Telugu అక్షర శిల్పాలు_మోచర్ల రామలక్ష్మి_2008_177 p_svka102b175 - anilvaranasi/indianlanguages GitHub Wiki
ళా త్ శూ, వట! ॥ ళీ ఆ 4 ళ్ " శీ | న క! || ము ॥ 1 క్ష & | . ఈ ఖై న. " . | ల" న చి లట ఖి | . న నం పి కలల. భం. , | త ల [్ / న్ భీ కై , ” | కతల. వే మ ఆఅ) 4 - = = శ ఎ వచో _ | | టీతో జా + న గ్గ ల + ఈ ॥ జై ఇ ఇ క నక్త శ ఖై శ జ. ప - స చాన్ అహి వై స శ జ జ శ | బ్లా - న న ను. వా శ్ చెం సం ర్త... ను. న పెటి ల శీల సా 7, త్ల ఫ్ ళ్ ఇళ 4 - అగో త్త 1 టీ న వైషు న ప. నం ఇ న్ వ్ =శ అక _ .. ఫి శకి ల్ న్ లి వ. ఎట క్ర క [కయ నీ. గ అ్య*,- ఇ జ జనల శి | వ ఛాతీ నా న్ స్? ం* ) న ఫ్ గా ఆబ “వతం. వివ 1 ఇం ఆయ _ ర్ జి " క ర లె ట్ నం - క వ! తం శే బస్
- 1 నీతి శ చ్ స +ట్టీ ఎల జ అం . ॥ ః క ( న తళ =. నవ! 4 చ నా శే న | బల ఇ? క స టి జూ ఫు. ల క్షా శం న్ క్ స. +వై గ గ లం - నే న గ ల జ! | న . వ్ న్య వ 5 +ఇణ్నాళ ॥ | తా న! జా క్ ఏ. . న్! టు ర్ (కం... మకు! . వె న్ వ" .. న్ా ధట! శె ఇ ర 1. . "| టే. |] మ గ్ర జ | ఆ స కుం. శీ వే వైర క... శే ం ” వ క్ షు న భె 4, న్ జ అ ( - వో" కే. జా వళ టి శు గ్ ణ్ ల మ! ॥ జా 1 24 న. కం? ॥ నం! . చ 1 సళ ( (| చ | శ! ॥ ల . క్ష ఇ మ. శస 2 71 ఎట స నం లీ , లే. _ ఇ వన క 9 స క 1 అత[' కీ ఇ! లం | ॥ “శే ్కం: లీ ం వా | గ. జ. న = _*ఉ్య _ చో. గ్ ఓ (1. ॥ టో ఎల ఇ | , షై! న్
౯ ల శ ( న!
॥ వ మ . 1 ( | స | కీ 4 | | ఇ జా క్షే అప న క ౯ అతా కే మ శ క్ష శీ.
| క్ష | గ యే ్‌ా ॥ లో గా . [ (| త్ జజ క న్ చక.”
- న్ | అ | స న క్త $ [| న | లా ణ్ షా ఆ ట్ జ య స! "౯ / ట్. ర శ సం ప ప, ఈ! నల.” జ లీ ఎ సి భా. క 1 శా ల వ చ. న్ గ కీ + లా ల వే "అట్ట! “క్! | తో గే ” చ . టం జ్న పోటే లన ష్ ము: | క న్ ॥ న్న న -వతో మం టె భు. న్ా ల త. ౯ ఉ త. ల గ ప శ భక కౌ = ల న ( ఇ జ 1 శ. ( 4 చో క శ 4 ఇయ. అం రంత. న న భట, 4 న కవ | నై | , అ ఈ వ ఓ స్తా ( (౪ ] త్రి ఆ ఓ త్, ఎ కే; తలో ళ్ ఆ ఇ ! అ తొ వి శా - జ్ లా క్ష శి జూ క “ + చ్ ఆ న టూ. నః ల్ త, అ శే న శ ॥ జ జ రుస జ *ఆొం్యూ | ఖత లు హ్ | ఇ. 4
అక్షర శిల్పాలు గగ/3 రచయి(ి మోచర్ల రామలక్ష్మి
అక్త౦ శిల్పాలు రచన: మోచర్ల రామలక్ష్మి (సర్వహక్కులు రచయిత్రివి) వాట్ నెం 304, తిరుమల ప్రవీణ్ రెసిడెన్స్ ఆంధ్రాబ్యాంక్ ఎటిఎం ఎదురుగా గాంధీనగర్, హైదరాబాద్ - 80 ౧/ ర ఫోన్ : 040 -,2ఈ6ఈ౯ఈఈ68, 65ర్ష్గ07359 7 గ్ర వ... ర గ్ల లో ప్రచురణ: మార్చి 2008 , క. వెల: రూ. 99 న ల ముఖచిత్రం: కాంతు (ఎం. ఎల్, కాంతారావు) టా ఎవ డుటింప ం' 6 యో క్రియేటివ్ మల్టీకలర్ ఆఫ్సెట్స్ నా. = స్టీమర్‌రోడ్, నర్సాపురం - 534 275 పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ : 08814-273113 ప్రతులకు: శ్రీ సుధా బుక్ డిపో 1-10-196/ఇ, అశోక్ నగర్ ౧౮ రోడ్, హైదరాబాద్ - 500 020. లలితా అండ్ కో, పన్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్. ఆశోక్‌నగర్, ఆంధ్రాబాంక్ పక్కన, హైదరాబాద్ - 500 020. ఖోన్స్: 040-27613164, 65225544. |]
గ్గ ల్నఖీడా ల్ల అంకితం ప్రియమైన అన్న (శ్రీమతి వల్లూరి వెంకటలక్షె శ్రీ వల్లూరి శివప్రసాద్ గార్లకు ర్రేముతో... మ్ రాము లాలా అకాాాాాాాాా [11
అగజపుత్ర గజానన ప్రధమ దండము వక్రతుండ | విఘ్నములు బాపి లంబోదర . విజయమొసగు ఐకదంత
[7
పరిమళ ప్రశస్తి ణాశీ
శ్రీమతి మోచర్ల రామలక్ష్మి సుప్రసిద్ధ సంఘ సేవాపరాయణురాలేగాక చేయి తిరిగిన రచయిత్రి, వక్త భారతీయ సంస్కృతికి ప్రతీక. ఆమె మామగారు నాకు స్నేహితులు కావటం వలన నాకు కూతురులాంటిది. శీం500126100 10! 106 0౧౭6 01 106 గీ్ర్ర66 మహిళా సమాఖ్య తరఫున అనేక సేవాకార్యక్రమములు సమర్ధంగా, అంకిత భావంతో నిర్వహించి అందరి మన్ననలు పొందారు. పరాశరి సేవా సంస్థ వ్యవస్తాపకురాలిగా పలువిధములుగా సంఘసేవ, ముఖ్యంగా వృద్ధులకు, బీదలకు, రోగులకు నిరంతరం, నిర్విరామంగా సేవలను అందించుచున్నారు. అనెక వృద్దా శ్రమములతో సంబంధం ఏర్పరచుకుని తగిన సలహాలను ఇచ్చుచున్నారు.
ఆమె సంప్రదాయాభిమాని, సాహితీతపస్పి, నిగర్వి, నిరాడంబరురాలు. సంన్మా రవంతమైన రచన కళ ఆమె కలంలో ప్రకాశించుచున్నది. పుస్తకం సాంతంగా చదివాను అని అనటం కంటే చదివించింది అంటే బాగుంటుందేమో! అందులో పద్యములు, వచన కవితలు, పాటలు, ప్రార్ధనలు, కధానికలు, నాటికలు ఒకటేమిటి అన్ని ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అది పరిమళించే పుష్పగుచ్చం.
అందం, చందం, అనుబంధం ఈ పుస్తకాన్ని చదవగానే కలిగే భావాలు. ఇంత హృద్యంగా రాయగలగటం ఒక వరం. కధానికలలో, వ్యాసములలో, నాటిక లలో ఉపయోగించిన భాష సామాన్యులకు కూడా తేలికగా అర్ధమయ్యేటంత సుల భంగా, సరళంగా ఉంది. రచనలు క్లుప్తంగా ఉన్నాయి. రచనలకు ఇంపు కుదింపు అసి సిద్ధాంతం ఉంది. భావసౌందర్యమునకు దైవభక్తి, భావోద్వేగం జోడించి చదు వరులను ఆకట్టుకున్నారు. కథల ఎత్తుగడ, ముగింపు, నిర్వహణ బాగున్నాయి. విషయం స్ఫూర్తిదాయకం. కథానికలు, నాటికలు ఆనందంగా ఆటలాదినట్టు, సరసంగా మాటలాడుకొన్నట్లుగా అలవోకుగా సాగిపోయాయి. అటు ప్రాచీన సంస్కృతి, ఇటు సమకాలీన జీవనరేఖలు ప్రతిబింబించాయి. చమత్కారం, హాస్యం కూడా తగుమాత్రం గోచరిస్తాయి.
అమృతమూర్తులకు అక్షరార్భన చేసి, అమ్మ నాన్ను గురువు వృద్ధదేవులను ప్రార్ధించి రాసిన, పవిత్ర గ్రంధం ఇది. చిన్న వయస్సులోనే ఆమెకింత ప్రసన్నమైన రచనాశక్తి అలవడటానికి తల్లిదండ్రుల (ఎెంకటలక్ష్మ, శివప్రనాదుల) అనుగ్రహం, మామగారి ఆశీర్వచనం, భర్తగారి ప్రోత్సాహం ప్రత్యక్ష కారణం కావచ్చును, కాని పరోక్షకారణం పురాకృత సుకృతం నిస్సందేహంగా.
పుస్తకాన్ని తల్లిదండ్రులకు భక్తితో అంకితం ఇవ్వటం సమంజసం. ఇంకా అనేక మంచి పుస్తకాలు రాయాలని ఆమెను ఆశీర్వదిస్తున్నాను.
=. వి. చలపతిరావు, *త్రివెణి సంపాదకులు. ఖో
రామలక్షితో నా పరిచయం
రామలక్ష్మితో నా పరిచయం అనుకోకుండా జరిగింది. నేను నా ౪7558 ఫౌండేషన్ ద్వారా వృద్దుల సెవాసదనాలు విజిట్ చేస్తున్నప్పుడు, రామలక్ష్మి గురించి ఎవరో చెప్పారు. తర్వాత ఫంక్షన్లో పరిచయం అయింది. చాలా రోజులు మేం కలవనే లేదు, ఫోన్లోనే మా సంభాషణ జరిగేది. ఎక్కువ మంది పాఠకులతో, మాట్లాడటం వల్ల, ఎదుటివారి కంఠధ్వనితో వారి నైజం కొంతవరకూ [గ్రహించగలిగిన నేర్పు నాకు వచ్చింది. రామలక్ష్మి మాటల ఉచ్చారణ, విషయం చెప్పటంలో స్పష్టత, ఆశు కవిత్వంగా మాటల సందర్భంగా, పదాలు జాలువారటం విని, నేను ఆమెలో భావుకత వుందని (గ్రహించాను.
ఈమె పరాశరి సేవాసంస్థ స్థాపించి దానిద్వారా చేసే సేవాకార్యక్రమాలు విని, నను ఆశ్చర్యపోయాను. నాకంటే చాలా చిన్నది. వనభోజనాలు, లలితా సహ(స్ర నామాలు ఇష్టంతో, భక్తితో చేసే సంప్రదాయవాది. మన ఆచార వ్యవహారాలు, మన జీవనశైలి, మన సమిష్టి కుటుంబాలు, బాధ్యతలు, ఒకరికి ఒకరుతోడు అన్నట్లు సాయం అన్నీ మెళవించిన స్రీమూర్తి. భేషజాలు లేవు. ఇల్లు చూసుకుంటూ, పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. ఇదంతా సగటు ఆడవాళ్ళు చేస్తారు. కానీ మరో కొత్తకోణం చూశాను. అది పరులకి ఉపకారం చేయటం. పేదపిల్లలని చది వించటం. భీదస్రీలకి గాస్స్టవ్లు, కుట్టు మిషన్స్ యిప్పించటం, వృద్ధులకి సేవలు చేయటం. ఓల్డ్ ఏజ్ హోమ్స్ సక్రమంగా నడిచే బాధ్యత స్వీకరించటం ఇవన్నీ ఒక ఎత్తు,
అనాధశవాలకి నడుంకట్టి దహన సంస్కారాలు చేయిస్తారు. మన దేశంలో మధ్య తరగతి స్త్రి శక్తిలో ఆల్ ఇన్ వన్ అనటానికి రామలక్ష్మి నిలువెత్తు దర్పణం.
ఆమెకు నేనెలా యిష్టమో, నాకు కూడా ఆమె అత్యంత ప్రీతిపాత్రురాలు ఆమెది చిన్నవయసు. మంచి భర్త. అత్తమామలు, పిల్లలు, తల్లి తండ్రి ఆర్థిక న్టోమత. ఎటుచూసినా లోటులేని జీవితం. అయినా ఇంటికి ఆమె అంకితం కాలేదు, సుఖా లతో బద్ధకస్తురాలు కాలేదు. తీరిక సమయం అంతా సంఘసేవకి వినియోగిం చింది. ఎంతమంది కన్నీళ్ళో తుడిచింది. మీకు నేనున్నాను అని ధైర్యం యిచ్చింది. వారి కోసం (శ్రమించి ఒక ఆధారం కల్పించింది. రామలక్ష్మి ఇంటినెంత బాధ్యతగా చూసుకుంటుందో, యీ సంఘంలో ఆర్హులైన వారిపట్ల కూడా, అలాగే తనవంతు కర్తవ్యం నిర్వర్తించింది. నాకిలాటి మధ్య తరగతి గృహిణులంటే చాలా యిష్టం.
ఖగ]
ఒకసారి ఇలాటివారు నాకు పరిచయం అయితే, వారితో నా మైత్రి స్థిరపడుతుంది. నిజజీవితపు కధానాయికలు వీరు.
రామలక్ష్మితో పరిచయం పెరిగిన కొద్దీ, ఆమెలో దాగివున్న రచయిత్రిని కనుగొన్నాను. చాలా సంతోషం అన్పించింది. రచయిత్రి అయిన సంఘసేవిక చాలా మంచి కాంబినేషన్గల వ్యక్తిత్వం. రామలక్ష్మి రచనల గురించి అడగటం (ప్రారంభిం చాను. అప్పుడూ ఇప్పుడూ వ్రాసి పక్కన పడేసిన వాటిని చదివి ముగ్దురాలిని అయ్యాను. రామలక్ష్మి మంచి రచయిత్రి అని ఆమె కధలే చెబుతాయి. ఆమెని రచయిత్రిగా ఇమేజ్ పెంచుకుని, అవార్డుల వేటకి వెళ్ళాలని తపన లేదు. అహం భావంతో, తెచ్చిపెట్టుకున్న గొప్పతనం లేదు. ఆమె రచనలు ఆమె మాటంత సహజంగా వుంటాయి. ఈ పుస్తకంలో స్నేహరత్నట అమ్మ మనసు లాంటి కధలే ఉదాహరణ. ఈ రచయిత్రి కలంలో చాలా విన్యాసాలున్నాయి. కవిత, నాటకం వేదాంతం లాంటి రచనల కూడా ఉన్నాయి. ఇందులో ముడత ముడతకో చరిత మరీ మరీ, నిజజీవిత నగ్నసత్యాలకి దర్పణం.
రామలక్ష్మి ఎంత బాధ్యతగా సంసార జీవితం నిర్వర్తించిందో, ఎంత బాధ్యతగా, సాంఘిక సేవ చేసిందో అంతే బాధ్యతగా రచనలు చేసింది. ఆమె కుటుంబాలు చాలా చూసింది. వాటిలో సమస్యలు, వ్యక్తులు అద్దంలో చూపించినట్టు చూసింది. ఈ కధలు మీకూ నాలాగా తప్పక నచ్చుతాయి.
రామలక్ష్మి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆశిస్తూ
ఆశీస్సులతో, యద్దనపూడి సులోచనారాణి. ఛ/1|
రామలక్ష్మి సంఘమిత్రే కాదు, రచయిత్రి కూడా
తమ కోసం మాత్రమే జీవించే వారికన్నా ఇతరులకు కూడా సాయపడుతూ జీవించే వారు ధన్యులు అన్న వివేకానందుని సూక్తికి దర్పణం శ్రీమతి రామలక్ష్మి. సంస్కార వంతులు, సేవాభావంగల ఉన్నత కుటుంబంలో జన్మించి పెద్దల యొక్క హితవచనాలను అవపోసనపట్లి, ఆచరణాత్మకమైన సేవాకార్యక్రమాలను సునిశితంగా గమనించడం వల్ల చిన్న వయసులోనే ఆమె ఎంచుకొన్న సంఘసేవకు పట్టుకొమ్మలయ్యాయి.
అసోషియేన్ ఫర్ ది కేరాఫ్ ది ఏజ్డ్ సంస్థలో మహిళావిభాగ్ కార్యదర్శిగా వృద్దా ఛ్రమాలను సందర్శిస్తూ వారికి సేవలందిస్తూ ఆశయవారధి సంస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, &౯౦4 సంస్థలో ట్రప్టీగా వున్నా వాటితో సంతృప్తి చెందక బాలలకు, స్త్రీలకు కూడా సేవలందించాలన్న తలంపుతో పరాశరి సేవాసంస్థను స్థాపించి వృద్ధవుల్లాసం, బాలవికాసం, స్రీ అభ్యుదయం, సమాచార సేవా సహకార కార్యక్రమాలను రూపొందించి బీద వృద్ధులకు నెలసరి పెన్నన్లు, బీదవిద్యార్థులకు స్కూలు ఫీజులు, పుస్తకాలు, అభాగ్య స్రీలకు ఉపాధి పథకంగా కుట్టుమిషన్లు, క్యాటరింగ్ సామాన్లు మొదలగునవి సమకూర్చి తన సేవా కార్యక్రమాలను విసృతపరిచారు. డాక్టరయి వుండి కూడా డిప్రషన్‌కి లోనయిన ఓ స్తీ ఆత్మహత్యా ప్రయత్నానికి పొల్చడినప్పుడు స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించి ప్రాణాన్ని నిలబెట్టటం సమాజంపట్ల ఆమెకున్న బాధ్యతకు నిదర్శనం. మారుమూలల్లో పలకరించే వ్యక్తులు కరువై ఒంటరి జీవితం గడిపే వృద్దులకు ఫోను ద్వారా అభిమానంతో ఆదరంగా మాట్లాడి వారి మనసుకు వుల్లాసం కలిగించడం ప్రతినిత్యమూ సంస్థ పరంగా వీరు నిర్వహించే కార్యక్రమం అభినందనీయము, హర్షణీయము. అనాధ ప్రేత సంస్కారాలు చేయించటం ఈ సంస్థ యొక్క బెదార్యం.
ఆచరణ నుండి వచ్చేది అనుభవం.. అనుభవం నుండి వెలువడేది యదార్థం. చాలామంది రచయితలు తమ ఊహాగానాలతో వర్ణ్దనా చమత్కలతో రచనలు చేస్తుం టారు. కాని ఈ రచయిత్రి తన దైనందిన జీవితంలో గత 20 సంవత్సరాలుగా తను నిర్వహించిన సేవాకార్యక్రమాలతో కొందరు ఎదుర్శొనే సమస్యలకు ్రత్వక్ష సాక్షిగా అనుభూతి పొంది వారి మాటలలోనే పొందుపరచిన యదార్థగాధల సమాహారమే ఈ పుస్తక రూపం. ఇందులోని ప్రతి శీర్షిక ఏదో ఒక స్ఫూర్తిని, నీతిని స్పురింపజేస్తుంది. వయసు చిన్నదైనా పెద్దమనసుతో వడిలే వృద్ధులకు చేరువై వారి ముడతలలోని అనుభ వాల చరితలు “ముడతముడతకో చరిత్ర” శీర్షిక క్రింద వెలువరించిన గాధలు యువత సందేశాత్మకం, కనువిప్పు కాగలదనుటలో సందేహం లేదు. ఆమె రచించిన నాటికలను పరాశరి సేవాసంస్థ మహిళలతో కలసి రవీంద్ర భారతిలోను, ఇతర ముఖ్యప్రదేశాలలో, పలువృద్దాశ్రమాలలోను ప్రదర్శించి ప్రశంసలను, బహుమతులను అందుకొని రామలక్ష్మి సంఘమిత్రే కాదు, రచయిత్రి కూడా అని అభినందించబడింది.
ీ.
నా మనవి క్షయము లేనిది అక్షరం, భాషకి ఆయువు అక్షరం హృదయాంతరాలలో జ్వలించె భావాలు ప్రతిరూపం అక్షరం. నా మనోఫలకంపై నిలచిన సంఘటనలకు రూపకల్పనే ఈ “అక్షర శిల్పాలు”.
ఈ పుస్తకంలోని అంశాలు, గడచిన ఇరవై సంవత్సరాలలో నేను రాసినవి. ఇందులోని కొన్ని అంశాలు ఆవలితీరం, గెలుపు, మహాంధ్ర, విశ్వసాహితీ, వార్ధక్యనసారథి మొదలగు మాస పత్రికలలోను మరియు అనేక సావనీర్లలోను ప్రచురించబడినవి.
వీటిలోని నాటికలు, త్యాగరాయ గానసభ, సిటీసెంట్రల్ లైబ్రరీ, మాలతీ జట్కార్భవన్, ఆంధ్ర మహిళాసభ, ఆంధ్ర బాలానంద సంఘం, రవీంద్రభారతి, అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెలఫేర్ అసోసియషన్, శివరాంపల్లి వివేకానంద వానప్రస్థ ఆశ్రమం మరియు పలు వృద్ధాశ్రమాలలో ప్రదర్శింపబడినవి.
“ఓ ఉపాధ్యాయుని ఎన్నికి బాలల నాటకోత్సవాలలో రెండు సార్లు ద్వితీయ బహుమతి పొందినది. నైజీరియాలో ప్రదర్శింపబడినది. “తరాల అంతరాలు”, “పరిష్కారాల పరిమళ” అనే నాటికలు పలుచోట్ల పలు ప్రదర్శనలు ఇచ్చి పదుగురి ప్రశంసలు పొందాయి. “ఆపాత మధురం” చూసి మా పాత రోజులు గురొచ్చాయి అని ఎందరో పెద్దలు సంతోషంగా చెప్పారు.
మరికొన్ని నాటికలు కథానికలు ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయినవి. “ఆచరణ” అను కథానిక పలువురు శోతల ప్రసంశలు పొందింది. గెలుపు మాసపత్రికలో ప్రచురింపబడిన “జగత్ రక్షాకరి జగన్నాత” అనే వ్యాసానికి శ్రీ తురగా సోమసుందరం గారు మరియు కొందరు పెద్దల నుంచి ఆశీస్సులు లభించాయి. “మనమంతా ఒక్కటే” అనే పాటకు విశ్వ సాహితీ నిర్వహించిన పాటల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. “కాల గమనం” అనే వచన కవితకు అనెక వృద్దాశ్రమాల నుంచి “మా వ్యధే నీ కాల గమనం అమ్మా” అని ఫోన్లు వచ్చాయి. ఆవలితీరంలో ప్రచురించిన “త్యాగధనులు” అనే చిన్న కథకి ఎంతో ఆదరణ లభించింది. వరంగల్, ఖమ్మం నుండి నాకు అటర్స్ వచ్చాయి. “వేము మా అంతిమ సంస్కారానికి రెండు వేలు దాచుకుం టున్నాం” అంటూ లెటర్స్ వచ్చాయి. ఈ సంఘటన నా మనస్సుని కుదిపేసింది. “నీ కథ చదివాం. మేము ఐ డోనేషన్ ఇస్తాం” అంటూ శివరాంపల్లి ఆ(శ్రమవాసు లయిన శ్రీమతులు లక్ష్మీనరసమ్మ, శాంతమ్మ, సుందరమ్మ మొదలగు వారు ఫోన్లు చేశారు. నేను వ్రాసిన ఈ చిన్న కథ ఎందరినో ఉద్వేగం చేయటం రచయిత్రిగా నాకెంతో సంతోషాన్నిచ్చింది.
ఈ పుస్తకం రాయటానికి నన్ను ఎందరో ప్రోత్సహించారు. కానీ ముగ్గురు మహనీయుల మాటలు నన్ను ప్రభావితం చేశాయి. చతుర నవలకి సమీక్ష రాస్తే ప్రథమ బహుమతి వచ్చింది. ఆ విషయం శివరామపల్లి ఆశ్రమవాసి అయిన
కీయ
శ్రీ నూకల లక్ష్మీనారాయణ గారికి చెప్పాను. ఆయన మంచి విమర్శకుడు. “భోజనం పెట్టే శక్తుండి ఒట్టి టీ ఇచ్చి పంపేస్తున్నావు. పుస్తకం రాసే సత్తా ఉండి సమీక్షలతో సరిపెట్టేస్తున్నావు” అన్నారు. ఆయన మాటలు ఆయన మాటలు ఈ రచనల సంకలనాన్ని అచ్చువేయించు అనే ఆశాబీజాన్ని నాటాయి. ప్రముఖ విద్యావేత్త త్రివేణి సంపాదకులు అయిన శ్రీ ఐ.వి.చలపతిరావు గారు “నువ్వు రాసినవి చదువుతున్నాను. బాగున్నాయి. పుస్తకం వేయించు” అన్నారు. వారి మాటలు నాలో ఆశను చిగురింపజేశాయి. ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి, నేను ఈ మధ్య కలిసి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను రాసినవి చదివి “నీకు ఓ పుస్తకం ఉండాలి” అని ప్రోత్సహించారు. ప్రోత్సహించటం తోటే ఊరుకోకుండా “నీ పుస్తకం ఎంతవరకు వచ్చింది? తొందరగా వేయించు” అని తరచూ ఫోనుల ద్వారా హెచ్చరించి వ్రోత్సహించారు.
మా మామగారు కీ॥శే॥ మోచర్ల వెంకట సత్యానందం గారి స్నేహితులు, పితృసమానులు, సంఘసేవా తత్పరులు, గౌరవ నీయులు, ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకపోయినా ఎంతో అభిమానంతో “పరిమళ ప్రశస్తి” రాసిచ్చిన శ్రీ ఐ. వి.చలపతిరావు గారికి మరియు ప్రియసఖి, సంఘసేవా తత్పరణి, నా పుస్తకం గురించి తమ అధీప్రాయాన్ని తలియబరచిన నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు, నవలా సామ్రాజ్యాన్ని ఏలిన రాణి శ్రీమతి సులోచనారాణి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖచిత్రాన్ని అందంగా రూపొందించిన మా మరిదిగారు శ్రీ ఎబ్్. ఎల్, కాంతారావు, పుస్తక ముద్రణకి సహకరించిన నా సోదరుడు చిరంజీవి వి.బాపిరాజు, సలహా సహకారంతో పాటు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించిన మా పిల్లలు వేణి, వంశీ, విక్రమ్, కోడలు మేఘలకు నా ఆశీస్సులు.
డి.టి.పి చేసిన శ్రీ ఎన్. రఘురామయ్య గారికి, పుస్తకాన్ని ముద్రించిన క్రియే టీవ్ ప్రింటర్స్కి నా ధన్యవాదాలు. అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహించిన శ్రీ కె. భాస్మరరావు, శ్రీ వై.వి.రత్నంగార్లకు నా నమశ్ళులు. ఈ పుస్తకంలోని నాటిక లను పలు చోట్ల ప్రదర్శించిన సోదరీమణులు, మహిళా విభాగ్, శారదా మహిళా మండలి, ల్రీ పరాశరి సేవాసంస్థ సభ్యురాళ్ళకు, చిరంజీవులు రెమిడియల్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు, ఈటీవి ఆగర్టిస్తులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని విధాలా సలహా, సహాయ సహకారాలందించిన మా శ్రీవారు శ్రీ ఎమ్. ఎస్.రావు గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞాభివందనాలు. పుస్తక స్వీకారానికి అంగీకరించి, (శ్రమకోర్పి నరసాపురం నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మ శ్రీమతి వెంకటలక్ష్మి, నాన్నగారు శ్రీ వల్లూరి శివప్రసాద్ గార్లకు నా నమస్సులు.
ఇదే నా ప్రథమ కృతి. భాషలో, భావంలో, అచ్చులో తప్పులుంటే పెద్ద మనసుతో మన్నిన్తారని ఆశిస్తున్నాను.
= యోచర్ల రామలక్ష్మి య
ఇందులో
- అక్షరార్చన క్షే
- అమ్మ
- నాన్న *ం గురువ రి పెద్దలు 2, అక్షర మాలికలు 2 శ = మహాసరస్వతి నమామి = ఇలవేల్పులకు అక్షర హారతి = మహనీయులకు అక్షరాభిషేకం
- థ్రీ పరాశరి సేవా సంస్థకి నామాక్షరమాల 8, గీతాత్రయం 5-8 = అక్షర రూపిణి ఆదుకోవమ్మా
- సెందిది ,... సెందిరి
- మనమంతా ఒక్కట 4 కథా సప్తకం 9-50
- అమ్మ మనసు అచరణ
- ఇంటర్వ్యూ
- నిర్ణయం
- నాకోసం = (ఘమికుడు కః స్నేహరత్న
- వ్యాస విపంచి 51 -64
- శ్రీరాముని చరిత మానవునికి నడత = గీతామృతం 6 వృద్ధాలయాలు కళ.
= మార్పు
= చొరవలేనిదే తెరువు లేదు
- జగత్ రక్షాకరి జగన్మాత
- వచన కవితా సంహిత 65-౯4
- తెలుగుతల్లి
= తల్లిభారతి
= మోక్షమొసగు జీవేశ్వరా .
- లేమా మనం [గ్రహించలేమా
= అనాదిగ ఉగాది ప్రభోదం
- కాలగమనం
6 కొమ్మా ఆ తెలుసుకోమ్మా
= విశ్వశాంతికి నీ వంతు
= నేను - నువ్వు
- మమతల మల్లి
= (ప్రతీకలు 7. నాటికా వాటిక 75-126.
- వందేమాతరం
= సంసారంలో సరిగమలు
- పరిష్కారాల పరిమళ
- తరాల అంతరాలు
= జ్ఞానోదయం
- కనువిప్పు
= ఆపాత మధురం
త ఓ ఉపాధ్యాయుని ఎన్నిక
- జీవన పథకం
- ముడత ముడతకో చరిత $27-145
- లోకాభిరామాయణం 146-149
- నా భావన 150-151
- సంఘహితులు 152-160
త! &
-
అకరారన వ. జ్ర అమ్మ నాన్న తన జీవం, తన రక్తం నీకొసగే భాగ్యదాత నీ జన్మకు కారకుడు నీ దేహపోషకుడు రూపమిచ్చి, ఆయువిచ్చు (పప్రణవరూప నేడు నీ ఈ హోదాకు నాడే వేసినాడు పునాది ఓరిమితో తాలిమితో తీర్చిదిద్దు ఘనదీక్ష నీ అవసరాల పథకాలను హృదయ ఫలకంపై శోభిల్లే భవిత నీది కావాలని ఆంకాక్ష. విషయ సూచికగా వ్రాసుకున్న విశాల హృదయడు జోలపాటలందు తారాజావిలుల దించి విద్వయు వినయము నీ చెంత కొలువుండ నీతికథల సుద్దులతో బుద్ద్ధులెన్నో నీకు నేర్పి, | నిదురయందైన నీ కీర్తిశిఖరాలనే గాంచు లాలలోనే లాలనలు పాలనలు (ప్రోదిచేసి నీ వృత్తి నీకొసగు సుఖశాంతులను చూసి నీ జీవనగమనానికి బాటయ్యే ఆదిగురువు. మదికడలి యందెపుడు సుధలనే చవిచూచు. అమ్మలగన్న యమ్మ దుర్గమ్మకి సర్వజీవుల తం(డి సదాశివునికి అమ్మ మనసున్న అమ్మలందరకు మా తండ్రి శ్రీ శివప్రసాద్‌కు మాయమ్మ వెంకట లక్షృమ్మకు బాధ్యతెరిగెన తండ్రులందరికీ నిశ్చలభక్తితో అక్షరమాలిక అక్షితమైన అక్షర పుష్పాలు గురువు ధరణిపై వెలుగొంద ధర్మశాస్తముల గజపి వినయసంపదగూడు విషయజ్ఞానము నొసగి పరమార్ధసహితమగు పాండిత్యమును పెంచి తన విద్యల సారమెల్ల ధారవోయు దానశీలి. ఆలనలో అమ్మగా పాలనలో తండ్రిగా వేదనలో చెలిమిగా శోధనలో బలిమిగా అంతరంగ హితునిగా ఆదరించు సఖునిగా కష్టాలను నిలువరించు థైర్యమిచ్చు ధీశాలి. నొసట విభూతి నడుమ కుంకుమబొట్టు మెరయు ముక్కంటి ఫాలనేత్రము రీతి రెండుకన్నుల నీకు లోకాలు చూపేట్టు పరమేశు మరపించు ఆచార్యునికి అక్షరాభిషేకం పెద్దలు పూజ్యులు, అనుభవజ్ఞులు, సంఘాధ్యయనం చేసే విజ్ఞులు, సహస్ర చంద్రదర్శనం చేసిన సర్వజ్ఞులు, ధరణిపై నదయాడు దైవజ్ఞులు యువతకు సందేశమిచ్చే ప్రాజ్జులు, సమాజాభివృద్ధికి కృషిసల్చే సమర్జులు పెద్దమనసున్న పెద్దలందరకు గౌరవపూర్వక అక్షర హారతి ద్ యా మోచర్ల రామలక్ష్మి న 1
-
అక్షర మాలికలు మహాసరస్వతి నమామి హాసిత వదనె పుస్తక హస్తై సకల శాస్త్ర కోవిద శారదె రమ్య రమణీయ కావ్యాలంకృతె స్వరరాగ సుధా మధుర గాత్ర తియ్యని పదముతో నాలికపై నర్తించె వాగ్దేవి సురపూజితె మామొర వినే భాసర వాసిని మిన్కు నిచ్చి బ్రోవుమా సౌదామిని, ఇలవేల్పులకు అక్షర హారతి అమ్మల గన్న అమ్మ మన దుర్గమ్మ ఆర్హుల నాదుకొనె ఇలవేల్పమ్మ ఇంద్రకీలాద్రి నుండె చూడరారమ్మ ఈజ్ఞాన సరస్వతి, లక్ష్మి కాళిల ఉజ్వల రూపిజై భాసరన వెలిసె. ఊర్మిపై శ్రీనివాసుడే కుబేరుని బుణము తీర్చ భక్తుల పెన్నిధిగా వచ్చె. ఎవ్వరో భక్తితో వేడితిరో ఏమో ఏడుకొండలు దిగి వారికై వచ్చి ఐశ్వర్య విభుడు చిలుకూరునుండే ఒప్పుగ శివుడు స్వయంభుగ వచ్చె ఓహోయని రాముడే ప్రతిష్టించిన
కానా
బెరా భక్తుని పేర కీసరగుట్ట
అందరు ముందుగా (మొైొక్కడి దేవుడు
ఆః కాణిపాకం నుండే వినాయకుదై
కమనీయుడు లక్ష్మీ నరసింహుడు
ఖలుని చీల్చి యాదగిరిపై నిల్బ
గంధ లేపనంతో సింహాద్రి అప్పన్న
ఘనతకెక్కి భక్తుల (బోచుచుండె
చల్లని దైవమా శ్రీశైల మల్లన్న
చక్కటి భ్రమరాంబను చూడనిమ్ము.
జగమేలే నారాయణ, సత్యరూప
అన్నవరమున వెల్సినావా
క్రీరపుర నివాస శ్రీ క్షీరా రామలింగేశ్వర
కాపాడి మము(బోవు కారుణ్యమూర్తి
దీనరక్షకుడా ఆరాధ్య దైవమా
భద్రాద్రిని సీతా సౌమిత్రితో కొలువుంటివా.
ఇలకేతెంచిన దేవదేవుళ్ళకు
భక్తి పూరిత అక్షర నీరాజనం
మహనీయులకు అక్షరాభిషేకం
అభాగినుల నుద్ధరించి, మహిళాసభ స్తాపించిన, నారీమణి దుర్గాభాయి ఆదర్శనీయుడు దేశభక్తి గల ధీరుడు, మనం సెహభాష్ అనే సుభాష్ ఇమ్ము రాజ్యమని శాంతి సత్యాగ్రహంతో, తెల్లవాళ్ల నడలించి. సాధించె బాపు ఈ దేశ రాజ్యాంగ చట్టము, రూపొందించిన సమతావాది, వి.ఆర్. అంబేద్నర్ ఉన్నత విద్యా వేత్త, అనాధలకు వీడ నిచ్చిన. కల్పతరువు రఘుపతి ఉఊపిరాదిలి, ఆం(ధ్ర రాష్ట్రమునె సాధించిన త్యాగి. గణనీయుదు శ్రీరాములు బుజుప్రవర్తన గల అజాతశత్రువే, ప్రధమ అధ్యక్షుడైన రాజేంద్రుడు ఎదతూటాకి చూపె వీరకిశోరం, ప్రజ బాగుకోరి ముఖ్యమంత్రయ్యె (ప్రకాశం ఏఫలాపేక్ష లేని తాత్విక వేత్త ఆశ్రమాలు స్తాపించిన అరవింద ఘోష్
ఐదు ప్రాణాలు దీన హీనులే అని, అంకితమై సేవించె కరుణామయి థెరిసా ఒక దురాచారమైన బాల్య వివాహము, రూపుమాపిన ఘనుడు గురజాడ ఓహో రామ్ మోహన్, సతీ సిస్టం తెచ్చి, స్రీల నెల్ల రక్షించిన సంఘ సంస్కర్త బెరా కందుకూరి వైతాళికుడు, వితంతు వివాహము జరిపిన సంఘ మిత్రుడు అందరాలపించె మధుర జాతీయ గీతం, అందించిన విశ్వకవి రవీండద్రుడే ఆః ఆర్ధర్ కాటన్, గోదావరిపై బ్యారేజి కట్టి, ఆ ప్రాంతమును సుభిక్షం చేసే కవి కోకిలైన కొమ్మ, (ప్రజ్ఞా శాలమ్మ రాష్ట్ర అధికారిణయ్యె సరోజినమ్మ ఖద్గము కన్న పదునైన కలంవాడి, సమాజాన్ని మేల్మొలిపే గుజ్జం జాషువా గరిష్ట వేదాంతి, గురుతుల్యుడు దేశాన్ని పాలించిన, ఉన్నతుడు రాధాకృష్ణ ఘనుడు గౌతముడు, అహింసావాది, సంఘం, శరణం గచ్చామనే మేటి ప్రవక్త చరితార్చుడు వివేకుడు, యువశక్తి దేశప్రగతికి ముఖ్యమన్న మేధావి జన ప్రియుడు, బాలల చాచా, శాంతి దూత, పంచశీల ్రదాతే, పండిత నెహ్రూ టక్కు లేని సేవాపరులే, ఆ గోఖలే, పటేల్, భగత్, లాల్బాల్పాల్లు. దచ్చీలు లేని సేవాపరులు, భారతమాత ముద్దు బిడ్డల్మి అక్షరాభిషేకం. శ్రీ పరాశరి సేవా సంస్థకి నామాక్షర మాల శ్రీల ఓజస్సుయె సత్తుగ పరోపకారమె. చిత్తముగ రాగతత్వమె సగుణము కాగ శమముతో అబలల నాదరించి రిక్కగా సేవానుభవమున వెల్లుచు సేవాపరుల సహకార మెంతయో కల్లి వాదోడై వృద్ధులకు, చేదోడై విద్యార్థులకు సంఘటిత శక్తితో, సమాచార మందించుటయే సండిలమని దీకబూనిన సభ్వులున్నట్లి సంస్ల 1 పరాశరి సేవాసంస్థ, శభలున్నాల్ట ౦
4 *లక్షు బ్బా
- గీతాత్రయం అక్షర రూపిణి ఆదుకోవమ్మా ఓంకార రూపిణి రావమ్మ మా ఎద గుడిలో వుండమ్మ మా మది ఆసనం చెకొమ్మ మానస పూజని గైకొమ్మ || ఓ౦|| చైతన్యరూపి, జదత్వాన్ని బాపి (క్రియా శక్తి కర్తవ్యాన్ని తెలిపి పశ్యంతి మా తిమరాన్ని తరిమి మణిదిపమై మాలో వెలుగమ్మ 11ఓ0|| ఈర్మ్యద్వేష అవేశాలన్నీ హరియించు మా నయనాల సజలాలు కురిపించు ఆర్ధ్య పాద్య పంచామృత ఆచమనీయ అభిషేక జలాలుగ స్వీకరించమ్మా 11 ఓ౦॥| పరోపకారమే వస్త్ర ఉపవీతం సమతే సుగంధం, మమతే కుసుమం ధర్మమే ధూపం, మా డ్రేమే నీరాజనం నిశ్చల భక్తే నైవేద్యమంటివమ్మ 11 ఓ0॥| కాంతిర్నందిని కరుణించమ్మ సువాసినిగా నీ దరిచేర్చమ్మ అక్షరరూపి రామలక్షిని పరాశక్తినె ఆదుకోవమ్మ 11ఓ0॥| -ఆణళమ్తవైాఖ హడాపాంం మోచర్ల రామలక్ష్మి శ
సెందిరి సెందిరీ సెందిరి సెందిరీ ఎళ్ళొత్తా సెందిరి మళ్ళొత్త సెందిరి నే పొరుగుదేశం, పోతానే సెందిరి సొమ్ము బాగా, తెత్తానే సెందిరి సొమ్ము బాగా, తెత్తానే సెందిరి మరి నగలెన్నో సేయిత్తా నా సేతోనే నిన్ను సింగారిత్తా నీ అందాలు సూసి నే సిందులేస్తా | సెందిరి॥ పోబోకు మావా నన్నీడి, పోబోకుమా నిన్ను సూడకుంటె మనసులోన మంటవుద్దీ కంటిమీద కునుకేమో కరువౌవుద్ది ఒంటరి (బ్రతుకేమో బరువౌవుద్ది 1 పోబోకు!! మరి అట్టాగంటే ఎట్టాగే 'సెందిరి గొప్పోళ్ళవ్వాలంటే తిప్పలు పడాల సీ కోసం నేను కొబ్బరితోవు కొనాలా మరి కోనేరు కాడ కోట కట్టాల 1 మరి॥। 6 * అక్షర శిల్పాలు
ఒద్దు మావా!
అయేయీ ఒద్దుమావా
ఆటికంటె నీ మీదే
నాకు మక్కువ మావా
కొబ్బరి నీరంటి నీ
మనసు నాదైతే సాలు
కోనెరు కాద
కోటెందుకు?
నీ గుండెల్లో నాకింత
సోటుంటె సాలు వద్దు!
నువ్వట్టంటే
నేనెట్టాగు పోగలనే
సెందిరి, నా సెందిరి
నువ్వెట్టంటే
అట్టాగే సెందిరి 11నువ్వ।
కోవెలకాడ కొట్టు ఎట్టుకుందాం
ఆలుమొగల మిద్దరం
కట్టపదదాం
హాయిగా కదుపు
కింత కూడు తిందాము 11 ఆ||
మాపుటేల బావికాడ కూకుందాం
నింగిలోన సెందురున్ని
ఆ పక్క నున్న సుక్కల్నీ
సూసుకుంటూ
ఊసులాడుకుందాం
మన గుడిసెనే
సొరగంగ సేసుకుందాం [1 మమః॥। మోచర్ల రామలక్ష్యి శ 7
మనమంతా ఒక్కటె
మనమంతా ఒక్కటే
మన మతం మానవతె
మన అభిమతం జనహితమె
అకలొక్కటె దాహమొక్కటె
పీల్చే గాలికి త్రాగే నీటికి
భేదం లెదులే పుడమి తల్లికి
ప్రకృతి కాంతకు
మనమంతా ఒకటేలే || మన॥।
నేత్రదానం, రక్తదానం
చేసే సోదరులారా
మీలో వున్నది మానవత్వమేగా
అదీ దైవత్వమేగా (మన॥
చేయి చేయి కలుపుదాం
స్నేహంగా మెలుగుదాం
సంఘ విద్రోహులను
తరిమి కొడదాం
ప్రాధమిక హక్కులతో
(ప్రాధమిక విధులతో
'ప్రజాన్వామ్యం సాగిద్దాం 1; మన॥।
ఒడిలో బడిలో
దేవుడి గుడిలో
మతము పేరిట
ఆరాచకాలను
సృష్టించవద్దు | మనః।।
- అడవ అడడప్రాం- 8 * అక్షర శిల్పాలు
- కథా సప్తకం అమ్మ మనసు “డాడి నేను చెన్నై వెడుతున్నా” అంది సుప్రియ.
పేపరు చదువుతునే “ఎప్పుడు” అన్నాడు భగవాన్ను.
“దేనికి” అంటూ గర్జించినట్టె అడిగింది భగవతి.
“చూడు డాడీ మీకు నేను ఒక్కగా నొక్క కూతుర్ని నన్ను ఎంత ముద్దుగా చూడాలి. అవునా” అంది ప్రియ.
“జను” అన్నట్టు తలఊవాడు భగవాన్న్సు.
“మీ ఆవిద మాత్రం నా మీద అయిన దానికి కానిదానికి అరుస్తుంది” అని తండ్రి భుజాలు మీద చేతులు వెసి గారాలు పోయింది సుప్రియ.
“నేను అరుస్తున్నాను అంటున్నావు, నువ్వు చేసే పన్లు" అంది భగవతి.
నేనేం చేస్తున్నాను? అంది ప్రియ.
“మొన్న (ఫైండ్ పుట్టినరోజు పార్టీ, నిన్న ఎవరిదో ఎంగేజ్మెంటు, ఈ వేళ మరో గ్రైంద్తో షాపింగ్, రేపు ఏం చెపుతావో” అంది భగవతి. రోజూ రాత్రి పది దాటాక వస్తున్న కూతురిని చూసి.
నేను అబద్దాలు చెపుతున్నాననా నీ ఉద్దేశం అంటూ తల్లిని సూటిగా అడిగింది సుప్రియ.
అలా అని ఎందుకనుకుంటున్నావ్. నీ మీద నాకు నమ్మకం ఉంది. రోజులే బాగాలేదు. ఆ భయంతో నువ్వు ఇంటికి వచ్చే వరకు నాకు గాబరాగానే ఉంటుంది అంది భగవతి.
“అబ్బా నీ ధోరణి ఆపు” అంటూ భార్యకేసి చూశాడు. ఆ తరువాత కూతురు కేసి తిరిగి నువ్వు చెప్పరా” అన్నాడు భగవాన్ను.
“దాడీ నీకు మొన్నే చెప్పాగా, ఈ వీక్‌లో వీసాకి వెళ్ళాలని” అంది సుప్రియ.
“వీసా దేనికి” అంటూ కూతురి కేసి అయోమయంగా చూసింది భగవతి.
“ఏమిటమ్మా మరీ అసహ్యంగా వీసా ఎందుకో తెలియదు? బాగా చదువుకో యమ్. ఎస్., చేద్దువుగాని, అమెరికా పంపుతానని దాదీ నాకు ఎప్పుడో చెవ్పారు” అంది ప్రియ.
కూతురి మాటకి తెల్లబోయి, చిన్న బుచ్చుకొని భర్తకేసి చూసింది భగవతి.
ఆమె చూపుకి అర్ధం, తండ్రీ కూతుళ్ళు కూడబలుక్కున్నారు. నాతో ఒక్కముక్క చెప్పలేదే అని గ్రహించాడు భగవాన్ను.
“భార్యకేసి అనునయంగా చూస్తూ, ప్రియ చదువుకి అమెరికా వెడుతోంది అంటే గర్వపదాలి, దిగులు పడకూడదు” అన్నాడు భగవాన్న్సు,
“అది ఎక్కడికి వెళ్ళినా, ఏం చదివినా నేనేం దిగులు పడను. కాని నాకో కోరిక ఉంది, ప్రియా అది నువ్వే తీర్పాలొ అంది భగవతి.
“మైడియర్ మమ్మీ నువ్వు అలా అడిగితే నాకు ఎంత ముద్దు వచ్చేస్తున్నావో తెలుసా? విన్నవించుకో నీకోరిక తీర్చే వెడతా” అంది సుప్రియ.
పై చదువులంటూ ఆడపిల్లలు విదేశాలు వెడుతున్నారు, అక్కడ రకరకాల (ధ్రాబ్లమ్స్కి గురిఅవుతున్నారు.
కొందరు విద్య, ఉద్యోగాలలో ఉన్నతస్థానం పొందిన, జీవితపు మధురిమలు కోల్పోతున్నారు. మరికొందరు మన నాంప్రదాయ సంస్కృతులను మరచి మాన వత్వం విలువలను దిగజారుస్తున్నారు. ధనార్జన అనే ఆశ హృదయాన్ని కరుడుగట్టిన రాయిలా చేస్తోంధి. సంపాదన ముందు, సంసారం గుదిబండలా అనిపిస్తుంది. వయస్సు మళ్ళాక ఒంటరి బతుకు ఒంటెద్దు బండిలా సాగుతుంటే, (బ్రతుకు ఎంతో భారంగా ఉంటుంది. అంటూ ఊపిరి తీసుకోటానికి ఒక్క క్షణం ఆగింది భగవతి.
అమ్మా ,.. నీ కోరిక చెపుతానని ఎంతో బాధాకరమైన కథ చెప్పావు. ఇది ఐ వీక్తీలో చదివావు తల్లీ అంటూ నవ్వింది ప్రియ. కూతురితో పాటు భగవాన్లు నవ్వాడు.
మీ ఇద్దరు కలిసి నన్ను ఆటపట్టంచటం కాదు. నా మనసులో ఉన్న బెంగ తెలుసుకోండి అంది భగవతి.
మనసు తెలుసుకోవటం అవి ఎందుకు కాని, నీ మనసులో ఏం ఉందో చెప్పు అన్నాడు భగవాన్ను.,
“అది ఒంటరిగా అమెరికా వెళ్ళడం నా కిష్టం లేదు. పెళ్ళీ చేసి పంపించండి” అంది భగవతి.
లంక జాం
“తల్లీ! పెళ్ళాయ, ఫ్రీడం నాశనాయ” అంటారు. పతిదేవుడికి సేవలు చేస్తూ ఆ దేవుడి తరఫు అతిథి దేవుళ్ళకు నైవేద్యాలు సమకూరుస్తూ ఉంటే నా చదువు సంతకెళ్ళి పోతుంది. టూ ఇయర్స్‌లో చదువు పూర్తి చేస్తా. ఆ తరువాత ఇండియా వచ్చిస్తా, అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం షాపింగ్‌కి వెళ్ళి వస్తా బై” అంటూ ప్రియ వెళ్ళిపోయింది.
“చమాశారా దాని పెదసరం మాటలు. తల్లినన్న గౌరవం, భయం లేకుండా ఉంది” అంది భర్తతో భగవతి.
