసదుపాయాలతో విశాలంగా ఉండడంవల్ల అంతఅద్దె కొంచెం ఎక్కువని భావించినా, త్వరలో ఇల్లు సునాయాసంగా దొరికిందని సంతోషంగా ఆ అద్దెయింట్లో ప్రవేశించడానికి ఒప్పుకుని బజానా యిచ్చేశాడు శివరాం తాతాయ్యకు రమ్మని ఉత్తరం వ్రాశాడు.
బ్రహ్మయ్యగారు సుభద్రమ్మను తీసుకుని, వీలయినన్నిిసామానులు వెంటబెట్టుకుని, నిర్ణయించిన శుభదినంనాడు, పొద్దున్న సికింద్రాబాదు స్టేషనులో దిగారు తనకు ప్రతిబింబాలుగా పూర్వతరాల వ్యక్తుల్లా వివిధ సంస్కృతుల పద్దతుల్లో రైలుదిగిన తాతయ్యను, తల్లిని పొంగిపొరలే అభిమానంతో, గౌరవంతో ఆనందంగా ఎదురేగి ఆహ్వానించాడు శివరాం బ్రహ్మయ్యగారు మితిమీరిన వాత్సల్యంతో శివరాం నడుం చుట్టూ చెయ్యివేసి ప్రధమంగా అతని క్షేమం విచారించాడు. కన్న (ప్రేమతో బాధపడే తల్లి భోజనం సౌకర్వాలు హొటల్లో ఎల్లా వున్నాయని, చిక్కిపోయావేమని ప్రశ్నించింది రైల్వే కూలీలను పిలిచి, సామానులు స్టేషను ఆవరణ దాటించి, టాంగాలు కుదిర్చడు శివరాం. టాంగాలు నగరంలోకి నడిచాయి. సుభద్రమ్మగారు, బ్రహ్మయ్యగారు నగరం చూస్తూ విభ్రాంతి
21 అన్వేషణ పొందుతున్నారు. శివరాం వాళ్ళకు చుట్టుప్రక్కల రోడ్ల పేర్లు, వింతలు, విశేషాలు చెబుతున్నాడు.
బ్రతుకు తెరువుల అన్వేషణలో గతులు మార్చే మనుషుల్లా గమ్యస్థానం అన్వేషణలో గమనం మార్చింది రైలుబండి కూతకూస్తూ పొగలు జిమ్ముతూ, చక్రాలు తిప్పుతూ, (క్రాత్తశక్తితో అడుగువేసింది రాబోయ స్టెషనువైపు రైలు పొగలు మేఘాల్లా గాలిలో తేలి పరిసరాల చెట్లను, స్తంభాలను నలుపుచేస్తున్యాఇ. నలుపెక్కిన ఆకులు రాల్చే చెట్టు (క్రింద బిక్షుకులు పడి దొర్లుతున్నారు మసి ఎక్కిన వంట గిన్నెలు చాల్లాచెదురుగా వదిలి నల్లకుక్క ఆ ఖీక్షుకుల మలిన దేహాలు తాకుతూ తోక ఆడిస్తోంది సంతోషంగా సంరక్షణ కొరకు గతులు మార్చే ఉన్నత మధ్య తరగతి వ్యక్తులకు, రక్షణే లేక నిత్యప్రమాద బాధితులై గతులు మార్చే భిక్షుకులకు ఉన్న వృత్యాసంలో పొడచూపే సర్వాంతర్యామి రక్షణ సిద్ధాంతం మెదిలింది శివరాం దృష్టి అన్వేషణలో.
అన్వేషణ 2105
జై నగరులోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అగుపించింది. మొదట్లో శివరాంకు భోజనసౌకర్యాలు చూసే తల్లి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వివ్ధ విషయాల్లో నిత్వమూ సలహాలచ్చే తాతయ్య ప్రక్కనే వుండడం ఏమిటో పది ఏనుగుల బలం సేకరించుకున్నట్లుయింది.
రుచికరమైన భోజనం, ప్రశాంత వాతావరణం, అభిమానులు ఆదరణ లభ్యమయిన శివరాం, చీకు చింతలేక ఆకారంలో కొంచెం పుష్టి పెంచుకుని హాయిగా (బ్రతకనాగాడు.
పరమహసంతో బాటు నాటకాల్లో నటించడంవల్ల రాణీతో సహా సమానమైన ప్రచారం శివరాంకు కూడా లభించింది. గంధర్వ నాటక సమితినుంచి కొంచెం దూరమైన శివరాం ఏ విధంగానూ తన కార్యక్రమాలలో విఫలుడు రాకుండా మసలడం ఈశ్వరయ్య అహంభావానికి, గర్వానికి దెబ్బతీసి నట్లయింది నగరంలోని వివిధవ్యక్తులు శివరాంకు చూపే గౌరవ మర్వాదలతో ఏ కొరత కనిపించక పోవడంతో, కార్యదర్శిగా తనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమి లభించలేదని గుర్తించుకున్నాడు ఈశ్వరయ్య.
ముభావంగా శివరాం మునుపు యిచ్చిన ఆహ్వానాలు అందుకుని పరమహంస ప్రదర్శనలకు హాజరయ్యాడు ఈశ్వరయ్య, రాణిని చూసి కులికాడు. ఆమెతో పరిచయం కలగజేసుకోవాలనే ఆత్రుత హెచ్చింది. వయసులోను, సాంఘిక పలుకుబడిలోనూ హెచ్చుతరహా మనిషిలా, బ్రతుకుతున్న పరమహంసతో సాన్నిహిత్యం దుర్లభమని గుర్తించి,
216 అన్వేషణ మునుపువున్న స్నేహాన్ని యినుమడింపచేసుకుని, శివరాంను మచ్చిక చేసుకుని, అతని ద్వారా రాణి స్నేహం పొందాలని ఆశించాడు ఈశ్వరయ్య
ఒకరోజు వీధిలో పోతుంటే, శివరాంను పిలిచి పలకరించాడు ఈశ్వరయ్య, బలవతంగా హోటలులోకి తీసుకువెళ్ళి వేడి కాఫీ యిచ్చాడు “ఎక్కడా కనిపించడం మానేసేవేమోయి . పూర్తిగా మన నాటక సంస్థను మరచిపోయినట్టున్నావే. . యీ మధ్య “వికారం” అనే నాటకం రిహార్సల్స్ వేస్తున్నాం .. నీకో పాత్ర యివ్వాలని ఉంచాం... వచ్చి నాటరంలో వెద్దూ ... మనమంతా యీ నాటక సంస్థ న్థాపకులం కనుక. దిని అభివృద్ధికి మసం సర్వవిధాల సహాయపదాలి!”
తన ఉపన్యాస ప్రవాహానికి తనే ఆశ్చర్యపడినట్లు అనుభూతి పొంది ఒక చిరునవ్వు నవ్వాడు ఈశ్వరయ్య,
ఈశ్వరయ్య తన్ను మళ్ళీ దువ్వుతున్నా డనిపించింది శివరాంకు. వ్యక్తిగత ఘర్షణలు విస్మరించి ఏ కారణంవల్ల నైనప్పటికి ముందుకు వచ్చే అవకాశాలు వినియోగించు కుంటున్నప్పుడే వ్యక్తి విలువలు తమంత తామే హెచ్చుతాయని నమ్మిన శివరాం ఆ మాటల్లోని ఈశ్వరయ్య అంతర్భావం. న్వార్ధం, గుర్తించకుందానే “వికారం” నాటకంలో పాత్ర వేస్తానని అంగీకరించాడు. తన పన్నుగడ పషారిందని ఆశించిన ఈశ్వరయ్య సంతోషించాడు.
“ఏమోయి . రాణి మన నాటకాల్లో వేస్తుంది!... మామూలుగా అందరికీ యిచ్చేటట్లుగానే ఈమెకూ యిద్దాం...” అది సరళంగా మాట్లాడేననుకుని నవ్వుకున్నాడు ఈశ్వరయ్య,
“కనుక్కోమని నిన్ను బాధ పెట్టటం లేదోయి. . ఒక రోజు నన్ను ఆమెకు పరిచయం చేస్తే తక్కిన విషయాలు నేను మాట్లాడుకుంటా!” ఏవో పగటికలలలో తేలి ఈశ్వరయ్య మత్తుగా హాయిగా నవ్వాడు.
రాణి పరిచయస్తుల రంగంలోకి ఈశ్వరయ్యకూదా ప్రవేశించడం మానవనైజమైన దుర్భలత్వ నిదర్శనమే ననుకున్నాడు శివరాం ఈశ్వరయ్యను ఆమెకు పరిచయం చెయ్యడంలో బాహ్యంగా తన కేమీ నష్టం కలిగినట్లు భావించలేదు శివరాం.
ఈశ్వరయ్యను ఒకరోజు సాయంత్రం రాణి యింటికి తీసుకెళ్ళాడు శివరాం, రాఖిని చూడగానే తన శక్రొత్తసూబు ఇస్నీమడతలు నలగకుండా నిలుచుని వంగి, నమస్సరించి
అన్వేషణ (1 సున్నితమైన చిరునవ్వుతో చూపించిన కుర్చీమీద కూర్చున్నాడు ఈశ్వరయ్య అతనిని పరిచయంచేసి అతను వచ్చిన పనిని ముక్తసరిగా చెప్పాడు శివరాం నాటకాల్లో తన అనుభవం, నాటక సంస్థలలో తాను చేసిన కృషి తాను దర్శకత్వం వహించిన నాటకాలు విపులంగా ఏకరువు పెట్టి 'వికారం' నాటకంలో నాయికపాత్ర వహించాలని రాణిని కోరాడు.
“నాకు ఒంట్లో బాగుండటం లేదండీ.... ఈమధ్య వికారం, డోకులు, జ్వరం... చాలా అనారోగ్యంగా వుందండిీ. . అందుచేత క్షమించాలి!... ముభావంగా నవ్వి ఊరుకుంది రాణి.
“ఇరెరే” అంటూ నాలిక జారుస్తూ సానుభూతి చూపాడు ఈశ్వరయ్య,
రాణి ఇంక ఏమి మాట్లాడకుండా కూర్చుంది. ఈశ్వరయ్యకి మరేప్రసక్తి తేవాలో అర్ధంకాలేదు. “మీరు వేసిన నాటకాలు చూశాను... బాగా నటించారు” వినయంగా నవ్వాడు ఈశ్వరయ్య,
“అది మీ అభిమానం!” మందస్మితం చేసింది రాణి.
ఒక నిమిషం నిశ్శబ్దం.
పనిమీద వచ్చిన ఈశ్వరయ్యకు పని పూర్తయిందనిపించింది రాణి చనువుగా తొను ఇతరచోట్ల చూసిన వారాంగనల్లా ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. ఏవో కబుర్లు చెప్పి అవసరమైతే రెండు చిన్నపాత్రలు అభినయించి, రాణిని సమ్మోహనపరచాలనే ఈశ్వరయ్య కాంక్ష మొదటలోనే త్రుంచబడింది. “ఈసారి మళ్ళీ ఇంకో నాటకం తీసుకునేటప్పుడు మీ దగ్గరకే వస్తాం... అప్పుడయినా వొప్పుకుంటావని ఆశిస్తున్నా!” పెద్ద వలవేస్తున్న చేపలవాడిలా సంతృప్తి పడ్డాడు ఈశ్వరయ్య.
“అల్లాగేనండి... యెల్లకాలం అనారోగ్యం ఉండదుగా!”.... రాణి మెల్లగా నవ్వి నమస్కరించింది
రాణి లేవడంతో తానుకూడ లేచి నిష్రమించవలసిన సమయమాసన్న మయిందని [గ్రహించుకున్నాడు ఈశ్వరయ్య సెలవు అంటూ తుదినమన్నారం పెట్టి, (ప్రయోజనం ఇవ్వని తనసూటును నిందించుకుంటూ గుమ్మం దిగాడు ఈశ్వరయ్య. శివరాంకూదా వచ్చిన స్నేహితునితో వెళ్ళిపోవడం భావ్యం అనుకుని ఈశ్వరయ్యను అనుసరించాడు,
218 అన్వేషణ
అధ్చిత్రో కొన్ని ముఖ్యవిషయాలు మాట్లాడాలండీ . వారిని పంపించి మీరు ఆగుతారూ!” రాణ్ మందస్మితం, ఆమె మాటలు శివరాంకు చాలా విచిత్ర మనిపించాయి. ఆమెమీద తనకున్న అనుమానాలు ఆమె గురించి తను ఊహించుకున్న సంగతులు ఏవో అన్నీ విడిపోయి రాణి ఏదో కొత్త స్వరూపంలా అగుపించినట్లు ఉబ్బిపోయాడు శివరాం
గుమ్మం దిగుతున్న ఈశ్వరయ్య ఆశ్చర్యంగా ఆగి ఒక నిమిషం నిలుచున్నాడు.
“మీకేమి అభ్యంతరం లేదనుకుంటా? రాణీ ఈశ్వరయ్యను ఉద్దేశించింది.
భావి తలపుల్లో ఆమె గురించి కార్యక్రమాలు అన్వేషిస్తున్న ఈశ్వరయ్య, ఆమెకు అసంతృప్తి కలిగించడం ఇష్టంలేక, శివరాంను ఆగమని తాను ఒంటరిగా వెళ్ళి పోయాడు.
రాణి, శివరాం మళ్ళీ యధాస్థానంలో వీధిగదిలో కుర్చీల్లో కూర్చున్నారు. రాణి మౌనంగా సంభాషణ కదిపేముందు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ముఖభంగిమల్లో మునిగి చోయింది.
“ఏమిటా ముఖ్య విషయాలు?” శివరాం ఆత్రుతగా ప్రశ్నించాడు.
మరియమ్మ టీ తెచ్చి వెళ్ళివోయింది ఇద్దరూ చెరొక కప్పు అందుకున్నారు.
“క్క విషయం మీతో ఎంతో కాలంనుంచి చెబుదామనుకుంటున్నానండి... మరేమీ అనుకోరుగదూ![” అమాయకంగా దీనంగా ముఖం పెట్టింది రాణి.
“ఏమీ అనుకోను!” తీవ్రంగా, నిశ్చితవదనంతో ఆప్పరాలైన ఒక స్తీ తన జీవిత రహస్యం చెబుతోందనే ఆశతో. అతి నిజాయితీ మనిషిలా కూర్చున్నాడు శివరాం టీ గుటకలు వేస్తూ,
రాణి టీ కప్పు కాళీచేసి ఎదురుగా మేజాబల్లమీద ఉంచింది.
రాణి, గాజులు గలగల్లాడిస్తూ ముఖం అరచేతులతో తుడుచుకుని, కళ్ళు రాసుకుని, శివరాంవైపు తదేకంగా చూసి, మెల్లిగా నవ్వి నవ్వు పెంచి;పకపక నవ్వేసింది గట్లిగా. శివరాం ఆశ్చర్యవోయాడు.
రాణి అతన్ని చూసి మళ్ళీ కిలకిల నవ్వింది. నవ్వు ఆపుకోలేక పొట్టపట్టుకునీ ఒగరుస్తూ కంటవెంట ఆనందబాష్పాలు రాలుస్తూ, ఆనందం పట్టలేక చప్పట్లు చరుస్తూ కుర్చిమీద ఓరగా వాలిపోయింది.
అన్వేషణ 219
ఈ నవ్వుల శబ్దంవిని మరియమ్మ వచ్చి తొంగిచూసింది.
“ముఖ్య విషయాలు. . ఏమీ.... లేవండి... మీ స్నేహితుణ్లీ పంపీంచేసి మిమ్మల్ని ఇంకాకొంతసేపు మా యింట్లో అట్టే పెట్టెయ్యాలని .. మళ్ళీ పకపక నవ్వింది.
అదంతా నటనో, నిజమో అర్ధం కాలేదు శివరాంకు. చెప్పదలుచుకున్నది ఏమీలేక యిలా నటించడం నిజమో, చెప్పదలచుకున్నది చెప్పలేక పరిస్థితి మార్చుతూ యిలా నటించడం నిజమో సతమతమయ్యాడు. కాని రాణీ ప్రవర్తనలో ఏదో కొంత విచిత్రగూఢజీవితం మాత్రం ఉందని నిర్ణయించుకున్నాడు శివరాం.
శివరాం తన్ను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అర్ధం చేసుకుంది రాణి అతని ఆలోచనలు సాగకుండా ఎదురుగుండా ఉన్న తను ఆటంకం కలుగచెయ్యడం విధ్యుక్తధర్మంగా ఎంచఛచింది రాణి.
“ఏమండీ.... మీకు పాటలు పాడడం వచ్చునా?
రాణి ప్రశ్నకు విస్తుపోయాడు శివరాం. సాధారణంగా మగవాడు ఆడదాన్ని వెయ్యవలసిన ప్రశ్న రాణి వెయ్యడంలో ఆమె అంతరార్ధం అవమానమో ఏమో శివరాం అర్ధం చేసుకోలేకపోయాడు.
“పోన్ నేను పాడుతా... వినండి!” శివరాం మౌనం చూసి రాణి పాట మొదలెట్టింది.
అనురాగాన్ని జ్ఞప్తికి తెచ్చే ప్రేమికురాలి గీతి ఒకటి వినిపించింది. ఆమె గొంతులో మాధుర్యమున్నాా స్వరం, రాగంలో సాధన లేకపోవడంవల్ల, ఆమె పాట ఎక్కువ ఆకర్షణీయంగా లేదు శివరాంకు. అయినా కాలక్షేపానికి బాగానే ఉంది అనుకున్నాడు శివరాం. పాట ఆగిపోయింది, రాణి మెల్లిగా నవ్వుతూ ఊరుకుంది.
శివరాం (పేక్షకుని సహజరీతిలో చప్పట్లు చరిచాడు.
“నన్ను హేళన చేస్తున్నారా?” రాణి బిక్కముఖం పెట్టింది.
శివరాం ఏదో అనబోయాడు.
“అవును నాపాట బాగాలేదు... నేను పాడలేను". రాణి కన్నీరు రెండు చుక్కలుగా ఉబికి ఆమె కనుకొలకుల్లో నిలచింది. గబుక్కున చీరకొంగులో ముఖం దూర్చుకుని
220 అన్వేషణ కాస్సేపు ధ్వనిచెయ్యకుండా ఎడ్బింది ముఖం తుడుచుకుని నిమీలిత నేత్రాలతో బరువుగా (క్రిందకు చూస్తూ కూర్చుంది.
'ఎందుకు ఏడ్చావు రాణి' రాణి ప్రవర్తన శివరాం దృష్టిలో నిమిష నిమిషము తిరుగుతున్నట్లనిపించింది.
“ఏమండీ నాబొమ్మ ఎప్పుడు వేస్తారూ?” విషయం మార్చింది రాణి.
“నా చిత్రలేఖనం నీ పాటలాగే ఉంటుంది!”
“పోనీలెద్దురు . అందరు నాలాగే డొక్కులా ఉండాలేమిటి” లేచి ఒయ్యారంగా చీరకొంగు చేతితో ముడివేసుకుని కులుకుతూ నవ్వింది రాణి.
“అయితే మీరు ఎప్పుడు వేయమంటే అప్పుడు వేస్తాను. .. మాయింటికి వచ్చి జాగ్రత్తగా రెండు గంటలు కూర్చుంటే మీసైజు బొమ్మగీసి యిస్తాను... మా అమ్మా తాతయ్య కూడా యిక్కడే ఉన్నారు... నిన్ను ఒక్కసారి వాళ్ళకు పరిచయం చేసాను!” శివరాం ఆపాడు తన మాటలు, రాణి శివరాంవైపు నిశితంగా ఒక క్షణం చూసింది.
“వేళ్తాకోళంగా అడిగాను... నా బ్రతుక్కు బొమ్మలు గీయించుకోవడం కూడానా. .. ఎందుకులెండి?” పెదాలు విరుచుకుని, లీలగా యింటి పైకప్పుచూస్తూ కనుబొమలు ఎగురవేస్తూ నవ్వింది రాణి. ఆమెలో కనిపించిన నిర్లక్షమైన నిరాశ శివరాంను చకితుడ్ణి చేసింది.
“పమండి!... యింక మనం యిద్దరం కలిసి నాటకాల్లో వేయడం పడదు.
శివరాం నిర్దాంతపోయాడు.
“ఏమీలేదు పరమహంసగారు యీమధ్య గానకచేరీలు ఎక్కువ చేస్తున్నాడు... సరళ అనే అమ్మాయి బాగా పాడుతుంది లెండి.... ఆమె గానం చూనీ ఆయన ముగ్శలైవోతున్నారు!”
రాణి మాటల్లోని వ్యంగ్యం శివరాం గుర్తించాడు.
పరమహంస ఆకస్మికంగా రాణి యింట్లో ప్రత్యక్షమయ్యాడు.
“బాగుంది .. యిద్దరూ యిక్కడే ఉన్నారన్నమాట... నాకు శ్రమ తప్పింది!” నవ్వుతూ పరమహంస వారివైపు నిశితంగా చూశాడు.
అన్వేషణ 221 శివరాం కంగారు పడ్డాడు కొంచెం పరమహంస సంభాషణ విని. రాణి నిర్లక్ష్యంగా నిర్భ్వయంగా మామూలుగా ఎదిరేగి పరమహంసకు సమస్మరించింది.
“రాణ్రీ!”... యిదిగో పుస్తకం .. మీ యిద్దరూ ఎల్లుండి నాటకానికి తయారు కావాలి... నేను వెళ్ళిపోతున్నా. .. ఒకచోట గానకచేరి ఉంది ఈవేళ” పరమహంస చిరనవ్వుతో తృటిలో నిష్రమించాడు,
రాణి బల్లమీద విసిరిన నాటకం పుస్తకం, విడివడి కాగితాలు గాలిలో రెపరెప శబ్దాలు చేసుకుంటూ గడియారం టిక్కు టిక్కు ధ్వనులకు తాళం వేస్తోంది.
పరమహంస పరుగుచూసి రాణి విచిత్రంగా బుజాలు ఎగరవేసుకుని పెదాలు విరుచుకుంది.
వెళ్ళిపోయిన పరమహంస మళ్ళీ వచ్చి “రాణి ఈ పొట్లం.... నీకివ్వాలనుకుని మర్చిపోయాను!”... అంటూ కంగారుగా రాణి చేతిలో పెట్టి మళ్ళీ పరుగులో అదృశ్యమైవోయాడు.
పొట్లం విప్పింది రాణ్.
జహంగీరు, లడ్డు, పాలకోవా... తీపి పదార్ధాలు చూడగానే రాణి నోరూరుంది. “సగం మీకు... సగం నాకు!” రాణి సగం శివరాం చేతిలో ఉంచింది. మర్యాదకు కనక తప్పలేదు శివరాంకు. పరమహంస పెద్దరికంలో అతని చనువుకు అపార్జాలు అణిగిపోయాయి.
తీపితినడం పూర్తిచేసి, పరమహంస నాటకం కాసేపు యిద్దరూ దందడకంలా వల్లించారు. శివరాం వెదతానంటూ లేచి నిలబడ్డాడు.
“మళ్ళీ ఎప్పుడు దర్శనం?” రాణి ప్రశ్నించింది.
“నిత్యమూ!” నవ్వాడు శివరాం.
“సత్యం?” నవ్వింది రాణీ.
శివరాం తల వూపాడు. వెళ్ళిపోతున్న అతనివైపు తదేక దృష్టితో చూసి రాణీ
222 అన్వేషణ దిగులుగా యింట్లోకి నడిచి మంచమీద బోన్లగిల వాలిపోయి విచారంగా నిట్టూర్చి కాస్సేపు కన్నీరు కార్చింది.
రాణి ప్రవర్తనలో భావతరంగాలు మెలికలు తిరిగి హరాత్తుగా నిమ్మోన్నతాల దశలు ఏర్పరచుకోవడం శివరాం స్పష్టంగా ఆనాడు గమనించాడు ఆమె జీవితాన్ని అన్వేషణ చెయ్యడంలో తనకు కొంత పరమార్ధం లభిస్తుందేమో అని ఆలోచనలో పడ్డాడు శివరాం.
వీధిలో బస్సుస్తాండువైపు నడుస్తున్న శివరాంకు ఎదురుగా వచ్చి ఒక రిక్షా ఆగింది.
“ఏయ్ స్వామీ!” కాకీటోపి తగిలించుకుని, చేతిలో వానకు తొడుక్కునె కోటు వేలాడించుకుంటూ రాజారావు నవ్వుతూ శివరాం ఎదురుగా నిలిచాడు.
రిక్షాను రెండు చేతులతో బలవంతంగా పట్టుకుని, కష్టంగా కాళ్ళు మెల్లిగా నేలమీద మోపి నిల్చుని, పొడవైన చేతులు ఊపుకుంటూ “ఏం మిత్రమా .. కుశలమా... నీ దర్శనంకన్న భగవద్దర్శనమే సులభమనిపిస్తోందే!” విచిత్రంగా నవ్వాడు చక్రవర్తి. చేతులు చాపిన రిక్షావాడి చేతులో నాల్లణాలు రాల్పాడు రాజారావు.
“పదవోదాం!”
“ఎక్కడికి!” రాజారావుని చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
“మిత్రమా నీలో మార్పురావాలి .. నాయకుడి మాటకు ఎదురు ప్రశ్న...? పైగా అటువంటి అశుభమైన ప్రశ్న ! నడు...నడు” గెంటాడు శివరాంను చక్రవర్తి,
“ఇంటిదగ్గర అమ్మ, తాతయ్య నా కోసం ఎదురుచూస్తోంటారు భోజనానికి!”
“అది నీ వయస్సు వచ్చినవాడు అనవచ్చునా మిత్రమా?.. మమ్మల్ని బ్రతికుండగా హత్యచేస్తున్నా వన్నమాట!” చక్రవర్తి విరగబడి నవ్వాడు.
“నీ భోజనం ఏమైపోదు... ఎప్పుడు తీసుకువచ్చేవు మీవాళ్ళను!” రాజారావు శివరాం బుజంపట్టుకుని చక్రవర్తికి కనుసైగ చేశాడు.
రెండు రిక్షాలు పిలిచాడు చక్రవర్తి ఒక దాంట్లో తాను హాయిగా తన పొడుగాటి చేతులు కాళ్ళు యిముడ్చుకుని కూర్చున్నాడు చక్రవర్తి తక్కినదాంట్లో రాజారావు, శివరాం ఎక్సారు. రిక్షాలు అబిద్స్లోని బార్ కేఫ్‌లోకి నడిచాయి.
అన్వేషణ ౨223 శరీరంలో పక్షాన్ని లోవల బనీన్ను బాహ్యంగా కనిపించ చేసే ఉల్లిపొర కోగితంలాంటి చొక్కాలో రాజారావు ఆరోజు చాలా వింతగా కనిపించాడు శివరాంకు. “నీకోసం ఎన్ని సార్లు వచ్చినా యిల్లు తాళమేకదు స్వామీ? బ్రతికి ఉన్నావో లేదో అనే అనుమానం కలిగింది!”
“మా పాపాయి చిరంజీవి గురించిమరేమి బెంగపెట్టుకో నకృర్లదు!” చక్రవర్తి అన్నాడు.
శివరాం కాస్సేపు చెప్పాడు తన కార్యకలాపాలు పెరిగి పోయాయని, ఆఫీసులో పని ఎక్కువైపోయిందని, ఇంతలో గృహంలో కష్టాలు కలిగి ఆ చింతలో మునిగిపోయానని కలుసుకుందా మని ప్రయత్నించినా ఏదో పని అడ్డంవచ్చి కలుసుకోకపోవడం జరుగుతోందని, మామూలు ధోరణిలో నవ్వేశాడు శివరాం. “నువ్వు నన్ను కలుసుకోకపోతున్నా, నీ వ్యవహారాలు, నువ్వు ఎక్కడుండేది అన్నీ నాకు తెలుసు. .. యిప్పుడు నువ్వు ఒక అమ్మాయి యింటినుంచి వచ్చావా లేదొ?” రాజారావు ప్రశ్నకు శివరాం నిర్దాంతపోయాడు.
“అవును.... మా నాటకాలలో వేషం వేస్తుంది” సర్దుకుంటూ సమాధానం ఇచ్చాడు శివరాం,
“ఏవరు? -రాణి ?” చక్రవర్తి రాజారావుకు సైగచేశాడు
“ఇందులో క్రొత్త ఏముంది- ఎల్లుండి నాటకం ఉంది, రిహార్సల్సు చేసుకోడానికి" నవ్వాడు శివరాం.
“ఏమైనా ఫరవాలేదు... జీవితంలో ఆడదాని స్నేహం చైతన్యం కలిగిస్తుందిలే - నీలో మార్పు రావాలి మిత్రమా - త్వరలోనే రావచ్చు అని నా ఆశ.” అంటూ చక్రవర్తి ఎదురుగా సెర్వరుఉంచి వెళ్ళిపోయిన మంచినీళ్ళగ్లాసు ఖాలీచేశాడు.
“ఏమిటి మారిపోతున్నావు?” శివరాం (ప్రశ్నించాడు రాజారావును అతని వింత దుస్తులు చూసి,
“ఏది శాశ్వతం ? - అందుకే (బ్రతికున్నంతకాలం నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు 'బ్రతకమన్నారు - యీమధ్య జగతి మిధ్య అనే సిద్ధాంతము బాగా అలవడిపోయింది. గతం మరచి భవిష్యత్తులో ఆలోచించక, ప్రస్తుతం చక్కగా గడపగలిగిన వాడే ధన్యుడు!”
రాజారావు మాటలకు చక్రవర్తి తప్పట్లు కొట్టేశాడు.
22శ్మ అన్వేషణ
“అందుచేత - మంచివాడవు - నువ్వుకూడా గతం మరచి, ప్రస్తుతం మాతో ఇక్కడి పానీయాలు సేవించి, భవిష్యత్తు గురించి ఆలోచించక, మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి మిత్రమా” చక్రవర్తి శోకంలా వల్లించాడు మాటలు శివరాంవైపు తిరిగి
బ్రాంది రెండు గ్లాసుల్లో సోడాలో కలిసి ఎర్రగా నిండింది, బుదగలు గాసు మట్టంనుంచి పైకితేలి ఎగురుతున్నాయి. రెండుసోడా ఎిడ్లు దిష్టిబొమ్మల్లా నల్లగా టేబులు మీద నిలుచున్నాయి.
“అయ్యగారికి మంచి వింటో ఒకటి తెచ్చిపెట్టు. .. ధాజూరావు సెర్వరుకు కనుసైగ చేశాడు.
శివరాం వింటో త్రాగేదు సగం.
సిగరెట్టు ముట్టించాడు
సిగరెట్ల పొగలతో గది అంతా నిలిడిపోయింది.
ప్రక్క గదుల్లోని జనం త్రాగుతూ తూలుతూ తేలుతూ పలుకుతున్న ధ్వనులు గాలిలో గందరగోళం చేస్తున్నాయి.
రాజారావు చ(కవరి, శివరాంకు తెలియని నన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు.
తల తిరుగుతున్నట్లనిపించింది శివరాంకు వింటో పూర్తిగా తాగెయ్యగానే. “ఇందులో ఏమన్నా కలిపేరా?” శివరాం అయోమయంగా అడిగాడు. మాటలు తేలిపోయాయి. సిగరెట్టు పొగలు కళ్ళముందు సరదాగా నృత్యం చేస్తున్నాయి.
“ఎంత మాటన్నావు మిత్రమా... మిత్రద్రోహమా?” ... అటువంటి కథలు పంచతం[త్రంలో ఉంటాయి.... మనజీవితంలో కాదు!.. ” చక్రవర్తి నవ్వాడు. “మనవడు స్వర్గం చూస్తున్నా డనుకుంటా!” రాజారావు మత్తుగా ఆలోచిస్తున్న శివరాంను చూసి చక్రవర్తితో కులికాడు.
శివరాంకు అర్దమయింది మిత్రులు వింటోలో కలిపి మత్తుద్రావకం యిచ్చారని.
రాజారావు బంగాళదుంప ముక్కలప్లేటు శివరాం ముందుకు తోశాడు తినమని.
నవ్వుతూ అందుకున్నాడు,
అన్వేషణ 22గ5
'ఎల్లావుంది స్వామీ.... ఏమన్నా కలలు వస్తున్నాయా?” రాజారావు నవ్వాడు.
'అది తీసుకుంటే... నిత్యం అమ్మాయిల కలలే తలలో!”
'స్యామికి మనమీద కోపం వచ్చింది!” రాజారావు శివరాం వైపు చూశాడు.
“మిత్రమా.. పూర్వం రాక్షసులు దేవతలు కలిసి సముద్రమధనం చేసినప్పుడు అమృతమనేవస్తువు పుట్టింది.... విన్నావా ఆ కధ... ఆ అమృతమే యిది...!” గ్లాసులో మిగిలినది ఒక గుక్కలో త్రాగేశాడు చక్రవర్తి
చక్రవర్తి హాస్యం శివరాంకు మత్తులో గిలిగింతలు పెట్టి, పకపక కులుకుతూ నవ్వాడు.
“ఫరవాలేదు - మన ధోరణిలోకి వచ్చాడు”
“ఎందుకు రాడు - మహాత్ములైనా వస్తారు?” రాజారావు మాటకు చ(క్రవర్తి తాళం వేశాడు
తాంబూలాలు వేసుకుని మాక్రోపోలో సిగరెట్లు త్రాగుతూ పబ్లిక్ గార్జెన్స్లో పిచ్చావాటి కబుర్లతో గంటసేపు గడిపారు ముగ్గురూ.
శివరాంకు నిషా తగ్గినట్లయింది కొద్దిగా. సెలవు తీసుకుంటానంటూ లేచాడు.
వెళ్ళిపోతావా - నన్ను విడిచి - ప్రియతమా - రేపు వచ్చెయ్యి మా యింటికి! - జూలి ముఖంతో నవ్వాడు చక్రవర్తి.
గృహోన్ముఖుడైయాడు శివరాం. ఆ మత్తు ద్రావకంలో పరుగిడే ఆలోచనలు, గిలిగింతలు పెట్టే శరీరంలోని వెచ్చదనం, సడలిపోయే నరాల బిగింపు, నొప్పులు ఒక విధంగా శారీరకంగా హాయి అనిపించింది శివరాంకు,
ఇల్లు చేరేటప్పటికి రాత్రి పదిగంట లయింది. నిద్రపోతున్న బ్రహ్మయ్యగారు తలుపుచప్పుడికి మెళుకువవచ్చి లేచి తలుపు తీసి మళ్ళీ పడుకున్నారు. కొంగు పరుచుకుని, విద్యద్దీపాల కాంతిలో మగత నిద్రలో నడుం వాల్చిన సుభద్రమ్మ లేచి, కొడుకుకు భోజనం ఎర్పాట్లు చేసింది. రుచికరమైన తల్లి భోజనంతో, శరీర అలసట తగ్గిన మత్తుతో నిర్విచారంగా హాయిగా సుషుప్తిలో మునిగిపోయాడు శివరాం.
226 అన్వేషణ
రోజూ ప్రొద్దున్న ఏకపంక్తిని కూర్చున్నప్పుడు తప్ప, ఆఫీసు దినాలలో శివరాంకు ఏమీ తీరక దొరకటం లేదు బ్రహ్మయ్య గారితో మాట్లాడ్డానికి, నగరం వచ్చాక ఒక ఆదివారం వీలు చేసుకుని తాతయ్యను, తల్లిని టాక్సీమీద త్రిప్పి, నగరము, నగరంలోని ముఖ్యమైన అందమైన ప్రదేశాలు చూపించాడు శివరాం. రాత్రి శివరాం ఇంటికి వచ్చేటప్పటికి బ్రహ్మయ్యగారు నిద్రలో మునిగి ఉంటారు. మళ్ళీ ఏ సెలవు దినం నాడో విరామంగా యిద్దరూ మాట్లాడుకోవటం జరిగేది.
నాటకాల్లో, క్షబ్బుల్లో [గగ్రంధాలయాల్లో సభల్లో కాలం గడిపే శివరాంకు కార్యక్రమాలు పెరిగి తీరిక కూడా తగ్గిపోయింది. ఇంటిలో ఒక క్షణమైనా ఉండని శివరాంమీద బ్రహ్మయ్యగారికి కొంత విసుగుగూడా కలిగింది. తన ఇంట్ళోకి సరుకులు తేవడం దాసీదానికి నియోగించాడు శివరాం. తన తీరిక గడపడం కష్టంగా ఉందని బ్రహ్మయ్యగారే స్వయంగా యింటి పనులన్నీ చూచుకోసాగారు.
పేరిశాస్తి బ్రహ్మయ్యగారి పరిచయం చేసుకున్నాడు మిగిలిన ఒక్క మనుమడి పెళ్ళీ త్వరగా చెయించి బూరెముక్క పెట్టించమని వేధిస్తూ నిత్యమూ సంబంధాల జాబితా వల్లించేవాడు పేరిశాస్తి. బ్రహ్మయ్యగారు సగం విని, సగం వినక, నచ్చినవి శివరాంకు చెప్పి, సుభద్రమ్మతో సంప్రదించి, బలవంతంగా ఒక్కొక్కసారి శివరాంకు ఏదో సంబంధం చూసివా, శివరాం నచ్చలేదనే పెళ్ళికొడుకు “వీటో” ఉపయోగించి సమస్యను ప్రక్కకు పెట్టేసేవాడు. ఎన్ని సంబంధాలు వస్తున్నా తిరగ్గొట్టె కొదుకు ప్రవర్తన సుభద్రమ్మకు నచ్చలేదు. అనునయంగా మందలించింది. ఏడో సంబంధం నిశ్చయించమని (బ్రతిమలాడింది.
శివరాంకు యింటికి వస్తే పెళ్ళిగొడవ. పేరిశాస్తి దర్శనము తప్పక పోవడంతో నాటక కార్యక్రమాలు పెంచుకున్నాడు మరి కొంత. పరమహంస నాటకాల్లో ప్రముఖపాత్రవహిస్తూ తోడ్పడుతున్న శివరాంను తన నాటక సంస్థలో చేరమని కోరినట్లయితే అతనికి ఒక ఆధారం తగ్గి పరపతి పోయినప్పుడు రాణీని కూడా క్రమంగా తమ సంస్టలోకి బెట్టుమీద చివరికి తీసుకోవచ్చునని యుక్తిపన్నాడు కృష్ణమూర్తి అతను చూడగానే ఒప్పుకున్నాడు శివరాం అతని సంస్థలో పనిచేస్తానని. సరళ సంగీతసభలతో జిల్లాలుకూడా పర్యటిస్తూ బాగా ధనార్దనిచేస్తున్న పరమహంస చాలా కాలం నగరంలో ఉండడని శివరాం ఊహించాడు. కృష్ణమూర్తి ఆహ్వానం తనకు సమయోచితమైందని సంతోషించాడు.
అన్వెషణ 227 నవయువక మండలి నాటకాల్లో, గంధర్వ నాటక సంస్థ 'వికారం' ప్రదర్శనలో, పరమహంసతో జంటనటకుడి పోజుల్లో రంగస్టలంమీద ఉభయనగరాల్లొ తరచు కనిపిస్తున్న శివరాం నటకుడిగ* బాగా పేరుపొందాడు అతని నటనా కౌొశల్యం చూసి నగర ప్రముణులు ప్రశంసించారు, వారు నడిపే ఇతర సాంస్కృతిక ఉత్సవాలలో శివరాం సహాయం ఆపేక్షిస్తే ఛీ స్వయంగా తానొక నాటక బృందం కొందరి క్రొత్త స్నేహితులను కూడగట్టుకుని తయారుచేసి, ప్రదర్శన లిచ్చెవాడు శివరాం తీరిక దొరికినప్పుడు చిత్రలేఖనంతో కాలం గడిపేవాడు. తెచ్చిన జీతంలో సగం పైగా వీధిలోని కార్యక్రమాలకు, బొమ్మలకు ఖర్చుచేసే శివరాం ప్రవర్తన బ్రహ్మయ్యగారికి నచ్చలేదు. ఉద్యోగ సంపాదన తర్వాత ఎప్పటికైనా నాల్గురాళ్ళు పోగుచేసుకుని, ఒక గృహస్థుడై మునిమనుమలకని, కుటుంబంతో కలకలలాడవలసిన శివరాం ప్రయోజంలేని ప్రజాకార్యక్రమాలపేర జీవితమంతా నిరుపయోగం చేసుకుంటున్నాడు” అని చిరాకు పద్దారు బ్రహ్మయ్యగారు. కృష్ణమూర్తి రిక్షాలో కనిపించేడు బషీర్‌బాగ్ చౌరస్తాలో శివరాం సాయంత్రం ఆఫీసునుంచి మెల్లిగా నడిచివస్తూంటే, ఏదో నాటక విషయాలు సంభాషణలో దొర్లాయి. 'రాణినికూడ మన నాటకాల్లో వేషం వెయ్యమనండీ!' అన్నాడు శివరాం యధాలాపంగా. 'రాణి... ఎవరు?”. పరమహంసతో నాటకాలు వేస్తుంది. .. ఆ పిల్లా... చాలు చాలు! ముఖం చిట్లించాడు కృష్ణమూర్తి. 'ఎం ? అలా అన్నావు?' నవ్వాడు శివరాం 'ఆ అమ్మాయి విశ్వాస ఘాతకురాలోయి!” “అసలు యీ నగరంలో పేరూ ఊరులేని పరిస్థితుల్లో నటన నేర్పి ఒక నటీమజణిని జ్ ఆ వ్ జల ను చేసి, పేరు ప్రఖ్యాతులు కలగజేస్తే ఆ విశ్వాసం మర్చిపోయి, నాటక సంస్థను వదలి ఎవడో... దూరంనుంచి వస్తే డబ్బు బాగా యిస్తున్నాడని వాడితో నాటకాలు వేయడమా?” కృష్ణమూర్తి రుద్రుడై పళ్ళు పటపట కొరికాడు. కృష్ణమూర్తితో యింక ఆ విషయం కదపకూడ దనుకుని మానేశాడు శివరాం. నాటకసంస్థ ఆదాయ వ్యయపట్టిక చర్చించడానికి సర్వసభ్య సమావేశం వచ్చే ఆదివారం
228 అన్వేషణ తన యింట్లో జరుగుతుందని, ఖాని కార్యక్రమాలు కొన్ని నిర్ణయించుకోవాలి కనుక, తప్పక సమావేశానికి రావలసిందని కోరాడు కృష్ణమూర్తి సెలవు తీసుకుంటూ
శివరాంకు రాణినిగురించి విన్న సంగతులు (క్రొత్తగానే తోచాయి. ఇంతవరకు పరమహంస దగ్గర రాణి డబ్బు పుచ్చుకుంటున్నట్లు శివరాంకు తెలియదు. నాటకాల సరదాలో నాటకరంగం ్రవేశించినదనుకున్నాడు కృష్ణమూర్తికి రాణీకి పరిచమున్నట్లయినా ఒక్కరోజూ తనకు చెప్పనేలేదు. ఎంత సన్నిహితంగా కనిపించినా రాణిలో తొను ఎరుగని సంగతులు ఎన్నో ఉన్నాయనుకున్నాడు శివరాం.
సుల్తానుబజారులో బట్టలషాపులో పంట్లాం గుడ్డకొనీ, దర్జీవాని షాపులోకి నడిచాడు ఒక సాయంత్రం. షాపు ముందుభాగంలో వార్నీసు పూసిన నున్నని గుండ్రని పెద్ద మేజూబల్ల చుట్టూ అద్దాలు, క్రొత్త సూటులు తొడుక్కుని షోకుగా నడుస్తున్న యువకుల ఫోటోలు. రకరకాల గౌనుల్లో నీటుగా నడుస్తున్న అమ్మాయిలు బొమ్మలు దుకాణం గోడకు తగిలించి ఉన్నాయి. రాణీ కుర్చీలోంచి గబుక్కున లేచింది శివరాంను చూసి నమస్కరిస్తూ,
“ఇలా వచ్చారేమిటి?' చనువుగా పది మందిలోను ప్రశ్నించింది.
ఆమెతో మాటాడదానికి కొంచెం మొదట జంకినా, మర్యాదకు సమాధాన మీచ్చాడు శివరాం, తన పంట్లాం కుట్టించుకోవదానికి వచ్చానని.
“ఏమండీ! మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి!” రాణి మెల్లిగా శివరాంతో చెవిలో నసిగింది.
“మళ్ళీ వేళాకోళమా?” శివరాం పూర్వపు సంగతి జ్ఞప్తికి తెచ్చాడు.
“ఒట్టు!” బలవంతంగా శివరాం చెయ్యి లాక్కుని శివరాం చెయ్యి పట్టుకుంది రాణీ,
వారి చనువు సంభాషణ వింటూ దర్గ్దీవాడు కత్తిరించే బట్టలు అట్లాగే వుంచి, కళ్ళజోడులోంచి సునిశితంగా సొగసుగా చూశాడు రాణివైపు,
తయారయిందని రవిక తెచ్చి యిచ్చాడు రాజీకి, రెండవ గదిలో మిషన్ కుడుతున్న మనిషి. మన పంట్లాం కొలతలు దర్దీవాడి కిచ్చాడు శివరాం మద్వాదకు, హోదాకు, రాణి రవికబిల్లు శివరాం చెల్లించాడు. శివరాం (ప్రవర్తన చూసిన దర్జీవాడు యువక (యమేమికలనుకుంటూ కులుకుతూ నవ్వుకున్నాడు లోలోపల.
అన్వేషణ 220 రాణి, శివరాం, ఇరానీ హోటళల్తోని చెక్కలగదిలోకి నడిచారు. తలుపు మూయబడింది శివరాం బిస్మట్లు కాఫీ తెమ్మని ఆర్జరిచ్చాడు.
“పరమహంశ అదృశ్యమయ్యాడండీ!”
కళ్ళు పెద్దవిచేసి, ఒగరుస్తూ, అమాయకంగా, భయంగా మాటలు జార్చింది రాణి.
“ఎక్కడికి... ఎప్పుడు?” శివరాం ఆశ్చర్యంతో బల్లగుద్దాడు
“ఏమో.... ఒక రోజు సాయంత్రం బయటి జిల్లాలలో వవో ప్రదర్శనా లున్నాయి... ఓ వారం రోజుల్లో మళ్ళీ వస్తానంటూ ... హోటలు గదికి తాళంవేసి వెళ్ళాడుట మూడు వారాలు గడిచినా తిరిగి రాలేదు ఆ హోటలువాడు అతని రాకపోకలు తెలుసునా అని మాయింటికి వచ్చాడు . నాకు భయం వేసింది .. హొటలుకు మూడువందల రూపాయలు చెల్లించాలిట... ఆ పాటలు పాడే అమ్మాయి, సరళను, లేవదీసుకు పోయాదని పుకారు.... ఏమిటో అంతా చికాకుగా ఉందండి.... ఆయనతో తిరిగిన స్నేహితులం మన మని అప్పులవాళ్ళు, పోలీసులు మనవెంట బడరుగదా?” రాణికి చమటలు పోశాయి. కంగారుగా గబగబా మంచినీళ్ళు త్రాగింది.
“మరేం పరవాలేదు ... ఏమన్నా జరిగితే నాకు చెప్పు... నేను, చూసుకుంటా తక్కిన సంగతి!” మగవీరుడిలా ఆ సమయంలో అభయం యివ్వడం తన ధర్మం అనుకున్నాడు శివరాం.
“నిషమణ” అనే (క్రొత్త నాటకం రిహార్సల్సు వేయించాలని నిశ్చయించి, నటకులనంతా సమావేశ పరిచాడు కృష్ణమూర్తి శివరాం వేళకు సమావేశానికి హాజరయ్యాడు. రాణి ఎదురుగవచ్చి లేచి వినయంగా నమస్కరించింది. కృష్ణమూర్తి రాణిపై కోపంగా చూశాడు. రాణి అక్కడికి ఎలా వచ్చిందో శివరాంకు అర్ధం కాలేదు. బహుశా పాతస్నేహం మళ్ళీ బలపరచుకుని ఉండవచ్చు వారిద్దరూ అనుకున్నాడు శివరాం.
పరమహంస నగరంనుంచి నిష్కంమించడంలో కృష్ణమూర్తి నాటకరంగం కార్యక్రమాలకు చాలావరకు పెద్ద ఆటంక మొకటి తప్పిపోయింది. నాటకా అభిరుచిగల ప్రేక్షక్షజనంలో సగంపైగా క్రొత్తగా వచ్చిన పరమహంస ప్రదర్శనలకు ఎగబ్రాకడంవల్ల కృష్ణమూర్తి వేసిన నాటకాలకు రాబడి తగ్గిపోయింది. మళ్ళీ మంచిరోజులు వచ్చాయని సంతోషించాడు కృష్ణమూర్తి.
230 అన్వేషణ “నిష్రమణ”కు పాత్రధారులు ఎన్నుకోబడద్దారు. హుస్సేను ఆలీ, జగదీశ్వర్, ఆచారి, శ్రీనివాసు రామారావు, వనజ, రాణి, శివరాం .. అమోఘమైన నటకులంతా యధాలాపం అల్లరి మానలేదు. తనకు తెలిసినా తెలియక పోయినా దర్శకుడిగా తన విలువైన సలహాలు అందజేయాలని కృష్ణమూర్తి తాపత్రయ పడ్డాడు. వినీవిననట్లు నటకులంతా తమకు తోచిన విధంగా నటించసాగారు.
“రాజీ! యీ సన్నివేశంలో నువ్వొక పాటపాదాలి!” దర్శకుడు తనకు తట్టన మెరువులాంటి యుక్తి తెలియపరిచాడు.
“నాకు పాటలు బాగా రావండీ!”
“వచ్చినట్లుగానే పాడు... వినాలి!” దర్శకుడి పూర్తిహోదా పుంజుకుని తీవ్ర వదనం దాల్పాడు కృష్ణమూర్తి.
వనజ, రాజి కాస్సేపు స్తీ సహజమయిన సిగ్గు బిడియాలతో గుసగుసలాదు కున్నారు
“నే పాడనాండీ!” అంది వనజ.
“*ల్త పాత్ర నీదికాదుగా!?” కసిరాడు కృష్ణమూర్తి.
రాణి బలవంతంమీద పాడింది.
నటకులంతా ముఖాలు ప్రక్కకు త్రిప్పుకుని ఆముదం త్రాగి నట్లు ముఖం చిట్లించారు.
“పాటలూరవు, నటనరాదు!” కృష్ణమూర్తి నీల్లాడు.
“ఈమధ్యన నృత్యం బాగా నేర్చుకున్నానండి స్కూల్లో!” రాణి నృత్యంభంగిమలో స్కూలులోని పిల్లలా, మేష్టారియందు చూపే భయభక్తులతో లేచి నిలుచుని హాస్యంగా సమాధాన మిచ్చింది.
“రాణీ ! నువ్వు నాటకాలనుంచి విరమించడం మంచిది మొదటలో నా దగ్గరకు ఎలా వచ్చావో అలాగే ఉన్నావు ... ఇంతకాలం పరమహంసదగ్గర ఏం నేర్చుకున్నావు? ,.. పైగా నేర్చిన నటన కూడా పాడుచేసుకున్నావు!... మనుస్సులోని అక్కసు వెళ్ళబుచ్చుకున్నాడు.
“ఇక్కడి నటకుల్లో నాకంటె ఎవరు బాగా నటిస్తున్నారు... చాలెంజిగ” రాణీ రీవిగా హాస్యంగా లేచి నిలుచుని సవాలు చేసింది.
అన్వేషణ 231
“హియర్ ! హియర్'” భీమారావు ఎదుర్శొనే మగధీరులెవరా?” అని గేయం పాదాడు.
“ఈకాలంలో ఆదవాళ్ళమాటకు ఎదురుచెప్పలేము,” శ్రీనివాసు ఘోషించాడు.
*ఊ నా నటనతో రాణికి పోటీగా నిలబడతా!” .... జగదీశ్వర్ మూతి చిన్నది చేసి కాళ్ళు ఎగరేసుకుంటూ ముందు నిలబడ్డాడు
కృష్ణమూర్తికి యీ అనవసర హాస్యంచూచి చికాకు కలిగింది.
అవ్వి రెవ్వరూ నటనవృద్ధి చేసుకోవటం లేదు. ఇటువంటి వాళ్ళతో నాటకం వెయ్యడం, వేయించడం నా తప్పు గట్టిగా అరిచాడు కృష్ణమూర్తి.
అందరూ నిశృబ్దం వహించారు. “రాణి నువ్వు పాటలు పాడకు... (పేక్షకులు భయపడగలరు” కృష్ణమూర్తి శాసించారు.
“వ్రశినీ ఆమె బదులు తెరవెనకనుంచి వనజను పాదమనండి!” భీమారావు వయ్యారంగా సిగ్గుగా త్రిప్పుకున్నాడు.
“నేను తెరప్రక్కనుంచి హార్మోనియం వాయిస్తా!” జగదీశ్వర్ కులికాడు.
ఆచారి కోపంగా తీవ్రమై పోయాడు. శివరాం మౌనంగా అంతా తిలకిస్తున్నాడు. కృష్ణమూర్తి మాటలు ఎవరూ వినేలా లేరు. వచ్చిన నటీమణులను నవ్వించడానికి ఏదో హాస్యం మాట్లాడాలనుకునే వాళ్ళే నటకులంతా అందరిని మందలించి, రిహార్సల్ మళ్ళీ మొదలు పెట్టాడు కృష్ణమూర్తి మళ్ళీ నటకులంతా ఏదో అల్లరిగా సరిగా నటించడం మానేవారు నవ్వులు ఆపుకోలేక పోయింది.
కృష్ణమూర్తి కోపంతో ఉగ్రుదైపోయాడు. “లాణి! నువ్వు అలా నవ్వేమాటయితే నాటకాలనుంచి విరమించుకొని నవ్వుతూ కూర్చోడం మంచిది యింట్లో!” కృష్ణమూర్తి తీవ్రంగా నిరసించాడు రాణిని.
కృష్ణమూర్తి మాటల్లో మందలింపుకన్న ఏదో అసూయతో కూడిన ప్రత్యేకమైన కోపం పొడసూపింది రాణికి కృష్ణమూర్తి ప్రవర్తన, పదేపదే మందలింపు, తన్ను ప్రత్యేకంగా అవమానించి నట్లు భావించింది. నాటకాలలో గలిగిన అభిరుచి చంపుకోలేక పరమహంస వెళ్ళిపోయాక తిరిగి స్వయంగా కృష్ణమూర్తిని కలుసుకొని నాటకాలలో వేస్తానని వినయంగా
232 అన్వేషణ తల ఒగ్గడంవల్ల, కృష్ణమూర్తి తన పై సర్వాధికారాలు ఉన్నట్లు సంచరిస్తున్నాడు అనుకుంది రాణి.
“సరేలెండి... నేను నవ్వుతూనే యింట్లో కూర్చుంటాను” అంటూ తన బేగ్ తీసుకుని చరచర వెళ్ళిపోయింది రాణి. కృష్ణమూర్తి ఆశ్చర్యవోయి, ముఖ భంగిమలు సరళంగా మార్చి ఆమెను పిలిచినా రాణి తిరిగి రాలేదు. ఆమెవెంట బడితే తనకు గౌరవభంగమని ఊరుకున్నాడు కృష్ణమూర్తి. రాణి నిషమణంతో రిహార్సల్సు స్తంభించిపోయాయి కొద్ది రోజులు.
తరువాత కృష్ణమూర్తి వెళ్ళి రాణిని బ్రతిమాలాడు యీ నాటకం అయేదాకానైనా నటించమని రాణి చివరకు ఒప్పుకుంది. నిష్టమణ నాటక ప్రదర్శన జరిగింది. రాణి, శివరాం, భీమారావు పాత్రలు అద్భుతంగా ఉన్నాయన్నారు ప్రేక్షకులు నగరంలో వివిధ ప్రదేశాలలో నాటకం మళ్ళీ మళ్ళీ ప్రదర్శింపబడింది. కృష్ణమూర్తికి దర్శకుడిగా పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి కాని రాణి కృష్ణమూర్తిమీద చనువు పూర్తిగా తగ్గించుకుని, ముభావంగా మసలసాగింది ఇకముందు నాటకాలలో నటించనని స్పష్టంగా చెప్పేసింది. కృష్ణమూర్తి యిరుకున పడి సతమత మౌతూ బాధపదసాగాడు. శివరాం వీరి పరివర్తన గమనించకపోలేదు.
ఒకరోజు నాటక ప్రదర్శన పూర్తిచేసుకుని శివరాం యింటికి రాగానే రాత్రి పదిగంటలైనా యింటినిండా విద్యుద్దిపాలు వెలుగుతున్నాయి. ఇంట్లో జనం అలికిడి వినిపించింది వీధి తలుపులు ఓరగా తీసి ఉన్నాయి.
బ్రహ్మయ్యగారు మంచముమీద ఓరగా పడుకుని మూల్లుతున్నారు. సుభద్రమ్మ ఆయన కదుపు వేడినీళ్ళు గుడ్డతో కాచుతోంది. ప్రక్ననే ఉన్న యూకలిష్టన్ ఆయిల్ వాననలు గుమ్మున గది అంతా వ్యాపించాయి. ఇరుగుపొరుగు అమ్మలక్క లిద్దరు గదిలో ఒకమూల నిలుచుని సలహా లిస్తున్నారు.
శివరాం రాగానే అమ్మలక్కలు తలవంచుకుని, పమిటలు సర్దుకుని, కొప్పులు సవరించుకుని, గబగబ అంగలు వేసుకుంటూ, ముసిముసినవ్వులతో నిష్ర్రమించారు. బ్రహ్మయ్యగారికి కడుపునొప్పి ఉపద్రవంగా వచ్చి గంటనుంచి బాధపడుతూన్నరని తని చెప్పింది శివరాంకు. శివరాం తాతయ్యను పలకరించాడు. ఒక్క నిమిషం యింట్లో ఉండకుండా, ఇంట్లోవాళ్ళకంటే వీధిలో మనుష్యులు యోగక్షేమాలు ఎక్కువ అవసరంగా
అన్వేషణ 236 తిరుగుతున్న శివరాం, రాత్రి ఆలస్యంగా వచ్చి, బాధ మధ్యలో పలకరించడం బ్రహ్మయ్యగారికి పుండుమీద కారం చల్లినట్లయింది సమాధాన మియ్యక మామూలు ధోరణిలో మూల్లసాగారు. పరిస్టితలు తనపై భీష్మించుకున్నాయని (గ్రహించుకున్నాడు శివరాం. తక్షణం డాక్టరును తీసుకు వస్తానని బయలుదేరారు. మాట్లాడని బ్రహ్మయ్యగారిలో సంచలనం కలిగింది ప్రొద్దుననగా వోయి, రాత్రి యింటికి వచ్చిన మనిషిని మళ్ళీ వీధిలోకి డాక్షరుకోసం తోలేనని మధనపడ్డారు లోలోపల సుభద్రమ్మ దృశ్యం చూస్తూ ఏమీ అనలేక ఊరుకుంది.'
అరగంటలో డాక్టరు కారుమీద వచ్చారు బ్రహ్మయ్యగారి శరిరం, వక్షం పదీ క్షించారు. ఒక ఇంజక్షను పొడిచారు. మందులు యిస్తానని శివరాంను వెంటబెట్టుకుపోయారు. శివరాం తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండుగంటలయింది. అప్పుడు విస్తరిముందు కూర్చుని చల్లబడిన మెతుకులు ఆరగిస్తున్న శివరాంను చూసి, సుభద్రమ్మ బాధపడింది. బ్రహ్మయ్యగారు వాత్సల్యంతో కరిగిపోయారు.
చేతులు కడుక్కుని గదిలోకి వచ్చిన శివరాంను పిలిచి, “ఇంత రాత్రి ఎందకురా పోయి డాక్టరును పిలుచుకు నచ్చావు.... పాపం! నీ భోజనము మదీ ఆలస్యమైవపోయింది" అన్నారు ఆప్యాయంగా బ్రహ్మయ్యగారు.
“ఫరవాలేదు తాతయ్యా!” అంటూ నవ్వుతూ శివరాం పక్క మీద వాలాడు.
తాతయ్య మనస్తత్వాన్ని అర్ధంచుసుకున్నాడు శివరాం, కొంతకాలం యింటిపట్టున మసలుతూ తల్లికి, ఆయనకు కొంత మానసిన సంతృప్తి యివ్వడం మంచిదని నిర్ణయించుకున్నాడు. తీరిక సమయాల్లో యింట్లో కూర్చుని తాతయ్యతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే వాడు.
శివరాం దృష్టి పొరుగింటి గృహాలమీద, మసిలే వ్యక్తులమీద వాలింది ఇంతవరకు ఎవరెవరో తెలియని శివరాం, ప్రతి వ్యక్తితో మాట్లాడకపోయినా ఫలానావారి తాలూకు అని మాత్రం గుర్తుపట్టగలుగుతున్నాడు
మేడక్రింద నివసించే కూలివాళ్ళు, దాసీమనిష్కి దుకాణాదారులు, పొరుగింటి అమ్మలక్కలు తల్లికి, తాతయ్యకు బాగా పరిచితులైనట్లు (గ్రహించాడు శివరాం. తన్ను చూసి గౌరవంగా తప్పుకుంటూ ధారి యిచ్చే ఆ మేడక్రింది నిమ్నజాతులు తాళయ్యతో
234 అన్వేషణ తల్లితో చనువుగా వచ్చి పలకరించేవారు పండుగనాడు పిండివంటలు, మామూలు దినాల్లో పచ్చళ్లు, ఊరగాయలు తోచినంతగా వాళ్ళకు సుభద్రమ్మ యిస్తుందేది పొరుగింటి షిల్లలు తాతయ్య అంటూ బ్రహ్మయ్యగారిని చేరినంతగా శివరాం దగ్గరికి వచ్చేవారు కాదు వొరుగు మనుష్యులు, ఉప్పు, పప్పు, బియ్యం, బొగ్గులు, రూపాయలు అప్పులు తీసుకోవడం కస్తాల బాదుకుంటున్నా మనే సంతృప్తితో తల్లి తాతయ్య వారికి అవసరమైన వస్తువులు అందివ్వడం పరపాటి అయిపోయింది. కాని అప్పుడు పట్టుకెళ్ళిన వస్తువులు వాపసుచెయబడినట్లు ఎప్పుడూ కనిపించలేదు శివరాంకు.
ఆఫీసునుంచి రాగానే తన వస్తువులు సర్దుకునే టప్పుడు తాను గీసిన కొన్ని చిత్రాలు కనిపించేవి కావు. ఏదో దృశ్యం దృష్టికి రాగా భావోద్రేకంలో సగం గీసి విడిచిన చిత్రాలు. పూర్తిచేసినవి రంగుల్లో తీర్చిదిద్దినవి అలమరులో దొర్హుతుండేవి కనిపించని బొమ్మలను గురించి ప్రశ్నిస్తే ప్రక్కయింటి సుశి పట్టుకెళ్ళిందని, క్రింది కాపురముండే లాయరుగారి అమ్మాయి ఆల్బములో గుచ్చుకుందనీ, ప్రక్క్మమెడ నాయుడిగారి కోడలు తమమ యింట్లో ఫోటో కట్టించుకుంటానని పట్టుకపోయిందని సుభద్రమ్మ చిరునవ్వుతో సమాధాన మిచ్చిది. కొడుకు వేసిన చిత్రాలు పొరుగింటివారు షొగుడుతూంటే, ఉబ్బితబ్బిబ్పైిపోయ అమాయక సుభద్రమ్మ, ఆ బొమ్మల శిల్పము, నైపుణ్యము, విలువ గుర్తించకుండా కొడుకు మీద తనకు తల్లిగా ఉన్న సహజమైన అధికారం అందగా చేసుకుని పొరుగువారికి శివరాం వేసిన చిత్రాలు బహుకరించేది తల్లిని ఏమనలేక శివరాం చికాకుగా మౌనం వహించేవాడు.
వాతావరణం నిత్యమూ ప్రశాంతంగా జరిగిపోతే పరిస్టితులకు విలువ కలగదు. పరిస్థితుల మార్పు మానసిక ప్రభావం మీద పని చేస్తుంది. అప్పుడు మానవుడు సహజంగా పొందవలసిన మార్పు పొందుతూంటాడు. శివరాం జీవితం నిండుగా ప్రశాంతంగా కదిలిపోవడానికి కూదా ఆటంకాలు ఎర్చ్పడ్డాయి.
ఇల్లంతా చక్కదిద్దుతూ గరిటి తిప్పి కడుపునింపే సుభద్రమ్మకి అనారోగ్యం వ్యాపించింది. నడ్డిమీద వ్రణం బయలుదేరిందీ మామూలు చిన్న సెగ్గడ్డ కావచ్చనే (ఖాంతిలో సుభద్రమ్మ తాను ఎరిగిన నాటు వైద్యం చేసుకుంది. కర్పూరం గంధం నెయ్యకలిపి రాయడం, ఏవో ఆకులు గుజ్జు నడ్డికి కట్టుకోవడంతో పదిహేనురోజులు గడిచిపోయయి.
అన్వేషణ 236
(బ్రహ్మయ్యగారికి, శివరాంకు కూదా ఏమీ చెప్పకుండా యింటిపనులు నిర్వహించుతూ నెమ్మదిగా ఓపిగ్గా కాలక్షేపం చేసింది సుభద్రమ్మ రానురాను పెద్దదై ఎముకలను దొలుచుతున్నంత వోటు, సెగలు, పొగలు నరనరాలు లాగెయ్యడం, రక్తం పీల్యుకుపోతున్నట్లు చిక్కిపోవటంతో సుభద్రమ్మ బాధ భరించుకోలేక పోయింది. శివరాంతో ఉన్న సంగతి చెప్పింది నడ్డిమీద వ్రణం చూశాడు శివరాం కప్పలాగ ఎదిగిన వ్రణం నిప్పు కణికలాకూర్చుంది వీపుమీద. శివరాం ఒళ్ళు జలదరించింది భయంతో తక్షణం డాక్టరును పిలుచుకువచ్చాడు.
డాక్టరు వచ్చి పరీక్షించాడు. వ్రణం ఆపరేషను చెయ్యాలని నిర్ణయించాడు. బాగా ఎదిగి పక్వదశకు రావడానికి మరో వారం రోజు లుండనిచ్చి ఆపరేషన్ చెయ్యాలన్నాడు. శరీరంలోకి మందులు, వ్రణంచుట్టు రాయడానికి లేహ్యం వంటి ముద్దమందులు పంపించాడు డాక్టరు. సుభద్రమ్మ చాకిరి చెయ్యలేక మంచం పట్టింది బ్రహ్మయ్యగారు చేతులు కాల్చుకుందుకు సిద్ధపడ్డారు శివరాం ఒక్కోసారి ఆయన్ను వారించినా ఆఫీసుకు వెళ్ళే స్థితిలో ఏమీ చెయ్యలేకపోయే వాడు మందులు తేవడం, డాక్టరును పిల్చుకురావడం, రాత్రిళ్ళు తల్లికి సేవచేయడం... వీటితో శివరాం అలసిపోయి చిక్కిపోయాడు.
డాక్టరు ఒకరోజు సాయంత్రం ఆపరేషన్ చేశాడు సుభద్రమ్మకు. మత్తుమందులో కొంతకాలం మైమరచి పడిపోయిన సుభద్రమ్మ తెలివిరాగనానే కోతబాధ భరించలేక విలపించింది బిగ్గరగా, ఓదార్చటానికి బ్రహ్మయ్యగారు ప్రయత్నించినా ఆమె బాధ తలచుకుని ఆయనే కుమిలి కుమిలి పోయేవారు. నిర్లక్ష్యంగా విచారంగాతిరగడం నేర్చి శివరాం తల్లిపడే దుర్భరవేదన గమనించి మానవ సహజమైన కష్టాలు గురించి యోచించాడు.
ఆపరేషను జరిగాక సుభద్రమ్మ పరిస్థితి మరి క్షీణించింది. వెన్నముక నంటి వ్రణం ఎముకలనే దొల్చింది. ఎముకలు, చుట్టే పుచ్చిపోయి విషపూరిత మైపోయింది సుభద్రమ్మ శరీరం. ఆపరేషను జరిగాక, రెండు రోజులు సరిగా మాట్లాడిన సుభద్రమ్మ అంత్యదశలు వెలిగ్రక్కింది. మెల్లిగా, బరువుగా, నీరసంగా, ఆయాసంతో మూల్గుతూ, పరాకుగా మాట్లాడుతూ, చిక్కిపోయి పీల్చుకుపోయిన ముఖంతో, వికారంగా కనిపించిందీ సుభద్రమ్మ. దాక్టరు ఆమె పరిస్థితి చూసి (బ్రహ్మయ్యగారి చెవిలో చెప్పాడు ఆమె అంత్యకాల మానన్నమయిందని.
236 అన్వేషణ
బ్రహ్మయ్యగారు ఆ వార్త విని చంటిపిల్లవాడిలా బెంబేలు పడిపోయాడు శివరాం నిర్దాంతపోయాడు ఎంతో శాంతం నెమ్మది, అణుకువ, గౌరవం, ఆప్యాయత ప్రసరించే మాతృమూర్తి కళ్ళనుండి క్రమంగా అదృశ్యమైపోతోందని భిన్నుడైపోయాడు.
వ్యక్తుల విలువలు, ప్రయోజనాలు ఎదురుగా ఉన్నప్పటికంటే, లేనప్పుడే ఎక్కువగా ఒక్కొక్కసారి అర్హమౌతాయి. వార్ధక్యంలో బ్రహ్మయ్యగారికి ఇంట్లో ఆసరాగా ఉంటూ, ఎన్నోపనులు స్వయంగా గృహంలో నిర్వర్తించుకుపోతుందే సుభద్రమ్మ విలువ బ్రహ్మయ్యగారికి పూర్తిగా అర్ధమయింది. తన భావి గురించి విచారంగా తలపోశారు బ్రహ్మయ్యగారు.
వ్రణ నివారణ సూత్రంకన్న మరణాసన్న సమయం డాక్టరు సరిగా గుర్తించాడు సుభ(ద్రమ్మలో. డాక్టరు చెప్పిన ప్రకారం సుభద్రమ్మ క్రమక్రమంగా దిగజారిపోయింది చైతన్యం తప్పి. కాళ్ళు చెతులు పట్టుతప్పి వేలాడసాగాయి రెండు దినాలు సుభద్రమ్మ స్పృహతప్పి మాట్లాడకుండా మరుజన్మలోని తన స్థితిగురించి ప్రశాంతంగా ఏదో నేర్చుకుంటున్నట్లు చలనం లేకుండా పడి ఉంది.
ఒకరోజు మధ్యాహ్నం మూదు గంటలకు వపరమవదింటింది సుభ(ద్రమ్మ. చనిపోయేముందు పూర్తి తెలివితో బ్రహ్మయ్యగారిని, శివరాంను దగ్గరకు పిలిచింది. పిల్లలను జాగ్రత్తగా చూస్తుండమని బ్రహ్మయ్యగారిని కోరింది. కాని నిజం పరిశీలిస్తే పిల్లలచే సంరక్షించబడే పరిస్థితి తనకు వచ్చిందని, ముసలివాడైన తనకంటె ముందుగానే కోడలు చనిపోయిందని పుట్టెడు దుఃఖంతో లోలోపల కుమిలి పోయాడు బ్రహ్మయ్యగారు. శివరాంను పిలిచి కంట తడి పెట్టింది సుభద్రమ్మ ....! “నీ పెళ్ళి కళ్ళార చూసే యోగం లేకపోయె ... ఎంతకాలం శారదను జ్ఞప్తికి తెచ్చుకుంటావు? .... శారద నీకు ద్రోహం చెసింది. మహాద్రోహం....!” ఆవేదనతో సుభద్రమ్మ ఆఖరి శ్వాస దిగజారింది. పెళ్ళి చేసుకోమన్నట్లు ఆమెకుమిలి వాలినముఖంలోని తెల్లగుడ్లు నల్లపాపలు సూటిగా చూపులు చూస్తూ శివరాంవైపు నిశ్చలంగా నిలుచున్నాయి.
తన జన్మకు కారకులై, తన బ్రతుకు అభ్యున్నతికి బీజమై, తన బాధల్లో కష్టాల్లో ప్రతినిత్యం తన్ను గురించి పలవరిస్తూ, తన క్షేమమే జీవిత ధ్యేయంగా పెట్టుకు (బ్రతికిన మాతృమూర్తి తుది వాంఛ నెరవేరలేదు. కోడలును చూసుకోలేకపోయింది. శారద తన్ను వివాహమాడి ఉంటే మాతృదేవత మరణాంతంలో అంత ఆవేదన పడ్డానికి అవకాశం
అన్వేషణ 237 ఉండేదికాదు. తన (బ్రతుకు మోడులా ఒంటిగా నిలిచేదికాదు ఒకే కుటుంబంలో ఒకే రక్త సంబంధంతో, ఒకే సాంఘీక పరపతి పహోదాల తరగతిలో జన్మించిన మనుష్యుల విధిమాత్రం వివిధం అని బుజువవుతూనేవుంది. ఆవేదనలు, బాధలు, అంటి పెట్టుకునే మమతలవల్ల మానసికంగా కలిగే పరిమాణాలే అనిపించేది శివరాంకు.
బ్రహ్మయ్యగారు ఒకవైపున, శివరాం మరొక వైపున మంచం మీద ఒరిగిన సుభద్రమ్మ శవం ఎదురుగా ఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ కూర్చున్నారు. పొరుగింటివారు తోచిన రీతిని ఊరడి వాక్యాలు చెప్పారు.
దహనక్రియలు జరపడానికి శివరాం స్వయంగా ఏర్పాటులు చేసుకోవలసి వచ్చింది. బ్రహ్మయ్యగారుయింటి పెద్దయినా జవసత్వావలు ఉడిగిపోవడంవల్ల ఆ ప్రదేశం క్రొత్త కావడంవల్ల, ఆ బాధ్యత తప్పని సరిగా శివరాంమీదే వదిలారు. మేదక్రింది నిమ్నజాతులు, దాసీమనిషి, సుభద్రమ్మ మునుపు పెట్టిన పిండివంటలు, ఊరగాయలు స్మరిస్తూ, విశ్వాసంగా శివరాం సలహా ప్రకారం అన్నీ అమర్చారు డాక్టరు వచ్చి శివరాంను పరామర్శించి వెళ్ళిపోయాడు.
మేద(క్రింది కూలీలు సుభద్రమ్మ శవాన్ని ఎత్తారు. నిప్పుకుండతో శివరాం “కవాడిగూడ” శృశానంవైపు నడిచాడు పురోహితుడు అతన్ని వెన్నంటాడు తల్లిని మోసుకు వచ్చిన కూలీల సహాయంతో శ్మశానంలో తల్లి శవం దహనం చేశాడు శివరాం
చితిలో సుభద్రమ్మశవం కరిగిపోయి, నాలికలు చాచుకుని ఎగిరే అగ్ని కీలల్లో ఆమె జీవం లీనమయిపోయింది. పశ్చిమ దిక్కున అస్తమించిన సూర్యుడు అరుణరాగం వెదజల్లిపోయాడు. శ్మశానం కాపలా కాచేవాడు. వురోపితుడు, కూలీలు, బ్రహ్మయ్యగారు.... అంతా తనచుట్టు మట్టిబొమ్మల్లా మారిపోతారనే సిద్దాంతం శివరాంకు ఒంటబట్టింది. శారద అదృశయమైపోవడం జీవితలోని సరాగ కామితాలు నశింపజేసి నిర్లక్ష్యమైన భావాలు తనలో కలగజేస్తే, మాతృమూర్తి మరణం మనస్సులో ఆధ్యాత్మిక జ్ఞానం రగిల్చి నిశ్చింత వైరాగ్యం నిర్భయం శివరాంలో వ్యాపింప చేసింది. చిగురు లేక, చలనం మాని మాడి నిలుచున్న ఎండుమోతులా కాంతి విహీనుడై పోయాడు శివరాం.
అందిన తంతులు చూసుకుని మర్నాటికి లక్ష్మి, దీక్షితులు, వెంకటేశ్వర్లు సికింద్రాబాదు చేరాడు. సుభద్రమ్మ మరణించినందుకు తమ సహజమైన మాతృ(ప్రేమతో విచారించాడు కొంతసేపు అన్నా చెల్లెళ్ళు. వెంకటేశ్వర్లు తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు.
ఏప8 అన్వేషణ
అంత్యక్రియల పన్నెండుదినాలు గడిచాక బ్రహ్మయ్యగారిని సంరక్షించే బాధ్యత ప్రస్తావన వచ్చింది. కాశీ వెళ్ళిపోయి అంత్యకాలం ఒంటరిగా గడుపుతానన్నాడు బ్రహ్మయ్యగారు వెంకటేశ్వర్లు సహజ అభిమానంతో తనతో ఉండమన్నాడు. లక్ష్మి, దీక్షితులు తమ యింట్లో కాలక్షేపము చెయ్యమని కోరారు. తర్జన భర్జన లయ్యాక బ్రహ్మయ్యగారు లక్ష్మిదగ్గరే అంత్యజీవితం గడపడానికి నిశ్చయించారు. ఎంతో కాలం తను బ్రతకనన్న దిగులు బ్రహ్మయ్యగారిని వెధించసాగింది.
బ్రహ్మయ్యగారు వెళ్ళివోతూ శివరాంను బుజ్జగించి చెప్పారు. జీవితం క్షణికమన్ీ, బ్రతికిన రెండురోజులు భార్యా పిల్లలతో గృహస్థుగా బ్రతికిన విద్యుక్తధర్మం నిర్వర్తించాలని భోదించారు.
ఒక శుభదినంనాడు వచ్చిన బంధువులు బ్రహ్మయ్యగారితో సహా నిష్క్రమించారు.
అందరూ వెళ్ళిపోగానే మేడమీద పెద్ద యిలంతా చిన్న బోయింది, గాలి కెగురుతున్న కర్టెన్ నీడల్లో సుభద్రమ్మ కదిలినట్లు ఏదైనా ధ్వనివస్తే, శివరాం” అని ఆమె పలిచినట్లు ఉలిక్కిపదేవాడు శివరాం కొన్నాళ్ళు.
కాలం మార్పులో జీవితంలో జరపవలసిన నిత్య కార్యక్రమాల్లో పరిసరాల ప్రభావంలో నూత్నరూపాలు ధరించుకునే మానసిక దృక్కోణాల్లో శివరాం బాధలను మరిచి కాలది గడపనాగాడు.
ఆకాశంలో మేఘాలు పయనాల్లో రూపురేఖలు మార్చుకుని పరుగిడుతన్నాయి. ఎండి మోడైనట్లు కొల్లలుగా ఉద్భవించే ఆకుల వస్త్రాలలో ఆకారాలు మార్చుకుంటున్నాయి. రవాణా రాపిడిలో శిధిలమై సన్నగిలిపోయిన కంకరరాళ్ళు వీధిలో చెదిరిపడి ఉన్నాయి. వ్యాహాళికి బయలుదేరిన శివరాం అనుకున్నాడు. ఈ అనంత జగత్తులో మారిపోయే బుతువుల కాలంలో ఏమూలో రాలిపోయే ఆకులాంటిదే తన జీవితం కూడా అని.
అన్వేషణ 239 10
మరణసమయంలో తల్లి అన్నమాటలు శివరాం వీనుల్లో నిత్యము ్రతిధ్వనిస్తున్నాయి. శారద నిజంగా తనకు మహాద్రోహం చేసింది. బ్రతికిఉన్న రోజుల్లో యిదేవాక్యం కొడుకుముందు అనడానికి సుభద్రమ్మ భయపడేది, బాధపడే కొడుకు హృదయం మరీ కుమిలిపోతుందని, శారద లేచిపోయాక ఆమెను తీవ్రంగా గర్హించిన మనుష్యుల్లో సుభద్రమ్మ ఒకతె అని తేలిపోయింది.... శారద ఎక్కడ ఉందో... ఏం చేస్తోందో... తరువాత ఏ సమాచారం తెలియలేదు ఒక వేళ లేచి పోయిన దుష్టప్రవర్తనకు పశ్యాత్తాపపడి తిరిగి ఇంటికివస్తే, తన తల్లిగాని తిరిగి బ్రహ్మయ్యగారు గాని ఆమెను క్షమిస్తారనిమాత్రం శివరాం నమ్మలేకపోయాడు. వారితత్వాలే అంత. శీలంలో ఏ మచ్చాలేకుండా పరిపూర్ణ పవి(త్రజీవితాలు గడపడం అలవర్చుకున్న జీవులు తల్లి, తాతయ్య,
శారద తనకు ద్రోహం చేసిందనే బాధకంటే తనకు ఆమెమీద కలిగిన అవ్యాజమైన (ప్రేమ ఒక రూపంపొంది తన కానందం జీవితంలో కలగలేదనే నిరాశ నిస్పృ వాలు మాత్రమే శివరాంలో ఎక్కువగా మధన పెడుతున్నాయి. జీవితంలో తనకు చేసిన ద్రోవానికి హృదయ పూర్వక పశ్చాత్తాపం వెలిబుచ్చుతూ క్షమించమని శారద ఎదురుగా వచ్చి వెడితే, ఆమెకోరిక నిరాశకరించే తత్వం తనలో లేనట్లు గుర్తించాడు శివరాం. గతాన్ని మరిచిపోయి ఆమెమీద తనకు ఉద్భవించిన (ప్రేమానురాగాల ప్రబలతలో ఆమెను తన హృదయానికి తిరిగి బంధించుకోవాలనే కోరిక శివరాంలో అణిగిపోలేదు. అదే కోరిక ఇతర స్త్రీతో వివాహం చేసుకోవాలనే కాంక్షను యింతకాలం అణచివేసింది.
ఉద్యోగాన్వేషణ, ధనాన్వేషణ తరువాత సాంఘిక పరపతి అన్వేషణలో విజయం పొంది, నలుగురిలో ఒక హోదా, పలుకుబడి సంపాదించుకున్నాడు కనుక, ఒక స్త్రీని
240 అన్వేషణ కూడా సంపాదించుకుని కుటుంబం ఏర్పరచుకోవాలనే కోరిక శివరాంలో మిణుకు మిణుకు మంటూంది కష్టపడి ఉద్యోగం, వివిధ మార్గాల ధనం, ప్రయత్నం మీద సాంఘిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజా గౌరవం పొందినా జీవితంలో అంతా శూన్యమే ఉన్నట్లు గోచరించింది. శివరాం ఏ స్రీనైనా వివాహం చేసుకుని గృహస్థుడు కావడానికి శారదమీద కలిగిన (ప్రేమతో మనస్సంగీకరించక పోవడంవల్ల జీవితంలో యింక చెయ్యవలసిన, చెయ్యదగిన అన్వేషణ ఏమిటో అర్ధంకాలేదు శివరాంకు. అందని ఆశల సాధనకై జీవితం కృషి చేస్తున్నప్పుడు కార్యక్రమ చైతన్యంలో మానసిక ఆనందం, కార్యవిజయంలో భౌతిక ఆనందం మనిషి పొందుతాడు ప్రస్తుతం అన్వేషించి సాధించడానికి తనముందు ఏ ఉన్నత సమస్య కనిపించకపోవడంతో జీవితంలో స్తబ్దత ఏర్పడినట్లయింది శివరాంకు.
ఒంటరి గృహంలో ఉదయం దాసీమనిషి రాజవ్వ వచ్చి అంట్లుతోమి, అన్నం వండి వెళ్ళివోతుంది. స్నానాదికాలు పూర్తిచేసుకుని, భుజించి, ఆఫీసుకు పోయి, సాయంత్రం ఎ సాంస్కృతిక కార్యకలాపాలలోనైనా కాలం గడిపి, హోటల్లో భోంచేసి, రాత్రి పదిగంటలకు యింటికి చేరి శయనించడం శివరాం దైనిక కార్యక్రమమైపోయింది. ఆదివారంనాడు ఎరుగున్న మిత్రులు ఎవరైనా రావడం, వీలైతే ఏదైనా సినిమా చూడడమో, వీధుల్లో తిరిగి కబుర్లు చెప్పుకోవడమో ఒక ప్రత్యేక కార్యక్రమం. జైనగరు మారుమూల బస్సు సౌకర్యం లేకపోవడంవల్ల స్నేహితులే ఎక్కువగా యింటికి రావటం లేదు సర్వ సదుపాయాలున్న ఆ యిల్లు అద్దకొంపలు దొరకడము కష్టమైన పరిస్థితుల్లో ముఖ్యంగా తనలాంటి ఒంటరి మనుష్యులకు కొంపలు అద్దె కివ్వటం నిరాకరించే రోజుల్లో అద్దె ఎక్కువైనా వదల బుద్ది పుట్టలేదు శివరాంకు ఖర్చులు తగ్గించుకో ప్రయత్నిస్తే జీవన ప్రమాణం తగ్గిపోగలదనే సిద్దాతం నమ్మాడు శివరాం,
పేరిశాస్తి ఒకరోజు శివరాం యింటికి పనికట్టుకుని వచ్చాడు.
“నేని మధ్య ఊళ్ళో లేనోయి!... ఎంతపని జరిగింది?” ఎంతో నొచ్చుకుంటూ, బాధపడుతూ వేదన వ్యక్తపరిచాడు శాస్తి.
సుభద్రమ్మ నెమ్మది, శాంతస్వభావం, దయార్దహృదయం వర్ణించి ఆమె కుటుంబాల్లో మణిపూస వంటిదని శాస్తి నిర్ణయించాడు. తిరిగి ఒంటరివాదడైపోయి బాధపడుతున్నందుకు శివరాంకు తన విచారం తెలియజేశాడు శాస్తి మునుష్యులంతా ఎప్పుడో ఒకప్పుడు భువినుంచి దివికి పోవలసినదేనని, మాతృదేవత గురించి బేదపడి ప్రయోజనం లేదని,
అన్వేషణ టా! బ్రతికిన రోజుల్లో ఎవరి విధ్యుక్తధర్మాలు వారు నిర్వర్తించుకోవాలని, అందువల్ల త్వరగా ఒక గృహస్టుడివై వంశాన్ని ఉద్దరించమని శాస్తి సలహా ఇచ్చాడు శివరాంకు. ఒంటరిగా ఉన్నప్పుడు ధనం దుర్వ్వ్యయం చెయ్యకూడదని ముసలితనంలో ఇప్పుడు దాచుకున్న సొమ్మే ఆధారమౌతుందని, అందువల్ల అవసరమైతే అతని దగ్గర అతని అవసరాలకు పోగా, మిగిలిన ధనం దాచి, ఇష్టమైతే వడ్డికి యిచ్చి, పదింతలు చేసి పెట్టిస్తానని అయాచితమైన సహాయబుద్ది వెల్లడి చేశాడు శాస్త్రి శాస్త్రి మాటలు విని, అన్నింటికి ఊకొల్చి ఊరుకున్నాడు శివరాం. తన సలహాలు కాలక్రమంలోనైనా అతన్మీద కొంత (ప్రభావం కలగచెయ్యకపోవనే విశ్వాసంతో వెళ్ళిపోయాడు శాస్తి
ఆఫీసుదగ్గర బస్సుస్తాండువద్ద శివరాంకు కనిపించింది రాణి కనిపించగానే రెక్కలు విచ్చుకుని ఎగిరివచ్చే పక్షిలా గాలిలో కోకకొంగు అల్లాడించుకుంటూ, గబగబ అంగలు వెసుకుంటూ దగ్గరకు వచ్చి నమస్కరించింది రాణి.
“క మధ్య మా యింటికి రావటము మానేశారే, కోపము వచ్చిందా” రాణి అనునయంగా నవ్వుతూ పలకరించింది. శివరాం ఆమె వదనంలోని అమాయక సౌందర్యం దీన సంభాషణ చూసి ప్రసన్నుపోయాడు.
“మీ మీద కోపం ఎందుకండీ... ఎప్పటికీ రాదు! ..” నవ్వాడు శివరాం,
“కోపం రానేవచ్చింది .. రాలేదనటం అబద్దం!... ఆ సంగతి నాకు తెలుసు!.. *
“ఈ మధ్య మా అమ్మ చనిపోయింది .. ఏవో కుటుంబ కష్టాలు. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళటం లేదు” శివరాం తల్లి జ్ఞప్తికి రాగా విచార సూచకంగా తల దించుకున్నాడు.
“మీ అమ్మ చనిపోయిందా ?” ఎవరో ఆస్తరాలు చనిపోయినంత కంగారుపడింది రాణి. తొట్రువాటు సద్దుకుని, తల్లి మరణానికి శివరాంకు సానుభూతి చూపించింది రాణీ.
'మా తాతయ్య మళ్ళీ నా చెల్లెలి దగ్గరికి వెళ్ళిపోయాడు... నేను ఒక్కడనే ఉంటున్నా ప్రస్తుతం...” మాటలు పొడిగించాలని యధాలాపంగా అన్నాడు శివరాం.
“పాపం! ఒంటరిగా ఏం బాధ పడుతున్నారో యింట్లో?... ఎప్పుడైనా నేను మీయింటికి వసానుందండి!” ఆ మాటల్లో తన్ను ఆహ్వానించమనే ఆర్షోక్తి రాణి విసరినట్లు శివరాం అర్ధం చేసుకున్నాడు.
2ర్మ2 అన్వేషణ
“తప్పుకుండా. . మీరు ఎప్పుడు వచ్చినా సుస్వాగతం!” నవ్వాడు శివరాం.
“మీరు యిన్నిసార్లు మా యింటికి వచ్చినప్పుడు నేను మీ యింటికి ఒక్కసారి రాకపోవడం... అన్యాయం కదూ!” పెదాలు బిగపెట్టుకుని నవ్వింది రాణి...” పైగా మీరు నా బొమ్మ గీస్తానన్నారు కదూ.... అది ఇంకా బాకీయే!... మీతో చాలా మాట్లాడాలండీ!”
“అయితే వచ్చే ఆదివారం రండి....”
“తప్పకుండా... నాకు మీ యిల్లు తెలియదుగా నేను సరిగా యీ బస్సుస్తాండు దగ్గరే మధ్యాహ్నం ఒంటిగంటకు ఉంటాను... మీరు వచ్చి తీసుకు వెళ్ళాలి” నవ్వింది రాణి.
“అలాగే” అప్రయత్నంగా శివరాం అన్నాడు ఇంతవరకు యే స్త్రీని వెంటబెట్టుకుని నడివీధుల్లో ఎక్కువగా తిరగని శివరాం, రాణిని వెంటబెట్టుకుని యింటికి తీసుకువెళ్ళడానికి కొంచెం జంకినా, ప్రీ సాహసించి ఇంటికి వస్తానన్నప్పుడు తిరస్కరించడం అసభ్యమని ఊరుకున్నాడు శివరాం.
వచ్చే అతిధికి కాస్త ఫలహారమైన పెట్టడం తన ధర్మమని గుర్తించాడు శివరాం, బజారుకు వెళ్ళి ఆపిలుపళ్ళు, ద్రాక్ష బిస్కట్లు కొని యింట్లో పెట్టి ఆదివారం ఒంటిగంటకు తన ఆఫీసుదగ్గర బస్సు న్థాండుకు చేరాడు శివరాం. సిల్కు గులాబి చిరకట్టి, వొలపిట్టరంగు చారలతో తెల్లటి సిల్కు రవిక తొడుక్కొని, పిరుదులకు దిగిన పొడుగాటి జడ బుజంమీద నుంచి ముందు వేలాడించుకుని ఊగిస్తూ, చేతిలో వేనిటీ బేగ్ పట్టుకుని నిరీక్షిస్తూ నిలుచుంది రాణి. ఆడిన మాట అక్షరాలా అమలు జరుపుతున్న రాణి హృదయంలో తనమీద ఏవో అపూర్వమైన అనురాగం ఉందనుకొన్నాడు శివరాం. బస్సు ఎక్కి మౌనంగా యిల్లు చేరారు యిద్దరు.
పొరుగింటి అమ్మలక్కలు, అందమైన అమ్మాయితో సహా వచ్చిన శివరాం ఎగాదిగా చూశారు. రాణిని కిటికీల్లోంచి తొంగి చూసి పరీక్షించారు ముఖం ఏదో గుసగుస లాదుకున్నారు. రాణి మేడ ఎక్కి శివరాం తలుపు తీసేలోగా పరిసరాలు పర్యవేక్షించసాగింది.
“మీ మేడమీద బంగళాకు వాయుదేవుడే సేవచేస్తున్నాడే!... వేసవికాలం యిక్కడ చాలా హాయిగా ఉంటుంది కదండీ!” రాణి లోపలికి ప్రవేశించింది.
విశాలమైన ముందు గదిలో నాల్లు కుర్చీలు ఒక చిన్న గుండ్రని బళ్ల, గోదడలలోకి
అన్వేషణ 243 దొలుచుకున్న అలమరుల్లో పుస్తకాలు, వెండి కప్పులు, మరో వైపున సుందర ప్రకృతి దృశ్యాలు, ఇంకొక వైపున శివరాం గీసిన కైలవర్ద చిత్రాలు, రేఖాకృతుల మనుష్యుల బొమ్మలు వేలాడుతున్నాయి ఇల్లు పరిశుభ్రంగా ఉంది వీధివైపున్న గోడకు నిలుపుటద్దం తగిలించి ఉంది.
అద్దంలో 'ప్రతిబంబించే తన రూపం ఒకసారి చూసుకుని జడ సవరించుకుంది రాణి.
“మీ దగ్గర చాలా పుస్తకాలున్నాయండి .. కాలక్షేపానికి ఎప్పుడైనా కధలు, నవలలు మీదగ్గరనుంచి పట్టుకెళ్ళవచ్చునన్నమాట.....*
తప్పకుండా నన్నాడు శివరాం.
చేతిలోని వేనీటి బేగ్ మరో కుర్చీలో పదేసి, వాలుకుర్చీలో ఒరిగి, ఒక నిముషం కాళ్ళు చాపుకుని బరువుగా శ్వాస విడిచి నవ్వింది రాణి.
“అలసివోయావా?”
'అబలను కదండీ!” నవ్వింది రాణ్.
“ఏమన్నా ఫలమారాలు తింటావా?"
'మీరు ఫలహారాలు కూడా యింట్లో తయారు చేస్తారా?” ఆడవాళ్ళు యింట్లో లేకపోయినా శివరాం ఏమి అమర్చారో తిండానికి అని ఆశ్చర్యపోయింది.
ప్లేటులో మూడు ఆపీలు పళ్ళు, రెండు ద్రాక్షగుత్తులు అరడజను బిస్కట్లు తెచ్చి ఉంచాడు శివరాం.
“ఇవన్నీ ఏమిటండోయ్!” నోరావలించింది రాణి ఒక ద్రాక్షపండు నోట్లోకి విసిరాడు శివరాం “అందుకు అంటూ నవ్వాడు,
తియ్యటి ద్రాక్షపండ్లు వయ్యారంగా నమిలి, అందులోని రుచిని ముఖభంగిమల్లో ప్రస్పుటంచేస్తూ నవ్వింది రాణి.
“వ్సీతో ఒక సంగతి చెబుదా మనుకున్నానండి!”
“చెప్పండి!”
బైైడ్సశ్ష అన్వేషణ
“ఎవరా ఈశ్వరయ్య మంచీ, మర్యాద లేనట్లుంది. . ఒక రోజు లక్డీ కపూల్ బస్సుస్తాండ్ దగ్గర నిలుచున్నాను. అతను కనిపించాడు - ఏమిటేమిటో మాట్లాడుతాడు. తన జన్మదినం నాడు టీపార్టి యిస్తాడట - నన్ను ప్రత్యేకం రమ్మంటాడు . దగ్గరకువచ్చి ముఖంమీద ముఖం పెట్టి... తుంపరలుపడేలా ఛి .పైగా దారినబోయ వువ్వులవాణ్ణి పిలిచి నాకో మల్లెదండ కొని యివ్వబోయాడు . నాల్గు చివాట్లు పెట్టాను . హడలు.. మీ స్నేహితులంతా యిటువంటి వాళ్ళే!” మూతి కోపంగా టత్రిప్పుకుని రెండు ద్రాక్షపండ్లు నోట్లో కుక్కుతుంది.
“అనేక రకాల స్నేహితులు జీవితంలో తారసిల్లుతారు. కొందరిని అర్ధం చేసుకోలేం . కొందరిని అర్ధం చేసుకోటానికి చాలా కాలం పడుతుంది!” శివరాం రాణివైపు నిశితంగా చూశాడు.
రాణి మౌనంగా సాలోచనగా ముఖం త్రిప్పుకుంది.
“ఏమిటి మీరు నన్నీగదిలో కూరోమన్నారే! ఇల్లంతా చూపించరు?....” లేచి నిలుచుంది రాణి.