“భగ మీ మామయ్య కూతురు రీసెర్చి కెళ్ళి తిరిగి రాకపోవటం, నీ ఫ్రెండ్ కూతురు ఎవర్నో పెళ్ళి చేసుకోవటం, మా అన్నయ్య కూతురు అసలు పెళ్ళే చేసుకోను అనటం, ఇంకా ఇలాంటివి నీ (బైెయిన్ మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి. నీకు తెలిసిన ఆ నలుగురే కాదు ఈ ప్రపంచం అంటే. అమెరికా వెళ్ళీ మొండిగా తయారయ్యారు అనుకుంటున్నావ్, కాని ఇండియాలో ఉండి తల్లి తండ్రుల మాట వినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రులకు మనసులో మాట చెప్పేట్టుండాలి. తల్లిదం[డ్రులతో చనువుగా ఉండే పిల్లలు ఏ తప్పు చెయ్యరు. అతిగా ఆలోచించటం మాని, కాస్త నాకు కాఫీ ఇయ్యి” అన్నాడు భగవాన్న్లు.
“ప్రియ మద్రాసు వెడితేనే ఇల్లు చిన్నబోయింది. ఇంకా అది అమెరికా వెళ్ళాక మనకి సందదే ఉండదు” అంది భర్తకి అన్నం వడ్డిస్తూ భగవతి.
“నీ కూతురు అమెరికా వెళ్ళిపోతుందనుకుంటున్నావా? వీసా రావటం ఈజీ ఏం కాదు. మన ప్రియ కన్నా ఎక్కువ అర్హతలున్న వాళ్ళకే వీసాలు రావటం లేదు” అన్నాడు భగవాన్న్సు.
భర్త మాటలకి విస్తుపోయింది భగవతి. “మీరు నాకు అర్ధంకారు. దాన్ని పిసాకి వెళ్ళమ్మా తప్పక, వస్తుందని మద్రాసు పంవారుగా” అంది.
“అదేనే నీ మట్టి బుర్రకి తెలియనిది నాకు తెలిసినది. పిల్లలు ఏదో అయి పోతారని బెంగపెట్టుకుని మనం వాళ్ళ వికానానికి అద్దుపడకూడదు. వాళ్ళ సత్తా ఎంతో వాళ్ళు తెలుసుకునే చాన్సు ఇవ్వాలి" అన్నాడు భగవాన్ను.
“ఒక వేళ ప్రియకి వీసా వస్తే ఏం చెస్తారు” అంటూ భర్తని అమాయకంగా అదిగింది భగవతి.
భార్య మాట విని పకపక నవ్వుతూ, “సంతోషంగా అమెరికా పంపుతాను. అది యమ్.ఎస్ చేసి వచ్చాక మనకి తెల్సిన అందరికీ ఘనంగా పార్టీ ఇస్తాను” అన్నాడు భగవాన్సు.
మోచర్ల రామలక్షి శ 11
“ప్రియ అమెరికా వెళ్ళిపోయింది. ఫోన్లో తనకి అక్కడ చాలా బావుంది. ప్రతివాళ్ళు జీవితంలో ఒకసారైనా అమెరికా చూసి తీరాలి. మాకు దొరకనివంటూ ఏమీ లేవు. మిమ్మల్ని అమెరికా తీసుకెడతా” అంటూ రికార్డు చేసిన మెసేజ్‌లా రెండు సంవత్సరాల నుంచీ తల్లిదండ్రులకు అవే చెపుతోంది.
“స్నేహితురాలు పెళ్ళికని ప్రియ ఇండియా వచ్చింది. కూతురు వస్తుందని ఎదురుచూసిన తల్లితండ్రులకి ఆమె తమతో ఎక్కువసేపు గడపలేదనిపించింది. “ప్రియా నీ కిష్టమని సున్నండలు చేశాను తిను” అంది భగవతి.
“వద్దమ్మా నేను ఇటువంటివన్నీ తినటం మానేశాను అంది.
కూతురు మాటకు చిన్న బుచ్చుకున్నా పైకి నవ్వుతూ *నీ అలవాటుల్లో చాలా తేదా కనిపిస్తోంది. ఉత్తినే విసుక్కుంటున్నాన్. హోటల్ రూమ్‌లో బ్యాగుపడేసినట్టు నీ బ్యాగ్ మన ఇంట్లో పెట్టావు. ఎక్కడికి వెడతావో, ఎప్పుడు వెడతావో ఎప్పుడొస్తావో తెలియటం లేదు. ఏ వయస్సుకాముచ్చట అంటారు. రెండు రోజులు ఇంటిపట్టున ఉందు నీకు పెళ్ళిచూపులు ఎర్పాటు చేస్తాను” అంది భగవతి.
“తల్లి మాట విని తారాజువ్వలా లేచింది ప్రియ. అమ్మా పెళ్ళి అంటూ నన్ను చంపుకు తినకు. ఇలా మాట్లాడావంటే మళ్ళీ ఇండియా రాను” అంది.
“నను ఊహించిందే నిజం అయ్యింది. పెళ్ళీ పేరంటం లేకుండా ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలోనే ఉండిపోతావా? చదువు పూర్తి చేసుకు వచ్చేస్తానన్న నీ మాట గాలికి వదిలేశావు” అంది భగవతి.
“అన్ని విషయాలు నాన్నకి చెప్పాను. అద్దు తప్పుకో అంటూ బెడరూమ్ గుమ్మంలో ఉన్న తల్లిని పక్కకు తోసేసి హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది” ప్రియ.
ప్రియ రావటం వెళ్ళటం అయ్యింది. కూతురి గురించి భగవతికి బెంగ ఎక్కు వయ్యింది. “ఏమండీ నిద్ర పోతున్నారా" అంటూ మంచం మీద పడుకున్న భర్తని కుదిపింది.
“ఊ చెప్పు” అన్నాడు.
“అమె ఏమి అదగబోతోందో” అతను గ్రహించాడు.
“పియ మీకు వదో చెప్పాను అంది ఏమటది” అని అడిగింది.
భర్త నుంచి సమాధానం రాకపోవటంతో ఆమెకు చిరాకెత్తింది. దాంతో “నా నోరు లాగటమే కాని మూగిదెయ్యంలా నోరు విప్పరు” అంటూ భర్తకేసి చూసింది.
12 * అక్షర శిల్సాలు
“ఏదో ఒకటి సర్ది చెప్పకపోతే రాత్రి అంతా సతాయించి చంపుతుంది” అని మనసులోనే అనుకుని భగ ఇలారా, హయిగా కళ్ళు మూసుకు పడుకో. దాని గురించి బెంగపడకు. అన్నీ నేను చూసుకుంటాను” అని భార్యని సముదాయించాడు భగవాన్స్లు.
భగవతి భగవాన్లు బంధుమిత్రుల ఇళ్ళల్లో జరిగే ఏ శుభకార్యానికి వెళ్ళినా, “మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, మీరెప్పుడు పప్పన్నం పెడతారు. మీ అమ్మాయికి పెళ్ళి చేసే అలోచన ఉందా? మీ అమ్మాయికి తగ్గ సంబంధం మా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చెప్పనా? మీ అమ్మాయే చూసుకుందా? అయితే చేసిపడెయి” అంటూ పలకరింపుగా ఈ మాటలే మొదలు పెడుతున్నారు. వయస్సు ముదిరిపోతుంది మీ అమ్మాయి పెళ్ళి విషయం మర్చిపోకండి” అంటూ హెచ్చరించి వీడ్కోలుగా చెపు తున్నారు.
తు ఫంక్షన్‌కి వెళ్ళీ వచ్చినా ఆ రోజు భగవతికి నిద్ర ఉండదు. భగవాన్లుతో బేటి, అమెరికా పంపి పిల్లని మీరే దూరం చేశారని ఆమె. మన దగ్గరున్నప్పుడు నీ మూర్టత్వంతో నువ్వే దాన్ని సమంగా పెంచలేదని అతను ఆరు సంవత్సరాల నుంచి పోట్లాడుకుంటూ” గడిపేశారు.
కాలింగ్ బెల్ మోగింది. రాత్రి పదకొండు అవుతోంది. ఈ టైమ్‌లో ఎవరు వచ్చారో అనుకుంటూ దోర్ తెరచింది భగవతి. ఎదురుగా శారద. ఆమెను చూడ గానే ఆనందంతో “ఏమండీ మన శారద వచ్చింది” అంటూ సంతోషంగా కకవెసింది భగవతి.
ఆ కేక విని హాల్లోకొచ్చి “ఎన్నాళ్ళకొచ్చావే శారదా” అంటూ పినతల్లి కూతుర్ని కుశల ప్రశ్నలు అడిగాడు భగవాన్లు. “శారద భోజనానికి రా" అంది భగవతి.
“మా ఫ్రెండ్ కూతురి పెళ్ళి రాత్రి 8 గంటల ముహూర్తానికయ్యింది. అక్కడ భోజనం చేసి ఇలా వచ్చాను” అంది శారద.
“ఇంత రాత్రి ఒక్క దానివి” అన్నాడు భగవాన్సు.
“ఇక్కడే శంకర మఠంలో అయ్యింది. అయినా నన్ను ఒక్కదాన్ని పంపలెదు. నా [గ్రైండ్ మరిది కార్లో డ్రాప్ చేశాడు” అంది శారద.
తెల్లారాక కాఫీ తాగుతూ, కులాసాగా కబుర్లు చెపుతోంది అన్నా వదినలతో శారద. “ఒరేయి అన్నయ్యా మా అబ్బాయికి వడుగు చెస్తున్నాం” అంది శారద.
మోచర్ల రామలక్ష్మ్య * 13
“ఎప్పుడు చెప్పు. పీటల మీద బట్టలు నందిమోహం ఖర్చు మేమే ఇస్తాం” అంది భగవతి.
“శారదా ఓ పాతిక వేలు ఇస్తాను. మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండి. నా మేనల్లుడికి గోల్టు చెయిన్ కొను. ఏమన్నా డబ్బులు పడితే నేఇస్తా” అన్నాడు హుషా రుగా భగవాన్ను.
అన్నయ్యా, వదినా “మా సారథికి ప్రియ అంటే ప్రాణం. వాడు అమెరికాలో ఉద్యోగం మానేసి ఇక్కడ మా బిజినెస్ చూసుకోవాలని, మేం రమ్మంటే వచ్చాడు. వాడికి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం. సారథి ప్రియ ఈడూ జోడుగా ఉంటారు. బమంటారు” అని సూటిగా అడిగింది శారద.
“దేవత ప్రత్యక్షమై వరం ఇచ్చినట్టు ఉంది నాకు” అంది సంతోషంగా భగవతి.
“పియని కూదా ఒక మాట అదిగి చెపుతా” అన్నాడు భగవాన్సు.
“ప్రియ నీ మాట కాదనదు. అయినా దాన్ని అడగడం మంచిదే” అంది శారద.
“చూశావా శారద ఎంత చక్కగా చెప్పింది. అలా ఉందాలి” అన్నాడు భగవాన్సు,
శారదకి పసుపు కుంకంపెట్టీ సాగనంపింది భగవతి.
“ప్రియతో సారథి విషయం చెప్పారా” అంటూ రోజుకి పదిసార్లు అడుగుతోంది భర్తని భగవతి.
అతను ముభావంగా ఉండటం ఆమెకి విసుగనిపిస్తోంది. ఓ రోజు అతనే ఆమెతో, “రెండు సంవత్సరాల నుంచి నీకో విషయం చెప్పాలనుకుంటున్నా”' అన్నాదు.
“ఖ విషయం” అందామె.
“మన ప్రియ విషయం” అన్నాడతను,
“పియకేం అవలేదు కదా” అంది కంగారుగా ఆమె.
“నువ్వు ఇలా రియాక్ట్ అవుతావనే నేను చెప్పటానికి ...” అంటూ నాన్సాడు అతను.
“చెప్పండి” అంది ఉద్రేకంగా.
భగవతీ మన ప్రియ “వివేక్ అనే అబ్బాయిని ఇష్టపడుతోందట. అతను దాని కొలీగ్. ప్రియని బాగా ఇష్టపడ్డాడట” అన్నాడు భగవాన్ను.
కారా
“ఇన్నాళ్ళూ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు” అని ఏడుస్తూనే అడిగింది భగవతి.
“ఇదిగో ఇందుకే. నువ్వు ఏడుస్తావు” అని అన్నాడు.
“చెప్పకండి చేతకాని కబుర్లు. నేను దాన్ని నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని. జీవితంలో ముఖ్యమైన దాని పెళ్ళి విషయం నా దగ్గర దాచారా?”
“నీకా అవగాహన తక్కువ... ఎంత చెప్పినా అర్ధం చేసుకోవ. బేసిక్‌గా నీకు చదువు లేకపోవటమే దానికి కారణం” అన్నాడు భగవాన్సు.
“అహా ఎంత బాగా మాట్లాడుతున్నారు. వెనకటికి ఎవరో కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడకి గడ్డికోసం అన్నాట్ట” అలా ఉంది మీ మాట తీరు. మీ ఆఫీసు విషయాలు, మీ బ్యాంకు బేలన్స్ నాకక్కరలేదు.
“కూతురి విషయం తల్లి దగ్గర దాయనక్షర్లీదు. ప్లీజ్ చెప్పండి” అంటూ భర్తని బ్రతిమాలింది భగవతి.
“చెప్పటానికి ఏముంది. వయస్సులో ఉన్న పిల్లలకి ఏవో ఆకర్షణలు ఉంటాయి. ఏడాది, రెండెళ్ళు గడిస్తే అదికాస్త ఉష్ కాకి అన్నట్టు ఎగిరిపోతాయి. అప్పుడు పరి స్థితులు అవే చక్క బడతాయి” అన్నాడు.
“తిన్నంగా చెప్పంది, వంకరమాటలు అపి” అని భర్తమీద విసుక్కుంది భగవతి.
“వివేక్ని చేసుకోవద్దని నేను అన్నా అది వినదు. అందుకే 'ఉ' అన్నాను. వివెక్ తల్లిదండ్రులే ఈ విషయం చూసుకుంటారు. వాళ్ళ వైపు నుంచి వద్దని వస్తే అదె సర్దుకుపోతుంది” అన్నాడు భగవాన్సు.
“ఎంత పిచ్చి పని చేశారండీ. వాళ్ళు వద్దు అంటే సమస్య దూదిపింజల్లా ఎగిరి పోతుందనుకున్నారు. మీరు ఓ.కే చేసి దాని మనసులో అతని మీద డ్రుమ నాటు కునేట్టు చేశారు. ఇది మీ ఆఫీసు వ్యవహారం కాదు. ఆడపిల్ల జీవితం. టైమ్ తీసుకుని ఎదురుచూడటానికి” అని భర్తని సున్నితంగా మందలించింది.
రెండు రోజులు ఆలోచించి ప్రియకి ఫోన్ చేసింది. “ప్రియా వివేక్ తల్లిదండ్రు లను కలుస్తాం. వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే నీ పెళ్ళి చేస్తాం. లేనిపక్షంలో నువ్వ జాబ్ వదిలి ఇండియా వచ్చెయ్. ఇక్కడే ఓ మంచి జాబ్ చూసుకో. ఏ విషయం తొందరగా తేల్చి ఫోన్ చేసి చెప్పు” అని కూతురికి ఫోన్ చెసి చెప్పింది భగవతి.
వారం రోజుల్లో ప్రియ నుంచి ఫోన్ వచ్చింది. భగవాన్లు ఫోన్లో “నీ వెధవ
మోచర్ల రామలక్ష్మి * 15
సెలక్షన్ అలా ఏడిసింది” అంటూ రెచ్చిపోయి అరుస్తున్నాడు. వంట ఇంట్లో వంట చేసుకుంటున్న భగవతి, ఫోన్ ఉన్న రూమ్‌లోకి పరిగెత్తుకొచ్చింది. భర్త చేతిలోని రిసీవర్ లాక్కుంది. హలో ప్రియా చెప్పు నాన్న ఇదిగో విను చిన్నప్పుడు నీకు ఎంతో ఇష్టమైన బొమ్మ నాన్న చెయ్యి తగలి పగిలిపోయిందని ఎద్సావు. పోయిన దాని గురించి వదవకూడదు కొత్తది కొనుక్కొందాం అని నేను చెపితే విన్నావు గుర్తుందిగా. వివేక్ తల్లిదండ్రులు నిన్ను కోడలిగా వద్దంటే, మనం ఏం చేస్తాం. ప్రియా వాళ్ళని కూదా తప్పు పట్టకు. స్నేహానికి కలర్, క్యాస్ట్, కాసు, ఏజ్ అని ఉండదు. ఇద్దరి మనసులో అభిప్రాయాలు ఒకలా ఉంటే చాలు. అదే పెళ్ళి విషయానికి వస్తే, ఎవరో కొందరు తప్ప, చాలామంది ఆ అమ్మాయి తమకి అన్ని విధాలా సరి అయి నదా కాదో అని ఆలోచించుకుంటారు. ఇంట్లో శాశ్వతంగా ఓ మనిషికి చోటు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. చీర మీద జాకట్టు మ్యాచ్ అవ్వకపోతేనే ఒప్పుకోము. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించు. వివేక్ నీకో మంచి (ఫండ్ అనుకో. మనసుని కష్టపెట్టుకోకు. ఒకసారి ఇండియాకి రా. ఫోన్ చేస్తూ ఉండు అని ఫోన్ పెట్టేసింది భగవతి.
భార్యకేసి ఆశ్చర్యపోయి చూశాడు భగవాన్సు, “నువ్వు నువ్వేనా” అన్నాడు.
“నన్నే ఎందుకా సందేహం” అంది భగవతి.
“దాన్ని ఐం తిట్టిపోస్తావో” అని భయవద్డాను. ఎంతో లాలనగా మాట్లాడావు అన్నాడు భగవాన్న్సు.
నేను అమ్మనందడీ. నా మనసు మీకేం తెలుసు. అది వంటచేస్తూ చెయ్యి కాల్చుకుంటుందో, స్కూటర్ నడుపుతూ కాలు విరగొట్టుకుంటుందో అని హడిలి వోతాను.
నిజంగా అది చెయ్యి కాల్చుకున్నప్పుడు బర్నాలు రాసింది నేనేగా. స్కూటర్ యాక్సడెంటు అయి ప్రియ కాలు విరిగితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది ఎవరు? నేనేగా.
దాన్ని చిన్నతనంలో వంటికి మట్టి రాసుకోవద్దని తిట్టేదాన్ని మట్టి రాసు కున్నాక తిట్టలేదు. దెట్టాల్ పెట్టి కడిగాను అంది భగవతి.
అమ్మ మనసు పిల్లల సుఖసంతోషాల కోసం ఆరాటపడుతుంది. వాళ్ళ హోదా అంతస్తులు కోసం ఆలోచించదు. పిల్లలకి ఏం కష్టమొస్తుందో అని హడిలిపోతూ, కావాడుకుంటూ ఉంటుంది. పిల్లలకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ అక్కున చేర్చుకుని, ఆ కష్టాన్ని కడతేరుస్తుంది, అదే అమ్మ మనసు అనుకున్నాడు భగవాన్సు.
16 * అక్షర ళిల్వాలు
ఆచరణ జూన్ నెల అవటంతో ఎండలుతగ్గి, చిరువానలు మొదలయ్యాయి. వేసవి సెలవులు అయిపోయి స్కూళ్ళు తెరిచారు. తల్లులకి పిల్లల్ని స్కూలుకి పంపే హడావిడి మొద లయ్యింది.
“స్పీట్రీ వానలో తిరక్కు టిఫెను బాక్సులో కేక్ పెట్టాను తిను. నీ వాటర్ బాటిల్లో వాటరే తాగు, అవి బాయిల్ చేశాను" అంది మృదుల.
“అలాగే మమ్మీ” అంది స్వీటి.
“హోమ్ వర్క్ టీచర్‌కి చూపించు. మర్చిపోకే, రిక్షాలో జాగ్రత్తగా కూర్చో” అంటూ కూతురికి అనెక జాగ్రత్తలు చెప్పింది మృదుల.
అబ్బ మమ్మీ రోజూ ఇలాగే చెపుతుంది. అందరూ నవ్వుతారు అని మనసులో అనుకుంటూ చేయి ఊపి టాటా చెప్పి వెళ్ళి పోయింది స్వీటి.
కూతుర్ని పంపి వీధి తలుపు గడియవేసి, వంట ఇంట్లో పనులు చూసు కుంటోంది మృదుల.
ఇంతలో కాలింగ్ బెల్ వినిపించింది. ఈ టైమ్‌లో ఎవరొచ్చారబ్బా ... స్వీటి ఏ నోట్స్ అన్నా మర్చిపోయిందా అనుకుంటూ వచ్చి వీధి తెలుపు తెరిచింది మృదుల.
ఎదురుగా సుజాత ఏదాది బాబుని భుజాన వేసుకొని, ఆందోళన నిండిన మొహంతో ఆత్రుతగా మృదులా అంది.
“ఏమిటే అంత కంగారుగా ఉన్నావ్. ముందు కూర్చుని స్థిమితపడు, కాఫీ తెసాను తాగాక విషయం చెబుదువుగాని"” అంటూ వంట ఇంట్లోకి వెళ్ళబోయింది మృదుల.
“అగవే ... ఇప్పుడు కాఫీ ఏమీ వద్దు నాకు. ఏమిటో భయంగా ఉంది. రాత్రి నుంచి బాబుకి ఒకటే జ్వరం, తెల్లవారు జాము నుంచి వాంతులు కూడదా అవు తున్నాయి. ఒక గంట నుంచి వాడు స్పృహలో కూదా లేడు. ఏం చేయాలో తోచక నీ దగ్గరకి వచ్చేశాను” అంటూ బావురుమంది సుజాత.
“ఛ ... కళ్ళ సళ్ళు తుడుచుకో, పిల్లలకి ఏదో వస్తూ ఉంటాయి, తగ్గుతుంటాయి కంగారు పడితే ఎలాగే” అంటూ స్నేహితురాల్ని ఓదార్చి బాబు వంటి మీద చేయి వేసి చూసింది మృదుల. వళ్ళు చల్లగా తగులుతోంది. శరీరంలో ఉండవలసిన ఉష్ణోగ్రత ఉన్నట్టు లేదు అన్న ఆలోచన ఆమెకు కంగారుని కలిగించింది. పైకి మాత్రం గంభీరంగా పద సుజ ముందు హాస్పటల్‌కి వెడదాం” అంది.
“మృదులా నా దగ్గర రిక్షాక్కూడా డబ్బులు లేవు. అమ్మ వాళ్ళు అన్నయ్య పెళ్ళి
మోచర్ల రామలక్ష్మి * 17
చూపులకని ....” అని సుజాత మాటపూర్తి చేయకుండానే, “పద అవి అన్నీ తరువాత మాట్లాడుకుందాం” అంటూ బీరువాలోంచి డబ్బు తీసుకొని, హాస్పటల్‌కి తీసుకు వెళ్ళి జాయిన్ చేసింది మృదుల.
“నిన్న మీరు ఒక గంట ఆలశ్యంగా వచ్చి ఉంటే మీ భాబు మీకు దక్కేవాడు కాడు. చిన్న పిల్లలకి నలత చెస్తే వెంటనే డాక్టరుకి చూపించాలి, అదే తగ్గుతుందిలే అని అశ్రద్ధ చెస్తె ఇలాగే ఉంటుంది. ఇంక మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఎప్పుడూ ఇలా రిస్కు తీసుకోకండి” అంటూ నర్సు సుజాతను చిన్నగా మందలించింది.
“నర్సు మాటలకు సుజాత తల్లి మనసు విలవిలలాడింది. ఆమె చెప్పినట్టుగా బాబు ఏమన్నా అయితే ... ఆ తలపే ఆమె తనువుని వణికింపచేసింది. ఆమె స్థితిని గ్రహించిన మృదుల ఆమె భుజం మీద అనునయంగా చేయి వేసి, బాబుకి ఇంక భయం లేదు పద ఇంటికి వెడదాం” అంటూ తన ఇంటికి తీసుకొచ్చింది మృదుల.
నాయింత్రం 4 గంటల సమయంలో సుజాత కూతురు స్వాతిని తీసుకొని, కరుణ, బాలమ్మగారు మృదుల ఇంటికి వచ్చారు. “అమ్మా తమ్ముడికి ఆయి తగ్గిందా” అంటూ పరిగెత్తుకొచ్చి తల్లిని వాటేసుకుంది స్వాతి.
“తమ్ముడికి ఆయి తగ్గిందమ్మా, నిద్రవోతున్నాడు. నువ్వు వెళ్ళి స్వీటీతో ఆడుకో” అంటూ ఆవ్యాయంగా కూతురి తలనిమిరింది సుజాత. ఆ ఏడు కొండలవాడి దయవలన బాబుకి గండం తప్పిందటగా ఆ నర్సమ్మ చెప్పింది” అంది బాలమ్మ గారు.
“దేముని దయతో పాటు మీ అందరి దయ” అంటుంటే సుజాత గొంతు బొంగురు పోయింది. అప్పు కోసం, వీధిలో ప్రతిగుమ్మం ఎక్కిదిగాను. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమ ఉన్నవాళ్ళని అప్పు అడిగాను అంటే, అవసరం అభిమానాన్ని ఆలోచనని ఎంత పక్కకి నెట్టేసిందో చూడు. ప్రక్క వీధిలో ఆదుకునే స్నేహితురాలు నువ్వు ఉన్నావన్న విషయం బాలమ్మ పిన్నిగారు చెప్పేదాకా నా బుర్రకి తట్టలేదు. మొన్న నా దౌర్భాగ్య స్థితికి నాకే అసహ్యం వేసింది” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది
“అయ్యో ... తప్పు ... తప్పు అలాంటి మాటలు అనకు. ఎంత మంది ఇళ్ళల్లో దీపాలు వెలిగించావ్. నీ మంచితనమే నీ బిడ్డని కాపాడింది తల్లో అంది మన స్ఫూర్తిగా బాలమ్మగారు.
“అమ్మగారు, నాన్నగారు వచ్చేదాక, ఈ డబ్బు ఉంచు” అంటూ ఆప్యాయంగా సుజాత చేతిలో మూడు వందల రూపాయలు పెట్టింది కరుణ.
“మి అమ్మగారు ఇల్లు కదలటం ఇంత వరకు నేను చూడలేదు. ఏమిటి విశేషం. ఇంతకి ఎ ఊరు వెళ్ళారూ” సుజా అంది మృదుల.
18 * అక్షర ళిల్తాలు
“మద్రాసులో మా సీత పిన్ని ఉందని తెలుసుగా నీకు, ఆవిడ స్నేహితురాలు కూతురికి, అన్నయ్యకి నిన్నె పెళ్ళి చూపులు. అందుకే, అమ్మ, నాన్నగారు, అన్నయ్య మద్రాసు వెళ్ళారు” అంది.
“ఇంట్లో అన్ని సరుకులూ ఉన్నాయి. పిల్లలతో, ఏమన్నా అవసరం వస్తుంది. ఈ రెందొందులు తీసుకో” అంది అమ్మ,
“ఈ ఊళ్ళో నాకేం కావాలి. మద్రాసు నుంచి నీకు నచ్చినవి నీ మనవలకి కొనితే...” అంటూ ఆ రెండు వందలు అమ్మ చెతిలో పెట్టెశా. వాళ్ళు వెళ్ళటం, ఇంతలో బాబుకి సుస్తీ చేయటం జరిగింది. బాబు విషయం పూర్తిగా నువ్వు చూసు కున్నావ్. పాపని వాళ్ళిద్దరూ చూశారు. మీ ముగ్గురికి నా థాంక్సు” అంటూ మృదుల కేసి చూస్తూ కళ్ళసీళ్ళు తుడుచుకుంది సుజాత.
“స్నేహితుల మధ్య ఉందవలసినవి ధన్యవాదాలు, రహస్యాలు కావు, మనసు విప్పి మాట్లాడుకునే చనువు” అంటూ సూటిగా సుజాతకేసి చూసింది మృదుల,
“ఏడో నెల గర్భిణీ. రెందేళ్ళ పిల్లతో పుట్టింటికి చేరిన నేను, అత్తంటికి ఇంకా, ఎందుకు వెళ్ళలేదనేగా.” చెపుతా విను. చాలా ధనవంతులు, పెద్ద బిజనెస్, పిల్లాడు అందగాడు, సుజాత గొప్ప జాతకురాలు అంటూ వియ్యాల వారి హోదాకి తగ్గట్టు నాన్న నా పెళ్ళి ఆర్భాటంగానే చేశారు. నా కాపురం చూసి మురిసిపోయారు.”
“నా పెళ్ళీ అయిన నాలుగేళ్ళకి మా మామగారు, మా వారు చేసే విజనెస్లో ఊహించనంత పెద్దనష్టం వచ్చింది. దానికి మా మామగారు తట్టుకోలేక హార్డు ఎటాక్ వచ్చి పోయారు. మామగారి కర్మకాండలు అయ్యాక మా ఆస్తి వాస్తులు బేరీజు వేస్తే, అప్పులకి ఆస్తులు సరిపోయాయి. మనుషులం మాత్రం మిగిలాం. ఈ పరిస్థితిలో ఏం చేయలేం, మనసు కుదుటపడే వరకు తమ్ముడు, అమ్మ నా తోటి ఉంటారు. హైదరాబాద్ తీసికెడతాం. నువ్వు, పాప మీ అన్నయ్యతో మీ ఊరు ఎళ్ళండ” అంది మా ఆడపడుచు అని చెప్పింది సుజాత.
“సుజాత చెప్పింది శ్రద్ధగా విన్న మృదుల, రెండెళ్ళు అయినా మీ వారికి ఉద్యోగం రాలేదా” అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అదే భావాన్ని వ్యక్తం చేస్తూ సుజాత కేసి చూశారు కరుణ, బాలమ్మ గారు.
“రాదు, వస్తుందన్న ఆశ కూడా లేదు” అంది సుజాత.
“అదేంటే” అంటూ ఇంకా ఆశర్య పోయింది మృదుల.
“ఆయనకి తండ్రి వెనక ఉండటమే కాని వ్యాపార దక్షత లేదు. కనీసం ఇంటర్ కూడా పాసవలేదు” అంది సుజాత.
మోచర్ల రామలక్ష్మ * 19
“పెళ్ళికి ముందు మీ వారి చదువు గురించి మీ అత్తవారు నీకు చెప్పలేదా” అంది మృదుల.
“మా వాళ్ళు అడగలేదు. వాళ్ళు చెప్పాలేదు. ఎవర్ని అనవలసిన పని లేదు, నా రాత ఇలా ఉంది అంతే” అంది సుజాత.
“అమ్మా సుజాతా, పెద్ద దాన్ని ఓ మాట చెపుతా మనసు కష్ట పెట్టుకోవుగా” అంది బాలమ్మగారు.
చెప్పమన్నట్టుగా ఆమె కేసి చూసింది సుజాత.
“మి అమ్మగారు నాన్నగారు, ఊరునుంచి వచ్చాక పిల్లల్ని తీసుకొని మీ ఆయన దగ్గరకి హైదరాబాదు వెళ్ళమ్మా” అంది.
ఆవిడ మాటలకి నిర్లిప్తంగా నవ్వుతూ “మా ఆడపడుచు భర్త మంచివాడు కనుక, ఆయన, మా అత్తగారు రెందేళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఏం అనటం లేదు. ఇంక పిల్లలు నేను కూదా వెడితే ఏం బావుంటుంది” అంది సుజాత.
“నువ్వా చదువుకున్న దానివి, నీకు వివరించి చెప్పాలా తల్లీ. రెందేళ్ళ అయినా భార్యాబీడ్డల్ని తీసికళ్ళాలన్న ధ్యాస లేనివాడు ఎప్పటికి మారతాడు, నువ్వే ఓ ఉద్యోగం చూసుకొని, భర్తని. పిల్లల్ని పోషించుకో” అంటూ జాలిగా సుజాత కేసి చూసింది బాలమ్మ గారు.
- రేపు మీ అన్నయ్య పెళ్ళి అవుతుంది. మూడు గదులు ఉన్న మీ ఇల్లు ఇరుకు అవుతుంది. వచ్చే అమ్మాయి నీలా నిదానస్తురాలు అయితే ఫరవాలేదు. లేకపోతే” అంటు నానుతోంది కరుణ. .
“నాన్బుతా వెందుకు. మీ వీధిని ఉద్ధరించిన ఉద్దండురాలికి బాగా అర్ధ మయ్యెట్టు చెప్పు. మీ ఆయన వాళ్ళ అక్క పంచన నువ్వు మీ అన్న పంచన హాయిగా బ్రతికేయండి పిల్లల్ని ఏ అనాధ శరణాలయంలోనో చేర్ప్చించేయండిని చెప్పు” అంది మృదుల.
“పరోపకారం తప్ప ఎరగని మనిషిని అంత మాట అనకమ్మా” అంది బాలమ్మ గారు.
“దాని మీద నాకు కోపం లేదండి. అది అందరి లాంటిది కాదు. చదువులో, డిబేట్లో, వ్యాసరచనలో, ఆటల్లో, పాటల్లో అన్నిటిలో ఫస్టు వచ్చేది. అంత తెలివి అయినది, దాని కాపురం అది సరిచేసుకోలేదే” అన్న బాధ అంది మృదుల.
“నువ్వు చెప్పింది నిజమే మృదులా. మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరికీ తలో ఉపాధి పదకం చెప్పి వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోద్చడింది. మా వారిది సీజనల్ జాబ్ అని నన్ను కుట్టు నెర్చుకోమని ప్రోత్సహించింది. మొన్న సుందరమ్మగారి
20 * అక్షర శిల్తాలు
కూతురి పెళ్ళి బట్టలు కుడుతూ ఉంటే, బాబుని చూట్టానికి కూడా రాలేదు. వొప్పు కున్న పని అయ్యేదాకా ఏ పని చేయలేదు. అలా పనే దైవంగా చెయ్యాలని సుజాతే చెప్పింది” అంది కరుణ.
“పట్నంలో చిన్న ఉద్యోగం చేసుకు బతికే మీ అబ్బాయి డబ్బు పంపాలంటే కష్టం. మీరు. ఇంత రుచిగా పిండివంటలు చెస్తారు.
“దిజినెస్గా చెయ్యండి” అని సలహా ఇచ్చింది.
“మన వీధిలో ఎవరిళ్ళల్లో పుట్టిన రోజు పార్టీలు అయినా క్యాటరింగ్ నేనే ఇస్తున్నా మొన్న కరణం గారి కోదలి సూడిదలకి స్వీట్లు అన్నీ నేనే చేశా. ఇంట్లో ఇబ్బంది పోయి నాకు చేతుల్లో డబ్బు లాడుతున్నాయి” అంది బాలమ్మగారు.
“ఆంజనేయ స్వామికి తన శక్తి చెపితే కాని తెలియదు అన్నట్లు చెసుకున్నావ్. మన కాలేజీలో జరిగిన “స్వయం ఉపాధి పధకాల” గురించి డిబేట్లో ఫస్టు వచ్చావ్ గుర్తుందా? నోటి మాటలు కాదు, చేతలుండాలి. ఏ పనైనా చేసి చూపించాలి” అంది మృదుల సుజాతలో నిస్తేజమైన చైతన్యం పుంజుకోటానికి.
“మృదుల మాటలు సుజాత మనసు మీద మంచి ప్రభావాన్ని చూపించాయి. “జేేల్సీ కేర్ సెంటర్” పెట్టింది. అమె ఆర్థికంగా పుంజుకుంది. ఆమె కృషి మూడు సంవత్సరాలు తిరిగేటప్పటికి ఆమెను ఒక స్కూల్ హెడ్మి(స్టెస్గా చేశాయి.
ఎదగటం మొదలుపెట్టిన ఆమెని చూసి మృదల ఆనందంతో పొంగిపోయింది.
“నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది” అంటూ సుజాతని మెచ్చుకుంది మృదుల.
“సరైన సమయానికి సరిపడే సలహా ఇచ్చిన నీలాంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టం. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అత్తయ్య ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇంట్లో సాయం చేస్తున్నారు. స్కూల్లో మేనేజర్‌గా అన్ని పనులు చూసు కుంటున్నారు. మృదుల! జీవితం ఎంతో హాయిగా ఉంది. ఆయన నేను పిల్లలు ఒకే చోట ఉండటం అంటుంటే “ఆమె కళ్ళల్లో అనందం తొణికిసలాడింది. చెప్పటం కన్నా చెయ్యటంలోనే తృప్తి, గౌరవం వస్తాయని స్వయంగా తెలుసుకున్నాను” అంది సుజాత.
“సుజా! ఎంతో మందికి, ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటికి రూపం ఇవ్వాలి. వాటికి సార్థకత చేకూర్చాలి. ఆశయాలని ఆలోచనలకే పరిమితి చెయ్యక, ఆచరణ యోగ్యతని కలిగించాలి. అప్పుడే సమాజం చైతన్యంతో సాగుతుంది” అంది మృదుల.
మోచర్ల రామలక్ష్య * 21
ఇంటర్వ్యూ ఫోన్ రింగవుతోంది. ఎవరబ్బా? అనుకుంటూ వచ్చి ఫోన్ ఎత్తాను.
“హలో అక్కా మన నానిగాడు సెలెక్ట్ అయ్యాడు. సాయంత్రం మనింట్లో పార్టీ ఇస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. ఉంటాను” అంటూ నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు మా తమ్ముడు.
వాడికేం పనులున్నాయో? హడావిడి పడిపోతున్నాడు. విషయం మా మరదల్ని కనుక్కుందామని మా తమ్ముడింటికి రింగ్ చేశాను. ఎంగేజ్, ఎంగేజ్ ... ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్. “తినబోతూ రుచెందుకు' అనుకుని ట్రిమ్గా తయారయ్యాను. రోడ్డు మీదికొచ్చి ఆటో పిలిచాను. కూకట్పల్లి వస్తావా? అంటే రాను మారేడుపల్లి అయితే వస్తాను అన్నాడు. అసలే లేటైపోతుంది. ఆటోవాళ్ళు రారు. ఆటోలక్కూడా సిటీ బస్సుల్లా నెంబర్లు పెట్ట స్తే వదిలిపోతుంది అనుకుంటుంటే కూకట్పల్లి వైపు వస్తానని దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు ఒక ఆటోవాలా.
మా తమ్ముడిల్లు షామియానా, లైటింగ్‌లతో కళకళ లాడిపోతుంది. బంధు మిత్రులతో ఇల్లు కిటకిట లాడిపోతోంది. మా తమ్ముడు, మరదలు మొహాలు ఆనం దంతో వెలిగిపోతున్నాయి. నన్ను చూసి రా... రా... అంటూ మా మరదలు, మా తమ్ముడు ఆహ్వానించారు. వాళ్ళు నాతో మాట్లాడటానికి వీలులేకుండా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ కాలనీవాసులు రకరకాల ప్రశ్నలు పోడీపడి మరీ అడుగుతున్నారు.
ఆ కాలనీలో ప్రముఖుడు ఈ మధ్యనే ఎం. ఎల్.సీ. గా ఎలెక్టయిన భోగేశ్వరరావు మా నాసీని ఆశీర్వదించి, మా తమ్ముడు మరదల్ని అభినందించి, “కార్యక్రమం చివరి దాకా ఉండాలని ఉంది కానీ మరో మీటింగ్‌కి తప్పనిసరిగా హాజరు కావాలి. అన్యధా భావించకండి. శెలవ్” అంటూ అందరికీ నమస్కరించి నిష్క్రమించాడు. ఆయనతో పాటు మందీ మార్చలం వెళ్ళిపోవటంతో మాకు కాస్త ఊపిరాడింది.
ఇంతలోనే యోగేశ్వరరావు యోగాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. సంతానం ఒక యోగం, ఆ సంతానం సత్సంతానం అవటం మరో యోగం. అటు వంటి యోగం ఉన్నమా తమ్ముడూ మరదల్ని గొప్ప అదృష్ట జాతకులని, ఎందరి లోనో కొందరని, పొగడ్తలతో ముంచెత్తాడు. మా తమ్ముడూ, మరదలకి పుత్రోత్సా హంతో ఒళ్ళు పులకరించిపోతోంది. మధ్యమధ్యలో అక్కా అంటూ వాడు వదిన అంటూ మా మరదలూ ఏదో చెప్పాలని తపించిపోతున్నారు. విషయం వాళ్ళు నాకు చెప్పకుండా ఎవరో ఒకళ్ళు అద్దుపడుతున్నారు.
ఇంతలో మా మామయ్య హడావిడి పదుతూ ఉన్న పళంగా రమ్మన్నారు. నాలుగు రకాల స్వీట్స్ తెమ్మన్నారు. అల్లుడికి చాలా పే... ద్ద ప్రమోషన్ వచ్చిందా?
ఇంక ళాం
ఇప్పటికప్పుడు ఇవన్నీ చేయించుకొచ్చాను. బావలేడా? అంటూ మా నాన్నగారి కోసం వెతికాడు. మా నాన్నగారు తన స్నేహితులకి నానీని చూపిస్తూ ఏవో చెప్పేస్తు న్నారు. అరే! అరుగో మా వారూ వచ్చారు. ఆయనకీ ఫోన్ చేసి ఉంటాడు వీడు. అబ్బో బావగార్ని బాగానే రిసీవ్ చేసుకున్నాడు. మా మరదలూ అన్నగారికి అంత లోనే తెగమర్యాద చేసేస్తోంది. మా తమ్ముడి బాస్ వచ్చాడు. మా వారి చెయ్యి వదిలి వాది బాస్‌కి ఎదురు వెళ్ళాడు. మా వారి మొహం ధుమధుమ లాడిపోతోంది. అసలే ముక్కుసూటి మనిషి. మర్యాద తక్కువైందని ఏం రాద్దాంతం చెస్తారోనని హడలి చచ్చాను. పెళ్ళై పాతికేళ్చైనా ఇంకా ఆయన్ని కొత్తల్లుడిలాగే చూస్తారు మా వాళ్ళు. మా తమ్ముడు వాళ్ళ బాస్ రావటం వల్ల మా ఆయన్ని వదిలి వెళ్ళాడు. తిన్నగా మా వారు నా దగ్గరికొచ్చారు. ఏమిటీ హడావిడంతా? వేలెడంత లేడు బోడి వెధవ మీ తమ్ముడు! విషయం కూడా పూర్తిగౌ చెప్పలేదు. ఫోన్ చెసి ఉన్న పళంగా రండి బావగారు అన్నాడు మా నానీ అంటూ నేను నాన్నాను.
మా నాని ఏమిటి? మా నాని. మీ అక్క కొడుకు, అన్న కొడుకు అందరూ నానీలే. ఇంతకీ నాని ఏమిటి? అంటూ నా మీద అనవసరంగా విరుచుకుపడ్డారు. నానీ అంటే వాళ్ళ ముగ్గురికీ మా నాన్నగారి పేరే పెట్టారు. ఆయన మీద గౌరవం కొద్ద ఆయన పేరు పిలవకుండా 'నాని' అని పిలుచుకుంటాము. నా అదృష్టం బావుంది మా తమ్ముడు వగంగా వచ్చి మా వారి రెందు చేతులూ పట్టుకుని తెగ ఊపేస్తూ ధన్యవాదాలు చెప్పాడు. బావగారు మీరు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. అందుకే ఈ హడావిడి. మా నానీ పుట్టినప్పుడు మీరు వచ్చి వాణ్ణి చూసి మీరే చెప్పారు. వీడు 'బైట్ బాయ్” గొప్ప ఫ్యూచర్ ఉందని. ఆ దేవుడే మీ చెత పలి కించాడేమో ఆ రోజు. మీరు అన్నట్టుగానే మన నానీకి ఈ సిటీలో ఉన్న మంచి ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాడు. ఆ విషయం తెలిసిన వెంటనె మీ అందరికీ ఇన్ఫామ్ చేసి ఈ పార్టీ అరేంజ్ చేశాను అన్నాడు.
మా తమ్ముడి మాటలతో మా రుద్రదేవుడు కాస్తా బోళా శంకరుడయ్యాడు.
ఆయనే స్వయంగా నానీ చేత కేక్ కట్ చేయించారు. పార్టి మొదలైంది. తినే వాళ్ళు తింటూనే వింటున్నారు. మా మరదల్ని మీ అబ్బాయి ఇంటర్వూ ఫలో సెలెక్ట్ అవటానికి కోచింగ్ ఎక్కడ ఇప్పించారు అని అడిగే వాళ్ళు అడుగుతూనె ఉన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాడు అంటే ఏమిటో అనుకునేరు ఎల్కజీలో. మా నానీకి మాత్రం ఈ హడావిడికి అర్ధం తెలియదు. హాయిగా బుడగలతో ఆడుకుంటున్నాడు. రేపటి బ్యాగ్ మోత ఎరగని పసి మనసు, పసి వయసు వాడిది. పసిప్రాయంలో మొట్టమొదటి ఇంటర్వ్యూలో సెలెక్టు అయ్యాడు. వాడి జీవితానికి ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలో!
మోచర్ల రామలక్ష్మి * 23
నిర్ణయం నింగిలో చీకటి తొలుగుతోంది. తూరుపున వెలుగు తొంగి చూస్తోంది. ప్రకృతిలో ప్రతి నిత్యం జరిగే, ఈ మార్పు, మానవాళికి మేల్మొలుపే.
దినకరుని కంటే ముందే, దినచర్య ఆరంభించి వంట ఇంటిలో అమ్టావధానం చెస్తున్నారు ఎందరో స్త్రీ మూర్తులు.
సమయం ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది. అప్పటికే టిఫెన్, వంట పూర్తి చేసేసింది దివ్య. అన్నగారి పిల్లలకి హార్లిక్స్ ఇచ్చి, టిఫెన్ తినిపించి, స్కూలుకి పంపించింది.
కూతురు ఒక్కతే వంట గదిలో పని చేయటం చూసిన శాంతమ్మ గారి తల్లి మనసు తరుక్కుపోయింది.
“మీ వదిన మహరాణులు లేచారే? వాళ్ళెందుకు లేస్తారు. లేచినా వంట ఇంట్లోకి రారు. బాత్రూమ్ల్లో స్నానాలు చేసి, నీట్‌గా తయారయ్యి, అప్పుడు దిగు తారు అంతపురం నుంచి. అన్ని నువ్వు అమర్చి పెట్టినా ఆఫీసుకెళ్ళటానికి తెగ కంగారు పదతారు.
“ఇంటి ఆడపడుచు, ఇంటెడు చాకరి చేస్తోందన్న ఇంగితం ఇద్దర్లో ఒక్కళ్ళకి లేదు” అంటూ ఆవేశంగానే అంది శాంతమ్మగారు కూతురు కేసి చూస్తూ,
హాల్లో పేపరు చదువుకుంటున్న కరుణాకరం గారికి, భార్య మాటలు అరుపు లాగే వినిపించాయి. భార్య దగ్గరగా నుంచుని “శాంతా, రోజు ప్రొద్దున్నే ఏమిటి ఈ గోల?” అంటూ విసుగ్గానే అడిగారు.
“గోల కాదండి, గోడు. ఇంత వరకు ఇంటి కోడళ్ళు నిద్ర లేవలేదు. దివ్యే చాకరి అంతా చేస్తోంది. ఈ రెండేళ్ళ నుంచి అది మన వంట ఇంట్లో మరబొమ్మ అయిపోయింది అంటూ వడుపు మొదలు పెట్టింది శాంతమ్మగారు.
“శాంతా, విషయం తెలిసి కూడా అరుస్తా వెందుకు. పెద్ద కోడలు నిర్మలకి మొన్నటి నుంచి జ్వరం. నిన్ననే పత్యం తింది, నీరసంగా ఉండి లేచి ఉండదు” అన్నారు కరుణాకరంగారు.
“చిన్న మహరాణి గారి కేమయ్యిందిట” అంది దీర్హం తీస్తూ శాంతమ్మ గారు.
“లాస్య వాళ్ళ పెద్దమ్మ గారికి గుందెపోటు వచ్చిందిట తెల్లవారు జామున” అన్నాడు కరుణాకరం గారు.
24 * అక్షర శిల్పాలు
“ఎవరూ ఈ ఊళ్ళో ఉన్నావిడకేనా” అంది శాంతమ్మ.
“ఈ ఊళ్ళో ఉన్న ఆవిడకే, వాళ్ళ అబ్బాయి దివాకర్ తెల్లవారు జామున నాలుగు గంటలకి కంగారుగా ఫోన్ చేశాడు. ఆ వెంటనే లాస్య, చైతన్య హడావిడిగా హాస్పటల్‌కి వెళ్ళారు” అన్నాడు కరుణాకరం గారు.
“కోజుకో వంక” అంటూ మూతి తిప్పింది శాంతమ్మ గారు,
“శాంతా! కూతురికి వచ్చిన కష్టంతో నీ మనసు కుళ్ళిపోతోంది. ఆపదలో ఉన్న వాళ్ళ మీద ఆదరణ చూపించలేకపోతున్నావు, కారణం లేకుండా కోదళ్ళని అడిపోసుకుంటున్నావ్. ఇది మంచి పద్ధతి కాదు” అన్నాడు కరుణాకరం గారు.
“కోడళ్ళని కూర్చోపెట్టడం మంచి పద్ధతా” అంటూ వ్యంగ్యంగానే అడిగింది శాంతమ్మ గారు,
“నువ్వు ఇలాగే కోడళ్ళని దోజూ ఏదో ఒకటి అంటూ ఉంటే వాళ్ళకి దివ్వ మీద అభిమానం, మనమీద గౌరవం లేకుండా పోతాయి. ఆలోచించుకో. నేను హాస్పటల్‌కి వెడుతున్నా. లాస్య పెద్దమ్మ గార్ని చూసి వన్లాొ అంటూ కరుణాకరం గారు వెళ్ళిపోయారు.
తండ్రి గట్టిగా మాట్లాడటం విని, మేడ మీద నుంచి క్రింద హాల్లోకి వచ్చాడు నవీన్, అతని వెంటే నిర్మల వచ్చింది.
“ఎందుకమ్మా నాన్నగారు కోపంగా ఉన్నారు” అంటూ శాంతమ్మ గార్ని అడిగాడు నవీన్.
“ఏముందిరా నా బెంగ అంతా మన దివ్య గురించే దాన్ని వంట ఇంట్లో చూడ లేక పోతున్నా ఆ మాటే ఆయనతో అంటె నా మీద విరుచుకు పద్దారు.” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది శాంతమ్మ గారు,
ఊరుకో అమ్మా “అంటు తల్లిని ఓదార్చి,” నిర్మలా నీకెన్ని సార్లు చెప్పాను దివ్యకి వంట పని చె్వ్పొద్దని, నా మాట అంటె నీకు లెక్క లేదు ” అంటూ భార్యని కేక లేసాడు నవీన్.
“దివ్యకి నేను ఏ పని చెప్పటం లేదు” అంది నిర్మల. “చెయ్యొద్దని చెవ్పొవా?” అన్నాదు నవీన్. “లేదు” అందామె. “ఏం” అన్నాడతను.
జ కాలక్షేపం లేకపోతే, ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది” అంది నిర్మల.
“ఎంత తెలివిగా మాట్లాడుతున్నావే. దివ్య చేత ఇంటెడు చాకిరి విశ్రాంతి లేకుండా చేయిస్తూ, కాలక్షేపానికి అంటున్నావా” అంది శాంతమ్మ,
“దివ్యకి కావలసిన విశ్రాంతి, శరీరానికి కాదు మనసుకి” అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది నిర్మల,
మోచర్ల రామలక్ష్మ్య్మ శ 25
భార్య మాటలు నవీన్ బుర్రలో అనేక ఆలోచనలు లేపాయి. దివ్య “అన్నయ్య” అని పిలవటంతో, ఆలోచనలకి స్వస్తి చెప్పి, “ఏం దివ్యా!” అంటూ చెల్లెలుకేసి ఆపేక్షగా చూశాడు. కాఫీ తీసుకో.
“పెద్ద వదిన నన్ను ఆదబీడద్దలా చూడదు, తన బీడ్డలా చూస్తుంది. చిన్న వదిన స్నేహంగా ఉంటూ, నా మనసుకి ఊరట కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే అమ్మ, అక్కలిద్దరి కన్నాా వదినలే నా మనసు అర్ధం చేసుకొని ఆదరించారు అంటూ కళ్ళ నీళ్ళు తుదుచుకుంది దివ్య,
“దినికి తల్లి తోడుకన్నా వాళ్ళే ఎక్కువయ్యారు. ఏం మందు పెట్టారో అంటూ అక్కసుగా కోడలకేసి చూసింది శాంతమ్మ గారు.
అమ్మా! అక్కలు నా చేత చాకిరి చేయించుకొని, అవసరం తీరాక వాళ్ళు అన్న మాటలు, నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోలేదు” అంది దివ్య.
“అయ్యో! అక్కలు నిన్నెమన్నారు. మా బ్రతుకు, నీ బ్రతుకు నవ్వులు పాలు చెయకు, మేం బ్రతికి ఉండగా, మా ఇంటి గడప తొక్కకు అన్నారు. నీ మేలు కోరే, వాళ్ళకి నీ మీద ప్రేమ లేక కాదు, నీ అందానికి, వాళ్ళ భర్తల చపలత్యానికి దదిసి అంతే. వాళ్ళమీద మనసులో కోపం పెట్టుకోకు నేను గుడికి వెళ్ళి వస్త అంటూ వెళ్ళివోయింది శాంతమ్మ గారు.
“నిర్మలా” అంటూ ఏదో చెప్పబోయాడు నవీన్. “మీరు బాధపడకండి. అత్తయ్య గారు. నన్ను ఏదో అంటున్నారని. నేను బాధపడటం లేదు. దివ్య బ్రతుకు చక్కబడా లనే ఆలోచిస్తున్నా ఏ తల్లి అయినా సరే పెళ్ళి అయిన మరునాడే కూతురి భర్త మరణించాడన్న విషయం జీర్చించుకోలేదు. క
“దివ్య (బ్రతుకు బాగు పడాలనే తాపత్రయం. ఎలా చక్కబెట్టాలో తెలియని అవేదన. దివ్య (బ్రతుకు వంట ఇంటికే పరిమితం అయిపోతుందేమోనన్న భయం అత్తయ్య మనసుని పీడిస్తున్నాయి. అందుకే ఆమె కర్కశంగా మాట్లాడుతున్నారు” అంది నిర్మల.
“అవును అమ్మ చాలా డిప్రషన్లో ఉంది. దివ్య (బ్రతుకు చక్కబడితే, పూర్వం లాగే, అమ్మ కోడళ్ళుని (ప్రేమగా చూస్తుంది. త్వరలో ఆ రోజు వస్తుంది. పద టిఫెన్ తిని ఆఫీసుకి వెడదాం” అన్నాడు నవీన్..
6 లక్షం శర్పాణ
“వదినా! హాస్పటల్ నుంచి రాత్రి ఎప్పుడొచ్చారు? మీ పెద్దమ్మ గారికి ఎలా ఉంది?” అంది దివ్య,
“పెద్దమ్మకి గండం గడిచింది. ఇదిగో దీని విషయం ఆలోచిస్తున్నా” అంది భుజం మీద ఉన్న పాపని చూపిస్తూ,
“పాప ఎంత ముద్వగా ఉంది. మీ పెద్దమ్మ గారి మనవరాలు కదా" అంటూ పాపని రమ్మని చేతులు చాచింది దివ్య.
“అవును, ఈ ఒక్కపూట దీన్ని చూస్తావా? సాయింత్రం ఆఫీసు నుంచి వచ్చాక బేబీకేర్ సెంటర్లో జేరిపిస్తా. నాకు లీవు లేదు అందుకోసం” అంది లాస్య.
“వదినా! పసిపిల్లలంటే నాకు ఇష్టం. మీ పెద్దమ్మ గారు ఇంటికి వచ్చి వరకు ఈ పాపని నేను జాగ్రత్తగా చూస్తాను. మీరందరూ ఆఫీసులకి వెళ్ళిపోతే మధ్యాహ్నం నాకు బోర్ కొదుతోంది. పాపతో నాకు సరదాగా గడిచిపోతుంది అంది.
“అయితే సరే నీ ఇష్టం. సాయింత్రం వాళ్ళ నాన్న వస్తాడు. కాసేపు దాని దగ్గర ఉండి వెడతాడు” అంది లాస్య,
ఏడుగంటలకు వచ్చాడు దివాకర్. “పాప మీకు ట్రబుల్ ఇచ్చిందా?” అన్నాడు.
లేదు. “చాలా బాగా ఆడుకుంది" అందామె.
ఆ “పాపని ఆడిస్తున్న దివాకర్‌తో, పాపని నాకివ్వండి కాఫీ తీసుకోండి” అని కాఫీ కప్పు అతని చేతికిచ్చింది దివ్య,
కాఫీ తాగుతూ “ఇంట్లో ఎవరూ లిరా?” అన్నాడు.
“వదినలు, అన్నయ్యలు రావటానికి ఏదున్నర అవుతుంది. పిల్లలు ఆడుకోటా నికి వెళ్ళారు. నాన్నగారు అమ్మ మీ అమ్మ గారిని చూడటానికి హాస్పటి ల్కి వెళ్ళారు" అంది.
“నాలుగు రోజులకే పాప మీ దగ్గర బాగా అలవాటు పడిపోయింది” అన్నాడు దివాకర్.
అవును అన్నట్టుగా తల ఊపింది.
కూతురి కోసం వచ్చిన దివాకర్‌కి, స్నేహపూరితమైన పలకరింపు, అలసివచ్చిన తనకి కాఫీ ఇవ్వటం, మీ అమ్మగారు ఎలా ఉన్నారని ఆపెక్షగా అడగటం ముఖ్యంగా పాపని ఎంతో (ప్రేమగా చూస్తున్న దివ్య పట్ల ఆరాధన భావం కలిగింది.
మోచర్ల రామలక్ష్య * 27
“వాపని ముచ్చటగా చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్న దివ్య దివాకర్లని చూసిన ఇంట్లో వాళ్ళ మనసులో ఒకే రకం ఆలోచన వచ్చింది. ద్వ్యివ దివాకర్‌లను ఒకటి చెయ్యాలని. శాంతమ్మ మనసులో కూడా అదే ఆలోచన.
దివాకర్ తల్లి హాస్పటల్ నుంచి ఇంటికి వచ్చేసింది. మనవరాల్ని తీసుకు వచ్చిన దివ్య కేసి చూసింది. బంగారు బొమ్మలా ఉంది, మంచిగుణం, భగవంతుడు ఎందుకో చిన్నచూపు చూశాడు. ఆమె లోపల అనుకుంది. ఆ పూట వాళ్ళ ఇంట్లో వంట చేసి వొపని నిద్రపుచ్చి ఇంటికి వెళ్ళివోయింది దివ్య. వారం రోజులు గడిచిపోయాయి.
దివ్య కోసం పాప మారాం చేస్తోంది. “ఒకసారి పాపని వాళ్ళ ఇంటికి తీసు కెళ్ళు” అంది దివాకర్ తల్లి. అతనికి దివ్యని చూడాలనే ఉంది. అందుకే తల్లి మాటకి అలాగే అన్నట్టు తల ఊపాడు.
పాపని తీసుకొచ్చిన దివాకర్ కేసి సంబరంగా చూసింది దివ్య, “పాపని నాకిచ్చెయ్యంది. నేను చూసుకుంటా” అంది. నన్ను కూడా అన్నాడు మనసులో మాట బయటపెట్టే చాన్సు మిస్స్ అవ్వకూడదని. అతని మాట విన్నాక కంగారుగా అతని కేసి చూసింది.
“మీకిష్టం లేకపోతే బలవంతం లేదు. వంటరి జీవితం ఎంతకష్టమో ఇద్దరికి తెలుసు” అన్నాడు.
“నాకొచ్చిన కష్టం మా ఇంట్లో అందరి మనసుల మీద ఎక్కువ ప్రభావం చూపించింది. ఎడాది నుంచి, మా ఇంట్లో సరదాగా మాట్లాడుకున్న సందర్భాలే లేకపోయాయి. మీ పాప మా ఇంట్లోకి వచ్చాక మా ఇంట్లో సందడి, సరదా కని పించాయి. నేను అదే ఆలోచిస్తున్నాను” అంది దివ్య,
“ఆలోచించటం కాదు ఆడపడచా! అందరిని ఆనందపరిచే నిర్ణయం తీసుకో” అంది లాస్య,
“వదినా! నా నిర్ణయం ఏముంది. మీ అందరూ నిర్ణయించాక” అంటూ నవ్వింది దివ్య.
దివ్య నిర్ణయంతోటి దివ్య దివాకరాలు జీవితాల్లో కొత్త వెలుగు ప్రవేశించింది.
-అడికవా అహపాఆ- 28 * అక్షర శిల్పాలు
నా కోసం మై ... ధిల్ నీకేం కావాలో అడగరా అన్నాడు శ్రీరామ్ భార్య కేసి హుషారుగా చూస్తూ, ఆమె పెదవిప్పేలోపే శ్రీరామ్ చెల్లెలు శాంత వాక్సాణాలను సంధించింది.
“ఒరేయి అన్నయ్య నీ గుండె లబ్ డబ్ అనటం మర్చివోయి మై .. ధిల్... ధిల్ అంటోందేమో చూసుకో” అంది.
“చూసుకోవలసిన పనలీదు. నలభై రెండు సంవత్సరాల నుంచి, నాగుండె మై ... ధిల్ మైధిల్ అనె కొట్టుకుంటోంది” అంటూ భార్యకేసి చిలిపిగా చూశాడు.
“నీ గుండె చప్పుడే మీ ఆవిడైనప్పుడు, ఆవిడకి ఏం కావాలో నీకే బాగా తెలుస్తుంది. ఇంకా ఎం కావాలని ప్రత్యేకంగా అదుగుతావెందుకు. ఉక్రోషాన్ని అణుచుకుంటూ రాని నవ్వు తెచ్చుకుంది.”
“ఆయన ముచ్చటగా భార్యని ఏం కావాలని అడిగితే నువ్వేంటి వాళ్ళ మధ్య కాఫీలో తొలకలా అద్దు పడతావ్” అన్నాడు భార్యని సుందరం.
“అబ్బో ముచ్చట్ల గురించి మీరా చెప్పేది. నేను. నోరు తెరచి ఇది కావాలి అని అడిగిన తుమ్మ మొద్దులా 'ఊ, 'ఆ అనరు” అంటూ భర్త డొక్కలో మోచెత్తో ఒక్క పోటు పొడిచింది. దాంతో సుందరం అబ్బా అంటూ చావుకేక పెట్టాడు. అతను తేరుకోటానికి ఐదు నిముషాలు పట్టింది.
“ఆ తరువాత అక్క అంటే మా బావకి వ్రాణం"” అంది ఉమ.
భార్య మాటకి ఫక్కున నవ్వాడు శంకర్.
“ఎంటి బాబాయ్ నవ్వుతున్నావు. విషయం మాకు చెప్పవా” అన్నాడు (పేమ్.
“మీ పిన్నికి కోపం వస్తుం” అంటూ మళ్ళీ నవ్వటం మొదలు పెట్టాడు.
“ప్లీజ్ పిన్ని బాబాయ్‌ని చెప్పమను అంటూ పినతల్లిని బ్రతిమాలింది సహన.
“మన సంసారంల్లో అంత మురిసిపోయే విషయం ఏముంది. పిల్లలు సరదా పడుతున్నారుగా చెప్పండి” అంది ఉమ.
“భార్య పర్మీషన్ ఇచ్చాక, నిర్భయంగా నవ్వుతూ చెప్పాడు శంకర్."
“మా పెళ్ళయిన కొత్తలో మీ పిన్ని నోరు విప్పితే చాలు మీ నాన్న గురించి గొప్పుగా చెప్పేది” అంటూ రెట్టంపు ఉత్సాహంతో చెప్పటం మొదలుపెట్టాడు. శంకర్, కొడుకు అంటే మా బావ. అల్లుడంటే మా బావ, తండ్రి అంటే మా బావ, భర్త అంటే
మా బావ, బావ అంటే బావ అని చెపుతూ ఉందేది. ఆ శ్రీరాముడుకి అన్నా ఏమన్నా లోపం ఉండొచ్చు మా బావకి ఏమచ్చా లేని శ్రీరాముడు అనేది.
“పరాయి మొగాణ్ణి అందులోను తోడల్లుణ్ణి భార్య పొగుడుతూ ఉంటే విని సహించటం సామన్యమైనది కాదు. నువ్వు నిజంగా దేవుడివి బాబాయ్. భార్య మా అన్నయ్య షర్టు బావుంది కదూ అంటేనే కుళ్ళుకునే మొగాళ్ళు ఉన్న సమాజం ఇది” అంటూ భర్తకేసి ఓరగా చూసింది సహన.
“ఓసి దుర్మార్గురాల ఎప్పుడో ఒకసారి నేనన్న మాట ఇంకా మర్చిపోలేదు. నీతో జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మీ అత్తయ్యలాగే తయారవుతావు” అని మనసు లోనే అనుకొని భార్యకేసి కొరకొరా చూశాడు.
“నువ్వు చెప్పు బాబాయ్ అంటూ శంకర్కేసి చూసి, బాబాయ్ చెప్పేది మనం పూర్తిగా వినాలి. మధ్యలో మనం ఎవ్వరం అంతరాయం కలిగించకూడదు” అన్నాడు ప్రేమ్.
“ఆ రోజుమీ పిన్ని పుట్టిన దోజు. నన్ను కట్టుకున్న పుణ్యానికి (ప్రతిఫలంగా నా కాళ్ళకి నమస్కరించింది. సంతోషంగా దీర్షసుమంగళీ భవ” అంటూ రొటీన్‌గా దీవించాను.
“పెళ్ళి అయ్యాక భార్య మొట్టమొదట పుట్టిన రోజుకి ఉత్తిగా దివించారు. అదే మా బావ అయితే దైమంద్ నెక్షస్ ప్రజంట్ చేస్తాడు అంది.”
“నాకు వళ్ళు మండిపోయింది. దాంతో ఏం అంటున్నానో అన్న ఆలోచన లేకుండా నువ్వు మీ బావనే పెళ్ళి చేసుకోవాల్సింది అన్నాను” అన్నాడు శంకర్.
“అప్పుడు మా పిన్ని ఉమాదేవి కాళిక అవతారం ఎత్తిందా!” అంటూ నవ్వాడు ప్రేమ్.
“అబ్బే అలాంటిదేమీ జరగలేదు. ఎవడు దొరకకపోతే అక్క మొగుదే గతి అంటారు. మీరు నాకు ఆ ఛాన్స్లికుండా చేశారు అంది” అంటూ పగలబడి నవ్వాడు శంకర్.
“ఒరేయ్ ప్రేమ్ ఆ రోజుల్లో మీ పిన్ని కూడా నన్ను మీ అన్నయ్య చురుకగా ఉంటారు. మీరూ ఉన్నారు” అంటూ ఎత్తిపొదిచేది అన్నాడు.
“శ్రీరామ్ తమ్ముడు విష్ణు. నేనే కాదు చాలామంది ఆడవాళ్ళం అక్కయ్య ఎంత అదృష్టవంతురాలు అనుకునేవారు” అంది విష్ణు భార్య విమల.
30 * అక్షర శిల్పాలు
“మీరేకాదు నేను అనుకుంటా” అంది (ప్రేమ్ భార్య కరుణ.
“అబ్బా దాడీ” అంటూ తండ్రి కేసి చూసి నవ్వారు (ప్రమ్ సహన.
ఆమె మాటలు విని భార్యకేసి గర్వంగా చూశాడు శ్రీరామ్.
“ఒరేయ్ 'పేమ్ మీ నాన్న మా మైధిలిని చేసుకున్నాక అంచెలంచెలుగా ఎదిగాడు” అని మైధిలి తండ్రి అన్నాడు జనార్ధనం.
“మా మైధిలి చాలా అదృష్టవంతురాలు. దాని జాతకచక్రం వేసిన, పండితుడె చెప్పాడు” అంది మైధిలి తల్లి జయమ్మ.
“నోరు విప్పి ఇది కావాలి అని అడగకుండానే అమురుతున్నాయిగా. అదృష్టం కాకపోతే ఏమిటి?” అంది శాంత.
“మెయిన్ విషయం పక్కకి పెట్టి వేరే విషయాలు మాట్లాడుతున్నాం. వదిన ఎం అడుగుతుందో చూద్దాం” అన్నాడు విష్ణు.
“మైధిల్ అడగరా నీకేం కావాలో” అన్నాడు మళ్ళీ శ్రీరామ్.
ఆమె ఏమి అడుగుతుందా అన్న కుతుహలం అందరిలోనూ కొట్టచ్చినట్టు కనపడింది.
ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదన్న ఆత్రంతో ఓ ఏదాది నిర్మలతో వాటు ఆథభ్రమంలో ఉంటా అంటూ గబగబా చెప్పేసింది మైధిలి.
“ఆ మాట విన్న అందరూ అవాక్ అయ్యారు. శ్రీరామ్‌కి నవనాడులు కృంగి నట్టు అయ్యాయి. నాకు ఏం కావాలి మీ చేతుల్లో పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలి” అని అంటుందనుకున్న భార్య నీ సహచర్యం నా కొద్దంది.”
“నీక్రేమయ్యిందే. అరవై ఏళ్ళు నిండదాయని నీకేం బహుమతి కావాలో అని అతను అడిగితే అతన్ని వేళాకోళం పట్టస్తున్నావు" అంది జయమ్మ కూతుర్ని
“వేళాకోళం కాదు నిజమే. పద నిర్మల” అంటూ సూట్‌కేసు తీసుకొని గుమ్మం దిగింది మైధిలి.
“ఒసేవ్ నీకేమయ్యింది. పండులాంటి కాపురాన్ని ఎండులా చేసుకుంటున్నావు. ముసలి తల్లితండ్రులం మమ్మల్ని కూడా వదిలి వెళ్ళివోతున్నావా" అంటూ అరుపులు మొదలు పెల్టింది జయమ్మ.
“నువ్వు ఊరుకో అమ్మమ్మ నాన్న పిలుస్తారు” అంది సహన.
నాన్న అమ్మని రమ్మని పిలు అన్నాడు (పమ్.
ఆమె తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం కాదు. నిన్నె సూట్‌కేస్ సర్దుకుంది
మోచర్ల రామలక్ష్మి * 11
అంటే సమ్‌థింగ్ ఈజ్ దేర్. అదేమిటో తెలుసుకోవాలి అని మనసులోనే అనుకుని మౌనంగా ఉండిపోయాడు ప్రముఖ వ్యాపార వేత్త శ్రీరామ్.
ఆలోచిస్తావేంటి? అమ్మ వెళ్ళిపోతోంది పిలు నాన్న అన్నారు (ప్రేమ్, సహన.
“అరవై ఏళ్ళ వయసుల్లో భర్తని, కాపురాన్ని వద్దని వెళ్లిపోతోంది. ఎంతథైర్యం. ఏడాది తరువాత వస్తుందిట. తన ఇష్టం వచ్చినప్పుడు వస్తే మన గుమ్మం లోనికి రానిస్తామా” అంది కోపంగా శాంత.
“అమ్మా శాంతమ్మా ఈ ఇంటి ఆడపడుచువి అన్నా వదినల బాగుకోరాలి. తప్పుగా మాట్లాడకూడదు” అన్నాడు జనార్ధనం.
“ఏమిటండీ నాకు నీతులు చెపుతున్నారు. కూతురికి చెప్పుకోటం రాక” అంటూ విరుచుకుపడింది శాంత.
“చూడు శాంతమ్మా ... నా కూతురు పద్దెనిమిది ఏళ్ళ వయస్సులో మీ ఇంట అడుగుపెట్టింది. ఓ విలువైన వస్తువులా ఆగకుండా పనిచేసే యంత్రంలా జీవిం చింది” అది. ఎందుకు వెళ్ళిందన్న విషయం నీకు నాకు కన్నా 42 సంవత్సరాలు సహజీవనం గడిపిన మీ అన్నయ్యకే తెలుస్తుంది” అన్నాడు జనార్ధనం.
మామగారి మాటలు ములుకుల్లా అనిపించాయి శ్రీరామ్‌కి.
శ్రీరామ్ బలవంతం మీద, అతనితో వాళ్ళకున్న అవసరాలను బట్టి నాలుగు రోజులు ఉండి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
శ్రీరామ్‌కి మైధిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనసు మనసులో లేదు. మామగారు అన్న మాట పదేపదే గుర్తుకొస్తోంది.
“మామయ్య భోజనానికి రండి” అని పిలిచింది కరుణ.
ఆకలిగా లేదు అని ముక్తసరిగా జవాబు చెప్పాడు శ్రీరామ్.
“మామయ్య మీకో మాట చెప్పాలనుకుంటున్నానుో అంది కరుణ.
“చెప్పు అన్నట్టుగా ఆమె కేసి చూశాడు.”
“నిన్న మేం చెప్పిన విషయం విన్నారుగా. ఆ విషయం అత్తయ్యతో చెప్పంది. ఆవిడకి మనవలంటే ప్రాణం తప్పక వస్తారు. వేడిగా పాలు తీసుకొస్తాను” అంటూ ఆమె వెళ్ళివోయింది.
కోడలు వెళ్ళివోయిన తరువాత మంచం మీద అటుఇటు దొర్లుతున్న అతనికి నలభై రెండేళ్ళ వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళముందు కద లాడాయి.
32 * అక్షర శిల్పాలు
శ్రీరామ్ మైధిలి ముచ్చటగా ఉన్నారు. చక్కని జంట అన్నారు వాళ్ళ పెళ్ళికొచ్చిన వాళ్ళు. భర్త చిటికిన వేలు పట్టుకొని అత్తింట అడుగుపెట్టింది మైధిలి. ఆమె వచ్చిన వేళావిశేషం అన్నారు. శ్రీరామ్ ఉద్యోగం నిమిత్తం డెపుటేషన్ మీద ఓ ఏడాది పాటు అమెరికాలో ఉండటం, తరువాత ఇండియాలో అతను బిజిన్స్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదగటం. తను అమెరికా వెళ్ళిన సమయంలో తన తల్లి తండ్రి చెల్లి తమ్ముళ్ళుని పుట్టింటికి కూడా వెళ్ళకుందా, తను ఆమె వద్ద తీసుకున్న మాట ప్రకొరం ఎంత (శ్రద్దగా, అభిమానంగా చూసింది.
గర్భవతిగా ఉండి పుట్టింటికి వెడతాను అంటే, తనని వదిలి ఉండలేనని అతనే పంపలేదు. (పేమ్, సహనలని చూసుకొని తమ (ప్రేమ పంటగా మురిసిపోయే వారు. అటు ఆమె చెల్లెలు పెళ్ళి. ఇటు అతని చెల్లెలు తమ్ముడి పెళ్ళిలోను సందడిగా తిరుగుతూ పూర్తి బాధ్యత తీసుకున్నారు.
అతని షష్టిపూర్తి కొచ్చిన వాళ్ళంతా మైధిలి, శ్రీరామ్, ఇంకా పెళ్ళిపిటలమీడ ఉన్నట్టె ఉన్నారు అన్నారు కొందరు. హెల్తు. వెల్లు ఉంటి ఎవరైనా అలాగే ఉంటా రన్నారు మరికొందరు. అణుకువ గల భార్య బాధ్యత గల భర్త లక్షణమైన పిల్లలు. మనవలిద్దరు కూడా ఎంత ముద్దు వస్తున్నారు అంటూ ముచ్చటగా చూశారు వచ్చిన వొళ్ళు.
ఎందరికో లభించనివన్నీ ఆమెకు లభించాయి. అయినా ఆమె ఎందుకు వెళ్ళి పోయింది. శాంత చెప్పినట్టుగా తీపిమొహం మొత్తేసిందా. ఏ కష్టం ఎరగకుండా సాఫీగా సాగే జీవితం ఆమెకి నచ్చలేదా? విమల అన్నట్లుగా ఆమెకి హెల్తు ప్రాబ్లమ్ ఏదన్నా ఉందా? అందుకే రెస్టు తీసుకోవటానికి ఆశ్రమానిక వెళ్ళిందా? లేదు లేదు నిష్టూరంగా మాట్లాడిన శాంత చెప్పిన దాంట్లో నిజం ఉంది. అనారోగ్యం అయితే ఆ ముఖంలో కళ చురుకు ఎందుకు కనిపిస్తాయి. మరి ఏమై ఉంటుంది. తన ఊహకందని విషయం ఎమటది.
దిందు మీద కొకుండా నా గుండె మీద తలపెట్టుకొని నిద్రపోయేది. ఇంతలో ఖం జరిగింది.
మామగారు అన్నమాట పదే పదే గుర్తుకొచ్చింది. మైధిలి ఆయనలాగే భావిం చిందా? ఎందుకు భావించకూడదు అంటూ అంతరాత్మ నిలదిసింది.
నీకు ఏం కావాలి అని ముద్దుగా ఏనాదన్నా అడిగావా. తను ఏమి కట్టుకోవాలో, ఏమి పెట్టుకోవాలో, చివరికి ఆమె ఏమి తినాలో, ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళకృర్లేదో అన్న విషయం నువ్వే డిసై డ్ చేసేవాడివి. అది అంతా ఆమె మీద నీకున్న (మేమాభిమానాలకి నిదర్శనమా?
మోచర్ల రామలక్ష్మి * 33.
నేను ఆమెని అలా చూస్తాననేగా, ఎందరో ఆమె స్నేహితురాళ్ళు బంధువులు కూడా ఆమె అదృష్టవంతురాలు అంటారు. బుకాయించకు. ఆమె సరదాపడి పుల్టీం టికి వెడతానన్నా నిన్ను వదిలి ఉండలేనన్నావు. ఆమె పుట్టింటికి వెడితే నీ ఇంట్లో ఎన్నో పనులు జరగవు. వాటివల్ల నీకు, నీ తల్లిదండ్రులకి ఇబ్బంది. అంతేకాక ఆమె ఈ నగ బాగుంది అంటే పూర్ టేస్టు అనేవాడివి. ఈ చీర బాగుంది అంటే పెదవి విరిచి బాగాలేదనేవాడివి. అంతెందుకు ఆమెకి నచ్చిన సినిమాకి అన్నా నువ్వు తీసుకెళ్ళావా? ఇలా చెప్పుకుంటూ పోతె ఎన్నో ఉన్నాయి. ఆమెకి ఆమెదైన అభిప్రాయం, ఆలోచన, ఇష్టం అనేవి లేకుందానే గడిపేసింది. అదే ఆడదానికి ఆనందం భర్త ఇష్టాలని ఇవ్టాలుగా కష్టాలని కష్టాలుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే భర్త మనసులో చోటు ఉంటుంది. అయినా మన ఈ భారతదేశంలో ఎంతమంది ఆడ వాళ్ళు, స్వేచ్చగా ఉండి స్వతంత్రంగా (బ్రతుకుతున్నారు. వాళ్ళందరి కన్నా మైధిలి చాలా అదృష్టవంతురాలు. అక్మర్లేనివి చెప్పి నా బుర్రపాడు చెయ్యకు అంటూ సగటు మొగాడిలాగే మనసుని నొక్కేశాడు శ్రీరామ్.
నువ్వు ఎన్ని చెప్పు. మీ మామగారు నిజం చెప్పాడు. తన కూతురు ఓ విలువైన వస్తువు, ఆగకుండా తిరిగే యంత్రం అని. ఇది నిజంకాదా? అని అతని మనస్సు మళ్ళీ నిలదీసింది. కోడలు చెప్పినట్టు అడగడానికి వెళ్ళాలి. కోడలు, కూతురు అమె రికా వెడుతున్నారు. వాళ్ళ పిల్లన్ని చూడాలి. వాళ్ళు నీ దగ్గరే అలవాటు అని నచ్చచెప్పాలి. మనవలకోసం ఆమె తిరిగి వస్తుంది అనుకున్నాడు, భార్య తిరిగి ఇంటికి వస్తుంది అన్న ఆలోచన అతని మనసుకి హాయినిచ్చింది. అతడికి కంటిమీద కునుకు వచ్చింది.
సాయంత్రం నాలుగు గంటల సమయాల్లో నిర్మల ఆశ్రమంలో కాలుపెట్టాడు శ్రీరామ్. అతని మనసుకి ఎంతో ప్రశాంతత చేకూరింది. పూలచెట్లు, ఫలవృక్షాలతో హరిత వర్ణంలా ఉన్న ఆ ప్రాంతం ఎవరికైనా ఆహ్లాదాన్ని ఇస్తుంది. మైకులోంచి మందార మకరంద మాధుర్యమును అంటూ పోతన భాగవతంలోని పద్యం ఎంతో మధురంగా వినిపిస్తోంది,
కాటేజ్ ముందు కుర్చీ వేసుకొని కూర్చుని ఆ పద్యాన్ని భక్తిపారవశ్యంతో వింటున్న ఓ వృద్ధుణ్ని చూశాడు శ్రీరామ్.
నమస్మ్కారంఅంటూ పలకరించాడు. ఎందుకు అన్నట్టుగా చూశాడా పెద్దాయన.
ప్రతి నమస్కారం చేసి. *ఈ' ఆశ్రమంలో మీకు సదుపాయంగా ఉందా” అన్నాడు
34 * అక్షర ళిల్పాలు
“చాలా సదుపాయంగా ఉంటుంది. పురాణ కాలక్షేపం చేసేది ఎవరు" అన్నాడు శ్రీరామ్.
ఈ మధ్య ఓ మహాతల్లి మా ఆశ్రమానికి వచ్చింది అన్నపూర్ణ తల్లిలా రుచిగా వండి పెడుతోంది అన్నాడతడు,.
పురాణాలు చెప్పే మంచి వంటావిడ అన్నమాట అన్నాడు శ్రీరామ్.
“ముక్కుమీద వేలువేసి తప్పు అలా అనకు. ఆమె కోటేశ్వరుడి భార్య. ఇప్పుడు మనం వింటున్న పద్యాలు ఆమె రాగయుక్తంగా పాడుతోంది. కాస్త మాట్లాడకుండా కూర్చోండి భాగవతంలోని పద్యాలు వినటం పూర్తయ్యాక మీతో మాట్లాడతాను" అన్నాడు ఆ పెద్దాయన,
శ్రీరామ్ చిన్నగా నవ్వుకుంటూ భాగవత కాలక్షేపం జరిగే స్టేజ్ దగ్గరకు వచ్చాడు. స్టైజీ మీద మైధిలి చిన్న తివాచి మీద కూర్చుని ఉంది. స్టేజీ ముందు ఏజైకి పైగా పెద్దలు కుర్చీలలో కూర్చొని ఉన్నారు. ఆమె చేసే భాగవత గానం వారి వీనులకు విందుగా ఉంది.
ఆఖరి వరుసలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమెనే కన్నార్పకుండా చూస్తు న్నాడు. నగలన్నీ ఇంట్లోనే తీసేసింది. లేత నీలం రంగుచీర రవిక కట్టుకుంది. నిరా దంబరంగా ఉంది. అయినా ఎంత చక్కగా ఉంది మైధిలి. అరవై ఏళ్ళ వయస్సులో కూదా బుగ్గల్లో నిగనిగ, మొహంలో మెరుపు, చక్కటి పలువరస, సంపెంగి లాంటి నాసిక, ఆకర్షణీయమైన ఆ కనుదోయే నా మనసుని దోచుకున్నాయి.
నిశ్చలమైన ఆమె మనసు, ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆమె పెదవుల మధురిమలు, పంటి బిగువు గుర్తుకొచ్చి ఆమెకేసి ఆరాధనగా చూశాడు.
మొదటి నుంచి ఇతన్ని గమనిస్తున్నా ఓ పెద్దాయన తప్పు బాబు, ఆమెకేసి అలా చూడకు అన్నాడు,
“నెనేం తప్పు చేశాను. మీ అందరిలాగే నేనూ చూశాను” అన్నాడు శ్రీరామ్ ఆయనకేసి విస్తుపోయి చూస్తూ,
“నీ చూపుల్లోని వికారం తెలుసుకోలేకపోవటానికి నేనేమో ఎనిమిదేళ్ళ పసి వాదిని కాదు. ఎనఖై ఏళ్ళ అనుభవజ్ఞ్జుడుని. ఆమె రోజూ ఓ మంచి విషయం చెప్త తుంది. అది విని బుద్ధిగా మసలుకో” అని ఆమె ఏదో చెపుతుంది విను అంటూ స్టేజీమీద ఉన్న ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు ఆ పెద్దాయన,
“భార్యని కళ్ళారా చూసుకోవటం తప్పని మరొకరి చేత చెప్పించుకోవటం"” హతవిధీ అనుకున్నాడు శ్రీరామ్.
మోచర్ల రామలక్ష్మి * క
“మైధిలి కేసి చూసి అమ్మా నిన్న నిన్నాకటి అడిగాను, ఆ విషయం ఈరోజు చెపుతానన్నావు” అంది ఓ వృద్ధురాలు.
“ఆ విషయానికే వస్తున్నా నేను ఆశ్రమానికి ఎందుకొచ్చాను అన్నదేగా మీ సందేహం” అంది.
ఆమె బెనన్నట్టుగా తలఊపింది.
“ఆశ్రమానికి రావటానికి గొడవో, ఇబ్బందో ఉండక్కర్లేదు. పూర్వం రాజులు కొడుకులకి పట్టాభి షేకం చేసి తాము తపోవనానికి వెళ్ళేవారు. అక్కడ వారిచే మహా బుషులు, రాజ్యక్షమం, ప్రజాక్షేమం కోరి యజ్ఞయాగాదులు చేయించేవారు. భాధ్య తలు తీరాక భగవత్ సన్నిధి వైపు పయనించాలి అనేది ముఖ్యఉద్దెశం.
ఇది అంతా ఎందుకు చెపుతున్నానంటే ముసలి తల్లిదండ్రులకు సేవచేయ కుండా ఆశ్రమానికి ఎందుకొచ్చావు అని ఈ ఆశ్రమంలోనే ఉంటున్న కమల పిన్నిగారు నన్ను అడిగారు. ఆవిడ మా అమ్మగారి స్నేహితురాలు. మా కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన మనిషి
మా అమ్మగారిని నాన్నగారిని నాతో పాటే ఆశ్రమంలో చేరమన్నాను. మా న్నగారు ఒప్పుకున్నా మా అమ్మ గారు ఆశ్రమంలో చేరటం చిన్నతనంగా భావిం చారు. చిన్న కూతురి దగ్గరే జీవితం గడిపేస్తాం అన్నారు అంది మైధిలి.
అమ్మయ్య మైధిలికి నా మీద మంచి అభిప్రాయమే ఉంది. నేను అనవసరంగా ఏవేవో అనుకున్నాను” అని అనుకున్నాడు శ్రీరామ్.
నాకు కవిత్రయం భారతం, పోతన భాగోతం, చదువుకోవాలని ఎంతో తపన. నా అరవై ఏళ్ళ కుటుంబ జీవితంలో నా ఈ చిన్న కోరిక తీరలేదు. తల్లిదండ్రుల వారి అదుపు ఆజ్ఞ్జలలో పెరిగాను. తరగతికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే చదువుకోగలిగాను. అత్తింట వారి ఆదరాభిమానాలు పొందాను. ఏ పని అయినా బాధ్యతతో చేశాను. భారత భాగవతాలు చదువుకోటానికి సమయం చిక్కేదికాదు. ఆ తరువాత పిల్లలని కనిపెంచటంతో సరిపోయింది. ఆ తరువాత వారి పిల్లలని చూడటం, ఇది ప్రీకి భగవంతుడు ఇచ్చిన వరం అనటంలో సందేహం లేదు. ఈ నా దేహం క్షీణించటం మొదలుపెట్టకుండా కవిత్రయ భారతాన్ని పోతన భాగవ తాన్ని, చదవాలనే ఆరాటంకొద్దీ ఈ ఆశ్రమానికి వచ్చాను అంది మైధిలి.
మీ వారు, మీరు ఏడాది ఆశ్రమంలో ఉంటానంటే ఒప్పుకున్నరా? అన్నాడు ఓ వృద్ధుడు.
36 * అక్షర ళిల్తాలు
“వారి అభిప్రాయం నేను అడగలేదు. వారు చెప్పలేదు” అంది మైధిలి.
“మీ పిల్లలు” అని మరొకరు ప్రశ్నించారు.
“నేను వాళ్ళ పిల్లల్ని కనిపెట్టుకుంటే, వాళ్ళు విదేశాలు వెళ్ళి మరికొన్ని డిగ్రీలు తెచ్చుకుంటారు. నా కోసం కూడా నెను చూసుకోవాలిగా” అంది మైధిలి.
“పెదవి విప్పకుండా అమాయకంగా పనులు చేసుకుపోయె మైధిలి ఎన్ని విష యాలు మాట్లాడుతోంది. ఆమె చెప్పినట్లుగా యాంత్రిక జీవితం ఎన్నాళ్ళు గడపాలి. ఎన్నాళ్ళు మీటింగులు, టూర్లు అంటూ తిరగాలి. ఎంత సంపాదించినా పిల్లలు వద్దు అనరు. మైధిలితో మాట్లాడాలి” అనుకున్నాడు శ్రీరామ్. మెల్లగా ఆఫీసు రూమ్ వైపు వెళ్ళాడు. అమ్మా ఒకాయన ఆఫీసు రూమ్‌లో కూర్చున్నాడు. ఆయన వచ్చి నప్పటి నుంచి మైధిలి మేడంగార్ని వళ్ళంతా కళ్ళు చేసుకు చూస్తున్నాడు. ఆయన మైధిలి మేడంగార్ని కలవాలిట అని చెప్పింది నిర్మలతో ఆశ్రమంలో తోట పనిచేసే రంగమ్మ.
ఆఫీసు రూమ్ వైపు వచ్చారు మైధిలి. నిర్మల కుర్చీలో కూర్చున్న శ్రీరామ్‌ని చూసిన మైధిలి మనసు చివుక్కుమంది. నీట్‌గా షేవ్ చేసుకునే మనిషి గడ్డం మాసి ఉన్నారు. ట్రిమ్గా డ్రస్సు అయ్యే అతను షర్టు ప్యాంటు మాచ్ అయినట్టులేదు.
తనకేసి జాలిగా చూస్తున్న భార్య కేసి చూసి మై..ధిలి, నను ఈ ఆశ్రమానికి వచ్చేస్తాను అన్నాడు.
ఎందుకు? అందామె. నీ కోసం ... కాదు కాదు నా కోసం” అన్నాడు శ్రీరామ్.
“మీ మైధిలిని వదిలి ఉండలేకపోతున్నారా” అంటూ హస్యమాడింది నిర్మల.
“ఆ రాముడు మైధిలిని అడవికి పంవాదు. ఈ శ్రీరామ్‌ని మైధిలి జనారణ్యంలో వదిలేసింది. ఆ రాముడెమో గాని ఈ రాముడు మైధిలిని వదిలి ఉండలేడు. ఓ నెల రోజుల్లో నా బిజినెస్ పన్లు, ఎవరెవరికి అప్పగించాలో అప్పగించేస్తాను. నా కోసం, నా మైధిలికోసం వస్తాను. నిర్మలమైన ఆశ్రమ జీవితం గడుపుతాను” అన్నాడు శ్రీరామ్.
- ఆధి వాక అడడమ్యెసాట-- మోచర్ల రామలక్ష్మి * 37
(ప్రేమికుడు శశ కిరాణాలు సోకి, తారలకి తాపం తీరింది. ఈ రేయితో తన తాపం తీరుతుంది అనుకుంది ్రపుల్ల. స్నేహితురాలు చెప్పినట్టుగా, రతీదేవిలా తయారయ్యి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్‌మీద పడుకున్న భర్త ప్రక్కన కూర్చుంది.
“ప్రమో నిద్రపోతున్నావా?” అంటూ అతని పెదవుల మీద తన చూపుడు వ్రేలితో లాలనగా రాసింది. కళ్ళు తెరచి, భార్య కులుకు చూసిన ప్రమోద్ ఉలిక్కి పడ్డాడు. ప్లీజ్ ప్రపూ నన్నాదిలేయి” అంటూ గాబరాగా ఆమె కేసి చూశాడు.
“ప్రమో భయపడకు. నిన్ను నేనేం చెయ్యను. సరదాగా కబుర్లు చెప్పుకుందాం” అంటూ అతని భుజానికి తన భుజం తగిలించింది.
“అర్ధరాత్రి వేళ కబుర్లేంటి. పైగా తెల్లచీర కట్టుకొని జదనిందడా పూలు పెట్టు కున్నావ్. అదోలా చూస్తూ మీది మీదికొస్తున్నావ్, నాకేమిటోలా ఉంది” అన్నాడు.
“అలాగే ఉంటుందిట” అందామె.
“నీ కెవరు చెప్పారు” అన్నాడు.
“మా ఫ్రెండ్ హేమ” అంటూ అతని కళ్ళలోకి చూసి మత్తుగా నవ్వింది,
ఆమె నవ్వుకి అతని మనసు చిత్తయి, మేను జివ్వున లాగినా, తమాయించు కొని, “మీ హేమ నీ కింకా ఏం నూరిపోసింది” అంటూ పళ్ళు పటపట కొరికాడు.
“దాని మీద కోపం ఎందుకు, అది మన మంచికే చెప్పింది. కొందరు మొగ వాళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. మన కర్మకాలి అలాంటి వాడు మొగుడైతే మనమే చొరవ చూపాలి. ఆడవాళ్ళమని సిగ్గుపడితే బ్రతుకు బుగ్గి అవుతుంది. అప్పటికీ కాకపోతే దాక్టర్కి చూపించు” అంది అని ఆమె మాట పూర్తి చేసే లోపే, “కామ పిశాచి ఈ గదిలోంచి నువ్వు వోతావా? నన్ను పొమ్మంటావా?” అంటూ కోపంగా అరిచాడు ప్రమోద్.
“గట్టిగా అరవకు మా రైతులు నిద్రలేస్తె, నీ పరువే పోతుంది. రేపటి నుంచి నీ గదిలోకి రాను. ఈ విషయంలో నువ్వు ఎందుకు మూడీగా ఉంటున్నావు, నిజం చెప్పు నేనేం అనుకోను. మనపెళ్ళి ముందు మా హాస్టల్ ముందు, నా కోసం ఎలా పడిగాపులు కాసేవాడివి. ఎవడైనా నన్ను కాఫీకి రమ్మన్నాా కన్నెత్తి చూసినా, వాళ్ళ వళ్లు సున్నం చేసేవాడివి. ఆ చేవ ఏమయ్యింది” అందామె.
“ఆ వయసు అలాంటిది అన్నాడతను,”
38 * అక్షర ళిల్పాలు
“అప్పటికీ, ఇప్పటికీ సీ వయస్సు ఎంత పెరిగింది అందామె.”
“ఆరు నెలలు, అంతేగా మన పెళ్ళి అయి” అన్నాడతను.
“పెళ్ళీట, పెళ్ళి. మనదో పెళ్ళ, నాదో (బతుకు, నీకసలు పెళ్ళికి అర్ధం తెలుసా”' అంటూ భర్తని నిలదీసింది ప్రపుల్ల.
“తెలుసని తల ఊపి, ధర్మార్ధ కామ మోక్షాలలో నీకు నేను తోడుగా ఉంటానని" అన్నాడు.
“ముద్దు ముచ్చట తెలియని మొద్దుమొఖానికి మంత్రాల అర్ధం బాగానే తెలిసింది. ఆ మంత్రాలలోని పరమార్ధం నీ మట్టి బుర్రకి ఎప్పటికి తెలుస్తుంది” అంది.
“ఆ టైమ్ వస్తుంది. అంత వరకు వాయిగా నిద్రపో” అంటూ అతను నిద్రలోకి జారుకున్నాడు.
“సూర్యోదయం అయింది. జనాలకి దినచర్య మొదలయింది. ప్రమో కాఫీ” అంటూ కరిచినట్టె అరిచింది ప్రపుల్ల,
“కాస్త మృదువుగా పిలవవచ్చుగా” అంటూ ఆమె చేతిలోని కాఫీ కప్పు అందుకున్నాడు (ప్రమోద్,
“నేనంతే ఇలాగే పిలుస్తాను” అని కసిరిందామె.
“పెళ్ళికి ముందు నా రూమ్‌కి వచ్చి నేను కాఫీ కలుపుతుంటే, నన్ను కలుప సీయకుందా, నువ్వే కాఫీ కలిపి, నాకు ఇచ్చి కాఫీ ఎలా ఉంది [ఘప్రమా అంటూ ప్రియంగా అడిగే దానివి. ఇప్పుడు ఆ ఆపేక్షంతా ఏమయింది” అంటూ కొంటెగా నవ్వాడు ప్రమోద్.
అతని మాటలకి ఆమెకి నవ్వు వచ్చింది. ఆ క్షణం ఆలుమగలు హాయిగా నవ్వుకున్నారు. అంతలో ఫోన్ మోగింది. ప్రపుల్ల ఫోన్ ఎత్తింది. హలో నేనే, చెప్పు. “రాను, రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడెందుకు మనం కలిసినప్పుడు చెపుతాను బై” అని ఫోన్ పెట్టేసింది ప్రపుల్ల.
“ఫోన్ చేసింది హేమ” కదూ అన్నాడు (ప్రమోద్.
“ఎలా కనిపెట్టావ్” అంది ప్రపుల్ల.
జరీ చచ్చు సమాధానాలు విని, పనికిమాలిన దాని ఫోన్” అనుకున్నానన్నాడు.
“ప్రమో నన్ను అంటే అను, హేమని అంటే మాత్రం ఊరుకోను” అని విసు రుగా సమాధానం చెప్పింది ప్రపుల్ల.
మోచర్ల రామలక్ష్మి * 39
“బరితెగించిన దాన్ని అంత వెనకేసుకొస్తున్నావ్” ఏంటి కథ అన్నాడు,
“ఎంటి వాగుతున్నావ్. వళ్ళు జాగ్రత్త” అంటూ అతని షర్టు కాలర్ పట్టుకుంది ప్రపుల్ల.
“అప్పుడే ఊరి నుంచి వచ్చిన తార ఆడియో లేని వీడియో సీన్ చూసింది.”
“ఏం తల్లీ మా తమ్ముణ్ణి పీక పిసికి చంపేస్తావా” అంది.
“ఛ అలా ఎందుకు చంపుతుంది. షర్టు బటన్ ఊడితే పెడుతున్నావ్ కదూ” ప్రపూ అన్నాడు.
భర్త మాటకి బెనన్నట్టుగా తల ఊపిందామె,
“అలా సర్దుకోక ఏం చేస్తావ్ వెర్రి వాజమ్మ. మొగాడిగా బ్రతికే యోగం నీకు ఉంటే నా మాటే వినేవాడివి. మా బావగారి కూతుర్నే పెళ్ళి చేసుకునే వాడివి అంది.”
“అక్కామీ బావగారి'కూతురు మొగుణ్జీ మరద్దరు చేసి పారిపోయిందిగా” అన్నాడు (ప్రమోద్.
“నీకెవరు చెప్పారురా” అంటూ కోపంగా తమ్ముడి కేసి చూసింది తార.
“నువ్వేగా పధి రోజుల క్రితం ఫోన్లో చెప్పావు మర్చిపోయావా” అన్నాడు అమా యకంగా (ప్రమోద్.
“ఓరి తింగర మాలోకం, ఎవత్తో మొగుణ్ణి మర్దర్ చేసిందన్న విషయం ఎవరైనా పెళ్ళాం ముందు చెబుతారా. నీ వాలకం చూస్తుంటే పెళ్ళాన్ని ఎలా చూడాలో, ఆమెతో ఏం చెప్పాలో తెల్సి ఏడిసినట్టు లేదు” అంది తార.
“మీ తమ్ముడి గురించి కరెక్టుగా చెప్పారు వదినగారు. కాఫీ తీసుకొస్తాను. మీ తమ్ముడితో కబుర్లు చెప్పండి” అంటూ వంటింట్లోకి వెళ్ళింది ప్రపుల్ల.
“ఒరేయి తమ్ముడు మీ ఆవిడ పద్ధతి నాకేం నచ్చలేదురా” అంది తార.
“ఎందుకు?” అన్నాడు ప్రమోద్.
“భర్తని కొట్టడం అనేది మన సంస్కృతి కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొట్టినా, మరో కంటపడకుండా జాగ్రత్త పదాలిరా” అంది.
“ఇందులో ప్రపు తప్పేమీ లేదు. (ఫెష్ ఎయిర్ వస్తుందని వీధి తలుపు నేనే తీశాను. నువ్వు వస్తావని మాకు తెలియదు కదా” అన్నాదు (ప్రమాద్.
“నువ్వు ఇలాగే దాన్ని వెనకేసుకు వస్తే నిన్ను నీ మాటని లెక్క చెయ్యదు.
“ఇ ఇలకళల్తాాం
పెళ్ళాం అంటే ముద్దుండొచ్చు అలాగే హద్దు ఉండాలి. కాస్త లౌక్యం తెలుసుకు (బ్రతుకు” అంది తార.
“అమ్మ గోరా? సుట్టం సూపుకొచ్చారు. సూసిపోవాలా ఇట్టా ఆలుమొగలు మద్ద అగ్గి ఎట్టగూడదు” అన్న ఆకారాన్ని చూసి హడలి పోయింది తార.
“ఒరేయ్ తమ్ముడూ ... మీ అవిడ గూండాల్ని మెయింటెన్ చెస్తోందా?” అని మెల్లగా అడిగింది.
“ఛా అతను గుండా కాదు అక్కా మా మామగారి పొలంలో పనిచేసే రైతు” అన్నాదతను,
“రెతంటే తిండీ తిప్పలు లేకుండా పీనుగలా ఉంటాడుగా. వీడు నున్నగుండు, వత్తుగా ఉన్న మీసం, కండలు తిరిగిన వళ్ళుతో పిటపిటలాడుతున్నాడు” అని మెల్లగా అందామె.