శివరాం రెండో గదిలోకి తీసుకువెళ్ళాడు. గోడమీద ఏవో బంధువుల ఫోటోలు కనిపించాయి నేలమీద కుంచె, రంగు పెట్టె కాన్వాస్ గుడ్డ, 'డ్రాయింగు పేపరు, చాకు. సూదిగా చెక్కిన పెన్సిళ్ళు... పొలం దృశ్యం.... కుంటుతూ చిప్ప కర్ర చేతబట్టిన ముసలి బీదవాడు... నూర్యాస్తమయం... ఉత్తుంగతరంగాల సముద్రతీరం.... చెట్టు, మీదిపక్షిగూళ్ళు, శీతాకాలంలో చలికాచుకునే ముసలివాడు... పావురాలకు తిండి పెడుతున్న కుర్రవాడు... బిడ్డకు పాలిస్తున్న తల్లి ... వివిధ చిత్రాలు చెదిరిపడి ఉన్నాయి. ఒక్కొక్కటి ఆసక్తితో పరీక్షించింది రాణి. ఒకవారగా పెద్ద పట్టెమంచంమిద పరుపు, న్లం గుళ్ళ దుప్పటి, పువ్వులు చెక్కిన తలగదడ- చిలక్కొయ్యలకు వేలాడే నెక్‌టైలు .. పంట్లాములు. మూడు ఫెల్స్ హేట్స్, ఒక స్త్రాహేట్.... ఒక బల్లమీద గుడ్డకప్పుకుని కూర్చున్న రేడియో కనిపించాయి రాణికి.
“మీ యింట్లో అన్ని హంగులూ ఉన్నాయండీ!”
“ఐదవతనం తప్పు” వ్యంగ్యంగా నవ్వాడు శివరాం.
మందస్మితం చేసింది రాణి.
అన్వేషణ 245
“మొదటిగదిలో ఫోటోలు - మా ఆఫీసువాళ్ళతో తీయించుకున్నవి - ఈ ఫోటో మా తాతయ్యగారిది -” శివరాం ఒక్కొక్కటి పరిచయం చేయసాగాడు.
“ఈ ముఖంలో ఎంత బ్రహ్మవర్చస్ఫో[!*
శివరాం చకితుడై ఆమె వైపు తేరిపారి ఒక్కసారి చూశాడు.
“ఈ ఫోటో - మా అమ్మగారిది.. ”
“ఎంతో భద్రత. నెమ్మది. శాంతం ఆమెలో మూర్తీభవిస్తోందండి!”
“క ఫోటో మా చెల్లెలిది!”
“లక్ష్మిలా కలకల లాడునోంది!”
“ఇదేమిటి చిట్టెలుకలా ముఖం పెట్టుకుని కూర్చుంది ఈవిడ ఫోటోలో!
రాణి పకపక నిర్లక్ష్యంగా నవ్వేసింది. రాణి అన్న మాటల్లో ఏదో సాన్నిహిత్యం దాగి ఉన్నట్లు శివరాంకు అనుమానం కలిగింది. మాటలద్వారా వ్యక్తులపేర్లు రాణి సూచనగా చేసినట్లు భ్రాంతిపడ్డాడు శివరాం, అయినా ఆమెతో పాటు తానూ మర్యాదగా నవ్వాడు.
“అయితే వాళ్ళ పేర్లు చెప్పారే కాదు!” నిష్టూరం మోపింది రాణి,
“వాళ్ళు పేర్లు నువ్వే సూచించావు చాల వరకు!” అంటూ అందరిపేర్లు ఏకరువు పెట్టాడు శివరాం. “బ్రహ్మవర్చస్సు కలిగిన మనిషి బ్రహ్మయ్యగారు. భద్రత కలిగిన మనిషి సుభద్రమ్మ, లక్ష్మిలా కలకలలాడిన మనిషి లక్ష్మి. చిట్టెలుకలా కనిపించిన మనిషి
శివరాం ఏదో మంత్రం చదివినట్లు రాణి విచిత్రంగా చూసింది శివరాం వైపు.
“అయితే నా మాటలు వేదవాక్కు అన్నమాట తెలియకుండానే నిజం చెప్పేస్తున్నానే యీమధ్య!” పకపక నవ్వింది రాణీ గట్టిగా.
“అవును తెలిసికూడా ఒక్కొక్కసారి అబద్దమాడటం సులువుగానే నేర్చుకున్నావు గదా!” రాణి నిజస్వరూపం మీద అనుమానం కలిగిన శివరాం వ్యంగ్యంగా ఏదో అంతరార్ధంతో మాట్లాడాడు.
రాణి శివరాం వైపు ఒకసారి తీవ్రంగా చూసింది. ముఖభంగిమలు మరుక్షణంలో మార్చుకుని కిలకిల నవ్వింది.
246 అన్వేషణ
“అబద్దాలాదడడం నిజంగా కళకదండీ , అందులో నిజాయితీ మనుష్యులు అబద్దాలాడడం చాలా కష్టంమీద నేర్చుకోవలసిన కళ కదండి!” రాణి మౌనంగా చిన్నగా నవ్వుతూ ముఖం ప్రక్కకు త్రిప్పుకుంది
జేబు రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది. శివరాం గాభరాపడ్డాడు రాణి ఐద్వడం గురించి.
జన్సేన్సు వేళాకోళంగా అన్నాను - ఏమనుకోకు రాణి!” శివరాం దగ్గరికిచేరి అనునయించాదు.
“అబ్బబ్బ! . . నేను ఏద్వటం లేదండీ.. మీ మిద్దెపై ఎగిరే పిచ్చికలు దుమ్ము కంట్లో రాల్సాయి... నీరు కారితే తుడుచుకున్నాను!” మళ్ళీ కిలకిల నవ్వింది రాణి,
“అబద్ధ 0
శివరాం వైపు తీవ్రంగా చూసింది రాణి, “జీవితంలో బాగుపడాలంటే అబద్దాలాడే కళ్లలో చాలా నైపుణ్యం సంపాదించుకోవాలండీ'” మందస్కితం చేసింది రాణి
ఆమె మాటలకు శివరాం అనుమానంతో ముఖం కందగద్ద చేసుకోవడం గుర్తించింది రాణి ప్రస్తావన మార్చి ప్రక్కగదిలోకి నడిచింది.
“ఇది వంటిల్లా?” (ప్రశ్నించింది. గదిలో అన్నం తిన్న విస్తరి అలాగే ఉంది, మూత లేక కొద్దిగా అన్నం ఉన్న గిన్నె తెరిచి ఉంది. ఊరగాయి సీసా పెరుగు సీసా ప్రకృనే ఉన్నాయి. ఒక వార ఇత్రడి గిన్నెలో మంచి నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి గోడ మూల ఎలక ఒకటి తొంగి చూసి దండెం ఊతతో ఇంటి కప్పు కిటికీ పైకి (ప్రాకిపోయింది. అలమరులో జాడీలు, సీసాలు, పప్పు, మిరపదినుసులతో కనిపిస్తున్నాయి. గోడ మేకుకు వేలాడి సజ్జలో కూరగాయలు నిండి ఉన్నాయి. గోడలు చాలా వరకు పొగచూరి మసితో నల్లబడ్డాయి.
“ఇక్షడే ముంది చూద్దానికి ?” అసహ్యంగా ఉన్న పందిల్లు చూసి రాణి భావాలలో తన మీద మార్చు తెప్పించుకోవడం యిష్టం లేకపోయింది శివరాంకు.
“న్పీర్రు వండుకుంటారా?” రాణి సాలోచనగా ప్రశ్నించింది. వండుకోవడం హోదాకు భంగమనుకునే సహజయువక అహంభావం శివరాం కూడా వెలిబుచ్చాడు.
“భేదు... దాసీ మనిషి వండుతుంది!”
అన్వేషణ లైడ్ష7
“నేను ఒకరోజు మీకు వంటచేసి పెడతానండి!”
“తప్పుకుండా... మనిద్దరం భోం చేద్దాం”
“ఇదేమిటి వంట చేసి పెట్టాక, భోజనం పెట్టకుండా యింట్లోంచి తరిమేద్దామను కున్నారా. ఏదో దయగా భోజనం పెడతామంటారెమిటి?”” వంట చేసేక మీ యింట్లో భోంచేయడం నా జన్మహక్కు!” నవ్వింది రాణి.
జని జన్మహక్కు అన్నివిధాలా కాపాడే అభయహస్తం ఇస్తున్నాగా!” శివరాం కూడా ఆమెతో పాటు నవ్వాడు.
ఇద్దరూ వంటిల్లుదాటి మేడ వరండాలోకి వెళ్ళారు. వరండాచుట్టూ పూల కుండీలు అ గా అమర్చిఉన్నాయి. ఒక ఎర్రమచ్చల ఆకుల కోటనుతీగ మేదవరందా చిన్న గొడపై సొగసుగా ప్రాకుతోంది కుండీలలో గులాబి, మల్లి, చామంతి మొక్కలు పువ్వులు విచ్చుకుని నవ్వుతూ గాలిలో ఊగుతున్నాయి ఎదురుగా నాయుడి గారిమేడ... ఇంటి
జమాని కట్టించిన బంగళాలు రాణీవైపు నిక్కి చూశాయియోద్యంగా.
రాణీ మొదటి గదిలోకి వచ్చేసింది. రాణి వెనుదిరిగాక శివరాం ఒక గులాబి కోసి, చేతిలో నడ్డి వెనకాల దాచుకుని, మొదటి గదిలోకి రాణిదగ్గరకు వచ్చాడు. రాణి బల్ల మీదమెగజైను పేజీలు తిరగవేస్తుంది.
శివరాం మెల్లిగా ఆమె వెనుకవైపు వెళ్ళి జడలో పువ్వు గుచ్చబోయాడు. రాణి కంగారుగా బేదురుగా వెనుదిరిగి చూసింది మౌనంగా ఊరుకుంది. సాహసంగా శివరాం ఆమె తలలో గులాబి గుచ్చాడు రాణి నవ్వింది. గులాబి మత్తు వాసనలు శివరాం అఘ్రాణించి, ఉద్రేకపడి. ఆమె నునుప్రేన బుగ్గలను స్పృశించి చుంబించాడు శివరాం.
“రాణి నిన్ను చూస్తుంటే ..* శివరాం ఏదో అనబోయి ఆగిపోయాడు.
“చూస్తోంటే...” ఆపీలు ముక్కలు చేసింది రాఖి.
“అసలు నీ దేవూరు రాణి... నీ జీవిత చరిత్ర కొంచెం చెప్పు!”
“మాది గుంటూరండీ!” మా నాన్న చిన్నతనంలో పోయాడు. అప్పటి నుంచి మా అమ్మ పెంచింది నన్ను. గుంటూరులో మా కొక యిల్లు, భూములు కూడా ఉన్నాయ+డీ! కావలిస్తే ఎవరినైనా అడగండి!”
శివరాం అసలు శారద గురించి ప్రస్తావిద్దామనుకున్నాడు. జానా రాణి మాటలు,
248 అన్వేషణ తీరు, ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఆ ప్రధమ అంతరంగిక సమావేశంలో పరప్తీ గురించి ప్రసావిస్తే అసూయతో రాణీ దూరమైపోతుందనే భయంతో శివరాం ఊరుకున్నాడు
ఆపిలు ముక్కలు శివరాం చేతిలో పెట్టింది రాణి ద్రాక్షపళ్ళు గుత్తుల నుంచి విడదీశాడు శివరాం. ఇద్దరూ ఫలహారాలు పూర్తి చేశారు,
“ఏమండీ! నాబొమ్మ వేస్తానన్నారు అప్పుడే వచ్చి రెండు గంట లయిపోయింది. ఏమిటో కబుర్లతో కాలక్షేపం అయిపోయింది! బుంగమూతి పెట్టింది రాణి.
“మళ్ళీరా! ఈసారి పూర్తిగా నీ బొమ్మ వేస్తూ కూర్చుంటా! మాట్లాడను నితో!” నవ్వాడు శివరాం.
“వేడ్రత్రానండీ! ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది...మా అమ్మ కోప్పడుతుంది!” గారాబుగా మాట్లాడింది రాణీ.
“అమ్మ అంటే ఎంత భయం పిల్లకి!” నవ్వాడు శివరాం,
లేచి అలమరు దగ్గరకు వెళ్ళి రెండు పుస్తకాలు తీసుకుంది రాణి.
“మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చి యిచ్చేస్తా!”
“అంటే ... ఎప్పుడు?”
“మీరు ఎప్పుడు రమ్మంటే... అప్పుడు!”
“వచ్చే ఆదివారం!”
“ఊ&!” మౌనంగా తల వంచుకుని నవ్వింది రాణి.
రాణిని ఐస్సుస్తాండు దాక దిగిబెట్టాలని బయలుదేరాడు శివరాం. మధ్యాహ్నం నాల్గు గంటలయింది. ఇల్లు విడిచి జంటగా నడుస్తున్న శివరాం. రాణివైపు మేడమిద నుంచి శివరాం పొరుగింటి అమ్మలక్కలు గుసగుస లాడకుంటూ తెగచూస్తున్నారు. ఇస్తీ పంట్లాము తొడుక్కుని, స్పోర్సు బనీను వేసుకున్న మేడ క్రింది నిమ్న జాతుల కుర్రాడొకడు ఒడుపుగా రాణీవైపు తేరిపార చూశాడు.
గాలి రివ్వున వీస్తోంది. బుజాలణిదకు జార్చి వేలాదే జడను అరచేతిలో గెంతిస్తూ రాణి వయ్యారంగా సొగసుగా శివరాం వైపు చిలిపిగా చూస్తూ నడుస్తోంది.
“నువ్వు అలా వంకరగా నడుస్తావేం రాణి” శివరాం రాణి నడకకు హేళన చేశాడు.
అన్వేషణ 24కి
“వయ్యారంగా సొగసుగా నడుస్తోంటే కాలు వంకర తిరుగుతుందండి!” రాణి ఫకాలున నవ్వింది తవ ఛలోక్తికి
శివరాం ఆమె ఛలోక్తికి ఆనందించి నవ్వుకున్నాడు.
“మిమ్మల్ని ఒకటి అడుగనా?”
ఓ చ్!”
“మీకన్నుమెల్లగా ఉంటుందేమండీ?”
ఉబికివచ్చే నవ్వు పెదాలమధ్య బిగించింది రాణి.
“అందమైన అమ్మాయిని చూస్తోంటే కన్ను వంకర తిరుగుతుంది!” శివరాం మునుపటి పద్దతిలోనే ఛలోక్తి విసిరాడు.
“కమ్మటి వాసనలు అఘ్రాణిస్తూంటే ముక్కుకూడా వంకర తిరుగుతుండోయి.”
పోటీగా మరో వాక్యం చెప్పి నవ్వింది రాణి.
“గాధంగా చుంబిస్తే పెదాలు కూడా వంకర తిరుగుతాయి కదూ”
శివరాం ఆఖరి వాక్వానికి లీలగా కోపంగా చూసి, మెరిసే కళ్ళతో, మూతి ముడుచుకుని వక్రం చెందిన పెదాలతో నవ్వుకుంది లోలోపల రాణి.
బస్సుస్తాండు చేరారు యిద్దరూ.
రావణుడు సీతను ఎత్తుకుని పోయినట్లు, దెయ్యంలాంటి బస్సు రోజుకుంటూ వచ్చి, రాణీని ఎక్కించుకుని అదృ్భశ్యమైవోయింది. శివరాం మత్తు ఆలోచనల్లో మెల్లగా యిల్లు చేరాడు
వాగ్ధానం చేసినట్లు రాణీ తరువాత ఆదివారంకూడా యధాప్రకారం ఒంటిగంటకు తలుపు తట్టింది. సుస్వాగతమంటూ ఆహ్వానించాడు. మామూలు పద్దతిలో శివరాం. టేబిలుమీద (ద్రాక్షపళ్ళు ఆపిలు పళ్ళు ప్లేటులో ఉంచాడు.
“ఈ పళ్ళు నాకు పెట్టకపోతే ఏమౌతుందండి?” రాణి చిలిపిగా నవ్వింది...
“క్క పళ్ళు తింటే ఏమౌతుందండి?” చిలిపిగా ప్రశ్నించాడు.
ఇద్దరు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే పళ్ళషప్తేటుమీద చేతులు వేశారు.
250 అన్వేషణ
“అబ్బ మీ చెయ్యి ముట్టుకుంటే నా చెయ్యి కాలిందండి?” అంటూ రాణీ చెయ్యి లాక్కుని వేళ్ళమీద ఊదుకుంది.
“నా గుండెల్లో పోటు వస్తోంది” అంటూ శివరాం కుర్చీలో వాలిపోయాడు.
“వీ కింత ఖర్చు ఎందుకండీ!” సానుభూతి చూపించింది రాణి.
“ఖర్భేముంది? మా దొడ్లో ఆపిలుచెట్లు, దద్రాక్షతీగ విరగకాస్తున్నాయి... అవి పాడైపోతాయని నీకు పెట్టాను!” శివరాం నవ్వాడు.
“అబద్దాలు కధల్లా చెప్పడంకూడా ఒక కళ కదండీ!” ద్రాక్ష పళ్ళగుత్తి చిలిపిగా నోటిమీదకు తెచ్చుకు ఒక్కొక్కపండు తినసాగింది రాణి
“రాణి, నిన్ను చూస్తోంటే...”
పమిటన్నట్టు శివరాం వైపు చేసింది రాణి.
“ఒక అమ్మాయి జ్ఞప్తికి వస్తుంది. ఆ అమ్మాయిని ఏంతో (ప్రేమించాను... చివరకు మోసం చేసింది.... అదే విషయం తిరిగి నువ్వు చేస్తే నేను భరించలేను!”
(బ్రతకుమీద భయంలో భారంగా మాట్లాడాడు శివరాం.
“అయితే యింతకుముందు ఎన్నో ప్రేమ కలాపాలు చేశారన్నమాట!” తింటున్న ద్రాక్ష గుత్తులు ప్లేటులోకి విసిరేసి, ముఖానికి అద్దుగా పుస్తకం తెరిచి పట్టుకుంది రాణి.
“ఆమెచేసిన ద్రోహానికి నాకు చాలా అసహ్వం వేసింది.... ఆమెను మరచివోవాలని యత్నించాను... కాని నిన్ను చూస్తోంటే ఆమె జ్ఞాపకం వస్తుంది!” నిట్టూర్చాడు శివరాం,
“వోనీ మె ఎక్కడుందో వెతికి, వెంటబడి పెళ్ళి చేసుకోండి... నా స్నేహం ఎందుకు మీకు!”
రాణి పుస్తకంచాటునుంచే మాట్లాడింది.
ఆమె ముఖభంగిమలు పరిశీలించడానికి శివరాంకు అవకాశం లేకపోయింది. శివరాం ఛటాలున ఆమె ముఖంమీద పుస్తకం లాగేశాడు రాణిముఖం భారమైన ఆలోచనలతో ముడతలు పడి చిట్లింపులతో నిండిపోయింది. ఆవేదనాభారంతో ముఖం
“దించుకుంది. “గతంలో మనకు నిమిత్తంలేదు రాణి... ప్రస్తుతం మనకు ప్రధానం... నువ్వు
అన్వేషణ బగ్] నన్ను పెండ్లి చేసుకోడానికి ఒప్పుకుంటే . నా ఆనందానికి మితిలేదు...” శివరాం రాణి చుబుకాన్నిఎత్తి దీనంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు.
రాణి ముఖం దించుకుని టేబిలుమీద పెన్సిలుతో మౌనంగా కాగితంమీద పిచ్చిగీతలు గీసింది కాస్సేపు. గబుక్కున కస్నీరుకార్చి చీరకొంగులు ముఖం దూర్చుకుని వెక్కి వెక్కి ఐద్భింది,
శివరాం నిర్జాంతపోయాడు. పెళ్ళిమాట విని రాణి ఎందుకు ఏడుస్తోందో, ఆమె మనస్సులోని అంతర్చ్భావా లేమిటో గుర్తించుకోడం చాలా కష్టమనిపించింది శివరాంకు. బహుశా పరస్త్రీని యింతకుముందు (ప్రేమించానని అనసూయతో దాని ఏద్పిందేమో అనుకున్నాడు శివరాం.
ఉద్రేకంతో రాణీమీద దినదినం పెరుగుతున్న అభిమానం మోజులో, పెళ్ళ చేసుకుంటానన్నమాట అప్రయత్నంగా జారిపోయింది శివరాం నోటినుంచి. క్రైస్తవుల పిల్లను పెళ్ళి చేసుకుంటానని వ్రాస్తే సనాతన సాంప్రదాయాలకు బద్ధులైనబ్రహ్మయ్యగారు తదితర బంధువులు, మత వివక్షతలేక వివేకం పోగొట్టుకున్నాడని తన్ను తిట్టడం సహజం అనుకున్నాడు శివరాం.
ఏడ్చివడ్చి తనంత తానే కళ్ళు తుడుచుకుని పచారుచేసి, తెచ్చిన కధలు నవల పుస్తకాలు రాణి అందిచ్చింది శివరాంకు.
“అబ్బ! ఆ నవల చదువుతూంటే చాలా భయం వేసిందండి!”
రాణి నవ్వింది ఆ నవ్వులో విషయం మార్చి శివరాంను ప్రసన్నుని చేసుకోవాలనే ఆకాంక్ష వున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అలమరులోని మరి రెండు క్రొత్త ఇంగ్రీషు నవలలు అందిచ్చాడు శివరాం.
“నేను ఈ ఏదు ఇంటర్ పరీక్షకు కూర్చుంటున్నానండి.... ట్యుటోరియల్ కాలేజిలో చేరానుగొ రాణి కనుబొమలు ఎగరవేసింది నవ్వుతూ.
“నృత్యం సంగతి ఎమయింది?”
“వదిలేశాను. ఒంట్లో ఓపికలేక, అస్తమానూ వంకరటింకరలుగా గెంతలేక...!”
“అయినా కనుబొమలు గెంతడం మాత్రం మానలేదు!” నవ్వాడు శివరాం.
252 అన్వేషణ
“నృత్యం మానేసినా ఈ పాడు అలవాటు పోలేదు నాకు?” రాణి కులుకుతూ ధనుస్సుల్లా వంగి ముడుచుకుంటున్న కనుబొమలు కాస్సేపు ఎగరెసి అద్దంలో తన ముఖారవిందం చూసుకుని ఆనందించింది
“ఏమండీ! నా బొమ్మ గీయరూ!”
గారాబుగా శివరాం బుజాలమాద చేతులు వేసి దగ్గరగా నిలుచుంది రాణి.
రాణి విచారం తగ్గి ప్రసన్నురాలైందని సమాధాన పడ్డాడు శివరాం.
కుర్చీమీద కూర్చోమన్నాడు ఒక భంగిమలో, ముఖం, కన్నులు, నాసిక, జడ, ఆకారరేఖలు స్ఫుటంగా కనిపించేలా కూర్వో పెట్టాడు శివరాం. ఒక పెద్ద (డ్రాయింగు కాగితం బల్లకు అమర్చి ఆమె ఆకృతి రూపురేఖలు ఒక గంటసేపు పెన్సిలుతో దిద్దాడు.
గంటసేపు ఒక భంగిమలో కూర్చునే ఓపిక, పట్టుదలలేని రాణీ మధ్య మధ్య చిలిపిగా నవ్వుతూ, గారాలుగా నిట్టూరుస్తూ, భంగిమ చెడగొడుతూ, అల్లరిగా ఆపిలుపండు ముక్కలు తింటూ నవ్వుతూ శివరాంను విసిగెత్తించింది శివరాం లీలగా కోపపడేవాడు. “ఏమండీ ఆ బొమ్మ పూర్తిచేశాక, నేనని ఎవరైనా చెప్పగలరా?. . లేక నా పేరు వ్రాసివచ్చిన వాళ్ళకు గంటసేపు మీరు ఉపన్యాసమియ్యాలా!” రాణి శివరాంను హేళన చేసింద.
“అబ్బే... బొమ్మ పూర్తిచేసి “కోతి అని నేనే వ్రాస్తా- ఉపన్యాసం యివ్వకృర్లదు!” అన్నాడు శివరాం సరదాగా.
“ఆం నేను కోతిలా ఉన్నానా.... ఎంతమాటన్నారు! అద్దంలో చూడండీ! ...మీకే తెలుస్తుంది...” రాణి ఒయ్యారంగా తల దువ్వుకుని సొగసుగా అద్దంముందు నిలుచుంది. శివరాం వెనుకనుంచి చూసేడు....
“నా వెనకాల ఉన్న కోతిని చూస్తోంటే నాకు భయం వేస్తోందండీ!” రాణి పకపక నవ్వింది.
“ఇద్దరు కోతులు పెళ్ళిచేసుకుంటే ఇంకా బాగుంటుంది కదూ!” నవ్వాడు శివరాం.
“అప్పుడు కోతులే బాజాలు వాయించడం మంత్రాలు చదవడం, సన్నాయి వాడడం వగైరా... వగైరాలు?” నవ్వింది రాణీ.
కోతిచేష్టలతో చిలిపి అల్లరిచేసే రాణిని మక్కువతో ఆనందంగా ఆలింగనం చేసుకునారు శివరాం. చేతులు విడిపించుకుని గెంతి దూరంగా పారిపోయింది రాణి.
అన్వేషణ 2గ్ర&
బస్సుస్తాండువైపు నడిచాడు యిద్దరూ. ఆనాటి సమావేశము ముగించుకుని,
“ఏమండీ నాకు ఆకలి వేసోందండి!”
రాణి చంటిపిల్లలా ముఖం పెట్టంది
“ఇంత వరకు తిన్న పళ్ళన్నీ ఏమైపోయాయి?”
“ఎంతసేపు పొట్టలో ఉంటాయి. . గంటసేపు ఒక్కబిగి ఊపిరాదకుండా కుర్చిలో కూర్చుంటే అన్నీ అరిగిపోయాయి!” నవ్వింది రాణి
“అయితే ఒక పనిచెయ్యి.... వీధిలో ఇంతమంది నడుస్తున్నారే.... వాళ్ళలో నీకు నచ్చిన వారిని విరుచుకు తినెయ్యి” ఛలోక్తి విసిరాడు శివరాం.
“ఊహూం.... నాకే. మరేమోల.... మిమ్మల్ని తినెయ్యాలని ఉందండీ!” పకపక నవ్వింది రాణి.
బస్సుస్తాండువద్ద దూరంగా బస్సు వస్తున్నట్లు కనిపించింది.
“మళ్ళీ పునద్దర్శనం?”
“ప్రతీ ఆదివారం” అంటూ రాణి బేగ్లోంచి తీసి కైస్తవ ఉపన్వాస సభల కరపత్రాలు శివరాం చేతిలో పెట్టింది.
ఇద్దరి హృదయాలు హత్తుకుపోయాయని ఆనందంలో (ప్రేమ మత్తులో ఊగుతూ ఖులాసాగా యిల్లు తిరిగి చేరాడు శివరాం. వీలైతే ఆ కైస్తవుల సభలకు హాజరు కావాలని నిశ్చయించుకున్నాడు శివరాం.
సులాను బజారులోని (గ్రంధాలయంలో బెంగాలి, ప్రముఖ చి(తకారుడొకడు ఉపన్యసిస్తున్నాదని విని సభకు హాజరు కావాలని శివరాం బస్సులో వెడుతున్నాడు.
ఒక శృంగాటకంలో రాణి మరొక యువకుడితో కలిసి నవ్వుతూ నడిచిపోతోంది. నల్లకళ్ళజోడు ధరించి, నాజూకు నాగరిక యువతిలా కులుకులు విసురుతూ నడుస్తోంది. యువకుడు సూటులో రీవిగా నడుస్తూ వీధి పక్క ఆపి ఉంచిన తన కారు తలుపులు తెరచి కూర్యోపెట్టాడు రాణిని ఆ యువకుడి ముఖం తనకు చిరపరిచయమైనదిలా ఆగుపించింది. శివరాం శరీరమంతా మంటలతో భస్మమైపోయినట్లు బాధపద్దాడు తల తీరిగిపోయింది. అసూయతో మరొక దుర్భర దుస్సుంఘటన జరిగేలా వుందని వ్యధ
2గ్రశ్ష అన్వెషణ చెందాడు, గ్రంధాలయంలో బెంగాలీ చిత్రకారుని ఉపన్వాసం తలకెక్కలేదు చికాకుగా యింటికి వచ్చేశాడు.
శారదరూపంలో కనిపిస్తున్న పరమతస్తీ రాణీని తన మానసిక వ్యధ తగ్గడానికి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటున్నానని, అంగీకారం యివ్యవలసిందని బ్రహ్మయ్య తాతయ్యకు శివరాం వ్రాసిన లేఖకు, జవాబు సాయంత్రం యింట్లో పడిఉంది. ఆత్రంతో ఉత్తరం తీసి చదివాడు బ్రహ్మయ్యగారు కాలరుద్రుడై తిడుతూ వ్రాసి, తమ మతంలోని కులాలన్నీ గొద్దువోయాయా అని ప్రశ్నించారు. తన అంత్యకాలంలో గొంతులో వీరు పోయడం యిష్టం లేకపోతే, ఇంతకాలం పెంచి, పెద్దచేసిన వారిపై కృతఘ్నత చెప్పదల్పుకుంటే, తన కభ్యంతరం లేదని కర్మశంగా (వ్రాశారు బ్రహ్మయ్యగారు. తెలివితక్కువగా ఉ(ద్రేకాల్లో మైమరచి తాతయ్యవరకు రాణి విషయము ప్రాకనిచ్చినందుకు కించపదడ్డాడు శివరాం. ఈసారి కనిపించినప్పుడు రాణితో నిక్కచ్చిగా స్నేహం తెగత్రెంపులు చేసుకోవాలని కృద్దుడైపోయాడు. మరో నిముషం ఆలోచనలో ఆమెను విడిచి ఉండడం దుర్భరమని దురపిల్లాడు శివరాం.
తరువాత ఆదివారం ఒంటిగంటకు రాణి శివరాం యింటికి రాలేదు. బహుశ ఆమె రాదనుకున్నాడు శివరాం. కధల పుస్తకం తీసి చదువుకుంటున్నాడు. తలుపు చప్పుడయింది. రాణి వచ్చింది తూలుతూ, తేలిగ్గా అడుగులు వేస్తూ, ఆయాసంగా ఒగరుస్తూ, కళ్ళు తేలిపోయేలా చూస్తూ, పాలిపోయిన ముఖంతో యింట్లో అడుగు పెట్టింది. శివరాం కోపంగా నిలుచున్నాడు. తలుపు తీసి. రాణి ఆశ్చర్యంగా దూరంగా ఉన్న శివరాంవైపు ఒక్కసారి చూసింది. స్వాగత మిచ్చే అతని ప్రవర్తనలోని మార్పు రాణిని కొంచెం బాధించింది. గబగబ నడిచి, వాలుకుర్పీలో కూలిపోయి, చేతిలోని బేగ్నేలమీద విసిరి ఆయాసంగా నీల్సింది. “కొంచెం నీళ్ళు ఇస్తారా? మౌనంగా లేచి శివరాం ఒక గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చి యిచ్చాడు. రాణీ త్రాగింది. నీరసంతో లేనిశక్తి తెచ్చుకుని” అలా ఉన్నారేం?” అంటూ దీనంగా ప్రశ్నించింది.
శివరాం ఆమె ప్రవర్తనలో ఏ మార్పు లేక మామూలుగా మాట్లాడుతున్న రాణిని శంకించలేకపోయాడు. ఆమె శరీరారోగ్యం బాగున్నట్లు కనిపించలేదు అతనికి. ఆమె వేసిన ప్రశ్న అతను ఎదురువేశాడు. “ఈ రెండు రోజులనుంచి జ్వరం... ఈవేళ రాలేనేమో అనుకున్నాను.... ఒంటిగంటకు మీరు నిరీక్షిస్తూంటారని తెలుసు... ఇంట్లో మంచంమీద పడుకుని ఉండలేకపోయాను... రిక్షాలో బయలు దేరి, బస్సు ఎక్కి యీ ప్రాంతంలో
అన్వేషణ 255 దిగి, యీ కొద్దిదూరం నడిచేటప్పటికి నీరసంతో కళ్ళు తిరిగాయి” ఒగురుస్తూ కూలబడింది కూర్చీలో రాణీ.
శివరాం హృదయం కరిగిపోయింది. దయతో, ఆవ్వ్యాయత, అభిమానం రాణీమీద ఎక్కువైపోయాయి లేవలేని స్టితిలో కూడా చూడాలనే ఆకాంక్షతో, పరుగెత్తుకు వచ్చిన రాణి హృదయంలో తనకు స్థిరమైన స్థానం లేదని శివరాం అనుకోలేకపోయాడు.
కలిసిపోయిన హృదయాల అనురాగ ప్రాబల్యం యీ విధంగానే ఉంటుందని, రాణి నిజమైన (ప్రేమ చవిచూపిందని శివరాం తబ్బిబ్పైపోయాడు రాణీమీద కోపం కలిగి ఆపిలుపండ్డు, ద్రాక్ష ఏమి కొని తీసుకురాని తన క్రూరత్వానికి తన్ను నిందించుకున్నాడు శివరాం తన మంచంమీదకు తీసుకువెళ్ళి స్వేచ్చగా పడుకోమన్నాడు శివరాం
మెత్తటి పరుపుమీద జఒత్తిగిలి పరుంది రాణి
“నాక్సు కాఫీ కావాలండీ?” రాణి కోరింది నిర్మాహమాటంగా, చుట్టుప్రక్కల హోటళ్ళు లేవు ఇంట్లో పాలులేవు, కాఫీ ఎలా వస్తుంది? శివరాం చిక్కులో పడ్డాడు పరిస్థితి గమనించి రాణి మౌనం వహించింది.
అలమరులో వడలిపోయిన బత్తాయిపండొకటి ఇచ్చాడు రాణికి. ఒకొక్క తొన అందుకొని తిని, కాస్తశక్తి తెచ్చుకుని నవ్వింది రాణి
శివరాం ఆమెను నర్మగర్భంగా... పరీక్షించాలనుకున్నాడు.
“మొన్న నిన్ను సుల్తానుబజారులో చూశాను ఎవరితోనో.... నల్ల కళ్ళజోడులో బలే అందంగా ఉన్నావు!” శివరాం చమత్కారంగా మాట్లాడాడు.
“సాయంత్రమా? .... అవునండి ....నేనూ, మా అమ్మ సినిమాకి వెడదామని బయలుదేరాం ... వీధిలో మా కంపెనీ యజమాని, భుజంగరెడ్డిగారు కారులో కనిపించారు బట్టల దుకాణాల దగ్గర... నన్ను రామనరసుగారు పిలిచారు... ఎవరో పెళ్ళికూతురు మేము తిరిగి వచ్చేదాక... మాతో పాటు రామనరసుగారు ఆయన తమ్ముడు కూడా సినిమాకు వచ్చారు ఆ సినిమా బాగుందని విని,... తడుముకోకుండా చెప్పింది రాణి.
ఆమె మాటలు సత్యదూరమనదానికి శివరాంకు ఏమీ బుజువు కనిపించలేదు. నమ్మాడు శివరాం.
తాను రంగులతో పూర్తిచేస్తున్న రాణిబొమ్మ చూపించాడు శివరాం. రాణి తన బొమ్మ చూచుకుని ఆనందంగా నవ్వింది.
26 అన్వేషణ
“ఏమండీ! ఆ బొమ్మలో ఎంత జీవం ఉట్టిపడుతోంది .. కొంప తీసి మీరు ఆ బొమ్మనే పెళ్ళిచేసుకునేరు కనుక!” పకపక బలహీనంగా నవ్వింది రాణి
“రాణి, మన అనురాగ చిహ్నంగా ఒక చిన్న బహుమతి” అంటూ పెట్టెలోంచి తీశాడు ఒక వెండి వస్తువు, గుంద్రని చిన్న ప్లేటులో ఆకుల కొమ్మల మధ్య నిలుచున్న చిన్న చెండి సెంటుబుడ్డి అందిచ్చాడు రాణికి శివరాం.
“పెళ్ళి కాకుండానే బహుమతు లిస్తున్నారే!” నవ్వింది రాణి. శివరాం ఉప్పొంగే ఆనందానురాగాలతో రాణిని చుంబించాడు.
అనారోగ్యంగా ఉన్న రాణిని యింటి దాకా తీసుకుపోయి దిగబెట్టాడు శివరాం.
మనస్సులు కలిసినపుడు మత విఖేదాలు ప్రధానంగా ఎంచక సంయోగం చెందినప్పుడే స్త్రీ పురుషుల జీవనానికి హాయి కలిగిస్తుందనే నమ్మకం గట్టిదైపోయింది శివరాంకు.
రాణి యిచ్చిన కైస్తవ ఉపన్యాస కరపత్రాలు టేబిలుమీద కనిపించాయి. పరమతసత్యం [గ్రహించుకోవడంలో స్వమత పరిత్యాగం యిమిడ ఉందనే భావం దూరం చేసుకోవాలని... అన్ని మతాల సత్యం దైవస్వరూప నిర్వచనానికే ఉపయోగపడుతున్నదనె ఉద్దేశ్యంతో బసీర్బాగ్లో జరుగుతున్న క్రైస్తవ ఉపన్యాస సభలకు వెళ్ళాడు శివరాం మేలి ముసుగులతో స్త్రీలు, వివిధరకాల దుస్తులతో పురుషులు (శ్రద్ధగా వింటున్నారు ఉపన్యాసాలు “వివాహం మానవుల విద్యుక్త ధర్మం” భార్యాభర్తల ఆదర్శాలు బైబిలులో ఉన్నట్లు నిర్వచిస్తున్నాడు ఉపన్యాసకుడు. సర్వమతాల సారాంశము ఒకటేయైన అవలంబనకు వివిధ పద్ధతులు అనుకరించడంవల్ల, వ్యక్తులో వ్యత్యానొలు ఏర్పడ్డాయనే సంగతి శివరాంకు విదిత మయింది వచ్చిన స్తీ ప్రేక్షక సమూహాన్ని పరిశీలించాడు శివరాం. రాణి కనిపించలేదు మరియమ్మ జాడకూడా లేదు. బహుశ వారిద్దరూ ఆ రోజు రాలేదనుకున్నాడు శివరాం. ఉపన్యాస గుడారం నుంచి బయటకి వచ్చి, తరువాతి కార్యక్రమం ఆలోచిస్తూ సిగరెట్టు వెలిగింది వీధిలో నిలుచున్నాడు శివరాం. జగదీశ్వర్ కనిపించాడు.
“ఏమోయ్ శివరాం!.... యిక్కడ నుంచున్నావేమిటి?.... వెకిలిగా నవ్వుతూ కాళ్ళు ఎగరేస్తూ నడుస్తూ దగ్గరికి చేరాడు.
అన్వేషణ ట5్7
“కైస్త్వవమత ఉపన్యాసాలు విన్నానోయి!” అన్నాడు శివరాం మామూలుగా.
“అంతేనా... లేక . మేలి ముసుగులు...” నవ్వాడు.
“సత్యం తెలుసుకోకుండా అసత్యం ఊహించకూడదు?” క్రైస్తవ ఉపన్యాసకుడి దోరణిలో సూక్తి బోధించాడు శివరాం.
“రాణి సావాసదోషం కాదుకదా!.. నాకూ యిచ్చింది కరపత్రాలు, రెండు రోజులు గుడారాల్లోకూర్వాన్నా .. రాణీ మాత్రం కనిపించలేదు .. తీరుబడి ఏది? ... ఎవరో ఒక స్నేహితుడు వెంటవేసుకు తిరుగుతుంటాడు ” జగదీశ్వర్ అతి తేలికగా నవ్వేశాడు.
శివరాం ఆ తేరిక సంభాషణ విని చాలా బాధపడ్డాడు. రాణికి తనకూ మధ్య విజృంభిస్తున్న అనురాగదృశ్యాలు నవయువక మండలి సభ్యులకు ఎవరికీ తెలియవని శివరాం నమ్మేడు. అదే విధంగా మాట్లాడే జగదీశ్వరుని యింకా ప్రశ్నలు వేసి సమాచారం తెలుసుకోవాలనుకున్నాడు నిప్పులేనిదే పాగరాదనే సిద్ధాంతం అనుసరించి, కొంత కారణం లేనిదే రాణి ప్రవర్తన గురించి పదిమంఇ పలు విధాలుగా అనుకోవడం జరగదని ఊహించాడు శివరాం.
్యాల్సి ఎటువంటి మనిషి?” బుజ్జగించి ప్రశ్నించాడు శిపరాం.
“అమ్మ! .. చాలా తెలివైన ఘటం. నీలాటి వాళ్ళని పదిమందిని బోల్తా కొట్టిస్తుంది... అయిదుగురు మగవారిని ఒకరోజు కలుసుకుని అందరిని సంతృప్తిపరిచి, అందినసామ్ము చేతపట్టి, లాలిస్తూ ఆశలు రేకెత్తించి మర్యాదగా నిషమించగలదు... ఆమె జీవితంలోనే నటిస్తుంది!” పకపక నవ్వాడు జగదీశ్వర్.
“నువ్వు ఎప్పుడైనా డబ్బిచ్చావా?”
“క్ష. ఎన్నోసార్లు... షికార్లు కొట్టాం... సినిమాలు చూశాం, మధ్యపానం సేవించాం... సిగరెట్లు... తాగేం... దుద్దులు...గాజులు, రిబ్బన్లు, మల్లెదండలు ఎన్నో బహుమతు లిచ్చా.... అన్నీ తీసుకుని ఆహ్లాదంగా, హాయిగా నవ్వి అందాలు విరజిమ్ముతూ అత్యద్భుతంగా అదృశ్యమై పోతుంది.... ఒకసారి స్నేహంతో సరి... నిన్ను విడిచేస్తుంది... బలే చిత్రమైన మనిషి” జగదీశ్వరుకీ యిచ్చిన రైలుబండి పరుగులా చకచక మాట్లాడేశాడు,
“అసలు ఏ వూరు రాజి?”
“అది నన్నడగకు... బ్రహ్మరుద్రులకే తెలియదు... ఇతరుల సంగతులు అన్నీ
లర్ట్ అన్వేషణ తెలుసుకుంటుంది... తన సంగతీ పరమ రహస్యం... ఎవ్వరికీ చెప్పదు! .. కొంపదీసి నువ్వుకాని రాణివెంట... ప్రమాదం సుమా.. వస్తా!” జగదీశ్వర్ కంగారుగా వెళ్ళిపోయాడు.
మనస్సులోని నిశ్చిత అభిప్రాయాల నిర్మల నీరాల్లో రాళ్ళు రువ్వినట్టయింది జగదీశ్వర్ సంభాషణతో. శివరాం మనస్సు వికలమైపోయింది. రాణి బ్రతుకు గురించి తనేమి తెలుసుకోకుండానే ఆమె బాహ్య ప్రవర్తన ప్రాతిపదికగా అభిప్రాయాలు ఏర్పరచుకుని తప్పుడు త్రోవ (శ్రొక్కుతున్నానేమో అని భయపడ్డాడు శివరాం. అందులో నిజం పరిశీలించేకంటే మనస్సుకు నచ్చిన స్తీనుంచి ఆనందం పొందలేక వికృతి పరిస్థితులు ఏర్పడుతున్నాయో” అని కుమిలి బాధపడ్డాడు శివరాం,
తరువాత ఆదివారం రాణి శివరాం ఇంటికి రాలేదు. బహుశ అనారోగ్యంగా ఉండి రాలేకపోయిందనుకున్నాడు శివరాం. జ్వరంతో ఉన్నా తన యింటికి వచ్చిన మనిషి మరీ హీనస్టితిలో ఉండి రాలేక పోయిందేమో అనుకుని తనే స్వయంగా చూడాలని యింటికి వెళ్ళాడు శివరాం.
ఇంట్లో రాణిలేదు సినిమాకి వెళ్ళిందని మరియమ్మ చెప్పింది. ఎవరితో వెళ్ళిందని శివరాం ప్రశ్నించలేదు. మరియమ్మ చెప్పనూలేదు. రాణి మీద దురఖిప్రాయలు మనస్సులో రగులుకుంటున్న శివరాం ఎవరితో సినిమాలో వెళ్ళింది ఊహించుకున్నాడు.
తరువాత ఆదివారం రాణి శివరాం ఇంటికి వచ్చింది హుషారుగా.
“ఇంటికి వచ్చినా దర్శనమే లేదే!” శివరాం రాణి రావడంతోనే చెప్పాడు.
“ఆ్రవేభ్ర వనజతో కలిసి బలవంతం మీద సినిమాకి వెళ్ళేనండి. మీరు వచ్చారని అమ్మ చెప్పింది” నవ్వింది రాణీ.
రాణి ప్రతిమాట ఎంతో సత్యంతోకూడి సహజంగా ఉండడంచే శివరాం తన్ను తనే నమ్మలేక పోయాడు. ఆమెను నమ్మక తప్పలేదు,
శివరాం సిగరెట్టు వెలిగించాడు. రాణీికి మరొకటి అందిచ్చాడు.
“ఆడది సిగరెట్టు ఎలా త్రాగుతుందండీ.... క్షమించండి!” రాణి నవ్వుతూ ముఖం త్రిప్పుకుంది.
“ఏమో సిగరెట్లు కాల్ఫడం నీకు కూడాఅలవాటునుకొన్నాను!
“అలవాటున్నదీ లేనిది పెదవులను చూస్తేనే తెలుస్తుంది!” రాణి మాటలు తీవ్రంగా ఫనబడ్డాయి. ఆమెకు కోపం తెప్పించడం శివరాంకు ఇష్టంలేదు.
అన్వేషణ 259
“పోనీలే... ఆ విషయం మాట్లాడడం మానేద్దాం.... నీ బొమ్మ తయారయింది... ఏమిస్తావు?”
ఎర్రగులాబీ చీర, పాలపిట్టరంగుల జాకెట్టు రంగురంగుల చుక్కల గాజులు .. కనుబొమ్మలు ఎగరవేస్తూ, చైతన్యవంతంగా సొట్టబుగ్గలతో నవ్వుతూ చిలిపిగా చూస్తోంది రాణిబొమ్మ
“అబ్బ! ఏం చక్కగా ఉందండి - ఏమివ్వగలను - ఈ బీద రాణి ఎమివ్వగలదు. నా హృదయరాజ్యానికి మిమ్మల్ని తక్షణం పట్టాభిషిక్తులుగా చేస్తాను!” రాణి ఉప్పాంగే ఆనందంతో తన్మయత చెండి, బొమ్మను నిశితంగా చూసి శివరాంవైపు చిలిపిగా కులుకుతూ నవ్వింది.
శివరాం, రాణి హావభావచేష్టల్లో తనపై పరిపూర్ణ ప్రేమ ఉన్నట్లు అనుభూతి పొందాడు. దగ్గరికిచెరి ఆమె మూర్ధం ఆ(ఘాణించాడు రాణి మెల్లిగా మలయామారుత కెరటాల్లా నవ్వు ప్రసరించింది.
“ఈ బొమ్మకూడా అచ్చు మీరు మునుపు ్రేమించిన అమ్మాయి లొగే ఉందండి?”
“క్రొద్దిగా ఆకారసౌష్టంలో మార్పు ఉంది - ముఖం డిటో” నవ్వాడు శివరాం.
“ఏమండీ ఆ అమ్మాయి తిరిగి కనిపించి పశ్చాత్తాపపడి మిమ్మల్ని కోరితే - బహుశ నన్ను వదిలేస్తారనుకుంటూ” నవ్వింది రాణి.
“ఇది అసంభవం
“సంభవమైతే ?”
“గతం మరచిపోవాలి రాజీ!” చికాకుగా దూరంగా వెళ్ళి పోయాడు శివరాం.
కిటికీలోంచి వీధిలోకి చూశాడు శివరాం శూన్యంగా. నిజంగా శారద కనిపించి క్షమించమంటే ప్రస్తుత పరిస్థితిలో తానేమి చెయ్యగల డనేది అనిశ్చితమైన పంష్కారంగానే కనిపించింది, తల్లి చనిపోతూ అన్న మాటలు చెవుల్లో (ప్రతిధ్వనించాయి. సరియైన సమాధానం దొరకడం దుర్లభమనిపించింది. వ్యధతోకుమిలి ఉప్పొంగే రెండు కన్నీటి బిందువులు రాల్హాడు శివరాం.
వెనుకనుంచి రాణి ఏడ్పు వినిపించింది శివరాంకు. రాణి మోకాళ్ళల్లో తల దూర్చి చేతులు చుట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది. మనస్థాపంతో తను కుమిలి
2060 అన్వేషణ విచారించవలసింది పోయి రాణి ఏడ్డడంలో సమంజసత కనిపించలేదు శివరాంకు. “ఎందుకు ఏడుస్తున్నావు? రాణి ఏడ్పు ఆపింది. కళ్ళు తుడుచుకుని మౌనంగా తల వంచుకుని కూర్చుంది శివరాం గీసిన ఫోటోలు వేలమీద దొర్హుతోంది. “మీకు అనవసరంగా మనస్థాపం కలిగించానని!” తన విచారంలో పాలుపంచుకుంటూ బేలగా ప్రవర్తించిన దాణి అంటే అభిమానం పొంగుకు వచ్చింది శివరాంకు. అయినా శారద గురించి ఆలోచనలు అతని మనస్సులో ఏవో తరంగాల్లా కదులుతూనే వున్నాయి. శ్హేన్స నాటకాల్లో యింక వెయ్యదలచుకో లేదండి కృష్ణ మూర్తిగారితో చెప్పేశాను ఈ సంగతి”. మౌనంగా నిశితంగా రాణి వైపు చూశాడు శివరాం. మనస్సు మరో విషయంపై మళ్ళించాలని ప్రస్తావన మార్చింది రాణ్ “నాటకాల్లో తిరుగుతూంటే సంసారంలో మసిలే ఆడపిల్లలకు పరువు ప్రతిష్టలు పోతాయి. అందరితోనూ చనువుగా ఉండకపోతే సంఘంలో తప్పు, ఉంటే మనుష్యులు అపార్ధం చేసుకుంటారు... అందుకే నాటకరంగంనుంచి పూర్తిగా నిష్రమించేను నేను!” రాణి సాలోచనగా ఏదో పుస్తకం తెరిచింది. శివరాం తెచ్చిన ఫలహారాలు టేబిలుమీద అట్లాగే వున్నాయి. ఎవరూ ముట్టుకోలేదు. “అవును పెళ్ళిచేసుకోబోయే ఆడది ఆ పని చెయ్యడం చాలా (శ్రేయస్కరం! రాణి పదిమందిలోను, చనువుగా మసలడం శివరాంకు కూడా యిష్టంలేనట్లు స్పష్టమైపోయింది. శివరాం అభిప్రాయం అర్ధం చేసుకున్న రాణి వింతగా లోలోపల బాధపడింది. ఇంతవరకు తన్ను అపార్ధం చేసుకునే పరిస్థితులు అనేకం బర్చడి ఉంటాయని, ఇటువంటి అనుమాన ప్రవర్తనల్లో, సందిగ్ధమనోనిశ్చయాల్లో చేసుకున్న వివాహం విజయవంతం కాదేమో అనే భయం రాణిని పీడించింఇ. “న్తేన్సు వివాహం చేసుకోదలచుకోలేదండి - మనం స్నేహంగా యిలాగా వుండిపోదాం[”
అన్వేషణ 2గ్ర1
శివరాం ప్రవర్తనవల్ల తన మనస్సు పూర్తిగా వ్యక్తం చెయ్యలేని రాణి తప్పనిసరిగా ఆ మాట అనవలసి వచ్చింది. ఆ మాటతో శివరాం హృదయంలో ఎన్నో అనుమానాలు ఎర్పడ్డాయి జగదీశ్వర్ మాటల్లో కొంత సత్యం స్పురించింది బహుశా యీమ అందరిదగ్గర యిదేవిధంగా ప్రవర్తించి మోసంచేస్తూ కాలం కడుపుతోందేమో అనే అభిప్రాయం ఏర్పడింది శివరాంకు. మనోభావాల సంఘర్షణలో పడి, ఆశలవైఫల్యానికి కుమిలి కుపితుదయ్యాడు శివరాం.
“రాణీ! నీ ప్రవర్శన ఎంతోకాలంనుంచి గమనిస్తున్నాను .. నీ విషయం గురించి స్పష్టంగా సాకల్యంగా, హృదయం విప్పి మాట్లాడిన రోజు ఒక్కటీ కనిపించలేదు ఏదో గూధంగా మనస్సులో ఏమిటో దాచుకుని, యితరులు నిన్ను అర్ధం చేసుకోవాలనుకుంటావు. అది చాలా తప్పు. నువ్వు ఎలా (బ్రతుకుతున్నదీ నీ కష్టాలు సుఖాలు నాతో చెప్పకపోతే నాకేం తెలుస్తుంది.... ఇదే నీ సహజ ప్రవర్తన అయితే, ఎవరు నిన్ను వివాహం చేసుకున్నా వాళ్ళకు ముప్పు తప్పదు!”
చికాకుగా అసహ్యంగా ముఖం పెట్టాదు శివరాం రాణివైపు.
ఉండేలు దెబ్బతిన్న పక్షిలా రాణి హృదయంలో గిలగిల తన్నుకుంది.
“మ్సీ ముప్పు తప్పించాలనే, వివాహం సంగతి ఎత్తవద్దంటున్నాను!” రాణీ ముభావంగా తలవంచుకుంది.
శివరాం క్రోధం అపుకోలేక, ఆవేదన భరించలేక బలవంతంగా కాస్సేపు మౌనం వహించాడు. అణచుకుంటున్న క్రోధం ఆగక, బాహ్య ప్రవర్తనలో రూపొంది, గదిలోకి బూట్లు గట్టిగా తన్ని తోసేశాడు. శివరాం పార్వతిమట్టి విగ్రహం నేలకేసి బాది ముక్కలు చేశాడు. శివరాం మౌనంగాకోపంలో ఉన్నత శిఖరంమీద తాండవం చేస్తున్నాడని రాణి (గ్రహించింది.
“ఏమీ లేదండి! పెళ్ళి చేసుకుంటే నాకు విడాకులు తప్పవని ఒక సాము(ద్రికుడు చెప్పాడు.... అందుకని అలా అన్నాను!” రాణి పకపక నవ్వేసింది తేలిగ్గా.
ఆమె తేలికగా నవ్వడం తన మనోభావాలు విలువలు (గ్రహించలేకపోవడమే అనుకున్నాడు శివరాం. జగదీశ్వర్ మాటలు ప్రతి ధ్వనించాయి శివరాం చెవిలో.
రాణి మీద విచిత్రమైన అసహ్యం ఏర్పడింది. ఆవేదనతో హృదయం దహించుకు పోయింది. తన (బ్రతుకులో మనశ్శాంతి శూన్యమనే భావంతో వివశుడయిపోయాడు
262 అన్వేషణ శివరాం తక్షణం తన పెట్టెదగ్గరకు వెళ్ళి పర్సులోంచి పాతిక రూపాయలు తీశాడు
“రాణీ! నీ శ్రమకు ఫలితంగా యిదిగో. ఇక ముందు నా యింటికి రానక్కర్లేదు!” పాతిక రూపాయిల కట్టరాణి మీద విసిరేశాడు.
“ఏమిటిది?” రాణి చికాకుగా ప్రశ్నించింది
“కోపం వచ్చిందా!” దగ్గరకు వెళ్ళి ప్రేమగా అనునయించింది.
“వెళ్ళు తక్షణం పో! ఈ రోజుతో మన స్నేహం ఆఖరు!” గట్టిగా అరిచి కోపంతో వెళ్ళి తన మంచంమీద పడుకున్నాడు శివరాం ముఖం చేతులతో కప్పుకుని.
రాణి అవమానం భరించలేకపోయింది. శివరాం విసిరిన నోట్ల కట్టలోని అంతరార్థం గ్రహించుకుంది. సహజంగా ఆమెతో ఉన్న అహంభావం ఆ(గ్రహాన్ని రెచ్చ గొట్టంది. శివరాం (ప్రవర్తనకు బాధతో కుమిలి కాస్సేపు మౌనంగా ఎడ్చింది. మెల్లిగా తన బేగ్ తీసుకొంది. శివరాం దగ్గరకు వెళ్ళింది కుపితురాలై.
“మీరింత నీచంగా వ్రవర్తిస్తారనుకోలేదు... మీరు నన్ను యింతకాలం ఒక భోగందానిలా అర్ధం చేసుకున్నారన్నమాట మీ డబ్బు నా కక్కరలేదు.. మీ ప్రవర్తన నా జన్మకు మరిచిపోలేను ఆడదాన్నైనా నాకూ వ్యక్తిత్వం. పరపతి ఉన్నాయి.... నమస్తే!” అంటూ రాణి నోట్ల కట్ట శివరాం వైపు విసిరింది. రూపాయి కాగితాలు చెదిరి శివరాం మంచం చుట్టూ పీడకలల్లా ఎగిరేయి. రాణి కోపంతో విసవిస నడుస్తూ వెనుదిరిగి చూదకుందా, ఉబికివచ్చే దుఃఖం ఆపుకుంటూ బస్సుస్తాండు వైపు నడిచి ఒంటరిగా వెళ్ళిపోయింది.
అన్వేషణ 263 కేకే
రాణి ఇల్లుచేరి విచారంగా దిగులుగా మంచంమీద పడుకుంది. తలగడలో ముఖం దూర్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తలగడ తడిసి పోయేదాకా. మరియమ్మ వచ్చి విషయ మేమని ప్రశ్నించింది కాని రాణి మౌనం వహించడంతో ధైర్యం వహించి పదేపదే ప్రశ్నించలేకపోయింది.
జీవితంలో చేసిన నేరాలు, ద్రోహాలు మనిషిని వెన్నంటుతూనే వుంటాయి. సంఘం దృష్టిలో మంచి సులభంగా విస్మరింపబడుతుంది కాని చెడు మాత్రం తరతరాలు మరచిపోని గాధగా వ్యాపించి పోతుంది. ఎవరి ప్రవర్తన ఫలితాలకు వారే బాధ్యులు కాని తదితడులు కారనే విషయం జగతిలోని ప్రతివ్యక్తి చరిత్ర బుజువు చేస్తూనే వుంటుంది.
శివరాం మీద కొండంత ఆశలు పెట్టుకుని వివాహ ప్రస్తావన ఒక నిర్ణీత రీతిగా పరిష్మరించుకోవాలని హుషారుగా రాణి వెళ్ళింది శివరాం యింటికి. శివరాంలోని వ్యంగ్యం, గర్వం, అనుమానాలు రాణి మనస్సు స్పష్టపరిచేలా అవకాశమివ్వలేదు. తన గత చరిత్ర చెప్పుకుని, కష్టసుఖాలు విపులంగా విశదీకరించితే ఆ విషయాలు సహృదయంతో శివరాం పరిశీలించేలా కనిపించలేదు. అటువంటప్పుడు తాను అనవసరంగా వెలితిపడి (బతుకు బట్టబయలు చేనుకుని అభానుపాలవడం జరుగుతుందనుకుంది రాణి,
నిష్కల్మష హృదయాలతో నిండు (ప్రేమతో కలుసుకున్న వ్యక్తులు వివాహ జీవితంలో విజయవంతులు కాగలరు కాని అనుమానాలతో, నిగూడ రహస్యాలతో వ్యక్తులు ఎప్పుడూ అన్యోన్యంతో బ్రతకలేరనే విషయం నిజం. శివరాంతో జీవితంలో తనకు సుఖవంతమైన బంధం ఏ విధంగానూ యింక ఏర్పడదనే నిశ్చయం చేసుకుంది రాణి.
త్రగ్రశ అన్వేషణ ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని అన్న శివరాం కేకలు రాణి చెవుల్లో ప్రతిధ్వనించాయి. సంఘమే తన్ను బహిష్కరించినట్లు అనుభూతి పొందింది రాణి. (బ్రతుకులో హాయిగా ఉండాలంటే సంఘదృష్టినుంచి ఎన్నోవిషయాలు. మరుగుపరు చుకోవాలనిపించింది. ఎంత కేమికుదుగా కనిపించినా, సహజ బలహీనతలుగల వ్యక్తిగా సంఘంలో బ్రతికే శివరాం ముందు తన కష్టసుఖాలు, గత చరిత్ర మనిషి తత్వం మీద పూర్తి విశ్వాసం లేనప్పుడు వెల్లడి చేయడం మూరత్వమని భావించింది రాణి. తన ప్రవర్తలో కొంత సమయస్పూర్తి ఉన్నట్లే సంతోషించింది. ఆశలు రేకెత్తించిన శివరాం తిరిగి తన్ను అవమానపరిచి, యింటినుంచి గెంటేయడంతో రాణీ అహంభావం దెబ్బతింది. ఆత్మగౌరవం హృదయంలో గగుల్మొంది. ఇంక శివరాం ముఖం చూడకూడదని నిశ్చయించుకుంది. ఏదో చిన్న ఉద్యోగంలో జీవితం గుడుపుతూ డబ్బుకు ఆశపడి తన అందం ఆధారంగా వ్యక్తులను ఉదద్రేకపరిచి మోసం చెయ్యడం నాటకాలద్వారా సులభమైన ప్రచారం పొందడం పరపతిగల స్తీ లక్షణాల్లా కనిపించలేదు రాణికి. మరియమ్మ త్రాగుడు, నల్లమందుకే తన సంపాదనలో చాలాభాగం ఖర్చవుతోంది. ఆమె తనకు పూర్తిగా ఒక పెద్ద బరువుగా చీడపురుగులా కనిపించినా, ఒక మాతృమూర్తి. _పెరిట ఎ నో సమస్యలు ఎదుర్కొంటూంటే, స్త్రీకి కావలసిన సమయోచిత పరపతి, హక్కులు వాటంతట అవే లభిస్తున్నాయి. మరియమ్మ ఖర్చులబ్రతుకు భరించడం తనకు తప్పనిసరి అనుకుంది శివరాంతో వివాహం ఆశలు సన్నగిలడంతో తన జీ వితంలో అధ్యాయం ఒకటి పూర్తయిపోయిందని విశ్వసించింది. ఇంక వివాహ (ప్రసక్తి మరచి, జీవితంలో క్రాత్తమార్పు తెచ్చుకోవాలనుకుంది. అందుకు తగిన వాతావరణ సృష్టిం చుకోవాలని నిశ్చయించుకుంది రామనరును ఆదరణలో నెలజీతం అందుకున్నా అది ఖర్చులకే చాలటంలేదు. ముందు చదువులు కొనసాగించి మపాళా నంధూలలో జేరి వాతావరణం మార్చుకోవాలంటే ప్రాతిపదిక ధనం కావాలి. రాణి మీద మోజు పెంచుకుంటున్న రామనరుసును పెళ్ళి చేసుకోవాలనే సంకటస్థితిలో పెట్టి అతని వ్యామోహ బలహీనతను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటోంది రాణి. చదువుకు కావలసిన ధన సేకరణ యిదేరీతిలో కొన్నాళ్ళుచెయ్యవలసినట్లు తప్పనిసరి. అనిపించింది రాణికి. ఇటువంటీ ప్రవర్తన తన శీలానికి జీవితానికి ముప్పుతేవడమే గాక, సంఘంలో పరపతి పోగొట్టుకునే
అన్వేషణ 265 పరిస్థితి కూడా ఏర్పడవచ్చునని భయపడింది రాణి. ఈ వాతావరణాన్నే త్యజించి ఎవరినైనా ఆ(థశయించి సినిమాలలో జేరి యీ తరగతి జీవనాన్ని పూర్తిగా మార్చెయ్యాలని ఒక్కొక్కసారి ఆవేశపడింది రాణి. తన కోరకలు రూపం పొందటానికి తగిన ఆశయంకోనం అన్వేషించాలనుకుంటూ ఒక స్టిరనిశ్చయం లేక చికాకుగా బాధపదసెాగింది రాణి
రెండు రోజులు గడిచాయి.
ఒక సాయంత్రం శివరాం రాణియింటికి వచ్చాడు. మరయమ్మ తలుపు తీసింది.
“*శివరాంగారు వచ్చారే అమ్మాయి!” అంటూ సాగదీసుకుంది మరియమ్మ.
రాణి అవమానంతో కోపంతో ఉద్రిక్తురూలయిపోయింది. మానసికంగా శివరాంతో ఆమె సమన్వయంపొంది స్టిరబీవితం గడపడం అసంభవమని నిశ్చయించుకుంది రాణి గతం మరచి మరోరీతిలో (బ్రతుకు కాలంగడప నిశ్చయించుకున్న రాణికి శివరాంను ఆహ్వానించడం యిష్టం లేకపోయింది.
“అమ్మా! ఆయన్ను వెళ్ళివొమ్మను... ఇంక ఎప్పుడు మనింటికి రావద్దనుగొ రాణీ ముఖం త్రిప్పుకుని వెనకకు తిరిగింది.
“రాణి!” శివరాం దీనంగా ఏడో చెప్పబోతున్నట్లు నిలుచున్నాడు.
నాకు మనశ్వాంతి యివ్వదల్పుకుంటే మీరు వెళ్ళివొండి తక్షణం!” రాణి ఐడుస్తూ గబగబ మేడమీదకు పోయింది.
“బం జరిగింది అబ్బాయిగారు!” మరియమ్మ శివరాంను ప్రశ్నించింది విషయం తెలుసుకుందామని.
శివరాం నిరాశగా కాస్సేపు కుర్పీలో కూర్చున్నాడు రాణి ఎంత సేపటికి క్రిందకు రాలేదు. బహుశ రాణితో జీవితములో సంయోగం అసంభవ మనుకుని చేతులారా తొనుచేసిన తప్పుకు విచారిస్తూ, భాదపడి వెళ్ళిపోయాడు శివరాం.
జీవితంలోని ఆశలు నెరవేరనప్పుడు, నిరాశ పెరిగిపోయి, నిర్లక్ష్యం విజృంభించి, మొండితనం యినుమడించే ప్రవర్తనకు దారి దీస్తుంది. రాణి బ్రతుకులో కూడా యీ మార్పులు ఉధృతరూపంలో కనిపించసాగాయి.
ఇంటరు పరీక్షకు (శ్రద్దగా చదువుతున్నా యింకా చదువులు సాగించడానికి యిప్పటినుంచి ధనసేకరణ చెయ్యాలని సంకల్పించింది రాణి. శివరాం స్నేహం
266 అన్వేషణ ఏర్పడినప్పుడు దూరం చేసిన స్నేహితుల నందరినీ తిరిగి మచ్చిక చేసుకోసాగింది. నాటకాల ద్వారా వచ్చే సులభప్రచారం స్వీయపరపతిని హీనపరుస్తోందని నాటకాలకు తన్ను ఉపయోగించే కృష్ణమూర్తిని దూరంగా వుంచింది. భూమారావు, జగదీశ్వర్, శ్రీనివాసు, రెడ్డి, రావు, రామనరుసు అవసరాలకు ఆదుకునే ప్రతీ మగమనిషిని, తన అందంతో రెచ్చగొట్టి చుట్టూ (త్రిప్పుకో సాగింది రాణి. షికార్లు, సినిమాలు, పిక్నిక్సు, హోటళ్ళులో ఫలహారాలు విందులు, అనుభవిస్తూ వివిధరకాల వ్యక్తులను వెంటబెట్టుకుని విచ్చలవిడిగా సంచరించనాగింది రాణి బట్టల దుకాణంవాడికి బాకీవుందని, అర్హంటుగాట్యుటోరియల్ కాలేజి జీతం కట్టాలని, పుస్తకాలు కొనుక్కోవాలని, దర్లివాడికి సొమ్ము చెల్లించాలని ఇంట్లో దినుసులిచ్చె దుకాణాదారుడు, పాలవాడు బాధ పెడుతున్నారని, నిర్మాహమాటంగా అప్పు రూపంలో తనవెంట తిరుగుతూ తనమీద మోజు చూపే ప్రతి స్నేహితుని సొమ్ము అడిగేది రాణి ఆ సొమ్ము తిరిగిరాదనే సంకల్పంతో అడిగితే ఆమె అభిమానానికి దూర మవగలమనే భయంతో స్నేహితులు ఆమెకు దబ్బు యిచ్చేవారు. రిక్షావాడికి కూలి యివ్వడం నుంచి వీధిలో కనిపించే మల్లైెదందవరకూ ప్రతి చిన్న వస్తువుకూ స్నేహితులనే ఉపయోగించుకోసాగింది ప్రతి దానిని వివాహం చేసుకోమని రెచ్చగొట్టి, అది అంతా సులభంకాని పరిస్థితిగా ఏర్పడినప్పుడు, అతన్ని వేధించి, అసహాయత, ఆపార (శ్రమ వ్యక్తపరచి, ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడికి తన సంబంధం బట్టబయలు కాకుండా తిరుగుతూ పూర్తిగా జీవితంలో నటకురాలైపోయింది రాణి దర్జీవాడిని సమ్మోాహనపరచి, ఖర్చు లేకుండా రవికలు కుట్టి ంచుకొనదం, బట్టల దుకాదారులమీద అందాలనవ్వులు విరజిమ్మి అప్పుగా తెచ్చిన చీరలకు తిరిగి సొమ్ము వాపసు చెయ్యకపోవడం, యింటిదినుసులు యిచ్చే దుకాజణాదారుని యింటికి రమ్మని కప్పు కాఫీ యిచ్చి, పేకాడి చనువు చూపించి ఊహాగానాల్లో అతన్ని వదిలి, యింటి ఖర్చు అడుగకుండా వ్యాయోహమంత్రం చల్లడంలో రాణి నిపుణురాలైపోయింది. (బ్రతుకు ఏమైపోతేనేం అనే నిర్భయంతో, ఒడుదుడుకులు తట్టుకోగలననే మూర్ధదైర్యంతో, తాను సున్నితమైన అబలననే విషయమే మరచి, తన అందం గర్వంమీదే (బ్రతకాలని పాటుపడసాగింది రాణి. రాణి ప్రవర్తన మరియమ్మకు అక్షరాలా నచ్చింది. తన అనుభవాలన్నీ రాణి చక్కగా పుణికి పుచ్చుకుంటోందని మరియమ్మ లోలోపల ఎంతో ఆనందించింది.
ఒకరోజు ఆదివారంచర్చికి ప్రార్ధన జరపడానికివెళ్ళి, రాణి, మరియమ్మ రిక్షాలో ఎదురు వస్తున్నారు. రిక్షావాడు గాలి ఎదురు బరువుకు తట్టుకోవాలని టాపు ముడిచేశాడు.
అన్వేషణ 267 ఎత్తువీధిలో యిద్గరి మనుష్యుల బరువు మోయలేక, క్రిందకుదిగి సైకిలురిక్షా నడిపించసాగాడు.
ఎదురుగా యిద్దరు మనుష్యులు వస్తూ మరియమ్మను చూసి హరాత్తుగా ఆగిపోయారు. లాల్చీ, పంచ, సిల్కు కండువాతో గిరజాలజుట్టు పెంచుకొన్న నలభైఏళ్ళ మనిషి ఒకడు మరియమ్మను పలకరించాడు.
“ఏం మంగమ్మా!. .. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు దర్శనం... . ఏమిటి విశేషాలు... ఎవరు వీ కూతురు?” రాణివైపు విసిరాడు ఓరగా ఓ చూపు.
మరియమ్మ నవ్వింది. అతన్ని ఎరుగున్నట్లు ఆనందంగా గబుక్కున రిక్షా అపి దిగింది. రాణి ఆశ్చర్యపోయింది మరియమ్మ గత చరిత్ర కొంత తెలుసుకున్న ఆమె పేరు మంగమ్మ అని యంతవరకు రాణికి తెలియనే లేదు
“ఎప్పుడొచ్చావు రెడ్డన్నా*?*” మరియమ్మ ఆనందంగా వక్రంగా పెదాలు త్రిప్పింది.
“హైకోర్టులో దావా పదేశాం ... అందుకే వచ్చాను..... యింకా నాల్ను రోజులుంటా!... ఎక్కడ మీ మకాం?.... నీ కూతురు చాలా అందంగా ఉందే!” వీధిలో పోయే మనుష్యులు వింటారని కూడా గుర్తించకుండా గట్టిగా వాగేస్తున్నాడు రెడ్డన్న.
“అబ్బ! చాలా కాలానికి కనిపించావే... కోఠీ ప్రక్క్మన ఉంటున్నాము. తీరుబడి చేసుకుని అలారా ఒకసారి... అమ్మాయి కూడా మాట్లాడుతుంది!” నవ్వింది మరియమ్మ వ(క్రంగా.
“ఏమిటి ? చర్చిలోంచి వస్తున్నావే? ప్రొద్దున్నే.. తావళం మార్చేసావా మంగమ్మ! ... బలేదానివిలే!” పకపకనవ్వాడు రెడ్డన్న.
“వెబుతాగా... యింటికిరా రెద్దన్నా[ో
మరియమ్మ మెల్లిగా ఎక్కి రిక్షాలో కూర్చుంది. రిక్షా కదిలింది. రెడ్డన్న మీసం సవరించుకుంటూ రాణివైపు ఓరగా చూశాడు.
ఆఫీసులో రాణి ముభావతత్వం ప్రదర్శించ సాగింది తక్కిన గుమాస్తాలు కూడా మూర్తిని కొట్టిన సంఘటన జరిగాక, కొంచెం అప్రమత్తులై ఆమెతో పరిచయం
268 అన్వేషణ పెట్టుకోవడం మానేశారు ఆఫీసులో మరొక స్త్రీ - సునీత ఉద్యోగంలో చేరింది. ఆడవాళ్ళవడంవల్ల కొన్నాళ్ళు యిద్దరూ కలిసి మెలిసి ఉందేవాళ్ళు ఒకరోజు ఇద్దరూ కలిసి ఫలహారాలు చేసే సమయంలో, మగవాళ్ళ పరిచయాలు, ఆడవాళ్ళ శీలం గురించి ప్రన్తావన వచ్చి, ఒకరి నొకరు వ్యంగ్యంగా దూరుకొని, చివరికి ఆ(గ్రహవేశులైపోయాను. మనస్సులో శాంతి లేక అసలే చికాకుగా బ్రతుకుతున్న రాణికి, సునీత ఆమె శీలం గురించి చేసిన దుర్భాషలు ఒంట్లో త్రేళ్ళు, జెర్రులు ప్రాకినంత పనిచేశాయి. ఉక్రోషం అపుకోలేక రాణి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం వదలి, సునీత జడపట్టుకు లాగి దవడమీద కొట్టింది. సునీత రామనరసుతో పిర్యాదు చేసింది. రాణిమీద ఆమె ప్రవర్తనవల్ల, మోజు తగ్గించుకుంటున్న రామనరసు ఆమెను కేకలేశాడు.
మరోసారి యిటువంటి ప్రవర్తన ఆఫీసులో కనిపిస్తే ఉద్యోగం విరమించుకుని యింటికి పోవలసివస్తుందని బెదిరించాడు. రాణి రానునరసు మనస్సు ఇదివరకే అర్ధం చేసుకుంది. సునీత ఉద్యోగంలో చేరడంతో, రామనరసు తనపై మోజు తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని చూచాయగా గ్రహించుకుంది కొంచెం జా[గ్రత్తగా మసలడం మంచిదని, మరో ఆధారము దొరికేక రామనరసుతో కొంచెం మంచిగా ప్రవర్తించడం అవసరమని గుర్తించింది. తన అసభ్యప్రవర్తనకు క్షమాపణ చెప్పుకుని ఆఫీసులో తన సీటులోకి వచ్చికూర్చుంది.
రాఘవరావు ఆమెను పిలిచాడు. రాణి అతనిమాట వినిపించుకోలేదు. హెడ్ గుమాసా అధికారంతో దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు. రాణీ అహంభావంతో వెళ్ళలేదు. రాఘవరావు ఆకారం చూస్తేనే అసహ్యం కలిగి, తన (బతుకు కర్మ్శకాలి, ఇట్ట్ వికృతరూపుతోనే స్నేహం చేసుకుని గడపవలసి వసోందని ఉదుకుమోతుతనంతో బాధపడింది. చివరకు రాఘవరావే రాణి సీటు దగ్గరకు వచ్చాడు
రాణి ముభావంగా, చికాకుగా తల వంచుకుని, కాగితాలు (వ్రాయడం మొదలుపెట్టింది. “ణి నీకు సలహా ఇద్దామని వచ్చాను నీలో యీ మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. మునుపటి నువ్వు, చలాకీ, అమాయకత్వం, నీలో కనిపించటం లేదు. చికాకు, ముభావం, కోపం ఎక్కువైపోతున్నాయి నీలో. అసలు ఏం జరిగింది? అన్నలాటి నాకు చెప్పకపోతే ఎవరు తీరుస్తారు సీ కవ్టాలు? చెప్పమ్మా రాణి” రాఘవరావు అభిమానం చూపిస్తూ లాలించాడు.
“వీరు స్వంత విషయాల్లో కలగచేసుకోకండి. నా కెవరీ సహాయం అవసరం. లేదు” రాణి చికాకుగా కసిరింది.
అన్వేషణ 269
“రాణీ ! మునుపు నన్ను అన్నగా చేసి నీ ప్రవర్తన మరిచిపోతూన్నవా! వీధిలో రోజు కొక మనిషితో తిరుగుతున్నావు అందరూ నిన్ను గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నీ మీద ఎటువంటి చెడ్డ ఉత్తరాలు రామనరసుగారికి వస్తున్నాయో నీకు తెలియదు. . రామనరసుగారికి కూడా నీ ప్రవర్తనమీద అసహ్యం కలిగింది. ఎప్పుడో నిన్ను ఉద్యోగంలోంచి తీసెస్తారు!” రాఘవరావు రాణి జీవితరహస్యాలు తెలిసిన హెడ్ గుమాస్తా ధోరణిలో అధికారంగా మాట్లాడాడు. “మీ సలహాలు చాలు .. మీ పని మీరు చేచుకోండి!” రాణి రివ్వున లేచి బాత్‌రూమ్‌వైపు నడిచింది నిర్లక్ష్యంగా.
రాఘవరావు తప్పనిసరిగా వెళ్ళిపోయి తనసీటులో కూర్చున్నాడు.
కాస్ప్సేప్పటికి రాణి బాత్రూమ్నుంచి తిరిగివచ్చింది.
రాఘవరావు ఫైలు పుచ్చుకుని రామనరసు గదివైపు నడుస్తూ రాణి దగ్గర ఒక నిముషం ఆగాడు.
“్రాజ్రి! నీ బతుకు అల్లరిపాలైపోయింది.... నిన్ను ప్రమాదాల గురిచెయ్యాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. జా(గ్రత్త! ప్రమాదంలో పడ్డాక అన్నగా నన్ను రక్షించమంటే మాత్రం నా శక్యం కాదు” రాఘవరావు డిటెక్టవ్లా వోజుబెట్టి, నిట్టూర్పు విడిచి రామనరసు గదిలోకి వెళ్ళివోయాదు. రాణివైపు అసహ్యంగా రాఘవరావు ముఖం చిట్లించాడు. ఈ బెదురులకు ర్సుడిసే భయభక్తులు తనలో నశించిపోయాయని లోలోపల నిర్లక్ష్యంగా నీల్గింది రాణి.
ఆ సాయంత్రం రాఘవరావే రాణి యింటికి వచ్చాడు. రాణీ కోపంతో అరిచింది తన యింటికి రావద్దన - “నే నేం ద్రోహం చేశాను!” రాఘవరావు దీనంగా ముఖంపెట్టి తనతప్పు తెలియజెయ్యమని నిలదీసి అడిగాడు రాణిని.
“తప్పాప్పులతో నాకు సంబంధం లేదు. నీ స్నేహం నాకు అనవసరం” అంటూ అరిచింది రాణి కూతురును వెనుక వేసుకొసూ రాఘవరావును యింట్లోంచి బైటికి నడవమంది మరియమ్మ “ఎంత సాహసంగా మాట్లాడుతూన్నరు తల్లీకూతుళ్ళు - మునుపు చేసిన సహాయం అంతా తృటిలో మర్చిపోయారన్నమాట.... ఆదజుతి లక్షణమే అంత!” రాఘవరావు కళ్ళల్లో నిప్పులు విరజిమ్మాడు.
“ఈ దరిద్రుడు విడవకుండా మన వెంట తగిలాడేమీ!” మరియమ్మ హీనంగా దీర్హం తీసింది.
270 అన్వేషణ
రాఘవరావు ఆత్మగౌరవం దెబ్బతింది ఉక్రోషంతో, ఉద్వేగంతో తల్లడిల్లిపోయాడు, ఉప్ప కృతఘ్నతకు తగిన ప్రతీకారం త్వరలోనే సగర్వంగా ఆత్మసంతృప్తి వొందుతూ అరిచాడు.
“చాల్లే ఊరుకో!” రాణి చికాకుగా కసిరి మేడమీదకు పోయి మంచం మీద పడుకుంది.
మరియమ్మ కూతురు ఆజ్ఞ ప్రకారం మౌనం వహించి ఒంటరిగా బైబీల్ గ్రంధం విప్పి, ఏసుక్రీస్తు భోదనలు మననం చేసుకోసాగింది.
రెండు రోజులు గడిచాక రెడ్డన్న ఒకరోజు ప్రొద్దున్నే కారులో వెతుక్కుంటూ మరయమ్మ యింటి ముందు దిగాడు. రెడ్డన్నను చూసి మరియమ్మ వందిమాగధ(నోత్తం చేస్తూ హారతితో పెండ్లికొాడుకును ఆవ్వానించినట్లు చేతులు ఊపుతూ వీధిగదిలోకి కూర్చీలో ఆఫీసుని చేసింది. రెడ్డన్నతోపాటు మరొక చౌదరికూడా లోపలికి వచ్చి కూర్చున్నాడు.
ఆఫీసుకు బయలుదేరిన రాణీ ముస్తాబై వచ్చికూర్చుంది రెడ్డన్న ముందు.
“అమ్మాయిని మంచిహోదాలో నడివిస్తున్నావు మంగమ్మా ఏంచేస్తోంది. చదువుతోందా లేక మామూలు వృత్తేనా?”
రెడ్డన్న నవ్వాడు.
“మా కాలం ఎలాగా తగులబడిపోయింది...యీ కాలం పీల్లలు మేం చెప్పినట్లు వింటారూ - ఉద్యోగం చేస్తోది అమ్మాయి... (ప్రస్తుతం యింటరు క్లాసుకూడా చదువుతోంది?”
రెడ్డన్న మెరిసిపోయే కళ్ళతో ఆకర్షణీయంగా రాణివైపు చూస్తున్నాడు. పేరు, అభిరుచులు నగరవిశేషాలు (ప్రశ్నిస్తూ కావాలని రాణితో సంభాషించాడు రెడ్డన్న.
“అమ్మాయికి నాటకాలంటే కూడ బాగా సరదా - - చాల నాటకాల్లో వేసింది. బహుమతులు కూడా తెచ్చుకుంది....[” అంటూ మరియమ్మ 'పెట్లో పదిలంగా దాచిన రెండు వెండి మెడల్సు, కృష్ణమూర్తి ఇచ్చిన వెండికప్పు, పరమహంస కొనియిచ్చిన నిర్మల్ కర్ర చెక్కడంపై కళాత్మకంగా చిత్రించిన ప్రకృతిదృశ్యం మొదలైన రెడ్డన్నకు చూపించింది.
“ఇక నేం, అమ్మాయితరహాయే వేరన్నమాట. ఏమయ్యా చౌదరి... మన బావగారితో మాట్లాడి అమ్మాయిని సినిమాల్లో చేర్పిస్తే బాగుంటుందేమో?” రెడ్డన్న చౌదరివైపు ఒక నిముషం చూసి రాణి ముఖం పరిశీలించాడు.
అన్వేషణ 271
సినిమా ప్రస్తావన రాణిలో చైతన్యం కలిగించింది. ఎలాగైనా సినిమాల్లో చేరితే భగ్నమయిన తన బ్రతుకు పూర్తిగా వాతావరణం మార్చుకుని తన్ను మరొక స్థాయిలోకి తీసుకుపోగలదని ఆశపడింది. రామనరసు యిచ్చే ఉద్యోగానికి ఆఖరి దశలు పొడసూపుతున్న యీ తరుణంలో రెడ్డన్నను ఆశ్రయించి సినిమాల్లో చేరితే రాఘవరావు రామనరసుకు, కూడా తన ప్రతిభ, ప్రతిష్టల గురించి ఒక గుణపారం చెప్పవచ్చునంటూ సగర్వంగా కులికుంది. తన్ను నిచంగా చూచు తోడి స్నేహితులు సినితారలా మారిపోయిన తన ఫోటోలు ప్రతి గోడమీద చూచి గుటకలు మింగుతూ లోలోపల ఆరాధింప గలరని ఊహాగానం చేసింది రాణి.
“అమ్మా! సినిమాల్లో చేరితే - మనకు ఎంతో మంచిది రెడ్డన్నగారికి మరి చెప్పవే?” అంటూ రాణి నర్మగర్భంగా తల్లిని అడిగింది.
“ఏం పిల్లానన్నే అడుగు - సిగ్గెందుకు?” ....” నవ్వాడు రెడ్డన్న.
“ఏదో అమ్మాయి అదృష్టం మీ చేతుల్లో ఉంది.” మరియమ్మ వక్రంగా నవ్వింది.
మరో రెండువారాలనాటికి అమ్మాయి సినిమాస్తూడియోలో ఉండదూ మద్రాసులో!” రెడన్న మీసందువ్వి చౌదరివైపు సరదాగా కులుకుతూ చూశాడు.
“నేనూ ఆఫీసుకు వెళ్ళానండీ!” అంటూ రాణి లేచి నిలబడింది.
“ఉండు పిల్లా. .. కారులో వదిలేస్తా ఆఫీసు దగ్గర!” రెడ్డన్న కూడా లేచాడు.
“మంగమ్మా!... మన పాత పరిచయం మళ్ళీ పునరుద్దరిస్తా యీమధ్య కలప వ్యాపారం బట్టలమిల్లు కూడా తెరిచాను... కొల్లలు లాభం - అనుభవించడానికి ఎవరో ఒకరు దొరకాలిగా - నగరంవిచ్చ నప్పుడు.... నీ యింట్లోనే మకాం - ఇది నీ దగ్గర ఉంచు!” రెడ్డన్న పర్సులోంచి వందరూపాయల కాగితం తీసి మరియమ్మ చేతులో పెట్టాడు.
“నీకు పుణ్య ముంటుంది - నా షేరు మరియమ్మ ... అలా పిలుద్దూ!” నవ్వింది మరియమ్మ వక్రంగా,
రెడ్డన్ను చౌదరి హృదయపూర్వకంగా పకపక నవ్వుకున్నారు మరియమ్మ వాలకం చూసి.
రెడ్డన్న రాణిని ఆఫీసు దగ్గర కారులో వదిలేడు. అప్పుడే ఆఫీసులోకి నడిచే రాఘవరావు మరియిద్గ్దరు గుమాస్తాలు రాణిని చూశారు. వారు చూస్తున్నారని మరీ గర్వంగా రీవిగా కారు దిగి ఒయ్యారంగా నిర్లక్ష్యంగా నడిచింది రాణి.
292 అన్వేషణ “చూశావా ! రాణి కొప్పులో క్రొత్తరకం పూలు చేరాయి!” గుమాస్తాలు గుసగుసలాదడుకున్నారు. రాఘవరావు విపరీతంగా మధనపడ్డాడు హృదయంలో రాణి గర్వంచూసి, ఆఫీసుమేడమీద తన గదికిటికీలోంచి రామనరసు బయటికి చూస్తూ రాణి ఎవరి కారులోనో దిగడం గమనించాడు తనకు చేరుతున్న ఆకాశరామన్న ఉత్తరాల్లో నిజంలేకపోలేదని నిశ్చయించుకున్నాడు రామనరసు. రాణీ ఆఫీసులో తన సీటులోకూర్చుని పని మొదలు పెట్టింది. రామనరసు తనను చాలాసార్లు పిలవడం రాణి గమనించింది. అందంతో మానవుల సహజ మనోదౌర్భల్యంను దోపిడీ చేస్తూ ఆకర్షణ వెదజల్లుతూ స్పప్రయోజనాలు సాధించుకుంటూ శీలం చెడగొట్టుకోకుండా నేర్పరితనంతో బ్రతికిన తనకు, ధనం తీసికొని ఉద్యోగాల పేరుమీద శరీర మమ్ముకునే సునీత వచ్చాక, ఎక్కువ కాలం ఆమెతో ఒకే ఆఫీసులో ఉండే అవకాశాలు తగ్గిపోవచ్చుననుకుని నిశ్చయించుకుంది. పొట్లాట జరిగాక సునీత నిర్లక్ష్యంగా రాణిని పలకరించడం మాని తక్కిన గుమాస్తాతో కూర్చుని గంటలతరబడి వెకవెకలు పకపకసాగించేది ఆ పకపక వెనకాల తన్నుగూర్చి హేళనలు అర్ధంచేసుకుని ఓదిమితో మౌనంగా కాలంగడుపుతోంది రాణి. కాబోయే సినీతార జీవితం గురించి ఊహాగానాలు చేయసాగింది రాణీ, రెడ్డన్న కారు మద్రాసులో పెద్ద బంగళా ముందు ఆగింది. బట్టతల మనిషితో రెడ్డన్న అరగంటసేపు తీవ్రంగా సంభాషించారు రాణి ఆకార సౌష్టవం, అందాల ముఖం ఆ బట్టతల మనిషి పరిశీలించాడు - రాణిని పిలిచి ఏదో నాటకం సంభాషణ పుస్తకము తెరచి చదవమన్నాడు - చదువుతూ రాణి చేసే అభినయం కళ్ళ జోడుల్లోంచిచూసి, కులికి, చిరునవ్వు నవ్వ, బల్లగుద్ది సెభాష్ అన్నాడు. తక్షణం టైెపిస్టును పిలిచి కాగితం టెపుచేయించాడు .. ఒక సినీమాలో నాయికకు పోటీయైన మరొక స్తీపాత్ర జా చంచలచిత్తమైన నాగరిక స్రీ గాధ నటించాలి.... కాగితం మీద సంతకం పెట్టంది పాత్రకు సరిగా జీవితంలోని అనుభవాలు కూడ సహాయం చేస్తాయి. రెడ్డన్న మద్రాసులో చిన్న బంగళా తీసుకున్నాడు.... మరియమ్మ, తనూ అందులో నివసించడం - సోఫాలు - పందిరి మంచాలు - పూల కుండీలు... నిలువు టద్దాలు.... అందాల ప్రకృతి దృశ్యాలు ఫోటోలు - గోడలకు .. నౌకర్లు...మాలి....కారుదైవరు - అన్ని హంగులతో కూడిన నివాసం-
అన్వేషణ 273
స్టూడియోకు రోజూ కాదు వచ్చి తీసుక వెళ్ళేది . గంటసేపు ముఖంనిండా కోటా కొట్టుకొని అందంగా తీర్చిదిద్దుకోవాలి శరీరం. మెడ సెట్టింగు... క్రింద సోఫాలు ... మాట్లాడుతుంటే విద్యుద్దీపాల కాంతులు ముఖం వేదెక్కిపోయేలా - ఆవిరుల్లా మీద పడడం ... సంభాషణల మధ్య 'కట్' అనే అరుపులతో నటన ఆగిపోవడం... మళ్ళీ నటకులంతా ఆవేశం తెచ్చుకుని రంగంలోని పాత్రల రూపాల్లో లీనమయి నటించడం
- దర్శకుడు హరాత్తుగా మధ్య ఆపి నటనలోని వివిధ భంగిమలు, ముఖ కవళికలు ప్రదర్శించడం - చివరకు (శ్రమతో ఒక రంగం పూర్తిచేసుకుని కోటాలు కడుక్కుని బడలికతో యిల్లు చేరడం....
మొట్టమొదటి నటించిన సినిమా వెలువడింది. ప్రేక్షకులు తండోపతండాలుగా సినిమా చూస్తున్నారు. రాణి చంచలచిత్తయైన నాజూకు నాగరికత స్రీగా చూపిన శరీర వికృత చేష్టలు, సొగసు నడకలు... ప్రేక్షకులు చూసి ఈలలు వేయసాగారు.... ప్రతిచోట సినిమా శతదినోత్సవం చేసుకుంటోంది.. . నగరాలకు రమ్మని ఆహ్వానాలు... సినిమా ధియేటరు యజమానులచే పూలహారాలు - పత్రికాధిపతులు కోరే యింటర్వ్యూలు .. తన ఫోటోలు పత్రికల్లో పడడం ప్రధమంగా వెండితెరమీద విజయవంతంగా నటించి, ఆమోఘనటనాకౌశలం చూపిన రాణి . చిన్న జీవిత సంగ్రహ చరిత్ర.... చెప్పడంలో కొంత అబద్దాలు కల్పించిక తప్పలేదు.... గోడమీద ప్రతిచోట తన ఫోటోలే, అనేక భంగిమల్లో రూపాల్లో నగరాల్లో. పర్యటిస్తుంటే తన కారు వెనుక పడిగాపులుపడి చూదాలనే గందరగోళం (ప్రజానీకం గుంపులు -
అప్పటి తన స్థాయి, గౌరవం, ప్రతిష్ట, గొప్పతనం.. హుం సునీత ముఖం డిల్లపోవాలి....
రాణి ఊహాగానాల్లో కోపంగా సునీతను చూసి తల విసురుతో ముఖం చిట్సించింది.
ఆఫీసు ముగిశాక రాణి బయటకు వచ్చింది బస్సుస్తాండు వైపు నడవడానికి. రెడ్డన్న, చౌదరి కారులో కూర్చుని ఆఫీసు కాంపౌండు ఎదుట కనపడ్డారు. రెడ్డన్న పిలిచాడు చెయ్యి ఆడిస్తూ; రాణి ఇంతకు ముందే కారు తనకోసం ఎదురుగా చూస్తున్నదని తెలుసున్నట్లేతిన్నగా పోయి కారులో కూర్చుంది.
“కోర్చు పనులు చూసుకొని హోటలుకు బయలుదేరాం- దారిలో మీ ఆఫీసు కనిపిస్తే నువ్వు ఆఫీసు వదిలేబటైెమయిందని తెలిసి ఒక నిమిషం ఆగాం.... ఈ లోపుగా నువ్వేవచ్చేవు బయటకు!” రెడ్డన్న మీసం మెలివెస్తూ నవ్వాడు.
లశ అన్వేషణ
[దైవరు తిన్నగా కారు హోటలు వైపున నడిపించాడు వోటల్లో రాణి, చౌదరి, రెడ్డన్న సుష్టుగా ఫలహారాలు చేశారు తిన్నగా రాణి ఇంటికి వెళ్ళారు రాణి దుస్తులు మార్చుకుంది, రెడ్డన్న కోరిక ప్రకారం మరియమ్మతో రాణి సినిమాకు బయలుదేరింది. అంతా సినిమాలో హాయిగా గడిపి ఆనందంగా ఇంటికి చేరారు.
“రాజీ - రేపు ఆదివారం మీకు సెలవే కదూ. నేను గండిపేట వెడుతున్నా చూడదాలని.... నువ్వుకూడా రావాలి కాలక్షేపానికి!” నవ్వాడు రెడ్డన్న.
“అటువంటి వాటికి అమ్మాయి అభ్యంతరం చెప్పదండీ! అందమైన చారిత్రక స్థలాలు చూడడమంటే అమ్మాయికి చాలా సరదా!” వక్రంగా నవ్వింది మరియమ్మ మర్వాదగా,
“అలాగేనండిగ”” రాణి రెడ్డన్నను సంతోషపెట్టాలనుకుంది తన భావి సినిమాతార జీవితం తల్చుకుని,
మర్నాడు మధ్యాహ్నం కారు ఒంటి గంటకు రాణి ఇంటి ముందు ఆగింది రెడ్డన్న ఒకృడే కారులోంచి దిగాడు. చౌదరికి తలనొప్పి జ్వరం వచ్చిందని, (డ్రైవరు సినిమాకి పోయాదని చెప్పాడు రెడ్డ్దన్న రాణికి కొంచెం భయం కలిగింది ఒంటరిగా రెద్డ్దన్నతో వెళ్ళడదమా అని. మరియమ్మ తాను కూడా వస్తానని అనదల్పుకోలేదు. రెడ్డన్న ఇచ్చిన వంద రూపాయలకు, ఏదో విధంగా అతన్ని సంతోషపెట్టడం తన ధర్మంకదా అని. తన మనస్సులో మరో విధంగా భయపడుతున్నట్లు రెడ్డన్నకు తెలిస్తే అసభ్యంగా ఉంటుందని, మౌనంగా మామూలుగా ముస్తాబయి, పర్సులో రెండు రూపయలు దీసుకుని తయారయింది ప్రాయాణానికి రాణి.
రెడ్డన్న స్వయంగా కారునడుపుతున్నాడు. కారు శరవేగంతో పరుగిడుతోంది జనం గుంపులు, దుకాణాలు, నగర మధ్య వీధులు దాటి, నగర పొలిమేరలు విడిచి, నిర్జన ప్రదేశంలో ఒంటరి బాటల మీద ప్రయాణం చేస్తోంది కారు. చుట్టూ రివ్వున గాలిలో ఎగురుతూ, రొదచేస్తున్నాయి. గాలికి రాణి ముఖంమీద శిరోజాలు ఎగురుతూ, చీర రెప రెప రెపలాడుతూ శబ్దం చేస్తోంది. రెడ్డన్న కారులో ఉంచిన ఫలాలు, ఆపిలుపండ్తు, అరటిపండ్లు, (ద్రాక్ర రాణి నోరూరించాయి. రాణి ఒక కమలాఫలం తీసుకుని, వలచుకుని తినసాొగింది.
రెడ్డన్న హైదరాబాదు నగర వైభవం, చుట్టూఉన్న సుందర ప్రదేశాలు, నవాబులు పొందిన అనుభవాలు, గాధలు, రాజుల జనానా గురించి గూఢంగా శృంగార రసం
అన్వేషణ £275 జిమ్ముతూ విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియని అమాయకురాలిలా రాజి అన్నీ వింటూ ఆశ్చర్యం వెలిబుచ్చుతూ కిలకిల నవ్వింది.
రాణిముఖం హరాత్తుగా ముఖకవకలుళి మార్చుకుని భయంతో నిశితంగా పరిసరాలు పరీక్షించింది. క్రిందటిసారి కృష్ణమూర్తితో గండిపెట వచ్చినదారికి యీ దారికి వ్యత్యాసం కనిపించింది. క్షయ ఆస్పత్రి, కొండగుట్టలు ఎత్తుపల్లాల రోడ్లు, గుబురు చెట్లు.... అదొక వింతప్రదేశంలా కనిపించింది
మరో ఐదునిమిషాలలో రెడ్డన్న కారు ఆపాడు. దూరంగా శిధిలమైన బంగళా ఒకటి కనిపించింది.
“ద్రాట్సి!.___ అవి పురాతనపు నవాబుల బంగళాలు... చూసి వద్దామా?” రెడ్డన్న మామూలుగా నవ్వుతూ (ప్రశ్నించాడు.
రాణి కాదనలేక పోయింది.
ఒక నిశ్చితమైన దారిలేక పుట్టలు మొక్కతుప్పలు గులకరాళ్ళతోనిండి పచ్చగడ్డి అల్లుకుని ఆ ప్రదేశమంతఆ ఉపయోగంలేని స్టలంలా ఉంది. సిల్కు కందువాలో నాల్లుపళ్ళు వేసుకుని ఊగుతూ రెడ్డన్న నడుస్తూ రాణిచెయ్యి పట్టుకుని మొక్కతుప్పలు దాటిస్తున్నాడు. ఒకఫర్లాంగు నడవగానే ఈతచెట్టు క్రింద కొండరాళ్ళు. . దుబ్బుల మధ్య సీతాఫలం చెట్లు. .. శిధిలమైన బంగళా ఎదురుగా వనరు ఎక్కిన నీళ్ళకుండీ... గోడలు పడిపోయి. పాలరాతి గోపురాలతో మూడు అంతస్థుల బంగళా కనిపించాయి ఆ బంగళాలోకి ఎవరూ వచ్చిన అలికిడిలేదు. దుమ్ముదూళి, నిండి, సాలిగూడుతో అసహ్యంగా ఉంది. మేడ పైభాగంలో గబ్బిలాలు తిరుగుతున్నట్లు కనిపించాయి. గోపురాల చివర పావురాల గుంపులు కువకువ మంటూ ఎగురుతున్నాయి.
ఆ శిధిలమైన బంగళా వరండాలో దుమ్ము దులుపుకుని కూర్చున్నాడు రెడ్డన్న తనకండువా పరచి రాణి కూడా కూర్చోమన్నాడు,
“నాకు ఇక్కడ భయమేస్తోందండి! త్వరగా పోదాం పదండి” రాణి అమాయకంగా అంది.
రెడ్డన్న పకపక నిర్లక్ష్యంగా నవ్వాడు.
2/6 అన్వేషణ “నడివయస్సులో నవనవ లాడుతూ, అందాలు విరజిమ్మే నీలాంటి పిల్లలకు భయమెందుకూ? ఎవరుపడితే వారు అదుకుని రక్షిస్తారు?” రెడ్డన్న మీసం దువ్వాడు. ఆపీలుపండు కొరికి, రాణికి తినమంటూ బలవంతంగా చేతుల్లో పెట్టాడు రాణికి అసహ్యం వెసింది రెడ్డన్న పైన.
“రాణి! ఎందుకు నటిస్తావు అమాయకంగా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలుసనుకుంటా?” రెడ్డన్న రాణి చెయ్య పట్టుకుని తనమీదకు లాక్కున్నాడు.
రాణ్ కోపంగా చెయ్యి విదలించుకుని లేచి నిలబడింది.
“ఎక్కడికి పోతావు?... వెళ్ళు” రెడ్డన్న హాయిగా కాళ్ళు చాచుకుని నిర్లక్ష్యంగా పకపక నవ్వాడు
“రాణికి పరిస్థితి అర్ధమయింది.”
“మర్యాదగా నన్ను ఇంటిదగ్గర దిగబెడతావా... లేకపోతే! రాణి బెదిరించింది లోలోపల తన (బతుకు ఈ రోజు అభాసు కాగలదని భయపడుతూ.
“మీ అమ్మకు వందరూపాయి లిచ్చెగా... ఇంకా బెట్టు ఎందుకు? ...” రెడ్డన్న (క్రూరంగా రాణివైపు చూశాడు. బలంగా నడిచాడు ఒళ్ళు విరుచుకుని ఆశగా నెమరువేశాడు. ఉ(ద్రేకాల ముఖంతో రాణి వైపు లంఘించాడు.
రాణి కెవ్వున కేక పెట్టింది.
రెడ్డన్న రాణిని బలవంతంగా బాహువుల మధ్య బంధించాడు. రాణి తనకు తెలియనిరీతిగా అతని చెయ్యి గట్టిగా కొరికింది. బాధగా బాహువులు సడలించాడు రెడ్డ్దన్న.
రాణి దూరంగా తుప్పట్లొకి పారిపోయింది. రెడ్డన్న ఉక్రోషంతో రాణీమీదకు నడిచాడు. క్రింద గుట్టలుగా ఉన్నకంకర్రాళ్ళు తీసి అరుస్తూ రెడ్డన్న మీదకు వర్షం కురిపించింది. కొన్ని రాళ్ళు రెడ్డన్న కణతలకుతగిలి రక్తం చిమ్మాయి. మరికొన్ని రాళ్ళు అతని ముఖం గీసుకుపోయాయి. అయినా ఈనాడు తన్ను రక్షించేవాడు లేడని రాని భీతితో తల్లడిల్లిపోయింది.
రాణి కేకలతో బంగళా వెనుకాలనుంచి గేదెలు మేపే ఇద్దరు గ్రామీణయువకులు కర్రలు ఊపుకుంటూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూసి రాణి మరీ పోలికేకలు పెట్టింది.
అన్వేషణ £277 గ్రామీణ యువకులు పరిస్థితి అర్ధంచేసుకున్నారు. కర్రలు విసురుతూ గబగబ రెడ్డన్నమీదకు వచ్చారు “ఏంటయ్యా.. పిల్లను ఒంటిరిగాచేసి అఘాయిత్యం చేస్తున్నావే! - ఏమన్నా ఆపిల్లకు జరిగితే మక్కలిరగతంతాం జాగ్రత్త అడ్డంగా నిలబడ్డారు. ఆ [గ్రామణ యువకులు, భుజంమీది తువ్వాళ్ళు సర్ఫుకుంటూ.
రెడ్డన్న సంభాషణ రీతి మార్చెడు.
“ర్రాణి ! చాల్లే ఆట ఇవాళకు అనవసరంగా నాకు గాయాలు కూడా తగిలాయి... పద ఇంటికి పోదాం. వాళ్ళంతా ఏమనుకుంటారు?!” రెడ్డన్న చిరునవ్వు తెచ్చుకున్నాడు. కణతలమీదిరక్తం తుడుచుకుంటూ జేబురుమాలుతో.
“నేను రాను మీకారులో.. మీరు వెళ్ళండి!” రాణి గట్టిగా అరిచింది.
“సరే...పోతా” నంటూ రెడ్డన్న రెండడుగులు వేశాడు.
రాణి గ్రామీణయువకులతో సంప్రదించింది కాస్సేపు.
రెడ్డన్న కారులో కూర్చుని కాస్సేపు ఆగాడు రాణి కోసం. రాణి కదిలిరాలేదు.
మరో గంటలో హైద్రాబాదుపోయే బస్సుయిలా వెడుతుందని అందులో వెళ్ళమని సలహా యిచ్చారు రాణికి గ్రామీణయువకులు.
రాణీ కదిలి రాకపోవడంతో నిరాశ చేసుకుని, రెడ్డన్న కారు తరలించుకుని వెళ్ళిపోయాడు నగరంలోకి.
రెడ్డన్న సినిమాలో చేర్పిస్తాననడం ఉత్తిబూటకమని గ్రహించుకుంది రాణి.
గ్రామీణయువకులు తోడుగా ఉండి బస్సు ఎక్కించారు రాజీని. చీకటిపడింది రాణి యిల్లు చేరేటప్పటికి.
రెడ్డన్న ప్రవర్తనచెప్పి మరియమ్మపైన విరుచుకుపడింది రాణి. ఒంటరిగా రెడ్డన్నతో వెళ్ళడానికి అంగీకరించిన రాణి మనస్తత్వం అర్ధంగాక గందరగోళపడింది మరియమ్మ.
రాణి ఆఫీసులో ఒకరోజు పనిచేస్తోంటే పొరుగింటి కుర్రాడొకడు చిట్టి అందించాడు. మరియమ్మ వ్రాసి యిచ్చిపంపింది. ఉత్తరంలోని విశేషం చాలా ఆశ్చర్యపరిచింది రాణిని. రామనరసు ఆఫీసు గదిలో లేకపోవడంవల్ల రాఘవరావును తప్పనిసరిగా (బ్రతిమాలి యింటికి పోయింది రాణి. రాఘవరావుకూడా ఆశ్చర్యం వెలిబుచ్చి సోదరుడుగా సహాయం ఏం కావాలసినా చేస్తానని అయాచితమైన వాగ్గానం చేశాడు రాణికి.
వగ్గాగ్ర అన్వేషణ
రాణి కంగారుగా రిక్షాలో యింటికి వెళ్ళిపోయింది. మరయమ్మ వీధిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది దినంగా- రాణిని చూసి మరీ శోకాలు హెచ్చింది రాగాలు దీసింది మరియమ్మ.
“ఈవెళ చచ్చిపోయేదాన్నే.. భూమిమీద నూకలు బుణం ఉండి (బ్రతికిపోయేనే అమ్మాయి. .[” మరియమ్మ తల విరిబోసుకుని శోకం శ్రుతి హెచ్చించింది.
“అసలు ఎం జరిగింది?” రాణి చికాకుగా ప్రశ్నించింది.
మరియమ్మ చుట్టూ ఓదారుస్తూ నిలుచున్న అమ్మలక్కలు మరియమ్మ, రాణి జీవితాలు అర్ధంకాక వీరిలో ఏ నిగూఢ రహస్యాలున్నాయో యని అనుమానిస్తూ, కూతురు వచ్చిందిగదా అని తమ యిళ్ళల్లోకి పోయారు మౌనంగా.
“వరండా గదిలో మంచంమీద కూర్చుని బైబిలుగ్రంధం చదువుకుంటున్నానే... ఇద్దరు నల్లటి కోరమీసాల మనుష్యులు ఒక సూటువేసుకున్నవాడు యింట్లో ప్రవేశించారు. నేను నీకోసం వచ్చారనుకుని మర్యాదగా నవ్వుతూ ఆహ్వానించాను. సూటు వేసుకున్న మనిషి కుర్చిలో కూర్చున్నాడు. ఒక. ..కోరమీసాలవాడు వీధి తలుపు మూసేశాడు. నాకు భయం వెసింది.... ఎందుకు తలుపు మూస్తావు అన్నా.. కోరమీసాలవాడు నవ్వాడు మెల్లిగా .. రెందో కోరమీసాలవాడు నాగ్గరకు వచ్చి చేతులు విరిచిపట్టుకున్నాడే!” మరియమ్మ గుండె బాదుకుంటూ క్రింద ఆవేశంతో దొర్తింది
మరియమ్మ ప్రవర్తన రాణికి అసహ్యం కలిగించింది. విషయం వివులంగా మామూలుగా చెప్పక యింత రాద్దాంతమెందుకని విరుచుకుపడింది రాణి
“అప్పుడు సూటు వేసుకున్నవాదు లేచాడు... చేతిలో బాకు తళతళలాడింది.... నేను కెవ్వున అరిచాను.... కేకలు పెట్టాను... కోరమీసాలవాడు నానోరు నొక్కేశాడు... డబ్బుడబ్బు అంటూ సూటువేసుకున్నవాడు బాకుతో నన్ను ర్వుళిపించాడు.... 'పెట్టిచూపించాను... రెడ్డన్న యిచ్చిన వంద రూపాయల కాగితం జేబులో మడిచాడు సూటువాలా.... ప్రక్క యింటివారు కేకలు విని తలుపు గల్టగా కొట్టారు. నేను గిలగిల తన్నుకున్నాను... అరుస్తే పొడుస్తానంటూ వచ్చాడు సూటువాలా... చేతులు అద్దుపెట్టాను.. వేళ్ళు కోసేశాడే సూటువాలా!” మరియమ్మ రక్తంకారే వేళ్ళు పట్టుకుని బాధతో క్రిందమీద గెంతనాగింది.
తరువాత ఎమి జర్గందని రాణి చికాకుగా చూసింది.
అన్వేషణ 270
“తలుపు చప్పుడు విని ప్రక్కయింటి మనుష్యులు వచ్చారని నన్ను మంచానికి కట్టసి దొడ్డిదారిని పారిపోయారే. ఎలా పోయారో నాకు తెలియదు, దొడ్డివైపు చూస్తే... !” గుండె బాదుకుని లబబలబ మొత్తుకుంది మరియమ్మ. మరియమ్మ స్టితి చూసి ఏడవాలో నవ్వాలో తెలియలేదు రాణికి తక్షం డాక్టరు దగ్గరికివెళ్ళి కట్లు కట్టించి, యింటికి తీసుకువచ్చింది తల్లిని రాణి
ఇంట్లో జొరబడిన శత్రువు లెవరో రాణికి అనూహ్యమై పోయింది. పోలీసులకు రిపోర్టు పంపింది ఎవరోమాత్రం తల్లిమీద తనమీద ఒక కన్ను ఉంచి రాకపోకలు, బ్రతుకు జాగ్రత్తగా పరీక్షిస్తున్నారని మాత్రం రాణికి అనుమానం కలిగింది మరియమ్మ బ్రతుకు బోగంకొంపల వాసనలతో నీచమైనది కావడంతో తనకు కూడా ఆ వాసనలు వెన్నంటుతున్నాయని రాణీ క్షోభపడింది. సాంగత్యదోషంలోనే ప్రవర్తన, బ్రతుకురీతులు నిర్ణయింపబదతా యనడంలోనిసత్యం గుర్తించింది రాణి. మరియమ్మకు ఎవరు శత్రువులో, ఎవరుమి(త్రులో యింత కాలం గడిపినా రాణి తెలుసుకోలేకపోయింది. అందుకు మరియమ్మ గడిపే గూఢమైన మోసటబ్రతుకే కారణమని ఆమెవల్ల తనకు కూడా ఎప్పుడో (ప్రమాదాలు వాటిల్లగలదని భయపడింది.
ఒక వారంరోజులు గడవగా మరియమ్మ గాయాలు మాయమై పోయాయి. గాయాలు మానడంతో మరియమ్మ రాణి గతం మరిచిపోయారు. యధారీతి జీవితం మామూలుగా గడపసాగారు.
ఒకరోజు సాయంత్రం జగదీశ్వర్ పనికట్టుకుని రాణి యింటికి వచ్చాడు జగదీశ్వర్ రాణీమిద చేసిన ప్రచారంతో తక్కిన నటకులకు రాణిపై అసూయకలిగి అసహ్వించుకుని దూరంగా ఉండసాగారు. తన ప్రచారంవల్ల రాణిచుట్టూ ఎగిరే పురుగులు కొన్ని తగ్గాయని, రాణి స్నేహం అభివృద్ధి చేసుకొనడంలో తనకు ఎక్కువ అవకాశాలేర్చడ్డాయని సంతోషించాడు జగదీశ్వర్.
రాణి చిరునవ్వుతో జగదీశ్వర్‌ను ఆహ్వానించింది. యధారీతి సినిమాకురమ్మని రాణిని వేధించాడు జగదీశ్వర్. రాణి ఒప్పుకుంది బలవంతంమీద. హోటల్లో రుచికరమైన పలహారాలు సుష్టుగా భుజించి యిద్దరూ సినిమాకి వెళ్ళారు. నాంపల్లిలోని సినిమాహాలునుంచి బయటకు వచ్చిన జనంతప్ప మరెవ్వరూ లేరు. రాణి సాంగత్యం తనివితీరని జగదీశ్వర్ కాస్సేపు పబ్లిక్ గార్దన్సువైపు వాహ్యాళి వెడదామన్నాడు. కష్టసుఖాలు తనతో చెప్పినట్టయితే ఆర్ధికంగా ఎంతో సహాయం చెయ్యగలనని, యీ మధ్యనే ఆఫీసులో
280 అన్వేషణ తనకు ప్రమోషన్ వచ్చి జీతం హెచ్చయిందని, ఆ సంతోషసూచన మంటూ రాణి చేతిలో వదిరూపాయలు ఉంచాడు జగదీశ్వర్ రాణి వాహ్యాళికి ఒప్పుకుంది నిశిధంలో విద్యుద్దీపాలు వెలుగులో పబ్లిక్ గారెన్స్ ముందు ఎత్తువీధిలో రిక్షావాడు క్రిందకు దిగి మెల్లిగా నడిపిస్తున్నాడు. ఒక సందు మెదల్లో నిలుచున్న యిద్దరు దృథఢకాయులు మెల్లిగా రిక్షావైపు వచ్చారు,
“లోపల ఎవరున్నారు?” రిక్షావాడిని ప్రశ్నించాడు.
రిక్షావాడు బెదిరిపోయాడు సమాధానం చెప్పలేక తబ్బిబ్బైపోయాడు.
చేతిలోకి లారీలుతీసి, రిక్షాటాపుమీద గబగబ బాదేరు ఆ దృధకాయులు. ఒకడు జగదీశ్వర్‌ను, మరొకరు రాణిని వెనుకనుంచి పీకనొక్కబోయారు.
రిక్షావాడు బెదిరిపోయి “పోలీస్” అంటూ గట్టిగా కేకలు వేశాడు దారినపోయ ఒక మోటరు కారు యీ గల్లంతు చూసి ఆగింది. అందులోంచి యిద్దరు సూటులో ఉన్న ఆఫీసర్లు దిగారు. వాళ్ళని చూసి దృథఢకాయులు ప్రక్కనున్న సందులోకి పరుగెత్తి కారు ఎక్కి పారివోయారు.
ఆఫీసర్లు జగదీశ్వర్ వైపు పరీక్షగా చూశారు.
“నా భార్యతో సినిమానుంచి యింటికి వెడుతూంటే....” జగదీశ్వర్ మాటలు నమిలాడు.
“ఇప్పుడైనా జాగ్రత్తగా యింటికి పొండి” నవ్వేరు ఆఫీసర్లు.
రాణికి భయం ఎక్కువైపోయింది తన (బ్రతుకు ప్రతి నిముషం ఎవరో పరీక్షిస్తున్నారని. తన్ను ప్రమాదాలకు గురి చెయ్యాలని యత్నిస్తున్నారని అర్ధం చేసుకుంది తక్షణం యింటికి పోతానంటూ రాణి రిక్షా త్రిప్పించింది. ఆ ప్రమాదంలో మగవాడై బెదిరి తన ఆశక్తత చూపినందుకు జగదీశ్వర్ కించపడ్డాడు. రాణిని వదిలేసి బస్సుస్తాండువైపు నడిచాడు ఒంటరిగా.
ఇంటికి వచ్చినా రాణీకి గుండెదడ తగ్గలేదు. జగదీశ్వర్‌ను కూడా పీక పిసకడంతో బహుశ తన ప్రవర్తనవల్ల అసూయకల్లిన మనుష్యులెవ్వరో యీకుట్రపన్ని ఉంటారనుకుంది రాణి తన చుట్టూ ఉన్న స్నేహితులంతా తనగురించి ఒకరినొకరు చెప్పుకుని అసూయతో (ప్రతీకారంతో కుట్రలుపన్ని తన్ను హత్యచెయ్యడానికి పూనుకున్నట్లు ఊహించింది రాణి.
అన్వేషణ 2ర్ర
ఆ ఊహల్లో బేలగా భయంతో బెదిరిపోయింది. అందుకు పద్ధతి మార్చుకోవలసిన తీవ్రపరిస్టితి ఏర్పడిందని భావించింది అందుకు ఏం చెయ్యాలనే తీవఆలోచనల్లో సతమత మయ్యింది రాణి
మర్నాడు ఆపీసుకు వెళ్ళగానే రామనరసు పిల్చి ఉద్యోగం లోంచి రాణిని తీసేశానని ఉత్తరం అందించాడు
“నాకు ఉపయోగించని మనిషిని గుదిబండలా ఎంతకాలం ఐవోషించగలను?... పైగా నీ ప్రవర్తనవల్ల నా ఆఫీసుకే కళంకం వస్తోంది!” రామనరసు కోపంగా చిట్లించుకుంటూ కారు ఎక్కి వెళ్ళిపోయాడు.
ఈ పరిస్థితి ఎప్పుడో ఏర్పడుతుంది అని నమ్మిన రాణి నిరాశ పడకపోయినా ముందు సంగతి ఏమిటనే తొట్రుపాటు బహిర్గతము చేసుకోలేకుండా ఉండలేకపోయింది.
రాణిని చూసి గుమాస్తాలతో వెకిలిగా నవ్వింది సునీత రాఘవరావు అప్యాయతతో పిళ్ళ, ఆమెమీద దుష్ప్రవర్తన నేరంతో అనేక ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయని. ఆమెను కులట అనే అభియోగంతో పోలీసులు ఆమె చర్యలు పరీక్షించి దర్యాప్తు చేస్తున్నారని యీ సంగతి తెలిసి రామనరసు తన పరువు ప్రతిష్టలు కాపాడుకోడానికి ఆమెను ఉద్యోగంలోంచి తీసేశాడని తన సలహాలు పాటించనందుకు యీ దురవస్థ కలిగిందని సానుభూతి చూవాడు రాఘవరావు.
రాణి సమాధానం చెప్పకుండా భిన్నురాలై వీధిలోకి వచ్చేసింది. భావిగతిగూర్చి చేస్తున్న ఆలోచనల్లో ఏదో మెరుపులా మెరిసింది. మెల్లిగా నడుస్తూ విచారంగా యింటికి వచ్చెసింది.
ఒకరోజు సాయంత్రం తమ కాలేజిలోని స్నేహితురాలు. నాటకం ఏదో వేస్తోందని, దుస్తులు తెచ్చే ఏర్పాటు తాను చేస్తానని వాగ్జానమిచ్చానని, తన ట్రంకుపెట్టె తీసుకుని రిక్షా ఎక్కింది రాణ్.
రాత్రికి రాణి యిల్లు చేరలేదు. మరియమ్మ బెంగపడింది మర్నాడు కూడా రాణి జాడలేదు. ఆఫీసుకు కబురంపితే, ఉద్యోగం లోంచి తీసివేసిన వార్త తెలిసింది మరియమ్మకు. ట్యూటోరియల్ కాలేజికి స్వయంగా వెళ్ళింది మరియమ్మ రాణిని వెతుక్కుంటూ. నెలరోజులనుంచీ కాలేజికి రావటమేలేదని ప్రిన్సిపాలు సమాధానం యిచ్చాడు.
2ద్ర2 అన్వేషణ
వారంరోజులు గడిచినా రాణిజాడ తెలియలేదు మరియమ్మకు పొరుగింటి అమ్మలక్కలు రాణీ కనిపించటం లేదని విడూరంగా ఏదో గుసగుసలాడుకున్నారు.
ఇంటి అద్దె పెరిగిపోయింది. పాలవాడు, దుకాణదారుడు నరసవ్వ దాసి, అప్పులవాళ్ళు డబ్బుకోసం మరియమ&మ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు బెంగపడి కుమిలింది మరియమ్మ ప్రస్తుత విపత్తు తప్పించుకోడానికి తెలిసిన మార్గం ఒకటే ఉంది ఆమెదృష్టిలో ఇంట్లో ఉన్న సామానులు ఒక వేలంపాడే యజమానికి అమ్మి ఒక అర్ధరాత్రి మూటముల్లె సర్పకుని, వీధితలుపులకు తాళంవేసి నిశీధంలో లీనమయిపోయింది మరియమ్మ ఖీన్నురాలై
ఇంటి యజమాని యీ సంగతి తెలుసుకొని, తాళాలు (బ్రద్దలు కొట్టి, యింట్లో పాడైన నులకమంచం చెత్త కాగితాలు, విరిగిపోయిన కుర్చీ, కదలలేని పెద్ద రుబ్బురోలు, చిల్లుపడిన యిత్తడి గిన్నె సేకరించి రెండునెలలు అద్దెకు వాటివిలువ సరివోదని చిటమటమండిపోయి అవన్నీ నేలవేసి బద్దలుకొట్టాడు.
ఇంటి కెదురుగా వీధిలో విధ్యుద్దప స్తంభాల తీగలమీద చచ్చిపోయినకాకి తల(క్రిందులుగా వేలాడుతోంది కుక్కలు కొట్లాడుకుంటూ భోంయమని అరుస్తున్నాయి. ఇద్దరు గ్రుడ్డి ముష్టివాళ్ళు హీనంగా అరుస్తూ పొట్టబాదుకుంటూ బిక్ష అడుక్కుంటున్నారు.
అన్వేషణ 8283 కేడ
చాంద్రాయణగుట్ట చెన్న కేశవస్వామి ఆలయం చుట్టూ దేవుడిమీద పుష్పాక్షతల్లా నిండిన కొండరాళ్ళు ఎక్కాడు శివరాం. సాయంత్రం అయిదుగంటలయింది, ఆఫీసు సెలవుదినం ఆదివారంవస్తే తలుపులు రాణిపై (ప్రసరించి ఏమిటో ఉన్మాదం కలగజేస్తున్నాయి శివరాంకు. మానసిక పరితాపంనుంచి తప్పుకోవాలంటే ఒంటరిగా కొత్త ప్రదేశసందర్శనంలో నూత్నభావాలు మనస్సులోకి జొనిపి ఆనందించుకోడం ఒక మార్గంలా స్ఫురించింది శివరాంకు.
ఓంటరిగా గమ్యస్థానం లేకుండా బయలుదేరి చార్మినార్ దాటి ఆ ముందు ఏముందో అనే వింతోదోరణితో అంతం చూడాలని రిక్షా ఎక్కి చెన్నకేశవ ఆలయం చేరాడు శివరాం. పెద్దపెద్ద కొండ రాళ్ళు చుట్టుకుని వాటిలోంచి కొండమీద ఆలయం దేవుని శిరస్సులా నిక్కి చూస్తోంది సంస్కారంలేక ఎక్కువ భక్తులపోషణ లేక ఆ ఆలయం శిధిలావస్థలో ఉన్నట్లుంది. ఆ గ్రామం వీధిలోంచి కొండమీదకు ఉట్టిపడుతోంది. కాస్త చీకటిపడితే ఎవరైనా కొండ ఎక్కడ మంటే భయపడడం సహజం. కొండరాళ్ళు మధ్య సందుల్లో కనిపించే నల్లనిసొరంగాల్లో ఏ సర్పాలు దాక్కున్నాయో అనే సందేహం కలుగుతుంది. కొండరాళ్ళు దాటి మెల్లిగా సన్నటిదారి చీల్చుకుని ఆలయం చేరాడు శివరాం. కొండమీద రెండు ఫర్లాంగుల ఎత్తున ఉన్న ఆ ఆలయం దూరాన హైద్రాబాదు నగరం యొక్క స్వరూపం స్పష్టం చేస్తోంది. ఆకాశంలో మిణుకుమంటున్న తారలతో కొండదిగువన నగరమధ్య దూరాన వెలుగుతున్న విద్యుద్దీపాలు పోటీ చేస్తున్నాయి మానవుడే తారలకు పోటీగా భువిలో విద్యుద్దపాలు ప్రతిష్టించినట్లు కనిపించింది.
వ! అన్వేషణ
పూజారి శివరాంను ఆహ్వానించాడు నగరంనుంచి ఆ ఆలయం చూడడానికి వచ్చే నాగరిక భక్తులే చాలా తక్కువ శివరాం ఆ ఆలయంలో క్రొత్తగా అడుగుపెట్టగానే పూజారి సంతోషించాడు ఆనాడు దైవం పేర ఎక్కువ ముడుపు తనకు దొరకుతుందని ఆలయ ప్రాంగణంలో పూజారి తాలూకు వనితలు ఏదో విషయంపై ఘర్షణపడుతూ కేకలేసుకుంటున్నారు. కేకలేసుకొంటున్న వనితలను కేకలేసి పూజారి శివరాంకు ఆలయ అంతర్భాగానికి తీసుకు వెళ్ళి గర్భగుడి తలుపులు తెరిచాడు. చెన్నకేశవస్వామి భక్తులకు అభయహస్తం చూపుతూ పెట్టుకున్న నానుంద్వారా త్రికాలవెదిలా సర్వాంతర్యామిలా గంభీరంగా కనిపించాడు. శరకోపం పెట్టి, తులసిదళం తీర్ధం చేతికందిచ్చి పూజారి వినయంగా పళ్ళెం పుచ్చుకుని నిలుచున్నాడు. శివరాం పావలా పళ్ళింలో విదిల్పాడు. పూజారి ముఖం ఆనందంతో పరవళ్ళు శ్రొక్కెంది.
పూజారి గర్భగుడి తలుపులు మూసి బయటికి వచ్చి కూర్చున్నాడు.
పూజారి ఆలయం నడపడంలో తన కష్టసుఖాలునివేదించాడు. శివరాం అన్నీ పరధ్యానంగా విన్నాడు. అంత ఎత్తెయిన కొండమీద ప్రశాంతంగా ఉన్న చెన్నకేశవుని ఆలయానికి ప్రతియేడుతీర్ణం జరుగుతే ఎంతో శోభ చేకూరేలా కనిపించింది. కొండచుట్టూఉన్న క్రింది వీధిలో గిలకలు, లకృపిదతలు, తినుబండారాలు, రంకులరాట్నాలు మొదటైన దుకాణాలతో చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వచ్చేతీర్దయాత్రికులతో సందడిగా సరదాగా ఉంటూ జాతి సంస్కృతికి ప్రతిబింబంగా కనిపిస్తుందని ఊహించాడు శివరాం. సరైన పోషణ, నిర్వహణ లేని చెన్నకేశవుని ఆలయం పురాతన చారిత్రక స్థలంగా మారిపోవడం శోచనీయం అనుకున్నాడు.
ఆలయ (ప్రాంగణంలో నిలుచుని ఎత్తు కొండ మీంచి పరిసర ప్రాంతాలు చూశాడు శివరాం. అప్పటికే అందకారం వ్యాపించడంతో విద్యుద్దీపాలే వెలుగునీడలు. ఆ వెలుగునీడల్లో చిన్నపురుగుల్లా కదిలే మనుష్యులు, దూరాన నల్లటి మేఘాల్లా కదిలే చెట్లకొమ్మలు గుంపులు తప్ప, యింకేమి స్పష్టంగా కనిపించటంలేదు రామచిలక ఆకుపచ్చ చీర కట్టుకుని, దొండపండు పెదాలతో మృదుమధురమైన అర్ధం కానిపలుకు లేవోవిసురుతోంది శివరాంను చూసి. భాష అద్ధం కాకపోయినా, ఆ పక్షి శివరాంకు ఏదో సన్నిహితంగా కనిపించింది. ఆప్యాయంగా దగ్గరజేరి పంజరం కదిలించి చిలకతో కాస్సేపు మాట్లాడాడు శివరాం.
అన్వేషణ 285
నిశీధంలో చెదిరిన కొందరాళ్ళ మధ్య శిధిలమైన అవస్థలో పాతదనం పొందిన ఆ ఆలయానికి, అగమ్యంగా చెదిరిన బాపాలతో” తిరుగుతూ శిధిలమైన హృదయంతో రోతకలిగించే పరిస్టితులతో కనిపించే తన బ్రతుకుకు ఎంతో సామ్యం కనిపించింది శివరాంకు. అర్ధంకాని అందమైన చిలకభాషలా దూరమైపోయిన (ప్రేయసి రాణి మధురవాక్కులు చెవుల్లో గింగురుమంటున్నాయి ప్రాపంచిక చింతతో దైవాన్ని విస్మరించిన మానవుల్లా, అనుమానాల చింతతో (ప్రేమమూర్తిని నీచపరిచేనని వాపోయాడు శివరాం. తాత్కాలికంగా మనిషి తత్వం తెలుసకోవాలని యిచ్చిన ధనం యిద్దరి మధ్య అనురాగాన్ని తెంచివేసింది శారద లేచిపోయిన సంఘటన తల్చుకుని జీవితం మార్పులో మనశ్శాంతి పొందుతూంటే, శారదరూపం కలిగిన రాణి బ్రతుకులో ప్రవేశించి, మునుపటి బడబానలం రగిలించి, సిన్నహితులై, అంత్యదశలో (డ్రేమను తిరస్కరించి తన్ను త్యజించడం శివరాం హృదయాన్ని బ్రద్దలు చేసినట్లయింది.
చాంద్రాయణగుట్ట వదలి రిక్షా ఎక్కి మళ్ళీ నగరంలోకి ప్రవేశించాడు. మక్కామసీదు అరుగుల మీద పనిలేని తురకలు జోగుతూ దోమలు తోలుకుంటున్నారు. చార్మినార్ చివర బురుజుల మీది పావురాలు ఎగురుతూ గూళ్ళల్లో చేరుతూ కువకువమంటూ జనం సందడికి తాళం వేస్తున్నాయి. నాల్గుగోపురాలు ఆకాశంలోకి నిగిద్బి, “అల్లహో అక్బర్” అంటూ నమాజ్ చేస్తున్నట్టు కనిపించింది చార్మినార్. హోటళ్ళలోంచి (పేమగీతాలు హిందీలో రేడియో నుంచి మధురంగా వెలువడుతున్నాయి.
రిక్షా పరుగిడుతోంది చిన్న వానజల్లు ప్రారంభమయింది. జనం దుకాణాల కప్పులక్రింద వానకుతడవకుండా కొద్దిసేపు నుంచోవాలని చేరారు. నల్లసిమెంటు రోడ్డు వానచినుకుల్లో తడిసి, విద్యద్దీపాల కాంతుల్లో మిలమిల మెరుస్తున్నాయి. శివరాం మీద పడే చినుకుల జల్లు ఆవేదనతో ఉడికిపోతున్న శరీరానికి కొంత ఉపశమనం కలిగించింది. వానలో తడిసిపోవాలనే బుద్ధి కలిగింది... రిక్షా ఆపి డబ్బు చెల్లించి వీధిలో నడవసాగాడు శివరాం. వానచినుకులు శిరోజాలను తడిపి చుక్కలుగా మారి చెంపలద్వారా ప్రవహించి, అతని బుగ్గలు నిమిరి, కంరంమీదికి జారిపోతున్నాయి. జేబురుమాలుతో ఆ నీటి చినుకులను ఒత్తుకోవాలనే కోరికను త్యజించాడు శివరాం, కిళ్ళీ దుకాణం దగ్గరకు వెళ్ళి ఒకసిగరెట్ వెలిగించాడు. వానచినుకుల తడిలో మందంగా వెలుగుతోంది సిగరెట్టు. పొగలుపైకి జిమ్మి వాన చినుకుల బరువులో ఒరిగి కరిగిపోతూన్నయి.
2286 అన్వేషణ
హోటల్లో భోంచేసి, ఇల్లు చేరాడు తాతయ్య, చెల్లెలు తన క్షేమ సమాచారం (ప్రశ్నిస్తూ ఉత్తరాలు వ్రాశారు ప్రత్వేక విశేషాలు లేని ఆ ఉత్తరాలు సరిగా చదవకుండానే చిత్తుకాగితాలు బుట్టలో విసిరేశాడు శివరాం. తలుపుక్రింది రంధ్రంలోంచి వీధి వరండానుంచి ప్రాకిన వాననీరు తడిపిన వార్తాపత్రిక నేలమీద తచ్చాడుతోంది వార్తలు చదవబోయాడు కాస్సేపు. అధికారం, అంతులేని ఖ్యాతికి ఎగబడే మానవసముదాయం కార్యకలాపాలతో నల్ల అక్షరాల వార్తా పత్రిక మసకమసకగా కనిపించింది. పత్రిక ముడిచి మూల విసిరేశాడు శివరాం.
పక్కమీద ఒరిగాడు శివరాం. తెల్లదుప్పటి తొదుగుకుని పరుచుకున్న మెత్తటిపరుపు మల్లిపూలశయ్యలా కనపించింది శివరాంకు. గళ్ళ గలేబు తొడుగుకున్న తలగడా చిలిపిగా పలకరించింది అతన్ని. తెల్ల చీర ధరించి, గళ్ళరవిక తొడుగుకుని రాణిశయ్యమీద ఉన్నట్లు శివరాం కళ్ళు భ్రమించాయి ఒక క్షణం. కళ్ళు మూసుకుని వాస్తవిక గుర్తించి నిట్టూర్చాడు. తూలుతూమత్తుగా ప్రక్క్మమీద వాలాడు అర్పేసిన విద్యుద్దీపం వెదజల్లిన చీకట్లలో కళ్ళు తెరిచినా మూసినా చీకటి, శూన్యం గొచరిస్తున్నాయి. వానజల్లు తోడుపొందినచలిగాలి కిటికీలోంచి రివ్వున విసురుతోంది. మెత్తటి పరుపు వెచ్చదనం అందిచ్చి గిలిగింతలు పెడుతోంది. శారద, కోమటి కోడలు, ప్రమీల కళ్ళముందు కదిలారు. జీవితంలోని స్రీసాంగత్య రీతులన్నీ అందీ అందని ద్రాక్ష గుత్తులు చూసి ఎగిరేనక్క సామ్యం ప్రతిబింబిస్తున్నాయి. చిన్నప్పుడు గుడిలో పూజారి మేష్టారు వద్ద నాల్గువక్షాసు చదువుతకునే రోజుల్లో రోజూ నిమ్మతొనలు, పిప్పరమెంటు లిచ్చే తహసిల్టారుగారి అమ్మాయి, చెరువులో ఈతలాడేటప్పుడు నీళ్ళలో జారి మునిగిఫోతున్నప్పుడు రక్షించిన జమీందారుగారి కూతురు, పొలంలోంచి మామిడికాయలు వేసవిలో యింటికి తెచ్చి సుభద్రమ్మకు అందిచ్చే పాలేరు పల్లెటూరిపిల్ల, కాలవ ఒద్దున షికారుగా రావిచెట్టుక్రింద కూర్చునేటప్పుడు ఒయ్యారంగా చిదుములు ఏరుకోడానికి వచ్చే నేతి సత్తెమ్మ కుమార్తె, రాలేజీ రోజుల్లో సైన్సు రికార్డుల్లో బొమ్మలు వేయించుకోడానికి రోజూ యింటికి పిలుపించుకునే లెక్సరరుగారి కూతురు, రాణితో మాట్లాడేటప్పుడు గ్రీన్ రూములో ఏవో వంకతో మధ్య అద్దు వచ్చే వనజ, వారి.... స్వభావాలు ఏవో ఉహాగానాల్లో నెమరువేసుకున్నాడు. ఆలోచనలు మెలికలుగా (తిప్పుకుంటూ వారి నడతల వెనకాలదాగుని బయటపడని భావాలు తమ రహస్యాలు శివరాం చెవిలో వవో ఊదాయి. గుండె వేగం హెచ్చింది. నిట్టూర్పుల యం(త్రం వదిలే పొగల్లా బయట పడుతున్నాయి. శరీరం వేదెక్కింది. కళ్ళు మండుతున్నాయి. గుండె వేగం హెచ్చింది. నిట్టూర్పుల యంత్రం వదిలే పొగల్లూ బయట పడుతున్నాయి. శరీరం
అన్వేషణ 287 వేడెక్కింది, కళ్ళు మండుతున్నాయి. తల తిరిగిపోయింది నిద్ర రావటంలేదు. బలవంతంగా ఆలోచనలు స్తంఖింపచేసి, ప్రక్కమీద దొర్హి బాధగా మిగతని[ద్రలో పడ్డాడు శివరాం.
మెదడులో కదిలిన ఆలోచనలు భగ్నమైన కోరికలు, వాస్తవికత పొంది కలలుగా రూపొందాయి మూసిన కళ్ళలో వెలుగునీడల తెరల్లో, ప్రాతకాలమయేసరికి నీరసించిన దేహంతో, నిద్రలేక ఎర్రబడిన కళ్ళతో చికాకుగా లేచాడు శివరాం.
ఆఫీసుకు వెళ్ళాడు శివరాం. పనిచెయ్యాలనే ఉత్సాహమే తగ్గిపోయింది శిరోభారంతో ఫైల్సు చూస్తూ ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు తోటి గుమాసాలు పలకరిస్తూ, ముభావంగా పేలవంగా నవ్వేడు. క్రొత్తగా వచ్చిన కంపెనీ డైరెక్టరు రీవిగా గుమాస్తాల పని పరీక్షించదానికి, కాలం వృధాపుచ్చకుండా వారిచే పని చేయించడానికి, వీలైనప్పుడు గుమాస్తాల గదుల్లో తిరగడం మొదలు పెట్టాడు. బద్దకంగా, నిరుత్సాహంగా ఉన్న శివరాంపై సోమరితనం నిందలు మోపాడు. ఇంతకాలం జాగ్రత్తగా చురుకుగా తెలివిగా చేసిన ఆఫీసుపని అంతా తృటికాలంలో మర్చిపోయి అనర్హతలు ఆపాదించాడు శివరాం పై కంపెనీడైరెక్టరు కంపెనీ డైరెక్టర్ చేసే అధికారం నిందాస్పదమైన సూక్తులు అసలే మనో వ్యాకులంలో ఉన్న శివరాంను మరీ వ్యధపెట్టాయి. ఉద్యోగంకు రాజీనామా యిచిచ దేశాల పాలబడి ఒంటరిగా బికారిగా తిరిగివయాలని బుద్ధి పుట్టింది శివరాంకు. మనశ్శాంతి పొందాలంటే మార్గం రాణ్ని ప్రసన్నురాలు చేసుకొనడంలోనే ఉందని శివరాం ఆలోచించసాగాడు.
కాలక్రమంలో గతం మరిచి రాణి మళ్ళీ సన్నిహితురాలు కాగలదని ఆశించే శివరాం ఆమె యింటికి వెళ్ళాడు. ఆ యింటి నుంచి రాణి మరియమ్మకూడా వెళ్ళిపోయి చాలా రోజులైందని విని నిరాశతో తిరిగి వచ్చేశాడు శివరాం.
కృష్ణమూర్తి కనిపించాడు. (కొత్త నాటకం ఒకటి ఎరుకుని, రిహార్సల్సు ప్రారంభించటానికి యత్నాలు చేస్తున్నానని, శివరాం సహకారం కావాలస్ మామూలు సంస్థ నిర్వహకుడి పద్దతిలో మాట్లాడాడు. తనకు అనారోగ్యంగా ఉంటోందని, ప్రస్తుతం నాటకాల్లో ఏమీ పాల్గొనలేనని శివరాం దూరమైపోయాడు నవయువక మందలికి.
ఆఫీసులో కంపెనీ డైరెక్టరు ప్రవర్తనతో చికాకు హెచ్చిశివరాం సెలవు పెట్టి ఇంట్లో సోమరిగా కూర్చునేవాడు ప్రొదున్నే దాసి రాజవ్వ వచ్చి వేన్నీళ్ళు కాచి స్నానాల గదిలో వుంచేది. కాఫీ తయారుచేసి మేజామీద వుంచేది. భోజనం తయారుచేసి వెళ్ళిపోయేది.
288 అన్వేషణ ఆలోచనల మైకంలో సోమరిగా పడుండి, ప్రక్క్మమీద దొర్లుతూ కాలం గడిపేశేవాడు శివరాం. మేజామీద కాఫీ చల్లారిపోయేది. స్నానాల గదిలోని వేడినీళ్ళు చల్లబడిపోయేవి. వేడి అన్నంబీరు సెక్కి పోయేది, సగం తిని, సగం తినక, అన్నం కెక్కరించి విసిరేవాడు. ప్రక్క్మయింటివారి మేద పైభాగం మీదినించి దుముకి ఒక నల్లపిల్లి వంటింట్లోకి వచ్చెది ఒంటరిగా వున్న శివరాంకు ఆ నల్లపిల్లి స్నేహితుడిగా కనిపించింది.
మెడ'(క్రింద తెల్లటి చారతో, తెల్లటి కాళ్ళతో బొద్దుగా ఎదిగిన నల్ల పిల్లి మృదువుగా అందంగా ఉంది. శివరాం భోంచేస్తుంటే ఆకలితో పెదాలు, మీసాలూ తుడుచుకుంటూ, “వ్యూవ్” మంటూ ఐదురుగా కూర్చునేది శివరాంకుదీనిమీద జాలి, అభిమానం, ఆదరణ కలిగేవి. ఒకరోజు రాజవ్వ వండిన అన్నం అంతా గుమ్మరించి, పల్లపిల్లిని మెల్లిగా పిలిచాడు. భయంతో అడుగులు వేసుకుంటూ, “మ్యావ్” మంటూ సన్నగా కూనిరాగం తీస్తూ, బెదురుకళ్ళతో ఇటూఅటూ పరిశీలిస్తూ శివరాంవైపు నిశితంగా చూస్తూ, అన్నం (క్రింద వోగుముందుకు వచ్చింది చేతిలో అన్నం వేసుకుని అందిచ్చాడు శివరాం. భయంతో వెనుకంజ వేసింది నల్లపిల్లి అన్నం క్రింద వేసి దూరంగా వెళ్ళాడు శివరాం. నల్లపిల్లి అన్నం దగ్గరగా వచ్చేసింది. ఒక్కొక్క మెతుకు కతికింది శివరాం ఒక మూలగా విశ్శబ్దంగా కూర్చుని జాగ్రత్తగా నల్లపిల్లిని పరిశీలించసాగాడు. తన ఒంటరితనం వల్ల ఇంట్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఎలుకలను భయం గొలిపేలా ఈ పిల్లి సహవాసం తనకు కొంచెం అండగా ఉంటుందనుకున్నాడు.
అన్నం పూర్తిగాతిన్న నల్లపిల్లి విశ్వాసంగా శివరాంవైపు చూస్తూ రీవిగా కూర్చుంది. శివరాం ముందు గదిలోకి నడిచారు. నల్లపిల్లి అతన్ని అనుసరించింది. శివరాం పకృ్కమీది ఒరిగాడు బద్దకంగా, నల్లపిల్ల గదిలో ఒక మూల ముడుచుకుని పడుకుంది. అలమరు తలుపు గాలికి కిర్రుశబ్బ్దంలో “ఏం చేస్తున్నావ్!” అంటూ శివరాంను పలకరించింది తలుపులు విచ్చుకున్న అలమరులో గాలికి పుస్తకాలు పేజీలు కదిలి “నన్ను చూడమన్నట్లు" రెపరెప ధ్వనులు చూస్తూ అలజడి చేశాయి. కిటికీలోంచి వచ్చే శీతగాలికి గోడకు తగిలించిన కేలండర్లు బాధపడుతూ దబదబ మొత్తుకుంటున్నాయి. గడియారం టిక్కుటిక్కు ధ్వనులతో, గదిలో ఎగిరే పిచ్చుకల “చుప్ చుప్” కూజితాలకు తాళం వేస్తోంది. నల్లపిల్లి గుడ్డ కప్పుకుని విశ్రాంతి తీసుకుంటున్న రేడియోవైపు తల నిగిడ్బి త్రిప్పుకుంటూ వయ్యారంగా పరీక్షిస్తోంది. ఉపయోగం లేక శూన్యంగా వున్నకుర్చీల్డు విశ్రాంతి తీసుకుంటున్నాయి
అన్వేషణ 2869
పుస్తకం చదువుదామని ఆలమరలోంచి ఒకటి తీశాదు. రెండు పేజీలు చదివినా ఏమీ అర్ధం కాలేదు. మనస్సు మరో ఆలోచనతో కదులుతోంది మనస్సు ఆలోచనలతో ఎదురీత ఈదడం ఇష్టంలేక పుస్తకం మూసేశాడు శివరాం. బ్రతుకులో ఆనందం ఏ విధంగా సంపాదించుకోవాలో అర్ధం కాలేదు శివరాంకు జీవితంయొక్క పరిపూర్ణత్వం, కోరిక పొందడం, కోరిక సిద్దిని అందడంలోనే ఉందనిపించింది కోరికలు సిద్దించనప్పుడు అసంతృప్తి నిండి బ్రతుకులో చీకాకు, ఆవేదన హెచ్చుతాయి. ఏ జీవికైనా అనురాగాన్ని అందుకుని, (ప్రతివాదంగా అందిచ్చే మరోజీవి లభించినప్పుడే మనశ్శాంతి లభిస్తుందనిపించింది శివరాంకు. పిచికలు రెండు కిటికీలో నిలుచుని ముక్కుపుటాలతో ముద్దు పెట్టుకుంటూ, చలిగాలికి ఈకల శరీరం గుజ్జుగా, విదుల్చుకుంటూ, “చుప్ చుప్” ధ్వనులతో ఎవో సరసాలాడుకొంటున్నాయి, అనర్నించి, అలరించి అనురాగాన్ని రెచ్చగొట్టిన జీవియొక్క సాన్నిపిత్యం లభించనపుడు అందుకు ప్రాతినిధ్యం వహించడానికి మరెజీవి పాటుపడినా వ్యర్ధ మనిపిస్తుంది. సాంఘిక కార్యక్రమాలలో ఎన్నో తరగతుల వ్యక్తులతో పరిచయం, స్నేహం కలిగినా, హృదయం విప్పుకుని మనణ్లేశం విపులంగా చెప్పుకోదగిన స్నేహితుడెవరూ శివరాంకు కనిపించలేదు మనసిచ్చి మాట్లాడే స్నేహితుడు, హృదయ మందిచ్చి (మేమించే యువతి మనిషికి లఅభ్యమవడం నిజంగా అదృష్ట మనిపించింది శివరాంకు. ఆ అదృష్టం తనకు లేదని వ్యధతో ఏడ్చాడు శివరాం.
తలుపు చప్పుడయింది. “పోస్ట్రమేన్” పలకరించాడు. మనియార్జురు అందిచ్చాడు పది రూపాయలకు సంతకం పెట్టి సొమ్ము తీసుకున్నాడు శివరాం. వెన్నెల్లో, ఉద్యావనంలో రాతితిన్నెపై కూర్చుని తెల్లని వస్ర్తాలు ధరించి మల్లిపూవులూ మెరుస్తున్న ఒక స్తీ విరహవేదనతో ప్రియుడికై నిరీక్షిస్తున్న దృశ్యం చిత్రించి పత్రికకు పంపాడు శివరాం. అచ్చయింది పారితోషికం వచ్చింది. పత్రికలో ఇంకేమున్నది పరిశీలించి చదవలేదు. పది రూపాయల నోటు మదత పెట్టి పర్సులో పెట్టేశాడు శివరాం. భారంగా ఉన్న పర్సు జేబులో కుక్సేశాడు.
తెరచి ఉన్న అలమర తలుపుక్రింది అరలో చిందరవందరగా పడివున్నాయి అనేక చిత్రాలు, అనేక భంగిమల్లో, ఆకారాలు వివిధ వర్హాలతో, చిత్రించిన రాణి చిత్రాలు ఆ గుట్టలో పడి ఉన్నాయి. రాణితో స్నేహం పొందక పూర్వం, పెళ్ళిపందిరిలో జనం హదావిడీి పూలదండలు వేసుకుని (ప్రేమ దృష్టులతో, సిగ్గు దొంతరలతో చూసుకునే భార్యభర్తలు, పరుగెత్తే కుక్కపిల్ల, మాతృత్వం వాత్సల్యం పొడుగాటి కన్నుల్లో తోణికిన లాడిస్తూ చీర చెరగు ముడతల్లో మదతగా ముడుచుకున్న పాపకు స్తస్యమందిచ్చే తల్లి, రూలువంతెన
2090 అన్వేషణ క్రింది చికటి దారుల్లో రక్షణ పొంది నీరసంగా శయనిసూ బాటసారుల దయకోసం తెరచిన డబ్బా వదిలిన బిక్షకుడు, ఉయ్యాల మంచంమీద రుమాలు కడుతున్న శారద, వివిధ చిత్రాల్లో కనిపించారు. తన మనస్సు హరించిన ఆ రూపాలను తాను హృదయంలో మనసార ఆరాధించే ఆ రూపాలను అగ్నిదేవుడికి ఆహుతిచేసి, మసిగా మార్చి, శూన్యం చూడదడమంటే శివరాంకు దుఃఖం కలిగింది అభిమానం, (పేమ చూరగొన్న వ్యక్తులు ఎ కారణంవల్లనైనా దూరమై పోయినా, వారి ప్రతివింబాలుగా ఎదురుగా కనిపించే ఫోటోలు, దృశ్యాలు మనస్సుకు కొంత శాంతి, ఆనందం కలిగించి ఆరాటం అణచగల వనుకున్నాడు. రాణికోసం తాను చిత్రించిన పెద్ద బొమ్మ రాణి తీసుకుపోలేదు. నాల్లు మేకులు తీసి, రాణిచిత్రం గోడకు కొట్టాడు. తన్ను తిరస్కరించిన రాజి ముఖం ఎదురుగా కనిపించగానే హృదయంలో అణగి చిన్న అలలుగా కదులుతున్న ఆవేదన ఉబికి, కెరటాలు పెద్దవి చేసుకుని వరదల్లా పొంగింది శివరాంకు చికాకు కలిగి మేకులు పీకి రాణిచిత్రం అలమరులో ఇతర చిత్రాల మధ్య దూర్చి మూసేశాడు.
శివరాం వీధిలోకి చూశాడు ఎదురుగా ఉన్న గుడిసెల మధ్య ఒక యిత్తడి బిందె కుంపటిమీద రగిలిస్తూ, ప్రక్కనే బాల్చీలోని నీళ్ళల్లో డబ్బాలు కడుగుతూ, బీడి కాలుస్తూ “చాయ!” అని అరుస్తున్నాడు ఒకడు చుట్టూ మూగిన కూలీలు గుడిసెల్లో నివసించే నీచజాతులు అర్ధణా యిచ్చ టీ త్రాగుతున్నారు, పెళ్ళాడే బొమ్మలా చీర కట్టుకుని, ముదురు ముఖంతో ఒక మరుగుజ్జు వనిత వీధిలో వారగా పెట్టిన చిన్న క్రిల్ళీ కొట్టులో కూర్చుని బోనులో బంధించిన ఎలుగు గొద్దులా పొట్టి చేతులతో తమాషాగా తమలపాకులకు సున్నం రాస్తూ కిళ్ళిలు తయారుచేసోంది.
వివిధ వ్యక్తులు తమకు ఉచితమైన వ్యాపారలతో నిమగ్నులై కాలం గడుపుతూంటిె, సర్వకార్యాలు త్యజించి ఒక స్తీ గురించి మనో వ్యాకులతతో సోమరిగా కాలం గడపడం బహుశా మార్ధత్వమనిపించింది శివరాంకు. ఇంట్లోకి పోయి తలుపులు బిగించుకున్నాడు శివరాం. నల్లపిల్లి యధాస్థానంలో చలనం లేకుండా అర్దనిమీలిన నేత్రాలతో విశ్రాంతి తీసుకుంటూ అవలించింది. ఇంట్లో కనిపించిన ఒక్క స్నేహితుడితోనైనా కాలం గడపడం: మంచిదని పిల్లి దగ్గర జేరి ఒంటిమీద నిమరాడు శివరాం. ఒళ్ళు విదిలించుకుని, కండరాలతో బొచ్చు శరీరాన్ని మెలికలుగా (త్రిప్పి “మ్యావ్ మంటూ లేచి నిలుచుంది పిల్లి యజమానికి గౌరవసూచకంగా. పిల్లి నెత్తుకుని ఒడిలోకి తీసుకున్నాడు శివరాం. పిల్లి గోళ్ళు పరిశీలించాడు మెత్తటి పాదాల అడుగులు తడిమాడు. మీసాలు మెలివేశాడు. తోకను ఆడించాడు. నల్లపిల్లి నాజూకుగా నాగరికంగా శివరాం ఒడిలో ముడుచుకుని
అన్వేషణ 291 కదలలేదు. పక్కమీద పడుకుని ప్రక్కను వదిలేడు పిల్లిని కాళ్ళు ముడుచుకుని పిల్లి “మ్యావ్” మంటూ శివరాం శరీరం నాకింది గూటిలోని బిస్కట్టు తీసి క్రింద పడేశాడు శివరాం నల్లపీల్లి మంచం మీద నుంచి క్రిందకు దూకి బిస్కట్టు తినేసింది. మళ్ళీ ఆశగా శివరాం వైపు 'మ్యావ్్ మంటూ చూసింది. బిస్కట్లు అయిపోయాయంటూ చెయ్యి తిప్పి సంజ్ఞ చేశాడు శివరాం. నల్లపిల్లి ఆ సంజ్ఞ అర్ధం చేసుకుందో లేదో కాని మంచంమీద కూర్చున్న శివరాం ఒడిలోకి ఎగిరిదుమికింది. తండ్రి కెదురువచ్చి ఎత్తుకోమనే పాపమిద ఆప్యాయత హెచ్చినట్లు, శివరాం నల్లపిల్లిని బాహువుల్లో మెత్తగా బంధించి ముద్దు పెట్టుకున్నాడు.
తలుపు చప్పుడుయింది నున్నటి బట్టతల, పొడుకాటి బలిష్టమైన శరిరం, తెల్లపంచ, చారల చొక్కాలో ఒక బుట్ట పుచ్చుకొని మేడ క్రింద లాండ్రీ యజమాని నిలుచున్నాడు. మేడ క్రీంది దుకాణాదారులతో శివరాం యింతవరకూ పరిచయమే కలిగించుకోలేదు తాతయ్య తల్లి ఉన్న రోజుల్లో పేరిశాస్తి పలుకుబడివల్ల కుదిరిన చాకలే బట్టలుతుకుతున్నాడు శివరాంకు. ప్రధమంగా తన అవసరం పడ తలుపు తట్టిన బట్టతల లాండ్రీ యజమాని శివరాంకు కొంత ఆశ్చర్యం కలిగించాడు.
“క్షమించండి సార్.... మిమ్ములని పిలిచినందుకు. బొగ్గులు అయిపోయాయి.... ఒక బుట్రెడు బొగ్గులు బదులు యిస్తే రేపు వాపసు చేచేస్తా. . చేతిలో డబ్బులేక తప్పనిసరిగా మిమ్మలిని ఈ వేళ అర్ధిస్తూన్నాను... యిస్త్రీ చెయ్యవలసిన బట్టలు చాలా ఉన్నాయి. మరోలా అనుకోక .!” దీనంగా నవ్వాడు లాండ్రీ యజమాని. ఆ నవ్వులో పెదాల మధ్య నుంచి తొంగిచూస్తున్న ముందు పళ్ళపరుసలో బంగారు రంగు దంతాలు రెండు మెరిసాయి. ఆ ముఖంలో నిశ్చింత, నిర్లక్ష్యం కనిపించినా, అవసరం తీర్చుకోవాలనే (వాపంచిక చింతతో కూడిన దైన్యం మాత్రం స్ఫుటంగా (మ్రతిబీంబించింది.
“మీ పేరు!”
“జనార్ధనం!”
జనార్ధనం చిన్న కోరిక కాదనలేక పోయాడు, శివరాం. వంటింట్లోకి వచ్చి డ్రమ్మ్భుతో ఉన్న బొగ్గులు తీసుకోమన్నాడు. జనార్ధనం బుట్టనిండా బొగ్గులు నింపుకున్నాడు. నల్లపిల్లి శివరాం వాళ్ళో పదిలంగా కూర్చుని చెవులు రిక్కించి జనార్ధనం వైపు చూసింది పరీక్షగా, బంగారు రంగు దంతాలు మళ్ళీ జయలు పరుస్తూ జనార్ధనం కృతజ్ఞతతో నవ్వాడు. శివరాం ముభావంగా ఊరుకున్నాడు.
292 అన్వేషణ
జనార్దనం జీవితం ఎటువంటిదో, మేడకు క్రింద ఎదురుగా గుడిసెల్లో నివసించే బీదవాళ్ళ కష్టసుఖాలు ఏమిటో, అనే ఆలోచన శివరాంకు కలిగింది పుష్కలంగా ధనం సంపాదించుకుంటూ సర్వసౌఖ్యాలు కల పెద్ద మేడలో నివసిస్తూ, ఒక స్తే సౌఖ్యం లేదని వేదన పదే తనకూ మేడక్రింది అసహ్యకరమైన, అనారోగ్యవంతమైన వాతావరణంలో బ్రతుకుతూ నిత్యమూ ఎన్నో యాతన అనుభవిస్తూ, బాహ్యంగా సంతోషంగా కనిపించే ఆ నీచజాతి మనుష్యులకూ ఎంతో వ్యత్యాసం కనిపించింది. మనస్సులో పరిస్థితి ఏదైనా టైనిక చర్యలు చేసూ విధ్యుక్తధర్మం నిర్వహిస్తూ శరీరానికి కొంత కార్యక్రమం నిర్ణయించుకున్నప్పుడు, మానసిక వేదన కూదా క్రమంగా తగ్గగలదని ఆశీంచాడు శివరాం వాహ్యాళికి పోవాలనిపించింది శివరాంకు న్నానాలగది చేది ముఖం రుద్దుకున్నాడు వరండాలో పేర్చిన కుండీల్లో యీ మధ్య ఒక్క మొక్కా పుష్పించలేదు ఒక కుండీలో పాతిన తీగె వాడిపోయి ఎండిపోయింది శివరాం ఆ లత పెరికి పారేశాడు. దాసీ రాజవ్వ తలుపు కొట్టింది తలుపు తీయగానె, పొరుగింటి గృహిణులు నిర్లక్ష్యంగా ఎక్కువ వండి పారేసిన అన్నం, గిన్నెలో పదిలంపరుచుకుని ప్రత్యక్షమయింది యజమాని వీధిలోకి ఫోతూందడం గమనించి, అంట్లుతోమాలని కంగారుగా లోనికి నడిచింది. “ఈవేళ పని చెయ్యకృల్లేదు.. , రేపుప్రొద్దున్నరాక ముభావంగా తల వంచుకుని ఆజ్ఞాపించాడు శివరాం.
సమాధానం చెప్పడానికి భయపడే ఆ దాసి నల్ల వదనంలో ఆశ్చర్యం గోచరించి, కదలలేని పెదాల మధ్య బిగుసుకుపోయింది. గిన్నె చంకను బెట్టుకొని, కాలి మట్టెలు టకటక చప్పుడు చేసుకుంటూ మౌనంగా కదిలిపోయింది రాజవ్వ,
“మిస్టర్! శివరాం!” అంటూ రాజారావు అరుస్తూ నవ్వుతూ తుఫానులా లోపలికి వచ్చాడు .
మెల్లిగా అంగలు వేసుకుంటూ, పొడుగాటి చేతులు ఆడిస్తూ పకపక నవ్వుతూ *ఏం మిత్రమా.... ఏమిటి విశేషాలు.... ఏమంటోంది ప్రపంచం... నిన్ను చూడగానే 'దాసి యజమాని సంవాదం” అనే గ్రంధం వ్రాయాలనిపిస్తోంది”. పకపక నవ్వాడు చక్రవర్తి శివరాం యింట్లోంచి బయటికి వచ్చిన దాసీని గమనించి.
“ఈవేళ ఆఫీసు మానేసావేం?” రాజారావు ప్రశ్నించాడు.
శివరాం మౌనంగా నవ్వాడు.
“విరహవేదనా?” ఛలోక్తి విసిరాడు రాజారావు మామూలు ధోరణిలో, “ఒక్కొక్కసారి ఆ బాధలో ఏ పని చెయ్యబుద్ధి పుట్టక ఆఫీసుకు సెలవు పెళ్టి యింట్లో ఊరికే కూర్చోవాలనిపిస్తుంది.” రాజూరావు నవ్వాడు.
అన్వేషణ 293
“మనవాడికి ఎటువంటి నౌకర్లును పెట్టుకోవాలో కూడా నేర్పాలిస్వామీ ... 'పెద్దమేద, ఒంటరిబంగళా.. . సర్వ సదుపాయాలు. నేనైతే నా జీవితమే (క్రొత్త రీతుల్లో నడిపేవాడిని....” పక పక నవ్వాడు చక్రవర్తి.
“ఆఫీసు కారులో బయలుదేరి యిలా వచ్చాం.... నువ్వు సెలవులో వున్నావని తెలిసి . . నీకు సభలు సమావేశాలు ఉన్నా ప్రయత్నలోపం చెయ్యికూడదని నీ యింటి ముందు దిగాం. .. ఈ వేళ నా జన్మదినం!” రాజారావు నవ్వాడు కులాసాగ.
ఈ జన్మదినాన్ని నీ సాంగత్యంలో పర్వదినంగా మార్చాలని బాబుగారి ఉద్ధిశ్యం!” పకపక నవ్వాడు చక్రవర్తి,
మనోవ్యధలో కుమిలే తనకు అయాచితంగా వచ్చి ఆనందం కలిగినామని అంటున్న స్నేహితులవైపు అభిమానంగా చూశాడు శివరాం .. నగరంలో అడుగుపెట్టాక మసలినా, మనశ్చాంతి, హృదయానందం ఇచ్చిన నిజమైన స్నేహితులు చక్రవర్తి, రాజారావే అని మాత్రం గుర్తించాడు శివరాం. జీవిత (ప్రవర్తనల్లో, మనస్తత్వాలలో విభిన్నత పొడసూపుతున్నా ఒక విధంగా అభిమానం, ఆవ్యాయత ఆధారంగా వారితో తన హృదయం సమన్వయం పొందిందని గ్రహించుకున్నాడు శివరాం అందుకే ఎటువంటి కష్టంలో, బాధలో వున్నా రాజారావు, చక్రవర్తి కనిపించగానే శివరాంకు మనస్సులో కొంత సేదదీరినట్లు అనిపిస్తోంది.
ముగ్గురినీ ఎక్కించుకుని కారు సికింద్రాబాదు నగరమధ్యంలో నడిచి వెళ్ళిపోయింది. సరోజినీదేవి రోద్దులో పెద్ద బంగళాలో ్రవేశించారు. కాంపౌండులో పూలమొక్కలు వచ్చే అతిధులకు స్వాగతమిస్తున్నాయి ఒక కర్రచెక్కల గదిలో చేరారు ముగ్గురూ. ఎర్రకాన్వాసుగుడ్డతో మెత్తటి నాల్లు కుర్చీలు ఒక అందమైన పలకల టేబిలు చుట్టూ అమర్చబడ్డాయి. టేబిలుమీద సిగరెట్టు మసి రాల్చుకునే “యా(స్టే, ఉప్పు, మిరియప్పాడితో నిండిన చిన్న సినాలు ఉంచబడ్డాయి, ఆ గదికి యిరువైపులా కట్టిన పువ్వులగుడ్డ తెర ఎలక్టిక్ పఫేసు గాలిలో ఊగుతోందిసోయగంతో. రేడియో లలిత సంగీతం పాడుతోంది.
“క్క వేత్త చేతిలో ఒక వందరూపాయల నోటు ఉంది... అది మీకు అంకితం... ఏం కావాలి?...” రాజారావు నవ్వుతూ అడిగాడు.
“మిత్రమా!... యీ ప్రదేశంలో దిగులుగా కూర్చొనడానికి కాదు మనం వస్తా.... సరదాగా గడపాలి.... సరదాగా మాట్లాడాలి! నీ మనస్సులో దిగులంతా పోతుంద ఒక్క గుక్క నోట్లో పోసుకుంటే” చక్రవర్తి శివరాం భుజంతట్లి కుదిపొదు.
294 అన్వేషణ నరాలబిగువు సడలించి తెలియని భావనల్లో ఒళ్ళుమరిచె తేలిక సుషుప్తితో మనస్సు గడిపితే కొంత శాంతి లభిస్తుందనుకున్నాధు శివరాం
“మారిపోయాను మిత్రమా ... మారిపోయాను.... ఈ వేళ మీరేం చెయ్యమంటే ఆది చేస్తాను” నవ్వాడు శివరాం
“ఆయ” రాజారావు, చక్రవర్తి హాస్యంగా ఆశ్చర్యముతో నోరు అవతించారు
“టోయ!” అరిచాడు రాజారావు.
మూడు గ్లాసుల్లో బ్రాందిపోసి, సోడాలతో ప్రత్యక్షమయ్యాడు సర్వరు బలవంతంగా కార్కులు సోదాబుద్లకు ఊడదీశాడు. ఉప్పాంగే హృదయా వేదనలా సోదా నీరు బుడ్డి మూతిలోంచి పొంగి పోొర్లింది. గ్లాసుల్లో సోడా నింపాడు. లేతపసుపు పచ్చరంగులో బంగారుతళుకులు కరిగించిన ద్రావకంలా బ్రాంది కనిపించింది. భగ్నమైన కోరికలు ప్రతినిమిషం హృదయాన్ని వేధించి కలచి వేస్తున్నట్లు బ్రాందీ గ్లాసుల్లో బుడగలు క్రిందికి పైకి ఎగురుతున్నాయి. కర్రల గది తెరమీద పువ్వులు విలాసవతియైన స్త్రీ చలిపినకన్నుల్లా మనస్సు చెదరగొడుతున్నాయి. కారంచల్లిన ఉడుకు ఆటుగడ్డలు, టమాటాముక్కలు ఉట్టిపొరలు, చేపల వేడీపకోడీలు, కోడిగ్రుడ్లు అట్లు ప్లేట్లలో ఎదురుగా గుమ్మున వాసనగొడుతూ ఆకలి పొట్టల్లో జరర రసాన్ని ద్రవింప జేస్తున్నాయి. రాజారావు తన బ్రాందీ గ్లాసుతీసి తక్కిన గ్లాసులతో టిక్కు మనిపించాడు. చక్రవర్తి నాలిక మెలికలు తీరుగతోంది ఆకలితో, అతని పొట్ట ముడతలు సాగదీసుకుంటూ పెద్దది కావదానికి ప్రయత్నిస్తోంది.
“జీవితంలో బాధలు మరిపించి, ఒక క్షణమైనా నిజమైన మనశ్శాంతి అందిచ్చే ద్రావకమా!.... నీకు నమస్కారం!” చక్రవర్తి బ్రాందీగ్లాసు ఎత్తి విద్యుద్రపంవైపు చూసి నటకుడిభంగిమలో నమస్కరించాడు - కోమటి చీకటి పడగానె విద్యుద్దిపం వెలిగించి నమస్మరించినట్లు.
“ఆశించిన వస్తువు జీవితంలో లభించనప్పుడు ఏదో వస్తువు దానిస్టానే తీసుకుని ఉపయోగించుకుని ఆనందించలేము ఆశించిన వస్తువు దూరమైపోయి ఆనందాన్ని భగ్న చేసినప్పుడు నిందు జీవితాలను భగ్నహృదయాలతో హత్యచేసుకోలేము కనుక, జీవితాన్ని నిర్లక్ష్యంగా ఏదో విధంగా గడిపేస్తాము. అటువంటప్పుడు సంకుచిత దృష్టితో సంఘం, మనం జీవితం ఎలా గడుపుతున్నామని అనవసరమైన పరీక్షచేస్తూ వేధిస్తే చివరకు
అన్వేషణ ఓ2రస్ సంఘాన్నే లెక్క చెయ్యం....” మత్తుద్రావకం కలిగించే తేలిక మనస్సుతొ ఉపన్యాసం నాగించాడు రాజారావు.
“ప్రతీ మనిషి జీవితం అతడి కర్మ ననుసరించి నడిచిపోతుంది. .. జీవితంలో అందదివలెనే సర్వాంగసౌష్టవం లేదని కుమిలే అంగవిహీనుల వ్యధను అంతే ముంటుంది.... ఉన్న పరిస్థితిల్లో కృత్రిమంగానైనా ఆనందం ఫొందడంలోనే జీఇత విజయం యిమిడీ ఉంది” చక్రవర్తి నీరసంగా నవ్వాడు.
వారిద్దరి పెదాల బిగువులమధ్య కృత్రిమంగా నీరసంగా వెలిగే నవ్వుల్లోకూడా అగాధమైన భగ్నగాధలు నిండి ఉన్నాయని గుర్తించాడు శివరాం,
కొంత నిజం, కొంత కల్పనచేసి, ఒక స్తీ మీద తనకు ఎర్పడిన అనురాగం. రూపొందిన భగ్న పరిస్థితులు నివేదించాడు శివరాం స్నేహితులిద్దరికీ.
“నా భార్య ఉత్తమూర్శురాలు... చదువులేదు... నన్ను అర్థం చేసుకొన ప్రయత్నించదు... తిరిగి తిరిగి అలసి యింటికి వెడితే ఎక్కడ తిరిగేరని ప్రశ్నిస్తుంది.... ఏ సమాధాన మిచ్చినా తృప్తిపడదు. ఆఫీసు వేళలో తప్ప తక్కిన సమయాల్లో తన వెంట ఉండమంటుంది?.... లేకపోతే ఏడ్పులు, సాధింపులు, గయ్యాళితనం, కోపగింపులు ... సంసారం రోత అనిపిస్తుంది ఒక్కొక్కసారి... ఒక క్షణం యింట్లో ఉండబుద్ధి పుట్టదు తప్పనిసరిగా ఒక భార్య ఉండాలని ఎవరైతేనేం అని ఒక పల్లెటూరి పిల్లను పెళ్ళిచేసుకున్నా .. నా మొదటి భారయ ఎంతో అందగత్తె. .. దగ్గర సంబంధ... ఆమెకు యిష్టం లేకుండా నాకు ముడి పెట్టారు... నాకు దబ్బుకు లోటులేదు.... సర్వవిధాల సంతోషపెట్టాలని ప్రయత్నించాను... ఎప్పుడూ దిగులుగా దీనంగా కూర్చునేది... నన్ను చూసి అసహ్యంతో భయంతో దూరంగా పోయేది... ఆమె అంటే విపరీతమైన అభిమానం, (పేమ పెరిగి పోయింది. ఏది కావలసినా చేస్తానన్నాను... పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు మరో మేనమామ కొడుకుతో సంబంధం ఏర్పరచుకుంది... ఆ మేరమామకొడుకు మా యింటి వీధిలో తిరగడం... ఆమె కిటికీలోంచి చూచి ఏడ్వడం... మా అమ్మ చాలాసార్లు చూసింది... కోడలును హింసించింది.... నేను ఒక రోజు దీర్హంగా విశాలదృష్టితో నిర్మలంగా ఆలోచించాను. ఆమెను (ప్రేమించిన మేనమామకొడుకు యింటి పంపేశాను... దానితో నాకు మనస్సు వికలమై పోయింది... ఏదో ఆత్మ సంబోధన కలిగింది.... నాల్గు సంవత్సరాలు ఒక్క వస్త్రంతో దైవప్రసాదలబ్ద ధనంతో తీర్దయాత్రలు చేశాను వైరాగ్యంతో... యింటికి వచ్చి మనస్సు కరడు చేసుకుని తిరిగి పెళ్ళి చేసుకున్నా... చితికి పోయి
296 అన్వేషణ హృదయం జీవితంలో తిరిగి ఆతుక్కోవడం చాలా కష్టం!” రాజారావు నిట్టూర్చుతో పూర్తిగా కాలిపోయిన సిగరెట్టును “యా(స్టే”లో వేశేశాడు. గ్లాసులో మిగిలిన బ్రాందీ ఒక్క గుక్కలో (త్రాగేసి పెదాలు చప్పరించాడు బాధగా తలవంచుకుని.
హృదయంలో బడబానలంలా రగిలే ఆవేదన భరించలేక కృత్రిమ వైతన్యం కలిగించుకుని నవ్వులు సృష్టించుకుని, నిర్లక్ష్యంగా బ్రతకడం నేర్చిన రాజారావులో చాలా న్మిగ్రహశక్తి ఉన్నట్లు అనిపించింది. ఆవేదన ఉధృతంలో మనోదౌర్భల్యం పెరిగిపోయి నిరాశతో మనిషి మతిచెడగొట్టుకునె పరిస్థితులు లెకపోలేదు. దుఃఖం మరిచి వ్యధలు దూరం చేసుకుని తామరాకుమీది నీటి బొట్టులా గడపాలంటే ఎంతో వైరాగ్యం మనిషిలో జీర్ణమయి ఉండాలనిపించింది.
చక్రవర్తి ఆకలితీరలేదు. తనముందు స్తేట్లన్నీ కాళీచేసేశాడు. మరో గ్లాసులో కొద్దిబ్రాంది, సోడా, బిర్వానీ తెమ్మని ఆజ్ఞ యిచ్చాడు సర్వరుకు. నరాల బిగువు సడలిన కాళ్ళు నిటాగ్గా మేజాబల్ల క్రింద సాచుకున్నాడు చక్రవర్తి.
శివరాం చక్రవర్తివైపు చూశాడు. తన కాళ్ళకు అతని కాళ్ళు క్రింద తగిలి ఢీకొన్నాయి. చక్రవర్తి కాళ్ళల్లో పట్లు ఎందుకు తప్పిపోయాయో అనేదఇ తెలుసుకోవాలనే కుతాహలం ఎక్కువైంది శివరాంకు.
“పుట్టుకనుంచీ ఇంతే నా కాళ్ళు!” చక్రవర్తి ప్రశ్నకు బాధపదని రీతిలో అడిగాడు శివరాం.
“బేద్రు మిత్రమా! .. కర్మ.... ఒకరోజు నెను, నా స్నేహితుడు, చంద్రం శెట్టి కలసి తిరుపతి వెళ్ళాం.... మొదటి ఆట సినిమా చూశాం.... శరీరబలంతో, ధనబలంతో చం(ద్రంశెట్టి ఊగులాడుతున్నాడు. సినిమా వేగంగా కదులుతోంది. పొరుగింటి యువతీ యువకుల (ప్రేమకలాపన ఘట్టం.... దీక్షతో చూస్తున్నా... చంద్రంశెట్టి పనివుందని సినిమాహాలు విడిచి బయటికి వెళ్ళిపోయాడు. అతని ప్రక్కయువతి నాంచారమ్మ కూడా కనిపించలేదు. సినిమా అయిపోయేటప్పటికి చంద్రంశెట్టి తన సీటులో ఉన్నాడు.... కారులో తిరుత్తని మీదుగా మద్రాసు తిరుగుప్రయాణం సాగిస్తున్నాం. సినిమాలో చేసిన సాహస శృంగారసంఘటనను వర్ణించాడు చంద్రంశెట్టి. కధతో ఒళ్ళు ఉద్రేకాలతో ఉడుకెత్తింది. కారులోని మత్తుద్రావకం మనస్సులోని భావాలను వేగం చేసింది. పది గంటలరాత్రి శరవేగంతో కారు కదిలిపోతోంది నిశీధంలో ఆకాశములోని చుక్కలు మెరుస్తున్నాయి. వీధి కిరువైపుల అల్లుకున్న జిల్లేడుడొంకలు, చెట్లతుప్పలు చీకటిలో
అన్వేషణ 207 దెయ్యాల్లా కదులుతున్నాయి. నల్లచీరమీది తెల్లచారలా అంధకారంలో రోడ్డు మసక తెలుపుతో నిటాగ్గా మధ్యమధ్య మలుపులతో సాచుకుంది ఒక (గ్రామం వచ్చింది. చంద్రంశిట్టి మత్తుద్రావకం (త్రాగి ఆనందంలో ఒళ్ళు మరచి వాడుతున్నాడు చుట్టూచీకటి, గ్రామంలో వీధిమలుపులో వేగంగా పోయే కారు, ఎదురుగా వచ్చే లారీని ఢీకొంది ఒక గజం ఎడంలో లారీ కనిపించినప్పుడు తప్పించాలని ప్రయత్నించిన+ లాభం లేకపోయింది. లారీ, కారు ఢీకొనడంతో పెద్దశబ్దమైంది.... స్పహ వచ్చేటప్పటికి గ్రామం విధిప్రక్క తిరగళ్ళశాల మధ్య, కాళ్ళు ఎముకలు విరిగి, ముఖం బీటలతో రక్తంకారి, రక్తంముద్దలా పడిపోయాను నేను. వెనక సీటులో కూర్చున్న చంద్రంశెట్టి మత్తు వదిలింది కాసి అద్దాలు (బ్రద్దలయిన ముక్కలు, ఒక ఇనుపరేకు శరీరంలో (గ్రుచ్చుకుని గాయాలు తీవ్రంగా తగిలేయి అతనికి కారు ఇంజనుభాగం తుత్తునియలుగ మారింది. లారీలోని సిమెంటు బన్తాలు క్రిందకూలి పడ్డాయి. లారీలోని డైవరు చేతికి కొద్దిగా గాయాలు తగిలాయి. పాడైపోయిన చంద్రంశెట్టి కారు ఆ గ్రామంలోని తిరగలిశాల వద్ద విడిచి లారీలో తక్షణం నన్ను చం(ద్రశెట్టిని ఎక్కించుకుపోయాడు మద్రాసుకు.. . ఆసుపత్రిలో చేర్చాడు... తల్లిదండ్రులు వచ్చి దుర్భరంగా నన్ను చూసి యేడ్చారు.... చికిత్స జరిగింది.. .. చివరికి ప్రాసంతో అంగవైకల్యంతో మిగిలేను నేను... నిష్పప్రయోజకుడనైన నేనెందుకీ ప్రపంచంలో అనిపిస్తుంది?...కొని ప్రతిష్ట, మెదడు, దైవం యిచ్చాడు ఎందుకో?... దీనితోనే జీవితందిద్దుకోవాలొ చక్రవర్తి నీరసంగా పేలవంగా నవ్వాడు. సర్వరుతెచ్చిన బిర్యానీ, బ్రాంది పూర్తిచేసేశాడు మాటల ధోరణిలో.
“గతం త్రవ్వుకోకూడదు స్వామీ.... పూర్తిగా మరచిపోవాలి.... భవిష్యత్తు శూన్యంగా తలచాలి.... ప్రస్తుతం మాత్రమే మనకు ప్రధానం.... ఇంకా పానీయం కావాలా?” రాజారావు చక్రవర్తిని, శివరాంను ప్రశ్నించాడు.
మాటల ఉద్రేకాల్లో, సంఘటనల తీవ్రతలో, పరిస్థితులు మర్చి మంచినీళ్ళలా బ్రాందీ (త్రాగేశాదు శివరాం.... తెరమీద పువ్వులు కాలవలో తెప్పల్లా కదులుతున్నాయి కంటిముందు... సిగరెట్టు పొగల రింగుల్లో రాణిరూపాలు గిర్రున తిరుగుతున్నాయి. కర్రరెక్కలగది సముద్రంలోని పడవలా క్రిందకూ పైకి ఒరుగుతున్నట్లుంది. టేవిలు మీది కాళీగాసులు శూన్యజీవితాల్లా గోచరించాయి సిగరెట్టు మసితో నిండిపోయిన “యాస్టై” కుమిలి సహృదయంలా ఉంది. నరాల బీగువు సదలింది. శరీరమంతా తేలిక్రైపోయింది. (ప్రపంచమంతా గాలిలో ఊగుతున్నట్లుంది మనోవ్యధ తీవ్రత మంచులా కరిగిమాయమైపోయింది. జీవితంలోని కట్టుదిట్టాల సూత్రాలలో ఏదో అడ్డుకట్టలు
2098 అన్వేషణ నిర్మించుకుంటూ ఆనందం యిచ్చి యిట్టి పరిస్థితులను గతంలో తృణీకరించినందుకు పశ్చాత్తాపపడ్డాడు శివరాం
ఆ మత్తుపానీయాలు గృహం బైటికివచ్చాను శివరాం కొద్దిగా తూలుతున్నాడు. చక్రవర్తి బుజం పట్టుకుని మెల్లిగా నడిచారు ఎదురుగా, టాక్సీవాడితో రాజారావు ఏదో గుసగుసలాడాదు టాక్సీ వచ్చింది. గబగబ పరుగెత్తింది. రాజారావు అకస్మాత్తుగా పద్యపరణం ప్రారంభించాడు చక్రవర్తి తాళం వేస్తున్నాడు ఏ పరిస్థితులో ఉన్నదీ కళ్ళు బలవంతంగా పెద్దవిగాచేసి చూస్తూ, కారులో ఉన్నట్లు గ్రహించుకుని, ఆ మత్తుపరిస్థితిలోని తేలక ఆనందంలో నవ్వుకున్నాడు శివరాం. మెల్లిగా నవ్వుకోవడం బాగులేదనిపించింది. గట్టిగా నవ్వేడు ఆ నవ్వుల తరంగాలు చెవిలో ప్రతిధ్వనించేక హాయిగా టాక్సీ సీటు మీద ఒరిగాడు.
టాక్సీ ఎక్కడ ఆగిందో శివరాం గుర్తించలేక పోయాడు ఒక పెంకుటిల్లు ఇంటిముందు ఆగింది. టాక్సీ డైవరుతో రాజారావు లోపలికి నడిచాడు. మరోనిమిషంలో ముగ్గురి వనితలతో తిరిగివచ్చాడు రాజారావు. కారు వేగంగా పరుగెత్తింది. నిర్దన ప్రదేశంలో ఆగింది. కారులో వనితల ప్రవేశంతో రాజారావు, చక్రవర్తి వారి కౌగిలులచేరి మౌనం. వహించారు. మత్తులో మైమరిచన శివరాం వనిత స్పర్శలోని ఆనందం పొందలేకపోయాడు. కారు ఆగినచోట మామిడితోపు కనిపించింది. పండువెన్నెల ప్రశాంతంగా ఆ స్టలమంతా చల్లబరచి, హాయి కలిగించింది రాజారావు, చక్రవర్తి తమ వనితలతో మామిడితోపుల్లోకి నడిచారు టాక్సీవాడు సిగరెట్టు వెలిగించి కారులో ఒంటరిగా కూర్చుని దమ్ములు లాగుతున్నాడు. శివరాం ప్రక్కనున్న వనిత బుజంమీద అతని చెయ్యి వేసుకుని టారక్తీలోంచి బయటకు లాగింది. రాజిరూపం మసకమసకగా కనిపించింది పండువెన్నెల్లో. ప్రక్కనున్న వనితను వదలి ఒంటరిగా రోద్దుమీద నడిచాడు. ఆ బాటకంతకూ తానే చక్రవర్తిలా ఒళ్ళు విరుచుకుని రీవిగా తూలుతూ అడుగులు వేశాడు కాస్సేపు. అతను పడిపోకుండా ప్రక్కనె నడవసాగింది నవిత ఒక కొండరాయిప్రక్కన కూర్చున్నా రిద్దరూ. అతనిలో కొంత ఉదేకం కలగచెయ్యడం తన విధ్యుక్తధర్మమని కంత ప్రయత్నించింది ఆ వనిత. నిర్లక్ష్యంగా చికాకుగా కొండరాయిపైన ఒరిగి పోయి, హాయిగా లీలగా కూనిరాగాలు తీశాడు శివరాం.
రాజారావు, చక్రవర్తి ఒక అరగంటపోయాక శివరాంను తీసుకుపోయి టాక్సీలో కూర్చోపెట్టారు. కారు పరుగెత్తింది. మధ్యలో వనితలు దిగిపోయారు. తరువాత కారు తన బంగళా దగ్గర దిగింది. తూలుతూ మెడమెట్లు ఎక్కాడు శివరాం. రాజారావు ప్రక్కనుండి
అన్వేషణ ఏం9 నడిపించాడు ఇంటి తాళపుచెవులు రాజారావుకు అందిచ్వాడు. రాజారావు తాళంతీశాడు. ప్రక్కపరచి పడుకోబెట్టి రాజారావు సెలవు తీసుకున్నాడు
రాత్రి గాధంగా నిద్రపట్టింది శివరాంకు. జరిగినదంతా ఒక కలేమో అని ్రమపడ్డాడు. తనలో తాను నవ్వుకున్నాడు శివరాం
కాలకృత్యాలు తీర్చుకుని గబగబ ఆఫీసుకు వెళ్ళాలని సిద్దమయ్యాడు. రాజవ్వ యధాప్రకారం వంటచేసింది. గబగబ రెండు మెతుకులు నోట్లో వేసుకుంటున్నాడు. నల్లపిల్లి మ్యావ్‌మంటూ ఎదురుగా వచ్చి కూర్చుంది. కొంత అన్నంతీసి దానివైపు గిరవాటిశాడు ఆ అన్నం తినేసి మెల్లిగా దగ్గరకువచ్చి కూర్చుంది. రోజు నల్లపిల్లి పంక్తి భోజనానికి తయారయేలా వుందనుకున్నాడు శివరాం. తనతోపాటు మరికొన్ని బియ్యం ఉడకబొమ్మవలసిందని రాజవ్వను చెప్పాలనుకున్నాడు
ఆఫీసుదగ్గర బస్సుదిగి, నడిచాడు శివరాం. దానిలో నానాస్వామి కనిపించాడు స్నేహితులతో నడుస్తూ, చాలాకాలం తర్వాత కనిపించిన నానాస్వామిమీద మునుపటి స్నేహభావం ఒక్కుమ్మడిగా ఉప్పొంగి ఆప్యాయంగా పిలిచాడు శివరాం. కొత్త మనిషిని చూసినట్లు ముభావంగా మాట్లాడాడు నానాస్వామి. తఆను ఐ ఏ ఎస్ ప్యాసయ్యానని త్వరలో టైనింగుకు ఢిల్లీ వెడుతూన్ననని చెప్పాడు నానాస్వామి ఆఫీసర్ హోదా అప్పుడే ప్రవర్తనలో చూపిస్తూ. శివరాం అభినందన అందుకోకుండానే నానాస్వామి ముభావంగా తన స్నేహితులతో వెళ్ళిపోయాడు.
నానాస్వామి ప్రవర్తనలో విడ్డూరం కనిపించింది. తోటి స్నేహితులను పరిచయం చెయ్యకపోవడం, తనవైపు వింతమనిషిలా చూడడము శివరాం అవమానపరిచినట్లు బాధపడ్డాడు. అంతస్థులు మారి ఉన్నత హోదాల్లోకి పోయే మనిషి పురాతనపు క్రింది తరగతుల స్నేహితులను మరువ ప్రయత్నించడం సహజమే అనిపించింది సద్భావంతో మునుపటి స్నేహవాత్సల్యంతో మసిలే మనుష్యులు చాలా కొద్దిమంది అనుకున్నాడు శివరాం,
ఆఖీసులో అడుగుపెట్టగానే కంపెనీ డైరెక్టరు పిలిపించారు శివరాంను. ఇష్టంవచ్చినట్టు సెలవు పెడితే ఆఫీసుపని కొండంత అవుతుందని తన అనుమతి లేనిదే ఇకముందు సెలవు తీసుకో వీలులేదని గర్జించాడు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఉద్యోగం ఊడివోగలదని బెదిరించాడు.
300 అన్వేషణ
సాయంత్రం అయిదుగంట అయింది. పనిచేసిన శ్రమతో టేబిలు మీది ఫైల్సు అలమారుల్లో బిగించి ఆఫీసు విడిచిపోదానికి ఉద్యమిస్తూ, విశ్రాంతికోసం కుర్చీలో కాళ్ళు చాపుకుని ఒరిగాడు శివరాం.
కంపెనీ డైరెక్టరు వెనుకనుంచి రావడం శివరాం చూడలేదు, పొడుగాటి స్పేన్సరు చుట్ట కాలుస్తూ, గర్వంగా ఒక చెయ్యి పట్లాంజేబులో బిగించి రీవిగా నిలుచున్నాడు శివరాం దగ్గర.
“ఆఫీసులో అంత నిర్లక్ష్యంగా సాచుకు పడుకుంటావే?” కంపెనీ డైరెక్టరు గంభీరంగా గదిమాడు. కంపెనీ డైరెక్టరు ప్రవర్తన శివరాంకు చికాకు కలిగించింది. వ్యక్తి స్వాతంత్ర్యం ప్రతినిమిషం అరికట్టాలని యత్నించే డైరెక్టరు పొగరు ప్రశ్నలకు సరిగా సమాధానం యివ్వాలనుకుని థైర్యం తెచ్చుకున్నాడు
“సాచుకోవడం లేద. .. విశ్రాంతి తీసుకుంటున్నా!”
“విశ్రాంతి తీసుకోడానికి యిది యిల్లు కాదు!”
పనిచేసి శ్రమించిన ఉద్యోగి రోజు ఆఖరిలో కాస్త విశ్రాంతి తీసుకోడం అతని హక్షు!”
“అప్పుడే ఆఫీసు విడిచి వోతున్నావా?”
“నిర్ణయించిన కాలం అయిపోయింది”
“అంటే గడియారం చూస్తో కూర్చుంటావా ఆఫీసులో”
గడియారం తనంతటదే తిరుగుతోంది. నేను చూస్తో కూర్చుంటేగాని, కదలకూడదనే నియమం పెట్టుకోలేదు గడియారం.” చాలా పొగరుగా మాట్లాడుతున్నావే?”
“యజమానుల లక్షణాలు ఉద్యోగులు నేర్చుకోవాలిగా!”
శివరాం ఎదురు ప్రశ్నలకు యజమాని కంపించి పోయాడు కోపంతో. తక్షణం శివరాంను ఏమీ చెయ్యలేక రుసరుసలాడుతూ బూట్లధ్వనితో నేల ఆదరకొడుతూ నడిచివోయాడు.
ఆఫీసు ఫైల్సులో తలదూర్చుకుని యింకా పనిచేస్తున్న ఉద్యోగులు శివరాం కంపెనీ దైరెక్టరుతో పడిన ఘర్షణ విని అబ్బురపడి పోయారు. తమ ఇరవై సంవత్సరాలు ఉద్యోగ
అన్వేషణ 01 సేవలో కంపెనీ డైరక్టరుతో యింత స్వతంత్రించి మాట్లాడగలిగినవాడే లేదని గుడ్లు తేలేశారు కొంతమంది నిర్భయంగా స్వతంత్రంగా సమాధానలిచ్చాదని కొంతమంది శివరాం ధైర్యానికి అభినందనలు యిచ్చారు ఒక్క ఉద్యోగం అంటిపెట్టుకుని స్వతంత్రబుద్ధి నశింపజేసుకుని బానిసగా మారిపోవడం తన వ్యక్తిత్వానికే అవమాన మనిపించింది శివరాంకు ఈ బానిస ఉద్యోగం మానుకుని స్వతంత్ర జీవనంగడిపే మార్గం యెచించాలనుకున్నాడు,
ఉద్యోగులలో అధికారుల ప్రాపకాలకై విచ్చితై భావాలు నశించి, ఐక్యత ఏర్పరచుకొని, వ్యక్తి స్వాతంత్ర్యం నిలబెట్టుకోవాలనే (ప్రయత్నం వర్దిల్లినప్పుడె ప్రజాస్వామ్య రీతుల్లో వివిధ తరగతుల అధికార పదవీగర్విష్పులకు గుణపారం నేర్చి ప్రవర్తనలో సమన్వయం తీసుకురాగలరని భావించాడు శివరాం. అతి నీచంగా అధికారుల (ద్రూపకానిక్తె ప్రాకులాడుతూ చేతులు నలుపుకునే గుమస్తాలమధ్య (బ్రతికేకంటే వీధిలో జామిపళ్ళు అమ్ముకుంటూ స్వతంత్రంగానే బ్రతకడం ఉత్తమమనుకున్నాడు. ఒక్క ఒంటరి మనిషి జీవనం కోసం భయపడుతూ బానిసత్వంతోనే తన భావాలు ఇముడ్చుకుంటుంటే సంసారాలు బాధ్యతలు నెత్తినపడి భారంగా జీవితాలు గడిపే గృహస్థులకు స్వతంత్ర జీవన వాసనలు ఆఘాణించ అవకాశమే జన్మలో లాభం కాదనిపించింది. అవకాశాలున్న తన జీవితంలో స్వతంత్ర జీవనం అలవర్చుకోవడం చాలా అవసరం అని నిశ్చయించాడు శివరాం.