“అయినా ఆమె మాటలు వాళ్ళకి వినిపించాయి. అమ్మగోరా మా అన్నయ్యని దిల్లీ కొట్టకందమ్మా అసలే నీర్సంగున్నాడు. హాస్పటల్కని వచ్చాం” అని అతనిలాగే ఉన్న నాలుగు అకారాలు ముక్త కంఠంతో పలికాయి.
“వీళ్ళు ఎవరురా” అంటూ తమ్ముడి కేసి భయం భయంగా చూసింది.
“అతని సోదరులు” అన్నాడు (ప్రమోద్.
“వీళ్ళు అందామొ”
నెలకొకసారి వచ్చి పదిహేను రోజులుంటారు అన్నాడు.
“వస్తాదుల్లా ఉన్న రైతు సోదరులని మేపుతున్నారు. నువ్వు నీ మావగారు కొత్త పార్టీ ఏదన్నా పెడతారా” అంది తార.
“ఆమె మాటకి రైతు సోదరులు వికట అట్టహాసం చేసి, రాజకీయాలలో జేరి, సంపాదించుకోవల్సిన ఖర్మ మా అయ్యగారికి లేదు. మా అయ్యగారే పార్టీ ఫందడులకు డబ్బు ఇస్తార” అంటూ గర్వంగా మీసాలు తిప్పుకున్నారు.
“ఒరేయ్ వాగుడు అపి మింగుడుకి రండి. మీ బస్సు టైమ్ అవుతోంది” అని రితు నోదరులను పిలిచింది ప్రపుల్ల,
“ఘ్రపుల్లా, నాలుగు రోజులు కూర్చోబెట్టి కమ్మగా వండిపెట్టావు. చీర సారే పెట్టీ సాగనంపుతున్నావ్. నాకు ఎంతో సంతోషంగా ఉంది” అంది తార.
“వదినా మీరు ఉన్న నాలుగు రోజులు మాకు సంబరంగా ఉంది వస్తూ
ఉండండి” అంటూ తార సూట్‌కేసు కారులో పెట్టింది ప్రపుల్ల.
“అలాగే వస్తా, త్వరలో స్వీట్‌న్యూస్ చెప్ప అంటూ కారిక్కుతూ మరదలికి చెయ్యి ఊపింది తార,
అలాగే అంటూ తల ఊపింది ప్రపుల్ల.
ప్రమోద్ “ఆడపిల్ల పెళ్ళికి ముందు వస్తువులు ముస్తాబు కావాలనుకుంటుంది. పెళ్ళి అయ్యాక సౌభాగ్యం, సంతానం కోరుకుంటుంది” అంది తార,
“ఈ విషయం నాకెందుకు చెపుతున్నావ్” అన్నాడు ప్రమోద్.
“ఎందుకో తెలియదా” అంటూ తమ్ముడి కేసి జాలిగా చూసింది.
“నీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే మా ఊరురా, మీ బావగారు గుట్టు రట్టు కాకుండా దాక్టర్కి చూపిస్తారు” అంది.
అక్క అభీమానంగా రమ్మన్నా ప్రమోద్‌కి తల కొట్టెసినట్టనిపించింది. (ప్రపు నేను, రాత్రి పూట వేరు వేరు రూమ్‌ల్లో పడుకోవడం వల్ల అపార్ధం చేసుకుంది. ఫణి భూషణరావు నా మీద ఇంత పగబట్టావా. నా వాళ్ళే నన్ను అవమానించేట్టు చేశావ్. నాకు టైమ్ వస్తుంది అప్పుడు చెపుతానని మనసులోనే ప్రతిజ్ఞ చేసు కొన్నాడు. అక్కని సాగనంపి ఇంటికి మరలివచ్చాడు.
ప్రపుల్లా ప్రమోద్‌ల ఇంటికి ఎందరో బంధువులు వచ్చారు. వీళ్ళ వింత కాపురం చూసి ఆశ్చర్యవోయారు.
“కాలచక్రం గిర్రున తిరిగింది, ఆ రోజు డిసెంబర్ ఎనిమిది. ప్రపుల్ల, ప్రమోద్‌ల పెళ్ళి రోజు. ప్రపు నువ్వ స్నానం చెయ్యి, నేను టిఫెన్ తయారుచేస్తా” అన్నాడు ప్రమోద్ ప్రపుల్లతో.
_ మ్యారేజ్‌డే అని గ్రీట్ చెయ్యడానికి వచ్చింది హేమ. జట్టు చిక్కు తీసుకుంటూ (ఫెంద్తో కబుర్లు చెపుతోంది ప్రపుల్ల.
సతీ సమేతంగా బంధుమిత్ర పరివారంతో కూతురింటికి వచ్చాడు ఫణి భూషణరావు.
“జడ వెసుకుంటున్న ప్రపుల్ల వాళ్ళని చూసి వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్ దాడీ” అంది.
అల్లుడుగారేరమ్మా అని కూతుర్ని అదిగింది లీలావతి.
వంట ఇంట్లో ఉన్నాడు అంది ప్రపుల్ల.
అక్కడేం చేస్తున్నారు అన్న లీలావతితో, “వెధవ తెలివితక్కువ ప్రశ్నలు, వంట ఇంట్లో ఏం చేస్తారో తెలియదా? అల్లం పచ్చిమిర్చి దట్టించిన తాళింపు ఘుమ
42 * అక్షర ళిల్సాలు
ఘుమలాడుతోంది. దాంతో ఉప్మా చేస్తున్నాడని ఇట్టే చెప్పొచ్చు” అన్నాడు ఫణి భూషణరావు.
“టిఫెన్ రెడ” అంటూ ఉవ్మా కొబ్బరి పచ్చడి వేసిన ప్లేట్లు అందరికీ అందిం చాడు ప్రమోద్.
“ఉవ్మ్నా చెట్నీ బాగా చేశావ్. మీ అత్తగారికి నేర్పు” అంటూ వేడి వేడి ఉష్మాని ఆవురావురుమంటూ తిన్నాడు ఫణిభూషణరావు.
“అంకుల్ ఉప్మాలో ఉన్న వేడి మీ అల్లుడికి లేదు. (ప్రేమ పెళ్ళి అన్న మాటే కానీ ఉత్తి దద్దోజనం” అంది హేమ.
“పపు నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు అల్లుడు” అంటూ ఆగిపోయాడు ఫణి భూషణరావు,
“స్నేహితులులాగే ఉన్నాం” అంది (ప్రపుల్ల.
“అల్లుడు నువ్వే గెలిచావ్” అన్నాడు ఫణిభూషణరావు.
“అక్కడ ఉన్న పాతిక మంది ఏం పందెం పెట్టారు” అని అడిగారు.
పెళ్లి అయ్యాక ఏడాది బ్రహ్మచర్యం వొటించాలి. ఏదో కారణం చెప్పి విడివిడిగా ఉందకూడదు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉందాలి. అప్పుడే మా అమ్మాయి మీద నీకు నిజమైన (ప్రేమ ఉన్నట్టు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. చెపితే ప్రపు మీద ఒట్టు అని అల్లుడికి చిన్న పరీక్ష పెట్టాను. ఇందులో నెగ్గాడు” అంటూ నవ్వాడు.
“చిన్న పరీక్షా? మీ అమ్మాయి (ప్రేమాగ్నికి ఎక్కడ గురవుతానో అని హడలి పోయాను. బంధువులందరూ నన్నో పనికిమాలిన వాడిగా, ప్రపు జీవితం పాదై పోయిందని దుమ్మెత్తి పోశారు. హేమ సరేసరి ఫోన్ కోచింగ్‌లు” అన్నాడు ప్రమోద్.
“ఇన్ని ఆటుపోటులకి తట్టుకున్నావు కనక మా అమ్మాయినే కాదు. ఓ వంద ఎకరాల పొలం నీకు ఇస్తాను. నేను తాతయ్య అవుతున్నానని తెలిసే వరకు మీ గుమ్మంలో కాలుపెట్టం, పదండిరా, వెడదాం” అంటూ స్వపరివార సమేతంగా త ఇంటీకి వెళ్ళాడు ఫణిభూషణరావు.
“ప్రమో నేను చాలా అదృష్టవంతురాల్ని నా భర్త కాముడు కాదు, (పేమికుడు” అంటూ ప్రమోదంగా అతని కేసి చూసింది. ఆమె చూపులు తాకిన అతని మనసు (ప్రపుల్లమయ్యింది.
-అహ్తవా* అపాం మోచర్ల రామలక్షై * 43
స్నేహ రత్న
లౌళ్ళన్నీ ఒక చోటికి, రత్నాలన్నీ ఒక చోటికి చేరతాయంటారు. రాళ్ళమాటేమోగాని రత్నాలు మాత్రం హైదరాబాద్ చేరాయి. రత్నాలంటే రత్నాలుకాదు. వనితా రత్నాలు, ఆ రత్నాలు వివేక్‌నగర్ కాలనీలో దగ్గర దగ్గర ఇళ్ళల్లోనే ఉంటున్నారు. కూరలు సరుకులు వగైరాలు కొనుక్కునేటప్పుడు చిరునవ్వుతో మొదలైంది వారి నెయ్యం, పరస్పర పరిచయాలతో ఒకళ్ళ ఇంట్లో ఒకరు తరచూ కలవటం వరకూ పెరిగింది. ఆ రోజు రత్నప్రభ ఇంట్లో స్నేహితురాళ్ళు కలిశారు. తను చేసిన గుంటపొంగరాలు, కొబ్బరి పచ్చడి కొసరి కొసరి వడ్డించింది రత్నప్రభ. కమ్మగా తిని మీ మనసులోనే కాదు, మీ చేతిలోనూ అమృతముంది అంటూ మెచ్చుకున్నారు స్నేహితురాల్ని మీ(త్ర రత్నాలు.
రేపు సాయంత్రం మీరు నలుగురూ మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకోవాలి అంది రత్నప్రభ,
ఎమిటి స్పెషల్ అంది కనకరత్నం.
స్పెషలేం లేదు. ప్రతి శుక్రవారం ఉదయాన్నే పూజచేస్తాను. సాయంత్రం ముత్త యిదువులకు తాంబూలం ఇసాను అంది రత్నప్రభ.
నేను ఏదో పూజచేస్తాను. కాకపోతే నాది చిన్నపూజ అంది సీతారత్నం.
నేనైతే పూజలు తక్కువే. ఉపవాసాలే ఎక్కువ అంది రాధారత్నం.
నేను మాత్రం పొట్ట పూజ చేస్తా. ఉపవాసాలంటూ ఆత్మారాముణ్ణి బాధించను అంది మణిరత్నం.
ఈ అయిదుగురి ఆలోచనలు, అభి[ప్రాయాలు, ఇంటి పరిస్థితులలో కాస్తంత అంతరాలు ఉన్నా స్నేహపూరితమైన వారి మనస్సులలో తాము ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న తపన ఎక్కువే. అందుకే వారు రత్నప్రభ, రాధారత్నం ఇష్టప్రకారం దేవాలయాలకీ, మణిరత్నం, కనకరత్నం కోసం సంగీత కార్యక్రమాలకి, సీతారత్నం ఇష్టమైన సాహిత్య సభలకి కలిసే వెళతారు. ఇళ్ళల్లో పనులు పూర్తిచేసుకోవడం, అయిదుగురూ ఒక చోటకి చేరటం వారి దినచర్యల్లో ఒక భాగమైపోయింది. ఈ మిత్ర రత్నాలకి బయట ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళ గోల వాళ్ళదే అను కునేరు. నలుగురితో కలవటం, పలువురికి సాయపడటం అనే ఓ మంచి గుణం ఉంది. చుట్టు పక్కల ఉన్న వాళ్ళకి మాటసాయం, చేత సాయం, ధనసాయం చేయ టంలో మిత్ర రత్నాలు ముందుగానే ఉంటారు. వీళ్ళని చూసి చాలామంది పంచ రత్నాలు, మిత్రరత్నాలని అభిమానంగా పిలుస్తారు. ఆ కాలనీలో ఎవరింట్లో ఏ
44 * అక్షర శిల్పాలు
శుభకార్యం అయినా ఐదుగురూ కలిసే వెళ్ళటం, అయిదుగురూ కలిసి ఒకె బహు మతి కొని ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది.
కాలగమనంలో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మధురమైన వారి మైత్రి మాలతీలతలా వారి హృదయాలలో దట్టంగా అల్లుకువోయింది, వారిలో ఏ ఒక్కరికి కాలులో ముల్లు గుచ్చుకున్నా కంటిలో నలకపడినా, ఇంటిలో గొడవైనా మిగతా నలుగురు విలవిలలాదిపోతారు. కష్టసుఖాలను కలబోసుకుంటూ హాస్యాన్ని రంగ రించి, ఒకరినొకరు ఓదార్చుకుంటూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయి” అనే పాటలా హాయిగా గడిపేస్తున్నారు.
ఏమిటోయ్ డల్‌గా ఉన్నావు. సొంత ప్లాట్ కొనుక్కున్నామన్న హుషారే లేదు. రోజూ మీ మిత్రరత్నాల్ని కలవటం లేదనా! అంటూ భార్యని అదిగాడు రమణ. అలాంటిదేమీ లేదు. మేము రోజూ కలుస్తూనే ఉన్నాం. కనకానికి ఒంట్లో బాగోలేదు. అందుకే నాకేమిటో బెంగగా ఉంటోంది. అయినా ఈ రోజు వాళ్ళు నలుగురూ మన ఇంటికి వస్తున్నారు అంది రాధ.
ఎప్పుడూ మీరందరూ మీ ప్రభ ఇంటికే భోజనానికి వెళతారుగా. ఈవెళ నీవు పిలిచావా? ఏం స్పెషల్ చేస్తున్నావ్? అన్నాడు రమణ. వాళ్ళకి నా గురించి తెలుసు అంటూ నవ్వింది రాధ. నీకు వంట చేయటం ఎలర్జీ అన్న విషయం వాళ్ళకి చెప్పేశావా? అయ్యో రామా వాళ్ళ పేరు చెప్పన్నా ఈ రోజు స్పెషల్ చేస్తావనుకున్నా అంటూ భార్యని ఆటపట్టంచాడు రమణ.
వంకర మాటలు ఆపండి. మేము మీలా తిండికి మొహంవాయం. ప్రభ వస్తూ ఫలహారం తెస్తుంది. వాళ్ళు ముగ్గురూ పండ్లు తెస్తారు. నేను కాఫీ ఇస్తాను అంది రాధ. మీ విషయాలు నాకెందుకు? ఏమన్నా వండితే పెట్టు. తిని ఆఫీసుకు పోతాను అన్నాడు రమణ.
ఆ రోజు కనకం పుట్టన రోజు. మిత్రరత్నాలను తన ఇంటికి లంచ్‌కి పిలిచింది ప్రభ. అబ్బ ఎన్ని చేశావో? తినగలమా అంది రాధ. నెను తింటాను బాబూ. నాకు ఆకలేస్తుంది. ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం ఉండకూడదు. నాకు కొంచెం పొంగలి పెట్టు. రెండు పెరుగు వడలు వెయ్యి అంది మణి. నాకు కొంచెమే వడ్డించు అంది కనకం. ఏం పుట్టినరోజు పాపాయికి ఇంట్లోనే ముద్దలు, ముద్దులు అయిపోయాయా అంది రాధ. మనకంత సీన్ లేదు. ఆకలికి ఆగలేనుగా. మా ఆయనకి వండిన దాంట్లోనే నేనూ కొంచెం తిన్నా అంది కనకం. నేను ఇంట్లో టిఫిన్ కూడా తినలేదు. ప్రభ చేతివంట తినాలని వచ్చేశాను అంది సీత. కబుర్లతో కడుపు
మోచర్ల రామలక్ష్మి * 45
శుభకార్యం అయినా ఐదుగురూ కలిసే వెళ్ళటం, అయిదుగురూ కలిసి ఒకె బహు మతి కొని ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది.
కాలగమనంలో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మధురమైన వారి మైత్రి మాలతీలతలా వారి హృదయాలలో దట్టంగా అల్లుకువోయింది, వారిలో ఏ ఒక్కరికి కాలులో ముల్లు గుచ్చుకున్నా కంటిలో నలకపడినా, ఇంటిలో గొడవైనా మిగతా నలుగురు విలవిలలాదిపోతారు. కష్టసుఖాలను కలబోసుకుంటూ హాస్యాన్ని రంగ రించి, ఒకరినొకరు ఓదార్చుకుంటూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయి” అనే పాటలా హాయిగా గడిపేస్తున్నారు.
ఏమిటోయ్ డల్‌గా ఉన్నావు. సొంత ప్లాట్ కొనుక్కున్నామన్న హుషారే లేదు. రోజూ మీ మిత్రరత్నాల్ని కలవటం లేదనా! అంటూ భార్యని అదిగాడు రమణ. అలాంటిదేమీ లేదు. మేము రోజూ కలుస్తూనే ఉన్నాం. కనకానికి ఒంట్లో బాగోలేదు. అందుకే నాకేమిటో బెంగగా ఉంటోంది. అయినా ఈ రోజు వాళ్ళు నలుగురూ మన ఇంటికి వస్తున్నారు అంది రాధ.
ఎప్పుడూ మీరందరూ మీ ప్రభ ఇంటికే భోజనానికి వెళతారుగా. ఈవేళ నీవు పిలిచావా? ఏం స్పెషల్ చేస్తున్నావ్? అన్నాడు రమణ. వాళ్ళకి నా గురించి తెలుసు అంటూ నవ్వింది రాధ. నీకు వంట చేయటం ఎలర్జీ అన్న విషయం వాళ్ళకి చెప్పేశావా? అయ్యో రామా వాళ్ళ పేరు చెప్పన్నా ఈ రోజు స్పెషల్ చేస్తావనుకున్నా అంటూ భార్యని ఆటపట్టంచాడు రమణ.
వంకర మాటలు ఆపండి. మేము మీలా తిండికి మొహంవాయం. ప్రభ వస్తూ ఫలహారం తెస్తుంది. వాళ్ళు ముగ్గురూ పండ్లు తెస్తారు. నేను కాఫీ ఇస్తాను అంది రాధ. మీ విషయాలు నాకెందుకు? ఏమన్నా వండితే పెట్టు. తిని ఆఫీసుకు పోతాను అన్నాడు రమణ.
ఆ రోజు కనకం పుట్టన రోజు. మిత్రరత్నాలను తన ఇంటికి లంచ్‌కి పిలిచింది ప్రభ. అబ్బ ఎన్ని చేశావో? తినగలమా అంది రాధ. నెను తింటాను బాబూ. నాకు ఆకలేస్తుంది. ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం ఉండకూడదు. నాకు కొంచెం పొంగలి పెట్టు. రెండు పెరుగు వడలు వెయ్యి అంది మణి. నాకు కొంచెమే వడ్డించు అంది కనకం. ఏం పుట్టినరోజు పాపాయికి ఇంట్లోనే ముద్దలు, ముద్దులు అయిపోయాయా అంది రాధ. మనకంత సీన్ లేదు. ఆకలికి ఆగలేనుగా. మా ఆయనకి వండిన దాంట్లోనే నేనూ కొంచెం తిన్నా అంది కనకం. నేను ఇంట్లో టిఫిన్ కూడా తినలేదు. ప్రభ చేతివంట తినాలని వచ్చేశాను అంది సీత. కబుర్లతో కడుపు
మోచర్ల రామలక్ష్మి * 45
నింపుకుంటున్నారు. ముందు అన్నం తినండి. సినిమాకు టైమ్ అవుతోంది అంటూ స్నేహితరాళ్ళకు ఆప్యాయంగా వడ్డించింది ప్రభ.
చాలా రోజులైంది కదా మనం కలిసి అంది మణి. అవును. నీకు కుట్టు క్లాసులు, రాధకి సంగీతం క్లాసులు. వీళ్ళిద్దరూ కిస్తీలు చేస్తున్నారు. నాకు ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో సరిపోతోంది అంది ప్రభ. ఈ మధ్య నేను బయటకు వెళతానంటే మా ఆయన మొహం మాడుకుంటున్నారు అంది కనకం. కనకం బావగారిని అనవసరంగా ఏమీ అనకు. నీవు మందులు సరిగా వాడటం లేదని నా దగ్గర బాధపడ్డారు అంది మణి. అవన్నీ దొంగ వేషాలు. లోకం కోసం. ఆ నటన అంది కనకం. లోకం కోసమో, నీ కోసమో అన్నీ నీకు సమకూరుస్తారు. అదే మా ఆయన అయితే జీతం గుర్రప్పందాలకి ఖర్చుపెట్ట ఇంటికి రావడానికి మొహం చాటేస్తారు. ఆ రోజు మా అత్తగారు, నా కూతుళ్ళిద్దరూ నన్ను విరుచుకు తింటారు అంది మణి. ' మణి విషయం చూడు. రెక్కలు ముక్కలు చేసుకుని మిషన్ కుట్టీ, వచ్చిన డబ్బుని ఇంటి ఖర్చులకు వాడుతుంది. అదే నువ్వయితే ఇద్దరు పేద పిల్లలకు స్కూల్ ఫీజు కడుతున్నావు అంటే ... అంటూ ఆగింది సీత.
చూడు సీతా మహాసాధ్వీ అవి మా ఆయన ఇచ్చిన దబ్బులు కావు. మా అమ్మాయి, అబ్బాయి ఉద్యోగాల్లోకి వచ్చాక ఇచ్చినవి అంది కనకం. ఆ పిల్లలెవరు? మీ ఇద్దరి (ప్రేమ గుర్తులు కాదా అంది సీత. కనకానికి ఆమె భర్రమీద ఉన్న దురభి'ప్రాయాన్ని తొలగించాలని. సీతా! పిల్లల్ని బురదలో దొల్లీ పందులూ కంటాయి, మేమూ కన్నాం. మా మధ్య మనసువిప్పి మాట్లాడుకోవటం, కలసి భోజనం చేయటం లాంటి చిన్నచిన్న ముచ్చట్లు కూడా లేవు. మూడేళ్ళ క్రితం కాట్ల కుక్కల్లా పోట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా మానేశాం. మాదో వింత కాపురం. ఇలా తెల్లారిపోవలసిందే నా జీవితం అంది కనకం.
“ఆడవాళ్ళకి బీలతనం, మగవాళ్ళకు అహంభావం వొళ్ళు ఎక్కువ పెట్టి సృష్టిన్తాడు ఆ బ్రహ్మ” నా విషయమే చూడు... మీరందరూ నన్ను రుచిగా వందు తావ్? ఇంటిని శుచిగా ఉంచుతావ్? అని మెచ్చుకుంటారు. మావరెప్పుడూ నన్ను మెచ్చుకోలేదంటే నమ్ముతావా? అంది ప్రభ.
“పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు” అన్నట్టు నేనేం చెప్పినా మా వారు పెడచెవిన పెడతారు. మా వీధిలో ఏంటి? మీరేంటి అందరూ ఏం చేస్తే బాగుంటుం దని నన్నే సలహా అడుగుతారు అంది రాధ. నాకు మా వారికి సలహా లిచ్చే పరిస్థితి, ఆయన నా మీద విసుక్కున్న సంఘటనలు నాకు ఎదురవలేదు. ఆయినా అన్నీ మా వారే చూసుకుంటారు అంది సీత.
సీతా నీ రూటే వేరు. నీలాంటి అదృష్టవంతులు వెయ్యికి ఒక్కళ్ళు ఉంటారు
46 * అక్షర ళిల్యాలు
అంది కనకం. సుత్తి కబుర్లు ఆపి, నిన్న నీ రిపోర్ట్ చూసి డాక్టర్ ఏమన్నారో చెప్పు అంది సీత, మన స్నేహంలా నా హార్ట్ ఎనలార్డ్ అయ్యింది. మా వారి బుర్ధిలానా కిడ్నీ కుచించుకుపోయింది. ప్రభ వాయిస్‌లా షుగర్ లోలో ఉంది. మణి కోపంలా వీపీ హైలో ఉంది. ఇంకా స్పాంద్లైటిస్, సైనస్, సయాటిక అంటూ పకపక నవ్వింది కనకం. హాస్యానికీ ఓ హద్దు ఉంటుంది. ఒంట్లో ఎలా ఉంది అని అది అదిగితే రోగాల పేరు చెబుతున్నావు అంది కోపంగా మణి.
“రోగాలు భోగాలు కావు కావాలని కోరుకోటానికి.” నేను చెప్పెది నిజమో, హాస్యమో ప్రభనే అడుగు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది కనకం. ఊరుకో అంటూ కనకం భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసింది ప్రభ. కనకం నువ్వు చెప్పిన రోగాలకి మందులు ఉన్నాయి. జాగ్రత్తగా వాడు. మన బ్రతుకు మన కోసం కాదు, మన వాళ్ళకోసం అంది సీత. “మనవాళ్ళు” అంటూ పెదవి విరిచింది కనకం. ఆ విషయాలు వదిలేయండి. ఎల్లుండి పెద్దమ్మ గుడికి వెళదాం అంది ప్రభ.
పిల్లలు ఎదిగాక ఇళ్ళల్లో కలుసుకోలేకపోతున్నాం. మనం కలవటానికి రోజుకో చోటు వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక స్టేహోం లాంటిది ఉంటే బాగుంటుంది కదా అంది సీత. నిజమేనే. ఈ మధ్య ఇళ్ళల్లో చికాకులు మరీ ఎక్కువవుతున్నాయి. ఇలా బయటికి వస్తేనే హాయిగా ఉంటుంది అంది మణి. ఈ మధ్య మన మీటింగ్ ప్లెస్ ఇందిరాపార్మే అవుతోంది. దిన్నె స్టేహాం అని అనుకుందామా అంటూ నవ్వింది రాధ.
నేను మాట్లాడేది మన గురించి కాదు. మనకైతే మనలో ఎవరి మనస్సు కష్టపడినా ఓదార్చటానికి నలుగురున్నాం. ఈ మధ్య చాలామంది కుటుంబాల్లో వచ్చే కష్టాలను తట్టుకోలేక, ఓదార్చే వాళ్ళులెక ఆత్మహత్యలకు వాల్చడుతున్నారు. అటువంటి వాళ్ళకోసం నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఓ నలభై రోజులు స్టేహాంలో ఉండి స్థిమితపడి, సరైన నిర్ణయం తీసుకుని బ్రతుకును చక్కదిద్దుకుంటారు అంది సీత.
ఈ మధ్య నువ్వు చాలాసార్లు స్టేహాం అంటున్నావు. అది మనకు సాధ్యమయ్యేది కాదు. బాబా గుడిదగ్గర అన్నదానం, అంధ బాలికలకు వస్త్రదానం లాంటివి అయితే చేయగలం అంది రాధ. ఎందుకు చెయ్యలేం. చెయ్యగలం అంది రీత. మరీ మొండిగా వాదించకు. అది అయ్యే పని కాదు. చీకటి పడుతోంది, వెళదాం పదండి అంది ప్రభ,
సరేలే. ఎల్లుండి వ(్రేశ్వరి మా ఇంటికి వస్తోంది. మీరూ రండి. ఓ ముఖ్య విషయం చెప్పాలి అంది సీత.
మోచర్ల రామలక్ష్మి * 47
ఆ రోజు శుక్రవారం అనుకున్న టైమ్‌కే సీతారత్నం ఇంటికి వచ్చారు వజ్రేశ్వరి, మిత్రరత్నాలు. కాఫీ ఫలహారాలు అయ్యాక, కనకం నీకోమాట చెప్పాలనుకుంటు న్నాను అంది సీత. మందులేసుకో, మీ ఆయన మాట విను ఇలాంటివి తప్పించి ఏం చెప్పినా వింటా అంది కనకం. ఏం మాట్లాడినా మీ ఆయన ప్రస్తావనే తెస్తావ్. దిన్ని బట్టీ మీ ఆయనంటే నీకు ఎంత ప్రేమో తెలుస్తోంది. పెళ్ళయిన కొత్తలో మీ అత్తగారు ఏదో అన్నదని, మీ ఆయన నిన్ను వెనకేసుకు రాలేదని ఇంకా సాధించడం మంచిది కాదు అంది సీత. నేను తొందరగా వెళ్ళాలి విషయం వాళ్ళకు చెప్పు అంది వజ్రేశ్వరి.
కనకం మీ ఇంటి దగ్గర 11 గదులున్న ఓ పెద్ద ఇల్లు ఉంది చూశావుగా అంది సీత. అది కూలగొట్టి ఫ్లాట్స్ కడతారు అన్నారంది కనకం. ఇప్పుడాలోచనను మానుకున్నారు. ఆ ఇంటిని స్టేహోంగా చేస్తున్నారు. ఈ సోమవారమే 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో ప్రారంభోత్సవం. ముఖ్య అతిథి మన సీతే. మీరు నలుగురు రావాలి అంది వజేశ్వరి. కంగ్రాట్స్ సీత నువ్వు ఏం కోరుకుంటే అదే నీ దగ్గరికి వస్తుంది. ఓ అద్భృష్టవంతురాలి పేరు చెప్పమంటే కళ్ళు మూసుకుని నీ పేరు చెప్పేస్తా. మనం ఇక స్టేహోంలోనే కలుస్తూ ఉందాం అంది అనందంగా మణి. ఉత్తినే కలవడం కాదు. ఆ స్టేహోంలో ఉండే వాళ్ళ మనసుకు ఊరట కలిగించాలి. ప్రభా నీకు ఈ విషయం గుర్తుందా? ఓ పాతికేళ్ళ అమ్మాయి ఎవ్వరూ లేరని లలితా పరమేశ్వరి గుడి దగ్గర ఉందేది. ఆ అమ్మాయికి మన ఇంట్లో వసతి కల్పించలేం. భోజనం అయితే పెట్టగలం అనుకుని మనం ఐదుగురం రోజుకొకళ్ళం అన్నం పట్టుకెళ్ళి పెట్టవాళ్ళం. ఆడపిల్లకి నీడనివ్వలేక పోయామని ఎంతో మదనపద్డాం అంది సీత. అవును అప్పటినుంచేగా నువ్వు స్టేహోం ఉండాలి ఆర్హులు అందులో స్తిమ్మితంగా నలభై రోజులు వుందాలి. ఎవ్వరి ప్రభావం లేకుందా ప్రసాంతంగా ఆలోచించుకోవాలి. బ్రతుకు చక్కబరుచుకోదానికి స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇమోషనల్‌గా మాట్లాడేదానివి అంది రాధ. ఆ విషయాలు అటుంచు. స్టేహోంకు మీరు నలుగురు మూల స్థంభాలుగా ఉండి అభాగ్యులకు సహకరించాలి. మీతోపాటు వజ్రేశ్వరీ ఉంటుంది అంది సీత. మీరు నలుగురూ అంటూ నిన్ను విడదీసి మాట్లాడుతున్నావు. నీకేమయింది? అంది ఉక్రోషంగా మణి.
మన కనకం భాషలో చెప్పాలంటే త్వరలోనే నాకు కపాల మోక్షం అంటూ జీవం లేని నవ్వు నవ్వింది సీత. సీత మాటవిని ఏంటే ఆ పిచ్చి వాగుడు అంటూ నలుగురు స్నేహితురాళ్ళు ఒక్కసారే అరిచారు. “విచ్చుకున్న పువ్వుని ముచ్చటగా
48 * అక్షర శిల్పాలు
కోస్తాం. దేవుని పాదల చెంతకు చేరుస్తాం. ఎండిపోయాక తీసిపారేస్తాం” అలాగే “ఓపిక పోయి ఒడిలిన శరిరం నిర్జీవం అయ్యి మట్టిలో కలిసే ముందే ఓ మంచి పని చెయ్యాలి”. అందుకే కోటేశ్వరరావుగారి అమ్మాయికి కిద్నీ డొనేట్ చేస్తానని మాట ఇచ్చాను. ఫార్మాలటీస్ అన్నీ కూడా ఫినిష్ చేశాను అంది సీత.
సీ్త్ర అర్ధం పర్ధం లేకుండా మాట్లాడకు. చూడు వజ్రేశ్వరి సీత ఆరోగ్య పరిస్టితి కిద్నీ డొనేట్ చేసేటట్టు ఉందా? నువ్వైనా చెప్పు అంది రాధ. నిజం నిష్టూరంగా కష్టంగా ఉంటుందని దాచి పెట్టలేం. సీతకి బ్రెయిన్ డిసీస్, తన బాడీ డొనేట్ చెస్తానంది. వాళ్ళ ఆయన, పిల్లలు కూడా ఒప్పుకున్నారు. ఇక తన లైఫ్‌టైమ్ 1 ఇయరె ఉంది అంది వజ్రేశ్వరి. వజ్రేశ్వరి ప్రాక్టికల్ మనిషి.
స్నేహితురాలు ఏడాది దాటాక ఉండదన్న బాధ వాళ్ళ గుండెల్ని పిండి గొంతు నొకృసినట్టయింది. కళ్ళల్లో నీళ్ళు పొంగుతుంటే మెదడు మొద్దుబారి వాళ్ళకు నోట మాట రాలెదు. అవాక్కయిన 'సస్నేహితురాళ్ళను చూసిన సీత మనసు బాధతో మూలిగింది. నాకూ బ్రతకాలనే ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అంది సీత. సారీ సోమవారం కలుద్దాం. మరి నేను వెళ్ళొస్తా అంటూ వజ్రేశ్వరి వెళ్ళిపోయింది.
వజైెశ్వరి వస్తుంది అంటే మీ అబ్బాయికో అమ్మాయికో పెళ్ళి కుదిర్చిందేమో మా నోటిని తీపి చేస్తావు అనుకున్నాం. ఇంత చేదు నిజం వినవలిసి వస్తుంది అని అనుకోలేదు అంది ప్రభ కళ్ళుతుడుచుకుంటూ, వజేశ్వరి పెళ్ళీ సంబంధాలు కుదర్చడంతో పాటు సమాచార సహకారం అందిస్తోంది. డబ్బు ఉన్నవాళ్ళ చేత లేని వాళ్ళకి సాయం కూడా చేయిస్తోంది అంది సీత. ఆమె మాటకి రెస్పాన్స్ అవ్వకుందా చిన్నబుచ్చుకున్న మొహాలతో ఉన్న స్నేహితురాళ్ళకేసి చూసి నేను ఎప్పుడో ఏడాదికి పోతాను. ఇప్పటినుంచే మీరు నేను పోయినట్టు మొహం పెట్టుకు కూర్చుంటే నేనేం చెయ్యను అంది సీత. అమాయకంగా ఉండి అందంగా నవ్వే సీత ఆరిందలా మాట్లాడుతుంటే ఎంతో బాధ అనిపించింది. లేని హుషారు తెచ్చుకుని మండే కలుద్దాం అంటూ స్నేహితురాలిని వదలలేక ఇంటికి వెళ్ళక తప్పక భారమైన మనసుతో సీత ఇంటినించి కదిలారు మిత్రరత్నాలు.
సోమవారం స్టేహోం (ప్రారంభోత్సవానికి ముందే బ్రెయిన్ హెమరేజ్ వచ్చి సీత ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఒక్క రోజు బ్రతికినా బాగుందేది. దాన్ని చేతో స్టేహోం ఇనాగరేషన్ చేసేది. దేవుని లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో అని విలపించారు ఆమె స్నేహితురాళ్ళు. మాకు కడుపుకోత అతనికి మనస్తాపం మిగిల్చి వెళ్ళివోయింది అంటూ విచారంగా అన్నారు సీ్త్ర తల్లిదండ్రులు.
స్త భర్త శ్యామ్‌ని పదిరోజుల్లో ఇళ్ళు ఖాళీ చెయ్యాలి. ఇంటిని బిల్లర్కి అమ్మేశాం
మోచర్ల రామలక్ష్మి * 4
అన్నారు ఇంటివాళ్ళు. ఇంట్లో శ్యాం ఒక్కడే ఉంటున్నాడు. ఉద్యోగాలు వచ్చి కూతురు ఆ(స్టేలియా కొడుకు కెనడా వెళ్ళిపోయారు. ఇంటివాళ్ళు ఇచ్చిన గడువు రెండు రోజులే ఉంది. ఇల్లు వెతుక్కుంటూ వీధిని పడ్డాడు. స్నేహరత్న స్టేహోం అని బోర్డు చూశాడు. ఇంత దగ్గర్లో స్టేహోం ఉందా ఇన్నాళ్ళూ చూడలేదే. కొన్నాళ్ళు ఇందులో ఉండొచ్చు అంటూ లోపలికి అడుగుపెట్టాడు శ్యాం. సీతారత్నం ఫొటో నిలువెత్తు ఉంది. ఆ ఫొటోకి గులాబీ దండ వేస్తున్నాదో పెద్దమనిషి, ఆ దృశ్యం చూసి ఆశ్చర్య పోయి అక్కడే ఉన్న కుర్చీలో సతికలపద్డాడు శ్యాం. ఈ మహాతల్లి భౌతికంగా మనకు దూరమై ఏడాదయ్యింది. నా కూతురికి తన కిద్నీ డొనేట్ చేసింది. “యాభై కోట్లకు వారసురాలు. నా ప్రాణానికి వ్రాణం నా ఒక్కగానొక్క కూతురి వ్రాణం నిలబెట్టావు. నీకు ఇల్లు లేదని వజేశ్వరి చెప్పింది. నాకు 11 గదుల ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లు నీ భర్త పేరునన్నాా నీ పిల్లల పేరునన్నా రిజిష్టర్ చేసాను. ఎవరి పేరు మీద రిజిష్టర్ చేయమంటావు అని అడిగాను. ఆమె చెప్పిన సమాధానం విని నా అల్పబుద్దికి నేనే సిగ్గుపడ్డాను. బాబాయిగారు “కట్టెలో వ్రాణం ఉండగా కళేబరాన్ని బేరం పెడు తున్నాను” అనుకోకండి. డబ్బు లేనివాళ్ళయితే అడిగేదాన్ని కాదు. మీరు ఇస్తా నన్నారు గనుక అడుగుతున్నా ఈ ఇంటిని స్నేహరత్న స్టేహోంగా మార్చండి అందామె. ఆమె రాలిపోతూ నా కూతురి జీవితాన్ని చిగురింపచేసింది. స్టేహామ్ అడిగి ఎందరో నిరాశయులకు నలభై రోజులు వసతి కల్పించింది. ఈమెకు శ్రద్ధాంజలి, పుష్పాంజలి, భాష్పాంజలి లాంటివి అక్కరలెదు. మనం అభాగ్యుల అ(శువులు తుడిచి, వారిలో ఆత్మబలం పెంచికే ఈమెకు నివాళి అర్చించినట్టే. సీతారత్నం గారి గురించి వాళ్ళ స్నేహితురాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కోటేశ్వరరావు. కళ్ళు వాగులై, నోరు మూగవోయి చెప్పలేం అన్నట్టుగా తల అద్దంగా తిప్పారు సీతారత్నం మిత్రరత్నాలు. నేను చెపుతాను అంటూ వేదిక మీదకు వచ్చాడు శ్యాం. సీతారత్నం నా అర్ధాంగి. ఏ సంబంధం లేనివాళ్ళకు సాయం చేయాలనేది. ఏదో అంటోంది పిచ్చిది అనుకున్నాను. కానీ సాధించింది. సాధించి చూపించింది. ఆమెకు స్నేహం అంటే కూడా ప్రాణం. అందుకే స్నేహరత్న స్టేహోం అని పేరు పెల్టింది. నేను నిరాశ్రయుబ్సి. ఓ నలభై రోజులు ఇక్కడ ఉంటాను, అనుమతి ఇవ్వండి అన్నాడు శ్యాం. నలభై రోజులేంటి, మీరు ఎన్నాళ్ళు ఉండాలను కుంటున్నారో అన్నాళ్ళు ఉండండి అన్నాడు కోటేశ్వరరావు.
భర్త పుణ్యంలో భార్యకి భాగం ఉంది అంటారు, భార్య త్యాగంలో భర్తకి స్ధానం లభీంచింది అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు.
- అదయి అడప్రాబ.-- రాలా
-
వ్యాస విపంచి శ్రీరాముని చరిత మానవునికి నదత శ్రీరామ రామ రామేతి, రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననె' అని రాముని స్తుతిస్తూ పూజించితే సరిపోదు. ప్రతి ఒక్కరూ ఆ మానవతామూర్తి గుణాలను తెలుసుకొని అభ్యసించాలి. శ్రీమద్రామాయణం, పదహారు మహోన్నతమైన లక్షణాలు గల పురుష పుంగ వుని చరితం. మానవ జాతి జీవన సరళికి ఓ నిఘంటువు. పరిపూర్ణమైన మానవత్వంగల ఆదర్శమూర్తి శ్రీరాముడు. ఆయన చరితం మానవులకు నదత నేర్పే మహాకావ్యంగా రూపొందించాడు వాల్నీకి మహాకవి. వాల్ళీకి రామాయణం చదివితే (ప్రతి ఒక్కరికి ఆ అంతరార్థం బోధపడుతుంది. అధర్మ్శశీలి అయిన రావణుడు, దేవ, గంధర్వ, కిన్నెర యక్షాదుల ఎవరిచేతా మరణం సంభవించకూడదనే వరం పొందుతాడు. ఆ అహంభావి నరులు, వానరుల చేత తనకి ముప్పు రాదనే (భ్రాంతి పొందాడు. రావణుని సంహరించటానికే దేవుడు మానవుడుగా జన్మించాడు. ఎవరైతే తమ ధర్మాన్ని ఆచరిస్తారో వారు దేవతలు అవుతారు. వారినే లోకం అంతా ఆరాధిస్తుంది. శ్రీరాముని ఎదుట దేవతలు నిలిచి స్వామి రామచంద్రా నీవు నారాయణుదడవు తండ్రీ అన్నారు, “కాను, కాను. ఆత్మానాం మానుషం, మానే రామం దశరధాత్మజం” అని సమాధానం చెప్పాడు శ్రీరాముడు. నేను నరుద్ని అనే భావించాడు. మనసులో ఎన్నడూ నేను దేవుడ్ని అనే భావన రాసీయకుండా ఈతి బాధలను మానవునిగానే ఎదుర్శొన్నాడు. శ్రీరాముడు ధర్మోపదేశాలు చేయలేదు, వేదాంతము చెప్పలేదు. అంతా నద వడియే అంటే ఆచరణమే. ఆ మహాకవి వాల్న్మీకి మానవునిలో ఉండవలసిన పదహారు మహోన్నతమైన గుణాలను శ్రీరామునిలో చూశాడు. అందుకే తన కావ్యనాయకునిగా చేశాడు. శ్రీరామునిలో ఉన్న ఈ పదహారు గుణాలు రామాయణంలో ఒకో అంకంలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ లక్షణాలను ప్రతివారూ తెలుసుకొని అలవర్శుకోవాలి. 1 గుణవ్యః, 2. ధర్శజ్ఞః, 3. కృతజ్ఞః, 4. సత్వవాక్యః, 5. దృధవ్రతః,
-
చారిత్రేణచకోయుక్తః, 7. సర్వభూతేషుకోహితః, 8. 'విద్యాన్కః, 9. కఃస్సమర్ధు,
-
కశ్చెకప్రియదర్శనః, 11. ఆత్మవాన్ః, 12. జితక్రోదోః, 18. ధృతిమాన్ వశీ, మోచర్ల రామలక్ష్మి * 1 న. . న [6 132339 3 [1 ల. న్ చె డో
-
కోనసూయకః, 15. కస్యబిభ్యతి, 16. దేవాశ్చబౌత రోషస్యసంయుగె.
శ్రీరాముడు సౌశీలుడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, ధీరో దాత్తుడైన మహనీయుడు, రాయి అయిన స్త్రీలో చైతన్యం కలిగించిన కరుణామూర్తి, పడవవాదైన గుహుని తనకి ధీటైన స్నేహితుడని కౌగలించుకున్న స్నేహశీలి. శబరి (ప్రేమతో పెట్టిన ఎంగిలి పళ్ళు భుజించిన (ప్రమమూర్తి.
రాక్షస సంహారం చేసిన మానవతామూర్తి, స్వార్ధానికి తావివ్వక ప్రజాభిప్రాయా నికి విలువనిచ్చిన మహారాజు. అందుకే రామరాజ్యం కావాలని ఈ నాటికీ కోరతాం.
పాలకుడు రాముడిలా ఉందాలి. అప్పుడే యథారాజా తథాఫ్రజ అని రామత్వం అలవడుతుంది. రామత్వం అంటే మానవత్వమే. మానవత్వం మనలో కలిగితే సర్వ భూతాలు మనల్ని ప్రేమిస్తాయి. ప్రేమించడానికి కావలసినది మానవత్వమె.
తొను మానువునిగా నిలిచి అహంకార, మమకార త్యాగాల తోటి జీవితం ప్రారంభించాడు. రాజ్యత్యాగం, భార్య పరిత్యాగంతోటి జీవనం సాగించాడు.
శ్రీరాముని జీవితకాలం పదకొండు వేల సంవత్సరాలని చెపుతారు. అందరికీ తెలిసిన రామకథ రాముని బాల్యం, వనవాసం, సీతాపరిత్యాగం మాత్రమే. అంటే రామాయణం ఒక త్యాగి కథగానే నిలిచింది. తక్కిన కాలం శ్రీరాముడు భోగాలతోటి ఉంది ఉంటాదు. త్యాగానికి ఉన్న కథ భోగానికి లేదు. అందుకే మిగతా కథ తెలియలేదు.
రామత్వము అలవడితే మనకు మానవత్వం వస్తుంది. మానవత్వం నీలో కలి గితే సర్వభూతాలు నిన్ను (ప్రేమిస్తాయి. (పేమించటానికి కావలసినది మానవత్వమే.
నేడు పిల్లలకు రామతత్వాన్ని అవగతం చేయాలి. రాముడు అంటే ఏదో దేముడు పూజచేయాలి అని మాత్రమే చెపితే చాలదు. రామునిలో ఉన్న ఉత్తమమైన లక్షణాలు నేర్పాలి. ఆ మహనీయుని బెన్నత్యం చెప్పాలి. విభీషణుడు దుర్శార్గుదైన తన సోదరునికి అంతిమ సంస్కారం చేయనంటే, “పగ ఎంతవరకు? వానిని మార్చ టానికే, పగవానిగ ఉండగా మార్చటానికి ప్రయత్నించాము. కుదరలేదు. చని పోయాడు. ఇంకా వానిపై పగదేనికి? నీవు అంతిమ సంస్కారం చేయని పక్షంలో నేనే చేస్తాను. నాకు సోదరుడే” అన్నాడు శ్రీరాముడు.
రాముడు మానవులను మానవులుగా నిలపటానీకి అవతరించాడు, అట్టి మహానుభావుని మనం అందరం సేవించి తరిద్దాం. సుగుణాభిరాముని కీర్తిద్దాం. ఆ మహానుభావుని గుణాలు అలవరచుకొని ఆచరిద్దాం. పదహారు గుణాలలో ఒక గుణం అన్నా అలవరచుకొని పదహారవవంతు మనిషిగా అన్నా జీవిద్దాం. శ్రీరామ నవమి మహోత్సవం జరుపుకుంటూ, సాంప్రదాయ సంస్కృతులను పెంచుదాం. స్నేహాన్ని పంచుకుందాం.
-అళావివా4 ఫమసప్తూల- 52 * అక్షర ళిల్పాలు
గీతామృతం
శ్రీమద్భగవద్గీత లోక కళ్యాణ ప్రదము. విశ్వ జనాదరణీయము. ఒక జ్ఞాన సాగరం, వివిధ జ్ఞానులకు అనంత భండారము.
మహాపురుషుడైన అర్జునునకు భగవానుడైన శ్రీకృష్ణుడు స్వయముగా అందిం చిన దివ్యామృత సందెశం.
యుద్ధమునకు విముఖుడైన పార్టునికి, 'క్షత్రియుడవైన నీవు యుద్ధమాచరిం చుట పాపకర్శకాదు, స్వాభావిక ధర్మము. సహజ కర్మ చేయకుండుటయే అవి వేకము అని శ్రీకృష్ణ పరమాత్మ బోధపరిచాడు.
సకల జీవులు జనన మరణ చక్రంలో తిరుగుచూ స్వకర్మనాచరించి కర్మ బంధ ముల నుండి విముక్తులై భగవదాజ్ఞానుసారము భగవంతుని చేరుకోవాలి.
పరమాత్ముని పొందే పరమాత్మ తత్వం, పరహితంలోనే ఉంది. మహాకవి కాళి దాసు కోటి గ్రంథాల పఠన సారాంశాన్ని “పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీదనం” అని అర శ్లోకంలోనే తెలిపాడు.
- చిత్తశుద్ధి, 2. సత్యము, 3. దానము, 4 త్యాగము, 5. భూతదయ,
- ఓర్పు, 7. ధైర్యము, 8. ద్రోహబుద్ధి లేకుండుట, 9. శాంతి మొదలగునవి తెలుసుకొనుటే కాక అవి ఆచరింప తగినవిగా కూడా గ్రహించవలెను. “శ్రేయోహి జ్ఞాననుభ్యాసాత్” అనే శ్లోకములో 'అభ్యాసముకంటే జ్ఞానము, జ్ఞానము కంటే ధ్యానము, ధ్యానము కంటే కర్మ ఫలము విడుచుట శ్రేష్టమైనవి అని, అట్టి కర్మఫల త్యాగముచే శాంతి లభించును అని చెప్పబడినది.
“కాలానుగుణంగా కర్మను అనుసరించాలి.” ఇది భగవంతుని ఆదేశము.
శ్లోకం “మూఢ గ్రహీణాత్మనో” అనే శ్లోక తాత్పర్యాన్ని ప్రతి ఒక్కరూ నెటి పరి స్థితులకు అన్వయించి, చక్కటి సందేశాన్ని (గ్రహించవచ్చు.
మూర్టపు పట్టుదలతో తన శరీరాన్ని ఉపవాసాదులచి బాధించటం వ్యర్థమని తెలుసుకొనవచ్చు. ఆకలిని చంపుతూ ఆత్మారాముని బాధిస్తూ అనేక రకములైన అనారోగ్యాలకి గురికావటం అనర్థమని (గ్రహించవచ్చు.
ఇతరుల నాశనము కోరి చేసే తపస్సులో పట్టుదల ఉన్నప్పటికి దైవత్వము
మోచర్ల రామలక్ష్మి శ 3
సిద్ధించదు, దానవత్వమె విజృంభిస్తుంది. పట్టుదల బహుజనహితముగా, బహు (ప్రియంగా, సత్ ఫలితాలను ఇచ్చే విధంగా ఉందాలి. మంచి భావన, మంచి ఆలో చన, మంచి ఆచరణ కలిగి ఉంటే అదే త్యాగనిరతి. అట్టి త్యాగనిరతి గల వారిలో ఉన్నది “నేనో అంటున్నాడు పురుషోత్తముడు.
“యదా యదాహి ధర్మస్య” అనే శ్లోకంలో ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగునో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను.