టాయిలెట్ సామానులు కొనుక్కొని బస్సు స్టాండు వైపు నడిచాడు. బస్సుస్తాండులో వకాలుగా రొకరు తనకు కేసు యిచ్చిన పార్టీతో అందులోని మంచి చెడులు వివరిస్తున్నాడు. చేతిలో మడతలుగా పెట్టుకున్న కాగితాల ఫైల్సు, నల్లటి కోటు, తెల్లటి, తెల్లపంట్లాంలో వకీలు కోర్టునుంచి వస్తూ దారిలో పార్టీని కలుసుకుని, విషయాలు వివరిస్తూ, గృహోన్ముఖుడై బస్సుస్తాండు చేరినట్లు భావించాడు శివరాం. మెదడు యొక్క శక్తిని వివిధ రీతుల్లో విస్తారంగా ఉపయోగించి, స్వతంత్ర జీవనాన్ని పెంపొందించి, నిర్భయవాక్ష్రసారానికి అవకాశమిచ్చి, న్యాయాన్యాయ విచక్షణజ్ఞానం అలవరచి, జీవిత తరగతులో అంతస్థులు పెంచే వకీలు వృత్తి చేపట్టడం ఉత్తమ మనిపించింది శివరాంకు. సాయంకాలపు లా కళాశాలలో చేరి త్వరలో లాయరు కావాలని నిశ్చయించుకున్నాడు శివరాం
పశ్చిమ దిక్కుకు చేరిన సూర్యుడు ఎండ వేడి తగ్గించి వెల్లులు ప్రసరిస్తున్నాడు. తూర్పు దిక్కున దట్టంగాఅల్లుకున్న నల్ల మేఘాలు ఉవ్వెత్తున గాలికి ఆకాశం పైకి ఎగబ్రాకి వాన జల్లులు కురిపించాయి. పదిహేను నిమిషాలు జల్లుల్లో చల్లటి చినుకులు మీదపడి
302 అన్వేషణ బస్సుస్తాండులో అలసిపోయి నిలుచున్న ప్రజల ముఖాలు శీతలవాయువుల్లో వికసించాయి. సూర్యకిరణాలు వానజల్లులో వక్రికరించి ఆకాశం మీద ఇంద్రధనస్సు తయారు చేశాయి. సప్తవర్దాల ఇంద్రధనస్సు మామూలు నీలి ఆకాశంలో నవదైతన్యం కలిగించినట్లయింది
పిట్టలబారులు స్వేచ్చగా హాయిగా ఎగురుతూ పోతున్నాయి, వాన జల్లులో తడిసి, అస్తమయ సూర్యుని కాంతుల్లో మెరుస్తున్న సీమతంగేడు పుష్పాలు రాబోయే సంధ్యారుణిమకు పోటీగా భూమిమీద వెలిసినట్లగుపడ్డాయి. స్వీయ భవిష్యత్తు అంతా ఉడుకు రక్తపు స్వతంత్ర జీవనం అన్యాయాలను ఎదుర్శొనే విప్రవ వపైతన్యంతో నిండిపోయిందనే కలతో శివరాం గుండె ఆనందంతో ఉప్పొంగింది.
అన్వేషణ త03 18
నెల్లూరు రామలింగాపురం నుంచి సంతపేటకు పోయేదారిలో ఇటికల కాంపొందుతో రేకుల షెద్దులోవున్న బియ్యపు మిల్లు గుప్పు గుప్పున పొగలు జిమ్ముతోంది పెడ్దకు ముందు చూరుక్రింది అరుగు పైన కట్టిన చిన్న గదిలో ఒక టేబిలు, రెండు కుర్చీలు, పూలవారాలు వ్రేలాదదీసి లక్ష్మిదేవి, ఫోటో, డబ్బు దాచుకునే ఇనుప పెట్టె వున్నాయి. గుమాస్తా పద్దులు చూస్తున్నాడు. వెండి ఫేము కళ్ళజోడు సరిచేసుకుంటూ, నెరసిన జుట్టు, చిన్న పిలక, సన్నగా నల్లగా ఎండివోయిన ముఖము, ఊడిపోయిన ముందుపళ్ళ తొస్సితో గుమాస్తా యజమానికి లెక్కలు వివరిస్తున్నాడు. నారపరెడ్డి మల్గుపంచ, మల్లులాల్చీ తొడుక్కొని, బంగారు గొలుసు వాచి మణికట్టుకు బిగించి, చేతి నాల్గు వళ్ళృకు ఉంగరాలు అలంకరించి, సిల్కు కంతువా భుజం మీద పాములా చుట్టుకుని చుట్టకాలుస్తూ, గుమాస్తా చెప్పే లెక్కలకు సంజాయిషీ అడుగుతూన్నడు.
షెద్దు లోపల మరల గిర్రున తిరుగుతున్నాయి కూలీలు చిన్న లాగులు, బనీనులు తొడుక్కుని, తలకు గుడ్డలు కట్టుకుని దుమ్ముతో బఓీయ్యపు మరల మసితో, విబూది ఒంటి నిండా పూసుకున్న సన్యాసుల్లా కనిపించారు. పులిగాడు ధాన్యం తట్టలో పోసుకుని వెళ్ళి బియ్యపు మరలో పోస్తున్నాడు. రోజుకు ఎన్నిసార్లు అట్లా చేస్తాడో పులిగాడు ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. రోజంతా (శ్రమపడి పనిచేస్తే చివరకు పధ్నాలుగు అణాలు ఇవ్వడానికి నారపరెడ్డి సణుగుకుంటాడు. గిరిజాల జుట్టు, బొద్దుమీసం, ఎ(ర్రటి కళ్ళు, పలకల ముఖం, పొట్టి దృఢకాయం గల పులిగాడిని చూస్తే ఐ మిల్లు యజమానికి ఎందుకో స్నేహభావం, జాలి, దయ కలిగేది కాదు. పైగా ఒక దినం కూలి ఇవ్వక ఆలస్యం చేస్తే కోపం ఆపుకోలేక పులిగాడు చిందులు త్రొక్కుతూ యజమానులను తిట్టేవాడు. కులివాడిచేత తిట్లు తినిపించుకునే స్థితి మన కెందుకని యజమానులు వీలైనంతవరకు పులిగాడిని
తి04 అన్వేషణ దూరంగా ఉంచ మొదలెట్టారు పులిగాడు పనిచేసిన మిల్లులు లెక్కపెడితే అప్పుడే ఇరవైయైదవ నెంబరు మారింది దేశమంతా స్వతంటత్ర మొచ్చిందంటారె కాని కడుపుకు చాలేగంజి రోజు ఎవ్వడూ యివ్వటం లేదని పులిగాడు ఒక్కొక్కసారి తీవ్రంగా ఆలోచిస్తాడు. పైగా కష్టపడి పనిచెశాక కూడా కూలి డబ్బులు యివ్వడానికి ధనికులైన యజమానులు పదిసార్లు తిప్పించుకోడం పులిగాడికి కోపం తెప్పించేది. ప్రొద్దున్న ఏడు గంటల నుంచి పన్నెండు గంటల దాకా పనిచేసిన పులిగాడు అలసిపోయాడు. పన్నెండున్నరకు ఫలహారాలు తీసుకోడానికి కూలీలక విరామం యివ్వబడింది. కూలీ లంతఆ షెద్దు వెనకాల కొండగుట్టలా నిలుచున్న ధాన్యపుపొట్టు గుట్టపై చేరారు మెత్తటి ఊక మీద ఒరిగి మెల్లిగా పులిగాడు మంతకు కట్టిన గుడ్డ తెరిచాడు భార్వ రంగమ్మ క్రితం దినం బ్రాహ్మణుల యింటి నుంచి తెచ్చిన తొక్కు పప్పుచారు కలిపిన అన్నం ముంతలో కనిపించాయి ఆకలితో వేగంగా ముద్దలు మింగి మంచి నీళ్ళు త్రాగాడు పులిగాడు. పొట్ట నిండలేదు ఏమిటో నీరసంగా మళ్ళీ, తప్పనిసరిగా సాయంత్రం దాకా పనిచెయ్యక తప్పలేదు భయపడుతూ రోజుకూలి పులిగాడి కిచ్చెశాడు గుమాసా. ముంత చేతబట్టి సంతపేటకు దారితీశాడు. ఒక అణా ఎండు రొమ్ములు, అర్ధణా తోటకూర, కానీ పిప్పరమెంట్లు కొన్నాడు. రొయ్యలు కలిపి తోటకూర పులుసు భార్యచేత చేయించుకోవాలని పులిగాడికీ మనసు గలిగింది. దృధకాయుడైన పులిగాడికి రుచుల కోరికలు ఎంత హెచ్చో, బలమీనమైన రంగమ్మకు అంత తక్కువ. నాలు&గ కాసువులు వచ్చి బిడ్డలు చచ్చిపోయారు రంగమ్మకు. రంగమ్మ ఆరోగ్యం పాడైపోయింది. తెచ్చిన కూలి డాక్టరుకుయివ్వటానికే ఒక్కొక్కసారి చాలేది" కాదు. అయినా రంగమ్మ ఓపిక తెచ్చుకొని మూడు యిళ్ళల్లో దాసీపని చేస్తూ పది రూపాయలు సంపాదిస్తోంది. పులిగాడు పైకి ఎంత క్రూరంగా వున్నా లోపల ఎంతో దయ, ఎవరైనా తోటి కూలివాడు అప్పు అడిగితే చేతిలోని సగం కూలీ ఇచ్చేసి ఇంటి కొచ్చేవాడు అప్పు తిరిగి రాకపోతే, తనలాగే కష్టాలు పడేవాడు. అప్పు ఎలా తీర్చగలడని ఊరుకునేవాడు. ప్రొద్దుగూకగానే మనస్సు సుఖంగా ఉంచుకోవాలని కల్లు అలవాటు చేసుకున్నాడు. దొరకనప్పుడు ఎక్కడో తంటాలుపడి దొంగతనంగా ఎక్కువ డబ్బుకు త్రాగి ఇల్లు చేరేవాడు. చివరకు ఇంటికి పైసలు తేలేకపోవడంచే రంగమ్మ తెచ్చిన కూలీ ఒక్కటే వాళ్ళ బతుకుకు ఆధారమైంది. ఆ రోజు పూర్తిగా కూలి రంగమ్మ చేతుల్లో పోయాలని, ఎదుగుతున్న ఒక్క బిడ్డకు కొంత డబ్బుపోగుచెసి చదువు చెప్పించాలని కుతూహలం కలిగింది పులిగాడికి. సంతపేట
అన్వేషణ 305 దాటి నడిచాడు పులిగాదు. వీధిలో దుమ్ములో కప్పువాడు వెల్లగిలా పడుకొని కడుపు బాదుకుంటూ సతుగిన్నై ధర్మం వెయ్యండంటూ తెరచిపెట్టాడు. పులిగాడి మనస్సు జాలితో జివ్వుమని పోయింది చేతిలో పావలా తీసి ఆ ముష్టివాడి సత్తుగిన్నెలో రాల్చి కన్నిరు పెట్టుకున్నాడు తనలాంటి బీద కూలివాడే తిండి తిప్పలు లేక ఆరోగ్యము చెడగొట్టుకుని చివరికి కుష్టవ్యాధితో అలమటిస్తున్నాడని వాపోయాడు పులిగాడు.
మూలపేట వైపున్న రోడ్డులోకి మళ్ళాడు పులిగాడు. కట్టెలు కొట్టి యింటికి జేరుతున్న ఈరిగాడు కనిపించాడు ప్రొద్దుటి నుంచీ త్రిరుగుతే రెడ్డ యింట్లో పుల్లలు కొట్టి అర్ధ రూపాయ సంపాదించుకున్నానన్నాడు ఆరుగురు పీల్లల సంసారం ఈదడం, వచ్చేకూలితో కష్టమైపోతోందని తన బాధలు చెప్పుకున్నాడు ఈరిగాడు పులిగాడితో. పులిగాడి ఒళ్ళు కనికరముతో నిండిపోయింది. పిల్లలు తనక లేకపోవడం యీ బీదరికంలో కొంత మేలు అనుకున్నాడు. ఈరిగాడు గొడ్డలి బరువు ఒక చేతిమాద నుంచి మరొక చెతికి మార్చుకుంటూ ఒగరుస్తూ నడుస్తున్నాడు.
సోలయ్య ఎదురుగావచ్చేడు ఈరిగాడు అతడిని పలకరించాడు.
“ఏం మామా!.... బిడ్డడు కనిపించాడా!.... ఎక్కడికివోయాడు?”
“షార్రిపోయానోణ్ని ఎక్కడ పట్టుకోగలం అనవసరంగా చితకకొట్టానని మాలమ్మి ఏడుస్తుంది దాని బాధ సూడలేక నా కడుపు చెరువైపోయింది!” నోలమ్మ దీనంగా _ నిట్టూర్చాడు.
“అదే తిరిగివత్తాడు.... అమ్మబాబుల మీద ఎటువంటి కొదుక్కైనా అభిమానముంటుంది!” ఈరిగాడు సోలయ్యను ఓదార్పాడు.
“ఏం... అభిమానాలో... పులిగాడిలా పిల్లలు అంతా చచ్చిపోయినా ఒక్కొక్కసారి బాగుంటుందనిపిన్తోంది.... ఉండి ఏం సుఖపెట్టెట్టు = కోపం వస్తే... లేచి పోవాలా?” కడుకు పారిపోయాడనే బాధ ఎక్కువై కోపంతో రోజుతూ అన్నాడు సోలయ్య.
పిల్లలున్న వాళ్ళకు ఒక రకం బాధ, లేని వారికి మరోరకం కష్పాలు దేముడు కలిగిస్తాడనుకున్నాడు పులిగాడు. కడుపున పుట్టిన బిడ్డను (బ్రతికించమని దుర్గ గుడికి నీరసంతోనైనా వారినికొకసారి నడిచిపోయి వస్తుందీ రంగమ్మ. ఆడవాళ్ళకు బిడ్డలంటే ఎందుకంత అభిమానమో అనుకున్నాడు పులిగాడు.
306 అన్వేషణ
ఈరిగాడు, పులిగాడు గూడెం చేరారు. ఎవరి గుడిసెవైపు వాళ్ళు నడిచారు అప్పుడె రాత్రి ఏడు గంటలు దాటింది.
గుడిసె తడికల తలుపు తీసి వుంది. గుమ్మం ముందు నులక మంచం ప్రక్క నేలమీద కూర్చుని చిన్నగోతులు త్రవ్వి గోపిగాడు గోళ్లీలాడుతున్నాడు మాసిన నల్ల లాగుతో, నూనె లేక అట్టగట్టిన కేశాలతో, పగలు వీధుల్లో కుర్రాళ్ళతో దాగుడుమూతలు, పరుగు పందాలు, దూదుంపుల్ల, ఆడేటప్పుడు ఒంటినిండా వ్యాపించిన ధూళితో ఆరెళ్ళ గోపిగాడు పులిగాడిని చూచి ఆనందంగా ఎగిరి మీదికివచ్చాడు. తోటకూర కట్ట, రొయ్యలున్న ముంత, నెత్తిమీద తలగుడ్డ నులక మంచంమీద విసిరి గోపేగాణ్ని ఎత్తుకున్నాడు పులిగాడు. బొడ్డులో దాచిన పిప్పరమెంట్లు గోపీగాడి చేతుల్లో పెట్టాడు ఒంటినిండా వున్న దుమ్ము చూచి తలగుడ్డలో తుడిచాడు పువిగాడు. గుడిసెలో సగం భాగం చిన్న మట్టిగోడతో వేరు చేయబడింది. ఆ మట్టి గోడ వెనక నుంచి రంగమ్మ కళ్ళు నులుపుకుంటూ మాసిన చీరతో, చిరిగినరవికతో మెడలోని నల్లపూసలతో, శిరోజూల ముడితో, పులిగాడి దగ్గరికి వచ్చింది ఆవ్యాయంగా
“ఈ ధినం కూడా తగలెట్టేసినావా.... ఏమన్నా మిగిలిందా!” నవ్వింది రంగమ్మ.
“ఏంటే . యిమద్దె పొదుపు సేత్తున్నావా! అంటూ బొడ్డులోంచి ఏడణాల కాసీ తీసి రంగమ్మ చేతిలో పెట్టాడు. ముంతమీద గుడ్డతీసి గుప్పున వాసనలు వెదజల్లే రొయ్యలు చూపించాడు. తోట కూర కాడ ఆకులతో (ప్రేమగా రంగమ్మ ముఖం మీద దధువ్వాడు పులిగాదు,
రంగమ్మ తోటకూరకట్ట, రొయ్యల ముంత పదిలంగా లోపల దాచింది.
పల్లెపూలదండ శిరోజూలకొప్పులో ముడుచుకొని పులిగాడు ప్రక్కన కూర్చుంది.
“్లోపి గాడికి సదువు సెప్సించాలే... వంతులయ్య నడిగితే అయిదు రూవాయలిమ్మన్నాడు!”
“మనవాడికీ సదువులెందుకు - ఇంకో ఏడుపోతే ఎవరిఇంటిలోనైనా పనికి పెడితే” మెటికలు విరిచింది.
“కడుపున పుట్టకపోతేనేం... ఉన్న వాణ్ని సరిగాసూడొద్దు”” మీసాలు సరిచేసుకున్నాడు పులిగాడు.
అన్వేషణ 307
మట్టిగోడ చెనకాల నుంచి మాడువాసన వచ్చింది.
“న్తూడవే .. కూడు మాడిపోయిందా!” రంగమ్మను లేవగొట్టాడు పులిగాదు.
పెద్దకుండలోనీళ్ళు గుడిసె ప్రక్క సందులో ఉంచింది రంగమ్మ గోపీగాడి ఒళ్ళు కడిగి తాను స్నాం చేసి ఇంట్లోకి వచ్చాడు పులిగాడు. రెడ్ల ఇంట్లో దొరికిన కూర, బ్రాహ్మణులు ఇచ్చినతొక్కు కంచంలో వేసి వేడి అన్నం గుమ్మరించింది రంగమ్మ. గోపిగాడు పులిగాడి ప్రకృనే కూర్చుని కంచములో కలియబడ్డాడు. గోపిగాడు కంచంలో కలియపడ్డం రంగమ్మకు ఇష్టం లేకపోయినా భర్తకుకోపం కలిగించకూడదని ఊరుకుంది.
“ఎల్లుండి గణేశుని చవితి గదంటే... గోపిగాడికి పంతులుని కుదురుస్తా... సదువు చెప్పమని!....”
“నీ కూలి ఇంటికే రాదాయె... నా కూలి కూడుకైనా సరిపోదాయె - గోపిగాడికి సదువు కెలా డబ్బుంటుందీ!” రంగమ్మ అంది .
“నేను పొదుపు సేత్తాగా!” రీవిగా నవ్వాడు పులిగాడు.
కడుపు నింపుకుని గోపిగాడు నేలమీది ఈతాకుల చాపమీద ఒళ్ళు తెలియక ఒరిగాడు. పులిగాడు బీడి కాలుస్తూ రంగమ్మ భోంచేసే దాకా సాయంకూర్చుని పట్టణం కబుర్లు చెబుతూ, భార్యతో సరసాలాడసాగాడు. రంగమ్మ ఒయ్యారంగా అందం ఒలకబోస్తూ పులిగాడి ఒళుషిళ గగుర్పొడిచేలా నవ్వి కులికింది.
రాత్రి పది గంటలు దాటింది రంగమ్మ చెమటపట్టిన ముఖం నీళ్ళతో కదడుగుకుని, కుంకం గుండ్రంగా తిలకంగా దిద్దుకుని, శిరోజాలు విప్పుకుని చిక్కు పళ్ళదువ్శెనతో దువ్వుకుని, కొప్పు సవరించుకుని చుట్టూ మల్లెదండ పెట్టుకుని కాన్సులు, చచ్చిపోయిన బిడ్డలు, ఆ మనసక వెలుగునీడల్లో రంగమ్మ ముందు కదిలాయి తల్లికి స్వంతబిద్ద ఉంటే గాని సంతృప్తి లేదనేభావం రంగమ్మకు చాలాకాలం వేధిస్తోనేవుంది.
“క్రూకోవే!” నవ్వాడు పులిగాదు.
రంగమ్మ నులకమంచంమీద పులిగాడి ప్రక్కన కూర్చుంది. ప్రమిదెలో నేనె పూర్తయిపోయి వత్తి కొడిగట్టి ఆరిపోప్రయత్నిచింది పులిగాడు, రంగమ్మ దీపం చూసి నవ్వుకున్నారు. దీపం ఆరిపోయి, ఎ(ర్రగా మిగిలి వత్తిలోంచి పొగలు ఎగిశాయి. అగరొత్తుదూపంలా, రంగమ్మ తలలో మల్లేపూలదండ మత్తు సువాసనలు వెదజిమ్మింది. గాజులు వేసుకున్న సన్సని బాహువులు పులిగాడి దృధకాయంలో గిలిగిలింతలు పెట్టాయి
308 అన్వషణ -వెచ్చదనం, వీదరికం, దుర్గంధం దుఖంతో కద్వాలు, శరీరశ్రమ, ఆకలి అన్నీ మరిచిపోయి ఆప్యాయతలతో నిండిపోయిన గుందెలతో రంగమ్మ పులిగాడు పెనవెసుకుపోయాడు.
ప్రభాత మయింది కోళ్ళు కూసాయి బద్దకంగా పులిగాడు లేచాడు. అంతకుముందే లేచి మట్టిగోడల వెనక ఓయ్యం ఉదక బెడుతున్న రంగమ్మ చిరునవ్వుతో ఎదురుగా కనిపించింది భార్య ముఖంలో కళ ఉందని, ప్రొద్దున్నే చూస్తే శుభమని పులిగాడు సరదాపడతాడు అది తెలుసుకునే ఎదురుగా వచ్చి నిలుచుంది రంగమ్మ. గోపిగాడు ఒళ్ళు తెలియని స్థితిలో బద్దకంగా దొర్హుతున్నాడు చాపమీద . సూర్య కిరణాలు గుడిసె కన్నాల్లోంచి యింట్లోకి బాణాల్లా తొంగి చూస్తున్నాయి. లేచి ముఖం కడుగుకుని బట్టలు వేసుకోగానె రంగమ్మ మంతచేతి కందిచ్చింది.
“దేస్పు చవితి గదా - యజమానిని అర్ధరూపాయి డబ్బులు ఎక్కువ అడుక్కురా?” రంగమ్మ భుజం తల్టంది,.
అన్నం ముంత చేతబట్టి గబగబ నడిచాడు వీధిలోకి పులిగాడు. మిల్లుకూత అప్పుడే వినిపించింది. ఆలస్యమైతే పిలకగుమాస్తా ఉరిమిచూస్తాడని నవ్వుకున్నాడు లోలోపల పులిగాడు గబగబ అంగలు వేసుకుంటూ మిల్లువేరాడు.
మిల్లులో మరల కరకరశబ్దాల్లో పులిగాడి ఆలోచనల వేగం హెచ్చయింది. పుట్టినప్పటి నుంచి ఒకేవూళ్ళో బ్రతుకుతూ కాలక్షేపం చేస్తున్నారు. (ప్రక్క ఊరు కావలిదాటి మరోచోటికి పోనేలేదు. ఎన్నో ఊళ్ళు ఉన్నాయని పరుగెత్తే రలుబండి తెలుపుతోంది తైలుకమ్మీల మలుపుకవతల తాటిచెట్టు, ఈత తుప్పలు జిల్లేడుపొదలు, పచ్చపొలాలే కాక ఎన్నో నగరాలు ఉన్నాయని విన్నాడు. మరో వూరు పోతే నాల్లు పైసలు బాగా సంపాదించవచ్చునేమో అనే ఆలోచన పులిగాడికి తట్టింది ఉన్న ఊళ్ళో గుడిసె కూడ స్వంతం కాకపోయింది. గూడెం యజమాని ప్రతినెలా వచ్చి నాల్చ్దు రూవాయలు చిక్కబెట్టుకపోతున్నాడు. మిల్లు యజమానిలా ఎప్పటికైనా ఉంగరాలు పెట్టుకుని మల్లులాల్సిచొక్కా వేసుకోగలనా అని ఆశ పడ్డాడు పులిగాడు. “చూద్దాం సంగతి!” అంటూ హుషారుగా తట్టలో దాన్యం నింపుకుని ఆలోచనల వేగంతో గబగబ మరలో పొయ్యసాగాడు.
సాయంత్రం కాగానే పిలక గుమాస్తా సొమ్ము లేదన్నాడు. “యజమాని ఊరు వెళ్ళాడు. రెండు రోజుల తర్వాత కూలి యిసా” మన్నాడు భయపడుతూనే గుమాసా మర్నాడు గుణేశుడి పండుగ అని కూలీలంతా డబ్బుకోసం కాచుకు కూర్చుంటే కూలి
అన్వేషణ 809 యివ్వని గుమాసాను తన్నుతానంటూ లేచాడుపులిగాడు. మిల్లులోని కూలీ లంతా పులిగాడివెనుక తాళం వేశారు తమకుకూద కూలి దొరుకుతుందని, పులిగాడి దౌర్జన్యరూపం చూసి గుమాస్తాగుండె దడదడలాడింది. పిలక గాలిలో భయంతో వణికింది. తక్షణం ప్రకృమిల్లులోకి పరుగెత్తి వాతిక రూవాయలు తెచ్చి కూలీలకు పంచి, భయం తగ్గించుకుని పదిలంగా కుర్చీలో కూర్చున్నాడు గుమాస్తా.
పులిగాడు కూలి అందుకుని ఖులాసాగా వీధిలోకి నచ్చాడు. కూలితోనే మర్నాడు గణేశపూజ చెయ్యడం కష్టం అనుకున్నాడు. గబగబ అడుగులువేశాడు పెన్నా నదివైపు నిండుగా నీరుతో వడిగా ప్రవహిస్తున్న పెన్నానదిలో ఒళ్ళుతోముకుని తుడుచుకున్నాడు శుభ్రంగా నదిఒడ్దున ఉన్న మారేడుచెట్టు ఎక్కి పత్రి కోశాడు మామిడిచెట్ల కొమ్మలు విరిచాడు నేరేడుచెట్ల ఆకులు వాల్సి పోగుచేశాడు. గడ్డిపూలు త్రుంచాడు. ప్రక్కనే ఉన్న రంగనాయకుల దేవాలయంలోకిపోయి. గుడిగంట (మోగించి, సామ్రాంగ నమస్కారం చేసి, వచ్చేటప్పుడు పూజారి అనుమతితో కొంచెం, తులసిపత్రి, గన్నేరు పువ్వులు కోసుకున్నాడు. వాటన్నింటినీ తలగుడ్డలో చుట్టి హుషారుగా ఈలవేస్తూ యింటివైపు నడిచాడు.
దారిలో పోలయ్య కనిపించాడు.
“ఒరే! పులిగా.... ఆగరా” అంటూ నవ్వుతూ పిలిచాడు సోలయ్య ఎప్పుడు విచారంగా కనిపించే సోలయ్య ఆనందంగా ఉండడంలో ఏదో విశేషముంది అనుకున్నాడు పులిగాడు.
“మావోడు వచ్చాడురా యీప్రొద్దు... హైద్రాబాదు పారిపోయాడట.... సిగరెట్టు కంపెనీలో పనిచేస్తున్నాడట.. వంద రూపాయలు యిచ్చినాదురా!” సోలయ్యముఖం చేటంత అయింది. కళ్ళనుంచి ఆనందబాష్పాలు జలజలారాల్పాడు నవ్వుతూ హాయిగా,
పులిగాడు జీవితంలో వందరూపాయలు ఒక్కసారి చూడలేదు. సోలయ్యకొడుకు అంతసొమ్ము కూడబెట్టుకున్నా డంటే ఏం ఉద్యోగమో, ఏంకదో పులిగాడికి అర్ధంకాక ఆశ్చర్యపోయాడు
“అక్కడ ఏం పనిచేస్తున్నాడురా నీ బిడ్డ!”
పులిగాడు నోరావలించాడు.
“సిగరెట్టు కంపెనీలో పనిట.... ఏడాదికి మూడునెలల జీతం ఊరికే యిస్తారటరా!”
910 అన్వేషణ పోలయ్య దవడలు నొక్కుకుంటూ, కొడుకు గొప్పతనానికి గర్వంగా నవ్వాడు. పులిగాడికి తల్లో ఏదో మెరుపు మురిసినట్లయింది,
“సీ కొడుకును సూడాలిరా!” అన్నాడు పులిగాడు.
రేపు మీ యింటికి వెళ్ళమంటూ” అంటూ సోలయ్య నిషమించాడు.
పులిగాడు యిల్లు చేరెటప్పటికి రంగమ్మ యింటికి రాలదు. సూర్యాస్తమయందాటి కనుచీకటి పడింది గోపీగాడు ఆకలి అంటూ ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాడు. తెచ్చిన పువ్వులు, పత్రి కుండపెంకుల్లో పోసి, భార్యరానందుకు కొంచెం చికాకుపడి, గోపీగాడిని ఊరడీస్తూ, పొయ్యి రాజేశాడు చిదుకులతో.
కొబ్బరి చెక్క పుచ్చుకొని, తలలో కనకాంబరం పువ్వు తురుముకుని, రంగమ్మ యింట్లోకి వచ్చింది. పులిగాడు అప్పుడె పొయ్యి రాజేస్తున్నందుకు నొచ్చుకుని, గబగబ లోపలికివెళ్ళి, భర్తను ప్రక్కకు నెల్టీ పొయ్యిప్రక్క్మన తాను కూర్చుంది.
“రెడ్డిగారి భార్య చెరువుదగ్గర దుర్గగుడికి వెళ్ళింది... రమ్మంటే నేనూ వెళ్ళాను... దేవికి దండం పెట్టుకున్నా!” ఓరగా పులిగాడివైపు చూసి సిగ్గుగా నవ్వింది రంగమ్మ. చిన్న పొట్లంలో తెచ్చిన కుంకం పులిగాడికి బొట్టు పెట్టింది. పులిగాడు భార్య కోరిక వరం అర్ధం చేసుకున్నాడు తాను తెచ్చిన పత్రి పువ్వులు చూపించాడు పులిగాడు, రంగమ్మ పులిగాడి మనస్సులోని దైవభక్తికి మెచ్చుకుని నవ్వింది ఆప్యాయంగా.
“ఒస్... యీవూరు విడిచిపోదామే!” అన్నాడు పులిగాడు సాలోచనగా,
“ఎక్కడికీ?” కెవ్వున అరచినట్లు ఆశ్చర్యంగా చూసింది రంగమ్మ.
భార్య ఆశ్చర్యానికి పులిగాడు పకపక నవ్వాడు. అడదానికి తన ఆలోచన గొప్ప తెలియదని.
“పైబ్సత్రాలే!?” అంటూ మౌనం వహించాడు పులిగాడు గంభీరంగా.
గోపీగాడు ఆకలి అంటూ రంగమ్మని పీడిస్తున్నాడు. వంటచేసి భర్తను గోపిగాడికి పెట్టింది రంగమ్మ. భర్త తెచ్చిన పత్రి, పువ్వులపై నీళ్ళు చల్లి ఒక కుండలో ఉంచింది మర్నాడు వాడివోకుండా.
పులిగాడు రాత్రిఅంతా పరదేశ ప్రయాణం కలలు కన్నాడు మహానగరంలోకి వెళ్ళిపోయినట్లు. దోసిళ్ళలో డబ్బుసంపాదించుకొని, రంగమ్మతో రిక్షాలో బస్సుల్లో
అన్వేషణ 31 తిరిగినట్టు, సినిమాలు మాసినట్లు ఊహల్లో తేలిపోయాడు రంగమ్మ దృష్టి తనకుకావలసిన సంతానం పైనే ఉంది. కలలోని ఎవరో మహాదేవి దేదీవ్యమానంగా ప్రకాశించి ఆ శరీరవాణి పలికి త్వరలో ఉత్తమ సంతానం పొందగలవని ఆశీర్వదించినట్లు, వచ్చీరాని మాటలతో ప్రాకుతూ బోసినవ్వుల్లో మురిపించే పాప ఒడిలో కదిలినట్లు ఆనందానుభూతి పొందింది, ఆమె రాత్రి నిద్రలో. వేగుచుక్క పొదవకుండా రంగమ్మ లేచి, గుడిసె బయట పొయ్యరాజేసి వేన్నీళ్ళు పెట్టి 0ది. పులిగాడికి, గోపిగాడికి తలంటు పోయాలని బ్రాహ్మలని అడిగి తెచ్చుకున్న కుంకుళ్ళు కొట్టి, నీళ్ళలో నురగ రంగరించింది గడపకు పసుపు రాసి కుంకం బొట్లు పెట్టింది. భర్త లేవకముందే అభ్యంగనం చేసి తడి శిరోజాలు ఆరవేసుకోసాగింది.
తలనిండా నూనె పోసి, భార్య నెత్తిమీద బాదుతూ నూనె ఇంకడానికి ప్రయత్నిస్తోంటే, పులిగాడి పురైలో నవచైతన్యం చిందులాడింది రంగమ్మ వేళ్ళు గిల్లాడు. కొంగులాగాడు. రంగమ్మ నూనె చేతులతో అల్లరి చెయ్యవద్దని పులిగాడి బుగ్గమీద కొట్టింది మృదువుగా,
అభ్యంగనం పూర్తి చేసుకుని, ఉతికిన పంచె బనీను తొడుక్కుని పులిగాడు గోపిగాడిని వెంటబెట్టుకుని సంతపేట వెళ్ళాడు. సూర్యుడు ఆకాశం పైకి రెపరెప లాడుతూ వస్తున్నాడు కిరణాలు బాణాలతో ప్రజలను వేటాడాలని, సంతపేట అంతా సందడిగా ఉంది. విఘ్నేశ్వరుడి బొమ్మలు వివిధ రంగులతో దుకాణాల్లో పేర్చి ఉంచారు. రావి ఆకుల్లో మట్టి విఘ్నేశ్వరుడు పడుకున్నాడు.
కర్రల పాలవెల్లుల అమ్మేవారి కరాలను అల్లుకున్నాయి మామిడాకులు, మారేడుపత్రి, వివిధ రకాల పత్రాలు, తామర, తుండుల పుష్పాలు, కలువలు, వెలగ, మొక్కజొన్న పోగులు, బతాయి, నారింజ, జామి, పళ్ళగుంపులు, ఆగరవత్తులు, హారతి కర్పూరం, రకరకాల సుగంధద్రవ్యాలు సంతనిండా కళ్ళు చెదరగొడుతున్నాయి. బాలుడు, వృద్దులు, స్త్రీలు, నవయువకులు, వయసు వివక్షత లేకుండా గణపతి విగ్రహాలు "కొనుక్కుని పట్టుకుపోతున్నారు. మనిషిలో సగం ఎత్తున పీతాంబరం ధరించి, బూడిద తామ్ర వర్ణంలో శరీరాచ్చాయ వెదజల్లుతూ, తొండం కదుపుతూ జీవం ఉట్టి పదే గణపతి విగ్రహం పులిగాడు చూసి ఆశ్చర్యపోయేడు. దైవాన్ని ఎదురుగా సందర్శించినట్లు అనుభూతి పొందాడు. తక్షణమే అప్రయత్నంగా అతని చేతులు జోడించి నిలిచాయి ఒక క్షణం.
రావి ఆకుమీద పెట్టిన చిన్న మట్టిగణపతి విగ్రహం అణాకు కొనుక్కుని అర్హణా పెట్టి ఒక తామరపువ్వు పుచ్చుకుని సంతపేట నుంచి గృహోన్ముఖుడైయాడు పులిగాడు.
312 అన్వేషణ
పవిత్రంగా ఇల్లు కడిగి ముగ్గులు పెట్టి ఒక పీరం అమర్చింది గణపతికి రంగమ్మ. పులిగాడు గణపతిని ప్రతిష్టించాడు గూడెంలో అందరికీ పూజదంపతులు పన్నిండు గంటలకు చెమటలు (గ్రక్కుకుంటూ, మూటలు మోసుకుంటూ, ఒగరుస్తూ వచ్చాడు 'ఒకొక్క గుడిసెలో ఐదు నిమిషాలు చొప్పున గణపతిపూజ చేయించి దొరికిన ప్రసాదాలు, పైసలు మూటగట్టుకుని ఎక్కడో తద్దిన బ్రాహ్మణుడుగా వెళ్ళాలంటూ పరుగెత్తాడు
రంగమ్మ పిందివంటగా పకోడీలు చేసింది. కడుపార భుజించాడు పులిగాడు. ఏదో సంతృప్తితో బరువైన శరీరాన్ని నులకమంచంమీద వాల్చాడు పులిగాడు. గోపీగాడిని వెంటబెట్టుకుని రంగమ్మ గూడెంలోని యితర గుడిసెల్లో గణపతి పూజామందిరాలు చూడాలని బయలుదెరింది
రంగమ్మ యింటికి తిరగి వచ్చేటప్పటికి మూడుగంటలయింది పులిగాడు నిద్రలేచి సోలయ్య కొడుకు లక్ష్మయ్యతో మాట్లాడుతున్నాడు లక్ష్మన్న ఎంతగానో మారిపోయాడు జుట్టు కత్తిరించుకుని చక్కగా క్రాఫు పెట్టుకున్నాడు పంచె, బనీను తీసేసి పంట్లాము, సిల్కు బుష్‌కోటు వేసుకున్నాడు చేతికి వాచీ పెట్టుకున్నాడు. కాలికి బూట్లు తొడిగాడు. మనిషి లావెక్కి పచ్చబడ్డాడు చూడానికి ఎంతో నాగరీకంగా కనిపించాడు లక్ష్మన్న.
“చూసేపుటే బస్తీలో లక్ష్మన్నపని. .. మనం కూడ పోదామే హైద్రాబాదు....” అన్నాడు పులిగాడు.
“పులిని చూసి, నక్కవాత బెట్టుకున్నదట” రంగమ్మ నీల్లింది.
"నేను నక్కను గాదె... వులినే” పులిగాడు సరదాగా మీసాలు దువ్వాడు.
రంగమ్మ నవ్వింది.
లక్ష్మన్న ఒక వారంలో తిరిగి హైదరాబాదు వెళ్ళిపోవాలన్నాడు. వెళ్ళిటప్పుడు చెప్పమన్నాడు పులిగాడు,
గుడిసె వదిలేసి మూటముల్లె సర్దుకుని క్రొత్త నగరము పోవాలనే కాంక్ష లక్ష్మన్న జీవితం చూసేక పులిగాడికి హెచ్చివోయింది. రంగమ్మ గోపీగాడిని వెంటబెట్టుకుని (బ్రాహ్మలు, రెడ్ల ఇళ్ళల్లో పనిచేయడానికి వెళ్ళింది పండుగనాడు పబ్బాలు దొరుకుతాయని కుర్రాడిని కూడ వెంటబెట్టుకు వస్తే, యజమానులు ఎక్కువ యిస్తారని రంగమ్మ ఉద్దేశపడింది.
అన్వేషణ ప1ేత్రి పులిగాడు సెలవుదినము నాటి గుమాస్తాలా సాయంత్రము వాహ్యాళికి బయలు దేరాడు ట్రంకురోడ్డులోని సత్రపు మీది బోర్సులో ఆనాడు టౌనుహాలు దగ్గర గణపతి పుట్టుక గూర్చి హరికథ, కరణాల వీధిలో నివసించే నెరజాణ పంకజాక్షిచేత అర్ధనారీశ్వర నృత్యము జరుగుతుందని వ్రాయబడింది (ప్రక్కవాడిచేత బోర్డుమీది విషయాలు చదివించుకుని శ్రద్ధగా టౌనుహాలు దగ్గరకు వెళ్ళాడు పులిగాడు గుంపులో కూర్చున్నాడు. పట్టుపీతాంబరం ధరించి. ఎర్రసిల్కు కండువా నడ్డికి చుట్టుకుని, పంగనామం చిట్లిస్తూ, తాళాలు వాయిస్తూ పిట్టకధలతో నవ్విస్తూ హరిదాసు పార్వతి అభ్యంగన సమయంలో గనపతిని ఎలా సృష్టించిందీ, అతనికి గజాననం ఎ విధంగా సిద్దించిందీ తెలియజేశాడు. జనాన్ని ఆకర్షిస్తూ కూర్చోపెట్టాలని పంకజాక్షిని చూస్తూ పరవశులైవోయాడు ఏమిటి ఆడదాని గంతు లనుకొంటూ మధ్యలో పులిగాడు ఇంటికి వచ్చేశాడు రంగమ్మ యజమానులు యిళ్ళల్లొంచి తెచ్చిన ఉంద్రాళ్ళు, కజ్జికాయలు తినిపించింది పులిగాడిచేత, పులిగాడు హైద్రాబాదు పోవాలనే తన నిశ్చయం చెప్పేశాడు రంగమ్మతో. రంగమ్మ కంగారుపడి కోపంగా అరిచింది పులిగాడిపైన. ఉన్న ఊరు విడిచి, ఏమీ తెలియని క్రొత్త దేశంలో మసలడమంటే తనకు గుబులేస్తోంది అంది రంగమ్మ “పులిగాడు ఉండగా నీకు భయమేలనే రంగి” అంటూ రంగమ్మ బుగ్గమీద లాలనగా కొట్టాడు పులిగాడు నవ్వుతూ. రంగమ్మ భర్తమాట కెదురాడడం ఇష్టంలేక ఒప్పుకుంది. ప్రయాణానికి ఒక నెల భత్యానికి సన్నద్ధులం కావాలనుకున్నారు దంపతలిద్దరూ యజమానుల యిళ్ళలో నెలాఖరుకు రావలసిన పదిరూపాయలు తెచ్చింది రంగమ్మ. కాళ్ళకు తగిలించుకున్న వెండికడియాలు ఊడదీసి, భర్త చేతుల్లో పెట్టి, అమ్మిన సొమ్ము తెమ్మంది పులిగాడిని. సాయంత్రం వేళ మరో మూడు గంటలు రిక్షా లాగి, మరో పదిరూపాయలు సేకరించాడు పులిగాదు. లక్ష్మన్నతోప్తాటు రైలు ఎక్కాలని నిశ్చయిగచుకున్నారు రంగమ్మ, పులిగాదు. పులిగాడి సాహసానికి ఈరిగాడు నోరావలించాడు. కుర్రాడిలా పెద్దపట్టణాలకు సంసారంతో పోతున్నాడని పులిగాడిని చూసి సోలయ్య లోలోపల దవడలు నొక్కుకుంటూ దిగ్రమచెందాడు పులిగాడు తన నిశ్చయానికి తిరుగులేదని సవాలు చేశాడు. ఆకాశంలో తెల్ల మేఘాలు దగ్గరగా జేరి, తీర్చిదిద్పుకుని, వెండి కొండలా ఒకవైపున బారులుతీర్చి నిలుచున్నాయి. వెండి కొండమీదనిలిచి విశ్రాంతి తీసుకోవాలన్నట్లు పక్షుల గుంపులు ఆకాశంలోకి ఎగురుతున్నాయి.
వ్కేశీ అన్వేషణ గం!
రెండు వర్ష బుతువులు భూతకాలంలోకి చొచ్చుకుపోయాయి.
ఆదివారం ప్రొద్దుటి నుంచి ముసురు పట్టింది. నల్లటి మేఘాలు ఆకాశాన్నంతా అలముకొని పొగల్లా కదులుతున్నాయి. వాన చినుకులు నిర్వరామంగా పడుతూనే ఉన్నాయి. వర్షవిందువులు వీధిలోని పల్లాల్లో నించున్న నీటి గుంటల్లో పడి వృత్తాకారపు కెరటాల్లా మారి అంచులను తగులుకుని అదృశ్యమౌతున్నాయి. ముఖ్యమైన పనుల్లో నిమగ్నులైన మనుష్యులు గొడుగులు వేసుకుని, రెయినుకోట్లు తొడుక్కుని వీధిలో నడిచివోతున్నారు.
వానజల్లులో ప్రయాణికుడు తడవకుందా ప్రతి రిక్షా పరదా కట్టుకుని నడుస్తూంది. దైనిక కార్యక్రమాలు నిర్వహించవలసిన దాసీవాళ్ళు వాన చినుకుల్లో తడుస్తూ, చిరకొంగు నెత్తిన కప్పుకుని ఒక యింటి నుంచి మరో యింటికి పోతున్నారు చెట్ల ఆకుల మధ్య దాక్కున్న పక్షులు వానగాలి చలిలో గజగజ వణుకుతూ ఈకల శరీరాలు విదిలించుకుంటూ దీనంగా ఆకాశం శూన్యంలోకి చూస్తున్నాయి. వీధుల్లో తిరిగే కుక్కలు ఇళ్ళపంచలు జేరి ముడుచుకు కూర్చున్నాయి. వీధి చప్తాలపై తిరిగే ముష్టివాళ్ళు కాళీ డబ్బాలు పుచ్చుకుని మూసిన దుకాణాల చూరుల క్రింద తచ్చాడుతున్నారు. గజగజ వణుకుతూ ముడుచుకుపోయి, వానజల్లు లోపలికి రాకుండా, రేకుల కిటికీలు మూసుకుని, ప్రయాణీకులు తక్కువైనా, బస్సులు తమ ప్రయాణాలు మానటంలేదు. వాన చలితో తడుస్తున్న గుర్రం ఒకటి మేతమాని ఏటవాలుగా నిలుచున్న టాంగాలోకి తలదూర్చి సకిలిస్తోంది. నగరమంతా జనసందడి తగ్గి ఎవరి కొంపలో వారు కూర్చుని కాలక్షేపం చెయ్యనాగారు.
లకిడీకాపూల్ దాటి సైఫాబాదు నుంచి ఖైరతాబాదుకు పోయే రోడ్డులో కురంగేశ్వర్రావుగారి (క్రొత్త బంగళా, వార్నీసు తలుపులు, గేటు వానలో తడిసి బూడిద
అన్వేషణ త్కేస్ రంగు పూసుకున్నాయి. చదరపు ఊచల కటకటాల ముందు వరండాలో ఆకుపచ్చరంగు (ఫేము కుర్చీలు అరడజను ఉన్నాయి. వీధి గుమ్మానికి కట్టన తెల్లగళ్ళ ఎర్ర తెర చలిగాలిలో ముందుకూ వెనకకూ ఊగుతోంది కురంగేశ్వరావుగారు లోపల గదిలో సోఫాలో కూర్చుని ఇంగ్లీషు నవల పరిస్తున్నారు. పెద్ద బొజ్జ, లావువాటి శరిరం, తెల్ల వెంట్రు కల మధ్య వెండితీగల్లా [గ్రుచ్చుకున్న నల్ల వెంట్రుకల క్రాపు, విశాల వదనం, మంచంకోళ్ళల్లా పెద్దకాళ్లు... చూడగానే కురంగేశ్వర్రావు గారు మధ్య వయసు దాటినా పుష్టికలమనిషి అని తెలుస్తుంది ఆకారంలో భర్తతో సరిసమానంగా పోటీచేసే కామేశ్వరమ్మ కళ్ళజోడు సర్పకుంటూ మెత్తటి పరుపుమీద సుఖంగా మేనువాల్చి సోవియట్ దేశంలోని మహిళల పురోభివృద్ధి గురించిన పత్రిక ఒకటి చదువుతోంది దీక్షగా కురంగేశ్వర్రావుగారి కొడుకు ప్రసాద్ గచ్చు నేలమీద కూర్చుని సుద్దముక్కతో చిటికలు వేస్తూ లెక్కలు చేస్తున్నాడు వంటలక్క వంటింట్లో ఫలహారం కాఫీ తయారుచేస్తోంది. వంటిల్లు దాటితే బంగళా వెనక కాంపొండు చాల విశాలంగా వుంది వంటిల్లు ఎదురుగా గచ్చుకోటలో ఏపుగా మొలచిన తులసి చెట్టు వాన చినుకుల్లో తడిసి నీరు కారుతోంది కూరపాదులు పూల మొక్కలు, ద్రాక్ష తీగె నారింజ, మామిడి వృక్షాలు మల్లె పందిరులతో కాంపౌండు కన్నుల పందువుగా వుంది.
వాన చినుకులు వికసించిన పువ్వుల్లో ముత్యాల్లా నిలుచున్నాయి పందిరుల క్రిందనుంచి వేలాడే పొట్లకాయ, బీరకాయ చివరల నుంచి వాన బిందువులు పాదరసం చుక్కల్లా జారుతున్నాయి. చూత వృక్షాలు లేతపత్రాలు వానలో తడిసి నవనవలాడు తున్నాయి.. మెటిమెలు పంచుకొని ఒళ్ళంతా నిగనిగలాడుతున్న నారింజ కాయలు వానతడిలోంచి తమ పరిమళాన్ని వెదజల్లు తున్నాయి.
కాంపొండులో కట్టిన రెండుగదుల బంగళా మొక్కలు కెదురుగా ఉంది ఎర్రచారల గుడ్డతో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని చంద్రప్రభ ప్రసాద్‌కు ఊలు బనీను కుడుతోంది. రాణి ఏవో కాగితాలు చదువుతూ ఎర్ర పెన్సిలుతో దిద్దుతూ మార్కులు వేస్తుంది మంచం మీద కూర్చుని.
వంటలక్క వేడి కాఫి తెచ్చి యిచ్చింది.
ఊలు బనీను క్రింది జార్చేసింది చం[ద్రప్రభ. రాణి చేతిలోని కాగితాలు మంచంమీద విసిరేసింది.
316 అన్వేషణ
చలికి చల్లబడిన శరీరంలో ఒక (గ్రుక్కెడు వేడి కాఫీ మ్రింగగానే, చైతన్యం కలిగింది చంద్రప్రభకు. ఐదున్నర అడుగుల ఎత్తు ఆకారం, చంద్రబింబంలా గుండ్రని ముఖం, పచ్చటి శరీరచ్చాయ గన్నెరు మొగ్గలాంటి ముక్కు తెల్లవాయిలు ఆకుపచ్చ రవిక - చం(ద్రప్రభ సర్వ లక్ష సంపన్నురాలై వెన్నెలలాంటి అందం విరజిమ్ముతూ నవ్వింది. వీచే చలిగాలిలో శిరోజాలు సర్దుకుంది కాఫీ త్రాగడం పూర్తిచేసి గబుక్కున రాణి ప్రక్కకుచేరి ఆమెను తన బాహువులో బంధించింది, చంద్రప్రభ.
“ఏమిటిది?” ఒళ్ళు నిమురుకుంటు* రాణి కోపంగా చూసింది.
“చలేస్తోంది! కాఫీ వేడి చాలక నీ దగ్గరి కొచ్చాను.”
“త్వరగా పెళ్లిచేసుకో!? రాణి నవ్వింది.
“పెళ్లి ఎప్పటికయినా తప్పదు . కాని త్వరలో కాదు! ఎం.ఎ. పూర్తి చేసుకొని కాలేజీలో ఎక్కడయినా లెక్సరరు పని సంపాదించుకుని అప్పుడు... చంద్రప్రభ గది దాలి వాన చినుకులో చెయ్యి తడిపి, అరచేతిలో వాననీరు తీసుకువచ్చి రాణి ముఖంమీద చల్లింది.
“అబ్బ! ఏమిటీ అల్లరి” నవ్వింది రాణి.
“వితంతువులు ఎంత చలియైనా భరినారుటగా పకపక నవ్వింది చంద్రప్రభ.
రాణి దీనంగా ముఖం దించుకుంది.
“కోపం వచ్చిందా లతా...లతలకు నీళ్ళు పొయ్యాలిగా... అందుచేత చల్లను!
చంద్రప్రభ రాణి గెడ్డం పట్టుకుని అనునయించింది. సన్నగా మృదువుగా లతవంటి శరీరంతో సుందారపత్రం లాంటి వదనంతో, మందార మొగ్గలాంటి పెదాలతో సొగసుగా కనిపించే రాణికి లత అని పేరు పెడితే బాగుంటుందని చంద్రప్రభ నిర్ణ యించింది. రాణీని లత అనే పిలవడం నేర్పారు ఆ యింట్లో అంతా.
నీ మీద కోసం ఎందుకు (ప్రభా...న్ స్నేహంలోకి వచ్చాక నా జీవితమే మారిపోయింది... ఇప్పుడున్న మనశ్వాంతి, హాయి మరెప్పుడూ లేవనుకుంటాను! రాణి ఐరువుగా నిట్టూర్చింది.
చంద్రప్రభ రాణీని పరీక్షగా చూసింది.
అన్వేషణ త్రి17 తాను వితంతువుననీ, చిన్నతనంలోనే తల్లి తండ్రులు చనిపోయారని “నా” అనే దిక్కుఎవరూ లేరని తప్ప రాణి ఇంక తన జీవితం గురించి విపులంగా ఏమీ చెప్పకపోవడం చంద్రప్రభకు విచిత్రంగానే తోచించి అయినా పదిసార్లు ప్రశ్నిస్తే ఆమె పురా తన దుః ఖాలు కెలికి ఆమెకు బాధ కలిగించడమెందుకని చంద్రప్రభ ఊరుకునేది. ఒంటరిగా వున్న సమయంలో రాణి దుఃఖించ డం ఎన్నోసార్లు చూసింది చంద్రప్రభ. చంద్రప్రభ రాగానే కళ్ళు తుడుచుకుని నవ్వుతూ కలిసి తిరిగేది రాణి. కాంపొందులో నిలబిన నీళ్ల, మడుల్లో (ప్రసాద్ కాగతం పడవలు వదులుతూ ఆదుకుంటున్నాడు. కాగితం కూర్చున్న చోటికే వచ్చేస్తున్నాయి. భర్తను, తల్లిదండ్రులను వోగొట్టుకొని, పరిమితమైన సంసార జీవనం గడిపే రాణి (బతుకులో ప్రత్యేక రహ న్యాలు ఎమి ఉంటాయని పరిమితమైన మడుగులో తిరిగే కాగితం పదవ యానంలాంటిదే ఆమె జీవనమని ఊహించింది చంద్ర ప్రభ. నల్ల మేఘాలు దట్టంగా గుంపులుగా ఆకాశంలోకి పరుగెత్తుకు వచ్చాయి. వాన జోరు హెచ్చింది. ఆకులమీద రాలే చినుకులు టపటప శబ్దాలు చేస్తున్నాయి. “ప్రజా.. మీ నాన్నగారితో ఒక విషయం చెప్పాలి...ఎక్కడైనా ఉపాధ్యాయినిగా ఉద్యోగం యిప్పిస్తే కృతజ్జురాలిగా ఉంటాను”... రాజి నసిగింది. “లేకపోతే కృతజ్ఞత చూపవన్నమాట... ఎంత కృతఘ్నురాలివే!...” చంద్రప్రభ వేళాకోళం చేసింది. రాణి మౌనంగా నవ్వింది. “ఇటువంటి విషయాలు నాన్నగారికి చెప్పనక్కర్లేదు... అయినా నేనూ చెబుదామనుకుంటున్నాగ నవ్వింది చంద్రప్రభ, “ఏం చేస్తున్నా రర్రా!” కామేశ్వరమ్మ కేకవేసింది. “కథలు చెప్పుకుంటున్నామే!” అరిచింది చంద్రప్రభ. “ఎవరి గురించి!” నవ్విందీ కామేశ్వరమ్మ కేకవేసింది. “కథలు చెప్పుకుంటున్నామే!” అరిచింది చంద్రప్రభ. “ఎవరి గురించి!” నవ్వింది కామేశ్వరమ్మ. “పూర్వకాలపు రాజకుమారుల సాహసాల గురించి!...” చంద్రప్రభ కిలకిల నవ్వింది.
918 అన్వెషణ
“ఈ కాలంలో రాజకుమారు లెవరూ లేరులే నిన్ను పెళ్ళిచేసుకోడానికి!” కామేశ్వరమ్మ వానలో తడుస్తూ రాణి కూర్చున్న గదిలోకి వచ్చింది లావైన తన శరీరాన్ని దడదడ నడిపిసూ “ఈ తువాను గాలికి నాయం . నువ్వు భూకంపంకూడా తెప్పిస్తే ఎలాగే అమ్మా...పాపం లతకిచ్చిన రెండు గదులూ కూలిపోవూ?” చంద్రప్రభ తల్లితో హేళన చేసింది.
“ఏమిటే పేలుతున్నావు?... పెళ్ళయ్యాక నాకు రెండు రెట్లు లావెక్కుతావు!” కామేశ్వరమ్మ ఆప్యాయంగా చంద్రప్రభ €ల మీద కొట్టింది.
ప్రసాద్ తడిసిపోయిన కాగితం పడవలు జేబులో కుక్కుకుని కామేశ్వరమ్మ దగ్గరకు వచ్చాడు.
“అమ్మా... నాన్న పిలుస్తున్నారే!” దీర్ధం తీశాడు ప్రసాద్.
“ఆయన కేమీ పనిలేదు... ఈ ముసురు రోజు అస్తమానూ నన్ను పిల్వడమెందుకూ?” చురచుర చూస్తు పెదల మధ్య నవ్వు బిగించుకుంది కామేశ్వరమ్మ.
“ఆ.. పిలవలేదే...ఏం చేస్తున్నారో చూసిరమ్మన్నారు!” ప్రసాద్ నవ్వాడు.
“పెద్దగుర్రానికి పళ్ళు తోముతున్నానని చెప్పు” కోపం అభినయిస్తూ అరచింది కామేశ్వరమ్మ.
“అమ్మా..మన యింట్లో ఎవరే పెద్ద గుర్రం?” ప్రసాద్ కొంటిగా ప్రశ్నించాడు.
“ఎవరా... నువ్వు!” నిజంగా కోపం తెచ్చుకొంది కామేశ్వరమ్మ.
తల్లి కోపానికి చప్పట్లు కొడుతూ ప్రసాద్ వానలోంచి దూకి యింట్లోకి పారిపోయాడు
ఆ ఆదంగులు ముగ్గూరూ గవ్వలాట మొదలెట్టారు కాలక్షేపానికి.
ఒక అరగంట గడిచింది. వర్షం కుంభపాతంలా పడుతోంది. పట్టపగలే మసక చీకటి అలముకొంది. (ప్రసాద్ వంటింటి గుమ్మంలోంచే అరిచాడు నాన్నగారు పిలుస్తున్నారని,
“బమిటా అబద్దాలు... ?” కూకలేసింది కామేశ్వరమ్మ కొడుకుని...
“ఈసారి నిజమేనే .. కేరమ్సు ఆడుకుందాం.... రమ్మంటున్నారు...!” పెద్ద గొంతు వేసుకొని అన్నాడు ప్రసాద్,
అన్వేషణ ఏ19
కామేశ్వరమ్మ భర్త ఒంటరితనం గుర్తించింది. రాణిని చంద్ర ప్రభను కూడా రమ్మని వానలో ఎగిరి పరిగెత్తి యింట్లోకి నడి చింది కామేశ్వరమ్మ. ఆమె పరుగులో వంటింటి గుమ్మం ముందు మెట్లలో ఒక మట్టితిన్నె వానకు తడిసి ఆమె అడుగు పడగానే పూర్తిగా విడిపోయి మట్టితో కలిసిపోయింది,
రాణి అణకువతో గౌరవంతో సోఫాలో వచ్చి కూర్చుంది కురంగేశ్వరరావుగారికి నమస్కరించి. ఆకర్షణీయమైన యవ్వనంలో అందాల రాణిలా అగుపించే రాణి వితంతువై పోవడం ఆమె దురదృష్టమని లోలోపల సానుభూతి పొందారు కురంగేశ్వరరావుగారు.
ప్రసాద్ కేరమ్ బోర్డు తెచ్చి బిళ్ళలు సర్హాడు. భార్యాభర్తలు ఒక పక్షాన, రాణి చంద్రప్రభలు ఒక పక్షాన ఆడటానికి నిశ్చయ మైంది సంచీలలోంచి క్రిందకు జారిపోయే బిళ్ళలు తేదానికి ఆట ఆఖరి దశలో బిళ్ళలన్నీ బోర్జుమీద నియమిత రీతిలో పేర్చడం ప్రసాద్‌కు అప్పచెప్పారు. ఆట (ప్రారంభమయింది. కురంగేశ్వరరావుగారు ఆనాడు తప్పనిసరిగా యిల్లు వదలకుందా చేసిన ముసురు కాలం సద్వినియోగం చెయ్యాలని పిల్లలతో ఆట మొదలెట్టారు. తండ్రి పక్షాన బిళ్ళల నడకలు పరిశీలిసూ ప్రసాద్ తండ్రికి సలహా యిస్తున్నాడు. అప్పుడప్పుడు బయటికిపోతూ వాన మడుగుల్లో పడవలు ఆడిస్తూ యింట్లోకి వస్తున్నాడు.
కురంగేశ్వరరావుగారి బంగళా అంతర్భాగం నవనాగరికత కలిగిన ధన సంపన్నుల యిల్లులాగే అందంగా అలంకరించబడింది కిటికీలకు నీలంచార్ల తెరలు, గోడమీద కళాత్మకమైన చిత్రాలు, బంధువుల ఫోటోలు, కుటుంబంలోని భార్యభర్తలు కుమార్తె కుమారుల వివిధ వయస్సుల్లోని ఫోటోలు, దంతపు తాజ్ మహల్ రేడియో, అద్దాల టేకు బీర్వాలు, పందిరి మంచాలు, వలెన్ కోట్లు, ఫాంట్లతో వ్రేలాడుతున్న టేకు బద్దలు షాందు, భోజనాలకు పొడుగాటి మేజా అమర్చబడిన కుర్సీలతో ప్రత్యేకమైగది. వీధి కాంపొందులో కోటను మొక్కలు, వ్రొద్దు తిరుగుగు, మెట్ట తామరలతో కూడిన సుందరమైన చిన్న ఉద్యానవనం, ఒవ కారు 'దైవరు ..తోటమాలి... నౌకర్లు... మధ్య తరగతికి రెండు అంతస్తులు పెరిగిన వైభవ జీవితంలాగే వుంది. చిన్న మేష్టారు ఉద్యోగం నుంచి కష్టపడి పరీక్షలు పాసయి, పెద్దవాళ్ళ ప్రాపకాన్ని నేర్పుగా సంపాదించి అందరినీ హర్షింపచేసేలా చాకచక్యంతో మాట్లాడి, అందరి గౌరవం, మన్ననలు పొంది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల జీతం కళ్ళ జూస్తున్నారు కురంగేశ్వర్రావుగారు, చదువురాని మేనత్త కూతురు కామేశ్వరమ్మను వివాహం చేసుకుని అత్తవారి పురాతన
320 అన్వెషణ సాంప్రదాయాల ప్రభావాన్ని ప్రతిఘటించి, ఆమెకు స్వయంగా చదువు చెప్పి, బి.ఏ చదివించి, పంతులమ్మ ఉద్యోగం వేయించారు ఆయన సంసారంలో చాలీచాలని జీతంతో సతమతమయ్యే రోజుల్లో, భార్య ఆదాయం ఆర్ధికంగా ఒడుదుడుకులు లేకుండా (ప్రశాంతంగా గడపడానికి అత్యవసరమని ఆమె సహాయంతో యిద్దరు తమ్ములకు ఇంజనీరింగు చెప్పించి, చెల్లెలుకు స్కూలు ఫైనలు దాకా చదువు చెప్పించి, పెద్ద కట్నంతో దాక్టరుకిచ్చి పెండ్డిచేసి, కుటుంబం యొక్క గౌరవ ఆదరణలు చూరగొన్నారు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగపదవి లభించగానే స్వీయ గౌరవ ప్రతిష్టలు కాపాడుకోవాలని భార్యను ఉద్యోగం మాన్వించి, మహిళా సంఘ కార్యక్రమాలలో పాల్గ్లొనేటందుకు పూర్తి విరామం యిచ్చి సంతృప్తి పొందారు ఆయన సంపాదించిన పలుకుబడితో నగరంలో ఒక హోదా పొంది ప్రజారంగంలో కొంత ప్రఖ్యాతి ఆర్జించారు కురంగేశ్వర్రావుగారు.
ప్రసాద్ వంటింట్లోకి వెళ్లి, వంటలక్క నడిగి ఆమె రుబ్బుతుతన్న గోంగూరపచ్చుడి కొంచెం అడిగి తింటూ, లొట్టలువేస్తూ తండ్రి దగ్గరకు వచ్చాడు. కొడుకును కూకలేసి, చిలిపిగా కురంగేశ్వర్రావు గారు కూడ కొంచెం పచ్చడి రుచి చూచి, భార్య వంటకంటె చాలా పసందుగా ఉందని గుటకలు వేశారు. ఆయన హాస్యం చూసి రాణి, చంద్రప్రభ సరదాగా నవ్వారు కామేశ్వరమ్మ మూతి తిప్పుకుంది వంటక్క భర్త అనుగ్రహానికి వాత్రురాలైందని.
సంభాషణలు సందర్భంలో చంద్రప్రభ రాణి ఉద్యోగం గురించి తండ్రి ముందు కదిపింది: “ఆ అమ్మాయికి ఉద్యోగం ఎందుకు? ఎవరినయినా చక్కటి కుర్రాణ్సి చూసి పెళ్ళి చేసేసాను!” నవ్వేరు కురంగేశ్వరరావుగారు.
“ఛాల్లెండి...ఆ అమ్మాయి ఏమన్నా అనుకోగలదు... ఆ మాటలేమిటి?” కామేశ్వరమ్మ భర్తను మందలించింది.
సంఘ సంస్కరణలో ప్రత్యేక అభిమానమున్న కురంగ్రేశ్వర్రావుగారు ఆ వాక్యం హాస్యానికన్నా హృదయంలో రాణి వివాహం చేసుకుని భర్తతో కాలక్షేపం చేస్తే చూడాలనే కుతూహలం లోలోపల ఉంది. కాని బాధిత వ్యక్తి సంన్మరణకు అనుకూలత చూపించనప్పుడు సంస్కరణకర్తలు చెయ్యగలది శూన్యమని నిరాశపడ్డారు రావుగారు.
“నవ్వు కూడా మా అమ్మాయితోపాటు ఎం.ఏ. చదువుకోకూడదమ్మా ?” మర్యాద విద్యుక్త ధర్మంగా ఆ మాట వదిలారు రావుగారు.
అన్వేషణ 321
రాణి తమ యింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అనాధ బాలికకు ఏవిధమైన సహాయం చెయ్యాలో ఓపికున్నంతవరకు అంతా చేశారు రావుగారు రెండు గదులు ఉచితంగా నివానానికిచ్చారు. తోటి స్నేహితుల యిళ్ళలో ట్యూషన్సు ఐర్పరచి, నెలకు అరవయి రూపాయలు, అధమం ఆమె సంపాదించుకునేలా అవకాశాలు ఏర్పరిచారు. పండుగ దినాల్లో అనారోగ్య సమయాల్లో తమ యింట్లోనే భోజన సదుపాయం చేసూ స్వంత బిడగా చూసుకునేవారు, వయసు వచ్చిన చంద్రప్రభకు యింట్లోనే సత్ ప్రవర్తనగల మరొక స్నేహితురాఉ ఉండడం ఎంతో శ్రేయస్మరరమని రావుగారు, కామేశ్వరమ్మ రాణికి ఎంతో ఆదరణ చూపించారు రాణి కూడా వినయం, గౌరవం, భయభక్తులు చూపిస్తూ, రావు దంపతులు అనుగ్రహానికి వాత్రురాలైంది కూతురుకు ఎం.ఏ. చదవు చెప్పించడానికి సన్నాహాలు చేసిన రావుగారు రాణి ముందు చదువు విషయంలో ఉపేక్ష వహించడానికి కారణం రాణికి యిష్టం లేకపోవడమైనా, ఫలితంగా ఆమె చదువులు మానవలసి వచ్చిందని మాత్రం లోలోపల తన తప్పుగానే భావిస్తూ మధనపడ సాగారు రావుగారు.
రాణి యధాప్రకారం నవ్వుతూ మౌనం వహించింది; తన పరిస్థితులు తెలిసిన తాను ప్రత్యేకం చెప్పుకునేది ఏమీ లేదన్నట్లు.
కురంగేశ్వర్రావుగారు బి.ఏ ప్యాసైన రాణికి ఉపాధ్యాయిని ఉద్యోగం యిప్పించడం అంతకష్టమైన విషయంగా భావించ లేదు. ఇంటింటికి వెళ్ళి పిల్లలకు ట్యూషన్సు చెప్పే శ్రమ ఆమెకు తగ్గించిన సహాయం చేసినట్లుంటుందని కూడ రావుగారికి తట్టింది. ఆ ప్రయత్నంలో నిమగ్నం కావాలని నిశ్చయించుకున్నాడు.
దైనికవృత్తి కార్యక్రమాలలో ఒక్క నిమిషం తీరుబడిలేక సంచరించే రావుగారు ఆ రోజు ముసురు పట్టడంవల్ల ఎందుచేతనో యింట్లో ఉండిపోయారు. విరామమున్నప్పుడు కుటుంబంతో కాస్సేపు హాయిగా చిలిపిగా అల్లరిచేసూ కాలక్షేపం చెయ్యాలనే కోరిక రావుగారిలో ప్రబలం. ఆ సమయంలోనే కుటుంబ వ్యక్తులు తమ అభీష్టాలు కోరుకోవడం, రావుగారు ప్రసన్నులై ఆ అభీష్పాలు నెరవేర్చుకోడానికి అభయ హస్తం యివ్వడం పరిపాటి. ఆ రోజు తన ఉద్యోగ ప్రస్తావన రావడం రావుగారు హాస్యంలోనే విషయాన్ని అర్ధం చేసుకుని, మనస్సుకు పట్టించుకోవడం రాణికి ఆనందం కలిగింది
కేరమ్సు ఆట పూర్తయ్యేటప్పటికి ఏడు గంటలయింది. రాణిని తమ యింట్లోనే భోజనం చెయ్యమని రావుగారు, చంద్ర ప్రభ, కామేశ్వరమ్మ బలవంతం పెట్టారు. అటువంటి బలవంతాలకు అలవాటుపడిన రాణి సులభంగానే ఒప్పుకుంది.
౩22 అన్వేషణ
కబుర్లు దొర్లాయి, సినిమాలు, పొరుగుంటివారి గృహ విషయాలు, కాలేజీ స్నేహితుల ప్రవర్తనలు, ట్యూషన్సు చెప్పించుకునే పిల్లల తల్లితండ్రుల ప్రవర్తనలు, ఉద్యోగుల (బ్రతుకు రీతులు, మహిళల హక్కులు, వాగ్వివాదాలు చెలరేగి కామేశ్వరమ్మ, చంద్రప్రభ, రావుగారు ఘర్షణ పడుతూ ఉపన్వాసాలిచ్చారు. మధ్య మధ్య తన అభిప్రాయాలు అందిస్తూ ఉపన్యాస ధోరణీ లేకుండా ముక్తసరి పలుకుల్లా ముగిస్తూ, రాణి సంభాషణల్లో పాల్గొంది. ప్రసాద్ అర్ధంకాని ఆ గొడవల్లో జోక్యం తనకెందుకని పూర్వకాలపు రాజకుమారుల సాహస కార్యాలు (ప్రతిబింబించే కధలు చదువుకోసాగాడు
రుచికరమైన భోజనం ముగించి, సుగంధ (ద్రవ్యాలతోకూడిన తాంబూలాదులు సేవించి, విద్యుద్దిపాల వెలుగు వెచ్చదనంలో, ముసురుగాలి చలిలో వంటలక్క వంటకాల పై హోటల్లోని తినుబండారాలపై విమర్శలు సాగించారు. కడుపునిండా భోజనం, చైతన్యం కలిగించే తాంబూలం అందుకున్న రావుగారు మేజాబల్లమీద నౌకరు తెచ్చిపెట్టన గుట్టల ఫైల్సు చూసి, తలలో పురుగు దొలిచినట్లయి కలం పుచ్చుకుని వాటిపై దండయాత్రకు బయలుదేరారు.
రాణి, చంద్రప్రభ కాంపౌండులోని గదుల్లో దూరారు. కధలతో, ప్రీ సహజ శృంగార చేష్టలతో, భావి జీవిత ఊహాగానాలతో కాస్సేపు కబుర్లు చెప్పుకుని, విడిపోయారు.
రాణి పరపుమీద మేను వాల్చింది. గతం కళ్ళముందు కదిలింది. వాతావరణాన్ని బట్టి వ్యక్తుల జీవితాలు కూడా మారిపోతా యని (ప్రస్తుతం బుజువు చేస్తోందనుకుంది రాణి.
ట్యుటోరియల్ కాలేజీలో చదివే రోజులలో చంద్రప్రభతో స్నేహం సంపాదించింది రాణి. చదువుకుందుకు తరుచు చంద్రప్రభ ఇంటికి వెడుతూ కామేశ్వరమ్మ ఆదరణ పొందింది. ఆఫీసులో సునీతను కొట్టినప్పుడు యజమాని రామనరసు చూపిన ప్రవర్తనలో తన ఉద్యోగానికి ఎలాగా ముప్పు వస్తుందని గ్రహించుకున్న రాణి భావి గురించి ప్రణాళికలు వేసుకుంది. చంద్రప్రభకు మరో ట్యుటోరియల్ కాలేజీలో రావుగారు మార్చించినప్పుడు, తానుకూడా చంద్రప్రభ స్నేహం వదలలేనని ఆమెను అనుసరించి రాణికూడా కాలేజి మార్చింది; మరియ్మకు తెలియకుండా (ప్రాణావాయం, శీలానికి ప్రమాదం ఏర్పడే తీవ్ర పరిస్థితులు వాతావరణంలో రూపొందగానే భయపడి మరియమ్మను విడిచి ఒంటరిగా ఏ సంసారుల యిళ్ళల్లోనో తలదాచుకుంటేగాని తనకు మనశ్శాంతి లేదని, నిశ్చయించి, చంద్రప్రభ సహకారంతో వాళ్ళ ఇంట్లోనే అద్దెకని, రెండుగదులు తీసుకుంది మొదట్లో
అన్వేషణ త2త తల్లిదండ్రులు లేని ఒంటరి బీద వితంతువు రాణి అని రావు దంపతులు తెలుసుకొన్నాక, ఆమె వద్ద అద్దె తీసుకోవడం అన్యాయమైనదని, కూతురు స్నేహితురాలికి ఈ కాస్త సహాయం చెయ్యడం ధర్మమని భావించారు. వారి కనుసన్నలలో మెలగుతూ రాణి కూడా వారి అనుగ్రహం సంవాదించి ట్యుటోరియల్ కాలేజీలో ఇంటరు చదివి ప్యొసయి, తర్వాత విశ్వవిద్యాలయంలోని బి.ఏ పూర్తి చేసింది చంద్రప్రభతో, చంద్రప్రభ స్నేహం ఒంటరి స్తీ జీవితానికి కావలసిన రక్షణ సౌకర్యాలు, ఆనందం అందించినప్పటికీ, తన జీవితం వ్యర్థమైపోయిం దనే దిగులు, నిరాశ, ఆవేదన రాణిని వెన్నంటుతూనే ఉన్నాయి. తన బ్రతుకుకు గమ్యం ఏమిటో అర్ధంకాక, బాధగా కుమిలి బద్భింది రాణి.
ముసురుగాలి కిటికీలను దడదడ బాదుతోంది. వాన చినుకుల చప్పుళ్లు చెవుల్లోకి ప్రసరిస్తున్నాయి మూసిన కిటికీ తలుపులు సందుల్లోంచి రివ్వున చొచ్చుకువచ్చే గాలి కిటికీ తెరలను అల్లల్లాడిసోంది. దొడ్గ్డోంచి కీచురాళ్లు గొంతులు సన్నగా వినిపి స్తున్నాయి. కళ్ళుమూసిన చీకటి శూన్యంలో శివరాం ఆకారం కదిలింది. రూపొందలేని కోర్కెలు రాణి యెడతను మన్ని ఆలోచన విత్తులను జల్గుతున్నాయి. తీరని ఆవేదనను తప్పనిససరిగా అణచుకుని సుషుప్తిలో ఒరిగింది రాణి. ఉదయమవగానే కాలకృత్యాలు తీర్చుకుని ట్యూషన్సు చెప్పడానికి బయలుదేరింది రాణి. చేతిలో రెండు పుస్తకాలు, చిన్న గొడుగు, ఎత్తు మడమల స్లిప్పరు, సాదా తెలుపుచిర ధరించి రాణి నాంపల్లి వైపు నడిచింది. భూమారావు దగ్గరగా ఎదురై నమస్కరించాడు పలకరిసూ ఎవరో (క్రొత్తవాడినిగా అతన్ని చూస్తూ మౌనంగా కదిలి పోయింది రాణి. ఆమె విచిత్ర ప్రవర్షన భూమారావుకు ఆశ్చర్యం గొలిపినా అడది నడిరోడ్డులో మాట్లాడకుండా పోతున్నప్పుడు పలుకరిస్తూ ఆమెను అనుసరించడం షరువు తక్కువ అనుకున్నాడు భూమారావు. తన దానికి వెళ్ళిపోయాడు.
అప్పుడప్పుడు రాణికి నాటకాలలో తిరిగే మునుపటి వ్యక్తులు కనిపించేవారు. ఆడదాని చనువును అపార్ధంచేసుకునే ఆ రంగం నుంచి పూర్తిగా ని(ష్మమించి నిశ్చయించుకున్న రాణి ఆ రంగంలో మసిలే వ్యక్తులతో కూడ పరిచయాలు మానుకోవడం శ్రేయస్కరమని తీర్మానించుకుంది. రాణి మారిపోయిందనే భావంతో, నటకులు మాత్రం ఆమెకు దూరంగా మసలజొచ్చారు.
విశాఖపట్నం బదిలి అయి వచ్చి నగంలో ఇన్‌కంటాక్సు ఆఫీసులో పనిచేస్తున్న హెడ్ గుమాస్తా శ్రీరాములుగారి యిల్లు నాంపల్లిలో ఉంది. ఆయనకు మొదటి భార్యవల్ల ఒక కూతురు కొడుకు కలిగారు. భార్య చనిపోయేక మళ్ళీ పెళ్ళి చేసుకుందామనే స్థితిలో
324 అన్వేషణ పొరుగింటి వింతకు నాంచారితో పరిచయం కలిగి పెండ్లి చేసుకోకపోయినా ఆమెతో జీవితం గదపడం మొదలెట్టారు
నాంచారమ్మ రోజు రాణి రాగానే చూపే ఆదరణ, గౌరవం అమితం తన స్వంతబిడ్డల్లా చూచుకుంటూ శ్రీరాములుగారి పిల్లలకు తల్లికంటె ఎక్కువ సేవచేస్తోంది ప్రొద్దున్న రాణి వచ్చే సమయానికి పిల్లలకు స్నానాలు చేయించి, ఫలహారాలు పెట్టి, ఇస్త్రీ బట్టలు తొడిగించి, తలలు దువ్వి, ఒక గదిలో చాపపరిచి రాణికోసం నిరీక్షిసూ కూర్చుంటుంది, రాణి రాగానే వద్దన్నా బలవంతంగా ఆమెకు ఫలహారాలు పెట్టి పిల్లలు చదువుతూంటూ చూస్తూ ఆనందించేది నాంచారమ్మ ఉంచుకున్న ప్రీగా పరిగణించబడినా, నాంచారమ్మ శ్రీరాములుగారిమీద ఆయన పిల్లలమీద చూసే అభిమానం రాణికి ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొ కృప్పుడు మనిషి గుణంకన్న మనస్సు ప్రధానం అనుకునెది రాణి
సైఫోబాదులో కృష్ణారావు నాయుడుగారి పిల్లలకు కూడా పాఠాలు చెప్పెది నాయుడుగారి భార్య ఎప్పుడూ సంపొర రుంరూటంలో ఏదో పని కల్చించుకుని, విరామంలేకుండా అవస్థ పడుతూ పిల్లల సంగతే పట్టించుకునేది కాదు రాణి రాగానే పిల్లలే ఆమెను ఆహ్వానించి పలక పుస్తకాలు తెచ్చుకుని చదివేవారు. పిల్లలు ఏమి చదువుతున్నారని నాయుడుగారు కాని భార్య గాని ఎప్పుడు ప్రశ్నించే వారు కాదు నెల కాగానే రాణి జీతం సరిగా యిచ్చెసేవారు.
ఖైరతాబాదులో పెద్ద ప్రభుత్వ ఉద్యోగి ప్రభాకరరావుగారి అబ్బాయి లిద్దరు ఎనిమిదవ పారం, తొమ్మిదవ పాఠం చదువు తున్నారు. వాళ్ళకు లెక్కలు, ఇంగ్లీషు నేర్పేది రాణి. రాణీ యింటికి రాగానే నౌకర్లు గదిలో కుర్చీలు వేసి పారశాల ఏర్పరచేవారు అందంగా స్నో పౌడరులతో ముఖం నింపుకుని అబ్బాయిలిద్దరూ పారాలు నేర్చుకోవడానికి వచ్చి బొమ్మల్లా కూర్చునేవారు పారాలు అర్ధమమయినా కాకపోయినా, కొంటె ప్రశ్నలడిగి రాణిని వేధించేవారు. ఒక్కొక్కసారి తన భాషతో ఆ అల్లరి పిల్లల (ప్రశ్నలకు సరియైన సమాధానం కష్టమనిపించేది రాణికి.
విరామ కాలంలో పిల్లలకు పాఠాలు చెబుతూ జీవనోపాధి సంపాదించుకోచడం, కాలేజీకి వెళ్ళి బి.ఎ చదవడంతో రెండు సంవత్సరాలు ఆమె జీవితంలో మందంగా ఒడుదుడుకులు లేకుండా గడచిపోయాయి ఆ రోజు సాయంత్రం ఖైరతాబాదు నుంచి పిలలకు వారాలు చెప్పడము ముగించుకొని యింటికి వసూంటే రాఘవరావు ప్రధమంగా ఎదురయ్యాడు. వ్యక్తిగా అతన్ని చూసి అసహ్యించుకొనే రాణి అతని (ప్రవర్తనలో నీచత్వము,
అన్వేషణ ఏ్జిగ్ మోసం వుందని శంకించి, అతన్ని చూడనట్లు ప్రక్క దారిలోంచి నడవసాగింది. రాఘవరావు ఆమెను వన్నంటాడు “చెల్లాయి!” అంటూ మృదువుగా పిలిచాడు ఆ పిలుపు విని భయపడి ఎదురుగా కనిపించిన రిక్షా ఎక్కి వడివడిగా కురంగేశ్వర్రావు బంగళాలోకి దూరింది రాణి రాఘవరావు కూడ ఆమె బస కనుక్కోవలెనని నిశ్చయించి మరొక రిక్షా వేసుకొని ఆ దారినే ఆమెను అనుసరించాదు రాణి బంగళాలోకి పారిపోయాక బహుశా అదే ఆమె నివాసమై ఉండవచ్చుననిర ఆ యింటి యజమాని భోగట్టా తెలుసుకొని, మెల్లిగా ఏదో ఆలోచిసూ వెళ్ళిపోయీడు రాఘవరావు. రాణికి చాలా భయం కలిగింది. రాఘవరావు ఆమెను అనుసరించినట్లు గుర్తించగానే తన పూర్వ జీవితం గురించి లేనిపోనివి కల్పించి కురంగేశక్వర రావు గారి మనస్సు చెరచి తన ప్రశాంత జీవితంతో రాళ్ళు రువ్వగలడు రాఘవరావని శంకించింది. అయినా జరిగే పరిస్థితులకు భయపడే కంటే ధైర్యంగా ఎదుర్శోవాలనే, మనస్తత్వంతో గుండె కుదుటపరుచుకుంది రాణి
రాణి యింటికి రావడం చూచి చంద్రప్రభ కంగారుగా రాణి గదిలోకి వచ్చింది. చేతితో ఏదో పుస్తకం పట్టుకుని నిలించింది
“రాణి నీతో ఒక రహస్యం చెప్పాలి - ఎవరితోను చెప్పకూడదు ! ”
రాణి ఊ కొట్టింది; చంద్ర ప్రభ మాటలకు పుస్తకం తెరచి ఒక ఉత్తరం చూపించింది రాణకి. ఎవరో విద్యార్ధి తన పేరు తెలియకుండా చంద్రప్రభకు (ప్రేమలేఖ వ్రాశాడు. ఇష్టపడితే తన్ను మూసి నదివద్ద ఆసుపత్రివైపు పార్కులో చిట్టచివర బుధవారం ఆరుగంటలకు కలుసుకోవాలని అర్ధించాడు. రాణి ఆ ఉత్తరం చూసి నవ్వింది.
“వెన్నెల్లా మెరిసే చంద్రప్రభను చూసి ఎవరైనా (ప్రేమిస్తాకు మాట వరసకు నాకే...”
“నాకీ ఉత్తరం చూస్తే భయమేస్తోంది ,..అతడు నా వెంటబడి అల్లరిపాలు చేసాడో అని... అయినా ఎవరితను? చంద్రప్రభ మనస్సు తొట్రుపడింది. ఇటువంటి పరిస్థితులు చివరకు గౌరవ ప్రతిష్టలు రూవుమాసి అల్లరివాలు చేసామని కుమిలింది చంద్ర ప్రభ.
“ఆ ఉత్తరం ముక్కలుగా చింపిపారేశాయి!”
రాణీ సలహా యిచ్చింది.
“ముక్కలుగా చించిపారేస్తే గొప్పతన మేముంది!...ఇటువంటి ఉత్తరాలు (వ్రాయకుండా గుణపారాలు నేర్పాలి!”
326 అన్వేషణ చంద్రప్రభ తీవ్రంగా ఆలోచించింది.
ఆడది మగవానికి గుణపారాలు నేర్చడం అంత సులువైన పనికాదని జీవితానుభవంలో నేర్చుకొన్న రాణికి చంద్రప్రభ ఆలోచనలు విని మౌనంగా ఊరుకొంది
“అత నెవరో తెలిసికొని చీవాట్లు పెట్టాలి... నువ్వు సాయం జేయాలి రాణి!” చంద్రప్రభ (బతిమాలింది.
“పోనీ అతన్ని చూడాలని వుంది అని అనకూడదూ...” ఠాణి హాస్యం చేసింది.
చంద్రప్రభకు కోపం చికాకు హెచ్చయింది.
“అయితే నన్నేం చెయ్యమంటావు!” రాణి చంద్రప్రభ దగ్గజగా వెళ్లి గెడ్డం పట్టుకుని (బ్రతిమాలింది కోప మెందుకని.
“ఏమీ లేదు . అక్కడికి వెడదాం. . నువ్వు నా ప్రక్క నుండు అతన్ని నానా చీవాట్లు పెడతాను...” చంద్రప్రభ తన యుక్తి చెప్పింది.
ఆ ఉత్తరం చంద్రప్రభకు ఎలా అందిందో అర్ధంకాలేదు రాణికి. కాలేజీ ఉత్తరాలు పెట్టెలో తన పేరున ఉన్న ఉత్తరం తెచ్చి తోటి స్నేహితురాలు యిచ్చిందని చెప్పింది చంద్రప్రభ.
బుధవారం సాయంత్రం పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళలేదు. సినిమాకి వెడుతున్నామని చంద్రప్రభ తల్లితో చెప్పింది. కారు తీసుకువెళ్ళమని కామెశ్వరమ్మ కూతురుకు సలహా యిచ్చింది ఇంకా చాలా స్నేహితులు దారిలో కలుసుకుంటున్నారని కారులో చోటు చాలదని సాకు చెప్పింది చంద్రప్రభ.
అనుకున్న కాలానికి అరగంట ముందే రాణి, చంద్రప్రభ పార్కుకు వెళ్ళి చెట్ల గుబురుల్లో పొంచి కూర్చున్నారు వేరుశెనగ కాయలు తింటూ, పార్యులో తిన్నె ప్రక్మనే నిలుచున్న పెద్ద చింతచెట్టు కొమ్మలు విస్తరింపచేసుకొని, వాహ్యాళికి వచ్చినవారికి నీడ యిస్తున్నట్లు, ఒకప్పటి వరదల్లో ప్రమాదానికి గురియైన ప్రజలను కూడా రక్షించే శక్తి కూడా వుందని కొమ్మలు ఊపుకుంటూ అభయ హస్తం యిస్తున్నట్లు (ప్రకటిసోంది. దూరాన వంతెన మీద చీమలబారులు ప్రాకినట్లు జనం నడిచిపోతున్నారు. రోగాల ముద్దలా నిశ్చలంగా ఉన్న ఆస్పత్రి గోపురాకారాల్లోని గోరీలుగా ప్రత్యక్షమయింది. నిరుద్యోగజనం నీరెండల్లో పచ్చగడ్డి మైదానాల మీద ఒరిగి దొర్హుతున్నారు. పాతగోడల
అన్వేషణ 827 ప్రతిబింబాల్లో నేరేడు రంగు నిళ్ళు కొద్దిగా బండరాళ్ళ మీంచి పారుతున్నాయి ఆకుపచ్చ పొలాలు నదీ'ప్రవాహ ప్రదేశంలోనే సాగుచెయ్యబడ్దాయి. బూంది, కార అమ్మేవారు గంపల్లో ఈగలు తోలుకోవడానికి ఉంచుకున్న సీమతంగేడు పుష్పాల కాడ కోడిపుంజుతురాయిలా నిక్కి చూస్తోంది వోకుమ్రాకు ఆకుల వద్ద వేలాడుతున్న గింజల కాడలు, కోయ దొరసానుల “పూసలదండల్లా గందరగోళంగా ఉన్నాయి. చిచ్చుబుడ్డుల కాంతుల్లా ఆకాశంలోకి ఎగురుతున్నాయి, సరసి వృక్షాలు.
ఉద్యాన వనంలో నిర్మించిన సిమెంటు తిన్నెమీద అందంగా ఏర్పరచిన సిమెంటు గొడుగు క్రింద తన జోడు సవరించు కుంటూ, సింహాసనం మీది ఏకచ్చత్రాధిపతిలా కూర్చున్నాడు. ఒక అద్భష్ట విహీనుడైన బికారి
ఉలెన్ సూటు, ఉలెన్ పాంటు తొడుక్కొని, బౌ టై కట్టుకొని, సీటుగా క్రాపు దువ్వుకొని, చేతి గడియారం పరిశీలిస్తూ, మెల్లగా మెట్ల తిన్నె ఎక్కి పార్కు చివరి భాగంలోకి పోయి నిలుచున్నాడు. ఒక విద్యార్ధి, పార్కు చివరి సరిహద్దు కటకటాల ముందు మలినంగా వున్న చిన్న గోరీల్లాంటి స్థలంలో తుప్పల మధ్య ఏదో ఆలోచిస్తూ చేతి గడియారం చూస్తూ నడయాడుతున్నాడు అతను. తన క్లాసులోని ఒక విద్యార్ధిగా అతన్ని గుర్తించిన చంద్రప్రభ కాస్సేపు అతని ప్రవర్తన పరీక్షించి అతనే ఉత్తరం వ్రాశాదని శంకించి లేచి నిలుచుంది కోపంగా.
ఒక అదుగువేస్తి ఆగిపోయింది చంద్రప్రభ.
“నాకు అతనితో మాట్లాడడానికి భయమేస్తుంది రాణీ!” చంద్రప్రభ బిక్క్మముఖం పెటింది.
క్స్
డంబాలు పలికి, యుద్ధరంగం నుంచి పారిపోయే ఉత్తరకుమారునిగా చంద్రప్రభ భయపడడం, రాణికి నవ్వు తెప్పించింది. జీవితంలోని ఒడుదుడుకులే మనిషికి ధైర్యసాహసాలు కలిగిస్తాయనే సూక్తి అక్షరాలా నిజమయినట్లు భావించింది రాణీ.
రాణికి ఒక యుక్తి తట్టింది. చంద్రప్రభ చేతుల్లో ఉత్తరం తీసుకొని ఆమెను అక్కడ వుండమని తనే వెగంగా పార్కు చివరికి నడిచింది. అక్కడ నడయాడుతున్న విద్యార్ధికి కొద్ది దూరంలో తానూ కాస్సేపు నడయాడింది. అతనివైపు చిరునవ్వుతో చూసింది కొద్ది క్షణాలు.
౩28 అన్వేషణ
టై సర్దుకొని కోటు నవరించుకున్నాడు విద్యార్ధి రాణి ధైర్యం చేసి ముందుకు వచ్చింది అతని దగ్గరగా.
“ఈ వుత్తరం. .* రాణి ఆగిపోయింది సిగ్గుగా నవ్వుతూ ఆమె ముఖ లక్షణాలు పరిశీలించి విద్యార్ధి ధైర్యం తెచ్చుకొని కొద్దిగా నవ్వాడు.
“మీరు ఎవరికైనా వ్రాశారా?...” రాణి ప్రశ్నించింది :
“ఆ. ,ఆ...లే...దూ అంటూ కంగారుగా ఆ వుత్తరాన్ని అందుకొని వివ్వాడు.
“చంద్రప్రభకు జ్వరం వచ్చింది. యీవేళ...నన్ను మీకు జవాబు చెప్పమని...” రాణి సిగ్గుపడింది.
అందంగా కనిపిస్తున్నా సాదా తెల్లచీరలో ముతకగుడ్డ రవికలో కనుపించే ఎదుటి ప్రీ బహుశా చంద్రప్రభ యింట్లో పనిచేసే వంటలక్కో ఎవరో అనుకున్నాడు విద్యార్ధి...”
'ఆ...ఆ.. ఈ ఉత్తరం నేనే వ్రాశాను ..యింకేం చెప్పింది?" ఆత్రుతగా నవ్వుతూ అడిగాడు విద్యార్ధి.
'వెప్పవలసిన... వన్నీ చెప్పింది... రాణి అతని ముఖ లక్షణాలు పరిశీలిస్తూ సౌమ్యంగా జవాబు చెప్పింది.”
“ఈ వుత్తరం పట్టుకెళ్లి యిసావూ' ..కలం కాగితం జేబులో నుంచి తీశాడు విద్యార్ధి.
రాణి మౌనంగా ఒక నిమిషం ఊరుకొంది. విద్యార్ధి కాగితం మీద వ్రాసెస్తున్నాడు ఏదో. అతను వ్రాసే కాగితాన్ని దౌర్జన్యంగా పర్రున లాగేసింది రాణి,
కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ రౌద్రంగా చూచింది.
“ఏమిటి తమాషా . నీకు అక్క చెల్లెళ్ళు లేరూ?...ఇటువంటి ఉత్తరాలు వ్రాయడానికి నీకు సిగ్గులేదూ - ఆ వుత్తరం (వానినంత మాత్రాన చులకనగా అన్నీ
' లభ్యమౌతాయనుకున్నావా...” రాణి రౌడీలా మాట్లాడింది.
విద్యార్ధి తెల్లబోయాడు. అతడి ఒళ్ళంతా చెమటలు కాల్వలు కట్టాయి. తొట్రుపాటుతో గజగజ వణకుతూ స్తంభించిపోయాడు నోటిమాట లేక.
“ఇకముందైనా జూ(గ్రత్తగా మసులుకో... లేకపోతే కాలిక్రింది ..” రాణి చెప్పులజోడు చూపించింది.
అన్వేషణ ష2కి విద్యాగ్గి పరిప్లితి అర్దం చేసుకున్నాడు. మరో మాట లేక తల తిరిగి గబగబ లి యు మ జారుకున్నాడు
రాణి జరిగిన వృత్తాంతం చెప్పింది చం(ద్రప్రభతో. చంద్రప్రభ విడ్డూరపడింది. సాత్వికంగా కనిపించే రాణికి యింత సాహస మెక్కడిదని.
రిక్షా ఎక్కి యిద్దరూ మొజంజాహి మార్కెటు వీధిలోంచి ప్రయాణం సాగించారు రిక్షా ఆపింది చంద్రప్రభ ఆపిలు పళ్ళు, బత్తాయిలు కొనుక్కోవాలని. రాణి ఆమెను అనుసరించింది. పల్ఫు బాగులేక కొట్టు మారారు యిద్దరు. మూడవ కొట్టువద్దకు ముందు చంద్రప్రభ వచ్చి పళ్ళు బేరం చెయ్యనాగింది రాణికి ఏదో ఆలోచన మెదడులో కదిలింది అక్కడ ఒకప్పుడు తనకు జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చి.
“నమస్కారం కమల్మమగారూ'” పళ్ళ దుకాణంలో వాడు చంద్రప్రభ అడిగిన ఆపిలుపండు అలాగే చేతిలో వుంచుకొని సంభ్రమంతో రాణికి నమస్కరించాడు.
రాణి ఆశ్చర్యంతో ఒక్క నిమిషం మౌనం వహించింది. వినయంగా గౌరవంగా పలుకరించిన పళ్ళ దుకాణం వాడిమీద ఏమిటో అభిమానం కలిగింది. గౌరవ పురస్పరమై నమస్మారానికి ప్రతి వందం చెయ్యటం విధి అనుకుంది రాజీ.
'రాముడూ!...' నవ్వింది రాజి.
“అవునండి...లాటరీలో నాకు వెయ్యి రూపాయలు వచ్చాయి. దానితో మునుపటి పని మానేసి దుకాణం తెరిచాను!” నవ్వుతూ చేతులు జోడించాడు రాముడు పుష్టిగా బలిసి పెదాలదాక వున్నా బొద్దు మీసంతో రాముడి చూపు చాల మారిపోయింది.
“ఎప్పుడైనా మా దుకాణానికి వస్తూండండీ!” నవ్వాడు రాముడు.
చంద్రప్రభకు చిత్రమనిపించింది ఆ పళ్ళ దుకాణం మనిషితో రాణికి పరిచయం ఎలా ఉందని, పైగా మరో పేరుతో పిలుస్తే రాణి గుర్తించి సమాధాన మిచ్చింది. పరిస్టితి అమయోమయమనిపించింది చంద్రప్రభకు.
పళ్ళు కొని తాటాకు బుట్టలో కట్టించుకొంది చంద్రప్రభ. రాముడు వాటి ఖరీదు అందుకొన్నాడు. చంద్రప్రభ రాణితో కదలబోతుంటే రాముడు పిలిచాడు. “ఆగండమ్మా!” అంటూ రెండు పెద్ద నల్ల ద్రాక్ష గుత్తులు, రెండు ఎర్రని ఆపిలు పండ్లు తీసి రాణికి, చంద్రప్రభకు అందిచ్చాడు రాముడు.
380 అన్వేషణ
“వీటి ఖరీదు నాకివ్వకృర్లేదండి... నాకు లాటరీ వచ్చినందుకు మీకు బహుమతి” వినయంగా నవ్వాడు రాము
చంద్రప్రభ, రాణీ అవి అందుకున్నారు మౌనంగా పోయి రిక్షాలో కూర్చున్నారు.
“నిన్ను కమలమ్మగారూ అంటాదేమిటి?” చంద్రప్రభ రాణిని ప్రశ్నించింది అమాయకంగా.
“చిన్నప్పుడు మా యింట్లో రాముడు పనిచేసేవాడు. మా నాన్నగారు బ్రతికివున్న రోజుల్లో.. అప్పుడు నన్ను కమలా అని పలిచేవారు. తర్వాత పెళ్ళయ్యాక రాణీ అని ..” సిగ్గుగా నవ్వింది రాణి...“ఆయన జ్ఞాపకార్ధం” ఆపేరు అలానే ఉంచుకున్నాను
భర్తమీది ఆమె అభిమానానికి కట్టుదిట్లాలతో సత్ర్రవర్తనతో వితంతు జీవితం గడుపుతున్న రాణి అంటే చంద్రప్రభకు గౌరవం ఆప్యాయత హెచ్చయింది.
“రాణి!...నీ నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి!” చంద్రప్రభ నిరల్మ మనస్సుతో ఆవేదనపడి ఉచ్చరించింది.
ఆ పలుకులు రాణికి మొదట ములుకుల్లా [గ్రుచ్చుకున్నా చంద్రప్రభ ముఖం పరీక్షించి తేలికగా నవ్వేసింది రాణి.
బట్టల దుకాణాల్లో చీరల ధరలు పరిశీలించి, బంగారు దుకాణాల్లో ఆభరణాల సొగసు పరిక్షించి, మెల్లిగా తొమ్మిది గంటలకు యింటికి చేరారు రాణి, చంద్రప్రభ. వాహ్యాళికి వెళ్ళి తిరిగివచ్చిన కురంగేశ్వర్రావుగారు వాలుకుర్చీలో ఆరుబయట కూర్చుని ప్రసాద్‌కు ఇంగ్లీషులో కధలు చెబుతున్నాడు.
తొమ్మిది గంటలకే యింటికి చేరిన కూతురును పలకరించాడు తండ్రి,
“అప్పుడే సినిమా అయిపోయిందమ్మా!”
“ఆ...మేము ఒక సినిమా చూద్దామని వెళ్ళాం ..తీరా టిక్కెట్టుకొని...లోపలికి వెళ్లి కూర్చునేటప్పటికి ఏదో జంతువులు, అరణ్యం సినిమా చూపించాడు ..ఆ సింహం అరుపులు, ఏనుగుల ఘీంకారాలు, సర్ఫాల బుసబుసలు చూస్తే భయమేసి మధ్యలో సినిమా విడిచి వచ్చేశాము! అంది చంద్రప్రభ గారాబంగా.
“క్క విషయం ఏమీ అమ్మతో చెప్పకు...*భావి భారత వీరనారీమణులు అభా భయపడవచ్చా!? అంటుంది” అని పకపక నవ్వారు కురంగేశ్వర్రావుగారు.
అన్వేషణ వ!
“నాన్నా మొన్న అక్కమీద రబ్బరుతోలు పడేస్తే భయపడి అరగంటసేపు గుండె పట్టుకు కూర్చుంది దదని ఆపుకోలేక!” ప్రసాద్ చిలిపిగా నవ్వేడు
“ఫ్థో... నువ్వు పెద్ద భావి భారత వీరుడిల్లా మాట్లాడుతావు?” చంద్రప్రభ కోషం అభినయిస్తూ రాణితో యింట్లోకి వెళ్లింది.
వంటలక్క భోజనాలు వడ్డించింది రాణికి, చంద్రప్రభకు.
కామేశ్వరమ్మ కారులో దిగింది బంగళాముందు. కురంగేశ్వర్రావు హాస్యంగా లేచి కామేశ్వరమ్మకు స్వాగతం చెప్పారు. ప్రసాద్ సైనికుడిలా నుంచొని తల్లికి సాల్యూట్ చేశాడు.
“బాగుంది మీ వేళాకోళం” అంటూ కామేశ్వరమ్మ వయ్యారంగా నడుస్తూ బరువైన శరీరాన్ని ఈడుస్తూ వాలు కుర్చిలో ఒక నిమిషం కూలబడింది.
“వీ కూతురు భోంచేసోంది... వెళ్లి పంక్తిలో కూర్చో! అన్నారు కురంగేశ్వర్రావుగారు.
కామేశ్వరమ్మ భోజనం పేరు చెప్పగానే మెల్లిగా లేచి కాళ్ళు, చేతులు కడుగుకొని వంట యింట్లోకి వెళ్ళింది.
“ఎక్కడి కెళ్ళావే అమ్మా గారాబంగా ప్రశ్నించింది చంద్రప్రభ,
“ఆ. .మా కార్యవర్గం అత్యవసర సమావేశం ఉంటే వెళ్ళా!”
“ఎందుకు సమావేశం! అమాయకంగా అడిగింది చంద్రప్రభ.
'మద్రాసు నుంచి మహిళా సంఘ కార్యదర్శిని యిక్కడికి వచ్చింది. రేపు ఆమె గౌరవార్థం ఒక సభ ఏర్పాటు చెయ్యాలి, ఒక్కడి సంఘం సహాయ కార్యదర్శిగా నాకుండే బాధ్యతలు లెక్కలేనన్ని!” నిట్టూర్పు విడిచింది కామేశ్వరమ్మ ప్రపంచ భారమంతా తనే మోస్తున్నట్లు
“అమ్మా! అయితే రేపు నవ్వు సభలో మాట్లాడుతావన్న మాట!” గ్రుడ్లు పెద్దవిచేసీ ఆశ్చర్యంగా అడిగింది చంద్రప్రభ
'మరే...రేపటి స్వాగత ఉపన్యాసం తయారు చెయ్యాలి ఈ రాత్రి!” నెత్తిమీద చెయ్యి వేసుకొంది కామేశ్వరమ్మ పెద్ద బరువున్నట్లు.
“చూడు రాణి! దీనికెంత పొగరో! తల్లిని అలా అంటుందా - మాతృప్రేమ ఏ కాశాన్నా లేదు!” కోపం అభినయిస్తూ పెదాల మధ్య నవ్వు బిగబెట్టింది కామేశ్వరమ్మ.
తపతి అన్వెషణ
“రేపు మీ సభకు నే వస్తానండి'” రాణి కామేశ్వరమ్మకు సంతోష పెట్టదలిచింది.
'మా అమ్మాయికంటె నువ్వు ఎన్నో రెట్లు మెరుగు!
“వోనీ ఆమెను దత్తర చేసుకో! నవ్వింది చంద్రప్రభ.
చివరకు అనే చేస్తాను! అంటూ గబగబ ముద్దలు మింగింది కామేశ్వరమ్మ
ఒక వారం గడిచింది. కురంగేశ్వరరావుగారు ప్రొద్దున్నే కాఫీ త్రాగుతూ రాణిని పిలిచారు నాంపల్లిలోని బాలికల మాధ్యమిక పారశాలలో ఆమెకు ఉపాధ్యాయిని ఉద్యోగం ఏర్పరచానని, వంద రూపాయల జీతం ఇస్తారని చెప్పారు మధ్యాహ్నం వెళ్ళి పార శాల నిర్వాహక సంఘం కార్యదర్శిని కలుసుకోమని సలహా యిచ్చారు
రాణి ఆనందానికి మెరలేకపోయింది. కురంగేశ్వర్రావుగారికి కృతజ్ఞత తెల్సింది, చంద్రప్రభ గంతులేస్తూ టీ పార్టీ ఇమ్మని అడిగింది. కామేశ్వరమ్మ సంతృప్తిగా నవ్వింది, భరట&త పలుకుబడి గర్వమూ చూపిస్తూ,
మధ్యాహ్నం రాణి యధాప్రకారం నిరాడంబరంగా దున్తులు వేసుకొని కురంగేశ్వర్రావుగారి నుంచి ఉత్తరం మొదట తీసు కొని నాంపల్లిలోని పాఠశాలకు వెళ్ళింది కార్యదర్శి యింకా రాలేదని నౌకర్లు సమాధానమిచ్చారు. ఒక గంట ఏ పనిలేక విసుగుగా కూర్చుంది. నోట్లో పైపు కాలస్తూ ఉలెన్ సూటులో, ఫేల్హాట్ పెట్టుకొని, దర్జాగా కారుదిగి, నల్ల కళ్ళజోడులోంచి పరిసరాలు పరీక్షగా చూస్తూ, రాణిని చూసి ఠీవి పెంచి తన గదిలోకి పోయి కూర్చున్నాడు భుజంగరెడ్డి. రాణి తన పేరుగల చీటి లోపలికి పంపించింది. పిలిచాడు భుజంగరెడ్డి. లోపిలికి వెళ్లి నమస్కరించి, కురంగేశ్వర్రావు గారి ఉత్తరం చూపింది రాణి. భుజంగరెడ్డి కళ్ళజోడు తీసేశాడు. సరదాగా నవ్వాడు. కాఫీ తెప్పించాడు ఆమె స్కూల్లో చేరడంతో బాలికల విద్యాభివృద్ధి నూత్న పంధాలో నడిపించబడుతుందని ఆశిస్తున్నానన్నాడు. కరచాలనం చేసి అప్పుడప్పుడు కనిపించమన్నాడు భుజంగరెడ్డి.
వొారశాల కార్యానిర్వాహక వర్గంలో కురంగేశ్వర్రావుగారు సభ్యులని తెలిసింది రాణికి. ప్రజల సహకారంతో చందాలు వసూలు చేసి ప్రభుత్వం నుంచి కొంత ధనం పొంది ప్రజలచే ఎన్నుకోబడిన కార్యనిర్వాహక సంఘం పర్యవేక్షణలో ఆ పారశాల నడుపబదుతోందని రాణి గుర్తించింది. ఏదైనా కురంగేశ్వర్రావుగారి ద్వారా లభ్యమయిన ఈ ఉద్యోగం చాలా కాలం నిలవగలదని, భుజంగరెడ్డి కూడా చాలా మర్యాదస్తుడులాగే ఉన్నాడని సంతోషించింది రాణి. ఒక్క మనిషి పొట్ట గడుపుకోడానికి ఏ ఉద్యోగమైనా
అన్వేషణ 39983 ఒకటే అనిపించినా, తన చదువుకు తగిన స్టిరత్వం గల ఉపాధ్యాయిని ఉద్యోగం లభించడంతో, నియమిత కాలంలో పనిచేసి, విరామ కాలం మరో నిర్మాణాత్మక పద్ధతిలో గడపవచ్చునని ఆశించింది. తన సంవాదన చాలావరకు తాత్కాలిక ఖర్చులకు ఉపయోగపడడమే గాని, నైతిక జీవితంలోని అవసరాలన్నీ ఎక్కువగా కురంగేశ్వర్రావు గారి కుటుంబంతోటే తనకూ లభ్యమౌతు న్నాయి. ప్రత్యేకం జీతం వస్తేగాని, బీవితం గడపదనే రోజులుపోయాయనిపించింది రాణికి
వీధిలో నడుస్తుంటే ఒక ముష్టి ముసలి స్రీ కర్ర పుచ్చుకొని, నడుం వంగి నడుస్తూ, మూల్లుతూ రిక్షా అడుగుతోంది; రాణి దృష్టిలో మరియమ్మ మెదిలింది బహుశా ఆ యింట్లోనే ఉండి ఎవరైన మరొక అమ్మాయిని చేరదీనిందో . ఎక్కడికికైనా వెళ్లిపోతుందో..ఆమె దగ్గర వున్నప్పుడు రోజు డబ్బుకు యిబ్బందే. ఆమె త్రాగుడుకు, నల్లమందుకు దబ్బు చాలక స్నేహితులను వంచించి, అందంతో ఆకర్షించి, లాలనచేసి డబ్బు గడించే తన స్టితి జ్ఞప్తికి వచ్చింది రాణికి. ఒక్కరోజు త్రాగుడు, నల్లమందు లేకపోతే పిచ్చిగా గంతులేసేది మరియమ్మ. వీధుల్లో తిరిగే ఆ బికారి ప్రీ మరియమ్మ యేమో అని పరీక్షించి చూసింది రాణి. కాదనుకొని తన దానిని నడచిపోయింది ఆలోచనలు బంధించుకొని.
రాణికి పాఠశాలలో చాలా హాయిగా జీవితం గడిచిపోతోంది. కావలసినన్ని సెలవుదినాలు, నియమితకాలంలో పని, నెల కాగానే జీతం, ఆనందం యిచ్చే బాలికల అల్లరి జీవితంలో సంతృప్తి ఇచ్చాయి. ముద్దుగా అందంగా అలంకరించుకుని, మురి షెంగా చిలిపిచేష్టలు చేస్తూ అజ్ఞానంలో నుంచి విజ్ఞానపు ప్రశ్నలు వేస్తూ, మేష్టారూ అంటూ, మితిమీరిన గౌరవం చూపిస్తూ కలకల్లాదే ఆ బాలికలు రాణికి ఎంతో కన్నులపండువగా కనిపించేవారు. ఒక్కొక్కనారి రాణి వారిని చూసి కన్నీరు పెట్టుకొనేది. జీవితంలో అటువంటి బిడ్డలతను పొందే అదృష్టం తనకు లేదని, ఒక దినం మధ్యాహ్నం భుజంగరెడ్డి పిలిచాడు రాణిని. తాను నిజాంసాగర్ ఆనకట్ట దగ్గరకు ఒక ప్రత్యేక పనిమీద వెడుతున్నానని, అచ్చటి ప్రదేశం చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుందని, కాలక్షేపానికి రాణిని కూడా తోడురమ్మని ఆహ్వానించాడు భుజంగరెడ్డి. అతని మాటల్లోని అంతరార్ధం సులువుగా [గ్రహించింది రాణి. తనకు నగరం కదలడానికి వీలులేదని ఎన్నో పనులున్నాయి క్షమించమనీ మర్యాదగా రెడ్డివద్ద శెలవు తీసుకొని బయటికి వచ్చేసింది రాజీ.
తపశ అన్వేషణ
భుజంగరెడ్డి చిన్నబుచ్చుకున్నాడు తన మాట త్రోసివేయబడిందని. ఆ పారశాలలో ఉన్న పంతులమ్మ లెవ్వరూ పూర్వం తన మాట జవదాటని పరిస్థితులలో మసిలిన రెడ్డికి, రాణి తిరస్కారం అవమానంగా కనిపించింది. తన చేతుల్లో చిక్కిన పిట్టను వేధించడం అంత కష్టమైన పనికాదనుకున్నాడు రెడ్డి
మరో వారం రోజులు దాటాక రాణి పూర్వ జీవితం కులట జీవితమని వర్ణిస్తూ రెడ్డికి ఆకాశరామన్న ఉత్తరాలు రెండు వచ్చాయి. అవి చదువుకొని కళ్ళు మిటకరించి , పైపు వెలిగించి పొగల్లోంచి ఆలోచనలు సృష్టించుకున్నాడు రెడ్డి.
అన్వేషణ 3865 15 విశాలమైన మైదానంలో స్వతంత్ర వ్యక్తుల్లా స్వేచ్చా వాయువులు పీలుస్తున్న వివిధ వృక్షాల మధ్య అద్భుత శిల్పంతో నిర్మించి ఉన్న విశ్వవిద్యాలయ భవన ప్రాంగణం దాటి స్నాతకోత్సవంలో ప్రదానం చేసిన లా పట్టాను న్యాయదండంలా చేతబుచ్చుకుని, నల్ల గౌను నల్ల టోపీ ధరించి, ఇతర స్నేహితులతో ఆనందంగా, తన విద్యా ప్రతిభను హెచ్చించే మరొక చిహ్నాన్ని పొందాననే గర్వంతో బమటికి వచ్చాడు శివరాం. ఒక చెట్టుక్రింద నిలబెట్టి, స్నాతకోత్సవ దుస్తుల్లో శివరాంను ఫోటో తీశాడు స్నేతుడుదొకడు. అద్దెకు తెచ్చిన గౌను, టోపి తిరిగి యిచ్చేసి, స్వయం సంపాదనతో నల్లకోటు కుట్టించుకోవలసిన అగత్యం గుర్తించాడు శివరాం. గతించిన రెండు సంవత్సరాలు న్యాయశాస్త్ర విద్యాభ్యాస కలాపాలత్తో, ఆఫీసులోని మితిమీరిన పనిబెడదతో, ఉత్సాహంతో అభివృద్ధి చేసుకుంటున్న చిత్రలేఖన ప్రయోగాలతో సాఫీగా నడిచి పోయింది. తీరుబడి లేకుండా లక్ష్యపూరితమైన కార్యకలాపాలు పెంచుకుని వీలైనంతవరకు రాణిని మరిచిపోయాడు శివరాం. భూమారావు, జగదీశ్వర్ కనిపించినప్పుడు రాణిని తాము నాంపల్లి ప్రాంతంలో చూచేమని యధాలాపంగా సంభాషణల్లో సూచన చేసినా, ఆమె గురించి తిరిరి ఆలోచించితే మనస్సు వికలమై, జీవిత లక్ష్యాలు వెనుకంజ వేయగలవనే భయంతో, శివరాం రాణిని చూడాలనే ఆకాంక్ష నిగ్రహించుకున్నాడు. పైగా ఒక స్త్రీ గురించి వ్యధపడి, భగ్న (ప్రేమవల్ల బాధతో మనిషి జీవితంలో ఏమి సాధించలేడనే సంగతి గుర్తించాడు శివరాం రాణి తన పరిసరాలలో కనిపించకుండా వీలైనంత వరకు తన కార్యకలాపాలు నిర్హ యించుకున్నాడు.
886 అన్వేషణ
కాని గడించిన రెండు సంవత్సరాలల్లో మేడ క్రింద కార్మికుల స్నేహం బాగా పెరిగిపోయింది శివరాంకు. ఎత్తయిన మేడ మీద ఉన్నత హోదాతో (బ్రతుకుతున్న శివరాం క్షేమసమాచారాలు ్రళ్నిస్తూ, నిమ్న జాతుల దగ్గర జేరి కలిసిమెలిసి మసలడంతో తమ తరగతి నిమ్నత్వం మరిచి, శివరాంతో గౌరవంగా సంచరిస్తు, తమ కష్ట సుఖాలు నివేదించుకునేవారు. మేడ క్రింద నివసించే పూరి గుడిసెల మనుష్యులు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తమ టబ్రతకు రీతులకు, అధమ తరగతిలో అన్ని అవసరాల లోపాలతో బాధపడుతూ దిన దిన గండం దిర్హాయుష్పులై గడిచెవారి బ్రతుకుల గతులకు ఉన్న వ్యత్యాసం గుర్తించి ఖేదపడేవాడు శివరాం జీవితంలో ఏదో క్రొత్త విజ్ఞానం నేర్చుకుంటున్నట్లు అనుభూతి పొందేవాడు శివరాం. ఆ గుడిసెల్లోని మనుష్యుల జీవితాలు పరిశీలించి.
లాండ్రీ యజమాని జనార్ధనం, క్రింద కూరలమ్మే ముసలవ్వ పోచమ్మ కిళ్లీ దుకాణం పెట్టిన మరుగుజ్జు స్త్రీ వెంకటమ్మ, బొగ్గుల దుకాణంలో బస్తాలు మోస్తు కూలా సంపాదించుకునే పెంటయ్య బట్టల మిల్లులో కూలివాడుగా పనిచేస్తున్న కిష్టయ్య, ఆస్పత్రిలో పనిచేస్తున్న శామ్యూల్, టాంగా తోలుకునే సేనయ్య, తాళాలు బాగుచేయదానికి వీధిలో తిరిగే అబ్దుల్లా, చెప్పులు కుట్టే యాదయ్య వడ్రంగి పనిచేసుకునే నరసింహులు, దర్జిపని చేసే బాలారాం శివరాం నిత్య స్నేహితులుగా మారి, వీధిలో కనిపిస్తే నమస్కారాలు పెడుతూ వీలైనప్పుడు యింట్లో కనిపించి వివిధ రకాల భోగట్లాలు తెలియజేయడం మామూలైపోయింది. వారి కష్టసుఖాలు పరిశీలిస్తూ, చేతనైన సహాయం చేస్తూ, ఆ నిమ్నజాతుల గైరవాదరణకు పాత్రుడయ్యాడు శివరాం. అతను చెప్పిన తీర్పులను, సలహాలను పాటిస్తూ, వీలైనంతవరకు ఐకమత్యం (ప్రకటిన్తూ, శివరాంను తమ నాయకుడిలా భావిస్తూ అవసరమొచ్చి నప్పుడు అతని మాట ప్రకారం ఏదైనా చెయ్యాలనే దృధవిశ్వాసం పెంపొందించుకున్నారు. ఆ నిమ్నజాతులంతా,
ఒక రోజు జనార్ధనం లక్ష్మన్నన, పులిగాడిని వెంటబెట్టుకు వచ్చాడు శివరాం దగ్గరకు. లక్ష్మన్నకు కావలసిన స్నేహితుడని పరిచయం చేశాడు జనార్ధనం పెంటయ్య అన్న రోగంతో తీసుకు చ్చిపోయాదని అతనికి సంపారం లేకపోవడంచే అతని గుడిసె కాళీగా ఉందని, ఆ గుడిసె పెంటయ్యతో చెప్పి పులిగాడికి అద్దెకు యిప్పించమని కోరాడు జనార్ధనం. ప్రక్కనే ఉన్న యినుప పని ముట్ల ఫ్యాక్టరీలో కూలివాడుగా జేరానని, యీ దగ్గర గుడిసె దొరికితే తనకు యెంతో సౌకర్యముగా ఉంటుందని మనవి చేసుకు న్నాడు పులిగాడు. శివరాం పెంటయ్యను పిలిపించి అడిగాడు. ఎవరికిద్దామా ఆ గుడిసె అని
అన్వేషణ 837 నిర్ణయం యింకా ఏమీ చేసుకోని పెంటయ్య శివరాం సలహాకు అభ్యంతరమెమీ చెప్పలేదు తనకు గుడిసె సులువుగా అద్దెకు యిప్పించేడని, శివరాంకు దణ్డం పెట్టాడు భక్తిగా పులిగాడు మర్నాడు లక్ష్మన్న గది వదిలి, గుడిసెలో ప్రవేశించాడు పులిగాడు. గుడిసెలో ప్రవేశించాక; రంగమ్మ కూడా జనార్ధనం సహకారంతో యిరుగుపొరుగు యిళ్ళల్లో దాసీ పనికి కుదిరింది.
వులిగాడికి నగరం వచ్చిక ఎంతో ఆనందం కలిగింది. తాను మునుపు ఉన్న పట్టణంకంటే ఈ నగరం ఎంతో సౌకర్యంగా కనిపించింది. కూలికూడా పుష్కలంగా దొరుకుతోంది. భార్య జీతాలు కలుపుకుంటే పులిగాదు సులువుగా ఎనఖై రూపాయలు క్రళ్ళ జూస్తున్నాడు వచ్చిన మూడు నెలలకే ఏఖై రూపాయలు దాచగలిగాడు.
లక్ష్మన్న సెలవుపూట పులిగాడి గుడిసెకు వచ్చి నగరంలోని పబ్లిక్ గార్డెన్స్, చార్మినార్, జుమ్మా మసీదు, నిజాంగారి కోట ప్రదేశం, ఎత్తెనకొండలమీది బంగళాలు హుస్సేన్‌సాగర్, సినిమాలు, మ్యూజియం, ఎన్నో చూపించాడు పులిగాడికి యీ బ్రహ్మాండ మైన కట్టడములు చూస్తోంటే ఏదో స్వర్దమే చూసినట్లనిపించేది తన కళ్ళను తానే నమ్మలేక, ఒక్కొక్క ప్రదేశంలోని వస్తువులు ముట్టుకుని, వాస్తవికత అనుభూతి పొంది, కళ్ళు పెద్దచేసి ఆనందించాడు. రకరకాల అందాల దుస్తులతో పెద్ద హోదాల్లో తిరిగే ఉన్నత తరగతుల వ్యక్తులను, అందమైన చీరల్లో ఆకర్షణీయంగా మసిలే నాగరిక నాజూకు వనితలను పరిశీలించి పులిగాడు ఏవో కలలు కనేవాడు తన భార్య గురించి, క్రొత్త వాతావరణం, పెరిగిన కూలి డబ్బులు, సునాయాసంగా అఖీంచిన గృహం, పులిగాడిలో సంతృప్తి, సుఖం హెచ్చింది, అతనిలో (క్రొత్త ఉత్సాహం మొలకెత్తించాయి.
జైనగరులో గుడిసెలో ప్రవేశించాక మందకొడిగా, ఎవరి కష్టాల్లో వారు లీనమయి, నీరసంగా బ్రతుకుతున్న పొరుగు గుడిల్లోని జనంతో కబుర్లు చెప్పి నవ్వించేవాడు పులిగాడు సెలవుదినం వస్తే నలుగురినీ పిలిచి, కోలాటం ఆదేవడు తనకు తెలిసిన నెల్లూరు జానపద పాటలతో, గుడిసెల్లోని ప్రీలంతా తమ మగవాళ్ళు విచిత్రంగా కర్రలు (త్రిప్పుతూ, ఉత్సాహంగా నృత్యం చెస్తూ కోలాటం ఆడుతుంటే కులుకుతూ కూర్చునేవారు. తీరుబడి ఉన్నప్పుడు శివరాం చోద్యంగా తన గది వరండాలో ఆ దృశ్యం చూస్తూండేవాడు.
మేడమీద కనిపంచిన శివరాంను ఒక్కొక్కసారి బ్రతిమాలి పులిగాదు తమ కోలాటం ప్రక్కనే కుర్చీవేసి శివరాంను కూర్చోపెట్టి ఆ నృత్యంలోని అనుభవాలను వర్ణించి చెప్పి, ఉత్సాహంగా కేకలేస్తూ, నర్తకుల పదాల చప్పుళ్ళు హెచ్చించే వాడు భూమిమీద విచిత్ర
3ెతె8ి అన్వేషణ వాయిద్య సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు కనిపించేది శివరాంకు గూడెంలోని కుర్రాళ్ళకు కుస్తీలు, కర్రసాము కూడా నేర్పే వాడు. పులిగాడి ప్రవర్తన గూడెంలోని జనాన్ని ఆకర్షించింది ఎక్కువ చదువు సంధ్యలు లేకపోయినా కబుర్లతో నవ్వించేవాడు పులిగాడు. పులిగాడిలో కొంత నూత్న చైతన్యం ఉందని గుర్తించాడు శివరం.
ఒకరోజు చుట్టకాలుస్తూ గుడిసెలో కూర్చున్న పులిగాడికి ఒక వింత ఆలోచన తట్టింది. తమ పేర్లు నాజూకుగాలేవని అను కన్నాడు. ఆలోచించి చటుక్కున చిటికవేసి రంగమ్మను పిలిచాడు.
“ఒసే...పెద్ద బస్తీ వచ్చాక మన పేర్లు మామూలుగా ఉండడం బాగులేదే...నా పేరు పుల్లయ్య అని మార్చేసుకుంటున్నాా. ...నీ పేరు రంగి...కుర్రాడి పేరు గోపి!” నవ్వాడు పులిగాడు.
మనిషిలో మునుపున్న నిర్లక్ష్యం, మాంద్యం, కోపం పోయి, సరసం, నవ్వు, ఉత్సాహం, సంతోషంచూసే భర్తను చూసి రంగమ్మకు లోలోపల సంతోషం పరవళ్ళు శ్రాక్కింది. “చాల్లే. .నీ పేరు, కుర్రాడి పేరు మార్చుకో...నా పేరు ఎందుకు? పేరులో ఏముంది?” రంగమ్మ వ్రేళ్ళు చిట్లించింది.
“ఏముంది!...సాగసు” పకపక నవ్వాడు పులిగాడు.
పులిగాడు “పుల్లయ్య”గా మారానని గుడిసెవాళ్ళలో ప్రచారం చేసుకున్నాడు. తన భార్యపేరు “రంగి” అని మార్చేశానని, భార్య ముందే ప్రచారంచేస్తూ వేళాకోళం చేసేవాడు పులిగాడు. గుడిసెల్లోని వాళ్ళు పులిగాడికి, భార్యకు, ఉన్న అన్యోన్యం చూసి ఆనందించేవారు.
గిరజాలు కత్తిరించి, రింగుల క్రాపు చేయించుకున్నాడు పులిగాడు. బనీనులు వదిలేసి లాగు, చొక్కా ధరించాడు. బొద్దు పొడుగు మీసాలు, సన్నగా కత్తిరించుకుని, పెదాల చివరదాకా మీసం చేసుకున్నాడు. భర్తలో క్రొత్త అందం వచ్చిందని రంగమ్మ పొంగిపోయింది.
నీరసంగా, నిరుత్సాహంగా మాంధ్యంగా, తమ బరువైన (బ్రతుకుల బాధల్లో నీమగ్నులయి కాలంగడిపే గుడిసెలోని మనుషుల్లో పులిగాడి రాకతో కొంత ఉత్సాహం, చైతన్యం, సంతోషం కలిగినట్లయింది. తనమీద విశ్వాసం గౌరవం పెంచుకుని, కష్టసుఖాలు నివేదించుకుంటూ సహాయం అర్ధిస్తున్న ఆ నిమ్నజాతులకు తన మేధా శక్తితో వారందరిలో
అన్వేషణ ఏ39 సంయుక్త కార్యక్రమాలు ఏర్పరచి, విజ్ఞాన వినోదాభివృద్ధి కలిగిస్తె, మానసికంగా భౌతికంగా ఆ నిమ్న జాతులు అభివృద్ధికి రాగలరని ఆశించాడు శివరాం తోటో మనుష్యుల "సేవలో పరమార్ధమున్నదని నమ్మి, తన విరామకాలాన్ని రాజకియాలు స్వార్ధ ప్రయోజనాలు, మనస్ఫర్ధలు పెంచే నాటక సంస్థలోకన్న పేదవాళ్ళ జీవనౌన్నత్యానికి వినియోగించడం ఉత్తమమనుకున్నాడు శివరాం.
ఒక రోజున గుడిసెలో వారందరినీ పిలిచి చిన్న సభ చేశాడు శివరాం. వ్యక్తిగతంగా చేసిన ఏ పనికన్నా కూడా సంయుక్తంగా చేసిన పని ఎక్కువ రాణిస్తుందని ఈ గుడిసెలోని జనమంతా ఒక సంఘం క్రింద ఏర్పడి సమిష్టి సౌకర్వాలు పొందుతూ, పరస్పర సహాయంతో బ్రతికితే, త్వరలో తమ జీవన ప్రమాణాన్ని బ్రతుకులోని ఆనందాన్ని వృద్ధి చేసుకోగలరని ఉపన్యసించి వారందరినీ జైనగరు నిమ్న జాతుల సంఘంగా ఏర్పరిచాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అణా చందా వసూలు చేసి ఆ వచ్చిన ధనంతో గుడిసెల్లో వాళ్ళకు కావలసిన సౌకర్వాలు, వినోదాలు జరిపించడానికి నిశ్చయించాడు. కాస్త ఉత్సాహంచూపుతూ తిరిగే పులిగాడిని వారి సంఘం పెద్దగా ఎన్నుకున్నారు అంతా. కార్యక్రమాలు శివరాం సలహాతో నడవాలని నిర్ణయించుకున్నారు.
ఆ ప్రాంతంలో ఉన్న వంద గుడిసెల యజమానుల వద్ద రెండు నెలలు చందాలు వసూలు చేసి ప్రధమంగా రాత్రి పారశాల వేయించాడు శివరాం ఆ గుడిసెల్లో నిరక్షరాస్యులకు తనకు వచ్చిన విద్యను నేర్పడానికి జనార్ధనం ముందుకు వచ్చాడు. పొరశాలకు కావలసిన చిన్న పరికరాల ఖర్చు శివరాం స్వయంగా భరించాడు పులిగాడు పారశాల నిర్వహణలో ప్రత్యేక (శ్రద్ధ తీసు కుంటున్నాడు.
గుడిసెల ప్రాంతంలో మాలిన్యం తొలగించి పరిశుభం చేయించమని స్థానిక పురపాలకులకు విజ్ఞప్తి చేశాడు శివరాం. ఆ నిమ్న జాతుల సంఘం పక్షాన, తమ గుడిసెలస్టానే త్వరలో చిన్న సిమెంటు యిళ్ళను వేయించమని, అందుకు తగిన ధనసహాయం యిప్పించమని ప్రభుత్వాన్ని అర్ధించాడు శివరాం. గుడిసెలలో కూలివాళ్ళకు సెలవు దినాలలో తోలుబొమ్మలాటలు, హరికధలు, భజనలు నృత్యాలు వర్పాటుచేసేవాడు శివరాం.
శివరాం దృక్పధంలో పేదవాళ్ళ బ్రతుకులు మెదిలేవి, నిత్యమూ సాధన చేస్తున్న చిత్రలేఖనంలో ఈ దృక్పధ ప్రభావం పదక మానలేదు. అందమైన సుందరుల స్వరూవాలు హాయి గొలిపే వెలుగునీడల (ప్రకృతి దృశ్వాలవైపు దృష్టి మునుపు మొగ్గించిన శివరాం,
340 అన్వేషణ బీదల దుర్భర దురంత విషాదం జీవిత రీతులు నూత్న ప్రయోగాలతో చిత్రలేఖనంలో ప్రవేశపెట్టెవాడు
సంప్రదాయబద్ధ కళారీతుల్లో రేఖా విన్యాస ప్రాముఖ్యతలో సౌష్టవ ప్రదర్శనలిచ్చే రూవాలు వదిలి, యాదృచ్చికమైన ప్రధమ సందర్శనంలో మనస్సుమిద (ప్రభావం గలిగించిన భావసముదాయం ఆధారంగా ఆకృతులు తీర్చి చిత్రించడం మొదలు పెట్టాడు శివరాం. పనిచేసే వండ్రంగి, కుమ్మరి, జోళ్ళు కుట్టేవారి దైనిక శ్రమ, మిల్లులో పనిచేసే కార్మికులు దృశ్యాలు, జామపళ్ళు అమ్ముతూ బండితోసేవారి నదక, పుల్లాకులమీద కుక్కలు, మందులతోపాటు బిచ్చగాడి పోరాటం మురికికూపాల పూరిగుడిసెలు ఆస్పత్రిలోని రోగుల దృశ్యాలు, బొగ్గు బస్తా మోసే కూలివాడి బరువు, ఇంట్లోని కుటుంబం ఆకలి తల్చుకుంటూ గుల్టంతోలే టాంగావాడు, ఇనుప పనిముట్ల ఫ్యాక్టరీ కాంపొందులో ఇనుపతుక్కుపై గోనుగుడ్డలు పరుచుకు కూర్చుని మాసిన దుస్తులతో, మాసిన ముఖాలతో, చెమట బిందువులతో సానుభూతికరంగా కనిపిస్తూ విరామ కాలంలో కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగే కార్మికులు, సమ్మెలు చేసేటప్పుడు కార్మికుల నినాదాలతో చేసే ఊరేగింపులు, నాయకులు ఉపన్వాసాలిచ్చే కార్మికుల జీర్ణ వస్తాకారాలు గుంపులు, సంతలో కూరగాయలు, పళ్ళు అమ్మే దుకాణాలు, వీధిలోని విద్యుద్దీప స్తంభాలు బాగుచేస్తున్న ప్రభుత్వ నౌకరు, పెన్సిలు స్కెచ్చింగుతో, ఇం(పెషనిజం, క్యూవబీజం, సిద్ధాంతాలతో శివరాం చిత్రాలు రూపొందించసాగాడు బొమ్మలు గీసేటప్పుడు ప్రక్క యింటి పిల్లలు యింట్లో చొరబడి, ఏదో అందమైన బొమ్మ పట్టుకుపోయేవారు హస్తాలు మారిన ఆ బొమ్మ, చివరకు దాని విలువలు అర్ధంకాని దుకాణదారుని చేతుత్తోపడి ఏ చింతపండు పొట్లం ద్వారానే కళనర్ధం చేసుకోగలిగిన విద్యావంతుల యిండ్ల లోకి పోయేది.
నగర చిత్రలేఖన ప్రదర్శనాల్లో, రాష్ట్ర చిత్రలేఖన ఉత్సవాల్లో శివరాం తన చిత్రాలు పంపించి (పేక్షకుల ప్రశంసలు, నిర్ణేతల బహుమతులు పొందాడు వీధిలో హార్మోనియం వాయిస్తు పాటలతో భిక్షం అడుగుకునే కురాడ్రి బొమ్మ, చెట్టుక్రింద గారడిచేస్తు తన స్వంత కుమారుడి నాలిక కోసేసి (పేక్షకులున భయపెడుతూ ముష్టి అడుక్కునే దృశ్యం, శివరాం బహుమతి పొందిన చిత్రాలు, చిత్రలేఖనా కళా నైపుణ్యంలో కొంత ప్రాశస్త్యము పొందినా, తాను గీసిన చిత్రాలు చూచి జనం పొగడుతున్నా కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పొందలేకపోయాడు. శివరాం సరైన ప్రచార సాధనాలు ఉపయోగించుకునే కృత్రిమ ప్రవర్తన అలవరచుకోలేక.
అన్వేషణ తశ]
శివరాంలో ఏర్పడిన మానసిక పరిణామాలు, ప్రాపంచిక (ప్రవర్తనలో కూడా వ్రతిఫలించాయి. అనహాయులైన పేదవాళ్ళమీద దయ, నవనాగరిక యువతులమీద నిర్ణయ పెరిగిబోయాయి. నాగరిక యువతుల పరిసరాలు త్యజించుకుంటూ దూరంగా మసిలాడు శివరా౨. కళాశాలలోని విద్యార్ధినులుగాని, నాటకాలతో మునుపు ఎరిగిన నటీమణులు గాని, పొరుగిళ్ళలో తన మేడ వెనుక నివసించే కంట్రాక్టరులు, ఇంటి యజమానుల స్త్రీలు గాని తాత్కాలికంగా పలకరించినా ముభావంగా ఉండడం నేర్చాడు శివరాం. అతని ముభావ (ప్రవర్ష్మనవల్ల అతన్ని అభిమానించే స్తీ సమాజమే దూరమైపోయింది.
ఒక రోజు బస్సులో ఎక్కుతున్నాడు శివరాం. బస్సు ఎక్కే జనం రద్దీలో, పెదాలకు రంగు, ముఖానికి స్నో పొడర్లు దట్టంగా వేసుకొని సిల్కుచీర సింగారించుకున్న ఒక నవనాగరిక యువతికి శివరాం చెయ్యి వొారవాటున తగిలింది. బస్సులో ప్రధమంగా ఎక్కిన శివరాంకు స్టలందొరికి కూర్చున్నాడు. ఆ యువతి తరువాత బస్సులో ప్రవేశించి స్టలంలేక నిలుచుంది శివరాం ప్రక్కన కూర్చున్న ప్రయాణీకుడు ఆ యువతి నిలుచుందని, స్త్రీని గౌరవించాలని నిలుచున్నాడు. శివరాం కూడా లేచి తన స్థలం కూడా ఖాళీచేస్తాదని ఆశతో, శివరాం లేవలేదు కందక్టరు ఆ పరిస్థితి గుర్తించి, ఆ యువతి రక్షణకు వచ్చి ఆ సీటు కాళీచేసి ఆ యువతికి ఇవ్వమని మర్యాదగా సలహా ఇచ్చాడు శివారం మొండిగా లేవలేదు బస్సులోని ప్రయాణీకులంతా శివరాం వైపు ఆశ్చర్యంగా చూశారు. కండక్టరు శివరాంను మళ్ళీ మర్యాదగా (బ్రతిమాలేడు.
“సమాన హక్కులుకోరే నవనాగరిక స్రీలకు సానుభూతి చూపనకృర్తేదు. బస్సుల్లో స్టలంలేనప్పుడు మగవాళ్ళు నుంచోరూ?... అల్లాగే ఆడవాళ్ళూ నుంచోవచ్చు. సమాన హక్షులు పొందే నాగరిక ప్రీలు సమాన బాధ్యతలు, బాధలు కూడా భరించాలి!” శివరాం తీవ్రంగా అని చలనం లేకుండా తన సీటులో కూర్చున్నాడు.
అంతవరకు వింతగా చూస్తున్న బస్సులోని ప్రయాణీకులు శివరాం మాటల్లోని సత్యాన్ని గుర్తించి ఆ యువతివైపు హేళనగా చూసి, శివరాం ప్రవర్తనకు హర్షం చూపారు లేచి నిలుచున్న ప్రయాణీకుడు తిరిగి వచ్చి తన సీటులో కూర్చున్నాడు మర్యాదగా సలహాలిచ్చిన కందక్టరు మారు మాటాడక టికృట్లు చించడంలో నిమగ్నుడైపోయాడు. బస్సు వేగం నడకలో తూలుతూ బాధగా నిలుచోక తప్పలేదు నవనాగరిక యువతికి.
ప్రశ్ష2 అన్వేషణ
మరో దినంలోస్త్టానిక రైలుబండి కాచిగూడ వెడుతున్నాడు శివరాం అతను కూర్చున్న పెట్టెలో నిండా జనం కూర్చున్నారు. సీతాఫల్ మండిలో తెలంగాణ (గ్రామీణరైతు ఒకడు పంచె ఎగగట్టి బనీను వేసుకుని, కంబళి భుజాన తగిలించి, చేత కర్రబట్సి చుట్ట కాలుస్తూ శివరాం ఉన్న పెట్టెలోకి వచ్చాడు అన్ని సీట్లు నిండి ఉన్నాయి. ఒక యూరోపియన్ శ్వేత వనిత 'ప్రక్శనే రెండు సీట్లు ఖాలీగా ఉన్నాయి. ఆ తెలంగాణ రైతు తిన్నగా పోయి ఆమె ప్రక్కన కూర్చుని కంబళి చివరలతో ఆమె శరీరాన్ని రాపిడిచేస్తూ కర్ర మొదలు ఆమె కాళ్ళమిద తగిలిస్తు చుట్ట పొగలు వదులుతూ, అమాయకంగా స్వంత యింట్లో ఉన్నట్లు కూర్చున్నాడు. శుభ్రంగా సిల్కు గౌనులో అందంగా అలంకరించుకుని, నాజూకుగా కూర్చున్న ఆ యూరోపియన్ స్త్రీకి తెలంగాణ రైతు కంటకంగా కనిపించాడు తన సౌందర్యం, “గాంభీర్యం గౌరవం ప్రతిష్ట ఆ రైతువల్ల భగ్నమవుతున్నట్లు బాధపడి గట్టిగా కసిరింది ఆ అమాయక రైతు అయోమయంగా, భయంగా లేచిపోయి దూరంగా నిలుచునానడు. ఆ శ్వేత వనిత ప్రవర్తన శివరాంకు కోసం కలిగించింది టిక్కెట్టు కొన్న ప్రతివానికి రైలులో నియమించబడిన ప్రతి పెట్టెలోను ఎక్కడైనా కూర్చొనే హక్కు ఉన్నప్పుడు జాతి గాంభీర్యం ప్రద రిస్తూ, పరదేశీయురాలు స్వదేశవాసుని అవమానించడం భరిపంరాని విషయంగా తోచింది. శివరాం తక్షణం తన సీటు కాళీచేసి తెలంగాణ రైతును కూర్చోబెట్టి, తాను వెళ్ళి శ్వేత వనిత ప్రక్కన కూర్చున్నాడు. శ్వేతవనిత శివరాంను అపాదమస్తకం ఒక క్షణం రీవిగా పరిశీలించి ఊరుకుంది.
“నేను అందంగా ఉన్నానా?” వ్యంగ్యంగా ప్రశ్నించాడు ఆ వనితను ఇంగ్లీషులో,
ఆ శ్వేత వనిత చిరాకుగా చూసింది అతని ప్రశ్చకు.
“నీల్రాగే టిక్కట్టు కొన్న రైతుని పొమ్మని బెదిరించడం చాలా అన్యాయం. అతనికీ న్ ప్రకృనే కూర్చునే హక్కు వుంది!” అంటూ శివరాం ఆ రైతును తీసుకువెళ్ళి శ్వేతవనిత (ప్రక్కన కూర్చాపెట్టాడు.
ఈ చిత్రం పరిశీలిస్తున్న జనం శివలాం ప్రవర్తనలోని స్వదేశాఖిమానం ప్రశంసిస్తూ శ్వేతవనిత వైపు హేళనగా నవ్వారు. ఆ నవ్వులతో శ్వేతవనిత ముఖం కుంచించుకు పోయింది. తెలంగాణ రైతు ఆ పరిస్థితి అర్ధంకాకపోయినా, శ్వేత వనితను చూచి బెదరకుండా స్వేచ్చగా కూర్చున్నాడు తన సీటులో.
అహింసా సిద్ధాంతాల నపార్ధం చేసుకుని, పూర్తిగా సాత్విక తత్వం పెంచుకుని, అవసర సమయాలలో కూడా వీరోచిత విప్లవ భావాలను అణగత్రొక్కుకుంటూ
అన్వేషణ తతత స్వతంత్రాలోచన మాని బూజుపట్టి న పురాతన మెదడులతోనే మారుతున్న పరిస్థితులలో కూడా నడిచే మనవాళ్ళ మందకొడి బతుకులకు స్వస్తి ఎప్పుడు కలుగుతుందా అనే యోచనలో పడ్డాడు శివరాం,
ఈ విప్లవభావాలు అతనిలో బాగా వ్రేళ్ళు నాటుకుపోయి, ఆఫీసులో కూడా శివరాం ప్రవర్తనలో మొలకెత్తాయి కంపెనీ యజమాని మితిమీరిన ఉద్యోగహోదా చూపిస్తూ గుమాస్తాలనందరిని భయపెడుతూ క్రూరంగా సెలవుదినాలలో పనిచేయిస్తూ నౌకర్లను తన గృహకార్యాలకు నిరయగా ఉపయోగించుకుంటూ, తన ప్రాపకం కోరినవారి పెద్ద పదవుల అవకాశాలు కల్పిస్తూ ప్రవర్తించడం శివరాంలో ఉక్రోషం కలిగించింది. గుమాసాల సంవుం ఎర్పరచడానికి ప్రయత్నించాడు. కొందరు గుమాసాలు శివరాంలో ఏకీభవించలేదు. మిగిలినవారి సహకారం లభించగానే కంపెనీ యజమాని ప్రవర్తనపై నిరసన తెలుపుతూ సమ్మె ప్రకటించాడు శివరాం. సమ్మె చేసేవారిని ఉద్యోగాలలోంచి తక్షణం తొలగిస్తానని కంపెనీ యజమాని బెదరించాడు. సమ్మె ముందు రోజువరకు సహకారం చూపిన్తామని ఐక్యత ప్రదర్శించిన గుమాస్తాలు సమ్మె దినాన శివరాంకు ద్రోహంచేసి ఆఫీసుకు వెళ్ళారు. ఇటువంటి పిరికితనమున్న గుమాస్తాల బ్రతుకులు కొన్ని తరాలు గడిచినా బాగుపడదం అసంభవమనుకున్నాడు శివరాం. సమ్మె ప్రకటన ఫలితంగా శివరాంను ఉద్యోగం నుంచి తొలగించాడు కంపెనీ యజమాని.
న్యాయ విద్యాభ్యాసం యింకా పూర్తికాకుండానే ఉద్యోగం పోవడంతో శివరాం దైనిక జీవన (ప్రమాణానికి కొంత నష్టం కలిగింది. అనేక ఖర్చులు తగ్గించుకోవలసి వచ్చింది. బ్రహ్మయ్యగ్గారికి తెలియజేస్తే తనకు నెలా నెలా కొంత సొమ్ము వచ్చే దారి కనిపించినా, ఉద్యోగం పోయిందనే అసంతృప్తి వార్త ఆయనకు అందించడం శివరాంకు యిష్టంలేకపోయింది. కష్టపడి చిత్రాలు ఎక్కువ గీసి పత్రికలకు పంపించి ధనం సంపాదించేవాడు. బజారులో తన చిత్రాలు అమ్మించేవాడు. దుకాణదారులచేత, బట్టల దుకాణంలో పద్దులు చూస్తూ ఒక గంట, ప్రసిద్ధ ఎగుమతి దిగుమతి వ్యాపారస్తుల కంపెనీలో ఉత్తరాలు టైపుచేస్తూ ఒక గంట ఎరుగున్న స్నేహితుల పిల్లలకు ఇంకో గంట పారాలు చెప్పి, జీవనోపాధి సంపాదించేవాడు శివరాం.
“లా, డిగ్రీ లభించగానే తన ఉద్యోగం రాజీనామా చేసి లాయరు వృత్తి అలలంబింప తల్చుకున్నానని అందుకు తగిన ధన సహాయం అర్ధిస్తున్నాొనని శివరాం బ్రహ్మయ్యగారికి ఉత్తరం వ్రాశాడు. బ్రహ్మయ్యగారి ఆనందానికి మేరలేకపోయింది మనుమడు కష్టపడి న్యాయపరీక్షలో ఉత్తీర్ణుడై సమాజంలో ఉన్నత పరపతి పొందడానికి వకీలు వృత్తి
ఏశ్షశ అన్వేషణ అవలంబించడం తన కుటుంబ గౌరవ ్రతిష్టలనే యినుమదింపచెస్తాయని గర్వపడ్డారు. తన పేరని ఉన్న రెండు ఎకరాలు భూమి అమ్మేసి అయిదువేల రూపాయలు శివరాంకు పంపించారు బ్రహ్మయ్యగారు భూములు తమ్ముడి కోసం తాతయ్య అమ్మేశాడని విన్న వెంకటేశ్వర్లు లోలోపల అసూయతో బాధపడ్డాడు పార్వతమ్మ భర్తను, మందకొడి ప్రవర్తనకు నిత్య గుమాస్తా జీవితానికి, నిరసిస్తూ పెద్ద ఘోష చేస్తూ సాధించింది.
బ్రహ్మయ్యగారు పంపిన ధనం శివరాంకు చాలా ఆధారమైంది తాతయ్య సహాయానికి శివరాం అభిమానంతో కృతజ్ఞతలు తెలియజేశాడు. మరో నాల్లు కుర్చీలు, ఒక పెద్ద మేజాబల్ల, నాల్దు అద్దాల బీరువాలు, వెయ్యి రూపాయలు విలువగల లా (గ్రంధాలు కొన్నాడు శివరాం ఇంట్లోని ముందుగది లాయరు ఆఫీసు గదిలా మార్చించేశాడు సుప్రసిద్ధ లాయరు రామచంద్రరావు వద్ద వృత్తి అనుభవాల శథ్రూష పొందదానికి చేరాడు శివరాం
లాయరు రామచంద్రరావు న్యాయవాద వృత్తిలో ఒడుదుడుకులు చూశాడు. వృత్తి ప్రారంభించిన రోజుల్లో అనుభవమున్న తదితర లాయర్లతో పోటీచేసి అభివృద్ధికి రావడం. తర్వాత అయిదు సంవత్సరాలు పుష్కలంగా ధనం సంపాదించడం, ఆ పిదప లా కళాశాలల ద్వారా పట్టాలు వొందిన యువకులు న్యాయవాద రంగంలో పెరిగి పోవడంతో లావాదేవీలు వివిధ తరగతుల వకీళ్ళకు పంపకములు, తన పలుకుబడి కొంత తగ్గడం శివరాంకు మొదట బోధన చేశాడు. వృత్తిలోని అభివృద్ధి పూర్తిగా వ్యక్తి యొక్క ప్రతిభమీదే కాక అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుందని నుడివాడు రామచంద్రరావు.
ఆస్తీ పంపకాలు, చెడు ప్రవర్తనలు, కొట్లాటలు, పరుపునష్టం నిందలు, అప్పుల ఎగవేతలు, దొంగతనాలు విషప్రయోగ హత్యలు మొదలయిన వివాదాలు రామచంద్రరావు పరిష్కారం చేసేవాడు. కేసు ఓడిపోయినా, నెగ్గినా, వివాదాలలో చిక్కుకుని తను ఉపయోగించుకునే వ్యక్తి వద్ద మాత్రం ఎప్పుడూ కేసు నెగ్గుతుందనే మాట్లాడుతూ, ఒక కోర్టులో కేసుపోతే, మరో పెద్ద కోర్టులో దావా వేయవచ్చని సలహా చెబుతూ, విలైనంతవరకు స్వప్రయోజనం, స్వార్దపరత్వమే పరమావధిగా పెట్టుకుని ధనం సంపాదించే వాడు. అసలు లాయరు జీవితంలోని రహస్యమే యిది, అని బోధచేశాదు రామచంద్రరావు శివరాంకు.
రామచంద్రరావు బోధన శివరాంకు నచ్చలేదు. అయినా వివాద పరిష్కారరీతులు, కోర్టులో వకీలుగా నిర్వర్తింగవలసిన విద్యుక్త ధర్మాలు కొంతకాలం నేర్చుకోవడం తప్పనిసరి
అన్వేషణ 345 అయింది. ధనం సంపాదనకోసం వకీలు వృత్తి నడిపించుకునే బాధ్యత తనదే కాబట్టి రామచం(ద్రరావు నీతిసూత్రాలు ప్రస్తుతం వినవలసిన అగత్యంలేదని పెడచెవిన పెట్టాడు శివరాం.
ప్రప్రధమంగా ఒకరోజు రామచంద్రరావుతో కలిసి హైకోర్టుకు వెళ్లాడు శివరాం. చుట్టూ కాంపౌండులో చెట్ల (క్రింద గుంపులుగా నిలబడి దావా విషయాలు మాట్లాడుకుంటూ, ఘర్షణపడుతూ, కోపోద్రేకాల తీవ్రత చూపిస్తూ నిలుచున్నారు కోర్టు వ్యవహారాలతలో చిక్కుకున్న వ్యక్తులు, లాయర్లు నల్లకోటు, తెల్లటైలు ధరించి కారుల్లో దిగి తమ గదులు చేరుకున్నారు
చిన్న చిన్న గుమాస్తాలు అక్కడక్కడ కలం సిరాబుడ్దులతో మరకల గోనుగుడ్డ చిన్న కరణం పెట్టె పెట్టుకు నిరక్షరాస్య అమాయకులకు దరఖాస్తులు వ్రాసి పెడుతున్నారు ఒక లాయరు అబద్దాలు పలికే ట్రెయినింగు యిచ్చి తీసుకువచ్చిన సాక్షులకు నాక్షి చెప్పవలసిన విధానం తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఏవిధంగానైనా పొట్టపోషణ చేసుకోవాలని అబద్దాల సాక్ష్యాల కలవాటుపడి, అదే వృత్తిగా పెట్టుకున్న తల నెరసిన ముసలివాళ్ళు యిద్దరు హడావిడిగా యిటూ అటూ తిరుగుతున్నారు. వచ్చే లాయర్ల దృష్టిని పడాలనుకుంటూ, క్రొత్తగా వృత్తి అవంబించిన యువక లాయర్లు కేసులు లేక, వివాదాలలో చిక్కుకున్న వ్యక్తులన తమంత తామే పలకరిస్తు పరిచయం చేసుకుంటూ ఒక అణా పిడత క్రింద పప్పు కొనుక్కుని తింటూ కాలక్షేపం చేస్తున్నారు. హైకోర్టు భవ నంలో గుమాసాలు కాగితాల దొంతరలు మేజాబల్లమీద తిరగవేస్తు గబగబ ఏవో రాసిస్తూ బంట్రోతులను పిలుసూ కాగితాలు అందిస్తున్నారు ఒకచోట న్యాయమూర్తిగారు వాదించే లాయరు ఉపన్వాసం వింటున్నాడు చెమటలు కక్కుకుంటూ, పెద్ద పుస్త కాలలోని నియమాలు వల్లిస్తు, కంగారుపడుతూ, వచ్చె దగ్గు ఆపుకుంటూ, శుష్కవాదన చేస్తున్న ఆ లాయరును చూసి, జడ్జి నతలో తాను నవ్వుకుంటున్నాడు. పోలీసు యిన స్పెక్టర్లు, ప్రభుత్వ న్యాయవాదులతో తాము జప్తు చేసిన కేసులు పరీక్షించుకుంటు న్నారు.
చిన్న కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు వరకు తన కేసు దావా వేయించి, చివరకు ఉన్న ఆస్తి కాస్తా తినేసి, కేసు నెగ్గించని న్యాయవాది మీది ఉక్రోషంతో ఉడికిపోతూ, బ్రతుకులో దివాలా తీసే స్థితి ఏర్పడిందంటూ దుఃఖం ఆపుకోలేకపోయాడు ఒక ఆసామీ.
ఒక వితంతువును, బావగారు తనకు మనువర్తి యివ్వటం లేదంటూ, తనకు న్యాయరీత్యా రావలసిన మనువర్తి గురించి న్యాయ సూత్రాలు పూర్తిగా తెలుసుకున్నట్లు
త్శ46 అన్వేషణ గట్టిగా మాట్లాడుతూ తన కేసు వాయిదా పడగా, నిర్ణయించుకున్న వకీలును నిలబెట్టి అరుస్తు సాగదిస్తోంది న్యాయమూర్తుల తీర్పులు విని దావాలలో ఓడిపోయిన వ్యక్తులు నియమించుకున్న లాయర్ల అశక్తతకు వారిని తిడుతూ తమ దురదృష్యానికి దురిసిల్లుతూ మెట్లు దిగుతున్నారు. కేసు నెగ్గిన న్యాయవాది ఒకడు విజయం గురించి గట్టగా 'ప్రకటిస్తు చుట్టు ప్రక్కల జనంవైపు చూశాడు తన్ను గొప్ప లాయరుగా గుర్తించమని. ఒక లాయరు గురించి వెతుక్కుంటూ వస్తున్న బిళ్ల పంచె శాస్తులు గారిని మరొక లాయరు పిలిచి వచ్చిన పని అడిగి ఆ కేసు తన కిప్పించిన తప్పకుండా నెగ్గించే బాధ్యత తీసుకుంటానంటూ ఘంటాపధంగా నొక్కి చెబుతున్నాడు.
తనకు తెలిసిన లాయర్షనందరినీ శివరాంకు పరిచయం చేశాడు రామచంద్రరావు కొందరు లాయర్లు ముభావంగా అతని ముఖం చూసి ఊరుకున్నారు. మరికొందరు అతని జోక్యం పట్టించుకోనేలేదు ప్రతీ వకీలు తన పనిలో నిమగ్నుడైపోయి. తీరిక లేనట్టు ప్రవర్తిస్తున్నాడు.
హైకోర్టులోని వకీళ్ళందరిలో పేరు ప్రతిష్టలు హెచ్చుగా సంపాదించిన చంద్రశేఖరం తన కుర్చీలో తలకు అందమైన తల పాగా చుట్టుకుని బిళ్లపంచె కట్టి తెల్లని పొడుగాటి 'షేర్వానీలో నిమీలిత నేత్రుదై కొగితాల్లో మునిగి ఆలోచనల్లో కనిపించాడు ఆయనకు న్యాయమూర్తుల దగ్గర ఉన్న పలుకుబడి గ్రహించిన ఇతర వకీళ్ళు ఆయన ప్రాపకానికి ప్రాకులాద సాగారు. చంద్రశేఖ రం కోర్టు నుంచి పోతున్నప్పుడు ఎరుగున్న లాయర్లంతా మెట్లదాకా వెళ్ళి నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నారు. ఏవో సంభాషణలు మెదుపుతూ చంద్రశేఖరం రెండు గుర్రాల పెద్దబండి ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూడగానే విచిత్రమైన ఆలోచన తట్టింది. తాను ప్రాక్టీసు మొదలు పెట్టాక హైకోర్టుకు రావలసిన ప్రధమ దినాల్లో ఏమి చెయ్యవలసిందీ ఊహించుకున్నాడు శివరాం.
రామచంద్రరావు ఆశీర్వచనంతో స్వతంత్రంగా ప్రాక్టీసు పెట్టాడు శివరాం. అప్పటికే ప్రజారంగంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వ్యక్తిత్వ ఖ్యాతి ఆర్జించడం జైనగరులోని కార్మికుల కష్ట సుఖాలు చూడడం పలుకుబడి వ్యాపించడం వృత్తికి దోహదం చేశాయి.
మొట్టమొదటిసారిగా హైకోర్టుకు బయలుదేరాడు శివరాం. చంద్రశేఖరంలాగే దుస్తులు ధరించి ఆయన బండిలాంటిదే ఒక గుర్రాల కోచ్ అద్దెకు తీసుకుని, సరిగ్గా చం(ద్రశేఖరం వచ్చే సమయానికి పదినిముషాల ముందు హైకోర్టు కాంపొండులో ప్రవేశించాడు శివరాం. చం(ద్రశేఖరం వచ్చారనే ఆశతో లాయర్లంతా కోచి ముందుకు
అన్వేషణ క్రిశ్స7 వచ్చి సుస్వాగతమిస్తు నిలుచున్నారు. శివరాం దిగాడు లాయర్లు ఆశ్చర్యపోయారు ఎవరీ వ్యక్తి అని రామచంద్రరావు ద్వారా పరిచయం పొందిన కొందరు లాయర్లు శివరాం చమత్కారమైన రాకకు కడుపుబ్బ నవ్వుకున్నారు ఈ వింత విషయం అందరు లాయర్లకు ప్రచారమైపోయి శివరాం అందరి దృష్టిని ప్రధమంగానే ఆకర్షించాడు.
వాదించవలసిన కేసు జాగ్రత్తగా పరిశీలించి, మొదట కొద్దిగా భయంతో వణికినా, భయం ని(గ్రహించుకుని, వాదించి నెగ్గాడు శివరాం అతని (ప్రధమ విజయం చూసి కొందరు ముసలి లాయర్లు ఆశ్చర్యపడి అభినందించారు. గుర్రాల బండిలో నిషమించాడు శివరాం. తనతో బహిరంగంగా పోటీ మొదలు పెట్టిన శివరాం అంటే చంద్రశేఖరానికి ఒక వింత ఆవ్వ్యాయత ఐర్పడింది.
చం(ద్రశేఖరం ప్రాపకం శివరాం అయాచితంగా పొందగలిగాడు తనకు వచ్చే చిన్న కేసులన్నీ శివరాంకు యిప్పిస్తానని వాగ్జానం చేశాడు చంద్రశేఖరం. ఆయన సలహాలు పొందుతూ వృత్తిలో త్వరితంగా (ప్రతిభ సంపాదించాడు శివరాం
వృత్తిలో విజయరీ పొందుతూ పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకున్న శివరాం తీసుకున్న కేసులు, చేసే న్యాయవాదం వార్తా పత్రికల నాకర్షించాయి తన వృత్తికి కావలసిన ప్రచారం కూడా ఆయాాచితంగానే లభిస్తోందని సంతోషించాడు శివరాం.
ఒక రోజు ఆఫీసు గదిలో కూర్చుని తీవ్రంగా ఒక కేసు గురించి ఆలోచిస్తున్నాడు శివరాం. నల్లపిల్లి వచ్చి శివరాం ఎదురుగా కుర్పీలోకి ఎగిరి కూర్చుంది. మేజాబల్లమీద కాగితాలు తలత్రిప్తుకుంటూ పరీక్షిస్తు నల్లటి ఆకారంతో తెల్లటి మెడక్రింద చారతో తెల్ల కాళ్ళతో కూర్చున్న పిల్లి తన సలహాలు వినడానికి వచ్చిన చిన్న వయస్సు లాయరులా కనిపించింది శివరాంకు.
కిటికీల్లోంచి తొంగి చూస్తు లోపలికి వచ్చి మిద్దెమీద క్రింద ఎగురుతూ. *'చుప్ చుప్ ధ్వనులతో పొట్లాడుకుంటూ శివరాం మేజా బల్ల మీదుగా ఏటవాలుగా వస్తు తమ వివాదాలు కూడా పరిష్కారం చెయ్యమంటున్నాయి పిచికలు రెండు. అలమరులో (త్రుప్పుపడుతున్న వెండి కప్పులు, శివరాం చూపిస్తున్న నిర్లక్ష్యానికి పరువునష్టం దావా వేస్తామంటూ బెదిరిస్తున్నాయి. కిటికీ తలుపు లకు కట్టిన తెర తన్ను దూసుకు లోలోపలకు చొరబడిన సూర్యకాంతిపై కోపగించి నా కేసు పరీక్షించి యీ అన్యాయం రూపుమాప మని రెపరెపలాడుతూ గందరగోళం చేసోంది వరండాలో నిలబడి కాకి, దైవం తనకు కోకిలలా తియ్యని స్వరం యివ్వకపోవడం అన్యాయమంటూ, తన కేసు పరీక్షించమని
348 అన్వేషణ అరుస్తోంది ఒక ఎలక కంగారుగా గదిలోకి పరుగెత్తుకువచ్చి శివరాంవైపు తొంగి చూసి, తాము నివసించవలసిన యింట్లో ఒక నల్ల పిల్లికి స్థానం ఇవ్వడం అన్యాయమంటూ నసిగిపోయింది అరిగిపోయిన చెప్పులు నిర్ణయగా తమ్ము కాలు క్రిందబెట్టి ఈదృడం అన్యాయం కదా అని జులిగా చూస్తున్నాయి సత్యాన్నే ఉద్దరించమంటూ మేజా బల్లమిద మూడు కోతుల బొమ్మ బోధ చేస్తున్నాయి. ద్వారానికి వ్రేలాడుతున్న తెల్ల గళ్ళ నల్ల తెర న్యాయాన్ని మా శివరాం యిప్పిస్తాడంటూ ఆనందంతో నృత్యం చేసోంది
శివరాం సిగరెట్టు వెలిగించాడు. ఆలోచనల మధ్య, పొగలు వదిలి నల్లపిల్లి ముఖం మీదకు ఊదాడు. కళ్ళు మిటకరించి నాలికతో మీసాలు దువ్వుకుని నవ్వింది నల్లపిల్లి. ఆప్యాయంగా ఒళ్లోకి తీసుకున్నాడు నల్లపిల్లి అతని మూతిమీదకు మూతి పెట్టి సిగరెట్టు దమ్ములు కావాలన్నట్లు ముఖం పెట్టింది. శివరాం వారించాడు. కాళ్ళతో మేజామీద కాగితాలు త్రిప్పి శివరాం వ్రాసే వ్రాతలు సరిగా ఉన్నదీ లేనిదీ ఒక క్షణం పరిశీలించింది. నల్లపిల్లి 'మ్యావ్” మని అబ్బ ఎంత బాగా రాశావు అన్నట్లు శివరాం ముఖంలోకి చూసింది నల్లపిల్లి ఖులాసాగా.
నల్లపిల్లిని కుర్సీలో వదిలేశాడు శివరాం తనపని చూసుకోవాలని. వంటింట్లో ఏదో పళ్ళెం క్రిందపడిన చప్పుడయింది. కుర్చీలో తీరిగ్గా పడుకుని ఆవలిస్తున్న నల్లపిల్లి ఒక్క దుముకు దుముకి లోపలికి పరుగెత్తింది. ఆ చప్పుడుకు కారణమేమిటను కుంటూ, ఒంటరిగా ఉన్న శివరాం పనిలో నిమగ్బుడై తీరుబడి లేనప్పుడు తక్కిన యింటి విషయాలు చక్కబెట్టకోవలసిన బాధ్యత తనదే అన్నట్లు, వంటింట్లో ఎలకల కదలికలవల్ల క్రిందపడిన పళ్ళాన్ని పరిశీలించి, ప్రమాదమేమీ జరగలేదని ఠీవిగా తల ఊపింది నల్లపిల్లి.
వీధి తలుపు చప్పుదడయింది. తలుపు తీయగానే టెలిగ్రాం అందిచ్చాడు ఒకతను శివరాంకు. నల్లపిల్లి శివరాం కాళ్ళదగ్గర నిలుచుంది వచ్చిన అగంతకుని పరిశీలిస్తూ అందించిన కవరు పరీక్షిస్తు నిలుచుంది. టెలిగ్రాం చదువుకుని శివరాం ఆనందంతో గెంతాడు. నల్లపిల్లిని గబుక్కున ఎత్తుకుని ముద్దాడాడు. ఒళ్ళు గట్టిగా నలిపేయకన్నట్లు “మ్యావ్ మ్యావ్” మంటూ అరిచింది నల్లపిల్లి. శివరాం చేతులు విదిలించుకుని క్రిందకుదూకి నేలమీద తోక ఆడిస్తూ విచిత్రంగా గెంతింది నల్లపిల్లి శివరాం ఆనందం తాను పంచుకున్నట్టు.
అఖిల భారత చిత్రలేఖన ప్రదర్శన పోటీకి శివరాం “పేద స్వరాలు” పేరుతో చిత్ర మొకటి పంపించాడు. సితార్, తబల, గజ్జెలు మోగుతున్నాయ. వాయిద్యకర్తల చుట్టూ
అన్వెషణ 343 ఆవరించుకున్న గుడిసెలు, గుడిసెలముందు కూర్చుని సంగీతం ఆలపిస్తున్న పేదవారి గుంపులు, పూర్వ పద్ధతులలో నిర్దిష్ట వస్తుభాండారము త్రోసిపుచ్చి వర్ణలయ నిర్మాణముతో ప్రత్యేక ప్రతిభ నూత్నత్వము ప్రతిఫలించింది శివరాం చిత్రం ధన రూపంలో వెయ్యి రూపాయలు ప్రధమ బహుమతిగా లభించిందనే సంతోషంకన్నా కళారంగంలో తానుచేసే నూత్న ప్రయోగం విలువలు ప్రముఖులు గుర్తిస్తున్నారనే ఆనందం పొందాడు శివరాం.
వార్తా పత్రికలు “పేద స్వరాలు” చిత్రాన్ని ప్రకటించి, శివరాం ఫోటో ప్రచురించి, అతని జీవిత సంగ్రహం, చిత్రలేఖన రంగంలో అతని ప్రత్యేక (ప్రతిభ, మునుపు బహుమతి పొందిన చిత్రాల విశిష్టత పొగిడాయి. ఢిల్లీలో జరిపిన పెద్దల సభలో పెద్ద పదవిలో ఉన్న ప్రముఖ రాజకీయవేత్త చేత బహుమతులు యిప్పించారు. బహుమతి ప్రదానంచేస్తూ చిత్రలేఖనంలో యింకా నూత్న ప్రయోగాలు భారతదేశంలో వర్ధిల్లాలని ఆశీర్వదించాడు రాజకీయవేత్త శివరాంకు నగరంలో సన్నానాలు చేశాయి తన కృషి గురించి ముక్తసరిగా మాట్లాడి, సభల్లోని ప్రేక్షకుల నోట్ కోరినట్లు సంతకాలు చేసి ఆనందంగా పూల దండలు చేతులకు తగిలించుకుని యింటికి వచ్చేడు ఇంట్లో గృహిణిలేకున్నా మల్లెపూల దండలు మోసుకువస్తున్న శివరాంను చూసి పొరుగింటి అమ్మలక్కలు ఏమిటో గుసగుసలాడు కున్నారు తలుపులు తీయగా నల్లపిల్లి మెడ చాచి ఎగురుతూ స్వాగతమిచ్చింది. సన్మాన గౌరవాల చిహ్నాలైన పూలదండల సందుకునే గృహిణీ తన గృహంలో లేదనే సంతాపం లిప్త మాత్రం శివరాంను వేధించింది చేతిలోని దండలు పిల్లి మెడలో వేసి, ఎత్తుకుని అభిమానంతో లాలించాడు శివరాం,
వార్తాపత్రికల్లో శివరాం ఫోటోచూసి జనార్ధనం పరుగున మేడమీదకు వచ్చాడు. తన అభినందనలు కూడా తెలియజేశాడు. తన నిత్యకృత్యాల్లో సహాయంచేస్తూ, స్వీయ జీవితగతులు కొంత అర్ధం చేసుకున్న జనార్ధనానికి తన మనోవేదన హాస్యంగానైనా తెలియపరచకుండా ఉండలేకపోయాడు.
“మనిషికి జీవితంలో ఎప్పుడు ఏది అనుభవించే యోగ్యతుంటే అది తప్పకుండా లభిస్తుంది; కోరికలు ఈదేరనప్పుడు కుమలడం మానవ సహజం కాని ఆ సమయంలో తన కోరికలు ఈడేరి ఆనందం పొందే యోగ్యత తనకు యింకా రాలేదని మనిషి గుర్తించుకోవాలి ... మీలాంటి వారికి గృహిణి దొరకడం కష్టంకాదు. కాని పరిస్థితుల ప్రభావంవల్ల ఏర్పడిన ఒంటరి జీవితంలో మానవుడు చెయ్యవలసిన కార్యాలు పూర్తిఅయితే కాని, విమోచనం లభించును!” జార్దనం వేదాంతిలా మాట్లాడాడు.
త్50 అన్వేషణ
జనార్ధనం ఉపన్యాసధోరణిలో శివరాం ప్రధమంగా విన్నాడు నిమ్న తరగతివాడైన జనార్దనం కూడా కొద్ది విద్యాగంధంతోనె విపులంగా వేదాంతవిషయాలు మాట్లాదడం కొంచెం శివరాంకు ఆశ్చర్యపరచినా, జనార్ధనం మీద అతనికి గౌరవాన్ని యినుమడింప చేసింది. పరిచయం పెరిగాక జనార్దనం ప్రతి సంభాషణలో ఒక జీవితసిద్ద్ధాంతం ప్రతిపాదించడం శివరాం గమనిస్తూనే వున్నాడు. ప్రొద్దున్నే రాజవ్వ పనిలోకి రావడం మానేసింది, తన పిల్లవాడికి జబ్బుగా వుందని, పులిగాడు రంగమ్మను పంవాడు శివరాం యింట్లో పనిచేయడానికి నాల్గు రోజులు పోయాక రాజవ్వ యింటికి వచ్చింది ఎడుస్తూ, తన పిల్లవాడికి ఏదో పెద్దవ్యాధి అంకురించిందనీ, డాకటరు దగ్గర మందులు తీసుకోడానికి రెండునెలలు జీతం సాయం చెయ్యమని కోరింది. నల్లని ఆకారంలో ముఖభంగిమలే స్పష్టంకాని ముద్దముఖంలో విషాదం పేరుకొనగానే రాజవ్వ రూపులో ఏదో కళానైపుణ్యం ప్రదర్శించ వచ్చుకున్నాడు శివరాం తన కళాత్మక భావాలు వదిలి, వాస్తవికతకువచ్చి, తనకు నిత్యము సేవచేసే నౌకర్ల సుఖదుఃఖాలలో సహాయం చెయ్యడం తన ధర్మమని శివరాం రాజవ్వకు మూడునెలలు జీతం ముందుగా యిచ్చేశాడు. మరో వారంరోజులు గడిచాక రాజవ్వ మళ్ళీ యింటిముందు ప్రత్యక్షమయి నిలుచుంది శోకదేవతలా, అంతకుముందే రంగమ్మ చెప్పింది రాజవ్వకొడుకు చనిపోయాడని. బలహీనమైన మానసిక తత్వంలో గాఢమైన మమతలు పెంచుకుని దరిద్రంలో (బ్రతికే పేద వాళ్ళమనోవ్యధలకు అంతంలేదనిపించింది, జాతిలోనే పాతుకుపోయిన బీదరికాన్ని కాని బీదరికంద్వారా ఉదయించే బాధలనుకాని, ఒక్క మనిషి తొంగించడం అసాధ్యమైన పనిగా భావించాడు శివరాం తన సహాయం వృధాఅయి, రాజవ్వ క్షోభ పెరిగి పోయినందుకు చింతించి ఆమెను పరామర్శించాడు. మర్నాడు వచ్చి పనిలోచేరింది రాజవ్వ. పనిచేసిన రోజులకు ఇచ్చిన డబ్బు తీసుకొని సంతోషంగా నిష్క్రమించింది రంగమ్మ
కూరలమ్మే పోచయ్య, కొదుకు కల్యాణానికి ధనమేమైనాసర్టుబాటుచెయ్యమని అర్ధించింది. మరుగుజ్జు వెంకటమ్మ రాత్రి తన కిళ్ళీ దుకాణములో సోడాలు, సిగరెట్టలు దొంగతనం చేశారని శివరాంకు ఫిర్యాదు చేసింది. బొగ్గులు మోసే పెంటయ్య వానలో బొగ్గువాసల దుర్షంధములో ఆరోగ్యం చెడగొట్టుకుని మంచంపట్టాడు. బట్టల మిల్లులో పనిచేసే కిష్టయ్యు పొరబాటున మిల్లుమరల్లోకి చెయ్యిదూర్చికొని (వ్రేళ్ళను పోగొట్టుకున్నాడు. అఫీసరుకు కోపంవచ్చి విశాఖపట్నం తన్ను బదిలీచేశారని ఆస్పత్రిలో పనిచేసే శామ్యూల్ వచ్చి మొత్తుకున్నాడు శివరాం దగ్గర. తాళాలుచేసి (బ్రతికే అబ్బుల్లా తన జీవితానికి సరిపడే డబ్బు లభించటం లేదని, ఎక్కడైన నౌకరు ఉద్యోగం ఇప్పించమని మనవి
అన్వేషణ 351 చేసుకున్నాడు చాలాసార్లు. చెప్పులు కుట్టే యాదయ్య, వడ్రంగిపనిచేసే నర్సింహులు క్రొత్త స్వంతపనులేవైనా యిచ్చి ధనసహాయం చెయ్యమని కోరారు. దర్జీ బలరాం మేడ (క్రిందభాగంలో ఏదైనా ఒక దుకాణం ఇంటి యజమానితో చెప్పి ఇప్పించమని వేడుకున్నాడు. ఆ నిమ్నజాతుల కష్టాలు వినికరిగిపోయేది శివరాం మనస్సు, తనకు తోచినంత సాయం చేసే వాడు శివరాం.
ఇంటియజమాని సేర్జీ అప్పుడప్పుడు అద్దెభాగాల్లోకి వచ్చి పరిశీలించేవాడు. అద్దెకున్న వాళ్ళు మేడను సరిగా చూస్తున్నారా లేదా అని. ఎనభై వేల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన పెద్ద బంగళావరుసల్లో నెలకు సుఖంగా అయిదువందల రూపాయీలు వసూలు చేసుకుంటూ నూనె వర్తకంద్వారా వేలుపోగుచేసి లక్షాధికారి అయిన సేర్జీలో ధనం మీద మమకారం ఇంకా ఎక్కువ పెరిగిపోయి, అద్దెల్లో ఒక్క కాని తగ్గించడానికి వీలులేదనేవాడు అద్దెలోంచి ఒక్కకానీ కూడా ఖర్చుపెట్టి ఇల్లుకు వెల్ల వేయించేవాడు కాదు. పోనీ వచ్చిన ఆదాయంలో అవసరంగా ఒక్కకాని ఎక్కువ ఖర్చు పెట్టి విలువగలదుస్తులు కాని, ఉత్తమైన భోజనంకాని చెయ్యలేదు సేర్జీ. దరిద్రంతో బాధపడుతూ వీధిలో బజ్జీ లమ్ముకునే చెల్లెలుకే సహాయం చెయ్య నిరాకరించాడు. కాని స్నేహితులను అప్పుడప్పుడు అద్దె భాగాల్లోకి తీసుకువచ్చి చూపుతూ తాను కష్టపడి కట్టించిన బంగళా గొప్పతనాన్ని బంగళాల్లోకి జనం కారుల్లో వస్తూ పోతూ పరిసరాల గుడి సెలతో తమకు ప్రసక్తే లేనట్లు తమ మేడలమీదినుంచి ఆకాశంలోనే చూస్తూ ఆనందించేవారు. గుడిసెల్లో కొట్లాటలు జరిగికేకలు వినిపిస్తున్నప్పుడు వినోదాల పేరిట నృత్యాలు, హరికథలు జరిగినప్పుడు, కూలివాళ్ళ వింత గంతులు చూసి నవ్వుకుంటూ ఆనందించేవారు. సమాజంలోని తరగతుల్లో ఆర్ధిక, వ్యత్యాసాలు పోయి సమానత్వం వాస్తవిక రూపంలో ఎప్పుడు వస్తుందో అని బాధపడేవాడు శివరాం.
ఒకరోజు లక్ష్మయ్య, అంకయ్యను తీసికొని శివరాం వద్దకు వచ్చాడు. అంకయ్య నగరంలోని బట్టల మిల్లుల కార్మికుల సంఘానికి కార్యదర్శి అని పరిచయం చేశాడు లక్ష్మన్న “మా అధ్యక్షుడు ద్రోహం చేశాడు. వేతనాలు హెచ్చించమని ఎంతో కాలంనుంచి ఆందోళన చేస్తున్నాం. మిల్లు యజమానులు ఏదో సాకు చెబుతూ కాలం గడుపుతున్నారు. కార్యవర్గంలో తీర్మానించి నగరమంతా సమ్మె చేయించాలని మొదట నిశ్చయించాం. మా అధ్యక్షుడిని మిల్లు యజమానులు బుట్టలో వేసుకొన్నారు. అతని కొక ఆఫీసరు పదవి ప్రసాదించారు దానికి ఆశపడి కార్మికులలో చీలికలు తెచ్చి యజమానులు కార్మికుల కోర్కెలు ఒప్పుకున్నారని అబద్ధం చెప్పి, ఆఖరి నిమిశంలో సమ్మె విధ్వంసం చేశాడు.”
త్రర్2 అన్వేషణ ఉ(దేకంతో అంకయ్య కంపించిబోయాడు. అంకయ్య నిజాయితీ మనిషిలా గోచరించాడు శివరాంకు సంఘాలు సాపించి, తద్వారా స్వార్ధ ప్రయోజనాలు పొందే నీచ నాయకులు (ప్రజాస్వామ్యం పేరిట పెరుగుతున్న చీడపురుగు లనుకున్నాడు శివరాం.
“మీ సహాయం అర్జించడానికి వచ్చాం .. మీరు జైనగరు పేటలో కార్మికులకు చేసే సేవ మాకు తెలుసు .. మీరు మా సంఘం అధ్యక్షులుగా వుండి కార్మికుల కోర్కెలు తీర్చే బాధ్యత వహించాలి!” అంకయ్య మాటల్లో కార్మిక రోదనం ప్రతిధ్వనించింది. అంకయ్య ఆహ్వానం తన ఆశయాల కనుగుణ్యమని అంగీకరించాడు శివరాం.
బట్టల మిల్లు కార్మికుల సభ జరిగింది. మునుపటి అథ్యక్షుడు కొందరి కార్మిక నాయకులను అండ చేర్చుకుని అధ్యక్షపదవికి పోటీ పెట్టించాడు సభలో. అంకయ్య తన బలాన్ని కూడగట్టుకుని తీవ్రంగా కృషి చేశాడు శివరాంను నెగ్గించాలని. శివరాం సంఘంలోని ప్రతికార్మికుణ్ణి కలుసుకున్నాడు. జైనగరులోంచి పులిగాడు, జనార్దనం, కిష్టయ్య, యాదయ్య, నరసింహులు, సేనయ్య పనికట్టుకువచ్చి ఎరుగున్న కార్మిక స్నేహితులకు శివరాంను నెగ్గించమని బోదచేశారు. జైనగర్ గూడెంలో శీవరాం చేసిన "సేవ వెనోళ్ళ పొగిడారు. అధ్యక్షుని శివరాం అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. నూత్న కార్యవర్గంలో సమ్మె చెయ్యాలని తీర్మానించాడు శివరాం. ఆమెదించబడింది తీర్మానం బట్టలమిల్లు కార్మికులు యుద్దానికి నడిచే సైనికుల్లా ఉత్సాహంగా ఊరేగింపు లేవదిశారు ఊరేగింపు ప్రవాహంలో ఎర్ర తలపాగాలు తేలాయి. స్వయంగా ఊరేగింపు నడిపించాడు శివరాం.
మిల్లు యజమానులు గుమిగూడి సభచేసేముందు కార్యక్రమం ఆలోచించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు. బయటనుంచి కార్మికులను తీసుకురావాలని నిర్ణయించారు. ప్రభుత్వ సహాయంతో వీలైతే సంధి చేసుకోవాలని ఆశించాడు.
సమ్మె ప్రారంభ మయింది. కార్మికులు పనిలోకి వెళ్ళడం మానేశారు చెట్ల క్రింద గుంపులుగా కూర్చుని తమస్థితిగతులు చర్చించుకుంటున్నారు. శివరాం, అంకయ్య, మరికొంత ఉత్సాహులై సహకార్శ్మిక నాయకులతో మిల్లుల ఎదుట పర్యటిస్తూ - కొత్తకూలి వాళ్ళు లోపలికి పోకుండా కాపలా కాశారు. పోలీసులు లారీలు పుచ్చుకుని, ప్రమాద
పరిస్థితులు ఏర్పడకుండా చూడడానికి లారీల్లో దిగారు. ప్రతిదినం కార్మికుల సబలు జరిపి, వారికి, నీరసం రాకుండా ఉద్రేకంగా ఉపన్వాసాలిస్తూ, కష్టాలు పడే కార్మికులతో మరణించడానికి కూడా తాము సిద్దంగా వున్నామని హెచ్చరించాడు.
అన్వేషణ 853
సమ్మె వారం రోజులు కట్టుదిట్టంగా జరిగింది బట్టల మిల్లులు పనిలేక విరామం పొందుతున్నాయి మిల్లు యజమానులు నాష్తాలు భరించలేక ఆయాసంగా మూల్లారు ప్రభుత్వం తరపున ఆఫీసర్లు శివరాంతో ప్రసంగిందారు సమ్మె మానమని, త్వరలో వేతనాల సంగతి పరిశీలిస్తామని, పరిశీలనకంటే నిర్దుష్ట ప్రకటన కావాలన్నాడు వేతనాల హెచ్చింపు విషయంలో శివరాం.
మిల్లు యజమానులు మరింత మొండితనం వహించారు. కార్మికుల గుడీ సెల్లో జనం ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లలు ఏడ్చారు గృహిణులు కన్నీరు కార్చరు. ఆకలితో మంచాలు పట్టారు వృద్ధులు. మొక్కజొన్నలు తిని నీరు త్రాగేరు యువకులు. ఇళ్ళల్లో ఖాళీగా మూలపడివున్నాయి కుండలు. నిశ్శబ్దముగా, మౌనముగా నిల్చున్నాయి గుడిసెలు. క్షామం వ్యాపించి నట్లయింది. కార్మికుల ఆర్ధిక పరిస్థితిలో ప్రతిష్ట్టైభవ ఎర్బ్చడింది సమ్మె మానెయ్యాలనే తీవ్రపరిస్టితి ఎదురైంది.
శివరాంకు తన ప్రతిష్టకే భంగం వాటిల్లేలాగ కనిపించింది ప్రజలవద్దక్షు పోయ చందాలు వసూలుచేశాడు అంకయ్య, జనార్ధనం సహాయంతో. వచ్చిన చందాలు కార్మికుల గుడిసెల్లో సర్ది, కొంత ఆకలి తగ్గెలా ప్రయత్నించాడు.
సమ్మె పరాకాష్ట అందుకోవాలంటే శివరాంకు ఒకేమార్ల్గం కనపించింది. నిరసనపత్రం పూనాలని నిశ్చయించాడు. అంకయ్య అతన్ని అనుసరించాడు. మిల్లు ఎదుట చింతచెట్టు క్రింద కూర్చున్నారిద్దరు పత్రికలు సమ్మెగురించి ఘోషిస్తూ వ్రాశాయి. కార్మిక నాయకుల నిరసనవ్రత దీక్షపై సంపాదకీయాలు ప్రకటించాయి.
నగరంలోని రాజకీయ వాతావరణం అట్టుడికి పోయింది. ఇతర కార్మిక సంఘాలు సానుభూతిగా ఊరేగింపులు లేవదీశాయి తమ సంఘాల నిల్వ సొమ్ములోంచి ధనం యిచ్చి. సమ్మె నడుపుతున్న కార్మికులకు భోజన వసతులు కల్పించడానికి ప్రయిత్నించాయి.
నిరాహారంఒక్షతో శివరాం నీరసించి పోయాడు. డాక్టరు అతని ఆరోగ్యం ప్రమాదకర మన్నాడు. కార్మికులలో చైతన్యం ఉప్పొంగింది. ఉదేకాలతో కేకలువేశారు. నాయకుడి జీవితం అంతం అవుతే మిల్లు యజమానుల జీవితాలు కూడా అంతం కాగలవని అరిచారు. మిల్లులే విధ్వంసం చేస్తామని కేకలేశారు. నిరసనవ్రత ప్రదేశంలో కార్మికులు గుంపులుగా చేరి కిటకిట లాడారు ఉ(దేకాలతో ఊగిపోతూ.
మిల్లు యజమానులు (్రభుత్వరక్షణ కోరారు. ప్రభుత్వం ఒక (ప్రముఖ రాజకీయ వేత్తను పంపించారు పరిస్థితి పరిష్క్మరించమని. చివరికి మిల్లు యజమానులు తమతమ
354 అన్వేషణ లాభాలు పంచక తప్పదన్నాడు రాజకీయవేత్త. నీల్దుతూ అసంతృప్తిగా ఒప్పుకున్నారు. మల్లు యజమానులు
సమ్మె ఆగిపోయింది శివరాం, అంకయ్య నిరహార దిక్ష విడిచారు రామచంద్రరావు, చంద్రశేఖరం యితర స్నేహితులు శివరాంకు అభినందనలు పంపించారు రాజారావు, చక్రవర్తి, శివరాం నిరాహారదీక్ష పట్టినరోజుల్లో వచ్చి ఏమిటి విచిత్రమనీ, కులాసాగా గపడవలసిన జీవితంలో స్వయంకృతంగా కష్టాలు తెచ్చుకోడం దెనికని సలహా యిచ్చారు. సమ్మె పరాజయమౌతుందనుకొన్న వ్యక్తులు నిరాశచెంది, శివరాం విజయానికి అసూయపద్డారు.
శివరాం ఆరోగ్యం బాగా చెడిపోయింది. నిరసనవ్రత నీరసం శరీరాన్నంతా తినేసింది. భోజనం చేసినా మామూలుగా జీర్ణం కావడంలేదు. మొదట కొద్దిగా జ్వరం వచ్చి తీవ్రమయింది. తర్వాత డాక్టరు వచ్చి పలకరించి క్షేమం ప్రశ్నించారు. జనార్దనం మరదులందిచ్చి, బత్తాయి తెచ్చి, వేన్నీళ్ళుకాచి, స్వయంగా దగ్గఅవుండి కనిపెట్టి చూశాడు. స్వీయ జీవితంలో ఏదో శూన్యం ఏర్పడినట్లు శివరాం భావించాడు. అయినా జనార్దనం తన లాండ్రీ పని మానుకొని, రాత్రీ పగలనక, వార్ధక్యం లెక్కసేయక తనకు చేస్తున్న సేవ అపారమని గుర్తించాడు శివరాం.
నల్లపిల్లి కూడా శివరాం క్షేమ సమాచారాలు ్రశ్నిస్తున్నట్లు ప్రతినిమిషం ఎదురుగా కూర్చొని 'మ్యావ్ మ్యావ్' మంటూండేది. ఏమైనా పెట్టినా మూతితో వాసనచూసి వదిలేది. కాని తినేదికాదు బత్తాయిపండ్లు దొర్తిస్తూ, శివరాం ముందుకి తెచ్చి పడేసేది. జనార్దనం అవసరం శివరాంకు ఏర్పడినపుడు అతని లాండ్రీలోకి పరుగెత్తుకువెళ్ళి మ్యావ్అంటూ జనార్ధనాన్ని పిలిచి యింట్లోకి తీసుకువచ్చేది. మనిషిగా యింట్లో ప్రవర్తిస్తూ, శివరాం పరిస్టితుల కనుగుణ్యంగా మసలుతూ నల్లపిల్లి అతనితో సన్నిహితమైన బాంధవ్యం బర్పరచుకొంది.
పదిహేనుదినాలు గడిచాక శివరాం తన పూర్తి ఆరోగ్యం కోలుకున్నాడు. యధావిధిగా దైనిక కార్యక్రమాల్లో నిమగ్నుడై పోయాడు.
ఒకనాడు ఈశ్వరయ్య శివరాం దగ్గరకు వచ్చాడు. అతివినయంగా నవ్వుతూ నమస్కరించాడు. చాలాకాలానికి కనిపించిన ఈశ్వరయ్యను, మునుపటి నాటక రాజకీయాలు విస్మరించి అభిమానంతో పలకరించాడు శివరాం, నాటక సమితి కార్యకలాపాలు (ప్రశ్నించాడు. “గంధర్వనాటక సమితి అధఃపతనం పొంది
అన్వేషణ వె5్త్ విచ్చిన్నమైవోయింది ఆఖరి నాటకం “ద్రోహం” 'ప్రదర్శించాం. నారయ్య, వెంకట్రావులు ఎంతో [ద్రోహం చేశాడు నాకు, నటకులలో చీలికలు తెచ్చి, తమ బలం పెంచుకుని, పెద్దవాత్రలు వాళ్ళు తీసుకొని, సీచపాత్ర నాకిచ్చారు చందాలరూపంగా ఎంతో ధనం దోచేశారు నారయ్య, వెంకట్రావులు. చివరికి నాటకం పాడైపోయింది. ధనం దోతి, గంధర్వ నాటక సమితి ద్రోహం చేసిందన్నారు ప్రేక్షకులంతా నారయ్య, వెంకట్రావు అంత పరమద్రోహులనుకోలేదు ఎప్పుడూ!” బాధతో ముఖం చిట్లించి, దురంత విషాదంలో గంభీరంగా మూల్గుతున్న నటకుడిలా నిట్టూర్పు విడిచి, సిగరెట్టు పొగలు వదలి, కన్నీటి కొలకుల్లో 60డు నీటిచుక్కలు నింప, తన కళాత్మక జీవితానికే ద్రోహం జరిగినంత ఫోదం చూపించాడు ఈశ్వరయ్య,
ఈశ్వరయ్య తత్వంలో, కాలం మార్పులో ఏ క్రొత్తదనం కనిపించలేదు నాటకాల గొడవలు, పాత్రల రూపాలు, స్నేహితుల ప్రదర్శనలు, నాటకసంస్థల న్ట్థాపన తప్ప మరో విషయం ్రస్తావించగలిగినట్లు కన్పించలేదు ఈశ్వరయ్య చేరిన రంగంలో ప్రత్యేక కృషి సల్పి, ప్రతిభకూడా పొందలేక పోయడాతను. బెతైడు గోచీనే ప్రతి నిమిషం ఇస్త్రీ చేస్తున్నట్లు, ఈశ్వరయ్య తన వాతావరణం పరిమితం చేసుకొని ఎదుగా బొదుగూ లేని జీవితంతో, భావాలతో సతమతమౌతున్నట్లు కనిపించాడు శివరాంకు. పురోభివృద్ది లేని సంకుచిత జీవితాలపై సానుభూతి ఒకటే.చూపించాలనుకుంటూ తనలో నవ్వుకున్నాడు శివరాం. “ఇంతకూ చెప్పే దేమిటంటే... నువ్వు చాలా పెద్ద హోదాల్లోకి పోయావు. పరువు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు సంఘంలో గణించావు. నువ్వు బాగుపడడం చూసి నిజంగా నేను సంతోషిస్తున్నాను ఈ శుభసమయంలో మరొక మంచి నాటకసంస్థ స్థాపించి, నీ అధ్యక్షతలో అవిరళకృషి చెయ్యాలని నాక ఆశకల్లింది!” ఈశ్వరయ్య వినయంగా చేతులు నలుపుతూ వెకిలిగా నవ్వాడు.
ఒక తరగతినుంచి మరొక ఉన్న తరగతి సమాజంలో పోవాలంటే, వ్వక్తి చెయ్యవలసిన పోరాటం సామాన్యం కాదని ఈశ్వరయ్య తన పురోభివృద్ధిలో గుర్తించినా, తన స్వార్ధం వచ్చేటప్పటికి తనలాగే మనలుతూ, తనతోనే మళ్ళీ తిరగమని అర్ధించడం శివరాంకు హాస్యాస్పందంగా కనిపించింది. గంధర్వ నాటకసంస్థ న్వాపించిన రోజుల్లో ఈశ్వరయ్య కుత్సిత ప్రవర్తన శివరాంకు యింకా మరుపు రాలేదు. అతన్ని దూరంగా ఉంచడమే శ్రేయస్కరమనుకున్నాడు శివరాం.
356 అన్వేషణ
“వేను నాటకరంగం నుంచి విరమించాను.. ఎవరైనా ఇంకా పెద్దవాళ్లని అధ్యక్షుణ్ణి చేసి సంస్థ స్థాపించుకో , నేను చెయ్యగల సహాయం యితర విధాలుగా తప్పక చెస్తాగ” అంటూ శివరాం తప్పించుకోబోయాడు.
ఈశ్వరయ్య శివరాం అధ్యక్షుడుగా ఉండవలసిన అగత్యం గురించి అరగంట ఉపన్యసించాడు. శివరాం చివరకు వినకవోగా (బ్రతిమిలాడాడు. చివరకు శివరాం అంగీకారం దుర్లభమని నిశ్చయించుకొని, ఈశ్వరయ్య అతి వినయంగా నమస్కరిస్తూ హోదాపెరిగిన శివరాంలో గర్వం పెరిగిందనుకుంటూ నిష్క్రమించాడు.