(శ్రేయస్సును కాంక్రించువారు ధర్మమును పెంచుతూ అధర్మమును తుంచుచు జన్మ సార్థకము చేసుకొనవలెను.
ఫలాపేక్ష లేకుండా బంధరహితమై కర్మలను భగవదర్పణ బుద్ధితో నాచరించ వలెను. నేను, నాది, నాకు, నా అనే తత్వాన్ని వీడినచో భగవంతుని (ప్రేమకు పాతృ లగుదురు.
“నేను గీతను ఆశ్రయించి యుండును. గీతయే నా నివాసము, ముల్లోకము లను పాలించుటలో గీతజ్ఞానమే నాకు పరమ సాధనమని విశ్వపాలకుదైన సహ స్రాక్షుడే పలికాడు.
ఏడు వందల శ్లోకములను పదునెనిమిది అధ్యాయములుగా విభజించి, మహా భారత ఇతిహాసమును అంతర్భాగముగా చెసి, నిజ జీవితమునందు నిత్య నైమిత్తిక, వ్యావహారిక కర్మలను ఆచరించుచూనే పరమార్థిక లాభములను పొందు అద్భుత మార్గము గీత యందు ప్రకటించవబడినది.
ఇట్టి గీతామృత పానము వలనే అమృత తత్వం సిద్ధిస్తుంది.
- ఈద వా అడప్రైల-- 4 *ఠక్షం శిల్పాట
వృద్దాలయాలు అ
యుగ ధర్మాన్ని అనుసరించి కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. గడియారంలో ముళ్ళులా జీవులు కాలచక్రంలో తిరుగుతూనే ఉంటారు.
వేదాలు అవిష్కరించుకున్న కృతయుగంలో అందరూ సత్యాన్నే పలుకుతూ, సత్యమే నిర్ద్ణుణరూపంలో ఉన్న భగవంతుడని నమ్మేవారు. పరహితం కోరుతూ, నిస్వార్ధంగా జీవించేవారు. ఆ యుగం సత్యయుగం.
సృష్టిలో మానవునికి, ప్రతిజీవికి కూడా అగ్ని అవసరం. ఆ అగ్నిలో తేజస్సు, వేడి ఉన్నాయి. సూర్య, తేజస్సు, పార్టివత్వం. ఈ మూడింటిని దేవునిగా పూజించిన కాలం గ్రేతాయుగం.
నిర్గుణ మానవాతీత శక్తికి ఒక గుణం కల్పించి పూజించటం మొదలు పెట్టంది. కృతయుగంలో లేనిది, త్రేతాయుగంలో పొలకుల వ్యవస్థ వచ్చింది. రాజైన శ్రీరామచంద్రుడు సత్యవాక్పాలన చేశాడు.
మానవులకి దానవులకి జరిగిన పోరులో సత్యం జయించింది.
సీత్రా మహా సాధ్విపై అపనింద మోపాడు ఓ అల్పుడు. ఆ తల్లి ఆయోనిజ పునీత. అటువంటి ప్రీమూర్తిపై ఆపాదించిన నింద అసత్యం అని రూఢధిఅయ్యింది. జనులు మాత్రం సత్య యుగానికి రాలేకపోయారు.
ద్వాపర యుగంలో ధర్మాన్ని ప్రతిష్టించటానికి ధర్మమే అన్నిటికన్నా మిన్న అని శ్రీకృష్ణభగవానుడు. ధర్మాన్ని బోధించిన కాలం, ఈ యుగంలో భగవంతునికి గుణంతో పాటు రూపం ఆపాదించారు.
భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, విదుర మొదలగు మహనీయులు ఉన్న ఓ మహసభలో ఏకవస్త అయిన (ద్రౌపదిని దుశ్ళాశనుడు ఈడ్చుకురావడం, ఆ స్థితిలో ఆ ప్రీమూర్తి విలపించటం ఎంత దయనీయం. స్త్రీని వంచించిన నాటి అధర్మం కురుకైత్ర యుద్ధం అయ్యింది. ధర్మం రక్షింపబడింది. జనులు మాత్రం అధర్మం వేపే అడుగులు వేశారు.
సత్యానికి ధర్మానికి విడదియ్య లేని సంబంధం. సత్యాన్ని చెపితే ధర్మం చెప్పాడు అంటారు. ధర్మం చెపితే సత్యం చెప్పాదంటారు. అందుకే సత్యం వధ, ధర్మం చర అంటారు. ఆ రెండూ మానవ మనుగడ అనే నాణానికి చేరో వైపు ఉండాలి.
మోచర్ల రామలక్ష్య్మ * 55
కలియుగం ఆరంభం అయ్యింది, సత్యం, ధర్మం సన్నగిల్లటం మొదలయ్యింది. అపనమ్మకం ఆవహించింది. న్వాద్ధం పురి విప్పి నాట్యమాదింది. వి[గ్రహరాధన, మూర్తి పూజలు ప్రోత్సహించిన కాలమయ్యింది కలియుగం.
ఏది ఏమైనప్పటికి యుగారంభంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. ఉమ్మడి కుటుంబాలలో నాల్గు తరాల వారు ఆనందంగా జీవించేవారు. కుటుంబ విషయాలలోను, సమాజ (శ్రేయస్సుకు, అనుభవజ్ఞులైన పెద్దల సలహా పాటిస్తూ, ఇంటా, బయటా గౌరవిస్తూ, ప్రత్యేకమైన విలువ కల్పించేవారు.
నాడు పెద్దల సలహాతో యువత సమాజాభివృద్ధికై అనేక కార్యక్రమాలను చెపట్టే వారు, కుగ్రామాలలో దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, (గ్రంథా లయాలు న్యాపించి ప్రజలలో చైతన్యాన్ని కలిగించేవారు.
రాను రాను అధిక జనాభాతో ఆహార, నిరుద్యోగ సమస్యలు మొదలయ్యాయి. తత్ఫలితంగా ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి. కుటుంబం అంటే తాము, తమ పిల్లలే అనే అభిప్రాయానికి వచ్చేశారు ప్రజలు. ఆ పరిస్థితులలో వృద్ధులకు నిలువనీడ కరువయ్యింది.
సమాజంలో సమస్య ఉత్పన్నమైనప్పుడు ఏ కాలంలోనైనా, సేవాపరులు పరుల కోసం, స్వార్ధపరులు స్వలాభం కోసం నడుం బిగించి ముందుకు వస్తారు.
ఈ నేపథ్యంలో వృద్దులకై ఎన్నో నిలయాలు ఏర్పడ్డాయి. ఎవరి స్థాయికి తగ్గవి వారు ఎంచుకొని, వారి పెద్దలను ఆ నిలయాలలో చేర్పించటం మొదలుపెట్టారు.
కొందరు న్వార్ధపరులకు వృద్ధాలయాలను నిర్మించటం, ఓ మంచి వ్యాపారంగా మారింది. నేటికీ సేవా తత్పరులు ఉన్నారు. అట్టివారు నిర్మించిన నిలయాల్లో నివ సించే వృద్ధులకు, మనో ఉల్లాసం, శరీర ఆరోగ్యం ముఖ్యం అని భావిస్తూ, వాటికి తగిన సదుపాయాలు సమకూరుస్తున్నారు.
పెద్దలను, వారి పిల్లలో, బంధుమిత్రులో వచ్చి జేరిపిస్తున్నారు. కాలక్రమేణా వారే స్వయంగా వచ్చి చేరుతున్నారు కూడా. మనం మేము అయ్యింది. మేము నేను అవుతుంది.
మేధావులు, విద్యాంసులు సమాజానికి వెన్నెముక వంటివారు. ఇటువంటి వారు ఎందరో వృద్ధాలయాలలో నివసిస్తున్నారు.
వారు కాలటానికి సిద్ధంగా ఉన్న కట్టెలు కారు, అరిగె కొద్ది సుగంధం వెదజల్లే చందనపు చెక్కలు. అపరిమళాన్ని పరిగ్రహించాలంటే ప్రతి ఒక్కరూ వృద్ధాలయానికి వెళ్ళాలి. మనో విశ్లేషణ చేసుకుంటే నాలుగు ఆలయాలు కనిపిస్తున్నాయి.
56 * అక్షర ళిల్తాలు
సహస్ర చంద్రదర్శనం చేసిన వృద్ధులు నేలమీద నడిచే దేవుళ్ళు. ఆ దేవుళ్ళుని దర్శిస్తే నిండు నూరేళ్ళూ మెండుగా ఉండమని, మనల్ని దివిస్తారు. అట్టి దెవుళ్ళు, దేవతలు ఉండే నిలయం దేవాలయం లాగే కనిపిస్తుంది.
మరికొందరు వృద్ధులు బ్రతుకు బడిలో చదువుకొని, జీవితం అధ్యయనం చేసిన ఆచార్యులులా ఉంటారు. వారు మనకి తెలియని ఎన్నో విషయాలు చెపు తుంటె, విద్యాలయంలో అధ్యాపకులు చెపుతున్నప్పుడు విన్నంత శ్రద్ధగా వింటాం.
కొందరు మనుషులకి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అనుమానం, అహం అనే రుగ్గతలతో మనసు దహించుకుపోతుంది. ఇట్టివారి జాద్యానికి సరయిన మందు, జ్ఞాన బెషధం. దీన్ని వేద అధ్యయనం చేసిన వృద్ధులే ఇవ్వగలరు. మోతాదులో జ్ఞానబెషధాన్ని ఇస్తూ, సదాలోచన చేసే ఆరోగ్యవంతులుగా వారిని తీర్చిదిద్దే వృద్ధులు ధన్వంతరీలు. మరి ధన్వంతరీలు ఉండే చోటు వైద్యాలయమేగా.
బాధ్యత గల పదవి నిర్వహించి, పదవీ విరమణ చేసిన వృద్ధులలో ఎందరో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వృద్ధాలయాలలో ఉంటున్నారు. వారి మస్తిష్కం విజ్ఞాన భండారం. వారితో గోష్టి విషయ పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆలో చించండి, వారితో మాట్లాడినంత సేపూ గ్రంథాలయానికి వెళ్ళి ఓ మంచి పుస్తకం చదివిన అనుభూతి కలుగుతుంది.
పాఠశాలలో చదివే బాలబాలికలను ఆహ్వానించి వృద్దాలయాలలో జాతీయ దినోత్సవాలు జరుపుతూ ఉండాలి. అదేవిధంగా యువతను ఆహ్వానించి విజ్ఞాన సదస్సులు జరవాలి.
అప్పుడు వృద్ధులకు, కాలం వృధా కాకుండా సదా సమాజ మేలుకే వినియో గిస్తున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఈ విధంగా వృద్ధాలయాలను నిర్వాహకులు, స్వచ్చంద సంస్థలు సమాజం కృషి చేయాలి, ప్రభుత్వం చేయూతనివ్వాలి.
సమాజం అనే రైలు బండిని, యువశక్తి, పెద్దల సలహా అనే సమాంతర రెఖల మీద నడిపిస్తే, ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా అభివృద్ధి అనే గమ్యస్థానం చెరు తుంది.
సంఘానికి, వృద్ధాలయాలు ఉన్న సాంగత్యం ఓ సంఘిటత శక్తి అవుతుంది. నాలుగు ఆలయాల ప్రతీకగా వృద్దాలయం విలసిల్లుతుంది.
ఆడవ అడడాటాల మోచర్ల రామలక్ష్మి * 57
మార్పు కాలగమనంలో కొన్ని మార్పులు మరికొన్ని చేర్పులు తప్పవు. యుగధర్మాన్ని అనుస రించటం సబబు అనుకొంటారు కొందరు. మార్పు సహించటం తమ ఓటమని బాధ పడతారు కొందరు.
సంఘ అధ్యయనంలో ఈ మధ్య కాలంలో వృద్ధుల అభిప్రాయ పట్టికలో కొంతలో కొంత మార్పు గోచరించింది. ఏది ఏమైనప్పటికీ వారిలో వచ్చిన మార్పు హర్షణీయంగానే ఉంది.
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, ఇళ్ళలోను, ఆ(శ్రమాలలోను ఉందే వృద్దులు, తమ సమస్యలను మనసు విప్పి మరొకరితో చెప్పటానికి అంగీకరించేవారు కారు. అలా చెప్పుకుంటే తమ వంశానికి, తమకి అగౌరవంగా భావించేవారు.
కాలక్రమేణా తమ వివరాలు పూర్తిగా చెప్పకపోయినా, తమ స్థితికి కారకులైన వారిని, తమ కర్మనీ, దేవుడి రాతనీ, ఏదో ఒకటి ఎవరో ఒకరికి చెప్పుకొంటూ ఊరట చెందుతున్నారు.
రాను రాను, కాలం కర్మం కలసి రాకపోతే అంటూ *లేడి వేటగాడి కథ చెపుతూ ఉండేవారు. లేడి కాలికి వేటగాడి బాణం గుచ్చుకొని రక్తం వస్తున్నా బాధ ఓర్చుకొంటూ ప్రాణరక్షణకై పరుగెడుతుంటే, కాలునుంచి కారిన రక్తమే, లేడి జాడను వేటగాడికి తెలిపి ప్రాణం తీసింది. రక్తం పంచుకు పుట్టినవాడే వాడి పంచనుంచి తోసేశాడు అంటూ వాపోయేవారు.
ఓ హోమ్‌లో ఐదుగురు స్రీమూర్తులు చెప్పిన సమాధానం ఇంచుమించుగా ఒకేలా ఉంది. 85 సంవత్సరాలు మాకు. మా కొడుకుకి 70 సంవత్సరాలు. వాడు మాకు సేవలు చేసే వయస్సు కాదు. వాడికి ఓపిక తగ్గింది. నెలలో మొదటివారంలో వచ్చి మాకేం కావాలో అన్నీ కొనిచ్చి, యోగక్షమాలు అడిగి, ఇంటి విషయాలు చెప్పి వెడతాడు. ఇక్కడ ఉంటున్నందుకు మాకు సంతోషంగానే ఉంది. 70 ఎళ్ళ కొడుకు చేత సేవలు చేయించుకోలేక వృద్ధాశమ నిర్వాహకుల చేత చేయించు కుంటున్నాము అంటూ సంతోషంగా చెప్పారు. అందరిలో కాకపోయినా కొందరిలో నైనా మార్పు వచ్చింది. ఎదుటివారి పరిస్థితి, మన స్థితి గురించి ఆలోచించటం సౌఖ్యంగా జీవించ టానికి సహచరులతో గడపటానికే ఇష్టపడటం, ఇళ్ళలో కన్నా ఆ(శమాలలో అన్నీ సమయానికి జరుగుతాయి. పిల్లలు చేయకూడదని కాదు, వాళ్ళకి సమయం లేదు అంటూ సదభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఇళ్ళలో ఉండే వృద్ధులు, కుటుంబ
58 * అక్షర ళిల్సాలు
సభ్యులతో అవగాహన కలిగి, ఇంటిని కనిపెట్టుకుని ఉండేలా పిల్లలకి ఆసరా, మాకు పిల్లలు ఆసరా అంటూ సంతృప్తిగానే మాట్లాడుతున్నారు. కొన్ని సేవాసంస్థలూ మరికొందరు వృద్ధులు ఇంటి పట్టునే ఉండే వృద్ధుల సమస్య లను తీరుస్తూ మాట సాయం, సహకారం అందిస్తూ ఇంటా బయటా కూడా సాయంగా ఉంటున్నారు.
కొడుకు విదేశాలకు వెళ్ళాడు. ఒంటరి వాళ్ళమైపోయాం అని విలపించకుండా కొడుకు పంపే డబ్బుతో ట్రస్టు పెళ్ళ పేదసాదలకు విద్యావైద్య సదుపాయాలకై ధనం వెచ్చిస్తూ ఖాళీగా కూర్చోకుండా సమాజ శ్రేయస్సుకై ఎన్నో యోచనలు చెస్తూ, తమలాంటి వారిని కొందరిని తయారు చేస్తున్నారు. ఇటువంటివారు తక్కువ మంది ఉన్నా త్వరలో ఇటువంటి వారి సావాసంతో మరిఎందరో ఇంకెందరో ముందుకు వస్తారు. సమాజంలో మార్చు కోరాలి, మార్పు రావాలి. మార్పు చైత న్యానికి నాంది.
-అడవా4 అసమాబ మోచర్ల రామలక్ష్మి * 59
చొరవ లేనిదే తెరువు లేదు
ఒక పని చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అని ఆలోచించి, ఇలా చెయ్యవచ్చు అని నిర్ణయించాలి. శ్రీకారం చుట్టి సాంతం అయ్యేవరకు శ్రమపడి, శ్రద్ధ తీసుకు చేయాలి వీటితోపాటు కార్యనిరర్వహణకు కావలసిన “చొరవ” వుంటేనేగాని సంపూర్ణంకాదు.
విశాల విశ్వంలో చరాచర సృష్టిలో, యుగయుగాలుగా జరిగిన, జరుగుతున్న విషయాలను గమనిస్తే “చొరవలేనిదే ఏ మహత్శార్యం జరగదు” (క్రియారూపమే చొరవ అనే నిజాన్ని గ్రహిస్తాం.
ఎందరో మహనీయులు విద్య, వైద్య, విజ్ఞాన, సేవ, కళారంగాలలో చొరవగా చొచ్చుకు పోయి చరిత్రలో స్ధానం వొంది గౌరవాన్ని గడించుకొన్నారు. సమాజానికి తెరువు చూపించారు.
మూధాచారాలలో మగ్గిపోయిన మానవాళి అభిప్రాయాలను ఖండించటంలో రాజారామ్మోహనరాయ్, కందుకూరి, గురజాడ చూపిన దారి కృంగికృశించి పోయే అభాగినులకు తెరువు అయ్యింది.
సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేపట్టిన బాపు చొరవే మనకు న్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టంది. తమని తాము రక్షించుకొడానికి కూడా చొరవ వుండాలి.
ఉద్యోగం, ఉద్యమం, యజ్ఞం, యాగం, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయం, సాయం ఏమి చెయ్యాలన్నా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే జరగవు. చొరవ చూపి తక్షణం మొదలుపెడితే ముందుకు సాగే తెరువు తెలుస్తుంది.
సెవన్ సీటరు ఆటో ఎక్కాలంటేనే కొందరు భయపడతారు. ఒక మహిళా సెవన్ సీటర్ ఆటో నడిపి కుటుంబానికి ఆధారమయ్యింది. అవార్డు పొందింది. భర్త బాధిస్తున్నాడని కృంగిపోకుండా చొరవచేసి ఆటో నడిపి కుటుంబాన్ని గడుపు తున్నానని గర్వంగా చెప్పింది.
నేడు ఆర్థింకగా అభివృద్ధి చెందిన టాటా, బిర్లాలు కూడా ఒకప్పుడు చొరవచేసి చిన్న వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళ. రాళ్ళు కొట్టడం నుంచి రాజ్యాలు ఏలటం వరకు పనిలో చొరవగా చొచ్చుకు పోయినవాళ్ళే ముందుకు సాగారు.
నిత్యకృత్యాలలో అనేక కుటుంబాలలో ఒకరితో ఒకరు చొరవగా మాట్లాడుకో లేకపోవడం అనేక సమస్యలకి దారితీస్తోంది. ఏ వయసు వారికి ఆ వయసుకు తగ్గ సమస్యలుంటాయి. ధైర్యంతో చొరవ చేస్తేనే ఆ సమస్యలు పరిష్కారమై జీవితంలో శాంతి, సంతోషాలను పొందుతారు.
60 * అక్షర ళిల్తాలు
చాలా మంది తమ సమస్యలకి మరి ఎవరో కారణం, ఇంకెవరో వచ్చి తీర్చా లని, అర్ధం పర్ధంలేని ఆలోచనలు చేస్తూ అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటారు. చొరవ చూపని వారి జీవితాలు ఓ అర్ధం పరమార్థం లేకుండా నిరర్ధకంగానే ముగుస్తాయి. కర్తవ్య నిర్వహణలో “ఆలస్యం అమృతం విషం” అనుకొని చొరవ చూపాలి.
పిల్లలకి తప్పు ఒప్పు చెప్పే చొరవలేిని తలితండ్రులు.
తలిదం(డ్రులకి నిజం చెప్పే చొరవలేని పిల్లలు.
బాధ్యత ఎరగని భర్తలని నిలదీసే చొరవలేని భార్యలు.
అత్తింట్లో ఆరడిపడుతున్నా చొరవ తీసుకొని పోరాడ లేని కోడళ్ళు.
అత్తింట్లో తిష్టవేసి, అ ఇంటిలో అందరిని హడలగొట్టె అల్గుళ్ళకు “ఇదీ పద్ధతి"
అని నీతి చెప్పే చొరవలేని అత్తమామలు.
వృద్ధులైన తలిదండ్రులని గౌరవంగా చూడమని భార్యలకి చెప్పె చొరవలెని
భర్తలు.
పెళ్ళి విషయంలో సరైన నిర్ణయం ' తీసుకొనే చొరవలిని యువతరం.
ఇలా ఎందరో చొరవలేక, బ్రతకలిక, చావలేక, (బ్రతుకును భారంగా మోస్తూ
జీవనయానానికి తెరువులేక తాము బ్రతుకుతున్నది ఎందుకో కూడా తెలియని
దుస్థితి తెచ్చుకొంటారు.
ఒక్కమాటలో చెప్పాలంటే “చొరవలేనిదే తెరువు లేదు.”
జగత్ రక్షాకరి జగన్మాత జగన్మాత సర్వవ్రాణ కోటిని సృష్టిస్తుంది. చరాచర జగత్తుని అనిమిషైై నడిపిస్తుంది. శ్రీమాత అపార మాతృ మమతే మాతరూపంగా ఈ సృష్టిలో క్రిమి, కీటక, జంతు, మానవజాతి ఉద్భవించటానికి తోడ్పడుతుంది.
సర్వసృష్టిలోని చరాచర కోటి వీజరూప సంస్కారాలన్నిటినీ ఆ శ్రీమాత తనలో నిక్షిప్తం చేసుకుంటోంది. మనం పుట్టక ముందు ఏ మాతృస్థానంలో, పంచభూతా లలో మనం లయం అయి వీజరూపంలో ఉన్నామో ఆ మాతృస్థానమే శ్రీమాత స్వరూపం.
ఆ తల్లి రాగస్వరూవ, భక్తివశ్య, నిరాడంబరి, నిర్లిప్త, నిర్మల, నిశ్చల, నిరహం కార “భవాని భావనా గమ్యం*% మనం ఏ రూపాన్ని ధ్వానిస్తామో ఆ రూపంలోనే సాక్షాతృరిస్తుంది.
శ్రీమాతను పూజించటానికి హంగు, ఆర్భాటాలు అక్కరలేదు. నిశ్చలమైన భక్తి, హృదయ ప్రక్షాళనం కావాలి. హృదయంలో ఉన్న అరిషడ్వర్లాల మురికిని కడిగేసి సర్వం శ్రీమాతార్పితంగా భావించాలి. మనసు మన వశంకాని పక్షాన ఆ తల్లి పాదాలపై పడి శరణు వేదాలి. ఆరు శత్రువులను నశింపజేసి మనకు చిత్తశాంతిని కలిగించటానికి ఆ కరుణా తరంగిణి సాక్షాత్కరిస్తుంది. ఉదయించే సూర్యుని కాంతి తిమిరాన్ని హరించి సర్వప్రాణి కోటిలో చైతన్యాన్ని నింపుతుంది. జగన్నాతని భక్తి పారవశ్యంతో పూజిస్తే మన పాపాలను నాశనం చేస్తుంది. ఆ తల్లి కామేశ్వర (పేమ రత్నమణి ప్రతిపణస్త ఈశ్వరుని అర్ధశరీరం ఆక్రమించిన అర్జాంగి. ఆ తల్లితత్వం తెలుసుకొని ఆరాధించే వారికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది.
ఆ తల్లి మృడుని అనీ, సత్యమే సుఖతత్వాన్ని ప్రసాదించే సాధనమనీ, శివుని ఇల్లాలని గోచరమవుతుంది,
జగన్మాత నిత్యతృష్తా, తన భక్తులైన వారు పేదవారైనా, గొప్పవారైనా ఏ పద్ధతిలో పూజించినా, ఏ రకమైన ప్రసాదం పెట్టినా వారిలోని భక్తి పారవశ్యాన్ని పరిపక్వతను మాత్రమే (గ్రహించి వారిని రక్షిస్తుంది.
నాడు, నేడు కూడా భండాసుర లక్షణాలు ఉన్న వారిని శిక్షిస్తూనే ఉంది.
అసురుల లక్షణం సోమరితనం, అతి తిండి, అతి నిద్ర, పనిలేనితనం, కష్టపడ కుండా అన్నీ సమకూడుతుంటే అహంకారంతో ప్రజ్వరిల్లటం వంటి లక్షణాలు అన్నీ
62 * అక్షర శిల్పాలు
సురగంగలాంటి, మానస సరోవరం లాంటి మనసు భక్తి పారవశ్యంలోకి అలా ఉప్పొంగే కన్నీరుతో ఆ తల్లి పాదాలను అభిషేకించి, నిష్కల్మష హృదయంతో శక్తిమర భక్తి శ్రద్ధలతో శ్రీలలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే స్వయం లలితా స్వరూపులుగా రూపొందగలరు.
జగన్మాతను అష్టవిధ పుష్పాలతో పూజించాలి అంటే గులావీ, మల్లెలు, మందారాలు కాదు. “అహింస, ఇంద్రియ నిగ్రహం, స్వభూత దయ, క్షమ, శాంతం, తపస్సు, ధ్యానం, సత్యం. ఇవి ఏ తోటలోనూ పూయవు. కేవలం మన హృదయా లలో మొక్కలునాటి పెంచి, పోషించి, పూజించవలసినవి. ఈ పుషాలే జగన్నాతకు ప్రీతిపాత్రమైనవి,
64 శ అక్షర ళిల్తాలు
- వచన కవితా సంహెత సాబగు పలుకుల తెలుగు తల్లి భాస్కరుని రామాయణము మణిమకుటమై జిలుగు వెలుగుల పాలవెలి విశ్వనాథుని కిన్నెరనాని కంఠసీమయెై ఏబది ఆరు అక్షరాల అల్లిక శ్రీశ్రీ, గురజాడ, కందుకూరి రచనలు కవికుల మనోభావాల రూపిక కురుల ముడిచిన కదంబములై చిన్నయసూరి వ్యాకరణం ్రాణముగా *లొారెడి తెలుగు తల్ల అష్టదిగజముల కావ్యములె అస్తికలుగా ఆంధ్రుల సారస్వత కల్పవల్లి నవరసములెల్ల రుధిరమై ప్రవహించ ల | నీతి శతకములన్ని శ్వాసకాగా జ్ ని ఆంధ్రీకరించిన పంచతంత్రమె పంచేం(ద్రియాలుగా శోభించ కవిత్రయ భారతమే కరాళమై పోతన భాగవతమే పరిద్రోణిగ తిమ్మక్క ద్విపదలే కుచ ద్వయమై శ్రీనాథుని శృంగార నైషధమే సుందర సురుచిర మధురాధరమై అన్నమయ్య సంకీర్తనలే సొగసైన పలువరుసై నండూరి జానపదములే పదరాజీవమున శింజానమై త్యాగరాజు కీర్తనలే కేయూర కంకణములై మంచన కవిత్వమే ముత్యపు హారములై తిరుపతి వేంకట కవుల పద్యములే లలాట తిలకమై
- మొల్ల రచనలే తీరైన కాటుక రేఖలై రామదాసు కీర్తనలే దివ్య వస్తములై
తల్లి భారతి విజ్ఞానం అంతరిక్షంలో విహరిస్తున్నా సామాన్యుల బ్రతుకు బాట స్వార్ధపూరిత రాజకీయ పాదాక్రాంతం అయిపోతుంటే సమైక్యత కరువైన తనయుల తన్నులతో అవిటిదై పోయింది తల్లి భారతి. తెగించి స్వార్ధాన్ని కదిలించే చైతన్యమూర్తులకు అకాల మరణం అవార్డు అవుతుంటే, ప్రతిభకు విలువ పొందక తన అనుంగు బీడ్డలు కీర్తి శేషులైపోతుంటే, కడుపుకోతను తట్టుకోలేక కన్నీళ్లు తాగుతూ, ఎక్కిళ్ళు మింగుతూ కుమిలి కుమిలి కృంగివోతుంది తల్లి భారతి. స్వార్థ సారధ్యంలో అవినీతి రథానికి దౌర్జన్యపు దుండగులు, అధికారపు అహంకారులు చక్రాలుగా తిరుగుతుంటే, నిరంకుశంగా నలిగిపోతూ ప్రగతి లేక నీటికి కూడా నోచుకోలేక నికృష్ణపు సంతతి గొంతు ఎండిపోతుంటే మూగదైపోయింది తల్లి భారతి-- కూటికోసం, కోటి పాపాల కూపాల్లో చిక్కుకున్న కర్మానికి, చావుకు సహితం తెగించి వావివరసలు వయసు సహితం మరచి, సంఘాన్ని చీడపురుగులుగా దొలచివేస్తూ నీతి న్యాయాలను కూల్చివేసే బుద్ధిలేని బడుద్దాయిల చర్యలకు లోనైన, బిడ్డల రోదన వినలేక చెవిటితనాన్ని కోరింది తల్లి భారతి. నవనాగరికత నడిబజారులో నైతిక విలువల్ని వేలం వేస్తుంటే, అబల అసహాయ ఆర్తనాదాలకు, పిల్లల నిరాదరణ, నిర్లక్ష్యపు చర్యలకు గురిఅయ్యి, వృద్ధుల గుండె మండిపోతుంటే, ఓదార్చలేని కుసంస్కార కొడుకుల కూర. కృత్యాలను కనలేక అంధురాలు అయింది తల్లి భారతి! నిరుద్యోగ జీవచ్చవాలపై అనర్హులను అందలం ఎక్కించి, ముడుపులను అందుకునే ఇలవేల్పులు, శ్రీపతి సుతుదే కదా అని సరస్వతి వరిస్తుంటే విద్య ధర ధరకు దగ్గరవ్వాలని సమ్మెలు చేసి సమ్మెట పోటులు తింటూ నీరు కారిపోయే భావిపౌరులను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది తల్లి భారతి. త్రివర్ణ పతాకపు వర్ణచిహ్నాలు తారుమారు అవుతుంటే తేనె పూసిన కత్తిలా, స్వలాభాపేక్షతో ధనార్ధనాపరుల ఆర్భాటపు హంగులతో, స్వతంత్ర గణతంత్ర అర్ధశతా్టీ దినోత్సవాలు జరుపుతుంటే ఆక్రోళశిస్తూ రక్తాశువులను రాల్చింది తల్లి భారతి.
66 * అక్షర ళిల్తాలు
మోక్షమొసగు జీవెశ్వర
శక్తితో శోభించే సుందరేశ్వర!
శుభకర! సకార భక్తవత్సల
నాగభూషణ, వ్యాఘ్ర చర్మధర
చంద్రశేఖర వృషభ వాహన గంగాధర!
(త్రినేత్ర అభయహస్త అర్ధనారీశ్వర
భక్తవత్సల సౌమ్యరూప, శంభో హరహర
నీ తత్వం బెరుగ ఎవ్వరికి శక్యము
శంకరాచార్యునికి పరమాత్మతత్వం
తెలిపిన పరంధామ! మహాదేవదేవ!
అన్నిట నీవుందువని, అన్నియు నీ యందే అని
తెల్పిన సత్యమూర్తి మము బ్రోచే శివానంద
కన్నప్పకు కైవల్య మొసగిన కైలాసవాస
మార్కండేయుని చిరంజీవిని చేసిన సాంబశివ!
కుమార సంభవమునకై మరుడు విరిశరమేసిన
ఫాలనేత్రము తెరిచి భస్మంబుగ చేసి
రతీ దేవికి పతిభిక్ష పెట్టిన చిద్విలాస!
త్రిగుణ సంపన్న అఖిల మనోహర!
నిరాకార నిరంజన అవిద్యను అంతమొనర్చి
సంఘటిత శక్తితో అసుర సంహరణ చేసితివి.
సంఘమున శాంతిసాఖ్యములు నెలకొల్పశంకర!
పార్వతీ ప్రాణనాధ పశుపతె
పంచారామాల్లో ఈశ్వర తేజంబుగా వెలసి
ద్వాదశ జ్యోతిర్లింగములుగా వెలిగె విశ్వేశ్వర
సహస్ర కోటి లింగ శిశిరంబు సార్ధకంబు చేకూర్చ
శివరాత్రి శుభసమయాన
మాయమ్మ జగదాంబతో ఐక్యమై
రుద్రతాండవము చేసె సదాశివ
కామేశ్వర నీ కళ్యాణమె లోక కళ్యాణముగ మోచర్ల రామలక్ష్మి * 67
నటరాజ లయకార నీవు తప్ప అంతిమ కాలమందు తోదురారు ఎవరు కట్టెను కాల్చి తిరిగి చూడబోరు పిదికడు భస్మమయ్యె ఈ దేహం నీపాదబ్ద ధూళికగ గైకొను మోక్ష మొసగు జీవెశ్వర. లేమా! మనం గ్రహించలేమా! అతివ! అణుకువే సీకాభరణం కన్నకొడుకుని కాదని ఆడదానికి ఆదడదె శత్రువమ్మా కోడల్ని వెనకేసుకొచ్చె అత్త ఇల్లాలా! భూదేవిలా ఉండాలా విడ్డూరంగా ఉందే అన్నాడతను ఈ సూక్తులు స్వార్ధపరుల కుయుక్తులని అత్తా కోడలంటే పిల్లి, ఎలుక ఉదితల వ్యక్తిత్వాన్ని చీల్చే కత్తులని పులిమేక కాదు వైరం ఉండటానికి లేమా! ఈ విషయం మనం (గ్రంహించలేమా వ్వక్ట జీవాన్ని నేనిస్తే
శ రాని. ణ్ ఒసయ్ వగలు మాని జీవితం ఆమె పంచింది ఎందుకు? అందాతని ఆలి పోయినా ఫరవాలేదు ఎదురు ప్రశ్చలేంటి హింసించితే మాత్రం గా సవాలక్ష ఊరుకోను అంది “ఆతనితల్లి'
స ఏ ఉంటా అవసరాలు ఉంటాయి ఏం చేస్తావు? అన్నాడు హేళనగా క. అదా అణుకువ సహనాన్ని చేతకానితనంగా అభిరణ 0౧)౯అటడూా సన ఓరిమిని ఓటమిగా అనుకుంటే అమ్మలందరు అలా చెప్పబ్యు అణుకువనే అణుశక్తిగా మారుస్తా నీలాంటి వెధవల ఆటలు సాగుతున్నాయి గ దుచే స న గు[ర్రపందాలు, జూదాలు, లాటరీలు ప క కు న లి జో అంటూ అంది అతగాడి తల్లి గా న్షంంలా 68 * అక్షర ళిల్సాలు
మరో పెళ్ళి చేస్తా అందామె. దీన్నేమంటారు? భార్య తన్ని వదిలేస్తే స్త్రీకి స్తీ సంఘంలో తన న్ధానం శత్రువా! ఊహించుకుని హడలిపోయాడు. ఆసరానా? ఆ మధ్యతరగతి మానవుడు లేమా మనం ఈ విషయం అత్తా కోడళ్ళ ఐక్యతకు (గగ్రహించలేమా? తలవొగ్గి మనిషిగా మారాడు. అనాదిగా ఉగాది ప్రభోదం మావి చిగురు తిన్నడగరు కోరిన కమ్మని కొబ్బరి (ప్రభాతమునే వగరున్న మావి పిందె కుహూకుహూ రాగంతో రుచితో కలసి సంబరంగా స్వాగతం పలికె షద్రసముగా ఆరగించుటే మరుని వింటి శరములే జీవన యానంలోని మల్లి విరజాజులుగా విరిసి మలుపులకి సంకేతం, ముచ్చటగా మానవాళి మదిని ఊపే కష్ట సుఖాలు వెలుగుజిమ్మే భానుని కాంతిలా చీకటి వెలుగులు హరిత వస్త్రము దాల్ఫ్సిన ధరణిగా జనన మరణాలు జలా కరము గలగలే నవ్వగా ప్రకృతి వైపరీత్యాలు మలయమారుతము సోకిన కాలచక్రంలో తిరిగే పులకింతతో ధర్మాలని గ్రహించాలి ఆమని అరుదెంచే చైతన్యంతో సాగాలి అగజ ఆమోదముతో ఆర్తులకు ఆసరా ప్రజకి ప్రమోదముగా అవుటే పరమావధని పూసిన వేపచేదు జీవన పోరాటానికి పందిన చింత పులుపు అనాదిగా ఇదే ఉగాది (ప్రభోదం. అచ్చుగున్న చెజికు తీపి
మోచర్ల రామలక్ష్మి * 69
కాలగమనం అనురాగ, ఆలత్మీయతానుబంధాలే పునాదిగా సమత, మమతల సమ్మళనే పై కప్పు కాగా సాంప్రదాయ సంస్కృతి పటిష్టమైన గోడలుగా అతిధి ఆశీసే గుమ్మాన పచ్చతోరణమయ్యె పసివాపల దరహాస చంద్రికలు ద్వారాలు కౌమార్యుల చిలిపి కేరింతలే ఆ గవాక్షాలు యవ్వనోల్లాస పూరిత ఉత్తేజాలు వసారాలు వృద్దుల సలహాల ప్రాకారమైనవి నాటి లోగిళ్ళుందే. కలి ప్రభావమో, ఆకలి మాయో, కాలమపహిమో కరువు కాటకములు క్యూర నృత్యములు చేసే కరుణను శ్రోసి, కపటముకై ఆసనమేసే కడుపు పంటే మంటయ్యే, ఆర్పకనులు వర్షించే (పేమాప్యాయతలు, వేగంగా, గుండె గదులు దాటి న్వార్ధ చింత చేరి, ఆర్థికాభివృద్ధి కోర కన్నవారిని కనుట మా తరము కాదనిరి (బ్రతుకు వేగంలో పయనించే ఈనాటి యువత రాముడు, పురూరవుడే సుగుణాల మా సుతుడు పున్నామ నరకం తప్పించునని మురసితిమి ఇంట మేముంటే కంటకమని విలపించినాడు పిచ్చి కన్నను మేం బ్రతికి బాధించలేమనిరి. కొడుకు కృత్యాల ఎదదెబ్బపై లేపనం పూసి అర్హులైన మమ్ము అక్కున జేర్చుకొని ఊరడించే ఆది వ్యాధికి బెషధం ఆశ్రమ జీవనమని భోదపరిచి స్వాగతం పలికే సేవాపరులు. ఆదరముగ పెట్టు కూడు అమృతముగ మారే వంటి బాధలు పోయి, మనసుకి ఉల్లాసమొచ్చె సమకాలీకులతో ఇష్టాగోష్టి సంతసమయ్యే
70 * అక్షర శిల్పాలు
ఈ యోగ కారకుడు మా కొడుకే అనిరి వృద్దులు. వృద్ధావ్యాన్ని మరో బాల్యంగా రూపుదిద్దుకొంటిమి మా కళాతేజస్సు, మేధస్సును వెలికి తీస్పిమి విశ్వశాంతికై వినియోగించుడి యువకులారా మీ వృద్ధి కోరే మేము, వ్యర్థులము కాము అనిరి. మెట్ట వేదాంతం మాని, వంశాభివృద్ది కోరండి ఆస్థిపాస్తులన్నీ పరుల పాలు చెయబోకండి మీ అస్థికలు గంగ కలిపె ఖర్భుంది మాకనే సుతుని సూక్తి దెయ్యం వేదాలు వల్లించినట్టుందే. చివరి దశ తల్లిదండ్రులది చూడరమ్మనగ మాకు వారికి బుణం లేదనే గర్భశత్రువులు పేగు బంధం కన్నా మానవత్వమే మిన్నయనుచూ అనాధ (ప్రేత సంస్కారం చేసితిమి .బాధ్యతగా. మా కర్మ ఫలానికి, స్వజనుల నిందించకంది మహా(ప్రసానానికి కొడుకు ప్రస్తావనెందుకు పరోపకారంకై కాయం, కనులు యోగించుడనే కన్న (ప్రేమకి కూడికే కానీ, తీసివేత రాదు. గడిచిన 25 సంవత్సరాల కాలగమనంలో కొందరు వృద్దులు, మరికొందరు యువతరం, సేవాతత్పరుల హృదయాల నుంచి వెలువడిన భావాలకి అక్షర రూపమే ఈ “కాలగమనం.” మోచర్ల రామలక్ష్మి * 71
కొమ్మా - తెలుసుకోమ్మా మహిళా మాణిక్యమా అత్త అమ్ముకొస్తే వనితా రత్నమా నూకలొస్తాయనుకుంది. భామా బంగారమా దగ్గుతో చుట్టుకు పోతున్న కడిగిన ముత్యమా అత్త దీనస్థితి చూసింది అంటూ విలువ కట్టి రేపటి తమ స్థితిని తలుచుకోగానే మాటలతో మూటలు గుండెలో మంటలు చెలరేగి ఎన్నో కడతారు కన్నీళ్ళని ఆవిరి చేశాయి తిండిలేక ఎండిన కొమ్మని ధైర్యము కోల్పోకని తాళి కట్టిన వాడే తాళి మనసు హెచ్చరించింది తెంచుకెళ్ళి తాగొచ్చి పాలిపోయిన పెదవుల మీద తాపం తీర్చుకు జీవం లేని నవ్వు తెచ్చుకుని పరారయ్యాడు. అత్తా పూలమ్ము కొత్త ఇంటీ బాధ్యతలతో నువ్వు, పిల్లలు జాగర్త అంది బతుకు బండి భారంగా అంతలోనే ఊడిపడ్డాడు నడుపుతోంది ఆమె. ఆరు నెలలుగా పరారైన ముందు పుళ్టన కవలలు ఆమె మొగుడు, ఆకలికి ఎద్బి ఎడ్చి మరో! ఇద్దరు వస్తాదులను సొమ్మసిల్లారు వెంట పెట్టుకుని. ఆమె భుజం మీద ఒసేయ్! బంగారమా! ఎడపిల్ల రోగంతో కవలోళ్ళని ఈయనకి రోదిస్తుంటే ఎడదాన్ని ఆయనకి మందిప్పించే ఇచ్చేత్తే ముసల్దాన్ని స్థోమత లేక ఏదో ఆశ్రమంలో ఊరడింపుగా ఏస్తారంట. ఎదకు హత్తుకుంది. మనమిదరం నేను ఉన్నానని ఇంక సిల్క గోరింకల్లే కడుపులో పిల్ల కదులుతోంది. ఉందాం అన్నాడు. కూటికోసం పూలమాల కట్టింది &రి నరకాసురుడా!
72 * అక్షర ళిల్తాలు
'కన్నాళ్ళకేనాడ కూర టా? గాల విశ్వశాంతికి నీ వంతు నీ సారా కోసం ఈళ్ళని గోరుముద్దలు పెట్టి నిన్ను సాని కొంప కమ్మేత్తున్నావా? పెంచిన వారిని పురిటిలో సందికొట్టి అలుసు చేసి నువ్వు సచ్చుందినా బావుండేది. చిన్నబుచ్చకురా అంది అతగాడి తల్లి మొక్కుబడిగా దగ్గుకి వడుపుని శృతిచేసి ముద్ద పెట్టి సమయానికి స్లమ్ ఏరియా నాలిముచ్చులా నువ్వుండి సంక్షేమ సంఘ మహిళలు వారి మనసున చిచ్చు పెట్టకురా అటు వచ్చారు. కన్నవారి మనసుకి పసిపిల్లల క్రయవి(క్రయాలు దీవించే శక్తి ఉంది జరిపే వాళ్ళ ముగ్గుర్నీ ఆ మనసు కలత చెంది అరెస్టు చేయించారు. కన్నీరు చిందిస్తే ఆ కుటుంబానికి ఆపై వాడే నీ కుమారుని జీవనాధారంగా నీకు మారుగా సృష్టిస్తాడు పూలకొట్టే పెట్టించారు కాలచక్రం ఇట్లు తిరిగితే పిలల చదువులకి మానవత్వం మరుగున పడి సాయాన్ని అందించారు. హింసాకాందడతో విశ్వమంతా దీన్నేమంటారు? విలపిస్తూ ఉంటుంది. ఆడదానికి ఆడది విశ్వశాంతికి నీ వంతుగా శత్రువా? ఆసరానా? నిను కన్న వారిని మురిపించు కొమ్మా ఈ విషయం వారి దీవెనలు పొంది తెలుసుకోమ్మా! ప్రగతి సాధించు.
మోచర్ల రామలక్ష్మి * 73.
నెనదిగిల హక్కు ప్రతిఫలము ఆశించని దానము ళ్ నువ్వదిగళ టెక్కు ప్రతిష్టను కోరక చేయు సేవలు న ఎన్నా శ మాదిం ప్రతిజ్ఞబూని సల్బె సత్కర్మలు
అది నువ్వు చెస్తె ప్రమాదం ప్రతిభావంతుల పరిత్యాగములు నే నడిగితే లాంఛనం ప్రగతి పదమునకు సోపానాలు నువ్వడిగిత లంచం ప్రజలకు అభయమిచ్చే పాలకులు నా పిల్లలు అల్లరి భావవల్లరి ప్రపంచ చరిత్రకు ప్రతీకలు నీ పిల్లల అల్లరి పీకేసిన పందిరి నా మాటలు తేనె లూటలు అటవా॥ అపాం. నీ మాటలు నీటి మూటలు నా కోపం పదుగురికి చేటు నీ కోపం నీ పెదవికి చెటు
-అళవమా4 అహ సాాల- మమతల మల్లి
(ప్రేమామృతము నీకు పంచిన అమ్మని
విషపూరితమైన మాటలని బాధించక
కరుణగల ఆ తల్లి కళ్ళసీళ్ళ పొంగిన
నీ జీవితంబున ఉపప్రదమైన ఉప్పెన వచ్చున్.
అమ్మమనసు వెన్నరా, వేడి మాటలు అనకురా?
కరిగి కాల గర్భంలో కలిసిపోయిన అమ్మ
నువ్వెంత పిలిచినా, నీకు మరలిరాదురా
అమ్మ ఉన్ననాడే, అమ్మ ,... అని పిలవరా
పరవసించి పోతుంది ఆ పిచ్చి తల్లి
మమతల మల్లె అమ్మరా
నిండు మనసుతో ఇస్తుంది
నీకెన్నో చల్లని దీవెనలు.
74 * అక్షర ళిల్సాలు
- నాటికా వాటిక వందే మాతరం పాత్రలు: 1. గాంధీ, 2. సుభాష్, పటేల్, ప్రకాశం, రాజీవు ప్రసాద్, నెహ్రూ. గాంధీ: వందేమాతరం .... వందే మాతరం. పతాక వందనానికి రాలేకపోయాను క్షమించు తల్లి (భారత మాత ఫోటోకి నమస్కరిస్తూ) కూడు గూడే కాదు నీ ఓీడ్డలకి సీటికి కరువు వచ్చింది. న్నానానికి పానానికి నానా అవస్థ అవు తోంది. పక్క వీధి పంపు దగ్గర సమరం జరిపి బిందెడు నీళ్ళు సాధించాను. చెంబుడు నీళ్ళతో స్నానం అయ్యిందనిపించుకొని వచ్చాను. సుభాష్: సెభాష్ గాంధీ గారు. మీ ధైర్యసాహసాలకి సత్సారం చేసే సత్తా నాకు లేదు అందుకే మీకు నమస్కారం చేస్తున్నాను. గాంధి: స్వార్ధంతో నా ఒక్కడి శుభ్రతే చూసుకున్నాననా? వెటకారం చేస్తున్నారు. సుభాష్: అయ్యో అపార్ధం చేసుకోకండి. నేను పరిసరాలు పట్టించుకొని నా ప్రాణం మిదికి తెచ్చుకున్నా. నేను చెప్పేది శాంతంగా వినండి. పర్యావరణ పరిరక్షణ శాఖలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అధికార పార్టీ ఎమ్.ఎల్.ఎ. గారి బావమరిది. వారి ఏకైక పుత్రిక పుట్టిన రోజు నవరాత్రులు చేస్తున్నారు. భారతంలో బకాసురుడికి రోజూ బండెడు అన్నం వచ్చినట్టుగా వీరి ఇంటికి వస్తుంది. రోజుకి ఒకరు పంపుతారు. వారి స్థాయికి తగ్గవారు విందు ఆరగించాక, ఎంగిలాకులు వీధుల్లో ఎగురుతూ ఉంటాయి. ఆ కంపు భరించలేక ఇది ఏమిటి అని అడిగే ధైర్యం లేక, ఆ ఎంగిలాకులు అన్నీ ఎతాను. ఆ అకులు ఎత్తే అర్హత నాకు లేదని, ఆ ఆకులు ముట్టుకున్నందుకు పన్ను కట్టాలని, కట్టలేకపోతే నా పళ్ళు ఊడగొడతామని వాళ్ళు తరుము కొస్తుంటే పక్క సందుల్లోంచి ఇలా వచ్చాను. అమ్మా భారతమాత వందే మాతరం వందేమాతరం. పటేల్; గాంధీగారూ నన్ను రక్షించండి. గాంధీ: అదేమిటంటే ఉక్కులా ఉండే మీరు బిక్కు బిక్కు మంటూ ఆ మూలనక్కి కూర్చున్నారు.. పటేలు: ఏం చెప్పమంటారు. మా వీధిని పాలించే రౌడీ షీటర్ గారు నిన్న మేన్ హోల్లో పడి పరమపదించారు. వారి శిష్యబృ్బందం వారి దినం అయ్యే మోచర్ల రామలక్ష్మి * 75
వరకు సంతాప దినాలు ప్రకటించారు .... మా వీధిలో శుభకార్యాలు జరగ కూడదు. మేం ఎవరూ శుభకార్యాలకి వెళ్ళకూడదు. పతాక వందనం కూడా చేయకూడదని హెచ్చరించారు. ఏం చేస్తాం మైట్ ఈజీ రైట్ అందుకే వీళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మెల్లగా ఇలా వచ్చాను. వందే మాతరం, వందే మాతరం.
సుభాష్: మనల్ని చూస్తుంటే మనకే జాలి వేస్తోంది. జాతిని జాగృతి చెయ్యగలమా (ప్రకాశం గారేమిటి అలా. నీరు కారిపోతున్నారు.
ప్రకాశం: మెం కారు పెట్టుకునే మా స్థలాన్ని మరొకడు కబ్ట్బా చేశాడు. ఊరుకోవడం ఉత్తమం కాదని ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాను. వాడు రాజీకి వచ్చే సమయానికి హోమ్‌లోనే అపోజిషన్ వచ్చింది.
పటేలు; హోమ్లోనా?