నగరంలోకి సాయంత్రం వాహ్యాళికి బయలుదేరేడు శివరాం. బజారులో నారయ్య క్రొత్తగా పెట్టిన రేడియోల దుకాణం కనిపించింది. లోపలినుంచి రేడియో కర్నాటక సంగీతం వినిపిస్తోంది నారయ్యను చూసి చాలా రోజులయిందని, దుకాణంలోకి తాత్కాలికంగా అడుగుపెట్టాడు శివరాం.
శివరాంను చూచి నారయ్య లోవల గందరగోళంలోంచి వినమతతో గౌరవపురస్పరంగా చేతులు జోడిస్తూ, బయటికి వచ్చి ఆహ్వానించాడు.
“ఊరకరారు మహాత్ములు” నవ్వాడు నారయ్య,
“నీ క్రాత్త దుకాణం చూడాలని ఇలా వచ్చాను.”
“వాల సంతోషం... ఎక్కడా, కనిపించడమే మానేశారు... అయినా పెద్ద హోదాల్లో లాయరుగా (బ్రతుకుతూ, అంతస్థులు పెంచుకున్న పూర్వస్నేహితుడు కలుసుకోవడం కష్టమే...మీకు బహుమతు లొచ్చాయని విన్నాను .. మీ ఉపన్యాసాలు చదివాను .. మీ సన్నానాలకు ఆనందించాను...మీరు నడిపించిన దిగ్విజయమైం సమ్మెలు చూసి హర్షించాను. ఎప్పుడో చూస్తుండగా యి నగరానికి పాలకులౌతారంటే అతిశయోక్తికాదు... నిజం చెప్పాలంటే మా అందరిలోనూ బాగా పురోభివృద్దికి వచ్చి బాగుపడినవారిలో మీ రొక్కరే కనిపిస్తున్నారు.”
నారయ్య వాక్ధోరణి గంగాప్రవాహంలా వడిగా నాజూకుగా నడిచింది.
తక్షణం యింట్లోంచి కాఫీ తెప్పించాడు శివరాం కోసం.
నారయ్య నాటక కార్యక్రమాల్ని గురించి ప్రశ్నించాడు శివరాం.
అన్వేషణ 357
“ఈశ్వరయ్య మహా దుర్మార్గుడు. అంత నీచబుద్ధి ఎవరికీ ఉండదనుకోండి. కాస్త సంస్థ బాగ్గుపడుతోందంటే నటకులలో ఏవో చీలికలు తెచ్చి డబ్బు తినెయ్యాలని చూస్తాడు. (ప్రజాసంస్థల్లో ధనం దోపిడి జరిగితే ఎంతకాలం నిలుస్తాయి?... తాను స్థాపించిన నాటక సంస్థ తన చేతులతోనే భస్మం చేశాడండి . ఇటువంటి వాళ్ళను ప్రజాసంస్థల్లో చీడ పురుగులుగా గుర్తించి గెంటెయ్యాలి!” ఆవేశంలో కేకలేశాడు నారయ్య,
కాఫీ తెచ్చిన కుర్రాడు జాలిగా, బుగ్గలమీద కన్నీటిచారలతో తడిసిన కళ్ళతో దీనంగా భయంగా నిలుచున్నాడు కుర్రాడి వగనం చూడగానే శివరాం ఆత్మీయత, అనుభూతి పొందాడు. శారద వదనంలోని రూపురేఖల లాలిత్యంతో లేతముఖంతో, చెరిగిన క్రాపుతో జాలి చూపులతో కనిపించాడు.
“నేను వచ్చేటప్పటికి ఏమిటి గందరగోళం జరుగుతోంది.... ఎవరినో కొడు తున్నావు” యధాలాపంగా అదిగాడు శివరాం.
*“...ఈ కురాడు పనిలోచేరి నాల్గు నెలలయింది... ఇప్పటికీ సరిగా పని నేర్చుకోలేదు... పైగా అన్నీ పాడు చేస్తాడు. అజా[గ్రత్తగా మందకొడిగా ఉంటాడు... రేడియో ఎత్తి తీసుకురారా అంటే క్రింద పదేశాడు, రేడియో బీటలుపడింది.” అంతవరకూ కుర్రాడి మీద పిర్వాదుచేసి, తాను కుర్రాడిని చావగొట్టిన విషయం (మింగేశాడు నారయ్య. శివరాం మాత్రం ఆ విషయం అర్ధం చేసుకున్నాడు.
“రేపటినుంచి వీడిని పనిలో మాన్పించేస్తాను. నీ ఎరుకలో ఎవరైనా కుర్రాడు ఉంటే పంచుదూ!” బ్రతిమాలే ధోరణిలో నవ్వుముఖం పెట్టాడు.
శివరాం కుర్రాడిని పిలిచాడు.
నీ పేరు?”
న
“ఎక్కడుంటావు!”
“జైనగరులో”
“వీ బాబు పేరు”
కస్పులి గాడు.
358 అన్వేషణ
శివరాంకు గోపిమీద అభిమానం హెచ్చయింది తన యింటి ఎదురు గుడిసెలో ఉండే కుర్రాడినే గుర్తు పట్టలేక పోయింనదుకు కించపడ్డాడు శివరాం. పగలల్లా బయటికిపోతున్న గోపిని ఎక్కువగా శివరాంచూసే అవకాశం కలగలేదు.
“అయితే కుగర్రాడిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నా వన్నమాట'! నవ్వాడు శివరాం
“అవును... యింక నేను భరించలేను . రోజుకు వీడివల్ల వందరూపాయలు నష్టం! సాగదీసుకున్నాడు నారయ్య
'అయితే రేపటినుంచి మాయింటికి వచ్చి పనిచెయ్యి"
గోపివైెపు నవ్వుతూ చూశాడు శివరాం.
“ఆ పెద్ద బంగళాకదండీ!” కుర్రాడు జూలిగా నవ్వాడు.
నారయ్యకు హృదయంలో శూలం[గ్రుచ్చు కున్నట్లయింది. ఇంతవరకు సాదరంగా తన పిర్యాదులు వింటూన్న శివరాం గోపిమీద జాలిచూపగానే తన్ను నెరస్థుడుగా నిర్ణయించినట్లు బాధపడ్డాడు నారయ్య,
నారయ్య మనోవెదన గమనించి నవ్వుతూ నిష్క్రమించాడు.
జ్వరం వచ్చినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు నిత్యం ఆపీసువ్యవహారాల సమయాల్లోను, తనతో తోడుగా అండగాఉంటూ పనిచేసే నౌకరును ఒకళ్ణి నియమించుకోవాలనుకున్నాడు శివరాం. వృత్తిలో జెన్నత్యంపొంది సంపాదన పెరిగాక, ఆ సంగతి ఆలోచించుకుందడా మనుకున్నాడు. గోపీని చూడగానే యీ ఆలోచన శివరాంలో కదిలితన వద్ద పనిచెయ్యమని అడిగేశాడు.
రాత్రి విద్యుద్దీపకాంతిలో మేజాబల్లమీద కూర్చుని కాగితాలు (వ్రాసుకుంటున్నాదు శివరాం. గుమ్మందగ్గర కూర్చుని నల్లపిల్లి కళ్ళు మూస్తూ, తెరుస్తూ, ఆవలిస్తూ ఎవరూ లోపలికి రాకుండా కాపలాకాస్తోంది. ఒక కార్షికునికి కాలుపోయిన సందర్భంలో యజనానులు తక్కువ నష్టపరిహారం ఇచ్చిన విషయాన్ని పరిశీలిస్తున్నాడు శివరాం.
రాత్రి తొమ్మిదిన్నర గంటలయింది. వీధిలో కల్తుత్రాగినవారిద్దరు పెద్దగా పాటలు పాడుతూ తూలుతూ గందరగోళం చేస్తూ పోతున్నారు ఇనుపపనిముట్లు ఫ్యాక్టరీ పెద్ద కూతకూసి ధధ్ధథ్ శబ్లాలతో రాత్రి నిశ్శబ్దాన్ని బేదిసోంది, గుడి సెలప్రక్క టాంగాలదగ్గరగా క్షట్టిన గుర్రాలు పచ్చగడ్డితింటూ సకిలిస్తున్నాయి. వీధిలో నిర్లక్ష్యంగా తిరుగుతున్న గాడిదలు
అన్వేషణ 85కి ఓం(డ్రపెట్టుతున్నాయి. కసాయిశాల కొండ క్రిందుగా ఏర్పడిన రొచ్చులో దొర్లుతున్న పందులు గుంపులు "కుర్ కుర్ మంటూ మూల్గుతున్నాయి.
శివరాం పనిశమతో అలసిపోయి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు నల్లపిల్లి నిలుచుని కాళ్ళు విదలించుకొని ఆవలించింది ఆకాశంలోంచి నిశీధం పయనించి మేడ ఎదురు గుడిసెల్లో వ్యాపించుకున్నట్లుంది. గదుల్లోని విద్యుద్దీపాల కృత్రిమ కాంతిని ఆర్బేశాడు శివరాం పరుపుమీద ఒరిగాడు. నల్లపిల్లి మెల్లిగా పయనించి, మంచం క్రింద ముడుచుకు పడుకుంది. కొట్టుకుంటున్న శివరాం గుండె అనురాగరసం లేక ఎండిపోయి బలహీనమైనట్లగుపించింది.
360 అన్వేషణ 16 పల్లెటూరు ఉండ్రాజవరం, సాయంత్రం అయిదుగంటలు దాటింది. దిక్షితులు పంచె మోకాలు పైకి ఎగగట్టి చొక్కాతొడుక్కుని కండువా బుజాల వేసుకొని, ఆకు చెప్పులు చప్పుడుచేస్తూ పొలంవైపు నడిచాడు పిల్లకాల్వదాటి తాటితోపుల మధ్యనుంచి ఏర్పడిన మట్టిదారిమీద వడివడిగా అడుగువేశాడు.
" _ వానలవల్ల బురద ఏర్పడి, ఎండలవల్ల కాస్త గట్టిపడినదారి నిర్లక్ష్యంగా నడిచినప్పుడు చెప్పులకాలును క్రిందకు జారుస్తోంది. ధాన్యం చల్లేక పచ్చగా ఎదుగుతున్న చేలు నీరుటెందలో నిగనిగ మెరుస్తున్నాయి. గాలికి వాలుగా కదలి నృత్యం చేసూ ఈతతుప్పలు, తీగలుమధ్య గుట్టలుగా ఎర్చడిన మట్ట సొరంగాలు పాముల నివానొాల్లూ భయం గొలుపుతున్నాయి. పిల్లకాల్వలమధ్య రాళ్ళమీద నిలుచుని కొంగలు దొంగతపనుతో చిన్న మీనాలను పట్టుకుంటున్నాయి.
మైలునడచి గట్లుదాటి. తమపొలం చేరాడు దీక్షితులు. పాలేరు పొలంచివర గుడిసెప్రక్క గేదెకు, ఆవుకు గడ్డి పెడుతూ, ఆవుదూదతో ఆడుకోంటున్నాడు గుడిసెప్రక్కనే వేసిన నారింజ బత్తాయిచెట్లు గుత్తుల పళ్ళుకాస్తు భారంగా నిలుచున్నాయి. గేదెను తట్టి ఆవును నిమిరి, దూడను చుంబించి దీక్షితులు ఎదుగుతున్న చేలవేపు పరిక్షగా చూశాడు. ఈఏడు వానలు సరిగా పడ్డాయని పంటకు నష్టం తెచ్చే తుఫానులు లేకుంటే పుష్కలంగా ధాన్యం పందకలదని ఆశించాడు సాయంత్రం బడి విడిచాక దీక్షితులు ప్రతిదినం పాలంవైపొకసారి నడిచి పంటల పొలాలు చూసుకువస్తేకాని సంతృప్తి పొందెవాడు కాడు
పాలేరు ఆవుపాలు పితికాడు. దూడను వదిలేసి ఆవుదగ్గరకు పోనిచ్చాడు. మిగిలిన పాలు త్రాగడానికి. తెల్లగా తోమిన ఇత్తడి చెంబునిండా నురగ కక్కుతున్న వాలు పదిలంగా ఉండేలా చిన్న ఉట్టిలో ఎంచాడు.
అన్వేషణ 361
సూగ్యాస్తమయం కాగానే సంధ్యారుణ రాగం విరిసి మాయమైంది కనుచీకటి పడింది. దీక్షితులు ఇంటికి పోదామని బయలు దేరాడు. పాలేరు పాలచెంబు పట్టుకొని వెనుకనే నడుస్తున్నాడు తాటితోపులు దాటి ముందుకు రాగా పిల్ల కాల్వలోంచి బురద పాము దారికద్దుగా పాకిపోయింది ఈతతుప్పల పుట్టలోంచి పాము తిన పడగ పైకి ఎత్తిచూసి, మనుష్యుల పదధ్వని విని లోనికి పోయింది కప్పలు బురదల్లోంచి బెకబెక మంటున్నాయి. మిణుగురుపురుగులు గాలిలో ఎగురుతూ మెరుస్తున్నాయి
పాలేరు ఇరుగుపొరుగు పొలం యజమానుల పంటల గురించి చెప్పుకు పోతున్నాడు. కరణంగారి మొక్కజొన్నవేను విరగకాసిందని, పంచాయితీబోర్డు అధ్యక్షుడుగారి పొలంలోని గడ్డిమోపులో చాలాభాగం దొంగతనం చేయబడిందని, చౌదరిగారు యీఏడు పొలం నిందా, పెసలు, మినుములు చల్లేశారని, యీఏడు ధాన్యం ధర పెరుగుతుందని తణుకు వెళ్ళివచ్చిన నాయుడుగారన్నారని పాలేరు కబుర్లు పురాణం విప్పాడు.
చదువు మానేసినందుకు దీక్షితులు విచారించలేదు. పల్లెటూరి జీవితంలో, ప్రాధమిక పోఠశాలలో పిల్లలకు వారాలు చెబుతూ సరదాగా కాలక్షేపంచేసి, యింటికివచ్చి సేద్యం చేసుకొని, వచ్చే ధనంతో కుటుంబాన్ని సంతృప్తికరంగా, లేమి అనేమాట వినిపించకుండా తండ్రి నవనాగరికపు నాజూకు మోజులులెక నిరాడబరంగా భర్త యిష్ణాలకు తలజఒగ్గుతూ అతని కనుసన్నలలో మసలడమే ఎంతో ఆనందంగా భావిస్తోంది. తలిదండ్రులు, సూర్యారావు, కామాక్షమ్మ, వృద్దులై సంసార బారమంతా దీక్షితులుకు లక్ష్మికి అప్పచెప్పి, తోటి ముసలివాళ్ళతో, ఇంట్లో ఉన్న బ్రాహ్మయ్యగారితో పుక్కిటికబుర్లు చెప్పుకుంటూ దైవనామస్మరణతో అవసానకాలం గడపాలని నిర్ణయించుకొన్నారు. కామాక్షమ్మ అప్పుడప్పుడు అత్తగారి రీవి అవలంబించినా కొడుకుమాత్రం గుర్తించకుండా మసలుకొనేది. స్త్రీ సహజమైన అత్తగారి పెత్తనం తనకు ఎక్కువ కష్టం కలిగించనందున లక్ష్మి కూడా ఆమె మాటలకు పట్టించుకోక వినయంగా మసలుతోంది. దీక్షితులు అన్ని విషయాలు గమనిస్తున్నా, ఘర్షణ భబేనంతవరకు ఉదాసీనంగానే ఉంటూ అన్ని విషయాలు చక్కబెట్టుకొనేవాడు.
చీకటిపడినా ప్రక్క్మయింటి కుర్రాళ్ళతో దీక్షితులు రెండో తమ్ముడు సుందర్ గోటి బిళ్ళ ఆడుతున్నాడు. చెల్లెలు ఉష పొరిగింటి పిల్లలను యింట్లోకి రమ్మంటూ కేక వేసోంది. దీక్షితులును చూడగానే భయంతో సుందర్, ఉష యింట్లో చొరబడ్డారు.
86లై అన్వేషణ
వీధి గుమ్మం కిరువైపుల రెండుగదులలాంటి వరండాలు, పైనితాటాకుల కప్పుతో అమర్చబడి ఉన్నాయి ఒకవేపు గది వరండాలో సూర్యారావు, కామాక్షమ్మ తమ సంసార సరంజామా అంతా పెట్టుకొన్నారు మరొకవైపు గది వరండా బ్రహ్మయ్యగారికి యిచ్చేశారు. ఒక నెలరోజులనుంచి బ్రహ్మయ్యగారు నరాల పటుత్వంతగ్గి కాళ్ళు చేతులు ఎక్కువగా మెదపలేక మంచంమీదే కాలం గడపసాగారు బ్రహ్మయ్యగారికి అస్తస్టతగా ఉందని లక్ష్మి దిక్షితులుకూడా శివరాంకు ఉత్తరాలు వ్రావారు ఒకసారి రమ్మంటూ, దీక్షితులు యింటికిరాగానె శివరాం వ్రాసిన ఉత్తరం అందిచ్చింది లక్ష్మి
'లాయరు శివరాంగారి ఉత్తరమా! ఉత్తరం అందుకుంటూ నవ్వాడు దీక్షితులు.
మామూలు సంసార జీవితంలోంచి, సాధారణ గుమాస్తాల (బతుకుల్లోంచి జీవితౌన్నత్యానికి పోరాటం సాగించి, ప్రఖ్యాత చిత్రలేఖకుడై ప్రతిభగల లాయరై పెద్దనగరంలో పలుకుబడిగల పెద్దగా మారేడని లక్ష్మి గర్వంగా భర్తముందు అనడం, దీక్షితులు భార్యను హేళన చెయ్యడం పరివాటి.
కవరు చించి, ఉత్తరం చదివాడు దీక్షితులు, 'మీ లాయరు సోదరుడు దీపావళికి మనయింట్లో దిగుతాడు!” ఉత్తరం మడిచి, దానితో లక్ష్మి బుగ్గమీద కొట్టాడు.
'ఆ విషయం మీరు చెవ్చకముందే తెలుసు” నవ్వింది లక్ష్మి
అన్నగారు వద్దనుంచి భర్తపేరవచ్చిన ఉత్తరంచూచి నీళ్ళతో కవరువిప్పి లోపల ఉత్తరం చూసి తిరిగి అంటించెసింది లక్ష్మి ఏమీ ఎరుగనట్లు. మరో రెండు రోజుల్లోనే అన్నయ్య వస్తాడని ఆశించింది.
“అయితే అన్నగారువస్తే, యింట్లోఉన్న మినుములు, పెనల బస్తాలు కొళీచేస్తుందన్నమాట చెల్లెలు పిండివంటలు చేసి! పకపక నవ్వాడు దీక్షితులు.
'మా అన్నయ్య మీలాంటి బకాసురుడు కాదండి! కొంటెగా వెక్కిరించింది లక్ష్మి.
“అయితే రాకరాకవచ్చే అన్నయ్యకు ఏంబహుమతి యిస్తావు?”
“అది బావగారి బాధ్యత!
'అయితే చెల్లెలుగారి బాధ్యత భర్తదగ్గర, అన్నయ్య దగ్గర బహుమతులు పొందటమే నన్నమాట!”
'అంతే!'... కిలకిల సవ్వింది లక్ష్మి.
అన్వేషణ 863
“ఏమండీ.... పండుగకు నాకేం చీర తెస్తారు? . వ్రక్క్మయింటి సీత తణుకునుంచి తెల్లసిల్కు కనకాంబరం పూలచిర తెప్పించుకుంది . ఎంతో బాగుంది!
“ఓహో ఈ ఉవోద్దాతం అది కావాలనా. . మనబాణసంచా ఖర్చు పూర్తయ్యాక డబ్బు మిగిలితే....”
మాటలు నమిలేసీ, అనవసరమైన సంసారం ఖర్చునుంచి దూరం కావాలంటూ భోజనాలు సిద్ధం చేయ్యమని కోపం అభినయిస్తూ కసిరాడు దీక్షితులు. కాళ్ళు చేతులు కడుక్కుందుకు దొడ్లోకి వెళ్ళాడు. భర్తకు తువ్వాలు, సబ్బు అందిచ్చింది లక్ష్మి
సుందర్, ఉష హరికేసు లైటుముందు కూర్చుని పారాలు చదువుతున్నారు (శ్రద్ద అభినయిస్తూ. బడిలోని మేస్తారు యింట్లో కూడా ఎప్పుడూ కనిపిస్తూండడం సుందర్‌కు, ఉషకు స్వేచ్చగా ఉండడానికి కొంచెం కంటకంగానే ఉంటుంది ఎటొచ్చి సాయంత్రం (మవ్రాతంకాలం.
దీక్షితులు పనిమీద వూళ్ళోకి వెళ్ళినప్పుడు వదినె దగ్గర చనువు తీసుకొని అల్లరిచేస్తూ ఆడుకోడం వాళ్ళ అలవాటు.
తణుకు హైస్కూల్లో చదువుతున్న పాత్రుడు, దీక్షితుని మొదటి తమ్ముడు సైకిలు యింట్లా పెడుతూ పుస్తకాలనుంచి ఊపుకుంటూ హుషారుగా లోపలికి వచ్చాడు రోజు ఆటలు ఆడుకొని చీకటి పదుతుందడగా, సైకిలు త్రొక్కుకుంటూ మామూలుగా యింటికివచ్చే ప్రాతుణ్తిచూసి దిక్షితులు ఏమీ ప్రశ్నించలేదు.
దీక్షితులు తండ్రి రుద్రాక్ష తావళంతో రామజపం పూర్తిచేసికొని భార్వాసహితంగా, పిల్లలపంక్తినికూర్చుని, కోడలి వంటకాలు భుజించడానికి వచ్చారు. తండ్రి కొడుకులు ఊరులోని రాజకీయాలు, పంటలరీతులు సంభాషణల్లో దొర్లించారు. పాత్రుడు మధ్యలో తన స్ఫ్కూలులోని వింతలు వల్లించాడు. ఉష, సుందర్, మూగనోము పట్టనట్టు భయభక్తులతో వదినెకు సంజ్ఞలు చేస్తూ కావలసినది అడిగి వేయించుకు తిన్నారు. లక్ష్మి అన్నయ్య దీపావళికి తమ యింటికి వస్తున్నాడని విని సూర్యారావు చాలా ఆనందించాడు. అతని రాక వల్లతనయింటి పరపతికూడా యిరుగు పొరుగు జనంలో పెరుగుతుందని సంతృప్తి పడ్డాడు.
వార్ధక్యం వచ్చిన సూర్యారావుకి, బ్రహ్మయ్యగారికి వేదాంత తత్వం ప్రబలి, మనస్సులు కలిసిపోయాయి. భోజనాలయ్యాక పేకాడుతూ కూర్చోవడం, తరువాత ఓపిక ఉంటే
త64 అన్వేషణ ఊళ్ళోకి షికారు వెళ్ళి స్నేహితులతో కాస్త కాలక్షేపంచేసి, యింటికివచ్చి సుష్టుగా భోజనాలు చేసుకొని, చుట్టకాలుస్తూ, పొడుం పీలుస్తూ, పిల్లలకు పారాలు చెప్పి పడుకోవడం మామూలు వారికి, బ్రహ్మయ్యగారు మంచం పట్టాక కొద్దిగా ఓపికతో తిరుగుతున్న సూర్యారావు అప్పుడప్పుడు ఆయనదగ్గరచేరి మాటలాడేవాడు. లక్ష్మి యింటిపనులన్నీ సర్దుకుంటూ బ్రహ్మయ్యగారికికూడ సేవ చేస్తోంది
భోజనాలు ముగిశాక సూర్వారావు, దీక్షితులు (బ్రహ్మయ్యగారి దగ్గర చేరారు ఊళ్ళోకి ఆయుర్వేదడాక్టరు యిచ్చిన భస్మం తేనెలో కలిపి మందు అందిచ్చాడు దీక్షితులు శివరాంరాక గురించి చెవ్పాడు. బ్రహ్మయ్యగారి ఆనందం తరంగాలుగా హృదయంలో కదలి పెల్లుబికింది. చాలా కాలానికి పెద్దవాదై పేరు ప్రతిష్టలు సంపాదించుక్ను మనుమణ్ణి చూసుకుంటానంటూ. వెంకటేశ్వర్లు మా(త్రం వీలైనప్పుడల్లా నెలకైనా ఒక్కసారి వచ్చి ('బ్రహ్మయ్యగారిని చూసి, ఏదో దబ్బు కావాలంటూ సట్టుకు పోతూనే వున్నాడు ఒక్క లాయరు వృత్తికోసం అడిగిన ధనసహాయం తప్ప శివరాం తన బాధలు ఎప్పుడూ బ్రహ్మయ్యగారితో చెప్పుకోనేలేదు. నిస్వార్ధత్యాగంతో, (ప్రాపంచికమైన కోర్కెలు చంపుకొని యవ్వనంలో ఒక విధమైన వైరాగ్యం ఏర్పరచుకుని బ్రతుకుతున్న శివరాం పై జాలివేసింది బ్రహ్మయ్యగారికి తన అంత్యదశ దగ్గరకు వచ్చినట్లున్నా శివరాంను ఒక రృహస్టుడిగా చూడలేక పోతున్నాననే చింత బ్రహ్మయ్యగారిని వేధించసాగింది.
బ్రహ్మయ్యగారితో కాస్సేపు మాట్లాడి ఆయనకు వి(శ్రాంతి యివ్వాలనుకుంటూ, తండ్రీ కొడుకులు ఆయన గదినుంచి నిషమించారు.
దీక్షితులు తనపడకగదిలోకి పోయి, పరిశుభ్రంగా అమర్చిన పరుపుమీద జఒత్తిగిలి, భార్య తయారుగా ఉంచిన తాంబూలం నమిలి కోడిగుడ్డు దీపం ముందు తెలుగు నవల ఒకటి చదవడం మొదలు పెట్టాడు. భోషాణం మీద కూర్చుని, హరికేను లైటుముందు తన పారాలు వల్లెవేసుకొంటున్నాడు పాత్రుడు, ఉష మరొక దీపంముందు కూర్చొని పుస్తకాలు తెరుచుకునే నిద్రతో జోగుతున్నారు. వంటింటిపనులు పూర్తిచేసికొని తడి చేతులతో బయటకు వచ్చిన లక్ష్మి వేళాకోళంగా సుందర్‌ను, ఉషను మొట్టి మెళుకువ తెప్పించి వాళ్ళను ప్రక్క్మమీద పడుకోబెట్టింది. సుబ్బారావుగారు తన మంచంమీద పడుకొని భార్య నాగదిసుకుంటూ ఆశ్చర్యంగా చెబుతున్న పొరుగింటి కధలు వింటూన్నడు ఊ కొఢుతూ. లక్ష్మి బ్రహ్మయ్యగారి మంచం వద్దకువెళ్ళి వేన్నీళ్ళృచెంబు ముక్కాలిపీటమీద పెట్టి, కోడిగ్రుద్దుదీపం బాగా చిన్నదిచేసి, నిద్రపోతున్న (బబ్రహ్మయ్యగారి వక్షంమీద దుప్పటి పూర్తిగాకప్పి బయటికి వచ్చింది ఇంట్లో ప్రక్కభాగంలో అద్దెకుంటున్న పంచాయితీ బోర్డు
అన్వేషణ 3685 గుమాస్తా భార్య బయటికి వచ్చి ఉబుసుపోక కబుర్లు మొదలెట్టింది లక్ష్మితో ఆనాడు వండుకొన్న పండుకొన్న వంటకాలు, పొరుగింటి ప్రీల గాజుల జతలు, క్రొత్త చీరలు, ఆడపిల్లల పెళ్ళిళ్ళ కష్టాలు, కట్నాల విడ్టూరాలు ఆత్తల నాధింపులు గురించి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోసాగారు. ఏమిటా నవ్వులు” గట్టిగా కసిరేడు పాత్రుడు తన పారాలు తలకెక్కుట లేదంటూ. లక్ష్మి కబుర్లకు స్వస్తి చెప్పి పడకగదిలో దూరింది
దీక్షితులు నవలాపఠనంలో నిమగ్నుడై కిరసనాయిలు లేక కోడిగడుతున్న దీపం సంగతే గుర్తించలేదు.
“ఏమిటండీ... యీ గ్రుడ్డి వెలుగులో చదువు?.... కళ్ళు పాదైపోవూ? భర్త నెత్తిమాద కొట్టింది మృదువుగా లక్ష్మి చేతిలోని పుస్తకంమూసి లాగేస్తూ
“కళ్ళు పాదైఫోతే కళ్ళజోడు పెట్టుకుంటా, కళ్ళజోడు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటా... ఇంకా అందంగా ఉంటే మా ఆవిడకు ఎంత సంతోషమో'” పకపక నవ్వాడు దీక్షితులు.
“ఆల.. ఉన్న అందం చాలక.. లేని అందంకూడా ఎందుకు?” సాగదీసుకుంది లక్ష్మి ప్రక్కమీద కూర్చుంటూ.
ఉతికిన తెల్లటి చీరలో, తురుముకున్న మొగపువ్వు ఘుమఘుమలో, దీపం ఆరిపోతున్న మసక వెలుగునీడల్లో ఆరునెలల గర్భంతో నిండుగా ఉన్న లక్ష్మి తనకంటె ఎంతో అందంగా కనిపించింది దీక్షితులుకు.
“ఒప్పుకుంటా... నా కంటె నువ్వు అందగత్తె!” లక్ష్మి చుబుకాన్ని గిల్లాడు దీక్షితులు. నవ్వింది లక్ష్మి.
“మొగలుపువ్వు ఎక్కడిది?”
“కోరిక కలిగి పాలేరుచేత తెప్పించుకున్నా యీవేళ!”
జ్రాత్రి మొగలుపువ్వు పెట్టకుంటే సర్పాలు చేరుతాయి జాగ్రత్త!”
నాకేం భయంలేదు!.... అబ్బ నిద్ర వస్తోందండీ!” అంటూ దీక్షితులును ప్రక్కకు గెంటి దుప్పటి కప్పుకుని ఒరిగింది లక్ష్మి.
కోడిగ్రుద్దు దీపం ఆ దంపతుల ఎదురుగా తన విధ్యుక్తదర్శం నిర్వర్తించుకుంటూ కిటికీలోంచి వచ్చే గాలితో ఆరిపోయింది.
ఏ66 అన్వేషణ
ఉదయం బద్ధకంగా లక్ష్మి లేచేముందు కామాక్షమ్మ దంతధావనం పూర్తిచేసుకొని దాసిచేత ఇంటి కడుగులు పురమాయించింది. పెద్ద హోదాలో ఉన్న కోడలు అన్నగారు వచ్చే సమయంలో గర్భంతో ఉన్న కోడలిని కష్టపెడుతున్నట్లు అతనికి కనిపించనీయకుండా వారక్యమొచ్చినా తనే గృహవిషయాలన్నీ నిర్వహిస్తున్నట్లు కనిపించాలనే చిన్న కోరిక కలిగింది కామాక్షమ్మకు వంటింట్లోకి వెళ్ళి ఆ రోజు చెయ్యవలసిన వంటకాల గురించి ఒక నిర్ణయానికి వచ్చెసింది ఉదయాన్నే లేచి ఇంటి విషయాలు పట్లించుకుంటున్న అత్తగారిని చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి.
“బరువుగా ఉన్న యిల్లాలవు .. ఈ పండుగరోజుల్లోనైనా కాస్త వి(శ్రాంత్ తీసుకోవమ్మా .. మామూలు రోజుల్లో చాకిరీ ఎలాగ తప్పదూ!” సాగదీసుకుంటూ నవ్వింది చమత్నారంగా కామాక్షమ్మ.
బ్రహ్మయ్యగారికి బాగా ప్రొద్దెక్కేక మెలుకువ వచ్చింది. మంచంమీద కూర్చునే పాత్రుడు ఆయన ముఖ ప్రక్షాళనం జరిపించాడు. మందు తీసుకొని ఆరోజు మనుమడు రాగలడనే ఉత్సాహం కలిగి కాస్తవోపిక తెచ్చుకొని కులాసాగా మాట్లాడడం మొదలు పెట్టారు అందరితో.
దొసీమనిషి ఆ తాటాకుకప్పుల మట్టిగదులు రెండూ పేడతో అలికి ముగ్గులు పెట్టింది. కప్పుల వెదురు బొంగులను పెట్టుకున్న బూజులు దులిపి శుభం చేసింది. కాటాకుల గదుల వరండా తర్వాత ఉన్న పెరడులో ఒక వైపు చామంతి మొక్కలు పూలు పూసి ఊగుతున్నాయి. ఆనందంగా పసుపు రాసుకొన్న ముత్తయిదువుల్లా బంతి మొక్కలు ఆకులరెమ్మలు విస్తృతంగా చేసుకొని మొగ్గలు వేసుకుంటున్నాయి. అరటి నున్నటి తొడలతో కసరత్తు చేస్తున్న వ్యక్తుల్లా ఆకుల చేతులు ఆడిస్తూ, ఉచ్వాస నిశ్వాసాలతో చెమట బిందువులతో నిగనిగ లాడుతున్నాయి. పెరడు తర్వాత ఉన్న పెంకుటిల్లు ముందు వరండాలో సుందర్, ఉష తలో క్రొత్త పుస్తకాలకు అట్టలు వేసుకొంటున్నారు.
దీక్షితులు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఊళ్ళొకి వెళ్ళాడు. పిల్లకాల్వలకు దక్షిణానవున్న పొలాల అమ్ముతానన్న మునసబును కలుసుకొని ధరలు కనుక్కుందామని, పా(త్రుడు చల్చిభోజనం చేసి, ప్రకృవీధిలోని తోటివిద్యార్థుల ఇంటికి వెళ్ళాడు తారాజువ్వల తయారు పరీక్షించాలని.
(బ్రహ్మయ్యగారు ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. పదకొండు పన్నెండు గంటలకు నిడదవోలువచ్చి రైలుదిగి బహుశా ఏ మూడుగంటలకైనా తప్పక మనుమడు శివరాం
అన్వేషణ 367 రాగలడని అనుకుంటున్నాడు. శివరామ్ రాగానే తనకొక క్రొత్త మల్గుపంచె, లక్ష్మికి ఒక (క్రొత్త సిల్కుచిర, బావమరిదికి నూటు తప్పకుండా తెస్తాడు. తన ప్రక్కనే కూర్చుని ఇంతకాలం శివరాం నగరంలో చేసిన ఘనకార్యాలు, ధనిక యజమానుల నెలా ఎదిరించింది, నిత్యము తనవద్దకు వచ్చే పార్టీల కోర్టు వివాదాలు హాస్యంగా చెబుతాడు. ఇంత వరకు గీసిన చిత్రాలు ఒక్కొక్కటే చూపిస్తాడు. సుందర్,ఉష వచ్చి వాటితో కొన్ని బలవంతంగా తమకిమ్మని వేదించి శివరాం దగ్గరనుంచి పట్టుకుపోతారు గెడ్డం పెరిగి వడలిపయిన వంకాయలా రక్తంలేనిదృశ్యం శివరాంను ఆకర్షిస్తుది. కబుర్లు చెబుతూనే పెన్సిలుతీసి కాగితంమీద తనచిత్తరవు గీసేస్తాడు ఉట్సిగీతలలో ఆకృతిలోని స్వరభావాలు ఉట్టిపడె ఆ బొమ&మ ఎంతో ఆనందం కలిగిస్తుంది . ఆ బొమ్మ గొప్పతనానికి చిత్రలేఖన ప్రదర్శనల్లో ఎటువంటి బహుమతి లబిస్తుందో... ఆ బొమ్మఅమ్మకుండా శివరాం ఇంట్లోనే ఫోటో కట్టించుకు పెట్టుకొంటాడు ఎరుపు తెలుపు వర్ణాలలో ఆ బొమ్మకు సౌందర్యం ఆపాదించి 'బ్రహ్మజ్యోతి' అని శివరాం నామకరణం చేసాడు మనుమడి భావోద్వేగానికి తనకు పరవశత కల్గుతుంది. .. వన్తాడు శివరాం... వస్తాడు తప్పకుండా... ఆనందబామవ్పాలు జలజల రాల్పారు బ్రహ్మయ్యగారు.
పన్నెండు గంటలకే భోంచేసి, దీక్షితులు పాత్రుడు తణుకు బయలుదేరారు. సైకిలుమీద, స్టెషనుకువెళ్ళి శివరాంను కలుసుకుని తీసుకురావడమే కాకుండా, మర్నాటి దీపావళి పండుగకు బాణసంచా తేవాలని ఉద్యుక్తులయ్యారు. దీక్షితులు సంవత్సరంలో అన్ని పండుగలూ నిర్లక్ష గంచేసి ఒక్క దీపావళికే ఆనందిస్తాడు బాణసంచా కాల్బడమంటే అతనికి ఎంతో యిష్టం రకరకాల భాణసంచా యింటికి తెచ్చి తెల్లవారేవరకు ఊరంతా సందడి కలిగేలా కాలేస్తూండడం అతని కలవాటు. సంసారబాధ్యతలు నెత్తిమీదపద్దాక, స్వతంత్రించి తండ్రి అనుమతి లేకుండానే దీపావళి వస్తే యిష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తాడు. దీక్షితులు కొడుకు సరదాలకు తానెందుకు అద్దురావాలనే పితృప్రమతో సూర్యారావుగారు ఊరుకుంటారు. అన్నగారి ఉత్సాహాన్ని పాత్రుడు ప్రక్కనుంచి ద్విగుణీకృతంచేస్తాడు. ఆ సంవత్సరము శివరాం కూడా వస్తూండడంవల్ల యింకా ఘనంగా దీపావళి పండుగ చెయ్యాలని నిశ్యయించారు. దీక్షితులు పాత్రుడు చిన్నపిల్లలైన సుందర్‌కు ఉషకు మాత్రం కొత్తబట్టలు కుట్టించి, తమకా క్రొత్త బట్టలకయే ఖర్చుకూడా బాణసంచా ఖర్చు పెట్టాలని తీర్మానించారు. అన్నదమ్ములు.
దీక్షితులు పంచె సైకిలు కట్టుకట్టి ముందు తమ్ముణ్ణి కూర్చోపెట్టుకొని హుషారుగా రోద్దుమీద త్రొక్కేస్తున్నాడు. ఊరి మంగలి యింకా పొది పుచ్చుకొని తిరుగుతా దీక్షితులకు
368 అన్వషణ నమస్మరించాడు బడిలోని పిల్లలు, దీక్షితులు సైకిలు శ్రొక్కడం చూసి చాటుగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గంపలో చిదుకలు ఏరుకొని పోతున్న పాలేరు భార్య సగౌరవంగా సరదాగా చూసింది అన్నదమ్ములవైపు ఇరు ప్రక్కల బ్రహ్మచెముడు డొంకలు, జిల్లెడు పొదలు ఈతతుప్పలతో చ్‌ను ఎరుపురంగు బూడిత రోడ్డు ఎత్తు పల్గ్లాలలో సైకిలును కుదిపేస్తోంది. రోకలిబండల్లా, ఒంటెద్దుబండి, రెందెండ్లబండి నడిచి పోతున్నాయి ఒక జట్మ్కామీద నాయుడిగారి భార్యాబిడ్డలు పట్నం పోతున్నారు మధ్యాహ్నం మేటనీ సినిమా చూడాలని. కాళ్ళ కసరత్తువేగం సైకిలు చక్రాలను గిరగిర త్రిప్పేసింది. ఒక అరగంటలో తణుకు చేరారు అన్నదమ్ములు పన్నెండు గంటలకు నిడదవోలు వచ్చే మెయిలుబండి ప్రయాణీకులను తెచ్చిన నరసాపురం రైలులోంచి శివరాం దిగిన జాడ కనిపించలేదు. 'శుహుశా రాత్రి బండికి రావచ్చునని ఆశించారు అన్నదమ్ములు. ఈలోగా పట్నంలో స్నేహితులను కలుసుకొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలంగడిపి దుకాణాల్లో ఏభయి రూవాయలు వెచ్చించి తారాజువ్వలు, వెలక్కాయలు, పిచుకలు, బొట్టు, చిచ్చుబుడ్ద్డు, పిల్లలకు కావలసిన కాకరవత్తులు, మతాబులు, కప్పగంతులు, అగ్గిపెట్టు, విష్ణుచక్రాలు, వొముమందులు కొన్నారు అన్నదమ్ములు బాణసంచా బుట్టల్లో కట్టంచి స్నేహితులింట్లో పెట్టి, తిరిగి రైలుస్టేషనుకు వెళ్లారు రాత్రి. ఎనిమిది గంటలకు రైలుబండిలోకూడా శివరాం కనిపించలేదు ఎందుకు రాలేదో ఏమిటో అనుకుంటూ అన్నదమ్ములు నిరుత్సాహపడి నీరసంగా సైకిలు తొక్కుకుంటూ బాణసంచా సామానులు బుట్టలు సైకిలు వెనుక కట్టి, మౌనంగా యిల్లు చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు వీధిలోనే నిలుచుని భర్తరాకకై నిరీక్షిస్తోంది లక్ష్మి. అన్నదమ్ములు సైకిలుమీద దిగారుబుట్టలతో. జట్కాకూడా వస్తుందని ఆశించింది లక్షి. జట్కాలో దిగే అన్నయ్యను ఆదరణతో ఆహ్వానించాలని నిలుచున్న లక్ష్మికి ఆశాభంగమయింది “రాలేదా అన్నయ్య!” నీరనంగా ప్రశ్నించింది లక్షి. దీక్షితులు మౌనంగా యింట్లో వచ్చేశాడు. బ్రహ్మయ్యగారు యింకా నిద్రపోలేదు. దీక్షితులు పట్నంనుంచి శివరాంను తీనుకువస్తాడని అతను ఒంటరిగావచ్చి ఎదురుగా నిలుచున్నాడు. “రాలేదన్నమాటో బ్రహ్మయ్యగారు నీరసంగా నిట్టూర్చారు “ప్రజాసేవకు శరీరం అంకితంచెసిన గొప్పవాళ్ళక మాలాటి సామాన్య సంసారులపై
అన్వేషణ 369 మమతలు స్మరించుకోడానికి సావకాశముండొద్దూ?” వ్యంగ్యంగా నవ్వాడు బ్రహ్మయ్యగారు. ఆయన అల్లుకున్న ఆశలన్నీ త్రెంచుకుపోయాయి. మర్నాడు రెండుగంటలకైనా మనుమడువస్తే రావచ్చుననే మరొక ఆశ బ్రహ్మయ్యగారిలో పొడసూపింది.
ఇంతలో వెంకటేశ్వర్లు చిన్న సంచీ పుచ్చుకుని దిగాడు. తాతయ్య చెల్లెలు క్షేమం ప్రశ్నించాడు. స్వార్ధపరుదైన అతని రాక పోకలు ఆ యింట్లో ఎవరికి నచ్చకపోయినా బంధువుగా వచ్చిన అతిదికి తప్పనిసరిగా సత్మారాలు చెయ్యక తప్పలేదు,
రాత్రి విశ్రమించి, మర్నాడు లేచి రాజమండ్రి దగ్గరున్న తమ పొలాలపంటలగురించి ప్రస్తావించి, కుటుంబంలో పిల్లలకు అనారోగ్యం పెరిగిపోవడంవల్ల తప్పనిసరిగా పొలంశిస్తుకు రెండువందల రూపాయిలు యీమధ్య వాడుకున్నానని చెవ్పాడు వెంకటేశ్వర్లు పూర్తిగా పొలాల వ్యవహారాలు వెంకటేశ్వర్లుకు తప్పనిసరిగా అప్పగించింన బ్రహ్మయ్య హా కొట్టి మౌనం వహించారు పండుగనాడు ఎట్లాగయినా యింటికి చేరాలనీ, లేకపోతే పిల్లలు బెంగపెట్టుకుంటారనీ తమ్ముడు శివరాం రావచ్చు నీ రోజని తెలిసినా, ఉండడానికి వీలుపడలేదనీ కర్మశంగా తిరుగుప్రయాణమై పోయాడు వూరికి.
మధ్యాహ్నం రెండుగంటలు దాటింది. శివరాం రాలేదు ఇంక మనమడు రాదని బ్రహ్మయ్యగారు పూర్తిగా నిరాశచేసుకున్నారు లక్ష్మి చాలవరకు దిగాలుపడిపోయింది. దీక్షితులకు నిరుత్సాహం కలిగింది.
సాయంత్రం సుందర్, ఉష గోంగూర కొమ్మలకు గుడ్డనూనె వత్తులు వెలిగించి, గుమ్మంలో నిలుచుని, ఆరిపోయే సమయానికి “దిబ్బు దిబ్బు దీపావళి!” మళ్ళీ వచ్చేది. నాగులచవితీ!” అంటూ నేల మీద గోంగూరకట్టకు బాది వీధిలో విసిరేశారు.
వీధిలో అరుగులమీద మట్టి ప్రమిదలనూనె వత్తులు ఒయ్యారంగా గాలిలో కదులుతూ వెలుగుతున్నాయి. ఆ వూళ్ళొ (ప్రతి యిల్లు దీపాలతో అలంకరించారు నిశీధం ఆవరించుకున్న నింగికూడా చుక్కల దీపాలు వెలిగించుకుని తొంగిచూస్తోంది భూమిపైన దీపావళిని.
భోజనాలు ముగించుకుని దీక్షితులు, పాత్రుడు బాణసంచా కాల్సాలని వీరుల్లా బనీను బిగుతువంట్లాములు తొడుక్కుని వీధిలోకి వచ్చారు సూర్యారావు సుందర్ దగ్గరచేరి కాకరపువ్వొత్తులు కాల్పించాడు. నక్ష్మత్రాల్లా వెలుగులు బయటికి రాగా దీక్షితులు తర్వాత యిద్దరు కూతుళ్ళు చచ్చిపోవడంతో మిగిలిన ఒక్కకూతురు ఉషను ఎంతో అభిమానంగా
870 అన్వేషణ చూసే కామాక్షమ్మ ఆమెచేత మతాబాలు కాల్పించింది. వెన్నల ముద్దల్లా వెలుగులు మతాబాలలోంచి క్రిందకు జలజల రాలాయి.
బ్రహ్మయ్యగారు లేనిశక్తి తెచ్చుకొని వీధి అరుగుమీదకు బలవంతంగా వచ్చి తలగడా నడ్డికి అన్నుకుని, బాణసంచా కాల్పుల సంబరం చూస్తూ కూర్చున్నారు.
అగ్గిపుల్లలు పసిపాపల ముద్దనవ్వుల్లా వెలిగాయి విష్ణుచక్రాలు గర్వంగా విర్రవీగుతూ తిరిగాయి. టపాకాయలు దారినపోయే మనుష్యులను బెదిరిస్తు పేలి ఎగిరాయి కప్పగంతులు కుప్పిగంతులు వేసుకుంటూ చంటి పిల్లల్లా కామాక్షమ్మ ఒడిలో దూరాయి. పాముల మందులు చిన్న వెలుగుల్లో ఆకారాలను నుసితో సాగుతూ పడగవిప్పుకు ఆడాయి ప్రతి యింటిలోంచి మెరుపుల్లా కనిపిస్తున్నాయి బాణసంచా కాల్పుల వెలుగులు. పిల్లలు కోలాహలంతో గల్లంతు చేస్తున్నాయి.
దీక్షితులు, పాత్రుడు పందెం వేసుకుంటూ బాణసంచా కాల్సారు తారాజువ్వలు నిప్పు ముట్టించారనె కోపంతో ఎంతోరోజు కుంటూ ఆకాశంలోకి పారిపోయాయి. పిచికలు తెలుపు ఎరుపు ముద్ద వెలుగులతో చిలిపిగా నవ్వుతూ తారాజువ్వల వెంటబడ్ద్డాయి. (మేమించినట్టు, వఎెలకాయలు భయంకరంగా అరుస్తు ఫోరంగా సగం ఎగిరి పేలుతున్నాయి. ఒక వెలక్కాయ దీక్షితులు చేతిలోనే పేలింది. సూర్యారావు కంగారు పద్డాడు. తోలుచెయ్యి తొడుక్కున్న దీక్షితులు నిర్భయంగా నిలుచున్నాడు.
పిల్లలు వెలిగించిన చిచ్చుబుడ్లు మా సొగసు చూడండంటూ భూమి మీద నృత్యం చేసినట్టు కనిపించాయి. హృదయ కుహరాలు బ్రద్దలుచేస్తు బొట్లు పేల్పాడు పాత్రుడు. సూర్యారావుగారు సరదా ఆవుకోలేక సీమటపాకాయ కాల్సొారు. కామాక్షమ్మ గోదటపాకాయలు కులుకుతూ కొట్టి పేల్చింది.
బ్రహ్మయ్యగారు మౌనంగా భూమిమీద వెలుగులు, ఆకాశం లోని వెలుగులు పరిశీలిస్తున్నారు. (ప్రశాంతంగా కళ్ళు బలహీనమైపోయి పూర్తిగా జ్యోతులు మాత్రమే కనిపిస్తున్నాయి. తోకచుక్కలు రాలినట్లు ఆకాశంలోకి పోయిన తారాజువ్వలు వెలుగుచుక్కలు రాలుస్తున్నాయి. ఆకాశంలో ఏదో నక్షత్రం ప్రకాశవంతంగా ఎర్రగా మెరిసింది,
బాణా సంచా కాల్పుల పొగలు (బ్రహ్మయ్యగారి ముఖం మీదకు వ్యాపించాయి. నాసికారం(ధ్రాలలో దూరిన ఆ పొగలు బ్రహ్మయ్యగారికి దగ్గు తెప్పించాయి ఖళ్ళు ఖళ్ళున గట్టిగా దగ్గారు. దగ్గు ఆపుకోలేక ఆయాసంగా ఒర్గారు. సూర్యారావుగారు కంగారుపడి బ్రహ్మయ్యగారిని పట్టుకున్నారు బ్రహ్మయ్యగారు నీరసంగా బరువుగా దగ్గుతూ కఫం
అన్వేషణ 871 కాండ్రించారు. తరువాత కక్కుకున్నారు రక్తం ముద్దలు ముద్దలుగా శరీరాంతర్భాగమంతా కాళీ అయినట్లు గొంతులోంచి బయటికీ వచ్చేసింది. కళ్ళు తేలవేసి, కాళ్ళు కట్టెల్లా నాచారు బ్రహ్మయఃగారు.
పరిస్థితి ప్రమాదం గుర్తించి తారాజువ్వల కాల్పులతో నిమగ్నుడయిన దీక్షితులనుపిల్సి బ్రహ్మయ్యగారిని ఇంట్లో మంచంమీద చేరవేశారు సూర్యారావుగారు లక్ష్మి కంగారుగా అటూ ఇటూ (బ్రహ్మయ్యగారి మంచం చుట్టు తిరుగుతోంది.
దీక్షితులను పిలిచారు బ్రహ్మయ్యగారు “అయిపోయిం ... ఇంకొక క్షణము .. మనుమడు రాలేదు. . చెప్పు ....పెళ్ళి చేసుకొని గృహస్థుడు కమ్మని . అది నాకు శాంతి .. ఇతర కులంలో పీల్లనైనా పర్వాలేదు .. మతం చెరుపుకోవద్దను. వస్తాడనుకున్నా.. రాలేదు .. బ్రజ్మాయ్యగారి నిడుగ్రుద్దులోంచి కన్నీరు కారి వెంట్రుకల దవడం మీద చారలు కట్టింది. లక్ష్మిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు ఆమె చేతులు గట్టిగా పట్టుకొని ఆఖరిశ్వాస వదిలారు బ్రహ్మయ్య గారు.
లక్ష్మి గొల్లున ఏడ్చింది. ఇల్లంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆకాశంలోకి ఎగిరిన తారాజువ్వల కాంతులు తచ్చాడు తున్నాయి. పరంలోని దేవతల వెలుగుల్లా చిన్న వానజల్లు కురిసింది
బ్రహ్మయ్యగారి శవాన్ని బయట వీధి అరుగుమీదకు చేర్పించారు సూర్వారావుగారు. రాత్రి అంతా లక్ష్మ, దీక్షితులు ని(ద్రమాని రోదిస్తూ కూర్చున్నారు.
బ్రహ్మయ్యగారి దహనక్రియలు తప్పనిసరిగా దీక్షితులు జరిపారు. వెంకటేశ్చ్వర్హు, శివరాం ప్రొద్దున్న టెలిగ్రాంలు ఇచ్చాడు వాట్రుదు.
మర్నాడే తన అయిదుగురు పిల్లలను, భార్యను వెంటబెట్టుక్ న వెంకటేశ్వర్లు వచ్చాడు మరొక రోజు దాటాక శివరాంకూడా చేరుకున్నాడు జట్కా దిగగానే ఐదు నిమిషాలు బాధతో కొయ్యభారి పోయి వలవల ఆడదానిలా ఎద్బేశాడు శివరాం చితికిన తన జీవితంలో గతిచూపి పెద్దచేసి, చైతన్యం కలిగించిన తాతయ్య చచ్చిపోయాడు దీక్షితులు ఓదార్హాడు. ఆ అపురూప అభిమానాలు చూసి పార్వతమ్మ మూతి విరుచుకుంది.
గోదావరి లోయలోంచి ప్రవహించిన సీరే పిల్ల కాల్వలోకి చేరిందనీ, ఆ పవిత్ర గంగతోనే బ్రహ్మయ్యగారికి తిలోదకాలు యివ్వవచ్చునని తీర్మానించాడు పురోహితుడు (బబ్రహ్మయ్యగారిని భస్మం చేసిన దుబ్బుగడ్డి, నేలమీద మసి ఇంకా ప్రస్ఫుటంగా కనిపించింది శివరాంకు చితి పేర్చగా మంటలురేగి, బ్రహ్మయ్యగారి శవం కాలిన వైనం కళ్ళముందు తిరిగింది శివరాంకు. తన కుటుంబంలో భారతీయ విజ్ఞాన సంప్రదాయాలు నిర్జ్దుష్టముగా
372 అన్వేషణ అవలంబించే పురాతన తరము గతించి, పాశ్చాత్య నాగరిక ప్రభావములో పురాతన సంప్రదాయాలతో ఘర్షణ పడుతూ బ్రతుకుతున్న ఆధునికతరం మిగిలి నిలద్రొక్కుకుందని తల్టంది శివరాంకు. ఈ భావాలతో కూడిన చిత్రం సృష్టించాలని బుద్దిపుట్టంది శివరాంకు తాతయ్య చనిపోయేడనే బాధతప్ప, ఆ పల్లెటూరులో శివరాంకు ఎంతో ఆనందం కనిపించింది నిత్యం తీరుబడి లేకుండా, ఒంటరి జీవితలో ఆత్మీయతతో పలుకరించె ఒక్క మనిషి దగ్గరలేకుండా, శ్రమతో చికాకుతో బ్రతుకుతున్న తనకు ఆప్యాయత ఆదరణ ఎదురుగా కనిపించడంతో ఉప్పాంగిపోయాదు శివరాం. సుందర్, ఉషలతో అదడుకువేశాడు, కుర్రాడిలా, దీక్షితులతో పొలాలవెంట షికార్లు చేసేవాడు పాత్రుడుతో విజ్ఞానవిషయాలు చర్చించేవాడు. మరిది ఆనందమైన బ్రతుకుచూసివార్వతమ్మ లోలోపల కుత్సితంగా ఏట్బెది వెంకటేశ్వర్లు కూడా ఆదో ముక్తసరిగా కోపంగానే వుంటున్నాడు. బ్రహ్మయ్యగారు వ్రాసిన వీలునామాలో తనకంటె శివరాంనే ఎక్కువ ఆస్తి ముట్టచెప్పాడని వెంకటిశ్వర్లుకు దగ్ధ కలిగింది. ఉన్న అయిదు ఎకరాల భూమిలో పంపకాల విషయం ఎక్కువ పట్టించుకోలేదు శివరాం. అంత్యక్రియలు కాగానే వెంకటేశ్వర్లు వేళంగిరి బయలు దేరాడు కుటుంబ సహితంగా. మరో రెండురోజులు ఉండమని ఎవరూ అతన్ని బలవంత పెట్టలెదు అన్నగారి అయిదుగురు పిల్లలకు చెరొక రూపాయి యిద్దామని ఆప్యాయంగా శివరాం దగ్గరకు వెడితే అదో భయంగా, హేయంగా, పిల్లలు రూపాయినాణాలు వెసిరేశారు తీసుకోకుండా. శివరాం చిన్నబుచ్చుకున్నాడు. తల్లితండ్రుల గుణాలే పిల్లలకు వస్తాయనుకుంది లక్ష్మ కోపంగా. అన్నగారి మనస్తత్వం గుర్తించిన శివరాం తనకు తాతయ్య యిచ్చిన ఆస్తిమీద ఏమీ మమకారం లేదనీ, దూరంగానే తనుంటూండడంవల్ల తనేమీ ఉపయోగించుకోలేననీ, ఆస్తిఅంతా తనే నిర్వహించుకుంటూ, కుటుంబానికి ఉపయోగించుకోమని నిస్వార్ధంగా చెప్పేశాడు శివరాం పిల్లలుగల అన్నగారికి ఒంటరి తమ్ముడుగా ఆమాత్రం సహాయం చెయ్యటం తన విధ్యుక్త ధర్మమనుకున్నాడు శివరాం. తమ్ముడి మాటలకు తాత్సాలికంగా ఆనందంగా నవ్వి వెంకటేశ్వర్లు కుటుంబంతో కదిలిపోయాడు. కుత్సిత మనుష్యుల బ్రతుకులు ఎంత ఆస్తివున్నా కుములుతూనే బ్రతుకుతాయని శపించింది లక్ష్మి. పెద్దన్న ప్రవర్తన చూశాక, శివరాం తేలిగ్గా నవ్వశాడు దీక్షితులు బలవంతంమీద శివరాం మరో రెండురోజులు ఆగాడు. చెల్లెలుకు బావగారికి సుందర్ ఉషకు పాత్రుడికి తనకు తోచిన క్రొత్తబట్టలు బహుమతులుగా తెచ్చియిచ్చాడు సూర్యారావు కామాక్షమ్మ శివరాంతో సగౌరవంగా మాట్లాడుతూ (బ్రహ్మయ్యగారి మనుమదడొచ్చాదని పుకారుతో గుసగుసలాడుకుంటున్న పొరుగింటి వారిని పిలిచి, అతన్ని పరిచయం చేసి ఆనందించెవారు.
అన్వేషణ పప
రాత్రి భోజనం చేశాక తీరుబడి సమయాల్లో శివరాం తాను గీసిన చిత్రాలు బావకు చూపిస్తూ పిల్లలతో నవ్వుతూ ఆనందిస్తోంటే, అద్దెకున్న పంచాయితీబోర్జ్దు గుమాస్తాగారి భార్య కిటికిలోంచి తనవైపు చూస్తున్న పిల్లి కళ్ళు మిణుగురు పురుగుల్లా వెరుస్తున్నట్లు కనిపించేవి శివరాంకు. గుమాస్తాభార్య తన భర్తను పిలిచి శివరాం బొమ్మలు చూపించి, తాను పొగిడి, మాటలు కల్పించుకొని శివరాంను పలకరించి సంతృప్పిషడేది. సుందర్ ఉషలు బలవంతంగా లాక్కున్నారు శివరాంనుంచి
చెల్లిలును, బావను, సికింద్రాబాదు రమ్మని ఆహ్వానించాడు శివరాం. పల్లిటూళ్ళకంటిె నగరంలో సర్వసౌభాగ్యాలలో పురుడ పోసుకోవచ్చని తొమ్మిదవనెల రాగానే భర్తతో సికింద్రాబాదు వస్తానంది లక్ష్మి. భార్యను చూసి నవ్వుతూ అంగీకరించాడు దిక్షితులు.
బ్రహ్మయ్యగారు మరణ సదుయంలో అన్న మాటలు నివేదించింది లక్ష్మి. శివరాం మౌనంగా నవ్వ తలదాచుకున్నాడు.
'కులంలోఏముంది? కులం కన్న గుణం ప్రధానం!” అంది లక్షి.
పురాతన కట్టుబాట్లుల్లో, సంప్రదాయాలలో క్రమశిక్షణ పొందిన బ్రహ్మయ్యగారి మనస్సు తర్మించి తర్మించి చివరకు సర్దుకుని, కుల విభేదాలు విస్మరించి సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకోవచ్చనే నమ్మకం కలిగి, ఆధునిక దృక్పధానికి ఒక అడుగు దగ్గర వేశారు మానవులంతా ఒకటే అయినప్పుడు, కులంలాంటి మతాలను కూదా విస్మరిస్తే వచ్చిన నష్టమెమీ లేదని శివరాం విశ్వసించాడు బ్రహ్మయ్యగారు మరొకవిధంగా కుతమత విభేదాలు విస్మరించవచ్చునన్నట్లే భావించాడు శివరాం. చెల్లెలన్న మాటలు కూడా తన భావాల కనుగుణ్యమే అనిపించింది శివరాంకు.
శివరాం జట్కా ఎక్కుతూంటే, సూర్వారావు గాది కుటుంబమంతా వీధిలో నిలుచుని, ఆప్వాయంగా వీల్కోలిచ్చారు పొరుగింటి అమ్మలక్కలు పెళ్ళికొడుకు హోదాలో ఉన్న శివరాంను పరిశీలించి తొంగిచూశాడు. దీక్షితులు బావమరిది తణుకు స్టేషనుదాకా తీసుకువెళ్ళి రైలు ఎక్కించి హత్తుకున్న హృదయాలు చీలినట్లు బాధపడుతూ గృహోన్ము ఖుదైనాడు
కూ ట్
974 అన్వేషణ
రాణి, కామేశ్వరమ్మ యింటిముందు రిక్షాలో దిగారు. వరండాలో చంద్రప్రభ మరో యిద్దరు కాలేజి అమ్మాయిలతో కూర్చుని కాగితాలు చదువుతోంది బిగ్గరగా అభినయిస్తూ, తల్లిని రాణిని చూసి అల్లరిగా గెంతుతూ ఆగిన రిక్షా ఎదుటకు వచ్చింది.
“పాపం! నీ ఒళ్ళు ఎంత హూనమై పోయివుంటుందో, కాస్త కాపడం పెట్టనా?” రాణీ ఒళ్ళు నిమిరింది చంద్రప్రభ నవ్వుతూ.
'ఎందుకు?' అంటూ కోపంగా చూసింది కామేశ్వరమ్మ.
“న్స్ లావుపాటి శరీరం పెట్టి యీ లతను రిక్షాలో కుక్కి నలిపేస్తే, పొపం నలిగిపోయి వాడిపోయి వుండదూ[” జాలిగా రాణి శరీరం ఊదింది చంద్రప్రభ,
“న్సవ్వు రోడ్డు రోలరంతా కాకపోతే నే చూస్తాగా... పెళ్ళిగానీకా చిందులు త్రొక్కుతూ కామేశ్వరమ్మ కోపం అభినయిస్తూ లోపలికి పోయింది.
“లతా? నీ గదిలోకి నడు... చిన్న పనుంది! చంద్రప్రభ స్నేహితులను పిలిచింది.
'ఈమె పద్మ ఈమె రాజ్యం!” తన స్నేహితులను పరిచయం చేసింది చంద్రప్రభ. పరస్పర అభివందనలు చేసుకొని నవ్వుకొంటూ రాణిగదిలోకి నడిచారు అంతా.
“లతా!... ఈ వేళ నువ్వు నాకు ప్రేమంచడం నేర్పాలి!”
చం(ద్రప్రభ నవ్వింది.
రాణి ఆశ్చర్యపోయింది
రాజ్యం, పద్మ నవ్వు పెడాల్లో ఆపుకుంటున్నారు.
అన్వేషణ $785
“నాకు ప్రేమ అంటే తెలియదు. . నేనెవ్వరిని (సేమించలేదు!? కోపం ముఖం పెట్టింది రాణి.
“ఫంతులమ్మకు పారాలు చెప్పడం సులవేగా!”.
చంద్రప్రభ పకపక నవ్వింది ఆమె వ్యంగ్యధోరణి అంతం చెయ్యాలనుకొంది రాజ్యం.
“ఏమిలేదండి!... మా కాలేజిలో ఆడవాళ్ళం నాటకం వేస్తున్నాం... చంద్రప్రభ రాజకుమార్తె పాత్ర వేస్తుంది... నేను రాజకుమారుడిగా నటిస్తాను ఆమె నన్ను (ప్రేమిస్తుంది. . విరహంతో తపిస్తుంది ఇద్దరం కలుసుకుంటాం ఒక ఉద్యానవనములో .. ఆ ఘట్టం ఎలా అనాలో కొంచెం చెప్పాలి.”
“రాజకుమారుడి స్నేపొతుడిగా వాని (ప్రేమ ఘట్టంలో నేను రాయబారిగా పనిచేస్తాను... వారి ప్రేమచూసి నేను ఒంటరిగా ఏదో ఊహాసుందరిని తలుస్తూ తపిస్తూ... నాకు కూడా చెప్పాలి. ఎలా నటించాలో!” పద్మ రాజి దగ్గర చేరింది.
“రాజకుమారా... నీ అందం చూస్తోంటే ఒళ్ళు పులకరిస్తోంది. ఆనందానుభూతిలో మైమరచిపోతున్నా.. నా హృదయ రాజ్యం వశంచేసుకొని ఏలుకో!” చంద్రప్రభ రాజకుమార్తెగా తన మాటలు చదివి రాణిని నటించమంది.
భజంగరెడ్డికి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాల సంగతి తండ్రి ద్వారా తెలుసుకొని చంద్రప్రభ తన్ను నటన నేర్పమని పరీక్షగా నిర్భందిస్తోందేమో అనుకుంది రాణి. “ప్రేమ నటించడం కష్టం, అనుభూతి పొంది ఆనందించాలి. అంతే? నవ్వుతూ ఊరుకొంది రాణీ.
“అమ్మతో సభలకు వెళ్ళి ఉపన్యాసాలు నేర్చుకుంటున్న సంగతి నాకు తెలుసు... ప్రత్యేకం చెప్పనక్కర్తేదు... యీ మాటలు నటిస్తూ ఎలా అనాలో చెబుతావా లేదా” చంద్రప్రభ కోపంగా మూతి ముడుచుకు కూర్చింది.
“గాజకుమార్తెకు కోపం తెప్పించకండి!” పద్మ నవ్వింది.
“అవును... నా రాజకుమార్తెకు కోపం వస్తే, నాకేభావం రావాలండీ!” రాజ్యం ప్రశ్నించింది చిలిపిగా.
అందరూ నవ్వారు.
376 అన్వేషణ
ముఖం తుడుచుకుంటున్న తువ్వాలు మంచంమీద గిరవాటేసింది రాణి. రంగస్టలంలో, రాజ్యం, చంద్రప్రభ నిలెచోవలసిన విధం బోధించింది మొదట. తర్వాత వారి పాత్రల సంభాషణలు చదువుతూ అభినయిస్తూ చూపింది.
ఇద్దరు స్త్రీలు భార్యాభర్తల ధోరణిలో (పేమించుకుంటున్న ఘట్టం వాస్తవంగా చూస్తున్న పద్మ అల్లరిగా యీలవేసి కేరింతలు కొట్టింది.
పాత్రల సంభాషణలు సరిగా తాను నటింలేక పోయినట్లు మనస్సులో అసంతృప్తి పడింది రాణి; జీవితంలో నిజమైన అనురాగం చవిచూడని తనకు (ప్రేమానుభూతి ఉవ్వెత్తుగా ఐ విధంగా 'వస్తుంది? కాలం గడచినకొలదీ సంవత్సరాలు (మోదైన చెట్టుకొమ్మల్లా బోడిగా. పెరుగుతున్నాయే గాని, చిగురుటాకుల (ప్రేమైన జీవనం ఏర్పడి ఆనందం కటగటం లేదు. జీవితంలో తెలివితక్కువ వల్ల చేసిన ఒక్కపారపాటు జీవితాన్నె నాశనం చేసింది. సంఘర్షణ కలిగించే మనో భావాలతో హృదయమే చిత్రమైపోతోంది. ఉబికి వచ్చే దుఃఖం ఆపుకోలేక మంచినీళ్ళు త్రాగాలనే నెపంతో వంటింట్లో చొరబడి మనస్పూర్తిగా బద్భి, ముఖం కడుక్కొని ముందు గదిలోకి వచ్చింది రాణి
చంద్రప్రభ, రాజ్యం, పద్మ, తమ రంగంలో లీనమయి సంభాషణలు చదివేస్తున్నారు తీవ్రంగా. నవ్వుతూ ముందుకు వచ్చి చంద్రప్రభ వైపు సొగసుగా చూసింది రాణి.
“రాజకుమార్తెలో పెళ్ళి కళ ఏర్పడిందే అప్పుడె!” నవ్వింది రాణి,
తమ నాటకానికి తప్పక రమ్మని, రాజ్యం, పద్మ, కామేశ్వరమ్మకు , రాణికి ఆహ్వాన మిచ్చి వెళ్ళిపోయారు.
చంద్రప్రభ కాగితాల దొంతరలో ఒక కార్డుబోర్డు పైలుతెచ్చింది.
“సనాక తమాషా చూపించనాకొ చంద్రప్రభ నవ్వుతూ ఫైలు చేతులతో వెనక దాచింది.
“ఏమిటిది... కాబోయే భర్తఫోటో గదూ!” నవ్వింది రాణి.
“ఆ!.... నీ కెప్పుడూ ఆ ధోరణేగ' మూతి ముడుచుకొని ఫైలు తెరిచింది చంద్రప్రభ.
వివిధ పత్రికలలో ప్రచురించబడిన శివరాం గీసిన చిత్రాలు కత్తిరించి వున్నాయి అందులో. అఖిలభారత చిత్రలేఖన ప్రదర్శనలో ప్రధమ బహుమతి లభించనప్పుడు పత్రికలు ప్రకటించిన అతని ఫోటో, జీవిత సంగ్రహం "“పేదస్వరాల) చిత్రం కూడా కత్తిరించబడి అందులో :]ర్చృబడ్డాయి.
అన్వెషణ 377 ఆ పత్రికలన్నీ రాణి చంద్రప్రభ చదువుకున్నా చంద్రప్రభ వాటి నన్నిటిని కత్తిరించి ప్రత్యేకత ఆపాదిస్తూ ఒక ఫైలు తయారు చెయ్యడంలోని వింత రాణికి అర్ధం కాలేదు, “ఇవన్నీ ఎందుకు సేకరించావో తెలుసా. .. నేను చిత్రాలు గీస్తున్నాను... ప్రఖ్యాత చిత్రకారుల బొమ్మలు అందుకే కత్తిరించాను” అంటూ చంద్రప్రభ తెల్లకాగితం మీద పెన్సిలుతో ఏదో బొమ్మ గీయడం మొదలు పెట్టింది
“చిత్రకళలో వున్న గొప్పతనం వర్ణనాతీతం!” అంటూ గీసిన బొమ్మ చూపింది.
ఆ గీసిన బొమ్మలో పందికీ, కుక్కకూ ఉన్న పోలికలన్నీ మిళితమై పోయాయి.
“దీని పేరు?” అడిగింది రాణి
“జంతువు.”
ఇద్దరూ పకపక నవ్వుకున్నారు.
“ఎలా వున్నాడీ చిత్రకారుడు. .!” అంటూ శివరాం ఫోటోలోని విశాలపధనం మీద పంగనామం పెట్టింది చంద్రప్రభ.
“తప్పు! ఫోటోలను అవమానపరచకూడదు!” నవ్వింది రాణి స్వీయ ఉద్రేకాలు అణచుకుంటూ. “చాలా మంచివాడుట... బన్ని అవమానాలైన భరించగలడు౯” చం(ర్రప్రభ పకపక నవ్వింది.
రాణి ఒక క్షణం తీవ్రంగా ఆలోచించింది. అతని ఫోటో తెచ్చి చూపించడంలో, ఏమైనా అంతరార్ధముందేమో అనీ భయపడింది శివరాంతో మరేవిధంగానైనా తనకు మునుపు పరిచయమున్నట్లు చంద్రప్రభకు తెలిసిందేమో అని అనుమానించింది.
“నీ బొమ్మ గీయనా?” మళ్లీ పెన్సిలు పట్టుకొంది చంద్రప్రభ,
“మ్రనిషిలాగా, లేక జంతువులాగా గీస్తావాగొ రాజి గట్టీగా నవ్వి తన మనస్సులో చెలరేగుతున్న భావాలు, అణుచుకోవాలని బాహ్యంగా చలనం కలిగించుకుని చంద్రప్రభ భుజాలు ఊపి అల్లరి చేసింది.
చంద్రప్రభ నిశ్చలంగా ఆడబొమ్మ చిత్రించ ప్రయత్నించింది. పేడి ఆకృతి ఏర్పడింది.
“నన్ను చిత్రవథ చెయ్యకే తల్లీ బొమ్మల్లోగ” రాణి బ్రతిమాలింది చం(ద్ర(ప్రభను.
ప్రసాద్ దొడ్లో కుర్చీ వేసుకుని పుస్తకం చదువుకుంటున్నాడు దీక్షగా.
378 అన్వేషణ కామేశ్వరమ్మ ఒళ్ళు ఊపుకుంటూ రాణి గదిలోకి వచ్చింది.
“లతా .. మనం రేపు నగరంలోని ఆస్పత్రులు తిరగాలి. బెంగుళూరునుంచి మహిళాసంఘ కార్యదర్శి వచ్చిందిగా . ఆమె యిక్కడ స్రీలకు చికిత్సా సౌకర్యాలు ఎ విధంగా ఉన్నాయో పరిశీలించాలనుకుంటోంది... ౫” కామేశ్వరమ్మ పెద్ద నాయకురాలిలా ఉపన్య్వసించింది.
“వంద్రప్రభకు త్వరలో ఏమైనా చికిత్స చేయించడం . చదువు మాన్పించి!” రాణీ హేళనచేసింది
“ఎందుకు?” కామేశ్వరమ్మ ఆశ్చర్యంగా ముఖంపెట్టింది.
“ఎందుకా... పిచ్చెక్కింది.... చంపేస్తాను . నే నెవరనుకున్నార్రా . నువ్వెవరవు?... మనిషివా, జంతువా....! ఏమిటిదంతా!” పిచ్చిదానిలా నటించింది చంద్రప్రభ
“అదంతా నటనలెండి... నాటకాలు వేస్తున్నారుకాలేజిలో!” నవ్వింది రాణి.
“నయం నిజంగా.. పిచ్చెక్కిందేమో అని భయపడ్డా!” తీరిగ్గా శ్వాసపీల్చింది కామేశ్వరమ్మ “పెళ్ళి కావలసిన దానవు . ఏమిటే ఆ గంతులు!” ఉరిమింది కూతురువైపు చూసి ఆమె,
“అందుకే త్వరగా పెళ్ళిచికిత్స చేయించమంటున్నా!”
రాణీ కామేశ్వరమ్మతో రహస్యం చెప్పినట్లు దగ్గరగా వెళ్ళింది.
“వేయిస్తా... ఈయేడు ఎం ఎ పూర్తికాగానే ఏ పల్లెటూరి వ్యవసాయదారుణ్నా పట్టికట్టేస్తా... అపుడు దీన్ని నాగలికి కట్టి పొలం దున్నిన్తాడు అల్లుడు!” నవ్వింది కామేశ్వరమ్మ.
“ఫపాలందున్నడం ఎంత సరదాగా ఉంటుందో నీకేం తెల్సు... సభల్లో ఊరికే కబుర్లుచెప్పి ఉపన్యాసాలివ్వడ మనుకున్నావా?” తల్లిని హేళన చేసింది చంద్రప్రభ.
“నమస్మారం అమ్మగారు!” ప్రసాద్ వచ్చి భక్తుడిలా నమస్కరించాడు తల్లికి హాస్యంగా.
“ఏ వరం కావాలి;” కామేశ్వరమ్మ కామేశ్వరీదేవిలా అభయహస్తం చూపింది.
“నాకేం వద్దు తల్లీ... నాన్నగారు వచ్చారు!”
అన్వేషణ 379
కామేశ్వరమ్మ హడావిడిగా లోపలికి నడిచింది భర్తదగ్గరకు. ప్రసాద్ తల్లిని అనుసరించాడు.
కురంగేశ్వర్రావుగారి చెవిలో భుజంగరెడ్డి తత్వంగురించి ఒక వాక్యం పడెయ్యాలని రాణి ప్రయత్నిస్తోంది ఆ మాట జారడం తన భావిజీవితానికి కొంతరక్షణ కలిగిస్తుందని ఆశ పడింది రాణి.
ఇర్టుభా .! ఆదది ఒంటరిగా అనాధగా బ్రతకడం సంఘంలో ముప్పుకదూ,” దినంగా ముఖం పెట్టింది రాణీ
తమయింట్లో ఏదైనా కష్టం కలిగిందేమో అని చంద్రప్రభ కంగారు పడింది “ఆమాట ఎందుకంటున్నావు... నీకేమైనా కష్టం కలిగిందా.” ముఖం మీద అడిగేసింది.
“ఏంతమాట!... మీ యింట్లో నాకు జరుగుతున్న సౌకర్యాలు మునుపు ఎక్కడా జరగలేదు. . కాని బడిలో... మాపారశాల కార్యదర్శి గుణం మంచిదిగా కనిపించడం లేదు!” రాణి దుఃఖంతో ముఖం చిట్లించింది
“ఏం జరిగింది?” చంద్రప్రభ ఆత్రుతగా అడిగింది.
భుజంగరెడ్డి తన్నొాకమారు నిజాంసాగర్ ఆహ్వానించడం తాను తిరస్మరించడం చెప్పేసింది రాణి.
“అతడు నన్ను ఏదైనా (ప్రమాదంలో దించుతాడేమో అని భయంగా ఉంది!” నసిగింది.
“నాన్నగారితో చెప్పుదాం!” అంది చంద్రప్రభ.
“తవ్ఫు! ఇటువంటి విషయాలు ఆయనకు తెలియకూడదు!” ముఖం దించుకుంది రాణి బాధగా.
ఈ విషయం చంద్రఫప్రభద్వారా ఆమె తండ్రికి తెలియాలనే రాజి అంతర్గతభావం.
చంద్రప్రభ కొద్దిసేపు మౌనంగా ఆలోచనలో మునిగింది.
కురంగేశ్వరరావుగారు నాంపల్లి పారశాల కార్యవర్గ సమావేశానికి మధ్యాహ్నం హాజరయ్యారు. భుజంగరెడ్డి తనకు రాణిగురించి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాలు కార్యవర్గం ముందుపెట్టి యిటువంటి కులతను ఆదపిల్ల బడిలో పంతులమ్మగా ఉంచడం (శ్రేయష్కరం కాదన్నాడు. కురంగేశ్వర(ర్రావుదిగ్భాంతి చెందాడు. ఉత్తరాలు చదివి
380 అన్వేషణ నిర్దాంతపోయాడు. రాణి కులట అనే విషయం ఆయన నమ్మలేక పోయాడు రాణిని ఉద్యోగంలో చేర్పించిన ఆయన పరువు ప్రతిష్టలే భగ్నమయినట్లు కనిపించింది. తన గౌరవం కాపాడుకోడానికైనా మొదట ఆకాశరామన్న ఉత్తరాలు త్రోసి పుచ్చాలని (ప్రయత్నించాడు. బుజువు లేక ఏవో ఉత్తరాలు ఆధారంగా ఒక స్తీ శీలం శంకించలేమన్నారు. చర్య చెలరేగింది.
విషయం మరొక కార్యవర్షసమావేశంలో చర్చించడానికి వాయిదా పడింది.
కురంగేశ్వరర్రావుగారి మనస్సులో చికాకు పెరిగిపోయింది పరిస్థితి ఆశాంతికరంగా పరిణమించందనుకున్నారు. రాణి ప్రవర్తనలో ఏవిధంగానూ కులట లక్షణాలు ఉన్నట్లు కురంగేశ్వర్రావుగారికి కనిపించలేదు రాణి ముఖంలో అమాయకత్వం, సంస్కార లక్షణాలు గల ఆడదానిలా మాత్రమ తెలియజేస్తున్నదని నమ్మారు కురంగేశ్వర్రావుగారు అయినా విషయం పరిశోధించనిదే ఒక నిర్ణయానికి రాకూడదనుకుని, రాణి విషయంలో మునుపటిలాగే కొంతకాలం ్రవర్తించాలనుకున్నారు. మనస్సులోని చిరాకు దాచుకోడానికి రాత్రి భోజనం చేసి ఒంటరిగా పోయి అలిసిపోయినట్న్లు మంచంమీద ఒరిగారు ముభావంగా కురంగేశ్వర్రావుగారు.
చంద్రప్రభ భోజనం సమయంలో కామేశ్వరమ్మ రాణి అన్నసంగతి చెప్పేసింది. కామేశ్వరమ్మ రెడ్డిమీద కోపం తెచ్చుకుంది. సాంఘికరంగంలో ముందంజ వేస్తున్న స్త్రీలను ఒక మగవాడు అపార్ధం చేసుకుని హింసించడం దుర్భర అవమానమని నిర్ణయించిది కామేశ్వరమ్మ పడకగదిలో భర్తసౌమ్యంగా ఉన్నప్పుడు రెడ్డి ప్రవర్తన గురించి కామేశ్వరమ్మ చెప్పేసింది. కురంగేశ్వరరావు గారు సమస్య పునః పరిశీలన చేశారు. ఆకాశరామన్న ఉత్తరాలు రెడ్డి పన్నిన పన్నాగమైై ఉండవచ్చునని శంకించారు. తానెరిగిన పెద్దపోలిసు ఉద్యోగితో యీ ఆకాశరామన్న ఉత్తరాలు పోలీసులకు దర్యాప్తకు పంపమన్నారు కురంగేశ్వర్రావుగారు. తనకేమి ఉత్తరాలతో జోక్యం లేనందున పోలీసుల పరిశోధనలతో కురంగేశ్వర్రావు, రాణికూడా ఆఫ్రతిష్ట పాలవ్వగలరని ఆశించి రెడ్డి ఆకాశరామన్న ఉత్తరాలు పోలీసులకు అందించాడు.
కామేశ్వరమ్మ మర్నాడు రాణిని తీసుకుని సాయంత్రం వేళ బెంగుళూరు మహిళా కార్యదర్శితో మరికొందరి కార్యవర్షసభ్యులతో ఆస్పత్రులు పరిశీలించడానికి బయలు దేరింది తమ స్వంతకారులో. కార్యదర్శిగా కామేశ్వరమ్మ వివిధ ఆస్పత్రి అధికారులకు ఉత్తరాలు వ్ర్రాయడంచే అధికారులు యీ మహిళాబ్బందానికి న్వాగత మిచ్చి, అస్పత్రిలోని
అన్వేషణ 31 రోగిష్పులైన మహిళలను చూపించారు జ్వరాలతో, అంగవైకల్యాలతో, కడుపుబాధలతో ప్రసవాలతో ఆస్ఫత్రిలో ఉన్న స్రీ జనాన్ని బెంగళూరు మహిళా కార్యదర్శిని పలకరించి ఆస్పత్రిలోని చికిత్సాసొకర్యాలు ప్రశ్నించింది స్త్రీల బాధల పురాణం సగం విని సగం వినక, కాలయాపన చెయ్యకుండా తన పర్యటన ముగించుకోవలనుకుంటూ గబగబ స్తీ రోగుల మంచాలచుట్టూ తిరిగేసింది బెంగుళూరు కార్యదర్శి బయటికివచ్చి స్రీజన సంక్షేమం గురించి మహిళలందరూ నడుం కట్టి ముందుకు రావాలంటూ ఉద్దోపించింది. అనాధ బాలికల శరణాలయం, క్షయరోగం ఆస్పత్రి పిచ్చివాళ్ళ వైద్యాలయం కూడ సందర్శించి, స్త్రీల న్పితిగతులు పరీక్షించిందావా, కుష్కరోగుల ఆస్పత్రిలోకి కారునడిపించింది.
ముఖము, శరీరాంగాలు ముద్దలు ముద్దలుగా ఊడి రక్తం చీము కారుతూ అంగాలు ఊడిపోతూ అసహ్యకరంగా ఉన్న ఆ కుష్టు రోగులను చూస్తూనే అసహిర్యచుకున్నా ఒక్కసారి ఆస్పత్రిలో పర్యటించక తప్పలేదు. రోగులను చూ. చే డాక్టరుతో ఏదో మాట్లాడుతూ గబగబ నడిచింది కార్యదర్శి. రాణికి స్త్రీల పరిస్టితిచూసి చాల జాలివేసింది. కనికరంతో దుఃఖం ఆపుకోలేక పోయింది. శరీరం చెడగొట్టుకొని యీ స్టితికి స్రీలు ఎందుకు వస్తారో, ఏకారణంవల్ల కుష్పరోగం ప్రబలుతోంది అని ఆలోచించింది రాణి.
“కమలమ్మా!” అంటూ స్త్రీ కంరం పిలిచింది.
రాణి ఆశ్చర్యంగా వెనుదిరిగి చూసింది స్త్రీని గుర్తుపట్టలేక పోయింది రాణి. కుంటుకుంటూ ఒగరుస్తూ, బలహీనంగా పేలవంగా నవ్వుతూ చేరింది. రాణి ఆమెను అప్పటికీ గుర్తుపట్టలేకపోయింది.
“నేను బాలమ్మను!”
రాణి శరీరమంతా కంపించి పోయింది.
తన్ను కులస్రీల వాతావరణంనుంచి తప్పించి మహోపకారం చేసీన బాలమ్మకు ఆదుర్గతి పడుతుందని రాణి కలలోకూడా ఊహించలేక పోయింది తనకు ఎంతో సహాయంచేసిన స్త్రీని యా దుర్గతిలో తెలియనట్లు నడిచిపోవడం ఆమెకు ద్రోహం చెయ్యడమే అని రాణి తలవోసింది. హృదయం ద్రవించి కృతజ్ఞత ఉప్పొంగి ఒక్కక్షణం నిస్తబ్బురాలై కన్నీటి కొలకుల్లోంచి వేడీ బిందువులు రాల్ఫింది మౌనంగా రాణి “నాకర్మ . యింత హీనస్థితి ఏర్పడుతుందనుకోలేదు... జీవితంలో చేసిన పొరపాట్లకు పాపాలకు
త8ిలై అన్వేషణ ఫలం బ్రతికిఉండగానే చూస్తున్నా... కులాసాగా ఉన్నావా నాతల్లీ .. నాకదే సంతోషం పాపం! ఆ రోజుల్లో ఎంత భయపడిపోయావు... ఆత్మహత్య చేసుకొని చచ్చి పోవా లనిపిస్తుంది... ఉరి పోసుకోడానికి త్రాడైనా యివ్వరు ఆస్పత్రిలో _ వెళ్ళమ్మా. మరిచోపోకు తల్లీ!” అంటూ ఏడుస్తూ చింపిరి ఆకుపచ్చచీరతో కళ్ళు తుడుచుకుంటూ కుంటుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది.
కామేశ్వరమ్మ యీ సంఘటననుచూసి కొమ్మబారిపోయింది. కుష్టురోగియైన స్తీ విలాపంతో. కరుణ ఆమెలో ద్రవించినా, లాణికి ఆ కుష్టురోగియైన స్తీకి సంబంధమేమిటా అని తలపోసింది. బెంగుళూరు మహిళా కార్యదర్శి ఆస్పత్రి పర్యటన ముగించుకుని కారుదగ్గరకు నడిచింది, కామేశ్వరమ్మ రాణి పిల్చి గబగబ కారువైపు వెళ్ళింది.
బెంగుళూరు కార్యదర్శిని, యితర సభ్యులను వాళ్ళయిళ్ళల్లో వదిలేసి, కామేశ్వరమ్మ, రాణి గృహోన్ముఖులైయారు. కామేశ్వరమ్మ ఆ కుష్టుగోగి గురించి ప్రశ్నించింది.
“ఆమె మాయింట్లో మునుపు దాసీపని చేసేది... మానాన్న గారు నన్ను కమలా అని పిలిచేవారు. అందుచేత కమలమ్మ్నా అని, పిలిచింది ... తర్వాత ఆ దాసి ఎవదిత్తోనో లేచిపోయింది.... వేశ్యగా (బ్రతికి శరీరం షాడుచేసుకుందేమో! పాపం!” రాణి జాలి కనపరచింది.
కామేశ్వరమ్మకు రాణి సమాధానం సంతృప్తికలిగించింది. వివిధ మనుష్యుల జీవితరీతుల విచిత్రాలు అనుకుని పెదాలు విరుచుకుంది
భోజనానంతరం చంద్రప్రభ తల్లిదండ్రులకు, రాణికి తమ కాలేజీ వార్షికోత్సవం కార్యక్రమం అందిచ్చింది. తాను రాజకుమార్తెగా నటించబోతున్నానని, నాటకం తప్పకుండా చూడవలసిందని తల్లిదండ్రులను కోరింది.
“అయితే యీ ్రజాస్వామ్యయుగంలో భర్తగా నీకు రాజకుమారుణ్ణి వెదకడం చాలా కష్టమే!” కురంగేశ్వర్రావుగారు పకపక నవ్వారు.
'రాజకుమారుణ్హి కాదు... తెలంగాణా రైతు నొకజ్జి కట్టబెడదాం?” కామేశ్వరమ్మ హేళనచేసింది.
“మీరేమి అవస్థపడనకృల్లేదు... నేను స్వయంవరం చేసుకుంటా!” చంద్రప్రభ నవ్వింది
అన్వేషణ 383
'నీ స్వయంవరం ప్రకటన డప్పు వాయిస్తూ నేను చేస్తానక్కయ్యా'' అన్నాడు ప్రసాద్ కొంటెగా.
కాలేజి వార్షికోత్సవానికి రాణి సహితంగా కురంగేశ్వర్రావు దంపతులు ప్రసాద్‌ను వెంటబెట్టుకుని కారులోదిగారు కాలేజీ మైదానంలో పెద్ద షామియానా పరిచి, వేలకుర్చ్సీలు బారుల్లో అమర్చి ఎత్తేన రంగస్థలవేదిక సుందరంగా అలంకరించారు. కాలేజి ప్రిన్సిపాలు, ఓక కవి, గాయకుడు, చిత్రలేఖకుదడు వేదిక అలంకరించారు విద్యార్ధి సంఘం కార్యదర్శి స్వాగతమిస్తూ, ఆయేటి నివేదన వినిపించాడు. కళాశాల అభివృద్ధి గురించి ప్రశంసిస్తూ అధ్యక్షుడు తొలి పలుకులు చెప్పాడు. ప్రబంధ నవ్య, అభ్యుదయ కవిత్వ రీతులగురించి శ్రావ్యంగా పద్యాలు చదువుతూ కవి ఉపన్యసించారు. ఆధునిక యుగంలో కర్ణాటక లలిత సంగీతరీతుల అభివృద్దిగురించి గాయకుడు ఉపన్యసించి, కరతాళధ్వనులు చెలరేగేలా మధురంగా గీతాలు ఆలపించారు,
చిత్రలేఖకుడుగా శివరాం ఉపన్యసించదానికి లేచాడు నగరంలోనే వుంటూ దేశవిఖ్యాతి ఆర్జించిన ప్రముఖ చి(త్రలేఖకుడు వేదిక మీద నిలుచోగానే ప్రేక్షకులలో హర్షధ్వానాలు మారు (మోగేయి ప్రాశ్చాత్యదేశంలో మొదట వృద్దిచెందిన యధార్ధవాద ప్రభావంతో లియనార్హు డావిన్పీ, మైఖేల్ ఏంజెలో, రాఫెల్ సల్పినకృషి తరువాత ప్రబలిన ఇం(్రైషనిజమ్ వివిధరీతులు, పికాసో చిత్రకళానైపుణ్యం వర్ణించాడు. వివిధ చిత్రాలను విపులీకరిసూ కట్టుకధల్లా ప్రతిబింబాల్లా కళ్ళకు కట్టెలా మాట్లాడాడు కళకు ఆటపట్టయినా శ్రూన్సు దేశంనుంచి భూప్రదక్షిణచేస్తూ ఇంట(పెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఫాసిజం మొదలైన శైలులు భారతదేశంమీద ప్రాకించిన ప్రభావం, ఆ ప్రభావంలో ప్రాధాన్యత మొసగపడిన నూత్న వర్ణవిన్యాసం, ఆకారనిర్మాణం, విచిత్రలయంలో వర్ణములు కలిసి రూపొందించబడిన ఆకృతులు. తెలియజేశాడు. అజంతా చిత్రాల అపురూపసౌందర్యం, ఆంధ్రసంస్కృతికి (ధ్రతిబింబాలైన లేపాక్షి తిరుపతి, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మల ప్రాశస్త్యం, మొగలాయీ రాజపుత్రుల చిత్రకళావైభవం, ఆధునిక యుగంలో ప్రఖ్యాతి కెక్కిన శాంతినికేతన కళారీతులు, ప్రస్తుత ప్రఖ్యాత చిత్ర కళాకారుల గురించి అనర్గళంగా వాగ్గొరణి కురిపించాడు శివరాం.
తెరవెనుక గ్రీన్ రూమ్‌లో రాజకుమార్తెగా కోటా వేసుకుంటున్న చంద్రప్రభ శివరాం ఉపన్యాస సరళి వింటూ మధ్యమధ్య దొంగతనంగా తెరసందుల్లోంచి అతని ఆకారాన్ని
౩84 అన్వేషణ పరిశీలించి మురిసిపోయింది శివరాంను వేదికమీదచూసి రాణీ ఒక్కక్షణం చకితురాలై, అతను చేసిన అనర్గళ ఉపన్యాస ధోరణివిని, చిత్రలేఖన కళలో అతను చేసిన కృషి అపారమనుకుంది. అతనిగురించి భావాలు మనస్సులో కదలి ్రేకకుల సందడి, ఇతర ఉపన్యాసకుల విషయాలు మనస్సు కెక్కించుకోలేదు రాణి
ఉపన్వానాలు పూర్తి కాగానే ఉపన్యాసకులు, అధ్యక్షులు, సభముందరి సోఫాలు అలంకరించారు. విద్యార్థులు కొందరు నాహసించి ముందుకు పోయి శివరాంను నోట్ బుక్కులో సంతకాలు పెట్టమని వేధించారు. క్రమశిక్షణ భంగం కలిగిస్తున్నారని ప్రిన్సిపాలు విద్యార్థులను కసిరాడు.
నాటక ్రదర్శనంలో చంద్రప్రభ రాజకుమార్తె విరహాన్ని (ప్రేక్షకులు రంజిల్లేలా నటించింది. సహజంగా మనస్సులో శివరాం గురించి ఆలోచనలు కలిగి ఉద్దేశాలు మొదలి, ఆమె నటనకు రాణింపు తెచ్చాయి. కూతురు నటనా కౌశల్యానికి తల్లితండ్రులు ఉప్పొంగి, పోయారు ఆనందంతో, రాణి దృష్టి నాటకరంగం విడిచి శివరాం కూర్చున్న సీటుమీదనే కేంద్రీకరించింది.
నాటక ప్రదర్శన తర్వాత విద్యార్థుల విచిత్ర వషధారణ నృత్యాలు, బహుమతి [ప్రదానం జరిగాయి.
సభ పూర్తవుతుండగానే శివరాం లేచి కార్యదర్శికి, ప్రిన్సిపాలుకు, తదితర ఉపన్వాసకులకు నమస్కరించి సెలవు తీసుకుని సంతకాలకోసం వేధించే విద్యార్ధి సమూహంలో కొందరిని సంతృప్తి పరిచి, గబగబ పోయి కారులో కూర్చుని వెళ్ళిపోయాడు.
చంద్రప్రభ వేషం మార్చుకుని తల్లిదండ్రులను చేరింది.
“రాజకుమారా! కారు ఎక్కుము. రధం లేదు యిక్కడ” అన్నాడు ప్రసాదు అందరూ ఫక్కున నవ్వారు.
ఉపన్యాసం గురించి కారులో సంభాషణలు జరిగాయి. శివరాం చిత్రకళ గురించి తొానెరిగిన విషయాలన్నీ పూసగ్రుచ్చినట్లు చెప్పి, అతన్ని ఎంతో పొగిడింది చంద్రప్రభ. ఒక్క క్షణం కురంగేశ్వర్రావు గారు నవ్వుతూ ఆమె ముఖం పరిశీలించారు. హరాత్తుగా శివరాం గురించి తన సంభాషణ ఆపి సిగ్గు పడింది చంద్రప్రభ. కామేశ్వరమ్మ భర్తవైపు చూసింది. ఏదో అంతర్గత భావంతో రాణి మౌనంగా కూర్చుని అన్నీ వింది.