(ప్రకాశం: అవును ... వెధవది కారు ఎక్కడ పెట్టుకుంటే ఏమిటి? మీరు అసువలు బాపి నా పసుపుకుంకాలు ఎత్తుకుపోతారా? ఇదిగో ఈ లెమన్ టీ తాగి నిరాహార దీక్ష విరమించండి. లేకపోతే బలవంతంగా నోట్లో నేనే పోసేస్తాను అంటూ మా ఆవిడ సతీసావిత్రి నా మీద విరుచుకుపడింది. ఆ గుక్కెడు టీ తాగి ఇంట్లోకి వెళ్ళటానికి మనస్మరించక జందా వందనానికి ఇటు వచ్చా. వందేమాతరం వందేమాతరం (భారత మాతకి నమస్కరిస్తూ)
సుభాష్: గాంధీగారు మన ప్రకాశం గారికి నీరసంగా ఉంది ఓ ప్లేటు ఇడ్లీ తెప్పిద్దాము.
గాంధీ: అలాగే ... పటేలు గారు. మీరు వెళ్ళి ప్రకాశం గారికి ఇడ్లీ తెస్తారా?
పటేలు: ఇడ్లీ తెస్తుంటే ఆ రౌడీ షీటర్ గారి తాలుకు ఎవరన్నా కనిపిస్తే నా ఎముకలు విరిచెస్తారు. అటు చూడండి డాక్టరు రాజేంద్ర ప్రసాద గారు పరిగెత్తుకుంటూ ఇటు వస్తున్నారు.
ప్రసాద్: సత్యాన్ని వధించారు. నా ధర్మం నన్నే చంపేస్తోంది. న్యాయం నిద్ర వోతుంది. రక్షక భటులు భక్షక భటులై తరుముతున్నారు. చట్టం చుట్టాల వైపు తిరుగుతుంది. వందే మాతరం వందేమాతరం.
గాంధీ: రాజేంద్ర ప్రసాద్ గారు మాటమాటకి సంబంధం లేకుండా మాట్లాడు తున్నారు. కొంపతీసి ఆపరేషన్ చేస్తుంటే పేషంట్ ప్రాణం వదిలేశాడా?
రాజేంద్రప్రసాద్; వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునే వ్యక్తిని. నా పేషంట్ని నా చేతు లతో చంపుకుంటానా. నా ప్రాబ్లమ్ మా ఇంట్లో రెంట్కుంటున్నావిడ వలన.
ప్రకాశం: ఆవిడ వలన ్రాబ్లమ్ ఉంటుంది కాని, రెంట్కున్నావిడ వలన ప్రాబ్లమా (ఆశ్చర్యంగా) 76 * అక్షర శిల్పాలు
రాజేం: అవును సార్ ఆవిడ మా ఇంట్లో అద్దెకి చేరి ఆరు నెలలయ్యింది. పటేల్: రాజేంద్ర ప్రసాద్ గారు మీరు డాక్టరేగా? గాంధీ: అయ్యా వారు దాక్టర్ కాదనె డౌటు మీ కెందుకు కలిగింది? పటేల్: ఇందాకటి నుంచి విషయాన్ని సూటిగా చెప్పకుండా టీవి సీరియల్ లాగ లాగుతుంటే. ప్రసాద్: నే చెప్పేది పూర్వాపరాలు చెప్పకుండా చెపితే అర్ధమయ్యే విషయం కాదు. అయినా మాలాంటి మధ్య తరగతి దాక్టర్లంటే ప్రతివాళ్ళకి లోకువే. పటేల్: సారీ ప్రసాద్ గారు, మీరు మళ్ళీ నాకు డౌట్ క్రియేట్ చేశారు. డాక్టర్తకి తరగతులేమిటి? గాంధీ: అబ్బా మీరూరుకోండి పటేల్ గారు. మధ్య తరగతి డాక్టర్లంటే ఓ చిన్న హాస్పిటల్ పెట్టుకొని మనలాంటి వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ప్రకాశం: కరెక్టు సార్. అదే కార్పొరేట్ హాస్పటల్స్‌లో పని చేసే డాక్టర్త కంట్లో నలక పడినా కడుపులో మంట వచ్చినా ...... హార్ట్ ఆపరేషన్ చేసినంత హడావిడి చేస్తారు. బిల్ సుమారుగా అంతే వేస్తారు. అటువంటి వారిని పెద్ద దాక్టరు అంటారు. వారి కారు, బంగళా కూడా పెద్దవిగానే ఉంటాయి. సుభాష్: (గాంధీ, ప్రకాశం, పటేల్ కేసి చూస్తూ) ఆయన్ని చెప్పనివ్వండి, ఆయన వాక్ స్వతంత్రాన్ని మీరు హరించకండి. చెప్పండి డాక్టరు గారు. ప్రసాద్: థాంక్స్ండి, సుభాస్ గారు. రెంట్ అడగటానికి నేను వెడితె రెంటు తెచ్చారా అందండి మా ఇంట్లో రెంటుకుందే ఆవిడ. ప్రకాశం: దాంతో మీకు మతిపోయి ఉంటుంది. ప్రసాదు: అవునండి... ఆ ఇల్లు తనదేనని, ఇరవై ఏళ్ళ నుంచి తను రెంటు ఇవ్వటం లేదని, తను రెంటు అడగటానికి వస్తే హత్యా ప్రయత్నం, మరో ప్రయత్నం చేశానని, నా ముందే పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసులు నన్ను అరెస్టు చేయటానికి తరుముకొస్తున్నారు. సుభాష్: చూశారా దారుణం. ఆడది అంటే కరుణామూర్తి అంటారు. ఆమె ఇంత కఠినంగా మారింది అంటే ఇది కాలమహిమ కాక మరేమిటి? సీత, సావి త్రిలు నడిచిన ఈ పుణ్యభూమిని వాప పంకిలం చేసేస్తున్నారు. పటేల్: ఊర్బ్కోండి సుభాష్ గారు. పురాణాలు విప్పి డాక్టరు గార్ని మరి కంగారు పెట్టకండి. సీతాదేవి కాలంలో సూర్చణఖ, తాటడి కూడా ఉన్నారు. వాళ్ళకి చేసిన తప్పుకు తగిన శిక్షలు పడ్డాయి. మోచర్ల రామలక్ష్మి * 77
గాంధీ: అద్దె ఎక్కువ తక్కువ అనుకోకుండా, తగిన వాళ్ళని చూసి ఇల్లు అద్దెకివ్వాలి. ఆమె చూస్తే మీ మీద దాదాగిరి చేస్తోంది ఆడగూండాలా.
ప్రకాశం; సొల్లు కబుర్లు ఆపి సమస్యకి సొల్యూషన్ చూడండి.
పటేల్: ఐ.జి.గారి ఇల్లు మీ ఇంటి ప్రకృ్శనేగా. నైబర్స్ అన్న అభిమానం, ఓ డాక్టరు అన్న గౌరవం ఆయనకి మీ మీద ఉంటాయి. సో ఆయన ఇంటికి మీరు వెళ్ళి మీ ఇంట్లో అద్దెకున్న ఆవిడ డ్రామాని పొల్లుపోకుండా చెప్పండి.
ప్రసాద్: నిర్లిప్తంగా అది అయ్యే పనికాదు సార్. మా ఇంట్లో అద్దెకున్నావిడ ఐ. జి. గారి బామ్మర్ది గారి బామ్మర్దిగారి బామ్మర్ది భార్య.
ప్రకాశం: మరి ఇప్పుడేం చేద్దాం.
ప్రసాద్; పోలీసులు కంటపడకుండా నన్ను మీరు కాపాడాలి. పట్టుబడితే నా ఉద్యోగం పోతుంది.
సుభాష్: ఆవిడ ఐ.జి.గారి బంధువు అంటున్నావు మాకేం గొడవా కాదుగా.
నెహ్రూ; సెభాష్... సుభాష్ గారు. సాటి మనిషికి నాయం చెయ్యటానికి సందేహిస్తు న్నారు. మీ పెద్దవాళ్ళు తమ ప్రియతమ నాయకుల పేరు మీకు పెట్టారు. ఆ పేర్లలో ఉన్న గొప్పతనమే మీలో ఆదర్శం భావం కలిగిస్తాయని అపోహ పదారు.
గాంధీ; ఎవరు బాబు నువ్వు? మా పేర్లు నీ కెలా తెలిశాయి.
నెహ్రూ: ఐదు సంవత్సరాలుగా మీ కాలనీలోనే ఉంటున్నా నేను. ఓ జూనియర్ దాక్టర్ని. డాక్టర్ ప్రసాద్‌గారు చాలా మంచివారు. మీరు నలుగురు లాయర్స్ నాకు తెలుసు.
పటేల్: నువ్వు ఎవరి అబ్బాయివి? నీ పేరేమిటి.
నెహ్రూ; నా పేరు నెహ్రూ, కృషికి తగిన ఫలితం పొందలేని, కిసాన్ కొడుకుని, శత్రు సైన్యంతో పోరాడి ప్రాణత్యాగం చేసిన జవాన్ తమ్ముడిని, నా తల్లి చెల్లెల కష్టార్దితంతో చదువుకున్న నికృష్ణుణ్సి ఓ జూనియర్ డాక్టర్ని.
పటేల్: నీకు మెడికల్ సీటు ...
నెహ్రూ; మెరిట్‌లోనే వచ్చింది సార్. చిన్న రోగానికి కూడా సరైన వైద్యం జరగక చనిపోతున్న మాలాటి ఎందరో పేదలకి వైద్యం చెయ్యాలని చిన్నతనం నుంచి ఆరాటపద్డాను. కష్టపడి చదువుకొని సీటు సంపాదించుకున్నాను. కోట్లకి పడగెత్తిన ఘరానా బాబులు, లక్షలు పోసి సీట్లు కొనుక్కున్నారు. కాలక్షేపానికి కాలేజీకి వచ్చి సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉంటు న్నారు. మా లాంటి బీద దాక్షర్లు బలైపోతున్నాం. మా స్టయిఫండ్, మీ
78 అక్షర ళిల్సాలు
పనివాళ్ళ జీతాలంత కూడా ఉండదు. ప్రాణాలు పోసే వృత్తిలో ఉన్న మాకు మా ప్రాణాలు ఎలా నిలుపుకోవాలనే దుస్థితి వచ్చింది. మా స్ధితి చూసి వైద్యవృత్తి మీద జోక్స్ వేసుకుంటున్నారు. మనం చస్తూ మరొకళ్ళని చంపే, మెడిసన్ చదివే కంటే మరో చదవు చదివితే మంచిది అని పదహారెళ్ళకే భావిపౌరులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రకాశం: నిరాశ పడకు బాబు. ఎవరో కొందరు ధనాశ పరులు వైద్య వృత్తి గురించి అయ్యా ఖర్చుకి లెక్కలు వేసుకొంటారు. అందరూ అలా ఉండరు. (ప్రాణాలు నిలిపే పవిత్రమైన వృత్తిలో ఉన్న మిమ్మల్ని వైద్యోనారాయణో హరి అని గౌరవించే వాళ్ళ ఎక్కువ. తమ వాళ్ళని బ్రతికించారని, కృతజ్ఞతతో మీరు దేవుడండి అని ప్రసాద్ గారిని ఎంతో మంది అన్నారు.
ప్రసాద్: అవునవును సార్. ఓ పేద రైతు కొడుక్కి ఆపరేషన్ చేసి కాలు సరి చేశానని నా పేరు పెట్టుకున్నాడు.
పటేల్: విన్నావుగా ప్రసాద్ గారు చెప్పింది. ఎవరో కొద్దిమంది స్వలాభం కోసం చేసే పనులకి మనం కలతపదడకూడదు.
గాంధీ: తినే అన్నంలో రాళ్ళు వస్తే ఏరి పారేస్తాం, అన్నం తినటం మానం. అలాగే నడిచే మార్గంలో మురికి ఉంటే దాటుకుంటూ వెడతాం. కాని పనులు మానుకోం. శరీరంలో ఓ భాగానికి రోగం వస్తే, అది ప్రాణానికే ముప్పని పిస్తే, ప్రాణం నిలపటానికి ఆ భాగాన్నె కోసి పారేస్తారు దాక్టర్లు. సమాజంలో అవకతవకలొస్తే సరిదిద్దాలి. అధైర్య పడకూడదు.
సుభాష్: సో మనం రాజేంద్రప్రసాద్ గారి ఇల్లు ఆయనకి దక్కేలా చేద్దాం. ప్రసాద్ గారు రేపే మీ ఇల్లు ఖాళీ చేయమని ఆవిడకి నోటీసు పంపుదాం. స్వతంత్ర సమర యోధుల పేర్లు పెట్టుకున్న మనం ప్రసాద్ గారి సొంత ఇల్లు వారికి దక్కేట్టు చేద్దాం.
అందరు: అలాగే.
నెహ్రూ: భారతమాతకి వందనం చేద్దాం. కులాల కుళ్ళు మతాల మత్తులను కడి గేద్దాం సమాజాన్ని చక్కబరుచుకుందాం.
అందరూ: వందే మాతరం ॥వం॥ 1 వం॥
-అళెవః అహడప్రైల- మోచర్ల రామలక్ష్మి * 79
సంసారంలో సరిగమలు పాత్రలు: పద్మ, శారద, విజయ శారద: (సెల్ ఫోన్ రింగ్ చేసి) హలో! పద్మా! మార్షింగ్షోకి వస్తావా? ఏంటీ! రావా! ఇంటి నిండా చుట్టాలా! స్లో నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్టే సిన్మా టైమైయిపోతుంది బై. విజయ ఎక్కడున్నావు. (మళ్ళీ రింగ్ చేసి) విజయ: నీ ఎదురుగా (ేతిలో సెల్‌ఫోన్‌తో) ట్రిమ్గా తయారై కూర్చున్నావ్ ఎక్కడికి ప్రయాణం? అదేదో పోస్టపోన్ చేసి నాతో మార్చింగ్ షోకి రాకూదదే! శారద: ఓకే, ఓకే, నేనూ నీకు ఫోన్ చేసింది మార్నింగ్ షోకి వస్తావా అని అదగ టానికి. విజయ: చిన్నప్పట్నించి మనిద్దరం ఒకటేనే! నువ్వు ఏదనుకుంటే నేను అదే అను కుంటాను. చూడు పెళ్ళి విషయంలో కూడా మనిద్దంం స్వతంత్రంగా ఆలో చించాము. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. పాపం! పద్మ విషయమే చూస్తే జాలేస్తోందే. అదో డూడూ బసవన్న శారద: మంచి అనే రెండు అక్షరాల కోసం అఘోరిస్తోంది. పాపం! ఎంతో చాకిరి చేస్తుంది అన్ని సరదాలు వదులుకుంటోంది. విజయ: నిజమేనే! దాని జీవితాన్ని ఆరు టి.వి.సీరియల్స్గాను, నాలుగు సినిమాలు గానూ తీయొచ్చు. పద మనకి సినిమా టైమ్ అవుతోంది. విజయ: సరే! సీన్ - 2 పద్మ: (బల్లలూ కుర్చీలు తుడుస్తూ) సంసారము రాగసుధామధురము. (విజయ, శారద ఎంటర్ అవుతారు. విజయ: ఏంటే! అంత హుషారుగా పాట పాడుకుంటున్నావ్. ఇంట్లో ఏ వర్క్ లేదా ఏంటి? శారద: (చుట్టూ చూస్తూ) చుట్టాలెవరూ ఉన్నట్టులేరే? ఇవాళ నిన్ను వదిలినట్టున్నారే! పద్మ; అవేమి మాటలే. వాళ్ళు నన్నేమి చేస్తున్నారు. వాళ్ళ పనుల కోసం వాళ్ళొస్తు న్నారు, పనులు పూర్తయ్యాక వెళ్ళిపోతున్నారు. విజయ; పాపం, పాపం అనకు, వాళ్ళందరి కోసం వళ్ళు అరిగేటట్టు చాకిరీ చేస్తు 80 * అక్షర ళిల్యాలు
న్నావు. నీకు ఏమైనా అయితే వాళ్ళు వచ్చి చేస్తారా?
పద్మ: నాకు ఏదో రావడము ఎందుకు, వాళ్ళు ఎవరో చేయటము యెందుకు.
శారద; ఎదన్నా చెబితీ మాట తప్పించేస్తావు. సీ పెళ్ళి అయి 20 సంవత్సరాలు అయ్యింది. నీకో ముద్దుముచ్చట, మనీ సేవింగ్ ఏమైనా ఉన్నాయా?
పద్మ: ముగ్గురూ కలిసి చిన్నప్పుడు ముచ్చటగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు బాధ్యతలు వచ్చి ఎలా తిరుగుతాం చెప్పండి.
విజయ; ఎందుకు కుదరదే! అన్నీ చేసి టేబుల్ మీద పెట్టి మేం రావటం లేదు, నువ్వు మాలాగే తెముల్చుకుని బయటకి రావాలి.
శారద: విన్నావుగా! అది చెప్పినట్టు చెయ్యి. ఇవాళ సరదాగా హోటల్‌కి వెళ్ళి లంచ్ చేసి మ్యాట్నీకి వెళదాం ఓకె.
పద్మ: సారీయే! అయినా మీరిద్దరూ ఇవాళ ఇంట్లో వంట చేయలేదా!
శారద: రాత్రి టి.వి.లో ప్రోగ్రామ్ చూసి పడుకునేసరికి చాలా లేట్ అయ్యింది. మార్షింగ్ లేచేసరికి 9 అయ్యింది. మా ఆయనకు ఒక కప్ కాఫీ ఇద్దామనే సరికి ఆయనే ఒక కప్ కాఫీ నా కిచ్చి, ఇవాళ ఏదో కాన్ఫరెన్స్ ఉందంటూ లంచ్‌కి రానంటూ వెళ్ళిపోయాడు.
విజయ: ఏమిటోనే! మా ఇద్దరికీ అన్నీ ఒకేలా ఉంటాయి. రాత్రి టి.వి. చూసి నేనూ లేట్‌గానే లేచాను. మా ఆయన బిజినెస్ సెమినార్ ఉందని లంచ్‌కి రానన్నారు.
పద్మ: మగవాళ్ళు ఇంట్లో తినకపోతే ఏదో ఆఫీస్‌లో తినేస్తారు, మరి! పిల్లల సంగతేమి చేశారే?
వజయ: (ఇద్దరూ నవ్వుతూ, వసేయ్! సత్తికాలెపు సత్తెమ్మా! పిల్లలు ఇంటి ప్రక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ తింటారు. స్కూలు క్యాంటిన్లో లంచ్ తింటారు. మరబొమ్మల్లా మనమే వంది పెట్టాలనే ఆలోచనలు కట్టి పెట్ట, అప్పుడప్పుడు, బయట ప్రపంచంలో ఇలా విహరించాలి.
పద్మ: మీరెన్ని చెప్పండే. మనము చేత్తో వండి పెడితే వాళ్ళు కమ్మగా తింటూ ఉంటే, మనకి తృప్తి, వాళ్ళకి ఆరోగ్యం.
విజయ: సరే! లేవే! ఇవాళ లీజర్‌గా ఉన్నావుగా నువ్వ మాతో లంచ్‌కి రావే!
పద్మ: సారియే! 2 గంటలకు మా ఆడపడచు వస్తానంది. ఏదో మ్యారేజి బ్యూరోకి వెళ్ళాలట వాళ్ళ అమ్మాయి కోసం.
శారద; నిన్ను బాగు చేయటం మాతరం కాదు తల్లీ! (దజ్దం పెడుతుంది).
పద్మ: దీర్హ సుమంగళీ భవ!!.... డియర్ (ఫెండ్స్ మీరిద్దరూ, పద్మ విలాస్‌లో శుచికరమైన, రుచికరమైన, ప్లేట్ మీల్స్ చేయాలని నా విన్నపము.
విజయ: ఎక్కడ చేయాలని కాదే! నీతో కలసి భోజనము చెయ్యాలన్నదే మా కోరిక. మన ముగ్గురం కలిసి తిని ఎన్నాళ్ళయ్యిందీ!
శారద; ఈ మాత్రము కోరిక తీరటానికి ఇనాళ్ళు పట్టింది. థ్యాంక్స్ టు వీళ్ళ చుట్టాలు. పద ఆకలేస్తోంది, వడ్డించేయి!
సీన్ - 3
శారద: (కుర్చిలో కూర్చని కాళ్ళ కేసి చూసుకుంటూ బాధపడుతూ ఉందాలి)
విజయ: ఏమిటే అలా ఉన్నావ్? ఏమైందే! మీ ఆయన పిల్లలూ, వరి?
శారద: (బాధపడ్డూ) వాళ్ళ విషయం వదిలేసెయ్. విజయా! నేను మోసపోయానే!
విజయ: ఎప్పుడే!
శారద: ఇప్పుడె ఒక అరగంట క్రితమే! నన్ను పట్టించుకుపోగా నేను ఫోన్ చేస్తే కూడా పలకలేదు.
విజయ: నాకు నీ మాటలు అర్ధం కావటం లేదు. నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. పద్మ వస్తే ధైర్యంగా ఉంటుంది. (సెల్ ఫోన్ తీసి ఫోన్ చేయాలి) పద్మా! ఎందుకూ! ఏంటీ అని ఆరాలు అదక్కు వెంటనే ఉన్నపళంగా రా! శారద పరిస్థితి ఏం బాగా లేదు. శారద ఇంటికే రా!
శారద: చాలా పొరపాటు చేశానే!
విజయ: అలా బాధపదకే, నువ్వేమీ పొరపాటు చెయ్యవు.
పద్మ: ఆత్రంగా! ఏమైందే! ఆ కాలేంటి అలా ఉంది. ప్రొద్దున్న మార్షింగ్ వాక్‌కి
ఇంకా
వెళుతూ కనిపించావు. అప్పుడు బానేవున్నావు ఇప్పుదేమైనా కాలుబెణికిందా!
శారద: (ఏడుస్తున్నట్టుగా) వచ్చీ రాగానే నా కాళ్ళ కేసి చూసి కాలు బెణికిందా! అని అడిగావు. అర గంట క్రితం కాలు నొప్పిగా ఉంది అన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు జీవితాన్ని పంచుకున్న భర్త, పైగా ఓ దాక్టరూ!
విజయ; ఊరుకోవే ఏం చేస్తావు! మీ ఆయన కళ్ళ డాక్టరు కదా! ఎప్పుడూ అందరి కళ్ళకేసి చూస్తాడు. ఎవరి కాళ్ళ కేసి చూడడు. నీ విషయంలో అదే చేశాడు.
పద్మ: పాపం! ఆయన ఏదో ఆపరేషన్ హడావిడిలో ఉండి ఉంటాడు. అందుకే నీ విషయం పట్టించుకోకపోయి ఉండొచ్చు.
శారద; భార్యని నాకన్నా మరొకళ్ళు ఎక్కువా?
విజయ: తాళికట్ట, తలంబ్రాలు పోసి “నాతి చరామి” అనే మంత్రంతో చేసుకున్న పెళ్ళికాదు కదా! పేపరు పెళ్ళి, పైగా పెద్దవాళ్ళ అండలేనిది, అందుకే మన మంటే చిన్న చూపు.
శారద: అంటే! మీ ఆయన కూడా నిన్నూ! ....
విజయ: ఇట్లాగే! నాకు జ్వరమొచ్చి మూలుగుతున్న ఎలా ఉన్నావని ఒక్క ముక్క కూడా అడగడు. పైగా ఇల్లు శుభ్రంగా పెట్టవు. వేపుడు బాగా లెదని వేపుకు తింటాడు.
పద్మ: తీరిగ్గా మీ ఆయన్ని ఆడిపోసుకుందురు గాని, ముందు “మూవ్” ఎక్కడుందో చెప్పు.
శారద: చూశావ! పద్మకి ఎంత “ప్రెజెంట్ ఆఫ్ మైండ్.” ఈ మాత్రము కూడా తోచ లేదు మా ఆయనకు.
విజయ: మీ ఆయన టి.వి. ఎక్కువ చూడడు కదా! అందుకే తోచలేదు.
పద్మ: ప్రతీ చిన్న విషయాన్నీ పెద్దది చేసుకోకండే! నాకొకసారి బి.పి. డౌన్ అయ్యింది,
ఇద్దరూ: (ఆశ్చర్యముగా) అప్పుడేమి చేశావు?
పద్మ: నా అంతట నేనే హాస్పిటల్‌కి వెళ్ళాను. సెలైను ఎక్కించారు. ఆ తర్వాత, నేన ఇంటికి వచ్చేశాను. వంట చేసి అందరికీ పెట్టాను.
శారద: (లేచి నుంచుంటూ) ఈ విషయం మీ ఇంట్లో ఎవరికి చెప్పలేదా!
పద్మ: అప్పుడు చెప్పలేదు. తర్వాత ఎప్పుడో మా వారికి చెప్పాను.
విజయ: అప్పుడు మీ ఆయన ఏమన్నాడు?
పద్మ; అంత రిస్కు ఎందుకు తీసుకున్నావు. ఇంతమంది మేము నీకుండగా అని కోప్పడ్డారు.
విజయ: చూశావా పెళ్ళి మంత్రాల్లో ఎంత పవర్ ఉందో! దాన్ని అంత (ప్రేమగా చూస్తాడు కాబట్ట అది ఇంటికి అంకితమయి పోయింది. నువ్వన్నట్టే మనిద్ద రమూ నిజముగానే మోసపోయాము.
పద్మ: ఏం మోసపోయారే! తెగ నీలుగుతున్నారు. డాక్టరు గారి భార్య అని దీన్ని వ్యాపార వేత్తగారి సతీమణి అని నిన్ను! సొసైటీలో తెగ గౌరవిస్తున్నారు కదా, ఏంటీ! నీ కాలు బాగానే ఉంది బెణుకు తగ్గిందా!
శారద: ఇందాక నీ బి.పి. కష్టాలు వినగానే నా కాలు నొప్పి ఎగిరిపోయింది.
పద్మ; కష్టాలేంటీ, కష్టాలు జీవితమన్నాక కప్వలు, సుఖాలు ఉంటాయి. వ్యావార మన్నాక లాభాలు, నష్టాలు ఉంటాయి. సంసారంలో సంగీతంలో లాగా ఎన్నో సంగతులు ఉంటాయి. హెచ్చు, తగ్గు న్ధ్థాయిలూ ఉంటాయి. భార్యా భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని సరే అనుకోవాలి, సారీ అనుకోవాలి. కలతులు లేని కుటుంబాలు సాధన లేని సంగీతము ఉండదు.
శారద: సారీ! సారీ! సారీ మా ఆయన్ని అర్ధం చేసుకుంటాను.
విజయ; పద, పద, పద్మా ఇళ్ళకి వెడదాం.
పద్మ: హమ్మయ్య! మీలో నేను ఆశించిన మార్పు వచ్చింది.
- అభివ అప్రైల- పరివ్మారాల పరిమళ నాటిక-38
పాత్రలు: పరిమళ, ఆశ, నిర్మద, నిర్మల, రాజేశ్వరి, పద్మ, జానకి, సుబ్బలక్షి పరిమళ వంటినిండా ఆభరణాలు పెట్టుకొని తెల్లపట్టుచీర కట్టుకుని అమ్మవారి
ఫోటోకి పువ్వులు పెట్టి, అగరొత్తులు వెలిగించి, కళ్ళుమూసుకొని కూర్చుంది.
అశ: ఆహా ...... ఓహో శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్ స్థితే జగన్మాత మహలక్ష్మీ నమోస్తుతే!
పరిమళ: (కళ్ళు తెరిచి నవ్వుతూ ఆశీర్వదిస్తూ) శ్లోకం చక్కగా చెప్పావు,
కాన
ఆశ; (సిగ్గు పదుతూ చేతులు నులువుకుంటూ) శ్లోకమే కాదు, పాటలు బాగా పాడుతా. నా సొంత ట్యూన్. ధనమేరా అన్నిటికి మూలం, ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం. డబ్బురా .... డబ్బు ... దబ్బురా. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానంది మనీ ... మనీ.
పరిమళ: (కొంచెం విసుగ్గా) పాటలు. అపి వచ్చిన పని చెప్పు.
ఆశ; (కళ్ళుతిప్పుకుంటూ) వచ్చిన పని వస్తూనే చెప్పా అయినా .... మేం చెప్పకుండా మీరే చెప్పేస్తారని మీ అసిస్టెంటు రాజేశ్వరి చెప్పింది.
పరిమళ: (అవునన్నట్లు తలఊపుతూ) ముందు దేవికి నమస్కరించండి, ఆ తల్లే చెపుతుంది.
ఆశ: (చేతులు జోడించి నమస్కరిస్తూ. ) దేవీ నా కష్టాలు నీకు తెలియనివి కావు. అడగందే అమ్మయినా పెట్టదు కదా. అందుకే అడుగుతున్నా నన్ను నువ్వే ఆదుకోవాలి.
పరిమళ: నమస్కారం అంటే అలాకాదు. భక్తితో దాక్షాయినికి ఇలా దక్షిణ సమర్పిస్తే తక్షణం దయచూపుతుంది.
ఆశ: (పరిమళ చేతికి నోట్లు అందిస్తూ) పైసామే పరమేశ్వరిహై తీసుకోండి.
పరిమళ: (డబ్బు చేత్తో ముట్టుకోను అని సైగ చేస్తూ) డిన్బీలో వెయ్యండి. పరమేశ్వరికి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి,
ఆశ: (డిన్పీలో డబ్బులు వేస్తూ ఆవేదనగా నిర్లిప్తంగా) ఏం చెప్పమంటారు. మా (ఘైంద్స్ రాణి, లత, వాణికి చెతి నిందా దబ్బు. రోజు విడిచి రోజు మార్నింగ్ షోకి వెడతారు. (నోటి దగ్గర చేయి పెట్టి) ఆ తరువాత హాయిగా హోటల్లో లంచ్ తీసుకుంటారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనేవి కొనుక్కొని లైఫ్ ఎంజాయ్ చేస్తారు.
పరిమళ: ఈ విషయం మీరు మీ వారితో చెపితే వాళ్ళతో నీకు వంతు ఏమిటి? ఉన్నదాంట్లో సర్దుకు (బ్రతుకు అంటారు? అవునా!
ఆశ: (ఆశ్చర్యం సంతోషంతో) కరెక్టుగా చెప్పారండి. చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోటానికి, మా ఆయనే కాదు చాలామంది మొగాళ్ళు ఇలాగే శ్రీరంగ నీతులు చెపుతారు.
పరిమళ: ఆ విషయాలస్న్ మనకెందుకు.
ఆశ: (స్టెప్స్ వేస్తూ, భుజాలు ఎగరేస్తూ) సారీ ... మేడమ్ వాళ్ళ గోల నాకెందుకు.
మోచర్ల రామలక్షి * 85
మా ఇంట్లో కనకవర్షం కురుస్తుంటే అష్టలక్ష్మీలు గ్రూప్ డాన్స్ చేస్తుంటే, ఓహో అని నా అదృష్టాన్ని అందరూ పొగుడుతూ ఉంటే ఆహా ... ఆహా.
పరిమళ; (కళ్ళు మూసుకొని లెక్కపెట్టి) మీరు మండలం రోజులు శ్రద్ధగా అష్టలక్ష్మీలను పూజించాలి. ధనలక్ష్మి పాదాల చెంత వంద రూపాయల నోటు ఉంచితే ఆశ ...
ఆశ: అయ్య బాబాయ్ నా పేరు చెప్పేశారు. ఆశని మీకెలా తెలిసింది.
పరిమళ: (తనలో) నీ మొహం నీ ఆశ తీరుతుందని అనబోయేలోపే నువ్వే ఆశని చెప్పేశావు. ధనలక్ష్మీ పాదాలచెంత నలభై రోజులు వంద రూపాయలు చొప్పున ఉంచాలి.
అశ; (సంతోషంగా మాట సాగదీస్తూ, )నాకు అర్ధం అయ్యింది. ధనలక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన డబ్బు నాలుగు వేలు అవుతుంది. అదిపెట్టి లాటరీ టిక్కెట్లు కొనాలి కదూ!
పరిమళ; చెప్పేది పూర్తిగా వినండి. ఆ డబ్బుతో చిన్నవ్యాపారం మొదలుపెట్టండి.
అశ: _ (గెద్దాన్ని చెత పట్టుకొని.) నా మొహం, నాల్లు వేలు ఏం వ్యాపారం వెలగ బెట్టాలి.
పరిమళ: (తనలో) తలబిరుసు ఎక్కువ,
ఆశ: (నవ్వుతూ) ఏమిటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.
పరిమళ; దేవితో మాట్లాడుతున్నా.
ఆశ: (ఆత్రుతగా) ఏమంది దేవి? నా ఆశ తీరుస్తానందా?
పరిమళ: నీ ఆశ తీరాలంటే ఏడు వంతులు నువ్వు శ్రమపదాలి. ఎనిమిదో వంతుగా దేవి తన కృప చూపుతానంటోంది.
ఆశ: (బిక్కమొహంతో) అయితే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు.
పరిమళ: (నవ్వుతూ) భయపడకమ్మా. అప్పడాలు, వడియాలు, తినుబందారాలు తయారుచేసి నీ స్నేహితులకి వాళ్ళ స్నేహితులకి అమ్ము. ఒకప్పుడు ఇలా అమ్మి కోట్లకి పదగెత్తారు చాలామంది. నీ నాలుగు వేలు నలభై నాల్లు కోట్లు అవుతాయి.
ఆశ: (సంతోషంతో) నిజంగానా .... నిజమేనా! మీరు చెప్పింది నాకు నలభై నాల్గు కోట్లు వస్తాయా. అయ్యా బాబోయ్. నిజంగా వస్తే మీకు నాల్లు కోట్లు ఇన్తా,.
56 *లక్షర తల్ఫాణ
పరిమళ: (బుజ్జగింపుగా) వెళ్ళమ్మా ..... నీ తరువాత వాళ్ళకి దేవి ఆశీస్సులు అంద జెయ్యాలి,
నిర్మద: (నుదుట వేళ్ళతో గీసుకుంటూ.) ఆ విరించి, వాగ్ధెవితో వాదులాడుతూ నా తలరాత రాశాడు. పుట్టింట్లో సుఖంలేదు, అత్తింట్లో శాంతిలేదు.
పరిమళ: (వేళ్ళు లెక్క పెడుతూ నిర్మల కేసి చూస్తూ) భర్త నిరాదారణ, అత్త మామల సాధింపు, పిల్లలు ఎదిరింపుతో ....
నిర్మద: 100% కరెక్టుగా చెప్పారు. పగవాళ్ళకి కూడా నాలాంటి (బ్రతుకొద్దు.
పరిమళ: (అమ్మవారి ఫోటో కేసి చూపిస్తూ) ఆ తల్లికి మైక్కండి, మీ సమస్యకి పరిష్కారం చెపుతుంది.
నిర్మద: ఇదిగో చూడండి. బాగా మొైొక్కుతున్నా 200 రూపాయలు డిబ్సీలో వేస్తున్నా
పరిమళ; మీకు ఏ దేవుడు అంటే ఇస్టం.
నిర్మద: (కళ్ళు పెద్దవి చేసి) పురైల దండ ధరించే మహంకాళి.
పరిమళ; ఎం రంగు ఇష్టం?
నిర్మద: (నొక్కి పలుకుతూ) ఎరరని రక్తం ఎరుపు.
పరిమళ: సినిమాల్లో నటించే నాయికా నాయకులలో మీకు ఎవరు ఇష్టం.
నిర్మద: (పెదవి విరుస్తూ) నాకు హీరో హీరోయిన్స్ నచ్చరు. సెంటిమెంట్లు, కమిట్మెంట్లు అంటూ ఏడుస్తారు. హుషారుగా చక్కగా, నిర్మాహమాటంగా ఉండే సూర్యకాంతం గారు అంటే ఇష్టం. (మెల్లగా, నాకు ఆవిడలాగే అందరిమీద పెత్తనం చెయ్యాలి అని ఉంటుంది. (గట్టిగా) ఈ కోరిక తీరాలంటే నేను ఏం వ్రతం చెయ్యాలి,
పరిమళ: (కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి), మౌనవ్రతం.
నిర్మద: (కంగారుగా) అయ్య బాబాయ్. తినేటప్పుడు, నిద్రపోయెటప్పుడైనా నోరు పూర్తిగా మూతపడదు. (గుండెల మీద చేతులు పెట్టుకొని.) అలాంటి నాకు ఇంత పెద్దశిక్షా.
పరిమళ: శిక్షకాదు. నీ క్షేమాన్ని కోరి దేవి ఆజ్ఞాపించిన వ్రతం.
నిర్మద: (బ్రతిమాలుతూ) ప్లీజ్ దేవిని మరోవ్రతం చెప్పమనండి. మీ మాటగా అడగండి.
పరిమళ: (చిన్నగా నవ్వుతూ) దేవి దగ్గర రికమండేషన్, కన్సెషన్ అని ఉండవు. మీ ఇష్టాలు తీరాలంటే, మీరు కాస్త కష్టపడాలి.
మోచర్ల రామలక్ష్మి * 87
నిర్మద: (నీరసంగా) సరే చెప్పంది.
పరిమళ: (కళ్ళు మూసుకొని కళ్ళు తెరచి) ఓ మండలం రోజులు మౌనవ్రతం చేయండి.
నిర్మద: (బతిమాలుతూ రెండు వేళ్ళు చూపిస్తూ) రెండు నిముషాలన్నా మౌనంగా ఉండలేను. అందుకే సంతాప సభలకి నన్న ఎవ్వరు రానివ్వరు. ఎలా ఇప్పుడు.
పరిమళ: (శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది. దేవి చెపుతుంది మీ ఇష్టం.
నిర్మద: (వెళ్ళిపోతూ, వేలు చూపిస్తూ) మౌనవ్రతం చేస్తా, చచ్చినట్టు అందరు నా మాట వినేట్టు చేస్తా.
నిర్మల: (నమన్మారం పెట్టి) నమస్కారం పరిమళ గారు.
పరిమళ: నమస్కారం బాగున్నారా?
నిర్మల: (నెత్తి కొట్టుకుంటూ) ఏం బాగుండడం. బాగుంటే మీ దగ్గరకి ఎందుకొస్తా?
పరిమళ ఏమిటి మీ సమస్య,
నిర్మల: నా వయస్సు వాళ్ళు అందరూ హయిగా ఉన్నారు. వాళ్ళకి వండి పెట్టేందుకు, నోటినిండా తిట్టుకునేందుకు మొగుడనే ఓ మనిషి ఉన్నాడు.
పరిమళ; వాళ్ళుబాగున్నారని బాధ ఎందుకు, మీకు ఏం కావాలో దేవిని అడగండి.
నిర్మల: (మొహం అద్దంలో చూసుకొని పౌడరు రాసుకుంటూ) అడుగుతా .... అందుకేగా వచ్చింది. నా అందానికి, చదువుకి తగ్గవాడు వస్తాడా?
పరిమళ: అరటిపండు, మామిడిపండు జామపండు వీటిల్లో ఏది ఇష్టం.
నిర్మల: (ముఖం చిట్లిస్తూ) నాకు ప్రూట్స్ ఇష్టం ఉండవు జ్యూస్, వైన్ జ్యూస్, ఎంటి అలా ముఖం పెట్టారు. ద్రాక్షరసం ఇష్టం.
పరిమళ: నీకు త్యాగరాజు అన్నమయ్యా రామదాసు కీర్తనలలో ఏవి ఇష్టం.
నిర్మల: (దాన్స్ చేస్తూ హిందీ పాటపాడుతూ) నాకు అలాంటి పాటలు కన్నా దాన్స్ ఇష్టం.
పరిమళ: (తనలో) ఎద్జెమంటె తెడ్డెం అనే రకం. దీన్ని ఎవడు పెళ్ళి చేసుకొంటాదో.
నిర్మల: మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.
పరిమళ: దేవితో నీ పెళ్ళి గురించి మాట్లాడుతున్నా
నిర్మల: (నవ్వుతూ) బాగా మాట్లాదిందా, ఏం చెప్పింది నాకు చెప్పండి.
పరిమళ: నీ పెళ్ళి అవుతుందిట.
రాశాక
నిర్మల: (కుతూహలంగా) ఎప్పుడూ?
పరిమళ; మార్చి.
నిర్మల: (ఉక్రోషంగా) మార్చి, మార్చి, మార్చి అంటూ ఐదేళ్ళ నుంచి వాట వాడు తున్నారు,
పరిమళ: నేను మాట మార్చే మనిషిని కాదు. నీకు పెళ్ళి అంటూ అయితే మార్చిలోనే అవుతుందని నీ జాతకం చెపుతోంది.
నిర్మల: (దువ్వెనతో తల దువ్వుకుంటూ) ఏదో పెళ్ళి అవటం కాదు నాకు షారూఖాన్ లాంటివాడు రావాలి,
పరామళః (తనలో, వేళ్ళు లెక్కపెడుతూ) నీ మొహం చూడు ఎలా ఉందో షారూఖాన్ కావాలిట. గొంతెమ్మ కొరికలతో, వంటి మీదకి 35 ఏళ్ళు వచ్చాయి.
నిర్మల: (ఆత్రుతగా) దేవి ఏమంటోంది షారుఖాన్ లాంటివాడు వస్తాడా? మాట్లాడరేమండి?
పరిమళ: (నిదానంగా) చూడమ్మా నీ జాతకం ్రకారం నీకు షారూఖాన్ లాంటి భర్తరాడు. కాకపోతే అతని లాంటి కొడుకు పుట్టే చాన్స్ ఉంది.
నిర్మల: (అయోమయంగా మొహం పెట్ట) అదెలా?
పరిమళ; (తాపీగా) అది అంతే ... అంతా దేవి మహిమ.
నిర్మల: నిజంగా నాకు షారూఖాన్ లాంటి కొడుకు పుడితే మీకు, మీ దేవికి కంచిపట్టు చీరలు కొనిపెదతా,
పరిమళ: తధాస్తూ ...... వెళ్ళిరా తల్లీ,
నిర్మల; (వెళ్ళిపోతూ) నాకు షారూఖాన్ లాంటి కొడుకు పుడుతాదోచ్ ....
రాజేశ్వరి: ఏమే ఐదు వేలియ్యి.
పరిమళ: నిన్నగా మూడు వేలు తీసుకెళ్ళావు.
రాజేశ్వరి: (కోపంగా) నిన్న అన్నం తిన్నావు, ఈ వేళ తిన్నావుగా,.
పరిమళ: వితండ వాదన ఆపు. నోటితో రోజూ అన్నం తింటాం, నోట్లు తినం.
రాజేశ్వరి: (నిర్లక్ష్యంగా) ఏంటి తెగ నీలుగుతున్నావ్ నేను ఎంత అడిగాను. ముష్టి మూడు వేలు. నా కూతుళ్ళు నేల్పాలిష్కి చాలదు.
పరిమళ: నీ ఐదుగురి కూతుళ్ళని నన్ను అడిగి కన్నావా?
రాజేశ్వరి: ఏంటి నీ దగ్గర కొచ్చే మూఢ భక్తులులాంటి దానిననుకుంటున్నావా నన్ను దబాయిస్తున్నావు. నా సాయం లేకుండా నువ్వు సంపాదించగలవా? నీ గురించి నీ దేవి మహత్యం గురించి నేను చెప్పబట్టే కదా ఇంతమంది వస్తున్నారు. దేనికైనా ప్రచారం ముఖ్యం. దానికే చార్జి ఎక్కువ ఉంటుంది.
పరిమళ: ఇంతకి ఐం అంటావు.
రాజేశ్వరి: ఆడిబ్బీలో ఉన్న నోట్లు నా కిచ్చి చిల్లర నువ్వ తీసుకో.
పరిమళ: ఇదెక్కడి న్యాయం (శ్రమ అంతా నాది సొమ్ము నీదీనా.
రాజేశ్వరి: క్యూలో చాలామంది ఉన్నారు. గుట్టు రట్టుకాకుండా డబ్బు ఇవ్వ నే వెళ్ళివోతా,
పరిమళ: అవసరం ఎంతటి పనినైనా చేయిస్తుందంటారు. ఇదిగో తీసుకో (డబ్బు ఇవ్వాలి. )
రాజేశ్వరి: లెక్క పెట్టుకుని ఎంటి వెయ్యి తక్కువ ఇచ్చావు? అది రేపు వసూలు చేస్తాలే.
పరిమళ: రోజూ నీతో నాకు రౌడీ మాములు అయిపోయింది. దీని బాధనుంచి నన్ను కాపాడు దేవి. (అంటూ దేవి ఫోటోకి నమస్కరించాలి.)
రాజేశ్వరి: ఏంటే నటించి నటించి జీవించేస్తున్నావ్.
పరిమళ: నీ కన్నీ వేళాకోళామే. ప్రొద్దున్నుంచి సాయంకాలందాకా అమ్మవారి ఫోటో ముందు పడి ఉంటున్నాను. ఇంటికెళ్ళిన దగ్గర నుంచి జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం పుస్తకాలు చదవలేక చస్తున్నాను. మా వారితో మా అమ్మాయితో 15 నిముషాలన్నా గడపటం కుదరటం లేదు.
రాజేశ్వరి: నేను మాత్రం ఎండనక, వాననక క్యూలో ఉన్న వారికి 125 రూపాయలు తక్కువ వస్తే దేవి మాట్లాడదని గొంతుచించుకుని ఆ మట్ల్ళి బుర్రలకి అర్ధమయ్యేట్టు చెప్పేటప్పటికి నా తల ప్రాణం తోకకి వస్తోంది.
పరిమళ: నీ విషయం పక్కనపెట్టు. ఈ మధ్య వచ్చే వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్పటం చాలా కష్టంగా ఉంటోంది. వాళ్ళు అడిగే పద్ధతి చూస్తుంటే మనల్ని టెస్టు చేయడానికి వచ్చారేమో అనిపిస్తోంది.
రాజేశ్వరి: ఏమీ కంగారు పడకు. అంతా ఆ దేవియే చూసుకుంటుంది. మనం ఇలా బ్రతకాలని, వాళ్ళు అలా బ్రతకాలని ఉంది. అంతే. అదిగో ఎవరో వస్తున్నారు. నేను మళ్ళీ వస్తా. (వెళ్ళిపోయింది)
90 * అక్షర ళిల్సాలు
పద్మ: తియ్యాలని ఉంది
పరిమళ: తనలో కంగారు అణుచుకుంటూ (డిబ్బీ కాదు కదా?) ఏమిటి?
పద్మ: సినిమా.
పరిమళ: సినిమా పేరు.
పద్మ: తియ్యాలని ఉంది.
పరిమళ: కథ.
పద్మ; నేనే.
పరిమళ: మాటలు, పాటలు? హాోరో హీరోయిన్, డైరక్షన్?
పద్మ: నేనే.
పరిమళ: మరి హీరో.
పద్మ: విదేశాలలో ఉంటాడు, తెరమీద చూపించం.
పరిమళ; విలన్.
పద్మ: ఎవరో ఎందుకు మా వారే.
పరిమళ: ప్రొడ్యూసర్?
పద్మ: నేను ........... తొంభై తొమ్మది మంది మా ఇంటీ దగ్గరే ఉంటారు.
పరిమళ: మీరు మారో తొంభైతొమ్మిది మంది సహనిర్మతలా? (ఆశ్చర్యంగా,
పద్మ: మీరూ కలుస్తారా ......... నూట ఒక్కమంది అవుతాం.
పరిమళ: అబ్బే అదేంకాదు ... మీకు ఏం ఇష్టమో చెప్పండి?
పద్మ: వేడిగా తినటం, చల్లగా తాగటం, హాయిగా పడుకోవటం.
పరిమళ: (కర్మ ఈవిడ వాగుడుతో నాకు మతిమరుపు వచ్చింది) మీకు ఏ నెంబరు ఇష్టమో చెప్పండి,
పద్మ: నూట ఒకటి ఎలా చూసినా, ఎలా వ్రాసినా, ఎలా గీసినా మారని నెంబరు 101.
పరిమళ: ఈవిడ వరస చూస్తే నాకు 111 పెట్టేట్టుంది. సినిమా తీయటం అంటే టీ పెట్టడం అనుకుంటోంది.
పద్మ: దేవి ఏం చెపుతుంది. నన్ను సినిమా తీయమందా?
పరిమళ: నిదానం ప్రధానం అంటోంది.
పద్మ: ఆలస్యం విషం అంటారు కదండీ. నా సహనిర్మాతలు తొంభై తొమ్మిది మంది మనసు మారుతుంది. ఇంక సినిమా తీయటం గోవిందే. దేవి ఏమంటుంది.
పరిమళ; ఎన్నిసార్లు దేవిని అడిగినా, ఏడాది పాటు రాజరాజేశ్వరి గుడిలో 11 ప్రదక్షిణలు చేశాక సినిమా తియ్యాలని చెపుతోంది.
పద్మ; ఏడాది ప్రదక్షిణాలు చేస్తాను. సినిమా తప్పక తీస్తానా?
పరిమళ: తప్పకుందా,
పద్మ: పిక్చర్ పిట్ అయ్యిందంటే నెను రిచ్ హీరోయిన్గా బోల్టు గోల్స్ నగలు చేయించుకుంటా, మీకు మీ దేవికి నేను చేయించుకున్నన్ని నగలు చేయిస్తాను. వస్తాను. నగలతో వస్తాను.
జానకి: నమస్మారం పరిమళగారు. కాలక్షేపం అవటం లేదు. ఏదన్నా చిన్న బిజనెస్ మొదలెడదాం అనుకుంటున్నా.
పరిమళ: తోచకపోతే టేస్టుకి తగ్గట్టు, సినిమాలకో, గుళ్ళకో, సేవాశ్రమాలకో, సభాకార్యక్రమాలకో వెళ్ళాలి. బిజినెస్ అంటే మాటలు కాదు, మూటలతో పని, ఈ ప్రపంచంలో నెగ్గుకు రాలేం,
జానకి: అవన్నీ నాకు అనవసరం. నాకు డబ్బుకు లోటులేదు. నాన్న గారిచ్చిన అస్తి, మామగారు ఇచ్చిన అద్దె, మా వారు సంపాదించింది ఖర్చు పెట్టలేక చస్తున్నాను.
పరిమళ: ఆదవాళ్ళు వంట ఇంటికే పదిమితంకాదు. ఎందరికో స్వయంఉపాధి కలిగించగలగాలి. దానధర్మాలు చేయగలం అని నిరూపించాలి అనేగా మీ ఉద్దేశ్యం.
జానకి: నా మనసుని ప్రింటవుట్ తీసినట్టు చెప్పారు. నాకు ఏ బిజినెస్ కలిసి వస్తుందో చెప్పండి.
పరిమళ; బేబీ కేర్‌సెంటర్ పెట్టండి, కాలక్షేపం, మనీ ఉంటాయి.
జానకి; అమ్మో పిల్లల్ని ఆడించే కన్నా బిక్షమెత్తటం నయం.
పరిమళ; పోని వృద్ధాశ్రమం పెట్టండి. పుణ్యం, పురుషార్ధం రెండూ వస్తాయి.
జానకి: బాబోయ్ ఆ పెద్దోళ్ళతో పడలేను. చెప్పిందే చెప్పి చంపుకు తింటారు.
పరిమళ: డిప్రెషన్లో ఉన్న మహిళకోసం స్టేహోమ్ను పెట్టండి. పేరుకు పేరు డబ్బుకి డబ్బు.
కావాలా
జానకి: తల్లిదండ్రుల మీద అలిగో, మొగుడితో పోట్లాడో వాళ్ళు వచ్చి చేరతారు. తరువాత వాళ్ళవాళ్ళు వచ్చి నా మీద విరుచుకుపడతారు. నేను అంతసాహసం చేయను.
పరిమళ: టైలరింగ్ షాపు పెట్టండి.
జానకి; ఈ సలహా బావుంది. నాకు మరో ఆలోచన కూడా ఉంది. దానికి మీ సహకారం కావాలి.
పరిమళ: మేం ఉన్నది మీ కోసమే. మొహమాటమెందుకు చెప్పుంది.
జానకి: మా ఇల్లు ఈ వీధిలోనే ఉంది. మీ ఇంటి ముందు జనం తిరునాళ్ళకి వచ్చి నట్టు ఉంటారు. వాళ్ళ వంతు వచ్చి మీరు చెప్పేటప్పటికి మూడు గంటలు కుర్చీలో ఉంటున్నారు. అకలి, దాహంతో అల్లాడుతున్నారు. వాళ్ళని అదు కోవటానికి ఖొస్టుఫుడ్ సెంటర్, టైలరింగ్ షాపు పెట్టాలనుకుంటున్నా మీరు కనికరిస్తే దేవి కరుణిస్తుంది.
పరిమళ: అమ్మో చాలా తెలివైనదానిలా ఉంది. నాకే ఎసరుపెట్టదు కదా ...... బీద స్త్రీలకి సాయం చేస్తానంటున్నది. చూద్దాం దేవి ఆజ్ఞ అయితే నాకు అభ్యంతరం ఏం ఉంటుంది.
జానకి: దెవి కృప ఊరికే వద్దు. నా లాభంలో దేవికి, మీకు వాటా ఇచ్చాకే దానధర్మాలు చేసుకుంటా.
పరిమళ: సరే .... మీ ప్రయత్నాలు మీరు మొదలుపెట్టండి. అంతాదేవి దయ.
సుబ్బలక్ష్మీ: పరిమళాజీ ...... పర్సనల్‌గా, గ్రూప్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లమ్‌కి మనీ ఎంత తీసుకుంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నందుకు రాయితీలేమన్నా ఇన్తారా?
పరిమళ: మీ హడావుడి చూస్తుంటే.....
సుబ్బలక్ష్మీ: హడలి పోతున్నారా?
పరిమళ: అబ్బి అలాంటి దేమీ లేదు. అంతా ఆ దేవి దయ.
సుబ్బలక్ష్మీ: మా అమ్మాయికి యమ్సెట్లో మంచి ర్యాంక్ వస్తుందా? మా అబ్బాయికి వీసా వస్తుందా? మా అల్లుడు అమెరికా, ఇంగ్లాండ్ ఆ(స్టలియాలలో ఎక్కడ ఉంటాడు? మా పక్కాంటావిడ కూతురు చదవకుండా పాసవ్వాలి ఎదురింటి వాళ్ళ కొడుకుకి వాడు కోరిన జాబే రావాలి.
పరిమళ: ఆపండి మీ ప్రశ్నలు. దేవి పలకడం లేదు. రోజుకి 108 ప్రశ్నలకే సమా ధానం చెపుతుంది.
మోచర్ల రామలక్ష్మి * 93
సుబ్బలక్ష్మీ: దేవి పలకడం లేదా? మా సమస్యలకి పరిష్కారం చెప్పే సత్తా మీ దగ్గర లేదా?
పరిమళ: మర్యాదగా మాట్లాడండి. మీ అందరికోసం దేవిని ఉపాసిస్తున్న నన్ను హేళన చేస్తున్నారా.
సుబ్బలక్ష్మీ: తెలుసుకున్నారు కదా ఇంకా అబద్దాలెందుకు, డియర్ (ఫెండ్స్ ఇలా రంది. (అందరూ వసారు.)
సుబ్బలక్ష్మీ: నేను అడిగే ప్రశ్నలకు ఈ పరిమళ సమాధానం చెప్పలేదని ముందే చెప్పాను.
ఆశ: (అవును) ఎలా కనిపెట్టారు.
సుబ్బలక్ష్మి: మీ సమస్య మీ పరిస్థితి మీ నోటితోనే చెప్పుకుంటున్నారు. కళ్ళు మూసుకొని మీరు మాట్లాడే మాటలని విని దేవి చెపుతుందని నాటక మాడుతున్నారు. అంతే కదూ పరిమాళాజీ.
పరిమళ; మీ సమస్యలు మీరు తీర్చుకోలేక నా దగ్గరికి వస్తున్నారు. దేవి చెప్పిన పరిష్కారం మీకు నేను చెపుతున్నాను.
సుబ్బలక్ష్మీ: మీలో ఎవరి సమస్యలన్నా తీరాయా?
నిర్మద: లేదు ... ఈవిడ చెప్పినట్టు మౌనవ్రతం చేశా, సూర్యకాంతంలా ఉండాలను కున్న నేను అంజలీదేవినైపోయా.
నిర్మల: నిజమే. నా పెళ్ళి మార్చి మార్చి అంటూనే ఉంది. ఎన్ని మార్చిలు వెళ్ళాయో. పెళ్ళి అవలేదు. ఈవిడ చెప్పేవి జరగలేదు.
సుబ్బలక్ష్మీ వాళ్ళ మాటలు విన్నారుగా ... ఏం శెలవిస్తారు.
పరిమళ: ఎవరి కర్మకి ఎవరు కర్తలు. ఒక నిమిషంపాటు ప్రశాంతంగా ఆలోచిం చండి. ధర్మామీరు జ్వరం ఎంతో చెపుతుంది, జ్వరం తగ్గించదు. అద్దం ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అందాన్ని పెంచదు.
పద్మ: ఆహా .. ఎంత సత్యాన్ని చెప్పారు. ఈ డైలాగ్ నా సినిమాలో పెడతా ...
సుబ్బలక్ష్మీ ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారందీ. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలని అనుకోరా ... పరిమళాజీ మీరు చేసేది ఒక రకంగా సంఘ విద్రోహం. అమాయకులని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా నిజం చెబుతారా?
పరిమళ: నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. నేను ఎంఏబిఎల్ చేశాను. ఏ ఉద్యోగం లభించలేదు. చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు, స్వశక్తి మీద తోటివ్యక్తి మీద నమ్మకం పోతుంది. కనిపించని అతీతశక్తి తమని కాపాడు
పం ఫంక్రం ట్వాల
తుందనే భ్రాంతి కలుగుతుంది. ఆ పరిస్థితులలో రాజేశ్వరి నా కష్టాలు రీరేందుకు విభూతిబాబా దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన పది వేల రూపా యలు ఇస్తే ఏవో జపాలుచేసి విభూతి ఇస్తామన్నారు.
జానకి: అమ్మో ఆయన ఇచ్చిన విభూతి కుంకం కలిపి మాకు ఇస్తున్నారా,
పరిమళ; లేదు. ఆయన దగ్గర నుంచి విభూతి తెచ్చుకోలేదు. పరిమళ బిఏబిఎల్ అనే బోర్డు తీసేసి, పరిష్కారాల పరిమళ అని బోర్జుపెట్టా. అమ్మవారి ఫోటో పెట్టుకొని సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారాలు చెప్పటం మొదలుపెట్టా.
పద్మ: అమ్మో ఎంత అన్యాయం. ఈవిడ చుట్టూ తిరుగుతున్న మనకి సుబ్బలక్ష్మి గారు కళ్ళు తెరిపించింది. ఆడదానివై ఉండి ఈ బుద్ధి ఎమిటి?
పరిమళ: నేను మిమ్మల్ని ఎవరినీ నా దగ్గరికి రమ్మని పిలువ లేదు. మీ సమస్యలు మీరు పరిష్క్మరించుకోలేక నా దగ్గరికి వచ్చారు. అయినా నేను అందరిలాగా నిమ్మకాయలు మంత్రించటం, హోమాలు, జపాలు అంటూ డబ్బు గుంజ లేదు. బాగా ఆలోచించి మీరు సమస్యలలో ఇరుక్కోకుందా ఉందే పరిమ్మా రాలే చెప్పాను. కనిపించని అతీతశక్తిమీద ఉన్న నమ్మకం మానవశక్తి మీద మీకు లేదు. నాలో కాదు మార్చు మీలో రావాలి.
పద్మ: పరిష్కారాల పరిమళ ఏం అంటోంది.
ఆశ: మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకూ తనలాంటి వాళ్ళు ఉంటారంటోంది.
సుబ్బలక్ష్మి; చూశారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మిమ్మల్ని హేళన చేస్తున్నానని అనుకోకండి. మీరేకాదు ఎంతో చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, యాక్షర్హు, రాజకీయ నాయకులు. ఒకరేంటి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, బాబాలు, మాతాజీలు అంటూ తియ్యని భ్రాంతిలో పడిపోతున్నారు. మన సమస్యని మనం పరిష్కరించుకోలేక వోతున్నాం. మనమేకాదు పెద్ద పెద్ద వాళ్ళు ఇలాగే ఉన్నారు.
పద్మ: పెద్ద పెద్ద వాళ్ళ విషయం మనకెందుకు. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. ఏమంటారు పరిమళాజీ.'
పరిమళ: మూఢ నమ్మకాలు వదలండి. సమస్యలను సరళంగా పరిష్కరించుకోండి. అమ్మ వారి ఫోటో తీసి పూజా మందిరంలో పెట్టేస్తా మీకు తగిన సలహా ఇచ్చి నా ఫీజు నేను తీసుకుంటా.
. జానకి: అలా అయితే నాకూ సంతోషమే. -అరనవా4 అడహ్రాం... మోచర్ల రామలక్ష్మి * 95
తరాలు - అంతరాలు
పక్క పక్కనే మూడు కుటుంబాలుంటాయి. పొత్రలు అత్తలు: (1) నర్సమ్మ, (2) లక్ష్మమ్మ, (9) దుర్గమ్మ. కోడళ్లు: (1) మణి, (2) రాజేశ్వరి, (3 విజయ.
అత్తగారు: (నర్సమ్మ) ఇంట్లో ఒక్కళ్లు ఉండరూ, బొత్తిగా కుక్క కాపలా అయి పోయింది నా బ్రతుకు.
మణి: (కోడలు) కుక్క కాపలా కుక్క కాపలా అంటారే హాయిగా ఇంట్లో కూర్పొవ టానికి, నేను ఏదో పిక్నిక్కో, పిక్చర్కో వెళ్లినట్టు దుమ్మిత్తిపోస్తూ ఉంటారు. ప్రయివేటు కంపెనీ ఉద్యోగం బస్సు మిస్సయితే బాస్ చేత చీవాట్లు.
అత్త; అంత చీవాట్లు తినే బదులు పెందలాడే లేచి తెమలొచ్చుగా.
కోడలు: ఆ! తెమలొచ్చు వంట ఇంటి పని అయ్యేటప్పటికి ఈ వేళ అవుతోంది.
అత్త; వంట ఏమిటి నా మొహం. నువ్వేమన్నా వండి వారుస్తున్నావా! పొయ్యి మీద పెడితే *కూ' ఉడికాను అంటూ కుక్కరు చెబుతుంది. బటన్ నొక్షితే పప్పులు, పచ్చళ్లు రుబ్బకుండానే తయారు. అదే మా కాలంలో అయితేనా, గుండిగల్తో వండి, వార్చే వాళ్లము. జబ్బలు విరిగేటట్టు పచ్చళ్లు రుబ్బే వాళ్లము. ఇప్పుడు ఆ పనులు ఏమున్నాయి.
కోడలు: మీకో నమస్కారము మీ కాలం కబుర్లు మీరు చెబుతుంటే వింటానికి నాకు టైము లేదు. డైనింగ్ టేబుల్ మీద కూర, పప్పు అన్నీ పెట్టాను. కడుపులో మంట వస్తుంది జావ తాగకపోతే. మధ్యాహ్నం మూడు గంటలకు సగ్గు బియ్యం జావ తాగండి. మరినే వెళ్ళి వస్తాను.
అత్తగారు: ఏదో మొక్కుబడికి పెట్టినట్టు అన్నీ టేబుల్ మీద పడేస్తారు. (ప్రేమగా కబుర్లు చెబుతూ పక్కనే కూర్చొని చారన్నం పెట్టినా అమృతంలా ఉంటుంది. మా అత్తగారికి నేనలాగే (ప్రేమగా దగ్గరుండి కొసరి కొసరి వడ్డించేదాన్ని. నీకు నాలాగే మంచి కోడలు వస్తుంది అంటూ సంబరంగా తినేవారు. ఆవిడ దీవెన ఏమయిపోయిందో నా పుణ్యం ఎటుపోయిందో.
కోడలు: మీ పుణ్యం ఎటూ పోలేదు. నేను ఇంట్లోంచి వెళ్లినా మనస్సు మీ చుట్టూ, పిల్లల చుట్టూ తిరుగుతుంది. మీకు ఆపేక్షగా వడ్దించాలని నాకు ఉంటుంది. ఇంటా బయటా చాకిరీతో రెస్ట్ లేక సతమతమవుతున్నాను. ప్లీజ్ అత్తయ్యా
96 * అక్షర ళిల్తాలు
నన్ను అపార్ధం చేసుకోకండి. మీరుండబట్టె పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చినా వాళ్లని చూసుకుంటున్నారు.
అత్తగారు; పిచ్చి మొహమా నువ్వు పరాయి దానివా? వాళ్లు పరాయి వళ్ళా. నా మనవలని నేను సంతోషంగా చూసుకుంటున్నాను. గబగబలాడుతూ నడవకు, ఎత్తుమడాల జోళ్లు. బస్సెక్కెటప్పుడు దిగేటప్పుడు జాగర్త.
కోడలు: అబిగేవస్తా అత్తయ్యా (అంటూ ఒకడుగు ముందుకేసి) ఫ్రిజ్‌లో గులాబ్‌జామ్ ఉంది మీరు పిల్లలు తినండి.
రెండవ రంగం
అత్త: ఏంటే ఈ వంట. ఈ బెండకాయ కూర నేను తినాలనే చేశావా, తింటె నాకు దగ్గు ఆయాసం వస్తుందని సీకు తెలుసుగా,
కోడలు: ఆ తెలుసు అయినా ఏంచేస్తాను, రోజూ రెండు కూరలొండి తద్దినం పెట్టె తాహతు మనకకృడిది.
అత్త: కూర వండలేదని అడిగితే తద్దినం దాకే పోతున్నావా నీవు. వేవిళ్లప్పుడు నీకు ఎలా చేసిపెట్టేదాన్ని పుల్ల పుల్లగా, నిమ్మకాయి చింతకాయ పచ్చడి వేడివేడిగా కారం పెట్టిన కూరలు, మజ్జిగ పులుసులు చేసి నీ నోటికి హితవ) అయిందా అని అడిగేదాన్ని అటువంటి నన్ను ఇన్ని మాటలంటున్నావు.
కోడలు: ఓ గతాలు చెప్పి దెప్పి పొదవకండి. నాకూ నవకాయ పిండి వండి వంట లతో వండి పెట్టాలని ఉంది. మీకు పళ్ల రసాలు, పిల్లలకు చిరుతిళ్లు చెయ్యా లనే ఉంది. ఏం చేస్తాం. మీ అబ్బాయి సంపాదన అంతంత మాత్రం.
అత్తగారు; ఆ మాత్రం సంపాదన లేకేగా మీ నాన్నమా అబ్బాయికిచ్చి నిన్ను చెశాడు,
కోడలు: ఐదుగుర్ని కంటానని మా నాన్నకి ఏమి తెలుసు. ఏదో ఒక పిల్లతో ముద్దుగా ఉంటాం అనుకున్నారు. పెద్ద దాన్హోటే చాలు అంటే మీరే వినలేదు. వంశోద్దా రకుడు ఉండాలంటూ గొడవ చేశారు. ఏదో ఆస్తుపాస్తులు మురిగిపోతు న్నట్టు అనుభవించేందుకు వారసుడు కావాలని.
అత్తగారు: అయ్యో అయ్యో, అవేమి మాటలే. పుత్రుడు పున్నామనరకాలు తప్పిస్తాడని అంటారు, నీ మంచికే చెవ్వాను, నీ కసలు పెద్దా చిన్నా భేదం లీకుందడా నన్ను ఆ ఐదుగురు గుంటల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు.
కోడలు: (ఏడుస్తూ) ఉన్న దాంట్లో సర్దుకు పోతోంటే పిల్లలు మీరు కూడా అవి కావాలి ఇవి కావాలి అని నన్ను కాల్ఫుకు తింటున్నారు. ఆ మహానుబావుడు
మోచర్ల రామలక్ష్మి * 97
హాయిగా క్యాంపులంటూ తిరుగుతున్నారు. నేను కొన్నాళ్లు మా అమ్మ గారింటికి వెళ్లిపోతాను. మీకూ హాయిగానే, నాకు హయిగానే ఉంటుంది.
అత్తగారు: ఒసేవ్ ఉరుకోవే. పెద్ద పీనుగని జిహ్వచాపల్యం కొద్దీ వాగాను, ఆ పచ్చడి వేసెయ్ అన్నం తినేస్తా. నువ్వు మమ్మల్ని వదిలివెళితే మేము ఏమై పోవాలే.
కోడలు: నేను మిమ్మల్నొదిలి ఎక్కడికెళతాను. మీకు ఏమి చేసి పెట్టలేకపోతున్నాననే బాధతో ఏదో అన్నాను. సాయంత్రానికి తోటకూర వండుతానెండి. పిల్లల్ని తీసుకుని సరదాగా గుడికి వెళ్లిరండి.
మూడో రంగం
కోడలు విజయ: అందరికి ఉంటారు పెద్దాళ్ళు. మాకు ఉన్నారు ఎందుకు. కంచాల లెక్కకి. మంచాలెక్కి మూలగటానికి.
అత్త దుర్గమ్మ: ఏంటీ ఈ, వేళ పొద్దున పొద్దున్నే మమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నావు.
కోడలు: మా (ఫెండ్ మణి కొడుక్కి ఫస్ట్ ర్యాంకు వచ్చింది.
అత్తగారు: (నవ్వుతూ) మణి కొడుక్కి ఫస్ట్ ర్యాంకు వస్తే సంతోషించాలి గాని వడు 'పెందుకో.
కోడలు: నా ఏడుపు అందుకు కాదు, దాని అత్త ఇంట్లో చాకిరి చేస్తూ ఉంటుంది, మావగారు పిల్లలకి ఎంతో బాగా చదువు చెబుతాదో. మనింట్లో పెద్దాళ్లు పీకలదాకా తిని పేపరు చదువుకుంటూ వుంటారు.
అత్తగారు: సీ నోరు పడిపోను. మేం పీకలదాకా తింటున్నామా. వాతం వచ్చి కాలు చేయి పడిపోయి మంచంలో పడివున్నారు. ఆయన చదువు చెప్ప లేదంటు న్నావా ఆయన వినలేదు గనుక సరిపోయింది, వింటే ఏమనుకునే వారు.
కోడలు: అనుకోవటానికి ఏముంది. ఇక్కడ బాలేపోతే మరోచోటికి పోతారు.
అత్త; పోతారు పోతారు అంటావేమిటే, పోకూడదనే కదా నీ దగ్గరకు వచ్చింది. వైద్యం అది జరుగుతుందని.
కోడలు: వోయబ్బో, కుక్కకొకచోట గౌరి కళ్యాణము. మిమ్మల్ని నెత్తిమీద ఎవరు పెట్టుకుంటారు కనుక. అందరూ తరిమి కొడితే ఇక్కడ పదివున్నారు.
అత్తగారు: ఏంటే పడివున్నారు అంటున్నావు.
కొడలు: అంతా పౌరుషంగా ఉంటే పొండి, మేం ఒకళ్ళమే కాదుగా ఇంకా ముగ్గురు న్నారుగా,
98 * అక్షర శిల్పాలు
అత్త; ఎర్రగా బుర్రగా వున్నావని ఏరికోరి నిన్ను కోడల్ని చేసుకున్నందుకు నాకు
కోడలు: ఊరుకున్న కొద్దీ పేట్రేగి వోతున్నారు. ముందు నా ఇంట్లోంచి పొండి అప్పుడు తెలుస్తుంది నా విలువ.
అత్త: (ఎడుస్తూ) ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావే. భగవంతుడా మమ్మల్ని ఇంకా ఎందుకు బతకమంటున్నావు తీసుకుపో తీసుకుపో అని (నెత్తి కొట్టు కుంటూ)
రాజేశ్వరి: ఉర్కో పిన్నీ ఉరుకో ఏమైంది.
కోడలు: ఏమి అవలేదు తిన్నదరక్క,
అత్త: విన్నావుగా దాని మాటలు. రోజూ ఏదో ఒక గొడవ పెడుతూ వుంటుంది.
రాజేశ్వరి: పిన్ని కొన్నాళ్లు మీకు ఊరటగా ఉంటుంది. మరొకళ్ళింటికి వెళ్ళొచ్చుగా.
అత్తగారు: వెళ్ళొచ్చు కాని పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు. అవసరానికి దబ్బు పంపుతున్నాడు. ఇక రెందోవాడు వాదొక భాబా.
కోడలు; భాబా అంటే ఎదో స్వామిజీ అనుకునేరు, భార్యా బాధితుడు. ఆయనకే ఆవిడ ముద్దెట్టదు. ఇంక వీళ్లకేం పెడుతుంది,
అత్తగారు: మూడోవాడు పల్లెటూరులో ఉన్నాడు. కాస్త వాడు వాడి పెళ్లాం ప్రేమగానే చూస్తారు. కాని అక్కడ వైద్య సదుపాయం లేదు. ఇంతకాలం అక్కడేగా మేం ఉన్నదీ. ఈ మధ్యేగా దీని దగ్గరకొచ్చాము.
కోడలు: రాజేశ్వరీ, మీ అత్తగారు నువ్వూ, మాట మాట అనుకుంటారు మళ్లీ మర్చిపోయి, పనిబాట చేసుకుంటారు. మణి వాళ్ల అత్తగారు, మణి అను కుంటారు, ఒకరినొకరు అభిమానించుకుంటారు. గమనిస్తునే ఉన్నావుగా మా అత్తయ్య విషయం. నేను వేరే చెప్పక్కర్లేదు నీకు.
అత్తగారు: అమ్మా రాజేశ్వరీ ఆయన సంపాదించినన్నాళ్లు, నేను చాకిరి చేసినన్నాళ్లు, మమ్మల్ని అందరూ గొప్పగానే గౌరవించేవారు. ఇప్పుడే మా (బతుకు ఇలా అయ్యింది. చెట్టంత కొడుకులు వృద్ధాప్యంలో నీడనిస్తారనుకున్నాను. కాని విషసర్పాలు చుట్టుకుని ఉన్న చెట్టులా ఉన్నారు. పాము పడగనీడనెలా బ్రత కాలి.
రాజేశ్వరి: బాధపడకు పిన్నీ నువ్వేమీ అనుకోనంటే నీకో విషయం చెబుతాను.
అత్తగారు: చెప్పమ్మా తరాల అంతరాల వల్ల అత్తా కోడళ్లకి చిన్న గొడవలు రావడం మామూలు అవుతుంది.
మోచర్ల రామలక్షి * 99
రాజేశ్వరి: ప్రతి ఇంటా జరిగేదే మీ ఇంటా జరుగుతుంది. బాబాయి గారిలా అనా రోగ్యం పాలైన వాళ్లకి ఫిజియో తెరఫీ చేసి భోజన సదుపాయాలు సమకూర్చే వృద్ధాశ్రమాలున్నాయి. వాటిల్లో ఒకటి ఎంచుకోండి. కొన్నాళ్లు ఆశ్రమ జీవితం గడపంది.
అత్తగారు: చాలా మంచి మాట చెప్పావు తల్లీ. రేపే మంచిరోజు. ఏది మంచిదో చూసి నువ్వే తీసుకెళ్లు. వాళ్ళు రమ్మన్నప్పుడే వస్తాము.
కోడలు: అమ్మయ్య మా పీడ వదిలించావ్ రాజేశ్వరి.
రాజేశ్వరి: విజయ పెద్దావిడని పట్టుకుని అంత మాట అనకు. ఆవిడ వయస్సుకి మనం చేరుకుంటాం. పెద్దావిడ కనుక కాస్త చేదస్తం ఉండొచ్చు. దాన్ని పీడ అని అనుకోకూడదు. అప్పుడు మన పిల్లలు మనల్ని అలాగే అంటే.
విజయ; మా అబ్బాయికి నేనంటే ప్రాణం. నన్ను ఏం అన్నా ఊరుకోడు.
రాజేశ్వరి: (నవ్వుతూ) మీ అత్తగారు కూడా నీలాగే అనుకుని ఉంటుంది. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాల వచ్చాక బిడ్డలు కాదు. అయినా పెద్దవాళ్ళని మరీ అంత తీసిపారేయకు. కావాలంటే పెద్దవాళ్ళు వస్తారా? మనం చేసే పనులు మనకి తెలియకుండానే మన పిల్లలు గమనిస్తారు. ప్రాయం వచ్చాక మనలాగే ప్రవర్తిస్తారు. ఆలోచించుకో. స్నేహం కొద్ది చెబుతున్నా. పిన్నీ నువ్వు మరోలా అనుకోకు. ఇంట్లో ఉన్నా ఆశ్రమాలలో ఉన్నా సర్దుకుపోతే సౌఖ్యం, సంతృప్తి, సంతోషాన్నిస్తాయి. ఆశ్రమాలకి వచ్చి పనివాళ్ళ మీద పెత్తనం, ఆశ్రమ నిర్వాహకుల మీద నిందలు వేస్తూ అహంకారాన్ని ప్రదర్శి స్తారు కొందరు. దానివలన సుఖశాంతులు కరువవుతాయి.
అత్తగారు: రాజేశ్వరి నేను ఎక్కడున్నా సర్పుకునే ఉంటా. ఆయన ఆరోగ్యం కుదుటపడితే అదే మహాభాగ్యం. మా ఖర్మకి మరొకళ్ళని నిందించం.
విజయ: సారీ అత్తయ్యా! అంతమాట అనుకోకండి. ఏదో చిన్నతనం కొద్ద పిచ్చి వాగుడు వాగాననుకొని పెద్ద మనసుతో క్షమించండి. రాజేశ్వరీ నువ్వ ఫిజియోథెరపీ చేసే అతన్ని ఇంటికే రమ్మను.
రాజేశ్వరి; గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు. తరాల అంతరాలవల్ల వచ్చే అపార్థాలు తొలిగిపోయాయి. హాయిగా ఉండండి.
స వంకా
జ్ఞానోదయం నాటకం-1
జానకి: రమా! రమా! ఏం చేస్తున్నావ్?
రమ: ఎం చెయ్యటం లేదు. రారా. కూర్చో, వాసేవ్ గంగా. మా జానకికి మంచి సళ్ళు తీసుకురా.
జానకి: నీ కోడలు గంగ నాకు ఎదురయ్యింది. బయటకి పనిమీద వెడుతోందిట. ఇప్పుడు మంచినీళ్ళు ఏమీ వద్దు.
రమ: ఏవిటీ! నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిందా? చెప్పే ఉంటుంది. ఈ మధ్య జ్ఞాపక శక్తి మరీ పోయింది. .
జానకి; అబ్బ! ఇప్పుడా గోల ఎందుకు గాని నీ కూతురు అఖిల ఎలా ఉంది? అమెరికా విశేషాలు ఏమిటి?
రమ: అఖిల అమెరికాలో ఇల్లు కట్టుకుంది. సత్యనారాయణ వ్రతం చెసుకుని 50 మందికి లంచ్ ఇచ్చింది. ఆ ఫంక్షన్‌కి నన్ను రమ్మని మా అల్లుడు, అఫీల ఒకటే పట్టు బట్టారు. వెళ్ళక తప్పలేదు.
జానకి: నీ వియ్యపురాలు, వియ్యంకుడు వచ్చారా?
రమ: అబ్బే రాలేదు. వాళ్ళ ఆరోగ్యం అంతంతమాత్రం. వాళ్ళని రమ్మని ఇబ్బంది పెట్టటం ఎందుకని మా అమ్మాయి పిలవ లేదు.
జానకి: అఖిల ఇల్లు బావుంటుందా? ఇంకా ఏమిటి విశేషాలు?
రమ: ఎంత బాగా కట్టించాడో ఇల్లు మా అల్లుడు. ఎన్ని సదువాయాలు అను కున్నావు. పెద్ద దాక్టరైనా వీసమంత గర్వం ఉండదు. అఖిలని ఒక్క పని చెయ్యసీయడు. మొగాడు పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో మా అల్లుడి దగ్గరే నేర్చుకోవాలి. దేవుడిలాంటి మొగుడు, పళ్ళ లాంటి ఇద్దరు కొడుకులు. అఖీల చాలా అదృష్టవంతురాలు. తల్లిని నేను అనగూడదు గాని దాని వైభోగం చూస్తే దిష్టి తగిలేట్టు ఉంది.
జానకి; నీ కూతురు కాపురం గురించి వింటే సంబరంగా ఉంది. నీ కొడుకు కాపురం ఎలా ఉంది?
రమః ఎం చెప్పమంటావ్. ఆ రాక్షసి కుక్కర్ ఆపు, కూర తరుగు అంటూ మా అబ్బాయిని ఆడంగి వెధవ చేసి ఆడిస్తోంది. ఆవిడ గారి పాద మహిమ వాడు ఏ ఉద్యోగం పట్టుమని పది నెలలు కూడా చెయ్యటం లేదు. ముగ్గురు
మోచర్ల రామలక్ష్మి * 101
ఆడపిల్లలు. పిచ్చి మొద్దులు. వాడి గురించి ఎం చెప్పను? వాడు దురదృష్ట వంతుడు. వాడి గురించి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది.
జానకి: నవ్వుతుంది.
రమ: ఏమిటే నవ్వుతున్నావ్? నా కొడుకు బతుకు నీకు నవ్వలాటగా ఉందా?
జానకి: సీకు చిన్నప్పటి నుంచి ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. ఎదుటివాళ్ళని అర్ధం చేసుకోవ.
రమ: నీ వరస చూస్తుంటే నాకో విషయం అర్ధం అవుతుంది.
జానకి; ఏమర్ధం అయిందో చెప్పు.
రమ: నేను అమెరికా వెళ్ళినప్పుడు మా కోడలు ఉన్నవి లేనివి నీ చెవిలో ఊది ఉంటుంది. అవి అన్నీ నిజం అనుకొని, నాకు సూక్తిముక్తావళి చెప్పటానికి వచ్చావు అవునా?
జానకి: నీ కోడల్ని ఎందుకు అనుమానిస్తావ్. ఆ బుద్ధి మానుకో. గంగ నాకేం చెప్పలేదు. నీ మాటలు విన్న ఎవరైనా నా లాగే నవ్వుతారు.
రమ: ఎందుకు?
జానకి: బుర్ర పెట్టి ఆలోచించు. నీ అల్లుడు దేవుడు. నీ కూతురు అదృష్టవంతురాలు అంటున్నావ్. నీ అల్లుడు చేసిన పని నీ కొడుకు చేస్తే కోడలు రాక్షసి, కొడుకు దురదృష్టవంతుడు అంటున్నావ్. ఇదెక్కడి న్యాయం. నా మాట విను.
రమ: ఏమిటి వినెది నీ సోది. గంగని రానీయ్. ఇంట్లోంచి బయటికి గెంటుతా:
గంగ: అత్తయ్యా మీకంత శ్రమ అఖ్బల్లేదు. మేమే వెళ్ళిపోతాం.
రమ: జానకి, చూశావా దాని అహం.
గంగ: అహం కాదు అత్తయ్య ఆత్మాభిమానం. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇంత వరకు మీకు, మీ అబ్బాయికి ఎదురు చెప్పానా, పిల్లలు ఎదుగుతున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. వాటికి తగ్గ డబ్బు లేకపోవటంతో అనేక అవస్థలు పడుతున్నాం. మన ఇంట్లో అవగాహన పోయింది. అక్కర. లేని మాటలు అనుకుంటూ అల్లరి పడుతున్నాం. మేము వెళ్ళిపోతే మీకు వోయిగా ఉంటుంది. మాకు హాయిగా ఉంటుంది.
రమ: ఎమిటి వాగుతున్నావ్. ఇంత పెద్ద ఇల్లు, సొంత ఇల్లు వదిలి ఎక్కడికి పోతావే.
గంగ: బాలానగర్‌లో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాం. అక్కదే ఫ్యాక్టరీలో మీ
102 *అక్షర శిల్పాలు.
అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. పిల్లలకి స్కూలు కూడా బావుంది. వాళ్ళ స్కూల్లో నాకు టీచరు ఉద్యోగం ఇస్తానన్నారు.
రమ: పెద్ద దిక్కుగా చూసుకోవలసిన నన్ను దిక్కులేనిదాన్ని చేసి వెళ్ళిపోతావా (ఐదుస్తూ).
గంగ: అంత మాట అనకండి. మీరు మాతో వస్తానంటే మేం వద్దనం. మనుషులు దగ్గరగా ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉండి అప్పుడప్పుడు ప్రేమగా పలకరించుకుంటేనే నయం. మనం (ప్రేమ, అభిమానం, గౌరవం అనేవి ఇవ్వగలిగితేనే పొందగలుగుతాం అవి పొందాలే కాని పోగొట్టుకోకూడదు. (అని ఇంట్లోకి వెళ్ళివోయింది.)
రమ: జానకి ..... చూశావా దాని తలవీరుసు.
జానకి: రమా నె చెప్పేది విను. తరువాత నీ ఇష్టం. నేను నీ చిన్న నాటి స్నేహితు రాలిని. నీ తరువాతే నీ కూతురైనా కోడలైనా.
రమ: ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.
జానకి: కూతురు, కోడలు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఓ కంట్లో వెన్న మరో కంట్లో సున్నం పెట్టుకోం కదా.
రమ: ఉవోద్దాతాలు ఆపి అసలు విషయం చెప్పు.
జానకి; గంగ గురించి ఒకసారి ఆలోచించు. తనలో ఏమన్నా చెడ్డగుణాలు ఉన్నాయా? ఉద్యోగం లేని భర్త, అర్ధంచేసుకోలేని అత్తగారు, తెలిసీ తెలియని వయస్సుతో పేచిపెట్టె పిల్లలు. వాళ్ళందరితో ఎలా నెట్టుకొస్తుంది చెప్పు.
రమ: గంగ చాలా మంచి పిల్ల, సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తోంది. కాఫీ ఎంత బాగా కలుపుతుందో తెలుసా? నేను కలుపుకున్నా నా కూతురు కలిపి ఇచ్చినా నాకు నచ్చదు. అది వెళ్ళిపోతే కాఫీకి కూడా మొహం వాచిపోవాలి.
జానకి: కోడలి మీద అంత అభిమానం ఉన్న దానివి అస్తమాను సాధిస్తా వెందుకు?
రమ: మా అత్తగారు నన్ను అలాగే సాధించే వారు. మా మామగారు కోడలు అంటే మన ఇంటి దీపం అని చెప్పేవారు. మా అత్తగారు నాకూ తెలుసు. కాని కోడల్ని నెత్తికి ఎక్కించుకోకూడదు. అందుకే అలా అంటూ ఉంటా అనేవారు. ఆవిదనే నేను ఫాలో అయ్యాను. అందుకే గంగని ఏదో ఒకటి అంటున్నాను.
మోచర్ల రామలక్ష్మి * 103
అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. పిల్లలకి స్కూలు కూడా బావుంది. వాళ్ళ స్కూల్లో నాకు టీచరు ఉద్యోగం ఇస్తానన్నారు.
రమ: పెద్ద దిక్కుగా చూసుకోవలసిన నన్ను దిక్కులేనిదాన్ని చేసి వెళ్ళిపోతావా (ఐదుస్తూ).
గంగ: అంత మాట అనకండి. మీరు మాతో వస్తానంటే మేం వద్దనం. మనుషులు దగ్గరగా ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉండి అప్పుడప్పుడు ప్రేమగా పలకరించుకుంటేనే నయం. మనం (ప్రేమ, అభిమానం, గౌరవం అనేవి ఇవ్వగలిగితేనే పొందగలుగుతాం అవి పొందాలే కాని పోగొట్టుకోకూడదు. (అని ఇంట్లోకి వెళ్ళివోయింది.)
రమ: జానకి ..... చూశావా దాని తలవీరుసు.
జానకి: రమా నె చెప్పేది విను. తరువాత నీ ఇష్టం. నేను నీ చిన్న నాటి స్నేహితు రాలిని. నీ తరువాతే నీ కూతురైనా కోడలైనా.
రమ: ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.
జానకి: కూతురు, కోడలు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఓ కంట్లో వెన్న మరో కంట్లో సున్నం పెట్టుకోం కదా.
రమ: ఉవోద్దాతాలు ఆపి అసలు విషయం చెప్పు. ,
జానకి; గంగ గురించి ఒకసారి ఆలోచించు. తనలో ఏమన్నా చెడ్డగుణాలు ఉన్నాయా? ఉద్యోగం లేని భర్త, అర్ధంచేసుకోలేని అత్తగారు, తెలిసీ తెలియని వయస్సుతో పేచిపెట్టె పిల్లలు. వాళ్ళందరితో ఎలా నెట్టుకొస్తుంది చెప్పు.
రమ: గంగ చాలా మంచి పిల్ల, సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తోంది. కాఫీ ఎంత బాగా కలుపుతుందో తెలుసా? నేను కలుపుకున్నా నా కూతురు కలిపి ఇచ్చినా నాకు నచ్చదు. అది వెళ్ళిపోతే కాఫీకి కూడా మొహం వాచిపోవాలి.
జానకి: కోడలి మీద అంత అభిమానం ఉన్న దానివి అస్తమాను సాధిస్తా వెందుకు?
రమ: మా అత్తగారు నన్ను అలాగే సాధించే వారు. మా మామగారు కోడలు అంటే మన ఇంటి దీపం అని చెప్పేవారు. మా అత్తగారు నాకూ తెలుసు. కాని కోడల్ని నెత్తికి ఎక్కించుకోకూడదు. అందుకే అలా అంటూ ఉంటా అనేవారు. ఆవిదనే నేను ఫాలో అయ్యాను. అందుకే గంగని ఏదో ఒకటి అంటున్నాను.
మోచర్ల రామలక్ష్మి * 103
జానకి: పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు మాని కాస్త బుర్రపెట్టి ఆలోచించు. నా ఇల్లు నేను అనుకోకు. మీ ఆర్థిక సమస్య ఎలా తగ్గాలో చూడు. కాలంతో పాటే మనమూ మారితేనే నీకు మంచిది. వాళ్ళకి మంచిది. లేకపోతే ఒంటరి జీవితం నీకు కష్టంగా ఉంటుంది. ఇంటిని కనిపెట్టుకు కాపల కాసే పెద్ద దిక్కులేక వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది.
రమ: నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోందె జానకి. ఈ ఇల్లు అద్దెకిచ్చి వచ్చే డబ్బుని మా మనుమరాళ్ళ కోసం దాచిపెడతా. నేనూ వాళ్ళతో పాటు వెడతా.
జానకి: అమ్మయ్య గతం తాలూకు చాదస్తాలని వదలి వాస్తవాన్ని గ్రహించావ్.
రమ: నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. పెద్దవాళ్ళం వాళ్ళు అవస్తల్లో ఉంటే ఆ పిల్లలకి ఆసరాగా ఉండాలే కాని, అక్కర్లేని మాటలు అనకూడదు.
రారా
కనువిప్పు శోభ: రావమ్మ! ఇందిరమ్మ! రావమ్మ! టిఫిన్ తిందువు రావమ్మ ఇందిర: నన్ను మనశ్చాంతిగా వుండనివ్వవా? శోభ; మనసు గతి ఇంతే మరచిపో అంతే. ఇందిర: నోరు మెదిపితే చాలు పాటపాడి చంపేస్తున్నావు, శోభ: చంపేదెవరు? చచ్చేదెవరు? సర్వము నీవేకదా! ......౨౨౨౨ ౨౨౨. రామలక్ష్మీ: అహ! ఎంత తత్త్వ జ్ఞానమే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇందిర: అమ్మా! తల్లి! మొదలు పెట్టావా సామెతలు. రామలక్షీ శై మొగుడు కొట్టినందుకు కాదు. నా మొహం తీరే ఇంత అని. నీ మొహం ఏంటి అలా మొటమొటలాడుతోంది. ఇందిర: మొటమొటకాదు. ఒళ్ళు మండిపోతుంది. మా ఆయన ఇంటికి వచ్చేయ మని ఫోన్ చేశారు. రామలక్ష్మీ: నీ మొగుడు నిన్ను రమ్మని పిలిస్తే ఆలోచన ఎందుకు? నిక్షపంలా వెళ్ళు. ఇందిర: నా మీద (ప్రేమ కారిపోవటం లేదు. వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చిందిట సేవ చెయ్యడానికి, శోభ: త్యాగశీలివమ్మ మహిళ, అనురాగశీలివమ్మ ఇందిర; వదినా! పాటలాపి మాట్లాడు తల్లి. చంపుతున్నావు నీ పాటలతోటి. శోభ: మాట్లాడమన్నావు. మాట్లాడుతున్నాను. నా మాటలన్నీ పాటచేసి మాట్లాడు తున్నాను. రామలక్ష్మీ: బావుందమ్మా పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం! దానికి కాపురంలో బాధ వచ్చి మనింటికి వచ్చింది. పాటలాపు. శోభ: మరపురాని బాధకన్నా మధురమే లేదు. రామలక్ష్మీ: మధురం అంటే గుర్తుకు వచ్చింది. మైసూర్ పాక్ చేద్దామనుకున్నాను, చక్కర అయివోయింది. శోభ; చక్కెరతో పని ఏముంది. స్వగ్భహలో కొనేద్దాం. రామలక్ష్మీ: మొదటి దానికి మొగుడు లేడు. కడదానికి కళ్యాణంట. చక్కెర కొన టానికే చిల్లర లేదు. మోచర్ల రామలక్ష త్రన 105
శోభ: ఇందాకటి నుండి చూస్తున్నాను. సామెతలతో నువ్వు, పాటలతో ఆవిడ నా మనస్సును తూట్లు చేసేస్తున్నారు. మీ వరస చూసే నాన్న అన్నయ్య బీజినెస్ అంటూ ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఏం చేస్తారులే! ఇంట్లో నరకాన్ని భరించలేక.
శోభ: గృహమే కదా స్వర్దసీమ.
రామలక్ష్మి; ఓసే శోభ ఎద్దుపుండు కాకికి నొప్పా అన్నట్టు చేస్తావేంటి. అత్తగారికి చాకిరి చెయ్యలేక అది మనింటికి వచ్చింది. అన్నగారి పెళ్ళానివి కడుపులో పెట్టుకొని చూసుకోవాలి! పాటలతో హింసించకు.
శోభ; ఎదుట వాళ్ళకి చెప్పేటందుకే నీతులు వుంటాయి.
రామలక్ష్మీ ఏంటి డబల్ మీనింగ్ పాటలు పొడుతున్నావు?
శోభ: లేకపోతే ఏంటి? మీ కూతురు మొగుడికి, అత్తగారికి చాకిరి చెయ్యలేక పుట్టింటికి వచ్చింది. ఆవిడిని నేను కడుపులో పెట్టుకోవాలా? మరి నాకు మీ అందరికి చెయ్యటం కష్టమేగా? నేను పుట్టింటికి వెళ్ళివోతాను, మా అమ్మ మా వదిన్ని నన్ను కడుపులో పెట్టుకోమంటుంది. ఆఅవిదా పుల్టంటికి వెళ్ళి వోతుంది.
రామలక్ష్మి: ఒసేవ్! నువ్వు పాటలు పాడితేనే నయం. ఒక్క ముక్కలో చెప్పి ఊరు కుంటావు. మాట్లాద్దం మొదలు పెట్టావంటే వరదలు వచ్చినట్టే.
శోభ: అబ్బో! తమరు మాత్రం సామెతలతో తుఫాను తెప్పించేస్తారు.
ఇందిర: అబ్బా! ఊరుకోండి. మా అత్తగారు నన్ను సూటిపోటి మాటలంటోందని మనస్సు విప్పి ఎంత చెప్పుకున్నా మీ దగ్గర లాభం ఉండటం లేదు. మీ గోల మీదే. అత్తింట్లో అలుసు చేసిన కూతురిని ఎలా ఆదరించాలో తెలి యదు మీకు.
శోభ; ఊరుకో మా తల్లి! ఊరుకోమ్మా. నీ అత్తింట అలుసుచేస్తే ఉండబోకమ్మ. నువ్వుండ స్టహోమ్ చూసి ఉంచాను.
ఇందిర: చూడమ్మ! వదిన ఎలాంటి పాటలు పాడుతోందో! నన్నింట్లోంచి పొమ్మనే కదా దాని అర్ధం?
రామలక్ష్మీ: సమయం సందర్భం ఉందక్కరలేదా? దాని మొహం చూడు తోటకూర కాడలా ఎలా వాడిపోయిందో. అయ్యో! నా మతిమండ డాక్టరు దగ్గరికి వెళ్ళి వచ్చావు కదే! ఆవిడ ఏమంది?
106 శ అక్షర ళిల్సాలు
ఇందిర; నాకున్న సమస్యలు చాలక పులిమీద పుట్రలాగ ఖర్మ! సీ సామెతలు నా కొచ్చేస్తున్నాయి! నాకు మూడో నెల అని చెప్పారు.
రామలక్ష్మీ: ఒసెవ్! ఇంత మంచి వార్తని పులి, పట్ర అంటావేంటి రోగి పాఠ కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అని ఇంక వి(శ్రాంతి తీసుకోవాలమ్మా
ఇందిర: అవునమ్మా కాస్త నీరసంగా ఉండి రెస్ట్ తీసుకుంటూంటే మా అత్తగారు దుమ్మెత్తి పోస్తున్నారు. మా ఆయన అస్సలు నాకు సాయం చెయ్యదానికి వీలులేదుట.
శోభ: ఏంటి? ఇంత నీరసంగా ఉంటి పాపం నిన్ను తిట్టివోస్తుందా?
ఇందిర: ఇంతదాక పాటలతోటి వెక్కరించి నా మీద ఒక్కసారిగా ఇంత (పేమ వచ్చిందేంటి?
రామలక్ష్మీ: కొత్తగా (ప్రేమ రావడమేమిటి? నువ్వంటే ఎప్పుడు ఇష్టమే దానికి.
ఇందిర: ఏంటి? కోడలిని అంత వెనకేసుకొచ్చెస్తున్నావు?
రామలక్ష్మీ: కోడలంటే ఎవరు? ఈ ఇంట్లో వెలిగే దీపం.
శోభ: అవును ఇందిర, నువ్వంటే నాకిష్టం నీ నవ్వుంటెే నా కిష్టం.
రామలక్ష్మీ: కాపురంలో కలతలు, కొలనులో అలలు రాకుండా ఉండవు. నువ్వు మి అత్తగారు పెళ్ళి అయిన కొత్తల్లో ఎంత పొత్తుగా ఉండేవారు. ఇప్పుడు మీ మధ్య మనసమర్ధలు ఎందుకొచ్చాయి?
ఇందిర: పక్కింటి ఆంటీ, వల్ల,
శోభ: అవిడ కేమిటి లాభం
ఇందిర: మీ అంతటీవాళ్ళు లేరు అని అత్తయ్యని తెగపొగిడేస్తుంది. వంట చేసుకో లేదు అంటూ నీరసంగా మాట్లాడుతుంది. రెందు పూటలా కూర, పచ్చుడి ఇస్తుంది. కూరలు పచ్చళ్ళు పట్టుళ్ళిటప్పుడు నేను ఇంట్లో ఉంటే ఆవిడకి నచ్చదు. అందుకే అత్తయ్యకు నా మీద ఏవో ఒకటికి చెపుతుంది.
రామలక్ష్మీ: శోభ! మా పెద్దమ్మకి పుట్టు రోగం కాదు అంటురోగమె. వదిలిద్దాం పదా.
సత్యవతి: రండి రంది.
శోభ: మా ఇంటిమీద సీతకన్ను వేశావ్. ఈ పెద్దమ్మని మర్చిపోయావా?
శోభ: మర్చిపోలేదు. కుశలమేనా మీరు కుశలమేనా?
సత్యవతి: అత్తారింటికెళ్ళినా నీ పాటల గోల మానలేదా,
శోభ; మా అత్తయ్య చాలా మంచిది. అందరి అత్తల్లా ఆరడి పెట్టదు. నేను సరదాగా హుషారుగా ఉంటేనె ఆవిడకిష్టం.
రామలక్ష్మీ: కోడలు అంటే ఎవరునా కూతురికన్నా ఎక్కువ.
సత్యవతి: మీ అత్తాకోడళ్ళు మా ఇంట్లో మీ గొప్పలు చెప్పుకుంటున్నారు.
శోభ; మీ అత్తాకోదళ్ళల్లా కాదు మేము, నీ కోడలు చూడు ఎంత నీరసంగా ఉందో. అస్సలు పట్టించుకోరు. మీ అబ్బాయి సరేసరి.
సత్యవతి: ఇందిర నీరసంగా ఉంది అంటే అది మీ తప్పే. మీ ఇంట్లోనే ఉందిగా. ఇంక మా అబ్బాయికి వాణ్ని పెళ్ళాం ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయిందని దిగులు.
రామలక్షీ: ఇందిర! నీకు బుద్ధిలేదు. మీ ఆయన్ని ఎదిరించి మీ అత్తగార్ని కాదని పుట్టింటికి వచ్చేశావా?
శోభ: ఉండు అత్తయ్యా, ఇందిర డోక్కుంటోంది. అసలే వట్టి మనిషి కాదు. పాపం వాళ్ళ అత్తగారు లాగే నువ్వు తయారవ్వకు. అర్దం పర్ధం లేకుందా,
సత్యవతి: ఏమిటి వట్టి మనిషికాదు అంటున్నావు ఇందిర సీళ్ళోసుకుందా!
శోభ: అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు.
సత్యవతి: నువ్విలా లోపలికిరామ్మా ఆపక్కంటావిడ మాటల పట్టుకుని నిన్ననవస రంగా మాటలు అన్నాను. మనసులో పెట్టుకోకు.
శోభ: పెద్దమ్మ చెప్పుడు మాటలు విని మన ఇంటిని నరకం చేసుకోకూడదు.
రామలక్ష్మి అత్తా కోడళ్ళంటే ఎవరు పిల్లి ఎలుక పులి, మేక కాదు ఒకే ఇంటికి ఒక తరం తేడాలో వచ్చిన కోడళ్ళ. ఒక వ్యక్తికి జీవాన్ని ఇచ్చింది ఒకరికి జీవితా న్నిచ్చింది ఒకరు. అత్తాకోడలు పొత్తుగా లేకపోతే మధ్యలో బాధపడేది ఆవిడ కొడుకు, ఆవిద భర్త.