అన్వేషణ 8385
కురంగేశ్వర్రావు గారు మర్నాడు సాయంత్రం ఆఫీసునుంచి వచ్చి భార్యను పిలిచాడు తన పురాతన స్నహితుడొకడు జైళ్ళ అధికారి, పత్నీ సమేతంగా యీ నగరం వస్తున్నాడని, అతను ఒక వారంరోజులు అతిధిగా ఉంటాడని, మరుసటి ప్రొదున్నే విమానాశ్రయానికి వెళ్ళి అతన్ని తీసుకురావాలన్నారు. మహిళా సంఘకార్యక్రమాంలో మునిగిపోయిన తనకు విమానాశ్రయం రావడానికి తీరుబడి లేదండి కామేశ్వరమ్మ కురంగేశ్వర్రావుగారు నోరు చప్పరించి చంద్రప్రభను తోడు రమ్మన్నాడు. తనకు తోడుగా రాణికూడా తోడురమ్మంటూ నంది చంద్రప్రభ కురంగేశ్వర్రావుగారు అందుకు అభ్యంతరం చెప్పలేదు
ఉదయం తొమ్మదిగంటలకు విమానాశ్రయం చేరారు కురంగేశ్వర్రావుగారు ముందు చిన్న ఉద్వానవనంతో అందంగా కట్టబడిన విమానాశ్రయ బంగళా పరికించారు. గాలిలో పక్షిలా ప్రయాణం చెయ్యడం నేర్పిన మనిషి మేధాసంపత్తి గొప్పదని లోలోపల ప్రశంసించారు. లోపలికి వెళ్ళి, విమానం రాక సమయం తెలుసుకుని, చంద్రప్రభకు వీమాన ప్రమాదాలగురిచి వివరిస్తున్నారు కురంగేశ్వర్రావుగారు. విశాలమైన తెల్లటి సిమెంటు మైదానంలో రెక్కలు చాచుకుని, సూర్యకాంతిలో తెల్లగా మెరిసిపోతూ పెద్ద ఉష్రపక్షుల్లా వాలినిలుచున్న విమానాలు పరికించింది మదరాసు నుంచి రాబోయె విమానం రాక ప్రకటించబడింది విమానం ఏటవాలుగా వాలి గిర్రున నేలమీద చక్రాలు త్రిప్పుకుంటూ పరుగెత్తుకు వచ్చి విమానాశ్రయం ముందు ఆగింది కురంగేశ్వర్రావుగారి స్నేహితుడు ప్రకాశరావు భార్యతో చిన్న లెదర్ సూట్‌కేసు పట్టుకుని నడిచివచ్చి ఎదురుగా ఆహ్వానిస్తూ వచ్చిన స్నేహితునితో కరచాలనం చేశారు. పరస్పర పరిచయాలయ్యాక స్నేహితుని, భార్యను కారులో ఎక్కించుకుని, వాతకొాలపు సంగతులు ముచ్చటించుకుంటూ ఇంటికి వచ్చారు.
కురంగేశ్వర్రావు గారు స్నేహితునితో ఒక రోజే తీరుబడి లేకుండా కలిసి మెలసి గడిపేశాడు.
ప్రకాశరావు తన అండలో ఉన్న జైళ్ళ పరిశీలించడానికి బయలుదేరాడు. అతని భార్య కూడా అనుసరించింది. జైళ్ళలోని ఖైదీలను చూడాలని అసక్తికలిగిన, చంద్రప్రభ తానూ వస్తానంటూ రాణిని తోడుతీసుకుని బయలుదేరింది.
జైలు పెద్దరాతి గోడల కోటలా ఉంది జైలు గుమ్మందగ్గర కాపలా కాస్తున్న పోలీసు ప్రకాశరావుకు సాల్యూట్ చేశాడు జైలును నిర్వహిస్తున్న ఆఫీసరు ప్రకాశరావును ఆహ్వానించాడు తన పరివారంతో ఇనుప కటకటాల తలపులతో రాతిగోదల గదులలో,
ఏ86 అన్వేషణ గాలి వెలుతురు లోపంతో కర్కశంగా భయంకరంగా కనిపించేయి జైళ్ళు దొంగతనాలు, వృభిచారాలు, హత్యలు ఆస్తిపంపకాలలో నేరాల చరిత్రలు నిపులీకరిసూ పోతున్నాడు ఆఫీసరు.
తెల్ల ముతకగుడ్డలపై నల్లగళ్ళ టోపీలు పెట్టుకుని, గెడ్డాలు పెంచుకుని, క్రూరమైన కళ్ళతో, భయంకరంగా కనిపించారు. ఆ జైళ్ళల్లోని ఖైదీలు, ఇనుప కటకటాల కావల స్వేచ్చగా విహరిస్తూ తమ్ము పరిక్షిస్తున్న ప్రకాశరావు బృందంవైపు ఏమిటో కసిగా చూశారు తమకు అన్యాయం జరుగుతోందని.
రాణి, చంద్రప్రభ ప్రకాశరావు భార్య ఆ ఖైదీలను చూస్తూ గుసగుసలాడుకుంటూ నడుస్తున్నారు ఖైదు కటకటాల పట్టుకుని సన్నగా బలహీనంగా ఉన్న తన వదనాన్ని కటకటాల్లోంచి దూర్చి చూస్తూ రాణి! అని పిలిచాడొకడు.
రాణీ ఉలిక్కిపడింది. ఆ వ్యక్తిని కొద్దిగా పోల్చింది.
“కులాసాగా ఉన్నావా?” నవ్వాడు ఖైది.
రాజి మౌనంగా ఏమీ ఎరగనట్లు నిలుచుంది.
నేను నరసింగాన్ని - విజయను హత్య చేసేశాగా!... నా మఫ్లర్ దొరికింది పోలీసులకు . పట్టుకుని ఖైదు చేశారు. . నెరం ఒప్పుకున్నా... అందుకు న్యాయంగా శిక్ష విధించారు... ఏడు సంవత్సరాలు ఒంటరి దుర్భర ఖైది (బ్రతుకు! నిర్లక్ష్యంగా గట్టిగా నవ్వాడు
“ఫరవాలేదు... పిశాచిని నరకానికి పంపించాను యమబాధపెట్టి... రిక్షా వెన్నంటి మూసీనది పార్కు గోపురంమీద పీక విసిరేశాను... అదే నాకు మనశ్శాంతిగొ వికటంగా ఖైదు రాతిగోడలు ప్రతిధ్వనించేలా భీకరంగా నవ్వాడు నరసింగం.
పోలీసు ఒకడు అడ్డువచ్చి నరసింగం కటకటాలు పట్టుకున్న చేతులమీద చేతిలోని లారీతో బాదాడు అనవసరంగా జైలు అధికారి కుటుంబాన్ని భయపెడుతున్నాదడని!
“వాడు ఉత్తివిచ్చివాడులెండి!” అని అదికారి ఆడవాళ్ళ అను[గ్రవాం సంపాదించాలనుకున్నాడు పోలీసు.
'నాకు కాదురా పిచ్చి....! ....నీకు!' గట్టిగా అరిచాడు నరసింగం.
రాణి మౌనంగా ముందుకు కదిలింది.
అన్వేషణ 387
“ఎవరు?” ప్రకాశరావు భార్య ప్రశ్నించింది.
'ఏమో ఎక్కడ చూచిన జ్ఞప్తిలేదు! అబద్దనూడింది రాణి అతన్నిగురించి చెబుతే తన పరువుప్రతిష్టలు పొతాయని.
ప్రకాశరావు భార్య ఆ ఖైదీ నిజంగా పిచ్చివాడనుకుని ఊరుకుంది. వాళ్ళ దుకాణ దారుని ఉదంతం జ్ఞప్రకివచ్చిన చంద్రప్రభ ఆ ఖైదీ రాణికి తెలుసున్నా చెప్పడం మానెసోందని ఆనుమాసపడింది
తోటల కాంపౌండులో ఖైదీలు ముక్కలుగా గొట్టే రాళ్ళ బండలు, నీళ్ళుపోసి పెంచె మొక్కలతోట, తిరుగళ్ళను త్రిప్పి బియ్యపిండి తయారుచేసే స్థలం, ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాలు జైలు ఆఫీసరు ప్రకాశరావుకు చూపించాడు.
ప్రకాశరావుతాను ముందు జైళ్ళను పరిపాలించవలసిన విధానం గురించి ఆలోచించసాగాడు తిరిగి యింటికి వచ్చేటప్పుడు. ఒక వారంరోజులు గడిచాక ప్రకాశరావు భార్యతో ప్రభుత్వం తనకు నిర్ణయించిన బంగళాలోకి వెళ్ళిపోయాడు.
పోలీసు ఆఫీసరు కురంగేశ్వర్రావుగారికి విన్నవించాడు ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాసే మనిషిని పరిశోధించామని అతడు కొందరి వ్యక్తులపై హత్యా ప్రయత్నాలు కూడా చేసినందువల్ల బంధించామని చెప్పాడు పోలీసు ఆఫీసరు.
రామనరసు ఆఫీసులో పనిచేస్తున్న హెడ్ గుమాస్తా యీ ఆకాశరామన్న ఉత్తరాలు (వ్రాశాదని వివి కురంగేశ్వ[ర్రావుగారు పరిస్థితి అర్ధం చేసుకోలేకపోయాడు. భుజంగరెడ్డి మాత్రమే ఉత్తరాలు వ్రాసి ఉంటాడనుకున్న ఆయనకు అసంతృప్తి కలిగింది అయినా అవి ఆకాశరామన్న ఉత్తరాలని, ఆ ్రాసినవాడు న్యా చట్టరీత్యా నేరస్థుడవడం వల్ల, వాటికి విలువలేదనీ, కార్యవర్గం నిర్ణయించి, రాణీమీద చర్య తీసుకోడం మానేసింది.
రాఘవరావు కాచిగూడ పోస్లోఫీసులో భుజంగరెడ్డి పేర మరొక రిజిస్టరు ఉత్తరం పంపిస్తుంటే సి.ఐ.డి పోలీసొకడు అతన్ని పట్టుకున్నాడు. రాణి తల్లి మరియమ్మను పట్టపగలే హత్య చేయించడానికి అతను చేసిన ప్రయత్నం ఒక రాత్రి రాణీని జగదీశ్వర్‌ను పీకఠకనులిపించి, అంగవైకల్యం చేయడానికి జరిపిన కుట్ర, సి ఐ.డి పోలీసులు గుర్తించి, కుటటదారుల వెన్నంటి మూలకర్త రాఘవరావును, కురంగేశ్వ(ర్రావుగారి పట్టదలవల్ల అరెస్టుచేశారు
388 అన్వేషణ
రాణిని ఆపారంగా (టేమించీన రాఘవరావుకు, ఆమెను నిస్పహాయురాలినిగా చేసి, తనమీద ఆధారపడదేలా పరిస్థితులు కల్పించి, 'చెల్లాయి' అంటూనే చివరకు వివాహం చేసుకోవాలనే బుద్ధి కలిగింది, మరియమ్మను చంపించ (ప్రయత్నించాడు రాణి ఆఫీసుకు వచ్చేసిన సమయంలో ఇతర స్నేహితులతో తిరిగి రాణిపై అసూయకలిగి, ఆ 'స్నేహితులకారు విరగగొట్టమని మనుష్యులను నియమించాడు చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.
రాణిని పదిమందిలోనూ వెనుక వేసుకువచ్చిన తన పరువు ప్రతిష్టలు నిలబడ్డాయని సంతృప్తిపడ్డాడు కురంగేశ్వరావు గారు. పోలీసు ఆఫీసరుకు కృతజ్ఞతలు చెప్పారు.
“రాణి శ్రేయోభిలాషిలా కనిపిస్తున్నారు గనుక మీతో ఒక విషయం చెప్పక తప్పదు!” అంటూ మాటలు మింగేశాడు భయంతో ఆపీసరు.
కురంగేశ్వర్రావుగారు శ్రద్దగా అలకిస్తున్నట్లు ప్రశాంతంగా కనిపించారు.
'రాణి ప్రవర్తన పరిశీలించమని అధికారుల వద్దనుంచి మాకు ఉత్తరువులు ఉన్నాయి.... ఎక్కడినుంచి వచ్చిందోకాని అనేక మొగవాళ్ళతో.... అనేక హోటళ్ళల్లో సినిమాల్లో...” ఆగిపోయాడు పోలీసు ఆఫీసరు యింకా చెప్పడం యిష్టంలేక.
'అయినా పూర్తిగా ఏం నేరం మాపడానికి మాకు అవకాశం చిక్కలేదు! కురంగేశ్వర్రావుగారి దయార్ధ దృక్కులకోసం చూశాడు పోలీసు ఆఫీసరు.
కురంగేశ్వర్రావుగారునవ్వారు.
పోలీసు ఆఫీసరు సంతృప్తిగా నిష్రమించారు.
ఆకాశంలో నల్లమేఘాలు ఆవరించాయి. ఎండపొదలో వానచినుకుల జల్లులు రాలాయి. వీధిగోడమీద ఇనుపతీగగల నల్లుకుని లత ప్రాకుతోంది. సగం ఎండిన ఆకులతో శోభపోగొట్టుకున్న ఆ లతను అలాగే ఉంచుదామా మార్చుదామా అనే ఆలోచనలో పడ్డాడు కురంగేశ్వర్రావుగారు.
అన్వేషణ 389 185
మేడమీద వెనుక వరండాలో సిగరెట్టు కాలుస్తూ నిలుచున్నాడు శివరాం. సూర్యోదయం ముందు తూర్ప్చుదెసలో అరుణ రాగం వ్యాపించింది.
గాలి అలజడి లేక ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో నవోధయం పొడసూపింది.
సీమంతంగేడు వృక్షాల ఎర్రపుష్పాలు విచ్చుకుని ఎరుపెక్కిన కుండ్లలో తనప్రక్కనే సాదువులైన జంతువులు కరవాలం కసాయి తనానికి బలి అవుతున్నాయన్నట్లు మంచుబిందువులు విదిలించుకుంటూ ఏడుస్తున్నాయి. నల్ల, ఆకుపచ్చ, ఎర్ర, సీలం చీరల్లో నిమ్నజూతుల స్రీలు. వివిధరకాల దుస్తుల్లో మగవాళ్ళు దారిలో నడుస్తూ మరుగుజ్జుల్లా అగుతూన్నరు. తన మేడ కెదురుగా ఉండే ముననుపటిగుడిసెలు సిమెంటు కప్పులతో మారిన చిన్న భాగమొకటి కనిపిస్తోంది. క్రింద బురదలో దొర్లుతూ తుక్కుమధ్య దుర్గంధం తింటున్న పందిమీద కాకి నిలుచుని స్వారీ చెస్తోంది. ప్రశాంతమైన ఉదయంలో ఉత్సాహం చెందికుక్కలు చెలగాటా లాడుకుంటున్నాయి. నిమ్నజాతుల సిమంటు కొంపల్లోంచి కోళ్ళు బయటికివచ్చి తిరుగుతూ మట్టిలోని పురుగులను ఏరుకుతింటున్నాయి. చేతన అచేతన వస్తువులలో ఎదురుగా నూత్నవచైతన్యం కనిపించింది.
మేడక్రింద కాపురమున్న అయ్యరుగారి జవ్వని కూతురు గుమ్మంముందు ముగ్గులు పెడుతోంది. '్రక్కయింటి మరాఠిగృహిణి దాసీదానితో కయ్యమాడుతోంది. సేర్జీ చుట్టకాలుస్తూ ఎదురుగా కాళీగా ఉన్న ప్రదేశంలో మరొక (బ్రహ్మాండమైన మేడ ఎలా కట్టాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా ఉన్న నాయుడుగారి మేడలో, కూతురు, అల్లుడు పిల్లలతో ఆడుకుంటూ, ముందు కాంపొండులోని పూలమొక్కల ఎదుగు బొదుగు ప్రస్తావించుకుంటున్నారు. దూరాన కొండమీద కసాయిదుకాణంలో మెకల కుటుంబాలు
390 అన్వేషణ విచ్చిన్నమయి రక్తంగడ్డలుగా మారుతున్నాయి. మాంసం గంపల్లో పోతోంది వక్రంగా వ్యాపించుకుని పాములా (ప్రాకుతున్న మేడ క్రింద విధిదారి రాత్రి నీశీధంలో ఆకాశంలో కనిపించే సూర్యరధం బాటలా ఆగుపించే వైనం గుర్తుకు వచ్చింది శివరాంకు. వకండా కింది గోడ, పైకప్పు మధ్యనున్న శూన్యంలోంచి ఉదయసూర్యుడు తన కిరణాల చేతులతో శివరాం బుజంతట్టి చల్లని ప్రాతఃకాలంలో వెచ్చదనం యిస్తున్నాడు నల్లపిల్లి వరండాక్రింది గోడమీదకు ఎగిరి శివరాంకు పోటీగా ప్రాతఃకాలదృశ్యాలు చూస్తోంది. గోపి శివరాంకన్న ముందే లేచి స్నానాదికృత్యాలు తీర్చుకుని నీటుగా చిన్న నిక్కరులోకి తన చొక్కా బోనిపి, తల దువ్వుకుని, శివరాం బూట్లు పాలిష్ చేస్తున్నాడు. టెలిఫోను (మోగింది, గోపి గబుక్కున వెళ్ళి టెలిఫోన్లో ఏదో మాట్లాడి వరండాలో నిలుచున్న శివరాంవైపు పరిగెత్తాడు
'సార్.... టెలిఫోన్!”
శివరాం వచ్చి మాట్లాడాడు. భుజంగరెడ్డి తన్ను పరిచయం చేసుకున్నాడు. తన కంపెనీ వ్యవహారాలు చూచే మునుపటి లాయరుతో తనకు సమన్వయం కుదరటంలేదని, తండ్రి మరణాంతరం విభేదాలు పెరిగిపోయాయని ఆ పదవి స్వీకరించమంటూ, వచ్చి శివరాంతో మాట్లాడుతానన్నాడు మధ్యాహ్నం వచ్చికలుసుకోమన్నాడు శివరాం.
వచ్చిన ఉత్తరాలన్నీ కవరుల్లోంచి తీసి మేజాబల్లమీద ఉంచాడు గోపి, ఒక్కొక్కటి శివరాం పరిశీలిస్తున్నాడు. రాజవ్వ కాఫీతయారు చేసి గోపికిచ్చి పంపింది వేడి కాఫీ గుక్కలు మింగుతూ నరాలలో చైతన్యం కలిగి ఉత్తరాల గురించి, పార్టీలు తమ వివాదాల గురించి వ్రాసిన విషయాలు తీవ్రంగా తర్మించుకోసాగాడు. శివరాం ఉత్తరాలకట్టలో రెండు శుభలేఖలు కూడా ఉన్నాయి. ఒకటి హుస్సేన్ ఆలీ, మరొకటి వనజ పంపించారు. ఇద్దరి వివాహాలు ఒకే రోజున మూడుగంటలు కాలవ్యత్యాసంలో జరుగుతాయి, నాటకరంగం నుంచి విరమించినా, నిత్య పరిచయం లేకపోయినా, పురాతన స్నేహము పురస్మరించుకునో, లేక పురాతన స్నేహితుడు అభ్యున్నతి చెందిన పెద్ద హోదాలో ఉన్నాదనో, శుభలేఖలు పంపించారు వారిద్దరూ వారి వివాహాలకు తప్పక హాజరు కావాలనుకున్నాడు శివరాం.
జనార్దనం కూరలు, పళ్ళు, వంట దినుసులు తెచ్చి యింట్లో రాజవ్వ కందిచ్చాడు. ఆథీను పనిలో నిమగ్నుదైన శివరాంను చూని, తన లాండ్రీలో ఇస్త్రీ పెట్టె మాడిపోతోందంటూ సెలవు తీసుకుని క్రిందకుపోయాడు జనార్ధనం.
అన్వేషణ పైఫి1
గోపి అలమారులో గుట్టల్లా పెరిగి పోయిన న్యాయశాస్త్ర గ్రంధాలమీది దుమ్ముదులిపి శుభ్రంగా, అందంగా అమరుస్తున్నాడు. నల్లపిల్లి బుర్ర త్రిప్పుకుంటూ న్యాయశాస్త్ర గ్రంధాలు పరిక్షిస్తుంది గోపి యింట్లో పనికుర్రాడిగా అడుగు పెట్టినప్పటి నుంచి శివరాంకు ఎంతో తీరిక, విశ్రాంతి దొరుకుతోంది బూట్లు విప్పఢం, టెలిఫోను అందుకోవడం, ఆఫీసుగదిలో నియమిత ప్రదేశాల్లో ప్రతి వస్తువు అమర్చడం, ఉత్తరాలు పోస్టు చెయ్యడం, అర్జ్హంటుపని ఉంటే బజారుకు పరుగెత్తి వెళ్ళిరావడం, ముఖ్య ఉత్తరాలు బట్వాటా చెయ్యడం, మొదలైన బాధ్యతలన్నీ గోపి భరిస్తున్నాడు. గడ్డం చేసుకోబోతుంటే వేనీళ్ళు, రేజరు సెట్టు అమరుస్తాడు. స్నానానికి వెడితే తువ్వాలు, సబ్బు అందిస్తాడు. భోంచేస్తుంటే వచ్చి ఆప్యాయంగా వడ్డిస్తాడు. గోపిచేసే సేవ తినిచ్చే జీతంతో పోల్చడానికి వీలు లేదని, వాడిని తన యింట్లోనే తనతోనే నివసిస్తూ భోంచెస్తూ ఉండమని శివరాం అవకాశం కల్పించాడు. గోపికి ఆనందం ఎక్కువైంది మేడ క్రిందనే ఉంటున్న పులిగాడు, రంగమ్మ గోపీ శివరాం యింట్లో ఉండడానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. శివరాం మీద ఏర్పడిన గౌరవంవల్ల, ఆ అవకాశం గోపీకి యివ్వడం తమ్ను ఆదరించడమే అనుకున్నారు. రాత్రి పారశాలలో క్రిందకు వెళ్ళి చదువుకోవడం తప్పితే, గోపీ పూర్తిగా రాత్రింపగళ్ళు శివరాంకు చాకిరి చేస్తూ కాలం గడుపుతున్నాడు.
శివరాం చదివి ప్రక్కన పెట్టిన ఉత్తరాలతోటి లాయరుగా తానూ చదివి తీరాలని కుర్చిలో గెంతి కూర్చుని, రీవిగా ఉత్తరాల వైపు చూస్తోంది నల్లపిల్లి.
శివరాం సరదాగా ఒక ఉత్తరం విప్పి దాని కళ్ళముందు త్రివ్వాడు. కళ్ళు మిటకరించి, తలత్రిప్పి, ఉత్తరంలో సలహాలు న్యాయశాస్త్రరీత్యా పసందుగా లేవంటూ “మ్యావ్”"మంది నల్లపిల్లి
శివరాం ఫక్కున నవ్వాడు.
“మిస్టర్! శివరాం ! రాజారావు తారాజువ్వలా లోపలికి రోజుకుంటూ విసురుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
“ఒహో లాయరు మిత్రమా!... నమస్తే!” చక్రవర్తి తన సహజ మందస్మితం చేసుకుంటూ కాళ్ళు ఈడుస్తూ వచ్చి వాలుకుర్చీలో ఒరిగాడు. నల్లపిల్లి మ్యావ్మంది.
శివరాం నల్లపిల్లి తనతో కలిసి పనిచేస్తున్న మరొక లాయరుగా పరిచయం చేశాడు. రూపురేఖల్లో లాయరుగా కనిపిస్తున్న నల్లపిల్లిని చూసి, రాజారావు, చక్రవర్తి నవ్వుకున్నారు.
39ట అన్వేషణ
“జంతువుల స్నేహం ఆపాయకరం మిత్రమా”
చరక్రవర్సి నల్లపిల్లిని దువ్వాడు.
“ఇది విశ్వాసంగల పెంపుడు జంతువు. . కరిచే పిచ్చికుక్క కాదు!” నవ్వాడు శివరాం. ఉదయం ఎనిమిదిగంటలకే వచ్చిన వారందరినీ చూసి శివరాం కొంచం ఆశ్చర్యంతో మునిగాడు ఏటాక్సీకో పదిరూపాయిలు ప్రొద్దున్నే ఆర్బేసి ఉంటారనుకున్నాడు
'స్వామీ! ...మన సంకల్పం ఈడేరింది!' నవ్వాడు రాజారావు,
శివరాంకు రాజారావు సంకల్ప మేమిటో అర్ధం కాలేదు. అతని మనస్తత్వమే చిత్రం. హరాత్తుగా దారిలో కలిపించి తక్షణం తనతో రమ్మని, గమ్యస్థానానికి టాక్సీ కుదిర్చి, పెద్దహోటల్లో ఫలహారం యిప్పించి, సిగరెట్టు త్రాగించి, టాక్సీవాడిని పొమ్మని టాంగాకుదిర్చి, బట పుస్తకాల దుకాణానకో వెళ్ళి రెండు పుస్తకాలు కొనుక్కుని, టాంగా వదిలేసి, రోడ్డుమీద కాస్సేపు నడిచి హరాత్తుగా సందులోకి నడిచి, ఒక గుడిపూజారితో తాను అభిషేకం చేయించాలనే సంకల్పం చెప్పి, డబ్బు యిచ్చి బయటికి వచ్చి, సెలవు తీసుకుంటున్నానంటూ, సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా ఆటోరిక్షా ఎక్కిపోయె ప్రవర్తన చూపే రాజారావులో ఏ సంకల్పాలు ఎప్పుడు ఎలా ఉద్భవిన్తాయో ఎవ్వరికీ అర్ధం కాని వషయం అనుకున్నాడు శివరాం
“బాబుగారు మోటారు సైకిలు కొన్నారు . ఆ వాహనం మీద ప్రధమంగా మేమిద్దరం స్వారీచేసి వచ్చాం... యీ సాయంత్రం ఆనందంగా గడపాలని బాబుగారి ఉద్దేశ్యం!” చక్రవర్తి స్నేహితుని మనస్తత్వ వాఖ్యాతలా నిశ్చలంగా మాట్లాడాడు.
రాజారావు ఉత్సాహంగా వీధి వరండాలోకి గెంటాడు శివరాంను. నల్లపిల్లి కూడా ఆత్రుతగా పరుగెత్తి వీధి వరండా గోడ ఎక్కి క్రింద ఉన్న మోటారుసైకిలు చూసింది శివరాంతోపాటు.
“మ్రూడువేలు ఖరీదు!” చిరునవ్వు నవ్వాడు రాజారావు గంభీరంగా.
ఏ గుజ్టపందాల లోనో రాజారావుకు యీ సొమ్ముచిక్కి ఉండవచ్చనుకున్నాడు శివరాం రాజారావుతో కలిసి పెరేడు మైదానాల ప్రక్క జరిగే గుజ్జిప్పందాలకు చాలానార్లు వెళ్ళాడు శివరాం. ఎప్పుడూ తనకూ, రాజారావుకు, ధన నష్టమే కాని లాభం కలగలేదు. చక్రవర్తి ఎప్పుడు కానీ ఖర్చు చెయ్యకుండా లాభనప్టాలు చూస్తూ ఆనందించేవాడు.
అన్వేషణ 393 నిగనిగలాడే బలిష్టమైన గుర్రాలు, సంగీతాలు పలుకుతున్నట్లున్న వాటి సకిలింపులు, జాకీల గంభీర స్వరూపాలు, పచ్చగడ్డి మైదానాల్లో చిన్నతుపాకి పేలడంతో ఒడుపుగా హొయలుగా ఉద్వేగంతో పరుగెత్తే గుర్రాల మెరుపు నడకలు, వాటిని వెన్నంటి పరుగెత్తే కారు, పరుగ పందెం పూర్తయ్యాక, బోర్దుమీద కనిపించే నెగ్గిన గుర్రాల నెంబర్లు ఓడిపోయిన వారి నెత్తురు లేని ముఖాలు. రంగు రంగుల చీరలతో అందంగా నాగరిక నాజూకులతో గుంపులుగా నవ్వులతో కులికే వనితలు, వివిధరకాల దుస్తుల్లో వాఖ్యానాలిసూ రాజారావుకు శివరాంకు చక్రవర్తి వంధిమాగధుల్లా ప్రవర్తించేవాడు హరాత్తుగా బుద్దిపుట్టి బొంబాయి గు(ర్రప్పందాలు చూడడానికి వోయి అదృష్టంతో మూడు వేలు తెచ్చుకున్నాడనుకున్నాడు శివరాం ఇంత ఆలోచన ఎందుకని అడిగేశాడు శివరాం.
“లేదు స్వామీ ... ఈ సంకల్పం కలిగి అప్పుడే అయిదు సంవత్సరాలు దాటింది ... ఎంతకాలం ఈదేరకుందాఉండడం ... లాటరీల్లో గుర్రప్పందాల్లో వెచ్చించిన సొమ్ము ఎంతో నీకు తెల్సుగదా. . మనకు ఎప్పుడో అదృష్టం పట్ట తీరుతుంది. అప్పుడు ఏడుమైళ్ళ కాలిఫోర్నియా బీచ్‌కి పోయి ఆనందిస్తా ... కాని ఈలోపుగా మోటారుసైకిలు కావాలనిపించింది. నాలాంటి తిరుగుడుమనిషికి ముఖ్యమనివించింది.. ఒక ఎకరంపొలం అమ్మెసి, భార్యనగలు తాకట్టు పెట్ట కొనేశాను... మనకు కావలసిన ఆనందం జీవితంలో పొందకపోతే యీ ధనం విలువ ఏమిటి?” రాజారావు తీవ ఆలోచనలతో ముఖం చిట్తించాడు గంభీరంగా.
“బాబుగారిమాటల్లో అసత్యముందని ఎవరనగలరు మిత్రమాగి చక్రవర్తి శివరాంవైపు చూశాడు రాజారావు పకపక నవ్వాడు గోపీ స్నేహితులకు కాఫీ తెచ్చియిచ్చాడు నల్లపిల్లికి ఒక చిన్నకప్పులో పాలు అందించాడు. శివరాం స్నేహితులతో పోటీగా నల్లపిల్లి పాలు (త్రాగింది.
రాజారావు కాఫీ త్రాగి జేబులోంచి నాల్లు టిక్కట్లు తీసియిచ్చాడు. ఒరిస్సా, కాళ్ళీర్ దేశాల్లో నడుపుతున్న క్షయవ్యాధి నివారణనిధికి ఏర్పాటుచేసిన లాటరీల్లో శివరాంపేరిట నాల్గుటిక్కట్లు కొన్నాదు రాజారావు.
“నా కదృష్టం లేకపోతే, జీవితంలో అభివృద్ధి పొందుతున్న నీకైనా అదృష్టం ఉండి తీరుతుందని నీపేర టిక్కట్లు కొన్నాను... బహుమతివస్తే నిదేసుమీ. . నాది కాదు!”
నిస్వార్దంగా హాయిగా నవ్వేడు రాజారావు.
ఏం4 అన్వెషణ
“బాబుగారి ఆజ్ఞతో యీ టిక్కట్టు కూడా యిస్తున్నా .. .అందుకో మిత్రమా!” చక్రవర్తి తన చొక్కా వేబులోంచి మరొక టిక్కట్టు అందిచ్చాడు.
రాజారావు లేచి ముక్కుతో, సంగీతం సరిగమలు వాయిస్తు నృత్యం చేశాడు ఆనందంగా చక్రవర్తిలేచి నిలుచుని ఇంగ్లీషు పాట విసిరాడు ఆంగ్రరీతుల్లో నృత్యం చేస్తూ నల్లపిల్లి గబుక్కున క్రిందకు దూకి రాజారావును చక్రవర్తిని చూసి రెడు కాళ్ళమీద నిలుచుని లిలగా ఆడింది
్రాత్రి పదిగంటలకు . సుందరీమణుల మధ్యనృత్యభంగిమల్లో... అమృతపానంతో ఆనందం...” వాఖ్యానించాడు చక్రవర్తి రాత్రి చూడబోయే బాల్దాన్సు దృశ్యాన్ని
శివరాం నంతోషంగా అంగీకరించాడు ఎడదతేగని వేడి ఆలోచనలతో న్యాయవాదరీతులు తర్మించే తన మెదడుకు వినోదం కలిగి శరిరానికి విశ్రాంతి దొరుకుతుందని, “ఆఫీసులకుపోవాలి .. గుడ్ భై” అంటూ చక్రవర్తి భుజంతట్టి నెమ్మదిగా విసురుగా నడిచిక్రిందకు పోయి మోటారుసైకిలు ఎక్కి వెళ్ళిపోయాడు రాజారావు చ(క్రవర్తితో.
హైకోర్టుకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమయింది ఒక బీద వ్యవసాయదారుణ్ణి బెదిరించి అతని పొలంలో కొంతభాగం ఆ(క్రమించి ప్రయత్నించిన ఒక ధనిక [గ్రామీణ ఆసామిపై వేసిన దావా గురించి నేడు తీర్చయివ్వబడుతుంది, తాను వాదించవలసిన ఆఖరి అంశాలు నిర్ణయించుకున్నాడు శివరాం గబగబా
రాజవ్వ వంట పూర్తిచేసి ఇల్లుతుడిచి, వెనుక వరండాలోని పూలకుండీలలో నీళ్ళుపోసి వెళ్ళిపోయింది. శివరాం న్నానాదికాలు పూర్తిచేసుకున్నాడు. గోపీ వడ్డించాడు దుస్తులు వేసుకుని శివరాం తయారుకాగానే, గోపీ డైవరును పిలిచి కారు సిద్దం చేయించి శివరాం తాను తీసుకువెళ్ళవలసిన కాగితాలు ప్రత్యేకంగా పెట్టినవి తీసి అందిచ్చాడు.
కోర్పులో న్యాయమూర్తి గంభీరంగా తన తీర్పు వినిపించాడు. శివరాం తనకేసు
నెగ్గాడు. ప్రతిపక్షానవాదించే లాయరు వచ్చి శివరాంకు అభినందనలు తెలిపారు. కేసు ఓడినా, నెగ్గినా, తనరుసుమతనకుముట్టిందని ప్రతిపక్షం వకీలు సంతోషించాడు. విచారసూచకంగా ఎదురైన తనపార్టీతో తాను చెయ్యవలసిన ప్రయత్నమంతా చేసెనని. విధితప్పింప ఎవరితరమంటూ ని'ష్మమించాడు.
అన్వేషణ 395
కేసు నెగ్గినపార్టీ శివరాం దగ్గరచేరి రక్షించారన్నట్లు ఆనందంగా కృతజ్ఞతగా చేతులు జోడించాడు “బీదవాణ్సి యింతకంటే యిచ్చుకోలేను” అంటూ పదిరూపాయాలు శివరాం చేతిలో పెట్టాడు పార్టీ శివరాం పరవాలేదన్నాడు న్యాయం వాదించడమే తన కర్తవ్యం కాసి, (శమఫలాలు దైవనిర్ణయాలన్నాడు శివరాం. పెద్ద ధనిక యజమానులు తము వ్యవహారాలు చూస్తున్నదుకు యిస్తున్న ధనం పుష్కలంగానే ఉన్నప్పుడు బీదవాళ్ళను కనికరించి, తగినరీతినే (శమకు (ప్రతిఫలం తీసుకోడం భావ్యమనుకున్నాడు.
కారు ఇంటివైపు నడిపించాడు. దారిలో కృష్ణమూర్తి కనిపించాడు. కారు ఆపి ఎక్కించుకున్నాడు శివరాం కృష్ణమూర్తి నవయువక నాటకమండలి కార్యక్రమాలు విపులీకరించాడు అరిగిపోయిన గ్రామఫోనురికార్డులా, మొన్ననే ప్రభుత్వం కోరితే గ్రామల్లో నటక ప్రదర్శనాలు జరిపామని, ఒక వారం క్రితం డిల్లీపోయి అఖిలబారత నాటక కళ పునరుద్దరణ సంఘం కార్యవర్గం సమావేశానికి హాజరయివచ్చానని ప్రస్తుతం మరొక క్రొత్త నాయికను కలుసుకుందామని ఇలా వచ్చానని తన సహజ మందస్మిత ధోరణిలో వాకుచ్చాడు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్నికలు జరిపించక తన పదవి నిలబెట్టుకుంటూ, నిత్యం కార్యదర్విగానే కనిపించే కృష్ణమూర్తిలో నాటక కళోద్దరణేకాక మరో అంతర్గత స్వార్ధం లేదని మాత్రం అనడం అసంభవమనుకున్నాడు. ఏది ఏమైనా కాలం మార్పులో చలనం, చైతన్యం లేక, ఎక్కడ అడుగిడిన వ్యక్తులు అక్కడే పాతుకుపోయి పరిభ్రమిస్తున్నారనిపించింది శివరాంకు ఆచారి తనతో చిలి మరొక నాటకసంస్థ స్థాపించాడని, థీమారావు ఉన్నతవిద్య పూర్తిచేసి కాలేజీలో లెక్సరుగా పదవిలో ఉన్నాడని, శ్రీనివాసు ఆఫీసరుగా బాపట్ల బఐదలీఅయి పోయేడదని, హుస్సేన్ఆలీ పూర్తిగా కవిగా మారిపోయాడని జగదీశ్వర్ మునుపటి గుమాస్తాబతుకులోనే అల్లాడుతున్నాడని, స్నేహితుల సమాచారాలు వినిపించాడు కృష్ణమూర్తి అతన్ని యింటి దగ్గర వదిలేసి శివరాం గృహోన్ముఖుడైనాడు.
ఇంటికి రాగానే శివరాం కోసం వేచి ఉన్నారు చాలమంది. భుజంగరెడ్డి శివరాంతో మాట్లాడి తన కంపెనీ లాయరుగా అతన్ని నిశ్చయపరుచుకొని వెళ్ళిపోయాడు. గుమాస్తాలసంఘ కార్యదర్శి అధ్యక్షుడైన శివరాంతో కొందరి గుమాస్తాల దురవస్థలు చర్చించాడు. బంట్రోతుల సంఘం అధ్యక్షుడు శివరాంతో వారి కనీస కోర్కిలు తీర్చడానికి అవలంభించవలసిన చర్యలను గురించి ప్రస్తావించాడు. టెలిఫోను (మోగింది. సాయంత్రం ప్రముఖ లాయర్ల సమావేశం తనింట్లో జరుగుతుందని, రాబోయే అఖిలభారత న్యాయవాదుల సమావేశాలకు కార్యక్రమాలు నిర్ణయించాలని చం(ద్రశేఖరం మాట్లాడాడు
వ అన్వేషణ ఫోనులో. తను వివాద పరిష్కారాలకోసం వచ్చినపార్టీలు తమ కేసులు చెప్పుకున్నారు శివరాంతో. నల్లపిల్లి యధాప్రకారం కుర్చీలో. కూర్చుని మూతి మెరుపుతో ముందు చెయ్యి ఎత్తి తమ వివాదాల్లో న్యాయం దొరకగలదని అభయహస్తం చూపింది.
పులిగాడు వచ్చి క్రింద యిండ్లలోని తోటివారి గురించి కాస్సేపు మాట్లాడి, పిల్లలంతా సాయంత్రం అడుకునేందుకు ఉయ్యాలలు మొదలైన అమర్చడానికి తమ పేటలో సన్నాహాలు చెయ్యాలన్నాడు. వచ్చిన వారితో కార్యాలు పూర్తిచేసుకుని హోటలునుంచి గోపీ తెచ్చిన పలహారాలు సేవించి ఒక క్షణం మంచంమీదకు పోయి విశమించాడు శివరాం.
“కాళ్ళు ఒత్తనాసార్!” గోపీ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.
ఎటువంటి నౌకరుగా ప్రవర్తించినా గోపీచేత కాళ్ళు పట్టించుకోడం శివరాంకు హీనంగా కనిపించింది. గోపీ మృదువైన ముఖంలో శారద, రాణిల రూపురేఖలు తాండవిస్తున్నాయి. అందుకే గోపీ అంటే శివరాంకు ఎందుకో చెప్పలేనంత ఆప్యాయత ఏర్పడింది.
చిన్న కునుకు తీసి ముఖప్రఖాళన చేసుకున్నాడు శివరాం శివరాం విశమించిన సమయంలో నల్లపిల్లి గోపితో చెలగాటాలాడింది. మిద్దెమీద ఎగిరే పిచికలు వారి చెలగాటాలు చూసి “చుప్ చుప్ మంటూ కేరింతలు కొట్టాయి. కేలండరు బొమ్మమీద నృత్యం చేస్తున్నట్లున్న స్రీలు, గాలిలోని కదలికల్లో వారి చెలగాటాలకు నృత్య భంగిమలు హెచ్చించినట్లు కనిపించాయి.
కేసులకాగితాలు కొద్దిసేపు పరీక్షించుకొని, సాయంత్రం సభలు, సమావేవాలు ముగించుకుని, రాత్రిభోజనం పూర్తిచేసి, నూలు తొడుక్కొని, బొటై కట్టుకొని నీటుగా ముస్తాబయి, సెంటు ఘుమఘుమల్లో తాంబూలం సుగంధంతో సిగరెట్టు పొగల కమ్మదనంలో ఆనందిస్తూ కూర్చున్నాడు శివరాం,
అనుకున్న టైముకు రాజారావు చక్రవర్తి టాక్సీలో దిగారు.
“నా కారుందిగా!” అన్నాడు శివరాం ఆశ్చర్యవోయి.
“నీకు పెట్రోలు ఖర్చు ఎందుకు... నువ్వు నా అతిధీవి!” అన్నాడు రాజారావు.
“మిత్రమా!... మన స్నేహితులు శ్రీరామ చంద్రునివంటి స్వార్ధత్యాగ!” చక్రవర్తి మాటలకు అంతా నవ్వుకున్నారు రామాయనం తలచుకుని.
అన్వేషణ 397
బాల్డాన్సుకు నేనూ వస్తానన్నట్లు పిల్లి “మ్యావ్ మ్యావ్” మంటూ శివరాంను వెన్నంటింది
“నువ్వు యింట్లో పడుకోమ్మా.. నువ్వు మాకు పోటీగావస్తే అక్కడి నారీమణులు మమ్మల్ని వరించరుగొ చక్రవర్తి నవ్వుతూ నల్లపిల్లిని ఎత్తుకుని గోపీకి అందిచ్చాడు.
టాక్సీ ఆగింది. బాల్ డాన్సు ప్రదేశం ముందు అందరికి సిగరెట్ట అందిచ్చి రాజారావు ముందు దారి తీశాడు. నీటుగా ముస్తాబయి సూటు తొడుక్కున్న మధ్యవయస్ములు భార్యలను సింగారించి నృత్యానికి తీసుకువస్తున్నారు. యౌవనస్రీలు, యువకులు ఖులాసాగా కేరింతలాడుకుంటూ ఉత్సాహంగా లోనికినడుస్తున్నాడు గుమ్మందగ్గర సూటు వేసుకున్న యువకుడొకడు అతి మర్యాదగా అందరినీ ఆహ్వానిస్తూ మెడమెట్లను దారి చూపిస్తున్నాడు. రెండవ అంతస్టులోని పెద్దహాలులో పువ్వులగుత్తుల్లా పెద్ద బల్బులతో విద్యుద్దీపాలు చలువకాంతులు హాలంతా వెదజల్లుతూ పాలగచ్చు నేలమీద ప్రతిబింబిస్తున్నాయి. తనకోసం అమర్చిన ఆ స్తానాలు అలంకరిస్తున్నారు. వచ్చినజనం, సిల్కుచిరల్లో నాజూకు గౌనుల్లో వచ్చిన నారీ మణులు ఎరుగున్న వారితో పరిచయంగా మాట్లాడుతూ, ఉన్న కొద్ది గాజులు ఆభరణాలు, శబ్ధం చేసుకుంటూ ఒయ్యారంగా కదులుతున్నారు.
సంగీతం ప్రారంభమయింది. సన్ననిరాగంతో, జలజల ధ్వనులతో వివిధ రాగాలు నృత్యం చేశాయి నాందిగా. బ్యాండు (మోగింది వచ్చిన జనం యిష్ట్రాయిష్టాలు పురస్కరించుకుని జంటలుగా కదిలారు శివరాం రాజారావులుకూడ యిద్దరు స్రీలను చేబట్టి నృత్యంలో లీనమైపోయారు. కాళ్ళు గట్టిగా త్రిప్పలేని చక్రవర్తి మెజాబల్లదగ్గర కూర్చుని బ్రాంది త్రాగుతున్నాడు.
సంగీత ధ్వనులు తరంగాల హెచ్చుతగ్గుల కనుగుణ్యంగా ఆ స్రీ పురుషజంటలు సొగసుగా ఏకశరీరాలుగా కదిలారు. ఆ కదిలికలలోంచి వదనాలు మధ్యమాటలు గుసగుసలు మమతల వెచ్చదనాలు చూపులు విద్యుద్దీపాలకొంతుల్లో, వంకాల గాలుల్లో 'ప్రసారమయి ప్రస్ఫుటమౌతున్నాయి. మత్తు ఆలోచనల్లో సంగీతమాదుర్యంలో ముసలి దంపతులు పురాతనస్కృతులు జ్జప్తికి తెచ్చుకుని కబుర్లు చెప్పుకుంటూ సంగీతంలోని మార్పు నృత్యంలోని క్రాత్తరీతులు గురించి ఆశ్చర్యంగా ముచ్చటించుకుంటున్నారు. తెల్లపంట్లాం, ఇత్తడి బొత్తాముల తెల్లకోట్లు తొడుక్కుని టోపీలతో పరిశుభ్రంగా ఉన్న సెర్వర్లు గ్లాసులు, మత్తుపానీయాల సీసాలు, తినుబందారాలు మోసుకుపోతూ పంచుతూ విరామంలేకుండా తిరుగుతున్నారు. వచ్చినజనం వదిలే సిగరెట్టుపొగలు చిన్న మేఘాల్లా హాలు ఉపరిభాగంలో తేలుతున్నాయి. గ్లాసులు, సీసాలు, ప్లేట్ల చప్పుళ్ళు ప్రతిధ్వనిస్తున్నాయి
398 అన్వేషణ
ఒక యువకుడు తన (పేమ తన (డ్రేయసి అర్ధం లేసుకోలేదని విచారంగా ఆంగ్రంలో గేయం పాడాడు. ఆ గేయాని కనుగుణ్యంగా సంగీతం కదిలి, జంటలు నృత్యం చేశాయి కాళ్ళు గెంతుకుంటూ, ఒళ్ళు ఊపుకుంటూ చప్పట్లకు సరిదిద్దకుంటూ జంటలు నృత్యంచెశాయి కాళ్ళు గెంతుకుంటూ, ఒళ్ళు ఊపుకుంటూ చప్పట్లకు సరిదిద్దుకుంటూ జంటలు ఉత్సాహంగా రాపిడులతో కులికారు. ఒక యువకుడు మరొక యువకుని బుజం మీద తట్టి తప్పుకోమని తనకు కావలసిన స్రీతో స్వేచ్చగా నృత్యం చేశాడు. కట్టుదిట్లాలులేక పూర్తి స్వేచ్చ ఉన్న ఆ సంఘంలో మనలడం రాజారావుకు చాల సంతోషమయింది. శివరాం కొంతసేపు నృత్యం చేసి విసిగిపోయాడు చక్రవర్తి నాల్లు గ్లాసులు కాళీచేసి ఎక్కుడో ఊహలోకంలో విహరిస్తున్నాడు.
యువకులలో, అమ్మాయిలలో వెకవెకలు, పకపకలు హెచ్చాయి. మత్తు పానీయాలు మనుష్యులను మైమరపించింది. నృత్యం క్రమ శిక్షణలేని యువతీ యువకుల స్వేచ్చ శిబిరంలా కనిపించింది శివరాంకు. రాజారావు త్రాగి తూలుతూ తన్నరిగిన స్త్రీలతో వేశాకోళమాడుతూ పకపక నవ్వుతున్నాడు. చక్రవర్తి కూడా ఆ గుంపులోకి పోయాడు చేతిలో గ్లాసు పుచ్చుకొని.
రాత్రి ఒంటిగంట దాటింది. నృత్యం యింకా కొనసాగేలాగ ఉంది. శివరాం దైనిక చర్యలవల్ల బాగా అలసిపోయాడు.
“మనవాడు యింత రసమయ ఘట్టం మధ్య వెళ్ళిపోతాడేమిటి?” పకపక నవ్వాడు చక్రవర్తి.
“అంతేలే!” రాజారావు పెదిమవిరిచాడు.
“అతన్ని మా దగ్గరకు శుశ్రూషకు పంపండి” అంటూ అమ్మాయిలు మత్తుపానీయాల ఆనందంతో కిలకిల నవ్వాడు.
శివరాం యింటికిరాగానే మేడ కెదురు నిమ్నజాతుల పేటలో ఏడ్పులు వినిపించాయి. లాండ్రీ తలుపులు తెరిచి జనార్ధనం బైటికి వచ్చాడు. మేడల్లో నివసించే ఉన్నత తరగతులవారంతా ని(ద్ర పోగొట్టుకోడం యిష్టంలేక చలికాలంలో రాత్రిలేవదంలోని అసౌఖ్యం గుర్తించి ముడుచుకుపోయారు యింకా, ఏడ్పులు వినికూడా.
శివరాం, జనార్ధనం ఐడ్పులు వినిపించినవైపు వెళ్ళారు. టాంగా సీనయ్య పిల్లలతో ఏడుస్తున్నాడు పెద్దగా పెడబొబ్బులు పెట్టుకుంటూ. పులిగాడు, రంగమ్మ, యితర పొరుగింటికూలిలు చుట్టూచేరి అతడిని ఓదారుస్తున్నారు. .
అన్వేషణ 899
సీనయ్య భార్య ఉరిపోసుకు చచ్చిపోయింది సీనయ్యకు కోపం వచ్చినా, అభిమానం కలిగినా అనంతంగా పరిణమిస్తుంది చిన్న విషయానికి పిల్లలను చావబాది వాళ్ళు గాయాలతో బాధపడుతుంటే ఏడ్చి, ఉన్నడబ్బు గుల్లచేసి వాళ్ళకుకావలసినవి యిచ్చేస్తాడు. భార్యనుకూడ కోపంతో యిలాగే చితకకొడతాదు. ఇంటికిరాగానే కూడు యింకా తయారవలేదని ఆకలితో భార్యమీద రెచ్చివోయి, తనకు ఐఏ ముఖం యివ్వని మొండి పీనుగని కొరడాతో చావగొట్టాడు. సీనయ్యభార్యపై రాత్రల్లా కోపంతగ్గాక సీనయ్య బయటికి పోయాడు. నిత్యదరిత్ర జీవితంలో కష్టాలతోపాటు భర్త ప్రవర్తనవల్ల ఏర్పడిన దెబ్బలతో శరీరబాధ భరించలేక చచ్చిపోవా లనిపించింది ఆమెకు, పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టి, సీనయ్య యింటికి రాకముందు, ఉట్టి (తాటిలో ఉరిఫోసుకు చచ్చిపోయింది సీనయ్యభార్వ.
రాత్రి పన్నెండుగంటలకు యింటికి వచ్చిన స్నయ్య కోపం తగ్గించుకుని శాంతంగా తలుపు తట్టాడు. చాలసేపు తలుపుబాదగా పన్నెందేళ్ళ కొడుకు తలుపు తీశాడు. భార్య ఎదురుగా లేదు, వంటింట్లో కొమ్మబారిపోయి మెడచుట్టూ పైమిద్దెకు కట్టిన త్రాటితో వేలాడుతోంది కొక్కెంనుంచి సీనయ్యకు దుఃఖం ఆగక తల గోడ కేసి బాదుకున్నాడు. పిల్లలు భయపడి పొరుగింటి పులిగాడిని, యితరులను పిల్చుకువచ్చారు.
సీనయ్యకు ఊరడించి పులిగాడిని, జనార్దనాన్ని సీనయ్య భార్యను అంత్యక్రియలు చేసే ఏర్పాటులు చేయ్యమని పురమాయించి శివరాం యింట్లోకి నడిచాడు.
శివరాంకు అందిన శుభలేఖల వివాహదినం వచ్చింది. ఇస్రీచేసిన సూటు జనార్ధనం తెచ్చాడు. గోపీ రాజవ్వ తయారుచేసిన కాఫీ అందిచ్చాడు. కాఫీ త్రాగుతుంటే రాజవ్వ తయారుచేసిన కాఫీ అందిచ్చాడు. కాఫీ త్రాగుతుంటే రాజవ్వ ఎదురుగావచ్చి నిలుచుంది చేతులు నులుముకుంటూ, గోపి నవ్వాడు. ఆమెను చూసి.
“అయ్యా మా గుడిసె వేసుకుంటున్నా... ఒక పది రూపాయలు సరద్ధవయ్యా... జీతంలో విరగ్గాసుకో” అంది రాజవ్వ వినయంగా.
పెరిగిపోతున్న తన పెద్ద బీదకుటుంబానికి రక్షణగా గుడిసె వేసుకోడానికి దాసి చేసుకుంటున్న ప్రయత్నం గృహస్థులకుసహజ మనిపించింది. ఏమిటో తనకు కుటుంబము స్వ్పంతయిల్లు ఏమీలేవనే లోపం తట్టింది శివరాంకు. కనికరంతో శివరాం పదిరూపాయలు
400 అన్వేషణ బహుమతిగా యిచ్చేశాడు రాజవ్వకు రాజవ్వ నల్లటి ముద్దముఖంలో నవ్వులు, ఒక క్షణం వ్యాపించి నల్లగా మాయమైవోయాయి.
శివరాం దుస్తులువెసుకొని దైవరు మేడక్రింద నిలబెట్టిన కారు దగ్గరకు నడిచారు. ఇంటిమంగలి సిమెంటు కొంపల్లో ఒకచోట భార్య భర్తతలలో పేలుకుక్కుతూ నవ్వుతోంది. కుళాయినీళ్ళు మోయలేని భార్యకు బరువైన కుండలు మోయడంతో సాయం చేస్తున్నాడు భర్త దర్జీ బాలారాం, పెళ్ళాన్ని సింగారించుకొని సినిమాకు పోతూ శివరాంకు నమస్కరించారు మరుగుజ్జు వెంకటమ్మ తన పొట్టి భర్తకు సిగరెట్టు అందిచ్చి నిప్పు ముట్లిస్తోంది కిళ్లీదుకాణంలో ... శివరాం కారులో కూర్చున్నాడు ఆలోచనలతో అయిదుగంటల సమయానికి మల్లేపల్లివిడిచి, మజీదు దాటి సందుల్లోకి దూకి ఒక బంగళా ముందు ఆగింది కారు. పెళ్ళికి తరలివచ్చిన స్నేహితులు బహుమతులు సందడిగా బంగళా కాంపొండులో పచారు చేస్తున్నారు. నవయువక మండలి నాటక బృందం అంతా అక్కడ కనిపించారు. శివరాం రాగానే కరచాలనం చేసి పెళ్ళి పెద్దల్లా ఆహ్వానించారు. హుస్సేన్ ఆలీ యింటివద్దనుంచి కారులో యిప్పుడే వస్తాడని, పెళ్ళి యీ బంగళాలో జరుగుతుందని చెబుతూ, పెళ్ళి కూతురు తండ్రిని శివరాంకు పరిచయం చేశాడు కృష్ణమూర్తి కొద్ది హిందూ స్నేహితులు తప్ప, తక్కినవారంతా పషేర్వాణీ పైజామాలు తొడిగి, ఎర్రజూలు టోపీలు, ధరించి మర్వాదులు చూపిస్తూ ఒంగి ఒంగి సలాములు చేసుకుంటున్నారు. హుస్సేన్ ఆలీ, కారులో వచ్చాదు-బ్యాండు సన్నాయిలతో కారు దిగగానే అతన్ని గుర్తుపట్టడమే కష్టమైపోయింది శివరాంకు. ఎర్రజూలు టోపీ ధరించి ముఖంముందు మల్లెపూల దండ తోరణాలు వేలాడించుకుంటూ, దండల మద్య సందుల్లోంచి పరిసరాలు చూస్తూ నియమిత క్రమశిక్షణతో మౌనంగా నిలుచున్నాడు. కొత్త సిల్కు షేర్వానీ తొడిగి చేతిదండకు ముఖమల్ చెమ్మి అలంకరణలు భుజకీర్తుల్లా తొడిగాడు. బావమరిది లోనికిరానీయందున అతనికి బహుమతి ఇచ్చి 'నికా జరగవలసిన వోలు చేరాడు. ముఖమల్ పరుపులు, తలగదాలు పరిచిన మొగలు సింహాసనంలాంటి స్థలంలో కూర్చున్నాడు మౌనంగా. జలతారు సిల్కు తెర కప్పిన పెద్ద వెండిపళ్ళిం ఎదురుగా పెట్టారు. ఆహుతులంతా ఆసనాలు అలంకరించినారు. 'కాజీ” పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వివరాలు అడిగి నియమాలు వ్రాశారు. హుస్సేన్ ఆలీ బావమరిది మరో ఇద్దరు సాక్షులతో ప్రక్క బంగళలోని పెళ్ళీకూతురు దగ్గరకు వెళ్ళి ఆమె అంగీకారం తెచ్చాడు. విహామైనట్లు కాజీ ప్రకటించాడు. సభికులంతా దంపతుల ఆయురారోగ్య అభివృద్ధికి చేతులు దోసిలిగా
ఆన్వేషణ శేగ్ర1 చేసి అల్లాను ప్రార్ధించి ముఖాలు తుడుచుకున్నారు ఆనందం చెలరేగింది అందరిలో. కృష్ణమూర్తి ప్రక్కనున్న ముస్లిం స్నేహితుని ఎర్రజాలు టోపీ తీసి శివరాం నెత్తిమీద పెట్టాడు వెండిపళ్ళింలోని ఖర్జూరం, బాదం, జీడిపప్పు పెళ్ళిపెద్ద సభికుల్లో విసిరేడు.
అవి ఏరుకునే సరదాలో జనమంతా విరగబడి నవ్వుకున్నారు. హుస్సేన్ ఆలీ లేచి స్నేహితుల నందరినీ కలుసుకొని అలింగనం చేసుకున్నాడు. శివరాం వచ్చినందుకు మురిసిపోయి ఎంతో సంతోషించాడు.
హుస్సేన్ ఆలీ కవి స్నేహితులు కొందరు వివాహం గురించి గేయాలు చదివారు. చల్లటి కూల్ డ్రింక్స్ అందరికి ఇచ్చారు
హుస్సేన్ ఆలీ ధార్య ప్రేక్షకులకు ఎవ్వరికీ కనిపించలేదు పరదాలో వుండే ఆస్త్రీని శివరాం వూహించుకున్నాడు. బహుశా హుస్సేన్ ఆలీ భావిలో భార్యమీద ఒక రసవత్తరమై కావ్యమే వ్రాయవచ్చు అనుకుని నవ్వుకున్నాడు శివరాం ఒక ఆంగ్లకవి చరిత్ర గ్రంధం అతనికి బహుమతి ఇచ్చాడు.
ఎరుగున్న నటకులనూ వీలునుబట్టి కారు ఎక్కించుకున్నాడు శివరాం, వనజ యింటివైపు వెళ్ళారు అంతా. పెండ్లి సమయానికి అరగంట ముందువెళ్ళినా చిన్న షామియానాముందు కుర్చీల్లో తొడుక్కుని, సెంటు పూతలతో ఘుమఘుమ లాడుతున్నాడు. కాల్చే సింగరెట్ పొగలు నోటితో గుప్పించి, కుర్సీలోంచి గబుక్కున లేచాడు శివరాంను చూసి.
“ఎమిటి స్వామి!.... నువ్వు యిలా వచ్చావు!...” నవ్వాడు రాజారావు.
నాటకాలలో తానెరగన వనజ రాజారావుకు ఏవిధంగా పరిచయస్థురాలో అని శివరాం కొద్దిగా ఆలోచించాడు. షామియానా ్రక్క ఇంట్లో ఆడవాళ్ళ రణగొణధ్వని వినిపిస్తోంది. భుజంగరెడ్డి లోపలనుంచి బయటికి వచ్చాడు పెళ్ళి మంటపం పక్క హంగులన్నీ హడావిడిగా చేయిస్తూ పురోహితుణ్ణి త్వరగా పెళ్ళి ప్రయత్నాలు చెయ్యమన్నాడు. విద్యుద్దీపాలు షామియానాలో ఆరిపోయాయి గ్లాసులైట్లను కారులో పరుగెత్తి భుజంగరెడ్డి తీసుకువచ్చాడు ఎనిమిది గంటల ముహూర్తం తప్పని, తొమ్మిదిగంటల ముహూర్తమే నిజమైనదని, తన కాలయాపన కప్పిపుచ్చుకుంటున్నాడు పురోహితుడు. పెళ్ళికూతురి ముఖమంతా పూలతో కప్పి, బనారసు సిలుకచిర కట్టి పెళ్ళిమంటపం మీదకు తీసుకువచ్చారు. పెళ్ళి ముహూర్తం గంట ఆలస్యమైనందున అంత సేపూ వీధిలో దూరంగా
తే౦02 అన్వేషణ జీపు కారులో జోగుతున్న పెళ్ళికొడుకు పురోహితుడు పిలిపించగానే పెళ్ళి మంటపంచేరి పుస్తెముడివేశాడు. నాజూకుల వనజకు పల్లెటూరి వ్యవసాయదారుణ్సి కట్టారు. పట్నం మోసా లెరుగని అమాయకుడైన అల్లుడైతే చెప్పుచేతుల్లో వుంటాడని ఆశించింది వనజతల్లి తూతూ బాకాలమోతతో పెండ్లి జరిగిపోయింది. బహుమతుల ప్రదాన సమయంలో శివరాం, వనజకు వెండి నెమలో అందిచ్చాడు.
నవయువకమండలి నాటకబ్బందాన్ని వనజతల్లి భోజనాలకు ఉండమని ఆహ్వానించింది. రాజారావు బలవంతపెడితే శివరాం కూదా భోజనానికి ఆగాడు. భోజనా లనంతరం రాజారావును ఊరేగింపుకు కూడా ఉందచమని (బ్రతిమాలింది వనజతల్లి శివరాంవైపు చూస్తూ ఆ ప్రతిపాదన నచ్చలేదు రాజారావుకు. శివరాంతో కలిసి కారులో నిషమించాడు పెళ్ళివారి గృహంనుంచి రాజారాజి.
వనజ నెలా ఎరుగుదువని రాజురావును ప్రశ్నించాడు శివరాం.
“అది నీకు ప్రత్యేకం చెప్పనకృర్లేదు” నవ్వాడు రాజారావు.
“వనజతల్లి తెలివైంది కూతురుకు కళంకం రాకుండా సంఘంలో గౌరవంగా మసిలే కళలో ఘటికురాలు!” రాజారావు విచిత్రంగా నవ్వాడు.
శివరాం అర్ధం చేసుకున్నాడు వివిధ తరగతుల మనుష్యులను ఆ పెండ్లి పందిరిలో చూసి, భుజంగరెడ్డి కూదా శివరాంనుచూసి నవ్విమౌనంగా ఊరుకున్నాడు. బహుశా తాను వివాహానికి రావడం ఎంత సమంజసమో అని సందిగ్గంగా ఒకసారి ఆలోచించాడు శివరాం.
“శివరాం! నా బ్రతుకంతా చాలా విచ్చిన్నమై పోతున్నట్లుంది... మనశ్శాంతి లేదు!.... ముందు నేనేమి చేస్తానో నాకే తెలియదు!” బాధగా నిట్టూర్చాడు రాజారావు.
కారు సగంలో ఆపేయమన్నాడు రాజారావు. ఇంటిదగ్గర విడుస్తా అని శివరాం అన్నా వినకుందా ఒంటరిగా నగరవీధుల్లో నిశీధంలోకీ జారిపోయాడు రాజారావు.
వివాహ మనేది సాంఘిక జీవనంలో తప్పనిసరి నియమమై పోయింది బహుశా పురుషుడు పరిపూర్ణత్వం పొందాలంటే జీవితంలో స్తీ స్వీకారం ముఖ్యమేమో అనిపించిందిఒ శివరాంకు.
అంకయ్య, గుమాసాసంఘం కార్యదర్శి, బం(టటోతుల సంఘం అధ్యక్షుడు. మరికొందరు మిత్రులు కలిసి ఒకనాడు శివరాం యింట్లో ప్రవేశించారు రాబోయే
అన్వేషణ 403 ఎన్నికలలో తమ సంవాూాల (ప్రాతిపద్యం వహిస్తూ వలుకుబడిగల అఆప్తులైన పెద్దనాయకుడొకడు శాసనసభకు పోటీ చేయాలని, ఆ నాయకుడిగా శివరాం పేరు ప్రతిపాదించామని తెలిపారు. వారంతా స్వతంత్ర అభ్యర్థిగా, కార్మిక నాయకుడిగా పోటిచేస్తే తామంతా ప్రక్కనుండి కృషి చెస్తామని, ధనం, ప్రఖ్యాతి, పలుకుబడిగల శివరాంకు విజయం తధ్యమని అంతా ఘోషించారు వారి విశ్వాసం తానెందుకు విచ్చిన్నం చెయ్యాలని పదవీకాంక్ష లేకపోయినా శివరాం ఒప్పుకున్నాడు. తనపేరు రాబోయే ఎన్నికలలో తన (ప్రాంతంనుండి ప్రతిపాదించడానికి అతని పేర పత్రాలు దాఖలు చెయ్యబడ్డాయి.
దీక్షితులు ఉత్తరం వ్రాశాడు లక్ష్మిని తీసికొని పురుడు నగరంలో పోయించడానికి వస్తున్నానని నౌకర్లు, ధనం ఉన్న శివరాం యింట్లో లక్ష్మికి అన్ని సౌకర్యాలు, లభిస్తాయని ఆశిస్తూ కామాక్షమ్మ తోడు రావడం మానేసింది. బావను చెల్లెలునుశివరాం రైలు స్టెషనుకు వెళ్ళి తీసుకు వచ్చాడు
నిండు గర్భవతియైన లక్ష్మి భారంగా ఉంది. పుట్టబోయే పాపగురించి దిక్షితులు కలలు కంటున్నాడు. దీక్షితులు, లక్ష్మి యింట్లోకి వస్తూంటే తమ సహజగుణంతో పొరుగింటి అమ్మలక్కలు వారిని పరీక్షించక మానలేదు. రెండురోజులు వారిద్దరినీ కారులో త్రిప్పి నగర విశేషాలు, వింతలు చూపించాడు శివరాం.
దినచర్యల్లో శివరాం తీరుబడి లేకుండా మునిగి తేలుతున్నా భోజనాల సమయంలో అంతా ఒకసారి కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు ఆడపిల్ల పుడుతుందని లక్షి, మగపిల్లవాడని దీక్షితులు అల్లరి చేస్తూ వాదించుకునేవారు ఇద్దరి వాదనలకు ఊతయిస్తూ నల్లపిల్లి “మ్యావ్” అంటూ అరిచేది.
శివరాం తాత్కాలికంగా ఏదో పనిమీద యిటూ అటూ యింట్లో తిరుగుతున్నప్పుడు, గదిలో జష్యంటరిగా ఉన్న చెల్లెలు బావ ఆడుకునే శృంగార పరియాచకాలు వినీ విననట్లు నటిస్తూ సషిశోపల ఆనందించేవాడు. బహుశా వివాహ మెజే మనిషి దృక్పధం, జీవిత పద్దతే మారిపోయందేమో అనిపించింది శివరాంకు,
మేడక్రింది నిమ్నుజాతులు, ప్రక్క్మమేడల ధనికులు శివరాం యింట్లో ఎవరో దంపతులున్నట్లు మేడ వరండామీద చూశారు రంగమ్మ, పోచమ్మ, వెంకటమ్మ, కిష్టమ్మ, బాలరాం భార్యలు శివరాం లేనపుడు యింట్లో తొంగిచూచి లక్ష్మితో పరిచయం కల్పించుకుని శివరాం మహా ధర్మాత్ముదని పొగిడి ఏం కావలసినా తమకొరకు కబరంపితే చేస్తామని వాగ్గానమిచ్చారు. పొరుగింటి అమ్మలక్కలు, లక్ష్మిని పలకరించి, వచ్చినవార్త
404 అన్వేషణ తెలుసుకొని, శివరాం యింటికి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరెవరో వస్తారని అందులో ఆడవాళ్ళుకూడా ఉంటారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు పొరుగింటి సుశి, లక్ష్మితో స్నేహం చేసుకుని, తీరుబడి సమయంలో శివరాం లేనపుడు ఆమెతో గడుపుతూ శివరాం వేసిన చిత్రాలు దొంగతనంగా చూసేది ప్రక్క్మమేడల ధనికుల స్త్రీలు, లక్ష్మిని ఒకనారి పలకరించి వెళ్ళిపోయారు. శివరాం లేనపుడు దీక్షితులు అతని పుస్తకాలు, చిత్రాలు చూసూ నల్లపిల్లితో ఆడుకుంటూ గోపీతో పరిసరాల గురించి కబుర్లుచెబుతూ, భార్యతో పరియాచకాలాడుతూ కాలం గడిపేవాడు.
ఒకరోజు ప్రొద్దున్న పదిగంటలకు శివరాం కోర్టుకు వెళ్ళడానికి సిద్దమయ్యాడు. లక్ష్మికి ప్రసవవేదన కలుగుతోందని దీక్షితులు చెప్పాడు. అంతకుముందే తనకు తెలిసిన డాక్షరుకు చెప్పి ఉంచిన శివరాం తక్షణం ఆమెను ఆస్పత్రిలో చేర్చించాడు గోపి, జనార్దనం, రంగమ్మ, లక్ష్మి సౌకర్యాలు చూస్తామంటూ ముందుకు వచ్చారు మూడు రోజులు గడిచినా లక్ష్మి ప్రసవించలేదు. ఆస్పత్రిలో డాక్టరుకు అనుమానం కలిగి ఆమెకు పూర్తిగా నెలలు నిండలేదని ఇంటిదగ్గరే విశాంతి తీసుకోమని పంపించేశాడు.
డాక్టరు పరీక్ష చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. మూడు తొమ్మది నెలలు గర్భమౌతుందేమో అని భయపడింది. చూద్దామని ఆశించే పాప దూరమై పోతున్న దేమిటంటూ దీక్షితులు భార్యను హేళన చేశాడు.
రెండు రోజులు గడిచాక లక్ష్మి కంగారుపడుతూ చెప్పింది భర్త చెవిలో ఏదో రహస్యంగా, దీక్షితులు శివరాం చెవిలో ఊదాడు. గోపీని క్రిందకు పంపి రంగమ్మకు కబురుచేశాడు శివరాం, రంగమ్మ, పోచమ్మ వెంకటమ్మ ఇంట్లోకి ఒక్కపరుగున వచ్చిపడ్డారు. శివరాం కారువేసుకొని డాక్టర్ దగ్గరకు పరుగెత్తారు. దీక్షితులు ముందుగదిలో కాలుకాలిన పిల్లిలా తిరిగాడు నల్లపిల్లి కాలు విరిగినట్లు గెంతులూ కంగారుగా నడయాడింది, గో*ప్పి చోద్యంగా విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు. .
లోపలి గదిలోంచి శేరి మని ఏడ్పు వినిపించింది. దీక్షితులు కంగాడు వదనంతో నవ్వులు వెలిశాయి. రంగమ్మ బయటికి వచ్చి తక్షణం క్రింది దుకాణంలో కర్పూరం తెమ్మంది. శివరాం డాక్టరును వెంటవేసుకుని వచ్చేటప్పటికి లక్ష్మి సన్నగా చిక్కిపోయి కందగడ్డలాంటి పసిపాపను ప్రక్కను బెట్టుకొని మంచంమీద జఒరిగి కనిపించింది.
దాక్టరు వచ్చి లక్ష్మి అరోగ్యం పరిశీలించాడు. అంతా సాఫీగానే జరిగిందని మందు పంపిస్తానన్నాడు గోపీ మందు తేవడానికి డాక్టరు వెంట వెళ్ళాడు.
అన్వేషణ 405
దీక్షితులు నవ్వుతూ లక్ష్మి మంచం దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు.
“మీరే నెగ్గారు!” నవ్వింది లక్ష్మి.
తామ్రవర్దం ఉన్న శిశువు కొద్దిగా మూతగా ఉన్న కండ్లతో వ్రథమంగా తండ్రిని చూస్తూ వక్రంగా పెదాలు కదిపి నవ్వాడు.
తన ప్రతిబింబాన్ని చూసుకొని దీక్షితులు మురిసిపోయాడు
“ఇంక అద్దం అక్కర్లేదు మీకు” నవ్వింది లక్ష్మి.
“ఆడపిల్ల పుట్టేదాకా నేను వాడుకునే అద్దం నీకు బహుమతి చేస్తాలే!”
మేనమామ పేరు పెదతానన్నాడు దీక్షితులు. శివరాం ఒప్పుకోలేదు. చనిపోయిన బ్రహ్మయ్యగారే మమతలు మరిచిపోలేక తన యింట్లొ జన్మించారన్నాడు శివరాం.
పురిటిరోజులు గడిచాక శిశువుతో యింట్లో ప్రతీవ్యక్తి ఆడుకోవడం మొదలెట్టారు నల్లపిల్లి పాపదగ్గరకు చేరి “మ్యావ్ మ్యావ్ మంటూ సంగీతం వినిపించేది. లక్ష్మి జోలపాట పాడేది మాతృమూర్తిగా మారి. దీక్షితులు పితృప్రమతో పాపనుచూసి కూనిరాగాలు తీసేవాడు. గోపి పాపకు ఎత్తుకొని ముద్దులు కురిపిస్తూ త్రిప్పేవాడు. శివరాం గంభీరంగా సరదాగా, అంతర్గతమైన ఆనందభావాలతో పాపను చూసేవాడు.
బారసాల ఘనంగా జరిపించేడు శివరాం దీక్షితులు తల్లితండ్రులు కోడలు సుఖంగా పురుడు పోసుకుందని ఆనందించారు. నెల రోజులు గడవగానే దీక్షితులు భార్యను తీసుకుని పయనంకట్టాడు. అన్నగారి దగ్గర యింకా కొంతకాలం ఉండాలానుకున్నా భర్తమాట కెదురాడడం యిష్టంలేక లక్ష్మి పయనమయింది. రెంగు నెలలు ఒక గృహంలా కనిపించింది. దీక్షితులు లక్ష్మి, అన్యోన్యానురాగం చూసి, తన జీవితం కూడా తప్పుకుండా మార్చుకుని, ఒక కుటుంబం ఏర్పరచుకోవాలని అభిలాషపడ్డాడు శివరాం.
శివరాం ఆదేశానుసారం అంకయ్య తన యింట్లో రాబోయే ఎన్నికల కార్యక్రమం నిర్దుష్టంగా నిర్వయించడానికి ప్రముఖ కార్మిక నాయకుల సమావేశం ఏర్పాటుచేశాడు ఎన్నికలలో సహాయపడగలిగిన ఉత్సాహవంతులైన కార్మికులను కూడా ఆహానించాడు అంకయ్య, సమావేశంలో పాల్గొనడానికి శివరాం కారులో అజంజాహి రోడ్డులోని అంకయ్య యింటిముందు దిగాడు.
406 అన్వేషణ
ఉభయనగరాల వివిద ప్రాంతాలలో, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉన్నచోట్ల, తమకు సన్నహితులైన వారిని ఎన్నికలలో నిలబెట్టి శాసనసభలో తమ ప్రాతినిధ్యం సంపాదించుకోవాలని ఉపోద్దాతం ఇచ్చాడు అంకయ్య. ఎన్నికల సమయంలో ప్రజలు మనస్తత్వాలు పరిశీలిస్తూ ఓట్లు సంపాదనరీతుల్లోని కౌశల్యం విప్పి చెప్పాడు శివరాం. ఏ ప్రాంతంలో ఎవరు సహాయం చెయ్యవలసినది నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు ముఖ్యమయిన ధనసంపాదన ఏర్పాట్లు తర్వాత చర్చించుదామని సమావేశం వాయిదా వెశారు.
దినమంతా కోర్టులో కేసు వాదనలో శివరాం అలసిపోయాడు సాయంత్రం ఎన్నికల విషయాల చర్చతో మెదదు వేడెక్కిపోయింది. కారు నడుస్తూంటే కాచిగూడా రైలు స్టేషనుముందు కొండమీద కోవెల చాలా సందడిగా కనిపించింది, మనస్సు మార్చుకు దైవచింతన సహకరించగలదని కారు ఆపించేడు శివరాం.
కోవెల మెట్ల వద్ద బిక్షువులు తమ చిప్పలు డబ్బాలు సత్తుగిన్నెలు తెరుచుకు కూర్చున్నారు దైవభక్తులు రాల్చే పైసలకోసం మెట్లు ఎక్కి ఆలయం సమీపం చేరాడు. గుడిముందు గచ్చుప్రాంగణానికి ఒకవైపు నాంవారమ్మ ఒకతె వేదాంత[గంధాలు, అంజనేయ దండకం అమ్ముతోంది మరోవైపు ముసలిమనిషి ఒకడు కొబ్బరి కాయలు, అగరవత్తులు, హారతి కర్పూరం అమ్ముతున్నాడు. కోవెలకు వెళ్ళేముందు భుక్తులందరూ ప్రక్కనున్న కుళాయివద్ద ప్రక్షాళనాలు చేసుకు లోనికి పోతున్నారు ఆంజనేయస్వామి కోవెల చూరుచుట్టూ మొక్కుబడుల కొబ్బరికాయలు (వ్రేలాడుతున్నాయి వేప, చింతచెట్లు ఏపుగ్గా ఎదిగి కోవెలకు పందిరివెశాయి కొమ్మలతో ఇనుప ఊచల కాంపొండువెనకాల మొక్కలు, పూలు... విచ్చుకుని తమ హృదయాలు దేవుని కర్పిస్తున్నాయి. భక్తులకోర్కెల్లా కాకులు అరుస్తున్నాయి. కోవెల నెత్తిమీద చెట్లకొమ్మల మధ్యనుంచి కపిధ్వజమొకటి ఊగుతూ వచ్చిన భక్తులకుస్వాగతం చెవుతోంది. జగద్రక్షణలో గరుబడిలేని దైవానికి తమరాక తెలియజేస్తున్నట్లు భక్తులు గుడిగంట మైోగిస్తున్నారు.
శివరాం గుడికి ప్రదక్షిణంచేసి, జనసమ్మర్ధంలో నిలబడి, కొబ్బరి కాయ, దక్షిణ పూజారికి చెల్లించి యిచ్చిన 'ప్రనాదం, పువ్వు తీర్ధం అందుకున్నారు. జేగురంగు స్వరూపంలో ఆంజనేయస్వామి విగ్రహం తోక ఆడిస్తూ చేతులుజోడించి రామధ్యానం చేస్తున్నట్లు ప్రశాంతగంభీరాకారంలో ఉంది కోవెలలోని ఆ ప్రశాంత వాతావరణం, దైవస్మరణ, శివరాంకు కొంచెం మనశ్చాంతి కలిగించింది.
అన్వేషణ య! ఇచ్చిన కొబ్బరిచెక్క ప్రసాదం కొరుకుతూ కోవెలలోని దేవుడి లక్షణాలు తనలో వ్యాపించినట్లు కూర్చున్నాడు శివరాం ప్రక్షనే తిన్నెమీద కాలు వేసుకొని, కాషాయాంబరాలు దరించి నిమీలిత నేత్రుడై, ముండిత శిరస్సుడై అజానుబాహు డొకడు కూర్చున్నాడు. తిన్నె మీద నిలబడిన రావిచెట్లు ఆకాశంలోకి కొమ్మలు వ్యాపించుకుని ఒంటికాలుమీద నుంచుని చేతులు పైకెత్తి తపస్సుచేస్తున్న మునీశ్వరుడిలా ఉంది. ఆ చెట్టుకు ఆ కాషాయవస్త్రధారికి సమానమైన పోలిక లున్నాయనుకున్నాడు శివరాం.
తినివసిన కొబ్బరిచిప్తు పారెయ్యలని లేచాడు శివరాం రావి చెట్టువైపు నడిచాడు. ఆ కాషాయవస్తధారి ముఖం పరిచయమున్నట్టె కనిపించింది. తేరిపారిచూశాడు శివరాం.
“చక్రవర్తి” ఆశ్చర్యంగా నోరావలించాడు శివరాం. నిమీలిత నేత్రుడైన చక్రవర్తి (ప్రశాంతంగా శివరాంవైపు చూశాడు
“క! లాయరు శివరాంగారా?.... ప్రాపంచిక కార్యక్రమాలలో మునిగితేలే ప్రజానాయకుడికి, లాయరుకు,కోవెలలోకి వచ్చే తీరుబడి ఎలా కలిగిందో?” మామూలు ధోరణిలో నవ్వాడు చక్రవర్తి
“ఏమిటీ స్థితి?” శివరాం నవ్వు ఆపుకోలేక పోయాడు.
“దశావతరాల తర్వాత దైవానికి సన్నిహితమైన ఫదకొందవ అవతారం యిది.. సన్యాసి అవతారం , అన్నీ త్యజిస్తేనే దైవానికి డగ్గరఎడతాం....మారిపోయాను మిత్రమా. .. పూర్తిగా మారిపోయాను... నువ్వు మారాలనేవాడిని ,.. కాని నేనే మారాలని గుర్తించుకున్నా చివరికి” మందస్నితం చేశాడు చక్రవర్తి గంభీరంగా.
“ఎందుకు మారిపోయావు?” కొంటెగా ప్రశ్నించాడు శివరాం.
“నిజం చెప్పెయ్యనా?”
కటిం
“నన్ను ప్రేమించిన (ప్రేయసి ఇంకొకరితో లేచిపోయింది!” పకపక నవ్వేడు చడ్రవర్తి.
కాషాయవస్తధారి విచిత్రంగా పకపక నవ్వడం కోవెలలోని భక్తులకు వింత గొలిపింది. అది గుర్తించాడు శివరాం.
“జయటికి వోదాం!”
408 అన్వేషణ చక్రవర్తి పాంకోళ్ళు తొడుక్కుని లేచాడు, మెల్లిగా నడిచేడు గన్నేరుచెట్టుదాటి (ప్రక్కకువెళ్ళి కొండమీద ఒకవారగా కూర్చున్నారు శివరాం, చక్రవర్తి కాస్సేపు.
“అయితే మరో(ప్రైయసిని వెతుక్కోడానికి శనివారంనాడు వచ్చే యీ స్త్రీల గుంపులోకి సన్యాసిలా దూరావా?” శివరాం హేళన చెశాడు సంభాషణ కలుపుతూ,
“లేదు మిత్రమా .. అది అంతా వేళాకోళం . ఒకడు నాకుఆంజనేయ ప్రసన్నమంత్రం బోధించాడు .. జీవితాంతం వరకు యింక అస్టలిత బ్రహ్మచారిగా వుండాలని తీర్మానించుకున్నాను.. మన వేషం.... ఆఫీసులో గుమాస్తా... బయట సన్వాసి... అంతే!”
“మన బాబుగారు ఏరీ?” రాజారావును గురించి ప్రశ్నించాడు శివరాం. అప్పుడే అతన్ని చూసి రెండునెలలు గడిచివోయిందను కున్నాడు
'బాబుగారు అదృశ్యమైవోయాడు ... డెర్బీ గుజ్జ్బప్పందాల్లో పాతికవేల రూపాయల... బహుమతివచ్చింది.... సాయం(డత్రం అందరికి హోటల్లో టీ పార్టీ అన్నాడు. నీకు కబురంపుతానని చెప్పాడు... అంతా ఆరుగంటలకు బాగా పొట్టలు కాళీ చేసుకువెళ్ళాం... రాజారావు మాత్రం రాలేదు.... హోటలు యజమాని మమ్మల్ని చూచి విరగబడి నవ్వాడు... అప్పుడు అంతా చందాలు వేసుకుని ఒక్కొక్కడు ఒక (గ్రుక్కెడు కాఫిత్రాగి తిరోగమించాం.... రాజారావు ఆ దినం ఇంటికే రాలేదుట.... ఆఫీసులోనూ కనిపించలేదు తర్వాత..... బొంబాయికి వెళ్ళే రైలుబండి ఎక్కుతూంటే ఎవరో చూశారుట.... అతను అదృశ్యమై దాదాపు మూడునెలలు గడిచిందికూడా .. భార్యా బిడ్డల... రోదన... అతని బావమరిది వచ్చి వాళ్ళని తనింటికి తీసుకుపోయాడు చక్రవర్తి కమండలంలోని నీళ్ళు చేతులో పోసుకుని త్రాగాడు.
వివిధవ్యక్తుల జీవితరీతులు విచిత్రమనిపించింది శివరాంకు. అద్భశ్యమయ్యే వ్యక్తుల తీరని ఆశల్లా మసకచీకటిలో గన్నేరుపూవులు దూరాన తెల్లతెల్లగా అనుతున్నాయి.
చక్రవర్తి వద్ద సెలవుతీసుకు లేచాడు శివరాం. చక్రవర్తి తన సన్యాస స్వీకారానికి చెప్పిన కారణం సమంజసంగా కనిపించలేదు. బహుశా (బతుకును సుఖంగా మరొక మార్గంలో గడపాలని చక్రవర్తి సన్యాసిగా మారి ఉండవచ్చు అనుకున్నాడు శివరాం.
రాజారావు ఎక్కడికి వెళ్ళినట్లు... రిక్షాఎక్కి స్టేషనుకుపోయి, రైలుఎక్కి బొంబాయి వెళ్ళి .. ఓడ ఎక్కి ఇంగ్లాండు చేరి... విమానం మీద కేలిఫోర్నియాలో అడుగిడి ఉండవచ్చు... ఎడుమైళ్ళ సుందరమైన కేలిఫోర్నియా సముద్రతీరంలో యిసుకతిన్నెల్లో
ఇన్వెషణ శ్ష()9 నీలాకాశపు అంచులనుంచి జలగా ఉదయించినట్టుండు ఉత్తుంగ తరంగాలు సముద్రం, సీరానికి చేర్చే సురగల బారులను తాకుతూ . నునువెచ్చని సూర్యకాంతిలో స్నానాల అంగోటి బిగించి నగ్నశరీరంలో . పడుకుని ప్రక్కనే రంగురంగుల పెద్ద గొడుగులక్రింద అర్దనగ్న శరీరాల స్నానదుస్తులతో తడిలో . సిగరెట్టు కాలుస్తూ నల్లకళ్ళజోళ్ళు ధరించిన శ్వేత నారీమణులను చూచి. హరాత్తుగా లేచి . పలకరించి... స్నేహం చెసుకుని, సముదతీరంలోని చెలగాటాలతో వారితో ఈతలాడి... పరియాచకాలాడి... పరిసరాలలోని వింత (ప్రదేశాలు చూచి ఆనందిస్తోండవచ్చు... పొడుగాటి గౌనుకోటు ధరించి, హేట్ పెట్టుకుని డిటెక్టివ్‌లా ఊరంతా టాక్సీల్లో కలయతిరిగి, అంతస్థులహోటళ్ళను ఎలక్టిక్ లిక్ట్రామించి ఎక్కుతూ, వివిధరకాల భోజనాలు చూస్తూండవచ్చు .. మత్తు పానీయాలు సేవిస్తూ, రాత్రి రందుగంటలదాకా బైటహోటళ్ళలో గడిపి, ఏఐ కులస్తీనో వెంట వేసుకుని,.. నిర్దన ఏకాంత వీధుల్లో నిశీధంలో తన వేదాంతం ఆమెకు భోదిస్తూ నడిచి, హరాత్తుగా టాక్సీ కుదిర్చి... బసచేసిన హోటలుకుపోయి . మర్నాడు దినమంతా ఆమె సాంగత్యంలో ఒరిగి విశ్రమించవచ్చు. . అక్కడ విసిగెత్తి విలాసాల కాటపట్టయిన పారిస్చేరి మత్తుపానీయాలతో మనోహిరిణులతో విచ్చలవిడిగా సంచరించి రూపాయిలు పైసల్లా జిమ్మి, బికారియైపోయి గృహం జ్ఞప్తికి వచ్చి బొంబాయివచ్చే ఓడలో పనివాడుగా కుదిరి కోరికలు తీరి పూర్తివిరాగి కావచ్చు... రాజారావులోని నంకల్చ్ప వికల్పాలు ఆమెఘమనిపించింది శివరాంకు.
సంప్రదాయాల కట్టుబాటుల్లో ముడిపడిన స్త్రీతో ఏర్పడిన కుటుంబంలో ఆత్మీయత లోపించినప్పుడు, మనిషి జీవితం విచిత్రగతులు దాల్చి, వికృతమయి, చివరకు విచ్చిన్నం కొగలదనుకున్నాడు శివరాం,
కారు పరుగిడుతోంది, కాచిగూడ బస్సుస్తాండు వీధి మొగలో బట్టలదుకాణంలోంచి విద్యుద్దీపాల వెలుగులో అద్దం బీరువాల్లోంచి క్రొత్తరకం బుష్కోట్లు కనిపించాయి. కొందామని కారఠరఆపి లోనికి నడిచాడు శివరాం,
దుకాణంలోని గుమాస్తా బుష్కోట్లు చూపిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు లోనికి ప్రవేశించారు.
“మిస్టర్ శివరాం.. . నమస్తే!” నవ్వుతూ ఒక నవనాగరిక రమణి నమస్కరించింది శివరాంకు. ఆకారం మారి కొద్దిగాలావెక్కి.. ఎదురు పాపిడిలో బర్మాకొప్పు ముడివేసుకుని, పొడుగాటి వులెన్కోటులో ఉన్న ఆమెను పోల్చుకోడానికి కష్టమయింది శివరాంకు. “ప్రమీల
శీ10 అన్వేషణ అంటూ తనపేరు చెప్పుకుని ప్రస్తుతం పూనాలో ఉంటున్నాంమంది. ఆమె 'బాగా మారిపోయారు!” అంది శివరాం నవ్వేడు. ప్రక్కనే వున్న వ్యక్తిని తన భర్త అంటూ పరిచయం చేసింది ప్రమీల.
ప్రమీల భర్త కెప్టెన్ సురేష్ కాకీపంట్లాం, కాకీ కోటులో యుద్ధరంగంలో పనిచేసె మనిషిలాగే వున్నాడు దుకాణంలోకూడా. భార్య పరిచయం చెయ్యగానే ఒక క్షణం పెదాలమీది కత్తిమోసాలు సాగేలా నవ్వి, పలకరలముఖం చిట్లించి, సైనికుడిలా ముఖంలో తీవ్రత ప్రదర్శించి శివరాందగ్గరి వీడ్కోలు ఠతీసుకుంటునట్లు భార్యను దుకాణంలోంచి బయటికి నడిపించాడు కెప్టెన్.
వారిద్దరూ దుకాణంలోకి ఎందుకు వచ్చారో శివరాంకు అర్ధం కాలేదు. అయినా (ప్రమీలకు వివాహమయినందుకు లీలగా నవ్వుకున్నాడు శివరాం.
శివరాం ఇంటికివచ్చి విశ్రమించాడు. చదవదానికి పట్టుకెళ్ళన వార్తప్రతిక వాపసు చేయడానికి లోనికివచ్చాడు జనార్దనం
'నిద్రవోతున్నారా?
లేడు కూరో. ..! ఏమిటి విశేషాలు!” ప్రక్మమీద ఒత్తిగిలి శివరాం ప్రశ్నించాడు.
“ఏమున్నాయి - వార్తాపత్రికనిండా... వార్తలే... శాంతి, శాంతి నినాదాలు .. ఆటంబాంబుల ప్రయోగాలు.. మంత్రుల ఉపన్యాసాలు ... ఒకరోజు చదివిన వార్తాపత్రిక మరొకరోజు ._.దివక్కర్తేదనిపిస్తుంది. మానవనైజం మారితేకాని మానవవార్తలు కూడా మారేలాలెవ్న!”
జనార్ధనం మాటల్లో సత్యం ఉందనుకున్నాడు శివరాం. వారాపథత్రిక చూశాడు. వివిధపార్టీలు తాము ప్రజలకు చెయ్యబోయే ప్రణాళికలు ప్రచురించారు ఎన్నికల (ప్రచారం నాంది రూపంలో పడింది. బహుశా తానుకూఆ విజయం వపోందడానికి కృషి సల్పేసమయం దగ్గరకు వచ్చిందనుకున్నాడు.
ఎన్నికల సంరంభం గురించి జనార్ధనానికి చెప్పాడు తన ప్రచారానికి ప్రాతిపదికగా.
“మీరెందుకు ఎన్నికల్లో నిలుచోరాదండీ మన ప్రాంతంనుంచి!' అన్నాడు జనార్ధనం,
మీరంతా సాయంచేసారా?” అడిగాడు శివరాం లౌక్యంగా
“హాయంచేయడ వేమిటి... జీవితాలు ధారపోస్తోం[!” నవ్వాగు జనార్ధనం.
అన్వేషణ త్తే 1
“అయితే , నిలుచున్నా. మన ప్రాంతంనుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నా! ఖ్ శివరాం విషయం విపులీకరించాడు, జనార్దనం మీద విశ్వాసంతో,
మర్నాడు జనార్ధనం మేడక్రింది పేటలో ఎరుగున్న స్నేహితులతో శివరాంకు ఓటు వెయ్యాలంటూ ప్రచారం మొదలుపెట్టాడు. అంకయ్య, లక్ష్మన్న పులిగాదు, మేడక్రిందపేటలోని యితర సన్నిహితులు, ఎరుగున్న లాయరుమిత్రులు శివరాం ఎన్నికల ప్రచారానికి సనాహోలు చేశారు. శివరాం ఓటర్ల జాబితా తీసుకుని, స్నేహితులతో ఇంటింటికి వెశ ఒటివ్వమని సవినయంగా అడిగాడు. ప్రసిద్దికక్కిన వకీలు తమయింటికి వచ్చాడనే సంలోషంతో లౌక్యులు, పెండ్లికొడుకువంటి శివరాంపై ఆశలున్న కన్యల తండ్రులు, ప్రఖ్యాతచిత్రకారుడని కళలో యిష్టమున్న విద్యావంతులు, తమ కష్టాలబాసిన నాయకుడని కార్మికులు, శివరాంకు ఓటువేయదానికి తీర్మానించుకున్నారు తనకు శిష్యుడివంటి కుర్రాడిని పైకి తీసుకురావడం తన బాధ్యత అంటూ పేరిశాస్తీ చుట్టుప్రక్కల ప్రతీ యింటికి వెళ్ళి శివరాంగురించి ప్రచారంచేశాడు ఓటు యిమ్మని. భావిలో తమకు సహాయకుడు కాగలడనే ఆశతో క్షయబాధ లెక్కచేయకుండా నారాయణ, మునుపటి స్నేహం పురస్కరించుకుని, రెండో పెళ్ళి ద్వారా పెరుతున్న తన కుటుంబానికి, వ్యాపారానికి ఎప్పుడైనా అవసరపడగలడని కోమటి యజమాని, క్రొత్తగా మరొక నాటక సంస్థ స్థాపించి పెద్దల సహకారం కోరుతున్న ప్రభాకరం, తమంతట తామే ముందుకు వచ్చారు ఎన్నికల ప్రచారంలో సాయంచేసామంటూ, మంచితనంతో, లౌక్యంగా అందరి సహాయాన్ని స్వీకరించాడు శివరాం.
ఊరేగింపులు, హరికధలు, బుర్రకధలు (ప్రతివీధీలోనూ గింగురుమంటున్నాయి పెద్ద పెద్ద అరణ్యాలలో చెట్లు లారీలమీద కట్టిన పెద్ద గుడిసెలు, నాగలితో ఉన్న జంట ఎద్దులబారులు, రబ్బరుతో చేసిన పెద్దచేతులు, వాటికి సంబంధించిన పోటీదార్ల జైజై నినాదాలతో ఊరేగించారు వ్యక్తులను గుర్తులను అల్లిగేయాలు పాడారు. బాజాలు బాదారు, ధనిక పోటీదారులు మభ్యపెడుతూ ఓట్లకు కొనడానికి ప్రయత్నించారు.
ఎన్నికలు పూర్తయ్యాయి శివరాం నెగ్గాడు, ఎన్నికల ప్రచారంచేసిన ఆసప్పలంతా శివరాంను కారులో ఎక్కించి ఊరేగించారు. జైజై ధ్వానాలతో పూలదండలతో, వ్యక్తిగత విలువలమీద, ఆధారపడి ఎన్నికలలో పోటీచేసిన శివరాం ఎక్కువ ధనం వెచ్చించవలసిన అవసరం లేకపోయింది సాధించిన శాసన సభ్యత్వం ద్వారా ప్రజలకు మునుపటికన్న ఎక్కువగా సేవచేయాలను కున్నాడు శివరాం
శ్షేలై అన్వేషణ
కాలక్రమంలో పదవులు, పరపతి, ధనం విఖ్యాతి హెచ్చవుతున్నా, శివరాంకు జీవితంలో ఏదో పెద్ద లోపముందని అవ్యక్తంగా బాధపడుతూనేవున్నాడు ఎటువంటి బెన్నత్యం లభించినా ఆత్మీయత ప్రదర్శిస్తూ అనురాగం చూపే స్తీ లేనంతవరకూ, తన బ్రతుకు ఎడారిలాంటిదే అనుకున్నాడు శివరాం
“ఒకరోజు ప్రొద్దున్నే కాఫీ అందిస్తూ “ఈ వేళ హోలీ పండుగ సార్!” అన్నాడు గోపీ.
కాలంలోని పండుగలే పట్టించుకోని శివరాం ఉలిక్కిపడ్డాడు బహుశా సెలవు కావాలని గోపీ అభిప్రాయమని అర్ధం చేసుకున్నాడు శివరాం. వెళ్ళమన్నాడు గోపీని.
ఎన్నికల సంరంభంలో తిరిగి హూనం చేసుకున్న శరీరానికి శివరాం విశ్రాంతి ఇస్తున్నాడు. మధ్యాహ్న ఖోంచెసి పదుకున్నాడు. తులపు, చప్పుడయింది. తీశాడు శివరాం.