సత్యవతి: ఒదినగారు చెప్పుడు మాటలతో పొరలు కమ్మిన నా కళ్ళను తెరిపించారు. మంచి మాటలతో మీ కోడలు, మీరు నాకు కనువిపు చేశారు.
- అత్ వా; అషస్రాల- 108 *అక్షర శిల్పాలు.
ఆఅవాత మధురం పాత్రలు సీతారామయ్య - 65 సంవత్సరాలు. శివానంద్ - 30 సంవత్సరాలు - సీతారామయ్య కొడుకు. ఆమని - 25 సంవత్సరాలు -- శివానంద్ భార్య. తాయారు- 60 సంవత్సరాలు-- సీతారామయ్య దూరపు బంధువు, పక్కింట్లో ఉంటుంది, వరసకి మరదలు. తెరవెనుక సీతారామయ్య: (బ్రతిమాలుతూ) నాన్నా శివానందా కన్నా శివానందా లే నాన్నా ఏడయ్యింది ఆఫీసుకి వెళ్ళే వేళయ్యింది. ఆమని: (విసురుగా) లాలి పాడినట్టు లేపితే ఎలా లేస్తాడు. నే లేపుతాను ఈ లోపు కాఫీ పని చూడండి. (బాదుతూ) ఆమని ఏయ్ మొద్దు లే ... లేస్తావా? నీళ్ళు కుమ్మరించమంటావా? శివ: (సాగదీస్తూ గారంగా) వద్దు ...'లేస్తా ... నువ్వెళ్ళు. తెరముందు డ్రాయింగ్ కమ్ దైనింగ్ సెట్టింగ్ కాఫీ కప్పుతో తెరమిదకి వచ్చి సీత; అమ్మా ఆమని కాఫీ తీసుకోమ్మా. వేడి చల్లారిపోతుంది. ఆమని: వస్తున్నా అంకుల్ (తలదువ్వుకుంటూ) ఆమని కాఫీ కప్పు అందుకొని - థ్యాంక్యు. సీతారామయ్య: (ఆమని కేసి ఆప్యాయంగా చూస్తూ) కాఫీ ఎలా ఉందమ్మా, ఆమని: నాట్ బ్యాడ్, సీతారామయ్య: టిఫెన్ తీసుకురానమ్మా ఆమని: తల అడ్గంగా తిప్పుతూ నో అంకుల్, టిఫెన్ తినే టైమ్ లేదు. సీతారామయ్య: (చిన్న బుచ్చుకొని బ్రతిమాలుతూ, నీ కిష్టమని పూరీ, ఆలు కర్రీ చేశాను. నా తృప్తికోసం ఒక్క పూరీ తిను. ఆమని: (వాచీ పెట్టుకుంటూ ఖంగారుగా) సారి అంకుల్ ఇప్పుడు తినే టైమ్‌లేదు. ఇఫ్ యు దోంట్ మైండ్ టిఫెన్ బాక్సు ఇస్తే పట్టుకడతా,
సీతారామయ్య: (హుషారుగా) ఇందులో అనుకోవదానికి ఏం ఉంది. ప్లేట్లో తిన్నా బాక్స్‌లో తిన్నా నువ్వు తినటం కావాలి. వేకువనే లేచి వేగంగా చేశాను వేది వేడిగా నువ్వు తింటావని,
ఆమని; (హేండ్బ్యాగ్ భుజాన వేసుకొని) అందుకే అంకుల్ మీరంటే నాకు చాలా ఇష్టం, కాని ఎక్కువగా మాట్లాడుతూ మీరు నా బ్రైమ్ తినేస్తుంటే, నాకు విసుగ్గా ఉంటుంది.
సీతారామయ్య: (లోపలికి వళ్ళివోతూ,) సారీ ... ఇక ముందు ఎక్కువగా మాట్లాడి విసిగించను.
ఆమని: (చెప్పులు వేసుకుంటూ) ఏ రోజుకారోజే పరగడుపు విసిగించను అంటూనే విసిగిస్తారు.
సీతారామయ్య: (ఆమనికి బాక్స్ అందిస్తూ) బాక్స్ తీసుకోమ్మా.
ఆమని; (బాక్స్ తీసుకుంటూ) థ్యాంక్సు అంకుల్.
ఆమని: (రెండదుగులు వెనక్కి వేసి) అంకుల్ చెప్పడం మరిచాను. దిన్నర్కి రాను మా ప్రోగ్రామ్‌లో మార్పు వస్తే మీకు కరెక్టుగా ఈవెనింగ్ సెవెన్‌కి ఫోన్ చేస్తా,
సీతారామయ్య: సరే అన్నట్టు తల ఊపాడు. (సీతారామయ్య ఫర్నీచరు తుడుస్తూ, పేపర్లు సద్దుతూ ఉంటాడు.
తాయారు: (చేతిలో పేపరుతో వచ్చి పేపరు టేబుల్ మీద పెడుతుంది తాయరు) బావా నిన్ను చూస్తుంటే జాలివేస్తోంది.
సీతారామయ్య: నవ్వుతూ, నన్ను చూసి జాలెందుకు? హాయిగా, ఆరోగ్యంగా ఉన్నాను.
తాయారు: (పెదవి విరుస్తూ) ఆ! ఉన్నావు జీతం, భత్యం లేని నౌకరులా,. అన్ని పన్లూ చేసూ,
సీతారామయ్య; నేనేం చేస్తున్నా ఎంతో కొంత ఇలా చిన్న పన్లు అంతే. నీకే ఎక్కువ శ్రమ ఇస్తున్నా
తాయారు: (ఆపేక్షగా చూస్తూ) శ్రమ అంటావేంటి బావా ఏదో పరాయి వాళ్ళకి చేసినట్టు. మన చిన్నప్పుడు గుర్తుందా అప్పదాలు వత్తినా, వడియాలు పెట్టనా, ఊరగాయలప్పుడు.
సీతారామయ్య: (హుషారుగా) ఆ గుర్తుంది. మీ ఇంటో పన్గుకి మా ఇంట్లో వాళ్ళు,
110 * అక్షర ళిల్తాలు
మా ఇంట్లో పన్లుకి మీ ఇంట్లో వాళ్ళు వచ్చి సాయం చేసేవారు. అవుడు మనందరం కలసి ఒక్కచోటే భోజనం చేసేవాళ్ళం,
తాయారు: నోరూరుతున్నట్టు, బావా అప్పడాల పిండి, పచ్చి వదయాలు, అన్నంలో నంజుకుతింటే, ఆహా ఎంత రుచిగా ఉందేవి. ఆ రుచులే వేరు.
సీతారామయ్య: మీ బామ్మ వాము మిరపకాయలు, పిండి వడియాలు ఎంత బాగా పెట్టేది మా అక్కకి ఇష్టం అని. అది అత్తవారింటికి వెడుతుంటే, అన్నీ సర్టి ఇచ్చేది. నలుగురికి పెట్టటంలో నీకు మీ బామ్మ పోలికే వచ్చింది.
తాయారు: ఊరగాయలు పెట్టినప్పుడు తిరగవేసినప్పుడు బేసిన నిండా అన్నం కలిపి, పెరుగు మీగడా, పేరిన నెయ్యి అద్ది (చేత చూపిస్తూ) మనందరికి పెద్ద పెద్ద ముద్దలు పెట్టెది. మా బామ్మ మనం ఓ ముద్ద తినేలోపు మా కృష్ణదన్నయ్య రెండు ముద్దలు లాగించేసేవాడు వెధవ, వెథవాని.
సీతారామయ్య: భలే ఉండేవి ఆ రోజులు. వెన్నెట్లో ఆడుకునేవాళ్ళం. మొత్తం ఓ పాతిక ముప్ఫై మంది ఉండవాళ్ళం కదూ. ఆ ఆప్యాయతలు స్నేహాలు ఆ రోజులే వేరు.
తాయారు: ముక్కు గిల్లిళ్ళు ఆడుకుంటుంటే మీ రాణీ అక్క మా రాజన్నయ్య ముక్కుని కందిపోయేట్టు గిల్లసింది.
సీతారామయ్య: అప్పుడు మీ పెద్దమ్మకి మా పెద్దమ్మకి పెద్ద యుద్ధం అయ్యింది. ఆ తరవాత కొన్నాళ్ళకి కయ్యంమాని వియ్యం పొందారు. చూశావా భగ వంతుని లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో.
తాయారు; (నిష్టూరంగా) అవునవును చిత్రంగానే ఉంటాయి. దేవగణంలో నిన్ను రాక్షస గణంలో నన్ను పుట్టించి మనల్ని ఒకళ్ళకి ఒకళ్ళని కాకుండా చేశాడు.
సీతారామయ్య: ఇప్పుడు మనకేం తక్కువయ్యింది. నా కన్నా యోగ్యుడు నీకు, నీ కన్నా నెమ్మదస్తురాలు నాకు ఇచ్చాడు. అంతా దైవ ప్రసాదం.
తాయారు; అంతేలే అలాగే అనుకోవాలి. ఇంతకూ సరోజిని ప్రకాశం గుర్తున్నారా.
సీతారామయ్య: ఆ ... ఇప్పుడు వాళ్ళిద్దరు వియ్యం పొందారుగా.
తాయారు: ప్రకాశం చిన్నప్పుడు సిగరెట్టు కాలుస్తుంటే, సరోజిని చూసి ప్రకాశం వాళ్ళమ్మకు చెప్పింది. దాంతో వాడ్ని వాళ్ళమ్మ భలే చితక్కొట్టేసింది.
సీతారామయ్య: అప్పుడు “చచ్చిపోతాడు పెద్దమ్మా” అంటూ సరోజినీయేగా అడ ళ్చింది. అయినా వాడికి సరోజినీ మీద కోపం పోలేదు. వీరి వీరి గుమ్మడి
మోచర్ల రామలక్షి * 111
పండు ఆటలో అది దొంగైనప్పుడు వాడి పేరు చెప్పినా సరే దాన్ని నెత్తిమీద ఎలా మొట్టేవాడో,
తాయారు: మా కరణం మావయ్య కూతురు అలివేలు, వెంకట్రావు దూందుంపుల్ల ఆడుకునే వారు గుర్తుందా బావా?
సీతారామయ్య: వాళ్ళిద్దరికేగా అయిదు రోజుల పెళ్ళి (బ్రహ్మాండంగా జరిగింది. తాయారు నీకి విషయం గుర్తుందా? కళ్ళ గంతల ఆటలో నేను దొంగయితే నువ్వు దొంగతనంగా ... (బుగ్గను నిమురుకుంటూ) అబ్బ అదో మధుర స్మృతి.
తొయారు: (సిగ్గుపడుతూ) పో బావా! అది ఇంకా నీకు గుర్తుందా (వాసన పీలుస్తూ) ఏదో మాడు వాసన వస్తుంది .మా ఇంట్లో నుంచే. కూర మాడిపోతోంది వస్తా,
(సీతారామయ్య కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూంటాడు)
శివ: అయ్యాయా మీ చిన్ననాటి ముచ్చట్లు?
సీతారామయ్య: ఎందుకురా! అలా చిరాకు పడతావు (చిన్నబుచ్చుకుంటూ)
శివ: (చిరాగ్గా) అస్సలూ ... పొద్దున, పొద్దున్న తాయారమ్మ పేపరు అంటూ మన ఇంటికి ఎందుకు తయారౌతుంది? ఆవిడ అలా రోజూ మనింటికి రావడం నాకిష్టం లేదు.
సీతారామయ్య: (ఆయోమయంగా చూస్తూ) ఎందుకిష్టం లేదు?
శివ: ఎందుకో నీకు తెలియదా?
సీతారామయ్య! (అయోమయంగా) నాకలా తెలుస్తుంది నీ మనసులో ఏముందో.
శివ; ఆవిద మాటలు వింటుంటే నాకు అసహ్యం. నువ్వు నాకు పుట్టవలసిన వాడివి. దేవుడు చిన్నచూపు చూశాడు అంటూ ఏదో పిచ్చిగా వాగుతుంది.
సీతారామయ్య: దానికి మొగపిల్లలు లేరు. నిన్ను చూస్తే ముచ్చట. నీ తల్లి లాంటిది, దాన్ని పిచ్చిది అనకు.
శివ; అచ్చా... తల్లిలాంటిదా నువ్వూ ఆవిడ రూటులోనే ఉన్నావు. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా?
సీతారామయ్య: (కోపంగా) ఏడ్చినట్టే ఉంది నీ వెధవ అనుమానం. తాయారు దూరంది కాదు. నాకు స్వయాన వేలు విడిచిన మేనమామ కూతురు. మీ అమ్మ ఎదురుగానే ఒకర్నొకరు వేళాకోళం చేసుకోవటం మాకు అలవాటేరా,
శివ: (కోపంగా) అందుకే అమ్మ అన్నయ్య దగ్గరకి వెళ్ళీ నాలుగు నెలలైనా తిరిగి రాలేదు.
సీతారామయ్య: కోపంగా నోటికి వచ్చినట్టు వాగకు. మీ అమ్మ నిన్నే ఫోను చేసింది. మీ వదినకి వేవిళ్ళు తగ్గాయి. ఉగాది తరువాత మంచిరోజు చూసుకొని బయలుదేరి వస్తానంది.
శివ: అమ్మ ఫోన్చేసిందన్న విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు.
సీతారామయ్య: బావుందిరా నీ వరస. రాత్రి ఎప్పుడొస్తావో, ఎప్పుడు పడుకుంటావో తెలియదు. తెల్లారి తొమ్మిది అయినా లేవవు. లేచాక పది గంటలకి ఆఫీసని అదరాబాదరా తెమిలి ఆఫీసుకెడతావు. నీతో ఎప్పుడు మాట్లాడాలన్నా నీకు ఏదో ఓ బిజీ, నేనయితే ఆ రోజుల్లో మా నాన్న గారితో సరదగా కబుర్లు చెప్పాకే పడుకునేవాణ్ణి..
శివ; అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పవు. మాటకి మాటకి సంబంధం లేకుండా వంద మాటలు చెపుతావు. సరేలే తాయారమ్మని మనింటికి రాని వ్వకు. అమ్మని బాధపెడితే నేను ఊరుకోను. నాకు ఆఫీసు టైమ్ అయ్యింది వెడుతున్నా
సీతారామయ్య: ఏమిటో ఈ కాలం పిల్లలు టెన్షన్ తట్టుకోలెరు. పెద్దవాళ్ళని కూడా చూడకుండా అకారణంగా నోటికి ఎంత వస్తే అంతా అనేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయి కాసేపు నడుం వాలుస్తా.
కూర్చీలో కూర్చుని శివ మార్దయిన్ చదువుతూ ఉందాలి.
అమని: (ఆఫీసు నుంచి వస్తూ) అంకులేరి.
శివ; (కోపంగా) ఏం మంచినీళ్ళు కావాలా అమ్మగారికి.
ఆమని; ఎంటి అరుస్తున్నావ్.
శివ; అరవటం కాదు, ఆక్రోశిస్తున్నాను. నువ్వసలు ఆడదానివేనా?
ఆమని: నీకు ఇప్పుడా అనుమానం ఎందుకొచ్చింది. పెళ్ళి అయ్యి పది నెలలైనా, ఇంకా పిల్లలు లేరే అని పనిపాటా లేనివాళ్ళు అడిగారా?
శివ; (కోపంగా) పిచ్చిగా ఊహించకు, అమ్మ ఊరెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నా నీ వరస నాకు నచ్చలే. అన్ని పనులు నాన్నే చేస్తున్నారు.
ఆమని: తేలిగ్గా నవ్వుతూ, ఆదా నీ బాధ నన్ననే బదులు ఎర్లిగా లెచి మీ దాద్కి నువ్వే హెల్పు చెయ్యొచ్చుగా.
మోచర్ల రామలక్ష్మి * 113
శివ; (ఆవేశంగా) బోడి సలహాలివ్వకు. పెళ్ళి చూపుల్లో నీకు నేను ఏం చెప్పానో గుర్తుందా?
ఆమని: చేతులు తిప్పుకుంటూ, నీలా నాది ఆఫ్సెంట్ మైండ్ కాదు, నాకు మెమరీ పవర్ ఎక్కువ. మీ అమ్మా నాన్నలని మా మమ్మీ దాడీలా చూడాలని చెప్పావు. నేను అలాగే చూస్తానన్నాను.
శివ; (ఆశ్చర్యంగా) మీ ఇంట్లో రోజు మీ డాడియే వంట చేసారా?
ఆమని: యస్. ఎక్కువ రోజులు. మా డాడీయే చేస్తారు. ఎవ్వరి హెల్ప్ తీసుకోరు. అంకుల్ లాగే టెేస్ట్గా చేస్తారు. అప్పుడప్పుడు మమ్మీ వంట చేస్తుంది. అప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తాను. అలాగే ఆంటీ వంట చేస్తే హెల్ప్ చేస్తున్నాగా.
శివ; తప్పు చేశాను. మా నాన్నని మామగారిలా చూడమని నిన్ను ఆడగాల్సింది.
ఆమని: అలా అయితే. అంకుల్ చేత ఒక్క పని చేయించేదాన్ని కాదు.
శివ: సారి, మనీ నేనో క్రాక్ గాడిని. పెళ్ళిచూపుల్లో తెలియక ఎగస్టాలు చేశాను. అవి మర్చిపోయి మా నాన్నను నీ మామగారిలా చేసుకో.
ఆమని; మర్చిపోయే గుణం నాకు లేనే లేదు. అలాగే ప్రామిస్ బ్రేక్ వేసే పద్దతి, నాకు అస్సలు నచ్చదు.
శివ; ఓ గాడ్ నాకు తెలియకుండానే మా నాన్నకు నా చేత అన్యాయం చేయిం చావు.
ఆమని: ఆట్టె బాధపడకు. గాడ్గ్రేస్ అంటే ఇదే. ఆ దేవుడు అంకుల్‌కి నీ లాంటి తింగర కొడుకుని ఇచ్చినా, ఆంటిలాంటి గుడ్వైఫ్నిచ్చాడు. ఆంటి వచ్చిం దంటే చాలు అంకుల్ని, కిచన్‌లోకి వెళ్ళనివ్వదు. ఇప్పుదైనా అంకుల్ లక్మీయే, అట్టే (ఛమపడకుందా తాయారాంటి వండి తెస్తోంది.
శివ: (కోపంగా) ఆవిడ ఎందుకు తెస్తోంది.
ఆమని: (విస్తుపోయి) ఈ వాళ ఏదో కొత్తగా తెస్తున్నట్టు మాట్లాడతావే. ఆవిడా, ఆంటీ రోజు ఒకళ్ళు వండినవి మరొకరికి ఇచ్చుకుంటారు. తాయారాంటి వందిన వంకాయ కూర అంకుల్‌కి ఎంత ఇష్టమో. మొన్న మజ్జిగ పులుసు బావుందని నువ్వు జర్రుకు జుర్రుకు తాగావు. అది తాయారాంటి చేసినదే. అయినా తాయాంరాంటి అంటే నీకెందుకు కోపం.
శివ; మా మమ్మీకి అన్యాయం చేస్తుందేమోనని నాకు అనుమానం.
114 * అక్షర శిల్పాలు
ఆమని; పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. అంటీ అంకుల్, తాయారాంటి ఎంతో (ఫెండ్లీగా ఉంటారు. ముగ్గురూ కలసి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటారు.
శివ; ఏం గేమ్స్ ఆడతారు.
ఆమని: ఆఫ్టర్నూన్ చైసీస్ చెక్కర్, చెస్, క్యారమ్స్.
శివ; అయితే వాళ్ళిద్దరూ కలసి మా అమ్మని ఓడిస్తారా?
ఆమని: ఆంటీలిద్దరూ కలసి అంకుల్ని ఓదిస్తారు.
శివః (ఆశ్చర్యంగా) మా దాడీది ఇంతలో బ్రోఫ్టైలా.
ఆమని: ఛా అదేం కాదు. అంకుల్ కావాలనే ఆంటీలని గెలిపించి, వాళ్ళు హేపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తారు.
శివ; ఓహో మా డాడీకి ఇలాంటి కళలు కూదా ఉన్నాయా, నాకు తెలియవు స్క్రా విషయాలన్నీ ఎలా తెలిశాయి.
ఆమని: వాళ్ళే చెప్పారు.
శివ; నాకు చెప్పరే.
ఆమని: వాళ్ళు కొడుకు కదా అని నీకేదో చెపుదామని (ప్రేమగా దగ్గరకి వస్తే పుల్ల విరిచినట్లు మాట్లాడతావు. అందుకే వాళ్లకి నీ కన్నా నేనంటేనే ఇష్టం. ప్రతి విషయం నాకు చెపుతారు నేను వాళ్లతో చాలా క్ల్షోజ్గ ఉంటా.
శివ: రాక్షసీ నా పేరంట్స్‌ని నాకు కాకుందా చేస్తున్నావా?
సీతారామయ్య: చేతిలో బట్టల బ్యాగ్ తీసుకొని, అమ్మా ఆమని కొత్తబట్టలు ఇవిగో తీసుకో.
శివ: అన్నీ మీ డాటర్ ఇన్లాకేనా నాకు తెచ్చావా.
సీతారామయ్య: నీ కెందుకు తీసుకురాను కన్నా? నీకు తెచ్చా.
శివ; విసుగ్గా, ఎందుకు తెచ్చావ్, దబ్బులిస్తే నేనే తెచ్చుకునే వాడినిగా.
సీతారామయ్య: శివా... ఇప్పుడే నాకు తెచ్చావా అన్నావు. తెచ్చాను అంటే ఇంతలోనే ఎందుకు తెచ్చావు అంటున్నావు. నీతో ఎలా మాట్లాడాలో అర్ధం అవటం లేదు.
అమని: మీరేం ఫీల్ అవకండీ అంకుల్. ఆఫీసులో ఏవో వత్తిళ్ళు అవి తట్టుకోలేక అడ్డతిడ్దంగా మాట్లాడుతాడు.
సీతారామయ్య: నేను అలా అనుకునే సరిపెట్టుకుంటున్నా ఇప్పటి తరం వారిలో కొంతమంది ఉన్నత విద్య ఉన్నా వినయం, వివేకం తక్కువుతున్నాయి. రుచిగా తినటం, శుచిగా ఉండటం, హాయిగా నిద్రపోవడం మరిచివో యారు. తృప్తిలేని సంపాదన, సంతృప్తి లేని జీవితం, వాళ్ళకి శాంతి సుఖాల నివ్వవు. దాంతో మమతానుబంధాలు, (ప్రేమాభిమానాలు మరచి సంపా దించే మరబొమ్మల్లా తయారవుతున్నారు. మనసు విప్పి పిల్లలతో మాట్లాడు కోవడం మా తరం తండ్రులకి కరువవుతుంది. ఇదో రకం శాపం.
శివ: సారీ డాడీ ఏదో తమాషాకి అన్నా. నాకు ఆకలేస్తోంది డిన్నరు చేద్దాం పదండి, మనీ పద ..
తాయారు: (బిగ్గరగా) బావా ... బావా, ఆమని ఆమని శివా ... శివా ఏం చేస్తు న్నార్రా.
సీతారామయ్య: రా రా. కూర్చో. వసంత లక్ష్మిలా తయారయ్యి వచ్చావు. ఉగాది శుభాకాంక్షలు.
తాయారు: (సంబరంగా) మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తెచ్చా. ఈ పచ్చడి తిని, లంచ్‌కి మా ఇంటికి రంది. కోడలు పిల్లా! ఉగాది పచ్చడి చేశావా? మీ పచ్చడి నాకియ్యి. ఇలా పంచుకు తినాలి.
శివా; నవ్వుతూ. పిన్నీ మీ కోడలు ఉగాది పచ్చడి చెయ్యలేదు. ఆ సందు చివరున్న ఫాస్టుఫుడ్ సెంటర్ల్లో పూర్ణాలు, పులిహోర కొంటే, ఉగాది పచ్చడి ఫ్రీగా ఇస్తారుట. అవి తెమ్మని నన్ను పచ్చడి చేస్తోంది.
తాయారు: బావ చూస్తుండగానే రోజులు ఎలా మారిపోయాయో చూడు, మన చిన్నప్పుడు ఏమన్నా కొనేవాళ్ళమా, ఒకళ్ళ తోటలో పండినవి ఒకళ్ళకి పంపుకొనేవాళ్ళం.
ఆమని: మీ చిన్నప్పుడు మీ ఫేం! అంతా బాగా ఎంజాయ్ చేసేవారా అంకుల్.
సీతారామయ్య: కోకిల కూస్తుంటే తిరిగి కూసేవాళ్ళం. మామిడి చెట్టు ఎక్కి పిందెలు కోసేవాళ్ళం. పూత రాలిపోతుందని పెద్దవాళ్ళు తిడుతుంటే పారిపోయే వాళ్ళం. షుగర్ ఫ్యాక్టరీకి, చెరుకు గడలు వెసిన బండ్లు వెడుతుంటే చెరుకు గెడలు లాగేసేవాళ్ళం. కాలవల్లో, చెరువుల్లో ఈతలు కొడుతూ ఎంత అల్లరి చేసేవాళ్ళమో.
116 *అక్షర శిల్పాలు.
తాయారు: ఒక ఉగాది కాదు. అన్ని పండుగలు బాగానే చేసుకునేవాళ్ళం. వినాయక చవితికి గుంపులు గుంపులుగా తోటకు వెళ్ళి పత్రికోసి, ఎక్కువగా కోసిన వాళ్ళ దగ్గర లాక్కుని తక్కువగా కోసుకున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం గదా!
సీతారామయ్య: దేవీ నవరాత్రుల్లో ప్రసాదాల కోసం పోటీపడేవాళ్ళం. ఇహ ... దీపావళి సంగతి చెప్పనకృల్లేదు. తిప్పడు పొట్లాలు, బాణాసంచా మనమే స్వయంగా తయారుచేసుకొని ఎవరివి బాగా కాలుతాయా అని పోటీలు పడేవాళ్ళం.
తాయారు; సంక్రాంతి పండక్కి నెల పట్టినప్పట్నుండీ, పెద్ద పెద్ద ముగ్గులుపెట్టి అందులో గొబ్బెమ్మలను పెట్టి గొబ్బి పాటలు పాడుతూ, వేళాకోళాలు చేసు కునేవాళ్ళం.
సీతారామయ్య: భోగి పండుగ రోజు భోగి మంటకి మనకి కలప దొరకలేదు. మీ మావయ్య వాళ్ళ టేకు దూలం తీసుకొచ్చి మంటలో వేసినప్పుడు మీ అత్తయ్య తిట్టన తిట్లు మన బ్యాచ్ ఎవ్వరూ మర్చివోరు. అన్నట్లు తాయారు నీకు ఇంకో విషయం గుర్తుందా? శివరాత్రికి శివాలయం దగ్గర పెద్దతీర్ధం జరిగేది?
తాయారు: (వెంటనే) ఎందుకు గుర్తులేదు బావా! (కొంచెం సిగ్గుపడుతూ, అప్పుడేగా నువ్వు నాకు పూసలదండ కొనిచ్చావు.
సీతారామయ్య: (ఆనందంగా అభిమానం) ఆ దండ ఇంకానీ దగ్గరుందా?
తాయారు; అవును బావా! మన స్నేహానికి గుర్తుగా దాన్ని జాగ్రత్తగా దాచుకున్నా.
సీతారామయ్య: తాయీ! ప్రతివాళ్ళ జీవితాల్లోనూ ఇలాంటి మధుర స్మృతులు ఉంటాయి. బాల్యపు మురివాలు, కామార్యపు చిలిపి పనులు, మరపునకు రావు. ఆ మధురానుభూతులు హృదయంలో పాతరలా పాతుకు వోతాయి. ఆ “పాత జ్ఞాపకాలు ఆ పాత మధురాలు.
శివ; నాన్నా! అమ్మతో చెపుతా!
సీతారామయ్య: చెప్పుకోరా!
తాయరు: ఏం చెప్తాడే?
అమని: ఆ వాత మధురం.
మోచర్ల రామలక్ష్య * 117
ఓ ఉవాధ్యాయుని ఎన్నిక అదో క్షాసు రూమ్ శాంతి, మీనా: వన్ బై టూ ఎక్కువా. చిరంజీవి, రాజకుమార్: వన్ బై టెన్ ఎక్కువా. శాంతి, మీనా; కాదు వన్ బై టూ యే ఎక్కున. చిరంజీవి, రాజకుమార్: కాదు వన్ బైటెన్ ఎక్కువ. టీచర్: 'సైలెన్స్. కాస్లులో ఏమిటి ఈ న్యూసెన్స్. శాంతి: న్యూసెన్స్ కాదు మేడమ్ న్యూసమ్స్, వన్‌బైటూ కన్నా వన్ బై టెన్ ఎక్కువ అంటున్నారు. చిరంజీవి; చూడండి మేడమ్, రెండు ఎక్కువా? పది ఎక్కువా? మీరే చెప్పండి. టీచర్: రెండు కన్నా పదే ఎక్కువ. చిరంజీవి, రాజకుమార్: (తప్పట్లు కొడుతూ) మేమే గెలిచాము, మేమే గెలిచాము. టీచర్: సైలన్స్, సైలన్స్ గెలవటం ఏమిటి? రాజకుమార్: వాళ్ళేమో! వన్ బై టూ ఎక్కువ అన్నారు. మేము వన్ బై టెన్ ఎక్కువ అన్నాము. మీరు కూడా టెన్ ఎక్కువ అన్నారు. మేమే గెలిచాము కదూ మెడమ్! టీచర్: రెండు కన్నా పది ఎక్కువ అన్నాను. కాని వన్ బై టెన్ ఎక్కువ అనలేదే! వన్‌బై టూ కన్నా వన్ బై టెన్ ఎలా ఎక్కువ చెప్పండమ్మా! మీనా; నాకు చెప్పడం తెలియదు మిస్. టీచర్: నువ్వు చెప్పమ్మా! శాంతి: నాకూ తెలియదు మిస్. టీచర్: ఏమి తెలియకుండానే వన్ బై టూ ఎక్కువ అని ఎలాచెప్పారు? శాంతి: చెప్పదానికి ఏముంది మిస్, వాళ్ళు ఏమంటే అది మేము కాదు అంటాం. మేము ఏది అంటే అదికాదు అని వాళ్ళు అంటారు. టీచర్; క్లాసులో చదువుకోవాలి కాని ఇలా పోట్లాడుకోకూడదు. ఒక కేకు ఉంది అనుకోంది. 118 అక్షర శిల్పాలు.
రాజకుమార్; ఏది మిస్. ఏది మిస్.
శాంతి: వీడికి ఎప్పుడు తిండి గోలే,
మీనా; మీరు చెప్పండి మిస్.
టీచర్: ఇటు చూడు బాబు. ఒక కేకు ఉంది అనుకో దానిని రెండు ముక్కలు చేసు కుంటే పెద్దవి వస్తాయా!
చిరంజీవి: పది అయితే చిన్నవి అయిపోతాయి మిస్. రెండయితే పెద్దవి వస్తాయి మిస్.
టీచర్: ఇప్పుడు చెప్పండి వన్ బై టూ పెద్దదా! వన్ బై టెన్ పెద్దదా!
అందరూ: వన్ బై టూయే పెద్దది మిస్.
రాజకుమార్: మీ ముందర ఉండే మిస్ మొట్టికాయలు మొట్టి చెప్పేది మిస్. దానితో మా బుర్ర పాడై పోయింది. మీలాగా కేకులు, కోవాలు అని చెపితే మాకు బాగా అద్ధం అవుతుంది.
టీచర్: ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను ఎవరిని అడిగితే వాళ్ళే జవాబు ఇంగ్రీషులో చెప్పాలి. ముందు మీరు మీ పేర్లు చెప్పండి.
అందరూ: ఎస్ మిస్.
టీచర్: వాట్ ఈజ్ యువర్ నేమ్?
శాంతి: మై నేమ్ ఈజ్ పీస్.
చిరంజీవి: మై నేమ్ ఈజ్ దెత్లెస్.
రాజకుమార్: మై నేమ్ ఈజ్ కింగ్సన్.
మీనా; మై నేమ్ ఈజ్ ఫిష్
టీచర్: వాట్! ఆర్ యూ ఫిష్.
మీనా: ఎస్.
టీచర్: వేర్ ఆర్ యూ లివింగ్?
శాంతి: రిచ్ మేన్ స్టమక్.
చిరంజీవి: హ్యాపీ సిటీ!
రాజకుమార్: వైల్డ్ సిటీ!
మీనా; సాద్ లెస్ సిటీ!
టీచర్: (అయోమయంగా మొహం పెట్టి) నేను అడిగింది ఏమిటి మీరు చెప్పేది ఏమిటి.
శాంతి; మీరే కదా మిస్ ఏది అడిగినా ఇంగ్లీషులోనే చెప్పమన్నారు.
టీచర్: మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, పేటల పేర్లు ఏ భాషలో అయినా ఒక్కటే, ఇవి మారవు. ఇప్పుడు చెప్పండి.
శాంతి: నా పేరు శాంతి. నేను అమీర్‌పేటలో ఉంటాను.
చిరంజీవి; నా పేరు చిరంజీవి. నేను సంతోష్‌నగర్‌లో ఉంటాను.
మీనా; నా పేరు మీనా. నేను అశోక్‌నగర్‌లో ఉంటాను.
టీచర్; వెరీగుడ్! ఇప్పుడు మిమ్మల్ని కొన్ని నోటి లెక్కలు అడుగుతాను.
అందరూ: అదగంది మిస్!
టీచర్: నేను నీకు ఓ వంద రూపాయలు అప్పు ఇచ్చాను అనుకో.
శాంతి: వద్దు మిస్ నేను తీసుకోను! మా నాన్న గారు అదో టైపు. అప్పు తీసుకుంటే తిదతారు.
టీచర్: సరే కూర్చో. నీకు అర్ధమైనట్టు లేదు. నువ్వ చెప్పు మీనా!
శాంతి: నాకు వద్దు మేడమ్, మా నాన్న గారు అయితే తీసుకుంటారు.
టీచర్: సరే, మీ నాన్న గారికి నేను వంద రూపాయలు అప్పు ఇచ్చాను. నెలకి ఇరవై రూపాయలు చొప్పున ఎన్ని నెలలో నా బాకీ తీరుస్తారు.
మీనా: అప్పు తీసుకుంటారు కాని, తీర్చరు. ఆయనకో సెంటిమెంటు ఉంది మేడమ్. అప్పు తీరిస్తే ఆయుష్షు క్షీణం అని.
టీచర్: కూర్చో అమ్మా! నువ్వు చెప్పు బాబు.
రాజకుమార్; మా నాన్న గారు మా అమ్మ గారు చెపితే కాని అప్పు తీసుకోరు.
చిరంజీవి: మేడమ్! వీళ్ళు అందరిలా కాదు మేడమ్. మా అమ్మ గారు అప్పు తీసుకుంటారు. ఎందుకంటే మా అమ్మగారు అప్పుచేసి పప్పుకూడు సినిమా ఎదురింటి ఆంటీ దగ్గర అప్పు తీసుకొని మరీ చూసింది.
టీచర్; నోటి లెక్కలకు ఆన్సర్ చెప్పడానికి. ఇలా మీ ఇంటిలో వాళ్ళ గురించి చెప్పకూడదు.
అందరూ; ఎస్. మిస్!
120 *అక్షర శిల్పాలు.
టీచర్: లాల్ బాల్ పాల్ అంటే చెప్పంది.
శాంతి: లాల్ అంటే ఎరుపు, బాల్ అంటే బంతి, పాల్ అంటేనూ చిరకు కుడతారు. అదేనా మేడమ్!
టీచర్: (చేత్తో తల పట్టుకొని) కూర్వ్పోమ్మా! నువ్వు చెప్పమ్మా! బాపు చాచాజీ అంటే ఎవరు?
మినా; బాపు అంటే కార్గూన్లు వేస్తాడు. చాచాజీ అంటే చాలీచాలని జీతగాడు.
టీచర్; దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడు పేరు బాపూజీ అని బాలల చాచా నెహ్రూ అని తెలియదా? రాజకుమార్ నువ్వు చెప్పు “చార్మినార్” ఎక్కడ ఉందో?
రాజకుమర్: మా బాబయ్య కాల్చే సిగరెట్ పెట్టి మీద!
టీచర్: నువ్వు కూర్చో. నువ్వు చెప్పమ్మా చిరంజీవి! ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటైన “తాజ్ మహల్” ఎక్కడ ఉందో చెప్పు.
చిరంజీవి: ఎక్కడని చెప్పను మిస్! కిరాణా కొట్టులో, మా వంటింట్లో, వీళ్ళ వంటింట్లొ ఇలా ఎక్కడ పదితే అక్కడ ఉంటుంది.
. టీచర్: మీరు చూస్తే తెలివైన పిల్లలాగే ఉన్నారు. ఇలా తికమక సమాధానాలు ఎందుకు చెపుతున్నారు? చివరిసారిగా ఒక ప్రశ్న అడుగుతాను. సమాథానం చెప్పంది.
అందరూ: అదగంది మిస్!
టీచర్: మన జాతీయ పండుగలు చెప్పంది?
శాంతీ, మీనా; ఆగస్టు పదిహేను.
చిరంజీవి, రాజకుమార్: కాదు జనవరి ఇరవై ఆరు.
టీచర్: అందరూ సరియైన జవాబులు చెప్పారు. గుడ్ ఇలాగే చెప్పాలి.
అందరూ; మిస్. మీరు ఎలెక్ట్ అయ్యారు మిస్!
టీచర్: మీరు మరలా మొదటికి వచ్చారు. ఎలక్ట్ అవటం ఏమిటి. నేను క్లాసు బాగా కందెక్టు చేస్తే అప్పుడు ఈ స్కూల్ కమిటీ మెంబర్స్ సెలక్టు చెస్తారు. ఇంకా నేను క్తాసు తీసుకోలేదు!
అందరూ: సారీ మిస్. మాకు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసు! ఈ
మోచర్ల రామలక్ష్మి * 121
స్ములులో టీచర్నీ కమిటీ మెంబర్స్ సెలక్టు చెయ్యరు. విద్యార్థులమే ఎన్నుకొంటాము. మీరు మాకు నచ్చారు టీచర్. మేము ఎలా సమాధానాలు చెప్పిన ఓపిగ్గా విన్నారు. మీలాంటి టీచర్స్ అందరూ ఈ స్కూల్లో ఉన్నారు. ఓపికగా బాగా చదువు చెపుతారు. టీచర్: మీరు బాగా చదువుతారు. అందుకేగా ఈ స్కూల్ స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. శాంతి: యధా టీచర్ తధా స్టూడెంట్. టీచర్: ఇందాక నేనడిగిన ప్రశ్నలకి అన్సర్ చెప్పుండి. మీనా; మీ దగ్గర తీసుకున్న వంద రూపాయలు నెలకి ఇరవై రూపాయలు చొప్పున ఐదు నెలలో తీర్చేస్తాం. చిరంజీవి: లాలా లజపతిరాయ్, బిపిసింగ్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక్. రాజకుమార్: చార్మినార్ హైద్రాబాద్‌లో, తాజ్‌మహల్ ఆగ్రాలో ఉన్నాయి. (బెల్ (మోగింది) అందరూ గుడ్ ఈవినింగ్ మిస్. మీరు ఎన్నికయ్యారు.
- ఆదాన అడమర్దా-బ- 122 *అక్షర శిల్పాలు.
జీవన పథకం (నాటిక)
పాత్రలు
అమృత: జీవన పథకం అనే నావలో సంసారసాగరంలో సవ్యంగా, దివ్యంగా పయ నించింది,.
సుగుణ: అమృత స్నేహితురాలు, వియ్యపురాలు,
జయమ్మ: అమృత ఆదపడుచు.
అర్భన: అమృత కూతురు.
సృజన: అమృత కోడలు.
జయ: మీ అత్తగారి పూజ అవలేదా?
సృజన: ఊ హు ఇంకా అరగంట.
జయ: మీ ఆడపడుచు ఏది?
సృజన: స్నానం చేస్తోంది.
జయ: ఇదిగో ఇలారా.
సృజన: “ఊ ... చెప్పుండి (దగ్గరగా వచ్చింది)
జయ; మీ మామగారు రిటైరయ్యాడు ఎక్కువగా డబ్బు దస్కం వచ్చి ఉంటుంది. అసలు కన్నా వడ్డీ ముద్దని, మనవలకి పంచేస్తుందేమో మీ అత్తగారు.
సృజన; వాళ్ళ కప్టార్దితం వాళ్ళ ఇష్టం.
జయ: పిచ్చితల్లి, నీ తెలివి తెల్లారినట్టె ఉంది. నీ ఆడపడుచుకి నలుగురు కూతుళ్ళు. నీకు ఒక్కడే కొడుకు.
సృజన; అంటే మా ఆడపడుచుకి నాలుగు వంతులు మాకు ఒక వంతేనా?
జయ: ఆ .... ఇప్పటీకైనా తెలిసిందా
సుగుణ: సృజనా.... (గట్టిగా అరుస్తుంది)
సృజన: అమ్మా... నువ్వా? కిందికి ఎప్పుడొచ్చావ్.
సుగుణ; నువ్వు, ఎవరి క్వార్దితం వాళ్ళ ఇష్టం అన్నప్పుడు, అది విని ఓహోనా వీడ్డ అని గర్వించా. అంతలోనే వంతుల గురించి మాట్లాదావ్. ఇలాంటి మన స్తత్వం ఎలా వచ్చిందా అని అఆశ్చర్యవోయాను?
జయ: అమ్మమ్మా - (ముక్కు మీద వేలు వేసుకొని మీ అంత ఎదిగిన కూతుర్చి ఇలా
మోచర్ల రామలక్ష్మి * 123
అనటం ఏం బాగా లేదు.
సుగుణ: వెనకటికి మీ లాంటిదే ఏద్చే దానికి ఇస్తే నాకూ ఇస్తారు అందట. మీకేదో దబ్బు అవసరం ఉంది. అందుకే దానికి నూరిపోస్తున్నారు.
సృజన: ఆవిడ నూరిపోస్తే కాని, నా అవసరాలు నాకు తెలియవా? ఏదో పెద్దావిడ కావలసినావిడే కనుక సలహా ఇచ్చింది.
జయ: చిన్న దానివైనా పెద్ద మనసుతో మాట్లాదావ్. ఈ మాత్రం అభిమానం మీ అత్తగారికి లేదు. వెళ్ళి కాస్త కాఫీ తే అమ్మ.
సుగుణ: ఎందుకండీ అమృతని (ప్రత్యక్షంగా పరోక్షంగా ఆఅడిపోసుకుంటారు. పెళ్ళి అయి అత్తింట అడుగుపెట్టింది మొదలు సౌఖ్యాలు సరదాలు అనేవే మరిచి పోయింది. బాధ్యతలతో నిండా మునిగిపోయింది. అవి చాలనట్టు మీరు డబ్బు ఇబ్బందని ఎన్నిసార్లు ఉత్తరాలు రాసారో అన్ని సార్లు పంపింది. ఆ విషయాలు గుర్తు ఉన్నాయా?
జయ: ఆ .... పంపేది ... అవసరం ఉండి ఉత్తరం రాస్తే అడిగిన దాంట్లో పదో వంతు. ఈ మాత్రానికే ఊరంతా డప్పెయ్యాలా?
సుగుణ: క్షమించండి. మీతో మాట్లాడడం నాకు రావటంలేదు. దయ ఉంచి ఈ ఒకళ్ళమీద ఒకళ్ళకి చెప్పి కుటుంబాల్లో కలతలు పెట్టకండి (వెళ్ళిపోయింది..
అర్చన: అత్తయ్యా సుగుణ అంటీ నువ్వు తెగ మాట్లాడేసుకుంటున్నారు. అంటీ వది?
జయ: ఏముంది మేద ఎక్కేసి ఉంటుంది, అక్కడేగా తిష్టేసింది.
అర్చన: అనవసరంగా ఆంటీనెందుకంటావ్. ఎవరికో అద్దెకిచ్చే బదులు ఆవిడకే అద్దెకిచ్చాం. కిందటి నెల అమ్మకి ఆరోగ్యం బాగుండకపోతే, మనం ఎవ్వరం రాలేకపోయాం. ఆవిడే అమ్మకి సాయం చేసింది. చాలా మంచిది ఆంటీ.
జయ: ఒక్కటే తెలుస్తోంది ఆవిడ తెలివి తేటలు, నీ వెర్రితనం, తన కూతురొచ్చి చెయ్యాలని తనే చేసింది. నా బెంగంతా నీ గురించే.
అర్చన: నా గురించి నీకు బెంగెందుకు? సందేహించకు. ఏం చెప్పాలనుకుంటు న్నావో చెప్పు.
జయమ్మ: నీకా నలుగురు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు చెయ్యాలంటే మాటలా, మూటలతో పని. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీ అమ్మ, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏదో అవసరం చెప్పి అడుగు.
124 * అక్షర శిల్తాలు
అర్చన: అమ్మ అవసరానికి మించి ఆవగింజంత కూడా ఖర్చు పెట్టదు. అన్నయ్య పెళ్ళీ, నా పెళ్ళి కూదా నిరాడంబరంగా చేసింది. హంగూ ఆర్భాటాలు ఆవీ దకి గిట్టవు. డబ్బు ఖర్చు పెట్టేస్తుందనే బెంగ మనకి ఎందుకు?
జయ: అది సరే .... మీ అమ్మ స్నేహితురాలు సుగుణమ్మ తీపి మాటల్లో పడి ఆదర్శాలు చట్టుబండ అంటూ పేదవాళ్ళకి పుస్తకాలు పుస్తెలు అంటూ ఖర్చు పెట్టెస్తుందేమోనని.
అర్భన: కొత్తగా అవి నేర్వవలసినదేముంది. ముందు నుంచి ఆవిడకి అలవాటెగా. నామాజిక స్పృహ ఉండాలని మాకు చెప్పేది. అమ్మా, అంటీ వస్తున్నారు. ఎలా మొదలెడతావో మొదలెట్టు.
జయమ్మ: అమృతా సాయంత్రానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా వెళ్ళకపోతే మా ఆయన గొడవ చేస్తాడు. నీ మనసులో మాట చెప్పేస్తే అర్చనా, సృజనా కూడా వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళివోతారు.
అమృత: మీరు ఏమంటున్నారో అర్ధం కావటం లేదు. ముగ్గురు కూడబలుక్కొని కిందటి నెలలో జబ్బుపడ్డానని మీరు నన్ను చూడటానికి వచ్చారనుకున్నా మీ మనసులో ఏముందో మీరే చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సృజనా.
సృజన: నీ మనవడికి ఇంజనీరింగ్ సీటు వచ్చిందత్తయ్యా,
అమృత; ఇంత సంతోషమైన విషయాన్ని నిన్నటి నుంచి చెప్పనే లేదు.
సృజన; వాడు అంటే నీకు ఎంతో ఇష్టం. నువ్వు తలుచుకుంటే లక్షా యాభై వేలు లెక్కకాదు. నువ్వు ఇచ్చావంటే వాట్స్ ఇంజనీరింగ్‌లో చేరిపించేస్తాము.
అమృత; వాడికి పేమెంటు సీటా ..; నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అర్భనా?
అర్భన: నీ మనవరాలికి చాలా మంచి సంబంధం వచ్చింది. కట్నం లక్షా ఏభై వేలు అడుగుతున్నారు. కట్నం వరకు నువ్వు సర్దుతావేమోనని మీ అల్లుడు గారు అదగమన్నారు.
అమృత: అలాగా ... వదిన గారూ మీరు?
జయమ్మ; ఏదో పుట్టింటి మీద ఆశ ... ఆముదం మీద జిడ్డు ... కుంకుడుకాయ మీద నురగ అంటారు. గాజు గాజులు వేసుకుని బయటకి వెడుతుంటే సిగ్గుగా ఉంటుంది. రెండు జతల బంగారపు గాజులు చేయించు, అంతే.
అమృత; మీరు ముగ్గురూ నన్ను సహృదయంతో అర్ధం చేసుకోండి. మీ కోర్కెలు
మోచర్ల రామలక్ష్మి * 125
అవసరాలకి పొదుపు చేసుకోవాలని తెలియలేదా అని నిలదీసి అదుగు. ఎంత కష్టపడి సంసారాన్ని లాక్కొచ్చావో చెప్పు.
అమృత; మీ పెళ్ళిళ్ళకి, చదువులకి బీదా బిక్కికి సాయం చేస్తూ డబ్బు అవసరం వచ్చేసరికి వేరొకరిని చేయి చాచి అదక్కూడదని ఆయనకి వచ్చే జీతంతో 12% దాస్తూ, 2% దానానికి, 85% ఇంటి ఖర్చుకి, 1% వార్ధక్య నిధికి అంటూ పథకాలు వేసుకొని ఇంత వరకు లాక్కొచ్చారు.
సృజన: క్షమించు అత్తయ్యా... మామయ్య రిటైరయ్యారు. (పైవేటు కంపెనీ ఉద్యోగం. పెన్షన్ కూడా రాదు ... ఇంటి ఖర్చులకి డబ్బు అవసరమా అని అడగవల సిన నేను ఎవరో మాటల్ని విని అసహ్యంగా అవివేకంగా మాట్లాడాను.
అర్చన: వదిన చెప్పింది నిజమేనమ్మా. నన్ను క్షమించు. జీవితంలో ఎన్నో ఒడిదుడు కులతో అలసిపోయిన మిమ్మల్ని తీసుకెళ్ళి విశ్రాంతి నిచ్చి మనశ్శాంతి కలిగించాలి. మా బాధ్యతలను కూడా మీ మీద రుద్దటం, ఛీఛీ నేనడిగి నందుకు నాకే సిగ్గుగా ఉంది.
సుగుణ: ఎందరో తల్లితండ్రులు ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేసి, వృద్ధాప్యంలో వాళ్ళు చూడకపోతే విలవిలలాడుతూ వాపోతారు. మా అమృత వాళ్ళలా జీవన పథకాన్ని తయారు చేసుకుంటే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గూర్చి ఆవేదన ఉండదు.
అమృత; నాకే కాదు ఎవరికైనా సరే శక్తి సన్నగిల్లితే, లక్ష్మీదేవి అండ ఉండాలి. బాల్యం, కౌమారం, యవ్వనం కులాసాగానే జరిగిపోతాయి. మన జీవన పథకాలలో వార్ధక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి వార్ధక్య నిధి కూడబెట్టుకోవల సిందే .... ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరికి తగ్గ ఖర్చు వారు చేసు కోవాలి. మన అవసరాలని ఆశలని మన ఆదాయానికి తగ్గట్టుగా కుదించు కోవాలి. అలా చేసుకోని పక్షంలో జీవితపు చివరి రోజుల్లో నానా అవస్థలు పదతాము.