టాంగా సేనయ్య ఒంటినిండా రంగులు చల్లుకుని క్రాఫు ముఖం మీదకు ఎగరగా, జిడ్డు ఆకారంలో (ప్రత్యక్షమయ్యాడు
“మా లక్ష్మి చచ్చిపోయింది.... పోయింది... యీ రంగులన్నీ వాళ్ళు పోసేరు. . వెధవలు ..మీకు చెప్పుకోవాలని వచ్చా... దణ్జం దొరా ఏమనోకోకండి!” అంటూ వెళ్ళివోయాదు సీనయ్య.
టాంగా సేనయ్యకు భార్య పోయాక మతి భ్రమించింది టాంగా పెద్ద కుర్రాడు నడుపుతున్నాడు. స్వతంత్రించి, విచిత్ర ఉ(దేకాల్లో ఉత్తమమయిన ఇల్లాలిని ఉరికంబం ఎక్కించుకుని జీవితమే నాశనం చేసుకున్న సేనయ్యనుచూసి జాలిపడ్డాడు శివరాం.
వేడ ఎదురుపేటలో స్త్రీపురుషులు, వయసు భేదం లేకుందా రంగులు చల్లుకుంటున్నారు నల్లపిల్లి కూడా రంగలు పూసుకుని యింట్లోకి చేరింది. ఒంటినిండా రంగులు పూనుకుని కులాసాగా సైకిళ్ళమీద పోతున్నారు కొందరు. ముఖంమీద మసిరంగులతో, ఎర్ర, నల్ల పచ్చరంగులు చల్లుకుని డప్పుల మోతల్లో నాట్యంచేస్తూ గొల్లున అరుస్తూ కురాళ్ళు ఊరేగింపులు తీసి గంతులు వేస్తున్నారు. మరికొందరు, డప్పులతో కేకలేస్తూ ఇంటింట చితుకులు డబ్బు అడుక్కుంటున్నారు. నాయుడుగారి మేడ పైభాగంలో కుటుంబమంతా నౌకర్ల పరివారంతో రంగులు చల్లుకుంటున్నారు సేర్ తన లావు పాటి భార్యముఖానికి నల్లరంగు పూశాడు నవ్వుతూ. తెల్లచీర కట్టుకుని కరసనాయలు సీసాతో వీధిలో నడిచేపిల్లమీద యమకుడొకదడు వెనకాలనుంచి రంగు
అన్వేషణ శ13 విసిరేడు. రంగులతో నిండిన ఆక్రింది వీధుల్లోని మనుష్యులంతా (పేమోద్రేకాలలో రక్తం పొంగిపోర్లిన “గుండాల్లా కనిపించారు శివరాంకు
రాత్రి చితుకులు పేర్స, మంటలు చేసీ జనమంతా లబలబమంటూ సందడిగా అల్లరిచేశారు పిల్లలు, పెద్దలు మంటల చుట్టూచేరి నృత్యం చేశారు పులిగాడు రంగమ్మ జట్లాపట్టాలు వేసుకుని యితర ధంపతులతో కోలాటమాడారు. గోపి కుర్రాళ్ళ అల్లరిలో లీనమై పోయాడు ముసి జనార్ధనం కూడా మురిపెంగా రంగులు పూసుకుని శివరాంను చూసి నవ్వాడు
హోలీ పండుగ మంటలు శివరాం గుండెల్లో అగ్నిజ్వాలలు రగిల్సాయి. శారద, రాణి రంగులు పూసుకుని కళ్ళముందు కట్టారు. కలల్లోని బొమ్మలుగా ఉన్న వాళ్ళను పూర్తిగా మర్చిపోవాలను కున్నాడు భగ్నపేమకు తిలోదకాలొసగి, బ్రతుకు బరువు తగ్గించుకుని, భౌతిక ప్రపంచంలో సామాన్యుడుగా మసలడం కూడా మానవుడు పరిపూర్ణత్వం పొందడానికి ముఖ్యమనిపించింది. అందం, విద్య, గుణం కలిగిన ప్రీ నెవరినైనా స్వీకరించి, కుటుంబం పెంచుకుని వచ్చే హోలీ పండుగనాడు సంతృప్తిగా ఆనందించగలిగినప్పుడే ఆర్జించుకున్న బెన్నత్యం విలువలు నాద్ధకంకాగల వనుకున్నారు శివరాం.
శ్తేశేత్మ అన్వేషణ
మధ్యాహ్నం రెండు గంటలు. నృత్యం చేస్తూ వేదికమీద గిర్రున తిరిగే ఆడదానిలా, సుడిగాలి రివ్వున వీచింది ఆడదాన్ని చుట్టుకున్న కోకలా దూళి తరంగం పైకి లేచింది.
చెదురుగా వీధిపడివున్నచిత్తుకాగితాలు, ఎండి రాలిన ఆకులు, కొమ్మలునుండి విడిపోయి నేలమీదకు జారిన పూలు గాలి దుమారంలో ఆకస్మికంగా గుంపులుగా కలుసుకున్నాయి.
ప్రక్క యింటిలో పెండ్లిచూపులు జరుగుతున్నాయి. ముత్తైదువులు పెళ్ళికొడుకు వచ్చి సుశిని చూచి వెడుతున్నారు. ఇంటి పెద్ద సవినయంగా వారికి వీడ్మోలిస్తూన్నాడు.
సేఠ్జీ మరదలు, పిల్లలతో భర్తతో టాంగాలోంచి దిగింది. పిల్లలు గంతులేస్తూ సేర్జీ చేతుల్లోకి ఎగిరేరు. సేఠ్జీ భార్య చెల్లెలుకు, ఆమె భర్తకు స్వాగతమిస్తూ కుశల ప్రశ్నలు వెస్తోంది,
నాయుడుగారి కూతురు సొగసుగా ముసాఖైపిల్లను దాసిఎత్తుకొని వెంట నడవగా, భర్తతో ఏదో మాట్లాడుతూ, నగరంలోని బందువుల యింటికి బయలుదేరింది. ప్రక్కయిళ్ళ గృహిణులకుపోటీగా తన యింట్లో ఒక అప్సరను దిగుమతి చెయ్యాలనుకున్నాడు శివరాం.
టెలిఫోన్ మోగింది.
గోపి పిలిచేడు.
వరండా విడిచి టెలిఫోన్ అందుకున్నాడు శివరాం రేపు సాయం[త్రం ఆరున్నర గంటలకు. .. ఒక జమీందారు గారింట్లోవిందు ... ఆంగదేశం నుంచి వచ్చిన (ప్రముఖ కార్మిక నాయకుని గౌరవార్థం... ఒకే విశ్వవిధ్యాలయంలో ఇంగ్రండులో యిద్దరూ కలిసి
అన్వేషణ 4165 మునుపు చదువుకున్న పురాతన స్నేహం పురస్కరించుకుని జమీందారు విందు ఏర్పాట్లు చేశాడు కార్మిక నాయకుడికి. శివరాం తన అంగీకారం తెలియజేశాడు.
ప్రక్కయింటివారి శ్రీను అల్లరిగా ఈల వేసుకుంటూ తప్పటడుగులతో పరుగెత్తుకుని లోపలికి వచ్చాడు. ద్రాక్షపళ్ళు గుత్తిఒకటి వాడి చేతిలో పెట్టి ఎత్తుకొని ముద్దాడి పంపించేశాడు శివరాం.
తన ఎరుకలో ఉన్న కన్యలందరూ శివరాం కళ్ళముందు తిరిగారు. ఉండ్రాజవరం వెళ్ళినప్పుడు దీక్షితులు యధాలాపంగా తన బంధువు సోమేశంగారి ఇంటికి శివరాంను తీసుకువెళ్ళినప్పుడు, సోమేశంగారు తన పద్దెనిమిదేళ్ళ కూతురిని చూపించి పరిచయం చేసి వీణ పాట పాడించారు. మనస్సులో ఏదో ఉద్దేశం పెట్టుకుని నేరేడు పండు రంగులో నిగనిగలాడుతూ, లక్షణమైన ప్రశాంత వదనంలో ప్రత్యేక అందంతో అలరారుతూ వీణ తంత్రులు మెదలించి శివరాం హృదయ తంత్రులు కదిలించింది ఆ అమ్మాయి. పరిపూర్ణమైన గృహిణిలా కనిపించినా ఆమెను పరిణయమాడితే బాగుండనేమో అనుకున్నాడు శివరాం దిక్షితులుకు ఉత్తరం (వ్రాద్దామని కలం, కాగితం పట్టాడు. ఏదో ఆలోచన మెదిలి మళ్లీ కలం మేజా బల్లమీద ఉంచేశాడు ఉదాసీనంగా.
నారాయణ మొట్టమొదటగా చూపించిన పెళ్ళికూతురు జ్ఞప్తికి వచ్చింది తన్నే పెళ్ళి చేసుకుంటానంటోంది అంటూ ముసలి తండ్రి తన్ను వెన్నంటిన దృశ్యం కదిలింది ..... తనంత తావలచివచ్చిన స్త్రీ మొగవాడిని ద్రోహం చెయ్యదు... ఆమెను... పెళ్ళి చేసుకుంటే... ఇన్ని సంవత్సరాలు తనకోసం ఏ స్తీ కలవరిస్తుంది.... బహుశా ఆమెకు వివాహమైపోయి ఉంటుందనుకున్నాడు శివరాం.
ఆఫీసులో తనతో పనిచేసి ఆకర్షించిన నల్లటి అమ్మాయి, ఎన్నికల (ప్రచారం సమయంలో కొద్ది నిమిషాల పరిచయంతోనే మనస్సులో ప్రవేశించిన పోలింగ్ బూత్ లోని పంతులమ్మ, చిత్రలేఖనంలో తనకు వచ్చిన బహుమతుల గురించి ముఖంలో స్తీ సహజ ఉ(దేకాలు అణుచుకుంటూ అథీినందనలు అందిచ్చిన మెడికల్ విద్యార్ధిని, బస్సులో మునుపు నిత్యమూ కనిపించి నమస్కరించి మాట్లాడే ధైర్యంలేక చిరునవ్వు నవ్వే వంకీలజుట్లు పొట్టీ అమ్మాయి... లీలగా సిగరెట్టు పొగరింగుల్లో ప్రతిబింబాలుగా కదిలారు .. కులమత విభేదాలున్నాా గుణానికి ప్రాధాన్యత యిచ్చి వారిలో ఎవరినైనా వివాహం చేసుకుంటే. ..
416 అన్వేషణ
సాధించిన సంపాదించుకున్న సాంఘిక బెన్నత్యం, స్వయంగా తనంతట తానే వెళ్ళి స్త్రీలను పలకరించడానికి ప్రతిబంధకంగా కనిపించింది. అభిమానాలున్నా ఎరుగున్న యువకులు కూడా హొదా అంతస్థులు పెంచుకున్న తన్నుచూచి భయంగా గౌరవంగా నమస్మరించడమే కాని, చనువచ్చినా సన్నిహితులు కావడానికి జంకేవారు. సాంఘిక పరపతి, కీర్తి సంపాదించుకోవడం ఒక విధంగా చాలా ప్రమాదమే అనుకున్నాడు శివరాం లోలోపల నవ్వుకుంటూ.
వివాహాభిలాష కలిగితే ఎంత అభ్యుదయ దృక్పధమున్నా, చివరకు పురాతన సాంఘికాచారాలకు మర్యాదగా లొంగవలసినిందే అనుకున్నాడు. పేరిశాస్రి ద్వారానే ఈ విషయం పరిష్కరించడం ఉత్తమ మనుకున్నాడు తనంతట తానే ఆయన్ను పిలిచేకంటే, తాత్భాలికంగా కనిపించినప్పుడు ప్రస్తావన కదవడం సమంజసంగా తోచింది శివరాంకు
గోపీ నల్లపిల్లి మెళ్ళో మువ్వలు కట్టాడు. నల్లపిల్లి గంతులు వేస్తూ మువ్వల ధ్వనులు ఇల్లంతా ్రతిధ్వనింపచేస్తోంది గృహిణి గాజుల గలగలల్లా.
ఎవరో ముగ్గురు పార్టీలు వచ్చి తమ వివాదాల పరిస్థితులు శివరాంతో చర్చించుకుని వెళ్ళిపోయారు.
వీధిలో బాజాలు, సన్నాయిలు, బ్యాండు ధ్వనులు మారుమైోగాయి శివరాం వీధి వరండాలోకిపోయి నిలుచున్నాడు. పూల దండలు కట్టిన పెళ్ళి కారులో వివాహమయిన క్రొత్త దంపతులు ఊరేగుతున్నారు. బంధువులంతా ఆ వివాహానికి సాక్షులుగా కారు వెంట గుంపులుగా నడుస్తున్నారు. కత్తిసాము, కర్రనాము ప్రదర్శనలతో ఊరేగింపు కదిలిపోయింది.
పేరిశాస్తి మేడమెట్లు ఎక్కి లోపలికి వచ్చాడు “చూశావా శివరాం ఆ ఊరేగింపు!” పకపక సరదాగా నవ్వాడు.
శివరాం ఆయన్ను ఆహ్వానించి మౌనంగా మందస్మితం చేశాడు.
న్సీ 'పెళ్ళెప్పుడు... మాకు ఎన్నాళ్ళెనా బూరెముక్క పట్టించవా?” పేరిశాస్తి తన సహజ లౌక్య్కధోరణిలో మనిషి కష్టపెట్టకుండా విషయం కదిపాడు.
ఈ అవకాశం వదులుకోకూడ దునుకున్నాడు శివరాం.
“ఆ భారం మీకే వదిలేశాను” అన్నాడు శివరాం కూడా లౌక్యంగా.
అన్వేషణ శ్నీ్షే
“ఆ భాద్యత నాకు వదిలేస్తే... మర్నాడే వివాహం పిడికిలి బిగించి మేజాబల్లమీద కొట్టాడు సేరిశాస్తి
“అయితే కానియ్యండి"*” మందస్మితం చేశాడు శివరాం. పేరిశాస్తి ఉబ్బీ తబ్బిచ్చైపోయాడు ఉన్నత సాంఘిక పరపతి గడించుకున్న శివరాం తాను సన్నిహితుడుగా మసలడమే తనకు గౌరవం అనిభావించ బడుతున్నప్పుడు, అతనికి ఆప్పుడుగా ఉండి వివాహం చేయిస్తే, తన స్వంతపలుకుబడి ద్విగుణీకృతమయి, జీవితంలో యితర స్వార్ధప్రయోజనాల సాధన సులువౌతుందని ఆళించాడు షేరిశాస్తి
“జీవితంలో వ్యక్తి నంపాదించేధనం, గౌవరం కీ ర్తపతివ్చలు అంతా కుటుంబంకోసమేనోయ్. . గృహంలో సతి, సంతానం ఉంటే జీవితానికి నిండు!” అన్నాడు నీతిబోధిస్తూ పేరయ్యశాస్తి.
“మనస్సు మారింది... (ప్రస్తుతం మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను” అన్నాడు శివరాం.
“క వీధి చివర కొండమీద చిన్న స్థలం కొన్నాను... స్నేహితుడొకడికి అదీ చూపిస్తూ .. నిన్ను కూడా చూచిపోవాలని వచ్చాను.... వచ్చినందుకు వూరికే పోవటంలేదు!” పేరిశాస్త్రి తన ఆగమన కారనం చెప్పేడు ప్రత్యేకం పెళ్ళి గురించి అడగడానికి రాలేదని శివరాం తెలుసుకోవాలని.
గతించిన ఎన్నికల సంరంభంలోని గందరగోళాలు కాస్సేపు యిద్దరూ ప్రస్తావించుకున్నారు. పెరిశాస్తి సెలవుతీసుకుని వెళ్ళి పోయాడు.
అలమరలోంచి తొంగిచూస్తున్న అర్ధ నగ్న అజంతా చిత్రాలునాత్విక సౌందర్యంతో శివరాం హృదయాన్ని దూసుకుపోయాయి. గోడమీది కేలండరులో గొల్లవాని మురళీధ్వనికి గొల్లభామ ఒకతె సర్పంలా మమతల ఉద్రేకాలతో ఊగుతోంది
నునువెచ్చని పరుపు గిలిగింతల్లో, రాత్రి నిద్రలో కమ్మని కలలు తేలాయి. వెలుగులు అలలు .. అలలలోంచి తొంగిచూసే నుందర నారీమణులు చిరునగవులు.. పెళ్ళిపందిరలోని మంగళ తోరణాల గలగల నృత్యాలు... సిగ్గు దొంతరలతో గులాబీ మొగ్గలో ఉన్న అమ్మాయి మెడలో మూడుముళ్ళు. - సుగంధ (ద్రవ్వాల పరిమళాలు .. రేఖాకృతుల కలయికలా స్పర్శ అనుభూతిలేని అలింగనాలు... హృదయం ఆనందంతో నిండుగా ఉప్పొంగింది... రాత్రి అంతా క్షణంగామూర ఉదయం వచ్చేసినందుకు అసంతృప్పిపద్దాడు శివరాం.
లేత అన్వెషణ
మర్నాడు నాయంత్రం జమీందారుగారి మూడంతస్టుల పెద్ద బంగళా ముందు కారులో దిగాదు శివరాం పెద్ద కొండమీద నిర్మించిన ఆ బంగళా ముందు కారులు ఒక వారగా క్యూలో నిలుచున్నాయి. నగరంలోని ప్రముఖులు కొందరు భార్యా సమేతంగా లోనికి నడుస్తున్నారు. కరచాలనాలు పరస్పర నమన్మారాలు జనం కదలికల్లో ప్రస్ఫుటమౌతున్నాయి. జమీందారుగారు పాశ్చాత్యనాగరికత ప్రతిబింబిస్తున్న తన సతీమణితో వచ్చే అతిదులను మందస్మితాలతో వినయంగా ఆహ్వానిస్తున్నారు. బంగళా వెనక ఫర్హాంగున్నర వ్యాపార్ధంతో వృత్తాకారపు సుందర ఉద్యానవనంలో అందమైన మేజాబల్లల చుట్టూ (ఫేము కుర్చీలు అమర్చబడి ఉన్నాయి సర్వర్లు ఫలహారాలతో ప్లెట్లు మేజాబల్లలమీద అమరుస్తున్నారు ఎరుగున్న వ్యక్తులు గుంపులుగా, ఉద్యానవనంలో చేది నగర రాజకీయాలు, ఉద్యోగాలలో మార్పులు, విదేశవార్తలు (ప్రస్తావిస్తున్నారు తమ విజ్ఞానం ప్రకటిస్తూ, కళలనభిమానించె విద్యావంతులు, పరిచయమున్న కార్మిక నాయకులు శివరాం చుట్టూ మూగారు
బంగారురంగు బట్టలతో, ఎర్రని కందగడ్డ ముఖంతో , రాగరంగు దాల్సిన చిన్న మీసంతో ఉద్వేగంగా ఆలోచిన్నున్న ఆంగ్ల కార్మిక నాయకుని వెంటబెట్టుకుని జమీందారుగారు, ఆయన సతీమణి ఉద్యానవనంలో ప్రవేశించారు. జమీందారుగారు కార్మిక నాయకుని అందరికీ పరిచయం చేశారు. ప్రభుత్వోద్యోగులు, కార్మిక నాయకులు, కళారాధకులు, నవాబులు, జమీందారులు, మహిళాసంఘ కార్యకర్తలు, మంత్రులు విచ్చెశారు.
ఆంగ్ల కార్మిక నాయకుడు తాను యీ దేశంలో చూచిన కార్మికుల జీవన పరిస్థితులకు తన దేశంలోని కార్మికుల స్టితిగతులకు ఉన్న వ్యత్యాసాలు విపులీకరించి, భావిలో (ప్రపంచమంతా కార్మికుడే ఏలగలడనే విశ్వాసం ప్రకటించాడు,
శివరాం తానెరిగిన వ్యక్తులతో హాస్యంగా సంభాషిస్తూ ఫలహారాలు చేస్తున్నాడు. ప్రక్క మేజాబల్లమీద కూర్చున్న కురంగేశ్వరరావుగారు శివరాంవైపు తేరిపార చూశారు. శివరాంను ఎరిగున్న ప్రభుత్వోద్యోగి ఒకడు తనతో ఫలహారం చేస్తున్న కురంగేశ్వరరావు గారిని అతనికి పరిచయం చేశాడు.
“మిమ్మలిని ఒకసారి కాలేజి వార్షికోత్సవంలో చూశాను.” నవ్వారు కురంగేశ్వరరావుగారు.
అన్వేషణ శీ19్రి
“మీ పేరు ఎరుగుదను కాని . పరిచయం లేదు...!” అన్నాడు శివరాం మర్యాదగా సటిస్తూ.
“మీ చిత్రాలు కొన్ని చూశాను... అవురూపమైన కళ ఉంది వాటిలో!” కురంగేశ్చ్వరరావుగారు పొగిడారు చిత్రకళలోని విచిత్ర రీతులు ఆయనకు తెలియకపోయినా.
కృతజ్ఞతగా మంచస్మితం చేశాడు శివరాం.
విందు ముగిసింది.
ఆంగ్ల కార్మిక నాయకుని గౌరవార్దం అని తాను నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక బహిరంగసభ జరిపి ఆయన కార్మిక సేవకు తన అభినందనలు తెలిపారు శివరాం. ఆయన రాజనల్ల నగరంలో లేచిన హడావిడి తగ్గింది.
కురంగేశ్వరరావుగారిని వెంటబెట్టుకుని పేరిశాస్తి ఒకరోజు తిన్నగా శివరాం యింటికి వచ్చేశాడు కురంగే శ్వరరావుగారి ప్రక్కనే పేరిశాస్త్రి కనిపించడంతో ఆయన ఆగమన కారణం సులువుగా (గ్రహించాడు శివరాం,
కురంగేశ్వరరావుగారు చనువుగా స్పష్టంగా వచ్చిన పని పూర్తిగా చెప్పేసి తన కూతురును వచ్చి ఒకసారి చూడమన్నారు. మధ్యవర్తిలా వచ్చిన పేరిశాసస్తి కురంగేశ్వర్రావుగారి కుటుంబ సంప్రదాయాలు, గౌరవం, కూతురు అందచందాలు, తెలివి, విద్య, యధాశక్తి వర్ణించాడు. శివరాం చంద్రప్రభను చూడదానికి అంగీకరించాడు.
పేరిశాస్తిని వెంటబెట్టుకుని శివరాం కురంగేశ్వర్రావుగారి యింటికి వెళ్ళాడు నిర్ణయించిన ఒక శుభదినంనాదు. కామేశ్వరమ్మ కురంగేశ్వర్రావు సగౌరవంగా తమ సాంఘిక హోదా అంతా వాతావరణంలో ప్రస్ఫుటంచేస్తూ శివరాంను ఆహ్వానించారు. సోఫాల్లో కూర్చున్నారంతా. కురంగేశ్వర్రావుగారు ప్రసాద్‌ను పరిచయం చేశారు.
“కాబోయే బావమరిది!” పెరిశాస్తీ నవ్వాడు సరదాగా. కామేశ్వరమ్మ కూతురుద్వారా తాను చూసిన శివరాం చిత్రాలు, సభలో విన్న ఉపన్యాసంలో తనకు కనిపించిన అతని విజ్ఞానం గురించి వేనోళ్ళ పొగిదేసింది. అల్లుడు అయినా కాకపోయినా ప్రఖ్యాత చిత్రకారుణ్జి ప్రత్యక్షంగా కలుసుకున్నందుకు సంతోషమంది కామేశ్వరమ్మ.
కురంగేశ్వర్రావుగారు శివరాం వృత్తి వ్యాపకాలగురించి ప్రశ్నించాడు.
“కాబోయే భార్యను ప్రవేశపెట్టండి!”” కూలాసాగా నవ్వుతూ తన సంభాషణ సరసానికి తనలో తానే సంతృప్తిపడ్డాడు పేరిశాస్తి లోపలినుంచి రాణి, చంద్రప్రభ కలిసి వచ్చి
శీ20 అన్వేషణ సోఫాలో కూర్చున్నారు. కురంగేశ్వర్రావుగారు ఎంతో అంతర్గత భావంతో రాణిని పరిచయం చెయ్యలేదు.
శివరాం దృష్టి మొదట రాణిమీద పడింది చకితుడై ఒక నిముషం సంభ్రమంలో పద్ద్డాడు ముఖకవళికలు, హృదయంలోని ఉద్రేకాలు అణచుకుని చంద్రప్రభవైపు చూశాడు. గుంద్రని వదనంతో, లేత నునుబుగ్గలతో సింధూర తిలకంతో తెల్లటి సిల్కుచిర, జూకెట్టులలో లాలిత్యం తొణికిసలాడిస్తూ వెన్నెల్లా అగుపించింది. (ప్రశాంతంగా చూచి నవ్వింది, నమస్కరించింది ఆమె. చంద్రప్రభ అందం, రాణిమీద భగ్నపేమ, హృదయంలో భావాల సంఘర్షణ రేపి, శివరాంకు వ్యధ కలిగించాయి.
పెళ్ళ కొడుకులా సిగ్గుపడుతున్నట్లు, ముఖంమార్చ్భి ముభావంగా, మేజూబల్లమీది మేగబైను తీసి తెరిచాడు శివరాం, సినీతార స్వరూపం అందంగా రంగుల్లో అందులో ప్రచురింపబడింది “బొమ్మలు చూడ్డ మెందుకోయి... ఎదురుగా అందాలరాణి...” నమిలేశాడు పేరిశాస్తి నవ్వుతూ
శివరాం, చంద్రప్రభ నలకరించుకున్నారు. కొంచెం సిగ్గుతో, నాగరికత నేర్పిన స్వేచ్చతో, చంద్రప్రభ శివరాం చిత్రకళను ప్రశంసించింది. శివరాం తానెరిగిన ఆమె కాలేజీ విషయాలగురించి ముచ్చటించాడు. రాణ్ వదనంలో తిలకంలేక, సాదా ముతక తెల్లచీర కట్టుకుని నిరాడంబరంగా వితంతువులా కనిపించింది శివరాంకు. ఆమె ఆ యింట్లోకి ఎల్లా వచ్చిందో శివరాంకు విచిత్రమే అనిపించింది ఆమె గురించి మరిచిపోయిన ఆవేదన మళ్లీ హృదయంలో ఉబికి రగిలింది. వివాహానికి స్థిర నిశ్చయం చేసుకుంటున్న స్థితిలో ఆమే పునదర్శనం తన మనోనిశ్చయాలను భగ్నం చేయగలదనే బలహీనతతో కుమిలాడు శివరాం.
కురంగేశ్వర్రావుగారు లేచి తమ క్రొత్త యింటినంతా. చూపించారు ఇల్లంతా నవనాగరిక రీతుల్లో శోభాయమానంగా వుంది శివరాంకు దొడ్లోని పూలతోట పాదులు, రాణి నివసిస్తున్న గదులు చూపించింది కామెశ్వరమ్మ
ప్రసాద్ ఫలహారాల పంపకం బాధ్యత నిర్వహిస్తున్నాడు. మౌనంగా రీవిగా. వేడి కాఫీ గొంతులో పోసుకున్నాడు శివరాం ఇల్లంతా పరిశీలించి, తిరిగి సోఫాల్లోకి అందరూవచ్చి కూర్చున్నప్పుడు రాణి మాత్రం తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం సోఫోలో తిరిగివచ్చి కూర్చునేదాకా గమనించని చంద్రప్రభ తోడుగా తన వయస్యలేదని కొంచెం తికమక పడింది.
అన్వేషణ త్తు] కాఫీ త్రాగారు అంతా.
తాంబూలాలు నమలారు.
“వీలయితే మాయింటికి వస్తూండండీ ... సంబంధ బాంధవ్వాలు బమయి నప్పటికీ...” అన్నాడు కురంగేశ్వర్రావుగారు లౌక్యంగా.
“అప్పుడప్పుడు వస్తూంటే.. కుటుంబం మంచి స్వయంగాన పరిశీలించుకుని ... నిర్ణయానికి రావచ్చు!” పేరిశాస్తి తన మధ్య వర్తిత్వానికి బాహ్యంగా తక్కువ ప్రాముఖ్యత యివ్వదలిచాడు.
వారిమాటల్లోని అంతరార్ధం గ్రహించుకున్నాడు శివరాం. మరో రెండుసార్లు కురంగేశ్వ[ర్రావుగారి యింటి మన్యాదగా రావడము అన్నివిధాల మంచిదనుకున్నాదు.
“వచ్చే ఆదివారం సైఫాబాదులో నేను ఒక సమావేశానికి హాజరు కావాలి... అప్పుడు తప్పకుండా మీయింటికి మళ్ళీ వస్తా!”
కురంగేశ్వర్రావు శివరాం భావం అర్ధం చేసుకున్నారు. అటువంటి కోరికను తనకేమీ అభ్యంతరం లేదన్నట్లు సంతోషం తెలిపారు. అతను మళ్ళీ యింటికి వస్తాననడమే శుభసూచనమనుకున్నారు కురంగేశ్వర్రావు దంపతులు.
కనిపించినా పలకరించని రాణికి అహంభావం, గర్వం మిక్కుటమనిపించింది శీవరాంకు. నాటకాల దినాలలోని తన జీవిత పరిస్థితికి ప్రస్తుత జీవిత హోదాకు ఉన్న వ్యత్యాసం, విలువ గుర్తించుకున్న శివరాం సామాన్య స్త్రీగా సంసారుల ఇళ్ళల్లో బ్రతుకుతున్న రాణిని తానే ముందు పలకరించవలసిన అగత్యం లేదనుకున్నాడు. ఇంటికి వచ్చిన తన్ను పొమ్మని అవమాన పరచిన దృశ్యం జ్ఞప్తికి వచ్చింది. అయినా ఏమిటో రాణితో మాట్లాడే అవకాశం కలగలేదని శివరాం బాధపడ్డాడు.
కురంగేశ్చర్రావుగారితో చెప్పిన విధంగా ఆదివారం శివరాం వారి యింటికి వెళ్ళాడు. కురంగేశ్వర్రావుగారు తప్పనిసరిగా ఆఫీసు పనిమీద బయటికి పోయాడు. చంద్రప్రభ, కామేశ్వరమ్మ మాత్రమే శివరాంతో గడిపేరు. కాస్సేపు పేకాట ఆడారు. సినిమాల గురించి ప్రస్తావించారు. చిత్రకళను గురించి చర్చించారు. మహిళల పురోగమనం అగత్యం ఉద్దాటించింది కామేశ్వరమ్మ.
త్ష2 అన్వేషణ రాణి ఒకసారి అక్కడికివచ్చి శివరాం కనిపించగానే ముఖం చిట్షించుకుని , వెనుతిరిగిపోయింది. కామేశ్వరమ్మ వచ్చి కూర్చోమని రాణిని పలిచింది కాని రాణి రాలేదు. ఇది గమనించి శివరాం లోలోపల బాధపడ్డాడు ఆమె తననుంచి ఎందుకు దూరం అయిపోతోందో కారణం సులువుగా గ్రహించుకున్నాా కనీసం మర్యాదగా వచ్చి కలుపుగోలుగా క్రొత్తవ్యక్తిగానైనా ఎందుకు మాట్లాడకూడదుకున్నాడు శివరాం. బహుశా తన రాక ఆమె జీవితసుఖాలకమైనా అడ్డంకి కలిగిసోందేమో అనికూడా శంకించాడు శివరాం “వచ్చే ఆదివారం. మేము మెడిచర్ల వైపున్న మామిడి తోపులో పిక్నిక్ చేసుకుంటున్నాం . మీరు కూదా రావాలి” కామేశ్వరమ్మ లేనిది సృష్టించి, శివరాంను తన కుటుంబంతో యింకా సన్నిహితంగా వచ్చెలా చేయ్యాలని ప్రతివాదించింది. శివరాం తప్పుకుండా వస్తానన్నాడు. రాణి ఈసారి తప్పకుండా పిక్నికకు రాగలదని ఆశించాడు శివరాం. వచ్చినప్పుడు ఏదో వీలుచేసుకుని ఒంటరిగా పలకరించవచ్చు ననుకున్నాదు. పై ఆదివాంర పొద్దున తొమ్మిది గంటలకే కురంగేశ్వర్రావుగారి యిల్లు చేరాడు శివరాం. కురంగేశ్వర్రావుగారు పంచె, లాల్చీ కట్టుకుని, వదులుగా హాయిగా కదులుతూ, కుటుంబ సహితంగా పిక్నివ్ళు నన్నద్దులైనారు వంటసరంజామా, పళ్ళు, తువ్వాళ్ళు, దుప్పట్లు అన్ని సర్టి వంటలక్క కారులో వెనుకభాగంలో పెట్టింది కామెశ్వరమ్మ, చంద్రప్రభ శివరాం కారులో ఎక్కారు. ఒక నౌకరుని ద్రైవరుని వెంటపెట్టుకుని కురంగేశ్వర్రావుగారు (ప్రసాద్‌తో తన కారులో కూర్చున్నారు. శివరాం కారు నడిపిస్తున్నాడు స్వయంగా. కాని దృష్టి అంతా రాణి చుట్టూ తిరుగుతోంది. ఆమె ఎందుకు రాలవడంలేదని ఆలోచించాడు తీవ్రంగా. సాహసంగా అడిగేశాడు. ఎలాగా బయలుదేరి పోతూండడంవల్ల తన (ప్రశ్నకు అవార్ధం కలగదనుకున్నాడు శివరాం. “మీ స్నేషపితురాలు రాలేదే?” తద్వూ లతకు జ్వర మొచ్చిందండి!” చంద్రప్రభ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆ పేరువినీ శివరాం ఆశ్చర్యపోయాడు. నటకురాలైన రాణి తన జీవితంతోపాటు పేరుకూడా మార్చుకోవడంతో రాణి జీవిత దీతులగురించి ఏవో అనుమానాలు కలిగాయి శివరాంకు.
అన్వేషణ శ్ష2తై
జ్వరం వచ్చిందని రాణి నాకుచెప్పి ఉండవచ్చు అనుకున్నాడు శివరాం అంతదూరమై పోవడానికి తాను ఆమె విషయంలో చేసిన అపరాధమేమో అతనికి అర్ధంకాలేదు ఇల్లు మారిపోయిన ఆమె ఎక్కడవుందో తాను గుర్తించలేకపోయాడు కాని, తన ఇల్లు తెలిసిన రాణి ఎందుకు ఇంతకాలం రాకూడదనుకున్నాడు శివరాం. చిత్రకళలో తాను సాధించిన విజయాలకు ఎందరో ఎరగని వ్యక్తులుకూడా అభినందనలు పంపారే కాని, హృదయాన్ని చూరగొని, ఒకప్పుడు సన్నిహితురాలయిన వ్యక్తి తనకు ఒక్క ఉత్తరమైనా (వ్రాయలేదని వ్యధపదడ్డాడు.
కార్లు మేద్సర్ల మామిడితోపు ఎదురుగా ఆగాయి గుడిసెల్లో కాపలాకాస్తున్న పాలేర్లు యజమానినిచూసి ముందుగా వచ్చి సవినయంగా నమస్కరించారు మామిడిచెట్లు కొమ్మలు వ్యాపించుకుని పెద్ద విస్తీర్ణంలో పందిర వేసుకున్నాయి ఆకుల రెమ్మల మధ్యనుంచి సూర్యకిరణాలు తొంగి చూస్తున్నాయి పిల్లగాలి రివ్వున వీసోంది. మామిడితోపుకు ప్రక్కగా పిల్లకాల్వ గలగల శబ్ధాలతో పారుతోంది. దూరాన జొన్నచేలు, సూర్యకిరణాల కాంతిలో నవనవలాడు తూన్నయి గడ్జిమోపు పరకల్లో దూరి పాలేరు భార్య మలయానిలంలో హాయిగా ని(ద్రిస్తోంది.
కురంగేశ్వర్రావుగారు తెచ్చిన సామానులు పాలేరు నౌకరు మోసి మామిడితోపులో మధ్యనుంచారు చంద్రప్రభ దుప్పట్లు పరిచింది మట్టినేలమీద కామేశ్వరమ్మ నౌకరుపిలిచి కుంపట్లు అంటించమని, వంట ప్రయత్నంలో నిమగ్నురాలైంది కురంగేశ్వర్రావుగారు, కూతురు, శివరాం పంచిన దుప్పటిమీద పేకాట మొదలెట్టారు. ప్రసాద్ జేబులోని ఈలతీసి గట్టిగా ఊదుతూ పాలేరు భార్యనులేపి పొలాలచుట్టూ తిరిగి, పిల్ల కాల్వల్లోదిగి కాళ్ళు కడుక్కుని నీరాల మధ్య మిణుగురుల్లా మెదలుతున్న చిన్న చేపలను పట్టుకోబోయి జారుతూంటే నవ్వుతూ అల్లరిచేస్తున్నాదు.
పాలేరుకుట్టిన బాదమాకుల్లో భోజనాలు చేశారంతా తాంబూలాలు సేవించి బరువైన శరీరాలు ఒరిగిస్తూ మామిడితోపు నీడల్లో ఒక చిన్నకునుకు తీశారు కామేశ్వరమ్మ, కురంగేశ్వర్రావు దంపతులు.
శివరాం చంద్రప్రభతో మామిడితోపు పర్యవేక్షణకు బయలు దేరేడు.
మామిడిచెట్లు పువ్వులుచూసి, చిన్నచిన్న పిందెలు వేస్తున్నాయి. చూతవృక్షపు లేత చిగుళ్ళు సూర్యకాంతిలో సుందరంగా మెరసిపోతున్నాయి పసిషాపల్లా. ప్రతీ వృక్షం తన కుటుంబ భారంతో ఒరిగినట్లుంది.
య! అన్వేషణ “ఏమిటి ఆలోచిస్తున్నారు!” చంద్రప్రభ సంభాషణ కదిపింది. “కృటుంబం గురించి!” నవ్వాడు శివరాం, ఆ మాటలో నిగూఢంగా తన్ను గురించే శివరాం ఆలోచిస్తున్నట్లు స్ఫురించింది చం[దప్రభకు. అప్పుడప్పుడు యీ తోటకు లత, తనూ కూడా తండ్రితో వచ్చామని చెప్పింది చంద్రప్రభ. శివరాంల ఆలోచనలు మళ్ళీ రాణివైపు మళ్ళాయి. రాణి రాకపోవడంతో భగ్నపేమ ఆవేదనలు శివరాం హృదయాన్ని దహిస్తున్నాయి. జీవితంలో బెన్నత్యందశకు వచ్చి అంతస్తులు పెంచుకున్నప్పుడు కూడా తన్ను నిర్లక్ష్యం చేసింది రాణి అని కుమిలిపోయాడు శివరాం. ఆమెకు అవమానం కలిగించి, ఆమి మనస్సును ప్రతీకారంగా చిత్రవధ చెయ్యాలంటే ఆమె స్నేహితురాలైన చంద్రప్రభను తప్పక పరిణయమాదడమే ముఖ్యమనిపించింది శివరాంకు. అందం, విద్య, గుణం కలిగి ఉన్నత వంశీకురాలయిన చంద్రప్రభ౭తన కన్నివిధాల భార్యగా తగునని విశ్వసించాడు శివరాం. తన నిశ్చయాన్ని ఆలస్యం చెయ్యడం మర్యాదలకు భంగమనుకున్నాడు. ప్రసాద్ పిల్ల కాల్వలో పట్టుకున్న రెండు చేపపిల్లలు దోసిలిలో నీళ్ళలో తేలుస్తూ తీసుకువచాచడు శివరాం దగ్గరకు చంద్రప్రభమీద నీళ్ళు, చేపలు విసిరేయబోయాడు ప్రసాద్ చంద్రప్రభ బెదిరింది మీనాలు మీద పడతాయని. శివరాం అద్దువచ్చి (ప్రసాద్‌ను పంపించేశాడు దూరంగా. పాలేరు, వాడీభార్య గద్దిమోపు ప్రక్కగా కూర్చుని, గడ్డిపరకలు పళ్ళమధ్య నొక్కుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. చేపలనుచూసి బెదరదమెందుకూ... నీ కళ్ళే మీనాల్లా ఉన్నాయి...” శివరాం మాటకు చంద్రప్రభ ఓరగా చూసి నవ్వింది. జన్సీ నవ్వే వెన్నెలలా ఉంది!” చంద్రప్రభ సిగ్గుగా తల ఒంచుకుంది. పిల్లకాల్వ గట్టుదగ్గర కూర్చున్నారు యిద్దరూ.
అన్వేషణ 42గ్
“చంద్రప్రభా! మీ నాన్న గారితో చెబుదామనుకుంటున్నా.... తాంబూలాలు పుచ్చుకుందామని[!”
చంద్రప్రభ ఒక క్షణం మెరుపులా చూసింది శివరాం వైపు ఆనందం పట్టలేక పోయింది. అక్కడ నుంచి గబుక్కున లేచి తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది నవ్వుకుంటూ,
కునుకుతీసి లేచిన కురంగేశ్వర్రావుగారు, కామేశ్వరమ్మ శివరాం గురించే ప్రస్తావించు “కుంటున్నారు చంద్రప్రభ తల్లి చెవిలో గుసగుస లాడింది. వచ్చిన కార్యం సంపూర్తి అయ్యిందనుకుంది కామేశ్వరమ్మ. తాను రెండురోజుల్లో అన్నామలై నగరం చిత్రకళా. రాధకుల మహాసభకు వెడుతున్నానని తిరిగి రాగానే తాంబూలాలు పుచ్చుకోవచ్చిని శివరాం కురంగేశ్వర్రావుగారికి చెప్పేశాడు.
(ప్రసాద్ గేదెమీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు. పాలేరు ప్రక్కనుంచి నడిపిస్తున్నాడు.
తెచ్చిన పళ్ళుతిని, మరోగంట పేకాట ఆడుకుని అందరూ గృహోన్ముఖులైనారు.
కారు ఇంటిదగ్గర ఆగగానే చంద్రప్రభ ఒక్క పరుగులో రాణి గదుల్లోకి పోయింది. శివరాం కాస్సేపు ప్రసాద్‌తో కబుర్లుచెబుతూ బయట నిలుచున్నాడు. కాని రాణి జాడ కనిపించలేదు శివరాంకు కురంగేశ్వ[రావుగారివద్ధ సెలవు తీసుకుని నిరాశగా వెళ్ళిపోయాడు శివరాం.
శివరాం అన్నామలై నగరం చేరాడు. చిదంబరం స్టేషనులో దిగగానే వాలంటీర్లు సామానులు కారులో ఎక్కించుకుని విశ్వవిద్యాలయంలోని విద్యార్సల హాస్టలులో ఏర్పాటుచేసిన తనబస చూపించాడు రాత్రి రెండుగంటలకు చేరి నిద్రపోయాడు తన బసలో శివరాం. ఉదయమే లేచి న్నానాదికాలు చేసుకునేటప్పుడు మహాసభలకు వచ్చిన కళాకారులంతా కనిపించారు. పేరులు వినడమేకాని ప్రత్యక్షంగా చూడడమదే ప్రధమం శివరాంకు. కలుసుకున్న ప్రతివ్యక్తి ఏదో నెపం మీద పలకరించుకుని పరస్పరం పరిచయం చేసుకుంటున్నారు. భారతీయ చిత్రకళాప్రతిభ అంతా శరీరాలతో ఆ విశ్వవిద్యాలయంలో నిండినట్లయింది.
మహాసభలు ప్రారంభించారు చిత్రకాళానైపుణ్యం తెలిసిన ఒక ప్రముఖ రాజకీయవేత్త. పుష్టిగల రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. మూడుదినాలు చిత్రకళలోని అభ్యుదయ పురాతన రీతుల గురించి చర్యలు జరిగాయి. శివరాం తన నూత్న ప్రయోగాలు గురించి వ్యాసం చదివాడు. ప్రముఖ విమర్శకులు మన్ననలనందించి అతని రచన.
తే26్ర అన్వేషణ
చిత్రాల ప్రదర్శన ఏర్పాటైంది అభ్యుదయ రీతుల్లో అత్యద్భుతసుందరవర్ణ లయలతో కూడిన దృశ్యాలు ప్రదర్శించారు. ప్రపంచమంతా ,. చిత్రాల చిన్న స్వరూవాలు దాల్చి చిత్రప్రదర్శనశాల గదుల్లో యిమిడిపోయింది
చిత్రకారుడి కృషి అంతా ఎంతో కాలం వినియోగించి సృష్టించిన చిత్రాల్లోనె ఉండి ప్రత్యేకం చర్చిండానికి ఏమీ లేకపోయినా, ఏకలక్ష్యమైన కళారాధన బాంధవ్యంతో కలుసుకుని పరిచయాలు వృద్ధి పొందించుకోవాలనే కాంక్షతో మహాసభలు ఏర్పాటు చేశారు. ఒకరి చరిత్ర గురించి మరొకరికి తెలియకపోయినా వ్యక్తిగత చరిత్రలతో ప్రసక్తి లేకుండా ప్రతీమనిషి మరొక మనిషిని ప్రేమిస్తాడు. ఆప్వాయతతో కలిసి పోతూంటాడు. కానీ సమాజంలో ఒక చరిత్ర మరొకరికి తెలిసినప్పుడు, ఆ చరిత్రలోని ప్రవర్తన మంచి చెడుల ననుసరించి, అందులో ఏ విధమైన యితర ఉదాత్త విలువలున్నా విస్మరించి, మనిషి తన మనోదృక్చధాలు మార్చుకుంటూంటాడు. బహుశా న్వార్ధం త్యజించినప్పుడు ఏకైక లక్ష్యంతో కలిసి పోతున్నప్పుడు గత చరిత్ర లోని మంచి చెడులు పూర్తిగా విస్మరించి మనిషీమనిషిని (ప్రేమిసాడు అంటూ సింద్ధాంతీకరించుకున్నాడు శివరాం.
శివరాం దృష్టిలో రాణి మెలగింది, ఆమె పురాతన చరిత్ర ఒక్కసారి తలపోశాడు శివరాం. చిదంబరంలో నటరాజ దేవాలయం దర్శించాడు నటరాజమూర్తి తాండవదృశ్యంలో కనిపిస్తున్నాడు ఒక భక్తురాలి కోరికను పరమేశ్వరుడే మన్నించాడు. మద్రాసులో దిగి మహాబలిపురం దర్శించాడు. కొండలమీద చెక్కిన మహాభారత గాధల శిల్పాలు చూసి, వందపాండువలు రధాలు పరీక్షించి, యిసుక తిన్నెల, ఈలచెట్ల మధ్య బికారిలా స్వేచ్చగా శయనించాడు. సముద్ర ఘమోషకు చలనంలేక (ప్రశాంతంగా శయనిన్తోంది విష్ణుమూర్తి విగ్రహం. కొండరాళ్ళమీంచి దుముకుతూ సము(ద్ర తరంగాలు విష్వాలయంలోకి (బ్రాకుతూ, పరిశుభ్రం చేస్తున్నాయి కుర్రాళ్ళు అమ్ముతున్న శంఖాలు రెందు కొన్నాడు శివరాం.
ఆ ప్రశాంత నిర్మల ఏకాంత ప్రాంతంలోని భీకర సముద్రగర్దనం గంభీర ఘోషలో ఆనందిస్తూ నిలుచున్నప్పుడు అనంతమైన జగతి కంటిముందు కదిలి సామాన్య మానవుల సమస్యల విలువలు బహుశా ఆ మహాసముద్రంలోని ఒక నీటి బిందువులకు సమాన మనిపించింది శివరాంకు.
మద్రాసులో మరికొన్ని రోజులు మనస్సు మార్పుకు గడిపి, శివరాం యిరవై దినాల ప్రయాణం తర్వాత యిల్లు చేరుకున్నాడు. పేరిశాస్త్రి వచ్చి తాంబూలాలు పుచ్చుకోడానికి
అన్వేషణ ల! నిర్ణయించిన తేదీ చెప్పొడు పేరిశాస్తితో వెళ్ళీ శివరాం కురంగేశ్వర్రావుగారి వద్ద నుంచి తాంబూలాలు అందుకున్నాడు. త్వరలోనే లగ్నం నిర్ణయించమని పేరిశాస్తి మీద బాధ్యత పెట్టారు కురంగేశ్వరరావుగారు
ఆ సాయంత్రం సినిమాకి వెడదామని ప్రతిపాదన పెట్టింది కామెశ్వరమ్మ. అందరూ బయలుదేరారు చంద్రప్రభ రాణిని కూడా రమ్మని బలవంత పెట్టింది. మశూచి తగ్గి వారం రోజులైనా గడవందే నే నెందుకు సినిమాకని రాణి కదలలేదు.
తెలుగు సినిమా కధ కొల్లేటి చేంతాడులా వ్యాపించి నాల్గు గంటలు తీసుకుంది ఆఖరవడానికి. పేరిశాస్తికి, ఆడవాళ్ళకు, ప్రసాదుకు సినిమా బాగా నచ్చింది శివరాంకు, కురంగేశ్వర్రావుగారు సినిమా లోని ప్రతి సంఘటన తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షం సమర్ధించింది. ఆ ఘర్షణల రొదతో కార్లు యింటికి చేరాయి.
రాత్రి కురంగేశ్వరరావుగారి యింట్లో అంతా భోజనాలు ముగించారు. శివరాం వెదతానంటూ లేచాడు.
“ఈ రాత్రి ఒంటరిగా పోయి యింట్లో పడుకోవటమేగా ... మా యింట్లోనే విశ్రాంతి తీసుకోవోయి! ప్రొద్దున్నే కాఫీ తీసుకువెడుదువుగాని” అన్నారు కురంగేశ్వర్రావుగారు. ప్రసాద్ ఉండమని బలవంత పెట్టాడు. కామేశ్వరమ్మ కూడా పట్టుపట్టింది.
“కాస్సేపు కూర్చుని నిర్ణయించుకున్న భార్యతో కబుర్లు చెప్పుకోవోయ్” పేరిశాస్తి ఛలోక్తి విసిరాడు. శివరాం ఆగిపోవడానికి అంగీకరించాడు. కాని పేరిశాస్తి తన కుటుంబ రక్షణ బాధ్యత నెపం మీద ఇంటికి చేరుకున్నాడు.
వేసవినాటి చల్లగాలి ప్రసరిస్తోంది. చంద్రుడు తనపండు వెన్నెల వెదజల్లుతున్నాడు.
ఆరుబయట, బంగళాగోడప్రక్క కాంపొండులో శివరాంకు, బంగళా ఎదురు కాంపొండులో చంద్రప్రభ, ప్రసాద్‌లకు, బంగళాముందు వరండాలో కురంగేశ్వ(ర్రావు దంపతులకు ప్రక్కలు అమర్చారు నౌకరు.
చం[ద్రప్రభతో శివరాం కబుర్లు చెబుతూ కూర్చున్నాడు.
“నువ్వు ఇక్కడ వున్నావని తెలియక చంద్రుడు అనవసరంగా వెన్నెల వృధా చేసుకుంటున్నాడు” నవ్వాడు శివరాం.
క2గ్ర అన్వేషణ
“పైన చంద్రుడు తారలతో బీచ్ షికారు చేస్తున్నాడు చూశారా!” శివరాం పోటీగా చం[ద్రప్రభ చంద్రుణ్ణి వర్జించింది
నీలాకాశ సముద్రం ముందు యిసుక తిన్నల్లా వశక్రరిఖల చిత్రాలతో పరుచుకున్న తెల్ల మేఘాల్లో కూర్చుని తారలతో ముచ్చటిస్తున్నాడు చంద్రుడు వెన్నెల నవ్వులలో. సాంకేతిక స్వరూపాలిచి యీ దృశ్యం చిత్రిస్తే బాగుంటుందనుకున్నాడు శివరాం
చంద్రప్రభ గేయాలు పాడింది.
శివరాం హాయిగా విన్నాడు,
శివరాం ప్రక్కమీద ఒరిగేటప్పటికి పన్నెండుగంటలయింది. వరండాలోంచి కురంగేశ్వర్రావుగారి గుర్రు వినిపించింది.
నిర్మల పవనంలో హాయిగా నిద్రపట్టంది శివరాంకు కలలో రాణి మెదిలింది... కన్నీటితో కనిపించింది.... మశూచితో ముఖం అంతా గంట్లుకేలి నల్లగా కనిపించింది అసహ్యంగా... వచ్చి కాళ్ళు దగ్గర మంచంమీద కూర్చున్నట్లనిపించింది. . శివరాం ఉలిక్కిపడి లేచాడు.
శివరాం పాదాలకు రాణి చేతులు తగులుతున్నాయి పాదాలు మీద నీటి బిందువులు నిలిచాయి. శివరాం ఉలిక్కిపడి లేవగానే రాణి చటుక్కున వెనుదిరిగి వెక్కివెక్కి ఏడుస్తూ నిలబడింది.
రాత్రి మూడు గంటలు సమయంలో యీ సన్నివేశంలో కనిపించింది.
మునుపటి అనురాగం ఒక్కవడి విజృంభించింది శివరాంలో. లేచి నిల్చున్నాడు.
రాణి కొంగలో ముఖం దాచుకుని హీనంగా గగ్గద స్వరంతో “బావా! అని మూల్చింది.
శివరాం అమాటవిని చకితుడైపోయాడు. అతని శరీరమంతా కంపించిపోయింది. మనస్సులో పాతుకుపోయిన అనుమానాలన్నీ వెల్లివిరిశాయి చిన్నతనం నాటి దినాలు జ్ఞప్తికి వచ్చాయి.
రాణి గబగబ నడిచింది. తన గదులవైపు శివరాం ఆమె వెనుక నడిచారు తొట్రుపాటుతో. రాణి తన గదిముందు ఆగింది.
“శారదాగో శివరాం స్వరం వణికింది.
అన్వేషణ 429 “అవును! .... శారదనే .. నన్ను క్షమించుబావా!” వెక్కివెక్కి ఏడ్చింది ఆమె శివరాం బాధగా నిట్టూర్చాడు.
“ఎందుకు యింతకాలం చెప్పలేదు” శివరాంకు మాటలు కరువయ్యాయి.
“నన్ను క్షమించు బావా .. అంతే నేను కోరేది!”
ఆమె మశూచి ముఖంతో తేరిన మచ్చల్లో తేలుతున్న కన్నీటి బిందువులు వెన్నెల్లో మెరిశాయి. పెదాలు బిగపట్టి, దుఃఖం ఆపుకుంటూ తడిసిన కంటిరెప్పలు నిమీలితం చేసి తల దించుకుంది కుములుతూ.
“వెళ్ళు బావా... ఎవరైనా చూస్తారు!” లోపలికి పోబోయింది ఆమె శివరాం ఇంకా ఏమిటో మాట్లాడాలనుకున్నాడు. కాని నోరు పెగలలేదు.
“రేపు ఒకసారి మా ఇంటికిరా శారదా! నీతో మాట్లాడాలొ” అన్నాడు కంగారుగా.
“అల్లాగౌ” అంటూ ఆమె తలుపులు మూసుకుంది.
గదిలోంచి ఆమె రోదనలు వినిపించాయి శివరాంకు.
దొడ్గోని చెట్లు, పాదులు వెన్నెల్లో చీకటిగుహలు ఏర్పరుచుకుని నిద్రిస్తున్నాయి. ఎదురుగావున్న ఇళ్ళు నిశ్చలంగా నించున్నాయి పాలిపోయి, అస్తమిస్తున్న చంద్రుడిలా
చంద్రప్రభ పడుకున్నవైపు చప్పుడు వినిపించింది. శివరాం గబగబ తన మంచం చేరి ఒరిగాడు నిద్రపోయినట్లు చంద్రప్రభ మరచెంబులోని నీరు గ్లాసులో పోసుకొని త్రాగి మళ్లీ నిద్రపోయింది బద్దకంగా.
శివరాంకు మనోవ్యధతో నిద్రపట్టలేదు. రాజి శారదగా మారిపోయింది. స్ర్రీవల్ల భగ్న్యప్రేమ కలిగి తానింత బెన్నత్యానికి వచ్చాడో ఆ స్త్రీ తనతప్పు క్షమించమంటూ కనిపించింది ఆ స్త్రీ ఇంక జీవితంలో కనిపించదని నిరాశ చేసుకున్నాక తన (బ్రతుకులోని నిజమైన సమస్య యిప్పుడే ఉద్భవించిందనుకున్నాడు శివరాం.
నిద్రచెడిన పొడికళ్ళతో ప్రొద్దున్నే లేచి కాఫీత్రాగి అందరి వద్ద మామూలుగా శెలవు తీసుకుని కురంగేశ్వర్రావుగారి యింటి నుంచి నిషషమించాడు శివరాం.
మధ్యాహ్నం రాణి మామూలు దుస్తులతో నిరాడబరంగానే శివరాం ఇంటికి బయలు దేరింది. చంద్రప్రభ అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. తోటిపంతులమ్మ రమ్మంటే
430 అన్వేషణ నాంపల్లి వెడుతూన్ననంది చంద్రప్రభ కూడా వెంట వస్తానని బయలుదేరింది “మమిద్దరం కలసి మరోచోటికి పోవాలి . నువ్వు వస్తే బాగుండదు!” రాణి నవ్వింది ఆమె మాటల్లోని అభ్యంతరం గుర్తించి చంద్రప్రభ ఆగిపోయింది.
శివరాం తీవ్రంగా ఆలోచిస్తూ సిగరెట్టు కాలుస్తూ యింట్లో కూర్చున్నాడు. నల్లపిల్లి తదేక దీక్షగా అతనివైపు చూస్తూ విచారంగా కూర్చున్నట్లుంది.
రాణి లోనికి వచ్చింది
ఆఫీసుగది వదలి లోపలిగదిలోకి నడిచాడు శివరాం. రాణి అతన్ని అనుసరించింది. గోపి ఆఫీసుగదిలో కూర్చున్నాడు.
ఇద్దరూ మౌనంగా రెండు నిమిషాలు కూర్చున్నారు.
రాణి తలదించుకుని, దుఃఖం ఆపుకోలేక కన్నీరు కారుస్తూ నేలమీద వేలుతో రాసోంది.
“శారదా! ఇక్కడి నీ ప్రవర్తన కొంత తెలుసు. నిన్ను గురించి నేను బాధపడిన దినాలనేకం నిన్ను రాణిగా చూసినపుపడు నీ ప్రవర్తనలో ఏదో నిగూఢరహస్యమున్నదన్నట్లు అనుమానించాను... నీ గత చరిత్ర అంతా స్పష్టంగా నాకు వినిపించాలి ”
“ప్రయోజనం?”
“నా (బ్రతుకు సమన్య పరిష్కరించుకోవాలి!” శారద పేలవంగా నవ్వింది. చీరకొంగుతో కన్నీరు తుడుచుకుంది.
“మాధవరావు నన్ను పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేశాదు. నాగరికత మోజులో నవమన్న్మధుడిలా కనిపించిన మాధవరావును నిమ్మ నీకు ద్రోహం చేశాను.... అందంలో .. ధనంలో... తెలివిలో నీకంటే వెయ్యిరెట్లు మిన్నగా కనిపించాడు నా కళ్ళకు. మన పెళ్ళి ముహూర్తనిశ్చయానికి ముందు అతన్ని కలుసుకుని మద్రాసు పారిపోయాం. అప్పటికి మా పెళ్ళి యిష్టంలేని తన తల్లిదండ్రులను తర్వాత మెల్లగా సమాధానపరుస్తా నన్నాడు. వెయ్యిరూవాయిలు తోడు తీసుకువచ్చాడు... మూడునెలలు సుఖంగా గడిపేము ఒక హోటల్లో.... ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళం. కంచి పోయి దేవాలయంలో పెళ్ళి చేసేసుకువద్దామన్నాడు మాధవరావు ఒక రోజు ముహూర్తం నిశ్చయించుకు వస్తానని ఒంటరిగా బయటికి వెళ్ళాడు... అంతే తిరిగి... రాలేదు... అప్పటికే గర్భందాల్చాను
అన్వేషణ 4931 మాధవరావు చేసిన మోసం నేను నీకు చేసిన (ద్రోవోనికి సరైన న్యాయమనుకున్నా. . నా విధికి విలపించా. తిరిగి మీ ముందు ముఖం చూపదలుచుకోలేదు . అజ్ఞాతంగా ఒంటరిగా (బ్రతికి జీవితమంతా ఏడ్వాలనుకున్నాను... జీవితములో చేసిన తప్పు చాలకుండా, గర్భం చిద్ర చేసుకుని శిశువుని హత్యచేసేనేరం కూడా జరపడం ఘోరమనిపించింది మిగిలిన డబ్బుతో హోటలు విడిచాను .. కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది . కాని గూడకట్ల మగవాళ్ళు వెన్నంటారు .. ఆ ఉద్యోగం విడిచి సంసారుల యిళ్ళల్లో దానిగా చేరాను... గృవాన్సలే నన్ను చూని చెడ్డ్దగుణం ప్రదర్శించారు... కూరలమ్ముకుని బ్రతికాను కొన్నాళ్ళు. .. నిమ్నజాతుల నన్ను నీచంగా శీలం భంగపరచ (ప్రయత్నించారు. మద్రాసు విడిచి రైలు ఎక్కాను... నెల్లూరు రాగానే ప్రసవవేదన కలిగింది దిగిపోయాను . స్టేషనుదాటి నడిచాను ఫర్లాంగు .. ప్రసవవేదన పెరిగింది .. ఓ కూలివాడు దారిన పోతున్నాడు.... ధర్మశాల ఎదైనా ఉందా అని అడిగాను. మరుక్షణంలోనే గబగబ నడిచి దారి ప్రక్కగుడిసెలో ఒరిగిపోయాడు .. మగశిశువు... కలిగింది ఆ కూలివాదు నా చరిత్ర విని జాలిచూపి యింటికి తీసుకుపోయాడు. .. కొన్నాళ్ళు వాళ్ళతోపాటు గడిపాను... వాళ్ళతోపాటు కూలిచేశాను... అక్కడకూడ మగవాళ్ళ వెన్నంటారు .. పాపం! కూలివాడు మంచిగా మర్యాదగా చూచేడు నన్ను... పిల్లవాణ్ణి భాగా లాలించేవాడు. తనకు పిల్లలులేక .. అది అతని భార్యకు నచ్చలేదు... నామీద మమత చూపుతున్నాడని అసూయపడింది .. ఆ విషయం గ్రహించేను బిడ్డతో కదిలే అవివాహిత స్త్రీకి సమాజంలో స్థానం లేదని, పిల్లవాడిని అక్కడే నిర్ణయగా వదిలేసి ఒంటరిగా యి క్రొత్త నగరం వచ్చేశాను!” శారద నిట్టూర్పులతో ముఖం దించుకుంది.
శివరాం సిగరెట్టు నుసి రాలుస్తూ వెలుగుతోంది పొగలతో.
నల్లపిల్లి ఆమె కథ వింటూ కూర్చుంది మౌనంగా ముఖం బాధగా చిట్లిస్తూ.
'నగరం వచ్చేక భోగం కొంపలకు రిక్షావాడు మోసంచేసి తీసుకుపోయాదు.... అక్కడ ప్రధమంగా నిన్ను చూసి గాభరాపడ్డాను... నువ్వీనగరంలో ఉంటావని ఎప్పుడూ అనుకోలేదు... మొదట నువ్వో కాదో అనుకున్నాను.... చివరకు అస్టిర నిశ్చయంతోనే ఉండి పోయాను... . నాటకాలలో బాగా పోల్పాను... క్రైస్తవ ప్రీగా నా నైపుణ్యం అంతా ఉపయోగించి ప్రవర్తించాను.... మనం కలుసుకున్న ఆఖరిరోజు నన్ను గురించి చెప్పుకుందామనుకున్నా. . ద్వంద్వార్ధంతో నన్ను క్షమించగలవా అని ప్రశ్నించాను... నువ్వు మౌనం వహించావు.. నా అహంభావం దెబ్బతింది... అవమానం భరించలేక
శత్ర2 అన్వేషణ పోయాను.. నాటకాలలో మసిలి నా శీలం చెడగొట్టుకోలేదు. . అందరితో చనువు పెంచుకున్నా. .. అందర్నీ ఆకర్షించి ధనం సంపాదించేదాన్ని . మరియమ్మ (బ్రతుకు నాకు పెద్ద బరువు అయిపోయింది. ఆ పరిస్థితులలో ఆమె నాకు తప్పనిసరిగా తల్లిగా ఉందె గతి పట్టింది నాకు మగవాళ్ళతో నేను చేసిన చనువు ప్రవర్తన అందరిలో అసూయ లేపింది . ప్రమాదాలకు గురి అయ్యాను. .. మరియమ్మను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి... నన్ను కొట్టడానికి యత్నాలు చేశారు . సినిమాల్లో చేరాలనుకున్నా.. శీలం చెడిపోయేదుస్టితి ఏర్పడింది.... తప్పించుకు బయటపడ్డా.... ఈ (ప్రమాదాలు తప్పించుకోవడానికి తప్పని సరిగా వాతావరణమే మార్చుకున్నా!” శారద లేచిదుఃఖం ఆపుకోలేక కిటికీవైపు నడిచింది.
శివరాం సిగరెట్టు కాలుస్తూ పచార్లు మొదడబు పెట్టాడు నల్ల పిల్లి “మ్యావ్” మంటూ సానుభూతి చూపింది
“తర్వాత చంద్రప్రభ స్నేహంతో, కురంగేశ్వ[ర్రావుగారి సహాయంతో పంతులమ్మగా (బ్రతికేను... నా ఒంటరి స్తీ జీవితానికి వారింట్లో చక్కటిరక్షణ దొరికింది. నువ్వు నన్ను క్షమించవని నిమ్మ బాధగా కాలం గడివాను. సపెళ్ళికొడుకుగా నువ్వు వస్తూన్నట్లు నాకు చంద్రప్రభ చెప్పలేదు. నువ్వు హరాత్తుగా కనిపించడం నాలో తీరనివ్యధ లేపింది.... ఆ దుఃఖం ఆపుకోలేకపోయాను. . వివాహ ప్రయత్నాలు చేసుకుంటూన్న నీకగపడి నీ మనస్సు పాడుచెయ్యదల్పుకోలేదు దూరమైపోయాను... నీ చిత్రకళ ప్రతిభ .. నీ సాంఘిక బెన్నత్యం విని ఆనందించాను అంతే” శారద గంభీరంగా నిలబడింది.
“తాంబూలాలు పుచ్చుకున్నాక పెళ్ళి స్థిరపడిందని సంతోషించా ... ఆ రాత్రి నువ్వు బంగళాలో పడుకోడం ఎరుగుదును. నా కిటికిలోంచి నీప్రక్క కనిపించింది... నాకు నిద్ర పట్టలేదు... ఏవో బాధలు .... ఒళ్ళంతా నమిలివేశాయి కళ్ళు పీడంచాయి నిద్రరాక ఆవేదన హెచ్చయి... మనశ్శాంతి నీ పాదాల త్రాకి పవిత్రమౌదామని వచ్చాను కన్నీరు కారింది నీ పాదాలమీద. ఉలిక్కిపడి లేచావు!” శోకంతో కుర్సీలో కూలబడింది శారద.
“చంద్రప్రభకూడా నాకు ఎంతో స్నేహితురాలు... ఆమెను పెండ్లిచేసుకొని సుఖపడు... కాని నన్ను క్షమించాననిమాత్రం మనస్ఫూర్తిగా చెప్పుబావా.... నేను నీకు చేసిన ద్రోహంవల్ల ఎంతకాలం దుర్భర ఏకాంతజీవితం గడిపావో నాకు తెలుసు... నీ మనస్సున కోత పెట్టిన రాక్షసిని... నా జీవితానికి తగిన ప్రాయశ్చిత్తం కూడా లేదు!” వెక్కివెక్కి ఐడద్చింది శారద
అన్వేషణ శ్నీపప
శివరాం ఆలోచనల్లో పడి వేగిపోతున్నాడు సిగరెట్టు చెయ్యికాల్చింది. . క్రింద పారేశాడు.
క్షమించవూ . .. బావా!” దీనంగా ఏడ్చింది శారద. శివరాం గంభీరంగా, మౌనంగా ఆమె భుజంమీద చెయ్యివేసి ఓదార్హాడు... అతని కళ్ళల్లోంచి రెండు వేడిబిందువులు ఉదయించాయి.
గడియారం అయిదు కొట్టింది (మోగుతున్న టెలిఫోనులో శివరాం... ఆదేశానుసారం అతను ఇంట్లోలేడని చెబుతున్నాడు గోపి
శివరాం నోటివెంట అప్పటికే 'క్షమిస్తా నన్నమాట రానందుకు శారద శోకం కట్టలు తెంచుకుంది. తానుచేసిన మహాపరాధం నిజంగా జీవితంలో మరువరానిది. ఆలోచించగా శివరాం నోటివెంట క్షమిస్తాననే మాటకుకూడా తాను అర్హురాలు కాదేమో అని విలపించింది శారద.
లేచి నిలుచుంది శారద వెదతానంటూ.
శివరాం మనస్సు తర్మ వితర్మాలతో పెనుగులాడుతోంది.
అతని వివాహం చెడగొట్టడానికి కనిపించి క్షమించమని ముందు మచ్చిక చేసుకుంటున్నానని తన్ను శివరాం అనుమాసనించేడమో అని భయపడింది శారద.
శివరాం మౌనంగా లేచి నిలుచున్నాడు వీడ్కోలివ్వడానికి.
అతని మౌనం తన హృదయాన్ని చీల్చినట్లు కుమిలింది శారద. పైకివచ్చె దుః ఖాన్ని దిగమింగుకుంటూ వడివడిగా నడిచిపోయింది శారద శివరాం మౌనంవల్ల, యింక జీవితంలో *నొ అనేవాడు లేడనుకుంది ఆమె. ఇక తన (బతుకు వృధా అని ఆత్మహత్య చేసుకొనడం ఉత్తమమని నిర్ణయించుకుంది శారద
శారద వెళ్ళివోయాక ఒక్కక్షణం కొయ్యబారిపోయి బాధతో కుర్చీలో కూలబడ్డాడు శివరాం. ఎదురుగా గోడమీది కాలందరులో శాపవిమోచనం పొందిన అహల్య శ్రీరామునికి నమస్మరిస్తోంది
శారద మందారపత్రపు వదనాకారంలోని అమ మశూచి మచ్చలు కళంకం చేశాయికాని, మనిషిలోని సహజమైన లావణ్యం మనస్సులో తొణికిసలాదే అనురాగం యింకా మాసిపోలేదు. ఆమె కొద్దిక్షణాల ఉనికి తనకెంతో మనశ్వాంతి కలిగించింది.
శ34 అన్వేషణ కుళ్ళుతూన్న బాధల గాయాలకు ఎంతో ఉపశమనం కలిగింది తన జీవితసమస్య ఏవిధంగా పరిష్మరించుకోవాలనే ఆలోచనలోపడి శివరాం స్తంభించి పోయాడు విచారంతో.
జనార్ధనం లోనికి వచ్చాడు. ముఖానికి విభూతి పెట్టుకుని, చెవికి గన్నేరుపువ్వు తగిలించుకున్నాడు అప్పుడే ఈశ్వరాలయంనుంచి వచ్చిన భక్తుడిల అగుపద్డాడు.
శివరాం మౌనంగానే కూర్చున్నాడు జనార్ధనాన్ని చూసి పలకరించకుండా, కనిపిస్తే ఆప్యాయంగా పలకరించే శివరాం తత్వం ఆనాడు విరుద్ధంగా ఉండడం జనార్ధనానికి విచిత్రంగా తోచింది.
“ఏదో విచారంగా ఉన్నట్లుగానే ఉన్నారు!” జనార్ధనం మాటలు కదిపాడు. ఒంటరిగా శివరాం ఇంట్లొనే వున్నాడని తెలుసుకున్న జగార్థనం కాస్సేపు కబుర్లు చెప్పిపోదామని వచ్చాడు.
శివరాం నవ్వాడు కొద్దిగా. జనార్ధనానికి కొంచెం హుషారుకలిగింది.
“పెళ్ళి చేసుకోండిసార్ . . . విచారాలన్నీ పోతాయి!” వేళాకోళం చేశాడు జనార్దనం.
“పెళ్ళి నిశ్చయం అయింది
“ఇంకేం మాకు బూరెముక్క దొరుకుతుదన్నమాట!' జనార్ధనం పకపక నవ్వాడు, తనకున్న చనువుతో.
“కాని జరిగేలాలేదు!” శివరాం గద్దదంగా అన్నాడు శారద జ్ఞప్తికివచ్చి.
తననవ్వు హఠాత్తుగా ఆపుకున్నాడు జనార్దనం, శివరాం మాటలకు చకితుదై.
“ఒక ఆప్తబంధువైన స్త్రీని నేను చదువుకునే రోజుల్లో ప్రేమించాను. ఆమె నన్నువిడిచి లేచిపోయింది. ఆమెవల్ల కల్టిన భగ్న (ప్రేమతో బాధపడి యిన్నాళ్ళు అవివాహితుడుగా ఉండిపోయాను. . . చివరికి విసిగెత్తి ఒక ఉన్నత కుటుంబీకురాలిని పెండ్లి చేసుకోడానికి ఒప్పుకున్నా. .... .నేను ప్రేమించిన స్త్రీ లేవదీసుకుపోయినవాడివల్ల గర్భందాల్చి, కొడుకుని విడిచి, సాహసజీవితం గడిపి, శీలం చెరుచుకోకుందడా మసిలి, వింత పరిస్టితుల్లోనన్ను క్షమించమని ఎడ్బిండి... నా కర్తవ్యం అర్ధం కావడంలేదు!” బాధగా నిట్టూర్చాడు శివరాం,
జనార్ధనం ఒక్కనిమిషం ఆలోచించాడు.
అన్వేషణ శీప్రర్
“వేసిన పొరపాటు తర్వాత, మనస్సూర్తిగా పశ్చాత్తాప పడి, శీలం చెరుచుకోకుండా బ్రతికిన ప్రీని క్షమించడంలో తప్పులేదు! పొరపాటులు మానవజీవితంలో సహజం. గుణాన్ని నిర్ణయించే కొలతబద్ధ మనస్సు, కాని పారపాటుతో కూడిన మనిషి ప్రవర్తనకాదు!. . దైవసృష్టిలో ప్రతీ వస్తువులోనూ ఏదో కళంకం కనిపిస్తోనే వుంటుంది. అందమైన చంద్రుడిలోనే వికృతమైన మచ్చలున్నాయి ప్రపంచంలో పరిపూర్ణత్వం పొందిన మానవుడెవరు?” జనార్దనం పాలభాగం వక్రలేఖలతో చిట్లించుకుంది. ఫాలభాగంమీది విభూతి పెదాలమీద రాలి. పెదాలనుంచఛి విడివదే అతని మాటలకు పవిత్రత ఆపాదిస్తున్నట్లు కనిపించింది శిరాంకు
“విజ్ఞానుల దృష్టిలో జగతిలోని మానవులంతా ఒకేకులం, బ్రతికేటప్పుడు మానవుడు కృత్రిమంగా కల్పించుకున్న కులమత విభేదాలు విస్మరించాలి. మనిషి విలువకు గుణం ప్రాతిపదిక. మనస్సు గుణాన్నికొలిచే కొలతబద్ద ....అందుకే కొన్ని ప్రత్యేక పరిస్థితుకలో పొరపాటు ప్రవర్తనతో బాహ్యంగా కనిపించే కంటె, అంతర్గతమైన మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మీరు ప్రేమించిన స్త్రీలో అటువంటి నిజాయితీ మనస్సు ఉందని మీకువిశ్వాసం కలిగితే ౬:కుండా స్వీకరించండి!”
ఉద్రేకవంతమైన జనార్ధనం ముఖంలో ఏదో వింతరంగు. విద్యుద్దిపాల కాంతిలో స్పష్టమైంది.
“నా జీవితం చెబుతా వినండి . .. నేను ధనికుడను. మొదటలో విచ్చిలవడిగా దబ్బు ఖర్చుపెడుతూ ఎందరో స్రీలవెంట నిర్లక్ష్యంగా తిరిగేను. ఇంటిపట్టు ఎప్పుడూ ఉందేవాడినికాదు.... నాభార్య నామీద విపరీతమైన (ప్రమతో తనదగ్గర ఉండమని బ్రతిమాలేది..... లెక్కచెయ్యలేదు ఆమె మాటలు కాలం మార్పులో నాకు ఇద్దరు సంతానం కలిగినా నాకు వ్యభిచారంమీద అభిలాష తగ్గలేదు.... ఒక (న్రీనన్ను వెన్నంటీంది . రాత్రింపగళ్ళు అక్కడే గడిపేవాడిని. ఒక దినం నా భార్య లేచిపోయింది పిల్లలను విడిచి సంఘం హేయంగా నవ్విందినన్ను చూచి. ఆ హేళన హృదయంలో బల్లెంలా గుచ్చుకుంది. గృహస్థ జీవితంలో అన్యాయం చేసిన నాకు ఆమె తగిన గుణపారం నేర్పిందనుకున్నాను. మానవుని తత్వాల బలహీనతను బట్టి శరీరోద్రేకాలు జీవితాలను ధ్వసం చేస్తాయి. నా భార్య నాకు కనిపింలేదు కనిపిస్తే బహుశా నేను క్షమించేవాడిని. సంఘం నవ్వినా. తర్వాత మారిపోయేను. పూర్తిగా మారిపోయాను. కొడుకు బైరాగుల్లో కలిసిపోయాడు కూతురు దూరంగా కులట జీవితం గడుపుతోంది. తల్లిదండ్రుల గుణాలే
436 అన్వేషణ
సంతానికి వన్తాయంటారు. కాని వ్యక్తిగత జీవితాలకు రక్త బాంధవ్వాలకూ సంబంధంలేదు
ఎవరి విధిననుసరించి వారి జీవితం నిర్ణయించబడుతుంది అందుకే పరిస్థితులు
పరిశీలించి మనుష్యుల విలువలు అర్ధం ఏనుకోవాలి! ఇంతకంటె నేనేం చెప్పను? జనార్ధనం నవ్వాడు మృదువుగా,
శివరాం అతని మాటల్లోని ప్రతి అక్షరం ప్రత్యేక శ్రద్ధతో వినితర్కించుకున్నాడు, గంభీరంగా -లేచి నిలబడ్డాడు.
“జనార్ధనం రెపు మధ్యాహ్నాం నువ్వు నాతో రావాలి!”
“అలాగేనండి . . . క్షమించండి... పెద్ద ఉపన్వాస షిచ్చాను!” అంటూ నవ్వుతూ శివరాంకు ఎక్కువకాలం వృధాపుచ్చకూడదనుకుని తన లాండ్రీలోకి వెళ్ళిపోయాడు.
జీవితంలో ఎన్నో అనుభూతులు పొంది, సంఘ కర్మశత్వాన్ని జీర్ణించుకున్న జనార్ధనంలో నీతి విలువలు ఎన్నో ఉన్నాయనిపించింది శిరాంకు మెదడులో ఆలోచనల వేగం తగ్గలేదు.
వివాహం నిర్ణయించుకున్నది దేనికి?. .ఒక కుటుంబం కావాలని... సాంఘికాచారం సాంప్రదాయాల ౩కట్టుబాటుల్లో ఒదిగి, ఒక స్త్రీని ఏరుకుని సంతానం కని, రక్త సంబంధమైన బాంధవ్యాలు పెంచుకున్నంత మాత్రాన ఆ గుంపు కుటుంబం క్రింద పరిగణించబడదు. వ్యక్తుల కలయిక కుటుంబంగా పరిగణించబడాలంటే ఆత్మీయత ముఖ్యం. రక్తసంబందమైన బాంధవ్వాలతో, ఆత్మీయత లోపించిన ఎన్నో కుటుంబాలు కనిపిస్తున్నాయి. తాను ఏర్పరచుకోవలసిన కుటుంబానికి ఆత్మీయత (ప్రధానం అనుకున్నాడు శివరాం.
ఇంతకాలం జీవితంలో ఏ ఆత్మీయత లేదని తాను కోభపడ్డాడో ఆ ఆత్మీయత అందించగల వ్యక్తి లభించినపుడు ఉదాసీనత వహించడం ఆత్మద్రోహం చేసుకున్నట్లే అని భావించాడు శివరాం.
శారదను తన యింటికి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాడు
మర్నాడు కారులో జనార్ధనంతో కలిసి కురంగేవ్వర్రావుగారి ఇంటికి వెళ్ళాడు శివరాం.
అన్ప్నేషణ శ్ర
ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చిన కురంగేశ్వర్రావుగారు వాలుకుర్సీలో వార్తాపత్రిక చదువుతూ కూర్చున్నారు శివరాం హఠాత్తుగా వచ్చేదేమా అని కొంచెం వింతగా చూశారు.
“ఒక పనిమిద వచ్చాను మీ దగ్గరకు....మీ లతనాకు చాలా ఆప్పరాలు .. ,.మా ఇంటికి తీసుకుపోదామని వచ్చాను . . పెళ్ళిముందు చూచుకోవలసిన పనులలో నాకు ఎంతో నవహకారం చేస్తుంది ఏదో తాత్కాలికంగా నిన్ను ఒక స్నేహితునింట్లో కలుసుకున్నప్పుడు మెమిద్దరం ఆప్రయత్నంగా బాంధవ్యాలు చర్చించుకున్నాం ఒకరి నొకరు తెలుసుకున్నాం, మీ కేమి అభ్యంతరం లేదనుకుంటాను!” శివరాం వినయంగా మాట్లాడాడు.
కురంగేశ్వరావుగారు కొద్దిగా ఆలోచించారు. తాను మునుపు లతగురించి విన్న సంగతులు దృష్టిలో పెట్టుకుని
“ఈ విషయం ఇంతవరకు నాకు తెలియదే” అంటూ భార్యను కూతురును పిలిచారు కురంగేశ్వరావుగారు.
తల్లి కూతుళ్ళు విస్మయం చెందినా, తన ఇంట్లో చాలాకాలం స్నేహంగావున్న స్తీ శివరాం అప్ప్తురాలు కావడం శుభసూచక మనుకున్నారిద్దరూ.
“భార్య వచ్చేలోపుగా మీ లతను మా ఇంట్లో అలకంరిచుకుంటా!” శివరాం మాటలువిని కామేశ్వరమ్మ చిరునవ్వు నవ్వింది
చంద్రప్రభ సిగ్గుపడింది
అందరూ రాణి గదివైపు నడిచారు. రాణిగది కిటికీలు ద్వారాలు బంధించబడి ఉన్నాయి. చంద్రప్రభ దబదబ తలుపులు బాదింది సరదాగా ఒకనిమిషం ఆలస్యం అయింది... ప్రొద్దున్నే బజారుకుపోయి నాభికోని తెచ్చుకుంది శారద. ఆత్మహత్యకు సన్నద్దురాలై తలుపులు మూసుకుని ఏడుస్తూంటే తలుపుచప్పుళ్ళు ఆమె ప్రయత్నాన్ని భంగపరిచాయి. గబగబ ఇల్లు సర్దుకుని, ముఖంలోని కన్నీరు తుడుచుకుని, తలుపు తెరిచింది శారద.
శివరాం, కురంగేశ్వరావుగారి కుటుంబం ఎదురుగా కనిపించడం శారదకు వింత గొలిపింది. కురంగేవ్వరావుగారు విషయం వివరించారు. శారద మౌనంగా మందస్మితం చేసింది
జనార్ధనాన్ని ఆమె సామానును బండిలో తెమ్మని పురమాయించేడు శివరాం. శారద కురంగేవ్వరావు దంపతులకు చంద్రప్రభకు నమస్కరించి కారులో కూర్చుంది.
శ38 అన్వేషణ
శివరాం కారు స్వయంగా నడిపిస్తున్నాడు.
“క్షమించావా బావా? శారద మెల్లిగా మందస్మితం చేసింది శివరాం నన్ని ఊరుకున్నాడు.
శారదను తీసుకుని ఇంట్లోకివస్తుంటే పొరుగింటి అమ్మలక్కలు చూసి నాలిక కొరుక్కున్నారు తాము వ్యభీచారుల (ప్రక్క అద్దె కొంపల్లో చేరే ఖర్మ పట్టిందని,
జనార్ధనం శారద సామానులుకూడ ఇంట్లో చేరవేశాడు. శారద వచ్చిరాగానే మీదకెగిరిన నల్లపిల్లిని ఎత్తుకుని ముద్దాడింది.
చంద్రప్రభతో వివాహం నిర్ణయించుకుంటూ తాంబూలాల ద్వారా చేసిన వాగ్దానం ఉపనంహరించుకోవాలనుకున్నాడు శివరాం సొంఫికాచారాలు మానవులు అవసరాలననుసరించి నిర్ణయించుకునే నియమాలు. ఆ ఆచారాలు పాటింషక పోవడంతో మనిషికున్న నితికి భంగం కలగదనిపించింది
పేరిశాస్రికి చీటి వ్రాశాడు శివరాం, చంద్రప్రభను వివాహం చేసుకోవాలనే తన నిశ్చయం విరమించుకుంటున్నాని. జనార్ధనం ద్వారా ఆ చీటీ పంపించాడు శివరాం. దానివల్ల కలిగే ఫలితాలు ఊహించాడు
పేరిశాస్రి చీటీ ఇచ్చాడు.
కురంగేశ్వరావుగారు తన మనస్సులోని అనుమానాలు నిర్ధారణ చేసుకున్నారు.
“మనపై ఆధారపడి (తికి చివరకు ఆమె మన ఇంటికే చిచ్చుముట్టించింది” మహిళల హక్కులు కాపాడటానికి కంకణం కట్టుకున్నాని ఉపన్యాసాలిచ్చి కామెశ్వరమ్మ హూంకరించింది.
లత, శివరాంకు ఎటువంటి ఆప్తురాలో చంద్రప్రభకు అర్దం జాలేదు,
పళ్ళదుకాణాదారుని పరిచయం, కుష్పురోగ ప్రీగాధ, ఖైదీ సంభాషణ, ఆకాశరామన్న ఉత్తరాలు -- భార్యాభర్తలు, కూతురు ప్రస్తావించుకున్నారు. లత జీవితంలోని అవ్లికలు వారి కనూహ్యమైనాయ అయినా చెడిన సంబంధం గురించి మరబిపోవడం మంచిదను కున్నారు. భార్యాభర్తలు, చంద్రప్రభకు నిజంగా కొంత దిగులు కలగకపోలేదు. క్షాని సహజమైన స్తీ అహంభావంతో దానిని అణగద్రొక్కుకుంది.
ఈసారి ఐ ఏ.యస్. పెళ్ళికొడుకుని తెస్తానని ('ప్రతినపట్టాడు పెరిశాస్తి కాని సాంఘిక పరపతిగల ఇద్దరి పెద్దవ్యక్తుల [ప్రాపకం పోగొట్టుకున్నానని చివరకు అర్ధం చేసుకుని కటలుగన్న స్వార్ధప్రయోజనాలు అడియాసలయ్యాయని విచారించాడు శాస్తి.
అన్వేషణ తపం
పులిగాదు రంగమ్మతో లోనికి ప్రవేవించాడు. 'బాబయ్వా... మా రంగికి బంగారుఒంటి పేటగొలుసుకొన్నాను నాణ్యం చూడండీ, అన్నాడు పులిగాడు. “నగల నాణ్యం నాకేం తెలుస్తుంది? ఇంట్లోవున్న నారీమణి నడగండి” అన్నాడు శివరాం శారదను వ్లిఆదు
గోపి ఆత్రుతగా పులిగాడి చేతులోంచి గొలుసు లాక్కుని చూశాడు.
శారద లోపలిగదిలో ఇల్లు సర్ఫతూ, శివరాం పిలవగానే వచ్చింది.
పులిగాడు, రంగమ్మ శారదను ఊఒ నోరు ఆవలించారు.
శారదకూడా వారిని చూచి దిగ్భ్రాంతి చెందింది ఒక్కక్షణం.
'శారదమ్మా!” పులిగాడు బంగారు గొలుసుతో ముందుకు వచ్చాడు.
ఇంతకాలం నేను కూడబెట్టిన సొమ్ముతో చేయించిన నగ! అన్నాడు పులిగాడు, గోపీ గోలుసు పట్టుకుని ముందుకు వచ్చాడు
శారద గోపీని, గోపిచేతులోని బంగారు గొలుసు పట్టుకొని ఆనందంతో జలజల బాష్పాలు వదిలింది.
'మీ అమ్మ!” పులిగాడు గోపివైపు చూశాడు. గోపీ అమాయికంగా నిర్హాంతపోయాడు. మాతృప్రేమ పొంగి పొర్లగా శారద గోపీని హృదయానికి హత్తుకుని ఏడ్చి. అతడి మూర్ధం నిమిరింది.
శివరాం ఆ దృశ్యమంతా సానుభూతిలో చూశాడు ఇంతకాలం ఇంట్లో తనకు అపారమైన సేవచేస్తున్నాడు గోపీ....
కుమారుడి కంటే ఎక్కువ (ప్రేమ గౌరవం చూపించాడు గోపి అనుకున్నాడు శివరాం,
శివరాం ముందుకువచ్చి శారద చేతిలోన్ బంగారు గొలుసు పట్టుకుని పరీక్షించాడు.
'ఈ గొలుసులోని బంగారం నాణ్యమైనదే!” అన్నారు శివరాం శారదలు ఒక్కమారు బంగారుగొలుసు రంగమ్మమెడ అలంకరించాడు పులిగాడు. పరాధీనుడైన గోపీ, తన్ను పూర్తిగా గొడ్రాలుగా వదిలినా, చివరికి బంగారు గొలుసు తనకు మిగిలింది అనుకుంది రంగమ్మ.
వీధిగుమ్మం దగ్గరి ముక్కాలిపీటమీద కూర్చునే గోపీని భుజం మీద చెయ్యివేసి అభిమానంతో శారద లోనికి తీసుకుపోయింది.
పులిగాడు రంగమ్మ నిష్మమించారు.
శారద ఇంట్లో స్వయంగా వంట ప్రయత్నంలో నిమగ్నురాలైంది నల్లటి రాజవ్వనల్లటి అంట్లు తోముతోంది.
శశ 0 అన్వేషణ
జనార్ధనాన్ని తనతో భోంచేయమని శివరాం ఆహ్వానించాడు.
న్వాయవాదం నేర్పిన మేజాబల్లముందు కూర్చుని తన కుటుంబం చిత్రం గీయడానికి ఉప[క్రమించెడు శివరాం.
పెన్సిలు రేఖలలో ప్రధమంగా రఖాకృతులు ఏర్పరుచుకున్నాడు .. మేజాబల్లమీద విద్యుద్దిపం కొంత ప్రజ్బరిల్లుతోంది. మశూచి కళంకంతో దీనంగా ముఖంపెట్టిన శారద . .బూట్లిష్ చేస్తున్న గోపీ తోటిలాయరుగా కుర్చీలో నిక్మికూర్చున్న నల్లపిల్ల, ఇస్త్రీ పెట్టితో బట్టలను మడత పెడుతూ భావాల వెచ్చదనం, చైతన్యం అందులో ముడుస్తున్న జనార్ధనం . . చుట్టూ వృత్తాకారంలో భావాల తరంగాల్లో నిలిచారు. ఈ రేఖాకృతుల చిత్రంలో ఇంక వర్ణం, లయపెంపొందింప ఏసుకోవాలనుకున్నాడు శివరాం.
పాశ్సాత్యనాగరికత ప్రభావంతో కూడిన భౌతిక జీవనంలోని వైపరీత్యానికి, భారతీయ విజ్ఞాన సంస్కృతుల తత్వవిచారమునకు, సమన్వయం కుదరక ఆధునికయుగం దైనిక జీవితంలో సతమతమౌతోంది. ఈ సమన్వయసాధనకు తన కుటుంబచిత్రం ఉదాహరణ కాగలదని ఆశించాడు శివరాం.
ఆ రాత్రి కలిసి మెలిసి సరదాగా కబుర్లు ఎప్పుకుంటూ శివరాం జనార్ధనం, గోపీ, శారద, నల్లపిల్లి ఒకే పంక్తిలో భోజనం చేశారు.
భోజనాలయాక శారద తాంబూలాలమర్భింది.
మేడమీది వెనుక వరండాలో కుర్చీలువేశాడు జనార్ధనం.
వీధిలో పండువెన్నెల వ్యాపించి వరండాలోకి తొంగిచూస్తోంది.
“చంద్రప్రభ కూడా నీ వెంటి ఉంది!” అన్నాడు శివరాం.
శారద నవ్వింది. ఆ నవ్వు చూసి శావరాం మాటల్లో నిజముందనుకున్నాడు జనార్లనం.
(ల
వరండాలోని కుండీల్లో. గులాబి మొక్కలు పుపష్పించాయి. వరండాలోని విద్యుద్దీపం కాంతిలో తెల్లగజలోవీ కశ్సిటి పరిమళించింది శివరాం పుష్పాన్ని కోశాడు, “బావా నన్ను క్షమించవూ!' శుక్మశూరద మాట జ్ఞప్తికి వచ్చిందిశ్ఞబీవ్లితంలో సాహసయాత్రకు పురికొల్పి ఎన్నో అనుభ్యాతక్షు విజ్ఞానం ఇచ్చి బెనత్యం ఉఈశ్రేంచిన శారదను ఆ వుష్పంతో ఆలంకరించాలను క్షున్నాడు శివరాం
శారదను పిలిచాడు దగ్గరగా...
అన్వేషణ డ్శే్ష]
అతని భావం అర్ధం చేసుకుని, చేతిలో పుష్పం తీసుకుని శారద స్వయంగా తానే జడలో గులాబి పుష్పాన్ని అలకంరించుకుంది పెద్ద వాడైన జనార్ధనం ఎదురుగా ఉన్నాదని,
జనార్దనం వారిద్దరిని చూసి నవ్వుకున్నాడు లోలోపల ఆత్మీయతతో హృదయం కలిస్తే ఆదంబంరంగా వివాహమహోత్ప్సవాలు జరపడమనవసరం. మంత్రాల మధ్య మంగళసూత్రం కట్టినంత మాత్రాన మనుష్యుల్లో మమతలుద్భృవించవు అనుకున్నాడు జనార్ధనం,
హృదయం అందించే ఆడది, మనసిచ్చి మాట్లాడే స్నేహితుడు, తన జీవితంలో తాను అన్వేషించుకున్న కుటుంబంలో లభ్యమయారని సంతోషించాడు శివరాం.
గోపి నల్లపిల్లికి కుంకంలో వొడుగ్గా నామం పెట్టాడు అల్లరిగా పిల్లి 'మ్యావ్ొ మంటూ గోలచెస్తూ శారద ఒడిలోకి దూకింది. శారద నల్లపిల్లిని ముద్దు పెట్టుకుంది ఆప్యాయంగా. శారద ముఖం మీద కుంకం తిలకం ఏర్పడింది.
శివరాం శారద ఒకరినొకరు చూచుకుని సంతృప్తిగా మందస్మితం చేసుకున్నారు
ఉగాదివచ్చి పదిహేనురోజులయింది.
జీవితంలో ఉగాది ఏర్పడింది అనుకున్నాడు శివరాం.
విద్యుద్దిపాల స్తంభం చుట్టూకొమ్మలు అల్లుకున్న సీమతంగేడు వృక్షం ఎర్రపుష్పాలు దీపం వెలుగుల్లో దూరాన విప్లవ సూచనల్లా మెరిశాయి.
పూర్ణచంద్రుడు నిర్మలమైన ఆకాశంలో అద్దువచ్చి తెల్లటి మేఘాలను తొలగించు కుంటూ తన జీవితంలో మనశ్వాంతి నిచ్చే చల్లని వెన్నెలకాంత ఏ దివ్యజ్యోతి నుంచి తనకు లభించిందనే సందేహంతో కనిపించిన తారలను ్రశ్చిస్తూ, అన్వేషణ చేస్తూ పరుగిడుతున్నాడు.
య డ్ న్ వంగ నా భం హం * ఉ (6 లో ళ్ క
ఈ/౫౧ 1౦1 86 1౪౮ క్ ళ ట్ శయ, ళ్ళి శీ రం నలా న్నే / అ ల భే లో స లి లో . శ / జ , 6 / |
ర [యవయుకుంటి నంఅణవిదరాంచు నేను వ్రాసిన నవలలు అయిదే! కాని ప్రతీదీ అత్యంత
విశిష్టమైనది. “ఉదయ కిరణాలు”, “అన్వేషణ”, తెలుగు సాహిత్య
చరిత్రలో నసంచలనం కలిగించిన నవలలు. హైదరాబాదు,
సికింద్రాబాదు జంట నగరాలలో వాస్తవిక దృశ్యాలు పాత్రలు ఆధారంగా రమణీయంగా చిత్రించిన నవల “అన్వేషణ”. [
ఇటువంటి నవల ఇంతవరకు వెలువడలేదు. శిల్పానికీ,
కథనానికీ, పాత్ర చిత్రణకూ, జంటనగరాల సంస్కృతికి అద్దం
.... పట్టిన ఆధునిక ఆంధ్రుల జనజీవన నవల. -. ఇంతవరకు అన్ని శాఖలలో నావి 8౪0 గ్రంథాలు
- ప్రచురింపబడినవి. ఇంకా అముద్రితాలు చాలా ఉన్నాయి.